ప్రశ్నలు మరియు జవాబులు #2
1ప్రార్థనకు ఒక్క నిమిషం లేచి నిలబడుదము.
ప్రియ దేవా, ఈ రాత్రి ప్రధమంగా మా రక్షకుడగు యేసుక్రీస్తును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. నీకు వందనములు చెల్లించుచున్నాము, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. దానిని నమ్ము జనులను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. మాకు ఒక దేవుడున్నందుకు ఎంతగానో మేము సంతోషించుచున్నాము, ఆయన ఒక ఊహాజనిత దేవుడు కాడు, ఒక ఊహాజనిత విగ్రహము కాదు, ఒక ఊహాజనిత ఆత్మ కాదు; ఆ విషయంలో ఊహకు ఏమాత్రము తావు లేదు — ఆయన నిజముగా జీవించుచున్నదేవుడు. ఆయన మనతోను, మాలోను, జీవించుచూ, మా ద్వారా పనిచేయుచున్నాడు. దేవునికి ఒక బొమ్మ తయారుచేయుట కాదు, కాని మేమే దేవునికి సజీవ స్వరూపములుగా యున్నాము. పరిశుద్ధాత్మ ఒక బొమ్మ ద్వారా మాట్లాడుట కాదు గాని, ఒక విమోచించబడిన పాత్ర ద్వారా మాట్లాడుచున్నది - దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. దీనిని బట్టి ఎంతగానో మేము వందనములు చెల్లించుచున్నాము. ఆ గొప్ప అగ్నిస్తంభము మమ్మును వెంబడించుచున్నది, లేదా దానిని మేమే వెంబడించుచున్నాము, ఆత్మ యొక్క గొప్ప ప్రత్యక్షతలు ఎప్పటివలెనె అవే కార్యములను చేయుచున్నది. అది భూమి మీదికి వచ్చినప్పుడు చేసిన కార్యములనే చేయుచున్నది. అది మాకెంతో ఆదరణను అనుగ్రహించుచున్నది.
ప్రభువా, ఈ రోజు రాత్రి మేము నీ సహాయము ద్వారా మంచి క్రైస్తవులముగా ఉండు విధానమును నేర్చుకొనుటకే ఇచ్చటకు వచ్చియున్నాము గాని మరే ఇతర ఉద్దేశముతోనూ రాలేదు. మేము సమీపించుచున్న ఈ ఘడియకు సరిపడు పాత్రలుగా ఉండునట్లు చేయుము. ప్రభువా, నీవు మాకు సహాయము చేయుము. నీవు మాకు అవసరము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చోవచ్చును.
2దాదాపు మరో ముప్ఫయి లేదా నలుబది ప్రశ్నలున్నవి. వాటి నెట్లు పూర్తి చేయుదునో నాకు తెలియదు. ఈ మధ్యాహ్నము కనీసం మామూలుగా చెప్పగలిగినన్ని చెప్పవలెనని గట్టిగా ప్రయత్నించాను గాని కుదరలేదు. ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చుటకు నేను శాయశక్తులా ప్రయత్నించెదను. ఇది నేను నిశ్చయముగా చెప్పెదను, ఎందుకనగా అవి చాలా మంచి ప్రశ్నలు, క్రైస్తవుల హృదయములలో నుండి వచ్చినవి. నాకు తెలిసిన అన్ని విధములుగాను నేను వాటికి జవాబిచ్చుటకు శాయశక్తులా ప్రయత్నించుచున్నాను. వివేచన పూర్వకముగా వాటికి జవాబు ఇయ్యవలెను. ఈ ఉదయమున ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చుటకు ప్రభువు సహాయము చేసెను. ఆయనకు వందనములు చెల్లించుచున్నాను.
ఇప్పుడు, అన్నీ ఇచ్చట కలగలుపుగా యున్నవి. ఇంకా 150 ఉన్నవనుకొనుచున్నాను. ఈ ఉదయం దాదాపు ఇరవై పూర్తి చేశాము. దీనిని ప్రారంభించు ముందుగా ఒక విషయము మీతో చెప్పగోరుచున్నాను, పత్రికలోని ఆ వ్యాసమును తెచ్చాను, "డ్రమ్స్ మ్రోగుచుండగా చర్చి గంతులు వేయుచున్నదను" అంశముతో ముద్రించిరి. ప్రెస్బిటేరియను సంఘ కాపరి తన సంఘమును రాక్-అండ్-రోల్ ద్వారా నడిపించుచున్నాడు. ప్రభురాత్రి భోజన ఆరాధన కార్యక్రమములో ఇది ఏర్పరచెను. ఒక నిమిషము దానిని నేను చూచెదను.
3ఆ జాజ్ (jazz) సంగీతమునకు యువకులు ఉర్రూతలూగుచున్నారు. సిలువ మరణమును వారు రాక్-ఎండ్-రోల్ మీద చిత్రీకరించి గానము చేయుచున్నారు. సంఘ కాపరి ఆ యువతీ యువకులను ఆలాగు నడిపించుచున్నాడు. క్రీస్తు మరణమును వారు రాక్-అండ్-రోల్, జాజ్ ధ్వనుల మీద ఆలపించుచున్నారు. అది మేరీలాండులో జరిగినది. ఆశ్చర్యముగా లేదా?
ఇదిగో, ఇక్కడ ఆ ఛాయాచిత్రము… ఈ ఉదయమున నేను ఆ బీటల్స్ గూర్చి చెప్పియున్నాను, "బీటిల్స్ పునరాగమనం" అను శీర్షికన ఆ వ్యాసము వ్రాసిరి. ఆ పత్రికలో మీరు దానిని చదువవచ్చును. ఇంకా చాలా సంగతులున్నవి. ఒక క్రొత్త మతమును వారు కనుగొనిరి. పేపరులో పడిన దానిని నేను తీసికొని వచ్చాను. వారియొక్క మేనేజరు… మనకు సమయము లేదు గనుక మీలో ఎవరయినా చదువగోరినచో బులెటిన్ బోర్డు మీద అది ఉండును, చదవండి. మనము ఏ ఘడియలో జీవించుచున్నామో మీకు చూపించుచున్నాను, ఆశ్యర్యము కలిగించును. దానిని మీరు అర్ధము చేసికొనలేకపోవచ్చును, కాని ఈ సంగతులను జనులు అర్థము చేసికొనుటకు ప్రయత్నించవలెను. సహోదరుడు కాప్స్ ను నేనడిగాను - అతడు మంచి విద్యావంతుడు. అతడు నాకంటె బాగా చదవగలడు. ఆ బీటిల్స్ మేనేజరు వ్రాసిన వ్యాసమును చదువమని అతనిని నేనడిగియున్నాను. కాప్స్ సోదరుడా, ఈ సమయములో ఆలాగు చేయగలవా?
4[బీటిల్స్ మీద వ్రాసిన వ్యాసములను కాప్స్ సహోదరుడు చదువుచున్నాడు.] ఇట్లున్నది:
బీటిల్స్ తమను గూర్చి తామే ఆశ్చర్యపడిరి మరియు జవాబు చెప్పలేదు. "అది అద్భుతము, నమ్మలేని నిజం" అని డెరిక్ టేలర్, బీటల్స్ వార్తా నిర్వాహకాధికారి (press officer) చెప్పెను. లివర్-పూల్? నుండి ఇచ్చటికి నలుగురు బాలురు వచ్చిరి. వారు మొరటు వారు, వ్యర్థపు మాటలు పలుకువారు, అసభ్య పదజాలమును ఉపయోగించువారు. వారు ప్రపంచమును ఆక్రమించిరి. వారు ఒక క్రొత్త మతమును కనిపెట్టినట్లున్నారు, వారు పూర్తిగా క్రీస్తు విరోధులు, నేను కూడా క్రీస్తు విరోధినే; కాని వారు ఎంతగా క్రీస్తు విరోధులంటే నాకే సంచలనము కలిగించిరి. అది ఏ మాత్రము సుళువైనది కాదు. వారి ముందు నేను తలదించుకొన్నాను. అందరూ ఆలాగే యుండాలి? "వారి యధార్థత ముందు నేను పనికిరాను. ఎక్కువగా కోపముతో నిండిన ప్రజలే వారిని ఎక్కువగా ఇష్టపడుచున్నారు."
"ఉదాహరణకు ఆస్ట్రేలియాలో మేము విమానాశ్రయమునకు చేరిన ప్రతిసారి మమ్మును డి-గాల్ వచ్చినట్లు, ఇంకా చెప్పాలంటే మెస్సీయా వచ్చినట్లు ప్రజలు భావించుచున్నారు. రహదారుల ప్రక్కలందు జనులు బారులు తీరి నిలుచున్నారు. కుంటివారు తమ కర్రలను విసిరి వేసిరి. రోగులు కార్డు యొద్దకు పరుగిడి వచ్చిరి. వారిలోని ఒకరు అంటుకొంటే చాలు స్వస్థత వచ్చునని భావించిరి. మేము వెళ్ళుచుండగా, వృద్ధ స్త్రీలు తమ మనుమలను ఎత్తికొని నిలబడి చూచుచుండిరి. వారి ముఖముల మీది చూపులను నేను చూచాను. ఒక రక్షకుడు వచ్చేనన్నట్లు వారి ముఖములు వికసించెను. ప్రజలు సంతోషించుచూ హాయిగా నిటూర్చిరి. ఇప్పుడు మంచి రోజులు వచ్చెనన్నట్లు భావించిరి." టేలర్ ఆగి తన నోట్లో సిగరెట్టు అంటించెను, "స్వస్థతా పర్యటనకు వెళ్ళుట ఒక్కటే బీటిల్స్కు మిగిలియున్నది," అని అతడు చెప్పెను.
MATT 7:22•
MATT 24:24•
MARK 13:22
5ఆయన చెప్పినది అదే గదా? "అనేకులు ఆ దినమున నా యొద్దకు వచ్చి నీ నామమున ఇది మేము చేయలేదా?" అని పలుకుదురు. చూచారా? స్వస్థతా కూటములను కూడా నమ్మలేని రోజులు వచ్చియున్నవి. అటువంటి ఏ సూచనను మీరు నమ్మజాలరు. బైబిలు నుండి వచ్చిన "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" నందు మాత్రమే మీరు విశ్వాసముంచవలెను. సంఘమా, మిమ్మును ఖచ్చితంగా అక్కడే నిలిపియుంచవలెనని నేను ప్రయత్నించాను, మీరు నా పిల్లలు. నాకేదయినా జరిగి, ఈ భూమిమీద నుండి దేవుడు నన్ను తీసికొనినచో, మీరు ఎన్నడూ తప్పిపోకూడదు. దానిని మీ పూర్ణ హృదయముతో గుర్తుంచుకొనండి. వాక్యముతో నిలచియుండుడి! వాక్యమును మీరు విడిచిపెట్టవద్దు. దానికి వ్యతిరేకముగా యున్నదానిని విడిచిపెట్టండి. అదెంత గొప్పదయినా కావచ్చు. ఇదే నిజమని మీరు తెలిసికొనుడి, చూచారా.
ఇప్పుడు ఒక స్వస్థతా కూటము! పాపాత్ములు తమ చెడ్డ, మురికి, బూతు మాటలతో తమ స్వంత మేనేజరులనే ఆశ్చర్యపరచుచున్నారు. వారిని చూచి జనులు తమ ఊత కర్రలను విసిరివేయుచున్నారు. వీరి వైపు చూచి వారు స్వస్థత పొందుచున్నారు. ఇది చాలా మురికి గాను, అంత్యక్రీస్తుగాను యున్నది, చూచారా. ఇది సాతాను జరిపించు ఒక అపహస్య కూటము, చూచారా. క్రీస్తు చేయగలిగిన ప్రతిదానిని అది చేయగలదు గాని, వాక్యమును మాత్రము స్థిరపరచజాలదు, చూచారా. అది వాక్యములో కొన్ని కొన్ని భాగములను తీసికొనును, అంతేగాని మొత్తం తీసికొనదు, చూచారా. మొత్తం వాక్యమును తీసికొనజాలదు. క్రీస్తువిరోధి యొక్క ఆత్మ సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునని బైబిలు చెప్పినదానిలో ఆశ్చర్యము లేదు.
వారి స్వంత ప్రెస్ మేనేజరు, ప్రెస్ ప్రతినిధి చెప్పెను, అతడు కూడా వారి వలన పట్టబడెను. వారతనిని స్వాధీనపరచుకొనిరి, వారినతడు నమ్ముచున్నాడు.
MATT 7:16,20
6అవి చెడ్డ కార్యములు… స్త్రీలారా, చూడండి. ఈ పొట్టి దుస్తులు ధరించుట గూర్చి జుట్టు కత్తిరించుట గూర్చి అందుకే నేను చెప్పుచున్నాను. అది ఒక ఆత్మ. అది ఒక ఆత్మ! దానిని ఇక్కడ మన ప్రముఖ దిన పత్రికలలో చూచుచున్నాము. సంఘములలో రాక్-అండ్-రోల్ చూడండి. అది నిశ్చయంగా సాతాను యొక్క కార్యక్రమము. వాటిని సంఘములని, శాఖలని ఇంకా పిలచుచున్నాము.
పిల్లలారా, వీలయినంత తొందరగా వాక్యము నొద్దకు తిరిగి రండి. దానిని విడిచి పెట్టుటకు తెగించవద్దు. ఆ వాక్యముతోనే నిలచియుండండి.
ఆ క్రీస్తువిరోధి ఆత్మ ఎట్లు పనిచేయుచున్నదో చూడండి, అది భాషలతో మాట్లాడుచున్నది, అద్భుత కార్యములు, సూచక క్రియలు చూపించుచున్నది; రోగులను బాగుచేయుచున్నది; అన్ని కార్యములను చేయకలుగుచున్నది. చూచారా? దేవునినే సమీపించుచున్నామని ఆ జనులు తలంచుచున్నారు. వారిని దేవుడు పంపెనని భావించుచున్నారు, ఎందుకనగా సంఘము వాక్యమును నిరాకరించినది.
ఆ కుర్రవాళ్ళు సంఘమునకు చెందినవారు. ఎల్విస్-ప్రెస్లీ ఒక పెంతెకోస్తు. పాట్-బూన్ ఒక చర్చి-అఫ్-క్రైస్ట్ వాడు. ఆ పెంతెకోస్తు వారిని, చర్చి-అఫ్-క్రైస్ట్ వారిని చూడండి. వారందరూ తమ మీద దురాత్మ కమ్ముకొనవలెనని ఆరాటపడుచున్నారు. రెడ్ ఫోలే, బంగారు స్వరము గల వ్యక్తి, చర్చి-అఫ్-క్రైస్ట్ వాడు. మత సంబంధమగు పాటలు అతని వలె ఎవరూ పాడలేరు. అవి పాడిన వెంటనే రాక్-అండ్-రోల్ పాటలు ఆ విధంగానే పాడును. స్వరములు మార్చగలడు. వారి ఫలములు వలన వారిని నీవు తెలిసికొందువు. వారే సంఘములకు చెందియున్నారో చూడండి. ఎల్విస్-ప్రెస్లీ అసెంబ్లీ-ఆఫ్-గాడ్ సభ్యుడు. ప్రతి ఒక్కరికి ఒక సంఘ సభ్యత్వము కావలెను. సాతాను వారికది ఇచ్చెను.
స్నేహితులారా, చూడండి, వాక్యమును మాత్రము మీరు విడిచిపెట్టకుడి. చూడండి, ఒక ఆత్మ వారిని వశపరచుకొన్నది.
MATT 5:28
7ఈ స్త్రీలకు చెప్పుచున్నాను, వారు తమ ఈ వస్త్రముల ద్వారా తమను తాము ఆకర్షణగా కనిపించాలనుకునేటప్పుడు, వారు వ్యభిచారము చేసినందుకు గాను దేవునికి జవాబు చెప్పవలసియున్నారు. నన్ను మీరు దేవుని దాసునిగా, ప్రవక్తగా నమ్ముచున్నయెడల, నేను మీతో చెప్పుచున్నదానిని ఆలకించుడి, చూచారా. దీనిని మీరు అర్థము చేసికొనలేకపోవచ్చును. అర్ధము కాకపోయినా, నేను మీతో చెప్పినట్లు చేయుడి. నేను చెప్పుచున్న దానికి దేవుడు నన్ను లెక్క అడుగును, చూచారా. బహు జాగ్రత్తగా వినండి. ఈ కార్యములు ఆత్మ ద్వారానే జరుగుచున్నవని గుర్తుంచుకొనండి.
చర్మపు చొక్కాయిలు వారికి దేవుడు తొడిగించెనను వర్తమానమును కొద్దికాలం క్రిందట ఇక్కడ నేను బోధించాను. మీకు గుర్తుండియుండును. (చూడండి, చూచారా?) - చర్మపు చొక్కాయిలు, ఈ సంగతులను చెప్పుటకు, ఈ పరిస్థితులను మార్చుటకు మనలో కొందరము పంపబడియున్నామని మీరు గుర్తుంచుకొనండి, చూచారా. ఇది ముందు జ్ఞానము; దేవుడు మాట్లాడుచున్నాడు, చూపించుచున్నాడు. శరీరము ద్వారా నీవు దేనికయినా తీర్పు తీర్చినచో వారు నిరపరాధులే. (ఇక్కడ చూడండి), ప్రజలు మంచివారే, యధార్థపరులు, అబద్ధము చెప్పగోరరు, కాని అపవాది వారిని పాడుచేయుచున్నది. మతమును, స్వస్థతా కూటమును వారు ఏర్పరచుచున్నారు, చూచారా. ఖచ్చితంగా క్రీస్తు విరోధులే, చూచారా. వారు ప్రెస్బిటేరియనులు మరియు వారి శాఖలను చూడండి, వారును ఆ విధంగానే క్రియలు చేయుచున్నారు.
MATT 24:24•
MARK 13:22•
2TIM 3:2-5
8ఇంగ్లాండులోని, లండన్ లో ఈ మధ్యనే ఒక రాక్-అండ్-రోల్ బృందము క్రీస్తును, యూదాను అనుకరించి ప్రదర్శన ఇచ్చిరి. వారు క్రీస్తును డాడీ అని పిలచిరి. మతిపోయిన వారి మాటలన్నీ ఆయనకు అంటగట్టిరి. చూచారా? యుక్త వయస్కులు ప్రపంచమును స్వాధీనపరచుకొనుచున్నారు. బైబిలు ముందుగానే దీనిని చెప్పెనని మీరెరుగుదురు. వారు కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, అబద్ద సాక్షులు తల్లిదండ్రులకు అవిధేయులు. (చూచారా?), యుక్త వయస్కులు ప్రపంచమును దోచుకొనుచున్నారు, అది జరుగుచున్నది.
ఒక రోజున ఒక చోటకు వెళ్ళాను; వారు ఒక రకమగు జూదమును ఆడుకొనుచున్నారు, అది అపవిత్రమగు ఆట. నా కుటుంబమును అక్కడికి నేను తీసికొని వెళ్ళుటకు ఇష్టపడలేదు. "ఆ రికార్డు ఎంత ఖరీదు?" అని అక్కడున్న స్త్రీని అడిగాను. వారు ఆ పాటలు వేయుచున్నారు.
"ఒక్కొక్కటి పది సెంట్లు" అన్నది.
"ఒక గంటలో ఎన్ని రికార్డులు వినగలము?" అనడిగాను. ఆమె నాకు చెప్పినది. నేను ఆమెకు డబ్బు ఇచ్చి, "ఆ ప్లగ్ ను తీసివెయ్యి!" అన్నాను.
"నేను కాదు. ఆ బాలురు వచ్చి దానిని పని చేయించెదరు," అన్నదామె.
నేను వెంటనే నా డబ్బును అక్కడ ఖర్చుపెట్టకుండా మరో చోటికి వెళ్ళాను, చూచారా. ఆ పాటలు మిమ్మును ఉద్రిక్తతకు గురిచేయును. ఆ పిచ్చి పాటలు వినిన తరువాత నీవు వెళ్ళి నిద్ర మాత్రలు మ్రి౦గవలసియుండును. అది క్రైస్తవునిగా అసహ్యము కలిగించును. నీవు అటువంటి వాటిని ఇష్టపడుచున్నచో నీలో ఏదో పొరపాటున్నదని గ్రహించగలను. అలాగయితే నీవు రక్షింపబడవలసియున్నావు, ఎందుకనగా నిన్ను వాక్యము గాకుండా మరియొకటి పోషించుచున్నది.
యేసు అటువంటి వాటిలో పాల్గొనగలడని నీవూహించగలవా? ఏ ప్రవక్త అయినా అట్టి వాటిని ఇష్టపడునని నీవనుకోగలవా? స్నేహితులారా, చూడండి, అదంతయూ అపవాదికి సంబంధించినది. వాడు మతపు ముసుగులో వచ్చునని బైబిలు చెప్పుచున్నది. క్రీస్తు చేసిన కార్యములనే నిశ్చయముగా చేయును. చూచారా? ఈ సంఘములో చేరుట, ఆ సంఘములో చేరుట కాదు గాని వాక్యముతో నిలచియుండవలెను. ఆయన వాక్యమైయున్నాడు. దానిని బట్టియే నిన్ను గుర్తుంచుట జరుగును.
9ప్రభువు, మీ ప్రతి ఒక్కరిని దీవించును గాక. మనము వెంటనే ప్రశ్నలలోనికి వెళ్ళుదము. గంట పదిహేను నిమిషములు సమయమున్నది. ఈ ప్రశ్నలన్నింటికీ నేను జవాబు చెప్పలేకపోవచ్చును. చాలా పోగయి యున్నవి. అవి మంచి ప్రశ్నలని నేను తలంచుచున్నాను. అవి చాలా మంచి ప్రశ్నలు. వాటిని నేను తీసికొని ఒక్కొక్కటి చదువుచుందును.
ఈ రాత్రికి నేను వచ్చునప్పుడు ఎవరితోనయినా చదివించి వెంటనే "అవును" లేదా "కాదు," అను జవాబులు ఇస్తే బాగుండునని తలంచాను. కాని అది ప్రజలకు న్యాయము చేసినట్లుండదు. జవాబులు పొందవలెనని వారు ప్రశ్నలడిగిరి. ఆలాగు నేను చేయను. వీలయినన్ని ప్రశ్నలకే జవాబు చెప్పెదను. చెప్పలేని వాటికి మరల సమయము వచ్చు వరకు ఎదురు చూచెదను.
వచ్చే ఆదివారము కావచ్చు, నాకు తెలియదు. వచ్చే బుధవారం లోపు బిల్లీని మీరు కలవండి.. బహుశా మేము వెళ్ళవలసియుండును.
10ఒక సంగతి చూడండి. చాలామందిని చూడలేకపోయాను. చూడవలెనని వచ్చిన వారు ఎందరున్నారో బిల్లీ చెప్పెను. ఆ కార్డులు పోగుపడియున్నవి. అందులో కొందరు నెలల తరబడి ఎదురుచూచుచున్నారు. ఇచ్చటికి నేను వచ్చినప్పుడు అందులో కొందరిని కలిసికొందును. కొందరిని కూటములో కలిసికొందును. వారిని కలిసికొనుటకు నాకు చేతనయినదంతా చేయుచున్నాను. ఈ వారము నేను ఇట్లు ప్రార్ధి౦చెదను, "ప్రభువా, ఈ విషయములో నేనేమి చేయవలెను? ఎట్లు వీరిని కలిసికొనగలను?" వారిని నేను కలిసికొనుటకు ఆదివారము వచ్చినచో ఇక్కడ కాకుండా మరొక చోట కలిసికొందును. దినమంతా అందుకే వెచ్చించెదను. ఆలాగు నాకు సాధ్యపడనియెడల మరల నేను తిరిగి వచ్చు వరకు అది వాయిదా వేయుదును. నేను మీకు జవాబు ఇచ్చెదను. బిల్లీ ఆ కార్డు మీకు పంపించును.
మీకు చెప్పుచున్నాను; ఈ ప్రియమగు పిల్లలు చాలా మంచివారు. వారు ఒకరి నొకరు ఎట్లు ఇష్టపడుచున్నారో చూడండి. వారికి ఒకరిపట్ల ఒకరికి ప్రేమ యున్నది. ఒకరిగురించి ఒకరు ప్రశంసించుచున్నారు. బిల్లీ ఒక వైపు వారిని పిలచును. దాదాపు నూట-ఏబది మైళ్ళ దూరము. వారు ఆ మిగిలినవారిని పిలచుచుందురు. వారు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. వారు దేనినీ పోగొట్టుకొనుటకు ఇష్టపడరు. ఇక్కడికి వచ్చి జరుగుచున్న దానిలో పాలు పొందవలెనని వారు ప్రతి నిమిషము ఆలోచించుచుందురు. ప్రభువు ఇచ్చు దానిని వారు పొందుటకు ఆశించుచున్నారు. వారిని నేను అభినందించుచున్నాను.
11ప్రియ స్నేహితులారా, గుర్తుంచుకొనండి. ఈ ఉదయమున కొన్ని ప్రశ్నల గూర్చి నేను వ్యాఖ్యానించాను. కొన్నింటిని నేను గమనించాను. (అవును!) ప్రజలు ఆరిజోనాకు తరలి వెళ్ళుట గూర్చియే ఎక్కువగా ప్రశ్నించారని ఉదయాన గ్రహించాను. చూచారా? దానిని మీరు అర్థము చేసుకొనునట్లు, ఇంకా వివరముగా చెప్పవలెనని తలంచాను.
ప్రజలు ఎక్కడ జీవించవలెనో, ఏమి చేయవలెనో నేను శాసించుచున్నానని తలంచకండి, మరియు.. నా ప్రియ సోదరులారా, వినండి. యధార్థముగా తరలి వెళ్ళవలెననుకొనుచున్న వారున్నారు. నిజంగా అక్కడికి వెళ్ళి నివాసమేర్పరచుకోవాలని మీరనుకొంటే సంతోషమే. అక్కడ నున్నంతకాలము మీకు బాగుండును, కాని అక్కడికన్న పది వంతులు ఇక్కడే ఉండెదను. ఇప్పుటి నుండి క్రిస్మస్ కు మధ్య అక్కడ నాలుగు రోజులు మాత్రమే ఉందును. ఆ వెంటనే విదేశములకు వెళ్ళుదును. విదేశములకు వెళ్ళక ముందు ఈ ఆలయములో రెండు లేదా మూడు వారములుండి, ఎప్పటి వలెనె వసంత కాల ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసెదను. ఆ తరువాత ఆరిజోనాలో ఒకే ఒక కూటముండును. అది జనవరిలో జరుగును. ఫీనిక్సులో రెండు రాత్రులు మాట్లాడుదును. అది క్రైస్తవ వ్యాపారుల కూడిక, చూచారా. ఆ టేపులు మీరు త్రిప్పగలరా?
12ఈ రాత్రికి మరల ప్రశ్నలను ప్రారంభించుదము. ఒక దానిని ఇందులో నుండి తీయుదును. వినుటకు సిద్ధపడిరా? ఆమేన్ చెప్పండి. ఈ సమయమున అది మనకు ఉపయోగకరమని నమ్ముచున్నాను. ఈ ఉదయమున ఇక్కడికి రాక ముందు వాక్యమును చూచాను. బైబిలులో కొన్ని సందర్భములను చదివాను. ఎంత అద్భుతముగా యున్నది! ప్రభుని రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. పాత నిబంధనలోని విశ్వాస వీరులను మరల చూచుట ఎంత అద్భుతము! యోబు మరియు అందరినీ మరల అధ్యయనము చేస్తే బాగుండును. ధారావాహికగా వారిని గూర్చి మాట్లాడుకొనే కూటములు ఏర్పాటు చేసినచో బాగుండును. (అది బాగుండదా?) ఈ దినమునకు వారెంత మాదిరిగా యున్నారో చూడవలెను. (వాక్యమంతా ముడిపడును) ప్రళయములను గూర్చి - ఆనాది కాలములు గూర్చి చెప్పుకొనవలెను. నేటికవి సరిపడును. పాత నిబంధనలోని ప్రతి అంశము ప్రభువైన యేసు రాకను గూర్చి మాట్లాడుచున్నది.
13ప్రశ్న: ఇప్పుడు మొదటి ప్రశ్నను లాగాను, బ్రెన్హా౦ సోదరుడా, క్రైస్తవులు ఉంగరాల జుట్టుకు పిన్నులు ధరించుట తప్పా? ఆలాగే ఆమె గౌను చేతులు ఎంత పొడుగుండవలెను? నీకు వందములు, ఒక సోదరీ.
ఆమెకది ఎంతో అవసరమైయున్నది. మనలో కొందరు సోదరులు ఇదేమి ప్రశ్న అనుకోవచ్చును గాని ఆమెకది అర్థవంతమైనదే. ఆమె దానిని తెలిసికొనగోరుచున్నది.
జడలు వేసికొనుట గూర్చి ఇంకా కేశాలంకరణ గూర్చి మనం మాట్లాడుకొన్నాము. నన్ను మన్నించండి. ఉంగరాల జుట్టుకు పిన్నులు గూర్చి అడిగిరి. క్షమించండి. చాలా సంవత్సరాల క్రితం ఆడవారు వాటిని వాడేవారు. మీకు గుర్తు౦డును. జడలు కాదు - పిన్నులు. అంతే గదా? వాటిని జడలనే వారు. అవి ఒకరకమగు ఉంగరములు. క్రిందికి వ్రేలాడెడివి గదా? స్నేహితులారా, క్షమించండి. పిన్ ఉంగరములు.
"ఎంత పొడుగు చేతులుండవలెను?" నాకు తెలియదు. అది వేరే ప్రశ్న. చూచారా? బైబిలులో నుండి చూచి దానిని మీకు చెప్పలేదు. దానిని గూర్చి ఎక్కువగా చెప్పగోరుట లేదు.
14నా కొరకే దీనినిప్పుడు మీకు చెప్పుచున్నాను, ఎందుకనగా దానికి నాకు వాక్యాధారము లేదు. స్త్రీలతో నేను చెప్పే ఒకే ఒక మాట ఏమనగా, మీరు జుట్టు కత్తిరించుకోవద్దు. దానిని వారెట్లు దువ్వుకొందురో అది వారే చూచుకోవలెను. పిన్ ఉంగరములు గూర్చి అడిగారు కాని అసలవి ఏమిటో నాకు తెలియదు. బట్టతో చేసిన పిన్నులు వీరు ధరించుకొనుచున్నారు. అదొక్కటే నాకు తెలియును.
గౌను యొక్క చేతుల పొడవు నాకు తెలియదు, కాని క్రైస్తవులమైన మనకు ఈ విషయములను గురించి దేవుడు తెలియచేయును. మీరు చూచారా? క్రైస్తవులుగా మీకు వాటిని గూర్చి నిర్ణయించుకోగల శక్తి యున్నది. పొడవులను దేవుడు నిర్ణయించునని నేను తలంచను. నీవు సభ్యముగాను, పవిత్రముగాను, మర్యాదగాను కనబడవలెను. అది మంచిదని నేను తలంచుచున్నాను. మీరాలాగు అనుకొనుట లేదా? అది నా అభిప్రాయము, ఎందుకనగా నాకు వాక్యాధారము అందుకు లేదు.
15ఈ ఉదయమున జుట్టుకు రంగు వేసికొనుటను గూర్చిన ప్రశ్న వచ్చినది. రంగుతో అదుకొనుట గూర్చి అడిగిరి. దానిని గూర్చి నేనేమియూ చెప్పలేను. నాకు తెలియదు, మీ జుట్టుకు రంగు వేయరాదని చెప్పు లేఖనము నాయొద్ద లేదు.
ఇప్పుడు స్త్రీ లైన మీరు చూడడానికి చక్కగా కనబడవలెనని కోరుకొందురు. మీరు అందంగా కనబడవలెను. బ్రెన్హాం సోదరుడు, పిల్లలైన మీకు విరోధి కాడు. మీరు నా పిల్లలు; మిమ్మును నేను ప్రేమించుచున్నాను. మీ మీద కేకలు వేయుట కాదు. మీకు సహాయము చేయుటకు ప్రయత్నించుచున్నాను; ఇంకో కారణము లేదు.
ఇప్పుడు చూడండి, ఆ ప్రశ్నకు జవాబుగా దీనిని చెప్పుచున్నాను. మీరు సిద్ధముగా యున్నారా? సోదరీలారా, మీ నిమిత్తమే టేపు చేయుచున్నాను. అందులో మీకు ప్రశ్న వచ్చినచో ఆలాగు చేయవద్దు. మీరు దేవుని ఆత్మతో నింపబడి దానిని చేయుటకు నడిపించబడిన యెడల, లేఖనముతో అది విభేదించనియెడల, ప్రశ్న తలెత్తనియెడల, అది ప్రభుని చిత్తమని మీరు పూర్తిగా సంతృప్తి చెందినయెడల, ఆలాగు చేయుడి, చూచారా, ఎందుకనగా దానిని వద్దని చెప్పే వాక్యము లేదు. బైబిలులో అందుకు తగిన వాక్యమేమీ కనబడదు.
ISA 3:22•
1COR 11:15
16యెషయా 5, స్త్రీల గురించి మాట్లాడుచున్నదని నేనెరుగుదును. వారెట్టి వస్త్రములు, అభరణములు ధరించెదరో వ్రాయబడినది. గర్వమును, అహంకారముగాను, డంబమును అది తెలియచేయును. మీరు గర్వము కొరకు దానిని చేసినయెడల అది తప్పు, చూచారా. దేవుని ఎదుట మీ హృదయమును పరీక్షించుకొనుడి, దానికి లేఖనాధారము లేనియెడల, ఆత్మ నడిపింపు ప్రకారము చేయుము. కాని జుట్టు పెంచుకోవలెనా, కత్తిరించుకోవలెనా అని ప్రశ్న వచ్చినచో, పొడవైన జుట్టుండవలెనని బైబిలు చెప్పుచున్నదని గ్రహించండి.
ఇక్కడ ఒక ప్రశ్న యున్నది; దీనికి నేను జవాబు ఇయ్యవచ్చును. ఈ ఉదయమే దానిని నేను చూచాను. చెప్పెను, "నీవు ఎప్పుడూ ఆడవారినే దుయ్యబట్టుచున్నావు. వారి జుట్టు గూర్చి నొక్కి చెప్పుచున్నావు. మరి మగవారి గూర్చి ఏమీ చెప్పవేమీ?"
GEN 3:4•
1COR 11:14•
1TIM 3:5
17ఒక పురుషుడు ఇక్కడికి స్త్రీవలె పొడవుగా వెంట్రుకలు పెంచుకొని వచ్చినచో నేనిట్లందును, "నీవు క్షారశాలకు వెళ్ళి జుట్టు కత్తిరించుకు రా! నీవు స్త్రీ వలె కనిపించుచున్నావు," అందును. చూచారా? కాని మగవారు ఆ విధముగా చేయరు. మగవారు తప్పుకు అతీతులని నేను చెప్పుట లేదు. వారును స్త్రీ వలె దోషమునకు గురి ఆగును.
తన భార్యకు ఆ విధముగా ప్రవర్తించుటకు అనుమతించు మగవాడు రెండింతల దోషమును భరించవలసియుండును, ఎందుకనగా గృహమును పురుషుడు ఏలుబడి చేయవలెను. తన స్వగృహమును ఏలుకోకొనలేనివాడు దేవుని మందిరమును ఎలా చక్కదిద్దగలడు? చూచారా?
ఇక్కడికి వచ్చుచున్న స్త్రీల గుంపును బట్టి నేను వందనములు చెల్లించుచున్నాను. దీనిని గౌరవముతోను, ప్రేమతోను చెప్పుచున్నాను. ఇది సత్యమని దేవునికి తెలియును. దక్షిణాదిన నాకు ఒక బోధకుడు స్నేహితునిగా ఉండేవాడు. నేను చూచిన వాటన్నింటిలో అది చాలా పరిశుభ్రముగా కనబడిన సంఘము. నేనెన్నడూ చూడని అందమగు స్త్రీలు అక్కడికి వచ్చుచుండేవారు. చాలా భక్తిగాను, పవిత్రముగాను ఉండేవారు. పొడవైన తలవెంట్రుకలుండేవి. ఆ సంఘమునకు వెళ్ళుట నాకు ఎప్పుడూ ఆనందముగా ఉండేది. దానిని మించిన ఒక సంఘమును ఈనాడు ప్రభువైన యేసు నాకిచ్చెను. నా స్త్రీలు వారికంటె ఇంకా వందమైళ్ళు దాటి వచ్చిరి.
మిమ్మును అనాగరికులుగా ఉండమని నేను గద్దించుట లేదు. మీ బట్టి నాకెంతో ఆనందముగా యున్నది. సాతానుకు ఎక్కడా అడుగుపెట్టుటకు చోటియ్యరాదు, చూచారా? మీరు ముందుకే సాగిపోవలెను గాని వెనుకకు కాదు. ఏవో మాయమంత్రముల వలన ఎవరైనా మిమ్మును మోసపుచ్చుటకు ఎన్నడూ మీరు అవకాశమియ్యవద్దు. అవ్వ ఆ విధంగానే సాతాను వలన మోసము చేయబడినది. వాక్యమునకు తప్పు అర్థము చెప్పినది. చూచారా? వాక్యము చెప్పుచున్నదానినే మీరు నమ్మవలెను. మంచిది.
18ప్రశ్న: చాలా త్వరగా. బ్రెన్హా౦ సోదరుడా, కాలము అంతమయి నిత్యత్వము సమీపమగుచున్నదని ఎరుగుదును. ఇద్దరు పెండ్లి చేసికొనగోరుచుండగా, వారికి నీ సలహా ఏమిటి?
పెండ్లి చేసికొనండి, చూచారా. ఈ భూమి మీద ఇంకా వంద సంవత్సరములు జీవించుదుమనునట్లుగా సాగిపొండి. ఏమీ ఆగవద్దు. మీ హృదయములను క్రీస్తు మీద నిలుపుడి. లోకపు విషయముల మీద కాదు గాని, క్రీస్తు మీద మీ హృదయములను నిలుపుడి, చూచారా. ముందుకు సాగిపోవుడి; పిల్లలారా, పెండ్లిచేసికొనుడి. మీ వివాహమును దేవుడు దీవించును గాక.
ACTS 2:38•
1COR 12:7-12
19ప్రశ్న: ప్రియ బ్రెన్హా౦ సోదరుడా, నేను యేసు నామములో బాప్తిస్మము పొందాను. మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురని వాక్యము చెప్పుచున్నది. దీని అర్ధము నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుదుననియా? లేదా వరమును పొందుదుననియూ? ఖచ్చితంగా నేను బాప్తిస్మము ద్వారా ఒక అనుభవమును పొందవలెనా? ఆత్మతో నింపబడుటకు నేను కుతూహలపడుచున్నాను. ఈ పొడుగైన ప్రశ్నకు మన్ని౦చుము. చాలా కాలమునుండి దీనిని అడుగవలెనని తలంచుచున్నాను. నీకు వందనములు. ఆ వ్యక్తి తన పేరును సంతకము చేసియున్నాడు. అతడు ఈ పట్టణమునకు వెలుపట నివసించేవాడు.
ఇప్పుడు, అది మంచి ప్రశ్న. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనునది ఒక వ్యక్తి పొందవలసిన ఖచ్చితమగు అనుభవము. దీనిని తప్పక పొందవలెను. దానిని నేను వివరించెదను, చూచారా. చాలామంది ఉద్దేశ్యము నేనెరుగుదును. దానిని వక్రీకరించిరి. ఇక్కడున్న సంఘమునకు వినుచున్న సంఘముల వారికి ఒక ప్రశ్న తలెత్తవచ్చును. భాషలతో మాట్లాడుట పరిశుద్ధాత్మ పొందినట్లుగా సూచన కాదని నేను చెప్పుదును. (దానిని నేనంగీకరించను) అది తప్పు అని దేవుని సహాయముతో బైబిలు ద్వారా దానిని నేను నిరూపించగలనని నమ్ముచున్నాను. (చూచారా?), ఎందుకనగా భాషలతో మాట్లాడుట పరిశుద్ధాత్మ యొక్క వరము. ఎందరికిది తెలియును? దైవిక స్వస్థత ఒక పరిశుద్ధాత్మ వరము, ఇక్కడ బీటిల్స్ కూడా దానిని చేయుచున్నది, చూచారా.
ఏ వరమునయినా సాతాను అనుకరించగలడు. మాంత్రికులు, సోదెగాండ్రు భాషలతో మాట్లాడి అర్ధము చెప్పగలరు. అతని ప్రాంతములలో మాంత్రికులు భాషలతో మాట్లాడుట ఎన్నోసార్లు చూచాను. వారు మానవ పుర్రెలో నుండి రక్తము త్రాగుదురు. తెలియని భాషలకు అర్థము చెప్పెదరు.
20ఆరిజోనాలో పాతకాలపు కోత పండుగ జరుగును. వారు ఆ పండుగలో నాట్యమాడుదురు. ఇండియనులు పెద్ద పాములను చుట్టుకొందురు. తమ పెంట మీదికి వర్షమును పంపమని దేవునికి ప్రార్థన చేయుదురు. దానిని మీరు పంట నృత్యమందురు. వారు ఆ పంట కాండములను తీసికొని వాటిని వంచి డాన్సు చేయుదురు. మాంత్రికుడు తన తల మీద ఎద్దు కొమ్ము పెట్టుకొని వచ్చును. వారు పెద్ద పాములను చుట్టుకొని డాన్సు చేసెదరు. వారు పొగ పీల్చుచూ ఏవేవో పనులు చేయుచుందురు. ఒక్క తెల్లవానిని కూడా ఆ సమయములో దగ్గరకు రానియ్యరు, కాని నేను వారిని బైనాక్యులర్స్ ద్వారా గమనించాను. వారి నృత్యములకు వెళ్ళిన ఇండియను స్నేహితులున్నారు; వారు క్రైస్తవులు కారు, వారు పాములను పట్టుకొని ఈ పంట నృత్యము చేయుదురు. మాంత్రికుడు వచ్చి కత్తులతో శరీరము కోసికొనును, ఏవేవో చేయును, చివరకు ఆత్మ వారి మీదికి వచ్చును, వారు భాషలతో మాట్లాడి దానికి భావము చెప్పెదరు.
నేను మిమ్ముల్ని ఇక్కడి నుంచి మూడు లేదా నాలుగు గంటల వ్యవధిలో ఒక దగ్గరకు తీసికొని వెళ్ళగలను. అక్కడ దురాత్మచే ప్రేరేపింపబడిన ఒకడు ఒక పెన్సిలును బల్లమీద ఉంచి, ఆ సమయములో ధ్యానములో యుండి ఏదేదో చేయుదురు. తమ చేతులు ఊపగానే ఈ పెన్సిలు లేచి అన్య భాషలలో ఏదో వ్రాయును, మరియు ఆ మాంత్రికుడు లేచి దానిని చదివి అర్ధము చెప్పును.
MATT 21:12•
MARK 3:5•
MARK 11:15•
LUKE 19:45•
JOHN 2:15
21అది పరిశుద్ధాత్మకు రుజువు కాదు, చూచారా. దానిపై నీవు ఆధారపడలేవు. ఆత్మ ఫలము మీద నీవు ఆధారపడవలెను, ఎందుకనగా ఆత్మ యొక్క మొదటి ఫలము ప్రేమ. నాకు తెలిసినంతవరకు క్రైస్తవ సైన్సు అను గుంపువారు అందరికన్న ఎక్కువ ప్రేమ కనపరచెదరు. వారు యేసుక్రీస్తు దేవుడు కాడందురు, చూచారా. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మకు ఒకే ఒక నిదర్శనమున్నది. అదేమనగా, ఆ ఘడియకు వాగ్ధానము చేయబడిన వాక్యమందు అసలయిన విశ్వాసమునుంచును.
ఇప్పుడు, ఆ యూదులు వచ్చిరి. శిష్యుల కంటే ఎక్కువగా వారికి మత భక్తి యున్నది. శిష్యుల కంటె ఎక్కువగా వాక్యములో శిక్షణ పొందియుండిరి, ఎందుకనగా శిష్యులు జాలరులు మరియు సుంకములు వసూలు చేయువారు. వారికి తాము చేయుచున్న వారికి దానిలో నిజమయిన విశ్వాసము, అసలయిన నమ్మకము యున్నది. ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. దీనిని తప్పిపోకూడదు. చూచారా? ఆత్మ ఫలములనే చూడండి. దయాళుత్వము మరియు మంచితనము అను వాటిని ఆ మత గురువులలో చూడండి. అందులో యేసుక్రీస్తునే వారు మించిపోగలరు. ఆయన కొరడా తీసికొని దేవాలయము లోనికి వెళ్ళెను. వారి మీద కోపము చూపెను. వారు బల్లలను పడద్రోసెను. ఆ చోటు నుండి వారిని తరిమికొట్టెను. అది నిజమేనా? ఆయన వారిపై మండిపడెనని బైబిలు చెప్పుచున్నది. ఆలాగు బైబిలులో యున్నది. అది అక్షరాలా నిజము.
JOHN 9:29
22కావున చూడండి, ఆ యాజకులు దయగలవారు, మంచివారు మానవులను అర్ధము చేసికొందురు. ఆత్మ ఫలముల విషయానికి వస్తే, వారు యేసుక్రీస్తు కంటే ఎక్కువ ఆత్మ ఫలములను కలిగియున్నారు. వేదాంత విద్య మాటకొస్తే, అతను ఏ వేదాంత పాఠశాల నుండి బయటికి వచ్చాడని వారికి తెలియదు. "ఈయనెక్కడి నుండి వచ్చెను? ఎక్కడ నుండి ఈయన వచ్చెను? ఏ సంస్థకు ఈయన చెందును? ఈయనెక్కడ నుండి వచ్చెనో మేమెరుగము. ఇతడు అక్రమముగా పుట్టినవాడు. అందరూ ఇతనిని త్రోసివేసిరి. ఇతనిని పడగొట్టుటకు కొన్ని నిమిషములు చాలు మరియు ధర్మశాస్త్రము ద్వారా…." వారు ఆలాగు చెప్పుకొను హక్కును కలిగియుండిరి, ఎందుకనగా అదంతా నిజమే. ఎందువలన? ఆయన ఆ ఘడియకు వాగ్దానము చేయబడిన వాక్యమని వారు గుర్తించలేకపోయిరి. వారి హృదయములో ఏమున్నదో వారేమి చేయుచున్నారో ఆయన చెప్పెను. అప్పుడు వారు గుర్తించవలెను… దేవుని యొక్క వాక్యము ప్రకారము ఆయన ప్రవక్త. ఆయన చెప్పిన ప్రతి మాటయు నెరవేరును.
COL 2:9
23ఆయన దేవుని యొక్క ప్రవక్త, దాసుడు, ప్రవక్తయైన దేవుడు. అంతకు ముందు దేవుని యొక్క ప్రవక్తలుండిరి. కాని ఈయనలో దైవ ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త కాడు. మలాకీ, యిర్మియా, యెషయా, ఏలియా మొదలగు వారు దేవుని ప్రవక్తలు. కాని ఈయన దైవ ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త కాడు. మీరిప్పుడు గ్రహించారా?
ప్రవక్తలందరూ ఆయన జీవితమును భాగములు భాగములుగా చిత్రీకరించి చూపించిరి. వారి వారి పాత్రలను పోషించిరి, కాని ఆయనలో అందరి ప్రవక్తల యొక్క సంపూర్ణత యుండెను. యెహోవా వాక్కు ప్రవక్తల యొద్దకు వచ్చును, వారు ప్రవక్తలు, కాని ఈయన వాక్యము మరియు ప్రవక్తయైయున్నాడు, అదే వ్యక్తి, చూచారా.
MATT 3:7,9•
LUKE 3:7,8•
JOHN 8:39
24ఇప్పుడు, ఇప్పుడు, ఒక వ్యక్తి అతడున్న వాస్తవ స్థితిలో క్రీసును అంగీకరించునప్పుడు, మీరు దానిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించరు… చూచారా? ఇప్పుడు, వారిలో కొందరు, "మంచిది, నేను ఒక లూథరనును," అనుచున్నారు. దానికి వ్యతిరేకముగా ఏదియూ లేదు, కాని పక్షిరాజులు ఆ ఆహారమును భుజించుట లేదు. చూచారా? అవి వాటికి ఎంత దూరముగా ఉండగలవో అంత దూరముగా ఉండగలవు; అవి ఆ దినమునకైన తాజా ఆహారమును మాత్రమే భుజించును.
"నేను వెస్లీయనును." అది మంచిదే, కాని నీవు గతం మీద జీవించుచున్నావు. చూచారా?
"అబ్రాహాము మా తండ్రి," అని ఆ జనులు పలికిరి.
అప్పుడు ప్రవక్త ఇట్లనెను, "దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు." చూచారా?"
"మేము దీనికి చెందినవారము. మేము దానికి చెందినవారము."
"అందువలన ఏమీ లేదు… "సర్ప సంతానమా! రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? అబ్రాహాము మాకు తండ్రి అని చెప్పవద్దు. ఈ రాళ్ళ వలన దేవుడు అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు," అని ఆయన చెప్పెను. చూచారా?
బాగుగా శిక్షణ పొందిన వేదాంత పండితుడివైనా ప్రయోజనము లేదు. నీవు దయా సంపన్నుడవయినా, సాత్వికుడనైనా ప్రయోజనము లేదు. ఎందువలన ఆయన వేరుగా ఉండెను? ఆయన శరీరధారియైన వాక్యము, మోషే దినమునకు వాక్యము కాదు, ఆ దినమునకు మోషే - వాక్యమై యుండెను; నోవహు దినములకు వాక్యము కాదు, ఆ దినమునకు వాక్యముగా నోవహు ఉండెను; ఏలియా దినమునకు వాక్యము కాదు - ఆ దినమునకు ఏలియాయే వాక్యముగా ఉండెను; కాని ఆయన వర్తమానకాల వాక్యమైయుండెను, వారేమో గతంలో జీవించిరి.
JOHN 14:26
25అదే కార్యము మరల జరుగును. అదియే పరిశుద్ధాత్మ యొక్క సూచన. దానిని దేవుడు నీకు బయలుపరచినప్పుడు నీవు దానిని చూచెదవు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును నీవంగీకరించెదవు. నీవేమై యున్నావన్నది కాదు గాని, ఇప్పుడు నీ కొరకు దేవుడు ఏమి చేయుచున్నాడనునది ముఖ్యము. అదే సూచన.
యేసు చెప్పెను… పరిశుద్ధాత్మ సూచనను ఆయన మనకిచ్చెను. యెహాను 14. ఆయనిట్లు చెప్పెను, "మీతో ఎన్నో సంగతులు చెప్పవలసియున్నాను. నాకు అందుకు సమయము లేదు, కాని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, నేను మీతో చెప్పిన సంగతులనన్నింటినీ స్మరణలోనికి తీసికొని వచ్చును. రాబోవు సంగతులను కూడా చూపించును." మీరు చూచుట లేదా? అదే సూచన. వ్రాయబడిన వాక్యమునకు దైవిక భావము చెప్పుట. ఇప్పుడు, అది ప్రవక్త యొక్క సూచన కాదా?
బైబిలులో ప్రవక్తను చూడండి, అతడు ముందే సంగతులను చెప్పును. అది పరిపూర్ణముగా నెరవేరును. ఎవరూ అతనిపై చేతులు వేయనవసరము లేదు. అది ఒక వరము. ప్రవక్త ముందుగా నిర్ణయింపబడి, ప్రవక్తగా జన్మించును, చూచారా. జీవితమంతా ప్రవక్తగా ఉండును. అది అతని పని.
EPH 4:11•
REV 22:17
26వధువు మీద, సంఘము మీద చాలా ప్రశ్నలున్నవి. చూచారా? వాటిని మీరు విడదీయలేరు. వధువు దేవునిచే ఏర్పాటు కాబడినది. సంఘము ఉపద్రవ కాలము గుండా… వారిని గురించి, "ఇచ్చయించువారిని రానిమ్ము." కాని వధువును దేవుడు ఎన్నుకొనును.
దేవునిచే ఏర్పాటయిన పనులు అయిదున్నవి. "ఏలయనగా దేవుడు సంఘములో కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని సంఘ కాపరులు గాను, కొందరిని సువార్తికులు గాను నియమించెను." దేవుడాలాగు చేసెను. కాని మనుష్యులు పెద్దలను తదితరులను నియమించిరి, కాని దేవుడు సంఘమును పరిపూర్ణము చేయుటకు వీరిని నియమించెను — దానిని విడగొట్టలేము.
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు సాక్షిగా యుండును, చూచారా, వాక్యమే సరియని చెప్పును, ఈనాటి వాక్యమును చూపించును. లూథరు వాక్యము కాదు, మోషే వాక్యము కాదు. అది సత్యమని మనము సాక్ష్యమిచ్చుదము, కాని అది మరొక దినము చెందినది.
1COR 13:10,11
27ఇప్పుడు, యేసు వచ్చి ఈలాగు చెప్పినచో ఎట్లు౦డును? "మోషే మిమ్మును ఐగుప్తు నుండి బయటకు నడిపించుకొని వచ్చెను. నేను మరియొక చోటికి మిమ్మును తీసికొనిపోవలెనా? పదండి. మనం వెళ్ళి ఒక ఓడ నిర్మించుదాం. నేను ప్రభువగు దేవుడను. ఇప్పుడు నేను ప్రపంచమును తేలునట్టు చేయుదును. ప్రపంచములోని వారందరిని ముంచి వేయుదును." ఆయన ఆ విధముగా వచ్చునని లేఖనము ఎన్నడూ చెప్పలేదు. చూచారా, ఆయన మెస్సీయా కాడు. ఆయన ఎంత పెద్ద ఓడ నిర్మించినా గాని, ఎంత గొప్ప పని చేసినాగాని లాభం లేదు. ఆయనకు మెస్సీయా అర్హతలు లేవు. హల్లెలూయా! చూడండి! అది అర్హత. అవును, అయ్యా!
I కొరింథీ 13 ఇట్లు చెప్పుచున్నది: "పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది తొలగిపోవును." పిల్లవలె గంతులు వేయుట, పైకి, క్రిందికి ఎగురుట, భాషలలో మాట్లాడుటకు ప్రయత్నించుట, మొదలగునవన్నియూ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు తొలగిపోవును. ఈనాడు మనము దేవుని సహాయము ద్వారా, దైవిక ప్రత్యక్షతతో, వాక్యమునకు పరిపూర్ణ భావమును చెప్పుచున్నాము. అపరిపూర్ణమైనది తొలగిపోవును. "నేను చిన్న పిల్లవానిగా ఉండినప్పుడు, చిన్న పిల్లవానివలె ఆటలాడితిని, చిన్నపిల్లవానివలె మాట్లాడితిని, చిన్నపిల్లవానివలె గ్రహించితిని; కాని పెద్దవానినయినప్పుడు, పిల్లవాని చేష్టలను మానితిని." ఆమేన్! నేను ప్రసంగములోనికి వెళ్ళుచున్నాను, ఆలాగయితే వీనిని పూర్తి చేయలేము.
28ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా… (దానిని పూర్తి చేశానా? బాప్తిస్మమును గూర్చిన ప్రశ్న చదివాను. అదేనా? క్షమించండి. దానిని పూర్తిచేయనిచో మన్నించండి. ఇవి చాలా అద్భుతమగు ప్రశ్నలు. సోదరుడా, ఒక్కొక్క ప్రశ్న మీద ఒక్కొక్క రాత్రంతా గడిపినా తరగనే తరగదు.) దైవసేవకునిగా నిన్ను అభినందించుచున్నాను. సత్య వర్తమానమును నేను నమ్ముచున్నాను. ఈ వర్తమానము గూర్చి ఏమి చెప్పినా గాని నా భార్య వినదు - టేపు వినదు, నా పని కూడా నాకు ఉద్రిక్తతను కలిగించుచున్నది. నా భార్య కూడా నమ్మవలెనని, నా పిల్లలు గురించి కూడా ప్రార్ధి౦చుచున్నాను. బ్రెన్హా౦ సోదరుడా, నేను దేవుని స్నేహితునిగా ఉండగోరుచున్నాను. నా జీవితములో దేవుని చిత్తమును నెరవేరగోరుచున్నాను. ఆయన దాసునిగా ఉండగోరుచున్నాను. (ఇతడు సంతకము చేసెను.) నేను బాలునిగా యున్నప్పుడు అందరికీ బోధకుడనగుదునని చెప్పేవాడిని. దేవుడు నన్ను ఏమి చేయమనుచున్నాడో నాకు తెలియదు. ప్రభువు కొరకు ఏదయినా సరే చేయుటకు ఇష్టపడుచున్నాను. ప్రభువునందు నీ సోదరుడు.
ఇప్పుడు, మంచి ప్రశ్న. అతడు యధార్థపరుడు. అతని భార్య అతనిలో భాగమై యున్నది. సహభాగస్వామి. దానికి నేను మరికొంత చేర్చనా? నా సోదరులారా, దీనిని ప్రభువు నామములో చెప్పుచున్నాను. ప్రభుని చిత్తమయితే, ఈ దినములలోనే వివాహము, పరిత్యాగము అను వర్తమానమును టేపు చేయుదును, చూచారా, ఈ ఆలయములోనే బోధించెదను. ఒకవేళ అది వేరవగలిగితే, దానిని వేరుచేయవలసియున్నదని గ్రహించుడి. కాని అది ప్రభువు యొక్క వాక్యమని నిరూపించెదము.
29నా సోదరులారా, చూడండి. దీనిని వినండి. మీకు ఈ భూమి మీద చాలాసార్లు సరియైన జత దొరుకుట లేదని ఎరుగుదురా? మీరు అందమును, రంగును, నేత్రములను చూచి ఎవరి మాట వినరు. మగవారు దానిని గ్రహించుదురు.
పెండ్లిచేసికొనగోరు వ్యక్తి ప్రార్థనా పూర్వకముగా దానిని సమీపించవలెను. బాహ్య అందమును చూచి నీవు స్త్రీని ఎన్నుకొనుట కాదు, కాని అంతరంగ సౌందర్యమును చూడవలెను, మీ పిల్లలకు ఆమె తల్లిగా ఉండవలెను.
30ఒక సేవకుడు వేదిక మీదనుండి ఇట్టి మాటలు పలుకుట అంత బాగా ఉండకపోవచ్చును. కాని నేను పశ్చిమాన ఉండినప్పుడు పశువులను కొనువారితో వెళ్ళుచుండేవాడిని. సంతానమిచ్చు పశువులను కొనెడివారము. వాటిని మేము మందలో అలవాటు చేసెడివారము. అక్కడ నేను చాలా నేర్చుకొన్నాను - అక్కడి వేలము వేయు వారిని చూచాను. వారి పనులు గమనించాను. వారు అమ్మవారు. ఒక ముసలాయనతో వెళ్ళుచుండేవాడిని. ఇక్కడికే నాతో కూడా సంఘానికి వచ్చేవాడు. అతనిని క్రీస్తు నొద్దకు నడిపించాను. అతడసలు నాస్త్రికుడు. పేరు శ్రీ. జెఫిరి. మీలో చాలామ౦దికి గుర్తు౦డియుండును. అతడు కొలరెడోలో పశువులదొడ్డిని కాపలాకాయువాడు (rancher). మేము పశువుల కొరకు వెళ్ళేవారము, వారు పశువులను గమనించేవారు.
ఒక రోజున నేను సంతానోత్పత్తికి పనికి వచ్చు ఒక దూడను చూచాను. 11,000 డాలర్లు అమ్మకమునకు తెచ్చిరి. చాలా చిన్న దూడ. ఇంకా అది ఎదకు రానే లేదు. జెఫ్ ఇట్లు చెప్పెను, "నా యొద్ద డబ్బున్నచో, దానిని ఆ దూడకు వెచ్చించెదను."
"అతడు ఒక పశువుల కాపరి. తన వ్యాపారము తనకు తెలియును," అని నేను అనుకొన్నాను. నేను "జెఫ్, లేగదూడ అర్హత ఏమిటి? అది హియర్ ఫోరు జాతిది. అది కొద్దిసేపటి క్రితం 300 డాలర్లకు అమ్ముడుపోయినది. పెద్ద దూడవలె కనిపించినది," అని అన్నాను.
అతడిట్లనెను, "బిల్లీ, చూడు! పశువులను అమ్ముటలో ఒక సంగతి నీకు అర్థము కాలేదు. నీవు వీధి ప్రసంగికునిగా పోవుట మంచిది. నీకు పశువుల గూర్చి అర్థం కాలేదు. ఆ దూడను చూడు! దాని కళ్ళలోని బెదురు చూపు చూడు?"
"అవును," అన్నాను.
"దాని పిల్లలు, దాని పిల్లల పిల్లలు, ఇంకా దాని పిల్లలు మొత్తం అన్నింటి కండ్లలోనూ, అదే చూపు ఉండును. అవి చాలా నాసిరకము. అవి తమ పిల్లలను సరిగా పెంచవు. వాటిని ఎంత మేపినా బలము రాదు. మాంసమునకు పనికి రావు. ఇక్కడ అమ్ముడుపోయిన చిన్న దూడను చూడు. అదెంత దీనముగా యున్నదో చూడు. దాని ముఖంలో ఎంత ప్రశాంత చూపుచున్నదో చూడు. అది జాలి చూపు. దాని కండ్లలో బెదురు లేదు. అది చక్కగా తన పిల్లలను పెంచును. దాని సంతతి మొత్తం ఆ విధంగానే యుండును. అవి అన్నియూ చక్కని సంతానమగును. దానికి సరయిన జాతి దానిని జత చేసినచో, గొప్ప పిల్లలు పుట్టును. (చూచారా?), కాని ఆ బెదురు చూపు ఎప్పుడూ నాసిరకం జాతినే ఉత్పత్తి చేయును. కాబట్టి పశువులను కొనువారు దీనిని గమనించవవలెను," అన్నాడు.
"అవునయ్యా! వందనములు," అన్నాను.
1PET 3:4
31స్త్రీలకి కూడా అదే వర్తించును. ముఖమునకు రంగులుపూసికొని ఓర చూపులు చూచే జంతువు వంటి ఆడవారుందురు. వారిని మానవులు లెక్కించకూడదు. అట్టిది ఎల్లప్పుడూ పరుగిడుచునే యుండును. క్రైస్తవ్యము బాహ్య అందమును చూడదు కాని ఆమె అంతరంగ సౌందర్యమును చూచును. శాంతి, సమాధానము, అలంకరణలుగా ఉండవలెను. నెమ్మది గల ఆత్మ కావలెను. సమాధానమును ధరించుకొనవలెను. అది ప్రభువు ఎదుట గొప్ప వెల. దానినే మనము స్త్రీలలోను, పురుషులలోనూ, వేరే ఎవరిలోనైననూ చూడాలనుకొందుము, వేరే ఎవరిలోనైననూ, మనము చూడవలెను. ఇప్పుడు…
1TIM 2:9•
1PET 3:3,4
32ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా: క్రైస్తవ సామాన్య ఆభరణములు అనగా నెక్లెస్ లేదా ముత్యములు వంటివి ధరింపవచ్చునా?
సోదరీ, ఇది నీకు అవసరమయిన ప్రశ్న అని నాకు తెలియును. నాకు కూడా ఇది అర్థవంతమైనదే. నాయందు ఎంతో నమ్మకముంచి అడిగావు గనుక సత్యము చెప్పుదును. ఇప్పుడు బైబిల్ చెప్పినది గుర్తుంచుకొనుము - వెలగల ఆభరణములు, ముత్యములు మీరు అలంకరించుకొనక - సమాధానము, నెమ్మది, సాత్వికము అనుగుణములను ఆభరణములుగా అలంకరించుకొనుడి. (ఇప్పుడే చెప్పాను) అది ప్రభువు ఎదుట గొప్ప వెలగలది."
నీవు పిన్ ధరించరాదని నా భావము కాదు. సోదరీ! ఇది నా మాట కాదు, ప్రభువు మాట. నీవు పిన్ ధరించగోరినయెడల, లేక నీ భర్త ఇచ్చిన చిన్న నెక్లస్ ధరించగోరిన యెడల, అది పాపమని నేననుకొనుట లేదు. ఇది నా అభిప్రాయము. ఇప్పుడు గుర్తుంచుకొనండి. స్పష్టముగా చెప్పుచున్నాను; ఇది నా అభిప్రాయము. కాని మీరు దానిని ఎందుకు చేయుచున్నారు? ఏలాగు భావించుచున్నారు? చూచారా? దాని వెనుక గల ఉద్దేశ్యమేమిటి? అది నిన్ను పట్టుకొని ఏలుచున్నచో దానిని విడిచిపెట్టుము. నీవు పెండ్లి ఉంగరము ధరించి యుండవచ్చును.
33నాజరీన్ వారిని నేనెరుగుదును. మీరు ఇది వరకు స్త్రీలకు పెండ్లి ఉంగరం ఉన్నాగాని బాప్తిస్మమిచ్చేవారు కాదు, చూచారా. అంత అవసరమని నేను తలంచుట లేదు. బైబిలులో వారు పెండ్లి ఉంగరములను ధరించిరి. దానిని దండగా పిలచెడివారు. అందులో తొమ్మిది నాణములుండెడివి. నుదుట కట్టుకొనెడివారు. అందువలన వారు వివాహితులని తెలియును. అది మంచిదేనని తలంచుచున్నాను.
స్త్రీలు మర్యాదగా, చక్కగా, సభ్యతగా దుస్తులు ధరించి అందముగా కనబడవచ్చును. అందులో తప్పు లేదు. కాని చిన్న గర్వము కొరకు వాటిని ధరించినచో తప్పు. అది మీ వైఖరి మీద ఆధారపడియుండును.
కొంతకాలం క్రిందట, "స్కాండల్-స్కర్డ్స్" అనునవి వచ్చినవి. స్త్రీలకది గుర్తున్నదా? అవి మరలవచ్చుచున్నవని తలంచుచున్నాను. ఇప్పుడవి స్కాండల్ బదులుగా స్కాండ్లేస్ అని పిలువబడుచున్నవి. ఆ యవ్వన స్త్రీలును, బాలికలును, ముసలివారు కూడా వాటిని ధరించి యువతుల వలె ఉండగోరుచున్నారు. మీ సోదరీల నుద్దేశించి ఇది చెప్పుట లేదు గాని, ప్రపంచములోని స్త్రీలు ఆలాగున్నారు. వారు తమ స్కర్టులను మోకాళ్ళ వరకు కత్తిరించుకొనుచూ దిగువ వస్త్రము కనబడునట్లు చేయుచున్నారు. వారు అడుగు వేసినప్పుడు, ఆ లేసు అందరికి కనబడును, ఫ్రిల్ కనబడును, ఆ వస్త్రము మీద అందము అందరూ చూడవలెనని ధరించెదరు.
34ఒక బాలిక నాయొద్దకు వచ్చినది. ఆమె డంకర్డ్ బాలిక. ఈ మధ్యనే పరిశుద్ధాత్మను పొందినది. ఆమె అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ కు చెందినది. ఇండియానాలోని, ఫోర్ట్ వేన్ ఆమె నివాసము. అక్కడే నా పెండ్లి అయినది. ఆమె నా యొద్దకు వచ్చెను. చక్కని స్త్రీ, "బ్రెన్హాం సోదరుడా, నిన్ను ఒక ప్రశ్న అడుగుదును," అన్నది.
"ఏమిటది సోదరీ?" అనడిగాను.
"ఒక క్రైస్తవ యువతి స్కాండల్ స్కర్ట్ ధరించుట తప్పా?" అనడిగినది.
"సోదరీ! ఇది నాకు అర్థము కాని సంగతి. స్కాండల్ స్కర్ట్ అంటే ఏమిటి?" అనడిగాను.
ఆమె చెప్పినది, "క్రింది లంగాను అది చూపించును."
"తన క్రింది దుస్తులు పురుషునికి చూపించవలసిన కారణము ఏమిటి? ఒక క్రైస్తవ స్త్రీకి అసలు దానితో ఏమి సంబంధము? ఒక క్రైస్తవురాలు ఆ విధంగా చేయగలదా?" అనడిగాను.
35మగవారిని చూడండి. శరీరరీత్యా వారికి ఏమీ ఆకర్షణ లేదు. సగం దిగంబరిగా ఉన్నా ఏమీ ఎబ్బెట్టుగా ఉండదు. ఒక మగవాడు షర్టు ధరించినా, షర్టు తీసేసినా, ఏ స్త్రీ ఆకర్షణకు లోను కాదు. షర్టు తీసివేసినచో, ఆ శరీరము ఇంకా భయంకరముగా కనిపించును. వాంతి వచ్చును. స్త్రీలు అట్టివారిని చూచి అసహ్యించుకోక మానరు. కాని స్త్రీని ఆ విధంగా చూపించండి. వేరే ప్రభావముండును. మీకర్దమయినదా? మంచిది.
కాని నేననుకొనుచున్నాను, నెక్లెస్ కు సంబంధించినంతవరకు, లేదా… ఇప్పుడు, మీరు పదిసెంట్ల కొట్టు మీ మీద ఉన్నట్లు అలంకరించుకొని, అయస్కాంతము మీ మీద కలిగినవారిగా వెళ్ళారంటే, అది… ఆ విధముగా చెప్పినందుకుగాను నన్ను క్షమించండి. నేను ఆ విధముగా చెప్పాలనుకోవడం లేదు, అయినా అది తప్పు.
36అమెరికాను చూచి నాకు సిగ్గు కలిగినది. ఒక రోజున నేను స్విట్జర్లాండులో యున్నాను. లుసేన్ లో సహోదరుడు ఆర్గన్ బ్రయిట్ మరియు నేను ఒక మంచి చోటు చూచుకొన్నాము. మాకచ్చట పెద్దదైన, మంచి ఆహారము స్టీక్ (steak - ముక్కలుగా నరకబడిన మాంసాహారము) దొరికినది. దాని బరువు ముప్పావు పౌనున్నది. దాని ఖరీదు అమెరికా ద్రవ్యము ప్రకారము ముప్పది సెంట్లుండును. మేము రాజుల వలె జీవించాము. ప్రతి రోజు అక్కడికే మేము వేళ్ళేవారము. వారందరూ వైన్ త్రాగేవారు. మీకు తెలియును గదా? వారి నీరు మంచిది కాదు. నేను ద్రాక్షారసమును త్రాగను, కావున ఒక మందుల షాపునుండి చిన్న పాత్రతో శుద్ధిచేసిన జలము తెచ్చిరి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఆ నీరు వెంట తీసికొని వెళ్ళేవాడిని. నేను నా స్వంత బ్రాండు మోసికొనిపోవుచున్నానని వారందరూ అనుకొనేవారు. కావున దానిని నా చేతిలో పట్టుకొనేవాడిని. మేము భోజన పదార్ధములమ్ము చోటికి వెళ్ళాము. ఒక రోజున మిస్ అమెరికా అక్కడికి కారు నడుపుకొని వచ్చినది. అది ' 28 మోడల్, చెవర్లెట్ కారు. ఆమె తొడ మీద ఒక కుక్క కూర్చొనియున్నది. దానిని కూడా లోపలకు తీసికొని వచ్చెను. ఆ ఇద్దరు స్త్రీలు ధరించుకొనిన ఆభరణములు పది సెంట్ల స్టోరుకు సరిపోవును. చెవులకు పెద్ద రింగులు, రంగులు పూసికొనిన ముఖం; ఆ ఇద్దరికీ నా వయస్సుండును. ఏబది సంవత్సరాలుంటాయి. వారు పదిహేనేళ్ళ పాపల్లా ఉండగోరువారు. వారేమి చేయుచున్నారు? వారు ఆ గతాన్ని తలంచుకొంటూ తమ జీవిత రహదారిలో పయనిస్తున్నారు. ఆ వెనుకటి అద్దంలో చూచుకొంటున్నారు.
PHIL 3:13
37ఇప్పుడు, క్రైస్తవులు ఆలాగు చేయరాదు. క్రైస్తవుడు ఇంతకు ముందున్నట్లుగా ప్రయత్నించరాదు. ఇంతకు ముందున్న దాని వైపు చూడరాదు, కాని గురి వైపుకు చూడవలెను. చూచారా, చూచారా? అప్పుడు మీరేమై యుండిరో దాని వైపు చూడరాదు. దానిని దాటి వచ్చేశారు. మరల ఎన్నడూ దాని యొద్దకు తిరిగి రారు. అది ఒక గతం. అద్దంలో చూచి వెనక్కు నడిపే వ్యక్తి జీవితము బ్రద్దలగును. ఈ క్రైస్తవ రహదారి కూడా అలాంటిదే. గతంలో మీరేమై యున్నారో అటు చూడవద్దు. ఏమగుదువో అని చూడుము. "వెనుక ఉన్నవాటిని మరచి, ఉన్నత పిలుపును బట్టి గురియొద్దకే పరుగిడుచున్నాను," అని పౌలు చెప్పెను.
అది నిన్ను సిగ్గుపడునట్లు చేయును. వారు అక్కడికి ఒక చిన్న మురికి కుక్కను తీసికొని వచ్చిరి. దానిని ఆ బల్లపై కూర్చోబెట్టిరి. అది ఎవరికయినా వాంతిని పుట్టించును. ఆ కుక్కతో వారు అక్కడ తిరుగుచున్నారు. చేతులతో పట్టుకొనుచున్నారు. ఆ చేతులతోనే మరల భోజనము చేసెదరు. ఆ పనివాడు వచ్చి ఏదో చెప్పెను. డాక్టర్. గుగ్గిన్బుల్ నాతో యుండెను. అతడు తల ఇటు త్రిప్పి నవ్వుచుండెను.
"ఏమన్నాడు?" అనడిగాను.
"దానిని తీసేయండి, అని వైటర్ చెప్పెను," అని నాకు చెప్పాడు.
"లేదు, అది అమెరికను; దాని జోలికి పోవద్దు, అక్కడే ఉండనీ," అన్నారు వారు. చూచారా? ఇంకో విధంగా చెప్పాలంటే దానికేమీ తెలియదని వారన్నారు.
నేను రోమ్లోని సెయింట్ ఏంజిలోకి వచ్చాను. (దీనిని వినండి), రోమ్లోని వాటికన్, ఇటలీ, సెయింట్ ఏంజిలో యొద్ద ఒక గమనిక వ్రాశారు: "అమెరికన్ స్త్రీలకు: ఈ పవిత్ర స్థలములో ప్రవేశించు ముందుగా, దయచేసి మీ బట్టలు వేసికొని ఆ మృతులను గౌరవించండి." - కాథలిక్కు చర్చి వ్రాసినది, చూచారా.
REV 20:9
38ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, భూమి మహా వేండ్రముతో లయమగునప్పుడు వధువు ఎచ్చటుండును? తెగుళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు గోషెనులో ఉండినట్లుగా వారుందురా? ఇది జరిగినప్పుడు వధువు భూమి మీద ఉండునా? ఆలాగయితే ఎచ్చట? ఎత్తబడు సమయములో వధువు అంతా ఒకే చోట ఉండునా?
ఎత్తబడు సమయము అనగా మృతులు మేల్కోనెదరు, సజీవులు కలిసికొందురు. సజీవులు వారిని కలిసికొందురు. వెయ్యేండ్ల పాలనకు ముందు ఎత్తబడుట జరుగును. వెయ్యేండ్లపాలన తరువాత, ధవళ సింహాసన తీర్పు తరువాత భూమి కాలిపోవును, చూచారా. ఆ ప్రియమగు పట్టణము మీదికి సాతాను వచ్చినప్పుడు పరిశుద్దులు ఆ భూమి మీద నివాసముందురు. దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించి వారిని నాశనము చేయును. అది లేఖనము.
MATT 6:33•
LUKE 12:31•
1COR 7:12,13
39ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, స్త్రీ, పురుషునికి లోబడవలెనని నమ్ముచున్నాను. కాని ఒక క్రైస్తవ స్త్రీకి పాపియగు భర్త యున్నాడనుకొందము. ఒక్క కూటమునకు కూడా అతడు రాలేదు. తన భార్య జుట్టు కత్తిరించుకోవలెనని, పొట్టి దుస్తులు ధరించవలెనని, అపవిత్ర స్థలములకు వెళ్ళవలెనని కోరుకొనుచున్నాడు. ఈ స్త్రీ ఈ విధంగా తన భర్తకు లోబడవలెనా? దయచేసి దీనికి తేటగా జవాబు ఇమ్ము, ఇది తరచుగా వచ్చుచున్న ప్రశ్న.
సోదరీ, అటువంటి వానికి నీవు లోబడనవసరం లేదు. నిశ్చయంగా! ఈ విషయములో నీవు అన్నీ విడిచిపెట్టి, నీ దేవుని హత్తుకొనుము. అతడు నీతో జీవించగోరినచో నిన్ను క్రైస్తవురాలిగా ఉండనియ్యువలెను. అంతేగాని నిన్ను పొట్టి దుస్తులు ధరించమని, జుట్టు కత్తిరించుకోమని, అపవిత్ర స్థలములకు రమ్మని, చెప్పినచో మొదట నీవు ఆయన రాజ్యమును నీతిని వెదకుము. అటువంటి వ్యక్తికి నీవు కట్టబడి యుండనక్కరలేదు. కాని మీరిద్దరు ఒకరినొకరు సంతోషపెట్టుకొన్నంత కాలము కలిసేయుండుమని బైబిలు చెప్పుచున్నది. (దానిని మరువరాదు.)
దీనికి లేఖనములు వ్రాయలేదు, ఎందుకనగా కొద్ది నిమిషముల క్రితమే వీటిని చూచాను. (మీరు చూచారా?). మధ్య మధ్యలో ఒక్కొక్కటి తీయుచున్నారు, అందువలన నాకు సమయము లేదు.
1COR 7:12,13
40కాని పౌలు వీరిని గూర్చి చెప్పెను - అవిశ్వాసి యగు భార్య యుండును, అవిశ్వాస భర్త యుండును. విశ్వాసియగు భార్య తన అవిశ్వాసపు భర్త నుండి దేవుని పట్ల విరోధ భావము వెల్లడియవ్వనంత కాలము కలిసియుండవలెను. ఆమెతో జీవించుటకు అతడు ఇష్టపడినచో మంచిదే. "నీవు ఆలయానికి వెళ్ళు! మంచిది; కాని నేను రాను. నాకు అందులో విశ్వాసము లేదు; నాకు దానితో సంబంధము లేదు. కాని నీవు వెళ్ళు; అంటే పరవాలేదు." కాని "నీవు వెళ్ళరాదు," అంటే వేరే సంగతి. అప్పుడు నీవు కట్టుబడియుండనక్కర్లేదు; దేవుని కొరకు దేనినయినా వేరుచేయము.
1TIM 3:2•
TIT 1:6,7
41ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, (చూద్దాం) విడాకులు తీసికొని మరో వివాహము చేసికొనిన తరువాత ఈ వర్తమానము లోనికి వచ్చి సేవచేయు వ్యక్తికి ఏమి జవాబున్నది. విడిపోయిన భాగస్వామి ఇంకా సజీవముగా యున్నప్పుడు ఏమి చేయవలెను?
I తిమోతీ 3:2. తీతు 1 నుండి 6. వ్రాసికొనండి. (నేను ఒకటి వ్రాసియుంచాను.) ఈ ప్రశ్నకు దానిని మీరు చదువవలెనని కోరుచున్నాను. చూచారా? ఒక వ్యక్తి బిషప్పగా గాని, లేక బోధకునిగా గాని ఉండగోరినచో (సంఘము ఏదయినా బాధ్యత స్వీకరింపగోరినచో) అతడు ఏకపత్నీ పురుషుడై యుండవలెను. అది సరి! ఒక సేవకుడు. I తిమోతీ 3:2 మరియు, తీతు 1 నుండి 6. దేవుని మందిరములో సేవచేయగోరు వ్యక్తి ఏకపత్నీ పురుషుడై యుండవలెనని బైబిలు చెప్పుచున్నదానిని గమనించండి.
PS 51:12•
MATT 5:13•
1COR 7:14
42ప్రశ్న: ప్రియ బ్రెన్హా౦ సోదరుడా, దాదాపు పది సంవత్సరాల క్రితం దేవుడు నన్ను కలిసికొని, ప్రేమ వరమనగా ఏమిటో బయలుపరచెను. దానిని పొందవలెనని నేను ప్రార్థించుచున్నాను. నేను మరణించకముందు దానిని పొందుదునా? నా భర్త వాక్యము వినునా? నేనేమి చేయవలసియున్నాను?
అది పెద్ద ప్రశ్న. "నా భర్త" అన్నది గనుక దీనిని వ్రాసిన వారు స్త్రీ, ఆమె తన మొదటి ప్రేమను పోగొట్టుకొనెను, చూచారా. ఆమె ఆత్మలో చల్లారిన సోదరీ, ఇంకా నీవు ఆలయమునకు వచ్చుచున్నావు గనుక సరియైనది చేయుము. రక్షణను పోగొట్టుకొనలేదు, కాని నీ రక్షణానందమును పోగొట్టుకొనియున్నావు. దావీదు ఒకసారి ప్రభువుకు ఈలాగు మొర్రపెట్టెను, "ప్రభూ, నా రక్షణానందమును మరల నాకిమ్ము." నీవు ఇంకా క్రైస్తవురాలవే. సోదరీ, నీకు తెలిసిన ప్రతి పొరపాటును విడిచిపెట్టి, దేవుని వెదకి, ప్రార్ధి౦చుమని నేను కోరుచున్నాను.
"నా భర్త వాక్యమును వినునా? నేనేమి చేయవలెను?" ఈ ఉదయమున నేను చెప్పినట్లుగా ఉప్పువలె యుండండి. "మీరు లోకమునకు ఉప్పుయి యున్నారు." నీ పతివ్రతా జీవితమును నీ భర్త చూచును. అవిశ్వాసియగు భర్త, విశ్వాసియగు భార్య వలన శుద్దీకరణను పొందును. ప్రభువును వెదకుము. దీనురాలిగా యుండుము. ఎల్లవేళలా ప్రార్ధి౦చుము. దేవునిని స్తుతించుము. ఆ విధముగా నీ భర్త నీతో జీవించుటకు ఇష్టపడుచున్నంత కాలము నీ భర్త పట్ల దయచూపుము.
43ప్రశ్న: ఇది ఆదివారం ప్రార్థనా సమావేశాల కొరకు: ఒక స్త్రీ ఒక తప్పును చేసి… (ఒక్క నిమిషము ఆగండి. దీనిని మొదట నేను చదువుకొనవలెను. చూడండి. సరే. ఇప్పుడు చూద్దాం.) ఒక స్త్రీ, పెండ్లయిన మగవానితో తప్పు చేసినది. ఆ తరువాత పశ్చాత్తాపపడి, లేఖనము ప్రకారము తన భర్తతో సరిచేసికొనినది. ఆమె ఆ వివాహితుడగు పురుషుని యొక్క భార్య యొద్దకు వెళ్ళువలెనా? ఆమెకు ఈ సంగతి ఏమీ తెలియదు, లేదా ఆమెకు చెప్పవలసిన బాధ్యత పురుషునిదా? స్నేహభావంతో పాలుపంచుకొంటున్న ఈ సరిదిద్దు విషయమును ఎంత వరకు కొనసాగించవలెను?
నా ప్రియ సోదరీ, నీవు సరయిన ఒకే ఒక దానిని చేసియున్నావు. నీవు ఆ క్రియలో పాలు పొందావు, లేక నీకు తెలిసిన వారెవరో ఈ ప్రశ్న అడిగియుండవచ్చు. ఆ కార్యము తప్పని నేననుకొనుచున్నాను. నీవు మరొకరి భర్తను తీసికొని సామాజిక నేరమును జరిగించావు. ఆ క్రియ నీవు జరిగించినప్పుడు, కృప నుండి నీవు పడిపోయావు. ఆ తరువాత నీవు పశ్చాత్తాపపడియున్నావు, అయితే నీవు ఆ మగవానితో సరిచేసికొనువరకు మారుమనస్సు లేదు. నీవు నీ భర్తను అతని యొద్దకు తీసికొని వెళ్ళి సరిచేసికొనవలెను. అదే నీవు చేయవలసియున్నావు; అది లేఖనము — దానిని నీవు చేయుట అత్యవసరము.
44ఈ లూయిస్విల్ నుండియే ఒకామె కొద్దికాలం క్రిందట నా యొద్దకు వచ్చి యున్నది. ఆమె యవనస్తురాలు. ఆమె ఒకనితో తిరిగినది. తాను తప్పు చేయుచున్నానని ఆమెకు తెలియును. ఆమె ఈ పట్టణమును విడిచి మరో పట్టణమునకు వెళ్ళి, పేరు మార్చుకొని వేరే జనుల మధ్య జీవించుచున్నది. ఈ పురుషుడు ఆమె వెనుక వెళ్ళి, ఆమెను తన భార్యగా ఉండమని కోరెను, లేనిచో అందరికీ చెప్పెదననెను. (ఆమె అక్కడుండగా ఒక మంచి క్రైస్తవుని పెండ్లి చేసికొనెను.) కాని ఇతడు వచ్చి మొత్త విషయమును బయట పెట్టెదనని బెదరించెను. కావున ఆమె ఇద్దరితో జీవించవలసి వచ్చెను. అది తప్పు. ఆమె ప్రారంభములోనే తన తప్పును ఒప్పుకొనుటకు బదులుగా ఈలాగు చేసినది. ఆమెకు ఒక బాలిక జన్మించినది. ఇప్పుడా బాలికకు పద్దెనిమిది సంవత్సరములు. నిజంగా ఇప్పుడామెకు ఆ ఇద్దరిలో తన తండ్రి ఎవరో తెలియదు. ఇప్పుడామె మెనోపాజ్ దశలో ఉన్నది, మరియు ఈ విషయము తెలిసి బాధపడుచున్నది. కాని ఇప్పుడు ఏమి చేయగలదు?
ఆమె ఇట్లనినది, "నా భర్తకు తెలియచేసినచో అతడు నన్ను విడిచిపెట్టును; నా బాలికకు తెలిసినచో, ఆత్మహత్య చేసికొనును."
నేనిట్లు చెప్పాను, "దానిని నీ హృదయములోనే దాచుకొనినయెడల నీవు నరకమునకు వెళ్ళెదవు, ఆలోచించుకొనుము," అన్నాను. నీవు చేయవలసినది ఒకే ఒకటున్నది, నీ పలకను శుభ్రపరచుకొనుము. అది నిశ్చయంగా మంచిది. యధార్థంగా ఉండుము.
45స్త్రీలు, పురుషులు గూర్చి దర్శనములో చాలాసార్లు చూచుచుందును. వారు జీవితములో చేసిన క్రియలను పరిశుద్ధాత్మ త్రవ్వుచుండును. (మీరు వాటిని గూర్చి విన్నారు. వాటిని చూచారు. ఎరుగుదురు.) వారేమి చేయవలసియున్నారో కూడా ఆత్మ చెప్పును.
"మంచిది, మేము ప్రభువుతో ఎప్పుడో సరిచేసికొన్నాము," అని వారు చెప్పెదరు. కాని నీవు నీ భార్యకు లేదా నీ భర్తకు దాచిపెట్టియున్నావు." దానిని నీవు ఒప్పుకొనవలసియున్నావు.
ఈమెను చూడండి. ఈమె దోషి అయితే ఈమెయే దానిని సరిచేసికొనవలెను. ఆమె తన భర్త ఎదుట ఒప్పుకొనవలెను. సోదరీ, నిన్ను నీవు సరిచేసికొనవలెను. నీవు నీ భర్తకు విరోధముగా వ్యభిచరించియున్నావు. నీవు నీ భర్త యొద్దకు వెళ్ళి, నీ భర్తకు దానిని చెప్పి, నిన్ను నీవు శుభ్రపరచుకొనుము. అవతలి వ్యక్తి యొద్దకును నీ భర్తను తీసికొని వెళ్ళి, తప్పును సరిదిద్దుకొనుము. నీవు నిర్దోషివగుదువు. నీ భర్త నీతో జీవించుట కొనసాగించినా, కొనసాగించకపోయినా అది అతని నిర్ణయము. నీతో జీవించుటకే అతడు తీర్మానించుకొనినచో, అతడు నిన్ను క్షమించును. అప్పుడు నీవు మరెన్నడూ అటువంటి పాపము చేయకుండా జాగ్రత్తపడుము. కాని అతడు నిన్ను క్షమించకపోయినచో, అది అతని పని. నిన్ను అతడు విడనాడవచ్చును. ఇది అక్షరాలా నిజము.
నీతో పాపము చేసిన ఆవలి వ్యక్తి, తన భార్య యొద్దకు వెళ్ళి దీనిని ఒప్పుకొని, ఆమెను నీ యొద్దకు తీసికొని రావలసిన బాధ్యతను కలిగియున్నాడు, నీవు నీ భాగమును నెరవేర్చుము, అతడు తన భాగమును నెరవేర్చును, చూచారా.
46ఆ మగవానితో దుష్కార్యము జరిగించిన ఆమె తన భర్తను అతని యొద్దకి తీసికొని వెళ్ళి తప్పును ఒప్పుకొనవలెను. దానిని సరిచేసికొనవలెను. ఆ తరువాత వ్యక్తి కూడా వివాహితుడే. అతడు తన భార్య యొద్దకు వెళ్ళి ఈ తప్పును ఒప్పుకొని, ఆమెను ఈమె యొద్దకు తీసికొని తప్పును సరిదిద్దుకొనవలెను. అది మంచిది. నా భావమును గ్రహించారా? అప్పుడది పరిష్కారమగును. ఆలాగు చేయని యెడల నీవింకా దోషివే. నీ మనస్సాక్షి నిన్ను గద్దించును.
ఒకామె కొద్దికాలం క్రిందట నా యొద్దకు వచ్చినది. మొదటి ప్రపంచ యుద్ధము నుండి ఇది దాగియున్నది. ఆమె మానసిక శాంతి నిమిత్తము వందలాది డాలర్లను ఖర్చు చేసినది. ఆమెను నేను గమనించుచూ ఆ గదిలో కూర్చున్నాను. మిడా, ఆమెను అక్కడికి తీసికొని వచ్చినది. ఆమె కూర్చొని తన రుమాలును చేతికి చుట్టుకొని ఏదేదో చేయుచున్నది. ప్రపంచము బ్రద్దలయిపోవుననుకొనుచున్నానని చెప్పుచున్నది. అటువంటి పిచ్చి మాటలు పలుకుచున్నది.
నేను కూర్చొని చూస్తూనే యున్నాను. "నీ జీవితములో ఎక్కడో ఏదో జరిగినది గదా?"అనడిగాను.
"లేదు, నేను సండే స్కూలు టీచరును" అన్నది.
ఆమెను కూర్చొని గమనించుచున్నాను. "అది సరే. నాకు ఒక చిన్న పచ్చ కారు కనబడుచున్నది. నీవు తెల్లని తలవెంట్రుకలు గల ఒకతనితో యున్నావు. నీ కారు రైలును దాదాపు గుద్దినది," అన్నాను.
"నీవు మరెవరికీ ఇది చెప్పవద్దు!" అన్నదామె.
"ఆ సమయములో నీ భర్త సైన్యములో యున్నాడు" అన్నాను.
ఆమె ఏడ్వనారంభించినది, గంతులు వేయసాగినది. దానిని మరెవరికి చెప్పవద్దన్నది. చూచారా? అది ఆమె మనస్సాక్షిలో మొదలుచున్నది. ఆ విషయమును ఎప్పుడో దేవుని ఎదుట ఒప్పుకొన్నానని చెప్పినది.
"ఒక్క నిమిషం ఆగు! నీవు దేవునికి విరోధముగా తప్పు చేయలేదు గాని నీ వివాహ ప్రమాణమునకు విరోధముగా పాపము చేసియున్నావు. నీవు నీ భర్త యొద్దకు వెళ్ళి మొదట సరిచేసికొనుము," అని చెప్పాను.
"అతడు నన్ను విడిచిపెట్టును," అన్నది.
"ఏలాగు దేవుడు నిన్ను విడిచిపెట్టెను. కాబట్టి ఎవరు నిన్ను వదులుట నీకు ఇష్టము?" అనడిగాను. అతని యొద్దకు వెళ్ళుము.
"ఓ, అతడు… ఫలానిది చేయును. నాకు ఇద్దరు పిల్లలున్నారు," అని ఏదేదో చెప్పసాగినది.
"సరే, నేను నీతో చెప్పగలిగింది అదే. ఏ మానసిక వైద్యుడు నిన్ను బాగుచేయలేడు, కాని పరిశుద్ధాత్మ దీనిని బయలుపరచినది. నిన్ను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు."
"అది నిజమే కాని అతనికి ఇది చెప్పలేను," అన్నది.
"నిన్ను కలిసికొన్నందుకు సంతోషము," అని చెప్పి నేను నా గదిలోనికి వెళ్ళిపోయాను. ఆమె వెనక్కు వెళ్ళినది.
మరల మిడా వచ్చి ఆమె నిన్ను కలిసికొనగోరుచున్నదని చెప్పెను. నేను అచ్చటికి వెళ్ళాను; "ఏమి కావాలి?" అనడిగాను.
"బ్రెన్హాం సోదరుడా, నేనది నా భర్తకు చెప్పలేను," అన్నది.
"నీ భర్తకు నల్లని జుట్టున్నది గదా?" అనడిగాను.
"అవును!"
"అతనికి కూడా ఇటువంటి ఒప్పుకొనవలసిన సంగతి ఒకటి ఉన్నది," అని చెప్పాను.
"ఓ, నా భర్త అటువంటివాడు కాడు," అన్నది.
"నీవు వెళ్ళి అతనిని ఇచ్చటికి తీసికొని రమ్ము, నీకు ఒక స్త్రీ తెలియును. పింక్ దుస్తుల ధరించినది. ఆమె ఒక ఆటోమొబైల్ వంటి కంపెనీలో పనిచేయుచున్నది," అని చెప్పాను.
"అవును. నిజమే." అన్నది.
"వారామెను ఫలాని పేరుతో పిలచెదరు గదా?" అనడిగాను.
"అవును!" అని ఆమె చెప్పెను.
"రెండు వారముల క్రితం వారు ఒక బీచ్ చెట్టు క్రింద కూర్చొనియున్నారు. ఒక చిన్న బ్రవున్ చెవర్లెట్ కారులో కూర్చొనియున్నారు. దాని నెంబరు ఫలాని, వారును అదే దుష్కార్యము చేసిరి," అని చెప్పాను.
"నా భర్త అట్టివాడు కాడు," అన్నదామె.
"సరే, అతనిని తీసికొని ఇచ్చటికి రా," అన్నాను.
ఆమె వెళ్ళిపోయినది. కొద్ది నిమిషముల తరువాత వారు వచ్చిరి.
"అది సత్యము!" అని అతడు అన్నాడు."
"చూచారా? ఇప్పుడు దేవునికి చెప్పుకొనండి!" అన్నాను.
MATT 5:23
47నీవు మొదట బలిపీఠము యొద్దకు వచ్చినప్పుడు సరిదిద్దుకొనవలసిన వాటిని సరిచేసికొనుము. అవతలి వ్యక్తి తన భార్యతో చెప్పుకొనకపోతే, అది నీకు సంబంధము లేదు. ఈమె తనను కడిగివేసికొనినది. ఆమెకు, ఆమె భర్తకు మధ్య ఉన్న సంగతి. కాని అవతలి వ్యక్తి తన భార్యను తీసికొని వచ్చి ఒప్పుకొనవలెను. నీవేమి చేసినా గాని వీవు బ్రదికియున్నంత కాలము అది నిన్ను వేంటాడుచుండును. దానిని శుభ్రముగా కడుగుకొనుము. ఒకే ఒక మార్గమున్నది: దానిని ఒప్పుకొనుము. నీ శరీరమును ఒలిచివేయు పరిస్థితి వచ్చినా సరే ఆలాగు చేయుము. సత్యము చెప్పుము. అప్పుడు నీవు సరియగుదువు. ఆమేన్.
"అది తప్పు," అని చాలామంది చెప్పుటను నేను టేపులో వినుచున్నాను. కాని ఒక్కసారి దీనిని చేసి చూడండి. ఆ తర్వాత వచ్చి చూడండి. మంచిది.
2COR 5:17
48ప్రశ్న: ఆదివారం ఉదయమునకు ప్రశ్న: (క్షమించండి. ఇప్పుడే తీసికొన్నాము) ఆకస్మాత్తుగా పరిశుద్ధాత్మను పొందుటకును, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుటకును మధ్య తేడా యున్నది? ఆలాంటి వ్యక్తి భాషలు మాట్లాడునా? అది లేనిచో ఏ ప్రత్యక్షత వలన తెలియును?
పిల్లను కనిన తల్లి దానిగురించి ఎరుగకుండునా? ఆమెకు తెలియలేదు. అంటే ఆమె స్పృహలో లేదని అర్థము. ఆలాగే పరిశుద్ధాత్మ పొందినప్పుడు నీకు తెలియకుండా ఉండదు. నీలో ఏదో ఒక విషయము జరుగును. చూచారా? నిన్ను మార్చునది ఒకటి జరుగును. నీ పూర్తి పద్దతి, నీ పూర్తి ఆత్మీయ క్రమము మరల క్రొత్తదిగా చేయబడును. నీవు క్రీస్తునందు నూతన సృష్టిగా మారెదవు. క్రీస్తునందు నూతనముగా సృజించబడెదవని బైబిలు చెప్పుచున్నది. నీకది తెలియును.
"బ్రెన్హాం సోదరుడా, పరిశుద్ధాత్మను పొందుటకు ఒక వ్యక్తి భాషలతో మాట్లాడవలెనను సంగతిని నీవు నమ్మవు గదా?" అని మీరందురు. పరిశుద్ధాత్మ పొందితినని ఒకడు దాని ద్వారా నిరూపించజాలడు.
1COR 13:1-3,10
49నా సంఘములోని ప్రతి సభ్యుడు భాషలతో మాట్లాడవలెనని నేను కోరుచున్నాను. వారాలాగు చేయుట నాకు ఇష్టము. అది కావలెనని వారడిగినచో దేవుడు దానిని అనుగ్రహించును. కాని నా మాట వినండి; నాకు చాలామంది తెలియును, వారు భాషలతో మాట్లాడుచుందురు, కాని పరిశుద్ధాత్మను పొందలేదు. తనకు తన సభికులకు నిజముగాయన్న ఏ బోధకుడైనా దీనిని గురించి సభికుల దగ్గర చెప్పకుండా యుండరు. అపవాది దానిని అనుకరణలు చేయును.
పౌలు ఇట్లనెను, "నేను మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను మాట్లాడినా గాని, కాల్చబడుటకు నా శరీరమును అర్పించినా గాని, వాక్యము యొక్క మర్మమంతయూ నాకు తెలిసినా గాని, నా వస్తువులన్నియూ పేదలకు పంచిపెట్టినా గాని, ప్రేమలేనివాడినయితే నేను వ్యర్ధుడను. కొండలను పెకలించగల గొప్ప విశ్వాసము నాకున్నాగాని వట్టివాడినే." ఆ తరువాత ఇట్లనెను, "పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది పోవును," అనగా పరిపూర్ణమైనది తెలియచేయబడును.
ఇప్పుడు, దాని మీద ఒక ప్రశ్న అడిగిరి. ఈ రాత్రికి చెప్పెదను, ముద్రలు విప్పినప్పుడు అది జరిగినది. ఈ ప్రశ్నకు దానిని చెప్పుట తగునని తలంచుచున్నాను.
50ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మేము ఏమి చేయుదము? నేను విడిపించుకొనలేనిది నా మీదికి వచ్చియున్నది. గత ఆకురాలు కాలములో నాకు కల వచ్చినది. నేను తెల్లని ఇసుకలో తప్పిపోయినట్లు చూచాను. అప్పుడు చీకటిపడుచున్నది. నాకు దారి కనబడలేదు. గత ఆకురాలు కాలము నుండి ఈ కల నన్ను వీడుట లేదు. నేను చీకటిలో తడవులాడుచున్నవానివలె యున్నాను. నా కలలో నా కుమారుడు ఇర్విన్, భార్య కూడా యుండిరి. వారు కూడా చీకటిలో యుండిరి. మేము నిరాశలో మునిగియున్నాము. ఇప్పుడు మా హృదయములలో ఉన్నదానిని దేవుడు నీకు చూపించునని నమ్ముచున్నాను. (శ్రీమతి. ఓ, మంచిది.) మేము తప్పులో యున్నచో, పాపపు చోటల్లో యున్నచో చెప్పుము. మేము సరిచేసికొనగోరుచున్నాము.
ఈమెను నేనెరుగను, కాని నీవు ఇచ్చటున్నయెడల వినుము. నీ సమస్యను చెప్పెదను. నిన్ను ఉద్రిక్తతలలో మునుగునట్లు చేయు ఒక పనిని నీవు చేసితివి. "తెల్లని ఇసుక" అనగా పవిత్రతకు, నీతికి సూచనయై యున్నది. నీవు సాతానును నీ మీదికి రానిచ్చియున్నావు. ఏదీ తప్పు లేదని నీ కల నిరూపించుచున్నది. నీవు ఉద్రిక్తతలో యున్నావు. అంతే! దీనిని చేయుట ద్వారా, దీనిని గూర్చి ఆలోచించుట ద్వారా మిగిలిన కుటుంబమును కూడా నీవు గాబరా చేయుచున్నావు. ఆలాగు చేయవద్దు. దేవుడు నీకిచ్చిన హక్కులను ఉపయోగించుకొనుము. నీవు తెల్లని ఇసుకలో యున్నట్లు నీ కల నిరూపించుచున్నది. అంతా సరియగును. నీవు గాబరాపడవద్దు.
నీ కుటుంబములో ఒకరిని నీవు గాబరా పెట్టించినచో, అది ఇంకొకరిని అంటుకొనును, అందిరికీ అది ప్రాకును. అప్పుడు మీరు ఏమీ లేకుండానే తొందరపాటుకు గురియగుదురు, తగవులాడుకొందురు. ఒక విషయములో కుటుంబములోని ఒక సభ్యుడు గాబరా అయినచో, అది ఇంట్లో అందరినీ పట్టుకొనును. మొత్తం కుటుంబమే అశాంతికి గురియగును. అది సాతాను. కుటుంబములోని ఒక సభ్యుడు సంతోషించినయెడల, అతనితో పాటు అందరునూ సంతోషించెదరు. కాబట్టి కుటుంబములోని ప్రతిఒక్కరూ ఆలాగుండుటకు ప్రయత్నించండి.
MATT 5:13•
PHIL 4:8
51పిల్లలారా, మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు సహాయము చేయుటకు ప్రయత్నించండి. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు సహాయము చేయుటకు ప్రయత్నించుడి. ఆ చీకటితో నిండిన అవిశ్వాసపు ఆత్మ మీ మీదికి వచ్చుటకు మీరు చోటియ్యవద్దు. మీరు క్రైస్తవులు. మీరు దేవుని ఆత్మ వలన జన్మించినవారు. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. మీకు దేవుడిచ్చిన హక్కులున్నవి. బైబిలు ఇట్లు చెప్పుచున్నది, "కొనియాడదగినదేదయినా యున్నచో, సద్గుణము ఏదయినా యున్నచో, దానిని గూర్చియే తలంచుడి." తప్పు సంగతుల గూర్చి ఆలోచించవద్దు.
సోదరీ, అదే నీ సమస్య అనుకొనుచున్నాను, ప్రియ సోదరీ.
దానిని గూర్చి చాలాసేపు చెప్పగలను, కాని నా వాగ్దానము ప్రకారము ఇరవై నిమిషముల సమయమున్నది. వీలయినన్ని చెప్పెదను. ముగించలేనియెడల, వాటిని బల్లపై ఉంచి మరల వచ్చి చెప్పెదను.
52ప్రశ్న: సహోదరుడు బ్రెన్హా౦ మనుష్యకుమారుడని కొందరనుచున్నారు. అగ్నిస్తంభమే మనుష్యకుమారుడని నేననుకొన్నాను. నేను పొరబడితినా?
అది మంచి ప్రశ్న చాలా మంచిది. కాని నేను మనుష్యకుమారుడను కాను. ఒక మనుష్యుని కుమారుడను. చాలా తేడా యున్నది. యేసుక్రీస్తు మనుష్యకుమారుడు. దేవుని కుమారుడు, మనుష్యకుమారుడు, దావీదు కుమారుడు.
ప్రజలు నన్ను ప్రవక్తగా ఎంచుచున్నారు గనుక ఇతడు బహుశా ఈ ప్రశ్న అడిగియుండును. దానిపై మరొక ప్రశ్న వచ్చినది. చూచారా? కాని నేను… మీరు ఈ ప్రశ్నలకు నేను జవాబులు ఎందుకిట్లు ఇచ్చుచున్నానో మీకు అర్థమయి యుండును. ఏదయినా చేయుటకు నాకు తప్పక నడిపింపు కావలెను, చూచారా, అప్పుడు నేను చెప్పవలసిన దానిని చెప్పెదను. కాని ఆ ఘడియ ఇంకా రాలేదు.
కాబట్టి నేను అభిషేకించబడిన మనుష్యకుమారుడిని కాను. ఆయన ప్రవక్తనని నేను చెప్పుట లేదు. చాలాసార్లు నేను అనుకోకుండానే ఆ మాట పలికియున్నాను. టేపులో దానిని గ్రహించియున్నాను. ఇంగ్లీషు భాషలో "బోధకుడు" అను అర్ధమునకు కూడా "ప్రవక్త" అను పదమును వాడుదుము. మీకది తెలియును, లేనిచో నిఘంటువును చూడండి. చూచారా? ఇంగ్లీషు నిఘంటువులో ప్రవక్త అనగా "బోధకుడు" అని అర్థము. కాని హెబ్రీ లేదా గ్రీకు భాషలో, ప్రవక్త అనగా "భవిష్యత్ వక్త అని అర్థము. సంగతులను ముందే చూచును. ముందే చూచి చెప్పును." కాని ఇంగ్లీషులో ప్రవక్త అను పదమునకు, "బోధకుడు," అని అర్ధము.
కాబట్టి నన్ను నేను మీ సోదరునిగా తప్ప మరిదేనిగాను పిలచుకొనను. నేను మీ సోదరుడను. నన్ను మీరు సహోదరుడు బిల్, లేక సహోదరుడు బ్రెన్హాంగా ఎంచుకొనండి. ఆ విషయంలో మీరెట్లు పిలచినా మంచిదే. అదే మంచిది. మీరు నమ్ముదానిని హృదయంలో ఉంచుకొనుడి. చూచారా?
53మరిప్పుడు, మరియొక ప్రశ్న ఏమిటి? నేను వీటన్నిటిలో మునిగిపోయి యున్నాను. ఆ సంగతులు మరిచిపోయాను. ఆ ప్రశ్నలలో ఒకటి, "నేను మనుష్యకుమారుడా?" అని వారడిగిరి. మరొకటి ఇదియే అని నేను అనుకొనుచున్నాను. "మనుష్యకుమారుడనగా అగ్నిస్తంభమా అని అడిగిరి." కాదు! అగ్నిస్తంభమనగా అభిషేకము చేయునది.
ఇది మరికొంత లోతుగా చెప్పవలెను. మీలో కొందరు వేదాంత పండితులున్నారు. డాక్టర్ వైల్, ఇంకా ఆర్కన్సాస్ నుండి వచ్చిన ఇతరు సేవకులున్నారు. వారు నాకు మంచి స్నేహితులు. బహుశా వారికి ఇవి తెలియును.
ఆ అగ్నిస్తంభము లోగోస్ అయి యున్నది. అది దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళినది. నిజానికి అది దేవుని సంపూర్ణత యొక్క గుణలక్షణము. దేవుడు ఒక రూపమును ధరించెను. దానిని చూడగలము. అది ఆ గొప్ప ఆత్మ యొక్క అభిషేకము బయలుదేరి వెళ్ళినది. అది తనను తగ్గించుకొని దిగివచ్చుచున్నది. తండ్రియగు దేవుడు, ఇశ్రాయేలీయులను కప్పిన లోగోస్. ఆయన పరిశుద్దుడు, పాపమును సహించలేడు. ఏదెనులో ఒక రక్త బలి అవసరమాయెను. ఆ తరువాత లోగోస్ శరీరమును ధరించి మన మధ్య నివసించెను. లోగోస్ ఒక మానవ శరీరములో నివాసముండెను. అదే బలిగా మారెను.
JOHN 8:42•
JOHN 13:3
54మానవుడు దేవుని స్వరూపమందు తయారుచేయబడినప్పుడు… దాని తరువాత మానవుని విమోచించుటకు దేవుడు మానవ రూపమును ధరించెను. అప్పుడు దేవుడు మరియు మానవుడు ఒక్కటయిరి. భూమ్యాకాశములు ఒకదానినొకటి కౌగలించుకొని ముద్దుపెట్టుకొనినవి. దేవుడు మరియు మానవుడు తండ్రి మరియు కుమారుల వలె ఆలింగము చేసికొనిరి. లోగోస్ శరీరధారి అయ్యెను. మన మధ్య నివాసము చేసెను.
యేసు చెప్పెను, "నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, దేవుని యొద్దకు ఎక్కిపోవుచున్నాను." అది నిజమే గదా? ఆయన మరణము, సమాధి, పునరుత్థానము మరియు ఆరోహణముల తరువాత ఆ శరీరము కొనిపోబడి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొండపెట్టబడియున్నది. దేవునికి కుడి చెయ్యి ఉన్నదని నా భావము కాదు… దేవుడు ఆత్మ స్వరూపియైయున్నాడు. కాని కుడి చెయ్యి అనగా "దేవుని యొక్క శక్తి మరియు అధికారము," అని అర్ధము. పరలోకమందున్న ప్రతిదియు ఆ నామము ద్వారానే పిలువబడును. ఆ నామమునకే లోబడవలెను. భూమిమీద నున్న ప్రతిదియు ఆ నామము ద్వారానే పిలువబడును. ఆ నామమునకే లోబడవలెను. అన్ని నామములకన్న పై నామము, యేసుక్రీస్తు,
ఆయనలో ఉండిన ఈ లోగోస్, దేవుని యొద్ద ఆత్మయై యున్నది. రక్తము యొక్క శుద్దీకరించు కృప ద్వారా అభిషేకించబడియున్నది. దేవునికి ఎందరో కుమారులను అనుగ్రహించినది. అదే లోగోస్ ద్వారా వారును అభిషేకించబడుచున్నారు.
JOHN 14:12•
ACTS 2:3
55ఇప్పుడు, ఆ అగ్నిస్తంభము పెంతెకోస్తు దినమున దిగి వచ్చెను. ఆ అగ్నిస్తంభము అనేక భాగములుగా విభాగించబడెను. అగ్ని నాలుకలు వారి ఒక్కొక్కరి మీద నిలచెను. వారి నాలుకలు కావు, అగ్నిమయమైన నాలుకలు వారి ఒక్కొక్కరి మీద నిలచెను. వారు ఎన్నుకోబడిన, ఏర్పరచుకొనబడిన గుంపుగా ఉన్నారు. ఈ అగ్నిస్తంభము ద్వారా గుర్తింపబడిరి. దేవుడు తన్ను తాను మానవులలోనికి ప్రత్యేకించుకొనెనని ఇది చూపించుచున్నది. దానిని మీరు గ్రహించారా? దేవుడు, లోగోస్, మానవులలోనికి విభజింపబడి వచ్చెను, దేవుడు, ఒక వ్యక్తిలో లేడు. విశ్వవ్యాప్తంగా ఆయన తన సంఘములో యున్నాడు. ఆ కారణముచేతనే యేసు ఇట్లు చెప్పెను, "నేను చేయు కార్యములు మీరును చేయుదురు. ఇంకా గొప్పవి చేయుదురు." కింగ్ జేమ్స్ అనువాదములో, "గొప్పవి" అని ఉన్నది. కాని సరయిన అనువాదమును చూడండి. "ఇంతకన్నఎక్కువ కార్యములు మీరు చేయుదురు." యేసుక్రీస్తు అను ఒక్క నరునిలో దేవుడు గుప్తమై భద్రపరచబడియుండెను. కాని ఇప్పుడాయన మొత్తం ప్రపంచములో యున్న సజీవ దేవుని సంఘములో గుప్తమై భద్రపరచబడియున్నాడు.
ఇప్పుడు, దేవుడు ఇక్కడ మనతో యుండి మన హృదయములతో మాట్లాడుచున్నాడు, ఆయన ఆఫ్రికాలో యున్నాడు, ఆయన ఆసియాలో ఉన్నాడు, ఆయన యూరోప్లో యున్నాడు, ఆయన ఇంగ్లాండులో యున్నాడు. విశ్వాసులు ఎక్కడెక్కడ కూడియున్నారో వారి మధ్యను ఆయన ఉన్నాడు.
LUKE 17:28-30•
ACTS 9:4,5•
HEB 13:8
56ఇప్పుడు, ఆయన యొక్క మరణము, సమాధి, మరియు పునరుత్థానము, ఆరోహణము, పరిశుద్ధాత్మ రాక తరువాత పౌలు - అనగా సౌలు - దమస్కు దారిలో వెళ్ళిపోవుచుండెను. లోగోస్, అగ్నిస్తంభము ద్వారా క్రిందకు పడద్రోయబడెను. ఆ యూదుడు తమ పితరులను అరణ్యములో నడిపించిన లోగోస్ ఇదేనని తెలిసికొని యుండకపోతే, ఆ యూదుడు ఆ అగ్నిస్తంభమును "ప్రభువని," ఎన్నడూ పిలిచియుండేవాడు కాదు. చూచారా? ఇప్పుడు, అది మనుష్యు కుమారుడు కాదు, అది లోగోస్.
ఇప్పుడు, దీనిని మనము భయభక్తితోను, ప్రేమతోను, మర్యాదతోను చెప్పుచున్నాము. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నందువలన, లోతు యొక్క కాలమునకు ముందు, లేదా సోదోమొలో లోతు దినములలో జరిగినట్టు, చివరి దినములలో మనుష్యకుమారుడు తనను మరలను బయలుపరచుకొనుచున్నాడు, అతడు తనను మరలను బయలుపరచుకొనుచున్నాడు. ఈ చివరి దినములలో, యేసు మీద యుండి, అక్కడ నుండి మరల అగ్నిస్తంభమునకు తిరిగి వెళ్ళిన లోగోస్ భూమికి దిగి వచ్చియున్నది. (నేను ఏదో ఒకదానిని చెప్పాలనుకొన్నాను, కాని నేను టేపు గమనించుచున్నాను. మీరు చెప్పినను వారు దానిని నమ్మరు. అది ఏ వ్యత్యాసమును ఏర్పరచదు. వారు… ప్రజలు దానిని నమ్మరు. దానిని చెప్పకుండా వదిలివేయుచున్నాను) - అతడు దిగి వచ్చియున్నాడు, ఇప్పుడు పరిశోధనా తీర్పు జరుగుచున్నట్లుగా యుండును.
SONG 2:1•
REV 2:16
57ఇప్పుడీ గొప్ప అగ్నిస్తంభమును సైంటిఫిక్ కెమారాలు సహితము నిరాక్షేపముగా గుర్తించియున్నవి. అది ఈనాడు భూమి మీద యున్నది. దానియొక్క పటము ఇక్కడ వ్రేలాడుచున్నది. ఇంకా అదిక్కడే యున్నదని నమ్ముచున్నాను. అది నిజమేనా? అది అక్కడే యున్నదా? మనకున్న ఉత్తమమైన ఒకరివలన అది శాస్త్రీయంగా రుజువు చేయబడినది. జార్జి జె. లేసీ, వ్రేలి ముద్రలను, పత్రములను పరిశోధించు ఎఫ్.బి.ఐ (FBI)లోని విభాగమునకు అధిపతి. అతడు ఇట్లు చెప్పెను, "రెవరెండు బ్రెన్హాం, నా మట్టుకు నేను దీనిని మానసిక సంగతి అనుకొన్నాను, కాని ఆ వెలుగు లెన్సును తాకి యున్నది. దానిని నేను అట్లాగే లైట్లు క్రింద ఉంచి, నాలుగు లేదా అయిదు రోజుల పాటు పరీక్షించియున్నాము. లెన్సును వెలుగు తాకియున్నది. ఈ లెన్సు సైకాలజీని తీయజాలదు." ఇప్పుడు, అది గుర్తించబడినది.
ఆ తరువాత దానియొక్క క్రియలను పరీక్షించండి. అది మనమధ్య ఉండి, ఒకప్పుడు పాలస్తీనాలో జీవించిన యేసునే నిరూపించుచున్నది. ఆయన మీద ఉండిన ఆత్మయే ఒక శరీరము ద్వారా వచ్చినది. అది మరల శిరస్సుగా మారుచున్నది. శరీరమును వశపరచుకొనుటకు ఆయన త్వరగా రాబోవుచున్నాడు. ఆమేన్. తలయనునది శరీరమునకు వచ్చుచున్నది. దానిని మీరు గ్రహించియున్నారా? ఆయనే దేవుడు కుమారుడు, మనుష్యకుమారుడు, దావీదు కుమారుడు, ఉన్నవాడననువాడు, షారోను పుష్పము, లోయలోని పద్మము, వేకువ నక్షత్రము.
58నేను ఆయనను కాను; నేను ఆయన దాసుడను. అగ్నిస్తంభము ఆయన కాదు. అది ఆత్మ రూపములో యున్నది, చూచారా, మనుష్యకుమారుని మీద ఉండినది. ఇప్పుడు నర పుత్రులను అభిషేకించుటకు వచ్చుచున్నది. ఆయన ఖచ్చితంగా చెప్పిన పరిచర్యనే తిరిగి తెచ్చుచున్నది, ఎందుకనగా శరీరముతో శిరస్సు కలుపబడవలసియున్నది.
హనోకు నిర్మించిన పిరమిడ్ వలెయున్నది. ఆ పిరమిడ్లో మనము కనుగొనగలము. దాని మీద తలరాయి వారుంచలేదు. ఎందువలన? తలరాయి ఇంకా రావలసియున్నది. పిరమిడ్లో ఏడు మెట్లున్నవి. ఒక దినమున దానిని చెప్పుచుందుము. అది ఖచ్చితంగా లేఖనముతో ఎట్లు సరిపోవునో చెప్పెదను.
MATT 24:28•
HEB 11:40
59ఇప్పుడు, మీ అమెరికను డాలర్ నోటును గమనించారంటే, ఆ మహత్తరమైన తలరాయి, కన్ను, "గొప్ప ముద్ర," కనబడును అని చెప్పుచున్నది. అది వచ్చును.
ఆ రాళ్ళను గమనించండి… ఐగుప్తులోని పిరమిడ్లు చూచినవారెవరైనా ఇచ్చటున్నారా? ఆ వెనుక కొందరున్నారు. మంచిది. అక్కడ, వాటిని చూచినట్లు వెనుక వైపు చేతులు ఎత్తబడియున్నవి. ఆ రాళ్ళు అంతపైన ఎంత పరిపూర్ణముగా పేర్చిరి. ఆ పై వైపు, వంగినట్లుగా యున్న ఆ పై వైపు, ఆ రాయి వచ్చినప్పుడు, ఒక గొప్ప వజ్రము దానిలో ఎంతో పరిపూర్ణముగా పొందుపరచినట్లుగా యుండును.
ఇప్పుడు, ఆ రాయి అడుగు పునాదికి సరిపోదు, రెండవ పునాదికి సరిపోదు, మూడవ పునాదికి సరిపోదు. అది పై పునాదికి మాత్రమే సరిపోవును. అప్పుడు మొత్తం భవనము ఆ రాయికి కలుపబడియుండును. సంఘమను విశ్వాసుల యొక్క శరీరము, ఆయన ఒకప్పుడు విడిచి వెళ్ళిన పరిచర్య ఒక్కటిగా యగు వరకు యేసు రాలేడు. "మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు," అని పౌలు చెప్పెను. హెబ్రీ 11. "మనము లేకుండా వారు సంపూర్ణులు కాజాలరు. లూథరన్, వెస్లీ మరియు కాలములన్నింటిలోను ఉన్నవారిని లేపుటకు వారికి ఈ పరిచర్య తప్పకుండా అవసరము. "తాజా ఆహారము ఎక్కడుండునో పక్షిరాజులు అక్కడ పోగవును." అదియే ప్రశ్న. ఓ, అది పరిపూర్ణముగా యున్నది. ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చానని తలంచుచున్నాను.
MATT 5:45•
1COR 14:29
60ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, పరిశుద్ధాత్మను పొందిన ఒక వ్యక్తిలోని భాషలతో మాట్లాడువరమును, ప్రవచనవరమును సాతాను ఉపయోగించుకొనగలదా?
అది మంచి ప్రశ్న కదా? అవును! బహు జాగ్రత్తగా దానిని గమనించుట అవసరము. I కొరింథీ 14:29ని గమనించండి. దీనిని వ్రాసుకోవలెననుకొనువారికి… చూచారా? దీనిని వ్రాసిన వారి పేరు లేదు. "దేవుడు నిన్ను దీవించును," అని మాత్రము చెప్పిరి. చూచారా? I కొరింథీ 14:29. సంఘములోని ఏ వరమునయినా గాని మొదట వివేచించవలెను, చూచారా. మీరు కనిపెట్టవలెను, ఎందుకనగా దురాత్మలు చొరబడును. ఎందుకనగా గుర్తుంచుకొనండి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురియుచున్నది. గోధుమలను పరిపక్వము చేయుటకు పంపబడిన వానయే గురుగులను కూడా పరిపక్వపరచుచున్నది. అదే నీరు. ఎందరికిది తెలియును? ఇప్పుడు, అది మీకు సర్వసంతానము ఎడల ఉన్న అపోహలను తొలగించును. ఈ కుమారుడెట్లు వచ్చునో గమనించగలరు. నా సమయము అయిపోక ముందే ఈ విషయమును ఎత్తిచూపగోరుచున్నాను, కాని కుదురుట లేదు. ఆ కుమారుడు సర్ప సంతానము ఎట్లయ్యెనో చూడండి.
దేవునికి ఒక చట్టమున్నది. ఈ జీవాత్మ యొక్క చట్టమును మీరు గమనించి చూడవలెను, ఎందుకనగా సాతాను చొచ్చుకొని వచ్చును.
ఒకరికి ఏదయినా ఒకటి బయలుపరచబడినప్పుడు, దానిని సంఘము ముందు చెప్పక ముందు కనీసము ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు తీర్పు చేయవలెను అని పౌలు చెప్పియున్నాడు.
61ఇక్కడ మరో విషయము చెప్పవలెను. ఈ రాత్రి నా సోదరుడు ఇచ్చట లేడను కొంటాను. ఒకరు ఈ ఆలయమును విడిచి సహోదరుడు జూనియర్ జాక్సన్ యొక్క ఆలయమునకు వెళ్ళిరని అపహాస్యము చేసిరి. వారు "చచ్చిన పక్షుల మధ్యకు వెళ్ళిరని హేళన చేసిరి." అటువంటి మాట అన్నందుకు మీరు సిగ్గుపడుట లేదా? మీరు ఎవరన్నాగాని, మీరు నా పిల్లలు గనుక నేను సిగ్గుపడుచున్నాను. అటువంటి మాటలు మాట్లాడరాదు. జూనియర్ జాక్సన్ నా సోదరుడు. డాన్ రడెల్ నా సోదరుడు.
మంచిది, దానికి కారణమున్నది, ఎందుకనగా ఇక్కడ సంఘమును నేను ఒక ప్రత్యేక క్రమములో ఉంచి, వరముల ప్రత్యక్షతను సమీక్షించుటకు నేను తిరిగి వచ్చినప్పుడు, వారిలో సగంమంది అందులో నుండి జారిపోయిరి. నీవు మాట్లాడుటకు, బోధించుటకు మొదలుపెట్టగానే… వారు అన్యభాషలతో మాట్లాడుచూ, వేరే ఎవరైననూ దానికర్దము చెప్పుచూ ఉంటే ఎన్నడూ నీవు బోధించలేవు; వారు చెప్పిన దానిలో సగం కూడ నెరవేరుట లేదు.
MATT 6:7
62ఇప్పుడు, అన్యభాషలతో మాట్లాడుటను నేను విశ్వసించుచున్నాను. అర్థము చెప్పుటను నేను నమ్ముచున్నాను. కాని అది ప్రత్యక్షంగా సంఘము కొరకైనదయి యుండవలెను. అంతేగాని, "ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు," లేదా మరో అటువంటి మాటలు కావు. కాని యేసు చెప్పిన విధంగా "అన్యులవలె వ్యర్ధపు మాటలు వచింపవద్దు."
అది ఏదైన ఒకటై ఉండియుండాలి, ఫలాని సోదరుని యొద్దకు వెళ్ళి, అతడొక రోజు ఈ నిశ్చితమైన పనిని చేసాడనియో, ఫలాని సోదరీ, సోదరుని యొద్దకు వెళ్ళి, ఆమె అప్పుడొక రోజు ఈ నిశ్చితమైన పనిని చేసినప్పుడు, ఆమె తన భర్తతో చేసిన ప్రమాణములను మీరిరనియు, దోషము చేసిరనియు చెప్పండి. ఆమె దీనిని సరిచేసికొననిచో ఆమెలో నుండి పరిశుద్ధాత్మ తీసివేయబడును." అదే విధంగా ఉండవలెను. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడయి యుండును.
అప్పుడు పాపము బయటపడును. అననీయ, సఫ్సీరాలు వచ్చిన సంఘము వలె అది ఉండును. అప్పుడు గట్టిగా నిలచిన సంఘము మనకుండును.
"నా జీవితంలో ఎన్నడూ చూడని క్రొత్తవారు వచ్చినప్పుడు కూడా ఆలాగే నేను చేయుట లేదా? దీనిని చేయుటకు నన్ను పంపిన నా దేవుని యందు ఎంతో విశ్వాసము, నమ్మకము నాకున్నది. ఏ ఒక్కసారి కూడా అది తప్పు కాదు. అది దేవుని యొద్ద నుండి వచ్చినంత కాలము తప్పుకాజాలదు," అని చెప్పాను. అది నిజము.
63భాషలతో మాట్లాడుట మొదలగునవి కావు. ఆ భాషలను, ఇతర వరములను కలిగిన వారిని నేను నమ్ముచున్నాను. వారు నిజమైన క్రైస్తవులయితే, వారికి అది కావలెనను ఆసక్తి యున్నచో, వారు అందుకు తగుదురు, ఎందుకనగా వారి భాషలు మరియు భావములు దేవుని రాజ్య వ్యాప్తికి దోహదపడును. వారికి వారి స్వంత పరిచర్య యున్నది, కాని జనుల మధ్యలో లేచి ఆటంకపరచరాదు, ఎందుకనగా పాపులకు బోధించవలసి యున్నాము. వారు నీకు ఏమీ తెలియదని తలంచెదరు. బైబిలు ఆ సంగతి గూర్చి చెప్పెను.
కొన్నిసార్లు వారు ఎంతో అమర్యాదగా ప్రవర్తించుచున్నారు. వారు ఆలాగు లేరని చెప్పను గాని కొంతకాలము కొనసాగనిచ్చుచున్నాను. దానిని గమనించుడని నేను చెప్పాను.
HEB 12:8
64"వారిని ఏమీ అనవద్దు. కొంత కాలము తరువాత అది దేవుని సంబంధమైనదో, కాదో తేలిపోవును. శిక్షను వారు తృణీకరించినచో అక్రమ సంతానమని అర్థమగును," అని సోదరులతో చెప్పాను. (అందుకు సాక్షులు ఇచ్చటున్నారు), అక్షరాలా అదే బైబిలు చెప్పుచున్నది. శిక్షను పొందినప్పుడు ఏమి జరుగును? దానిని ఎప్పుడో మీకు చెప్పాను. చూచారా? మీ సంఘ కాపరిని అడగండి.
"దీని మాట, దాని మాట ఏమిటి?" అని అతడడిగెను.
"వారిని ఏమీ అనవద్దు. వారు పసిపిల్లలు. వారిని మనము ఏమీ అనరాదు. కాని వాక్యము యొద్దకు వచ్చినప్పుడు నిజంగా వారేమైయున్నారో తేలిపోవును," అని చెప్పాను.
ఇప్పుడు, ఆ విషయములో అసమ్మతిని తెలియజేయు హక్కు సహోదరుడు జూనియర్ జాక్సన్ కు ఉన్నది. అతడు తన సంఘములో ప్రజలందరి మధ్య వారు భాషలతో మాట్లాడవచ్చునని కోరియన్నాడు. ఆ బాధలు సహోదరుడు జూనియరే సహించును; అది అతని ఇష్టము. కాని మనందరివలెనె జూనియర్ జాక్సన్ వర్తమానమును నమ్ముచున్నాడు. అతడు మనలో ఒకడు. అక్కడికి వెళ్ళితే చచ్చిన పక్షుల మధ్యకు వెళ్ళినట్లు కాదు. జూనియర్ జాక్సన్ దైవజనుడు. నా పూర్ణ హృదయముతో అతనిని ప్రేమించుచున్నాను. ఈ రాత్రి ఇక్కడ లేడు గనుక నేను చెప్పవలెననుకొన్నదంతా చెప్పెదను.
65డన్ రెడల్… డాన్ కూడా ఈ రాత్రి ఇక్కడలేడనుకొంటాను, ఎందుకనగా వారికి స్వంత ఆలయములున్నవి. ఈ ఆలయమునకు వచ్చు ప్రతి వ్యక్తి, డాన్ రడెల్ లేదా జె.టి. పార్నెల్, లేక మన సోదరుల యొక్క ఏ సంఘమునకు వెళ్ళిపోయినా నేను చాలా సంతోషించెదను, ఏమి చేయవలెననునదే తెలియదు. "ప్రభువా, దీనిని మరల నింపుము. ఒకరు బయటకు పోయిరి గనుక మరొకరిని లోనికి తీసికొని రమ్ము," అని చెప్పెదను. అది నాకు ఇష్టము. వారిని చూచుట నాకు సంతోషము. వారు నా పిల్లలు.
జె.టి. గాని, మరెవరయినా గానినేను నమ్మినట్లుగానే నమ్మవలెనని లేదు; వారాలాగు చేయనవసరము లేదు. ఈ ఉదయమున నేను చెప్పినట్లుగా, నేను నా భార్యతో సమ్మతించను, లేదా నా భార్య నాతో సమ్మతించదు. మేము భోజనపు బల్ల యొద్దకు వెళ్ళినప్పుడు జూనియర్ యాపిల్-పై ఇష్టపడవచ్చు. నేను చెర్రీ-పై ఇష్టపడవచ్చు. సోదరులారా, మేమిద్దరం దానినే తినుచున్నాము. అక్కడ మేము సమ్మతించెదము, కాని మేమిరువురము ఒకే సువార్త ప్రకటించుచున్నాము. అతని సంఘ క్రమశిక్షణ అతని బాధ్యత.
66పేతురుకు మరియు పౌలుకు మధ్య భేదములున్నవి, వారి బోధలో తేడా కాదు, కాని పేతురు యొక్క స్వయం ప్రవర్తనలో తేడా వచ్చెను. వారద్దరికీ అక్కడే చిన్న తేడా యుండెను. అది వారిని ఎన్నడూ వేరుచేయలేదు. వారు సోదరులు, నిశ్చయంగా మన మధ్య తేడాలుండును. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ తో నేను విభేదించెదను. వారి విధానములు నాకు సరిపోవు, కాని అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ లో చాలామంది ప్రశస్త సోదరులున్నారు. నేను ఏకత్వ సిద్దాంతముతో సమ్మతించను, కాని అందులో చాలామంది ప్రశస్త సోదరులున్నారు.
బాప్టిస్తులతో నేను సమ్మతించను, ప్రెస్బిటేరియనుల విధానము నాకు నచ్చదు, కాని వారిలో నిజమగు క్రైస్తవులున్నారు.
67ఈ మధ్యాహ్నము ఒక తంతి వార్త నాకు వచ్చినది. దానిని నేను ఎక్కడో మరచిపోయాను. ఒక సోదరుడు, అనగా బాప్టిస్టు బోధకుడు దానిని పంపెను. మనుష్యులు ఒకరినొకరు గౌరవించుకొనుటకు బదులుగా, దేవునిని గౌరవించు స్థాయికి ఎదుగవలెనని చాలాకాలం నుండి అతడు ఎదురు చూచుచున్నట్లు తెలిపెను.
ఈ ఆలయమునకు వచ్చు ఒక ప్రశస్త సోదరుడు చెప్పెను, "అటువంటి చోటికి నిన్ను కొనిపోయెదను." ఇక్కడికి రావలెనని ఆ బాప్టిస్టు వ్యక్తి కోరెను. చూడండి, వారు అన్ని చోట్లా చెదరియున్నారు. వారి విధానముతో నేను సమ్మతించను, కాని నిశ్చయంగా వారిని ప్రేమించెదను. కావున సోదరుల గూర్చి చెడుగా మాట్లాడవద్దు.
ఈ వరముల యొద్దకు వద్దాం - వాటిని పరీక్షించవలెను. వరములను గమనించి చూడవలెను. ఏ వరమునయినా గాని సాతాను అనుకరించగలదు. ఇప్పుడు ఈ బీటిల్స్ దైవిక స్వస్థతను అనుకరించుచున్నది - వారు అపవిత్రులు, మురికివారు, చెడిపోయినవారు, నరకము నుండి పుట్టినవారు. చూచారా? మంచిది.
DAN 3:25
68ప్రశ్న: అగ్ని గుండములోని నాలుగవ వ్యక్తి దానియేలా? ఎందుకనగా అతడు ఆ కాలమునకు ప్రవక్త కాదా?
కాదు, ఆయన యేసు. ఆ నాలుగవ వ్యక్తి - దేవుని కుమారుని పోలియుండెను. అతడు ప్రవక్త అని నేననుకోను, ఎందుకనగా అతడు సింహపు గుహలో యున్నాడు; అయితే దానియేలు అగ్ని గుండములో యున్నాడని నేననుకొనను. మీరు సరికావచ్చు, కాని ఇది కేవలము నా అభిప్రాయము.
GEN 6:12•
MATT 24:37-39•
LUKE 17:26
69ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనములో ప్రతి మానవుడు తన మార్గమును చెరిపివేసికొనినట్లు దేవుడు చెప్పెను. ఇది వివాహము మరియు పరిత్యాగమునకు చెందునా? ఆలాగయితే, యేసు చెప్పినది దీనికి చెందియుండును గదా, "నోవహు దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలోనూ ఉండును." మత్తయి 24:38-39.
GEN 6:12•
MATT 24:38•
LUKE 17:27
70ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, వెయ్యేండ్ల పాలన కాలములో పిల్లలు జన్మింతురా? - క్రీస్తు, వెయేండ్లు ఈ భూమి మీద పాలన చేయునా? లేదా ఆ సమయములో భూమి మీద ఏ పాపమైనా ఉండునా; మరియు ఆ సమయములో భూమి మీద మనుష్యులు ఇట్టి శరీరమునే కలిగియుందురా?
త్వరగా వీటికి జవాబు చెప్ప ప్రయత్నించుదును. ఇప్పుడు, ఆదికాండము 6వ అధ్యాయము, 12వ వచనం. సర్వ శరీరులు చెడిపోయిరని దేవుడు చెప్పెను. అందులో వివాహము, పరిత్యాగము అన్నీ యున్నవి. "నోవహు దినములలో వలె పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసికొనుచు యుందురు," అని బైబిలు చెప్పెను. అది అంత్యకాల సూచనలలో ఒకటి యగును, కేవలము సూచనలలో ఒక్కటి మాత్రమే.
ఇప్పుడు, ప్రపంచమంతా అది చేయుచున్నాగాని, నేను ఇది అంత్యకాల సూచన అని చెప్పను. పరిశుద్ధాత్మను పొందెననటానికి అన్యభాషలు మాట్లాడుట సూచన కాదని చెప్పు రీతిగానే చెప్పెదను. నోవహు దినములలో ఉండినట్లుగానే వివాహము, పరిత్యాగము ఉండు కాలము ఒకటి రావచ్చునని ఊహించుదుము, కాని ఇంకా ఎన్నో ఇతర సంగతులు కూడా యున్నవి; ఇది వానిలో ఒక్క సూచన మాత్రమే.
71అన్యభాషలతో మాట్లాడుట పరిశుద్ధాత్మ యొక్క సూచనలలో ఒక్కటి, కాని పరిశుద్ధాత్మను పొందినట్లు అదే ఖచ్చితమగు గురుతని చెప్పరాదు. స్త్రీలు, పురుషులు పెండ్లిచేసికొనుచున్నారు, విడిపోవుచున్నారు, మరల పెండ్లి చేసికొనుచున్నారు. అదొక్కటే సూచన కాదు. అదొక్కటే సూచనగా ఉంటే నేనూ ఆలాగే చెప్పియందును. చూచారా? అది దేవుడు అదే విధంగా చేయటానికి, అన్యభాషలు మాట్లాడుటతో పాటు ఇతర విషయములు కూడ యుండవలెను.
ఇప్పుడు, "వెయ్యేండ్ల పరిపాలన కాలములో పిల్లలు పుట్టుదురా?" అని ప్రశ్న వేసిరి. ఆ ప్రశ్న నా మనస్సులో యున్నదని ఒక రోజున మీకు చెప్పాను. నాకు తెలియదు. కాని పుట్ట వచ్చునని చాలా వరకు తోచుచున్నది. ఈ విషయములో యధార్థముగా మాట్లాడుచున్నాను. అది ఇంతవరకు నాకు తెలియదు. ఎప్పుడైనా దేవుడు నాకు బయలుపరచినచో, మీకు చెప్పెదను. కాని వేచియుండుడి; అది దేవుని యొద్ద నుండి రావలెను. మీరు నా పిల్లలు. నేను మీకు చెప్పలేను. ఆ విధముగా జరుగునో, జరుగదో అది నాకు తెలియదు.
REV 20:2
72"ఆ కాలములో భూమి మీద పాపముండునా?" అనడిగారు. ఉండదు! భూమి మీద పాపము ఉండదు. సాతాను బంధింపబడును.
"ఆ సమయములో ఇట్టి శరీరములను కలిగియుందుమా?" అనడిగాను. అవునయ్యా! ఈ భూమి మీద మహిమ శరీరము మనకుండును. తిందుము, త్రాగుదుము, గృహములు కట్టుదుము - ఇప్పుడు జీవించుచున్నట్లే వెయ్యేండ్లపాలన కాలములోను ఉందుము. అది వధువుకు మరియు పెండ్లి కుమారునికి హానీమూన్.
MATT 12:31,32•
MARK 3:28,29•
LUKE 12:10
73ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మత్తయి 12, వచనము 32లో యేసు చెప్పిన దానికి అరమేమి? "పరిశుద్ధాత్మకు విరోధముగా ఒక్క మాట మాట్లాడినా గాని, అట్టివానికి ఈ లోకములోగాని, రాబోవు లోకములో గాని క్షమాపణ దొరకదు." ఈ వాక్య భాగమును దయచేసి నాకు వివరించుము. వందనములు. దీనిని వ్రాసిన వారి పేరున్నది. ఈయన ఒక సేవకుడు. మంచిది.
సోదరుడా, నీవు వేదాంత పండితుడవు, కాని నేను కాను. కాని నేను దీనిని చెప్పగోరుచున్నాను. యేసు చెప్పెను, "పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడువానికి - ఈ లోకములో గాని, రాబోవు లోకములో గాని క్షమాపణ దొరకదు. ఇతర వచనములో చూడండి. "ఏ రకమగు పాపమునకయినా గాని క్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు." పరిశుద్ధాత్మను దూషించుట అనగా హేళన చేయుట, దానిని గూర్చి అపహసించి మాట్లాడుట, గేళి చేయుట మొదలగునవి. తప్పు మరియు ఒప్పునకు మధ్యనున్న గీతను దాటుట.
JOHN 3:18
74ఉదాహరణకు చూడండి, పరిశుద్ధాత్మ ఇక్కడికి దిగి వచ్చి వివేచించుచున్నది. ఆ పరిశుద్ధాత్మను నీవు నమ్ముటలేదనుకొందము. నీవు బయటకు వెళ్ళి, దానిని గూర్చి హేళనగా మాట్లాడియున్నావు. అంతే! నీ పని అంతటితో అయి పోయినది. నీవేమీ చేయ జాలవు. నీవు దేవుని సంబంధివి కావని అందుమూలముగా అర్థమగుచున్నది, ఎందుకనగా దేవుని బీజము ఒకనిలో నిలచియున్నయెడల, అతడు పాపము చేయడు. పాపమనగా ఏమిటి? అవిశ్వాసము. ప్రత్యక్తపరచబడుచున్న వాక్యమును చూచినప్పుడు అతడు నమ్మును. అతని వలన మాత్రమే..
చూడండి, ఒకే ఒక పాపమున్నది, ఒకే ఒక పాపము. ఇదెందరికి తెలియును? అది అవిశ్వాసము. అది నిజము. వ్యభిచరించుట పాపము కాదు. సిగరెట్లు త్రాగుట, అబద్ధము, ప్రమాణము మొదలగునవి పాపము కాదు. అవి అవిశ్వాసము యొక్క గుణలక్షణములు. నీవు విశ్వాసివి కానందున, అవి చేయుచున్నావు. ఇది నిజము. చూడండి, ఒకే ఒక పాపమున్నది, అది అవిశ్వాసము. "విశ్వసింపనివానికి ముందే తీర్పు తీర్చబడియున్నది." అతడేమి చేసినా, చేయకపోయినా, ముందే శిక్ష విధింపబడినది. మంచిది.
75ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, వివాహము కాని యువతి (ఏమిటో చెప్పలేదు) జుట్ట కత్తిరించుకొనుట తప్పా? దీనిని స్త్రీ అడిగినదనుకొంటాను.
అవును! ఏ స్త్రీ అయినా గాని జుట్టు కత్తిరించుకొనుట తప్పు.
అది చిన్న ప్రశ్న మీకు నిద్ర వచ్చుచున్నదా? వీలయినంత త్వరగా ముగించుదము. సర్పసంతానము గూర్చి చెప్పవలెనని మిక్కిలి ఆశించుచున్నాను.
ప్రశ్న: మా కుమారుని కొరకు ప్రార్థించుము…
అది ఒక ప్రార్థన విన్నపము. వీటన్నింటినీ చూచెదను.
76ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, ఒక స్త్రీకి ఆర్యోవంతుడగు భర్త, పిల్లలు ఉండగా, బయటకు ఆమె వెళ్ళి పని చేయవచ్చునా? ఈ ప్రశ్నను నేను మరియొకరి కొరకు అడుగుచున్నాను.
మంచిది, దానిని గూర్చి నాకు తెలియదు. నేను చెప్పలేను. కాని నాకు ఒక అభిప్రాయమున్నది. దానిని చెప్పెదను: నేను ఒక స్త్రీని అయితే, నా భర్త ఆరోగ్యవంతుడై యుండి మంచి ఉద్యోగము చేయుచున్నచో, నేను ఇంటియొద్ద ఉండి నా పిల్లలను శ్రద్ధగా చూచుకొందును. వారిని పెంచెదను. ప్రభువును ప్రేమించెదను. బట్టలుతుకుతూ, ఇంకా ఆయా ఇంటి పనులు చూచుకొంటూ, నా పిల్లలకు ప్రభువునెట్లు సేవించవలెనో చెప్పెదను.
77ఇప్పుడు, మీకు అప్పు ఉన్నదనుకోండి. మీరు మీ భర్తకు సహాయము చేయగోరి పనిచేయుచుందురు. ఆ విధముగా పరిస్థితులు అర్థము చేసికొని పనిచేయుచున్నచో మంచిదే. స్త్రీ వలె జీవించుము. అది కష్టమని నేను భావించుచున్నాను. అవగాహన గల ఏ మగవాడయినా గాని తన భార్య ఒక గుంపు మధ్యకు వెళ్ళి, పనిచేయవలెనని కోరుకొనడు. వారు అల్లరి గుంపుగా యుందురు. అసభ్యకరముగా మాట్లాడుచుందురు. ఒకవేళ స్త్రీ అటువంటి చోటికి వెళ్ళవలసి వచ్చినచో, ఆమె ముందు తన భర్తకు నిజమైన క్రైస్తవురాలననియు, నమ్మదగిన వ్యక్తిననియు నిరూపించుకొనవలెను.
కాని ఆమె పనిచేయకూడదు, అని నేను చెప్పుట లేదు. చూడండి, అందుకు ఏ లేఖనాధారము లేదు. నా అభిప్రాయమును వెల్లడి చేయుచున్నాను. స్త్రీ పని చేయవలెనని కోరుచుండవచ్చును…
78కొన్ని వ్యాపార కార్యాలయములలో స్త్రీ పనిచేయుటను నేను ఖచ్చితంగా వ్యతిరేకించుచున్నాను. వారు పోకిరి సరసోక్తులు పలుకుదురు. చక్కని, పవిత్రమగు స్త్రీ అచ్చట కూర్చున్నచో వారి అపవిత్ర ప్రవర్తనను ఎట్లు సహించగలుగును. అందుకు నేను విరోధిని. అటువంటి వారి మధ్యనుండి మీరు బయటకు రావలెనని నేను తలంచుచున్నాను.
కాని ఇప్పుడు, ఒక స్త్రీ నిజంగా - స్త్రీ వలె ప్రవర్తించుచూ, తన భర్తకు సహాయపడవలెనని, తన పిల్లలు బడికి వెళ్ళుచుండగా వారి ఖర్చును భరించుటకు పనిచేయగోరినచో మంచిదే. ఆ ఖర్చులున్నంత వరకూ ఆమె పనిచేసి తర్వాత మానివేయుట మంచిది. ఇది నా మాట. ప్రభుని వాక్యములో ఆధారము లేదు. నా స్వంత అభిప్రాయమును చెప్పుచున్నాను. ఒక స్త్రీ కాలక్షేపము కొరకు, లేదా విచ్చలవిడిగా ఖర్చుచేయుట కొరకు, అనగా ధూమపానము, మద్యపానము, నాట్యశాలలు, ఇతర దురలవాట్లకు డబ్బు ఖర్చు చేయగోరి పనిచేయవలెనను కొన్నచో, తప్పు. ఆమె ఆ విధంగా ఉండకూడదు. ఆమె ఇంట ఉండవలెను. స్త్రీవలె ప్రవర్తించి, గృహిణిగా పిల్లలను పెంచవలెను.
79ప్రశ్న: యేసు రెండవ… (లేదు!) యేసు - విడాకులు తీసికొనిన ఇద్దరు రెండవసారి వివాహము చేసికొన్నారనుకొనండి… వారు మారుమనస్సు పొందిరి, దానిని సరిచేసుకోవడానికి గాను వారిప్పుడు తమ వివాహ జీవితమును ముగించుకొనవలెనా? లేక పశ్చాత్తాపపడితే చాలునా?
"మీరు ఇద్దరూ విడాకులు పొందిన తరువాత రెండవసారి పెండ్లిచేసికొన్నారు…" ఇంతకు ముందే ఆ ప్రశ్నకు జవాబిచ్చాననుకొనుచున్నాను. చూచారా? అవును, దానికి ముందే జవాబు ఇవ్వబడినది.
ఈ సంగతుల గూర్చి ఇక చెప్పుకోనవసరము లేదు. నాకు తెలిసిన స్నేహితులు ఈ సమూహములో కూర్చొనియున్నారు. దీనిని చెప్పాలంటే నాకు చచ్చినంత పనియగుచున్నది, కాని నేను చెప్పక తప్పదు. చూచారా? ప్రపంచము ఇంతగా చెడిపోయిన స్థితిలో యున్నది.
ఒక దీనమగు స్త్రీ పొరపాటున ఒక త్రాగుబోతును చేసికొన్నదనుకొనండి, లేదా మరో మంచి వ్యక్తి అటువంటి చెడ్డ స్త్రీని పెండ్లి చేసికొన్నాడనుకొనండి. తెలియక చేసి వారు పెండ్లిచేసికొన్నాగాని జీవితకాలము దానికి వారు కట్టుబడియుండవలెను. అది చాలా ఘోరమగు సంగతి. పెండ్లి అనునది పవిత్ర కార్యము.
చాలాసార్లు పాపులయిన వారు ఇట్టి పనులను చేయుచుందురు. వారందుకు ఆశ్చర్యపడనవసరము లేదు. ప్రభువు నాకు అనుమతి ఇచ్చినచో, వివాహము మరియు పరిత్యాగము గూర్చి తేటగా వివరించెదను. అప్పుడు ఆ విషయము మీద సందేహములన్నీ నివృత్తమగును. [టేపు మొదటి వైపు అయిపోయినది. రెండవ వైపు ప్రశ్న మిగిలియుండి ప్రారంభమైనది.]
80ప్రశ్న: మేము ఇండ్లు ఎందుకు అమ్ముకోకూడదు? వందనములు! దానిని అమ్మవలెనని మేము ఉపవాసముంచి ప్రార్ధి౦చాము, కాని ఏమీ ఫలితము రాలేదు.
సోదరీ, సోదరుడా, మీరెవరో తెలియదు. (వారి సంతకము లేదు), మీరు ఎవరైనా, నీ ఆస్తిని నీవు అమ్ముకొనగోరినచో అది నీ ఇష్టము. బహుశా ఇంకొకటి కొనుక్కోవలెను. నీవు దీనిని అమ్ముచుండవచ్చును, నాకు తెలియదు. నీ ఉద్దేశ్యము సరియైనదగును. మంచిదే. నీకు పిల్లలుండి, వారికొరకు ఇంకా మంచి ఇల్లు కావలెనని దీనిని అమ్ముకొనుచున్నచో, అది మంచిదేనని చెప్పుచున్నాను. నీవెందుకొరకు అమ్ముచున్నావో నాకు కారణము తెలియదు. నీవు దానిని అమ్మవలెనని ఉపవాసముండి ప్రార్ధి౦చి ప్రయత్నించియున్నావు. ఇక దానిని ప్రభువుకు అప్పగించి మరచిపొమ్ము, చూచారా. నీవు మరొక చోటికి తరలి వెళ్ళిపోవలెనను కొనుచున్నావేమో. బహుశా అది దేవునికి ఇష్టము కాకపోవచ్చును, చూచారా.
నీవు క్రైస్తవునివైతే, నీవు ప్రభువునందు విశ్వాసముంచుచున్నచో ప్రభువుకు దానిని అప్పగించుము. చూచారా? నిశ్చయంగా నీవు అట్టి వ్యక్తివేనని నమ్ముచున్నాను, లేనియెడల నీవు ప్రార్ధన చేయవు, ఉపవాసముండవు. "ప్రభువా, దానిని అమ్ము సమయము వచ్చినప్పుడు, కొనువానిని పంపించుము," అని పలుకుము. ప్రభువుకే దానిని అప్పగించుము. నీ చేతులు కడుగుకొని ముందుకు సాగుము. ఆ పని దేవుడే చేయునని నీవు నమ్ముము. సమయము అయిపోవుచున్నది గనుక నేను త్వరగా పరిగెత్తవలెను.
81ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, స్త్రీలు ఉంగరముల జుట్టు తయారు చేసికొనుట తప్పా?
ఇంతకు ముందే దానిని చెప్పాను. ఇంక దానిని గూర్చి సమయము వెచ్చించను. చూచారా? ఆ విషయమును గూర్చి బాలికలకు సరసోక్తిగా నేను చెప్పుట లేదని గమనించండి, చూచారా. అది యధార్ధము. మీరు తెలిసికొనగోరి నన్ను అడిగియున్నారు. నా యందు మీకు నమ్మకమున్నది గనుక అడిగారు, లేనియెడల నన్ను అడిగేవారు కారు. సోదరీ, నీ యందు నాకు నమ్మకమున్నది. నేను చెప్పుచున్న దానిని నీవు చేయుదువని నమ్ముచున్నాను.
దానిని లేఖనముతో నేను బలపరచలేను. నీకు అందమగు ఉంగరాల జుట్టు లేనియెడల, నీవు స్త్రీవి గనుక నీ భర్తకు లేదా కాబోయే భర్తకు అందముగా కనబడవలెనని కోరుకొందువు. నీ జుట్టుకు ఉంగరాలు పెట్టుకొనుట గూర్చి నేను చెప్పను. వాటిని గూర్చి నాకేమీ తెలియదు. అలంకరణల పేరు నాకు రావు. దానిని గూర్చి నేనేమియూ చెప్పజాలను. అది మీ నిర్ణయము. చూచారా? ఏమి చేయవలెనని ప్రభువునే అడుగుడి. ఆయనే మీకు చెప్పును. నేను లేఖనము ద్వారా వాటిని వివరించగోరుచున్నాను, చూచారా.
JOHN 1:1•
1COR 13:1,10
82ప్రశ్న: I కొరింథీ 13:8-12ను దయచేసి వివరించుము, పరిపూర్ణ వాస్తవము ఇప్పుడు సంఘమునకు తిరిగి జొయ్యబడినది - కాబట్టి ఈ వచనములు నెరవేరినవా?
దానిని ముందే వివరించానని తలంచుచున్నాను. "పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది తొలగిపోవును." పౌలు చెప్పెను, "మనుష్యులు భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినా గాని, ఇంకా ఏవో చేసినా గాని, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, ఇది పోవును." దేవుడు తప్ప పరిపూర్ణమైనది మరేమున్నది? ఏదీ లేదు. దేవుడే పరిపూర్ణుడు గదా? ఆదియందు [వాక్యము అని జనులు జవాబిచ్చిరి.] వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము ఇంకా దేవునిగానే యున్నది. చూచారా? మంచిది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది వెడలిపోవును.
DEUT 22:5
83ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, ప్లాట్ టాప్ జుట్టు కత్తిరింపు సరికాదా?
అడిగినవారు పురుషుడని తలంచుచున్నాను; అవును. కొందరు స్త్రీలు కూడా ఆలాగు జుట్టు కత్తిరించుకొనుచున్నారు. నిశ్చయంగా! ఒకప్పుడు నేను బస్సులో ప్రయాణము చేయుచున్నాను. నేనప్పుడు గేమ్ వార్డెన్ గా పనిచేయుచున్నాను. నేను కూర్చొనియుండగా, ఒకతను నాతో మాట్లాడసాగెను. అతడు వెల్డర్స్ కేప్ పెట్టుకొనియుండెను. అతనితో నేను మాట్లాడుచుంటిని. అతడు సిగరెట్లు త్రాగుచుండెను. వెల్డర్స్ కండ్లద్దములు తల పైన యున్నవి. సెల్లర్స్-బర్గ్ దరిదాపుల్లో ఇది జరిగినది. నేను కూర్చొని అతనితో మాట్లాడుచుంటిని. అతడు ఏదో చెప్పగా, మేమందరము నవ్వుకొన్నాము. నేనతని కాలు మీద తట్టి, "నిజంగా ఇది గొప్ప సంగతి కదా?" అన్నాను.
ఆలాగు నేను కూర్చొనియుండగా, సరిగా మా ఎదురుగా ఒకామె కూర్చొనియుండుట గమనించాను.
ఆమె మగవారివలె పెద్ద శరీరమును కలిగియుండి, పాంటు ధరించి, సిగరెట్లు త్రాగుచూ, ముక్కులో నుండి పొగను వదలుచున్నది. నేను మగవాడనుకొన్నాను. ఏసిటలిన్ టార్చిని జారవిడుచుట గూర్చి చెప్పుచూ మరింకేమో చేయుచున్నది. ఎవరి తల మీదనో తట్టియున్నది. నవ్వుచూ తూగుచున్నది. నేను కూడా ఆమె సంభాషణకు నవ్వి, మగవాడనుకొని ఆమె కాలు తట్టాను. తేడా నాకు తెలియలేదు. నీవు గమనించలేవు. బైబిలు ఇట్లు చెప్పుచున్నది, "స్త్రీ, పురుషుని వస్త్రములు ధరించుట హేయము." చూచారా.
1COR 11:3,5,14
84సోదరుడా, నీవడిగిన మాదిరి జుట్టు కత్తిరింపు గూర్చి చెప్పుచున్నాను. వినుము. నా వయస్సు వచ్చు వరకు నీవు ఎదురు చూడుము. అప్పుడు నీవు ఆలాగు కత్తిరించుకొనుము. అది మంచిది. సహోదరుడు బ్రెన్హాం నీకు సత్యము చెప్పుచున్నాడని తలంచినచో మంచిది. నిన్ను దేవుడాశీర్వదించును. మగవారి గూర్చి దేవుడు ఇంతకు మించి ఏమీ చెప్పలేదు. అతడు స్త్రీ వలె జుట్టు పెంచుకొనరాదు. పురుషుడు, స్త్రీవలె జుట్టు పెంచుకొనుట అతనికి అవమానమని బైబిలు చెప్పుచున్నది.
కాని ఇప్పుడు, నీ జుట్టు నీవు చక్కగా కత్తిరించుకొన్నంత కాలము నీకు దోషము లేదు. దానిని గూర్చి ముందే చాలా చెప్పియున్నాను: "రిక్కిలు ఇటువంటి జుట్టు కత్తిరింపులు, ఇంకా చాలా పనులు చేయుచున్నారు." ఆలాగు మీరనుకరించవద్దు. చూచారా?
పురుషుడు జుట్టును కత్తిరించుకొనవలెను. ఆలాగు కత్తిరించుకొనినప్పుడు, దేవుడు సంతోషించును, ఎందుకనగా అతని శిరస్సు దేవుడు. స్త్రీకి, శిరస్సు పురుషుడు; అందువలన ఆమె జుట్టు కత్తిరించుకొనినప్పుడు, ఆ శిరస్సును అవమానపరచుచున్నది. అవమానకరమగు స్త్రీని విడనాడవలెను. పరిత్యాగ పత్రిక ఇవ్వవలెను. అది సరియేనా? జుట్టు కత్తిరించుకొనిన స్త్రీని ఆమె భర్త విడిచిపెట్టవచ్చునని బైబిలు నిస్సందేహముగా చెప్పుచున్నది. విడాకులిచ్చు హక్కు అతనికి అప్పుడుండును, ఎందుకనగా అట్టి హేయురాలగు స్త్రీతో అతడు జీవించరాదు. అది సత్యమని ఎందరికి తెలియును? బైబిలు ఆలాగు చెప్పుచున్నది, ఎందుకనగా ఆమె తన శిరస్సును అవమానపరచుచున్నది. అటువంటి స్త్రీతో కాపురము చేయరాదు.
MATT 5:27,28
85ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, సీయోను కుమార్తెల గూర్చి యెషయా పలికెను. (వారి గూర్చి చెప్పబడినదని అర్థము) - సీయోను కుమార్తెలు వింత పిన్నులు, వింత జుట్టు, ధరించి కనబడుచున్నారు. జుట్టు సరిగ్గా దువ్వుకొనలేదు. అది ఈ రోజుకు అన్వయించునా? లేక కొందరు చెపుచున్నట్లు, పాత నిబంధన ఇప్పుడు వర్తించదా?
పాత నిబంధన ఎన్నడూ నిరర్ధకము కాదు, దేవుడు చెప్పిన ప్రతి మాటయు అర్థవంతమైనదే. అవును! క్రొత్త నిబంధన వచ్చి, పాత నిబంధనను బూతద్దములో చూపించినది. యేసు చెప్పెను, "వ్యభిచారము చేయవద్దని మీతో చెప్పబడిన మాట విన్నారు గదా? (ఆ కార్యమును గూర్చి చెప్పెను); కాని ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో తన హృదయమందు వ్యభిచరించినవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." ఇవి ఎంత గొప్ప సంగతులు!
స్నేహితులారా, నేను ముగించవలసియున్నాను. చాలా ఆలస్యమగుచున్నది. ఇంకొన్ని చూద్దాం. అన్నియూ చెప్పవలెను, ఎందుకనగా చాలా యున్నవి.
1TIM 2:9
86ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, స్త్రీలు ఏ విధముగా (ఓ, మై!) తమ జుట్టును ఉంచుకొనవలెను?
మరల అదే ప్రశ్న. నీకిష్టమొచ్చిన విధంగా ఉంచుకొనుము. I తిమోతీ 2:9. చూచారా? "తగుమాత్రపు వస్త్రములను, ఆమె ధరించుకొనవలెను." దేవునిని సంతోషపరచురీతిగా నేను ధరించగోరుచున్నాను. (సోదరీ! వందనములు. దేవుడు నిన్ను దీవించును!) నీకు వందనములు. దేవుడు నిన్ను దీవించును. మా కొరకు ప్రార్ధి౦చుము. ఆమె తన పేరు వ్రాసినది.
షారోను! నిశ్చయంగా దేవుడు నిన్ను దీవించును. సోదరీ, తగినంత వస్త్రములు ధరించుము. ఆమె చిన్న బాలిక. అమ్మా! దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. ఆలాగే కొనసాగుము.
REV 22:11
87ప్రశ్న: వధువు ఎత్తబడిన తరువాత, బుద్ధిలేని కన్యకలలో ఎవరయినా రక్షించబడుదురా? లేక వారు నశించెదరా?
లేదు! చూడండి, భూమి మీద నుండి వధువు ఎత్తబడిన తరువాత అన్యసంఘము యొక్క పని ముగియును. దేవుని ఆత్మ భూమిని విడిచిపెట్టును. "అపవిత్రుని ఇంకా అపవిత్రునిగానే యుండనిమ్ము, నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే యుండనిమ్ము." పరిశుద్దుడు ఇంకా పరిశుద్దుడుగా యుండును. మరో విధంగా చెప్పాలంటే, బలిపీఠము ధూమముతో నిండియుండును. కేసును సంపాదించుటకు న్యాయవాది లేచి నిలుచును. క్రీస్తు బలిపీఠమును విడిచిపెట్టును. ఆయన మధ్యవర్తిత్వపు రోజు ముగియును. రాకడ వచ్చును. ఆయన బలిపీఠమును విడిచిపెట్టి, విమోచనా గ్రంథమును తీసికొనును. తాను విమోచించిన వారిని స్వీకరించును. ఇక మధ్యవర్తిత్వపు పని లేదు. దానిని ఎందరు అర్ధము చేసికొన్నారు? ముద్రలలో ఒకదానిలో దీనిని గూర్చి చెప్పాననుకొనుచున్నాను. తన మధ్యవర్తిత్వపు పనిని స్వీకరించుటకు క్రీస్తు వచ్చును.
REV 12:15-17
88ఇప్పుడు, ఒక్క నిమిషము చూడండి. "బుద్ధిలేని కన్యక రక్షించబడునా?" లేదు! జరుగుచున్నది తప్ప మరేమియూ జరుగదు. ఆ కాలము అయిపోయిన తరువాత ఆమె శ్రమల కాలము గుండా వెళ్ళవలసియుండును. దానికి కారణము, ఆమె సంపూర్ణ పరిహారమును నిరాకరించుటయే. ఆమె విశ్వాసినని చెప్పుకొనినది, కాని శ్రమల కాలము గుండా వెళ్ళవలసియుండును. బైబిలు చెప్పుచున్నది, "ఆ ఘట సర్పము తన నోట నుండి నీటిని ఉమ్మినది. యుద్ధము చేయుటకు మిగిలినవారుండిరి…" ఎటువంటి ఘడియ అది.
పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుటకు నామకార్ధ సంఘములు ఇంతగా ఆకలిగొనిన సందర్భము చరిత్రలో ఎన్నడూ లేదు. క్రైస్తవ వ్యాపారుల గూర్చి మాట్లాడుచున్నాను. ప్రెస్బిటేరియనులు, లూథరన్లు, కాథలిక్కులు, బాప్టిస్టులు, క్రీస్తు సంఘమువారు, నాజరీనులు, పిలిగ్రిం హోలీసెస్ వారు, సెవెంత్-డే ఎడ్వంటిస్టులు, ఇంకా చాలామంది వందల కొలదిగా వచ్చుచున్నారు… చూడండి.
MATT 25:1,7
89ఇది చాలా సంచలన క్రియ. దయచేసి దీనిని ఒక సిద్దాంతముగా తీసికొనవద్దు. ఏమి జరుగునని వాక్యము చెప్పినదో మీరు గ్రహించియున్నారా? సమయము అయిపోయినది. చూడండి, పదిమంది కన్యలు వధువును ఎదుర్కొన వెళ్ళిరి. వారిలో సగం మందికి దివిటీలలో నూనె యున్నది, సగం మందికి నూనె లేదు; చనిపోయిన వారు, జీవించియున్న వారు సాదృశ్యముగా అక్కడ చూపించబడిరి. వారే శరీరమైయున్నారు. వారిలోని భాగములను చూపించుచున్నది. "ఇదిగో పెండ్లి కుమారుడు," అను కేక వినబడగానే - ఆ అయిదుగురు బుద్ధిగల కన్యకలు పెండ్లి విందులోనికి వెళ్ళుటకు మేల్కోని తమ దివిటీలను సిద్ధపరచుకొనిరి. వారి దీపములు వెలిగినవి. మా దీపములు ఆరిపోయినవి గనుక మీ నూనెను మాకు కొంచెము ఇయ్యుడని బుద్ధిలేని కన్యకలు అడిగిరి. (చూచారా?) మా యొద్ద మాకు సరిపడునంత మాత్రమే యున్నది గనుక వెళ్ళి కొనుక్కొనుడని వారు చెప్పిరి. వీరు కొనుటకు వెళ్ళుచుండగా, పెండ్లి కుమారుడు వచ్చెను.
MATT 8:12•
MATT 25:10,30
90"పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు" అను అధికారపూర్వక ప్రకటన వినబడినది. అందరూ త్వరబడి సరిచేసుకొనబోయిరి. గోడ మీద చేవ్రాత కనబడుచున్న ఘడియ ఇదే కదా?
"ఓ, మాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావలెను." మాకు ఇది కావలెను, అది లేక వేరొకటి కావలెనని అందురు. కాని దానిని కొనుటకు వారు వెళ్ళుచుండగా, పెండ్లి కుమారుడు వచ్చెను. బుద్ధిగలవారు లోనికి వెళ్ళిరి, మిగిలినవారు బయట విడిచిపెట్టబడిరి. అక్కడ ఏడ్పును, దుఃఖించుటయు, పండ్లు కొరుకుటయు ఉండును.
దానికి సంబంధించిన చక్కని ప్రశ్చలు ఇచ్చట ఉన్నవి: "పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లీ విందుకు వచ్చినవారెవరు?" ఇంకా చాలా ప్రశ్నలు దానికి సంబంధించియున్నవి.
MAL 3:10•
HEB 7:1,2
91ప్రశ్న: దశమ భాగమును వ్యక్తికి ఇవ్వవలెనా? లేక క్రైస్తవ పనికి ఇయ్యవలెనా?
నిశ్చయంగా వ్యక్తికి ఇయ్యవలెను. ఎందుకనగా అతడు ఆ పనిని చేయుచున్నాడు, అతడు క్రైస్తవ పనివాడు.
వ్యక్తికి దశమ భాగములు చెల్లించవచ్చా అనడిగారు. ఆ వ్యక్తి ఎవరను దానిమీద ఆధారపడియుండును, చూచారా. అది మంచిది. హెబ్రి 7లో మొదటిగా దశమ భాగము చెల్లించుట గూర్చి చెప్పబడినది. ఒక్క నిమిషం ఆగండి. "సహోదరుడు బ్రెన్హాంకు రెండు ప్రశ్నలున్నవని," వ్రాశారు.
హెబ్రి 7వ అధ్యాయములో రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రాహాము, మెల్కీసెదెకును కలిసికొని దశమ భాగము చెల్లించెనని వ్రాయబడియున్నది. మెల్కీసెదెకు అనగా షాలేము రాజు, అనగా సమాధానమునకు, నీతికి రాజని భావము. ఆయన దేవుడు తప్ప మరెవరూ కాదు, చూచారా.
నీవు దశమ భాగములను చెల్లించవలసిన చోటు నీవు ఆహారమును తినుచున్న చోటే. నీకు ఆహారము పెట్టుచున్న వారికి నీవు ఋణపడియున్నావు. "నా నిధిలోనికి దశమ భాగములన్నింటినీ తీసికొని రండని, యొహోవా సెలవిచ్చుచున్నాడు. (అది సరియేనా?) నన్ను ఆలాగు చేసి పరిశోధించుడని, దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశపు వాకిండ్లను విప్పి మీ మీద పట్టజాలనంతగా ఆశీర్వచనములను కుమ్మరించెదనని ఆయన చెప్పుచున్నాడు." దశమ భాగము చెల్లించని ఏ స్త్రీనయినా, ఏ పురుషుడనయినా నేను దీనిని అంగీకరించమని సవాలు చేయుచున్నాను.
MAL 3:10
92ఎటువంటి పరిస్థితులలో నేనుంటినో, ఏలాగు నన్ను ఆశీర్వదించెనో ఇక్కడ నేను నిలబడి ఉదయమంతా చెప్పినా తరుగదు. నేను ఎంతో విధేయతగా దశమ భాగములు చెల్లించాను. ఈ ఆలయము నుండియు, నా కూటముల నుండియు వచ్చు డబ్బులో నుండి నేను దశమ భాగము తీయుదును. దానిని నేను సేవకులకు ఇచ్చుచుందును. దేవునికి తొమ్మిది వంతులు ఇచ్చి, నేను ఒక్క భాగమును ఉంచుకొనుట చేయుచున్నాను. విదేశ సేవకు నేను అది పంపుచున్నాను, ఎందుకనగా చట్టము దానికి అనుమతించదు. వారమునకు వంద డాలర్లను జీతముగా తీసికొని అందులో నుండి దశమ భాగమును చెల్లించుచున్నాను.
అవునయ్య! దశమ భాగములు చెల్లించుట యందు నాకు విశ్వాసమున్నది. అది దేవుని యొక్క ఆశీర్వచనమును నీకిచ్చును. దేవుని ఆశీర్వచనము అందువలన రుజువగును. "అది పాత నిబంధన కదా," అని మీరందురేమో. అది అది కొత్త నిబంధనలో కూడా యున్నది! అవునయ్యా!
DEUT 23:2
93ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, పెండ్లి కాకుండా జన్మించిన బిడ్డ రక్షింపబడునా? రాకడలో ఎత్తబడునా?
రక్షింపబడునా? ఎందుకు రక్షింపబడదు? జరిగిన దానికి ఆ బిడ్డ ఏమియూ కారకురాలు కాదు. అది నిజము. రక్షణ విషయమైతే నేను అవునని చెప్పెదను. కాని ఎత్తబడు విషయము చూడండి, ముందుగా నిర్ణయించబడిన సంతానము రాకడలో ఎత్తబడును. వ్యభిచారమును ముందుగా నిర్ణయించబడిన సంతానముగా నేను నమ్మలేను. మీరు గ్రహించారా? చూచారా? ఆ బిడ్డ రక్షించబడును; ఆ బిడ్డకు స్వయం నిర్ణయ హక్కులు అప్పుడు లేవు. అది చాలా భయంకరమగు కార్యము.
కాని ఇప్పుడు, పాత నిబంధనలో ఆలాగు పుట్టిన అక్రమ సంతానము పది తరముల పాటు, అనగా నాలుగు వందల సంవత్సరముల పాటు, సమాజములో ప్రవేశించుటకే అర్హత లేదు. అంత ఘోర శాపమది. దానిని గూర్చి ఆలోచించండి. ఆ బిడ్డ నిర్దోషి, కాని ఆ బిడ్డ యొక్క ముని మనుమలు, వారి మనువలు, ఇంకా వారి మనవలు దేవుని యొక్క సమాజములోనికి ప్రవేశింప వీలులేదు. అది నిజము.
చూడండి, ఆ పాపమును క్షమించునంత బలమైనది ఏదీ అక్కడ లేదు. పాత నిబంధనలోని రక్తము పాపమును క్షమించజాలదు; అది పాపములను కప్పును. కాని యేసుక్రీస్తు యొక్క రక్తము దానిని తుడిచివేయును. ఇప్పుడు మారినది. యేసుక్రీస్తు రక్తము వచ్చినందువలన, ఈ మార్పు కలిగినది.
94ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, నీ వర్తమానమునకు బహు సమీపముగా మేము రాగోరుచున్నాము. మేము ఆరిజోనాకు గాని, లేదా జెఫర్సన్-విల్ గాని రావలయునా?
నీకనుకూలమైన దానిని చేయుము. నిశ్చయంగా నిన్ను ప్రేమించుచున్నాను. మీరెక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, నా సలహా వినండి. నేను జెఫర్సన్-విల్ కు వచ్చెదను. మీరు ఏలాగయినా కదలవలెననుకొంటే, జెఫర్సన్-విల్ కు రండి. ఆరిజోనాలో కంటె ఇక్కడే ఎక్కువగా నేనుందునని తలంచుచున్నాను. అది మంచిది.
95ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, పాపులకు బోధించవలసిన సమయము అయిపోయినదా?
లేదు! లేదు! సోదరుడా, అది నీ మనస్సులో నుండి తొలగించుకొనుము. ఇల్లు కట్టుటను కొనసాగించుము. నీవు చేయుచున్న పనిని చేయుట సాగించుము. నిన్ను పిలచు వరకు నీకప్పగించబడుచున్న పనిని మానవద్దు, చూచారా.
96ప్రశ్న: రెండవది. రక్షించబడినవారు ఆరాధన సమయములో పాపుల నుండి వేరై కూర్చోవలెనా? ఆరాధనలో పాపుల నుండి రక్షించబడినవారు వేరు కావలెనా?
నాకు ఖచ్చితంగా నీ భావము అర్థము కాలేదు. నీవు ఎక్కడయినా దేవుని ఆరాధింపవచ్చును. సంఘములో నీవు ఆలాగు చేయుట మంచిది కాదు, ఎందుకనగా ఆలయమునకు అందరూ వచ్చెదరు. పాపి వచ్చి క్రైస్తవుని ప్రక్కనే కూర్చొనును. పాపము నుండి వేరగుము, కాని పాపిని తృణీకరించవద్దు. నీకు వీలయితే పాపి దగ్గరకు వెళ్ళుము, కాని వారి పాపములో పాలుపొందవద్దు
97ప్రశ్న: రక్షించబడిన భార్య తన పాపియగు భర్తను తిరస్కరించవలెనా?
అయ్యా, వద్దు! లేదయ్యా! అతడు నీ భర్త. ఆలాగు చేయుట వలన వీవతనిని దేవుని నుండి ఇంకా దూరము చేయుచున్నావని గ్రహించుము. చూచారా? అది నిజము, సోదరీ, సోదరుడా, నీవు పెండ్లి చేసికొన్నావు; అతడు నీవాడు, నీవతనిదానవు.
98ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, ఈ మధ్య ఒక క్రొత్త పదము "రద్దు" (Annulment) వచ్చియున్నది. దాని భావమేమిటి? ప్రజలు స్వేచ్చగా పెండ్లి చేసికోవచ్చునా? లేక ఇది విడాకులకు అది మరో పదమా? దీనిగూర్చి తెలుపుము.
నిశ్చయంగా వారు వివాహమైనవారే. ఆ ప్రమాణము చేసికొన్నంత కాలము వారు పెండ్లికాబడినవారే. మంచి నమ్మకముతో ఒక యువకుడు, ఒక యువతికి పెండ్లి చేసికొందునని వాగ్ధానము చేయును. ఆమెకు అతడు బాధ్యత వహించవలెను. ఆమెను అతడు పెండ్లి చేసికొనినట్లే. చట్టము నీకు కలిసి జీవించుటకు ఒక అధికార పత్రమును ఇచ్చును. భార్యా భర్తలుగా మీరు జీవించకుండా అడ్డగించునది ఏదీ యుండదు. "నిన్ను నేను పెండ్లి చేసికొందును; నిన్ను, నా భార్యగా స్వీకరించెదను," అని ఒక పురుషుడు - స్త్రీతో చెప్పినప్పుడు వారు పెండ్లి చేసికొనినవారగుదురు.
నీ ప్రమాణము పవిత్రమైనది; అదే నీకు పెండ్లి చేసినది. ఏ బోధకుడు గాని, ఏ మేజిస్ట్రేటు గాని, మరెవరు గాని నీకు పెండ్లి చేయలేరు. నీ స్వంత ప్రమాణము నీవు దేవునితోను, అతనితోను చేయుచున్నావు. నీవు వాగ్దానము చేసినప్పుడు, పెండ్లి చేసికొన్నట్లే.
MATT 1:18-20
99బ్రెన్హాం సోదరుడా, బైబిలు ద్వారా దానికి జవాబు చెప్పుమని మీరడుగవచ్చు. మీకా విషయమును బైబిలులో చూపించాలా? మీక్కావలసినచో, చేతులెత్తండి. ఇప్పుడు, మనకు ఎనిమిది లేదా ఆరు నిమిషములు సమయమున్నది. సరే.
"ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడై యుండి (అతడు ప్రధానము చేసికొనగానే భర్తగా పిలువబడెను)… ఆమెను రహ్యముగా విడనాడనుద్దేశించును," ఎందుకనగా వారు ఏకము కాక మునుపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. (చూచారా?) ప్రభుని దూత అతనికి స్వప్నమందు కనబడి, "దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయగు మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము," అని చెప్పెను. ఆమెను పెండ్లి చేసికొందునని వాగ్ధానము చేసెను గనుక పెండ్లి అయినట్లే.
100నీవు అతనిని పెండ్లి చేసికొందునని వాగ్ధానము చేసినచో అందుకు కట్టుబడియుండవలెను. ఆ వాగ్దానము మీరి నీవు మరొకరిని పెండ్లి చేసికొనినయెడల, నీవు వ్యభిచారములో జీవించుచున్నట్లే. గమనించండి, ఒక స్త్రీకి వాగ్దానము చేసిన పురుషునికి ఇదే వర్తించును.
దానికి కట్టుబడి యందునని నీవు నిర్ణయము చేసికొననియెడల, ఎవరికిని ప్రమాణము చేయవద్దు. గుర్తుంచుకొనండి, దానికి బైబిలు ఉన్నది. మరియను పెండ్లి చేసికొందునని యోసేపు వాగ్ధానము చేసెను. దేవుడు దానిని చూచెను…
ఆ విషయములో పాత నిబంధన చట్టములను చదువుము. చూచారా? పాత నిబంధన శాసనము, ఒక స్త్రీని నీవు పెండ్లి చేసికొందునని వాగ్దానము చేసి - మరొకరిని పెండ్లి చేసికొనిన యెడల, వ్యభిచారములో జీవించుచున్నట్లే. నిన్ను సమాజము నుండి వెలివేయుదురు. అవునయ్యా! ఒక స్త్రీకి నీవు ఆ విధంగా వాగ్ధానము చేసినప్పుడు, దానిని అమలు పరచవలెను. ఆమె ఒక పవిత్ర పాత్రయై యున్నది. ఈ లోకములోనికి పిల్లలను ఆమె తీసికొని వచ్చును. కావున నీవు వాగ్ధానము చేసినప్పుడు, తప్పక పెండ్లి చేసికోవలెను.
101ప్రశ్న: ఆత్మలను రక్షించుటకు చెరసాలలకు వెళ్ళి సువార్తను బోధించు సమయము అయిపోయినదా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు గనుక ఉన్నవన్నీ అమ్ముకోవలెనా?
అటువంటి విశ్వాసమును కలిగించు దేనినీ నేను చెప్పలేదని భావించుచున్నాను. చెప్పానా? ఒకవేళ నేను చెప్పినట్లయితే, నన్ను క్షమించండి. చూచారా? ఆ సంగతులను గూర్చి ఊహాగానము చేయవద్దు. బోధించుటను, జైలు సేవను, ఇతర పరిచర్యలను ఎప్పటివలెనె కొనసాగించండి.
ఇటు చూడండి. కొంతకాలము క్రిందట, అనగా దాదాపు ఎబది లేదా అరవై సంవత్సరాల క్రిందట సెవెంత్-డే అడ్వెంటిస్టులు వ్రాసిన దానిని కొరియార్-జర్నల్ పత్రికలో చూచాను. (ఎక్కడో పెట్టెలో అది నాకు కనబడినది), కొరియర్-జర్నల్ పత్రిక చాలా పెద్దది. సెవెంత్-డే అడ్వెండిస్టులని పిలువబడక ముందు వారిని మిల్లిరైటిస్ అని పిలచెడివారు. కొరియర్ పత్రికలో పెద్ద స్థలమును వారికిచ్చేవారు. అది కెంటాకీలోని, ఫ్రాంక్లిన్ నుండి వెలువడేది. వారందరు తమ ఆస్తులన్నింటినీ అమ్మివేసుకొని… ఒక తేదీని వారు నిర్ణయించి, దానిని లేఖనము ద్వారా నిరూపించిరి. యేసు ఆ తేదీన వచ్చునని ప్రకటించిరి - వారు తమయొక్క వాయిద్యములను తీసికొనిపోయి ఒక కొండ శిఖరము మీద కూర్చొనిరి. ఆ మరుసటి ఉదయమున మంచు కురిసి, వారియొక్క రెక్కలన్నింటిని తడిపివేసినది. గాలి అంతా పోయినవారిలాగా వారు క్రిందికి దిగివచ్చిరి. చూచారా? అవి భిన్న బోధలు మరియు చీకటి క్రియలు.
102దానిని మీరు నమ్మకండి. ఇంకా వంద సంవత్సరములకు కూడా యేసు రాకపోవచ్చును. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు. ఏ మనుష్యుడూ ఆయన రాకను ఎరుగడు. కాని ఆయన వచ్చు వరకు నేను బోధించుటను, నా కప్పగించిన ప్రతి పనిని నేను చేయుదును. ఈ రోజు ఆయన రానిచో రేపు ఆయన కొరకు నేను చూచెదను. ఈ వారము ఆయన రానిచో, వచ్చే వారం ఆయన కొరకు నేను చూచెదను. వచ్చే పది సంవత్సరములలో ఆయన రానిచో, నేను బ్రదికియున్నయెడల రాబోవు ముప్పది సంవత్సరములు ఆయన కొరకు కనిపెట్టెదను. చూచారా? ఇంకా నేను చూచుచునే యు౦దును. ఆయనెప్పుడు వచ్చునో నాకు తెలియదు, కాని నేను ఆయన వాక్యము పట్లను, ఆయన జనుల పట్లను, యధార్ధముగా జీవించి, క్రైస్తవునిగా జీవించి ఆయన రాక కొరకు ఎదురు చూచెదను, చూదారా.
జైలు సేవను కొనసాగించండి, వీలయినంతమందిని రక్షణలోనికి నడిపించండి. ఆయనెప్పుడు వచ్చునో నాకు తెలియదు; ఎవరికిని తెలియదు. కాని ఒక్క సంగతి చెప్పుచున్నాను. మీ స్వంత అర్ధమును మీరు చెప్పుటకు ప్రయత్నించవద్దు. ఈ వ్యక్తిని నేను నిందించుట లేదు. సోదరుడా, సోదరీ, నీవెవరివైనా గాని దేవుడు నిన్ను దీవించును. పట్టణమునకు వెలుపట నుండి వచ్చిన వారు దీనిని అడిగినట్లు నాకు కనిపించుచున్నది, ఎందుకనగా ఇది పోస్టు కార్డుపైన యున్నది. కొలరెడోలోని, డెన్వర్ నుండి వచ్చియున్నది. పైక్స్-పిక్, కొలరెడో, ఎవరో తపాలా ద్వారా దీనిని పంపియన్నారు. వారు టేపు వినవచ్చును.
కాని మనము గుర్తుంచుకొందము, పాపములో నుండి మారి నీతిలోనికి రండి గాని మరేదీ మార్చుకొనవద్దు. మీ పనిని కొనసాగించండి. దీనిని అర్థము చేసికొనినవారందరూ, "ఆమేన్!" చెప్పండి. చూచారా? ఆలాగు చేయండి!
MATT 12:40
103ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మత్తయి 12:40లో ఈలాగు చెప్పబడినది, "తిమింగల గర్భములో యోనా మూడు రాత్రులుండినట్లుగా, మనుష్యకుమారుడు భూగర్భములో మూడు దివారాత్రులుండును." వారాయనను శుక్రవారము సాయంకాలము సమాధిలో యుంచిరి. ఆదివారము ఉదయమే ఆయన తిరిగి లేచెను. అప్పుడు రెండు రాత్రులు ఒక్క పగలే గదా అయినది?
మీరిప్పుడు గమనించినట్లయితే, "యోనా తిమింగల గర్భములో మూడు దివారాత్రులున్నట్లుగా" అని యున్నది. (చూచారా?) మూడు దివారాత్రుల లోపటే అని అర్థము. వాక్యమును మీరు అబద్ధముగా మార్చలేరు. ప్రవక్త చెప్పెను, "నా పరిశుద్దుని కుళ్ళుపట్టనియ్యను. ఆయనాత్మను నేను పాతాళములో విడిచిపెట్టను." మానవ శరీరము డెబ్బది రెండు గంటలలో కుళ్ళ నారంభించును. అదే మూడు దివారాత్రులు. ఆ మూడు దివారాత్రులలోగానే ఆయన సమాధి నుండి బయటకు వచ్చును.
మూడు పగళ్ళు, మూడు రాత్రులు అనగా, అక్షరాలా ఆలాగని అర్ధము కాదు. ఆ మూడు దివారాత్రుల లోగానే, ఏదో సమయమున ఆయన వచ్చును. ఆయన బయటకు రావలసియుండెను, ఎందుకనగా ప్రవచనము నిరర్ధకము కాదు. ఆయన కుళ్ళును చూడడు. సరిగ్గా అంత సమయము గాని ఆయన లోపట ఉన్నచో కుళ్ళుపట్టుట నిశ్చయము.
PS 16:10•
ACTS 2:27•
ACTS 13:35•
1COR 6:9
104ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, వివాహము, పరిత్యాగము గూర్చినది (చూచారా? ఎన్ని ప్రశ్నలు వచ్చినవో! జనులను నేనేమి అనుటలేదు. అది ప్రజల మనస్సులో యున్నది. నిజంగా వారు బాధల్లో యున్నారు. రాకడ గూరించి ఎక్కవగా ప్రజలు ఆలోచించుట లేదు; దానిని గూర్చి ఎక్కువ ప్రశ్నలు లేవు. కాని ఇప్పుడు లోకము దీనితో సతమతమవుచున్నది. ప్రజలు ఈ విషయములను వాక్యములో చదువుచున్నారు. దానిని వారు చూచుచున్నారు. వారు యధార్థవంతులు. వారది తెలిసికొనగోరుచున్నారు. ఆ కారణము చేతనే నేను దీనికి అంత యధార్థముగా, జాగ్రత్తగా జవాబు ఇచ్చుచున్నాను.) ఒక వ్యక్తి పెండ్లి చేసికొని పరిత్యాగ పత్రిక తీసికొని, మరో స్త్రీని మరల పెండ్లి చేసికొనెను. ఆమె కూడా వివాహము చేసికొని విడాకులను పొందినదే. వీరిద్దరి వివాహము దేవుని ధృష్టిలో సరియైనదేనా? వారిద్దరు లేదా వారిలో ఒకరు రాకడలో ఎత్తబడుట జరుగునా?
ఏలాగు? నాకు తెలియదు. నేను మీకు చెప్పలేదు. వారు ఎత్తబడుదురా? అని ప్రశ్నించిరి. వారిద్దరు విడాకులు పొందిన వారే. వారిరువురు బ్రదికియున్న భాగస్వాములున్నారు. వీరిరువురు మరల పెండ్లి చేసికొనిరి. ఈమె యొక్క భర్త జీవించియున్నాడు. ఇతని యొక్క భార్య జీవించియున్నది. వారికి పిల్లలున్నారు. వారు దేవుని యొద్దకు రాగోరుచున్నారు. వారు రాకడలో ఎత్తబడుదురా? అది పరలోక తండ్రి యొక్క ఇష్టము. దానికి నేను జవాబు చెప్పజాలను, చూచారా.
ఒక సంగతిని నేను చూచాను. వారు వ్యభిచారులుగా పిలువబడుదురని బైబిలు చెప్పుచున్నది. "వ్యభిచారులు పరలోక రాజ్యము ప్రవేశించరని కూడా బైబిలు చెప్పుచున్నది. అది మాత్రమే నేను చెప్పగలను. బహు కష్టముగా దీనిని చెప్పుచున్నాను, కాని వాక్యము చెప్పుచున్నదానిని తప్ప మరిదేనినీ నేను చెప్పజాలను. దానితోనే నేను నిలచియుండవలెను. అది తప్పు అని భావించుచున్నాను. బైబిలులోని కొన్ని స్థలములలో…
MATT 12:4•
MARK 2:26•
LUKE 6:4
105నేను మీకు సలహా ఇచ్చుట లేదు. దయతో ఒక చిన్న లేఖనము ఇచ్చెదను. మీరు మీ భార్యతో లేదా మీ భర్తతో సంతోషముగా జీవించుచున్నచో ఆలాగే నిలచియుండండి, ఎందుకనగా ఇల్లు లేకుండా, అనాధలుగా పిల్లలను విడిచిపెట్టవద్దు. తప్పులు చేసిన ప్రజలకు దేవుడు దిద్దబాటు ఏర్పరచియున్నాడు. గుర్తుంచుకొనండి, దావీదు ఆకలిగొనినప్పుడు దేవుని ఆలయము లోనికి జోచ్చి మందసపు రొట్టెలను తినెను. అది ధర్మశాస్త్ర ప్రకారము తప్పు. యేసు దానిని ఎత్తి చెప్పెను, కాని దావీదు నిందింపబడలేదు. దేవదూషణ చేసిన యాజకులను కూడా నిందించలేదు. సబ్బాతు కంటె గొప్ప వాడిచ్చటున్నాడని ఆయన చెప్పెను, చూచారా. దేవునికి దానిని విడిచిపెట్టెదము. ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించండి.
చూద్దాం, మీరొకవేళ ఎత్తబడు అవకాశమున్నదేమో. రెండు పొరపాట్లు ఎన్నడూ ఒక తప్పును సరిచేయలేవు. మీరు సంతోషముగా జీవిస్తూ యుంటే అలాగే జీవించుచూ సాగిపొండి. మీకు తప్పుడు భాగస్వామిని కలిగియుండవచ్చు. ఒక సంగతి చెప్పుచున్నాను: మీకు తప్పుడు భాగస్వామి దొరికినచో — ఈ జీవితములో, మరొక దానిలో నీవు ఎన్నడూ కలిగియుండవు. అన్ని తప్పులు ఒప్పుగా చేయబడును.
REV 20:5
106ప్రశ్న: తిరిగి జన్మించిన విశ్వాసులందరూ ఎత్తబడుదురా?
లేదు, తిరిగి జన్మించిన విశ్వాసులందరూ కాదు గాని శేషిత జనాంగము మాత్రమే ఎత్తబడుదురు. బైబిలు చెప్పుచున్నది వినండి, "చావగా మిగిలినవారు వెయ్యేండ్లు జీవించరు. దాని తరువాత వారు పునరుద్ధరింపబడి వేరుచేయబడుదురు. మేకలలో నుండి గొర్రెలు వేరుచేయబడును. వాక్య ప్రకారము తిరిగి జన్మించిన వారందరూ ఎత్తబడరు.
JOHN 14:26
107ప్రశ్న: ఒకడు నిజంగా పరిశుద్ధాత్మను పొందినట్లుగా సూచన ఏమిటి?
యోహాను 14:26: "పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు రాబోవు సంగతులను చూపించును." చూచారా? ఆయన దానిని పరిపూర్ణపరచును. "మానవ-కల్పితములు"
పని చేయవు. ఆయన వాక్యమై యున్నాడు. ఆయన, అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, వాక్యముతో నీలో గుర్తింపచేసికొనును. పరిశుద్ధాత్మనీలో యున్నట్లుగా అదే నిజ గురుతు, ఎందుకనగా అది వాక్యమై యున్నది.
ఇప్పుడు, చూడండి! నీవు భాషలతో మాట్లాడితే ఏమిటి? మిమ్మును అది అడుగగోరుచున్నాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమి చేయునో యేసు చెప్పెను. నీవు భాషలతో మాట్లాడుచూ, పైకి, క్రిందికి ఎగురుచూ, కేకలు వేయుచున్నావు. కాని ఆ తర్వాత వాక్యము ద్వారా నేను నీకు ఆ బాప్తిస్మము గూర్చి రుజవు చేసినప్పుడు నీవు వినవు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులను ఉపయోగించి బాప్తిస్మము పొందుట వాక్యానుసారముగా పూర్తి తప్పు అనియు, ఆలాగు ఎవరూ బాప్తిస్మమును పొందినట్లు వాక్యములో లేదనియూ, అది కేవలము అవగాహనలో తప్పు అనియు చెప్పినప్పుడు - ఇంకా నీవు దానినే పట్టుకొని వ్రేలాడుచున్నావంటే ఏమిటి? నీలో యున్న పరిశుద్ధాత్మ ఆలాగు చేయనా? తన స్వంత వాక్యమును అదెట్లు నిరాకరించును?
HOS 2:2•
HOS 4:11•
HOS 5:3,4•
HOS 6:10•
MATT 24:24•
MARK 13:22
108ఈ దినమున జరుగవలసియున్న దానిని నీకు చూపించినప్పుడు, మనుష్యకుమారుడు తన్ను తాను ఎట్లు బయలుపరచుకొనునో వివరించినప్పుడు, ఆయన చేయు దానిని లేఖనముల ద్వారా నీకు చూపించినప్పుడు, దానిని రుజువు చేయుటకు ఆయన దిగి వచ్చుచున్నాడని నీకు చెప్పినప్పుడు - నీవు నమ్మక, ఇంకా నీ శాఖనే పట్టుకొని వ్రేలాడుచుండినప్పుడు, నిన్ను తిరిగి జన్మించిన వ్యక్తి అని పిలువవచ్చునా? ఆలాగు పిలచుట న్యాయమేనా?
నేను నా భార్యను ప్రేమించుచున్నానని చెప్పి, మరో స్త్రీతో తిరిగితే, నేనామెను ప్రేమించినట్లు చెప్పిన మాట నా హృదయములో నుండి వచ్చినదా? అది నిజమగు ప్రేమని మీరందురా? ఆమె కూడా ఆలాగే నన్ను ప్రేమించుచున్నానని చెప్పి, నేను ఇంట్లో లేనప్పుడు మరో మగవానితో తిరిగితే ఏమనుకోవలెను?
ఇశ్రాయేలీయులు నిశ్చయంగా ఆలాగే చేసిరని బైబిలు చెప్పుచున్నది. "నీవు ప్రతివారితోను వ్యభిచరించితివి. నీకు నేను విడాకులిచ్చెదను. ప్రతి పురుషుడుతోను నీవు దుష్కామ క్రియ జరిగించియున్నావు." అది ఏమిటి? నీ స్వంత శరీరమునకు విరోధముగా నీవు వ్యభిచారము చేయుచున్నావు. పెండ్లి అయిన స్త్రీ, పురుషులు, వేరే స్త్రీ, పురుషులతో జీవించుచున్నప్పుడు వారు తమ శరీరములను అపవిత్రపరచుకొనుచున్నారు. ఒక వ్యక్తి క్రైస్తవుడనని చెప్పుకొని, వాక్యమును పూర్తిగా నిరాకరించుచున్నచో, తానెందులో భాగమైయున్నానని చెప్పుకొనుచున్నాడో, ఆ శరీరమును మలినమును చేయుచున్నాడు. చూచారా? అది క్రీస్తువిరోధి యొక్క ముద్ర. సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని కూడా అది మోసము చేయును.
DEUT 22:5
109ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, ఒక చంటిపిల్ల మగవారి దుస్తులు ధరించవచ్చునా?
ఎంత చిన్న పిల్ల? దానికి నీవే తీర్పు తీర్చుకొనుము. నీవు క్రైస్తవునివయితే వివేచించుకొనుము. ఎంత చిన్న పిల్ల అన్నది నాకు తెలియదు. నాకు తెలిసినది ఒక్కటే. పురుషుని వస్త్రములు స్త్రీ ధరించుట హేయము అని బైబిలు చెప్పుచున్నది. చూచారా? "స్త్రీ" అనెను గాని "చంటిపిల్ల" అనలేదు. దానిని నీవే ఆలోచించుకొనుము. నాలుగు లేదా అయిదు సంవత్సరముల చంటిపిల్ల అలాంటివి ధరించినచో నా మట్టుకు ఏమీ పొరపాటు కనబడుట లేదు. వారు ఆవరణలో అటు ఇటు తిరుగుచుందురు. చిన్న పాంటు లేదా షర్టులు అంత చిన్నపిల్లలు ధరించుటలో నాకు పొరపాటు కనిపించుట లేదు.
చూడండి, వాక్యము చెప్పుచున్న దానిని మీకు చెప్పుచున్నాను. పురుషుని దుస్తులు ధరించుట స్త్రీకి హేయము.
110ప్రశ్న: మేము ఎక్కడ కూడికొనవలెను? బూరల పండుగకు కూడికొనవలెనని నీవు చెప్పియున్నావు.
సోదరీ, నీవెవరివైనా గాని ఆ విషయములో పొరబడితివి. బూరల పండుగకు కూడికొనుడని ఎన్నడూ నేను చెప్పలేదు. అన్య వధువు కాదు గాని ఇశ్రాయేలీయులు బూరల పండుగకు కూడికొనిరని చెప్పాను. లేదు, లేదు! ఏడు బూరలు ఊదబడుట ఇశ్రాయేలీయులను పోగుచేయుటకే! (ఇది ఎందరికి తెలియును?) ఆ బూరల పండుగకు… వధువు పోగవదు. పెంతెకోస్తు పండుగ తరువాత బూరల పండుగ వచ్చును. చూచారా? ఎత్తబడుట వచ్చును… అది ఈ ప్రశ్న దానికి సంబంధించినది కాదు.
MATT 10:41
111ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీకు సమయమున్నచో దయచేసి మత్తయి 10:41ని వివరించుము. ప్రవక్త యొక్క ఫలమేమిటో నేను తెలిసికొనగోరుచున్నాను.
"ప్రవక్త నామములో ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలమును పొందును," అని యేసు చెప్పెను. ప్రవక్తకు స్నేహితునిగా యుండుటయే ప్రవక్త యొక్క ఫలము. నీతిమంతుని నామములో ఎవరయితే నీతిమంతుని చేర్చుకొందురో, వారు నీతిమంతుని ఫలము పొందెదరు. అది నిజమేనా? ప్రవక్తకు స్నేహితునిగా ఉండుటయే ప్రవక్తను చేర్చుకున్నందుకు ఫలము అని తెలిసికొనుడి. చూచారా? అదే ఫలము. అతడు నీకు స్నేహితుడు.
షునేమీయురాలను చూడండి. ఒక సమయములో అది కనబడును. చూచారా? ఆమెకు ఆలాగే జరిగినది. చూచారా? దేవుని దాసులను గమనించండి.
స్నేహితులారా, నేను ముగించవలెను. ఇది నాకు ఇష్టము కాదు గాని, ఇటు చూడండి. వందలకొలది యున్నది. చూడండి. నాకది ఇష్టమే గాని, జనులు వంద మైళ్ళు ఈ రాత్రిలో కారు నడుపుకొని వెళ్ళవలసియున్నారు. చాలా ప్రశ్నలున్నవి.
REV 11:3
112ప్రశ్న: బ్రెన్హా౦ సోదరుడా, వెయ్యేండ్లపాలన గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను. అది పెండ్లి విందు తర్వాతనా? లేక భూమి మీదనా? అది నాకు అర్ధము కాలేదు.
సోదరీ, సోదరుడా, నా మట్టుకు నాకే దానిని అర్ధం చేసికొనుట కష్టముగా యున్నది. కాని నేను చెప్పగలిగినదంతా ఇదే: వెయ్యేండ్లపాలనకు ముందే పెండ్లి విందు వచ్చును.
ఇక్కడే ఎవరో దాని మీద ఒక ప్రశ్న అడిగిరి. ఇట్లడిగిరి, "బ్రెన్హాం సోదరుడా, దానియేలు డెబ్బది వారముల విషయములో నీవు తప్పు చెప్పియున్నావు. ఇంకా డెబ్బది వారములుండును." తప్పు, మెస్సీయా వచ్చి ప్రవచింపవలసియున్నాడు. డెబ్బదివారముల మధ్యలో ఆయన కొట్టివేయబడును. డెబ్బది వారములనగా ఏడు సంవత్సరములు. సజీవుల మధ్యనుండి ఆయన తీసివేయబడి బలిని అర్పించును. దానినెందరు జ్ఞాపకముంచుకొనియున్నారు? మంచిది. ఎన్ని సంవత్సరములు మెస్సీయా, యేసు ప్రవచించెను? మూడున్నర సంవత్సరములు. అప్పుడు ఇంకా 3 1/2 సంవత్సరములు నియమింపబడి యున్నవి.
ప్రకటన 11వ అధ్యాయములో ఈ ఇద్దరు ప్రవక్తలు ఒక-వేయి-రెండు వందల-అరవై రోజులు ప్రవచించెదరు. అన్య వధువు వెళ్ళిపోయిన తరువాత ఇశ్రాయేలునకు ఇంకా మూడు సంవత్సరములు వాగ్ధానము చేయబడియున్నవి. ఇప్పుడు దానిని ఎందరు అర్థము చేసికొనియున్నారు? చూచారా? మంచిది.
113ప్రశ్న: నాకు భోజనశాల యున్నది. ఎక్కువగా హైస్కూలు పిల్లలకు పనిచేయుదును. ఈ వెలుగు లోనికి వచ్చినప్పటి నుండియు పిన్ బాల్ మెషిన్ కు, జె-బాక్సును తీసివేసియున్నాను. ఈ యువకులు పొగత్రాగుచున్నారు, రేడియో లోని రాక్-ఎండ్-రోల్ సంగీతమునకు నాట్యము చేయుచున్నారు. నేను రోజుకు నాలుగు గంటలు మాత్రమే తెరచి ఉంచెదను. ధూమపానమును గాని, మద్యపానమును గాని నేను సహించను, కాని ఆ స్థలములో ఉండవలసి వచ్చినందుకు చింతించుచున్నాను.
మీకు తెలుసు, అది ఒక సమస్య, చూచారా. జీవనోపాధి కొరకు ఆ చోట ఉండవలసి వచ్చెను. నేనయితే ఎట్లు౦దునో ఎరుగుదురా? చాలా ఒత్తిడికి లోనగుదును. మీరు దానిని సహించవచ్చును, కాని ఆ చిన్న "రిక్కి"ల గుంపు ఆ విధంగా ప్రవర్తిస్తూంటే నాకు వెర్రి కోపము వచ్చును.
మీతో చెప్పుచున్నాను, అది నేనే అయితే ఏమి చేయుదునో నాకు తెలియును. "దానిని ఆపండి లేదా ఇక్కడినుండి బయటకు పొండి," అందును. చూచారా? సరయిన స్థలమయితేనే దానిని నేను నడుపుదును, లేనిచో మానేసి వచ్చివేయుదును. కాని నీవు నీ జీవనోపాధి కొరకు ఆ పని చేయుచున్నావు గనుక నిన్ను కించపరచను, సోదరీ, సోదరుడా. ఈ సంగతులు చెప్పుట చాలా కష్టమని నేనెరుగుదును. (చూచారా?) అది సరి కాదు.
114మన స్త్రీలు పొట్టిబట్టలు ధరించుట చాలా అవమానకరమని ఈ ఉదయము ఎవరో చెప్పిరి. మన ముసలి స్త్రీలు, యువ స్త్రీలకు చెడ్డ మాదిరిగా యున్నారని చెప్పిరి. అది నిజమేనని అనుకొనుచున్నాను. చూచారా?
నేను ఆలాగే తలంచుచున్నాను. వారక్కడ ధూమపానము, మద్యపానము చేయుచూ, అల్లరిగా జీవించుచున్నారు. నీ సాక్ష్యమును చూచుచున్నారు. ఆ పిల్లల యొక్క పోకిరి చేష్టలను చూచియూ నీవు వారిని మందలించలేని స్థితిలో యున్నావు. అది నీ సాక్ష్యమునకు మంచిది కాదు. ప్రభువు నడిపించిన ప్రకారము నీవు చేయుము. దేవుడు నిన్ను సరయిన మార్గమునకు నడిపించునని ప్రార్ధి౦చుచున్నాను.
115ప్రశ్న: సంఘము లోనికి ప్రవేశించుటకు వరుసలో నిలబడవలసి వచ్చుట అనునది కేవలము ఒక జ్ఞాపకముగా ఉండబోవుచున్నది, ఒకవేళ శ్రమల ద్వారా వెళ్ళనిచో ఏమి జరుగును? మనము కొంత శ్రమను అనుభవించతగమా?
చూచారా? ఈ ప్రశ్న భావము బహుశా ఇది. నేను త్వరపడుచున్నాను; వీటిని ఆ వెనుక ఉంచవలెను, ఎందుకనగా ఒక గంట సేపు వాటిని దాయవలెను. ఆ తరువాత చింపివేయవచ్చును. నేను ఆగుదును.
చూడండి. జనులు దానిని చెప్పుటకు ఎదురుచూచుచున్నారు. సంఘము శ్రమల కాలము నెదుర్కొనునని చెప్పుచున్నారు. చూచారా? అది జరుగదు, ఎందుకనగా ముందే అది విమోచించబడినది, చూచారా. అది జరుగదు.
ఇప్పుడు, లోతు వంటి నామకార్ధ విశ్వాసులు శ్రమల కాలము గుండా వెళ్ళి అగ్ని ద్వారా రక్షింపబడినట్లు రక్షింపబడుదురు. నోవహు శ్రమల కాలముగుండా వెళ్ళెను. దాని పైన నిలబడెను. దానిపైన నిలబడెను. భూమిని మరల కలుషితము చేసిన హాముతో బయటకు వచ్చెను. లోతు బయటకు వచ్చెను, కాని తన స్వంత కుమార్తెలతో శయనించి పిల్లలను కనెను. చూచారా? కాని అబ్రాహాము రాజ సంతానమును తీసికొని వచ్చెను. హనోకు మహిమ లోనికి ప్రవేశించెను, నడిచి గృహము చేరెను. అతడు ఎన్నడూ శ్రమల కాలము గుండా వెళ్ళలేదు. మీరు చూచారా?
అక్కడే మీరున్నారు, చూచారా. బైబిలు ముందు సూచనల వలన ఒకసారియైనను… బైబిలులోని ఈ మాదిరులు కొట్టివేయబడవు, చూచారా. వధువు శ్రమలకాలము గుండా వెళ్ళును అని ముందుగా చెప్పబడలేదు… ఇప్పుడు, సంఘము శ్రమల కాలము గుండా వెళ్ళును.
REV 18:4
116ఇప్పుడు, ఆదికాలములోని పరిశుద్దుల మాట ఏమిటని కొందరడుగుచున్నారు. అది యుగముల మార్పిడి. అది శ్రమల కాలము. ఆలాగు వారు శ్రమపడవలసి వచ్చెను. సంఘ కాలములు, ఎట్లు ఒకదాని తరువాత ఒకటి చీకటి కాలముల లోనికి వెళ్ళినవో చూచాము. చివరకు వారు ఆయన నామమును నిరాకరించు స్థానమునకు వచ్చిరి. మరొక నామమును వారు తీసికొని వచ్చిరి. వారు అనుభవించి చనిపోయిరి, సార్ధిస్. ఆ తరువాత తుయతైర మరియు సార్ధిస్ వచ్చినవి. ఆ తరువాత ఫిలడెల్ఫియా వచ్చినది. ఆ కాలము నుండి వధువును బయటకు పిలచు కాలము వరకు చూడండి. అది సమస్త శిక్షను తప్పించుకొనును. ఈ సమస్త శిక్షను మరియు ఉగ్రతను, అనగా భూమి మీదికి రానైయున్న దీనిని తప్పించుకొను అర్హత దీనికే యున్నట్లు లెక్కించబడినది. దానిని తప్పించుకొనుటకు నీకు యోగ్యత ఉన్నట్లు లెక్కించబడినది. దానిని ఎదుర్కొనవు. దానిని తప్పించుకొందువు, చూచారా. ఇప్పుడు అందరూ అర్థము చేసికొన్నారా? గ్రహించారా?
REV 2:27•
REV 12:5•
REV 19:15•
REV 20:5
117నులివెచ్చని సంఘము, ఏర్పరచుకోబడిన వధువు కానిది ఏదయినా గాని శ్రమల కాలము గుండా వెళ్ళవలెను. మొదటి పునరుత్థానములో వారు లేవరు: "మిగిలిన వారు వెయ్యేండ్లు బ్రదుకరు." ముందుగా నియమింపబడిన వారు, ముందుగా నిర్ణయింపబడిన వారు, ఏర్పరచుకొనబడిన వధువు, దేవుని యొక్క స్వంత ఎన్నికలోని వారే. "బ్రెన్హాం సోదరుడా, ఇదెవరు?" అని మీరడుగవచ్చు. నాకు తెలియదు. అదెవరో నేను చెప్పలేను గాని అది మాత్రము అక్కడుండునని నాకు తెలియును, ఎందుకనగా వారుందురని ప్రభువు చెప్పెను. చూచారా? శ్రమల నెదుర్కోకుండా పోవు వారు వారే, కాని మిగిలిన వారు శ్రమల గుండా వెళ్ళెదరు. వెయ్యేండ్లపాలనకు ముందు సమస్తమూ చంపబడును. నీతిమంతులు వెయ్యేండ్ల పాలనలోనికి వచ్చి వేయి సంవత్సరముల పాటు జీవించెదరు.
వెయ్యి సంవత్సరముల తరువాత, మహా ధవళ సింహాసన తీర్పు వచ్చును. అప్పుడు మృతులు అనగా మంచివారు, చెడ్డవారు కూడా లేచెదరు. గ్రంథములు విప్పబడును, జీవగ్రంథము తెరువబడును; పరిశుద్దులు, భార్యభర్తలు కూర్చొని లోకమునకు తీర్పు తీర్పుదురు. అప్పుడు ఈ సామెత నెరవేరును: "ఆయన ప్రతి జనాంగమును ఇనుప దండముతో ఏలును." అక్కడ ప్రతి రాజ్యము ఆయన ఎదుట నిలబడును. ఆయన వారిని ఇనుప దండముతో ఏలును. ఆయన మేకల నుండి గొర్రెలను వేరుచేయును, మేకలతో ఇట్లనును, "తొలగిపోవుడి," గొర్రెలతో ఇట్లనును, "నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి."
REV 21:1-3
118భూమి మీద పరిశుద్దుల కూడిక ఒకటి యుండును. సాతాను చెరసాల నుండి విడిపించబడును. మరల పరిశుద్దులతో యుద్ధము చేయబయలు వెళ్ళును. ప్రారంభములో మహిమలో సరిగ్గా వాడు అదే చేసెను అప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించును. భూమి దహించబడి లయమైపోవును. సముద్రము ఇక లేదు. నీరు లేదు. భూమి మీద మరేమీ ఉండదు. అగ్ని పర్వతములు బ్రద్దలయి వ్యాప్తిచెంది దహించును. అంతయును…
"అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించినవి. సముద్రము ఇకను లేదు. తన భర్త కొరకు అలంకరించబడిన వధువువలె దేవుని యొద్ద నుండి పరిశుద్ధ పట్టణము ఆకాశములోంచి దిగివచ్చుటను యోహానను నేను చూచితిని." అది గుర్తున్నదా? "ఇదిగో దేవుని నివాసము మనుష్యుల మధ్యకు వచ్చియున్నది." ఈ పిరమిడ్ ఆకారములో యున్న పట్టణము పైన దేవుడు వారితో నివాసము చేయును. అది పదిహేను వందల చదరపు మైళ్ళ విస్తీర్ణములో యున్నది. ఆ పట్టణ శిఖరము మీద ఒక దీపమున్నది. ఆమేన్!
ఓ సీయోను కొండపై ఉన్న ఆ పట్టణమా,
నేను క్రొత్తవాడనే, అయినా ప్రేమించెదను.
ఆ కాలములలో నిన్ను అచ్చట కలిసికొందును.
ఆ కొండ మీద పట్టణమును చేరుకొందును.
ISA 65:24•
REV 21:23
119సీయోను కొండ శిఖరము మీద గొర్రెపిల్ల కూర్చొనును. ఆ పట్టణమునకు దీపము అక్కరలేదు. గొర్రెపిల్లయే వెలుగుగా ఉండును. గొర్రెపిల్లకు పైగా తండ్రి యుండును. అదే లోగోస్. దేవుడే గొప్ప వెలుగు. ఆ సింహాసనము మీద నిత్య వెలుగు ప్రకాశించును. యేసు తన తండ్రి సింహాసనము మీద కూర్చొనడు, ఆయన తన సింహాసనము మీద కూర్చొనును. కుమారుని తండ్రి కప్పును, అప్పుడు తండ్రి, కుమారుడు ఒక్కటగుదురు. "వారింకా మాట్లాడుచుండగానే నేను జవాబు ఇచ్చెదను. వారు ఆలోచించక ముందే వారి కొరకు నేను ఆలోచించెదను." అది నిజము.
పరిపూర్ణుడై జీవించుచున్న దేవునికి ఒక పరిపూర్ణ యుగమును యేసు అప్పగించును. ఆయన విమోచించిన తండ్రికి ఇచ్చెను. అది నిజమేనా? తండ్రియగు దేవునిగా మారును. మానవుడు కాడు గాని, ఆత్మస్వరూపియై ఆయన ఉన్నాడు. సమస్త మంచిని పోగుచేసినచో ఎట్లు౦డునో, దేవుడు ఆలాగున్నాడు. మంచి నుండి వక్రీకరించిన ప్రతిదీ చెడ్డదే. అది సాతాను రాజ్యము. సమస్త మంచి దేవునికి చెందును. హేయమైన కార్యములన్నియు సాతానుకు సొంతమైనది.
JOHN 14:20•
REV 21:16
120అప్పుడు దేవుడు యేసుక్రీస్తు అను నరుని యందు శరీరము ధరించెను. ఆయనే కుమారుడు. ఆ కుమారుడు ఇతర కుమారులను తీసికొని వచ్చుటకును, దేవుని దృశ్యపరచుటకు తన జీవమును ఇచ్చెను. స్వరములో స్వరమై పనిచేయుచున్నాడు. "నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నా యందు మీరును, మీ యందు నేనును ఉన్నానని ఆ దినమున తెలిసికొందురు."
ఓ, సోదరుడా, అది నిజమైన దినము. వర్తమానమును వినుటకు మీరు బర్మింగ్హామ్ నుండి కారు నడుపుకొని రానవసరము లేదు. అప్పుడు వర్తమానము మనతోనే యుండును గదా? ఓ, అది అద్భుతమగు, ఆశ్చర్యమగు కాలము. ఆ దినము కొరకు మనము చూచుచున్నాము. దేవుడు దానిని త్వరగా తీసికొని వచ్చును గాక!
ఆ గొప్ప పట్టణము అక్కడ యుండును. (ఇప్పుడు, చూడండి?) "పదిహేను వందల మైళ్ళ ఎత్తుండునా?" అని మీరడుగుదురు. ఆలాగని బైబిలు చెప్పెను. ఇప్పుడు, ఈ విధంగా తిన్నగా పదిహేను వందల మైళ్ళ ఎత్తుండదు. చూచారా? మనకు మరియొక భౌగోళిక కొలతయున్నది. అన్ని వైపుల సమానముగా ఉండును. అది పిరమిడ్, చూచారా.
దాదాపు అరవై డిగ్రీల వైపుగా ఆ పట్టణము ప్రారంభమగును. ఆ విధంగా పదిహేను వందల మైళ్ళతో ఆరంభమయినప్పుడు, అదెంత ఎత్తుగా ఉండునో కాస్త ఆలోచించండి. ఎంత పొడవుండునో చూడండి. మీరు కొండను ఎక్కుచున్నప్పుడు పైకి ఎక్కుచున్నట్లుగా భావించరు. అరవై డిగ్రీల యొద్ద పదిహేను వందల మైళ్ళు ఎత్తులో నీవు ఈలాగుందువు. చూచారా? పట్టణమంతా ఈ కొండ మీద యున్నది. దాని ఎత్తు పొడవు సమానముగానే యున్నవి. దాని వెడల్పును అంతే యున్నది. ఎత్తు, లోతు, వెడల్పు, సమానము, గోడలన్నియూ సమానము. పిరమిడ్నకు నాలుగు గోడలున్నవి. ఈ నాలుగు గోడలును..
REV 21:17
121ఇప్పుడు, పట్టణము చుట్టూ ఉన్న గోడలు - 216 అడుగుల పొడవు, 144 మూరలు, మరియు ఆ ప్రతి ఒక్కటి రాయియై యున్నది. స్నేహితులారా, ఆ పట్టణము గూర్చి ఆలోచించండి. ఈ వేడి స్థలంలో ఎందుకు మనం కూర్చొనియున్నాము? ఈ క్రియలు ఎందుకొరకు చేయుచున్నాము? ఈ విధంగా ఎందుకు కారు నడుపుకొనివచ్చుచున్నాము? ఎందుకు మనము, శ్రమపడుచున్నాము? ప్రతి అంగుళము కూడా అందుకు యోగ్యమే.
ఈ దారిలోని ప్రయాస ఎన్నదగినదిగా కనబడదు,
ఆ మార్గాంతమును నేను చేరినప్పుడు,
అది నిజము. ఓ, అదేటువంటి సమయము!
HEB 11:10,13•
REV 22:1,2
122అక్కడ యేసు సింహాసనము మీద కూర్చొని యుండును. ఆ సింహాసనము క్రింద నుండి జీవనది ప్రవహించుచుండును. ఆ గోడలను తాకుచూ చిన్న శాఖలుగా తయారయి పట్టణము గుండా ఆ నది ప్రవహించును. వీధుల గుండా అది ప్రవహించును. ప్రతి వైపున జీవవృక్షములుండెను - ప్రతి ముప్పది రోజులకు దాని పండు మార్చుచుండెను. ఓ, ఎలాంటి ఒక నగరము.
గుర్తుంచుకొనండి, సృష్టికర్తయగు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఇప్పుడాయన మహిమ యందుండి పట్టణమును సిద్ధపరచుచున్నాడు. అబ్రాహాము దాని కొరకు చూచెను. అతడు తన గృహము విడిచిపెట్టెను. తనకు ప్రియమగు ప్రతి దానిని విడిచిపెట్టెను. ఎందుకని? అతడు ఒక ప్రవక్త. ప్రవక్తయి యున్నందున, ఆత్మతో సంబంధము కలిగియుండెను. ఆత్మలో భాగముగా యుండెను. "అక్కడ ఒక పట్టణమున్నది," అని అతనితో ఏదో చెప్పుచుండెను. దాని కొరకు అతడు ఎదురుచూడనారంభించెను. "నేను పరదేశిని, నేను యాత్రికుడను. ఏ పట్టణమునకు దేవుడు శిల్ఫియు, నిర్మాణకుడై యున్నాడో దాని కొరకు ఎదురు చూచుచున్నాను," అని చెప్పెను. ఆ పట్టణము ఎక్కడో యున్నదని అతనికి తెలియును. ఓ, మై! పాలస్తీనా నేల మీద యుండి అతడు దాని కొరకు ఎదురు చూచెను. అక్కడే అది లేచును. సీనాయి పర్వతము మీద ఉండును. అక్కడే అది యుండును.
అది సముద్రము నుండి సముద్రము వరకు విస్తరించియుండును. పదిహేను వందలమైళ్ళ పట్టణము గురించి ఆలోచించుము. ప్రభువు యొక్క పర్వతముల మీద అది యున్నది. ఓ, అది అద్భుతము!
ISA 65:25
123సింహము మరియు గొర్రెపిల్ల కలిసియుండును. సింహము కూడా ఎద్దువలె గడ్డి మేయును. ఎలుగుబంటి సాధువుగా యుండును. తోడేలు మచ్చికయగును. అదెటువంటి సమయము! ఏదియు హాని చేయదు. నాశనము కలిగించదు. ప్రతిది సమాధానముతోను, ప్రేమతోను ఉండును. ముసలితనము ఇకను లేదు; వ్యాధి ఇక లేదు, మరణము ఇక లేదు.
ప్రజలారా, ఇదేదో శాంతాక్లాస్ కథ కాదు. కట్టు కథ కాదు. ఇది వాక్యములో వ్రాయబడియున్నది. ఎన్నడూ వాక్యము తప్పిపోదు. బైబిలు దినమును చూడవద్దు గాని ఈ దినమునే చూడండి. ఆయన వాక్యములోని పొల్లు కూడా తప్పిపోదు. ఆ పట్టణమునకు నేను వెళ్ళుచున్నాను. దానిని నేను ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించుట లేదా?
124సోదరీ సోదరా, తొమ్మిది గంటల ఇరవై నిమిషములయినది. కెంటాకీ నుండి వచ్చిన నా స్నేహితులిచ్చట ఉన్నారని నేనెరుగుదును. దేశములోని వివిధ ప్రాంతముల నుండి వచ్చిన స్నేహితులున్నారు. మీరు రాత్రికి ఉండినచో, మీ గది బిల్లు నేను చెల్లించెదను. నేను మీకు ముందే చెప్పాను, మీ కొరకు ఆహారము సిద్ధముగా యున్నది. మీరు రాత్రికి ఉండినచో వసతి బిల్లును కూడా చెల్లించెదను. ఆ వెనుక నున్న ఆయనను మీరు కలిసికొంటే చాలును. నిశ్చయంగా, నేనాలాగు చేయుదును. మీకు సహాయము చేయుటకు ఏదయినా చేయుదును. మిమ్ము ప్రేమించుచున్నాను.
కొన్నిసార్లు మీ ప్రశ్నలకు జవాబులు మీరూహించిన దానికి విరుద్ధముగా చెప్పి యందును, కాని నా ఉద్దేశ్యపూర్వకముగా చేయలేదు. మీరది నమ్మలేకపోయినచో, మంచిదే. ఎప్పటివలెనె మీరు నన్ను ప్రేమించవలెనని కోరుచున్నాను, ఎందుకనగా మీ పట్ల నేను ఆలాగే యున్నానని దేవునికి తెలియును. నాకు తెలిసిన రీతిలో దీనికి జవాబు ఇచ్చియున్నాను - కొన్ని తప్పు చెప్పియుండవచ్చును. కాని ఇష్టపూర్వకముగా తప్పు చెప్పలేదు. ఆరు లేదా ఎనిమిది ప్రశ్నలకు నేను సవివరముగా జవాబు చెప్పినయెడల, సమయము సరిపడి యుండకపోవును. చాలా ప్రశ్నలు చూచాను. వివాహము మరియు పరిత్యాగము గూర్చి కొన్ని నేను చెప్పాను. కొద్దివానికి జవాబివ్వగోరాను. ఇంక ఎక్కువ ఇక్కడ లేవు, వాటిని చూచాను, కాని కొన్ని చాలా ప్రాముఖ్య ప్రశ్నలు ఇచ్చటున్నవి, చాలా ముఖ్యమైనవి. వీలయితే వాటికి జవాబు ఇచ్చెదను.
125ఇప్పుడు, మీరు ఈ చుట్టుప్రక్కలే ఉంటున్నచో, బుధవారం నాడు బిల్లీని కలవండి. నేను తిరిగి రాగలనో లేదో అప్పటికి తెలియును. ఈ వారము నేను ప్రార్ధి౦చెదను. కాని చాలా మందిని ఇంటర్వ్యూ కొరకు నేను కలిసికొనవలసియున్నాను. నన్ను కలిసికొనగోరు వారి జాబితా చాలా యున్నది. ఆరిజోనాలో కూడా అంతేమంది ఎదురుచూచుచున్నారు. ఒక దినమున వారిని కలిసికొందును. వారు నిజంగా వ్యాధితోనున్నారు. అందులో కొందరికి సమస్యలున్నవి - భార్య భర్తలకు సమస్యలున్నవి, ఏమి చేయాలో వారికి తెలియుట లేదు.
ఇక్కడ్నున వారిలో కొందరు వ్యక్తిగతంగా నన్ను కలిసికొనగోరుచున్నారు, ఎందుకనగా వారు వ్రాసినది సరిగ్గా నేను చదువలేకపోయాను. ప్రజలు తమ పెండ్లి వ్యవహారముల గూర్చి ప్రశ్నలు అడిగిరి. వారిని కలిసికొనమని బిల్లీకి చెప్పాను. వారిని పిలచుకొని వచ్చినచో మాట్లాడుదునని కబురు పంపాను. కొన్ని చాలా తీవ్ర సమస్యలున్నవి, మరియు జవాబునివ్వవలసిన ప్రశ్నలున్నవి.
2COR 11:2
126మీకు సహాయము చేయవలెనని ఇక్కడ నేను ప్రయత్నించుచున్నాను, ఎందుకనగా మిమ్మును ప్రేమించుచున్నాను. క్రీస్తునందు మిమ్మును నేను కనియున్నాను. వారు నా పిల్లలు. మీ ప్రతిఒక్కరు నా వారే. ఈ రాత్రి మిమ్మును నేను స్వీకరించాను. ఎప్పుడూ మీరు నా వారే. ఎల్లవేళలా మీరు నా సోదరీ సోదరులుగా యున్నారు. మీరు నా పిల్లలు. పౌలు ఒక చోట చెప్పినట్లుగా, సువార్తలో నేను మీకు తండ్రిని, యాజకుని తండ్రి అనుచున్నట్లు కాదు. సువార్తలో మీకు నేను తండ్రిని. క్రీస్తుకు మిమ్మును కనియున్నాను. క్రీస్తుకు ఇప్పుడు మిమ్మును ప్రధానము చేసియున్నాను, కన్యకను ప్రధానము చేసినట్లుగా మిమ్మును క్రీస్తుకు ప్రధానము చేసియున్నాను. నన్ను నిరాశపరచవద్దు! నన్ను కించపరచవద్దు! మీరు కన్యకలవలె నిలచియుండుడి!
"బ్రెన్హాం సోదరుడా! నేనెట్లు౦డగలను?" అని మీరడుగవచ్చును. వాక్యముతో నిలచియుండుడి. పవిత్రముగా, పరిశుద్ధముగా జీవించుడి. లోక విషయములతో ఏమీ మీకు సంబంధము లేదు. దానిపట్ల మీ హృదయములో ప్రేమ యున్నచో ఇట్లు చెప్పండి, "ఓ, యేసూ, దయతో దానిని నా హృదయములో నుండి తీసివేయుము. ఆ విధముగా నేనుండగోరుట లేదు."
దీనిని చెప్పవలెనని ఎవరినో నేను కోరుట లేదు. విశ్వాసులు నిజంగా దీనిని చెప్పవలెను. యేసుక్రీస్తును నమ్మి ప్రతి దినము ఆయన కొరకు జీవించుడి. ఏ కీడు చేయవద్దు.
1COR 8:13
127చాలాసార్లు నేను కాల్వినిస్టిక్ విశ్వాసము గురించి చెప్పుచుందును. మీ ఇష్టమొచ్చిన దానిని చేయుటకు అది మిమ్మును అనుమతించదు. ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చినప్పుడు.. "ఆలయమునకు వెళ్ళావా?" అనడిగాను.
"వేటకు వెళ్ళాను," అన్నాడు.
అతని భార్య నా యొద్దకు వచ్చినది. ఆదివారము ఆమె బట్టలుదుక్కొని వచ్చుచున్నది.
"నీవెందుకు ఆలయానికి వెళ్ళలేదని అడిగాను?"
"బట్టలుదుకుకొన్నానని" చెప్పినది.
"నీవది చేయరాదని," అన్నాను.
"నేను పాత లీగలిస్టుని కాదని" ఆమె చెప్పినది.
"కాని నీవు క్రైస్తవురాలవనుకొనుచున్నాను," అన్నాను. చూచారా? నీవు ఎవరికో అడ్డు బండగా ఉంటున్నావు.
"నేను లీగలిస్టును కాను గనుక మరీ ఆచారబద్ధంగా ఉండుటలో నాకు నమ్మకము లేదు," అన్నది.
నా సోదరీ, సోదరులారా, ఇటు చూడండి. "నా భోజనము ఒక సోదరునికి ఆటంకము కలిగించుచున్నచో నేను ఆ భోజనమును బహు నిశ్చయముగా మానివేయుదును," అని పౌలు చెప్పెను. అది చాలా మంచిదని అనుకొనుచున్నాను.
128"బ్రెన్హాం సోదరుడా, నీవు వేటాడుదువు. నీవు ఆదివారము ఎప్పుడూ వేటాడ లేదా?" అని మీరడగుదురు. ఒక సంగతి మీకు చెప్పుచున్నాను. నా గురించి గొప్పగా నేనిది చెప్పుకొనుట లేదు. నేను సబ్బాతు నాచరించువాడిని కాను. పరిశుద్ధాత్మయే మన సబ్బాతని నేను నమ్ముచున్నాను. దానిని నేను విశ్వసించుచున్నాను, కాని పునరుత్థాన దినమును మనము జ్ఞాపకార్ధముగా చూడవలెను. దానిని గౌరవించవలెను. పునరుత్థాన దినమును మనము ఘనముగా ఎంచవలెను.
ఒక ప్రత్యేక దినమును ఆచరించవలెనని చట్టము లేదు. ఆయన లోనికి మీరు ప్రవేశించునప్పుడు, సమాధానమను సబ్బాతులోనే ప్రవేశించియున్నారు. ఇక్కడ దాని మీద ప్రశ్న యున్నది. త్వరగా దానిని చెప్పెదను. సబ్బాతు దినమనగా ఏమిటని ప్రశ్నించిరి. దేవుని చిత్తమయితే, దానిని వివరించెదను.
ఇప్పుడు దీనిని గమనించి గుర్తుంచుకొనండి. చూచారా? నేను చిన్నవానిగా యున్నప్పుడు, ఐక్స్ ఈ దారి ప్రక్కనే యుండేవాడు. నాకప్పుడు దాదాపు పదిహేను సంవత్సరములు. నేను జీవనోపాధి కొరకు ప్రయత్నించుచున్నాను. స్కంకులు, మస్క్-రాట్స్, ఒపోసమ్లు పట్టుచూ మా ఇంటికి కొంత సహాయము చేయుచుంటిని.
నాకు జంతువులను పట్టుట ఇష్టము. నేను స్కంకు వాసన కొట్టుకొంటూనే బడికి వెళ్ళేవాడిని. నాకు రెండే దుస్తులుండేవి. ఎప్పుడూ అవే నేను ధరించేవాడిని. నాకున్నదంతా అదే. నా తల్లి వాటిని ఉదికేది. మరల అదే ధరించి బడికి వెళ్ళుచుండేవాడిని. నేను బాలుడను. ఒక రాత్రి అక్కడ నేను నిలబడియున్నాను. వాతెన్స్ ప్రాంతములో జంతువుల కొరకు ఉచ్చులు పెట్టియున్నాను. ఈ ఉచ్చులు పెట్టుటకు ఉదయం 2 గంటలకే లేచి, లాంతరు తీసికొని వెళ్ళేవాడిని. బడికి వెళ్ళే సమయము వరకు జంతువులు పట్టుచుంటిని. కుందేలును పట్టి పదిహేను సెంటు సంపాదించేవాడిని. దానితో మరికొన్ని సామానులు కొని మూడు లేక నాలుగు కుందేళ్ళు పట్టుచుంటిని. ఆ కుందేళ్ళు అమ్మి మా రొట్టె కొరకు డబ్బులు సంపాదించుచుంటిని. వారితో మా జీవనము కొనసాగెడిది. మీరా విధంగా జీవించవలసి వచ్చెనో లేదో నాకు తెలియదు. ఆ సంపాదన ద్వారా రొట్టె, పిండి, సూపు వచ్చెడిది.
129నదియొద్ద నేను గాలము వేసేవాడిని. చేపలు పట్టి, పౌనును పది సెంటులకు అమ్ముచుంటిని. చేపలను గాలము వేసి పట్టేవాడిని. నాకు ఏ నావ లేదు. ఒక దుంగ మీద ఎక్కి ఈదుచుంటిని. బకెట్లో ఆ ఎరలు పెట్టి ఆ దుంగను చాలా శక్తితో నడుపుచుండేవాడిని. నా మొండి శరీరము నదిలో నానిపోతుండేది. నా మొలకు తాడుతో కట్టుకొనిన ఒక జాలె ఉండేది. అందులో చేపలు వేసేవాడిని. ఆ పెద్ద జెల్లల వంటి చేపలు నా దుంగ మీద నుండి ఎగురుతూ నన్ను కుట్టుచుండేవి. నా ఎరను పెద్ద చేపలు తినిపోతుండేవి.
కాని చూడండి, చాలాసార్లు రాత్రి 11 గంటల వరకు నేను ఆ గదిలో ఎరలో విడిచి గాలముతో చేపలుపట్టుచుండేవాడిని. ఆరు రోజుల పాటు నేను చేపలుపట్టుచుండేవాడిని. నాకు కావలసిన డబ్బు అందువలన రాకపోయినా గాని, ఏడవ దినమున మాత్రం పట్టేవాడిని కాను. వర్షముతోనే నేను నిలబడియుండేవాడిని.
130ఒక రాత్రి నేను దేనికో ఆనుకొని నిలబడియున్నాను… నేను ఒక పాపిని; కాని ఒక తలుపు ద్వారబంధమును పట్టుకొని నేను నిలబడియున్నాను. వర్షము కుండపోతగా కురుస్తున్నది. దాదాపు 11 గంటలయినది. ఏది ఏమైనా నేను వెళ్ళి, ఆ గాలములన్నింటినీ చూచి రావలెననుకొన్నాను, ఎందుకనగా విశ్రాంతి దినమున వేటకు వెళ్ళను. దేవుడు దానిని గౌరవించెను.
నాకెప్పుడూ ఏ కోరిక ఉండేదో నాకింకా జ్ఞాపకమున్నది. నా జీవితమంతా వేటగానిగా ఉండగోరాను. నా తాత అంతే! మీరెరుగుదురా? నా మామ్మ అటవిక జాతిలో నుండి వచ్చినది. ఆమెకు పింఛను ఇచ్చెడివారు. వెలుపలి ప్రదేశములంటే నాకు చాలా ఇష్టము.
నా జీవితములో అదే కోరిక. నాకు సరిపడిన డబ్బు వచ్చినప్పుడు 30-30 రైఫిల్ కొనవలెనని ఆశించేవాడిని. అప్పుడు చాలా జంతువులను వేటాడవచ్చును. నేను అడవులకు పోయెదను. ప్రపంచముతో నాకేమీ పని లేదు. నా .22 రైఫిల్ ఎప్పటికయినా చేతికోస్తే, చక్కగా వేటాడుటను నేర్చుకొందును. నాకు గురి చూచి వేటాడుట వచ్చినచో ఎవరైనా వేటగాడు రమ్మని అడుగును. వేటగాళ్ళు తమ సంరక్షణ కొరకు మంచి గురిగా కొట్టు వారిని రమ్మందురు. ఆ విధంగా నేను వేటకు వెళ్ళుదును. ఇవి నా మనస్సులోని ఆలోచనలు. నా గోడలకు మంచి తుపాకీలు వ్రేలాడదీయును. బాగా డబ్బు సంపాదించి, ఆలాగు చేసి అద్దెకు కూడా రైఫిల్స్ ఇచ్చెదనుకొన్నాను.
131ఆయన నన్ను కొండలకు పంపి ప్రసంగించనిచ్చెను, ప్రపంచములోని అత్యుత్తమ మార్గదర్శకులు కొందరు నన్ను వేటకు రమ్మని ఆహ్వానించిరి. ఇదంతా ఉచితముగానే జరిగినది. "అద్భుతమైన కృప, ఎంత మాధురమైన స్వరము."
ఈ ఉదయం కూడా ఒక గొప్ప జింకల వేటగాడు .35 రెవింగ్టన్ రైఫిల్ పట్టుకొని వచ్చెను - నాకు నిజంగా రైఫిల్ అవసరం లేదు — కాని అతడు నన్ను ఆలింగము చేసికొని, నేను ముసలివాడినైపోయాను గనుక నా రైఫిల్ నీకియ్యగోరుచున్నానని చెప్పెను. బాలునిగా ఉన్నప్పుడు నేననుకొనినది అదే. అటువంటి రైఫిల్ ఎప్పుడైనా నాకు స్వంతంగా దొరుకునా అని ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు నా గోడ మీద చక్కని రైఫిల్స్ వ్రేలాడుచున్నవి. వేటాడు స్థలములున్నవి.
బయటకు వెళ్ళుట నాకు గుర్తున్నది. కుర్రాళ్ళు ఐస్-క్రీమ్ కోన్స్ కొనేవారు. అందులో కొందరికి ఇంకా డబ్బులు మిగిలితే నాకు ఒకటి కొని ఇచ్చేవారు. నేను మరల వారికి కొని ఇచ్చే స్థితిలో లేను.
132వారు కొన్నిసార్లు ఒక రకమైన వంటకములుకొనేవారు. ఆ పాతకాలపు హాంబర్గరు అవి. మీకవి గుర్తున్నవో లేదో నాకు తెలియదు, కాని ఆ పాతకాలపు వారికి తెలియును. ఒక నికెల్కు అవి వేయించిన ఉల్లిపాయలతో సహా ఇచ్చెడివారు. ఓ, అవి నాకెంతో ఇష్టము. మాకు జోన్న రొట్టె మరియు బెల్లం తేనె తప్ప మరేదీ లేదు. అది తినుటకు ఎట్లు౦డునో మీకు తెలియును.
ఎవరో ఒకరు నాకు ఆహాంబర్గరు కొని ఇచ్చెడివారు. దానిని పట్టుకొనిన నా వ్రేళ్ళను కూడా నాకే వాడిని. అంత గొప్ప రుచిగా ఉండేది. ఎవరికయినా సరే నేను ఆ హాంబర్టన్ కొనియ్యవలెననుకొనేవాడిని. ఇప్పుడు నేను ఒక సంఘమంతటికీ భోజనం పెట్టగలను.
ఆ సంగతులన్నియూ నాకు గుర్తున్నవి. ఇదెక్కడ నుండి వచ్చినది? దేవుని కృప, నా ప్రగతి కాదు.
133ఆ వీధిలో నేను వెళ్తూ ఎవరితోనయినా మాట్లాడాలని చూచేవాడిని. నా తండ్రి మీ అందరికీ తెలియును. అతడు త్రాగుబోతు. విస్కీ తయారుచేసేవాడు. ఎవరూ నాతో మాట్లాడే వారు కారు. నేను వీధిలో వెళ్తూ మనుష్యులతో మాట్లాడాలని చూచేవాడిని. ఈ రోజుకు కూడా ఇంకా నేను కొందరితో మాట్లాడాలని చూచెదను. ఎవరూ లేనప్పుడు వారు ఆగి "నీవు బ్రెన్హాం గదా!" అని నవ్వి పోవుచున్నారు." చూచారా? నేను బ్రెన్హాంను.
నాకు చాలా బాధ కలిగేది. అటు ఇటు చూస్తూ పోయేవాడిని. "నేను దోషము చేయలేదే?" నా తండ్రివలె నేను జీవించగోరుట లేదే? నా జీవితములో నేనెప్పుడూ త్రాగలేదే. ఎందుకు నన్ను ఆ విధంగా చూస్తున్నారు? నేనిక ఈ పట్టణములో జీవించలేను," అనుకొనేవాడిని. నా భార్యకు ఒకసారి ఆ మాట చెప్పాను. దేవుడు నా పట్ల ఎంతో మేలు చేసెను.
2SAM 7:2,3,8-13
134ఒకసారి నాతానును దావీదు ఏమని అడిగెనో చూడండి. "నా దేవుని మందసము ఆ బయట గుడారములో యుండగా నేను దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో నివసించుట న్యాయమా?"
ప్రవక్తయగు నాతాను ఇట్లు చెప్పెను, "దావీదూ, నీ హృదయ కోరిక చొప్పున చేయుము, ఎందుకనగా దేవుడు నీకు తోడైయున్నాడు." ఆ ప్రవక్త అనుకోకుండగానే ఒక తప్పు చేసెను.
ఆ రాత్రి ప్రవక్త యొద్దకు ప్రభువు వచ్చి ఇట్లు చెప్పమనెను, "నా సేవకుడగు దావీదు ఒక దినమున చిన్న గొర్రెల కాపరిగా యుండెను. ఎక్కడో గొర్రెలను మేపుచుండెను. అట్టి వానిని బయటికి పిలచి ఈ భూమి మీద గొప్పవానిగా చేసితిని. (అతి గొప్ప పేరు ఇచ్చానని ఆయన ఎన్నడూ చెప్పలేదు గాని, గొప్పవారికున్న పేరు ఇచ్చానని చెప్పాను.) దావీదుకు ఇవన్నీ నేను చేశాను. వెళ్ళిన ప్రతిచోట శత్రువును నిర్మూలనము చేసియున్నాను. అతని పక్షముగా నేనున్నాను. ఎచ్చట అతనిని నేను తప్పిపోనివ్వలేదు, తప్పిపోనియ్యను. కాని ఈ మందిరము మాత్రమే కట్టుటకు అతనికి సెలవియ్యను."
135దానిగూర్చి నేను ఆలోచించాను, ఈ స్థలమును దేవుని సహాయము చేత నేను పొందాను. గొప్పవారు దీనిని తెలిసికొనవలెను. నేను ప్రపంచమంతా తిరుగుదును. ప్రపంచములోని పలు జనులు నన్ను పిలచుచున్నారు. వారి కొరకు ప్రార్థించమని అడుగుచున్నారు. రోగులు నాతో కొద్ది నిమిషములు గడపవలెనని ఆశించుచున్నారు. కొన్ని సంవత్సరముల క్రితం నేను వీధిలో నడుస్తూ౦టే, తలెత్తి చూచే వారే కారు. కాని ఇప్పుడు, ఈ పట్టణము లోనికి నేను తీసికొని వచ్చిన జనుల వలన వ్యాపారులు వర్ధిల్లిరి. వారి భోజనపు బిల్లులు హోటల్ బిల్లులు, వస్తువుల బిల్లుల వలన వారందరూ ధనికులయిరి.
ప్రజలు నన్ను అసలు ప్రేమించరు; ఎవరికీ ఉపయోగపడను. కాని దేవుని సహాయము చేత యేసుక్రీస్తు యొక్క వధువును నేను నడిపించుచున్నానని నమ్ముచున్నాను. ఓ, "అద్భుతమైన కృప, ఎంత మాధురమైన స్వరము."
136అదెక్కడనుండి వచ్చినది? విద్య వలనా? నాకు విద్య లేదు. అదెక్కడ నుండి వచ్చినది? నా వ్యక్తిత్వము వలనా? అది నాకు లేదు. నాకున్నవేదాంత పాండిత్యము వలన అది వచ్చినదా? నాకేమీ తెలియదు. ఏలాగది వచ్చినది? దేవుని కృప నన్ను రక్షించెను.
నా హృదయమునకు భయపడమని కృప నేర్చెను.
నా భయములను కృప తొలగించెను.
ఆ కృప ఎంత ఆనందముగా కనబడినది!
నేను నమ్మిన ఆ మొదట ఘడియ!
అనేక అపాయములు, అలసటలు, ఊరుల గుండా
నేను ఎప్పుడో వచ్చితిని.
ఇంత వరకు క్షేమముగా నన్ను తెచ్చినది కృపయే.
కృపయే నన్ను గృహమునకు కొనిపోవును.
ఆ పట్టణములో వెయ్యేండ్లపాటు మనం ఉన్నప్పుడు
సూర్యుని కంటే అధిక ప్రకాశముండును.
ఆయన స్తుతిని పాడుటకు సదా సమయముండును,
మనం మొదట ప్రారంభించినప్పటకంటె.
ఓ, యేసును ఎంతగానో నేను ప్రేమించుచున్నాను. ఆ సుందరమగు నామము నన్ను రక్షించెను. ఒకప్పుడు నేను పాపిని. నేను రోగినై యుండగా, అది నన్ను బాగుపరచెను. ఆ పట్టణములో నాకొక గృహమున్నదని అది వాగ్దానము చేసెను. ఆ బండలో నాకొక ఇల్లున్నది. ఇప్పుడేమీ లెక్కకు రాదు. దేవుని పిల్లలందరూ కలిసి "వెళ్ళుదాం" అని చెప్పుదము. ఆ ఘడియ, అర్ధరాత్రి వచ్చుచున్నది. మనం అనుకొనుచున్న దానికన్న త్వరగా అది వచ్చును. మనము ప్రార్ధి౦చుదము.
JOB 19:25,26
137ప్రభువైన యేసూ, ఒక పరిపూర్ణ దినము ముగియుచున్నది. మేము కొండ శిఖరాన నిలబడి సూర్యుని గమనించుదము. ఆ గొప్ప పశ్చిమ కొండల మీదికి, ఆవలగా ఆ ఎర్రని సూర్య కిరణములు వెదజల్లును. ఆ గొప్ప నేత్రము మూసికొనిపోవును. పక్షులు తమ గూళ్ళకు త్వరపడును. రాత్రి వచ్చుచున్నది. మేము మరియొక గొప్ప ఆత్మీయ దినమున చూచియున్నాము. ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చుటకు పరిశుద్ధాత్మ సహాయము చేసెను. ప్రభువా, ఇప్పుడు మేము మా గూటికి వెళ్ళుచున్నాము. మమ్ము కాయుము. ప్రభువా, ఏదీ మమ్మును తాకకుండా చేయుము. రాత్రియందుండు సర్పములు మరియు కీడుల నుండి తప్పింపుము. అన్ని సమయములలోను దేవుడు మాకు దగ్గరగా యుండి, మమ్ము కాపాడి మాకు సహాయము చేయును గాక!
పరలోకపు తండ్రీ, మా ప్రతి ఒక్కరినీ, ఈ కూటములో యున్న వారినందరినీ, రాలేకపోయిన వారిని, టేపు వినుచున్న వారిని దీవించమని ప్రార్ధి౦చుచున్నాను. ఆ ప్రశ్నలు మరీ కఠినంగా ఉండకుండును గాక, ప్రభువా, నేను ఏదయినా తప్పు చేసినచో, నేను కావలెనని చెప్పలేదని నీవు నా హృదయమును ఎరుగుదువు. దేవా, ఏదయినా తప్పు దొర్లినచో దానిని కొనసాగకుండా నీవు ఆపుము. ఎవరినీ నేను మోసపుచ్చకుండా ఆ టేపును ఆపుము. నిన్ను నీ నిజ దాసునిగా ఉండనిమ్ము. అదే నా హృదయ వాంఛ. నేను బ్రదికినా, చనిపోయినా, నీ రాకడ వరకు ఉన్నా లేకపోయినా, ఆయన వచ్చునప్పుడు నేను నిద్రించినా, మేల్కోనియున్నా నాకు లెక్క కాదు గాని నీ చిత్తమే జరిగించుము. "నా విమోచకుడు సజీవుడనియు, చివరి దినమున ఆయన భూమి మీద నిలబడుననియు నేనెరుగుదును. చర్మపు పురుగులు నా దేహమును తినివేసినా గాని, నా శరీరముతోనే దేవుని చూచెదను." అది ప్రవక్తయగు యోబు ప్రభుని రాకడను చూచిన దృశ్యము.
138ప్రభువా, ఈనాడు నీ దాసులమగు మేము నీ రాకడ కొరకు ఎదురుచూచుచున్నాము. ప్రభువా, అది ఎప్పుడు, ఏలాగు, ఎక్కడ అనునది మాకు ముఖ్యము కాదు. నిన్ను మాత్రమే మేము సంతోషపరచగోరుచున్నాము. మేము నీ చేతులలో యున్నాము. ప్రభువా, సూర్యోదయగమగు వరకు మమ్ము కాపాడుము. కృప చూపుము. అప్పుడు మేము ఆ పట్టణమున్న చోటికి, గొర్రెపిల్ల దీపముగా ఉన్న చోటికి, అనగా సీయోనుకు సాగిపోయెదము.
ప్రభువా, నా ప్రియమైన చిన్నపిల్లలిచ్చటున్నారు. బైబిలు యొక్క బంధముల ద్వారా నీ కొరకు వారిని నేను కనియున్నాను. వారు ఈ వాక్యము యొక్క ఫలములు. వారు నన్ను ప్రేమించుచున్నారు. నేను వారిని ప్రేమించుచున్నాను. నీవు మా అందరినీ ప్రేమించుచున్నావని మేమెరుగుదుము. నీ వాక్యముతో మమ్మును నింపి, నిన్నే చూచునట్లు చేయుము. ప్రభువా, కృప చూపుము. నీ వాక్యముతో సంపూర్తిగా మమ్మును నింపుము. అప్పుడు ఆత్మ మమ్మును ఎక్కడయినా గాని నీవు వాగ్ధానము చేసిన వాక్యమును బయలుపరచుటకు వాడుకొనగలదు. అది మా అందరికీ దయచేయుము. ఇక్కడున్న జనుల మీదను కృప చూపుము.
139నా సహోదరుడు జాక్సన్ ఇప్పుడు ఎక్కడో యున్న ఆఫ్రికాకు తిరిగి వెళ్ళుచున్నాడు. అతనితోను, అతని భార్యతోను నీవు వెళ్ళుము. ప్రభువా, వారితో ఉండుము. వారి ప్రయాణములో వారిని నడిపించుము.
నేను చెప్పిన ప్రతి మాటను ఇక్కడ సహోదరుడు లీవైల్ వ్రాయుచున్నాడు. ఒక పుస్తకమును తయారు చేయుటకు ప్రయత్నించుచున్నాడు. ఓ దేవా, సహోదరుడు వైల్ కు, సహోదరి. వైల్ కు సహాయము చేయము.
ఇక్కడ ఆర్కన్సాస్ నుండి వచ్చిన మార్టిన్ సోదరులున్నారు. ఇంకా చాలామంది సోదరులున్నారు. ఆ ప్రతి ఒక్కరితోను నీవుండమని ప్రార్ధి౦చుచున్నాను.
సహోదరుడు నెవిల్ తోను, సహోదరుడు క్రాప్స్ తోను, సహోదరుడు రదెల్ తోను, సహోదరుడు జాక్సన్ తోను, అందరితోను నీవుండుము. ఓ దేవా, చాలామంది ఉన్నారు. జార్జియా, అలబామా, దేశము నలుమూలల నుండి, ప్రపంచమంతటి నుండి వచ్చినవారున్నారు. ఈ పాట మాకు గుర్తుకొచ్చుచున్నది:
ఓ, వారు తూర్పు నుండి వడమర నుండి వత్తురు;
దూర దేశముల నుండి వత్తురు,
మన రాజుతో విందు చేయుటకు,
ఆయన అతిధులుగా భోంచేయుదురు.
(పాలుపొందమని ఆయనే వారి నాహ్వాని౦చును.)
ఈ యాత్రికులు ఎంత ధన్యులు,
ఆయన పూజనీయమైన ముఖమును చూచెదరు,
దైవిక ప్రేమతో ప్రకాశించెదరు;
ఆయన కృపలో పాలు పొంది ధన్యులగుదురు,
ఆయన కిరీటములో మణులుగా రాజిల్లెదరు.
140ఓ, దేవా, ఆయన కిరీటములో మణులుగా మేమూ ప్రకాశించెదము గాక ఇతరులు చూచి ఆయనను సేవింప ఆకాంక్షించెదరు గాక ప్రభువా, కృప చూపుము. మార్గములో వారిని కాపాడుము. ప్రతి ఒక్కరిని దీవించుము.
తండ్రీ, నేను నీ దాసుడను. ఈ వచ్చే వారము నీవు నన్ను కొనసాగించమని కోరినచో, లేదా వారిని కలిసికొనవలెనో నాకు బయలుపరచుము. ప్రభువా, ఇప్పటికిని, బుధవారమునకును మధ్య ఏమి చేయవలెనో మాకు అర్ధమగునట్లు చేయుము. తండ్రీ, అనుగ్రహించుము. జనులు రాకలుగునట్లు చేయుము. దీవించమని ప్రార్ధి౦చుచున్నాను. నీవు మాకు సహాయము చేయుము - తరువాత కూటములో మమ్మును నీవు కలిసికొనుము.
టెకాన్స్ లోను, ఆర్కన్సాస్ లోను, ఆయా ఇతర స్థలములలోను వాక్యము నందించనైయున్న సహోదరుడు నెవిల్, ఇంకా ఇతరులతో నీవుండుము. తండ్రీ, వారికి తోడుగా ఉండుము. అక్కడున్న పెర్రీగ్రీన్ సోదరుని గుంపుతోను నీవు తోడై యుండుము; వారు నీ చిన్న పిల్లలు. ప్రపంచములోని ప్రతిచోట వారు నీ రాక కొరకు ఎదురు చూచుచున్నారు. మాకు సహాయము చేయుము. తండ్రీ, మమ్మును మేము నీకప్పగించుకొని ప్రార్ధి౦చుచున్నాము. యేసు నామములో మిమ్మును వేడుకొనుము. ఆమేన్.
141ఆ పాట నాకు ఇష్టము, "వారు తూర్పు మరియు వడమర నుండియు వత్తురు." ఎందరికది తెలియును? నాకు వచ్చునో రాదో నాకే తెలియదు కాని ఒక వచనము వచ్చుననుకొనుచున్నాను. సోదరీ, నీవు పాడవచ్చును. వారికది దొరుకునో లేదో నాకు తెలియదు.
ఓ, వారు తూర్పు నుండి పడమర నుండి వత్తురు
దూర దేశముల నుండి వత్తురు
మన రాజుతో విందు చేయుటకు,
ఆయన అలోధులుగా ఉండుటకు -
ఈ యాత్రకులెంత ధన్యులు
ఓ, ఆయన ఘనమగు ముఖమును చూచెదరు
దైవిక ప్రేమతో ప్రకాశించెదరు
ఆయన కృపలో పాలు పొందిన ధన్యులు
ఆయన కిరీటములో మణులుగా ప్రకాశించెదరు.
ఓ, యేసు త్వరగా వచ్చుచున్నాడు
అప్పుడిక మన శోధనలు ముగియును
ఓ, ఈ క్షణములో మన ప్రభువస్తే ఎట్లుండును!
పాపము నుండి స్వేచ్చ పొందిన వారు
అప్పుడు సంతోషించెదరు
దుఃఖము మరియు గాఢ నిరాశయా?
ప్రభువు మహిమలో వచ్చునప్పుడు
మధ్యాకాశములో ఆయనను కలిసికొందము
(అది మీకిష్టమా! మరల ప్రయత్నించెదము)
ఓ, వారు తూర్పు నుండియు, వడమర నుండియు వత్తురు.
దూరదేశముల నుండి వత్తురు
మన రాజుతో విందు చేయుటకు
ఆయన అతిధులుగా ఉండుటకు
ఈ యాత్రికులెంత ధన్యులు
ఓ, ఆయన స్థానమగు ముఖమును చూచెదరు
దైవిక ప్రేమతో ప్రకాశి౦చేదరు,
ఓ, ఆయన కృపలో పాలు పొందిన ధన్యులు
ఆయన కిరీటములో మణులుగా ప్రకాశించెదరు
ఓ, యేసు త్వరగా వచుచున్నాడు
అప్పుడు మన శోధనలు ముగియును.
ఓ, ఈ క్షణములో మన ప్రభువు వచ్చినచో ఎట్లుండును!
పాపము నుండి విమోచింపబడినవారు ఆనందమును పొందెదరు
దుఃఖము మరియు ఘాడ నిరాశయా?
మహిమ యందు మన ప్రభువు వచ్చినచో
మధ్యాకాశములో ఆయనను కలిసికొందుము
(ఎందరు అక్కడాయనను కలిసికొనగోరుచున్నారు?)
ఓ, యేసు త్వరగా వచుచున్నాడు
(కండ్లు మూసికొని బూరధ్వని వినుచున్నట్లు ఊహించండి)
అప్పుడిక మనకు బాధలుండవు
ఈ క్షణములో మన ప్రభువు వచ్చినచో ఎట్లుండును!
పాపము నుండి విమోచింపబడిన వారు ఆనందమును పొందెదరు.
దుఃఖము మరియు ఘాడ నిరాశయా?
మహిమ యందు మన ప్రభువు వచ్చినచో
మధ్యాకాశములో ఆయనను కలిసికొందుము.
(మీకది ఇష్టమేనా?)
142పాట్, ధైర్యము కలిగియుండుము. ఈ ఉదయములలోనే ఒకనాడు నీకు సూర్యోదయమగును. అదెక్కడికి వెళ్ళినదో నాకు తెలియదు గాని, మంచిగానే కనిపించినది. ఆమేన్. సోదరుడా, చాలా కాలము పట్టినది. అది తిరిగి వచ్చును. నీటి మీద వేయబడిన ఆహారము వలె ఒక దినమున అది తిరిగి వచ్చును. అది నిజము. మంచిది.
ఓ, మీరాయనను ప్రేమించుచున్నారా?
నా విశ్వాసము నీ వైపు చూచును,
ఓ కల్వరి గొర్రెపిల్లా,
ఓ దైవ రక్షకా!
ఇప్పుడు నేను ప్రార్థించుచుండగా వినుము,
నా పాపములన్నియూ తీసివేయుము.
నీ ప్రక్కనుండి ఎన్నడూ నన్ను తొలగనీయకుము,
జీవితపు చీకటి దారిని నేను త్రోక్కుచుండగా,
వేదనలు నన్ను చుట్టుకొని యుండగా,
నీవే నా మార్గదర్శిగా యుండుము.
చీకటని పగలుగా మార్చుము
దుఃఖములను, భయములను తుడిచివేయుము
ఓ, ఈ దినము నుండి పూర్తిగా నన్ను నీ వానిగా ఉంచుము.
(మీకది ఇష్టము కాదా?)
నా విశ్వాసము నీవైపు చూచును
ఓ కల్వరి గొర్రెపిల్లా,
ఓ దైవ రక్షకా!
ఇప్పుడు నేను ప్రార్థించుచుండగా వినుము
నా పాపములన్నియూ తీసివేయుము
నీ ప్రక్కనుండి ఎన్నడూ నన్ను తొలగనీయకుము
బంధించు బంధము ధన్యము (ఓ, మై!)
క్రైస్తవ ప్రేమలో మన హృదయములు ఏక మనసు గల
సహవాసమైనున్న దానివలె యుండును.
మన తండ్రి నీంహాసనము ఎదుట
మన ఆస్తక్తి గల ప్రార్థనలు కుమ్మరింతుము
మన భయములు, మన ఆశలు, మన ఉద్దేశ్యములు ఒక్కటే
మన ఆదరణలు మరియు మన చింతలు,
మనము విడిపోవునప్పుడు
అంతరంగముందు బాధ కలుగును
కాని ఇంకా మన హృదయములు కలిసేయుండును
మరల కలిసికొందుమను ఆశయున్నది.
143విల్సన్ సోదరీ, దాదాపు ముప్పది-మూడు లేదా ముప్పది-అయిదు సంవత్సరాల క్రితం ఒక చిన్న గృహ కూటములో మనం ఒకరి చేతులు ఒకరం పట్టుకొన్నాము. నీకు గుర్తున్నదా? నీకది గుర్తున్నదని నాకు తెలియును. ఓ, మనం ఇప్పుడు లేచి ఒకరి చేతులు ఒకరు పట్టుకొందము.
బంధించు బంధము ధన్యము
క్రైస్తవ ప్రేమలో మన హృదయములను
ఒకే రకమగు సహవాసము పై నున్న దానిని పోలియుండును.
మన తండ్రి సింహాసనము ఎదుట
మన ఆస్తక్తి గల సింహాసనము ఎదుట
మన ఆస్తక్తి గల ప్రార్థనలు కుమ్మరింతుము
మన భయములు, మన ఆశలు, మన ఉద్దేశ్యములు ఒక్కటే
మన ఆదరణలు మరియు మన చింతలు,
మనము విడిపోవునప్పుడు అంతరగమందు బాధ కలుగును
కాని ఇంకా మన హృదయములు కలిసే యుండును
మరల కలిసికొందుమను ఆశ యున్నది.
మీరు ఒకరినొకరు ప్రేమించుచున్నారా?
చిన్న పిల్లలారా! ఒకరినొకరు ప్రేమించుకొనుడి.
మనము కలిసికొను వరకు, మనము కలిసికొను వరకు
యేసు పాదముల యొద్ద మనం కలిసికొను వరకు;
మనం కలిసికొను వరకు, మనము కలిసికొను వరకు,
మరల మనము కలిసికొను వరకు
దేవుడు మీతో యుండుగాక!
144మీరాయనను ప్రేమించుచున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు కాడా? ఒకరినొకరు మీరు ప్రేమించుచున్నారా? ఒకరి యొద్దకు ఒకరు వెళ్ళి ఇట్లు చెప్పండి, "సోదరుడా, నిన్ను దేవుడు దీవించు గాక. సోదరీ! నిన్ను దేవుడు దీవించు గాక!"
విల్సన్ సోదరీ, ఆ నది కావలనున్నవారు ఈ రాత్రి మన పాటను వినుచున్నారు. మన వృద్ధ సోదరుడు సీవార్డ్ నేల మీద నడుస్తూ చప్పట్లు కొట్టుటను నేను చూడగలను. ఆ వెనుక నున్న మన సోదరుడు గడ్డమును పెంచుకొనియుండి చేతులెత్తి దేవుని స్తుతించుట నాకు కనబడుచున్నది. సహోదరుడు రేయాన్ గూర్చి నేనాలోచించాను. పాత ఆలయములో ఆ స్థలమున అతడెట్లు కూర్చొనియుండేవాడో గుర్తున్నది. పొడవైన గడ్డము పెంచుకొనేవాడు. ఈ రాత్రి మహిమలో ఉండి అతడు వినుచున్నాడు. ప్రియమైన వృద్ధ పరిశుద్దుడు. ఆయన ఆశ్చర్యకరుడు కాడా!
యేసు నామమును నీతో కొనిపొమ్ము,
దుఃఖము మరియు శ్రమతో నిండిన బిడ్డా!
అది నీకు ఆనందమును ఆదరణను ఇచ్చును
ఓ, నీవు వెళ్ళు చోటికల్లా తీసికొని పొమ్ము,
ప్రశస్త నామము, ఓ, ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ మరియు పరలోకానందము
ప్రశస్త నామము ఓ ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము
ఇప్పుడు యేసు నామమును నీతో కొనిపొమ్ము
(ఎందు కొరకు?)
ప్రతి ఊరి నుండి రక్షణగా
(ఏమి జరుగును?)
శోధనలు నిన్ను చుట్టుకొన్నప్పుడు
పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.
ప్రశస్త నామము, ఓ, ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ మరియు పరలోకానందము
ప్రశస్త నామము, ఓ ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ మరియు పరలోకానందము.
145ఇంటర్వ్యూ కొరకు: ఇప్పుడు నుండి బుధవారం వరకు బిల్లీని కలిసికొనుడి లేదా బుధవారం నుండి శనివారం వరకు కలిసికొనండి అని బిల్లీ చెప్పెను. బుధవారం తరువాత మనకు కూటములు లేనిచో నన్ను కలిసికొనగోరువారు, బిల్లీ యొద్దకు వచ్చి తెలియచేయండి. మీలో కొందరిని ఎట్లు సంప్రదించవలెనో అతనికి తెలియదు. నన్ను కలిసికొనగోరు వారందరూ బిల్లీని ముందు సంప్రదించండి.
మీరాయనను ప్రేమించుచున్నారా? మంచిది. మనము తిరిగి కలిసికొను వరకు దేవుడు మిమ్ము దీవించును. మన శిరములు వంచవలెనని కోరుచున్నాను. నా మంచి విధేయుడగు స్నేహితుడు, ఇప్పుడు విదేశములకు వెళ్ళుచున్నవాడగు సహోదరుడు సిడ్నీ జాక్సన్ను రమ్మని కోరుచున్నాను. ఆ దంపతులు ఆఫ్రికాకు తిరిగి వెళ్ళు మార్గములో యున్నారు. ప్రభువు నామము పేరట నేను అక్కడ ఒకసారి మిషనైరీగా పనిచేశాను. గత కొద్ది కూటములో వారు మనతో యుండుటను బట్టి చాలా సంతోషించుచున్నాను. అందరికీ ఆనందమే. దేవుడాయనను ఎంతో ఆశీర్వదించెను. మన సోదరుడు సిడ్నీ జాక్సన్ను వచ్చి ప్రార్థనతో కూటమును ముగించమని అడుగుచున్నాను. జాక్సన్ సోదరుడా, నీవు కోరినట్లయితే.