ఆతని కొరకు నేను అంగీకరించెదను
అది అటువంటి ఒక రాత్రి, ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. నేను అక్కడ నిలబడియుండి, “శక్తిగల యేసు నామమునకే స్తోత్రములన్నీ”, అనే ఆ అద్భుతమైన కోరస్‌ను (నేను) అక్కడ కూర్చొని వినుచున్నప్పుడు, నేను ఆ చిన్న పడకపై కూర్చొని ఉన్నప్పుడు అక్కడే ఒకవేళ ఎత్తబాటు వచ్చునేమో అన్నట్లుగా నాకు అనిపించియున్నది. ఏదో నన్ను పైకి ఎత్తుచున్నట్లుగా అనిపించియున్నది. ఆ...
“స్తోత్రములన్నీ శక్తిగల యేసు నామమునకే”.
ఎడ్డీ పార్నెట్ అతడు ఆ పాటను వ్రాసినప్పుడు, మరియు అనేక మంది కవులు, ఎటువంటి సమయము ... అతడు లోపలికి నడిచి మరియు అతని యొక్క తండ్రి అక్కడ చేతులూపుచుండుట చూచి ...?... ముందుకు మరియు వెనుకకు, పక్షవాతముతో, అవిటితనముతో, అక్కడ పడియుండి, అతని బిడ్డను
ఆనందపరచుచుండెను. మరియు నేను అనుకొన్నాను, “దేవా, నేను ఏమి చేయగలను? నేను ఏమి చేయగలను? ఏమి చేయవచ్చును?”
ఎటువంటి సమయము (టేపులో ఖాళీ) ... సమకూడుట. ఎటువంటి సమయమది దేవుడు అలా కదులుచూ మరియు మన మధ్యన ఏమైనా చేయగలడు.
2
ఇప్పుడు నేను అడుగగోరుచున్నాను, ఆ సమాచారము, గతరాత్రి నుండి ఒక ఖచ్చితమైన స్థితిలోనికి వచ్చిన వారి యొక్క సమాచారము. సహోదరుడా బోస్‌వర్త్, గతరాత్రి ఏమి జరిగియున్నది అనే సమాచారము నీ దగ్గర ఉన్నదా? మరియు అది ఆ బుక్‌స్టాండ్ (పుస్తకములు పెట్టెడి చెక్క అర) దగ్గర విడువవలసియున్నది. ఒకవేళ అక్కడే ఆ సమాచారమును ఎవరైనా నాకు ఇచ్చియుండెదరు. అది నాకొరకు నీవు తీసుకొనిరాగలవా, సహోదరుడు బోస్‌వర్త్? ఆ బుక్‌స్టాండ్ యొద్ద, ఆ పుస్తకాల అర యొద్ద, ఆ సమాచారము ... ఎవరైనా, లేక ఆ ద్వారపాలకులలో ఒకరు, ఒకవేళ ఆ పుస్తకాల అర యొద్ద నుండి ఒక సమాచారము వారు తీసుకొని రాగలిగిన యెడల, మరియు గతరాత్రి కూడిక నుండి, ఈ రాత్రి వరకు ఎంతమంది లెక్కించబడియున్నారో కనుగొనుడి, గతరాత్రి కూడికలో ఏమి జరిగినది. ఈ రోజు దానియందు నేను చాలా ఆసక్తిని కలిగియున్నాను.
మన ప్రభువు మనకు ఎంత మంచివాడై యున్నారు. క్రైస్తవ స్నేహితులారా, ఈ కూడికలకు సంబంధించి, మనకు ఇంకా రెండు రాత్రులు కలవు. ఈ ఉదయము, ఆ సేవకుల యొక్క అల్పాహార విందులో మేము నిజముగా ఒక మంచి సహవాసపు సమయమును కలిగియున్నాము: ఎంతో ప్రియమైన సేవకుల సమూహము, అందరూ ఏక హృదయము మరియు ఏక మనస్సుతో అక్కడ కూర్చొని యున్నారు. సాధారణముగా, ఆ అల్పాహార విందులో వేర్వేరు శాఖా సంస్థలను గూర్చి నేను ఏడో సంగతి ప్రస్తావిస్తూ ఉంటాను. అది నేను ప్రస్తావించే నా గొప్ప సంగతులలో ఒకటైయున్నది. అది నేను ఎందుకు ప్రస్తావించలేదు అని సహోదరుడు బాక్స్‌టర్ ఆశ్చర్యపోయియున్నాడని నేను ఊహించుచున్నాను. అది పరలోకపు వాతావరణము వలె అనిపించియున్నది, దానిలో ఎవరికి ఎటువంటి భేదము లేదు. అది ఒక... చూశారా?
3
నేను దీనిని నమ్ముచున్నాను, అది సంఘము యొక్క గొప్పరాజ్యములో, ఆయన యొక్క సంఘము కొరకు ప్రభువైన యేసు యొక్క రాకడను జరుగకుండా, మరియు ఆయన రాజ్యము స్టాపింపబడకుండా పట్టియుంచుచున్న ఒకే ఒక సంగతి, సంపూర్ణ సువార్త ప్రజల మధ్యన ఉన్న విభేదములే. అది నిజము. ఎంతకాలమైతే, “నేను దీనికి చెందినవాడను; నేను దానికి చెందినవాడను, అని చెప్పెదరో. నేను దీనిని
పొందుకున్నాను, నేను దానిని చేశాను,“ మరియు నీ సహోదరుడిని సహోదరుడిగా గుర్తించకపోవుట, యేసుక్రీస్తు యొక్క రాకడ రాకుండా లేక మనము పొందుకొనకుండా ఆపుచున్న అడ్డంకులలో ఒకటి, అని నేను తలుస్తున్నాను.
ఇప్పటికే అలస్యం అని నేను నమ్ముచున్నాను. యేసుని రాకడ ఇప్పటికే ఆలస్యమైనది. (లేక గడువు మీరినది). అది ఒక పెద్ద మాట, కానీ దానిని నేను లేఖనముల ద్వారా రుజువుపరచగలనని నమ్ముచున్నాను. అది ఇప్పటికే జరుగవలసియున్నది. దేవుడు, ఆయన చెప్పాడు, “నోవహు దినములలో జరిగినట్టుగా, మనుష్యు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” దేవుడు, “దీర్ధశాంతము కలిగియున్నాడు, ఎవరూ నశించిపోకూడదు, కానీ అందరూ మారుమనస్సు పొందవలెనని” ఆయన ఎదురుచూచుచున్నాడు.
వందనములు, సోదరుడా. రాత్రి నుండి ఒక డజను లేక మరెన్నో సాక్ష్యములు. అవును, అది ఎంతో మంచిగా లేదు, వేదిక పైకి వచ్చి వెళ్ళిన దెబ్బది ఎనిమిదిలో కేవలము పన్నెండు. డెబ్బది ఎనిమిది వేరు, వేరు ప్రజలు వేదికపై నుండి వెళ్ళారు మరియు కేవలము పన్నెండు మంది మాత్రమే సాక్ష్యమిచ్చారు. అది సరే. అది సులువు మరియు అప్పుడు నాకైతే ఏమియూ కాదు, మరియు ఈ రాత్రి ఎక్కువ సంఖ్యలో రోగుల స్వస్థత కొరకు మనము ప్రయత్నించెదము మరియు మన ప్రభువు ఏమి చేయునో కనిపెట్టెదము. చూశారా?
4
ఇప్పుడు, నేను ఏమి చెప్పుచున్నానో, అర్ధమైనదా? ప్రతీ ఒక్కరికి సహాయము చేయుట కొరకు ఇక్కడ నేను ప్రయత్నించుచున్నాను. కొద్దిమంది చెప్పుచున్నారు, “నా కొరకు ప్రార్థించుము. ఒకవేళ నీవు నా కొరకు ప్రార్థించినట్లయిన నేను బాగుపడుదును.” చూశారా? “మంచిది, అది నిజము, దేవుడు చేయునది అదే, ఆయన రోగులను స్వస్థపరచును. ”విశ్వాస సహితమైన ప్రార్ధన రోగులను స్వస్థపరచును.“
కానీ నేను ఆశించాను, మరియు వచ్చిన డెబ్బదికు పైగా... ఇరవై నాలుగు గంటలలో ఎంతమందికి మార్పు వచ్చినదని, ఈ రోజు సుమారు మూడుసార్లు వారి యొక్క నివేదికను నేను అడిగాను. ఒక చిన్న బాలిక, నిన్న రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్న సేవకుని కుమార్తె, అదే హోటల్‌లో వారు ఉంటున్నారని ఆమె చెప్పినది, క్రింద ... అవును, ఆమె కెంటకీలో నివసించును, నా ఇంటి నుండి నదికి ఆవల వైపున, సహోదరి బీలర్ యొక్క మేనకోడలు. మరియు ఆమె చెప్పినది వేదికపైకి వచ్చిన వారినందరినీ ఆమె లెక్కించినది, మరియు డెబ్బది ఎనిమిది మంది వేదిక పైకి వచ్చి వెళ్ళారని ఆమె చెప్పినదని నేను నమ్ముచున్నాను.
గతరాత్రి ఒక ప్రయత్నపు రాత్రిగా ఉన్నది, కాబట్టి పరిశుద్దాత్మ ఏమి చేయునని
మనము కొంచెము ప్రయత్నించి చూచెదము. ప్రార్ధన ద్వారా, చేతులుంచుట ద్వారా ఎంత మంది స్వస్థపడెదరో చూచుటకు, మరియు ఏమి జరుగునో చూచుటకు. పిదప ఆవిధముగా చేయుట ద్వారా నేను దయగా ఒక చిన్న తప్పిదము చేసియున్నాను. అయినా నేను-నేను... అలా దర్శనములు కదులుచున్నవి ... నా సహోదరుడా, కృతజ్ఞతలు.
5
ఇప్పుడు, ఇక్కడ మరొక నివేదిక చెప్పుచున్నది, “ఖచ్చితముగా ఒక సంఖ్య కాదు, కానీ అనేక మంది నమోదు చేయబడ్డారు.” అది ఆశ్చర్యకరము. ఇక్కడున్న వారిలో ఎంతమంది గతరాత్రి ఇక్కడ స్వస్థత పొందుకునియున్నారు అని మీరు తెలుసుకున్నవారు ఎంతమంది? ఆ విధముగా మీ చేతులు పైకెత్తండి, ఆ విధముగా, కనుక చుట్టూ నేను మిమ్ములను చూడగలను. అవును, అది ఒక నిర్ణీత సంఖ్యగా కనబడుచున్నది, స్వస్థత పొందియున్నామని నిజముగా మీరు ఆ వ్యత్యాసమును అనుభూతి చెందియుండెదరు. అది ఆశ్చర్యము. మంచిది, ఒకవేళ ... ప్రతీ ఒక్కరికి, కృతజ్ఞతలు. దేవుడు నిన్ను దీవించును. మీరు ఆ సాక్ష్యమును కలిగియుండుడి.
6
స్నేహితులారా, నేను మీకు చెప్పుచున్నాను. నేను ఏమి కదుపుచున్నాను, ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాను, అది ఒక పాలసీ మార్చు... ప్రజలు నన్ను అపార్థము చేసుకొందురేమో అని నేను భయపడుచున్నాను, మరియు నేను ఒక... అని తలంచుచున్నాను, ఒక, అంతయూ కలిపి ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని, మరియు చాలామట్టుకు ఒక... అది ప్రారంభమగును, అవును, ఇది చెప్పాలని నేను ఆశించుచున్నాను: నా హృదయము యేసుక్రీస్తుదే. నా హృదయమంతటితో నేను ప్రేమించునది ఆయననే. మరియు నా మొదటి విధి ఆయనకే. అది నిజమేనా? నా మొదటి విధి ఆయన కొరకే. మరియు అడ్డుపడు దేనినో నేను చూసినప్పుడు, ఎక్కడో పిలుపులో ఉన్నప్పుడు, లేక ఎక్కడో నింద తీసుకొనువచ్చుట, అది నేను అనుభూతి చెందినట్లుగా... మొదట ఇప్పుడు, నా విధి“ ఆయన కొరకే. చూశారా? ఆయన కొరకు నేను సహాయపడులాగున ఏదో నేను చేయగోరుచున్నాను.
మంచిది ఇప్పుడు, దానిని చేయలేమని నేను కనుగొనియున్నాను... మరియు మనము వెళ్ళుచున్న ఈ పరిధులు... కొంతకాలం క్రితము, ఇక్కడ దక్షిణమున, ఒక వ్యక్తి అరెస్టు అయ్యెను. అతడు వేదిక పైకి వచ్చి, మరియు అతడు చెప్పెను, “అవును, సహోదరుడా బ్రాన్హాం కేవలము... అది ఏమీ కాదు, అదొక మానసిక శాస్త్రము; నేను కూడా అది చెయ్యగలను”. మరియు అతడు కూడ ఒక సేవకుడే. అతడు వేదిక పైకి వచ్చి మరియు తన మానసిక శాస్త్రమును కొంత ప్రయత్నించెను, మరియు అతడు ఇప్పుడు జైలులో ఉండెను. చూశారా?
ఒక వ్యక్తి చెప్పెను, “నీవు నీ భార్యపట్ల అనైతికముగా జీవించుచున్నావు”.
అతడు చెప్పెను, “నీవు ఒక అబద్ధికుడవు”. అతడు చెప్పెను, “నేను అటువంటివాడను కాదని చెప్పుటకే ఇక్కడ నిలబడియున్నాను, మరియు నేను ఒక మర్యాదస్తుడను మరియు ఒక కైస్తవుడను, మరియు ఇక్కడ పొరుగువారిలో ప్రతీ ఒక్కరూ నన్ను ఎరుగుదురు”. అతడు అడిగాడు, “అది ఎప్పుడో చెప్పుము”.
7
అది నిజము. చూశారా? కనుక అక్కడ, దానికొరకు. మరియు వారు అందుకే దానిని చేసియుందురు, వారు అతడిని జైలులో పెట్టియున్నారు. అది ఖచ్చితముగా నిజం. సహోదరుడా, ఒకవేళ దేవుడు దాని వెనక లేకున్న యెడల, నీవు మరింత జాగ్రత్తగా ఉండుము, మరియు లోకము వలె ఖచ్చితముగా నీవు నిందను తీసుకొని వచ్చెదవు. చూశారా? నీవు ఎక్కడనుండి మాట్లాడుచున్నావో, మరియు ఏమి మాట్లాడుచున్నావో ఖచ్చితముగా ఎరిగియుండుము, మరియు పరిశుద్దాత్మను మాట్లాడనిమ్ము. నీవు
నిమ్మళముగా ఉండుము. చేయుటకు మంచి సంగతి అదే. అది సరైనది అని మీరు అనుకొనుట లేదా? చూశారా?
మరియు నేను తలంచాను, “అవును, ఆరంభములో, మొదట ప్రారంభించినప్పుడు, ఆయన నాకు చెప్పినట్లుగా నేను ప్రజల చేతులను తీసుకొనెడివాడును”, మరియు అది అలాగే జరిగియున్నది. మీరు చూశారా? మరియు తరువాత ఆయన కొనసాగుతూ వెళ్ళుచుండెను... నేను, చూడండి కొన్నిసార్లు అది ఒక నిందను తీసుకొని వచ్చును, అప్పుడు ప్రతీ ఒక్కరూ దాని వైపు చూసెదరు. ప్రభువు చేసిన గొప్ప సంగతులను వారు చూడరు. సాతాను చేసిన దానిని వారు చూసెదరు, అన్నిటిని ఒకే వరుసలోనికి నెట్టెదరు. అది ఖచ్చితముగా జరుగుచున్న రీతిగానేయున్నది. వారు అంతటిని విసిరివేయుదురు,
చెప్పెదరు, “మీరు అక్కడేయున్నారు, మొత్తము అంతయూ కలుషితమే. దానిలో ఏమియు లేదు”. మరియు వీరు అలాగే వెళ్ళుచున్నారు. చూశారా? మరియు శత్రువు ఆ విధముగానే చేయును.
8
మరియు ఇప్పుడు కైస్తవులుగా మనము, ప్రతీ సంగతిని గమనించుచూ, ప్రతీ క్షణము అప్రమత్తముగా ఉండవలసియున్నది. సహోదరుడా నేను ఇది తలంచుచున్నాను, మరియు , లేఖనము ద్వారా ఇది నేను ఎరిగియున్నాను, అది ఏ వ్యక్తి అయిన, అది ఎవ్వరైనప్పటికి, ఏమిటి... దైవిక స్వస్థతను నమ్ము ప్రతీ వ్యక్తి ఒక పరిపూర్ణ హక్కును కలిగియున్నాడు, మరియు దేవుడు నీ ప్రార్థనలను గౌరవించును, ఒకవేళ నీవు' రోగులకు ప్రార్ధించినయెడల- రోగుల కొరకు ప్రార్ధించుము. అది నిజము చూశారా? అది ప్రార్థన కాదు; నా ప్రార్ధన సహాయము చేయును; మీ ప్రార్ధన నాకు సహాయము చేయును. చూశారా?
ఈ ఉదయ కాలములో సేవకుల యొక్క అల్పాహార విందులో, నేను... గత రాత్రి వరుసలో చాలా సేపు నిలబడియున్నాను, ఒక చిన్న సహోదరుడు నిలబడియున్నాడు. అది సహోదరుడు కాక్స్ అని నేను నమ్ముచున్నాను, మరియు అతడు ... అనుభూతి చెందెనని చెప్పియున్నాడు, గత రాత్రి కేవలము ఒక గంట నిద్ర మాత్రమే నేను కలిగియున్నాను, కేవలము నన్ను నేను నియంత్రించుకోలేక పోయాను, నేను చాలా సేపు నిలబడియున్నాను. మరియు మేనేజరు నాకు చెప్పియున్నాడు. “మంచిది, తరువాత సారి, నేను ఏమీ చెప్పుచున్ననూ నన్ను తీసుకొని వెళ్ళుము, అని నేను అతడికి చెప్పాను.
మరియు అతడు నాకు చెప్పుచున్నాడు, “నీవు చాలా సేపు చేసితివి, నన్ను లాగుచుండెను, మరియు నేను ఎదురుచూచుచుంటిని, ఎందుకనగా నేను గతరాత్రి సుమారు మూడు, నాలుగు వందల ప్రజలకు ప్రార్ధన చేయగోరాను (చూశారా), వారందరిని ఆ వరుసలో నుండి పంపివేయబడుట ”నేను చూడ గోరాను. మరియు తరువాత, అది దాదాపు వారిలో సగం, వారి యొక్క స్వస్థత గూర్చి సాక్ష్యము ఇవ్వగలరు. అదియే నేను చేయగోరాను. అవును, దానిని గూర్చి అదియే నా ఆలోచన, ప్రతీ ఒక్కరికీ ప్రార్థన చేయుట.
9
ఇప్పుడు, ప్రియ క్రైస్తవ స్నేహితులారా, ఒకవేళ మీరు గమనించిన యెడల, ఖచ్చితముగా, మీ హృదయమంతటితో మీరు నన్ను నమ్మగలిగిన యెడల, ఇదియే మంచి ఉత్తమమైన మార్గము. నేను చెప్పినది మీరు నమ్మినప్పుడు మాత్రమే, నేను మీకు సహాయపడగలను. మరియు ఒకవేళ నేను పరిశుద్ధ గ్రంథమును దాటిపోతే, అప్పుడు మీరు నన్ను నమ్మకపోవుటకు అప్పుడు మీరు“హక్కును కలిగియుందురు.. కానీ ఎంతకాలమైతే నేను మీకు దేవునియొక్క వాక్యమును ప్రసంగించుచూ లేక బోధించుచున్నానో అప్పుడు మీరు నమ్మవలెను. అది నిజమేనా? చూశారా?
ఇప్పుడు, ఇక్కడ, వేదికయొద్ద, మన పరలోకపు తండ్రి, ప్రేక్షకులలో ఏదో సంగతిని చేయును, మరియు ఆయన రుజువు చేయును లేక ఆయన మార్గములను తెలియపరచును, లేక ఎవరినో దేనినుండో స్వస్థపరచును, మరియు అప్పుడు అది సత్యమని మీరు చూచెదరు, మరియు ఇదిగో ప్రజలు వచ్చుచున్నారు, మరియు ప్రతీది ...
10
మరియు గతరాత్రి మీరు గమనించారు, మనము ప్రార్ధనకార్డులను ఎందుకు ఇవ్వవలసియున్నదో, చూశారా? అసలు క్రమమే లేదు; దానిని మీరు చేయలేరు. మరియు ప్రజలను, ఒకవేళ మీరు వరుసలో నుండి తప్పిస్తే, అప్పుడు అదే వారికి చెడు అనుభూతిని కలుగజేయును, మరియు మీరు కేవలము... దైవిక స్వస్థత కూడికను కలిగియున్న ప్రతీ ఒక్క సేవకుడు ప్రార్థన కార్డులను ఇవ్వవలెను. మనము క్రమమును కలిగియుండవలెను. చూశారా? ఒకవేళ మీరు కలిగిలేకపోతే ... పౌలు చెప్పెను సంఘమును క్రమములో ఉంచుము. అది నిజమేనా? క్రమము సంఘమునకు చెందినదే, కనుక మనము చాలా కృతజ్ఞులము.
భవనములో ఉన్న ఒక వ్యక్తికి ఒక ప్రశంసను పంపగోరుచున్నాను. అతడు ఒక రకముగా చాలా తేలికగా గుర్తుపట్టగలిగే వ్యక్తి కానీ మరొక రకముగా చాలా సంవత్సరముల నుండి అతడు నాకు మంచి స్నేహితుడు. ఈరాత్రి అతడు కూడికలో కూర్చొని ఉండుటను నేను చూసాను. అనేక రాత్రులు నుండి నేను అతడిని చూచాను. నా జీవితములో ఆ సహోదరునికి గొప్ప స్థానమున్నది. మరియు మీరు అతడిని చూడవచ్చును, లేక అతడితో మాట్లాడవచ్చును, మరియు అతడు ఒక వింత వ్యక్తి అని తలంచవచ్చును. కానీ నా హృదయపు లోతులో, నేను లోతైన మర్యాదను కలిగియున్నాను. మరియు చుట్టుప్రక్కల నేను కలిగియున్న ప్రతీ కూడికకు అతడు వచ్చియున్నాడు. అతడు రాగలిగిన, లేక ఏదో విధముగా ఎవరెవరినో లిప్టు అడుగుతూ ఉచితముగా అతడక్కడికి చేరుకొనెడివాడు మరియు అతడు ఎన్నడూ ఒక్కరూపాయి, ఒక్కసహాయము, ఒక్క మరేదీ ఎవరినీ అడగలేదు.
11
కొంతకాలము క్రితము, నేను ఒక గొప్ప పట్టణములో ఉన్నాను, మరియు ఈ వ్యక్తి లిప్టుల ద్వారా ఉచితముగా అక్కడకు చేరుకున్నాడు, మరియు నేను ... మరియు అక్కడ కొంతమంది గొప్ప... ఆ పట్టణపు మేయరు వచ్చి మరియు నన్ను చూడగోరెను. నేను ... వారినందరిని వారు బయట వుంచిరి. మరియు ఈ పేద, దీన వ్యక్తి పైన కోటు ఒకటి క్రింద ఫ్యాంటు మరొకటి ధరించుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చెను. నాతో పాటు పడుకొనుటకు అతడిని నేను నా గదిలోనికి తీసుకొని వెళ్ళాను. అతడు నా వైపు చూసి, “ఇది నాకు అర్థము కావట్లేదు”, అని చెప్పెను.
నేను చెప్పాను, “అతడు నా సహోదరుడు. ఏమీ ... నేను పట్టించుకొనను. ఆ పెద్ద ధనవంతులు అని పిలుచుకొనుచున్నవారు తెలుసుకొనగోరుచున్నారు. నేను... చూశారా? అది ఏమైనప్పటికి ... ఆ వ్యక్తి.
మరియు నేను ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడు, మొదటిసారి, పెంతెకొస్తువారు భాషలలో మాట్లాడుచుండుటను నేను చూస్తూ ఉన్నప్పుడు, మరియు నేను చెప్పాను, “దానిని అర్ధము చేసుకొనలేకపోయాను, దానిని చేయలేకపోయాను”.
12
మరియు ఆ వ్యక్తి వచ్చి అతడు భాషలలో మాట్లాడును. అతడు ఒక మంచివాడని నాకు తెలుసు నేను అతడిని గమనించాను. అతడు సిగ్గుపడడు. మరియు నేను లోపలికి ప్రవేశించు ప్రతీసారి... ఈ రోజు నా బాలుడు వచ్చాడు; అతడు నాకు ఒక చిన్న కరపత్రిక ఇచ్చాడు. అతడు చెప్పాడు, “ఆ వీధి మూలన ఈ సహోదరుడు సాక్ష్యమిస్తూ, దేవునిని మహిమపరుస్తూ నిలబడియున్నాడు. నాలుగు సంగతులు మీరు తెలుసుకోవలెనని దేవుడు కోరుచున్నాడు”. మరియు అతడు దాటుకొని వెళ్ళాడు, మరియు నా కుమారుని అతడు గుర్తించలేదు, మరియు అతడు చెప్పాడు, “సహోదరుడా, దేవునికి స్తోత్రము”. “నీవు ఎన్నడైనా సహోదరుడు బ్రాన్హాం కూడికలకు వెళ్ళావా?” అని అడిగాడు. “దేవుడు గొప్ప సంగతులను చేయుచున్నాడు”, అని చెప్పాడు.
హఠాత్తుగా అతడు ఇతడిని చూసాడు, మరియు బిల్లీ చెప్పాడు, “సహోదరుడా, నీవు నన్ను ఎరుగవా?”, మరియు అతడు చుట్టూ చూసాడు.
అతడు చెప్పాడు, “దేవునికి స్తోత్రము”. చెప్పాడు, “అవును నీవు ఎవరివో నేను
ఎరుగుదును“.
13
అక్కడే నీవున్నావు, ప్రతీ స్థలములో, ప్రతీ చోట. మరియు కుర్రవానిగా ఉన్నప్పుడు, అప్పుడే పరిచర్యలోనికి ప్రవేశించియున్నాను, ఒక యవ్వన బాలునిగా, ఒకరోజు ఈ పెద్దవాడైన మర్యాదస్తుడు నా గదిలో కూర్చొన్నాడు, నా మొదటి భార్య చనిపోక ముందు, అక్కడ కూర్చొన్నాడు. మా గృహములో ఏమియూ కలిగిలేము, కేవలము ఒక మడత మంచము. దానిని మేము అతడికి ఇచ్చియున్నాము. మేము వేరొక గదిలోనికి వెళ్ళాము, ఒక చిన్న పాత ఇనుప మంచముపై పిల్లలు పడుకొనియున్నారు. అతడు మా ఇంట్లో ఉండియున్నాడు. మరియు ఒకరోజు అక్కడ కూర్చొనియున్నప్పుడు, నేను అతడిని అర్ధము చేసుకొనలేకపోయాను. ఆత్మీయమైన సంగతులను గూర్చి నాకు ఎక్కువగా తెలియదు మరియు ఆ సంగతిని గూర్చి నేను ఆశ్చర్యపోయాను, అది రుజువుపరచబడక ముందే, మరియు దానిని నా హృదయములో పెట్టుకున్నాను.
మరియు ఒకరోజు అక్కడ కూర్చొనియున్నప్పుడు, అతడు తన కాళ్ళపై లేచి నిలబడి మరియు ఒక వర్తమానమును ప్రసంగించెను, కొంతసేపటి క్రితము ఆ వ్యక్తి చేసినట్లుగా అన్యభాషలో. నేను అతడిని చూశాను, మరియు అతడు నిలబడి మరియు అనువాదమును కూడా ఇచ్చెను. మరియు అతడు చెప్పాడు, “దేవుడు మాట్లాడుచున్నాడు మరియు చెప్పుచున్నాడు. ఇప్పుడు నీవు బాలుడవు మాత్రమే, నీ కొరకు చాలా యవ్వన ప్రాయమున్నది, కానీ ఒకరోజు దేవుడు నిన్ను వాడుకొనును”. మరియు అది నెరవేర్పులోనికి వచ్చినది, ఒక కుర్రవానిగా అది నిజము.
14
సహోదరుడా ర్యాన్, నీ గురించే నేను మాట్లాడుచున్నాను. నీవు కొంచెము నిలబడగలవా? దేవుడు నిన్ను దీవించును. నేను ...అన్యభాషలలో మాట్లాడుటను నేను వినియున్న మొదటి వ్యక్తులలో అతడు ఒకడు. అతడు మార్పు చెందిన క్యాథలిక్ అయ్యియున్నాడు. అతడు ఒక శ్రమజీవి. మరియు నేను అతడిని గమనించాను, మరియ నేను చూసాను, మరియు నేను అతడిని విన్నాను, మరియు నేను అతడి జీవితమును గమనించాను. అతడు చాలా దీనుడు, అతడు నది ఒడ్డున జీవించేవాడు, మరియు కొంతసేపటి తరువాత అతడు బయటకు వెళ్ళిపోయేవాడు, మరియు అతడు... ఎక్కువగా ప్రార్ధనలో మరియు అటువంటి సంగతులలో ఉండేవాడు. మరియు నన్ను ఇటువంటివి వినుటకొరకు కదిలించిన మొదట వ్యక్తులలో అతడు ఒకడు. మరియు తరువాత అతడు... ఏమైనప్పటికి, నేను వీధులలో నిలబడ్డాను. ఒకరోజు నేను పెన్సిల్వేనియాలోని ఈరీలోయున్నాను, మరియు వారు అక్కడ ఒక రకమైన ప్రదర్శన ముఖముపై గడ్డముతో ఉన్నదానిని కలిగియున్నారు, మరియు ఆ పెద్ద సహోదరుడు తలంచాడు, “ఇప్పుడు, ఇదే నా అవకాశము, ఎందుకనగా అతడు పొడుగాటి గడ్డమును మరియు ఒక పొడుగాటి జుట్టు, లేక తన భుజముల వరకు ఉన్న జుట్టును కలిగియున్నాడు.
15
మొదటిసారి నేనతడిని చూచినప్పుడు, అతడు దావీదు గుడారమునకు చెందినవాడని నేను తలంచాను, కానీ అతడు అది కాదు. కాదు, అతడు ఒక పెంతెకొస్తు సహోదరుడు. కనుక నేను బయటకు వెళ్ళాను, మరియు నేను ... భార్య మరియు నేను వీధిలో నడుస్తూ ఉన్నాము, మరియు ఆ తెల్లని గడ్డము మెరిసిపోతూ అతడు ఆ ప్రక్కగా నిలబడి యుండుటను మేము చూచాము, దీనిని పాడుచూ ఉన్నాడు : ఇది ఆ పాతకాలపు మతము, ఇది ఆ పాతకాలపు మతము, ఆ విధముగా, కరపత్రికలను పంచుతున్నాడు మరియు అతడు నన్ను చూచిన వెంటనే, వెనుకకు జరుగుటకు అతడు ప్రయత్నించెను.
అతడు చెప్పాడు... నా భార్యతో కూడా చూచాడు. నేను అక్కడకు వెళ్ళి మరియు అక్కడే, అతడి చుట్టూ నా చేతులు వేశాను. “దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా ర్యాన్”, అని చెప్పాను.
అతడు అన్నాడు, “సహోదరుడా బ్రాన్హాం నేను నిన్ను ఇబ్బంది పెట్టానేమో అని అనుకొన్నాను, ”నేను వెనుకకు వెళ్ళెదను అని తలంచాను“, అని చెప్పాడు.
“నన్ను ఇబ్బంది పెట్టావా? సహోదరుడా, నీవు నా సహోదరుడవు. ఇబ్బంది పెట్టుట మరేమియూ లేదు. అతడు నా సహోదరుడు. సహోదరుడు ర్యాన్‌ను ప్రేమించుటను మనము నేర్చుకున్నాము. మరియు మనము వెళ్ళు ప్రతీ చోటుకు అతడు ఎవరినో లిఫ్ట్ అడిగివచ్చును, అతడి భార్యను మరియు అందరిని తీసుకొని వచ్చును. మరియు ఓహ్, మై, వీధులలో అతడు సాక్ష్యమిచ్చుచుండెను. మరియు జనులు ఉత్తరముల ద్వారా నాకు వ్రాయుటను నేను విన్నాను, వ్యాపారస్తులు, మరియు అటువంటి వారందరూ, ”జాన్ ర్యాన్ అను పేరు గల వ్యక్తి, పొడవాటి గడ్డము, ఇక్కడకు వచ్చి, జరుగుచున్న గొప్ప సంగతులను గూర్చి చెప్పియున్నాడు,“ అని వారు చెప్పెదరు.
16
ఇప్పుడు, దేవుడు తన బహుమానమును తీసుకొని వచ్చినప్పుడు, ఈ దినములలో ఒక దినమున, అర్హునిగా అతడు కిరీటము పొందుకొనుటను నేను చూచినప్పుడు అతడి ప్రక్కగా నేను నిలబడగోరుచున్నాను. అది సరే. ఆయన వాక్యములో నుండి ఒక చిన్న భాగమును, ప్రభువు యొక్క వాక్యములో నుండి ఇప్పుడు, చదివెదము. గౌరవము ఏ వ్యక్తికీ ఇవ్వకుండా, కానీ ఆ దృశ్యముగా ఆ వెనుకను కూర్చొని ఉన్న ఆ చిన్న వ్యక్తులు... గత దినమున, కూడిక కొరకు ఎదురు చూస్తుండగా, మరియు జనులు, వారు తలుపులు తెరుచుటకు ముందు, అని నేను తలస్తూ ఉన్నాను, నేను ఆ ట్రక్కులో ఉండి దాటుకొని వెళ్ళుట జరిగినది, మరియు ఆ కుడి ప్రక్కగా చూచినప్పుడు, మరియు అక్కడ సహో. ర్యాన్ తన పరిశుద్ధగంథముతో ఉండెను, బోధిస్తూ, ఒక్క క్షణం విడిచిపెట్టకుండా, మరియు ప్రతీది. అందరమూ ఆ విధముగా ఉందుము గాక. మీరు ఏమి చెప్పెదరు? మనమందరమూ బయటకు వెళ్ళి మరియు దీనిని ప్రతీచోటా చెప్పి, ఎవరో ఒకరిని తీసుకొని వచ్చెదము గాక.
ఇప్పుడు, ప్రార్ధన కొరకు, నేను దీనిని చెప్పెదను : లేఖనములోని ఒకచిన్న భాగమును చదువుటకు నేను ఆశించుచున్నాను, మరియు అప్పుడు నేను ప్రార్ధనా వరుసను ప్రారంభించెదను. చాలా వేడిగా ఉన్నది.
కానీ ఇప్పుడు, దేవుని చిత్తమైతే, రేపు రాత్రి, శనివారము రాత్రి కనుక, త్వరగా వచ్చెదము గాక. మరియు ఆదివారము మధ్యాహ్నము, ఒకవేళ దేవుని ... ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది నా జీవితకథను వినెదరు? చూద్దాం? మీరందరూ వచ్చెదరని నేను తలస్తున్నాను. లేదా? మీలో దానిని వినినవారు, దానిని మరొక సారి వినగోరుచున్నారా, మీ చేతులను చూడనివ్వండి, ఒకవేళ మీరు ...అయితే సరే. ఆదివారము మధ్యాహ్నము, జీవిత కథ.
17
ఇప్పుడు, నేను ఏదో మిమ్ములను అడుగగోరుచున్నాను. మీకు తెలిసిన విధముగా, బయటకు వెళ్ళి మరియు పాపులందరినీ తీసుకొని రమ్ము మీరు పొగిడైనా, వారిని ఆదివారము మధ్యాహ్నమునకు తీసుకొని రమ్ము. ఆదివారము రాత్రి, మన గొప్ప ముగింపు కూడిక, ఇక్కడ మనమొక గొప్ప ముగింపును ఆశించెదము. ఒకవేళ మనకు సాధ్యమైతే, ఆ రాత్రే, మనము ఒక్క వ్యక్తినైననూ విడిచి పెట్టగోరుట లేదు, కానీ మనము పొందగోరునది పొందుకొనెదము.
ఇప్పుడు, ఈ రాత్రి నేను ఒక లేఖనమును చదువగోరుచున్నాను, ఒక్క క్షణం, మరియు అప్పుడు మనము మన ప్రార్ధనా వరుసను పిలిచెదము, యోబు 42లో కనుగొనెదము. ఎందుకో తెలియదు ఈరోజు, చదువుటకు ప్రయత్నించుచుండగా, బైబిలులో ఈ స్థలమునకు మళ్ళీ మళ్ళీ నేను వచ్చుచుంటిని. మరియు 8వ వచనము దగ్గర ప్రారంభించి, 8వ వచనములో కొంత భాగమును నేను చదివెదను. సహోదరుడు బాక్స్‌టర్ ఈ రాత్రి వెలువరించిన ఆ అద్భుతమైన, ప్రేరేపించబడిన వర్తమానము ప్రసంగించిన తరువాత నేను మాట్లాడుటకు ఇష్టపడగోరుట లేదు. అది చాలా అద్భుతమైనది.
కాబట్టి యేడు ఎడ్లను, ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని, నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మరియు మీ... అర్పింపు... (నన్ను క్షమించండి)... మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను.
18
నేను ఎక్కడ... చూడండి ఎక్కడైతే నేను నా చెమటను దాని మీద పడనిచ్చానో, అక్కడ అది చెరిగిపోయినది. నేను మళ్ళీ దానిని తిరిగి చదివెదను, చూడండి నేను సరిగా చదువుచున్నానా లేదని.
కాబట్టీ యేడు ఎడ్లను, ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని, నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్ధన చేయును. అతనిని బట్టి నేను అంగీకరించెదను.
19
అది ఒకరికొరకు ఒకరు ప్రార్థించుట, ప్రార్థన యొక్క విలువ. ఇప్పుడు, వచ్చియున్న ఈ సలహాదారులు, వచ్చి మరియు యోబు ముందు కూర్చొని, అతడు ... అది పరిశుద్ధ గ్రంథములోనే అత్యంత పాత పుస్తకము. బహుశా ... యోబు సుమారు నిమ్రోదు యొక్క కాలమున జీవించెను, మరియు ఆ సమయమున, షేతు నుండి అబ్రహాము వంటి కాలమున. మరియు అది... యోబుగ్రంథము, ఆదికాండము కన్నా ముందే వ్రాయబడినది. కానీ అతడు ఒక యాజకుడు మరియు రాకుమారుడు. మరియు అతడు ప్రభువును ప్రేమించెను. మరియు దేవుడు అతడిని దీవించెను, అతడిని ఒక గొప్ప వ్యక్తిగా చేసెను. మరియు అప్పుడు సాతాను వచ్చెను ... ఇప్పుడు, ఇక్కడే మీరు గమనించాలని నేను కోరుచున్నాను: సాతాను దేవుని యొక్క కుమారులతో వచ్చి, వారి మధ్యలోనే కూర్చొని, మరియు యోబుతో మాట్లాడుటకు ప్రారంభించెను, లేక మాట్లా ... దేవుడు కూడా భూమిని గూర్చి మాట్లాడుట ప్రారంభించెను.
ఆయన వలికెను, “సాతానా”, “నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా?
అతడు యధార్ధవర్తనుడు, భూమి మీద అతనివంటివాడెవడును లేడు“ అని పలికెను.
20
అపవాది చెప్పెను, “ఓహ్, అవునా”, “నీవు అతని చుట్టూ కంచె వేసితివి. నీవు అతనిని దీవించుచున్నావు, మరియు నీవు అతనికి ఇవ్వగలిగిన ప్రతీ దానిని ఇచ్చుచున్నావు”,
“ఖచ్చితముగా, అతడు నిన్ను ఆ విధముగానే సేవించును, ”ఒక్కసారి అతడిని నాకు అప్పగింపుము, మరియు అతడు నీ ముఖము యెదుటనే నిన్ను దూషించులాగున చేసెదను“, అని చెప్పెను.
“ఇప్పుడే”, “అతడు నీ యొద్దనే యున్నాడు. నేను కంచెను తెంచివేసెదను, కానీ అతని ప్రాణమును ముట్టవద్దని” ఆయన చెప్పెను.
మరియు సాతాను అతడి ప్రాణమును తీసుకొనుట తప్ప అన్నియూ చేసెను. అతడి యొక్క బిడ్డలను వాడు తీసుకొనెను. పుండ్లతో అతనిని మొత్తెను, అతని సంపదనంతటినీ వాడు నాశనము చేసెను. అతనిని ఒక బీకారిగా మార్చెను; మరియు అతడు ఆ వెనుక, అక్కడ, అతడు ఒక బూడిదె కుప్పపై కూర్చొనెను. నేను అనుకొనుచున్నాను, ఒక చిల్ల పెంకుతో, లేక మరేదో, తన శరీరముపై ఉన్న పుండ్లను దానితో గోకుచుండెను. అతని భార్య తలుపు నొద్దకు వచ్చి మరియు “ఓహ్, యోబూ, నీ పరిస్థితి చాలా దయనీయము, ఎందుకు నీవు దేవుని దూషించి మరియు చనిపోకూడదు?” అని పలికెను.
“అమ్మా, ఎందుకు నీవు బుద్ధిలేని దానివలె మాట్లాడెదవు, దేవుడు ఇచ్చెను; దేవుడు తీసుకొనెను; ప్రభువు నామమునకే దీవెనలు కలుగును గాక”, అని అతడు చెప్పెను.
21
ఇప్పుడు, గమనించుము. శ్రమల గుండా వెళ్ళిన ఆ వ్యక్తి, శుద్దీకరించబడిన ఆ వ్యక్తి, ,దేవుడు ఇప్పుడు ఒక పాపితో వ్యవహరించుటలేదు; ఆయన ఒక పరిశుద్దునితో వ్యవహరించుచుండెను. చూశారా? దేవుని ద్వారా శుద్దీకరించబడుచున్న ఒక వ్యక్తి అతడు అనేక కష్టముల మధ్య ఇంకా దేవునిని సేవింపగల మర్త్యులు ఉన్నారని సాతానుకు రుజువు చేయుచుండెను
మరియు అతడు చెప్పెను, “నీవు ఒక బుద్ధిహీనురాలు వలె మాట్లాడుచున్నావు”.
ఇప్పుడు, ఆమె బుద్ధిహీనురాలు అని అతడు ఎన్నడూ చెప్పలేదు. ఆమె ఒక బుద్దిహీనురాలు వలె మాట్లాడుచున్నది అని అతడు చెప్పెను. ప్రభువు ఇచ్చెను; ప్రభువు తీసుకొనెను; ప్రభువు నామము దీవించబడును గాక“.
22
ఇక్కడ ఈ మంచి సలహాదారులు లేక సంఘసభ్యులు వచ్చియున్నారు. యోబు అతడు జన్మించిన ఆ దినమును శపించెను. “నక్షత్రములు రాత్రి ప్రకాశింపకుండును గాక లేక సూర్యుడు పగలు ప్రకాశించకుండును గాక”, అని అతడు పలికెను. కానీ అతడు దేవునిని దూషించలేదు మరియు అక్కడే, అపవాది అతనిని చాలా శిథిలావస్థకు తీసుకొని వచ్చెను.
అప్పుడు అతని స్నేహితులలో కొందరు వచ్చెను, మరియు అతనిని ఓదార్చుటకు బదులుగా, అతడు ఒక రహస్య పాపియని అతనిని నిందించెను. ఇక్కడ ఈ చక్రాల కుర్చీలో ఉన్న ఈ స్త్రీని, ఆ పడక మీద ఉన్న ఆ యవ్వనస్తుడిని, పక్షవాతముతో బాధపడుచున్న ఆ చిన్న బిడ్డను, అక్కడ నిలబడియున్న ఆ తండ్రిని, బహుశా వారు ఒక రహస్యపాపిగా ఉన్నారని, లేక మీరు ఏదో చేసియున్నారు కనుకనే అని వారు నిందించెదరు. ఎల్లప్పుడూ అలాగు ఉండదు.
ఒకసారి యేసు చెప్పెను, శిష్యులు అడిగిరి, “ఎవడు పాపము చేసెను, గ్రుడ్డివాడు, ”అతడా, అతడి తండ్రా, అతడి తల్లా?“
ఆయన చెప్పెను, ఈ విషయములో, ఎవరునూ పాపము చేయలేదు, కానీ అది దేవుని క్రియలు అతడియందు ప్రత్యక్షపరచబడుట కొరకే, మహిమ“.
23
యోబు పాపము చేయలేదు; అతడు పాపము చేయలేదు అని అతడు ఎరిగి యుండెను. మరియు అతడు పాపము చేయలేదు, కనుక అతడు ఒప్పుకొనడు, ఎందుకనగా అతడు సంపూర్తిగా ఎన్నడూ పాపము చేయలేదు. కానీ దేవుడు నిజముగా అతనిని పరీక్షించుచుండెను, అతనికి పరీక్ష పెట్టుచుండెను మరియు తిరిగి జన్మించిన ప్రతీ క్రైస్తవుడు, ఈ పరీక్షల గుండా వెళ్ళవలసియున్నదని నేను నమ్ముచున్నాను. దేవునియొద్దకు వచ్చు ప్రతీ కుమారుడూ మొదటగా శిక్షింపబడి పరీక్షించబడవలెను. అది నిజమేనా? ఒకవేళ నీవు దేవుని ద్వారా పరీక్షించబడకపోతే, నీవు ఒక దుర్భర జీవి లేక ఒక అక్రమ సంతానము. దేవుడు నా తండ్రియని నీవు చెప్పుకొనుచూ, మరియు ఆయనను గూర్చి నీవు ఏమియూ ఎరుగవు. చూశారా? ఒక నిజమైన, సత్యమైన, తిరిగి జన్మించిన దేవుని యొక్క బిడ్డ స్థిరముగా నిలబడును. మనము క్షయము కాని దేవుని యొక్క విత్తనముద్వారా విత్తబడ్డాము; అది నశించదు. నేను ఏమి చెప్పుచున్నానో గ్రహించండి?
24
ఇప్పుడు, ఒకవేళ మీరు ఎత్తు మరియు పల్లములు కలిగిన ఒక దారిని కలిగి యున్నారని మీరు చెప్పవచ్చు, మరియు ఎత్తు పల్లములు, మరియు మీరు నిజముగా తిరిగి జన్మించేటంతటి వరకూ, నీవు దేవుని దగ్గరకు వెళ్ళి మరియు అక్కడే వేచియుండమని నేను నీకు సలహా ఇచ్చుచున్నాను. శ్రమలు, మరియు ఇబ్బందులు మరియు గుండెనొప్పులు, మరియు నిరుత్సాహములు వచ్చినప్పుడు, ఏదో పట్టుకొనును, అది నీవు పట్టుకొనుట కాదు; ఏదో నిన్ను పట్టుకొనుచున్నది. చూశారా? అది నేను పట్టుకొని యున్నానా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఆయన పట్టుకొని యున్నాడా లేదా అన్నదే ప్రశ్న. అది నా వైపు చూచుట కాదు; అది ఆయన వైపు చూచుటై యున్నది. అది ఆయనే ఒకవేళ నేను ... కొంతకాలం క్రితము, ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చాడు, “సహోదరుడా ”బ్రాన్హాం, రక్షింపబడుటకు నేను యోగ్యుడను కాను“, అని చెప్పాడు.
నేను చెప్పాను, “లేదు, అలాంటిది ఏమీ లేదు.”
మరియు అతడు ఏడ్వడం ప్రారంభించాడు. “రక్షింపబడుటకు పంతొమ్మిది వందల నలభై నుండి నేను ప్రయత్నించాను అని అతడు చెప్పాడు.”“కానీ నన్ను నేను యోగ్యునిగా కనుగొనలేక పోయాను, అని చెప్పాడు.
“నీవు ఎన్నడూ యోగ్యునిగా ఉండలేవు”, అని చెప్పాను.
“అయితే నేను ఎన్నడూ రక్షింపబడలేను”, అని అతడు చెప్పాడు.
25
నేను చెప్పాను, “ఓహ్, లేదు. అది నీవు కాదు; అది ఆయన.” చూశారా? “దేవుడు నిన్ను చూడడు. ఆయన ఆయన వైపే చూచును. మరియు ఒకవేళ అతనిలో నీవు ఏ తప్పిదమునైనను కనుగొనిన యెడల, అప్పుడు నీవు రక్షింపబడలేవు. కానీ ఒకవేళ ఆయనలో ఏ తప్పిదము లేనియెడల, అప్పుడు నీవు సరైనవాడిగా ఉందువు. ఆయనలో నీవు కనుగొనిన ఆ మచ్చ అది నీపైనే ఉన్నది. కానీ ఒకవేళ నీలో ఏ మచ్చ లేకున్నయెడల... ఆయనలో, అప్పుడు నీలో యే మచ్చ ఉండదు”.
“సహోదరుడా బ్రాన్హాం, నేను దానిని చూచుచున్నాను, నేను దానిని చూచుచున్నాను, అని అతడన్నాడు.
అతడు అరవాలని కోరాడు. నేను చెప్పాను,“మొదటిగా సరిచేసుకొనుము, పిదప అది తరువాత జరుగును. మీరు చూశారా?”
26
కనుక అక్కడ, యోబు, అతడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయలేదని అతడు ఎరిగినప్పుడు... కానీ ఒకవేళ ఒక వ్యక్తి యదార్థవంతుడైతే, ఒక మనుష్యుడు యదార్ధవంతుడైతే, తల్లి తన బిడ్డను ఇక్కడకు తీసుకొని వచ్చుచున్నది, ఒక గ్రుడ్డివాడు తన కర్రను పట్టుకొని ఇక్కడ కూర్చొనియున్నాడు, తిన్నగా నా ముందే కూర్చొని యున్నాడు, ఒక స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది, ఆమె కాళ్ళకు అవిటి పరికరములు పెట్టు కొనియున్నది, మరియు చంక కర్రలు, వేరే వారందరూ వారు చుట్టూ పడి యున్నారు... బహుశా చనిపోతూ ఒక స్త్రీ ఇక్కడ పడియున్నది, నాకు తెలియదు, మరియు మరణావస్థలో. మరియొకరు ఇక్కడ పడియున్నారు... కొంచెము దానిని చూడుము. బహుశా కొందరు, ఆ జనులలో అక్కడ కూర్చొనియుండవచ్చు, గుండె వ్యాధితో, అది ఎవరి ముందైనా వెళ్ళును; హృద్రోగము అదియే మొదటి శత్రువు.
కానీ దేవుడు దేవునిగా ఉండాలంటే ఆయన తన వాగ్ధానమును నిలబెట్టుకొనవలసియున్నది. ఒకవేళ ఆయన తన వాగ్ధానమును నిలబెట్టుకొనని యెడల అప్పుడు ఆయన దేవుడు కాదు. ఇప్పుడు, ముఖ్యమైన సంగతి ఏదనగా, అది దేవునియొక్క చిత్తమా కాదా అని కనుగొనవలసియున్నది. వెళ్ళుటకు అది చాలా సులువు ... ఒకవేళ, “రేపు, ఇక్కడ ఈ జనుల యొద్దకు రమ్ము అని దేవుడు చెప్పినయెడల”, మరియు ఇక్కడ నిలబడి, మరియు అది దేవుని కుమారుడే అని మనము నిజముగా ఎరిగియున్న యెడల, ఆయనను యెరిగి, మరియు చెప్పెను, “వెళ్లవద్దు మీ అందరిలో రేపు ఎవరైనా ... రోజంతయూ వర్షము కురవబోవుచున్నది.”
27
మంచిది, నేను ఇంటికి వెళ్ళి, మరియు మంచము పైకి వెళ్ళి, “నేను రేపు బయటకు వెళ్ళుట లేదు, ఎందుకనగా రేపు రోజంతా వర్షము కురవబోవుచున్నది”, అని చెప్పుట చాలా సులువు. చూశారా? ఎందుకనగా ఒకవేళ ఆయన అలాగు చెప్పినచో, వర్షము కురియును. మీరు దానిని నమ్మెదరా? దేవుని యొక్క చిత్తము ఏమి అని మీరు తెలుసుకొనినప్పుడు, అప్పుడు మీరు ఇక్కడ దేవుని యొక్క వాక్యమును చూడగలరు, మరియు మీ కొరకైన దేవుని యొక్క చిత్తమును కనుగొనగలరు. ఆది మీరు నమ్మెదరా?
ఈ మరి యొకటి చేయు ఒకే ఒక సంగతి అది వ్యక్తిగతముగా సరిచేయుటయే. చూశారా? ఇది సంఘమంతటి కొరకు, ప్రతీ ఒక్కరి కొరకు. మరియు ఒకవేళ మీరు విశ్వాసము అవలంభించి, మిమ్ములను మీరు శుభ్రపరచుకొని, లేక, యేసుక్రీస్తును అంగీకరించి, మరియు ఆయనను నమ్మిన యెడల అది దేవునియొక్క వాక్యమును నెరవేర్చుటకు బద్దుడైయున్నది, ఎందుకనగా అది ఒక విత్తనమై యున్నది.
28
ఇప్పుడు, అతడు పాపము చేయలేదని యోబు ఎరిగియున్నాడు. కాబట్టి, ఆ (శమలన్నిటి తరువాత, మరియు ఆ ఇబ్బందులన్నీ యోబు ఓపిక పట్టియున్నాడు. దానిని గూర్చి ఏదో ఉన్నది, అది దేవుడు అతనిని ప్రేమించుచున్నాడని అతడు ఎరిగి యున్నాడు, మరియు అతడు దేవునిని ప్రేమించెను.
ఇప్పుడు, గమనిoచుడి. తరువాత తూర్పు నుండి ఎలీహు అను పేరు గల, ఒక చిన్న రాకుమారుడు వచ్చియున్నాడు . దాని అర్ధము, ఓహ్, లేక యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యము, ఇప్పుడు, అతడు యోబు యొద్దకు వచ్చినప్పుడు, అతడు చెప్పెను, “నా యవ్వనమును దూషించవద్దు, ఎందుకనగా నేను నీకన్నా చిన్నవాడను. నీవు ఒక వృద్ధ ఋషివి, బహుశా ఒక నూటయాభై, లేక వంద సంవత్సరములు, లేక ఏదైనా. మరియు నేను బహుశా ఒక యవ్వనస్తుడను, కానీ నా యవ్వనమును ద్వేషింపవద్దు ”.
మొదటగా, అతడు యోబును సరిచేయుటకు ప్రారంభించెను, అతడు ఎక్కడ తప్పు చేసెనో, దేవునిని దూషించుట, మరియు అటువంటి సంగతులు. అప్పుడు అతడు యోబుతో మాట్లాడుట ప్రారంభించినప్పుడు, ఒక పాపిగా కాదు... ఇదియే నాకు అర్థమైనది. ఒక పాపిగా కాదు... అతడు... మరియు యోబు చెప్పుటకు ప్రారంభించెను, “ఇప్పుడు, నేను... అది సరియే, ఒక వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చును, లేక ఒక పుష్పము చనిపోయిన, ఎందుకు, దానియొక్క చిన్న రేకులు రాలిపోయిన, మరియు చిన్న విత్తనము భూమిలోనికి వెళ్ళిపోయిన, మరియు ఒక సమాధి క్రమము వలె వర్షము వచ్చి దానిని పాతిపెట్టిన, ఆకాశములు ఏడ్చుచూ, వాటికి ఒక నిరీక్షణ కలదు. మరియు అక్కడ పడియున్న ఆ చిన్న విత్తనము, మరియు అది పగులుగొట్టుకొని, మరియు దానిలోయున్న సారము బయటకు వచ్చి, మరియు అప్పుడు ప్రతీది పోయినప్పుడు... కానీ అది ఆ పుష్పము యొక్క ముగింపా?” లేదయ్యా.
29
ఇండియానాలో ఉన్న ఓ స్తీ, నీవు పూలచెట్లను పాతియున్నావు, దానిని గూర్చి నీవు చింతించనవసరము లేదు. ఒక చిన్న విత్తనము అక్కడ పడియుండెను, మరియు తరువాత వచ్చే శీతాకాలములో, ఆ పువ్వు తిరిగి ఇక్కడ వచ్చును. ఆ చిన్న విత్తనము యొక్క జీవమును గూర్చి విజ్ఞానశాస్తములో కనుగొనుటకు ఈ లోకములో ఏదియూ లేదు. సారము పోయినది. విత్తనము పోయినది. వేరులు ఎండి -పోయినవి, మరియు ప్రతీది, కానీ ఆ పువ్వు తిరిగి జీవించెను.
అది తిరిగి జీవించుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. అవును, ఒకవేళ ఒక పువ్వు తిరిగి జీవించుటకు ఆయన ఒక మార్గమును ఏర్పరచిన యెడల మరి ఆయన యొక్క పోలికలో చెయ్యబడిన దేవుని యొక్క కుమారుని సంగతి ఏమిటి? యోబు చెప్పుచున్నాడు, “ఒక వ్యక్తి మరణించినప్పుడు, అవును, అతడు తన ఆత్మను విడిచిపెట్టును. అతడు నశించును. అతని యొక్క కుమారులు వచ్చి ఏడ్చును, ఏదో కార్యము చేయును, మరియు అతడు దానిని పొందుకొనడు, అటువంటి కార్యము. నేను అర్ధము చేసుకొనలేను, ఒక పువ్వు - ఒక విత్తనము పాతిపెట్టబడుట నేను చూశాను, అది తిరిగి జీవించును. పువ్వు చనిపోవుటను నేను చూశాను, అది తిరిగి వికసించెను. కానీ ఒక వ్యక్తి పాతిపెట్ట బడినప్పుడు, తన ఆత్మను విడిచిపెట్టినప్పుడు, మరియు అతడు ఎక్కడ ఉండును?” చూశారా? “అతడు తిరిగిలేవడు”.
30
అప్పుడు ఎలీహు అతడిని సరిచేయుటకు ప్రయత్నించెను. ఇప్పుడు, దీనిని ఒక చిన్నపిల్లల నాటిక రూపములో నేను చెప్పెదను, ఇక్కడ. ఇప్పుడు, అతడు చెప్పెను, “యోబూ, నీవు ఆ పువ్వులను గమనించుచున్నావు. అవి దేవుని యొక్క మార్గములో ఉన్నవి; అవి పాపము చెయ్యలేదు; పాపము అనునది దానిలో ఏమియూ లేదు. కానీ మానవుడు పాపము చేసెను, మరియు ఆ కారణము చేతనే అతడు భూమిలో పాతిపెట్టబడినప్పుడు మీరు అతనిని ఇక ఏ మాత్రము చూడలేరు. అతడు హెడెస్, లేక పాతాళమునకు వెళ్ళును, మరియు నీవు ఇక ఏ మాత్రము అతనిని చూడవు. కానీ ఇంకను, యోబు, ఒక్కడు వచ్చుచున్నాడు, ఒకే ఒక్కడు, ఖాళీలో నిలబడేవాడు, తన చేతులను ఒక పాపయుక్తమైన మనిషిపై యుంచి, మరియు ఒక పరిశుద్ధ దేవునిపై, మరియు అగాధమునకు వంతెన వేయును, మరియు అతని స్థానములో నిలబడును, మరియు అతని కొరకు విజ్ఞాపన (మధ్యవర్తిత్వం) చేయును. అప్పుడు మానవుడు తిరిగి లేచెను.”
మరియు అప్పుడు, యోబు, ఒక ప్రవక్తగా ఉండి, ఆత్మవశుడాయెను; ఉరుములు ఉరుముటకు ప్రారంభించెను, మెరుపులు మెరిసెను. యోబు తన కాళ్ళపై నిలబడెను, మరియు చెప్పెను, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును, మరియు అంత్యదినములలో ఆయన భూమి మీద నిలుచుననియు: ఈ శరీరమును పురుగులు తినివేసినను, ఇంకనూ నా శరీరముతో నేను దేవుని చూచెదను“ పునరుథ్థానము యొక్క ఒక దినము రాబోవుచున్నది అని అతడు యెరిగియుండెను. ”అంత్యదినములలో,“ బహువచనము (చూశారా?), గత రెండు వేల సంవత్సరములు, ”నా విమోచకుడు ఈ భూమిపై నిలబడును.“
31
“నా శరీరము ఆశతో విశ్రాంతి పొందుచున్నది, ఎందుకనగా కుళ్ళు పట్టుటకు నా పరిశుద్దుని విడిచిపెట్టడు, మరియు ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు,” అని దావీదు కేకలు వేయుటలో ఆశ్చర్యము లేదు.
వెనుక అంతయూ కూడ, అంతా కల్ప్వరినే సూచించుచున్నది. పిదప, యేసులో రక్షణ యొక్క సంపూర్ణత ఉండెను, దైవిక స్వస్థతయొక్క సంపూర్ణత, ఒకవేళ ఇప్పుడు దైవిక స్వస్థత అనునది లేకపోతే, మృతుల యొక్క పునరుద్దానము లేదు. ఓహ్, మీ కొరకు దాని మీదుగా వెళ్ళుటకు ఇష్టపడెదను. అది నిజము. మనము మన స్వాస్థ్యము యొక్క ప్రథమ ఫలములను కలిగియున్నాము. (అది నిజమేనా?) మన రక్షణయొక్క సంచకరువు.
అది నిజమేనా?
మనము కలిగియున్న ఆ చిన్న తాకిడి, నేను ఆ తెరయొద్దకు నడిచినప్పుడు, కొంతసేపటి క్రితము, మరియు వారు కేకలు వేయుచున్నారు, మరియు దేవునిని స్తుతించుచున్నారు, మరియు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుచున్నది, మరియు కన్నీళ్ళు చెంపలపై కారుచున్నది, “యేసు యొక్క శక్తిగల నామమునకే స్తుతి అంతా”, అని అతడు పాడుచుండగా మనము అది కలిగియున్నాము. ఈ ఉదయకాలమున నేను నిలబడి, మరియు ఆ చిన్న ప్రేమ గీతమును ఈ ఉదయము నేను వినినప్పుడు, పాడిన ఆ అందమైన కీర్తన, ఈ రాత్రి వారు తిరిగి పాడియున్నారని నేను నమ్ముచున్నాను. మరియు అక్కడ వున్న ఆ కైస్తవులు, యుద్ధములో దెబ్బలు తిన్న ఆ వృద్ధ సైనికుడు, మరియు కన్నీళ్ళు వారి చెంపలగుండా కారుచున్నవి, అది ఏమిటి? అది వారి రక్షణ యొక్క సంచకరువు. అక్కడవున్న పరిశుద్దాత్మ, సంచకరువు ...సంచకరువు అనగా వాయిదాలకు ముందుగా చెల్లించే సొమ్ము కేవలము ... దానిని మనకొరకు ఉంచుకొనుటకు కొంత మొత్తము.
32
అయితే ఒక రుజువు ఉన్నది. అవునయ్యా. అది మన పైకి వచ్చినప్పుడు, అది పాపము యొక్క కోరికను మనలో నుండి తీసివేయును. మనకిక పాపము చేసేకోరిక ఉండదు : ఆరాధికుడు ఒకసారి శుద్దీకరించబడెను. అయితే ఏదో ఒకరోజు అది పరిపూర్ణమైనప్పుడు, “యేసు యొక్క శక్తి గల నామమునకే జయమూ, అని ఆ దూతలయొక్క సమూహము పాడుచు వుండుటను మనము నిలబడి మరియు వినుచున్నప్పుడు అది ఏమైయుండును? అవలిగట్టున అది ఏమైయుండును? నేను ఏమి చెప్పియున్నానో చూసారా? ఇప్పుడు, ఒకవేళ మన విమోచింపబడిన శరీరముల యొక్క సంచకరువు దైవిక స్వస్థత అయ్యున్న యెడల ...
ఇక్కడ క్యాన్సర్‌తో చనిపోతున్న ఒక స్త్రీ పడియున్నది. మన వైద్యులు , మన భూసంబంధమైన వైద్యులు ఆమె యొద్దకు నడిచి మరియు చెప్పెదరు, “చేయుటకు ఏమియూ లేదు”.
చనిపోయెదరని చెప్పబడిన వారియొక్క పట్టిక నేను మీ కొరకు తీసుకొని వచ్చెదను, బహుశా మూడు లేక నాలుగు సంవత్సరముల క్రితమే చనిపోవలసినవారు, మరియు ఈ రాత్రి వారు ఆ క్యాన్సర్ యొక్క జాడలేక మరి ఏదైనా కనుగొనలేరు. ఏమి జరిగినది? వైద్యులు చెప్పుచున్నారు, “నాకేమియు తెలియదు. ఏమి జరిగినదో నాకు తెలియదు.”
33
మన విమోచింపబడిన శరీరము యొక్క సంచకరువు... మరియు ఒకవేళ నా పుస్తకములో వున్న రెడ్‌క్రాస్ సంస్థయొక్క వ్యవస్థాపకురాలు అయిన ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క మునిమనువరాలైన శ్రీమతి ఫ్లారెన్స్ నైటింగేల్ అనే క్యాన్సర్‌తో బాధపడుచున్న ఒక రోగియొద్దకు దేవుడు దిగి రాగలిగెను. ఒకవేళ అటువంటి దీన దౌర్భాగ్యురాలై అక్కడ పడి యున్న ఆమర్మ్యురాలు యొద్దకు, కనీసము ఆమె తన చేతిని కూడా పైకి లేపలేదు, కరచాలనము చేయుటకు, మరియు నాకు వినబడగలిగేలా కూడా మాట్లాడలేని ఆమె యొద్దకు దేవుడు దిగి రాగలిగిన యెడల ... మరియు ఒక నూటయాభై అయిదు పౌoడ్లతో పరిపూర్ణ ఆరోగ్యము గల దానిగా ఆమెను వుంచెను. అదియే మన విమోచింపబడిన శరీరము యొక్క సంచకరువు.
ఈ దినములలో ఒక దినము, నా శరీరము ఒక స్పూన్ బూడిద తప్ప మరి ఏమి కాదు, కానీ దేవుడు యేసుక్రీస్తును పంపును, మరియు క్రీస్తు నందు మృతులైన వారందరు లేచి మరియు ఆయనతో పాటు వచ్చును, ఆయన పోలికలో చేయబడినవారు. మీరు దానిని నమ్మారా? అది ఏమిటి? ప్రార్ధన.
34
౩4. ఇప్పుడు, హేళన చేసిన ఈ మనుష్యులు, మరియు యోబును గూర్చి ఒక రకమైన అపహాస్యం, దేవుడు వారికి చెప్పెను, మీరు వెళ్ళి ఒక అర్పణమును తీసుకొని యోబు యొద్దకు వెళ్ళుము, నీతిమంతుడైన నా సేవకుడు. నేను మిమ్ములను వినను, ఎందుకనగా మీరు చాలా తప్పిదమును చేసియున్నారు. మీరు సత్యము కొరకు నిలబడలేదు. మీరు సరైనదానిని చేయలేదు. కాబట్టి, మీరు ఒక దహనబలిని తీసుకొని, వెళ్ళి మరియు ఒక బలి అర్బణను అర్పించుము, మరియు నా సేవకుడైన యోబును మీ కొరకు ప్రార్థించమని అడుగుము, యేలయనగా నేను అతనిని వినెదను.“
మీరు అక్కడే ఉన్నారు. ప్రార్ధన సంగతులను మార్చును, అవునా? “వెళ్లి నా సేవకుడైన యోబును అడుగుము, మరియు అతడిని మీ కొరకు ప్రార్థింపనిమ్ము, ఎవరైతే శ్రమల గుండా వెళ్ళియున్నాడో, ఎవరి యెడల నేను దయ చూపించి యున్నానో, నేను దీవించిన అతడు.”
ఇప్పుడు, ఒకవేళ నీవు ... ఒకవేళ నీవు గనుక ఒక మంచి, దైవికమైన పాస్టర్‌ను కలిగియున్న యెడల, మరియు నీవు రోగియైయుండి మరియు ఆ వైద్యుడు నీ కొరకు ఏమియు చేయలేనప్పుడు, వెళ్ళి ఆ దైవికమైన పాస్టర్‌ను నీ గృహము యొద్దకు తీసుకొని వచ్చి, మరియు చెప్పుము, “ఇప్పుడు, ప్రియమైన దేవా నా పెద్ద ఇక్కడున్నాడు. నా పాస్టర్ ఇక్కడ వున్నాడు. అతడు ఒక మంచి, దైవికమైన వ్యక్తి అని నాకు తెలుసు. నేను ఇక్కడ నా బిడ్డ ప్రక్కన అతనితో పాటు మోకాళ్ళు వేయుచున్నాను. ప్రియమైన దేవా దయ చూపించమని నేను నిన్ను అడుగుచున్నాను.” ఏదో జరగబోవుచున్నది. అంతయూ అదే. చూశారా?
“నా సేవకుడైన యోబు మీ కొరకు ప్రార్థించును.”
35
వారు భక్తిగల జనులైనప్పటికి, వారు విశ్వాసులు. కానీ యోబు వారి కొరకు ప్రార్థింపవలెను. ప్రార్థన, “ఒక నీతిమంతుని యొక్క తీవ్రమైన ప్రభావవంతమైన ప్రార్ధన ప్రయోజనమును కూర్చును.” మీరు నమ్ముచున్నారా? ఇక్కడ నేను మాట్లాడుటకు ప్రారంభించి, మరియు దీర్గముగ మాట్లాడెదను. మన తలలు వంచెదము.
ప్రియమైన దేవా ఘడియ ఇప్పుడు ముగియబోవుచున్నది, మరియు గత సాయంత్రము, కూడికలో నుండి వచ్చియున్న ఈ రుజువులను గూర్చి ఏమియూ నేను ఎరుగను. ప్రభువా, ఈ రాత్రి నేను ఏమి చేయాలని నీవు కోరుచున్నావు? ఇక్కడ నేను నిలబడియున్నాను, ఏ వైపునకు వెళ్ళవలెను. ఇప్పుడు ఏమియు ఎరుగకుండ, లేక ఏ వైపునకు తిరుగవలెనో తెలియకుండ, కానీ నీవు నడిపించెదవు, ఓ దేవా, దానిని నేను నీకు సమర్పించుచున్నాను.
మరియు ఇప్పుడు విసురుకుంటూ, ఈ వేడిగావున్న భవనములో ఇప్పుడు ఇక్కడ కూర్చొనియున్న ఈ ప్రజలు చాలా యదార్థపరులు, పర్యటన వివరము ప్రకారము కేవలము మరో రెండు రాత్రులు మాత్రమే ఉన్నవి అని యెరిగి, పిదప కొంత సమయము మేము ఎడబాయవలెనని, మాలో చాలా మంది ఎరిగియున్నారు: మాలో కొంతమంది, మేము నిన్ను కలుసుకునేంత వరకూ, తరువాత మేము అక్కడకు రావలసియున్నది, నీ సన్నిధిలో నిలబడవలసియున్నది. దేవా, దయ చూపించుము.
ఈ రాత్రి నా హృదయమును ఏమి తాకియున్నదో నీకు తెలుసు, నేను అక్కడ ద్వారము గుండా లేక ఆ తెరలో నుండి చూసినప్పుడు, అక్కడ ఆ దీన ప్రజలు రోగముతో పడియుండి, వేడికి విసురుకొనుచు, మరియు ఒక్క ఉద్దేశ్యము కొరకు వారు ఇక్కడున్నారని తలంచి: నీ నుండి సహాయమును పొందుకొనుటకు ప్రయత్నం చేయుచున్నారు. ఓదేవా, ఇప్పుడే నేను ప్రార్ధించుచున్నాను, ఇప్పుడే ఈ క్షణమందే, ప్రభువా...
ప్రభువా, ఏ విధముగా అని నేను ఎరిగిన ప్రతీ మార్గమందు, నీ దయను నేను పొందుకొనుటకు ప్రయత్నించాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను... ఒకవేళ నేను నా హృదయమును ఎరిగియున్న యెడల, నా హృదయమంతటితో నేను నిన్ను ప్రేమించెదను. నీవు నా భార్యకంటే ముందే, నా పిల్లలు కంటే ముందే, మరిదేనికంటే ముందే నీవు ఉన్నావు. నా జీవితములో మొదటివాడవు నీవే. నీవు దానిని ఎరిగియున్నావు ఈ రాత్రి ఇక్కడ నేను మాత్రమే కాదు, కానీ కొన్ని వందల మంది ఇతరులు అదే రీతిగా ఇక్కడ కూర్చొనియున్నారు.
36
దేవా, ఒకవేళ నీవు ఇప్పుడు... మేము ఎంత ఆనందముగా ఉండెదము, నీవు ఇప్పటికే స్వస్థపరచియున్నావని నాకు తెలుసు, ఒకవేళ ఈ రాత్రి నీవు వారికి కొంచెము ఎక్కువ ఊపు ఇచ్చిన యెడల, అది ఉన్నట్లుగా, ప్రభువా, ఆ నీరు కదల్బబడుచున్నప్పుడు,. వారిని ఆ కోనేరులోనికి నడిపించుము, ప్రభువా. దానిని అనుగ్రహించుము. మరియు ఆకాశము నుండి సుడులుగా తిరుగుచూ వచ్చి మరియు ఆ నీళ్ళను కదిలించిన అదే దూత వచ్చి, మరియు అతడే రాత్రి తరువాత రాత్రి, ప్రతీ రాత్రి వచ్చును గాక. నాకు తెలియదు; నీకు తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథము అది ఒక దూత అని చెప్పుచున్నది, నేను దానిని నమ్ముచున్నాను. మరియు తండ్రీ, నేను ప్రార్ధించుచున్నాను, అది ఈ రాత్రి ఆ నీళ్ళు కదల్చబడినప్పుడు, కలయబెట్టినప్పుడు, గజిబిజిగా, దానిని చూచుచూ, ప్రజలు ఇక్కడ లేచి నిలబడి, కేకలు వేయుచూ, ప్రతీ ఒక్కరూ, ఈ రాత్రి ఈ భవనమంతా, అవి ఉన్నట్లుగా, ప్రభువు యొక్క దూత ఆయన యొక్క గొప్పరెక్కలను చాచినప్పుడు, మరియు అవి ప్రతీ ఒక్కరిని తిన్నగా కోనేరు యొద్దకు నడిపించును గాక. మరియు ఈ రాత్రి ఒకపరిపూర్ణ స్వస్థత వచ్చును గాక, ప్రాణాత్మ మరియు శరీరముల యొక్క స్వస్థత, ఈ భవనములో. ప్రభువా, ఏ ఒక్క బలహీనులు విడిచిపెట్టబడకుందురు గాక. ప్రభువా, నీ యొక్క వాక్యమును బట్టి, నాకు తెలుసు, అది నేను వెళ్ళవలసియున్నది, మరియు నా దానితో... ఎలా నమ్మవలెనో అదియే నాకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ బాగుండాలని నీవు ఇప్పటికే వెల చెల్లించియున్నావని నేను నమ్ముచున్నాను. నీ కుమారుడైన ప్రభువైన యేసు, దానిని కల్వరి యొద్ద చేసియున్నాడని నేను నమ్ముచున్నాను.
మరియు ఆయన చెప్పెను, “కేవలము మీరు నమ్మిన యెడల, అన్ని సంగతులు సాధ్యమే. మీరు. ప్రార్థించినప్పుడు, మీరు అడిగినది మీరు పొందుకొనియున్నారని నమ్ముము. మరియు మీరు దానిని పొందుకొనెదరు.”
మరియు పిదప, వాటన్నిటి కంటే, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యమును పంపుట, మేము ఇంకనూ ఎరిగియుండుట కొరకు వరములు మరియు సూచనలు మరియు ఆశ్చర్యకార్యములు నీవు మా కొరకు పంపియున్నావు. లోకము మరియు ఆ చదువుకున్నవారు పరిశుద్ధ గ్రంథమును పట్టుకొన్నప్పుడు, నీకు తెలుసు, వారి యొక్క చల్లని, శాఖాపరమైన విధానములు దానిని ముక్కలు చేసి మరియు దానిని ఆ విధముగా మరియు ఈ విధముగా వివరించును.
37
బిలాము వలె, కయీను వలె, ఆ పాతవారు, తమ బలి అర్చించుచూ, మరియు బలిపీఠము కట్టుచూ, మరియు నిన్ను ఆరాధించుచున్నారు, కానీ ఏర్పరచబడిన మార్గములో కాక, రక్తము లేకుండా చేయుచున్నారు. అతడు నిరాకరించబడి, తిరస్కరించబడ్డాడు. మరియు వాడియొక్క పిల్లల ద్వారా అదే ఆత్మ ఇంకనూ జీవించుచున్నది.
కానీ హేబేలు, నీతిమంతుడు, అందముగా కాక, బలిపీఠము అందముగా అలంకరించబడకుండా వచ్చెను, కానీ ఏర్పరచబడిన మార్గములో వచ్చెను, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, ఒక గొర్రెపిల్లను నడిపించుకుంటూ, ఒక ప్రత్యామ్నాయము, ఒక అపరాధి యొక్క స్థానమును తీసుకొనుటకు ఒక నిరపరాధి.
38
తండ్రీ, నీవే యేసును కల్వరి యొద్దకు నడిపించియున్నావని మేము నమ్ముచున్నాము. ఆయన ఒక పశువులశాలలో జన్మించెను. మహిమ యొక్క రాకుమారుడు ఎందుకు ఒక పశువులశాలలో జన్మించెను? ఆయన ఒకగొర్రెపిల్ల, గొర్రెపిల్లలు మంచముల పైన జన్మించవు; అవి తొట్టెలలో జన్మించును. మరియు వారు ఆయనను కల్వరి యొద్దకు నడిపించిరి. హేబేలు ఒక ద్రాక్షతీగను గొర్రెపిల్ల యొక్క మెడ చుట్టూ చుట్టి, ఆ బలిపీఠము యొద్దకు నడిపించినట్లుగా,. వారు ఆయనను ఆక్కడకు నడిపించిరి. మరియు అక్కడ, ప్రాణము మరియు శరీరమునకు ఒక పాపపరిహారార్థ బలివలె, ఆయన చేయబడి ... అది ఆయనను చితక్కొట్టి, మరియు ఆయనను నలుగగొట్టి, మరియు ఆయనను కొట్టెను.
మరియు అక్కడ. ఆయన తన ఆత్మను తండ్రియొక్క చేతులలో అప్పగించెను, మరియు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగెను; భూకంపము కలిగెను. వారు ఆయనను పాతిపెట్టిరి. ఆ మూడవ దినమున, ఆ వేకువ చుక్క... ఆ రాయిని ఎవరు దొర్లించివేసిరని ఆశ్చర్యపడుచూ, మార్తా మరియు మరియ కొండ వైపు నడుచుచున్నప్పుడు పక్షులన్నీ పాట పాడకుండా నిశ్శబ్దమాయెను. అప్పుడు హఠాత్తుగా, ఇక్కడ దూత ఒక వెలుగువలె వచ్చెను, ఆకాశము నుండి కిరణము వలె వచ్చెను, మరియు రాయి దొర్లింపబడెను. ఆయన ముందుగా వచ్చెను. మరియు భూమి యొక్క ధూళిలో నిద్రించిన అనేకమంది, పరిశుద్దులు లేచి మరియు సమాధులలో నుండి బయటకు వచ్చెను, మరియు పట్టణములో ప్రవేశించెను, పైకి వెళ్ళిపోయే ముందు కొంతమంది పాత స్నేహితులను కలుసుకొనెను. ఓహ్, ఎటువంటి ఒక సమయము, ప్రథమ ఫలములు, ఆ సంచకరువు.
39
ఇప్పుడు, ఈ రాత్రి నమ్ముటకు మాకు సహాయము చేయుము. ప్రతీ అంధకార సంబంధమైన బరువును ప్రక్కనబెట్టి, మరియు ఒక పరిపూర్ణమైన కన్యక వలె, కలుషితము కాని విశ్వాసముతో ఇప్పుడే కొనసాగనిమ్ము, ప్రభువా, మరియు ప్రతీఒక్కరూ స్వస్థతనొందురు గాక. ఏలయనగా దీనిని ఆయనయొక్క నామములో అడుగుచున్నాము. ఆమేన్.
లక్షణములు కనబడును, అప్పుడు అవన్నియూ అనుభూతి చెందుటను చూడుము. తరువాత రోజు ఉదయము లక్షణములు కనబడినప్పుడు, మీరు చెప్పెదరు, “ఓహ్, నేను నా స్వస్థతను పోగొట్టుకున్నాను. అది ఆవిధముగానే యుండును.” చూడండి, కానీ మీరు ఎక్కడ నిలబడియున్నారో మీరు గ్రహించినప్పుడు, మీకు ఒక వేదిక (నిలబడే స్థానము) దొరుకును. మీరు తిరిగి యేసు యొద్దకు చేరుకుని మరియు సాతానుకు చెప్పెదరు, “ఈలాగు వ్రాయబడియున్నది ...” అది నీ అనుభూతులపైన ఆధారపడినది కాదు. యేసు ఎన్నడూ, “నీవు అనుభూతి చెందియున్నావా?” అని అడుగలేదు, “దానిని నీవు నమ్ముచున్నావా?” అని అడిగెను. నమ్ముము, అంగీకరించుము, నమ్ముము.
సహోదరుడా బోస్‌వర్త్, ఈ అమెరికా సంయుక్త రాష్ట్రములలోనే దైవిక స్వస్థతను గూర్చి ఎరిగియున్న అత్యంత వృద్దుడవు నీవే అని నేను ఊహించుచున్నాను. అది సత్యమేనా? అది సత్యమే, అవునా? దైవిక స్వస్థత ఉన్న విధానము, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు దానిని నమ్మవలసియున్నది.
ఇప్పుడు , గతరాత్రి యాబది వరకూ మనము పిలిచియున్నామని నేను నమ్ముచున్నాను, గత రాత్రి. అది నిజమేనా? అది యాబది వరకూ అని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, మనము యాబది నుండి ప్రారంభించి మరియు ఈరాత్రి మరొక వైపునకు వెళదాము. మరియు అది రెండువైపులా సరిసమానమగును. అది సరే, మరియు రేపు రాత్రి, ఒకవేళ దేవుని చిత్తమైతే, మరియు ఈ జాబితాను గూర్చి నేను కనుగొనబోవుచున్నాను. బహుశా ఒకవేళ సాధ్యమైతే నేను కలిగియున్న తరువాత రెండు లేక మూడు కూడికలలో నేను దీనిని చేయబోవుచున్నాను; నేను నా జీవితమంతా కూడికల కొరకే ప్రయత్నించబోవుచున్నాను, మరియు - నేను సీయోనులో ప్రారంభమవ్వక ముందు నాకు కేవలము రెండు రోజులే విశ్రాంతి ఉన్నది.
ట్రిబ్యూన్ అనే వార్తాపత్రిక దానిని గూర్చి రెండు లేక మూడు పేజీల వ్యాసము వ్రాసి యున్నది, అది మీకు గుర్తున్నదా...?... “కొలియర్స్” కూడా ఆ కూడికను గూర్చి ఒక వ్యాసము వ్రాసియున్నదని నేను నమ్ముచున్నాను. అదిగో అక్కడ ఉన్నది, అక్కడ ఒక్క బలహీనుడు కూడా విడిచిపెట్టబడలేదు. ఇప్పుడు, ఈ రాత్రి మీరు గనుక అదే ఆత్మీయమైన వైఖరిలోనికి వచ్చిన యెడల, అందరూ ఏక స్వరముతో, అత్మ కదులుచూ, మరియు ప్రతీ వ్యక్తి ఓహ్, ఏదో జరుగబోవుచున్నది. అది సరే, బహుశా కొంచెము సమయము తరువాత నాకు జరిగియున్న చిన్న సంగతులు ఏమిటని నేను మీకు చెప్పెదను. కొంతసేపైన తరువాత చూడుము, ఇప్పుడే నాకు తెలిసినది. నేను... మీరు నన్ను నమ్మెదరా?
ఇప్పుడు మీలో ఎంతమంది ఆ ప్రభువు యొక్క దూత చిత్రమును చూసియున్నారు. ఇప్పుడు చూసియున్నారు. మరియు దానిపై ఉన్న కాపీరైట్ హక్కులను గూర్చి చదవండి, మరియు ప్రతీది మరియు జార్జ్ జె.లేసీ ... ఒకవేళ మీరు చదువగోరిన యెడల, ఇప్పుడు తిరిగి అ పుస్తకములు అక్కడ లభ్యమగుచున్నవి. మరియు మీకు కావలసిన యెడల... మీరు పంపి మరియు దాని యొక్క చిత్రమును తెప్పించుకొనవచ్చును. డగ్లస్ స్టూడియోస్‌కి వ్రాయవలెను ఎందుకనగా దానితో నేను ఏమీ సంబంధము కలిగిలేను. అది అమెరికన్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కు చెందినది. దానితో నాకు ఎటువంటి సంబంధము లేదు, చూడండి. మరియు ప్రపంచము యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి, ఒక యాంత్రిక కన్ను ద్వారా ఒక సహజాతీతమైనది ఫొటో తీయబడినది. దానిని గూర్చి ఆలోచించుడి, మరియు దానిని పరిశోధించినది, వేలిముద్రలు మరియు మొదలగు వాటిపై పరిశోధించే ఉత్తమమైన ఎఫ్.బి.ఐ (FBI) సంస్థ అయ్యున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములలోనే ఉత్తమమైన సంస్థ అతడు దానిపై తన సంతకము చేసియున్నాడు. అక్కడ ఒక ఫోటో తీయబడిన చిత్రము ఉన్నది, అక్కడ సంపూర్ణముగా ఒక వెలుగు నిలిచియున్నది, “అది ఒక మానసిక శాస్త్రము కాదు అని అతడు చెప్పాడు. సుడులు తిరుగుతూ ఆ వెలుగు అక్కడ నిలబడియున్నది, మరియు ఆ వెలుగు ఆ నెగిటివ్‌ను తాకియున్నది. మీరు అక్కడే ఉన్నారు, కనుక ఈ దినము యొక్క విజ్ఞానశాస్త్రము దానిని గూర్చి ఏమియూ చెప్పలేదు ... ”దేవుడు లేడు. అయితే దేవుడు ఉన్నాడని నాకు రుజువు చేయుము“, అని ఆ అవిశ్వాసి చెప్పును. దేవుడు ఉన్నాడని ఒక శాస్త్రీయమైన ఆధారమును నేను చూపగలను ...? శాస్రీయముగా నిరూపించబడినది. ఆమేన్.
ఓహ్, ఏమి - నేను ఎంతో సంతోషముగా ఉన్నాను. ఒకవేళ నేను ఇప్పుడే ఇక్కడ ఈ భవనములో చనిపోతూ ఉంటే, మరియు ఇదే నాచివరి కూడికైతే, నా సాక్ష్యము సత్యమైయున్నది. సంఘము దానిని ఎరిగియున్నది, లక్షల మంది, ప్రపంచమంతా అనేక లక్షల మంది ప్రజలు. మరియు వారు ఏ విధముగా ప్రయత్నించి మరియు శోధించారో; మరియు నాస్తికులు, మరియు అవిశ్వాసులు, మరియు విజ్ఞానశాస్త్రము, మరియు చట్టములు, మరియు ప్రతీది అన్ని చోట్ల నుండి వెళ్ళి మరియు దానిని చీల్చివేయుటకు ప్రయత్నించెను, మరియు ప్రతీసారి దేవుడు తిరిగి వచ్చి మరియు తన శక్తితో రుజువు చేసెను. మరియు అప్పుడు విజ్ఞాన ప్రపంచము దానిని కనుగొనుటకు వెళ్లెను మరియు దేవుడు దానియొక్క చిత్రమును అక్కడ తీసి మరియు వారికి చూపెను. మరియు ఒక క్రైస్తవ నాగరికత ఉన్నంత వరకు ఒక జ్ఞాపక చిహ్నముగా నిలబడుటకు ఈరాత్రి అవి అక్కడ కట్టబడియున్నవి. అవి ఇప్పుడు వాషింగ్‌టన్ డి.సి. నందు వ్రేలాడుచున్నవి.
దానిని గూర్చి నేను ఏమి చెప్పెదను? నేను ఒక మానవుడను. ఒకవేళ ఆ పరిచయ పాఠమును (పుస్తకములో) మీరు గమనించిన యొడల, నేను అక్కడ దానిని వ్రాసియున్నాను. అది లేకుండా ఆ చిత్రము అమ్మబడదు. నేను నీవలె ఒక మానవుడిని తప్ప మరేమి కాను; కృపద్వారా రక్షింపబడిన పాపిని. కానీ - అది ఏమనగా సత్యము ఏమిటో నేను మీకు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను అది యేసుక్రీస్తు మీ అందరియొక్క స్వస్థతను కల్వరియొద్ద కొనెను, మరియు ఆయన ఇప్పటికే ఇక్కడే ఆ స్వస్థతను నీ కొరకు సిద్ధపరచియున్నాడు. నీవు దానిని చేరుకొని మరియు పొందుకొని యున్నప్పుడు అది మీకు అప్పగింపబడుటకు సిద్ధముగా ఉన్నది. ఓ ఎంత సామాన్యత, ఎంత ఆశ్చర్యము!
మరియు నేను ఎవరి గురించి మాట్లాడానో ఆ ప్రభువు యొక్క దూత అది ఇప్పుడు నాకు మూడడుగుల దూరములో లేదు. ఇప్పుడు, అది నిజమే, ఖచ్చితముగా నేను మీకు ఏమీ తప్పు చెప్పుట లేదు. నిశ్చయముగా నా మాటలు సత్యమని దేవుడు మీకు రుజువు చేసెను. నేను చెప్పుచున్నాను అని కాదు, కానీ ఎందుకనగా అవి సత్యము, చూడుము. ఆయన దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడే. ఇప్పుడు ఆయన దేవుని యొక్క వర్తమానికుడు, నేను కేవలము ఆయన యొక్క నోరు మాత్రమే. ఆయన నాకు ఏమి చెప్పునో కేవలము దానిని మాత్రమే చెప్పెదను.
అది సరియే, అందరూ మర్యాదగా ఉండండి. ఇప్పుడు అమ్మా, నీవు ఇక్కడ కొంచెము దగ్గరగా రావలయునని నేను కోరుచున్నాను.
నేను ఈ మైక్రోఫోనును క్రిందకు దించెదను. (సహోదరుడు బ్రాన్హాం మైక్రోఫోనును సరిచేయుచుండెను) నేను ఈ ప్రక్క వెనుకగా నిలబడినప్పుడు మీరు నన్ను వినగలుగుచున్నారా? మీరు మంచిగా వినుచున్నారా? ...?... ఏదో తప్పిదము ఉన్నది, బహుశా నేను దానిని కొంచెము దగ్గరగా తీసుకొని వచ్చెదను. ఇప్పుడు మునుపటి దానికన్నా మంచిగా వినగలుగుచున్నారా? (ప్రేక్షకులు “అవును” అని చెప్పుచున్నారు) అది సరే అది మంచిది. ఇప్పుడు, కొన్నిసార్లు... ఇప్పుడు బిల్లీ, లేక మీలో కొంతమంది గమనించుడి. ఒకవేళ అది అభిషేకము పొందికొనినప్పుడు మరియు నేను ప్రక్కకు తప్పుకొనెదను, మంచిది మీరు దగ్గరగా జరిగెదరు, చూడుము. మీరు ఒక దర్శనములో ఉన్నప్పుడు మీరు ఏమి మాట్లాడుచున్నారో మీరు చెప్పలేరు. కానీ ఎంత గట్టిగా మాట్లాడుచున్నారో లేక మరేదో మీరు యెరుగరు. మీరు కేవలము ... నేను దానిని వివరించలేను.
కానీ ఇప్పుడు అమ్మా, నేను - మీరు క్రైస్తవులు. నేను దానిని చూడగలుగుచున్నాను, చూడుము. మీరు వేగముగా ముందుకు నడిచిన వెంటనే, ఒకవేళ మీరు నడవకపోతే అక్కడ ఆగ్రహము కలుగును, చూడుము అప్పుడు మీరు కైస్తవులు కాదు అని నేను తెలుసుకొందును; లేక ఏదో ఒక రకముగా ఏదో దానిని మీరు సరిచేసుకొనునట్లుగా, మీ యొక్క ప్రాణాత్మలో ఏదో చెడ్డ సంగతి, లేక నీ జీవితములో మరేదో నిన్ను వెనుకకు లాగుచున్నది. కానీ అది... మీరు ఒక క్రైస్తవుడు అని, లేక మీ పాపములు రక్తము క్రింద ఉన్నవని నేను నమ్ముచున్నాను. మరియు నేను... ఒకవేళ అది కాకపోతే, ఆయన యొక్క సన్నిధిలో అది వ్యత్యాసముగా ఉండును. చూశారా? నేను చెప్పెదను, “ఇప్పుడు, ఎక్కడో, ఏదో తప్పు ఉన్నది”. కానీ ఎటువంటి సందేహము లేదు, కానీ నీవు ఒక యదార్ధమైన విశ్వాసివైయున్నావు. మరియు ఇప్పుడు, నేను నీ సహోదరుడను. నీ గురించి నాకు ఏమియూ తెలియదు, నా జీవితములో నిన్ను ఎన్నడూ చూడలేదు. నీ గురించి ఒక్క సంగతియూ నేను ఎరుగను; అదంతయూ దేవుని యొద్ద నుండి రావలసియున్నది.
40
ఇప్పుడు, ఆయన దానిని చేయును అని నేను నమ్ముటకు గల కారణము, ఏదనగా వరములు మరియు పిలుపులు పశ్చాత్తాపము లేకుండగానే వచ్చును. చూశారా? దేవుడే వరములను ఇచ్చును. దానిని ఆయన తీసివేయడు, కానీ ఒకవేళ నేను దానిని తప్పుగా ఉపయోగించిన ఎడల, అప్పుడు దానిని గూర్చి ఆయన నాతో వ్యవహరించును. చూశారా? ఇప్పుడు, ఆ కారణమును బట్టే నేను చేయగలిగినదం -తయూ ఆయనను గూర్చే చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, మరియు నేను యేసును గూర్చి గొప్పగా చెప్పుటను మీరు వినుచున్నారు, ఎల్లప్పుడూ యేసును గూర్చే. ఎల్లప్పుడూ యేసే, నా గురించి ఎన్నడూ కాదు, అది యేసే. మీరు చూశారా? అది ఆయనే, అది ఆయనే, అది ఆయనే. దానిని గూర్చి నేను చేయుటకు ఏమియూ లేదు. నేను కేవలము ఆయన నోరు మాత్రమే.
ఒకవేళ అమెరికా యొక్క దేశాధ్యక్షుడు నన్ను జర్మనీ దేశమునకు రాయబారిగా నియమించిన యెడల, ఆ వీధముగానే. చూశారా? అప్పుడు నా మాటలు, జర్మనీలో, దేశాధ్యక్షడు ఏమి చెప్పమని నాకు చెప్పునో ఖచ్చితముగా ఆ విధముగానే ఉండును. మరియు ఆయన నాకు ఏమి చెప్పమని చెప్పెనో, అవి నేను చెప్పినప్పుడు, అప్పుడు అమెరికా సంయుక్త రాష్టములన్నియూ ఆ మాటల వెనుక నిలబడును. అది నిజమేనా? పేక్షకులారా, అది నిజమనా? ఒకవేళ నేను ఒక రాయబారినైతే, ఆయన దాని వెనుక నిలువవలసియున్నది.
41
అప్పుడు ఒకవేళ నేను దేవుని యొద్దనుండి పంపబడిన ఒక సేవకుడినైతే, ఈ విధముగా, మరియు నేను ఇక్కడ ఏమి ప్రకటించుచున్నానో, మరియు ఒకవేళ అవి దేవుని యొద్ద నుండి వచ్చుచున్నవో, పరలోకములో ఉన్న ప్రతీది ఆ మాటల వెనుక నిలబడియుండును. అది నిజమేనా? ఎందుకనగా అవి నేరుగా, తిన్నగా, తాజాగా సింహాసనము యొద్ద నుండి ఇవ్వబడుచున్నవి, అది ఏమైయున్నదో దానిని చెప్పుటకు, మరియు దానిని గూర్చి ఏదో చేయుటకు. అది నిజమేనా?
ఇప్పుడు ఒకవేళ అది నా చిత్తానుసారముగా అయితే, ఇప్పుడు నేను ఏమి చేయుదునో మీకు తెలుసా? ఒకవేళ అది ఆలోచనను బట్టి అయితే, చేయుటకు ... నా చేతిలో, నేను ఏమి చేయగలనో దానిని చేయుటకు అయితే నేను అలా నడిచి పోయెదను. నేను చూచెదను:... “ఇక్కడ ఎంత మంది ప్రజలు హృద్రోగముతో బాధపడుచున్నారు?” అని నేను అడిగెదను, మొదటగా వారినందరినీ నేను పైకి తీసుకొని వచ్చెదను, మరియు వారినందరినీ స్వస్థపరిచెదను. అప్పుడు నేను చెప్పెదను, “క్షయ ఉన్న వారినందరినీ తీసుకొని రండి, మరియు క్యాన్సర్ ఉన్న వారినందరినీ, వారే మొదటగా చనిపోయెదరు”. అప్పుడు నేను చుట్టూ తిరిగి అవిటితనముతో ఉన్న ఈ ప్రజలను చూసెదను,“వారు లేచి మరియు నడవాలని కోరుచున్నారు”, అని నేను చెప్పెదను. వారు సాధారణమైన జీవితమును జీవించినప్పటికీ, వారు అవిటితనముతోనే సంవత్సరములు, సంవత్సరములు జీవించెదరు, కానీ ఈ గుండె సంబంధిత రోగములు కలవారు అక్కడికక్కడే చనిపోవుదురు, ఒకవేళ వారికి వైద్యము (లేక) ఏమీ జరగకపోతే, చూశారా? క్యాన్సర్ మరియు మొదలగువి, అవి తినివేయును, మరియు వారు చనిపోవుదురు. కనుక, వారిని తీసుకొని రండి. దాని తరువాత, నేను క్రిందకు వెళ్ళి, మరియు ఈ అవిటి వారినందరినీ తీసుకొని మరియు వారినందరినీ స్వస్థపరిచెదను. అది ఆశ్చర్యముగా ఉండదా? కానీ అది చేయునది నేను కాదు. చూశారా? నేను దానిని చేయలేను. ఇప్పుడు, నేను చేయగలిగిన ఒకే సంగతి, మిమ్ములను నమ్మునట్లుగా చేయుట, మరియు - లేక ప్రభువైన యేసునందు మీరు విశ్వాసముంచుటకు నేను చేయగలిగినంత ఉత్తమమైనది చేయుటకు ప్రయత్నించుట.
42
ఎక్కువ సేపు నేను నీతో మాట్లాడియున్నాను, ఎందుకనగా నేను... ఎదురుచూచుచున్నాను, అక్కడ నీ ప్రక్కనే ఎవరో కూర్చొనియుండుటను నేను చూచుచున్నాను, అది ప్రకాశించుచున్నది. ఒకవేళ నీవు ఇటువైపు తిరిగితే, కొంచెము బాగుండును, అది బాగుండును. చూశారా? మానవులు, ప్రతీ ఒక్కరూ ఒక ఆత్మను కలిగియుందురు. చూశారా? మరియు అప్పుడు, మీ ఆత్మ మరియు నా ఆత్మ... పిదప ఒకవేళ నేను వేరైన ఆత్మ యొక్క అభిషేకమును కలిగియుంటే, మరియు మీకొరకు ఏదైనా చేయుటకు, దేవుని యొద్ద నుండి వచ్చుచున్న దేవుని యొక్క వరమైన పరిశుద్దాత్మ యొక్క అభిషేకము, మరియు మీలో ఏదైనా చెడ్డ ఆత్మ, క్యాన్సర్, లేక కణితి, లేక ఏదైనా గడ్డ వంటిది, మీ యొక్క జీవమునకు తోడుగా దానిలో జీవము ఉన్న మరేదో మీలో ఉన్నప్పుడు, మంచిది అప్పుడు, అవి రెండూ ఒకదానితో మరొకటి పోరాడును. మీరు చూశారా? ఒకటి చెప్పును, “నీవు వచ్చేయవలసినదే.
మరొకటి చెప్పును, “నీవు దానిని నమ్మవా?”
ఆ మరొకటి చెప్పును, “అతడు వచ్చేయవలసినదే.”
మరొకటి చెప్పును, “దానిని నమ్మవద్దు.”
43
చూశారా? మరియు నేను నీతో మాట్లాడుచున్నాను, కేవలము ఏమి జరుగునో చూచుటకు, అప్పుడు అది జరిగినప్పుడు, అది అక్కడ ఉండును. మీరు చూశారా? అది నీ విశ్వాసముపై ఆధారపడి ఉండును. మరియు నేను మాట్లాడుచున్న యేసుక్రీస్తుపై చూశారా? అది... ఆ కథను చూడుము?
ఇప్పుడు, నీవు ఇంటికి వెళ్ళి, మరియు మళ్ళీ తిని, మరియు ఒక మంచి, పూర్తి భోజనము తినుటకు ఇష్టపడెదవా? ఆ ఉదరము (కదుపు) నిన్ను చాలా కాలము బాధపెట్టినది, అది నిజమేనా? ఇప్పుడు, నీవు కొనసాగుము, మరియు నీవు ఏమి చేయగోరుచున్నావో దానిని చేయుము. మరియు దేవుడు నిన్ను దీవించును...?...ఆమేన్. “దేవునికి స్తోత్రము” అని చెప్పెదము. ప్రతీ ఒక్కరూ వినయముగా ఉండుడి.
ఇప్పుడు, దీనిని నా హృదయమంతటితో చెప్పెదను. అది ఏమిటా అని; నేను ఆ దర్శనమును మర్చిపోవుటకు ముందు, ఆ చిన్న స్త్రీతో మాట్లాడుచుండగా మరియు ఆమె తనను గూర్చి అనుకొనుచున్న దాని కన్నా మరి ఎక్కువైన తప్పిదము ఆమెలో ఉన్నది. చూశారా? కానీ ఆమెకు ఉదర సంబంధమైన సమస్య ఉన్నది, ఆమెకు నరముల బలహీనత; ఆమెకు నిరుత్సాహము ఎక్కువ. మరియు ఆమె ప్రతీదానిని తన మనస్సులో పెట్టుకునేటువంటి జనులలో ఒకరై యున్నది, ఎక్కడో ఆమె దేనిని గూర్చో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండును. అమ్మా, అదే గదా నీ స్వభావము? మరియు నీవు ఇతర సమస్యలతో కూడా బాధపడుచున్నావు. చూశారా? మరియు నేను దానిని చెప్పగోరుట లేదు, కానీ నా పూర్ణ హృదయముతో మరియు పూర్ణాత్మతో, అమ్మా, ఇక ఏమాత్రము నీవు బాధపడవని నేను నమ్ముచున్నాను. నీవు బాగవబోవుచున్నావు. చూశారా? నేను దానిని నమ్ముచున్నాను.
44
ఇప్పుడు, అమ్మా, నీవు వచ్చి ఇటువైపుగా నిలబడుము, ఒకవేళ నీకు ఇష్టమైతే, ఒక్కక్షణం నేను నీతో మాట్లాడెదను. ఇప్పుడు, నేను చెప్పిన ఈ సంగతులను నీవు నమ్మెదవా? అవి నిజముగా దేవుని వద్ద నుండి వచ్చినవని నీవు నమ్మెదవా? నీ హృదయమంతటితో నీవు వాటిని నమ్మెదవా? అవును, నీవు నమ్మినందకు నాకు సంతోషము, ఏలయనగా నేను కేవలము... మాత్రమే చెప్పగలను, ఇప్పుడు నేను చేయగలిగిన ఒకే సంగతి, అది నీలో ఏ తప్పిదము ఉన్నదని చూచుటయే. చూశారా? ఒకవేళ అది పాపము యొక్క క్రమములో ఉన్నయెడల, నేను దానిని గ్రహించగలను. మరియు నీవు గనుక దానిని ఒప్పుకొనిన యెడల, మంచిది, బహుశా నేను ... అప్పుడు అది రక్తము క్రింద వుండును (మీరు చూశారా?) మరియు అది ముగించబడును.
ఆయన నీవు ఒక పాపమును ఒప్పుకొనినప్పుడు, ఆయన దానిని మరుపు అనే సముద్రములో పడవేయును, నీకు వ్యతిరేకముగా ఆరోపించుటకు అది ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనబడదు. అది కేవలము ... నీవు బట్టలు ఉతుకుట కొరకు ఉపయోగించే ఈ బ్లీచ్ గూర్చి నీకు తెలుసా, క్లోరాక్స్, అది ఏమైనప్పటికి? మంచిది, నీవు ఒక చుక్క సిరా తీసుకొని, మరియు ఆ బ్లీచ్ అనే టబ్‌లో వేయుము, అప్పుడు ఆ చుక్కసిరా ఏమవును? నీవు దానిని కనుగొనలేవు, కనుగొనగలవా? అది కేవలము బ్లీచ్‌లో కలిసిపోవును. అది నిజమేనా?
45
యేసుక్రీస్తు యొక్క రక్తమును తాకినప్పుడు పాపము ఆ విధంగానే చెదిరిపోవును. అది ఇక ఉండదు దానికి ఏమి జరుగునో అతడికి తెలియదు. అది ... అక్కడ ఇక మీరు దానిని కనుగొనలేరు ఒకవేళ ఇక ఏదైనా మీకు కావల్సిన యెడల, అది అక్కడితో ముగిసియుండును అది నిజము.
రంగు, నలుపు సిరా అనే రంగు ఉన్నది, కానీ అది ఒక ఏమాత్రము నలుపు కాదు. చూశారా? అది పోయినది నలుపు తెలుపు అయినది, మరియు నలుపు ఎక్కడికో పోయినది, మరియు అది ఎక్కడికి పోయినదో మీకు తెలియదు. అది నిజమేనా? పాపము ఆ విధంగానే ఉండును.
ఇప్పుడు, నిన్ను స్వస్టపరచువానిగా యేసును నీవు అంగీకరించిన యెడల, నీవు బాధపడుచున్న ఆ గుండె వ్యాధి నీటిని తాకిన సిరావలె పోవును. దానిని నీవు చేసెదవా? అది సరియే. నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయు గుండె నీకున్నది, నీ గుండె ధమనులలో రక్తము గడ్డ కట్టినది. అది నిజమేనా? మరియు ఇప్పుడు, కొద్దిసేపు అవి నిన్ను ఇబ్బంది పెట్టుచున్నది.
46
కానీ ఇప్పుడు, సహోదరి, మన యజమానుడైన యేసుక్రీస్తు యొక్క నామములో నీ దారిన నీవు వెళ్ళుము. ఆయన సేవకుడనైన నేను, సత్యమును మాట్లాడుటకు, మరియు ఈ సంగతులను రుజువు చేయుటకు ఆయన తన దూతను పంపెను, ఆయన నిన్ను దీవించును గాక. క్రీస్తుయేసు నామమున ఆమేన్. ఇప్పుడు నమ్ముచు వెళ్లిపొమ్ము సహోదరి, మరియు నీ తక్కిన జీవితమంతా ఆ విధముగానే ఉండుము. అది సరియే, సహోదరి.
ఇప్పుడు, అయ్యా, నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? అయ్యా, నీవు నమ్ముచున్నావని నేను నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు, ఆమె కలిగియున్న దానినే నీవును కలిగియున్నావు, అది సరియేనా. కానీ ఆయన ఇప్పుడే నిన్ను స్వస్థపరచియున్నాడని నీవు నమ్మెదవా? అయ్యా, అది సరే. పిదప ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు ఈ వేదికపై నుండి వెళ్ళి మరియు బాగుపడెదవు గాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. “దేవునికి స్తోత్రము” అని చెప్పెదము.
47
ఆ గుండె వ్యాధులు, ఒక ఒత్తిడితో కూడిన కదలికలు, గుండె సమస్య, గుండె సమస్య, అన్ని చోట్లా. ఇక్కడ, ఒక్కక్షణం. పిదప నీవు గెంతులాగున చేసినది ఏమిటి? నీకు గుండె సమస్య కూడ ఉన్నది, లేక నీకున్నది. అది నిజమే కదా? ఆ చిన్న స్తీ , ... అది నిజమేనా? నీ కాళ్ళపై లేచి నిలబడుము. అవును, ఆ తెల్ల టోపి పెట్టుకున్న నీవు, నీవు గుండె సమస్యతో బాధపడుచున్నావు. అది నిజమేనా?అది సరియే, ఆమె వలె నీవు స్వస్థపరచబడ్డావు.
నీ ప్రక్కగా కూర్చొన్న ఆమె క్యాన్సర్‌తో బాధపడుచున్నది, ఆమె కూడా స్వస్థపడగలదు, ఒకవేళ ఆమె పైకి లేచి మరియు దానిని నమ్మిన యెడల దానిని నమ్మెదవా? క్యాన్సర్ నిన్ను విడిచిపెట్టునని నీవు నమ్మెదవా? నీవు నమ్మెదవా? ఒకవేళ నీవు నమ్మిన యెడల నీ చేయి పైకెత్తుము. అది సరే. నీవునూ ఇంటికి వెళ్ళవచ్చు. దేవుడు నిన్ను దీవించును. సంతోషిస్తూ నీ మార్గమున వెళ్ళుము.
ఇప్పుడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఓహ్, ఏమి జరుగగలదు; ఏమి జరుగును! అది నీలోనే ఉన్నది, నాలో లేదు; నీలో ఉన్నది!
48
అయ్యా, ఎలా ఉన్నారు. రెవరెండ్ గారు, దేవుడు నిన్ను దీవించును. మీరు ఎలా జీవితమును వెళ్ళబుచ్చుచున్నారు? అది సరే. అవునయ్యా, మీరు బాగుపడగోరుచున్నారా? మంచిది, యేసుక్రీస్తు యొక్క నామములో, నీ స్వస్థతను స్వీకరించుము. దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు నీవు కోరుకున్నది నీవు తినుము.
అది సరియే. “దేవునికి స్తోతమూ, అని చెప్పెదము.
నీ హృదయమంతటితో నీవు నమ్మెదవా? తల్లీ, దేవుడు నిన్ను దీవించును. అదియే దారి. వచ్చి, వేదిక పై నుండి “నన్ను స్వస్థపరచినందుకు ధన్యవాదములు యేసు”, అని చెప్పుచూ వెళ్ళుము.
ప్రభువైన యేసూ, ఈ దీన, పేద తల్లులు వచ్చియుండగా, వారి జీవితములు కొట్టుమిట్టాడుచున్నవి, వారు సామాన్లు సర్దుకున్నారు, నదిని దాటుటకు సిద్ధముగా ఉన్నారు, దేవా, వారిని దీవించుము, మరియు వారి దినములను అనందమయముగా చేయుము. యేసు నామములో ఈ స్త్రీని స్వస్థపరచుము. ఆమేన్,
అమ్మా, దేవుడు నిన్ను దీవించును. నీ హృదయమంతటితో నమ్ముచూ, సంతోషముతో, ఆనందముగా నీ మార్గమున వెళ్ళుము.
49
సహోదరి, అది సరే. నీవు నమ్మెదవా? నీ హృదయమంతటితో? నీవు నిజముగా ఆయనకు దగ్గరగా నడవగోరుచున్నావా, నీ హృదయమంతటితో నమ్మెదవా? ఆయన నీ కళ్ళను భాగుచేయునని నీవు నమ్మెదవా, అప్పుడు? ఆయన చేయును. అయ్యా, అది సరే, నీవు దానిని పొందెదవు.
యేసుక్రీస్తు నామములో, దేవా ఆమె హృదయపు కోరికను, ఆ స్రీకి అనుగ్రహించుము, ఏలయనగా నీ మహిమార్థమై నేను దీనిని అడుగుచున్నాను. ఆమేన్.
దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు నమ్ముచూ, వెళ్ళుము. “దేవునికి స్తోత్రము” చెప్పెదము. (సంఘము “దేవునికి స్తోత్రము” చెప్పుచున్నది)
దేవునికి కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రము. అయ్యా, నీ హృదయమంతటితో నీవు నమ్మిన యెడల, ఆ గాయము నుండి నీవు స్వస్థపడెదవు. దానిని నీవు నమ్మెదవా? అయితే లేచి నిలబడుము, “ఇప్పుడు నా స్వస్థతను నేను అంగీకరించుచున్నాను” అని చెప్పుము. అంతయూ సరే, అది మంచిది. సహోదరుడా, వందనములు. ఆవిధముగానే చేయవలసియున్నది. అవును.
50
నీ భార్య అక్కడ తిరుగుచూ ఉన్నది, ఏమి జరిగినది? సహోదరి, ఇటు వైపు చూడుము. నీ హృదయమంతటితో నీవునూ నమ్మెదవా? ఆ. కీళ్ళవాపు వ్యాధిని జయించుటకు ఇష్టపడెదవా? బాగుపడగోరుచున్నావా? ఒకవేళ ఇష్టపడిన యెడల, అప్పుడు నీ కాళ్ళపై లేచి నిలబడుము, “యేసుక్రీస్తు యొక్క నామములో నా స్వస్థతను అంగీకరించుచున్నాను, అని చెప్పుము. ఆ విధముగానే చేయవలసియున్నది.
నీవు కూడా, సహోదరి, “యేసూ, వందనములు”, అని చెప్పుచూ వేదిక యొద్ద నుండి వెళ్ళి మరియు బాగుపడుము. “దేవునికి స్తోత్రము”, అని చెప్పెదము. (సంఘము “దేవునికి స్తోత్రము” అని చెప్పుచున్నది).
అది సరే, ఒక్కక్షణం, తలలు వంచెదము. తండ్రీ, పరలోకములో, ఈ స్త్రీని స్వస్థపరచుము, మరియు అమెను సంపూర్ణముగా స్వస్థపరచుము.
సాతానా, ఆమెను విడిచిపెట్టుము. యేసుక్రీస్తు యొక్క నామములో, నేను చెప్పుచున్నాను, ఆమెలో నుండి బయటకు రమ్ము నీవు నమ్మెదవా?
ఇప్పుడే ఆయన నిన్ను సంపూర్ణునిగా చేయును అని నీవు నమ్మెదవా? నన్ను వినగలుగుచున్నావా? ఇప్పుడు నన్ను వినగలుగుచున్నావా? అది సరే. మరియు నీవు స్వస్థపడియున్నావు. వేదికపై నుండి వెళ్ళి మరియు బాగుపడుము. “దేవునికి స్తోత్రము” అని చెప్పెదము. (సంఘము “దేవునికి స్తోత్రము” అని చెప్పుచున్నది).
51
ఓహ్, మై, అక్కడ ఉన్న ప్రజలను నేను ఏ విధముగా చూడగలుగుచున్నాను, అది (వారు) అంతయూ నాకు ఒక గుంపు వలె అనిపించుచున్నది. మరియు ఏ విధముగా సాతాను కొంచెము ... అని నేను తలంచెదను. ఓహ్, ఒకవేళ ఇప్పుడే నీపైన ఉన్న ఆ ఆత్మను నేను పారద్రోలగలిగితే ... అంతే చాలు, సాతాను తన నల్లటి రెక్కలను అక్కడ ఆడించుచున్నది, నిన్ను నమ్మకుండా చేయుటకు అది తన శాయశక్తులా ప్రయత్నించుచున్నది. ఒకవేళ ఏరీతిగానైనా దానిని కదిలించివేయగలిగితే, అప్పుడు నీకునూ మరియు దేవుని యొక్క మహిమ ప్రదేశమునకు మధ్య ఉండునది ఏమీ లేదు, ఆ మహిమ నీ పైకివచ్చి మరియు ఇక్కడ ఉన్న ప్రతీ వ్యక్తినీ స్వస్థపరచును. నీ హృదయమంతటితో నమ్ముము.
అది సరే, ఒక చిన్న బాలుడు. అవును, నీ చిన్నహృదయమును దేవుడు దీవించును. సన్నీ బాయ్, నీవు ఎలా ఉన్నావు. ఆహ్, నిన్ను కలుసుకొన్నందుకు సంతోషము. ఇప్పుడు, ఇది ఒక పిల్లవాడు. ఇప్పుడు, ఈ సంగతులు ఏమిటో అతనికి అర్థము కాదు. కనుక, ఒక్క క్షణము అతనితో మాట్లాడెదము. ఇప్పుడు, చిన్న పిల్లవాడా, యేసు ఈ భూమిపైన ఉన్నప్పుడు... నీవు నమ్మెదవా... నీవు సండే స్కూలుకు వెళ్ళెదవా? వెళ్ళెదవు . నీవు సండే స్కూలుకు వెళ్ళుటకు ఇష్టపడెదవు. యేసును గూర్చి చదువుటకు నీవు ఇష్టపడెదవా? ఇప్పుడు, యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు, మరియు ఆయన నీ వంటి చిన్న పిల్లలను తీసుకొని, మరియు ఆయన తన చేతులను వారిపై ఉంచి మరియు వారిని దీవించెను. మరియు. ఆయన చెప్పెను, “చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి; వారిని ఆటంకపరచవద్దు: ఏలయనగా పరలోకరాజ్యము అటువంటి వారిదే.” చూశారా?
52
ఇప్పుడు, ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఎడల, మరియు హమ్మండ్‌లో ఇక్కడే ఎక్కడో ఉన్న యెడల, మరియు ఎందుకు, మీరే ఆయన యొద్దకు వెళ్ళి, మరియు ఆయన నీపైన చేతులు ఉంచును, మరియు నీవు బాగుపడుదువు (చూశారా?), ఇప్పుడు, ఎందుకనగా ఆయన యేసై యుండును. ఇప్పుడు ఆయన మహిమలో ఉన్న తన తండ్రీ యొక్క గృహమునకు వెళ్ళెను. మరియు అక్కడ తన తండ్రి కుడిపార్వమున, ఆయన అక్కడ కూర్చొనియున్నాడు, ఈ రాత్రి, మన గురించి విజ్ఞాపన చేయుటకు, తన తండ్రి సింహాసనముపై కూర్చొనియున్నాడు. బహుశా నీకు తెలియ... లేక, మనము ప్రార్ధించినప్పుడు, లేక ఆయనను ఏదైనా అడిగినప్పుడు, ఆయన తన తండ్రి ముందు నిలబడి రక్తమును చూపును. “తండ్రి , నేను ఆ ఉద్దేశ్యము కొరకే మరణించితిని”. చూశారా? మరియు పిదప, వారు, అది అలాగు జరుగును.
ఇప్పుడు, ఆయన ఇక్కడున్న యెడల, ఆయన అక్కడికి వెళ్ళుటకు ఒక సంగతి ఉన్నది, కానీ ఆయన పరిశుద్దాత్మను వెనుకకు పంపెను. చూశారా? మరియు ఆ పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఇక్కడున్నది మరియు మీకు సహాయము చేయుటకు ఆయన సేవకుడైన నన్ను ఆయన పంపెను, దానిని మీరు నమ్మెదరా? మీరు నమ్మెదరు. మీరు నమ్మెదరని నాకు తెలుసు.
53
ఇప్పుడు, చూడుము. చిన్నవాడా, నేను నిన్ను ఎరుగను, ఎరుగుదునా? నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. కానీ ఇప్పుడు, ఒకవేళ ఒక దేవుని యొక్క ప్రవక్తగా నేను ఇక్కడ నిలబడిన యెడల, మరియు మీతో మాట్లాడి, మరియు నీ జీవితమును గూర్చి ఏదైనా నీకు చెప్పిన యెడల, నీకు తెలిసినది, అప్పుడు నీవు నమ్మెదవు, నమ్మవా? ఇప్పుడు, చూడుము. కొంతసేపటి క్రితము మీరు ఉండెడి ఆ గదిలో, మీరు ఉక్కిరిబిక్కిరి అగుదురు, మీరు ఊపిరి కూడా పీల్చలేరు. నీకు ఆస్తమా ఉన్నది. అది నిజమేనా? అది నిజమేనా? రాత్రివేళలో, చాలాసార్లు, ఊపిరి పీల్చుటలో నీకు కష్టముగా ఉన్నది. అది నిజమేనా? మరియు గదిలో ఉన్న ఆ వెలుగు, కొన్ని సార్లు అది... నీవు ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు, వారు నీతో వచ్చి మాట్లాడెదరు, మరియు నీతో పని చేసెదరు. అది ... చూడుము, అది ఆస్తమాయే నిన్ను ఇబ్బంది పెట్టినది. అది నిజమేనా? అది సరే. ఇప్పుడు, హనీ, నీవు ఇక్కడకు రమ్ము.
54
ప్రియమైన దేవా, ఈ ప్రియమైన చిన్న ఇథియోపియా బాలుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు, మరియు నేను అతడిని నా గుండెలలో హత్తుకున్నాను. ప్రభువా, ఈ చిన్న బాలురను నేను (ప్రేమించుచున్నాను. మరియు నీ కుమారుడైన యేసు నామములో ఈ మృదువైన చిన్న బాలుడు, ఆ ఉబ్బసం వ్యాధితో జీవితము నెట్టుకొని వచ్చుచుండగా, అతడిని గూర్చినేను ప్రార్ధించుచున్నాను, ఓ దేవా, ఆ దీనబాలుడు, తన జీవనము కొరకు పనిచేసుకొనవలసియుండెను. మరియు ఓహ్, అది ఎంత ప్రతికూల పరిస్థితి. ఇప్పుడు దేవా, ఈ పరిస్థితిని బట్టి ఈ రాత్రి అతడిని స్వస్థపరిచెదవని నేను ప్రార్థించుచున్నాను. దానిని అతడి..నుండి దూరపరచుము, మరియు అతడిని అభిషేకించుము, మరియు ప్రభువా, బలిపీఠముపై నిలబడి సువార్తను ప్రసంగించుటకు అతడిని ఒక ప్రసంగీకునివలె చేయుము అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ విశ్వాస సహితమైన ప్రార్ధనను నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
చిన్నబాలుడా, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు ఏమి జరుగబోవుచున్నది? బాగవబోవుచున్నాడా? అది సరియే. దేవుడు నిన్ను దీవించును. “దేవునికి స్తోత్రము” అని చెప్పెదము. (సంఘము “దేవునికి స్తోత్రము” అని చెప్పుచున్నది).
55
సహోదరి, దేవుడు నిన్ను దీవించును. నీవునూ నమ్మెదవా? మా పరలోకపు తండ్రీ, ఆ స్త్రీ యెడల దయ చూపమని అడుగుచున్నాను, ఆమెను నీవు మాత్రమే స్వస్థపరిచెదవని ఎరిగియున్నాము, కనుక దానిని నీవు అనుగ్రహించెదవని నేను ప్రార్థించుచున్నాను, నీ కుమారుడైన యేసు నామములో ఆమెను బాగుచేయుము. ఆమేన్.
ఇప్పుడు, ఆ చిన్నబాలుడు నమ్మినట్లుగా నీవునూ నమ్మెదవా? అది సరే. సంతోషిస్తూ మరియు ఆనందిస్తూ వెళ్ళుము. నీకు ఏమి జరిగెను అని నేను తెలుసుకొనుటకొరకు, నీ యొక్క సాక్ష్యమును నాకు వ్రాయుము.
అమ్మా అది సరే. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా, నిన్ను స్వస్థపరచగలవాడైన, ప్రభువైన యేసును నేను అడగవలెనా? అయితే సరే, ఇక్కడకు రమ్ము.
ప్రియమైన యేసూ, ఇక్కడ ఒక స్తీ నిలబడి ఉన్నది. ఆమె ఒక అవసరతలో ఉన్నది. అన్ని సంగతులూ ఎరిగినవాడవైన, నీకు ఆ సంగతి తెలుసు. మరియు నీ యొక్క సేవకునిగా, ఈ రాత్రి నేను అడుగుచున్నాను, నీ పరిశుద్దాత్మ భవనములో ఉండియుండగా, అభిషేకము, మరియు ఈ అద్భుతమైన సంగతులను మాకిచ్చుచున్నది : వచ్చునని నీవు వాగ్ధానము చేసినట్లుగా, తీర్పునకు ముందు గొప్ప సూచనలు వచ్చుచున్నవి. మరియు ఆమె చేతిని పట్టుకొనియుండగా, ప్రభువా, నీవు ఆమెను స్వస్థపరచమని, నేను అడుగుచున్నాను. మరియు ఆనందముగా, సంతోషముగా, దేవుని స్తుతిస్తూ, బాగుపడి ఈ రాత్రి ఆమె తిరిగి రావలెనని యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాము. ఆమేన్.
సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు, నీ హృదయమంతటితో నమ్ముచూ, “ప్రభువా, వందనములు”, అని చెప్పుచూ వెళ్ళుము. అది సరే, ఇప్పుడు ఆ స్త్రీని రానిమ్ము
56
ఒక్క క్షణం మన్నించండి. మీకు ఆ మాట ఇష్టమా? అది ఆశ్చర్యము కాదా? ఆయన ఆశ్చర్యకరుడు. ఈ స్త్రీలో ఏదో తప్పిదము ఉన్నది, మరియు అది దయ కొరకు పిలుచుచున్నది. చూశారా? మరియు ఎవరో ఉన్నారు, మరియు అది ఏమిటో నాకు తెలియదు, కాబట్టి ఒక్కక్షణం. ప్రతీ ఒక్కరూ గౌరవముగా ఉండండి. ఒక్కక్షణం నేను మీతో మాట్లాడగోరుచున్నాను. ఒకవేళ మీకిష్టమైతే, ఇక్కడ వెనుకగా నిలబడుము.
నీ హృదయమంతటితో, అమ్మా, నీవు నమ్మెదవా? (ఆ స్రీ ప్రతిస్పందించుచున్నది “నేను నమ్మెదను”) నేను దానిని నమ్మెదను. మరియు ఆ వెన్నునొప్పితో ఇక నీవు ఎంతమాత్రము ఇబ్బంది పడవని నేను నమ్ముచున్నాను. దీవించెదము ...?... దేవుడు నిన్ను దీవించును, ఆనందిస్తూ వేదికపై నుండి వెళ్ళుము, “దేవునికి కృతజ్ఞతలు” అని చెప్పుము.
అన్ని సంగతులు సాధ్యమే.
అక్కడ ఆ బాల్మనీలో, నన్నే చూస్తూ, ఆ ప్రేక్షకులలో దేవుని యొక్క ఆత్మ కదలాడుచూ ఉన్నది, అక్కడ కొంచెము సేపు నీ హృదయమంతటితో, నేను దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్మెదవా?
నేరుగా నాకు ముందుగా, దేవుని యొక్క ఆత్మ ఈ వైపుగా కదులుచుండుటను నేను చూడగలుగుచున్నాను. అది ఇప్పుడు ఆగియున్నది. అది నన్ను విడిచిపెట్టినది. ఇప్పుడు, ఒక్కక్షణం, ప్రతీఒక్కరూ మీ హృదయమంతటితో నమ్మండి.
ఓహ్, అతడు ఇక్కడే స్నేహితుడని నాకు తెలుసు. దేవునికి స్తోత్రము. అమ్మా అక్కడ కూర్చొనియున్న నీకు గుండె జబ్బు ఉన్నది, గులాబి రంగు దుస్తులు ధరించియున్న ఆమెకు ప్రక్కగానున్న స్తీ, అక్కడ కూర్చొనియున్నది. ఒకవేళ నీవు స్వస్థపడగోరిన యెడల, నీ కాళ్ళపై లేచి నిలబడి, మరియు నీ స్వస్థతను అంగీకరించుము, అక్కడ ఆ రెండవ వరుసలో. ఒకవేళ నీవు స్వస్థపరచబడగోరిన యెడల, లేచి నిలబడి మరియు భాగుపడుము. దేవుడు నిన్నుదీవించును, అది సరే, మంచిది. అది సరే.
అక్కడ కూర్చొనియున్న ఆ నల్లజాతి రంగు స్తీ అవును కదా, నీ... ఏదో సమస్య ఉన్నది, నీ తలలో బాధపడుచున్నావు, అది నిజమేనా? నీవు కదులుచుండుటను నేను చూస్తున్నాను, లేచి నిలబడుము. నీవు స్వస్థపరచబడ్డావు, అది నిజము. దేవుడు నిన్ను దీవించును. ఆమేన్. ఆమేన్.
అ వేరే, పెద్ద, రంగు జాతి స్తీ అక్కడ కూర్చొనియున్నది, ఆ కణతితో, ఆమె కూడా లేచి మరియు ఇంటికి వెళ్ళిపోవచ్చును. ఆమె కూడా బాగుపడినది. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. హల్లెలూయా.
అది సరే, అమ్మా, ఇంటికి వెళ్ళి మరియు నీకు కావలసినది తినుము, నీవు అక్కడ కూర్చొనియుండగానే నీ కడుపు సమస్య నిన్ను విడిచిపెట్టినది. నీవు వెనుకకు వెళ్ళవచ్చును, నీకు కావలసిన దారిలో వెళ్ళవచ్చును. ఎంత ఆశ్చర్యము.
ఆ బిడ్డ కొరకు నీవు నమ్మెదవా? ఓహ్, యేసూ, ఈ దీన, చిన్న తొందరపాటు కలిగిన బిడ్డను దీవించుము, మరియు ఆమెను బాగుపరచుము; నీ కుమారుడైన యేసు నామములో నేను ఆమెను దీవించుచున్నాను. ఆమేన్. సహోదరుడా కాక్స్, దేవుడు నిన్ను దీవించును.
ఆమె నీకు బంధువా? అని నేను అనుకొన్నాను. అని నేను అనుకొన్నాను. వెళ్ళుము మరియు. ప్రభువు ఆయన యొక్క స్వస్థతా శక్తులను అనుగ్రహించును. గాక. విశ్వాసముంచుము. నమ్ముము.
అది సరే, అమ్మా. ఇప్పుడు, అక్కడ తిరిగి అంతా కేకలతో నిండియున్నది. భవనములో అన్నివైపులా అది కదులుచున్నది. ఇక్కడ ఈ స్తీ బాధపడుచున్న అదే సమస్యతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ బాధపడుచున్నారు. ఈ రాత్రి ఒక రోగితో నేను మాట్లాడుచున్నప్పుడు ప్రతీసారీ అది నావైపు కదులుచున్నది. కడుపు సమస్యతో బాధపడుచున్న మీరందరూ... నీకు కడుపు సమస్య ఉన్నది, అవును కదమ్మా? కడుపు నొప్పితో బాధపడుచున్న వారందరూ లేచి నిలబడుము. నేను ఏమి చెప్పుచున్నానో చూడుడి? మీరు అక్కడే ఉన్నారు. అది ఏమిటి ...? ప్రభువా, భూమ్యాకాశములకు దేవా, ఈ రాత్రి అది తెలియపరచబడును గాక, నేను నీ యొక్క ప్రవక్తనని, మరియు నీవే దేవుడవని. యేసుక్రీస్తు యొక్క స్వస్థతాశక్తిని ఇప్పుడు నేను స్వాధీనపరచుకొనుచున్నాను. యేసునామములో, ప్రతీ ఒక్కరినీ నీవు స్వస్థపరచుము.
అది సరే. సహోదరి వెళ్ళుము, మీ ఒక్కొక్కరూ ఇంటికి వెళ్ళుము, లేక మీకు కావలసిన దానిని తినుము.
(సహోదరుడు బ్రాన్హాం వేదికపై ఎవరితోనో మాట్లాడుచున్నారు) లేదు, ఒక్కక్షణం,
వెనుకకు రమ్ము, వెనుకకు రమ్ము, ఒక్కక్షణం.
సాతాను ఓడిపోయినవాడు. సాతాను ఒక ఓడిపోయినవాడు.
అమ్మా, ముందుకు కొనసాగుము, అప్పుడు నీవు స్వస్థపడెదవు. నీ యొక్క కడుపు నొప్పి కూడా, కాబట్టి నీవు ఇంటికి వెళ్ళవచ్చును. నీవు అక్కడ వరుసలో నిలబడినప్పుడే స్వస్థపడియున్నావు, ప్రతీ... తక్కిన వారందరూ. అది సరే.
దేవుడు నిన్ను దీవించును, కొనసాగుము. ఓహ్, ఇప్పుడు దేవుడు ఏమి చేయును? ఏమిటి?
ఆమెను ఇక్కడకు తీసుకొని రమ్ము. మీకొకటి చూపించనివ్వండి. ఈమె దేనితో బాధపడుచున్నదో, దానితో ఇక్కడ డజన్ల మంది బాధపడుచున్నారు. ఈమె ఒక మానసిక సంబంధమైన ఉద్రిక్తతతో బాధపడుచున్నది. ఆమె నిజమైన నరముల బలహీనత మరియు నిరుత్సాహము, అది నిజమేనా? మిన్ - ఒకవేళ అది నిజమైతే నీ చేయి పైకెత్తుము. అది సరే. అటువంటి బలహీనతతో ఇక్కడ ఎంత మంది బాధపడుచున్నారు, మీ కాళ్ళపై నిలబడుము, ఈ సమయములో స్వస్థపడగోరువారు. రండి, నీవు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఆ ఆత్మ వేడుకొనుచున్నది, “దయ, దయ, దయ చూపుము”.
ఏమిటి ... అదియే నేను చేయాలని దేవుడు కోరుచున్నాడు, నేను ఇప్పుడే ఇక్కడే దానిలోనికి వెళ్ళియున్నాను.
సాతానా, నీవు ఒక ఓడిపోయినవాడవు, యేసుక్రీస్తుయొక్క నామములో, అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిలో నుండి బయటకు రమ్ము...?... అది సరే.
అయిదు సంవత్సరములు, దానిని గూర్చియే నేను మాట్లాడుచున్నాను. అదియే దేవుడు కోరుచున్నాడు, దానిని ఇంతవరకూ నేను చూడలేదు. ఆయన ఏమి చెప్పుచున్నాడో నేను చూడగలను. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంటికి వెళ్ళి మరియు కడుపు సమస్య లేకుండా తినుము; అది చెడ్డది. ప్రతీ నరముల బలహీనత కలిగిన రోగి, ఇంటికి వెళ్ళి మరియు బాగుపడుము.
ఇప్పుడు, ఒక్కక్షణం, అది ఇక్కడ తిరిగి వచ్చినది. ఇప్పుడు, ఒక్కక్షణం, ఈ వ్యక్తి యొద్ద నుండి ఒక బలమైన కదలిక వచ్చినది. ఓహ్, ఇదిగో ఇక్కడ ఉన్నది. అయ్యా, నీకు క్యాన్సర్ ఉన్నది. నీకు క్యాన్సర్ ఉన్నది. నీకు ఉన్నది. అది నిజమేనా? అవును. ఆమెకు క్యాన్సర్ ఉన్నది. అది సరియే. అమ్మా, దేవుడు లేకుండా నీవు జీవించలేవు; క్యాన్సర్ కలిగిన ప్రతీ ఒక్కరూ, మీ కాళ్ళపై నిలబడుము. మీరు స్వస్థపడుటకు సిద్దపడియున్నారా? సిద్ధపడ్డారా? ఆ పడకపై నుండి లేచుటకు సిద్ధముగా ఉన్నారా... ... ఇంటికి వెళ్ళుము, మరియు. బాగుపడుము ? అది సరియే యేసుక్రీస్తు యొక్క నామములో, లెమ్ము, ఇంటికి వెళ్ళుము...?...పైకి లేచి మరియు నడువుము, ప్రభువైన యేసు నామములో...?... ప్రభువైన యేసు నామములో ...?... ఇంటికి వెళ్ళి మరియు బాగుపడుము...?... ఇంటికి వెళ్ళి మరియు బాగుపడుము. సర్వశక్తి గల దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో, ప్రతీ దయ్యపు శక్తిని నేను గద్దిస్తున్నాను. బయటికి రమ్ము...?... దురాత్మల సమూహము. ఈ ప్రజలలో నుండి బయటకు రమ్ము.