గొర్రెల కాపరులకే ఎందుకు కనబడవలెను
1నేను ఎక్కువసేపు బోధించే బోధకుడనుగా ఉన్నాననుకొనుచున్నాను. విద్య లేదు గనుక కొందరికి అసలు బోధకునివలె కనబడుట లేదేమో. నేను కూడా బోధకుడనని చెప్పుకొనుట లేదు. నేను స్పేరు టైరు వలె యున్నాను. కాని నాకు దేవుని యొద్ద నుండి ఒక వర్తమానము వచ్చియున్నది. దానిని నేను నా పద్ధతిలో ప్రపంచమునకు ఇవ్వ ప్రయత్నించుచున్నాను. ఆ ఒక్కరీతిగానే దానిని నేను ఇవ్వవలసియున్నాను. ఆ వర్తమానముతో నేను నిలచియుండనియెడల, దేవుని దృష్టిలో మోసగానిగాను, మీ దృష్టిలో వేషధారినిగాను ఉందును. ఒకటి చెప్పి మరో దానిని నమ్ము వ్యక్తి వేషధారి. మనము ఎల్లపుడూ హృదయపూర్వకముగా సత్యము చెప్పవలెను. అప్పుడు జనులు మనతో ఏకీభవించకపోయినా గాని మనలను లెక్కలోకి తీసికొందురు. మనము గౌరవింపబడు స్త్రీ, పురుషులుగా ఉండవలెను. మన హృదయములలో ఉన్న సత్యమునే మనము మనస్ఫూర్తిగా చెప్పవలెను.
2గత సంవత్సరము లేదా అంతకు ముందు సంవత్సరము రమాడా యొద్ద ఒక క్రీస్తును వర్తమానము అందించు భాగ్యము కలిగినది. ఇక్కడ గాని లేదా ఫీనిక్సులో గాని నేను మాట్లాడిన ఆంశము. ఎందుకు అల్పమైన బెత్లెహేము? మరియు నేను నమ్ముచున్నాను, గత సంవత్సరము: తూర్పున మేమాయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి, అను దానిపై మాట్లాడితిని.
మనము బైబిలు చదువునప్పుడు, "ఎందుకు?" అను మాటను చూచి తరచుగా ఆశర్యపడుచుందుము. మీరు నాతో కొంత సేపు నిలిచి ప్రార్థించినయెడల, నేను మీకు క్రిస్మసు వర్తమానమిచ్చుటకు ప్రయత్నించుదును. దీని తరువాత మరల ఇంకో క్రిస్మసు యున్నచో అదెక్కడ జరుగునో దేవునికి మాత్రమే తెలియును. కాబట్టి మరల బల్ల యొద్ద మనము కూర్చొను వరకు ఇదే చివరి క్రిస్మసుగా భావించుదము. అది ఈ విధముగా ఉండకపోవచ్చును. మార్గాంతమున, తండ్రి రాజ్యములో ఆయనతో పాటు ప్రభురాత్రి భోజనమును క్రొత్తగా తిని త్రాగుదుము. మనము బహు యధార్థముగా ఈ రాత్రి ఇక్కడ కూడుకొని ఇదే చివరి క్రిస్మసు వర్తమానమనునట్లుగా విందము.
JOHN 1:1,14
3ఈ రాత్రి నేను ఒక ఆసాధారణమగు అంశము మీద మాట్లాడగోరుచున్నాను. కొన్నిసార్లు అసాధారణమగు వానిలోనే దేవుని మీరు కనుగొందురు. ఆయన అసాధారణ రీతిలో క్రియలు చేయును. మామూలు పద్ధతి కాదు గాని, అసాధారణమగు పద్ధతి. అసాధారణ సమయములు, ఆసాధారణ రంగములు; ఆయనే అసాధారణమగు వాడు. ప్రభుని చిత్తమయితే, నేను మాట్లాడగోరు అంశము, "గొర్రెల కాపరులకే ఎందుకు కనబడవలెను."
వాక్యమును ఇప్పుడు మనము సమీపించు ముందుగా దానిని దేవునిగా ఎంచుదము, "ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను."
4గతవారము లేదా అంతకు ముందు వారము నేను ఫీనిక్సులో చెప్పాను, "ఈ భూనివాసులు ఇప్పుడు ఈ భవనము గుండా కదిలి వెళ్ళుచున్నారని రుజువయినది." అందుకు టెలివిజను రుజువు. అది మరో కోణము. మన స్వాభావిక నేత్రములు, మన పంచేంద్రియములు దానిని పట్టుకొనజాలవు. అది టెలివిజను ఉత్పత్తిదారుల వలన కాదు గాని, ఆ చానల్స్ వలన జరుగుచున్నది. నీ వ్రేలితో ఏమి కదపలేవు. నీ కనురెప్పును వేయలేవు. అది నిత్యముగా రికార్డు చేయుచున్నది. ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తి తన టెలివిజను తెర మీద మాటను, వ్రేలి కదలికను, కనురెప్పను, ధరించియున్న వస్త్రపు రంగును కూడా చూడ కలుగుచున్నాడు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యావత్తు ప్రపంచమునంతటిని అది చుట్టి వచ్చుచున్నది. చూడండి, అది ఈధరు ఆలల ప్రభంజనము. దానిని నేను వివరించలేను గాని, అది జరుగుచున్నదని ఎరుగుదును. ఎవరూ దానిని నిజంగా వివరించగలరని నేననుకోను. కాని టెలివిజను దానిని పట్టుకొనుచున్నది. కొన్ని సాధనముల ద్వారా దానిని యధార్థమని రుజువు చేసిరి. దానిని వారు గోడ మీద ప్రతిబింబింపచేయగలరు.
REV 22:19
5ఆదాము ఇక్కడున్నప్పుడును అది యున్నది. ఏలియా కర్మేలు కొండ మీద ఉండినప్పుడు టెలివిజను యున్నది. మార్టిన్ లూథర్ యున్నప్పుడు అది ఉన్నది. ఆ యువ యాజకుడు ప్రభురాత్రి భోజనమును నేల మీద పారవేసి, "ఇది కోషేరు! నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును," అని చెప్పెను. అప్పుడే ఇది ఇక్కడుండెను, కాని దానిని ఇప్పుడు మనము కనుగొన్నాము. మన స్వాభావిక దృష్టికి కనబడుట లేదు గాని, ఈ రాత్రి దేవుడు, ఆయన దూతలు, పరలోక సైన్యము ఆదృశ్య రూపములో ఇచ్చటున్నారు. కాని ఒక దినమున ఈనాటి టెలివిజను వలె అది వాస్తవ రూపము దాల్చును, సామాన్యమగును. అందుకే నేను వాక్యము నమ్ముచున్నాను.
యేసు చెప్పెను, "ఈ బైబిలుకు ఒక్క మాట చేర్చినా, అందులో నుండి ఒక్క మాటను తీసివేసినా, వానికి జీవగ్రంథములో పాలు లేకుండా పోవును."
6కాబట్టి దానిని చదువు ముందుగా, మన తలలు వంచుదము. ఈ పేజీని శారీరకమైన బలము గల ఏ మనిషి అయినా త్రిప్పుగలడు గాని దానిని దేవుడు మాత్రమే బయలుపరచును.
ఇప్పుడు మనము తలలు వంచుదము, ధూళి వైపుకు తిరుగుదము, అందులో నుండి మనము వచ్చాము, అందులోనికే మరల వెళ్ళుదుము. ఈ నిర్మల క్షణములో మనము క్రిస్మసును సమీపించుచుండగా, అయోగ్యులమని తలంచుచున్న వారేవయినా ఇక్కడుండి ప్రార్థన సహాయము కోరుచున్నచో, దేవుని వైపు చేతులెత్తి ఈలాగు చెప్పండి, "ప్రభువా, ఈ క్రిస్మసులో నన్ను జ్ఞాపకము చేసికొనుము." (మీ తల ఎత్తవద్దు). దేవుడు మిమ్ము దీవించును.
JOHN 14:17•
JOHN 15:26•
JOHN 16:13•
2PET 1:20•
1JN 4:6
7అతి పరిశుద్ధుడవును, కృప కలిగిన పరలోక తండ్రి, సర్వశక్తుడవగు దేవా, ఆది నుండియు ఉన్నవాడా, నక్షత్రము, అణువు, పరమాణువు లేక ముందే నీవు ఉన్నావు. నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నీవు సర్వము చేసితివి. ఆయన యందు నీవు మాకు సమస్తము ఉచితముగా ఇచ్చితివి. ప్రభువా, ఇక్కడ మేము కూడుకొనుటకు నీవిచ్చిన అవకాశమును బట్టి వందనములు చెల్లించుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరింపబడుటకు, నేర్చింపబడుటకు కూడియున్నాము. నీ మాటలను పరిశుద్ధాత్మ తీసికొని మా కొరకు వాటిని బయలుపరచును. "సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన సంగతులన్నియూ మీకు జ్ఞాపకము చేయును. రాబోవు సంగతులను కూడా చూపించును," అని యేసు చెప్పెను.
దేవా, ఇక్కడగాని, భూమి మీద మరెక్కడయినా గాని, నీ వాక్యమును అనువదింప చేయుటకు యోగ్యతగల వ్యక్తి ఎవడునూ లేడు. "దేవుని వాక్యమునకు స్వంత అర్థము చెప్పనక్కరలేదు," అని వ్రాయబడియున్నది. కావున ప్రభువా, నీతో మరింత దగ్గరగా నడువవలెనను మా హృదయ ఆకలిని ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ తీర్చునట్లుగా ప్రార్థించుచున్నాము. మా ప్రతి ఒక్కరికి ఆ అవసరత యున్నది, కావున సంతృప్తిపరచుము. మేము అయోగ్యులము, అపవిత్రులము, అనర్హులము. బెత్లెహేములో జన్మించిన ఆ బిడ్డ ఎంతో పరిపూర్ణ జీవితము జీవించెను. భూమి మీద ఆయన మాత్రమే పరిపూర్ణుడు. ఆయన తన్ను క్రయ ధనముగా అర్పించుకొనెను. పాపులమగు మమ్మును శుద్ధిపరచెను. తండ్రితో మాకు సంబంధమును ఏర్పరచెను. దానిని ఈ రాత్రి పరిశుద్ధాత్మ మాకు అది చేయకలుగునట్లు సహాయము చేయుము. (వాక్య పరిచర్య ద్వారా దానిని చేయుము.)
8ప్రభువగు దేవా, నేడు దేశములో ఎందరో రోగులున్నారు. వైద్యుని ద్వారా ఎంతో గొప్ప వైద్యము చేయించినా గాని, ఆస్పత్రిలో యున్న శ్రేష్ఠమగు మందు వాడినా గాని ఇకా రోగము పోలేదు. గొప్ప శాస్త్రీయ పరిశోధనలు జరిగినవి. ఎన్నో కనుగొనబడినవి. అయినా ప్రపంచములో ఎన్నడూ లేని వ్యాధులు కనబడుచున్నవి, ఎందుకనగా ప్రపంచములో ఎన్నడూ లేని పాపము, అవిశ్వాసము ఉన్నది. పరమ వైద్యుడా, ఈ రాత్రి మాకు సహాయము చేయుము. మా మధ్య గల రోగులను బాగు చేయుము.
మాకు నిజమగు క్రిస్మసు ఆత్మను ఇమ్ము. అన్య ఉత్సవములు, క్రిస్మసు చెట్టు పూజలు, శాంతా క్లాస్ అను కట్టు కధలు, ఈస్టరు కుందేళ్ళు, వ్యాపార ప్రపంచము రూపొందించిన విభిన్న వస్తువులు ప్రక్కకు పెట్టుదుము గాక. వాక్యమైయున్న క్రీస్తులోనికి ప్రవేశించుదము. దీనిని ఆయన మహిమ కొరకు ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్.
LUKE 2:1-20
9మీరు నాతో పాటు వాక్యము చదువుటకు పరిశుద్ధ లూకా వ్రాసిన సువార్త 2 వ అధ్యాయము తీయండి. నా మాట సరిగా వినబడుచున్నదా? మైక్రోఫోను వలన ఏదయినా ఆటంకమున్నదా? ఆ వెనుకనున్న వారికి సరిగా వినబడుచున్నదా? చేయి చూపించండి. వందనములు. పరిశుద్ధ లూకా సువార్త 2 వ ఆధ్యాయము:
"ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను.
(ఇది కురేనియ, సిరియ దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య.)
అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి.
యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి, రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా,
ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
అయితే ఆ దూత - భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి - సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను.
ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, ఆ గొర్రెల కాపరులు - జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియ చేయించియున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని -
త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశర్యపడిరి.
ఆయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.
అంతట ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని, కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి."
చదువబడిన వాక్యమును ప్రభువు ఆశీర్వదించును గాక!
10ఈ గొప్ప సంఘటన గొర్రెల కాపరులకు ఎందుకు బయలుపరచబడెను? అది మనకు ఒక వింతగా తోచును. ఇక్కడ నేను కొన్ని వాక్యములు వ్రాసియుంచాను. నాకు తెలిసినంత వరకు దానికి కారణములను వాక్యపూర్వకముగా చూపించెదను. ప్రభువు తన కృపను బట్టి ఈ ఎందుకు అను ప్రశ్నను మనలో నుండి దీని తరువాత తీసివేయును. ఎన్నడూ జరుగని ఈ గొప్ప సంఘటన గొర్రెల కాపరులకు ఎందుకు బయలుపరచబడినదని మనము ఆయా సమయములలో ఆశర్యము చెందుదుము. ఆనాటి వేదాంతజ్ఞులకు గాక గొర్రెల కాపరులకు ఎందుకు దీనిని బయలుపరచెను? (శిక్షణ పొందిన వేదాంత పండితులున్నారు) ధనవంతులను దాటి పేద వారి యొద్దకు ఇది ఎందుకు వచ్చెను? విద్య గల వారిని, జ్ఞానులను దాటిపోయి విద్య లేని పామరులను ఎందుకు చేరినది? దీనిని గూర్చిన కొన్ని ప్రశ్నలున్నవి.
11మరో కారణమును నేను చెప్పవచ్చును, గమనించండి, శిశువు బెత్లెహేములో జన్మించెను. బెత్లెహేము అనగా హెబ్రీ భాషలో "దేవుని రొట్టెల ఇల్లు," అని అర్థము. ఆయన అక్కడికి తప్ప మరెక్కడికి రాలేడని కొద్దికాలం క్రితం వాక్యము ద్వారా తెలిసికొన్నాము. రాహాబు, ఆమె భర్త ద్వారా ఈ బెత్లెహేము కనుగొనబడినది. రాహాబు ఒక వేశ్య. ఇశ్రాయేలు సైన్యాధిపతులు యెరికోను స్వాధీనపరచుకొనిరి. ఆమె విశ్వాసమును బట్టి దేవుని వర్తమానమును నమ్మినది. ఆమె తన స్థితిలో నుండి రక్షించబడినది. ఆ తరువాత యెహోషువా ఆ దేశమును అందరికి పంచి ఇచ్చెను.
12ఇక్కడ గొప్ప పాఠమున్నది. టుసాన్లో దీనిని చెప్పగోరాను. ఆ హెబ్రీ తల్లులు బిడ్డలను కనిరి. ఆమె ప్రసవ వేదనతో శిశువును కనును. ఆమె మూలుగును. వారి వారి పిల్లలకు ఆ దేశములో గోత్రముల బట్టి స్థానము దొరకును. దేవుని వాక్యమంతయూ చక్కగా సరిపోవును. అది సరిగా అమరినయెడల, దేవుని వాక్యమే కాదు. నీ ఆలోచన వల్లనే వాక్యము అమరదని నీవనుకొనుచున్నావు. కానీ వాక్యమంతయూ చక్కగా అమరును.
13కాబట్టి ఆయనే జీవాహారము, గత వారము లేదా అంతకు ముందు వారము ఫీనిక్సులో మనమది నేర్చుకొన్నాము. ఆయన జీవాహారము గనుక "రొట్టెల ఇంటికి" తప్ప మరెక్కడికి రాజాలడు. యేసు బెత్లెహేములో జన్మించెను. బెత్లెహేములో సమాజ మందిరము కలదు. గొప్ప మత నాయకులు బెత్లెహేములో నివసించిరి. గొప్ప గొర్రెల కాపరియగు దావీదు రాజు బెత్లెహేములో జన్మించెను. ఆతని తండ్రియగు యెషయి, అతని తండ్రియగు ఓబేదు కూడా బెత్లెహేములోనే జన్మించిరి. కాబట్టి బెత్లెహేము వారికి పుట్టినిల్లు.
దావీదు కుమారుడగు యేసు బెత్లెహేములో జన్మించెను. గొప్ప మత ప్రాబల్యపు ఛాయలు అప్పుడున్నవి. వారు ఎన్నో సంవత్సరముల నుండి మెస్సీయా కొరకు ఎదరు చూచుచుండిరి. మెస్సీయా వచ్చునని నాలుగువేల సంవత్సరములకు ముందే ప్రవచించబడెను. ఆ గొప్ప మత నీడలో మెస్సీయా పుట్టవలసియున్నచో, ఆ మొదటి వర్తమానము అనామకులగు, పామరులగు గొర్రెల కాపరులకు ఎందుకు అందినది? అదే మొదటి వర్తమానము. గొర్రెల కాపరులకు వార్త అందినది. వారు జ్ఞానులు కాదు, విద్యగలవారు కారు. వారు గొర్రెలకాపరులు, అది వింతగా యున్నది కదా? కానీ దీనికి జవాబు ఉండవలసియున్నది. దేవునికి తప్ప మరెవరికి ఆ జవాబు తెలియదు. ఆ జవాబు ఆయనకు మాత్రమే తెలియును.
14గుర్తుంచుకొనండి, మెస్సీయా పట్టణములో జన్మించియుండెను. ఒక తొట్టిలో ఆయన పరుండెను. గొప్ప దేవాలయము, ప్రధానయాజకులు, గొప్ప యాజకులు, వేదాంత పండితులు, జ్ఞానులు, శిక్షణ పొందిన వారు మెస్సీయా కొరకు ఎదురుచూచుచుండిరి, అయితే ఆయన వారి మధ్యనే యుండెను. కాని ఆ విద్యలేని, శిక్షణ లేని, సంస్కృతి తెలియని, నిరు పేదలకు ఎందుకు తెలియ చేయబడెను? అట్టి వార్త వారికి అందించబడుటకు తగరు అనిపించును. అట్టి పనికి వారు అనర్హులని భావించుదుము.
నా అభిప్రాయము మీరు తెలిసికొన్నారా? అది గొప్పగా మీరు ఎంచకపోవచ్చును, కానీ నా అభిప్రాయము మీకు చెప్పగోరుచున్నాను. దేవుని జ్ఞానము బట్టి అది జరిగినదని నేను నమ్ముతున్నాను. ఆ రకమగు వర్తమానమును ఆ విధంగా వారంగీకరించరని ఆయనకు తెలియును. అది వారి తెలివికి రుచించదు. అది వేరుగా యున్నది. ఆయన ఆ విధముగా వచ్చునని వారికి నేర్పించబడలేదు గనుక వారు నమ్మరు, అది వారి వేదాంత అవగాహనకు వేరుగా యున్నది. వారి తర్ఫీదు, వారి విద్య ఎందుకూ పనికిరానిదయినది. అటువంటి వర్తమానమును వారు చేరుకొనరని దేవుని జ్ఞానమునకు తెలియునని నేను నమ్ముచున్నాను.
MAL 3:6
15మెస్సీయా వచ్చెను, దానిని ఎవరో తప్పక గుర్తించవలసియున్నారు. వారి వేదాంతములో కలువని వారు కొందరున్నారు. విద్యలేని గుంపుకు ఆయన తన వర్తమానమును సమర్థవంతముగా అందచేయగలడు. మిశ్రిత గుంపుకు ఆయానాలాగు అందించజాలడు. వారు కదల్చబడని చోటులో కూర్చొనియున్నారు. దేవుని వాక్యము కూడా వారిని త్రిప్పజాలదు.
క్రైస్తవ స్నేహితుడా, ఒక ప్రశ్నను ప్రేమతో, యధార్థముగా అడుగుదును. ఆయన ఈ రాత్రి అదే కార్యము చేయునేమోనని నాకు తోచుచున్నది. ఈ తరమునకు వాగ్దానము చేయబడిన వాక్యమును ఆయన మనకు పంపించును. అలాగు పంపిన యెడల వారు మన వేదాంత పండితులు, విద్యాధికులు, తెలివిగలవారు ఆనాడు వారు తిరస్కరించినట్లుగా - ఈనాడును వర్తమానమును తిరస్కరించరా? మానవుడు మారలేదు, అలాగే దేవుని వాక్యము మారలేదు. ఆయన మారని దేవుడు. ఆయనకు మార్పులేదు!
16గమనించండి, పరలోక దూతలు వచ్చి ఈ తక్కువగా ఎంచబడిన మానవులకు వర్తమానము ఇచ్చెను. ఈ పేద, విద్యలేని గొర్రెల కాపరుల కంటే గొప్ప అర్హతలు గల వ్యక్తులు ఎందరో యున్నారు. భూలోక సంబంధముగా ఆలోచించుదము. గొర్రెల కాపరులు అందరికన్ననూ అజ్ఞానులు, వారికి వారి గొర్రెల గూర్చి తప్ప మరి దేని గూర్చియు తెలిసికొన ఇష్టపడరు. గణితము అతడు తెలిసికోనవసరము లేదు. ఒక అణువును చీలుట ఎట్లో అతడు తెలిసికోనక్కర లేదు. అతనికి ఏ పాండిత్యము అక్కరలేదు. తన గొర్రెల గూర్చి తెలిసినచో చాలును. అది మాత్రమే అతనికి అవసరము. గొప్ప జ్ఞానము గల దేవుడు, సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడగు దేవుడు అటువంటి వారిని ఎన్నుకొనెను. (ఆ వ్యక్తులు అలాంటి వారే), బాగా శిక్షణ పొందిన వారిని ఆయన దాటిపోయెను. దానిని తెలిసికొనుటకే వారు నేర్చుకొనిరి. దీని వలన ఒక సంగతి అర్థమగుచున్నది. వారు తప్పుడు స్థలములో శిక్షణ పొందిరి. దేశములోని ప్రాముఖ్యమగు వాటిని వారు దాటిపోయిరి. అక్కడ ప్రముఖ వ్యక్తులుండిరి. గొప్ప బోధకులుండిరి. ప్రధానయాజకుడగు కయప, ఇంకా చాలామంది గొప్పవారు ఉండిరి. ఇశ్రాయేలీయులలో అధిక నేర్పరులుండిరి, శాఖలకు కొదువలేదు. వేదాంత పండితులు గర్వించుచుండిరి. దేవుడు వారినందరినీ దాటి పోయెను! అదియే దేవుని యొక్క జ్ఞానము.
17గమనించండి, భువి మీద ఉన్న అతి దీనులను, పామరులను గౌరవించుటకు ఉన్నతాకాశములు వేగిరపడుచున్నవి. పరలోక ఔన్నత్యము క్రిందికి దిగి వచ్చి, భూమి మీది అతి దీనులకు తన్నుతాను బయలుపరచుకొనెను. మధ్యలో నున్న అందరినీ దాటి వచ్చెను. సాధారణ కాపరులకు ఆయన తన్ను తెలియచేసికొనెను. అన్ని కాలములోని అతి గొప్ప వర్తమానమును ఈ సామాన్య గొర్రెల కాపరులకు అందించ వచ్చెను. ఎందరో గొప్ప వర్తమానికులుండిరి. నోవహు దినములను, ప్రవక్తలను, గొప్ప యాజకులను చూడండి. గతించిన దినములలో ఎందరో అట్టి వారుండిరి. గొప్ప మేధావులు, రాజులు, అధికారులు, చక్రవర్తులు ఉండిరి, కాని ఈయన అన్నింటి కంటే గొప్ప వర్తమానముతో వచ్చెను. ఆ వర్తమానము ఏమిటి? "ఇప్పుడు మెస్సీయా ఇచ్చట ఉన్నాడు." చూచారా? దానిని తెలియచేయుటకు ఆయన మేధావులను దాటి దీనులగు గొర్రెల కాపరుల యొద్దకు దిగి వచ్చెను.
దీనిని గూర్చి ఆలోచించండి: యాజక బృందము, సంఘాధికారులు, బోధకులు, వేదాంత శిక్షణ పొందిన వారు ఉండిరి. వారు డబ్బంతా ఖర్చు చేసి విద్యనభ్యసించిరి. ఆయన వారిని దాటి వచ్చెను. అన్ని సంఘములను, సిద్ధాంతములను, శాఖలను ఆయన దాటి వచ్చెను. తమ విద్య వలన, తమ మిషనెరీల వలన, సభ్యత్వము వలన దేవుని గౌరవించుచున్నామని వారనుకొనిరి, కానీ ఆ మూల వర్తమానము వారిని దాటి వెళ్ళినది. ఎంత వింత! ఎందువలన? చూచారా?
18గమనించండి, అంతే కాదు, అయితే ఆ స్థలము అట్టి సంఘటనకు అసలు ఏ మాత్రము అనుకూలమైనది కాదు. వర్తమానమును గొర్రెల కాపరులు చేరుకొనిరి. వర్తమానము ఎచ్చటున్నదో ఇప్పుడు గమనించండి. అట్టి అనుకూలము లేని స్థలములోనికి ఆ వర్తమానము వచ్చునని వారెన్నడూ తలంచలేదు. ప్రభువైన యేసు యొక్క నిజ వర్తమానము కొరకు మనము ఈ రాత్రి ఎదురుచూచుచున్న యెడల, అది మనము అనుకొనని గుంపులోనికి వచ్చుట చూచి ఆశ్చర్యపడము. కాని ఈ నాటి గొప్ప, ఉన్నత సంస్కృతి గల ప్రపంచము, సంఘము వారిని మతభ్రష్టులని ఎంచును. కాని అక్కడే ఆయనను మనము కనుగోనమా? అది ఊహించని స్థలము. వారు అర్హత లేని వార్తాహరులు. గొర్రెల కాపరులకు ప్రసంగించుట ఏమి తెలియదు, గొర్రెలను పిలచుదురు; అందుకే ఇది వచ్చినదనుకొనుచున్నాను.
19ఒక వాగ్దాన వాక్యమున్నది. చూడండి, తిరిగి అదే జరుగగలదు.
దేశములోని ఘనులందరిని అది దాటెను, గొప్ప వారిని అది దాటి వెళ్ళెను. ఎన్నికలేని వారికి బయలుపరచబడెను. దైవ సంబంధమగు విద్యలో గొప్ప పట్టాలు పుచ్చుకొన్న వారుండిరి. మానసిక శాస్త్రము, ఉన్నత విద్య అభ్యసించిన వారుండిరి. గొప్ప దేవాలయములున్నవి. వాటినన్నిటిని దాటి ఎన్నికలేని వారికి ప్రత్యక్షతను ఇచ్చెను. సర్వశక్తుడగు దేవుని యొక్క జ్ఞానము, అనంత జ్ఞానము వలన ఇది జరిగినది. ఇంత కంటె గొప్ప వర్తమానము ఎన్నడూ ఇక ఉండదు. "ఇప్పుడు మెస్సీయా భూమి మీద యున్నాడు." ఎంత జ్ఞానము! దేవుని నుండి మాత్రమే అది రాగలదు. ఆయనే జ్ఞానాధారము! సమస్త జ్ఞానము, విద్య పెంటగా ప్రక్కగా త్రోయబడినది. దేవుని గొప్ప జ్ఞానము వాటిని కొట్టివేసినది. దానిని మరింత లోతుగా చెప్పవలెనని మరల నొక్కి చెప్పుచున్నాను. అంతయూ వ్యర్థముగా ప్రక్కకు త్రోయబడెను. వాటి వలన ఏ మేలు లేదు. మార్గమును కలుగచేసికొను హక్కు దేవుని జ్ఞానమునకు మాత్రమే యున్నది. అది అన్నిటిని దాటి వెళ్ళును. దేవుడు శూన్యమును తీసికొని సమస్తమూ సృజించగలడు.
20ఇక్కడ మనము ఆగి యోహాను గూర్చి చెప్పుకొనవచ్చును. ఆగి మనము ఏలియా గూర్చి చెప్పుకొనవచ్చును. ఏలియా ఎక్కడ నుండి వచ్చెనో ఎవరికీ తెలియదు. అతడు రంగము మీద కనబడెను. అంతే! ఆ వెనుక కాలములోని ప్రవక్తలు ఎవరికీ తెలియని వారు. కానీ దేవుడు వారిని తీసికొనెను. సంఘము యొక్క నీతులను, బోధలను ఆయన దాటి వచ్చెను. తాను దేవుడనని చూపించుకొనెను. ఆయన అనామకుని తీసికొని ఏదైనా చేయగలడు. ఆ విధముగా చేసి ఆయన తన జ్ఞానమును, తన దైవత్వమును చూపించుకొనును. ఆయన శూన్యమునే తీసికొనును. ఆయన మొదటగా మానవుని చేసినప్పుడు ఒక మట్టి ముద్దను తీసికొనెను. దానిలో నుండి ఒక మానవుని చేసెను. అది మట్టి తప్ప మరేమీ కాదు, కాని మానవుని చేసెను. ఇప్పుడు కూడా దేవుడు ఎన్నికలేని వారిని తీసికొని ఏదో చేయనై యున్నాడు. మనము ఏదో అయిపోయామని తలంచినంతకాలము దేవుని చేతిలో ఎన్నడూ వాడబడము. మనకు తెలిసినది, మనము నేర్చుకొన్నది విడిచి పెట్టవలెను. గొప్ప పరిశుద్ధుడగు పౌలు క్రీస్తును ఎరుగుటకు తాను నేర్చుకొన్నదంతా మరచిపోయెనని చెప్పెను.
21వారి విద్య, వారి బోధలు వారిని హీన గతికి తీసికొని వచ్చినవి. చివరకు వారాయననే తిరస్కరించిరి. ఆయన కొరకు వారు నేర్చుకొన్న విద్యయే వారిని అపనమ్మకములోనికి తెచ్చినది. వారాయనకు ఎదురు తిరిగి, విమర్శించి, ప్రధాన శత్రువుగా ఆయననెంచి, సిలువవేసిరి.
చరిత్ర బహు తరచుగా పునరావృతమగునని మీకు తెలియునా? అది తెలిసిన సత్యము, అది మరల మన ప్రక్కనే జరుగగలదు. "ఓ, నేను అప్పుడు జీవించిన యెడల బాగుండును," అందువు. అప్పుడు నీవేమి చేసియుందువో తెలిసికోవలెనన్న, ఇప్పుడు నీ పరిస్థితి చూచుకొనుము. అప్పుడేమి చేసియుందువో తెలిసికోగలవు, ఎందుకనగా అది నిశ్చయంగా ప్రత్యక్షమగుచున్నది.
22ఆయన వాక్యము నమ్ముటకు వారు తర్ఫీదు పొందిరి, కాని వారి కన్నుల ఎదుటనే ఆ వాక్యము బయలుపరచబడినప్పుడు ఆ ప్రత్యక్షతను వారు తిరస్కరించిరి. దేవుడు తాను చేయగలదానిని నిరూపించెను. అయినా వారు ఆయనను, "దురాత్మ" అని పిలచిరి. అది వారందరికి శాపము. జరిగిన దానిని గూర్చి ఆలోచించండి! వారికేమి సంభవించెనో ఆలోచించండి. వారి దినమున శరీరధారియైన వాక్యమును గుర్తించకుండా చేసినది వారి విద్యయే. వారు అతి గొప్ప బోధకులచే శిక్షణ పొందిరి.
"నేడు మేము అలాగు చేయుట లేదు," అని మీరందురు. ఈనాటి మన ఉపాధ్యాయుల కంటే ఆనాటి వారు ఎంతో గొప్పవారు. మన బోధకుల కంటే అగ్రగణ్యులు, వారే తప్పిపోయిరి. నేడు మనకు తొమ్మిది వందల తొంబై ఆరు వివిధ సంస్థలున్నవి. వారికి మూడే ఉండినవి. కాని ఆ మూడింటిలో ఏ ఒక్కటీ ఆయనను గుర్తించలేదు. మానవుడు చేసినది దేవుని దృష్టిలో వెర్రితనమని తేలినది, చూచారా.
23దానిని వారు గుర్తించలేకపోయిరి. మరల అలాగే జరుగును.
మానవోద్దేశము మంచిదే, ఎల్లప్పుడూ మంచిదే. మానవుడెన్నడూ తన మార్గములను మార్చుకొనడు. నేను లోక జనులను గూర్చి మాట్లాడుచున్నాను. మానవుడెల్లప్పుడూ దేవుని స్తుతించును. భక్తిపరులుగా పిలువబడువారు దేవుడు గతంలో చేసిన దానిని గూర్చి దేవుని స్తుతించెదరు. ఆయన చేయబోవు దానిని జనులకు చూపించెదరు, కాని ఆయన ఇప్పుడు చేయుచున్న దానిని అలక్ష్యము చేయుదురు. చూచారా? అది మానవ బుద్ధి! ఆ విధంగా అతడు చేయబడెను. ఎల్లప్పుడూ ఆ విధంగానే యున్నాడు. అది వాక్యము చెప్పినదేనని బైబిలు చదువు వారికి ఈ రాత్రి తెలియును. దేవుడు గతంలో చేసిన దానిని బట్టి ఆయనను వారు స్తుతించెదరు, ఆయన చేయబోవు దానిని గూర్చి చెప్పెదరు. ఆయన చేయుచున్న దానిని అలక్ష్యము చేయుదురు. అది మానవుని అలవాటు.
2PET 1:20
24ఈ బోధకులు ఈ విధముగా చేయుటకు కారణమును నా ఉద్దేశ్యము బట్టి నేను చెప్పెదను. వారు వాక్యమునకు అర్థము చెప్పిరి, ఎందుకనగా వారందరూ రానున్న మెస్సీయా యందు విశ్వాసముంచిరి. ఇశ్రాయేలీయులందరూ అది నమ్మిరి, నేడును వారు నమ్ముచున్నారు. ఆయన వర్తమానము వారి మత కార్యక్రమములకు అనుగుణంగా రాలేదు గనుక వారాయనను గుర్తించలేదు. వాక్యమునకు వారు అర్థము చెప్పిరి. ఆయన వారి వాక్య అర్థమునకు అనుకూలంగా రాలేదు. మెస్సీయా ఆ విధంగా తన్ను ప్రత్యక్షపరచుకొనలేదు. కాబట్టి వారాయనను గుర్తించలేదు, వారి భావమునకు అది సరిపోలేదు. నేను ముందు చెప్పినదే మరల చెప్పుచున్నాను. "దేవుని వాక్యమునకు ఎవరూ అర్థము చెప్పనవసరము లేదు. ఆయనే స్వంతముగా అనువదించుకొనును."
ISA 7:14
25అది బైబిలు సత్యమని మీకు నిరూపించెదను. ప్రవక్తయగు యెషయా ఇది జరుగుటకు ఏడువందల-పదిహేను సంవత్సరముల ముందే ప్రవచించెను. "ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును." యెషయా చెప్పెను గనుక జరుగునని అతని కాలములోని తల్లిదండ్రులు తమ కుమార్తెల గూర్చి ఆ విధంగా తలంచిరని నిస్సందేహముగా చెప్పవచ్చును. కాని ఏడువందల సంవత్సరముల తరువాత జరిగెను. దేవుడు తన వాక్యమునకు ఎవరూ అర్థము చెప్పవలెనని కోరడు. ఆయన ఎప్పుడు దానిని చేయునో, ఏలాగు చేయునో చెప్పనక్కరలేదు. దానిని చేయుదునని ఆయన చెప్పెను గనుక దానిని చేసెను!
ISA 28:11•
JOEL 2:28
26దేవుని వాగ్దానమును యెషయా 28 వ అధ్యాయము 18 వచనములో చూతుము. అలాగే యోవేలు 2:28 లోను యున్నది. చివరి దినములలో, అనగా చివరి రెండు వేల సంవత్సరములలో ఆయన సర్వశరీరుల మీద తన ఆత్మను కుమ్మరించును. "మీ కుమారులు, కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు చూచెదరు. మీ వృద్ధులు కలలు కందురు." ఆయన చేయు కార్యములను గూర్చి యెషయా చెప్పెను, "నత్తి పెదవులతోను, అన్యభాషలతోను ఈ ప్రజలతో నేను మాట్లాడుదును. ఇదే విశ్రాంతి." కాని వారు దానిని వినరు. వారు తమ తలలూచుచూ వెళ్ళిపోయెదరు. "దేవుని భోజన బల్లలన్నియూ వాంతితో నిండి యున్నవి. ఏదీ పరిశుద్ధముగా లేదు," అని ఆయన చెప్పెను. అది యెరూషలేము యొక్క చిత్రము. మెస్సీయా వచ్చిన నాటి సంఘ దృశ్యము. నేడును అలాగే యున్నది. అదే మరల జరుగుచున్నది.
దేవుడు ఒక కార్యము చేయుదునని చెప్పినప్పుడు దానిని చేయును. దానిని గూర్చి ఎవరు ఏమనుకొన్నాగాని, ఎవరేమి చెప్పినా గాని ఆయన తన మాటను నెరవేర్చు బద్దుడైయున్నాడు. అది ఆయన విధి. ఆయన తన వాక్యమునకు తన స్వంత అనువాదమును ఇచ్చి బయలుపరచును. మెస్సీయా వర్తమానము బయలుపరచుబడుచున్నది. మెస్సీయా వచ్చునప్పుడు ఏమి జరుగునో చెప్పబడెను.
MATT 2:16
27తూర్పున జ్ఞానులు దక్షిణముగా చూచిరి. అప్పుడు వారు బబులోనులో యుండిరి. వారికి ఒక అద్భుతమగు నక్షత్రము కనబడెను. దానిన మరెవరూ చూచినట్లుగా చరిత్రలో ఎక్కడా కనబడదు. గొప్ప పరిశోధన శాలలు, ఈ నక్షత్రములను అధ్యయనము చేయు గొప్ప వ్యక్తులు ఆనాడున్నారు. వారు నక్షత్రముల ద్వారానే సమయమును చూచెడి వారు, కాని వారికెందుకు కనబడలేదు? వారికది అనుగ్రహించబడలేదు. వారందుకొరకు చూచుట లేదు. కానీ ఈ జ్ఞానులకు యాకోబు నక్షత్రము పుట్టునని తెలియును. అందుకొరకు వారు ఎదురు చూచుచుండిరి. యేసు బెత్లెహేములో జన్మించిన కాలము నుండి అది కదలి వెళ్ళుచున్నది.
మన క్రైస్తవ ఆచారములు నాకు తెలియును. మన సంఘములును అలాగే యున్నవి. అంతా అయోమయమే. కాని ఇక్కడ జ్ఞానులు వచ్చి బాలుని ఆరాధించిరి. అటువంటి వారు రెండు సంవత్సరముల తరువాత అక్కడికి చేరిరి. మైదానములను, టైగ్రిస్ నదిని దాటిరి. వారు రెండు సంవత్సరాల బాలుని ఆరాధించిరని ఇందు వలన మనము గ్రహించగలము. అదే సమయములో హేరోదు రెండు సంవత్సరముల బాలురనందరినీ చంపెను. మెస్సీయాను పట్టుకొనగోరెను. దేవుడు తన వాక్కునే దీనిని బయలుపరచెను.
MATT 2:2,6
28ఈ జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. నక్షత్రము వారిని ప్రపంచ మత కేంద్రమగు యెరూషలేమునకు నడిపించినది. వారా గుమ్మములలో ప్రవేశించగానే ఆ నక్షత్రము కనబడలేదు. దైవ సంబంధమైనది వారిని నడిపించెను. గొప్ప ధనికులకు వీరు చక్కనీ ఒంటెల మీద ఎక్కి యుండి వీధులలో తిరుగుతూ "యూదుల రాజుగా పుట్టిన వాడెచ్చటున్నాడు? మేము తూర్పున ఆయన నక్షత్రము చూచాము," అని అడుగుచుండిరి. అది ఒక గొప్ప మత రాజధాని. రెండు సంవత్సరాల పాటు గొర్రెల కాపరులు వర్తమానము ప్రకటించినా గాని వారికేమి అర్థము కాలేదు. ఆయనను గూర్చి ఏమి వారికి తెలియదని జవాబిచ్చిరి, ఆ శాఖల యొక్క అధిపతులకు ఏమి జవాబు దొరకలేదు.
సన్హేద్రీను సభను అది కలవరపరచినది. శాస్తులను వచ్చి దాని గూర్చి చదివి చూడమనిరి. వారు ప్రవక్తయగు మికాయ గ్రంథమును చదివిరి. "ఓ, బెత్లెహేమా, యూదా వారిలో నీవెంత మాత్రమును అల్పమైదానవు కావు. (చిన్నదే అది) ఏలయనగా నీలో నుండి నా జనులగు ఇశ్రాయేలీయులను పరిపాలించు రాజు వచ్చును." లేఖనములు చదివిన తరువాత కూడా దానిని వారు అంగీకరించలేక పోయిరి. వాక్యము చెప్పినను నమ్మలేదు. నేడును ఆ విధంగానే యున్నది కదా? ఈ దినమునకు వాగ్దానము చేయబడిన లేఖనములు బయలుపరచబడియున్నవి. మరల మీకెన్నడూ నేను బోధించకపోవచ్చును, కాని మీరు దీనిని గ్రహించవలెనని కోరుచున్నాను. ఇంకనూ వారు దానిని నమ్మరు.
తండ్రి యొక్క గొప్ప జ్ఞానము, మానవ జ్ఞానమును వెర్రితనముగా ఎంచును. మానవుని అలుసిగా ఆయన చేయును. మానవుడు తన్ను చూచుకొని తానే సిగ్గుపడునట్లుగా ఆయన చేయును, కాని తన తప్పును మాత్రము ఒప్పుకొనడు. ఇంకా ఏవో కధలు చెప్పును. దేవుని మాట సత్యమని రుజువయినా గాని, ఆయన తన వాగ్దానము చేయుచున్న దానిని నేరవేరుచున్నాగాని ఇంకా మానవుడు దేవుని కంటే తన జ్ఞానమే గొప్పదని ఎంచుకొనును. అది తన జ్ఞానానుసారముగా రానిచో, "ఇది, అలాగు లేదే?" అనును. ప్రతి కాలములోను ఇది నిజముగా జరుగుచున్నది. ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇదంతా ఎంత చక్కగా సరిపోవుచున్నదో చూడండి?
29ఈ గొర్రెల కాపరులకు ఎక్కడి ప్రేరణ వచ్చినది? దేవదూతలు దిగి వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడినవి. దేవుని దూతలు గొర్రెలను కాయు గుంపుతో మాట్లాడినవి.
ఒక గొర్రెల కాపరితో మాట్లాడు అవకాశము మీకెన్నడైనా కలిగినదా? వారితో కొద్దిసేపు గడిపారా? నేను దీనిని చెప్పుగూడదు గాని చెప్పక తప్పదు. గొర్రెల కాపరి గొర్రెలతో కలిసి యుండును గనుక చివరకు అతడు గొర్రె వలె నవ్వును. (అరచును) గొర్రె వలె మాట్లాడును. గొర్రె వలె వాసన చూచును. ఇది నిజము, ఎందుకనగా అతడు గొర్రెతో యున్నాడు. అతనికి తెలిసినదంతా గొర్రెయే.
30సత్యవాక్యము బయలుపరచబడినది. ఈ గొర్రెల కాపరులు విద్యలేని పామరులు. క్రొత్తగా జన్మించిన గొర్రెపిల్ల యొక్క వర్తమానమును గొర్రెల కాపరులు విసిరి. వారికెంత ఘనత! చక్కగా ఇది తగియున్నది. అది గొర్రెల కాపరి యొద్దకు మాత్రమే వచ్చును. అందుకే ఆయన తొట్టిలో జన్మించెను, ఇంటిలో కాదు. గొర్రెలు ఇండ్లలో పుట్టవు. చక్కగా అలంకరించిన ఆస్పత్రులలో పుట్టవు. చూచారా? అవి పొలములలోను, దొడ్లలోను పుట్టును.
ఆ కారణము చేతనే ఆయన కల్వరికి నడిపించబడెను. వధశాలకు గొర్రెపిల్ల తనంతట తాను వెళ్ళదు. అది మీకు తెలియునా? వధశాలలలో ఒక మేక ఈ గొర్రెను నడిపించుకొని వెళ్ళును. చంపబడు స్థలము నొద్దకు గొర్రెను తీసికొని వెళ్ళిన మేక అక్కడ నుండి దూకి వచ్చును. గొర్రెపిల్ల లోనికి పోవును. కావున గొర్రె తనంతట తాను వెళ్ళదు గాని, నడిపించబడును. కాబట్టి గొర్రె కొరకు గొర్రెల కాపరి రావలెను. ఆయన ఎక్కడున్నాడో వారికి దూత చెప్పెను. ఈ దైవ శిశువును వారు కనుగొనిరి. పశుల తొట్టిలో పరుండియున్న వర్తమానికుని వారు కనుగొనిరి. ఆయన ఎక్కడుండునని దూతలు చెప్పెనో అక్కడే వారాయనను కనుగొనిరి. ఈ వర్తమానము వారికి దొరికినది.
31కొందరు వచ్చి, "దేవదూత నాతో ఫలాని విధంగా మాట్లాడినదని చెప్పుచుందురు." ఎంత వ్యంగ్యముగానో కొన్నిసార్లు కనబడును. దేవదూత తమతో ఏదేదో చెప్పినట్లుగా జనులు నాతో అనేకసార్లు చెప్పిరి. అది వాక్యానుసారముగా లేకుండుట నేను చూచాను. దేవదూత అలాగు ఎట్లు చెప్పును? వాక్య వ్యతిరేకముగా మాట్లాడదు. ఒక సంగతి జరుగునని దేవుడు నీతో చెప్పిన యెడల, అది జరుగును; జరుగని యెడల, నీతో దేవుడు మాట్లాడలేదని గ్రహించుము. దేవుడు అబద్ధమాడడు. దేవుని అబద్దికునిగా నీవు చేయవద్దు.
32ఆ బాలుని వారు కనుగొని ఎంతగా ఆనందించియుందురో కదా? ఎందుకనగా దేవదూత వారికి వర్తమానము ఇచ్చెను. దూత చెప్పినట్లుగానే అక్షరాలా జరుగుట వారు చూచిరి. దూత చెప్పిన చోటనే బాలుడుండెను. అది వారికి ఎంతో సంతోషము పుట్టించి యుండును!
పశులతొట్టిలో ఎందుకు పుట్టెను? ఆ తొట్టె యొద్ద ఈ గొర్రెల కాపరులు ఎంత చక్కగా యున్నారో చూడండి. ఒక వేదాంత పండితుడు అక్కడుండగలడా? అతడు అక్కడికి వెళ్ళి ముక్కు మూసికొనును. ఈ స్థలములో నేను నిలబడలేను, అని చెప్పును. చూచారా? అతడు ఆ స్థలములో యుండలేడు. అతడు చింతా క్రాంతుడగును.
కాని చూడండి, అది గొర్రెల కాపరులకు ఇంటిలో యున్నట్లుగా ఉండెను. తన వర్తమానమును ఎచ్చటకు పంపవలెనో దేవునికి తెలియును, చూచారా. అక్షరాలా సత్యము. గొర్రెల కాపరులు ఆ తొట్టె యొద్ద గొర్రెపిల్లను చూచిరి. వారు దీనిన వర్తమానము వారికి బయలుపరచబడినది. ఎంత చక్కగా యున్నది! మెస్సీయా సన్నిధి వారిని ఆనందపరవశులనుగా చేసినది. వాక్యము బయలుపరచబడినది. మెస్సీయా భూమి మీదికి వచ్చెనని గొర్రెల కాపరులు వినిరి. ఆయన సన్నిధిలోనికి వచ్చిరి. వారి పరిసరమువలెనే అది యున్నది. (ఆ వర్తమానము సత్యమని వారెరిగిరి. అక్కడ అది వారికి బయలుపరచబడినది) దేవుడు తమ కొరకు చేసిన ఈ గొప్ప పనిని ఆ గొర్రెల కాపరులు చూచి ఎంతో పులకించి యుందురు.
JOHN 21:15,16
33వేదాంత పండితులు ఆ స్థలములో నిలబడలేరు. అటువంటి పరిస్థితులలో వారు వెంటనే వెళ్ళిపోవుదురు. ఎందువలన? వర్తమానికుడు సామాన్య గొర్రెల కాపరుల యొద్దకు వచ్చెను. ఈ గొర్రెల కాపరులలో కొందరికి అసలు సంతకము చేయుట కూడా రాదేమోనని నాకు సందేహము కలుగుచున్నది. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఏర్పరచుకొనిన గొర్రెల కాపరులను చూడండి. ఈ పేతురూ, నీవు వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నవా? "నా గొర్రెలను మేపుమనెను."
"ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు."
"నా గొర్రెలను మేపుము." పేతురు విద్యలేని పామరుడని బైబిలులో చెప్పబడెను. ఇంకా అట్టి గొర్రెల కాపరులనే ఎన్నుకొనుచున్నాడు.
34గతించిన ఆ దినములలోని యాజకులు, సంఘ సభ్యులు, బాగా తర్ఫీదు పొందిన సమాజము ఆ చోట నిలబడలేరు. పశుల తొట్టె యొద్దకు వెళ్ళలేరు. ఆ యూదయ ప్రాంతపు పశుల తొట్టి ఎంతగా వాసన కొట్టునో ఇక్కడున్న మీలో అనేకులకు అర్థము కాదు. మీరు పట్టణవాసులు. అది జంతువుల కొరకు ఏర్పరచబడినది. ఈనాటి తరము వారు ఆ స్థలములో నిలబడలేరు. ఆ తలుపు యొద్దకు కూడా వెళ్ళలేరు, కాని అది దేవునికి ఇష్టమాయెను. ఆయన తన అనంత జ్ఞానము ద్వారా చేర్చుకొను అట్టి వారికి దానిని బయలుపరచెను. పండితులు, అనాటి మేధావులు దానిని అంగీకరించరు. అటువంటి స్థలములోనికి వెళ్ళుటకు వారు సిగ్గుపడుదురు.
మొదటగా, వారు తమ సంఘమునకు వెళ్ళియుందురు. అటువంటి కూటమునకు వెళ్ళితిమని సాక్ష్యమిచ్చియుందురు. విద్యలేని గొర్రెల కాపరులు అక్కడ కూడికొనినందున అది మంచిది కాదని ఆ సంఘస్థులు తలంచి, ఆ గొర్రెల కాపరులను వెలివేసియుందురు. బెత్లెహేము సమాజము నుండి వారిని త్రోసివేసియుందురు. ఆ విద్యలేని పామరుల మాటను ఎవరూ వినరాదని శాసించియుందురు. ఆ గొర్రెల కాపరులు నిజంగా హీనపరచబడిరి. అట్టి సామాన్యులతో సాంగత్యము చేయుటకు, గొర్రెల కాపరులు చెప్పిన వర్తమానము దేవుని నుండి వచ్చినదని నమ్ముటకు వారందరూ నిరాకరించి యుందురు. దానిని వారు విశ్వాస భ్రష్టత్వమని యుందురు, అయినా గొర్రెల కాపరులు నిందను మోయుటకు సిద్ధపడిరి. వారి సంఘ సభ్యత్వము పోయి యుండును. వారి పత్రములను లాక్కొని యుందురు. ఆనాటి తమ సమాజము, గుంపు మధ్య గుర్తింపును పోగొట్టుకొని యుందురు, ఎందుకనగా వారట్టి దానిని నమ్మిరి గనుక మతిపోయిన వారిగా ఎంచబడిరి.
35"అటువంటి వెర్రి బోధను, అవిశ్వాస గాధను తీసికొని నా పరిశుద్ధ స్థలములోనికి నీవు ఎంత ధైర్యముగా వచ్చితివి?" అని యాజకుడు చెప్పియుండును. అతనికి ఈ గొర్రెల కాపరులు కేవలము అడవి మనుష్యుల వలెనే కనబడిరి. పరలోకము నుండి దేవదూత దిగివచ్చి వారితో మాట్లాడుట అసాధ్యమనుకొనిరి.
"ఆ వర్తమానము బయలుపరచబడుట మేము చూచాము," అనిరి.
అతడు ఇట్లనియుండును, "మీకు వెంటనే తాకీదులు ఇచ్చుచున్నాను. ఈ సమాజములో నుండి అవతలకు పొండి." కాలము మారును కాని జనులు మారరు. నేడు మరల అదే జరుగుచున్నది. వారిని సంఘములలో నుండి త్రోసివేసి యుందురు.
ACTS 2:39•
HEB 13:8
36కాని ఆ గొర్రెల కాపరులు దేవుని గొర్రెపిల్లతో చక్కగా కూర్చొని ఆనందించిరి. ఏ మంచి కాపరి అయినా గాని అలాగే చేయును. గొర్రెలను కాయు మంచి కాపరి దేవుని వాక్యము తేటగా బయలుపరచబడుట చూచి ఆనందించును. ఆయన తాను చేసిన వాగ్దానమును గొర్రెల కాపరులకు నెరవేర్చెను. ఎవరేమి చెప్పినా గాని నేను వినను. "దేవుడు వాగ్దానము చేసెను, దేవుడు దానిని జరిగించెను."
"అద్భుతములు జరుగు దినములు గతించినవి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనునది లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తలులకు మాత్రమే," అని వారందరు.
కాని ఒక నిజమగు గొర్రెల కాపరి వాక్యమునే బోధించును. పునరుత్థాన శక్తిని ప్రచురము చేయును. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చెప్పును. పేతురు పెంతెకొస్తు దినమున ఇట్లు చెప్పెను, "ఈ వాగ్దానము మీకును, మా పిల్లలకును, దూరస్థులందరికిని, ప్రభువగు దేవుడు ఎవరిని పిలచెనో వారికందరికిని చెందును." ఆయన ఎవరిని పిలచెనో వారికందరికిని ఆ వాగ్దానము, నిజ ఆశీర్వచనము చెందును. నిజముగా వాక్యము ద్వారా పోషించబడుచున్న గొర్రెల కాపరి బయలుపరచబడిన దానిని చూచును. ప్రపంచములోని వేదాంత పండితులందరూ కలిసినా అతనిని దాని నుండి దూరము చేయజాలరు, ఎందుకనగా దానిని దేవుడు చెప్పెను గనుక జరుగునని నమ్మును. అంతే. దేవుని మాట ఎల్లప్పుడూ ఆ విధంగానే యుండును. ఆయన వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను, కాని వారికది తెలియలేదు.
37ఈ దినమున కూడా ఆయన దానినే వాగ్దానము చేసెను. దానిని మనము గుర్తించామా? గర్వాంధులు, తెలివిగలవారు ఎన్నడూ అటువంటి దానిని చేర్చుకొనజాలరు. మెస్సీయా భూమి మీదయుండుటను వారు నమ్మలేదు. ఆయన తమ శాఖలోనికి రావలెనని వారు తలంచిరి. వారి గుంపు దానిని చేర్చుకొనదు. "అది సరికాదు," అనిరి. ఇంకా లోతుగా ఆలోచించవలెననుకొనిరి. మీరు గమనించారా? దేవుడు వారి గుంపులో నుండి ఎవరినో ఎన్నడూ ఏర్పాటు చేసికొనలేదు. వారితో సంబంధము లేని వారిలో నుండి ఆయన కొందరిని ఎన్నుకొనెను, ఎందుకనగా ఒక గుంపు ఇట్లన్నది, "మేము చేసినది చూచారా?" వారు నేడును అదే చేయుచున్నారు. కాని దేవుడు ఎన్నికలేని వానిని ఎన్నుకొనును, అందువల్లనే ఆయన గొర్రెల కాపరులను ఎన్నుకొనెను. గొర్రెల కాపరులు దేవుని గొర్రెపిల్లతో పాటు అచ్చట ఉండిరి. అది వారికి ఇల్లు వలె యుండెను. ఆయన వాక్యము వారి మధ్య శరీరధారి అయ్యెను. గర్విష్టులు మరియు తెలివిగలవారు ఎన్నడూ దానిని చేరుకొనరు, వారిని ఆయన దాటిపోయెను.
38ఈనాటి విషయములు ఎన్నో మనము చెప్పుకొనవచ్చును. ఏకాలములో నయినా అలాగే జరుగును. మార్టిన్ లూథర్ కాలములో ఆ విధంగానే జరిగెను. జాన్ వెస్లీ దినములలో ఆ విధంగానే జరిగెను. పెంతెకోస్తు దినములలోను ఆ విధంగానే జరిగెను. కాని ఏ మానవ సంస్థ కొరకు దేవుడు ఆగడు. ఆయన తన వాక్యమును బయలుపరచుటకు తన ఆత్మను కదిలించును. అయితే వారు అది తమ ఇష్టానుసారము తామనుకొనిన రీతిలో వచ్చినప్పుడే దానిని చేర్చుకొందుమను కొందురు. నేడును వారు అంత గర్వముతో యున్నారు. సంఘములన్నియూ కలిసి ఏదేదో చేయగోరుచున్నవి. సంఘములన్నియూ ఐక్యము కావలెననుచున్నవి. ప్రొటస్టెంటులను, కాతలిక్కులను, ఆర్తోడాక్సు వారిని ఏకము చేసి ఒకే గొప్ప సంఘమును నిర్మించగల వర్తమానికుని కొరకు వారు చూచుచున్నారు.
39సోదరులారా, వందలాది వేర్వేరు మతముల వారికి బోధించు భాగ్యము నాకు దొరికినది. వాటన్నిటిలోను మంచివారున్నారు. కాని గుర్తుంచుకొనండి, ఇప్పుడు నేను ప్రవచించుచున్నాను, "ప్రతి సంస్థ దీనిని అంగీకరించి తీరవలెను, లేని యెడల అది సంస్థగా ఉండదు. అది నిన్ను బలవంతము చేయును." నేటి టుసాన్ పేపరు చదివారా? ఒక ప్రొటస్టెంటు బోధకునికి అభిషేకము చేయుటకు కాతలిక్కు మతగురువు యొక్క సహాయము కోరిరి. మిస్సోరిలో ఇది జరిగినది, దానినెవరు గుర్తించిరి. ప్రెస్పిటేరియనులు, బాప్టిస్టులు, లూథరనులు, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారు. అది నేటి టుసాన్ పత్రికలో యున్నది.
ఓ, ఇది సంచలనము కలిగించుచున్నది! వాటి వెనుక ఉన్నది మనుష్యులు కారు. ప్రభుత్వ నేతలు, మత సంబంధ నాయకులు ఉన్నారు. నీవు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా వారు నిన్ను అందులో త్రోసివేయుదురు. నీవు సంస్థగా యున్నచో ఈ భూమి మీదికి వచ్చు ఉగ్రత నుండి నీవు తప్పించుకొనలేవు. అది నిజమో కాదో చూడుము. ఇది జరుగునప్పటికి నేను లేకపోవచ్చును. ఈ టేపులను మరల వినండి. ఇది జరుగని యెడల నేను అబద్ధ సాక్షినే. అది జరిగినయెడల నేను సత్యము చెప్పితినని గమనించండి.
40అది ఏదో ఒక దురాత్మ పని అని వారనుకొనుచుండవచ్చును. అది వారి ఆలోచనకు విరోధముగా యున్నది. అనుకూల ఆలోచన గూర్చి మీరు ఈ రోజుల్లో చాలా వినుచున్నారు. మీరు దేని మీద మనస్సు నిలిపి అయినా గాని అనుకూలంగా ఆలోచించగలరు. దానిని అపవాది చేయగలదు. దేవుని వాక్యము మాత్రమే అన్నిటికన్న పైగా పనిచేయును. ఆ వాక్యమునకు వ్యతిరేకముగా నీవు ఆలోచించుచున్న యెడల, నీ ఆలోచనను మరచిపొమ్ము. వాక్యమునే ఆలోచించుము.
"అట్టి పెంట పోగులో మెస్సీయా ఉండడు," అని వారనుకొనిరి.
చక్కని ప్రధానయాజకుడు, లేదా పరిసయ్యుడు, వేదాంత విద్యలో ప్రవీణుడు, ఆ పేడతో నిండిన పశుల పాకలోనికి వచ్చునని మీరనుకోనుచున్నారా? చదువులేని ఒక పేద గొర్రెల కాపరి వచ్చి చెప్పిన వర్తమానమును అంగీకరించుదురా? "ఈయనే ఆ శిశువు. ఈయనే ఆ వర్తమానికుడు. దానిని మీకు రుజువు చేయుదును," అని చెప్పినా నమ్మరు.
వారేమని యుందురో తెలుసా? "ఇతడు యధార్థపరుడే. నిజంగా నమ్మినదానినే చెప్పుచున్నాడు, కాని అది పూర్తిగా తప్పు."
41ఎంతో మంచి జీవితమును జీవించిన వారిని నేను చూచాను. వారిని గూరి చెడ్డ చెప్పలేరు, కాని వారు ఎవరి మాట నమ్మరు, "అతడు చెప్పినది పూర్తిగా తప్పు. అతడు దేని గూర్చి మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. దేవుడు అటువంటి పని ఎన్నడూ చేయడు," అని వారందరు.
కాని ఇక్కడ వీరి యొద్ద సాక్ష్యమున్నది. రుజువు చూపిరి, "వెళ్ళి, ఆ పశుల పాకలో చూడండి. బాలుడచ్చట పరుండి యున్నాడు," అనిరి,
"నీకేదో దురాత్మ పట్టి పీడించుచున్నది, అందువలననే ఈ విధంగా మాట్లాడుతున్నావు," అని వారందురు. అయినా గాని అది దేవుని వాక్యానుసారమే జరిగెను. దానిని వారు చూడలేనంత గ్రుడ్డివారయిరి, ఎందుకనగా వారి గ్రుడ్డితనము వారి వేదాంతము వల్లనే కలిగినది. ఎంత గొప్ప విషాదము!
"అటువంటి చోట పుట్టునా? అదంతా కంపు కొట్టుచున్న స్థలము. పశుల తొట్టిలో పరుండునా?" ఆయన రాక కొరకు వారు అందమగు స్థలములను ఏర్పాటు చేసియుంచిరి. ఆయన కొరకు సమస్తమూ సిద్ధపరచిరి. ఆయన వారి బోధకులకు చెప్పకుండా ఎట్లు దిగి వచ్చును? అని తలంచిరి. "చదువులేని గొర్రెల కాపరులకు ఆ వర్తమానము చెప్పుటయా?" ఆయన తన స్వంత కుమారుని పశుల తొట్టిలో పరుండ చేయునా? అది ఒక సామాన్య సావిడి. ఎండు గడ్డి యున్న పశుల పాక. అలాగు జరుగనే జరుగదు. అది చాలా తక్కువగా యున్నది గనుక వారు నమ్మరు.
HEB 13:8
42అది చాలా సూక్ష్మముగా యున్నది. తెలివిగల వారు ఎన్నడూ దానిని పట్టించుకొనరు. అది చాలా సామాన్యము గనుక వారు బోర్లపడెదరు. వారు దైవ మార్గము కొరకు ఎదురుచూచిరి. ఆయన అక్కడే యున్నాడు. చూచారా? వారు ఇంక దేనికొరకు ఎదురుచూచుండిరి, కాని అది వారితోనే యున్నది. క్రీస్తు మృతులలో నుండి లేచి యున్నాడు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
వారి యొక్క గొప్ప వాటినన్నింటిని ఆయన దాటిపోయెను. కాని ఆక్కడ మెస్సీయా ఉండెనన్నది సత్యము. దానిని నేడు మనము చూచుచున్నాము. దానిని నేడు మనము నమ్ముచున్నాము. నేడు దానిని మనము అంగీకరించుచున్నాము.
ఈ క్రిస్మసునకు దేవుడు ఒక దానిని మనకు వాగ్దానము చేసియున్నాడు. ఈ దినమునకు ఆయన ఒకటి వాగ్దానము చేసి యున్నాడు. దానిని ఆయన నిరూపించెను. అయినా దానిని మనము దాటి వెళ్ళిపోవుచున్నాము. వారుండిన స్థితిలోనే మనమూ ఉన్నాము. ఆనాటి వలె ఇది యున్నది. మన శాఖ యొక్క రుచికి అది సరిపడలేదు. అందుకే ఈ క్రిస్మసు సమయములో మనము ఇంత గందరగోలముగా యున్నాము.
JOHN 14:12•
HEB 13:8
43యేసుక్రీస్తు చనిపోలేదు, ఆయన సజీవునిగాయున్నాడు. నేడు ఆయన ఇచ్చటున్నాడు! "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు," అని బైబిలు చెప్పుచున్నది. యోహాను 14:12 లో ఆయనీలాగు చెప్పెను. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. ఇంత కంటే గొప్పవియు చేయును, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను." (వేషధారి వలె నమ్మువానికి ఇది వర్తించదు) ఈ బైబిలు యొక్క పేజీలలో వ్రాయబడిన వాటి కంటే ఇంకా గొప్ప క్రియలను ఆయన చేయుట నేను నా స్వంత జీవితంలో ఆయన చేయట నేను చూచాను. అది వారి తలల పై నుండి పోవుచున్నది. నేటి మేధావులు గ్రహించుట లేదు. నేర్చుకొను పసిపిల్లల వంటి వారికి బయలుపరచబడుచున్నది. వారి కొరకే యేసు ప్రార్థించెను. ఇది సత్యము. నా ముప్పుయి మూడు సంవత్సరముల చరిత్రలో ఎన్నో గొప్ప కార్యములు ఆయన చేయుట చూచాను. బైబిలులో నేను చదివిన వాటి కంటే అవి ఎక్కువగా యున్నవి. ఏమి మారలేదు.
JOHN 5:39
44కాని అప్పుడు ఆయన చేసినది ఆ సన్హేద్రీను సభ నమ్మలేదు. ఆయనను దయ్యము పట్టినవాడని వారు పిలచిరి. వారి దినమున రానై యున్న మెస్సీయా గూర్చి వాక్యమేమి చెప్పినదో వారు గుర్తించలేదు. వారు ఆచారములనే చూచి నమ్మిరి. అక్కడే వారు తప్పు చేసిరి. నేడు మనమును అక్కడే తప్పు చేయుచున్నాము. లేఖనములను పరిశోధించుట లేదు. యేసు వారితో ఇట్లనెను, "లేఖనములను పరిశోధించుడి, ఎందుకనగా అందులో నిత్యజీవముకలదని మీరు తలంచుచున్నారు గదా! అదే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. నేనెవరినో అదియే మీకు చెప్పును."
45గమనించండి, దీనిని వారు చేయుదురని దేవునికి ముందే తెలియును. అందుకొరకే ఆయన గొర్రెల కాపరులను ఎన్నుకొనెను. వీరు తిరస్కరించక చేరుకొందురని ఆయన ఎరుగును. గొర్రెల కాపరులకే ఎందుకు కనబడెనో ఇప్పుడు అర్థమయినదా? గొర్రెల కాపరులకే ఎందుకు కనబడెను? వేదాంత పండితులు దానిని చేర్చుకొనరు. మరల గొర్రెల కాపరులకే ఎందుకు కనబడెనని అడుగుచున్నాను. ఆయన వాక్యమునకు విరోధముగా అది వచ్చునా? రాదు! వారు గొర్రెల కాపరులు. వారు గొర్రెలను ఎరుగుదురు. ఆయన ఒక గొర్రెపిల్లగానే జన్మించెను. గమనించండి, ఆయన గొర్రెపిల్ల. గొర్రెల కాపరులు మాత్రమే ఆయనను అంగీకరించగలరు. గొర్రెల కాపరి మాత్రమే గొర్రెను స్వీకరించును. వాటిని కాయుట ఎట్లో వారికే తెలియును. నేడు మనమును అలాగే గొర్రెపిల్ల వర్తమానమును అంగీకరించుచున్నాము.
46ఇప్పుడు చూడండి! అతి దీనమగు, చదువులేని మనుష్యులు ఇమ్మానుయేలును పశుల తొట్టిలో మహిమపరచిరి. అదే రోజులలో అక్కడ కొందరుండిరి. వారు తమ వేదాంతమును బోధించుచుండిరి. గొప్ప జన సమూహములు ఆ దేశపు నలుమూలల నుండి కూడి వచ్చి యెహోవాకు బలులు అర్పించుచుండిరి. అది "ఆయన ముక్కుకు దుర్వాసన" గా యుండెను. ఈ దీన గొర్రెల కాపరులు ఒక పశుల తొట్టిలో ఇమ్మానుయేలును అలంకరించుచుండిరి. దేవుడే శరీరధారి అయ్యెను. పశుల తొట్టిలో పరుండెను. చూడండి, మనము గొప్ప చదువు అభ్యసించియున్నాము. మనము ఏదో అంతా తెలిసిపోయినదని మెడ వంచకుండా యున్నాము. అందుకే దేవుడు పూర్తిగా మనలను దాటి యున్నాడు. ఆయన తాను చేయుదునని వాగ్దానము చేసిన దానిని చేయును. ఆయన ఎల్లప్పుడూ దానిని చేయును. పశుల తొట్టిలో నున్న ఇమ్మానుయేలును ఈ దీన గొర్రెల కాపరులు ఆరాధించుట చూడండి. ఇది నిశ్చయముగా ఒక గొప్ప సంగతి.
47వారాయనను ఆరాధించిన తరువాత, వారు అంత వరకు బోధించిన వర్తమానము బయలుపరచబడుట చూచిరి. దానిని వారు గ్రహించిరి. దేవదూత ఇచ్చిన అతి గొప్ప వర్తమానము నిమిత్తము వారు దేవుని స్తుతించిరి. దీనిని నేటితో పోల్చి చూడండి. ఒక్క నిమిషము ఆగి ఆలోచించండి. వారు దేవుని పూజించిరి, స్తుతించిరి; తాము విన్న వాటిని గూర్చి, చూచిన వాటిని గూర్చి ఆయనను స్తుతించిరి. వారు ఎరిగినది సత్యము. మేధావుల మనస్సుకు ఆ వర్తమానము నమ్మజాలనిదిగా యుండెను. మత సంబంధమగు వారి ఆలోచనలన్నింటికి అది వేరుగా ఉండెను. అయినా అది సత్యమే! అది వాస్తవము! దానిని వారు నమ్మిరి. మానవ జ్ఞానము ఎంత వెర్రితనమో చూడండి! ఆ బాలునికి దూతల సమూహము మొదటి జోలపాటను పాడెను. దానిని మీరు ఊహించగలరా? తన పేరు వ్రాసికొనలేని గొర్రెల కాపరి, గొర్రెవలె కంపు కొట్టుచున్నవాడు ఆ వీధిలో నడచుచూ, "సర్వోన్నతమగు స్థలములలో దేవునికి మహిమ! ఆయన భూమి మీద యున్నాడని మాకు తెలియును," అని కేకలు వేసిరి.
"అతనికి మతిపోయినది. మన సంఘములో అతనికి సభ్యత్వమున్నదో లేదో చూడండి, మన పుస్తకాలలో అతని పేరున్నదో లేదో చూడండి. అతడు తన నీతిలేని బోధల ద్వారా మనందరికి సిగ్గు కలుగచేయుచున్నాడు. అతనిని మనలో నుండి తరిమి కొట్టండి. జనుల మధ్య మనకు అవమానము కలుగుచున్నది," అని యాజకుడు పలికెను.
మీరు జనుల మధ్య సిగ్గుకు గురి కావచ్చును గాని దేవుని దృష్టిలో మహిమపరచబడుదురు. మీ ఎన్నిక చేసికొనండి. దేవుని వాక్యమునకు ఈనాటి మత ఆచారములు రుచించవు. తొమ్మిది వందల అరవై తొమ్మిది వేర్వేరు రుచులు దానికి లేవు. దానికి ఒకే రుచియున్నది. ఒకే వాక్యము, ఒకే దేవుడు. అంతే!
48దేవదూతలు వారికి మొదటి జోల పాటను పాడినవి. దేవదూత యొద్ద నుండి వారికి వర్తమానము వచ్చినదని తెలియచేసిరి, ఒక దేవదూత వారికి ప్రత్యక్షమాయెను. ఒక వర్తమానము ఇయ్యబడెను. ఆ వర్తమానము సత్యమని వారు కనుగొనిరి. అంతే కాకుండా దేవదూత మొదటి జోలపాట పాడెనని వారు చెప్పిరి.
ఆ పేదవారు మరీ ఉబ్బిపోవుచున్నారని వారు అని యుందురు. అట్టిది వారి మధ్య జరుగుట వారెన్నడూ చూడలేదు. అది వారందరికి ఏదో ఒక క్రొత్త బోధ వలె కనిపించెను. ఆ కారణము చేతనే అది వారి లేఖనములలో దొరకలేదు. దానిని కనుగొనుట వారికియ్యబడలేదు. తెలివైన వారికది నమ్మజాలనిదిగా ఉండెను. అట్టి అనుభవము వారికెన్నడూ లేదు. నమ్మజాలనిదిగా ఉండినాగాని అది సత్యమే. అది సత్యమని మనమెరుగుదుము. ఆలోచించండి! క్రీస్తు యొక్క మొదటి విశ్వాసులు, మొదటి సంఘము గొర్రెల కాపరులే, మత బోధకులు కారు; గొర్రెల కాపరులు, ఎందుకు గొర్రెల కాపరులను ఎన్నుకొనెనో చూచారా?
49గమనించండి! వారు తాము చూచిన దానిని బట్టియు, విన్న దానిని బట్టియు దేవుని మహిమపరచిరి. ఒక మానవునికి మొదటిసారిగా దేవదూతలు జోల పాడుటను వినిరి. అంతకు ముందు ఏ మానవునికి దేవదూతలు పాట పాడలేదు. గాయక బృందములను చూడండి. వారు నిలబడి ఎట్లు కలిసికట్టుగా పాడిరో వినండి. "మెస్సీయా జన్మదినమందు పాడిరి." కాని అందుకు తర్ఫీదు పొందిన ఇశ్రాయేలీయులను ఆయన దాటిపోయెను. దేవదూతలు దిగివచ్చి సామాన్య గొర్రెల కాపరులతో కలిసిపోయిరి. వారికి యాజకుల అంగీలు లేవు. గొర్రెల కాపరుల బట్టలే వారికి ఉన్నవి. మొదటి వర్తమానము ఎవరికి వచ్చెనో చూడండి. అది నమ్మలేని నిజము.
అది దేవాలయముల లోనికి రాలేదు గాని అడవిలోనికి వచ్చెను. బయటి అరణ్యములోనికి యెహోవా దూత వచ్చెను. సంఘములోకి కాదు గాని అరణ్యములోనికి వచ్చెను. ఆయనను సంఘములోకి ఆహ్వానించారు. వారు తప్పులో యున్నారని ఆయన నిరూపించెను, కాని వారయితే తమకు అంతా తెలియుననుకొనిరి. "ఆయన ఈ రాళ్ళ వలన కూడా అబ్రాహాముకు పిల్లలను పుట్టింపచేయగల సమర్థుడు." అది నిజము.
JOB 38:3,4,7•
MATT 3:9•
LUKE 3:8
50మొదటిసారిగా దేవదూతలు పరలోకములో ఉత్సాహముగా పాడినవి. యోబు 38:7 చూడండి. (కొందరు నోట్సు వ్రాసికొనుట నాకు కనబడుచున్నది), దేవుడు భూమిని మొదటిసారిగా సృజించినప్పుడు ఇది జరిగెను. యోబు ఒక గొప్ప చురుకైన మనిషి. అతనికి అన్ని విధముల జ్ఞానము యున్నది. అతడు చెప్పెను, "నేను వీధిలోనికి వెళ్ళగా యువరాణులు నాకు సాష్టాంగపడుచున్నారు. నా జ్ఞానమును ఒక్క క్షణము వారు కోరుచున్నారు." తాను ఎందుకు ఆ విధంగా కొనియాడబడుచున్నడో అతనికి అర్థము కాలేదు.
కాబట్టి దేవుడతనిని ఇట్లు అడిగెను, "నీవు నడుము బిగించుకొనుము, ఎందుకనగా నేను నీతో మాట్లాడుదును." దేవుడు సుడిగాలిలో దిగి వచ్చెను. "యోబూ, భూమికి పునాదులు వేసినప్పుడు నీవెచ్చట ఉంటివి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని కుమారులు ఆనందముతో కేకలు వేసినప్పుడు, యోబూ, నీవెక్కడ ఉంటవి?" ఆ సమయములో అతడు నిటారుగా నిలబడి యున్నాడు. "నీవెక్కడుంటివి?"
దేవదూతలు మొదటిసారి పరలోకములో ఉత్సహించినవి. కాని అవి భూమి మీద మొదటిసారి దేవుని జననము యొద్దనే పాడినవి. ఆక్కడ గొర్రెల కాపరులు ఉండిరి. భూమి మీద ఇమ్మానుయేలు ఉండెను; దేవదూతలు పాడగా మొదటిసారి వినిన మానవులు ఆ వినయము గల గొర్రెల కాపరులే.
JOB 38:4
51మన స్త్రీలు రంగులు పులుముకొని, జుట్టు కత్తిరించుకొని, పొట్టి బట్టలు ధరించి సంఘపు ముసుగులో దాగుకొనుచున్నారు. నిలబడి ఏవో పాడుచున్నారు. దానిని దేవుడు వినునని మీరనుకొనుచున్నారా? ఆయనను వినోదముతో ముంచెత్తగల దేవదూతలున్నారు. దేవునికి అసహ్యముగా నున్న బట్టలు ధరించుకొనిన వీరి పాటలు దేవుడెట్లు వినునని అనుకొనుచున్నారు? నీవు ఏదో చెప్పుకొనుచున్నావు…
"భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? వాటిని నేను సృజించినప్పుడు నీవెక్కడున్నావో చెప్పుము. అది తిరుగుచున్న ఇరుసు ఎక్కడున్నదో చెప్పుము? అప్పుడు నీవెక్కడుంటివి?" దేవుడు మన జ్ఞానములో కొంత కావలెనని కోరునా! మన తెలివి ఆయనకు వెర్రితనముగా యుండును. ఆయన తాను చేయుదునని చెప్పిన దానిని చేయును.
52గమనించండి, దేవుడు మరియొక సృష్టిని చేయబోవుచున్నాడు. ఆయన మర్త్య భూమిని, మర్త్య జీవమును సృజించుచున్నాడు. దేవదూతలు పరమందు పాడెను. కాని ఆయన ఒక నూతన జీవమును కూడా సృజించుచున్నాడు. అది నిత్యజీవము. దేవదూతల ద్వారా ఆయన తన గానమును మానవులకు వినిపింప చేయుచున్నాడు. అది భూమి మీదనే వినబడుచున్నది. పరమందున కాదు, పరలోకమందు నిత్యజీవమున్నది, చూచారా. మర్త్య సృష్టి జరిగినప్పుడు అవి పరలోకము నుండి పాడినవి. ఇక్కడ అమర్త్య సృష్టి జరుగుచున్నది. ఇప్పుడు వారు భూలోక జనులకు పాడుచున్నారు. మొదటిసారిగా గొర్రెల కాపరులకు పాడిరి. ఇది ఎంతో వింత కదా?
JOHN 1:14
53ఆయన ఒక నూతన సృష్టిని ప్రారంభించెను. ఏమిటది? తన్ను తాను సృష్టించుకొనుచున్నాడు. దేవుడు శరీరధారియై మన మధ్య నివసించెను. దేవుని సృష్టి యొక్క ఆరంభమును గూర్చి బైబిలు చెప్పినది. దేవుడు మానవాకారమందు సృజింపబడెను. ఆయనే యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, ఆయనలో దేవుడు నివసించెను. ఆయన తన శరీరపు, ఎముకల దేవాలయమును నిర్మించెను. ఆ మందిరములో నివసించెను. ఇమ్మానుయేలు దేవుడు అనగా "దేవుడు మనకు తోడు" అని అర్థము. ఆయన తన కొరకు ఒక ఇంటిని నిర్మించుకొనెను. అందులో ఆయన సివసించెను. దాని ద్వారా ఆయన తన జనులకు తన వాక్యమును వెల్లడి చేయును. క్రీస్తును మీరు చూచినప్పుడు దేవుడెవరో అర్థమగును.
54గుర్తుంచుకొనండి, ఒక రాజు జన్మించినప్పుడు పాడుట సహజము. దానిని ఎందరు ఎరుగుదురు? మాకందరకు తెలియును. "ఇమ్మానుయేలును నేను భూమి మీదికి తీసికొని వచ్చుచున్నాను గనుక వైద్యులను, పడకను సిద్ధపరచుడి," అని చెప్పుచూ ఆ స్త్రీ ఈ రాజు జన్మించినప్పుడు పరుగిడెనని తలంచుచున్నారా? ఈ రాజు జన్మించినప్పుడు ఆమె ఏమందిరమునకయినా వార్త అందించ వెళ్ళినదా? ఆమె నజరేతువాసియగు పేద స్త్రీ. అది చిన్న పట్టణము. ఈ టుసాన్ కంటే చిన్న ఊరు. ఆ గొప్ప ప్రధానయాజకుని యొద్దకు ఈమె వెళ్ళి, నేను ఇమ్మానుయేలును కనుచున్నానని చెప్పినచో ఆమెను వారు చెరసాలలో పడవేసి యుందురు. నిశ్చయంగా , ఆ పని చేసియుందురు. దానిని ఒక విశ్వాసభ్రష్టతగా ఎంచి, ఆమెను బంధించి యుందురు. ఈనాడయినా అంతే జరుగును. నేడును అక్షరాలా అలాగే జరుగుచున్నది.
MATT 3:9•
LUKE 3:8
55చూడండి, గానము అక్కడ ఉండవలసియున్నది. జనులు ఆయనకు పాట పాడరు, ఎందుకనగా వారాయన యందు విశ్వాసముంచలేదు. ఇక్కడికి ఆయన వచ్చెను. ఈనాడు జనులు దేవుని స్తుతించుటకు, క్రీస్తును గూర్చి చెప్పుకొనుటకు సిగ్గుపడుతున్నారు. గొప్ప దేవాలయములు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అంగీకరించుట లేదు. వారు ఆ రకమగు మత వ్యవస్థలో పాదుకొనిపోయిరి. అందుకే దానిని చేర్చుకొనలేదు. దేవుడు కొందరి కొరకు వెదకుచున్నాడు. వారు దొరికినచో ఆయన వారిని వాడుకొని స్తుతి పొందును. "ఆయన రాళ్ళ వలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడు." యోహాను చెప్పినదే చెప్పుచున్నాను.
చూడండి, ఆయన విధేయులు ఆయనకు పాటలు పాడిరి. అప్పుడు విధేయులయిన వారు దేవదూతలే. గొర్రెల కాపరులకు వారు పాటలు పాడిరి, వారే ఆయన వర్తమానమును కొనిపోయిరి.
MATT 5:3
56మొదటగా దానిని ఎవరు విందురు? ఆయనకు విధేయులు. రాజు యొక్క గానమును మొదట వారే విందురు. వారే ఆయనకు విధేయులు. ఆయనకు విధేయులుగా నున్న వారు ఒక రకమగు సంచలనమును రేపిరి. వారాయనకు సేవ చేయు యాజకులు కారు. వారు వేదాంత పండితులు కారు. వారు శాఖలకు చెందిన జనులు కారు. వారు గొర్రెల కాపరులు. ఎందుకు? ఒక గొర్రె జన్మించినది, అదియే కారణము, చూచారా. ఆయనకు విధేయులు దానిని వినిరి. వారే నమ్ముదురని దేవునికి తెలియును. దానిని నమ్ము వారికే దేవుడు తన వర్తమానమును పంపెను. ఆయన సర్వజ్ఞాని. ఎక్కడికి తన వర్తమానమును పంపవలెనో, ఎవరు దానిని నమ్ముదురో ఆయనకు తెలియును. ఉన్నత పరలోకము, అతి దిగువగా నున్న భూమి మీది మానవుల యొద్దకు దిగి వచ్చినది.
మత్తయి 5లో యేసు చెప్పెను, "ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది." అది మత్తయి 5లో ఉన్నది. వ్రాసికొనండి. నేను వ్రాసికొను వారికి చెప్పుచున్నాను.
MATT 12:37•
LUKE 1:52
57లుకా 1:52 లో మరియ ఇట్లు చెప్పెను, "తక్కువగా ఎంచబడిన వారిని ఆయన హెచ్చించెను." ఆమె పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినది. మరియ యేసుకు తల్లియే. "ఆయన తక్కువ స్థితిలోని వారిని హెచ్చించెను."
లూకాలో కూడా చెప్పెను, "సామాన్యులు ఆయన మాట ఆనందముతో స్వీకరించిరి." బాగా విద్యగలవారు, వేదాంతజ్ఞులు, దైవ సంబంధ పట్టాలు పుచ్చుకొన్నవారు కాదు; అయితే సామాన్యును ఆయన మాటను సంతోషముగా వినిరి, వారు తక్కువ స్థాయికి చెందిన వారు.
గొర్రెల కాపరుల ద్వారాను, గొర్రె ద్వారాను, విమోచనా వర్తమానము పరిశుద్ధ లేఖనములన్నింటిలోను చూడగలము.
ఇప్పుడు నేను ముగించవలసియున్నాను, ఎందుకనగా సమయము గతించుచున్నది. చాలా వాక్యములు నేను దాటి వచ్చాను. ఈ ఆలోచన మీకు అర్థము చేయుటకు ఇవన్నీ చెప్పాను.
58లేఖనములన్నింటిలోను గొర్రెల కాపరులు మరియు గొర్రె ద్వారా ఏమోచనా పధకము చూపించబడినది. దానిని మనమందరము అంగీకరించుదుము. ఎందువలన? ఇది ఒక ఛాయగా, మాదిరిగా యున్నది. నీడలో నా చేతి యొక్క అయిదు వ్రేళ్ళు కనబడును. నిజంగా ఉన్నదానినే నీడ ప్రతిబింబించును. అందుకే గొర్రె ద్వారా ఎల్లప్పుడు విమోచనా వర్తమానము వచ్చియున్నది. ఆది నుండి దీనిని చూడగలము. గొర్రె ద్వారాను, గొర్రెల కాపరుల ద్వారాను ఆయన, తన్ను తాను బయలుపరచుకొనెను. ఇవన్నీ ఛాయలు మరియు మాదిరులు.
59ఆదియందు ఎట్లున్నదో చూద్దాం. దేవుడు వారికియ్యబోవుచున్న వర్తమానమును వినుటకు ఆదామవ్వలు దేవుని సన్నిధిలో నిలబడియుండిరి. గొర్రె చర్మముతో వారు తమ మొలలను కప్పుకొనిరి. చంపబడిన గొర్రెపిల్ల యొక్క చర్మమును వారికి దేవుడు ఇచ్చెను. దానికంటే ప్రధమ వర్తమానము మరొకటి లేదు. దేవుడు గొర్రెపిల్లను చంపి ఆదామవ్వలను ఆ చర్మముతో కప్పెను. వారు అంజూరపు ఆకులు చుట్టుకొనిరి. అది వారు తయారు చేసికొనిన మతము, దాని వలన లాభము లేదు. ఆది నుండియూ పరిహారార్థ బలిగా గొర్రెపిల్లనే దేవుడు ఏర్పాటు చేసికొనెను.
ఇప్పుడు దీనిని మనము ముగించబోవుచున్నాము, గొర్రెల కాపరులే ఎందుకు ఎన్నుకోబడిరో చూపించాను, గొర్రెపిల్లయే కావలసియున్నది, దానివల్లనే విమోచన.
MAL 3:6
60పాత నిబంధన ప్రవక్తలు గొర్రె చర్మములను ధరించిరి (మనకు అది తెలియును) పరిపూర్ణ గొర్రెపిల్ల యందు, దేవుని వాక్యమందు వారు తమ విశ్వాసమును వెల్లడి చేసిరి. ప్రవక్తలు గొర్రె చర్మము ధరించిరి.
వేదాంత పండితుని యొద్దకు దేవుని వాక్యము రాదు. దానిని అతడు గలిబిలిగా మార్చును. ఇతడు గొప్ప వేదాంత పండితుడని మీరందురు. నాకు తెలిసినంత వరకు అతనిని వాక్యము నుండి దూరము చేయునది వేదాంతము తప్పు మరేదీ కాదు. చూచారా? ప్రభువగు దేవుని మాట, దేవుడు మారనివాడు. బైబిలులో ఎక్కడయినా గాని చూడండి, దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్తల యొద్దకే వచ్చును. వేదాంతజ్ఞులకు, డాక్టర్లకు కాదు. ప్రవక్తలకే అది తెలియును! ప్రతిసారి మిగతా వారు దానిని తిరస్కరించి త్రోసివేసిరి.
61మామూలుగా ప్రవక్తలు కాపరులే. ప్రవక్తలు గొర్రె చర్మము చుట్టుకొనిరి. వారు తాము మేపిన గొర్రె చర్మములనే ధరించిరి. ఆ తరము వారిని ఖండించిన మొదటి వర్తమానము గొర్రె చర్మము ధరించిన వారి యొద్దకే వచ్చెను. మరల చెప్పుచున్నాను, ప్రవక్తలు గొర్రె చర్మములనే చుట్టుకొనిరి, ఎందుకనగా వారు బలిగా అర్చించబడబోవుచున్న పరిపూర్ణ గొర్రెపిల్ల రాక యందు విశ్వాసముంచిరి. అందుకు సాక్ష్యముగా వారు ప్రవర్తించిరి. గొర్రె చర్మము ధరించుకొనిన వారి యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఈ ప్రవక్తలు సాధారణంగా కాపరులే. అబ్రాహాము ఒక పశుల కాపరి. ఇస్సాకు ఒక పశుల కాపరి. యాకోబు ఒక పశుల కాపరి. మోషే ఒక పశుల కాపరి. దావీదు ఒక పశుల కాపరి, దేవుని యొక్క ప్రతినిధులందరూ మామూలుగా పశుల కాపరులే.
62గొర్రెల కాపరుల యొద్దకే వారెందుకు వచ్చిరో మనము కనుగొందాము. నడిపించు గొర్రెల కాపరి లేకుండా గొర్రె నిస్సహాయురాలగును. అది తనకు తానుగా వెళ్ళలేదు. అందుకే దేవుడు తన యందు విశ్వాసముంచు వారిని గొర్రెలతో పోల్చెను. వారిని నడిపించవలెను. నిన్ను ఏమి నడిపించుచున్నదో చూచుకొనుము, మేకచే నడిపించబడవద్దు. అది నిన్ను వధశాలకు తీసికొనిపోవును. దేవుడు మేకను నీకు ఇయ్యలేదు. మనలను నడిపించుటకు ఆయన తన కుమారుని ఇచ్చెను. పరిశుద్ధాత్మ. ఆయనే మన నాయకుడు. మానవ-నిర్మిత కాపరి కాదు, గొర్రె ఆహారముతో పోషించు దేవుడిచ్చిన కాపరి నీకు కావలెను.
63"నిన్ను నేను గొర్రెపిల్లనుగా చేసెదను," అని మీరు ఒక పందితో చెప్పండి. దానిని మీరు కడగండి. దానికి మీరు మంచి రంగు వేయండి. గొర్రె తిను ఆహారము దానికి పెట్టండి. దానికి ఆ రకమగు తిండిని ఇవ్వండి. గొర్రెలుండు నివాసములో దానిని పెట్టండి, లేదా గొర్రెలున్న పొలములో ఉంచండి. అది మురికి గుంట కనబడగానే తిన్నగా అందులోనికి పరుగెత్తుకొని వెళ్ళును. చూచారా? ఎందుకు? అది పంది యొక్క స్వభావము.
నేడు సంఘ సభ్యులు లేక సంగతులలో మునిగి యుండుటకు అదే కారణము, ఎందుకనగా వారి స్వభావము మారలేదు. వారు ఏ విధమగు వేదాంత, మత ఆచారమునయినా గాని తిందురు, కాని దేవుని వాక్యము దగ్గర వారు నిలబడజాలరు. వారు వెళ్ళి దేవుని వాక్యమును వినరు.
GEN 8:11•
1JN 2:15
64ప్రపంచములో నున్న అతి పెద్ద వేషధారి, కాకి. ఓడలో నుండి రెండు పక్షులను బయటకు విడిచినట్లు బైబిలులో యున్నది. కాకి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు, ఎందుకనగా అది చచ్చిన వాటిని పీక్కొని తినును. అది చచ్చిన శవముల మీద కూర్చొని కడుపు నిండా తిన్నది. కాని పావురమును బయటకు విడువగా అది ఆ మురికి కంపును భరించలేకపోయేను. కాబట్టి అది తండ్రియగు నోవహు ఇంటికి తిరిగి వచ్చెను. నోవహు తలుపుతీయు వరకూ తట్టుచునే యుండెను.
కాకి ఒక చచ్చిన గుర్రము మీద కూర్చొని దినమంతా తినును, మరల ఎగిరిపోయి పొలములో గింజలను తినుచున్న పావురముతో కలిసి తినును. కాని పావురము కాకి వలె చచ్చిన గుర్రమును పీక్కొని తినలేదు. అలాగు తిన్నచో అది చచ్చును, ఎందుకనగా ఆ చచ్చిన దానిని తిని జీర్ణించుకొను ఆంత్రము దానికి లేదు.
వాక్యమును తినుచున్న దేవుని పావురము లేదా గొర్రెపిల్ల ఒక పరిశుద్ధ జీవి. లోక పదార్ధములను అవి తినలేవు. తమ యాజమానిని అవి ఎరుగును. "లోకమును గాని లోకములో యున్న వాటిని గాని ప్రేమించినయెడల, దేవుని ప్రేమ వానిలో యుండదు." దేవుని వాక్యమునకు విరోధిమగు దానిని నీవు ఇచ్చిన యెడల అతడు భరించలేడు. అపవాది దానిని తీసికొనును; లోకమును తీసికొనును. అదంతయూ దేవుని సంబంధమైనదే అని చెప్పును. నీవు నీటిని నూనెను మిశ్రితము చేయలేవు, అది కలువదు.
2PET 2:22
65వీరందరూ గొర్రెల కాపరులే, గొర్రెల కాపరి లేనియెడల, గొర్రెలు నిస్సహాయులగును. వారు గొర్రెల కాపరులు గనుక గొర్రెలను కాయుట తెలియును. వాటిని ఎట్లు నడిపించవలెనో వారెరుగుదురు.
నేడు గొర్రెలకు చెత్తను మేపుటకు కొందరు ప్రయత్నించుట ఎంత విచారకరము! కాని గొర్రె దానిని తినజాలదు. చేత్తతో గొర్రెలను వారు మేపుటకు ప్రయత్నించుట చూడండి. వారు చెత్తకు అలవాటుపడినందున వాక్యము వారి యొద్దకు వచ్చినా వారికి రుచించలేదు. నేటి పరిస్థితి అదే, దేవుడు ఒక ప్రత్యేక పనిని చేయుదునని వాగ్దానము చేసి దానిని బయలుపరచి రుజువు చేసియున్నాడు. వారు చెత్త తినుటకు అలవాటు పడిరి. వారికి మీరెంత చెప్పినా మీ మాట వినరు. బైబిలు ఇట్లు చెప్పెను, "కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొర్లుటకు వెళ్ళినట్లు," అను సామెత వీరి యెడల నిజమైనది.
వాక్యమును విందురు గాని మరల ఆ పాత వాంతి యొద్దకే వెళ్ళుదురు. "అది మత మౌఢ్యము. దానిని మీరు నమ్మవద్దు," అందురు.
AMOS 3:3
66ఈనాడు దేవుని గొర్రెలు వాక్యాహారమందు విశ్వాసముంచవలెను. నిజమైన గొర్రె ఆచారపు ఆహారమును తినదు. "మనందరం కలిసి యుందము. మనందరము ఏకము కావలెనని యేసు ప్రార్థించెను," అని మీరు వారికి చెప్పినా వారు వినరు. అది అబద్ధము! కొంత కాలము క్రిందట టూసాన్ లో దానిని మీరు విన్నారు. యేసు ఎన్నడూ అలాగు ప్రార్థించలేదు. వాక్యము తనకు విరోధముగా తానే ఎట్లు మాట్లాడుకొనును? అలాగయితే దేవుడు మానవుని కంటే అధికుడు కానేరడు.
యేసు చెప్పెను, "సమ్మతించకుండా ఇద్దరు ఎట్లు కూడి నడువగలరు?" మేతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్పిటేరియను, కాతలిక్కు మొదలగు వారినందరిని ఎట్లు ఒక్కటిగా చేయుదురు? మీరు ఒకే మానవాధికారము క్రింద యుండవచ్చును. యేసు చెప్పినది ఇది, "నీవు నేను ఏకమై యున్నట్లుగా మీరును ఏకము కావలెనని కోరుచున్నాను." వాక్యమైయున్న ఆయనలో మనందరము ఏకము కావలెనని ఆయన కోరుచున్నాడు. ఆమేన్! "తండ్రితో ఏకమవవలెను." తండ్రియే కుమారుడై యున్నాడు, ఇద్దరు కారు. ఒకే వాక్యము, ఆ వాక్యము ప్రత్యక్షపరచబడినది, మీరు ఏకమవునట్లుగా అది ఈ దినమున తన్ను తాను వెల్లడి చేసికొనుచున్నది.
JOHN 14:12•
JOHN 20:21
67గమనించండి, "తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను," అని ఆయన చెప్పెను. ఆయనను పంపిన తండ్రి ఆయనలో యుండి ఆ వాక్యమును ధృవపరచుచుండెను. తన జనులను పంపిన ఆ యేసే ఆ జనులతో కూడా వెళ్ళుచున్నాడు. ఈలాగు చెప్పుచున్నాడు, "నేను చేయు క్రియలు మీరును చేయుదురు." ఆయన మనము ఏకము కావలెనని నిశ్చయంగా ప్రార్థించెను; అయితే సంస్థతో ఏకమవుట కాదు గాని, ఆయనతో ఏకము కావలెను. ఆ శాఖతో ఏకమవుట కాదు గాని, దేవునితో ఏకము కావలెను. ఎందుకనగా దేవుడు, ఆయన వాక్యము ఒక్కటిగా ఉన్నట్లు గమనించండి. యేసు మరియు దేవుడు ఏకమైయున్నట్లుగానే నేను, మీరు, మరియు వాక్యము ఒక్కటి కావలెను. వాక్య విషయములో మనము అంగీకరించుటకు ఒక్కటి కావలెను, ఎవరో చెప్పినది కాదు. ఎవరి స్వంత అర్థమో కాదు. ఉన్నది ఉన్నట్లుగా తీసికొనుము. నమ్ముము, దానిని దేవుడు బయలు పరచును. అది నిజమని దేవుడు తెలియజేయును. దానిని నీవు శిష్యులకు మాత్రమే ననుకొనుచున్నావు. ఆ వాక్యమును నీవు తీసికొనుము. ఒకసారి దానిని ప్రయత్నించి చూడుము. అది ఆయన వాగ్దానము చేసినట్లే పని చేయుటను నీవు చూడగలవు. అవును!
అవి చెత్తను తినవు, గొర్రెల ఆహారమును భుజించును. యోహాను 10 ఇట్లు చెప్పుచున్నది, "నా గొర్రెలు నా స్వరము వినును." ఆయన వాక్యము గనుక ఆయన స్వరము ఏ విధముగా యుండును? "నా గొర్రెలు నా స్వరమును ఎరుగును, అవి వేరొకనిని వెంబడించవు," చూచారా. యేసు చెప్పెను, "వేరొకని స్వరము విని అవి వెళ్ళిపోవు." కాబట్టి ఆయన గొర్రెలు వేరొకని స్వరమును వినవు. అవి వానిని వెంబడించవు.
ప్రవక్తలు, గొర్రెల కాపరులు, గొర్రెలు అన్నియూ ఆయన రాకను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
JOHN 10:4,5
68మారని దేవునిని చూడండి, ఈ దినమునకు ఆయన ఉద్దేశించిన వాక్య సంకల్పములు మారలేదు. కొద్ది నిమిషములు ఆలోచించండి: మారని వాక్యము.
ఇప్పుడు చూడండి! నోవహు వర్తమానముతో మోషే వచ్చినయెడల, లాభముండేది కాదు. మోషే వర్తమానముతో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చినచో ప్రయోజనము లేదు. మోషే వర్తమానముతోనో లేదా నోవహు వర్తమానముతోనో యేసు వచ్చినచో, ఏమి ప్రయోజనము లేదు. లూథర్ వర్తమానముతో వెస్లీ వచ్చినచో, పని జరుగదు. వెస్లీ వర్తమానముతో పెంతెకోస్తు వచ్చినచో, పని జరుగదు. అవి సాక్ష్యమిచ్చుటను మనము విన్నాము. దేవుడు సదా ముందుకు పోవుచున్నాడు. వాక్యము వైపు చూచినప్పుడు మనం ఎచ్చటున్నామో అర్థమగును.
69ఈ గొప్పవారు, ఈ ప్రవక్తలు అందరూ గొర్రెల కాపరులే. దేవుడు తన పద్ధతిని మార్చుకొనడు. ఆయన మారనివాడు. వేదాంతులకు దానిని బయలుపరచడు. గొర్రెల కాపరులే ఆయన ఏర్పాటులో యున్నారు. పరిపూర్ణ పాప బల్యర్పణ గొర్రెపిల్లగా ఆయన గొర్రెల కాపరి యొద్దకే వచ్చెను.
గొర్రెల కాపరికి తన గొర్రెల గూర్చి అందరికన్నా ఎక్కువగా తెలియును. గొర్రెల కాపరి కంటే గొర్రెల గూర్చి ఎక్కువగా తెలిసిన వారు మరెవరును లేరు. అందుకతడు శిక్షణ పొందెను. అవి ఏ విధమగు ఆహారము తినునో అతనికి తెలియును. తన గొర్రెలు తిను దానిని బట్టి ఆ కాపరి వాటిని గుర్తుపట్టును. పెంటపోగు యొద్దకు వెళ్ళి చెత్తను తిను గొర్రెను అతడు బయటకు త్రోసివేయును. చూచారా? కాబట్టి దేవునికి వాటినెచ్చటికి పంపవలెనో తెలియును.
70యెహోవా యొక్క గొప్ప కాపరి ప్రవక్తలలో ఒకరిని మనము చూద్దాం. గొర్రె చర్మము క్రింద నున్న ఈ ప్రవక్తలలో దేవుడుండెనని రుజువగును. ఇప్పుడు చూడండి, మొదట మనము మోషేను పిలుచుదము. అతని వైపు చూద్దాం. అతని సేవ చూచినప్పుడు ఈ కాపరి ప్రవక్తలో యెహోవా యున్నాడని గ్రాహ్యమగును. మనకు సమయము లేదు గనుక పది నిమిషముల పాటు ఆ ఒకనిని చూద్దాం. వారిద్దరిని చూచుటకు సమయము లేదు.
మోషే అను గొర్రెల కాపరియగు ప్రవక్తలో యెహోవా తన్నుతాను బయలుపరచుకొనెను. అతనికి మూడు వరములు ఇయ్యబడినవి. వాటిని అతడు తన సేవలో వెల్లడి చేసెను. ఇశ్రాయేలు పెద్దలను, ఫరోను అతడు పిలచెను. ఈ గొర్రెల కాపరియగు ప్రవక్తను ఇప్పుడు గమనించుదం. ఆయన ఎల్లప్పుడూ తన ప్రవక్తలకు పరలోక సంబంధమగు సూచనను ఇచ్చును, అందువలన తమలో దేవుడున్నట్లు వారు బయలుపరచెదరు. పరలోక సంబంధమగు క్రియలు జరుగకుండా అక్కడ దేవుని సన్నిధియుండదు. దైవసంబంధమగు క్రియలు కనబరచకుండా యెహోవా ఎన్నడును వారికి ప్రత్యక్షము కాలేదు. అది జరుగుట సహజము. ఈ ప్రవక్తలతో ఉన్నట్లుగా ఆయన ఎల్లప్పుడూ రుజువు చేసికొనెను. వారు ప్రవచించుచున్న దానిని స్థిరపరచెను. అది ఆయన వాక్యానుసారమేనని చెప్పెను.
EXOD 4:3,6,9•
EXOD 8:2,6,21,24•
PS 78:45
71ఈ ప్రవక్తగా నుండిన గొర్రెల కాపరి తన మొదటి గురుతుగా కర్రను పాముగా మారెను. (చూడండి).
రెండవదిగా - అతని హస్తము కుష్టరోగముతో నిండెను.
మూడవదిగా - ఐగుప్తులోని నైలు నది యొక్క నీటినీ రక్తముగా మార్చెను.
ఐగుప్తు వారికి, ఇశ్రాయేలు వారికి బయలుపరచుటకు అతనికి మూడు గురుతులు ఇయ్యబడినవి. అతడు దేవుని యొక్క పలుకబడిన వాక్యము.
చూడండి, మోషే సృష్టిని చేసెను. ఇది నిజము. గాలిలోనికి ఇసుకను విసరగా, ఈగలు వచ్చెను. కప్పలు వచ్చు గాక అనగా, కప్పలు వచ్చెను. అతడు సృష్టించెను! ఏ మానవుడూ సృజించలేడు. అసలు సృజించుట మానవుని పని కాదు, కాని ఆ గొర్రెల కాపరియగు ప్రవక్తలో యెహోవా ఉండెను. ఆమేన్!
72గమనించండి! అతనికియ్యబడిన మూడవ సూచన అతని వృత్తికి గాని, అతని వ్యక్తిత్వమునకు గాని చెందినది కాదు. అది అతని మూడవ గురుతు. గమనించండి, మొదటి రెండు గురుతులు అతనికి, అతని వృత్తికి సంబంధించినవి. ఆ రెండు గురుతులకు మాత్రమే స్వరమున్నదని బైబిలులో చెప్పబడెను. మిగతా గురుతుకు స్వరము లేదు. కాని తన వ్యక్తిత్వము నుండి తన జనులకు ఇయ్యబడిన ఆ రెండు గురుతులకు స్వరమున్నది. కాని ఇప్పుడు మూడవ సూచనను గమనించండి. అది మరణ గురుతు. నీరు రక్తముగా మారెను. రక్తము నీరుగా మారితే మీరు చనిపోయెదరు. చిందించబడిన రక్తము మరణమునకు సూచనగా యున్నది. పరోకు అలాగే జరిగెను. నైలు నది నీటిని రక్తముగా మారట మూడవ గురుతు. మా దేవుడు నైలు నది మీద కూడా దేవుడే అని ఫరోకు చూపించెను. ఆయన అన్నింటి మీదను దేవుడే. ఆ దేశము మీదికి దేవుడు మరణమును తీసికొని రానైయున్నాడు. అదే ఆ రక్తపు సూచన. ఓ, మై! మరణము యొక్క ప్రత్యక్ష సూచన: రక్తము!
73కాని తక్కిన రెండింటికి ప్రవచనపు స్వరములున్నవి. (నేను చెప్పుచున్న దాని అర్ధమును పొందుకొనుచున్నారు అనుకొనుచున్నాను). ఇశ్రాయేలు భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనములు ఆ రెండు సూచన క్రియలలోను యున్నవి. కొండ మీద నుండి రాయి దొర్లి పడుట కొంత కాలం క్రితం మీరు చూచారు. (కదా?)
ఆయన వారికి సహాయపడునట్లుగా ప్రకృతిని మార్చెను. కర్రను గమనించండి, సర్పమును గమనించండి, ఎర్ర సముద్రమును గమనించండి. ఆయన చేసిన ప్రతి దానిని చూడండి. ఆ గొర్రెల కాపరి యొక్క కర్ర వారికి దారిని ఏర్పాటు చేయుట చూడండి. గొర్రెల కాపరి చేతిలో యున్న ఆ కర్ర ప్రతి వేదాంత విద్యను అధిగమించెను. ప్రతి అసాధ్య పరిస్థితి నుండి ఆ కర్ర వారిని బయటకు తీసికొని వచ్చెను. యాజకుల మాటలను అతడు అధిగమింపచేసెను. మానవునికి అసాధ్యమే. కొండల మీద లావా బ్రద్దలయి నీరు ఎర్రగా మారినదని ఫరో తలంచి యుండును. దేవుడప్పుడు ఆకాశము నుండి అగ్నిని కురిపించెను. ఆకాశము నుండి వడగండ్లను కురిపించెను. భూమి మీదికి పేలను రప్పించెను.
74దేని ద్వారా వీటిని జరిగించెను? ఒక పుస్తకము ద్వారా కాదు గాని, ఒక కర్ర ద్వారా జరిగించెను. ఒక వేదాంత పండితుని అభిప్రాయము కాదు గాని, ఒక గొర్రెల కాపరి యొక్క దండము. దీనిని మనము చూద్దాం, ఇది గొర్రెల కాపరి యొక్క కర్ర, ఒక శాఖకు సంబంధించిన ప్రార్థనా గ్రంథము కాదు గాని, ఒక కాపరి యొక్క కర్ర. గొర్రెల కాపరి యొక్క కర్ర తన గొర్రెలను నడిపించుచున్నది. వారు వాగ్దాన వాక్యముతో ఆ దేశములోనికి వెళ్ళుచుండగా త్రోవను కలుగచేసినది. ఆ గొర్రెల కాపరి యొక్క కర్ర ఎంత చక్కగా యున్నది! నేడు తన గొర్రెలను వాగ్దాన దేశములోనికి అది నడిపించుచున్నది. ఈ లోకము యొక్క వేదాంత విద్యను, ఈ లోక సంగతులను, శాఖలను మొదలగు వాటినన్నింటిని దాటి వెళ్ళెను; మార్గమును తెరచెను, ఆయన మాట సత్యమని రుజువు చేసెను; గొర్రెల కాపరి యొక్క కర్ర ముందుకు పోవుచున్నది.
75చూడండి, ఆ కర్ర గొర్రెలను నడిపించినది. దానిని మీరు నమ్ముతున్నారా? నిశ్చయంగా ఆయన గొర్రెలను నడిపించును. తన చేతిలేసి కర్రతో అతడు ఐగుప్తులో నుండి తన ప్రజలను విమోచించెను. దాని గూర్చి మనమెంతో చెప్పుకొనగలము. అతడు గొర్రెలను నడిపించెను. దానిని తిరస్కరించు వారి మీదికి తీర్పును తీసికొని వచ్చెను. ఒకే కర్ర వలన ఒకరికి దీవెన, మరొకరికి శాపము వచ్చెను. ఒకే నీరు ప్రపంచమును నాశనము చేసెను, నోవహును రక్షించెను. ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశములోనికి నడిపించిన ఆ కర్రయే ప్రవక్తయగు గొర్రెల కాపరిని వెంబడించ నిరాకరించిన వారిని శిక్షించెను. ఇది నిజము. తీర్పు కర్రగా మారెను.
సృష్టి; దేవుడు తన సృష్టి ద్వారా ఎట్లు మాట్లాడునో గమనించండి. మనకు సమయము చాలదు. నేను చాలా వ్రాసియుంచాను. దేవుడు తన సృష్టి ద్వారా మాట్లాడును. దానిని రుజువు చేయుటకు మనకు సమయము లేదు.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
76కాని ఆ తరువాత ఇది ఇత్తడి సర్పము వలన రుజువాయెను. వ్యాధి మరియు పాపమునకు నిజమగు పరిహారముగా ఈ గొర్రెల కాపరి యొక్క కర్ర వాడబడినది.
ఫరో యెదుట ఈ కర్ర సర్పముగా మారెను. ఆ ఫరో మంత్రగాళ్ళ వలన దానిని అనుకరించ ప్రయత్నించెను. నేటి ఆధునిక ఫరోలు కూడా అలాగే చేయచున్నారు. వారు వేషధారులు. వర్తమానమును శరీర సంబంధముగా అనుకరించుచున్నారు. అదెక్కడి నుండి వచ్చుచున్నదో ఎరుగకుండానే దానిని వారు అనుకరించ ప్రయత్నించుచున్నారు. ఏదో ఒక శాఖా సంబంధమగు దానిలోనికి దానిని త్రోసివేయుచున్నారు. వారు మంత్ర విద్య ద్వారా అనుకరణ చేయ ప్రయత్నించిరి.
చూడండి, ఇదే గొర్రెల కాపరి యొక్క కర్ర ఇతర కర్రలను తినివేసెను. ఆ పాములు ఇప్పుడు ఎచ్చటున్నవి? అవి అసలు కర్రలు. వాటిని ఒకే కర్ర మ్రింగివేసెను. "భూమ్యాకాశములు గతించినా గాని నా మాటలేమాత్రమును గతించవు," అని యేసు చెప్పెను. పాప పరిహారార్థమై నిజమగు బలి వచ్చుటను గూర్చి మాట్లాడెను.
JOHN 6:31,49
77ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు గూర్చి ఇక్కడ చెప్పబడెను. ఒక ప్రవక్త యగు గొర్రెల కాపరి ద్వారా మరణ దాస్యము నుండి వారికి విమోచన అనుగ్రహించబడినది, చూచారా. మరణము, పాతాళము మొదలగు వాటి నుండి ఒక గొర్రెల కాపరియగు ప్రవక్త ఇశ్రాయేలీయులను భవిష్యత్తులో విమోచించుటకు రానైయున్నాడని ఆ కర్ర ద్వారా మాట్లాడెను.
మనందరము ఎరుగుదుము, ఇశ్రాయేలు ఆ ప్రవక్తయగు గొర్రెల కాపరి యొక్క మాటను వినలేదు. అందరు ఇశ్రాయేలీయులు దానిని వినలేదు. గమనించండి, వారు సణుగుచుండిరి. అతడు ఆశ్చర్య కార్యములను జరిగించినంత కాలము. అతనిని గొప్పవాడని పిలచిరి, కాని వర్తమానము దగ్గరకు వచ్చుసరికి వేరుగా మాట్లాడిరి. అన్ని గొప్ప సూచక క్రియల వెనుక ఒక వర్తమానముండును. అది మనకు తెలియును. వారు అరణ్యములో సణిగినందున వేలాదిమంది చనిపోయిరి. రెండున్నర మిలియనుల మందిలో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చిరి.
వారికేమయినది? నిత్యముగా గతించిరి.
"అందరూ చనిపోయిరా బ్రెన్హాం సోదరుడా?" అవును, యేసు మాట అది.
"మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి. బండలోని నీళ్ళు త్రాగిరి," అని వారు చెప్పిరి.
"వారందరు చచ్చిరి," అని యేసు పలికెను. నిత్యముగా నశించిరి.
JUDE 1:11
78దేవుడేర్పాటు చేసిన మార్గము గూర్చి వారు సణిగిరి. అందుకే వారందరూ చనిపోయిరి. (ఈ చివరి కొద్ది మాటలు జాగ్రత్తగా వినండి.) వారు సణిగిరి. దేవుడేర్పాటు చేసిన మార్గమును గూర్చి వారు సణిగినందున అరణ్యములో చనిపోయిరి. ఒకని యొక్క వర్తమానము; ఒక్కడే ప్రవక్త, ఒక్కడే నాయకుడు. ఒక గుంపును నాయకులుగా దేవుడెచ్చటయినా వాడుకొనేనేమో చూపించండి. బైబిలులో మనకెక్కడా అది కనబడదు. మోషే యొద్దకు వాక్కు వచ్చెను.
కోరహు గూర్చి మనందరికి తెలియును. అతడు కొందరిని సమకూర్చుకొని దేవుడు అటువంటి పని చేయుట న్యాయము కాదని సణిగెను. ఒక్కని వర్తమానమును నమ్మలేదు. "మేమందరమూ పరిశుద్ధులమే. మనమంతా ఒక శాఖగా ఎందుకు ఏర్పడరాదు? మనము ఇది చేయుదుము, అది చేయుదము," అని అతడు పలికెను.
దేవుడు మోషేతో ఇట్లనెను, "అతని నుండి మీరు వేరగుడి. ఇక చాలును." చూడండి, యూదా దాని గూర్చి వ్రాసెను. చివరి దినములలో అలాగు జరుగును. "వారు కోరహు త్రోవను నడిచి నశించిరి." దేవుని వాక్యమును, దేవుని జ్ఞానమును, ఒక్కని నాయకత్వమును ప్రశ్నించిన వారందరూ కోరహుతో పాటు నశించిరి: ప్రతి ఒక్కరు నశించిరి.
79ఆ గొర్రెల కాపరియగు ప్రవక్తలో మనము దేవునిని గుర్తించగలము. తరువాత స్వరపు సూచనలో ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలను చూపించెను. ఇప్పుడు గమనించండి, తరువాత సూచక క్రియలో దానిని మనము గమనించగలము.
చూడండి, దాస్యములో నున్న తన సోదరుల యొద్దకు అతడు పంపబడెను. ఒక విమోచక వర్తమానముతో పంపబడెను. అతడు దేవుని వలన వచ్చెనని సూచక క్రియలు నిరూపించెను. దానిని వారందరూ నమ్మిరి. వారతని అద్భుతములనే వెంబడించిరి, కాని సాయంకాలమున అతడు తన వర్తమానమును ఇచ్చెను. "అది వేరుగా యున్నది." ఆ వర్తమానమును నమ్మని వారందరూ చనిపోయిరి. ఇది నిజము. ఆ వర్తమానము ఏమిటి? ఆ వర్తమానము రాబోవు తీర్పును గూర్చినది. దేవుడు సాయంకాలమందు ఇశ్రాయేలీయుల పాలెములో సంచరించి, జనులు తన యొక్క గొర్రెల కాపరి - ప్రవక్త వర్తమానమును నమ్మిరో లేదో అని వెదకెను; నమ్మని వారందరూ నశించిరి.
JOHN 6:52,53•
JOHN 10:30
80ఇప్పుడు చూడండి, గొప్ప గొర్రెల కాపరి యొద్దకు మనము కొద్ది నిమిషములు వచ్చి చూద్దాం. గొప్ప గొర్రెల కాపరి ప్రవక్త యొక్క సేవను చూద్దాం, ఆయన అద్భుతములు చూచి అందరూ తమ సంఘములలోనికి ఆయనను ఆహ్వానించిరి. వారు తమ రోగులను బాగు చేసిరి. వారు గొప్ప కార్యములను ఆయన నుండి చూడగోరిరి. ఆయన కీర్తి వ్యాపించెను, కాని ఒక సాయంకాల సమయము వచ్చెను. ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చెను. వేలాదిమందికి భోజనము పెట్టెను. ఎన్నో అద్భుతములు జరిగించెను. ఆ తరువాత ఆయన కూర్చొని వారితో మాట్లాడసాగేను. ఆయన వారితో ఇట్లనెను, "నేను నా తండ్రి ఏకమైయున్నాము. తండ్రిని చూపించమని మీరు నన్ను ఏల అడుగుచున్నారు?"
"ఓ, సోదరులారా! ఇతడు దేవునితో సమానునిగా తను చేసికొనుచున్నాడు." అది వారి మత తలంపులకు అందనిదిగా యుండెను. కాని అది సత్యము. ఆయన దేవుడు. చూచారా? ఆయనను అప్పటి నుండి అనేకులు వెంబడించ వెనుకదీసిరి.
అప్పుడాయన వారి వైపు తిరిగి ఇట్లనెను, "మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మిలో జీవముండదు."
ఒక తెలివిగల వ్యక్తి ఆ మాట విని ఏమనుకొనును? ఆయనను ఆ దేవాలయములోనికి రానిచ్చిన యాజకులు ఆయనను చూచి సిగ్గుపడి యుందురు. "శరీరము తిని, రక్తము త్రాగమనుటా?" ఇటువంటి మాట చెప్పిన ఇతడు ఎవరైయుండును? ఇతడు ఒక రక్తపిపాసి. "శరీరము తిని, రక్తము త్రాగుట? ఇతడు ఒక నరమాంస భక్షకుడు. అట్టి పిచ్చివాని జోలికి మీరు వెళ్ళవద్దు," అని జనులను హెచ్చరించి యుందురు.
దానిని ఆయన పలికెనే గాని ఎన్నడూ వివరించలేదు. వారిని తొట్రిల్ల చేయుటకు, మేకల నుండి గొర్రెలను వేరు చేయుటకు ఆయన ఈ మాట చెప్పెను. వారిని జల్లించుటకు ఆ మాట చెప్పెను. ఆ తరువాత ఎవరూ ఆయనతో సహకరించ ముందుకు రాలేదు. అక్కడ నుండి ఎవరూ ఆయనతో చేతులు కలుపలేదు.
81గమనించండి, సాయంకాలమందు దేవుడు పాలెములో సంచరించి నమ్మిన వారిని లెక్కించెను. గొప్ప గొర్రెల కాపరి దినములలో కూడా ఆయన ఆ విధంగానే చేసెను. ఆ గొప్ప గొర్రెల కాపరి. ప్రవక్త యొక్క సేవను చూడండి. ఈ సాయంకాల వర్తమానమును వారు నమ్మరు. ఆయన దేవుడని వారు నమ్మరు. ఆయన చాలా మంచి మనిషి అని వారందురు. ఆయన ఒక ప్రవక్త అని వారందురు. ఆయన మంచివాడు. ప్రవక్త నిజమేగాని ఆయన అంతకంటే గొప్పవాడు. "ఆయన మంచివాడు, ఆయన ప్రవక్త," అనునది ఈనాటి బోధ. ఆయన ఇమ్మానుయేలు. ఆయన బయలుపరచబడిన దేవుడు, కుమారుడుగా ఉన్న యేసు క్రీస్తే తండ్రియై యున్నాడు. ఆయన ఒక్కడై యున్నాడు. ఆ విధంగానే ఆయన ఉండగలడు.
ZECH 14:7
82జెకర్యా 14:7, అంత్యకాలమందుండు వర్తమానము మరియు వెలుగును గూర్చి అక్కడున్నది. సాయంకాల వెలుగును గూర్చి మీరు గమనించారా? మోషేను వెంబడించిన వారందరూ సీనాయి కొండ మీద అతనిని గుర్తించిన అగ్నిస్తంభమును చూచిరి. పొద యందు ఆ వెలుగుండెనని అతడు సాక్ష్యము చెప్పెను. ఈ అగ్నిస్తంభము గూర్చి మాట్లాడెను. దానిని వారిలో అనేకులు నమ్మలేదు. కాని ఐగుప్తులో నుండి బయటకు వచ్చుటకు బయలుదేరిన వారందరూ అగ్నిస్తంభమును చూచిరి. లోకము నుండి బయటకు వచ్చి ప్రత్యేకించబడి అరణ్యములోనికి వెళ్ళిరి. గొర్రెలకు అతడు గొర్రెల కాపరిగా, ప్రవక్తగా బయలుపరచబడెను. దానిని వారు చూచిరి. దానిని చూచిన తరువాత కూడా అనేకులు ఇంకా నమ్మనొల్లక పోయిరి.
83చూడండి, ఎన్నడూ మారని దేవుడు, ఆ గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త వారిని బయటకు తీసికొని వచ్చెను. ఒలీవ కొండ మీద ఆయన వారికి పరిచర్య చేసెను. మనము మాట్లాడుకొనుచున్న ఈ గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త యేసే. మోషేను బయలుపరచిన తండ్రి ఈయనను బయలుపరచుటను వారు చూచిరి, వినిరి.
మోషే ఆ దేవుని గూర్చియే పలికెను. అగ్నిస్తంభము ద్వారా మోషేకు ఆయన రుజువాయెను. మోషేను నడిపించినవాడే ఆ యెహోవా. దేవుడు ఈ గొర్రెల కాపరియగు ప్రవక్తలో ఉండెను.
నిజమైన ఆ గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త యేసే. ఆయన తాను ఎన్నుకొనిన ముగ్గురిని తీసికొని ఒలీవ కొండ మీదికి ఎక్కెను. అక్కడ యేసు ప్రత్యక్ష పరచబడెను. ఆయనను అందరిలో నుండి వేరు చేసెను. "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి." వారు పైకి చూచినప్పుడు యేసు తప్పమరెవరూ కనబడలేదు. ఆయన ఒక్కడే! నాకు చెందినంత వరకు ఇంతకన్న మరేమీ అక్కర్లేదు.
EXOD 34:33,35•
EXOD 40:3
84[టేపు మీద ఖాళీ యున్నది.] అది షెకీనా మహిమ. [టేపు మీద ఖాళీ యున్నది.] మోషే సీసాయి కొండ పై షెకీనా సన్నిధిలో యుండెను. అతని ముఖ రూపము మారెను. అతడు క్రిందికి దిగి వచ్చినప్పుడు అతడు ముఖమును కప్పుకొని వచ్చెను. మోషే ఒక గొర్రెల కాపరియగు ప్రవక్త. అతని ముఖములో యెహోవా యొక్క ఒక భాగమును చూచెదము. అతని నోటిలో వాక్యముండెను.
కాని చూడండి, ఆ గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త షెకీనా మహిమలో యుండెను. అదేమి చేసెను? అది అతని ముఖమును పూర్తిగా మార్చివేసెను. అతడు దేవునిలో ఒక భాగమే కాదు, అతడు పూర్తి దేవుడాయెను! అతడు ఇమ్మానుయేలు.
గొర్రెల కాపరులకే ఎందుకు కనబడెను?
EXOD 4:6
85చూడండి! గొర్రెల కాపరియగు ప్రవక్త మోషేలో సర్వశక్తుడగు దేవుడు తన్ను బయలుపరచుకొనెను. దేవుడు తన్ను తాను ఎట్లు బయలుపరచుకొనెనో చూడండి. ఇది నా చివరి వ్యాఖ్య. అగ్నిస్తంభములో ఆయన అభిషిక్తుడై కనబడెను. మోషే మరియు యెహోవా తప్ప మరెవరును ఆ కొండ మీద లేరు. ఆమేన్! ఆమేన్ అనగా "అలాగు జరుగును గాక!" అని అర్థము.
గమనించండి! "నీ చెయ్యి రొమ్మున ఉంచుకొనుము." ఈ రెండవ సూచక క్రియ. వెనుకనున్న స్వరమును వినండి. మోషే ఎడమ చేయి వాడుక గలవాడు అని అనుకొనుటకు ఏ కారణము లేదు, గనుక అతడు తన కుడి చేయిని ముడుచుకొనెనని మనము చెప్పగలము, ఎందుకనగా ఎక్కువగా పురుషులు కుడి చేయి వాడుకగా కలిగియుందురు. ఇప్పుడు చూడండి! ఇక్కడ మనము ఒక దృశ్యమును చూడగలము. గొర్రెల కాపరియగు ప్రవక్త మోషేలో యెహోవా యుండెను. మోషే దేవుని ప్రతినిధి, ఎందుకనగా దేవుడు మోషేలో యుండెను. అతడు చెయ్యి రొమ్మున ఉంచుట ఎట్టి గురుతో చూడండి!
EXOD 4:6
86అతడు తన కుడి చేతిని గుండె మీద పెట్టుకొనెను, ఈలాగు నిలబడెను, జగత్తు పునాది వేయబడినప్పటి నుండియూ విమోచన రహస్యములు దాగి యున్నవి. అందుకే ఈ గొర్రెల కాపరులను ఎన్నుకొనెను. యేసే దేవుని కుడిచేయి అని మనందరకు తెలియును. మోషే ఆయనను చూపించుచుండెను. తండ్రి యొక్క రహస్యములను ఆయన చూచి మనకు తెలియచేసెను. ఆయన మరణకరమగు కుష్టముతో మొత్తబడెను. దేవుడు తన కుడి చేయితో ఏమి చేయగలడో చూపించెను. చూడండి, కుష్టరోగమునకు స్వస్థత లేదు. అది మామూలు కుష్టు రోగము కాదు. అది ముదిరిన రోగము, మంచువలె తెల్లగా యున్నది. అది చివరి దశ. అతని చేయి అట్టి భయంకర రోగముతో మొత్తబడెను. కుష్టు రోగముతో మొత్తబడిన తన కుడిచేయిని గుండె మీద నుండి లాగుతూ మోషే ఏమనుకొని యుండునో గదా? కుష్టు రోగము పాపమునకు సాదృశ్యము. ముఖ్యంగా చివరి దశలో నున్నది బాగుపడదు.
GEN 3:5
87సోదరులారా, దేవుడు తన కుడి చేయిని లాగి పంపినప్పుడు ఈ లోకము ఆ స్థితిలోనే యుండెను. ప్రపంచము మరణకరమగు కుష్టముతో మొత్తబడి యుండెను. స్వస్థత కొంచెము కూడా లేదు. ఈ రాత్రి అలాగే పరిస్థితి యున్నది, ఎందుకనగా వారు విడుదల కోరుకొనుట లేదు. కల్వరి యొద్ద ఆ విడుదల దొరికినది, కాని పాప విరుగుడుకు దేవుడిచ్చిన మందుకు బదులు మానవులు ఏదో మానవ-కల్పిత ఆచారమును తీసికొనుచున్నారు.
చూడండి కుష్టు రోగము క్రమముగా వచ్చును గాని ఇక్కడ వెంటనే వచ్చెను! తన చేయి ముడువగానే కుష్టు రోగము వచ్చెను. పూర్తి కుష్టు రోగముతో నిండెను. దేవుడు చెప్పినది గమనించండి. "మీరు నెమ్మదిగా పాపములోనికి వెళ్ళుట కాదు గాని, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు." అది నిజము. "దానిని తిను దినమునే!"
JOHN 10:17,18
88చూడండి, ప్రవక్తయగు గొర్రెల కాపరి తన్ను తాను మొత్తుకొనెను. దేవుని ఆజ్ఞానుసారము అతడు తన కుడి చేయిని ముడువగానే అది కుష్టు రోగముతో నిండెను. ప్రవక్తయగు గొర్రెల కాపరి తనంత తానే అది చేసికొనెను. గొప్ప ప్రవక్తయగు గొర్రెల కాపరి యేసు కూడా తన్ను అలాగే చేసికొనెను, "నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను. ఎవడునూ దానిని తీయలేడు. ఆయన ఆ గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త, "నా యంతట నేనే ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడునూ దానిని తీయలేడు." చూడండి, అది క్రమముగా రాలేదు గాని ఒక్క నిమిషములోనే వచ్చెను. ఆ గొప్ప గొర్రెల కాపరి మన దోషమునంతటినీ తనపై వేసికొనెను. మన పాపములచే ఆయన మొత్తబడెను. ఆ కవి ఈలాగు వ్రాయుట ఆశ్చర్యము కాదు:
బ్రద్దలగుచున్న రాళ్ళ మధ్య, చీకటి మేఘముల మధ్య,
నా రక్షకుడు తన తలను వంచి చనిపోయెను;
చిరిగిన తెర మార్గమును బయలు పరచెను,
పరలోకానందము, అంతము లేని పగలు వెల్లడాయెను.
ISA 53:5
89ఇన్ని సంవత్సరములు ఆ రహస్యము దేవుని గుండెలో యున్నది. యేసు అను తన కుడి చేతితో దానిని కప్పెను. ఆ గొప్ప గొర్రెల కాపరి మన కొరకు మన పాపములను తన పై వేసికొనెను. యెషయా 53:6, "ఆయన మన అతిక్రమముల కొరకు గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను, మన సమాధానార్థమగు శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగినది. దేవుని యొక్క స్వస్థతా మర్మము యేసు క్రీస్తులోనే దాగి యున్నది. ఆయన దేవుని కుడిచేయి. ఈ గొర్రెపిల్ల గుండెలలోనే ఈ మర్మము దాగి యున్నది. ఆ కారణము చేతనే ముందున్న ఛాయలు గొర్రెపిల్లగా కనబడినవి. మొదటిది గొర్రెపిల్ల, చివరిది గొర్రెపిల్ల. ఆ కారణము చేతనే అది గొర్రెల కాపరి యొద్దకు వచ్చెను. గొర్రెలను కాయుట ఆయనకు తెలియును. మీరిది గ్రహించారా? చూడండి, "ఆయన మన అతిక్రమముల కొరకు గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను, మన సమాధానార్థమగు శిక్ష ఆయన మీద పడెను."
JOHN 19:30
90చూడండి, అది వెంటనే వచ్చెను; మరియు వెంటనే పోయేను, రెండవసారి రొమ్ము మీద నుండి చేయిని తీయగానే ఇది జరిగెను. మరణకరమగు వ్యాధి పోయినది. రెండసారి దానిని అతడు తీసెను. ఆ గొప్ప గొర్రెల కాపరి, గొర్రెల ప్రవక్త, కల్వరి సిలువ మీద మనందరి పాపమునకు జరిమానా చెల్లించి "సమాప్తమాయెను" అని పలికెను. పాపము ముగిసినది, జరిమానా చెల్లించబడినది, అప్పు తీరిపోయినది! అందుకు ఒక సంవత్సరము పట్టలేదు. దినములు పట్టలేదు. సంస్కరణ కర్తగా పని చేయలేదు. వెంటనే అది సమాప్తమైనది.
MATT 4:4•
LUKE 4:4•
REV 22:19
91దేవుని ధర్మశాస్త్రము మీరినందున, ఒక్క మాటను ఉల్లంఘించినందున ఒక్క క్షణములో పాపము వచ్చెను. సోదరులారా, ఈ రాత్రి మా ఆత్మ పాతాళములో ఒక గొలుసు మీద యున్నది. ఆ గొలుసు ఏదో ఒక సెమినరీ యొక్క వేదాంత బోధ కాదు. ఆ గొలుసు ఏదో శాఖ యొక్క ఆచారము కాదు. ఆ గొలుసు దేవుని వాక్యము! మానవజాతి జీవించుటకు యేసు తన వాక్యమును ఇచ్చెను. అందులోని ఒక చిన్న లింకును హవ్వ బ్రద్దలుగొట్టెను. గొలుసులోని బలహీనమైన బంధమే గొలుసులోని బలమైన బంధము. ఒక్క మాటను నీవు ఆ గ్రంథములో నుండి తీసివేయరాదని మొదటి గ్రంథములోనే వ్రాయబడినది.
ఆ గ్రంథము మధ్యలో యేసు వచ్చి ఇట్లనెను, "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును." అది బైబిలు మధ్యలో యున్నది.
బైబిలు చివరి గ్రంథములో ఆయనట్లు చెప్పెను, "ఇందులో నుండి ఒక్క మాటను తీసివేయువాని పేరు జీవగ్రంథములో నుండి కొట్టివేయబడును." ఒక్క మాటకు తప్పు అర్థము చెప్పరాదు. మీరు పాతాళమును దాటిపోవుచున్నారు. దేవుని వాక్యము మీద వ్రేలాడుచున్నారు. యెహోవా సెలవిచ్చుచున్నాడు అను మాటను గాక మరి దేనిని మీరు లోనికి రానియ్యరాదు.
GEN 3:4•
MATT 7:13,14•
1PET 3:20
92"మేము చేయవలసినదంతా చేశాము. అంతా అయిపోయింది!" అని వారనుచున్నారు. ఆ గొప్ప కాపరి యొక్క దినములలో కూడా యాజకులు మొదలగువారు అలాగే భావించిరి. హవ్వ ఆ విధంగానే తలంచెను. సాతాను ఆమెతో అలాగే అన్నది. "నిశ్చయంగా దేవుడిలాగు చేయడు." కాని ఆయన తాను చేయుదునని చెప్పెను. ఆ కారణము చేతనే ఆయన నేడు తిరిగి అలాగు చేయుచున్నాడు.
"నోవహు దినములలో నీటి ద్వారా ఎనిమిది మంది రక్షించబడిరి. మనుష్యకుమారుని రాకడ యందును అలాగే యుండును," అని ఆయన చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు. చూడండి, చాలాకొద్దిమంది, "ఇరుకు మార్గము, జీవమునకు పోవు దారి సంకుచితముగా యున్నది. దానిని కనుగొనువారు కొందరే." ఇది నిజము. "ఏలయనగా నాశనమునకు పోవు దారి విశాలముగా యున్నది, దాని లోనికి అనేకులు వెళ్ళుదురు."
JOHN 19:30
93ఆ గొప్ప గొర్రెల కాపరి కొట్టబడెను. ఆ గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త ఆ దినమున కొట్టబడెను. "సమాప్తమాయెను," అని ఆయన చెప్పెను. ఈ గొర్రెల కాపరి కొట్టబడగానే ఆ నిమిషములోనే ఆ పని ముగిసెను. పాపము అంతమాయెను. ఇక పాపము లేదు. వారు పరిశుద్ధులయిరి. జరిమానా చెల్లించబడెను. జీవగ్రంథములో పేర్లు వ్రాయబడిన విశ్వాసులు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిరి. సమాప్తమైనదని యేసు చెప్పిన ఆ క్షణములోనే అది ముగిసెను. ఆ గొప్ప గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు వచ్చెను. అది సమాప్తమాయెను. దేవుని కుడి చేయి కొట్టబడెను. ఈస్టరు నాడు ఆయన తిరిగి లేచెను, ఆమేన్, తన కుడిచేయిని తిరిగి లేపెను. దానిని నీ కొరకు నా కొరకు విస్తరింపచేసెను. ఆయన వాక్య రూషములో వచ్చి మనలను తిరిగి విమోచించెను, ఆదిలో నుండిన ఏదేను తోటలోనికి మరల మనలను తీసికొని వచ్చెను. మనలో నుండి పాపమును తీసివేసెను. ఆయన గొప్ప హృదయములో నున్న మరుగైన రహస్యమును గొర్రెల కాపరియగు ప్రవక్త ద్వారా బయలుపరచెను. ఒక గొర్రెల కాపరి ద్వారా, ప్రవక్తయగు గొర్రెల కాపరి ద్వారా అది బయలుపరచబడెను.
94ఆ దినమున కొండలు గంతులు వేసి చప్పట్లు కొట్టుటలో ఆశ్చర్యము లేదు. సూర్యుడు తన ముఖము చాటు చేసికొని ఆనందముతో కేరింతలు కొట్టుటలో వింతలేదు. సమస్త సృష్టి అదుపు తప్పెను. గాలి చెట్లను ఊపి వేసెను. ఆ విధముగా అది ఆనందించి గంతులు వేసెను. జీవగ్రంథములో యుండిన ప్రతి పేరును ఆ కొండ మీద ప్రవక్తయగు గొర్రెల కాపరి విమోచించుట అవి చూచెను. సృష్టి విడుదల పొందినది. అందుకే ప్రకృతి సంతోషముతో గంతులు వేసెను. భూలోకము భూకంపము లోనికి పోయినది. పర్వతములు బ్రద్దలాయెను. బండలు దొర్లిపోయెను. సూర్యుడు అస్తమించెను. ఎన్నో వింతలు జరిగెను. "సమాప్తమాయెను!" అని గొర్రెల కాపరి పలికెను.
95అన్నియూ ఆనందముతో, సంతోషముతో గంతులు వేసెను గాని ఎవరికీ ఏ హాని కలుగలేదు. కొండలు తత్తరిల్లెను, సూర్యుడు అస్తమించెను, అయినా ఎవరూ బాధ చెందలేదు. దేవుని శక్తి కూటములలో బయలుపరచబడుట నేను చూచాను. జనులు లోకము నుండి, లోక సంగతుల నుండి విడుదల పొంది ఆనందముతో నింపబడుదురు. వారు నిలబడి సంతోషము తమ గొంతెత్తి శాయశక్తులా కేకలు వేయుచుందురు. దేవుని మహిమపరచుదురు, అయితే ఇన్ని చేసినా వారెన్నడూ క్రమము, మర్యాద తప్పుట నేను చూడలేదు; ఎందుకనగా దానిని వారు గుర్తించిరి, జగత్తు పునాది వేయబడక ముందే తమ పేరు జీవగ్రంథములో వ్రాయబడినదని వారెరుగుదురు. ఆ గొప్ప ప్రవక్తయగు గొర్రెల కాపరి వారికి వర్తమానము అందించెను. వారు విడుదల పొందిరి. దాని గూర్చి మత సంస్థల వారేమి చెప్పినా వినరు. జరిగిన దానిని వారెరుగుదురు. ఆ నాటి గొర్రెల కాపరుల వలెనే వారును జరిగిన దానిని ఎరుగుదురు.
96మోషే దేవునిని ముఖా ముఖిగా కలిసికొనెను. కాబట్టి ఏ వేదాంత పండితుడు వచ్చి ఏది చెప్పినా, మోషే వినడు. ఆ అనుభవమునకు వచ్చువరకు ఏ బోధకుడు బల్ల ఎక్కి వాక్యము బోధించు హక్కు కలిగియుండడు. మోషే అక్కడుండెను. "ఓ, అది బుద్ధిహీనత! దీనిని నీవు చూచినట్లు ఊహించావు, కాని అది కాదు," అని ఎవరు ఇశ్రాయేలీయులతో వచ్చి చెప్పినా మోషే వినడు. దానిని నీవు అతని నుండి దూరము చేయజాలవు, అతడెరుగును. అక్కడతడు ఉండెను. అతనికే అది జరిగెను. అగ్నిస్తంభములో మొదటగా దేవునిని ముఖాముగా కలిసికొనువరకు యేసుక్రీస్తు వర్తమానమును బల్ల ఎక్కి బోధించు ఎక్కువ వేదాంత డిగ్రీ గల వానికైననూ, డాక్టరు పట్టా పుచ్చుకొన్న వానికైనను లేదు. వర్తమానికునిగా చెప్పుకొను వాక్కు అతనికి లేదు. లోకములోని వేదాంత పండితులందరూ నీ యొద్దకు వచ్చినా గాని, దాని నుండి నిన్ను దూరము చేయజాలరు. అది నీకు జరిగెను. నీవక్కడ ఉంటివి. దాని గూర్చి నీవెరుగుదువు. "ఆ దినములు గతించినవి," అని ఎవరు ఎంతగా చెప్పినా గాని నీవు వినవు, ఎందుకనగా అది నీకే జరిగినది. అది వాక్యానుసారమని నీకు తెలియును.
GEN 26:3•
JOEL 2:28•
ACTS 2:17,18
97తనతో మాట్లాడిన వాక్య స్వరమును మోషే ఎరుగును. దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాట అతనికి తెలియును. "నీ సంతానము నాలుగు వందల సంవత్సరముల పాటు అన్య దేశములో యాత్ర చేయును, కాని వారిని నేను విమోచించెదను." నాలుగు వందల సంవత్సరములు అయిపోయినవి గనుక ఆ పని చేయుటకు అతడు పిలువబడెను.
పురుషులారా, స్త్రీలారా, సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరించెదనని దేవుడు వాగ్దానము చేసెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పంపుదుననియు, మచ్చ - ముడత లేని పెండ్లి కుమార్తెను బయటకు పిలుచుదుననియు ఆయన వాగ్దానము చేసెను. ఆయన దానిని చేయుదునని వాగ్దానము చేసెను గనుక దానిని చేయును. ఈ జీతగాళ్ళగు గొర్రెల కాపరుల మాట వినకుడి, వారు మిమ్మును మార్గము తప్పించుదురు. పరిశుద్ధాత్మయే నీ కాపరి. ఆయన వాక్యాహారమును ఇచ్చి నిన్ను పోషించును. గొర్రెల కాపరి యొద్ద నుండియే అది నీకు ఎల్లవేళలా వచ్చును. ఆయనే మన గొర్రెల కాపరి. ఆయన మాట వినుడి. మీరాయన మందలోని గొర్రెలు, ఆలాగయితే మీరాయన స్వరము విందురు. ఎవరో చెప్పినది కాదు గాని, ఆయన మాటనే విందురు. ఒక క్రొత్త స్వరమును విని వెంబడించరు.
JOHN 5:25
98ఓ, ఆ సర్వశక్తుడగు గొర్రెల కాపరి-ప్రవక్త మరల దానిని అనువదించి వారికి పరిచయము చేయుట వినండి. యోహాను ఆ యోర్ధాను నది యొడ్డున నిలబడి చెప్పినది వినండి. ఆ ఘడియ వచ్చుచున్నదని అతడక్కడ నిలబడి బోధించెను.
చూడండి, యోహాను ఒక యాజకుని కుమారుడు. వారెల్లప్పుడూ తండ్రి క్రమమునే పాటించెదరు. మన పేర్లు ఆ ప్రకారమే వచ్చినవి. వారు చేసిన క్రియలతోనే వారిని పిలచిరి. యోహాను తన తండ్రి వలె యాజకునిగా ఉండవలసి యున్నాడు.
అతని తండ్రియగు జెకర్యాను యెహోవా దూత కలిసికొనిన తరువాత అతని తల్లి గర్భవతి అయ్యెను. ఎలీసబెతు అప్పటికి ఆరు నెలల గర్భిణి. కాని ఇంకా ఆమెలోని పిండమునకు జీవము లేదు, ఆ బిడ్డ కదలనందున ఆమె భయపడెను. ఇది అసాధరణము.
LUKE 1:31,35,44
99మరియకు ప్రభుని దూత, ప్రత్యక్షమాయెను. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనెను. ఆమె పురుషుని ఎరుగకుండానే గర్భము ధరించనైయున్నదని దూత చెప్పెను. ఎలీసబెతు గూర్చి కూడా చెప్పెను.
ఆమె ఎలీసబెతుకు చెప్పుటకై యూదయ కొండలను దాటి వెళ్ళెను. తాను తల్లిని కాబోవుచున్నట్లు ఆమె ఎలీసబెతును కలిసికొని చెప్పెను. ఆమెకు అది అర్థము కాలేదు. పురుషుని ఎరుగకుండా ఎట్లు? అనుకొన్నది. కాని పరిశుద్ధాత్మ తన్ను కమ్ముకొన్నదనియు తన ద్వారా జన్మించు పరిశుద్ధుని దేవుని కుమారుడని పిలుచుదురనియు, ఆయనకు "యేసు" అను పేరు పెట్టుదురనియు చెప్పెను." మానవ పెదవుల ద్వారా యేసు అను పేరు మొదట పలుకబడగానే, మృతతుల్యుడుగా నుండిన శిశువు తల్లి గర్బములో ఆనందముతో గంతులు వేసెను. ఇంకా అప్పటికి పూర్తి జీవము కూడా పొందని శిశువు తల్లి గర్భములో గంతులు వేసెను.
యేసుక్రీస్తు నామము పలుకబడగానే మృతతుల్యమగు శిశువు బ్రదికెను. తిరిగి జన్మించామని చెప్పుకొనుచున్న ఈ సంఘము ఇంకెట్లుండ వలెను?
100ఏమి జరుగుతున్నా మనము నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని యుంటున్నాము. నీ సాక్ష్యమును లేచి చెప్పుటకు భయపడుతున్నావు. ఈ చెత్తను ఖండించుటకు వెనుదీయుచున్నావు, యేసుక్రీస్తున్న నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చూపించలేకపోవుచున్నావు. ఇది క్రిస్మసు సమయము. ఈ శాంతాక్లాస్, వ్యాపార ప్రకటనలు అవతల పారవేయుము. బైబిలులో శాంతాక్లాస్ గూర్చి ఎక్కడున్నది? అది ఒక రోమను పురాణము. అసలు అటువంటిది లేనే లేదు. అటు వంటి చెత్తను మా పిల్లలకు నేర్పవద్దు. అది ఒక గ్రుడ్డి కథ అని, నీవు అబద్ధము చెప్పావని ఒక రోజున నీవు పిల్లల యొద్ద ఒప్పుకొనవలసి వచ్చును. యేసుక్రీస్తును గూర్చిన నీ సాక్ష్యమునకు అది ముప్పు తెచ్చును. యేసుక్రీస్తు అను గొప్ప గొర్రెల కాపరిని నీ క్రిస్మసులోనికి తిరిగి తీసికొని రమ్ము. అది ఆయనకే చెందును.
MATT 3:7•
LUKE 3:7,9
101చూడండి, నిలబడియున్న ఈ ప్రవక్తయగు యోహాను మాటలు వినండి. అతడు ఒక గొప్ప గొర్రెల కాపరియగు ప్రవక్త అని మనందరకు తెలియును. అతనికి ఒక వర్తమానమున్నది. యేసును అతడు పరిచయము చేయనై యున్నాడని దూతకు తెలుసును.
అతడు ఏదో సెమినరీకి వెళ్ళజాలడు. ఫలాని డాక్టరు డిగ్రీ గల వాడు ఈ స్థానము పొందునని వారందురు. నీవే తనిని పరిచయము చేయవలసి యుందువు. ఆ విధంగా కలగలుపు కారాదు.
దేవుని ఎదుట సిద్ధపడుటకు అతడు తొమ్మిదేండ్ల వయస్సులో అరణ్యమునకు వెళ్ళెనని మనము చదివాము. గొర్రెల కాపరులు అచ్చట నుండియే వచ్చుదురు. అతని వర్తమానము చూడండి. ఒక గొప్ప పండితుని వలె, వేదాంతజ్ఞాని వలె తియ్యని పదములు పలుకలేదు. "ఓ, పాములారా," అనెను. మీరు సర్ప సంతానమని ఆ మత నాయకులను అనెను. అరణ్యములో అతడు వాటినే చూచెను. అతడు పామును చూచెను. అది నీచమైనదిగా అతడు ఎంచెను. ఆనాటి యాజకులను, మత నాయకులను, వేదాంత పండితులను, "సర్పసంతానమా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మేము దీనికి చెందాము, మేము దానికి చెందాము అని చెప్పకుడి. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహాముకు పిల్లలను పుట్టించగల సమర్థుడు," అని చెప్పెను. అరణ్యములో అతడు రాళ్ళను చూచెను. "చెట్ల వేరున గొడ్డలి యుంచబడి యున్నది," అని చెప్పెను. అతడు దానిని చూచెను. పాములు, చెట్లు, అరణ్యము. చూడండి, అదే అతని వర్తమానము. ఏదో గొప్ప వేదాంత డిగ్రీ గల వ్యక్తి తీయ్యని పదములను వాడినట్లుగా అతని బోధ లేదు. (దానిని తన రీతిలో వివరించెను), ప్రకృతిని చూపించి బోధించెను.
JOHN 1:26,29
102అదే ఇక్కడ మనము చూపించుచున్నాము: గొర్రెల కాపరి యొక్క కర్ర, గొర్రెలు, ఇది ప్రకృతిలో చూతుము.
అతడేమి చేయును? అతడు చేయవలసిన గొప్ప పని యున్నది. మెస్సీయాను ఎరుగువాడు అతడు మాత్రమే. "ఇప్పుడాయన మా మధ్య నిలబడియున్నాడు. మీరాయనను ఎరుగరు, ఎందుకనగా మీ ఆచారములు అంతగా మిమ్మును బంధించినవి. మీరెక్కడున్నారో మీకే తెలియదు," అని అతడు పలికెను.
ఒక రోజున యేసు వచ్చుట చూచి, "ఇదిగో, లోక పాపమును మోసికొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల," అనెను. గొర్రెపిల్ల! హల్లెలూయా! నిజమగు పరిహారము! ఏదేను తోటలో నుండి వచ్చిన గొర్రెపిల్ల మొదలుకొని ఛాయలన్నియు ఒక సామాన్యుని వలె నది యొద్దకు నడిచివచుచున్న ఆయనలో నెరవేరెను.
JOHN 1:32
103"యోహానూ! ఆయనే అని నీవెట్లు చెప్పగలవు? మాకేమి తేడా తెలియుట లేదే?" అన్నారు వారు.
"కాని నేను సాక్ష్యమిచ్చుచున్నాను, దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుటయు, ఒక స్వరము 'ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించ నేను ఆనందించుచున్నాను,'" అని పలుకుటయు విన్నాను.
పావురమును, గొర్రెపిల్లను చూడండి? అక్కడ తోడేలు నిలబడి యుండిన ఎట్లుండును? దేవుడు తన్ను పావురముగా చూపుకొనెను. ఆకాశ పక్షులన్నింటిలోను దీనురాలు. చూడండి, ఆయన గొర్రెపిల్ల. భూజంతువులన్నింటిలోను సాత్వికమైనది. చూడండి, పక్షులన్నింటిలో పవిత్రమైనది పావురము, కాకి కాదు; రాబందు కాదు. పంది కాదు, కాని గొర్రెపిల్ల. మరే ఇతర జాతిది కూడా అందుకు సరిపడదు.
గొర్రెపిల్ల మీదికి పావురము దిగి వచ్చుట చూడండి, అది ఆయనను నడిపించెను. తండ్రి కోరిన విధంగా నడిపించెను గాని తన ఇష్టానుసారముగా కాదు. నేడు నిజమగు గొర్రెపిల్ల ఆ విధంగానే యున్నది. ఓ, క్రిస్మసు కాలపు గొర్రెపిల్లా, దేవుడు తన వాక్యము ద్వారా మాత్రమే నడిపించబడునని నీవెరుగవా? అదే ఆయన దండము.
JOHN 1:29,36•
HEB 13:8
104తక్కిన వారెవరికీ కనబడనిది యోహానుకు కనబడెను. "దానిని చూచితిని, అందుకు నేను సాక్షిని" అనెను. "ఇదిగో! లోక పాపమును మోసికోని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల," అని పరిచయము చేసెను.
ఇప్పుడు ముగింపులో నేను నా క్రిస్మసు సందేశమును పరిచయము చేయుదును. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఆ గొర్రెపిల్ల మారలేదు. ఆయన ఇప్పుడున్న గొర్రెపిల్ల వలెనె నేడును యున్నాడు. ఆయన అక్కడున్నట్లే ఇక్కడను యున్నాడు. ఆయన వాక్యము మారదు. "ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి యుందురో అచ్చట వారి మధ్యన నేనుందును," అని ఆయన చెప్పెను. ఆయన ఎన్నడూ మారడు. ఆయన వాక్యమైయున్న దేవుడు. ఆయన ఎన్నడూ మారడు; ఇంకా ఆయన తన గొర్రెలను మేపుచున్నాడు. మొదటగా గొర్రెలకు తన ఆహారమును ఇచ్చును. తన యొక్క గొర్రెల కాపరియగు ప్రవక్త ద్వారా పోషించును. వేదాంత పండితులచే తన గొర్రెలను మేపడు.
105ఇతరమగు దానిని అవి ఎట్లు తినగలవు? దీనిని గమనించండి! జ్ఞానులు, మేధావులు, లోక రీత్యా శిక్షణ పొందిన వారు ఇంకా శాంతాక్లస్ ఉన్నాడని చెప్పుటకు ఇష్టపడుతున్నారు. వారు అన్ని రకముల కట్టు కధలను పూజించుచున్నారు, ఎందుకనగా వారు వాక్యమైయున్న ఆయనను అంగీకరించరు; ఎందుకనగా అది వారి శాఖలకు, వారి రుచికి సరిపడదు. వారే ఈనాటి జీతగాళ్ళగు గొర్రెల కాపరులు. వారు ఆచారములు బోధించు జీతగాళ్ళు. ఒక మేకతో నిన్ను ఏకము చేయగోరుదురు. దానిని నీవు నమ్మవద్దు. వారు నిన్ను వధశాలకు నడిపించెదరు. పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇదే నెలలో జన్మించిన ఆ గొప్ప గొర్రెల కాపరి మాట వినండి! గొర్రెలను కాయుట ఎట్లో ఎరుగు నిజమగు గొర్రెల కాపరులకు ఆయన వర్తమానము వెళ్ళినది.
చూడండి, వారింకా అదే కోరుచున్నారు. ఆనాడు వారి వలెనే వీరును నేడు దానిని అంగీకరించరు, ఎందుకనగా అది వారి ఆచారపు రుచికి సరిపడుట లేదు. వారా వాక్యమును త్రిప్పి తమ సంస్థకు అనుకూలముగా మార్చివేయుచున్నారు. వారు వాక్యము బోధించరు. "అది అపోస్తలుల కాలమునకు, అది వేరే అర్థమిచ్చును," అని వారందురు. వాక్యము ఏమని చెప్పుచున్నదో అదే వినవలెను, ఎవరి అనువాదము దానికి అక్కరలేదు.
106ఈ సమయములో మనము తలలు వంచి, ధూళి వైపు మన హృదయములను చూపెట్టుదము. త్వరపడి పశుల తొట్టె యొద్దకు వెళ్ళి, గొర్రెల కాపరి ద్వారా తేబడిన ఈ వాక్య వెలుగును చేర్చుకొందము. దేవుని కుమారుడగు యేసు క్రీస్తే ఆ గొర్రెల కాపరియగు ప్రవక్త. నేను మీకు వివరంగా చెప్పాను. ఒక నేర్చుకొనిన బోధకుని వలె నా మాటలను మీకు వివరించలేకపోవచ్చును. అలాగు చేయ నేను ప్రయత్నించలేదు. ఆయన నాకు చెప్పిన దానినే మాట్లాడుటకు ప్రయత్నించాను.
కాని గొర్రెల కాపరులకే ఎందుకు రావలెనో మీరు చూచారా? తక్కిన వారు మరో దానిలో శిక్షణ పొందిరి. కాబట్టి దీనిని చేర్చుకొనలేకపోయిరి. ఈనాడు మనకు అన్ని రకముల ప్రవక్తలు, జిల్లా అధికారులు, బిషప్పులు, యాజకులు, కార్డినలు, పోపులు లోకములో యున్నారు. వారు మనలను నడిపించ ప్రయత్నించుచున్నారు. కాని దేవుడు మనకు ఒక గొర్రెల కాపరిని ఇచ్చెను, ఆ గొర్రెల కాపరి పరిశుద్ధాత్మయే.
107ఇప్పుడు నా మాట వినండి. (ఆయన ఒక ఆలోచనగా లేడు. ఆయన ఒక వ్యక్తి) పరిశుద్ధాత్మ వచ్చి నేను మీతో చెప్పిన సంగతులను బయలుపరచును. రాబోవు సంగతులను చూపించును. (ఒక సత్యస్వరూపియగు ఆత్మ), అదియే గొప్ప గొర్రెల కాపరి. యేసు విడిచి వెళ్ళిన గొర్రెల కాపరి అదియే. బైబిలును పరిశుద్ధాత్మ వ్రాసెనని బైబిలులో చెప్పబడెను. "ఆ కాలపు వారు పరిశుద్ధాత్మనే కదిలించబడి వాక్యమును వ్రాసిరి." పరిశుద్ధాత్మ నిన్ను ఒక ఆచారము వైపుకు లాగునా? వాక్యము చెప్పని దాని వైపుకు నిన్ను లాగునా? అది పూర్తిగా అసాధ్యము. "నీవిది చేయవలెను," అని పరిశుద్ధాత్మ పలికి, మరల కొంతసేపటికి "కాదు, అది తప్పు, నీవు నీ సంఘము చెప్పునది చేయవలెను," అనినచో అబద్ధికుడగును.
నీవు ఎవరి మాట వినయినా నిజమగు దాని నుండి దూరముగా పోయిన యెడల, నిజమగు గొర్రెల కాపరి వాక్యము నొద్దకు నడిపించును. పరిశుద్ధాత్మ అనుభవము నీకుండకపోవచ్చును. నీ జీవితములో పరిశుద్ధాత్మ సాక్ష్యము నీకు లేకుండ వచ్చును.
JOHN 3:27
108దేవుడు ఒక్కడే. దేవుడొక్కడే నిత్యజీవము గలవాడు, ఆయనే నిత్యజీవము. ఆది యున్న ప్రతిదానికి అంతముండును. నీవు కేవలము ఒక సంఘ సభ్యునివైనచో దానికి ఒక ఆది యుండును. కాని దేవుని వాక్యమునకు ఆది లేదు. నీవు దేవుని మూలముగా జన్మించినప్పుడు, వాక్యము వలనే జన్మించెదవు. అప్పుడు నీవు దేవుని కుమారునివగుదువు. జగత్తు పునాది వేయబడక ముందే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంచబడును. నీ జుట్టు రంగును, నీ కంటి రంగును, నీ వ్యక్తిత్వమును జగత్తు పునాదికి ముందే దేవుడు చూచెను. నిన్ను ఒక మానవునిగా ఆయన చూచెను. ఒకవేళ అందుకు కొన్ని మిలియను సంవత్సరములు పట్టినా గాని ఆది యందు దేవుడు నీకు నిర్ణయించిన స్వరూపము నీకు ఖచ్చితముగా రాకుండా ఏదియూ అడ్డగించలేదు, "నా గొర్రెలు నా స్వరము వినును, క్రొత్త వానిని అవి వెంబడించవు."
109ఈ రాత్రి ఇంకా నీవు ఆ నిత్యజీవమును అంగీకరించని యెడల, తొట్టిలో పరుండియున్న బాలుని గూర్చి అల్లబడిన కధలను నీవు వినుచున్నయెడల నీకు చెప్పుచున్నాను. ఆ కట్టు కధలు నమ్మవద్దు, "నేను మంచివాడను. నేను ఇది చేశాను. నేను సంఘలో చేరాను. ఇంక నేను చేయవలసిందేమి లేదు," అని నీవు తలంచుచున్నచో నశించినట్లే. నీకు నిత్యజీవము లేదు గనుక నీవెట్లు సదాకాలము జీవించెదవు?
ఒక గోధుమ గింజను చూడుము. దానిని నిలువుగా కోసిన యెడల ఒక విధమగు తేమను నీవు కనుగొందువు. అన్ని గోధుమ గింజలును ఆ నిలువు కోతలో ఒకే విధంగా కనబడును. ఒక దాని నుండి మరో దానిని నీవు వేరు చేయలేవు. నీవు పరిశోధన శాలలో చూచినా తేడా చెప్పజాలవు. అన్నియూ కలిసినచో ఒక మంచి రొట్టె తయారగును. కాని వాటిని మీరు పాతి పెట్టండి, అందులో కొన్ని కుళ్ళి పోవును, ఎన్నడూ పైకి రావు. కాని కొన్ని జీవము కలిగి బయటకు వచ్చును, అవి మరల జీవించును.
ACTS 2:39
110నీవు ఒక క్రైస్తవుని అనుకరణ చేయవచ్చును, నీవు ఒక క్రైస్తవుని వలె సంఘమునకు వెళ్ళుచుండవచ్చును, నీ పేరు క్రైస్తవునిగా పుస్తకములో వ్రాయబడి యుండవచ్చును, ఒక క్రైస్తవుని వలె నీవు ఒక శాఖలో చేరి యుండవచ్చును; అంతా మంచిదే కాని ఆ నిత్యజీవము నీలో లేనిచో వ్యర్థమే. మంచి గొర్రెల కాపరి నీ కొరకు తన ప్రాణమిచ్చెను. పెంతెకోస్తునాడు దేవుడు దిగి వచ్చెను. సీనాయి కొండ మీద వలె ఆయన అగ్నిగా కనబడెను. మొదటి గొర్రెల కాపరియగు మోషేకు ఆయనాలాగు కనిపించెను. ఆయన అగ్ని నాలుకల వలె వారి మీదికి దిగి వచ్చెను. దేవుడు తన జనులను వేరుపరచెను. "అది మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని చెందును," అని పేతురు చెప్పెను.
111స్నేహితులారా, ఏ పురాణ గాధను వినవద్దు. మీరు తిరిగి జన్మించవలెను. అప్పుడు దేవుని ఆత్మ మీలో యుండును. మీరు దేవునిలో భాగమగుదురు. దేవుని ప్రతి మాటకు సాక్షులుగా ఉందురు. "అది సత్యము," అని చెప్పెదరు. ఆ అనుభవము మీకు లేనిచో వాక్యమైయున్న పశుల తొట్టె యొద్దకు త్వరపడి వెళ్ళుదము, బైబిలు యొద్దకు త్వరపడి వెళ్ళుదము. అలంకరించబడిన ఈ వేదాంత పదములను వల్లించు సంఘముల నుండి బయటకు వచ్చుదము. దేవుని వాక్యమే నిజమగు పశుల తొట్టి, అక్కడ మెస్సీయా తెలియపరచబడును.
మనము తలలు వంచి ప్రార్థించుదము.
GEN 22:17
112ప్రియదేవా, ఈ సమయములో నాకు తెలిసినదంతయూ చెప్పాను. మేము క్రిస్మసును సమీపించుచున్నాము. స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలతో వీధులు నిండిపోవుచున్నవి. వారికి బహుమతులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించవలెనని అందరూ బహుమతులు కొనుటకు త్రోసికొని వచ్చుచున్నారు. క్రైస్తవులుగా చెప్పుకొనుచున్న అనేకులు వీధులలో సిగరెట్లు, మద్యము క్రిస్మసు కానుకలుగా కొనుచున్నారు. దేవా, వారు తమ పిల్లలకు ఆ రోమను అన్యుల వేదాంతమును, పరిశుద్ధ నికోలస్ అను కట్టుకధను చెప్పుచున్నారు. లోకము దానిని సుళువుగా అంగీకరించినది. నిజమగు క్రిస్మసు యొక్క క్రీస్తును, నిజమగు గొర్రెపిల్లను వారు నిరాకరించుచున్నారు.
దేవా, మా శిరములను ధూళి వైపు దించి ఈ రాత్రి నీకు ప్రార్థించుచున్నాము. మమ్మును మంటి నుండి సృజించితివి. "సముద్రపటోడ్డున గల ఇసుక రేణువులను లెక్కించుము," అని ఒకప్పుడు నీవు గొప్ప ప్రవక్త గొర్రెల కాపరియగు అబ్రాహాముతో పలికితివి.
"అవి అసంఖ్యాకము, నేను వాటిని లెక్కించలేను" అని అతడు చెప్పెను.
"ఆకాశము వైపు చూడుము, నక్షత్రములను లెక్కించుము," అని నీవు మరల చెప్పితివి. అది అసాధ్యమని అతనికి తెలియును. "నీ సంతానము కూడా అలాగగును," అని నీవు చెప్పితివి. గొర్రెల కాపరియగు ఆ ప్రవక్తతో చెప్పిన వర్తమానమును మేము చూచుచున్నాము, "ఆకాశము మీది నక్షత్రములు, భూమి మీది ధూళి," మమ్మును, అనగా మా మర్త్య శరీరములను మరణము ధూళిగా చేసినా గాని, నక్షత్రములకు పైగా లేచు జీవము మాలో యున్నది.
DAN 11:32
113మహా ప్రవక్తయగు దానియేలుతో నీవు చెప్పితివి, "తమ దేవుని నెరుగు వారు చివరి దీనములలో గొప్ప కార్యములు చేయుదురు. అనేకులను నీతి వైపునకు త్రిప్పువారు ఆకాశములోని నక్షత్రముల వలె నిత్యమూ ప్రకాశించెదరు."
ప్రభువగు దేవా, మహా సృష్టి కర్తా, యేసు రూపములో భూమి మీదికి వచ్చుటకు ఇష్టపడినవాడా, నీవు మానవునికి దేవుని ప్రత్యక్షపరచితివి. నీవు మాత్రమే మరణ శిక్షను భరించగలవు. దానికి ఏ దేవదూతయు పనికి రాదు. నీవు మాత్రమే ఆ శిక్షను చెల్లించినావు. నీవు ఒక్కడివే దానిని న్యాయముగా పరిహరించగలవాడవు. నీవు ఆత్మ స్వరూపివి గనుక చనిపోవు. నీవు చనిపోవునట్లుగా శరీరము ధరించితివి. నీవు నీ స్వ రక్తముతో నీ జనులను ఏమోచించ కలుగునట్లు, లోక పాపమును మోసికొనిపోవు గొర్రెపిల్లగా మారితివి.
ఓ ప్రభువా, ఆ గాధ చాలా గొప్పది, కాని అది చాలామంది మనస్సుల లోనికి దూరుట లేదు. "చిన్న యెహోవా ఒక పశుల తొట్టిలో పరుండి యున్నాడు. ఆయన ఒక శిశువు వలె జీవించ వచ్చెను. చిన్న యెహోవా ఒక పశుల పాకలో పుట్టవలసి వచ్చెను. చిన్న యెహోవా, వీధిలోని పిల్లలతో ఆడుకొనెను. చిన్న యెహోవా ఒక బడి పిల్లవాని వలె ఉండెను. ఆయన సర్వశక్తుడగు యెహోవాయే." నీవు ఇన్ని స్థానముల తీసికొంటివి. యెహోవా ఒక గొర్రెపిల్లగా మారెను. యెహోవా ఒక ప్రవక్తగా మారెను. పాపశిక్షను భరించి మాకు నిత్యజీవము ఇచ్చుటకు నీవు ఇవన్నియూ భరించితివి.
114ఓ దేవా, దరిద్రులమగు, అయోగ్యులమగు ఈ లోక జీవులమగు మమ్మును క్షమించుము. ప్రభువా, ఈ రాత్రి నీవు మా కొరకు చేసిన దానిని చూచి, మేము అందుకు ప్రతిగా చిన్న మేలు కూడా చేయజాలమని చూచి సిగ్గుపడుచున్నాము. ఆ గొప్ప మత నాయకుల కాలములో నీవు వచ్చితివి. తండ్రి యొక్క వాక్కును నీవు నిలబడి ప్రతిబింబించుటకు ఎంతగానో ఇష్టపడితివి. వారి సిద్ధాంతములకు నీవు రాజీపడలేదు. ఈనాడు రాజీపడకుండా వాక్యమును "వాక్యము" గా పిలువ గలిగిన వారెవరూ కనించుటలేదు. మేము ఇంతగా నిర్లక్ష్య పెట్టిన ఈ విషయములను బట్టి మమ్మును క్షమించుము. ఈ రాత్రి మా హృదయములను ఒక పశుల తొట్టిగా చేసి నీవు ఆక్రమించుము. సిలువ వేయబడిన క్రీస్తును అంగీకరించినప్పుడు నూతన జన్మ వచ్చును. ఒక గొర్రె కొత్తగా జన్మించును. దేవదూతలు పరలోకమందు పాటలు పాడును. ఒక్క పాపి మారుమనస్సు పొందినచో దేవదూతలు పాటలు పాడును.
దేవా, నిన్ను దైవ బహుమానముగాను, వ్యక్తిగత రక్షకునిగాను ఎరుగని వారు ఈ రాత్రి ఇక్కడ ఉండి యుందురు. మామూలుగా మానసిక ధృక్పధముతో కాదు, నూతన జన్మ కావలెను, నీ ఆత్మ ద్వారా జన్మించవలెను, ఇప్పుడే దానిని వారు పొందుదురు గాక! ప్రభువా, మేము తలలు వంచి యున్నాము. ఇంకా దానిని పొందని వారు ఎవరైనా యున్నచో, ఇప్పుడే వారు తమ హృదయములలో ఆనందమును కనుగొందురు గాక! వాక్యమైయున్న మెస్సీయాను తమ హృదయములలో ఆ గొర్రెల కాపరుల వలె కనుగొందురు గాక! ఈనాటి గొప్ప గొర్రెల కాపరి పరిశుద్ధాత్మగా వారికి బయలుపరచబడును గాక. యేసు నామములో దీనిని అడుగుచున్నాము.
LUKE 22:32•
JOHN 3:3,5•
JAS 2:19
115మనము తలలతో పాటు హృదయములను కూడా వంచుదము. నా ప్రియ సోదరుడా, నీవు సంఘ సభ్యుడవు కావచ్చును. ఈ మాట చెప్పుచున్నందుకు బోధపడవద్దు. సంఘమునకు చెందియుండుట మంచిదే. అలాగు మనముండ వలెను, కాని ఓ సోదరుడా, దానిని మాత్రమే అంగీకరించవద్దు. నీవు తిరిగి జన్మించవలెను. ఆ గొప్ప ప్రవక్తయగు కాపరి అదే చెప్పెను. "మీరు తప్పక తిరిగి జన్మించవలెను." ఒక వేదాంత పండితునికి ఆ మాట చెప్పెను, "నీవు తిరిగి జన్మించవలెను."
నీవు నమ్మినందు వలన కేవలము తిరిగి జన్మించవు. "నమ్మినప్పుడు తిరిగి జన్మించినట్లే," అని కొందరనుచున్నారు.
"దయ్యము కూడా నమ్ముచున్నది," అని బైబిలు చెప్పెను. గమనించండి, అది కాదు. అనుభవము కావలెను.
"నేను మంచి జీవితము జీవించాను," అని నీవు పలుక వచ్చును.
అపోస్తలులు కూడా అలాగే యుండిరి. వారు పరిశుద్ధాత్మను పొందు వరకు తిరిగి జన్మించలేదు. పరిశుద్ధాత్మను పొందువరకు వారు అసలు మారనే లేదు. అప్పగించుటకు ముందు రాత్రిని చూడండి. సీమోను పేతురుతో యేసు ఇట్లనెను, "నీవు మారినప్పుడు నీ సోదరులను బలపరచుము." పేతురు ఆయనను మూడున్నర సంవత్సరములు వెంబడించెను, దయ్యములను వెళ్ళగొట్టెను, రోగులను బాగు చేసేను, సువార్తను బోధించెను, అయినా గాని ఇంకా మార్పు చెందలేదు.
JOHN 3:3
116ఈ రాత్రి అటువంటి వర్తమానికుని నీవు కోరుకొనుచున్నావా? ఎవరేమి చెప్పినా వినవద్దు. సోదరుడా, సోదరీ, ఇది సత్యము. అది నిజమని నాకు తెలియును. అందరూ తలలు వంచి కండ్లు మూయండి. నేను కేవలము ఒక మానవుడను. మీ సోదరుడను. కాని మీ చేతులు క్రీస్తు వైపు ఎత్తి చెప్పండి, "దానిని నేను నమ్ముచున్నాను. నిజంగా నా హృదయములో క్రీస్తును కోరుకొనుచున్నాను. క్రిస్మసు యొక్క నిజమగు క్రీస్తును నేను కోరుకొనుచున్నాను." ఇప్పుడే నీ చేతిని ఎత్తుదువా? దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. దేవుడు కూడా మిమ్మును దీవించును. దేవుడు మిమ్ము దీవించును. ఎక్కడ చూచినా చేతులు కనబడుచున్నవి.
సోదరుడా, అది జరుగును గాక; సోదరీ, అది జరుగును గాక; నా స్నేహితుడా! అలాగు జరుగును గాక; దేవుని ఆత్మతో నింపబడుడి. ఎవరేమి చెప్పినా నీవు నిరుత్సాహపడవద్దు. గుర్తుంచుకో! అది నీ జీవము. ఉదయ కాలమునకు నీవు ఈ భూమి మీద లేకపోవచ్చును. మన జీవితమునకు హామీ లేదు. మన నాసికా రంధ్రములలో ఊపిరియుండగానే సిద్ధపడవలెను. దేవుని కృప లేకుండా మనము ఊపిరి పీల్చలేము. నీవెంత మంచిగా జీవించినా లాభము లేదు. యేసు చెప్పెను, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించలేడు."
ACTS 2:22,23,37,38
117తిరిగి-జన్మించుట అను పదము యొక్క భావములు నాకు తెలియును, కాని తిరిగి జన్మించినప్పుడు వారికి ఏమి జరిగెనో బైబిలులో చూద్దాం. పేతురు ఒక విశ్వాసి, అపోస్తలులు విశ్వాసులు, కాని పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగు వరకు వారు తిరిగి జన్మించలేదు. వారు జరిగిన దాని గూర్చి ఆశర్యపడుచుండిరి. ఆ తక్కిన వారితో పాటుగా పేతురు ఇట్లనెను, "ఇశ్రాయేలీయులారా, దీనిని మీరు తెలిసికొనుడి. నజరేయుడగు యేసు మీ మధ్య అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను జరిగించి దేవునిగా రుజువు కాబడెను. ఆయన ద్వారా దేవుడే ఈ కార్యములను చేసెను. మీ ఆలోచన సభ వారు ఆయనను దోషిగా నిర్ణయించి దుష్ట చేతులతో సిలువవేసిరి. దేవుడాయనను తిరిగి లేపెను. అందుకు మేము సాక్షులము. మీరు చూచి, వినునట్లుగా లేఖనముల ప్రకారము దీనిని జరిగించెను."
దీనిని వారు విని హృదయములలో నొచ్చుకొని ఇట్లనిరి, "అయ్యలారా, సోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను?"
"మారుమనస్సు పొందుడి" అని వారితో పేతురు చెప్పెను.
JOHN 20:23•
ACTS 2:38
118ఇక్కడ నా కాతలిక్కు స్నేహితుడు కూర్చొనియున్నాడు. నాకు తెలిసినవారు నలుగురు, అయిదుగురున్నారు. మీ యాజకునితో నేను చర్చించాను. అతడు ఒక కాతలిక్కు మత గురువు. నాతో ఇట్లు అనెను, "పాపములను క్షమించు అధికారము యేసు సంఘమునకు ఇచ్చెను. మీరెవరి పాపములు క్షమించుదురో అవి క్షమించబడును. ఎవరి పాపములు నిలిచియుండనిత్తురో, ఆ పాపములు నిలిచి యుండును." అది నిజమే. కాని అపోస్తలులు ఆయన క్రమమును ఎట్లు వెంబడించిరో చూడండి. ఈనాటి మత గురువులు చేసినట్లుగా వారు చేయలేదు.
పేతురును మీరు మొదటి యాజకుడని పిలువవచ్చును. అతడేమి చేసెను? పరలోక రాజ్యపు తాళపుచెవులు అతనికియ్యబడగా ఏమి చేసెను? ఇట్లు చెప్పెను, "ప్రతివాడును మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, ప్రభువగు దేవుడు ఎందరిని పిలచెనో వారికందరికిని చెందును." ఇంకా దేవుడు పిలుచుచున్నాడు గనుక అదే అనుభవము మాకు చెందును. అదే సూచన మిమ్మును వెంబడించును. మీరు దీనిని నమ్ముచున్నయెడల, తలలు వంచి యుండగానే "ఆమేన్" చెప్పండి. దానికి భిన్నమైనది ఏదయినా గాని వాక్య విరుద్ధము. అది గొర్రెల కాపరికి ఇష్టమైనది కాదు.
119ప్రభువైన యేసూ, వారిప్పుడు నీ చేతిలో యున్నారు. ఈ రాత్రి తమ హృదయములో క్రీస్తును కలిగి యుండని ప్రతి వారి కొరకు ప్రార్థించుచున్నాను. క్రీస్తే వాక్యమైయున్నాడు. అభిషేకించబడిన వాక్కు బయలుపరచబడినది. ఆ మెస్సీయాను, నిజమగు క్రిస్మసు కానుకను ఇంకా చేరుకొనని హృదయములు ఈ రాత్రియున్నచో వారికొరకు ప్రార్థించుచున్నాను. దేవుడు లోకమునకు ఇచ్చిన నిజమగు క్రిస్మసు కానుక ఆయనే, గొర్రెల కాపరుల ద్వారా లోకమునకు దానిని బయలుపరచెను. పాపపరిహారార్థమగు దేవుని గొర్రెపిల్ల ఆయనే. ప్రభువా, ఈ రాత్రి తెరువబడిన హృదయములలో ఈనాటి వాక్య మెస్సీయాను ఉంచుము. నీ కుమారుడగు యేసుక్రీస్తు నామములో వారిని నీకు అప్పగించుచున్నాను. ఆమేన్!
LUKE 12:31
120మీరాయనను ప్రేమించుచున్నారా? మీరాయనను నమ్ముచున్నారా? "మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి. అప్పుడవన్నియూ మీకనుగ్రహించబడును."
స్నేహితులారా, ముగించు ముందుగా, దీనిని చెప్పగోరుచున్నాను. చాలాసార్లు నన్ను అపార్థము చేసికొనిరి. దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానము నా యొద్ద ఉన్నది. ఏమయినా గాని ఆ వర్తమానమును నేను చెప్పవలసియున్నాను. దానిని అపార్థము చేసికొందురని నేనెరుగుదును - లేనియెడల అది దేవుని వర్తమానము కాదు. దానిని అపార్థము చేసికొనకుండా ఈనాడు ఎన్నో రీతులుగా ప్రత్యక్షత వచ్చుచున్నది. ప్రపంచములోని ప్రతి శాఖలోను, ప్రతి సంస్థలోను దేవునికి జనులున్నారు. నేను నా సోదరులకు విరోధిని కాను. మూడు సంవత్సరముల క్రితం ఈ టుసాన్ కు వచ్చి సోదరుడు గిల్మర్ యొద్ద సేవకుల కూటము పెట్టాను. నేనిక్కడకు సంఘము ప్రారంభించుటకు వచ్చానని కొందరనుకొన్నారు.
"కాదండీ! ఇక్కడికి నేను మీకు సహాయము చేయ వచ్చాను," అన్నాను. మూడు సంవత్సరాలయినా ఇంకా ఏమి పిలుపు రాలేదు. ఇక్కడికి కూడా నేను మీకు సహాయము చేయ వచ్చాను. మీతో చేతులు కలుపుటకు ఇక్కడికి నేను వచ్చాను. మీతో సంస్థలో చేరుటకు రాలేదు. దేవుని వాక్యము మీతో పంచుకొని మీతో చేతులు, హృదయములు కలుపుటకు వచ్చాను. నశించిన ప్రతి ఆత్మకు, ప్రతి అవసరములో ఉన్న వ్యక్తికి సువార్త బోధించుటకు ప్రయత్నించుచున్నాను. మీ స్వరములు అందుకే వినిపించుచున్నాము.
ఈ రాత్రి నా పూర్ణ హృదయమును, నాలో నున్న సమస్తమును ఈ రాత్రి దేవునికి సమర్పించుకొనుచున్నాను. నా యొద్ద ఇచ్చుటకు ఏమి ఎక్కువ లేదు. బంగారము, సాంబ్రాణి, బోళమును నేను తీసికొని రాలేను, ఎందుకనగా అవి నా యొద్ద లేవు. కాని దేవుడు నా జీవితములో ఇచ్చిన సర్వస్వమును ఈ రాత్రి నూతనముగా ఆయనకు ఇచ్చుచున్నాను. ఆయన వాక్యమను పశుల తొట్టిని నా హృదయములోనికి చేర్చుకొనుచున్నాను. వాక్యముతో నిలబడుదునని ఆయనకు వాగ్దానము చేయుచున్నాను. ఆయన ఇంకా ఒక సంవత్సరము నన్ను బ్రదుకనిచ్చినచో నేను నమ్మకముగా నిలబడుటకు తీర్మానించుకొనుచున్నాను. ప్రతి మాటను బోధించుదును. ప్రతి దానిని నమ్ముదును. కాబట్టి దేవా, సహాయము చేయుము. మీరును నాతో పాటు అలాగు చేయుదురా?
HEB 13:8
121ప్రభువా, మమ్మును చేర్చుకొనుము. నీ క్రిస్మసు కానుకయగు మెస్సీయాను మేము చేర్చుకొనుచున్నాము. ప్రభువా, అభిషేకించబడిన నీ వాక్యము నీ సన్నిధిని బయలుపరచుచున్నది. శాఖను లేదా ఆచారమును నేను నమ్మను. లోకము తునాతునకలగుట మనము నేడు చూచుచున్నాము. ఇక్కడ గొప్పు మెస్సీయా తన చేతులు చాచి నిలబడియున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఈ చివరి దినములకు ఆయన వాగ్దానము చేసియున్నాడు. సంఘము వ్యవస్థీకరించబడి లవొదకయ స్థితిలోనికి వెళ్ళిపోయినది. ప్రభువా, దానిని నేడు మేము చూచుచున్నాము.
ప్రియదేవా, మేము ఏమి చేయగలము? ప్రభువా, నేనేమి చేయగలను? నాకును, ఈ గొర్రెల కాపరులకు, ప్రపంచమంతటా వాక్యము ప్రకటించుచున్న కాపరులకు సహాయము చేయుము. ఈ వచ్చే సంవత్సరము దానిని ప్రకటించునట్లు సహాయము చేయుము. ప్రభువా, మాకు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను. నీ ప్రేమను, నీ ఆత్మను, నీ వెలుగును మాకు ఇమ్ము. నీ వాక్యమునకు మరియు నీ పిలుపుకు మమ్మును మేము ఈ రాత్రి సమర్పించుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామములో నీ క్రిస్మసు కానుకను మేము చేర్చుకొనుచున్నాము. దేవుని వాక్యము మాలో శరీరధారియైనది. ఆమేన్.
122సంఘపు పాటలను నేను ప్రేమించుచున్నాను. బైబిలులో పౌలు ఇట్లు చెప్పెను, "నేను ఆత్మతో పాడుదును. ఆత్మతో బోధించెదను. నేనేమి చేసినా సమస్తమూ యేసుక్రీస్తు నామములోనే చేయుదును." మీరు ఇంతగా ఓర్పు చూపించినందుకు మిమ్ము ప్రశంసించుచున్నాను. నేను వర్తమానముతో వచ్చుదును. కొన్నిసార్లు దానిని చెప్పుటకు నాకే ఇష్టముండదు, కాని సోదరులారా, నా బాధ్యతను నేను నెరవేర్చవలెను, లేనియెడల నేను వేషధారినగుదును. ఆ పని నేను చేయనియెడల, నా స్వంత మనస్సాక్షి నన్ను ద్రోహి అని పిలచును. దేవుని వాక్యమందు నాకే విశ్వాసములేని వాడనగుదును. అందరికీ వేరుగా కనబడవలెనని నేను దీనిని చేయుట లేదు గాని, నా పిలుపుకు నమ్మకముగా యుండవలెను. మీ అందరికీ నేను సహాయము చేయగోరుచున్నాను. నాకు సాధ్యమైనదంతయూ చేయగోరుచున్నాను.
ఎప్పటికీ గొప్ప పాటగా నిలబడి నేనెంతగానో ప్రేమించిన ఒక పాటను పాడుదము. నేనాయనను ప్రేమింతును, అను పాట. మనందరమూ ఆయనను ప్రేమించవలెను. ఆయన మనలను చేయమని కోరునది చేయుదము. "నేను చేయమని ఆజ్ఞాపించినవి మీరు చేయకుండా నన్ను ఏల ప్రభువని పిలచుచున్నారు?" ఆయన మనలను చేయుమని చెప్పినది చేయకుండా ఆయనను 'ప్రభువా' అని పిలుచుట వ్యర్థము.
JOHN 3:5•
JOHN 8:44
123"మీ పేరులను పుస్తకములో వ్రాసికొనండి. ఇందులో చేరండి. ఈ ప్రభు రాత్రి భోజనము తీసికొనండి. ఇది చేయండి, అది చేయండి. ఏదయినా మంచిదే,'' అని చెప్పు జీతగాళ్ళ మాటలు వినవద్దు. ఆ గొప్ప కాపరి ఈలాగు చెప్పెను, "ఒకడు తిరిగి జన్మించితేనే గాని పరలోక రాజ్యమును చూడలేడు."
ఆనాటి శిక్షణ పొందిన వేదాంత పండితులను చూడండి. తర్ఫీతు పొందిరి. పరిశుద్ధతయా? పవిత్రముగా జీవించుటయా? వారు జీవించిన విధంగా ఈనాడు ఎవరును జీవించుట లేదు. పోల్చ తగరు. వారిని ఆ గొప్ప గొర్రెల కాపరి ఏమని పిలచెను? "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు," అని పిలచెను, ఎందుకనగా వారు వాక్యమును గుర్తించలేదు. ఆనాటి వాక్యమును గాక మరొక నాటి వాక్యమును వారు చేర్చుకొనిరి.
వారు నోవహు కాలమును గుర్తించుట మంచిదే, కాని అది నోవహు కాలము; అది మోషే కాలమునకు పని చేయదు. మోషే కాలము, క్రీస్తు కాలమునకు సరిపోదు. చూచారా? లూథర్ కాలము, వెస్లీ కాలమునకు సరిపోదు. వెస్లీ కాలము, పెంతెకోస్తు కాలమునకు పని చేయదు. పెంతెకోస్తు కూడా అందరి వలెనే పని చేసినది. గతించిన దినములలో మీరెవరు నాకు సహాయము చేసిరి? మిమ్మును అడుగుచున్నాను.
JOHN 12:24
124పైకి వచ్చిన గడ్డిపోచ ఏమిటి? ఒక గోధుమ గింజ పైకి వచ్చుచున్నది. యేసు చెప్పెను, "గోధుమ గింజ భూమిలో పడి చావవలెను." గోధుమ గింజ భూమిలో పడినప్పుడు ఏమి జరుగును? మొదటగా చిన్న మొలక వచ్చును. అది భూమిలోనికి వెళ్ళిన గింజి వలె యుండదు. ప్రకృతిని గమనించండి. అది భూమి లోనికి వెళ్ళిన గోధుమ గింజ వలె యుండదు. కానీ అది గోధుమ గింజ జీవమును మోసికొనివచ్చును.
ఒక నాస్తికుడు ప్రసిద్ధమగు పుస్తకము వ్రాసెను. దాని పేరు మౌన దేవుడు. అందులో ఇట్లు చెప్పెను, "ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు వేలాది సంవత్సరముల చీకటి యుగములలో ఎందుకు నిశ్శబ్దముగా యుండెను? చిన్న పిల్లలను సింహములు తినివేసినవి. ప్రజలను సిలువల మీద వ్రేలాడదీసిరి. ఆట రంగములలో హత్య చేసిరి. అయినా ఆయన ఎన్నడూ నోరు తెరవలేదు?" చూచారా, వాక్యమే ప్రత్యక్షతయై యున్నది.
125ఆది యందు ప్రారంభమైన గోధుమ గింజ దేవుని విషయంలో తప్పిపోయినది. చివరగా ఒక గోధుమ గింజ వచ్చును. నిజంగా దేవుని ప్రతిబింబించును. అది ఆయన యొక్క సంపూర్ణ వాక్యమును బయలుపరచెను. ఆయన వాక్యమైయుండెను. పెంతెకోస్తునాడు దేవుడాయనకు ఒక వధువును ఇచ్చెను. కాని ఆ వధువు చీకటి యుగములలో భూమిలో పడిపోయినది. నిజమగు గోధుమ గింజ వలె అది భూమిలో పడిపోయినది. ఎందుకది పని చేయలేదు? అది భూమిలో దాగి యున్నది. అది కుళ్ళిపోయిన తరువాతనే జీవమును బయటకు తెచ్చును.
కాని ఒక సమయమున మార్టిన్ లూథరు అను పేరు గల ఒక చిన్న బోధకుడు ఒక వాక్య సత్యమును బయటకు తెచ్చును, "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును." ఒక మొలక బయటకొచ్చెను. దాని తరువాత మరియొక దళము బయటకు వచ్చెను. ఆయన జ్వంగ్లీ. తరువాత కాల్విన్, నాక్సు తదితరులు వచ్చిరి.
మొదటి సంగతి మీరు తెలిసికోవలెను. ఆ దళము మారిపోయినది. అది కాండముగా మారినది. కొద్దిగా అసలు దాని వలె కనిపించినది, కాని ఇంకా అది కాదు. భూమి లోనికి వెళ్ళినది అది కాదు. తరువాత వెస్లీ వచ్చెను. వెస్లీ నుండి మెతడిస్టు చర్చి వచ్చెను. మెతడిస్టు చర్చి నుండి నాజరీను, యునైటెడ్ బ్రదరిన్ మొదలగు సంఘములు వచ్చెను. అవేమయినవి? మరల భూమిలోనికి పోయి మొలక వచ్చినది. పెంతెకోస్తు ఒక నిజమగు గోధుమ గింజ వలె కనిపించినది.
MATT 24:24•
MARK 13:22
126మత్తయి 24:24 లో యేసు చెప్పినది చూడండి, "చివరి దినమున రెండు ఆత్మలు బహు సన్నిహితంగా కనబడును. సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని కూడా అది మోసము చేయును." ఆ గోధుమ గింజ బయటకు వచ్చినది. గోధుమ చేలు పెంచు వారికి ఈ గోధుమలు మొలకెత్తుట గూర్చి తెలియును. మీరు ఆ తప్పును చూచినయెడల, అందులో ఏ గింజ ఉండదు. కాని గింజ వలె కనబడును, అది పొట్టు మాత్రమే. కాని మీరు మైక్రోస్కోపు క్రింద పెట్టి చూచినయెడల, ఎక్కడో చిన్న మొలక కనబడును. చిగురు వచ్చును. అయితే ఆ పొట్టు ఏమి చేయును? ఎండ దానిని చంపకుండా ఆ పొట్టు దానిని సంరక్షించును. గింజ పక్వమగు వరకు ఆ పొట్టు దానిని రక్షించును. గోధుమ గింజ పక్వమయినప్పుడు ఆ పొట్టు రాలిపోవును. కాని చూడండి, ఆ బయటకు వచ్చిన గింజ లోనికి వెళ్ళిన గోధుమ గింజ వలెనే యుండవలసియున్నది.
127లూథరు ఉజ్జీవము తరువాత ఒక సంస్థ వచ్చెను. వెస్లీ ఉజ్జీవము తరువాత ఒక సంస్థ వచ్చెను. అలెగ్జాండర్ కాంప్ బెల్, జాన్ స్మిత్, తదితరులందరి తరువాత ఒక్కొక్క సంస్థ వచ్చెను. పెంతెకోస్తు తరువాత వచ్చిన సంస్థ నిజమగు గింజ వలెనె కనబడెను. అదేమయినది? రాలిపోయినది.
మనకు పదిహేను సంవత్సరాల ఉజ్జీవము వచ్చినది. చరిత్రలో ఎన్నడూ ఇట్టిది లేదు. ఈ పదిహేను సంవత్సరాల ఉజ్జీవమును చూడండి. అది ప్రపంచమంతా ప్రాకినది. దాని వలన ఒక్క సంస్థ కూడా నిర్మించబడలేదు. అదెక్కడున్నది? (అది కడవరి వానను ప్రారంభించగానే చచ్చినది.) దీనిని ఏ సంస్థ వెంబడించలేదు. ఎందువలన? ఇదియే గింజ. ఇక మరేదీ యుండదు. ఇప్పుడు ఆ పొట్టు రాలిపోవుచున్నది. ఏ సహకారము అక్కరలేదు. ఎందువలన? అది ఆ విధంగా ఉండవలసియున్నది.
128ఎందుకు సంఘము అచ్చట ఏర్పాటుకాబడినది? దానిని బలపరచుటకే. ఎవరు సహకారము చేసి యుండవలసినది? దైవిక స్వస్థత కూటములను బాప్టిస్టులు, ప్రెస్పిటేరియనులు, లూథరనులు బలపరచుదురా? సత్యము బయలు వెళ్ళునప్పుడు ఏమి జరుగును? పొట్టు కనబడదు; కాని జీవము పొట్టులో నుండి బయటకు వచ్చుచున్నది. నిజమగు జీవము ఆ గింజలోనికి వెళ్ళుచునే యున్నది. సంస్థ అక్కడే చనిపోయినది. ప్రతి కాలములో జరిగినట్లుగానే ఇప్పుడును జరిగియున్నది. ఏబది సంవత్సరాల క్రితం మీరు అందులో నుండి బయటకు వచ్చారు. సోదరులారా, మనము చివరి కాలములో యున్నాము. నిజమగు జీవము గింజలో నుండి ముందుకు వెళ్ళుచున్నది.
JOHN 5:39
129ఎందుకొరకు అది రాలిపోయినది? కుమారుని సన్నిధిలోనికి ఆ గింజను తీసికొని వచ్చినది. యజమాని కొరకు ఆ గింజను ఎర్రగా పండించును. ఎందుకు అది రాలిపోయినది? నిజమగు సంపూర్ణ సువార్తను కుమారుడు పండించును. బైబిలులో యేసుక్రీస్తు వాగ్దానము చేసిన ప్రతి దానిని బయలుపరచును. గుండె పోటులు, కన్నీళ్ళు ఇక ఉండవు. జనుల మధ్య నేడు ఒక శరీరము తిరిగి లేచుచున్నది. సంస్థలు ఇక ఉండవు. ధనిక లవొదకయలోనికి అది వెళ్ళును. సంస్థలు ఎంత అభివృద్ధి చెందినవి? మిలియనుల డాలర్లు, మిలియనుల ఆత్మలు వారికున్నవి.
గొర్రెల కాపరి ఎందుకు వచ్చెను? దాస్యము నుండి సోదరులను విడిపించుటకే. దేవుడు మనకు తోడైయుండి సహాయము చేయును గాక! వాక్యమును చదవండి. లేఖనములను పరిశోధించండి. అందులో నిత్యజీవము కలదని మనకు తెలియును. అవి సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చును. చూడండి, దేవుడు ఈ కాలమునకు తన మాటలు ఇచ్చెను.
MATT 23:29•
JOHN 6:37
130యేసు వచ్చినప్పుడు ఏమి చెప్పెను? "మీరు వేషధారులు! మీరు సున్నము కొట్టిన గోడలు, ప్రవక్తల యొక్క సమాధులను కట్టుచున్నారు. వారిని మీ తండ్రులే చంపిరి. మీరు వారి పిల్లలు. వారు చేసిన క్రియలనే మీరును చేయుచున్నారు." నా సోదరులారా! అది ఎన్నడునూ మారుట లేదు.
కాని యేసు ఒక దినమున వచ్చును, ఆయనే గొర్రెల యొక్క గొప్ప కాపరి. లూథరు కాలము మొదలుకొని పెంతెకొస్తు కాలము వరకు వచ్చిన వెలుగు అంచెలంచెలుగా వచ్చియున్నది. (వెలుగును అంగీకరించవలెను గాని ఆ వెలుగును తెచ్చిన వారిని కాదు), ఆయన విమోచించుటకు వచ్చును. ఆయన తిరిగి వచ్చుచున్నాడని ఎరిగి ఎంతో నేను సంతోషించుచున్నాను. ఓ, ఆయన గుంపుతో పాటు మీరు లెక్కించబడగోరుచున్నారా? మీరును లెక్కించబడుదురా? అందుకే ఒకే ఒక మార్గమున్నది. సంఘములో చేరుట కాదు గాదు, తిరిగి జన్మించవలెను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వచ్చుదురు. నా తండ్రి పిలిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాడు." చూడండి, దానిని అంగీకరించుటయే మీరు చేయవలెను. నాకు తెలిసినంత వరకు ఆయన ప్రపంచమునకు ఇచ్చిన క్రిస్మసు బహుమానము ఆ ఏకైక కుమారుడే. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్న వాక్యమైయున్నాడు. చూచారా? ఈ రోజు ఆయనను నమ్మండి, ఆయనే బైబిలు యొక్క సంపూర్ణత.
REV 22:18
131ఆ ఏడు సంఘ కాలములలో ఏడు మర్మములు దాగి యున్నవి. దానిని గూర్చి నేను ఒక గ్రంథము వ్రాయుచున్నాను. ఒక గొప్ప వేదాంత పండితుడు నాతో కొంత కాలము క్రిందట ఇట్లు చెప్పెను, "బ్రెన్హాం సోదరుడా, మేము తరువాత ఏమి చేయవలెనో ప్రభువు నీకు తెలియ చేయునని నమ్ముచున్నాను. ఈ ఏడు ముద్రల క్రింద ఏదో గొప్ప రహస్యము దాగి యున్నదని నమ్ముచున్నాను."
"సోదరుడా! అలాగు కాదు," అన్నాను.
"వాక్యములో వ్రాయబడనిది ఏదో అందులో యుండును," అని చేప్పెను.
"కాదు! కాదు! వాక్యమునకు ఏది చేరరాదు. దాని నుండి ఏదీ తీసి వేయరాదు," అని చెప్పాను. చూడండి, అది ఎప్పుడో ఇక్కడ యున్నది, కాని దానిని చూచుటలో సంస్కర్తలు తప్పిపోయిరి. దానిని వారు చూచునంత కాలము జీవించలేదు.
ఇప్పుడు కాలములు గతించినవి. మనము లవొదకయలో ఉన్నాము. గుర్తుంచుకొనండి, ఇది లవొదకయ కాలము. ఆయన సంఘమునకు బయట ఉన్నాడు. లోపలకు వచ్చుటకు తలుపు తట్టుచున్నాడు: హవ్వ తన ఆదామును బయటకు త్రోసి వేసినది. దేవా, మాకు సహాయము చేయుము. ఆయనను కనుగొనుటకు మనము పాలెము ఆవలకు వెళ్ళుదము. ఆయనతో కూడా మనమును గవిని వెలుపల శ్రమ పడుదము. ఆయన మరణము, సమాధి, పునరుత్థానములలో మనమును పాలు పొందుదము. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
HEB 13:8•
REV 3:20
132మనము వెళ్ళిపోవు ముందుగా ఒక పాట పాడుదము. పాడెదరా? నేనాయనను ప్రేమించుదును. సోదరీ, నీవు పాట ఎత్తుదువా? ఆ పాత పాట ఎందరు పాడగలరు? మీరు కూటములకు వచ్చుచున్న యెడల ఆ పాట నాకెంతో ఇష్టమని మీకు తెలియును.
మనము ఇప్పుడు కండ్లు మూసికొని యెహోవాను గూర్చి ఆలోచించుదము. ఆయన తప్ప మరెవరును యోగ్యులు లేరు. ఆయన ఒక శిశువుగా దిగి వచ్చెను. ఆయన యుక్త వయస్కుడాయెను. ఆయన ఒక వడ్రంగి ఆయెను. పని వాడాయెను. ఆయన గొర్రెపిల్ల ఆయెను. ఆయన ఒక బలి ఆయెను. యెహోవా జయశాలిగా తిరిగి లేచెను. మోషే తన కుడిచేతిని చాపినట్లుగా దేవుడు తన కుడి చేయిగా నున్న కుమారుని పంపెను. ఆయన రహస్యము ఆయన పాపము అను మానని వ్యాధితో మొత్తబడెను. ఆయన తన కుడి చేతిని నీ కొరకు, నా కొరకు చాపెను. "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు."
ఆయన వైపు ఇప్పుడు చూడండి:
నేనాయనను ప్రేమింతును,
నేనాయనను ప్రేమింతును
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను
కల్వరి మ్రాను మీద.
133అది గొర్రెల కాపరికే ఎందుకు దొరికెనో తెలిసిన వారందరూ "ఆమేన్" చెప్పండి. తప్పకుండా గొర్రెల కాపరుల యొద్దకే రావలెను. అలాగు జరుగవలసియున్నది. ఇదే వచనమును మనము పాడుచుండగా, వేదిక యొద్దకు చేరుదము. ఈ రాత్రి ఇక్కడ మెతడిస్టు, బాప్టిస్టు, లూథరను, ప్రెస్పిటేరియను, కాతలిక్కు మొదలగు సంఘముల సభ్యులున్నారు. చేతులు కలిపి ఈలాగు చెప్పండి, "సహ యాత్రికుడా, ఈ రాత్రి నీతో యుండుట నాకు సంతోషముగా యున్నది." "దేవుడు నిన్ను దీవించును," అని చెప్పి వారితో కరచాలనము చేయండి. ఇప్పుడు మరల దానిని పాడుదము.
నేను ఆయనను ప్రేమింతును, ….
[టేపు మిద ఖాళీ యున్నది.]
… నా రక్షణను కొనెను
కల్వరి సిలువ మీద.
ఇప్పుడు మనము కండ్లు మూసికొని మన చేతులు ఎత్తి ఆయనకు పాడుదము:
నేనాయనను ప్రేమింతును
నేనాయనను ప్రేమింతును
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి మ్రాను మీద.
134దేవుడు నిరాకారుడు. మన తలలు వంచి ఇప్పుడు దీనిని పాడుదము. చిన్న పిల్లల వలె గానము చేయుదము. మీరు దేవుని పిల్లలు. లోకము ఏమనుకొనునో అని తలంచవద్దు. ఇప్పుడు మీరు క్రీస్తును ఆరాధించుచున్నారు. మీరు తలలు వంచి దానిని గానము చేయుడి. [సహోదరుడు బ్రెన్హాం నేనాయనను ప్రేమించెదను అను పాటను గానము చేయుచూ జనులను నడిపించుచున్నారు.]
సమస్త సందేహమును మరియు లోకమును మీలో నుండి ఏదో చెరిపి వేసినదని మీరెరిగియున్నారా? ఆ విధమైన అనుభూతి పొందారా? మీరు చేతులెత్తి ఇట్లు చెప్పండి, "నాలో ఉన్నదంతయూ పోయినట్లున్నది. నేను వేరుగా యున్నట్లు కనిపించుచున్నాను. ఆయన చేతులలో నుండి నేను తినుచున్నట్లు అనిపించుచున్నది." ఇక్కడ సోదరుడు ఆ విధంగానే సాక్ష్యమిచ్చెను. "ఆహారము, గొర్రెల యొక్క ఆహారము. గొర్రెల కాపరి యొక్క ఆహారము." అదే వాక్యము.
MATT 4:4•
LUKE 4:4
135దేవుని గొర్రెలు ఆయన యొక్క ఆహారమును భుజించును. "మనుష్యడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును." అంతే, అది బైబిలు. కొన్ని వాక్యముల వలన బ్రదుకుట కాదు గాని, ప్రతి మాట వలనను బ్రదుకుదుము. ఓ, ఇందువలన మిరాయనను ప్రేమించవలెనని తోచుట లేదా? ఇప్పుడే మనకు నిత్యజీవము కలిగియున్నది. ఇక ముందుకు కలుగునని కాదు గాని, ఇప్పుడే మనము దేవుని కుమారులము. ఇప్పుడే! భవిష్యత్తులో కాదు. క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలములందు కూర్చొనియున్నాము. ఆ గొప్ప టెలివిజను ఒక ఈధరు అల యన్నదని రుజువు చేయుచున్నది. ఆ వ్యక్తి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, టెలివిజను తెర ద్వారా తెలియచేయబడును. దేవుని యొక్క ఆత్మ వాక్యమును తీసికొని యేసుక్రీస్తును ప్రతిఫలింప చేయుచున్నది. ఆయన గొర్రెలను పరలోక స్థలములందు నిలబెట్టుచున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు కాడా? ఆయన అద్భుతమగువాడు! దేవుడు మిమ్ము దీవించును.
136ఒక్క నిమిషము నిలబడుదము. ఆశీర్వచనము చెప్పుటకు మీకెవరైనా యున్నారా? గుర్తించుకొనండి, క్రిస్మసు సమయములో ప్రభువైన యేసును ఆరాధించుడి. ఆయన యొక్క పునరుత్థాన శక్తిలో ఆయనను ఆరాధించుడి. (చీకటి దట్టము కాక ముందే, వర్షము ఉధృతము కాకముందే సిద్ధపడుడి!) మీరు, మీ సంఘ కాపరి, మీ సంఘము నా పట్ల ఈ మేలు చేయుడి.
ఒక రాత్రి నేను రోగులకు తీరిక లేకుండా ప్రార్థించుచున్నాను. ఎనభై ఏళ్ళ వృద్ధురాలు మతి-స్థిమితము లేనిదై వచ్చినది. ఆమె ఇప్పుడిచ్చట యున్నది. ఆమె మనసు స్థిమితము లేక బిడ్డను కనబోవుచున్నట్లుగా చెప్పినది. బిల్లీ నన్ను ఆఫీసు నుండి పిలచి ప్రార్థించగలవా?" అనడిగెను.
"ఇప్పుడు నేను ఏమి చేయలేను,'' అని చెప్పాను.
"మీరు ప్రార్థన చేయుదురా? మీరు ప్రార్థించుదురని చెప్పెదను," అన్నాడు.
"సరే," అన్నాను. ఆ క్షణములోనే ఆమె తనంతట తానుగా వచ్చినది. ఆమె నిద్రపోయి మరల మామూలు స్థితిలో లేచినది. మాములుగానే చక్కటి భోజనమును తినినది. కొద్ది నిమిషముల క్రితం దానిని గూర్చి ఒక వ్యక్తి సాక్ష్యమిచ్చెను.
137ఈ ఆలయంలో ఎక్కడో గాని కొద్ది సేపటి క్రితం సహోదరుడు, మాక్ ను చూచాను. అతడు స్థానిక సంఘ కాపరులలో ఒకడు. చాలా ప్రియమగు సోదరుడు. నేను మొదటగా సేవలను ప్రారంభించినప్పటి నుండి సహోదరుడు మాక్ ను ప్రేమించుచునే యున్నాను. తరువాత అతనిని కలిసికొనుట జరిగినది.
నేను బ్రిటిష్ కొలంబియాకు వెళ్ళాను. దేవుడు అన్నిటిని మేలు కొరకు ఎట్లు జరిగించునో చూపించెదను. నేను అప్పుడు గుర్రము ఎక్కాను. నేను అరణ్యములోనికి వెళ్ళుచున్నాను. ఒక ఇండియను గుంపును దేవుని యొద్దకు నడిపించాను. వారందరూ మార్పు చెంది యేసును అంగీకరించారు.
రెండు సంవత్సరాల క్రితం తన గుర్రపు పిల్లను పోగొట్టుకొనిన ఇండియను కుర్రవానికి ప్రవచనము ద్వారా అదెక్కడున్నదో చెప్పాను. అదెంత దూరములో యున్నదో, ఎక్కడ నిలబడియున్నదో చెప్పాను. అతని తల్లి గుండెపోటుతో మరణించుచున్నది. ఆమె స్వస్థత పొంది రక్షించబడినది. అప్పుడే వచ్చిన ఈ బాలుడు దీనిని చూచెను. ఆ విధంగానే చెప్పిన ప్రకారము అతని గుర్రము దొరికినది.
138దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా తప్పిపోలేదు. మీరెవరైనా చెప్పండి? "మీతో చెప్పుమని ఆయన నాతో పలికిన మాట ఏ ఒక్కసారి అయినా జరుగకుండా తప్పిపోయెనా?" అది నిజము. "ఆమేన్" చెప్పండి. చూచారా? చూచారా? ఒక్కసారి కూడా అది తప్పిపోలేదు. ఖచ్చితంగా జరిగినది.
సహోదరుడు మాక్ చావు బ్రతుకుల మధ్య పడి యుండెను. అతని భార్య బిల్లీ భార్యను పిలచినది. నేనెక్కడున్నానో అడిగినది. అతని భార్య చక్కని స్త్రీ. నా కోడలు ఇట్లు చెప్పినది, "ఆయన వేట పర్యటనలో ఎక్కడో బ్రిటిష్ కొలంబియాలో యున్నారు."
ఆ ఉదయమున ఎందుకో నేను గుర్రపు స్వారీ చేయలేకపోయాను. "ఒక్కసారి ఇంటికి ఫోను చేయుదును," అని బిల్లీ చెప్పెను. ఫోను చేయుటకు పోస్టు యొద్దకు వెళ్ళాను. మమ్మును చూడగానే ఆ గుర్రము దొరికిన ఇంటిలోని ఇండియను స్త్రీ పరుగెత్తికొని వచ్చి "సహోదరుడు మాక్ చావు బ్రతుకుల మధ్య యున్నాడు. మిమ్మును పిలచుచున్నారు," అని చెప్పెను.
139నేను దిగిపోయి ఆ అడవుల లోనికి వెళ్ళి మోకరించాను. "ప్రియ దేవా, ఎక్కడో మూడు వేల మైళ్ళ దూరములో ఎండ కాయుచున్న ఆరిజోనా రాష్ట్రములోని, టూసాన్ లో నా సోదరుడు చావు బ్రతుకు మధ్య యున్నాడు. నీవతనికి సహాయము చేయవా?" అని అడిగాను.
"అంతా బాగయినది" అని ఎవరో నాతో చెప్పిరి.
ఆ తరువాత సహోదరుడు, మాక్ యొద్దకు ఒక రోజున వచ్చి "ఏ సమయంలో స్వస్థత వచ్చినది?" అనడిగాను. సరిగ్గా మేము ప్రార్థన చేసిన ఘడియలోనే అది జరిగినదని చెప్పెను.
ఓ, ఆయన ఆశర్యకరుడు కాడా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. రాజు యొక్క సన్నిధిలో జీవించుచున్నానని ఎరుగుటకు నేను ఎంతో సంతోషించుచున్నాను.
140ఇప్పుడు మనము తలలు వంచుదము. ఒక ప్రస్తమగు చిన్న సోదరుడు ఇచ్చట యున్నాడు. అతడు ఒక మిషనెరీ సోదరుడు, నాకు స్నేహితుడు. అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ లో ఒక సభ్యుడు. ఆ ప్రశస్త చిన్న సోదరుడు ఇచ్చటున్నాడు. నేనతనిని "క్రీచ్" అని పిలచుదును. అతడు ఎన్నో చక్కని సంగతులను పలుకును. సహోదరుడు క్రీచ్ అని పిలచుచున్నాను. ఏమి చెప్పవలెనో నాకు తెలియదు. నీవు నా సోదరుడవు. ఈ చివరి దినమందు యేసుక్రీస్తు యొక్క శ్రమలలో తోటి సేవకుడవు, దేవుడు నిన్ను దీవించును. మేము తలలు వంచియుండగా, ఈ సమయములో నీవు ప్రార్థన చేసి పంపించుదువని సహోదరుడు టోని చెప్పెను. మంచిది. రమ్ము!