ప్రశ్నలు మరియు జవాబులు #1

ప్రశ్నలు మరియు జవాబులు #1

1మనము ప్రార్థనకు తలలు వంచియుండగా ఒక్క క్షణము లేచి నిలబడుదము.

కృప గల తండ్రియగు దేవా, ఈ ఉదయకాలమున మా హృదయపు లోతులలో నుండి నీకు వందనములు చెల్లించుచున్నాము, ఎందుకనగా నీవు మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వగల సమర్దుడవు మరియు అందుకు ఇష్టపడుచున్నాము. ఇంతవరకూ మీరు మాకు చేసిన దానిని బట్టి మేము చెల్లించు వందనములను స్వీకరించుమని ప్రార్ధించుచున్నాము. ఈ ఉదయ కాలమున నీవు మాకు సహాయము చేయుదువని గొప్ప ఆశతో ఎదురు చూచుచున్నాము. మేము ఈ భవనములో నుండి బయటకు వెళ్ళునప్పుడు వచ్చినట్లుగా కాక వేరొక మనుష్యులముగా మారి బయటకు వెళ్ళుదుము గాక. పరిశుద్ధాత్మ ఈ ఉదయమున మమ్మును మలచును గాక! మా గుణశీలములను చక్కబరచి, నీ రాజ్యమునకు విధేయులమగునట్లు మమ్మును చేయును గాక. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

2కొద్దిగా ఆలస్యమయినందుకు చింతించుచున్నాను, కాని నాకు కొన్ని చేయవలసిన పనులున్నవి. ఈ భవనములోనికి రాకముందు చాలా మంది రోగులు నన్ను కలిసికొనుటకు వచ్చిరి. వారిని చూడవలసి వచ్చెను.

ఈ ఉదయమున ఇక్కడ మిమ్మునందరినీ చూచుటకై ఎంతో సంతోషించుచున్నాను. చాలా చక్కని జనులు. నా భార్యకు, మాకు, మీరు పంపిన చక్కని వస్తువులను గూర్చి మీకు వందనములు చెల్లించుచున్నాను. ఒక సోదరుడు తన ప్రియమైన రైఫిల్ ను నాకు పంపించెను. ప్రభువతనిని దీవించును. తాను వృద్దుడనగుచున్నాను గనుక దానిని ఇక వాడగోరుటలేదని అతడు చెప్పెను, కావున నేనుపయోగించవలెనని నాకు ఇచ్చెను. దానిని బట్టి నిశ్చయంగా నేను కృతజ్ఞడనైయున్నాను. సోదరుడా, నేను బ్రతికియున్నంతకాలము, నేను ఉపయోగించగలిగినంత కాలము దానిని నేనుపయోగించుదును. నీ గూర్చి తలంచి, నీ కొరకు ప్రార్థించి నేను దానిని వాడుచుందును.

3ఈ దినము చాలా పనులు చేయవలసియున్నాము. ఇక్కడ నేనుండగా సంఘములోని మనుష్యుల హృదయములలోయున్న కొన్ని ప్రశ్నలను గూర్చి ఆలోచించితే బాగుండునని తలంచుచున్నాను. నిశ్చయంగా నేను చెప్పెదను. వెయ్యేండ్ల పాలన ప్రారంభమగు వరకూ చెప్పినా తరగనన్ని ప్రశ్నలు నాయొద్ద ఉన్నవి. అన్ని ప్రశ్నలు వచ్చునని నేనెన్నడూ తలంచలేదు. కొన్ని వందల ప్రశ్నలు ఇచ్చటున్నవి. ఈ ఉదయమున మరో వందకు పైగా ప్రశ్నలు వచ్చినవి. కావున వాటన్నిటికి నేనెన్నడూ జవాబు ఇవ్వలేనని అనుకొనుచున్నాను. అవి మంచి ప్రశ్నలు, నిజముగా చాలా మంచి ప్రశ్నలు.

అందులో కొన్ని ప్రశ్నలను బహిరంగముగా ప్రజలలో చదువుటయు మంచిది కాదని మీరు తెలిసికొనుడి. అవి కొన్ని కుటుంబ సమస్యలు. మీరు గ్రహించగలరు. అటువంటప్పుడు భార్యభర్తలిరువురినీ ప్రత్యేకముగా పిలచి మాట్లాడవలెను. ఆ విషయముల గూర్చి తెలిసికొనవలెను. అవి చెడ్డ కార్యములు కావు; కుటుంబములో సర్దుబాటు చేయవలసిన సంగతులవి, మనము మానవులము గనుక స్వభావము ఆ విధంగా ఉండును. మనం జీవించుచున్న కాలమును బట్టి ఇవి తలెత్తుచుండును. మానవ కుటుంబములలో ఈ సమస్యలు వచ్చుచుండును. వాటికి తప్పక జవాబు రావలెను. నేను వాటికి జవాబిచ్చుటకు నా శాయశక్తులా ప్రయత్నించి, అత్యుత్తమ రీతిగా జవాబు ఇచ్చెదను.

4ప్రశ్నలకు జవాబు ఇచ్చుటలో కొన్నిసార్లు చాలా సమయము పట్టును. వాటిలో ఏ ఒక్కటినీ నేను తప్పించుదలచుకోలేదు. నాకు వీలయినంత వరకు వాటికి నేను జాగ్రత్తగా జవాబు ఇచ్చెదను. వాటిని నేను ఈ సంచిలో వేసియున్నాను. ఒక్కొక్క దానిని చూచి లేఖనాననుసారముగా జవాబు ఇచ్చెదను. నిన్న దినమంతయూ మరల రాత్రిలో చాలా వరకు నేను ఆ పని మీదనే ఉన్నాను. ఈ ఉదయం కూడా కొంతసేపు చూచాను. ఈ ఉదయమున ఇంకా రెండు రెట్లు ప్రశ్నలు వచ్చియున్నవి. ప్రభుని చిత్తమయితే, ఈ మధ్యాహ్నము వరకు ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్పెదనని అనుకొన్నాను. మరల సాయంకాలమున ఇక్కడికి వచ్చి మిగిలిన వాటిని పూర్తి చేయుదును. ఈ రాత్రికి కూడా వచ్చి వీలయినన్ని మరల నేను పూర్తి చేయుదును. వాటిని ఎంత వరకు పూర్తిచేయగలనో నేను చూచెదను. ఒకే పర్యాయము చాలా సేపు మిమ్మును కూర్చోబెట్టి శిక్షించదలంచుకోలేదు. మీరు బయటకు వెళ్ళుటకు, విశ్రాంతి తీసికొనుటకు, కొద్దిగా ఇటూ అటూ తిరుగుటకు, చిన్న కునుకు తీయుటకు మీకు విరామ సమయము ఇచ్చెదను. వీలయితే మీరు మరల రండి. సహోదరుడు ఫ్రెడ్ సాద్మన్ దీనిని టేపు చేయుచున్నాడు. మీరు రాలేనప్పుడు అవి వినండి. దీనిని టేపు చేయుచున్నారా? మంచిది. వారు ఆ గదిలో దానిని టేపు చేయుచున్నారు. మీరు ఈ టేపును తీసికొని వెళ్ళవచ్చును. దానిని ప్రశ్నలు మరియు జవాబులు టేపుగా పిలచుట జరుగును, ఎందుకనగా కొన్ని నిజంగా కఠినమగు ప్రశ్నలున్నవి. అందులో చాలా వరకు సంఘ సిద్ధాంతములపై యున్నవి.

5కొన్నిసార్లు ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చుట కష్టమని నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ నిలబడుటకు ఎంతో కృప కావలెను. ప్రజల పట్ల నాకున్న ప్రేమను నేను వ్యక్తపరచలేను. నా పిల్లలకు కూడా దానిని నేను వివరించలేను. నేను నాకున్న ప్రగాఢ ప్రేమను నా భార్యకు కూడా వ్యక్తము చేయలేను, ఎందుకనగా నేను ఉద్రేకపూరితుడను. ఒకే తిన్నని గీతమీద నడిచిపోవుచున్నాను. సర్వశక్తుడగు దేవునికి మాత్రమే నేను నా పూర్తి ప్రేమను వ్యక్తము చేయగలను. అన్నిటి కంటె ప్రధమముగా ఆయననే నేను ప్రేమించుచున్నాను. ఇతరులను నేను ప్రేమించుచున్నాను. కాని ఆయన పట్ల నాకు గల ప్రేమను అందుమూలముగా ఆటంకపరచగోరుట లేదు. ఆయనే ప్రధముడు. కాబట్టి మీ ప్రశ్నలకు నేను జవాబులు ఇచ్చునప్పుడు, మీ పట్ల నా హృదయములో ప్రేమ కలిగియుండి జవాబు ఇచ్చెదనని గ్రహించవలెను; కాని నా యెదుట యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఉన్నాడు (చూచారా?) ఆయనిచ్చు జవాబునే మీకిచ్చెదను.

6కొన్నిసార్లు నా జవాబులు మీకు బాధ కలిగించవచ్చును. గాయములను చేయవచ్చును. అయితే అది నా భావము కాదు. ఒకే ఒక ఉద్దేశ్యముతో నేను జవాబు ఇచ్చుచున్నాను. క్రీస్తు నా ముందున్నాడని చెప్పియున్నాను గదా? అది ఆయనే అని నేను గుర్తుంచుకొనవలసియున్నాను. నేనాయనకు లెక్క అప్పగించవలసియున్నాను. కాబట్టి నా మొదటి ప్రేమ ఆయనకే. నా రెండవ ప్రేమ మీ జనులమీద యున్నది. ఆయన తన సంఘమును తన స్వరక్తమిచ్చి కొనియున్నాడు. ఆయన తన్నుతాను ప్రేమించుకొనిన దానికంటె ఎక్కువగా మిమ్ములను ప్రేమించుచున్నాడు, ఎందుకనగా ఆయన మీ కొరకు తన్ను సమర్పించుకొనెను. మీరాయన రక్తముచేత కొనబడినవారు. నేను నాకు తెలిసినంత జాగ్రత్తగాను, యధార్ధముగాను ఈ పని చేయుచున్నాను. కాని కొన్నిసార్లు మీరు ఈలాగు తలంచుచుందురు, "చాలా కఠినముగా మాట్లాడుచున్నాడు. మరీ కరకుగాను, నిర్మొహమాటముగాను మాట్లాడుచున్నాడు." ఆయనను మనస్సులో యుంచుకొని ఇది నేను చేయుచున్నాను, చూచారా, ఇది ఈ విధముగానే యుండవలెనని మీరందరూ గ్రహించవలెను. ప్రజలను బాధపెట్టవలెనని గాని, నొప్పించవలెనని గాని ఇది చెప్పుట లేదు. జనులు నిశ్చయంగా గ్రహించవలెనని నేనిది చెప్పుచున్నాను. అందరూ ఆ విధముగానే దానిని చేర్చుకొనవలెనని నేను కోరుచున్నాను. మన మనస్సులలో యున్నదానిని ఇక్కడ మనము కనుగొందుము.

మీరందరూ ఈ ఉదయము ఇక్కడ కూడికొనుటను నేను చూచియున్నాను. ఇక్కడ, మరియొక సంఘములోను జనులు క్రిక్కిరిసియున్నారనుకొనుచున్నాను. మరో సహ సంఘము రేడియో లేదా టెలిఫోను సంబంధమును ఏర్పరచుకొనియున్నది. ఆ సంఘములో ఈ ఉదయము పట్టలేనంతగా జనులు వచ్చియున్నారని నాకర్థమయినది. మరో సోదరుని సంఘము కూడా ఆ విధంగానే జనులతో నిండిపోయియున్నది. ఈ ఆలయము నుండి అక్కడికి వర్తమానము ప్రసారము చేయబడుచున్నది. ఆ కారణము చేతనే మీరందరూ నిలబడియున్నారు మరియు గోడల చుట్టూ చేరబడియున్నారు.

7ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రికి కొంత పెందలకడనే ప్రారంభించుదము. సంఘ కాపరిని, బోర్డు వారిని నేనడుగగోరుచున్నాను. ఈ రాత్రికి కొద్దిగా ముందు ప్రారంభించుదము, ఎందుకనగా కొందరు చాలా దూరము నుండి వచ్చియున్నారు. వారు మరల కారు నడపుకొని వెళ్ళవలెను. వీలయితే ఈ రాత్రి ఒక గంట ముందే నేను ప్రారంభించవలెనని కోరుకొనుచున్నాను. దానిని ముగించెదను. 6 గంటలకు తర్వాత మీరు మీ భోజనము ముగించుకొని వచ్చినచో ఏ సమయములో నయినా మనము ప్రారంభించుకొనవచ్చును. చూచారా? మీరు మామూలుగా 7:30కు ప్రారంభించుదురు గదా? నేను 7:00 గంటలకే వేదిక మీదికి వచ్చెదను. చూచారా? అప్పుడు 8:00 లేదా 8:30 గంటలకు విడిచిపెట్టెదను, రేపు అనునది ఉన్నట్లయితే, మీరు మీ ఇండ్లకు తిరిగి వెళ్ళి రేపటి పనికొరకు సిద్ధపడవచ్చును.

ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మును సమృద్ధిగా దీవించును గాక. ఈ ఆరాధన ముగిసిన వెంటనే నేను వెళ్ళిపోవుదును. మిగిలిన ప్రశ్నలకు జవాబులు వెదకుదును. చిన్న చిన్న కాగితముల మీద అవి వ్రాయబడియున్నవి. లేఖనములను మరచిపోయాను. గదిలో నేను అధ్యయనము చేయుచుంటిని. (వాటిగూర్చి ముందే చెప్పవలసియుంటిని, గాని ఇప్పుడు సమయం వచ్చినది) ఒక కాగితము మీద వ్రాసియున్నాను. ఎన్సైక్లోపీడియా చూచి వాటికి జవాబు ఇయ్యవలెను. ఒక మాటకు లేదా పేరుకు అర్థము అందులో యుండును. వాటిని నేను చూచుకొందును. పుస్తకాలు ఎక్కువగా ఇక్కడికి మోసికొని నేను రాగోరుట లేదు; వాటిని అక్కడే నేను చూచెదను.

8ప్రశ్నకు నేనిచ్చిన జవాబు మీకు సంతృప్తికరముగా లేకపోవచ్చును. నేను తప్పు చెప్పవచ్చును. చూచారా? నేను పొరపాటుగా చెప్పవచ్చును, ఎందుకనగా నాకు తెలిసిన అత్యుత్తమ రీతిలో వీటిని చెప్పుచున్నాను. కొన్ని సంఘముల వారు లేదా కొందరు సేవకులు వీటిని విందురు. మీ బోధ మీద దీని ప్రభావము ఏదయినా పడినయెడల, మీ సంఘముతో మీరు అర్థమగునట్లు వివరించవలెనని కోరుచున్నాను. ఈ ఆలయములోని వారు అర్ధము చేసికొనవలెనని ఆలాగు చెప్పుట జరిగినది. ఏ ఇతర గుంపు జనుల మీద దీనిని రుద్దవలెనని నేను ప్రయత్నించుట లేదు. నేను నా హృదయములో క్రైస్తవునిగా ఉండగోరుచున్నాను. నేను నమ్ముచున్నదానినే బోధించగోరుచున్నాను. నేను నమ్మినదాని కొరకు నిలబడియున్నాను. ఆ విషయములో నేను రాజీపడినచో మోసగాడినవుదును, మీ పట్ల వేషధారినగుదును; నేను ఏది సత్యమని నమ్ముచున్నానో దానిపట్ల విధేయునిగా నిలబడవలెను. ఆ విధముగానే ప్రతివారు చేయు హక్కును కలిగియున్నారు. మనందరికి దేవుడే తీర్పరియై యున్నాడు.

9మనము ప్రారంభించు ముందుగా, ఒక చక్కని చరిత్రకారుడగు పాల్ బాయడ్ ను గూర్చి ప్రస్తావించవలెనని కోరుచున్నాను. మీలో చాలామంది అతనిని ఎరుగుదురు. అతడు ఈ ఆలయమునకు వచ్చును. ఈ మధ్యనే అతడు యెరూషలేములోని ప్రపంచ సంతకు హాజరయి వచ్చెను. అతడు ప్రవచనములను చక్కగా బోధించును. ఒక గొప్ప చరిత్రకారుడు. అతడు మెనోనైట్ సోదరుడు - పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినవాడు. నాకు చాలా వ్యక్తిగతమగు స్నేహితునిగా అతడున్నాడు. నేను ప్రవచనము గూర్చి చెప్పినప్పుడు అతడు దానిని చక్కగా గమనించి దానిని గూర్చి పరీక్షించును. ఆ ప్రవచన నెరవేర్పు గురించి కనిపెట్టుచుందును.

ఇక్కడ అతడు నాకు వ్రాసినది యున్నది (అతడిప్పుడు అమెరికాలోనో యున్నాడు), అది బులెటిన్ బోర్డు మీద యున్నది. ఈ ఉదయము దానిని గూర్చి ఆలోచించుచున్నాను. ఇక్కడ అతడు ఒక నోట్ వ్రాసెను. ఒక పత్రికలో దానిని ప్రచురించెను. అసామాన్యమగు ప్రవచనములను గూర్చి వ్రాసెను. అతడు అయిదవ దానిని ఎత్తిచూపెను. విజ్ఞానము ఎట్లు అభివృద్ధి చెందునో నేను ముప్పది-మూడు సంవత్సరాల క్రితమే చూచాను. మీరు దానిని గూర్చి వ్రాసికొని గుర్తుంచుకొనియున్నారు. నా పుస్తకములలో అది యున్నది. ప్రభువు నాకు చెప్పిన ప్రతిదానిని నేను వ్రాసియున్నాను. జనులకు దానిని గూర్చి చెప్పవలెను.

10ఈ ఉదయము దీనిని ప్రారంభించు ముందుగా, నాకు ఒక ఆలోచన వచ్చియున్నది. ఇవి ప్రసంగములు కావు, మన హృదయములలో యున్నదానిని, ఒకరి నుండి మరొకరము నేర్చుకొనుచున్నాము. ఈ సంగతులన్నింటినీ మనము వడకట్టి చూచుకొందము. మనము సంఘ కాలములను దాటియున్నాము. ఒకటి లేదా రెండు కూటముల కొరకు ఆగుట మంచిదని నేను తలంచుచున్నాను. చెప్పినదానిని పరీక్షించుకొనవలెను. ప్రజల హృదయములలో ఉన్నదానిని చూడవలెను. ఆ తరువాత ఇక్కడనుండి వెళ్ళవలెను. గ్రహించారా? ఆ తరువాత వరుస కూటములు జరుగును. ప్రభుని చిత్తమయితే, కొద్ది కాలములోనే ఇక్కడ వాటిని ప్రారంభించవలెనని కోరుచున్నాను. చాలా దీర్ఘకాలపు వరుస కూటములు. నా భావము మీరు గమనించియుందురు. వివిధ అంశముల గూర్చి బోధించుదును. ఆయన నా కొరకు వచ్చువరకు లేదా నేనాయనను కలిసికొనుటకు వెళ్ళు వరకు ఈలాగు చేయవలెను, చూచారా.

నేను 1933వ సంవత్సరములో చూచిన ఏడు సంగతుల గూర్చి ఇక్కడ పాల్ బాయడ్ వ్రాసెను. అవి జరుగనైయున్నవి. అతడు వాటిని సాంకేతిపరంగా ఎంతో జాగ్రత్తగా గమనించుచున్నాడు, ఎందుకనగా అతడు ఒక చరిత్రకారుడు. వాటిని అతడు గమనించును. మీరు చెప్పిన ప్రకారమే గమనించును. చాలా సంవత్సరాల క్రితం చెప్పిన సంగతులను అతడు చక్కగా గమనించుచుండును. ముస్సోలినీ గూర్చి గమనించెను. అతనికేమగునో గమనించెను. హిట్లరుకు ఏమి జరుగునో అతడు గమనించెను. ఫాసిజంను ఇంకా ఇతర వాదములను కమ్యూనిజం ఎట్లు మ్రింగి వేయునో అతడు చూచెను. సీగ్ ఫ్రిడ్ వరుసను ఎట్లు నిర్మించెదరో అతడు చూచెను. అక్కడ అమెరికనులు ఎట్లు పోరాడుదురో చూచెను. (దాదాపు రెండు సంవత్సరాల క్రితం వరకు వారు దానిని అంగీకరించనే లేదు. దానిని ముట్టడించిన జర్మను పటములను వారు చూచిరి; వారు నిజంగా పోరాడిరి. వారు తమ యొక్క పూర్తి సైన్యమును అచ్చట కోల్పోయిరి); ఆ సంగతులన్నియూ నెరవేరియున్నవి.

11ఇంకా ఈలాగు చెప్పబడెను, "అంత్యకాలమునకు ముందు కార్లు అండాకారములో తయారు చేయబడును. చాలా గుండ్రముగా కనిపించును. అటువంటి ఒక కారును రోడ్డు మీద నడుపుకొనిపోవుచున్న అమెరికను కుటుంబమును చూచాను. వారు ఒకరికెదురుగా ఒకరు కూర్చొనియుండిరి. ఒక బల్ల యున్నది. వారు జూదము లేదా మరేదో ఆట ఆడుచున్నట్లుగా కనిపించినది. ఆ కారుకు నడపించు స్టీరింగ్ వీల్ లేదు. స్టీరింగ్ వీల్ కాకుండా మరేదో దానిని అదుపులో ఉంచుచున్నది. దానిని గూర్చి నేను ప్రవచించినప్పుడు ఇక్కడ ఎందరున్నారు? (చూచారా?)

ఆ ప్రపంచ సంతలో అటువంటి కారును ప్రదర్శించినట్లు అతడు చెప్పెను. దానినిప్పుడు అమ్ముచున్నారు. ఒక పెద్ద కంపెనీ వాటిల్లో చాలా మట్టుకు కొనెను. ఆ కారు ఇక్కడున్నది. పాల్ బాయడ్ ఆ ప్రవచనమును గుర్తుంచుకొనెను. తన పుస్తకములో నేను చెప్పిన దానిని చూచుకొనెను. దాని బొమ్మను తీసికొని వచ్చెను. అది ఖచ్చితంగా అండాకారములో యున్నది. రెండు సీట్లు ఎదురెదురుగా యున్నవి. రెండు సీట్లు అభిముఖంగా యున్నవి. కార్డులు ఆడుకొనుటకు మధ్యలో బల్ల యున్నది. ఖచ్చితంగా!

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

12ప్రభువు యొక్క మాట ఖచ్చితము. అది 1933లో చెప్పాను. అదేమిటో చూద్దాం. ముప్పది-మూడు సంవత్సరాలు కాలేదా? ఇది 64వ సంత్సరం. ముప్పది-ఒక్క సంవత్సరాలయినవి. ముప్పది-ఒక్క సంవత్సరాల క్రితం ప్రభువు దానిని నాకు చెప్పెను. దానిని అమ్మే కంపెనీ ఇప్పుడు లేచియున్నది. ఆర్డరు సేకరించుచున్నారు. ట్రక్కు కంపెనీలు కూడా ఆ స్వరూపములోనే ట్రక్కులను తయారు చేయవలెనని ఆర్డర్లిచ్చుచున్నారు. వారు తమ ప్రధాన కార్యాలయములలో ఉండియే వాటిని నియంత్రించుచుందురు. దానికి డ్రైవరు కూడా అక్కర్లేదు. ఇప్పటికే అది తయారయినది. ఆ కారు మార్కెట్లో ప్రవేశపెట్టబడినవి. ఆ వెనుకనున్న బులెటిన్ బోర్డు మీద పటమున్నది. మీరు ప్రవచనమును చదువవచ్చును. మన దేవుడు ఎంత ఖచ్చితమైనవాడో గమనించండి. ఆయన మాట ఖచ్చితము. "భూమ్యాకాశములు గతించినా గాని ఆయన మాటలేమాత్రమూ గతించవు."

చూడండి, ముప్పది-మూడు సంవత్సరాలు జరిగిపోయినవి. 1931 మోడల్ కారు ఎట్లు౦డెనో మీరెరుగుదురు కదా? అది గ్రుడ్డు ఆకారములో రూపొందించబడునని చెప్పాను. దానిని నేను చెప్పగా వినినవారు. ఇప్పుడు ఇక్కడెవరూ సజీవంగా లేరు. ఆయా సందర్భములలో ఈ కాలమంతయూ నేను చెప్పుకొంటూ వచ్చుచున్నాను. ఇక్కడ ఒకామె కూర్చొనియున్నది. శ్రీమతి విల్సన్, ఆమెను నేను చూడలేదు. దానిని నీవు గుర్తుంచుకొనియున్నావు. ఆమె క్షయవ్యాధితో చనిపోవుచుండినప్పుడు స్వస్థత పొందినది. (ఆమె భర్త మరియు కుమార్తె వచ్చి ఆమె కొరకు నన్ను ప్రార్ధించమని అడిగిరి) ఆమె రక్తము కక్కినది. ఆమె రక్తమును అద్దిన బట్టలు ఆ గదిలో మూలన కుప్పగా పడిపోయియున్నవి. ఆమె ఏ మాత్రమూ జీవించు అవకాశము లేదని వైద్యులు చెప్పిరి. ఆమె చనిపోవు ముందుగా, నాతో ఏదో చెప్పవలెనని ప్రయత్నించినది. ఆమె కక్కుచుండిన రక్తము వలన దుప్పట్లు, తలగడలు తడిసిపోయినవి. ఆమె దగ్గుటకు ప్రయత్నించెను. ఆమెను నేను పడకమీద నుండి లేపాను. ఇక్కడున్న ఒక చల్లని నదియొద్దకు తీసికొని వెళ్ళగోరాను. అది చల్లని నీరు. ఆ నీటిలో ఆమెకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చాను. అది జరిగి ముప్పది-మూడు సంవత్సరములయినది. నేడు ఇక్కడ ఆమె కూర్చొనియున్నది. చక్కగా జీవించి, ఆరోగ్యవంతమగు పెద్ద పిల్లలను కనినది. అందులో చాలామంది గతించిరి. చూచారా, "అద్భుతమైన కృప. ఎంత మధురమైన స్వరము, నావంటి ఒక నీచుని అది రక్షించెను." యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనునది ఎంత పరిపూర్ణముగా నెరవేరునో అందువలన అర్థమగుచున్నది.

13[సమూహములో నుండి ఒక సోదరి బ్రెన్హాం సోదరునితో మాట్లాడుచున్నది.] అది సరియే సోదరీ! అవును! చివరి దినములలో స్త్రీ చాలా అసభ్యకరముగా ప్రవర్తించునని చెప్పాను. ముప్పది సంవత్సరాల క్రితం వారెట్లు దుస్తులు ధరించిరో చూచారా? వారు ఎంతవరకు దిగిజారిపోవుదురనగా, చివరకు క్రింద చిన్నగుడ్డ పేలిక నుంచుకొని వీధులలో నడిచిపోవుదురు. నేనిట్లు చెప్పాను, "చివరకు వారు అంజూరపు ఆకు వంటిది ధరించుకొందురు. అంత ఘోరముగా వారు తయారగుదురు. ఇది నెరవేరును." దానిని నేను చూచాను. అదిప్పుడు నెరవేరుచున్నది. అటువంటిదే వారిప్పుడు ధరించుచున్నారు. స్త్రీల యొక్క నైతిక పతనము అంతగా యుండును. బహు నీచ స్థితికి దిగిజారిపోవుదురు. ఇంక అంతకంటె దిగజారిపోవుట ఉండదు. ఇంతకంటె అధ్వాన్న స్థితి యుండదు. ఆమె ముగింపుకు వచ్చినది. వారు పూర్తిగా వస్త్రములు ధరించకుండా ఎన్నడూ ఉండరు.

నేను జనులకు బోధించాను, వేలాదిమంది స్త్రీలకు బోధించాను, వారికి అసలు వస్త్రములు గూర్చి శ్రద్దయే లేదు. (చూచారా?), వారు యువతీ యువకులు, కాని తాము దిగంబరులమని వారెరుగరు. చూచారా? వారికది తెలియదు.

14ఈనాడు స్త్రీలు ఆ విధముగా ప్రవర్తించుచున్నారు…

ఒక రోజున కొందరు నా స్నేహితులతో ముచ్చటించుచున్నాను. ఆ వెనుక కొండలలో యున్నాను. అక్కడున్న ఒక యువతి యొక్క బిడ్డకు ప్రార్ధన చేశాను. ఆ పిల్లకు మూర్చ రోగమున్నది. ఆ బిడ్డ బాగయినది. వారిది చిన్న పేద కుటుంబము. అది ఎక్కడో మారు మూలన యున్న గ్రామము. వారి ఇంటి చుట్టూ పొగాకు పొలమున్నది. ఆ ఇంట్లో రెండు గదులున్నవి - ఏడుగురు లేదా ఎనమండుగురు పిల్లలున్నారు. ఆమె ఎంతో కష్టించి పనిచేయుచున్నది. పెద్ద గొడ్డలితో కట్టెలను నరకుచున్నది. తోటను దున్నుచున్నది. ఆహార పదార్ధములను నిలువచేయు పనిలో యున్నది. ఆ పేద స్త్రీ వైపు నేను చూచాను. ఒకటి లేదా రెండు సంవత్సరముల నుండి అదే దుస్తులను ధరించుచున్నది. బాగా చినిగియున్నది. ఆ తరువాత నేను మిడా యొక్క బట్టలు కొన్ని తీసికొని వెళ్ళి, ఆమెకియ్యవలెనని తలంచాను.

అక్కడ నిలబడియుండగా మేము గమనించాము. నాతో పాటు కొందరు సోదరులున్నారు. ఆమె తన బిడ్డకు పాలిచ్చుచున్నది. ఆమె తన రొమ్మును బట్ట దిగువ నుండి బయటకు తీసి బిడ్డకు పాలియ్యసాగినది. బిడ్డకు పాలిచ్చుటకు తగినట్లుగానే ఆ దుస్తులు ఉన్నవి. నాకు ఒక్క నిమిషం పాటు ఎంతో ఆశ్చర్యం వేసినది. నా తల్లి నాకు ఆ విధంగానే పాలిచ్చెను. ఇది అక్షరాలా నిజం.

15చిన్న డ్రాయర్లు వేసికొని సగం దిగంబరులుగా తిరుగుచున్న నేటి స్త్రీలకంటే అటువంటి స్త్రీలే నయం. వారిని నేను గౌరవించుచున్నాను. ఈనాటి స్త్రీలు అసలు మానవులలాగే కనబడుటలేదు. వారాలాగు చేయుటకు కారణమున్నది. వారు భక్తిహీనులు, లైంగిక వాంఛ గలవారు. స్త్రీ నిండుగా బట్ట ధరించుకొనియుండవలెను, కాని ఈ స్త్రీలు ఆ విధంగా లేరు. ఇది ఒక విధమగు హాలీవుడ్ సరుకు. స్త్రీలమీద దెయ్యపుటాత్మ పనిచేయుచున్నది. లైంగిక వస్త్రధారణ ద్వారా ఆ స్త్రీలు పురుషుల దృష్టిని ఆకర్షించగోరుచున్నారు. తన పిల్లలకు పాలిచ్చుటకే స్త్రీలకు రొమ్ములు ఇయ్యబడినవి. ఇది అక్షరాలా నిజము. ఆది నుండియూ స్త్రీల యొక్క వరుస అదే, కాని వారిని అనాగరికులని పిలచుచున్నారు. కాని స్త్రీలపట్ల గౌరవ మున్నది, ఎందుకనగా వారి తల్లులు వారిని ఆ విధముగానే పెంచిరి. ఈనాటి స్త్రీల వైపు మీరేమీ దృష్టిని నిలుపవద్దు. మీరు చూచుచున్న మడోనా బోమ్మవలెనె ఆనాటి స్త్రీలు తమ పిల్లలకు పాలిచ్చిరి. జనులు తమ మనస్సును ఆ దృష్టితో చూచుటకు మళ్ళించుకొనినప్పుడు వేరేగా యుండును.

16కాని మీరు బయటకు వెళ్ళునప్పుడు శరీరమునంతటినీ బయట పెట్టు వస్త్రములను ధరించుచున్నారు. ఆ త్రాళ్ళవంటి వస్త్రములు ధరించి ఏదో నాగరికులమని పొంగిపోవుచున్నారు. అది అపవాది యొక్క ఆత్మయని మీరు గ్రహించియున్నారా? సోదరీ, ఆ విధముగా మీరు చేయరాదు. అది హాలీవుడ్ నాగరికత. అది అపవాది యొక్క ఉరి. ఆ విధముగా నిన్ను నీవు కనుబరుచుకొనినప్పుడు మగవారు పతనమగుటకు నీవు కారణమగుదువు. నిన్ను చూచి మగవారు చెడ్డగా ఆలోచించెదరు. నీవు అప్పుడు ఆ మగవానితో వ్యభిచారము చేసిన దోషమును భరించవలసియుందువు, ఎందుకనగా వారు చెడ్డగా నిన్ను చూచి ఆలోచించుటకు నీవు తావు ఇచ్చితివి. నీవు నీ స్వరూపమును మార్చుకొనజాలవు, కాని దేవుడు నిన్ను ఉండమనిన విధంగా నిలిచియుండుము. మానవునివలె బ్రదుకుము. ఎంత భయంకరము? కొందరి ప్రశ్నలకు ఇది జవాబు కూడా కావచ్చును.

17మా తండ్రీ, యేసుక్రీస్తును బట్టి మరియు వాక్యము యొక్క సూటీతనము బట్టి నేడు మీకు వందనములు చెల్లించుచున్నాము. మాటలను ఎంతో వివరముగా నీవు నెరవేర్చుట మేము చూచుచున్నాము. సత్యముతో నిలబడవలేననిఇది మాకు నిశ్చయతను కలుగజేయుచున్నది. ప్రతి మాటయు సత్యమే. తండ్రీ, ఈ ఉదయమున మమ్ము దీవించుమని ప్రార్ధించుచున్నాము. ఈ చక్కని జనుల నాశీర్వదించుము. ఈ టేపు చాలా స్థలములలోనికి వెళ్ళునని మాకు తెలియును. ఇప్పుడు మేము చెప్పినదానిని వారందరూ విందురు. ఇది ముందుగా అనుకొని చెప్పినది కాదు, నీవు నా హృదయము నెరుగుదువు. అది నా మనస్సులోనికి వచ్చినది. దానిని నీవు నాతో చెప్పించవలెనని కోరి యున్నావని నేను నమ్ముచున్నాను. దానిని నేను చెప్పియున్నాను. దాని పని అయిపోయినది, నీవు నాతో చెప్పుచున్నదానిని నేను చెప్పియున్నానని నమ్ముచున్నాను. నేను ఖచ్చితంగా దానినే నమ్ముచున్నాను.

ఆయా దేశములలోని, ప్రపంచములోని పలు ప్రాంతములలోని స్త్రీలు దీనిని విందురు. జరుగుచున్నదానిని చూచి ఆమె తలదించుకొని సిగ్గుపడునట్లు చేయుము. స్త్రీవలె ఆమె ప్రవర్తించి బట్టలు ధరించునట్లు చేయుము. వ్యభిచార ధోషమును ఆమె కలిగియుండకుండా సహాయము చేయుము. ఒక అందమైన చక్కని సృష్టిగా ఆమెను నీవు సృజించియున్నావు. ఆమె పురుషునిలో భాగమైయున్నది. ఆమె అతని దృష్టిని ఆకర్షించును. వారిద్దరు ఏక శరీరమై యుందురు, ఎందుకనగా ఆమె పురుషునిలో నుండియే వచ్చినది. తనయొక్క అందము మరియు రూపము తనయొక్క స్వంత భర్తకు మాత్రమే చెందునట్లుగా ఆమె ప్రవర్తించవలెనని స్త్రీలు గ్రహించుదురు గాక! తండ్రీ, ఆలాగు కృప చూపుము.

18ఈ ప్రశ్నలను వివరించుటకు మేము ప్రయత్నించుచుండగా మాకు సహాయము చేయుము. మేము ఈ విషయములలో అసమర్దులము, కాని ప్రభువా, నీ గొప్ప కృపను దిగి రానిమ్ము, అది మాకు చాలును; చాలా మంది హృదయములలోయున్న ప్రశ్నలకు అది జవాబు నిచ్చును గాక! నీవు మాకు ఇచ్చిన దానిని బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. సంఘ కాలములను, ముద్రలను మాకిచ్చియున్నావు. ప్రభువా, ఈ గొప్ప సంగతుల ద్వారా నీవు మాతో ఎంతగానో మాట్లాడుచున్నావు. అంత్యకాలము సమీపించుటను మేము చూచుచున్నాము.

జనులను నేను సరిదిద్దినప్పుడు నీ రాజ్యము వర్ధిల్లునని నేను ఆలోచించుచున్నాను. చాలాసార్లు వివేచన వలన ఎన్నో సంగతులను చూచుచున్నాము. ఒక్కరి మీదనే కేంద్రీకరించలేము; అందుకే వారి హృదయములలోయున్నదానిని వ్రాసి ఇమ్మని అడిగియున్నాను. వారు వ్రాసిన ఆ కాగితమును చదివి వారి ఆలోచనలకు నేను జవాబు ఇచ్చెదను. నీవు మాకు సరియగు జవాబును దయచేయుము. ప్రభువా, మేమందరమూ ఎదురు చూచుచున్నాము. ప్రభువా, మా మధ్యకు రమ్ము, ఈ వరుసల మధ్య సంచరించుము. నీ చిత్తమును బట్టి ప్రతిఒక్కరితోను నీవు మాట్లాడుము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. [టేపు రిక్షారింగు గూర్చి బ్రెన్హాం సోదరుడు ఒకరితో మాట్లాడుచున్నాడు.]

19మనము ప్రారంభించుకొనుచుండగా, ఇది మరల చెప్పుచున్నాను. దేశములోని వివిధ ప్రాంతముల నుండి సేవకులు వచ్చియున్నారు. ఈ టేపును అనేకులు విందురు. (టేపు చేయుచున్నారు) ఇవి ప్రజల హృదయములలో యున్న ప్రశ్నలు. ఈ ఆలయమునకు చెందినవారడిగిరి. ఇక్కడ మాకు శాఖ లేదు. ఒకరితో ఒకరము సహవాసము చేయుచున్నాము. మన ఆలోచనలను ఇది తేటపరచునని నేను నమ్ముచున్నాను. మన ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడిన తరువాత మనము ఎట్లు జీవించవలెనో, ఏమి చేయవలెనో ఎరుగుదుము. వాటిని చదువుటయే నాకు ఆశీర్వచనమని నేను ఎరుగుదును.

వాటిని ఇక్కడ నేను వరుసగా పేర్చియున్నాను. వాటిని నేను 12:00 వరకు చూచి ఆ తరువాత ముగించుదును. ఆ తరువాత 6:30కు మరల నేను చెప్పెదను.

MATT 24:19

 

20మొదటి ప్రశ్న నేను కలిగియున్నాను. ఒక్కొక్క వరుసలో అయిదు ప్రశ్నలున్నవని నేను తలంచుచున్నాను. పసుపు రంగు పేపరు మీద వీనిని టైపు చేసియున్నాను.

ప్రశ్న: దీని భావము ఏమిటి? మత్తయి 24:19: "ఆ దినములలో గర్భిణి స్త్రీలకును, పాలిచ్చు వారికిని శ్రమ!"

అనుకోకుండానే నేనింతకుముందు స్త్రీ గూర్చి చెప్పాను. చాలా వింతగా యున్నది. ఈ మొదటి ప్రశ్న స్త్రీ గూర్చియే అడిగిరి.

ఇప్పుడు, మత్తయి 24:19. యేసును మూడు ప్రశ్నలు అడిగిరి. ఈ ప్రశ్నలను గమనించండి. ఈ రాతిమీద రాయి ఒకటియైనను నిలువని కాలము ఎప్పుడు వచ్చును? యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? రాకడకు గురుతులేమిటి? మూడు వేర్వేరు ప్రశ్నలు ఆయనను అడిగిరి. ఆయన ఆ మూడింటికి మూడు జవాబులను ఇచ్చెను. ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చెను. రాతి మీద రాయి ఒక్కటియైనను నిలిచియుండని కాలము ఎప్పుడు వచ్చును? నీ రాకడకు గురుతులేమిటి? యుగ సమాప్తికి సూచనలేమిటి? ఆయన ఈ మూడింటికి వేర్వేరుగా జవాబు ఇచ్చెను. రాతిమీద రాయి ఒక్కటియైనను నిలిచియుండని కాలమెప్పుడు వచ్చునో ఆయన చెప్పెను. ఆయన రాకడకు గురుతులను చెప్పెను. యుగసమాప్తికి సూచనలను చెప్పెను. చాలాసార్లు ఆయన జవాబును మీరు జాగ్రత్తగా గమనించరు, ఆయన ఆలాగే జవాబును ఇచ్చును, చూచారా, అన్నింటినీ ఒకే సారి, ఒకే దగ్గర కలగలుపు చేయరాదు; అన్నీ కలిపి చూచినచో మీకు అయోమయముగా ఉండును.

MATT 24:19,20

 

21మన అడ్వెంటిస్టు సోదరులను ఈ విషయములో నేను చిన్నపరచుట లేదు. వీటిని వీరు అక్షరాలా తీసికొని భవిష్యత్తుకు అన్వయించెదరు. సెవెంత్-డే వారు ఆ అంశమును తీసికొందురు. "మీరు పారిపోవుట చలికాలమందయిననూ, విశ్రాంతి దినమందయిననూ జరుగుకుండునట్లు ప్రార్థించుడి." చూచారా, ఇంకా వారు సబ్బాతును ఆచరించుచున్నారు. ఆ సోదరులను చిన్నబరుచుట లేదు. అది క్రైస్తవుల లక్షణము కానే కాదు, కాని సరిదిద్దుటకు ఇది చెప్పుచున్నాను, చూచారా.

ప్రపంచములోని క్రైస్తవులందరూ ఒకే గదిలో ఎట్లు పోగవుదురు? ఆనాడు ఇప్పుటి వలె తెరచుట, మూయట్లేదు. చూచారా? ఉష్ణమండలములో జీవించుచున్న ప్రజలకు శీతాకాలమయినా, ఎండాకాలమయినా ఏమి తేడాయుండును? చూచారా? అది కేవలము ఇశ్రాయేలీయులకే చెందును. రాయి మీద రాయి ఒక్కటికూడా నిలచియుండని కాలమది. గర్భిణులకును, పాలిచ్చువారికిని శ్రమ. ఆ దినములలో బిడ్డలతో వారు పరుగిడుట కష్టము, చూచారా, గర్భిణులకును పరుగెత్తుట కష్టము. వారు యెరుషలేము పట్టణములో నుండి బయటకు వచ్చి యూదయలోని కొండలకు పారిపోవలెను.

LUKE 21:20-22

 

22ఆ ఒక్క సంగతిని గూర్చి ఉదయమంతా చెప్పినా గాని చాలదు. వీలయినంత వరకు మీకు వివరించవలెనని కొన్ని ముఖ్యమగు సంగతులను చెప్పెదను. జనులకు ఇది వివరించి తరువాత ప్రశ్నను చూచెదను.

యేసు వారికి జవాబు చెప్పెను, "యెరుషలేము సైన్యముతో ముట్టడించబడినప్పుడు పొలములో ఉన్నవాడు తన వస్త్రము తీసికొనుటకు గాని, తన ఇంట్లో ఉన్న మరేదయినా వస్తువు తీసికొనుటకు గాని పట్టణము లోనికి తిరిగి రాకూడదు. ఎవరునూ పట్టణములోనికి రా రాదు. యూదయ లోనికి పారిపోవలెను. ప్రపంచము ప్రారంభమయినప్పటి నుండీ జరుగని శ్రమ కలుగును." రోమను సైన్యాధిపతియగు తీతు యెరూషలేమును ముట్టడించినప్పుడు ఇదంతయూ నెరవెరేను. పట్టణమును తగులబెట్టుట జరిగెను. జనులను హతము చేసెను. ఆ రక్తము గవునులను దాటి ప్రవహించెను. వీధులగుండా రక్తము పారినది. దానినతడు పట్టుకొనెను. అదెన్ని సంవత్సరముల క్రితం జరిగినదో నాకు తెలియదు గాని అతడు తన సైన్యములతో వచ్చి ఆ పట్టణమును ముట్టడి చేసెను. ప్రజలు, తల్లులు తమ స్వంత పిల్లలను తినివేసిరి. చెట్ల బెరడు, నేలమీది గడ్డి వారికి భోజన మాయెను. వాక్యమును వారు నిరాకరించినందునే ఆలాగు జరిగినది. దానికదే కారణము. మరియు అప్పుడు…

MATT 24:20

 

23వాక్యమును కొందరు చేర్చుకొనిరి, జోసెఫస్ అను చరిత్రకారుడు వ్రాసెను. వారు నరమాంస భక్షకులని పిలచెను. నజరేయుడగు యేసు అను ఒక మనుష్యుని శరీరమును వారు భుజించిరి, పిలాతు ఆయనను సిలువవేసెను; వారు రాత్రియందు వచ్చి ఆయన శరీరమును దొంగలించిరి. ఈ జనులు దానిని బయటకు తెచ్చి ముక్కలుగా కోసి తినిరి. (వారు కమ్యూనిజం గూర్చి మాట్లాడుచున్నారు గాని ఇది తెలియదు.) అది ఒక కట్టు కథగా ప్రాకిపోవుచున్నది. మనము, ఇంకా మిగిలిన క్రైస్తవులు ఆలాగే యున్నాము. చూచారా? వారు ఆ సంగతులను ఎరుగుదురు.

"మీరు పారిపోవుట చలికాలమందు జరుగకుండునట్లు ప్రార్ధించుడి," అని చెప్పబడిన దానికి కారణమున్నది. యూదయ మంచుతో కప్పబడియుండును. క్రిస్మస్ చూచారా? ఆ మంచుతో నిండిన కొండలలో యేసు ఏలాగు జన్మించును? "మీరు పారిపోవుట చలికాలమందు గాని, విశ్రాంతి దినమందు గాని సంభవించకుండునట్లు ప్రార్ధించుడి," చూచారా, విశ్రాంతి దినమ౦దు ద్వారములు మూయబడియుండును. వారు అందులో చిక్కుబడిపోవుదురు. తీతు గాని, వారి నివేదిక శుక్రవారము మధ్యాహ్నము వచ్చినయెడల సబ్బాతు దినమున వారు ముట్టడివేయబడుదురు, ఎందుకనగా తలుపులు మూయబడును. సబ్బాతు నాడు గవునులు మూసివేయుదురు మరియు వాటిని తెరువరు. విశ్రాంతి దినమున పట్టణము లోనికి వచ్చుట గాని, పట్టణములో నుండి బయటకు వెళ్ళుట గాని జరుగదు.

MATT 24:19,24

 

24ఏమి జరిగినదో ఇప్పుడు చూచారా? "ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ," అని ఆయన చెప్పెను, చూచారా, ఎందుకనగా వారు పారిపోవుట కష్టము. యేసునందు, వాక్యమందు విశ్వాసముంచిన వారు ఒక్కరు కూడా అది జరుగు వరకు వేచి యుందుమని తలంచక ముందే అక్కడినుండి వెళ్ళిపోయిరని చరిత్రను బట్టి తెలియుచున్నది. వారు తప్పించుకొనిరి. యెరూషలేము నుండి యూదయకు వెళ్ళిపోయిరి. తమ ప్రాణములను దక్కించుకొనుటకు పారిపోయిరి. ఒక్కరుకూడా అక్కడ లేరు, ఎందుకనగా గొర్రెల కాపరి వారికి ముందే హెచ్చరికనిచ్చెను. ఆ ఘడియ వచ్చునని వారెరుగుదురు. తీతు వచ్చుచున్నాడని వారు విని, ప్రాణములను దక్కించుకొనుటకు పారిపోయిరి, పట్టణములో నుండి బయటకు వచ్చిరి.

MATT 24:24•

MARK 13:22

 

25తరువాత ప్రశ్న చూద్దాం.

ప్రశ్న: మత్తయి 24:24, "అబద్ధ ప్రవక్తలు లేచెదరు - అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లేచి గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను చూపించెదరు." వారిని మనమెట్లు గుర్తించగలము?

మీరు మరో యుగములోనికి వచ్చుచున్నారు, చూచారా. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లేచెదరు. అబద్ధ క్రీస్తు అనగా అబద్దపు అభిషేకము పొందినవాడు, ఎందుకనగా క్రీస్తు అను మాటకు అభిషిక్తుడని అర్ధము. క్రీస్తు అనగా "అభిషిక్తుడు" అని ఎందరికి తెలియును? అబద్ధపు అభిషిక్తులు లేచెదరు. మేము ప్రవక్తలమని వారు చెప్పుకొందురు. అయితే వారిని నీవెట్లు గుర్తించగలవు? వాక్యము ద్వారానే, వాక్యము ద్వారానే నీవు వారిని తెలిసికొనగలవు. వారు అబద్ధికులో కాదో తెలిసికొనగలవు. వారినెట్లు మనం కనుగొనగలము? వాక్యమును బట్టియే. వారు వాక్యమును కలిగియున్నామని చెప్పుకొంటూ, వాక్యమును నిరాకరించుచున్నయెడల, వారేమి చేసినా గాని అబద్ధికులేనని గ్రహించవలెను. వారు రోగులను బాగుచేయవచ్చును, వారు గ్రుడ్డివారి కన్నులు తెరువవచ్చును; కాని వాక్యమును త్రోసివేసి దానికి దూరముగా జీవించుచున్నారు. వారిని నీవు లెక్కచేయవద్దు, ఏమయినా గాని వాక్యముతోనే నిలచియుండుము. (చూచారా?) మాంత్రికులు, దయ్యపు శక్తులున్నవారు స్వస్థతలు చేయుటను నేను ఎన్నోసార్లు చూచాను.

26దక్షిణాఫ్రికా నుండి వచ్చిన సహోదరుడు సిడ్నీ జాక్సన్ మరియు శ్రీమతి జాక్సన్లు ఇక్కడ ఈ ఉదయం కూర్చొనియున్నారు. అతడు ఇచ్చట నిలబడి ఆ సంగతులను నిజంగా మీకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలడు. జనులు విగ్రహముల యొద్దకు వచ్చి స్వస్థత పొందుచున్నారు. చూడండి, ఎందువలన ఇది జరుగుచున్నది?

అపవాది స్వస్థపరచజాలదని నేను ఒకసారి చెప్పినప్పుడు డాక్టర్. హెగ్రే నా మీద మండిపడెను. ఇంతమంది జనుల యెదుట నీవు నిలబడి అపవాది స్వస్థపరచజాలదని నీవు చెప్పుటకు కారణము నీకు వేదాంత పరిజ్ఞానము లేకపోవుటయేనని అతడు నన్ను గద్దించెను. వారి పొరుగునేయున్న ఒకామె పొడవైన దుస్తులు ధరించి అక్కడికి వెళ్ళుటను గూర్చి అతడు చెప్పెను. జనులు ఆమె యొద్దకు వచ్చి ఆ వస్త్రములో డబ్బు వేయుదురు. అప్పుడామె వారిని రుద్ది, తన తల వెంట్రుకను తీసి వారి నరములలో నుండి రక్తము వచ్చునట్లు చేయును. ఆమె దానిని ఆ తలవెండ్రుకకు రుద్ది వెనక్కు విసరును. ఆమె బలవంతముగా వెనక్కు చూచును. ఆ వ్యాధి జనుల మీదికి వచ్చును. ఆమె దగ్గరకు వెళ్ళిన వారిలో, "నూటికి ముప్ఫయిమంది బాగవుచున్నారని చెప్పెను. కావున అపవాది స్వస్థపరచజాలదని నీవందువా?" అని నన్ను ప్రశ్నించాడు.

MATT 12:26•

MARK 3:26•

MARK 9:23

 

27ఆ తరువాత అతనికి ఇట్లు నేను వ్రాశాను, "అయ్యా! మీరు లూథరను కళాశాలకు అధిపతిగా యున్నారు. మీరు మీ వేదాంతములను దేవుని వాక్యమునకు బదులుగా ఒక అనుభవము మీద నిర్మించుకొనియున్నారని గ్రహించి ఆశ్చర్యపడుచున్నాను." చూచారా? "సాతాను సాతానును వెళ్ళగొట్టజాలదని," దేవుని వాక్యము చెప్పుచున్నది. అది స్థిరము. యేసు ఆ విధముగా చెప్పెను. అయితే ఈ క్షుద్ర శక్తుల ద్వారా జనులెట్లు బాగవుచున్నారని మీరు ఆశ్చర్యపడుచుండవచ్చును, ఎందుకనగా జనులు క్షుద్ర శక్తి ద్వారా దేవునిని సమీపించుచున్నామని తలంచుచున్నారు. స్వస్థత అనునది నీ నమ్మిక మీదనే ఆధారపడియున్నది. నీవెంత నీతిమంతుడవు, నీవెంత మంచివాడవు, నీవెంతగా ఆజ్ఞలను వెంబడి౦చుచున్నావు అను దానిమీద ఆధారపడిలేదు. అది సంపూర్తిగా విశ్వాసము మీదనే ఆధారపడియున్నది. "నమ్మువారికి సమస్తమూ సాధ్యమే." చూచారా? నీవెంత మంచివాడవను దానిమీద అది ఆధారపడిలేదు. వేశ్యలు ఈ వేదియొద్దకు వచ్చి వెనువెంటనే బాగవుట నేను చూచాను. పరిశుద్దులు వచ్చి స్వస్థత పొందకుండానే తిరిగి వెళ్ళిపోవుట చూచాను. నిశ్చయంగా ఇది విశ్వాసము మీదనే ఆధారపడియున్నది - నమ్ముట నీవలననయితే - నీతి మీద ఆధారపడిలేదు.

ఫ్రాన్సులో జనులు ఒక స్త్రీ యొక్క ఆలయమునకు వెళ్ళుట చూడండి. చక్రాల కుర్చీలలో అక్కడికి వెళ్ళి నడిచి వచ్చుచున్నాను. అది కేవలము మూఢ నమ్ముకమే గాని మరొకటి కాదు. భూతములకు ఆరాధించుట అదియే - చనిపోయినవారిని ఆరాధించుచున్నారు. చూచారా? అయినా గాని వారు బాగవుచున్నారు, ఎందుకనగా తాము దేవునిని సమీపించుచున్నామని వారు తలంచుచున్నారు. కాథలిక్కు ప్రజలను కించపరచుట కాదు. కాథలిక్కు క్రమమును నేను తప్పుపట్టుచున్నాను. ప్రొటస్టెంటు క్రమమును నేను తప్పు పట్టుచున్నట్లుగానే దీనిని తప్పుపట్టుచున్నాను. (చూచారా?)

28సేవకులారా, మీకిది బాధ కలిగించునని నేనెరుగుదును, కాని నేను ప్రశ్నలకు జవాబులు ఇచ్చుచున్నాను. దానిని మీరు అర్ధము చేసికొనవలెనని కోరుచున్నాను, చూచారా, నా హృదయములో నుండి సత్యమును మీకు చెప్పుచున్నాను. క్రీస్తు నా ఎదుట ఉన్నాడు. నాకు తెలిసినదే చెప్పుచున్నాను, చూచారా. ఇవన్నియూ క్రమములు. ఆ క్రమములలో జనులు చిక్కుకుపోయియున్నారు. ప్రజలు వెళ్ళి మెథడిస్టులో, బాప్టిస్టులో, ప్రెస్బిటేరియనులో, పెంతెకోస్తులో, కాథలిక్కులో చేరుచున్నారు. వారు దేవుని సమీపించుచున్నామనుకొనుచున్నారు. కాని వారు ఒక క్రమముగుండా వెళ్ళుచున్నారు. కొన్నిసార్లు దేవుడు వారి నమ్మికను గౌరవించి రోగములను నయం చేయుచున్నాడు. విగ్రహముల యొద్దకు వెళ్ళి బాగవుచున్నారు. ఆఫ్రికాలోని హాటెన్టోట్ విగ్రహముల ద్వారా వారు స్వస్థతపొందుచున్నారు, చూచారా, కాని తాము దేవునిని సమీపించుచున్నామని వారనుకొనుచున్నారు.

ఒక కాథలిక్కు సన్యాసిని వెళ్ళి, ఆ కాథలిక్కు క్రమములో చెడ్డదానిగా యుండవలెనని చేరుచున్నదా? మంచి స్త్రీగా యుండుటకే ఆమె ఆ కాథలిక్కు క్రమములో చేరుచున్నది. చెడ్డవానిగా ఉండవలెనని తలంచి ఒక వ్యక్తి కాథలిక్కు చర్చిలో చేరడు. మంచివానిగా ఉండవలెనని తలంచియే అతడు అందులో చేరును, లేక ఇండియాలోని వారు హిందూ మతములో ఎందుకు చేరుచున్నారు? చెడ్డవానిగా తయారు కావలెనని కాదు.

29నేను జైనుల ఆలయములోనికి వెళ్ళాను. ఆ మత గురువు నన్ను ప్రశ్నించెను. ఒక పెద్ద దిండుపైన అతడు పోపువలె కూర్చొనియుండెను. కాళ్ళు మడుచుకొనియుండెను. తన బోటన వ్రేళ్లు పట్టుకొనియుండెను - చక్కని నేత్ర దృష్టి యున్నది. కండ్లద్దములు లేకుండానే 23వ కీర్తనను వ్రాసి, దానిని వారి వేదముతో సరిపోల్చెను. అంగుళములో మూడవ వంతు మందము గల ఇనుప రేకు మీద దానిని వ్రాసెను. దానిని వ్రాయగలుగుటకు కారణమును ఏ మానవుడూ చెప్పజాలడు. మామూలు కంటితో దానిని అతడు చెక్కెను. అతని వయస్సు నలుబది సంవత్సరములు దాటెను. చూచారా?

మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను గూర్చి మీరు వినండి. ఒక్కసారి మీరు మిషను మిషన్ ప్రదేశములోనికి వెళ్ళి చూడండి. మీ కన్నులు ఆ సంగతులు చూచి తెరువబడును.

PROV 14:12

 

30ఆ సహోదరీలందరూ అక్కడ కూర్చొనియున్నారని మీరు తలంచుచున్నారు. వారు వంట కూడా చేయుట లేదు; వారు తిండి తినుట లేదు; వారు ఏమీ లేని స్థితిలో యున్నారు. వారు చీమలను తినుచున్నారు. జోన్న రొట్టెలు కాల్చుకొని వీధిలో కాలక్షేపము చేయుచున్నారు. చీమలను కూడా ఆ జనులు చంపనియ్యరు, ఎందుకనగా వారు అవతారము నందు నమ్మికయుంచుదురు; వారు తమ బంధువుల మీద అడుగు వేసినట్లుగానే ఆ చీమలను వీధిలో త్రోక్కినప్పుడు భావించుచున్నారు. చీమలను గాని, ఈగలను గాని వారు చంపరు. వారు ఒక వ్రేలికి శస్త్రచికిత్స చేయు కత్తిని కూడా నీటిలో ఉడకబెట్టరు. మనుష్యుడు చనిపోయినా చింతించరు గాని ఆ జీవులు చావరాదు, ఎందుకనగా వారి బంధువులే ఆ జీవులుగా పునర్జన్మ పొందియుండుదురని తలంచెదరు. చూచారా? నీవు ఆ విధంగా పుణ్యము చేసికొంటూపోతే చివరకు నీకు మానవ జన్మ లభించునని వారి నమ్ముకము. ఆ తరువాత మ౦చి మానవునిగా ఉంటే దేవునివగుదువందురు. ఇదంతా ఒక చక్రమువలె తిరుగుచుండునని అందురు.

చెడ్డవారిగా ఉండుటకు వారిది చేయరు. వారు యధార్ధముతో దానిని చేయుచున్నారు, కాని చూడండి, "ఒకని మార్గము అతనికి సరిగానే కనబడును." జనులారా, ఒక సంగతిని మీతో చెప్పుచున్నాను. ఇది ప్రశ్నల సమయము. దేవుని వాక్యమే వివరించుచున్నాను. యేసుక్రీస్తే వాక్యమై యున్నాడని మీరు నమ్ముచున్నారు. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య జీవించుచున్నది. ఈ కాలములో అదేమి చేయునని ఆయన చెప్పెనో, దానినే అది ఖచ్చితంగా నెరవేర్చుచున్నది.

వారిని ఆ విధంగా మీరు ఎరుగుదురు, వారి సంఘము బట్టి కాదు, వారి విశ్వాస ప్రమాణముబట్టి కాదు, వారి సూచనబట్టి కాదు, వారి శాఖలను బట్టి కాదు, వారి స్వస్థత బట్టి కాదు, మరి దేనిని బట్టి కాదు గాని వాక్యము బట్టియే గ్రహించుదురు.

MATT 24:26,28•

MARK 13:23

 

31ప్రశ్న: మత్తయి 24:26 ఒక "ప్రత్యేక గది," మరియు "ఎడారి స్థలము," గూర్చి చెప్పుచున్నది. దీని భావమేమిటి?"

క్రీస్తు విరోధులు, అబద్ధ అభిషిక్తులు లేచెదరని దాని భావము. వారు శత్రువులు. విరోధులు అనగా వాక్యమునకు వారు "విరోధులు." వాక్యమునకు విరోధముగానున్న ఆ జీవులు మాత్రమే. వారు ఎడారులలోను, రహస్య గదులలోను ఉందురు. "వారియొద్దకు వెళ్ళక దూరముగా ఉండవలెనని చెప్పెను." చూచారా?

MATT 24:28

 

32ఇప్పుడు, నాలుగవ ప్రశ్న:

ప్రశ్న: మత్తయి 24:28, (అడిగినవారి పేరు కనబడలేదు. క్షమించండి, వ్రాసియున్నారు. వారి పేరు పిలువను, ఎందుకనగా అవసరత లేదు. చూచారా?) మత్తయి 24:28, "పీనుగు ఎక్కడుండునో అక్కడ గద్దలు పోగవును." పీనుగు ఎవరు? గద్దలు ఎవరు?

అది మంచి ప్రశ్న, అందులో ఏమీ పొరపాటు లేదు. పీనుగు అనగా ఏమిటి? గద్దలు ఆ పీనుగునే తినుచుండును. గద్దను ఒక ప్రవక్తగా బైబిలు సాదృశ్యపరచుచున్నది. పక్షిరాజు కుటుంబమునకు చెందును. ప్రవక్తకు సాదృశ్యము. దేవుడే స్వయంగా తనను పక్షిరాజుగా పిలచుకొనెను. మనము పక్షిరాజు పిల్లలమైయున్నాము — విశ్వాసులము. మీరు చూచారా? పక్షిరాజులు తిను పీనుగు ఏది? వాక్యము. వాక్యమెక్కడున్నదో అక్కడికి నిజమగు పక్షిరాజు పయనించి తన స్వభావమును చూపించుకొనును. చూచారా? పక్షిరాజు తాజా మాంసమును తినును. తాజా ఆహారము కొరకు అది కనిపెట్టును. అది రాబందు కాదు, పక్షిరాజు. ఏ శాఖకు సంబంధించిన పదార్ధములను నీవు దానికి తినిపించలేవు. పక్షిరాజు ఆహారమే దానికి కావలెను. అది తాజా భోజనము తినును. మోషే చేసి ముగించినది కాదు, మరెవరో చెప్పినది కాదు; సాంకీ, ఫిన్నీ, నాక్స్, కాల్విన్ మొదలగువారు చెప్పినది కాదు. ఈ దినమునకు ఇవ్వబడిన తాజా ఆహారమును భుజించును. అది క్రీస్తులో భాగము. ఈ వాక్యమును స్థిరపరచుటకు ఆయన చనిపోయెను. వారు దానినే భుజించెదరు. దానిని గ్రహించారా? చూచారా? చూచారా?

33నోవహు చేసినది కాదు, మోషే చేసినది కాదు, వారు మాదిరిగా యుండిరి; వారు చేసిన దానిని మనం చూచి చదువుచున్నాము, కాని ఇప్పుడాయన చేయుదునని వాగ్ధానము చేసిన దానిని చూడండి. ఆ వెనుక ఆయన వాక్యమై యుండెను. అది ఆ దినమునకు పీనుగు. వెస్లీ యొక్క దినము ఆ దినమునకు పీనుగైయున్నది; కాని వారు దానియొద్దకు తిరిగి వెళ్ళరు. అది ఎప్పుడో పాడయిపోయినది. మిగిలిన దానిని దహించవలెను. ప్రభురాత్రి భోజనములోను ఆలాగే చేయవలెను. తరువాత తరము కొరకు దానిని విడిచి పెట్టరాదు. మీరు ప్రభురాత్రి భోజనమును తీసికొనునప్పుడు, తినగా మిగిలిన దానిని మరల ఉదయమువరకు ఉంచక దానిని దహించివేయవలెనని బైబిలు చెప్పుచున్నది. కావున మరల వెనుకకు వెళ్ళవలెనా? లేదయ్యా! ఈ రోజు మనకు తాజా ఆహారమున్నది; అది ఈ దినమునకు వాగ్ధానము చేయబడిన వాక్యము. ఈ ఘడియలో అది ప్రత్యక్షమగును. అక్కడే పక్షిరాజులు పోగవును — తాజా ఆహారము ఉన్నచోటికి అవి వచ్చును. దీనిని చాలాసేపు చెప్పుకొనవచ్చును గాని నా భావమును మీరు తప్పక గ్రహించిరని తలంచుచున్నాను.

1THS 4:15-17

 

34ఇప్పుడు, అయిదవ ప్రశ్న.

ప్రశ్న: ఎత్తబడుటకు వధువు ఒక్క చోటికే సమకూర్చబడునా? అది పశ్చిమాన జరగునా?

కాదు, ఆలాగు జరుగవలసిన పని లేదు. వధువు ఒక చోటకే కొనిపోబడును. అది నిజము. కాని అది పునరుత్థానము వరకు జరుగదు, చూచారా. "ఆ మీద సజీవులమై నిలచియున్న మనము ప్రభువునెదుర్కొందుము." II థెస్సలోనీయులు 5వ అధ్యాయము. "ప్రభుని రాకడ వరకు సజీవులముగా నిలచియుండు మనము, నిద్రించినవారికంటె ముందు చేరము. (విశ్వవ్యాప్తంగా); ఏలయనగా దేవుని బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు, వారితో పాటు మనమును ప్రభువును మధ్యాకాశములో ఎదుర్కొనుటకు కొనిపోబడుదుము." కాబట్టి వధువు ఏకముగా ఉండి ప్రభువును కలిసికొనుటకు వెళ్ళును. చూచారా? ఏకముగా చేయబడును, అయితే అందరూ ఒక్కచోట చేరుకొనిన తరువాతనే రాకడ వచ్చుననుకొనుట కాదు, ఎందుకనగా ప్రపంచమంతటను ఉన్న ధూళిలో వధువు నిద్రించుచున్నది. ఆర్కిటిక్ మొదలుకొని ఉష్ణప్రాంతము వరకు, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరము నుండి దక్షిణము వరకు ఆమె వ్యాపించియున్నది.

MATT 24:27•

LUKE 17:24

 

35యేసు చెప్పెను, "మెరుపు పుట్టి తూర్పు నుండి పడమరకు ఎట్లు బయలు వెళ్ళునో, ఆ ప్రకారముగానే మనుష్యుకుమారుని ప్రత్యక్షతయు ఉండును." ఒక పునరుత్థానము, ఒక ఎత్తబడుట, అన్నియూ ఉండును. ఆయనను కలిసికొనుటకు వెళ్ళుదము.

ప్రభువు యొక్క జ్ఞానమును గమనించండి. ఉదాహరణకు చెప్పుకొందము, వాక్యము నందు విశ్వాసము కలిగియుండి దీనిని చెప్పుచున్నాను. కృపా సంబంధమైన ఆలోచనలివి. "మనము," అని చెప్పుచున్నాను. మీతో కూడా నేనూ ఉన్నాను. క్రీస్తు యొక్క శరీరమంతయూ అందులో యున్నది. విశ్వవ్యాప్తంగా అది యున్నది. దానిని నేను నమ్ముచున్నాను. "మనము" అని చెప్పునప్పుడు కృప ద్వారా దానిని నేను నమ్ముచున్నాను. ఆయన కృప యందు నాకు నమ్ముకమున్నది. ఎత్తబడువారిలో మనమును ఉందుము.

1COR 15:54

 

36మనము పునరుత్థానము చెందునప్పుడు ముందుగా జరుగు దానిని చూద్దాం. జీవించియున్నవారు ఉందురు. మొదట పునరుత్థానము జరుగును. నిద్రించినవారి పునరుత్థానమది. ఒక మేల్కోను కాలము వచ్చును. ఇప్పుడు ధూళిలో యుండి నిద్రించుచున్నవారు, పాపములో యుండి నిద్రించినవారు కారు; వారు ఆలాగే నిద్రించెదరు. వారు మరో వెయ్యి సంవత్సరముల పాటు లేవరు. కాని ఈ నిద్రించుచున్నవారు మొదట లేతురు. ఈ మర్త్య శరీరములు అమర్త్యతను ధరించుకొనును. అది ప్రభువు యొక్క ఎత్తబడు కృప. అప్పుడు మనమందరమూ ఏకమగుదుము. వారు ఏకమవనారంభించినప్పుడు, సజీవులమై నిలచియున్న మనము మారుదము. మర్త్య శరీరములు మరణమును చూడవు, కాని ఒక్క క్షణములో మారుదుము. గాలి ఆకస్మాత్తుగా వీచినట్లుండును. మీరు అబ్రాహామువలె ముసలితనము నుండి యవ్వనత్వమునకు మారుదురు. ముసలి స్త్రీలు, యువతులుగా మారుదురు. ఈ ఆకస్మిక మార్పు ఏమిటి? నీవు ఆలోచనలో పయనించునట్లే యుండును. అంతకు ముందే పునరుత్థానము చెందిన వారిని నీవు చూచెదవు. ఓ ఎట్టి ఘడియ! అప్పుడు మనందరము వారితో చేరెదము. అప్పుడు ప్రభువును మధ్యాకాశములో కలిసికొనుటకు కొనిపోబడుదుము.

1COR 15:52

 

37మీ అంకుల్ దక్షిణ కెంటాకీలో సమాధి చేయబడెననుకొనండి, అతనిని ఇండియానాకు తేవలసియున్నదనుకొందము, లేదా ఇండియానాలో సమాధిచేయబడినా, దక్షిణ కెంటాకీలోనికి తేవలసియుండెననుకొనండి. అతను ఎక్కడ సమాధి చేయబడేననేది ఒక విషయము కాదు. సముద్రములో చనిపోయినవారు తిరిగి లేచెదరు. పందెపు రంగములలో సింహములచే తినివేయబడినవారు, అగ్ని గుండములలో త్రోసివేయబడినవారు, ఎముకలు లేకుండా ధూళిగా మారిపోయినవారు, మరల లేచెదరు. వారు రోమ్ లో ఉన్నా రోమ్ లోని పందెపు రంగములలో యున్నా, దక్షిణాది ఉష్ణ అరణ్యములలో యున్నా, ఉత్తరాన కరడుగట్టు మంచుఖండంలో ఉన్నా - తిరిగి లేచెదరు. కనురెప్పపాటులో మార్పుపొందుదురు. మృతులలో నుండి తిరిగి లేచెదరు. బ్రదికియున్నవారు రెప్పపాటు కాలములో మార్పుచెందెదరు. కనురెప్పపాటు కాలములో వారు మారి కొనిపోబడుదురు.

MATT 24:40•

LUKE 17:34,36

 

38ఆఫ్రికా అడవులలో చనిపోయిన మిషనైరీల గూర్చి ఆలోచించండి. ఉత్తరాన గడ్డకట్టు మంచులో చనిపోయినవారిని గూర్చి తలంచండి. పందెపురంగములలో చనిపోయిన వారిని గూర్చి ఆలోచించండి. ప్రపంచమంతటా చనిపోయినవారున్నారు. కాంగో మొదలుకొని విశ్వవ్యాప్తంగా చనిపోయినవారున్నారు. చైనా, జపాన్, ఇంకా ప్రపంచ దేశాల్లో వారు మరణించిరి. ప్రభువు యొక్క రాకడ విశ్వవ్యాప్తము. ఈ ఎత్తబడుట ఆలాగే జరుగును.

మార్పును గమనించండి. "ఇద్దరు మ౦చము మీద ఉందురు, ఒకరు కొనిపోబడుదురు. ఒకరు విడిచిపెట్టబడుదురు." అదే సమయములో, "ఇద్దరు పొలములో యుందురు, ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు." ఒకరు భూమి యొక్క చీకటి భాగములో యుందురు, మరొకరు భూమి యొక్క వెలుగు భాగములో యందురు. చూచారా? అది విశ్వవ్యాప్త రాకడ. సంఘమంతయూ ఏకము చేయబడును, కాని పునరుత్థానము తరువాత మరియు ఎత్తబడుట స్థిరము.

మీరా విధంగా దానిని చూడనియెడల, పరవాలేదు. ఇప్పుడు గ్రహించండి, దీనిని టేపు చేయుచున్నారు. గమనించారా? దీనిని అంగీకరించని సేవకులుండవచ్చును. మంచిది.

ACTS 2:16•

ACTS 10:47•

ACTS 16:33•

ACTS 22:16

 

39ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, బాప్తిస్మము గూర్చి నేను ప్రశ్నించుచున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడు రక్షించబడును? ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు రక్షించబడునని నేను విన్నాను. కొందరయితే నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు రక్షించబడుదువని చెప్పుదురు. నీటిలో బాప్తిస్మము పొందకపోయినా గాని అని చెప్పి అపోస్తలుల కార్యములు 10:47లోని కొర్నేలి ఉదాహరణను చూపించెదరు, దమస్కునకు పోవు దారిలో పౌలు రక్షించబడెనని కొందరనుచున్నారు. కాని అపోస్తలుల కార్యములు, 22:16లో ఆ తరువాత మూడు దినముల వరకు అతని పాపములు నిలిచియున్నట్లు చూతము. ఒక వ్యక్తి కొర్నేలి వలె బాప్తిస్మము పొందినా గాని ఇంకా అతని పాపములు నిలచియుండునా? ఎందుకనగా అతడు నీటి బాప్తిస్మము పొందలేదు. ఒక వ్యక్తి నీటి బాప్తిస్మము పొందనిచో పరలోకములో ప్రవేశించలేడా? అతడు పరిశుద్ధాత్మను పొందియున్నాగాని?

నా ప్రశస్త స్నేహితుడు. ఈ సోదరుడు తన పేరు వ్రాసెను. ఇతనిని నేనెరుగను, కాని ఇతడు సంతకము చేసెను. నేను పేరు పిలువను, ఎందుకనగా అది అవసరము లేదు. ఎందుకనగా ఇతరులు వారియొద్దకు వెళ్ళి ఇట్లందురు, "నీవు వ్రాసినదానితో నేను ఏకీభవించను." చూచారా? అందుకే నేను పేరు పిలువను. చాలామంది తమ పేరు క్రింద వ్రాసిరి, కాని అది నా కొరకే వ్రాసిరి. చూచారా? వారి ప్రశ్నలను నేను ఇక్కడ దాని ఉంచుదును. ఇది నీలపు చేతివ్రాత, కొందరు టైపు చేసిరి, రకరకాలుగా పంపించిరి.

ఇక్కడ మొదటి ప్రశ్నను చూద్దాం. ఎప్పుడు రక్షించబడినట్లు ఎరుగుదుము? నీటి బాప్తిస్మము పొందకుండా పాపక్షమాపణ యున్నదా? కొర్నేలి మరియు అతని ఇంటివారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. అప్పటికి వారింకా నీటి బాప్తిస్మము పొందలేదు. పౌలు పొందలేదు… దమస్కునకు పోవు దారిలో అతడు అనుభవమును పొందెను, కాని అతని పాపములు ఇంకా బాప్తిస్మము పొందనందున నిలిచేయున్నవి. (నిశ్చయమని తెలిసికొనుటకు ఈ లేఖనములను నేను చదివాను). "లేచి తిన్నగా వెళ్ళి బాప్తిస్మము పొందుము. ప్రభువు నామములో ప్రార్ధన చేయుము. బాప్తిస్మము పొంది నీ పాపములను క్షమాపణ పొందుము. (కడిగివేసికొనుము), ప్రభువు నామములో ప్రార్ధించుము."

40"ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందినా గాని, నీటిలో బాప్తిస్మమును పొందని యెడల, అతని పాపములు ఇంకా ఆలాగే నిలచియుండునా?" అని ప్రశ్నించెను.

"పరిశుద్ధాత్మను పొందినా గాని, నీటి బాప్తిస్మమును పొందని వ్యక్తి పరలోకమందు ప్రవేశించడా? పరలోకమునకు నిశ్చయముగా వెళ్ళవలెనన్నచో, తప్పక నీటి బాప్తిస్మము పొందవలనా?" ఈ సోదరుని నేనెరుగను. అది చాలా మంచి తెలివైన ప్రశ్న. దీనికి చాలా వివరంగా జవాబు చెప్పవలెను, ఎందుకనగా ఈ విషయములను తెలిసికొనుట ముఖ్యము, చూచారా.

41ఈ సోదరుడు ఒక విధంగా నాకు చెప్పుచున్నాడో, లేదా నన్ను చెప్పమని అడుగుచున్నాడో తెలియుట లేదు (లేదా ఆలాగతడు నమ్ముచున్నాడో తెలియుట లేదు) వాక్యము నందలి నిజ విశ్వాసమునకు, వాస్తవమునకు మంచిదే. ఇది కొద్ది విరోధముగా యున్నది. ఆ సోదరుడే నాకు చెప్పుచున్నట్లుగా యున్నది. మంచిదే. సోదరుడా, నీవిచ్చటనే కూర్చొనియున్నావని తలంచుచున్నాను. మంచిది. నీవిది వ్రాసి పంపించినందుకు ఎంతో సంతోషించుచున్నాను. ఇప్పుడు, చూచారా? కాని మారుమనస్సు కొరకు నీటి బాప్తిస్మము పొందుటను నేను విశ్వసించుట లేదు. (చూచారా?), ఆలాగు మీరు చేసినచో, రక్తమును నిరాకరించుచున్నట్లే. మారుమనస్సు పొందితిమని చూపించుటకే మీరు నీటిలో బాప్తిస్మము పొందుచున్నారు. చూచారా? అది మారుమనస్సు పొందినట్లుగా ఒక బాహ్య సూచన మాత్రమే. మొత్తం సంగతి అంతయూ ముందు నిర్ణయము వలననే జరుగుచున్నది. దానిమీదనే ఆధారపడియున్నది. చూచారా? కాని మనము ఎవరు అందులో యున్నారో అందులో లేరో ఎరుగము. కాబట్టి విశ్వాసము ద్వారానే మనము బోధించుచున్నాము. అందుకే మనం సువార్తను ప్రకటించుచున్నాము.

42ఇప్పుడు మారుమనస్సును చూడండి. నేను ఆ విషయములో ఏకత్వము వారితో విభేదించుచున్నాను. ఏకత్వపు సోదరులగు మీరు ఈ ప్రశ్నలను వినుచున్నారు. మీరు మీ కార్యాలయములలో లేదా మీ ఇండ్లలో లేదా మీ జనుల మధ్య, అనగా ఏకత్వము వారి మధ్య యున్నప్పుడు దీనిని గూర్చి చర్చించండి. నన్ను మీరు అపార్ధము చేసికొనరాదు. మనము అసమ్మతించుటకు అది కారణమయినది.

నేను మరియు నా భార్య అసమ్మతించుదుము; ఇది నిశ్చయము. నేనామెను ప్రేమించుచున్నానని ఆమెతో చెప్పెదను, కాని ఆమె కాదని నమ్మును. ఆ విషయంలో మేము నిశ్చయంగా అసమ్మతిని వ్యక్తపరచుదుము, కాని నేను మీతో నిజం చెప్పుచున్నాను. ఏమయినా మేము కలిసి జీవించుచున్నాము.

ఇప్పుడు చూడండి. నాకు చాలా సూచనలు తెలియకపోవచ్చును. నేను బయటకు వెళ్ళి బోధించుచున్నాను. ఇంటికి వచ్చి నేను చేపలు వేటాడుటకు వెళ్ళాను, చూచారా. కాని నా హృదయాంతరంగములో ఆమెను ప్రేమించుచున్నాను. ఆమెనుండి దూరముగా ఉండవలసి వచ్చినది, అంతే.

ఈ విషయమును గమనించండి. మేము అసమ్మతించినా గాని పరవాలేదు, కాని మీరు చూడండి. నీరు పాపమును పోగొట్టదు; కాని అది మంచి మనస్సాక్షికి ఇచ్చు ప్రత్యుత్తరమే.

ACTS 10:44

 

43పౌలు అక్కడ బాప్తిస్మము పొందుటకు కొన్ని కారణములున్నవి. అది అధికార పూర్వకంగా అవసరము. మనము బాప్తిస్మము పొందవలసిన అవసరమున్నదని బైబిలు చెప్పుచున్నది. దీనిని త్వరగా చూచుదము. సిలువ మీద వ్రేలాడిన దొంగను గూర్చి చెప్పుదురు. అతడు బాప్తిస్మము పొందకుండానే చనిపోయెను, కాని ఆ దినమున పరదైసులో అతనిని యేసు కలిసికొందునని వాగ్ధానము చేసెను - అది పరదైసు. నశించిన వారి నివాస ప్రాంతము కాదు, ఎందుకనగా అతనికి మొదటిసారి ఇవ్వబడిన అవకాశము అది.

కొర్నేలి ఇంటివారు కూడా అట్టి హృదయములను అట్టి పరిస్థితులను కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. వారు సంతోషముతో వాక్యమును అంగీకరించిరి. పరిశుద్ధాత్మ ఆ వాక్యమును జీవింపచేసినది. అది వారిని జీవముతో నింపినది. ఇతర భాషలలో పరిశుద్ధాత్మ మాట్లాడనారంభించినది. ప్రవచి౦చనారంబి౦చిరి, వాక్యము ఆ జనుల హృదయములలో పడగానే వారు దానిని చేర్చుకొనిరి. దైవ సంబంధమైన దానిని వారు చూచిరి.

నేడు మనము జీవించుచున్న ఈ ఘడియలో ఆశ్చర్యమును ఇది నాకు కలిగించుచున్నది. వారు రోమనులు - గ్రీకుల గుంపు. ఒక దర్శనము యొక్క ప్రత్యక్షతను వారు నిశ్చయంగా చూచిరి. పరిశుద్ధాత్మ వారిని ఎంతగానో కలవరపరచినది. చివరకు పేతురు ఈ మాటలు పలికెను, పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చెను. చూచారా?

ACTS 10:5,6,8-10,13

 

44చూడండి, కొర్నేలి ఇట్లనెను, "వెళ్ళి పిలువనంపుడి." అతడు ఒక సేనాధిపతి. "శతాధిపతి" అనగా వంద అని అర్థము. వందమంది మీద అతడు అధికారి. అతడు ఒక రోమను శతాధిపతి. అతడు ప్రార్ధించుచుండగా ఒక దర్శనమును చూచెను. ఒక దేవదూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు మంచివాడు. "యొప్పేకు వెళ్ళుము, సీమోను అను ఒక చర్మకారుడు అక్కడున్నాడు. సీమోను పేతురు అక్కడున్నాడు. అతడు నీకు వాక్యమును బోధించును," అని చెప్పెను.

ఆ దర్శనము చాలా నిజమైనదని వారు తలంచిరి. "నేను నిద్రపోయి యుండక పోవచ్చును. నేను దేవదూతను సూటిగా చూచాను." కావున అతడు కొందరు నమ్ముకస్తులగు సైనికులను పంపెను.

అక్కడుండగా, దేవుడు అపోస్తలుని సిద్ధపరచుచుండెను. అది ఆ వరుసలోని చివరిది. "ఇప్పుడు లెమ్ము," అని చెప్పెను. అతడు మేడగదిలో యుండగా, ఎదురుచూచుచుండెను. - శ్రీమతి. సైమన్ విందు తయారుచేయుచుండెను. అతడు అచ్చటుండెను, అతడు ఆకలిగా యున్నాడు, బహుశా ఆ అపోస్తలుడు నడిచి వచ్చియుండును, ఎడారుల గుండా పయనించి వచ్చెను. ఆ విందు చేయక ముందు అతడు మిద్దిమీద ఎదురుచూచుచుండెను. అది ఒక ఆచారము. ఇంకా వారు మిద్దె మీదకు ఆ విధంగానే నిచ్చెను మీదుగా ఎక్కెదరు. కొన్నిసార్లు మెట్ల మీదుగా మిద్దె పైకి ఎక్కెదరు. అది సాయంకాల సమయము - అక్కడ కూర్చొనియుండెను.

ACTS 10:13-15,19,20

 

45కాని అపోస్తలు నిద్రపోయెను, అతడు నిద్రించుచుండెను. అతడు నిద్రలోనుండి మరో స్థితిలోనికి జారిపోయెను. ఆ తరువాత అతడు ఒక దుప్పటివంటి దానిని చూచెను. అది క్రిందికి దిగుచుండెను. అందులో అపవిత్రమైనవి ఉండెను. ఒక స్వరము ఇట్లు చెప్పుచుండెను, "లేచి వెళ్ళి వాటిని తినుము."

"ప్రభువా, ఆలాగు కాదు. నేను ఏ అపవిత్రమైన దానిని నా నోటి లోనికి రానియ్యలేదు," అని అతడు పలికెను.

ఆ దర్శనమును చూడండి. దానిని గమనించండి! దానికి అర్థము చెప్పవలసి యున్నది. పేతురు ఒక వేటకు వెళ్ళి, ముందెన్నడూ చూడని ఒక జంతువు వేటాడి దానిని తినుటకు ఉపక్రమించినట్లుగా ఇది యున్నది. "ప్రభువా, ఆలాగు చేయలేను. నా నోటిలోనికి ఎన్నడూ అపవిత్రమైన దానిని రానియ్యలేదు," అని చెప్పెను.

"నేను పవిత్రపరచిన దానిని నీవు అపవిత్రమైనదని పిలువరాదు. లేచి వెళ్ళుము. నీ కొరకు ఒక వ్యక్తి గుమ్మము యొద్ద ఎదురు చూచుచున్నాడు. సందేహించక, నీవు వెళ్ళుము." అదే సమయములో ఎవరో తలుపును తట్టిరి.

46ఇప్పుడు దీనిని చూచారా? ఈతనిని చూచెను. వారు నమ్ముకమగు సైనికులు. ఆ దర్శనమును చూడండి. ఆ దర్శనములో దేవుడు ఏ వ్యక్తిని చూపించెనో, ఆ వ్యక్తినే ఇక్కడ చూచిరి — అతడు ఒక అపరిచితుడు, అతడు ఒక అనామక జాలరి. ఆ చిన్నగుంపు మధ్య ఈ జాలరిని ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించెను. ఇప్పుడతడు ఇంటిలోనికి వచ్చుచున్నాడు. అతడు దర్శనములో చూచినది అదే స్థలము. కొర్నేలి ఈ జనులందరిని ఒక చోట పోగు చేసెను. "ఇది ఖచ్చితముగా నేను చూచినట్లుగానే యున్నది," అని చెప్పెను. అప్పుడు పేతురు లేచెను. వారెట్లు పరిశుద్ధాత్మను పొందిరో పేతురు చెప్పనారంభించెను. వారు ఆ ఒక్క దర్శనములో అన్నింటినీ చక్కగా చూచిరి. వారందరూ అన్యజనులు, గుంపుగా కూడియుండిరి. ఒకే దర్శనము బయలుపరచబడుటను వారు చూచిరి. వారు సత్య వాక్యమును వినిరి, వారు జీవమును పొందిరి; వారు బాప్తిస్మము పొందక ముందే పరిశుద్ధాత్మ వారి మీదికి దిగెను.

ACTS 10:47

 

47ఈ ఉదయమున ఈ ఆలయములో జరిగితే ఎట్లుండును? రోగులున్నారు, బాధపడుచున్నవారున్నారు, గ్రుడ్డివారున్నారు. చెవిటివారున్నారు, మూగవారున్నారు, పాపులున్నారు. కాస్త ఆలోచించండి, పదివేల ప్రవచనములలో ఏ ఒక్కటియూ ఎన్నడూ విఫలము గాక అక్షరాలా నెరవేరినది. ఇది మన హృదయములను మండించవలసియున్నది.

అతడు ఇంకా ఆ మాటలు చెప్పుచుండగానే పరిశుద్ధాత్మ వారిమీదికి దిగెను. అప్పుడు పేతురు ఇట్లనెను, "మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరిని బాప్తిస్మము పొందకుండా ఎవరు ఆపగలరు? వారి పాపములు ఎప్పుడో క్షమించబడియున్నవి, లేనియెడల పరిశుద్ధాత్మ వచ్చియుండకపోవును. ముందుగా నిర్ణయించబడిన పాత్రలో మాత్రమే అది పోయబడగలదు." వారు వెంబడించెదరని అతనికి తెలియును.

ACTS 9:15

 

48పౌలు విషయములోను ఆలాగే యుండెనని నేను నమ్ముచున్నాను. క్రైస్తవులను హింసించడమనే కారణము వలన అతడు తిరిగి బాప్తిస్మము పొందవలసియున్నది. అది నిజము. దేవునికి తెలియును, "నేనతని ఏర్పరచుకొనియున్నాను" అని చెప్పెను. ప్రవక్తయగు అననీయకు అతడు చెప్పెను. సౌలు అక్కడ గదిలో యుండగా, ఆయన గమనించెను. అతని ముఖము నల్లబడినది. కండ్లు నల్లబడినవి. అతడు ఎంతో గట్టిగా ప్రార్ధించెను. అతడు ధూళితో కమ్ముకొనియుండెను. దారిలో వచ్చుచుండగా ప్రత్యక్షమైన అగ్నిస్తంభము వలన అతని నేత్రములు గ్రుడ్డి అయిపోయినవి. ఆయన ఇట్లనెను, "అన్యుల కొరకు ఒక సాధనముగా అతనిని నేను ఏర్పరచుకొనియున్నాను." దేవునికి అది తెలియును - ఆ మూడు దినముల తరువాత దమస్కు నదిలో అననీయ అతనికి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇయ్యగలడు. కాని అతని పాపములు ముందే తుడిచి వేయబడినవి. కాని లోకమునకు చూపించుటకు దీనిని చేయవలసియుండెను. దీనిని నమ్ముచున్నాను. ఆ కారణము చేతనే మనము తప్పక యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలసి యున్నామని నేను నమ్ముచున్నాను. ముందుగా నిర్ణయించబడిన విత్తనము దానిని చూచునని నేను నమ్ముచున్నాను. వారు మాత్రమే దానిని చూచెదరు.

49త్రిత్వ విశ్వాసములో యున్న సోదరులు చూడండి. దీనిని మీ మీదికి నేను త్రోయుట లేదు. నా ప్రియ సోదరులారా, నేను ప్రశ్నలకు జవాబులు మాత్రమే ఇచ్చుచున్నాను. ఆ విషయములో నా నిజ జవాబులు ఇచ్చుచున్నాను. అవి నా నిజ ఆలోచనలు. ఈ టేపును ఆఫ్రికాలోని వారు విందురు. ఆయనయొక్క రాకడ ఛాయలలో మనం ఉన్నాము. దానిని మనం నమ్ముచున్నాము.

నాకు ప్రశస్తమగు స్నేహితులున్నారు. డ్యుప్లెసిస్ మరియు షుమన్స్, యాగిర్ ఇంకా చాలామంది చక్కని సోదరులున్నారు - దక్షిణాఫ్రికాలో యున్నారు. కాని ఒక మనిషి యొక్క జీవితములో అతని పక్షముగా నిలబడువారు కొందరుండుట ఎల్లప్పుడూ సహజమే. వారందరూ అట్టివారే - నా స్వంత సోదరుని ప్రేమించినట్లుగానే వారిని ప్రేమించుచున్నాను. చాలా ప్రియైనవారు. సహోదరుడు జాక్సన్ మరియు అతని భార్య నా జీవితములో గట్టిగా బలపరచుచున్నారు. దానిని నేను అర్థము చేసికొనలేను. వారు నా కొరకు నిలబడిరి. జస్టిస్ డుప్లేసిస్ నా ప్రముఖ స్నేహితుడు. ఇంకా అట్టివారు చాలామంది యున్నారు. చక్కని ఆఫ్రికను సోదరులు, సోదరీలు ఉన్నారు.

సహోదరుడు జాక్సన్ మరియు అతని భార్య నా కొరకు ఎందుకు నిలబడియున్నారు? అతడు కూడా వేటగాడయినందువలనా? కాదు! నాకు చక్కని వేటాడే స్నేహితులు అక్కడ చాలామంది యున్నారు, కాని అతడెందుకు నా పక్షముగా నిలబడియున్నాడు? ఎందువలన? దీనంతటి వెనుక గల రహస్యము మీ అందరికి తెలియును. నాకు తెలిసిన రహస్యములను అన్నింటినీ అందరికి చెప్పను. అదే సమయములో ప్రభువు ఇట్లు చెప్పెను, "దక్షిణ ఆఫ్రికాలోని సిడ్నీ జాక్సన్ను మీరు సంప్రదించండి." ఇక్కడికి రమ్మని ప్రభువు సిడ్నీ జాక్సన్తో చెప్పెనా? ఆ తరువాత ఆదివారము ఆ భార్యాభర్తలు బాప్తిస్మము పొందిరి. ఇక్కడే ఒక మధ్యాహాన్న వేళలో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చాను. చూడండి, ఆ కారణము కొరకు వారు ముందుగా నిర్ణయించబడిరి. చూదారా?

MATT 7:22,23

 

50మీరు యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారానే రక్షింపబడియున్నారని నేను నమ్ముచున్నాను. లోపల ఏదో జరిగియున్నదని బయటకు చూపించుటకే నీటి బాప్తిస్మము ఏర్పాటు చేయబడినది, ఎందుకనగా నీటిలో ఏ శక్తి లేదు. అది కేవలము ఒక గురుతు మాత్రమే. మీరు రక్షింపబడియున్నారని నేను నమ్ముచున్నాను.

రక్షింపబడియున్నామని చెప్పుకొనువారు చాలామంది యున్నారు. (సోదరుల గూర్చి దీనిని చెప్పుచున్నాను)… అనేకులు యేసు నామములో బాప్తిస్మము పొందియున్నారు. చాలామంది భాషలలో మాట్లాడుచున్నారు, అందరును అన్ని రకముల పరిశుద్ధాత్మ సూచనలను కలిగియున్నారు,. అయినా గాని వారు రక్షించబడలేదు. ఇది నిజము. "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి ఇట్లందురు, ప్రభువా, నీ నామమున మేము ప్రవచించలేదా? - [బోధకులు] - నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? చాలా గొప్ప కార్యములు చేయలేదా? - అందుకాయన ఇట్లనును, నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను. అక్రమము చేయువారలారా! నాయొద్దనుండి తొలగిపోవుడి." చూచారా? ఇవన్నియూ గమనించండి. అది దేవుని చేతులలోనే యున్నది. దేవుని వలననే జరుగును. దానిని నేను చూచుచున్నాను.

తిరిగి బాప్తిస్మము ఎందుకు పొందవలెనని చాలామంది ప్రశ్నించుచుందురు. నేను ప్రారంభపు మాదిరినే మరల వెంబడించుచున్నాను. ఆ నమూనాను మనము పోగొట్టుకొన జాలము.

ACTS 19:2-4

 

51అపోస్తలుడగు పౌలును మనం చూచెదము. అతడు కొందరు శిష్యులను కనుగొనెను. వారు చాలా అద్భుతమైనవారు. వారు రక్షింపబడిరని నేను నమ్ముచున్నాను. అయినా గాని వారింకా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందియుండలేదు. వారు ఒక బాప్తిస్మము పొందిరి, అపోస్తలుల కార్యములు 19. పౌలు ఎఫెసు పై తీరము గుండా వెళ్ళుచుండెను. అతడు కొందరు శిష్యులను కనుగొనెను. అతడు వారిని ఇట్లడిగెను, "మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందియున్నారా?"

అందుకు వారిట్లనిరి, "అసలు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతియే మాకు తెలియదనిరి."

"అయితే మీరెందుకు బాప్తిస్మము పొందియున్నారు?" అనడిగెను.

వారిటు చెప్పిరి, "మేము బాప్తిస్మము పొందియున్నాము. మాకు యోహాను బాప్తిస్మము ఇచ్చెను, అతడే యేసునకు బాప్తిస్మము ఇచ్చెను." అది మంచి బాపిస్మము.

ఈ కఠినమగు అపోస్తలుని మాటలను గమనించండి. "కాని యోహాను మీకు మారుమనస్సు బాప్తిస్మమే ఇచ్చెను." పాపక్షమాపణ కొరకు కాదు. ఎందుకనగా బలి అర్పించబడలేదు. వారిది విని మరల యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. పరిశుద్ధాత్మ వారిమీదికి దిగి వచ్చెను.

GAL 1:8

 

52ఇదేమి చేయుచున్నది? వారు జీవము కొరకు ముందుగా నిర్ణయించబడినవారని ఇది చూపించుచున్నది. లేఖన సత్యమును వారు చూచిన వెంటనే వారా సత్యములోనికి నడిచి వచ్చి విశ్వాసి యొక్క ఫలితమును పొందియున్నారు. వారిమీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. వారు భాషలతో మాట్లాడిరి, ప్రవచించిరి, దేవుని మహిమపరచిరి. మీరిప్పుడు దీనిని గమనించారా? చూచారా? వారంతకు ముందే గొప్ప సంతోషముతోను, ఆర్భాటముతోను నిండియుండి దేవుని స్తుతించుచుండిరి.

వారికి బైబిలులో ఒక బాప్తిస్మమిచ్చు బోధకుడున్నట్లుగా తెలియుచున్నది. అతడు కూడా బాప్తిస్మమును పొందెను. యేసే క్రీస్తు అని బైబిలు ద్వారా రుజవాయెను. ప్రజలు గొప్ప సంతోషముతో నిండియుండిరి. వారా విషయములో ఎంతో ఆనందముతో నిండియుండిరి; అయినా వారింకా పరిశుద్ధాత్మ పొందియుండలేదు! వారు మరల బాప్తిస్మము పొందవలసి వచ్చెను. గలతీ 1:8లో పౌలు ఇట్లు చెప్పెను, "పరలోకమునుండి ఒక దేవదూత దిగివచ్చి నేను మీకు బోధించిన సువార్తను గాక వేరొక సువార్తను బోధించిన యెడల శాపగ్రస్తుడవును." అదేమయినా గాని లక్ష్యపెట్టవద్దు.

53కావున ఈ సంగతులను గ్రహించండి. నా సోదరులారా, బహుశా మీరు వీటిని గ్రహించియుండకపోవచ్చును; కాని ఈ సంగతులను ఎరుగుదురు, మొదటి పునాదిని కొనసాగించుటకు నేను బలవంతము చేయబడి దేవునికి పనిచేయుచున్నాను. ఆ బాధ్యత నాకున్నది. ఆ పునాది ముందే వేయబడియున్నది. వారే అపోస్తలులు మరియు ప్రవక్తలు. ప్రవక్తలు దానిని ముందుగానే చెప్పిరి. అపోస్తలులు దానిని కొనసాగించిరి. ఆ భవనము పూర్తియగు వరకు మనము దానిని కొనసాగించవలసినవారమై యున్నాము.

ఒక వ్యక్తి తన పూర్ణ హృదయముతో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు రక్షించబడునని నేను నమ్ముచున్నాను. బయటి మనస్సాక్షి బట్టి కాదు గాని తన హృదయముతో నమ్మువలెను.

HEB 11:1

 

54మీరు బహు వ్యక్తిగా యున్నారు - ఒకేసారి ముగ్గురిని చూచెదము - ఆత్మ, శరీరము, ప్రాణము. బయటి ఇంద్రియములు మీకున్నవి. బయట మనస్సాక్షి యున్నది, అది మీ ఆత్మ కాదు, మీరు అయిదు జ్ఞానేంద్రియముల ద్వారా పనిచేయుచున్నారు: చూచుట, వాసన, తాకుట, రుచి, చూచుట, మరియు వినుట. మీ భూసంబంధమగు గృహమును అనుభవించుటకు అవి మీకు ఇయ్యబడినవి. మీ పరలోక సంబంధమగు గృహమును సంధించుటకు అవి ఇవ్వబడలేదు. నిజానికి మానవ శరీరములో ఆరు జ్ఞానేంద్రియములున్నవి, ఎందుకనగా మానవుని సంఖ్య బైబిల్లో ఆరుగా యున్నది. ఆరవ దినమున మానవుని సృజించెను. అతని సంఖ్య ఆరు — మానవుడు. అతనికి దృష్టి, రుచి, తాకిడి, వాసన, వినికిడి, మరియు విశ్వాసము అను జ్ఞానేంద్రియములున్నవి. అతని విశ్వాసము అతని గమ్యమును నిర్ణయించును, అందుకే అతడు పయనించును.

విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపమును, చూడనివి, రుచి చూడనివి, తాకనివి, వాసన చూడనివి, విననివి ఉన్నవనుటకు రుజువునైయున్నది. కాని విశ్వాసము ద్వారా వాక్యమును అతడు పట్టుకొనినప్పుడు, అతడు మరియొక్క పరిణామములోనికి వెళ్ళును (చూచారా?) అది అతనికి నిజ రూపమగును, అది అతని చేతిలో వాస్తవముగా యున్నట్లు భావించును. అది జరుగునని అతనికి తెలియును.

GAL 1:8

 

55ఈ నీటి బాప్తిస్మము మీద కూడా అదే ప్రశ్న ఇచ్చటున్నది. చూచారా? యేసుక్రీస్తు నామములో జనులు బాప్తిస్మము పొందవలసియున్నారని దేవునికి తెలియును. పౌలు అందుకే ఆ మాట చెప్పెను. బోధింపబడిన సువార్తను గాక మరియొక సువార్తను పరలోకమునుండి దూత దిగివచ్చి బోధించినా గాని శాపగ్రస్తుడగును అని చెప్పెను. ఒక బోధకుడు లేదా ఒక సేవకుడు, ఒక ప్రవక్త లేదా మరెవరయినా గాని రావచ్చు. పరలోకమునుండి దూతయే దిగి రావచ్చు. ఈ అపోస్తలుడు చెప్పిన దానికి వ్యతిరేకమయిన దానిని బోధించవచ్చును. యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందవలెను. దీనిని నా యంతట నేను చెప్పుట లేదు. బైబిలులో దీనిని మనం చూచెదము. నేనది నమ్ముచున్నాను. అందుకు మనము సాక్ష్యులము.

56మాదిరి యున్నదని నేను నమ్ముచున్నాను. బైబిలులోని ప్రతి వ్యక్తియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందియుండిరి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఎవరునూ ఎన్నడును బాప్తిస్మము పొందలేదు. చూచారా? ఎవరునూ ఎన్నడునూ చిలకరింపు బాప్తిస్మము పొందలేదు, వారందరూ ముంచబడిరి.

ప్రశస్త సోదరుడా, మీ ప్రశ్నకు జవాబు చెప్పుచున్నాను. నీ హృదయమును దేవుడు ఎరుగును. యేసు నామములో వేలాదిమంది బాప్తిస్మము పొందిరి. కాని పొడి పాపి మరల తడి పాపిగా బయటకు వచ్చుట జరుగుచున్నది. చూడండి, చూచారా? కాని నిజమగు విశ్వాసిని చూడండి. పూర్ణ విశ్వాసముతో, దేవునియెడల నిర్మలమగు మనస్సాక్షి గలిగి నడుచుకొనును. నీవు బాప్తిస్మము పొందినప్పుడు అది కనబడును. అంతరంగమందు జరిగిన ఒక కృపా కార్యమును దీనిద్వారా బయటకు వ్యక్తపరచుచున్నామని నేను నమ్ముచున్నాను.

GEN 7:1

 

57దేవుడు ఓడను కూడా ఆ విధముగానే నిర్మించెను. ఇట్లనెను, "నోవహూ, నీవును, నీ ఇంటి వారును, అందులోనికి ప్రవేశించుడి." వారందులోనికి ప్రవేశించిరి. అక్కడ గాని ఓడ లేకున్నచో, దేవుడు నోవహును ఒక దుంగమీద ఎక్కించి రక్షించగలడు లేదా నీటిమీద నడిపించగలడు. చూచారా? కాని అతడు దాగుకొనుటకు ఒక ఓడను ఆయన తయారు చేసెను. ఆయన ఆ విధంగానే చేయును. అది దేవుడేర్పరచిన మార్గము. దేవుడు కృప ద్వారా ఒక మనిషిని రక్షించునని నేను నమ్ముదును. ఒక బయటి సూచన ద్వారా యేసుక్రీస్తు నామములో అందులో ప్రవేశించవలెననునది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. వారందరూ ఆ విధంగానే బాప్తిస్మము పొందిరి.

ఇతరులను నేను ఖండించుట లేదు, కాని అది ఇదేనని తలంచుచున్నాను. నీరు ఒక మనిషిని రక్షించదు, అతడు రక్షించబడెనని అది చూపించును; అది ఒక వెలుపటి సూచన. సోదరుడా, అది సరికాకపోవచ్చును, దానిని మరొకసారి చూచెదము.

GEN 6:4

 

58ప్రశ్న: ఆదికాండము 6:4 ఉన్నత దేహులు ఎక్కడనుండి వచ్చిరి?

అది చాలా మంచి ప్రశ్న. అది ఆలోచించదగిన ప్రశ్న ఈ ఉన్నతదేహులు ఎచ్చట నుండి వచ్చిరి? మనకు తెలిసినంతవరకు ఆదాము ఉన్నత దేహముగలవాడు కాదు, ఎందుకనగా ఆలాగయితే బైబిలులో వ్రాసియుండెడిది. అతడు ఒక సామాన్య మనిషి. వారెచ్చటనుండి వచ్చిరి? ఇది చాలా వివాదాస్పదమైనది. దీనిని నాకిప్పుడు వేశారు. ఇది చాలా పెద్ద నల్లని కాగితము మీద వ్రాయబడినది - తెల్లని కాగితము మీద నల్లని పెద్దక్షరములతో వ్రాసిరి.

GEN 6:2

 

59జోసెఫెస్ అనుకొంటాను. ఇక్కడ కొద్దికాలం క్రితం ఈ ప్రశ్న అడిగెనని తలంచుచున్నాను. సేవక సోదరులారా, అది జోసెఫస్ అని నేను చెప్పుట లేదు. కాని అతని వలెనె నాకు కనిపించుచున్నది. డాక్టర్. స్కోఫీల్డ్ ని లేక మరెవరో గాని దానిని చెప్పిరి, ఈ ఉన్నత దేహులు, సాతాను యొక్క మాట విని పరలోకమునుండి పతనమైన పడిన దేవుని దూతలే అని వారు చెప్పిరి. వారు పరలోకములో మిఖాయేలుతో యుద్ధము చేయ సాగిరి… వారు త్రోయబడిరి… నరుల కుమార్తెలను చక్కని వారని ఈ దేవుని కుమారులు చూచిరి. ఆ సమయములో ఈ ఉన్నతదేహులు భూమిమీద ఉండిరి. వారు స్వయంగా మానవ శరీరమును ధరించుకొనిరి. ఒకవేళ ఆ విధంగా చెప్పినచో సాతానును ఒక సృష్టికర్తగా మనము తయారుచేసినట్లే. ఆలాగు మనం అనలేము.

60డాక్టర్ స్మిత్ బలి మేకను గూర్చి చెప్పినట్లే ఇది ఉన్నది. సెవెంత్-డే ఎడ్వంటిస్తుకు చెందిన వాదమది. పాప ప్రాయశ్చిత్త దినమున వారు రెండు గొర్రెలను తెచ్చెదరనియు, అందులో ఒకదానిని చంపి, ఒకదానిని విడిచిపెట్టెదరనియు అతడు చెప్పెను. చంపబడిన మేక యేసుకు ప్రతినిధి. మన పాపములకు ఆయన మోషే చనిపోయెను; విడువబడిన మేక అపవాదికి సంకేతమనియు, అది మన పాపములను మోసికొని నిత్యత్వములోనికి వెళ్ళును. ఇక్కడ ఎవరయినా అడ్వెండిస్టు సోదరులున్నయెడల గొప్పవాడగు డాక్టర్ స్మిత్ కు విరోధముగా నేను ఏమియూ చెప్పుట లేదు అని గ్రహించవలెను. అతడు గొప్ప మేధావి, చురుకైనవాడు, నాగరికత తెలిసిన క్రైస్తవుడు, మంచి విశ్వాసి; కాని నాకు అందువలన ఏమీ తేడా కనిపించుట లేదు. ఆ విధముగా భావించినయెడల మనము అపవాదికి కూడా బలి అర్పించినట్లే అగును. అవి రెండునూ క్రీస్తు మరణము, సమాధి, మరియు పునరుత్థానములకు అవి సాదృశ్యముగా యున్నవి. ఆయన మన పాపముల కొరకు చనిపోయెను. మన పాపములను దూరంగా మోసికొనిపోయెను. అవి రెండునూ క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించుచున్నవి.

61కావున తమంత తాముగా శరీరములు ధరించుకొనినవారు ఈ ఉన్నత దేహులు కారు. ఈ ఉన్నత దేహులు కయీను కుమారులైయున్నారు. వారి తండ్రి సర్పము, అన్ని విధములా మానవునివలె కనిపించెను, కాని మనిషికంటె చాలా పెద్దవాడు, ఉన్నత దేహము గలవాడు. అందులో నుండియే ఈ సంతానము వచ్చెను, ఎందుకనగా వారు కయీను కుమారులు. వారు కనాను దేశములో యుండిన కనానీయులు. కయీను అక్కడికే వెళ్ళెను. చూడండి, సర్ప సంతానమును ఇది కూడా రుజువు చేయుచున్నది. వారు వేరే జాతికి చెందినవారు. వారు సర్పసంతానమైయున్నారు. చూచారా?

సర్పసంతానము యొక్క ప్రశ్న ఇక్కడ ఉన్నది, కావున దానిని మనం చూచెదము. దీనిని మీరు మనస్సున ఉంచుకొనవలెనని కోరుచున్నాను, చూచారా. ఇది మీకు ఈ నేపద్యమును తెలియ చేయును.

GEN 6:4

 

62చూడండి, వారు కనానీయులు, వారు ఉన్నత దేహులు; వారు కయీను కుమారులు, సర్పము యొక్క సంతానమైయున్నారు. సర్పము ఉన్నత దేహముగల మనిషి, భీకర మృగముగా యుండెను, ప్రాకునది కాదు, చాలా అందమైనది. పొలములోనున్న జంతువులన్నింటిలో అది చాలా యుక్తిగలదైయుండెను.

ఒక జంతువు యొక్క జన్యువులను స్త్రీలోనికి విడిచినా గాని అది పరిపక్వము కాదు. వారు దీనిని పదే పదే ప్రయత్నించి చూచిరి. స్త్రీ యొక్క వీర్యములోనికి అది జత కాదు. అది వారివలన కాదు. ఒక చింపాజీని తీసికొనండి, మానవునికి అతి సమీపముగా నున్న జంతువు అదే. గొరిల్లా, ఇవి మనిషికి బహు దగ్గరగా ఉన్నవి. దేవుడు తనయొక్క గొప్ప పరిణామములో చేపను తయారుచేసెను. ఆ తరువాత ఆయన పక్షులను తయారుచేసెను, ఆ తరువాత ఆయన ఇతర జంతువులను తయారుచేసెను, ఆలాగు ఒక క్రమము ప్రకారము వాటిని సృజించెను. ఒకదాని తరువాత ఒకటిగా అవి వచ్చి చివరకు చింపాంజీ, కోతి వచ్చెను, గొరిల్లా వచ్చెను, ఆ తరువాత సర్ప రూపము వచ్చెను, సర్పము నుండి మనిషి వచ్చెను.

63మానవాళి ఎన్నో పరిశోధనలను చేయుచున్నది, విజ్ఞానము ద్వారా ఎముకలను పరీక్షించుచున్నారు. ఈ జంతువు మానవునికి అతి సమీపమందున్నదని వారు అనుచున్నారు. మానవుడు కూడా ఒక జంతువేనని వారనుచున్నారు. శరీరమునకు సంబంధించినంత వరకు మానవ శరీరము, జంతు శరీరము ఒక్కటేనని మనమెరుగుదుము. మనము క్షీరదులము, అనగా వేడి రక్తము గల జంతువులము; దానిని మనము ఎరుగుదుము. అయితే దేనివలన తేడా కలుగుచున్నది? జంతువునకు అంతరంగమునందు ఆత్మ లేదు, కాని మనిషికి ఆత్మ యున్నది. జంతువులకు తప్పొప్పులు తెలియవు.

ఒక చిన్న ఆడ కుక్కకు వస్త్రములు ధరించవలెనన్న జ్ఞానము లేదు, అర్థమయితే అది పొట్టిబట్టలు ధరించునని నేననుకొనను. పంది కూడా ఆలాగు తలంచదు, కాని మానవ జాతి పతనమైపోయినది, చూచారా.

64అక్కడినుండియే అది వచ్చియున్నది. ఈ రాక్షసులు అందులో నుండియే వచ్చిరి. వారు సర్పము యొక్క కుమారులు.

చూడండి, అవ్వ ఈ స్థితిలో యుండుటను అతడు చూచెను. సాతాను ఆమెను స్వాధీనము చేసికొని పనిచేసెను. చూడండి, ఆదాము ఇంకా దానిని కనిపెట్టలేదు. ఈ మాటలను ఎట్లు ఉపయోగించవలెనో నాకు తెలియదు. మీరు ఏమీ అనుకొనరు గాని కొందరు దానిని విమర్శించవచ్చును. మీరెరుగుదురు, ఎల్లప్పుడూ వారేదో ఎత్తిచూపవలెనని కోరుదురు. కాని చూడండి, ఆదాము ఎన్నడూ తన భార్యయగు అవ్వను ఇంకా కూడలేదు. అతడు ఆ స్థితికి ఎన్నడూ రాలేదు. సాతాను అక్కడే వారిని కొట్టెను, చూచారా. ఆమె గర్భవతియైనది, ఆమెను అప్పుడతడు కూడెను. మనము దానిని గూర్చి ఆ తరువాత ప్రశ్నలో లేదా ఇక్కడున్న మరికొన్ని ప్రశ్నలలో చూచుదము. ఆ ప్రశ్న ఎక్కడున్నదని నాకు తెలియలేదు; దానిని నేను ఇక్కడే ఎక్కడో చూచాను. ఇప్పుడు, ఉన్నత దేహులు ఆ విధముగానే వచ్చిరి.

65ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, నిజముగా తిరిగి జన్మించిన విశ్వాసుల యొక్క కుమారులు మరియు కుమారైలు అందరూ రక్షించబడెదరా?

సోదరుడా, ఇది నిశ్చయంగా కాదని చెప్పుచున్నాను. ఈ విషయములో డేవిడ్ డఫ్లెసిస్ మాటలను నేను అనుకరించుచున్నాను. "దేవునికి మనుమలు లేరు. (చూచారా?) కేవలము కుమారులు మరియు కుమార్తెలే ఉన్నారు." చూడండి, వారు కూడా వారి తల్లిదండ్రులవలెనె ఆత్మ ద్వారా తిరిగి జన్మించవలసియున్నారు. చూచారా? అందువలన ఒక వ్యక్తి నూతనమగును, తిరిగి జన్మించుట వలన అది సాధ్యమగును. అతని మొదటి జన్మవలన ఈ భూమిమీద ఒక సహజ మానవునిగా మారుచున్నాడు. అతని రెండవ జన్మవలన పరలోకములో ఆత్మ సంబంధిగా మారుచున్నాడు, చూచారా. అది అతని ఆత్మను మార్పు చేయుచున్నది, అతని యొక్క బాహ్యమనస్సాక్షిని కాదు. అతని బాహ్య వ్యక్తిత్వమును కాదు, అతని జ్ఞానేంద్రియములను కాదు. అతని రుచి చూచు శక్తి, వాసన చూచు శక్తి, వినే శక్తి, తాకగల శక్తి ఎప్పటివలెనె యుండును; కాని అతని యొక్క అంతరంగ భాగములు, అతని యొక్క కోరికలు, అతని ఉద్దేశ్యములు మారి అవి దేవునిగా అగును, చూచారా.

ACTS 16:28,31

 

66ఇప్పుడు గుర్తుంచుకొనండి, అది జరగగల మార్గము ఒక్కటే యున్నది. రోమన శతాధిపతి కాలములోను ఆలాగే జరిగినది. ఆ రోమను సైనికుడు తన కత్తి దూసికొని ఆత్మహత్య చేసికొనవలెనని తలంచినప్పుడు - పౌలు మరియు సీలలు చెప్పినది చూడండి, దేవుడు ఒక భూకంపముతో ఆ చెరసాలను కదిలించెను. వారిట్లనిరి, "నీకు నీవు ఏ హానియు చేసికొనవద్దు. మేమందరము ఇక్కడేయున్నాము, లెమ్ము." తామేమి చేయవలెనని వారినడిగెను. వారిట్లనిరి, "లేచి బాప్తిస్మము పొందుము. ప్రభువు నామమున ప్రార్ధించుము. నీవును, నీ ఇంటివారును రక్షించబడుదురు." చూచారా? ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసముంచినప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షించబడుదురు.

అది ఏలాగు? నీవు నమ్మినట్లుగానే నీ గృహములోని వారును నమ్మవలెను. చూచావా? నీవు ప్రార్థన చేసి పిల్లలను, నీ ఇంటివారిని దేవునికి అప్పగించవలెను, వారు రక్షించబడెదరని నమ్మవలెను.

67రిబ్కా విషయములో ఈ మధ్యనే నాకు ఈ అనుభవము కలిగినది. చూచారా? దేవునికి అప్పగించుము. ఆమె యుక్తవయస్సురాలయినది. ఆమె మరో బాలికతో అక్కడికి వెళ్ళినది. సంగీత పాఠములు నేర్చుకొనుటకు వారి యింటికి వెళ్ళినది. ఒక రోజున నేను వెళ్ళి చూచు సరికి ఆమె పియానో యొద్ద కూర్చొని రాక్-ఎండ్-రోల్ వాయించుచున్నది. అది నాకు చాలును! వెంటనే దానినుండి దూరము కమ్మని చెప్పాను. చూచారా? అయితే సంగీతము నేర్చుకొనుచోటు అదొక్కటేనని ఆమె చెప్పినది. (యుక్త వయస్సులో ఉన్నవారి సంగతి మీకు తెలియును.)

ప్రతి పిల్లలు ఆలాగే యుందురు. అందరూ ఆ వయస్సులో ఆ విధంగానే ప్రవర్తించుచుందురు. మీరు ఆ విధంగానే యుండిరి; నేను ఆ విధంగానే యున్నాను. వారి ఆలోచనలను గూర్చి మనము తలంచవలసియున్నాము.

68ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె తల్లి ఎందుకో ఆమెను గద్దించినది. ఆ రిబ్కా ఈలాగు అప్పుడు లేదు. తటాలున లేచి, తలుపును దబాలున కొట్టి, వస్తువులను గోడ వైపుకు తన్ని, బడికి వెళ్ళిపోయినది.

అప్పుడు నేను నా బెల్టును తీసికొని ఆమెను ఆవరణలో నుండి వెనుకకు పిలచి, వాతలు పడునట్లు కొట్టవలసినది, చూచారా. కాని నేనిట్లు అనుకొన్నాను, "ఒక్క నిమిషం ఆగుదాం. పద్దెనిమిదేండ్ల ఆలోచనలను మననం చేసికొందాం." ఆమె తల్లి ఏడ్వనారంభించియున్నది. "మిడా, నీవు చేయవలసినదంతా చేసియున్నావు. నేను కూడా చేయకలిగినదంతా చేశాను. ఇప్పుడామె మన చేతులను దాటిపోయినది. మనమిక త్వరగా నిర్ణయం తీసికోవలెను," అని చెప్పాను.

ఒక రోజున ఒకామె ఎంతో మధురముగా వ్రాసినది, (అది ఈ ప్రశ్నలలోనే యున్నది) "బ్రెన్హాం సోదరుడా, నీవు మెస్సీయావు కావు గదా?" అన్నది.

"కాదు," అన్నాను.

"నీవు మా కాపరివి అని మేము నమ్ముచున్నాము, కాని నీవెల్లప్పుడూ ఆ గొప్ప కాపరివైపు చూపించుచున్నావు," అన్నదామె.

"అది నిజము, అది సరియైనది," అన్నాను. చూచారా?

నేను అన్నాను, "సరే చూడు, హనీ! నీవు నా మాట వినవలెను. దీనిని చేయుట నీకు కష్టము; నేను నీ భర్తను. కొన్ని మాటల కొరకు, సలహా కొరకు జనులు దేశములోని పలు ప్రాంతముల నుండి కారు నడుపుకొని వచ్చుచున్నారు. ఒకవేళ నీవు… ఒక రోజున ఆమెతో నేను మాట్లాడినప్పుడు, ఆమె నా మాట వినకుండా వెళ్ళిపోయినది."

69బెకీ ఎన్నడూ ఆలాగు నా విషయంలో చేయలేదు. చూచారా? ఆమె తల్లి ఆమెకు ఏదో సలహా ఇయ్యగా, ఆమె ఆ తలుపును దబాలున కొట్టి ఇట్లన్నది, "నేను గోడమీది బొమ్మ పువ్వువలె జీవితమంతా కూర్చొనవలెనా?" అని అడిగినది. నిందించినది! ఆమె తలుపు దబాలున కొట్టి బయటకు వెళ్ళిపోయినది. అది అపవాది కార్యము.

నాకు గుర్తున్నది, ఆమె జీవితములోని మొదటి రెండు సంవత్సరములు ఆమె ఏడ్చినది. మేము ఒక రెస్టారెంటులోనికి వెళ్ళి భుజించాము. మిడా తినుచుండగా ఆమెను నేను వీధిలోనికి నడిపించాను. నేను తినుచుండగా, ఆమె నడిపించినది. పిల్ల చాలా గోల చేసెడిది. ఒక రాత్రి కెనడాలో ఉండగా, ఆమె రాత్రంతా ఏడ్చినది. నాకు నిద్రలేదు; నేను నిలబడియున్నాను. ఎవరో నాతో అప్పుడు ఇట్లనిరి, "నీ సేవలోనికి దయ్యము చొరబడవలెనని చూచుచున్నది."

"బాలికను నా చేతికిమ్ము" అని చెప్పి ఇట్లు గద్దించాను. "సాతానా, ఆమె మీద నుండి నీ చేతులు తీసివేయమని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నాను." ఆ మాట పలుకగానే, ఆమె ఏడుపు ఆపినది, మరెన్నడూ ఏడ్వలేదు. ఆమె ఎంతో మెల్లని నెమ్మదిగా మారిపోయినది. ఆ ఘడియ నుండియే ఆమె మారిపోయినది. అయితే ఆలాగు నీవు చేయు ముందుగా, నీకది తెలియవలసియున్నది.

ఆమె ఆ విధంగా చేయసాగినది. ఒక గంటసేపు నేను మిడాను ఆదరించాను. "మిడా, నీ చేతులు దులుపుకో" అన్నాను.

"నేనా? అది నా పిల్ల గదా?" అన్నదామె.

"నా బిడ్డ కాదా? ఆమె ఈ ఉదయం చనిపోవుచున్నదని మనకు తెలిసినచో ఆమెను దేవునికి అప్పగించి, ఆమె యొక్క నిత్యత్వపు గమ్యమునకు ఆమెను తీసికొమ్మని పలుకుదుము. మరి ఈ భూలోక యాత్రలో కూడా ఆమెను దేవునికి అప్పగించవద్దా?" అన్నాను

"అది నా బిడ్డ" అన్నదామె.

"ఆమె నా బిడ్డ కూడా," అన్నాను.

"ఆ విషయములో నేనేమియూ అనుట లేదు."

"ఎన్నడూ ఆలాగు నేనట్లనలేదు."

నేనిట్లు పలికాను, ఆమెను తిట్టుట మనం మానేసి ఆమెకు సలహా ఇచ్చుదము. ఆమెను స్నేహితులవలే యుండవలెను, నీవే ఆమెను ఆ విధంగా చూడవలెను. ఆ బాధ్యత మన ఇరువురి మీదను ఉన్నది. మనం ఆమె యొక్క తల్లిదండ్రులము."

70ఈనాడు మన పిల్లలకు సలహాలిచ్చువారు అవసరము. వారికి తల్లిదండ్రులున్నచో వారిగూర్చి శ్రద్దవహించవలెను. వారు ఇంటిలో నిలచియుండవలెను, కాని అందుకు బదులుగా వారు నాట్యశాలలకు, మద్యపానమునకు వెళ్ళి రాత్రంతా గడుపుచున్నారు. అటువంటి పనులు యుక్త వయస్సులోని వారికి తగవు.

వారు బైబిలునుండి దూరమైరి; వారందరూ ఆలయమునకు వెళ్ళి జూదములను ఆడుచున్నారు. చూచారా? మీరు సాతాను స్థలములకు మెరుగులు దిద్దుచున్నారు. హాలీవుడ్ అటువంటిదే. హాలీవుడ్ను మీరు ఆలయములోనికి తీసికొనిరావద్దు. సంఘమును ఎన్నడూ హాలీవుడ్లోనికి తీసికొని వెళ్ళరాదు. వారికి తెలియని దానిని మనము తెలిసికొనియున్నాము.

71కావున మనము మోకాళ్ళు వంచి వారిని దేవునికి అప్పగించవలెను. "ఆమె ఇంకొద్ది రోజులకు పద్దెనిమిదేండ్ల వయస్సులోనికి వచ్చును. ఆ వయస్సుకు వచ్చిన బాలిక ఒక మగ స్నేహితుని గూర్చి ఆలోచించును. ఆమెను మేము లోపట ఉంచాము. ఆమె పెండ్లి చేసికొనుట నాకిష్టము లేదు. ఇక్కడే ఆఫీసులో ఆమె పనిచేయవలెనని కోరాను. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడవలెనని కోరాను."

మనందరి ఇష్టము ఆ విధంగానే యుండును. ఆమె ఇట్లన్నది, "అది మన వలన కాదు, ఎందుకనగా ఆమె మన మాట వినుట లేదు."

"ఒక్క నిమిషం ఆగు! మన శాయశక్తులా ఆమెను మంచిగా పెంచాము. ఇప్పుడామెను దేవుని చేతులకు అప్పగించుదము. ఆమె ఏదయినా చేసినప్పుడు ఈలాగు చెప్పుదును. "బెకీ, నా ప్రియైన బిడ్డా, నీవది చేయుట మీ అమ్మకు ఇష్టము లేదు. నేను నీ తండ్రిని, నిన్ను హత్తుకొనుచున్నాను." చూచారా? ఆమెను మీరు ప్రేమించుచున్నారన్న సంగతి ఆమెకు తెలియనీయండి. ఆమెను ప్రేమించే వారొకరు కావలెను. ఆమె చెడ్డ స్త్రీయే కావచ్చును. చూచారా? మీరు ఒకరిచే ప్రేమింపబడగోరుదురు. ఇది చాలా కష్టముగా తోచ వచ్చును. ఆమెతో ఇట్లన్నాను, "చూడమ్మా! జనులు ఆయా చోట్లనుండి నా యొద్దకు వచ్చి సలహాలు పొందుచున్నారు. వ్యక్తిగత విషయములను పంచుకొనుచున్నారు. నేను మీకు ఒక సామాన్య వ్యక్తిని. మనం ఒకరికొకరం చాలా సన్నిహితులము, ఎందుకనగా మనం భార్యా భర్తలము, కావున అదెన్నడూ జరుగకుండా చూడవలెను. నీవిది తప్పక గుర్తుంచుకొనవలెను, ప్రభువు నామములో దీనిని చెప్పుచున్నాను."

"మంచిది," అన్నదామె.

మేము మోకరించి ఆమెను దేవునికి అప్పగించాము. ఆ విషయంలో మా చేతులు తీసివేయుచున్నట్లు చెప్పాము.

ఆ మధ్యాహ్నము ఆమె లోపలకు వచ్చెను, "నన్ను అక్కడికి వెళ్ళవద్దని ఇంకా మీరనుచున్నారా?" అన్నది.

మిడా ఇట్లన్నది, "మరెన్నడూ ఆ మాట నేను అనను. నీ తల్లికి అది ఇష్టము లేదని నీవెరుగుదువు. ఆ చెడ్డ సంగీతము నీవు వాయించుచున్నావని నీ తండ్రికీ తెలిసినచో, ఆయన చనిపోయినంతగా బాధపడును. ఆ బాలికతో నీవది వాయించకూడదు. ఆయనకు నీవాపని చేయుట ఇష్టముండదు. మాకెవరికీ అది ఇష్టము కాదు. బెకీ, దానిని మేము ప్రభువుకు అప్పగించియున్నాము. మేము నిన్ను ప్రేమించుచున్నామని నీవు తెలిసికొనుము. నీవేమి చేసినా గాని ఇంకా నిన్ను మేము ప్రేమించుచునేయున్నాము."

"ఏమైనా సరే, నేను వెళ్ళక తప్పదు," అని ఆమె గట్టిగా చెప్పినది.

"సరేనమ్మా! నీవు వెళ్ళు. నీవు వచ్చేసరికి రాత్రి భోజనం సిద్ధపరచియుంచుదును," అన్నదామె. అంతే, ఆ క్షణము నుండి ఆమె ఎన్నడూ అక్కడికి వెళ్ళలేదు. చూచారా?

ఆ తరువాత కొంత కాలమునకు ఆమె జార్జిని కలిసికొనినది; జార్జి ఒక క్రైసవుడు. అంతటితో ఆ సమస్య పరిష్కారమయినది.

ఒక రోజున శ్రీమతి. ఉడ్ కు ఆమె దానిని చెప్పినది. "నేను భయంకర కోపంతో నిండిపోయాను. నా తల్లిదండ్రులు నన్ను ప్రభువుకు అప్పగించారు. చాలా కోపించాను" అన్నదామె. ఆమె మా మీద కోపగించినది, ఆమె పై మేము కోపపడలేదు, చూచారా. ఆ విధంగా ప్రవర్తించండి. మంచిది.

72ప్రశ్న: (దీనిని చదివిన జ్ఞాపకము నాకున్నది. దీనిని ఆలస్యముగా చెప్పవలెనని తలంచి ఉంచాను. అయితే ఇప్పుడు చదివెదను. ఇది ఒక స్త్రీ యొక్క చేవ్రాత. ఆమె తప్పక కెంటాకీనుండి వచ్చియుండును, ఎందుకనగా ఆమె యొక్క కాస్మస్ పోర్ట్లాండ్ సిమెంట్ చీటీ ఇక్కడున్నది.) బ్రెన్హాం సోదరుడా, మన సంఘములలోని సోదరీలు అటువంటి పొట్టి బట్టలు ధరించుట గూర్తి నీవేమి తలంచుచున్నావు? అది మన సాక్ష్యమును చెరచి, మన సంఘములలో ఉన్న యువతీయువకులకు ఒక తప్పు మాదిరిని చూపించదా? ఒక ఎదిగిన స్త్రీ ఆ రకమగు పొట్టి బట్టలు ధరించుట సరిగ్గా లేదు. ఆమె నడచుచుండగా మోకాళ్ళు బయటకు కనిపించుచున్నవి.

సోదరీ లేక సోదరుడా, దీనిని వ్రాసినవారెవరయినా గాని, మీతో నేను నూటికి నూరు శాతం అంగీకరించుచున్నాను. అది అవమానము, కాని ఆ విషయంలో ఏమి చేయాలో నాకు చెప్పండి. నాకు తెలిసినంత గట్టిగా దానిని గూర్చి బోధించుచున్నాను, అయినా వారు మారుట లేదు. కాబట్టి అది వారి తీర్పు వాక్యము బయలు వెళ్ళియున్నది. పొట్టి బట్టలకు, శరీరమును అంటిపెట్టుకొనియుండు బట్టలకు నేను వ్యతిరేకిని. నా పిల్లలగు బెకీ మరియు శారాలతో నిరంతరము ఈ విషయమును చెప్పుచుందును. వారిని నేను చూచీ చూడనట్లుగా ఉండను. వారి దుస్తులు కూడా ఆలాగే యున్నవి. మిడా ప్రతిరోజు వారిని చీల్చుచున్నది. చూచారా? పిల్లలను మనము సరిదిద్దవలెను; కాని ఒక పెద్ద స్త్రీ యొద్దకు వచ్చుసరికి మనం ఏమీ అనలేము. ఎక్కడో తప్పున్నది. చూచారా?

73ఎవరి భావములను కించపరచుటలేదు, నేను ప్రశ్నలకు జవాబులు ఇచ్చుచున్నాను. మీ హృదయములో ఉన్నదానిని మీరడిగియున్నారు. నా హృదయములో ఉన్నదానిని మీకు చెప్పుచున్నాను. మీకు దానికి పరిష్కారము దొరికినచో దయచేసి నాయొద్దకు వచ్చి చెప్పండి. నిశ్చయంగా దానిని నేను ఆలోచించి చేయవలసినది చేయుదును.

ఒక రోజున ఎవరో ఇట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా, ఆదామవ్వలు యాపిలు తినిరి." వారిప్పుడు దానిని మార్చివేసిరని గమనించాను. వారిప్పుడు ఏమి తినిరని చెప్పుచున్నారు? [సమూహములోని ఒకరు "ఆఫ్రికాట్? అని చెప్పిరి.] వారు ఆఫ్రికాట్ తినిరని చెప్పుచున్నారు. వారు ఆఫ్రికాట్ తరువాత మరేదో తినిరని చెప్పుసమయము రావచ్చును. కాని వారు దిగంబరులయిరని గ్రహించినచో మంచిది, చూచారా.

74ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నేను మరియు నా కుమారుడు నేడు దేవుడిచ్చిన వర్తమానమును అంగీకరించియున్నాము. మేమిరువురుము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందియున్నాము. నా భర్త వర్తమానమును అంగీకరించలేదు. ఈ వర్తమానం విషయంలో కలహమాడుచున్నాడు. అతడు నా కుమారుని వశపరచుకొని ఒక మెథడిస్టు చర్చికి తీసికొని వెళ్ళుచున్నాడు. ఈ ఆలయములో మనకు ఆరాధన లేని సమయములో నన్ను కూడా తనతో పాటు ఆ సంఘమునకు రమ్మని కోరుచున్నాడు. అతనికి కూడా నేను వెళ్ళుట సరియేనా? లేక ఆ శాఖకు దూరంలో నేనుండుటయే మంచిదా?

ఈ ప్రియ సోదరీ తన పేరు వ్రాయలేదు. బహుశా నీవు నీ ప్రశ్నను వినుచున్నావను కొనుచున్నాను, నీవిక్కడ లేనియెడల టేపును విందువు. నీ భర్తతో వెళ్ళుము, కాని వారు చేయుచున్నవాటితో పాలు పొందవద్దు. చూడు, నీవు నీ భర్తను ప్రేమింపవలసియున్నావు, ఏమయినా గాని అతనిని ప్రేమించుము. నీవు నిజమైన ఉప్పుగా ఉండుము; అతనికి దాహము పుట్టును.

వారి శాఖలో చేరవద్దు. ఆ శాఖనుండి దూరముగా ఉండవలెనా అని నీవడిగావు. అందులో చేరవద్దు; దానిలోనికి వెళ్ళుము. నీవు మొత్తం వినలేకపోతే సగం వినుము. సగం వినలేకపోతే కొంచెం వినుము. చూచారా? ఆ విధంగానే మీరు మీ భర్తలను సంపాదించుకొనగలరు. ఆ విధంగా చేయండి, తిరుగుబాటు చేయరాదు. నీకున్న కోపమును బట్టి అతనికిని కోపము రేగును. చూచారా? కాని అతనికి లేని దానిని నీవు చూపించగలిగినయెడల, అతడు కూడా నీవలె యుండవలెనను దాహముతో ఉండును. శుద్దీకరింపబడిన భార్య తన భర్తను కూడా శుద్దీకరించును.

ఇది ఒక సలహా మాత్రమే. దానిపై ఎక్కువ సమయము తీసికొనను. వీలయినన్ని ప్రశ్నలను నేను చూడవలెను. నాకు కేవలము ఇరవై-రెండు నిమిషముల సమయమున్నది.

JOHN 6:37•

JOHN 12:32

 

75ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీవు బోధించుచున్న వర్తమానమును నా పూర్ణ హృదయముతో అంగీకరించుచున్నాను. అది నా ఆత్మను పరవసింపచేయుచున్నది, అయినా నా భార్యా మరియు నా కుమారుడు వాక్యమందు ఆనందించుట లేదు. వారు కొన్ని లోక అలవాట్లనుండి తమ్మును తాము వేరుచేసికొనగోరుటలేదు. మన కుటుంబములను రక్షించుకొనగలమని నీవు చెప్పితివి. అది నాకు కష్టమగు పనిగా కనబడుచున్నది. వారు వాక్యము కొరకు గాని, వాక్యములోగాని జీవించుచున్నట్లు నాకు కనబడుట లేదు. అయ్యా! నేనేమి చేయవలెను? నేను వారి రక్షణ కొరకు నమ్మి, ప్రభువా, నీ చిత్తము జరిగించుమని ప్రార్ధించవలెనా? లేక ఇప్పుడున్న నా స్థితిలోనే నేను సంతృప్తి చెందవలెనా? బ్రెన్హాం సోదరుడా, ఈ విషయములో నీ నడిపింపును నేను ప్రశంసించుదును,

నా సోదరుడా, లేక సోదరీ, వ్రాసినది ఎవరయినా గాని దేవుడు మిమ్మును దీవించును గాక! నేను వారిని ప్రభువుకు సమర్పించుదును. చూడండి, నా తండ్రి అనుగ్రహించిన వారందరూ నాయొద్దకు వచ్చెదరని ఆయన చెప్పెను. ప్రజలు చేయవలసినది ఈనాడు ఒకే ఒకటున్నది…

76ఒక రోజున దానినిబట్టి నా హృదయము ఎంతగానో సంతోషించినది. నేను పైకి క్రిందికి ఎగిరాను. ఆ హోటెల్లో ఉన్న బెకర్ ను అడిగాను. అతడిట్లు చెప్పాడు, "బిల్లీ, నీకు తెలుసా? నేను మొత్తం మీ సమూహమునకు ప్రతి ఆదివారం భోజనము పెట్టుచున్నాను. బ్లూ-బోయర్ వారు ప్రతి ఆదివారం దాదాపు మూడు వందల మందికి భోజనం పెట్టుచున్నారు. రాంచ్ హవుస్ వద్దగల మనిషి చాలా మంచివాడు."

అతనిని నేను కలిసికొన్నాను; అది నిజంగా చాలా మంచిది అని చెప్పాను. నిన్ను నేను అభినందించుచున్నాను. నీవు ఆ పదార్ధములను దూరంగా ఉంచుము. వాటిని బయటకు మోసికొనిపోవుదురు.

"ఆలాగే బ్రెన్హాం సోదరుడా," అని నాతో పలికెను.

"నన్ను నీవెట్లు ఎరుగుదువని?" అడిగాను. చూడండి? "నన్ను నీవెట్లు ఎరుగుదువు?"

"నిన్ను నేనెరుగుదును. మీ సహవాసమునకు ప్రతి ఆదివారం నేను భోజనం పెట్టుచున్నాను. వారు చాలా చక్కని ప్రజలు," అని చెప్పెను.

అది నన్ను ఎంతో సంతోషపరచినది. ఇక్కడున్న మీరు నా పిల్లలు. చాలా చక్కగా మీరు ప్రవర్తించుచున్నారు. తండ్రికి ఎంతో సంతోషము కలిగించును గదా? అది మీకర్ధమయినదని తలంచుచున్నాను.

JOHN 12:32

 

77అమ్మా, నీ భర్త నిన్ను రమ్మని చెప్పినచో తప్పక ఆ మెథడిస్టు ఆలయమునకు వెళ్ళుము. నీకు పూర్తి భోజనము అక్కడ లభించకపోవచ్చును, యేసు దేవుడని వారు చెప్పెదరు. మనము కూడా అదే చెప్పెదము. అయితే వారు చెప్పే ఇతర మంత్రములను అనుసరించవద్దు, నీకు కావలసినంత రొట్టెను మాత్రమే తినుము. చూచారా? మరియు దానిలో… నీ జీవితము మధురముగా యుండును. నీవు ఏదయినా కృత్రిమమైన దానిని ధరించినప్పుడు, ఎందుకనగా నిజమైనది కాదు. నీ భర్త వెంటనే గ్రహించును. కాని నీవు నిజముగా ప్రార్ధన చేసినయెడల, నీ వాస్తవికతను నీవు తప్పక బయలుపరచెదవు, నీవు ఉప్పువలె ఉందువు, అప్పుడు అది తాకును. "ఆయన భూమిమీదనుండి పైకెత్తబడినప్పుడు మనుష్యులను ఆకర్షించుకొనును." జాగ్రత్తగా ఉండుము. వారి సంఘములో చేరవద్దు! దయయుంచి ఆ పని మాత్రం చేయరాదు. వారి ఆలయములో చేరవద్దు, కాని ఆలాగే ముందుకు కొనసాగుము.

78ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఇక్కడ ఉన్న ఒక ప్రశ్న యున్నది. ఇది మనలో చాలామందికి ఆశ్చర్యమును కలిగించవచ్చును. (క్షమించండి) - వధువు ఎత్తబడిన తరువాత యూదులు మాత్రమే రక్షించబడుదురని నీవు చెప్పిన టేపులు విన్నాను. (ఒక గీత అడ్డంగా గీసెను.) రాకడలో ఎత్తబడని అన్యులు శ్రమల గుండా వెళ్ళెదరనియు, యేసు కొరకు సాక్ష్యమిచ్చుటకు తమ ప్రాణములను ఇచ్చెదరనియు చెప్పినట్లు టేపులో యున్నది. అన్యుల వైపునుండి ఆయన యూదుల వైపు తిరుగును. అన్యులు రక్షించబడు అవకాశమే ఉండదు. అన్యులు కొందరు రక్షించబడియున్నారు, కాని అంత్యదినపు సత్యమును చేర్చుకొని వారు శ్రమల కాలము గుండా వెళ్ళెదరు. అయితే అంతమందు రక్షించబడుదురు. ఇది నిజమేనా? దయతో వివరించుము. ఎందుకనగా రాకడలో ఎత్తబడు వారి సంఖ్య కొద్దిగా యుండునని నీవు చెప్పియున్నావు. ప్రభువునందు విశ్వాసముంచినవారున్నారు, కాని వారు నీవు బోధించు అంత్యకాలపు వర్తమానమును విశ్వసించుట లేదు. వారు రక్షించబడుదురా? దీనిని వ్రాసిన సోదరియెుక్క సంతకము ఇక్కడున్నది.

చాలా మంచి ప్రశ్న గందరగోళమును మొదట చూడండి. అన్యుల దినములు గతించిపోయినదని నేను చెప్పియున్నాను. శ్రమలు వచ్చును. అన్యులను నేను బైబిలులో చూడలేదు. అన్య సంఘము కాదు గాని అన్యవధువు గూర్చి చెప్పుచున్నాను. అన్య సంఘము శ్రమల గుండా వెళ్ళును. (చూచారా?) చూడండి. వధువు ఎన్నుకొనబడినది; వారు ఎత్తబడుదురు. వారు మార్పుపొంది లోకములో నుండి కొనిపోబడుదురు, చూచారా. ఆ తరువాత ప్రశ్నలో నేనిది వివరించెదను. లూథర్ నుండి దీనిని సంగ్రహించాను. దాని భావమును మీరు గ్రహించెదరు. శరీరము పరిపక్వము చెందును, చూచారా.

ఇప్పుడు గమనించండి. విడిచిపెట్టబడిన యూదులకు ఆ ఇద్దరు ప్రవక్తలు, అనగా మోషే మరియు ఏలియాలు బోధించెదరు.

1THS 4:17

 

79సేవకులగు సోదరులారా, ఇవి నా స్వంత ఆలోచనలు, పరిశుద్ధాత్మ నాకు ఈ విధంగా బయలుపరచినదని భావించుచున్నాను.

అన్యులలో నుండి ఏర్పరచుకొనబడిన వధువు ఎత్తబడును. అన్ని కాలములలోనూ నుండి అన్యులలో నుండి ఏర్పరచుకొనబడిన వధువుతో పాటు వారు వెళ్ళెదరు. ఆకాశములలోనికి కొనిపోబడును. క్రీస్తు సముఖములోనికి ఎత్తబడుదుము. మృతులు లేచెదరు, జీవించియుండి మిగిలినవారు మార్పు పొందెదరు. ప్రభువును అందరము కలిసి మధ్యాకాశములో సంధించుదుము.

మహిమలో పెండ్లి ఉత్సవము అయిపోయిన తరువాత - ఆకాశములలోనికి ఎత్తబడిన తరువాత, యేసు భూమి మీదికి తిరిగి వచ్చును. ఆయన తన్నుతాను జనులకు బయలుపరచుకొనును. యోసేపు తన సోదరులకు తెలియపరచుకొనిన మాదిరిగానే యున్నది. యోసేపు మాత్రమే యున్నాడు. ఏ ఇతర అన్యుడు అచ్చట లేడు. అతడు తన సోదరులకు తన్ను తెలియపరచుకొనెను. ఇప్పుడు దానిని అందరూ అర్థము చేసికొనిరా?

80అతని భార్య రాజ నగరులోనే యుండెను. ఆ సమయములో వధువు మహిమలో రాజభవనములో యుండును. యేసు తన్నుతాను యూదులకు తెలియపరచుకొనెను, చూచారా, పెండ్లి ఉత్సవము తరువాత, 3 1/2 సంవత్సరములు, మరియు యాకోబు శ్రమ, 3 1/2 సంవత్సరములు, దానియేలు దెబ్బది వారములలో చివరిది. మధ్యలో మెస్సీయా కొట్టివేయబడును. అతడు 3 1/2 సంవత్సరములు ప్రవచించును, ఆ తరువాత కొట్టివేయబడును. ఇంకా ప్రవక్తలకు 3 1/2 సంవత్సరములు మిగిలియుండును, వారు మోషే మరియు ఏలియాలు. వారియొక్క డెబ్బది దినముల అంతము ఇంకొ జనులకు నిర్ణయింపబడవలసియుండును. ఆ విధముగా దానియేలు చెప్పెను. డెబ్బది దినముల అంతమందు యేసు వారికి తన్నుతాను తెలియపరచుకొనును. యూదుల యొద్దకు రావలసిన రాజాధిరాజు ఆయనే, చూచారా.

81చూడండి, అన్య వధువు ఆకాశమందున్నది. నిద్రించుచున్న కన్య అన్యకన్య, ఆ కాలమందు రక్షించబడదు; ఆమె ముందే రక్షించబడినది, కాని వధువుగా ఆమె నిరాకరించబడినది. ఆమె శుద్దీకరణ కొరకు శ్రమలగుండా బయలు వెళ్ళును, ఎందుకనగా ఆమె తనను శుద్దీకరించు వాక్యమైయున్న క్రీస్తును నిరాకరించినది. ఆమె తన క్రియల నిమిత్తము శ్రమపడవలసి వచ్చును, కాని వాక్యముగా మారియున్న వధువు సంపూర్ణ పరిహారము పొందియున్నది. క్రీస్తు దానిని చేసెను, ఎందుకనగా ఆయన వాక్యమైయున్నాడు. శరీరము చీల్చబడినది, ఆ శరీరము చీల్చబడినప్పుడు, ఆ వధువు అక్కడే యున్నది, ఎందుకనగా ఆమె పూర్తి వాక్యమైయున్నది. ఆమేన్! దానిని మీరు చూచారా?

GEN 2:21•

PS 34:20

 

82యేసు తన శరీరమందు శ్రమపడెను, ఎందుకనగా స్త్రీ మరియు పురుషుడు ఏకమైయున్నారు. ఆదాములో నుండి అవ్వ తీసికొనబడెను. ఏమి జరిగియున్నది? దేవుడు ఆదాము యొక్క ప్రక్కను చీల్చి అతని కొరకు సాటియైన సహాయమును తీసెను. ఆమె వధువు, కల్వరియొద్ద యేసు యొక్క ప్రక్కను దేవుడు చీల్చెను. అందులోనుండి వధువును బయటకు తీసెను, చూచారా. యేసు కల్వరియొద్ద చనిపోయెను. గుర్తుంచుకొనండి, శరీరము చనిపోవువరకు వధువు తీసికొనబడలేదు. ఆయన ముందే చనిపోయెను. వారాయన కాళ్ళు విరగగొట్టవలెనని తలంచిరి. ప్రవక్త ఇట్లనెను, "ఒక్క ఎముకయు విరుగగొట్టబడదు." వారు ఆయన ఎముకను విరుగగొట్టవలెనని సుత్తి తీసికొని వచ్చిరి. ఒక వ్యక్తి ఈటెతో ఆయన గుండెలో పొడిచెను. నీరు మరియు రక్తము కలిసి వచ్చెను. అప్పటికే ఆయన చనిపోయెను. ఆయన మరణము ద్వారా ఆమె అప్పటికే ఆ శరీరమందు విమోచన పొందెను. వధువుకు ఇక శ్రమలకాలము ఉండదు. చూచారా? ఆమె వెళ్ళిపోవును. ఆయనయందు విశ్వాసముంచి, శాఖా సంబంధమైన పద్ధతులను వేమబడి౦చిన అన్యసంఘము ఆలాగుండదు.

1JN 2:15•

1JN 3:9

 

83ఈ దీన వ్యక్తి చెప్పినది వినండి: "నా భర్త మరియు కుమారుడు ఇంకా లోక సంబంధమగు సంగతులను ప్రేమించుచున్నారు." చూడండి, వారు ఆ విమోచనను ఇంకా అంగీకరించలేదు. దానిని నీవు అంగీకరించినప్పుడు శుద్దీకరణను అప్రయత్నముగా పొందెదవు. "దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు." ఆ కోరిక యుండదు. లోక విషయముల పట్ల వాంఛ ఉండదు.

యేసు చెప్పెను, "లోకమును గాని (కాస్మస్) లోకములో ఉన్నవాటివి గాని ప్రేమించు వారిని దేవుడు ప్రేమించడు, అనగా దేవుని ప్రేమ వానిలో ఉండదు." అతడు పెండ్లికుమారుని ప్రేమించడు. చూచారా? కాబట్టి ఆమె తన శిక్షా విధిని చెల్లించవలెను. ఆమె ఆ కాలమున రక్షించబడదు; ఇప్పుడామె నిత్య మరణమునుండి రక్షించబడియున్నది; కాని ఆమె శ్రమల కాలముగుండా వెళ్ళి శుద్దీకరణ పొందవలసియున్నది. నా భావము మీరు గ్రహించారా? ఆ ప్రశ్న ఇప్పుడు పరిష్కారమయినది. ఇక్కడ మరియొక్క దానిని ఇప్పుడు చూద్దాం.

MATT 7:14

 

84"దయచేసి వివరించుము, ఎందుకనగా రాకడలో ఎత్తబడువారు చాలా కొద్దిమందిగా యుందురని చెప్పావు." అనగా ఈ భూమిమీదనున్నవారు మార్పుపొందువారు. యేసు ఇట్లు చెప్పెను, "ఆ ద్వారము ఇరుకుగాను, ఆ త్రోవ సంకుచితముగాను యున్నది, దానిని కనుగొనువారు కొందరే."

"ప్రభువునందు విశ్వాసముంచినవారు ఇపుడు నీవు బోధించుచున్న దానిని విశ్వసించనిచో వారి సంగతి ఏమిటి? దీనిని వీరు నమ్మవలసిన పనిలేదు. నేను బోధించిన విధంగా దానిని నమ్మువలసిన అవసరము లేదు, చూచారా. దానిని నమ్మువలసిన పనిలేదు. ఇది చివరి దినపు వర్తమానము. వారు రక్షించబడుదురా? అవును. వారు ప్రభువును విశ్వసించినచో రక్షించబడెదరు, చూచారా. వారు అంగీకరించక ఇట్లన్నారనుకొందము, "ఆయనే వాక్యమని నేను నమ్మను. ఇది నిజమని నేను నమ్మను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నేను నమ్మను," వారు శ్రమల కాలమునకు బయలుదేరుచున్నారని దీని వలన అర్థమగుచున్నది. వాక్యమును దాని సంపూర్ణతతో నమ్మవలెను. నేను దానిని బోధించుట కాదు. ఆ విధముగా బైబిలు చెప్పుచున్నది. ఉచితముగా దీనిని అంగీకరించవలెను, వాక్యము ముందే తీర్పు తీర్చెను.

LUKE 21:36

 

85ఒక న్యాయము తీర్చు న్యాయాధిపతి, జరిమానా చెల్లించిన వ్యక్తికి రెండోసారి తీర్పు తీర్చునా? నేను ఒక తాకట్టు కొట్టులో యుండగా నీవిట్లు నాతో చెప్పావు, "నేనతనిని విడిపించ వెళ్ళుచున్నాను. విమోచన ధనమును చెల్లించబోవుచున్నాను." (అది నేను చెల్లించవలసిన జరిమానా), నీవు నా విడుదలకు డబ్బు చెల్లించావు, కావున నన్ను మరల చెరసాలలో ఎట్లు వేయగలరు? నేను మరల నేరము చేసినచో వెళ్ళగలను. నేను మరల ఆ సంపూర్ణ వాక్యమును నిరాకరించినచో వెళ్ళెదను. మరల చెరసాలలోనికి ప్రవేశించెదను, చూచారా. మరల పోరాడి బయటకు నాకు సాధ్యమైతే రాగలను. కాని నా బదులు అతడు వచ్చి విమోచించెను. ఇక్కడ చాలామంది దానిని గ్రహించవలెనని కోరుచున్నాను… [టేపుపై ఖాలీ ఉన్నది.]

LUKE 21:36

 

86ప్రశ్న: ఇది మూడువ ఈడ్పు అని వాక్యము చెప్పుచున్నది. నీవు సంపూర్తిగా వాక్యము చెప్పుట సాధ్యమే. అందువలన ఒక వ్యక్తి పూర్తిగా, సంపూర్ణముగా పునరుద్ధరించబడును. పునరుత్థానములోనికి ఎత్తబడుటకు, మనుష్యకుమారుని ఎదుర్కొనుటకు అతడు పూర్తిగా సిద్ధమగును. ఇది సాధ్యమా లేక కాదా? నీవు సరిగ్గా దానిని చెప్పినచో సాధ్యమే. "మనుష్యకుమారుని ఎదుట వీటన్నింటినివారు తప్పించుకొందురా? - వీటన్నింటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుదురా?" (లూకా 21:36)

ఇప్పుడు, నా ప్రియ స్నేహితునికి చెప్పుచున్నాను. నీవు మంచి సంగతిని అడిగావని నేను తలంచుచున్నాను. అయ్యా! అది ఆలాగే నీవు చెప్పినట్లుండును. నీవు చెప్పినదానిని నేను మెరుగుదిద్దుచున్నాను. జనులకు అర్థమగునట్లుగా కొద్దిగ సవివరంగా చెప్పుచున్నాను. పలుకబడిన వాక్యమును, దానిని గూర్చి ఆయన చెప్పిన సంగతులను మీరెరుగుదురు. అందుకు మీలో సాక్ష్యులు, ఉడుతలు మొదలగు ఇతర విషయముల గూర్చి మీరు చూచియున్నారు. వాటిని ఆయన తన సార్వభౌమాధికారము చేత నాతో జరుగనిచ్చెను. నేనాయనను కావలెనని అడుగలేదు, ఆయనే వాటిని పలుకమని చెప్పెను. ఈ కార్యములను చేయమని చెప్పెను, అంతేగాని ఎన్నడూ ఆయనను నేనడుగలేదు. ఆయన తన స్వంత దైవచిత్తానుసారముగానే నా యొద్దకు వచ్చి, "నీవు వెళ్ళి దీనిని చేయమని చెప్పెను." ఒక విషయమును కూడా నేనాయనను అడుగలేదు. మోషే ఎన్నడూ ఐగుప్తులోనికి వెళ్ళి, ఈ కార్యములను చేయలేదు గాని, దేవుడే ఆయనను పంపి ఐగుప్తులో ఆ కార్యములను చేయించెను, చూచారా.

87పరిశుద్ధాత్మ వచ్చి ఒక దర్శనములో నాతో ఈలాగు చెప్పునని నేను విశ్వసించాను, "ఫలాని-ఫలాని వ్యక్తి యొద్దకు వెళ్ళుము, వారు ఒక ఫలాని విషయమును జయించవలెనని కోరుకొనుచున్నారు గాని ఆలాగు చేయలేకపోవుచున్నారు." వారు పొగపీల్చుచున్నారు, వారు మందు త్రాగుచున్నారు, వారు అబద్దమాడుచున్నారు, వారు దొంగిల్లుచున్నారు, వారు వ్యభిచరించుచున్నారు, ఇటువంటివి వారెన్నో చేయుచుండవచ్చును. వారికి శరీరాశలు గల ఆత్మ యుండియుండవచ్చును, నీవు అక్కడికి వారియొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుము, "వారిలో ఉన్న ఆత్మా బయటకు రమ్ము! ఈ బందీని నేను విడుదల చేయుచున్నాను." ఆలాగు జరుగునా? ఖచ్చితంగా! నిశ్చయంగా అది జరుగును. నా స్వంత ఊహ కాదు, ఊహ అనగా "అధికారము లేకుండా సాహసము చేయుట." చూచారా? ఈ వ్యక్తికి సహాయము చేయుటకు నేను వెళ్ళుచున్నాను. అది సరియగునని నేనూహించుచున్నాను. చూచారా? నాకది తెలియదు. వారికి ప్రభువు నామములో ప్రార్ధించుచున్నాను. వారికొరకు నేను ప్రార్ధించగలను. నా ఇష్టమైనది నేను చేయగలను.

JOHN 5:19

 

88ఈ ఉదయమున నా స్వంత మార్గము నాకున్నది. ఈ చక్రాల కుర్చీలో కూర్చొనియున్న ఈమెతో ఉదయం నేను మాట్లాడాను. ఈనాటి కూటమునకు ఆమె హాజరు కావలెనన్న షికాగోలోని అగ్నిమాపక విభాగం వారు ఆమెను గృహంలోనుండి బయటకు తీయవలసియుండెను; జనులు చాలా వరకు దగ్గరే ఉంటున్నా కూటములకు రారు, చూచారా.

నేనేమి చేయుదును? నాకు దానిని చేయగల అధికారమున్నది, కాని దానిని చేయమను ఆజ్ఞ కొరకు నేను ఎదురు చూడవలసియున్నాను, చూచారా. దానిని చేయుటకు దేవుని యొద్ద నుండి అధికారం నేను పొందాను; కాని ఆయన ఆజ్ఞాపించవలెను, అప్పుడామె బాగయి ఇంటికి వెళ్ళును, చూచారా. అది సత్యమని నేనెరుగుదును. నేను ఇతరులకు మేలు చేయుటకు చనిపోవుటకైనా ఇష్టపడుదును, ఏదయినా నేను చేయుదును. చూచారా? అది సత్యము.

కాని మొదట మీరు చూడండి. యేసు స్వయంగా ఇట్లని చెప్పెను, "కుమారుడు తనంతట తాను ఏమియూ చేయలేడు. తండ్రి చేయుచున్నదానిని చూచి, ఆ ప్రకారమే కుమారుడు చేయును." దానిని మనం ఎరుగుదుము. యోహాను 5:19. మంచిది. "కుమారుడు స్వయంగా ఏదియూ చేయడు, తండ్రి చేయుచున్నదానిని చూచి కుమారుడు ఆ ప్రకారము చేయును." మంచిది.

89ప్రశ్న: ఇండియానాలోని, కొరడాన్ కు సమీపములో అద్భుతము ఒకటి జరుగునని కొన్ని సంవత్సరముల క్రితం దర్శనమందు చూచావు, అది నెరవేరినదా?

దీనిని గూర్చినా పుస్తకంలో చూచాను. ఒక ప్రశ్న గురుతు ఉంచాను. ఆ దేవదారు చెట్లను గమనించవలసిన సమయము ఒకటి రానున్నది. మీరు ఆ కొండపైకి ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఒకవైపున కొరైడాన్ కు త్రోవ ఉండును, న్యూ-అల్బనీలో కొండ పైకి ఎక్కిన తరువాత ఇది ఉన్నది. ఆ దేవదారు వృక్షములను నేను గమనించవలసియున్నాను. నేను ఒక ఘోరమగు ప్రమాదమును ఎదుర్కొందును, కాని దేవుని కృపను బట్టి దానిని నేను తప్పించుకొన్నాను. ఒక పదహారేళ్ళ యువతి విస్కీ త్రాగి ఆ సీసాతో కొంత కోసికొని చనిపోయినది. ఆ సమయములో నేను అచ్చటనే యున్నాను, చూచారా. మీరు దాని గురించి మాట్లాడుచున్నారని అనుకొనుచున్నాను. దానిని నేను చదివాను.

90సహోదరుడు బీన్ బ్లాసమ్స్ యొుద్ద ఈ కూటము జరిగినది. అది అదే కావచ్చును. జార్జి కార్టర్ అదే కావచ్చును. చూచారా? అక్కడ మరియొకటి జరిగినది. అక్కడ నలుగురు లేదా అయిదుగురు ఉండిరి. నెరవేరుట తప్పు మరి దేనినీ నేను చూడలేదు. ఆ సమయములో నేను చెప్పిన దానిని ఈ వ్యక్తి చూచి వ్రాసినచో నేను దానిని చూచెదను. చూచారా? ఆ దర్శనములో నేను చెప్పినది రావలెను, ఎందుకనగా ఆ దర్శనములో జరుగనైయున్న సంగతులేమిటో నేను చూచాను. పుస్తకంలో వాటిని వ్రాశాను. అదే విధంగా జరిగినదో ఇక్కడ ఉన్నది. దానికి మించి మరేదియూ నాకు తెలిసినంతవరకూ వ్రాయలేదు.

91మరియొక సంగతి యున్నది. అది ఒమర్ ప్రయిస్ యొక్క సంభాషణ, ఆ సమయములో అతడు నన్ను ఎంతగానో విమర్శించుచుండెను. మీకు తెలియును, అతడు ఆలయమునకు వచ్చి ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందెను. ఆ విషయముపై నామీద ఎంతో గట్టిగా పోరాడెను. నేను రాత్రులందు అతనితో కూడా యున్నాను. అతనిని ప్రేమించుచునే యున్నాను, ఎప్పటివలెనె అతనితో నిలచియున్నాను; చివరకు అతడు వచ్చెను, ఎందుకనగా అతడు వచ్చునని ప్రభువు చెప్పెను, కావున ఆ మాటతో నేను నిలచి యున్నాను, చూచారా.

ఇక్కడ నా వెనుక కూర్చొనియున్న చిన్న బోధకుని విషయము కూడా అంతే. ఒకసారి అతనితో నేను మాట్లాడుటకు క్లార్క్ విల్ వెళ్ళాను. అతని కొరకు మెథడిస్టు చర్చిలో మాట్లాడాను. అతడు నాకు అర్థమైనంత వరకు గట్టి మెథడిస్టు. నేనిచ్చటికి తిరిగి వచ్చాను; ఇట్లు పలికాను, "ఒక దినమున నేనతనికి ప్రభువైన యేసు నామములో బాప్తిస్మ మిచ్చేదను." అలాగే చేశాను; అతడే సహోదరుడు నెవిల్!

92ప్రశ్న: బ్యూటి పార్లర్ నడుపుట తప్పా? నేను ఒక బ్యూటిషయన్ను మరియు క్రైస్తవులు జుట్టు కత్తిరించుకొనరాదని నేను నమ్ముచున్నాను, కాని ఇతరులకు నేను కత్తిరించుచున్నాను. (రంగు కూడా వేయుచున్నాను) రంగు వేయుచున్నాను.

ప్రియ సోదరీ, నీకేమి చెప్పవలెనో నాకు తెలియదు. వినుము, జుట్టుకు రంగు వేయు విషయములో ఆడవారికి నేను చెప్పలేను. దానికి నా దగ్గర వాక్యాధారము లేదు; వాక్యముతోనే నేను నిలచియుందును, చూచారా. ఆలాగు చేయరాదని వాక్యము చెప్పుట లేదు. ఆమెకు పొడుగైన వెండ్రుకలుండవలెనని లేఖనము చెప్పుచున్నది. దీనిని గూర్చి ఎక్కడికి వెళ్ళవలెనో నాకు తెలియుట లేదు. దాని గురించి నాకు ఏమియు తెలియదు.

93ఇక్కడ ఒక దైవసేవకున్నాడు, నాకు ప్రియ స్నేహితుడు. ఒక రోజున మేము బ్లూ బయర్ లో భోజనము చేస్తూ ముచ్చటించుకొనియున్నాము. "నా భార్య నీ ముందుకు వచ్చుటకు సిగ్గుపడుచున్నది," అన్నాడు. ఆమె చాలా భక్తిగల పరిశుద్ధ స్త్రీ, చాలా చక్కని స్త్రీ, మనుమలున్నారు. ఆమె చక్కగాను, పరిశుభ్రముగాను ఉండును. ఈమె అంటే నా భార్యకు ఎంతో అభిమానము. ఆమె చాలా చక్కని స్త్రీ, ఆమె ఇక్కడున్నదేమో నాకు తెలియదు, ఉండియుండవచ్చును. ఆమె భర్త ఇక్కడున్నాడనుకొనుచున్నాను, అతడు నాతో ఇట్లనెను, "నీ బోధ వినిన తరువాత ఆమె జుట్టును పెరుగనిచ్చినది. అది సరియని తెలిసికొన్నది, కాని ఆమె తన జుట్టుకు ఒక రకమగు రంగువేయును. ఆ రంగు మొత్తం జుట్టు ఎదిగినప్పుడు పోవును, అంతవరకు ఆమె నీ ఎదుటికి రాలేకపోవుచున్నది."

MATT 25:40

 

94ప్రియ సోదరీ, ఇట్లు వినుము. నిన్ను ఎంతో గౌరవించుచున్నాను. ఆలాగు చేయు స్త్రీలను నేను ఘనపరచుదును. కొందరు స్త్రీలు ఆలాగు కాక ఎన్నిసార్లు వినినా గాని ఆ జుట్టును కత్తిరించెదరు, లేదా నీ కాళ్ళ మీద ఉమ్మివేయుదురు మరియు గర్వముగా నడిచి వెళ్ళి పోవుదురు. వారికి మర్యాద లేదు, గుర్తుంచుకొనండి, యేసు చెప్పెను, "వీరికి మీరు చేసిరి గనుక నాకును చేసినట్లే." చూచారా? మిమ్మును నేను గౌరవించుచున్నాను, అందును బట్టి దేవుడు మిమ్ము దీవించును.

సోదరీ, జుట్టుకు రంగువేయుట గూర్చి అడిగియున్నావు, నాకు తెలియదు. లేఖనముతో దానిని నేను బలపరచలేను, కావున అది మీకే విడిచి పెట్టుచున్నాను. మీరు చూచారా? మీరాలాగు చేయగోరుచున్నయెడల నాకు మాత్రము ఏమీ అభ్యంతరము లేదు. నాకు తెలిసినంత వరకు సంఘమునకు ఆచారముగా అది లేదు. ఈ బైబిలులో లేనిదాని విషయమును మీరే చూచుకొనుడి. చూచారా? కాని నా సలహాను మీకిచ్చెదను, చూడండి, అందముగా కనబడవలెననుకొనుట స్త్రీ సహజ గుణము; ఆ విధముగానే ఆమె ఉండును.

95మీరెరుగుదురు, ప్రతి జాతిలోను అందముగా ఉండునది మగవాడు, కాని మానవ జాతిలో మాత్రమే స్త్రీ అందముగా ఉండును. పక్షిని గాని, ఆవును గాని మీరు చూడండి, కొన్ని పశువులను తీసికొనండి. ఏది అందముగా ఉండును? చిన్న కొమ్ముల ఆవా? లేక పెద్ద ఎద్దా? లేడిని తీసికొనండి. అందులో ఆడది అందమైనదా? మగది అందమైనదా? ఇంకా కొన్ని జంతువులను పరిశీలించండి. ఏది అందముగా ఉండును? మగదా? లేక ఆడదా? మీరు దేనినయినా చూడండి. పక్షులలో చూడండి. కోడి పుంజును చూడండి. కోడిపెట్టను చూడండి. పెద్ద కోడిపెట్ట అందంగా ఉండును. పొదిగే చారపెట్ట సామాన్యముగా ఉండును. చూచారా? అన్ని జాతులలోను మగవే చాలా అందముగా ఉండును, కాని మానవజాతిలో స్త్రీ అందగత్తె ఎందువలన? ఆమె పతనమునకు కారణమయ్యెను. సాతాను ఆమెను ఎన్నుకొనెను, అందము అపవాది వలన కలిగినది, చూచారా.

GEN 6:2•

1TIM 2:9

 

96సాతాను ఓ అందమైన దేవదూత. అది కేరూబులు. ఇప్పుడు ఉండిన స్త్రీలకంటె ఎంత నాజూకుగా ఉన్నారో గమనించండి. ఎందరిచ్చట పెరల్ ఓ బ్రెయిన్ గూర్చి చదివారు? మీలో కొందరు ముసలి వారెరుగుదురు, చేతులెత్తి చూపించండి. నిశ్చయంగా చూచారా? అమెరికా అంతటిలో ఆమె గొప్ప అందగత్తెగా వారు ఎంచిరి, కాని ఈనాడు వీధిలోని ఏ యువతినయినా చూడండి, ఆమెకన్న రెండు రెట్లు అందముగా యున్నారు. ఎందువలన? అది అక్షరాలా బైబిలు చెప్పెను. నరుల కుమార్తెలు చక్కనివారని దేవుని కుమారులు చూచిరి. ఆ రౌడి గుంపువల్లనే భూమి మీదికి జల ప్రళయము వచ్చెను. మొత్తం మానవ జాతిని దేవుడు నాశనము చేసెను, చూచారా. అది ఖచ్చితము. ఈనాడు ప్రతిదియు హాలివుడ్ మీదనే ఆధారపడియున్నది. అందమును చూడండి, అది హృదయమునకు చెందినది, హృదయ రహస్యము (చూచారా?) అది బాహ్య దృశ్యము కాదు. బాహ్యాలంకారములతో కాక వారు అంతరంగ ఆలంకారమును ధరించుకొనవలెను, అదే సాత్వికము, దీనత్వపు ఆత్మ. వారే క్రైస్తవులు.

సోదరీ, ఇప్పుడు నీ ప్రశ్న చూద్దాం. ఏమి చెప్పవలెనో నాకు తెలియదు.

ఇక్కడ నేను ఆపుదునా? లేక మరో ముప్పది నిమిషముల సమయం తీసికోవచ్చా? ముప్పది నిమిషములు. ఇంకో ముప్పది నిమిషములు ఎందరుండగలరు? ఆలాగయితే ఈ రాత్రి మరికొంత సమయం దొరకును. మంచిది, నేను త్వరగా చెప్పెదను.

1TIM 2:9

 

97ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, I తిమోతీ 2:9. ప్రకారము స్త్రీ జడ అల్లుకొనకూడదని భావమా? జడలల్లుకొనుట అనియేనా దాని అర్ధము?

సోదరీ, చూడుము. దాని వెంటనే ఇది వచ్చినందుకు సంతోషించుచున్నాను. నేనాలాగు అమర్చలేదు గాని, అది ఆ విధంగా వచ్చినది.

గమనించండి, ఆ దినములలో జడలల్లుకొను స్త్రీ అనగా వేశ్యకు చిహ్నము. ఆమె వీధిలో జడలల్లుకొని నిలచియుండును. పౌలు క్రైస్తవులకు చెప్పెను, "ఆ అలంకరణ కాదు. (జడ అల్లుకొనుట) అందువలన లోకస్తులవలె మీరు కనబడుదురు."

లోకములోని వారివలె మీరుండరాదు, వారివలె మీరు ప్రవర్తించరాదు! చూచారా? స్త్రీలు అక్కడ వేరుగా ఉండవలెను. ఈనాడు జడలల్లుకొనిన జుట్టు అందమని ఎంచబడుచున్నది. అది లోకపు నాజూకుతో ఏమీ సంబంధము లేనిది. ఈనాటి స్త్రీలను మీరు చూచుచున్నారు. వారి పోకడ చూడండి, మీరు జుట్టు ఏ రకమునయినా దువ్వుకొనండి గాని, లోకపు మాదిరిని అనుసరించవద్దు. చూచారా? ఆ విధంగా మీరు వస్త్రములు ధరించరాదు, వారివలె కనబడరాదు. వారు పొట్టిబట్టలు ధరించినచో, మీరు నిండుగా దుస్తులు ధరించుకొనుడి. వారు జుట్టు కత్తిరించుకొనుచున్నారు, మీరు పెండ్రుకులను ఎదగనీయండి.

98ఆ ప్రశ్నను గమనించండి. జడలు అల్లుకొనుట గూర్చి అడిగిరి. దాని భావమును అడిగెను. అవును. అది సరియే.

ఆ జడలు అల్లుకొనుట గూర్చినది ఏమిటా అని నేను చూచాను. చాలా సంవత్సరాల క్రితం ఎట్లు౦డెనో చూచాను. ఆనాటి స్త్రీలు జుట్టు వెనక్కు దువ్వుకొని ముడివేసికొనెడివారు. ఈనాడు పోనీటెయిల్ దాదాపుగా ఆ విధంగానే ఉన్నది. వారి వస్త్రములు ఆ రకంగానే యుండెడివి, కాని వీధి స్త్రీలు తమ జుట్టును జడలుగా అల్లుకొనెడివారు; ఒక విధంగా ముడివేసికొనెడివారు, పూలు అందులో ముడుచుకొనెడివారు, వీధిలోని స్త్రీలు ఆ విధంగా అలంకరణ చేసికొనెడివారు. ఆనాటి అలంకరణలు ఈనాడు కూడా మనకున్నవి, ఆలాటి దుస్తులు ఇచ్చటను ఉన్నవి. నేను ముసలివాడను, ఆ పేరు నాకు తెలియవు. నా రోజులలో వాటిని ఏమని పిలచెడివారో తెలియును. ఈనాడు వాటిని వారేమిటని పిలచుచున్నారు? నాకు తెలియదు. చిక్స్ లేదా మరేదో అని పిలచుచున్నారు. ఏ పేరుపెట్టి పిలచినా, అది వారికి ఇష్టము.

99ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నోవహు తన కుటుంబమును రక్షించుకొనెనని నీవు టేపులో చెప్పగా విన్నాను. తన కుటుంబము విషయములో ఒక తల్లి అదే రకమగు విశ్వాసము కలిగియుండవచ్చునని దాని భావమా? దానిని మనము నమ్మినయెడల కుటుంబములోని ప్రతిఒక్కరును రక్షింపబడుదురా?

దీనికి నేను ఇచ్చు జవాబును నా ధోరణిలో మీరు గమనించవలసియున్నారు. చూచారా? (నన్నిప్పుడు సరిగ్గా దానిని చూడనీయుడి.) "నోవహు తన కుటుంబమును రక్షించుకొనెనని నీ టేపులో నేను విన్నాను." ఎందువలన? వారు నమ్మినందువలననే. ఎందుకనగా వారతని వర్తమానమును విశ్వసించిరి.

"ఒక తల్లి తన కుటుంబము విషయములో కూడా ఇదే విశ్వాసమును కలిగియుండ వచ్చునా?" అవును, సోదరీ! ఒక తల్లి హృదయము పిల్లల కొరకు మొర్రపెట్టును. "దానిని మనము నమ్మినయెడల కుటుంబములోని వారందరూ రక్షించబడుదురని అర్థమా?" అవును, దానిని వారు అంగీకరించవలెను. అది నిజము.

MATT 9:21•

ACTS 16:31

 

100ఫిలిప్పీయ జైలు అధికారిని మీరు గుర్తుచేసికొనండి. నీ స్వంత రక్షణకు చాలినంత విశ్వాసము నీకున్నది. అదే విశ్వాసమును నీ కుటుంబీకుల కొరకు నీవు కలిగియుండలేవా? విశ్వాసమనగా ఏమిటి? అది ఒక అదృశ్య బలము, చూచారా. అది ఒక ఆత్మ పరిశుద్ధాత్మ విశ్వాసమును తీసికొని వచ్చును, చూచారా. అది ఒక అదృశ్య శక్తి.

రోగుల మీద నేనెందుకు చేతులుంచుచున్నాను? చూచారా? ఆ వ్యక్తిలో యున్న ఆత్మతో నేను వ్యక్తిగతముగా సంబంధము ఏర్పరచుకొందును, చూచారా. ఒకటి జరుగబోవుచున్నది. ఇక్కడ పరిశుద్ధాత్మ నిలబడియున్నది. ఆయన హృదయములోని రహస్యములను బయలుపరచును. అంత్యదినమున తానేమి చేయుదునని వాగ్దానము చేసెనో, దానినే ఆయన ఖచ్చితంగా చేయును. ప్రజలు దానిని నమ్ముచున్నారు. దానివైపు వారు చూచి ఇట్లనుచున్నారు, "దానిని నేను నమ్ముదును."

ఒకవేళ నేను మీకు మరీ సామాన్యము మారనియెడల (చూచారా?) - అది ఒక సామాన్య విషయముగా అది మారును. ఒక రోజు మీరు దానిని త్రోక్కుదురు, ఆ మరుసటి రోజు మీరు త్రోక్కుదురు, చూచారా. అది కేవలము అవకాశము తీసుకొనుట, చూచారా. అసలు మొదట దానిని నీవు నమ్ముట లేదు (చూచారా?) మీరు దానిని నమ్మిన వెంటనే ఇది జరుగును. ఆ స్త్రీ ఈలాగు చెప్పెను, "ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను తాకినచో చాలును, నేను బాగవుదును." ఆమె స్వస్థత పొందినది. చూచారా? నన్ను మరల ప్రయత్నించనీయండి అని ఆమె చెప్పలేదు, చూచారా. ఆమె దానిని నమ్మినది, చూచారా.

JUDG 14:5,6

 

101నీ కుటుంబము కొరకు కూడా నీవు ఆలాగే సంపూర్తిగా నమ్మవలెను.

ఇక్కడ చూడండి, నన్ను ఏది ఆవేశపరచినది? నా చేతిలోయున్న బలము ఏమిటి? ఇది ఖచ్చితంగా నా కండ బలము కాదు, ఇది నా ఆత్మ. నిశ్చయంగా! ఆత్మను బయటకు తీసివేయండి. కండరము ఏమి చేయును? అది మృతమగును. చూచారా? అది కుళ్ళిపోవును, కాని చూడండి. ఆత్మ బలమును ఇచ్చును.

చిన్న సమ్సోనును చూడండి. ఇక్కడ మధ్యనున్న రెండు స్తంభములవలె ఆ ద్వారములు అక్కడ నిలబడియున్నవి. ఒకప్పుడు ఆ మహా బలాఢ్యుడు సింహమును ముక్కలుగా చీల్చెను, జాక్సన్ సోదరుడా. అతని మీదికి సింహము దూకెను, కాని అతని భుజములు గొప్ప తలుపులవలె యుండినవి, అందులో ఏమీ మర్మము లేదు; కాని ఒక మర్మమేమనగా, అతడు చాలా చిన్న మనిషి, ఎందుకూ పనికిరానివానివలె కనబడెను, ఏడు చిన్నపాటి జడలు వ్రేలాడుచుండెను, మగవానివలె కూడా అతడు కనబడలేదు. కాని చూడండి, యెహోవా యొక్క ఆత్మ అతని మీదికి వచ్చెను. అంతవరకు అతడు నిస్సహాయుడుగానే యుండెను. యెహోవా యొక్క ఆత్మ అతని మీదికి రాగానే అతడు తనమీదికి ఎగిరిపడిన సింహమును ముక్కలుగా చీల్చెను. ఆ సమ్సోను కాడు; అది యొహోవా యొక్క ఆత్మ.

JUDG 15:16

 

102ఒక గాడిద యొక్క దవడ ఎముకను ఆ ఎడారిలో పడియుండగా అతడు చూచి దానిని చేతిలోనికి తీసుకొనెను, అది తెల్లగా యున్నది. ఆ ఫిలీష్తియుల శిరస్తాణములను దాదాపు ఒక అంగుళము మందముగా యుండును. గట్టి ఇత్తడితో తయారుచేయబడును. ఆ గాడిద దవడ ఎముకను తీసికొని వారి శిరస్తాణము మీద కొట్టిన యెడల ఆ ఎముక వేయి ముక్కలుగా విరుగును. మీకది తెలియును. అది ఎండిపోయిన ఎముక. కాని ఇట్లు చూడండి, అతడు తన చేతిలో ఈ గాడిద దవడ ఎముకను పట్టుకొని వేయిమంది ఫిలీష్తియులను కొట్టెను. మిగిలినవారందరూ రాళ్ళలోనికి పారిపోయి దాక్కొనిరి. "మీలో ఇంకా కొందరు మీలో నా యొద్దకు రండి," అని వారినతడు సవాలు చేసెను. ఇంకా ఆ గాడిద దవడ ఎముకను పట్టుకొనియుండెను. ఏమిటది? అతని మీదికి యెహోవా ఆత్మ దిగి వచ్చెను, చూచారా.

కాబట్టి అది ప్రభువు యొక్క ఆత్మ నీలోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు నీ స్వంత రక్షణకు విశ్వాసముంచినట్లుగానే నీ కుటుంబ రక్షణ కొరకును విశ్వాసముంచెదవు. ఈలాగు చెప్పుము, "యేసుక్రీస్తు నామములో వారిని సంపాదించుకొనుచున్నాను. దానిని పొందియున్నాను! దేవా! ఈ పనిని నీవెట్లు చేయుదువో నాకు తెలియదు, కాని దానిని నేను నమ్ముచున్నాను. ప్రభువా! దానిని నేను నమ్ముచున్నాను. నాకు అపనమ్మిక లేకుండా సహాయము చేయుము." ఆలాగు సంపాదించుకొని ఏమి జరుగునో చూడుము. అది నెరవేరును.

1COR 10:6,11

 

103ప్రశ్న: యేసు వచ్చు ముందుగా, అన్ని రకముల అద్భుతములు చేయుటకు, మృతులను లేవుటకు వధువుకు పరిశుద్ధాత్మ యొక్క పూర్తి శక్తి వచ్చునా? ఇదే 144,000 మంది యూదులకు కడవరి వర్షమా? మనము రాకడకు ఎదురుచూడవలెనా?

స్నేహితుడా, చూడుము, నేను వేదాంత పండితుడను కాను. వేదాంతజ్ఞుడను కాను; బైబిలులో నాకు తెలిసినదంతయూ ఛాయలు మరియు మాదిరిలు మూలముగానే బోధింపవలసియున్నాను. మీరు నన్ను ఒక మాదిరిలు బోధించువాడనవచ్చు. కాని ఆ గోడ మీదికి నేను చూచినప్పుడు నాకు నేను ఎన్నడును కనబడను. నా వైపు నేను చూచుకొన్నప్పుడు నా శిరస్సు, నా చెవులు, నా చేతులు కనబడును. ఆ విధంగా నన్ను నేను చూచికొనినప్పుడు నేనెట్లున్నానో నాకు కనబడును. చూచారా? అద్దములో నా ప్రతిబింబము కనబడును. నా వైపు నేను నిలబడి చూచుకొన్నప్పుడు నా స్వరూపము నాకు కనబడును.

బైబిలు కూడా ఆ విధంగానే యున్నదని నేననుకొనుచున్నాను. రోమా 26లో చెప్పెను, "ఇవన్నియు మనకు మాదిరులుగా నుండుటకు జరిగినవి." మనము వెనక్కు తిరిగి వాటిని చూడగలము. సూర్యుని చంద్రుడు ప్రతిబింబించినట్లుగానే ఉన్నది. సూర్యుడెట్లు౦డునో మనమెరుగుదుము. మనం సూర్యుని చూడలేదనుకొందము, కాని చంద్రుని చూడగలము. దానికంటె సూర్యుడు పెద్దదని చెప్పెదము. పాత నిబంధనలో ఏమి జరిగినదో మీరు చూడండి, క్రొత్త నిబంధనలో జరుగు దానికి ఇది ఒక ప్రతిబింబము.

GEN 2:17

 

104నేను నా పూర్ణ హృదయముతో నమ్ముచున్నాను… మనము కాకపోతే మరియొకరు లేచెదరు; అది జరుగవలసినదే. కాలము గతించుచున్నది; మనము అంతములో యున్నాము!

దేవుడు ఈ ప్రపంచమును ఆరువేల సంవత్సరములలో తయారు చేసెను. ఏడవ వేయి సంవత్సరమున ఆయన విశ్రాంతి తీసికొనెను. "దానిని నీవు తిను దినమున నిశ్చయముగా చనిపోయెదవు," అని ఆయన చెప్పెను. బైబిలులో ఎక్కువ కాలము బ్రదికినవాడు మెతూషెలా, 969 ఏండ్లు జీవించెను; అతడు వేయి సంవత్సరములు జీవించలేదు. కాని మనిషి వెయ్యేండ్లపాలన కాలములో వెయ్యేండ్లు జీవించును. జరిమానా చెల్లించబడినదని దీనివలన తెలియుచున్నది. మానవుడు సదాకాలము జీవించును. దినము సంపూర్తి అయినది; కాలము సమాప్తమయినది; వారు నిత్యత్వములో యున్నారు.

105రెండు లేదా మూడు వారముల క్రితం నేను బోధించిన వర్తమానము మీద చాలా ప్రశ్నలు వచ్చినవి — "పెండ్లి కుమారుడు మరియు పెండ్లికుమార్తే యొక్క భవిష్య గృహము." నిశ్చయంగా అది చాలామందిని తాకినది. నన్ను కూడా అది తాకినది. దానిని నేను చులకనగా ఎన్నడూ ఎంచలేదు.

106దీనినిప్పుడు గమనించండి, చూచారా, ఆయన అబ్రాహాము యొక్క సంతానము గూర్చి మాట్లాడెను. ఈ దినములలోనే ఒకనాడు మరల తిరిగి ఇచ్చటికి వచ్చెదను. దానిని తీసికొని మరికొంత విపులముగా చెప్పి, అబ్రాహాము యొక్క జీవితములోని ఆ యా దశలను చూపించెదను. అది ఖచ్చితంగా లూథర్, వెస్లీ, తదితరులు వచ్చిన క్రమములోనే యుండును. ఆయన అబ్రాహాముతో మాట్లాడినట్లుగానే సంఘములతో కూడా మాట్లాడెను. ఆయనెట్లు ప్రత్యక్షమయ్యెనో చూడండి. చిందించబడిన రక్తము క్రింద ఆయన నిబంధనను అతనికి స్థిరపరచెను. అది ఫిలడెల్ఫియ కాలము. అది రక్త యుగము. లూథర్ - వెస్లియను కాలము.

కాని పెంతెకోస్తు కాలమును చూడండి. అక్కడికి ఆయన వచ్చిన తరువాత ఎల్-షద్దాయిగా వాగ్ధానము చేసెను. "నా నుండి బలము పొందుము." ప్రశ్న ఇది: నీవు బలము పొందుదువా? అది పెంతెకోస్తువారి ఎదుటికి వచ్చెను, చూచారా. మీరు బలము పొందుదురా? కాని వారాలాగు చేయలేదు. వారు శాఖయొక్క రొమ్మును పట్టుకొనిరి. అందులో నుండి వారు త్రాగిరి. కాని ఆ తరువాత సంతతి, అనగా నిజ సంతానము వచ్చి ఆ రొమ్ము నుండి బలము పొందినది.

107వాగ్ధాన కుమారుని రాకకొరకు ఇన్ని సంవత్సరముల నుండి వారు ఎదురుచూచుచున్నారు. దానికి ముందుగా కనబడు చివరి సూచన ఏమిటి? దేవుడు ఒక మానవ రూపములో యుండి వెనుక ఉండిన శారా హృదయములోని ఆలోచనలను బయటపెట్టగలిగెను. (శారా సంఘమునకు సాదృశ్యము) ఆయన వెనుక గల సంఘములోని ఆలోచనలను ఆయన పరిశోధించగలిగెను. అది నిజమేనా? ఆ వెనువెంటనే, ఆమె ఒక యువతిగా మారినది, అతడు ఒక యువకునిగా మారెను. రంగము మీదికి ఇస్సాకు వచ్చెను, వాగ్ధాన కుమారుడు.

ఎత్తబడుటకు ముందుగా సంఘమునకు సంభవించు చివరి సూచనను మీరు చూచుచున్నారని నేను నమ్ముచున్నాను. ఇది నిశ్చయము. దానిని నేను నమ్ముచున్నాను. వర్షము ముగిసినది. ప్రకటనలోని మొదటి మూడు అధ్యాయములను చదవండి, సంఘమునకు ఇయ్యబడిన వాగ్ధానమును మీరు చూచెదరు. అదే సంఘము యొక్క వాగ్ధానము - సంఘ కాలములు.

ఒక రోజున బూరల గూర్చి మనము మాట్లాడుకొనుటకు ప్రారంభించియున్నాము, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పెను, "అది ఈ స్థలమునకు చెందినది కాదు." చూడండి, చూచారా?

108కడవరి వాన 144,000 యూదులా అనడిగెను. కాదు. ఏలియా మరియు మోషేలు వచ్చెదరు. అప్పుడు అద్భుతములు జరుగును. పెంతెకోస్తువారు, ప్రజలు, అద్బుతముల కొరకు చూచుచున్నారు. వారి ఆధ్వర్యములో అది జరుగును. మోషే మరియు ఏలియాలు! వారు భూమిని తమకిష్టమొచ్చిన రీతిలో శాపములతో మొత్తెదరు; వారి ప్రవచన కాలములో వర్షము రాకుండా ఆకాశములను మూయుదురు. దేవుడు వారి పక్షముగా యుండి పోరాడును. ఆ కాలములో చేసినట్లే చేయును. ఐగుప్తులో ఆయన చేసినట్లుగానే, ఒక బలమగు హస్తము క్రింద వారిని ఆయన తీసికొని వచ్చును, చూచారా, ఈ ప్రపంచ "వాదముల"ల నుండి బయటకు తెచ్చును. ఆయనది చేయును, కాని అది…

109మనము ప్రభుని రాక కొరకు ఎదురుచూడవలసియున్నాము. కనిపెట్టండి; మీ దీపములను శుభ్రము చేయండి, పూర్తిగా నూనెతో నింపండి. ప్రతి రోజూ కాదు, ప్రతి గంట కాదు గాని ప్రతి ఘడియ ప్రార్ధించండి. సిద్ధపడుడి; సిద్ధముగా ఉండండి, మధురముగా ఉండుడి మరియు కనిపెట్టుడి.

ఓ, మనము ఆ సంతోషకరమగు వెయ్యేండ్లపాలన

దినము కొరకు ఎదురు చూచుచున్నాము.

మన మధ్య ప్రభువు వచ్చును.

తన వధువును కొనిపోవును.

నేను శ్రమపడి ఎదురు చూస్తూ, ప్రార్ధించుచుండగా,

నా హృదయము అమితానందముతో నిండియున్నది.

ఎందుకనగా మన ప్రభువు తిరిగి భూమి మీదికి వచ్చును

అవును; ఈ ఘడియలో సంఘము యొక్క నిరీక్షణ అదే.

110ప్రశ్న: "యేసుక్రీస్తు నామము" బాప్తిస్మమునకు చాలునా? లేక "ప్రభువైన యేసుక్రీస్తు నామము," అని చెప్పి బాప్తిస్మమియ్యుట అవసరమా?

ఏదయినా సరే. నేను ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పెదను, చూచారా, ఎందుకనగా ఆయన మన ప్రభువని నేను నమ్ముచున్నాను. కొందరు మన సోదరులు యేసు నామములో అని బాప్తిస్మమిచ్చుచున్నారు. అక్కడ నేను బేధము చూపుచున్నాను, చూడండి, ఎందుకనగా యేసు అను పేరుగలవారు నాకు చాలామంది స్నేహితులు కలరు. మెక్సికోలో చాలామంది నాకు బోధించు స్నేహితులున్నారు, ఇటలీలో యున్నారు, వారిని యేసు అని పిలతుము. యేసు అనుట చాలదు, ఆయన రక్షకుడగు క్రీస్తుగా జన్మించెను, ఆయన రక్షకుడగు క్రీస్తుగా పుట్టెను, ఆయన అభిషిక్తుడు. ఎనిమిది దినముల తరువాత ఆయనకు యేసు అని పెరు పెట్టిరి, చూచారా. కావున ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మంచిది. ఆయన అదే అయియుండెను.

111ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఈ సమయములో నీవు వివాహము మరియు పరిత్యాగము గూర్చి మాకు ఉపదేశించుటకు ప్రభువు అనుమతి ఇచ్చునా? ప్రశ్న: ఒక వ్యక్తి ఒకామెను పెండ్లిచేసికొనెను మరియు ఆమె అతనికి విడాకులిచ్చెను, అప్పుడు మరల పెండ్లి చేసికోవచ్చునా? వారిరువురును వేరొకరిని పెండ్లి చేసికొనినయెడల ఇద్దరును వ్యభిచరించినవారగుదురా? అది సర్ప సంతానమునకు ముడిపడునని నీవు చెప్పియున్నావు. అదెట్లు?

ఇది ఇక్కడున్న ప్రశ్నలన్నింటిలోనికి చాలా గొప్ప చిక్కు ప్రశ్న, నేడు ప్రపంచములోనే ఇది గొప్ప ప్రశ్న. నా మాట వినండి, దీనికి ఒక కారణమున్నది. నేను ఈ ఆలయమునకు మరియు ఈ ఉదయాన ఈ టేపుపై నేను వివాహము మరియు పరిత్యాగము గూర్చిన సరియగు వివరణ అందించినచో అందువలన దేశములోని ప్రతి సంఘము ముక్కలయిపోవును, వారు వినినచో ఆలాగే అగును, చూచారా. అది నిజము.

112నాకు సహాయము చేయండి, నా ఎదుట బైబిలున్నది. ఆ ప్రశ్ననా ముందున్నది, యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడు! వాదించుచున్న ఇరు పక్షముల వారిది తప్పు. పెండ్లి అయిన వారిని మరల పెండ్లి చేసికొనువారు తప్పుచేయుచున్నారు. వారు చేయుచున్నది తప్పు, కాని దాని మధ్యన సత్యమున్నది, మధ్య దారి అది. నేనిది టేపు చేయగోరుచున్నాను. మీకది చూపించగోరుచున్నాను, ఎందుకనగా నాకేమయినా జరిగితే, సోదరులు దానిని సంఘములకు వినిపించెదరు. నా నిష్కృమణ తరువాత, చూచారా, దానిని గూర్చి ఒక టేపును తయారు చేయగోరుచున్నాను; కాని ప్రభువు నడిపింపు కొరకు కనిపెట్టుచున్నాను, అంతవరకు దానిగూర్చి ఏమియూ చెప్పను. కాని ఈ విషయములో తప్పక ప్రభువు నడిపింపు కొరకు ఎదురుచూచుచున్నాను. ఆయన నడిపింపు లేకుండా చెప్పినయెడల ఎక్కువ కీడే జరుగును, చూచారా.

MATT 5:32

 

113ఈ ప్రశ్నను మీరు గమనించవలెనని కోరుచున్నాను: "ఒక వ్యక్తి పెండ్లి చేసికొనిన స్త్రీ అతనికి విడాకులిచ్చిన తరువాత ఇతడు మరియొకరిని పెండ్లి చేసికొనవచ్చునా? ఇద్దరును వేరొకరని పెండ్లి చేసికొనిన యెడల, వారిద్దరూ వ్యభిచారము చేయుచున్నవారగుదురా?" నా స్నేహితుడా, నీ అభిప్రాయమును కించపరచగోరుటలేదు, కాని అది సత్యము. యేసు చెప్పెను, "విడనాడబడిన దానిని పెండ్లిచేసుకొనువాడు వ్యభిచరించుచున్నాడు." చూచారా? దానిని నేను చెప్పగోరుట లేదు, కాని ఇది సత్యము.

"ఇది సర్ప సంతానములోనికి పోవునని నీవు చెప్పియున్నావు." చూచారా? దానిని చెప్పినట్లుగా నాకు గుర్తులేదు, కాని బహుశా ఎక్కడో నేను చెప్పియందును, దానిని గూర్చి ప్రస్తావించి యుందును.

114ఒక రోజున ఆలాగే జరిగినది, అంతా కలగలుపయినది, దానిని నేను వినుట సంభవించెను, అక్కడే నేను దానిని పట్టుకొన్నాను. అది టేపు మీద ఉన్నది. దానిని బహుశా నేను విందును. నేను ఏడు బూరల గూర్చి మాట్లాడుచుంటిని. ఏడు బూరలని నేను చెప్పాను. పెంతెకోస్తు పండుగ గూర్చి నేను చెప్పాను. పెంతెకోస్తు పండుగ మొదలుకొని బూరల వరకు ఏడు సబ్బాతులున్నవి. పస్కా పండుగ మొదలుకొని పెంతెకోస్తు వరకు ఏడు సబ్బాతులున్నవి. చూచారా? ఏబది దినములు. చూచారా? కాని నేను దేనిని గూర్చి చెప్పదలంచానో చూచారా? "ఏడు సంఘ కాలములు గూర్చి."

ఆ టేపు మీద ఉండవలసినది ఏమిటో గమనించండి (మీరు దానిని వినవలెను) బూరల పండుగ తరువాత ఏడవ నెల వచ్చును. అదే ఏడు సంఘ కాలముల కాలము - ఏడు నెలలు, ఏడు సబ్బాతులు కాదు. అక్కడ దానిని నేను వివరించియున్నాను. ఏడు సబ్బాతులని నేనన్నాను. ఇంకా ముందుకు కూడా అదే ఆలోచనను నేను కొనిపోయాను. పస్కా పండుగ తరువాత అది ఏడవ నెల - లేదా పెంతెకోస్తు పండుగ. పనలను తెచ్చి అల్లాడించెదరు. ఆ కాలము తరువాత వెన్నులు రొట్టెలుగా మారునని చెప్పిన సంగతి మీకు గుర్తుండియుండును. చూచారా? ఒకే వెన్ను ఒకే రొట్టెగా మారును. ఓ, అది గొప్ప బోధ. దాని అంచును కూడ నేను తాకలేదు, కాని మీరు టేపుమీద దానిని వినుట జరిగినచో దీనిని గుర్తుంచుకొని బైబిలును చూడండి. దాని తరువాత ఏడు నెలలు వచ్చును. ఏడు నెలలు లెక్కించండి. జనవరి, ఫ్రిబవరి, మార్చి, ఏప్రిలు, మే, జూన్, జూలై - జూలై నెల. ఏడు నెలలు పూర్తిగా ఏడు సంఘ కాలములను చూపించుచున్నవి. సేవకులు కొందరు దీనిని గమనించవచ్చును, మీరు గ్రహించవలసియున్నారు. అక్కడ మీరు చూచారా? మంచిది.

115ఇక్కడ చూడండి. నేనిది చెప్పుచున్నాను, ప్రభువు కాదు, నన్ను చేపనివ్వండి. ఈ సమయములో మీరు పెండ్లియైనవారయితే, మీరిద్దరూ రక్షింపబడినట్లయితే, పరిశుద్ధాత్మతో మీరు నింపబడినవారయితే, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీకు చిన్న పిల్లలున్నారు (ఇప్పుడు, ఇది నా మాట, ప్రభువు చెప్పినది కాదు, చూచారా), మీరు కలిసి జీవించుడి; సంతోషంగా ఉండుడి; ఎందుకనగా నీవు నీ మొదటి భార్యతో జీవించలేకపోయిన యెడల మరొకరిని పెండ్లిచేసికొనరాదు. నీవు ఒకరిని విడిచి పెట్టి మరియొకరి దగ్గరకు వెళ్ళుట చాలా ఘోర కృత్యము, మొదటి కంటె మీ స్థితి ఇంకా అధ్వాన్నముగా ఉండును, చూచారా. మీరు గలిబిలితో నిండియున్నారు; కాని దీనినుండి బయటకు వచ్చు మార్గము లేదు. ఒకే ఒక మార్గము నిజంగా యున్నదని బైబిలునుండి నేను తీసి చెప్పగలను: మీరు విడిపోయినట్లయితే ఇద్దరూ ఒంటరిగానే జీవించవలెను, చూచారా.

ఇప్పుడు అది ఒక్కటే నేను చెప్పగలను, కాని మరో సంగతి కూడా యున్నది, దానినిప్పుడు చెప్పలేను. ఆ కారణము చేతనే ప్రభువే గాని నేను ముందుకు కొనసాగించలేనని చెప్పుచున్నాను. ఒక దినమున నేను దీనిపైన టేపు తయారుచేయుట జరిగితే, నేను చెప్పిన విధానమును గుర్తుంచుకొనండి. మీరు బుద్ధిగలవారయితే దానిని గ్రహించెదరు (చూచారా?), నేనెట్లు చెప్పానో దానిని మీరు గ్రహించగలరు.

116ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీతో సమ్మతించకపోయిన ఇతర సంఘముల యొద్దకు మేము వెళ్ళవలెనా?

నిశ్చయంగా! తనతో సమ్మతించకపోయినా యేసు ఆలాగే చేసెను. ముందుకు సాగిపోండి. నీతో సమ్మతించని ఇతర సంఘములకు మేము వెళ్ళవచ్చునా అని ప్రశ్నించాను. నిశ్చయంగా! సముద్ర తీరమున ఉన్న ఒక్క గులకరాయిని నేనే కాదు. అన్నిచోట్ల దైవజనులున్నారు. వారిలో నేను ఒకరిని. చూచారా?

ఒక రోజున నన్ను ఒకరు పిలచిరి. అరిజోనాలోని ఒక గుంపు నన్ను పిలచెను, చూచారా. అది ఒక సేవక బృందము. వారు నాతో ఇట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా, ఒక్క విషయంలోనే మేము నీతో విభేదించుచున్నాము (ఒక సంగతి) నీ యొద్దకు వచ్చు జనులు మరే ఇతర సంఘములకు రారు. వారికి పిల్లలున్నాగాని ఆ సంఘమునకు రారు, వారిని మా సంఘమునకు రమ్మని ఆహ్వానించుచున్నాము.

117వారు మీ మీద ఒత్తిడిచేయుచూ, వారిలో చేరమనుచున్నారని నాకు తెలియును, అయితే మీరందులో చేరనవసరము లేదు; కాని మీ పిల్లలను ఏదో ఒక ఆదివారపు పాఠశాలకు పంపించండి. మీరు సంఘమునకు వెళ్ళండి; ఇంట్లో కూర్చొనవద్దు, ఆదివారము నాడు చేపలవేటకు గాని, మామూలు వేటకు గాని, అటువంటి మరి ఏ పనులకు గాని వెళ్ళరాదు.

"మంచిది, నేను లీగలిస్ట్ ని కాను," అని నీవందువు.

క్రీస్తు యొక్క పునరుత్థానమును అగౌరవించేకన్నా, కొద్దిసేపు ఆ విధంగానే ఉండుట మంచిది. ఎక్కడో చోట ఒక ఆలయమునకు వెళ్ళుము!

నేను ఏ ఆలయమునకు వెళ్ళినా గాని నేను నమ్ము ఒక సంగతిని వారు తప్పకుండా చెప్పెదరు. యేసే దేవుడని చెప్పెదరు. ఆయన దేవుడు కుమారుడని చెప్పెదరు. (నాకదే సందేహము), అయినా గాని దానిని నేను విందును. ఒక సంఘము బాప్టిస్టువలె ఉండును. ఇది ఇంకో దానివలె ఉండవచ్చును. "మీరు ఒక అనుభవమును పొందవలసియున్నారని నేను నమ్ముచున్నాను," అని కొందరనవచ్చు. వారితో నేనందును. యేసు దేవుని కుమారుడని నేను నమ్ముదును; నీవొక అనుభవమును పొందవలసియున్నావని నమ్ముదును. అది మంచిదే.

అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారున్నారు. నేను వారితో కలిసి మూడు లేదా నాలుగు రొట్టె ముక్కలు తినగలను (చూచారా?) వారది నమ్ము గలరు…

118ఇదే వ్యక్తి ఒక రోజున నన్ను పిలచి దానిని గూర్చి తెలిసికొనగోరెను. (ఆ సోదరుడు ఆ విషయము గూర్చి చర్చించగోరెను. చాలా అయోమయ స్థితిలో యుండెను.) అతడిట్లు పలికెను, "బ్రెన్హాం సోదరుడా, చూచారా, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారు నీకు విరోధులు." ఆ సంస్థకు చెందిన ఒక సేవకుడు ఆ టేపును వినినచో నేను వారికి గాని, మరెవరికి గాని విరోధముగా మాట్లాడలేదని గ్రహించగలరు. క్రీస్తునందు నేను కనిన పిల్లలలో మిలియనుకు మూడువంతుల మందిని మీ యొద్దకే పంపినట్లు మీ స్వంత ప్రధానాధిపతులే ఒప్పుకొనిరి. కావున అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ కు నేనెట్లు విరోధిని కాగలను? ఏకత్వము వారికి నేనెందుకు వ్యతిరేకిని? ఏకత్వము వారికి నేను విరోధిని కాను. అసెంబ్లీస్ ఆఫ్-గాడ్-వారికి గాని, చర్చి-ఆఫ్-గాడ్ వారికి గాని, మరెవరికి గాని నేను విరోధుడను కాను! మానవుని వేరు చేయు ప్రతి క్రమమునకు నేను విరోధిని.

119చూడండి, మిలియనులో మూడు వంతుల వారిని నేను అసెంబ్లీస్ సంస్థలకు పంపినట్లు స్వయంగా వారి ప్రధాన కార్యాలయము వారే ఒప్పుకొని లెక్క చెప్పిరి. వారు నా స్వంత పిల్లలు. వారిది చెడ్డ గుంపయితే నేనెందుకు పంపించెదను? ఎందువలన? దేశములో ఉన్నవాటిలో అదే బహు మంచిదని తలంచుచున్నాను. ఏకత్వపు విశ్వాసము గలవారి యొద్దకో లేదా పెంతెకోస్తు విశ్వాసముగలవారి యొద్దకో పంపియుందును గదా? ఎందుకనగా వారు దైవిక స్వస్థతను నమ్ముదురు. సహజాతీతమగు వాటిని వారు నమ్ముదురు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వారు నమ్ముదురు. వారందరినీ ఇక్కడికి నేను తీసికొనిరాలేను. వారు ప్రపంచమంతా చెదరియున్నారు. ప్రపంచమంతటా నాకు స్నేహితులున్నారు. క్రీస్తులో వారిని నేను కనియున్నాను. నేను వేదిక పిలుపు ఇచ్చునప్పుడు మీరు విన్నారా? వారు రక్షింపబడిన పిదపనేనిట్లు అందును, "ఇప్పుడు మీరు మంచి సంపూర్ణ సువార్త సంఘమునకు వెళ్ళండి. దానిని మీ గృహాలయముగా చేసికొనండి." దానిని నేను చెప్పుగా ఎందరు మీరు విన్నారు? నిశ్చయంగా నిజము. ఎందుకు వారిని అచ్చటకు నేను పంపుచున్నాను? నా స్వంత పిల్లలను మరణమునకు అప్పగించు వేషధారినా నేను? అది నాకు దూరమగు గాక! లేదయ్యా!

120మీరు ఈ ఆలయమునకు రాలేనియెడల ఎక్కడో చోట ఒక ఆలయమునకు వెళ్ళండి. వారు చేయువన్నీ మీరు చేయనవసరము లేదు. వారు రొట్టెలో కొంత భాగమును మీకు వడ్డించెదరు. దానిని తినండి. అందులో వెల్లుల్లిపాయ ఉన్నదని చెప్పి తినకుందురా? చూడండి. ఇది నిజము. వారిని నేనాలాగు చేయలేను గాని ఆలయమునకు వెళ్ళమని చెప్పెదను. తప్పకుండా మీరు ఆలయమునకు వెళ్ళవలెను. సంఘ తలుపులు ఎక్కడ తెరచియుంటే అక్కడికి పనికట్టుకొని వెళ్ళండి. వారు నమ్ముకపోతే నీకనవసరము. నీవు వారిలో పాలు పొందనవసరము లేదు. వారిలో చేరరాదు. వారి ఏ సంఘములలోనూ చేరవద్దు, కాని వారియొద్దకు వెళ్ళుడి. వారితో సహవాసము చేయుడి. అది ప్రభువునకు చెందినది కాదని నీకెట్లు తెలియును? సమస్తము మేలు జరుగుటకే సమకూడి జరుగునని ఆయన చెప్పెను. బహుశా అక్కడ రక్షించబడవలసిన ఒక ఆత్మ ఉండి యుండవచ్చును, వారికి నీ వెలుగును ప్రసరించవచ్చును. చూచారా? అక్కడికి వెళ్ళండి. వారికి విరోధముగా మాట్లాడరాదు, మాధుర్యముగా ఉండవలెను. చూచారా? వారు మిమ్ముల్ని చూచి, "వారు ఎంత మంచి క్రైస్తవులో చూడండి. వారు నిజంగా క్రైస్తవులవలె ప్రవర్తించుచున్నారు," అని చెప్పుకొనవలెను. చూచారా? "ఏమిటది అని వారడుగుదురు?"

అప్పుడు వారికి మీరు చెప్పండి. మీరు ఉప్పువలె యుండండి, వారు దాహము గొందురు.

MARK 16:17•

GAL 5:22

 

121ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా; పరిశుద్ధాత్మను పొందిన వారందరి వలన తప్పక సూచక క్రియలు కనబడవలెనా?

అలాగని యేసు చెప్పెను, మార్కు 16.

ప్రశ్న: అలాగయితే వూర్ణ హృదయముతో వర్తమానమును నమ్ముచున్నాగాని సూచక క్రియలను కనబరచలేని వారి మాట ఏమిటి? వారు ఆవిశ్వాసులా? లేక వారికి పరిశుద్ధాత్మ అవసరమా? అలాగయితే నేడు మాకు ఉపదేశించుము. పరిశుద్ధాత్మను ఎట్లు పొందవలెనో చెప్పుము. మా దినమునకు, సోదరుడా, నీవే దేవుని బూరవని మేము నమ్ముచున్నాము.

నన్ను నీ సోదరునిగా ఎంచుకొన్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాను, సోదరుడా. అది చాలా మంచి ప్రశ్న అని తలంచుచున్నాను. స్నేహితులారా, అది చాలా వింతగా ఉండవచ్చు. ఈ విషయమును నేను కొద్దిగా వివరముగా చెప్పగోరుచున్నాను. చూచారా? అది అవసరము. అనుభవము లేకుండా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మీరు పొందలేరని నేనెరుగుదును. ప్రతి మాటను మీరు నమ్ముచున్నారు. ప్రతి మాటను మీరు నమ్ముచున్నారని మీరందురు. అప్పుడు వాక్యము అక్కడ యుండి పరిశుద్ధాత్మ వచ్చి పనిచేయించవలెనని ఎదురుచూచును; కాని దీపమును వెలిగించుట అవసరము.

వత్తితోయున్న దీపం ఇచ్చటున్నది, ఆ దీపములో చమురున్నది, ఉండవలసినవన్నీ దానికున్నవి; కాని అగ్ని వచ్చు వరకు అది ఎట్టి వెలుగును ప్రసరింపచేయదు. ఆ దీపం ఎంత పరిపూర్ణముగా ఉన్నా లాభం లేదు. అది చాలా వెలుగునియ్యగల స్థితిలో యుండ వచ్చును, కాని దానిని వెలిగించనంత వరకు ప్రయోజనం శూన్యము. నీవు నమ్మియుండవచ్చు, పరిశుద్ధాత్మ గూర్చి చాలా నేర్చుకొనియుండవచ్చు; కాని ఆ దీపమును ఆత్మ వెలిగించినప్పుడే అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము అను ఫలములు కనబడును. అగ్నితో కూడిన అనుభవమును పరిశుద్ధాత్మ ఇచ్చును. ఆ దీపమును పరిశుద్ధాత్మ వెలిగించును. ఆలాగు లేకున్నచో నీవు పరిశుద్ధాత్మనే పొందలేదు. చూచారా? పరిశుద్ధాత్మను కలిగియున్న అనుభవమును నీవు పొందియుండవలెను.

122ప్రశ్న: నేను ఒక లేబర్ యూనియన్ కు చెందియున్నాను. ఇది క్రైస్తవునికి తప్పా? ప్రమాణము చేయరాదని శాస్త్రము చెప్పుచున్నది గదా? లేబర్ యూనియన్ యొక్క రాజ్యాంగమును గౌరవించుదునని నేను ప్రమాణము చేయుట తప్పనిసరి. నేను క్రైస్తవుడనయిన నాటి నుండి క్రియాశీలక కార్యక్రమములలో పాలు పొందుట లేదు, అయినా గాని నా బాధ్యతలను ఇంకా నేను నిర్వహించుచున్నాను.

123యూదా ఇస్కరియోతు యొక్క పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో నుండి తుడిచివేయబడినదా? లేదా అది గొర్రెపిల్ల జీవగ్రంథములో యున్నదా?

మంచిది. లేబర్ యూనియన్ కు చెందియుండుట గూర్చి అడిగిరి. మీరు పనిచేయుచున్న చోట లేబర్ యూనియన్లున్నవని నేనెరుగుదును. మీరు పనిచేయవలెనన్న వాటిలో చేరుట తప్పనిసరి. మీరు చేరవలెను. కాని దానిని గమనించండి (చూచారా?) ఏదో ఒక దినమున అది శ్రామికుల నుండి మతములోనికి వచ్చును, చూచారా. మీరు గుర్తుంచుకొనండి, అన్నియూ ఐక్యతా రూపము ధరించుటకు ఇది నాంది. మీరు పనిచేయలేరు; వారు మీకు పని ఇయ్యరు; మీరు యూనియన్ కు చెందనియెడల, ఎందుకూ పనికిరానివారగుదురు.

యువకులారా, సహోదరుడు బ్రెన్హాం చెప్పుచున్నదానిని మీరు గుర్తుంచుకొనండి. నా మాటలు ఇనుపరేకు మీద ఉక్కు కలముతో చెక్కబడవలెనని కోరుచున్నాను! యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మతములో కూడా అదే విధంగా జరుగును. మీరు ఏదో ఒక రకమగు శాఖలో చేరియుండవలెను, లేనిచో మీరు కొనలేరు, అమ్మలేరు. కావున చాలా జాగ్రత్తగా యుండండి, సోదరుడా. అది కేవలం శ్రామికులకే అయితే మంచిదే. దానిని గమనించండి; అది ఒక హెచ్చరిక!

MATT 10:1•

LUKE 10:18-20•

REV 20:12

 

124"యూదా ఇస్కరియోతు యొక్క పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో యున్నదా, లేక తుడిచివేయబడినదా?" అని అడిగిరి. అవును, అది దానిలో యుండెను, తుడిచివేయబడెను. చూచారా? మత్తయి 10వ అధ్యాయము చూడండి, యేసు తన మిగతా శిష్యులతో పాటు యూదాను పిలచెను. అపవిత్రాత్మల మీద వారికి అధికారమను అనుగ్రహించెను. వారు దయ్యములను వెళ్ళగొట్టిరి. "సాతాను ఆకాశము నుండి పడుటయు చూచితిని," అని యేసు చెప్పెను. అది నిజమేనా? ఆ శిష్యులందరు ఎంతో సంతోషముతో తిరిగి వచ్చిరి. ఆయనిట్లు చెప్పెను, "దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపవద్దు, కాని మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడియున్నవని చెప్పి సంతోషించుడి." చూచారా? అది నిజము. యూదా అప్పుడు వారితోనే యుండెను! చూచారా?

తీర్పును గుర్తుచేసికొనండి, తీర్పు సింహాసనమును గుర్తుచేసికొనండి, "తీర్పు ఆయుత్తమైనది; గ్రంథములు తెరువబడినవి; మరియొక గ్రంథమును విప్పబడెను, అదే జీవగ్రంథము, మరియు ప్రతి మనుష్యుడు ఆ ప్రకారముగా తీర్పు పొందెను."

1COR 6:2•

REV 20:6

 

125కొద్దిసేపటి క్రితం మీరడిగిన ప్రశ్నకు చెప్పుచున్నాను. చూచారా? తీర్పు సింహాసనము నొద్ద జరుగు సంగతి ఇది. యేసు, సంఘము, వధువు ఎత్తబడెను, మహిమలోనికి వెళ్ళెను. అక్కడ పెండ్లి అయినది, భూమి మీదికి తిరిగి వచ్చిరి, వెయ్యి సంవత్సరములు జీవించిరి. వేయి సంవత్సరముల అంతమందు సాతాను చెరసాలలో నుండి విడుదల పొందెను, దేవదూత ద్వారా ఒక గొలుసు చేత బంధింపబడెను, కర్ర గొలుసు కాదు, పరిస్థితి అను ఒక గొలుసు; వాని అనుచరులందరూ పాతాళములో యుండిరి. భూమిమీద ఉండి పునరుత్థానము పొందినవారు యేసుతో కూడా ఉండిరి, వారు విమోచించబడినవారు. తాను ఏమియు చేయలేడు; కాని వెయ్యేండ్లపాలనంతమందు రెండవ పునరుత్థానము వచ్చును… "మొదటి పునరుత్థానములో పాలు పొందువాడు ధన్యుడు మరియు పరిశుద్దుడు, వానిమీద రెండవ మరణమునకు అధికారము లేదు."

ఇప్పుడు గమనించండి, ఈ రెండవ పునరుత్థానములో వారు వచ్చెదరు, కొంతకాలము మట్టుకు సాతానును చెరసాలలోనుండి విడిచిపెట్టెదరు; అప్పుడు తీర్పు జరుగును. చూడండి, యేసు వధువుతో రాజుగాను రాణిగాను ఉండును, సింహాసనము నొద్ద, ధవళ సింహాసనపు తీర్పు; గ్రంథములు విప్పబడినవి, పాపుల గ్రంథములు. మరియొక గ్రంథము విప్పబడెను, అది జీవగ్రంథము; వధువు ద్వారా ప్రతివానికిని తీర్పు తీర్చబడెను. (ఈ చిన్న విషయములను చట్టము ముందుకు తీసికొని వెళ్ళుట) - "పరిశుద్దులు భూమికి తీర్పు తీర్పుదురని ఎరుగరా?" చూచారా? మంచిది.

126ప్రశ్న: ప్రకటన 20:4లోనున్న గుంపు ఎవరో దయచేసి వివరించుము? వారు గతములోని వధువు యొక్క భాగమైయున్నరా? లేక భవిష్యత్తులోని వారా?

వారు సంపూర్ణ వధువు, భూత, భవిష్యత్తు కాలములలోని వారు. వారు సంపూర్ణ వధువుగా నున్నారు, ఎందుకనగా వారు వెయ్యేండ్ల పాలనలో జీవించుచున్నారు. మంచిది.

REV 20:4

 

127ప్రశ్న: (ఇది కూడా సరిగ్గా అదే ప్రశ్న) ప్రకటన 20:4. మృగమునకు మొక్కకయు, దాని ముద్ర వేసికొనకయు ఉండుట వలన, క్రీస్తుకు సాక్షులుగా నిలబడినందున హతులైన వారి ఆత్మలేనా? (దీనిని ఇప్పుడే నాకు ఇచ్చిరి.) వారు క్రీస్తుతో కూడా వెయ్యేండ్లు జీవించి ఏలిరని యున్నది. కావున ఇది ఆశ్చర్యముగా యున్నది, ఎందుకనగా వధువు హింసింపబడినది, వారెవరైయున్నారు? వారు క్రీస్తుతో కూడా వెయ్యేండ్లు ఏలియున్నారు. వారు 144,000 మంది. అయి యున్నారా?

కాదు, కారు! వారు వధువు. ఇప్పుడు గుర్తుంచుకొనండి.

వారు మృగమునకు నమస్కరింపక క్రీస్తుకు సాక్ష్యులుగా నిలబడియున్నందున హతులయిరని చెప్పబడినది. నిశ్చయంగా! "మృగము ఇంకా రావలసియున్నది గదా అని మీరందురు."

మృగము అన్ని కాలములలోను ఉన్నది; ఆ మృగమే ఆ వెనుకటి వారిని సింహముల గుహలలో తినివేసినది, రోమ్ పందెపు రంగములందు వారిని భక్షించినది. అదే క్రీస్తువిరోధి; అక్కడ మృగము ఉండి ఒక రకమగు మతమును రూపొందించినది. దాదాపుగా అది ఒక మాదిరి. రోమను సంఘమును బైబిలులోనే చూచెదము. వారు సంస్థగా దానిని చేసిరి. ఒక సంస్థను తయారుచేసిరి. దానిలోనుండి ఒక విశ్వవ్యాప్త సంఘమును తయారు చేసిరి. దానికి నమస్కరింపని వారందరూ నాశనము చేయబడుదురు, చూచారా. అదే జరిగెను.

వారు శరీరములో భాగమైయున్నారు. ఒక చెట్టువలె శరీరము ఎదిగినది, చివరకు తల యొద్దకు వచ్చియున్నది, చూచారా. హతసాక్ష్యులున్నారు, హింస పొందినవారున్నారు, మొదలగువారు…

అయితే నదికి ఈవలనున్న మనకు యేసు శాంతిని ఇచ్చెను, దరికి రాని గోత్రముల వారికి చేసినట్లుగానే చేసెను. (చూచారా?)

GEN 4:1•

EXOD 2:12•

EPH 6:2

 

128ప్రశ్న: అతని కొరకు నేనేమి చేయవలెను? నేను తండ్రికి వ్యవసాయములో సహాయము చేయుట కొనసాగించవలెనా? జీవనోపాధికి ఏమి చేయవలెను? అతడు తన పేరును వ్రాసెను.

అవును, సోదరుడా! "అతని కొరకు నేనేమి చేయవలనని వ్రాసియున్నావు," ఆలాగే ప్రారంబించావు,

బహుశా ఒక కుమారుడు తండ్రికి ఎట్లు సహాయపడవలెనని అడిగినట్లున్నది, నా ప్రియ సోదరుడా చూడుము, నీ తండ్రిని గూర్చి నీవు శ్రద్ధవహించినప్పుడు నీవు ధన్యుడవగుదువు, ఎందుకనగా నీకు నీవు ఏమీ శ్రద్ధవహించలేని సమయములో ఉన్నప్పుడు అతడు నీ గూర్చి శ్రద్ధవహించెను. వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞను చూడుము, ఆజ్ఞకు వాగ్ధానమున్నది: "ప్రభువైన దేవుడు నీకిచ్చుచున్న భూమిమీద నీవు దీర్గాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము." చూచారా నీకు చేతనయిన రీతిగా నీ తండ్రికి సహాయము చేయుము. అది గొప్ప పద్ధతి.

129ప్రశ్న: కయీను సర్పసంతానముతో ఒకడని నీవు చెప్పియున్నావు. "నేను యెహోవా వలన ఒకనిని సంపాదించుకొన్నానని అవ్వ ఎందుకు పలికినది?"

చూడండి. భోజనము చేసి వచ్చిన తరువాత దీనిని చూడవలెనని కోరుచున్నాను. ఆ తరువాత చెప్పితే బాగుండును. దానిని వివరించుటకు చాలా సమయము కావలెను. సరే.

ISA 2:2

 

130ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడు: యెషయా 2:2ను దయచేసి వివరించుము: "అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడును. జనములందరూ అందులోనికి ప్రవాహముగా వచ్చెదరు."

గత ఆదివారము దానిని నేను చెప్పియున్నాను. చూచారా? పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడును. దేశముల వారందరూ అందులోనికి ప్రవాహమువలె వచ్చెదరు. పెండ్లికుమారుడు మరియు పెండ్లికుమార్తె యొక్క భవిష్య గృహము, అను వర్తమాన టేపును వినండి. అది మీకు చక్కగా వివరించును.

ఓ, మై! ఇక ఆపుట మంచిది, ఎందుకనగా చాలా యున్నవి. వీటిని పూర్తిచేయలేము.

131ప్రశ్న: (దీనిని చూద్దాం) బ్రెన్హాం సోదరుడా, నీ వర్తమానమును వెంబడించు అనేకులు, నీవే ఈ దినపు మెస్సియావని సామాన్యముగా నమ్ముచున్నారు. అది నిజమేనా?

కాదండి!

ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మాకు తేటగా చెప్పుము, నిన్ను నీవు తెలియపరచుటకు సందేహించుచున్నట్లు కనపించుచున్నది. దేవుడు నీకు ఎటువంటి పరిచర్యను ఇచ్చెనో మాకు తెలియును, వాక్యములో ఎక్కడో ఒక చోట నీవు గుర్తించబడ వలసియున్నావు.

COL 2:9

 

132ప్రశ్న: నెంబర్ 2: మొదటిసారి ఆరిజోనాకు వెళ్ళుటలో నీకున్న ఉద్దేశ్యమును మాకు చెపితివి. ఎందుకో ఏమి జరుగునో చెప్పియున్నావు, అయితే నీవెందుకు తిరిగి వచ్చావో మాకు చెప్పలేదు.

మొదటిగా నేను మెస్సీయాను కానని గ్రహించండి! చూచారా? మెస్సీయా అనగా యేసుక్రీస్తు, అయితే మనము ప్రతి ఒక్కరము "మెస్సీయా వారము." మెస్సీయా అనగా "అభిషిక్తుడని" అర్థము. శరీరరీత్యా దైవత్వము యొక్క సంపూర్ణత మొత్తం ఆయనలో నివసించెను. నాలో ఆయన ఆత్మ యొక్క భాగము నివసించుచున్నది. మీలోను ఆలాగే నివసించుచున్నది. చిన్న సంగతులు తెలిసికొను జ్ఞానము, ముందుగా సంగతిని చెప్పగల శక్తి ఒక వరముగా నాకియ్యబడినది. అయినా గాని నేనింకా మీ సోదరుడనే, చూచారా. నేను మెస్సీయాను కాను; నేను మీ సోదరుడను, చూచారా, మందను కాయు కాపరిని. నేను మెస్సీయానని చెప్పుకొనినచో అబద్ధికుడనగుదును, చూచారా, నేను అబద్ధికునిగా ఉండగోరుట లేదు.

మొదటిసారి నేను ఆరిజోనాకు ఎందుకు వెళ్ళానో మీరు అర్థము చేసికొనిరి. ప్రభువు నామము పేరిట నేను వెళ్ళాను. ఒక దర్శనము ద్వారా నేను పంపబడితిని. ఒక ఉద్దేశ్యముతోనే రెండవసారి తిరిగి వచ్చాను. అది ఆలాగుంచండి. ఎందుకొరకు వెళ్ళానో నేనెరుగుదును; అన్నియూ చెప్పలేను. అపవాది నా హృదయములో నుండి దానిని తీసివేయజాలదు. నేను బయటకు చెప్పినయెడల, వాడు ఏదో చేయగలడు, కాని అది నా హృదయములో ఉండగా వాడేమియూ చేయలేడు. అది నెరవేరువరకు ఆగి చూడుడి, అని నేనందును. గుర్తుంచుకొనండి, ఈ టేపును వినండి; ఒక ఉద్దేశ్యముతోనే ఆరిజోనాకు నేను వెళ్ళాను. దయతో నాకు సహకరించండి. చూచారా? నేను మీతో చేయమని చెప్పిన దానినే చేయుడి, చూచారా; నేను చేయమన్న రీతిగానే చేయండి, చూచారా.

133ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగవలెను. జనులను అన్నీ అమ్ముకొమ్మని నీవు చెప్పినట్లు నేను విన్నాను. (దీనిని నేను విడిచిపెట్టుట మంచిది. చూద్దాం. ముగించవలసిన సమయమయినది. భోజనమైన పిదప దీనిని చూద్దాం. దీనికి నేను జవాబిచ్చెదను. నాకు తెలియదు; దీనిని నాకిచ్చిరి, చూచారా. నేను ఆ తలుపునొద్ద ఉండగా బిల్లీ కొన్ని తెచ్చినాకిచ్చెను. చూచారా?) ప్రజలు తమ గృహములను, సమస్తమును అమ్ముకొని నీతో పాటు ఆరిజోనాకు రావలెనని నీవు చెప్పినట్లుగా జనులు మాట్లాడుకొనుట విన్నాను. ఆలాగు లేనియెడల ఎత్తబడరని చెప్పితివనుచున్నారు. అది నిజమేనా?

అది ఒక అబద్ధము!

ప్రశ్న: …లేక మేము మా గృహములను అమ్ముకొని రావలెనా? లేక మీరు ఇట్లు చెప్పారా?

134అమ్ముకోవద్దు! ఆలాగని నేను చెప్పలేదు, ఆలాగు చేయరాదని నేను చెప్పాను. నేను వెళ్ళిన ఆ సమయములో జూనీ జాక్సన్ కు వచ్చిన కలను గుర్తుచేసుకొనండి. జూనీ కలగనెను. ఎందరికి ఆ కల గుర్తున్నది? ప్రభువు దాని భావము చెప్పెను. ఒక గొప్ప పర్వతము మీద మేము నిలబడియున్నాము. అక్కడ చెరిగిపోవుచున్న పాత అక్షరములున్నవి. దానికి నేను భావము చెప్ప ప్రయత్నించుచుంటిని, కాని నా చేత కాలేదు. వారికి దాని భావమును నేను చెప్పుచున్నాను. అదంతయూ వివరించిన తరువాత ఒక విధమగు దండము వంటి దానియొద్దకు వెళ్ళాను. (అతని కల ఇప్పుడు చూడండి) ఆ పర్వతపు శిఖరమును కోసి చూచాము. అది హిమములో తెల్లగా, చలువరాయివలె యున్నది. దానిమీద వ్రాత లేదు. వారితో నేనిట్లు చెప్పాను, "నేను అవతలకు వెళ్ళుదును, మీరంతా ఇక్కడే యుండి దీనిని చూడండి."

135జూనీ, ఇంకా సోదరులందరూ పైకి ఎక్కి దానివైపు చూచుచుండిరి. వారికి అర్థమగుట లేదు. "మీకేమి తెలియును? ఇక్కడ అది వ్రాయబడలేదు, కాని అతడు దానికి బయట ఏదో చదువుచున్నాడు. ఎందువలన ఇక్కడ వ్రాయబడలేదు? మనకు అర్ధము కాదు."

జూనియర్ అటు ఇటు తిరిగి చూచెను, నేను పశ్చిమానికి, సూర్యాస్తమయము వైపు వెళ్ళుట అతడు చూచెను. చాలా వేగంగా ఒక్కొక్క కొండను దాటుకొంటూ వెళ్ళిపోవుచున్నాను. వారు నేను వెళ్ళిపోవుటను చూచుచుండిరి. ఒక పెద్ద గుంపు అటుగుండా వెళ్ళుచుండిరి. వారిని అక్కడే యుండమని నేను చెప్పాను, కాని వారు అటు ఇటు వెళ్ళి ఏదేదో చేయగోరిరి. అక్కడే, ఆ స్థలములోనే యుండమని వారితో నేను చెప్పాను.

136ఆ తరువాత నేను ముందుకు వెళ్ళాను; ఆ తరువాత కొద్దిసేపటికి ప్రభుని దూత నాకు ప్రత్యక్షమాయెను, "ఆరిజోనాకు ఆవలగా వెళ్ళుము," అని చెప్పెను. ఆ ప్రేలుడు నాకు అటువైపున వినబడినది. అదేమిటి? అతడు కనిన కల అక్షరాలా నిజము. ప్రభువు సరైన దానినే ఇచ్చెను. ఒకదానికొరకు అక్కడికి వెళ్ళుచున్నానని వారికి నేను చెప్పాను. అక్కడికి నేను వెళ్ళినప్పుడు, ఏడు ముద్రల మర్మము తెలిసినది. ప్రభువు యొక్క పర్వతమునకు లోపల అది ముద్రించబడినది. ఏడు ముద్రలు విప్పబడుటతో నేను తిరిగి వచ్చాను, చూచారా.

మీరాలాగు చేయరాదు. మీ ఇష్టప్రకారమై వెళ్ళితే, అది మీ ఇష్టం. మీరెక్కడికి వెళ్ళినా నాకు పరవాలేదు, కాని వధువు కొరకు అక్కడికే ఆయన వచ్చునను మాట తప్పు.

137(ఎక్కడో తప్పు చదివాను. చూద్దాం.) మేము ఇండ్లు అమ్ముకొని రావలెనని నీవు చెప్పినది నిజమేనా? అనడిగెను. ఎన్నడూ ఆ మాట నేననలేదు. మీరున్న చోటనే ఉండుడని నేను జనులతో చెప్పాను. యేసు వచ్చు వరకు ఆ విధంగానే కొనసాగనీయుడి. మరల చెప్పుచున్నాను, ఈ టేపును మీ జ్ఞాపకార్ధముగా ఉంచండి. నా మాట జ్ఞాపకము చేసికొనండి. ఈ ఆలయమునకు జనులు రావలెనని నేను ఎన్నడూ తప్పు మాట గాని, అబద్ధము గాని చెప్పలేదు. జనులు రావలెనని ఎన్నడూ నేను ప్రయత్నములు చేయలేదు. మీ స్వంత సంఘములు విడిచి, వస్తువులు, ఇండ్లు అమ్ముకొని రండని చెప్పలేదు. దేవుడు మిమ్ము పిలచు వరకు మీరున్న చోటనే క్రైస్తవులుగా నిలచియుండుడని నేను ఎల్లప్పుడూ జనులకు చెప్పుటను దేవుడెరుగును. అందరికీ ఇది తెలియును. అక్కడే నిలచియుండుడి! కాని మీరెక్కడికయినా వెళ్ళి ఉండాలనుకొంటే అది మీ ఇష్టం. మీరెక్కడికయినా వెళ్ళతాన౦టే అది మీ పని గాని నా పని కాదు.

అదేమిటో చూడండి. ఒక సిద్దాంతమును అది లేపును. చూచారా, అప్పుడు నేను ఆపదలో పడుదును. ఆ బయట ఒక గుంపు అప్పుడే లేచినది. త్వరలోనే అది ప్రేమతో నడచును. ఇప్పుడిది ఏమగును? "రాకడలో ఎత్తబడుటకు వధువుగా ఇచ్చటికి వచ్చితిమి," అని వారందురు. వార్తాపత్రికలు ఆ మాట కొరకే ఎదురుచూచుచున్నవి. వారు అన్నీ అమ్ముకొని అడుక్కొనే స్థితికి రావలెనని వారు ఎదురుచూచుచున్నారు. తిరిగి వెళ్ళుటకు వారికి ఇండ్లు ఉండవు. అప్పుడు వారేమి చేయుదురు?

138"మంచిది, సహోదరుడు బ్రెన్హాంను మేము వెంబడించాము. ఆలాగు…" ఆ విషయములో నేను నిర్దోషిని. చక్కని ప్రియ జనులను నేను ప్రేమించుచున్నానని వారికి తెలియును. వారి పొరపాటును ప్రేమించెదను. ఏమయినా వారిని ప్రేమించుదును. చూచారా? వారిని నేను ప్రేమించుచున్నాను; వారు నాపిల్లలు; కాని నేను ఏమి చెప్ప ప్రయత్నము చేయుచున్నానో వారు నా మాట వినుట లేదంతే! ప్రభువు నామము పేరట నేను ఏదో చేయవలెనని నేను ప్రయత్నించుచున్నాను, మరియు వారు నాకందుకు అవకాశము ఇచ్చుట లేదు. చూచారా? వారు నిజంగా నా పక్షము నుండుటకు బదులుగా, నాకు విరోధముగా లేచుచున్నారు.

ఈ ఆలయములోనే నేను వర్తమానమును బోధించుచున్నాను. ఆ విషయం మీకు చెప్పాను గదా? నేను ఏది చేయవలసి వచ్చినా మొదట ఇక్కడికి వచ్చి నేను చేయుదును, ఈ ఆలయము నుండియే సూటిగా చెప్పెదను. అది నా వాగ్దానము!

139ప్రశ్న: మరియొక బోధ కూడా నాకు వినబడినది. జీవాహారము గూర్చి నీవు చాలా సంవత్సరాల క్రితం ఒక పుస్తకమును వ్రాసియున్నావు. దానిని వారు తప్పుగా అన్వయించుచున్నారు. మేమంతా తప్పక నీతోనేయుండవలయును లేకపోతే రాకడను తప్పిపోదుమని చెప్పుచున్నారు.

ఆ పుస్తకము తప్పు. జీవాహారము అను పుస్తకము. ఇప్పుడు నేనది గుర్తుచేసికొన్నాను. అది విశ్వవ్యాప్తంగా యుండు ఏ సంఘముకయినా ఆహారమే. సమస్యను గమనించండి. మీరు గట్టిగా యున్నారు, కాని దానిని మీరు గమనించాలి. ప్రతి కూటమును చూడండి.

కొంతకాలం క్రిందట నేను మార్టిన్ లూథర్ గూర్చి చదువుచున్నాను. దానితో మనలను పోల్చుట లేదు; కాని ఇది కూడా అటువంటి సంస్కరణయే. చరిత్రకారులు ఇట్లు చెప్పిరి, "మార్టిన్ లూథర్ కాథలిక్కు చర్చిని ఎదిరించి మనకలుగుట చాలా అద్భుత విషయము. అది చాలా అద్భుతము, కాని మార్టిన్ లూథర్ యొక్క అత్యద్భుత సంగతి అది కాదు. అతని కూటమును చూచిన వారు లేవదీసిన మతోన్మాదమును వారందరూ కాలదన్ని వాక్యము విషయములో నిజముగా నిలచియుండుట అత్యుద్భుతము, అతని పిలుపు…" చూచారా?

కాదండీ! నేను చెప్పిన దానిని ఏ స్త్రీ అయినా, పురుషుడయినా వక్రీకరించి చెప్పినచో దానిని నమ్మవద్దు. నేను చెప్పినట్లుగా వారు చెప్పరు.

MARK 1:7•

JOHN 1:25,27

 

140ప్రశ్న: ఆలాగే కొన్ని కుటుంబముల వారు తమకున్నవన్నియూ అమ్ముకొని ఆరిజోనాలోని సియరా విస్తాకు తరలి వెళ్ళిరి, వారు నీ టేపునొకదానిని వక్రీకరించి భాష్యము చెప్పిరి. (ఒక్క నిమిషము) ఆ వర్తమాన టేపు పేరు "చిన్న బెత్లెహేము" - ఆరిజోనాలో రాకడ జరుగునని చెప్పిరి. వారినచ్చటికి వెళ్ళుమని నీవు సలహా ఇచ్చితివా?

నిశ్చయంగా నేను చెప్పలేదు. వారు దానిని గూర్చి ఒక ఉత్తరము వ్రాసిరి. కనెక్టికాట్ లోనికి మరెచ్చటనో వారున్నారు. వారి ఉత్తరమునకు నేను జవాబు ఇచ్చాను. "మీరు మీ జీవితములో ఎన్నడూ చేయని ఒక పెద్ద తప్పు చేయుచున్నారు. అటువంటిది మీరు చేయవద్దు." జనులారా, మీరు గుర్తుంచుకొనండి. ఆ ప్రజలకు ఆలాగు చేయమని నేను చెప్పలేదు. ఆలాగు చేయరాదని వారికి నేను చెప్పుచున్నాను. కాని చూడండి, కూటము వెంబడి ఇవి వచ్చును. ప్రజలు నన్నెందుకు మెస్సీయా అని పిలచుచున్నారు? ఒక రోజున ఒక వ్యక్తి ఏదో అందరికీ పంచిపెట్టుట చూచాను. నా నామములో అందరూ బాప్తిస్మము పొందవలెనని ఆ కరప్రతికలో వ్రాసెను. అప్పుడు నేను క్రీస్తు విరోధినగుదును. ఆ సంగతులకు నేను బాధ్యుడను కాను. మీ అందరికి అది తెలియును. కాని చూడండి, అది నిజమైన వర్తమానమని ఇవన్నియూ నిరూపించుచున్నవి.

క్రీస్తు యొక్క ముందు రాకను చాటించిన యోహానును కూడా వారాలాగే అనిరి కదా? "నీవు మెస్సీయావా"?

అందుకతడు ఇట్లనెను, "నేను కాను! ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను తగను." చూచారా? కాని అతడు చెప్పెను, "నా వెనుక వచ్చువాడు…"

141ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మేము దేనినయినా తప్పిపోవుచున్నామా? నీవు చెప్పిన ప్రతి మాట నిజమని ఈ జనులు చెప్పుచూ నమ్ముచున్నారు. (కాని అది తప్పు! వారు చెప్పుచున్నారే గాని నీ మాటలు నమ్ముట లేదని వారి క్రియలు రుజువుచేయుచున్నవి.) దయచేసి నీ సూటి జవాబును నాకు తెలియచేయుము: అవును/కాదు (మీరది విన్నారు.) ఈ విషయముల గూర్చి చెప్పుము, అవి నిజమయినచో మేము కూడా మిగిలిన వారిని వెంబడించెదము. ఈ ప్రశ్నలకు నీవిచ్చిన జవాబులను బట్టి నీకు ఎంతగానో వందనములు చెల్లించుచున్నాము. ప్రభుని రాకడ ఆలస్యమయినచో, ఈ ఆదివారం వాటిని వినుటకు ఎదురు చూచుదును.

సోదరీ, సోదరులారా, అది అర్థమైనదని తలంచుచున్నాను. మీరు అరిజోనాకు వెళ్ళి జీవించగోరినచో, వెళ్ళి జీవించండి. నేను మరల ఆరిజోనా నుండి వచ్చి ఇక్కడ ఉండవలసియున్నాను. అక్కడ నేను నివసించగోరుచున్నాను; పిల్లలు ఆరోగ్యముగా ఉన్నారు, అంతా బాగున్నది. అక్కడ నేనుండగోరుచున్నాను, ఒక పని కూడా యున్నది. టేపుమీద ఉన్నది మరువరాదు, యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడు. నేను పని లేకుండా ఏదియూ చేయుట లేదు; మీకు తెలియును; కాని అవన్నీ మీకు చెప్పలేను.

మిమ్ములను ఇండ్లు అమ్ముకొనవద్దని ఎందుకు చెప్పుచున్నానో గ్రహించండి, మీరు అడ్డదారిన అక్కడికి చేరుకోలేరు, తప్పిపోవుట గూర్చి మాట్లాడరాదు. ఆ పని చేయరాదు. నేను కొద్దికాలము మాత్రమే ఆరిజోనాలో ఉండెదను. ఎందువలన? ఆలాగు ఇప్పుడు నేను చేయను.

142ఆ ప్రజలను నేను ఆలాగు చేయునిచ్చినచో వారు చివరకు బిక్షమొత్తకోవలసియుండును. మరేమి జరుగును? ఆ శాఖల వారు, ఇతరులు అది జరుగవలెనని ఎదురు చూచుచున్నారు. "ఆహా! మేము అతని గూర్చి చెప్పాము గదా? ప్రవక్తనని చెప్పి మోసము చేసెను," అందురు. చూచారా? వారందు కొరకే ఎదురుచూచుచున్నారు. వారు సామాన్య మానవులు, కాని వారి విషయము బాధ్యతవహించవలెను; నేను చెప్పినది వారు చేయకపోయినా గాని నేను సహించవలెను. "నీవు చెప్పినా వినలేదు గనుక వారిని చావనీయండి," అని మీరనవచ్చు. నా హృదయములో ఆలాగు లేదు. ఇంకా నా హృదయము వారికొరకు పరుగెత్తుచున్నది. వారు నా పిల్లలు. వారిని చిన్న దెబ్బకొట్టి అయినా గాని మళ్ళించెదను. కాని తప్పక వారిని వెంటాడెదను. అక్కడ నేను ఏ విధముగా వారిని పట్టుకొందును?

"మేము వాక్యమును వెంబడించుటకు వచ్చితిమి," అని వారందురు. వారిని ఎక్కడికయినా పంపాలన్నా ఏ సంఘము అక్కడ లేదు. మీరు విడిచి వచ్చిన సంఘముల వంటివే బహుశా అక్కడ ఉన్నవి. వాటిలోనికి వెళ్ళినచో వారు మరింత దిగజారుదురు, చూచారా. వారు ఆలయమునకు వెళ్ళరు, మరియు వారికి బోధించవలెనన్నా నాకు సంఘము లేదు. అప్పుడు నేను నా పిల్లలను ఆరిజోనా నుండి బయటకు తీసికొని వచ్చు నైతిక బాధ్యతను చేపట్టవలెను.

143ఒక సంగతి మిమ్మును అడుగుచున్నాను. గత సంవత్సరం ఈ ఆలయములో ముప్ఫయికంటె ఎక్కువ ప్రసంగములు అందించాను. ఆరిజోనాలో ఉన్నప్పటినుండి అయిదు సంవత్సరములు బోధించిన దానికంటె ఎక్కువే ఈ ఒక్క సంవత్సరం ఈ ఆలయములో ప్రసంగించాను. అయిదు సంవత్సరాలలో నేనాలాగు బోధించలేదు. (నిశ్చయంగా!) ఇది నా ఇంటి ఆలయము. ఇది నా ప్రధాన కార్యాలయము. ఇక్కడే మనం ప్రారంభించాము. ఏమి జరిగినా గాని దీనిని మనస్సులో ఉంచుకొనండి. మీరు జ్ఞానులయితే దీనిని గ్రహించెదరు. ఏది ఏమైనా గాని ఇది మన ప్రధాన కార్యాలయము. దీనిని మనస్సులో ఉంచుకొని ఒక దినమున మరల టేపును వినండి. నా ప్రవచనమును మీరు వినియున్నారు. దానిని మరువవద్దు.

మీరు తప్పకుండా విడిచిపెట్టి ఆలయమునకు రావలెనన్నచో అక్కడికి మాత్రం వెళ్ళరాదు, ఎందుకనగా అక్కడ ఆలయము లేదు. నేను కూడా ఉండను. నాకు అచ్చట చోటు లేదు. నాకు అచ్చట ఆలయము లేదు. వారు తమ ఆలయములలో నన్ను బోధించనియ్యరు. నాకు చోటు అసలు లేనే లేదు. అక్కడికి వెళ్ళి నేను పెద్ద ఆలయము కట్టుదునని వారు భయపడిరి. వారి సంఘములు ఖాళీ అయిపోవునేమోనని తలంచిరి. అది నా జీవిత గురి కాదు, చూడండి. ప్రజలు రక్షింపబడవలెనని నా కోరిక, అది వారి పని. సమరయ్యుడు వచ్చి అతనిని సత్రమునకు కొనిపోయి పరామర్మించెను. వారును ఆలాగే శ్రద్ధ తీసికొననీయండి. వారి సంఘములను నేను చీల్చువాడను కాను. క్రీస్తు కొరకు జనులను సంపాదించువాడను! చూచారా? ప్రజలు నన్ను అపార్ధము చేసికొనుచున్నారు, చూడండి, వారు తమ స్వంత అర్ధమును చెప్పుచున్నారు. నేను చెప్పిన దానిని వారు చెప్పుట లేదు.

144ఆ దర్శనము మీకు గుర్తున్నదా? జూనియర్ జాక్సన్ కల ఎందరికి గుర్తున్నది? అది చక్కగా నెరవేరుచున్నది. ఏమిటది? అక్కడికి నేను వెళ్ళు వరకు ఇక్కడే ఉండండి! చూచారా? అర్ధమును తెలిసికొని వెనక్కు వచ్చాను.

నా హృదయములో మరో సంగతి ఉన్నది. ప్రభువు దానిని చేయమని నన్ను హెచ్చరించెను. ఈ ఆలయమునకు సంబంధించి ఒక కదలికను నేను చేయవలెను; కొద్ది కాలము పాటు ఎచ్చటికో నేను వెళ్ళిపోవలెను. ఒక పని నిమిత్తమే, చాలా గొప్ప పని, ఆ ఉద్దేశ్యము మీరు ఎరుగనే ఎరుగరు. కాని గుర్తుంచుకొనండి, గురి లేక నేను అటు ఇటు తిరుగుట లేదు. ఆ విధంగా నా ప్రవర్తన కనిపించవచ్చును. ప్రభువు చిత్తములోనే పనిచేయుచున్నాను. నాకు తెలిసినంతవరకు ఆలాగే పనిచేయుచున్నాను. చూచారా? ఆ కారణము చేతనే నేను చెప్పు మాటను, చేయమను కార్యమును చేయండి, చూచారా, నా మాట వినుడి మరియు మీ సోదరునిగా నన్ను నమ్ముడి. మీరు నన్ను ప్రవక్తగా నమ్ముచున్నయెడల నా మాటలకు వక్ర అర్ధము చెప్పవద్దు.

మీరు నాకు సహాయము చేయండి, దేవుడు నాకు చెప్పమని మీకేదయినా తెలియ చేసినయెడల చెప్పండి. నేను చెప్పినది నిజమని దేవునికి తెలియును. దానికి ఏమియు చేర్చవద్దు. దానిలో నుండి ఏదియూ తీసివేయరాదు. నేను చెప్పినదానిని చెప్పినట్లే ఉంచండి, చూచారా, నాకు తెలిసిన అత్యుత్తమమైన దానిని నా హృదయపూర్తిగా మీకు చెప్పుచున్నాను, చూచారా. దానిని మీరు నమ్ముడి. నేను చెప్పిన దానిని చెప్పినట్లుగానే తీసికొనండి. ఆలాగే దానిని పోనియ్యండి. మంచిది.

ఆహారము కొరకు పిల్లలను నేను ఇచ్చటికి తీసికొని రావలసియున్నాను. వారా ఎడారిలో ఆకలిగొనుచున్నారు.

2THS 3:10

 

145ఒకనాడు ఒక సేవకుడు వచ్చి ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, నీవు ఎన్నడూ చూడని ఒక భయంకరమగు గుంపు లేచియున్నది. ప్రతి ఉదయము వారు లేచి బయటకు వెళ్ళుచున్నారు. వారు పని చేయమని చెప్పుచున్నారు, ఎందుకనగా రాకడ బహు దగ్గరలో ఉన్నదట." వారు పనిచేయుట లేదు. మీరసలు సంగతి అర్థము చేసికొనలేదని ఇందువలన అర్థమగుచున్నది, చూచారా. నిజము. (ఈ టేపు అచ్చటికి వెళ్ళుచున్నది!) అవును, చీమను చూచి పాఠము నేర్చుకొనుమని బైబిలు చెప్పుచున్నది. పని చేయనిచో ఆహారము తినరాదని చెప్పబడినది. అది అక్షరాలా నిజము.

ఇందులో ఒక్కటిని మనం చూద్దాం.

146ప్రశ్న: … (నాకు తెలియదు. ఇది పేరే చేవ్రాతగా యున్నది. ఇటువంటివి ఎనిమిది లేదా పది ఉన్నవని మీకు చూపించుచున్నాను, చూచారా.) అతి పరిపూర్ణమగు సంఘము అరిజోనాలోని, టుసాన్లో ఉండబోవుచున్నదా? నేను దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో ఉండగోరుచున్నాను. టుసాన్ కు తరలి పోవలెనా?

ఇది వేరే చేవ్రాత. ఇక్కడ చూడండి; ఆ ఒక్క ప్రశ్నను ఎందరు వ్రాసిరో మీరు చూడండి. నేను వాటిని కనుకోనలేను. ఇక్కడ కొన్ని నేను గుర్తుపెట్టుకొని ఉంచాను, "నేను మీకు తెలియచేయుదును."

147ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా: (చూద్దాం.) నీవు, మేము జీవించుచున్న ఘడియకు ప్రవక్తవని ఎరుగుదుము. నేటి మా ఘడియకు ప్రవక్తవు. (అదే) దేవుని జనులు ఆరిజోనాకు తరలిపోవలసిన సమయము వచ్చునా? ఆ సమయ మెప్పుడు వచ్చునో మాకు తెలియచేయుము.

నిశ్చయంగా. మీతో చెప్పెదను. చూడండి, రెండు వేర్వేరు చేవ్రాతలున్నవి. ఇద్దరు వ్రాసిరి. చూచారా? ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వీటిని వ్రాసిరి. చూచారా? అది సంఘము మనస్సులో యున్నది. చూడండి. దీనిని మనం పరిష్కరించవలెను. చూద్దాం..

REV 21:1

 

148ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా… (ఇది మరొకటి. పేరే వారు వ్రాసిరి) "పెండ్లికుమారుడు మరియు పెండ్లికుమార్తె యొక్క భవిష్య గృహము," అను నీ వర్తమానమును కొందరు అర్ధము చేసికొనిన తీరు ఇట్లున్నది. (ఇది వేరే ప్రశ్న.) - ఆలయము నుండి పదిహేను వందల మైళ్ళ దూరములో ఉండవలెను - చదరము - ఎటు చూచినా ఏడు వందలు - (ఆలయము నుండి ఎటు చూచినా ఏడు వందలు ఉండవలెను) ఇది నిజమా? నేను చాలా దూరాన నివసించుచున్నాను గనుక ఆ పరిధిలోనికి కదిలి రావలెనా?

ప్రియమైన వారలారా, ఆలాగు చేయరాదు. ఇది జనులకు ఎంత సులభమొ చూడండి? ఆ వర్తమానము బోధించినప్పుడు ఇక్కడ ఎందరున్నారు? నేను క్రొత్త యెరూషలేము యొక్క కొలతలను చెప్పాను. చదరంగా పదిహేను వందల మైళ్ళుండునని చెప్పాను. దాదాపుగా అది మయినే నుండి ప్లారిడా వరకు ఉండునని చెప్పాను. మిస్సిసిపీకి పశ్చిమంగా ఆరు వందల మైళ్ళుండును. అప్పుడు పదిహేను వందల చదరపు మైళ్ళు అగును. ఆ పట్టణమును గూర్చి నా అభిప్రాయమును చెప్పాను. ఆ పట్టణము కొరకు ప్రవక్తయగు అబ్రాహాము వెదికిన చోటనే అది ఉండునని నా ఉద్దేశ ప్రకారము చెప్పాను. సముద్రము ఇకను లేదు. సముద్రము ఇకను లేదని బైబిలు చెప్పుచున్నది. మూడు వంతుల భూమి నీటిలోనే ఇప్పుడున్నది. ఇక మీదట సముద్రము ఉండదు. మరీ పెద్ద పట్టణములో ఆ స్థలముండదు. దేవుడు ఎక్కడో గొప్ప పట్టణములో జన్మించునని ఆనాడు వారనుకొనిరి, కాని ఆయన చిన్న బెత్లెహేములో జన్మించెను. అది పాలస్తీనాలోనే ఎక్కడో యుండునని నేను నమ్ముచున్నాను. అది భూమిలోనుండి లేచును. ఆ కొండమీద ఉండును.

1THS 4:14

 

149ప్రియ స్నేహితుడా, ఈ ఆలయమునకు దానితో ఏమీ సంబంధము లేదు. చూచారా? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు మొదలగు పరిశుద్దులెందరో ప్రపంచ మంతటిలో చనిపోయియున్నారు. కొందరు కాల్చబడిరి, కొందరు నీట మునిగిరి, కొందరు సింహములచే తినబడిరి, నానా విధములుగా చనిపోయిరి. ప్రపంచపు ప్రతి మూలనుండి, ప్రతి బండ సందులో నుండి వారు వచ్చెదరు. అక్కడ నేనుందునని నా నమ్మకము. నేను ఆ గుంపులో ఉండినయెడల అక్కడ నన్ను ఉండకుండా ఏదియూ ఆపజాలదు. చూచారా? ఆ ప్రత్యేక స్థలము ఇదేనని చెప్పుట లేదు. క్రీస్తునందు మాత్రమే నేనుండవలసిన చోటున్నది. క్రీస్తునందున్న వారిని దేవుడు ఆయనతో కూడా తీసికొని వచ్చును. అదెక్కడో నాకనవసరము. యేసులో నన్ను సమాధి చేయుడి.

GEN 5:24,25

 

150ఆ వెనుకటి ప్రవక్తలను చూడండి. మొదటి పునరుత్థానమును, ప్రధమ ఫలములను గూర్చి వారు అక్షరార్ధమును ఎరుగుదురు. అది పాలస్తీనాలోనని తెలియును. ఒక చోటును అబ్రాహాము కొనెను. శారాను అక్కడ పాతిపెట్టెను. అతడు ఇస్సాకును కనెను. తన తల్లిదండ్రుల ప్రక్కన అతనిని పాతిపెట్టిరి. ఇస్సాకు యాకోబును కనెను; యాకోబు ఐగుప్తులో చనిపోయెను - కాని మరల పాలస్తీనాకు తీసికొని వచ్చిరి. వారు యోసేపు శల్యములను తీసికొని వచ్చిరి. తనను అక్కడ సమాధి చేయక, వాగ్ధాన దేశమునకు తీసికొని రమ్మని అతడు ప్రమాణము చేయించుకొనెను. యోసేపు ఇట్లనెను, "ఒక దినమున ప్రభువగు దేవుడు మిమ్మును దర్శించును. నా ఎముకలను తీసికొని వచ్చినా తండ్రి యొద్ద పాతిపెట్టుడి." వారాలాగే చేసిరి. వారు ప్రవక్తలు గనుక పునరుత్థానపు ప్రధమ ఫలములు పాలస్తీనాలో యుండునని ఎరిగియుండిరి.

151మీరు నన్ను ప్రవక్త అని పిలచుచున్నారు, కాని నేను చెప్పుకొనుట లేదు; గుర్తుంచుకొనండి, మీరే పిలచుచున్నారు. ప్రవక్త నామములో మీకిది చెప్పుచున్నాను, చూచారా - ప్రవక్త నామములో, పునరుత్థానము మరియు ఎత్తబడుట అనునవి మొత్తం ప్రపంచములో సామాన్యముగా జరుగును. మీరెక్కడున్నా పరవాలేదు. ఆ ఘడియ వచ్చినప్పుడు మీరాయనను కలిసికొందురు. అంతే! ఏదీ మిమ్మును ఆపజాలదు. మీరెక్కడున్నా పరవాలేదు. వారిలో నేను ఒకనిగా యుందునని మీతో చెప్పి నిరీక్షించుచున్నాను. నేను దేవునియందు విశ్వాసముంచి, నిరీక్షణ కలిగియున్నాను. వారిలో ఒకనిగా నేనుందును. మీ ప్రతి ఒక్కరు ఆ విధంగానే యుందురు.

మరియొక ప్రశ్నకు మనకు సమయమున్నదా? ఇప్పుడు దాదాపు 1:00 అయినది. చూచారా?

JOHN 6:37

 

152ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా: నేను నా భార్య విడిపోయితిమి, ఆమె పరిత్యాగ పత్రిక కొరకు నా మీద వ్యాజెము వేయుచున్నది. ఆమె క్రైస్తవురాలు కాదు. నేను వర్తమానమును నమ్ముచున్నాను. ఆమె రక్షించబడవలెనని కోరుచున్నాను. (అది మంచిది, కాదా? అది నిజమగు క్రైస్తవ ఆత్మ, చూచారా?) నేనేమి చేయవలెనో చెప్పుము? మాకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (వారు సంతకము చేసిరి.)

సోదరుడా, చూడుము, ఆమె నీ నుండి విడాకుల కొరకు కోర్టులో వేసినది. అది సాతాను పని, చూచారా. ఆలాగు చేయరాదు, కాని నీవు క్రైస్తవుడయినచో, ఆమెను అభ్యంతరపరచు విధముగా లోకములో ఏమీ చేయనిచో, ఈ పనిచేయుచున్నది సాతాను. మిమ్మును చీల్చుటకు వాడు ప్రయత్నించుచున్నాడు.

ఆమె దేవునిచే ఏర్పాటు చేసికొనబడిన వారిలో ఒక వ్యక్తిగా ఉన్నచో అతని యొద్దకు వచ్చును. ఆలాగు కానియెడల ఆమె గూర్చి చింతించవలసిన పనిలేదు. నీవు చింతించుచున్న యెడల నీ ఆరోగ్యము పాడవును. సాతాను అదే చేయగోరుచున్నాడు. వాడు నీమీద పని చేయుచున్నాడని నేనెరుగుదును, కావున నీ సర్వస్వము దేవునికి సమర్పించుము. ఎప్పటి వలెనె సంతోషముగా దేవుని సేవించుము. మిగిలినదంతయూ దేవుడే చూచుకొనును. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నాయొద్దకు వచ్చుదురు." మోకాళ్ళూని ప్రార్థించుము. నేను కూడా నీతో కలిసి ప్రార్ధి౦చెదను. ఆ విషయము గూర్చి ప్రార్థించెదను. ఈలాగు నీవు చెప్పుము, "ప్రభువగు దేవా, ఆమెను నేను ప్రేమించుచున్నాను. ఆమె నా పిల్లలకు తల్లి. ప్రభువా, సమస్తము నీకే అప్పగించుచున్నాను. వారు రక్షింపబడవలెనని నేను కోరుచున్న సంగతిని నీవెరుగుదువు, కాని నేనేమియూ చేయజాలను. ఆమె ఏలాగయినా నాకు విడాకులిచ్చెను. నేనేమీ చేయలేదు; ఒకవేళ ఏదయినా చేసినయెడల నాకు బయలుపరచుము, దానిని సరిచేసికొందును. ఏదయినా నేను చేసెదను." ప్రభువుకు దానిని సమర్పించుము. నీవు ఊరకుండుము. ఎప్పటివలెనె జీవించుము. ఏమీ జరుగలేదన్నట్లు జీవించుము. తక్కినదంతయూ దేవుడే చూచుకొనును.

153ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, జనులు ఆరిజోనాకు వెళ్ళిపోవలెననుకొనుట ఏమిటి? దానిని వివరించుము, ఇది మరొకరి చేవ్రాత, చూచారా. చూచారా?

మంచిది, దానిని గురి౦చి ముందే వివరించుట జరిగినది.

154ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, అది అపోస్తలుల సంఘమువలె వధువు కూడా శ్రమల గుండా వెళ్ళవలెనా?

కాదు, కొద్ది నిమిషముల క్రితం దానిని నేను వివరించాను. ఇక జరుగనైయున్నది. ఎత్తబడుట. గుర్తుంచుకొనండి, మనము వాగ్ధాన భూమి యొద్ద ఉన్నాము. మనం సరిహద్దులో యున్నాము. ఇశ్రాయేలుకు తరలి వెళ్ళుట మీకు గుర్తున్నదా?

155ప్రశ్న: ఏ విధమైనా కుటుంబ నియంత్రణ వాడుటయినా న్యాయ సమ్మతమా?

ఈ మధ్యాహ్నము వరకు ఆ ప్రశ్నను విడిచిపెట్టెదను, ఎందుకనగా దానిని గూర్చి కొంత చెప్పవలెను.

156ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, (మూడు నిమిషములు చూచెదను. చిన్న ప్రశ్నలను చూద్దాం.) నేను సంపూర్తిగా యేసుకు సమర్తించుకొనలేకపోవుచున్నాను. నాలో దురాత్మ ఉన్నదా?

మిగిలిన సమయమును దానికొరకు గడిపెదను. యేసుకు నీవు అప్పగించుకొన లేకున్నావా? చూడండి, స్త్రీయో, పురుషుడో ఇక్కడ వ్రాయలేదు. నాకు తెలియదు గాని దేవునికి తెలియును.

యేసుకు నీవు అప్పగించుకొనలేకున్నావు. ఎందువలన? కారణమేమిటి? నీవు స్త్రీ యైనచో, నీవు నీ భర్తకు లోబడవలసి యందువు గదా? నీ సర్వస్వమును అప్పగించుకొనవలెను. నీవు మంచి శీలము గల స్త్రీగా అతనిని పెండ్లిచేసికొంటివి. ఆ శీలమును కాపాడుకొనుటకు జీవితమంతా పోరాడియున్నావు. సద్గుణముతోను, పవిత్రముగాను, నిష్కళంకముగాను ఉండవలెనని నీవు ప్రయత్నించియున్నావు. దానినంతటినీ నీవు ఒక్కనికి అప్పగించియున్నావు. అది నిజమేనా? నిన్ను నీవు పూర్తిగా అతని హస్తములకు అప్పగించుకొన్నావు. నీవు అతనికి చెందియున్నావు. నీకున్న శీలము, నీతి, సమస్తము ఆ ఒక్క పురుషునికి అప్పగించియున్నావు, ఎందుకనగా నిన్ను నీవు ఆ పురుషునికి సమర్పించుకొన్నావు. యేసుక్రీస్తుకు కూడా ఆలాగే నీవు చేయలేవా? ఆ విధంగానే సమర్పించుకొనుము - సర్వస్వము, నీ మనస్సు, నీ ఆలోచనలు. నిశ్చయంగా!

నీవు దురాత్మను కలిగియున్నావని నేను తలంచుట లేదు; నీలో దురాత్మ యున్నచో అది నిన్ను దురాలోచనలతో అభిషేకించును. నీవు దేవునికి లోబడవలెనని ప్రయత్నించుచున్నావు. ఒక సంగతి నీకు చూపించెదను. నీవెందుకని ఆయనకు లోబడగోరుచున్నావు? ఎందుకనగా నీలో ఏదో ఆయనకు లోబడమని పిలచుచున్నది. నీవు స్వయంగా ఆయనకు సమర్పించుకొనవలెననుకొనుట మంచి సూచన.

157సోదరుడా లేక సోదరీ, నీవు చేయవలసినది వినుము. (బహుశా ఒక యువ వ్యక్తి కావచ్చును, ఎవరయినా సరే వినవచ్చును), సంపూర్ణముగా సమర్పించుకొనుట చాలా అవసరము. నిన్ను నీవు పూర్తిగా అర్పించుకొనుము. "ప్రభువా, నా ఆలోచనను, నా సమస్తమును నీకు సమర్పించగోరుచున్నాను. నా జీవితమును నీ సేవకు ఇచ్చుచున్నాను. ప్రభువా, నన్ను తీసికొనుము. ఉన్నపాటున నన్ను వాడుకొనుము." అది చాలా సూక్ష్మ విషయము. ఆలయములోని వారందరూ ఈ ప్రశ్నల మూలముగా ఉపయోగము పొందవలెనని నేను కోరుకొనుచున్నాను. వాటిని మీరు ఇష్టపడుచున్నారా? మంచిది. అది కొద్దిగా సహాయపడును.

ఇప్పుడు దీనిని చూడండి. సంఘము ఈ సంగతులను అడుగవలెను. (చూచారా?) ఈ సంగతులు అడగండి. దానిని చేయవచ్చునా, దీనిని చేయరాదా అని అడుగుదురు. నాకు వీలయిన శ్రేష్ఠమగు రీతిలో జవాబు ఇచ్చెదను. నేను తప్పుగా సలహా ఇచ్చినయెడల, అది నా హృదయములో నుండి రాలేదని మీరు గ్రహించవలెను. నా స్వంత ఆలోచనలను ఆచరణలో పెట్టుటకు ఏదయినా తప్పు సలహాను మీకు ఇయ్యుట జరిగినచో, అది నా ఉద్దేశపూర్వకముగా ఇచ్చినది కాదని గ్రహించుడి. తప్పు చేయమని మీకు నేను చెప్పను. ఆలాగు నేను తెలిసి తప్పు చేయమనినయెడల, అపవిత్ర వేషధారినగుదును. ఇది నిజము. నా హృదయ పూర్తిగా తప్పు చేసినచో దేవునికి తెలియును, చూచారా, మీ ప్రశ్నలకు జవాబు ఇచ్చుటకు నా హృదయపూర్తిగా నేను ప్రయత్నము చేశాను.

158దేశములోని అనేకమంది సేవకులు ఈ టేపు విందురు. మిమ్మును గాయపరచుటకు ఈ మాటలు చెప్పలేదు. మిమ్మును ప్రేమించుచున్నందువలననే ఈ సంగతులు చెప్పుచున్నాను. చూచారా? నిజంగా నా హృదయపూర్తిగా ప్రేమించుచున్నాను. వేషధారిగా నేనుండగోరుట లేదు. మీకు తెలియనిది నాకు తెలియునని గర్వించుట కాదు. నా సోదరుడా, అది కాదు. మిమ్మును ప్రేమించుచున్నందునే దీనిని నేను చేయుచున్నాను. నన్ను మీరు ప్రేమించుచున్నారని నమ్ముచున్నాను.

నేను ఒక పాత నావలో ఈ నది మీద వెళ్ళిపోవుట మీరు చూచారనుకొనండి, మన ఆలయమునకు బహు దగ్గరగా ఉన్న నది ఒహాయో నది; ఆ నది వరద నీటితో పొంగుచున్నదనుకొనండి; నా దిగువగా జలపాతమున్నది. ఆ నావ ఈ జలపాతమును దాటలేదని మీరెరుగుదురు. నేను ఆ నావలో తల ఆనించి, పాట పాడుచూ, విశ్రాంతి తీసికొంటూ, చాలా హాయిగా నదిలో తేలుకొంటూ వెళ్ళిపోవుచున్నాను. ఇంకొద్ది దిగువకు వెళ్ళితే, నావ బ్రద్దలగునని మీరు ఎరుగుదురు. మీరు నన్ను ప్రేమించుచున్నయెడల, మీరది చూచి కేకలు వేయుచూ, నావ లోనికి దూకి, నా తలమీద కొట్టి నన్ను బయటకు తీసికొని వచ్చెదరు. "సహోదరుడా బ్రెన్హాం, నీకు మతిపోయినది. నీ శిరస్సు పాడయినది. ఆ దిగువన జలపాతమున్నదని మరచిపోయావా?" అందురు.

"నోరు మూయండి! నా జోలికి రావద్దు!" అన్నాననుకోండి. అయినా గాని మీరు నన్ను ప్రేమించుదురు. లోకములో మీరు చేయకలిగినదంతా చేయుదురు. నన్ను కౌగలించుకొందురు. ఆ నావను మీరు బయటకు లాగెదరు, ఎందుకనగా మీరు నన్ను ప్రేమించుచున్నారు; జరుగబోవు దానిని మీరెరుగుదురు.

159సోదరుడా, ఆ శాఖకు ఏమి జరుగునో నాకు తెలియును. అలను అది తట్టుకొన జాలదు. చూచారా? వారు తిన్నగా ప్రపంచ సంఘ సమితిలోనికి వెళ్ళుదురు. మీరందులోనికి వెళ్ళనయినా వెళ్ళవలెను లేదా ఇప్పుడు మనవలె బయటకు రానన్నా రావలెను. నీ ఎన్నికను నీవే చేసికొనవలెను. నేను ఆ నావను అడ్డగించుటకు యత్నించుచున్నాను. నేను చేయగలిగినదంతా చేయుదును. సోదరులారా, మిమ్ము బాధించుటకు కాదు, కాని మీ తప్పులోనుండి మిమ్మును లేవనెత్తగోరుచున్నాను. ఆలాగు చేయరాదు!

యేసుక్రీస్తు నామములో ఈ నీటి బాప్తిస్మము గూర్చి ఆలోచించండి. ఈ భూమి మీద దానిని ఖండించు వ్యక్తి ఏ ఒక్కడును లేడు. లేఖనము ద్వారా ఖండించజాలరు. సోదరులారా, లేఖనమును పరిశోధించుడి. క్రొత్త నిబంధన అంతటిలో ఏ ఒక్కరైనా గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములో గాక మరో విధముగానయినా బాప్తిస్మము పొందిరేమో నాకు చూపించండి. (పాత నిబంధనలో బాప్తిస్మము లేదు, అయితే క్రొత్త నిబంధనలోనే ఉన్నది.) నాకు చూపించండి. చివరి అపోస్తలుడు చనిపోయిన కొన్ని వందల సంవత్సరముల వరకు బాప్తిస్మము మారలేదని చరిత్ర గ్రంథములు రుజవు చేయుచున్నవి. కాథలిక్కు చర్చి ఇతర బాప్తిస్మమును ప్రారంభించినది. వారి మత నియమావళి కూడా దీనినే చెప్పుచున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామమును వాడమని బోధించుచున్నది.

160సేక్రెడ్ హార్ట్ చర్చిలో ఒక మతాధికారితో మాట్లాడాను. అతడు అదే సంగతి చెప్పెను. కాథలిక్కు చర్చి ఆ విధంగానే బాప్తిస్మమియ్యుట జరిగినదని చెప్పెను. ఫ్రేజియర్ బాలికకు నేను ఎట్లు బాప్తిస్మమిచ్చానో అతడు తెలిసికొనగోరెను. "నీవు ఆ విధంగా ప్రమాణము చేస్తావా?" అనడిగాడు.

"నేను ప్రమాణము చేయను," అని చెప్పాను.

"బిషప్పులు ప్రమాణము చేయమందురు," అన్నాడు.

నేనిట్లు చెప్పాను, "బిషప్సులు నా మాట నమ్మువలెను. అది వారి ఇష్టము. ప్రమాణము చేయరాదని బైబిలు చెప్పుచున్నది." చూచారా?

"మంచిది," అన్నాడు.

ఇట్లు చెప్పాను, "ఆమెకు నేను క్రైస్తవ బాప్తిస్మమిచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమెను స్సింగ్ వీధిలోని నీటిలో ముంచుట ద్వారా బాప్తిస్మమిచ్చాను."

"కాథలిక్కు చర్చి కూడా గతంలో ఆలాగే చేసెడిది," అన్నాడు. మతగురువు పలికిని మాటలివి.

"ఎప్పుడు?" అనడిగాను.

"అపోస్తలుల దినములలో," అన్నాడు.

"వారిని మీరు కాథలిక్కులందురా?" అనడిగాను.

"నిశ్చయంగా," అన్నాడు.

"అయితే నేను మీకంటె మంచి కాథలిక్కును. వారి బోధను నేను అనుసరించుచున్నాను," అని పలికాను. ఇది సత్యము. చూచారా? వారాలాగు చెప్పుదురు గాని చేయరు.

రోమ్లోని నైసియాలో కాన్స్టాంటయిన్ ఆధ్వర్యమున కాథలిక్కు చర్చి స్థాపించబడినది. సంఘమును, రాజ్యమును ఏకము చేసిరి. రాజ్యము వలన సంఘమునకు ఆస్తే వచ్చినది; వారు నిజంగా వెయ్యేండ్లపాలనలో ఉన్నట్లు భావించిరి. వెయ్యేండ్లపాలన అదేనని తలంచిరి. అది సాతాను యొక్క వెయ్యేండ్లపాలనా కాలము. ఇది నిజము. ఆ మాటలను మీరు నమ్మవద్దు. అవునయ్యా!

161విగ్రహమును అనగా వీనస్ ను వారు తీసివేసి, దానికి బదులుగా మరియను నిలబెట్టిరి. జూపిటర్ ను తీసివేసి, పౌలు లేదా పేతురును నిలబెట్టిరి. ఇప్పుడు రోమ్లోని వాటికన్ సిటీని చూడండి., పందొమ్మిది అడుగుల పేతురు విగ్రహమున్నది. వారు ఆ విగ్రహము యొక్క పాదమును, మూడు వ్రేళ్ళను ముద్దుపెట్టుకొందురు.

ఒక ఉదయమున బిల్లీ, నేను ఆ చర్చికి వెళ్ళాము. సన్యాసులను పాతిపెట్టిన స్థలానికి వెళ్ళాము. ఆ ధూళిలో వారి ఎముకలు కుళ్ళిపోయినవి. ఆ కృశించిన ఎముకలను వారు ఏరి అవయవములుగా అమర్చి. ఆ పుర్రెలను వాటికి తగిలించెదరు. ఆ జనులు వచ్చి పుర్రెలను ముద్దాడినందున అవి అరిగిపోయి తెల్లగా నున్నవి. ఆ చచ్చినవారి పుర్రెల వలన దీవెన పొందగోరుచున్నారు. అవి చచ్చినవారి పుర్రెలు. అది ఒక భూతవాదము, చూచారా.

REV 3:17

 

162రోమ్లోనే ఇది ప్రారంభమయినది. అదే మృగము యొక్క సింహాసనము. అక్కడ నుండియే ముసలి వేశ్య వచ్చును. ఆమె కుమార్తెలు కూడా ఆమెవలెనె వేశ్యలు. సర్వ ప్రపంచమునకు అది తన కోపపు పాత్రను - తన సాక్ష్యపు పాత్రను అందించుచున్నది. అని భూమిమీది దుష్టత్వముతో మిశ్రీతమైయున్నది, దాని సాక్ష్యము దానికి ఉన్నది, అది ఇట్లనుకొనుచున్నది, "నేను కన్యకగా కూర్చొనియున్నాను, నేను విధవరాలుగా కూర్చొనియున్నాను (నా భావము) నాకేమియూ కొదువలేదు"; కాని తాను దరిద్రురాలననియు, దిక్కుమాలినదానదనియు, గ్రుడ్డిదానననియు, దౌర్భాగ్యురాలననియు, ఎరుగుట లేదు. కాథలిక్కు చర్చి మరియు ప్రతి ప్రొటస్టెంటు శాఖ ఆలాగే యున్నవి! అంతా అయోమయముగా యున్నది. వారు ప్రశస్త జనులు. దేవుని తమ పూర్ణ హృదయముతో ప్రేమించుచున్నారు. ప్రభువుకు ఆత్మ మనస్సు ఇచ్చియున్నారు. తాము సరిగానే యున్నామనుకొనుచున్నారు. తాము చేయుచున్నది సరియేననుకొనుచున్నారు. దేవుడే అత్యున్నత న్యాయాధిపతి.

163దేవుడు ప్రపంచమునకు సంఘము ద్వారానే తీర్పు తీర్చునని కాథలిక్కు చర్చి చెప్పుచున్నది. నాతో మాట్లాడిన ఆ వ్యక్తిని అదే అడిగాను. "దేవుడు లోకమునకు సంఘము ద్వారానే తీర్పు తీర్చునని చెప్పెను."

"ఏ సంఘము ద్వారా?" అనడిగాను.

"కాథలిక్కు చర్చి ద్వారా," అన్నాడు.

"ఏ కాథలిక్కు చర్చి ద్వారా? ఎందుకనగా అందులో చాలా రకములున్నవి గదా?" అన్నాను. ఏ సంఘము? గ్రీకు ఆర్థోడక్సా? రోమను? దేని ద్వారా ఆయన తీర్పు తీర్చును? ప్రొటస్టెంటు చర్చి ద్వారా ఆయన తీర్పు తీర్చినచో, ఏ ప్రొటస్టెంటు సంఘము ద్వారా? మెథడిస్టు, బాప్టిస్టు, లూథరన్, పెంతెకోస్తు, వీనిలో దేని ద్వారా ఆయన తీర్పు తీర్చును? యేసుక్రీస్తు ద్వారా ఆయన లోకమునకు తీర్పు తీర్చునని బైబిలు చెప్పుచున్నది. యేసుక్రీస్తు వాక్యమై యున్నాడు. కావున, ఆయన దేవుని వాక్యము ద్వారా లోకమునకు తీర్పు తీర్చునని నాకు తోచుచున్నది. అది నిజము. ఆయన తీర్పులు ఇప్పుడు భూమిమీద ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఉగ్రతను తప్పించుకొనుటకు మన పూర్ణ హృదయముతో వెదకుదము. దేవుని యొక్క ఉగ్రత ఈ అవిశ్వాస ప్రపంచము మీద కుమ్మరింపబడబోవు చున్నది. దానిని తప్పించుకొను మార్గము మరేదియూ లేదు.

164ప్రపంచమునకు రక్షణ మరే ఇతర విధముగాను రాదు. కృపకు మరియు తీర్పు మధ్యనున్న గీతను వారు దాటిపోయిరి. అమెరికా దేశములోని ప్రతి రాష్ట్రములోను మీరు ఒక అబ్రాహామ్ లింకనును ఉంచవచ్చును, కాని అందువలన ఈ "రికీ" మరియు "ఎల్విస్"ల గుంపు దేవుని వైపు తిరుగదు.

పేపరులో మీరు చూచారు (నా వద్ద అది ఉన్నది. దానిని మీరు చూడగోరినచో, ఈ రాత్రికి తీసికొని వచ్చెదను), ఒక ప్రెస్బిటేరియను చర్చి వారు రాక్-ఎన్-రోల్ సంగీతముతో ప్రభురాత్రి భోజనమును ఇచ్చుచున్నారు. (దానిని మీలో చాలామంది చదివియుందురు). సంఘకాపరి చప్పట్లు కొట్టుచూ ఆలాగు నిలబడియుండెను. వారందరూ సిలువాకారములో నిలబడి కదలుచుండిరి. ప్రెస్బిటేరియను ఆలయములో రాకెన్-రోల్ చూడండి.

నీతి లేని అల్లరిమూకల అపవిత్ర బీటిల్స్ చూడండి. వారు నిజంగానే మనుష్యులు కారు, పురుగులుగా దిగజారియన్నారు. కొద్దివారాల క్రితం సెంట్ లూయిస్ లో వారు ఒక వంద వేల డాలర్ల కాంట్రాక్టును ఉల్లంఘించిరి; అంతటితో ఆగలేదు. మూర్ఖులగు ఒక ఇంగ్లీషు గుంపు వచ్చినది. వారి జుట్టు కళ్ళ మీద వ్రేలాడుచున్నది. వారు స్వయంగా ఒక మతమును ప్రారంభించిరి. "లుక్" మాగజైన్ లో మీరది చూచారు.

165ఈ ప్రపంచము చెడిపోయినది. ఏ ఆశ ఇక లేదు; వారు ఆ హేతుబుద్ధికి, ఇంగిత జ్ఞానమునకు మధ్యగల గీతను దాటియున్నారు. రక్షణ వారికి ఇక లేదు.

మానవుడు కనీసం విచక్షణా జ్ఞానం కలిగిలేకయున్నాడు. ఇంతకు ముందున్న పెద్ద తరహా మనుష్యులు ఇప్పుడు లేరు. పాట్రిక్ హెన్రీ ఎక్కడ? అబ్రాహాం లింకన్ ఎక్కడ? - వారు తాము నమ్మినదాని కొరకు ప్రాణములను అర్పించిరి.

అటువంటి మహానుభావులు లేచి ఈ గుడ్డలు లేకుండా మగవారి యెదుట తిరుగుచున్న స్త్రీలను తరిమికొట్టవలెను. వారిని అవమానపరచి బాలురను బందీ గృహములో ఉంచుచున్నారు - ఏది మీ జ్ఞానము? హేతుబుద్ధి ఏది? ఆమె వస్త్రములు లేకుండా కుక్కవలె తిరుగుతూ ఉంటే మీరు తిరుగనిచ్చుచున్నారా? కనీసపు సభ్యతను ఆమె మీరి తిరుగుచున్నది. దానిని ఆపు చట్టములు ఏవి?

166కెంటాకీలోని, ఈ లూయిస్విల్ లోనే కొన్ని వారాల క్రితం ఒకామె పేపర్లో తన పేరు పడాలని ప్లాస్టిక్ బికినీ వేసికొని బ్రవున్ హోటల్ ముందునుండి నడిచి వెళ్ళినది. ఒక పోలీసు ఆమెను అడ్డగించ ప్రయత్నించెను. ఆమె ఆగకుండా అతనిని చూచి నవ్వినది. ఆమెను ఆపుటకతడు తుపాకీని విసిరెను. ఆమెను కారులో త్రోసి అసభ్యకరమగు వస్త్రములు ధరించిన నేరము మీద పోలీసు స్టేషనుకు పంపెను. వారప్పుడు ఏమి చేసిరో మీరెరుగుదురా? పోలీసును ఉద్యోగము నుండి తొలగించిరి..

ఇంతగా చెడిపోయిన దేశమును దేవుడే చూడవలెను. తప్పు చేయకపోతే నీవు బ్రదుకలేవన్న స్థితికి వచ్చినది. మీరు బ్రదుక లేకపోవచ్చును గాని మనం పైకి లేవాలి; అందుకొరకే మనం చూచుచున్నాము. మన శరములు వంచుదము.

167ప్రభువైన యేసూ, ఆ గొప్ప కాపరి వచ్చి మమ్మును ఇందులోనుండి బయటకు లాగును గాక ప్రభువా, ఆయన కొరకు మేము ఎదురుచూచుచున్నాము. ఆ ఘడియ కొరకు మేము కనిపెట్టుచున్నాము. ప్రపంచము ఎంతో చెడిపోయియున్నది. ఇదిట్లే యుండునని నీవు చెప్పావు. ఈ ఘడియలు ఇక్కడికి వచ్చునని నీ గొప్ప ప్రవక్తలు ప్రవచించిరి. ప్రభువా, నీ ప్రవక్తలను మేము నమ్ముచున్నాము. దానిని మేము నమ్ముచున్నాము, ప్రభువా.

దేవా, ఈ వాక్యమునకు అర్ధమును మాకు చెప్పు ప్రవక్తలను ఇమ్మని నీకు ప్రార్ధించుచున్నాము. మా తప్పొప్పులను మేము ఎరుగగలము. అబద్ధ ప్రవక్తలు లేచుట మేము చూచుచున్నాము. వారు ఎడారులలో యున్నారు. సాల్ట్ లేక సిటీ, దేశములోని పలు ప్రాంతములు, అన్ని రకముల ఎడారులు, అన్ని విధముల రహస్య స్థావరములు, అన్ని రకముల దైవ తండ్రులు వారికి ఆటపట్టుగా యున్నవి. ఎక్కడ చూచినా వారే యున్నారు.

ఆ దీనులగు నల్లజాతి సోదర సోదరీలను చూడండి. వారికి సంలీనము కావలెను. అది వారి హక్కు. అది నిజంగా వారికి కావలెను; వారు మన సోదర సోదరీలు. కాని వారది పొందిన తరువాత ఎన్నడూ లేని విధంగా దిగజారిరి. వారు కమ్యూనిస్టులచే ఆవేశపరచబడిరని దానివలన అర్థమైనది. ఓ దేవా, ఆ దీన జనులు దానిని చూడగలరా? ప్రభువా, అది జరుగవలెను.

ISA 28:8

 

168రండి, అదే మనకు కావలెను. తండ్రీ, నీ పేర రమ్ము! మేము ఎదురుచూచుచున్నాము. ప్రభువా, రమ్ము! నీ చేతులలోనికి మమ్మును తీసికొనుము. మా పాపములను క్షమించుము. ఈ లోకములో న్యాయము ఇక లేదు. ఎక్కడ చూచినా విరోధ భావమే కనబడుచున్నది. అంతా పురుగులు తినివేసినట్లున్నది. ఏమీ గట్టితనము లేదు. శరీరమంతయూ పచ్చిపుండు వలె తయారయినదని నీవు చెప్పియున్నావు. నిజంగానే, ప్రతి బల్లయు వాంతితో నిండియున్నది. నీవిట్లు పలికావు? "ఎవరికి నేను హితబోధ చేయుదును? ఆ దినమున ఎవరికి నేను బోధపరచుదును?" ప్రభువు యొక్క బల్ల౦తయూ వాంతితో నిండియున్నది. ప్రభువా, దానిని మేము చూచుచున్నాము. ఆ ఘడియ ఇక్కడున్నట్లు చూచుచున్నాము. దయతో మాకు సహాయము చేయుము.

ప్రియ దేవా, జనులు ఆరిజోనాకు వచ్చుట గురించి ఎన్నో ప్రశ్నలడిగిరి. ఓ దేవా, వారు ప్రశస్తమగు ప్రజలు. వారు ఈ టేపును అక్కడ విందురు. వారు ఏమి చేయవలెనో, ఎక్కడ జీవించవలెనో శాసించు నియంతను కాదు నేను. దానిని వారు తేటగా గ్రహించెదరు గాక. ఆ ప్రాంతమును వారు ప్రేమించుచున్నచో, నేనును ఆ ప్రకారమే దానిని ప్రేమించుచున్నానని తెలుపుచున్నాను. తండ్రీ, వారినచ్చట ఉంచుము, కాని అక్కడుంటేనే ఎత్తబడుట జరుగునని వారు బోధించుట తప్పు. నేను ఒక దీనుడను, అయోగ్యుడను, అపవిత్ర పాపిని. దేవుని కృపచే రక్షింపబడితిని. వారు నాతో ఉండవలెనని కోరుకొనుచున్నారు. ప్రభువా, నేను పౌలువలె తిరుగుచున్నాను. పేతురు, యాకోబు, యోహానులు పాలస్తీనాలో ఎక్కడో సమాధి చేయబడిరి. జగత్తు పునాదికి ముందే నీవు నా పేరును ఆ గ్రంథములో వ్రాసినయెడల, నేను కూడా వారితోనే యుందునని ఎరుగుదును. దేవా, ప్రతిఒక్కరు అచ్చటుండవలెనని నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువా, వారినందరినీ నేను సమకూర్చ గలుగునట్లు సహాయము చేయుము. వారు వర్తమానమును వినగోరుచున్నారు. సహోదరుడు నెవిల్, సహోదరుడు కంప్స్, సహోదరుడు రాడేల్, సహోదరుడు జేటి, సహోదరుడు కలిన్స్, సహోదరుడు బీలర్, సహోదరుడు పామర్, ఇంకా ఎందరో గొప్ప బోధకుల వర్తమానము వారు వినగోరుచున్నారు. ఆ కృపను అనుగ్రహించుమని, దేవా, నీకు ప్రార్ధించుచున్నాను.

నిజంగా వినవలెననుకొను వారిని ఇచ్చటికి తీసికొని రమ్ము, ఎడారిలోనికి పరుగెత్తుట కాదు గాని నిజముగా దీనిని వారు వినవలెను. ఏది చేయవద్దని లేఖనము చెప్పుచున్నదో, ఖచ్చితంగా దానినే వారు చేయుచున్నారు. "ఇదిగో, ఆయన ఎడారిలో ఉన్నాడన్నచో నమ్ముకుడి. ఆయన రహస్య గదిలో ఉన్నాడని చెప్పినచో నమ్ముకుడి." ప్రభువా, వారిని హెచ్చరించుటకు శాయశక్తులా ప్రయత్నించుచున్నాను, కాని ఆ ఘడియ సమీపించినదని ఇదంతయూ సూచించుచున్నది. సాయంకాల నీడలు సాగుచున్నవి.

169ప్రభువా, కృప కొరకు ప్రార్ధించుచున్నాను. నా మీద కృప చూపుము. నాకు సహాయము చేయుము. అది నన్ను ఉద్రిక్తుని చేయుచున్నది. తండ్రీ, నాకు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను. ఎక్కడో ఎడారికి వీరందరినీ నడిపించి ఒక మతోన్మాద గుంపును గాని, ఒక మత విభాగమును గాని తయారు చేయుటకు నేను పనిచేయుట లేదు. ప్రభువా, ఆలాంటి పేరు నాకు రాకుండా కృప చూపుము. దీనికొరకు నేను గట్టిగా పోరాడాను. ఈ విషయములో నేను నాకు చేతనయినంత యధార్థంగా యున్నాను. దేవా, ఆలాగు జరుగనీయకుము. ఏదో విధంగా నాకు సహాయము చేయుము. ఏమి చేయవలెనో నాకు తెలియదు. నీమీదే నేను ఆధారపడియున్నాను. నీవు నాకు సహాయము చేయుము. నీవు నాతో ఏదో చేయమని చెప్పినా నేను చేయుదును. నేను నీ దాసుడను; వీరు నీ పిల్లలు. ప్రభువా, వీరిలో నూటికి తొంబది తొమ్మిదిమంది చాలా గట్టిగా యున్నారు. వారు నమ్ముచున్నారు; వారు ఎరుగుదురు; వారు గ్రహించియున్నారు. ఇది నా పని కాదని వారెరుగుదురు; కాని ప్రతి ఉజ్జీవమును ఇటువంటివి వెంబడించును, ఇది అందుకు అతీతమేమీ కాదు. కావున ఇప్పుడు మాకు సహాయము చేయమని ప్రార్ధించుచున్నాను.

ప్రభువా, కొద్దిగా భోజనము చేయుటకు వెళ్ళుచుండగా, మాకు సహాయము చేయుము. మా సహవాసమును దీవించుము. ఈ మధ్యాహ్నము మరల పెందలకడ మేము కూడుకొనునట్లు చేయుము. ప్రభువా, ఇప్పుడు చాలామంది ఇండ్లకు వెళ్ళనైయున్నారు. వారి ఇండ్లకు తిరిగి వెళ్ళవలసియున్నారు. వారికి నీవు సహాయము చేయమని ప్రార్ధించుచున్నాను. ప్రభువా, మిగిలిన ప్రశ్నలకు జవాబులను వారు టేపులో వినగలుగునట్లు సహాయము చేయుము. వారి ప్రశ్నలకు జవాబులు వారు వినలేకపోవచ్చును. ప్రభువా, వారికి సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను.

ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చుటకు ఈ రాత్రి నాకు త్వర త్వరగా సహాయము చేయుము. అందరి ప్రశ్నలకు జవాబులు ఇచ్చునట్లు నాకు కృప చూపుము. ఈ మధ్యాహ్నము తిరిగి మరల మనము కలిసికొను వరకు నీవు మమ్మును ఆశీర్వదించుము. యేసు నామములో నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

170నేనాయనను ప్రేమించుదును,

నేనాయనను ప్రేమించుదును,

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను, కల్వరి మ్రానుమీద.

అక్కడ వ్రాసియుంచాను, అది ఎల్లప్పుడు నా యెదుట కనబడునట్లుగా వ్రాశాను: "ఈ ప్రశ్నలకు నేను జవాబు ఇచ్చునప్పుడు, క్రీస్తు నా ముందున్నాడు." నా హృదయపూర్తిగా దీనిని చెప్పానని మీరు నమ్ముచున్నారా? మీకు సహాయము చేయుటకు ప్రతిది నా హృదయపూర్తిగానే చెప్పుచున్నాను.

వారి పార్శిల్సు తీసికొనుటకు ఎవరైనా ఇచ్చటికి రావచ్చును.

171ప్రియదేవా, ఇక్కడ చేతిరుమాళ్ళున్నవి, పార్శిల్సు ఉన్నవి. ఇవి రోగులకు, శ్రమపడుచున్నవారికి ఉపయోగపడును. వాక్యము యొక్క గొప్ప అనువాదకుడు, దానిని వ్రాసిన పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ మిగిలిన భాగము యొద్దకు వచ్చి, ఈ వస్త్రములను దీవించును గాక. ప్రభువా, నా గూర్చి నేనాలోచించుకొనుచున్నాను. నా శరీరము అపవిత్రమైనది, అశుభ్రమైనది. ఈ చేతిరుమాళ్ళమీద నా చేతులుంచలేను. అనేకుల జీవము మరియు మరణమునకు మధ్య నిలబడియున్నాను. ఓ దేవా, నేను వణకుచున్నాను. నీవు నన్ను చూచుటయే కాదు, నా స్వరమును వినుచున్నావు. ప్రభువైన యేసు రక్తము ద్వారా వాటియొద్దకు వచ్చుచున్నాను. నా పక్షముగా నీవు జవాబు ఇచ్చెదవని నేను విశ్వసించుచున్నాను. నీవే ఆ కార్యమును చేసియున్నావు, ఎందుకనగా నా ముందుగా నీవు వెళ్ళి మహోన్నతుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొనియున్నావు. ఆయన రక్తము ఒక పరిహారముగా అక్కడ పడియున్నది. ఆ రక్తము క్రింద నేను కప్పబడియున్నాను.

ప్రభువా, వారు అవసరతలో యున్నారు. వారిని నీవు స్వస్థపరచెదవని నమ్ముచున్నాను. వారు ఆలాగు ఇక పడియుండవలసిన అవసరము ఉండదు. ప్రతి ఒక్కరినీ నీవు బాగుచేయమని ప్రార్ధించుచున్నాను. వాటిమీద నేను చేతులుంచుచున్నాను. పౌలు వస్త్రములను వారు పంచుకొనిరని విన్నాము. ప్రభువా, అతడు కూడా కృప ద్వారా రక్షించబడిన పాపియే. అతడు జనులను గద్దించినా గాని వారతనిని నమ్మిరి. అతడే వారి కాపరియని నమ్మిరి. నీవే అతనిని పంపియున్నావని వారెరిగియుండిరి, ఎందుకనగా అతని పరిచర్య ద్వారా నీవది రుజవు చేసియున్నావు. దేవా, ఈ దినము ఈ ప్రజలు దానినే నమ్ముచున్నారు. ఇప్పుడు వారికి సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను. ప్రతి ఒక్కరినీ స్వస్థపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

MATT 4:4•

LUKE 4:4

 

172ఆకలిగా యున్నదా? మంచిది. ఈ ప్రశ్నల గూర్చి నేను ఎక్కువగా ఆకలిగొని యున్నాను. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." వీటిలో కొన్ని ప్రశ్నలకు నేను సరిగ్గా జవాబు ఇచ్చి యుండకపోవచ్చును. నాకు సాధ్యమయినదంతా నేను చేశాను. ఈ రాత్రికి మరల నేను 7 గంటలకు ప్రారంభించెదను. ఆలయము 6:30కు తెరచెదరు. ఉండగలిగినవారు ఉండవచ్చును. మంచిది. మీకర్ధమయియుండును. ఈ రాత్రికి వీలయితే, అన్నింటికీ జవాబు ఇచ్చుటకు ప్రయత్నించెదను. తిరిగి మనం కలిసికొను వరకు దేవుడు మిమ్మును దీవించు గాక!

ఇప్పుడు, అందరం లేచి నిలబడుదము. ఈ మంచి పాత పాట పాడుకొనుచుండగా, ముగించుదము. "యేసు నామమును మీతో కొనిపొండి."

యేసు నామమును నీతో కొనిపొమ్ము,

దుఃఖము, శ్రమతో నిండిన బిడ్డా;

అది నీకు ఆనందమును, ఆదరణను ఇచ్చును.

నీవు వెళ్ళు చోటకల్లా దానిని తీసికొని పొమ్ము,

ప్రశస్త నామము, ఎంత మాధుర్యము!

భూలోక నిరీక్షణ, పరలోకి ఆనందము.

ప్రశస్త నామము, ఓ, ఎంత మాధుర్యము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.

173ఈ ప్రకటన నేను చేయగోరుచున్నాను. వారు ఈ ఉదయమున ఒక ప్రేమ కానుకను స్వీకరించిరని బిల్లీ ఇప్పుడే చెప్పెను, చూచారా, ఎంతో ఇచ్చిరని విన్నాను. అతడు వెనక్కు వెళ్ళి ఆ భవనము చివర నిలబడవలెనని కోరుచున్నాను. సిద్ధపడి రాని వారితో చెప్పుచున్నాను. మీ భోజనమునకు ద్రవ్యము లేనిచో, మీ భోజనము కొరకు బిల్లీ ద్రవ్యమిచ్చును. మీ హోటల్ బిల్లు లేదా మోటెల్ బిల్లు మరేదయినా సరే చెల్లించండి. మీరు తీసికొని ఇప్పుడే చెల్లించండి. ఆ వెనుక బిల్లీ మిమ్మును కలిసికొనును. మీరెక్కడున్నాగాని మీ పేరును తీసికొని మీ భోజనము కొరకైన బిల్లును, మీ మోటేల్ బిల్లును చెల్లించును. నా కొరకు ఈ ఉదయము తీయబడిన ప్రేమ కానుక నుండి దానిని అతడు చెల్లించును.

తిరిగి మనం కలుసుకొనువరకు! తిరిగి మనం కలుసుకొనువరకు!

తిరిగి మనం యేసు పాదముల యొద్ద మనము కలిసికొను వరకు;

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...