కోత కాలము

కోత కాలము

1సహోదరుడు విలియమ్స్ మీకు కృతజ్ఞతలు. స్నేహితులారా, ఉదయకాలపు వందనములు. ఈ ఉదయమున ఇక్కడుండుట ఒక విశేషమైన కార్యముగా నున్నది. మరియు నన్ను గురించిన పరిచయ వాక్యములను వినుచున్నప్పుడు అవి నన్నునేను ఇంకా కొంచెం తగ్గించుకునేలా చేయుచున్నది. మరియు ఫినిక్సకు ఈ ఉదయమున రాగలిగిన ఈ యొక్క అవకాశము కొరకు నేను చాలా కృతజ్ఞునిగా యున్నాను.

నేను మొదటిసారి ఫినిక్సుకు వచ్చినప్పుడు, నేను సుమారుగా పదునేడు సంవత్సరములు వయస్సు గలవానిగా నుండుట నాకు జ్ఞాపకమున్నది. అప్పటికంటె ఇప్పుడు ఇది బాగా అభివృద్ధి చెందియున్నది. ఈ రోజు ఉదయమున మేము టూసాన్ నుండి బయలుదేరి ఫినిక్సుకు వచ్చిన సమయమే తెలియ లేదు, ఏలయనగా వచ్చు దారి యంతయును అనేక కట్టడములు లేచియున్నవి. మేము ఆ ఎడారి వలె నున్న అంతట గడ్డి గల చోట్లలో తిరుగులాడుచుండెడివారము, మరిప్పుడు అక్కడ హోటళ్ళు మరియు పెద్ద అంగళ్ళను, మరియు మొదలగునవి వెలసియున్నవి. మరి ఇవన్నియును నాకు వయస్సగుచున్నదని చూపించుచున్నది.

2నా అమూల్యమైన సహోదరుడు వాల్టెజ్ ప్రక్కన నేను కూర్చొని మరియు మేము మాట్లాడుకొంటిమి. మరియు నేను చెప్పితిని, "మంచిది, సహోదరుడా…" మరియు నేను చెప్పాను, "మంచిది, నాకు వయసగుచున్నది…" మరియు నేను చెప్పాను, "మంచిది, నాకు వయసగుచున్నది." మరియు "నా జీవిత యాత్రలో అనేక మైళ్ళను నేను దాటివచ్చానని గ్రహించగలుగుచున్నాను" అని నేను చెప్పితిని, "నా వయస్సు అయ్యేంత వరకు నీవు వేచియుండుము," లేదా అంటువంటిదేదైనా. అతడు నా కంటె పండ్రెండు సంవత్సరములు పెద్దయని తెలుసుకొని నేను ఆశ్చర్యపడ్డాను. కావున నేనప్పుడు మంచి అనుభూతినొందాను. నేను అడిగాను, " సహోదరుడు వాల్టెజ్ నేను నిన్ను కోరుచున్నాను… నీవు ఎంతకాలముగా సువార్తను ప్రసంగించుచున్నావు?"

"ఏబది సంవత్సరములుగా" అని అతను చెప్పెను.

సరి, అతను ప్రసంగించుచున్నప్పుడు నేను ఒక చిన్న పిల్లవానిగా నుంటిని. కావున "ఈ ఉదయము ఆరాధనను నీవు తీసికొనవలయునని నేను కోరుచున్నానని సహోదరుడు వాల్టెజ్ తో చెప్పాను. నేను చెప్పాను, "నేను ఒక యౌవ్వనస్తున్ని నేను "పెద్దలకు" మునుపు ప్రసంగించుటను కోరను."

"నేనిక్కడికి ఎందుకొరకు కారు నడుపుకొని వచ్చియున్నానని నీవు అనుకొనుచున్నావు?" అని అతడు నవ్వుచూ చెప్పెను.

కావున సహోదరుడు వాల్టెజ్ ను నేను కృతజ్ఞునిగా యున్నాను. ఇక్కడొక విశ్రాంతి గది ఒకటున్నదని అతను నాతో చెప్పుచుండెను. అది నిజముగానే చాలా బాగున్నది. దానిని నేను మెచ్చుకొనుచున్నాను. ఏదో ఒక సమయమున నన్ను అక్కడికి వచ్చి వారిని దర్శింపవలయునని కోరెను. మరియు అది ఇక్కడున్న క్రొత్త నది ప్రక్కనున్నది. అదెక్కడున్నదని మీరెవరైనను ఎరిగియున్నారాయని నాకు తెలియదు. నాకు నిశ్చయముగా తెలియును, వాల్టెజ్ కుటుంబస్తులు ఎవరైనను దానితో సంబధింపబడియున్న యెడల అది బాగుగానే యుండును.

3కావున ప్రతి యొక్కక్కసారియును నేను ప్రత్యేక కూటములకు వచ్చునప్పుడు స్వస్థత నొందు ఎవరినో లేక ఆ విధముగా ఎవరినో యొకరిని సంధించుచుండెదను. మరియు ఈ ఉదయమున నేను బల్లయొద్ద నిలుచుకొని యుండగా, ఎర్స్ అను పేరు గల ఒక అమూల్యమైన సహోదరి ఇక్కడ కూర్చొని యుండెను, ఆమె మిచిగాన్ నుండి వచ్చుచున్నది. ఇక్కడున్న క్రైస్తవ ఆకాశవాణి కేంద్రములో ప్రకటనలను ప్రకటించువాడుగా ఉంటున్నాడు. స్లింటన్, మిచిగాన్ అను స్థలములలో జరిగిన కూటములకు ఆమె హాజరయినట్లుగా నాతో చెప్పెను. ఆమె ప్రార్ధనా అట్టను కలిగియుండెను, మరియు ప్రార్థించుకొనుటకు ఆమె చాలా ప్రయత్నించెను, కాని అది ఆమెకు సాధ్యము కాకపోయెను. మరియు ఆమె చాలా తీవ్రమైన వ్యాధితో నుండెను. మరిప్పుడు ఈ ఉదయమున, ఈ స్థలములో ఈ ప్రక్కగా నిలుచుకొని యున్నప్పుడు, దేవుడు ఆమెను స్వస్థపరచెనని నేను నమ్ముచున్నాను.

నేను చెప్పాను, "ఇప్పుడు ఎటువంటి సమయమిది! ఇప్పుడు ఫినిక్సు అని పిలువబడుచున్న ఈ నగరము పండ్రెండు, పధ్నాలుగు సంవత్సరములకు మునుపు, ఫినిక్సు, అనగా, శిథిలమైన స్థితిలో నుండి కట్టబడినదని అర్థము." నేను చెప్పాను, "సరి, ఈ ఉదయము అదే విధమైన కార్యము మీకు సంభవించియున్నది. క్షీణించిన అనారోగ్య దశ నుండి మంచి ఆరోగ్యకరమైన స్థితికి ఈ ఉదయమున దేవుడు నిన్ను కట్టి యున్నాడని నేను నమ్ముచున్నాను.

JAS 4:2

 

4గత సాయంకాలమున నాకు అనేక పిలుపులు టెలిఫోను ద్వారా వచ్చినవి. నేను మీ పొరుగువాడను, నేను టూసాన్లో యున్నాను మరియు అనేక పిలుపులు వచ్చినని వాటి నుండి నేను వదలి రాలేకపోయాను, కావున ఫోను ద్వారా వారి కొరకు ప్రార్థించుచుంటిని. మరి వారు వారి యొక్క ఫోను నెంబరులను ఇవ్వవలసి యు౦డేను.

మరియు మతిస్థిమితమును కోల్పోయిన ఒక పాత క్రైస్తవ స్త్రీ, ఎనభై-ఏడు సంవత్సరముల వయస్సు గల ఒకామె యుండెను. ఆమె తన యొక్క బిడ్డను ఎవరో తీసికొని పోయున్నారని వీథులలో కేకలేయుచు పోలీసులను పిలచుచునుండెను, చూశారా, ఎనభై-ఏడు సంవత్సరముల వృద్ధురాలు, ఆమె మతి స్థిమితముగా లేకుండెను. మరియు ఆమె ఒక ప్రియమైన వృద్దురాలు. ఆమెను నా జీవితములో నేను ఎరుగను. మరి బిల్లీ ఫోను చేసి మరి చెప్పెను, "వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళుము," చెప్పెను "ఆ స్త్రీ చనిపోవు స్థితిలోనున్నదని వారనుకొనుచున్నారు." చెప్పెను, "ఆమె… తన్నుతాను మరచిపోయి తాను ఎవరైనది ఎరుగకున్నది."

పిమ్మట నేను టెలిఫోను రిసివర్ను అట్టే వ్రేలాడదీసి మరి గదిలోనికి వెళ్లి మరి ప్రార్ధించితిని. కొన్ని క్షణములలో ఆమె నిద్రించెను. ఆమె మరల లేచెను, సాధారణముగా మంచి స్థితిలోనే యుండి, ఒక పూర్తి కోడితో రాత్రి భోజనమును ముగించి, పిదప ఐస్ క్రీము మరి కేకును కూడా తినెను. అవును.

మీరు చూశారా, దేవుడు సర్వాధికారి. ఆయన నిజముగా అన్ని చోట్లను నున్నాడు, ఆయన… మీరు అక్కడ ఉండవలయునని కాదు; ఊరకనే దీనిని అడుగుడి.

ఈ రోజు ఉదయము ఇక్కడున్న మన నాయకుడు, లేక వేరేవరో లేక సహోదరుడు వాల్టెజ్ అతని యొక్క ప్రార్థనలో చెప్పెను, "మనము అడుగకుండా యుండుటవలన మనము పొందకుండా యున్నాము, మనము ఎందుకు అడుగకుండా యున్నామనగా మనము నమ్ముట లేదు."

5ఇక్కడున్న యౌవ్వనస్తులు పాడిన పాటలను నేను మెచ్చుకొనుచున్నాను. నేను, వాల్టెజ్ పోలిన వయస్సు ముదిరిన వారమందరమును ఆ యొక్క యౌవ్వనస్తుడు యేసును, అతను తెలుసుకొన్న దానిని గురించి చెప్పిన సాక్ష్యమును దానిలోని నిజాయితిని గురించి మెచ్చుకొనుచున్నాము.

అనేక సమయములలో ఈ యొక్క నలుగురు కూడుకొని పాటలు పాడుట, నేను… ఇది ఇంకొక వాక్య సేవకుని పలుకు, సహోదరుడు వాల్టీజ్ చెప్పెను, "కొన్ని సమయములలో వారు ఒక పండ్రెండు నాణముల వలె వచ్చెదరు." ఏలయనగా ఈ రోజులలో అది పెంతెకోస్తు వారు ఒక కాలములో కలిగియున్న పరిశుద్ధత మరియు నిజాయితి వంటి కార్యములకు బదులుగా వారు పాడు పాటలు వారి యొక్క ప్రతిభను చూపించునట్లుగా యున్నది.

మరియు ఈ యొక్క బాలుర యొక్క నిజాయితిని, నేను దానిని మెచ్చుకొనుచున్నాను. బాలులారా, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. మరియు నేను…

6నేను టెలివిజన్ను మెచ్చుకొనను. మరి మీకు తెలిసిన విధముగా దానికి నేను వ్యతిరేకిని. ప్రభువు చిత్త ప్రకారము మా గృహము సరిగా కుదురు వరకు నేను టూసాన్లో ఒక స్థలమును అద్దెకు తీసికొనియున్నాను. మరి మాకు అద్దెకు ఇంటిని అద్దెకిచ్చిన ఆ ఇల్లుగలామె ఒక మంచి క్రైస్తవ స్నేహితురాలు, అయితే ఆమె తన ఇంటిలో ఒక టెలివిజన్ను కలిగియున్నది. సరి, నాకు చిన్న పిల్లలు కలరు మరి మీకు తెలియును వారు ఎట్లు౦డెదరుయని, మరి వారు దానిని చూచుటకు వెళ్ళుచుండెడివారు. కావున రెండు దినములకు మునుపు నేను సహోదరుడు స్థామల్తో బయటి ఊరి నుండి వచ్చితిని… ఈ ఉదయము ఇక్కడ స్థామల్ ఉన్నాడో లేడోయని నాకు తెలియదు, అతను టూసాన్ వర్తక సంఘమునకు అధ్యకుడు. నా యొక్క చిన్న కూతురు ఇక్కడ వెనుక కూర్చొని యున్నది, టి. వి. చూచుటకు లోనికి రమ్మని పిలిచెను, చెప్పెను, "మంచి పాటలు పాడు నలుగురు కలసి పాడు గానము వినుటను టెలివిజన్లో చూడబోవుచున్నాము," లేక, అది ఏది ఏమైనను.

సరి, ఇప్పుడు, నేను ఒక మంచి విమర్శకుడని, మరియు నన్ను అందులకై మన్ని౦చుడి, అయితే, నేను ఎట్లున్నానో ఆ విధముగానే యుండెదను. నాకు నేను మార్చుకొని యుండలేను, నటించలేను ఆ విధముగా నటించిన యెడల నేను ఒక వేషదారినగుదును. ప్రజల ముందు నేను వేషదారిగా నుండుటకు కోరుకొనుట లేదు. నేను ఎట్లున్నానో ఆ విధముగానే ఉండదలచుచున్నాను, మరప్పుడు మీరు మనమెట్లు నిలుచుకొని యున్నామో తెలిసికొనెదరు. మరియు నేను కొద్దిగా అధికముగా విమర్శించుచున్నానని అనుకొనుచున్నాను.

అయితే, ఇప్పుడు దానిని నేను విమర్శించుటకు నా హృదయములో ప్రోత్సహింపబడి యున్నాను, ఏలయనగా ఆ టి.వి.లో కార్యములన్నియును హాలివుడ్లో ఉండు సినిమాలవలె నున్నవి. దానిలో పవిత్రత లేదు. వారు బంగారు రంగుగల చెప్పులను తొడుగుకొని మరియు రాక్-అండ్-రోల్ పద్దతిలో క్రైస్తవ పాటలను పాడుచున్నారు. సువార్తయనునది రంగు పూసుకొని వేషము ధరించునదియా విధముగానున్న యెడల వాటితో నాకు ఏ విధమైన సంబంధము లేదు. నేను నిజమైన మరియు స్వచ్చమైన దానిని కోరుకొనుచున్నాను మరియు దానిని ఆ విధముగానే పవిత్రముగా మనము అనుసరింపవలయును.

ఇప్పుడు, ఇక్కడ ఉంచబడియున్న మైకు మరియు ప్రసారము చేయు పరికరములు సరిగా అమర్చబడియున్నవని నేను నమ్ముచున్నాను సహోదరులారా. ఇప్పుడు నేను చెప్పునది సరిగా వినబడుచున్నదా?

7ప్రభువు చిత్తమైన యెడల రానున్న శనివారము ఉదయము నేను మొట్టమొదటి సారిగా అరిజోనాలో ప్లాగ్స్ స్టాఫ్ అను చోటనున్న వ్యాపారస్తుల కూడికలో ప్రసంగించు భాగ్యము నాకు దొరికినది. ఇక్కడున్న సహోదరుడు దానికి అధ్యక్షుడు, అతని పేరు నేను మరచి పోయున్నాను. [ఒక సహోదరుడు చెప్పుచున్నాడు, "చెస్టర్ ఎర్ల్,"] చెస్టర్ ఎర్ల్, సహోదరుడు చెస్టర్ ఎర్ల్. ఈ రోజు ఉదయము ఇండియా నుండి వచ్చిన మంచి సువార్త సేవకునితో నేను కరచాలనము చేయుచున్నప్పుడు, ఒక ఇండియన్ సహోదరుడిని సంధించు అవకాశము నాకు దొరికినది. మరియు అతడు అప్పుడు చెప్పెను, రానున్న శనివారము నేను అక్కడ మాటలాడబోవుచున్నానని. ఈ యొక్క కూటమునకు మీరందరు ఆహ్వానింపబడుచున్నారు. దేవుడు మనలను ఆశీర్వదించునని మనము నమ్ముచున్నాము.

మరల పిదప రానున్న సోమవారము రాత్రి టూసాన్లో విందు కలదు. అక్కడ ఇరవై ఒకటవ తేది డిసంబర్ జరుగు విందులో టూసాన్లో నేను మాట్లాడు భాగ్యమును ప్రభువు నాకిచ్చియున్నాడు. ఆ రాత్రి జరుగు విందులో మీరు వచ్చి కలుసుకొనులాగున ఆహ్వానింపబడుచున్నారు.

మరియు సహోదరుడు విలియమ్స్ ప్రకటించిన ప్రకారము ప్రత్యేక కూటములకు మునుపు నేను పరిచయ కూటములను నడపుటకు మరల వచ్చెదను.

8మరి కావున… అక్కడ సహోదరుడు విలియమ్స్. అక్కడ… ఏమి చెప్పబడుచున్నది? విద్యుత్ సరఫరా సరిగ్గానున్నదా? ఇప్పుడు సరిగ్గానున్నదా? అది బాగున్నది. మంచిది.

మీలో అనేకులు ఒకటి లేక ప్రతి రాత్రి మరియు పగలు జరుగు కూటములకు హాజరు కాగలరని నేను నమ్ముచున్నాను. అది ఆదివారము మధ్యాహ్నము ఏడు గంటలకు, పదునేడవ తేది ఆరంభమగును కదూ? [ఎవరో చెప్పుచున్నారు, "ఒకటిన్నర."] ఒంటిగంట-ముప్పది నిమిషములకు ఆదివారము మధ్యాహ్నము ఒంటిగంట-ముప్పది నిమిషములకు ప్రభువు చిత్తమైన యెడల ఆ యొక్క కూటములలో వ్యాధి గ్రస్తులకు కూడా ప్రార్ధి౦పవలయునని యున్నాను, మరియు నా వలన వీలైన౦తయును మీకు సహాయపడ వలయునని యున్నాను.

9మరియు ఈ ఉదయమున ఫినిక్స్ పరిసరములలో నుండి వచ్చిన సువార్త సేవ చేయు సహోదరులారా. ఈ యొక్క మండపమునకు నేను వచ్చిన కారణము నేను… ఒక్కొక్క సారియు నేను వచ్చునప్పుడు, నేను నాలుగు దిశలకు వెళ్ళవలెననే ఉద్దేశముతో ప్రతి సంఘమునకును వచ్చుచున్నాను. మరియు కొన్ని సంఘములు చాలా చిన్నవిగా నుండుట వలన అక్కడకు వెళ్ళుటకు నాకు చాలా కఠినముగా నుండును. ఏ ఒక్క సహోదరుని యొక్క సంఘమును విడిచిపోవుటకు మేము యిష్టపడము, అయితే వారి సంఘము యొక్క స్థలము చిన్నది అందువలన మరియు జనులు లోపలికి ప్రవేశించుటకు కూడా కష్టపడుదురు, అది చాలా ఇబ్బందిగా వుండును. అందువలన… మనమందరము ఒక చోటు కలుసుకొని, మరియు దానికి నేనే బాధ్యతను వహించి చూచుకొనవలెనని నేను తలంచితిని, మనమందరము ఇక్కడ ఒక్కటిగా కూడుకొని ఆరాధనను కొనసాగించి, ఒక చిన్న సువార్త కూడికను జరిపి మరియు వ్యాధి గ్రస్తుల కొరకై ప్రార్థించెదము మరియు ఆ విధమైన కార్యములను జరుగుతాయి. మునుపు…

10నేను ఇంకొక మైకు యొద్దకు వచ్చిన యెడల బాగుగా వినిపించునా? [ఎవరో చెప్పుచున్నారు, "వద్దు, అది టేపుకు సంబంధించిన భాగము."] అది టేపుదా. సరి మంచిది.

మరియు నేను ఆ విధముగా చేసిన యెడల బాగుండును. మేము ఈ విధముగా చేయుటకు కారణము, ఇక్కడ ఈ యొక్క హాలులో వచ్చి మనమందరమును ఒక్కటిగా కూడుకొనుట అందరికి ప్రయోజనకరముగా నుండునని దీనిని ఇక్కడున్న సహోదరులు, సంఘము నుండి వచ్చియున్నవారు, ఫినిక్సులోని కాపరులు తెలిసికొనవలయునని నేను కోరుచున్నాను. ఇక్కడ అనేక సహోదరులు ఉన్నందు వలన మీరు ప్రతియొక్కక్కరిని వేరు వేరుగా సంధింపలేరు. ఈ ఉదయమున ఇక్కడ నిలుచుకొనియున్న వారిలో వారు సగము కూడా ఉండరు. ప్రత్యేక కూటములకు మునుపు ఉన్న ఈ కొద్ది దినములలో వారినందరిని ఇక్కడకు రప్పించుట చాలా కఠినమైన కార్యముగా యుండును.

మరియు ప్రత్యేక కూటములలో మనకు గొప్ప సమయము ఉండబోవుచున్నదని నేను నిశ్చయముగా నున్నాను. గొప్ప ప్రసంగికుల ప్రసంగములను మీరు వినబోవుచున్నారు. ఈ యొక్క సహోదరుడు కాష్, కాష్ హామ్బర్గ్, హామ్ బర్గ్. మై, అతని యొక్క ప్రసంగములను మీలో ఎందరు వినియున్నారు? అతను నిశ్చయముగా ఒక తుఫాను. అవును. నన్ను మన్ని౦చుడి, నేను ఆ విధముగా చెప్పియుండకూడదు. అతనొక సహోదరుడు, అయితే, మై, అతనితో కూడా నేనొక సారి కలిసియుంటిని. ఆ విధముగా ప్రసంగించిన ఒక వ్యక్తి ప్రసంగమును మీరు వినిన పిదప, నేను ప్రసంగించే ప్రసంగమును వినుటకు మరల మీరు ఎట్లు వచ్చుచున్నారో నాకు అర్థమగుట లేదు. అతడు శ్వాసను వదలకుండా మాటలాడగలడు. అతను ఆ విధముగా ఎట్లు చేయునో నేను తెలియుట లేదు, నేను… అయితే ఆ విధముగా అతను అధికముగా ప్రసింగింపగలడు. సమీపకాలములో న్యూయార్కులో జరిగిన కూటములో నేను అతనితో కూడా వెళ్ళితిని. కూటములు ముగిసిన పిదప అతను నన్ను రాత్రి భుజించుటకు అతనితో రమ్మని చెప్పి నన్ను పిలుచుకొనిపోయెను. మరియు నేనతనితో వెళ్ళిన పిదప భోజనము ముగించుకొని బయటికి వచ్చిన పిదప ఆ సహోదరుడు… అతను క్రిందికి, పైకి ఎగురుచు నేలపై ప్రసంగించెను మరి చుట్టు ప్రక్కలనున్న వారందరును అక్కడ అతనిని చూచిరి. అతను మరి ఆ విధముగా తనకుతానే ఒక ప్రత్యేమైన గుణములు కలిగిన ఒక వ్యక్తి.

1CH 17:2

 

11మరియు కాలిఫోర్నియా నుండి వచ్చిన సహోదరుని యొక్క ప్రసంగమును కూడా మీరు విని ఆనందించితిరని నేను నమ్ముచున్నాను. అతని పేరు ఏమిటి? అతని పేరు నాకు గుర్తుకు రాకున్నది, అతను కూడా ప్రసంగికులలో ఒకతను. నేను అతని పేరును కూడా మరచిపోయాను. అయితే అతను వేగముగా ప్రసంగించు ఒక ప్రసంగికుడు, మరియు మీరు అతని ప్రసంగమును విని ఆనందించెదరు. సహోదరుడు రాబర్ట్స్ మరియు ఈ దినములలో అటువంటి గొప్ప వ్యక్తులు ఎందరో గలరు.

కావున, ఈ సమయములో నాకు జ్ఞాపకములో వచ్చుచున్న ఒక లేఖన వాక్యమును గురించి తలంచుటకు నేను కృతజ్ఞానిగా యున్నాను. మరియు గుడారములోనున్నటువంటి ప్రభువు యొక్క మందసమును ఒకప్పుడు దావీదు చూచెను. మరియు అతను చెప్పెను… ఆ రోజులలో ప్రవక్తైన నాతానుతో అతను కూర్చొనియుండెను. కావున, అతను చెప్పెను, "నేను దేవదారు మ్రానులతో నిర్మింపబడిన గృహములో నివసించుచుండగా, నా ప్రభువు యొక్క నిబంధన మందసము గుడారములో నుండుట సరియా?"

మరియు ప్రవక్త అతనితో చెప్పెను, "యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను." ఏమి చెప్పవలయునో అతనికి తెలిసిన దంతయూ అదే.

అయితే ఆ రాత్రి యొహోవా వాక్కు ప్రవక్తయగు నాతానునకు ప్రత్యక్షమై మరి సెలవిచ్చెను, "నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, గొర్రేల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి, ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను," పెద్ద పేరు కాదు, గొప్ప పేరు కాదు, అయితే ఆ యొక్క సమయములో భూమిపై గొప్ప వారిగానున్న ఘనులతో అతనిని కూడా ఒకనిగా ఎంచియున్నాను.

మరియు నేను తలంచుకొంటుని, "దేవుని యొక్క కృప అక్కడ దావీదుకు అనుగ్రహించబడును!" మరియు నేను తలంచితిని, నాకునేనుగా లెక్కించుకొనగలను. "మనము జీవించుచున్న ఈ ప్రపంచము యొక్క సమాప్తమయ్యే దినములలో, మరియు ఈ యొక్క కూటమునకు హాజరైన వ్యక్తులతో లెక్కింపబడుట ఈ దినము యొక్క భాగ్యముగా నున్నదనుటను నేను కనుగొనుచున్నాను." మరి ప్రభువు మిమ్ములను నిజముగానే నిండుగా ఆశీర్వదించును.

12నా యొక్క మంచి స్నేహితుడు సహోదరుడు వాల్డెజ్ చెప్పెను, "సహోదరుడు బ్రెన్హాం, నేను 9:45కు లేక 10, 15కు వెళ్లిపోవలయును, కావున మిమ్ములను తొందర పెట్టక నేను పోవునట్లు చివరగా కూర్చొనెదను." అతను ఇంతకు మునుపు కూటములకు వచ్చియున్నాడు.

నేను ఒక విధముగా చాల నెమ్మదిగా మాటలాడెదను, నేను మాటలాడునప్పుడు, మీకు తెలియునా యోచించి పలికెదను. మరియు నేను నా యొక్క లేఖనములను ఇక్కడ గుర్తించుకొని యున్నాను, అయితే నేను వెనుదిరిగి మరి ప్రభువు నాతో ఏమిచెప్పెనో యని యోచింపవలసినదిగా యున్నది, మీకు తెలియునా, నేను ఆయన కొరకు కాచుకొనియుండవలసినదిగా యున్నది. మరియు నేను చాలా మెల్లగా పోయెదను, కావున ఈ ఉదయము మిమ్ములను అధిక సమయము ఉంచనని నేను నమ్ముచున్నాను.

నేను సహోదరుడు విలియమ్స్ ను అడిగియున్నాను, "సహాగోదరుడు విలియమ్స్, నాకు ప్రసంగించుటకు ఎంత సమయము కలదు?" అని నేను అడిగితిని. నేను చెప్పాను, "ఇప్పుడు, నా యొద్ద ఒక లేఖన వాక్యము కలదు దానిపై నేను ప్రసంగించుటకు నాకు ముప్పై నిమిషములు పట్టును లేక ఆ విధముగా ఇంచుమించు అంత సమయము పట్టవచ్చు మిమ్ములను కూటము ముగించి ఇంటికి పంపించి వేయుటకు." మరియు నేను చెప్పాను, "అయితే నేను వీలైతే ఒక చిన్న పాఠ్యభాగమును తీసికొనవలయునని యున్నాను నేను తలంచు ఆ చిన్న కార్యము ఈ దినమున మీకు అది ఏదో ఒక కార్యముగా నుండవచ్చును, మీరు దానిని గురించి ఆలోచించులాగున మీరు గృహమునకు పోవునప్పుడు దానిని మీతో కూడా కొనిపోవులాగున అది మీకు ఏదో యొక కార్యముగా నుండవచ్చును.

మీరు నన్ను చూడవలయుననుటకు గాను మరి నేను నిశ్చయముగా ఈ ఉదయము మూడున్నర లేక మూడు-నలభై నిమిషములకు లేచి సిద్దపడి ఇచ్చటికి రాలేదు. నేను మీరు నన్ను చూడవలయునను కారణము కొరకు నేనిచ్చటికి రాలేదు. నేను నిన్నటి దినమున ఇచ్చటకి వచ్చి మరి నేను వ్రాసియుంచుకొనిన కొన్ని లేఖన వాక్యములపై ధ్యానించి మరి అని ఎవరికో యొకరికి సహాయపడులాగున మరి వాటిపై ప్రార్థించి యున్నాను. నేను మనలను ఒకరికొకరు చూపించుటకును మరి మనలను గురించి చాటి౦చుటకు మనకు సమయము ఇది కాదు మనకు వాటికి సమయము లేదు. మనము కార్య నిర్వహణలో, కర్తవ్యములో దిగవలయును. యేసు చాలా శిఘ్రముగా వచ్చుచున్నాడుని నేను నమ్ముచున్నాను.

13మరిప్పుడు దీనిని టేపు చేయుచున్నారు, మరియు ఈ టేపును ఎవరో ఒకరు పొండుకొనెదరు. మరియు నేను ఈ యొక్క కార్యమును చెప్పదలచుచున్నాను, కొన్ని సమయములలో నేను… అనేక సమయములలో నేను తప్పుగా అర్థము చేసికొనబడుచున్నాను. మరియు అనేక సార్లు జనులు నన్ను పిలచి, "సహోదరుడు బ్రెన్హాం మీరు దీనిని ఈ అర్ధముతో చెప్పియున్నారా?" అని అడిగెదరు. మరియు కొన్ని సమయములలో మనము దేనినైనను చెప్పినప్పుడు తప్పుగా అర్థము చేసికొనుటకు మునుపు మీరు దానిని నేను ఏ భావముతో చెప్పియున్నానో, ఆ భావముతో మీరు దానిని చూడవలసియున్నది.

మరియు ఒకవేళ మీలో ఎవరో ఒకరియొక్క నమ్మకమునకు కొన్ని సమయములలో నేను చెప్పు కార్యములు కొంచెము భిన్నముగా ఉండును. కొంతమంది, వారు నమ్మేదానిని ఇప్పుడు నేను వారికి సృష్టముగా విశదపరచవలెనని కోరుచున్నాను. అయితే నాకు ఒక వర్తమానము గలదు, అది నాది కాదు… దానిని ప్రభువు యొద్ద నుండి పొందితిని, వాటిని ఆ విధముగానే పొందుకొన్నట్లుగా నేను గ్రహించుచున్నాను. ఇతరులు ఆ వర్తమానములు దయ్యము యొద్ద నుండి వచ్చియున్నవని అనుకొనుచున్నారు. ఇతరులు నేను చెప్పు కార్యములు బుద్ధిహీనత యని అనుకొనుచున్నారు. అయితే, నాకు అది జీవమైయున్నది. నేను వేరే విధమైన కార్యములను జనులకు చెప్పునప్పుడు నేను ప్రజలను వేరుపడవలయునన్న ఉద్దేశముతో చెప్పుట లేదు. జనులను నొప్పింపవలయునన్న ఉద్దేశము లేదు. ఆ ఉద్దేశము నాకు లేదు. నేను ఒక వేళ ఆ విధముగా నేను చేసిన యెడల అప్పుడు నేను ఒక వేషదారినవుదును. నేను దేవుని యొద్దకు జనులు ముందంజ వేయవలయునన్న ఉద్దేశముతోనే వాటిని చెప్పుచున్నాను. దేవునిని గురించి జనులు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశముతోనే ఈ కార్యములను చెప్పితిని. మరియు వీటిని నాయంతట నేను కూర్చి ఏర్పరచుకొని చెప్పిన నా స్వంత కార్యములు కావు. అవి నేను దేవునియొద్ద నుండి కనుగొని పొందిన కార్యములు.

14మరిప్పుడు ఈ యొక్క ప్రత్యేక కూటములలో నేను దేనినైనను ప్రసంగించినప్పుడు అవి జనులను బాధించిన యెడల లేక… ఆ విధముగా నేను చెప్పుచున్నానని మీరు అనుకొనినయెడల… నేను ఆ విధమైన ఉద్దేశముతో ప్రసంగించుట లేదు.

నేను అప్పుడప్పుడు ఈ విధమైన కఠినమైన ధోరణిలో చెప్పుచుండెదను. మరియు అక్కడ కూర్చొని నా భార్య వినుచున్నది. ఆ విధముగా కఠినముగా చెప్పవలయునన్న నియమము నాకు ఏమియు లేదననేది ఆమెకు తెలియును. నేను… మీరు కోడి మాంసమును తినుచున్నప్పుడు మరి ఎముకలు కూడా దానిలో నుండును. ఇప్పుడు కోడి మాంసములో ఎముకలు ఉన్నంతమాత్రాన కోడి మాంసమును ఇష్టపడి భుజించే ఏ వ్యక్తి కూడా ఆ కోడి మా౦సమును విసరివేయడు. అతను ఎముకలను దూరముగా విసిరివేసి పిమ్మట కోడి మాంసమును తినును. చెర్రీ పండుతో చేసిన ఒక తిను పదార్ధము కూడా అటు వంటిదే. నేను గనుక దానిని తినునప్పుడు ఒక గింజను చూసిన యెడల నేను గింజ ఉన్నదేయని చెర్రి పై య౦తటిని విసిరి వేయను, గింజను మాత్రము విసిరి వేయుదును. కావున…

మరియు ఆ విధముగానే నా యొక్క కూటములలో మీకు కొన్ని కార్యములు గింజల వలె లేక విత్తనములవలె అగుపించవచ్చును మరప్పుడు మీరు దానిని ప్రక్కకు నెట్టివేసి దానిని గురించి మీకు ఎంత తెలియదో, అదే విధముగా నాకు తెలియదనుకొనుడి. కావున మీరు తక్కిన కార్యములతో ముందుకు కొనసాగి మరి ఏది సరియని మీకు తోచునో వాటిని భుజించండి. అది సరి. మరి…

15ఇప్పుడు మరియు ప్రభువు ఆయన యొక్క వాక్యమును ఆశీర్వదించునని నేను నమ్ముచున్నాను. నేను వాక్యమునందు దృఢమైన విశ్వాసిని, మరియు వాక్యము నందు మాత్రమే. మరియు వాక్యమునందు మాత్రమే దృఢమైన విశ్వాసిని మరియు ఆ వర్తమానమును మాత్రమే ప్రభువు నాకిచ్చియున్నాడు.

మనము ఒకరికొకరము భేదముగా యున్నాము. నా యొక్క సహోదరులారా, ఇక్కడ వందలకొలది మిషనరీలు సువార్తికులు, మరియు కాపరులు నిలుచుకొని యుండుటను నేను ఈ ఉదయము గమనించియున్నాను. వీరిలో అనేకులు నా కంటెను ఇక్కడ నిలుచుకొని మాటలాడుటకు అధిక అర్హతను కలిగియున్నారు. వారు అర్హులని నాకు నిశ్చయముగా తెలియును. అయితే, చూడుడి మనలో ప్రతి యొక్కక్కరును, మనము ఇంకొకరి స్థానమును తీసికొనలేము. ఇంకొకరి యొక్క వర్తమానమును ఇంకొకరు తీసికొనలేరు. చూడుడి, మనము వేర్వేరు మార్గములను కలిగియున్నాము.

16దేవుడు సర్వాధికారి. ఆయన… ఆదిలో ఆయన మాత్రము ఒంటరిగా నున్నప్పుడు ఈ కార్యములను ఈ విధముగా లేదా ఆ విధముగా చేయవలెనని దేవునికి ఎవరు చెప్పగలరు? చూశారా? మరియు మనము నిత్యజీవమున్న యెడల, ఒకే ఒక విధమైన నిత్యజీవము మాత్రమే కలదు, మరియు అది దేవుడైయున్నాడు. కావున మనకు నిత్యజీవమున్నదనిన యెడల మనము అప్పుడు దేవునితో కూడా యున్నాము, దేవునిలో ఒక భాగమైయున్నాము. మనము ఆయన యొక్క స్వభావమైయున్నాము. మనమిప్పుడు ఆయన యొక్క గుణాలక్షణములై యున్నాము. మరి, ఏలయనగా "ఆదిలో వాక్యముండెను." మరియు ఒక కార్యము తలంపుగా నుండి అది బయలుపడుటయే ఒక వాక్యముగా నున్నది. కావున మనము మొదలు ఆయన తలంపుగా నుంటిమి, అటు పిదప వాక్యముగా బయలుపడి మరి ఇప్పుడున్న విధముగా మనము శరీరములో నున్నాము. ఆ కారణము వలననే మనయొక్క పేర్లు ఇప్పుడు మనకున్న పేరుగా కాదు గాని, అయితే జగత్తుకు పునాది వేయబడక మునుపు మన యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడియున్నవి. చూశారా? మరియు ఒకవేళ అప్పుడక్కడ గాని పేర్లు లేనియెడల ఇంకెప్పుడును అవి అక్కడ ఉండవు. చూశారా? మరియు ఆ యొక్క పుస్తకములో ఎవరెవరి పేర్లు ఉన్నవో వారినందరిని విమోచించుటకు యేసు వచ్చెను. చూశారా, ఆయన ఎరిగియున్నాడు.

ROM 8:29•

1COR 15:41•

2TIM 2:20

 

17"కుమ్మరి, రోమా 8లో మనకు చెప్పబడినట్లు, "కుమ్మరికి ఎవరు చెప్పగలరు? నన్ను ఇట్లు, అట్లు చేయుము?" అని బంకమన్ను చెప్పగలదా, చూశారా? చెప్పలేదు. దేవుడు తనయొక్క సమస్త గుణాలక్షణములన్నిటిని బయలు ప్రదర్శింపవలయును. కావున ఆయన ఒక పాత్రను అవమానపరచబడుటకు గాను మరియు ఇంకొకదానిని గౌరవింపబడుటకుగాను, ఒకటి మరొక దానికంటెను హెచ్చింపబడియుండునట్లుగా కనబరచుచుండెను. అయితే, ఇప్పుడు ఆయన సర్వాధికారి, మీరు చూడుడి, ఇది లేదా అది చేయవలెనని ఆయనకు ఎవరును చెప్పజాలరు.

ఆయన మనలను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా చేయుచున్నాడు. నక్షత్రములు ఒకదానికంటె ఒకటి భేదముగా యున్నట్లు పరిశుద్ద గ్రంథములో మనకు చెప్పబడియున్నది. మీకు తెలియునా, పరలోకములో కూడ వ్యత్యాసము కలదు, దూతలలో, దూతల యొక్క స్వరూపములలో వ్యత్యాసము కలదు; అక్కడ దూతలు కలరు, కెరూబులు కలరు, సెరాపులు కలరు మరియు వారికి వేర్వేరు కార్యములు కలవు. మరియు మనము కూడా వ్యత్యాసముగానున్నాము. మరియు దేవుడు పెద్ద పర్వతములను సృష్టించెను, ఆయన సమభూములను కలిగియున్నాడు, పచ్చిక బయలును కలిగియున్నాడు, గడ్డిని, ఎడారులను, నీటిని పలు విధములైన వాటిని కలిగియున్నాడు. చూడుడి, ఆయన ప్రత్యేకమైన దేవుడు, ఆయన ఒక విచిత్రమైన దేవుడు. మరియు ఆయన యొక్క జనులను ఈ ఉదయమున చూడుడి, మనలో కొందరు తెల్లగా నున్నాము, కొందరు నలుపు రంగు కలిగియున్నాము, కొందరు బ్రౌన్, కొందరు పసుపుగా నున్నారు, కొందరు ఎర్రగా నున్నారు; చూడుడి, అది ఆయన యొక్క ప్రజలు. ఆయన ఒక విచిత్రమైన స్వభావము గల దేవుడు, మరి కావున ఆయన తన యొక్క వాక్యపరిచారకుల మధ్య కూడా ఆ విధముగానే పలు రకములైన వారిని కలిగియున్నాడు.

18ఇప్పుడు మనము ప్రార్ధనకై మన తలలను ఒక్క క్షణము వంచెదము. మనము వాక్యమును చదవుటకు మునుపు మరి నేను దీనిని చెప్పనిమ్ము. ఒక వేళ నేను గనుక కొద్దిగా అధిక సమయము తీసికొనిన యెడల మరి మీరు లేచి బయటికి వెళ్ళిపోయెదరు, నేను అర్థము చేసికొనగలను, చూశారా, నేను పరిపూర్ణముగా గ్రహించగలను. ఇప్పుడు మనము ప్రార్థించెదము. మరియు మనము, మనలను దేవుడు మన్ను నుండి తీసియున్నాడు గనుక ఆ మంటకి తట్టు మన తలలను వంచి ప్రార్థించుచుండగా, ప్రార్థనలో జ్ఞాపకము చేసికొమ్మని ఇక్కడున్న వారిలో కోరువారు మీ చేతులను వైకెత్తుడి. మీరు చేతులు వైకెత్తియుండగా మీ చేతుల క్రింద, మీ హృదయములో ఏమున్నదని సరిగా సమస్తమును ఆయన ఎరిగియున్నాడు.

GEN 15:5•

LUKE 24:32•

GAL 3:29•

REV 5:4

 

19పరలోకమందున్న ప్రియమైన తండ్రీ, మమ్ములను ఏ మన్ను నుండి తీసియున్నావో ఆ మన్ను తట్టుకు మా తలలు త్రిప్పి మేము భయభక్తులతో మిమ్ములను సమీపించుచున్నాము. మరియు మీరు అబ్రాహాముతో "సముద్ర తీరముననున్న ఇసుకను లెక్కింపగలవా?" అని ఒక రాత్రి అతనిని అడుగుటను మేము తలంచుచున్నాము. మరియు "నక్షత్రములను చూడుము," మరి అతను వాటిని లెక్కింపగలడా?" అని మీరు అతనిని అడిగియున్నారు. అది సాధ్యము కాదు. మరి మీరు అతనితో చెప్పియున్నారు అతని యొక్క సంతానము "సముద్రతీరములోని ఇసుక వలెను, ఆకాశమును వెలిగించు నక్షత్రములవలెను లెక్క పెట్టుటకు వీలుకాని విధముగా వర్ధిల్లును." ఇప్పుడు మా యొక్క తలంపులు, మా యొక్క భావములు, మా మనస్సులోనున్న తలంపులు ఏ మన్నులో నుండి తియ్యబడియున్నామో ఆ మన్ను వైపు మా తలలు వంగియుండగా; మరియు మా యొక్క హృదయములు మేము పోబోవు పరలోకము వైపుకు త్రిప్పబడియున్నవి. అబ్రాహాము సంతతియైన మేము మన్ను నుండి నక్షత్రములకు! ఆయన యొక్క వాగ్దానము ప్రకారము మనము క్రిస్తులో చనిపోయి అబ్రాహాము యొక్క సంతతిగాను మరియు వారసులుగాను నున్నాము."

అది మా మార్గమునకు అడ్డుగా లేకుండ మరి ఈ ఉదయము సహజముగా భుజించు ఆహారమునకు గాను మేము ఐక్యతతో కూడియున్నాము మరిప్పుడు మాలోనున్న జీవమును బలపరచుటకుగాను ఆ యొక్క పరలోకపు మన్నాను మీరు మాకు అనుగ్రహింపవలయునని మేము మిమ్ములను కోరుచున్నాము. ఇప్పుడు భుజించిన ఆహారమును రక్తము శరీరములోని ప్రతి భాగమునకు అందించి మరి అనేక జీవాణువులను ఉత్పత్తి చేసి ఈ దినమునకై మమ్ములను బలపరచుచుండగా, మేము క్రీస్తును పొందుకొని, ఈ ఉదయము ఆయన వాక్యము ద్వారా మా యొక్క ఆత్మలలోనికి ప్రవేశించి మేము జీవించుచున్న సమయమునకు మమ్ములను బలపరచనిమ్ము, ఏలయనగా పగలు అస్తమించి మరి సాయంకాలపు నీడలు పడుచున్నవి, మరియు సాయంకాలపు వెలుగిక్కడ నున్నది మరియు త్వరలో మేము "పైకి రమ్ము" అని పిలుచు పిలుపును వినబోవుచున్నాము. మరి మేము ఆ వేళ కొరకు సిద్ధపడి కాచుకొనియున్నాము. కావున, తండ్రీ మాకు సహాయపడుము.

మరియు ఏ ఒక్క మనుష్యుడును ఆ పుస్తకమును తెరచుటకు లేక ముద్రలను విప్పుటకు యోగ్యుడుగా లేడు; అయితే ప్రపంచమునకు పునాది వేయబడక మునుపు వధింపబడిన గొర్రెపిల్ల వచ్చి పుస్తకమును తీసికొని మరియు ముద్రలను విప్పెను. ఓ, దేవుని యొక్క గొర్రె పిల్ల, ఈ రోజు ఉదయము వచ్చి మాకు పుస్తకమును తెరచి మరి మేము కూడ మీతో దానిలోనికి తొంగి చూచి, ప్రభువా మరి ఈ యొక్క వేళకు మేము ఏ విధముగా సిద్ధపడవలయునో దానిలో మమ్మును చూడనిమ్ము. ప్రతి యొక్క సంఘమును ఆశీర్వదించుము, రాబోవు కూటములను ఆశీర్వదించుము, ప్రతియొక్కక్క కూటమును, మరియు మా యొక్క ఈ చిన్న కూటమును రానున్న ఆ జరుగబోవు కూటములను ఆశీర్వదింపుము. మరియు ఈ రోజు మేము ఈ స్థలమును వదిలి పోవునప్పుడు ఎమ్మాయు అను ఊరి నుండి వచ్చిన వారు "మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?" అని ఏ విధముగా చెప్పిరో, మరి ఆ విధముగా మేము కూడా చెప్పులాగున మాతో ఈ దినమున మాటలాడుము, దానిని అనుగ్రహింపుము, తండ్రి. యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.

MATT 4:1-10

 

20ఇప్పుడు లేఖన వాక్యములను త్రిప్పగోరు వారు, సాధారణముగా ఒక వాక్యపరిచారకుడు లేఖన వాక్యములను చదువుచున్నప్పుడు మీరు కూడ ఆయనతో చదివి, ఆయన దేనిలో నుండి చదువుచున్నాడో మీరు తెలుసుకొనగోరెదరు. మీ యొద్ద పరిశుద్ద గ్రంథము వున్న యెడల పరిశుద్ద మత్తయి 4వ అధ్యాయమునకు త్రిప్పుడి.

మరియు నేను మాట్లాడుటకు ముందు నా యొక్క పాఠ్యాంశమును ఇవ్వబోవుచున్నాను; దానిని ఇంచుమించుగా బోధించు విధముగా చెప్పవలెనని కోరుచు, దానిని మనము ఆ విధముగా కొనసాగించుచు ముందుకు సాగిపోదాము, ఎందుకో నాకు తెలియదు గాని మరి ఏదో విధముగా నేను ఈ అంశమునకు కోతకాలము అని పేరు పెట్టితిని: "కోతకాలము," అని నేను దానికి పేరు పెట్టితిని.

మరియు ఈ తలంపులకు ఆధారముగా దాని సారాంశమును గైకొనుటకు ఇక్కడి నుండి దానికి సంబంధమగు ఒక లేఖన వాక్యమును పరిశుద్ద గ్రంథము నుండి తీసి మనము చదువబోవుచున్నాము. మనము పరి. మత్తయి 4వ అధ్యాయము దానిలోని కొంత భాగమును చదివెదము. ఇది యేసును శోధింపబడినప్పటి కార్యముగా నున్నది. ఆయన పరిశుద్దాత్మతో నింపబడిన పిదప, ఆయన అరణ్యమునకు కొనిపోబడెను.

అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.

నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా

ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి - నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.

అందుకాయన - మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.

అంతట అపవాది పరిశుద్ద పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు

దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.

అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోటు వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.

మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి

నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా

…యేసు వానితో - సాతానా, పొమ్ము - ప్రభువైన నీ దేవునికి మ్రోక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.

MATT 4:4•

JOHN 6:48-50•

JOHN 8:58

 

21నేను మరల 4వ వచనమును తిరిగి చదువవలయునని యున్నాను.

అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడి యున్నదనెను.

ఇప్పుడు ఒక పాఠము కొరకు, నేను "దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను." ఇప్పుడు మనము ధ్యానించుచుండగా దీనిని మీ యొక్క తలంపులలో నుంచుకొనుడి.

యేసు ఒకప్పుడు చెప్పెను, సరి. యోహాను 6:48లో, అది సరియని నేను నమ్ముచున్నాను, ఈ ఉదయమున దానిని నేను గుర్తుంచుకొనియున్నాను, "నేనే జీవాహారమునైయున్నాను" ఇది పస్కా పండుగ సమయములో చెప్పబడెను, యూదులు అరణ్యములో వారు తినిన మన్నాకు జ్ఞాపకార్థముగా వారు రొట్టెను తినుచు, మరియు బండకు చిహ్నముగా అరణ్యములో అక్కడున్న ఊటలో నీటిని త్రాగుచు మరియు వారు మహత్తరమైన సమయమును కలిగియుండిరి. మరి యేసు వారి మధ్యలో నుండి మరి ఆయన చెప్పెను, "నేనే జీనాహారమును. మీ పితరులు అరణ్యములో నలుబది సంవత్సరములు మన్నాను తినినను మరియు వారిలో ప్రతియొక్కరును చనిపోయిరి. అయితే దేవుని యొద్ద నుండి పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైతే ఈ ఆహారమును భుజించునో, అతడు మరణించడు. వాడు చనిపోడు." మరియు బండను గురించి ఆయన చెప్పెను, "అరణ్యములోనున్న ఆ బండను నేనే. మీ పితరులు ఏ బండ నుండి నీరు త్రాగితిరో ఆ బండను నేనే."

"అదెట్లు సాధ్యమగును?" అని వారు అడిగిరి, "నీకింకను ఏబది సంవత్సరములైనను లేవే, నీవు అబ్రాహామును చూచితిని అని చెప్పుచున్నావా? నీవు ఒక దయ్యము పట్టియున్న పిచ్చివాడవని ఇప్పుడు మేము ఎరిగియున్నాము."

మరియు యేసు చెప్పెను, "అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను." చూశారా, "నేను ఉన్నవాడను" ఆ మండుచున్న అగ్ని పొదలో మోషేతో మాటలాడితిని అగ్నిస్తంభమును నేనే. మరియు మీరు గనుక దానిని విశదీకరింపవలయుననిన, నేను మునుపు ఉన్నవాడను, నేను ఉండబోవువాడను అని కాదు, "నేను ఉన్నవాడను" వర్తమానము, ఎల్లప్పుడును ఉన్నవాడను.

JOHN 1:1,14•

JOHN 8:49

 

22ఇప్పుడు తనను గురించి "జీవాహారమును నేనే" అని ఆయన చెప్పిన దానిని గురించి మనము ఆలోచించిచున్నాము. ఇప్పుడు ఈ మనుష్యుడు ఎట్లు జీవాహారము కాగలడు? అని దానిని గురించి మనము ఆశ్చర్యపడుచున్నాము. "నా యొక్క శరీరము రొట్టె," అని ఆయన చెప్పియున్నాడు. మరిప్పుడు ఈ వ్యక్తి ఎట్లు జీవాహారము కాగలడు? అది వింతగా కనిపించుచున్నది, అయితే దానిని గురించి కలత చెందవద్దు. దానిని గురించి ఆయన కాలములో జీవించిన వ్యక్తులు కలత నొందిరి. ఈ మనుష్యుడు ఎట్లు తానే ఆహారము కాగలడని వారికి అర్థము కాకుండెను. మరియు పరిశుద్ద, యోహాను 1లో ఈ విధముగా చెప్పబడియున్నది, "ఆదిలో వాక్యముండెను, మరియు వాక్యము దేవుని యొద్దనుండెను, మరి వాక్యము దేవుడై యుండెను. మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను." కావున వాక్యము ఆహారమాయెను. వాక్యము మరియు ఆహారము ఇక్కడ ఏకమైయున్నవి, ఏలయనగా యేసు వాక్యమైయున్నాడు మరియు ఆయనే జీవాహారము.

ఇప్పుడు ఆయనే వాక్యము మరి జీవాహారముగా ఎట్లు నుండగలడు? సమస్తమును… అది సహజమైన మానవుని యొక్క తలంపులకు అది గందరగోళముగా నున్నది. అయితే ఈ ఉదయమున మన మధ్య మానవుని యొక్క తలంపులతో ఎవరును లేరని, ఒక ఆత్మీయమైన తలంపులతో మన మధ్యనున్నారనియు తండ్రి ఏమి మనకు ఇప్పుడివ్వబోవుచున్నాడో యని మనము గ్రహించు ఆత్మీయ జ్ఞానమును కలిగియున్నామని మనము నమ్ముచున్నాము. ఈ యొక్క వాక్యములు కలవరపరచినను అదే సమయములో అవి లేఖనములలోని సత్యములు, చూడుడి.

"ఇప్పుడు ఈ మనుష్యుడు ఆహారముగా ఎట్లు౦డగలడు?" వారు దానినే చెప్పిరి. దానినే, జోసెఫస్, అనేక చరిత్రకారులు నేను అనుకొనుచున్నాను… దానిని నేను చదువుచుండగా.

23ఇప్పుడు ప్రకటన గ్రంథములోని మొదటి నాలుగు అధ్యాయములను గురించిన నా యొక్క వ్యాఖ్యానములను నేను ఒక పుస్తక రూపములో వ్రాయుచున్నాను, అది త్వరలో వెలువడనై యున్నది. అది ఒక పెద్ద పుస్తకముగా నుండును. పిమ్మట ఒక్కొక్క సంఘ కాలమును గురించి ప్రత్యేక సంచిక నేను ప్రచురించుచున్నాను.

మరియు నేను సంఘ చరిత్రను చదువుచుండగా. నేను… అది నాకు ఒక విధముగా జ్ఞాపకం వున్నది, అది జోసెఫస్ అని అనుకొనుచున్నాను, ఆది రచయితలలో ఒకరు "నజరేయుడైన యేసు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుచు పోవుచునుండెను," మరియు చెప్పెను, "ఆయన యొక్క శిష్యులు ఆయన యొక్క శరీరమును త్రవ్వి పైకి తీసి మరియు ఆయన శరీరమును భుజించిరి" అని ఏదో విధముగా దానిలో వారు చెప్పియున్నారు. చూడుడి, వారు ప్రభురాత్రి భోజనమును గైకొనిరి, ఆయన యొక్క శరీరమును త్రవ్వి పైకి తీసి మరి ఆయన శరీరమును శిష్యులు భుజించిరని వారు అనుకొనిరి. మనము ఆయన శరీరమునకు జ్ఞాపకార్థముగా శిష్యులు రాత్రి భోజనమును ఆచరించుచున్నారు లేదా తీసికొనుచున్నారు, ఏలయనగా ఆయన వాక్యమైయున్నాడు.

ఇప్పుడు, చూశారా, ఇది కలవరపరచుచున్నది. మరియు అదే సమయములో, వాటికి ఆధార పూర్వకముగా లేఖనములున్నవి. మరియు యేసు చెప్పెను, "లేఖనములన్నియును నెరవేర వలయును." చూశారా? ఇప్పుడు, లేఖనములకు విరుద్దముగా వుండు ఎటువంటి కార్యములైనను మన తలంపు నుండి వైదొలగవలెనని మనము ఎల్లప్పుడును కోరుచున్నాము. ఏ కారణమ చేతనైనను, ఏ సమయములలోను లేఖనములలోని ఒక్క వాక్యమును కూడా వదలివేయవద్దు, వద్దనే వద్దు. ఆ లేఖనములతో ఖచ్చితముగా అట్లే నిలబడియుండుడి.

24ఇప్పుడు, దేవుడు ఏదో ఒక రోజు జనులను తీర్పు తీర్చవలయును. మరి ఆయన ఒక సంఘము ద్వారా ప్రజలను తీర్పు తీర్చిన యెడల ఏ సంఘము ద్వారా తీర్పు తీర్చును? వారు చెప్పుచున్నారు, "కాథోలిక్కు సంఘము ద్వారా తీర్పు తీర్చును." సరి, అట్లైన ఏ కాథోలిక్కు సంఘము? చూశారా? మనతో బేధము కలిగియుండుట కంటేను వారిలో వారికే అనేక భిన్నాభిప్రాయములు కలవు. చూశారా, వారు వ్యత్యాసముగా నున్నారు, ఒకటి… వారిలో అనేక రకములైన తెగలున్నవి, రోమనులు మరియు ఆర్తోడిక్స మరియు జాఫనైట్ మరియు, ఓ వారిలో అనేక తెగలున్నవి. మరియు వారు ఒకరి గొంతు మరియొకరు తెగ గొట్టవలయునని యున్నారు, కావున వారిలో ఎవరు నిజమైన కాథోలిక్కు సంఘము? ప్రతియొక్కక్కరు ఇంకొకరితో వేరుపడియున్నారు.

అయితే ఆయన ప్రపంచమును న్యాయ తీర్పు తీర్చును, మరి అట్లు చేయుటకు ఆయనకు ఒక నియమము కలిగియుండవలయును, లేక ఆయన ఏ విధమైన నియమము లేకుండిన ఏదో విధముగా తీర్పుతీర్చినయెడల ఆయన న్యాయమైన దేవుడు కాకపోవును. ఎవరు సరైనవారు? ఏది సరియని ఎక్కడ మీరు చెప్పగలరు? ఒక నియమము కలిగియుండవలయును.

ACTS 17:31•

HEB 13:8

 

25మరియు ఆయన చెప్పియున్నాడు, ఆయన బైబిలులో చెప్పియున్నాడు, యేసుక్రీస్తు మూలముగా ప్రపంచమును తీర్పు తీర్చును. మరియు మనమిక్కడ చదివియున్నాము ఆ యేసు వాక్యమైయున్నాడని. హెబ్రియులు 13:8లో చెప్పబడియున్నది, "యేసుక్రిస్తు నిన్న, నేడు, యుగయుగములకును ఒక్కటే రీతిగా యున్నాడు." కావున సంఘము యేసుక్రిస్తు యేడల ఏ వైఖరి కలిగియున్నదో దాని ప్రకారము ఆయన తీర్పు తీర్చును, ఆయన వాక్యమై యున్నాడు. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును." మనుష్యుని నోట నుండి వచ్చు మాటవలన కాదు గాని, సెమినరీ నుండి వచ్చు మాట వలన కాదు గాని, సంఘము నుండి వచ్చు మాట వలన కాదు గాని, అయితే "దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాట వలన." మనుష్యుడు దాని వలన మాత్రమే జీవింపవలయును, మరి దాని ద్వారానే జీవింపవలయును; మానవుని యొక్క అనువాదమునుబట్టి కాదు గాని, అయితే దేవుని యొక్క స్వయ వాక్యమువలన!

"సరి," మీరు చెప్పవచ్చును, "ఇక్కడొక తప్పున్నది." ఒక వేళ తప్పున్న యెడల దానికి దేవుడు బాధ్యుడు. ఆయన వాటిని నా యొద్దకు తీసికొని వచ్చియున్నాడు, చూశారా. నేను తీసికొనవలసిన కార్యమిదే, ఆయన చెప్పినది ఇక్కడ యున్నది.

ఇప్పుడు, "ఒక మనుష్యుడు రొట్టెయని మరియు వాక్యమని," కలవర పరచుచున్నయెడల మనము దీనిలోనికి పోయి దీనిని పరిశీలించెదము. మనము కనుగొనెదము. ఏలయనగా లేఖనములన్నియును సత్యము మరియు అవి విడిపోవు. ప్రతియొక్క లేఖనమును నెరవేర్చబడును. అది ఎంత వింతగా నున్నను, అది ఎల్లప్పుడును నెరవేరును.

MATT 12:34•

LUKE 6:45

 

26సహోదరుడు విలియమ్స్, లేక ఇక్కడున్న సహోదరులలో ఒకరు, మన యొక్క పెద్ద తాత ముత్తాతలు ఈ ఉదయమున వారు లేచి వచ్చి మరి వారికి మనము టెలివిజన్ను చూపించిన ఎట్లు౦డును? "ప్రపంచమంతటను స్వరమును వినగలుగు ఒక కాలము వచ్చుచున్నది," అని వారి యొక్క దినములలో ఎవరన్న ఒకరు ప్రవచించి చెప్పియుండవచ్చును.

"సరి, ఆ దీన వృద్దుడ్డ్ని అట్లే వదిలి వేయుడి అతనికి మతి చలించి యున్నది" అని వారు చెప్పియుండవచ్చును,

"మరియు గాలి ద్వారా రంగులు ప్రవహించుచు వచ్చు ఒక కాలము వచ్చును." అదిప్పుడు ఇక్కడ యున్నది. "మరియు వారు ఒక చిన్న బటున్ను నొక్కెదరు మరియు మీరు తెరపై ప్రపంచమలోని జనులందరును కదలాడుటను చూచెదరు."

"సరి, దీన వృద్దుడని!" అని వారు అతడిని చెప్పియుండవచ్చును. అయితే ఇప్పుడు ఈ ఉదయమున మనము దానిని మన గదియందు కలిగియున్నాము.

మరియు మనము ఇంకా ముందుకు కొనసాగుటకు మునుపు, దేవుడు ఈ గదిలో వున్నాడనే దానిని మీ యొక్క గ్రహింపుకు తీసుకురావలెనని నేను కోరుచున్నాను. ఈ వాక్యము యొక్క గ్రంథకర్త ఇక్కడ యున్నాడు. కావున మీరు ఏ విధముగా దుస్తులు ధరించుకొనియున్నారోయని కాదు, ఏ స్థాయిలో మీరు జీవితములో జీవించుచున్నారని కాదు, లేక ఎటువంటి గృహములో మీరు జీవించుచున్నారని కాదు, లేక ఏ విధమైన కారు మీరు నడుపుచున్నారని కాదు, లేక మీరు ఎంతటి విద్యావంతులని కాదు, అయితే దేవుడు మీ హృదయుములను చూచుచున్నాడు. మరియు ఆయన నా హృదయమును చూచుచున్నాడు. మరియు మనము మన హృదయముల ద్వారా తీర్పుతీర్చబడెదము, మన వాక్యములను బట్టి కాదు. మన హృదయమే మనలను తీర్పు తీర్చును. "హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా." మరి అది ఆ విధముగా కాకున్న యెడల, అది వేషధారితనము.

27ఇప్పుడు, ఈ యొక్క గదిలో ప్రపంచమునందున్న మనుష్యుల రూపములు, మనుష్యుల ఛాయలు కదలాడుచు పోవుచున్నవి, స్వరములు పాడుచున్నవి ఈ గదిలో ఇప్పుడే. అయితే మీరు చూచిన యెడల మీ యొక్క ఇంద్రియములలో మీరు ఒక పరిమితలో యున్నారు, మీరు ఒక పరిమితికి మించి చూడలేరు. అయితే మీరు దూరదర్శినిణిలోనున్న ఆ స్ఫటికము లేక గొట్టమును తీసికొని దానిని త్రిప్పినయెడల గాలిలో ప్రయాణించు ఆ అలలచే చెదరియున్న వాటిని పొందుపరచి, మరియు ఒక ఛానల్ ద్వారా చెదరియున్న రూపములను సంగ్రహపరచి ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, లేక ఇండియా లేక ఇంకెక్కడి నుండియైనను తెరపై మనకు కనబడునట్లుగా చేయును, మీరు వారు ఏ రంగు వస్త్రములను ధరించుకొనియున్నారు, చెట్టు యొక్క రంగును, మరియు వారు కదలాడు ప్రతియొక్క కదలికను దూరదర్శిణి తెరపై అది చూపించును, మరి అది నిజమో కాదో చూడుడి.

28మరట్లైన యెడల ఎక్కడనో మన కండ్లకు తెలియకుండా ఇవన్నియును ఇప్పుడు ఇక్కడ కదలిపోవుచు నుండవలయును. దేవుడు అబ్రహోముతో "నక్షత్రములను పైన చూడుము," అని చెప్పినప్పుడు అవి ఈ మార్గము గుండా కదిలి పోయుండవలయును. ఏలియా, కర్మెలు పర్వతమునొద్ద జరిపించిన సంభవము ఇక్కడున్నది. ఆదాము ఈ లోకములో నున్నప్పుడు, అది ఇక్కడుండెను, అయితే ఈ కాలములో వారు ఇప్పుడే దానిని కనుగొన్నారు.

మరి కావున ఆ విధముగానే దేవుడు మరియు దూతలును ఇక్కడున్నారు. మరియు ఏదో ఒక రోజున అది కూడా ఒక దూరదర్శిణిని లేదా ఎదైన ఒక దానిని వలెమనము నిజముగానే సమస్తమును చూడగలము, ఏలయనగా ఆత్మ మనలను ఆ నిత్యమైన జీవితమునకు తీసికొనిపోవును. అప్పుడు మనము అర్థము చేసికొనగలము. కావున, మనము ఆయన యొక్క వాక్యములో నుండి మాటలాడుచున్నాము. ఇప్పుడు మనము దానిని ప్రయత్నింపబోవుచున్నాము..

29దేవుడు, గొప్ప సృష్టికర్తయైన దేవుడు, ప్రకృతి యొక్క రూపములో మనము మాటలాడుటకు ప్రయత్నించెదము, మొదటిగా ఆయనను ప్రకృతి నుండి తీసికొనెదము, పిదప వాక్యమునకు తిరిగి తీసికొని వచ్చెదము. ఇప్పుడు, ప్రకృతి వాక్యముతో జతపరచబడి కొనసాగుచున్నది, ఏలయనగా దేవుడు ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త. ప్రకృతి క్రియ చేయుటను మీరు చూచునప్పుడు, మరి ఆ విధముగానే ఇదియును ఉండునట్లు కనుగొనెదరు. అది, అదియే నా యొక్క మొదటి పరిశుద్ద గ్రంథము, ప్రకృతి ఎట్లు క్రియ చేయుచున్నదని కనుగొనుట… దేవుడు ప్రకృతిలో యున్నాడని కనుగొనియున్నాను. మరియు గోధుమ ప్రకృతి యొక్క ఉత్పత్తి, రొట్టెను దానినుండి తయారు చేసెదరు, అది మన యొక్క శరీరములను జీవముతో కాపాడును. ప్రకృతి అనేక రహస్యములను కలిగియున్నది. మనము… ప్రకృతిని గమనించుచున్నప్పుడు మరి దానిలోనే మొట్టమొదటిగా దేవునిని నేను కనుగొనియున్నాను. అక్కడేదో కార్యమున్నదని నేను చూశాను. మరియు ఇప్పుడు నాకు చదువు లేనందువలన నేను అధికముగా ప్రకృతిని గురించి మాటలాడెదను. మరియు అది… జ్ఞానశూన్యతను నేను బలపరచుటకు ప్రయత్నించుచున్నానని కాదు. అయితే నేను చెప్పుటకు ప్రయత్నించు కార్యమేదనగా దేవుని తెలిసికొనుటకు మీకు విద్య అవసరము లేదు.

MATT 3:7,9

 

30క్రీస్తు యొక్క రాకను ముందుగా తెలియజేసిన బాప్తిస్మమిచ్చు యోహాను, అరణ్యవాసములో నుండి వచ్చెను. తను తొమ్మిది సంవత్సరముల వయస్సులో అరణ్యమునకు వెళ్లి మరియు అతడు అక్కడే వుండెనని మనము బోధింపబడియున్నాము, ఏలయనగా అతని యొక్క పని చాలా ముఖ్యమైన కార్యమైయుండెను. అతని తండ్రి ఒక యాజకుడు. మరియు ఆ యాజక క్రమములో లేక ఆ సంఘ శాఖలో అతని తండ్రి అని చెప్పెను. "యోహాను ఇప్పుడు నీకు తెలియునా, నీవు అభిషిక్తుని (మెస్సీయా)ను పరిచయము చేయవలసిన వాడవైయున్నావు. నీకు తెలియునా, ఆ యొక్క ఫలానా - ఫలానా సహోదరుడు మెస్సీయాకు సరైన అతను!" అని చెప్పెను. కావున యోహాను దానినుండి వైదొలగి, తనకు తానుగా అతడు అరణ్యమునకు వెళ్ళిపోవలసి వచ్చెను, ఎందుకనగా మెస్సీయా మానవునిచే ఎన్నుకోబడిన వ్యక్తిగా యుండకుండా దేవునిచే ఎన్నుకోబడిన మెస్సియాగా ఉండవలెను. అందువలననే, అతను సుమారు తొమ్మిది సంవత్సరముల వయస్సులో అరణ్యమునకు వెళ్ళెను.

మరియు, మీరు గమనించిన యెడల, ముప్పది సంవత్సరముల వయస్సప్పుడు అతను అరణ్యము నుండి బయటికి వచ్చినప్పుడు, అతని యొక్క ప్రసంగములు ఒక వేదాంతివలె నుండలేదు. అతను పెద్దగా ఉబ్బించు పదములను ఉపయోగింప లేదు, అయితే అతని ప్రసంగమంతయును ప్రకృతిపై నుండెను. ఆ రోజులలోనున్న సంఘపు వారిని అతడు, "మీరు సర్ప సంతానము? " అని చెప్పెను. అతను అరణ్యములో సర్పములను చూచెను. అతడు పాములను ద్వేషించెను. అవి విషముతో నిండియుండును. వాటియొక్క కోరలలో విషము నిండుకొని యుండును మరియు అతను దీనిని ఆ దినపు సంఘశాఖలతో పోల్చి, ఇట్లు చెప్పెను, "విషముతో నిండుకొని యున్న సర్ప సతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము దీనికి చెందినవారము, మరియు మేము జేనేస్సేలైట్స్, లేక మేము ఫలానా-మరి- ఫలానా వారము, లేక మేము మెథడిస్తు, బాప్తిస్తు, ప్రెస్బిటేరియన్ లేక వేరేమైననుయని చెప్పకుడి. మేము దానిని కలిగియున్నామని చెప్పకుడి, ఏలయనగా, నేను మీకు చెప్పుచున్నాను, దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడు." చూశారా?

MATT 3:10

 

31మరియు, "గొడ్డలి," దానిని అతడు అరణ్యములో ఉపయోగించెను, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడియున్నది. మరియు మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, అగ్నిలో వేయబడును." చూశారా, ఫలములనిచ్చు ఒక చెట్టును అతను నరుకుట లేదు, ఏలయనగా అతను చెట్టు యొక్క ఫలముల వలన జీవించుచున్నాడు. అయితే, ఫలింపని చెట్టు! ఓ, మీరు లేఖనములనంతయును తీసికొనవచ్చును అది నిజముగానే ప్రేరేపించుచున్నది, సమస్త లేఖనములును యేసుక్రీస్తును గురించియే సూచించుచున్నవి. మీరు చూడుడి, "మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును," మరి ఆలాగున. మీరు చూచిన యెడల అతను ప్రకృతికి సంబంధించిన కార్యములతో తన వర్తమానమును ఉపయోగించెను.

32మనము కనుగొనియున్నాము ఆయన చెప్పియున్నాడు, "నేను రొట్టెను. మరియు మనుష్యుడు ప్రతి యొక్క మాట వలన జీవించును, మరి నేను వాక్యముగా నున్నాను." దీనిని మనము చూడవలయును. చూశారా? కావున మనము ప్రకృతి యొద్దకు తిరిగి పోవలయును. నేను అనేక సార్లు దానిని చేయవలెననుటను నేను గమనించియున్నాను.

మరియు ప్రకృతి యంతయును ఒకే విధముగా పనిచేయును. మీరు పక్షులను గమనించిన ఎడల, అవన్నియును ఒకే సమయములో గుంపుగా కూడికొని, అవి గూటిని వదలి, బయటకు వెళ్ళి పొలముల యొద్ద మేతను మేయుచున్నవి. అదే విధముగా ఆవులను, మేకలను అన్నింటిని గమనించి చూడండి, గుంపుగానే పొలమునకు పోయి, గడ్డి మేయును. ఆ సమయములో నీటిలో గాలమును చేపలకు వేసిన అవి తినును. అయితే ఆ యొక్క ఆవులు మేకలు… ఆ పక్షులు చెట్టులోనికెక్కి గూటిలో చేరిన పిదప మరి ఆ జంతువులు ఒక మూలకు చేరిన పిదప మీరు గాలమును నీటిలో నుండి తీసివేయుట మంచిది. చేపలు ఎరను తినవు, ఏలయనగా సృష్టి యావత్తును ఎల్లప్పుడును ఒకే విధముగా కొనసాగుచున్నది.

JOHN 17:21

 

33మరియు ఆ విధముగానే దేవుని యొక్క వాక్యము కూడ ఎడతెగకుండా అదే రీతిగా నెరవేరును. దేవుడు ఎల్లప్పుడును ఒకే విధముగా ఆయన క్రియ చేయుచుండును. మానవుడు దేవునియందున్న సహవాసమును కోల్పోయినప్పుడు, ఒక నిరపరాధి యొక్క రక్తమును చిందించుట ద్వారా అతడిని రక్షింపవలయునని ఆయన ఆదియందే తీర్మానించెను. ఆయన దానిని మార్చనే లేదు. మనము మన విద్యా జ్ఞానమును ఉపయోగించి, దానిని ఇంకా కొద్దిగా మెరుగుపరచ చూచాము; సంఘ శాఖను ఏర్పరచుకొని, దానిలోపల దానిని చొప్పించుటకు చూచాము; మరియు వారిని బ్రతిమలాడి, దానిని లోపలకు చొప్పించుటకు చూచాము; వారిని కొట్టి, లోపలకు దానిని చొప్పించుటకు చూచాము; వారిని తిట్టి, లోపలకు దానిని చొప్పించుటకు చూచాము. అయినను అది మారక ఇప్పటికిని అట్లేయున్నది, దేవుడు ఒక విశ్వాసిని చిందింపబడిన రక్తము క్రింద మాత్రమే సంధించగలడు.

మనము సంఘములన్నిటిని ఒక్కటిగా కలిపి ప్రపంచ సంఘముల యొక్క ఆలోచనసభను తయారు చేయుట కాదు. అది ఎన్నటికిని క్రియ చేయదు; అది దీనికి ముందు కూడా క్రియ చేయలేదు. ఇంకెప్పుడును చేయదు. ఆ విధముగా, ఆ విధమైన క్రమములకు నేనెల్లప్పుడును వ్యతిరేకిని. దేవునికి ఒక క్రమము కలదు. "సమస్త సంఘములు ఏకమవ్వండి, అది ఒక ప్రపంచ సంఘము యొక్క ఆలోచనా సభగా మారవలయును. "మనమందరం ఏకమవ్వుటకే యేసు ప్రార్థించెనని చెప్పుటను ఈ దినములో మీరు వినియుందురు." మంచిది, ఇప్పుడు మీరు చూడండి, ఆత్మ చెప్పిన దానిని గ్రహించకుండా, అది శారీరకమైన తలంపులలో నుండి వచ్చినదైయున్నది.

JOHN 17:21

 

34యేసు చెప్పియున్నాడు, "తండ్రీ, మనము ఏకమైయున్నాలాగున, వారును ఏకమై యుండవలయును." ఏదో ఒక కార్యముపై ఎవరో ఒక వ్యక్తి పెద్దగా నుండుట కాదు, అదెప్పుడును పని చేయుదు; ఒక సంఘ శాఖ ఇంకొక శాఖను తను ఆధీనములోనికి తీసికొనవలయునని కోరుచున్నది. ఒక వ్యక్తి ఇంకొకరిపై అధికారము చేయవలెనని యున్నారు. అయితే క్రీస్తు మరియు దేవుడు ఏకముగా ఉన్నట్లుగా, మీరును దేవునితో ఏకమై వుండవలయును, ఇదే అయన ప్రార్థించిన ప్రార్దనైయున్నది. ఆయన వాక్యమై యున్నట్లుగా మనము కూడా వాక్యముగా యుండి ఆయనను ప్రతిఫలించవలెనని యేసు ప్రార్థించెను. మరి ఆయన యొక్క ప్రార్థనకు మనము బదులివ్వవలెను.

చూశారా సాతాను దానిని ఈ యొక్క శారీరక మనస్సులో ఎలాగు సందేహమును తీసుకోని వచ్చునో? మనమందరము ఏకముగా కూడుకొని మరియు మనకు ఒక ఆచారము మరియు అలా౦టి మొదలగు కార్యములను ఏర్పరచుకొనే దానికొరకు యేసు ప్రార్ధించలేదు. వారు ఆ విధముగా దానిని చేయు ప్రతీసారి, దేవుని నుండి దూరముగా, మరియు ఇంకా దూరముగా వైదొలగిపోవుచున్నారు.

ఆయన మనలను దేవునితో ఒక్కటిగా యుండవలయునని కోరుచున్నాడు, మరి దేవుడు వాక్యమైయున్నాడు. ప్రతి యొక్కక్కరును, తమ హృదయములో, వారు దేవునితో ఏకమై యుండవలయును.

35దేవునికి ఇదంతయును తెలియును, ఈ కార్యములన్నియును ఈ విధముగా జరుగునని కూడ తెలియును. దేవునిని మరి ఆ విధముగానే కొన్ని సమయములలో సృష్టిని చూచుట ద్వారా, ప్రకృతిలో మనము దేవునిని కనుగొనగలము. కాలములు మారుచున్నప్పుడు దేవుడున్నాడని నిరూపించుచున్నది. అక్కడే నేను మొదటగా ఆయనను కనుగొనియున్నాను, వసంత ఋతువులో జీవము ఏ విధముగా వచ్చుచున్నదో, ఆ జీవము దాని జీవితమును జీవించి, ఒక విత్తనమును ఉత్పత్తి చేసి, చనిపోయి, మరియు భూమిలోనికి వెళ్ళి, మరల పునరుద్దరించి అది చక్రము వలె తిరుగుచుండును. మనము గంటల తరబడి ఈ అంశముపై గడపవచ్చును.

అయితే ఇప్పుడు ఈ కార్యములన్నియును ఇండియా నుండి ఇక్కడికి వచ్చియున్న మన మిషనెరి సహోదరుని యొక్క కార్యములతో వ్యత్యాసముగా నున్నది. అక్కడ వుండు వారును మరియు ప్రపంచమంతట వున్నవారును ఈ పునర్జన్మను గురించి వారు నమ్మకమును కలిగియుండుటను నేను కనుగొంటిని, అదెట్లనగా, మీరు ఒక మానవునిగా చనిపోయి మరి ఒక పక్షిగా లేక ఒక జంతువుగా మరల జన్మించెదరు. చూశారా, అది ప్రకృతితో ఏకీభవింపకున్నది.

ప్రకృతి చెప్పుచున్నది భూమిలోనికి వెళ్ళిన విత్తనమే మరల అదే విత్తనము పైకి వచ్చుచున్నది. చూడుడి? ఏ యేసు క్రిందికి వెల్లెనో అదే యేసు తిరిగి వచ్చెను. హల్లేలూయా! మరియు ఈ యొక్క శరీరము భూమిలోనికి పోయిన పిదప, ఒక పుష్పముగానో మరి లేక మరి వేరే ఏదో యొకటిగానో తిరిగి రాదు, అది ఒక మనుష్యునిగానో లేక ఒక స్త్రీ గానో మరల వచ్చును. దానిని మనము ప్రకృతిలో చూచుచున్నాము, అదెట్లు జరుగుచున్నదో, అది చలికాలము ద్వారా వెళ్ళి క్రుళ్ళిపోవలయును, కాని దానిలో జీవము ఉన్నయెడల, అది భద్రపరచబడుచున్నది.

36అయితే, ఆ యొక్క విత్తనములో జీవము లేక అది చిగురించకున్న యెడల అది తిరిగి లేవనే లేవదు; అది మరల లేవదు, దానిని తిరిగి లేపుటకు దానిలో ఏమియును లేదు. మరి ఆ విధముగానే మనము సాధారణ క్రైస్తవులుగానున్న యెడల… ప్రపంచములో రెండు సంఘములున్నవి, సహజమైన సాధారణ సంఘము, ఆత్మీయ సంఘము, వారందరును "క్రైస్తవులని" పిలువబడుచున్నారు. అయితే సాధారణ సంఘము మరల లేవనే లేవదు. అదిప్పుడు ప్రపంచ ఆలోచన సభలో, ఆలోచనా సంఘములో నుండి అది లేచుచున్నది.

అయితే క్రిస్తును సంధించుటకు క్రైస్తవుడు లేచుచున్నాడు, ఏలయనగా ఆయనను వెళ్ళి సంధించుటకు, అది ఒక వధువైయున్నది. కావున ఈ రెండు కార్యములలో భేదమున్నది. మనకొరకు ప్రకృతి ఈ రహస్యములను తనలో కలిగియున్నది, మరి మనము వాటిని గమనించుచున్నప్పుడు దానిని మనము కనుగొనగలము. మరియు క్రైస్తవత్వము మరణమును గురించి, పూడ్చబడుటను గురించి మరియు పునరుత్దానమును గురించిన సత్యములను పలుకుట మనము చూచుచున్నాము.

1TIM 4:4,5

 

37మనము ఆహారముగా భుజించుచున్న గోధుమ రొట్టెను మనము తీసికొని పరిశీలించిన ఎడల, మనమెట్లు జీవించుచున్నామనగా, ఒకే ఒక మార్గము ద్వారానే అది చనిపోయిన పదార్ధములను మన శరీరములోనికి తీసికొనుట ద్వారానే. మీరు జీవించుటకు వేరే మార్గమే లేదు.

ఒక శాకాహారి చాలా కాలము క్రిందట నన్ను కలిసి అతను అడిగెను, "సహోదరుడా బ్రెన్హాం, ఉదయకాలపు ఫలహారమునకు పంది మాంసమును మరియు గ్రుడ్లను మీరు తినవచ్చునని మీరు చెప్పువరకు మీపై నాకు అధికముగా నమ్మకముండెను." చూశారా? మరియు అడిగెను, "ఒక దైవజనుడు ఆలాటి వాటిని ఏల తినగలడు?"

మీరు చూడుడి, "సరి, వాటిని తినుటలో తప్పు ఏమిటి అని?" నేను అడిగాను

సమస్తమును అపరిశుద్దమైనవి, అయితే అవి దేవుని వాక్యము ద్వారా మరి ప్రార్థన ద్వారా పవిత్ర పరచబడుచున్నని చెప్పుచున్నది, "నీవు యేసుక్రిస్తుకు మంచి పరిచారకుడవైన యెడల సహోదరునికి ఈ కార్యములన్నిటిని బోధించి జ్ఞాపక పరచుము. చూశారా, సమస్తమును పవిత్రపరచబడి యున్నవి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన యెడల ఏదియు నిషేధింపతగినది కాదు." మొదటి తిమోతి :3. ఇప్పుడు అది సత్యమని మనము కనుగొనియున్నాము. కావున నేను చెప్పితిని….

నేను అడిగాను, "సరి, మీరు చనిపోయిన దానిని కూడా తినవలయునా?"

"ఓ, లేదయ్యా!"

నేను చెప్పాను, "మీరు గనుక జీవింపవలయుననిన మీరు చనిపోయిన పదార్ధములను తినుట ద్వారా జీవింపవలయును. మీరు రొట్టెను తిన్నప్పుడు అక్కడ గోధుమ చనిపోవలయును. మీరు గనుక ఆకు కూరలను తినిన యెడల, అది చనిపోవలయును. మీరేమి చేసినను, పాలు కూడ, మీరు సూక్ష్మక్రిములను త్రాగుచున్నారు. మీరు వాటిని త్రాగుచున్నారు." మీరు చనిపోయిన పదార్ధములను తినుట ద్వారానే జీవించుచున్నారు.

MAL 3:6•

JOHN 6:48

 

38మరి శరీరకముగా మనము జీవింపవలయునన్న ఏదో ఒకటి చనిపోవలసినదిగా యున్నది, మరి అట్లైన యెడల మనము నిత్యముగా జీవింపవలయునన్న ఏదో ఒకటి చనిపోవలయుననుట ఎంత నిశ్చయముగా నున్నది! దానిని జీవింపజేయుటకు మరణము దానిని చేయుచున్నది. రొట్టె! "నేనే రొట్టెను," అని యేసు చెప్పుటను చూచునప్పుడు మరక్కడ గోధుమ రొట్టె వలె అగుపించుచున్నది, మరి ఆయన సహజమైన గోధుమ రొట్టె కాదు, కావున అక్కడ రొట్టె ద్వారా జీవింపబడుచున్న రెండు రకములైన జీవితములున్నవి. దాని యొద్దకు అది మనలను నడిపించును. ఆయన కాదు… ఆయన గోధుమ కాదు; మరియు ఆయన వాక్యము కాదు, ఆయన శరీరధారియై యున్నాడు, కావున అక్కడ రెండు రకములైన జీవితములు ఉండియుండవలయును. నేను చెప్పినట్లు గోధుమ చనిపోవుట వలన మనము శారీరకముగా జీవించుచున్నామని మనకు తెలియును. యేసు, వాక్యమును రొట్టె చనిపోయెను, కావున మనము నిత్యముగా జీవింపగలము. ఆయన వాక్యమును రొట్టెగా యున్నాడు. ఇప్పుడు గమనించుడి, దానిని మీ మనస్సులో నుంచుకొనుడి. ఇప్పుడు యేసు యొక్క వాక్యములు సత్యములని నిరూపించుటకు ప్రకృతిలో అవి ఎట్లు సంభవించుచున్నవో మనము చూడబోవుచున్నాము.

దానిని కనుగొనుటకు ఇప్పుడు మనము లేఖనములలోనికి పోయెదము, మనము ముఖ్యమైన అంశమునకు వచ్చు వరకు లేఖనముల ద్వారా దానిని మనము చూచెదము. తోటలో, దేవుడు ఆయన యొక్క మొదటి కుటుంబమునకు ఆ కుటుంబము జీవించులాగున దేవుని వాక్యమును ఇచ్చెను, ప్రతి యొక వాక్యము ద్వారా వారు జీవింపవలసియుండెను. మొట్ట మొదటి కుటుంబము భూమిపై ఏర్పరచబడినప్పుడు వారు దేవుని యొక్క వాక్యముతో నిలచియుండు వరకు వారికి నిత్యజీవము అనుగ్రహింపబడెను.

అది ఆయన యొక్క ప్రణాళికయై యుండెను. "నేను దేవుడను," ఆయన చెప్పుచున్నాడు, "నేను మారనివాడను." అదింకను ఆయన యొక్క ప్రణాళికగా యున్నది. ఆచారము వలన, సంఘ శాఖవలన, మానవునిచే ఏర్పరచబడిన చట్టముల వలన మానవుడు జీవించాలనేది ఆయన యొక్క ప్రణాళిక కాదు. అయితే దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన మనుష్యుడు జీవించును.

HEB 13:8

 

39ఇప్పుడు ఆదికాండమునకు తిరిగి పోయెదము, అది ఆరంభము. ఆదికాండము అనగా, ఆరంభము అని అర్ధము. దేవుడు ఆయన యొక్క కుటుంబమునకు వారు ఈ యొక్క వాక్యములో నిలచియుండు వరకు మరియు ఈ యొక్క వాక్యము ద్వారా జీవించుటకు గాను నిత్యజీవమును ఇచ్చెను. అయితే వారు దానిని మీరినప్పుడు, వాగ్దానములనబడు గొలుసులో ఒక కొక్కెమును వారు త్రుంచి వేసినప్పుడు, మరణము వారిని కొట్టెను, అది కూడ ఒక వాగ్దానముగా ను౦డెను.

అది ఒక గొలుసుగా యున్నది. దానిని పట్టుకొని మరి నరకముపై మీరు వ్రేలాడుచుండిరి మరియు అదొక్కటే మిమ్ములను నరకమును దాటి తీసికొనిపోవును. మరి విశ్వాసి, ఒక వేషధారి విశ్వాసిగా నుండి ఈ యొక్క వాక్యమునకు విరుద్దమైన ఒక వాక్యముతో జీవించినయెడల, అతను దేవునితో తన యొక్క సహవాసము తెంపుకొని దేవునికి దూరముగా పోవుచున్నాడు. ఒకే ఒక కొక్కెము విరిగిపోయెను! మరియు గుర్తుంచుకొనుడి. ఈ యొక్క వాక్యముపై మీకు గల విశ్వాసము ఒక గొలుసు. ఒక గొలుసు యొక్క బలహీనమైన సంధిలో కలయు చోటు అది బలముగలదిగా నుండును. అది సరియే. అది చాలా బలముగా నుండును, ఏలయనగా అది సమస్త భారమును సహించుచున్నది. మరియు వాక్యములో ఏదైనను కార్యము మిమ్ములను కలవరపడులాగున చేసిన యెడల, మీరేదో క్రొత్త దానిని వినినయెడల, అయితే వారు చెప్పెదరు, "ఓ, అవి అపొస్తలులకు, మరి వాటి యొక్క రోజులు ముగిసి పోయున్నవి," యేసుక్రిస్తు నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా నున్నాడని లేఖనములు చెప్పునప్పుడు, ఆ విధమైన బలహీనతకు మీలో చోటియ్యకుడి! ఆ వాక్యము చుట్టు కోటకట్టి మరి దానితోనే యుండి మరి దానిలోనికి మీ జీవితమును చుట్టి యుండుడి, ఏలయనగా అది మాత్రమే మిమ్ములను నరకము యొక్క జ్వాలలపై తీసికొనిపోవును, ఆ జ్వాలలను దాటిపోవులాగున చేయును. అది సరియే.

GEN 2:17•

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

40మరి ఈ గొలుసు విరిగిపోయినప్పుడు, మొదటి కుటుంబమైన ఆదాము మరియు హవ్వ ఇప్పుడు గుర్తుంచుకొనుడి, వారు పూర్తి వాక్యమును విరుగగొట్టలేదు, వారు మూడు పదములను విరుగగొట్టలేదు; ఒకే పదమును! మనుష్యుడు ప్రతియొక్క వాక్యము ద్వారా నరకముపై వ్రేలాడును, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటవలన. అక్కడే మానవుని యొక్క నిత్యజీవము నిర్ణయింపబడుచున్నది. ఏల అతను ఆ యొక్క గొలుసును పట్టుకొని వ్రేలాడును, లేనియెడల ఒక ఆచారము ద్వారా వ్రేలాడును; లేనియెడల ఆ గొలుసులో ఆచారము మిశ్రమమై యున్నయెడల మరక్కడే బలహీనమైన సంధి కలదు, మీరు పడిపోయెదరు. అక్కడే ఆదాముకు మరియు హవ్వకు బలహీనమైన సంధి కలదు. ఆ బలహీమైన సంధి, "నిశ్చయముగా," అతను చెప్పెను, "దేవుడు …" అయితే నిశ్చయముగా దేవుడు దానిని చెప్పియున్నాడు! మరి దేవుడు గనుక దానిని చెప్పియున్న యెడల, దేవుడు దానిని సరైన అర్ధముతో చెప్పియున్నాడు. మరియు ఈ విధముగా చెప్పుట ద్వారా ఆయన తనయొక్క వాక్యమును కాచుకొనును, "నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు." దేవుని యొక్క వాక్యముతో ఏ కలుషితము కాని వాక్యము తప్పనిచ్చి వేరేదేనినైనను నీవు కలిపినయెడల, నీ యొక్క ఆత్మలోనికి దానిని అనుమతించిన యెడల ఆ దినముననే నీవు దేవుని యొద్ద నుండి వేరుపరచబడెదవు.

ఇప్పుడు చాలా కఠినముగా నుండును, అయితే సూక్ష్మముగా గమనించుడి. ఇప్పుడు గమనించుడి. ఒకే వాక్యము, పరిశుద్ద గ్రంథము యొక్క ప్రారంభమున ఒకే వాక్యము, దేవుడు దానిని చెప్పియున్నాడు, "ఒకే పదము, నిత్యజీవమను గొలుసు నుండి మనుష్యుని వేరుపరచెను."

అది ఒక మనుష్యుని కాళ్ళు కట్టి వానిని తల క్రిందులుగా వ్రేలాడదీయు లాగున మరియు అతను తనయొక్క చేతులను ఆకాశము తట్టుకు ఎత్తియుండెను, మరియు మీరు అతనిని రెండుగా నరికినయెడల, ఒక కాలి వ్రేలును విరగగొట్టిన ఎడల, మీరు దేనితో అతనిని వ్రేలాడదీసియున్నారో. మీరు క్రింది భాగము నుండి వ్రేలాడబడియున్న యెడల మరి మీరు ఆ యొక్క గొలుసును ఖండించినయెడల, ఎట్లైనను మీరు పడిపోయెదరు. దానిని మీ యొక్క మనస్సులో నుంచుకొనుడి.

MATT 18:16

 

41గుర్తుంచుకొనుడి, పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "ముగ్గురు సాక్షుల నోటి ద్వారా ప్రతియొక్క వాక్యమును స్థిరపరచబడవలయును." ఇంకొద్ది నిమిషములలో దానిలోనికి పోయెదము, యేసు శోధింపబడిన మూడు శోధనల లోనికి; వాక్య పరిచారకులకైన మూడు శోధనలలోనికి ఈ రోజులలో వారు పడిపోవు కార్యములోనికి; సంఘము పడిపోవు మూడు విధములైన శోధనలు; పడిపోవు సంఘ శాఖలలోనున్న మూడు విధములైన శోధనలు; ప్రతియొక్కక్క వ్యక్తియు వ్యక్తిగతముగా పడిపోవు మరి మూడు విధమైన శోధనలు. ఇప్పుడు ఇవన్నియును మూడుగా నున్నవి; నీతిమంతుడుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మమువలె మూడు కార్యములు; తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ. ప్రతియొక్కటియును మూడులో పరిపూర్ణపరచబడుచున్నది.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

REV 22:18,19

 

42ఇప్పుడు గమనించుడి, దేవుడు ఆదిలో, తన బిడ్డలు జీవించుటకుగాను మొట్ట మొదటిగా యిచ్చిన కార్యము ఆయన యొక్క వాక్యమైయున్నది. ఇప్పుడు అది సత్యమని మనము కనుగొనియున్నాము. పిమ్మట పరిశుద్ద గ్రంథముకు మధ్యలో యేసు వచ్చి చెప్పుటను మనము వినుచున్నాము, "మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుచున్నాడు." మరి పిదప ప్రకటన 22:18లో యేసు మరల ఆయనే పలుకుచున్నాడు, "నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా. ఎవడైనను వీటితో ఏదైనను కలిపినయెడల, లేక ఈ గ్రంథము నుండి ఏదైనను తీసివేసిన ఎడల ఈ జీవగ్రంథము నుండి వానికి పాలులేకుండ చేయును."

ఇప్పుడు చూడుడి, మనమేదో మంచిగా జీవించుట కాదు; మరి అది దానితో వచ్చు కార్యమైయున్నది. అది మన యొక్క సంఘమునకు నమ్మకముగా నుండుట కాదు; అది దానితో కూడా వచ్చుచున్నది. అయితే ముఖ్యమైన కార్యమేదనగా, ఆ యొక్క వాక్యముతో నిలచియుండుటయే. వాక్యము తప్పనిచ్చి మరి దేనిని భుజింపకుడి. దానితో నిలచియుండుడి. ఆయనే ఆ వాక్యమైయున్నాడు. ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా గమనింపవలసిన వారమైయున్నాము.

JOB 19:26

 

43జీవించుటకుగాను మనము భుజించు సృష్టింపబడిన రొట్టెలో ఏమి వ్యత్యాసము కలదు? ఇప్పుడు గోధుమ జీవాహారముగా నున్నది, అది మిశ్రీతమైన గింజ కాదు, దానిని… వాటిని పూడ్చి పెట్ట౦డి మరి అది తిరిగి పైకివచ్చును. అది మంచి పరిపక్వమైన గింజ. లోపమున్న గింజలు మరలపైకి లేవవు. మనకందరికి అది తెలియును. ఇక్కడున్న సహోదరుడు సాత్మన్, కెనడాలో గోధుమలను పండించును, ఒక మంచి పంటను పొందవలయుననిన లోపమున్న గింజలను మరల భూమిలో మనము పాతిపెట్టమని అతనికి తెలియును. ఏలయనగా ఆ గింజలోనున్న బాక్టీరియా అనగా, సూక్ష్మవిష క్రిములు దానిని తినివేయును, గింజలోనున్న జీవమును మొదట తినివేయును.

మిమ్ములను నాశనము చేయు, మీ యొక్క శరీరమును తినివేయు క్రిములు మరి ఇప్పుడే మీ శరీరములో యున్నవని మీకు తెలియునా? యోబు చెప్పియున్నాడు, "నా యొక్క చర్మ క్రిములు ఈ యొక్క శరీరమును నాశనము చేసినను!" మిమ్ములను పీనుగు పెట్టెలో నుంచి మరి గాలిజొరబడకుండా ముద్రించినను; అయినప్పటికిని మీలోనున్న క్రిములు (పురుగులు) మిమ్ములను తినివేయును.

మీరు ఆహారమును మరియు పిండిని మరి తిను పదార్ధములను కొద్దిసేపు ఆ విధముగానే యుంచిన ఎడల, దానిలో పురుగులుండుటను మీరు గమనించగలరు, దానిని మూసివేయుడి. అదేమిటి? ఆరంభములోనే ఆ యొక్క పురుగు దానిలో యున్నది. ఆరంభములోనే అదక్కడ నున్నది.

44ఇప్పుడు, ఈ యొక్క గింజ ఒక మంచి గింజగా నుండవలయును. దానిలో ఏ దోషము మరియు లోపము మొదలగునవి లేని గింజగా అది నుండవలయును. అది సంపూర్ణముగా ఎదుగు గింజగా నుండవలయును. అది మిశ్రీతమైన గింజగా నుండకూడదు, ఏలయనగా అది ఎదిగినప్పుడు మీరు దానిని మరల నాటినప్పుడు మరియు మిశ్రీతమైన గింజగా మీ గోధుమ గింజనున్న యెడల అది ఎదుగదు, ఎందుకనగా అది ఒక మిశ్రీతమైన గింజ, అది మరల ఎదుగదు. మీరు దానిని సంకరము చేసినయెడల దానిలో నుండి మీరు జీవమును తీసివేయుచున్నారు.

మరి సంఘములకు సంభవించియున్న కార్యమిదియే. వారు ప్రపంచముతో మిశ్రమమైయున్నారు, మరియు ఆ కారణము చేతనే ఒక్కొక్క ఉజ్జీవము వచ్చినప్పుడు, దానివెనుక మీరు ఇంకొక ఉజ్జీవమును పొందలేక పోవుచున్నారు. ప్రతి సంఘ శాఖయును ఒక శాఖగా స్థాపింపబడినప్పుడు, అవి అచ్చటనే మరణించి మరల ఎన్నటికిని మరి తిరిగి లేచుట లేదు, ఏలయనగా అది ప్రపంచ కార్యములతో దాని పద్దతులను మిళితము చేయుట వలననే అది మరల లేచి ఎదుగకున్నది. ఏ ఒక్క సంఘము శాఖగా మారి అది శాఖగా స్థాపించబడిన పిదప అది తిరిగి లేచినట్లు చరిత్రలో ఎచ్చటను చూపించుట లేదు. అక్కడే ఆమె చనిపోయియున్నది. ఎందువలన? మీరు దానిని సంకరము చేయుట వలననే.

45దాని పైన ఒక బిషప్పును పెట్టకుడి. దానిపై పరిశుద్దాత్మను నాయకునిగా నుండనియ్యుడి. చూశారా? పరిశుద్దాత్మ కలుపు మొక్కలను మరి ఆలాటి కార్యములను వెలుపలనుంచుటకు పంపబడి యున్నది; బిషప్పు ఏమి తలంచునోయని కాదు, లేక పై విచారణ చేయునతను మరి ఆలాటి వారు ఏమి తలంచుకొనుచున్నారనుట కాదు. సంఘమును దానియొక్క సరైన స్థితిలో అమర్చుటకు, నడిపించుటకు పరిశుద్దాత్మ కావలసియున్నది. మనము చూడబోవు లాగున ఆయనే ఆ యొక్క పరిపూర్ణమైన వాక్యముగా యున్నాడు.

వాక్యమును నమ్మి జీవించుట, లేక ఒక పదమును అవిశ్వసించి మరి చనిపోవుట, అనే దానిని గురించి ఆదాము తాను స్వయముగా ఎన్నుకొనవలసిన వాడైయుండెను.

మనము కూడా ఆ విధమైన మనకిష్టమైన రీతిగా కోరుకొనవచ్చును, ఏలయనగా ఆదాముకు ఇవ్వబడినట్లు రెండింటిలో దేనినైనను మనము ఎన్నుకొనవచ్చును. ఆదామును దేవుడు వాక్యముపై ఆధారపడి యుండులాగున ఉంచిన యెడల, మరి వాక్యముపై మాత్రమే ఆధారపడినయెడల, మరి మనలను మాత్రము ఒక ఆచారము లేక ఒక విధమైన ఆచారముపై ఆధారపడులాగున నుంచిన ఎడల, మరి దేవుడు అప్పుడు తన యొక్క తీర్పులో అనీతిమంతుడుగా నుండును, మరలు చేసిన అది ఆయన యొక్క పరిశుద్ధతకు మరి ఆయన యొక్క ఏలుబడికి తగిన రీతిగా నుండదు. అయితే ఆయన ప్రతియొక్క వ్యక్తిని అదే విధముగా ఆదామును నుంచినట్లు చేయుటయే ఆయన సరైన పాలకుడని చూపించుచున్నది. ఆయన సరైన దేవుడని చూపుటకు ఆ విధముగా ఆయన చేయవలసి యున్నది. మరియు ఆయన మారని దేవుడైయున్నాడు. దేవుడు మొదటగా ఏమి చేసియున్నాడో, అదే కార్యమును ఆయన ఎల్లప్పుడును చేయును. ఆయన తనయొక్క కార్యక్రమమును ఎన్నడును మార్చుకొనడు. ఆయన చేయు కార్యమొక్కటే దానిని పెద్దదిగా చేయును అనగా, చిన్న వస్తువును పెద్ద వస్తువుగా కనబడునట్లు చేయును, అయితే ఆయన దానిని ఎన్నడును మార్చడు. అదే కార్యము కొనసాగింపబడును.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

ROM 3:4•

1TIM 5:6

 

46ఇప్పుడు ఆదాముకు ఒక ఎన్నుకొనబడవలసిన కార్యముండెను మరియు అతను గనుక వాక్యముపై ఆధారపడియున్నడల అతను జీవించును. అతను గనుక వాక్యమునకు హత్తుకొనియుండకున్న యెడల, అతను మరణించును.

మరి మనము అదే కార్యమును కలిగియున్నాము. మనము వాక్యముతో నిలిచియున్న ఎడల, మనము జీవించెదము. "మనుష్యుడు ప్రతియొక్క మాట వలన జీవించును." అయితే ప్రతి యొక్క వాక్యము వలన జీవింపకున్నయెడల మనము మరణించెదము, మనము ఆత్మీయముగా మరణించెదము. ఓ, మనము ఇంకను పెద్దగా అరచుచు కేకలేయ వచ్చును, నిశ్చయముగా, చుట్టు కొట్టవచ్చును, మరి కేకలేయవచ్చును మరి ఆ విధముగా చేయవచ్చును, అయితే అది జీవించుట కాదు. అది జీవించుట కాదు. నేనొక మిషనైరిని. విగ్రహారాధికులు చుట్టు కొట్టుకొంటు మనము కేకలేయుట కంటె అధికముగా అరచుచు, మరి దేవుళ్ళు తెలుసునని ప్రకటించుకొనుచు మరి ఆలాటి కార్యములను చేయుచున్నారు. వారు జీవించుట లేదు. "వారు జీవించి యుండగనే మరణించియున్నారు — పరిశుద్ద గ్రంథము ఆ విధముగా చెప్పుచున్నది. ఇప్పుడు మనకు ఎన్నుకొను అవకాశమును ఇవ్వబడియున్నదని మనము కనుగొంటిమి.

అయితే అతను సాతాను యొక్క ఒక్క వాక్యమునకు రాజీపడెను, అప్పుడు మరణించెను.

మరియు దేవుడు ఆదిలో ఆయన యొక్క కృప వలన మరియు దయ వలన ఆదాము వాక్యము మీరుటను పరవాలేదని గమనింపక దానిని దాటిపోయున్న ఎడల, మనకు దాని కారణముగా కలుగు కష్టములును, చిన్న బిడ్డలు చనిపోవుటయు, మరియు సమస్తమును మరియు యుద్దములును, లోనున్న క్రోధములు మరియు సిలువ వేయబడుటయును మనము కలిగియున్న కార్యములన్నియును ఉండియుండవు. ఆయన యొక్క ఏలుబడి లేక సర్వాధికారిగా ఆయన ఉన్నందువలన, ఆ విధముగా దేనిని చూడక అన్నిటిని ఆయన దాటిపోవులాగున చేసియుండును. అయితే ఆయన ఆ విధముగా చేసియుండిన ఎడల, ఆయన అవినీతిపరుడుగా నుండియుండును. దానిని మీరు గ్రహించియున్నారా? దానిని ఆయన దాటిపోలేడు. ఆదిలో ప్రారంభము నుండి ఆదాము కొరకు ఆయన దాటిపోలేదు. మరియు ఆదాముకే ఆ విధముగా ఆయన వదలలేక పోయిన ఎడల మరి నాకు లేక మీకు ఆయన దానిని దాటిపోలేడు. మనము ఆ కార్యము నొద్దకు రావలయును, వాక్యము నొద్దకు మాత్రమే. ఆయన చెప్పియున్నాడు, "ప్రతి మనుష్యుడును అబద్దికుడగును గాని, దేవుడు సత్యవంతుడు కాక తీరడు."

ROM 8:29•

ROM 9:16,21•

2TIM 2:20

 

47ఇప్పుడు మనము, మనము జీవించుచున్న ఆ దినమునకై ఎదురు చూచుచున్నాము, కోత కాలము.

ఆదాము పడిపోయిన పిదప దేవుడు (ఆదాము వాక్యము ద్వారా పరీక్షింపబడి పడిపోయెను), దేవుడు వదలక తన యొక్క సృష్టిని కొనసాగించెను, ప్రతియొక్క వాక్యము ద్వారా జీవించు ఒక మనుష్యుని కనుగొనుటకు ప్రయత్నించెను. ఆయన దానిని కనుగొన ప్రయత్నించెను… అదెట్లనగా తనయొక్క కాలమునకు అనుగ్రహింపబడిన వాక్యము ప్రకారము జీవించు ఒక వ్యక్తిని. ఇప్పుడు మీరు చూడుడి, దేవుడు ఆయన యొక్క వాక్యమును వెదజల్లి యున్నాడు, ఏలయనగా ఆయన చేయగలడు.

ఆయన అంతములేనివాడు, మరియు ఆయన సర్వవ్యాప్తియై యున్నాడు. సర్వజ్ఞుడు, అందువలననే ఆయన సమస్త కార్యములను కలిగి యున్నాడు. ఆయన అన్ని చోట్లను నుండడు. అయితే ఆయన సర్వజ్ఞుడైనందు వలన ఆయనకు సమస్త కార్యములు తెలియును, కావున ఆ రీతిగా ఆయన అన్ని చోట్లను యున్నాడు, ఏలయనగా ఆ మార్గముననే ఆయన మనలను ముందు ఎన్నుకొనియున్నాడు, ము౦దు జ్ఞానము వలన, ఈ యొక్క వ్యక్తి రక్షింపబడవలయును మరి ఇతను తప్పిపోవలయునని కాదు గాని, ఎన్నిక వలన ఆయన ముందెరిగి యున్నాడు. అయితే ఆయనకు తెలియును, ఎవరు తప్పిపోయెదరు మరి ఎవరు రక్షింపబడెదరని. చూశారా? కావున ఆయన ముందుగానే సమస్తమును ఎరిగినందువలన ఆయన ముందుగానే నిర్ణయించగలడు. మరియు ఆయన సమస్తమును తనయొక్క మహిమార్థమై చేసికొనియున్నాడు. ఆయన యొక్క గుణాలక్షణములు వాటినే చేయుచున్నవి, ఆయన యొక్క మహిమను బయలుపరచుచున్నవి. ఒక పాత్ర ఘనతకును మరింకొక పాత్ర ఘనహీనతకు, అయితే మరి దేవుడు దానిని అట్లు చేసియున్నాడు. "కాగా పొందగోరు వానివలనైనను, ప్రయాసపడు వానివలనైనను కాదు గాని, కరుణించు దేవునివలననే ఆగును." చూశారా?

JOHN 1:12•

JOHN 6:44•

REV 5:3,4

 

48"నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును [భూత కాలము], "నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వచ్చెదరు, వాక్యము నొద్దకు." మరి వారందరును వచ్చుటకుగాను ముందుగానే నిర్ణయింపబడని ఎడల వారేలాగు వచ్చెదరు? "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను." చూడుడి, ఏలయనగా వారియొక్క పేరు పుస్తకములోనున్నవి, పుస్తకములోనున్న వాటిని విమోచించుటకు ఆయన వచ్చెను.

ముద్రలు విప్పబడినప్పుడు, అక్కడొక పుస్తకము నుండుటను మనము ప్రకటన గ్రంథములో చూచుచున్నాము. మరియు సింహాసనము నందు కూర్చొన్నతను, దేవుడు దానిని ఆయన యొక్క కుడి చేతిలో కలిగి యున్నాడు. మరియు ఆ గ్రంథమును తీయుటకును లేక మరి దానిని చూచుటకు కూడ ఎవరును, పరలోకమందు గాని మరి భూమిమీద గాని ఎవరును యోగ్యుడుగా లేరు. యోహాను బహుగా ఏడ్చుచుండగా… ఏలయనగా గ్రంథము యొక్క సకల విమోచన అక్కడ నుండెను.

REV 5:5-7

 

49ఆ రోజు రాత్రి జరిగిన కూటములో ఆ దేవుని యొక్క చిన్న అసెంబ్లీ సంఘము నుండి ఆ సహోదరుడును మరియు సహోదరియును ఆ పాటను పాడిరి, "అన్ని దేశములును ఒక్కటిగా కూడియున్నప్పుడు యోహాను నన్ను చూచెనా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. అతను నన్ను చూచియున్నాడా? నిశ్చయముగా, నీ యొక్క పేరు ఆ పుస్తకములోయున్న యెడల అతను నిన్ను చూచియున్నాడు. మరియు అప్పుడు…

యోహాను యొక్క పేరు కూడ అందులో యుండెను మరియు దానిని తాకుటకు ఎవరును యోగ్యులుగా లేనందువలన అతను ఏడ్చెను. మరటు పిమ్మట పెద్దలలో ఒకడు వచ్చి మరి చెప్పెను, "ఏడువకుము, యోహాను, యూదా గోత్రపు సింహము జయము పొందియున్నది."

మరియు ఒక సింహమును చూచుటకు యోహాను అటు ఇటు చూచుచుండగా, అప్పుడు తెర వెనుక నుండి ఒక గొర్రెపిల్ల వచ్చెను, ప్రపంచమునకు పునాది వేయబడక మునుపే వధింపబడినట్లుండిన ఒక గొర్రెపిల్ల. అటు పిమ్మట రక్తము కారుచునుండు ఒక గొర్రెపిల్ల బయటకువచ్చుటను అతను చూచెను, మరియు అతను వచ్చి ఆయన యొక్క కుడిచేతి నందుండు పుస్తకమును తీసికొని, మరి ఆ పుస్తకమునందున్న సమస్తమును పిలిచెను. అది ఒక పరిపూర్ణమైన విమోచన గ్రంథము. మరియు ఇదియే అది. విమోచన గ్రంథము, ఆ పుస్తకములోనున్న అందరిని ఆయన విమోచించెను, పుస్తకములో వ్రాయబడక వెలుపలనున్న వారిని కాదు. మరియు ఆదియున్న ప్రతియొక్క దానికి అంతము అనేది ఒకటి కలదు. అయితే, మీకు గనుక నిత్యజీవమున్న ఎడల, మీకు ఆరంభము లేదు - ముగింపును లేదు, ఏలయనగా మీరు దేవునియొక్క కుమారులును మరియు కుమార్తెలుగా నున్నారు, ఆయన యొక్క వాక్యములోను మరియు తలంపులలోనున్న ఆయున యొక్క స్వభావములును మరియు గుణాలక్షణములునై యున్నారు. ఆ పుస్తకములో గనుక మీ పేరున్న ఎడల మీ యొక్క జీవితమునకు ముగింపే లేదు. దానిని విమోచించుటకు గొర్రెపిల్ల వచ్చెను. "క్రైస్తవులని" చెప్పుకొను వారందరును కాదు, మరి పవిత్రముగాను మంచిగాను జీవింపవలయునని ప్రయత్నించువారు కాదు గాని; అయితే అక్కడ ఎవరి యొక్క పేరైతే వ్రాయబడియున్నవో, వారిని ఆయన విమోచించియున్నాడు, మరియు ఆ పుస్తకములోనున్న వారి యొక్క పేర్లు మాత్రము ఆయన విమోచించియున్నాడు.

50ఇప్పుడు మనము కనుగొనియున్నాము ఆ ఒకే ఒక్క వాక్యము ద్వారా ఆదామును సాతానుడు తోట్రిల్లునట్లు చేసియున్నాడు. మరి దేవుడు ఆయన యొక్క సృష్టిని కొనసాగించెను, ఎందులకనగా ప్రతియొక్క వాక్యము ద్వారా జీవించు ఒక మనుష్యుని కనుగొనుటకు ప్రయత్నించుచుండెను. ఆయన సృష్టించిన మొదటి వ్యక్తి ఓడిపోయెను. మరియు ఈ వ్యక్తి తన కాలములో జీవించెను, అతని యొక్క కాలములో అతడు జీవించెను.

ఇప్పుడు, గమనించుడి, ప్రారంభము నుండి ఒక్కొక్క దశగా కాలములు యుండునని మరి ఆ విధముగా ఉండునని దేవుడు ప్రవచించియున్నాడు. అందువలననే మరి ఆ కారణమువలననే ఆయన ఆది నుండి అంతము వరకు చెప్పగలడు, ఏలయనగా ఆయన సమస్త కార్యములను ఎరిగియున్నాడు. మరియు ఆయన సమస్త కార్యములను యేసు క్రీస్తు ద్వారా చేసెను, మరి వాటిని ఆయన కొరకు, మరియు ఆయన యొక్క సొంత ఆనందము కొరకు సృష్టించెను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుడి, దీనిని వదలకుడి.

51మోషే గనుక నోవహు వర్తమానమును తీసికొనివచ్చి యుండిన ఎట్లు౦డి యుండును? అది క్రియచేసి యుండదు… చేయదు. వీలు కాదు.

యేసు గనుక మోషే వర్తమానమును తీసికొనివచ్చి యుండిన ఎట్లు౦డి యుండును? అది పని చేసియుండదు.

మనము గనుక మెథడిస్తుల యొక్క వర్తమానమును, బాప్తిస్తు యొక్క వర్తమానమును లేక పెంతెకోస్టు యొక్క వర్తమానమును తీసికొనివచ్చుటకు ప్రయత్నించిన ఏలాగుండును? అది క్రియ చేయదు. అవి చాలా మంచి వర్తమానములు; వాక్యము ద్వారా అవి మంచివని ఒక నిమిషములో నిరూపించెదను. వారియొక్క కాలములో అవి సరైన వర్తమానములు అవి ఆ కాలమునకు బాగుండెను. ఆ యొక్క కాలము గడచిపోయెను. ఈ రోజు కొరకు లేఖనములు ఏమి చెప్పుచున్నవన్న కార్యమును మనము కనుగొన ప్రయత్నించవలయును. ఈ రోజు, ఆ విధముగానే మానవుడు ఆ వర్తమానము ప్రకారము తనయొక్క కాలమునకై జీవింపవలయును.

పరిపూర్ణముగా సమస్త వాక్యముతో జీవించు ఒక వ్యక్తిని ఆయన కనుగొనుటకు ప్రయత్నించెను.

GEN 9:21•

NUM 20:12•

ACTS 13:22

 

52ఆయన చేసిన మొదటి కార్యము, ఆయన నోవహును ప్రయత్నించెను. నోవహు ఆయన కోరినట్లు నుండక ఓడిపోయెను; త్రాగుట వలన అతడు విఫలమయ్యెను.

మోషే ఆ గొప్ప దేవుని యొక్క మహోన్నతమైన కళాఖండముగా నుండెను, ఆయన అతని ద్వారా ప్రయత్నించెను మరి విఫలుడయ్యెను. మోషే తన్నుతాను మహిమపరచుకొన చూచెను మరి వాగ్దానపు భూమికి పోవుటకు అనుమతింపబడలేదు.

అటు పిదప దావీదు వచ్చెను, ఆయన యొక్క గొప్ప వెయ్యేండ్ల పరిపాలనను దావీదు ప్రతిభింబి౦పవలసియుండెను, మరియు ఆ యొక్క రాజు ఎవరని అతను చూపింపవలసిన వాడైయుండెను. మరియు సింహాసనముపై కూర్చొండబెట్టుటకై తనయొక్క కుమారుని లేపెదనని దేవుడు దావీదు ద్వారా ప్రమాణము చేసెను. మరియు దావీదు ఒక ధైర్యముగల వ్యక్తి, "దేవుని యొక్క చిత్తానుసారమైన మనస్సుగల ఒక వ్యక్తి" యని పిలువబడియున్నాడు. మరియు దావీదు చాలా మంచిగా ప్రవర్తించుచుండెను. అతను ఫిలీష్తియులనందరిని సంహరించెను మరి వారి బలిపీఠములను పడద్రోసి మరి వాక్యముతో నిలిచియుండెను. మరి చివరకి, ఒక అందమైన స్త్రీ అతనిని తలక్రిందులు చేసినది, మరియు అతను ఆజ్ఞలను మీరెను, వాక్యమును కోల్పోయెను, వ్యభిచారమును చేసెను. చూశారా? దేవుని చిత్తానుసారమైన మనస్సుగలిగిన వ్యక్తి, చూడుడి, దావీదు కూడ దేవుని యొక్క ప్రయత్నములో విఫలుడయ్యెను.

మోషే దేవుని చిత్తమును నెరవేర్చలేక పోయెను, మరి మిగిలిన అందరును ఆయన ఎడల ఓడిపోయిరి, అయితే వీరందరి యొక్క జీవితములు రాబోవు ఆ ఒకని యొక్క ప్రతిభింబములై యున్నవి.

REV 2:17,28

 

53ప్రకటన గ్రంథమును గురించి నేను వ్రాయుచుండగా, దానిని తర్జుమా చేయలేక వ్యాకరణ ప్రకారము దానిని సరిచేయునతను… నా యొక్క వ్యాకరణము చాలా ఘోరముగా నుండును, వ్యాకరణ విధముగా వ్రాయవలెనని సరైన నామవాచకములను పెట్టవలయునని మరియు సర్వనామములను పెట్టవలయునని దానిని ఒక మంచి పండితుని ద్వారా చేయవలెనని, అతడిని నేను కలిగియుంటిని. నామవాచకమునకు మరి సర్వనామమునకు నాకు బేధము తెలియదు. అయితే, అతనికి తెలియును, మరి అతను వాటన్నిటిని అమర్చి క్రమముగా చేయుచున్నాడు… దేవుడు దానిని నాకు అనుగ్రహించుచున్నాడని నాకు తెలుసు. ఆ ఒక్క కార్యమే నేను ఎరుగుదును. మరి నేను వాటిని అట్టే వ్రాయుచున్నాను, చూశారా. మరి వారు దానిని సరైన పద్దతిలో వ్యాకరణ రీతిగా పెట్టి వ్రాయుచున్నారు, తద్వారా ఆ వర్తమానములు పాఠశాలలకు మరియు ఇతర చోట్లకు పోయినప్పుడు వారు వారి భాషలో చక్కగా అర్థం చేసుకొనేలా వారికి సులభముగా నుండును. మరి అప్పుడు దానిని వ్యాకరణ రీతిగా సరిచేయునతను నాతో చెప్పియున్నాడు, నన్ను అడిగెను, "అయితే సహోదరుడా బ్రెన్హాం పెర్గమ సంఘ కాలములో మనము చూచుచున్నాము అక్కడ యేసు చెప్పియున్నాడు, 'జయించు వాడెవడో అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.' అతనికి వేకువ చుక్కను ఇచ్చునా?" అని అతను అడిగెను, "ఇప్పుడు యేసు తానే వేకువ చుక్కయని చెప్పియుండగా, జయించువాడు ఏ విధముగా వేకువ చుక్కను పొందగలడు?"

REV 1:20

 

54చూశారా, అబ్రాహాము యొక్క సంతతియంతయును నక్షత్రములవలె ప్రకాశించుచున్నారు. వారు ఒకరికొకరు భేదముగా యున్నారు, మరియు మనము కూడ ఒకరికొకరము వ్యత్యాసముగా యున్నాము. మరియు యేసు వాటిన్ని౦టి కంటే మిక్కిలి ప్రకాశవంతమైన వేకువ చుక్కగా యున్నాడు. అయితే, మనము ప్రకటన గ్రంథము 1లో ఆయనను చూచుచున్నాము, ఆయన చేతిలో ఏడు నక్షత్రములు కలవు. ఆయన వాటిని అనువదించి చెప్పుచున్నాడు, "ఈ ఏడు నక్షత్రములు, ఏడు సంఘములకు ఏడు దూతలుగాను, లేక రాబోవు ఏడు సంఘ కాలములకు దూతలు."

అప్పుడు అతను అడిగెను, "వారు గనుక వేకువ చుక్కను పొందియున్న యెడల, అదెట్లు మరి ఆ విధముగా నుండును?"

"ఆయన చేతిలోనున్న నక్షత్రములు వేకువ చుక్కను ప్రతిఫలించుచున్నవి అంతే చూశారా, ఏలయనగా ఆ దినపు వర్తమానికుడు ఆ కాలమునకైన వర్తమానమును కలిగియుండెను" అని నేను జవాబు చెప్పితిని. మరియు ఆయన వాక్యముగా నుండెను; ఆ వర్తమానికుడు ఆ కాలమునకైన వాక్యభాగమును అతడు కలిగియుండెను. మరియు లోకపు పోకడనుండి మరి లోకపు కార్యముల నుండి వేరుపడి ఆయనతో కూడ నడచుటకు ఆ కాలపు వర్తమానికుని ద్వారా వారు వేకువ చుక్క యొక్క ప్రతిబింబమును చూచిరి. ఆయన నోవహు ద్వారా మరియు మోషే ద్వారా మరి ఆ విధముగా పాత నిబంధనను వీరందరి ద్వారా ప్రతిబింభించుచు, ఆ ఒక్క వ్యక్తి వచ్చు వరకు ఆలాగుననే చేయుచుండెను. మరి కావున, ఆ విధముగానే సమస్తమును, యేసు నొద్దకు తిరిగి వచ్చులాగున సంఘకాలము యొక్క అంతమందుండును. ఆయన వాక్యము గనుక సమస్తమును మరల వాక్యము నొద్దకు వచ్చును.

JOHN 3:34

 

55క్రైస్తవులైన మనము మాత్రమే ఆయనను ప్రతిబింబించుచున్నాము. సూర్యుడు లేనప్పుడు చంద్రుడు మాత్రమే ప్రతిఫలించును. దేవుని కుమారుడు లేనప్పుడు మరి విశ్వాసి మాత్రమే దేవుని కుమారుడిని ప్రతిఫలించును. అంధకారములో వాక్యము వెలుగైయున్నట్టుగా పరిశుద్ద గ్రంథములోని లేఖనములు మన జీవితములో ఆ వెలుగుగా నిరూపించబడుచున్నది. మీరు కొండపై నుంచబడిన దీపములై యున్నారు. అది సూర్యుడు కాదు; అది క్రొవ్వత్తి మాత్రమే. అది ఉత్త క్రొవ్వత్తి మాత్రమే, సూర్యుని యొక్క స్థానమును తీసికొను క్రొవ్వత్తి, అది కొద్దిగా మాత్రమే వెలుగునిచ్చును. మనము దేవుని యొక్క బిడ్డలముగా నున్నాము, మనము దేవుని యొక్క కుమారులును మరియు కుమార్తెలుగా నున్నాము, కొద్ది భాగము ఆత్మను మాత్రము పొందియున్నాము. ఆయన పరిపూర్ణముగా వెలుగును కలిగియున్నాడు. మనము వెలుగుచున్న ఒక నక్షత్రమై యున్నాము, ప్రపంచమునకు మనమందరమును కలిసి ఒక వెలుగుగానున్నాము, అయితే ఒక్కొక్క నక్షత్రముపై తన ప్రకాశమును ప్రతిఫలించు అఖండమైన ప్రకాశముగల కుమారుడుగా ఆయన వున్నాడు. హల్లేలుయా! నేను ఆయనను నమ్ముచున్నాను. దేవా నా యొక్క అవిశ్వాసమును తీసివేయుము!

MATT 4:4•

LUKE 4:4•

HEB 4:15

 

56చివరగా, ఈ పరిపూర్ణమైన ఒకాయన ఉదయించెను. ప్రతీ ఒక్కొక్క కార్యమునందు శోధింపబడుటకు ఇప్పుడు ఆయన మనవలె వచ్చెను. నోవహువలె ఆయన శోధింపబడియున్నాడు. మోషేవలె ఆయన శోధింపబడియున్నాడు. మిగత అందరివలెను ఆయన శోధింపబడియున్నాడని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. మనకు గనుక సమయమున్న యెడల దానిని మీకు వివరించి చూపవలయునని యున్నాను, అయితే నేను అధికమైన సమయమును దానిని వివరించి మీకు చూపుటకు, తీసికొనవలయునని కోరుట లేదు. ఆయన అదే విధముగా శోధింపబడియున్నాడు.

సాతాను తన యొక్క యుక్తులను మార్చలేదు, దేవుడు కూడా మారనివాడై యున్నాడు, అయితే కాలములు మారుచున్నవి. అయితే ఏమిటి… సాతాను ఏ విధముగా భూమిపైనున్న దేవుని యొక్క మొదటి కుటుంబములో జొరబడెను. ఇదిగో అది ఇక్కడనున్నది సహోదరుడా, సహోదరి దీనిని గ్రహించుడి. మొదటి కుటుంబమును సాతానుడు ఏ విధముగా కలిగెను? వాక్యమును కోటగా కలిగి దాని వెనుక వారు ఉన్నందువలన అతనికి వాక్యమును ముక్కలుగా ఖండించునట్లు చేయుట తప్ప వేరే మార్గము లేకపోయెను. అతనికి గనుక ఒకే ఒక్క సందు దొరికిన చాలును!

అతను ఆ విధముగానే ఒక్కొక్క కాలములోనున్న ఒక్కొక్క సంఘములోను, ప్రతియొక విశ్వాసిలోను ఆ సందును చూచుకొని వారిని వాక్యము నుండి బయటికి లాగివేయుచున్నాడు. "సరి, నేను పరిశుద్ద గ్రంథము సరియని నమ్ముచున్నాను, అయితే దానిని నేను నమ్మను." ఓ, అక్కడ అతను జొరబడుచున్నాడు. చాలా ఘోరముగా నున్నది, అయితే అతను జోరబడుచున్నాడు.

"దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన!"

57ఇప్పుడు దీనిని జాగ్రత్తగా గమనించుడి. రావలసియుండిన ఆ ఒకాయన చివరగా వచ్చి, ఆయన కూడ ఇతరుల వలె శోధింపబడవలసియుండెను. ఇప్పుడు గమనించినయెడల సాతాను అదే విధమైన యుక్తులను ప్రతి యొకసారియును ప్రయోగించుచుండెను. అతను హవ్వకు ఇచ్చినట్టే, సహజమైన రొట్టెను ఆయనకు కూడ ఇచ్చుటకు అతడు ప్రయత్నించెను. "దీనిని నీవు భుజించినయెడల, దీనిని తీసికొనుము," లేక మరి ఆ విధముగా అతను కలిగియున్న దేనినో వారి కిచ్చుటకు అతను కలిగియుండెను.

మరియు దానినే అతను ప్రతీ ఒక్కొక్క సంఘ శాఖకు చేసెను, ప్రతియొక్క వ్యక్తికి అతను దానినే చేసెను, మీరు చూచులాగున ప్రకృతి సంబంధమైన కార్యములను అతను మీకు ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. మరి అది మిమ్ములను వాక్యము నుండి వైదొలగింపజేసి దూరముగా కొనిపోవుచున్నది! "సరి, ఈ యొక్క గొప్ప సంఘమును చూడుము! ఏలయనగా వారు అనేక లక్షల మందిని వారి సంఘములో కలిగియున్నారు! నగరములో మా యొక్క సంఘము చాలా పెద్దది. సరి, మా యొద్దకు నగరాధ్యక్ష్యుడు వచ్చుచున్నాడు. దానినంతయును చూడుడి! మా యొక్క కాపరికి డి.డి., ఎల్.డి, పిహెచ్.డి! పట్టాలు కలవు! అవి చాలా బాగున్నవి. అతను మిక్కిలి తెలివైన వ్యక్తి." ఒక కాథోలిక్కు మత గురువు తనయొక్క డిగ్రీలతో ఇతనిని మించిపోవచ్చును. మీరు పరిశుద్ద గ్రంథమును చదివి తెలుసుకొనులాగున అతను అరువది ఆరు పుస్తకములను అభ్యసించి కార్యములను తెలుసుకొనవలసినదిగా యున్నది, అందువలన అతను ఒక మతగురువుగా అగుటకు ఆ విధముగా చదివి తనయొక్క పట్టాను పొందవలసియున్నది, కావున విద్య ద్వారా దానిని పోల్చుటకు మీరు ప్రయత్నించవద్దు.

58ఎల్లప్పుడును పోల్చుటకు ప్రయత్నించునది, ప్రపంచములో ను౦డు కార్యముగా నున్నది. ప్రపంచము యొక్క కార్యములతో మీరు పోల్చి చూచుకొనకుడి. సంఘములతో పోల్చి చూచుకొనకుడి, పరిశుద్ద గ్రంథముతో పోల్చి చూచుకొనుడి! ఈ రోజు మనము చేయుచున్న కార్యమిదియే. మనయొక్క పెంతెకోస్తు సంఘములతోనున్న కార్యమిదియే. మన యొక్క నలుగురు కలిసి పాడు గాయకుల తోను మరి ఆలాటి కార్యములు మనము చలన చిత్ర రంగమైన హాలీవుడ్ వలె నటించుటకు ప్రయత్నించుచున్నాము. హాలివుడ్ తళతళమని మెరయును; సువార్త ప్రకాశించును. మరి తళతళమని మెరయుటలోను ప్రకాశించుచు వెలుగుటలోను బేధమున్నది. హాలివుడ్ ఈ లోకపు దుస్తులతో అలంకరించుకొని మరియు రిక్కీస్, రిక్కటూన్లతో నవీన నాగరిక యువతి, యువకులతో నిండియుండును. అయితే దేవుడు ఒక విశ్వాసియొక్క నడతలో తన్నుతాను తగించుకొని వారి ద్వారా ప్రకాశించును, ఎంత నిర్లక్ష్యము చేయబడినవాడైనను వారిద్వారా తన్నుతాను వెలిగించుకొనును. ఆయన తన్నుతాను తగ్గించుకొనుట ద్వారా ప్రకాశించును, హాలివుడ్ వలె తళతళమని మెరవటం కాదు.

59గమనించుడి, మిగలిన వారియొద్ద చేసినట్లు, మోషే యొద్ద చేసినట్లు తనయొక్క పాత తంత్రమును యేసు నొద్ద ప్రయోగించుటకు ప్రయత్నించెను. దానిని అతను ప్రయత్నించెను. తళతళమని మెరయు ఆ విధముగా పైపై మెరయు గొప్ప కార్యములను మీరు అంగీకరించునట్లు దానిని అతడు మీపై ప్రయోగించును.

నేను రకూన్ను (జంతువు) వేటాడుట నాకు జ్ఞాపక మున్నది. నా తండ్రికి పొగ త్రాగు అలవాటు కలదు. ఆ చుట్టును చుట్టి ఒక తళతళ మెరయు జిగినా కాగితముండుట మీకు తెలియునా. ఈ జంతువులు తిరిగే స్థలముల యందు ఒక మొద్దులో రంధ్రము చేసి దానిలోపల ఈ యొక్క తళతళమని మెరయు జిగినా కాగితమును పెట్టి మరియు దాని లోపల అది దాని చేతులను పెట్టినప్పుడు సులభముగా మరల దాని చేతులు బయటకు రావటానికి వీలులేకుండా ఆ స్థలమందు మేకులను వేర్వేరు చోట్లలో కొట్టి యుంచెదవు. దానిని ఆ విధముగా చేసియుంచవలయును. మరియు రకూన్లు ఎల్లప్పుడు తలతలమని మెరయు వాటిని చూచి వాటియొద్దకు అవి వచ్చును. కావున చంద్రుని యొక్క కాంతిలో మరి ఇవి ఆ జిగినా కాగితము మెరయుటను చూచి చేతిని దానిలోపలకి పెట్టును. కాగితమును గట్టిగా పట్టుకొనును దానిని అది వదలదు.

అతను ఒక సంఘ సభ్యునివలె నున్నాడు. అతను తాను చిక్కుకొని యున్నాడని ఎరిగియుండియు, ఆ మెరుపుల కాగితమును వదలక అట్టే పట్టుకొని యుండును. "నేను ఆ విధముగా చేసినయెడల వారు నన్ను సంఘ శాఖ నుండి నెట్టి వేయుదురు." అది అతనియొక్క మరణము, అదంతే. అది సరి. గమనించుడి. అక్కడ అతడు దానిని పట్టుకొనియున్నాడు, దానిని అతను వదలలేక పోతున్నాడు.

MATT 4:4•

LUKE 4:4

 

60ఇప్పుడు సాతానుడు అతని యొక్క తంత్రమును యేసుపైనను, మరియు తక్కిన వారిపైనను ప్రయోగించెను. వాగ్దానము చేయబడిన వాక్యమును రొట్టెను తప్పనిచ్చి మరి దేనినో ఆయన తినులాగున ఆయనయొద్ద అతడు ప్రయత్నించెను. ఏలయనగా, యేసు చెప్పెను, "వ్రాయబడి యున్నది, 'మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవింపడు.'" చూశారా? అతడికి ఆయన లొంగిపోవలయునని అతడు ప్రయత్నించెను. అది చూచుటకు చాలా బాగుండెను, ఆయన తన్నుతాను పోషించుకొనగల సమర్ధుడని చూపించుకొనులాగుండెను, మరియు దానిని ఆయన చేయగలిగి యుండెను. మీరు…

మీరును మీకు తోచిన విధముగా మీరు ప్రవర్తింపవచ్చును. మీరు దానిని గైకొనవచ్చును లేక వదిలి వేయవచ్చును, మీకు తోచిన విధముగా. ఆ యొక్క రకూన్ తనయొక్క చేతిని ముడుచుకొని బయటికి లాగిన ఆ ఉచ్చు నుండి తప్పించుకొనవచ్చును; అయితే దానిని అతడు చేయలేక అక్కడ ఆ కాగితమును అట్లే పట్టుకొనియుండును. మరియు ఆ విధముగానే అనేకమైన సాధారణ క్రైస్తవులు కుడా చేయుదురు. వారు దానిని గురించి వినదలచుకొనలేదు, వారు వచ్చి వినదలచుకొనలేదు. వారికి దానిని గురించిన కార్యము అక్కర లేదు. పోయి మరి దానిని పట్టుకొనుడి, అప్పుడు చూడుడి, ఏమి జరుగనైయున్నదో మీరు కనుగొనగలరు.

61ఇప్పుడు గమనించుడి, ప్రతీ ఒక్కొక్క మనుష్యుడును జీవించుటకు గాను యున్న జీవాహారమైన రొట్టెను వదిలి మరి వేరొకదానిని ఆయన తినులాగున చేయుటకు వారు ప్రయత్నించిరి. అయితే యేసు తండ్రి యొక్క వాక్యముతో నిలిచియుండెను. ఓ, అప్పుడతను హవ్వను తాకలేదు. మోషేను తాకలేదు. తక్కిన వారినెవరిని అతడు తాకలేదు. ప్రతియొక్క వాక్యమును ప్రతిఫలింపజేయు ఆ ఒక్కనిని అతడు తాకెను, చూడుడి, ఆయన వాక్యమైయున్న కారణముచే అతడు అట్లు చేసెను. అయితే యేసు వాక్యముతో నిలచియుండెను, సాతాను యొక్క వేదాంత సెమినరీ సిద్ధాంతాలను నిరాకరించెను, అవునయ్యా, అతని యొక్క క్రొత్త వెలుగును, నూతన అనుభవమును నిరాకరించెను. ఆమెతో చూపించుటకు, "ఓ, నిశ్చయముగా, దేవుడు…" హవ్వపై దానిని ప్రయోగించిన విధముగా అతడు యేసు పై ప్రయోగింపలేక పోయెను.

"మనమందరమును ఒక్కటిగా కూడి మరి ఒక సర్వప్రపంచ ఆలోచనా సంఘమును నెలకొల్పినట్లయితే. నిశ్చయుముగా, దేవుడు అందులో వుండును. ఆయన ఐక్యతను మరియు సహోదరత్వమును కోరుకొనును." ఆయనతో మనము ఐక్యమైయున్నట్లు కోరుచున్నాడు, లోకముతో కాదు; అయనతో మనము సహోదరత్వమును పొందుకొనియుండి, ఆయనను ఆరాధింపవలయునని కోరుచున్నాడు. అందుకొరకే ఆయన చనిపోయెను, మరియు మీరు ఆయనను ఆరాధించులాగున. ఎప్పటివలె అతడు గనుక పొందలేకపోయిన…

అతడు విఫలమయ్యెనని మనము కనుగొనియున్నాము. "ప్రభువు ఈలాగు నెలవిచ్చుచున్నాడు," అనే దానితో యేసు అతడియొద్దకు వెళ్ళెను.

62అతను ఒక విశ్వాసిని చూచునప్పుడు… మీలో ప్రతి యొక్కక్క విశ్వాసియును ఈ విధమైన వర్గములో వచ్చుటను గమనించుడి. అతను గనుక మీరు పరిశుద్ద గ్రంథముతో నిలిచియుండుటను అతడు చూచినయెడల, "అవును నేను బైబిలును నమ్ముచున్నాను, నేను ఎటువంటి శాఖలో చేరి దానిని వెంబడించును, నేను పరిశుద్ద గ్రంథముందు నిలిచియుందును" అని చెప్పుదురు. నిజమైన సత్యములో జీవించుటను మరియు వాక్యమును నమ్ముటను మరి వీటిలోనుండి గనుక అతను మిమ్ములను వేరుపరచ వీలుగానియెడల, యేసుకు రెండవ సారిగా ఏమి చేసియున్నాడో మరి దానిని అతను మీకు చేయును. మీరు చెప్పవచ్చును, "నేను ఏ ఆచారములోనికి వెళ్ళి చేరను. నేను చేరను. నేను స్వేచ్చతో పుట్టిన వ్యక్తినైయున్నాను, దానితో కూడ నిలిచియుండెదను. దీనిని, దానిని మరి దేనినో నేను చేయబోవుచున్నాను." చూడుడి, సంఘముతో చేరుము, మరి నీవు వచ్చి చేరుము, మరి ఇంకొక దేనితోనో చేరుము. అతను ఆ విధముగా మిమ్ములను దేనిలోను చేర్చలేకపోయిన యెడల, మరప్పుడు అతను ఇంకొక కార్యమును మీ యెడల చేయును. ఓ, సహోదరుడా, దీనిని గమనించుము.

JOHN 16:13•

2PET 1:20

 

63అతను ఆ విధముగా మిమ్ములను మార్చలేకపోయిన యెడల, అతడు తనయొక్క స్వంత సెమినరీలకు ప౦పును, తన యొక్క పండితులను మీకు బోధించుటకు పంపును, చూడుడి, సాతాను వాటియొక్క వ్యాఖ్యానమై యున్నాడు. "ఓ, అద్భుతముల దినములు ముగిసిపోయున్నవి. అక్కడున్న ప్రజలు వారు మత పిచ్చి గలవారు, మరి వీరు అట్లా కాదు అని చెప్పి, చూశారా." అక్కడికి మిమ్ములను పంపివేయును.

ఓ, మీరు చెప్పవచ్చును, "ఒక్క నిమిషమాగుము, సహోదరుడు బ్రెన్హాం! ఒక్క నిమిషమిప్పుడు!" అవును, మనము ఒక్క నిమిషము ఆగెదము, చూడుడి. మీరిప్పుడు చెప్పవచ్చును, "దీనిని మనమిప్పుడు చేయకూడదు తెలియునా? మనము చేయకూడదు కదూ?" కాదయ్యా. కాదయ్యా.

అయితే యేసు చెప్పెను, "సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, చూశారా, నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని ఆయన మీకు జ్ఞాపకము చేయును, వాక్యమును. మరియు ఆయన రాబోవు సంగతులను మీకు చూపును." భూమిపైన దేవునిని, వాక్యమును ప్రతిబింబింపజేయు, నిజమైన ఆత్మతో-నింపబడిన సంఘము, వాక్యముతో నిలిచియుండు సంఘము ఇప్పుడు కలదు. చూశారా? ఆయనకు ఏ యొక్క వేదాంత పండితుడు అక్కరలేదు, ఏలయనగా ఆయన యొక్క వాక్యమును ఏ ఒక్క మానవుడును తన వ్యక్తిగతమైన అనువాదము చేయరాదు. ఆయన తనయొక్క స్వంత వాక్యమును తానే అనువదించుకొనును, ఎట్లనగా అది సత్యమని నిరూపించుట ద్వారా ఆయన దానిని రుజువుచేయును.

పెంతెకొస్తను దినమున వారు పరిశుద్దాత్మను పొందినట్లు మీరు పొందలేరని మెథడిస్తు సంఘము మీకు చెప్పినయెడల, మీరు వారు చెప్పిన మాటలయందు మీ ఆసక్తిని కనబరచితిరా? నిశ్చయముగా లేదు. మీరు వాక్యముతో నిలచియుండి పరిశుద్దాత్మను పొందియున్నారు. చూశారా? ఏలయనగా…

JOHN 14:18,19•

HEB 13:8

 

64ఆ దినము రాత్రి ఒక బాప్తిస్తు వాక్య పరిచారకునితో నేను త్రిత్వమును గురించి సంభాషించుచుంటిని, మరి అది ఒక పరిభాష మాత్రమేనని నేను అతనితో చెప్పితిని. మరి కావున సెమినరీలలో నున్న ఇంకొక చిన్న పరిచారకుడు, "మంచిది, మిస్టర్ బ్రెన్హాం, అపొస్తలుల యొక్క మతమును జనులు విశ్వసించులాగున మీరు చేయుచున్నారు" అని నాతో చెప్పెను.

"నిశ్చయముగా, ఆ ఒక్క మార్గము మాత్రమే యున్నది" అని నేను చెప్పాను.

మరియు అతను అడిగెను, "అయ్యూ, మీరు ఏ పాఠశాలకు వెళ్లి యున్నారు?"

నేను బదులిచ్చాను, "నా యొక్క మోకాళ్ళపై, నా సహోదరుడా. చూశారా, అక్కడే నేను పొందాను, వేదాంత పండితము ద్వారా కాదు, అయితే మోకాళ్లు ద్వారా పొందుకున్న పండితము." "అక్కడే నేను ఆయనను కనుగొన్నాను" అని నేను జవాబిచ్చితిని.

మరియు అతను అడిగెను, "మిస్టర్ బ్రెన్హాం, పెంతెకొస్తు దినమున వారు పరిశుద్దాత్మను పొందినట్లుగా, ఈ దినములలో కూడ పొందగలమని మీరు చెప్పుటకు ప్రయత్నించుచున్నారా?"

నేను చెప్పాను, "పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, అయ్యా, యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు," అని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. నేను చెప్పాను, "పెంతెకోస్తు దినమున వచ్చిన యేసుక్రిస్తు ఆయనే." ఓ, అవును.

కాదు, ఆయనే అది. "కొంత కాలమైన తరువాత, నేను నా తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా, పరిశుద్దాత్మను మీకు అనుగ్రహించును. కొద్ది కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు, మరి ఎన్నడును నన్ను చూడదు; అయినను మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను మీతో కూడ నుండెదను, మీలో నుండెదను, యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ నుండెదను."

నేను చెప్పాను, "అవును, పెంతెకొస్తు దినమున అది ఆయనే. అవునయ్యా. ఆయన వచ్చెను, వారిలో జీవించెను, పరిశుద్దాత్మయను వ్యక్తి రూపములో, మనము దైవత్వము గురించి తెలుసుకొనియున్న విధముగా, యేసుక్రీస్తు పరిశుద్దాత్మ అను వ్యక్తి ద్వారా వచ్చెను."

ACTS 1:15•

ACTS 8:5,14-17

 

65ఇప్పుడు గమనించుడి. సాతానుకు అతని యొక్క వేదపాండిత్యము అక్కర లేదు. మరియు ఈ వ్యక్తి నాతో చెప్పెను, అతను చెప్పెను, "మిస్టర్ బ్రెన్హాం, మీకు అర్థమయ్యేలాగ చెప్పుచున్నాను, నేను ఫలానా వేద పాఠశాల నుండి వచ్చియున్నాను, మరి మేము బాగుగా శిక్షణనొంది యున్నాము" అని అతడు చెప్పెను.

నేను బదులిచ్చాను, "నేనెల్లప్పుడును మీ యొక్క కార్యక్రమములను విని యున్నాను." చూశారా?

"అక్కడ మేము శిక్షణనొంది యున్నాము." చెప్పెను, "పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము శిష్యులకు మాత్రమే" అని అతను చెప్పెను,

నేను బదులిచ్చాను, "నూట-ఇరువది-మంది మేడ గదిలో కూడి యుండిరని బైబిలు చెప్పుచున్నది." మరియు "ఇప్పుడు ఎవరు సరి, నీవా లేక వాక్యమా?" అని నేను అతనిని అడిగాను,

మరియు నేను చెప్పాను, "మరప్పుడు ఫిలిప్పు వెళ్ళి సమరయులకు బోధించెను, మరియు అతను వారికి యేసుక్రిస్తు నామమున బాప్తిస్మమిచ్చెను, అయినను పరిశుద్దాత్మ వారిపై ఇ౦కను రాలేదు, ఏలయనగా పేతురు తాళపు చెవులను కలిగియుండెను. కావున అతను వెళ్లి యెరుషలేమునందున్న పేతురును కలిసినప్పుడు, పేతురు వచ్చి వారిపై చేతులనుంచినప్పుడు పరిశుద్దాత్మ వారిపై దిగెను. "పరిశుద్దాత్మ!" అని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది."

ACTS 10:44-48•

ACTS 19:2-6

 

66నేను చెప్పాను, "అప్పుడు పేతురు, ఒక దర్శనమును పొందినవాడై, తాళపుచెవులతో కొర్నేలి ఇంటిపైకి వెళ్ళి, అపొస్తలులు కార్యములు 10:49, మరి అతను ఈ మాటలు పలుకుచుండగా, పరిశుద్దాత్మ వారిపై కుమ్మరింపబడెను. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు మరి ప్రవచించుచు దేవుని ఘనపరచుచుండిరి. అందుకు పేతురు - "మనవలె ఆదిలో పరిశుద్దాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా?" అని చెప్పెను. మరియు వారిని యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలయునని ఆజ్ఞాపించెను."

"ముప్పది సంవత్సరములకు పిదప మనము చూచుచున్నాము, పౌలు ఎత్తైన తీరములు గల ప్రాంతముల వైపు నుండి ఎఫెసుకు వచ్చినప్పుడు, గొప్ప ఉజ్జీవ కూటములను కలిగియున్న కొద్దిమంది బాప్తిస్తు జనులను కనుగొనెను. గొప్ప కార్యములు అచ్చట సంభవించుచుండెను. వారు అరచుచు ప్రభువును స్తుతించుచునుండిరి. మరియు పౌలు సంఘమును దర్శించెను అక్కడ ఇరువది మంది ప్రజలు కూడుకొనియుండిరి, ప్రిస్కిల్ల అకుల్లయు ఆ కూటములలో నుండిరి; న్యాయవాదిగా నుండి మారిన అపొల్లో అనునతను యేసు క్రీస్తుయని లేఖనముల ద్వారా అక్కడ నిరూపించుచుండెను. మరియు వారు గొప్ప కూటములను కలిగియుండిరి చాలా సంతోషముతో నుండిరి. పౌలు అక్కడ నుండి దాటి పోవుచున్నప్పుడు దేవుడు అతనిని చెరశాల నుండి విడిపించిన పిదప, సోదె చెప్పు ఒక యౌవ్వనస్తురాలి నుండి దయ్యమును వెళ్లగొట్టుట వలన అతను చెరశాలలో వేయబడెను. ప్రభువు యొక్క కార్యము నిమిత్తము అతను అక్కడకి వచ్చియుండెను మరి ఆ కూటములకు పోయెను. మరియు అతను చెప్పెను, "ఈ యొక్క మనుష్యుడు గొప్ప వ్యక్తి, అది సరి, అయితే," అడిగెను, "అతను బదులిచ్చెను, నీవు విశ్వసించిన పిదప, నీవు పరిశుద్దాత్మను పొందియున్నావా?" "పరిశుద్దాత్మయున్నాడన్న సంగతియే మేము వినలేదని" అతను బదులిచ్చెను.

అడిగెను, "ఆలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి? అదియే ప్రశ్న. అతను బదులిచ్చెను, "యేసుకు బాప్తిస్మమిచ్చిన అదే వ్యక్తి ద్వారా, యోహాను బాప్తిస్మమును బట్టియే మేము బాప్తిస్మము పొందియున్నాము." చూశారా? అతను చెప్పెను, "రాబోవు ఆయనయందు విశ్వాసముంచవలెనని యేసుక్రీస్తును గురించి చెప్పుచు మారుమనస్సు విషయమై యోహాను బాప్తిస్మమిచ్చెను. "మరియు వారు దీనిని వినినప్పుడు వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. మరియు పౌలు తనయొక్క చేతులను వారిపై నుంచెను, మరి పరిశుద్దాత్మ వారిపైకి వచ్చెను, మరి వారు ప్రవచించుటకును భాషలతో మాటలాడుటకును మొదలుపెట్టిరి," ముప్పది సంవత్సరముల పిదప.

మరియు నేను అడిగాను, "మీరు పరిశుద్ద గ్రంథమును నమ్ముచున్నారా?"

"నిశ్చయముగా," అని అతను బదులిచ్చెను.

JOHN 16:13•

ACTS 2:38,39

 

67నేను చెప్పాను, "పేతురు పెంతెకొస్తు దినమున అక్కడ పెద్ద శబ్దము వచ్చెను, మరియు అక్కడ కేకలును మరి దేవుని స్తుతించుటయు నుండెను, వారు అడిగిరి, "పురుషులారా మరియు సహోదరులారా, రక్షింపబడుటకు మేమేమి చేతుమని? పేతురు, "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రిస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మయను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా, ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను." ఆకాశములు మరియు భూమియు గతించును గాని, అయితే ఆ వాక్యము ఎన్నడూ తప్పిపోదు!"

పెంతెకొస్తులైన మీరు మెథడిస్తు, బాప్తిస్తు లేక ప్రెస్బిటేరియన్ వారికి శ్రద్ధనియ్యలేదు. అది ఒక్కొక్క కాలమునకని మీరు ఎరిగియుండి మరి మీరు పెంతెకొస్తు ఉపదేశములను గ్రహించిరి. నిశ్చయముగా. ఇప్పుడు, అక్కడే నిలిచిపోకుడి ముందుకు కొనసాగుడి, చూశారా.

అక్కడే పెంతెకొస్తులు తప్పు చేసియున్నారు, వారు శుద్దీకరణ వరకు వచ్చి అక్కడే ఆగిపోయిరి. లూథరనులు నీతిమత్వము వరకు వచ్చి మరి అక్కడే ఆగిపోయిరి. చూడుడి, అటు పిదప అది ఒక సంఘ శాఖగా స్థాపింపబడినది, అక్కడ అది చనిపోయున్నది. దానితో దాని సంగతి అంతే ముగిసినది. దాని సంగతి అంతే.

68మనము శిఘ్రముగా పోవుచుండగా ఇప్పుడు గమనించుడి. "సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, మిమ్మును నేను బోధించిన సర్వసత్యములోనికి నడిపించును." ఓ, మై, "నేను మీకు బోధించి మీతో చెప్పిన సంగతులనన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. మరియు ఆయన రాబోవు కార్యములను మీకు చూపును. ఆయన ప్రతి వాక్యమును నిరూపించును, రాబోవు సూచనల ద్వారా వాక్యమును స్థిరపరచును." ఆయన వాగ్దానము చేసిన సమస్తమును, మీరు గనుక ప్రతియొక్క సంఘ శాఖ నుండి మరి సమస్త కార్యముల నుండి వేరుపరచబడి దేవుని యొక్క వాక్యమును పట్టుకొనిన ఎడల, దేవుడు పరిశుద్ద గ్రంథములో వాగ్దానము చేసియున్న ప్రకారము ఆయన వాక్యములో చెప్పినవి జరుగులాగున ఆయన దాని యొక్క బాధ్యతను తీసికొనును. మరి కావున వారు ఈ విధముగా చేసిన యెడల, వాక్యము దానిని అదే నిరూపించుకొనును.

"సరి, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని," ఎవరును చెప్పనవసరము లేకుండనే వాక్యము దానిని అదే నిరూపించును.

ఒకప్పుడు నేను ఒక గ్రుడ్డివాడిగానున్న నాయొద్ద అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని ఏ మానవుడు నాకు చెప్పగలడు? హల్లేలుయా. ఒకప్పుడు నేను మూడు నిమిషములు మాత్రమే జీవింతునని వైద్యులు చెప్పినటువంటి పరిస్థితులలో యుంటిని, మరి ఈ దినమున నేను జీవించియున్నాను. వారు నాకు ఆ విధముగా వ్యత్యాసముగా ఎట్లు చెప్పగలరు? ఒకప్పుడు నులివెచ్చని సంఘ సభ్యునిగా నున్నాను, ఇప్పుడు పరిశుద్దాత్మతో నింపబడియున్నాను. దేవునికి ఏ అనువాదకుడును అక్కరలేదు. ఆత్మ తానే, అది వాక్యముగానున్నందు వలన అది సత్యమని అదే అనువదించును. ఎవడైనను ధైర్యముగల మనుష్యుడైతే దానిని అంగీకరించును. ఆయన ఆయనకు ఆయనే స్వంత అనువాదకుడై యున్నాడు. ఆయనను ఒకసారి పరిశోధించి మరి అది సరియా కాదాయని కనుగొనుడి. ఎవరో ఏదో చెప్పినారని దానికి శ్రద్ధనియ్యకుడి. దేవుడు ఏమి చెప్పియున్నాడో దానిని చేయుడి.

సరి, మీరు చెప్పెదరు. "నేను దీనిని మాత్రము చేసెదను." సరి, అట్లైన ఇంకొక దానిగురించి ఏమిటి, ప్రతివాక్యమును చేయవలసియున్నది. ఒక వాక్యమును మాత్రము వెంబండించిన యెడల అది గొలుసును త్రుంచివేయును.

ఆ యొక్క గొలుసులోనే సంఘ శాఖలు ఎల్లప్పుడును తప్పిపోవుచున్నవి. వారు దానిని ఒక సంఘ శాఖగా మార్చి పెద్ద శాఖగా స్థాపించుచున్నారు. ఈ۔ యొక్క మనుష్యులందరును ఒక్కటిగా కూడి, పరిశుద్ద తండ్రి, ఫలానా మరి-పలానా మరియు పలానా బిషప్పు ఫలానా-మరి-ఫలానా, చేసిన యెడల మీకు సంభవించు మొదటి కార్యమేమిటి? అక్కడే మీరున్నారు. మీరక్కడే చనిపోవుచున్నారు. దానిని మనము ప్రభువు చిత్తమైన యెడల సృష్టి ద్వారా మరియు వాక్యము ద్వారా ఇంకొద్ది నిమిషములో నిరూపించెదము. అది సరియా.

DEUT 8:3•

MATT 4:4•

MARK 16:17•

LUKE 4:4

 

69"మీకు జ్ఞాపకము చేయును. "ఆయన ప్రతియొక్క వాక్యమును నిరూపించును, మరియు దానిద్వారా మనము జీవించగలము. హల్లెలూయా! దాని ద్వారా జీవించును! "మనుష్యుడు ప్రతియొక్క వాక్యము వలన జీవించును, ప్రతి యొక వాక్యము నిరూపింపబడియున్నది. యేసు చెప్పెను, "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును!" దానిని పట్టుకొనుడి; అది సత్యము అని, దేవుడు నిరూపించును.

అయితే సెమినరీలు మరియు వేదాంత పండితులు సాతాను చేత ప్రేరేపింపబడి మరి చెప్పుచున్నారు, "దానిని మీరు నమ్మకూడదు. అవన్నియును అపొస్తలులకు మాత్రమే. ఆ దినములు గతించిపోయినవి. అటువంటి కార్యములు లేవు అప్పుడు సువార్తను నిరూపించుటకు యేసు చెప్పిన కార్యములన్నియును అపొస్తలులకు మాత్రమే అని వారు చెప్పుచున్నారు." ఈ రోజు మనయొద్ద విద్యావంతులైన ప్రజలు కలరు, అని అంటున్నారు.

ఆ కాలములో ఉన్నవారికి మనకిప్పుడు ఉన్నటువంటి విధ్య కన్నను అధికమైన విద్యయుండెను. ఆనాటి, యూదుల ప్రధాన ధర్మాధికారి ముందు నిలబడగల ఒక సంఘమును చూపుడి, వారక్కడ ఆ సన్హెడ్రిన్ ముందు నిలువబడ వలయుననిన, వారియొక్క తాత ముత్తాతలు యూజకులుగా యుండి యుండవలయును. ఒక్క వాక్యము ఒక పొల్లు తప్పినను, ఆ యొక్క పుస్తకపు చుట్టలో వారు ఒక పదమును మార్చినను దానికై వారిని రాళ్ళతో కొట్టెదరు. వారు దానితో సరిగా నిలువబడవలసియుండెను. అయితే నిజమైన వాక్యమనే జీవముగల గింజ వచ్చినప్పుడు వారు దానిని చూచుటకు తప్పిపోయిరి లేక వదిలివేసిరి. అందువలననే వారు ఉగ్రతకు పాత్రులగువారుగాను మరియు "సాతానుగా సేవ చేయువారు" గాను పరిగణించబడిరి.

JOHN 14:12•

HEB 13:8

 

70చూడుడి, "పరిశుద్దాత్మ ఈ దినములకు కాదు, అని ఒక సెమినరీలో విధ్యార్థి మీకు చెప్పిన యెడల, అది దేవుని యొక్క వాక్యమును ప్రతిబింబింప చేయుట లేదు. మరియు ఈ యొక్క దైవీక స్వస్థత మరి ఈ కార్యములన్నియును ఈ దినములకు కాదు అని వేరే కాలమునకు చెందినవని వారు చెప్పెదరు." చూశారా, అది దేవుని నుండి ప్రతిబింబించుట లేదు, అది ఒక ఆచారము నుండి ప్రతిబింబించుచున్నది. ఒక శాఖ నుండి ప్రతిబింబించుచున్నది. అది పరిశుద్ద గ్రంథమునకు వెలుపలి నుండి వచ్చు ఒక బోధన ద్వారా ఆ కార్యములు ప్రతిబి౦బించుచున్నవి.

హెబ్రీయులు 13:8 చెప్పుచున్నది, "ఆయన నిన్న, నేడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు. పరి. యోహాను 14:12 చెప్పుచున్నది, "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును." ఇప్పుడు మీరు అక్కడ నుండి ఆ వాక్యమును ఎట్లు తీసివేయగలరు, దాని యొక్క స్థానములో వేరొక దానిని మీరు ఎట్లు చేర్చగలరు? ఆ విధముగా చేసిన మీరు జీవపు గొలుసును విరుగగొట్టుచున్నారు . మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించును, రొట్టె వలన, ఆ యొక్క రొట్టె వలన నిత్యముగా జీవించును. ఈ యొక్క రొట్టె వలన అతను శారీరకముగా జీవించును. అక్కడ రెండు రొట్టెలున్నవి. పరిశుద్దాత్మ, పరిశుద్దాత్మ మీలోనున్నది, మీలో గనుక పరిశుద్దాత్మయున్న యెడల దేవుని యొక్క ప్రతి వాక్యమునకు "ఆమేన్" అని చెప్పును. ఇప్పుడు నేను మిమ్ములను ఒకటి అడగదలచియున్నాను. ఇప్పుడు ఇది మిమ్ములను బాధింపవచ్చును.

71నా యొక్క తల్లి నేను పసి పిల్లవానిగా నున్నప్పుడు నాకు ఆముదము నిచ్చుచుండెడివారు. మరియు నేను దానియొక్క వాసనను భరించలేకపోయేవాడిని కాదు, అయినను. చూశారా? మేము చాలా బీదవారముగా నున్నాము, ఆ విధముగా పెంచబడియున్నాము మరియు మా తల్లి జంతు చర్మమును బాగుగా నీళ్లలో ఉడుకబెట్టి మరి దానిలోనుండి క్రొవ్వును తీసెడివారు. ఒక వృద్ధురాలైన సహోదరి గుడ్విన్ వారికి ఒక బేకరి ఉండెడిది మరియు అక్కడ ఆమె పంది మాంసమును మొదలగు వాటిని వండుచుండెడి వారు. అక్కడ నుండి క్రొవ్వును తీసి మేము వండి మా యొక్క భోజనమునకుగాను జొన్న రొట్టెలతో వాటిని తినెడివారము. మరియు మేము బలమైన ఆహారమును తిననందువలన, బలహీనులముగా నుండి మరియు దానివలన జబ్బులు వచ్చుచుండెడివి. అయితే అప్పుడు మా తల్లి ప్రతి శనివారము రాత్రియను… మాకు సరైన పుష్టియైన ఆహారము లేనందు వలన అందరికి ఆముదము పోసెడి వారు. మరియు నేను నా యొక్క ముక్కును మూసుకొని మరి అరిచెడి వాడిని, నేను చెప్పెదను, "అమ్మా, అది నాకు నచ్చదు ఆ వాసన నన్ను బలహీనుని చేయుచున్నది." ఆమె చెప్పుచుండెడి వారు, "అది నిన్ను గనుక బలహీనుని చేయని యెడల, దానివలన ప్రయోజనము ఉండదు." కావున, అదే విధముగా ఈ కార్యములు కూడ ఉండును. ఇప్పుడు ఎట్లు…

72నేనిప్పుడు ఒక కార్యము మిమ్ములను అడుగదలచియున్నాను. పరిశుద్దాత్మ వలన నింపబడియున్నామని, పరిశుద్దాత్మ వాక్యమైయున్నది మరియు ఆ పరిశుద్దాత్మ మీలో శరీరధారియైయున్నాడనియును, మీ యొక్క కాలములో సువార్తను ప్రతిఫలించుటకు ఆయనలో మీరు ఒక భాగమై యున్నారని ఒక మనుష్యుడు లేక ఒక స్త్రీ చెప్పుకొనుచు హక్కును కోరుచు మరి ఆయన వ్రాసిన వాక్యమును ఏ విధముగా నిరాకరించెదరు?

మీరెంతటి మ౦చివారైనను నాకు లెక్క లేదు. ఏలయనగా, నేను మిమ్ములను ఆఫ్రికాకు తీసికొని పోయి అక్కడున్న హాట్స్ టూల్స్ అనగా ఏమి తెలియని వారిని, మరి వారి యొక్క జీవితములను మీకు చూపించిన యెడల ఒక క్రైస్తవుడు వారి యొద్ద నిలువలేడు వారు అంతమంచి జీవితమును జీవించుచున్నారు. వారు ఒక వేళ వ్యభిచారములో పట్టబడినను; వారి స్త్రీలలో ఒకరు ఆమె వివాహమునకు మునుపు, ఒక యౌవ్వన స్త్రీ ఆ విధముగా నుండిన ఆమె యొక్క కన్యాత్వమును ఆమె కన్యకయా కాదాయని వారు పరిశోధించెడి వారు. ఆమె గనుక వ్యభిచారము చేసినట్లు నిరూపింపబడినయెడల, ఆమె యెడల ఏ పురుషుడు ఆ విధముగా చేసెనో ఆమె చెప్పవలయును, మరి వారిరువురును ఒక్కటిగా చంపబడెదరు. ఆ విధముగా అమెరికా సంయుక్త రాష్ట్రములలో జరిగిన యెడల అన్ని శవములను ఎవరు పూడ్చగలరు, చూశారా? అక్కడే మీరున్నారు, చూడుడి. మరియు వారు విగ్రహారాధికులు, వారియొక్క మంచి నడతను చూడుడి. కావున ఒకరు మంచిగా నున్నారనుట వలన మీరు శోధింపలేరు చూడుడి. మనయొద్ద గల ఇండియన్ సహోదరుడు మహమ్మదీయులు మనము తలంచి చూచుకొనుట కంటె శ్రేష్టమైన జీవితమును జీవించుచున్నారనుటను చెప్పగలడు.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

73అయితే అదేమిటి? వాక్యము దానిని పరిశోధించును. యేసు వలె రెండింతలు నమ్రతను పరిసయ్యులు కలిగియుండిరి. ఆయన వారిని, వారి సంఘములను చీల్చుచు, అక్కడున్న సమస్త కార్యములను పడద్రోయుచు, మరి వారిని కొట్టి, మరి ఆ విధముగా ఆయన చేసెను.

మరియు ఈ యొక్క దైవ భక్తిగల వృద్ద యాజకుడు ఏల, ఎవరు ఒక వేళ నేను గనుక ఆయనకు విరోధముగా, ఈ ఉదయము ఒక కూటమును ఏర్పరచిన యెడల; నేను చెప్పియుండెడి వాడిని, మీరు వ్యాధితో నున్నప్పుడు ఎవరు మీ యొద్దకు వచ్చియున్నారు, మీ కొరకు ఎవరు ప్రార్ధించియున్నారు. "ఆ యొక్క దైవభక్తి కలిగిన వృద్ద యాజకుడు ప్రార్థించియున్నాడు." ఆ తండ్రియొక్క పంటలు పండక నష్టపడినప్పుడు అతనికి ఎవరు ధనసహాయము చేసి ఆదుకొనిరి? "ఆ యొక్క దైవ భక్తి కలిగిన వృద్ద యాజకుడు." మిమ్ములను దేవుని యొక్క సేవ నిమిత్తము ఎవరు మిమ్ములను అర్పించియున్నారు? "ఆ యొక్క దైవభక్తిగల వృద్ద యాజకుడు." మీరు జైలులో ఖైధీగానున్నప్పుడు మిమ్ములను ఎవరు వచ్చి దర్శించిరి? ఆ యొక్క దైవ భక్తిగల వృద్ద యాజకుడు. మరి మా ఆచారములన్నిటిని వదిలిన యేసు అని పిలువబడు ఇతను, ఆయన ఏమి చేసియున్నాడు? మీ యొక్క సంఘకాపరిని ఒక "సర్పము" అని పిలిచియున్నాడు చూశారా? చూడుడి, అది ఫలముల వలన కాదు.

అది వాక్యము వలన. "మనుష్యుడు ఫలముల వలన మాత్రము జీవించడు గాని, అయితే దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును."

మరియు ఆయనే ఆ వాక్యమై యున్నాడు. దానిని వారు చూచుటకు తప్పి పోయున్నారు. ఆయన చేయవలసిన కార్యము అదైయుండెను. దానిని వారు చూడలేకపోయిరి, ఏలయనగా దానిని వారు ముందుగా నిర్ణయింపబడలేదు. చెప్పెను, "మీరు నా యొద్దకు రాలేరు." ఆ యొక్క దయామయ స్థితిలోనున్న యూదులను చూడుడి, వారి యొక్క కండ్లు మూయబడి యుండి వారు గ్రుడ్డి వారుగా నుండిరి. నిశ్చయముగా, ఆయన దానిని చేసెను. ఆయన వారిని గ్రుడ్డి వారిగా చేసెను, ఆయనే దానిని చేసెను.

గ్రుడ్డి వారుగా చేయబడియున్న యెడల అదెట్లు నుండునని యోచించి చూడుడి. లేఖనములను మీరు చూడగలుగునట్లున్న మీ యొక్క దృష్టికి మీరు దేవునికి స్తోత్రములు చెల్లించుడి. ఇప్పుడు గమనించుడి.

HEB 13:8

 

74ఇప్పుడు, ఆయన, ఆయన ఈ యొక్క వాక్యమైయున్నాడు. ఇప్పుడు దీని తరువాత ఆయన శోధింపబడెను. యేసు శోధింపబడుట. ఇప్పుడు వీటిని మనము చూచుచున్నాము.

చూడుడి, "సరి, అది ఇంకొక కాలమునకు," అని ఎవరైనను చెప్పిన యెడల అది వాక్యమును ప్రతిబింబించుట లేదు, ఏలయనగా పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది; ఆయన నిన్న, నేడు, మరి యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు. మీలోయున్న పరిశుద్దాత్మ, మీరు పరిశుద్దాత్మతో ఏ విధముగా నింపబడియున్నారని చెప్పును?

ఇప్పుడు నేను మిమ్ములను కొద్దిగా బాధింపవచ్చునా? అది పరవాలేదా? మీ చేతులను వైకెత్తుడి. నాపై కోపపడరు కదూ? మీరు కోపపడిన యెడల పరవాలేదు.

వెంట్రుకలు కత్తిరించుకొని కురచ వెంట్రుకలతోనున్న స్త్రీలారా, మీరు పరిశుద్దాత్మతో నింపబడియున్నారని నాకు ఎట్లు చెప్పగలరు? ఒక మాట! "ఓ, నేను భాషలలో మాట్లాడియున్నాను." అది ఏ విధమైన బేధము చేయదు. మాంత్రిక వెద్యులు భాషలలో మాట్లాడి, దానికి అర్ధము చెప్పి, ఆత్మలో కేకలు వేయుట ఆత్మలో నటన మాడుటను నేను చూచియున్నాను.

ఒకడు తన యొక్క భార్యను పొట్టి దుస్తులు వేసుకొనుటకును, మరి ఆమెకిష్టము వచ్చినట్లు౦డుటకు అనుమతించిన యెడల, మరి ఆ వ్యక్తి తన యొక్క ఇంటికి యజమానునిగా నుండి మరి ఏ విధముగా క్రైస్తవుడని పిలుచుకొనును?

మరియు అటువంటి కార్యములకు ధైర్యముగా ఎదురు నిలబడి దానిని తప్పుయని చెప్పక సంఘకాపరైన మీరు, ఎలా దేవునిని సంధించగలరు? దానిని వారు చేయకుండా మీరు నిలుపలేరు. అయితే అటువంటి కార్యములను ఎదిరించి మీరు ప్రసంగించిన యెడల మీరు సెమినరీకి లేక ఆ విధమైన గుంపుతో మీరు అధిక కాలము సహవాసముతోనో మరి వారి అండలో నుండలేరు. మీరు ఎక్కడ నుండియైనను సహకారము పొందవలయును. ప్రభువు చిత్తమైన యెడల ఇంకొక్క క్షణములో మనము దానిలోనికి పోయెదము, చూశారా.

75అయితే అక్కడే మీరున్నారు. నేను మిమ్ములను నొప్పించుటను కోరలేదు. నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. అదియే కారణము. ఒకవేళ మీరు గనుక నదిలో కొట్టుకొని పోవుచున్న యెడల మరియు నేను మీరు మునిగి పోవుటను చూచుచు, "సరి, ఒక మంచి వ్యక్తిగానుండుము ప్రియా," యని చెప్పిన యెడల, నేను వేషధారిగా నుండెదను. మీరు హెచ్చరింపవలయును. అది సరి. వారికి చెప్పుడి!

ఆ రోజు రాత్రి నేను చెప్పినట్లు, నేను గనుక క్రైస్తవుడైన యెడల పరిశుద్ధ గ్రంథములోనున్న ప్రతి యొక గుణాలక్షణములతో నేను గుర్తింపబడవలయును. నోవహు దినములలో నేను నోవహుతో నిలచి మరి ప్రసంగించి మరి జనులను హెచ్చరించి యుండవలయును. అది సరియే. ఎలీయాతో కర్మెలు పర్వతముపై నేను నిలుచుకొని యుండవలయును. నేను కల్వరిలో అక్కడ నిలుచుకొని నా యొక్క తలంపులను నా స్వయమైన కార్యములను ఆయనతో కూడ సిలువపై సిలువ వేయబడియుండవలయును. అయితే, అప్పుడు మరల ఈస్టరు రోజు సమస్త కార్యములపై జయము పొందినవాడై ఆయనతో లేచియున్నాను. ప్రపంచములో నున్న ఐహిక కార్యములకు పైగా ఆయనతో కూడ లేవవలయును.

EXOD 16:33•

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

76గమనించుడి, అది వాక్యమును అప్పుడు ప్రతిబింబింప చేయలేదు, దానిని నిరూపింపలేదు. ఇప్పుడు, అయితే మీరు గనుక వాక్యమును నమ్మినయెడల, దేవుడు దానిని నిరూపించును, ఆయనే నిరూపించును, ఇక్కడ ఏసులో ఆయన చేసినట్లు.

ఎల్లప్పుడును రొట్టె అను మాటకు ఎల్లప్పుడు "భుజించుట,'' అని భావము. మరియు "మనుష్యుడు రొట్టేవలన మాత్రము జీవింపడు గాని, ఈ యొక్క రొట్టెవలె మాత్రము కాదు గాని, అయితే ప్రతిమాట వలన జీవించును." కావున అది వాక్యమను-రొట్టె, దానిని మనస్సులో నుంచుకొనుడి. ప్రతియొక కాలములో సంఘము భుజింపవలసిన రొట్టె ఇదియే, జయించు వానికి ఇది మరుగైయున్న మన్నా. ప్రకటనలో ఆ విధముగా చెప్పబడియున్నది. ఇప్పుడు నాకు ఈ యొక్క సమస్త కార్యమును విడమరచి చెప్పుటకు సమయము లేదు, ఏలయనగా నాకు ఇంకొక ముప్పది నిమిషములు మాత్రమే యున్నవి. అయితే, గమనించుడి, అప్పుడు పరలోకము నుండి పరిశుద్ద మన్నా పడినప్పుడు, అది పరిశుద్దాత్మకు మాదిరిగా యున్నది. దానితో మీరు ఏకీభవించెదరు.

దేవుడు మోషేతో నీవు బయటికి పోయి ఒక ఓమెరు నిండుగా దానిని సమకూర్చుకొని, మరి దానిని మహా పరిశుద్ధ స్థలములో నుంచుము. ఏలయనగా వారు గనుక దానిని మహా పరిశుద్ద స్థలములో ఉంచని యెడల, అది చెడిపోవును. అది సరియేనా? పురుగులు దానిలోనికి పోవును. ఇప్పుడు ఆయన చెప్పెను, "అయితే దానిని ఈ ఓమెరులో పెట్టి, మహా పరిశుద్ద స్థలములో నుంచవలయును, ఏలయనగా ఆ యొక్క యాజకత్వము ముగిసిన పిదప దాని తరువాత వచ్చు ఒక్కొక్క సంతతియును, వారిలో నుండి ఎవరైనను వాక్యమును ప్రసంగించు యాజకునిగా యుండగోరిన యెడల, అతను అభిషేకింపబడిన పిదప చేయవలసిన మొదటి కార్యములోనికి వెళ్లి మరి ఒక చేతినిండుగా ఆ యొక్క అసలైన మన్నాను తీసికొని భుజింపవలయును.

అదేమనగా ఆయన చేతిలో నున్న ఆ యొక్క వెలుగును ఈ యొక్క నూతన సంఘ కాలములో ప్రతిబింబించుట, అదియే మన్నా; మరి ఆ విధముగా ప్రతిబి౦బించు వాడెవడనగా పరిపూర్ణముగా జయించు మనుష్యుడును, మరి నిజముగా అతను వాక్యమును తప్పనిచ్చి మిగత కార్యములను నెట్టివేయును. మరి వాక్యమే ఆ మన్నాగా నున్నది. ఓ మై, అది యేసు! "మనుష్యుడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును." జయించు వానికిచ్చు మరుగైన మన్నా అదియే, ఓ, అది దాని వెన్నంటి వచ్చు ప్రతి యాజకత్వమునకు ఉంచబడియున్నది.

GEN 25:34

 

77వేద పాఠశాలలు చాలా కాలము క్రిందటే, ఈ యొక్క ఆశీర్వాదమైన కార్యమును ఒక కలగూర వంటకము అంబలికై వదలుకొనిరి. అది సరియే నిజము. అవునయ్యా.

ఏశావు చేసిన విధముగా. ఇప్పుడు, ఏశావు యాకోబు కన్నను మంచి వ్యక్తి, అయితే వాక్యమైన తన జ్యేష్ఠత్వమును ఉంచుకొనలేక పోయెను. జ్యేష్ఠ కుమారుడు, ఆ జ్యేష్ఠత్వము వాక్యము మరియు వాగ్దానమని ఎందరికి తెలియును? అయితే అతను మంచి మనిషి నీతి - న్యాయములు గలవాడు, ఈ రోజులలోనున్న నామకార్ధ క్రైస్తవులవలె మంచి వ్యక్తి. అతను అబద్దములు చెప్పలేదు. అతను దొంగిలించలేదు. అతను తన తండ్రియెడల చాలా మంచిగానుండెను. అతను ఈ కార్యములన్నియును చేసెను. అయితే, మీరు చూడుడి, అతని జ్యేష్ఠత్వమును గురించి వచ్చినప్పుడు, అతను చెప్పెను దానిని గురించి నాకు అక్కర లేదు. "అది ఎటువంటి వ్యత్యాసమును కలుగజేయుచున్నది? నేను ఎట్లైనను ఇశ్రాయేలీయుని, చూశారా, నేను ఎట్లైనను దానికి చెందియున్నాను." అయితే అతని జ్యేష్ఠత్వము మాత్రమే లెక్కలోనికి వచ్చినది, చూశారా. అతని యొక్క సహజమైన కృత్రిమ గుణములు బాగుగా యున్నవి, అయితే అతని ఆత్మీయ జీవితము తప్పుగా నున్నది.

కావున ఈ దినములలో కలగూర వ౦టకము సంఘమును మరియు లోక కార్యములను కలిపివేయుచున్నది, వెంట్రుకలను కురచగా కత్తిరించుకొంటు, పొట్టి దుస్తులను స్త్రీలు ధరించుకుంటు, ఒక్కొక్కరు గొప్ప విందులను జరుపుకుంటు మరియు మొదలగు కార్యములతో సంఘమును కొనసాగుచున్నవి.

సరి, మీరు అడుగవచ్చును, "సహోదరుడా బ్రెన్హాం, ఏమిటి ఆ చిన్న కార్యము?"

GEN 3:4•

1COR 11:5

 

78వాక్యములో ఒక కార్యమైయున్నది, ఏలయనగా ఒక స్త్రీ తలవెంట్రుకలు కత్తిరించుకొనకూడదు, అది తప్పని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. అది సరియే. ఆమె గనుక ఆ విధముగా కత్తిరించుకొనిన ఎడల, ఏ విధముగా లోనికి ప్రవేశించగలదు? చూశారా? ఏ ప్రసంగినైనను అడిగి చూడుడి, వాక్యము దానిని చెప్పుచున్నదని చెప్పును. చూశారా, "ఆమె తనయొక్క తలను అగౌరపరచుచున్నది," ఆమె తనయొక్క భర్తను అగౌరపరచుచున్నది. ఆమెకు విడాకులియ్యవలెను. అది ఖచ్చితముగా సరియే. "ఏలయనగా ఆమె ముసుగు వేసికొనిన యెడల తల వెండ్రుకలు కత్తిరించుకొనవలయును, క్షౌరము చేయించుకొన వలయును." చూశారా, దాని ద్వారా అది కనబడపరచబడుచున్నది. కత్తిరించుకొనుట కాదు, ఆ విధముగా కత్తిరించుకొనుటను దేవుడు కోరుట లేదు. దాని మధ్యలోనున్నది భర్తకు సాదృశ్యము దానితో చెలగాటమాడవద్దు. దానిని కత్తిరించిన పూర్తిగా కత్తిరించుకొనుడి, లేక దానిని ఎదుగ నియ్యుడి, అదే దేవుడు చెప్పియున్నాడు. మీరు చెప్పినా చెప్పకపోయినా, సువార్తను ప్రసంగించు ఏ ప్రసంగియెనను అది సత్యమని ఎరిగియున్నాడు. అయితే అది సత్యము, చూశారా. మిగిలిన కార్యములన్నిటిని చేసి మరి దీనిని మాత్రము వదలిన యెడల ఏమి లాభము?

ఏమిటి? ఇంకను ఇతర సంఘములవలె నుండుటకు మీరు ప్రయత్నించుటవలన ఈ లోక ధోరణి మీలోనున్నది. ఇశ్రాయేలు అక్కడే తప్పు చేసియున్నది. అక్కడే వారు చనిపోయున్నారు. అక్కడే ఆదాము చిక్కులో పడెను. అక్కడే తక్కిన మిగిలిన వారందరును చిక్కులో పడిరి. ఒకే ఒక వాక్యము, అదియే సరైన దారినుండి తప్పు త్రోవకు నడిపించినది, ఒకే ఒక విషయము. కలగూర వంటకము, ప్రపంచముతో కలిసిపోవుట! కొద్దిగా ప్రపంచపు కార్యములు, కొద్దిగా హాలివుడ్, కొద్దిగా సంఘము, కొద్దిగా వేద పాండిత్యము మరి మీరేమి కలిగియున్నారు?

79గమనించుడి, ఒకవేళ సాతాను ఇక్కడ మిమ్ములను జయించలేక పోయినయెడల, అప్పుడు మీరు వాక్యమును నమ్మకుండునట్లు చేయుటకు అతను తన యొక్క రెండవ పథకమును మీపై ప్రయత్నించును, అతను… మరి మిమ్ములను సెమినరీలకు వెళ్ళునట్లు చేయును. అతను ఇంకొక పథకమును మీపై ప్రయోగించును. మరిక్కడే మీరు చాలా జాగ్రత్తగా నుండవలయును మరిక్కడే మీకు గనుక వీలైనయెడల ఒక ఐదు నిమిషములుండుడి. పిదప అతను అస్వాభావికమైన మీకు ఇష్టము కలిగించెడు విధముగా నుండు ఒక దానిని మీకు అర్పించును. నేను ముగించుటకు మునుపు, ఈ కార్యములన్నిటి యొద్దకు వచ్చెదను. అతను ప్రయత్నించును… చూడుడి, వాక్యమునొద్ద నుండి మీరు దూరముగా అతను మిమ్ములను శోధింప వీలు కానియెడల, "కాదు, నేను వాక్యముతో నిలచియుండెదను," అప్పుడు అతను మీకు ఇంకొక అస్వాభావికమైన దానిని మీముందుంచును.

అతను చెప్పెను, "అదేమిటని నేను మీకు చెప్పెదను. నీవు ఇక్కడి నుండి లేచి మరి ఆలయము పై నుండి క్రిందికి దూకుము మరి దెబ్బలు తగులకుండా లేవుము. చూడుము, నీవు అస్వాభావికమైన కార్యము చేయగలవని జనులకు చూపించుము."

వారిని అక్కడ చిక్కుకొను లాగున చేయును. ఇప్పుడు దీనిని గమనించుడి. దానిలోనున్నది ఇదియే. గమనించుడి, మీరు చివరకు వచ్చునప్పుడు, ఈ యొక్క శోధన ఎక్కడెక్కడ వచ్చినదో చూడుడి. ఒకవేళ మీలో అనేకులను అతను అన్యభాషలలో మాటలాడులాగున చేయును, దానిని మీరు గ్రహించియున్నారని తలంచుచున్నాను, చూశారా. లేనియెడల వాక్యమునకు అది విరుద్ధముగా నున్నను, అతను మీరు ప్రవిచించులాగున చేయును. నేను జనులు లేచి ప్రవచించుటను చూచియున్నాను, అది వాక్యమునకు విరుద్దముగా, తూర్పు పడమటికి ఎంత దూరమో ఆ విధముగా నుండును, చూశారా. మీరు వాక్యము ద్వారా జీవింపవలయును. ఆ విధమైన చెప్పబడినట్లు అస్వాభావికమైన వరములను సాతానుడు అనేకమైనవి మీకు చేతినిండా ఇవ్వగలడు. నిశ్చయముగా. వాటివలన ఏ ప్రయోజనము లేదు.

PS 66:18•

MATT 7:22,23

 

80యేసు చెప్పియుండలేదా, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి మరి చెప్పుదరు, 'ప్రభువా, నీ నామమున నేను ప్రవిచింపలేదా? నీ నామమున నేను దయ్యములను వెళ్లగొట్ట లేదా. నేను అనేక మహత్తరమైన కార్యములు చేసియున్నాను. నేను సంఘ శాఖలో ఒక ప్రముఖ వ్యక్తిని. ఈ కార్యములన్నిటిని నేను చేసియున్నాను కదా?'" ఆయన చెప్పును, "అక్రమము చేయు వారలారా, నా యొద్దనుండి పొండి."

అక్రమము అనగా ఏమిటి? మీ యొక్క హృదయములో ఒక కార్యము సరియని తెలిసియుండియు, దానిని మరుగు పరచి, మరి ఆ సరైన కార్యమును చేయకుండుటయే. మీకు పరిశుద్ద గ్రంథము ఒక కార్యమును బోధించుచున్నదని మీరు తెలుసుకొని యుండియు మరి మీరు దానిని చేయరు, అదియే అక్రమము. మరియు దావీదు చెప్పియున్నాడు, "నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినయెడల, ప్రభువు నా మనని వినకపోవును." అది సత్యమేనా? అది పరిశుద్ద గ్రంథము సరియేనా? ఇప్పుడు, నిజముగా మీరు నాపై కోపపడ కూడదు పై కార్యమునకై, చూడుడి. యేసు దానిని చెప్పెను "ఆ దినమందు అనేకులు నా యొద్దకు వచ్చి, మరి చెప్పెదరు ఈ కార్యములన్నిటిని నేను చేసియున్నాను, మరి నేను చెప్పెదను, "అక్రమము చేయు వారలారా, నా యొద్ద నుండి పొండి.

ఆదాము అలాగే చేసెను. ఆదాము చెప్పెను, "ప్రభువా, నేను దీనిని చేసియున్నాను, నేను దానిని చేసియున్నాను." అయితే ఒక వాక్యము, చూశారా, ఒకే వాక్యము దానిని చేసినది. ఒక వాక్యమును వదలుటయే దానికి కావలసినది, ఒకే ఒక వాక్యమును మీరి అవిధేయత చూపుటయే.

1COR 13:1,2

 

81అవున, ఒక వేళ వాక్యమునకు విరుద్దముగా ప్రవచింపవచ్చును. అయితే ఇప్పుడు, అతను ఒక మహత్తరమైన అస్వాభావికమైన వరమును కలిగి యున్నాడు, దానియొక్క అరుపులకు, మరియు దాని ద్వారా వచ్చు మాయమబ్బులకు అతను పరవశించి దానిలో తేలుచున్నాడు. "దేవునికి మహిమ, నేను ఫలానా-మరి-ఫలానా వారికొరకు ప్రార్థించియున్నాను, మరి వారు నడచి వెళ్ళుచున్నారు! హల్లేలుయా, నేను అన్యభాషలలో మాటలాడగలను! మరియు ఎవరో ఒకరు దానికి అర్ధము చెప్పితిరి, అది స్వచ్చమైనది, సత్యము."

పౌలు చెప్పెను, "నేను మనుష్యుల భాషలోను మరియు దూతల భాషలోను మాటలాడినను, నేను వ్యర్ధుడను. కొండలను పెకలింపగల విశ్వాసము గలవాడైనను అయినప్పటికిని నేను వ్యర్ధుడను." అది సరియేనా?

అయితే అతడు మీకు వీటిని అనుగ్రహించును. ఓ పెంతెకొస్తు జనులారా, నేను మిమ్ములను ప్రేమించుచున్నాను లేనియెడల నేను మీతో కూడ నుండను. అక్కడే మీరు తప్పిపోయున్నారు, చూశారా. వాక్యమును గమనించుడి, వరమును కాదు. అదెక్కడి నుండి వచ్చుచున్నదో చూడుడి, ఇచ్చునతనిని గమనించుడి, చూశారా. అతను వాటివలన కొనిపోబడుచున్నాడు, అతను ఆత్మలో నటనమాడుచున్నాడు, [టేపులో ఖాలీ స్థలము కలదు.]… ఒకే కార్యము. అతను అనేక మంది జనులను తన చుట్టు కలిగియున్నాడు, మరి ప్రతియొక్కరును అతనిని పిలుచుచున్నారు, ఇక్కడికి రమ్ము - అక్కడికి రమ్ముయని పిలుచు చున్నారు, మరి అతను వాక్యమును మరచి పోవుచున్నాడు.

82ఓ, మీరు వాక్యమునకు దూరముగానున్నంత వరకు అధికమైన పేరు ప్రఖ్యాతులు కలిగియుండెదరు. అయితే ఒక్కసారి మీరు వాక్యములోనికి ప్రవేశించి, అప్పుడు మీతో ఎవరెవరు సహకరించెదరో గమనించి చూడుడి, చూశారా. అప్పుడు ఏమి వచ్చునో చూడుడి. ఇంకొక క్షణములో ప్రకృతి యొక్క ఇంకొక దశ ద్వారా మనము దీనిని చూడబోవుచున్నాము. చూడుడి, గమనించుడి, ఎవరు మిమ్ములను అప్పుడు కోరెదరు, ఎవరును కోరరు. "దాని నుండి దూరముగా తొలగిపోవుడి!" కొన్ని వారములకు క్రితము ఒక సంఘ సభ ఇక్కడ కూడుకొని చెప్పిరి, నన్ను లేదా ఈ నగరమునకు వచ్చు ఎటువంటి సంపూర్ణ సువార్త సేవకుడినైనను, తమ "సంఘ సేవకులు వారిని వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకు పిలిచిన యెడల, ఆ సేవకుడిని తమ సంఘ సభ్యత్వము నుండి వారిని పూర్తిగా తొలగించెదమని షరతును విధించిరి. సరి, ఎందుకనగా నేను రోగుల కొరకు ప్రార్థించుచున్నానని అట్లు వారు చేసిరి. అది సరి. "దానిని వినవద్దు!" చూచారా? మరక్కడే వాక్యము నిరూపింపబడియున్నది.

మన ప్రభువుకు కూడ అదే విధమైన కార్యమును వారు చేసియున్నారు. ప్రతీ ఒక్కొక్క యొక కాలములోను, ప్రతీ ఒక్కొక్క మానవునికిని వారు అదే విధమైన కార్యమును చేసియున్నారు. లూథరునకును, వెస్లీకి మరియు అందరికిని వారు అదే విధముగా చేసిరి. ప్రారంభములో వారు మీకు అట్లే చేసిరి, ఇప్పుడు మీరు ఏ బురదలో నుండి వచ్చియున్నారో, మరి అదే బురదలోనికి మరల పోవుచున్నారు. ఆ మార్గమును గమనించుడి, ఎల్లప్పుడును అదే విధమైన మార్గమున్నది. అది ఎన్నడును తప్పిపోలేదు, సాతాను అదే కార్యమును ఎల్లప్పుడును చేయును.

83ఇప్పుడు అతడు అరుపులనే మాయతో మరియు మొదలగు కార్యములతో ఎంతో దూరం వరుకు కొట్టుకొనిపోయి, వాక్యమునకు ఎటువంటి ఆసక్తిని కూడా అతడు కనబరచకుండా అది చేస్తుంది. "ఓ, సహోదరుడా, సహోదరుడు ఫలానా-మరియు-ఫలానా, మరి ఫలానా-ఫలానా కార్యములను చెప్పియున్నాడు, నేను అక్కడికి పోవలయును. నేను…" చూడండి, అతను దానిలో మునిగిపోయి తాను ఆ విధముగా కొట్టుకొని పోవుచున్నానని కూడ అతడు ఎరుగకున్నాడు. అది వాక్యమా కాదాయని కూడ బేధము తెలియకున్నది. "తక్కిన వారందరు చెప్పుచున్నారు అది పరవాలేదని, కావున వారికి వ్యత్యాసము తెలియకున్నది." సంఘ శాఖ చెప్పుచున్నది, "సోదరా, నీవు దానిని పొందియున్నావు, అది నీకు వేరే ఎవరును చెప్పనక్కరలేదు!" నీవేమి కలిగియున్నావు? చూశారా?

గమనించుడి.

MATT 4:6•

LUKE 4:10,11

 

84సాతాను ఈ యొక్క స్థలములో కూడ వాక్యమునకు పై పూతలు పూసి యున్నాడు. ఈ యొక్క అస్వాభావికమైన దానిలో కూడి యేసును అతడు చెప్పిన దానిని ఆయన ద్వారా చేయుటకు అతడు ప్రయత్నించినప్పుడు కూడ చూశారా, యేసు గనుక అతనికి చెవి యొగ్గియున్న యెడల ఏమి సంభవించి యుండును? చూశారా? అతను చెప్పెను, "ఇప్పుడు ఆగుము నీవు వాక్యముతో నిలువ వలయునిని కోరుచున్నావు, నీవు కోరుచున్నావు కదూ? నీవు వాక్యముతో నిలిచి యుండవలెనని కోరుచున్నావా?" చెప్పెను, "అది వ్రాయబడియున్నది, ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు." అయితే ఆయన తన పాదములను ఏ రాతికి కొట్టుకొనలేదు. చూశారా? గమనించుడి. అతను దానిలోనే నిలిచియుండిన ఎట్లు౦డును? ఆయన… మీరు గమనించారా, అతను వాక్యమును గుర్తించి చెప్పియున్నాడని నేను చెప్పలేదు; అతను దానికి పూతపూసినాడు, ఎట్లనగా కేకుపై చక్కెర కలిపిన పూత పూసిన విధముగా, దానిపై పూత పూసియున్నాడు, దానికి సున్నము కొట్టియున్నాడు, చూడుడి, అది దానియొక్క సరైన స్థానములో లేదు.

2COR 3:2•

HEB 13:8

 

85ఈ రోజు కూడ వారు దానినే చెప్పుటకు ప్రయత్నించుచున్నారు, దానికి సున్నము కొట్టుటకు ప్రయత్నించుచున్నారు, అయితే ఆ విధముగా చేసిన యెడల మరి దానిని మిగిలిన లేఖన వాక్యములతో మీరు జతపర్చలేరు. అది సమస్త వాక్యముగా నుండవలయును, "యేసుక్రిస్తు నిన్న, నేడు యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నాడు." చూడుడి, మీరు ఎంతగా వాక్యమునకు పూత పూయుటకు ప్రయత్నించినను అది సరిగా రాదు…

ఆయన దానిని చెప్పిన విధముగా సరిగా గుర్తింపబడవలయును. మరప్పుడు అది గనుక సరిగా గుర్తింపబడియున్న యెడల, మీ యొక్క జీవితములో దానిని ఆయన నిరూపించును. "మరి ఆ విధముగానే మీరు దేవునిచే వ్రాయబడిన పత్రికలని సకల మనుష్యుల ద్వారా చదువబడుచు తెలిసికొనబడెదరు." వ్రాయబడిన పత్రిక ఈ యొక్క పరిశుద్ద గ్రంథము. అది సరియేనా? ఒక పత్రిక పరిశుద్ద గ్రంథము. మరియు మీరు ఆయన యొక్క వాక్యమును ప్రతిఫలించుచున్న ఒక వ్రాయబడియున్న పరిశుద్ద గ్రంథముగా యుండి, దేవునిలో మీరు ఆ యొక్క పరిపూర్ణ మానవునిగా యున్నారు.

అయితే యేసు చెప్పెను, "ఇది కూడా వ్రాయబడియున్నది."

MATT 4:7•

HEB 13:8

 

86అయితే గమనించుడి హవ్వ అదే దశలో ఆమె తనయొక్క అస్వాభావికమైన గ్రహింపుతో ఆమె ఒక వేదాంత పాఠశాల అనుభవమును పొందెను. ఆమె యొక్క విద్యా జ్ఞానము ఆ కాలములో దేశములోనున్న ఏ యొక్క వేదాంత పాండిత్యముకన్నను మిన్నగా నుండెను. చూడుడి, దానిలో ఎంతగానో ఆమె కొట్టుకొనిపోయెను. అయితే ఆమె దానిని ఎరుగకుండెను. ఆమె ఆదాము పొందని ఏదో కార్యమును ఆమె పొందియున్నదని ఎరిగియుండెను. ఆమె ఒకవేళ అతనిపై అధికారమును చెలాయించగలదు, ఏలయనగా ఆమె దానిని గురించి అధికముగా తెలిసికొనియుండెను ఆదాము కన్నను అధికముగా. వారియొక్క ఆదాములు ఈ రోజు ఏమి చేయుచున్నారో గమనించుడి. ఆమెకు మంచి, చెడు తెలిసియుండెను, సత్యమును గురించి బాగుగా ఎరిగియుండెను. అది సరియే. ఆమె ఇదివరకంటే బాగుగా సత్యమును గురించిన చక్కని జ్ఞానమును కలిగియుండెను మరియు అది దేవుని యొక్క సత్యమైయుండెను. అయితే ఆమె వాక్యమును విరచుట ద్వారా లేక అవిధేయత వలన చనిపోయెను. అవును, ఆమె జ్ఞానమును సంపాదించుకొనెను, మంచిది.

కావున సెమినరీ అదే విధముగా మీకు వేద పాండిత్యమును అనుభవమును ఇచ్చును, మీరు పాత నిబంధన లేక క్రొత్త నిబంధనలోని ప్రతి యొక గుణలక్షణములను తెలుసుకొనియుందురు. అయితే జాగ్రత్తగా నుండుడి, వాక్యమును అచ్చట విడగొట్టకుండా వుండండి. ఆ విధముగా వాక్యమును మీరు ముక్కలుగా చేసి "సరి, అది వారికి అని చెప్పెదరు." ఆ విధముగా కాదు, అది మీకు ఎవరెవరు కోరెదరో వారికందరికి! చూశారా? చాలా జాగ్రత్తగా నుండుడి. "ఓ, అది చాలా కాలము క్రిందటనున్న సంఘమునకు." ఆయన నిన్న, నేడు, యుగయుగములకు ఒకే రీతిగానున్నాడు! ఆమె మంచి విద్యా జ్ఞానమును పొందెను, అయితే ఆమె తనయొక్క పాపము మరియు అతిక్రమములో చనిపోయెను.

MATT 4:4,9,11•

LUKE 4:4,6,8

 

87ఇప్పుడు సాతాను యొక్క మూడవ పథకము. మనము త్వరగా ముగించ వలయును, ఏలయనగా మనము అధిక సమయమును తీసికొనక, వీలైతే ఇంకొక పదిహేను, ఇరువది నిమిషములు వరకు మీరు వినదలచిన కొనసాగించెదము. గమనించుడి అతని యొక్క మూడవ పథకమును, లేక అతడి మూడవ శోధన. ఒక వేళ ఇంతకు మునుపు అతనిచ్చిన శోధనలు గనుక విఫలమయ్యిన యెడల, ఈ యొక్క మూడవది విఫలమవ్వదు, చూశారా. అతనిప్పుడు మీకు ఒక స్థానమును సంఘములో ఇచ్చును, యేసు యెడల అతను చేసినట్లు. నేను నీకు ప్రపంచమంతటిని ఇచ్చెదను. నీవు రాజుగా నుండుము, నేను నిన్ను రాజుగా చేసెదను. వారందరు నాకు చెందిన వారు, కావున దానిని నేను నీకు ఇచ్చెదను."

ఒక వ్యక్తిని ఎవరు ఒక వాక్య సేవకునిగా చేయుదురు? ఎవరు ఒక వ్యక్తిపై చేతులుంచి అతనికి వరములు ఇవ్వగలరు ? "దేవుడు సంఘములో పెట్టియున్నాడు!" వారు వాక్యమును ఏ విధముగా మార్చుచున్నారో చూడుడి. ఇప్పుడు హవ్వ తన యొక్క నూతన జ్ఞానముతో, దానిని తెలుసుకొనుటవలన ఆమె ఆదామును తన ఇష్టము వచ్చిన రీతిగా అడించెను. ఆదాము దానిని అంగీకరించునట్లు ఆమె చేసిన వెంటనే ఆమె కోరినదంతయును అతడు చేసెను.

మరయితే అతను యేసు నొద్దకు వచ్చినప్పుడు, ఆయన దానిని అంగీకరింపలేదు. ఆయన చెప్పెను, "సాతానా, నా వెనుకకు పొమ్ము. ఇంకొక విధముగా చెప్పవలయుననిన, దానిని నేను తప్పుగా చెప్పక, దీనిని దానితో జతపరచనిమ్ము, "ఇట్లు వ్రాయబడియున్నది, ప్రతి యొక మనుష్యుడును దేవుని యొక్క ప్రతి వాక్యము ద్వారా జీవించును; మీ యొక్క సొంత ఆలోచననలన కాదు, నేను నిన్ను పై అధికారిగా చేసెదను, ఒక బోధకునిగా, లేక సంఘ పెద్దగా, లేక సహోదరీ, నిన్ను ఫియోనా వాయించునట్లు నేను చేసెదను, చూడండి, 'నీవు చాలా ఒక ప్రతిభావంతుడువైన వ్యక్తివి, నీ యొక్క ప్రతిభ మా యొక్క సంఘమునకు కావలయును' అనునటువంటి ఈ సమస్త ఆలోచనలు కాదు." చూశారా, వాక్యమునొద్దకు రండి.

ఈ దినములలో కనబడు విధముగానే ఆమె అతనిపై అధికారము చెలాయించుచు లేక అతనికి బోధించుచున్నది. మరి ఆ విధముగా వారు ఈ దినమున దానిని చేయుచున్నారు, ఒక డి.డి.గా, ఒక పట్టణపు బోధకునిగా, పై విచారణకర్తగా, జిల్లా అధ్యక్ష్యుడిగా, లేక వేరేదైనను ఆ విధముగా వారు మనుష్యులను నియమించుచున్నారు.

DEUT 8:3•

MATT 4:4•

MATT 5:19•

JOHN 1:14•

ROM 3:4•

REV 22:18,19

 

88యేసు కన్నను అది ఎంత భిన్నముగా నున్నది! ఆయన వాక్యముతో నిలిచి యుండెను. ఇప్పుడు రానున్న కొద్ది నిమిషములలో, సృష్టి ద్వారా మరియు వాక్యము ద్వారా వీటి రెండింటిని కలిపి ఈ కార్యములన్నిటిని నేను నిరూపింపవలయునని కోరుచున్నాను. ఆయనే వాక్యము శరీరధారియైనదని ఇది నిరూపించుచున్నది, రొట్టె కొరకు. ఆయన శరీరధారియైన వాక్యమైయుండెను. ఆయన దేనిని ప్రతిబింబించెను? వాక్యమును మాత్రము.

మీరు గనుక వ్రాయబడిన పత్రికలైన యెడల, మీరు వాక్యమును మాత్రము ప్రతిబింబించెదరు; సెమినరీ చెప్పుదానిని కాదు, ఇతరులు చెప్పునది కాదు, దానిని గురించి కుమారి జోన్స్ ఏమి తలంచుచున్నదని కాదు, ఫలానా - ఫలానా డాక్టరు దానిని గురించి ఏమి తలంచుచున్నాడని కాదు, అయితే దేవుడు దానిని గురించి ఏమి చెప్పియున్నాడు. "ప్రతి యొక్క మనుష్యుని మాటలు అబద్దము, మరి నా యొక్క వాక్యము సత్యము! ఈ యొక్క ఆజ్ఞలలో చిన్న కార్యమును ఎవరైనను మీరిన యెడల మరి మనుష్యులకు ఆ విధముగా కొద్దిగా దాని నుండి తీసివేసి బోధించిన యెడల! ఎవడైనను ఈ పుస్తకము నుండి ఒక వాక్యమును తీసివేసినయెడల లేక ఒక వాక్యమును కలిపిన యెడల! మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవింపడు గాని, అయితే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును." ఆ యొక్క వాక్యము వలన నిత్యముగా జీవించును!

JOHN 1:1,14•

REV 22:18

 

89అక్కడ మనము ధ్యానించినట్లు మీరు జీవించుటకు శరీరప్రకారముగా ఒక మృతతుల్యమైన పదార్ధము కావలసియున్న యెడల, ఇక్కడ మీరు జీవించుటకు క్రీస్తును కలిగియుండవలయును లేనియెడల మీరు చనిపోయెదరు. మరి క్రిస్తు అనగా ఏమిటి? "ఆదిలో వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద నుండెను, మరి వాక్యము దేవుడై యుండెను. మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను."

మరియు మీరు కూడ అదే విధముగా వ్రాయబడిన పత్రికలై యున్నారు, ఒకరేమో ఒక కాలమునకు మరి ఒకరు ఇంకొక కాలమునకును, సమయమునకు వెలుగైయున్నారు; అయితే వారు దానిని చూడలేకపోయిరి. మీరు దానినే ప్రతిబింబించుచున్నారు.

మరియు ఇతరులు వాక్యమును కలిగియున్నను ఏదో ఒక విషయములో వారు విఫలమైపోయినారు; అయితే ఆయన విఫలమవ్వలేదు. మరియు నేను చెప్పినట్లు, ప్రకటనలో 22:18, ఆయన చెప్పెను, "దీనికి ఎవడైనను దేనినైనను కలిపిన యెడల!"

MATT 24:24•

MARK 13:22

 

90ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమునించుడి. మత్తయి 24:24 ఆశ్చర్యకరమైనదిగా, దానిని వారెట్లు… "ఇంచు మించు, ఈ యొక్క కడపటి దినములలో," యేసు చెప్పెను, "ఎన్నుకొనబడిన వారు సహితము ఈ యొక్క కార్యమువలన మోసపరచబడెదరు." ఆత్మలను గమనించుడి. "అంత్య కాలమందు…" ఇప్పుడు ఆ యొక్క లేఖన వాక్యములు నెరవేరవలసినదిగా యున్నది. దానిని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, అది, "అంత్య కాలమందు, ఏర్పరచబడిన వారు, ముందుగా నిర్ణయింపబడిన వారు, దానికొరకు ఎన్నుకొనబడిన వారు, మోసగింపబడెదరు…" అది చాలా పూర్తిగా ఖచ్చితముగా యున్నది, అది లేఖన వాక్యముల ప్రకారమున్నది, మరియు చాలా బాగుగా మరియు స్పష్టముగా నున్నది, మరి దానిలో మీరు ఏ లోపమును కనుగొనలేరు, ఏది ఏమైనను ఎన్నుకొనబడిన వారు మాత్రము దాని నుండి తప్పించుకొనెదరు. ఇప్పుడు యేసు దానినే చెప్పియున్నాడు. దానిని మీరు నమ్మెదరా? "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చును.

"ఏలయనగా అవి పరిపూర్ణమైన లేఖన వాక్యములు, మీ యొక్క సహజ కన్నుల ద్వారా దానిని మీరు చూడగలరు." అయితే, మీరు చూడుడి, దానిలో నున్నది అది కాదు. యేసు… పరిసయ్యులు పరిపూర్ణముగా లేఖన వాక్యములను కలిగి యుండిరి, అయితే అది వారియొక్క స్వయమైన అనువాదము వలన.

ఆయన తప్పు కాదని. వారెట్లు తెలిసికొనిరి? ఎట్లనగా దేవుడు ఆయన కొరకు ఆ కాలమునకు ఇచ్చెదనని వాగ్దానము చేసిన ప్రతి యొక వాక్యమును దేవుడు నిరూపించెను. ఆ కారణము వలననే ఆయన మెస్సీయా లేక అభిషిక్తుడని వారు తెలుసుకొనిరి, చూశారా.

MATT 15:9•

REV 22:18,19

 

91ఇప్పుడు గమనించుడి, "సాధ్యమైతే," ఈ దినములలో. ఒకే ఒక వాక్యము, ఒక పదము చాలును. మరి సాతాను ఒకే ఒక పదము ద్వారా ఆదామును తన మాట వినునట్లు చేసెను. ఈ రోజు కూడా అతనికి కావలసినది అదే, ఒక్క వాక్యమును మాత్రము మీరునట్లుగా చేయును. అదే అతనికి కావలసినది. ఇప్పుడు, మీకు తెలియును, అది సత్యమని. ఒకటి కలిపిన లేక ఒకటి తీసివేసిన, అది సమస్తమును తప్పిపోవును. ప్రతి దానిని, "దేవుని యొక్క ప్రతి వాక్యమును!" సెమినరీలలో వ్యాఖ్యానములను గురించి ఇప్పుడు ఆలోచించుడి, ప్రతి ఒక్కటియు ఒకదానికి మరియొకటి భిన్నముగా నుండును.

ఎక్కడో ఒక చోటు సత్యముండవలయును, మరి అది దీనిలో యున్నది, పరిశుద్ద గ్రంథములో. ఇప్పుడు యేసు చెప్పెను…

"సరి, సహోదరుడు బ్రెన్హాం, వారి ఆరాధన చాలా అంధముగా నున్నది" అని మీరు చెప్పవచ్చును.

యేసు చెప్పెను, "మానవులు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు, నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు, వాక్యమును కాదు," మానవుడు, వాక్యమును తన యొక్క స్వయ అనువాదమును కలిగి బోధించుచున్నాడు.

MATT 15:9

 

92మరియు నేను ఇంతకు మునుపు చెప్పినట్లు, దేవునికి ఏ ఒక అనువాదము అక్కర లేదు. ఆయన యొక్క ప్రతి వాక్యమును ఆయనే అనువదించును. చూశారా, మీకు దానిని అనువదించుటకు వేరెవరో మీకు అక్కర లేదు, దానిని గనుక మీరు అంగీకరించగలిగిన యెడల దేవుడు దానిని మీకు అనువదించును. చూడుడి, అదియే జీవముగా నున్నది దానిలోనే దాని జీవమున్నది.

యేసు చెప్పెను, "వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు." వారు నిజముగా దేవుని ఆరాధించిరి. ప్రారంభములో కయీను నిజముగా దేవుని ఆరాధించెను. "ఆయితే వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వర్ధముగా అనగా ఏమిటి? "అది ఆ ఆరాధన ఏ మంచియును చేయదు."

వారు చెప్పవచ్చు, "సరి, నేను దీనిని చేయుచున్నాను. నేను ఆత్మలో నాట్యమాడుచున్నాను. నేను, నేను అన్యభాషలలో మాటలాడుచున్నాను. నేను, నేను ప్రవచించుచున్నాను. సువార్తను నేను ప్రసంగించుచున్నాను." అయితే మీ తల వెంట్రుకలను పెంచుకొనక కత్తిరించుకొనుచున్నారు, ఆ కార్యములో తప్పు చేయుచున్నారు, మరి ఏమి జరుగుచున్నదో చూడుడి, అక్కడే ఆత్మ మిమ్ములను వదలిపోవుచున్నది. మన సంఘములకు సంభవించిన కార్యము అదే, విఫలమైపోయెను.

"నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఓ అది ఒక అందమైన ఆరాధన. అయితే వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, మానవుల యొక్క ఆజ్ఞలను దేవోపదేశములని వారు బోధించుచున్నారు."

JOHN 6:49

 

93ఆ యొక్క పరిసయ్యులు బాగుగా చదివిన వేదాంత పండితులు. ఈ దినములలో వారితో మనము సరితూగులాగున దేనినో పొందియున్నామని చెప్పగల ధైర్యము మనకు గలదని చెప్పుకొనవద్దు. కాదు, కానే కాదు. వారు వాక్యము వ్రాయబడియున్న ప్రకారము ప్రతి వాక్యమును తెలుసుకొనియుండిరి, అయితే వారు వ్యర్థముగా ఆరాధించుచుండిరి. "వ్యర్థముగా," దానిని గురించి ఆలోచించుడి, పెద్ద చక్కటి పాఠశాలలు, మరియు సెమినరీలు, మరియు బోధకులు, మరి యౌవ్వనస్తులు, మరి ఆ విధముగా అనేక కార్యములు గలవు, అయినను తప్పిపోయిరి!

అరణ్యవాసములో జరిగిన విధముగానే, ఆయన చెప్పెను, "వారందరును అరణ్యవాసములో ఆ యొక్క ఆత్మీయ బండ నుండి మున్నాను భుజించిరి, వారందరును ఆ యొక్క బండ నుండి నీరు త్రాగిరి, మరి వారందరు దాని నుండి మన్నాను భుజించిరను అర్ధముతో నేను చెప్పుచున్నాను." మరి యేసు చెప్పెను, "మరి వారందరు, ప్రతి వారును మరణించిరి." మరణము అనగా, "నిత్యముగా వేరుపరచబడుట." ఎందులకు? ఏలయనగా వారు దేవుని యొక్క వాగ్దానమును నమ్మలేక పోయిరి.

NUM 13:30-33

 

94ఓ, నేను ఈ విధముగా మిమ్ములను ఉంచుటకు కోరలేదు, అయినను దీనిని నేను చెప్పవలయును. చూడుము, దీనిని నేను చెప్పుటకు ఒక నిమిషము కూడ తీసికొనను. వారిలో ప్రతి వారును ఆ జనులు అగ్నిస్త౦భము క్రింద వచ్చిరి, వారు అరణ్యము గుండా వచ్చిరి, దేవునిని నమ్ముకొనుచు నడచి వచ్చిరి. అయితే వారు ఆ ఆటంకమును చూచినప్పుడు, ఆ పదిమంది తిరిగి వచ్చినప్పుడు మరి వారు చెప్పిరి, "ఆ భూమిని మనము గైకొనలేము. ఓ, మై, వారు అక్కడ రాక్షసులవలె నున్నారు. వారు ఈ విధముగా, ఆ విధముగా మరియు అనుచున్నారు. వారు ఉత్త… దానిని మనము సాధించలేము. అది అసాధ్యము" అనిరి.

అయితే యెహోషువ మరియు కాలేబు ఏమి చేసిరి? వారు జనులను నిమ్మళ పరచిరి. వారు చెప్పిరి, "దాని జయించుటకు మన శక్తి చాలుననిరి." ఎందువలన? ఆ యొక్క జనులను వారు వారి కన్నులారా చూచి నమ్మిరి, వారు చూపులకు అందిన దానిని చూచిరి. అయితే కాలేబు మరియు యొహోషువ దేవుని యొక్క వాగ్దానమును గమనించుచు దానిని చూచిరి. దేవుడు చెప్పెను, "ఆ యొక్క దేశమును నేను మీకు ఇచ్చియున్నాను. పోయి దానిని స్వాధీనపరచుకొనుడి!"

MATT 11:25•

HEB 6:4,5

 

95ఇప్పుడు హెబ్రియులకు 6వ వచనము, దానిని గనుక నేనిప్పుడు చదువ గలిగిన "ఒక సారి వెలిగింపబడి, పరలోకసంధమైన వరమును రుచి చూచి, పరిశుద్దాత్మలో పాలివారై, యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, వారు గనుక మరల పడిపోయిన ఎడల వారు నిరాకరించి మరి దూరముగా పోయెదరు."

అక్కడ నిలుచుకొనియున్నవారు ఆ యొక్క దేశమునకు పోయి అక్కడున్న ద్రాక్షపండ్లను తినినవారివలె వారున్నారు; మరి వాక్యమును చివరివరకు అనుసరింపవలసి వచ్చినప్పుడు, వారు చెప్పిరి, "దానిని మేము చేయలేము." మరి వారు అరణ్యములో చనిపోయిరి.

అక్కడే మనము ఆ స్థితిలోనే నున్నాము. మనము దేవుని యొక్క మంచి వాక్యమును రుచి చూచియున్నాము. అయితే, పూర్తి వాగ్దానమును అంగీకరింప వలసినప్పుడు, "కాదు, కాదు, దానిని మనము చేయలేము, చూశారా, ఏలయనగా డాక్టరు ఫలానా - మరి - ఫలానా లేక వేరెవరో చెప్పిరి, దానిని మనము చేయలేము అది అపొస్తలులకు మాత్రము. అది ఇంకొక దినమునకైనది." ఆ విధముగా మీరు చేసినప్పుడు అక్కడే మీరు మరిణించియున్నారు.

చూడిడి, లేఖనములన్నియును ఒకదానితో ఒకటి జతపరచబడియున్నవి, మరియు అది ఏ యొక్క మానవుడు చేసిన ప్రయత్నమువలన లేక వేరె దానివలన గాని అనుగ్రహింపబడదు. అది పరిశుద్దాత్మవలన మాత్రము బయలు పరచబడును. యేసు చెప్పెను, "తండ్రీ నీవు జ్ఞానులకును, వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను."

MATT 23:29

 

96మనకు గనుక వీలైన యెడల శీఘ్రముగా ఇంకొక తలంపునకు పోయెదము. "వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు." ఆ యొక్క పరిసయ్యులు, చక్కటి విద్యావంతులు. ఓ, మంచి నడత గలవారు; అయితే యేసు ద్వారా వారు ఇట్లు పిలువబడిరి, "దయ్యములు." వారు చదువుకొన్న వేద పండితులు, యేసు చెప్పెను, "మీరు దయ్యములు, మరియు మీ యొక్క తండ్రి క్రియలు మీరు చేయుదురు." చెప్పెను, "మీరు ప్రవక్తల యొక్క సమాధులను అలంకరించి సున్నము కొట్టెదరు, అయితే మీ యొక్క తండ్రులు వెనుకటి కాలమున అప్పుడు… ఆ యొక్క ప్రవక్తలు ఆ మత సంబంధమైన మార్గములను చీల్చుటకై వారు వచ్చిరి, వారి పితరులు చేసినది తప్పు," అని చెప్పిరి. వారు చేసినది అదే.

ప్రవక్తలు! వాక్యము ఎవరియొద్దకు వచ్చును ఒక వేద పండితునికా లేక ఒక ప్రవక్తకా? వేద పండితులకు మరియు పాఠశాలకు కాదు. అది ఎల్లప్పుడు ఒక ప్రవక్త యొద్దకే వచ్చును. దేవుడు ఆయన యొక్క పద్దతిని ఎన్నడును మార్చడు. మార్చనే మార్చడు, ఎల్లప్పుడును ఆ విధముగానే యుండును! ఒక గుంపునకు కాదు, ఒక వ్యక్తికి! ఎన్నటికిని ఒక సమూహము యొద్దకు రాదు; వ్యక్తికి మాత్రమే, అవునయ్యా, ఒక ప్రవక్తకు. మరి వారు చెప్పిరి…

యేసు చెప్పెను, "మీరు ప్రవక్తల యొక్క సమాధులను అలంకరించెదరు, మరియు మీ తండ్రులు వారిని అక్కడ నుంచియున్నారు." మరి వారు సాతాను యొక్క సెమినరీ ద్వారా కలిగిన గ్రుడ్డితనము వలన మరల తిరిగి అదే కార్యమును వారు చేయుచున్నారు, చూశారా.

97మరిప్పుడు పెంతెకొస్తు వారలారా, ఆ యొక్క ప్రపంచ సంఘముల ఆలోచన సభ నుండి దూరముగా నుండుడి. ఇప్పుడు ఇక్కడున్న వాక్య సేవకులారా అక్కడున్న మీ యొక్క ప్రధాన స్థావరమునకు మీరు వ్రాయండి. ఇప్పుడు మీరు అసెంబ్లీన్ మరియు వారిలో అనేకులకు వ్రాయ నక్కరలేదు, ఏలయనగా వారు దానినుండి ఇదివరకే దూరముగా నున్నారు. మరి బాప్తిస్తులైన మీరు సహోదరులారా, దానినుండి దూరముగా నుండుడి. ఖచ్చితముగా మృగము యొక్క ముద్ర వచ్చుచుండుటను మీరు చూచుట లేదా? మీకు గనుక లేఖనములను గురించి తెలిసియుండిన దానినంతటిని మరియు మ్రి౦గపోవునది ఎవరనేది మీకు తెలిసియుండును. వాక్యము గనుక మీలో ప్రతిబింబించిన యెడల, ఆ యొక్క కార్యము నుండి దూరముగా నుండుడి. దానిలోనికి ఆ మృగము ముద్రలోనికి మీ యొక్క సంఘ శాఖ పోవనైయున్నది. మరియు మీరు దానితో పోవలయును లేనియెడల మీ సంఘ శాఖను బహిష్కరించి మీరు రావలయును. మీరు స్థాపింపబడిన ఒక సంఘ శాఖలో ఉండలేరు, ఏలయనగా ఒకటి మీరు సంఘ శాఖలో నుండవలయును లేని ఎడల దానిని వదలి బయటికి రావలయును.

అటు మీరు వదిలి వచ్చిన యెడల మీరు స్థాపింపబడిన సంఘ శాఖ కాదు, అప్పుడు మీరు ఎవరైయున్నారనే దానిని చూపించుకొనుచున్నారు. ఖచ్చితముగా. దానిని మీరు చేసిన, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఎందరు ఆ విధముగా స్థాపింపబడిన సంఘ శాఖ నుండి బయటికి వచ్చెదరో చెప్పుట బహు కష్టము. అయితే కొందరు వచ్చెదరు, నిస్సందేహముగా. అవునయ్యా.

98మోసగింపబడియున్నారు, మరి యేసు వారిని "దయ్యములు" అని పిలిచి యున్నాడు. అయితే అప్పుడు యేసు అక్కడ నిలుచుకొని యున్నప్పుడు (ఏమి) ప్రతి యొక్క శోధనయు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన దానిని వాక్యముతో గద్దించెను, మరియు వాక్యముతో అక్కడ నిలిచెను. దేవుడు ఆయనను నిరూపించెను.

ఆ రోజు రాత్రి నేను మైకల్ ఆంజిలోను గురించి ప్రసంగించినప్పుడు, ఎందరు ఫారెస్ట్ లాన్లోనున్న మైకల్ ఆంజిలో ద్వారా చెక్కబడిన మోషే శిల్పమును ఎందరు చూచియున్నారు? మరియు నేను వెళ్లి దానిని మొదటి సారి చూచినప్పుడు, అది నా మనస్సులో నాటబడి నాకు ఆశ్చర్యమేసినది. మైకల్ ఆంజిలో తన జీవితమంతటిని ఆ శిల్పము చెక్కుటలో గడిపెను. అతని యొక్క తలంపులో మోషే ఏ విధముగా నుండునని అనుకొనెను. మరియు తాను చనిపోక మునుపు ఆ శిల్పమును చేసి ముగించవలయునని అనుకొనెను. మరియు అతను దానిని చెక్కుటకును, కోయుటకును మరి ఇక్కడ, అక్కడ విరుగ గొట్టుటకు మరియు మెరుగులు దిద్దుటకు అతనికి అనేక సంవత్సరములు పట్టెను. చివరకు ఒక రోజు అతను దానిని అనేక సంవత్సరములకు తరువాత ముగించిన పిదప ఈ విధముగా అతను ఒక చింపిరి గుడ్డను తన చేతిలో నుంచుకొని దాని ఎదుట అతడు నిలువబడెను. మోషేను గురించి అతను మొట్ట మొదటి సారిగా దర్శనములో చూచినప్పుడు ఎట్లు౦డెనో, అతని తలంపులలో ఎట్లు౦డెనో అతనికి ఆ సమయమున తోచి మరి అట్టే దానిని చూచుచుండెను. అతని యొక్క దర్శనములో అతను చూచిన ఆ చిత్తరువు అతని ముందు కదలాడెను. అతను తనయొక్క సొంత కళాఖండము యందు తన నేర్పరితనముపై ప్రేరేపణనొందినవాడై, అతను ఒక సుత్తిని తీసికొని మరియు ఆ శిల్పము యొక్క కాలుపై కొట్టెను "మోషే పలుకుము!" అని కేకలేసెను, అతను నిజముగానే, ఆ శిల్పము తాను తన మనస్సులో నుంచుకొనిన మోషే చిత్తరువును జ్ఞాపకమునకు తెచ్చుకొని, అది నిజమైన మోషే అనుకొని పరవశించి అది మాట్లాడవలయునని ఎదురు చూచెను. మరియు అతను కొట్టుట వలన అక్కడ శిల్పము దెబ్బ తగిలిన చోటు ఆ కాలిపై ఇంకనూ అట్లేయున్నది. అది ఒక పరిపూర్ణమైన ప్రతిమ, అయితే కుడి కాలిపై అతను కొట్టుట వలన విరిగిన కొద్ది భాగము అచ్చట అట్లేయున్నది. ఫారెస్ట్ లాన్లో దానివలె చేయబడిన శిలను మీరక్కడికి పోయిన యెడల చూడగలరు. మైకల్ ఆంజిలో యొక్క మోషే అతని యొక్క కళాఖండము, అది అతని జీవితమును ముద్రించియున్నది.

COL 2:9

 

99దేవుడు ఒక గొప్ప శిల్పి, సరి, ఆయన తనను మానవుడు ప్రతిబింబించులాగున మానవుని తనయొక్క స్వరూపమున చేసెను, మరి ఆయన వాక్యమైయున్నాడు. మరియు ఆయన ఏమి చేసి యున్నాడు? ఆయన ఆదాము ద్వారా ప్రయత్నించెను; ఆదాము ఓడిపోయెను, మోషే ఓడిపోయెను, మిగిలిన వారందరును ఓడిపోయిరి. అయితే ఇక్కడ ఒక పరిపూర్ణమైన అతను ఉన్నాడు, హల్లేలుయా. అదేమిటి? దేవుడే శరీరములో అక్కడనున్నాడు, వాక్యము ఆయన ద్వారా ప్రతిబింబించెను, దేవత్వము యొక్క పరిపూర్ణత ఆయన శరీరములోనున్నప్పుడు నుండెను; ఒక ప్రవక్త కాదు, అయినప్పటికిని ఆయన ఒక ప్రవక్త, ఒక మానవుడు కాడు, అయినప్పటికిని ఆయన ఒక మానవునిగా యు౦డెను.

యూదులారా, ఆయన మీకే సొంతమని హక్కు కోరవద్దు. ఆయన యూదుడు కాదు లేదా అన్య జనుడు కాడు. ఆయన దేవుడు, చూశారా. మీరు మీ రక్తము ఏమైయున్నదో అదే మీరు. మరియు మీరు ఇప్పుడు శరీరములోనున్నారు. పరిశుద్దాత్మ ఒక ఉద్రేకమును కలిగించుట ద్వారా మరియు గర్భము ధరించలేదు. తండ్రియైన దేవుడు ఒక బీజమును లేక ఒక గ్రుడ్డును మరియలో సృష్టించెను, మరియు ఒక రక్తపు అణువును సృష్టించెను, మరియు అది దేవుని యొక్క రక్తముగా నున్నది.

ACTS 20:28

 

100రక్తము పురుషుని నుండి వచ్చును. కావున అది కాదు… హిమోగ్లోబిన్ మరియు రక్తము తండ్రి యొద్ద నుండి రావలయును, ఏలయనగా క్షయవ్యాధి లాంటి వ్యాధిని తన తల్లియొద్ద నుండి ఆ బిడ్డ పొందుకొనజాలదు. తల్లి యొక్క శ్వాస ద్వారా వ్యాధిని పొందుకొనును, అయితే తల్లి నుండి వ్యాధిని పొందదు, నేను చెప్పునది శ్వాస ద్వారా మరి దానిని పొందెదరు. అయితే బిడ్డ దానిని తల్లి నుండి గైకొనదు, ఏలయనగా అతను, ఆ బిడ్డ దానిని పొందలేదు, ఆ బిడ్డ తన తల్లి యొక్క రక్తము కాదు.

ఇప్పుడు, అయితే యేసు యూదుని లేక అన్యుని యొక్క రక్తము కాదు, ఆయనలో యెహోవా తానే సృష్టించిన రక్తమైన దేవుని రక్తము కలదు. ఆయన దేవుని యొక్క రక్తమైయున్నాడు. పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "మనము దేవుని యొక్క రక్తము వలన రక్షింపబడియున్నాము." యూదుని రక్తము లేక అన్యుని యొక్క రక్తము కాదు, అవన్నియును శారీరకమైన ఇచ్చవలన కలిగిన రక్తము, అయితే ఇది దేవుని యొక్క రక్తమైయున్నది.

ISA 53:5

 

101ఇప్పుడు గమనించుడి, ఆ యొక్క పరిపూర్ణమైన ఒకనిని ఆయన చూసినప్పుడు, ఆయనను కొట్టెను, నలుగగొట్టెను. యెషయా చెప్పెను, "మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను." ఆయన ఏమైయున్నాడు? ఆయన ప్రతియొక మనుష్యుడును తిని జీవించులాగున, ఆ రొట్టెను ప్రతిఫలించు పరిపూర్ణమైన వాక్యముగా నున్నాడు. నాలుగు సువార్తలలోను అరువది ఆరు పుస్తకములలోను పిండిగా చేయబడిన దేవుని యొక్క వాక్యము అను గోధుమగా ఆయన నున్నాడు. మరియు మనుష్యుడు దానివలన జీవించును, మరియు దానివలన మాత్రమే మరియు దానిలోని ప్రతి యొక మాట వలన! ఆమేన్. అదియే మైకల్ ఆంజిలో యొక్క కళాఖండము. మరియు దేవుడు ఒక మానవునిలో తాను ప్రతిబింబించుటను చూచినప్పుడు, ఆ యొక్క పరిపూర్ణ మానవుని తన యొక్క స్వరూపమున సృష్టించెను. ఓ, మై, ఎటువంటి మనుష్యుడతను! ఆయన మన అందరికొరకు చనిపోవలసియుండెను. దానిపై మనము ఇంకను ధ్యని౦పవచ్చును, అయితే మనకు సమయము లేదు. ఆయన మనందరికొరకు చనిపోవలసి యుండెను. మరియు ఆ పరిపూర్ణమైన ఆయన చనిపోయెను; పరిపూర్ణులుగా లేని మనము ఆయన యొక్క పరిశుద్ద గ్రంథ మ౦దుండు ఒక్కొక్క వాక్యములోను పాలుపంచుకొనుచు ఆయనలో పరిపూర్ణమగునట్లు, పరిపూర్ణమైన ఆయన మనకొరకు మరణించెను. పిదప మనము నీతిమంతులుగా తీర్చబడునట్లు ఆయనను దేవుడు మరల లేపెను, మరియు దాని ద్వారా మనకు హక్కు కలదు, ఒక పునరుద్ధానుడైన యేసుగా ఆయన ఇప్పుడు ఇక్కడనున్నాడు, మనకు వాక్యపరిచర్య చేయుటకుగాను, మనము జీవించులాగున ప్రతియొక దేవుని వాక్యమును మనకు భుజింపజేయుచున్నాడు.

JOHN 5:18•

JOHN 10:30

 

102ఇప్పుడు, అతి త్వరగా మనము ముగించబోవుచున్నాము. ఇప్పుడు రెండవ వధువు హవ్వ.

ఇప్పుడు, మొదటి పెండ్లి కుమారుడు, ఆదాము; అనేక ప్రవక్తల ద్వారా రావలసి యుండెను, మరియు ఆ విధముగా పరిపూర్ణుడుగా వచ్చి మరలు పిమ్మట తక్కిన వారి కొరకు రొట్టెగా నుండుటకు ఆయన మరణించవలసినదై యుండెను.

ఇప్పుడు హవ్వను గురించి ఏమిటి? ఆమె కూడ అదే విధమైన కార్యమును చేయవలసి యుండెను. అయితే యేసు వచ్చినప్పుడు… గుర్తుంచుకొనుడి, హవ్వ ఒక స్త్రీ. పరిశుద్ద గ్రంథములో ఒక స్త్రీ సంఘమునకు మాదిరిగా నున్నది, ఏలయనగా ఆమె ఒక వధువు. ఇప్పుడు ఆమె ఏమి చేసినదో గమనించుడి. ఆమె యొక్క బోధనలకు ఆయనను త్రిప్పవలయునని ఆమె ప్రయత్నించెను. వారు తలంచిన దానిని ఆమె బోధించునంత వరకు, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఎంచబడెను.

అయితే ఒక రోజు ఆయన మాటలాడుటకు ప్రారంభించెను, మరి చెప్పెను, "నేను మరియు నా తండ్రియు ఏకమైయున్నాము."

"ఓ, నీవు నిన్ను దేవునితో సమానునిగా చేసికొనుచున్నావు, చూశారా. ఓ, మై! అటువంటి వ్యక్తితో మాకు పనిలేదు."

MATT 4:4•

LUKE 4:4•

JOHN 6:53,56

 

103మరియు ఈ యొక్క కార్యములన్నియును ఆయన చెప్పుటకు ప్రారంభించెను, "మీరు మనుష్యకుమారుని శరీరము తింటేనే గాని. అక్కడ ఒక వైద్యుడు కూర్చొనియున్న యెడల అతనెట్లు తలంచుకొనియుండును, దానిని గురించి? సాధారణముగా తలంచు ఒక వ్యక్తి కూడా ఏమి తలంచుకొని యుండును, యేసు ఆ విధముగా చెప్పుటను గురించి విని? "మీరు నా యొక్క శరీరమును తిని, నా యొక్క రక్తమును త్రాగితేనే గాని."

"ఈ యొక్క మనుష్యుడు రక్త పిశాచి, ఒక వాక్య సేవకుడు కాడు. ఆ మనుష్యుని యొద్ద నుండి దూరముగా నుండుడి, అతను పిచ్చివాడు. అతని నుండి దూరముగా నుండుడి" అని వారు చెప్పిరి.

అయితే అది సత్యము, చూచారా. అది సత్యమైయున్నది. "మీరు గనుక తినకుంటే, మీరు నశించెదరు. దానిని గనుక మీరు తినని యెడల, మీరందరును చనిపోయెదరు."

ఈ రోజు కూడ ఆ విధముగానే కార్యములున్నవి. రొట్టె మరియు ద్రాక్షారసము ఒక చిహ్నముగా నున్నవి, ఆ యొక్క సహజమైన వాటిని భుజించి మీరు తృప్తినొందకుడి. మీరు జీవించులాగున వాక్యమైన క్రిస్తును మీరు భుజింపవలయును, "వచ్చు ప్రతి మాటవలన," పరిశుద్ద గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన వరకు మీరు భుజింపవలయును.

104ఇప్పుడు, రెండవ ఆదాము, ఆమెను గమనించుడి. ఆమె నూతనముగా పెంతెకోస్తు దినమున, ఆత్మతో నింపబడి, వాక్యముతో పోషింపబడి, ఆయనవలె సృష్టింపబడెను. ఆమేన్. ఇప్పుడు నేను భక్తిపరవశములో నున్నాను. నేను మంచి అనుభూతిని పొందుచున్నాను. క్రీస్తు వధువుగా నుండవలసిన ఆ యొక్క మొదటి హవ్వ, ఆ మొదటి సంఘము. దానికి ఎందరు "ఆమేన్" అని చెప్పగలరు? ఆమె క్రీస్తు యొక్క వధువుగా నుండవలయును. ఆమె పెంతెకొస్తులో జన్మించెను, నైసియా, రోములో కాదు, లండన్, ఇంగ్లాండులో కాదు; అమెరికా సంయుక్త రాష్ట్రములో కాదు; లూథరుతో జర్మనిలో కాదు, వెస్లీతో ఇంగ్లాండులో కాదు, నామకార్థ పెంతెకొస్తులున్న సంయుక్త రాష్ట్రములో కాదు. పెంతెకొస్తు దినమున ఆమె జన్మించెను. ఆమె ఆత్మతో నింపబడియున్నది. మరియు ఆమె ఆత్మతో నింపబడి మరియు వాక్యముతో పోషింపబడి యున్నది, "దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటవలన." ఇస్కరియోతు యూదాకు కూడ… మరియు వారు సమస్తమును తీసికొనవలసినదిగా యున్నది, ప్రతియొక వాక్యమును, దేవుని యొక్క భూమిపై వికసించి పూయు మొక్కలవలె, ఆయనను ప్రతిఫలించుచు ఇంకొక వధువు వృక్షముగా నుండవలయును.

ACTS 4:13

 

105ఆమెలో ఆయన యొక్క వాగ్దాన వాక్యము ఆయనగా ప్రతిబింబించెను. వారు పేతురు మరి వారిని గమనించవలసిన వారిగా నుండిరి. వీరు ఏ యొక్క సెమినరీకి వెళ్ళలేదని వారు ఎరిగియుండిరి. వారు ఏ యొక్క బైబిలు పాఠశాలకు వెళ్లలేదు, ఏదో కొద్ది శిక్షణ సంస్థ యొక్క వేదాంత సెమినరీ కలిగియుండలేదు. వారికి చదువు లేకుండెను, ఏలయనగా 'వారు వారియొక్క పేరును కూడ వ్రాయలేకుండిరి' అని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "వారు పామరులై చదువు జ్ఞానము లేని వారుగా నుండిరి. అయితే ఏమి సంభవించెను? వారు యేసుతో నున్నామని గుర్తించిరి, ఏలయనగా ఆయన తన వాగ్దానమును ప్రతిఫలించుచు వారిలోనుండెను. హల్లెలుయా! దేవునికి మహిమ! ఈ యొక్క కాలములో మనకు కావలసినది అదియే. సంఘమైన ఆమెలో ఉన్న ఆయన వాక్యమును, ఆయనను ప్రతిఫలించెను. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటవలన ఆమె జీవించియున్నది.

అయినప్పటికిని, హవ్వ వలె, రోములోని నైసియాలో మొట్ట మొదటగా స్థాపించబడిన సంఘ సంస్థాన సర్వ ప్రపంచ క్రైస్తవ సంఘమునందు ఆమే వాక్యమందు తప్పిపోయినది. ఇక్కడ బైబిలు వేదపండితులు ఎవరైనను ఉన్నారా? అది సత్యమని తెలిసిన ఒక వేద పండితుడు ఎవరైనను యున్నారా? మొట్టమొదటి సంఘ సంస్థ రోములోనున్న నైసియానందు స్థాపింపబడెను. దేవుడు ఎన్నడును సంఘ సంస్థలను కలిగియుండలేదు, ఇంకెన్నెడును కలిగియుండబోడు. అవన్నియును మనుష్యుని యొక్క అధికారము క్రింద నున్నవి. అక్కడ వారందరును…

నేను ఒక క్రైస్తవుడిని. "నీవు ఏ సంఘమునకు చెందియున్నావు?" ఒకే ఒక సంఘము మాత్రమే కలదు. నేను ఒక బ్రెన్హాం కుటుంబమని, యాభై-ఐదు సంవత్సరములు వయస్సు, నేను బ్రెన్హాం కుటుంబములో చేరలేదు, నేను దానిలో జన్మించియున్నాను. మరి ఆ విధముగానే మీరు కూడ దేవుని రాజ్యములో జన్మించియున్నారు, మరి మీరు ఆయన వాక్యమును ప్రతిఫలించుచున్నారు.

HEB 13:8

 

106గమనించుడి, హవ్వ పడిపోయెను. మరి ఆ విధముగానే రెండవ హవ్వ రోములోనున్న నైసియానందు పడిపోయి ఒక సంఘ శాఖగా, ఒక ఆచారముగా మారి, వాక్యమునకు బదులుగా సిద్దాంతములను అంగీకరించెను; జూపిటర్ పోలిన విగ్రహములకు బదులుగా మరి పౌలును మరియు బర్నబాసును ಆ స్థానములో నుంచెను. మరియు సూర్య-దేవునిని మరియు చంద్ర దేవునిని ఆరాధనలో నుంచి చంద్ర దేవతైన అష్టారోతును దానిని ప్రతిఫలించి చూపునట్లు౦డు గుండ్రముగా నుండు రొట్టెను తీసికొని ఆ దేవతను జూపిటర్ అయిన సూర్య-దేవునికి తల్లిగా చేసెను. యేసు జన్మించిన దినమును ఏప్రిల్ నుండి వారు తీసివేసి సూర్య-దేవుని పుట్టుక దినమునకు మార్చివేసిరి. ఆయన గొర్రెలు పుట్టు ఏప్రిల్ నెలలో జన్మించెను, ఏలయనగా ఆయన ఒక గొర్రె, సూర్య-దేవుని యొక్క జన్మదినము డిశంబర్ 25వ తేది, అది దేవుని కుమారుడు జన్మించిన దినము కాదు. మరియు మనమొక్కక్కరమును శాంతా క్లాస్ (క్రిస్మన్ తాత) ఆటను ఆడి, మరియు చెట్టుతో అలంకరించుట్లు అది ఒక విగ్రహారాధనకు పోలికగా యున్నది, మరియు అటువంటి విధమైన కార్యములు చేయుచు మరియు పిదప మనలను మనము క్రైస్తవులమని పిలుచుకొనుచున్నాము కదూ? సంఘమా క్రైస్తవునికి ఏమి సంభవించియున్నది?

వాక్యమును ప్రసంగించి మరియు సత్యమును చెప్పి మరి దేవుడు దానిని నిరూపించి మరి జనులకు ఆయన నిన్న, నేడు, మరి యుగయుగములకు ఏకరీతిగా నున్నాడని మన మధ్యలో ఎవరైనను లేచి దానిని నిరూపింపగలరా? మనకు సెమినరీ అక్కర లేదు. మనకు వేదపండితుడు అక్కరలేదు. మనకు కావలసినది ఒక ప్రవక్త. అదే సత్యము. దేవుడు కూడ దానిని వాగ్దానము చేసియున్నాడు.

107హవ్వ విఫలమైపోయినట్లుగానే సంఘము కూడ విఫలమయ్యెను. ఇకమీదట పరిశుద్దాత్మతో నడిపింపబడకుండునట్లు, మానవుని యొక్క నిబంధనములతో ఒక సంఘ శాఖగా స్థాపించబడి మానవుని యొక్క అధిక్యత క్రింద ను౦డుటకు తనను సమర్పించుకొనినది. ఆమె వాక్యము నుండి దూరముగా తొలగిపోయి మరి సిద్ధాంతములను అంగీకరించెను. ఎవరు "ఆమేన్" అని చెప్పగలరు? నిశ్చయముగా. అయితే మీకు తెలియునా, ప్రాటెస్టెంట్ వారమైన మనము వారు కలిగియున్నట్టే అనేకమైన సిద్ధాంతములను కలిగియున్నామని, ఎట్లనగా ఈ యొక్క వాక్యమునకు మనము దేనినైనను కలిపిన ఎడల దానినుండి దేనినైనను తీసివేసినయెడల మనము వారివలె చేయుచున్నామని తెలియునా? హవ్వను ఏ విధముగా సాతాను మోసగించెనో మరి అట్లే: రాజీపడుట ద్వారా. అక్కడే వాడు దానిని పట్టుకొన్నాడు… వాక్యములోనున్న కార్యమునకు కొంచెము భిన్నముగా చెప్పెను, ఒక ఆచారము లేక ఒక సంఘశాఖ.

108మొదటి అసలైన విత్తనము హతసాక్షులుగా మరణించి భూమిలోనికి పోయిరి, రోము అను గుండ్రని రంపము ఆ అసలైన పెంతెకొస్తు నుండి వచ్చిన గోధుమను ధూళిగా చేసి మరి వారిని కొయ్య స్తంభమునకు కట్టి ప్రాణముతో కాల్చి మరియు సింహములను వారిపై పురికొల్పి, సింహములకు వారిని ఆహారముగా వేసిరి. మరియు వారు ఇతర గోధుమలవలె చనిపోయిరి, అది సరి, అయితే ఆయన వారిని చక్కదిద్దు లేక సంస్కారములో, అదే దానిని, రెండవ సారి లేపెను.

ఆయన రెండవ ఆదాముకు చేసినట్లు. ఆదాము పడిపోయిన పిదప, ఆయన రెండవ ఆదామును లేపుటకు ప్రారంభి౦చెను. మరియు రెండవ ఆదాము పడిపోయి పిమ్మట పైకి కొనిపోబడెను. మొదటి ఆదాము తన యొక్క పాపములో పడిపోయి అక్కడే నుండెను. రెండవ ఆదాము మానవుని యొక్క పాపముల నుండి విమోచించుటకు పడిపోయి, మరి పైకి కొనిపోబడేను.

ఇప్పుడు, మొదటి సంఘము రోమునందున్న నైసియాలో పరిశుద్ద గ్రంథము నుండి ఒక సత్యవాక్యమును తీసివేసినందువలన పడిపోయెను, దాని స్థానములో రోము సంఘము వారియొక్క సిద్దాంతములను మరియు ఆచారములను చేర్చినది. అక్కడొక చిన్న యాజకుడు మార్టిన్ లూథరు అను పేరుగలతను వచ్చి అతను చెప్పెను, "ఇది ప్రభు సంస్కారము కాదు, ఇది క్రీస్తు యొక్క శరీరము కాదు. ఇది ఒక రొట్టె మాత్రమే. మరియు మనుష్యుడు, "నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును." మరియు అతడు వారిచ్చు ఆ రొట్టెను విసిరికొట్టి, మరి వారు చేయునది తప్పు అని దానిని ఎదిరించెను. తుయత్తెర సంఘ కాలమునకు పిదప అక్కడే మొదటి నక్షత్రము ప్రకాశించుటకు ప్రారంభించెను. అవునయ్యా, విశ్వాసము ద్వారా నీతిమంతుడగుట! ఆయన, గొప్ప శిల్పి, ఆయన యొక్క వాక్యమును ప్రతిబింబించు ఒక మహోన్నతమైన కళాఖండమువంటి వధువును తయారు చేయుటకు సిద్దపడియున్నాడు.

109అయితే లూథరు మరణించిన పిదప లూథరనులు ఏమి చేసియున్నారు? వారు సాతానును సంధించి మరి దానిలో నుండి ఒక సంఘ శాఖను ఏర్పరచుకొని, మరణించిరి. దాని పిదప మరి ఆమె ఏమియును చేయ లేదు, ఆమె కథ అంతటితో ముగిసినది, అది ఒక గొప్ప జనసమూహము గలదిగా మారిపోయినది. అది సరి.

అటుపిదప దేవుడు ఆమె (సంఘము)ను జాన్ వెస్లీ దినములందు ఇంకొక సత్యమును ప్రతిఫలించులాగున మరల లేపెను. అతనేమి చేసెను? అతను చెప్పెను, "పరిశుద్ధపరచబడుట కృప యొక్క రెండవ కార్యమైయున్నది." మరి దేవుడు ఏమి చేసియున్నాడు? ఆయన దానిని ఆశీర్వదించెను. మరియు జాన్ వెస్లీ ఆంగ్లికన్ సంఘమును, మరియు జ్వింగ్లీ సంఘమును మరియు తక్కిన వారినందరిని మరియు చట్ట ప్రకారము పోవువారిని (లీగలిస్ట్), కాల్విన్లనందరిని మరి వీరినందరిని ఎదిరించెను. మరియు చెప్పెను, "నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును," లూథరు దానిని చెప్పియున్నాడు. "మరియు కృప యొక్క రెండవ కార్యము పరిశుద్దపరచబడుట." మరియు అది సత్యము. అది సరియే, చూచారా.

110పిదప అతనేమి చేసెను? అదే కార్యమును, వెస్లీ మరియు ఆస్బరి మరి వారు చనిపోయిన పిదప, లూథరనులు చేసిన అదే కార్యమును వారును చేసిరి, సంఘ శాఖగా స్థాపించిరి, మరణించిరి. ఇప్పుడు దానిని చూడుడి.

శస్త్ర చికిత్సకు సిద్ధపడు ఒక స్త్రీని వైద్యశాలయందు, ఆమె కొరకు ప్రార్థించుటకు కొద్ది కాలమునకు మునుపు వెళ్ళియుంటిని. నేను అక్కడ లోనికి వెళ్లియుంటిని. ఆమె చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, నేను మిమ్ములను పిలిచితిని. నన్ను మీరు ఎరుగరు. అయితే మీరు నా కొరకు ప్రార్ధి౦చగలరా? యని ఆమె అడిగెను. ఉదయకాలమున నాకు శస్త్ర చికిత్స జరుగనైయున్నది."

"నిశ్చయముగా చేసెదను సహోదరి," అని నేను చెప్పాను.

అక్కడ ఇంకొక వ్యక్తియును, ఒక స్త్రీ, మరియు ఒక బాలుడు కూర్చొని యుండిరి, ఆ బాలునికి సుమారు ఎదునెనిమిది సంవత్సరముల వయస్సు ఉండును, మరియు వారు నన్ను చాలా జాగ్రత్తగా గమనించుచుండిరి. మరి నేను తిరిగి మరి వారిని చూచి చెప్పాను, "మీరు నన్ను మన్నించగలరా, నేను మీ కొరకు…."

ఆమె చెప్పెను, "ఆ తెరను (ఆసుపత్రిలో రోగుల మధ్య విభాగించు తెర) లాగుము!"

నేను అడిగితిని, "మీరు క్రైస్తవులు కారా?"

ఆమె చెప్పెను, "మేము మెతడిస్తులము!"

నేను చెప్పాను, "నేను మిమ్ములను అడిగిన ప్రశ్న అది కాదు. నేను మిమ్ములను అడిగితిని… మీరు గనుక ఉత్త మెతడిస్తులైన యెడల, నేను ఆ తెరను లాగెదను. మీరు గనుక క్రైస్తవులైన యెడల, మీరు ఆ తెర మధ్యలో లాగబడవలయునని మీరు కోరరు." కావున, అవును, అది సరియే.

మెతడిస్టు, లేక ఒక బాప్తిస్తు, లేక ప్రెస్బిటేరియన్ గా నుండుటకంటెను, మరి ఒక క్రైస్తవునిగా నుండుటకు చాలా తేడా యున్నది; ఒక కాంప్బెల్లైట్ గా నుండుట కాదు, అయితే ఒక క్రైస్తవునిగా వుండవలెను, చూశారా. ఆమె ఏమి చేసెను? అదే కార్యమును చేసెను.

111అప్పుడు ఏమి జరిగెను? దక్షిణములో గల ఒక చిన్న గుంపును, వారి మధ్యలో ఒక చిన్న మెల్ల చూపుగల నలుపు వ్యక్తిని దేవుడు ఎన్నుకొనెను. మరియు ఆయన, ఆయన ఏమి చేసెను? ఆయన వరములను మరల సంఘములో కుమ్మరించెను, మరది పెంతెకొస్తుగా మారెను. సహోదరుడు వాల్డజ్ ను పోలిన అనేకులు వెనుక అక్కడనున్నారు, సహోదరుడు వాల్డజ్, వృద్దుడైన భక్తుడు మరి మీరు నేను ఐదు సంవత్సరముల వయస్సుగలవానిగా నున్నప్పటి నుండి ప్రసంగించుచుండిరి. అతనికి ఆది పెంతెకొస్తును గురించి జ్ఞాపకమున్నది. సహోదరుడా, వారికి సంఘ శాఖలను గురించి మీరు మాటలాడనక్కరలేదు, వారు ఆ మురికి కార్యము నుండి బయటికి వచ్చియున్నారు. మరియు వారు దేవుని యొక్క వర్తమానమును కలిగియుండిరి.

అయినప్పటికిని వారేమి చేసిరి? ఇతరులు చేసిన అదే కార్యమును వారు చేసిరి, దానిని స్థాపించిరి. ఇప్పుడు వారు ముప్పది లేక ఏబది రకములైన సంఘ శాఖలను స్థాపన సంఘములను ఏకత్వము, రెండత్వము, త్రిత్వము మరి ఈ విధముగా కలిగియున్నారు. అయ్యో, దయ కలిగియుండును గాక, నా జీవితములో ఇటువంటి కార్యములను నేను ఎరిగియుండలేదు. మీరేమైతిరి? ఆ చోటునే మీరు మరణించియున్నారు. మీరు వెళ్ళగలిగే దూరము అంతవరకే, దానికన్నా ముందుకు కొనసాగిపోలేరు. దీనిని మీయొక్క సంఘ శాఖ ఒప్పుకొనదు. మీరు మీ మనుష్యుని ఎన్నుకొనుచున్నారు, "ఈ యొక్క వ్యక్తి మనతో ఏకీభవింపని యెడల అతనిని అక్కడ నుంచరాదు. మనయొక్క ఐక్యతలో అతనిని మనము చేర్చరాదు." ఓ!

MATT 24:37

 

112గమనించుడి, త్వరగా ముగించవలయును, ఒక నిజమైన విత్తనము రావలయును. అక్కడ అది రావలయును, ఏలయనగా కళంకమును, ముడతలు గాని లేని వధువు కొరకు ఆయన వచ్చుచున్నాడు. దాని కొరకు ఆయన వచ్చుచున్నాడు, వాక్యము వలన నిరూపింపబడిన ఒక వధువు కొరకు, ఓ, ఆమె చాలా చిన్న గుంపుగా నుండును. యేసు చెప్పెను, "నోవహు దినములలో వలె, అక్కడ ఎనిమిది ఆత్మలు మాత్రము రక్షింపబడెను." [అది సరియేనా?] "మనుష్య కుమారుని రాకడ దినములయందును ఆలాగే జరుగును. ఎందరు? నాకు తెలియదు.

అయితే, చూడుడి వారి, వారి కాలమునందు వాక్యమును అంగీకరించిన వారందరితో కలిసి వధువుయుండును. ఏదో చివరి గుంపు మాత్రము కాదు, ఇక్కడ నుండి వీరినందరిని దేవుడు తీసికొనును. ఓ, కాదు.

అది చాలా చిన్నమందగా నుండును, అది చాలా ఆశ్చర్యముగా నుండును. వారు కనబడకుండా పోయెదరు, మరియు వారు వెళ్ళిపోయినారనే దానిని మీరు ఎరుగకుందురు. ఈ యొక్క కడపటి దినములలో ఒక వేళ ఐదువందల మందిని ఆయన తీసికొనిపోయిన ఎట్లు౦డును? దానిని గురించి మీకు తెలియనే తెలియదు. కొద్ది రోజుల వ్వవధిలో ఐదువందల మందిని ఆయన గనుక తీసికొనిపోయిన ఎడల ఎట్లు౦డును? ప్రపంచములో అంత కొద్దిమంది కనబడక పోయిన ఎడల, వారెక్కడికి పోయియున్నారనుట గురించి ఎవరికి తెలియకుండును వారిని గురించి ఏ సమాచారమును ఎవరికిని తెలుపబడదు. యేసుక్రీస్తు యొక్క రహస్యపు రాకడ ఆమె కొనిపోబడును.

మరియు ఎత్తబడుట ముగించిన పిదప, తక్కిన వారు నోవహు దినములవలె ప్రసంగించుచుండెదరు, "దేవునికి మహిమ, దానిని మనము పొందియున్నాము, హల్లేలుయా!" - మరియు వారు వారి మరణమునకై ముద్రింపబడియున్నారు. పరిశుద్ద గ్రంథము దానినే చెప్పుచున్నది, మరియు అది ఎన్నటికిని తప్పిపోదు.

113మరియు నోవహు, మోషే, దావీదు వలె ఈ యొక్క పరిపూర్ణ పెండ్లి కుమారుడు తన రాకడను ప్రతిబింభించెను; కావున ఆ విధముగానే లూథరు, వెస్లీ, మరియు పెంతెకొస్తు ఒక పరిపూర్ణ వధువు యొక్క రాకడను ప్రతిబింభించిరి.

గమనించుడి, ప్రతీసారి ఆమె బయలుపరచబడుచున్నది, ఒక్కొక్క సారి ఆమె ఏమి చేసెను? ప్రతి సారియు, ఈ యొక్క సంఘము హవ్వ చేసినట్లు, ఆమె యొక్క నూతన వెలుగును, ఆమె యొక్క పధకమును ఆమె తనయొక్క ఆదాము నమ్మునట్లు బలవంతము చేసినది. మరి దానితో అక్కడికక్కడే అది మరణించెను. "మంచిది, మా యొక్క గుంపు ఒక్కటిగా ఏకమవ్వను, చూశారా. ఓ, మేము కనుగొనిన మా యొక్క నూతన ఆశీర్వాదములు." — మొదలగు కార్యములు.

ఇవన్నియును హవ్వకు ఏమి చేసెను? ఇప్పుడు మనకు చాల కొద్ది సమయము మాత్రమే కలదు. మొదటి ఆదాము యొక్క మొదటి వధువుకు, హవ్వకు మొదటి తల్లి సంఘము ద్వారా ఇవన్నియును ఏమి చేసెను? ఆమెకు ఇవన్నియును ఏమి చేసెను? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినుడి, దీనితో మీరు ఏకీభవించలేరు. అయితే అది సర్పము యొక్క సంతానమును, ఉత్పత్తి చేసెను. ఖచ్చితముగా.

JUDE 1:14

 

114ఆమె యొక్క మొదటి కుమారుడు ఆదాము యొక్క కుమారుడు కాడు. ఆ విధముగానున్న ఎడల, అతనికి జ్యేష్టత్వము ఉండియుండును. పరిశుద్ద గ్రంథములో యూదాలో ఇట్లు చెప్పబడియున్నది, ఆదాము, "ఆదాము మొదలుకొని యేడవవాడైన హనోకు. అది సరియేనా? మరియు అతను "ఆదాము షేతును కనెనని" ప్రారంభించుచున్నాడు. అట్లయిన యెడల జ్యేష్ఠత్వమును కలిగియున్న కయీనును గురించిన కార్యమేమిటి? అతను ఆదాము యొక్క కుమారుడు కాడు. షేతును కనెను మరి షేతు కనెను; ఆదాము నుండి యెరెదు వరకు ఆ విధముగా క్రిందికి వచ్చిన యెడల "ఆదాము నుండి యేడవ వాడు." మరి కయీను గనుక ఆదాము యొక్క కుమారుడైనయెడల పరిశుద్ద గ్రంథములో ఎచ్చటయును, లూకాలో కూడ దానిని గురించి మరల చెప్పబడినప్పుడు కయీను ఆదాము యొక్క కుమారుడని చెప్పబడలేదు. మరియు అతను ఆదాము యొక్క కుమారుడు కానియెడల, అతను ఎవరి కుమారుడు? మరియు అతను గనుక ఆదాము యొక్క కుమారుడైన యెడల అతను మొదటి కుమారుడు కావున సమస్త జ్యేష్ఠత్వము అతను కలిగియుండవలయును. ఓ!

అక్కడే మానవుని యొక్క ఇహిక తలంపుతో ఉద్భవించిన సంఘము (దానిని మీరు చూచుచున్నారా?), వాక్యమునకు బదులుగా, ఏదో ఒక కార్యమును, అయితే వ్యభిచారమును ఆ సంఘము అంగీకరించెను. పెంతెకొస్తు జనులారా, మీకు ఆశీర్వాదములు. అది సరి, హవ్వకు అది దేనిని ఉత్పత్తి చేసెను? సర్పము యొక్క సంతానమును హవ్వకు ఇచ్చెను. సంఘశాఖల ద్వారా ఈ యొక్క చివరి దినములలో అది ఏమి చేసెను? వాక్యములో జొరబడి మరల సర్పము యొక్క సంతానమును ఉత్పత్తి చేసెను. అతను వేటిని అర్పించెను? ఫలములను మరి ఆలాటి కార్యములను, రక్తమును కాదు.

HEB 11:4

 

115దేవుని వాక్యము వ్రాయబడుటకు మునుపే వాక్యము బయలుపడుట ద్వారా, "విశ్వాసమును బట్టి హేబెలు, కయీను కంటె శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను." వాక్యము అతని ద్వారా, అతని అర్పణ ద్వారా, ప్రతిబి౦బించెను.

హవ్వ ఒక ఆపిల్ తినినదనుకొని కయీను తన పొలమునకు వెళ్ళి ఫలములను తీసికొని వచ్చెను. ఇప్పుడు ఆ ఆపిల్ను అనేక వేదాంత పండిత సెమినరీలు ఆఫ్రికల్ అను పండు అని మార్చియున్నారు. అది పండు కాదు, అది ఒక వ్యభిచారము. పరిశుద్ద గ్రంథమును గురించి తెలిసిన ఎవరికైనను ఆ సంగతి తెలియును. నిశ్చయముగా, అక్కడ జరిగినది అదే.

గమనించుడి, మొదటి హవ్వ వాక్యము నుండి దూరముగా తొలగిపోవుటవలన సర్పము యొక్క సంతతి హవ్వ ద్వారా ఉధ్బవించెను. రెండవ హవ్వ రోములోనున్న నైసియలో అదే కార్యమును చేసియున్నది. మరి ఆమె దేనిని ఉత్పత్తి చేసియున్నది? ఒక సమూహము ద్వారా సంఘ శాఖచే స్థాపించబడిన సంతతిని అది ఉత్పత్తి చేసినది. అది సరియే. ఓ, చూచుటకు నీతి నియమమైన కార్యముగా నున్నది; నిశ్చయముగా, బాగున్నది. అయితే దానిని గురించిన కార్యము ఏమిటి? వారి ఆచారముల ద్వారా వారు మృతులైరి.

MATT 24:24•

2TIM 3:5•

2PET 1:20•

REV 3:17

 

116ఇప్పుడు కూడా అదే విధముగా నున్నది. కయీను పొందిన వాక్య ప్రత్యక్షతను మీరును పొందుకొని, అదే కార్యమును చేయునట్లు చేసినది. ఏమిటి? ఆమెకు వాగ్దానము చేయబడియున్నది. కాల సమాప్తములో ఇప్పుడు ఈ హవ్వకు ఏమి వాగ్దానము చేయబడియున్నది? నేను ముగించబోవుచున్నాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినుడి. చివరి కాలములో ఈ యొక్క హవ్వకు ఏమి వాగ్దానము చేయబడియున్నది? ధనము, లవొదికయ, గొప్ప పేరు, గొప్ప వ్యక్తి, ధనవంతుడను. "అయితే చనిపోయి మరియు దిగంబరుడవుగా నున్నాము, మరియు దానిని ఎరుగకయున్నాము." మరి ఆ విధముగానే దానితోనే సంఘ కాలము సమాప్తమవ్వ బోవుచున్నది.

అయితే ఆమె వాక్యమును నిరాకరించుచున్నది. మత్తయి 24:24 ఆమెలో నిజరూపము దాల్చులాగున ఆమె అధిక శబ్దముతో ముందుకు కొనసాగుటకు ప్రయత్నించుచున్నది, మరియు నిండుగా ఇది, అధికముగా సాంఘిక వైభవములను, మరియు ఈ విధములైన కార్యములను కలిగి, చెప్పుటకు ప్రయత్నించుచున్నది," సరి, మా యొద్ద శక్తియున్నది! దేవునికి మహిమ, హల్లేలూయూ! మా యొద్ద శక్తి యున్నది!" పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయి౦చనివరునై యుందురు, చాలా సన్నిహితముగా, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చులాగున నున్నారు. ఒక వ్యక్తి ఆత్మలో నాట్యమాడి మరియు అన్యభాషలతో మాటలాడి, మరి అదే సమయములో దేవునియొక్క వాక్యము సత్యము కాదని ఎట్లు నిరాకరించగలడు? ఆ విధముగా నిరాకరించుట వలన అచ్చట ఎట్లా పరిశుద్దాత్మగా నుండగలదు? అది ఆలాగు జరుగదు.

"ప్రతి యొక్క వాక్యమును!" దేవుడు గనుక ఒక కార్యమును చెప్పిన యెడల దాని అర్థము అదియే. దానిని ఇంకొక విధముగా అనువదింపకూడదు. పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "దానిని ఎవరును వారి స్వయముగా వారికిష్టము వచ్చిన రీతిని దానిని అనువదింపకూడదు." ఆయన దానిని ఎట్లు చెప్పియున్నాడో, మరి ఆ విధముగానే చెప్పవలయును.

REV 13:4

 

117అసత్యమైన శక్తిని గమనించుడి. దానినే సాతానుడు యేసుకు ఇచ్చుటకు ప్రయత్నించెను, ఎట్లనగా ఆలయ శిఖరమునకు పైకెక్కి అక్కడి నుండి దూకి తననుతాను ఎవరుయని చూపించుకొని పేరు ప్రఖ్యాతులు పొందమని చెప్పెను. ప్రజలు మరి దానిని చేయుదురు, ప్రపంచ క్రైస్తవ ఆలోచన సభ వారందరును. "అతనితో యుద్ధము చేయగలవాడెవడు," అతను చెప్పెను, పరిశుద్ధ గ్రంథములో అదున్నది, "లేవనైయున్న మృగము యొక్క స్వరూపమా?" మనకు గనుక సమయమున్న యెడల దానిని చూడవచ్చును, (అయితే మనకు సమయము లేదు). గమనించుడి, రెండవ వాక్యమైన ఆదాము, యేసు; ఆమె యొక్క దినములలో, ఇప్పుడు ఈ యొక్క సంఘపు దినములలో రెండును చాలా చూచుటకు ఒకే విధముగా నుండునట్లును గమనించుడి. కడపటి సంఘ కాలము లవొదికయ.

ఎందరు దానికి "ఆమేన్" అని చెప్పెదరు? ఆమె ఏమి చేయును? ఆమె ఏ విధముగా ఆ మహిమగల దశకు పోగలదు? నులివెచ్చని స్థితి ద్వారా, దేవుడు లేకుండ. మరియు ఆమె ఏమి చేయుచున్నది?

MATT 7:22,23•

LUKE 13:27•

1TIM 2:12,14

 

118ఇప్పుడు ఆదాము… మనస్పూర్తిగా కాకుండా, అయితే ఆమె ఎరుగకుండానే వంచింపబడినదని ఆదాము తెలుసుకొని ఆమెను విమోచించుటకై ఆదాము హవ్వతో వెలుపలికి వెళ్ళిపోయెను. అది సరియేనా? పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది, "ఆదాము మోసపరచబడలేదు." ఆ కారణము వలననే పరిశుద్ద గ్రంథము స్త్రీ ప్రసంగించుటకు అనుమతించుట లేదు, చూశారా. ఆదాము అతిక్రమించలేదు గాని, హవ్వ అతిక్రమించెను. కావున ఆ కారణము వలననే ఆమె ప్రసంగించ కూడదు. చూశారా, లేక పురుషునిపై అధికారము చెలాయించ కూడదు, లేక మరి ఆ విధముగా ప్రవర్తింపకూడదు. వాక్యము దానినే చెప్పుచున్నది.

మీరు చెప్పవచ్చును, "సరి, ఇదిగో ఇక్కడ!" ఇది ఏమి చేయును మరి అది ఏమి చేయును అని మీరు చెప్పినా, నాకు లేక్కలేదు. సహోదరి, సహోదరుడా వాక్యము ఏమి చెప్పుచున్నదో అదే సరైనది. వాక్యము ఏమి చెప్పుచున్నదో అను కార్యమును నేను మీకు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. మనము వాక్యము ద్వారానే జీవించుచున్నాము, ఏదో ఒక నిదర్శనమువైన కాదు, లేక ఏదో ఐహిక తలంపు కాదు, లేక ఏదో అనుభవముపై కాదు. వీటికి దానితో ఏ సంబంధమును లేదు. వాక్యమును నిరాకరించు ఏ అనుభవమును పనికిరానిది. "అనేకులు నా యొద్దకు వచ్చి మరి చెప్పెదరు, 'నేను ప్రవచించియున్నాను, దయ్యములను వెళ్ళగొట్టి యున్నాను, నేను అన్యభాషలలో మాటలాడియున్నాను. నేను ఈ కార్యములన్నియును చేసియున్నాను, సువార్తను ప్రసంగించియున్నాను; ఒక వేద పాండిత్యములో డాక్టర్ పట్టాను పొందియున్నాను.' యేసు చెప్పెను, 'అక్రమము చేయువారలారా, నేను మిమ్ములను ఎరుగను.'" వాక్యము ఆ విధముగా చెప్పుచున్నదని తెలిసి కూడ మరి ఏదో సంఘ శాఖతో లేక దేనితోనో, ఏదో ఒక మార్గముతో రాజీపడుట చేయుచున్నారు. ఓ, నా యొక్క స్నేహితుడా, మిమ్ములను ప్రేమించు మీ యొక్క ప్రియమైన సహోదరునిగా నేను మిమ్ములను హెచ్చరించుచున్నాను. జాగ్రత్తగా వినుడి.

MATT 24:24•

MARK 13:22•

REV 3:17,20

 

119ఇప్పుడు, హవ్వ వంచింపబడిన కారణముగా మొదటి ఆదాము ఆమెతో వెలుపలికి నడిచి వెళ్ళిపోయెను. అయితే అచ్చట ఈ లవోదికియ సంఘముననున్న ఆమె భిన్నమైన దానిని ఎరిగియున్నది. అవునయ్యా. ఆమె తనయొక్క పడక గదినుండి ఆయనను ఆమె త్రోసివేసెను, ఆమె గది నుండి , ఆమె…. ఆయన బయటనున్నాడు, తలుపు తట్టుచు మరల లోపలికి ప్రవేశించుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు. ఆమె ఆచారమును కలిగియున్నది, ఆమె ఉన్నతమందు (అధునిక నాగరికత) గలదు. ఆమె అధిక గర్వముగానున్నది.

ఆమె "నాకేమియు కొదువగా లేదు" అనుకొనుచున్నది, అయితే ఆమె దిగంబరిగా నున్నదనియు, దౌర్భాగ్య స్థితిలో నున్నదని ఎరుగకున్నది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చు సంఘము అదియే. ఆమె తనయొక్క ఆదామును గమనించుడి, ఆమెకు శక్తి గలదు, తప్పైన శక్తి గలదు. ఆమె వాక్యములో ఒక భాగమును మాత్రము తీసికొనెను, మిగిలిన వాటిని తీసికొనలేదు.

MATT 24:24•

MARK 13:22•

REV 3:20

 

120ఇది వరకు చెప్పబడిన గొప్ప అబద్దము ఏది? దానిలో తొంబది తొమ్మిది శాతము నిజమున్నది. ఒకవేళ ఎవరైనను "విల్లియం బ్రెన్హాం ఫలానా రోజు టెక్సాస్ లోనున్న హోస్టన్లో త్రాగిపడియున్నారని చెప్పినయెడల, అది ఒక అబద్దము. చూశారా. "ఓ" చెప్పవచ్చు, "కాదు, అతను, ఆరిజోనాలోనున్న ఫినిక్సులో నుండెను. క్రైస్తవ వ్యాపారుల వర్తకులకు అతను ప్రసంగించుచుండెను, అతను ఫలానా అంశముపై ప్రసంగించెను, అనేక జనులు అచ్చట నుండిరి, సుమారు పదిన్నర వరకు వారు వినిరి. మరియు పదిన్నరకు అతనేమి చేసెనో మీకు తెలియునా? వెళ్ళి మద్యమును త్రాగెను." ఇప్పుడు దీనిలో అబద్దమున్నది. తక్కినదంతయును నిజము. మోసగింపబడులాగున అది సరిగా ఖచ్చితముగా సత్యమువలె నుండవలయును. చూశారా,

మరి ఈ రోజులలో జనులు ఆ విధముగానే చేయుచున్నారు. వారు అధిక భాగము సత్యమును కలిగియున్నారు, వారు ఎన్నుకొనిన వారిని మోసగించుచున్నారు… అయితే మోసగించుటకు ఒక్క వాక్యము చాలును, ఆ ఒక్క వాక్యమును చేర్చి మోసగించెదరు. మరియు పరిశుద్ద గ్రంథము ద్వారా దానిని నేను నిరూపించెదను.

121గమనించుడి, ఆయన ఆమెతో వెలుపలికి రాలేదు. ఆమె ఆయనను వెలుపలికి నెట్టివేసెను, వాక్యమును, ఆయనను నిరాకరించెను. ఇప్పుడు మనము చివరకు వచ్చినప్పుడు ఇది చాలా దీనమైన దృశ్యముగా నుండును.

బబులోనులో జరిగినట్లు మానవుడు తాను అనుకొన్నది సాధించువరకు నిర్విరామముగా ప్రయత్నించుచుండును. అతను దానిని ఆపనే ఆపడు. నోవహు దినముల వలె, అతను ఎంత శ్రమపడి ప్రసంగించినను మరియు హెచ్చరించినను అది ఏ మ౦చియును చేయలేదు. అహాబు ఆ దినములలో తననుతాను పాతాళములో వేయబడుటకుగాను తన సొంత రొట్టెను తానే చేసుకొన వలసియుండెను. తానే పాతాళమును కోరుకొని అందులో పడెను. అది ఖచ్చితముగా జరిగినది. ఆ గొలుసు యొక్క కొక్కెము విరిగిపోవునట్లు అతను తన యొక్క రొట్టెను చేసికొనవలసియుండెను, కావున అతను తన్నుతాను పాతాళమునకు పోవుటకు సిద్దపరచుకొనెను. అహాబు మరియు యొజెబెలువలె వారు చేసిరి. అయితే దానిలోనున్న కార్యమేదనగా వారు, పాపము చేయుచున్నారనేది వారు ఎరుగకుండిరి. వారు చేయునదంతయును సరియని వారు అనుకొనిరి.

JOHN 16:2

 

122మీకు తెలియునా, యేసు చెప్పెను, "వారు తాము దేవునికి సేవచేయుచున్నామని అనుకొనుచు మిమ్ములను చంపుదురు, అవి నెరవేరు కాలములు వచ్చుచున్నవి." నా యొక్క నూతన పుస్తకము వచ్చువరకు కాచుకొనియుండుడి. రోమను కథోలిక్కులను, ప్రాటెస్టెంట్ వారితో చేర్చుకొనుట తప్పుయని చెప్పి నందులకు గాను కొద్ది జనులను ఆ రోజు రాత్రి కాల్చిచంపిరి. ఆ విధముగా జరిపిన కాల్పులలో నా యొక్క స్నేహితుని ఇంటివైపు మూడు తుపాకి గుండ్లు వెళ్ళినవి — వారు వెంట్రుక వాసిలో తప్పిరి. ఈ యొక్క పుస్తకము చదువుటకు వచ్చు వరకు కాచుకొని యుండుడి. వారు పాపము చేయుచున్నారని వారు తలంచుట లేదు; వారు సరైన కార్యమును చేయుచున్నారని వారు అనుకొనుచున్నారు. వారు పాప కార్యములు చేయుచు దేవుని కొరకు వాటిని చేయుచున్నామని వారు అనుకొనుచున్నారు, దానిని వారు ఎరుగక ఉన్నారు.

యూదులు వారు చేయు కార్యము సరైన కార్యమని తలంచి యేసును చంపి వేసిరి, ఏలయనగా వారి సంఘ బోధనలు వారికి చెప్పియున్నవి ఆయన దోషియని. ఓ, ఆయన వారికి చెప్పియున్నాడు… "దేని ద్వారా అయితే వారు జీవింపవలసి యున్నదో అదే రొట్టెను వారు సిలువ వేసిరి."

2KGS 4:40,41•

JOHN 1:12

 

123అయితే అప్పుడు "వారియొక్క జీవముగా, నిత్యజీవముగా ఎందరైతే ఆయనను అంగీకరించిరో, ఆయన ద్వారా ఎందరు జీవించిరో, మరి వారందరును ఆయనలో భాగముగా నుండుటకును, దేవుని పిల్లలగుటకును ఆయన వారికి అధికారమును అనుగ్రహించెను." అది సరియేనా?

వారు అడవిలో కాయు కాయలను ఇష్టపడుచున్నారు, అది వారియొక్క వేద శాస్త్ర పాఠశాలలోని వేదపండితుల నుండి వచ్చిన జావలేని మరణమైయున్నది. జీవపు రొట్టె అయిన యేసు వారికి అక్కర లేదు. ఆయన వారికి అక్కర లేదు. వారి సంఘము నుండి ఆయనను బయటికి నెట్టివేసియున్నారు. దానిని వారు చేయవలసినదిగా యున్నది. వారేమి చేసినను నాకు లెక్కలేదు.

మీరు అడుగవచ్చును, "సహోదరుడు బ్రెన్హాం, మీరు దానిని మార్చగలరని మీరు అనుకొనుచున్నారా?" అయ్యా, లేదు. అయితే నేను ఎన్నుకొనిన వారి కొరకు మాటలాడుచున్నాను.

వారు ఆయనను వెలుపలికి నెట్టివేసిరి. ఏల? ప్రపంచముతో మరియు దాని కార్యములతో మిశ్రితమై వాటితో యున్న ఆ అంబలిని కలగూర వంటకమును తీసికొని, దానితో దేనినో కలిపి ఒక్కటిగా చేసి, మరి ఒక వేదాంత సెమినరీ అంబలిని తయారు చేసిరి. దానిని స్వస్థపరచు ప్రవక్తయైన ఏలీయా ఇచ్చు పిండిని వారు నిరాకరించిరి.

ఆ దినములలో దానిని వారు చేసియున్నారా? ఏలీయా కొంత పిండిని కలిగియుండెను. ఆ పిండి క్రీస్తు, భోజన నైవేద్యము, అంతయును ఒకే విధముగా పిండి చేయబడి యుండును. దానిని దంచెడు రోకలి బండ కూడా ఒకే విధముగా నుండును. మరియు అతను దానిని అక్కడ విసిరి వేసినప్పుడు మరి అది వారియొక్క రోగములను స్వస్థపరచెను, లేక కుండలోనున్న మరణమును తీసివేసెను.

అయితే ఈ రోజు వారు ఆ కుండలో మరణమును కలిగియున్నారు, మరి వారికి ఏలీయా యొక్క పిండి అక్కర లేదు, అదే క్రిస్తు, అదే రొట్టె, మరియు అదే వాక్యమైయున్నాడు. "కాదయ్యా! అది పిచ్చితనము!" వారు దానిని పొందలేరు. మీరు పోయి దానిని తినుడి, మరి ప్రపంచములోని వారివలె నిశ్చయముగా మరణించెదరు. కుండలో విషమున్నది. వేదపాండిత్యమనే కుండలలో ఈ యొక్క పిండిని వారు ఉంచుకొనలేరు (ఉంచుకొనలేరయ్యా) వారు దానిని చేయలేరు. ఇప్పుడు వారు దానిలో నుండి మిమ్ములను బయలు నుంచెదరు, మీతో వారు ఏ విధమైన సంబంధమును ఉంచుకొనరు.

REV 17:4,5

 

124ఇప్పుడు వెంతెకొస్తు దినమున ఉద్భవించిన రెండవ హవ్వ, రొట్టె విత్తనమైన మొదటి ఆదామైన రొట్టెవలె రోము ద్వారా కఠినముగా బాధింపబడి హింసింపబడి మరి హతసాక్షులుగా మరణించిరి.

అయితే వేశ్యగా మారిన ఆమె యొక్క సహోదరి (పరిశుద్ధ గ్రంథము దానినే కదూ చెప్పుచున్నది?) అది సరి, ఆమె ఏమి చేసెను? ఆమె లోకములోనికి వెళ్లి మరి బిడ్డలను కనెను. దానికి "ఆమేన్," అని ఎవరు చెప్పగలరు? ప్రకటన 17, "మహా వేశ్యయు మరి ఆమె యొక్క కుమార్తెలు," పురుషులు కాదు; స్త్రీలు, సంఘములు. స్థాపింపబడిన సంఘములు, ఏది ఆమెను వేశ్యగా మార్చెను? ఆమె వాక్యమును నిరాకరించి మరి సంఘ శాఖను అంగీకరించెను, మరి ఆమె వేశ్యగా మారెను. ఆమె యొక్క కుమార్తెలు ఏమి చేసిరి? వారు వేశ్యలు, అది అదే కార్యమైయున్నది. అదే కార్యమును చేసియున్నారు, వాక్యమును నిరాకరించి మరియు సంఘ శాఖను అంగీకరించిరి. "ఆమె యొక్క సంతానము," కుమార్తెలను, సంఘములను, వాటిని చూడుడి.

125ఇప్పుడు నేను దీనిని ప్రవచనముగా చెప్పనిమ్ము. మీరు దానిని గ్రహించగలరా? పెద్ద కుటుంబ కలహములు సమసిపోయినవి. వారందరు తిరిగి ఒక్కటిగా కూడుకొనుచున్నారు. తల్లి ఆమె యొక్క సంతానమును మరల దగ్గరకు చేర్చుకొనుచున్నది. ఎట్లున్నను వారందరును ఒక్కటే. వారందరును ఒక్కటిగా నుండవలయునని కోరుచున్నారు. సంఘము మరియు దేవుడు, సంఘము మరియు వాక్యము ఒక్కటిగా ఇక్కడ నుండవలసిన సమయమిది, ఏలయనగా దానికొరకే ఆయన వచ్చుచున్నాడు; పైన చెప్పబడిన ఆ యొక్క ఒక సమూహము కొరకు కాదు. కాదయ్యా.

ఒక గోధుమ గింజ. ఇప్పుడు ప్రకృతి కార్యములను గమనించుడి, మరియు ఈ యొక్క తలంపుపై మనము ముగించబోవుచున్నాము. ప్రకృతిని గమనించుడి. ఒక వ్యక్తి గోధుమను విత్తుచున్నాడు.

వారు ఒక పుస్తకమును వ్రాసియున్నారు, దానిని మీరందరును చదివి యుండెదరని నేను ఊహించుచున్నాను, ఒక వేళ మీలో వేదపండితులు దానిని "నిశబ్ద దేవుడు" అని పేరు పెట్టియుండవచ్చును. మీరు దానిని పుస్తకముల అంగడిలో సంపాదించుకొనవచ్చును. నిశబ్దమైన దేవుడు ఎట్లు…. ఒక నాస్తికుడు అడిగెను, "ఆ యొక్క చీకటి యుగములో అగ్నితో చిన్న పిల్లలను సజీవ దహనమును చేసిరి. స్త్రీల యొక్క పొడుగైన వెంట్రుకలకు తారు పూసి మరియు ఆ వెంట్రుకలకు నిప్పంటించి మరియు చంపిరి; సిలువను వారు ముద్దు పెట్టనందులకు ఒక చేతిని ఒక ఎద్దుకు కట్టి ఇంకొక చేతిని మరొక ఎద్దుకు కట్టి లాగించి చంపిరి, మరి ఈ విధముగా అనేక రకములైన చిత్ర హింసల ద్వారా క్రైస్తవులను చంపిరి కదూ? ఆ సమయములో ఊరక చుస్తూ కూర్చొనియున్నటువంటి ఒక దేవుడుయున్నాడని మీరు ఎట్లు ఎదురుచూడగలరు; అతను అడిగెను, "దేవుడని ఒకడున్నాడనిన యెడల ఆ చిన్న పిల్లలను కాల్చి చంపబడుచుండగా చూచుచు ఆయన అచ్చట ఎట్లు కూర్చొనియుండును?" చూడుడి, అది సహజమైన, మానవుని తలంపు, చూశారా.

126చూడుడి, మీకు తెలియునా, ఒక గోధుమ విత్తనము అది భూమి క్రిందికి పోయిన యెడల మరియు అది అక్కడనే యుండి కుళ్లి పోవలయును కదా? మరి దానినే పెంతెకొస్తు సంఘము చేయవలసినదిగా యున్నది, వారక్కడనే పడి యుండి భూమిలోనికి వెళ్ళి మృతులై మరల జీవమును పొందుకొని వచ్చునట్లుగా అది కుళ్ళి పోవలసినదిగా యున్నది. అది సరియేనా? ఇప్పుడు గమనించుడి, మరి ఇదిప్పుడు నేను ముగించబోవునప్పుడు చెప్పు తలంపులు. ఇప్పుడు ముగించుటకు మునుపు మనము ప్రకృతిని తీసికొనెదము. సమస్త కార్యములకును దేవుడు ప్రకృతితో సమానముగా క్రియ చేయునని మీలో ఎందరు నమ్ముచున్నారు?

చూడుడి, ఆయన ప్రపంచమును సృష్టించెను… ఒక మానవుని ఏ విధముగా విమోచించునో మరియు అదే విధముగా ఆయన ప్రపంచమును విమోచించును. ఒక మనుష్యుడు దేనిని నమ్మును? అతను మొదలు విశ్వసించి పిదప బాప్తిస్మము నొందును; అప్పుడు అతను రక్తముతో పరిశుద్దపరచబడును, శుద్దీకరణ, అదియే వెస్లీ యొక్క వర్తమానము; అటు పిమ్మట అతను పరిశుద్దాత్మ అగ్నితో నింపబడును, అతనిలో నుండి ఈ లోకకార్యములన్నింటిని నిర్మూలము చేసి మరియు అతను ఆత్మతో నింపబడును, అదియే వాక్యము. దానిని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు ఏమి జరుగనైయున్నదని గమనించుడి. ఆయన మానవుని విమోచించిన అదే విధముగా దేవుడు ప్రపంచమును విమోచించనైయున్నాడు.

REV 21:1

 

127"వధువు మరియు పెండ్లి కుమారుని యొక్క భవిష్యత్తు గృహము" అను వర్తమానమును గల టేపును ఎందరు కలిగియున్నారు? చూడుడి, దానిలో దీనిని గురించి చెప్పియున్నాను. ప్రభువు దానిని నాకు అనుగ్రహించియున్నాడు. ఆయన నాకు అనుగ్రహించిన దానిని నేను మీకిచ్చుచున్నాను.

చూడుడి, మొదటి కార్యము, ఆదాము వాక్యము నుండి తొలగిపోవుట వలన ఈ ప్రపంచము తీర్పు తీర్చబడినది. నోవహు యొక్క ప్రసంగము నీతిమత్వమును తీసికొని వచ్చెను, మరి దేవుడు భూమిని నీటితో బాప్తిస్మమిచ్చెను; అటు పిదప కుమారుడు వచ్చెను మరియు ఆయన భూమిపై తన రక్తము చిందించి, పరిశుద్ధపరచి దానిని ఆయన యొక్క స్వయమునకై సంపాదించెను; అటు పిమ్మట చివరగా, కార్యమును ముగించుట, పునరద్ధరణ, ఎట్లనగా భూమి అగ్నితో కాల్చబడును ప్రతియొక్క భీజమును దహించి వేయును, సమస్తమును కాల్చి వేయును, ఆ విధముగా ఆకాశములో వేల కొలది మైళ్ళకు అది దహించివేయును.

అటు పిదప ఏమిటి? నేను నూతన ఆకాశమును మరియు నూతన భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మరియు భూమియు గతించిపోవును. మరియు నూతన యొరూషలేముయను ఆ పరిశుద్ద పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన వధువు వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని, చూశారా, భూమిపై దిగి వచ్చుచున్నది. అప్పుడు దేవుడు మరియు మానవుడును…

JOHN 2:19

 

128యేసు విషయములోను అదే కార్యము సంభవించియున్నది, ఆయన నీటిలో బాప్తిస్మమునొందినప్పుడు మరి ఆయన వాటిని సిద్ధపరచెను. ఆయన మొదటగా తండ్రి వలన పరిశుద్ద పరచబడెను; పిమ్మట ఆయన తన చేతులను వైకెత్తినప్పుడు మరిక్కడ పావురము వచ్చి గొర్రెపిల్లగా యున్న ఈయనపై నిలిచెను. పావురమును ఆయన అక్కడ ఉంచినప్పుడు దేవుడు ఏమి చేయుచుండెను? ఆ జీవము యొక్క భాగముపై ఆయన హక్కును పొందెను. అది భూమిలో భాగము, యేసు మనవలెనే ఆహారమును భుజించెను, సహజమైన రొట్టెను. అయితే ఇప్పుడు దానిని దేవుడు హక్కు కోరుచున్నాడు, దానిని వేరే ఎవరును ఉంచుకొనలేరు. మరణమునకు దానిపై హక్కు లేదు. చెప్పెను, "ఈ యొక్క ఆలయమును పడగొట్ట౦డి. దానిని మరల నేను లేపెదను."

మరియు ఒక పురుషుడును మరి స్త్రీయును దేవుని యొద్దకు వెళ్ళిన యెడల వారిప్పుడు పరిపూర్ణముగా నున్నారు, ఏదో ఉద్రేకములో కాదు, ఏదో ఒక ఆకర్షణవలన కాదు, అయితే నిజముగా వాక్యము మరియు ఆయనయు ఏకముగా నున్నారు; దేవుడు ఆ వ్యక్తిని రక్షించెను, ప్రపంచ కార్యముల నుండి పరిశుద్ధపరచెను, అతనిలో నుండి ప్రపంచమును తీసివేసి మరియు పరిశుద్దాత్మయను అగ్నితో నూతన పరచెను, మరియు ఆ వ్యక్తిలో ఆయన జీవించును. తన్నుతాను ప్రతిబింబించుచు, మరియు ఆ పరిపూర్ణ పురుషుడు లేక స్త్రీ వాక్యము ద్వారా జీవించెదరు. చూడుడి, అదియే పరిశుద్ధపరచబడిన భూమి. అదే విధముగా ఆయన భూమిని కూడ చేయును, దానిని ఆయన విమోచించును.

129ఇప్పుడు గమనించుడి, ఒక గోధుమ గింజ భూమిలో పడుచున్నది. ఇప్పుడు, భూమిలో పడిన ఆ గోధుమ గింజ యేసు, అది పరిపూర్ణమైన పిదప దానిలో జీవముండెను. మోషే తిరిగి లేవలేదు. ఆదాము తిరిగి లేవలేదు. తక్కిన మిగిలిన వారు ఎవరును లేవలేదు. అయితే ఈ యొక్క పరిపూర్ణమైనవాడు, ప్రతి మార్గములోను వాక్యమును ప్రతిఫలించుచు, ప్రతి వాక్యము ద్వారా ఆయన జీవించెను! దానికి ఎందరు "ఆమేన్" అని చెప్పగలరు? ప్రతియొక వాక్యము ద్వారా ఆయన జీవించెను. ఏమి సంభవించెను? వారు ఆయనను సమాధిలో నుంచిరి. అయితే, మూడు దినములలో ఆయన దానిని బ్రద్దలు చేసి మరియు తెరచుకొని బయటికి వచ్చెను, చూశారా.

ఇప్పుడు ఇక్కడ మరల సంఘము వచ్చుచున్నది, చూడుడి, ఆ యొక్క పరిపూర్ణతకు వచ్చుచున్నది, మరల ఎత్తబడుటకు సిద్దపడుచున్నది. ఇప్పుడు సంఘము రోములోని నైసియానందు సంఘ శాఖగా ఏర్పడి అది భూమిలో పడిపోయిన పిదప ఏమి సంభవించెను? ఎవరైనను అది సరియని దానికి "ఆమేన్," అని చెప్పగలరా? ఆమె ఏమి చేసెను? ఆమె ఒక తాత్కాలిక పునరుద్ధరణలో లేచెను, నోవహుతో ప్రయత్నించిన విధముగా ఆయన లూథరుతో ప్రయత్నించెను. అయితే అతను ఏమి చేసెను? అతను వాక్యమును అనుసరింపకుండా సంఘమును ఒక శాఖగా స్థాపించెను. అది ఏమి చేసెను?

130అది తిరిగి గోధుమ గింజ పైకి వచ్చునట్లున్నది. మరియు ఆ గోధుమ గింజ పైకి వచ్చుచున్నప్పుడు, మొదలు వచ్చునది ఏమిటి? రెండు చిన్న మొలకలు మొలకెత్తెను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినుడి. ప్రకృతి ప్రకారము సహజముగా ఏమి పైకి వచ్చును? మనము సహజముగా ప్రకృతిలో జరుగు కార్యములను ఆత్మీయ కార్యములకు జతపరచి చూడబోవుచున్నాము, సహజమైన రొట్టె, ఆత్మీయ రొట్టెతో, ఏమి జరుగును? "ఈ యొక్క మనుష్యుడు ఎట్లు రొట్టె కాగలడు?" గమనించుడి.

సంఘము పైకి వచ్చినప్పుడు, ఆమె ఒక చిన్న ఆకుగా నుండెను. ఇప్పుడది భూమి క్రిందికి వెళ్ళిన ధాన్యమువలె లేదు, అయితే జీవమును తీసికొనివచ్చు ఒక పాత్రగా యుండెను, చూశారా. ఇప్పుడు ఏమి సంభవించెను? ఇప్పుడు ఈ స్థితిలో ఒక మనుష్యుడు చెప్పును, "ఓ, నేను మంచి గోధుమ పంటను పొందియున్నాను." ఇంకా పొందియుండలేదు. ఆ పంటను పొందగలనుటకు నిదర్శనమును అతను పొందియున్నాడు. ఏమి సంభవించెను? అటుపిదప వచ్చినతను జ్వంగ్లీ, లూథరు తరువాత వచ్చిన ఇంకొక కదలికగా అది యున్నది. అయినను అది చివరి దశ కాదు. అది వెడల్పైన ఆకు. పిదప కాడ అనేక ఆకులను చిగురించెను, కాల్విన్, మరియు ఆలాటివి పైకి వచ్చెను. చివరికి ఆంగ్లికన్ సంఘములు పైకి వచ్చెను, అవన్నియును ఆకులే. చూడుడి, అవన్నియునును ఒకే విధముగా నుండెను.

131అటు పిమ్మట ఏమి సంభవించెను? గోధుమ మారిపోయెను, మరియు ధాన్యము మారిపోయెను మరియు సమస్తమును మారిపోయెను. పిదప వచ్చునది ఒక కంకి వచ్చును. దానిని మీరు కంకి అని పిలువవచ్చును. మరి ఆ విధముగానున్నప్పుడు దాని నుండి వ్రేలాడునది ఏమిటనీ, చిన్న పుప్పొడి. ఇప్పుడు ఆ పుప్పొడి ఆకు కలిసెను, భూమి క్రిందికి వెళ్ళిన ఆ నిజమైన గోదుమ గింజ వలె కొంచెము పోలికగా కనిపించును. అది సరియేనా? సరి, వెస్లీ వర్తమానము, లూథరు వర్తమానము కన్నను పరిశుద్ద గ్రంథమునకు దగ్గరగా నుండెను. అది మీకు తెలియును. అది సరియేనా? ఇప్పుడు చిన్న కంకిలన్నియు ఏమైయున్నవి? అనంతయును వెస్లీయులు, మెథడిస్టు, నాజరిన్, పిలిగ్రీమ్ హోలినెస్, యునైటడ్ సహోదరుల గుంపు, వీరందరును పరిశుద్ధత క్రిందనుండిరి. అటుపిదప దానినుండి వచ్చిన కార్యమేమిటి? అది, చివరకు అదేమి చేసెను. స్థాపింపబడి మృతిచెందెను!

దాని నుండి వచ్చినది పెంతెకొస్తు. మీరు చెప్పవచ్చు, "ఓ, సహోదరుడా!"

ఇప్పుడు భయభక్తులతో దేవుని ప్రేమతో నేను దీనిని చెప్పుచున్నాను. మరియు నేను ప్రారంభములో మీకు చెప్పినట్లు, ఆ గొప్ప తండ్రి ఇప్పుడు ఇక్కడ నుండును గాక, ఆయన సర్వ వ్యాప్తియైన దేవుడు. దీనిని గనుక నేను దురభిప్రాయముతో చెప్పినయెడల అప్పుడు నన్ను ఆయన తీర్పు తీర్చును. దానిని నేను సత్యముతో చెప్పినయెడల ఆయన నన్ను ఆశీర్వదించును. మీరు గనుక జీవమునకు నిర్ణయింపబడిన యెడల, మీరు దానిని చూచుటకు ఆయన మిమ్ములను అనుమతించును.

MATT 24:24

 

132గోధుమ యొక్క కాడ నుండి ఆ మొదటి చిన్న గోధుమ గింజ వచ్చినప్పుడు, అది చూచుటకు అసలు గోధుమ గింజవలె నుండెను. అది సరియేనా? అయితే అదేమిటి? అది గింజ కాదు. అదియే మత్తయి 24:24, "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చునదిగా నుండును." గమనించుడి, అది గింజవలె కనిపించును. అయితే మీరు దానిని విడదీసి మరి కూర్చొని ఒక మైక్రోస్కోపు అద్దమును తీసికొని మరియు దానిని దగ్గరగా చూచినయెడల, అది ధాన్యము పైనుండు తొక్క లేక గోధుమపై నుండు పొట్టుగా కనిపించును. అది గింజను కాపాడుటకై ఉన్న పొట్టు, అయితే అది చూచుటకు అసలు గింజవలె కనబడును. ఇప్పుడు, అది సత్యమని ఎందరు ఎరిగియున్నారు, మీ చేతులు వైకెత్తుడి? నిశ్చయముగా. అయితే అది తొక్క మాత్రమే.

ఇప్పుడు, పెంతెకొస్తు సహోదరులారా నన్ను తప్పుగా తలంచకుడి, అయితే ఇది సత్యము. మీరు ప్రకృతిని మీరలేరు, కాదనలేరు. మరి ప్రకృతియంతటిలోను అ దేవుడు నున్నాడని చాటి౦చుచున్నది, ఆయన వాటియొక్క సృష్టికర్త.

133ఇప్పుడు ఆ యొక్క తొక్కను చూడుడి. అది గింజ వలె నుండును… వారేమి చేసియున్నారు? వారు అన్యభాషలలో మాటలాడియున్నారు. పెంతెకొస్తు దినమందు వారు ఎట్లు౦డిరో, ఆ విధముగా వారు వ్యవహరించిరి. అయితే మీరు గనుక దానిని కోసి చూచినత్లయితే దానిలో అనేక తొక్కలుండును. మరియు దానిని మీరు మంచి భూత అద్దములో చూచిన యెడల, ఒక చిన్న గింజ మొలకెత్తుటను మీరు చూడగలరు. అదియే నిజమైన కార్యము. ఇది జీవమును తీసికొనివచ్చు కార్యము మాత్రమే. ఎందువలన? ఆ యొక్క గింజను కాపాడుటకు అది ఉండవలసినదిగా యున్నది. అది చక్కగా కలిసి పనిచేయవలసినదిగా యున్నది, అయితే అది ఆ గింజను కాపాడవలసినదిగా యున్నది. ఇప్పుడు వచ్చియున్నది, లూథరనుల వరకు, సంఘముల ద్వారా వెస్లీ వరకు మరియు దాని ద్వారా కంకిగా కనిపించుదానినుండి మరిప్పుడు తొక్క (తొడుగు) వరకు వచ్చెను. ఇప్పుడది అసలు గింజవలె కనిపించుచున్నది. యేసు చెప్పుటలో ఆశ్చర్యము లేదు, "సాధ్యమైతే అది ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చును." అది చూచుటకు గింజవలె కనిపించును, గింజ ఉండవలసిన స్థానములో అది యుండెను, అయితే ఏమి సంభవించెను? దానికి మునుపు ఇతరులు చేసినట్టే, ఆది కూడ సంఘ శాఖగా మారి స్థాపింపబడెను! అదేమైనది? అది మోసికొనిపోవు కార్యముగా నున్నది.

134మనము జీవించుచున్న దినములలో ఏ చరిత్రకారునికైనను తెలియును, ఏ యొక్క ఉజ్జీవమైనను మూడు సంవత్సరములు మాత్రమే కొనసాగును, అటు పిదప ఆ ఉజ్జీవము నుండి సంఘశాఖ ఉద్భవించుచున్నదని వారికి తెలియును. సహోదరుడు, సహోదరిలారా, నేను జీవించియున్న కాలమున ఈ యొక్క గొప్ప పదునయిదవ సంవత్సర ఉజ్జివమునందు మీతో కూడ జీవించు భాగ్యమును నేను కలిగియున్న ఈ సమయములో దాని నుండి ఇంకొక సంఘ శాఖ స్థాపింపబడదు. ఇక నుండి ఏ సంఘ శాఖలు స్థాపించబడవు. ఇక నుండి ఉండబోవు. పెంతెకొస్తు చివరిగా స్థాపింపబడిన సంఘశాఖగా నున్నది. దీనిని కాపాడుటకు పెంతెకొస్తు ఉండవలసినదైయున్నది. దీనిని నమ్ముటకు ఒక పెంతెకొస్తు వారు లేకుండయుండిన యెడల, ఇటువంటి వర్తమానముతో మనము ఎచ్చటికి పోయుండెదము? ఇప్పుడు 1933లో ఓహైయో నది దగ్గర జరిగిన సంభవమునకు తిరిగి వెళ్ళుడి, చూశారా.

దీనిని మన్నించుడి, అయినను సత్యమును మీరు తెలుసుకొనవలయునని నేను కోరుచున్నాను. మరియు నాకు అధిక కాలము లేదు, నేను ఇప్పటికే ఏబది-ఐదు సంవత్సరములు వయస్సు చెందినవాడను. నేను చనిపోయినప్పటికిని ఈ యొక్క టేపులు ఉండును, మరియు నేను చెప్పినది సత్యమా లేక అసత్యమా అని, నేను నిజమైన సేవకుడనా లేక ఒక అబద్దపు ప్రవక్తనాయని మీరు చూడగలరు. నేను మీకు చెప్పినవన్నియును నెరవేరియన్నవి, మరియు ఆ విధముగానే ఇది కూడా సంభవించును.

JOHN 14:12

 

135అది జీవమును మోసికొని పోవుచున్నది. అది ఆ విధముగానే యుండవలయును. అయితే ఆ గోధుమ ఎదుగుటకు ప్రారంభించినప్పుడు, మొదటి సంఘము యేసును మోసికొని పోవునదిగా యుండెను, అయితే ఆయన వారికి సత్యమును చెప్పుటకు ప్రారంభించినప్పుడు, వారు ఆయనను విడచి వెళ్లిపోయిరి. ఇప్పుడు ఏమి సంభవించుచున్నది? ఏ సహకారము లేకపోయెను. లేదు. ఎందువలన? అది ఆ విధముగానే నుండవలయును, కావున గోధుమ సూర్యుని ముందు నుండవలసినట్లుగానే, మరియు ఆ విధముగానే ఆత్మీయ గోధుమ కూడ కుమారుని ముందు నుండవలయును, ఏలయనగా వాక్యమును సువర్ణపు గింజగా అది మారవలెను. చూడుడి, వాక్యముగా మారుటకు, దేవుడు శరీరధారియై నిరూపించెను… "నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును." సంఘము నిశ్చయముగా ఆ వాక్యము ద్వారానే జీవించవలయును. సంఘ శాఖల ద్వారా కాదు, వాక్యమనే కుమారుని సన్నిధియందు అది (ఏమి)గా మారును? పెంతెకొస్తు దినమున భూమికి క్రిందికి వెళ్ళిన అదే వాక్యముగా అది మారును.

MAL 4:6•

LUKE 17:20

 

136ఇప్పుడు, మలాకీ 4 మనకు బోధించుట లేదా, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు, ఇవన్నియును జరుగునని? ఎందరు దానిని తెలుసుకొనియున్నారు? "మరియు అతను పిల్లలయొక్క హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును," అది సరియేనా, "అసలైన పెంతెకొస్తు తండ్రుల యొక్క విశ్వాసము తట్టుకు."

"మరియు ఆ దినమున, లూకా 17:20 దానిలోనేయని నేను నమ్ముచున్నాను. యేసు చెప్పెను, "మనుష్యకుమారుడు ప్రత్యక్షమగునప్పుడు, "మనుష్యుడు" కాడు "మనుష్యకుమారుడు," స్థాపింపబడిన ఒక సంఘ శాఖ కాదు. "మనుష్య కుమారుడు," వాక్యము మరల జనుల మధ్య నివసించుచున్నది! చూశారా.

వాక్యము మీలో, మీ ద్వారా శరీరధారి ఆయెను, ఈ సమయమునకై వర్తమానమును మీరు ప్రతిభింభింపజేయుచున్నారు. చూడుడి, మీరు మరల జీవించుచున్నారు, యేసు క్రిస్తులోనున్న జీవమును పొంది జీవించుడి. మీరు కుమారుని యొక్క సన్నిధిలో నున్నారు. పిమ్మట…

దానికేమి సంభవించును? ఆ యొక్క సంఘమునకు ఏమి సంభవింపనై యున్నది? చివరగా ఆ యొక్క తొక్క (తొడుగు) ఆ గోధుమనుండి వదలుకొని రాలిపోవును, అప్పుడు గోధుమ ప్రత్యక్షమగుటకు ఆరంభించును. ఏమి సంభవించినది? ఆ తొక్కలోనున్న జీవము మరియు గోధుమలోనికి వెళ్ళెను. జీవము మారదు. మోసికొనిపోవునది మారును, వారు స్థాపింపబడి శాఖలుగా మారి; చూశారా, ఆకులు, విత్తనము మొలకిత్తినప్పుడు వచ్చు కంకి, తొక్కగా మారును. అయితే గోధుమ మారదు. మొదటి సంఘము ఏ విధముగా వాక్యముపై ఆధారపడియుండెనో ఆయన ఎట్లు వాక్యమునందు నుండెనో, ఆ విధముగా నుండి, వాక్యముతో పోషింపబడి, సరిగ్గా వాక్యముపై ఆధారపడిన ఒక వాక్యపరిచర్యను కలిగియుండును ఆ గోధుమ సంఘశాఖలపై ఆధారపడియుండదు. వాక్యము ద్వారా పోషింపబడినదై యుండును!

137ఇప్పుడు ప్రకృతి యున్నది, మరియు దేవుని యొక్క వాక్యమును ఉన్నది. ఆయన ఆ యొక్క రొట్టెయై యున్నాడు. "మనుష్యుడు రొట్టేవలన మాత్రము కాదు గాని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును."

ఇప్పుడు ముగించబోవుచుండగా, ప్రార్థనకు మునుపు. ఇక్కడ గమనించుడి, నేను చెప్పదలచుకొన్న కార్యము ఇక్కడ ఇదియే.

ఇప్పుడు ఆ తొక్క గోధుమ నుండి తనకుతానుగా తొలగిపోవలయును, అది దేవుని యొక్క తీర్మానమైయున్నది. ఎందరు "ఆమేన్" అని చెప్పగలరు? తొక్క గోధుమను వదలి రావలసియున్నది, ఏలయనగా గోధుమ పరిపక్వమగుచున్నది. అది పైకి వచ్చియున్నది. ఇప్పుడు అక్కడ తొక్క లేదు, ఆ తొక్క దానిని మోయుచునుండెను, అది జీవమును మోసికొనిపోయెను, పిదప దానినుండి జీవము గోధుమలోనికి పోయెను. ఇప్పుడు, అదియే కారణము.

స్నేహితులారా, వినుడి, మనము ఏ రోజులో జీవించుచున్నాము? మనము పదునయిదు సంవత్సరముల ఉజ్జీవమును కలిగియున్నాము. ఎందరు దానికి "ఆమేన్" అని చెప్పగలరు? స్థాపన సంఘములు దేనిని లేపి యున్నవి? వేటిని కాదు. నేను కూడ ఒకదానిని స్థాపింపవలయునని వారు నన్ను కోరిరి, అడిగిరి, "సహోదరుడు బ్రెన్హాం మీ యొక్క వాక్య పరిచర్యను బట్టి మీరు ఒక సంఘ శాఖను స్థాపింపనైయున్నారా? అది…" ఇప్పుడు నేను కాదు, నన్ను గురించి నేను మాటలాడుట లేదు. ఈ సమయమునకై, ఈ దినమునకైన వర్తమానమును గురించి నేను మాటలాడుచున్నాను.

138మరియు వారు అక్కడ కెనడాకు వెళ్ళి మరి కొద్ది కడవరి-వర్షపు సంఘమునకు చెందిన సహోదరులను వారు పొందిరి. అది అక్కడే మరణించినది. సహోదరులారా మీకు కడవరి వర్షపు సంఘము గుర్తున్నదా? అదెక్కడికి పోయినది? తక్కిన ఏదైనను కూడ ఎచ్చటికి పోవును? దాని ద్వారా మరి స్థాపన సంఘములు ఏమి పొందియున్నవి? లక్షలకొలది మారుమనస్సు పొందినవారిని, వారు చేర్చుకొని మరియు వారిని వారియొక్క సిద్దాంతములకు బానిసలుగా చేసికొనిరి, తద్వారా ఐశ్వర్యవంతులై, లక్షలు మరియు కోట్ల డాలరుతో భవనములను నిర్మించుకొని మరియు ఇంకా అనేక కార్యములతో "ప్రభువు వచ్చుచున్నాడని" చెప్పుచు, బోధకులను సెమినరీలకు పంపించి మానవునిచే నెలకొల్పిన సిద్దాంతములను అక్కడ నేర్పించుచున్నవి. లూథరు, వెస్లీలు మరియు ఇంకా కొంతమంది చేయుచున్నట్లుగా చేయుచున్నారు. అది ఒక తొక్కగా మారిపోయినది.

అయితే దేవునికి స్తోత్రము, ధాన్యము కొనసాగిపోవుచున్నది. వాక్యము ద్వారా మనము జీవించుచున్న ఈ కాలములో అది సత్యముగా నున్నది, సమస్త రీతులుగా అది సత్యమని గోధుమ ధాన్యము ద్వారా ప్రకృతి నిరూపించుచున్నది. మనకు ఇంకా ఎంత సమయము కలదు? మీకు తెలియునా అది? ప్రపంచ ఆలోచన సభ సంఘములన్నియు ఏకమవ్వును అది వచ్చుటను నేను వినుచున్నాను, దానినుండి ఆమె వేరుపరచుకొనును. ఆమె ఏమి చేయును? కాడ నుండి తనను వేరుపరచుకొని బయటికి వచ్చును. అయితే ఆమెను పైకెత్తుకొను పోవుటకు ఒక ఎలివేటరు కాచుకొనియున్నది. ఒకానొక ఈ ఉదయ కాలమున ఆమె గృహమునకు పోవును. ఓ, అవును. మీకు అర్థమైన యెడల, "ఆమేన్" అని చెప్పుడి.

MATT 3:12•

JOHN 6:44

 

139ప్రపంచము దానిని నమ్మదని నాకు తెలియును. దానిని వారు నమ్మలేరు. వారికొరకు చింతించుడి, ఏలయనగా, "నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, మరియు తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వచ్చెదరు." అతని పేరు గనుక జీవగ్రంధములో నున్నయెడల అతను నిశ్చయముగా వాక్యమును గుర్తించును. అతను గుర్తించవలయును, ఏలయనగా అది ఖచ్చితముగా సత్యమని సరిగ్గా నిరూపింపబడుచున్నది.

మనకు ఇకమీదట ఏ సంఘ శాఖయును ఉండదు, అయితే అన్ని స్థాపన సంఘములు కలిసి ఒక్కటిగా నుండును. ఆ విధముగా ఒక్కటిగా ను౦డుట వలన అది ఆమెకేమి మంచి చేయును? పోయి… పొట్టుతో వారేమి చేసికొనగలరు? దానిని కాల్చివేయుదురు. యేసు చెప్పెను, "దూతలు వచ్చి గోధుమను కొట్టులో చేర్చెదరు." మరియు ఏమి జరుగనైయున్నది? "తీరని అగ్నితో కాడలు, మరియు వరి కోసిన తరువాత మిగిలియుండు దుబ్బు, ముండ్లు కాల్చబడును." మీరు చూశారా? మొదట ఏమి జరుగవలెను? దూతలు మొదట పోయి మరి గురుగులను కట్టెదరు. అది సరియేనా? చూడుడి, వారు వారినందరిని కలిపి ఒక గొప్ప పెద్ద సంఘముగా స్థాపించుచున్నారు, ఇక మీదట స్థాపన సంఘములు లేవు.

140గోధుమ ఇక్కడున్నది. దేవునికి స్తోత్రములు, గోధుమ ఇక్కడున్నది. క్రిస్తు ఇక్కడున్నాడు. ఆయన వాక్యమును ఆయన నిరూపించును, అది సత్యము. గోధుమ ఇక్కడున్నది, అది పక్వమునకు వచ్చుచున్నది, అది కుమారుని యొక్క సన్నిధిలో యున్నది.

ఏ మనుష్యుడును దానిని తాకలేడు, అది అన్నిటినుండి దూరముగా తొలగిపోవుచున్నది, "దానితో మనకు ఏ సంబంధమును లేదు." దానిని మీరు చేసియే తీరవలయును.

ఓ, సహోదరుడా, గోధుమలోనికి పొమ్ము, నీలో నున్న జీవము గోధుమ లోనికి రానిమ్ము. ఆ విధముగా మీరు చేసెదరా? దేవుని నమ్ముడి. కేవలము దేవునితో నిలచియుండుడి. దానిని మీరు పొందగలరని మీకు నిశ్చయము కలదా? ఒకవేళ ఎవరైనను ఏమైనా చెప్పినయెడల… నేను లెక్క చేయను.

141ఒక సనుయుములో నేను చదివిన ఒక కథలాగున్నది. అక్కడొక వైద్యుడుండెను, అతను ఒక చక్కటి వ్యక్తి, మరియు అతను పేద జనులను ప్రేమించెను. మరియు ప్రతియొక్కసారి బీద ప్రజలు డబ్బు చెల్లించక అప్పు చేసినయెడల, అతనేమి చేసెనో తెలియునా? దానిని అతను ఎర్రని సిరాతో చేవ్రాలు వేసి, చెప్పును, "నీవు మన్ని౦పబడియున్నావు." చివరకు ఆ వైద్యుడు చనిపోయెను. మరి ఆ వైద్యుడు చనిపోయిన పిదప, అతని భార్య, ఆమె బహు గర్విష్టి ఆమె ఈ దినములలోనున్న ఈ లోక సంఘములవలె వేరు విధముగా నుండెను. ఆమె వెళ్లి అప్పు చెల్లించవలసిన వారిని హింసించి, వారిపై కోర్టులో కేసు వేసెను. "మీరేవిధముగానైనను ఈ యొక్క బిల్లులను వైద్యునికి ఇయ్యవలసిన పైకమును చెల్లించవలయును," అని చెప్పెను.

అయితే కొన్ని రసీదులను న్యాయాధిపతి తీసి చూసి, చెప్పెను, "అమ్మా, ఇటు రమ్ము." ఆయన చెప్పెను, "ఈ యొక్క ఎర్రని సిరాలోనున్న వ్రాత నీ యొక్క భర్త చేవ్రాలు కదూ?"

ఆమె చెప్పెను, "అవునయ్యా, అది ఆయన చేవ్రాలు."

ఆ న్యాయాధిపతి చెప్పెను, "భూమిపై ఏ కోర్టుకు కూడ వారిపై దావా చేయుటకు వీలు కాదు. వారు అప్పు నుండి విడిపింపబడి యున్నారు."

వారు ఏమైనను వారికి తోచినది చెప్పుకొననిమ్ము. ఆయన తన యొక్క సొంత రక్తముతో ఆయన వాక్యమును చేవ్రాలు వేసియున్నాడు. సహోదరుడా, దానిని మనయొద్దనుండి ఏ కార్యమును తీసివేయజాలదు. మనము స్వేచ్చాపరులము.

మనము ప్రార్థించెదము. [సంఘములో నున్న ఒక సహోదరుడు ప్రవచించుచున్నాడు]:

ఆమేన్.

142ఇప్పుడు, మీ యొక్క తలలు వంచియుండగా, మరి నేను సరిగా గ్రహించియున్న యెడల రాజుల యొక్క కాలములో వారి మధ్యలో ఒకడు లేచి వారెక్కడ వారి యొక్క శత్రువును ఎదుర్కొని మరియు వారిని నాశనము చేయవలెనని ప్రవచించెను. ఇప్పుడు నేను గనుక దానిని సరిగ్గా అర్థము చేసికొనిన వాడనైన యెడల మీ యొక్క శత్రువును మీరు ఎదుర్కొనవలసిన ఒక స్థలమున్నది, అదియే వాక్యము. అక్కడే అతను మిమ్ములను ఎదుర్కొనుటకు ప్రయత్నించుచున్నాడు. మీరు అతనిని అక్కడ ప్రభువు నెలవిచ్చుచున్నాడుతో ఎదుర్కొనుడి.

మీరు మీ తలలు వంచియుండగా, మీలో ఇక్కడున్న ఎందరు, (ఇప్పుడు ఇంచుమించు మధ్యాహ్నసమయము కావచ్చుచున్నది, బలిపీఠము పిలుపు నిచ్చుటకు నాకు సమయము లేదు అయితే దీనిని మాత్రము), మీ యొక్క తలలువంచి, మీ కండ్లు మూయబడి యుండు ఈ సమయములో మీ చేతులను వైకెత్తి, "ఆయనలో నేను ఒక భాగముగా నుండగోరుచున్నాను. నేను ఆయనతో మరియు ఆయన వాక్యముతో కలిసియుండవలెనని కోరుచున్నాను. ఏమి సంభవించినను, ప్రపంచమేమి చెప్పినను, ఆయనలో నేను ఒక భాగముగా నుండవలయునని కోరుచున్నాను," మీ చేతులను వైకెత్తి మరి, "నేను ఆ విధముగా నుండగోరుచున్నానని," మీరు చెప్పగలరా? దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. నూటికి-నూరు-పాళ్లు, నేను నమ్ముచున్నాను.

143మన తలలు వంచియుండగా, మనము ఆలోచించుకొనుచుండగా, మనము నెమ్మదిగా ఈ యొక్క చిన్న పాటను మౌనముగా పాడుకొనెదము ప్రతి యొక్కరును ప్రార్థించుడి.

బంధించి కట్టు ఆ కట్టు ఆశీర్వదింపబడును గాక

మన హృదయములు క్రైస్తవ ప్రేమలో

ఒకే మనసుగల వారి సహవాసము

ఆ పైన చెప్పినట్లుండును.

"నేను మరియు నా తండ్రియు ఒక్కటిగా నుండులాగున,

మీరును ఆయనలో ఒక్కటిగా నున్నారు."

మనము విడిచి వెళ్ళునప్పుడు

మన హృదయాంతరంగము వేదనతో నిండిపోవుచున్నది,

అయినను మనము హృదయములో ఏకము చేయబడియున్నాము

మరియు మనము మరల కలిసికొనెదమను నమ్మకమును కలిగియున్నాము.

రానున్న శనివారము ఉదయము అరిజోనాలో నున్న ఫ్లాగ్ స్టాఫ్ అను చోటు, ప్రభువు చిత్తమైన యెడల విుమ్ములను తిరిగి కలిసికొనెదనని ఎదురు చూచుచున్నాను. మీరు ఆయనను ప్రేమించుచున్నారా?

144ఇప్పుడు నేను ఆ విధముగానే విడువబోవుచున్నాను, చూడుడి. బైబిలు చెప్పుచున్నది, "ఆయనను నమ్మిన వారెందరు, మరియు వాక్యమును అంగీకరించిన వారు అందరును." చూశారా? నేను ఎవరు అంగీకరించిరి ఎవరు అంగీకరింపలేదని చెప్పజాలను, అది మీ యొక్క కార్యమైయున్నది. అయితే, మీరు గనుక ఏదో ఒక చిన్న సంఘశాఖలో చేరియుండిన యెడల, మీలోనున్న మెథడిస్తులు, బాప్తిస్తులు లేక పెంతెకొస్తులు లేక మీరెవరైనను, వాక్యమునకు విరుద్దముగా నున్న ఏదైన కార్యములను చేపట్టియున్న యెడల, నా ప్రియమైన జనులారా, దయచేసి ఈ రోజు దానినుండి మరలుడి, వాటిని వదిలివేయుడి. మీరు ఆ విధముగా చేయరా? వాటినుండి తొలగి మరి ఆయన ప్రక్కకు తిరుగుడి. క్రిస్తునందున్న ఐక్యత నుండి ఏ ఒక్క వాక్యమును మిమ్ములను విడదీయకుండులాగున జాగ్రత్తగా నుండుడి. ఆయన యొక్క ఆత్మ దీనిని అనుగ్రహించును గాక.

145తండ్రియైన దేవుడా, ఈ యొక్క ప్రజలు ఇక్కడ చాలా సేపుగా కూర్చొనియున్నారు. ఒకప్పుడు పౌలు ఈ విధముగా చాలా సేపు రాత్రంతయును ప్రసంగించుచుండగా, వారు రాత్రంతయును కూర్చొని అతను చెప్పునది వినుచుండిరి, అప్పుడు ఒక యౌవ్వనస్తుడు కిటికీ గుండా క్రిందపడి మరి చనిపోయెను, అది నాకు గుర్తుకు వచ్చుచున్నది. పౌలు క్రిందికి వెళ్లి మరి ఆ యౌనస్తుని శరీరముపై పండుకొని మరి చెప్పెను, "అతనికి తిరిగి ప్రాణము వచ్చినదని చెప్పెను." తండ్రీ, ఇక్కడ అనేకులు వ్యాధితోను మరియు బాధలలోను నున్నారు, వారి యొక్క శరీరములకై ప్రార్ధింప కోరియన్నారు. ప్రియమైన తండ్రి, కూటము ముగించువరకు కాచుకొనియుండకుము. వారు ఏ కూటము కొరకును కాచుకొని ఉండనక్కర లేదు. ఇక్కడ వాక్యము ఎల్లప్పుడును యున్నది, అది క్రీస్తు. వారిలో ప్రతియొక్కక్కరిని మీరు స్వస్థపరచవలయునని నేను ప్రార్థించుచున్నాను. వారిలో ప్రతి యొక్కరును పరిపూర్ణముగా స్వస్థత నొందనిమ్ము, దానిని అనుగ్రహించుము, దేవా. వారి యొక్క ప్రయాసలను వారిని ఆశీర్వదించుము. వారు దీనిని నమ్మనియెడల ప్రభువా, వారు ఇక్కడ కూర్చొని యుండలేరు, దీనిని ఇంతసేపు వారు వినియుండను లేరు. ఇప్పుడు ప్రభువా వారు వారియొక్క చేతులను వైకెత్తియున్నారు, దానిని వారు నమ్మియున్నారు, ఇప్పుడది వారి హృదయములలో అంగీకరింపబడనిమ్ము, ప్రతియొక్క వాక్య పరిచారకుడును, ప్రతియొక్క సంఘస్తుడును. పాపి, క్రిస్తును అంగీకరించును గాక; వెనుదిరిగినతను తిరిగివచ్చును గాక. తండ్రి దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో ఈ ఆశీర్వాదములను మేము అడుగుచున్నాము. ఆమేన్

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను

చాలా సంవత్సరముల క్రితము ఆయన నా యొక్క పేరును అక్కడ ఉంచియున్నాడు.

…మొదట నన్ను ప్రేమించెను

మరియు నా యొక్క రక్షణను కొనెను,

కల్వరి వృక్షము పై.

మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు మనము ఆ పాటను పాడుచుండగా, మీరు బల్లకు అటువైపునుండి వెళ్లి మరి వారితో కరచాలనము చేసి, చెప్పుడి, "ప్రియమైన యాత్రికుడా, ఈ ఉదయమున ఇక్కడుండుటకు నేను ఆనందించుచున్నాను. నేను క్రిస్తును నమ్ముచున్నాను. నీవు నమ్ముట లేదా?" ఆ విధముగా చెప్పుకొనుచు, మనము మరల పాడుచుండగా,

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను

మరియు నా యొక్క రక్షణను కొనెను,

కల్వరి వృక్షము పై.

146ఇప్పటి నుండి మనము లోక పోకడలో నున్నామా? ప్రపంచపు నాగరికతలో నున్నామా? సమస్త బుద్ధిహీనతలో, ఈ యొక్క వైభవములో, మరియు సువార్తను తీసికొని మరి దానినుండి ఒక వ్యాపార కార్యమును తీసి వ్యాపారము చేయుచున్నామా, మరి వీటితో మనము పోవుచున్నామా? ఆ విధముగా మనము నున్నామా? నాకు యేసును ఇవ్వుము, నేను కోరునదియంతయును అదియే. "ఆయనను ఎరుగుటయే జీవము, ఆయనను ఎరుగుట." నేను ఆయునను ప్రేమించుచున్నాను. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఓ, ఆయనను మనము ఎంతగా ప్రేమించుచున్నాము!

ఇప్పుడు, నేను ఆరాధనను సహోదరుడు కార్ల్ కు తిరిగి ఇచ్చుచున్నాను, అతను ఇంకను ఏమి చేయనైయున్నాడో నాకు తెలియదు.

దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. మరియు నేను మిమ్ములను చూడలేనియెడల రానున్న ఆదివారము మిమ్ములను చూచెదనని నమ్ముచున్నాను లేక రానున్న శనివారము. ఒకవేళ అప్పుడు చూడని ఎడల, టుసాన్ లో మిమ్ములను చూచెదను. అప్పుడును చూడని యెడల, ఇక్కడ తిరిగి పదిహేడవ తేదిన చూచెదను. అప్పటికి చూడని యెడల మిమ్ములను మహిమలో చూచెదను. ఆమేన్.

ఇప్పుడు సహోదరుడు కార్ల్, ఈ సమయమున అతను ఏమి చేయనై యున్నాడో నాకు తెలియదు, సహోదరుడు విలియమ్స్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...