ప్రశ్నలు మరియు జవాబులు #3

ప్రశ్నలు మరియు జవాబులు #3

1మన శిరములు వంచుదము. ప్రభువైన యేసూ, ఈ ఉదయమున నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ సన్నిధిలోనికి వచ్పు అవకాశమును, ఈ సహవాస సమయమును, క్రీస్తు యేసునందు ఉన్నత స్థలములలో కూర్చొను తరుణమును నీవు మాకిచ్చియున్నావు. ప్రభువా, నీ గూర్చి మాట్లాడుచుండగా నీవు మాతో ఎడతెగక యుండుమని ప్రార్థించుచున్నాము. నీ వాక్యమును చూచుచుండగా నీవు మాకు చేసిన వాగ్దానములను చూచుచుండగా మా హృదయములు ఆనందముతో నిండునట్లు చేయుము. మా సంఘ కాపరిని, మా సహచరులను, మాతో ఇక్కడికి చేరి వచ్చిన మా సోదరులు, సోదరీలనందరిని దీవించమని ప్రార్థించుచున్నాను. ఈ చిన్న స్థలములో మేము కూడియున్నాము. నీ కొరకు ఈ కూడిక స్థలమును మేము ఏర్పరచియున్నాము. ఈ దినమంతా మేము చేయు ప్రతి దానిని నీవు ఆశీర్వదించుము. యేసు నామములో ఈ ప్రార్థనను అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోవచ్చును.

2ఇది నాకు ఒక విధంగా చిన్న విశ్రాంతిగా యున్నది. ఇక్కడ నాకు కొందరిని కలిసికోవలసిన కార్యక్రమములు ఉన్నవి. అలాగే ప్రశ్నలను స్వీకరించి జవాబులు చెప్పవలసిన పనియున్నది. ఈ ఉదయమున దర్శనములు వచ్చియున్నవి. సహోదరుడు నెవిల్ తీరికగా యున్నచో నేను ఆలయమునకు వచ్చి ఈ ప్రశ్నలకు జూబులు ఇచ్చెదనని బిల్లీతో చెప్పాను. ఆ విధంగా నా మనస్సుకు విశ్రాంతి దొరకును. ఆ దర్శనముల నుండి నన్ను మళ్ళించును. ప్రజలకు సహాయము చేయవలెను. అదే ప్రధానము. వారికి సహాయపడుటయే ముఖ్య ఉద్దేశ్యము. అది మంచి భాగము. ఈ మధ్యాహ్నము వరకు నేను వాటిని చూచెదను. వీలయితే మధ్యాహ్నము ఇంటర్వ్యూలో ప్రత్యేకముగా కొందరిని కలిసికొందును.

3ఈ ఉదయము మన స్నేహితులనందరిని చూచుటకు సంతోషించుచున్నాను. దీనిని బట్టి బిల్లీని కోపంగా చూడవద్దు. ఈ ప్రశ్నలకు జవాబు లిచ్చుటను నేను కొనసాగించుదునో లేదో అతడు చెప్పవలసియున్నాడు. ఈ ప్రశ్నలకు జవాబు లిచ్చుటకు ఒక గంట సరిపోవచ్చని నేను తలంచాను, నేను వెళ్ళదలచుకోలేదు; నేను నా పలకను శుభ్రంగా తుడువగోరుచున్నాను. చూచారా? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పుట పూర్తి చేయవలెను. నా మనస్సులో చాలా యున్నది. అది నన్ను ఉద్రిక్తునిగా చేయుచున్నది. ఏ విషయములోను నేను ఉద్రిక్తతను కలిగియుండను. ఈ దినములలోనే ఒక దినమును నేను మహిమలోని గృహమును చేరుటకు వెళ్ళెదను.

4ఒక నా స్నేహితుడు కొన్ని రోజుల క్రితం ఇట్లు చెప్పెను, "ఈ పెట్టెలో జీవించటం మీద నాకు విసుగు వస్తున్నది."

నేనిట్లు చెప్పాను, "ప్రియ సోదరుడా, ఒక విషయము నిన్ను అడుగగోరుచున్నాను. ఒక సంగతి నీకు చెప్పుగోరుచున్నాను. నాకు ఇంటి మీద బెంగ వచ్చినది. ఇరవై సంవత్సరాల నుండి నాకు ఈ బెంగయున్నది. నాకు వెళ్ళుటకు ఏ గ్రహము లేదు. చూచారా? అది నిజము. ఇది చాలా విచారకరమగు సంగతి. నేను కూర్చొని ఎక్కడో యున్న గృహమునకు వెళ్ళుట కొరకు ఏడ్చుచున్నాను. నాకు గృహము లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కువ రోజులు ఉండలేను. ఎక్కడికో వెళ్ళిపోవుటకు నేను సిద్ధంగా యున్నాను. నా స్వభావమే అది. ఆ విధంగా నేను పుట్టాను. నా భార్య నన్ను "విశ్రాంతి లేని గాలులు," అని పిలచును. నేను అటూ, ఇటూ తిరుగుచుందును. అది చాలా ఘోరమగు స్థితి, కాని నా సేవ విషయములో ఆ విధంగానే ఉండవలసి వచ్చుచున్నది. దేవుని కొరకు చేయు ఏ పనినయినా మనము ప్రశంసించెదము.

5ఈ ఉదయమున స్థానికులమగు మనం మాత్రమే యున్నాము. చూచారా? కాని నాకు ఇంటి మీద బెంగగా యున్నది. నేను ఇంటికి వెళ్ళగోరుచున్నాను. ఎక్కడికి వెళ్ళవలెనో నాకు తెలియదు. "ఆరిజోనాలో నీ కుటుంబమున్నది గదా? ఇల్లు లేదందువే," అని మీరన వచ్చును. రెండు లేక మూడు రోజులు బాగానే ఉందును. ఆ తరువాత మరల ఎక్కడొకో వెళ్ళవలెననిపించును. ఎక్కడికి వెళ్ళినా రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండలేను. మరెచ్చటికో వెళ్ళిపోవలె ననిపించును. కావున ఏ గృహము నాకు లేదు. నా ఇంటి మీద బెంగగా యున్నది.

అక్కడ ఒక గృహమున్నది. ఒక సమయమున అచ్చటికి నేను వెళ్ళుదును, కాని మొదట మీకు నేను సహాయము చేయవలసియున్నాను. చూచారా? అందుకోసమే నేనిచ్చట యున్నాను. మీకు సహాయము చేయవలెను. ఆ సమయము వచ్చు వరకే. ఆ తరువాత నేనిక సహాయపడలేను. ఇంటికి నేను వెళ్ళవలసి యున్నాను. నిజంగానే అప్పుడు నా ఇంటికి వెళ్ళగోరుదును. నాకెంతో ఇష్టమయిన ఒక స్థలము యున్నది, అక్కడికి వెళ్ళితే నాకు తిరిగి రావాలని అనిపించదు.

6జెఫర్సన్-విల్ నేను విడిచెదను; కొద్ది వారముల పాటు నేను రాను; ఆ తరువాత మరల వచ్చెదను. నేను ఆరిజోనాకు వెళ్ళుదును; అది చాలా అద్భుతమైనదని నాకు అనిపించును; అయినా మరల వచ్చి వేయగోరుదును. మరెక్కడికో వెళ్ళెదను; మరల వచ్చి వేయుదును. ఇక్కడికి, అక్కడికి నేను తిరుగుచుందును. ఎక్కడా ఉండలేను. ఇక్కడ కొద్ది దినములు ఉందును; మీరు చూచుచున్నారు, ఇక్కడికి వచ్చి మిమ్మును చూచిన తరువాత మరెక్కడో వెళ్ళగోరుదును. చూడండి. నా పిల్లలు ప్రపంచమంతా చెదరి యున్నారు. క్రీస్తునందు నేను వారిని కనియున్నాను. నాకు ఒక గృహము లేదు. ఈ దినములలోనే ఒక దినమున నేను వారినందరినీ ఒకే చోట చేర్చగోరుచున్నాను, చూచారా… తండ్రి ఇష్టము - ఇక మరెక్కడికి తీరుగనవసరము లేని గృహము ఒకటి మనకున్నది, చూచారా. అటు ఇటూ ఎరిగి అలసట కలుగుచున్నది, ఎక్కడా ఉండు చోటు లేదు.

HEB 11:10

 

7దొర్లిపోవు బండ వలె ఎవరూ ఉండకూడదని నేను సలహా ఇచ్చుచున్నాను. (చూచారా?) ఒకవేళ అటువంటి సేవకు మీరు పిలువబడితే అది వేరే విషయము. "ఇది నా ఇల్లు" అని నేను చెప్ప గలిగినది ఈ భూమి మీద ఏదయినా ఉన్నచో, దాని కొరకు ఈ ఉదయమున దేనినయినా నేను ఇచ్చెదను. ఒక మిలియను డాలర్లు చెల్లించావంటే దాని కొరకు చెల్లించెదను. అటువంటి చోటున్నచో నేనిట్లు పలుకుదును, "ఇది నా కెంతో ఇష్టము; దీనిని విడిచి నేనిక రాను," అట్టి దానికి ఏదయినా ఇచ్చెదను. కాని నాకది దొరుకుట లేదు.

నేను కొంత వరకు అబ్రాహామువలె యున్నాను. ఒక పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాను. చూచారా? దానిని నేను కనుగోలేను గాని అది ఒక చోటున్నదని నేనెరుగుదును. కాని నిశ్చయంగా ఈ భూమి మీద ఏ స్థలమునకు నేను అలవాటు కాలేను. ప్రజలు మంచి వారే. స్థలములు చక్కని… అక్కడికి వెళ్ళితే వెచ్చగా ఉండును. ఇచ్చటికి వచ్చినచో చల్లగా ఉండును. మరో చోటికి వెళ్ళితే, పొడి వాతావరణముండును. మరో చోట అతి శీతలముగా ఉండును. మరో చోట అతి ఉష్ణముగా ఉండును. చూచారా? ఏ స్థలము లేదు. ఏ గృహము నాకు లేదు. మీ భుజము మీద ఆనుకొని నేను ఎడ్చుటకు నా సమయమునుపయోగించను.

ప్రభువుకు మనము కృతజ్ఞులమైయున్నాము. ఆమేన్! అన్ని విషయములలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను. ఆయన వలననే నేనీవిధంగా యున్నాను. దేవుడు నన్నీ విధంగా తయారు చేసెను. ఆయన నన్ను చేసిన విధంగా తప్ప మరొక విధంగా నేనుండలేను. అన్నింటినీ ఆయన అద్భుతంగా తయారు చేసెను. ఇక్కడి జనులకు సహాయము చేయుటకు ఆయన నన్ను పంపెను గనుక ఆ రీతిగానే నేనుండ వలసియున్నాను. ఆ విధంగా నేనుండవలసియున్నాను గనుక ఆ విధంగానే

నేనుండగోరుచున్నాను. దేవుని యొక్క రాజ్య చిత్తము ఏదయినా గాని, లేదా దేవుని చిత్తమును బట్టియే నేనీలాగు ఉండగోరుచున్నాను.

8మరల ప్రార్థించుదము. ప్రభువైన యేసూ, ఈ ప్రశ్నలు మా ముందున్నవి. తండ్రి, నేను వీటికి జవాబు చెప్పలేను. ప్రభువా, వీటికి జవాబు చెప్పగల సామర్థ్యము నాకు లేదు, కాని నీవు సర్వశక్తిగలవాడవని ఎదుగుదుము, ఎందుకనగా ఇవి ప్రజల హృదయములలో యున్నవి. ప్రభువా, వారి ఒత్తిడులను తీసివేయుటకు నన్ను వాడుకొనుము. తండ్రి, సహాయము చేయవా? యేసుక్రీస్తు నామమున దానిని అడుగుచున్నాను. ఆమేన్.

9వారు దీనిని టేపు చేయుట లేదని తలంచుచున్నాను. మంచిది.

ఈ ప్రశ్నల విషయములో ఎప్పుడూ నేను బాధపడుటకు ఒక కారణమున్నది. అది నన్ను ఎంతో తొందరపరచును. వివాహము మరియు పరిత్యాగము గూర్చిన ప్రశ్నలు. ఆ జవాబు కొరకు ఫోను పిలుపులు మరియు ఉత్తరములు ఎన్నో వచ్చుచున్నవి. ఒక సోదరుడు దుప్పటి కప్పుకొని వచ్చి మా వసారాలో 12 గంటల నుండి తెల్లవారే వరకు కూర్చొనియుండెను. ఎన్నో చోట్ల నుండి సేవకులు పిలచి అడుగుచున్నారు. రెండు లేదా మూడుసార్లు పెండ్లి చేసికొని సేవకులుగా పని చేయుచున్నారు. ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. నాకు తెలిసినవారనేకులు ఇంకా ఇచ్చటున్నారు. వారందరినీ నేను చూడలేదు గాని, అటువంటి వారు చాలామంది ఇక్కడ ఇలా ఉన్నారు.

10దీనిని గుర్తుంచుకొనండి! పెండ్లి చేసికొని, విడాకులు తీసికొని మరల పెండ్లి చేసికొనిన వారు ఒక సంగతి నాకు వాగ్దానము చేయండి. చూచారా? మీరు నా యందు నమ్మక ముంచి యున్నారు. (ఇది టేపగుట లేదని భావించుచున్నాను. నాకు తెలియదు..) దేవుని యొద్ద నుండి మీ కొరకు పంపబడిన ప్రవక్తగా, దాసునిగా మీరు నన్ను విశ్వసించుచున్నారు. గనుక ఈ విషయములో మీరు నా మాటను తీసికొనండి. అవునా? ఇప్పుడున్న ప్రకారమే మీరు జీవించండి. ఇంకో రీతిగా యుండవలెనని ప్రయత్నములు చేయవద్దు. అలాగే సంతోషముగా జీవించుచు సాగిపోవుడి. మీరు రక్షింపబడియున్నారు. మీరు క్రైస్తవులయినచో క్రీస్తు కొరకు జీవించుచూ ముందుకు వెళ్ళుడి; మిమ్మును రక్షించుటకు ఆయనకు ఒక కారణమున్నది.

ప్రభుని చిత్తమయితే, నేను తిరిగి వచ్చునప్పుడు ఆ విషయమును బైబిలులో నుండి మీకు వివరించెదను. చూచారా? మీరేమి తొందరపడవద్దు. చాలామంది ఈలాగు చెప్పుచున్నారు, "నా భార్యను నేను ప్రేమించుచున్నాను - అయినా ఆమెను నేను విడిచిపెట్టవలెను; ఎత్తబాటును నేను తప్పిపోవాలని కోరుటలేదు." ఆ విధంగా మీరు చేయవద్దు. ఈ విషయము మీద ఇంకా నేను వివరించుదానిని మీరు వినువరకు ఇప్పుడున్న ప్రకారముగానే ఉండండి. దీనిని పది లేక పదిహేను నిమిషములలో నేను వివరించలేను; దీనిని వివరించుటకు కొంత సమయము పట్టును, ఎందుకనగా అది వాక్యసహితమై యుండవలెను. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా యుండవలెను. అలాగు కానిచో, అది సరి కాదు.

MATT 5:32•

MATT 19:9•

LUKE 16:18

 

11యేసు ఇక్కడ చెప్పిన దాని విషయమును నేను ఎరుగుదును, "ఒకడు తన భార్యను వ్యభిచార కారణమును బట్టి గాక మరొక కారణమున విడనాడి, వేరొకతెను పెండ్లి చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు." ఈ విషయములు అలాగు ఆయన చెప్పుటకు కారణమున్నది. ఆయన దేవుడు. అది ఆయన వాక్యము.

ఇప్పుడు మనము ఆది యొద్దకు వెళ్ళి దాని భావమేమిటో కనుగొందము, మీరు చూచారా, దానిని పైకి తెచ్చుదము. కాని దానిని మనము తేల్చువరకు ఇప్పుడున్న రీతిగానే మీరు క్రైస్తవులుగా ఉండగోరుచున్నాను. మీరు క్రైస్తవ దంపతులయితే, మీరు పెండ్లి చేసికొని పిల్లలను కని యున్నయెడల మిమ్మును బంధించిన ఆ చిన్న బంధములను బట్టి మీరు భార్యను లేదా భర్తను విడనాడకుడి. అలాగున చేయరాదు. చూచారా? ఆ అంశము మీద నా మాట మీరు మరల వినువరకు వేచియుండండి. దానిని మీరు నాకు వాగ్దానము చేసెదరా? మీ చేతులను ఎత్తండి. మీరు నాయందు నమ్మకం ఉంచియున్నారు. ఇంత వరకు మీరు నన్ను నమ్మియున్నారు. ఈ అంశము మీద ఇంకొద్దిగా మీరు నమ్మిక యుంచండి.

ఇప్పుడు, మనము చూద్దాం, ఈ ఉదయమున నిజంగా మంచి ప్రశ్నలున్నవి.

12ప్రశ్న: వధువులో ఉండగోరువారందరూ ఆలయమునకు పదిహేనువందల మైళ్ళ లోపు దూరంలో జీవించవలెనా? (దీనిని గత ఆదివారం చూచామని తలంచుచున్నాను) - ఆలయమునకు పదిహేను వందల మైళ్ళ దూరంలో జీవించవలెనా? "వధువు యొక్క భవిష్య గృహము," అను వర్తమానపు రెండవ టేపులో అలాంటి భావము వచ్చుచున్నది. ఎత్తబడు సమయములో ప్రపంచములోని అన్ని మూలల నుండి వధువు వచ్చునని ఎల్లప్పుడూ నేను తలంచుచూ వచ్చాను. నా ఆలోచన తప్పా?

కాదు, నా ప్రియ స్నేహితుడా, నీ ఆలోచన తప్పు కాదు. సరియే. టేపులో నేను చెప్పినది ఏదయినా గాని మరి దేనినయినా నమ్ముటకు దారి తీసినయెడల…

.ఇవన్నీ ఇప్పుడు నాకు కొత్తవి. వీటిని నేనెన్నడూ చూడలేదు - ఇక్కడున్నవి. చూచారా? ఇవి ఆదివారం వచ్చిన కొత్త చీటీలు, వీటిని ఈ కవరులో పెట్టి ఆ వెనుక దాచాను.

1THS 4:16

 

13వధువు ఏదో ఒక ప్రత్యేక స్థలములో ఉండవలసిన పనిలేదు. అందులో చాలామంది భూమి మీది ధూళిలో కలిసిపోయి యున్నారు. వారు ప్రపంచమంతా ఉందురు. ఉత్తర ఖండపు మంచులో కొందరు గడ్డకొట్టుకు పోయి యుందురు. ఉష్ణమండలపు అడవులలో కొందరు ధూళిగా మారియున్నారు. ప్రపంచచుంతటా చెదరియున్నారు. అయితే దేవుని బూర మ్రోగినప్పుడు క్రీస్తునందు మృతులు లేచెదరు. వారు మేల్కొందురు. వారెక్కడున్నాగాని ధూళిలో నుండి వచ్చెదరు. ఈ సందర్భములో పునరుత్థానము సార్వత్రికముగా యుండును, చూచారా. క్రీస్తునందున్న వారు ఎక్కడున్నా గాని, ఆయన వచునప్పుడు బయటకు లేచి వచ్చేదరు, చూచారా, నీవెక్కడున్నా పరవాలేదు.

ఆది కాలములో హతసాక్షులయిన వారిని గూర్చి ఆలోచించండి. ఆ క్రైస్తవులను సింహముల గుహలోనికి వేసిరి వేసిరి. ఆ సింహములు క్రైస్తవులను చంపి తీసివేసినవి. చూచారా? భూమి మీద ఆ సింహములు విసర్జించిన మలములో వారి శరీరములు కలిసిపోయినవి. అవి ఎక్కడెక్కడికో చెదిరిపోయినవి. అదెక్కడున్నదని కాదు. చూడండి, మీరు అదృశ్యమగు పదార్థములతో నిర్మించబడియున్నారు. అదృశ్యమైన వాటితో ఈ దృశ్యమైనవి తయారు చేయబడినవి. దేవుడా మూల పదార్థమును తిరిగి ఇచ్చును, చూచారా.

14ఒక కణమును తీసికొనండి. దానిని మీరు బ్రద్దలు చేసినప్పుడు ఒక కణములో నుండి మరో కణము, అందులో నుండి అణువు, దానిలో నుండి పరమాణువు వచ్చును. ఇంకా ఇంకా విడదీయుతూ పోతే ఆ కణము చివరకు అదృశ్యమగును. అది ప్రారంభములో చూచుటకు కనబడినది. దానిని నీ చేతులతో తాక గలవు. వాయువులుగా మారినది. వాయువులేమో ఆమ్లముల నుండి జనించినవి. ఆ విధంగా నాశనము చేసినప్పుడు అవి వాటి మూలకములను చేరును. ఆ కనబడనిదే ఆత్మ, ఆత్మ ఈ వాయువులచే బంధింపబడినది. అది వేరే వాయువు కావచ్చును, కాని నీవేమై యున్నావో ఆ లక్షణములు మరల ఖచ్చితంగా పాటగానే మారును. చూచారా? దానిని ఆత్మ వశపరచుకొని యున్నది.

మరో విధంగా చెప్పాలంటే, నీవు యువకునిగాను, యువతిగాను మారుచున్నావు. నీ చిత్రమును దేవుడు తీయును. నీవెంత ముసలివాడివైనా, ముఖం ఎంత ముడుతలు పడినా, రూపం ఎంత మారిపోయినా, అది మరల పూర్వ స్థితిని ధరించును. ఆ శరీరము నాశనము కావచ్చును, రూపం మారిపోవచ్చును, కాలి పోవచ్చును, సింహములచే తినివేయబడవచ్చును, మరేమయినా కావచ్చును, కాని అది వాయువులతోను, భూమి మీద గల పదహారు మూల పదార్థముల తోను నిర్మించబడియున్నది. అదే కాల్షియం, పొటాష్, పెట్రోలియం, సూర్యకాంతి మొదలగునవి. శరీర నిర్మాణమునకు దోహదపడినవి - సర్వభూమి దానితో నింపబడియున్నది.

ROM 8:29•

EPH 1:4,5

 

15కాని ఈ చిత్రమే ప్రధానము. పునరుత్థానములో 4 వాయువులు, ఆమ్లములు, మొదలగునవి మరల వచ్చి వాటి స్థానమును గైకొని ఈ చిత్రమును మరల తయారు చేయును. నీవు పదహారేండ్ల ప్రాయములో, లేదా పద్దెనిమిదేండ్ల ప్రాయములో, లేదా ఇరవై ఏండ్ల ప్రాయములో ఉన్నప్పుడు తీసిన చిత్రము కాదిది. అది ఎప్పుడు తీయబడినది? జగత్తు పునాది వేయబడక ముందే, అది దేవుని యొక్క గొప్ప పైల్లో దాచబడియున్నది. అది చేసినదొక్కటే, నీవు నీ ఎన్నికను చేసికొనుటకు అది ప్రత్యక్షమయినది. చూచారా? నీవప్పుడు దేవుని దాసునిగా మారి యున్నావు. దానిని ఆయన ముందుగానే ఎరుగును. ఆయనను విమోచకునిగా చేసెను, దానిని మనం చూచాము.

ఇది నెగిటివ్. జీవితము యొక్క నెగిటివ్ భాగమును ఇప్పుడు నీవు జీవించుచున్నావు. దేనికయినా నెగిటివ్ ఉన్నదనగా పోజిటివ్ తప్పక ఉన్నదని అర్ధము. పోజిటివ్ లేకుండా నెగెటివ్ ఉండదు. కాబట్టి ఇది నెగెటివ్ అయిన యెడల పోజిటివ్ ఎక్కడో ఉండవలసియున్నది. ఇది నిజమైనది కాదు. ఇది రాబోవుచున్న నిజమైన దాని యొక్క ముందు రూపము. ఇప్పుడు దీనిని మీరు గమనించారా?

కావున వారు నిన్ను ఏమి చేసినా పరవా లేదు. వారు ఆ నిజ రూపమును నాశనము చేయలేరు. ఆ పటము అక్కడున్న దేవుని యొక్క గొప్ప గాలరీలో యున్నది. దాని నేదియూ నాశనము చేయజాలదు. అది పరలోక మందున్నది. దానిని మీరు కాల్చివేయ వచ్చును, సింహములను ఆహారముగా వేయ వచ్చును, మీ కిష్టమొచ్చిన విధంగా చేయవచ్చును; కాని రెండు రెండ్లు నాలుగు అనుట ఎంత నిశ్చయమో అంతే నిశ్చయముగా అది మరల వచ్చును. దేవుడు చెప్పినంత నిశ్చయముగా అది వచ్చును. కాబట్టి నీవెక్కడున్నా…

16మీరు టేపు వినండి. (ఎవరు వ్రాసిరో దీనిని నాకు తెలియదు; పేరు వ్రాయలేదు. చిన్న కాగితం మీద నీలము సిరాతో వ్రాసిరి. నోట్ పుస్తకం లోంచి చింపిన కాగితమది.) కాని ఈ ప్రశ్నను గూర్చి గుర్తుంచుకోనండి, టేపులో మీరు గమనించినట్లయితే ఈ విషయము గూర్చి నేను చెప్పినది వేరుగా నున్నది. (బహుశ ఉన్న మాటనే అక్షరాలా నేను చెప్పలేను): మీరు టేపును చూచుకొనండి. నేనిట్లు చెప్పాను, "ఉదాహరణకు ఈ ఉదయం మనమిచ్చటున్నాము. మనము ఎదురు చూచుచున్న ఈ పట్టణము పదిహేను వందల మైళ్ళ చదరపు ఆకారములో యున్నది. అది మయిన్ నుండి ఫ్లోరిడా వరకు ఉండును. ఈస్ట్రన్ సీబోర్డు నుండి మిసిసిపీ నదికి ఎనిమిది వందల మైళ్ళ పశ్చిమంగా యుండును. పదిహేను వందల చదరపు మైళ్ళు గలది. దానిని గూర్చి ఆలోచించండి, ఈ ఉదయమున ఇచ్చట జనులు కూర్చొని యున్నారు - వారు అంత దూరం నుండి వచ్చియున్నారు. పదిహేను వందల మైళ్ళ చదరపు వైశాల్యత నుండి వచ్చియున్నారు. భూమి మీద ఎక్కడ ఆలయముండునో నాకు తెలియదు. నాకు ఒక అభిప్రాయమున్నది. ఇప్పుడు పాలస్తీనా యున్న చోటనే ఆలయముండునని నేను తలంచుచున్నాను. అక్కడున్న పర్వతము శిఖరము మీద అది బహుశా ఉండ వచ్చును. అది విస్తరించి యుండును, ఎందుకనగా అప్పుడు సముద్రము ఇకను లేదు. చూచారా, ఈ ప్రపంచము 25, 000 మైళ్ళ చుట్టుకొలత కలిగి యున్నది. అందులో పదిహేను వందల మైళ్ళు పెద్ద గొప్ప ఏమి కాదు. కాని ఈ గొప్ప పట్టణము ఆ పదిహేను వందల మైళ్ళ చచ్చౌకము గల కొండ మిద ఉండును.

HEB 11:10

 

17నేను దీనిని నమ్ముటకు వాటికి సంబంధించిన ప్రవచనములే కారణము. యెరూషలేములో ఉన్న సీయోను పర్వతము గురించి, ఇంకా ఇతర పట్టణముల గురించి ప్రవచనములున్నవి. ప్రవక్తయగు అబ్రాహాము అక్కడే ఆ పట్టణము కొరకు వెదకుచుండెను. దాని యొక్క శిల్పియు, నిర్మాణకుడును దేవుడే. ఆ దేశములో ఆ పట్టణము కొరకు అతడు చూచెను. ఆ దేశము అక్కడే యున్నదని నేను నమ్ముచున్నాను.

ఆ భూమిని పటములో మీరు కనుగొనలేరు. అది ఒక చిన్న చుక్క. రష్యా, అమెరికా, దక్షిణ అమెరికా ఇంకా ఇతర దేశముల భూవైశాల్యమును చూడండి. దేవుడు ఆ ఒక్క స్థలము విషయములో ఎందుకంత ఆసక్తి కలిగి యున్నాడు? (చూచారా?) అదే ప్రశ్న, దానిని నేను నిరూపించలేదు, కాని ఆ విధంగా నాకు కనిపించుచున్నది. ఏది ఏమైనా గాని అక్కడికే మనం వెళ్ళుచున్నాము, అందును బట్టి ప్రభువును స్తుతించుదము.

HEB 11:3•

2PET 3:10,13•

REV 21:1

 

18ఆలయమునకు చుట్టూ పదిహేను వందల మైళ్ళని నేను చెప్పినట్లు మీరభిప్రాయపడినచో తప్పు, మీరు చూచారా, ఎందుకనగా అది కాదు. ఇది నాశనమవబోవు చిన్న స్థలము. ప్రపంచమే కాలిపోవును, ఇదంతయూ లయమైపోవును. ఈ ఇండియానా, అమెరికా దేశము, సమస్తమూ కరిగి మైనమువలె, లావా వలె మారును, చూచారా?. సమస్త పాపము, సమస్త వ్యాధి, సమస్త క్రిములు, సమస్తము నాశనమగును. "అంతట క్రొత్త ఆకాశములను, క్రొత్త భూమిని నేను చూచితిని."

ఆలోచించండి! ఈ ప్రపంచమును దేవుడు ఆరువేల సంవత్సరములలో తయారు చేసెను. దానినంతటిని క్రమపరచి రూపు దిద్దెను. ఆయన దానినెట్లు చేసెను? బైబిలు ఇట్లు చెప్పుచున్నది, "అదృశ్యమగు పదార్థములతో ఆయన దానిని నిర్మించెను." ఆయన భూమిని సృజించెను. ఇప్పుడు గమనించండి; ఇది అందమైనది, ఒక ఉద్దేశముతో సృష్టికర్త దీనిని సృష్టించెను - దానిని సాతాను పాడుచేసెను. ఇక్కడ మిగిలియున్న దానిని విడిపించుటకు ఆయన వచ్చెను. ఆయన మరియొక చోటికి వెళ్ళెను మరియు ఇంకా ఆయన సృజించు పనిలోనే యున్నాడు.

JOHN 14:2•

REV 21:21

 

19భూమిని తయారు చేయుటకు ఆయనకు ఆరువేల సంవత్సరములు పట్టెను. భూమి మీద ఉండబోవు ఆ పట్టణమును ఆయన రెండు దినములలో సృజించనైయున్నాడు. "నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును. మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. (స్ఫటికము వంటి శుద్ధ సువర్ణముతో దానిని నిర్మించును. వీధులు బంగారముతో చేయబడినవి)." ఎంత అందమగు స్థలము.

వాటిని ఆయన ఎక్కడ సంపాదించును? ఇతర భూమి మీద గాని, చంద్రుని మీద గాని, నక్షత్రముల మీద గాని మరేవయినా పదార్థములున్నవా? అవి ఉండనవసరము లేదు. ఆయన సృష్టికర్త, పట్టణమును నిర్మించుటకు ఆయన వెళ్ళియున్నాడు. ఆమేన్! అది నాకు చాలును. మీకును అంతే గదా? అది మేలుకరము. ఆయన నిర్మించిన దీనిని నేను అనుభవించుచున్నాను. ఈ కొత్త దానిని ఆయన నిర్మించబోవుచున్నాడు. అదెట్లుండునో గదా? ఎంత అద్భుతమగు విషయము. కావున ఆ పట్టణమునకు మనము వెళ్ళనైయున్నామని ఎరిగి సంతోషించుచున్నాను.

20ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నేను ప్రభువును ప్రేమించుచున్నాను, కాని గత సంవత్సరమంతా ఒక సమస్యను నేను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు నా మతి దాదాపు పోయినట్లుగా భావించుచున్నాను. ఏమిటది? దయచేసి నా కొరకును, నా భర్త కొరకును ప్రార్థించుము.

ఒకవేళ వ్యక్తిగతముగా నన్ను కలుసుకొనుటకు వచ్చారా, ఈ వ్యక్తి ఈ ఉదయమున మీరు వచ్చినట్లుగానే వచ్చియున్నాడు, అదేమయినా గాని, చూచారా? దేవుడు దానిని బయటకు లాగును. అదేమిటో ప్రభువు బయలుపరచును. కాని నీవెవరివో నాకు తెలియదు, నీవిక్కడ కూర్చొని లేవు; క్రీస్తునందు సోదరి అని వ్రాయబడియున్నది.

నీవు ఏదయినా తప్పు చేసినయెడల, అది నిన్ను బాధించుచున్న యెడల నీవు బైబిలుతో దానిని సరి చూచుకొనుము. నీవేమి చేయవలెనో తెలియును. కాని నీవేమి చేయని యెడల, ఏ విషయములోను నీవు దోషివి కానియెడల బహుశ నీకు నరముల బలహీనత ఉండియుండ వచ్చును. చూచారా? అటు వంటివి చాలా జరిగి యుండ వచ్చును. నీ జీవితంలో పూర్వం ఏదో బాధ ఉండవచ్చును. ఇక్కడున్న ఈ స్త్రీ మెనోపాజ్ దశకు వచ్చియుండును. అప్పుడు ఆమెకు అంతా ఈలాగు కనిపించును. మరేమీ ఆమెకు వ్యాధి లేదు. అయినా ఏమి బాగా ఉండుట లేదనిపించును. ఆమె చిక్కిపోవుచున్నది. ఆమె నిజంగా విచారములో యున్నది; ఇది వాస్తవము. నరముల ఉద్రిక్తతకు లోనయిన ఏ మనిషి అయినా గాని అలాగే యుండును. ఈ విషయము అంగీకరించక తప్పదు.

21మీ భార్యల జీవితములలో అలాగున్నప్పుడు, భర్తలగు మీరు వెంటనే సహాయము చేయండి. మీ సహాయము వారికి అవసరము, నిజంగా వారికి మీ సహాయము కావలెను. అర్థము చేసికొనువారు కావలెను. ఆమెకు సహాయపడు వారు కావలెను. ఆమెతో మాట్లాడండి. మీరు ఆమెను ప్రియముగా ఎంచుచున్నచో, మీ చేతులలోనికి తీసికొనండి. అలాగే ఆమెను మీరు చూడవలెను. ఆమెను అర్థము చేసికొనండి, ఎందుకనగా ఆమె అటువంటి సమయము గుండా వెళ్ళుచున్నది. ఆమె యొక్క పూర్తి వ్యవస్థ మారుచున్నది. ఆ సమయములో మీరామె పట్ల మంచిగా ఉండవలెను.

అందువలననే శ్రీ. రాక్-ఫెల్లర్ గొప్ప తప్పు చేసెను. దేశమతనిని ప్రేమించెను, బహుశ అతడే తరువాత దేశాధ్యక్షుడయి యుండును. అతని భార్య మెనోపాజ్ సమయములో ఆమెనతడు విడిచిపెట్టి తన కార్యదర్శిని పెండ్లి చేసికొనెను. ఏమి జరిగినదో చూచారా? ఇంకను మంచి ఆలోచన కలిగిన అమెరికనులున్నారని ఇందువలన రుజువగుచున్నది.

శ్రీ. గోల్డ్ వాటర్ లేదా శ్రీ. రాక్-ఫెల్లర్ అంటే నాకు ఇష్టము; ఎవరన్నా నాకు ఇష్టమే. నా రిపబ్లికను సోదరులు కొందరు అక్కడ కూర్చొని నేను చెప్పేదానిని వినుచున్నారు.

HEB 13:14

 

22గమనించండి, నేను రాజకీయవేత్తను కాను, క్రైస్తవునిగా ఉండగోరుచున్నాను. చూచారా? ఇక్కడ రాజకీయములకు తావు లేదు. చూచారా? అంతా ఎప్పుడో చెడిపోయినది. కాని మనము నిత్యమైనవాటిని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. డెమొక్రాట్ లేదా రిపబ్లికను రావచ్చు. ఓ, అదెంతో గందరగోళముగా యున్నది. దానినెవరూ విడిపించజాలరు. దాని పని అయిపోయినది. కావును దానిని గూర్చి వాదించవద్దు. ఈ రాజ్యము కొరకు జీవించుట మాత్రమే మనము చేయవలసియున్నాము. "ఏలయనగా నిలువరమగు పట్టణము మనకిక్కడ లేదు, కాని రాబోవుచున్నదాని కొరకు మనము వెదకుచున్నాము." ఆమేన్! అది నిజము. అవునయ్యా!

కావున రాజకీయము కంచెకు ఒక వైపున ఉన్నది, నేను మరియొక వైపున ఉన్నాను. నేను ఒక్కసారే ఓటు వేశాను; అది క్రీస్తుకు; నిశ్చయముగా నేను జయించుదును. అది నిజము, చూచారా. ఒక ఎన్నిక మీకును వచ్చుచున్నది, చూచారా. దేవుడు మీ కొరకు ఓటు వేసెను. మాకు వ్యతిరేకముగా అపవాది ఓటు వేసెను. నీ ఓటును ఎటు వైపు వేయుదువు? ఎటు వైపుకు నీవు వచుదువు?

ఈ వ్యక్తి నరముల బలహీనతకు గురియైనదని నేను తలంచుచున్నాను. నిన్ను ఏ దోషమూ ఖండంచనియెడల, నీవు ఈలాగు చెప్పుము. "సాతానా, నా యొద్ద నుండి పారిపొమ్ము!" అని చెప్పి ముందుకు సాగిపొమ్ము. చొరవ చేసి, నీవు దేవుని కొరకు జీవించుము.

23ప్రశ్న: లేఖనముల ప్రకారము, విడాకులు పుచ్చుకొనిన తరువాత మరల వివాహము చేసికొనుటకు అనుమతించు పరిస్థితి ఏదయినా యున్నదా? (దీనిలో రెండు లేదా మూడు ప్రశ్నలున్నవని తలంచుచున్నాను.) - నేను పెండ్లి చేసికొనినవానిగా నిలచి యుండనియెడల - ముందు సమయముల బట్టి - తిరిగి పెండ్లి చేసికొనుటకు కూడా అనుమతించునట్లుగా విడాకలు పొందగల కారణములేమైనా యున్నదా? ఈ జవాబును చూడవలెనని టేపును కొనుచున్నాను. మీకు చాలా వందనములు. దీని కొరకు ఆదివారము నేను చూచెదను.

చూడండి, దీనిని నేను చెప్పాను, దీనినంతటిని సరిగా వివరించు సమయము వచ్చు వరకు దీనిని ఈలాగే విడిచిపెట్టుదము, చూచారా, మీరు గుర్తుంచుకొనండి. ప్రభుని చిత్తమయితే, నేను తిరిగి వచ్చిన వెంటనే చేయుదును. మరుసటి సమయము నేను వచ్చునప్పుడు ప్రభుని చిత్తమయితే ఆ అంశము మీద బోధించెదను, చూచారా. అప్పుడు ఎట్లయినా టేపు చేయదుము, అందువలన బాధ కలిగితే కలుగవచ్చును. సందేహము తొలగితే తొలగవచ్చును. కాని మీరు నిబ్బరము కలిగి యుండవలెను, చూచారా.

24ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, ఒకడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందియుండియూ, ఆ తరువాత కనబడు సూచనలు లేకుండా ఉండుట సాధ్యమా, కనీసం భవిష్యత్తులో కొంత సమయము వరకు, ఆత్మ యొక్క నిర్ణయ పరిస్థితులు నెరవేర్పువరకు?

ఇప్పుడు, ఇది కలుగలుపు ప్రశ్నవలె కనిపించుచున్నది, కాని అది మంచిది, చాలా మంచిది, చూచారా. ఇక్కడ నాకు చిన్న అవకాశము దొరకుచున్నది. ఇక్కడ నా కుటుంబముతో పని చేయుచున్నాను, చూచారా, మీరే నా కుటుంబమని అర్థము, బయట ప్రపంచములోనికిని టేపులు వెళ్ళుచున్నవి - వారంతా మన కుటుంబమే.

25నా సహవాసులు చాలా భాగము పెంతెకోస్తులో నుండి వచ్చిన వారే. శాఖా సంబంధమగు పదవులను బట్టి చూచినచో పెంతెకొస్తు చాలా తాజా వర్తమానము. ఏ ఇతర శాఖా సంఘము కంటెను నేను వారితో ఎక్కువగా సమ్మతించెదను. పెంతెకొస్తు వారిపై నేను మొగ్గుచున్నాను, ఎందుకనగా అది కడవరి వర్తమానము. క్రీస్తు యొద్దకు నేను నడిపించువారినందరినీ, ఒక పెంతెకోస్తు సంఘమువైపునకే నేను నడిపించుటకు ప్రయత్నించుచుందును. కాని వారిని నాకు తెలిసిన అన్ని విధములుగాను ఖండించుచున్నాను. శాఖగా ఉండుటను బట్టి వారు తప్పులో యున్నారు. వెలుగు వారి యొద్దకు ప్రసరించబడినా గాని ఆ వెలుగులో నడచుటకు వారు ఇష్టపడుట లేదు. అయినా గాని నేటి ప్రపంచములో శాఖలన్నింటిలో ఏ శాఖ ఉత్తమమైనదని అడిగితే నేను పెంతెకొస్తు అని చెప్పెదను. కాని వ్యక్తిగతముగా చెప్పవలసి వచ్చినప్పుడు, అన్ని శాఖలలోను అసలయిన క్రైస్తవ స్త్రీలు, పురుషులు ఉన్నారు. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్పిటేరియను, లూథరను, మొదలగునవి. కాని ఈ ప్రజలు చిక్కుకుపోయిన ఈ క్రమము గూర్చి మాట్లాడుచున్నాను. ఈ శాఖల్లో చిక్కుకు పోయిరి. వ్యక్తులు మంచివారే. దీనిని పూర్తిగా అర్థము చేసికొనండి, చూచారా. రోమను కాతలిక్కులు, యెహోవా సాక్షులు, ఆర్తోడక్సు, యూదులు ఇంకా చాలామంది ఉన్నారు. నాకు వాటితో పని లేదు; కాని అందులో యున్న వ్యక్తుల కొరకు, వారిని రక్షించుటకు క్రీస్తు చనిపోయెను.

26నేను వారి శాఖలతో సమ్మతించుట లేదు. బాప్టిస్టులోను, మెతడిస్టు లోను ప్రెస్పిటేరియనులోను, తదితర శాఖలలోను చాలామంది క్రైస్తవులున్నారని నేను నమ్ముచున్నాను. వారు క్రైస్తవులు, నిజమగు విశ్వాసులు. ఆ రోమను కాతలిక్కు సంఘములో అసలయిన వారు ఎందరో యున్నారు. ప్రభువును నిజముగా ప్రేమించు జనులు, స్త్రీలు, పురుషులు అందులో చాలామంది యున్నారు. తప్పు కొరకు వారు ఆ సంఘములో చేరుట లేదు. సరియైన దానిని చేయుటకే వారందులో చేరుచున్నారు. కాని ఆ పద్ధతి వారి మనస్సును తప్పులోనికి నడిపించుచున్నది. నేను ఎప్పుడయినా ఒక శాఖను తయారు చేసినచో మిమ్మును మోసము చేసినట్లే, మిమ్మును ఒక విధానములోనికి తీసికొని వచ్చినట్లే; అది నాకు దూరమగును గాక. దేవుడు నా మనస్సును సరియైన స్థితిలో యుంచి మిమ్మును క్రీస్తు అను వాక్యము నొద్దకు నడుపునట్లు చేయును గాక. దానితో నిలచి యుండుడి, చూచారా.

27సూచనలు లేకుండానే పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో ఒక వ్యక్తి నింపబడుట గూర్చి నన్ను ఇతడు ప్రశ్నించెను. మీరు మొదట మానవమాత్రులుగా జన్మించియున్నారు. నేను చాలా అల్ప రీతిలో దీనికి జవాబు ఇచ్చుచున్నాను. మీరు సహజముగా మానవులుగా జన్మించినట్లయితే మానవులు సామాన్యముగా చేయు క్రియలనే చేయుదురు. అది నిజమే కదా?

నీవు ఒక మానవునిగా జన్మించినప్పుడు సహజముగా మానవుని యొక్క లక్షణములు నిన్ను వెంబడించును. నీవు చెట్టు మీద జీవించవు. పక్షి వలె రెక్కలు చాపుకొని ఎగురుటకు నీవు ప్రయత్నించవు. సహజ మానవుడు అలాగు చేయడు. సామాన్య మానవుని యొక్క చర్యలు అలాగు ఉండవు. సామాన్యముగా జన్మించిన మానవుడు పని చేయును, పెండ్లి చేసికొనును, కుటుంబమును కలిగియుండును, ఇతర క్రియలు చేయును. అది సహజ మానవుని స్వభావము, ఎందుకనగా ఆ విధంగా నీవు జన్మించావు. క్రైస్తవునిగా నీవు జన్మించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించినప్పుడు నీవు సహజముగానే క్రీస్తు యొక్క లక్షణములను కలిగియుందువు. మీరు గమనించారా?

MARK 16:17,18•

1COR 12:30

 

28ఈ ఉదయమన ఈ జన సమూహమును తీసికొనండి. ఈ ప్రజలు కూర్చొని ప్రతి దినము బోధను వినుచున్నారు. మీలో ఒకరికి ఇంకొకరికి భేదమున్నది, ఎందుకనగా వేరుగా ఉన్నారు. మీరు వేరు వేరుగా చేయబడి యున్నారు. మీ అభిరుచులు వేరు. మీరు వేరుగా తిందురు. కానీ మీరందరూ ఆహారమే భుజించెదరు. కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అభిరుచి కలిగియుండును. అలాగు తేడా యున్నది. క్రైస్తవులు అలాగే యున్నారు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ప్రవచించుచున్నారా? చూచారా?

ఈ సంగతులను మీరు గమనించవలసి యున్నారు, ఎందుకనగా క్రైస్తవుడు ఒక క్రైస్తవుని అలవాట్లను పొందును. వారు క్రైస్తవుల వలె జీవించెదరు. యేసు చెప్పెను, "నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును." గమనించండి: "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; సర్పములను ఎత్తి పట్టుకొందురు, విషకరమైనది త్రాగినను వారికేమి హాని చేయదు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు." ఇవి సహజముగానే క్రైస్తవులలో కనబడును.

29ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగెను, "భవిష్య సమయం కొరకు మనం ఎదురుచూడవలెనా లేక పరిశుద్ధాత్మ యొక్క షరతులు నెరవేర్చు వరకు ఆగవలెనా?" అనడిగెను. అది నాకు ఇష్టము. చూచారా? ఆ అభిప్రాయమును మీరు గ్రహించారా? పరిశుద్ధాత్మ ద్వారా అది నిర్ణయింపబడును! క్రియలను దేవుడే నియమించును.

పెంతెకొస్తు వారు నన్ను ఆర్థము చేసికొందురని తలంచుచున్నాను. ఈ టేపును వినుచున్న వారు అందరూ తప్పక భాషలలో మాట్లాడవలెనను పెంతెకోస్తు వారి అభిప్రాయములో నేనెందుకు విభేదించుచున్నానో మీరు అర్ధము చేసికొనండి. అది నాకు సరిగా కనబడదు. నాకు చెర్రి-పై ఇష్టము. నేను మానవుడను. నా వలె మీరు కూడా చెర్రి-పై తననిచో మీరు మానవులు కారని నేను అనవలసిన పని లేదు. చూచారా? చెర్రి-పై తినుట మానవ అలవాట్లలో ఒకటి, చూచారా. దాని విషయములో మీరు నాతో సమ్మతించక పోవచ్చును, కాని అది నిజము. ఒకరు ఒకటి తిందురు, మరొకరు మరొకటి తిందురు.

30పరిశుద్ధాత్మ ఈ కార్యములను నియమించును, కాని నీవు బలవంతముగా ఆ పనులు చేయ ప్రయత్నించరాదు. చెర్రి-పై నీవు తినవలసిందే అని నేను అందును. నీవు ఆ చెర్రి-పైను వాంతి చేసెదవు, చూచారా. ఆ చెర్రి-పై తినుట వలన నీకు బాధ కలిగి యున్నది. అలాగే ఆత్మకు విరోధమైన దానిని నీవు చేసినప్పుడు, బలత్కారముగా ఆ పని చేసినప్పుడు జరుగును. దేవుడు నీ జీవితమును ఒక ప్రత్యేక పని కొరకు నియమించెను. దానిని మీరు అర్థము చేసికొన్నారా? చూచారా?

నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, నాకు తెలిసిన ఒక ఉత్తమ సూచన ఒకటున్నది. నీవు క్రీస్తుతో ఎంతో ప్రేమతో యుందువు. ఆయన సత్యమని చెప్పిన ప్రతి మాటను నీవు నమ్ముదువు. చూచారా? నీవు పరిశుద్ధాత్మను కలిగి యున్నావనుటకు అదే రుజువు. నీ జీవితము సంతోషముతో నిండియుండును - ఇంతకు ముందుండిన ప్రతిది మారిపోయి వేరుగా నుండును. అదే పరిశుద్ధాత్మ.

31ఈ వరములు పరిశుద్ధాతలో యున్నవి. ఈ ఉదయ కాలమున ఈ సమూహమును చూడండి - చక్కని ఆలయము, గదులు నిండిపోయి యున్నవి, ఖాళీ లేదు, చూడండి. (ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చెదమని ప్రకటన చేయలేదు, కాని జనులు వచ్చిరి.) గమనించండి, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో పొందిక కలిగి యున్నచో, మీ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడినచో, పరిశుద్ధాత్మతో సత్సంబంధము కలిగి యున్నచో ఈ వరములు మీ మధ్య విస్తరిల్లు చుండును. (చూచారా?) అది నిరంతరము వర్ధిల్లుచుండును. కాని ఎక్కడ తేడా వచ్చునో అక్కడ గలిబిలి ఏర్పడును. మనము పెత్తనము చేయుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ సంచరించజాలదు. మీరు చూచారా? జనుల ద్వారా అది పని చేయజాలదు. చూచారా?

MARK 16:17,18

 

32"ఇప్పుడు, మీ ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడుతున్నారా?" అని నేను అడిగినచో.

"అవును."

అయితే మీరు దానిని పొందారు." "మీరు భాషలతో మాట్లాడుచున్నారు. కదా?

"లేదు."

"మీరు దానిని పొందలేదు." నన్ను నేనే తీర్పరినిగా చేసికొనుచున్నాను. కాని ఈ విషయములన్నింటికి దేవుడే తీర్పరి.

కానీ యేసు చెప్పిన దానిని గమనించండి, "ఈ సూచక క్రియలు వారిని వెంబడించును." చూచారా? విశ్వసించుచున్న గుంపు గుండా పరిశుద్ధాత్మ యొక్క పూర్తి స్వభావము ప్రవహించును. వారు ప్రేమతోను, ఆనందముతోను నిండియుందురు. వారు గొప్ప దైవభక్తితో నిండిన జనులుగా యుందురు. చూడండి, అది పరిశుద్ధాత్మ. వారు సందర్భమును బట్టి భాషలు మాట్లాడుదురు. (ఎందుకు), వారు భాషలలో దానికి అవసరమని మాట్లాడుతున్నారు. అక్కడ ప్రవచనమున్నచో అదే మాట్లాడును. ఓ, అది అన్ని సమయములలోనూ పరిపూర్ణముగా ఉండును.

33ఈ ఉదయమున అక్కడికి కలిసికొన వచ్చిన ఆ పదిహేను లేదా ఇరవై మందిని అడగండి. ఒక్క మాట గాని ఎక్కడైనా తప్పుపోయినేమో చూడండి. వారు పూర్తిగా కొత్తవారు. పరిశుద్ధాత్మ ఆ సంగతులను లోతుగా త్రవ్వినది. ఆ విషయములను బయటకు తెచ్చెను. వారి యెదుటనే వాటిని బయట పెట్టాను. వారికి చెప్పెను. చూడండి, చూచారా. అందులో ఏమి తప్పు లేదు. అన్ని విషయములను, జరుగబోవువాటిని చక్కగా చెప్పెను. వారేమి చేసేరో, వారేమి చేయవలెనో చెప్పెను, చూచారా. చక్కగా క్రమపరచెను. వారు దానికనుగుణంగా పని చేయవలెను.

34ఒక రాత్రి ఒక దంపతులతో నేను మాట్లాడుచున్నాను. ఒక ఇంటి యొద్ద కూటములో యున్నాము. ఒక బల్ల చుట్టూ చేరి ముచ్చటించుచున్నాము. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినది. అక్కడున్న కొందరితో ఇట్లు చెప్పాను, "ఒక ప్రత్యేక వ్యక్తిని చూచాను. అతడు కొన్ని విషయముల గూర్చి మనస్సులో కలవరపడుచుండెను. వివేచన విషయములో గందరగోళపడుచున్నాడు. అదిప్పుడు ఇచ్చటనే యున్నది. నీవు తలంచుకొనుచున్న దానిని ఎరుగుదును." నేను వెనక్కు వెళ్ళాను. ఒక వైపుకి తిరిగి ఆ మనుష్యుని మనస్సులో యున్న ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాను. నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో ఆ సంగతి అతనికి తప్ప మరెవరికీ తెలియదు, చూచారా. కాని అతనికి తెలిసినది. అదంతా దేని గూర్చో అతనికి తెలియును. చూచారా? అతనికి అందువలన ఏమాయెను? అతని మనస్సులో ఉన్న దానిని పరిశుద్ధాత్మ నాకు బయలుపరచుచున్నదని అతనికి స్థిరముగా కనిపించెను. మీరు చూచారా? మిగిలిన వారికి దానిని నేను చెప్పనవసరం లేదు. ఆ వ్యక్తి ఇప్పుడు దీనిని వినుచున్నాడు. ఇది నిజము. అదెట్లో మీరు చూచారా? అది ఒక నిర్ధారణ.

MARK 16:17,18

 

35ఆ విధంగా సంఘమంతయూ సహకరించి పని చేసినచో మన మధ్య ఉన్న దయ్యములు వెళ్ళగొట్టబడును, సర్పములను ఎత్తి పట్టుకొందుము, విషకరమైనది త్రాగించినా హాని చేయదు, ఇవన్నియూ జరుగును. కాని దానిని నీవు బలవంతముగా ఎవరి మీద రుద్ద వద్దు. అది మరల పెంతెకొస్తు అగును. మరల బాబెలు అనగా గందరగోళము తయారగును. దానిని నీవు తీర్పు తీర్చలేవు. చూచారా? మన హృదయములు ఆనందము మరియు సంతోషముతోను నిండియుండును. పిట్టలు గానము చేయును. ప్రతిది అద్భుతముగా ఉండును. దేవుని యొక్క ఆత్మ నిండుగా ఉండును. యేసుతో అట్టి ప్రేమను మనము కలిగియుందుము. రాత్రంతా మనము ప్రార్థించగోరుదుము.

ఈ జనులను నేను ఇబ్బంది కలిగించుట కాదు, లేక నన్ను నేను మీకా విధంగా చూపించుకొనుట కాదు. ఈ ఉదయమున ఈ జనులలో ఎందరు పరిశుద్ధాత్మను పొందియున్నారని నేను అడిగినచో, బహుశా నూటికి తొంబది అయిదు మంది పరిశుద్ధాత్మను పొందితిమని చేతులు ఎత్తుదురు. అప్పుడు నేను మీ వైపు తిరిగి బైబిలు సూచనను ఇచ్చెదను - ఒక్క బైబిలు రుజువు. అప్పుడు రెండు చేతులయినా పైకి లేచునేమో నాకు అనుమానమే. చూచారా, చూచారా? అటువంటి స్థలములో ముడివేయండి, కాని మీరు అది చేసినప్పుడు, చూచారా, మీరు కూడా మీ సమూహమును బాధించుచున్నారు. కానీ మీరు వారిని ఆ బాల్యము నుండి యవ్వనత్వములోనికి తీసికొని రావలసియున్నారు, చూచారా.

36ఒక రోజున ఒకరు ఇచ్చట ప్రశ్న వ్రాసియున్నారు. సోదరుడు జూనియర్ జాక్సన్ గూర్చి ఏదో వ్రాసియున్నారు. ఎవరో అతని యొద్దకు వెళ్ళి, నీవు చచ్చిన పీనుగుల యొద్దకు వెళ్ళుచున్నావనిరట. అటువంటి మాటనే అనిరి, ఎందుకనగా సహోదరుడు జాక్సన్ యొక్క సంఘములో భాషలు మాట్లాడనిచ్చుదురు. ఆత్మ ఉన్నదని భావించు వారందరూ భాషలతో మాట్లాడుదురు. వారిని ఎవరూ ఆపరు. సరే, అది సహోదరుడు జాక్సన్ సంఘము. అది పరిపూర్ణముగా మంచిదే. దానికి విరోధముగా నాకేమి లేదు, ఒక విషయము కూడా లేదు. జూనియర్ జాక్సన్ నా మంచి స్నేహితులలో ఒకడు. నిజముగా ఒక దైవజనుడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడు. మేము సోదరులము. నా చెర్రీ-పైని అతడు తిననవసరము లేదు. అతని యాపిల్-పైని నేను తిననవసరము లేదు., చూచారా, కానీ మేమిద్దరము పాయ్ తినుచున్నాము. ఈ వర్తమానమును మేమిద్దరం ఒకే విధంగా నమ్ముచున్నాము. అది సంఘము యొక్క క్రమము. నా సంఘము ఒక్క త్రాటి మీదికి రావలెనని నేను కోరుచున్నానని చెప్పాను. భాషలతో మాట్లాడుట, పరిశుద్ధాత్మను గురించిన విషయములలో మేము చీలిపోతే ఎట్లుండును? "సహోదరుడా బ్రెన్హాం, అది అంతా నిజమైనదా?" అని ఎవరో అడిగారు.

37"నేను తీర్పరిని కానని" చెప్పాను. "ఒక కొలిక్కి దానిని మనం తీసికొద్దామని చెప్పాను. కొంత కాలం అలాగు పోనీయండి, ఒక కొలిక్కి దానిని తీసికొద్దాం. దానిని గూర్చి వాక్యము బోధించబడు వరకు ఆగండి అన్నాను. ఆ తరువాత దానిని మీరు గమనించండి. అది పరిశుద్ధాత్మ నుండి వచ్చినదయితే, సరిగ్గా వాక్యముతో ఏకీభవించును, లేనియెడల కలవదు," అని చెప్పాను. చూచారా? ఆ విధంగా మాత్రమే దానిని నీవు చెప్పగలవు. దానికదే తీర్పు తీర్చును. చూచారా? అది పరిశుద్ధాత్మ మూలముగా రానియెడల ఎగిరిపోవును. అది ప్రభావము చూపదు. చూచారా? కాని అది పరిశుద్ధాత్మ మూలముగా కలిగినదయితే, ఆ వరుసను దీనముగా వెంబడించును, ఎందుకనగా అది అంతే; పరిశుద్ధాత్మ తన యొక్క స్వంత క్రమములోనికి వెళ్ళును.

38ఈ భాషలు మాట్లాడుట మొదలగునవి చూడండి. మీ ప్రతి ఒక్కరు భాషలలో మాట్లాడవలెనని నేను కోరుచున్నాను. నేను నిశ్చయంగా చేయుదును. చాలాసార్లు మంచి క్రైస్తవులు…

మీరు గమనించండి, అది కార్యక్రమములో ఉన్నదని చెప్పుచున్నాను. కొందరిని చూచాను - కార్యక్రమము కాదు, నన్ను మన్నించండి - ఇంటర్వ్యూలో ఈ ఉదయము. ఒక వ్యక్తి వచ్చెను. (ఈ ఆలయంలో ఇప్పుడింకా ఉన్నాడని తలంచుచున్నాను) భాషలు మాట్లాడుట గూర్చి, ఆ వ్యక్తి నిజమగు వ్యక్తి. వాస్తవమైన వ్యక్తి, వారు సరిగా జీవించిరి. పరిశుద్ధాత్మను పొందినట్లుగా భాషలు సూచన కాదని నేను చెప్పుట వినెను - అది సూచన కాదు - కాని దేవునిని అడగమని అతనికి నేను సలహా ఇచ్చాను. వారు భాషలలో మాట్లాడవచ్చు లేదా ప్రవచించవచ్చు, ఎందుకనగా అదే స్వభావము.

39మొదటి విషయమేమనగా నేను ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి అతని జన్మ స్థలమెక్కడో కనుగొన్నాను. ఏ సూచన క్రింద వారు పుట్టిరో దానిని బట్టి వారి జన్మ స్థానమును చెప్పవచ్చును. వారి స్వాభావిక గుణము ఎట్లున్నదో అది వారిని ఒక ప్రత్యేక స్థానములో ఉంచును. వారు మరల తిరిగి జన్మించినప్పుడు మరియొక స్వభావమును కలిగియుందురు. ఇది అంతరంగములో ఉండు స్వభావము. అంతరంగ మనస్సాక్షి, బయటి మనస్సాక్షి నిన్ను ఒక స్థానమనకు కదిలించును. అది నీ స్వాభావిక జన్మ, వారు తమకు లేని దానిని ఉన్నట్లుగా నటించినచో ఎట్లుండును? అది వారిని చీల్చు స్థితికి నడిపించును. ఏమి చేయవలెనో వారికి తెలియదు. వారు ఇట్లందురు, "ప్రభువు నన్ను ఇది చేయమని కోరుచున్నాడు."

"ఇది లేఖనమునకు చాలునని నాకు తెలియును," అని అంతరంగము పలుకును. దానిని వారు చేయటకు ప్రారంభించుదురు, మొదటి సంగతి మీరు తెలిసికొనండి, బయట ఉన్న సాతాను వారికి అందులో అన్ని రకముల లోపములను చూపించును. చూచారా? వారు సాతాను మాట విందురు. గమనించారా? నీవు అంతరంగమందున్న దానిని స్వీకరించవలసి యున్నావు. నీ అంతరంగమందున్నది లేఖన సహితము. ఎక్కడా సాతానును నిలబడనీయ వద్దు. అక్కడ నిలబడి ఆ విధంగా నిన్ను గుద్దుట వాని యొక్క పని. కాని వాని మాటను నీవు వినవద్దు.

కాని ఆ వ్యక్తికి నేను చెప్పాను. "పరిశుద్ధాత్మను పొందినట్లుగా మీకు ఖచ్చితంగా తెలిసినచో బాగుండనని," వారనిరి. చూశారా? ఒక బలమగు వ్యక్తి, నిజముగా పరిశుద్ధాత్మకు విధేయుడగు వ్యక్తి, కాని ఆమె ఈలాగు చెప్పుట ఆమెకు మేలుకరముగా ఉండును. "తండ్రి, నాకు నిలబడుటకు ఒక దానిని ఇమ్ము."

1COR 13:1

 

40దానిని ఆ విధంగానే నేను నేర్పించాను, ప్రజలు ముందుకు వచ్చి దానిని పట్టుకొందురు, ఆ వ్యక్తి పొందిన దానిని వారు పొందకుండానే వచ్చెదరు. చూచారా? పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడును, కాని అది భాషలతో మాట్లాడుట కంటే ముందుగా నీవు పరిశుద్ధాత్మను పొంది యుండవలెను. ఇప్పుడది గమనించారా? కావున మీరు ముందుకు వచ్చి భాషలతో మాట్లాడు వరమును పొంది…

ఇప్పుడు గుర్తుంచుకొనండి, అది నిజమైన వరమే కావచ్చును; అన్యభాషలతో ఆ పరిశుద్ధాత్మ నీలో యుండి మాట్లాడుచుండ వచ్చును, అయినా గాని నీవు నశించి నరకమునకు వెళ్ళవచ్చును. ఆ విధముగా బైబిలు చెప్పుచున్నది. దానిని మీరు నమ్ముచున్నారా? ఆ విషయములో మీకు లేఖనము కావలెనా? లేఖనము చూపించమను వారు చేతులెత్తండి. "మనుష్యుల భాషతోను, దేవదూతల భాషతోను నేను మాట్లాడినప్పటికిని వట్టివాడనే." (అది నిజమేనా? రెండు భాషలు. ఒక దానికి భావము చెప్పగలము మరియొక దానికి భావము చెప్పలేము, నిజమయిన పరిశుద్ధాత్మ భాషలు) చూచారా, మిగిలినవి దానితో కూడా రావలెను. నీవు దీనిని కలిగియుండవచ్చును (చూచారా?), కావున ఇది లేకుండా అది పొందవలెనని పరుగెత్తవద్దు. దీనిని మొదట పొందుము, ఆ తరువాత అది దానిని వెంబడించును.

1SAM 28:7•

MATT 5:45

 

41నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురియుచున్నది. దుర్మార్గుల మీదను, మంచి వారి మీదను సూర్యుడు ప్రకాశించుచున్నాడు. పంటను పండించుటకు వర్షము కురియును. అది కలుపు మొక్కలను కూడా పండించును. ఒకే వర్షము. ఒక గుంపు జనుల మీద పరిశుద్ధాత్మ పడును, వారు భాషలతో మాట్లాడుదురు, దానిని నిజము అని రుజువు చేయుదురు, జనుల మధ్య అది ప్రాకును, ప్రవచనముగా చేయుదురు, అది కూడా ఖచ్చితంగా ఉండును. అది అక్షరాలా నిజము!

కొన్నిసార్లు మీరు క్షుద్ర శక్తిగలవారు లేదా మాంత్రికుల యొద్దకు వెళ్ళినప్పుడు వారు ఖచ్చితంగా చెప్పుట చూతురు. సౌలుతో ఎన్దోరులోని సోదెగత్తెను చూడండి. అది అక్షరాలా నిజము కావచ్చును; అయినా గాని కాదు. వారు మాంత్రికులు, దయ్యములు భాషలతో మాట్లాడుట నేను చూచాను. తెలియని భాషలలో వ్రాసినవి. అందువలన ఏమి గొప్ప లేదు. నిజమైనది ఏదనగా మరల వాక్యమే. వాక్యము నొద్దకు తిరిగి రావలెను!

వాక్యము లేకుండానే వీటిని నీవు చేయవచ్చును. కాని నీవు వాక్యమును పొందినప్పుడు అది చేయును. దానిని గమనించుము, అక్షరాలా నెరవేరును. సరిగ్గా నిజమయినదే జరుగును. చూచారా? అప్పుడు నీవు వరుసలోనే యున్నావని తెలియును.

EZEK 9:4

 

42అవును, పరిశుద్ధాత్మ ఈ జనులను ఉపయోగించుకొనును. ఆయన యొక్క స్వంత దైవజ్ఞానము ద్వారా దానిని చేయును. కానీ మొదటిది చూడండి …

ఏమిటిప్పుడు? ఒక్క నిమిషము పాటు మాకు చిన్న ప్రశ్న ఇచ్చెదను. ఎంత మంది పరిశుద్ధాత్మను పొందిరని నేనడిగితే మీరందరు చేతులెత్తెదరు. "సరే, మీరు పొందారో లేదో చూచెదనని పలుకుదును." పరిశుద్ధాత్మను కలిగియున్న వారు ఆ పట్టణములో జరుగుచున్న హేయ కార్యముల విషయమై దీవారాత్రులు నిట్టూర్చి మొర్ర పెట్టారని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడెందరు చేతులు ఎత్తుదురు? రాత్రులందు మీలో ఎందరు నిద్ర పోకుండా ఉంటున్నారు? అంత సంపూర్ణమైన ఆనందము, దేవుని యొక్క శక్తి ఉన్నా వారికి నశించిపోవుచున్న జనుల గూర్చి విచారమున్నది. ఆ హేయ కృత్యముల విషయమై మీరు దివారాత్రులు మొర్ర పెట్టుచున్నారా? లేదు… చూచారా? ఆ పట్టణములో ఎవరు ఉందురు? ఆ సంఘములో ఎందరుందురు? పరిశుద్ధాత్మ యొక్క సూచన అదేనని బైబిలు చెప్పుచున్నది.

EZEK 9:2-6

 

43ముద్రించు దేవదూతలకు ఆయన చెప్పెను. (యెహెజ్కేలు 9 అధ్యాయము), పట్టణములో హేయ కార్యములు జరిగించిన వారి నిమిత్తము ఎవరు నిట్టూర్చి మొర్ర పెట్టుచున్నారో చూచి వారిని ముద్రించుమని చెప్పెను. మిగిలిన వారినందరినీ నాశనము చేయు దూత నాశనము చేయును. ఎంతమంది సభ్యులు వారికున్నారని కాదు, వారెన్ని కార్యములు చేశారని కాదు. తెల్లని వస్త్రములు ధరించి వ్రాయు సిరా కలమును పట్టుకొని యున్నాడు. (పరిశుద్ధాత్మకు సూచన) అతడు వచ్చి పట్టణములో జరిగిన హేయ కార్యములను బట్టి నిట్టూర్పుచూ, మొర్ర పెట్టుచున్న వారిని కనుగొని వారిని ముద్రించెను. అక్కడతడు చెప్పిన దానిని కూడా గమనించండి. "చిన్న పిల్లలను, వృద్ధ స్త్రీలను, పసివారిని బొత్తిగా హతము చేయుము!" చిన్న పిల్లలనా? అవును!

కనాను దేశములోనికి యెహోషువా ప్రవేశించినప్పుడు ఇట్లనెను, "వారిలో ఒక్కరిని కూడా బ్రదుకనీయ వద్దు. అది చిన్న పిల్ల కావచ్చును, చిన్న అమాలేకీయులు కావచ్చు, లేదా అమోరీయులు కావచ్చు, దానిని చంపవలెను! మీరు గుర్తుంచుకొనండి, వాడు అమాలేకీయుడుగా ఎదుగును; పాలెమును వాడు పాడుచేయును." దేవుని వాక్యముతో ఏకీభవించకుండా చేయు చిన్న కార్యములు మనకు ఎదురయినప్పుడు దానిని నిర్మూలము చేయుడి. అది ఏ శాఖకు చెందిన నాకక్కర లేదు.

వారు మంచివారేనని నీవందువు. వారెంత మంచివారని కాదు, వారు వాక్యమునకు విరోధులయితే వారి నుండి దూరమగుము. అది పెరుగుచున్న చిన్న అమాలేకీయుడు. చాలా చిన్నగా కనబడవచ్చును, అమాయకముగా కనబడ వచ్చును, పరవాలేదనిపించ వచ్చును, కాని నీకు దానితో ఏమి సంబంధము లేదు. దాని నుండి నీవు దూరముగా తొలగుము.

"బ్రెన్హాం సోదరుడా, నేనిటు వెళ్ళెదనని నీవు అనవచ్చును." నీవు గుర్తుంచుకొనుము, ఎంత చిన్న అమాలేకీయుడయినా, వాక్యమును నిరాకరించునది ఎంత చిన్నదయినా, దాని నుండి నీవు దూరముగా ఉండుము. దానితో నీకేమి సంబంధము లేదు. అది సత్యమని ఎందురు నమ్ముచున్నారు? నిశ్చయంగా అది సత్యమే. చూచారా? దాని నుండి దూరముగా ఉండుము!

EZEK 9:4,5

 

44పట్టణములో జరుగుచున్న హేయ కార్యముల కొరకు నిట్టూర్చి మొర్ర పెట్టుచున్న వారెవరు? దానిని ఎక్కడ మీరు చూచెదరు? భాషలతో మాట్లాడుచున్న పదివేల మందితో పాపి కొరకు భారము నిజంగా కలిగిన వారు ఒక్కరూ లేరు. ఒక్క గంట ప్రార్థించువారు లేరు. కాని బైబిలు చెప్పిన దానిని మీరు గుర్తుంచుకొనండి. పట్టణములో జరుగుచున్న హేయ క్రియల విషయమై నిట్టూర్చి మొర్ర పెట్టుచున్న వారిని ముద్రించమనెను. దానిని ఎదురు చదివారు? నిశ్చయంగా! పరిశుద్ధాత్మ వచ్చి ప్రజలకు ముద్ర వేయును. సంహార దూతతో ఇట్లు చెప్పెను, "ముద్ర లేని వారినందరినీ వెళ్ళి సంహరించుము." దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మయే; అదే దేవుని యొక్క ముద్ర.

ఆసక్తి గల జనులు ఎచ్చట? సంఘములో క్రిందికి, పైకి ఎగిరి గంతులు వేయుచూ కేకలు వేయు జనులను మీకు చూపించగలను; భవనమంతా పరుగెత్తుచూ అల్లరి చేయు జనులను మీకు చూపించెదను, ప్రవచించు వారిని మీకు చూపించెదను, అది నెరవేరు ప్రవచనమే; భాషలతో మాట్లాడుతున్న వారిని మీకు నేను చూపించెదను, వారు భవనములో పరుగులు తీయుచూ చక్కగా భావము చెప్పగా అలాగే నెరవేరుచున్నవి; కాని పట్టణములో జరుగుచున్న హేయ కార్యముల విషయమై నిట్టూర్చి, ప్రలాపించు వారు ఎక్కడున్నారు? భారము కలిగిన ఆత్మ ఎక్కడున్నది? నీవు కొన్ని కొత్త ఆకులు దానికి అతికించ వచ్చును. నా భావమును గమనించావా?

2COR 11:2

 

45నా శాయశక్తులా మీతో చెప్పుచూ ప్రయత్నించాను. తండ్రి తన పిల్లలను నడిపించినట్లుగా మిమ్మును నడిపించాను. మీరు నా పిల్లలు. నేను బోధించు ఈ సువార్త ద్వారా క్రీస్తునందు మిమ్మును నేను కనియున్నాను, చూచారా. పూర్తిగా పరిపక్వము కలిగిన పిల్లల వలె మిమ్మును చేయవలెనని నేను పెంచగోరాను. పౌలు చెప్పినట్లుగా, ఆ రోజున క్రీస్తుకు మిమ్మును ఈలాగు సమర్పించగోరాను, "పవిత్రమగు కన్యకగా." మీరు మీ హృదయములో "ఆమేన్" అని పలుకని వాక్యము అందులో ఒక్కటి కూడా లేదు.

మీరు తప్పు క్రియలు చేయుచుండ వచ్చును, కాని మీ దోషము మిమ్మును ఖండించునప్పుడు, "తండ్రి, నన్ను క్షమించుము," అని పలుకుము.

MATT 5:13•

MATT 22:16-22•

MARK 12:17•

LUKE 20:25

 

46దీనిని నేను చెప్పగోరుచున్నాను. కొద్ది నిమిషముల క్రితం ఒక వ్యక్తి వైపు చూచాను. ఒకనాడతడు ఒక చక్కని బాలుని గూర్చి అడిగెను. మేము ఉడుతలను వేటాడుచున్నాము. ఆ ఉదయము నాకు అయిదు దొరికినవి. ఆ మధ్యాహ్నము కొరకు అందులో ఒక దానిని నేను విడిచి పెట్టియున్నాను. కెంటకీలో ఆరుకు మించి దొరకవు; అదే హద్దు. కావున ఈ వ్యక్తి ఇట్లనెను, "నాకు తొమ్మిది దొరికినవి." క్రైస్తవ బాలుడు, చాలా మంచివాడు.

"నీవు తప్పు చేశావు. నీవు పొరబడియున్నావు!" అన్నాను.

"సరే.." అన్నాడతడు.

నేనిట్లు చెప్పాను, "ఆ ఉదయం నాకు అయిదు దొరికి యున్నాయి. ఆ మధ్యాహ్నము కొరకు ఒకటి దాచి యుంచాను. ఆ ఒక్క ఉడుతను నేను పట్టినప్పుడు చెట్టు వైపు చూచాను, అయిదు లేదా ఆరు ఉన్నట్లుగా నేను లెక్కించాను. వాటిని నేను చూచాను. వాటిని విడిచి వెళ్ళిపోయాను. కొద్దికాలము క్రితమే అక్కడకు నేను వెళ్ళి వచ్చాను. అప్పుడు దాదాపుగా పదిహేను లేదా ఇరవై అక్కడ కూర్చొనియుండెను. నేను ఆ పరిధిని తీసికొన్నాను. దూరంగా వెళ్ళిపోయాను. ఆ మిగిలిన వాటిని అక్కడే విడిచి పెట్టాను. ఈ ప్రాంతమునకు మరల నేను వచ్చినచో మీ బాలురకు బోధించెదను. ఆ విషయము నిజము. ఆ మాదిరిగా నేను జీవించవలసియున్నాను." క్రైస్తవ్యమనగా నీవు మాటలు చెప్పుట కాదు, నీవు జీవించవలెను, నీవు చేయవలెను; అది ఒక మాదిరి. మీరు భూమికి ఉప్పుయి యున్నారు. యేసు చెప్పెను, "కైసరుది కైసరుకు చెల్లించుడి." మీరు వేగపు చట్టమును మీరుచున్నారు, మీరేమి చేయుచున్నారు? మీరు తప్పు చేయుచున్నారు; మీరు పాపము చేయుచున్నారు. కైసరుది కైసరుకు చెల్లించుడి, దేవునిది దేవునికి చెల్లించుడి.

"ఆ చట్టము తప్పు," అని మీరందురు. నాకు అందుకు ఏ ఆధికారము లేదు. యేసు యొక్క ఆజ్ఞను మీరుట తప్పు. కైసరుకు చెందునది కైసరుకు మీరు చెల్లించనియెడల, యేసు చెప్పిన దానిని చేయుట లేదు. కావున పాపము చేయుచున్న వారగుదురు, ఆజ్ఞను అతిక్రమించుట పాపము. అది నిజమేనా?

మనమందరమూ దోషులమే; మనమాలాగు చేయుచున్నాము. నీవు స్వయంగా తప్పు చేయుచున్నయెడల దానిని ఆపుము. ప్రజలు మిమ్ములను గమనించుచున్నారు; ప్రజలు ఆలయమునకు వెళ్ళరు, కాని వారు నిన్ను చదువుచుందురు, నీవేమి చేయుచున్నావో వారు చూచుదురు.

1COR 13:1,2

 

47కావున క్రీస్తును నీ హృదయము లోనికి తెచ్చుకొనుము. క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే. క్రీస్తు అనగా, "అభిషిక్తుడు" అని ఆర్థము. పరిశుద్ధాత్మయే ఆ అభిషేకము. అభిషేకించబడినవాడవు నీవే. చూచారా? క్రీస్తు నీలో యుండి అభిషేకించుచున్నాడు. నా భావమును గమనించారా?

అప్పుడు నీవు సరయిన దానిని పొందియున్నావు. ఆయన నిన్ను ఏలాగయినా వాడుకోగలడు. తన కోరిక ప్రకారము ఆయన వాడుకొనును, ఎందుకనగా నీవు శరీరములో యున్నావు. ఆ వరములలో దేనినయినా నీవు లోబడియున్నావు. కాని చూడండి, ఆ శరీరమునకు బయట ఉండి వరములలో ఒక దానిని కలిగి యున్నప్పుడు ఏమి మేలు కలుగదు. "దేవదూతల భాషలతోను, మనుష్యుల భాషలలోను నేను మాట్లాడినప్పటికిని ప్రేమలేనివాడనయితే వ్యర్ధుడను. నాకు విశ్వాసముండి దేవుని యొక్క మర్మములన్నింటిని గ్రహించగల శక్తి యున్నా గాని వట్టివాడనే. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, పేదలకు నా వస్తువులన్నియూ ఇచ్చినను, కొండలను పెకలించగల విశ్వాసము నాకున్ననూ వట్టివాడనే." చూచారా? ఆ విషయముల మీద ఆధారపడరాదు. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము కలిగియున్నది! అది దేవుడే, నీలో ఉన్న దేవుడు, వ్యక్తి, దేవుడు, నీ సర్వ శరీరమును వెలిగించియున్నాడు. నీవు మారియున్నావు; నీవు ఒక నూతన సృష్టివి. ఏ చిన్న తప్పు పనిచేసినా ఆయన చెప్పును. అది తప్పు అని చెప్పినప్పుడు, నీవు దానిని మరల చేయక విడిచిపెట్టుము. "తండ్రీ, నేను చేయవలెనని చేయలేదు, నన్ను క్షమించుము." చూచారా? అదియే పరిశుద్ధాత్మ.

48నీవు భాషలతో ఎంతగా మాట్లాడినా నాకక్కర లేదు. నీవెంత పరుగిడినా, నీవెన్ని గంతులు వేసినా, నీవు ఇది, అది, ఇంకేదేదో చేసినా నాకు లెక్క లేదు. పరిశుద్ధాత్మ లేనిచో అంతా వ్యర్థము. తప్పును, ఒప్పును చెప్పునది అదియే.

ఆ కారణమును బట్టియే ఇక్కడున్న ఈ వ్యక్తి సరియైనవాడు. దానిని పరిశుద్ధాత్మయే చేయనట్లు అప్పగించుము. దీనికి కారణము ఏమిటి… ప్రేమతో దీనిని చెప్పుదును, ప్రేమతో ప్రోక్షించెదను - వాక్యముతో అభిషేకించెదను, చూచారా. నిజమైన పరిశుద్ధాత్మ నీలో యున్నచో నీవు దానిని ప్రశ్నించవు. నీ యంతట నీకే అది తెలియును. అది నీకును దేవునికి మధ్య నున్న ఒక వ్యక్తిగత విషయము, చూచారా. ఏదో జరిగినదని నీకు తెలియును. ఒక మార్పున్నదని నీవెరుగుదువు - ఏది ఏమయినా గాని నీవే ఆ మార్పును చూపించెదవు, చూచారా. ఆ మార్పును కలుగజేయవాడవు నీవే, నీ లోపల మార్పు జరిగెను. దానిని నీవు పొందినట్లుగా నీకే తెలియును. నీవు భాషలతో మాట్లాడ వచ్చును, నీవు గంతులు వేయవచ్చును, నీవు కేకలు వేయవచ్చు, మరేదయినా చేయవచ్చు, నీలో దేవుడు జీవించుచున్నాడని నీకు తెలియును, నీ స్వంత మనస్సుతో నీవు నడచుట లేదు, నిన్ను దేవుని మనస్సు నడిపించుచున్నది, వాక్యముతో నడిపించుచున్నది, అక్షరాలా ఆ విధంగానే అది వెళ్ళును.

1COR 11:1

 

49"బ్రెన్హాం సోదరుడా, మేము భాషలలో మాట్లాడవలసి యున్నామని నీవు నమ్ముట లేదా?" అని ఇప్పుడు జనులు ప్రశ్నించవచ్చు. చూచారా? అయితే ఇప్పుడు నీవు నేను చెప్పిన దానికి అక్షరాలా వెనక్కు వెళ్ళియున్నావు. నిశ్చయంగా మీరు భాషలతో మాట్లాడవలెనని నేను నమ్ముచున్నాను. చూచారా? ఈ ఆలయమునకు చుట్టూ పదిహేను వందల మైళ్ళని అడిగినట్లుగానే అది యున్నది. (మీరు చూచారా?) దానిని మీరు అర్థము చేసికోలేనియెడల నన్ను అడగండి. చూచారా? మీకు అర్థము కానియెడల నాకు వ్రాసి తెలిసికొనండి. ఇక్కడ నేను చెప్పుచున్న దానినే మీరు చెప్పండి, చూచారా. "నేను క్రీస్తును పోలి నడచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడచుకొనుడని పౌలు చెప్పినట్లే చెప్పుచున్నాను." మీరది చూచారా? అప్పుడు నాది గనుక తప్పు అయితే నా యొద్ద నుండి తొలగిపోవుడి (చూచారా? అంతే), ఎందుకనగా అప్పుడు నేను తప్పు వ్యక్తినవుదును.

50ప్రశ్న: దయచేసి వివరించుము. సహోదరుడు బ్రెన్హాం మానవుని కంటే గొప్పవాడు, అతడు సృజించగలడు, యేసు వలెనె సహోదరుడు బ్రెన్హాం కనిపించుచున్నాడు అని జనులు చెప్పుచున్నారు.

దీనిని ఒకరు చెప్పిరి. వారెవరో నాకేమి తెలియదు. కాని నేను మీ సోదరుడను, చూచారా. యేసు మీ రక్షకుడు. నేను మీ రక్షకునిగా ఉండలేదు, ఎందుకనగా ఆయన ముందే మిమ్మును రక్షించెను. ఆ విషయములో సత్యమునకు మీరు చాలా దగ్గరగా ఉన్నారు. అలాగే సత్యమునకు బహు దూరంగా కూడా యున్నారు. దీనిని చెప్పిన వ్యక్తి అలాగున్నాడు. ఇది ఆడవారి చేవ్రాత వలె నాకు కనిపించుచున్నది. చాలా అందమగు చేవ్రాత. అది స్త్రీ యొక్క చేవ్రాతని నేను చెప్పగలను. అవును గదా? కాష్ సోదరుడా, అది స్త్రీ యొక్క చేవ్రాతని నీవు చెప్పగలవా? చాలా చక్కని చేవ్రాత, ఎవరో వ్రాసిరో నాకు తెలియదు, చూచారా.

HEB 1:3

 

51"బ్రెన్హాం సోదరుడా, నీవు యేసు వలె కనిపించుచున్నావు, నీవే యేసువు, లేదా అలాగే యున్నావు" అని వ్రాసిరి. ఆ మాట ఒక రకంగా పూర్తి సత్యము; మరియొక రీతిగా క్రీస్తుకు విరోధము. తప్పుకు మరియు ఒప్పుకు మధ్య గల తేడా అది. నన్ను ప్రభువైన యేసుక్రీస్తుగా చేయుట, అనగా అంత్యక్రీస్తే, (చూచారా?) ఎందుకనగా ప్రభువైన యేసు అను వ్యక్తి మహోన్నతుడగువాని కుడిపార్శ్వమున కూర్చొని యున్నాడు. మహా మహిమ మరియు శక్తితో మరల ఆయన వచ్చును. కాని ఆయనలో యుండిన జీవము నా మీద యున్నది. ఆయనను కలిగియుండిన మీ మీద ఉన్నది. అది అక్షరాలా నిజము; మీరు క్రీస్తు అయిరి.

మెస్సీయాలు అను నా వర్తమానము మీకు గుర్తున్నదా? చూచారా? మెస్సీయా అను మాటకు - "అభిషిక్తుడు" అని అర్ధము. మీరు పరిశుద్ధాత్మను కలిగి యుండినప్పుడు మీరు అభిషేకించబడిన వారగుదురు. చూచారా? ఆ విధముగా చాలామంది అభిషిక్తులున్నారు.

52ఇప్పుడు, అది బైబిలు ప్రకారము అభిషేకమేనా గమనించండి. చాలామంది అభిషేకించబడి యున్నారు… చూచారా? అదంతా చాలా గందరగోళములో ఉన్నది. ప్రతి విధమగు కలగలుపు ఉన్నది. సాతాను తన యుక్తి అంతటితో వచ్చి పొల్లు పోకుండా బహు ఖచ్చితంగా అనుకరణ చేయుచున్నది. నీవు సంపూర్ణ నిశ్చయతను కలిగియుండుటకు ఒకే ఒక మార్గమున్నది; ప్రతి వాక్యమును వాక్యముతో పరీక్షించుము! నీవు చేయగలిగినది అది ఒక్కటే.

ఒక వ్యక్తిగా నేను విలియం బ్రెన్హాంను, అంతే గాని మగవారయినా, ఆడవారయినా నన్ను మన రక్షకుడగు ప్రభువైన యేసుక్రీస్తు అనిన యెడల తప్పు. కాని ఆయన ఆత్మతో అభిషేకించబడితిమి, ఆయన యొక్క జీవము మనలోనికి వచ్చియున్నది.

2KGS 2:8-13

 

53ఏలియా మరియు ఎలీషాలలో చాలా చక్కగా ఆ మాదిరిని చూడగలము. ఏలియా ఆరోహణుడాయెను. వృద్ధ ప్రవక్తను ఇంటికి తీసుకొని పోయెను. ఏలియా అలసిపోయి సొమ్మసిల్లెను, ఆ నదికవతల ఒక రధము సిద్ధపరచబడినది. అగ్ని గుర్రములు అతనిని కొనిపోవ వచ్చినవి. మిరప్పుడు జరిగినది గమనించండి. ఏలియా మరియు ఎలీషాలు నదిని దాటిరి. (ఆ పాఠశాలకు చెందిన ప్రవక్తలు వారిని గమనించుచున్నారు) మరియు ఎలియా తన దుప్పటిని తీసికొని నదిని కొట్టెను. అప్పుడది పాయలయ్యెను. వారు నదిని దాటిపోయిరి. యవ్వవ ప్రవక్తతో అతడిట్లు ప్రశ్నించెను, "ఎందుకు నీవు నన్ను వెంబడించుచున్నావు? నీ కోరిక ఏమిటి?"

"నీ ఆత్మ రెండింతలుగా నా మీదికి వచ్చునట్లుగా చేయుము," అనడిగెను. ఆ శక్తి గల ప్రవక్త యొక్క ఆత్మ నా మీదికి రావలెనని అడిగెను.

"నీవు చాలా కఠినమైన దానిని అడిగియున్నావు; కానీ నేను కొనిపోబడినప్పుడు నీకు కనబడినయెడల అలాగు నీకు జరుగును." కావున ఆ ప్రవక్తను ఎట్లు కనిపెట్టి చూచెనో మీరూహించండి.

JOHN 14:12

 

54ఆ దినమున ఆ ప్రవక్తయే వాక్యమై యుండెను, ఎందుకనగా లోకమునకు బయలుపరచబడిన వాక్యముగా అతడుండెను. చూచారా? ఇంకా గొప్ప పరిచర్య రాబోవుచున్నదని అతనికి తెలియును, ఎందుకనగా ఇంకా గొప్పది అవసరమయ్యెను. ఈ భూమి మీద యేసు ఉండినప్పుడు ఏలియాగా ఉండెను. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. ఇంతకంటే గొప్పవి చేయుదురు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను." మిరెట్లు వాటిని చేయగలరు? ఆయనను గమనించండి! ఆయన ఎవరు? వాక్యము! చూచారా? ఆయనను గమనించండి!

MATT 14:19,20•

MARK 6:41-43•

LUKE 9:16,17•

JOHN 2:7,9

 

55సృజించుట మాట నిజమే. యేసు ఎన్నడూ వెంటనే దేనిని ఉనికిలోనికి వచ్చునట్లు సృష్టించలేదు. ఆయన మొదట ఒక దానిని తీసికొనెను. ఆయన నీరు తీసికొని ద్రాక్షారసమును చేసెను. ఆయన రొట్టెను తీసికొని మరికొన్ని రొట్టెలను చేసెను. ఆయన చేపలను తీసికొని మరికొన్ని చేపలను చేసెను. కాని ఇంతకంటి గొప్ప కార్యములు చేయుదురని ఆయన చెప్పెను. చూచారా? మీరు గ్రహించారా? ఎందువలన? ఆయన ఇక్కడ ఉండిన నాటి కంటే ఇవి మరి చెడ్డ దినములు. చూచారా? ఇంకా ఆయనే పని చేయుచున్నాడు, కాని నీ ఆలయమును ఆయన ఉపయోగించుకొనుచున్నాడు. చూచారా?

నీలో ఈయన ఉన్నాడు, నీవు జన్మించియున్నావు… నీవు జాన్-డో వి. నీవు ఫలాని నెలలో జన్మించియున్నావు. నీవు ఫలాని నక్షత్రము క్రింద జన్మించియున్నావు. ఒక ఫలాని పరిస్థితిలో నీవు జన్మించి యున్నావు. వాటితో నీకు సంబంధమేదో యుండును. అది నిశ్చయము!

56నా తండ్రి ఈలాగనుచుండేవాడు, "ఈ సమయములో బంగాళా దుంపలు నేను నాటను, ఎందుకనగా చంద్రుడు సరిగా లేడు. బిల్లీ, ఇప్పుడు నీవు బంగాళా దుంపలు నాటలేవు."

"నేను వాటిని చంద్రునిలో నాటను. వాటిని ఈ భూమిలో నేను నాటుదును," అనే వాడిని.

"సరే, నీకెంత తొందరగా ఉంటే నాటుము. నీకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలితేనే గానీ నీవు ఏదీ నేర్చుకోలేవు," అనేవాడు. నాకు తగిలినవి. నేను నేర్చుకున్నాను.

మీకు చెప్పుచున్నాను: ఒక బోర్డును తీసికొని అమావాస్య చీకటి సమయములో గడ్డి మీద పడవేయండి. ఏమి జరుగునో గమనించండి. వెంటనే ఆ గడ్డి చనిపోవును. పౌర్ణమి నాటి వెలుతురులో దానిని పడవేసి చూడండి. ఒక వారం పాటు అది ఉన్నాగాని ఆ గడ్డికి ఏమి హాని కలుగదు.

57ఎక్కడో చంద్రునిలో జరుగు మార్పులకు అనుగుణంగా సముద్రము ఎట్లు మారునో చూడండి. చంద్రుని కదలికను బట్టి అల నడచుచుండును. అది భూమికి ఎన్నో మిలియనుల దూరాన ఉన్నది. అంతే కాదు, ఈ కెంటకీ రాష్ట్రములోనికి వెళ్ళండి. ఒక ఇనుప దండమును ఉప్పు నీరు లోనికి దిగు వరకు వెళ్ళ నీయండి. ఆ పైపును గమనించండి, అలను బట్టియే అది లోనికి వెళ్ళుచుండును. భూమి లోనికి కూడా దాని ప్రభావమెట్లు చొచ్చుకొని పోవుచున్నదో చూడండి. నిశ్చయంగా!

భూమి మీద వ్యాపించు ఒక మొక్కను మీరు నాటండి. చంద్రుని చీకటి వేళన దానిని గమనించండి. లోనికి దిగి పోయి ముల్లంగి లేదా టర్నిప్ దుంప వలె తయారగును. దానిని తీసి మరొక విధంగా నాటండి. అప్పుడది భూమి మీద వ్యాపించును. స్వయంగా దానితో ఏదో సంబంధమున్నది.

GEN 49:1-27•

EXOD 28:17-21

 

58అహారోను యొక్క ఛాతీ మీద నున్న ఆయుధము మీద పితరుల యొక్క జన్మ రాళ్ళు ఎందుకు వ్రాయబడినవి? ఆ తల్లులను చూడండి, వారు అలాగు పలికిరి. ఆ తల్లులు మరియు హెబ్రీ స్త్రీలు ప్రసవ వేదన పడుచూ తమ పిల్లలను కనునప్పుడు ఏమనుచుండిరో ఆ ప్రకారమే వారికి పేర్లు పెట్టబడుట పరిపాటి. అది వారి జన్మను చెప్పును. ఆ విధముగా వారు మాతృ దేశములో స్థిరపడిరి; వారి నిత్యత్వమును అది నిర్ణయించెను.

ఈ రోజులలోనే ఒక రోజున నేను మరల ఇక్కడికి వచ్చి, కొద్ది సమయము తీసికొని ఆ అంశమును తీసికొందును. ఖచ్చితంగా! ఆ తరువాత యాకోబును గమనించండి. అతడు మరణించు ముందుగా ఆ పితరుల మీద తన చేతులుంచి ఆశీర్వదించెను. వారెక్కడుందురో అతడు ఖచ్చితంగా చెప్పెను. అది అక్షరాలా వారి పేరును బట్టియే జరిగెను. వారి జన్మను బట్టియే అది జరిగెను. నిశ్చయంగా దానితో నీకు సంబంధమున్నది.

EPH 6:17

 

59అది నీ జనన రహదారి, నీవదే అయి యున్నావు. ఒక స్వాభావిక స్త్రీ మరియు ఒక స్వాభావిక పురుషుడు అలాగే యున్నాడు. కాని నీవు తిరిగి జన్మించినప్పుడు దానికి బయటి అంతరాత్మతో సంబంధము లేదు. బయటిది ఏదనగా దృష్టి, రుచి, తాకిడి, వాసన, వినికిడి మొదలగునవి, కాని ఆ అంతంగము నిజంగా నీవై యున్నావు. ఇటు చూడండి, సాతాను నిన్ను పరిశోధించును, నిన్ను అన్ని వైపులకు త్రోయు చుండును; కాని ఈ అంతరంగమును మాత్రము నీవు అనుమతించితేనే గాని వాడేమి చేయజాలడు. ఎందుకనగా ఇందులో నీ విశ్వాసమున్నది, బయటి మనస్సు ద్వారా నీకు విశ్వాసము రాదు, అది హేతువును వెదకును. కాని విశ్వాసములో హేతువాదముండదు. దానిని దేవుని యొద్ద నుండి నీవు పొందెదవు. అక్కడున్నదని నీకు తెలియును. అదెంత తప్పుగా కనబడినా గాని నేను అనుమానించను. అది ఇంకా నిజమని నీకు తెలియును. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దానిని తొందరపరచునది ఏదియూ లేదు. దానిని ఎదీ బాధించజాలదు. అది ముందుకు సాగిపోవును. కష్టమంటే దానికి తెలియదు. అది ముందుకు కదిలిపోవుచుండును, ఏలయనగా అది వాక్యము. వాక్యము ఖడ్గమైయున్నది. వాక్యము కోయును. వాక్యము దేనినయినా కోసుకొంటూ ముందుకు పోవుచుండును. మీరు చూచారా? ఆ వాక్యమును పట్టుకొనుటకు విశ్వాస హస్తము కావలెను. అదే విశ్వాసము…

60ఇప్పుడు ఆ అంతరంగ మనస్సును చూడండి. ఇక్కడ అంతరంగమున్నది; ఇక్కడ బాహ్య రూపమున్నది. ఇక్కడ సత్యము బయలుపరచబడినది; ఈ బయట హేతువున్నది. "మనందరము వెళ్ళి అసెంబ్లీస్ లో చేరుదాం, అని చెప్పు మాట సహేతుకముగానే మనకు కనబడును. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారు నాకు ఇష్టమే. ఏకత్వం వారు నాకు ఇష్టమే. అన్ని సంఘములు నాకు ఇష్టమే. మనందరమూ ఒకటిగా కలిసిపోతే చాలా మేలుకరముగా ఉండునని మీరనుకొందురు. అది బయటి కారణము. కాని అంతరంగములోనిది గమనించండి. ఇది అంగీకరించదు. అప్పుడు అసెంబ్లీసని చూడండి. వారు చేయు అనేక కార్యములను నేను విశ్వసించను. అవి లేఖనాధారము కావని రుజువు చేయగలము. కాని అందులో చాలామంది మనస్సుంచి యున్నారు. ఆ అసెంబ్లీస్ యొక్క ఎందరో సోదరీ సోదరులు, వేలాది మంది ఇది వాక్యమని నమ్ముచున్నారు. అసెంబ్లీస్ వారు బోధించు దానిని సరియని వారు నమ్మరు. కానీ వారు ఆ వలలో చిక్కుకొని పోయిరి.

JOHN 5:4•

ROM 3:4

 

61బాప్టిస్టులు, ప్రెస్పిటేరియనులు, ఏకత్వము వారు, మిగిలిన వారందరూ ఆ వలలో చిక్కుకొని యున్నారు. ఒక గుంపు జనులు కలిసికొని దానిని గూర్చి తర్కించుకొనుచున్నారు. అక్కడ ఎంతో మానవ హోదా యున్నది. బిషప్ కూర్చొని యుండును, పర్యవేక్షకుడు అక్కడుండును; వారు చెప్పిన దానికి ఆ చిన్న వారు ఏమి చెప్పగలరు? ఏది చెప్పాలన్నా వారికి భయమే. "మీతో సమ్మతించుచున్నాను. అవును, అది సరియే. బిషప్ లేదా ప్రెస్పిటర్ చెప్పినది తిరుగులేని సత్యము," అని చెప్పి వారితో సమ్మతించును.

ఈ వీధిలోని ఒక త్రాగుబోతును మనము తీసికొందము. వీధిలో వెళ్ళుచున్న ఒక సామాన్య పౌరుడు ఇట్లనును, "ఆ ముసలి తిరుగుబోతు మాట మనకెందుకు?" అతనిని తీసికొని వెళ్ళి పోలీసు బలగంలో చేర్చండి. అతనికి ఒక బాడ్జి తగిలించి భుజానికి తుపాకీ వ్రేలాడునట్లు చేయండి. "శుభోదయం జాన్! నిన్ను మరల చూచుట చాలా బాగున్నది," అనండి. ఒకరినొకరు గౌరవించుట.

యేసు చెప్పెను, "ఆ విధమగు మర్యాద నీవు కలిగినయున్నప్పుడు నీవు విశ్వాసమును ఎట్లు కలిగియుండగలవు." మీకు తెలుసా, గౌరవమును ఇచ్చుట (ఆ మాట ఏమిటో నాకు సరిగ్గా తెలియదు) - కాని నీవు గౌరమును కోరునప్పుడు - ఒకరి నుండి ఒకరు పరస్పరము గౌరవము. చూచారా? అలాగు చేయలేము.

ఒక వ్యక్తి సంస్థలోనికి చేరిన వెంటనే వారితో కలిసి కూర్చొనును. ఈ చిన్న మనిషి దేనిని చెప్పుటకయినా భయపడును, ఎందుకనగా బిషప్పు ఆలాగు చెప్పెను, ప్రెస్పిటరు అలాగున చెప్పెను. ఆ మనిషిని అమర్యాద చేయమని కాదు, అతడు మంచివాడేనని నమ్ముము; కాని ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకొనుము, దేవుని వాక్యమే సత్యము, దానికి వ్యతిరేకముగా ఉన్నవన్నియూ తప్పు. "నా మాటయే సత్యము, ప్రతివాని మాటయు అబద్దము." దానిని చూచారా? మనము చేయవలసినది అదే, దానిని నమ్ముట.

GEN 22:4•

MATT 8:20•

LUKE 9:58•

JOHN 11:43,44

 

62ఇప్పుడు గుర్తుంచుకొనండి, మనము వాక్యము కాదు, కాని మనము మాటయై యున్నాము. దానిని మీరు గ్రహించారా? యేసు దేవుడు కాడు గాని ఆయన దేవుడై యుండెను. ఆయన నరుడు, అయినా గాని ఆయన దేవుడే. ఆయన ఏడ్వగలడు, అయినా ఆయన చనిపోయిన వారిని బ్రదికించగలడు. చనిపోయిన ఒకని కొరకు ఆయన కన్నీరు కార్చెను. అతనిని మరల బ్రదికించెను. ఆయన యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా మనషే; ఆయన యెహోవా, సర్వములో సర్వమైయున్నాడు. ఆయన యెహోవా, ఆయనను నరుడైయుండెను. భూమి ఆయన స్వంతము. భూమిని తయారు చేసెను, అయినా ఆయనకు తలవాల్చుటకు స్థలము లేదు. ఆయన ఇట్లనెను, "నేను సృజించిన ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ నా తలవాల్చుటకు స్థలము లేదు. నేను సృజించిన నక్కలకు బొరియలున్నవి, కాని నా సమాధికి కూడా నాకు స్థలము లేదు." అది నిజము. ఆయన తన సమాధి కొరకు మరియొకరి సమాధిని అరువు తీసికొనవలసి వచ్చెను.

MARK 15:43-46•

ACTS 2:2,3•

EPH 5:32

 

63ఆయన ఒక స్త్రీలోని గర్భమును తయారు చేసెను. ఆయనకు జన్మించుటకు గర్భము లేకపోయెను; ఆయన ఒక గర్భమును అరువు తీసికొనెను. ఆయన భూమిని సృజించెను, కాని పాతి పెట్టబడుటకు ఆయనకు చోటు లేదు; ఆయనకు అరిమత్తయి యోసేపు యొక్క స్థలమును అడిగి తీసికొనిరి, చూచారా. వారొక చోటును ఆయన కొరకు తీసికోవలసి వచ్చెను, అయినా ఆయన దేవుడే… తాను దేవుడనని ఆయన నిరూపించెను.

ఇప్పుడు, మీరు గ్రహించారా? మనము మెస్సీయా వారము, కాని ఆ యేసుము కాము. ఆయన మన తండ్రి; ఆయనాత్మతో మనము అభిషేకించబడియున్నాము, ఆ కారణము చేతనే ఆయన జీవము మన మీద ఉన్నది. అది జనులను ఆకర్షించుచున్నది. చూడండి, మీరీవిధంగా కూర్చొని ఆలోచించకపోతే జనుల ఆలోచన అలాగే యుండును. ఈయన మెస్సీయా అని తలంచెదరు. ఇది నిశ్చయమని అనుకొందురు.

ఈయన మెస్సీయా కావచ్చుననుకొనందురు. వారిరువురు అలాగే యున్నారు, చూచారా. వారిద్దరూ ఎట్లు కాగలరు? చూచారా? అటువంటి వారు వేలాదిమంది ఉన్నారు, చూచారా.

అయితే మీరు చూడండి, పెంతెకోస్తు దినమున ఆయన జీవము వేరు చేయబడినది. ఆ అగ్నిస్తంభము క్రిందికి దిగి వచ్చినప్పుడు అది అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలెను. దేవుడు తన్ను తాను విభాగించుకొనెను. తన జనుల మధ్య వచ్చెను, ఎందుకనగా సంఘము మరియు క్రీస్తు ఒక్కటే. భార్యా భర్తలు ఒక్కటిగా ఉన్నట్లుగానే.

MATT 18:6•

MARK 9:42•

LUKE 17:2

 

64ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నా భార్య పట్ల విజంగా నేను చింత కలిగియున్నానని నేనెట్లు ఆమెకు చూపించగలను? - వాక్యముతో నిలచి యుంటూనే - (అది) వాక్యము నందు నిలచి ఉంటూనే, కాని ఈ రకమగు ప్రశ్నను వేసినట్లుగా యున్నది: "నీవు బోధించు దానిని, నీవు విశ్వసించు దానిని ఎందుకు ఆచరణలో పెట్టవు?"

నీ భార్య ఈ విధంగా నీతో ఉన్నదని వ్రాశావు - అలాగనుటకు ఆమెకు హక్కున్నది. నీవు సరియగుట మంచిది. చూచారా, ఒకవేళ ఆమె కీడు చేయగోరి, అలాగనిన యెడల బైబిలు చెప్పిన దానిని గుర్తుంచుకొనుము, "నా ఈ చిన్న వారిలో ఒక్కరికి అభ్యంతరము కలుగజేయువాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్ర అగాధములో ముంచబడుట మేలు." అదే ఇప్పుడు నీ ప్రశ్న.

ఈ భార్య ఆ రకమగు వ్యక్తి కాకపోవచ్చును. ఆమె వ్యత్యాసముగా ఉండవచ్చును - ఆమె మంచి వ్యక్తి కావచ్చును. బహుశా నీవేమి చేయుదువో నిన్ను ఆమె పరీక్షించుచుండ వచ్చును.

65ఆమెను ప్రేమించుట మానవద్దు. నీలో యేసును ఆమె చూడ వలెను. నీవది చేయుము. చూచారా? నీవాలాగే ముందుకు సాగుము. ఒక వ్యక్తిని గూర్చిన చిన్న ఉదాహరణను మీకిచ్చెదను. ఒకసారి ఒకామె పరిశుద్ధాత్మను పొందినది. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె జీవితము చాలా కఠినముగా యున్నది. ఆమె భర్త ఒక త్రాగుబోతు. ఆమె అలాగే అతనితో సహించి జీవితము గడుపుచున్నది. అతడు ఇట్లనెను, "నీవు ఆలయమునకు వెళ్ళగోరుచున్నావు గదా? వెళ్ళు, కాని నేను ఆ పాత బ్రవున్ డెర్బీ యొద్ద నున్న సారాయి దుకాణమునకు వెళ్ళెదను." ఆ విధంగా వారు చేయుచున్నారు. బోనిఫయిర్స్ అని ఆ కాలములో పిలచెడి వారు. మీకు గుర్తుండియుండును. ఆ మూలన బోనిఫయిర్ వారుండుట మీలో పాతకాలపు వారికి గుర్తుండియుండును. ఇప్పుడు దానిని బ్రవున్ డెర్బీ అనుచున్నారు.

66అక్కడే అతడు కాలము గడుపును కాని ఒక సంగతి ఎరుగుడి, ఒక రాత్రి అతనికి సంఘము గురించి, క్రైస్తవుల గురించి ప్రశ్న వచ్చెను. ఒక త్రాగుబోతు అక్కడ కూర్చొని ఇట్లనెను, "అదంతా బూటకము, క్రైస్తవులను వారు ఇక ఇప్పుడెవరూ లేరు. వీరు వేషధారులు. క్రైస్తవులు ఇపుడెచ్చటా లేరు. వారిని చూడు, ధూమపానము, త్రాగుడు, మనవలె అన్నీ పనులు వారు చేయుచున్నారు. క్రైస్తవులుగా పిలిపించుకొనుచున్నారు, అంతేగాని నిజమైన వారెవరూ లేరు."

ఈ త్రాగుబోతు వెంటనే లేచి ఇట్లనెను, "ఒక్క నిమిషం ఆగు! నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు."

"ఎవరది?" అనడిగాడు.

"నా భార్య," అన్నాడు. చూచారా? ఆమె ఉప్పుగా మారినది. దానిని అతడు గమనించుచునే యున్నాడు.

"ఆమెను ఒత్తిడికి గురిచేస్తే…." అన్నాడు.

"ఆమెను ఎంతగా నీవు నలిపినా ఆమె క్రైస్తవురాలిగా మిగిలి యున్నది. దానిని నీకు నిరూపించెదను. మనం ఒక పని చేయుదము. ఇంటికి వెళ్ళుదము. ఆమె క్రైస్తవురాలో, కాదో నీకు చెప్పెదను. పద ఇంటికి వెళ్ళుదము. బాగా త్రాగి పోదాం. తప్ప త్రాగిన వారి వలె ప్రవర్తించుదం. తలుపులు తన్నుదాం. అన్ని విసిరి కొడదాం. అన్ని విధములా విసగించుదం. ఆమెను మన కొరకు భోజనం తయారు చేయమని అడుగుదం. మనకు హమ్ మరియు గ్రుడ్లు కావలెనని చెప్పుదాం. ఆమె వాటిని తయారు చేసి బల్ల మీద పెట్టినప్పుడు, ఆ ప్లేటును విసిరి నేలకు కొడదాం. గ్రుడ్లు ఈలాగేనా చేసేది? అని ప్రశ్నించి గందరగోళం సృష్టించుదం," అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిరి.

67వారు వెళ్ళి, అనుకొన్నట్లుగానే కూర్చొనిరి. ఆమె బయటకు వచ్చినది; ఆమె ఇట్లన్నది, "ఏమండీ, వాటిని తయారు చేయలేదు. క్షమించండి; ఇప్పుడు తయారు చేయుదును."

"ఓ, బుద్ధిలేనిదానా, ఆ విధంగా నాకు ఇష్టముండదని నీవెరుగవా?" అని చెప్పి గల్లంతు సృష్టించారు. వారు బయటకు వెళ్ళి, కూర్చొనిరి. నిజంగా త్రాగిన వారివలె ప్రవర్తించారు. ఆమె తనలో తాను సన్నగా స్వరముతో ఏదో పాట పాడుట వారికి వినిపించినది:

యేసు ఒక్కడే సిలువను సహించెను,

సర్వలోకము స్వేఛగా పోవునట్లు?

ప్రతి వారికి ఒక సిలువున్నది,

నాకును ఒక సిలువ ఉన్నది.

ఈ త్యాగపూరిత సిలువను నేను మోయుదును

మరణము నన్ను స్వేచ్చగా పోనిచ్చు వరకు,

ఒక త్రాగుబోతు మరియొకని వైపు చూచి ఇట్లనెను, "ఆమె క్రైస్తవురాలు; అది ఆమెకు ఉన్నది!" ఆ చిన్న స్త్రీ తన భర్తను, అతనితో పాటు ఈ వ్యక్తి ఆ రాత్రి క్రీస్తు యొద్దకు నడిపించెను. చూచారా? ఎందువలన? చూచారా? చాలా మధురముగా ఉన్నది. గుర్తుంచుకొనండి, ఆయనకు అన్నియూ తెలియును.

కావున సోదరీ సోదరుడా, నీవెవరవో నాకు తెలియదు. ఇది వ్రాసినది సోదరుడే. అతడు తన భార్య గూర్చి అడిగెను. నీవు ఉప్పు వలె యుండుము. వారు దాహము గొందురు. ఆమెకు అందులో ఏదయినా కనబడినప్పుడు దాహము గొనును. అలాగు లేనియెడల, గుర్తుంచుకొనుము, ఇప్పుడు నీకు ఒకవేళ సరయిన వ్యక్తి దొరకనిచో, వెయ్యేండ్లపాలనలో సరయిన దానిని పొందెదవు. అలాగే కొనసాగుము; అన్ని తప్పులు అక్కడ ఒప్పులుగా చేయబడును.

68ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీవు ఆలయములో బోధించుచున్నప్పుడు వధువుగా నున్నవారు వచ్చి విందురు. మరి బయటి ఏ సంఘమునకు వెళ్ళకూడదని నీవు బోధించుచున్నావా? (ఈ ప్రశ్నలో ద్వంద్వ అర్ధమున్నది)

69ప్రశ్న: ఆదివారమును ఆచరించనవసరము లేదని నీవు బోధించుచున్నావా? ఆదివారము లేదా సెలవు దినమున పనికి, చేపల వేటకు, తదితర పనులకు వెళ్ళవచ్చునని బోధించుచున్నావా? (నాకది ఆదివారము వలెనే కనబడుచున్నది. అడుగున వ్రాయబడియున్నది - సెలవు లేదా ఆదివారము అని యున్నది. అదెట్లు కనబడుచున్నది? ఆదివారము మరియు పరిశుద్ధ దినము అని వ్రాసెను.)

కాదు! నీవు పొరబడియున్నావు. చూచారా? దీనిని ఇంకా ముందుకు వెళ్ళి నేను జవాబు ఇచ్చెదను.

"వధువు ఏ ఇతర ఆలయమునకు వెళ్ళరాదని నీవు బోధించుచున్నావా? నీవు ఆలయములో బోధించునప్పుడు మాత్రమే హాజరు కావలెనా?" లేదు! దానిని నేను బోధించలేదు. అది నేను నమ్ముట లేదు; దాని యందు నాకు విశ్వాసము లేదు. దేశములో పలు ప్రాంతములకు చెదరిపోయి సేవ చేయుచున్న సేవకులు ఇచ్చటున్నారు. వారు వధువులో భాగముగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. స్త్రీ అయినా, పురుషుడయినా వాక్యమును బోధించు సంఘమునకు వెళ్ళవచ్చును. ఎక్కడికయినా వెళ్ళీ, విన వచ్చును. వారు పూర్తి వాక్యమును బోధించనియెడల, పూర్తి వాక్యమును బోధించు సంఘము నీకు దొరకు వరకు సగం వాక్యమును బోధించు ఆలయమునకు వెళ్ళుము. నీవు ఆలయమునకు మాత్రము వెళ్ళవలెను. అది మానవద్దు.

EXOD 16:23-30•

LUKE 14:5

 

70"ఆదివారమును లేదా ఏ పరిశుద్ధ దినమును మేము ఆచరింపరాదని నీవు చెప్పుచున్నావా? ఆదివారము నాడు పనికి, చేపల వేటకు వెళ్ళ వచ్చనని బోధించుచున్నావా? "

సంఘమునకు వెళ్ళవలసిన ఆదివారమునాడు నీవు పనికిరాని, చేపలకు గాని, వేటకు గాని వెళ్ళుట పాపమని నేను నమ్ముచున్నాను. నీవు దేవుని యొక్క శాసనమును మీరి పాపము చేయుచున్నావు. "అటువంటి ఆజ్ఞ ఏదైనా ఉన్నదా?" అవును. ఉన్నది. పాత నిబంధనలో దీనికి మాదిరిగానే సబ్బాతు ఉన్నది. నీవు సబ్బాతు దినములను ఆచరింపవలెనని యేసు రాలేదు. పాత కాలపు సబ్బాతు దినము శనివారము, అది వారము యొక్క అంతము. ఆదివారము ఎనిమిదవ దినము, లేక వారములో మొదటిది, ఆ దినమున యేసు లేచెను.

మీరు ఎక్కడో దూరాన అరణ్యములోనికి వెళ్ళారనుకొనండి. మీరచ్చటికి వేట కొరకు వెళ్ళి యుందురు. అక్కడ సంఘము ఏదియూ ఉండదు. అటువంటిది ఏదీ ఆ ప్రాంతములో లేదు. ఇక మీరేమి చేయలేరు. మీరు చేపల వేటకు వెళ్ళినట్లయితే, సరే మంచిది, అని నేను నమ్ముచున్నాను. మీరు పట్టణమునకు దరిదాపుగా ఉన్నయెడల, లేదా సంఘమున్న స్థలములో ఉన్న యెడల, ఏ విధముగానయినా గాని ఆలయమునకు హాజరవుదురు, ఏదో చోటికి వెళ్ళెదరు.

పనికి సంబంధించినంత వరకు నేను నమ్ముదానిని చెప్పుచున్నాను. ఒక ఎద్దు గాని గోతిలో పడిపోయినప్పుడు, లేదా ఆదివారము ఏదయినా చేయవలసి వచ్చినప్పుడు, ఆ పనిని మీరు చేయవచ్చును. మీరు చేయలేని దానిని గూర్చి మీరేమి చింతించవద్దు. అప్పుడే మీరు చేయ వచ్చును. కాని దానిని చేయ వలెనని ఆదివారము వరకు ఆగుట తప్పు. అలాగు పధకము వేయుట పొరపాటు. చూచారా? అలాగు మనము చేయుట తప్పు. ఆ పరిశుద్ధ దినమును మనము గౌరవించవలెను.

71ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఏదో ఒక స్థలములో యున్న సంఘమునకు వెళ్ళుడి. ఒక ప్రత్యేక శాఖా సంఘమును నేను ఎత్తి చూపగలను, కాని అలాగు చేయను, ఎందుకనగా ఈ సంఘము బోధించుచున్నదానిని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు దేవుని కుమారుడని వారు నమ్ముచున్నట్లుగా వారు చెప్పుచున్నారు. సరే, దానిని నేను నమ్ముదును. నీటి ద్వారా పాపములు క్షమించబడునని వారు నమ్ముదురు. ఇంకా వారి ఇతర బోధలున్నవి. ఇది ఏకత్వము కాదు; వారు అదే చేయుచున్నారు, కాని వారిని గూర్చి నేను మాట్లాడుట లేదు. నీటి ద్వారా నూతన జన్మ అని వారు నమ్ముచున్నారు. ఇంకా ఇతర బోధలున్నవి. వాటిని నేను నమ్మను. దైవిక స్వస్థతను వారు దయ్యమునకు సంబంధించినదని నమ్ముచున్నారు. అక్కడే ఒకే ఒక విషయమున్నది. ఆ గ్రంథములో నీ పేరు వ్రాయబడియుంటే చాలునని చెప్పుదురు. అందులో నీ పేరు లేనిచో నశించినట్లే అందురు. దానిని నేను నమ్మను. వెళ్ళుటకు మరే ఇతర సంఘము లేనియెడల, ఇక్కడ నేను విమర్శకునిగా వెళ్ళగోరుట లేదు, నేను అక్కడికి నా సన్నిధిని కనబరచు నిమిత్తము ఆ ఉద్దేశ్యముతోనే వెళ్ళుదును. నేను ఎవరి ప్రక్కనే కూర్చొని యుండి, నా హృదయములో యున్న క్రీస్తును బట్టి వారిని ప్రభావితము చేయుదును. వారి మధ్యకు వెళ్ళుడి, కాని వారి అవిశ్వాసములో సహవారసులు కావద్దు.

MATT 5:6•

MARK 11:24

 

72ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నేను పరిశుద్ధాత్మను పొందగోరుచున్నాను. ఏమి చేయవలెనో తెలిసికొనగోరుచున్నాను. నా కుటుంబ రక్షణ కొరకు నేను భారము కలిగియున్నాను. ఈ సోదరి తన సంతకమును చేసినది.

నీవు పరిశుద్ధాత్మను పొందగోరిన యెడల, ప్రియ సోదరీ, ఒక సంగతిని నీతో చెప్పుచున్నాను. నీవిక్కడున్నచో వినుము. నెవిల్ సోదరుడా, ఆమె ఈ సంఘములో సభ్యురాలేనా? వారు నాకు కూడా జ్ఞాపకము లేరు. సోదరీ, నీవు ఇచ్చట ఉన్న యెడల, బఫ్ సోదరీ, నీవిచ్చట ఉన్న యెడల ఈ విషయమును చెప్పుచున్నాను. బైబిలు ఇట్లు చెప్పుచున్నది, "నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు." దానిని నీవు కోరినా గాని నీకు ఆశీర్వచనము కలుగును. చూచారా? గుర్తుంచుకొనుము, దానిని నీవు పొందలేదు గాని దాని కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, ఎందుకనగా వారు తృప్తిపరచబడుదురు. దానితోనే నీవు నిలచియుండుము.

"నా కుటుంబము కొరకు నేనేమి చేయవలెను?" నీ కొరకు నీవు ఉపయోగించుకొనిన విశ్వాసమునే నీ కుటుంబము నీవు ఉపయోగించుకొనుము. వారిని ప్రభువుకు అప్పగించుకొనుము. వారు రక్షించబడుదురని నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముము. ఇక్కడ నీ స్వాభావిక ఆలోచనకు తావు ఇయ్యవద్దు. దానిని ఎక్కడో అంతరంగపు లోతనుకు జారిపోనిమ్ము. ఆ మనస్సు యొక్క లోపలకు పోవలెను. అప్పుడది నీది అగును. ఆ విధముగా నీవు చేసినప్పుడు దేవుడు వారిని నీకిచ్చును.

ఇక్కడ నీ హృదయములో - ఏమి ఉన్నదో దాని కొరకు అడుగుము. నీవు ప్రార్థించునప్పుడు నీవడిగిన దానిని పొంది యున్నట్లుగా విశ్వసించుము. అప్పుడు నీవిక సందేహింపరాదు. నమ్ముట మరియు సందేహము ఒకేసారి నీకుండరాదు. ఎందరికి ఇది తెలియును? ఒకే సమయములో నీవు నమ్మికను మరియు సందేహమును కలిగియుండలేవు. నీవడిగిన దానిని నీవు పొందినట్లు విశ్వసించవలెను, అప్పుడది నీకనుగ్రహించబడునని ఆయన చెప్పెను. కావున నీ కుటుంబము కొరకు నీవు విశ్వసించుము, వారు దానిని పొందెదరు.

73ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మా కుమారుని సంగతి ఏమిటి? బూరల గూర్చి బోధించుట లేదు. అతని గురించియు, ఏడు బూరల గురించియు ఫోనులో నీవు నాకిచ్చిన వాగ్దానమును గుర్తుచేసికొనుము.

అది నాకు జ్ఞాపకము లేదు. అదేమిటో నాకు గుర్తులేదు. అయితే దానిని గూర్చి బిల్లీకి తెలియును. నేనేమి వాగ్దానము చేశానో దానిని గూర్చి నాకు జ్ఞాపకము లేదు గాని అది జరుగును. మీరెరుగుదురు - కొన్నిసార్లు రాత్రులందు ఒకే సమయములో ముప్పయి లేదా నలుబది పిలుపులకు జవాబు ఇచ్చుచుందును. (మీరు చూచారా?), కావున నాకు ఏ రాత్రి దేనికి జవాబు ఇచ్చానో గుర్తుండుట లేదు - కొన్నిసార్లు అదేమిటో నేను గుర్తుచేసికొందామన్నా గుర్తుకు వచ్చుట లేదు.

ప్రశ్న: నా కాతలిక్కు సోదరి మరియు సోదరుడు గురించి ఏమిటో చెప్పుము? నీకు వందనములు.

74ఈ వ్యక్తి పట్టణములో నుండి కాక దూరము నుండి వచ్చి యున్నాడు, టెక్సాస్ నుండి వచ్చి యున్నాడు. సోదరీ, నీవు టెక్సాస్ నుండి వచ్చిన యెడల ఈ టేపు తీసికొనుము. టేపు ఉన్నదని తలంచుచున్నాను. (దీనిపై టేపు ఉండదు అని నేను అనుకొనుచున్నాను). వారు టేపు తయారు చేయుచున్నారా? దానిని మీరు తయారు చేయుచున్నారా? మంచిది. ఏమిటో నేను చెప్పెదను. ఈ టేపు మీద ఉన్న దానిని గుర్తుంచుకొనుము. "మా కుమారుని గురించి, ఏడు బూరల గురించి ఏమిటి? దానిని గూర్చి నాకు జ్ఞాపకము లేదు. ఏడు బూరల సమయములో అతనిని నేను చూచెదనని వాగ్దానము చేసియుందునేమో. అలాగు వాగ్దానము చేసిన యెడల అతనిని నేను కలిసికొందును. "ఏడు బూరలను గూర్చి నేను బోధించలేదు. బూరల పండుగ గూర్చి నేను బోధించాను. దానిని గూర్చి మీరు అర్థము చేసికొన్నారా?

"నా కాతలిక్కు సోదరి మరియు సోదరుడు గూర్చి ఏమిటి?" వందనములు శ్రీమతి. కారినల్సనకు చెప్పుచున్నాను. ఆమె గాని ఇచటున్నచో ఈ ఉదయమున బిల్లి పాల్ ను చూడవలెనని కోరుచున్నాను, లేనియెడల అదేమిటో నాకు అర్థము కాదు. (మీరు చూచారా?); అది కేవలము ఒక ప్రశ్న. దానిని గూర్చి నేను గుర్తుంచుకోలేదు, చూచారా, ఆమె కుమారుని గూర్చి మరియు బూరల గూర్చి వారి కాతలిక్కు సోదరి గూర్చి నేను ఎదో వాగ్దానము చేసియున్నాను. అది నా మస్సులో లేదు. ఇప్పుడు జ్ఞాపకము లేదు. కావున బిల్లీని కలిసికొనండి.

అది కేవలము ఒక ప్రార్థన విన్నపము. ఆ వ్యక్తి యొక్క పేరును వ్రాసేను. "తలనొప్పి మరియు సైనస్ వ్యాధి," అని వ్రాసెను. వారి కొరకు ప్రార్థించవలెనని అడిగినట్లు నేను తలంచుచున్నాను. మంచిది.

75ప్రశ్న: దయచేసి వివాహము మరియు పరిత్యాగము గూర్చి వివరించుము, దానిని ఇంతకు ముందే చూచాను. ఇవి ఏడు ప్రశ్నలు - ఒకే కాగితము మీద ఎనిమిది ప్రశ్నలున్నవి.) దయతో వివాహము మరియు విడాకులను వివరించుము.

నేను వివరించాను.

76ప్రశ్న: మోషే మరియు ఏలీయాలు ఇప్పుడు భూమి మీద ఉన్నారా? ఇప్పుడు మోషే మరియు ఏలీయాలు భూమి మీద ఉన్నారా? వారు అమెరికాలో యున్నారా?

కాదు! చూచారా? లేదు, వారు ఇచ్చట లేరు; సంఘము ఎత్తబడిన తరువాత వారు వచ్చెదరు గాని అంత వరకు రారు. అప్పుడు మోషే మరియు ఏలియాలు వచ్చెదరు. దానిని ఎందరు అర్థము చేసికొనిరి? మంచిది. మనం చూద్దాం. వారు దీనికి ఏ సంతకము చేయలేదు. మంచిది. ఈ ప్రశ్నలు అడిగినవారెవరో గాని ఏడు అడిగిరి. ఏడు అని నేను వ్రాశాను. మంచిది!

77"యేసు నామమునకును" మరియు "యేసు నామము" నకును

మధ్యగల భేదమును వివరించుము. (ఒక్క నిమిషము ఆగుము.) "యేసు నామము" మరియు "యేసు" నామము మధ్యగల భేదము. ఒకే విధంగా వాటిని అన్వయించినయెడల ఆ రెండునూ ఒక్కటే, చూచారా, ఒకే వ్యక్తికి ఆ యేసు నామమును అన్వయించవలెను. అది యేసు నామము. యేసు నామము - యేసు ఏమై యున్నాడో ఆ నామము చెప్పును. యేసు నామము ఆ వ్యక్తిని గూర్చి మాట్లాడును. అది అర్థ సహితముగా వినిపించుట లేదా? యేసు అను నామము ఆ వ్యక్తిదే. నీవు యేసు నామమును ఎత్తి చూపునప్పుడు, ఆ వ్యక్తిని గూర్చి చెప్పుచున్నట్లే, చూచారా.

నా పేరు విలియం అని చెప్పండి. అనగా నేనే. మంచిది. నేను విలియం పేరు పెట్టుకొన్నాను, అనగా మీరు నన్ను ఎత్తి చూపుతున్నారు. అది నా పేరు, చూచారా.

GEN 22:4•

EXOD 3:14•

EXOD 6:3•

PS 83:18•

JOHN 6:31,49,58•

JOHN 8:52-58

 

78ప్రశ్న: వేర్వేరు యుగములలో ప్రభువు యొక్క నామము మారి యున్నదా?

అవును, అవును! ఒకప్పుడు ఆయనను పిలచిన తీరు చూడండి - నేను ఉన్నవాడనని ఆయన పిలచుకొనెను. ఆయనను యెహోవా అని పిలచిరి. ఆయన చాలాసార్లు పేరు మార్చుకొనెను. చివరిసారిగా ఆయన మార్చుకొనిన దానిని దేవుడు శరీరధారియైనప్పుడు చూచెదము. ఒక మానవ పేరును ఆయన ధరించెను.

యెహోవా, నేనున్నవాడను , ఇవన్నియూ ఆయన నామమునకు బిరుదులు. చూచారా? నీవు యెహోవా నామములో బాప్తిస్మము పొందియున్నావు, అది యేసుక్రీస్తు నామమై ఉండవలసి యున్నది. యెహోవా రాఫా, యెహోవా మనషే, యెహోవా యీరే, మొదలగువానిలో నీవు బాప్తిస్మము పొందియున్నావు. అవన్నియూ యేసుక్రీస్తు అయి యుండవలెను. ఉన్నవాడననువాడు యేసు క్రీస్తే.

గుర్తుంచుకొనండి, ఆ దినమున ఆయన నిలబడి ఇట్లు చెప్పెను, "అరణ్యములో మన్నాను తిన్నామని మీరు చెప్పుకొనుచున్నారు."

"మా పితరులు మన్నాను తినిరి."

"వారు చనిపోయిరి!" అని ఆయన చెప్పెను.

"నీవు పిచ్చివాడవని మాకు తెలియును, ఎందుకనగా నీవు ఏబది సంవత్సరముల వయస్సు కూడా లేనివాడవు. అయినా అబ్రాహామును చూచానని చెప్పుకొనుచున్నావు."

"అబ్రాహాము కంటే ముందే నేనున్నాను. నేను ఉన్నవాడను." చూచారా? ఆయనే ఆ ఉన్నవాడు. ఆయన నామమునకు ఈ బిరుదులన్నీ చెందియున్నవి. దేవునికి ఒక మానవ పేరున్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు. మంచిది.

79ప్రశ్న: ముద్రలు విప్పబడినప్పుడు కాలము ముగిసినచో - అప్పుడు వెయ్యేండ్లపాలన కూడా ముగియును గదా? అవునా?

కాదు, అది జరుగదు. ముద్రలు విప్పుబడినప్పుడు సమయము సమాప్తము కాదు. దానిని అపార్థము చేసికొనిరి. జరిగినదేమనగా - మర్మములు బయలుపరచబడినవి కానీ సమయము సమాప్తము కాదు, చూచారా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా దానిని గమనించవలెను. మీ యొద్ద ఆ టేపు ఉన్నచో దానిని వినండి.

GEN 5:1,24•

REV 20:4,7,8•

REV 21:1

 

80సమయము అంతము కాదు. ఈ ప్రశ్నను వెయ్యేండ్లపాలన తరువాత ఏమి జరుగునని అడిగియుందురు లేదా అటువంటి ప్రశ్మయే. ఎందుకనగా చూచారా? సంఘము ఇంటికి వెళ్ళిపోయిన తరువాత మనకు వెయ్యి సంవత్సరములు ఉండును భూమి మీదికి అది తిరిగి వచ్చును. కొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో సమయము ఇక ఉండదు.

వెయ్యేండ్లపాలన అనగా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము కాదు. వెయ్యేండ్లపాలన తరువాత ఇంకా పాపముండును. నోవహు ఓడలోనికి వెళ్ళిపోయి, పైకి కొనిపోబడి, మరియొక వైపున హాము ఇంకా ఇతరులను తీసికొని వచ్చెను. దానికి వెయ్యేండ్లపాలన ఒక మాదిరి. పాపము ఆ ఓడలో నుండి బయటకు వచ్చియున్నది. చూచారా?

కాని హనోకు, రూపాంతరము చెందెను, ఎత్తబడిన వధువుకు మాదిరి, మోసికొనిపోబడిన వారికి సాదృశ్యము కాదు. కావున వెయ్యేండ్లపాలనకు ఆవలగా ఇంకా పాపము ఉండును, కాని వెయ్యేండ్లపాలనా కాలములో కాదు, చూచారా. వెయ్యేండ్లపాలన కాలములో సమాధానముండును, చూచారా. కాని వెయ్యేండ్లపాలనకు ఆవల గల పాపము పని ముగియును, అప్పుడు కాలము అంతరించి పోవును.

పరిశుద్ధాత్మ ద్వారానే ఏడు ముద్రలను విప్పుట జరిగెను. మన వెనుక గల యుగములలో విడిచిపెట్టబడిన దానిని ముద్రలు తెలియచేసినవి.

81ఒక గొప్ప వేదాంత పండితుడు దానిని గూర్చి విమర్శించెను, అతడిట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, ఒక దినమున దేవుడు ఆ ఏడు ముద్రల యొక్క మర్మమును ఇచ్చును. ఆ ఏడు ముద్రల గూర్చి ఇంకా మనం ఎన్నడూ నేర్చుకొనలేదు. అది బైబిలులో లేని ఒక అంశము." కాదు, కాదు! అది అలాగు కాదు. అతడు చెప్పినది నిజమే అయినచో నేను అబద్ధ ప్రవక్తనగుదును. (చూచారా?) యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత యావత్తు ఈ వాక్యములో సంపూర్తి అయ్యెను, చూచారా. ఏడు ముద్రలు ఏడు సంఘ కాలములకు చెంది యున్నచో అది ఎప్పుడో గతించినదై యండవలెను, ఎందుకనగా మనము లవొదకయ సంఘ కాలములో యున్నాము. ఆ వెనుక విడిచి పెట్టబడిన దానిని ఏడు ముద్రలు బయలుపరచుచున్నది. అందులో విడిచి పెట్టబడినవాటిని ఇవి బయలుపరచినవి. లూథరు విడిచి పెట్టినవి, వెస్లీ విడిచి పెట్టినవి, మిగిలిన సంస్కర్తలు విడిచిపెట్టినవి, పెంతెకోస్తు వారు విడిచిపెట్టినవి, ఈ కాలము వరకు విడిచి పెట్టబడినవి అందులో యున్నవి.

REV 11:3•

REV 20:4,11

 

82సంఘము యొక్క రూపాంతరము, మోషే మరియు ఏలియాల యొక్క ఆగమనము, భూమి మీద వెయ్యేండ్ల - పరిపాలన, అనగా పెండ్లి కుమారునితో వధువు వెయ్యి సంవత్సరములు జీవించుట, తీర్పు సింహాసనము, పాపము యొక్క సంపూర్ణ నాశనము ఇక మిగిలి యున్నది. ఆ సమయము వచ్చుసరికి ఇక ఏమి సమయముండదు.

ముద్రలు, ఎన్నడూ సమయమునకు అంతము కావు. వెయ్యేండ్ల పాలన తరువాత వరకు కాలము మరియు రుతువులు ఉండెను. మీరడిగినది కాదు. వెయ్యేండ్లపాలన తరువాతను సమయము ఉండును.

MATT 25:32•

2PET 3:8•

REV 20:2,11

 

83ప్రశ్న: వెయేండ్లపాలనకు వేయి సంవత్సరములతో ఏమయినా పని యున్నదా? అది ఒక తరము కాదా?

కాదు! బైబిలులో ఒక తరమనగా నలుబది సంవత్సరములు, బైబిలు ఇట్లు చెప్పెను, "వారు క్రీస్తుతో కూడా ఒక వెయ్యి సంవత్సరములు జీవించి పరిపాలన చేయుదురు." అది భూమి మీద ఒక వెయ్యి సంవత్సరములు, ఎందుకనగా భూమి మీద వెయ్యి సంవత్సరములు అనగా అది ఒక సమయమునకు లెక్క, దేవునికి ఉపమాన రీతిగా, చెప్పవలెనన్నచో అది ఒక దినము. ఈ భూమి మీద వెయ్యి సంవత్సరములు దేవునికి ఒక్క రోజుతో సమానమై యున్నది. అది దేవుని యొక్క సమయపు లెక్క. ఇప్పుడు దీనిని ఎందరు అర్థము చేసుకొనిరి?

కావున, ఆ సబ్బాతు దినమున సంఘము ఇక ఏ మాత్రము పాపపు వేదనను కలిగి యుండదు. కొంత కాలము పాటు సాతాను బంధించబడును, అనగా వేయి సంవత్సరములు బంధింపబడును, ఎందుకనగా వాని అనుచరులందరూ నరకములో యుందురు. భూమి మీద నున్న సంఘము విమోచించబడును. క్రీస్తు యొక్క సముఖములో యుండును. కావున దానికి ఇక ఏ పనియు ఉండదు. కావున అది ఒక గొలుసు కాదు, నేను చెప్పినట్లుగా, కర్ర గొలుసు కాదు గాని అది పరిస్థితుల గొలుసు; వానికి చేయుటకు ఏమియూ లేదు. వాడు నిస్సహాయుడు గాను, నిరీక్షణ లేనివాడు గాను ఉండును, ఆ అనుచరుల పునరుత్థానము కొరకు ఎదురు చూచును; ఆ తరువాత వారు మేకలలో నుండి గొర్రెలు వేరగునట్లుగా వేరు చేయబడుదురు.

1KGS 10:6,7

 

84ప్రశ్న: ప్రభువు యొక్క నామము సొలోమోనో కాదో పరీక్షించి తెలిసికొనవలెనని షేబ దేశపు రాణి స్వయముగా రాలేదా? (నాకిది అర్ధము కాలేదు. కాస్త ఆగండి.) ప్రభువు యొక్క నామము నిజంగా సొలోమోనో కాదో పరీక్షించి తెలిసికొనగోరి షేబ దేశపు రాణి స్వయంగా రాలేదా? (ఇది బహుశా నాకు అర్థము కాలేదు. క్షమించండి. ఒక్క నిమిషము ఆగుదము. మరల దీనిని చదివెదను.) ప్రభువు యొక్క నామము నిజంగా సొలోమోనో కాదో పరీక్షించి తెలిసికొనవలెనని స్వయంగా షేబ దేశపు రాణి సొలోమోను యొద్దకు రాలేదా?

కాదు! దేవుని పేరు సొలొమోనో కాదో పరీక్షించి తెలిసికోవలెనని ఆమె ఎన్నడూ రాలేదు. సొలోమోను ఒక రాజు. ఆమె వచ్చి ఇట్లన్నది, "దేవుడు నిజముగా తన రాజుతో యున్నాడు. ఆయన తన ప్రజలతో ఉన్నాడు." చూచారా? ఆమె వచ్చి సొలోమోను యొక్క వరమును పరీక్షించినది, ఎందుకనగా సొలోమోను బయలుపరచిన సంగతులు ఆమె యొక్క హృదయములో ఉన్నవి. భూమి మీద అతడే దేవుని రాజని ఆమె గమనించినది.

1KGS 10:2

 

85మీకు గుర్తుండియుండును. షేబ ఏ దేశము నుండి వచ్చెనో మీరెరుగుదురు. ఆ జనుల గూర్చి మీకు తెలియును. జరుగుచున్న గొప్ప విషయములను గూర్చి చెప్పుచుండెను. వారి రాజును దేవుడు అభిషేకించెనని ఆ జనులు చెప్పుకొనుచుండిరి. ఆ రాజు దేవుని చేత ఎట్లు అభిషేకించబడెనో వారికి తెలిసెను. దేవుని పేరు సొలొమోను అని ఆమె తలంచెనని నేను నమ్మను. ఆమె గాని ఆ విధమగా చేసినచో, అన్యురాలుగా పరిగణించబడును. చూచారా? అలాగు ఆమె చేసియుండగలదు. ఆమె తన హృదయములో సొలోమోను దేవుడై యుండునని తలంచియుండును - సొలోమోను దేవుడై యున్నాడని అనుకొనియుండును, ఎందుకనగా ఆమె ప్రారంభమే అన్యురాలు. కాని ఆమె హృదయములో ఉన్నదానిని అతడు తన వివేచన వరము ద్వారా బయలుపరచెను, వారు దానిని జ్ఞానమని పిలచిరి, దానినతడు వివేచించెను, దేవుడు సొలొమోనుకు తోడై యున్నాడని ఆమె ఎరుగును. ఆ కారణముచే ఆమె అలాంటి మనస్సుతో వచ్చి యుండవచ్చును.

86ఈ ప్రశ్నను అడిగిన వ్యక్తి ఇచ్చట ఉండి యుండవచ్చును, "ప్రభువు యొక్క నామము నిజంగా సొలొమోనే అని ఆమెకు తెలియునా?" అని అడిగియున్నాడు. చూచారా? సొలోమోను ప్రభువు కాడు. దానిని ఆమె ప్రజల ద్వారా వినినది, ఎందుకనగా వారు యెహోవాను ఆరాధించుచుండిరి. అక్కడ గొప్ప మందసమున్నది. గొప్ప నిబంధన యున్నది. దేవుని యొక్క ఆజ్ఞలు ఆ మందసములో యున్నవి. సీనాయి పర్వతము గూర్చి, ఇంకా ఆయా స్థలముల గూర్చి ఆమె వినినది. ఆ నిబంధన యొక్క దేవుడు ఈ వ్యక్తిలో యున్నాడని ఆమె చూచినది, ఎందుకనగా అతనికి వివేచన యున్నది, అది దేవునికి మాత్రమే చెందును, చూచారా. కావున సొలొమోనులో దేవుడున్నాడని ఆమె చూచినది. ఆ ప్రశ్న అడిగిన వారి భావము ఇదే అయి యుండునని తలంచుచున్నాను. కానీ చదివినప్పుడు ఇట్లున్నది, "ప్రభువు యొక్క నామము నిజంగా సొలొమోను అని ఆమెకు తెలియనా?" బహుశా వారు తమ తలంచిన దానిని సరిగ్గా వ్రాసియుండకపోవచ్చును. మీరు చూచారా? కాబట్టి వారు ఈ విధంగా తలంచి యుందురు. "సొలోమోనులో ప్రభువుండెను." అవును. అది నిశ్చయము. అడిగిన ప్రశ్న అదే అయినచో అది నిజమే. ఆమెకు దేవుడు తెలియును. అందువలననే ఆమె ఆ మాట పలికినది. ఆమె మరి ఏ దేవుని ఆరాధించుట లేదు. ఆమెలో ఇక ఏ సందేహము లేదు. ఆమెకు ఇక ఏ ప్రశ్నయూ లేదు. సొలోమోను మొత్తం బయలుపరచెను. దేవుడతనికి తోడైయుండెనని ఆమెకు తెలియును.

87ప్రశ్న: జస్టిస్-ఆఫ్-పీస్ ద్వారా ఇరవై-ఒక్క సంవత్సరాల క్రితం మేము పెండ్లి చేసికొనియున్నాము, అది తప్పా?

అవును, మీరాలాగు చేయుట తప్పు. వివాహమనునది దేవుని యొక్క గృహమునకు చెందును. కాని మీరు ఆ విధంగా పెండ్లి చేసికొనియున్నారు. మీరు ఒకరితో ఒకరు ప్రమాణము చేసికొని యున్నారు గనుక పెండ్లి చేసికొనినట్లే. మీరు ఒకరినొకరు స్వీకరించుకొనినట్లుగా వాగ్దానము చేసికొనియున్నారు. జస్టిస్-ఆఫ్-పీస్ శాఖవారు మీకు లైసెన్సు ఇచ్చిరి. అది చట్ట పూర్వకము. భార్యా భర్తలుగా జీవించుచున్నారు. కామన్-లా ప్రకారము భార్య భర్తలు కారు. స్త్రీ ఆ పురుషునితోను, పురుషుడు ఆ స్త్రీతోను వాగ్దానము చేసికొనిరి. ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా యుందురని వాగ్దానము చేసికొనిరి. భార్యగా ఆమెను, భర్తగా నిన్ను స్వీకరించుట జరిగినది. కావున మీరు పెండ్లి చేసికొనిరి. గుర్తుంచుకొనండి, గతవారము దానిని నేను వివరించితినని నమ్ముతున్నాను, చూచారా. మీరు ఒకరినొకరు వివాహము చేసికొని వాగ్దానము చేసికొనిరి, చూచారా.

బైబిలులోని పాత నిబంధన కాలములో చూడండి. ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రధానము చేసికొనును. ఆ చట్టము మీకు తెలియును. దానిని మీరినచో నిశ్చయముగా వ్యభిచారమే, ఎందుకనగా ఆతడు ఆలాగున వాగ్దానము చేసెను.

88ఒక రోజున ప్రశ్న అడిగిరి, "నిషేధము కూడా పరిత్యాగముతో సమానమా?" చూచారా? స్నేహితుడా, ఈ ప్రశ్నను మీరు అడిగినప్పుడు నాకేమనిపించినదో మీకు తెలియదు. రెండు లేక మూడుసార్లు పెండ్లి చేసికొనిన నా స్నేహితులు చాలామంది ఉన్నారు. నా స్వంత కుమారుడు బిల్లీ పాల్ తో నేను చెప్పినది మీరు గ్రహించారా? నేను బిల్లీ పాల్ ను సమర్థించుదునా? నిశ్చయంగా సమర్థించను. బిల్లీ పాల్ ఒక చిన్న బాలికను పెండ్లి చేసికొనెను. నా వద్దకు వచ్చి ఇట్లు చెప్పెను, "నాన్నా, నేను పెండ్లి చేసికొనబోవుచున్నాను."

నేను నా కారు కడుగుకొనుచున్నాను; "నీ తలను గోడకు వేసి కొట్టు," అన్నాను. నేను అలాగే నా కారు కడుగుకొనుచున్నాను.

"నేను పెండ్లి చేసికొనబోవుచున్నాను," అని చెప్పెను.

"సరే, పో అన్నాను. నేను నా పని చేసికొనుచున్నాను. అతడు తన తల్లి యొద్దకు వెళ్ళి అదే చెప్పుచుండెను, ఆమె నవ్వినది. అతడేమి చేసెనో మీకు తెలియునా? ఇంకా పాఠశాలలో చదువుచున్న ఆ బాలికతో వెళ్ళిపోయి పెండ్లి చేసికొనెను. ఆ బాలిక యొక్క తండ్రి, నేను కలిసి వివాహమును నిషేధించాము. ఆ పెండ్లిని మేము గుర్తించలేదు, కాని అతడు పెండ్లి చేసికొనెను. అతడు నా కుమారుడు, ఇక్కడ కూర్చొని ఇప్పుడు వినుచున్నాడు. ఇది నిజము.

ఇప్పుడతడు జీవించుచున్న బాలికతో కలిసి నా యొద్దకు వచ్చెను. ఆమె నా కోడలు. "నాన్నగారూ, మాకు పెండ్లి చేయదురా?" అనడిగెను.

"అది జరగని పని," అన్నాను. అతడు నా స్వంత కొడుకు. అతనిని నా చేతులలో పెంచాను. అతని కొరకు నేను చేయకలిగినదంతా చేశాను. అతనికి నేనే తల్లిగాను, తండ్రిగాను ఉన్నాను. ఇది నా హృదయమును ఎంత లోతుగా కోయునో మీరు గ్రహిచగలరా? అలాగు చెప్పినందుకు నేను చచ్చినంతగా బాధపడితినని మీరు గ్రహించగలరా? కాని ఇది సత్యము. నిశ్చయంగా! దీనిని నా కుమారుడు కూర్చొని వినుచున్నాడు. ఇపుడిచ్చట నా కోడలు, నా మనుమడు కూర్చొనియున్నారు. కాని అది తప్పు అని చెప్పాను. (చూచారా?), ఎందుకనగా నేనది చెప్పవలసియున్నాను. వాక్యము విషయములో నా బాధ్యతను నేను నిర్వహించవలసియున్నాను.

89మీరు మెజిస్ట్రేటు ద్వారా పెండ్లి చేసికొనినట్లు చెప్పుచున్నారు. మీరు సంఘములోనీ సేవకుని ద్వారా పెండ్లి చేసికోవలసి యున్నారు. ఒక క్రైస్తవుడు ఆ విధంగా సభ్యత కలిగిన పని చేయవలెను. కాని ఆ విధంగా మీరు వాగ్దానము చేసియున్నారు. మీరు ప్రమాణము చేసికొనియున్నారు. ఇరవై-ఒక్క సంవత్సరాల క్రితం పెండ్లి చేసికొనియున్నారు. అది సరేనని నేను తలంచుచున్నాను.

మీరు మరేదో చెప్పవచ్చును.

"నేను మరల వచ్చి పెండ్లి చేసికొనవలెనా? " అని మీరు ప్రశ్నించి యుండవచ్చును. అది మీ ఇష్టము. మీ విశ్వాసమును గలిబిలి చేయు దేనిని మీ మనస్సులో కలిగియుండరాదు, ఎందుకనగా ఏదయినా మీ మనస్సులో ఉన్నచో అంతకన్న మీరు చేయకలిగినది మరేదియూ లేదు. అక్కడే మీరు ఆగిపోవుడి. మీకు ప్రశ్న వచ్చినప్పుడు ఆగిపోక తప్పదు. కాని ఇప్పుడు, నాకది బాగుగానే ఉన్నది.

ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు బాప్తిస్మమిచ్చిన ఆయనే, నేను స్త్రీ బోధకుల విషయములో ఆయనతో ఏకీభవించలేదని నన్ను సంఘములో నుండి బయటకు పంపెను. అందువలన నేను తిరిగి బాప్తిస్మము పొందవలసిన అవసరం రాలేదు. చూచారా? నిశ్చయంగా రాలేదు. చూచారా? అది పరవాలేదు.

90కానీ గుర్తుంచుకొనండి, ఈ విషయములు నన్ను కోయుచున్నవి. ఇక్కడ నా ప్రాణ స్నేహితులు కూర్చొనియున్నారు. నేను అడిగినట్లయితే నా కొరకు తమ నేత్రములను పెరికి ఇయ్యగల స్త్రీ, పురుషులు ఇచ్చట కూర్చొని యున్నారు. (అవునయ్యా!) వారు రెండు సార్లు, లేక మూడుసార్లు వివాహము చేసికొనిరి. ఇప్పుడిచ్చట కూర్చొని యున్నారు. నా స్వంత కుమారుడు, నా స్వంత కోడలు, నా మనుమడు ఇచ్చట యున్నారు. బిల్లీని చూడండి, మేము ఒకరికొరకు ఒకరం నిలబడియున్నాము, కాని సత్యమును సత్యముగానే చెప్పవలెను, అది సత్యము గనుక సత్యమని చెప్పెదను.

ఈ రోజున నేను లేచి ఈ అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ లేదా ఇంకా ఇతర శాఖల వారితో ఇట్లు చెప్పగలను, "నేను పూర్తిగా తప్పు చేశాను. నేను వాక్యముతో నిలిచి యుండను, మీతోనే నిలచి యుందును." నేను అతి త్వరలోనే గొప్ప దేవుని వరము గల వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొందును. ఈ సంస్థలలో ఒక దానిని నేను పట్టుకొని నా ప్రభావమునంతటిని పారవేయుదును. వారి మధ్య నేను గొప్ప పేరు పొందుదును. వారి మధ్య నా పేరు కొరకు చూచుట లేదు. వారిని నేను ప్రేమించుచున్నాను, అది సత్యము. కాని నేను నమ్మకముగా ఉండవలెను. అలాగు కానియెడల నేను వేషధారినవుదును.

91నేను వేషధారిగా ఇచ్చట నిలబడియుందును, ఎందుకనగా నా స్వంత కుమారుడు ఒక బాలికకు వాగ్దానము చేసి వచ్చి యున్నాడు. ఆ క్రమము ఎన్నడూ జరిగియుండలేదు, అతడు ఆ స్త్రీతో జీవించినా, ఆమెతో అతడు పడుకొనినా, ఆ అమ్మాయి, లేక అది ఏమైనా, అతడు ప్రమాణము చేసియున్నాడు గనుక ఆమెను పెండ్లి చేసికొనినట్లే. బిల్లి పాల్ కావచ్చు లేదా బిల్లి పాల్ కాకపోవచ్చు. ఇది అక్షరాలా సత్యము! ఆ వాగ్దానము చేసినందున అతడు వివాహము చేసికొనినట్లే. అది నేనయినా, అది అంతే.

మనం యధార్థముగా ఉండవలెను. నా కుమారుని విషయములో నేను యధార్థముగా లేనిచో, మీ విషయములోను యధార్థముగా ఉండలేను. మీ పట్ల నేను యధార్థముగా లేనియెడల, దేవుని విషయములోను యధార్థముగా ఉండజాలను. నేను మీతో చెప్పుచున్నది యధార్థముతోను, సదుద్దేశముతోను చెప్పుచున్న మాట అని మీరు విశ్వసించవలెను. దానిని మరో రీతిగా భావించవద్దు. నేను దానిని చెప్పిన విధంగానే చెప్పవలెను, చూచారా, ఎందుకనగా నేను మీతో సత్యమునే చెప్పబోవుచున్నాను.

1COR 4:15

 

92మరీ తరచుగా మీ అందరితో ఈలాగు నేను మాట్లాడను, ఎందుకనగా మీరు నా పిల్లలు అని నేను పిలచుచున్నాను. సువార్త ద్వారా క్రీస్తునందు మిమ్మును నేను కనియున్నాను. ఇక్కడ మనమందరము కూడికొనియున్నాము, ఇక్కడ మన స్వంత గుంపున్నది, మిమ్మును కొద్దిగా నేను కత్తిరించియున్నాను. కాని మితో నేను చెప్పుగోరుచున్నాను: మీరు నా యొద్దకు వచ్చి ఏదయినా నన్ను అడిగినప్పుడు నేను నాకు తెలిసిన అత్యుత్తమ రీతిలో జవాబును ఇచ్చెదను. అది వాక్యములో యున్నచో నన్ను అది ఖండించినా గాని చెప్పక తప్పదు. నాలో ఉన్న ఎన్నో ముడులను నేను కత్తిరించవలసి యున్నాను. నిశ్చయంగా!

కానీ మీరు ఏదయినా నన్ను అడిగినప్పుడు నేను జవాబు ఇచ్చెదను. నేను సత్యమునే మీకు చెప్పుదును. నేను ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండగోరుచున్నాను. ఆ విధంగానే నేను జీవించి, చనిపోగోరుచున్నాను. ఎవరితోనయినా యధార్థముగానే యుండగోరుచున్నాను.

93కొద్ది కాలము క్రిందట ఒక బాలిక నా యొద్దక వచ్చెను; ఇప్పుడామె ఇచ్చట లేదు. టామ్ సింప్సన్ ను మీలో చాలామంది ఎరుగుదురు. టామ్ చాలా చక్కని వ్యక్తి. అతని వారెవరూ ఇచ్చట లేరు. (వారందరూ తిరిగి వెళ్ళి పోయిరని తలంచుచున్నాను. బహుశా ఫ్రెడ్ సాద్మన్ ఇచ్చట ఉండియుండును. అతడిచ్చట ఉన్నాడో లేదో నాకు తెలియదు, కాని వారున్నారని తలంచుచున్నాను.) కాని టామ్ సింప్సన్ కెనడా నుండి ఫ్రెడ్ తో కలిసి వచ్చును. (మన ట్రస్టీ యగు ఫ్రెడ్ మీకు తెలియును.)

సహోదరుడు టామ్ ను ఇక్కడ మీరు చాలామంది ఎరుగుదురు. టామ్ చాలా చక్కని మనిషి. చాలా మంచి వ్యక్తి. శ్రీమతి. సింప్సన్ కూడా అట్టి వ్యక్తియే. ఆమెతో నేను చెప్పునది ఆమె వినినచో ఆమె కూడా మరల నడిచి వచ్చును. ఆమె కుంటిదై చక్రాల కుర్చీలో కూర్చొనియున్నది. ఏమి చేయమని చెప్పానో దానిని ఆమె చేసినయెడల, ఆమె నడచును. అది నిజమో, కాదో మీరు గమనించి చూడండి! చూచారా? కాని అది జరుగవలెనని ఆమె ఆశించినయెడల చెప్పిన ప్రకారము చేయవలెను.

94ఆమెకు చక్కని బాలికలున్నారు. వారు చిన్నగా ఉన్నప్పుడు వారిని నా ఒడిలో ఎక్కించుకొని ఆటలాడేవాడిని. ఇప్పుడు వారు చాలా పెద్ద వారయిరి. వారు దాదాపు స్త్రీలయి పోయారు. పది లేదా పన్నెండు సంవత్సరముల వయస్సు, అందులో ఒకరు నా యొద్దకు వచ్చి ఇట్లడిగిరి, "బ్రెన్హాం సోదరుడా, నాకు ఒక కల వచ్చినది." ఆమె ఆ కలను నాతో చెప్పెను. దాని భావమేమిటని ఆమె అడిగినది.

"నాకు తెలియదు హని. నేను ప్రార్థించెదను, ప్రభువు నాకది చెప్పినచో దానిని నీకు చెప్పెదను," అన్నాను.

"మంచిది!" అన్నదామె. కొద్ది రోజుల తరువాత ఆమె వచ్చినది. ఆ కల భావము తెలిసిదేమో అని అడిగినది.

"లేదు, హని, నాకు ఇంకా తెలియలేదు. ఆయన ఇంకా నాకు దానిని బయలుపరచ లేదు," అన్నాను.

దాదాపు రెండు లేదా ఒక్క వారము తరువాత మరల ఆమె వచ్చి "బ్రెన్హాం సోదరుడా, ఆ కల మాట ఏమిటి?" అనడిగినది.

"నాకు తెలియదు," అన్నాను. ఆమె నిరుత్సాహపడినట్లుగా నాకు కనిపించినది.

95మీరు గుర్తుంచుకొనండి, నన్ను ఏదయినా చెప్పమని మీరు అడగినప్పుడు, దానిని ప్రభువు యొద్ద నుండి నేను పొందనప్పుడు నేను కూడా నిరుత్సాహము చెందుదును. నేను వేషధారిగా గానీ, అబద్ధికునిగా గానీ, ఉండగోరుట లేదు. మీతో నేను సత్యమును చెప్పుచున్నాను. ఆయన నాతో చెప్పిన యెడల, మీతో చెప్పెదను. ఆయన చెప్పని యెడల, మీతో చెప్పును. అంతే నేను చేయగలను. ఆ విధంగా మీరు నన్ను నమ్మవలెనని కోరుచున్నాను.

ఆ కల యొక్క భావము ఏమై యుండునో అని నేను నా మనస్సులో ఆలోచించాను, కాని నాకెట్లు తెలియును. దానిని మరల నేను చూడవలెను. ప్రభువు యొక్క నామము పేరట ఏ స్థలములోనయినా, ఎవరికయినా నేను కల భావము చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరుగును. ఎవరూ, ఏ ఒక్కరూ వ్రేలు పెట్టి చూపించలేరు. అవునయ్యా! ప్రభువు నామము పేరట నేను చెప్పిన ప్రతిదియు ఖచ్చితంగా ఆ విధంగానే నెరవేరుట జరుగును, ఎందుకనగా అది ఆయనది. అప్పుడు అందులో నా బాధ్యత లేదు. అది ఆయనే; అది ఆయన యొక్క బాధ్యత.

96ఇట్లు చెప్పాను, "ట్రూడీ, ఇటు చూడు! మనము ఆరిజోనాకు వెళ్ళ వచ్చును. మీరక్కడికి వెళ్ళినప్పుడు మీతో నేను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పవచ్చును. మీకు చిన్న సోదరుడున్నాడు (చిన్న జానీ, అతని పొట్ట ఎప్పుడూ తెరచుకొని యుండునని చెప్పి ఎగతాళి చేయదును)…" అతడు వీధిలో కారు క్రింద పడి చనిపోవునని నేను చెప్పుదుననుకొనండి. అప్పుడు మీరు నా యొద్దకు వచ్చి ఇట్లందురు, "అతనిని సహూదరుడు బ్రెన్హాం యొద్దకు తీసికొని వెళ్ళండి," అందురు. మీరప్పుడు నా కొరకు వెదకుదురు. ఒక తెల్లని సూటు ధరించిన ఒక వ్యక్తితో నేను మెట్ల మీద నిలబడి మాట్లాడుట మీరు చూచుచుందురు. అప్పుడు నేను చిన్న జానీ మీద చేతులుంచుదును. అతడు మరల జీవము పొందనై యండును. "నీవు పశ్చిమానికి వెళ్ళుము, నీవు మొదటగా తెలిసికొను సంగతి ఇది. నీ తల్లి మరియు నీ తండ్రి, చిన్న జానీ చనిపోయెనని ఒక రోజున ఏడ్చుటను నీవు చూచెదవు. నీవేమి చేయదువు?" అని అడుగుదును. చూచారా? మీరు నన్ను నమ్ముదురు. చూచారా? మీరు నాయందు నమ్మిక యుంచుదురు. నేను ఏదియూ ఊహించి చెప్పును. సత్యమునే మీతో చెప్పెదను. తెలియని యెడల ఏదియూ చెప్పను. అప్పుడు నేనిట్లందును, "చిన్న జానీ కారు క్రింద పడి చనిపోయెనని మీరు, మీ తల్లి నా యొద్దకు వచ్చి చెప్పెదరో లేదో చూడండి!"

97డాక్టరు వచ్చి అతని కన్నులు తెరచి చూచును. గుండెను పరీక్షించి ఊపిరి తనిఖీ చేయును. "అతడు చనిపోయెను; శవములుంచు స్థలముకు కొనిపోవుడి," అని చెప్పును. మీరేమి చేయుదురు?

మీరిట్లందురు, "ఒక్క నిమిషం ఆగండి! ఒక్క నిమిషం ఆగండి! నా చేతులలో అతడిని తీసుకోనియండి; మనం నడుస్తూ వెళ్ళుదము. ఆమేన్!

"ట్రూడీ, నీవెచ్చటికి వెళ్ళుచున్నావు?"

"నాకు తెలియదు."

"నీవేమి పొందియున్నావు?" నీ చిన్న సోదరుని మృత దేహము నీ చేతులలో యున్నది. వీధిలో నడిచిపోవుచుందువు. "ఈ పిల్లకు పిచ్చి పట్టినదా," అని జనులు అనుకొందురు. లేదయ్యా! ఆమెకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఉన్నది. ఏమి జరుగబోవుచున్నది?

నీవు నీ తల్లిదండ్రులకు ముందు ఇట్లు చెప్పుదువు, "ఆగండి, సహోదరుడు బ్రెన్హాం ఎక్కడున్నాడో చూద్దాం. అతడు మెట్ల మీద నిలబడి తెల్లని సూటు ధరించిన ఒకతనితో మాట్లాడుచుండును. అక్కడే అతడు నిలబడియుండును. ఏమి జరుగునో చూడండి." నీ మనస్సులో ఏమి సందేహముండదు. "బ్రెన్హాం సోదరుడా, నీవు నాతో ఏమి చెప్పియున్నావో నీకు తెలియును," అని నీవందువు.

"అవును, ట్రూడీ. చిన్న జానీ, లెమ్ము!" ఒక్క గంతు వేసి వీధిలో నడిచి పోవును.

98కాని అటువంటి విషయములు నేనూహించి చెప్పినచో ఎట్లుండునో ఆలోచించండి. నేను ఆలోచించి అలాగు విషయములు చెప్పినప్పుడు, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు కాదు. అది సరి కాదు. అది జరుగదు. అదెన్నడూ నెరవేరదు. అప్పుడు మీరు ఆ బాలుని మరణము గూర్చి భయపడుచుందురు. అతనిని తీసికొని రావలెనో లేదో మీకు తెలియదు.

మీకు సహాయము చేయుటకు దేవుడు నన్ను ఇచ్చటికి పంపెను, మీకు నేను సహాయకారిగా ఉండవలెను. అది కోసినా, బాధించినా, మరేమి చేసినా గాని నేను ఎలాగయినా దానిని చెప్పవలసియున్నాను.

99ఇప్పుడు వివాహము మరియు పరిత్యాగము విషయము. మిమ్మును ఒక సోదరుని వలె అడిగాను, నా నుండి మీరు విను వరకు నెమ్మదిగా యుండుడి. విన్నారా? మీరు యధా ప్రకారముగా జీవించండి. (ఇక్కడ నేను చాలా సమయమును తీసికొనుచున్నాను.)

"మేము ఇరవై-ఒక్క సంవత్సరాల క్రితం పెండ్లి చేసికొన్నాము. జస్టిస్-ఆఫ్-పీస్ ద్వారా జరిగినది." ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒక రోజున ఒక సేల్స్-మెన్ ఆలయము లోనికి వచ్చి ఇట్లు చెప్పెను. (అతడు ఒక క్రైస్తవుడు) కనెక్టికట్ లేదా మరే చోటనో ఉన్నాడు. గొప్ప ఆలయము, ప్రార్థన కొరకు లోనికి వెళ్ళెను. అతడు పెంతెకోస్తు వ్యక్తి, కాని అక్కడికి ప్రార్థించుటకు వెళ్ళెను. అతడు అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థించినప్పుడు జరిగిన దానిని చెప్పెను. అతడు పయనించుచుండెను, అలసిపోయి యుండెను, ఒక రకంగా ఇంటి మీద బెంగతో యుండెను. అతడు ఒక సేల్స్-మెన్, వస్తువులను అమ్ముచుండును. ఫ్యాక్టరీలకు సరఫరా చేయును. అతడు వ్యాపారము నిమిత్తము అచ్చటికి వెళ్ళి యుండెను. దారీలో అతడు ఆలయమునకు వచ్చెను. వెళ్ళి ప్రార్థించవలెనని తలంచెను. తలుపులు తెరచి యుంచిరి. అతడు లోపలకు వెళ్ళెను. ఎవరూ అక్కడ లేరు. అతడు మోకరించి ప్రార్థించసాగెను. ప్రార్థించిన తరువాత అతడు అక్కడే ఒక గంటసేపుండెను. ఆ తలుపులు కొట్టుకొనుట అతడు ప్రత్యక్షంగా వినెను. సంఘ కావలివారెవరో వచ్చిరని అతడు తలంచెను. ఆ తరువాత కొంతసేపటికి ఎవరో మాట్లాడుటను అతడు వినెను. అతడచ్చటికి వచ్చి అది కావలికాయు వ్యక్తి ఏమోనని చూచెను. వేదిక మీద స్త్రీ, పురుషులిరువురు నిలబడియుండిరి. వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొనియుండిరి, "చట్ట సమ్మతముగా నిన్ను నా వివాహిత భార్యగా స్వీకరించుచున్నాను," అని చెప్పుచుండెను.

"నిన్ను నా ప్రియమగు భర్తగా, చట్టపూర్వక పెండ్లి ద్వారా స్వీకరించుచున్నాను," అన్నదామె.

"ఇదేమిటి? చాలా వింతగా యున్నదే! బోధకుడు లేకుండా ఈ స్త్రీ, పురుషులు పెండ్లి చేసికొనుచున్నారు," అని ఈ పెంతెకోస్తు వ్యక్తి తలంచెను. కావున అతడు ఆగి చూచుచుండెను. ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా జీవించుదమని వారు ప్రమాణములను చేసికొనిరి. మరణము మాత్రమే వారిని వేరు చేయును. వారు ఆలింగనము చేసికొనిరి, ఒకరి నొకరు ముద్దు పెట్టుకొనిరి. వారు నవ్వుకొంటూ చుట్టూ తిరుగుచుండిరి. అతడు ఇట్లనెను, "ఒక్క క్షణం ఇటు చూడండి. నేను ఆసక్తిగా అడుగుచున్నాను. నేను ఒక క్రొత్తవాడిని. మీరు పెండ్లి చేసికొనియున్నారు గదా?"

"అవును!" అన్నాడు.

"బోధకుడు లేకుండానే?"

కాదు! మా పెండ్లి అయి నలుబది సంవత్సరములయినది. ఈ వేదిక మీదనే మాకు నలుబది సంవత్సరముల క్రితం పెండ్లి అయినది. ప్రతి సంవత్సరం మేము ఇచ్చటికి వచ్చి, మా ప్రమాణములను నూతనపరచుకొందుము," అని అతడు చెప్పెను. అది మంచి ఆలోచన, చూచారా.

కాని వివాహమునకు సంబంధించినంత వరకు నీవామెతో వాగ్దానము చేసినందున, ఆమె నీ మాటను తీసికొనెను; నీవు ఆమె మాటను తీసికొందువు; దేవుడు మీ ఇద్దరి మాటలను తీసికొనును, చూచారా? కాబట్టి వాగ్దానము… [టేపుపై ఖాలీ ఉన్నది.]

100ప్రశ్న: పొడవైన జుట్టును ముందు భాగములో కత్తిరించినప్పుడు? (ఇప్పుడు, ఆ ఒక్క నిమిషం ఆగండి, దీనిని చూచెదను.) పొడవైన జుట్టును…

వారి భావము ఇది కావచ్చును: "వారు జుట్టును ముందు కత్తిరించుకొనుట వలన పొడవైన వెండ్రుకలను పోగొట్టుకొన్నట్లేనా?" వారు జుట్టు కత్తిరించుకొనిరి, చూచారా. ట్రవజర్లు ధరించిన ఒక వ్యక్తి తన ట్రవజర్లను మూడుసార్లు కత్తిరించుకొన్నాగాని ఇంకా పొట్టిగా యున్నది. ఏమందుము? ఏమని చెప్పెదము? ఓ, వారు దానిని గురించి సంభాషించుకొనుచున్నారు. నేను నా చిన్న బాలికను గేళి చేయుటకు, "బూమ్స్" అని పిలచుచుందును. బాంగ్స్, అని మరేదో అని వారు పిలచుచుందురు, మీకు తెలియును, ఇక్కడ ముందే ఉన్నారు.

ఆ బాలికలు ముందున్న వెంట్రుకలు కత్తిరించుకొనుచుందురు. మీ తల్లి బహుశా మీకు చెప్పగలదు. ఆ విధంగా నీవుండ వచ్చునేమో చెప్పును. పాతిక సంవత్సరములు, దాటిన ఒక స్త్రీ ఒక్కసారి వెనక్కు తిరిగి చూచుకొన్నట్లుగానే అది యుండును. ఆ వయస్సు వారు ముందు జుట్టు కత్తిరించుకొనినప్పుడు పిల్లల వలె కనిపించుదురు. సోదరీ, నీవు ఎటు వెళ్ళావో కాదు కాని, నీవెటు వెళ్ళుచున్నావో చూచుకొనుము, చూచారా.

101జుట్టు కత్తించుకొనుట గూర్చి దీనిని మీతో నేను చెప్పుచున్నాను. ఇంత కత్తిరించుకోవలెనని చెప్పు లేఖనమును మీకు నేను చూపించజాలను దానిని వివరించు వాక్యము లేదు. సోదరికయినా, సోదరునికయినా అదే నేను చెప్పగలను.

ఒక సంగతి మీకు చెప్పెదను. నా పిల్లలగు శారా మరియు రిబ్కాలు కూడా అలాగే చేసిరని నాకు తెలియును. వారు ఈ ముందు భాగములో జుట్టు కత్తిరించుకొనుట నేను చూచాను. దానిని వారు వెనక్కు జడ వేసిరి. ముందు భాగాన ఒక విధంగా చేసి, వారిని నేను బలపరచను, చూచారా? అది నాకు సమ్మతము కాదు. అసలు వారి వెంట్రుకల మీద కత్తిరిని వేయరాదనే నా కోరిక. కాని వారి జుట్టు బాగా పొడవైపోయి ఈలాగు పడిపోవుచున్నందున, వారి కన్నుల మీదకు పడకుండా ఆ జుట్టును కత్తిరించుట జరిగినది. వారు చిన్న పిల్లలు కూడాను. అది తప్పు అని నాకు తెలియదు, అది పొరపాటని నేను తలంచుట లేదు. చూచారా? కాని సోదరీలతో చెప్పుచున్నాను. ప్రభువు దానిని ఉంచిన విధంగానే ఉండనీయండి, చూచారా.

102స్త్రీలు అందముగా కనబడవలెనని కోరుకొందురని నాకు తెలియును. అది సహజము. వారు ఆ విధంగానే ఉండవలెను, చూచారా. వారు ఆ రీతిగానే ఉండవలెను. అది మంచిది, కాని మరో మాట వినండి, లోకస్థుల వలె కనిపించ రాదు (చూచారా?); లోక పోకడను వెంబడించరాదు. తప్పు పనులు చేయరాదు. ఆ విధంగా మీరు కత్తిరించుకొనగోరుదురు, కాని ఇప్పుడు, అలాగు కత్తిరించుకొనరాదు. మీరు పొడవైన జడలు కలిగియున్నా, మరేమి కలిగియున్నా, వాటిని పొడవుగా వ్రేలాడనీయండి. లోకస్థుల వలె కనబడవలెనని కత్తిరించుకొనరాదు. ఆ చిన్న పిల్లల విషయమయితే వేరు…

103నా అంకుల్ కు న్యూయార్కులో ఒక చిన్న బాలిక ఉండెడిది. ఆమెకు అతి చక్కని జుట్టున్నది. అది ఒక విధమైన నల్లని జుట్టు. ఆమె జడలు అల్లుకొనును. నా తల్లి యొక్క జడ ఆమె మోకాలు వరకు వచ్చెడిది. ఈ చిన్న బాలికకు కూడా ఆ విధంగానే వచ్చెను. ఆమె పేరు జాక్విలిన్. ఆమె అందులో ఒక భాగమును ఈ విధంగా దువ్వి మిగిలిన దానిని కత్తిరించెడిది. అది దాదాపు పదిహేను, పద్దెనిమిది, ఇరవై సంవత్సరాల క్రితం సంగతి. నేను ఆమె మొత్తం జుట్టును ఎందుకు దువ్వుకొనుట లేదని ఆశ్చర్యపడేవాడిని. అది మామూలుగా ఉన్నప్పటి కంటే ఆ విధంగా కత్తిరించుకొనినప్పుడు అందంగా కనబడునని ఆమె తలంచెను. ఈ ఆధునిక బీటిల్స్ వారి వలె కనబడెడిది. మీరు దానిని ఎరుగుదురు. ఓ, అది నిజము. అలాగు నేను చేయనిచ్చుచున్నానని నేననుకొనను. బీటిల్స్ వారి వలే కనబడునది ఏదయినా సరే లోకము వలె కనబడునదని గ్రహించవలెను - కావున దానిని వంటరిగా వదిలివేయండి. అవును!

1COR 7:12-15

 

104ప్రశ్న: బైబిలులో నుండి నీవు బోధించు సత్యములను నా భర్త మరియు నేను ఒక్కరీతిగా చూచుట లేదు. అతనికి అర్థము కాదు. వారి బోధను నమ్మని నేను వారి సంఘమునకు అతనితో కూడా నేను వెళ్ళవలెనా? దీని గూర్చి నాకు చాలా కలవరము ఉన్నది.

అవును! అతడు నీకు భర్త, నీవతని భార్యవు గనుక అతనిని నీవు ఖండించరాదు. అతడు నిన్ను ఖండించుట లేదు (చూచారా?), ఎందుకనగా భార్య ద్వారా భర్త శుద్ధీకరింపబడుచున్నాడు. చూచారా? అతడు ఒక శాఖా సంఘమునకు వెళ్ళుచున్నయెడల, లేదా అటువంటి మరో చోటికి వెళ్ళుచున్నప్పుడు, నిన్ను తనతో పాటు రమ్మన్నప్పుడు వెళ్ళవలెను. మీరు చూచారా? అక్కడ నీకు హాని కలిగించునది ఏదియూ లేదు, ఎందుకనగా ఏమయినా గాని వారు చెప్పే దానిని నీవు వినవు, ఎందుకనగా వారి బోధను నీవు వినవని ముందే ఇక్కడ చెప్పియున్నావు. చూచారా? కావున దాని వలన నీకు నష్టము లేదు. నీవు నీ భర్త పట్ల మర్యాద చూపించుచున్నావు. నిన్ను నీవు అతనికి లోబరచుకొనియున్నావు. వారు బోధించు విషయములు వేరుగా ఉండవచ్చును, కాని అంతకన్న ఉన్నతమగు సంగతులను నీవు నేర్చుకొనియున్నావు. నీవు ఉప్పుగా యుందువు; అతడు దానిని చూచి ప్రభువు యొద్దకు వచ్చును. ఇంకా ముందుకు వెళ్ళవచ్చునని నేను నమ్ముచున్నాను. సమయము ఎంత అయినదో చూడండి?

ZECH 4:12,14•

REV 11:3,4

 

105ప్రశ్న: జెకర్యా 4 మరియు ప్రకటన 11:3-12 ఒకే విషయమును గూర్చి మాట్లాడునా? జెకర్యా 4:12-14 మరియు ప్రకటన 11:4 చూడండి. వారు పేరును సంతకము చేసిరి. ఈ సంఘములోని సోదరి మరియు సోదరుడు.

జెకర్యా 4ను మనము చూద్దాం. రెండు ఒలీవ చెట్లు అక్కడున్నవి. అవును, రెండు ఒలీవ చెట్లు. ప్రకటన 11… ఓ, అవును, అంతే. ఒకే విషయము. ఆ రెండూ అంతే. మోషే మరియు ఏలియాలు, రెండు ఒలీవ చెట్లు.

ప్రశ్న: మా కొరకు ప్రార్థించుము … అది ఒక ప్రార్థన విన్నపము.

దీనిని ముందు చదువనందుకు చింతించుచున్నాను… ఇది ఒక కుటుంబ సంబంధము గూర్చినది. దానిని దీనితో చేర్చి చూడండి. జనులందరి ఎదుట దానిని చదువరాదు. వారు ప్రత్యేకముగా కలిసికోవలెనని తలంచుచున్నాను.

106ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఆదివారము పని చేయుట తప్పా?

MATT 12:11•

LUKE 14:5

 

107దానిని ఇంత క్రితమే వివరించాను. ఒక ఎద్దు గోతిలో పడితే తీయండి, కాని ఆదివారము పని చేయవలెనని కోరి దానిని గోతిలో పడద్రోయకండి.

ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, వచ్చే ఆదివారం ఇక్కడ నీవు బోధించుదువా?

అది ఒక ప్రశ్న. సోదరీ, సోదరుడా, మీరెవరైనా గాని చెప్పుచున్నాను; బోధించుట లేదు. ఇక్కడ కొన్ని ఉంచబడినవి. వాటిని ఎవరో ఈ స్థలములో ఉంచియుందురు. పేర్చి తెచ్చిరి.

కాప్స్ సోదరుడా, ఇది నీకు చెందినది, "మనం ఎన్నడూ ముసలివారము కాము," అను పాటను పాడుదువా? ఇంకా కొన్ని కలగలుపుగా యున్నవి.

108ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీవు బైబిలులో ఎందుకు చూపబడలేదని కొందరు అడుగుచున్నారు. హబక్కూకు 2:1-4 నీవేనని నేను నమ్ముచున్నాను. (నెవిల్ సోదరుడా దానిని తీయుము, హబక్కూకు 2:1-4) వారిని చదివి అధ్యయనం చేయనీయుము. 3వ అధ్యాయము. నాలుగు అధ్యాయములలోను ఉన్న పేరు మరియు మాదిరులు నీవేనని నేను నమ్ముచున్నాను.

హబక్కూకు 2:1-4 ను అతడు తీయుచున్నాడు. దీనినడిగిన వారెవరో తెలియదు. సోదరి లేదా సోదరుడు కావచ్చును. (అది మంచిది; పేరు వ్రాయలేదు), ఆ విషయములను నేను అడుగగోరుచున్నాను. నీ హృదయములో ఏమున్నదో నేను తెలిసికొనినప్పుడే జవాబు చెప్పగలను. కాదు. చూచారా? మీ పేర్లు బైబిలులో ఉండవలసిన అవసరము లేదు, చూచారా, కాని, నీవు బైబిలులో ఉన్నంత కాలము, క్రీస్తులో ఉన్నంత కాలము, నీవు బైబిలులో ఉన్నట్లే. నీవు ఆయన యందు బైబిలులో యున్నావు. (చూచారా?) నీవు క్రీస్తులో ఉన్నంత కాలము, నీవు బైబిలు యొక్క సంపూర్ణతలో యున్నట్లే. చూచారా? నీవు క్రీస్తులో యున్నప్పుడు నీ పూర్తి స్థానములో యున్నట్లే. అందరూ దీనిని అర్థము చేసికొనిరా?

HAB 2:1-4

 

109నెవిల్ సోదరుడా, దానిని తీసితివా? ఏమిటి? అవును. హబక్కూకు. దానిని నేను చదువలేదు. ఈ ఉదయమే ఇక్కడ దీనిని పెట్టారని నేను తలంచుచున్నాను. హబక్కూకు 2:1-4, అది ఇదే. హబక్కూకు 2:1 నుండి 4:

ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను, గోపురము మీదను కనిపెట్టుకొనియుందుననుకొనగా -

యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము.

ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.

వారు యధార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రదుకును.

110దీనిని అడిగిన ప్రియ వ్యక్తిని గూర్చి ఆలోచించుచున్నాను… చూచారా? వారు నన్ను ప్రేమించువారు, లేనిచో దానిని వ్రాయరు. చూచారా? బైబిలులో విలియం బ్రెన్హాం అను పేరు లేదు. మీ ఎవరి పేరు లేదు, కాని ఆయనలో మనం ఉన్నాము.

బైబిలులో ప్రస్తావించబడిన కొన్ని తెలిసిన స్థలములను మీరు చూడండి. కొన్ని ప్రత్యేక సంగతులను గూర్చి చెప్పును. చూచారా? మీరు గమనించినట్లయితే, చరిత్ర పునరావృతమగుటను బైబిలులో చూచెదము, చూచారా. ఇప్పుడు, ఒక దానికి లేఖనమును ఇచ్చెదను. (మీలో చాలామంది వ్రాసికొనుట నాకు కనబడుచున్నది.) మత్తయి సువార్త 3వ అధ్యాయములో ఇట్లు చెప్పెను, "పలుకబడినది నెరవేరునట్లు దేవుడు తన కుమారుని ఐగుప్తులో నుండి రప్పించెను. ఐగుప్తులో నుండి నా కుమారుని బయటకు పిలచితిని." మీ యొద్ద స్కొఫీల్డు గాని మరే ఇతర బైబిలు గాని యున్నచో ఆ రిఫరెన్సును చూడండి. ఆ ప్రక్కన ఉన్న దానిని గమనించండి. ఆయన యాకోబును, ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి బయటకు పిలచుటను గూర్చి అక్కడ వ్రాయబడినది. చూచారా? కాని యాకోబు అను తన కుమారుని ఆయన ఐగుప్తులో నుండి బయటకు పిలచెను. కావున, చూడండి, దేవుని యొక్క వాక్యమునకు ఎన్నడూ ముగింపు లేదు. మనము బైబిలులో గుర్తింపబడియున్నాము. క్రైస్తవ వ్యక్తిత్వములతో నిన్నునీవు గుర్తించుకొనుట అను నా వర్తమానమును ఎందురు వినిరి? దానిని నేను ఆరిజోనాలోని, ఫీనిక్సులో బోధించాను. దానిని మీలో చాలామంది టేపులో వినియుందురు. చూచారా? క్రైస్తవ వ్యక్తిత్వములతో గుర్తింపబడుట. చూచారా? నీవు క్రైస్తవునివయినా, క్రైస్తవునివి కాకపోయినా బైబిలులోని ఎవరో ఒకరితో గుర్తింపబడుట నిశ్చయము. నిన్ను నీవు బైబిలులో చూడగలవు. గ్రహించారా? అది సహాయము చేయవచ్చని బహుశా నేను తలంచవచ్చును. వీనిలో వీలయినన్ని నేను చెప్పెదను.

HOS 11:1•

MATT 2:15

 

111ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, కొందరు కృప ముగిసెనని చెప్పుచున్నారు. ఎవరూ రక్షింపబడరని చెప్పెదరు. ఇది నిజమేనా? (ఇది వచ్చినందుకు సంతోషించుచున్నాను.) మనము ప్రార్థన వరుసలను గమనించవలెను. ఇంకా కొందరు కృప కొరకు వేడుకొనుచున్నట్లుగా కనిపించుచున్నది.

ఇది మొదటి ప్రశ్న, మీ యొద్ద రెండున్నవి.

"కృప అయిపోయినదా?" ఎన్నడూ అలాగు తలంచరాదు! చూచారా? నీవు కొనిపోబడు వరకు నీకు చేతనయినది మానక చేయుము, చూచారా.

"ప్రార్థన వరుసలో కొందరు కృప కొరకు అడుగుటను మనము గమనించుచున్నాము." నిశ్చయంగా! కృపా ద్వారములు ఇంకా తెరువబడియున్నవి, చూచారా. మీరెక్కడికి వెళ్ళుచున్నారో తలంచుచున్నాను. ఈ ఆలోచన రెండింటి మధ్య యున్నది. మీకు ప్రతిదానికి లేఖనము ఇయ్యవలెనన్న నాకు సమయము లేదు, మీరు చూచారా, ఈ ప్రతిదానికి తగు స్థానమున్నది. నిశ్చయంగా ప్రార్థన వరుసలో మీరు కృపను కనుగొందురు.

ఈ మధ్యాహ్నము యేసు వచ్చునని నాకు తెలిసినయెడల, ఇప్పుడు చేయుచున్న కార్యక్రమమునే కొనసాగించుదును (చూచారా?), దానినే కొనసాగించుదును. కృప ఎల్లప్పుడు తెరువబడియున్నది. చూచారా?

ROM 13:11,12•

REV 1:3

 

112ఏడు సంఘ కాలములు మరియు ఏడు ముద్రలు గూర్చి ఈ మధ్య ముగించుట జరిగినది. మీరది గ్రహించిరని నేను తలంచుచున్నాను. అవి తెరువబడియున్నవి, చూచారా. ఏడు ముద్రలు, జరిగిన దానిని అది బయలు పరచినది. ఏడవ సంఘ కాలము, మనము ఏడవ సంఘ కాలాంతమందు ఉన్నాము. అంతము అని నేను చెప్పినప్పుడు అది ఈ ఘడియ, ఈ నిమిషము అని కాదు. బైబిలులో చెప్పిన దానిని గుర్తుంచుకొనండి, ప్రభువైన యేసు కాలములో పౌలు ఇట్లు చెప్పెను, "కాలము సమీపమైయున్నది." దేవుని సమయములో అది ఎంతో మీరు గ్రహించారా? అది నిన్న. నా సమయము రెండువేల సంవత్సరములు, చూచారా. సమయము సమీపించినది, చూచారా. కాలము సమీపించియున్నదని దేవుడు చెప్పినప్పుడు, కాలము సమిపించినదని మనము చెప్పినట్లు కాదు, చూచారా.

కావున విశ్వాసమందును, ప్రార్థించుట యందును ఎడతెగక యుండుడి. దేవుడింకా కృపను తెరచియుంచి యున్నాడు. నీకు వీలయినంత త్వరగా ఆ ప్రవాహములోనికి పరుగిడుము. తగు సమయము వచ్చినప్పుడు దేవుడు దానిని ఆపును, చూచారా.

113ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీవు తప్ప మరెవరును బోధించరాదను మాట సత్యమేనా? నీవు పురుషులను అభిషేకించుట మేము చుచాము. వారు బోధించుటకు అభిషేకింపబడితే తప్ప దానిని నీవు చేయవని మేము నమ్ముచున్నాము.

కృప! సోదరుడా, సోదరీ, దీనినెవరు చెప్పిరో గానీ వినవలెను. నేను తప్ప మరెవరూ బోధించరాదని ఎవరు చెప్పిరి? నిశ్చయంగా నేను దేవునికి చాలా బలహీనమగు పాత్రగా యున్నాను. తన జీవితములో దేవుని పిలుపును కలిగియున్న ప్రతి వ్యక్తియూ సేవలోనికి వచ్చి బోధించుట ప్రారంభించవలెను; వారు మనకు అవసరము.

ప్రపంచములో ఉన్న దేవుని జనులందరూ సువార్తను బోధించుటకు అభిషేకించబడి యున్నారు, చూచారా. చాలా పెద్ద రాళ్ళ మధ్య నేను ఒక చిన్న గులకరాయి వలె ఒడ్డున యున్నాను, చూచారా. సమర్ధులగు వారు చాలామంది యున్నారు, చాలా యోగ్యత గల వారున్నారు, నా కంటే ఎక్కువగా బోధించగల వారున్నారు; నేను చిన్నవాడను, ఒక దీన వ్యక్తిగా పడియున్నాను. మొత్తం గాదెలో ఒక చిన్న గోధుమ గింజ వలె ఉన్నాను, చూచారా నా భావమును మీరు గమనించారా!

దేవుని చేత పిలువబడిన ఏ వ్యక్తి అయినా గాని సువార్తను బోధించవలసిన అవసరమున్నది.

114ప్రశ్న: దేవుని ప్రేమలో ఒక క్రైస్తవుడు ఎట్లు లోతుగా వెళ్ళగలడు?

వాక్యమును చదివి ప్రార్థించుము. దేవుని వాక్యమును చదివి ప్రార్థించుము. నేను త్వరపడవలెను, వీలయినన్ని వాటికి జవాబు ఇచ్చెదను.

ప్రశ్న: ఒక ప్రశ్న నేను చూచాను, దానిని తప్పుగా నేనడిగాను. నీవు పట్టణమును విడిచిపెట్టు ముందుగా స్వస్థతా కూటమును ఏర్పరచెదవా అని అడుగుచున్నాను, లేనియెడల నీతో వ్యక్తిగతముగా మాట్లాడవలెనని కోరుచున్నాను.

ఈ ఉదయమున ఇతడు నన్ను కలిసికొనెనని తలంచుచున్నాను. స్వస్థతా కూటము జరిగినది - మేము ఒక స్వస్థతా కూటమును కూడా ఏర్పరచి యున్నాము.

1COR 11:4-6

 

115ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, దయచేసి 1 కొరింథీ 11 మరియు 4 నుండి 6వ వచనము వరకు వివరించుము. ఒక ప్రత్యేక ముసుగును వెండ్రుకల పై ధరించవలెనని దీని భావము కాదా! పొడవైన వెండ్రుకలు మాత్రమే ముసుగుగా మనకు అవసరమా? (నా కొరకు 1 కొరింథీయులకు 11:4 తీయండి.) మనము ప్రవచించునప్పుడు మన వెంట్రుకలను ధరించుట లేదా తీసివేయుట చేయగలమా? (దీనిని మనం చూద్దాం, వారిక్కడ ఒక గీత గీసిరి.)

నీకు ఒక జుట్టు విగ్గు ఉన్నచో, దానిని నీవు చేయవచ్చును, లేదా ఈ బీటిల్స్ విగ్గును (బీటిల్స్ అను గాయక బృందము వారి వలే కనబడుటకు దరిచు ఒక విగ్గు), ఒక దానిని మీరు ధరించి యుండ వచ్చును. నాకు సరియైనది ఒకటి దొరికినయెడల నేనే స్వయంగా దానిని ధరించెదను, కాని అది బీటిల్స్ విగ్గు కాదు గాని, ఒక విగ్గు వంటిది.

116కాని అది సరియే. నీకు జుట్టు లేనియెడల అది ఒకటి సంపాదించుకోవచ్చును. దానిని నీవు చేయగలిగినయెడల, అది పరిపూర్ణముగా సరియే. అవునయ్యా! ఒక స్త్రీ యొక్క జుట్టు తగినంత పొడవుగా లేనిచో, ఆమె వేరే జుట్టును సమకూర్చి ధరించుకొనగోరినచో, సోదరి, దానిని ధరించవచ్చునని తెలియజేయుచున్నాను.

ఒక వ్యక్తికి బాగా జలుబు లేదా మరేదో అనారోగ్యము కలుగును, తన భార్యకు బాగుగా కనబడవలెనని కోరును. అప్పుడతడు తన బట్టతలకు ఏదయినా జుట్టు ధరించుట సమంజసమే. అది నిశ్చయముగా సరియే. అందులో ఏమియూ తప్పు లేదు. లేదండీ! నీవు పన్ను లేదా కృత్రిమ చేయి అమర్చుకొనుట వలెనే అది ఉండును. ప్రకృతి సిద్ధముగా అది నీకు ఊడిపోయినది. కావున నీవు నీ అనుకూలము కొరకు దేనినయినా ధరించుట సరియే. ఏమీ తప్పు కాదు.

కాని ఇక్కడ ఇట్లు చెప్పబడినది, "మనము ప్రార్థించునప్పుడు లేదా ప్రవచించునప్పుడు జుట్టును ధరించుట లేదా తీసివేయుట చేయవచ్చునా?" దీని యొక్క అసలు భావము ఏమిటి?

1COR 11:4-6

 

117మంచిది, నెవిల్ సోదరుడు చదువుము. 4 - 6 వరకు చదువుడి.

ఏ పురుషుడు తల మీద ముసుగు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. (అది, అతనికి పొడవైన జుట్టున్నచో. మంచిది.)

ఏ స్త్రీ తల మీద ముసుగు వేసికొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును: (అనగా ఆమె భర్త.) ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే యుండును.

స్త్రీ ముసుగు వేసికొననియెడల, ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను: కత్తిరించుటకొనుటయైనను, క్షౌరము చేయించుకొటయైనను స్త్రీకి అవమానమైతే, ఆమె ముసుగు వేసికొనవలెను. (ఆమె జుట్టు కత్తిరించుకొనగోరినచో, దానిని పూర్తిగా క్షౌరము చేయించుకొనవలెను. చూచారా? కానీ అది కూడదు…)

అక్కడ జుట్టు ధరించుట గూర్చి గాని ధరించక పోవుట గూర్చి గాని నాకేమియూ కనబడుట లేదు. ఒక వేళ స్త్రీ గానీ కత్తిరించుకొనగోరినచో ఆమె పూర్తిగా క్షౌరము చేయించుకొనవలెను. చూచారా? అలాగు చేయ ఆమె ఇష్టపడనియెడల, ఆమె జుట్టు పెంచుకోవలెను; ఎందుకనగా ఆమె జుట్టుయే ఆమెకు ముసుగు. కాని ఒక పురుషుడు ముసుగు వేసికొనుట గాని, పొడవైన జుట్టు పెంచుకొనుట గాని, ఈ విధముగా యుండి వేదిక మీద నిలబడుట గాని తప్పు. అక్కడతడు స్త్రీ వలే కనిపించును. చూచారా? కావున అతడు ఆ విధంగా యుండరాదు. చూచారా?

1COR 11:4-6

 

118వారు జుట్టు గూర్చి అక్కడ మాట్లాడుతున్నారని భావము. దానిని గూర్చి ఆ సందర్భములో ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి పొరబడి యున్నాడని తలంచుచున్నాను. ఒక పురుషుడు తన తలను కప్పుకొని ప్రవచించుననియు, ఆ తరువాత దానిని తీసివేయుననియు అర్థము వచ్చినట్లు తలంచిరి. చూచారా? కాదు. అతనికి పొడవైన జుట్టున్నదని దాని అర్థము కాదు. ఇంకా కొద్ది ముందుగా మీరు దానిని చదవండి. ఈ ప్రశ్నను అడిగిన వ్యక్తి దీనిని గమనించవలెను. స్త్రీ యొక్క శిరస్సు ఆమె భర్త. ఎందరికి ఇది తెలియును. పురుషుని యొక్క శిరస్సు క్రీస్తు. కాబట్టి క్రీస్తును బట్టి పురుషుడు తన వెండ్రుకలను పెంచుకొనుట తప్పు, ఎందుకనగా ఆయనలో పురుషుడు మరియు స్త్రీ ఇద్దరును ఉన్నారు. ఆయన తల్లి మరియు తండ్రి, సోదరి మరియు సోదరుడు అయి యున్నాడు. కాని మానవునిలో స్త్రీత్వము ఒక్కటే యున్నది. కాబట్టి అతడు క్రీస్తును బట్టి జుట్టు కత్తిరించుకొనవలెను; కాని స్త్రీలో స్త్రీత్వము మాత్రమే యున్నది, కాబట్టి ఆమె ముసుగు ధరించవలెను, ఎందుకనగా ఆమె మీద ఆమె భర్త యున్నాడు. అతడు ఆమెకు ప్రభువు, ఆమెను ఏలువాడు; కాబట్టి ఆమె తప్పక పొడవైన వెండ్రుకలు ధరించవలెను.

ఒకవేళ ఆమె తన వెంట్రుకలు కత్తిరించుకొనగోరిన యెడల ఆమె క్షౌరము చేయించుకొనవలెను. కాని అది స్త్రీకి అవమానము మరియు చిన్నతనము. ఆమె అందముగా కనిపించవలసి యున్నది. ఆమె పూర్తిగా క్షౌరము చేయించుకొనుటకు ఇష్టపడదు గనుక ఆమెకు ముసుగు ఉండవలెను. అందువలననే ముసుగుగా ఆమె తల వెంట్రుకలు పెంచుకోవలెను. చూచారా? అందరికీ ఇది అర్థమైనదా? ఇది మీకు సరిగా తోచుచున్నదా? "ఆమేన్!" అని చెప్పండి. అలాగయితే మీకు అర్థమైనదని భావము. చూచారా?

119ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా (ఇంకా మనకు పది నిమిషములున్నవి) — బ్రెన్హాం సోదరుడా, మేమున్న చోట బోధకుడెవరూ లేరు, కాని మేము ఆదివారం రాత్రి టేపు ఆరాధనను జరుపుకొనుచున్నాము. ఆదివారపు బడి కొరకు మేము మా పిల్లలను వేరే సంఘమునకు తీసికొని వెళ్ళవలెనా? టేపు ఆరాధనలు చాలునా?

మీరు మీ పిల్లలు వెళ్ళుచున్న దాని ప్రకారముగా జరుగనీయుడి, చూచారా. మీరు మీ పిల్లలను యుక్త వయస్సులో అలాగు వేరే గుంపులోనికి అలవాటు చేసినచో, ఆ బోధ వారిలో నాటుకొని పోవును. వారది ఎరుగకుండుట మంచిది. నేనేయితే అలాగే చేయుదును. టేపులు మొదలగు వాటి ద్వారా వారు నేర్చుకొనగలిగినచో చాలును. వారిని మీరు కాతలిక్కు చర్చికి తీసికొని వెళ్ళితే, వారు దానినే నేర్చుకొందురు; అందువలన నేను సమ్మతించను, చూచారా. అటువంటి సంఘమునకు తీసికొని వెళ్ళరాదు.

మీరున్న చోట ఏదయినా ఒక చక్కని చిన్న సంఘమున్నచో ఆదివారపు బడికి మీ పిల్లలను వెళ్ళాలని కోరినచో, ఒకవేళ వారు రెండు లేదా మూడు విషయములలో మీతో సమ్మతించక పోవచ్చును; అయినా వారు సంపూర్ణ సువార్త వారు, లేక మరెవరైనా, అది పరవాలేదు. కాని చూడండి, మీ పిల్లలు దానిని ఎలా స్వీకరించుచున్నారు అనుదాని మీద ఆధారపడియుండును. చూచారా? మీ పిల్లలేమీ చేయుచున్నారో గమనించండి, దానికి వారెట్లు ప్రతి స్పందించుచున్నారో చూడండి.

120ప్రశ్న: మనము చూద్దాం. ఒకవేళ వెళ్ళుటకు సంఘము లేనప్పుడు, టేపులను వింటే చాలునా?

అవును! అది మంచిది.

JOHN 3:7•

EPH 4:11-13

 

121ప్రశ్న: పరిశుద్ధాత్మను పొందిన అనుభవమును పిల్లలు కూడా కలిగియుండవలెనా? వారు అంత్యకాల వర్తమానమును చూచినచో పరిశుద్ధాత్మను కలిగియుందురా?

ప్రతివారు తప్పక ఒక అనుభవమును కలిగియుండవలెను. మీ పిల్లలు మరో మార్గములో వెళ్ళకూడదు. మీ మార్గములోనే వెళ్ళవలెను. చూచారా? వారు తిరిగి జన్మించవలెను. దేవుని యొక్క రాజ్యములో మనుమలు లేరు; వారందరూ పిల్లలే. వారది తప్పక కలిగియుండవలెను, దేవునితో తప్పకుండా ఒక అనుభవమును నీవు కలిగియుండవలెను, నీకున్నదే వారికిని ఉండవలెను. దీనిని చెప్పానని నేను తలంచుచున్నాను.

122ప్రశ్న: మిక్కిలి ప్రియమైనవాడా: (మనము చూద్దాం.) ఎఫెసీయులకు 4:11 నుండి 13 వరకూ గల లేఖనము గురించి అడుగుచున్నాను - టేపుల ద్వారా పరిశుద్ధుల యొక్క పరిపూర్ణత అంతా మనము పొందుదుమా? లేక ఆత్మ సంబంధమగు వరములు మరియు సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడు క్రియలు బయలుపరచబడుచున్న ఈ స్థలమునకు వచ్చి పరిపూర్ణత కొరకు సహాయము పొందవలెనా? ప్రభువు యొక్క వాక్యమంతటిని మా హృదయములు నమ్ముచున్నవి.

ఈ వ్యక్తి ఓరెగాం నుండి వ్రాసియున్నాడు. అదెవరో నాకు తెలియునని నమ్ముచున్నాను. చూచారా? అవును, నిశ్చయంగా నాకు తెలియును. ఆ వ్యక్తి ఇక్కడున్న యెడల వినుచుండును. గత ఆదివారము ఇక్కడే ఉండెను. చూచారా? ఇది గత ఆదివారపు ప్రశ్నావళి నుండి వచ్చియుండును. నీ కుమారుడు అరణ్యమును భద్రపరచును. ఓరెగాన్ లో నీతో కూడా ఎల్క్ వేట కొరకు నన్ను ఆహ్వానించినది అతడేనని తలంచుచున్నాను. ఇది నిజమని తలంచుచున్నాను. ఉత్తరము ద్వారా ఈ వ్యక్తిని నేనెరుగుదును.

కాదు! వారు పరిపూర్ణత కొరకు ఈ సంఘమునకు రాగోరుచున్నారు. చూచారా? ఈ సంఘములో మనకు ఒకరితో ఒకరికి సహవాసమున్నది, కాని పరిపూర్ణత అను క్రియ మనకును మరియు దేవునికి మధ్య జరుగును. క్రీస్తు యొక్క రక్తము మనలను పరిశుద్ధాత్మ యందు పరిపూర్ణము చేయును.

123సంఘములో వరములు పనిచేయుచున్నవని వ్రాసిరి. మరీ ఎక్కువ వరములు ఇచ్చట పనిచేయుట లేదు, కాని కొన్ని మాత్రము మనకున్నవి. భాషల వరము మరియు ప్రవచన వరము మనకున్నవి (వాటిలో రెండు లేక మూడు).

మన సోదరుడు హిగ్గిన్ బోతమ్ ఇచ్చటున్నాడని తలంచుచున్నాను. అతడెచ్చటున్నా గానీ, భాషల వరము అతనికి ఉన్నది. మన సోదరుడు జూనియర్ జాక్సన్ మనతో యున్నాడు. అతడు భాషలతో మాట్లాడును. ఆ తరువాత అర్థము చెప్పేవారు ఇద్దరు లేక ముగ్గురు ఉన్నారు. మన సంఘ కాపరియగు సహోదరుడు నెవిల్ కూడా ఇచ్చటున్నాడు, అతడు భాషలతో మాట్లాడును మరియు కొన్నిసార్లు ప్రవచించును. ప్రభువతనిని వాడుకొనును.

ఒక రోజున ఒక విషయము అతడు చెప్పెను. నేనున్న ఇంటికి ఫోను చేసి అతడు చెప్పెను, ఒక వ్యక్తి గురించి ప్రవచించెను. ఒక త్రాగుబోతు గురించి చెప్పెను - అతనిలో వెంటనే ఒక మార్పు గొప్పగా వచ్చుననెను. మద్యపానమును నివారించు ఒక సంస్కరణ శాల నుండి అతడు వచ్చినా ఇంకా త్రాగుబోతుగానే యున్నాడు. అరవై-ఎనిమిది రోజుల పాటు సారాయిని ముట్టుకోలేదు, దానికి ఏ మందు లేదు, వారిని గూర్చి సహోదరుడు నెవిల్ ప్రవచించెను.

కావున మన మధ్య కొన్ని వరములు పనిచేయుచున్నవి, ఎవరు మాతో సహవాసము చేయుటకు వచ్చినా, పని చేయుటకు వచ్చినా మేము సంతోషముతో సహవాసము చేయుదుము, మేము ఏదయినా చేయగలము, ఆ విషయములో చాలా సంతోషించెదము. చూచారా? కాని పరిపూర్ణపరచుట మాత్రము క్రీస్తుకు చెందినది.

ఇప్పుడు, ఒకటి గాని లేదా రెండుగాని మనం చూద్దాం.

124ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, సహోదరుడు ఆర్గన్ బ్రయిట్ తీసిన చిత్రము గూర్చి దయతో వివరించెదవా? మొదటి ప్రశ్న: గోడ మీది రెండవ బొమ్మ, నీ చుట్టూ వెలుగున్నది, బకెల్ మొదలగునవి ఉన్నవి.

అదేమిటో ఇప్పుడు చెప్పెదను. వారు పేరు వ్రాసిరి, వారిప్పుడు ఇచ్చట లేరు. అది మనకు అర్థమయినది. దక్షిణాఫ్రికా నుండి జాక్సన్ దంపతులు వ్రాసిరి; వారు తిరిగి వెళ్ళిపోయిరి. కావున అది మనకు అర్థమయినది; దానిని మనము వివరించాము.

125ప్రశ్న: శ్రమల కాలములో చనిపోయినవారు ఎప్పుడు పునరుత్థానులగుదురు? భక్తిహీనుల పునరుత్థానము వరకు వారు కూడా వేచియుండవలెనా? వెయ్యేండ్ల పాలన కాలములో వారు మరల జీవించెదరా?

ఇప్పుడు, అది మంచి ప్రశ్న. దీనికి ఎక్కువ సమయమును ఇయ్యవలెను. అందుకు తగిన ప్రశ్న. చూచారా? ఈ ఉదయం నేను ప్రారంభించినదానిలో కనీసం మూడు వంతలలో రెండు వంతులు పూర్తి అయినది - రెండు గంటలు అయినది. చాలా యున్నవి, వాటన్నిటినీ పూర్తి చేయలేము. మీరు చూచారా? నేను నాకు వీలయినన్ని పూర్తి చేయ తలంచాను. అవెక్కడున్నాయో నేను చూడనే లేదు. చాలా మంచి ప్రశ్నలు, తెలిసికోవలసినవి కూడా ఇచ్చటున్నవి, సర్ప సంతానమును వివరించవలెను, మరియు ఇంకా ఆయా సంగతులున్నవి; అయితే చాలా త్వరపడి వీటిని నేను చెప్పవలసి యున్నాను.

REV 20:5,12,13

 

126"శ్రమల కాలములో చనిపోయిన సంఘము, పునరుత్థానములో యుండునా?" (చూచారా?) రెండవ పునరుత్థానము, రెండో పునరుత్థానము.

"భక్తిహీనుల పునరుత్థానము వరకు వారు కూడా వేచియుండవలెనా?" నీతిమంతుడు మరియు అనీతిమంతులు ఒకేసారి లేచుదురు.

"వెయ్యేండ్లపాలన కాలములో వారు మరల జీవించెదరా?" లేదు! మిగిలిన మృతులు వెయ్యేండ్లపాలన అంతము వరకు జీవించరు. అది చాలా చిన్నగా యున్నది, కాని నేను నిశ్చయముగా…

1COR 8:9•

GAL 2:4•

GAL 5:13

 

127ప్రశ్న: క్రీస్తునందు స్వాతంత్ర్యము మరియు స్వేచ్చ అని పౌలు చెప్పినదానికి అర్థమేమిటి? ధర్మశాస్త్రము నుండి స్వాతంత్ర్యమునకు మార్గము ఏది?

మీరు చట్టమునకు బద్ధులు కారు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ అదే యున్నది; సహజ విధానములో నేను వివరించెదను, త్వరగా. ఉదాహరణకు చూడండి, ఇక్కడి వీధిలో నీవు గంటకు ముప్పది మైళ్ళ వేగమును దాటి వెళ్ళరాదు. ఇప్పుడది సరి. నేను ఆ వీధిలో గంటకు నలుబది మైళ్ళ వేగముతో వెళ్ళిన యెడల, చట్టము నన్ను శిక్షించును. కాని వీధిలో గంటకు నేను ముప్పది మైళ్ళ వేగముతో వెళ్ళిన యెడల చట్టము క్రిందికి నేను రాను, చూచారా. అదే క్రీస్తులో స్వాతంత్ర్యము, చూచారా, అదే సంగతి.

నేను దొంగిలనప్పుడు, అబద్ధమాడనప్పుడు, పొగ త్రాగనప్పుడు, వ్యభిచారము చేయనప్పుడు, ఈ కార్యములలో ఏదియూ చేయనప్పుడు నేను చట్టము క్రిందికి రాను, చూచారా. నేను చట్టము నుండి విముక్తుడను; నేను క్రీస్తులో యున్నాను.

128ప్రశ్న: కుటుంబ నియంత్రణ గూర్చి నీ అభిప్రాయమేమిటి?

ఈ ఉదయమున కొందరితో ఆ విషయము మాట్లాడాను. ఆ విషయముల గూర్చి మీతో వ్యక్తిగతముగా మాట్లాడుటకు నేను ఇష్టపడుదును, చూచారా, ఎందుకనగా నేను చెప్పవలసిన మాటలు మరియు సంగతులు ఉన్నవి. భార్యా భర్తలకు దానిని గూర్చి తప్పక చెప్పెదను.

దానిని సరయిన మార్గములో అనుసరించు బాధ్యత ఒకటున్నది. సామాన్యముగా దీనిని చెప్పుచున్నాను. స్త్రీ పరిపక్వమునకు రాని రోజులు ఆమె జీవితములో చాలా యుండును. మీరు గ్రహించారా? మంచిది.

కొన్నిసార్లు పిల్లలు పుట్టుట ద్వారా స్త్రీ చనిపోవు పరిస్థితి ఎదురవును; అనగా బిడ్డ పుట్టినచో ఆమె బ్రదుకదని చెప్పెదరు. దానిని కూడా మీరు గమనించవలెను. చూచారా? కావున ఆ విషయములో మీరు చాలా జాగ్రత్తగా యుండవలెను. చూచారా? చూడండి, అది జీవమును తీసికొని వచ్చు చర్య, అందుకొరకు మీరు భూమి మీద ఉంచబడియున్నారు.

నీ భార్య చాలా వ్యాధిగ్రస్తురాలై, మరో శిశువును ప్రసవించినచో చనిపోవునని చెప్పినప్పుడు, ప్రభువు నిన్ను అలాగు బిడ్డను జన్మింపచేయమని కోరడు. ఆ విషయముల గూర్చి మీరు వ్యక్తిగతంగా నా యొద్దకు రండి; వ్యక్తిగతముగా కలిసికొనండి. మీతో వ్యక్తిగతముగా నేను మాట్లాడెదను. చూచారా?

129చూడండి, ప్రతి వ్యక్తిని చూచి, వారు నాతో అబద్ధమాడుచున్నారో లేదో చెప్పగలను. చూచారా? వారు ఆయా విషయములు చెప్పెదరు. చూచారా? ఈ విధముగా మీరు వ్రాయునప్పుడు, మీకు తెలియదు. ఆ విషయములు వ్యక్తిగతముగా సంబంధించినవి; దానిని నేను చెప్పగలను, వారు సత్యము చెప్పుచున్నారో లేదో నేను చెప్పగలను, చూచారా.

REV 20:1-15

 

130ప్రశ్న: ప్రకటన 20 మరియు 3, ప్రకటన 20:27 లోని వెయ్యేండ్ల తరువాత కొద్ది కాలము పాటు సాతాను ఎందుకు విడిపించబడును?

ఎందుకు విడుదలయగును? తన ప్రజలను రెండువ పునరుత్థానము కొరకు పోగుచేయును, ఎందుకనగా సాతాను కూడా తీర్పులో నిలబడవలెను, చూచారా. వానికి శిక్ష విధింపబడవలసి యున్నది.

ఓ మై, ఈ గ్రంథములో వారి గూర్చి పూర్తిగా యున్నది. వారిని గూర్చి పూర్తిగా వ్రాసిన ఉత్తరము ఇక్కడ మరియొకటున్నది. ఇప్పుడు నేను బహు త్వరగా ముందుకు వెళ్ళవలెను.

ACTS 9:7

 

131ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, అపోస్తులుల కార్యములు 9వ అధ్యయము మరియు 7వ వచనము మరియు అపోస్తులుల కార్యములు 20 - 22 వచనమును దయచేసి వివరించుము. (నెవిల్ సోదరుడా, దానిని నా కొరకు తీయుము) దయచేసి అపోస్తులుల కార్యములు 9:7 వచనమును వివరించుము.

దానినతడు తీయుచుండగా మరియొక ప్రశ్నను వెంటనే చూచెదను. మీరు అలసిపోయారా? అలసితిరని నేనెరుగుదును.

ప్రశ్న: "వధువు ఎత్తబడుట యొక్క మర్మమును దయచేసి వివరించుము. అదెట్లు జరుగును? ఏ స్థలములో నుండి వధువు వెళ్ళును?" అవి చక్కని ప్రశ్నలు. నిజంగా మంచి ప్రశ్నలు. దినమంతా నిలబడి చేసెదను.

ఇప్పుడు ఒక నిమిషము ఆగుదము. అపోస్తులుల కార్యములు 9:7. (నెవిల్ సోదరుడా, వందనములు) - 9వ అధ్యాయము మరియు 7వ వచనము.

అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.

132మీరెక్కడికి వెళ్ళుచున్నారో నాకు తెలియును. చూచారా? ఆ తరువాత కూడా ఆ విధంగానే చెప్పబడినది. అక్కడ ఏమి జరిగినో నాకు తెలియదు. మీకు నేను చెప్పలేను, ఎందుకనగా ఆ తరువాత వారు వినిరి. ఒకసారి దానిని వారు చూడలేదు. ఆ తరువాత దానిని వారు చూచిరి గానీ వినలేదు. బైబిలులో ఇంతకు ముందు దీనిని చూచిన వారెందరున్నారు? నేను చూచాను గాని దానిని నేను వివరించలేను, చూచారా. ప్రభువు దానిని నాకు బయలుపరచవలసియున్నాడు. కొంత సేపటి క్రితం మీతో చెప్పియున్నాను, మీ పట్ల నేను యధార్థంగా ఉండవలసి యున్నాను, చూచారా. నాకు తెలియదు. నన్ను క్షమించవలెను. దానిని నేను వివరించలేనప్పుడు, ఆ విధంగా మీతో యధార్థముగా చెప్పవలెను. నాకు తెలియనప్పుడు దానిని తెలిసినట్లు చెప్పరాదు.

దానిని నేను వివరించలేను, ఒక చోట వారు వెలుగును చూచిరి గాని ఆ స్వరమును వినలేదన్నట్లుగా యున్నది. ఆ తరువాత వారు స్వరమును వినిరి గాని వెలుగును చూడలేదని యున్నది. దానిని నేను వివరించజాలను, చూచారా. ఏమి జరిగినదో నాకు తెలియదు. ప్రభువు దానిని నాకు బయలుపరచు వరకు దాని గూర్చి నేనెరుగను; వివాహము మరియు పరిత్యాగము గూర్చి నేను చెప్పలేకపోయినట్లే యున్నది. దానిని ఆయన నాకు బయలుపరచు వరకు నేనెరుగను.

133ఈ ఉదయము కూడా ఒక సంగతి జరిగినది. ప్రభువగు దేవుడు, భూమ్యాకాశములను సృష్టించినవాడు ఇది సత్యమని ఎరుగును, ఈ ఉదయమున ఆయన మొత్తం పూర్తి చేసెను. వివాహము మరియు పరిత్యాగము గూర్చి చెప్పెను. అది నిజము. ఆ కారణము చేతనే అదంతా సమకూర్చనీయండని చెప్పాను.

సర్ప సంతానము వంటి సంగతులు కొన్ని వున్నవి. వాటిని నాకు అందించినప్పుడు నేను ఏమియు చూడలేకపోయాను; కాని దానిని వెంబడించుచునే యున్నాను, మొదటి సంగతి మీకు తెలియును… నీవు ముందు దాని నుండి దూరంగా పోవలెను, అప్పుడు పరిశుద్ధాత్మ దానిని బయలుపరచును. ఇప్పుడు దానిని ఎవరైనా ఖండించుటకు ప్రయత్నించవలెనని కోరుచున్నాను, చూచారా. దానిని చేయలేరు.

GEN 17:16•

ROM 4:19

 

134ప్రశ్న: వధువు ఎత్తబడుట యొక్క మర్మమును దయచేసి వివరించుము.

కేవలము ఒక మార్పు, చూచారా, మన శరీరములు అని ఇప్పుడు చెప్పుదము… దానిని నేను చెప్పినప్పుడు నా భావమేమిటో మీకు తెలియును. బక్తిహీనత అని నా భావము కాదు. మన అని నేను చెప్పుగోరను; ఈ సంఘము అని నేను చెప్పను; ప్రతి విశ్వాసి అని నా భావము.

అబ్రాహాము ఒక వాగ్దాన కుమారుని కొరకు చూచుచుండెను. అది అతనికి వాగ్దానము చేయబడెను. అది నిజమేనా? సంఘము ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు (అది నిజమేనా?), వధువు వాగ్దాన కుమారుని కొరకు ఎదురుచూచుచున్నది.

శారా మరియు అబ్రాహాముల యొద్దకు వాగ్దాన కుమారుడు వచ్చు ముందుగా వారి శరీరములు మార్పు చెందవలసియున్నది. అది నిజమేనా?

బిడ్డను కనలేనంత వృద్ధురాలు. ఆమె యొక్క రొమ్ములో పాల నాళములు లేవు. ఆమె రొమ్ము ఎండిపోయినది. ఆమె గర్భము మృత తుల్యము. ఆమె వంధ్యురాలు. ఆమె శిశువును కనలేదు. ప్రసవ వేదనను తాళలేనంత గుండె బలహీనురాలు. కాని ఏమి జరిగినది? దేవుడామెను మరల ఒక యువతిగా మార్చెను. అబ్రాహాముకు కూడా ఆయన అదే చేసెను, ఎందుకనగా అతని శరీరము చచ్చిన దానికి సమానముగా యుండెను. చూచారా? వాగ్దాన కుమారుని పొందుటకు వారి శరీరములను ఆయన మార్చవలసి వచ్చెను.

ఇప్పుడు మనము జీవించుచున్న ఈ శరీరములలో నేడు మనకు వాగ్దానము చేయబడిన వాగ్దాన కుమారుని పొందలేము; ఈ శరీరములు పాప తుల్యములు.

135మొదటి మనస్సాక్షి ఈ శరీరమును చూపు, రుచి, తాకిడి, వాసన, వినికిడి, మొదలగు వాటితో అదుపు చేయును, మనందరము వాటితో నిండియున్నాము; మనము కారణములు వెతుకుదుము మరియు సమస్తము చేయుదుము. కాని తిరిగి జన్మించుట ద్వారా ఆ నూతన శరీరము వచ్చును. (ఈ మొదటి మనస్సాక్షి కాదు, అది గతించును)… ఆ అంతరంగములో ఒకటి జీవించును. దానిని గ్రహించిన వారందరూ "ఆమేన్!" చెప్పండి.

ఈ బాహ్య దృష్టి, రుచి, స్పర్శ, వాసన, వినికిడి కాదు. అవి కానే కావు. అవి మరణమునకు గురి యగును మరియు చనిపోవును, కాని నీ అంతరంగ భాగము, అది ఈ లోన యున్నది, ఆ వ్యక్తి మరణించడు. చూచారా? ఆ వ్యక్తిలో నుండియే ఈ నూతన జీవము ప్రారంభమగును. ఈ క్రొత్త జన్మ నుండి వచ్చును. నీ వ్యక్తిత్వపు రూపములో అది మరొక వ్యక్తిని నిర్మించును, ఆ జీవము చుట్టూ నిర్మించును. దానిని మీరు గ్రహించారా?

136కావున యధార్థముగా అది ఇచ్చట ఉన్నది, అది ఏమిటి? జగత్తు పునాదికి ముందే వాక్యము వాగ్దానము చేయబడినది. ఇది నెగెటివ్ మాత్రమే ప్రతిబింబించును; అది పోజిటివ్ ను ప్రతిబింబించును, వాక్యము, చూచారా. వధువు ఎత్తబడుట కూడా అంతే. నీలో నున్న వాక్యము ద్వారా శరీరము నిర్మితమగును. ఆ వాక్యము చుట్టూ శరీరము ధరించును, శారా ద్వారా అదే జరిగెను.

ఆమెకు మసలి శరీరమున్నది. ఆ మెదటి శరీరము మారినప్పుడే కుమారుడు వచ్చును. దానిని మీరు గమనించారా? ఆ శరీరము దీనిని చేయలేదు. ఈ శరీరము అందుకు పనికి రాదు. కావున కుమారుని మనము పొందవలెనన్న ఆ విధంగానే అది మారవలెను.

GEN 24:12,15

 

137ప్రశ్న: అదెట్లు జరుగును మరియు వధువు ఎచ్చటికి వెళ్ళును?

అది మహిమలోనికి వెళ్ళును, పెండ్లి విందునకు పరలోకములోనికి వెళ్ళును, ఇస్సాకు మరియు రిబ్కాల మాదిరిగా యుండును. ఇస్సాకును ఎదుర్కొనుటకు రిబ్కా వెళ్ళెను. ఎలియాజరును గుర్తుంచుకొనండి, అబ్రాహాము నుండి బయలు వెళ్ళిన వర్తమానమునకు ప్రతినిధి. ఇస్సాకుకు వధువును కనుగొనుట కొరకు ఎలియాజరు బయలు వెళ్ళెను. సాయంకాలపు వేళ అతడు అందమగు రిబ్కాను కనుగొనెను. చిన్న నల్లని-ఛాయ బాలిక కుండలో నీరు చేదుకొని వచ్చుచుండెను. ఎలియాజరు ప్రార్థించెను, "ప్రభువగు దేవా, నాకు మంచి ప్రయాణము దయ చేయుము. నా యజమానుడగు అబ్రాహామునకు జయమునిమ్ము."

"ఫిలిష్తీయులలో నుండి ఆమెను తీసికొని రాకూడదు," అని అతడు చెప్పెను. తన జనుల మధ్యలో నుండి ఆమెను తీసికొని రావలెనని చెప్పెను. క్రీస్తు యొక్క వధువు మరియు క్రీస్తు రక్త సంబంధము కలిగియున్నారని చూపించెను, ఎందుకనగా రిబ్కా మరియు ఇస్సాకులు బాంధవ్యమున్నవారు.

GEN 24:15,16,56-58

 

138వారు వెళ్ళిరి, అందమగు రిబ్కా బయటకు వచ్చెను. నీరు తీసికొని వచ్చెను. అతడు ప్రార్థించెను - ఒంటెలన్నింటికిని నీరు పెట్టెను, రిబ్కాను మీరు గమనించండి. తుది నిర్ణయము రిబ్కాదే. ఆ బాలిక నిమిత్తము అతడామె తండ్రిని అడిగెను. ఆ బాలిక తల్లితో కూడా మాట్లాడెను. వారిద్దరిలో ఎవరునూ నిర్ణయము చెప్పలేదు. కొద్దిసేపు ఆమెను ఉండమని కోరిరి. "నా పని విషయములో నన్ను ఆటంకపరచ వద్దు" అని అతడు చెప్పెను.

రిబ్కాయే తీర్మానము చేయవలసి వచ్చెను, ఎందుకనగా అతడు ఇట్లనెను, "ఆమె యుక్త వయస్సురాలు; కావున ఆమెనే నిర్ణయము చేసికోనీయండి."

ఆమెకు అది తెలియచేసిన వెంటనే ఆమె తన మనస్సులో నిర్ణయము చేసికొనినది. "నేను వెళ్ళెదను" అన్నదామె. ఆమె ఒంటి ఎక్కి బయలుదేరినది. చూడండి, ఆమె ఏ ఒంటికు నీరు పోసినదో ఆ ఒంటియే ఆమెను పెండ్లి కుమారుని యొద్దకు మోసికొని పోయినది. అదే ఆమెకు జయము నిచ్చెను. (బైబిలులో జంతువు అధికారమునకు, శక్తికి సాదృశ్యము)… మనము ఆ శక్తికి నీరు పోయుచూ స్తుతించుచున్నాము. (ఆమేన్! చూచారా?) నీరు, జీవము, స్తుతి, వాక్యము - అవే మనలను మహిమ రాజ్యమునకు వెళ్ళుటకు, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు తీసికొని వెళ్ళును. అవునయ్యా! ఆమేన్!

ఆ సంతోషకరమగు వెయ్యేండ్లపాలన దినము యొక్క

రాక కొరకు ఎదురు చూచుచున్నాము;

మన ధన్య ప్రభువు వచ్చునప్పుడు,

ఎదురు చూచుచున్న వధువును తీసికొనిపోవును.

GEN 24:63-67•

1THS 4:17

 

139గుర్తుంచుకొనండి, ఇస్సాకు గుడారమును విడిచి వచ్చి బయటి పొలములో ఆ మిట్ట మధ్యాహ్న సమయమందు ధ్యానించుచూ నిలబడి యుండెను. (ఆమేన్!) రిబ్కా వచ్చుటను అతడు చూచినప్పుడు… అతనిని ఎన్నడూ ఆమె చూడలేదు, ఆమెను ఎన్నడూ అతడు చూడలేదు, కాని అది మొదటి చూపులోని ప్రేమ. ఆమె అతనిని ప్రేమించసాగినది, అతడు ఆమెను ప్రేమించెను, ఆమె ముసుగు కూడా ధరించినది. ఆమేన్! ఓ, మై!

చూడండి, ఆమె అతనిని చూడగానే ఆమె హృదయము సంతోషముతో నిండిపోయినది. ఆమె ఎవరిని పెండ్లి చేసికొనునో తెలియదు, కాని విశ్వాసము ద్వారా. ఆమేన్! గుర్తుంచుకొనండి, యేసు రాజ్యమును విడిచిపెట్టును, మహిమలో మనము ఆయనను కలిసికొనము, కాని ఆకాశము మరియు భూమికి మధ్య అనగా మధ్యాకాశములో ఆయనను కలిసికొందుము, మనలను విమోచించుటకు అది విస్తరించబడినది. మధ్యలోనే అతడు రిబ్కాను కలిసికొనెను. ఆమె ఇంటికిని, అతని ఇంటికి మధ్య కలిసికొనెను. ఆమేన్! ఆమెను తన గృహమునకు కొనిపోయెను. ఆమెను పెండ్లి చేసికొనెను. తన తండ్రి యొక్క సమస్తమునకు అతడు వారసుడయ్యెను. ఆమేన్! ఓ, పరిపూర్ణము. మంచిది.

ప్రశ్న: …లో పురుషుని, భార్యను దేవుడు వేరుచేయునా?

140దీనిని చదువకుండుట మంచిదని భావించుచున్నాను, చూచారా. అది మరియొక భావమును ఇవ్వవచ్చును. మీరు చూచారా? మీ అందరి గూర్చి నాకు తెలియును, కాని ఇది టేపు చేయబడుచున్నది. మీరు చూచారా, కావున నేను చెప్పకుండుట మంచిది. ఇది ఒక సంగతి గూర్చి అడిగిరి. దీనిని వ్రాసిన వ్యక్తికి నాకు ఇది తెలియును. కావున నన్ను వ్యక్తిగతముగా కలిసికోవలెనని కోరుచున్నాను. కావున అందరిలో దానిని చదువకుండుట మంచిది, చూడండి. అందులో ఏమి తప్పు లేదు. వారు ఒక చట్ట సంబంధమగు ప్రశ్నను అడిగిరి, కాని దానిని వ్యక్తిగతముగా వారిని కలిసికొని దీని గూర్చి చెప్పుట మంచిది. వ్రాసినది ఎవరైనా గాని వారికిది తెలియును.

141ఓ, మై! జనులారా, మన సమయం ఎప్పుడో అయిపోయినది. మనము ముగించుకొని భోజనమునకు వెళ్ళుట మంచిది. నేను నిలబడి ఎంత సమయము గడుపవలెనని కోరుచున్నారు? ఓ, మై, మై! కేవలను కొద్ది సమయము గడుపుదును. అందరూ త్వరగా వెళ్ళవలసియున్నారు. మీ భోజనమును వృధా కానీయరాదు. నేను బహుశ బ్లూ-బోయర్ యొద్ద గాని ప్రేయర్స్ యొద్ద గాని భోజనము చేయుదును. వారు ఏ విధముగాను తొందర చేయరని తలంచుచున్నాను. మీరు వెళ్ళవలసి యున్నచో మంచిది, దేవుడు మిమ్ము దీవించును గాక; నేను అర్ధము చేసుకొందును, చూచారా. నేను ఈ కొద్ది ప్రశ్నలు చూచెదను. అంతే. వాటికి నేను జవాబు ఇచ్చి ముగించెదను. దాదాపుగా వీటి కొరకు మరి పదిహేను నిమిషములు తీసికొని ఆ తరువాత భోజనమునకు వెళ్ళెదను.

142ప్రశ్న: నాకు ఇద్దరు పెండ్లి అయిన కుమార్తెలున్నారు. వారు ఈ వర్తమానమును నమ్ముదురు. (అది నిజము.) వారు శాఖలకు చెందినవారు. వారు ఈ వర్తమానమును నమ్మి అందుకొరకు నిలబడియున్నారు. దానిని చేర్చుకొనియున్నారు. వారు ఏమి చేయవలెను? వారు వ్యతిరేకతను ఎదుర్కొనుచున్నారు? మేమేమి చేయవలెను?

మీరు గట్టిగా నిలబడుడి! నిశ్చయంగా! మీ రంగులు చూపించండి. వారికి మీరు లొంగిపోరాదు. అయ్యా, వారి సహవాసమునకు వెళ్ళరాదని నా భావము కాదు. వారి మధ్యకు వెళ్ళరాదని కాదు. మీరు వారితో సహవాసము చేయ కలిగినంత కాలము చేయవచ్చు; కాని వారు ఆహారమును మార్పు సమయము వచ్చినప్పుడు, మీరు పావురపు ఆహారమునే గాని కాకి ఆహారమును తినరాదు. మీకు తెలియును. కాకితో పావురము భుజించదు.

MARK 13:27•

REV 20:7-9

 

143ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, దయచేసి మార్కు 13:27ను వివరించెదరా. ప్రకటన 20:7 మరియు 19 లోని ప్రజలు గూర్చి ఏమిటి బ్రెన్హాం సోదరుడా? - పరిశుద్ధులకు విరోధంగా యుద్ధము ఎందుకు చేసెను? వారెచ్చట నుండి వచ్చిరి? నోవహు కుటుంబముతో పాటు వారు కొనిపోబడుట జరుగునా?

ప్రకటన 13 - కాదు, మార్కు 13:27, నేవిల్ సోదరుడా ప్రకటన 20. కాప్స్ సోదరుడా, నీ బైబిలు నీ యొద్ద ఉన్నదా? ప్రకటన 20. అది 7 మరియు 9 వలె యున్నది. దానిని అతడు తీసెను. ప్రకటన. ఇప్పుడు ఏది? మార్కు 13:27, 13 మరియు 27.

అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును - భూదిగంతము నుండి ఆకాశము యొక్క అంతము వరకు.

అది పునరుత్థానమును గూర్చి, ఎత్తబడుటను గూర్చి, పైకి ఎక్కిపోవుటను గూర్చి మాట్లాడుచున్నది. పోగు చేయుటకు ఆయన తన దూతలను పంపించును. దేవదూతలు అనగా ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హూ? వర్తమానికులు. ఆయన వారిని పోగుచేయును, వారినందరినీ సమాకూర్చును, చూచారా. వారిని తీసికొని వచ్చును, భూదిగంతము మొదలుకొని ఆకాశము అంతము వరకు ఉన్నవారినందరినీ పోగుచేయును. గతంలోను, ఇప్పుడును ఉన్న వాక్యము భూమి మీద ప్రత్యక్షపరచబడుచున్నది, చూచారా. దానిని గ్రహించారా? వాక్యము పలుకబడినది; ఇక్కడిది ప్రత్యక్షపరచబడినది, చూచారా. మంచిది, కాప్స్ సోదరుడా, మనము చూద్దాం.

వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడెను.

మంచిది. దానిని వివరించుట నేను ముగించాను. వెయ్యి సంవత్సరముల తరువాత సాతాను చెరలో నుండి విడిపించబడునని నేను చెప్పలేదా?

మంచిది, ఇక్కడ మరియొకటి ఉన్నది. ఒక్క నిమిషము.

144ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, జరిగిన సంగతులు దేవుని వలన జరిగినవా లేక నా స్వంత క్రియల మూలముగా జరిగినవా! నీవది వ్రాసియుండవలసినది. మంచి చేవ్రాత, కాని నా విద్య సరిగా లేదు. అక్కడేమి చెప్పెను? (సహోదరుడు బ్రెన్హాం, సహోదరుడు నెవిల్ మాట్లాడుతున్నారు- దానికి నేను జవాబు ఇయ్యగలనని నేను అనుకొనుట లేదు. సహోదరుడు కాప్స్ గానీ నేను గాని దానిని చూడలేకపోయాము. (పోషణ గూర్చి అనుకొనుచున్నాను. ఏదో పెంచుట గూర్చి అనుకొనుచున్నాను.) నేను సాకుట అపినప్పుడు దేవుని వలన జరిగినదా? లేక అది నా పొరపాటా?

నాకు తెలియదు. దీనిని నేను వ్యక్తిగత ఇంటర్వ్యూలో చూస్తాను, చూచారా.

నర్సువలె సాకుట ఒక చట్టబద్ధమగు విషయము. దీనికి జవాబు ఇవ్వరాదని నేను వెనక్కు త్రోసివేయుట లేదు. ఈ ప్రశ్న ఆమెకెంత ముఖ్యమో, నీకు మరియు నాకును అంతే ముఖ్యము, చూచారా. నీవు నర్సువైనచో, నీ పనిని నీవు విడిచి పెట్టగోరుచున్నచో అనగా పని చేయరాదని నీవు తలంచుచున్నచో అది నీ నిర్ణయము. నామట్టుకు సేవ చేయుట దయతో కూడిన పని, చూచారా. నీవు వైద్యుని వలె ఏదో చేయుటకు ఆలోచించవలెను.

145ఒక వైద్యుడు, అనగా మంచి వైద్యుడు, డబ్బు ఉన్నా, లేకపోయినా రోగికి సహాయము చేయును. అతడే నిజమగు వైద్యుడు, చూచారా. సేవకుడయినా అంతే, మనము ఒకరికి సహాయము చేయవలెను, ఎందుకనగా ఒకరి జీవితమును కొద్దిగా మెరుగుపరచుటకు సేవ చేయవలెను.

ఈ సంఘము నుండి నేను జీతముగా వారమునకు వంద డాలర్లు తీసికొనవలెనని వారు నన్ను కోరిరి. అది నన్ను చంపినట్లయినది. శ్రీమతి. విల్సన్, నాకు తెలియును, బహుశ వారి కుమారులు ఇచ్చట కూర్చొని యుందురు, కొన్ని సంవత్సరముల క్రితం జరిగినది గుర్తుంచుకొనండి, ఇక్కడ నేను పదిహేడు సంవత్సరములు బోధించాను. నా జీవితములో ఒక్క పైసా కూడా తీసికొన లేదు. నేను సంపాదించిన ఏ చిన్న మొత్తమునయినా గాని ఎప్పుడూ అందులోనే వేయుదును, చూచారా. ఈ కూటములలో హాజరగుట కొరకు దానిని నేను స్వీకరించవలెనని వారు నాకు చెప్పినప్పుడు, నేను దాదాపు నాశనమైనట్లు తలంచాను, చూచారా, అది పరవాలేదు అని నేను నమ్ముచున్నాను, కాని నా మట్టుకు నేనది కోరుకొనుట లేదు, డబ్బు వద్దు, నాకు కావలసినది కేవలము మీ స్నేహము మరియు మనతో దేవుని దయ.

మిమ్మును నేను ప్రేమించుచున్నాను, చూచారా, నేను మిమ్ము ప్రేమించుచున్నాను మరియు మీరు సరిగా ఉండవలెనని నేను కోరుచున్నాను; నా మట్టుకు నేను సరిగా ఉండగోరుచున్నాను. నన్ను మీరు నమ్మవలెనని కోరుచున్నాను; మిమ్మును నేను నమ్ముచున్నాను. మీరు ఒక ప్రశ్నను తీసికొని నా యొద్దకు వచ్చినప్పుడు, మీకు యధార్థముగా నేను జవాబు చెప్పగోరుచున్నాను. ప్రభువు నామము పేరట నేను చెప్పినయెడల, నేను ఏమి చేయమని చెప్పితినో - ఖచ్చితముగా దానినే మీరు చేయవలెనని కోరుచున్నాను. దాని నుండి ఏ మాత్రమూ తొలగవద్దు, ఆ విధంగా యున్నచో మనము కొనసాగిపోగలము అని నేను తలంచుచున్నాను, చూచారా. అప్పుడు ఇతరులు…

146నర్సింగు విషయమై అడిగారు. నీ హృదయములో నర్సుగా ఉండవలెనని నీకున్నదని తలంచుచున్నాను. అందరూ నర్సుగా ఉండలేరు. నర్సు ప్రజల పట్ల దయతోను, మృదువుగాను ఉండవలెను. ఓ, అట్టివారే నిజమగు నర్సు. మారెన్నడయినా వ్యాధితో యుండి ఆస్పత్రిలో పడి యున్నచో ఒక నిజమగు నర్సు వచ్చి ఎట్లు ఆదరించునో చూడండి. ఎంతో నీకు ఉపశమనము కలిగించును.

నాకు ఆపరేషను జరిగినది - ఆ సమయములో నాకు తుపాకీ పేలి గాయమైనది. నేను ఆస్పత్రికి వెళ్ళవలసి వచ్చెను. అక్కడ ఒక వృద్ధ నర్సున్నది. ఆమెను నేను "స్వీట్ పికిల్స్" అని పిలిచెను. ఆమె తన నోటితో ఊరగాయ పెట్టుకొని తినుచుండెను. సమయమంతా ఆ విధంగానే దానిని నమలుచుండెను. నాకు కేవలము ఆ సమయములో పధ్నాలుగు సంవత్సరములు. నాకు తుపాకీ దెబ్బ తగిలినది. ఆమె చాలా చిన్న మనిషి. నా చిన్న కాళ్ళు రెండునూ దాదాపుగా ఎగిరి పోయినవి. ఆమె ఇక్కడ ఒక తలగడ, అక్కడ ఒక తలగడ పెట్టినది. ఆమె అన్ని సమయములలో నాకు సహాయము చేయుచుండెను. (నేను చిన్న బాలుడను) - ఆమెను పెండ్లి చేసుకోవాలని నేను తలంచాను, ఎందుకనగా ఆమె అంత దయను, మంచిని నా పట్ల చూపినది. చూడండి, అనగా ఏదో చేయవలెనని దాని అర్థము.

147ప్రశ్న:ఒక ప్రశ్న నేను అడుగగోరుచున్నాను. మొదటి ప్రశ్న: స్త్రీల యొక్క పైజాములు… (ఒక్క నిమిషం ఆగండి: దానిని చదివెదను. లేదు, ఇది మంచిదే). స్త్రీల యొక్క పైజాములు, పురుషుని యొక్క దుస్తులకు సంబంధించినవా?

బాలుడా, వారు నిన్ను ఆ విషయములు అడుగరరాదని నాకు చెప్పవద్దు. నాకు తెలియదు. ఆ విషయములో నిర్ణయము నీవే చేసికొనుమని చెప్పుచున్నాను. అటువంటివి ధరించి జనుల ముందరకు వచ్చి తిరుగవద్దు; నాకది తెలియును. కానీ పడక మీదకు వెళ్ళు విషయము నాకు తెలియదు. దాని విషయములో కూడా నేను సమర్థించవలసి యున్నాను.

"నాకు తెలియనప్పుడు యధార్ధంగా నాకు తెలియదని నేను చెప్పవలసి యున్నానని మీతో చెప్పాను. ఆ విషయములో నా స్వంత ఆలోచన చెప్పను. (మంచిది), మీరు నా స్వంత ఆలోచనను అడిగినచో చెప్పెదను. అది మీరు కోరినచో చెప్పెదను. చూచారా?

ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఇది మిలియను మైళ్ళ తప్పు కాగలదు. రాత్రి గౌను చక్కగా ధరించుట మంచిదేనని నేను తలంచుచున్నాను. కాని అది మీ ఇష్టము. దానిని నేను చెప్పలేను, ఎందుకనగా దానిని నేను బలపరచలేను. గుర్తుంచుకొనండి, ఇది నా మాట గాని ఆయన మాట కాదు, చూచారా.

148ప్రశ్న: స్త్రీ యొక్క జుట్టు చివరలు సరి చేసికొనుటకు కత్తిరించుకొనుట తప్పా?

దానిని గూర్చి కొద్ది నిమిషముల క్రితం మనం చూచామని నేను నమ్ముచున్నాను, చూచారా, క్రిందికి వేలాడు ఆ చిన్న వాటిని గూర్చి వ్రాసిరని ఊహించుచున్నాను.

MATT 10:8-20•

LUKE 10:17,20

 

149ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఏడు సంఘ కాలములలోని ఒక టేపులో నీవు యూదా నీతిమంతునిగా తీర్చబడి శుద్ధీకరింపబడెను అని చెప్పియున్నావు. అతడు కృప యొక్క నిజమగు అనుభవములను పొందేనేమో వివరించుము. (అది మంచిది.) జీవగ్రంథములో యూదా యొక్క పేరున్నదని కూడా నీవు చెప్పితివి. అయినా అతడు పాతాళములోనికి, నాశనమునకు పోయెనని ఎరుగుదుము. జీవగ్రంథములో పేరున్న వ్యక్తి ఎట్లు నశించగలడు? చివరలో నశించునని తెలిసియుండియు దేవుడు ఆ వ్యక్తి యొక్క పేరును జీవగ్రంథములో ఎందుకు ఉంచెను?

అది మంచి ప్రశ్న, కదా? ఇది మంచి ప్రశ్న. దీనికి జవాబు ఇయ్యుటకు నేను దేవుని మీద ఆధారపడవలెను, ఎందుకనగా దానిని నేను పరిశోధించుచున్నాను. చూడండి! యూదా యొక్క పేరు జీవగ్రంథములో యున్నదని మొదట నేను మన సంఘములలో చెప్పాను. అది నిజము. దానిని మనమెరుగుదుము, ఎందుకనగా యేసు చెప్పెను. (మత్తయి 10) యేసు వారి నందరినీ దయ్యములను వెళ్ళగొట్టుటకును, సువార్తను బోధించుటకును, ఉచితముగా పొందిన దానిని ఉచితముగా ఇచ్చుటకును పంపెను. వారు సంతోషించుచూ తిరిగి వచ్చిరి, ఎందుకనగా దయ్యములు వారికి లోబడుచున్నవి. అది నిజమేనా? యేసు అప్పుడు వారికి చెప్పెను. వారి పేర్లు పిలచెను (ఎంతమందిని ఆయన పిలచెనో వారిని ఆయన పిలచెను, వారు తిరిగి వచ్చిరి); అందులో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా ఉండెను. చూచారా? దయ్యములు వారికి లోబడుచున్నందున వారు సంతోషముతో తిరిగి వచ్చిరి. చూచారా, అక్కడ దృక్పధము తప్పు, చూచారా. దయ్యమును కదిలించు శక్తి నీకు వచ్చినందున నీవు సంతోషించుట కాదు. అలాగు నీవు చేయరాదు. నీవు రక్షించబడుటకు కావలసిన కృప దొరికినందుకు నీవు సంతోషించవలెను. చూచారా. గమనించండి, అంతే గాని మరో విధంగా నీవు సంతోషించరాదు. జనులా విధంగా చేయుచున్నారు.

LUKE 10:20•

LUKE 22:32

 

150మామూలుగా వరములు కలిగిన వారు ఇక ఏ వరములను అపేక్షించరు, చూచారా. అందుకు దూరంగా పౌలు పారిపోవుటకు ప్రయత్నము చేసెను, అలాగే మోషే కూడా. అటువంటి గొప్ప నాయకులు ఆ పని నుండి పారిపోయిరి; వారి ముందు ఏముండెనో వారెరుగుదురు.

చూడండి, ఎల్లప్పుడూ ఈ విధంగా చెప్పు ఒక వ్యక్తిని తీసికొనండి, "ఓ ప్రభువా, నన్ను శక్తితో నింపుము, ఇక్కడికి నేను వెళ్ళెదను, దయ్యములను వెళ్ళగొట్టుదును." ఎన్నడూ దానినతడు చేయలేడు. ఎవరిని బాగుగా నమ్మవలెనో దేవునికి సరిగా తెలియును. చూచారా? ఆయనెన్నడూ అలాగున చేయడు.

అటువంటి వ్యక్తి దానితో ఏమియూ చేయగోరడు. మీరు చూచారా? అటువంటి దానిని దేవుడు తీసికొని ఒక సమయములో ఒక విషయము నేర్పును. మీరు గమనించారా?

అందరితో పాటు యూదా కూడా సంతోషించుచూ వచ్చెను. ఆయనట్లు చెప్పెను, "దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించవద్దు, కాని మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి యున్నవని ఎరిగి సంతోషించుడి." మీరిది గమనించి దానియేలును కూడా తీసికొనండి. చూచారా?

ఎందుకనగా మీ పేరు జీవగ్రంథములో ఉన్నది (ఎందుకనగా అది పరలోక మందున్నది, నీ పేరును గుర్తించెను) అయినా గాని దాని అర్థము నీవు రక్షింపబడినట్లు కాదు, చూచారా. నీవు పరిశుద్ధాత్మను పొందువరకు మార్పును పొందనట్లే. దానిని గుర్తించుకొనుము. నీవు మార్పుపొందినట్లు భావించవచ్చును, చూచారా.

151మీరు నన్ను ఒక ఓక్ చెట్టు అడిగినప్పుడు, నేను దాని విత్తనమును ఇచ్చాననుకొనండి. అది ఓక్ చెట్టుయే గానీ ఇంకా అది అభివద్ధి చెందలేదు. ఆ కారణము చేతనే నేను ఈ విధంగా భద్రతను విశ్వసించుచున్నాను.

మీరు ఒక గోధుమ పొలమును నాకియ్యవలేనని కోరితిననుకొనండి. అది కొంత ఎత్తునకు ఎదుగును. దాని అర్థము నాకు గోధుమ పంట వచ్చినట్లే, అది ఇంకా అభివృద్ధి కాలేదు గాని ఏదయినా జరుగ గలదు, చూచారా.

నీతీకరణము మరియు శుద్ధీకరణము ద్వారా మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందు దారిలో యున్నారు. కాని మీరు నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినప్పుడు మీరు ఆ రాజ్యములో యున్నారు. "అది నిజమేనా బ్రెన్హాం సోదరుడా?" అని మీరడుగ వచ్చును.

LUKE 22:32•

JOHN 17:17

 

152లేఖనములను చూపించుటకు ఇప్పుడు నాకు సమయము లేదు; మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చూచుకొనండి, నాకు తెలియుదు… నా మనస్సు. దానిని వెదకుటకు నేను నా కాంకర్డెన్సును మరల చూడవలసియున్నాను. రక్షించబడి, శుద్ధీకరింపబడిన పేతురుతో యేసు చెప్పెను. అతడు యేసు నందు విశ్వాసముంచి శుద్ధీకరణ పొందెను. యోహాను 17:17లో యేసు చెప్పెను. "తండ్రీ, సత్యము ద్వారా వీరిని శుద్ధీకరించుము. నీ వాక్యమే సత్యము." ఆయన మరియు వాక్యము ఒక్కటే. వారు వాక్యమను సత్యము ద్వారా శుద్ధీకరింపబడిరి. అదే సత్యము. అప్పగింపబడు రాత్రి యేసు పేతురుతో ఇట్లు చెప్పెను, "నీవు మారిన తరువాత నీ సహోదరులను బలపరచుము," - నీవు మారిన తరువాత అనెను.

LUKE 10:20

 

153మూడు సంవత్సరముల పాటు అతడు యేసును వెంబడించెను. అతని పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో యున్నది. దయ్యములను వెళ్ళగొట్టెను, గొప్ప క్రియలు చేసెను, స్వస్థతలు చేసెను, అన్ని విధముల కార్యములు చేసెను. వాక్యమును బోధించెను, అన్నీ ఉన్నా, ఇంకా మార్పు పొందలేదు. మీరు మార్పును నడిపించబడుచున్నారు, చూచారా.

అండమునకు మరియు వీర్యమునకు మధ్య చర్య జరుగుచున్నది. లేదా జన్యువు, ఆ కార్యము జరిగినప్పుడే బిడ్డ అక్కడ యున్నది. ఆ తరువాత శరీరము రూపొందును, అది రెండవ దశ; కానీ ఆ బిడ్డ ఇక్కడ జన్మించవలసి యున్నది, అప్పుడది జీవపు ఊపిరిని పొందును. అయినా అది జీవపు ఊపిరి కాదు. "ఓ, అది బ్రతికి ఉన్నది!" అని నీవు చెప్పవచ్చును. లేదు, ఇంకా జీవము లేదు! చిన్న నరములు మరియు కండరములు గంతులు వేయుచుండును, చూచారా. ఆ బిడ్డ జన్మించు వరకు ఇంకా జీవమును పొందనట్లే. నీవు గంతులు వేయవచ్చు, కదల వచ్చు, కాని ఇంకా కాదు… చూడండి. నీవు జన్మించవలసియున్నావు. నా భావమును మీరు గ్రహించారా? మంచిది.

DAN 7:9•

DAN 9:25•

REV 1:14•

REV 5:11•

REV 20:12

 

154ఇప్పుడతడు చెప్పిన దానిని చూద్దాం… "యూదా యొక్క పేరు జీవగ్రంథములో యున్నదని నీవు చెప్పియున్నావు, అయినా గాని అతడు పాతాళమునకు వెళ్ళి నశించెనని మనకు తెలియును. ఒక వ్యక్తి యొక్క పేరు జీవగ్రంథములో యున్నప్పుడు మరల అతడు నశించుట ఎట్లు జరుగును?" ఈ ప్రియ వ్యక్తి కొరకు మరొక చిన్న విషయమును నేను చెప్పెదను.

ఇప్పుడు గమనించండి, బైబిలులో దానియేలు గూర్చి ఉన్నది - ప్రకటనలలోని మొదటి గ్రంథమును దానియేలు వ్రాసెను. అతడు దర్శనములలో చూచినది మనము గమనించుదము. ఒక పురాతనపు వ్యక్తి వలె వచ్చిన ఆయనను అతడు చూచెను. ఆయన వెంట్రుకలు ఉన్నివలె తెల్లగా యున్నది. దానిని ఎందరు చదివి గుర్తుంచుకొనియున్నారు? ప్రకటన గ్రంథములో కూడా యోహాను దానినే చూచెను. ప్రకటన 1? ఆయనక్కడ నిలబడి యుండెను. ఆయన వెంట్రుకలు ఉన్ని వలె తెల్లగా యుండెను. ఆయన పాదములు మొదలగునవి చూడండి - ప్రాచీనకాలము వాని వలె యున్నాడు. ఆయన అనంతుడు, సమయము ఆయనకు లేదు, కాలాతీతుడు. ఇప్పుడు గమనించండి! పరిశద్దులు భూమి మీదికి వచ్చుదురు, గ్రంథములు తెరువబడును, మరో గ్రంథము విప్పబడును, అదే జీవగ్రంథము, ఒక్క గ్రంథము. వారు తీర్పు నొద్దకు వచ్చెదరు. ఆయన వచ్చును, ఆయనతో పాటు వేలాది పరిశుద్ధులను వెంటబెట్టుకొని వచ్చును. అది నిజమేనా? ఆయనకు పరిచర్య చేయుదురు, వధువుకు సేవ చేయుదురు, వారు రాజు మరియు రాణిగా ఉందురు.

DEUT 8:3•

MATT 4:4•

REV 5:11•

REV 20:12

 

155ఇంటిలో చిన్న రాణి ఎవరు? ఆమె నీకు భోజనము వడ్డించును. అది నిజమేనా? (మీకిప్పుడు అది ఆలస్యమయినది.) ఆమె మీకు భోజనము వడ్డించును. వాక్యమైయున్న క్రీస్తుకు వధువు పరిచర్య చేయును. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని ప్రతి మాట వలనను జీవించును." చూచారా. ఆమె రాజుకు వాక్య పరిచర్య చేయును. ఆమె జీవించుచున్న యుగమునకు వాగ్దానము చేయబడిన వాక్యమును ప్రత్యక్షపరచును. ఆమేన్! అప్పుడు ఒక సంగతి చెప్పాను గాని మీరది గ్రహించలేదు, కాని…

గమనించండి! ఓ, మై! అది మంచిది, చూచారా. ఆ కాలములో వాక్యము పరిచర్య చేయును. ఇప్పుడు గమనించండి! ఆయన వచ్చెను - ఆయన యొద్దకు వేలాది మంది వచ్చిరి; తీర్పు ఆసన్నమాయెను, గ్రంథములు తెరువబడెను; మరియు మరియొక గ్రంథము కూడా తెరువబడెను, అదే జీవగ్రంథము; ఆ ప్రకారము వారికి తీర్పు తీర్చబడెను. ఆ వచ్చినది ఎవరు? వధువు తీర్పులోనికి రానవసరము లేదు, ఆమె తీర్పు నుండి స్వాతంత్ర్యము పొందినది.

MATT 27:3•

LUKE 10:20•

REV 20:12

 

156జీవగ్రంథమను మరియొక గ్రంథము తెరువబడెను, మరియు ఆ జీవగ్రంథములో పేరుగల వారికి ఆ గ్రంథమును బట్టి తీర్పు తీర్చబడును. ఇస్కరియోతు యూదా విశ్వాసినని చెప్పుకొనెను, అతని పేరు జీవగ్రంథములో యున్నది. అది సరియేనా? తనకు నిత్యజీవమున్నదని చెప్పుకొనెను. అతని పేరు జీవగ్రంథములో వ్రాయబడెను. కావున అతడు… ఎందుకు, అతడు తీర్పునకు గురి కావలసియున్నాడు, జీవవాక్యమును అప్పుడతడు ఖండించెను, ముప్పది వెండి రూకలకు అమ్ముడు పోయెను. కొందరు మెతడిస్టుకు, బాప్టిస్టుకు, ఇతర వాటికి అమ్ముడు పోతున్నారు. జీవగ్రంథములోని తన స్థానమును అమ్ముకొనెను. దాని ద్వారా అతడు తీర్పును ఎదుర్కొన వలసియున్నాడు. వాక్యము బట్టి అతడు తీర్పును ఎదుర్కొనును, చూచారా. అందువలననే యాదా ఆ విధముగా చేయవలసి వచ్చెను, చూచారా. యూదా తీర్పులోనికి రావలసియుండెను. అతని పేరు జీవగ్రంథములో యుండెను, కాని దాని భావము అతడు రక్షించబడినట్లు కాదు. అతడు తీర్పును ఎదుర్కొనవలసియుండెను.

JOHN 5:24

 

157నిద్రించుచున్న కన్యక కూడా అదే పరిస్థితిలో నిలబడవలసియున్నది. యోహాను 5:24లో యేసు చెప్పిన దానిని గమనించండి, "నా వాక్యమును విని (దానిని చేర్చుకొనువాడు, అంతే గాని బోధ విని అది 'బుద్ధిహీనము' అనువారు కాడు. చూచారా?), నా వాక్యమును చేర్చుకొనువాడు - నా మాట విని నన్ను పంపిన వానియందు (అనగా వాక్యము) విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు (అది నటించు విశ్వాసము కారాదు, కాని నిజమయిన విశ్వాసము) అట్టివాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు (భూత కాలము)," చూచారా. అదే.

GEN 24:34•

NUM 13:23•

HEB 12:16,17

 

158కావున యూదా పేరు జీవగ్రంథములో యుండెను. (అది ఖచ్చితంగా నిజము), కాని అతనికి శిక్ష విధించబడెను, ఎందుకనగా అతడేమి చేసెను? తన జన్మహక్కులను అమ్ముకొనెను.

దేవుని యొక్క వాగ్దానముతో నీవు ఒక కుటుంబములో జన్మించెను. పెద్ద కుమారునికి జన్మ హక్కున్నది. ఎందరికిది తెలియును? దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఏశావు యొక్క పేరు జన్మహక్కు కొరకు గ్రంథములో వ్రాసియున్నది. (అది నిజమేనా?), కాని దానినతడు చిక్కుడు కాయ కూర కొరకు అమ్ముకొనెను. తన ఆకలిని తీర్చుకొనగోరెను. తన భోజనము కొరకు జన్మహక్కును వదలు కొనెను. ఒక్క పూట భోజనము కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనెను. తిరిగి పశ్చాత్తాప పడుటకు అవకాశము లేదు.

దేశమును వేగు చూచుటకు ఆ వేగుల వారు వెళ్ళియుండిరి. యెహోషువా మరియు కాలేబులు తీసికొని వచ్చిన ద్రాక్షా గెలలను కూడా తినిరి. అయినా వారేమి చేసిరి? తమ జన్మ హక్కులను అమ్ముకొనిరి.

HEB 6:4-6•

HEB 10:29

 

159యేసు చెపెను - లేక హెబ్రీయులకు 6వ అధ్యాయములో క్రీస్తు యొక్క దైవావేశముతో పౌలు మాట్లాడుతున్నాడు: "ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము. వారు ఏ నిబంధన రక్తముతో అయితే శుద్ధీకరింపబడిరో దానినే తృణీకరించుచున్నారు. కృప యొక్క క్రియలను విసర్జించి అపవిత్ర కార్యమును జరిగించుచున్నారు." అట్టి వ్యక్తి మరల వెనక్కు వచ్చుట అసాధ్యము.

యెహోషువా మరియు కాలేబులు తప్ప మిగిలిన వారందరూ అరణ్యములోనే చనిపోయి నశించిరి, అయినా వారు విశ్వాసులే, అయినా వారి పేర్లు గ్రంథములలో యున్నవి.

HEB 10:29•

HEB 13:12

 

160ఇక్కడ పౌలు చెప్పుచున్న దానిని చూడండి. ఒక వ్యక్తి రక్షించబడి యుండ వచ్చును, శుద్ధీకరణ కూడా పొందియుండవచ్చును. (రక్తము శుద్ధి చేయును; హెబ్రీయులకు 13:12 మరియు 13లో రక్తము శుద్ధిపరచునుని చెప్పుచున్నది), ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము వరకు వారు వచ్చుదురు. హూదా బట్టి లేదా శాఖను బట్టి వారా విధముగా లోబడుటకు ఒప్పుకొనరు, "ఆ వ్యక్తి నశించినట్లే, మరెన్నడునూ రక్షింపబడడు," అని చెప్పెను, చూచారా, ఎందుకనగా అతడు కృప యొక్క క్రియలను విసర్జించెను. అతడు వాటిని చూచెను, ఆ అనుభవము వరకు వచ్చెను, ఆ తరువాత దాని నుండి దూరమైపోయెను, ఎందుకనగా కృప యొక్క కార్యములను అతడు కాలదన్నెను. అతడు కృప చేతనే అక్కడికి పిలువబడెను, ఆ మార్గమతనికి చూపబడెను, ఆ తరువాత దాని నుండి తొలగిపోయెను, నిబంధన రక్తమును అతడు అపవిత్రముగా ఎంచెను. క్రీస్తు సిలువ వేయబడి ఆ రక్తమును కార్చెను, ఆ రక్తమే అతనిని రక్షించినది, నీతిమంతునిగా తీర్చినది, అతనిని శుద్ధీకరించినది, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొద్దకు తీసికొని వచ్చినది. ఆ తరువాత దాని నుండి దూరమైపోయెను.

GEN 3:3,4

 

161ఆ మాదిరిని ఇప్పుడు గమనించండి. నేను చాలా సమయము తీసికొను చున్నాను, కాని చూడండి! ఇస్కరియోతు యూదా అదే మార్గమును వెంబడించెను. ప్రభువైన యేసు నందు విశ్వాసముంచి అతడు నీతిమంతునిగా తీర్చబడెను. తన స్వంత రక్షకునిగా ఆయనను అంగీకరించెను. అతడు శుద్ధీకరింపబడెను. దయ్యములను వెళ్ళగొట్టు అధికారమియ్యబడెను. గొర్రెపిల్ల జీవగ్రంథములో అతని పేరున్నది. కాని పెంతెకోస్తు దగ్గరకు వచ్చుసరికి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నొద్దకు వచ్చుసరికి, వాక్యము యొక్క సంపూర్ణత యొద్దకు వచ్చుసరికి అతడు తన రంగును చూపించెను. కానాను వేగుల వారు కూడా ఖచ్చితంగా అదే చేసిరి; ఏశావు ఖచ్చితంగా అదే చేసెను.

ఏదేను తోటలో హవ్వకు కూడా సాతాను దానినే చేసెను: "నిశ్చయముగా చావనే చావరు…"

కాని, "దేవుడు చెప్పెను…" అన్నదామె.

"అవును, అది ఆ విధముగా చెప్పునని నాకు తెలియును; విధముగా చెప్పునని నాకు తెలియును, కాని నిశ్చయముగా చావరు…" అనెను. చూడండి, అప్పటి నుండి నేటి వరకు ఆ విధంగానే జరుగుతూ యున్నది.

JOHN 3:7

 

162మార్టిన్ లూథర్ యొక్క నీతీకరణము ద్వారా సంఘము పునరుద్ధరింపబడెను. తరువాత వెస్లీ యొక్క శుద్ధీకరణ వచ్చెను. కాని పరిశుద్ధాత్మ బాప్తిసపు సమయము వచ్చుసరికి వారు తమ రంగును చూపించిరి. దానితో వారికి సంబంధము లేదనిరి. నజరీన్, పిలిగ్రీం హెరాలీనెస్, చర్చ-ఆఫ్-గాడ్, ఇంకా తదితరులందరూ శుద్ధీకరణను విశ్వసించెదరు. ఆ విషయమలో వారిని వేలు ఎత్తి చూపించలేవు. అది సత్యము. కాని సరిహద్దు గీత యొద్దకు వచ్చుసరికి, నూతన జన్మ కొరకు పరిశుద్ధాత్మను పొందవలసి వచ్చినప్పుడు, ఆ అపవాది ఏమి చేయును? వచ్చి దానిని వక్రీకరించును. ప్రజలను అక్కడికి రానీయకుండా చేయుటకు తనకు తెలిసిన శక్తినంతా వాడుకొనును.

వారు వచ్చి, "నీవు భాషలతో మాట్లాడవలసి యున్నావు. నీకు ఉద్రేకము రావలసియున్నది. నీవు ఫలానిది చేయవలసి యున్నావు" అందురు. కాని అందులోనికి నీవు జన్మించ వలసి యున్నావు. శుద్ధీకరణ మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే అని ఎవరయినా నీతో చెప్పినచో, నమ్మరాదు. నిశ్చయంగా కాదు. ఖచ్చితంగా ఒకటి కాదు!

ఈ నాజరీన్ వారెట్లు కేకలు వేయుచున్నారో వినుము. "అది కాదు," చూచారా. అందులో ఒక భేదమున్నదని వారికి తెలియును. మన గొప్ప సోదరుడగు కాప్స్ నిశ్చయంగా అందులోని వ్యక్తియే, చూచారా.

MATT 12:31,32•

MARK 3:28,29•

LUKE 12:10•

HEB 6:4-6•

HEB 10:29

 

163నిశ్చయంగా నాజరీన్… వారికి విరోధంగా ఎవరును ఒక్క మాట పలుక లేరు. వారు చక్కని మత భక్తిగలవారు. వారు చాలా చక్కని వారు. చర్చ-ఆఫ్-గాడ్, నాజరీన్, ఫ్రీ-మెతడిస్టు, మొదలగు వారు నిజముగా మంచివాడు, కాని వారు ఆత్మ యొక్క క్రియల యొద్దకు వచ్చుసరికి, "ఓ, అది అపవాది క్రియ" అందురు. వారక్కడ ఏమి చేయుదురు? పరిశుద్ధాత్మను దూషించుచున్నారు. వారు అది చేసినప్పుడు…

దేవదూషణ అనగా ఏమిటి? దానికి క్షమాపణ లేదు. అది నిజమేనా? ఒకప్పుడు వెలిగింపబడి, పాలిభాగస్థునిగా యుండి, పరలోక వరమును రుచి చూచియు నిరాకరించినవాడు. దేవుని యొక్క శుద్ధీకరణను రుచి చూచెను. సిగరెట్లు నుండి శుద్ధి పొందెను. అపవిత్ర స్త్రీ నుండి విడిపించబడెను. అటువంటివాటన్నింటి నుండి విడిపించబడెను. పరలోక సంగతులను రుచి చూచెను. ఆ వేగలవారి వలె సరిహద్దు గీత వరకు నడిచి వచ్చెను. ఆ ద్రాక్ష పండ్లను తినిరి… కానీ వారేమి చేయవలసి యుండిరి? ఇందులోనికి వచ్చుటకు వారు తమ శాఖను చీల్చుకొన వలసి యుండిరి, చూచారా - పరలోక వరములను రుచి చూచిరి. దేవుని కుమారుని వారు నూతనముగా సిలువ వేయుచున్నారు. వారు ఏ నిబంధన రక్తములో అయితే శుద్ధీకరింపబడిలో దానినే అపవిత్రమైనదిగా ఎంచిరి.

1JN 3:12

 

164శుద్ధీకరణ పొందినప్పుడు నీ పేరు విశ్వాసిగా గ్రంథములో నమోదగును. నీ మాట - నీ పేరు ఆయన రక్తములో వ్రాయబడును, చూచారా? శుద్ధీకరణ దానిని చేయును. నీవు బయటకు వచ్చెదవు. ఇంత వరకూ ఆయన నిన్ను నమ్మియున్నాడు. అప్పుడు నీవు వచ్చి ఇట్లు చెప్పెదవు. "ఆయనకు ఇది తెలియునా?"

అవును, దానిని ఆయనెరుగును. ఆది యందు నీవది చేయవని ఆయనకు తెలియును. యూదా దానిని చేయడని ఆయనకు తెలియును; అతడు నాశన పుత్రుడు, కాని ఆ సంగతి నేరవేరబడవలెను, చూచారా. వాక్యము నెరవేర్చబడవలెను. అలాగే మాదిరిగాను, ఛాయగాను ఉన్నది. ఓ, మై! దాని మీద మనం నాలుగు గంటలుండ వచ్చును.

DAN 9:25•

ZECH 4:12•

REV 11:3,4

 

165ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, డెబ్బది సంఘ వారముల మీద నీవు వర్తమానము అందించావు - డెబ్బది వారములు. (క్షమించండి) దానియేలు యొక్క డెబ్బది వారములలో, చివరి వారము పూర్తిగా లేదా చివరి ఏడు సంవత్సరములు, రాకడలో వధువు ఎత్తబడిన తరువాత మొదలవునని నీవు చెప్పినట్లుగా నేను వినియున్నాను,

కాదు, కాదు, కాదు, కాదు, కాదు, కాదు, కాదు, కాదు! మీరది తప్పు విన్నారు, చూచారా, పూర్తి ఏడు వారములు కాదు. యేసు భూమి మీదికి వచ్చిన తరువాత వారము ప్రారంభమాయెను. "మెస్సీయా, అధిపతి, వచ్చి ప్రవచించును. ఏడు వారముల మధ్యలో ఆయన కొట్టి వేయబడును," అని చెప్పెను. యేసు ఖచ్చితంగా మూడున్నర సంవత్సరములు బోధించెను. అది డెబ్బది వారములలో అర్థభాగము, ఏడు రోజులు - వారము, చూచారా. ఇంకా మూడున్నర సంవత్సరములు మిగిలియున్నవి.

మోషే మరియు ఏలియాలు భూమి మీదికి వచ్చుట గూర్చి ప్రకటన మరియు జెకర్యాలలో వ్రాయబడియున్నది. (సహోదరుడు కూమర్, సహోదరి కూమర్ యొక్క ప్రశ్న కూడా అదే.) జెకర్యా 4 మరియు ప్రకటన 11. రెండు ఒలీవ చెట్లు అనగా - మోషే మరియు ఏలియా - వారు భూమి మీదికి వచ్చి 1,264 దినములు ప్రవచించెదరు. అదేమిటి? స్వయంగా మూడున్నర సంవత్సరములు. అది ఖచ్చితంగా ఒకే విషయము, చూచారా. ఈ ప్రియ వ్యక్తి ఎవరో గాని మంచి ప్రశ్న అడిగెను. చాలా అందమగు వ్రాత వ్రాసెను. చాలా భక్తిగల వరుసగా కనబడుచున్నది. చాలా చక్కగా యున్నది. అది చాలా మంచి ప్రశ్న. కాని మీరది గ్రహించలేదు, చూచారా, నేను చెప్పినది గ్రహించలేదు. మొత్తం డెబ్బది వారములు ఇచ్చట ఉండునని నేనన లేదు. మెస్సీయా కొట్టివేయబడును. ఇక్కడ దానిని బోధించగా ఎందురు జ్ఞాపకముంచుకొనిరి? నిశ్చయంగా! చూచారా? ఏడు వారములు.

JOHN 14:12

 

166ప్రశ్న: అప్పుటి నుండియు యేసు యొక్క సేవా సమయములో మొదటి మూడున్నర సంవత్సరములు నెరవేరినట్లుగా కనిపించుచున్నది. (ఇక్కడ దానిని మీరు చూచారు.) కాని "వారముల మధ్య" అను మాట క్రీస్తు విరోధి నిబంధనను ఉల్లంఘించుటకు వర్తించునట్లుగా కనిపించుచున్నది. (కాదు, చివరి మూడున్నర సంవత్సరములలో క్రీస్తు విరోధి తన నిబంధనను మీరును, చూచారా.) దానియేలు టేపును నేను అర్ధము చేసికొనిన ప్రకారము, మొదటి అరువది-తొమ్మిది వారములు యేసు యెరూషలేము లోనికి క్రీ.శ. 30 లో ప్రవేశము జరిపినప్పుడు నెరవేరినట్లుగా యున్నది. కావున ఆయన సేవలోని మూడన్నర సంవత్సరములు అరవై-తొమ్మిది వారములలో నిక్షిప్తమైయున్నవని అనుకొనుచున్నాను. చివరి పూర్తి వారము లేదా ఏడు సంవత్సరములు ఇంకా నెరవేరబడవలసి యున్నవి. రాకడలో అవి ప్రారంభమవును. దయచేసి నాకు దీనిని వివరించుము.

సోదరుడా, సోదరీ, ఈ ప్రశ్నను ఎవరడిగిరో వారు వినవలెను. చాలా బాగున్నది, చూచారా కాని నేను చెప్పిన దాని విషయములో మీరు కొద్దిగా గలిబిలి అయినట్లు కనిపించుచున్నది, చూచారా. యేసు యెరూషలేము లోనికి వచ్చెను (అది అక్షరాలా నిజము), అక్కడ నుండి ఆయన నేరుగా వెళ్ళి సిలువ మరణము పొందెను, చూచారా. డెబ్బది వారములలో సగము, అనగా మూడున్నర సంవత్సరములు ఆయన ప్రవచించెను. ఆయన కొట్టివేయబడెను. ఆయన ఆత్మ ఒక బలిగా అర్పించబడెను. ఈ చివరి దినములలో యూదులకు ఇంకా మూడున్నర సంవత్సరములు వాగ్దానము చేయబడినవి. ఈ సమయములో రాకడ కొరకు పరిశుద్దులు పోగుచేయబడును, సంఘము.

సోదరీ, సోదరుడా, ఇంతకంటే ఎక్కువగా నేనేమి చెప్పుజాలను.

167ప్రశ్న: I కొరింథీయులకు 1వ అధ్యాయము 1 మరియు 9 వచనములను దయచేసి వివరించెదవా! (నెవిల్ సోదరుడా, దానిని తీయుము. I కొరింథీయులకు 7వ అధ్యాయము, 1 వచనము)

MARK 16:15,18

 

168ప్రశ్న: యోహాను 14:12 లో యేసు చెప్పిన ప్రకారము ప్రతి నిజ విశ్వాసి ఆ క్రియలను చేయునా? (ఖచ్చితంగా కాదు. కాదు!): రోగులను స్వస్థపరచుట, దయ్యములను వెళ్ళగొట్టుట, మృతులను లేపుట. (అది యోహాను 14 లో లేదనుకొంటాను. సరే పరవాలేదు. అది మార్కు 16.), లేక ఇది కేవలము ఏలియాకు మాత్రమేనా? నిజముగా విశ్వసించు ఏ విశ్వాసి అయినా తప్పక దీనిని చేయవలెనా? అతడు నిజంగా అసలయిన విశ్వాసి అయినచో మృతులను లేపి, గొప్ప అద్భుతములు జరిగించునా?

అది విశ్వాసుల మధ్య ఉన్నది. చూచారా? ప్రతి వారికి ఆ వరములుండవు. అలాగని ఒక్క వ్యక్తియే దానిని చేయునని అర్థము కాదు. ఒక గుంపు జనులుందురు. ఉదాహరణకు చూడండి, ఇక్కడి మన ఆలయములో ఒక చక్కని బాలిక లేదా చక్కని బాలుడు లేదా మరొకరు, మనం నిజంగా ప్రేమించువారు చనిపోయిరనుకొందము. మొత్తం సంఘము కూడుకొనును, మరియు వారు ఉపవాసముండి ప్రార్థించెదరు: "ప్రభువా, ఈ బిడ్డ మీద కనికరము చూపుము," చూచారా. దేవుడా జీవమును మరల పోయగలడు.

నైసీన్ పితరులు గూరి ఎందరు చదివారు? మీకు తెలియును. ఆది సంఘములో వారు అలాగే చేసిరి. వారందరూ కూడుకొనిరి, కొన్నిసార్లు వారు సంఘ కాపరులను కూడా లేపిరి. అది చేయుట యుక్తమని దేవుడు చూచినచో జరుగును; వారు దానిని చేసిరి.

169ప్రశ్న: ఎత్తబడకపోయినా గాని సంఘము రక్షింపబడినచో నీవు బోధించినదే నమ్ముచున్నాను. శుద్ధీకరణ కొరకు ఆమె శ్రమల గుండా వెళ్ళుట తప్పని సరి. కాని చనిపోయిన వారి సంగతి ఏమిటి? వారెట్లు శుద్ధీకరణ పొందుదురు?

మంచిది. వధువుకు పవిత్రీకరణ అవసరము లేదు. ఆమె ముందే శుద్ధీకరించబడెను. వెనుక మృతులయిన వారి గూర్చి అడిగారు… చూచారా. ఈ సంఘము పొందిన వెలుగును వారెన్నడూ పొందలేదు. వారు వారి యొక్క నీతీకరణము, శుద్ధీకరణము మొదలగు వానిలో జీవించిరి. ఒక విధంగా వారు శ్రమపడి యుండ వచ్చును. వారు హింసలకు గురి కావలసి వచ్చెను. కాని ఇప్పుడున్న ఇటువంటి రాకడ సమయములో, చూచారా, ఒక కాలము రావలసి యున్నది - వధువు యొక్క శిరస్సు భాగమును నిరాకరించిన వధువు, - తన నిరాకరణ బట్టి శ్రమ పొందవలసి యున్నది, ఎందుకనగా ఆ కాలములో వారికి సువార్త తేటపరచబడలేదు. నేడు మీరెరిగినంత స్పష్టముగా వారెరుగరు, చూచారా. మీరు ఎంతో స్పష్టముగా ఇది చూచుచున్నారు, చూచారా. చాలా తేటగా దానిని చూచుచున్నారు. ఆ సంవత్సరములు మరియు మాదిరులు మీరు చూచారు, ఏడు ముద్రలు విప్పబడినవి, సంఘ కాలము మీ ముందుంచబడినది, అంతా అలాగే యున్నది. అదెంతో తేటగా యున్నది. దానిని మీరు తప్పిపోలేరు, చూచారా. దానిని మీరు పూర్తిగా నిరాకరించినయెడల ఒకే ఒకటి మిగిలియుండును, శ్రమపడవలసి యుందువు.

1COR 7:9

 

170నెవిల్ సోదరుడా, దానిని గ్రహించావా? అది దేనికి చెందును? నేనిక ఆపుట మంచిది, ఎందుకనగా చాలా ఆలస్యమగుచున్నది. చూచారా? 7:9 - మనము చూద్దాం.

అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లి చేసికొనవచ్చును; కామతప్తులగుట కంటే పెండ్లిచేసికొనుట మేలు.

అపవిత్ర జీవితము గూర్చి అది వ్రాయబడినది. పెండ్లి చేసికోవలెనని ఎవరయినా స్త్రీ పురుమడు, బాలిక, బాలుడు ఎరిగి యుండు వచ్చినప్పుడు వెళ్ళి పెండ్లి చేసికొనుట మంచిది. నా భావము మీరు గ్రహించియుందురు. అవును గదా? చూచారా? అంతే గానీ అపవిత్ర జీవితమును గడప రాదు, ఎందుకనగా అది మంచిది కాదు. చూచారా? నీవు క్రైస్తవునివైనచో ఒక రీతిగా ఆమె నీ సోదరి. అది లోకస్తులకయితే లోక సంబంధముగా ఉండును. కుక్క కుక్కను తినును. కాని నీవు జత చేయుచున్న బాలిక నీ సోదరి కూడా అగును. ఆమె రాబోవు నీ పిల్లలకు తల్లి కూడా అగును. ఆమెతో అపవిత్ర జీవితము నీవు గడపరాదు, నీవు నిజమగు క్రైస్తవునివని, పెద్ద మనిషివని ఆమెకు చూపించుము, ఒక క్రైస్తవ పెద్ద మనిషి ఎట్లు జీవించవలసి యున్నాడో ఆ విధముగా జీవించుము, చూచారా. ఆమెను నీ సోదరిగా ఆదరించుము, నీవు వివాహము చేసికొనిన తరువాత కూడా అలాగే ప్రవర్తించుము.

171దీనికి వెంటనే నేను జవాబు ఇయ్యవచ్చును. పెండ్లి అయినా కూడా పెంతెకోస్తు వారి మధ్య, పరిశుద్ధ జనుల మధ్య అపవిత్ర జీవనమునకు తావు లేదు. దాని యందు నాకు విశ్వాసము లేదు. లేదండీ! కొన్ని ఈ అపవిత్ర కార్యములు భయంకరములు… కొన్ని సార్లు అవి విందును. ఈ ఉదయాన అవి చెప్పను, అవి నేను చెప్పరాదు. కాని నేను ఆయా సమయములలో కాలిఫోర్నియా, ఇంకా ఇతర స్థలములకు వెళ్ళుచుందును. అక్కడ నేను సేవకులను కలిసికొనుచుందును, వివేచనలో చూచుచుందును, నేను వారిని నా మోకాళ్ళ మీదికి తీసికొని వచ్చి, "సువార్త చురక" ను అంటించవలెననిపించును. అవునండీ! మరొకరి భార్యను తీసికొనగోరుట చాలా అపవిత్రము. అది చాలా మురికి పని. నా భావమును మీరు గ్రహించారా? దేవుని మనిషిగా నీవు ఎంతో సిగ్గుపడవలసినవాడవై యున్నావు. భర్తగా నీవుండుము; ప్రియునిగా జీవించుము. ఎల్లప్పుడూ ఆమెను గౌరవించు రీతిగానే ఆమెను గౌరవించుము. వీటికి ఏ మాత్రమూ తలవంచవద్దు. లైంగిక ప్రేరణను రెచ్చగొట్టు ఈ పనికిమాలిన పుస్తకములు కొన్ని చదువుచున్నారు. అటువంటి చెత్తతో లోకము నిండిపోవుచున్నది. దానిని నీ మనస్సులో నుండి తీసివేయుము. అది అపవిత్రపు మురికి.

COL 3:8

 

172పరిశుద్ధులుగా చెప్పుకొనుచున్న మీరు మీ సంభాషణలో ఒక్క అపవిత్ర మాటను కూడా చోరనీయరాదని బైబిలు చెప్పుచున్నది. ఆ చిన్న స్త్రీని నీ ప్రియురాలిగా ఎంచుము. ఆమెకు అరవై సంవత్సరాలు వచ్చినా అలాగే యుండుము. నీవు బాలునిగా ఉన్నప్పుడేట్లు ఆమెతో ఉన్నావో అలాగే యుండుము; నీవది జ్ఞాపకము చేసికొనుము.

ఈ కొత్త విషయములను వేటినీ నీవు చూడవద్దు. నేను చెప్పుచున్న దానిని నేనెరుగుదును. నీవు భర్తగా ఉండుము. నిజమైన సోదరునిగా, నిజమైన క్రైస్తవునిగా ఉండుము.

మీరు నా పిల్లలు. నేను మీతో చెప్పుగోరు దానిని మీకు చెప్పు హక్కు నాకున్నది. చూచారా? మీరు నా పిల్లలు. మీరు సరిగా జీవించండి.

స్త్రీలారా, మీ భర్తలతో సరయిన విధంగా జీవించండి. భర్తలారా, మీ భార్యలతో సరిగా జీవించండి. నిజముగా మర్యాదను చూపండి. ఒకరితో ఒకరు చక్కగా ఉండండి. మీ కుటుంబ సంబంధములు మొదలగునవి చక్కగా కొనసాగించండి. ప్రతిది మర్యాదగాను, భక్తిగాను, ఒకరితో ఒకరు సమ్మతి కలిగి చేయుడి. ప్రతి దానిని వీలయినంత వరకు అలాగే జరిగించుడి. ఎన్నడూ ఉద్రిక్తతలకు, ఆందోళనలకు, బూతులు మరియు అపవిత్రతకు చోటియ్యరాదు.

173అర్థము చేసికొని మీ భార్యతో ముచ్చటించుడి. నీ స్వభావము ఒకటి, ఆమె స్వభావము మరొకటి అయితే ఆమెతో జ్ఞానముగా మాట్లాడుము. సోదరీ, నీవు కూడా అతని పట్ల అలాగే ప్రవర్తించుము. ఇద్దరు ఆ విధంగా ఒకరి నొకరు అర్థము చేసికొనండి. నిజమగు క్రైస్తవ పెద్ద మనిషిగా, నిజమగు క్రైస్తవ స్త్రీగా మెలగుడి - ఒకరితో ఒకరు సోదరీ సోదరుల వలె యుండుడి. మీరు దేవుని పిల్లలనియు, రాజ వంశపువారనియు ఎల్లప్పుడూ గుర్తుంచుకొనండి. మీది రాజవంశపు రక్తము. మీ కన్న మంచి రక్తము ప్రపంచములో మరెవరికీ లేదు. అది నిజము. రాజ రక్తము దానికదే కనబడును. అది చాలా రాజరికమునకు చెందినది. దానిని నమ్మువారందరూ "ఆమేన్!" చెప్పండి. అవునయ్యా! మీరెవరో చూపించుము. నేను రాజకుమారుడను, నా భార్య ఒక రాజ కుమార్తె. రాజ కుమార్తెను నేనెట్లు చూచుదును? రాజకుమారుని ఆమె ఎట్లు చూచును? నా భావమును గ్రహించారా? నిజముగా అలాగుండండి.

174ప్రశ్న: వధువు ఎత్తబడబోవు ముందుగా సూచన క్రియలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించు పరిశుద్ధాత్మ సంచలనము ఉండునా? లేక అయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూచుచున్నామా?

దాని విషయమై దాదాపుగా చెప్పానని నేను తలంచుచున్నాను, ఎందుకనగా ఇక్కడ ప్రస్తావించలసినది చాలా యున్నది. చాలా ఆలస్యమయి పోయినది. ఇప్పుడు ఇరవై నిమిషాల తక్కువ ఒంటి గంట అయినది. ఇంకా దాదాపుగా ముప్పయి లేక నలభై ప్రశ్నలున్నవి. నా సమయమును బట్టి అతి సాధ్యముగా దానిని చెప్పెదను - మూడు నిమిషములు తీసికొందును. నాకు వీలయినప్పుడు మిగతావి చెప్పెదను. చూచారా? వాటినెప్పుడు చెప్పగలనో నాకు తెలయదు. నాకు సాధ్యమైనన్ని చెప్పెదను. మీరు వాటిని అనుభవించారా? అవి నాకు కూడా సహాయపడినవి, చూచారా.

ఇక్కడికి వచ్చి ఈ విధంగా వాటిని పట్టుకొని యున్నాను. వాటిని ముందు చూడనే లేదు. (మీరు చూచారా?) జవాబు చెప్పలేని కొన్ని సంగతులుండును. నేను నిరీక్షణలో వాటిని చూచెదను. సర్ప సంతానము గూర్చి ఒకటి ఇచ్చటున్నది. దానిని చాలా కృషితో చెప్పుగోరాను. దానిని వివరించగోరాను, చూచారా. కాని దానిని నేను చేయలేక విఫలమయ్యానని భావించుచున్నాను. ఆ విధంగా జరుగకుండా ప్రభువు ఆపి యుండును. అది సర్ప సంతానము గూర్చిన ప్రశ్న. దానిని నేను చెప్పకుండా దాట వేశానని టేపును వినువారు కొందరు అనుకొనియుందురు. అందుకొరకు మరి రెండు నిమిషములు ఎందరు కూర్చొని యుందురు. హు! మంచిది.

REV 11:6

 

175ఇపుడు ఆగండి, "మొదట దీనిని చెప్పెదను. మనము చూద్దాం! కాదు. ఈ ప్రశ్న ఇది: "వధువు ద్వారా అద్భుతములు జరుగునా?" అవును! ఇప్పుడు జరుగుచు ఉన్నవి. అది నిజము. చూచారా? కాని ఏదో గొప్ప దాని కొరకు చూడకండి - ఆకాశములు తెరువబడుట, ఆకాశములు మూయబడుట, వర్షము కురియకుండుట కాదు. అదిప్పుడు యూదుల యొద్దకు వెళ్ళును, చూచారా. అది దీనికసలు చెందనే చెందదు. మోషే మరియు ఏలియాలు యూదులకు చెందెదరు. ఈ సంఘమునకు కానే కాదు. ప్రకటన మొదటి మూడు అధ్యాయములు చదవండి. సంఘము అక్కడెట్లున్నదో మీరు గమనించండి. అది సంఘమునకు వర్తించును. ఆమె వధువుతో తిరిగి వచ్చునప్పుడు ఎట్లుండునో మీరు తెలిసికొనగోరినచో చదవండి. సంఘమునకు సంబంధించినది తెలియును. ప్రకటన మొదటి మూడు అధ్యాయములు చదవండి. ఆ తరువాత 19వ అధ్యాయము యొద్దకు వెళ్ళండి. అక్కడ నుండి చదవండి. మీరు వధువును చూచెదరు. ఆ మిగిలినదంతా యూదులకు చెందును.

GEN 4:1•

MATT 5:45

 

176ఇప్పుడు, సర్ప సంతానము చూడండి. దానిని ఇచ్చట చూడలేను, ఎందుకనగా మీరు చూచారా, అది ఒక పెద్ద గుంపు. కానీ ఆ వ్యక్తి ఇట్లు ప్రశ్నించెను, "అది సర్ప సంతానమయితే ఆమె యెహోవా వలన కుమారుని పొందితినని ఎందుకు అన్నది?"

మంచిది, యెహోవా యొద్ద నుండి ఆమె ఎట్లు పొందినదో గత ఆదివారం వివరించాను అనుకుంటా. ఆమె పొందినది గనుక యెహోవా వలననే పొందినది, చూచారా, ఎందుకనగా యెహోవా యొద్ద నుండియే అది రావలసి యున్నది. ఎందుకనగా దేవుని యొక్క చట్టము… అది దేవునికి లోబడును. ఖచ్చితంగా.

సూర్యడు ప్రకాశించునని ఆయన ఆదేశించెను. ఆ కారణముచే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించుచున్నాడు. అలాగు జరుగుచున్నది. ఏ పొలములో నయినా విత్తనములు దాగి యుండును. అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. అది విత్తనము గనుక పైకి వచ్చును. ఏలాగు పాతి పెట్టినా విత్తనములు పైకి వచ్చును.

ఈ సర్పము బీజమును నాటుటకు ఒకే ఒక మార్గమున్నది. మానవునికి తరువాత జంతువు అది మాత్రమే. ఏలయనగా మానవ పరిణామము, ఎప్పుడైతే మానవుడు - దేవుడు భూమి మీద పొదిగెను… ఆయన పక్షులను తీసికొనరా నారంభించెను, పక్షుల నుండి ఆయన వేర్వేరు జంతువులను సృజించెను, ఆ తరువాత చింపాంజీ, చింపాంజీ నుండి సర్పము వరకు సృజించెను.

GEN 3:1

 

177ఈ తరమును గందరగోళము చేయు విధంగా ఆయన సర్పమును మార్చెను (అది అలాగు జరుగవలసి యున్నది) ఒక రకమగు జంతువుగా కనిపించుచున్న దాని యొక్క ఎముకను వారు కనుగొనుటకు ప్రయత్నించుచున్నారు. (అది ఒక భాగము మనిషి, మరొక భాగము జంతువు), వారు చింపాంజీ తరువాత దానిని కనుగొనలేకపోయిరని చెప్పిరి; చింపాంజీకి మాత్రమే జ్ఞానము లేదు. చింపాంజీకి ఆత్మ లేదు; అది ఆలోచించజాలదు. స్వరము మాత్రమున్నది. గుర్రము సకిలించును, "గీ" "హ" అనును. ఒక కుక్కను "ఫిడో, ఇక్కడికి వచ్చి దీనిని దాటుము" అనండి. అడ్డంగా బండలుంచండి. ఉద్రేకము ద్వారాను, వినికిడి ద్వారాను, క్రియ ద్వారాను అవి చేయును; కాని ఆలోచన మరియు అవగాహన వాటికి లేదు. అవి దిగంబరులుగా ఉన్నట్లు ఎరుగవు. తాము మగో, ఆడో ఎరుగవు, ఆ రకమగు భేదము తెలియదు. ఆ చట్టములు వాటికి లేవు , చూచారా. దానిని అవి అనుసరించలేవు. మానవుడు మాత్రమే అలాగున చేయును.

మానవునికి అతి దగ్గర పోలికలో సర్పమున్నది. పొలములోని జంతువులన్నింటిలో అది అతి యుక్తి గలదని బైబిలు చెప్పుచున్నది. చాలా చురుకైనది. దాదాపుగా ఆత్మ యున్నట్లే కనిపించును. ఆత్మకు ఒక చోటును అది కలిగియున్నది, కాని అదేమి చేసెను? సాతానుకు అమ్ముడుపోయినది, దేవుని మోసము చేయవలెనని ప్రయత్నించినది. అంత వరకు ఎందరు దీనిని అర్థము చేసికొన్నారు?

178సాతాను, సర్పము, దాదాపు ఆత్మను కలిగియుండినది. ఆ ఎముకల కొరకు వారు చూచెదరని దేవుని తెలియును. మానవుని వలె కనిపించు ఒక్క ఎముక కూడా ఆ సర్పములో లేదు. అది దాని యొక్క శాపము. అది ఒకప్పుడు మానవుని వలె నిలబడి యుండెను.

గమనించండి, ఆ సంతానము మానవ సంతానమునకు అతి సమీపమైనది. ఆత్మయగు సాతానే స్వయంగా ఎరిగి యుండెను. ఆ బీజము మాత్రమే స్త్రీని గర్భవతినిగా చేయగలదని ఎరిగెను, ఎందుకనగా చింపాంజీ దానిని చేయజాలదు. వారు దానిని మిశ్రమము చేసి అన్ని విధాలా పరీక్షించిరి; అయినా ఫలితం కనబడ లేదు. వాడెరుగును, చింపాంజీలో యున్న జీవకణము స్త్రీ యొక్క అండముతో సంయోగము కాజాలదని ఎరిగియుండెను; కాని సర్పము యొక్క బీజము దానిని చేయగలదని ఎరిగియుండెను, కావున సర్పముతో పని చేసెను.

GEN 3:6•

GEN 4:1,2,25

 

179ఈ కార్యము జరుగునని ఆదామునకు ఎన్నడూ తెలియదు. చూచారా? ఆమె ఒక స్త్రీగా తయారు చేయబడిను. ఆమె నిశ్చయంగా తరువాత ఆ క్రియ యొద్దకు వచ్చును; కాని మీరు చూడండి, దేవుడు రక్షకునిగాను, ఇతర విధములుగాను క్రియ చేయుటకు సార్వభౌమాధికారమును కలిగియున్నాడు. దీనిని చాలాసార్లు ఆయన వారికి ప్రేమతో వివరించెను. కాని దీనిని సాతాను ఎరిగి యుండి, ఆమె యొద్దకు ఈ సర్ప రూపములో వచ్చెను. అదే అందుకు తగినది, అందువలననే దానిని ఆశ్రయించి వచ్చెను. ఆమె సాతాను ద్వారా మొదట గర్భము ధరించినది.

మీరు గమనించినట్లయితే, రెండు కార్యములు మాత్రమే జరిగినవి, అక్కడ ముగ్గురు పిల్లలు జన్మించిరి. లేఖనములను పరిశోధించుడి. ఇద్దరు కవలలు జన్మించిరి. అందులో ఒకరు సర్ప సంతానము; మరొకరు హేబేలు. ఆమె తన భర్తను వశపరచుకొని మరియు చెప్పినది… చూచారా? అది ఏమిటో ఆమె తన బర్తకు చూపించెను, మరియు ఆ తరువాత అతడును ఆమెతో శయనించగా ఈ బిడ్డ జన్మించెను. మిమ్మును చూపించవలెనని కోరుచున్నాను, ఇద్దరు వేర్వేరు వ్యక్తుల ద్వారా ఆమె గర్భవతియై కవలలను గర్భము ధరించినది. ఆమె కన్యయగు స్త్రీ.

GEN 20:12•

GEN 25:24-26•

MATT 24:24

 

180వారి సంతానము బలమైనది. ఇక్కడ చూడండి. అబ్రాహాము తన స్వంత సోదరిని పెండ్లి చేసికొనెను. ఎందుకు, ఈనాడు ఒక వ్యక్తి అలాగు తన స్వంత సోదరిని పెండ్లి చేసికొనినయెడల వారి పిల్లలు అక్రమకారులని పిలువబడుదురు, చూచారా. యాకోబు లేదా ఇస్సాకు రిబ్కాను పెండ్లి చేసికొనెను, ఆమె అతని సోదరి. ఆతని యొక్క స్వరక్త సంబంధి, రక్త సంబంధియగు సోదరి, రక్త సంబంధి, చూచారా, ఆమె అబ్రాహాము సోదరుని కుమార్తె.

గమనించండి, ఇప్పుడు చూచారా, అక్కడ మానవ జాతి యుండెను. అది చాలా బలమైనది. ఇప్పుడు, మీరు గమనించండి ఎల్లప్పుడూ వారు అలాగే కవలలుగా యుండిరి. కయీను మరియు హేబెలులు కవలలు. ఏశావు మరియు యాకోబు కవలులు. యేసు మరియు యూదాలు కూడా అదే గోత్రము ద్వారా బయటకు వచ్చిరి, వారు అదే సంఘస్థులు. పరిశుద్ధాత్మ మరియు క్రీస్తు విరోధి కూడా కవలలుగా ఉండబోవుచున్నారు, "ఎంతో దగ్గరగా అది యున్నది, సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని కూడా అది మోసము చేయును." మీరది అర్థము చేసికొన్నారా? మంచిది.

GEN 3:15•

GEN 21:10•

GAL 4:30•

1JN 3:12

 

181ఇప్పుడు దీనిని పరిశోధించుటకు మిమ్మును యూదా పత్రిక యొద్దకు తీసికొని వెళ్ళగోరుచున్నాను. 17 వచనము. లేదా 14 వచనము యూదా పత్రికలో చూడండి. ఇప్పుడు దీనిని గమనించండి. ఇప్పుడు ముగించెదను. దానిని మొత్తం సరి చేయుటకు విభజించి చెప్పాను, "నీ సంతానమునకును మరియు సర్ప సంతానమునకును మధ్య వైరము కలుగ జేసెదను." చూచారా? ఆమెకు ఒక బీజము లేదు. సాతాను యొక్క సంతానము కయీను అయి యుండెను. ఆమెకు బీజము లేదు, కావున దానిని ఆమె లైంగిక సంయోగము ద్వారా పొందినది. ఆ విధముగా ఆమె చేసిన వెంటనే దేవుని యొక్క విరోధి ద్వారా దానిని పొందినది. దేవుడు ఆమెకు ఒక బీజమును ఇచ్చినప్పుడు లైంగిక క్రియ ద్వారా అది జరుగలేదు. దీనిని మీరు గ్రహించారా? దాస్యపు స్త్రీని, ఆమె కుమారుని బయటకు వెళ్ళగొట్టాలి, ఎందుకనగా స్వాతంత్ర్యపు స్త్రీతోను, ఆమె కుమారునితోను వారికి సంబంధము లేదు.

JOHN 2:4•

JOHN 19:26

 

182దీనిని గమనించండి, ఆమెకు ఒక సంతానము ఇయ్యబడినది. ఆయన క్రీస్తు. ఆమె యొక్క అండము అది కాదు. ఇప్పుడు ప్రొటస్టెంటు వారు అది కన్యక జన్మయని నమ్మగోరుచున్నారు. అది హెమోగ్లోబిన్, అనగా దేవుని యొక్క సృజనాత్మక రక్తము, అందులో జీవ కణమున్నది, కానీ ఆమె యొక్క అండముతో కలిసినది అని వారందురు. కాదండి! ఆ అండము ఆ నాళము ద్వారా గర్బము లోనికి తీసికొని రాబడదు, ఎందుకనగా అది గర్భములోనికి రావలెనన్నచో ఉద్రేకము రావలెను. అలాగు నీవు అనునప్పుడు ఆత్మ స్వరూపియైయున్న దేవునిని ఒక స్త్రీతో లైంగిక సంపర్కము చేసినవానిగా ఎంచుచున్నావు. అదెట్లు జరుగును? అండము మరియు కణము కూడా దేవుని యొక్క సృష్టియై యున్నవి.

ఆయన దేవుని కుమారుడు, మరియ కుమారుడు కాడు, ఎందుకనగా ఆమెను ఆయనెన్నడూ తల్లిగా సంబోధించలేదు. "స్త్రీ" అని పిలచెను. ఆయన తల్లిగా ఆమెను ఎన్నడూ పిలువలేదు. ఆమె ఆయనకు తల్లి కాదు. ఆయన దేవుని కుమారుడు, మరియు దేవుడు ఒక్కడే. దానిని గ్రహించారా?

JUDE 1:14

 

183దీనిని రుజువు చేయుటకు మరో సంగతి ఉన్నది. దీనిని గుర్తించండి. ఎవరయినా మీతో వాదించినప్పుడు ఈ యూదా పత్రికలోనికి వెళ్ళండి. 17వ వచనము అనుకొంటాను, (14 లేదా 17 వచనము), దానిని చదువ వలెనని నన్ను కోరుదురా? అంత సమయము మీకున్నదా? ఈ టేపు ముందుకు పరుగిడుచున్నది. నాకు తెలియును. దీనిని మనం ఇప్పుడు మిశ్రమం చేయవచ్చును. ఇది 14వ వచనమో కాదో చూడనీయండి:

ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను - ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

GEN 4:26•

LUKE 3:38•

JUDE 1:14

 

184ఇప్పుడు, ఆదికాండము 5వ అధ్యాయము దగ్గరకు వెళ్ళుదము (అదే అనుకొనుచున్నాను) లూకా సువార్తలోనికి కూడా రండి (దానిని వెదుకవలెనని కోరుచున్నాను; ఇక్కడ నేను వ్రాసియుంచాను - దానిని కనుగొందుమో లేదో చూద్దాం) వంశావళులలో మీరు దానిని కనుగొందురు. బైబిలులో ఎక్కడయినా గానీ చూడండి! ఆదాము నుండి హనోకు ఏడవవాడు. బైబిలు అలాగని చెప్పెను, "ఆదాము మరియు అతని కుమారుడు షేతు," ఎందుకనగా కయీను ఆదాము యొక్క సంతానము కాదు. ఆదాము షేతును కనెను, షేతు యెరెదును కనెను, యెరెదు నుండి హనోకు వరకు చదువుదుము. ఆదాము నుండి హనోకు ఏడవవాడు. దేవుని యొక్క వంశావళిలో కయీను యున్నట్లుగా ఎక్కడా ప్రస్తావించబడ లేదు.

GEN 5:3-7•

LUKE 3:38

 

185అది నిజమో కాదో మీరే కనుగొని చూడండి; దానిని పరిశోధించండి. లూకా వచ్చి మరల దానిని చెప్పెను, ఆదాము నుండి వ్రాసెను. మొత్తం జాబితాలో ఒక్కసారి కూడా కయీను గూర్చి చూపించలేదు. ఆదాము నుండి ఏడవ వాడు హనోకు, చూచారా, ఆయితే కయీను ఎక్కడి నుండి వచ్చెను? వంశావళుల గూర్చి బైబిలులో వ్రాసినప్పుడు ఎట్లున్నదో చూడండి. ఆదాము తన కుమారుడగు షేతును కనెను, షేతు యెరెదును కనెను, యెరెదు ఫలాని-ఫలాని వానిని కనెను. ఆ విధంగా చివరి వరకు వ్రాసెను. ఒక్కసారియు కయీనును ప్రస్తావించ లేదు. కావున అతడు ఆదాము యొక్క కుమారుడు కాలేడు. కాబట్టి అతడు సర్ప సంతావమై యుండును, సంపర్కము లేకుండా కుమారునిగా అతడు ఉండుట అసాధ్యము. ఆమేన్! అతడు ఆలాగు కానియెడల, కన్యకకు జన్మించినవాడయితే, అప్పుడు అతడు దేవుని కుమారుడగును. దాని నుండి వారు ఒక్కసారి బయటకు రావాలి అని నేను కోరుచున్నాను.

GEN 5:1-3

 

186ఇప్పుడు, దానిని బయలుపరచిన ఆ దేవుడే వివాహము మరియు పరిత్యాగము గూర్చి మీతో చెప్పుమని నాకు తెలిపెను. నా సోదరీ, సోదరుడా, ఆయన మీతో ఈ సంగతులు చెప్పుచున్నాడు. నేను మీ సోదరుడను, ఒక మానవుడను. ఆయన దానిని చెప్పినప్పుడు అది ఇక్కడ తాకును. దానిని మీకు నేను వివరించలేను. అందుకు నేను ప్రయత్నించవలసిన అవసరము నాకు లేదు, ఎందుకనగా అది నా వలన కాదు. కాని ఏ ఒక్కసారి కూడా అది తప్పు కాలేదు. దానిని నేను స్వయంగా చూడలేక పోయినప్పటికిని, దానిని పట్టుకొని యున్నాను. దానిని నేను చూడలేను. అప్పుడాయన దానిని బయలుపరచ నారంభించును, అది నన్ను తాకును. అది అక్కడే యుండును, కాని దానిని నేను చూడలేదు. మీ విద్య దానికి అందదు, మీ హేతు బుద్ధి దానికి అందదు, మరేదీ దానికి సరిపోదు; అలాగే కయీను కూడా దాటిపోయెను.

ఇప్పుడు, ఆదికాండములోనికి వెళ్ళి చదువగల సమయము మనకున్నచో బాగుండును… దానిని తీసి చూద్దామని కోరుచున్నాను. దానిని చేయగలనో లేదో నా మట్టుకు ఖచ్చితంగా తెలియదు. ఒక రోజున శ్రీమతి. వుడ్ కు దానిని చూపించాను, నీకు గుర్తున్నదా? అది 5వ అధ్యాయమా? 5. మంచిది.

ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను.

మగవానిగాను, ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారిని నరులని పేరు పెట్టెను.

ఆదాము నూట-ముప్పది ఏండ్లు బ్రదికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.

కయీను? అతని పేరు ఏది? మొదటగా జన్మించిన వాడెచ్చట? జ్యేష్ఠత్వపు హక్కు ఎవరి యొద్ద ఉన్నది? ఎన్నడూ అతనిని ఎత్తి చూపలేదు. షేతు అతని కుమారుడు.

GEN 5:3-7

 

187ఇక్కడికి మరల మనం వచ్చి చూద్దాం, హవ్వకు ఒక కుమారుడు ఇవ్వబడెను, ఎందుకనగా కయీను హేబెలును చంపెను. ఇంకా ముందుకు వెళ్ళి గమనించుదము:

ఆదాము నూట-ముప్పది ఏండ్లు బ్రదికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని, అతనికి షేతు అను పేరు పెట్టెను.

షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను:

ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను.

షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.

ఇంకా క్రిందికి చూడండి, అతడు ఏడవవాడు, ఆదాము నుండి హనోకు ఏడవవాడు.

లూకాలో ఉన్నది నాకు గుర్తులేదు. దానిని కూడా నీవు గుర్తించావా శ్రీమతి. ఉడ్? ఒక రోజున ఆమెకు దానిని నేను చూపించాను … ఏమందురు? నీవు చెప్పినది సరి అని నేను నమ్ముచున్నాను, సహోదరి వుడ్. ఆమె బైబిలులో దానిని మేము వ్రాసియుంచాము - ఆమె బైబిల్ లో చూపించాను… అది ఇక్కడ ఉన్నది, వంశావళులు. మంచిది.

LUKE 3:36-38

 

188ఇక్కడ మనం గమనించవలెను … లూకా 3వ అధ్యాయములో అదే విషయమును మనము కనుగొందుము - కుమారులు మరియు మొదలగునవి.

…నోవహు, లెమెకు,

మెతూషెల, హనోకు, యెరెదు, మహలాలేలు, కయీనాను.

ఎనోషు, పేతు, ఆదాము. వారందరూ ఒకరి కుమారులు ఒకరిని వ్రాసి ఆదాము దేవుని కుమారుడని వ్రాసెను.

కయీను ఎక్కడి నుండి వచ్చెను? మొదటగా జన్మించిన కయీను ఎక్కడి వారు? జ్యేష్ఠత్వపు హక్కులు అతనికే చెందవలెను. అతడిచ్చట నుండి వచ్చెను? అతడు సాతాను సంతానము. దేవుని సంతానము కాదు. ఆదాము సంతానము కూడా కాదు, ఎందుకనగా ఆదాము కుమారుని యొక్క నామము షేతు. కయీను, సర్ప సంతానము. తన మొదటి కుమారుని చంపెను, అది ఒక ఛాయ మరియు మాదిరి, యేసు అను మరొక కుమారుని చంపవలెనని సర్పము ప్రయత్నించెను. వంశావళులలో అతని స్థానమును షేతు తీసికొనెను, అది పునరుత్థానమునకు సూచన. దేవుని యొక్క వంశావళులు సంపూర్తిగా కొనసాగును.

GEN 4:1

 

189అతడు సర్ప సంతానము కాడని ఎవరయినా చెప్పగలరేమో చూపించవలెనని కోరుచున్నాను. దేవుని యొక్క వంశావళులలో అది గుర్తించబడలేదు. మానవ జాతి వంశావళిలో కూడా అది గుర్తించబడలేదు. ఆదాము వంశావళిలో కూడా అది లేదు. మరే ఇతర వాటిలో కూడా అది లేదు. అది సరియేనా? దానిని నమ్మువారందరూ "ఆమేన్!" చెప్పండి. నిశ్చయంగా. అతడు కాడు; అతడు సర్ప సంతానము, ఆదాము యొక్క సంతానము కాదు!

అతడు ఆదాము కుమారుడని ఆమె చెప్పినది. అతడు ఆదాము కుమారుడు కాదు. "దేవుని వలన పొందియున్నాను," అన్నదామె. అది సంతానము గనుక ఆయన వలననే పొందవలసి యున్నది. అది ఒక సంతానము, అయితే అది సర్ప సంతానము, చూచారా.

జరిగిన ఆ లైంగింక చర్యను తేట తెల్లము చేయవలెనన్నచో ఆమెను మరల ఒక కన్యకగా తీసికొని రావలసి యున్నాడు. ఆదామును ఈ భూమి మీద ఉంచెను, కాని తానే తండ్రిగా ఉందునన్న సంగతి ఎన్నడూ అతనికి తెలియదు. నా భావమును మీరు గ్రహించారా? దీనిని సాతాను ఎరిగియుండెను, ఆదాము ఆమె యొద్దకు వెళ్ళక ముందే సాతాను ఆమె యొద్దకు చేరెను. ఈనాడు మొత్తం సంగతి అక్కడే యున్నది. సోదరుడా, ఈ దినమున వివాహము మరియు పరిత్యాగమును అంత గందరగోళముగా చేయునది అదే. ఇది చాలా విచారకరము, చూచారా. దేవుడు తన మార్గమును ఏర్పరచెను, దానికి మనము కృతజ్ఞులము.

190మీరాయనను ప్రేమించెదరా! ఆయన అశ్చర్యకరుడు కాడా? సర్ప సంతానము సరియేనా? దానిని నేను ఎదిరించుటకు భయపడి యున్నానని టేపును వినుచున్న కొందరు తలంచుచుండవచ్చును. మీరు చూచారా? అందుకే వారిట్లందురు, "దానిని ఎందుకాయన రెండుసార్లు దాట వేసెను? దానిని గూర్చి గట్టిగా చెప్పుటకు ఆయన భయపడుచున్నాడు." విషయము అది కాదు. అందులో ప్రభువున్నంత కాలము అది పరవాలేదు.

అదేమిటో మీకు తెలియును, పక్షిరాజు రెక్కల యొక్క అనుభూతిని ఒకసారి నేను గమనించాను, మీకది చెప్పాను. "నన్ను గూర్చి నీవు భయపడుటలేవా?" అనడిగాను. నేను నా తుపాకిని అచ్చట ఉంచి యున్నాను; "నిన్ను నేను కాల్చగలను," అని చెప్పాను. నేను దానిని కాల్చగలను అని దానికి కూడా తెలియును. నా తుపాకీ నాకు చాలా దూరంగా యున్నది. "నీకు భయంగా ఉన్నదా?" అనడిగాను. అది తన పెద్ద కళ్ళు నా వైపు త్రిప్పి చూచినది. ఒక చిన్న ఉడుత అక్కడే కూర్చొని, "చా, చొ, చో, చొ, చో; నిన్ను ముక్కలు చేయుదును, చీల్చి వేయుదును!" అన్నట్లు అరచుచున్నది. ఆ ఉడుతను అసలు అది పట్టించుకొనుటలేదు. కావున కొంత సేపటికి దాని రొద పక్షిరాజుకు విసుగు కలిగించినది. కావున రివ్వున ఒక్కసారి ఎగిరి రెక్కలతో దాని వైపుగా వెళ్ళినది. ఆ రెక్కలను ఎట్లు అదుపు చేయవలెనో దానికి తెలియును, అది కంటికి కనబడకుండా ఎగిరిపోయినది. చూచారా? అది చాలా చిన్న పిట్ట వలె కనిపించునంత పైకి ఎగిరిపోయినది, చిన్న పిట్ట వలె కనిపించినది.

191ఫ్రెడ్ సోదరుడా, నీకది చూపించానని తలంచుచున్నాను. ఇప్పుడు ఆ వెనుకన ఫ్రెడ్ సోదరుని చూచాను, కొద్ది సేపటి క్రితం అతడు "ఆమేన్!" అని అరచెను. ఉడ్ సోదరుడా, నీకు ఆ చోటు చూపించానని అనుకొనుచున్నాను, నీవెక్కడున్నావో తెలియదు, ఎక్కడో ఆ పర్వత పై భాగాన అది జరిగియున్నది. ఆ పక్షిరాజును నేను చూచాను. ఆ తుఫానుకు అది బలవంతముగా క్రిందికి దిగినది, ఈ చెట్టు వెనుక నేను నిలబడియున్నాను.

ఎల్క్ అను జంతువులను వేటాడుచున్నాను (ఆ కొద్ది సేపటి తరువాత), అది అక్టోబరు నెల, మరియు మంచు పడుచున్నది. ఇక్కడున్న ఈ సోదరుడు గత ఆకురాలు కాలములో మాతో కూడా అక్కడున్నాడు. సహోదరుడు జాన్ మరియు ఇతరులు కర్రోల్ శిఖరాన ఉన్నారు. అక్కడే అది జరిగినది.

192అక్కడ నేను నిలబడియున్నాను, ఈ చెట్టు వెనుక నేను నిలబడియున్నాను. కొద్దిగా మంచు కురిసినది. కొద్దిగా వాన వచ్చినది. నేను అచ్చట అలాగే నిలబడియున్నాను. ఆ పక్షిరాజు అక్కడ నిలబడియున్నది. అది బలవంతముగా క్రిందికి దిగినది. అది ఆ పైకి ఎగిరినది, గొప్ప, మృగము వలె కపిపించినది, చాలా పెద్ద గోధుమ రంగు పక్షిరాజు. అక్కడ అది కూర్చొని చుట్టూ చూడసాగినది. ఇది నాకు చాలా మంచి సమయము అనుకొన్నాను. నేను "దేవునికి స్తోత్రము!" "హల్లెలూయా!" అని కేకలు వేయసాగాను. నేను ఒక పొద చుట్టూ చాలాసార్లు తిరుగుచూ కేకలు వేయసాగాను. నేను ఆ క్రిందికి చూచాను. ఆ ముసలి పక్షిరాజు నెమ్మదిగా అరచుట నాకు వినబడినది. మీకు అవి ఎట్లు అరచునో తెలియును.

గత సంవత్సరం అచ్చటికి వెళ్ళాను - అది వర్షమునకు ముందు, అవి కేకలు వేయుట పరిపాటి; అది ఒక చిన్న తోడేలు, మీకది తెలియును. వాటి స్వరము వినుట నాకు ఇష్టము.

HEB 13:8

 

193అప్పుడు నాకు ఎల్క్ యొక్క స్వరము వినబడినది, "ఏ, హూ" అని అరచెను. ఆ విధంగా అవి పోవును, దాని స్వరము విని ఆ జతది జవాబు ఇచ్చును. (ప్రభుని చిత్తమయితే, వచ్చే రెండు వారముల తరువాత వాటిని వేటాడుచుందును.) ఆ విధంగా అచ్చట నేను విన్నాను, ఓ, అది నిజంగా చాలా భక్తి పుట్టించు చోటు. అది నాకు ఒక దేవాలయము వంటిది, అక్కడ నేనాయనతో మాట్లాడుచుందును. ఆ, తరువాత అక్కడి నుండి క్రిందికి దిగి వచ్చి మీతో మాట్లాడుచుందును, చూచారా.

ఆ పై నున్నప్పుడు చాలా అద్భుతముగా యుండును, సేదదీర్చు కొందును. అక్కడ నిలబడి యుండి ఇట్లనుకొన్నాను, "ఓ దేవా…" అప్పుడు నేను చూచాను, ఆ వర్షము వచ్చినది, హరిత చెట్ల అన్నియు మంచుతో గడ్డకట్టినది, ఆ కరోల్ శిఖరము నుండి అడ్డంగా షీప్ కొండల వరకూ వర్షధనుస్సు ఉద్భవించినది." ఆ విధంగా ఉన్నప్పుడు నేనిట్లు తలంచాను, "ఓ దేవా, అటు చూడు. ఊ. నీవు ఇక్కడ అల్ఫా మరియు ఓమేగా గా యున్నావు. ఆది మరియు అంతము. ఇక్కడది క్రిందికి దిగి వచ్చుచున్నది మరియు ఇక్కడ, అక్కడ. నిన్న, నేడు, నిరంతరము నీవు ఏకరీతిగానే యున్నావు, ఏడు సంఘ కాలములు, ఏడు సువర్ణ దీపస్తంభములు. అక్కడే నీవున్నావు, దేవా, నీవెంత అద్భుతవమైనవాడవు."

194నేను ఆనందముతో కేకలు వేయసాగాను. నా తుపాకి క్రింద ఉంచి ఆ చెట్టు చుట్టూ తిరిగి కేకలు వేయసాగాను. "దేవునికి మహిమ! ప్రభువుకు స్తోత్రము." ఆ చెట్టు చుట్టూ పలుమార్లు ఆ విధంగా తిరిగాను. గొప్ప సమయం అక్కడ నేను స్వయంగా గడిపాను. ప్రభువు మరియు నేను ఎంత చక్కగా గడిపామో మీరెరుగుదురు.

ఆ తరువాత కొంతసేపటికి ఆ పక్షిరాజు ఆ పొదల మధ్య నుండి బయటకు వచ్చినది మరియు నా వైపు చూచినది. నేనిట్లు తలంచాను, "సరే, నీకది నచ్చలేదా?" నేనిట్లనుకొన్నాను, "ఓ బాలుడా, నిన్ను చేసిన దేవునినే నేనారాధించుచున్నాను." చూచారా? అది కళ్ళు రెప్పలార్పినది. దాని కన్నులు చాలా పెద్దవి మరియు నా వైపు చూచెను, మరియు ఆ విధంగా కేకలు వేయుచున్న నన్ను చూచినది.

ఒక చిన్న ఫైన్ ఉడుత (పర్వతములలో ఎవరైనా ఎన్నడయినా వేటాడినచో తెలియును, అడవికి అది పోలీసు వంటిది), అక్కడికి దూకి వచ్చినది. (ఒక చిన్న ఉడుత అది, ఏమి చేయలేని బలహీనురాలు, కాని ఓ, అది ఎంత గొప్ప స్వరము) — అది అక్కడికి దూకి వచ్చినది, పైకి-క్రిందికి గంతులు వేయుచున్నది, మీరెరుగుదురు, "య - య - య - య - య - య - య - య - య - య - య - య," అట్లే ఆ విధంగానే అది దూకుచున్నది.

195ఆ పక్షిరాజు దీనిని గమనించుచున్నది; అది నా వైపు చూచినది. నేనిట్లనుకొన్నాను, "సరే, నా ప్రభువా! నీవు నన్నెందుకు ఆపియున్నావు? దీనినేందుకు చూపించావు?" చూచారా? నేనిట్లనుకొన్నాను, "ఎందుకనగా నీవెరుగుదువు, నిన్ను నేను ఆరాధించుచున్నాను. ఆ పక్షిరాజులో ఎదో నన్ను చూడమని నీవు కోరుచున్నావు.'' నేనిట్లనుకొన్నాను, "దానిని నేను అధ్యయనం చేయుదును. పైన్ ఉడుత గూర్చి అది ఆలోచించుచున్నదా?" అక్కడ నేను నిలబడి యున్నాను. దానిని గమనించాను. ఇట్లనుకొన్నాను, "దానిని నేను కొద్దిగా అధ్యయనము చేసెదను." ఇట్లనుకొన్నాను, "ఒక సంగతి దానిలో గమనించాను, అది భయపడుట లేదు." అది నాకు ఇష్టము, భయపడుట లేదు. అక్కడే అది నిలబడియుండెను. అది చాలా పెద్ద పక్షి; నేనిట్లనుకొన్నాను, "ఏమిటో నీవెరుగుదువా?" (నా తుపాకీని ఒక చెట్టుకు ఆనుకొని ఉన్నది.) నేనిట్లనుకొన్నాను, "నీకు తెలియునా? నిన్ను నేను తుపాకీతో కొట్టగలను." నాకంటే దానికి బాగుగా అది తెలియును; ఒక సంగతి దానికి తెలియును: ఆ పని నేను చేయను; దానిని ఎంతో నేను అభిమానించాను, చూచారా. అది అక్కడే నిలబడియున్నది, ఏ మాత్రమూ భయపడలేదు.

నేనిట్లు అనుకొన్నాను, "నిన్ను నేను చంపగలను." ఇప్పుడు దానిని నేను చూచాను. అది ఆ విధంగా నా వైపు చూచుచున్నది. అది తన రెక్కలను విదిలించుకొనుచున్నది. మీరెరుగుదురా! వాటిని చూడండి. ఆ రెక్కలతో అదెట్లు చేయునో మీరెరుగుదురు. అవి చాలా పెద్ద రెక్కలు. ఇంత పొడవుండును. చాలా పెద్దది. అది అక్కడే కూర్చొనియున్నది. నా వైపు అది చూచుచున్నది. ఇవన్నీ నాకు తెలియక ముందే అది జరిగినది; చాలా చాలా సంవత్సరాల క్రితం జరిగినది, దాదాపు ఇరవై సంవత్సరాలైనది.

196దానిని నేను గమనించాను; కొంత సేపటి తరువాత దానిని చూచాను. ఇట్లనుకొన్నాను, "ఇదేమిటి? ఇదేమిటి? అది ఏమి భయపడ లేదు, దానిని ఎంతో నేను ప్రశంసించాను. ఆ ముసలి పక్షిరాజు గూర్చి దైవ సంబంధమగు చింతన ఏమిటి?" ఆ గొప్ప పెద్దది ఆ విధంగా బయటకు వచ్చుచున్నది, దాని కన్నులు చాలా పెద్దవి. ఇట్లనుకొన్నాను, "బాలుడా, నిజంగా ఇది గొప్ప పక్షి."

ఒక గ్రద్ద దానిని వెంబడించుటకు ప్రయత్నించినప్పుడు, అది ప్రేలిపోవును. ఏదియూ దానిని వెంబడించజాలదు. లేదు, లేదు! విమానము మాత్రమే అలాగు వెంబడించగలదు. అవునండి! మరే పక్షియు దానిని వెంబడించజాలదు, కావున - అంత ఎత్తునకు అది వెళ్ళును. దానికి కన్నులున్నవి; అంత పైకి వెళ్ళిపోయిన తరువాత భూమి మీద ఉన్న దానిని కూడా అది చూడగలదు, అంత దూరము నుండి చూచును.

యెహోవా తన ప్రవక్తలను పక్షి రాజులతో పోల్చెను, మీరు చూచారా; ఆయన ఆ విధంగా వారిని పైకెత్తును. వారు ప్రత్యేకముగా తయారు కాబడవలసియున్నారు. అవును, చూచారా. ముందుగా నిర్ణయింపబడిరి, ఆ ఉద్దేశ్యము కొరకు జన్మించిరి, చూచారా, ఆ విధంగా పైకెత్తబడిరి. నీవెక్కడున్నావో నీకు కనబడనప్పుడు అంత ఎత్తుగా నీవు వెళ్ళుటవలన ఏమి ప్రయోజనము? చూచారా? నీవేమి చేయుచున్నావో నీకు తెలియనప్పుడు, అంత పైకి వెళ్ళుట వలన ఏమి ప్రయోజనము? చూడండి, చూచారా?

అది అసలు ఏమిటో తెలియకుండా క్రిందికి పైకి ఎగురుట, కేకలు వేయుట, భాషలలో మాట్లాడుట వలన ఏమి ప్రయోజనము? చూడుము, నీవక్కడున్నప్పుడు దానిని నీవు అర్థము చేసికొనవలసియున్నావు, చూచారా.

197అప్పుడు, దానిని నేను గమనించాను, అది ఆ చుట్టూ సంచరించుచున్నది. దానిని ఎంతో నేను అభిమానించాను; అది అంత అందమైన పక్షి. అయనను, అది నా దుప్పి మాంసమును ఇంకా ఇతరమగువాటిని తినుచుండ వచ్చును. దానిని నేను గమనించాను, మరియు కొంత సేపటి తరువాత ఇట్లనుకొన్నాను, "మీరుగుదురా - అది…"

కొంత సేపటి తరువాత అది అలసి పోయినది. నా వైపు చూచుచున్నందు వలన అది అలసిపోయినదని నేననుకోనుట లేదు గాని, అక్కడ కూర్చొని ఒకటే అరచుచున్న చిన్న ఉడుత గోల వినలేక విసిగిపోయినది. మీకు తెలుసా, ఈనాటి మన సంఘములో అటువంటివి చాలా యున్నవి. మీకు తెలుసా? చూచారా? "చ, చ, చ! అద్భుతములు జరుగు దినములు గతించినవి! దైవిక స్వస్థత అనునది లేదు. ఈలాంటి కార్యములు ఇక లేవు!" చూచారా? భూ-సంబంధమగు ఆ చిన్న ఉడుత ఆ ఎండిన మొద్దు మీద కూర్చొనియున్నది. "నీవు దీనికి చెందియున్నావు. మనము…" చూడండి, చూచారా? అక్కడ కూర్చొని అవి ఎడా పెడా కేకలు వేయుచున్నవి. ఓ, గొంతు పగిలేటట్లు అరచుచున్నవి, ఎంతో గట్టిగా కేకలు వేయుచున్నవి.

వారి కేకలు విని ఆయనకు విసుగు పుట్టియున్నది, ఆయన ఒక పెద్ద, గొప్ప గంతువేసియున్నాడు, మరియు తాను కూర్చొనియున్న ఆ కొమ్మను ఎంతో గట్టిగా ఊపియున్నాడు. ఆ కొమ్మ ఊగెను, ఆయన ఆ విధంగా వెళ్ళెను. చూడండి, ఆయన తన రెక్కలు కొట్టుకొంటూ ఆ చెట్టు మీద నుండి ఎగిరిపోయెను. ఆయనాలాగు చేయుచుండగా, నేను చూచాను, చూచారా. ఆయన భయపడలేదు, ఎందుకనగా తనకు దేవుడిచ్చిన రెక్కల యొక్క ప్రభావమును అనుభవించెను. ఏ విధమగు ప్రమాదము నుండి అయినా గాని ఆ రెక్కలు తనను తప్పించునని ఆయనకు తెలియును, చూచారా.

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

198మనము కూడా ఆ విధముగానే భావించవలెను. ఇదియే వాక్యము, వాక్యమును వ్రాసిన ఆయనే నా రెక్కలు. వాక్యమునకు నేను భయపడను; అక్కడున్న ఏ విధమగు ఆపద నుండి అయినను అది నిన్ను తప్పించుకొని తీసికొనిపోవును. తిన్నగా కోయు ఖడ్గము అదే. దాని విషయములో ఎన్నడూ నీవు చింతించవద్దు, చూచారా.

అప్పుడు నేను గమనించాను. అది కొట్టుకొనలేదు, తన రెక్కలను సరిగా అమర్చుకొనెను, చూచారా. గాలి వచ్చు ప్రతిసారి అది పైకి లేవసాగినది, ఇంకా, ఇంకా పైకి పోసాగినది.

నేను అక్కడే నిలబడియున్నాను, నా చేతులు ముడుచుకొని యున్నాను, అది కంటికి కనబడలేనంత పైకి ఎగిరిపోవు వరకు చూచాను. నేను ఇట్లనుకొన్నాను, "దేవా, అదే జరుగవలెను. పరుగిడి వెళ్ళి దానిలో మరి దీనిలో చేరుట కాదు, ఇది మరి అది, లేక మరేదో చేయుట కాదు; అది కేవలము నీ రెక్కలను సరి చేసికొనవలెను, చూచారా - నీ విశ్వాసపు రెక్కలను దేవుని యొక్క వాక్యములో ఎట్లు మోపవలెనో నీవు ఎరుగవలెను. ఈ వ్యర్థపు ముచ్చట్లు, అక్కడి గోల, ఇక్కడి గోల విడిచిపెట్టి దూరంగా ఎగిరిపోవలెను. అవును! "భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవు."

199ఈ మధ్యాహ్నమునకు మరల ఇరవై దాదాపుగా యున్నవి, అనగా ఇరవై ఇంటర్వ్యూలు ఉన్నవి. మీరు బిల్లీని కలవండి, ఎందుకనగా వారందరినీ కలిసికొనుటకు వీలుగా కొంత పెందలకడ ప్రారంభించగోరుచున్నారు. నాకు సాధ్యమైచో, వారినందరినీ కలిసికొందును, అందుకు నేను ప్రయత్నించెదను. ఇది బిల్లీకి తెలియదు (చూచారా?) కానీ ఈ ఉదయమున దాదాపు ఇరవై దర్శనములు వచ్చిన తరువాత నా మనస్సు ఎంతో గలిబిలి అయినది. అది ఒక విధమగు స్థితిలో నిన్ను ఉంచును. బిల్లీ నాతో ఇట్లనెను, "నీవు వెళ్ళి కొంత విశ్రాంతి తీసికొనుము. ఆ తరువాత వచ్చి అక్కడ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇమ్ము."

"సహోదరుడు నెవిల్ వర్తమానమందించును," అని నేను చెప్పాను.

"నేను వెళ్ళి ఆయనకు చెప్పెదను," అని చెప్పి వెళ్ళిపోయెను.

"రమ్ము," అని నెవిల్ సోదరుడు చెప్పెను. అప్పుడు నేను లేచి ఇక్కడికి వచ్చాను. అందులో కొందరు ఈ మధ్యాహ్నము ఎదురు చూచుచున్నారు. ఒంటి గంట వరకు ఇక్కడ మిమ్ములను ఉంచినందుకు చింతించుచున్నాను. కాని నేను రేపు, లేదా ఎల్లుండి వెళ్ళిపోవలసి యున్నాను - కావున మరల ఆరిజోనాకు వెళ్ళుదును.

1JN 4:20

 

200గుర్తుంచుకొనండి, ప్రభుని చిత్తమయితే, మరల నేను వచ్చునప్పుడు వివాహము మరియు పరిత్యాగము యొక్క సరియగు పద్ధతిని గూర్చి లేఖనములో నుండి చూపించుచూ బోధించెను. నిజంగా ఆ ఉన్న దానిని ఉన్నట్లుగా చూపించెదను. అప్పుడు దానిని మీరు చూడగలరు, కావున ఆ సమయము వరకు మంచి ధైర్యము కలిగియుండుడి; ప్రభువు బహు సమృద్ధిగా మిమ్మును ఆశీర్వదించును గాక. మనము నిలబడుదుమా? ప్రభువుకు స్తోత్రము.

నేనాయనను ప్రేమించుచున్నాను,

ఆయనను ప్రేమించుచున్నాను,

(మీరు ప్రేమించుచున్నారా?)

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

మీరాయనను ప్రేమించుచున్నారా? దాని మరల పాడుచుండగా మనము ఒకరితో ఒకరము కరచాలనము చేయుదము.

నేనాయనను ప్రేమించుచున్నాను,

ఆయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

ఓ, అది అద్భుతము కాదా? ఓ, ఆశీర్వచనము తరువాత దానిని ప్రకటన చేయుమని బిల్లీ నన్ను కోరెను, నాతో వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉన్నవారికి ఒక మాటను అతడు చెప్పును. మీరు చూచారా? కొద్ది నిమిషములలో అతడు మిమ్మును కలిసికొనగోరుచున్నాడు. కాని ఇప్పుడు నాకు ఆరాధనను ఒక్క క్షణము అనుభవించవలెననిపించుచున్నది. ఆత్మలో ఆయనను ఆరాధించవలెనని మీరనుకొనుటలేదా?

నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

ఓ, అది అద్భుతముగా లేదా? ఓ, ఆయనను నేను ప్రేమించుచున్నాను. నా హృదయములో ఆయనను నేను ప్రేమించుచున్నాను. నా హృదయమును నేనెరుగుదును. మీరు కూడా అలాగే యున్నారని నేను నమ్ముచున్నాను. కావున మనందరము కలిసి ఆయన పిల్లలము. మనము ఒకరినొకరిని ప్రేమించుదుము. మిమ్మును ప్రేమించకుండా ఆయనను నేను ప్రేమించజాలను. ఆయనను ప్రేమించుచున్నానని చెప్పి, మిమ్మును నేను ప్రేమించనియెడల నేను అబద్ధికుడనని బైబిలు చెప్పుచున్నది. చూచారా? నన్ను గాని, నా కుటుంబమును గాని మీరు ప్రేమించగోరుదురు. నన్ను గాని లేదా వారి కుటుంబమును గాని ప్రేమించవలెనను ఎన్నిక వచ్చును; మీరు నా కుటుంబమును ప్రేమించుదురు. నాకంటే ఎక్కువగా బిల్లీ పాల్ ను మీరు ప్రేమించుడని చెప్పుదును. అటువంటి పరిస్థితియే వచ్చినచో దానినే మీరు చేయవలెనని నేను కోరుదును. నా మాట మీరు వినవలెనని కోరుదును, ఎందుకనగా బిల్లీ సేవకుడు కాడు. నేను చెప్పు మాట మీరు వినవలెనని కోరుదును. మీరు ఎవరినయినా ప్రేమించగోరినప్పుడు నిజముగా ప్రేమించుడి. నన్ను ఎక్కువగా ప్రేమించవలెనా, బిల్లీని ఎక్కువగా ప్రేమించవలెనా, అను ప్రశ్న వచ్చినప్పుడు బిల్లీనే మీరు ప్రేమించుడని చెప్పెదను. చూచారా? మన విషయములో దేవుడు కూడా ఆ విధంగానే కోరును. నన్ను ప్రేమించకుండా బిల్లీని మీరు ప్రేమించలేరని నాకు తెలియును, ఎందుకనగా అతడు నాలో భాగమైయున్నాడు. చూచారా? కావున మిమ్మును ప్రేమించకుండా నేను దేవునిని ప్రేమించలేను, ఎందుకనగా మీరు దేవునిలో భాగమైయున్నారు. మనము ఒకరినొకరము ప్రేమించుదుము. ఓ, అదెంతో అద్భుతమని నేను తలంచుచున్నాను. ఈ ప్రశ్నలు మనలను ఇరుకులో పెట్టినది. దీనికి జవాబు ఇచ్చిన తరువాత పాటలు పాడుట చక్కగా యున్నది గదా? ఓ, చాలా వాస్తవముగా ఉన్నవి.

నేనాయనను ప్రేమించుచున్నాను,

ఆయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

ఓ, వారు తూర్పు నుండి వచ్చెదరు…

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...