ప్రశ్నలు మరియు జవాబులు #4
1శుభ సాయంకాలము స్నేహితులారా. నేను మన యొక్క ప్రియ కాపరి గారితో మాట్లాడుచుంటిని. వారు కొందరు ఎదురు చూచుచున్నారని తలంచుచున్నాను; ఇంక ముందుకు నేను వెళ్ళలేకపోయాను. దర్శనములతో నేనెంతో చిందరవందర అయిపోయాను, చూచారా. మరియు చాలా వచ్చినవి, ఈ మధ్యాహ్నము దాదాపు పదిహేను లేక ఇరవై వచ్చినవి. మరియు అవి నన్ను ముక్కలుగా చీల్చినవి. ఇక్కడ, అక్కడ ఏదో కొద్దిగా నేను చూడగలిగాను. నేను బయటకు వచ్చాను; "నెవిల్ సహోదరుడా, నీవు కొనసాగించదలచినచో ఇంకా ముందుకు కొనసాగించు నేను మెల్లగా ఇంటికి జారుకోవలెననుకొనుచున్నాను. నేను కూలబడిపోవుచున్నాను. నా గుండె కొట్టుకొనుచూ గంతులు వేయుచున్నది. ఇక ఏ మాత్రం నేను నిలబడలేను," అని చెప్పాను.
అతడు ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, ఈ ప్రశ్నలకు జవాబులిచ్చుటను సమాప్తము చేయమని ప్రజలు కోరుచున్నారు." మరియు విధి నిర్వహణను ఎన్నడూ నేను తప్పించుకొనగోరను. సహోదరుడు నెవిల్ కు నేను అభినందించుదును. కొద్ది నిమిషముల పాటు శాయశక్తులా నేను ప్రయత్నించెదను. బిల్లీ అక్కడికి వచ్చెను; "అవన్నీ నీయొద్దకు చేరినవా?" అనడిగాను.
2అతడు ఇట్లనెను, "డాడీ, ఇరవై లేదా ఇంకా ఎక్కువ నిలబడియున్నారు." చెప్పలేకపోయాను. ఈ రోజున దాదాపుగా ముప్ఫయి మందిని నేను కలిసికొనలేకపోయాను. దాదాపుగా ఇరవై-అయిదు దర్శనములు వచ్చియున్నవి. కావున నా పరిస్థితి ఏమిటో మీకు అర్థమగును. నేను నిజంగా అలసిపోయియున్నాను, మానసికంగా నిజంగా అలసిపోయియున్నాను. కానీ మనము ప్రార్ధించుదము. ఎక్కడ మనం విడిచిపెట్టామో అక్కడినుండి ఆ ప్రశ్నలను మరల ప్రారంభించుదుము. నేను ఆరిజోనాకు వెళ్ళినా ఇవి నా మనస్సులో ఉండును. అన్నివేళలా అవి నన్ను తొందరచేయుచుండును. ప్రభుని చిత్తమయితే, బహు త్వరలోనే నేను తిరిగి వచ్చెదను. ఒక దినమున వీలయినంత శీఘ్రముగా ఈ అంశము మీద మాట్లాడుదును. వివాహము మరియు పరిత్యాగము యొక్క దిద్దుబాటు గూర్చి మాట్లాడుదును. మనము ప్రార్ధించుకొందము.
3ప్రియ దేవా, నా హృదయమును నీవెరుగుదువు. మరియు నా భావమును నీవెరుగుదువు. నా గురించి సమస్తమూ నీవెరుగుదువు. దేవా, అనేక జనులున్నారు. నేను నీకు ప్రార్ధించుచున్నాను. ప్రభువా, వారిని మరీ ఎక్కువ దూరం పోనిచ్చాను. చాలామంది వారిలో యున్నారు. కానీ ఈ రోజున సహాయం ఆర్ధించి వచ్చిన ప్రతివారికి అది దొరికినదని నమ్మి నీకెంతో కృతజ్ఞత నేను చెల్లించుచున్నాను. ప్రతివారు ఆనందముతోను మరియు సంతృప్తితోను బయటకు వెళ్ళిరని నమ్ముచున్నాను. నా మట్టుకు నేను ఆ సంగతులకు జవాబు చెప్పులేను. నీవు దర్శనములలో దిగివచ్చి వారి జీవితమును బయలుపరచియున్నావు. (వారిలో చాలామంది ఇక్కడ కూర్చొని దానిని ఇప్పుడు వినుచున్నారు. అది సత్యమని వారెరుగుదురు), వారి జీవితములలో జరిగిన సంగతులను, ఆలాగు జరుగుటకు కారణములను నీవు వారికి బయలుపరచియున్నావు. ప్రభువా, వారెరుగుదురు. నీ సహాయము లేకుండా మరే ఇతర విధముగాను ప్రపంచములో ఇది సాధ్యము కాదు.
పరలోకపు తండ్రీ, నేను అలసిపోయినా గాని నీ దాసునిగా ఉండుటకు సంతోషించుచున్నాను. నీకు ప్రార్ధించుచున్నాను. నిలబడియున్నవారిని ఆశీర్వదించుము, ఇంకా చాలామంది రావలెనని ఆశించిరి. మరియు ప్రభువా, వారిపట్ల నీవు శ్రద్ధ చూపెదవని నమ్ముచున్నాను. వారికి అవసరమైయున్న ప్రతిదానిని నీ గొప్ప పరిశుద్ధాత్మ ఇచ్చునని విశ్వసించుచున్నాను.
ప్రియ దేవా, ఈ ప్రశ్నలకు జవాబులను ముగించుట ఎట్లో నాకు సహాయము చేయుము. వాటి విషయములో నాకు సాధ్యమైనంత ఉత్తమ రీతిగా నీ ప్రజల యొక్క ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలుగునట్లు కృప చూపుము. వాటిని వ్రాసి యిమ్మని నేను వారికి చెప్పాను. వారు వాటిని వ్రాసిరి. వారియొక్క ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చు బాధ్యత నాకు కలదని నేను తలంచుచున్నాను. నీ పట్లను, నీ ప్రజల పట్లను నాకున్న విధిని నేను నిర్వహించగల శక్తిని, బలమును నాకిమ్మని ప్రార్ధించుచున్నాను. యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్.
4ఈ ఉదయము ఎక్కడ ఆపివేశామో అక్కడనుండి ప్రారంభించుదము. వీనిలో కొన్నింటిని నేను చదువలేకపోయాను, ఎందుకనగా నా గొంతు కొద్దిగా బొంగురుపోయినది. కారణమేమనగా నేను మరీ ఎక్కువగా మాట్లాడుచున్నాను. ఈ రోజున వివేచనలో ఎంతమంది యున్నారు. నిజంగా దేవుడిచ్చిన దానిని ప్రశంసించవలెను, చూచారా. అవన్నియూ చాలా ఉత్తమముగా యున్నవి. ఆరాధనలు చాలా బాగున్నవి. మీరు తెలిసికొనగోరిన సంగతులు, జీవితములో దాగియున్న సంగతులు బయలుపరచబడి చెప్పబడుట జరిగినది.
గుర్తించుకొనండి, చాలా సంగతులున్నవి. కొన్ని జుగుప్సాకరమగు సంగతులు బయటపెట్టుట జరిగినదని నిశ్చయంగా మీలో చాలామందికి తెలియును. కానీ నాకు మరియు దేవునికి తప్ప మరెవరికిని తెలియవు. మరియు మీతో నేను చెప్పినవి మీకును మరియు దేవునికిని తెలియును. ఆలాగే ఉండనీయుడి. మీకు సహాయము చేయుటకే ప్రభువు ఈ సంగతులు బయలుపరచెనని మీలో ఎందరు నమ్ముచున్నారు? ఆలాగయితే మీ చేతులు ఎత్తండి. చూచారా? ఆ ప్రజలకే తెలియదు, కాని ఆ సంగతులు దేవునికి తెలియును.
5ఇప్పుడు, వీలయినంత త్వరగా ఆ ప్రశ్నల యొద్దకు వెళ్ళుదము. ఇక్కడే మరొక ప్రశ్నకూడా యున్నది. "మూడవది" అని యున్నది. ఇది ఒక ఉత్తరమని తలంచుచున్నాను. అది నిజము. అది ఒక ఉత్తరము క్షమించండి. వాటిని ఇక్కడ ఉంచి వచ్చెదను. అవునండీ! ఇది కూడా ఒక ఉత్తరమే. కాని "ప్రశ్న" అని యున్నది. కాని ఇది ఉత్తరమని నేను నమ్ముచున్నాను. ప్రశ్నను ఉత్తరములో వ్రాసిరి. కాదు, అది ఒక కలను గురించిన ప్రశ్న. సరే. ఆ కలను నేను చదువుదును. మరియు ప్రభువు దానియొక్క భావమును నాకిచ్చునో లేదో చూద్దాం. నాకు కలిగియున్న దానిని మీకిచ్చెదను. మీ చిరునామా మీ యొద్ద ఉన్నదనుకొనుచున్నాను. అది చూద్దాం. అవునో, కాదో చూద్దాం. మీ చిరునామా వ్రాయమని అడిగాను. ఈ ప్రశ్నను మరియు ఈ కలను వ్రాసిన వ్యక్తిని కోరుచున్నాను. మీ యొద్ద అది లేదు.
ఈ ఉత్తరమును వ్రాసినవారు వినండి. (దీనిని నాకే కేవలము వ్రాసిరి), మీ చిరునామాను బిల్లీకి ఇవ్వండి. నేను ఆరిజోనాకు వెళ్ళుచుందును. నేను ఎడారిలోనికి వెళ్ళి ప్రార్ధి౦చెదను. నాకు భావమును ఆయన ఇచ్చినచో, దానిని మీకు వ్రాసి పంపించుటకు చిరునామా కావలెను. (మీరు చూచారా? అది లేకపోతే అనువాదము…) దానిని ఆయన నాకిచ్చినచో చేయుదును. కాని నామట్టుకు నేను చెప్పును, ఎందుకనగా నేను చేయకలిగినది అది మాత్రమే. అప్పుడు అది సరియని నాకు తెలియును. ఇప్పుడు.
6ప్రశ్న: వధువు, ఈ వర్తమానమును నమ్ముచున్నవారు, పశ్చిమానికి వెళ్లి, అనగా అక్కడ పోగవుట జరుగునా?
7(ఒక్క నిమిషము ఆగండి. ఒక్క సెకను చూడండి. కాదు. ఓ, అది కాదు. అది ప్రకటనలోని అధ్యాయమని తలంచాను. "రెవ. కాప్స్," వలె కనిపించుచున్నది. దానిగూర్చి కొద్దిగా నేను గందరగోళములో పడియున్నాను. మీరు చూచినట్లయితే నిశ్చయముగా ఆలాగే కనబడుచున్నది, చూచారా. అది "రెవ. కాప్స్" ఇంకా ముందుకు వ్రాసిరి. కాదు. అది సరియే.) ప్రకటన 12వ అధ్యాయము వధువు గూర్చి మాట్లాడుచున్నదా?
కాదు! "వధువు క్రమముగా పశ్చిమానికి వెళ్ళునా?" నాకు తెలియదు. వధువు విశ్వవ్యాప్తముగా యున్నది. ప్రపంచమంతా చెదరియున్నది. దానిని గ్రహించిన వారందరూ "ఆమేన్" చెప్పండి. నీవెక్కడున్నా పరవాలేదు, నీవెక్కడ చనిపోయినా పరవాలేదు, క్రీస్తునందు నీవు చనిపోయినచో దేవుడాయనతో కూడా నిన్ను వెంటబెట్టుకొని వచ్చును.
నీవు కాల్చబడవచ్చును, తినివేయబడవచ్చును, నాశనము చేయబడవచ్చును, మరేదయినా జరుగవచ్చును. కాని క్రీస్తు వచ్చునప్పుడు ఆయనతో కూడా దేవుడు నిన్ను వెంటబెట్టుకొని వచ్చును. మీరు పశ్చిమాన పోగవనవసరము లేదు. ప్రభువు మిమ్మును నడిపించిన చోటికి వెళ్ళండి.
8మీకు పశ్చిమానికి వెళ్ళవలెననిపించుచున్నదనుకొనండి, నేను వెళ్ళు ముందుగా ఈ విషయమును బహు తేటగా చెప్పగోరుచున్నాను. (ఈ వర్తమానమును వారు టేపు చేయుచున్నారా? చేయుచున్నారా? సరే. మంచిది.) మీరెక్కడికి వెళ్ళవలెనో నేను చెప్పుట కాదు. మీరు పశ్చిమానికి రాగోరినచో, పశ్చిమానికి రండి. మీరు తూర్పుకు, ఉత్తరానికి, దక్షిణానికి, ఎక్కడికి వెళ్ళగోరినచో అక్కడికి ప్రభువు నడిపింపును బట్టి వెళ్ళుడి. దానిని అర్ధముచేసికొనినవారందరూ, "ఆమేన్!" చెప్పండి.
9ఫలాని చోటికి వెళ్ళవద్దని నేను చెప్పుటకు ప్రయత్నించుటలేదు. ఈ సమయములో నేను కొంతకాలము ఆరిజోనాలోని, టుసాన్లో జీవించుదును, మీరు రావాలంటే రావచ్చును. ఈ ఉదయము నేను చెప్పాను, నాకు ఇంటి బెంగ యున్నది. వెళ్ళుటకు ఏ గృహమూ నాకు లేదు. నేను గృహము అని పిలచునది, పిలచువారు ఉన్నచో ఎంత బాగుండునని అనుకొందును. ఈ రాత్రి అటువంటి దానికొరకు పదివేల డాలర్లు ఇమ్మన్నా ఉచితముగా చెప్పెదను, "ఇది నా గృహము" అని నేను చెప్పగలిగినచో చాలును. ఉచితముగా అంత డబ్బు ఇచ్చెదను. నాకు ఏ చోటూ లేదు.
ఫ్రీమన్ సోదరుడా, నా బాల్యము నుండి నీవు నన్ను ఎరుగుదువని నేననుకొనుచున్నాను. నేను ఒక సంచారిని. మీరెన్నడూ సంచారులుగా యుండవద్దు. మీరు ప్రేమించు ఒక చోటును కనుగొని, అక్కడ స్థిరపడండి; ప్రభువైన యేసు కొరకు ఎదురు చూడండి.
నేను జీవించుచున్న ఆరిజోనాలోని, టుసాన్ కు, అనగా పశ్చిమానికి రాగోరుచున్నచో మిమ్మును ఆహ్వానించుచున్నాను. సంతోషముగా మిమ్మును చేర్చుకొందును. మీరు నా సోదరులు, సోదరీలు. మీకు సహాయము చేయుటకు ప్రపంచములో ఏదయినా చేయుదును. మీరందరూ అక్కడికి వచ్చినా నేను మీకు సౌకర్యము ఏర్పరచుటకు శాయశక్తులా ప్రయత్నించెదను, నాకు తెలిసిన ప్రతి దానిని చూపించెదను, మిమ్మును త్రిప్పెదను, నాకు వీలయిన ప్రతిదీ చేయుదును. మరియు ఎల్లప్పుడూ మిమ్మును ఆహ్వానించుచున్నాను.
కానీ ఆరిజోనాలోని, టూసాన్ నుండి మాత్రమే వధువు ఎత్తబడునని విశ్వసించి వచ్చినచో, ఆ ఉద్దేశ్యము తప్పు అని చెప్పుచున్నాను. ఆలాగున మీరక్కడికి రావద్దు. అందుకొరకు రావద్దు, ఎందుకనగా అది తప్పు. అది సరి కాదు.
10ఇప్పుడు, ప్రకటన 12వ అధ్యాయము… కానీ ప్రభువు నాకు బయలుపరచిన లేదా నాకు చెప్పిన ఒక సంగతిని వినండి. ఆ దర్శనములను ఈ మధ్యే చూచాను, గమనించారా, వాటిని దూరంగా త్రోసివేయుట చాలా కష్టము, చూచారా. ఈ పశ్చిమానికి వెళ్ళుట గురించి ఆయన నాతో మరీ మరీ చెప్పుచున్నట్లు నాకు కనిపించుచున్నది.
ముందు నేను చెప్పినట్లుగా, అక్కడికి నేను శాశ్వతంగా వెళ్ళుట లేదు. నాకు నడిపింపు కలుగుట చేత అక్కడికి నేను వెళ్ళుచున్నాను. కాని అక్కడే స్థిరపడి, దానిని నా గృహముగా చేసికొనుట తప్పు. ఒక ఉద్దేశ్యము నెరవేర్చుట కొరకు దేవుడు నన్ను కొద్దికాలము మట్టుకు అక్కడుండుటకు పంపుచున్నాడని తలంచుచున్నాను. పంపిన కార్యమును సాధించవలెను. ఎందుకు వెళ్ళుచున్నానో ఇక్కడ మీకు నేను చెప్పలేదు, కాని పని లేకుండా మాత్రము నేను వెళ్ళుట లేదు.
11ఒక రోజున దానిగూర్చి ప్రశ్నించిరి: "మొదట నీవు ఆరిజోనాకు ఎందుకు వెళ్ళితివో మేమెరుగుదుము. ఆ దేవదూతలు ప్రత్యక్షమయినవి. రెండవసారి నీవు ఎందుకు వచ్చితివి?" ఆ ప్రశ్నను నేను చదివినప్పుడు విన్నారా?
దాని తరువాత నేను తిరిగి వచ్చి, నా భార్యతో కూడా డాక్టర్. లీవైల్ ఎదుట కూర్చొని యుండుట మీలో ఎందరికి గుర్తున్నది? (ఈ భవనములో ఎక్కడో ఒకచోట అతడున్నాడని నమ్ముచున్నాను) నేను ఆరిజోనా గూర్చి అక్కడ మేముండుట గూర్చి మాట్లాడాను. ఒక చేయి మరియు వెలుగు అక్కడి గోడ మీదికి వచ్చి ఈలాగున అక్షరములను వ్రాసినది, "ఆరిజోనాకు తిరిగి రమ్ము." దానిని ఎందరు గుర్తుంచుకొనిరి? ఈ కారణము చేతనే మరల అక్కడికి వెళ్ళాను. ఎందుకు తిరిగి వెళ్ళానో నాకు తెలియదు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు, ఎందుకొరకు నేను వెనక్కి రావలసి వచ్చినదో ఆయన తెలియచేసెను. దానిని నేను చెప్పిన యెడల, సాతాను దానిని అడ్డగించును. కాని నా హృదయము దానికి తెలియదు. వాడు వాక్యము కాదు, గనుక వానికి నా హృదయము తెలియదు. కాని దానిని నేను చెప్పినప్పుడు, వాడు వినును. కాబట్టి ఇప్పుడు దానిని గుర్తించుకొనండి.
12ఒక రోజున నేను దానిని ఒక విధంగా చెప్పాను, మీరు దానివలన ఒక రకమగు తప్పు అభిప్రాయమును కలిగియుండవచ్చును. నేను "ఆరిజోనాకు మీరు రావద్దని" చెప్పాను. కాని దాని భావము "మీరు రావద్దని," కాదు. వచ్చుటకు మీకు నడిపింపు ఉన్నయెడల రండి, అది నా భావము. వెళ్ళి చేయదలచినది చేయండి. మీరు నడిపింపును బట్టి ఆరిజోనాకు గాని, కాలిఫోర్నియాకు గాని, మరెచ్చటికయినా గాని వెళ్ళండి. కాని మీరు అక్కడికి వెళ్ళునప్పుడు ఇట్లు చెప్పినయెడల, "బ్రెన్హాం సోదరుడా, నీవు అక్కడ యుండి వాక్యమును బోధించుదువని నమ్ముచున్నాను." ఆలాగు మీరు చెప్పినయెడల తప్పు. చూచారా? నా బోధ ఈ ఆలయములోనే యుండును; ఇదే ఆ స్థలము.
ఆరిజోనాలో ఒక్క ఆరాధన కూడా నాకు లేదు. ఒక్కసారి కొన్ని గంటలు తప్ప ఎక్కువ నేను ఆరిజోనాలో గడపలేదు. నాకు ఒక వ్యాపారుల కూటము క్రిస్మస్ తరువాత యున్నది. అది సంవత్సరం మొదట్లో, ఫీనిక్సులో, అంతకు మించి నాకేమియూ లేదు. నేను వాగ్ధానము చేయుచున్నాను, ఏమియూ లేవు.
నా తరువాత కూటము, నాకు తెలిసినంత వరకు, ఇక్కడే ఎనిమిదవ పెన్ వీధి, బ్రెన్హాం ఆలయములో యుండును. నాకు ముప్ఫయి లేదా నలుబది అంశములుండును. అందుకు ఒక వారము లేదా రెండు వారములు ఒకేసారి కావలెను. అవి ఇక్కడ బ్రెన్హాం ఆలయములో, అనగా ఈ జెఫర్సన్-విల్, ఇండియానాలోనే భోది౦చవలేనని నా హృదయములో యున్నది.
13మరియు ఇప్పుడు, వాక్యముతో నిలచియుండవలెనని మీరు ఎక్కడికయినా వెళ్ళవలెనని కోరుకొనుచున్నచో మంచిది. మన వర్తమానము ఎక్కడయినా గాని ఒక్కటే. ఏమీ మార్పు రాదు. మీరు మీ జీవితకాలమంతా దానిని వినియున్నారు. కేవలము మరికొంత మీకు బయలుపరచబడియున్నది. ఈ వర్తమానమునే లూథర్ బోధించెను, ఈ వర్తమానమునే వెస్లీ బోధించెను, ఈ వర్తమానమునే పెంతెకోస్తు బోధించెను, దానికి కొంత ఇప్పుడు చేర్చుట జరిగినది. అది ఏమిటనగా, ముద్రలు ఇప్పుడు బయలుపరచబడి యున్నవి, సంఘ సంస్కర్తలు విడిచిపెట్టిన దానిని తెలియపరచుట ఈ దినములలో జరిగినది, చూచారా, ఆ దినములలో అది బయలుపరచబడలేదు. పెంతెకోస్తు వర్తమానము లూథర్ లేదా వెస్లీ దినములలో బయలుపరచబడుట జరుగలేదు. పెంతెకోస్తు యుగము వరకు అది కనిపెట్టవలసియున్నది. కానీ పెంతెకోస్తు యుగము అనగా లూథర్ యుగమునకు ఇంకా ముందంజ మాత్రమే. అది పంట పరిపక్వమగుటకు సాదృశ్యముగా యున్నది, సంఘము కూడా ఆ విధంగానే యున్నది.
JOHN 15:5
14ఈ రాత్రి నేను బోధించవలసిన అంశము ఏదనగా, బైబిలులో దానిని గమనించండి. ఐగుప్తు నుండి పాలస్తీనాకు మార్చబడిన ద్రాక్షావల్లి గురించి చెప్పెదను. ఇశ్రాయేలు తన ద్రాక్షావల్లి అని దేవుడు చెప్పిన సంగతి మీలో ఎందరికి గుర్తున్నది? ఆ తరువాత యేసే ద్రాక్షావల్లి అని నేను ఎత్తిచూపాను. మరియు ఇప్పుడు సంఘము లోకములోనికి బదిలీ చేయబడినది, కానీ అది లోకపు మురికిలో కూర్చొనుటకు కాదు గాని, క్రీస్తులో పాదుకొనుటకు ఏర్పరచబడియున్నది, అది ఫలమును ఫలించవలసియున్నది. మీరు చూచారా? ఈ రాత్రికి నేను బోధించబోవు వర్తమానము అదే అయి యున్నది. కాని ఈ మిగిలిన ప్రశ్నలకు జవాబు ఇచ్చుట కొరకు దానిని ప్రక్కకు బెట్టాను. నేను మరల తిరిగి వచ్చినప్పుడు దానిని బోధించెదను.
REV 12:1
15ప్రకటన 12వ అధ్యాయము వధువుకు చెందినది కాదు. ప్రకటన 12వ అధ్యాయము. (దానిని నేను చూడలేదు గాని అదేనని తెలియను), సూర్యునిలో ఒక స్త్రీ నిలబడియున్నది. ఆమె పాదము క్రింద చంద్రుడున్నాడు. చంద్రుడు ధర్మశాస్త్రమునకు ప్రతినిధిగా యున్నాడు. స్త్రీ అయితే ఇశ్రాయేలునకు సాదృశ్యముగా యున్నది, అదే సంఘము. ఆమె నొసటి మీదనున్న పండ్రెండు నక్షత్రములు, పండ్రెండుగురు అపోస్తలులకు సాదృశ్యము. పన్నెండు సంఘ కాలములు మొదలగునవి, ఇటీవలెనె అవి దాటిపోయినవి. చూచారా? ఆమె తలయెద్ద సూర్యుడున్నాడు. మీరు దానిని గమనించండి, సూర్యుని యొక్క ఛాయయే చంద్రుడు, రాబోవు మేలులకు ధర్మశాస్త్రము ఛాయయై యున్నది. ఆ స్త్రీ ఇశ్రాయేలే గాని వధువు కాదు.
ఇప్పుడు మరీ ఎక్కువ సమయము నేను గడపను, ఎందుకనగా వాటిని ముగించవలసియున్నాను.
ROM 7:14-17
16ప్రశ్న: రోమా 7:14-18. "ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని మనకు తెలియును, కాని నేను శరీర సంబంధిని, పాపమునకు అమ్మబడితిని, ఎందుకనగా చేయవలసిన దానిని చేయుట లేదు, చేయరాని దానిని చేయుచున్నాను. నేను ద్వేషించున్నదానిని చేయుచున్నాను, చేయరాని దానిని చేయుచున్నందున ధర్మశాస్త్రమునకు సంబంధించి మేలుగా కనబడదు. కావున ఇక మీదట దానిని చేయుచున్నవాడను నేను కాను, నాలో నివసించుచున్న పాపమే." ఇది నాకు అర్థమగుట లేదు.
మంచిది, వారు వాక్యమును వ్రాసిరి. రోమీయులతో పౌలు మాట్లాడుచున్నాడు. అతడిట్లు చెప్పెను… మీరది అర్ధము చేసికొనునట్లుగా దానికి కొంత మెరుగుదిద్దెదను. అతడిట్లు చెప్పెను, "నాలో ఇద్దరు వ్యక్తులున్నారు: ఒకరు సరైన దానిని చేయమని కోరుచున్నారు, మరొకరు తప్పు చేయమందురు. మంచి చేయవలెనని నేను ప్రారంభించిన ప్రతిసారి తప్పు నన్ను ఆటంకపరచుచున్నది."
ఈ మధ్యాహ్నము ఎంతమంది ఇంటర్వ్యూ కొరకు కలిసికొనుటకు వచ్చియున్నారు? (చూచారా?), ఉదయము కూడా ఆలాగే జరిగియున్నది గదా? దానిని గూర్చి ఈ ఉదయమున తాత్కాలికంగా మాట్లాడియున్నాను.
ROM 7:14•
1COR 9:27
17నీవు ఆరు జ్ఞానేంద్రియముల ద్వారా అదుపు చేయబడుచున్న ఒక బాహ్య పురుషునివి; నీ యొక్క అంతరంగ పురుషుడు విశ్వాసమను ఒక జ్ఞానేంద్రియము ద్వారా అదుపుచేయబడును. విశ్వాసముతో ఈ ఆరు జ్ఞానేంద్రియములు ఏకీభవించలేనప్పుడు, ఈ ఆరు జ్ఞానేంద్రియములను విశ్వాసము ఎదిరించును. ఒకటి మరియొక దానికి విరుద్ధమై యున్నది. విశ్వాసముతో ఆరు జ్ఞానేంద్రియములు ఏకీభవించినంతకాలము, అద్భుతముగా యుండును; కానీ ఆరు జ్ఞానేంద్రియములు విశ్వాసముతో ఏకీభవించనప్పుడు, వాటిని విడిచిపెట్టు.
ఉదాహరణకు ఇచ్చట చూడండి. యేసు ఒక మాట ఇచ్చెను, ఒక వాగ్ధానము. అది నిజమని అంతరంగ పురుషుడు చెప్పును; కాని అది నిజము కాదని బాహ్య పురుషుడు వాదించుచుండును. అప్పుడు బాహ్య పురుషుని అతడు అలక్ష్యము చేసి అంతరంగ పురుషుని స్వీకరించవలెను. పౌలు ఆ విషయమును గూర్చియే మాట్లాడుచుండెను. అతడు ధర్మశాస్త్రము క్రింద ఉండి శరీర సంబంధమగు పాపమునకు అమ్మబడెను. మనలో ప్రతి ఒక్కరము ఆ విధముగానే యున్నాము. ఆ కారణము చేతనే మనకు ఇన్ని సమస్యలు వచ్చియున్నవి. నాలుగు లేదా అయిదుసార్లు పెండ్లి చేసికొనుట, ఇది, అది మరియు అన్ని రకముల పాపములు యున్నవి - అన్ని రకముల పాపములు, వ్యభిచారములు, ఇంకా మన జీవితములలో అనేకములు చోటు చేసుకొనుచున్నవి, కారణము ఈ క్రియలే. మనము శరీరసంబంధులము. ఆ భాగము తప్పక నశించబడవలెను; కాని అంతరంగమందు మనకు ఒక ఆత్మీయ పురుషుడున్నాడు, అంతరంగమందు ఆత్మ ఉన్నది, దానికి దేవుని యొక్క వాక్యమందు విశ్వాసమున్నది. దేవుడు చెప్పిన దానిని అంగీకరించుట ద్వారా, విశ్వాసము ద్వారా వాక్యమునకు లోబడుట ద్వారా మన శరీరములను అదుపులోనికి తెచ్చుకొనవలెను.
18నేను ఒక గురుగును చల్లి గోధుమ గింజలను ఎట్లు పండించగలను? దానిని చేయుట నాకు అసాధ్యము. అందుకే ఒకే ఒక మార్గమున్నది. ఆ గురుగు లోపల గల జీవమును మార్చుట ఒక్కటే మార్గము. "గోధుమ గింజ జీవమును" అందులోనికి తీసికొని వచ్చినప్పుడు, అది గోధుమ గింజలనే మరల తీసికొని వచ్చును. అది నిజము. చూచారా, ఎందుకనగా గురుగులోనికి గోధుమ గింజ జీవము వచ్చినది. ఆ గురుగు యొక్క జీవమును బయటకు తీసివేయుట జరిగినది. కానీ ఆ గురుగు యొక్క స్వభావము ఇంకా అంటుకొనుచున్నది, చూచారా, ఈ క్రొత్త జీవము పూర్తిగా అభివృద్ధి చెందువరకు ఆలాగే యుండును. అది భూమిలో నుండి పెరిగి వృద్ధి చెందును. ఆ విధముగా జరిగినప్పుడు అది ఇక పిచ్చిమొక్కగా ఉండదు. అది గోధుమ గింజగా యుండును. కానీ అది ఈ భూమిమీద ఉండగా ఆ గురుగు స్వభావముతోనే కనిపించుచుండును. కానీ లోపట గోధుమ గింజ యున్నది.
ఈ జీవితముతో నీవున్నంత కాలము నీవు అంటుకొనియున్నట్లుగా యు౦దువు. నిన్ను బాధించు శరీర సంబంధమగు స్వభావముండును. నీవు బ్రదికియున్నంత కాలము ఉండును; కానీ నీ అంతరంగమందు నీవు తిరిగి జన్మించియున్నావు. నీవు తిరిగి లేపబడినప్పుడు క్రీస్తు యొక్క పోలికలో నీవు యుందువు. నీలో నుండి పాపమంతయూ పోవును, చూచారా. అదీ సంగతి
19దీనిని నీవు చెప్పవచ్చునా? ఇది సరసోక్తివలె కనిపించవచ్చును. ఒక ఇండియను… వారు చాలా వింత జనులు; వారు వింతయిన వారు కారు గాని మనకు విడ్డూరంగా కనబడెదరు. వారికి వారు చక్కగానే కనిపించెదరు. వారితో నీవు పరిచయము కలిగి యున్నప్పుడు నీకు వారు సరైన వారేనని తెలియును. రక్షించబడిన ఒక ఇండియను ఒకసారి నన్ను అడిగెను.
20ఆరిజోనాలోని, ఫీనిక్సులో ఒకరు నాకు గుర్తున్నారు. ప్రార్థన కార్డులు ఇచ్చుటకు బిల్లీ బయటకు వెళ్ళుచుండెను. మామూలుగా అతడు నిలబడి ప్రార్థన కార్డులు ఇచ్చుచుండెను. ఆ జనులు పరుగిడి వచ్చి ప్రార్ధన కార్డులను లాక్కొనగలరు. ప్రజలకు తల నొప్పి, పంటి నొప్పి లేదా పాదములో మరేదో బాధ ఉండును. వారు ప్రార్థన కార్డులు పొందిరి, సహోదరుడు రడెల్. వారు ఆ విధముగా ప్రార్ధనా వరుసలో యుందురు. వారికి తలనొప్పి లేదా కాలిలో ఏదో నొప్పి ఉండియుండును. కాన్సరుతో చచ్చిపోవుచున్న జనులు అచ్చటున్నారు. ఇంకా ఇతర రోగులు ప్రార్ధనా వరుస లోనికి రాలేకపోయియున్నారు. నేనిట్లు చెప్పాను, "బిల్లీ, అక్కడికి వెళ్ళి, ఆ జనుల యొక్క వ్యాధులను అడిగి తెలిసికొనుము. కాన్సరు గాని మరేదో భయంకర వ్యాధి గాని, ప్రాణాంతకము గాని వ్యాధి గాని లేని వారిని ప్రార్థనా కార్డులు తీసికొనవద్దని చెప్పుము. మరణకరమగు వ్యాధులతో బాధపడుచున్న వారిని ప్రభువు వలన సహాయము పొందుటకు తీసికొని రమ్ము మిగిలిన వారిని కనిపెట్టి యుండనిమ్ము వారిని త్వరగా జరుగు వరుసలోనికి లేదా మరో విధమగు విధంగా తీసికొని రమ్ము. కాని మరణ స్థితిలో ఉన్నవారిని…." నేను చెప్పాను, "వారిని అడగండి."
అతడు ఇట్లనెను, "కార్డులను కుదిపి వారికి ఇచ్చుచున్నారు, నేను అదే చేయుచున్నాను, మంచిది."
"కాని కొందరు ప్రజలు ముందుకు పరుగిడి వెళ్ళుచున్నారు. కాని ఆ కుంటివారు, ఇతరులు రాలేకపోవుచున్నారు" అని నేనన్నాను.
"సరే, అలాగే చేయుదును"
అతడు క్రిందికి వెళ్ళెను; ఒక ముసలి ఇండియను ఉండెను - వారు చాలా కరకైన వారు - అతడు కుర్చీలో కూర్చొనుట లేదు. వారతనికి ఒక కుర్చీ ఇచ్చిరి, కాని అతడు గుడారములోని నేలమీద కూర్చొనియుండెను. ఒక టోపీని పెట్టుకొనియుండెను; దానినతడు తీసివేయుట లేదు; దాని వెనుకన ఒక ఈకెను గ్రుచ్చియుంచెను, అక్కడ కూర్చొనియుండెను.
బిల్లీ అతనియొద్దకు వచ్చెను, అతడు దగ్గరగా వెళ్ళెను, "నీకు ప్రార్ధనా కార్డు కావలెనా," అని అడిగెను
"హు౦."
"చీఫ్, నీ వ్యాధి ఏమిటి?" అనడిగెను.
"నేను రోగిని," అన్నాడు.
"నీ వ్యాధి ఏమిటి?" అనడిగాడు.
"నేను రోగిని," అన్నాడు.
"కాని నీ వ్యాధి ఏమిటో తెలిసికొనగోరుచున్నాను," అని చెప్పాడు.
"నేను రోగిని," అన్నాడు.
21ఎంత ప్రశ్నించినా అతని జవాబు అదే. "సరే, కొంతసేపటి తరువాత మరల వచ్చెదను," అని చెప్పి, బిల్లీ జనులను ప్రశ్నించుచూ వెళ్ళిపోయెను. ఆ ముసలి ఇండియను ప్రార్ధనా కార్డులను గమనించుచుండెను, అవి ఇక అయిపోతున్నవి. అతడు తన జేబులో నుండి తీసి ఇచ్చుచుండినప్పుడెల్లా అవి తరిగిపోవుచుండినవి. కొంతసేపటి తరువాత ముసలి ఇండియను లేచి నిలబడెను, నడచి దగ్గరికి వచ్చెను, మరియు బిల్లీ వీపును తట్టి తాను కూడా ఆ వరుసలోనే యున్నట్లుగా చెప్పెను. "నీ వ్యాధి ఏమిటి?" అని మరల బిల్లీ అడిగెను.
"నేను రోగిని," అన్నాడు.
"సరే, చీఫ్, నీవు నాకు చెప్పవలసియున్నావు. కడుపు నొప్పి, తలనొప్పి మరియు అటువంటి ఇతర చిన్న రుగ్మతలుగల వారికి ఈ కార్డులు ఇయ్యరాదని నాన్నగారు చెప్పిరి. "నిజంగా రోగులగు వారికి వీటిని ఇమ్మని" చెప్పెను. "నీవెంత జబ్బుగా ఉన్నావ్?" అని అతడు ప్రశ్నించెను.
"నాకు జబ్బు," అన్నాడు. అతనిని మరల కూర్చుండబెట్టెను. ఆ కార్డులు దాదాపుగా అయిపోయియున్నవి. మరి రెండు నిమిషములు తరువాత మరల వచ్చి తట్టెను. (అతడు ఆ కార్డులను గమనించుచునే యుండెను.) అతడు … ? బిల్లీ అతని చేతిలో కార్డు పెట్టి అతనిని ఆ స్థలమునకు వెళ్ళమని చెప్పెను.
22అతడు ప్రార్ధనా వరుసలోనికి వచ్చెను, అతని కొరకు నేను ప్రార్ధించుచున్నాను. "చీఫ్, నీవు నమ్ముచున్నావా?" అనడిగాను.
"అది నిజము," అన్నాడు.
"నిన్ను దేవుడు బాగుచేయునని నమ్ముచున్నావా?" అనడిగాను.
"అవును," అన్నాడు.
"నీవు మంచివానిగా ఉందువా?" అనడిగాను.
"అవును" అని చెప్పెను.
దాదాపు ఒక వారం తరువాత అతనిని నేను కలిసికొన్నాను. సహోదరుడు ఫ్రెడ్ సాద్మన్ అచ్చటుండెనని తలంచుచున్నాను. అది ఫీనిక్సులో గుడార కూటము జరుగుచున్న సమయము. ఆ వారములో మరికొన్ని రోజులు గడిచిన తరువాత అతనిని నేను కలిసికొన్నాను. "చీఫ్, నీవు బాగున్నావా?" అనడిగాను.
"అవును. నిజంగానే" అన్నాడు. నేను సంభాషించి కనుగొన్నాను. అక్కడున్న మిషనైరీ పేరు నాకు చెప్పండి. ఆ ముసలివానికి తెల్లని మీసమున్నది, అపాచీలకు మిషనైరీ గదా? అతని పేరు నాకు గుర్తుకు వచ్చుట లేదు. అతడు చాలా మంచి వ్యక్తి. అతని భార్యకు కాన్సరు నుండి స్వస్థత కలిగినది. మీరెరుగుదురు. "నాకు జబ్బు" అని మాత్రమే అతడు చెప్పగలడు. బ్రెన్హాం సోదరుడా, అది మాత్రమే నేనతనికి నేర్పించానని అతడు చెప్పెను. అది మాత్రమే అతడు చెప్పగలడు. చూడండి, అదీ సంగతి. "నాకు జబ్బు" అని మాత్రమే చెప్పెను.
23ఒకసారి అతడు మార్పుపొంది, పరిశుద్ధాత్మను కలిగియుండెనని ఎవరో నాకు చెప్పిరి. "నీవెట్లున్నావు?" అని అతనిని ఆ వ్యక్తి ప్రశ్నించెను.
"చాలా మంచిగాను, చాలా చెడ్డగాను ఉన్నాను," అని చెప్పెను.
"చాలా మంచిగా, చాలా చెడ్డగా అనగా అర్థమేమిటి?"
అందుకతడు ఇట్లనెను, "నేను పరిశుద్ధాత్మను పొందినప్పటినుండి, నాలో రెండు కుక్కలు పనిచేయుచున్నవి. అందులో ఒకటి నల్లనిది, మరియొకటి తెల్లనిది. అవి ఎప్పుడూ పోరాడుకొంటూనే యుండును. అవి ఒకదానిమీద ఒకటి మొరుగుకొంటూ పోరాడుకొనుచుండును. నన్ను మంచి చేయుమని తెల్ల కుక్క కోరును నన్ను చెడు చేయమని నల్ల కుక్క కోరును."
"సరే చీఫ్! అందులో ఏది గెలచుచున్నది," అనడిగెను.
"చీఫ్ దేనికి ఎక్కువగా తిండిపెట్టుచున్నాడో దానిపైనే అది ఆధారపడియుండును," అనెను. అది మంచి జవాబుగా ఉన్నదనుకొనుచున్నాను. చూచారా? నీలోయున్న శరీరము యొక్క దృఢత్వము మీద అది ఆధారపడియుండును. దేనికి నీవు ఎక్కువగా తిండిపెట్టుచున్నావో, నీ స్వభావమును నీవు పెంచుచున్నావో దానిమీదనే అది ఆధారపడి యుండును. శరీర సంబంధమగు స్వభావమే అయితే, లోక సంగతులను వెదకును. ఆత్మ సంబంధమగు స్వభావమయితే, దేవుని సంగతులను వెదకును. అదే పనిచేయును.
24ప్రశ్న: అద్భుతములు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు చేయునంతగా ప్రతి దేవుని కుమారుడు అభిషేకించబడునా? లేక ఇది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి జరుగునా?
అవును, అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి జరుగును. నీవు దేవుని కుమారునివయితే లేదా దేవుని కుమార్తెవయితే, నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఆ కార్యములు చేయుటకు నడిపించును.
నాకు సమయము లేదు. చిన్న కథలు మీకు చెప్పవలెనని కోరిక నాకు యున్నది. ప్రతిసారి దానిగూర్చి ఆలోచించుచున్నాను, గాని దాటవేయుచున్నాను. కాని ఒక్క నిమిషము పాటు దీనిని నేను చెప్పగోరుచున్నాను.
25ఇది మిస్సిసిపీలోని, మెరిడియన్లో జరిగినది. మీలో చాలామంది ఏకత్వము వారు, సహోదరుడు బిగ్ బై నా కూటములకు యజమాన్యము వహించెను, అతడు ఒక ఏకత్వపు సోదరుడు. ఒక రాత్రి కూటములో బిల్లీ పాల్ ఆవరణలోనికి వెళ్ళి ప్రార్ధన కార్డులను ఇచ్చెను. ఓ, వర్షము కుండపోతగా కురియుచున్నది. గొడుగులు వేసికొని జనులు బయట నిలబడియున్నారు. బిల్లీ ప్రార్ధన కార్డులు ఇచ్చుచుండెను. తరువాత అతడు నన్ను తీసికొని వెళ్ళుటకు వచ్చెను. అతడు నన్ను తీసికొని వెళ్ళుటకు వచ్చునంతలో ఆ ముందు భాగములో ఒకామె కూర్చొనియున్నది, మరియు మరో స్త్రీ చిన్న శిశువును ఎత్తికొని ఊరుకోబెట్టుటకు ప్రయత్నించుచూ నడచుచున్నది. మరియు ఈ స్త్రీ అయితే చిన్న కాలికో దుస్తులు ధరించియున్నది, ఏమైనా కూడా ఆమె కూడా తల్లియే. ఆమెను ఈవిడ చూచినది. మరియు ఆమెతో పరిశుద్ధాత్మ మాట్లాడినది, "ఆ బిడ్డ కొరకు ప్రార్ధించుము," అని ఆమె హృదయములో చెప్పెను.
26"మంచిది," ఆమె చెప్పెను, "మరియొకసారి ఆమె వెళ్ళినప్పుడు, నేను వెళ్ళి ప్రార్ధి౦చెదను." మరియు ఈమె వెళ్ళుచుండినప్పుడు, ఆమె చేతిలో ప్రార్ధనా కార్డున్నది. "ఆ బాలుని కొరకు నేను ప్రార్ధి౦చలేను," అనుకొన్నది. "ఈ రాత్రి ఆ బిడ్డ కొరకు సహోదరుడు బ్రెన్హాం ప్రార్ధించునని తలంచినది. కాని సహోదరుడు బ్రెన్హాం ఆ బిడ్డ కొరకు ప్రార్ధి౦చనై యున్నచో నేనెవరి కొరకు ప్రార్ధి౦చవలెను?" అనుకొన్నది. ఇప్పుడు అది మర్యాద, అది మంచిది కాని అది ఎల్లప్పుడూ దేవుని చిత్తము కాజాలదు. కొన్నిసార్లు అది వేరుగా ఉండును.
"వెళ్లి ఆ బిడ్డ కొరకు ప్రార్ధించుము," అని పరిశుద్ధాత్మ చెప్పుచునే యున్నది.
చివరకు ఆమె ఇట్లనుకొనినది, "ఆమె నన్ను సూటిగా తిరస్కరించును. ఆమెకు ప్రార్ధనా కార్డు ఉన్నది గనుక ఆమె బిడ్డ కొరకు నన్ను ప్రార్ధి౦చనియ్యదు. నా చేత ప్రార్ధన చేయించుకోవలెనని కాదు గాని, సహోదరుడు బ్రెన్హాం చేత ప్రార్థన చేయించుకోవలెనని ఆమె ఈ బిడ్డను తీసికొని వచ్చినది."
"వెళ్ళి, ఆ బిడ్డకు ప్రార్థన చేయుము" అని పరిశుద్ధాత్మ చెప్పుచునే యున్నది." సరే. ఆమె పట్ల నేను మర్యాద చూపుతూ నా సీటు ఇచ్చెదను. (ఒక చిన్న తల్లి మరియొక తల్లితో మాట్లాడుచున్నది) అని ఆమె చివరకు ఆనుకొని ఈలాగు అన్నది, "హానీ, నీవు చిన్నబిడ్డను ఎత్తుకొనియున్నావు. వచ్చి నా సీటులో కూర్చొనుము."
"ఓ హానీ, నీ సీటు నేను తీసికొనగోరుట లేదు. నేను నా బిడ్డను ఊరుకోబెట్టుటకు ప్రయత్నించుచున్నాను," అని ఆ తల్లి అన్నది.
"కాని నీవు చాలా అలసిపోయి నీరసంగా కనబడుచున్నావు," అన్నది.
"అవును నిజమే" అన్నదామె.
"అయితే వచ్చినా సీటులో కూర్చొనుము. నీ యొద్ద ప్రార్ధన కార్డు ఉండుట నేను చూచియున్నాను. బహుశా సహోదరుడు బ్రెన్హాం నీ బిడ్డ కొరకు ప్రార్థించునేమో?" అన్నది.
"ఈ నెంబరును పిలచెదరని ఆశించుచున్నా ను," అన్నది.
"నేను కూడా ఆలాగే యున్నాను. సోదరీ, నీవు క్రైస్తవురాలవా?" అనడిగినది.
"ఓ, అవును!" అన్నది.
"నేను కూడా క్రైస్తవురాలనే. ఇక్కడ నేను కూర్చొనియున్నప్పటినుండి ప్రభువు యొక్క ఆత్మ ఈ బిడ్డకు ప్రార్థన చేయుమని నాతో చెప్పుచున్నది, నీవు నాకు అనుమతి ఇచ్చెదవా? పిలువబడినప్పుడు సహోదరుడు బ్రెన్హాం నీ బిడ్డ కొరకు ప్రార్ధించునని నాకు తెలియును. నీవు నీ కార్డును పట్టుకొని యున్నచో అతడు వచ్చి దానిని తీసికొనును. కాని నా చేతులను ఆ బిడ్డ మీద ఉంచి ప్రార్ధించినచో నాకు బాగుండును. నాతో చెప్పుచున్నదానికి లోబడవలెను. ఇందుకు నీకు అభ్యంతరమా?"
ఆమె ఇట్లన్నది, "ఎందుకు, కాదు? నిశ్చయంగా నీవు ప్రార్ధించుము. ఆ బిడ్డకు ప్రార్థన చేయుము." ఆ బిడ్డ చిన్నగా నీలంగా యున్నాడు. ఆమె ఆ బిడ్డకు ప్రార్ధి౦చెను. ఆమె ఆ స్త్రీకి సీటు ఇచ్చినది. మరియు ఆమె మూడవ బాల్కనీ పైకి ఎక్కి నిలబడినది. ఒక క్రైస్తవ సోదరుడు పైన యున్నాడు, అతడు పెద్ద మనిషి తన సీటును ఈమెకు ఇచ్చెను, కావున ఆమె కూర్చొన్నది.
27దాదాపు ఒక అరగంట తరువాత నేను కూటములోనికి వచ్చాను. కొద్ది నిమిషముల పాటు మాట్లాడాను, ప్రార్ధనా కార్డులను పిలిచాను. ఈ బిడ్డను ఎత్తుకొనిన ఈమె ఆ వరుసలో మూడవది లేదా నాలుగవది. ఆమె అక్కడ కూర్చొనియుండి, "ఓ ప్రభువా, నీకు వందనములు. ఆ చిన్నతల్లిని చూచి ఎంతో నేను జాలిపడుచున్నాను. సహోదరుడు బ్రెన్హాం ప్రార్ధించును గనుక ఆ బిడ్డ ఇప్పుడు బాగవునని తలంచుచున్నాను. ఆమె మూడు లేదా నాలుగో వ్యక్తి గనుక అతడు ప్రార్ధించును. ప్రభువా, నీకు వందనములు!" అనుచుండెను. ఆ బిడ్డను పట్టుకొని తల్లి అక్కడ కూర్చొనియుండెను. మంచిది.
నేను వచ్చి ఆ బిడ్డకు ప్రార్ధనచేయనారంభించాను. ఆ స్త్రీని చూచి ఇట్లన్నాను, "నీ బిడ్డ వ్యాధితో యున్నది. ప్రార్థన కొరకు నీవిచ్చటికి తీసికొని వచ్చియున్నావు. నీ పేరు శ్రీమతి. ఫలాని ఫలాని. నీవు ఫలాని-ఫలాని చోటు నుండి వచ్చియున్నావు. కాని బిడ్డ ఎప్పుడో బాగయ్యెను. ఫలాని పేరుగల ఆమె తన హృదయములో ఈ బిడ్డను గూర్చి భారము కలిగియున్నది. ఆమె ఇక్కడి బాల్కనీలో కూర్చొనియున్నది. (మొదటి స్త్రీ మూడవ బాల్కనీలోని నాలుగవ వరుస చివరన మొదట కూర్చొనియున్నది), ఆ బిడ్డ కొరకు విశ్వాస సహితమగు ప్రార్థన ప్రార్ధి౦చెను. ఆ బిడ్డ ముందే బాగయ్యెను." ఆమె ఆ సీటులో నుండి దాదాపు పడిపోయినంత పనయినది, చూచారా. ఆమె ఆ విధంగా దానిని చేయకుండినచో ఎట్లుండేడిది? నా భావమును మీరు గ్రహించారా? ఆ బిడ్డపట్ల ఆ స్త్రీకి ఎంతో సానుభూతి కలిగియుండవలెను. ఆ బిడ్డపట్ల నాకంటె ఆ తల్లికే ఎక్కువ జాలి ఉండవలెను, చూచారా. ఆమె తల్లి… చూచారా?
28"మనమందరమూ అద్భుతములు చేయగలమా?" అవును. పరిశుద్ధాత్మ ద్వారా నీవు అద్భుతములు చేయుటకు నడిపించబడినప్పుడు ఆలాగు చేయుము, ఎందుకనగా అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు.
దేవుడామెతో చెప్పినదానిని ఆమె జరిగించకుండినచో ఆమెకు బహుశా గద్దింపు వచ్చి యుండెడిది, మీరు చూచారా, ఆమె దేవునికి అవిధేయురాలయినట్లే. నీవు క్రైస్తవునివయితే, ఏదైనా చేయుటకు నీవు నడిపించబడుచున్నయెడల, వెళ్ళి ఆలాగుచేయుము. దాని ప్రకారమే చేయుము. దానిని గూర్చి సందేహించరాదు. వెళ్లి దానిని చేయుము.
"ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను." ఇక్కడ మరియొకటి ఉన్నది, లేక నేను తప్పు చదివానా… అవును. అది ఈ ఉదయమునకు చెందినది. "స్త్రీలు పైజామాలు ధరించుచున్నారు. ఇది మగవారికి చెందినదా?" ఈ మిగిలినవాటిలో ఇది కలిసిపోయి యుండును.
"బ్రెన్హాం సోదరుడా, దీనిని దేవుడు చేసెనా? - లేక నేను జరిగించానా ఎప్పుడైతే ఆ టేపు…" ఓ, అవును. ఈ ఉదయం దానిని మనం చూచాము. అందులో కొన్ని మిశ్రమం అయిపోయి యుండును. వాటిని నేను చింపి పారవేసియుండవలసినది, కాని అది నాకిష్టము లేదు.
29ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, పరలోక పట్టణమునకు వెలుపట గల భూమిని నింపువారెవరు?
REV 21:24,25
30పుట్టినది మొదలు మరణము వరకు తోడుగా ఉండు ప్రతి వ్యక్తి యొక్క దేవదూతను గూర్చి వివరించుము, చాలా మంచి ప్రశ్న.
వీటిని దాటిపోవుట నాకు ఇష్టము లేదు; ఇవి చాలా మంచి ప్రశ్నలు. నా పిల్లలు ఈ సంగతులను ఎరుగవలెనని నేను కోరుకొనుచున్నాను, చూచారా. "ఆ పట్టణమునకు వెలుపట గల భూమిని నింపువారు ఎవరు?" - బయట. ఆ పట్టణమునకు బయట గల భూమిని నింపు జనులు విమోచించబడినవారు, కాని వారు ఏర్పరచబడినవారు గాని పిలువబడిన వధువు గాని కాదు. వధువు రాజుతో కూడా రాజ్యము లోపట జీవించును. బయట భూసంబంధులగు రాజులు ఉందురు. వారు తమ ఫలములను శ్రమలను తీసికొని వత్తురు - శ్రమను కాదు, కాని వారు తమ ఫలములను పట్టణములోనికి తీసికొని వచ్చెదరు. రాత్రి యందు ద్వారములు మూయబడవు.
ISA 66:23
31కొండ పై భాగాన ఉన్న ఈ వెలుగు మొత్తం ప్రపంచమును వెలిగించదు. పట్టణమును మాత్రమే అది వెలిగించును. కాని వేలాది మైళ్ళ ఆవల నుండి బహుశా దానిని చూడవచ్చును. కాని అది భూమిని వెలిగించదు, ఎందుకనగా బైబిలు చెప్పెను, క్రొత్త ప్రపంచములో ఒక సబ్బాతు నుండి మరియొక దానికి - ఒక పౌర్ణమినుండి మరియొక దానికి (చూడండి) సీయోనులోనున్న ప్రభువును ఆరాధించుటకు - ఆ పట్టణమునకు వచ్చెదరు.
వారు పట్టణమునకు వెలుపట ఉందురు, వధువు కాదు, కాని రెండవ పునరుత్థానములో పైకి వచ్చు జనులు భూమిని దున్నుదురు, ఆదాము తదితరువలె తోటను కాయువారైయుందురు. కాని రాజు మరియు రాణి పట్టణములో నిలచియుందురు.
PS 34:7
32"పుట్టినది మొదలు చనిపోవు వరకు ప్రతి వ్యక్తికి తోడైయుండు దేవదూతను గూర్చి వివరించుము." చూడండి, ఇది చాలా లోతైన విషయము. దీనిని ఇప్పుడే చూచాను. దీనిని సగం టైపు చేసిరి. మిగిలిన దానిని పెన్సిలు - లేక పెన్ తో వ్రాసిరి.
ఒక దేవదూత ఉన్నది, కాని ఈ ప్రభుని దూత దేవునియందు భయభక్తులుగలవారి చుట్టూ కావలియుండి వారిని రక్షించును, చూచారా. పాపులకు దేవదూతలుండునని వాగ్దానము చేయబడలేదు, కేవలము విమోచించబడినవారికి మాత్రమే దేవదూతలుండును. అది మీకు తెలియునా? దేవునియందు భయభక్తులుగలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండును.
ఇప్పుడు, దేవదూతలు వర్తమానికులు. మీరది గమనించవలెనని కోరుచున్నాను. అది చాలా పరిపూర్ణముగా యున్నది. అది మీకు ముందు నిర్ణయమును రుజువు చేయును, చూచారా.
33తల్లి గర్భములో చిన్న బిడ్డ రూపొందించబడునప్పుడు… ఈ సంగతులను అర్థము చేసికొను చిన్నవారు చూడవలెను, చూడండి, ప్రభువు మిమ్మును మీ తల్లికి ఇచ్చెను. ఆమె మిమ్మును తన గర్భములో మోసినది. మీరామె గుండెకు దగ్గరలో యున్నారు. ఆ తరువాత ఒక దినమున ప్రభువు దిగివచ్చి మిమ్మును మీ గర్భములో నుండి బయటకు తెచ్చెను. మీరామె గుండెకు దూరమై యున్నారు గాని ఎల్లప్పుడూ ఆమె హృదయములోయున్నారు.
ఈ చిన్న శరీరము రూపొందింపపడుచుండగా, చిన్న స్వాభావిక శరీరము తల్లిలో రూపుదిద్దుకొనుచుండగా, అది జన్మించిన వెంటనే దానిని అందుకొనుటకు ఈ భూమి మీద ఒక ఆత్మ సంబంధమగు శరీరము సిద్దముగా కాచుకొనియున్నది. చలించు కండరములతోను, కొట్టుకొను గుండెతోను బిడ్డ జన్మించును, కాని అందులో జీవవాయువు లేదు. దాని కండరములు ఎగురుచుండును… చూచారా. అప్పుడు, చూడండి, దానినుండి వేరయినది ఏదయినా యున్నదో, లేదో చూడండి. ఆ తరువాత దానిలోనికి ఆత్మ రానియెడల మన ఊపిరి మనలను విడిచిపెట్ట గలదు. ఇక మనము ఊపిరి పీల్చము, అయినా గాని జీవము కలిగియుందుము. ఈ శరీరము ఆక్సిజను, లేదా ఊపిరిని పొందనప్పుడు మనము చనిపోయినట్లే. (మన ఊపిరితిత్తుల యొక్క ఉచ్చ్వాస నిచ్వాసులు.)
34కాని ఆ తల్లి తల్లియొక్క గుండెనుండి చిన్నబిడ్డ భూమిమీదికి పడినప్పుడు ("పడును" అని నేను చెప్పు మాట మీరు అర్ధముచేసికొందురు. దీనిని ఈ విధముగా చెప్పుటకు కారణమున్నది.) ఈ చిన్న బిడ్డ భూమి మీద పడినప్పుడు ఏమి జరుగును? ఆ శిశువు భూమి మీద పడిన వెంటనే కేకవేయనిచో వైద్యుడు లేదా నర్సు కొట్టుదురు. సాగదీయుదురు. శిశువుకి ఒక చురక తగలవలసియున్నది. అప్పుడేమి జరుగును?
గమనించండి, ఒక తల్లి ఎంతో క్రూరురాలు లేదా పనికిమాలినది కావచ్చును, కాని ఆ బిడ్డ పుట్టు ముందు ఒక రకమగు దయ ఆమెలో కలుగును. ఒక స్త్రీ తల్లి కాబోవు ముందు ఎట్లుండునో మీరు గమనించారా? ఆమె విషయములో ఏదో ఒక మధుర సంగతి యుండును. ఆమె ఎల్లప్పుడూ ఆ మాధుర్యమును పంచిపెట్టును. ఎందుకనగా అది — చిన్న దేవదూత, చిన్న ఆత్మ చిన్న వర్తమానికుడు, ఈ చిన్న ఆలయములోనికి రాబోవుచున్నది. లోకములోనికి వచ్చుటకు సిద్ధముగా యున్నది. ఈ చిన్న దేవదూత శరీరములోనికి వచ్చునప్పుడు, ఆ శిశువుకు ఎన్నికయుండవలసియున్నది. (అది భూమియొక్క చిన్న దేవదూత, ఈ శరీరమును ధరించుటకు ఆత్మ దేవునిచే అభిషేకించబడినది), దాని నిర్ణయమును అది చేసికొనును. ఇది జరిగినప్పుడు ప్రభువు యొక్క దూత ఇక్కడికి వచ్చుటను మీరు చూచెదరు. అది ఆత్మసంబంధమగు శరీరము, అది నిత్యమైనది.
2COR 5:1
35ఇది మరణించు ఆత్మ మరణించు శరీరములో యున్నది; కాని మీరు ఒకేసారి రెండు శరీరములలో ఉండలేరు, కాని ఒకేసారి నీలో రెండు స్వభావములుండగలవు. ఇప్పుడు, ప్రభుని ఆత్మయొక్క స్వభావమును చూడండి. నీవు తిరిగి జన్మించినప్పుడు శరీరసంబంధమైన బిడ్డ జన్మించినట్లుగా జన్మించుట లేదు; కాని ఆత్మ సంబంధమగు జన్మ వచ్చియున్నది. మరియు దేవుని యొక్క ఈ ఆత్మ సంబంధమగు ఆత్మ నీ హృదయములో ఎదుగుచున్నప్పుడు, ఆ ఆత్మను చేర్చుకొనుటకు ఒక భౌతిక శరీరము లేదా ఒక పర శరీరము సిద్ధముగా అక్కడ ఉండును. ఈ శరీరమును విడిచి జీవము వెళ్ళినప్పుడు, అది ఆ శరీరమును ఆక్రమించును. భూమి మీదికి ఆ శరీరము ఇవ్వబడినప్పుడు, ఆత్మ లోనికి వచ్చును. శరీరములో నుండి ఆత్మ బయటకు వెళ్ళునప్పుడు ఒక శరీరము ఎదురుచూచుచున్నది. "ఏలయనగా ఈ భూసంబంధమగు శరీరము శిధిలమైనప్పుడు మరియొకటి అందుకొరకు కాచుకొనియున్నది." చూచారా? అది ఇదే, ప్రజల యొక్క ఆత్మ సంబంధమగు శరీరము.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా…
REV 22:8,9
36ఇప్పుడివి తప్పక ఇక్కడ ఆ గుంపువారున్నారు. కనీసము పది లేక పదిహేను మంది అయినా యుందురు. అదంతా కాగితము మీద వ్రాయబడియున్నది. ఒకే విధమగు కాగితము. టైపు చేయుట కూడా జరిగియున్నది. వీలయినంత త్వరగా మనము బయటకు వెళ్ళుదము.
ప్రశ్న: ప్రియ సోదరుడా, ప్రకటనలో యోహాను ద్వారా ఆరాధింపబడుటకు యేసు ఎందుకు అంగీకరించలేదు? అతని ఎదుట ఆయన ఆరాధనను అనుమతించలేదు, యేసును ఆరాధించవలెనని యోహాను కోరగా ఎందుకాయన అంగీకరించలేదు?
నా ప్రియ సోదరీ, సోదరుడా, ఎవరయినా గాని వినవలెను. ఆరాధనను అంగీకరించనివాడు యేసు కాడు. ప్రకటన 22:8. అది దేవదూత, ప్రవక్త అని మీరు చదివెదరు, వారు ఆరాధనను స్వీకరించలేదు. ఈ సంగతులన్నియూ చూపించిన దేవదూతకు నమస్కరించవలెనని యోహాను సాగిలపడినప్పుడు ఇట్లు చెప్పెను, "నీవు ఆలాగున చేయవద్దు, నేను నీ సోదరులలో ఒకడను. నేను ప్రవక్తలలో ఒకడను." చూడండి, చూచారా? "నేను నీ సహ సోదరుడను, నీ సహదాసుడను, ప్రవక్తలలో ఒకడను; దేవునికే నమస్కరించుము." దానిని అంగీకరించనివాడు యేసు కాడు, దానిని అంగీకరించనివాడు ప్రవక్త.
JOHN 20:22
37ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, యేసు తన శిష్యుల మీద ఊది ఇట్లనెను, "మీరు పరిశుద్ధాత్మను పొందుడి?" వారు మేడ గదిలోనికి వెళ్ళి, కనిపెట్టవలసియుండిరి గదా? తేడా ఏమిటి?
ఆయన వారికి ఒక వాగ్ధానమును ఇచ్చెను. తన వాగ్ధానమును వారిపై ఊదెను, "పరిశుద్ధాత్మను పొందుడి," అని చెప్పెను. అది ఒక వాగ్దానము. ఆ వాగ్ధానము నెరవేర్పు కొరకు వారు మేడ గదిలోనికి వెళ్ళి కనిపెట్టిరి.
మీరు స్వస్థత పొందవలెనని మేము చేతులు మీ మీద ఉంచుటయూ అంతే, ఆ వాగ్ధానము నెరవేర్పు కొరకు మీరు ఎదురు చూచుచూ మీ దారిన మీరు వెళ్ళెదరు.
LUKE 24:16•
JOHN 21:5,6
38ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, యేసు పునరుత్థానుడై తన శిష్యులకు పలుమార్లు ప్రత్యక్షమైనప్పుడు భౌతిక ముసుగును మార్చెనా?
"ఆయన తన భౌతిక ముసుగును మార్చెనా?" - నాకు తెలియదు. అదేమిటో అని నేను ఆలోచించుచున్నాను. అక్కడాయన తన ముసుగును మార్చలేదు. ఆయన వారి చూపును అడ్డగించెను, లేదా తానెవరో తెలియకుండా చేసెను. అదే ఆయన చేసిన పని.
ఎమ్మాయి నుండి వచ్చిన వారికి అదే జరిగినది. వారు దినమంతా ఆయనతో నడుచుచుండిరి, కాని ఆయనే అని వారు గుర్తించలేదు. ఒకాయన ఆ దరిని చేపలు పట్టుటను వారు చూచిరి. వారక్కడే ఇంత క్రితం చేపలు పట్టిరి. ఆయనిట్లనెను, "పిల్లలారా, మీయొద్ద ఏమైనా యున్నవా?"
"రాత్రంతా మేము శ్రమపడితిమి గాని మాకేమియూ దొరుక లేదు," అనిరి.
"అవతలి దరిని వలలు వేయుడి," అని ఆయన చెప్పెను. వారికి గొప్ప చేపలు దొరికెను. ఆయన ప్రభువే అని వారెరిగిరి. ఆయన తన ముసుగును మార్చుకొనెనని నేననుకొనుట లేదు. జనుల యొక్క కన్నులు మూయబడినవని నేననుకొనుచున్నాను.
39ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ప్రభువు యొక్క దూతకును, స్వయంగా ప్రభువునకును మధ్యగల తేడా ఏమిటి?
ప్రభువు యొక్క దూత అనగా ప్రభువు యొద్దనుండి వచ్చిన వర్తమానికుడు. ప్రభువే స్వయంగా అనగా ఆయనే అని అర్థము. దేవదూత యొక్క రూపము కాదు. ప్రభువు యొద్ద నుండి వచ్చిన దూత వేరు. నన్ను మీకు చూపనివ్వండి. భూసంబంధముగా మాట్లాడుచున్నాను. ఇక్కడ ఒక ప్రభుని యొక్క దేవదూత యున్నది. ప్రభువు యొద్ద నుండి వచ్చిన దూతలని మనకెట్లు తెలియును? వారు ప్రభువు యొక్క వాక్యమును తీసికొని వచ్చెదరు. వారు దానిని వక్రీకరించుటకు ప్రయత్నించినచో, ప్రభువు యొద్ద నుండి వచ్చినవారు కారు, చూడండి, గ్రహించారా - చెప్పని దానిని చేయుటకు ప్రయత్నించెదరు. వారిని ఏమయినా అనండి…
ప్రభువు యొద్ద నుండి సహజాతీతమగు దేవదూత ఒకటి దిగి వచ్చును. గాబ్రియేలు — మిఖాయేలు వంటి వర్తమానికులు. మాచిప్రతి తదితర పేర్లున్నవి.
40ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మనము జీవించుచున్న ఈ దినమున ఒకటి తప్పువలె నాకు కనిపించుచున్నది. అదేమనగా విశ్వాసిగా ఉండి, నేటి వర్తమానమును మరియు వర్తమానికుని వెంబడించుచూ, ప్రార్ధి౦చవలసిన రీతిగా ప్రార్ధి౦చుట లేదనిపించుచున్నది. అది మంచి ప్రశ్న.
సోదరీ, సోదరుడా, దానిని అడిగిన వారెవరైనా గాని వినండి. అది ఈ కాల పరిస్థితి యొక్క ప్రభావము. ఉజ్జీవము అయిపోయినది. దాదాపు పదిహేను సంవత్సరముల పాటు ఉజ్జీవము కొనసాగినది. ఇంతకు ముందు అయితే మూడు సంవత్సరములకు మించి ఉజ్జీవము లేదు. చివరి ఉజ్జీవము వచ్చినదని నేను నమ్ముచున్నాను. అందువలననే ఇంతకు ముందు మీరు ప్రార్థించు రీతిగా ప్రార్ధించుట, ఆత్మాను భవమును పొందుట చేయలేకపోవుచున్నారు. దానికి కారణము ఏమనగా ఉజ్జీవ జ్వాలలు చల్లారిపోయినవి.
41ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఒక వ్యక్తి తన స్వంత ఆలోచనలను బట్టి ఆలోచించుచున్నాడో లేక ఆ విధంగా తప్పు ఆలోచనలు అపవాది వలన అతని మనస్సులోనికి వచ్చినవో ఎట్లు తెలియును. ముఖ్యంగా, అటువంటి ఆలోచనలు ఆలోచించరాదని ఎరిగియు ఆలోచించుట ఎందుకు జరుగునో వివరించుము?
అది వాక్యమునకు విరుద్ధమయినచో, అపవాది యొక్క ఆలోచనయేనని ఎరుగుడి. అది వాక్యమునకు సరిపోయినచో, దేవునికి సంబంధించిన ఆలోచనయే. అది తప్పు ఆలోచన అయితే అపవాదికి చెందినదే. అది వాక్యము గూర్చినది, దేవుని గూర్చినది అయితే దేవుని యొక్క ఆలోచనయే.
42ప్రశ్న: ఒక ప్రత్యేక విషయము గూర్చి అపవాది నీ మనస్సులో ఆలోచనలను ఉంచితే దానిని వదిలించుకొని జయించుట ఎట్లు?
దానికి వ్యతిరేక విధానమును తీసికొనుము. అపవాది ఆ విధమైన ఆలోచన నీకు ఇచ్చుచున్నట్లయితే… నీవు క్రైస్తవునివని నీకు తెలియును. నీవు క్రైస్తవునివి కాదని వాడు నీకు ఆలోచన కల్పించును. దానికి వ్యతిరేక ఆలోచనను తీసికొనుము. "నేను క్రైస్తవుడను," అని చెప్పుము. మీ అనుభవము దేవుని వాక్యమునకు జత అయినంత కాలము "నేను క్రైస్తవుడను," అని చెప్పెదవు. ఏదయినా గాని అది మారదు.
ప్రశ్న: దీనికి నీవు జవాబు ఇచ్చునప్పుడు దయచేసి దీనిని జయించుట కొరకు నాకై ప్రార్ధించుము. నా యంతట నాకు సాధ్యము కాదు.
జయించుటకు దేవుడు నీకు కృప చూపును, నీవు ఎవరవైనా, నీ ఆలోచనలు మరియొక వైపునకు వెళ్ళి ఇట్లు పలుకును గాక, "నేను క్రైస్తవుడను; నేను విశ్వాసిని. సాతానా, నా మీద నీకు పట్టులేదు."
నిజంగా ఇక్కడ దానినే నేను పలుకుచూ నిలబడియున్నాను, ఈ వేదిక మీద స్పృహ తప్పి పడిపోకుండా నిలచియున్నాను. అది నిజము. నాలుగు లేదా అయిదు సార్లు వేదిక మీద నేను తూలి దాదాపు పడబోయాను. అది సత్యము. అది నిజమని దేవునికి తెలియును.
43ప్రశ్న: ఒక వ్యక్తి తనకు ఆత్మన్యూనతా స్వభావము లేదా ఒక విధమగు స్వభావము ఉన్నదని గ్రహించినప్పుడు దానినెట్లు జయించగలడు? అతడు ఒకే పిల్లవాడయినందున తన ప్రారంభ యవ్వన దశలో ఇందుకు గురియగుట జరుగునా?
సరిగ్గా దానికి వ్యతిరేకమైన దానిని తీసికొనుము. ఎల్లప్పుడూ నీవనుకొన్న విధంగానే జరుగవలెనననుకొనుట ఒక కారణము. ప్రతిది ఎల్లప్పుడూ నీవనుకొనిన విధంగానే జరుగవలెననుకొనుట ఒక అవాంతరము. నీవు పూర్తిగా వెనక్కు తిరిగి ప్రతిదానిని నీవనుకొను విధంగా కాక అందుకు వ్యతిరేకముగా ఆలోచించుము. నీవు స్వార్థపరునివై, అంతా నీకే చెందవలెనని భావించినచో, నీకున్నదానిని ఇచ్చివేయ నారంభించుము, చూచారా. కేవలము నీ మనస్సుకు వ్యతిరేకముగా వెళ్ళుము. దేనినయినా జయించుటకు మందు అదే.
నా ముసలి దక్షిణాది తల్లి ఈలాగు చెప్పుచుండెడిది. "కుక్కకు బొచ్చు కత్తిరించి వేయుము, ఆ వీపు కరచుటకు బాగుండును." అది దీనికి కూడా అన్వయించును.
44ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మా యుక్త వయస్సులో అడుగిడబోవు పిల్లలను ఏ కార్యక్రమములలో పాలుపొందనీయవలెను? (క్షమించండి,) - యుక్త వయస్సులో అడుగిడబోవుచున్న మా పిల్లలను ఏ కార్యకలాపములలో పాలుపొందనీయవలెను? వారి సహచరులను ఎన్నుకొనుటలో మేమెట్లు వారికి సహాయము చేయవలెను?
నీకు సాధ్యమైనంతవరకూ వారిని క్రైస్తవ సహవాసములో ఉంచుము. ఆమె బాలిక అయినచో క్రైస్తవ బాలికలతో ఆమెను ఉంచుము. ఆలాగే బాలురను క్రైస్తవ బాలురతో ఉంచుము. మగవారిని ఎన్నుకొను వయస్సు ఆమెకు వచ్చినయెడల, సరైన విజ్జోడును ఎంచుకొనునట్లు చూడుము. ఆలాగు లేనివారిని గూర్చి ప్రోత్సాహించవద్దు. బాలికయినా, బాలునికయినా అంతే. ఆమె ఒక అవిశ్వాసితో జతచేయుచున్నయెడల, ఆమెను నిరుత్సాహపరచి, విశ్వాసితో వెళ్ళునట్లు ప్రోత్సాహించుము. ఎవరికయినా అదే సూత్రము. నీ గృహమును చక్కగా చేయుము. నీ కుమారుడు లేదా కుమార్తె తన జతవారిని తల్లిదండ్రుల ఎదుటికి తీసికొనివచ్చునప్పుడు అవమానము కలుగకుండా చూడుము. వారి కుటుంబము లేదా గృహము చక్కగా యుండవలెను; కుటుంబములో ఆనందముగా జీవించునట్లు వారిని చేయవలెను, అట్టి నిలయముగా అది ఉండవలెను.
ఓ, ఇక్కడ వరుసగా ఏడున్నవి. కొద్ది నిమిషములకంటె ఎక్కువ తీసికొనను.
45ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, లవొదికయ సంఘకాలము అయిపోయినదని నీవు ఈ మధ్య ఎప్పుడయినా చెప్పితినా?
లేదు, అది ముగిసినదని ఎన్నడూ నేను చెప్పలేదు. ఆలాగు నేను చెప్పెనని నీవన్నచో అది నీవు తప్పుగా అర్థము చేసుకొనుటయినా కావచ్చు, లేదా నేను తప్పు చెప్పి యుండవచ్చు. ఇది చివరి సంఘ కాలము; సంఘ కాలములకు ఇది అంతము, లవొదికయ. ఇది ముగియలేదు; అది ముగిసినప్పుడు సంఘము వెళ్ళిపోవును. కావున ఇక్కడ సంఘము ఉన్నంతకాలము అంతము కాలేదు, చూచారా.
REV 3:15,16•
REV 7:13,14•
REV 20:4-6,11•
REV 21:1
46ప్రశ్న: సంఘకాలము ముగిసి, అంతమైపోయి, వధువు పిలువబడి, ఇప్పుడు మనం శ్రమల కాలములో ప్రవేశించియున్నామా?
లేదు, లేదు, లేదు. ఆ విషయము చెప్పుటకు ఎక్కువ సమయముంటే బాగుండునని తలంచుచున్నాను. చూడండి. చూచారా? వధువు సంఘము నుండి ఎత్తబడినప్పుడు సంఘకాలము ముగియును. లవొదికయ గందరగోళములోనికి వెళ్ళిపోవును; వధువు మహిమలోనికి వెళ్ళును; నిద్రించుచున్న కన్యకకు మూడున్నర సంవత్సరముల పాటు శ్రమకాలమువచ్చును. అప్పుడు ఇశ్రాయేలు తన ప్రవచనమును అనుభవించును. అప్పుడు ఇశ్రాయేలు మీద శ్రమల కాలము నిలచియుండును. అప్పుడు ఆర్మగెద్దోను యుద్ధము వచ్చును. అది సమస్తమునూ నాశనము చేయును. అప్పుడు వధువు, పెండ్లికుమారునితో కూడా తిరిగి వచ్చి వెయ్యేండ్లపాటు పరిపాలన చేయును. ఆ తరువాత ధవళ సింహాసన తీర్పు జరుగును. ఆ తరువాత క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము వచ్చును. పరలోకములోని దేవుని యొద్ద నుండి ఆ పట్టణము క్రిందికి దిగి వచ్చును. నిత్యత్వము మరియు కాలము ఒకటిగా కలిసిపోవును.
47ప్రశ్న: బూరలకు వధువుతో ఏమీ సంబంధము లేదని పరిశుద్ధాత్మ నీతో చెప్పెను. ఏడు పాత్రలు మనతో ఏమయినా సంబంధము కలిగియున్నవా?
ఆ విధముగా పరిశుద్ధాత్మ నాకు బయలుపరచునో లేదో కనిపెట్టి చూచెదను. ఇంకా నాకు తెలియదు.
MAL 4:5•
REV 7:9
48ప్రశ్న: మలాకీ 4లోని ప్రవక్త ప్రకటన 7:9లోని శేషిత జనాంగమును బయటకు పిలుచువాడేనా? వారు శ్రమల కాలము గుండా వెళ్ళినా గాని ఆలాగు జరుగునా?
కాదు, కాదు! ప్రకటన 7లో 144,000 మంది ముద్రించబడుటను అతడు చూచెను. ఆ తరువాత ఆ గొప్ప సంఖ్య వచ్చుటను అతడు చూచెను. అది ఎవరూ లేక్కి౦చజాలని సంఖ్య, అది వధువు. మలాకీ 4 పరిసమాప్తమగును మరియు వధువు ఎత్తబడును, అప్పుడు ఈ గుంపు - అనగా ఏలియా మరియు మోషే తిరిగి భూమి మీదికి వచ్చెదరు. సంఘము శ్రమల కాలము గుండా వెళ్ళును, కాని ఏలియా మరియు ఏలీషాలకు నిద్రించుచున్న కన్యకతో ఏమీ సంబంధము లేదు (వారు అన్యులు); వారు యూదుల కొరకు మాత్రమే పంపబడుదురు.
REV 10:7
49ప్రశ్న: ఏడు మర్మములకు సమానముగా ఉన్న ఏడు ఉరుములు ఇప్పటికే బయలుపరచబడియున్నవా? ఏడు ముద్రలలో అవి బయలుపరచబడినవా, లేక ఉరుములు వలె అవి ఇంకా తెలియపరచబడలేదా?
లేదు, ఏడు ముద్రలలో అవి బయలుపరచబడియున్నవి; వాటినే ఉరుములు చెప్పుచున్నవి. ఏడు ఉరుములు తమ స్వరములను వినిపింపచేసినవి. అవి ఏమిటో ఎవరును చెప్పలేకపోయిరి. అది ఏమిటో యోహానుకు తెలియును, కాని దానిని వ్రాయవద్దని చెప్పెను. అతడు ఇట్లు చెప్పెను, "ఏడవ దూత పలుకు దినములలో ఏడు ఉరుముల యొక్క ఏడు మర్మములు బయలుపరచబడును." ఏడవ దూత అనగా ఏడవ సంఘకాలపు వర్తమానికుడు, చూచారా.
LUKE 17:34-36•
1THS 5:2
50ప్రశ్న: మొదటి వధువువలెనె, సజీవమగు చిన్న వధువుయు ఎక్కడో సమకూడి సామాన్యముగా అన్ని విషయములలో కనబడును. ప్రభువైన యేసు మేఘములలో వచ్చుటకు ముందుకు బహుశా ఈలాగే యుండును అని నీవు నమ్ముచున్నావా?
దానిని నేను నమ్ముచున్నానా అని వారడగుచున్నారు. లేఖనముల ద్వారా దానిని నేను నిరూపించజాలను, కాని బహుశా ఒక కాలము వచ్చును, నాకు తెలియదు. మీరు చూచారా? అది ఆలాగే అయితే ఆయన రాక సమీపముగా యున్నదని గుర్తించవలెను. ఆయన చెప్పెను, "రాత్రియందు దొంగ వచ్చినట్లుగా ఆయన వచ్చును." చూచారా? రోమియో మరియు జూలియట్ పుస్తకం నేను చదివాను. అతడు వచ్చి రాత్రియందు తన వధువును తీసికొనిపోయెను. ఒక్క క్షణములో, కనురెప్పపాటులో ఆమె కొనిపోబడినది, చూచారా?
అది ఆ విధముగా యుండునో లేదో చాలా సందేహమే, ఎందుకనగా బైబిలు ఇట్లు చెప్పెను, "ఇద్దరు మంచము మీద ఉందురు; ఒకరు కొనిపోబడుదురు; మరొకరు విడిచి పెట్టబడుదురు. ఇద్దరు పొలములో ఉందురు, ఒకరు కొనిపోబడుదురు, మరియొకరు విడిచిపెట్టబడుదురు," చూచారా. బహుశా ప్రపంచమంతా ఆలాగుండును. అన్నీ ఒకే రకముగా ఉండుట కొరకు వారు ఒకే చోట కూడియుందురు. కాని చిన్న గుంపులుగా వారు భూమియందంతట చెదరియు౦దురు.
51ప్రభుని అనుమతి ఇస్తే, అదే ఈ చిన్న గుంపు అని నేను నమ్ముచున్నాను. ఆసియాలో మరో చిన్న గుంపు ఉండి యుండవచ్చును. జర్మనీలో ఒకటి ఉండియుండ వచ్చును. మరెక్కడో ఇంకొకటి ఉండి యుండవచ్చును. ఒక రాత్రి నేను వధువు యొక్క దర్శనమును చూచాను. వారు అంతర్జాతీయముగా తయారయిరి, చూచారా. కావున వధువు ఒక్క చోట నుండి రాదు. ప్రపంచమంతటి నుండియూ అది సమకూడును. ఇది అక్షరాలా వాక్యమునకు సరిపోవును. వాక్యమెన్నడునూ తప్పు కాదు. ఈ సమయము వరకు దర్శనం ఎన్నడును తప్పు కాలేదు, ఎందుకనగా అది వాక్యప్రకారము జరుగుచున్నది.
MATT 25:3,10
52ప్రశ్న: ఈ ఘడియలో అసలయిన, నిజమయిన పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినవారు ఎవరయినా గాని వధువు ఎత్తబడినప్పుడు ఎత్తబడక యుందురా? మీరు వివరించెదరా? భాగమును తగ్గించుటకు ఏ విధముగా మీకు మేము సహాయపడగలమో చెప్పుము. అది చాలా మధురముగా యున్నది కదా, చూచారా.
ఇప్పుడు, మీరు చేయవలసినది ఏదియూ లేదు.
అవును, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన అసలయిన విశ్వాసులు వధువులో ఉందురు. వారు ఏర్పరచుకొనబడి బయటకు పిలువబడిరి. నిద్రించుచున్న కన్యకకు నూనె లేదు. నూనెగలవారు లోనికి వెళ్ళిరి, కాని…
53"భారమును తేలికపరచుటకు మేము ఏమి చేయవలెను?" అవును. సోదరీ, సోదరుడా వ్రాసిన వారెవరైనా గాని నా కొరకు ప్రార్ధించండి. మీరు చేయవలసిన ముఖ్యమైన పని అదే. మీకు వందనములు. నాకు డబ్బు అవసరము లేదు. నా అవసరములకు చాలినంత వచ్చుచున్నది. అందును బట్టి ప్రభువుకు వందనములు. నాకు బట్టలు అవసరము లేదు. నేను ధరించు బట్టలు ఎక్కువగా ప్రజలు ఇచ్చినవే. నా స్నేహితులు మరియు ఇతరులు బట్టలు ఇచ్చుచుందురు. నా కుటుంబమును పోషించుటకు కావలసిన డబ్బు వచ్చుచున్నది, అదే కావలెను. నా కొరకు మీరు ప్రార్ధించండి, ఎందుకనగా నాకు నిశ్చయంగా ఆత్మ సంబంధమగు సహాయము కావలెను.
54ప్రశ్న: వాక్యమును బోధించు సేవకులు మధ్య ఇది కనిపించుచున్నది. ప్రార్ధించుటకును, బోధించుటకును, ఉపవాసముండుటకును, లేదా నశించిన ఆత్మల కొరకును, ప్రపంచములో ఇంకా రక్షించబడని అనేకుల కొరకును భారము లేదనిపించుచున్నది. ఈ పరిస్థితి గూర్చి ఏమి చేయవలెనో దయచేసి మాకు చెప్పుము, బ్రెన్హాం సోదరుడా, దీనిని బట్టి నీకు వందనములు, ఇది తప్పక సేవకుడు వ్రాసియుండును. దీని క్రింద ఏ పేరూ లేదు.
సోదరుడా… నేను అలసిపోయి, సొమ్మసిల్లి ఏమీ బాగుగాలేనప్పుడు వాటికి జవాబు ఇయ్యవలసియున్నాను. ఆ ప్రశ్నకు ఇది జవాబిచ్చునని నమ్ముచున్నాను. నీకు చాలా వందనములు. ఏమి జవాబు ఇయ్యవలెనో నేను మరచిపోయాను.
బోధకులము అయిన మనకు, సేవకులకు ఈ భారము ఉండవలెను… నశించుచున్న ఆత్మల పట్ల భారము లేదు. ఉజ్జీవము లేకపోవుటయే లోటు అని నమ్ముచున్నాను. యేసు వచ్చు వరకు నశించుచున్న ఆత్మల కొరకు ఆత్యాసక్తితో మనము దేవునిని ప్రార్ధించుటకు ఇంకా ప్రయత్నించవలెనని నమ్ముచున్నాను.
1COR 12:30
55ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, పరిశుద్ధాత్మను కలిగియున్న ప్రతివారునూ భాషలలో మాట్లాడుదురని నీవు నమ్ముచున్నావా? (కాదు!) భాషలతో మాట్లాడుట పరిశుద్ధాత్మను పొందినట్లుగా రుజువు కాదని నీవు చెప్పుట నాకు తెలియును. I కొరింథి 12:30ని దయచేసి వివరించుము, I కొరింథి 12:30 మీరు తీయుదురా? "అందరూ భాషలతో మాట్లాడుచున్నారా," అను వాక్యమనుకొందును; ఖచ్చితంగా నాకు తెలియదు, వారది తీయుచుండగా నేను మరియొక దానికి జవాబును చెప్పుటకు ప్రయత్ని౦చుదును.
JOB 14:13
56బ్రెన్హాం సోదరుడా, దయచేసి యోబు 14:21ని వివరించుము?
అవును. యోబు 14, "ఒక మనుష్యుడు చనిపోయిన తరువాత మరల బ్రదుకునా?" ఒక మనుష్యుడు చనిపోయిన… యోబు పునరుత్థానము గూర్చి మాట్లాడుచున్నాడు. (ఒక రోజు ఉదయాన దానిని చెప్పానని తలంచుచున్నాను, అవునా? చార్లీ ఇంటి యొద్దనా? శ్రీమతి. కాక్స్ అచ్చటున్నది.) - యోబు, పుష్పములు చనిపోయి మరల ఎట్లు బ్రదుకుచున్నవో అతడు చూచెను, కాని అతడు నేలలోనికి వెళ్ళి మరల రాలేకున్నాడు. మరియు ఏదో పాపము చేసినదని అప్పుడతనికి వివరించబడెను. తనకును దేవునికిని మధ్య ఒక మధ్యవర్తి కావలెనని కోరెను, అప్పుడతడు ప్రభువు వచ్చుటను చూచెను.
1COR 12:31•
1COR 13:1,2
57సోదరుడా, అది ఏమిటి? I కొరింథి 12:30 అవును. అదేననుకొనుచున్నాను.
"అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అదే ననుకొన్నాను గాని ఖచ్చితంగా తెలియదు. ఈలాగు అలసిపోయియున్నాను, కాని… కాదు! అందరూ భాషలతో మాట్లాడరు. అందరూ అర్ధము చెప్పరు. అందరూ దానిని చెప్పరు. ఆ తరువాత అధ్యాయములో చూడండి "మనుష్యులు భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినప్పటికిని ప్రేమలేనివాడనయితే వ్యర్థుడనే." చూచారా? పౌలు, వారితో ఈ విధంగా చెప్పుచున్నాడు, "అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? నిశ్చయంగా మాట్లాడుట లేదు. అందరూ ప్రవచించుచున్నారా? లేదు. కాని ఉత్తమమగు వరములను కలిగియుండుటకు ఆశించుము; అయినా గాని ఇంకా శ్రేష్ఠమైన మార్గమును నేను చూపించుచున్నాను." చూచారా? అందరూ భాషలతో మాట్లాడరు.
ప్రశ్న: మీరు వెళ్ళు ముందుగా మరొక వివేచన ఆరాధన ఏర్పరచెదరా? అది లేనియెడల వ్యక్తిగతముగా (ఇంటర్వ్యూ కొరకు), నిన్ను కలిసికొనుట సాధ్యమేనా?
నీవు కలిసికొన్నావని తలంచుచున్నాను. ఇప్పుడు, మరీ ఎక్కువగా నాకు లేవు. నాకు సాధ్యమైనంతవరకు వరకు వీటిని పూర్తిచేయ ప్రయత్నించుదును.
58ప్రశ్న: ఒక దూత యొక్క విచారకరమగు దుశ్యమును చూచినట్లుగా నీవు చెప్పిన సందర్భము గుర్తున్నది - ఒక వంజరములో పక్షిరాజు తన రెక్కలను కొట్టకొసుచున్నది. స్వేచ్చగా పోవుటకు సతమతమవుచున్నది. ఆ స్థితిలో యున్న ఒక ప్రశస్థ తల్లి నాకున్నది. ఆమె యొక్క ముగ్గురు వివాహిత బిడ్డలను మూడేండ్లనుండి ఆమె చూచుటకు అనుమతింపబడుట లేదు, ఎందుకనగా వారు తమ తండ్రియొక్క బోధకు లోబడుట లేదు. అతడు ఒక శాఖకు చెందిన బోధకుడు, తల్లి అయితే ఈ అంత్యకాల వర్తమానమును వినవలెనని కోరుచున్నది. ఒక ఉత్తరమును కూడా ఆమెకు నేను పంపించలేక పోవుచున్నాను. ఆమె ఎంతవరకు లోబడియుండవలెను? ప్రార్థన కాకుండా నేను చేయగలిగినది మరేదయినా యున్నదా?
నాకు తెలిసినది ఇది ఒక్కటే. ఆమె భర్త బోధకుడు, వాక్యమును విననిచ్చుట లేదు. ఆమె దానిని వినగోరుచున్నది, కాని ఆమెను వినుటకు అనుమతించుట లేదు, కేవలము ఆమె కొరకు ప్రార్ధించుము. ఆమె రక్షించబడినదని నేను నమ్ముచున్నాను.
59ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఒక వ్యక్తి నిజమగు నీతీకరణ మరియు శుద్దీకరణ అనుభవమును పొందియుండియూ వాక్య వెలుగును తిరస్కరించెననుకొందము. అటువంటి వ్యక్తి నశించిపోయి నరకములో పోవుటకు అవకాశమున్నదా?
అవునండీ! అది ఖచ్చితంగా నిజము.
JOHN 3:3
60ప్రశ్న: వాక్యమును మనము విశ్వసించనప్పుడు క్రీస్తునుండి నిత్యముగా మనము వేరగుదుమని నీవు చెప్పుచుందువు. బుద్ధిలేని కన్యక నిత్యమూ జీవించునని నీ భావమా? లేక వధువుతో క్రీస్తు నివాసము చేయు క్రొత్త యెరూషలేమునుండి వారు వేరగుదురనియా? పరిశుద్ధాత్మను పొందనివారు ఇచ్చటున్నారు, కాని లేఖనము చెప్పుచున్న మాదిరిగానే వారు తిరిగి జన్మించిరి. ప్రకృతి సంబంధమగు జన్మకు నీరు, రక్తము మరియు ఆత్మ కావలెను, ఆలాగే ఆత్మ సంబంధమగు జన్మకును ఈ మూడు దశలు అవసరము కాదా? ఒక వ్యక్తి నిజముగా తిరిగి జన్మించు ముందు కృప యొక్క ఈ మూడు దశలు అవసరము కాదా?
తప్పుకుండా! ఈ ఉదయమున దానిని వివరించాను - అదే విషయమును చెప్పాను. అన్ని దశలు నీకు కావలెను. మీరు ఆత్మద్వారా జన్మించియున్నారు. తల్లి గర్భములో నుండి శిశువు జన్మించు మాదిరిగానే, కాని పరిశుద్ధాత్మను పొందువరకు వారు జన్మించరు. అది నిజము. అప్పుడు నీవు జన్మించుదువు, మారుట కాదు. ఆ సమయము వరకు నీవు మార్పుపొందు విధానములో యుందువు.
ఆ కారణము చేతనే ఈ గొప్ప మర్మములన్నియూ లూథర్ కు ఇవ్వబడలేదు, వెస్లీకి ఇవ్వబడలేదు, ఇప్పుడు మనలను దాటియున్న కాలమునకు ఇవ్వబడలేదు, పెంతెకోస్తు యుగము. ఎందువలన? అది సమయము కాదు. వారు జన్మించబడిరి. క్రీస్తు స్వయంగా, వ్యక్తిగా, మనుష్యకుమారునిగా (మీరు గ్రహించారా?) మానవ శరీరములో తన్ను బయలుపరచుకొనియున్నాడు, అది ఇంతవరకు రాలేకపోయెను.
61ప్రశ్న: వెయ్యేండ్లపాలన ప్రారంభమగునప్పుడు భూమిమీదనుండి అవిశ్వాసులెట్లు తీసివేయబడుదురు?
నిద్రించుచున్న కన్యకతో పాటు అవిశ్వాసులు శ్రమల కాలములోనికి కొనిపోబడుదురు, మరియు ఇతరులందరూ (అవిశ్వాసులు, మరియు నిద్రించుచున్న కన్యక), మరియు ఇశ్రాయేలులోని శేషిత జనులు బయటకు తీసికొనిపోబడుదురు.
62ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఎవరో నా కాలు త్రోక్కిరి (ఇది మంచిది కావచ్చును) పాత సామెత ప్రకారముగా ఎవరయినా నా వ్రేలు తొక్కితే నాకు కోపమువచ్చును. దీనిని నేనెట్లు జయించగలను? ప్రభువే దానిని చేయవలసి యున్నాడని నేనెరుగుదును, కాని నా హృదయములో ఏమి చేయవలెను? ఇది నాకిష్టముగా లేదు.
నీ కోపమును ప్రార్థనతో మాధుర్యము చేసికొనుము. అందుకు నీ మనస్సును స్థిరపరచుకొనుము. అసలు చెప్పాలంటే నాకంటె ఎక్కువ కోపముగలవారు ఈ భవనములో ఎవరూ లేరని తలంచుచున్నాను. నేను ప్రతిసారి నోరు మూసుకోవలసి వచ్చుచుండును. నేను చాలాసార్లు గడ్డినే భోజనము చేసియున్నాను.
63నా తల్లి సగం ఇండియను అని మీరెరుగుదురు. మరియు నా తండ్రి ఐరిష్ వాడు. కెంటాకీ ఐరిష్ వాడు. వారిద్దరికీ చాలినంత కోపమున్నది. పోట్లాటకు ముందుండేవారు. ప్రతిసారి నేను నోరు పారవేసికోవలసి వచ్చేది. నేను మొదటినుండి చిన్న మనిషినే. వారు నన్ను ఎత్తి క్రిందపడేసేవారు — ఇక నేను పైకి లేవలేకపోయేవాడిని; అది ఎప్పుడూ జరిగేది. నేను శాయశక్తులా ప్రయత్నించి లేచేవాడిని. వారు నన్ను మరల క్రిందపడేసేవారు. ఆ విధంగా నాకు జరిగేది.
"నేను ఎన్నడూ క్రైస్తవునిగా ఉండలేను," అనుకొన్నాను. కాని నా జీవితములోనికి పరిశుద్ధాత్మ వచ్చి పనిచేసెను, అది సరి చేసినది. ఇక ఎన్నడూ…
ఒకసారి ఒకామె ఉండెను. నేను దీపములు అర్పివేయుటకు వెళ్ళాను. ఆ రోజు నా తల మీద విగ్గులాంటిది ఉన్నది."ఒరే, జుట్టులేనివాడా" అని తిట్టినది.
ఆమెతో నేనిట్లు పలికాను, "అమ్మా, నీవాలాగు తిట్టరాదు. నీవు దేవునికి భయపడవా?"
"ఒరే జుట్టులేనివాడా, నీవు నాకు నీతులు చెప్పెదవా? నీ వంటి వెర్రి వాడు నాకు కనబడలేదు," అన్నది.
"హూ!" ఆ తరువాత ఆమె నన్ను అసహ్యమగు పదములతో పిలచినది. ఒక సంవత్సరం ముందు అది జరిగితే ఏమి చేసేవాడినో నేనెప్పుడూ ఇట్లనేవాడిని, "ఆడదానిని కొట్టే మగవాడు, మగవానిని కొట్టుటకు సరిపోడు." నా తల్లిని ఆలాగు సంబోధించి తిట్టినందుకు ఆమెను నేను ముక్కలు చేసియుండేవాడిని. కాని మీరెరుగుదురా? నాకు కనీసం రోషమే రాలేదు. "నీ కొరకు నేను ప్రార్ధి౦చెదను," అని చెప్పాను. బాధ కలుగ లేదు. నాలో ఏదో జరిగినదని అప్పుడే అర్ధమయినది. అవును! ఓ, మై!
బాలునిగా ఉన్నప్పుడు ఎన్ని పోట్లాటలు తెచ్చానో మీకు తెలియదు. ఒకేసారి దాదాపుగా అయిదుగురిని చంపాను. పదహారు గుండుగల తుపాకీని నింపి సిద్ధమయ్యాను. నేను కెంటాకీవాడినని వారు నన్ను కొట్టిరి. మరే కారణము లేదు. నా తలను పైకి ఎత్తుకోలేకపోయాను. ఒకడు నా చేతులు ఈలాగు పట్టుకొనెను. మరొకడు తన చేతిలో రాయి పట్టుకొని నా ముఖం మీద కొట్టెను, నేను చచ్చినట్లు అయిపోయాను. లోకంలో మరేదీ…
64వారు నన్ను "కెంటాకీ కుంక" అని పిలిచారు, ఎందుకనగా నా తల్లి యవ్వనంలో ఉండినప్పుడు తప్పకుండా ఇండియనువలె కనిపించియుండును. (కొద్దిసేపటి క్రితం ఆమె చిత్రం నేను చూచాను), ఆమె సగం ఇండియను అని వారెరుగుదురు. నేను కెంటాకీ వాడిని, ఆమె ఇండియన్ గనుక వారు నన్ను "కెంటాకీ కుంక" అని పిలిచారు. అందుకు నేనేమీ లోకములో చేయలేదు. నేను కెంటాకీలో పుట్టాను. అందుకు నా తప్పు ఏమీ లేదు.
అక్కడి బడికి నేను వెళ్ళాను, మరియు నాకు వేసికోవటానికి బట్టలు లేవు, మరియు నా జుట్టు మెడ మీద పడుచుండేది. నా తండ్రి పెండ్లిచేసికొన్నప్పటి పాత కోటును అమ్మ ముక్కలు చేసి నాకు పాంటు కుట్టినది. దానిని నేను మొదటిసారి బడికి తొడుక్కొని వెళ్ళాను. ఆమె నాకు తెల్లని మేజోళ్ళు తొడిగినది. టెన్నిస్ బూట్లు వేసినది. నన్ను వారు "గాలి కెంటాకీ వాడు" అని పిలిచారు. నా బడి దినములన్నియూ అవే తొడిగాను.
65ఒక బాలిక యొక్క పుస్తకాలు పట్టుకొని ఆమెతో కలిసి నేను వెళ్ళేవాడిని. నేను రోడ్డు మీద వెళ్ళుచుండగా కొందరు కుర్రాళ్ళు చూచారు… ఆలాగు నన్ను చేయనియ్యమన్నారు, వారు అక్కడే నన్ను పట్టుకొని కొట్టిరి. నాకు స్పృహ తప్పినది. నన్ను విడిచి పెట్టినచో నేను తిన్నగా ఇంటికి పోదునని వారితో అన్నాను. వారు నన్ను నాలుగు లేక అయిదు సార్లు తన్నిరి, క్రింద పడవేసిరి, నా ముఖమంతా రక్కిరి. ఆలాగు నేను ఆ పొలాలను దాటుకొంటూ ఇంటికి వెళ్ళాను.
మా తలుపుపై .22 వించెస్టర్ రైఫిల్ తగిలించి ఉండెను. దానిని అందుకున్నాను. గుండు నిండుగా ఉన్నవి. ఆ పొదల మాటుగా వెళ్ళి ఈ అయిదుగురు లేదా ఆరుగురు కుర్రాళ్ళు వచ్చు వరకు రోడ్డు ప్రక్కన పొంచియున్నాను. వారు వచ్చే వరకూ చూచాను. వారు ఈ విధంగా మాట్లాడుకొంటూ వచ్చుచుండిరి, "ఆ కెంటాకీ వాడికి ఇప్పుడు మన సంగతి తెలిసియుండును," ఆలాగనుకొంటూ పోవుచుండిరి.
66నేను గుట్ట పైకి ఎక్కి రైఫిల్ తీశాను. "ఇతరుల చావు చూడకుండా మీలో ఎవరు ముందు చావగోరుచున్నారు?" అనడిగాను. వారు కేకలు వేయసాగిరి. "అరవవద్దు, మీరందరూ ఒకరి తర్వాత ఒకరు చచ్చెదరు," అన్నాను. నేను ఊరకే ఆ మాట అనలేదు. వారు కేకలు వేయనారంభించిరి. నేను రైఫిల్ ఎక్కుపెట్టాను. తుపాకీ పేల్చాను. అది పేలలేదు. మరో గుండు వేసి పేల్చాను. అది పేలలేదు; ఆలాగు పదహారు గుండు వేసి పేల్చాను గాని అన్నియూ పేలలేదు. అవన్నియూ నేలమీద పడినవి. ఆ కుర్రాళ్ళు కేకలు వేస్తూ పరుగిడిపోయిరి. కొండమీద దొర్లుకొంటూ పారిపోయిరి.
వారు వెళ్ళిపోయిన తరువాత అక్కడే నేను నిలబడి చూచాను. నాకు మహా కోపం వచ్చెను. నేను అరవలేకపోయాను. నేను పిచ్చి కోపంతో నవ్వాను. నా కళ్ళనుండి నీరు వచ్చెను. అది కోపము. దేవుడు నన్ను తప్పించియుండనియెడల ఒక హంతకునిగా మిగిలి యుండేవాడిని.
ఆ గుండు మరల ఏరి రైఫిల్లో వేశాను. పేల్చి చూచాను, "పాపా" అని చక్కగా పేలినవి. కృప అంటే అదే!
REV 20:5
67ప్రశ్న: వెయ్యేండ్ల పాలన కాలములో బుద్ధిలేని కన్యకలు ఎచ్చటుందురు?
వెయ్యేండ్ల పాలనలో వారు సమాధిలో యుందురు. "చావగా మిగిలిన వారు వెయ్యేండ్లపాటు జీవించరు."
68ప్రశ్న: ఇశ్రాయేలీయులను మోషే పోగుచేసి నడిపించినట్లుగా ఇప్పుడు వధువు సమకూర్చబడు స్థలము ఏదయినాయున్నదా? కలిసి జీవించు చోటున్నదా?
నీ కొరకు ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చెదను; ఇప్పుడే నాకది బయలుపరచబడినది. మీకు సత్యమును చెప్పబోవుచున్నాను. అవునండీ! వధువు మొత్తం పోగవుటకు ఒక స్థలమున్నది. అదెక్కడో మీరు తెలిసికొనగోరుచున్నారా? క్రీస్తునందు. నిజము. అక్కడే పోగవును; మనమందరము పోగవుదము.
1COR 11:14
69ప్రశ్న: స్త్రీల బట్టల గురించి మరీ పెద్దగా ఎందుకు మనం చెప్పుచున్నాము? (నేను దీనిని చెప్పాను కదా? లేదా?) - స్త్రీల దుస్తుల గురించి, జుట్టు కత్తిరించుట గురించి మరీ పెద్దగా చేసి మనం చెప్పుచున్నాము - కాని మగవారి జట్టు గురించి గాని, వారి దుస్తుల అలంకరణ గురించి గాని ఏమీ చెప్పుట లేదు?
సోదరీ! ఒక విషయములో నీతో నేను సమ్మతించుచున్నాను. మొదటగా, మగవాడు వెంట్రుకలు పెంచుకొనరాదని బైబిలు చెప్పుచున్నది. అట్టి వారున్నచో నీకు చెప్పినట్లుగానే వారికిని చెప్పెదను. అది తప్పు. కాని చాలామంది నావలెనెయున్నారు. జుట్టు పెంచుకోలేదు. వారు చాలా వరకు జుట్టు కత్తిరించుకొని మగవారివలె కనబడుచున్నారు. వారాలాగు చేయనియెడల వారితో చెప్పెదము. స్త్రీలవలె జుట్టు పెంచుకోరాదని చెప్పెదను. దీనంతటిని గూర్చి మీరు వివాహము మరియు పరిత్యాగము గూర్చి బోధించినప్పుడు కనుగొందురు. ప్రమాణములు ఇతర విషయములు గూర్చి విందురు. స్త్రీల దుస్తుల గూర్చి మరీ ఎక్కువగా చెప్పుచున్నామనిరి.
70మొదటగా చెప్పవలెనన్నచో, మగవారి శరీరము స్త్రీ శరీరము వలె శోధనకు తావు ఇయ్యదు. మగవానిని చూడండి. పెద్దగా, ముసలిగా, కాళ్ళ నిండా వెండ్రుకులతో, సడలిన మొకాళ్ళతో, కుండ వంటి పొట్టతో చూచుటకు భయంకరముగా యుండును. అతనిని చూచి శోధనకు గురి అయ్యేది లేదు. ఈ మగవారు రోడ్డు మీద వస్తూ ఉంటే, వారు ముసలి వారైనా, పడుచువారైనా సరే, "వికృతంగా" కనిపించుదురు. మీరు బట్టలు ధరించి రోడ్డు మీద నడిచి వచ్చుచుందురు. నాకు అంతకన్న అసహ్యమైన దృశ్యము మరొకటి లేదు. అనగా మగవారు బికినీలు ధరించి కనబడుట. ఇది నిజము. ఏ జాతికి చెందినవాడో అర్థం కాదు. (చూచారా? ఇది నిజము!), మగవాడు ఆలాగు ప్రవర్తించుట అసహ్యము.
71మీరెరుగుదురా? అమెరికను సైన్యము ఆ విధమగు దుస్తులు ధరించునని కొద్ది నెలల క్రితమే నేను విన్నాను. అవును! వచ్చే సంవత్సరం, లేదా ఆ పై వచ్చే సంవత్సరం ఆ పొట్టి బట్టలతో మనము సైన్యమును చూచెదము. ఎటువంటి ఆడంగివారు బయలుదేరుచున్నారో చూడండి?
దేవుడు మగవానిని మగవానిగా కనబడునట్లుగాను, మగవానిగా నడుచునట్లుగాను, మగవాని బట్టలు ధరించునట్లుగాను సృజించెను. స్త్రీని కూడా ఆ విధంగానే ఆయన చేసెను. ఆమె స్త్రీవలె దుస్తులు ధరించవలెను, స్త్రీవలె ప్రవర్తించవలెను, స్త్రీవలె ఉండవలెను. ఈ ఉదయమున మగవారి గూర్చిన ప్రశ్న వచ్చియున్నది. [టేపు ఒక వైపు అసంపూర్తిగా ముగియబడి మరియు రెండవ వైపు అసంపూర్తిగా మొదలయినది.]
72బహు పలుచని జట్టును కలిగియున్న స్త్రీ ఆ "రాట్స్" అను దానిని లేదా మీరేదో అందురు గదా దానిని ధరించగోరినచో సరే … నా భార్య దానిని ధరించును. తన జుట్టు పలుచని అని ఆమె అన్నది. ఆమె ఒక పెద్ద గుండ్రముగా ఉన్నదానిని పెట్టుకొనును. పెద్ద బిస్కటు వలె కనిపించును. ఆమె తన జుట్టును చుట్టుకొని పిన్ను పెట్టుకొనును. నా ఉద్దేశ్యము ప్రకారము నీవు పొడవైన జుట్టు పెంచుకొన్నంత కాలము ఏదీ ఆటంకము కాదు.
తన భార్య జుట్టుకు ఒక పిన్ను వంటిది పెట్టుకొన్నందున కొందరు "ఏదో అనిరని ఒక సేవకుడు చెప్పెను. ప్రశ్నలను బట్టి అదేమిటో నేను గ్రహించాను. అది జుట్టుకు ఒక రకమగు రంగు లేదా పూత. అది తప్పు అనను; దానిగూర్చి నాకేమీ విరోధము లేదు. ఆమెకు పొడవైన జుట్టున్నచో చాలును, దాని గురించి అదే నేను చెప్పగలను.
73తమ జట్టు తీసివేయుట గూర్చి మరల దానిని ధరించుట గూర్చి ఒకాయన ఈ ఉదయము ప్రశ్నించెను. అటువంటిదే ఇది కూడా, ఒక రకమగు కత్తిరింపు, చూచారా.
ఒకరికి జుట్టు లేకపోవచ్చును, మరియు అతని భార్య లేదా ఆడవారు ఇట్లనుకొనుట నేను విందును, "జాన్ ను నేను పొందితే… జుట్టులేని చోట విగ్గువంటిది ధరించి యుండినచో బాగుండును. బ్రెన్హాం సోదరుడా, దానిని గూర్చి నీవేమనుకొనుచున్నావు? దానిని ధరించుట పొరపాటా?" కాదండీ! నిశ్చయంగా కాదు, అది తప్పు కానే కాదు, దానిని అతడు ధరించగోరినచో మంచిదే. కట్టుడు పళ్ళు పెట్టుకొనుటతో అది సమానమే గాని ఇంకేమీ కాదు.
74నాకు మూడు కట్టుడు పళ్ళున్నవి. అవి లేకుండా ఉంటే బాగుండునని నా కోరిక. వాటిని వైరుతో కట్టిరి. అది నా స్వరమును ఎల్లప్పుడూ అడ్డిగించుచున్నది. నా నాలుకను కోయుచున్నది, కాని తినుటకు అవి నాకు కావలసియున్నవి. నేను విదేశములకు వెళ్ళి బహిరంగ కూటములను ఏర్పరచునప్పుడు ఈ జుట్టును పెట్టుకొందును. దానిని చూడవలెనని కాదు. నాకు బట్టతల గనుక, నేను బయటకు వెళ్ళి బోధించునప్పుడు దానిని పెట్టుకొందును. నాకు తేడా ఏమీ కనబడదు. ఇక్కడ నేను యేసుక్రీస్తుకు ప్రతినిధిగా యున్నాను. ఒకసారి నేను ఆ బయట బోధించుటకు నిలబడియున్నప్పుడు, ఉష్ణమండలపు తుఫాను వచ్చినది. ఆ మరుసటి రాత్రి నా గొంతు పచ్చిపుండువలె తయారయినది. ఇక నేను బయట నిలబడలేకపోయాను.
DEUT 22:5
75అప్పుడు నేను దానిని ధరించకొనగోరాను. ఆలాగు చేయవలెననిపించినది. దానిని నేను ధరించుదును. అవును! ఆలాగు ధరించరాదని చెప్పు ఏ వాక్యము మనకు లేదు. సోదరీ, నీవు పిన్నును గాని, సవరమును గాని లేదా అటువంటి మరి ఏదయినా గాని వాడరాదని చెప్పునది ఏదీ లేదు. అందులో ఏమీ పొరపాటు లేదు, కాని మీ జట్టును పొడవుగా ఎదుగనీయుడి. మగవారలారా, మీ జట్టును కత్తిరించుకొనండి. మీరు దానిని ఎంతవరకు ఉండనీయవలెనో అంతవరకూ ఉంచి మిగతాది కత్తిరించుకొనండి. చూచారా? అంతటితో ఆ సమస్య ముగియును.
స్త్రీలారా, మీరు స్త్రీలవలె దుస్తులు ధరించుకొనుడి. మగవారలారా, మీరు మగవారివలె ఉండుడి ఆడంగివారివలె ఉండుటకు ప్రయత్నించవద్దు. స్త్రీ దుస్తులు ధరించవద్దు. స్త్రీలారా, మీరు మగవారి దుస్తులు ధరించుకొని స్త్రీగా ఉన్నామని తలంచవద్దు, ఎందుకనగా దేవుడు ఆ విధంగా నిన్ను ఉంచగోరుట లేదు; బైబిలు దానిని ఖండించుచున్నది.
కాని బట్టతలకు చిన్న వెంట్రుకలు కుచ్చును లేదా అట్టిది మరేదో ధరించుట సరియే. ఆ "రాట్స్" సంగతి ఏమిటి? కొద్దిసేపటి క్రితం నేను తప్పు చేసితినా? దానిని "ఎలుక" అందురు గదా? దానిని స్త్రీలు జట్టుకు ప్రత్యామ్నాయంగా వాడుచుందురు. ఆ విషయములో తప్పు లేదు, చూచారా, ధరించండి. అది పరవాలేదు.
76ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, దాదాపు ఎనిమిది వందల మైళ్ళ దూరం ను౦డి ఒక సోదరి ఈ ఆలయమునకు వచ్చినది. నీవు యేసుక్రీస్తు యొక్క అవతారమని ఆమె నమ్ముచున్నట్లుగా చెప్పినది. దయచేసి నాకు దీనిని గూర్చి చెప్పుము. ఆమె తాను తలంచుచున్న దానిని గూర్చి ఇతరులకు చెప్పుటకు ఓపిక లేకుండా యున్నది. మంచిది.
ఇప్పుడు, ఆ సోదరి చెప్పుచున్నది తప్పు. నేను యేసుక్రీస్తును కాను; నేను ఆయన దాసుడను. దానిని గూర్చి చాలాసార్లు చెప్పాను. కాని…
ఓ, చాలా సమయము అయిపోయినది; నా కొరకు ప్రార్ధించండి, ఇంకొద్దిగా చెప్పెదను.
77ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, (నేను వీలయినంతగా త్వరగా చెప్పెదను - ఆ మిగిలిన వాటిని కూడా వినండి). బ్రెన్హాం సోదరుడా, దేవుడు నాకు శారాకు ఇచ్చినటువంటి వాగ్దానమును ఇచ్చెనని భావించుచున్నాను. అక్కడ ఒక ప్రశ్న యున్నది, కాని ఆ తరువాత వాగ్దానము వచ్చినది. దేవుని యొక్క వాగ్దానమేనా? శారా యొక్క వాగ్దానము నాకు తెలియును, కాని సమయము చాలా కొద్దిగా యున్నదని భావించుచున్నాను. నీ సేవను మరియు నిన్ను పిలిచిన ఆయనను మేము ప్రేమించుచున్నాము. (అది మధురము, కాదా?) - నీ సేవను, దానిని చేయుటకు పిలచిన ఆయనను ప్రేమించుచున్నాము. కాబట్టి నిన్ను మేము ప్రేమించుచున్నాము. ఓ వారు తమ పేరు వ్రాసిరి, సోదరీ, సోదరుడా, మీకు వందనములు, ఒక ప్రశ్న, అవును. మంచిది.
దేవుడు నీకు వాగ్ధానమును ఇచ్చెనని తలంచుచున్నాను, మరియు అది శారావలె జరిగినది. నిశ్చయంగా, అది మారని దేవుని మాట. ఆయన ఆ విధంగానే జవాబు ఇచ్చెను. అది దేవునికి చెందినదే గాని మరి దేనినీ నీవు నమ్మవద్దు.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, బైబిలుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగగోరుచున్నాను. దయచేసి మార్కు సువార్తను వివరించుము…
దానిని నేను చూచాను; దానిని నేను చదివాను, పరిశుద్ధ మార్కు సువార్త 16. ఒక రోజున దానిని మనం చదివాము, నాకు గుర్తున్నది. మనం చూద్దాం.
GEN 4:1•
MATT 22:11,12
78ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, మత్తయి సువార్త 22ను (అది మనం చూచాం, చూచారా. ఆ రోజున మనకు గుర్తున్నదా? దానిని నేను మీకు చూపించాను. దానిని ఇక్కడ మీరు చూచారా?) 22… అందరూ దుస్తులు ధరించి పెండ్లి విందుకు వచ్చిరి, కాని ఒక్కడు మాత్రము పెండ్లి వస్త్రము లేకుండా ఎట్లు వచ్చెను?
గుర్తుంచుకొనండి, చిన్న సరసోక్తి నేను విసిరాను; ఇట్లు చెప్పాను, "శాఖకు సంబంధించిన సోదరుడు - అతడు తలుపు ద్వారా కాదు గాని కిటికీ గుండా వచ్చెను." వాక్యమే తలుపు.
ప్రశ్న: కయీసు సర్ప సంతానమని నీవు చెప్పియున్నావు. అవ్వ ఎందుకు ఈలాగు చెప్పెను, "యెహోవా యొద్దనుండి నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను."
ఈ ఉదయమున దానిని నేను కనుగొనుటకు ప్రయత్నించుచున్నాను. అందుకొరకు నేను లేఖనములు ఇక్కడ వ్రాసియుంచాను. నేను కొద్దిగా వేచియుందునని తలంచుచున్నాను; ఇక్కడ కొన్ని కనుగొన్నాను.
ప్రశ్న: సహోదరుడు బ్రెన్హాం, నా భర్త కాథలిక్కులో పెంచబడెను. మీ ఆరాధనలో అతడు తన విధానములో ప్రార్ధించుచున్నాడు.
దానిని చూచారా. గుర్తు౦దా?
ఓ, ఇప్పుడు నేను వాటియొద్దకు వచ్చుచున్నాను. అది నాకు అందినది.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, చివరకు… నా సోదరి విషయములో ఆసక్తి కలిగినది. దానిని నేను చూచాను. ఒక సోదరికి కాథలిక్కు సహోదరి యున్నది.
బ్రెన్హాం సోదరుడా, II తిమోతీ 4లో ఇవ్వబడిన కానుక…
దానిని నేను చూచాను. ఎందరికి అది గుర్తున్నది?
ఇక్కడ అవి కొన్ని కలగలుపు అయిపోయినవి, చూచారా.
MATT 24:28
79ప్రశ్న: … ఏ విధమగు దానిని వాడుట చట్ట సమ్మతమా?
అది కుటుంబ నియంత్రణ. దానిగూర్చి వ్యక్తిగతంగా మాట్లాడుదునని ఈ ఉదయము చెప్పాను, చూచారా.
ప్రశ్న: మొదటి, అయిదుగురు బుద్ధిలేని కన్యకలు రక్షించబడిన సమయము.
దానిని చూచాను. నేను ఇక్కడ వేచియున్నాను. ఒక్క నిమిషము, నా విషయములో సహనము వహించండి.
ప్రశ్న: మారుమనస్సు మరియు శుద్దీకరణ మార్గమును ఎరిగిన తరువాత దానినుండి తొలగిపోయినప్పుడు. (మీకు గుర్తున్నదా? దానిని చూచాను.)
దానిని కూడా నేను చూచాను. కొద్దిగా దానిని చూపించాను. వాటిని నేను చూచెదను…
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మత్తయి 24:28 యొక్క అర్ధము ఏమిటి? "పీనుగు ఎక్కడుండునో అక్కడ గ్రద్దలు పోగవును."
దానిని నేను వివరించిన సంగతి మీకు గుర్తున్నదా? చూచారా? దానిని నేను చూచాను. వాటన్నింటినీ నేను చూచాను. ప్రభువుకు స్తోత్రము!
ప్రశ్న: వధువు ఎత్తబడుట కొరకు నీతో ఉండవలసిన సమయము వచ్చినదా? (దానిని చూచాము.)
దానిని చూచామని నాకు తెలియును, ఎందుకనగా అడుగ భాగాన వ్రాసియుంచాను. దానిని నేను గుర్తించుకొనియున్నాను. సరే! ప్రభువుకు స్తోత్రము! ఇప్పుడు మనము ఇంకా కొన్ని చూద్దాం. రండి.
JAS 4:17
80ప్రశ్న: అపోస్తలుల కార్యములు 2:38 ఒక్కటే బాప్తిస్మమునకు విధానము. అయితే జనుల మాట ఏమిటి…? దానిని చూచాము.
వారి దినములలో అది వారికి తెలియదు; ఇప్పుడే అది బయలుపరచబడినది. ఏమి చేయవలెనో ఎరిగియుండిరి, "మేలు చేయనెరిగియుండియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును."
81బ్రెన్హాం సోదరుడా, పొగాకును పెంచుట, దానికొరకు పనిచేయుట తప్పా? దానిని చెప్పానని తలంచుట లేదు.
నేను పొగాకుకు వ్యతిరేకిని. పొగాకును వాడుటకు నేను విరోధిని; తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడును అందుకు వ్యతిరేకియే; ఎందుకనగా అది తప్పు. పొగాకు వలన ఊపిరితిత్తుల కాన్సరు - గొంతు కాన్సరు మొదలగునవన్నియూ వచ్చుచున్నవని వైద్యశాస్త్రము చెప్పుచున్న సంగతి మనమెరుగుదుము. "ఫిల్టరు సిగరెట్టు త్రాగండి," అని వారనుచున్నారు.
ఇప్పుడు, పొగత్రాగుచున్న స్త్రీ మరియు పురుషులకు చెప్పుచున్నాను, అది మిమ్ములను మోసము చేయుచున్నది. మీరు వడపోత సిగరెట్లు కొనుచున్నారు, అప్పుడు మీరు మరి ఎక్కువగా వాటిని కొనవలెను, ఎందుకనగా దానిలో తక్కువ శాతం పొగ యుండును. దీనిని ఎవరయినా మీకు చెప్పగలరు…
82గత సంవత్సరం ప్రపంచ సంత వాషింగ్టన్లో జరిగినప్పుడు వారిచ్చిన సందేశం విన్నాను (నేను ఆ ప్రపంచ సంతకు వెళ్ళాను), ప్రపంచమంతటి నుండి వచ్చిన వైద్యులు దానిని వివరించిరి. తారు లేకుండా పొగరాదని వారు చెప్పిరి. పొగ వచ్చినదంటే తారు వచ్చినట్లే. వారిట్లనిరి, "ఫిల్టర్ గల సిగరెట్టు అమ్ముట కేవలము మిమ్మును మోసము చేయుటయే. పొగ త్రాగవలెనని మీలో కలుగు వాంఛను తృప్తిపరచునది ఏదయినా గాని హానియే. మీరు ఒకదానికి బదులుగా రెండు లేదా మూడు కాల్చుచున్నారు." రేడియో మరియు టెలివిజనులలో ఒక ప్రచారము జరుగుచున్నది. అది కేవలం ఒక బహిరంగ ఎత్తుగడ.
83పొగాకుతో పనిచేయుట లేదా పొగాకును పెంచుట గూర్చి అడిగిరి. కెంటాకీ సోదరులు ఈ పొగాకును పెంచుచుందురు. ఒక విషయము చెప్చెదను: ఆలాగు చేయుట మీ మనస్సుకు తప్పు అని తోచినయెడల చేయకండి - ఎందుకనగా ఎవరినీ నేను బలపరచుట లేదా కించపరచుట కాదు. ఒకరి చావు కొరకు నేను పనిచేయుట తప్పు అని నాకు తెలియును. పొరుగువానికి నిషాగా ఉండు మద్యము ఇచ్చుట తప్పు. ఆలాగే దానిని తయారుచేయుటయు తప్పు అగును. ఇప్పుడు మరో సంగతి చెప్పెదను. దానిని పెంచుట…
పొగాకు గూర్చి మీకు తెలియును. నికోటయిన్ అని వైద్య పదజాలములో అందురు. విస్కీని తయారుచేయు పంట మీరు పండించుచున్నారని మీరెరుగుదురా? గోధుమ మరియు బార్లీలతో విస్కీని తయారుచేయుదురు. అది నిజమేనా? సరే, చూచారా. దానిని ఎందుకొరకు వాడెదరో మీకు తెలియదు.
84కాని ఇప్పుడు, మనం పంటను పండించునప్పుడు మనకు పొలాలు, తిండి గింజలు, రొట్టె మొదలగునవి మాత్రమే మనస్సులో కనబడును; కాని వారు దానిద్వారా మత్తు కలిగించు మద్యమును కూడా తయారుచేయుచున్నారు. (చూచారా?), కావున ఏమి చేయవలెనో మీకు తెలియదు.
మీరు పండించెదరు - మీకు పూలతోట యున్నది. వారు లిల్లీ పూలతో ఏమి చేయుదురో మీరెరుగుదురా? దానిలోనుండి నల్లమందును తయారుచేయుదురు. మరో రకమగు తిండి గింజలతో కూడా వారు దానినే తయారుచేయుదురు. నల్లమందు ఆ తిండి గింజలలో కూడా యున్నది. మీరు ఆ రకమగు గింజలు కొన్ని తిని చూసి మరియు కొంత సేపుపాటు మీరెంతో నెమ్మదిగా యుందురు. చూడండి? అందులో నల్లమందున్నది. ఉల్లిపాయలలో కూడా అది ఉన్నదని మీరెరుగుదురా? నిశ్చయంగా, కావున మీరు చూడండి. దానిని ఎందుకొరకు చేయుచున్నావో దానిమీద అది ఆధారపడియున్నది.
ఒక క్రైస్తవ సోదరునిగా క్రైస్తవ సోదరులగు మీతో ఇది చెప్పుచున్నాను: మీకు పొగాకు పండించు పొలమున్నదే దానిని ఎవరికయినా అమ్మి, పంట పొలమును కొనుక్కొనండి. అది మంచిదని నేను నమ్ముచున్నాను, చూచారా, ఎందుకనగా వారెందుకు పెంచుచున్నారో నిస్సందేహంగా మనకు తెలియును.
ప్రశ్న: నా భర్త ఒక త్రాగుబోతును, వ్యభిచారిని పెండ్లిచేసికొనియున్నాడు…
అది చూచాను. అదెక్కడినుండి వచ్చినదో మీతో చెప్పాను. ఇక్కడకి చాలా దూరంగా ఉన్నచోటునుండి వచ్చినది. ఆ ప్రశ్న నన్ను అడిగిరి. మరియు ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న: ప్రకటన 12 లోని స్త్రీ…?
దానిని నేను చూచాను. అవును, ఈ ప్రశ్నలన్నీ చూచాను. ఇంకా చూద్దాం. వాటిని చూచాను. ప్రకటన 12, ఆమె ఎవరో చూద్దాం.
85ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, మాకు ఇద్దరు పిల్లలున్నారు. వారు ఒక స్త్రీ నడుపుచున్న సంఘమునకు వెళ్ళుచున్నారు. ఆ స్త్రీ వాక్యమునుండి తొలగిపోయినదని మాకు తెలియును. మా పిల్లలు ఈమె యొక్క గొప్ప ప్రభావము క్రింద ఉన్నారు. ఈ తప్పును గురించి వారికి చెప్పుట ఎట్లు?
మీకు ముందే చెప్పాను. దానికి జవాబు ఇచ్చాను. ఆ పరిస్థితిని నెమ్మదిగా సరిదిద్దండి. ఆ వ్యక్తి ఇచ్చట కూర్చొనియున్నదని నేనెరుగుదును. ఆ స్త్రీ ఎవరో నేనెరుగుదుననియు, ఆమెగూర్చి నాకు తెలియుననియు నేను చెప్పినచో మీరు ఏమందురు?
REV 20:4
86ప్రశ్న: వెయ్యేండ్లపాలన అనగా ఒక వెయ్యి సంవత్సరములా లేక ఒక కాలపరిమితియా?
ఈ ఉదయమున దానిని నేను చూచాను. అవునా? అది వెయ్యి సంవత్సరములు. సరే.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఒక సమస్య…?
అవును, దానిని చూచాను. గోధుమలు మరియు గురుగులను, మీరు గుర్తించుకొనండి. దానిని చూచాము.
మనం ఇప్పుడు క్రిందికి వచ్చుచున్నామని ఎరుగుదుము. చాలా వరకు వెనక్కు తీసివేయుట మంచిది. ఆ తరువాత చూద్దాం. ఒకే విషయము.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఆరుగురు చక్కని పిల్లలకు నేను తల్లిని. ఆర్థికముగా సహాయపడుట కొరకు నా భర్త నన్ను కొద్దికాలము పనిచేయమని కోరియన్నాడు. నేను చేయవచ్చునా? ఆలాగే అబ్రాహాము, దానియేలు మరియు హెబ్రీయులకున్న విశ్వాసము వంటి విశ్వాసమును దేవుడు నాకనుగ్రహించవలెనని ప్రార్ధి౦చుము. ఒక క్రైస్తవుడు పొగాకు పండించవచ్చునా?
దానిని ఇప్పుడే చూచాము…
87ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, స్త్రీ తన కాళ్ళ వెంట్రుకలు క్రౌరము చేసికొనుట పొరపాటా?
నేను సంగతులను చూచుచున్నానా? అది ఆ విధముగా చెప్పుచున్నదా? నాకు తెలియదు. ఆ విషయము మీకే విడిచిపెట్టుచున్నాను.
ప్రశ్న: కుటుంబ నియంత్రణను ఈనాడు పాటించుట తప్పా? పూర్తి కుటుంబ నియంత్రణను ఆచరణలో పెట్టుట అని భావమా?
దానిని నేను వ్యక్తిగతంగా కలిసి చెప్పాను. మరికొన్ని చూద్దాం.
ప్రశ్న: ఒక స్త్రీ పాపములో యుంటూ, విడాకులు తీసికొని మరల పెండ్లి చేసికొన్నచో…?
దానికి నేను జవాబు ఇచ్చాను. "విడాకుల సమస్యను కొంతకాలం వరకు విడిచిపెట్టమని మీకు చెప్పినది గుర్తున్నదా?"
88ప్రశ్న: నేను ఎంతగానో ప్రేమించు ఒక స్నేహితురాలు నాకుండెను. ఆమె కొన్ని టేపులను, ఉత్తరములను కలిగియున్నది. ఆమెతో ఎన్నడూ ఈ సంగతులు మాట్లాడలేదు. ఆమె స్నేహమును, ఆమె సాంగత్యమును దానిని గూర్చి చెప్పినచో పోగొట్టకుందునేమోనని నిజంగా భయపడుచున్నాను. నేనేమి చేయవలెను?
ప్రేమతో ఆమెను మాట్లడుము. దానికి నేను జవాబు ఇచ్చానని తలంచుచున్నాను. కాని ఎవరి మీద ఏమీ బలవంతంగా నెట్టవద్దు. ఉప్పువలె ఉండుము; వారును నీవలె యుండుటకు ఆశించెదరు. సోదరుడా, సోదరీ, వీటికి నేను జవాబు ఇచ్చానని నమ్ముచున్నాను.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, అయిదుగురు బుద్ధిలేని కన్యకల గురించి దయతో వివరించుము.
దానిని చూచానని ఎరుగుదును. ఎర్రని కాగితంపై దానిని వ్రాసిరి. అది చూచామని నమ్ముచున్నాను. వీటన్నింటికీ నేను జవాబు ఇచ్చానని తలంచుచున్నాను. ప్రభువుకు స్తోత్రము. చూద్దాము. ఒక్క నిమిషం దయతో ఆగండి.
MARK 16:18
89ప్రశ్న: ప్రియ దేవుని ప్రవక్తా, మార్కు 16:18. రోగులపై చేతులుంచుట గూర్చినది. నేను పాములనాడించు వారి మధ్య యున్నాను. దాని సంగతి ఏమిటి?
అది మంచి ప్రశ్న. నీ చుట్టూ పాములను ఆడించువారున్నచో వారు మార్కు 16 చెప్పెదరు. నిశ్చయంగా! బైబిలు ఏమి చెప్పుచున్నదో అది అంతేనని నేను నమ్ముచున్నాను. ప్రభువును దేనికొరకైనా మనము శోధించునప్పుడు మనము దానికొరకు వెంటాడుచున్నామని అర్ధము. ఒక సీసా విషం నాకు ఇచ్చి దీనిని త్రాగి నా విశ్వాసమును రుజువుచేయమని నీవు కోరినచో తప్పు. అది దేవుని ఉద్దేశ్యము కాదు. ఆ విధంగానే పామును తెచ్చి ఎత్తిపట్టుకొమ్మని నీవు నన్ను అడుగుట కూడా ఉండును. దాని విషయమును జయించు విశ్వాసము నాకున్నదేమో నీకు చూపించుట కాదు. అది అపార్ధమని నా నమ్మకము.
నీటిలో నేను ప్రజలకు బాప్తిస్మమిచ్చుచున్నప్పుడు, లేదా ప్రభువు పనిచేయుచున్నప్పుడు, లేదా అరణ్యములో యున్నప్పుడు, పాము నన్ను కరచినచో, నేను ప్రభువు నామము పేరట నడిచి వచ్చెదను. చూచారా? దాని భావము అదేనని నమ్ముచున్నాను
90ఇప్పుడు, మీరు దానిని చూడండి. దానితో మీరేమి చేయుదురు? దీనిని వ్రాసిన ప్రియమైన వ్యక్తి దీనిని గుర్తుంచుకొనవలెను. చూచారా? దానిని గురించి బైబిలు ఏమి చెప్పుచున్నదో గమనించండి. "మహిమ, మహిమ, మహిమ," అని మీరు చెప్పుటకు ప్రయత్నించుచుందురు. భాషలతో మాట్లాడుటకు దేవుని మీరు పరిశోధించవద్దు. నీ ద్వారా ఆత్మను మాట్లాడనిమ్ము. చూచారా?
దేవునిని శోధించుట లేదా ఒత్తిడి చేయుట యందు నాకు నమ్మకము లేదు. కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్లే యున్నది. మనము ఆత్మ కొరకు కనిపెట్టవలెను, దానిని అదే చేయును
ACTS 28:3
91ఇప్పుడు గమనించండి, క్రేతు ద్వీపము మీద పౌలు కట్టెలను ఏరుచుండెను. అదేనని నమ్ముచున్నాను. అతడు సంకెళ్ళలో యుండెను. ఒక పాము అతని చుట్టుకొన్నది, బహుశా అది విషపాము అయి యుండును. కరచినచో మరణించుటే జరుగును; అతడు కరచిన వెంటనే చనిపోయి పడియుండును. మాంబా అను ఆ సర్పము కరచిన వెంటనే మరణము తప్పదు, అంతకన్న విష సర్పము మరేదీ లేదు.
మరియు ఈ మూ౦బా సర్పమును అతడు ఎత్తి పట్టుకొనెను, మనం చెప్పుకొందము. అది మరణకరమగు కాటు; ఇక ఊపిరి లేనట్లే, కొన ఊపిరి మిగిలియున్నది. త్రాచు పాము నిన్ను కరచినప్పుడు నీవు బ్రదుకుటకు అవకాశము లేనట్లే… లేక నల్ల త్రాచు విషం అంత మరణకరము. గోధుమ త్రాచు కరచినచో నూటికి 80 మంది చనిపోయెదరు. నూటికి 20 మంది మాత్రమే బ్రదికెదరు. మాంబా పాము కరచినచో అసలు బ్రతికే అవకాశమే లేదు. మరణమే ప్రాప్తించును. అంతే! కొన్ని క్షణములలో ఊపిరి పోవును. నరముల వ్యవస్థను అది చచ్చుపరచును, రక్త మండలము చచ్చుబడును, అన్నియూ ఆగిపోవును. చూచారా?
ACTS 28:4,6
92ఈ మాంబా సర్పము పౌలును చేతిమీద కరచినప్పుడు, "వీడు చాలా దుర్మారుడై యుండెను. బహుశా నరహంతకుడై యుండును. సముద్ర ప్రమాదము నుండి అతడు
బ్రదికి బయటపడినాగాని, మరణము అతడిని వదలలేదు. అతడు హంతకుడు గనుక దేవుడు ప్రతీకారము తీర్చుకొనుచున్నాడు," అని వారనిరి.
పౌలు చూచెను, ఈ సర్పము అతని చేతిని చుట్టుకొనియుండెను, దానినతడు విదిలించెను, ఏమీ కంగారుపడలేదు, "ఓ దేవా, నాకు సహాయము చేయుము," అనలేదు. దానివైపు అతడు చూచెను, అగ్నిలోనికి విదిలించెను, ఏమీ జరుగలేదన్నట్లుగా అతడు మరల కట్టెలను ఏరుకొనుచుండెను.
వారిట్లనుకొనిరి, "అతడు ఒక నిమిషములో చనిపోవును, ఎందుకనగా ఈ పాము కరచిన వెంటనే చనిపోవుట తధ్యము." ఆ తరువాత కొంత సమయము గడిచినది. పౌలు ఏమీ చావలేదు. ఎక్కడా వాపు లేదు. ఏమీ ప్రభావము కనిపించలేదు. వారిప్పుడు తమ మాటను మార్చుకొనిరి, "ఇతడు మానవ రూపములో దిగివచ్చిన దేవుడే," చూచారా.
అతడెన్నడూ ఈలాగు పలుకలేదు, "ఆ పామును నాయొద్దకు తీసికొని రండి," కాని ఆ పాము అతనిని కరచెను. దేవునిని ఎన్నడూ అతడు శోధించలేదు, కాని ఆ పాము కాటును జయించునట్లు చేయునని విశ్వాసముంచెను. నా భావమును గ్రహించారా?
93మీరు పాముల నాడించువారి మధ్య ఉండవచ్చును. వారు పాములను ఆడించెదరు - అది వారి పని. చూచారా? దానిని ఆ విధంగా నేను చూచుట లేదు.
ఇప్పుడు, "ఆ ప్రజలకు విశ్వాసమున్నది," అని మీరందురు. వారికి విశ్వాసము లేదని నేను చెప్పును. వారు ఆమ్లములతో కాల్చుకొందురు. అటువంటివి వారు చేయుదురు, చూచారా, అయినా గాని అది దేవుని రుజవు చేయుట కానే కాదు.
ఇండియనులను నేను చూచాను - అగ్నిని రాజేయుదురు. మూడు అడుగుల వెడల్పున, దాదాపు నలుబది గజముల పొడవున అగ్నిని తయారుచేయుదురు. ఆకులతో దానిని బాగా వేడిచేయుదురు. అది తెల్లగా నుండును. (వారు ప్రత్యేకమైన వారు కారు, వ్యవసాయదారులు), తమ చెప్పులు తీసివేయుదురు, (మేక రక్తముతో ఆ పూజారులు వారిని దీవించెదరు) -చిన్న గాలపు ముల్లులను తీసికొందురు. తమ శరీరములకు గ్రుచ్చుకొందురు. తమ నోటికి తగిలించుకొందురు - పెద్ద నీటి తొట్టెను నింపుదురు. క్రిస్మస్ చెట్టువలె యుండును. ఆభరణములను పేర్పుదురు. పొడవైన చేపలు వేటాడు గాలపు ముళ్ళులను నోటికి తగిలించుకొందురు. (వాటిని గుచ్చి లాగుట ఎంత బాధకరమో ఊహించండి), ఆ మండుచున్న నిప్పుల మీద వారు నిలబడుదురు. ఆ ఎర్రని నిప్పుల మీద వారు నడచెదరు (అది ఎర్రదనమును మించిపోయి తెల్లగా ఉండును, అమితమగు వేడి) - ఆ నిప్పుల మీద నడచెదరు. అటు ఇటు సంచరించెదరు, కాని వారి పాదములకు బొబ్బలు కూడా రావు. వారికి కనీసము మన దేవుని యందు విశ్వాసము కూడా లేదు. వారు దయ్యములను ఆరాధించెదరు. చూచారా? కావున అందులో అర్థము లేదు. చూచారా? మీరు దీనులగు, మధురమగు, నిజమగు క్రైస్తవులవలె జీవితములను జీవించండి. అప్పుడు మిగిలినవాటినన్నింటినీ దేవుడే చూచుకొనును.
94ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, వధువులో వెళ్ళనివారికి బోధకులు బోధించునది ఏది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మము, రక్షణ గూర్చి ఇప్పుడు వారు బోధించుచున్నారు. వారు వధువులో వెళ్ళనప్పుడు ఇక బోధించునది ఏమిటి?
ఏమి జరుగునో బహుశా మీకు తెలియును? ఇప్పుడు దానిని చెప్పుచున్నాను. దీనిని నేను నిరూపించలేను, కాని వారు ఇప్పుడు బోధించుచున్న దానినే మామూలుగా బోధించుచుందురు. ప్రజలు కూడా తాము రక్షించబడుచున్నామని తలంచుచుందురు. మరియు వధువు ఎత్తబడియుండును.
95ప్రశ్న: వాక్య ప్రకారము, కుటుంబ నియంత్రణ పాటించుట సరియేనా?
దానిని వ్యక్తిగతంగా మీకు చెప్పెదనని నేను చెప్పాను. ఈ ప్రశ్న గలవారు నన్ను వ్యక్తిగతంగా కలిసికొనండి.
ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, మనకు ఒక బోధకుడున్నాడని వాక్యము చెప్పుచున్న సంగతి నీవెరుగుదువు.
అవును, అది చూచాము. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, ఒకసారి మన పేరు ఒక ప్రత్యేక గ్రంథములో వ్రాయబడియున్నవి…
అవును, అది చూచాము. అది ఎట్లు తొలగించబడునని వారడిగిరి, ఏదయినా తప్పు చేయుట వలనా?
96ప్రశ్న: కుటుంబ నియంత్రణను నీవు సరియందువా?
కాదు, దానిని నేను సరియనను. కాదండీ! చూచారా?
MAL 4:5•
REV 10:7
97ప్రశ్న: ప్రకటన 10లోని ఏడవ దూత, మలాకీ 4లోని ఏలియా ఒక్కటేనా?
దానికి నేను జవాబు చెప్పానా? దానికి జవాబు చెప్పినట్లు లేదు.
అవును, ఒకే వ్యక్తి. ప్రకటన 10 ఏడవ దూత యెక్క వర్తమానము —ఏడవ సంఘ కాలము యొక్క ఏడవ దూత, ఆ వర్తమానికుడే మలాకీ 4.
ప్రశ్న: కుటుంబ నియంత్రణ…
దానిమీద చాలా ప్రశ్నలున్నవి. వీటిని నేను వెనక్కి త్రోశాను, జవాబియ్యగోరుట లేదు; మీరు వ్యక్తిగతంగా నన్ను కలిసికొనండి.
GEN 6:3
98ప్రశ్న: నోవాహు 120 సంవత్సరములు బోధించెనని, ఓడను 120 సంవత్సరములలో నిర్మించెనని ఎక్కడున్నది?
దానికి నేను జవాబు చెప్పానా?
ఒక తరము లేదా నియమిత కాలము, భూమిమీద మానవునికి నియమింపబడిన సమయము 120 సంవత్సరములు. నోవహు ఓడను ఆ కాలంలో నిర్మించెను. ఆ దినమున దానిని ఒక తరముగా పరిగణించిరి. నూట-ఇరువది సంవత్సరములు మానవునికి నియమించబడెను. అతడు బోధించెను, ఆదికాండము 6:3 ప్రకారము, అతడు ఆ తరమునకు బోధించెను, అది 120 సంవత్సరములు; నోవహు బోధించెను. మంచిది. ఇంకా చూద్దాం.
MAL 3:1•
MAL 4:5,6
99ప్రశ్న: మలాకీ 4లోని ఏలియా తండ్రుల హృదయములను పిల్లల వైపునకు త్రిప్పును, ఆ తరువాత పిల్లల హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును. ఒకే వ్యక్తియా?
అవును, ఒకే వ్యక్తి. మంచిది. ఒక్క నిమిషం ఆగండి. కాదు! నన్ను క్షమించండి. చూడండి. పరిశుద్ధాత్మ దానిని కనిపెట్టెను? కాదు! నేనట్లు తలంచాను… చూచారా.
మలాకీ 3లో ఏమి ఉన్నది? "నాకంటె ముందుగా వర్తమానికుని పంపెదను. అతడే ఏలియా, మలాకీ 4లో దానిని త్రిప్పి చెప్పెను, ఇదిగో, నేను ఏలియాను పంపుచున్నాను." మలాకీ 3, ప్రభువైన యేసుకంటె ముందుగా ఒక వర్తమానికుడు పంపబడును, అతడే యోహాను. ఎందరు దీనిని అర్ధముచేసికొనిరి? మలాకీ 4, ఆ ఏలియా వచ్చి వర్తమానమందించిన వెంటనే - ప్రభువు రాక వచ్చును మరియు భూమి నూతనపరచబడును.
MAL 4:6
100మీరు గమనించండి, నిశ్చయముగా చెప్పుచున్నాను అది… ఈ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ఎట్లు వ్రాసెనో చూడండి, అతడు చెప్పెను, "మొదటగా అతడు తండ్రుల హృదయములను పిల్లల వైపుకు త్రిప్పును." చూచారా? అది యోహాను మొదట రాకడ. అతడు తండ్రుల హృదయములను త్రిప్పెను. వారే పితరులు, వృద్దులు, పిల్లల యొక్క వర్తమానము తట్టు త్రిప్పెను, అది అప్పటి క్రొత్త తరము. యేసు ఆ తరములోనే ఉండెను. ఆ తరువాత దానిని అనుసంధానపరచు మాట వాడెను. పిల్లల హృదయములను తిరిగి తండ్రుల వైపు త్రిప్పెను. దాని అర్థము చూడండి, ఈనాటి వర్తమానము సంఘ కాలములో యుండిన పిల్లల హృదయములను, ఆదియందున్న అసలు పెంతెకోస్తు విశ్వాసము వైపునకు త్రిప్పును.
కావున ఇద్దరు వేరుగా నున్నారు - ఒక వర్తమానికుడు, కాని తేడా యున్నది, యోహాను యొక్క మొదటి రాక మరియు రెండవ రాక —లేదా వర్తమానికుడగు ఏలియా.
ప్రశ్న: నా భర్త మరియు నా చిన్న కుమారుడు నమ్ముుట లేదు…
అవును, దానిని చూచాము. నాకు తెలియును, ఎందుకనగా ఆ వ్యక్తి పేరిక్కడ వ్రాసియున్నాడు. దానిని గురించి ఆ తరువాత మాట్లాడినది గుర్తున్నది.
101ప్రశ్న: ప్రభువు యొక్క చిత్తమును మనమెట్లు కనుగొందుము? మేము మా గృహమును ఇండియానాలోని, జెఫర్సన్-విల్ కు మారవలెనా? ఒక వ్యక్తి క్రైస్తవుడై యుండియు నల్లజాతి సోదరుని అసహ్యించుకోగలడా? వారిని కూడా దేవుడు మనవలె చూడవలెనని కోరుట లేదా? వారి రంగు నల్లగా ఉంటే ఏమిటి? ఈ విషయములో మీ సలహా ఏమిటి? వేర్పాటు లేదా సంలీనమునందు నీకు నమ్మకమున్నదా?
నాకు సంలీనము నందు విశ్వాసమున్నది. ఒక వ్కక్తి ఏ రంగు వాడయినా గాని మానవుడే, నావంటి ఒక మనుష్యుడే. ఇది ఖచ్చితము. ఆ నల్ల రంగు వారిని రెచ్చగొట్టని యెడల, కమ్యూనిష్టులు వారియొద్దకు వెళ్ళి ప్రేరేపించక పోయియుందురు…
ఆ నిజంగా నల్లరంగు ప్రజలలో తిరిగి జన్మించినవారున్నారు. వారిలో భక్తిగల పరిశుద్దులున్నారు. అవును. నిశ్చయంగా! చర్మము తెల్లగా ఉన్నందున, వారి చర్మము నల్లగా ఉన్నందున నాకేమీ తేడా కనబడుట లేదు. అతడు క్రీస్తునందున్నయెడల నా యొక్క సోదరుడే.
102ఆ కారణము చేతనే నేను ఆఫ్రికనుల వర్తమానముతో విభేదించుచున్నాను; ఆ జనులకు ఆత్మ ఉన్నదని కూడా వారు నమ్మరు. అదే నాకు నచ్చలేదు. నేను చెప్పాను, "వారు కూడా నా వంటి మానవులే. నాకున్న హక్కులే వారికిని ఉన్నవి. వారి చర్మముబట్టి నాకేమీ భేదము కనబడదు. దేవుని యొక్క ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన ఏ మనిషి అయినా సరే, ఆ హక్కు కలిగియున్నాడు."
కాని ఇట్లు నేనన్నాను, "వారు ఆ నల్లరంగు జాతి వారి జోలికి పోనియెడల ఎన్నడో ఆ విధంగా వారిచేత ప్రభావితులు కాకపోయి యుందురు." దీనిని నేను వేదికపై నుండి చెప్పుచున్నాను. ఇక్కడికి చాలామంది నల్లజాతివారు వచ్చుచున్నారు. (ఈ రాత్రి ఇక్కడెవరూ ఆలాంటి వారు లేరనుకొనుచున్నాను.) ఈ సంఘమునకు చాలామంది నల్లజాతివారు వచ్చుచున్నారు. సోదరుడా, వారు కూడా అందరివంటివారే, వారికి స్వాగతం పలుకుచున్నాను. వారు నా సోదరీ, సోదరులు.
కొందరు నల్లవారు చాలా మంచివారు, నా జీవితములో అంత మంచివారిని ఎన్నడూ కలిసికొనలేదు. అందులో కొందరు తిరుగుబోతులున్నారు, తెల్లని వారివంటివారే, లేదా పసుపు రంగువారివంటివారే, గోధుమ రంగు వారివంటివారే. అవును. నిశ్చయంగా.
103మిశ్రమ వివాహముల యందు నాకు విశ్వాసము లేదు. ఒక తెల్లజాతి వ్యక్తి ఒక నల్లజాతి స్త్రీని పెండ్లిచేసికొనుట యందు నాకు విశ్వాసము లేదు. ఆలాగే నల్లజాతి స్త్రీ, తెల్ల వానిని లేదా పసుపు రంగు వాడు నల్లవారిని లేదా తెల్లవారిని పెండ్లిచేసికొనుట యందు నాకు విశ్వాసము లేదు. గోధుమ రంగువారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, ఏ జాతివారయినా దేవుని యొక్క తోటలో పూలవంటి వారు. అయితే వారిని సంకరము చేయుట యందు నాకు నమ్మకము లేదు. దేవుడు వారిని ఆ విధంగా తయారుచేసెనని నమ్ముచున్నాను. వారు ఆలాగే నిలచియుండవలెనని నేను నమ్ముచున్నాను.
నిజంగా అందమైన నల్లజాతి బాలికను నేను చూచాను, చక్కగానున్న బాలురను చూచాను. అంత చక్కని స్త్రీలను మీరు ఎక్కడా చూడలేరు. అటువంటి ఆమె ఒక తెల్లజాతి వానిని పెండ్లి చేసికొని సంకర జాతి పిల్లలను ఎందుకు కనవలెను? తెలివి కలిగిన నల్లజాతి బాలిక అటువంటి పని ఎందుకు చేయవలెను? ఒక నల్లజాతి యువకుడు, తెల్లజాతి స్త్రీని పెండ్లి చేసికొని మిశ్రమ రంగు వారిని ఎందుకు కనవలెను?
మనమెట్లున్నామో ఆ విధంగానే ఉండవలెనని నేను నమ్ముచున్నాను. మనము క్రీస్తు యొక్క దాసులము. దేవుడు నన్ను చేసెను… ఆయన నాకు నల్లరంగు అనుగ్రహించిన ఆలాగే యుండును. దేవుని కొరకు ఒక నల్లజాతివానిగా ఉండుటకు నేను సంతోషించుచున్నాను. ఆయన నన్ను పసుపు రంగు వానిగా చేసినచో, నేను సంతోషముగా క్రీస్తు కొరకు పసుపు రంగువానిగా యుందును. ఆయన నన్ను తెల్లవానిగా చేసినచొ, తెల్లవానిగా క్రీస్తు కొరకు జీవించెదను. ఆయన నన్ను గోధుమ రంగు వానిగా లేదా ఎర్రని వానిగా, ఇండియనుగా, లేదా మరో రంగు వానిగా చేసినప్పుడు, నేను ఆ రంగులోనే యుందును. నేను ఆ విధంగానే యుందును. నా సృష్టికర్త నన్ను చేసిన విధంగానే నేనుండగోరుచున్నాను.
104శ్రివ్-పోర్టులో ఆ అల్లరి జరిగిన రోజు అక్కడున్నాను - యువకులగు నల్లజాతి వారు ఆ కమ్యూనిష్టుల వలన ప్రేరేపించబడిరి.
ఈ వేదిక మీదనే నేను మీకు చెప్పియున్నాను, మార్టిన్ లూథర్ కింగ్ కు నల్లజాతి వారు ఎంతో ఋణపడియున్నారు. ప్రజలకు అతడు చేసినది గొప్ప సంగతి. అది నిజము.
అతడు — వేలాదిమందిని వధకు నడిపించెను. (అది నిజము), కమ్యూనిజం ద్వారా ప్రేరేపించబడెను.
నా విషయమును నిరూపించెదను. దాదాపు రెండు సంవత్సరాల క్రితం దానిని నేను చెప్పాను. ఇప్పుడేమి జరుగుచున్నదో చూడండి. వారు సంలీనము కొరకు పోరాడుచున్నట్లు చెప్పిరి, మరియు వారికి చట్టము ద్వారా సంలీనము కల్పించబడినప్పుడు… సంలీనము నందు విశ్వసించని వారికి చెప్పుచున్నాను, మిమ్మును చూచి అవమానపడుచున్నాను. మన దేశము సంలీనమును అనుమతించుచున్నది, పెద్ద యజమాని ఏమి చేయమని చెప్పునో దానిని మనము చేయవలెను. అది అక్షరాలా నిజము.
ఇప్పుడు మీరు చెప్పండి… ఆ యా స్థలములకు లేదా షాపులకు వెళ్ళుట కాదు, బస్సులలో వెనుక భాగాన కూర్చొనుట కాదు, అటువంటిది కాదండీ! వారు కూడా మనవంటి వారేనని చట్టము చెప్పుచున్నది. మనము కూడా వారివలెనె యున్నాము. ఆ విధంగా మనం ప్రవర్తించుదము. ఆ ప్రకారంగా మనం ఉందము. నిజంగా తిరిగి జన్మించిన ప్రజలు ఖచ్చితంగా దానినే విశ్వసించుదురు. ఇప్పుడు, వారి హృదయములో యున్నదని నమ్ముచున్నాను.
105ఆఫ్రికాలోని జనులు చాలా పేదవారు. వారిపట్ల నాకున్న జాలి ఎనలేనిది, వారినెట్లు చూచుచున్నారో గమనించండి. అటువంటి వాటియందు నాకు విశ్వాసము లేదు. నేను దక్షిణాదివాడిని; ఆ నదికావల నేను జన్మించియుంటిని, కాని నేను అబ్రహాం లింకన్ వలెయున్నాను; నేను ఇక్కడికి వచ్చియున్నాను, ఎందుకనగా మానవులందరూ సమానంగా జన్మించారని నమ్ముచున్నాను. అది నిజం. జనులను వేరుపరచుట, తదితర విషయములు నాకు నచ్చవు. వాటిని నేను నమ్మను… ఆ జనులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుచున్నారు.
కాని చూడండి, నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవులగు నల్లజాతి వారివలన ఈ సమస్యలు తలేత్తుట లేదు. మీరు వారిని ఖండించుచున్నారు గాని మరికొందరు తెల్లవారు ఆలాగు చేయుట లేదా? చూచారా? ఎవరి తప్పులు వారికి కనబడవు. మన తెల్లజాతి పిల్లల వారికంటె రెండు రెట్లు అల్లరిని చేయుచున్నారు. అది అక్షరాలా నిజము. అదెక్కడున్నది? మన కళాశాలలలో ఏమి జరుగుచున్నదో చూడండి. మనయొక్క కొందరు విద్యాధికులు ఈ సంగతులన్నింటికీ కారకులని మీరు గమనించారా.
106మంచిది, అయితే అది ఏమిటి? అది కమ్యూనిజం అని నేను చూపించుచున్నాను. ఆ నల్లజాతి వారివలన కానే కాదు. కమ్యూనిజం ఎల్లప్పుడూ ఆ విధముగానే ఆక్రమించుచున్నది. ప్రతి దేశములోను ఆలాగే వారు చేయుచున్నారు. వారా విధంగానే చేయుదురు, ఒకరితో ఒకరు పోట్లాడునట్లుగా చేయుచున్నారు, విప్లవమనుచూ ఒక గుండు పేల్చకుండానే వారు ఆక్రమించుచున్నారు. వారు ఈ దేశమును పేల్చివేయగోరరు గాని దానిని కావలెనని కోరుచున్నారు. వారు దానిని విషతుల్యము చేయుదురు. వారికి పాత విప్లవమేమిటో తెలియును. వారు మరియొక విప్లవమును ప్రారంభించవలెనని ఆలోచించుచున్నారు.
నా మాట నిజమని నిరూపించెదను, సంలీనము తరువాత (వారిప్పుడు దానిని చట్ట సమ్మతముగా, న్యాయబద్దంగా చేయుచున్నారు), వారు మొదట చేసిన దానికంటె ఎక్కువ ఇబ్బంది కలుగజేయుచున్నారు, చూచారా. అది కమ్యూనిజం అని అర్థమగుచున్నది మరియు దేవుని యొక్క ఆత్మ వలన తిరిగి జన్మించిన ప్రశస్త ఆత్మలు అందుకు కారకులు కారు.
107ప్రశ్న: ఇంకా మనము ఆత్మతో మండుచూ సువార్తను బోధించవలెనా లేదా సమయము అయిపోయినదా?
లేదు, నీవు ఎంత గట్టిగా బోధించగలవో అంత గట్టిగా బోధించుము. సోదరుడా, దానితోనే నిలచియుండుము; నేను నీ వెనుకనే యుందును.
108ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, నీవు గ్రుడ్డు తినరాదని, ఆ లోయలో జీవించరాదని ప్రవచించియున్నావు, ఆ ప్రవచనము నీమట్టుకేనా లేదా సమూహమంతటి కొరకా? మంచిది.
చాలా సంవత్సరాల క్రితం దాదాపు ముప్పది సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం ఇచ్చాను. చివరి దినములలో జంతువులు, పశువులు, గ్రుడ్డు వ్యాధులకు గురియగునని ఆ ప్రవచనంలో చెప్పాను. గ్రుడ్డు కూడా వ్యాధికి గురియగునని చెప్పాను. తినుటకు పనికిరాని గ్రుడ్డు వచ్చునని చెప్పాను. ఆలాగే లోయలో జీవించు ప్రజల గూర్చి చెప్పాను. ఇప్పుడు గుర్తించుకొనండి, ముప్పది సంవత్సరాల క్రితం నేను ప్రవచించాను, అది జరుగవలసియున్నది, క్రైస్తవులు లోయలలో నుండి బయటకు రావలెనని చెప్పాను. ఫలానివి తినరాదని చెప్పాను. ఆయా మాంసములు మరియు సంగతులు ప్రమాదకరమని చెప్పాను. (ఆ విధంగానే చెప్పినట్లు గుర్తున్నది) లోయలలో జీవించు జనులు ప్రమాదము నెదుర్కొందురని ప్రవచించాను.
ఇప్పుడు, అది అవి పాడైపోవుటకు ముందు లేదా పాడవుట గూర్చి తెలుసుకొనుటకు ముందు. కానీ అది పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరించినది. మరియు ఇప్పుడు, మన మందలకు కూడా (బజారు సంతలలో మనము చూచెదము) డిడిటి ( DDT) అను ద్రావణము చల్లుచున్నారు, అది ఆ గెదెలలో ఏదో చేయుచున్నది.
109మరల గమనించండి, ఈ సంకరజాతినంతటినీ చూడండి. వీటన్నింటి వలన మానవ జాతి కూడా దిన దినము క్షీణించుచున్నది. రీడర్స్ డైజెస్టులో ఇట్లు చెప్పెను, "రోగులలో నూటికి ముప్ఫయి మంది వైద్యుల పొరపాటు కారణంగానే ఆస్పత్రులలోనికి వచ్చుచున్నారు." వారు నీలో నున్న ఒక రోగమును, తొలగించుటకు మందును ఇచ్చుచున్నారు, కాని అది వెళ్ళి మరో రోగమును నీలోనికి తెచ్చుచున్నది.
మీరు గ్రుడ్లను గమనించారా? లూయిస్విల్ మరియు జెఫర్సన్ విల్లో గత సంవత్సరం వందలాది జనులు గ్రుడ్డు తినుట వలన వాంతులు చేసికొని ఆస్పత్రిపాలయిరి. లోయలలోని కోళ్ళ వలన ఇచ్చట అట్లు జరిగినది. లోయలలో ఉత్పత్తి అయిన గ్రుడ్డు ఆనారోగ్యకరమైనవిగా నిరూపణ అయినది. విషకరమగు మొక్కల ద్వారా అంతా కలుషితమైపోయెను.
1TIM 4:3,4
110కాని మీరిక్కడ పొందుకొనెదరు, నా సోదరుడా, నా పూర్ణహృదయముతో నమ్ముచున్నాను. ఇక్కడ లేఖనములలో వ్రాయబడియున్నది. కృతజ్ఞతలు చెల్లించకుండా, ప్రార్ధన చేయకుండా, దేవుని యొక్క వాక్యము ద్వారా శుద్దీకరింపబడకుండా, తినినచో ఆలాగే జరుగును. చూచారా? ఈలాగు చెప్పి తినండి, "ప్రభువైన యేసూ, నా కొరకు నీవు భోజనమును సిద్ధపరచియున్నావు. విశ్వాసముతో ఈ ఆహారమును మా శరీరము కొరకు శుద్దీకరించమని ప్రార్ధించుచున్నాను." ఆ తరువాత తినండి, ఎందుకనగా ప్రతిది మనం విశ్వాసముతో చేయుచున్నాము.
ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరడా, ఒక త్రాగుబోతు భర్తనుండి విడాకులు పొందుటకు ఆధారము లేవి?
ఆ విడాకుల గూర్చి మాట్లాడుటకు నాకు ఇష్టము లేదు. దానిని గూర్చి మరికొంత సమయం తరువాత మాట్లాడెదను.
111ప్రశ్న: బ్రెన్హాం సహోదరుడా, (ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడి ఒక సేవకునికి సంబంధించినది ఇది. మొదట నన్ను చదువనీయండి. ఒక్క నిమిషం ఆగండి. ఏమయినా గాని దీనిని నేను చదువుదును.) బ్రెన్హాం సోదరుడా, నెవిల్ సోదరుడు ప్రవచనము ద్వారా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని, నేను పరిశుద్ధాత్మను పొందుదునని చెప్పెను. ఇంకా నేను పరిశుద్ధాత్మను పొందలేదు. ఇంకా నేను ప్రార్ధి౦చవలెనా?
అవును! నిశ్చయంగా! నీవు నమ్ముట కొనసాగించుము. గమనించుము, సహోదరుడు ఉడ్ యొద్ద నేను నిన్న నిలబడియున్నాను. ఒక ఫోన్ పిలుపు నాకు వచ్చెను. అతడు చక్రాల కుర్చీలో యున్నాడు. అతనికి ఒక సోదరుని గూర్చి భారమున్నది. ఆ వ్యక్తి త్రాగుబోతు. సినోనమస్ వ్యాధికి గురయ్యెను. ఇంజక్షనులను తీసికొనెను. ఆస్పత్రిలో యుండెను. సహోదరుడు నెవిల్ భాషలతో మాట్లాడి చెప్పెను, లేదా మరేదో విధంగా ఈ వ్యక్తి గురించి ప్రవచించెను. వచ్చే కొద్ది రోజులలో ఆ వ్యక్తికి మంచి ఏదో జరుగునని లేదా అట్టి అర్థమిచ్చునని ప్రవచించెను. ఆవలి వ్యక్తి పిలచి ఇతడు అరవై-ఎనిమిది రోజుల నుండి, ఆస్పత్రి నుండి విడుదల అయి ఏ మాత్రమూ సారాయి త్రాగుట లేదని చెప్పెను, మద్యమును నిషేధించు మరే ఇతర ప్రత్యామ్నాయమును గాని అతడు ముట్టలేదు. సహోదరుడు నెవిల్ ప్రవచనము ద్వారా చెప్పినది నెరవేరినది. ప్రభువుకు స్తోత్రము! మన సోదరుడు దైవజనుడని మేము నమ్ముచున్నాము.
ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, వారు…?
112ఇప్పుడు ఆగండి, ఒక్క నిమిషం ఆక్కడ ఆగి, జనులతో చెప్పుచున్నాను. నేను విశ్వసించు వర్తమానమునే సహోదరుడు నెవిల్ విశ్వసించుచున్నాడు. సహోదరుడు కాప్స్ సహోదరుడు బీలర్, సహోదరుడు రడెల్ తదితర సోదరులందరూ ఇదే వర్తమానమును, అనగా నేను నమ్ము వర్తమానమును నమ్మి, నావలెనె బోధించుచున్నారు, నా మాదిరిగానే చేయుచున్నారు.
నిజంగా మీరు బయటకు వెళ్ళిపోవలెననుకొన్నచో వెళ్ళండి. మీ పనిని విరమించుకో గోరినచో నిజంగా మీ ఉద్దేశ్యము బట్టి విరమించుకొనండి. వాక్యము వినవలెనని రాగోరినచో, ఆలయమునకు రండి. వచ్చి వినండి. మీ ఇష్టానుసారంగా అది చేయండి.
వీరు దైవజనులు నాకున్న పరిశుద్ధాత్మనే వారును కలిగియున్నారు. మీరు దానినే కలిగియున్నారు. ఇదే బైబిలు నుండి, ఇదే వర్తమానమును బోధించుచున్నాము.
ప్రశ్న: ప్రియ బ్రెన్హాం సోదరుడా, భాషలలో మాట్లాడువారు ఆ శేషిత జనాంగము…?
అవును, దానిని చూచాను. హూ, హూ, అది చదివినాము. ఒకామె భాషలలో మాట్లాడుచున్నది.
ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీద నీ ప్రసంగ టేపు, యేసు నామములో బాప్తిస్మము…?
అవును, దానిని చదివాము. ఇంకా చూద్దాం.
MATT 10:37,38•
1PET 3:1
113ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, భార్య భర్తకు లోబడవలెనని బైబిలు చెప్పుచున్నది. నేను క్రైస్తవుడను మరియు నా భర్త పాపి. అతడు నన్ను అన్ని విధములుగా హింసించుచున్నాడు. నన్ను ఆలయమునకు వెళ్ళవద్దని, బైబిలు చదవరాదని అనుచున్నాడు, వాక్యమును నిరాకరించుచున్నాడు. నేనేమి చేయవలెను?
నీవేమి చేయుదువు? ఇప్పుడు వినుము. నీ భర్తకు నీవు లోబడవలసియున్నావు; అది వాక్యము. కాని అతడు నిన్ను ఆలయమునకు వెళ్ళవద్దని, వాక్యమును చదువవద్దని లేదా అట్టిది మరేదయినా చెప్పుచున్నచో, నీవు అందుకు లోబడనవసరము లేదు, ఎందుకనగా, "నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, భర్తనైనను, భార్యనైనను, మరి దేనినైనను విడిచిపెట్టనివాడు, నన్ను వెంబడించుటకు యోగ్యుడు కాడు." అది నిజమేనా?
114ఆమెను ఏలువాడైయున్నందున ఒక పురుషుడు తన అధికారమును స్త్రీ పైన అలాగున ఉపయోగించుకొనరాదు. సోదరుడా, ఆమెకు అందరికన్న పై యజమాని దేవుడే, చూచారా? నీ భార్య ఏదయినా తప్పు చేయుచున్నయెడల, నీకు ఆమెను సరిచేయు అధికారమున్నది. ఆమె నీకు లోబడవలసియున్నది, కాని ఆమెను కొట్టు హక్కు నీకు లేదు. ఆమెను ఈడ్చే హక్కు నీకు లేదు, అట్టి పనులు మరేవీ చేయరాదు. లేదయ్యా!
మీరు చూడండి, దేవుడు మనవానికి ఒక సాటియగు సహాయమును తయారుచేసెను గాని కాళ్ళు తుడుచుకొను గోనెగా ఆమెనియ్యలేదు. గుర్తించుకొనండి, ఆమె నీ ప్రియురాలు; ఆమె ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండవలెను.
115ప్రశ్న: చివరి వాక్యము కొరకు దేవుని ప్రజలు ఎప్పుడు మరియు ఎచ్చట కూడుకొందురు?
క్రీస్తునందు. అవును! చివరి దినము కొరకు వారు క్రీస్తులో కూడికొందురు. ఇప్పుడు దానిని మరువ రాదు. మనకు ఒక కూడిక చోటున్నది; దానిని ఖచ్చితంగా మనము చూచియున్నాము.
116ప్రశ్న: మనము పిలువబడితిమి… (ఒక రోజున ప్రశ్న చూచాము.) మేము జూనియర్ జాక్సన్ ఆలయమునకు వెళ్ళచున్నందున మమ్మును అపవిత్ర పక్షులని పిలచుచున్నారు. అతడు ఇక్కడున్న ఈ క్రొత్త సంఘ నియములతో ఏకీభవించుటలేదు. కొన్నిసార్లు అక్కడికి హాజరగుచున్నందున దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము నుండి తొలగిపోయి యున్నామా?
కాదండీ! జూనియర్ జాక్సన్ దైవజనుడని నేను నమ్ముచున్నాను. దానిని ఇంతకు ముందే వివరించాను.
ఇప్పుడు, సంఘ క్రమ విషయములో మేము సమ్మతించుట లేదు. ఇప్పుడు, నేను నమ్ముచున్నాను జూనియర్ యొక్క… ఎందుకు అతను… జూనియర్ జాక్సన్ను ఎందరు ఎరుగుదురు? అతడు దైవజనుడని మనందరికీ తెలియును. నావలెనె అతడు వర్తమానమును ఈ ఇతర సంగతులను నమ్మును. వాస్తవంగా, జూనియర్, నేను స్నేహితులము. ఇక్కడున్న జె.టి., మరియు సహోదరుడు రడెల్, సహోదరుడు జాక్సన్, సహోదరుడు బీలర్ ఇంకా తదితరులవలె మేమున్నాము. ఇక్కడున్న మేమందరము సహోదరులవలె కలిసి ఉన్నాము. ప్రతిదానిని మా కన్నులు ఒకే రకంగా చూడకపోవచ్చును, చూచారా, కాని ఇదే వర్తమానమును మేము నమ్ముచున్నాము, చూచారా, మేము హత్తుకొనియున్నాము. అక్కడ సోదరుడు హ్యూమ్ కూడా యున్నాడు, ఒక మిషనైరీ, ఇంకా చాలామంది ఉన్నారు . కొన్నిసార్లు వారందరి పేర్లు నేను చెప్పలేను, కాని సోదరుడా, మీకందరికి నా హృదయము తెలియును.
117ప్రశ్న: నిశ్చయంగా! నర్సింగ్ చేయకుండా మానుకోవలెననుకొనుచున్నావు…
దానిని నేనడిగాను. గుర్తున్నదా? ఒక ప్రియమగు సోదరీ నర్సింగ్ చేయుట గూర్చి ప్రశ్నించెను.
ప్రశ్న: నేను పిల్లవానిగా ఉన్నప్పుడు నేను బోధకునిగా ఉండగోరుచున్నానని అందరికీ చెప్పాను. (దానిని చూచాను. అది కూడా అయిపోయినది.) అయితే నేడు అతడు ఏమి చేయవలెను?
క్రీస్తు కొరకు పనిచేయుచున్న ఒక సేవకుని యొద్దనుండి ఈ ఉత్తరము వచ్చెను. ఇది నాకు వ్యక్తిగతంగా వ్రాసెను. సహోదరుడు పాట్ టేలర్ నుండి వచ్చెను. ఈ సంఘములోని మన సోదరులలో ఒకరు.
అన్ని అవే. ప్రభువుకు వందనములు. జనులకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. [టేపులో ఖాలీ ఉన్నది.]
……ఒక్కటే,
మన ఆదరణలు మరియు మన చింత.
118విల్సన్ సోదరి ఇంకా భవనంలోనే యున్నదా? ఇక్కడ నేనామెను చూచాను. విల్సన్ సోదరీ, కొద్దిసేపటి క్రితం నేనేమి చేయుచుంటినో నీవెరుగుదువా? మూలరాయి వేసినప్పుడు మనం తీసిన పటములను చూచుచున్నాను. నేను చిత్రములను చూచాను. నేను, హోప్, పెండ్లి కాక ముందున్న పటము చూచాను. అది నాకు తెలియదు. నేను పోరాటము చేసి వచ్చుచున్న ఒక పటము చూచిన గుర్తున్నది, ఒక ఛాంపియన్ షిప్ నేను సాధించాను. ఒక రాత్రి నా పటమును చూచుకొన్నాను. అప్పుడు నేను ఇండియానాలో, గేమ్ వార్డీన్ గా పనిచేయుచున్నాను. సంఘము గురించి నేను ఆలోచించుచున్నాను. మీరెరుగుదురు, ఆనాడున్న గుంపులో నేటి రాత్రి ఒక్కరు మాత్రమే మిగిలియున్నారని నేను తలంచుచున్నాను. ఆదిలో మనం పునాది రాయిని వేసినప్పుడు ఉన్నవారిలో ఇప్పుడిచ్చట ఎందురున్నారో చేతులు ఎత్తండి.
నా సోదరుడు, విల్సన్ సోదరి, మిమ్మును ఒక సంగతి అడుగగోరుచున్నాను. మనమెట్లు ప్రారంభించామో గుర్తున్నదా? ఆ పాత నేల గుర్తున్నదా? పూర్తిగా బురదతో నిండియుండేది. ఆ పాత కిటికీలు రాలిపోవుచుండేవి. ఎనభై సెంట్లతో దానిని మేము ప్రారంభించాము. పొదలు నిండుగా పెరిగియుండేవి. ఈ ఆలయమును ఇక్కడ కట్టినప్పుడు, ఈ స్థలమంతా అరణ్యమే.
119మనందరము ప్రమాణములను చేసి ముందుకు నడిచాము. బలిపీఠము చుట్టూ తిరిగాము. వారు వచ్చుట, వెళ్ళుట మనం చూచాము. ఒకరి తరువాత ఒకరు వెళ్ళిరి. వర్తమానముతో నిలచియుండినవారు ఎట్లు వెళ్ళిరో మీరు చూచారా? ఆలాగే వర్తమానమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని కూడా మీరు చూచారు. ఆ సంగతులను గూర్చి తలంచండి.
ఈ రాత్రి ఇక్కడ మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడున్న గుంపుకు మూడు రెట్లు ఎక్కువమంది అప్పుడుండిరి. మన సంపూర్ణ కూటములలో ఎందరుండేవారో చూడండి. దానిని గూర్చి ఆలోచించండి. స్కూలు బస్సులలో జనులు వచ్చేవారు. ఆ బస్సులను ఇక్కడ నిలిపేవారు. ఎక్కడ చూచినా ఈ స్థలంలో అవే నిండిపోయియుండేవి. గుడారములు కూడా నిండిపోయేవి. ప్రజలను ఎక్కడ కూర్చోపెట్టాలో అర్థమయ్యేది కాదు. అంత గుంపు వచ్చేది. నేనప్పుడు కేవలం ఒక బాల బోధకుడను. చూచారా? అప్పుడుండిన వేలాదిమందిలో ఈ రాత్రి ఇక్కడ ముగ్గురం మాత్రమే మిగిలియున్నాము.
120సహోదరి విల్సన్ స్థితి నాకు గుర్తున్నది. ఆమె క్షయ వ్యాధితో చనిపోవుచుండగా, నన్ను ఆమె పడక యొద్దకు పిలిపించారు. రక్తము కక్కుచుండెను. తలగడలు, దుప్పటలు రక్తములో మునిగిపోయేవి, మూలంతా రక్తమే. పరిశుద్ధాత్మ ఆ రక్తమును ఆపుట నాకు గుర్తున్నది. ఆ తరువాత కొన్ని రోజులకు యేసుక్రీస్తు నామములో ఓహయో నదిలోని మంచు నీటిలో బాప్తిస్మమిచ్చాను. నా తెరువబడిన కారులో వెనుకన ఆమెను కూర్చోబెట్టాను. అది ఒక చిన్న పాత కారు. యుటికా నుండి నడుపుకొచ్చాను. అది నిజమే గదా! అవును! సహోదరి హోప్, నా భార్య ఇంకో సోదరి ఆ ముందు భాగాన కూర్చొనిరి. అది చిన్న కారు. నా తల్లి మరియు స్నెల్లింగ్ సోదరి వెనుక నుండిరి. ఆ చిత్రము నా యొద్ద ఉన్నది. స్నెల్లింగ్ సోదరీ, శ్రీమతి. వెబర్, నా అత్తగారు, మీడా, ఇంకా మేమ౦దరము అక్కడే నిలబడియున్నాము. మిడా చిన్న బాలికగా యుండెను. ఇప్పుడామె వెంట్రుకలు నెరసినవి.
121మా మొదటి ద్రవ్య నిధి కొరకు వారు చిన్న విరాళ దినమును ఏర్పరచుట నాకు గుర్తున్నది. హోప్ ఆ మూలన నిలబడిన దృశ్యము నేను మరిచిపోలేదు. ఆమె దాదాపు పదహారేళ్ళ బాలిక. ఆమె విరాళములు పోగుచేయుట కొరకు శ్రమదానము చేయుచుండెను.
వీధిలోని ఒక త్రాగుబోతు వచ్చి ఇట్లనెను, "అమ్మా! నన్ను క్షమించు. మీరేమి అమ్ముచున్నారు?"
"ఏమీ లేదు కనుక నీకు ఈ పతకము ఇచ్చెదను." ఆమె చెప్పెను, "ఇది ఆలయమున కొరకైన విరాళము. మీరు ఏ రకముగానైనా విరాళము ఇచ్చినట్టితే, మేము ఈ నగరములో ఒక ఆలయము నిర్మించుట కొరకు విరాళములు పోగుచేయుచున్నాము. మీరు ఏదైనా ఇవ్వనున్నట్లయితే, ఇవ్వవచ్చును, కానీ…"
అతడు చెప్పెను, "నా దగ్గర ఏమీ లేదు."
చెప్పెను, "సరే ఈ పతాకము తీసికొనుము." అతడు దానిని తీసికొని చూచెను. ఒకవైపున దానికి ఇట్లు వ్రాసిరి, "నిత్యత్వమును నీవు ఎక్కడ గడుపుదువు?" ఆవలి వైపున మరో ప్రశ్న గుర్తు యున్నది. "నీ నిత్యత్వమును ఎక్కడ గడిపెదవు? ఒక ప్రశ్న."
"అతడు నిలదొక్కుకొని దానిని చూచి ఇట్లడిగెను, "సోదరీ, నీవు తీవ్రమగు ప్రశ్నను అడిగియున్నావు!"
ఆమె ఇట్లన్నది, "దానిని పరిష్కరించుట తప్పనిసరి!" మరియు అది నిజము. ఈ రాత్రి ఆమె తెరను దాటి వెళ్ళిపోయినది. ఆమె చెప్పిన చివరి మాటలు నాకు గుర్తున్నవి. ఆమెతో నేనేమి చెప్పానో గుర్తున్నది; అది నేను మరువలేదు. అవునండీ!
122నదిలోని నీరు చాలా తగ్గిపోయినది. మేము వాడుకగా నిలబడే చోటు ఒకటుండేది — ఆలయము అసలు లేనప్పుడే ఇక్కడ మేము నిలబడి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పాటలు పాడుచుండేవారము. ఆ పాటను ఇప్పుడు నేను వినగలను. మిర్టిల్ అప్పుడు ఒక చిన్న బాలిక. చిన్న లీరోయ్ పటము నాయొద్ద ఉన్నది. అక్కడామె నిలబడియున్నది. చాలా చిన్న వ్యక్తిగా ఉండేది.
ముడివేయు బంధము దీవించబడును గాక,
క్రైస్తవ ప్రేమలో మన హృదయములను;
ఒకే మనస్సుగలవారి సహవాసము,
పైనున్న దానికి సమానము.
దానిని మేము పాడినప్పుడు అక్కడ చాలామంది ఆవల ఆయన రాక కొరకు ఎదురు చూచుచుండిరి.
… మనం విడిపోదుము,
అందువలన అంతరంగమందు నొప్ళి కలుగును;
(ఆ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారా?)
అయినా ఇంకా మనం హృదయంలో కలిసేయుందుము,
మరల కలిసికొందుమను నిరీక్షణ.
123ఫ్రీమాన్ సోదరుడా, అక్కడికి నీవు సమీపంగా యున్నావు గదా? నేను ఆలోచించుచున్నాను. నీవు సహోదరుడు రాయ్ యొద్దకు వెళ్ళుట నాకు తెలియును. అడరాక్స్ నీకు గుర్తున్నాడా? కెన్నెత్ నాకు తెలియును. అతని సోదరి పేరు ఏమిటి? వారి చిత్రము నాయొద్ద ఉన్నది. మేమందరము ఒకరి చేతులు ఒకరము పట్టుకొని ఆలాగు గుండ్రంగా అక్కడ నిలబడి యున్నాము. ఆ స్థలమందు నిలిచాము. డాక్టర్ రాయ్. ఇ. డేవిస్ సంఘకాపరి. కొద్దిసేపటి క్రితం ఆ చిత్రములను నేను చూచాను. డాక్ ఆ పాత చిత్రములను తీసికొని వచ్చెను. నన్ను చూచుకొని నాకే అందులో నవ్వు వచ్చినది. అందులో చాలామంది వెళ్ళిపోయిరి, చూచారా - వెళ్ళిపోయిరి. మనం వెళ్ళుటకు కూడా ఇంకెంతో సమయము లేదు, చూచారా.
కాని మనం విడిపోవునప్పుడు,
అంతరంగమందు నొప్పి కలుగును;
అయినా ఇంకా మనం హృదయంలో కలిసేయుందుము.
మరల కలిసికొందుమను నిరీక్షణ.
124సహోదరుడు బోస్వర్త్ మీకు గుర్తున్నాడా? అతడు వెళ్ళిపోవు ముందుగా గదిలో లేపబడెను, నేలమీద నడిచెను, తన తల్లిదండ్రులతోను, తాను క్రీస్తు కొరకు సంపాదించిన వారితోను కరచాలనము చేసెను. వారు చనిపోయి నలుబది లేదా ఏబది సంవత్సరములయి యుండును. వారు ఆ గదిలో నిలచియుండినట్లు అతడు చూచెను. అందరూ తమను చూడవలెనని వారు కోరుచున్నట్లుగా కనబడెను. అది ఏమిటి? పాత పురుషుడు ఆ దేశములోనికి దాటిపోవుచున్నాడు. ఆ ఉదయమున దర్శనములో దానిని నేను చూచాను.
వారిని అక్కడ నేను చూచాను; వారు మరల యవ్వనులయిరి. ఇంకా మనం హృదయాలలో కలిసేయున్నాము; మరల కలిసికొందుమను నిరీక్షణ మనకున్నది. అది నిజము. దేవుడు మిమ్మును దీవించును.
125భవనం వెనుకకు నేను చూచాను, నా నల్లజాతి స్నేహితుల గూర్చి మాట్లాడుచున్నాను. మరియు ఆ వెనుకన నాష్ దంపతులు కూర్చొనియుండుట నేను చూచాను. మీరక్కడున్నారని నేనెరుగను. వెనక్కుచూచుట జరిగినది. వారు బాగా వెనుకయున్నారు. మరో సోదరుడు ఇచ్చట కూర్చొనియున్నారు. మధ్య మధ్యలో నన్ను ఉత్తేజపరచుటకు పెద్ద కేకను వేయు సోదరుడు అతడేనా? ఇక్కడతడు కూర్చొనియున్నాడు. అతని పేరు నాకు గుర్తుకొచ్చుటలేదు. సహోదరుడు ఉడ్ అతనితో మాట్లాడినట్లు చెప్పెను. "మీరెరుగుదురా? ఆత్మ నన్ను తాకినప్పుడు నేను కేకలు వేయుదును, "హే!" ఎవరినీ ఆటంకపరచుట లేదని తలంచుచున్నాను," అని చెప్పెను. నీవు "హే!" అని అరవనప్పుడే నాకు ఆటంకము కలుగును. దేవుడు నిన్ను దీవించును. సోదరీ, సోదరుడా, మిమ్మును నేను ప్రేమించుచున్నాను. అది నిజము.
సహోదరుడు నాష్ మరియు సోదరి నాష్, మిమ్మును నేను ప్రేమించుచున్నానని మీరెరుగుదురు. అవునండీ! మీరు క్రీస్తు యేసునందు నా సోదర, సోదరీలు.
126ప్రియమగు స్నేహితులు, చాలా మంది, ఒకవేళ నేను వారిలో కొందరిని కోల్పోయినయెడల, మీ కొరకు ఇక్కడి తలుపులు తెరచియుంచాము. పరలోక ద్వారములు కూడా తెరువబడే యున్నవి.
ఇంకా మన హృదయములు కలిసేయున్నవి.
మరల కలిసికొందుమను నిరీక్షణ యున్నది.
నా విశ్వాసము నీ వైపు చూచుచున్నది. దానిని మనము పాడుదుము. ఇప్పుడు మరోసారి ఆ పాటను పాడుదము. ఇప్పుడు ఇంటికి వెళ్ళు సమయము అయినది.
నా విశ్వాసము నీవైపు చూచును,
ఓ కల్వరి గొర్రెపిల్లా,
ఓ దైవ రక్షకా!
నా ప్రార్థనను వినుము
నా పాపములన్నీ పరిహరింపుము,
ఓ, ఈ రోజు నుండి పూర్తిగా నన్ను నీ వానిగా ఉంచుము!
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అను పాటను మరల ప్రయత్నించెదము. పాడెదరా? సోదరీ, పాటకు ప్రారంభమిమ్ము. అది మీకు తెలియునా? సోదరీ గెర్టీ తదితరులు దానిని పాడే వారు మీకు గుర్తున్నదా?
127పశ్చిమాన పగలు మరుగవుచున్నది. ఆకాశములు భూమి దీవించబడినది. సాయంకాల సూర్యాస్తమయము నాకెంతో ఇష్టము. దిగిపోవును. పిట్టలు తమ చివరి కోలాహలము చేయును. అది మనలో ప్రతి ఒక్కరికి వచ్చును. అది సాయంకాల సమయము. మీరు గమనించండి, గాలి వీచుట ఆగును. పిట్టలు నెమ్మదిగా ఉండును, చూచారా. అది లోకము యొక్క మరణము, రేపు ఉదయం మరల జన్మించుట కొరకు పగలు చనిపోవుచున్నది. ఇప్పుడు చూడండి. వీలయితే దానిని మనం ప్రయత్నించుదము.
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువగు దేవుడు మహాన్నతుడు
ఒక్క నిమిషం ఇట్లు రమ్ము. ఆ రాగము నాకు తెలియదనుకొనుచున్నాను. సంగీతము లేకుండానే దానిని పాడ ప్రయత్నించెదను. చూచారా? దానిని పాడగలమో లేదో చూద్దాం. నేనది తప్పుగా పాడవచ్చును. చూచారా? మీరిప్పుడు నాకు సహాయము చేయుడి, అందరూ తోడ్పడండి, ఇప్పుడు.
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువగు దేవుడు మహోన్నతుడు!
భూమ్యాకాశములు పూర్తిగా నీవే.
భూమ్యాకాశములు నిన్ను స్తుతించును,
ఓ, మహాన్నతుడగు దేవుడా!
మీకది ఇష్టమా? అది మీలో ఒక అనుభూతి కలిగించుట లేదా? మరల దానిని ప్రయత్ని౦చుదాం!
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువగు దేవుడు!
మహాన్నతుడు భూమ్యాకాశములు వ్రూర్తిగా నీవే;
భూమ్యాకాశములు నిన్ను స్తుతించును,
ఓ, మహాన్నతుడగు దేవుడా!
128నాకది ఇష్టము, మీకు కాదా? ఆ మంచి పాత పాటలు నాకు ఎంతో నచ్చును. నాకిష్టమగు ఆ పాటలలో ఏదో యున్నది. మీరు ఈ చిన్న కత్తిరింపు పాటలన్నీ పాడుకొనండి. కాని వాటిని నాకు ఇవ్వండి; నాకది ఇష్టము. చీల్చబడిన తెరను దాటుము. ఇంకా మంచి పాటలున్నవి. ఆ పాటలు నాకు ఇష్టము. పాడుట ఆరాధనలో ఒక భాగమని తలంచుచున్నాను. (అవునయ్యా!), ప్రభువుకు స్తుతి గానము చేయవలెను.
సరే మంచిది, ఇప్పుడు మనం ముగించుదము - యేసు నామమును నీతో కొనిపొమ్ము అను పాటను పాడుదాం. మనం ఇప్పుడు నిలబడియుండగా ప్రభువు మిమ్మును దీవించును గాక.
యేసు నామమును నీతో కొనిపొమ్ము,
దుఃఖము మరియు శ్రమతో నిండిన బిడ్డా!
అది నీకు ఆనందమును, ఆదరణను ఇచ్చును.
ఓ, నీవు వెళ్ళు ప్రతి చోటకి దానిని కొనిపొమ్ము,
ప్రశస్త నామము, ఓ, ఎంత మాధుర్యము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము
ప్రశస్త నామము, ఓ ఎంత మధురము
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము,
ఇప్పుడిచ్చట నాకు ఇష్టమగు వచనమున్నది, అదిప్పుడు మీ అందరికీ ఆదరణగా నుండును. ఏమి చేయుదము?
యేసు నామమును నీతో కొనిపొమ్ము
ప్రతి బంధకము నుండి తప్పించు కొ౦దుము; (వినండి!)
శోధనలు నిన్ను చుట్టుకొన్నపుడు
(నీవేమి చేయవలెను?)
ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.
ప్రశస్త నామము, ఓ ఎంత మాధుర్యము!
భూలోకనిరీక్షణ పరలోక ఆనందము
ప్రశస్త నామము, ఓ, ఎంత మధురము!
భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము,
ఇప్పుడు మన శిరములు వంచుదము,
తిరిగి మనం కలిసికొను వరకు
తిరిగి మనం కలిసికొను వరకు
యేసు పాదముల యొద్ద తిరిగి మనం కలిసికొను వరకు
(మనం కలిసికొను వరకు.)
మనం కలిసికొను వరకు,
మనం కలిసికొను వరకు,
దేవుడు మీకు తొడైయుండు గాక…