ఈయన ఎవరని మీరు చెప్పెదరు?

ఈయన ఎవరని మీరు చెప్పెదరు?

1స్నేహితులారా, శుభోదయం. ఇచ్చట ఈ సంఘములో ఉండుట ఒక భాగ్యమని నేను నిశ్చయంగా భావించుచున్నాను. మరియు చెప్పాలంటే మొదటిగా నేను దాని పేరును ఇష్టపడుదును, అది "యేసు నామము" అని పిలువబడును. నేను దానిని ఇష్టపడుదును, మరియు నేను విమోచింపబడినది ఆ నామము చేతనేయని నేను తలంచుదును, అదియే ప్రియమగు ప్రభువైన యేసు అనే నామము. మరియు పిదప సరిగ్గా ఇక్కడ ఫీనిక్సులో ఈ ప్రియమైన ఆదివారమున కూడియున్న నా మంచి స్నేహితులతో ఇక్కడ ఉండుటను ఇష్టపడుదును. నేను మీ అందరితో మహిమలో ఉండుటకంటే మరే ఇతర స్థలమును నేనెరుగను, మరియు ఏదో ఒక దినమున జరుగునని, మనము ఎదురుచూచుచున్న ఆ గొప్ప సంభవము అదేయైయున్నది.

మరియు ఈ దినమున ఇచ్చటకు రానైయున్నట్టు ఒక రోగి యొద్దనుండి నాకు కబురు వచ్చియున్నది మరియు నేను నా ప్రశస్త స్నేహితుడైన, సహోదరుడు ఔట్లాతో మాటలాడుచుంటిని, మరియు నన్ను ఇచ్చటకు రమ్మని అతడెంతో దయగల ఆహ్వానాన్ని అందించియున్నాడు. మరియు ఇచ్చట ఫీనిక్సులోని సేవకులందరూ నా పట్ల మంచితనముగలవారై యున్నారు.

2నేనెందువలన టూసాన్ కు వెడలియున్నాను అని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోవుదును. నేను మూడు సంవత్సరములు అచ్చట ఉండియున్నాను, మరియు ఒక్క వేదిక మీదకు నేను ఆహ్వానించబడియుండనేలేదు. కావున నేను…. ఇచ్చట టూసాన్నకు… లేదా ఇచ్చట ఫినిక్సునకు నేను ఆహ్వానితునిగా భావించుచున్నాను గనుక, ఇచ్చటకు రావలసివచ్చెను. మంచిది, బహుశా వారు నాకు అలవాటుపడవచ్చును. మీకు తెలుయునా, గత రాత్రి నేను అచ్చట ప్రసంగించియున్నాను, మరియు నేను మూడు గంటలపాటు ప్రసంగించియున్నాను; వారు నన్ను తిరిగి ప్రశ్నించలేదనుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు.

అయితే దేవుని కొరకు మరియు ఆయన ప్రజల కొరకు నేను అంతగా నా హృదయమందు భారము కలిగియున్నాను. మరియు నేనెంతో నిదానంగా చెప్పుచున్నాను మరి ఎందుకంటే, నేను సరిపడునంతగా కాకుండా ఏదైనా విడిచిపెట్టుదునేమోయని నేను భయపడుచున్నాను, మరియు ఒక్కదానిలోనే నేను మూడు లేదా నాలుగు వర్తమానములను కలిపియున్నాను. కావున నేను నిశ్చయంగా అంతసేపు మిమ్మల్ని ఉంచినందుకు, నన్ను క్షమించమని అచ్చటనున్న జనులగు మిమ్మల్ని అడుగుచున్నాను. నేను అట్లు చేయకుండవలసియున్నది.

3మరియు ఈ ఉదయం, సహోదరుడు కార్ల్ విలియమ్స్, మరియు యవ్వనసుడైన జిమ్మి మరియు గాయక బృందంతో మరియు నా స్నేహితుడైన మోస్లే సహోదరులతో ఇచ్చట ఉండుట నాకు ఆనందముగా ఉండియున్నది; బ్రాడ్, సహోదరుడు జాన్ షరిట్ మరియు నా స్నేహితులలో అనేకులను చూచుచున్నాను; సహోదరుడు ప్యాట్టేలర్, కెంటకీ నుండి ఇచ్చటికి వచ్చియున్నారు, మరియు ఈ ఉదయము ఈ కూటము కొరకే కూడుకొనియున్న అనేకమంది స్నేహితులు ఇచ్చటనున్నారు. చూడండి, టూసాన్ మరియు మొదలగు స్థలముల నుండి వచ్చియున్న అనేకులగు స్నేహితులు, ఇచ్చట కూర్చునియుండుటను చూచియున్నాను.

ఇదంతయూ ముగించబడిన పిదప, అప్పుడు ఎక్కడైతే మనము ఈ చక్కని సంగీతమును వినుటను మనము అపనక్కర్లేని చోట మనము కూడుకొనెదమో, ఆ దినమును గూర్చి నేను ఆలోచించుచున్నాను. సహోదరుడు విలియంసన్ ఆ వెనక కూర్చునియుండుటను నేను ఇప్పుడే గమనించియున్నాను, అతను గతరాత్రి రమడా ఇన్ కు వెళ్ళుచుండగా అతడు ఒక సాక్ష్యమిచ్చియున్నాడు. మరియు అతని ఎత్తు దాదాపు ఆరు అడుగులు ఉండునని నేను తలంచుచున్నాను. అయితే నేను మీతో చెప్పునదేమనగా, ఆ సాక్ష్యము తరువాత, అతని ఎత్తు పది అడుగులని నేను నమ్ముచున్నాను. అతను కేవలం… నిజముగా ఆ పిల్లవాడు చెప్పినది అభినందించతగినది, అది అటువంటి ఒక అధ్బుతమైన సాక్ష్యమైయున్నది

4క్రీస్తునందు కేంద్రీకృతమైన తమ విశ్వాసమును గూర్చి ఈ చక్కని యవ్వనస్తులు సాక్ష్యము చెప్పుట నేను వినుచున్నప్పుడు, మరియు నేను వృద్ధుడనగుచున్నాను, మరియు నేను, ఒక దినమున నేను విడిచిపెట్టి గృహమునకు వెళ్ళవలసియున్నది. మరియు నేనెకడైతే విడిచిపెట్టానో అక్కడి నుండి తీసుకుపోవుటకు స్వయంగా సన్నద్ధులగుచూ మరియు సిద్ధపడివచ్చుచున్న ఈ యవ్వనస్తులను ఆ విధంగా మనము చేయుచుండెదము. జీవితము ఆ విధంగానే అమర్చబడియున్నది. తద్వారా మనము… ఒక తరము గతించిపోవును. తల్లి మరియు తండ్రి, మరియు వారు వారి పిల్లలను పెంచుదురు, మరియు వారికి వివాహము గావించెదరు మరియు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చెదరు. మరియు కొంతకాలమైన పిదప తండ్రి మరియు తల్లి మట్టిలోనికి పోవుదురు. మరియు పిదప, ఆ సమయానికి ఈ పిల్లలు పెద్దవారై వాళ్ళు కూడా మనవళ్ళు మనవరాళ్ళకై సిద్ధమయ్యెదరు; మరియు పిదప, ఆ రీతిగా వారు పోవుచునుందురు. అయితే ఒకానొక ఈ దినాల్లో ఒక గొప్ప పునరుత్దానము జరుగును. దేవుడు మనకు ఇచ్చినదానితో మనము ఏమి చేసియున్నామని లెక్క అప్పగించుటకు మనందరము దేవుని యొక్క సన్నిధికి, యేసుక్రీస్తు నొద్దకు పిలువబడెదము. మరియు కావున, ప్రపంచమంతటా నేను కలిసినవారిలోకెల్లా ఇటువంటి ఒక చక్కని ప్రజలతో ఈ తరమునందు నివసించినందుకు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. నేను కేవలం దేవునికి కృతజ్ఞతగలవానిగా ఉన్నాను. మరియు ఒక దినమున నాకు పిలుపు వచ్చినప్పుడు, సరి, నేను వెళ్ళి నేను చేసిన క్రియలను నేను ఎదుర్కొనవలసియున్నది. అవన్నియూ దేవుని యొక్క మహిమ మరియు ఘనతకై ఉండవలెనని నేను కోరుచున్నాను.

5మనము నూతన సంవత్సరము సమీపించుచుండగా, నేను మరిచిపోవలెనని కోరుకుంటున్న అనేక సంగతులు కలవు, అయితే నేను ఆయనయొద్ద వాటిని తప్పిదములుగా ఒప్పుకొనియున్నానని నేనెరిగియున్నాను మరియు ఆయన వాటిని మరుపు అను సముద్రములో పారవేసియున్నాడు, మరియు ఆయన వాటిని మరెన్నటికి గుర్తుచేసుకొనడు. ఇప్పుడు చూడండి, మనము ఆ విధంగా చేయబడియుండలేదు, మనము ఎప్పటికిని గుర్తుపెట్టుకొనెదము. మనము ఒకరినొకరం క్షమించుకొనగలము, కానీ మనము దాని గూర్చి మర్చిపోజాలము, ఎందుకనగా మనము భిన్నముగా చేయబడియున్నాము. అయితే దేవుడు దానిని క్షమించగలడు మరియు దానిని మరచిపోగలడు. అసలు అది లేదన్నట్లుగా దానిని ఆయన తుడిచివేయగలడు. చూశారా? ఎందుకనగా, ఆ మరుపు అను సముద్రమునకు ఆయనకు ప్రవేశము కలదు కానీ మనకు లేదు. దాని గూర్చి ఆలోచించుడి, మనము ఎన్నడయిననూ పాపము చేసినట్టుగా దేవుడు జ్ఞాపకము చేసుకొనజాలడు. దాని విషయమై ఆలోచించుడి! గాయక బృందమా, యవ్వనస్తులారా, దాని సంగతేమిటి? మనము ఎన్నడయినా పాపము చేసినట్టు దేవుడు జ్ఞాపకము చేసుకొనడు. చూడండి, ఆయన పూర్తి విషయమును మర్చిపోగలడు, మరియు మరెన్నడునూ జ్ఞాపకమునకు తీసుకురాబడదు. అది ఎట్లు౦డియున్నది కదా?

6ఇది ఏదో ఒక హాస్యమాడు స్థలము కాదు. అటువంటి ఎగతాళి చేయుటయందైననూ లేదా పరిహాసమాడుటయందైననూ నేను నమ్మికయంచను. అది నా స్నేహితుడొకనిని జ్ఞాపకమునకు తెచ్చుచున్నది. ఇప్పుడాయన మహిమలోనికి ప్రవేశించియున్నాడు. అయితే అతడు ఒకసారి అతడొక చిన్న కధను చెప్పియున్నాడు, అది ఒక పల్లెటూరి నుండి పట్టణమునకు తరలివచ్చిన ఒక దంపతుల గూర్చినదైయున్నది. మరియు వారికి ఒక… ఈ యవ్వనదంపతులకు ఒక వృద్ధుడైన తండ్రి కలడు, మరియు అతడు నిజముగా దేవుని కొరకు మంటను కలిగియున్నాడు. కావున ఆ యవ్వన స్త్రీ (ఆమెకి అతను తండ్రియైయున్నాడు) కావున ఆమె కొంతమంది ఉన్నతస్థాయి ప్రజలతో జోడికట్టినది. ఈ ఉన్నతస్థాయి ప్రజల వినోదములు ఎచ్చట ఉండునో మీకు తెలియును. మరియు కావున, ఆ దినమున ఆమె తన ఇంటిలోనే ఒక వేడుకను కలిగియుండబోవుచున్నది.

మరియు ఆమె యొక్క తండ్రి, తన భోజనము ముగించుకున్న పిమ్మట, తన బైబిల్ను తీసుకొని మరియు గదిలోనికి వెళ్ళును, మరియు కొద్దిసేపు అతను చదువుకొనుచుండేవాడు. మరియు అతను దానిని క్రిందపెట్టి, అతను ఏడ్చుచూ మరియు అరుచుచూ మరియు కేకలు వేయుచూ మరియు ఆ రీతిగా చేయుచుండేవాడు, మరియు అతను లేచి తన కళ్ళజోడును పెట్టుకొని మరలా చదువుచుండేవాడు. పిదప మరిదేనినో కనుగొనేవాడు మరియు తన కండ్లజోడు ప్రక్కకు పెట్టి మరియు ఏడ్చుటను మరియు అరుచుటను మొదలుపెట్టేవాడు. "అది నా వినోదమునకు అంతరాయము కలిగించును గనుక నేను డాడీ విషయంలో ఏదో ఒకటి చేయవలెను, మరియు ఏమి చేయవలెనో నాకు తోచడంలేదు," అని ఆమె అనుకొన్నది. కావున అతనిని ఆ చోటనుండి లేపి మేడమీదికి పంపించవలెనని ఆమె నిర్ణయించుకొన్నది.

7మరియు ఆమె ఆలోచించసాగినది, "సరి ఇప్పుడు, నేను అతనికి తన బైబిల్ను ఇవ్వను, ఎందుకనగా అక్కడ కూడా అతను ఆ విధంగానే చేయును." కావున ఆమె అతనికి కేవలం ఒక పాత భూగోళ శాస్త్ర పుస్తకమును ఇచ్చినది, మరియు అతనిని అక్కడికి పంపించినది. "డాడీ మేము వేడుక సంబరములో ఉండగా నీవు పుస్తకములోని ప్రపంచవ్యాప్తముగానున్న పటములను మరియు మొదలగునవి చూడుము," అని చెప్పినది. మరియు, "మేము ఎక్కువ సమయము ఉండము. మేము క్రింద… నీవు కొద్దిసేపైన పిదప క్రిందకు రమ్ము అనినది." ఆ స్త్రీలందరూ ఉన్నచోట నీవు ఉండగోరుటలేదని నేనెరుగుదును," అని అన్నది.

"లేదు, పర్వాలేదులే, అమ్మా నేను మేడమీదకి వెళ్ళుదును" అని అతడనెను.

కావున అతను… ఆమె అతనికి ఒక లైటును మరియు ఒక చిన్న స్థలమును అమర్చినది. మరియు ఆమె ఇట్లు అనుకొన్నది, "మంచిది, అది దానిని కుదుర్చును. ఇప్పుడు, అతడు కేవలం ఆ పటములను చూచును మరియు కొద్దిగా భూగోళ శాస్త్రములోనిది చదువును మరియు పిదప మరియు కొద్దిసేపటి తర్వాత అతడు క్రిందకి వచ్చును. మరియు అది బాగుండును."

8కావున వారు వారియొక్క గులాబీ రంగు పానీయమును త్రాగుచున్న సమయములో, మీకు తెలియును మరియు వారు వేడుక జరుపుకొనుచుండగా కొద్దిసేపటి తర్వాత ఆ ఇల్లు కదులుట మొదలయ్యెను, మరియు ఆ వృద్ధుడు పైకి, క్రిందకి పరిగెత్తుచూ, కేకలు వేయుచూ, మరియు గంతులేయుచుండెను. మరియు "అతనికి ఏమి సంభవించినది. "అక్కడ పైన అతని వద్ద బైబిల్ లేదు కదా. అయితే… అతను బైబిల్ ను కనుగొనియున్నాడేమో," అని ఆమె అనుకొన్నది.

కావున ఆమె మెట్ల పైకి పరుగెత్తినది, మరియు ఇట్లన్నది, "డాడీ!" "నీవు చదువుచున్నది బైబిల్ కాదు. అది ఒక భూగోళ శాస్త్ర పుస్తకమైయున్నది" అని అన్నది.

అతడిట్లనెను, "అది నాకు తెలియును ప్రియా, అది నాకు తెలియును!" అయితే, "మన పాపములను మరుపు అను సముద్రములో పారవేసెదననీ, మరియు వాటిని ఇక ఎంత మాత్రము జ్ఞాపకము చేసుకొననని, ఎక్కడైతే యేసు చెప్పెనో, దానిని గత రాత్రి నేను పరిశుద్ధ గ్రంధములో చదువుచుంటినని నీకు తెలియును, మరియు సముద్రము యొక్క అడుగుభాగము ఎంతో కొన్ని ప్రదేశాలలో కనుగొనలేకపోవుచున్నారని, ఇచ్చట ఈ భూగోళ శాస్త్ర పుస్తకములో వారు చెప్పుటను నేను చదువుచుంటిని" అని చెప్పెను. "కొద్దిగా ఆలోచించుము, వారింకనూ ప్రయత్నించుచున్నారు" అని అనెను.

అది అతనికి సంతోషము కలుగజేయుచున్నది. కావున మీరు ఎచ్చట చూసిననూ దేవుని కనుగొనగలరు. చూడండి, మీరు గనుక చుట్టూ చూచినయెడల, ప్రతీది ఆయనను గూర్చియే మాటలాడును.

9ఇప్పుడు నిజముగా, యదార్ధముగా, నేను సహోదరుడు ఔట్లాతో ఇట్లన్నాను, "ఈ ఉదయమునకు నేను ఏమి మాటలాడవలెను? నీవు నీ క్రిస్మసు వర్తమానమును ప్రసంగించితివా?"

"అవును" అని అన్నాడు.

"మరి నీ నూతన సంవత్సర వర్తమానము?" అని నేను అడిగాను.

"లేదు."

కావున, ఒకవేళ ఎచ్చటికైనా నాకు ఆహ్వానము వచ్చినయెడల నేను నా నూతన సంవత్సర వర్తమానమును మాటలాడుదునని, ఇచ్చట నా వద్ద కొంత వివరణను కలిగియున్నాను. దానిని నేను వచ్చేవారమునకై సహోదరుడు ఔట్లాకి వదిలివేయుదునని నేను తలంచాను.

కావునా, ప్రభువు చిత్తమైనయెడల, కొద్ది నిమిషములు మనలను ఉంచునట్లు ఇక్కడ ఒక చిన్న పాఠ్యాంశమును నేను ఉంచబోవుచున్నాను. మరియు ఆయన మనలను ఆశీర్వదించునని మేము నమ్ముచున్నాము. ప్రసంగించుటకొరకై నన్ను ఇచ్చటకు ఆహ్వానించినందుకు సహోదరుడు ఔట్లాకు మరియు ఇక్కడున్న ఈ సంఘమునకు నేను కృతజ్ఞతలు చెల్లించ గోరుచున్నాను. మరియు నేను సహోదరుడు ఔట్లా చెప్పినట్లు, "మా స్నేహం ఎన్నడూ చెడిపోలేదు, అయితే దేవుని కృపయే ఈ సంవత్సరములన్నిటా మమ్మును కాపాడియున్నది. నేను వచ్చియున్న మరియు నన్ను ఆహ్వానించిన మొదటి సంఘము ఇదే, ఫినిక్స్ వద్దనేయైయున్నది.

10నాకు తెలియును… నేను ఇక్కడ సహోదరుడు ట్రాల్ ని చూచుచున్నానని నమ్ముచున్నాను. నేను అంత ఖచ్చితంగా చెప్పలేను… ముందు కూర్చునియున్నాడు. సహోదరుడా ట్రాల్, అది నిజమేనా? ఆ కాలమందు అతను మాతో కూడా ఉండియున్నాడని నేను నమ్ముచున్నాను. ఆ సమయములో అతడు నాకు ఇచ్చిన కొన్ని చిన్న వస్తువులు నా వద్ద ఉండియున్నవి; చిన్నవి… వాటిని వారు మలచిరి లేదా అటువంటిదేదో చేసియుండిరి. నీకు తెలియును, నీవు నివసించు స్థలము నుండి తీసుకురాబడిన చిన్న రాగి వస్తువులైయున్నవి. మరియు నీవు చుట్టూర చూచుచున్నావు. మరియు మనము ఆవలివైపునకు వెళ్లినప్పుడు ప్రజలను చూడబోవు ఆ ఉదయమున అది ఎట్లు౦డునా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను, నీకు తెలియును. వారు చెప్పుదురు, "మంచిది, అక్కడ…." మనము ఇప్పుడున్నదానికంటే, భిన్నముగా అక్కడ కనిపించెదమని మీకు తెలియును. అది సరియే. మనము పాపము లేదా వృద్దాప్యము యొక్క ఆనవాలు లేనివారిగా ఉండెదము. మనము సంపూర్తులుగా ఉండెదము. ఓ, ఈ శ్రమలన్నియూ తీరిపోవు ఆ సమయము కొరకై నేను ఎదురుచూచుచున్నాను, మీరు చూచుట లేదా?

11మరియు ఇప్పుడు, దేవుని యొద్ద నుండి అనుభూతి చెందుతున్న ఒక వర్తమానమును నేను కలిగియున్నాను. మరియు నేను నేను భిన్నముగా ఉండవలెనని కాదు, కానీ నేను నమ్మకముగా ఉండవలసియున్నది. మరియు నా ధృడమైన నమ్మకము గూర్చి నేను మాటలాడనియెడల, అప్పుడు మీకు నాయందు నమ్మకము ఉండదు. ఎందుకనగా నేను ఒక మోసగాడినో లేదా ఒక వేషధారినో అగుదును. మరియు నేను అది గాక ఇంకేదో అయి యుండును, మీరు చూడండి. నేను భూమిమీద కొందరు స్నేహితులను పోగొట్టుకొనవలసివచ్చునేమో, కానీ ఏది వాస్తవమని నేను తలంచుదునో అట్టి నా ధృడవిశ్వాస్యతల గూర్చి నేను నమ్మకముగా నిలబడగోరుచున్నాను.

JOHN 10:30

 

12ఇప్పుడు, సంవత్సరముల క్రితం, నేను ప్రారంభించినప్పుడు, అది చాలా సులువుగా ఉండియుండేది; ఆ సూచనలు, మరియు వర్తమానము, మరియు ప్రసంగించుటయైయున్నది. అంతటా, చేతులు చాపి "రండి! రండి! రండి!రండి!" అని ఆహ్వానించేవారు. అయితే పిదప, మీరు చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతీ నిజమైన సూచన వెంబడి ఒక వర్తమానము, ఒక స్వరము ఉండియుండును. చూడండి, అది దానిని వెంబడించును. అట్లు కానియెడల ఊరికే ఆటలాడుట కొరకు దేవుడు అటువంటిదేదియైనను ఇవ్వడు. ఆయన చెప్పవలెనని నిర్ణయించుకొన్నదానివైపు శ్రద్ధ చూపుటకు ఆకర్షించునదేదైనా ఆయన పంపించును. అది ఈ గాయకబృందం అద్భుతంగా పాడినట్లేయైయున్నది; అది ఎందుకొరకు చేయవలసియున్నది? అది రాబోవు వర్తమానము కొరకు ప్రజలను ఆయత్తపరచుటకైయున్నది.

అదే ఒక సూచన చేయుపని అదేయైయున్నది. మోషే సూచనలను కలిగియుండెను అను దానిగూర్చి గత రాత్రి మనము మాటలాడుకొనియున్నాము, మరియు ఆ సూచనలు స్వరములను కలిగియుండెను. మరియు ఆ… ఆ స్వరము మాటలాడినప్పుడు. యేసు రోగులను సైతం స్వస్థపరుచుచూ వెళ్ళియుండెను. ఆయన ఒక గొప్పవాడైయుండెను. అయితే ఒక సమయము వచ్చినప్పుడు, ఆ భూమి మీదనున్న ఆ ప్రవక్త నాలుగు వందల సంవత్సరాలుగా వారు ఒక్కరిని కూడా కలిగిలేరు, మరియు ఇచ్చట ఆయన భూమిపై ఉండెను మరియు సూచనలను చేయుచుండెను. అప్పుడాయనను "మంచి వ్యక్తి" అనిరి, అందరూ ఆయనను కోరుకొనిరి. అయితే ఆ సూచనను వెంబడించే వర్తమానము వచ్చినప్పుడు, స్వరము… ఒక దినమున ఆయన కూర్చుని, మరియు ఇట్లు చెప్పెను, "నేను, మరియు నా తండ్రి ఏకమైయున్నాము." ఓ, మై! అది ఏదో వ్యత్యాసముగానుండెను. వారికది అవసరము లేదు, చూశారా.

మరియు అది.. స్నేహితులారా, లోకమైతే సరిగ్గా ఆ రీతిగానే యున్నది, చూశారా. తమకి తాము సహాయము చేసుకోదగినటువంటి దేనినైనా వారు స్వీకరించగలరు, మీరు చూడండి… వారిని అది ఇబ్బంది పెట్టనంతవరకు, దానిని వారు చేయుదుమని అనుకొందురు. అయితే విషయముల పట్ల వారు తమ అభిప్రాయములను మార్చుకొనవలసిన సమయము వచ్చినప్పుడు, మరి అటువంటప్పుడే సమస్య వచ్చును.

13ఇప్పుడు, చూడండి, మనము ఒక గోడను కాదు కానీ, ఒక భవనమును నిర్మించుచున్నాము. నిర్మాణకులు ఒక వరుస ఇటుకలను తీసుకొని మరియు తిన్నగా అమర్చుటకు వెళ్ళగోరుదురు. ఇప్పుడు ఏ నిర్మాణకుడైనా దానిని నిర్మించగలడు. అయితే మూలమలుపు త్రిప్పుటకు ఒక అసలైన నైపుణ్యతగల పనిమంతుడు అవసరమైయుండును, చూశారా. మీరు మూలను త్రిప్పవలసినప్పుడే, ఆ సమయములోనే అది అవసరమైయుండును. అది నీవు ఒక నీవు దానితో మూలమలుపును త్రిప్పగలిగి మరియు ఆ మిగతా భవనముతో దానిని కొనసాగించగలుగుచూ తప్పక మలుపు త్రిప్పగలిగినప్పుడే, అది నీవు ఒక నిజమగు సామర్థ్యముగల మేస్త్రీవా లేదా అని చూపించును; ఇప్పుడు ఈ మూలమలుపుల వద్దనే సమస్యలు వచ్చును. ఆ నిర్మాణకులు నిర్మించుటను కొనసాగించుచునే యు౦దురు. అయితే మనము ఒక గోడను నిర్మించుట లేదు; కానీ ఒక భవనమును నిర్మించుచున్నాము.

ఇప్పుడు ఈ ఉదయం మనము దీనిని సమీపించుండగా, మీరు నా కొరకు ప్రార్థించుడి, మరియు నేనెల్లప్పుడూ మీ కొరకు ప్రార్ధించుచుంటిని. మరియు ఇప్పుడు గొప్ప దేవుడైన యెహోవా యొక్క సన్నిధిలో, ఒక క్షణము మన శిరములు వంచెదము. మరియు మనము అందరము మన కొదువుతనమును గ్రహించియున్నాము. మరియు అవసరతలో ఉన్నవారము మనమే కాదు. అయితే మనము ప్రార్ధించుచుండగా, ఒక ప్రత్యేక అవసరత కలిగినవారెవరైనా మీలో ఉన్నారేమోయని నేను ఆశ్చర్యపోవుచున్నాను?

14మీకు తెలియును, గడిచిన దినమున ఇచ్చట ఫీనిక్స్ వద్ద కూటములో నేను చెప్పిన ప్రకారము, నిత్యుడైన ఆ దేవుడు టెలివిజన్ వలె అది ఉన్నది, అది వచ్చుచున్నది, సరిగ్గా ఇప్పుడు ఇచ్చటే ఈ భవనములో క్రీస్తు ఉండియున్నాడు. చూడండి, మీరు చేసే ప్రతీ కదలిక, మీరు కనురెప్ప వేసిన ప్రతీసారీ, అది ఎన్నటికీ మృతము కాదు. అది గాలిలోని ఈథర్ తరంగములలో ఉండియున్నది. టెలివిజన్ దానిని ఉత్పత్తి చేయలేదు. అది కేవలం మీ యొక్క తరంగమును చిక్కించుకొనును మరియు ఒక తెరపై దానిని ప్రదర్శించును. అది ఎట్లైననూ అచ్చటే ఉండియున్నది. అది ఎప్పుడూ అలాగే ఉండియుండును. మీరు చేయు ప్రతీ కదలిక, గాలిలో ఇంకనూ సజీవముగానే ఉండియుండును. తీర్పునొద్ద మన పరిస్థితి ఏమైయుండునో, ఇప్పుడు మీరు చూచుచున్నారా?

కావున, దేవుడు ఆ విధానములోనే ఇచ్చట ఉండియున్నాడు. ఆ టెలివిజన్ దృశ్యములను మనము చూడలేనట్లుగానే ఆయనను మనము చూడకుందుము. ఆ స్వరమును అందుకొని మరియు ఆ దృశ్యమును పునరుత్పత్తి చేయుటకు మరియు ఇంకా అటువంటివి చేయుటకు ఒక ఫలానా ట్యూబు లేదా ఏదైనా క్రిస్టల్ అవసరమైయున్నది. ఆదాము భూమిపై ఉన్నప్పుడే అది ఇచ్చట ఉండియున్నది, అయితే మనము ఇటీవలే దానిని గుర్తించియున్నాము. ఈ ఉదయం దేవుడు ఇచ్చట ఉండియున్నాడు. మరియు ఏదో ఒక దినమున, వెయ్యేండ్ల పాలనలో మనము గ్రహించబోవుచున్నాము. ఈ ఉదయకాల కూటములో ఆయన ఖచ్చితముగా ఇచ్చట ఉండియున్నాడనునది, టెలివిజన్ లేదా అట్టి సంగతులకంటెనూ ఎంతో వాస్తవమై ఉండబోవుచున్నది.

ఇప్పుడు మనము… ఆ తలంపునే కలిగియుండగా, మీకు ఏది అవరమైయున్నదో దానిని మీ హృదయములో ఉంచుకొనుడి మరియు కేవలం మీ చేయి ఆయనతట్టు ఎత్తుడి మీరట్లు చేయుదురా? చెప్ప౦డి, "ప్రభువా…" మరియు ఆ తలంపును గూర్చి మీ హృదయములో ఆలోచించుడి.

JOHN 16:23

 

15పరలోకపు తండ్రీ, ఇప్పుడు, మేము సమీపించుటకు ఈ ఒక్క మార్గమునే కలిగియున్నాము, మరి అది ప్రార్ధన ద్వారాయైయున్నది. మరియు మేము ప్రభువైన యేసు నామములో వచ్చుచున్నాము. దానిని ఉపయోగించుటకై ఆ నామమును ఉచ్ఛరించుటకైననూ మేము అర్హులము కాము. మేము కాము… మేము ఏ ప్రకారముగానైనా అర్హులమని తలంచుటలేదు, అయితే మేము ఆహ్వానించబడియున్నాము గనుక దీనిని చేయుచున్నాము. మరియు ఆయన ఇట్లు చెప్పెనని మేము ఎరిగియున్నాము, "నా నామమున తండ్రిని మీరు ఏది అడిగిననూ, దానిని నేను అనుగ్రహించెదను." మరియు మేము… అది ఆయన యొక్క వాక్యమైయుండుటను బట్టి మరియు ఆయన ఎవరనునది గ్రహించి, దాని పక్షమున మన విశ్వాసము నిలిచియుండిన చాలును, అప్పుడు మనము అడిగిన దానిని పొందుకొనెదమను నిశ్చయతను కలిగియుండెదము. నీవు ప్రతీ విన్నపమును చూసియున్నావు. నా చేతిని నీవు చూసియున్నావు. నా విన్నపమును నీవు ఎరిగియున్నావు.

మరియు తండ్రీ, వారిలో ప్రతీఒక్కరి కొరకు నేను ప్రార్ధించుచున్నాను. వారు కలిగియున్న ప్రతీ అవసరతను. ప్రభువా, ఇటువంటి ఒక గుంపు ఏదైనా తప్పుడు వాటి కొరకు అడిగెదరని నేను నమ్ముట లేదు. అది వారు పొందబోవు రాజ్యము యొక్క ఘనతకైయుండును, అది స్వయంగా వారి స్వస్థత నిమిత్తమే అయి యుండవచ్చును; మరియు దానిని చేయుటలో, వారికి అవసరత వచ్చియుండును… లేదా వారి స్వంత గ్రహింపు కొరకైయుండును. వారు అవసరతను కలిగియున్నది దేవుని యొక్క రాజ్యమునందు వారికి ప్రోత్సాహకరముగా ఉండుట కొరకైయున్నది.

REV 5:5

 

16మరియు దేవా, ప్రతీయొక్కరి విన్నపము అనుగ్రహించబడునట్లు నేను ప్రార్థించుచున్నాను. ఈ సంఘమును, దానియొక్క సంఘ కాపరిని, దానియొక్క సహకారులను, మరియు సంఘ పెద్దలను, కోశాధికారులను, దానియొక్క సభ్యులందరినీ, సందర్శకులను, అపరిచితులను ఆశీర్వదించుము. ప్రభువా, వారు అపరిచితులు కారు. కృపను బట్టియు మరియు క్రీస్తును బట్టియు మేమంతా నీ పిల్లలమైయున్నాము. మరియు ఇప్పుడు, ఈ ఉదయం నీవు మాకు జీవాహారమును ఇచ్చెదవనియు, తద్వారా మేము అడిగిన ఈ విన్నపములు మాకు అనుగ్రహించబడియుండెనను అవగాహనతో మేము ఇచ్చట నుండి వెళ్ళెదమని ప్రార్ధించుచున్నాను

ప్రభువా, నేను దానిని చదువుచుండగా, నీ వాక్యమును ఆశీర్వదించుము. వాక్యమును అనువదించుటకు చాలిన లేదా సామర్థ్యము కలిగిన ఏ వ్యక్తియూ లేకుండెను. సింహాసనమందు ఆసీనుడైనవాని చేతిలో ఆ పుస్తకమును యోహాను చూసియుండెను, మరియు పరలోకమందు గానీ, లేదా భూమిమీద గానీ, లేదా భూమి యొక్క అడుగు భాగమందు గానీ, కనీసం ఆ గ్రంధమును చూచుటకైననూ అరులైనవారెవ్వరూ లేకుండెను. అయితే పెద్దలలో ఒకరు ఇట్లనిరి, "ఇదిగో యూదా గోత్రపు సింహము జయించియుండెను." ఒక సింహము కొరకు వెదకుచున్న యోహానుకు ఒక వధింపబడిన గొర్రెపిల్ల కనబడెను, రక్తము కార్చుచున్న ఆ గొర్రెపిల్ల ముందుకు వచ్చి మరియు ఆ పుస్తకమును తీసుకొని, ఒక సింహాసనమును అధిరోహించి కూర్చునియుండెను. మరియు పరలోకపు ప్రముఖులందరూ వారి తలలపై నుండి వారియొక్క కిరీటములను తీసివేసి మరియు ఆయనే అర్హుడని తెలిసికొని సాగిలపడిరి.

ప్రభువా, ఈ ఉదయం ఆయన మా హృదయపు సింహాసనమునొద్దకు వచ్చునని మేము ప్రార్ధించుచున్నాము. దానిని అధిరోహించి, మేము కలిగియున్న ప్రతీ తలంపును స్వాధీనపరచుకొని, మరియు ఆయన గూర్చియు మరియు మా జీవితాలలో ఆయన యొక్క ప్రణాళికను గూర్చియూ మేము మరింతగా తెలుసుకొనునట్లు వాక్యము ద్వారా మాతో మాటలాడుము. దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

MATT 21:10,11

 

17ఇప్పుడు, పరిశుద్ధ గ్రంధములో మీరు త్రిప్పగోరినయెడల… మత్తయి సువార్త 21వ అధ్యాయములో కనుగొనబడిన లేఖనమైయున్నది, మరియు ఇక్కడి నుండి ప్రారంభించి… మత్తయి సువార్త 21వ అధ్యాయములో 10వ మరియు 11వ వచనమును మనము చదివెదమని నేను తలంచుచున్నాను. సరిగా ఉండుడి, ఈ సెలవుల్లో మీరిదివరకే దానిని చదవనియెడల, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ అధ్యాయమంతయూ చదివితే, అది చాలా బాగుంటుంది. అదంతయూ బాగుండును. మరి విశేషముగా, ఈ తరునమునకై ఈ వర్తమానమును తీసుకువచ్చునట్లు, పరిశుద్దాత్మ నాకు అనుమతించెనని నేను ఆశిస్తున్నాను.

మనము చదువుచుండగా 10వ వచనమును మరియు 11వ వచనమును గమనించెదము.

ఆయన యెరుషలేములోనికి వచ్చినపుడు, పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను.

జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

ఇప్పుడు దేవుడు తన వాక్యమునకు ఈ చదువబడిన లేఖనమునకు పాఠ్య సందర్భమును జతచేయును గాక.

ZECH 9:9•

MATT 21:5,10

 

18ఇది ఏ సమయమున జరిగెనో ఇప్పుడు మనము ఎరిగియున్నాము, మరియు ఈ అధ్యాయంలోని ఈ లేఖనమును మీలో చాలామంది బాగుగా ఎరిగియుందురు. నిజముగా అది క్రీస్తు ఈ చిన్న గాడిదపై స్వారీచేయుచూ, యెరుషలేములోనికి వచ్చిన దినమునైయుండెను. మరియు మనము… "అది ఒక తెల్లని గాడిద," అని చెప్పునట్టి ఇతిహాసము కలదు. ఒక యుద్ధగుర్రముపై ఆయన యొక్క రెండవ రాకడను ఇదొక దృష్టాంతరముగా కనబరచుటను నేను ఊహించుచున్నాను. ఆ సమయమున, ఆ ప్రవక్త ఇట్లనెను, "నీ రాజు దీనుడు, నీతిపరుడై గాడిదపిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు." ఆయన వచ్చునది ఆ రీతిగానైయున్నది, మరియు… ఒక చిన్న భారమును మోయు, చిన్న గాడిదమీదయైయున్నది. అయితే తరువాతసారి ఆయన మహిమ నుండి వచ్చును (ప్రకటన గ్రంధంలోని 19వ అధ్యాయమైయున్నది), ఆయన ఒక జయశీలునివలె వచ్చును. ఒక తెల్లని గుర్రముపై కూర్చుండియున్న ఆయన యొక్క వస్త్రము రక్తములో ము౦చబడియుండెను, మరియు పరలోక సైన్యమంతయూ తెల్లని గుర్రములపై ఆయనను వెంబడించుచుండిరి. మరియు ఆ ఇతిహాసము (లేఖానానుసారమైననూ లేదా చారిత్రికమైననూ కాదు)… అయితే ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఒక తెల్లని గాడిదపై స్వారీ చేయుచూ వచ్చునని ఆ ఇతిహాసము నమ్ముచున్నది.

19ఇప్పుడు నేను దీనిని ఎన్నుకొనియున్నాను… అది ఇంకనూ…

ఎందుకనగా మనము ఆ ఛాయలలో ఉన్నాము. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగకాలములో ఉన్నాము; పాత సంవత్సరము యొక్క ముగింపులో మరియు ఒక నూతన సంవత్సర ఆరంభములో యున్నాము. ఇప్పటి నుండి కొద్ది దినములలో, అనేకులు క్రొత్త పేజీలను త్రిప్పుదురు మరియు క్రొత్త కార్యములను చేయుచూ మరియు క్రొత్త ప్రమాణములను చేయుదురు; మరియు అది ఒక నూతన సంవత్సరమునకు ఆరంభమైయున్నది. మరియు అది క్రిస్మస్ వలెనె నాకెన్నడూ అంతగా అనిపించదు. ఎందుకో నాకు తెలియదు, నేను దానిని ఎల్లప్పుడూ "సా౦తక్లాస్ దినము" అని పిలువగోరుదును. చూశారా? ఎందుకనగా అక్కడ అంత వాస్తవమైనది లేదు…

అది క్రీస్తు యొక్క జన్మదినమైయుండదు. అది ఖచ్చితముగా కాకుండును. ఆయన మార్చి లేదా ఏప్రిల్ లో జన్మించియుండవచ్చును, ఎందుకనగా ఆయన గొర్రెపిల్లయైయుండెను. మరియు ఆయన ఒక మగ గొర్రెపిల్లయైయుండెను మరియు గొర్రెపొట్టేలుకు చెందిన మేషరాశినందు జన్మించియుండెను. అది అట్లేయైయుండ వలసియున్నది, మీరు చూడండి. మరియు ఎట్లైననూ గొర్రెలు డిశంబరులో జన్మించవు. గొర్రెపిల్లలు వసంతకాలములో జన్మించును. మరియు పిదప మరొక విషయము ఏదనగా, ఇప్పుడా యూదయ కొండలు, దానిపై ఇరువది అడుగుల మంచు ఉండియుండును. ఆ గొర్రెల కాపరులు అచ్చట ఎట్లు ఉండగలరు?

20కావున అది వాస్తవముగా రోమన్ కల్పిత కధ నుండి వచ్చిన, సూర్య-దేవుని యొక్క జన్మదినమైయున్నది. ఆ వేసవి ఎండ కాయుచుండగా, పగటివేళలు ఎక్కువగుచూ, ఎక్కువగుచూ, మరియు రాత్రులు తగ్గిపోవును. మరియు రోమన్ పురాణ కల్పిత గాధ ప్రకారంగా, డిశంబరు 20 మరియు 25 మధ్యన సూర్య-దేవుని యొక్క జన్మదినమైయున్నది, మరియు పిదప వారి దేవుళ్ళు. మరియు పిదప వారు సూర్య-దేవుని యొక్క జన్మదిన వేడుకను జరుపుకొనేవారు. కాన్స్టాంటైన్ మరియు కొందరు, సంఘము మరియు దేశము యొక్క రాజ్యాంగమువంటి మొదలగువాటిని, రూపొందించుకొనియున్నారు. "మనము దానిని మార్చెదము అని అతను చెప్పెను [అది ఏ దినమో తెలియక] మరియు దానిని సూర్య-దేవుని యొక్క ( Sun-god) జన్మదినమునకు మార్పుచేసి దానిని దేవుని కుమారుని జన్మదినముగా రుపొందించిరి (Son of God birthday)," చూసారా. అయితే అది ఏ దినమో మనకు తెలియదు.

అయితే, ఇప్పుడు వారు, క్రీస్తును పూర్తిగా తొలగించివేసి, అది ప్రతీది అగునట్లు చేసిరి. మరలా కొందరు ఏదో పరిశుద్ధ నికోలస్ లేదా క్రిస్ క్రింగేల్ అను పేరుగలవారు జీవించియుండిరని ఊహించి, ఒక కల్పిత-గాధను తిరిగి తీసుకు వచ్చిరి, అదొక జర్మను దేశపు కట్టు-కధయైయున్నది. మరి అదంతయూ కేవలం ఒక కల్పితమైయున్నది. మరియు క్రీస్తు అందులో లేనేలేడు.

మరియు ప్రజలు విస్కీని కొనుటకు, మరియు జూదమాడుటకు మరియు ఫ్యాషన్లకు దానిని మార్చివేసిరి. మరియు ఒక వ్యక్తి క్రిస్మసు సమయములో తన సరుకులను అమ్మెడి ఒక వర్తకుడు దాదాపు ఆ సంవత్సరమంతా ఇట్టే బ్రతికేయగలడు, చూశారా. అది అటువంటి ఒక పెద్ద వ్యాపారసంబంధమైన సెలవుదినమైయున్నది. మరియు పేద పిల్లలు వీధిలో ఉండెదరు; వారియొక్క తల్లిదండ్రులు స్యాంతాక్లాస్ వలె వారిని ఒక బహుమానముతో దర్శించలేకపోదురు, మరియు ఆ పిల్లలు, చిన్న మురికి చేతులతోను మరియు ఎర్రబడిన కళ్ళతో వీధులలో తిరుగుచునుండెదరు. అటువంటివి జరుగుటను చూచుటకు నేను అస్సలు ఇష్టపడను. ఒక గుండె నొప్పి మరియు ఒక తల నొప్పితో కూడిన కార్యములు జరుగుటకు బదులు అది దేవుణ్ణి భయభకులతో ఆరాధి౦చునట్టి ఒక దినమైయుండవలసియున్నది. దాని విషయమై క్రీస్తుకు ఎటువంటి సంబంధము లేకుండెను. అయితే మనము ఇప్పుడు సరిగ్గా వీటన్నింటి మధ్యన ఉండియున్నాము.

21అప్పుడు వారున్నట్లే, మనమును ఉండుటను మనము స్వయంగా కనుగొనుచున్నాము. చూడండి, అది ఇప్పుడును ఒక గొప్ప పండుగలోకి ప్రవేశించినట్లేయున్నది. యేసు ఒక వస్కా పండుగకు వచ్చుచుండెను. మరియు ఆయన యెరుషలేమునకు ప్రవేశించియుండెను… లేదా యెరుషలేములోనికి ప్రవేశించుచుండెను. మరియు ప్రతిదాని విషయమై ఆయన చేసిన ప్రవచనములన్నియు నెరవేరవలసియున్నవి. పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రతీదానికి ఒక అర్ధము కలదు. ప్రతీ పేరుకి ఒక అర్ధమున్నది. లేఖనములో ఏదియూ ఒక గూడార్ధము లేకుండా వ్రాయబడియుండలేదు.

గతరాత్రి టూసాన్లో, వేదపండితులకు బదులు అది గొర్రెల కాపరులకే ఎందుకు? అను దానిపై నేను మాటలాడియుంటిని, ఆయన సరిగ్గా సంఘ పక్షమునే జన్మించియుండెను. మరియు పరిశుద్ధాత్మ అరణ్యములోకి వెళ్ళి వేదాంతులను కాదు గానీ గొర్రెలకాపరులను ఎన్నుకొనెను. అది ఆ రీతిగానే ఉండవలసియున్నది. అటువంటి ఒక వర్తమానమును వేదపండితులు నమ్మకపోదురు. కావున వారు… అది గొర్రెలకాపరులకేయై ఉండవలసియున్నది.

నేను కొన్ని సంవత్సరముల క్రితం, "అది అల్పమైన బెత్లెహేము ఎందుకు?" అని ఒక రెండు సంవత్సరముల క్రితం ఇక్కడ ప్రసంగించియుంటిని. ప్రభువు చిత్తమైనయెడల, మరుసటి క్రిస్మసునకు, "అది జ్ఞానులకు మాత్రమే ఎందుకొరకు కనబడెను?" అను దానిపై ప్రసంగించుదును. ఈ "ఎందుకు? అనువాటికి జవాబులు ఉండియున్నవి, మరియు అవి సరిగ్గా ఇచ్చట బైబిలునందే ఉండియున్నవి. మరియు మనము అన్ని గొప్ప కాలముల కంటే ఒక అద్భుతమైన కాలములో జీవించుచున్నాము. మనము జీవించుచున్న కాలము ఎట్టిదనగా, ఏ సమయములోనైనా కాలము ముగించబడి మరియు నిత్యత్వము ఖచ్చితముగా దానితో ఐక్యమై మరియు అట్లు కొనసాగిపోవును. ప్రవక్తలు మరియు జ్ఞానుల యొక్క కాలములన్నియు దానికొరకు కనిపెట్టుచుండెను. మనము ప్రతీ ఘడియ ఆయన రాకడకై కనిపెట్టుచూ, మెలకువగా ఉండవలసియున్నది.

22మొదటి క్రిస్మసులో సరిగ్గా వారు చేసినట్లే, మనము ఈ క్రిస్మసునొద్ద చేయుచున్నట్టు మనల్ని మనము కనుగొన్నాము. ప్రపంచము పతనమగుటకు దగ్గరలో ఉండియున్నది. ఒకసారి, నేను ఎక్కడో, ఒక క్రిస్మసు వర్తమానము గూర్చి ప్రపంచము తునాతునకలగుచున్నదని ప్రసంగించియున్నాను. మరియు మరలా ప్రపంచము ముక్కలవ్వబోవుచున్నది. ఇచ్చట కాలిఫోర్నియాలోని భూకంపములను పరిశీలించండి. ప్రభువైన యేసు యొక్క రాకడకు ముందు, దేవుడు ఆ స్థలమును ము౦చివేయునని నేను ఊహించుచున్నాను. హాలీవుడ్ మరియు లాస్ఏంజిల్స్ మరియు అచ్చటనున్న ఆ అసభ్యమైన ప్రదేశములను, వాటన్నిటిని సర్వశక్తుడైన దేవుడు ము౦చివేయునని నేను నమ్ముచున్నాను. అవి సముద్రము యొక్క అట్టడుగునకు మునిగిపోవును. మరియు మీరు చూడండి, అది ఎంతగానో పాపముతో నిండియున్నది, ఇక నాశనమే దానికి హద్దుయైయున్నది.

నాగరికత సూర్యునితోపాటు ప్రయాణించెను. మరియు అది తూర్పున ప్రారంభమై, పశ్చిమమునకు పోవుచుండెను. మరియు ఇప్పుడది పశ్చిమ తీరమున ఉండియున్నది. అది గనుక ఇంకా ముందుకు పోయినయెడల, అది తిరిగి మరలా తూర్పునకు వచ్చును. కావున అదియే సరిహద్దుయైయున్నది. మరియు నాగరికతతోపాటు పాపము కూడా ప్రయాణించెను, మరియు అది అన్ని కాలముల యొక్క మురికి గుంటవలెనె అయ్యెను. వారెట్టి క్రియలు చేయుదురనగా, వేరే ఏ కాలములోనూ మనుష్యులు అటువంటిదానిని తలంచనేలేదు. ఈనాడు మనము చేయుచున్నటువంటి వాటి గూర్చి ఏ కాలములోనూ ఏ స్త్రీయైనను ఆలోచించనేలేదు, అంతగా స్త్రీలు అపవిత్రతకు తమను తాము అప్పగించుకొనియున్నారు. మరి అయిననూ మనల్ని మనము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నాము. అది ఎటువంటి ఒక అవమానకరమైన విషయమైయున్నది!

AMOS 3:8

 

23గొప్ప ప్రవక్త యొకరు లేచి మరియు ఇట్లు చెప్పినందుకు ఆశ్చర్యపోనవసరం లేదు, "నేను ఒక ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క కుమారుడనైనను కాను, కానీ.." ఇట్లనెను: సింహము గర్జించెను, భయపడనివాడెవడు? మరియు ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు? చూశారా, అచ్చట బిగ్గరగా పిలుచుటకు ఏదో కార్యము ఉండియున్నది.

మనము ఒక క్లిష్టమైన ఘడియలో ఉండియున్నాము; ప్రపంచము అట్లండియున్నది. అయితే సంఘము, నిజమగు సంఘము (సంఘ శాఖ కాదండి); అయితే, మందెన్నడూ మ్రోగనటువంటి ఆ గొప్ప బూరధ్వనికై సంఘము తనను తాను సిద్ధపరచుకొనియున్నది: పెండ్లికుమారుడు తన వధువు కొరకు వచ్చుటయైయున్నది.

మనము వేర్పాటై వచ్చుచున్నాము, ఒక మెస్సీయా కొరకు ఎదురుచూచుచున్నాము, ఏదైనా వచ్చి మరియు మనలను రక్షించి దానంతటి నుండి మనలను బయటకు తీసుకురావలెనని మనము కనిపెట్టుచున్నాము. మనము తూర్పున జరుగు శ్రమలను చూచుచున్నాము. మనము జాతి విభేదములు, మరియు విలినీకరణము, మరియు వేర్పాటులాంటి తిరుగుబాట్ల ఆఫ్రికాలో తలెత్తడం మనము చూచుచున్నాము. మరియు "మనము తప్పక కలిగియుండాలి, మనము తప్పక సమైఖ్యమైయుండాలి. మనకు కావలసినది అదే. మాకు తప్పక సమైఖ్యము కావాలి; మానవులంతా, సమానమే; ప్రతీ మనిషి తల వంచి…" అంటూ కేకలువేయుచూ ఇటీవలే మనందరము (మన నల్లజాతి స్నేహితులు) ఉద్యమించియున్నాము. అది సంపూర్ణముగా సరియే, అది ఖచ్చితముగా సరియే, నేను బానిసత్వము పట్ల నమ్మికయంచను. ఆ ప్రజలు ఆది నుండి బానిసలు కాదు. వారు బానిసలు కాదు.

24దేవుడు ఒక వేర్పాటును కోరువాడైయున్నాడు. నేను కూడా అంతే. ఏ క్రైస్తవుడైనా ఒక వేరుచేయబడ్డవాడైయున్నాడు. దేవుడు తన ప్రజలను ఆ మిగతావారందరి నుండి ప్రత్యేకపరచును. వారు ఎల్లప్పుడూ ఒక విభజన జరుగుతూనేయున్నది. ఆయన ఒక దేశమును ఎన్నుకొనును. ఆయన ప్రజలను ఎన్నుకొనును. ఆయన ఒక విభజన కోరువాడైయున్నాడు. ఆయనే దేశములన్నిటినీ కలుగజేసెను. అయిననూ, ఒక నిజమగు అసలైన క్రైస్తవుడు ఒక వేర్పాటును కోరువాడైయుండవలసియున్నది. లోకము యొక్క కార్యముల నుండి మరియు ప్రతీదాని నుండి తననుతాను వేరుపరచుకొని మరియు యేసుక్రీస్తు అను ఒకే ఒక్క ఉద్దేశ్యమునకు రావలసియున్నది.

అయితే వారట్లు కేకలువేసిరి. "మన దేశమును కాపాడునది అటువంటిది కాదు. అది ఒక రాజకీయ యుక్తి మాత్రమేయైయున్నది. అది ఒక కమ్యూనిష్ణు నేపధ్యంతో కూడిన కార్యమైయున్నది" అని నేను వారితో చెప్పుటకు ప్రయత్నించితిని. మార్టిన్ లూధర్ కింగ్ తన ప్రజలను ఒక పెద్ద వధకు, మరియు మునుపెన్నడూ ప్రవేశించనటువంటి మారణకాండకు వారిని నడిపించబోవుచుండెనని నేను తలంచితిని. మరియు వారు… మీరు చూడండి, అది ప్రపంచమును ఒకటిగా తీసుకు వెళ్ళదు. మనము వారికి సమైఖ్యను ఇచ్చెదము. అటువంటిది మనలను కాపాడనేరదు. అది ఇదివరకంటే ఇప్పుడు ఇంకా నీచమైపోయినది. చూడండి, అది కాదు… ప్రశ్న అది కాదు. ఒక్కటి మాత్రమే కలదు: అది దేవుడే. మరియు నిశ్చయంగా వారు దానిని కోరుకొనరు.

వారు అప్పుడు ఆయనను కోరుకొనలేదు. వారు తునాతునకలైపోవుచున్నారు, మరియు వారి రాజకీయము తునాతునకలగుచున్నది, వారి దేశము బ్రద్ధలగుచున్నది, వారి సంఘము ముక్కలగుచున్నది, మరియు వారు ఒక మెస్సీయ కొరకు మొర్రపెట్టుచుండిరి. ఆయన కావలెనని వారు కోరుకొనిరి. "ఓ, మా కొరకు ఒక మెస్సీయను పంపుము." అయితే ఆయన వచ్చినప్పుడు…

25దేవుడు మీ ప్రార్ధనకు జవాబునిచ్చును. మీరు అడిగితిరి గనుక మీరు పొందుకొనెదరు. మరియు అది… నేను ఇచ్చట నిలిపివేసి మరియు దేనికొరకైనా ప్రార్ధించే స్త్రీలు, పురుషులు, మరియు క్రైస్తవుల గూర్చి కూడా కొన్ని గంటలు తరబడి చెప్పగలను; మరియు దేవుడు జవాబునిచ్చును గానీ వారు కనీసం దానిని గుర్తించకుందురు.

మరియు ఇప్పుడు, దేవుడు వారికి జవాబునిచ్చెను. వారు ఒక మెస్సీయను కోరుచుండిరి. వారు కైసరులను కలిగియున్నారని వారికి తెలియును, వారు దావీదులను కలిగియున్నారు, వారు సొలొమోనులను కలిగియున్నారు (జ్ఞానము గలవారు), వారు దావీదులను కలిగియున్నారు (గొప్ప యోధులైనవారు), వారు అన్ని విధములైనవి కలిగియున్నారు, అయితే వారికి పరలోకము నుండి సహాయము కావలసియుండెనని వారు ఎరిగియున్నారు మరియు వారు… దేవుడు వారికి ఒక మెస్సీయను వాగ్దానము చేసియున్నాడు. మరియు వారి ప్రార్థనకు జవాబుగా, ఆయన వారికి ఆ మెస్సీయను పంపెను, కానీ వారికి ఆయన అవసరము లేదు.

26ఈనాడు, నేను ఆశ్చర్యపోవుచున్నాను, ఒకవేళ మన ప్రార్థనలు. "ఒక గొప్ప ఉజ్జీవము కొరకు ప్రార్ధించుడి. దీనికొరకు ప్రార్ధించుడి. ఒక పురోగమనం కొరకు ప్రార్ధించుడి. ఐక్యత కొరకు ప్రార్ధించుడి" అని వారు చెప్పుటను మీరు విందురు. దేవుడు అటువంటి ఒక కార్యక్రమమును పంపినయెడల, దానిని మనము అంగీకరించగలమాయని నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఆయన మనయొద్దకు పంపినదానిని మనము అంగీకరించినచో నేను ఖచ్చితముగా ఆశ్చర్యపోదును, మీరు చూడండి, ఆయన… మనము ఈ సంగతుల కొరకు ప్రార్ధించుటకు కారణమున్నది… ఎందుకనగా అది అవసరమని మనము ఎరిగియున్నాము. అయితే దేవుడు ఆయన కోరిన విధానంలో దానిని పంపినప్పుడు, మన అభిరుచికి తగినట్టుగా అది లేనందున, దానిని మనము స్వీకరించుటలేదు. మరి ఆ దినమున అది ఆ విధంగా ఉండెను. ఆయన వారి నమ్మకమునకు అనుగుణంగా లేనియెడల, వారు మరలా ఈ దినమున కూడా ఆయనను స్వీకరించకుందురు. ఆ కారణమును బట్టియే వారు ఈ ప్రశ్నను అడిగిరి, "ఈయన ఎవరు? వచ్చుచున్న ఈ వ్యక్తి ఎవరు?" చూడండి, అది ఒక మహత్తరమైన సమయమైయున్నది. ఓ, ప్రతీయొక్కరూ… ఒక ఒత్తిడిలోనున్నారు. ఏదో జరగనైయున్నది.

27మరియు ఈనాడు లోకమువైపు చూడండి, ప్రపంచమంతయూ ఎటువంటి ఒత్తిడిలో జీవించుచున్నదో చూడండి. మీరు వీధిలోకి వెళ్ళండి. కనీసం వాహనమును నడుపుటకైనా సురక్షితముగా లేకుండెను. నాలుగు రోడ్ల రహదారిపై ప్రయాణించుట కూడా సురక్షితముగా లేకుండెను. ప్రతీఒక్కరూ నరములు తెగిపోయేంతటి ఒక ఉద్రిక్తతలో ఉండియున్నారు. మరియు విషయం ఏమిటి? శాంతముగా ఉండుడి. మీరెచ్చటికి పోవుచున్నారు? పిచ్చి ఆస్పత్రులు నిండిపోవునట్లు చేయునది అదేయైయున్నది. సంఘమును అటువంటి ఒక ఆందోళనకు గురిచేసినది అదేయైయున్నది. వారు తలబిరుసుతనముతో ఏదో ఒక విషయమునకు కట్టుబడియుందురు. వారు నిలిచి మరియు దేవుని యొక్క వాక్యమును, మరియు మనము జీవించుచున్న ఘడియను విచారింపరు; అందరూ ఉద్రిక్తతలోను, ఒత్తిడి క్రింద ఉండియున్నారు.

28మరియు ఇప్పుడు, మనకు తెలియును. మనము బాగుగా ఎరిగియున్నాము. భూమి గొప్ప ప్రసవనొప్పలగుండా వెళ్ళియున్నది. మరియు సంఘము ఒక ప్రసవనొప్పుల గుండా వెళ్ళుచున్నది. అది జన్మనిచ్చుటకు ముందు అది ప్రసవ నొప్పలగుండా వెళ్ళవలసియున్నది. ప్రవక్తలలో ప్రతీయొక్కరూ, లోకమునకు వారు వచ్చినప్పుడు, అది సంఘమునకు ఒక ప్రసవనొప్పియైయున్నది. లోకము ఒక మొదటి ప్రపంచయుద్ధము, రెండవ ప్రపంచయుద్ధము గుండా వెళ్ళియున్నది, మరియు ఇప్పుడు అది ఒక మూడవ ప్రపంచయుద్ధమునకై సిద్ధమగుచున్నది. మరియు అది మరలా ప్రసవనొప్పులుపడుచున్నది. అయితే సమాధానమును తీసుకువచ్చునది ఒకే ఒక్కటి ఉన్నది, మరి అది క్రీస్తే

మన పధకాలన్నియు, మరియు మన ఉపాయములన్నియు, మరియు మన మతాధికారుల సన్నాహాలు, మరియు మన రాజకీయమంతయూ, మరియు మన విజ్ఞాన శాస్త్రమంతయు మరియు ప్రతీది, అదంతయూ బుద్ధిహీనతయుని రుజువు చేయబడియున్నది. మరియు పిదప మాకు సహాయము చేయమనియు, మధ్యవర్తిత్వము చేయమనియు, "వచ్చి మా కొరకు ఏదైనా చేయుము" అని మనము దేవునికి ప్రార్ధించుచుండెదము, మరియు ఆయన దానిని చేసినప్పుడు, మనము దానిని గ్రహించగలమా; మనము దానిని స్వీకరించగలమా; లేదా కనీసం దానిని మనము విచారించెదమా? అని నేను ఆశ్చర్యపోవుదును.

LUKE 19:40•

JOHN 1:14

 

29ఆ వెనుకటి రోజుల్లో జరిగినది అదేయైయున్నది. వారు ప్రార్ధించుచుండిరి, వారు అన్ని విధములైన గొప్ప నాయకులను కలిగియున్నారు, వారు ప్రభుత్వముల క్రింద ఉ న్నారు, వారు రాజత్వము క్రిందనున్నారు, వారు ప్రతీది, న్యాయాధిపతుల క్రిందనున్నారు. అయితే వారిని రక్షించగలిగినది ఒకే ఒక్కటని వారు ఎరిగియున్నారు, అది రానున్న మెస్సీయాయైయున్నాడు. మరియు మెస్సీయ అనగా, "ఒక అభిషిక్తుడు" అని అర్ధమైయున్నది. అభిషేకించబడిన ఒక మానవుడు. పిదవ ఆ మానవుడు వాక్యముచేత అభిషేకించబడుటయైయున్నది. ఆ వాక్యము మనమధ్య శరీరధారియాయెను. మరియు ఆయన వచ్చినప్పుడు, ఆయన సరిగ్గా వారు కోరుకున్న అభిరుచికి తగినట్లుగా లేకుండెను; ఆయన ఇట్లు రావలసియున్నదని వారు కలిగియున్న అభిరుచికి తగినట్లుగా లేకుండెను. కావున అందుకొరకే వారు, "ఈయన ఎవరు? ఈ హడావిడి అంతా దేనిగురించి?" అని వారు కేకలు వేసిరి. అచ్చట ద్వారమునొద్ద ఒక మోటు ప్రజలగుంపు మట్టలను విరుచుచూ దారి పొడుగున పరిచిరి మరియు…

మరియు ఒకడిట్లనెను, "ఎందుకు, వారిని మౌనముగా ఉండునట్లు చేయుడి. వారు అరవడం, మరియు కేకలు వేయడం మరియు అట్లు చేయడంతో వారు మనలను ఉద్రిక్తతకు లోను చేయుచున్నారు."

ఆయన ఇట్లు చెప్పెను, "వీరు ఊరకుండినయెడల, వెంటనే ఈ రాళ్ళు కేకలు వేయును."

AMOS 3:8

 

30ఓ, కాలము ముందుకు సాగుచున్నది! ప్రవచనము నెరవేర్చబడియున్నది. "సింహము గర్జింపగా భయపడనివాడెవడు? మరియు యెహోవా సెలవిచ్చెను ప్రవచింపకు౦డువాడెవడు?" అని చెప్పుటలో ఎటువంటి ఆశ్చర్యములేదు!

"లేదు, ఆయన సరిగ్గా మా అభిరుచికి తగినట్టుగా లేనియెడల సరిగ్గా మేము కోరిన విధంగా ఆయన లేనియెడల, మేము తలంచిన విధంగా ఆయన రానియెడల, మేము ఆయనను స్వీకరించము." పిదప, వారియొక్క ఆచారములే, వ్రాయబడిన వాక్యము నుండి వారిని అంతగా తొలగిపోవునట్లు చేసెను. ఎవరు రావలెనని వారు ప్రార్థంచారో, ఆయనను గుర్తించుటలో విఫలమయ్యేంతగా వారు తొలగిపోయిరి. వారి సంఘములు వారిని ఎంతగా దూరము చేసినవనగా - దేనికొరకు వారు ప్రార్ధించారో, అది సరిగ్గా వారితోనే ఉండియున్నది, మరి అది వారి అభిరుచికి తగినట్టుగా లేదు, గనుక వారు దానిని విశ్వసించలేకపోయిరి. వారు దానినుండి దూరముగా వెళ్ళిపోవలసివచ్చెను. వారు దీనిని త్రోసివేసియున్నారు. మీరు క్రీస్తును కలుసుకున్నప్పుడు మీరు చేయగల ఒకే ఒక కార్యము కలదు. అదేదనగా, ఆయనను అంగీకరించటం లేదా ఆయనను తిరస్కరించటం. మీరు ఎన్నడూ మధ్యస్థముగా నడువలేరు. మీరట్లు చేయలేరు. అట్లు చేయుట మీకు తగదు. అది కేవలం ఆ రీతిగానే యుండును.

REV 17:8

 

31ఆ దినమునకు అభిషేకించబడిన వాక్యముగా ఆయనను కొందరు ఎట్లు గుర్తించియున్నారో చూడండి, ఆదియందు దేవుడు అనంతుడైయుండి, మరియు ఆది నుండి సమస్తమును ఎరిగియున్నాడు. మరియు ఒకే ఒక్క విషయమేదనగా ఈ కార్యములన్నియూ ఆయన యొక్క గుణలక్షణములను చూపించుటకైయుండెను. ఒక గుణలక్షణము… మీరు ఒక గుణలక్షణమును కలిగియుందురు. అది మీ యొక్క తలంపైయున్నది. మీరు దేనిగూర్చియైనా ఆలోచించి, పిదప దానిని మీరు మాటలాడుదురు, అది దేవుడైయున్నాడు. ఆదిలో ఆయన… మీరు గనుక… మీరు ఎప్పుడైనా పరలోకములో ఉండినయెడల లేదా ఉండబోయినయెడల, మీ యొక్క ప్రారంభమే పరలోకములోయైయుండును. మీరు దేవునిలో భాగమైయున్నారు. మీరు ఆయన యొక్క ఆలోచనయైయున్నారు. ఆయన మీ పేరును ఎరిగియున్నాడు. ఒక అణువైనా లేకముందే, ఒక వెలుగుయనునది లేకముందే మీరెవరనునది ఆయనకు తెలియును. ఏదైనా లేకముందే, మిమ్మును మరియు మీ పేరును ఆయన ఎరిగియున్నాడు. మరియు ప్రపంచము సృష్టించబడకముందే, ఆయన దానిని గొర్రెపిల్ల జీవగ్రంధములో ఉంచియున్నాడు. మరియు తరువాత ఒక పిదప మీరు ఒక వాక్యముగా మారియున్నారు. మరియు ఒక వాక్యమనగా వ్యక్తపరచబడిన ఒక ఆలోచనయైయున్నది. పిదప మీరు ప్రత్యక్షపరచబడియున్నారు.

JOHN 1:1•

JOHN 6:37

 

32ఆయన ఆ విధంగా ఉండియున్నాడు. ఆయన ఆదిలో తనకుతానుగా ఉన్నవాడై యున్నాడు. దేవుడు ఒంటరిగా తన తలంపులతో ఉండియున్నాడు. ఆయన ఇక ఎన్నడూ అట్లు చేయడు, ఏలయనగా ఆయన తలంపులు ప్రత్యక్తపరచబడియున్నవి. మరియు అందునుబట్టియే సరిగ్గా ఈ దినమున మనము ఇచ్చటనున్నాము. ఇది దేవుడు తన ప్రత్యక్షపరచబడిన తలంపులతో సహవాసము చేయుటయైయున్నది. చూశారా? అచ్చటే మనము ఉండియున్నాము. కావున మీరు, చింతించుటవలన, మీ ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనలేరు. మీరు దీనిని, దానిని, లేదా మరొకదానిని చేయలేరు. అది కరుణించు దేవునివలనేయైయున్నది. అది దేవుడేయై యుండెను. "తండ్రి నాకు అనుగ్రహించువారందరును నా యొద్దకు వత్తురు, మరియు తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేదు." అది దానిని స్థిరపరచును.

MATT 7:14

 

33ఆయన దినాల్లో అతి తక్కువమంది ఉండుటను ఇప్పుడు గమనించండి, భూమి మీదనున్న లక్షలకొలది ప్రజలు ఆయన ఇచ్చట ఉన్నాడన్న విషయమే ఎరుగకయుండిరి. ఒక్క క్షణం ఆలోచించుడి, అచ్చట పదుల లక్షలకొలది ప్రజలు దానిగూర్చి ఏమియూ ఎరుగకయుండిరి. మరియు ఇశ్రాయేలు గూర్చి ఆలోచించినచో ఆ సమయంలో, ఇరువది-ఐదు లక్షలమంది ఇశ్రాయేలు ప్రజలు పాలస్తీనాలోయుండిరి, మరియు వారిలో ఒక్కింట వందవభాగమైననూ దానిని ఎరుగకయుండిరి. ఆయన ఇట్లు చెప్పెననుటలో ఎటువంటి ఆశ్చర్యములేదు, "ద్వారము ఇరుకుగానున్నది, మరియు ఆ దారి సంకుచితమైయున్నది, అయితే దానిని కనుగొనువారు కొందరే." ఎంతమంది ఆయనను గుర్తించలేదో ఒక్క క్షణం ఆలోచించుడి! మరియు సరిగ్గా ఆయన ఉన్నచోటనే వారు ఉండియున్నప్పటికినీ అది ఆయనేనని వారు ఎరుగకయుండిరి; అదియే విచారకరమైన విషయమైయున్నది.

ఎవరైతే ఆయనతో నడిచారో, మరియు వీధిలో ఆయనను చూసారో, వారే. ఆట్టివారే ఆయన ఎవరన్నది గుర్తించలేకపోయిరి, ఎందుకనగా ఒక వ్యక్తికి ఇవ్వగల అత్యంత నీచమైన పేరు ఆయనకు పెట్టబడుటను అపవాది చూసియున్నాడు. లోకముచేత (బాహ్య ప్రపంచం)… ఆయన ఒక అక్రమ సంతానంగా పిలువబడినాడు (ఎందుకనగా "ఆ తల్లి, ఆమెకు యోసేపుతో వివాహము కాకమునుపే, ఆమె అతని ద్వారా తల్లియైయుండెను" అని వాడు చెప్పెను.) కావున ఒక అక్రమ సంతానమనే పేరును వాడు ఆయనకు తగిలించాడు.

MATT 12:24

 

34మరియు మరలా, ఆయన యొక్క ప్రత్యక్తపరచుకొనే గొప్ప శక్తిలో సంఘము ఆయనను చూచియున్నది. దేనిని ప్రత్యక్షపరచుటయైయున్నది? ఒక ఆచారము ప్రత్యక్షపరచుట కాదు! ఆయన వాక్యమును ప్రత్యక్షపరచుచున్నాడు! ఆయన స్వయంగా తానే అభిషేకించబడిన వాక్యమైయున్నాడు. మరియు అది జరుగుటను వారు చూసినప్పుడు, అభిషేకించబడిన మెస్సీయా, ప్రత్యక్తపరచబడుటను, వారు దానిని త్రోసివేసిరి. అది వారికి అక్కర్లేదనుకొనిరి. అది వారి అభిరుచికి తగినట్టుగా లేకుండెను. అది దయనీయమైన స్థితియైయుండెను. ఎంతమంది… ఒక్కసారి దానిగూర్చి ఆలోచించుడి! ఆ మిగతా దినములలో ఉన్నట్టేయుండెను.

చూడండి, ప్రతీఒక్కరూ వాక్యమునకు తమ స్వంత అనువాదమును కలిగియున్నారు. అదియే… ఆ కారణముచేతనే ఇశ్రాయేలీయులు మోషేను గుర్తించకపోయిరి. ఆ కారణముచేతనే లోకము నోవహును గుర్తించలేదు. ఆ కారణముచేతనే ప్రవక్తలందరూ గుర్తించబడియుండలేదు. వారు వాక్యమునకు తమ స్వంత అనువాదమును కలిగియున్నారు. అయితే ప్రతీ కాలములో, దేవుడు తనయొక్క మెస్సీయాను కలిగియున్నాడు. చూశారా? నోవహు యొక్క వర్తమానమును త్రోసివేయుట, దేవుడిని త్రోసివేయుటయేయైయున్నది. నోవహును త్రోసివేయుటయనగా నశించిపోవుటయేయై యున్నది. మోషేను తిరస్కరించుట, నశించిపోవుటయేయైయున్నది. అది వారు ఆ కాలమునకు అభిషేకించబడిన మెస్సీయాలైయున్నారు, ఆ కాలమునకు వాగ్దానము చేయబడిన ఆ వాక్యమైయున్నారు. మరియు పిదప యేసు వచ్చినప్పుడు, ఆయన వాక్యము యొక్క సంపూర్ణతయైయున్నాడు.

దేవుడే, స్వయంగా, ఎముకలతో, మరియు మాంసముతో ఒక మానవ ఆకారములోనికి రూపించుకొనెను; ఒక అభిషేకించబడినవాడైయుండెను. మరియు దానిని వారు చూసియుండవలసియున్నది. అయితే మీరు చూడండి, వారు వారియొక్క సంఘ ప్రపంచము ఇచ్చట కొంత కలిపి మరియు ఇచ్చట కొంత తీసివేసి మరియు ఎంతగా అటువంటివి చేసిరనగా, వారు వాక్యమునకు బదులు వారియొక్క సంఘము పైనే నమ్మికయుంచిరి. మరియు ఎప్పుడైతే వారియొక్క సంఘము అభిషేకించబడుటను వారు చూశారో, అప్పుడు ఏదో గొప్ప కార్యము జరుగుచున్నదని వారు తల౦చిరి. మరియు అభిషేకించబడిన ఆ వాక్యమును వారు చూసినప్పుడు, "అది మూఢ భక్తి, ఈ మనుష్యుడు ఒక దయ్యము, ఒక బయెల్డెబూబు" అని వారు అనిరి. ఎందుకనగా వారి సంఘమునకు, వారియొక్క సంఘ సిద్దాంతములకు మరియు వారు చేసినదానికి, అది ఎంతో విరుద్ధముగానుండెను. మరియు ఒక ప్రవక్త వచ్చునప్పుడల్లా అది ఆ విధంగానే ఉండెను, సంఘము ఎంతో గందరగోళమగును.

35దేవుడు తన ఆజ్ఞలను పంపించి మరియు వారికొక నిబంధనను ఇచ్చియుండెను. మరియు యాజకుడు వచ్చి దానినుండి తీసివేసి, మరియు దానికి కలిపి, మరియు దానిపై అధికారము తీసుకొని, దానినుండి ఒక ఆచారమును తయారు చేయును. మరటు తరువాత, ఎచ్చటనుండియో, ఆత్మయొక్క శక్తిలో ఎదిగిన ఒక అభిషేకించబడిన వ్యక్తిని దేవుడు లేపును. మరియు అతను ఎల్లప్పుడూ యాజకుల చేత, రాజుల చేత ద్వేషించబడును. మరియు ఆబద్ధ ప్రవక్తలైతే వారియొక్క సన్నపు దుస్తులు ధరించి, రాజులు మరియు యాజకుల మధ్య గొప్ప పేరు ప్రఖ్యాతలకు పాత్రులగుటకు, వినయముగాను మరియు శాంతముగాను నడుచుకొందురు. పిదప అసలైన నిజప్రవక్త ఎచ్చటినుండియో వచ్చును, కానీ వారియొక్క సంస్థల నుండి మాత్రం కాదు.

దేవుడు ఎన్నడైనా ఒక యాజకుడిని తీసుకొని మరియు అతనిలో నుండి ఒక ప్రవక్తను తయారు చేసినట్టు, పరిశుద్ధ గ్రంధములో ఎచ్చటైనా ఉన్నదా? దేవుడు ఎక్కడైనా ఒక మతసంబంధమైన వేదాంతిని (తర్ఫీదు పొందిన వ్యకిని, వేదాంతమును అభ్యసించిన వ్యక్తిని) తీసుకొని అతనిని ఒక వ్రవక్తగా చేసియున్నాడా? చరిత్రలో ఎక్కడైనా, ఏ కాలమందైనా ఆయన దానిని చేసియుండలేదు. దానిని ఆయన ఎన్నడూ చేయలేదు. మరియు దానిని ముందుకు తీసుకువెళ్ళుటకు ఆయన ఆ పద్దతినుండి బయటకు రావలసియున్నది. మరియు ఆయన ఇక్కడ చేసినది అదేయైయున్నది.

ACTS 2:22

 

36యేసు, ఆయన యూదయ బెత్లెహేములో ఒక పేద కుటుంబములో జన్మించిననాటికి, ఒక యూదా గోత్రమునకు చెందినవాడనియు, మరియు ఆయన యొక్క తల్లి, తండ్రి దావీదు వంశావళికి చెందినవారనియు, అంతకన్నా చెప్పుకోదగ్గ పలుకుబడి వారికి తెలిసి, ఏమియూ ఆయనకు లేకుండెను. మరియు వారు వచ్చి పన్ను చెల్లించవలసియుండెను. మరియు ఆయనిక్కడ ఒక యవ్వనస్తుడైయున్నాడు, దాదాపు… సంఘములను చీల్చివేయుట తప్ప మరేమియూ చేయకుండెను. మరియు వారు ఆయనను ద్వేషించిరి. మరియు ఆయన అద్భుతములు జరిగించెనని చెప్పుటకన్నా మరేమియు వారు అనలేకపోయిరి. పెంతెకోస్తు దినమున పేతురు దానిని ఇట్లు వ్యక్తపరిచెను, "నజరేయుడైన యేసు, దేవుడు ఆయనతో ఉన్నాడనియు, ఆయన తనవలన అంగీకరింపబడినవాడనియు, దేవుడే మీ మధ్య నిరూపించెను." మరియు దానిని కొద్దిగా తేటపరచుటకైనా, దేనిని, ఆయన వాక్యమునకు కలపకూడదనెను. "ఆయన మన మధ్య శరీరధారియైన దేవుడైయుండెను. దేవుడు మనతోనుండుటయై యుండెను."

37మరియు గతరాత్రి మోషే తన చేయి రొమ్మున ఉంచుకొని నిలబడియుండుటను గూర్చి చెప్పుకున్నట్లు — అది దేవుడు మోషేలో ఉండుటయైయున్నది. ఆయన తన హృదయంలో రహస్యములను పట్టుకొనియుండెను — మరియు దానిని చాపినప్పుడు అది తెల్లని కుష్టముగలదయ్యెను. తిరిగి దానిని తన రొమ్మున ఉంచుకొనగా, మరి అది బాగయ్యెను, మరియు పిదప ఆయన పరిశుద్దాత్మను పంపినప్పుడు దానిని మరలా మనకొరకు చాచెను; అది పెంతెకోస్తు దినమున మరలా మరొక రూపములో ఉన్న దేవుడేయైయుండెను. మరియు మనము దానిని త్రోసివేసియున్నాము. మనకు అది అక్కర్లేదనుకొన్నాము. ఆనాడు వారు ఆ విధంగా చేసియున్నారు. బహుషా ఈనాడు మనము కూడా ఆ విధంగానే చేయుచున్నాము.

2PET 1:20

 

38ప్రతీ మనిషీ తనయొక్క స్వంత అనువాదమును కలిగియున్నాడని, మనము చూచియున్నాము. ఆ కారణముచేతనే అది ఎంతో గందరగోళమయ్యెను. అయితే పరిశుద్ధ గ్రంధము ఇట్లు చెప్పెనని మీకు తెలియును, "ఈ వాక్యమునకు ఎటువంటి స్వంత అనువాదము ఇవ్వకూడదు." దానికి ఒక ప్రెస్బిటేరియన్ అనువాదము అవసరంలేదు. దానికి ఒక బాప్టిస్తు అనువాదము అవసరంలేదు. దానికి ఒక పెంతెకోస్తు అనువాదము అవసరంలేదు. దేవుడే తన స్వంత అనువాదకుడైయున్నాడు. ఆయన దానిని చేయుదునని చెప్పెను, కావున ఆయన దానిని చేయును, అప్పుడది స్థిరపరచబడును. కావున అందునబట్టియే వారు వాగ్దాన వాక్యము అభిషేకించబడుటను చూచియున్నా గానీ దానిని వారు స్వీకరించలేకపోయారు. మీరు చూడండి, ఎందుకనగా అది వారియొక్క ఆచారములకు విరుద్ధముగా ఉండియున్నది.

39చూచుటకు మెస్సీయ, అభిషేకించబడినవాడు, ఎట్లుండును, మరియు ఆయన ఏమి చేయును; అనునది వారి గ్రహింపునకు ఎంతో దూరముగానుండెను. మరియు పిదప ఆయన ఏమి చేయునని లేఖనములలో నుండి వారికి చదివి వినిపించినప్పటికినీ, ఇంకనూ వారు దానిని గ్రహించకయున్నారు. ఎందుకనగా ఈ జ్ఞానులు బబులోను నుండి వచ్చినప్పుడు, వారు యెరూషలేమునకు ఈశాన్యంవైపు ఉండియుందురు, మరియు ఆ నక్షత్రము, వారిని పశ్చిమమునకు నడిపించుటను చూచియుండిరి. వారు దానిని రెండు సంవత్సరములు వెంబడించిరి, వారు టైగ్రిస్ నది దాటుకొని, లోయలగుండా మరియు షీనారును దాటుకొని మరియు ఇంకనూ ప్రయాణించుచూ, ప్రపంచములోకెల్లా అతి గొప్ప మతమునకు, అన్ని మతాలకు ముఖ్యపట్టణమైన చోటికి, యెరుషలేములోని ఆలయమునకు వచ్చిరి. మరియు వీధులలో అటు, ఇటూ తిరుగుచూ, "ఆయన ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పట్టివాడెక్కడనున్నాడు?" అని చెప్పుచుండిరి. ఎందువలన, దాని గూర్చి ఎవ్వరికీ, ఏమియూ తెలియకుండెను. అది వింతగానున్నది.

MATT 2:5,6

 

40అది సనైడ్రిన్ సభను కూడా కుదిపివేసినది. శాస్త్రులను పిలువనంపించి మరియు, "మెస్సీయ ఎక్కడ పుట్టునని లేఖనములలో చదువమనిరి."

మరియు వారు వెళ్ళి, లేఖనములను తెప్పించి, మరియు మీకా చెప్పిన దానిని చదివిరి, "యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో అల్పమైనదానవు కావు? అయిననూ ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును."

చూడండి, దానిని పరిశీలించుటకు బదులు, వారు దానిని త్రోసివేసిరి, "సరి, అది ఒక మూఢభక్తిగల గుంపు," అనిరి, చూశారా. అందునుబట్టియే ఆ వర్తమానమును గొర్రెలకాపరులు పట్టుకొనిరి. చూడండి, వారు తమ స్వంత అనువాదమును కలిగియుండిరి, తద్వారా, వారు సత్యమగు నిజమైన కార్యమును తప్పిపోయిరి.

41అయితే ఆయన ఎప్పుడు వచ్చిననూ, ఆయన ఎట్లు వచ్చునని వాక్యము చెప్పునో ఖచ్చితముగా ఆయన ఆ విధంగానే వచ్చును. ఈ ఉదయం మన పాఠ్యాంశములో ఆయన ఎట్లు వచ్చునని వాక్యము చెప్పెనో, ఆయన ఖచ్చితముగా పట్టణములోనికి ఆ రీతిగానే వచ్చెను. మరియు వారు, "ఈయన ఎవరు?" అని చెప్పిరి. నా భావమును మీరు గమనించుచున్నారా? ఆయన ఎవరనునది వారు తెలిసికొనవలసిన వారైయున్నారు. మరియు ఇక్కడ… ఆయన ఖచ్చితముగా ఈ విధముగా వచ్చునని అక్కడ లేఖనములు స్పష్టముగా చెప్పుచున్ననూ, బాహ్య ప్రపంచము కాదు కానీ, సంఘ ప్రపంచమే ఇట్లన్నది, "ఈయన ఎవరు? ఈయన ఎవరు?" మరియు వారు ఇట్లనిరి, "ఇది ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? ఈ తొందరంతయూ దేనిగూర్చి? ఆ గోలచేయడాన్ని ఆపివేయండి. అది మమ్ములను ఒక ఉద్రిక్తతకు గురిచేయుచున్నది." చూశారా. వారు దేనికొరకు ప్రార్ధన చేశారో సరిగ్గా అది వారి చేతివద్దనే ఉండియున్నది, మరి అయిననూ వారాయనను గుర్తించలేకపోయిరి. మరియు ఆయన ఏ విధంగా వచ్చునని లేఖనము చెప్పెనో, ఖచ్చితముగా ఆయన ఆ రీతిగానే వచ్చెను. మరియు ఈనాడు ఆయన వచ్చినయెడల, ఆయన ఏ రీతిగా వచ్చునని లేఖనము చెప్పునో, ఆ విధంగానే ఆయన వచ్చును. ఆయన ఎప్పుడొచ్చినా ఎవరో ఒక వేదాంతి దానిగూర్చి కలిగియున్న ఆలోచనచొప్పున కాక, దేవుని వాక్యము యొక్క అభిరుచి ప్రకారమే వచ్చును.

42ఇదియు గాక, దేవుని యొక్క వాక్యము ఎన్నడూ ఒక వేదాంతియొద్దకు వచ్చి యుండలేదని మీకు తెలియునా? అట్లు ఎక్కడైనా జరిగేనాయని లేఖనములలో కనుగొనండి. వాక్యము వేద పండితులయొద్దకు వచ్చియుండలేదు; రానే రాదండి. అయితే మీరు చూడండి, ఈనాడు, మన దినమునకైన వాక్యము ప్రత్యక్షపరచబడినయెడల, అది దేవుని వాక్యము యొక్క అభిరుచి ప్రకారమే ఉండును. ఎవరో ఒకరి ఆలోచన యొక్క అభిరుచికి అనుగుణంగా ఉండదు. ఈ దినమునకై ఆయన వాగ్దానము చేసిన వాక్యమును దేవుడు తీసుకొనును, మరియు దానిని అభిషేకించును, మరియు అది సంభవించును. అదంతే. అది సంభవించకుండా ఆపగలదేదియూ లేకుండెను. సంఘము ఏమి చెప్పినా కానీ మరియు మిగతావారు దేనిని నమ్మినా గానీ, దానిని అది చేయును. అది దేవుడు ఎట్లైనా దానిని చేయును. దానిగూర్చి తెలిసినవారు కేవలం చాలా కొద్దిమందేయుందురు. అది నిజము, కేవలం చాలా కొద్ది మందే. అది ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉండియున్నది.

43చూడండి, వారియొక్క స్వంత అనువాదముతో వారేమియూ చేయలేకపోయిరి, ఎందుకనగా సంఘము వారికి చెప్పినదానిపై వారు ఆనుకొనియున్నారు. అయితే ఆయన వచ్చును… ఆయన వచ్చినప్పుడల్లా… ఆయన అప్పుడు చేసినదాన్నే ఆయన వచ్చిన ప్రతీసారి చేయును, మరియు ఆయన చేయు ప్రతీకార్యము వాక్యము యొక్క అభిరుచికి తగినట్టుగా ఉండును, కావున అందునుబట్టియే, మనము ఇతరులు చెప్పినదానిపై నమ్మకముంచలేము. మీరు నమ్మకముంచగల ఒకే ఒక్క కార్యమేదనగా, అది వాక్యమైయున్నది. మరియు వాక్యము దేవుడైయున్నాడు. మరియు, అభిషేకించబడిన ఆ వాక్యమే మెస్సీయయగును; ఆ గడియకు అభిషేకించబడిన వాక్యమైయున్నది. ఎంత మనోహరము! వారు దానిని, ఆ వాక్యమును తప్పిపోయిరి; సరియైనది… వారి వాక్యమెల్లప్పుడు సరియైనదైయుండును, కానీ దానికి వారియొక్క అనువాదమే తప్పైయున్నది.

JOHN 17:22

 

44ఈనాడు మనము కలిగియున్న ఈ పెద్ద సార్వత్రిక సమైఖ్య మరియు మనందరిని ఐక్యము చేయుటకై రూపించబడుచున్న ఈ ప్రపంచ సంఘ సమైఖ్య విషయమై నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఖచ్చితముగా వారు దానిని చేయుదురని లేఖనములు చెప్పెనా లేదా అని వారు గ్రహించినచో నేను ఆశ్చర్యపోవుదును. అయితే మనందరం చేతులు కలిపి మరియు ఐక్యముగా ఉండుటయనునది ప్రపంచములోనే చాలా అద్భుతమైన కార్యముగా వారు తలంచుదురు. "మనందరం ఒక్కటిగా ఉండవలెనని యేసు ప్రార్థించెను" అని చెప్పుదురు. అది నిజమే. కానీ అటువంటి ఐక్యత కాదండి.

ఆయన చెప్పెను, "నేనును మరియు నా తండ్రియను ఏకమైయున్నలాగున మీరునూ ఉండుడి." అవునండి, ఆ విధంగా ఐక్యమైయుండుడి. అప్పుడది ఏలాగుండును? వాక్యము మరియు మనము ఐక్యమై అభిషేకించబడిన వాక్యముగా ఉండెదము. అదియే దేవుని యొక్క ఏకత్వమైయున్నది. చూడండి, దేవుని యొక్క ఏకత్వమనగా, అభిషేకించబడిన వాక్యము మీలో ఉండుటయైయున్నది, చూశారా. మరియు అప్పుడు ఆ కాలమునకు మీరు ఒక కుమారుడు, ఒక మెస్సీయ, అయ్యెదరు.

45అనేకమంది ప్రజలు ఒకే విధంగా ప్రవర్తించుటను మనమిప్పుడు కనుగొన్నాము. ప్రజలు మార్పునొందరు. ఈ ప్రజలు మూడు గుంపులుగా విభాగింపబడియున్నారు. ఇప్పుడు మరికొద్ది నిమిషములలో దానిని మనము గమనించెదము. మీకు ఫరవాలేదు అనిపించినయెడల, నేను కొంచెం నిదానంగా చెప్పుదునని నేనెరుగుదును. నేను చాలా నిదానంగా పోవుచున్నాను, నేను కేవలం… నేను ఎరుగను; నేను లోపలికి వచ్చి మరియు లేఖనములను మరియు చిన్న పాఠ్యమును వ్రాసుకొనుచుందును. మరియు నేను ఇచ్చటికి వచ్చిన తరువాత పరిశుద్దాత్మ ఒక దానిని పట్టుకొనును, మరియు నేను దానిలోనికి వెళ్ళుదును. దానికి ఇక ముగింపులేదన్నట్లుగా కనిపించును. అది ఇక కొనసాగుచూనే ఉండును. అయితే, ఇప్పుడు మన పాఠ్యభాగమునకు వచ్చెదము.

ROM 9:20,21

 

46వారు అచ్చట మూడు భిన్నమైన అభిప్రాయములతో మూడు భిన్నమైన గుంపులుగా విభాగింపబడియున్నారు. వారిలో కొందరు ఆయనయందు విశ్వాసముంచియున్నారు. వారిలో కొందరు ఆయనను ద్వేషించియున్నారు. మరియు వారిలో కొందరు ఏమిచేయాలో తెలియకయున్నారు.

చూశారా, సరిగ్గా ఆ విధంగానే దానిని మనము కలిగియున్నాము. ఒకసారి నేను ఈ సంఘములో విశ్వాసులు, వేషధారులు, మరియు అవిశ్వాసులు అనుదానిపై ప్రసంగించియున్నానని నేను నమ్ముచున్నాను. గుంపులో అ మూడు రకములైనవారు, అది మీరు అంతటా కలిగియుండెదరు. ఈ గుంప కూడా ఆ మూడి౦టిని కలిగియున్నది, ప్రజల యొక్క ఈ స్థితిని చూచుటయనునది ఎల్లప్పుడూ ఉండెను. ప్రజల స్థితి ఎల్లప్పుడూ అదేనని మనము వెనుకకు వెళ్ళి రుజువు చేయగలము. వారెల్లప్పుడూ అటువంటి పరిస్థితిలోనే ఉండియున్నారు.

అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండుటను చూసిన పిదప, దేవుడే ప్రజలను ఆ విధంగా ఉండునట్లు రూపించియున్నాడని నమ్మునట్లు అది మనలను చేయుచున్నది. అంతెందుకు, ఆయన యొక్క శత్రువు కూడా ఆయనను స్తుతించునట్లు, ఆయన చేయును. ప్రతీదీ… పౌలు, రోమా పత్రిక, 8వ అధ్యాయంలో వ్రాయుచు, "ఓ, అవివేకీ, నన్నెందుకీలాగు చేసితివని రూపించబడినది రూపించిన వానితో చెప్చునా? ఒక ముద్దలోనుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా?" అని చెప్పెను. ఆయన రాత్రిని కలుగజేయనియెడల ఏమగును? మీరెన్నటికీ సూర్యోదయమును అభినందించరు. ఎప్పుడూ సూర్యోదయమే ఉండినయెడల దానిని ఎట్లు అభినందించవలెనో మీరు ఎరుగకుందురు. అసలు వ్యాధి లేకున్నయెడల ఏమగును? మంచి ఆరోగ్యమును ఎట్లు అభినందించవలెనో మీరు ఎరుగకుందురు. అసలు చెడ్డ ప్రజలు, చెడ్డ స్త్రీలు లేకున్నచో ఎట్లుండును? అప్పుడొక మంచి స్త్రీ ఘనతవహించదు, చూశారా. ఆమెకు ఘనత దక్కదు, ఏలయనగా అందరూ అట్లేయుందురు, అందరూ సమానముగా ఉండియుందురు. అయితే అది ఒక విభిన్నమైన చట్టమైయున్నది.

47దేవుడు ఆ ప్రకారము చేయును: ఒక ఘనతవహించిన దానిని చూపించడానికి ఒక ఘనహీనమైన దానిని చేయును; ఒకటి ఎంతో తప్పిదముగానుండును, అది తెలియజేయబడును. అది అట్లు లేనియెడల, అదియే ఒప్పైనదిగా ఉండును. అక్కడ లేనియెడల… ఒక అసలైన రూపాయి లేనంతవరకు నకిలీ రూపాయి అనునది ఉండదు. మరియు పిదప ఆ నకిలీ రూపాయి… అది ఆరంభములోనే ఒక నకిలీ రూపాయి చేయబడినయెడల, అప్పుడదే నిజమైన రూపాయియగును. అయితే అది ఒక అనుకరణయగును. నీతియనునది లేనంతవరకూ పాపము అనునది ఉండదు. ఎందుకనగా నీతియనునది సరియైన కార్యమైయున్నది, మరియు నీతిని వక్రీకరించుటయే పాపమైయున్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక సత్యమనగా సత్యమేయైయున్నది. ఒక సత్యమును అబద్ధముగా వక్రీకరించుటకు, ముందుగా ఒక సత్యమనేదే లేనియెడల, ఒక అబద్ధమనునది అబద్ధమే కాకపోవును. కావున పాపమంతయూ మరేదో కాదు కానీ, నీతిని వంకరచేయుటైయున్నది. కావున లోకములో ఒక నియమావళి ఉండియున్నది.

48రెండు నియమములు కలవు; మరియు వాటిలో ఒకటి సరియైన నియమము, మరియు మరొకటి ఒక వక్రీకరించిన నియమము. మరియు వాటిలో ఒకటి దేవుని యొక్క వాక్యమైయున్నది, అది సరియైనది; మరియు ప్రతీ మానవుని మాట ఒక అబద్ధమేయైయున్నది. మరియు ఈనాడు మనము కలిగియున్న ఈ సంఘ శాఖ పద్ధతి, వారందరిని ఐక్యము చేయుటకు ఒక ప్రపంచ సంఘ సమైఖ్యను రూపించుచూ ఒక మృగము యొక్క ముద్రను తయారుచేయుటకు ఉద్భవించుచున్నది, అది తప్పుడు కార్యమైయున్నది. మరియు మనుష్యులు గ్రుడ్డిగా దానిలోనికి నడుచుకుంటూ పోవుచున్నారు.

వారు దేనిచేత విడుదల పొందెదరో దానిని దేవుడు వారికొరకు భూమిపై ఉంచియున్నాడు. అయితే అది ఒక మూఢభక్తిగల గుంపు అని వారు తలంచుదురు. వారు దానిని కోరుకొనరు. వారు దానిని తిరస్కరించుదురు. దాని విషయమై వారు ఏదైనా చేయవలసియున్నదని తలంచుదురు. వారు తమ స్వంత పద్ధతిని చేసుకొనగోరియున్నారు. దేవుడు ముందుగానే తన పద్ధతిని ఇచ్చట కలిగియున్నాడు, అది ఆయన యొక్క వాక్యమైయున్నది. అయితే దానిని మనము కోరుకొనము. కావున అప్పుడు వారున్నట్టుగానే ఈనాడు మనము కూడా ఉండుటను మనం స్వయంగా కనుగొన్నాము.

49మరియు ఇప్పుడు, ప్రజలు ఆ విధంగా ఉండునట్లు రూపించబడిరని చూచుచుండగా… గమనించండి, మీరు చెప్పుదురు… నేను చాలా సమయమును తీసుకున్నానని నాకు తెలియును, అయితే అది నాకు ఉద్రిక్తతను కలుగజేయును గనుక నేను దానిని గమనించగోరుటలేదు, చూశారా.

రాజకీయము; ఇప్పుడు ఇటువంటిది మనము తీసుకొనెదము. ప్రజలు మూడు తరగతులుగా రూపించబడినారా లేదా అని చూచుటకు కేవలం ఒక ఉదాహరణకై మనము తీసుకొనెదము. మనము రాజకీయమును తీసుకొనెదము. కొందరు ఒక వ్యక్తి పట్ల అత్యాసక్తిపరులైయుందురు. మరియు మరియొక్క గుంపు అతనిని ద్వేషించుదురు. మరియు మరియొక గుంపు ఆ వ్యక్తి విషయమై ఏమి చేయవలెనో తోచకయుందురు; వారికి ఎటువైపో తెలియకయుందురు, మరియు అది వారిని గందరగోళములోనికి నెట్టును.

"ఓ, అతను ఒక గొప్ప వ్యక్తి అతను మనకు ఉత్తమ ప్రెసిడెంటుగా ఉండును" అని ఈ మనిషి చెప్పును.

"అతను ఒక రాజద్రోహి తప్ప మరేమికాదు" అని ఇంకొకడు చెప్పును.

పిదప, ఈ రెండు తలంపుల మధ్యనున్నవాడు ఇట్లు చెప్పును, "ఇప్పుడు నాకు ఏమిచేయవలెనో తెలియదు." చూడండి, మనము అ రీతిగా రూపించబడియున్నాము. మనము అట్లు చేయబడియున్నాము. మానవులు ఆ రీతిగానున్నారు. దేవుని యొక్క గొప్ప ఏర్పాటును నెరవేర్చుటకు అది ఆ విధంగా ఉండవలసియున్నది. మరియు ఆయన భూమి మీద సాధించబోవుదానిని, సాధించడానికి మానవుడు అట్ల రూపించబడవలసియున్నది. ఒకరు ఒప్పైయుందురు, మరొకరు తప్పైయుందురు. మరియు మరొకరు ఆ రెండిటి మధ్యనుందురు. అది ఎల్లప్పుడూ ఆ రీతిగానేయుండెను.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

50గమనించండి, ప్రతీసారీ వారికి తెలియనిదానిని వారు చేయుదురు… మధ్యనున్న ఆ వ్యక్తి అతనిది అది ఒక దురవస్థయైయున్నది, ఎందుకనగా: ఒకడు తానెందువలన సరియని తాననుకొనుచున్నాడో చూపించగలడు. అతనెట్లు తప్పైయుండెనని తలంచుచున్నాడనునది ఇంకొకడు చూపించగలడు; మరియు మధ్యనున్నవాడు ఆ విషయమును ఏమియు ఎరుగనివాడైయుండి, ఎటువైపు తిరగవలెనో తాను ఎరుగకయుండును. మరియు మతము విషయములో సరిగ్గా ఆ రీతిగానేయున్నది. ఈనాడు ప్రజలు తమ నిత్యమైన గమ్యస్థానం విషయములో ఆ ప్రకారమే చేయుచున్నారు.

ఒక నిమిషము, ఇప్పుడు మనలను బాధపెట్టబోవుచున్నది. వారు వారియొక్క నిత్యమైన గమ్యస్థానము విషయములో దానిని చేయుచున్నారు. ఒక మనిషి ఇక్కడ తినుటకు ఒక చోటికి వెళ్ళును. మరియు మీ సూపు గిన్నెలో ఒక సాలీడు పురుగును మీరు కనుగొన్నయెడల, మీరు ఆ వ్యాపార సంస్థ, లేదా ఆ రెస్టారెంటు పై అభియోగం మోపుదురు. అది విషపూరితమైయున్నది మీరు ఆ సూపును త్రాగకుందురు. ఒక సూపు గిన్నెలో ఒక పెద్ద బొద్దింక పురుగు లేదా ఇంకేదో ఉడికించబడెను గనుక మీరు దానిని అస్సలు త్రాగనే త్రాగరు. అందుచేతనే మీరు దానిని తీసుకొనకుందురు, దానిని గూర్చిన ఆలోచన మిమ్ములను అది రోగిగా చేయును. అయిననూ, "మనుష్యుడు దేవుని నోటినుండి వచ్చు ప్రతీ మాటవలననూ జీవించును" అని ఉన్నప్పటికినీ, దేవుని యొద్ద నుండి ఒక మిలియను మైళ్ళ దూరమునకు తీసుకొనిపోవునట్టి దానిని మీ గొంతులోనికి నెట్టునట్లు, మీరు ఒక వేదాంతుల గుంపునకు అనుమతించుదురు, మరియు దానిని మ్రి౦గివేయుదురు. దానితో మీ ఆత్మ నరకములో వ్రేలాడుచున్న ఒక గొలుసువలె అది ఉన్నది. మరియు నేను ఇదివరకు చెప్పినట్లు, "దానియొక్క బలహీనమైన మొనవద్దనే ఒక గొలుసు యొక్క గట్టితనం ఆధారపడియుండును." ఒక్క వలయము తెగిపోయినా… మీరు చేయవలసిందల్లా వాటిలోని ఒక్కదానిని తెంపుటయే; అంతే. ఆ మిగిలినవి దానితోపాటు వదులగును. దాని బలహీనమైన పట్టువద్దనే దానియొక్క బలము ఆధారపడియుండును.

51ఇప్పుడు…. మరియు ఒక విషపూరితమైన సాలీడు పురుగుతో నిండిన ఆ సూపును మీరు త్రాగినయెడల, అది బహుషా మిమ్మును వ్యాధిగ్రస్తులుగా చేయునని ఒక వ్యక్తి ఎరిగియుండును. మీరు ఆసుపత్రికి వెళ్ళవలసియుండును, మరియు మీ కడుపు శుభ్రము చేయించుకొని మరియు ఎంతో బాధపడవలసియుండును. మరియు వాస్తవముగా అది మిమ్మును చంపివేయగలదు. అయితే, మై! మీరు… అందువలనే మీరు ఎన్నడూ ఇక అటువంటి ఒక పరిసరాల్లోకి వెళ్ళకుందురు. మరలా దానిని మీరు దర్శించగోరరు, ఎందుకనగా మీరు ఆ విషమువలన మీరు చనిపోవుదురని భయపడుదురు. అయినా కానీ, మీరు ఖచ్చితంగా దేనిలోనో చేరి, పుస్తకములో మీ పేరు నమోదు చేసుకొని, మరియు "దేహమును చంపవారికి భయపడకుడి గానీ, ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి," అని బైబిలు చెప్పిన దానికై మీరు పోరాడుచుందురు. ప్రజలు ఎంత వింతగా ప్రవర్తించుదురో చూశారా? వారు వారియొక్క నిత్యత్వపు గమ్యస్థానము విషయములో వారు ఏదో ఒక వేదాంతపు ఒడంబడిక పై ఆధారపడుచుందురు. మరియు మీరు వారియొద్దకు లేఖనమును తీసుకువచ్చి "బైబిలు చెప్పినది ఇది. ఇది సరిగ్గా ఇక్కడే ఉండియున్నది" అని చెప్పగలరు.

మరియు ఆ వేదాంతి దానివైపు చూసి, "సరి, అది మరియొక దినమునకై యున్నది" అని చెప్పును. చూశారా. మరియు మీరు ఆయన చెప్పినది విందురు. దేవుడు చెప్పిన దానిని మీరు చూడండి. ఒక నిజమైన, అసలైన క్రైస్తవుడు కేవలం ఆ వాక్యము చెప్పినదానినే వినును, మరియు అదంతే. దేవుని యొక్క మనిషి ఆ రొట్టె వలనే బ్రతుకును.

52గమనించండి, వారియొక్క సంఘశాఖ యొక్క అనువాదమును వినువారు కొందరు ఉండియుండగా, కొందరు మాత్రం వాక్యమునే విశ్వసించుదురు. మరియు ఇంకొందరున్నారు, వారు ఈ గందరగోళమువలన, దేనిని నమ్మవలెనో తెలియక యున్నారు.

ఇప్పుడు వారిలో కొందరు ఇట్లు చెప్పుదురు, "ఓ, ఈ ప్రపంచ సంఘ సమైఖ్య, అదే అసలైన కార్యమైయున్నది. అది మనందరినీ ఒక్కటిగా చేయబోవుచున్నది. ఓ, అది మాత్రమే చేయగలదు."

మరియు ఇంకొందరు, "అది దయ్యమునకు సంబంధించినదైయున్నది! ఇదిగో అది ఇక్కడ లేఖనములో ఉన్నది" అని అందురు.

అప్పుడు కూర్చుని ప్రార్ధించి మరియు దానిని వెదకుటకు సమయమును కేటాయించని ఆ వ్యక్తి, "ఓ, దీన్ని మరచిపొమ్ము" అని అతడు అనును. దానిని మరచిపోవలెనా? అది నీ యొక్క… సహోదరుడా, నీ యొక్క ప్రకటనను బట్టియు, నీ యొక్క స్థితిని బట్టియు, నీ అభిప్రాయమునుబట్టియు, నీవు సదాకాలము ఎచ్చటైతే ఉందువో అట్టి నిత్యమైన గమ్యమునకు అది నిన్ను చేర్చును. దానిని నీవు చేయకుము.

53ఇటువంటిది ఏదైనా తలెత్తినప్పుడు మనము మోకరించుట మనకు ప్రయోజనకరమైయుండును. మరియు ఒక ప్రశ్న. యేసు యొక్క దినములలోనున్నట్లు; వారు వచ్చినప్పుడు, సంఘము ఇట్లు చెప్పినది, "ఓ, అతను ఒక మత ద్రోహి, అతనితో ఏమీ పనిలేదు?"

అయితే ఒకరిట్లనిరి, "లేఖనములను పరిశోధించుడి." "వాటిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవియే నేనెవరన్నది మీకు తెలియజేయును" అని ఆయన చెప్పెను.

అప్పుడు ఏ మాత్రం క్రైస్తవ హోదా కలిగియున్న స్త్రీ, పురుషులైనా లేదా తమ నిత్యత్వపు గమ్యము విషయంలో ఆసక్తి కలిగియున్నవారైనా, లేఖనములను పరిశోధించి మరియు ఆయన ఎవరనునది చూడవలసినవారైయున్నారు. అప్పుడు "ఈయన ఎవరు?" అనే ప్రశ్న ఉండకపోవును. "ఇదిగో ఆయన ఇచ్చటున్నాడు" అని వారు చెప్పియు౦దురు. వ్యత్యాసము అదేయైయున్నది. చూడండి, మనుష్యుడట్లున్నాడు, వారు ఆ విధంగా ఉ౦డుటకు మొగ్గు చూపియున్నారు. కొందరు దానికై నిర్ణయించబడియున్నారు. దానిని చెప్పుటకు కఠినముగా ఉండును, కాని అది వాస్తవమైయున్నది. అది దానినే చూపించుచున్నది, చూచారా.

54ఇప్పుడు, ఈనాడు, కొందరు ఇట్లు చెప్పుదురు, "నేను వాక్యమును నమ్ముదును. వాక్యము సత్యమైయున్నది; దానిలోని ప్రతీ వాక్యము సత్యమే."

ఇతరులు ఇట్లు చెప్పుదురు, "ఆహ, మా సంఘ కాపరులు వెళ్ళి మరియు అటువంటివి నేర్చుకొనియున్నారు. దాని విషయమై ఏమి చెప్పవలెనో వారికి తెలియును."

మరొకరు ఇట్లు చెప్పిరి, "సరి, నాకు తెలియదు. నేను దీనిలో చేరియున్నాను. నేను దానిని ఇష్టపడను. నేను అచ్చటికి వెళ్ళి మరియు దీనిలో చేరియున్నాను. నేను దేనికి చెందవలెనో నేను ఎరుగకయున్నాను," చూశారా. అప్పుడున్న ప్రకారమే అది ఉండియున్నది, అదే రకమైన గుంపైయున్నది. సరి, ఆది నుండి అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండియున్నది, మరియు అది ఎల్లప్పుడూ అట్లే ఉండబోవుచున్నది.

GEN 3:3

 

55ఇప్పుడు ఈ విషయంపై బైబిలు యొక్క సత్యమును పరిశీలించుదుము, మరియు అది వాస్తవమో కాదోయని చూచెదము; కేవలం ఇప్పుడు కొద్ది నిమిషములకై ….. ఆదాము… ఆదిలో అది ఈ రీతిగా ప్రారంభమయ్యెను, సరిగా ఈనాడు మనము కలిగియున్న ప్రకారమేయైయున్నది, కొంచెమైనా అది మారలేదు. ఆదాము "ఒక విశ్వాసియైయున్నాడు." సాతాను అవిశ్వాసియైయున్నాడు; అతడు వాక్యమును నమ్మలేదు. కావున అది నిజమా - కాదా అని నిశ్చయత లేనటువంటి హవ్వను వాడు పట్టుకొనియుండెను, చూశారా. సాతాను, అవిశ్వాసియైయున్నాడు… "నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు" అని దేవుడు చెప్పియున్నాడు.

"అది వాస్తవము కాదు" అని అపవాది చెప్పెను. చూడండి, మరియు అతడు దానిని నమ్మియుండలేదు. ఆదాము దానిని నమ్మెను. కావున వాడు ఈ రెండిటి మధ్యనున్న ఒకరిపై క్రియ చేసెను. వారు చెప్పలేకపోయిరి… ఆమె చెప్పలేకపోయినది.

MATT 25:8,10

 

56ఇప్పుడు, గమనించండి, ఇచ్చట, స్త్రీ అనునది వధువుగా పిలువబడే భవిష్యత్తులోని మత శాఖా సంఘమును సూచించుచున్నది. అదంతయూ ఆదికాండములోనే వచ్చును. అది ఒక విత్తనమైయున్నది. మీరు ఆదికాండము నుండి ప్రారంభించుడి; అప్పుడు మీకు పటము తిన్నగా కనిపించును, చూశారా. ఇప్పుడు, ఇచ్చట, ఆమె ఈ దినపు సంఘమును సూచించుచున్నది, ఏలయనగా కొందరు చెప్పుదురు, ఇప్పుడు ప్రెస్టిటేరియన్లు మరియు లూధరన్లు మరియు ఈ వ్యాపారులు మరియు మొదలగువారందరూ కూడి వచ్చుటను మనము తీసుకుందాము, "మనము కలిగియుండుటకు ఇష్టపడుదుము. మాకు పరిశుద్దాత్మ బాప్తిస్మము అవసరమైయున్నది. మేము దానిని పొందుకొనుటకు మేము ఇష్టపడుచున్నాము."

మనము లోనికి వెళ్ళు ఆ దినమును మీరు గ్రహించగలరా? చూశారా? అది వారు దానిని ఎప్పటికీ పొందలేరన్నట్లుగా ఉండియున్నది. యేసు చెప్పినది మీరు ఎరుగుదురా, "ఎప్పుడైతే ఆ నిద్రించు కన్యక…"?

నిద్రించు కన్యక వచ్చి నూనె కొరకు పిలచుటను, ఇప్పుడు గుర్తుంచుకొనుడి, అదంతయూ ముద్రించబడియున్నది. ఆమె దానిని పొందుకొనలేదు. ఆమె ఎన్నటికీ దానిని పొందలేదు. వధువు వెళ్ళిపోయిన తరువాత, పరలోకమునకు ఎత్తబడిన తరువాత, సంఘములు ఇంకనూ కొనసాగుచూనేయుండును, ప్రజలు ఇంకనూ తాము రక్షించబడుచున్నామనే తలంచుదురు, మరియు ప్రతీది వారెప్పుడూ చేసినట్లే చేయుదురని మీరు గ్రహించగలరా, నోవహు దినములవలే కొనసాగుదురు. వారు ఎప్పుడూ చేసినట్లే తినుచు, త్రాగుచు మరియు ప్రతీది చేయుచూనే యుందురు. అయితే ద్వారము మూసివేయబడియుండెను, కానీ వారు దానిని ఎరుగకయుండిరి. మరియు స్నేహితులారా, ద్వారము ఏ సమయములోనైనా మూసివేయబడవచ్చును. నాకు తెలిసినంతవరకు, బహుషా ఇదివరకే అది జరిగియుండును. మనము ఎరుగము.

1PET 3:20

 

57అచ్చట వారిలో కొద్దిమంది మాత్రమే లోపలికి పోబోవుచున్నారు. దానిని మనము ఎరుగుదుము, "నోవహు దినములలో జరిగినట్లే, ఎనిమిది ఆత్మలే రక్షించబడియుండెను, మనుష్యకుమారుని రాకడలో జరుగును." అచ్చట కేవలము కొన్ని ఆత్మలే రక్షించబడి యుండెను. ఎనిమిది మందే అని నేను చెప్పను. బహుషా ఎనిమిది వందలమందియై ఉండవచ్చును లేదా… ఎంతమందో నేను ఎరుగను. ఎనిమిది వేలు. నాకు తెలియదు. ఎనిమిది మిలియన్లు. నేను…..

అయితే మీరు చూడండి, ఇప్పుడు కేవలం ఇచ్చట భూమిపైనున్న చిన్న గుంపుతో వధువు తయారుచేయబడియుండదు. ఏడవ జాములో, ఆయన వచ్చినప్పుడు, ఆ కన్యకలందరూ లేచి మరియు వారి దివిటీలను శుభ్రము చేసుకొనిరి. గతంలో ఆ కాలముగుండా అభిషేకించబడిన వాక్యమును నమ్మిన ప్రతీయొక్కరూ, వచ్చెదరు. పిరమిడ్ వలెనెయైయుండును, అడుగు భాగము, మరియు పైకి వచ్చును. అయితే దానినంతటినీ తీసుకొని ఒక పిరమిడ్ వలె చేయుటకు తలరాయి రావలసియున్నది. చూడండి, దానిని ఒకటిగా జతచేయును. ఇప్పుడు, ఆయా కాలములలో క్రీస్తుని విశ్వసించి మరియు ఆయనను వారి రక్షకునిగా అంగీకరించిన వారందరి ద్వారా వధువు తయారుచేయబడును.

GEN 2:17•

GEN 3:4•

REV 3:20

 

58ఇప్పుడు, హవ్వ నిశ్చయతను కలిగిలేదు. "ఇప్పుడు, ప్రియా, 'మీరు తిను దినమున, నిశ్చయముగా చచ్చెదరు' అని దేవుడు చెప్పెనని," ఆదాము ఆమెతో చెప్పెను.

ఆయితే వారన్నారు. సాతానుడు అన్నాడు, "నిశ్చయంగా అది వాస్తవమై యుండదు. ఒక తండ్రి తన పిల్లలను ఎట్లు నడిపించునో ఊహించుకొనుము… ఏదో కొంచెం తమాషా కొరకు, మరి అటువంటి ఒక విషయమైయుండును. నిశ్చయంగా అట్లు కానేరదు," చూసారా.

మరియు ఆమె చివరకు ఎటువైపు తిరిగింది? ఆమె "నిశ్చయంగా" అను దానివైపు మరలియున్నది. మరియు ఈనాడు ఖచ్చితముగా సంఘము దానినే చేయుచున్నది, ఖచ్చితముగా, "ఓ నిశ్చయంగా… మనము ఒక గొప్ప సంఘమైయున్నాము. మనము గొప్ప ప్రజలమైయున్నాము. మనము చాలా యేండ్లనుండి ఉండియున్నాము. ఇచ్చటనున్నవారు మతమూఢత్వమని పిలుచుచున్న ఇవన్నియూ, ఈ.. వారు చెప్పే ఈ పరిశుద్దాత్మ బాప్తిస్మం, మరి అవన్నియు, అదంతయూ బుద్దిహీనతయైయున్నది! దానిని చూడండి. అటువంటిది ఏమియూ లేదు. ఆహా, నిశ్చయముగా… నేను దశమ-భాగములు చెల్లించుచున్నాను. నేను సంఘమునకు వెళ్ళుచున్నాను. నా తల్లి వెళ్ళుచుండెడిది. నిశ్చయంగా…. దేవుడు" అని అనుకొందురు. అయితే దేవుడు భిన్నంగా చెప్పియున్నాడు. మరియు అది ఆ విధంగానే ఉండబోవుచున్నది, కేవలం వాక్యము యొక్క అభిరుచికి తగినట్టుగా ఉండును. ఈ లవోదికయ సంఘకాలము ఇట్లుండునని ఆయన చెప్పెను. ప్రభువు చిత్తమైతే చూడండి, ఈ లవోదికయను గూర్చి, అది ఇదివరకే ముగిసినదనియూ, అది ఇదివరకే ముద్రించబడినదనియూ మరియు క్రీస్తు వెలుపల ఉన్నాడనియూ చూపించుటకు నేను త్వరలో ఒక ప్రత్యేకమైన పుస్తకమును విడుదల చేయబోవుచున్నాను. ఆయన తిరిగి మరలా లోపలికి వచ్చెనని ఎన్నడూ చెప్పబడలేదని మీకు తెలియును. కావున ఎప్పుడూ ఉన్నట్లుగానే ఈనాడు కూడా మనము వాక్యమును వెలుపల ఉంచామని కనుగొనియున్నాము.

59ఇప్పుడు, గమనించండి, మోషే ఒక అభిషేకించబడిన వాక్యమైయున్నాడు… లేదా మనమిట్లు పిలిచెదము. అతడిని మెస్సీయ అని నేను అన్నప్పుడు, మీరు అర్థం చేసుకొనెదరని నేను ఆశిస్తున్నాను. అతడు ఆ దినమునకు వాగ్దానము చేయబడిన, అభిషేకించబడిన వాక్యమైయున్నాడు. మోషే అట్లు౦డెను! దానిని మీరు నమ్మెదరా? నిశ్చయంగా, మెస్సీయ అనుమాటకు "అభిషేకించబడినవాడు" అని అర్ధము. చూశారా? ఇప్పుడు, నోవహు తన దినమునకు అభిషేకించబడినవాడైయుండెను. అబ్రహాముతో చెప్పబడెను… ఆయన ప్రజలు తమదికాని దేశములో నాలుగు వందలయేండ్లు దాస్యత్వములో ఉందురనియు మరియు గొప్ప బాహువు చేత వారు బయటికి తీసుకురాబడుదురనియు, మరియు ఆయన సూచనలను మరియు అద్భుతములను చూపించుననియూ, మరియు రాబోవు తరములవారేమి చేయుదురనియు చెప్పబడెను. మరియు ఆ దినమునకు అభిషేకించబడిన వాక్యమైయున్న మోషే అచ్చట నిలబడియుండెను. అందునుబట్టియే అతడు తన చెయ్యిని తన రొమ్మున ఉ౦చుకొనగలిగెను. ఎందువలన? అతడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడియుండెను. ఆమేన్! ఆ గొప్ప షకినా మహిమ తన చుట్టూ ఆవరించెను. ఆయన యొక్క ప్రతీ కదలిక దేవుడిని ప్రతిబింబించుచున్నది. సంఘము ఇప్పుడు అచ్చట నిలబడవలసియున్నది. అది నిజం! దానికి బదులు మనము ఏదో ఒక సంఘ శాఖపరమైన అపస్మారకములో ఉండియున్నాము.

60అయితే మోషే ఆకర్షించబడినవాడై మరియు ఒక ప్రక్కకు వచ్చియుండెను. మరియు అచ్చట ఆ పొదలో ఆ అగ్నిస్తంభము వ్రేలాడుచునుండెను. మరియు అభిషేకించబడినవాడై మోషే అచ్చట నిలబడియుండెను. ఆ మనుష్యునికి కనీసం తానేమి చేయుచున్నాడనునది తెలియదనుటలో ఎటువంటి సందేహములేదు. తన గొర్రెలను కాయు చేతికర్రతో అతనక్కడ నిలబడినప్పుడు అతనికి ఇవ్వబడిన సూచనలు గానీ, మరియు అది అరణ్యములో ఒక తీర్పు కర్రవలె ఉండునని తెలుసుకొనుట గానీ అతడు ఎరుగకయుండెను. అది ఒక సర్పముగా మారెను, అప్పుడది, అరణ్యములో ఆ సర్పము ఒక ప్రాయశ్చిత్తమయ్యెను; అతడు చేసిన క్రియలన్నియూ… అవన్నియూ ప్రజలకొరకు సూచనలు మరియు మాటలాడు స్వరములు అయ్యెను. చూడండి, అచ్చట ఏదో అతనితో ముడివేయబడియుండెను. మరియు స్వయంగా మోషేకి అది తెలియకపోవును, కానీ అతడు ఆ దినము కొరకు అభిషేకించబడిన వాక్యమైయున్నాడు. అతడు అభిషేకించబడిన వర్తమానికుడై యుండెను. కావున అతడు ఆ ఘడియకు వర్తమానికుడైనయెడల, అతడు ఆ ఘడియకు మెస్సీయాయైయుండెను. అభిషేకించబడినవాడు ఆయనేయైయుండెను.

ఇప్పుడు, అతను, యెహోషువా, మరియు కాలేబు ఆ గుంపులోని విశ్వాసులైయున్నారు, గమనించండి, మరియు ఇతరులకు సత్యమును బోధించుటకు ప్రయత్నముచేసియున్నారు. అయితే చూడండి, సాతానుడు, కోరహు మరియు దాతాను, ఇతరులను అరణ్యములో నశించునట్లు చేసియుండెను. ఇప్పుడు, సమస్య ఏమైయున్నది?

1SAM 15:22

 

61దేవుడు మోషేను పిలిచెను. అతడు వెళ్ళదలంచుకొనలేదు. ఆ ప్రవక్తలు చేయుటకు అట్టి కార్యములు కలిగియుండిరి, వారు… అది చేయుటకు కఠినమైన కార్యమైయుండెను. వారు వెలుపలికి వెళ్ళి మరియు ఎగతాళి చేయబడదలంచుకొనరు. వారు సహవాసమును కలిగియుండగోరి ఆ మిగతావారితో వెళ్ళగోరుదును మరియు సహోదరులతో కలిసి వెళ్ళగోరుదురు. అయితే మీరు చూడండి, సరిగ్గా… నేను నమ్ముదును… ఆ ప్రవక్త ఎవరో నేను మరచిపోయాను, చెప్పెను, "ఒకవేళ… నేను దీనిని చేయగోరుటలేదు," ఇంకొక మాటలో చెప్పాలంటే - "అయితే నా గుండె నాలో మండుచున్నది. దేవుడు మాట సెలవిచ్చెను మరియు నేను దానిని ప్రకటించవలసియున్నది." వారు దానిని ఇష్టపడకున్ననూ; వారాయనను సిలువవేసినను; వారాయనను రాళ్ళతో కొట్టిననూ; వారేమి చేసినా గానీ దేవుడు అతని హృదయములో మాటలాడెను, గనుక అతడు దానిని తప్పక చెప్పవలెను. భిన్నంగా ప్రవర్తించుటకు కాదు కానీ, విధేయుడిగా ఉండుటకైయున్నది. "బలులు అర్పించుటకంటే, విధేయత చూపుటయు - పొటేళ్ళ క్రొవ్వు అర్పించుటకంటే, మాట వినుటయు శ్రేష్టం." చూడండి, అది అతని హృదయములో ఉండియున్నది. అతడు తప్పక దానిని చేయవలెను. అది అతనికి జీవమైయుండెను. దానిని అతడు ఆపలేడు. అచ్చట ఏదో కార్యమున్నది, అది వారిని నెట్టుచున్న ఒక స్పందనవంటిదైయున్నది. వారు దానిని ఆశీర్వదించలేరు లేదా దానిని శపించనూలేరు. దేవుడు వారిని ఎంతగా తన స్వాధీనములో ఉంచుకొనియున్నాడనగా, ఆయనే వారియొక్క స్వరము మరియు వారియొక్క చలనమైయున్నాడు. హల్లెలూయా!

వారియొక్క ప్రతీ క్రియ మరియు ప్రతీ కదలిక "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అన్నట్లుగా ఉండి, ఆ షకీనా మహిమలో నడుచుచూ, దేవునిచేత పూర్తిగా అభిషేకించబడియున్న ఒక సంఘమును నాకియ్యుడి, అప్పుడు భూమి మీద నిలిచియున్న, దేవునిచేత అభిషేకించబడిన ఒక మెస్సీయను నేను మీకు చూపించెదను.

62అచ్చట ఈ మండుచున్న పొద మరియు షకీనా మహిమ ప్రక్కనే మోషే నిలబడియుండెను. అభిషేకించబడినవాడై అచ్చట నిలబడియుండెను, అతనేమి చేయుచున్నాడో అతను ఎరుగకయుండెను. "నీ చేయి నీ రొమ్మున ఉంచుకొనుము. దానిని బయటకు తీయము. ఆ కర్రను తీసుకొనుము. దానిని ఒక సర్పమువలె మార్చుము. దానిని మరలా క్రిందపడవేయుము" అని ఆ స్వరము చెప్పుచున్నదానికి మాత్రం అతడు విధేయుడైయుండెను. ఎవ్వరేమి చెప్పినా గానీ, అతడు దానిని చేయుచుండెను.

"ప్రభువా, నీ మహిమను నాకు కనపరుచుము, మరియు నేను ఐగుప్తుకు వెళ్ళుటకు సిద్దముగా ఉన్నాను. నేను మాటనేర్పరిని కాను. నేను నోటి మాంద్యము గలవాడను. అయితే నీ మహిమను నన్ను చూడనిమ్ము" అని అనెను. మరియు ఆయన దానిని అతనికి చూపించెను. మరియు అతడు అవే సూచనలను తీసుకొని మరియు తానే అభిషేకించబడియున్న మెస్సీయ అని చూపించుటకు వెళ్ళెను. ఆ మనుష్యుడు భూమి మీదనుండి ధూళిని తీసుకొని మరియు దానిని గాలిలోనికి విసిరెను, మరియు ఆ ధూళి నుండి ఈగలు మరియు పేలు బయటకు ఎగిరి వచ్చి భూమి మీద వ్యాపించెను. దేవుడు కాకుండా సృష్టించగలిగినది మరేదై యున్నది? ఏటిలోని నీళ్ళను తీసుకొని మరియు దానిని ఒడ్డున పోయగా, అప్పుడు ఐగుప్తులోని ప్రతీ నీటిబిందువు రక్తమువలె మారెను. దేవుడు కాకుండా మరేది అట్లు చేయగలదు? అదేమైయున్నది? తానే ఆ మెస్సీయ అనునంతగా దేవుని యొక్క అభిషేకించబడిన వాక్యమునకు అతడు పూర్తిగా అప్పగించుకొనెను.

ఐగుప్తియులు దానిని ప్రక్కకు మళ్ళీంచుటకు ప్రయత్నించిరి. అవిశ్వాసులు దానిని త్రోసివేయుటకు ప్రయత్నముచేసిరి. వేషధారులు తమ కుట్రను పన్నుటకు ప్రయత్నించిరి. కానీ దేవుని యొక్క వాక్యము నేరుగా వారిని వాగ్దాన దేశములోనికి తీసుకుని వెళ్ళెను. అది వాస్తవమైయున్నది. వారు అభిషేకించబడియుండిరి. వారు… అతను మెస్సీయయైయుండెను.

63ఇప్పుడు ప్రశ్న వచ్చినది అరణ్యములోయైయున్నది. దానిని తెచ్చినది ఇక్కడే యైయున్నది. ఇప్పుడు చూడండి, నా సహోదరులారా, మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. ఆ ఆశీర్వాదములను ఈ ప్రజలు అనుభవించిరని ఇప్పుడు గుర్తుంచుకొనుడి. అభిషేకించబడిన ఈ ప్రవక్త యొక్క ప్రసంగమును వారు ఆనందించిరి. వారాయనను నమ్మియుండిరి. వారాయనను వెంబడించిరి. అయితే అరణ్యములో దాతానను ఒకడు, మరియు కోరహు అను పేరుతో ఒకడు లేచిరి. మరియు వారు ఇట్లు చెప్పిరి, "ఇది ఒక్క మనుష్యుడే సాధించిన వ్యవహారమువలె అగుచున్నది. దేవుడు తనను మాత్రమే పిలిచెనని మోషే తలంచుచున్నాడు."

ఆ ఒక్క మనుష్యుని వర్తమానము, వారికి అది అక్కర్లేదనుకొనిరి. లేదు, వారు దానిని కావాలనుకొనలేదు. మరియు దేవుడెప్పుడైనా ఒక సమయములో ఒక్క మనుష్యునితోనే వ్యవహరించును. అది ఎల్లప్పుడూ ఒక్క మనుష్యుని యొక్క వర్తమానమేయైయున్నది. ఆయన ఒక్క మనుష్యునితో కాకుండా ఎప్పుడైనా తన ప్రజలతో వ్యవహరించెనా? అది ఒక వ్యక్తిగత విషయమైయున్నది. అది ఒక గుంపుగా కాదండి. దేవునికి మీలో ప్రతీ ఒక్కరూ జవాబుదారులైయున్నారు. "ఓ, నేను దానిని నమ్ముదును," అని మీరు చెప్పుదురు. మీరు కేవలం. మీరు చేయునది ఏమిటనగా, దానిని మీరు కేవలం వినోదముగా భావించుచున్నారు. మీరు ఒక ఆలోచనతో కాలక్షేపము చేయుదురు.

64(ఇచ్చట ఒక స్త్రీ నిలబడియున్నది. నేను వివాహము కొరకు వేచియున్న ఒక యవ్వనస్తుడనైయున్నాను. ఆమె అన్ని విధాలుగా నా నిబంధనలకు సమతూగును. ఆమె ఒక ప్రియమైన క్రైస్తవురాలైయున్నది: ఆమె ఒక ప్రత్యేకమైనదిగా కనబడును, ఆమె ప్రత్యేకముగా వస్త్రధారణ చేసుకొనును, ఆమె ప్రత్యేకముగా ప్రవర్తించును, ఆమె ప్రత్యేకముగా జీవించును. ఆమె నాకొక మంచి భార్యగా సరిపోవునని నేను ఒప్పుకొనుచున్నాను. అయితే నేను ఆమెను నా భార్యగా చేసుకొనువరకు ఆమె నా భార్యగా ఉండలేదు.) ఈ వర్తమానము ఆ రీతిగానే ఉండియున్నది. మీరు దానిపట్ల సానుభూతి కలిగియుండి మరియు "అది వాస్తవము" అని చెప్పగలరు. అయితే మీరు దానిలో భాగమైయుండుటకు స్వయంగా మీ కొరకు దానిని తీసుకొనవలసియున్నది. అప్పుడు మీరు మరియు ఆ వర్తమానము ఒక్కటయ్యెదరు. అప్పుడు ఇతరులతో ఉండినట్లే ఆ అభిషేకము మీతో కూడా ఉండును.

65ఇప్పుడు, సాతానుడు, వాడు దానిని నమ్మలేదు. దాతాను… వాడు దాతానును మరియు వారిని పట్టుకొని దానిని నమ్మకుండా చేసి, వారందరూ నశించుటకు కారణమయ్యెను.

అయితే మీరు చెప్పుదురు, "బ్రెన్హాం సహోదరుడా, ఒక్క నిమిషము అగుము, నీవు ముగ్గురు, అని చెప్పితివి: మోషే, యెహోషువా, మరియు కాలేబు." అది ఖచ్చితముగా సరియే. అక్కడున్నది వారేయైయున్నారు. "అయితే ఇక్కడ ఇద్దరే అని నీవు చెప్పియున్నావు. ఇక్కడేమో అక్కడ…"

"సహజాతీతమైన సాతాను" అని మీరు అంటారు. అయితే ఈ ముగ్గురిని అభిషేకించుచున్న సహజాతీతమైన దేవుడును ఉండియున్నాడు. ఇప్పుడు, సాతానుడు కేవలం అభిషేకమునొందెను. అయితే ఇంకొకడు వచ్చుచున్నాడు, ఇంకొకడు వచ్చుచున్నాడు, కేవలం కొద్ది నిమిషములు గమనించండి. అతడు రంగము మీదికి వచ్చును, వాడి పేరు బిలాము. అతడు డబ్బును ప్రేమించు ప్రవక్తయైయున్నాడు, ప్రవక్తగా పిలువబడే ఒక అబద్ధ ప్రవక్తయైయున్నాడు.

1KGS 22:8•

2CH 18:7

 

66ఎల్లప్పుడూ అన్నిరకములైన ప్రవక్తలు ఉండియున్నారు. మరియు అన్నివేళలా ఇశ్రాయేలుతో మరియు ఆ గుంపుతో, ఎప్పుడూ, ఆ ప్రవక్తలు ఉండియున్నారు; మృదువైన మాటలు చెప్పువారున్నారు, విషయమును బలవంతంగా ప్రజలపై రుద్దు ప్రవక్తలును ఉండియున్నారు. వారు రాజు గారి వద్దకు మంచి మాట కొరకు వెళ్ళుదురు, మరియు అతనికి తోడ్పడెదరు, మరియు… అది సరియే, ఆహాబు కలిగియున్న నాలుగువందలమంది వలెనేయైయున్నది, అందరూ వారియొక్క మతసంబంధమైన ధోరణిలో వస్త్రధారణ కలిగియుండిరి. మరియు అతడు మీతో చెప్పెను. అక్కడున్న గొప్ప రాజైన యెహోషాపాతుతో అతడిట్లనెను, "అంతెందుకు, నిశ్చయంగా, తర్ఫీదు పొందిన నాలుగువందలమంది హెబ్రీ ప్రవక్తలు నా వద్ద నున్నారు."

మరియు వారందరూ వచ్చి ప్రవచించిరి. అయితే అది తప్పు అని తెలుసుకొనునట్లు సరిపడా దేవుడిని, ఆ మనుష్యుడు తనలో కలిగియున్నాడు, ఏలయనగా ఏలియా ఆ కార్యమును శపించెనని అతడెరిగియున్నాడు. మరియు అతడు శపించిన దానిని దేవుడెట్లు ఆశీర్వదించగలడు? ఆయన దానిని చేయలేడు. "మనము విచారించునట్లు ఇంకెవరైనా నీవద్ద ఉన్నారా?" అని అతడు అనెను.

"అవును, ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చటనున్నాడు, "కానీ," చెప్పెను, "అతనియందు నాకు ద్వేషముకలదు." "అతను ఎల్లప్పుడూ నన్ను ఖండించుచూ మరియు నన్ను గూర్చి కీడే ప్రకటించును," అని అనెను. సింహము ఎట్లు గర్జించును… దేవుడు మాట సెలవిచ్చెను. సత్యమును పలుకనివాడెవడు? అది దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగానున్నయెడల, అతడు దానిని శపించవలసియున్నది. వారెల్లప్పుడూ అబద్ద ప్రవక్తను కలిగియున్నారు. అయితే ఒక నిజమైన వాడిని కూడా వారెల్లప్పుడూ కలిగియున్నారు. గుర్తుంచుకొనుడి, పాఠశాల మొత్తం వారితోనే నిండియుండలేదు. వారిలో ఒకడు ఉండియున్నాడు. మరియు ఏనాడైనా అది ఆ విధంగానే ఉండియున్నది. ఈనాడు కూడా అది ఆ విధంగానే ఉండియున్నది.

HEB 13:8

 

67ఈ వాక్యమే ఆ దినమునకు ప్రవక్తయైయున్నది. అది నిజము. ఈ దినపు ప్రవక్త ఇక్కడున్న ఈ వివిధమైన వారివలె కాదు. ఒక మెథడిస్టు ప్రవక్త ఉన్నాడు, ఒక బాప్టిస్ట్ ప్రవక్త ఉన్నాడు, ఒక పెంతెకోస్తు ప్రవక్త ఉన్నాడు, దేశమంతటా అన్నిరకములైన ప్రవక్తలు ఉండియున్నారు. అయినా గానీ; నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటేరీతిగానున్న ఒక నిజ ప్రవక్త ఉండియున్నాడు. అది వాస్తవమైయున్నది. యేసు క్రీస్తు! మరియు ఆయన వాక్యమైయున్నాడు. అది నిజము. ఆయన వాక్యమైయున్నాడు: ఆ ఘడియకు అభిషేకించబడిన వాక్యమైయున్నాడు.

68మనము కొనసాగుచుండగా, ఇప్పుడాయనను గమనించ౦డి, యెహోషువా మరియు కాలేబుల గూర్చి మనము కనుగొన్నాము… మరియు పిదప ఇక్కడ అద్దెకు తీసుకురాబడిన ప్రవక్తగా బిలాము వచ్చుచున్నాడు. అతడేమి చేసెను? దేవుడు అతనికి దానిని చూపించిన తర్వాత కూడా అతడు నేరుగా దేవుని యొక్క ప్రతీమాటను దాటుకొను వెళ్ళెను. అతడు ఈనాటి మతశాఖను సూచించుచున్నాడు. మనము కొద్ది నిమిషములలో, దాతాను ఏమైయున్నాడనియు మరియు ఆ మిగతావారు ఏమైయున్నారను దానిని చూపించెదము. ఇప్పుడు బిలాము సంఘ శాఖను సూచించుచున్నాడు. శ్రేష్టమైనది ఎరిగియుండవలసిన వాడైయున్నాడు. అది తప్పు అని అతనికి తెలియును. అయితే పిదప అతడేమి చేసెను? దేవుడు అతనిని హెచ్చరించియున్నాడు, మరి అయిననూ అతడు, నేరుగా ఆ హెచ్చరికను దాటివేసెను. అతడు వాటికి చెందవలెనన్నంతగా డబ్బు మరియు పేరు ప్రఖ్యాతుల విషయమై అతడు ఎంతగానో వెర్రివాడైయుండెను. మరియు ఈనాడు సంఘములు కూడా అట్లే చేయుచున్నవి, నేరుగా ప్రపంచ సంఘ సమైఖ్యలోనికి పోవుచున్నవి. మరియు ప్రతీ హెచ్చరిక, సూచనలు మరియు అద్భుతములు, ఈ అంత్యదినములలో ప్రపంచమంతటినీ బ్రద్దలు చేయుచున్నవి. అయిననూ వారు నేరుగా దానిలోనికి వెళ్ళుచుండిరి, ఎందుకనగా దేవుని యొక్క వాక్యమును ప్రేమించుటకన్నా అధికంగా వారు మనుష్యుల యొక్క పొగడ్తలనే ప్రేమించుచున్నారు.

AMOS 3:3

 

69అచ్చట నాకొక మంచి స్నేహితుడున్నాడు, ఆ వర్తమానమును ప్రసంగించుచూ; పెంతెకోస్తువాడైయున్నాడు, ప్రజలతో చెప్పుచూ, సంఘమును ఒక్కటిగా ఐక్యము చేయుటకు ప్రయత్నించుచున్నాడు. "మనము దీనిలోనికి రావలసియున్నది, ఇది క్రైస్తవ ప్రపంచము యొక్క కదలిక" అని చెప్పెడివాడు. అంతెందుకు వారిలో కొందరు… క్రీస్తు సంఘంవారు ఉన్నారు. కనీసం కన్యక జన్మను, మరియు ఈ ఇతర సంగతులనైనా నమ్మనివారైన ఈ సంఘ శాఖలలోని అనేకులు, మరియు వారందరూ దానికి చెందియున్నారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా? దానికి మీరు "ఆమేన్" అని చెప్పియున్నారు, మరి ఇప్పుడు దీని విషయమై నేను ఆశ్చర్యపోవుచున్నాను: అటువంటప్పుడు ఒక మనిషి తాను క్రైస్తవుడననియు మరియు పరిశుద్దాత్మతో నింపబడినాడని చెప్పుచూ, ఆ వాక్యము - నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉండెనను దానిని ఎట్లు నిరాకరించను? నీలోనున్న పరిశుద్దాత్మ ఆ వాక్యమునకు, ప్రతీమాటకు, "ఆమేన్. ఆమేన్. ఆమేన్" అని నొక్కి పలుకును. వాక్యము ఏదైనా చెప్పినప్పుడు, మీరు, "అది నిజము," ఆమేన్! అని చెప్పుదురు. ఎందుకనగా మీరు వాక్యముతో ఏకీభవించుచున్నారు. మీరు దేవునితో ఏకీభవించుచున్నారు. మీరు మరియు దేవుడు ఒక్కటైయున్నారు. దేవుడు మీలో ఉండియున్నాడు. మీరు ఆయన యొక్క కుమారుడు లేక ఆయన యొక్క కుమార్తెయై, అభిషేకించబడిన వాక్యము మీలో జీవించుటవలన అది మిమ్ములను ఆయన కొరకు ఒక మెస్సీయాగా చేయును.

70గమనించండి, బిలాము నేరుగా ఈ కార్యములను దాటుకొని వెళ్ళెను. అతడు ఒక పరిపూర్ణమైన మతశాఖయైయున్నాడు మరియు వారి అభిరుచికి తగ్గట్టుగా ఒక పరిపూర్ణ జవాబైయున్నాడు. దాతాను కోరుకున్నది అదేయైయున్నది. కోరహు కోరినది అదేయైయున్నది. వారు దానినుండి ఒక సంస్థను తయారుచేయగోరియున్నారు. "ఇచ్చటనున్న సర్వసమాజము పరిశుద్ధులేయైయున్నారు," అని చెప్పిరి.

ఇద్దరు వ్యక్తులు ఎంత పరిపూర్ణముగా కలిసి నడిచిననూ నేను లెక్క చేయను, వారిలో వ్యత్యాసము ఉండియుండును. మన నాసికములు ఒకే రకంగా లేవు. మన వ్రేళ్ళ అచ్చులు ఒకేరీతిగా లేవు. మనగూర్చి చాలా సంగతులు కలవు. మనము ఒకరికొకరము రక్తమార్పిడి చేసుకొన్ననూ, కవలలైనా గానీ, వారు భిన్నముగానే యు౦దురు. పిదప, మీరు చూడండి, దేవుడు ఆ ఊపులోనికి కేవలం ఒక వ్యక్తిని తీసుకువచ్చును, మరియు మిగతావారు దానిని విశ్వసించుదురు.

71ఆయన ఒక మనిషిని సృష్టించెను, మరియు ఆ మనుష్యునిలో నుండి అనేక మనుషులను కలుగజేసెను. ఆదాములో అందరూ మరణించునట్లు, క్రీస్తులో అందరూ బ్రతుకుదురు. ఆయన మరణమునకు ఒకదారి కలుగజేసెను, మరియు వారందరూ దానిలోనికి నడిచి వెళ్ళిరి, మరియు ఆయన జీవమునకు ఒకదారి కలుగజేసెను, మరియు జీవము గలవారందరూ దానిలోనికి నడిచిరి. ఒక్క మనిషి తప్పిదముకై, ఒక డజను మంది మరణించుటకు వచ్చియుండలేదు. ఒక డజను మంది పాపము చేయనవసరంలేదు. ఒక మనిషి ఒక్క పాపమును చేసియుండెను. ఒక్కమనిషే అపరాధ రుసుమును పూర్తిగా చెల్లించెను. ఇక ఎంత మాత్రము మీరు మోకాళ్ళ మీద ప్రాకులాడి, ధన్యురాలైన మరియా అని చెప్పనవసరంలేదు మరియు ఈ ఇతర కార్యములను, మరియు మృతులకు నివాళులు అర్పించనవనసరంలేదు. దేవుని వరము ఉచితముగా అనుగ్రహించునట్లు యేసు మరణించెను. అయితే మీరు చూడండి, దాని విషయంలో ఇంకేదో కార్యమును చెప్పవలెనని మనము కోరుచున్నాము.

NUM 16:3,21,26,32

 

72ఇప్పుడు దీనిని గమనించండి. వీరు అచ్చటికి వచ్చి మరియు, "సరి, ఈ సర్వసమాజము మీద నిన్నునీవే హెచ్చించుకొన ప్రయత్నించుచున్నావు. నీవు ఒక్కడివే అన్నట్లు నీవు తలంచుచున్నావు," అని చెప్పిరి.

మరియు అతని విషయమై మోషే అలసినట్టివాడాయెను. అతడు వెనుకకు వెళ్ళి చెప్పెను "తండ్రీ…"

అయన చెప్పెను, "వారినుండి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. నేను…"

"దేవుని పక్షమునున్నవారందరూ, ఇటువైపుకు రండి." మరియు ఆయన భూమియొక్క నోటిని తెరిచెను మరియు అది వారిని మ్రి౦గివేసెను. అది వాస్తవమేనా? సహోదరుడా, ఒక్క క్షణం దానిగూర్చి ఆలోచించుడి. ఓ, మై! ఎందువలన వారాయనను విశ్వసించలేదు? ఈ మోషేయే దేవుని యొక్క నాయకుడని వారెందుకు నమ్మలేదు? వారాయనతో ఎందుకు వాదించగోరియున్నారు? దేవుని యొక్క హస్తము కదలాడుటను చూసిప్పటికినీ ఎల్లప్పుడూ గొణుగుచూ మరియు సణుగుచునుండిరి. మరియు మోషేయే తన యొక్క అభిషేకించబడిన మెస్సీయ అని దేవుడు నిరూపించెను. మీరు చూశారా? మరియు పిదప కేవలం… చూడండి, వారి హృదయములో మాత్రం వారు దేనినో భిన్నమైనదానిని కోరుచున్నారు.

MATT 17:4,5•

MARK 9:5,7,33,35

 

73పెంతెకోస్తువారలారా, మీకేమి సంభవించినది? కొద్ది సంవత్సరముల క్రితమే ఆ మతశాఖ అను గందరగోళము నుండి మీరు బయటికివచ్చి మిమ్మును మీరు ఒక పెంతెకోస్తుగా చేసికొనియున్నారు. మరలా తిరిగి దానిలోనికి మీరెందుకు వెళ్ళగోరుచున్నారు? పొట్టు రావలసియున్నది. ధాన్యము ఇంకనూ ఇచ్చట లేకుండెను. చూశారా, గమనించండి, వారు ఆ విధంగానే చేసియున్నారు. వారి హృదయములో ఉన్నది అదేయైయున్నది. వారు దానిని చేయవలసియున్నది.

ఇప్పుడు, చూడండి, దానిలోనుండి ఒక గొప్ప మతమును చేయవలెనన్న ఉపాయమును దాతాను కలిగియున్నాడు. మీకు తెలియును, అపోస్తలుడైన పేతురు కూడా రూపాంతర కొండ మీద అదే ఆలోచనను కలిగియున్నాడు. అతడిట్లు చెప్పెను, "ఇచ్చట మనము మూడు పర్ణశాలలు కట్టుదుము; మోషేకు ఒకటియు, మరియు ధర్మశాస్త్రమున కొకటియు, మరియు ప్రవక్తలకు ఒకటి."

మరియు అతడింకనూ మాటలాడుచుండగా, ఒక స్వరము వచ్చి "ఈయన నా ప్రియకుమారుడు. ఈయన మాట వినుడి" అని చెప్పెను. వారు వెనుదిరిగి చూడగా, యేసు మాత్రమే వారికి కనబడెను. అచ్చట ఆయన నిలబడియుండెను. ఆయన వాక్యమైయున్నాడు. మీరు వినవలసినది ఆ వాక్యమునేయైయున్నది. అది ఏ కాలమందైనా ఆయనేయైయున్నాడు. ఆ కాలమునకు వాక్యము ఏమి చెప్పుచున్నదో చూడండి, మరియు దేవుడు దానిని అభిషేకించుటను గమనించి మరియు దానితో వెళ్ళండి. అంతే.

74వాగ్దాన దేశమునకు వెళ్ళనంతవరకు వారు అగ్నిస్తంభమును వెంబడించిరి. మార్గమంతటా వెంబడించినవారు వెళ్ళిరి, మిగతావారు నశించిరి. గమనించండి, వారు వాక్యమును లోకముతో కలుపగోరిరి. అదే వారు పొరబడుటకు కారణమయ్యెను. మరియు అది వారికేమి చేసెనో గమనించండి. ఆ వాక్యము… ఆ అభిషేకించబడిన వాక్యమును వారు అంగీకరించకపోయిరి గనుక వారు దానిని తప్పిపోయిరి, చూడండి, మీరు ఒక నకిలీ కలిగియుండవలసివచ్చెను. మీరు దానినుండి ఒక అనుకరణను తయారు చేయుటకు ముందు ఒక వాస్తవమైన దానిని కలిగియుండవలసియున్నది. మరియు అచ్చట వారు దానిని కలిగియుండిరి, మరియు దేవుడు దానిలో లేడని చూపించియుండెను.

EXOD 20:18•

DEUT 18:18

 

75వారికది రుజువు చేయుటవలన వాక్యమెంత పరిపూర్ణముగా వారికి తెలియజేయబడినదో ఆలోచించుడి. ఈ వాగ్దాన దేశములోనికి వారిని తీసుకు వెళ్ళుటకు అతడు పిలువబడినాడని తెలియజేయుటకు మోషే ప్రవచించిన ప్రతీది సరిగ్గా అక్కడే నెరవేరుచుండెను. దానిలో ఒక్కమాటయైనను తప్పిపోలేదు. మీరు అరణ్యములో నడుచుచున్నారని తెలుసుకొనుటకు అది ఎటువంటి ఒక భాగ్యమైయున్నది కదా… మరియు అక్కడ, పిదప… అతడు వారికి వర్తమానమును చెప్పినప్పుడు, మొదటిగా దానిని వారు నమ్మవలసియుండెను. అయితే అతడు వారిని బయటకు తీసుకువచ్చిన తరువాత, అప్పుడు దేవుడు చెప్పెను, "నీవు అరణ్యములో కలిసిన ఆ అగ్నిస్తంభమును నేనేయని వారికి రుజువు చేయుదును.

కావున ఆయన, "ఆ పర్వతము దగ్గర వారిని పోగుచేయుము" అని చెప్పెను. మరియు ఆయన ఆ సీనాయి పర్వతము మీదకి దిగివచ్చెను. మరియు దేవుడు ఉరుముటకు మొదలుపెట్టెను.

మరియు ప్రజలు ఇట్లు చెప్పిరి, "దేవుడిని మాటలాడనీయకుము. మోషే నీవు మాటలాడుము."

దేవుడు చెప్పెను, "ఇకమీదట నేను వారితో ఈ రీతిగా మాటలాడను, నా నామమున వారితో మాటలాడుటకు నేను వారికొరకు ఒక ప్రవక్తను లేపుదును," చూశారా. కావున దేవుడెల్లప్పుడూ దానినే చేసెనని మనము కనుగొనియున్నాము. ఆరంభములోనే వారు దానిని ఎందువలన చూడలేకపోయిరి? ఈ సంగతులన్నిటిని చూసిననూ, పిదప వారిని వాగ్దాన దేశములోనికి తీసుకొనిపోవు ఆ వర్తమానమునకు విరుద్ధముగా గొణిగిరి; అది వారికి ఒక ఆరంభమునిచ్చి మరియు వారిని వాగ్దాన దేశమునకు తీసుకొని పోవుచుండెను. అయితే వారింకనూ… వారు దానికి విరుద్ధముగా గొణగవలసివచ్చెను. అనుదినము వారు ప్రభువుతో నడవవచ్చును, ప్రభువుతో నడుచుచూ, అలాగే రాత్రి వేళ కురిసిన మన్నాను ఉదయమునే తినుచూ సరిగ్గా ఆ అరణ్యములో జీవించునట్టి అ జీవితము ఎంత

పరిపూర్ణముగా ఉండునో ఆలోచించుడి!

NUM 21:5

 

76మీకు తెలియును, వారికది ఎంత సామన్యముగా అనిపించినదనగా, "చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది" అని వారు అన్నారు. చూశారా? మరియు మన విషయము కూడా ఆ విధముగానే ఉండియున్నది. దేశమంతటా కేవలం నేను కలిగియున్న నా చిన్న పరిచర్యలోనే, మనకున్న చిన్న గుంపుల గూర్చి నేను ఒక్క క్షణం ఆలోచించుచున్నాను. ఎప్పుడూ ఉన్నటువంటి స్వస్థతలను మరియు అట్టి కార్యములను మాత్రమే చూచుట కాదు. స్వస్థత విషయమైతే, దేవుడెల్లప్పుడూ ఏదో ఒకచోట స్వస్థత కొరకు ఒక మార్గమును కలుగజేసియున్నాడు. ఆయన ఒకప్పుడు కోనేటిపై దేవదూతను కూడా కలిగియున్నాడు. మరియు ఆయన… అన్నిరకములైన కార్యములను కలిగియున్నాడు. అరణ్యములో ఇత్తడి సర్పమును కలిగియున్నాడు. ఎల్లప్పుడూ స్వస్థత యొక్క గురుతులను మీరు కలిగియున్నారు. (నేను మాటలాడునది దానిగూర్చి కాదండి.) స్వస్థతయనునది ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక కార్యమైయున్నది. ఒక స్వస్థతా కూటమునకు ఎవ్వరైనా విరాళములిచ్చెదరు. వారు ఒక సంగీత కచేరీకి విరాళములిచ్చెదరు. అయితే ఒక దీనమైన నశించిపోవు ఆత్మ విషయంలో, దాని విషయమై వారేమియూ చేయగోరరు. చూడండి, ఇప్పుడంతవరకు అది నిజమేనా? మనము ప్రతీది కలిగియున్నప్పటికినీ. ఒక దీనమైన నశించు ఆత్మ విషయంలో దానికి ఏదైనా చేయుటకు ఇష్టపడరు. అతనిని దేనిలోకైనా తడుములాడునట్లు చేయుదురు. "మంచిది, అది సరియే, అతడు ఒక సంఘమునకు చెందియున్నాడు. అందువల్ల అది ఏ హానియు కలుగజేయదు," అని చెప్పుదురు.

77అయితే ఇప్పుడు, మనమిచ్చట కనుగొన్నాము… (ముగింపునకు వచ్చి యుండగా మనమిచ్చట వీలైనంత త్వరపడెదము.) అది ఎంత పరిపూర్ణముగా ఉన్నదో ఆలోచించుడి. ఈ భూమిపై మనము ఇంతవరకు జీవించియున్న దినములను నేను గమనించితిని. ప్రభువైన దేవుడు ఏమి చేసియుండెనో గమనించుడి. మనమంతా ఆనందించినటువంటి గొప్ప సూచనలతోనూ, మరియు అద్భుతములతోనూ మరియు మహత్కార్యములతోనూ ఆరంభమునిచ్చెను. పిదప గమనించండి… అప్పుడు వాటి వెనుక వర్తమానము వచ్చియుండెను.

ఏమి జరిగినదో గమనించండి. నీవు ఒక్కడివే కాకుండా, మనుష్యులు నీతో కూడా నడుచుట. అక్కడ నిలబడియున్నప్పుడే, పరలోకము నుండి దేవదూతల గుంపు వచ్చి భూమియంతటినీ కుదిపివేయుటను చూడండి. మరియు పత్రికావాళ్ళు దానిగూర్చి వ్రాసియున్నారు; అది జరుగుటను గూర్చి కొన్ని నెలల క్రితమే చెప్పబడెను. ఆయన అచ్చట నిలబడియుండెను, మరియు, "ఇక సమయము లేదు, తిరిగి వెళ్ళము. సంఘ సంస్కరణ కాలములో దాచబడియున్న ఏడు ముద్రల మర్మములను విప్పి మరియు ఆ కార్యమును బయటకు తీసుకురమ్ము," అని చెప్పెను. పిదప సర్పము యొక్క సంతానము, మరియు అటువంటి ఈ కార్యములన్నియూ ప్రసంగించబడెను. మరియు మతాధికారులు ఏమి చేసెను? దానిని చెప్పడానికి బదులు. "లూథర్ ఎందుకు దీనిని చెప్పెను లేదా అటువంటిదానిని చెప్పెను" అని చెప్పుదురు. వారు కేవలం వారెన్నటికీ దానిని చూడకయుందురు. చూశారా? అయితే విశ్వసించుచున్న మనకు; అనుదినము దేవుని యొక్క సన్నిధిలో నడుచుటకు అది ఎంతటి భాగ్యమైయున్నదో కదా.

HEB 13:8

 

78అచ్చట నిలబడియుండి మరియు ఆకాశము నుండి ఒక సుడిగాలి వచ్చుటను చూడుడి. మేమెచ్చట నిలబడియున్నామో అక్కడ అది ఒక పర్వతమును మధ్యకు రెండుగా చీల్చివేసెను; చెట్ల పైభాగమును నరికివేసెను మరియు అటువంటి కార్యములు జరిగియుండెను. మరియు ఒక గొప్ప శబ్దముతో ఒక స్వరము బయటికి వచ్చి మరియు అక్కడ మూడుసార్లు కుదిపివేసి, "అది పశ్చిమ తీరానికి వెళ్ళుటను గమనించుము," అని చెప్పెను. అది నేరుగా అచ్చటికి వెళ్ళి మరియు అలాస్కాను కుదిపివేసెను. మరియు సరిగ్గా ఇప్పుడది పశ్చిమ తీరమునకు వచ్చుచుండెను. అది ఖచ్చితముగా అట్లేయైయుండెను.

మొన్నటి దినమున, నేను ఒక రాయిని తీసుకొని మరియు దానిని గాలిలోకి విసిరియున్నాను, మరియు, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, భూమిమీద తీర్పులు మొదలయ్యే ఘడియ వచ్చియున్నది. భూకంపములు మరియు ప్రతీది సంభవించును. మరియు పశ్చిమ తీరమంతయూ కుదిపివేయబడును మరి అటువంటివి సంభవించును" అని అన్నాను. ఎంత పరిపూర్ణముగానున్నదో గమనించండి. రోజురోజుకీ, ప్రతీదియూ ఖచ్చితముగా ఆయన చెప్పినట్లేయున్నది. సహోదరులారా, మనమెట్లు దానిని త్రోసివేయగలము? మన విశ్వాసమును ఆయన తట్టు ఉంచెదము.

"ఈయన ఎవరు?" అని వారన్నారు. మనకైతే ఆయన ఎవరన్నది తెలియును. అది అగ్నిస్తంభమైయుండి, నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగానున్న యేసుక్రీస్తేయై యున్నాడు. మోషే కాలమందు, అది ఏమిచేసెనో చూడండి; ఈనాటి అగ్నిస్తంభమువలెనేయైయున్నది. అది ఎల్లప్పుడూ… యేసే ఆ వాక్యమైయున్నాడనుటను వారెందుకని విశ్వసించలేదు? వారు తప్పుడు అనువాదమును మరియు అవగాహనను కలిగియున్నారు. సరిగ్గా హవ్వ చేసినట్లే, వారిప్పుడు చేయుచున్నారు.

79అప్పుడు వారికి, బిలాము మరియు అతని సిద్ధాంతము సరిగ్గానే అనిపించినది. మరియు ఖచ్చితముగా వారియొక్క అభిరుచికి తగినట్లేయున్నది. పండుగ సమయమందు, గమనించండి…. మోయాబీయుల పండుగ సమయములో….. ఓ, అతనేమి చెప్పెనో చూడండి. ఈనాడు ఇక్కడున్న ఒక దృశ్యం, అక్కడున్నదానికి ఎట్లు సాదృశ్యముగానున్నదో గమనించండి. (నేను మిమ్మల్ని చాలాసేపు ఉంచుచున్నాను.) అయితే చూడండి, కేవలం కొద్దిసేపు మోయాబీయుల ఆ పండుగను గమనించండి. అతడు వారిని అచ్చటినుండి ప్రక్కకు త్రిప్పలేకపోయెనాయని చూడండి, బిలాము వారిని త్రిప్పెను, అటుపిమ్మట అతడు వారందరినీ ఒక సంస్థగా చేసియున్నాడు. అతడు తనకుతానుగా వారిని శపించలేనప్పుడు. అతడు ఎంతగా శపించెనో, దేవుడు అంతగా ఆశీర్వదించెను. కేవలం కాపాడెను….

JUDE 1:11

 

80చూడండి, ఆయన పెంతెకోస్తువారికి చేసింది అదేయైయున్నది. మీరందరూ ప్రారంభించిన రోజుల్లో, కొద్ది సంవత్సరముల క్రితం, వారు మిమ్మును ఇట్లనియున్నారు, "మీరెక్కడికీ వెళ్ళకుందురు. మీరు దేనిని పట్టించుకొనరు. మీరు మండిపడెదరు. మీరు కేవలం ఒక మత మూఢత్వపు గుంపైయున్నారు." అయితే వారు మిమ్మును శపించుటకు ప్రయత్నించిన ప్రతీసారి, మీరు మరలా తిరిగి ఆశీర్వదించబడుచూ వచ్చిరి. ఆ మునుపటి సమావేశము ఆరంభము నుండి, ఆ జనరల్ సమావేశమప్పటి నుండి దేవుడు తన వర్తమానమును బయలుపరచుచూనుండెను. పిదప నీటి బాప్తిస్మము కొరకు వారు యేసుక్రీస్తు నామమును స్వీకరించినప్పుడు ఆయన వారిని లోపలికి తీసుకువచ్చియుండెను. అప్పుడు ఒకరు ఈ మార్గమున దుమికిరి, మరియు ఒకరు ఈ మార్గము వైపుకు మరియు మరొకరు వెళ్ళిపోయిరి…; దీనిని మరియు దానిని సంస్థాగతం చేసిరి. దేవుడు ఆశీర్వదించుచూనుండెను.

ఇప్పుడు, సరి, అతడు మిమ్మును శపించలేకపోవుటను ఆతడు చూచెను, చూశారా. కావున అతడేమి చేయబోవుచున్నాడు? వాడు మిమ్మును సంస్థగా చేయబోవుచున్నాడు. "ఓ, ఏ తల్లిదండ్రులున్ననూ మేమంతా ఒక్కటే." "మేమంతా ఒకే దేవునిపై నమ్మికయుంచియున్నాము." అనే స్థితికి మిమ్మును తీసుకువచ్చుచున్నాడు. చూశారా. కావున బిలాము చేసినది సరిగ్గా అదేయైయున్నది. మరియు దీనివిషయమై యూదా మనలను హెచ్చరించలేదా? వారు తప్పు త్రోవలో నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము యొక్క సిద్దాంతములో నడిచిరి, మరియు కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. యేసు యొక్క దత్తత సహోదరుడైన యూదా దీని విషయమై పరిశుద్ధ గ్రంధములో మనలను హెచ్చరించలేదా? వారు ఆదినుండి కయీనువలె ఉండియున్నారు, అద్దెకు తీసుకురాబడినవారై యున్నారు. సంఘమునకు వెళ్ళీ మరియు సంఘములు నిర్మించి మరియు ఒక బలిపీఠమును కట్టి మరియు అర్పణను అర్పించినవాడైయుండెను. అట్లు కయీను నడిచిన మార్గమున వారు నడిచిరి. బిలాము యొక్క మార్గములో వారు పరుగెత్తిరి, మరియు కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. సరిగ్గా మనము కూడా ఈ ఉదయము దానినే చేస్తున్నామన్నట్లుగా, ఆ విషయమంతటినీ, యూదా ఇక్కడ మనముందు ఉంచియున్నాడు. ఆ విషయమంతయూ ఇచ్చట మనముందే ఉండియున్నది.

JUDE 1:11

 

81వారు కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. అది ఎంత విచారకరమోయని ఒక్క క్షణం దానిగూర్చి ఆలోచించుడి, కేవలం ఆ కోరహు చేసిన దాని విషయమై ఆలోచించాలనిన. చూడండి, ఆతడిట్లు చెప్పెను, "ఇప్పుడు, మనందరము పండుగకు వెళ్ళెదము. మనమంతా ఒక్కటైయున్నాము." మోయాబీయులు దేవునియందు విశ్వాసముంచుదురు. వారు లోతు కుమార్తెల యొక్క పిల్లలైయున్నారు. చూశారా? "మనమందరము ఒకే దేవునియందు విశ్వాసముంచు వారమైయున్నాము." ప్రాధమికముగా వారన్నది సంపూర్ణముగా సరియే. ఈనాడు ఒక చక్కని బాప్టిస్టు లేదా ఒక ప్రెస్టిటేరియన్ వలే ప్రాధమికముగానున్న ఆ బిలామును గమనించండి. అతను అచ్చటికి వచ్చియున్నాడు మరియు అచ్చట ఇశ్రాయేలు మత సంస్థకు వేరుగా ఉండియున్నారు. వారు ఒక దేశముగానున్నారు. అప్పటికింకా ఇశ్రాయేలు ఒక దేశముగా లేకుండెను. ఆ సమయములో వారు ఒక ప్రజగా ఉండి యున్నారు. కొంచెం కాలము తర్వాత వారు దేవుని యొక్క మార్గములో వెళ్ళగోరలేదు. వారు ఇతర దేశస్థులవలె ఉండుటకు ఇష్టపడియున్నారు. వారు విఫలమయినది అప్పుడేయైయున్నది. అయితే వారు దేవునితో నిలిచియుండగోరినంతకాలము, సరిగానున్నారు.

NUM 23:1

 

82బిలాము వెలుపలికి వచ్చి వారివైపు చూచెను, "సరి, మై! వారిలో ఒక సేవకుడు వేరొకని భార్యను వివాహమాడెనని నాకు తెలియును" అని అనెను. ఈ ఇతర కార్యములన్నియూ, ఓ నిశ్చయంగా, వారు అటువంటివి చాలా కలిగియున్నారు. అతడు పాలెములో రాజు యొక్క ధ్వని వినుటను మరచిపోయెను. కొట్టబడిన బండను, మరియు ప్రాయశ్చిత్తము కొరకై వ్రేలాడుచున్న ఆ ఇత్తడి సర్పమును అతడు ఎన్నడూ చూడలేకపోయెను. వారు ఎటువంటి సంస్థకును అంటుకొనియుండలేదని అతడు గ్రహించలేకపోయెను. వారు దేవుని యొక్క నిబంధనకు అంటుకొని మరియు దానిలో నడుచుచున్నారు, చూశారా. మరియు బిలాము ప్రాధమికముగా ఇట్లు చెప్పెను, "నాకు ఏడు బలిపీఠములను అమర్చ౦డి." యెహోవా కోరినది అదేయై యున్నది. యెహోవా ఇరువైపుల కలిగియున్నది అదేయైయున్నది. "అది సరియే, ఇప్పుడు దానిపై ఏడు దూడలను అమర్చ౦డి." అచ్చట వారు ఆ పాలెములో చేయుచున్నది అదేయైయున్నది. "దానిపై ఏడు పొటేళ్ళను ఉంచుడి, ఎందుకనగా ఒక దినమున ఒక మెస్సీయ రాబోవుచున్నాడు." అది సరియే.

83చూడండి, ప్రాధమికముగా వారిరువురూ సరిగానేయున్నారు; ప్రాధమికంగా. చుశారా, అయితే ఒక దినమున ఆ విషయంపై అతడు వారిని చిక్కించుకోలేక పోవుటను అతడు చూచినప్పుడు, అతడిట్లనెను, "మనము ఏకమై స్వయంగా ఒక సంస్థగా ఏర్పాటయ్యెదము." మరి సరిగ్గా అక్కడే వారు తమ పొరపాటును చేసియున్నారు.

మరియు ఆ మిగతా సంఘములవలె అది తిరిగి సంస్థగా ఏర్పాటయినప్పుడు; ఖచ్చితముగా అక్కడే పెంతెకోస్తు దానియొక్క తప్పిదము చేసియున్నది. నేను మీకు శత్రువును కాదండి. నేను మీ సహోదరుడనైయున్నాను. ఒకానొక ఈ దినాల్లో అది వాస్తవమని మీరు తెలుసుకొందురు. బహుషా ఇంకా కొంతకాలము పట్టవచ్చును, కొన్ని రోజులవ్వచ్చును, కానీ ఏదో ఒక దినమున అది వాస్తవమని మీరు చూచెదరు.

అప్పుడు బిలాము యొక్క సిద్దాంతము వారిని తాకినది. వారు కోరుకున్నది అదేయైయుండెను. "మనమంతా ఒక్కటే," చూశారా. కావున, అక్కడే వారు తప్పిపోయిరి. వారియొక్క ప్రవక్తలు మరియు అందరునూ వారితో కూడా వెళ్ళిరి. మరియు పండుగలో, వారే ఇట్లు చెప్పిరి, "మరియు మనమంతా ఒక్క దేవుడే ఉన్నాడని నమ్ముచున్నాము. మనము దానినే నమ్మెదము." సరిగ్గా వారు దేనికొరకు ఎదురు చూచుచున్నారో, ఖచ్చితముగా అదేయైయున్నది.

84వారి సంస్థను బట్టి ఇప్పుడు మెధడిస్టువారు మరియు బాప్టిస్టువారు ఒక్కటిగా అగుటకు కష్టమైనప్పుడు, ఒక ప్రధానమైన సంస్థ వచ్చుచున్నది గనుక అప్పుడు మనమందరము ఒకటవ్వవచ్చును, అది సరియే. "ఓ", మీరు చెప్పుదురు, "పెంతెకోస్తవారు దానినెన్నడూ స్వీకరించరు," వారు స్వీకరించరా? గడిచిన దినమున మిస్సోరీనందు వారు ఏమి చేసిరి? మీరు మీ పత్రికలు చదవండి, నిశ్చయంగా, చూశారా? మీరు చదువరా? లేదు, పెంతెకోస్తు ప్రజలైన మీరు కాదు; అయితే అది మీరు కాదు, అది అక్కడుండి మిమ్మును నడిపించుచున్న ప్రభుత్వమై యున్నది. మిమ్మును మలుపు త్రిప్పుచున్న శిరస్సు అదేయైయున్నది. అది వాస్తవము. మీరు దానితో వెళ్ళకుడి. మీరు ఆ కార్యమునకు దూరముగా ఉండుడి, అది మృగము యొక్క ముద్రయైయున్నది. మీరు వీలయినంత త్వరగా దానినుండి స్వతంత్రులవ్వ౦డి, చూశారా. అది ఒక మతాచార. ఆ నడిపించేది ప్రభుత్వపు శిరస్సైయున్నది.

85మనము జర్మనీతో కానీ లేదా ఈ ఇతరులతో కానీ అస్సలు యుద్ధమునకు వెళ్ళియుండేవారము కాదు. దీనిని ఇక్కడున్న కొంతమంది ఈ గొప్ప రాజకీయ నాయకులు కొత్త తుపాకీలు చేయుటకు పూనుకొనిరి… దానినుండి నేను డబ్బు కోరుటలేదు. అచ్చటికి వెళ్ళి మరియు దానికొరకు ప్రాణంపెట్టు నా స్వంత పిల్లలు నుండి ఆ రక్తపు సొమ్మును నేను కోరుట లేదు. చూశారా? అయితే అది అదేయైయున్నది, దానిని చేయునది రాజకీయమైయున్నది. మరియు ప్రపంచమంతయూ అపవాదిచే నియంత్రించబడుచున్నది. యేసు చెప్పినది ఖచ్చితముగా అదేయైయున్నది. మరియు అది యేసువచ్చి దానిని స్వాధీనము చేసుకొనువరకు, వెయ్యేండ్ల పాలనవరకు అది ఎన్నడూ సరిచేయబడదు. ఇప్పుడయితే మనము ఈ ఇబ్బందులను కలిగియున్నాము. దానిగూర్చి చెప్పుటకు ఇప్పుడు త్వరపడెదము.

86దేని కొరకు ఎదురుచూచుచున్నారో… సరిగ్గా అదే కార్యమైయున్నది. వారు కోరుకున్నది సరిగ్గా అదేయైయున్నది. మోయాబు పండుగలో సాతాను యొక్క విజయమువలెనైయున్నది. ఇంకొకరు వచ్చుటను కూడా వాడు కలిగియున్నాడు. వాడు వారందరినీ ఒకే దారిలోనికి తీసుకుపోవుచున్నాడు. అందరూ ఒక్కసారిగా ఆగండి. వారు చేసిన దానిగూర్చి ఆలోచించుడి. అప్పుడున్నట్లేయైయున్నది. దానిని గుర్తించుటకు ఒక సుదీర్ఘంగా, మూడు లేదా నాలుగు సంవత్సరములు పట్టకుండును. వారు… దేవుని యొక్క వాక్యమును దాటుకుని వెళ్ళినవాడైన ఆ అబద్ధ ప్రవక్త ప్రతీ హెచ్చరికనూ దేవుడు ఆ దేశముగుండా పంపించెను మరియు వారితో చెప్పెను, "దానినుండి తొలిగిపోవుడి! దానినుండి తొలిగిపోవుడి! దానినుండి తొలగిపోవుడి!" కానీ వారు దానిని చేయకుందురు. వారచ్చటనే నిలిచియుందురు.

వారు దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేయుదురు, ఆ మాటలను నిర్లక్ష్యం చేయుదురు, ఆ సూచనలను నిర్లక్ష్యం చేయుదురు, మనమున్న ఆ కార్యములను నిర్లక్ష్యము చేయుదురు. మరియు,"ఎట్లైననూ మేము దానిని కలిగియుండబోవుచున్నాము. మేము సరిగానే పోవుచున్నాము. మేము దానిని కలిగియుండవలసియున్నది. అంతే. మేమంతా ఒక్కటైయున్నాము" అనుచూ పోవుచుందురు. అపవాది యొక్క అవివేకమును చూచుచున్నారా? రోములో, నైసియా వద్ద, నైసియా పండుగలో వారు చేసినది అటువంటి కార్యమేయైయున్నది. వారు దానినుండి ఒక సంస్థను ఏర్పాటు చేసిరి మరియు జరిగినది అదేయైయున్నది. సాతానుడు ఒక నైసియా పండుగను కలిగియుండెను. ఓ, మై! మరియు ఎప్పుడైతే… వినండి, ఇచ్చట నేనొక పెద్దమాటను ఉపయోగించబోవుచున్నాను. మరియు టేపును వినుచున్న మీరు, దీని విషయమై వాదించగోరినయెడల, నాతో కాదు గానీ, చరిత్రతోను మరియు బైబిలుతోనూ మరియు స్వయంగా మీకు మీరే వాదించుకొనుడి, చూడండి.

87వినండి! ప్రతీసారీ దేవుడు ఒక వర్తమానికుడిని పంపి, మరియు ఒక వర్తమానమును ప్రారంభించినప్పుడు. మరియు ఆ సంఘము, ఆ గుంపు ప్రజలు సంఘ శాఖ పండుగగా మారుచున్నప్పుడు. అక్కడేవారు దానిని చేయుచున్నారు. అసెంబ్లీవారైన మీరు అక్కడే దానిని చేసియున్నారు. ఏకత్వపు వారైన మీరు అక్కడే దానిని చేసియున్నారు. అక్కడే మిగతావారైన మీరు, మీ సంఘ శాఖ పండుగలోనే దానిని చేసియున్నారు, ఆదినుండి దేవుడు శపించిన ఆ కార్యములోనికే తిరిగి మిమ్మును మీరు పడద్రోసుకొనుచున్నారు. అది ఖచ్చితముగా సత్యమైయున్నది. సంఘము ఒక ఉజ్జీవమును కలిగియున్న ఏ సమయములోనైనా… లూధర్ యొక్క కాలములో అప్పుడు ఏమి జరిగినది? మెథడిస్తులు… ఆ కాలములన్నింటిలో నుండి జ్వింగ్లి, ఫిన్లే, ఫిన్నీ ఆ మిగతావారందరూ, వారు ఒక ఉజ్జీవమును కలిగియున్నప్పుడు, దానితో వారు ఏమి చేసియున్నారు? దానిని నేరుగా ఒక సంఘ శాఖ పండుగలోనికి నెట్టివేసి, మరియు ఆ మిగతావారితో కలిసి దానిలోనికి ప్రాకుతూపోయి, ఆ మిగతావారివలె మీపైన ఒక ముద్రను వేసి అప్పుడు మిమ్మును నియంత్రించుటకు ఒక గుంపు మనుష్యులను మీరు కలిగియుండెదరు. ఇక పరిశుద్దాత్మ ఎంతమాత్రము ముందుకు నడిపించదు. ఖచ్చితముగా అంతేయైయున్నది. బైబిలు బోధించిన ప్రకారమే మీరు దేనినైనా బోధించుటకు ఆరంభించినప్పుడు మరియు ఆ సంఘ శాఖ దానిని నమ్మనియెడల వెంటనే వారు మిమ్మును గెంటివేయుదురు. అది నిజమా కాదా, అని ఒక్కసారి ప్రయత్నించి చూడుడి. అది నిజమేనని మీరు తెలుసుకొందురు. చూడండి, ప్రతీసారీ సంఘ శాఖ పండుగ వద్ద, బిలాము యొక్క పండుగకు, వారు పిలువబడిన ప్రతీసారీ, సమస్య చోటు చేసుకొనును. ఓ, లూథర్, వెస్లీ, పెంతుకోస్తు, మరియు వారందరూ దానియొక్క బాధితులైయుండిరి.

88గమనించండి, హల్లెలూయా, మోషే అడుగుపెట్టి మరియు "నా పక్షమున మరియు దేవుని పక్షమున ఉన్నది ఎవరు?" అని చెప్పినది అప్పుడేయైయున్నది. ఆమేన్! ఆ లేవీయుడు తన ఖడ్గమును దూసి మరియు పాలెములోనికి వెళ్ళి మరియు దానితో సంబంధము కలిగియున్న ప్రతీదానిని సమూలంగా నరికివేసినది అప్పుడేయైయున్నది. ఆమేన్! ప్రతీదానిని; మోయాబు స్త్రీని కలిగియున్న ప్రతీ పురుషుడిని, వారిరువురిని వారు చంపివేసిరి. అదే ఘడియ ఇప్పుడు వచ్చియున్నది. ఆ మనుష్యుడు ఎక్కడున్నాడు? దేవుని యొక్క వాక్యమునే ఈ రెండంచులుగల పదునైన ఖడ్గమును దూయుటకు కోరుచున్న ఈ అహరోను కుమారులైన కొందరు యాజకులు ఎక్కడున్నారు? "నా కొరకు మరియు దేవుని కొరకు నిలుచువారు ఎవరు?" అని అనినతడు ఎక్కడ ఉన్నాడు? ఆహ్వానించవచ్చు, ఆహ్వానించిననూ ఎవ్వరూ బదులివ్వకుందురు. నా భావమును గ్రహించారా? మనము దానిని పొందలేము. మనము కేవలం…. ఏదో తప్పిదము ఉండియున్నది. గమనించండి, వారు అచ్చట ఉండగా… అప్పుడే మోషే నిలబడి మరియు ఈ సంగతులను చెప్పెను.

JOHN 6:31,49

 

89గమనించండి, వారచ్చట చేసియున్న వారి పాపము, మోయాబుతో వారికై వారు సంస్థగా ఏర్పాటు చేసికొని మరియు వారిని ఒక్క శరీరముగా చేసుకున్నప్పుడు ఆ పాపము వారికెన్నటికిని క్షమించబడియుండలేదు. ఒక్క నిమిషములో నేను దానియొక్క పరిణామము గూర్చి చెప్పబోవుచున్నాను. (ఆలస్యమైనది, కానీ ఒక్క నిమిషము.) వారి పాపము వారికెన్నటికీ క్షమించబడలేదు. వారిలో ఏఒక్కరూ వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనలేదు. యేసు చెప్పెను, (ఒక్క నిమిషము నన్ను మన్నించండి) పరిశుద్ధ యోహాను సువార్త 6… యోహాను సువార్త 6 లో యేసు చెప్పెను, "మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి" అని వారు చెప్పిరి." వారు పెంతెకోస్తు వారైయున్నారు. సహోదరుడా, వారు మన్నాను తినియున్నారు, వారు వాస్తవమైన దానిని కలిగియున్నారు.

అందుకు యేసు ఇట్లు చెప్పెను, "మరియు వారు, ప్రతీఒక్కరూ మరణించియున్నారు. వారు నశించియున్నారు. వారు నిత్యము నశించిరి." వారి పాపము వారికెన్నటికినీ క్షమించబడలేదు. వారేమి చేసియున్నారు? వారు దేవునితో వారియొక్క నిబంధనను మీరి మరియు దేవుని యొక్క హెచ్చరికను లక్ష్యపెట్టని, దేవుని యొక్క వాక్యమును లక్ష్యపెట్టని, దేవుని యొక్క ఏ విషయమును లక్ష్యపెట్టని, ఆ అద్దె ప్రవక్తయైన బిలాముతో కూడా సంస్థాగతమైనారు; అయితే అతడు వారందరిని ఏకము చేయుటకు నిశ్చయించుకొనెను. అతని అవివేకమును మీరు చూడగలరా? నేను దానిని గూర్చి చాలా సేపు చెప్పగలను, కానీ దానిని మీరు గ్రహించియున్నారని నేను తలంచుచున్నాను. చూశారా? గమనించండి, ఆ ఆశీర్వదముల క్రింద జీవించి మరియు ఆ మన్నాను తిని మరియు ప్రతీది చేసిననూ; వారి పాపము వారికెన్నటికీ క్షమించబడియుండలేదు.

JOHN 6:31•

JOHN 10:30

 

90నిజమగు, సత్యమైన వర్తమానము ఒక పరాకాష్టకు చేరుకున్నప్పుడు, వారు దానిని సంస్థాగతము చేసియున్నారు. "సరి, మోయాబీయులను మరియు మనలను తీసుకుందాం. వారు ఒక గొప్ప సంస్థగానూ, ఒక గొప్ప దేశముగానూ ఉన్నారు. మనము మనము కనీసం ఒక దేశముగానైనాలేము. మనము ఒకరితోనొకరము వివాహము చేసుకొనిన చాలును మరి అప్పుడు అంతా సరియగును మరియు మనము వారితో కూడా ఉండెదము." మరియు అది ఎన్నటికీ క్షమించబడలేదు; ఎన్నటికీ, వారెన్నటికీ క్షమించబడలేదు.

యేసు చెప్పెను, "వారు, ప్రతీఒక్కరూ, మరణించిరి." హెబ్రీ లేదా గ్రీకు, ఏదో ఒకటి, లేదా ఆంగ్లములోనైనా ఆ పదమును అనువదించుడి, దాని అర్ధమేదనగా "నిత్యయెడబాటు"; ఎప్పటికీ నశించిపోవుటయైయున్నది. అది నిజము.

ఓ, అవును, వారు అద్భుతములను చూసియున్నారు. వారు అభిషేకించబడిన వాక్యమును చూసియున్నారు. వారు పరలోకము నుండి వచ్చిన మన్నాను తినియున్నారు. వారు ప్రాయశ్చిత్తము యొక్క ఆశీర్వాదములను ఆనందించియున్నారు. కొట్టబడినబండ నీళ్ళను ఇచ్చుటను వారు చూసియున్నారు. వారు దానినుండి త్రాగియున్నారు. వారు దానిని వ్యక్తిగతముగా బాగుగా ఎరిగియున్నారు. కానీ ఆ వాక్యము విరువబడు సమయము వచ్చినప్పుడు… దానిని మీరు మర్చిపోకుడి! "నేను మరియు నా తండ్రి ఏకమైయున్నాము" అని యేసు చెప్పినప్పుడు, అచ్చట ముగ్గురున్నారని చెప్పలేదు. ఈ ఇతర లేఖనము యొక్క ప్రాధమికమైనవన్నీ…

MATT 16:18

 

91గత రాత్రి నేనెక్కడ తప్పైయున్నాని నాకు చూపించుటకో లేదా త్రిత్వము గూర్చి మాటలాడుటకో ఒక వ్యక్తి నా వద్దకు వచ్చెను. నాకు వేలమంది మంచి త్రిత్వ స్నేహితులున్నారు. వారు ఆ బబులోనులోనే ఉండియున్నారు. ఆ గందరగోళములోనే ఉన్నారు ఉండియున్న చాలామంది ఏకత్వపు స్నేహితులు కూడా నాకున్నారు, చూశారా. అయితే ఏమి జరిగింది? "సహోదరుడా బ్రెన్హాం, అది పరిభాషయైయున్నది. నీవు త్రిత్వమును నమ్ముదువా?" అని అతడు అనెను.

"నిశ్చయంగా" అని నేను అన్నాను. "పరిభాష అని నీవు చెప్పిన పదమును నేను తీసుకొందును" అని అన్నాను. "నీవు దానిని ఎట్లు నమ్ముదువు?" అని నేను అన్నాను.

"నేను ఒక్క దేవునియందు నమ్మికయుంచుదును" అని అతడనెను. నేనన్నాను, "నీవు బాగుగానే చేయుచున్నావు." చూశారా.

"దేవుడు ఒక్కడేయనియు, మరియు దైవత్వములో ముగ్గురు వ్యక్తులున్నారనియు నేను నమ్ముదును" అని అతడనెను.

"నీవొక బయోలా (Biola అనగా లాస్ఏంజిల్స్ బైబిల్ సంస్థ అని అర్ధము -తర్జుమదారుడు) విద్యార్థివి కదా?" అని నేను అన్నాను.

"అవును" అని అతడనెను.

"అట్లే అనిపించుచున్నది" అని నేను అన్నాను. "నీ చదువుకి అది అంత మంచిగా అనిపించుటలేదు" అని అన్నాను. "ముగ్గురు వ్యక్తులు మరియు ఒక్క దేవుడా?" అని నేన్నాను. నేను "వెబ్స్టర్ ప్రకారము, ఒక వ్యక్తియైయుండుటకు ముందు అచ్చట ఒక వ్యక్తిత్వము ఉండవలసియున్నది. అయ్యా, నీవు ముగ్గురు దేవుళ్ళను నమ్ముచున్నావు." నీవు ఒక వ్యక్తిత్వము లేకుండా ఒక వ్యక్తివైయుండలేవు, ఎందుకనగా ఒక వ్యక్తిగా చేయునది ఒక వ్యక్తిత్వమేయైయున్నది.

కావున వారు చెప్పుదురు… "మంచిది, బ్రెన్హాం గారు, దానిని వేదాంతులు కూడా వివరించజాలరని నీకు తెలియును" అని అతడు చెప్పెను.

"అది ఖచ్చితముగా సరియే. వాక్యము ఒక వేదాంతియొద్దకు రాదు" అని నేను చెప్పాను. "బైబిలంతయూ ప్రత్యక్షతతో ముడివేయబడియున్నది, "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవు" అని నేను చెప్పాను, చూశారా. ఆమేన్, అచ్చటే మీరున్నారు, చూశారా. అయితే ఆ సంగతులయొద్దకు వచ్చినప్పుడు… ఓ, మై!

92ఇప్పుడు మనము త్వరపడెదము మరియు వీలయినంత త్వరగా ముగించెదము. నేను ఈ కొన్ని లేఖనములను మరియు వ్యాఖ్యానములను దాటివేయవలసియున్నది, చూడండి. ఇప్పుడు, గమనించండి, వారు చేసినదానికి వారెన్నటికీ క్షమించబడలేదు. వారేమి చేసిరి? వారు ఆశీర్వాదములను ఆస్వాదించిరి. దానిని మర్చిపోకండి. దానిని నేను మరలా చెప్పబోవుచున్నాను. దాని విషయమై వారెన్నటికీ క్షమించబడలేదు. ఈ టేపు ప్రపంచమంతటికీ వెళ్ళునని, గుర్తుంచుకొనుడి చూశారా? అది ఆఫ్రికా, ఇండియాలోని క్యాంపులలోను మరియు ప్రపంచమంతటా వినిపించబడుచున్నది; వివిధ భాషలలోనికి, తర్జుమాచేయబడి, మరియు వివిధ క్యాంపులలోను, వివిధ స్థలములకును తీసుకొని పోబడుచున్నవి, ఆ పాపమెన్నటికీ

క్షమించబడలేదు. ఏమిటి?

"మంచిది, దేవుడు దీవించెను, నేను దీనిని చేసియున్నాను. నేను దీనిని చేసియున్నాను. నేను పరలోకపు మన్నాను తినియున్నాను," అని మీరు చెప్పుదురు.

అవునండీ, వారు కూడా అట్లు చేసిరి. మరియు, "వారందరూ మరణించిరి" అని యేసు చెప్పెను. అయితే ఎక్కడైతే ఇతర దేశముతో కలిసి వారు ఆ నిబంధనను మీరకూడదను అసలైన వర్తమానము వద్దకు వచ్చినప్పుడు. దేవుడు ఒక ప్రత్యేకపరచువాడైయున్నాడు గనుక ఆయన ఆ ప్రజలను ప్రత్యేకపరచెను, మరియు వారు ఇతరులతో విజ్జోడుగా చేయునట్టిదేదియూ కలిగియుండకూడదు, ఎవరినీ వివాహమాడకూడదు. మరియు నిజమగు, అసలైన సంఘము, మరియు క్రీస్తు యొక్క వధువు, వాక్యమైయున్న క్రీస్తుతో జతచేయబడియున్నది. మరియు మీరు ఎటువంటి సంస్థకు గానీ, ఎటువంటి సంఘ శాఖతో గానీ వివాహమాడకూడదు. మీరు ఖచ్చితముగా క్రీస్తుతోను మరియు ఆ వాక్యముతోను వ్యక్తిగతముగా నిబడవలసియున్నది. అట్లు చేయనిచో అది దేవుని యొద్దనుండి నిత్యయెడబాటైయున్నది. ప్రతీ ఒక్కరూ దానిని గ్రహించారని నేను ఆశిస్తున్నాను.

93ఇప్పుడు, మన అంశములో అది పస్మాపండుగ జరుగుచున్న సమయమైయున్నది; అది ఒక విచారకరమైన సమయమైయున్నది. ప్రజలు గవునుల వెలుపల నిద్రించుచుండిరి. ప్రతీ పస్మాకు ఇట్లు చేయుదురు. వారు బయట మైదానములలో పడుకునేవారు. సత్రములు మరియు ప్రతీది నిండిపోయి ఉండును. అది పస్కాయైయున్నది. అచ్చట గొప్ప ఎదురు చూపులు ఉండియున్నాయి. ఆ ప్రాంతమంతయూ నిండిపోయియుండెను. ఇప్పుడు ప్రభువు చిత్తమైన యెడల 5 లేదా 10 నిమిషములలో నేను ముగించెదను. ప్రతీఒక్కరు ఆవేశపూరితులైయున్నారు.

గమనించండి, అక్కడ మూడు తరగతుల ప్రజలు ఉండియున్నారు. చూడండి, అక్కడొక గొప్ప ఎదురుచూపు ఉండియున్నది. ఈ పండుగకు ఒక వింతవ్యక్తి వచ్చుచున్నాడని వారెరిగియున్నారు. వారిలో కొందరు ఆయనను ప్రేమించిరి; వారు ఆయనను నమ్మిరి, వారిలో కొందరు ఆయనను ద్వేషించిరి; వారిలో ఎక్కువమంది ఆయనను ద్వేషించిరి. మరియు ఒకరు ఆయనను ప్రేమించి మరియు మరొకరు ఆయనను దేషించుటనుబట్టి, ఆ రెండిటి మధ్యనున్న వ్యక్తి ఏమిచేయవలెనో ఎరుగక యుండెను, చూశారా. వారెరుగకయుండిరి. గమనించండి, ఆ ప్రాంతమంతయూ ఎదురుచూపులతో నిండియుండెను. "నేను చెప్తాను, ఆయన అచ్చటికి వచ్చినప్పుడు, మనమాయనను పిలిచెదము. మనమాయనకు ఒక వాక్య పరీక్ష పెట్టుదుము. ఆ ప్రధానయాజకుల ప్రక్కన అతనిని మనము నిలబెట్టెదము. కెఫా ఎదుట అతని జ్ఞానము ఏపాటిదో మనము చూచెదము" అని ఒకడు చెప్పుచుండెను. ఆయన ఇదివరకే దానిని రుజువు చేసెను, చూశారా.

94"అయితే మనము దీనిని చేయుదుము: మనము చూచెదము… ఈ గొప్ప నాయకులలో కొందరు ఆయనపై పట్టు బిగించెదరని నేనెరుదును. అబ్బాయి, వారు ఆ యవ్వనస్తుడి యొక్క స్వభావమును వెలికి తీయుదురు. వారు మన యాజకులతో పాటు ఎగతాళి చేయబోవునప్పుడు, అతనేమిటాయని అతనికి తెలియజేయుదురు. అబ్బాయి, వారేమి చేయుచున్నారో వారికి తెలియును. వారు తెలివైన మనుష్యులైయున్నారు. వారు చేయుచున్నది ఏమిటో వారికి తెలియదు.

ఇతరులు ఇట్లనిరి, "ఆ పిల్లవాడిని వారేమి చేయుదురోయని నేను ఆశ్చర్యపోవుచున్నాను."

"ఓ, అతడు వచ్చుటకు నేను వేచియున్నాను. దేవుడు అతనితో ఉండియున్నాడు. ఆయనే ఆ వాక్యమైయున్నాడు. ఓ, నేను కేవలం ఆయనను చూడగోరుచున్నాను" అని ఇతరులు చెప్పిరి, చూశారా. ఓ, వారు విభాగింపబడియున్నారు. ఇప్పుడు, చూడండి ఆయనను ఎరిగియున్నవారు మరియు ఆయనను నమ్మియున్నవారు, ఏ ద్వారమునొద్ద వేచియుండవలెనో వారు ఎరిగియుండెదరు, చూశారా. ఏ మార్గము గుండా ఆయన వచ్చుచున్నాడో వారెరిగియున్నారు. అక్కడ గొప్ప ఎదురుచూపు ఉండియున్నది, అయితే ఎక్కువమంది ఆయనను చూచియుండలేదని మీకు తెలియును. చూడండి, ఆయనను చూడనివారు చాలామంది ఉండియున్నారు. ఈ దినమున కూడా అది ఆ విధంగానే ఉండియున్నది.

95కొందరు ఇట్లనిరి, "అతను ఒక మంచి వ్యక్తియైయున్నాడు. ఓ, అతనితో ఎటువంటి సమస్య లేదు. నెపోలియన్, వాషింగ్టన్ వలె, ఈయన ఒక మంచి వ్యక్తియైయున్నాడు. అయితే, ఓ, ఒక బోధకునిగా మాత్రం, కాదు, కాదు."

మరికొందరు ఇట్లు చెప్పిరి, "ఓ, అతనొక మంచి వ్యక్తియైయున్నాడు. ఓ, అతడు కేవలం సామాన్యులందరితో కలిసిపోయినాడు, అంతే, అతను ఒక మంచి వ్యక్తియైయున్నాడు. అతని విషయమై ఎవ్వరునూ ఏ చెడునూ చెప్పలేరు."

ఇతరులు ఇట్లనిరి, "లేదు, అతనొక అపవాదియైయున్నాడు. అచ్చటున్న మనసును చదువుతున్న విషయములను మరియు ఈ ఇతర విషయములన్నియు, మరియు అదంతయూ తప్పుడు ప్రవచనమైయున్నది. అది మన ఆచారమునకు విరుద్ధముగానున్నది. అటువంటి ఒక విషయమును మీరు నమ్మకుడి."

మరియు, "దేవునికి మహిమ, అది దేవుడే. నేను ఆయనను ఎరుగుదును. నేను చూచుచున్నాను" అని మరొకరు చెప్పిరి. మరియు వారు వేచియున్నారు. ఈనాడు సరిగ్గా ఆ విధముగానే మనమిప్పుడు నిలబడియున్నాము, అయితే అదే కార్యమైయున్నది: లవోదికయ సంఘకాలమునకు, అనగా, ఈ ఘడియకై అభిషేకించబడిన వాక్యమైయున్నది.

JOHN 1:42,49

 

96ఇప్పుడు దీనిని చెప్పుటతో మనము ముగించబోవుచున్నాము, ఒక్క క్షణము. మూడు తరగతులవారు ఆయనకొరకు వేచియుండిరి. ఈనాడు అది అట్లేయైయున్నది, అది వాస్తవమైయున్నది, మూడు తరగతులవారు. గమనించండి, విశ్వాసులు కేకలువేయుచున్నారు. చూశారా, చూశారా? ఆయన కొందరిచేత ప్రేమించబడుటకు, ఇతరులచే ద్వేషించబడుటకు, మరియు మరొక తరగతి వారు ఆయన పట్ల ఆశ్చర్యపోవుటకు, ఆయన యొక్క పరిచర్యయే అందుకు కారణమాయెను, చూశారా. ఆయన యొక్క పరిచర్య. మరొకసారి దానిని నొక్కి చెప్పనివ్వండి. ఆయన యొక్క పరిచర్య, అది ఏమైయుండినప్పటికినీ… అది వాక్యమైయున్నదని మనకిప్పుడు తెలియును. అయితే కొందరు ప్రజలు ఆయనను ప్రేమించుటకు ఆయన పరిచర్యయే కారణమాయెను. వారు అట్లు చేయుటకు ముందుగా నిర్ణయించబడిరి. చూడండి, వారు దానిని నమ్మియున్నారు. వారు దానిని చూచియున్నారు. అక్కడ ఎటువంటిదియూ….. నతానియేలు అచ్చటికి వచ్చినప్పుడు, మరియు అతడు ఏమి చేసెనన్నటువంటివి ఆయన అతనితో చెప్పినప్పుడు అతనిట్లనెను, "బోధకుడా, నీవు దేవుని కుమారుడవైయున్నావు. నీవు ఇశ్రాయేలు యొక్క రాజువైయున్నావు. నా మనసులో ఇక ఎటువంటి ప్రశ్నయూ లేదు."

అచ్చట నిలబడియున్న సీమోను, ఇట్లనెను, "ఓ, ఆంద్రేయా, నేను వెళ్ళుటలేదు. నేను ఇదివరకే అక్కడున్న ఆ సంగతులన్నియూ వినియున్నాను."

"అయితే,"ఆంద్రేయ ఇట్లు చెప్పెను, "నీవు రావవలసియున్నది. నీవు రావలసియున్నది. నీవు కేవలం ఒక్కసారి నాతో రావలసియున్నది."

మరియు అతను అక్కడ కూర్చొనియుండగా, అక్కడికి వచ్చుచున్న యేసు అతనిని చూచెను, మీకు తెలియును, అక్కడికి వచ్చి ఇట్లనెను, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవైయున్నావు." ఇక అచ్చట ఎటువంటి ప్రశ్నయూ లేదు. చూడండి, ఇక ఆ విషయమంతేయైయున్నది. వారావిషయములతో పట్టబడియున్నారు. వారు దానిని నమ్మియున్నారు. వారు దానిని చూచియున్నారు. మెస్సీయ వచ్చినప్పుడు ఆయన చేయనైయున్న కార్యము అదేయని వారెరిగియున్నారు.

97ఆయన ఒక ప్రవక్తయై ఉండవలసియున్నది, ఏలయనగా "ఆయన ఒక ప్రవక్తయైయుండును" అని మోషే చెప్పెను. మరియు ఒక ప్రవక్త లేకుండా నాలుగువందల ఏండ్లుగా వారు కలవరపాటులో ఉన్నారు. దానిని సరిచేయుటకు ప్రతీ కాలములోనూ ఒక ప్రవక్త అవసరమైయుండెను. మరియు ఇచ్చట ఆయనే నిలబడియున్నాడు.

వారికి ఎటువంటి ప్రశ్నయూ లేదు. వారచ్చట వారి చేతులతో మట్టలు పట్టుకొని వేచియున్నారు, "కొద్దిసేపైన తర్వాత ఆయన వస్తాడు."

పట్టణమంతయూ ఒత్తిడిలో ఉండియున్నది. వారు ఇట్లనిరి, "అక్కడ ఆ గవిని వద్ద గుమికూడినది ఒక మూఢభక్తిగల గుంపైయున్నది."

మరొకరు ఇట్లన్నారు, "ఆయన ఇచ్చటికి వచ్చినప్పుడు తానేమి చేయునాయని నేను ఆశ్చర్యపోవుచున్నాను. మీకు తెలియనా, ఆయన ఒక మోసగాడని నేను నిజముగా నమ్ముచున్నాను. మీకు తెలియునా, ఆయన ఒక కుందేలు పాదాన్ని కలిగియున్నాడని నేను నమ్ముచున్నాను, ఆయన దాన్ని చెవిన రుద్దుతాడు, లేదా అటువంటిదేదో మీకు తెలియునా

మరియు ఈనాడు వారు చెప్పినట్లే, "ఓ, అది ఒక విధమైన మనస్సును చదువుచునట్టిదైయున్నది. (మెంటల్ టెలీపతీ) అది ఒక విధమైన." వారు విరామం లేకుండా దానిని వివరించగలరు.

మరొకరు ఇట్లనిరి, "అది ఒక దయ్యమైయున్నది. మీరు పట్టణమునకు ఈప్రక్క నిలిచియుండుడి. దాన్ని మీరు లక్ష్యపెట్టకుడి. ఆ కూటమునకు మీరు సహకరించకుడి. మీరచ్చటికి వెళ్ళకుడి, చూడండి. దానితో మనకు ఎటువంటి సంబంధము లేదు." మూడు తరగతుల ప్రజలుండుటను చూడండి.

MATT 21:9•

MARK 11:9

 

98ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఇచ్చట ఆయన స్వారీచేయుచు, పట్టణములోనికి వచ్చుచున్నాడు. ఒక చిన్న గాడిదపై స్వారీచేయుచూ, పట్టణములోనికి వచ్చుచున్నాడు. తానేమి చేయునని వాక్యము చెప్పెనో ఖచ్చితంగా అట్లే వచ్చుచుండెను. ఆచారమువైపు చూడనివారు, ఆలయంవైపు చూడనివారు, ఈ ఇతర కార్యములవైపు చూడనివారు, యాజకులవైపు చూడనివారు, వారేమి చెప్పవలసియున్నారో చూడుడి. ఆయనను నమ్మినవారు, వారచ్చట వారి చేతిలో మట్టలను పట్టుకొని నిలబడియుండిరి. కేవలం ఆ మొదటి కదలిక కొరకు వేచియుండిరి. "ఈయన ఎవరో వచ్చుచున్నాడు?" అని వారు చెప్పుటను మీరు ఎంతమాత్రమూ వినలేదు. ఓ, లేదండి! వచ్చుచున్నది ఎవరో వారికి తెలియును. వాక్యము ఏమి చెప్పెనో, వారికి తెలియును. చూశారా? మరియు పట్టణమునకు వెనుకనున్న ఆ వేరొక తరగతివారిని చూశారా? మరియు పిదప వారు ఈ సందడి వినినప్పుడు: "రాజునకు హోసన్నా! ప్రభువు పేరట వచ్చుచున్న రాజునకు హోసన్నా! హోసన్నా!హోసన్నా!" మరియు ఆ కేకలను…

అప్పుడు ఈ మతకల్లోలము దేనిగురించాయని చూచుటకై యాజకులు బయటకు పరిగెత్తుకొనిపోయిరి. మరియు ప్రజలు, "ఈయన ఎవరు?" అని అనిరి. స్నేహితులారా, వారచ్చట దేనికొరకు ఉండియున్నారు? ఒక మతసంబంధమైన పండుగయైయున్నది! ఈ పండుగను వారికి నియమించిన దేవుడే సరిగ్గా ఆ విధంగా తానచ్చటికి వచ్చునని వారితో చెప్పెను, మరి అయిననూ వారు, "ఈయన ఎవరు?" అని కేకలు వేసిరి.

ZECH 9:9•

MATT 21:5•

HEB 13:8

 

99కాలము మారలేదు. అప్పుడున్నట్టుగానే ప్రజలు ఇప్పుడునూ రూపించబడియున్నారు. హెబ్రీ 13:8 ఇట్లు చెప్పుచున్నది, "ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒకటే రీతిగానున్నాడు." ఇప్పుడు దీనిని చెప్పుటతో నేను ముగించబోవుచున్నాను: ఇకమీదట ఆ ప్రశ్న వారికి కాదు. "ఈయన ఎవరు?" అని వారు ప్రశ్నించిరి. అయితే 1964లో, ప్రశ్న ఏదనగా, "ఈయన ఎవరని మీరు చెప్పెదరు?" ఇదంతయూ దేని గూర్చియైయున్నది? లేఖనములు పరిశోధించుటను మీరు నిలిపివేసితిరా? ఈయన ఎవరని మీరు తలంచుచున్నారు? ఇది మనస్సును చదువుటయా? (మెంటల్ టెలిపతీయా?) "యోహాను ఒక వెర్రివాడివలె ఉన్నాడు, ప్రజలను అచ్చట నీటిలో ము౦చుచున్నాడు," అని వారు చెప్పినట్లు ఇదియూ, ఎక్కడో అరణ్యము నుండి వచ్చిన ఏదో వింతైన కార్యముగానున్నదా? ముందుగా పంపబడినవాడు అచ్చట ఉండునని యెషయా చెప్పినట్లు, ఆయన ఖచ్చితముగా అచ్చట ఉండునని మలాకి చెప్పినట్లు "దానిని పరిచయం చేయుటకై ముందుగా ఈ ప్రవక్త లేచును" అని ఆ ప్రవక్తలు చెప్పినట్లు, మరి ఇదిగో ఆయన ఇచ్చట ఉండియున్నాడు.

"అతనొక వెర్రివాడైయున్నాడు. అతనికి దూరముగానుండుడి. చూశారా? ఆయన జోలి మీకు అక్కర్లేదు" అని వారు అనిరి. "ఆయన గాడిద పిల్లను ఎక్కి పట్టణములోనికి స్వారీ చేయును. లేఖనములు నెరవేర్చబడునట్లు, నీ రాజు దీనుడు, నీతిపరుడై గాడిదను, దాని పిల్లను ఎక్కి పట్టణములోనికి వచ్చుచున్నాడు," అని ఖచ్చితముగా ఆ లేఖనము చెప్పినట్లే, ఇదిగో మెస్సీయా వచ్చుచున్నాడు. మరియు ఒక మతపరమైన పండుగలో బిలాము నిలబడినట్లు, మరలా ఇచ్చట ఈ మతపరమైన పండుగలో ప్రజలు నిలబడి, "ఈయన ఎవరు?" అని చెప్పుచున్నారు.

మరియు స్నేహితులారా, ఈ దినమున, ఈ ఘడియకై వాగ్దానము చేయబడిన లేఖనములు సరిగ్గా మన మధ్యలోనే ఘడియ ఘడియకు నెరవేరియున్నవి. ఈయన ఎవరని మీరు తలంచుదురు? మన శిరములు వంచియుండగా, మనము దానిని అధ్యయనము చేయుదుము.

100ప్రియమైన దేవా, మేము దీనిని చేయవలసియున్నది గనుక, మేమంతా తీవ్రముగా, లోతుగా ఆలోచించుచున్నాము, ప్రభువా, అది మా చేతులపైనే ఉండి యున్నది. గొప్ప రాజవైన నిన్ను మేము చూచుచున్నాము. నీ వాక్యము యొక్క వాగ్దానమును మేము చూచుచున్నాము. మేమిప్పుడు బ్రతికియుండగానే, ఈ గొప్ప సమయము రావలెనని, దీనికొరకు మేము సంవత్సరముల తరబడిగా ఎదురుచూచుచుండి యున్నాము. నీవు ఏమి జరుగునని చెప్పియున్నావో, ఖచ్చితముగా అట్లే నీ యొక్క అభిషేకించబడిన వాక్యము నీ ప్రజలలో నుండి అది జీవించుటను మేము చూచుచున్నాము. మరొకవైపు అపవాది యొక్క గుంపు అభిషేకించబడుటను మేము చూచుచున్నాము. మరియు ఒక్క రాయియైననూ విడిచిపెట్టబడ కూడదని, దేశమంతటా మేము వాక్యము ద్వారా దాన్ని తీర్చిదిద్దాము. ప్రభువా, నీవు ఎవరిని జీవము కొరకు నియమించావో నేను ఎరుగను. దానిని తెలుసుకొనుట నా పని కాదు, అది నీ కర్తవ్యమైయున్నది. అయితే ప్రతీ రాయిని దొర్లించుట నా పనైయున్నది. దేవా, నాకు సహాయము చేయుము, దానిని నమ్ము వ్యక్తికినీ సహాయము చేయుము. ప్రభువా, దానిని విన్నది తప్ప, నీవు నియమించనిది ఏదియూ ఉండకుండునట్లు, ప్రతీ రాయిని దొర్లించుము.

ప్రభువా, సరిగ్గా మా తరములోనే, నీ రాకడను మేము చూడగోరుచున్నాము. మేము దానిని నమ్ముచున్నాము. మరొక మట్టల శుక్రవారము ఉండియున్నదని మేము నమ్ముచున్నాము; మంచి శుక్రవారము మరియు ఒక ఖర్జూరపు మట్టల శుక్రవారము ఉండియున్నది. నీ సంఘమునకు ఒక సిలువ మరణమైయున్నది, అయితే నీవు వచ్చుచున్నప్పుడు మాకు అది విజయోత్సవమైయున్నది.

101ప్రభువా, ఈ దినమున నీ ప్రజలను నీవు ఆశీర్వదించవలెనని మేము ప్రార్ధించుచున్నాము. ఈ చిన్న సంఘమును ఆశీర్వదించుము. ఇచ్చటున్న ఈ ప్రియమైన కాపరిని మరియు ఆయన కుమారుని ఆశీర్వదించుము, సహచరుడు ఔట్లా మరియు ఆయన కుమారుడు; సీనియర్ జిమ్మి మరియు జూనియర్ జిమ్మి ఇరువురిని ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆశీర్వదించుము.

ప్రభువా, కొందరు ప్రజలతో మాటలాడే భాగ్యము నేను కలిగియున్నానంటే, అది ఈయన ఎవరని, ఎవరి గూర్చియైతే, ఈ జనులు ఆశ్చర్యపోవుచున్నారో, అట్టి ఈ వ్యక్తిని మహిమపరచుటకేయైయున్నది. దేవా, అట్లు కానిచో, ఈ ఉదయం నేను టూసాన్ నుండి ఇచ్చటికి ఊరకే వచ్చియుండేవాడిని కాదు. ఒక మనిషివలన ఇది జరిగియుండదని వారికి తెలియును. ఈ సంగతులు తెలుసుకొనుట మనుష్యునికి అతీతమైన కార్యమని వారికి తెలియును. అయితే ప్రజలు, "ఇది ఏమిటి?" అని అనుచున్నారు.

ప్రభువా, అది నీవేయని మేమెరుగుదుము. అది పరిశుద్దాత్మయను వ్యక్తిలో ఉన్న యేసుక్రీసైయున్నాడు. ఆయన పరిశుద్దాత్మయై యున్నాడు. "నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను. మరలా దేవుని యొద్దకు పోవుచున్నాను." మరియు ప్రభువా, పరిశుద్ధ గ్రంధము యొక్క మొదటి భాగములో మోషేతో ఉన్నవారు చూసినట్లే ఆ గొప్ప అగ్నిస్తంభమును మేము మా మధ్యన చూచుచున్నాము. బైబిల్ మధ్యలో, పౌలు ధమస్కు మార్గమున పోవుచుండగా మేము దానిని చూచియున్నాము. దానిని మేము చూశాము. ఇప్పుడు మరలా అంత్యకాలమున మేము ఇచ్చట దానిని చూచుచున్నాము. మూడు అనునది ఒక నిర్ధారణయైయున్నది. ప్రతీసారి అది వర్తమానమేయైయున్నది.

ప్రభువా, స్త్రీ మరియు పురుషులు ఇక ఎంతమాత్రము సాంప్రదాయములపై మరియు ఆచారములపై ఆధారపడకుందురు గాక. అయితే వారు ఆ కార్యము నుండి బయటకు వచ్చి, దేవునికి వారి జీవితములను పూర్తిగా సమర్పించుకొని మరియు నమ్మెదరు గాక; మనుష్యుని యొక్క వాదములు మరియు ఆ కార్యములపై నమ్మికయుంచుట కాదు కానీ, జీవముగల దేవుని యందు నమ్మికయుంచుదురు గాక. ఈ సెలవుదినములు గడుచుచుండగా, ఆ కేక, ఇంకనూ: "ఈయన ఎవరు? ఇదేమిటి? ఇదంతయూ దేనిగూర్చియైయున్నది?" అనునదైయుండెను. మతపరమైన ప్రజలు కూడా అదే కార్యమును చెప్పుదురు. మరియు అది తన ప్రజల మధ్యలో శరీధారియై, వధువుకొరకు తన వాక్యమును అభిషేకించుచున్న అదే ప్రభువైన యేసైయుండెను. మరియు వారు దానిని గ్రహింపలేకున్నారు. ఇదంతయూ ఏమిటోయని తెలియనంతగా, ఈ లవొదికయలో వారందరూ మరలుకొల్పబడియున్నారు. అయితే, "అస్తమయ కాలమున వెలుగు కలుగును," అని ప్రవక్త చెప్పియున్నాడు. కావున ఇప్పుడు, ప్రభువా, మేము దానికొరకు ఎదురుచూచుచున్నాము. ప్రభువా, రమ్ము ప్రతీఒక్కరినీ ఆశీర్వదించుము.

102ఇప్పుడు మీ శిరములు మరియు మీ హృదయములు వంచినవారైయుండగా, మీరు ఇది సత్యమని నమ్ముచున్నారా? నమ్ముదురా? కేవలం మీ చేయి పైకెత్తి, ఇట్లు చెప్పుడి, "మనము అంత్యదినములలో జీవిస్తున్నామన్నది, సత్యమని నేను వాస్తవముగా నమ్ముచున్నాను. ఇప్పుడు మేము ఇచ్చటనున్నాము మరియు మనము ఎంతో వంకరచేయబడినామని నేను నమ్ముదును." గడిచిన దినమున మీరు కూటములో ఉండియున్నారు, ఎప్పుడైతే గోధుమ, కాండము మీరు గమనించండి, దీనిని వెంబడించునట్లు మనము ఎటువంటి సంస్థను కలిగియుండలేదు. నేను సరిగ్గా ఇచ్చట సంవత్సరాలపాటు మీ కాపరితో ఉండియున్నాను. సాధారణముగా, రెండు లేదా మూడు సంవత్సరాలైన పిదప అది సంస్థగా మార్చబడును. ఈసారి మాత్రం అది సంస్థగా మారలేదు. అది మారదు. పొట్టు దానినుండి తొలగిపోయినది, అయితే ఇక ఎటువంటి పురోగతియులేదు. గోధుమవలెనున్న ఈ పరిచర్య ప్రారంభమునొద్ద ఎట్లుండినదో తిరిగి అటువైపుకు మరలియున్నది. స్నేహితుడా, అది మనమధ్యనున్న యేసుక్రీస్తే. ఒక మానవుడు కాదు, అయితే అది మీలో జీవించుచున్న యేసుక్రీస్తనే నరుడైయుండి మరియు మీలో ఒక భాగమైయుండ గోరుచున్నాడు, మరియు ఆయనలో మీరొక భాగమైయున్నారు. మీరు ఈ దినమున ఆయనను అంగీకరింతురా?

103ఇంకనూ, పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందనివారెవరైనా ఇచ్చట ఉన్నారా? ఇప్పుడు, "సహోదరుడా బ్రెన్హాం నీకు చెప్పెదను, ఒకసారి నేను అరిచాను," అని మీరు చెప్పుదురు. అది చాలా మంచిది. "నేను ఒకసారి అన్యభాషలు మాట్లాడినాను." అది కూడా చాలా మంచిదే. అయిననూ నేను మాట్లాడునది దానిగూర్చి కాదు. మీరు కేకలు వేసి మరియు భాషలలో మాట్లాడి, పిదప వాక్యమునెట్ల త్రోసిపుచ్పుదురు? ఆయన యొక్క వాక్యమును నమ్ముటయే పరిశుద్దాత్మ యొక్క రుజువైయున్నది. మీరు వాక్యమును స్వీకరించగలిగినయెడల, ఎల్లప్పుడూ అదియే ప్రతీకాలమునకు రుజువైయున్నది. సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళుత్వమనే ఆత్మఫలముల విషయములో ఆ యాజకులు యేసుకంటెనూ కొన్ని మిలియను మైళ్ళ వ్యత్యాసమంత మెరుగైయుండిరి; ఆయన సంఘములను చీల్చివేసి వారిని వెళ్ళగొట్టియున్నాడు; మరియు ప్రజలను చీల్చివేసి మరియు "గడ్డిలోని సర్పములారా" అని వారిని పిలిచెను. మరటువంటివన్నియూ అనెను, చూశారా. అయితే ఆయనే ఆ వాక్యమైయున్నాడు. ఆయనే ఆ వాక్యము. అది అంతే; దేవుని నమ్ముడి. దేవుడు వాక్యమైయున్నాడు. దానిని నమ్ముడి

104క్రైస్తవ బాప్తిస్మమును మీరింకను పొందనియెడల, ఇదిగో ఇచ్చట ఒక కోనేరు సిద్ధముగానున్నది. దేవుని యొక్క ప్రతీవాక్యము సత్యమని మీకు తెలియజేయు నిజమైన పరిశుద్దాత్మను మీరింకను పొందనిచో, దానికి మీరు "ఆమేన్" అని చెప్పి - మరియు దానిని మీ హృదయమంతటితో నమ్ముడి, అప్పుడు ఈ ఉదయం దానిని మీరు పొందుకొనగలరు. మరియు అప్పుడు ప్రజలను అటు ప్రవర్తింపజేయు ఈయన ఎవరు అని మీరు ఆశ్చర్యపోకుందురు. అదేమైయున్నదని మీకు తెలియును. అటువంటి అనుభవము మీకు లేనియెడల, "సహో బ్రెన్హాం, మీ ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము, మరియు నేను నా చేయి పైకెత్తుదును," అని మీరు చెప్పుదురా? మరియు మీరు చెప్ప౦డి, "మరియు నేను…" ప్రభువు మిమ్మును దీవించును. నిన్ను, నిన్ను, ప్రభువు నిన్ను, దీవించును. చాలా మంచిది, ప్రభువు నిన్ను దీవించును. మంచిది, ప్రభువు నిన్ను దీవించును.

ISA 9:6

 

105ఓ దేవా, సంగీతము మాధుర్యముగా వాయించుచుండగా.. ఓ, ఆయన అద్బుతకరుడైయున్నాడు! నిశ్చయముగా: "ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి." ప్రభువా, నీవు ఈ ప్రజలకు ఇచ్చెదవని నేను ప్రార్ధించుచున్నాను. నేను కేవలము ప్రార్ధించగలను. నాకు తెలిసినదంతయూ, వారికొరకు అడుగుటయేయైయున్నది. వారు తమ చేతులను పైకెత్తియున్నారు. నేను వారికి ప్రమాణము చేసిన ప్రకారం చేయుచున్నాను, ఈ గొప్ప అనుభవమును నీవు వారికి ఇచ్చెదవని నేను ప్రార్ధించుచున్నాను; ఏదో కేవలం ఒక విధమగు ఉద్రేకం కాదు కానీ, ఒక నిజమగు అనుభవమైయున్నది; మోషే దేనిని ఆధారంచేసికొని షకీనా మహిమలో దేవుని కలుసుకున్నాడో, అట్లేయైయున్నది; మరియు అచ్చట మాత్రమే కాదు కానీ ఆ వాక్యము నుండి ఎన్నడూ తొలగిపోకుండా, దానితో నేరుగా వాగ్దాన దేశములోనికి నడుచుటయైయున్నది. దేవా, ఈ ఉదయం ప్రతీ ఒక్కరికీ దానిని అనుగ్రహించండి.

దేవా, ఈనాడు మా మధ్యన వ్యాధి ఉండియున్నది. మీరు దానిని స్వస్థపరచెదరని మేము ప్రార్ధించుచున్నాము. అవసరతలో ఉన్న ప్రతిఒక్కరినీ, ప్రతీ వ్యాధిగ్రస్తుడిని స్వస్థపరచండి ప్రభువా, దానిని అనుగ్రహించండి. ఇప్పుడు వారు నీవారైయున్నారు. నేను యేసు నామములోవారిని నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.

HEB 13:8

 

106నన్ను మన్నించండి, రెండు గంటలుగా నేనిచ్చట ఉండియున్నాను. అయితే చూడండి, మీకు ఇంకా సాయంకాలమంతా మిగిలియున్నది. మీరు గృహమునకు వెళ్ళి మరియు కాస్త తేరుకొని మరియు కొద్దిగా విశ్రాంతి పొందగలరు. అయితే నేను మీతో చెప్పినది మర్చిపోకండి. నేను నా హృదయపూర్వకంగా చెప్పియున్నాను. అది వింతగా అనిపించునని నాకు తెలియును. కొద్ది సంవత్సరాల క్రితం ఇచ్చట ఫీనిక్స్ పట్టణమునకు విశ్వాససహితమైన ప్రార్ధనతో, రోగులను స్వస్థపరుచుచూ, ప్రజలైన మీతో నేను వచ్చియుంటిని. నేను దానినెన్నడూ వివరించలేదు, దానినీ నేను వివరించదలచుకోలేదు. నేను కేవలం ప్రజలు ఏమిచేయుదురని చూచుచూ మరియు గమనించితిని, కేవలం ఆ అనుకరణలు మరియు అట్టి కార్యములు లేచుటను గమనించితిని. దానిని గమనించుట నాకు ఒక గొప్ప కార్యముగా ఉండియున్నది

అయితే ఇప్పుడు, ఆ సూచనచేత నిరూపించబడిన ఒక వర్తమానముతో నేను మీ వద్దకు వచ్చుచున్నాను. సంఘము ఏమిలేదు, అది అస్సలు సంస్థగా మారలేదు. అయితే ఈ ఉజ్జీవమువల్ల సంఘ శాఖలకు ఏమి జరిగినది? అవి ఏమి చేసినవి? అవి నేరుగా లవొదికయలోనికి వెళ్ళియున్నవి. లక్షలకొలది మరియు కోట్లకొలది డాలర్లు దానిలోనికి పోయబడినవి, మరియు కేవలం… మరియు అది గొప్పదై, మరియు ధనవంతురాలై మరియు లక్షల డాలర్ల విలువచేసే ఆస్తులను కట్టుకొనుచుండెను మరియు అటువంటి కార్యములను చేయుచుండెను. మరియు వర్తమానమును స్వీకరించే విషయం? వద్దు అవసరములేదు. వారు దానిని త్రోసివేసియున్నారు. అది ఏమిటి? గోధుమ నుండి పొట్టు వేరగుటయైయున్నది. ఇప్పుడు, ఒక సంపూర్ణ సువార్తగా, యజమానునికి ఒక బంగారు ధాన్యముగా మారుటకు, కుమారుని యొక్క సన్నిధిలో ఉండుటకై, గోధుమ ఆ విధంగా ఉండవలసియున్నది. దానిని మీరు నమ్మకుందురా? ఇంతకీ, ఈయన ఎవరు? ఇది ఎవరు? అది మనుష్యుడైయుండునా? అది ఒక సంఘమైయుండునా? అది ఒక సంఘశాఖయై యుండునా? అది నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగానున్న యేసుక్రీస్తు అయి యున్నాడు. ఆయనను మీరు నమ్ముదురా?

107ఇప్పుడు అటువంటి ఒక కఠినమైన వర్తమానము తర్వాత, ఒక చిన్న ఆరాధనకై, ఇక్కడున్న చిన్న గాయక బృందమునకు నేనాయనను ప్రేమించుచున్నాను అనే పాట కొరకు ఆ సహోదరి ఒక శృతిని అందించినందుకు నేనాశ్చర్యపోవుచున్నాను. నీకు ఆ పాత పాట తెలియునా?

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,

ఆ దయనీయమైన, భయంకరమైన కల్వరిపై

నా రక్షణను కొనెను.

ఇప్పుడు, ఆరాధనలో మీరందరు నాతో పాటు మీరు దానిని పాడెదరా. కేవలం నాతో పాటు ఆరాధించుడి.

నేను ఆయనను ప్రేమించుచున్నాను. (ఇప్పుడు గుర్తుంచుకొనండి,

ఆ టెలివిజన్ వలె, ఆయన ఇక్కడ ఉండియున్నాడు.)

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,

మరియు కల్వరిపై నా రక్షణను కొనెను.

దాని భావమేమైయున్నదో మీరు గ్రహించియున్నారా? మీరు గ్రహించగలరా… ఆయన ఏమి చేసెనో, దానియొక్క లోతులను మీరు గ్రహించారా?

నేను ఆయనను ప్రేమించుచున్నాను, ………..

నేనాయనను చూచుటలేదు, కాని ఆయన ఇచ్చట ఉన్నాడు. నేను ఇచ్చట ఒక చిన్న గ్రాహకమును కలిగియున్నాను, అది నా హృదయములో వెలిగే ఒక చిన్న కార్యమైయున్నది. అది ఆయనను ప్రతిబింబింపజేయునని నేనెరుగుదును, ఆయన ఇచ్చట ఉన్నాడు.

……. ఆయన నన్ను ప్రేమించెను,

మరియు నా రక్షణను కొనెను

ఆ కల్వరిపై ….

108ఇప్పుడు, దాని రాగమును మనము పాడుచుండగా, మీరు దీనిని చేయవలెనని నేను కోరుచున్నాను. గతములో మనము ఏమైయున్నామను విషయమునకు వచ్చినయెడల మనమందరము కలగలుపైయున్నాము. గతములో నేను కతోలిక్ అయి యున్నానని జ్ఞాపకము చేసుకొనుడి. చూశారా? ఇప్పుడిచ్చట మనమంతా ఒక మిశ్రమమైన గుంపైయున్నాము, అయితే ఇప్పుడు మనము ఆ చెత్తంతటి నుండి బయటకు వచ్చియున్నాము. మనము క్రీస్తుకు చెందియున్నాము. మనము ఆయన వారమైయున్నాము. ఇప్పుడు దీనిని మనము పాడుచుండగా, కొద్దిగా వెనుకకు తిరిగి, మరియు కేవలం కరచాలనము చేయుడి లేవవలసిన అవసరములేదు. మనము ఒక నిజమైన క్రైస్తవ వాతావరణములో అట్లు దానిని చేయుచుండగా, కేవలం "సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. సహోదరి, దేవుడు నిన్ను దీవించును," అని చెప్ప౦డి దేవుడు ఆరాధింపబడుటకు ఇష్టపడునని నేను నమ్ముచున్నాను. మీరు అట్లు తలంచుట లేదా? ఆయనను ఆరాధించండి. ఆయన దేవుడు ఆరాధనకు పాత్రుడైయున్నాడు. మరియు మనమాయనను ఆరాధింపగోరుచున్నాము. మరియు మనమెట్లు చేయుదుము? మీరు ఒకరినొకరు ప్రేమించుడి. మీరు ఒకరినొకరు హెచ్చించగోరినచో…" మీరు వీరికి చేసినచో, నాకు చేసినవారగుదురు."

మనమిప్పుడు దానిని పాడెదము, మరియు ఒకరితోనొకరు కరచాలనము చేయుదుము, మరియు ఆరాధించెదము.

ఎందుకనగా ఆయనే…

ప్రభువు మిమ్మును దీవించును.

ఓ, నేనాయనను ప్రేమించుదును, నేనాయనను ప్రేమించుదును

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను.

ఆ…..

అది మీ హృదయమును మండించుటలేదా? అని నేను ఆశ్చర్యపోవుచున్నాను. అదేదో నిజమగు చక్కని అనుభూతి కలుగుచున్నట్లేయున్నది కదా? ఇచ్చట మీరు దానిని బయటకు తీసి మరియు దానిని కౌగిలి౦చుకోవాలని అనిపించుచున్నదని మీకు తెలియును. అహ? మీ హృదయములో ఆ విధమైన అనుభూతి కలిగియుండుట లేదా? లేనియెడల, స్నేహితుడా, జాగ్రత్తగానుండుము. అచ్చట నిజమైన ప్రేమను మీరు కలిగిలేనిచో, మీరొక భయంకరమగు స్థితిలో ఉండినట్లే, చూడండి, "నేను ఆయనను ప్రేమించుచున్నాను." అనునది కేవలం ఒక పాట మాత్రమే కాదు, కాని ఒక వాస్తవమైయున్నది. ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, లేనిచో ఈనాడు నేనెచ్చట ఉండేవాడిని. నేను యాభై-ఐదు సంవత్సరముల వాడినైయున్నాను. నా జీవితము త్వరలో ముగియును, చూశారా. మరియు నేను ఏపాటి వాడిని. నా రక్షణను కొనెను. సహోదరుడా ట్రో, నీవెమైయుండెదవు…? [ఒక వ్యక్తి సంఘములో నుండి మాట్లాడెను.]

109మీరు ఆ సాక్ష్యమును వినియున్నారు, "రక్షింపబడుట."

ఆయన యొక్క దైవిక శక్తిచే "రక్షింపబడుట."

శ్రేష్టమైన ఎత్తునకు "రక్షింపబడుట" జీవితమిప్పుడు మాధుర్యముగానున్నది!

నా ఆనందము సంపూర్ణమైయున్నది,

ఏలయనగా నేను రక్షింపబడియున్నాను.

మీకెట్లు తెలియును? నేను మరణములో నుండి జీవమునకు దాటియున్నానని - నా ఆత్మ ఆయన యొక్క వాక్యముతో కూడ సాక్ష్యమిచ్చుచున్నది.

ప్రియమైన క్రైస్తవులారా, మీకు వందనములు. అది నాకు మేలు చేసినది. గృహములో ఉన్నట్టుగా అనిపించే ఇటువంటి ఒక స్థలమునకు వచ్చుటకు నేను ఇష్టపడుచున్నాను. వెళ్ళిపోవుటకు చాలా కష్టముగానున్నది. ఆ గడియారమువైపు చూచి, నేను ఆలోచించుచుంటిని; మరియు నా కుమార్తె అక్కడ కూర్చునియుండుటను చూచితిని, నా వైపు తల ఆడించి మరియు ఆ విధంగా క్రిందకు చూచుచున్నది; మరియు ఇక్కడ కూర్చునియున్ననా కుమారుడు, చెప్పుచున్నాడు, "ఏమిటి, దేనికొరకు నీవిచ్చట వేచియున్నావు?" నాకు తెలియదు. నేను కేవలం మీతో కూర్చునియుండుటను ఇష్టపడుదును. మీకు తెలియును. నేనెరుగను. నేను సహవాసమును ఇష్టపడుదును. అది అన్ని చోట్లా నాకు దొరకదని మీకు తెలియును, అది మీకు తెలుసు, అది బొత్తిగా తగ్గిపోవుచున్నది. అయితే నేను దానికి దగ్గరగుచున్నానని నాకు తెలియును, చూశారా. మరియు ఏదో ఒక రోజున నేను నా ఆఖరి ప్రసంగమును బోధించెదను, చివరిసారిగా బైబిలును మూసివేయుదును. అప్పుడు నేనొక చిన్న పర్యటన చేయుదును. నేను అట్లు చేసినప్పుడు నన్ను సందర్శించుటకు రాగలరు. రండి, అప్పుడు సహోదరుడు కార్ల్ చెప్పినట్లు, మనమిక శాశ్వతంగా కూర్చుని మాటలాడుకొనెదము, మరియు శాశ్వతంగా జీవించెదము.

110స్నేహితులారా, ఇప్పుడు చూడండి, మీరు చేయవలెనని నేను కోరుచున్నదొకటి మిమ్మల్ని అడగబోవున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని భోజనం చేయకుండా ఉంచియున్నాను, చూశారా. మరియు ఇప్పుడు, కొద్దిసేపటి క్రితం సహోదరుడు ఔట్లా ఏదో చేసియున్నాడు. అతను అప్పుడప్పుడు నేను ఇష్టపడని దానిని చేస్తుంటాడు. అయితే నా కొరకు అతను కానుకలు సేకరించాడు, చూడండి. వారిలో ఒకరు వెనుకకు వెళ్ళి అక్కడున్న ఆ కానుకలు తీసుకొని మరియు ద్వారము దగ్గర నిలబడినయెడల నాకు అద్భుతముగా ఉంటుంది. మరియు మీరు వాటిని తీసుకొని మరియు దానితో మీ ఆహారమమును కొనుక్కొనుడి. అది నా తరుపున మీ కొరకు ఒక బహుమానమైయుండును, చూశారా. దానిని మీరు చేయుడి, చూశారా. అది బాగుగానుండును. అతనొక మంచి వ్యక్తియైయున్నాడు. అతను ఎల్లప్పుడూ… అతనెన్నడూ నేను ఎన్నడూ ఎచ్చటికీ వెళ్ళియు౦డలేదు లేదా అతను నాకు ఏదైనా సహాయము చేసే విషయములో ఏదియూ తక్కువ చేయలేదు. అది అతని విధానమైయున్నది.

111ఇచ్చట కొందరు వ్యక్తులు నిలబడియున్నారు; నేను వారి పేర్లు పిలుచుటకు నేను భయపడుచున్నాను, బహుషా వారి మనోభావాలను గాయపరచవచ్చును. ఈ మధ్యనే ఒక ప్రశస్త సహోదరుడు మహిమలోనికి వెళ్ళియుండెను. అతని కోరిక… నేను అరణ్యమును ప్రేమించుదునని అతనికి తెలియును, కావున అతను నా కొరకు ఒక జీపును కొనవలెనను కోరినాడు. అతడు దానిని చేయుటకు నేను అనుమతించలేదు. పిదప అతను వెళ్ళిన తరువాత, అతని భార్య దానిని చేయవలెననుకొన్నది, మరియు ఆమె దానిని చేయుటకు నేను అనుమతించలేదు. అయితే మిగిలిన అబ్బాయిలు అందరూ కలిసి అచ్చటికి వెళ్ళిరి… మరియు ఈ సంఘమునకు వచ్చు మరియొక సహోదరుడు ఇట్లు చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం, నేను ఇసుక వాహనములు తయారు చేయుదును." నాలుగు చక్రాల బండ్లు మీకు తెలియును; లేదా బాడిగబండ్లు అని మీరు పిలిచుదురు, మరియు, "నేను దాన్ని ఒకటి మీ కొరకు చేయుదును" అని చెప్పెను. అతడు దానిని చేయుటకు నేను అనుమతించలేదు. ఈ పిల్లలు ఏమి చేశారో మీకు తెలుసా? వారు ఒక జీపును మరియు ఇసుక బండిని కలిపి తయారు చేశారు. అటువంటిదానిని నేనెన్నడూ చూసియుండలేదు.

112ఆ రాత్రి టూసాను కూటము నుండి, వారు దానిని నా పెరటిలోనికి నడుపుకొని వచ్చి, మరియు, "ఫీనిక్స్ ప్రజల నుండి ఇది ఒక కానుక," అని చెప్పిరి. చూడండి, కేవలం వారిని మాత్రము కలుపుకొనలేదు, కేవలం ఇట్లనిరి, "ఓ, ఇది మేమందరము, మీరు చూడండి." అది ఓ, నేను పరలోకమునకు వెళ్ళినయెడల, అటువంటి ప్రజలతో నేను జీవింతునని నాకు ఇప్పుడు అర్ధమయినది. మీకు తెలియనా, అది నాకు ఎంతో గొప్పదైయున్నది, అటువంటిది ఏదైనా ఈ చిన్న ఏదైనా కార్యము.

ఇక్కడున్న సహోదరుడు ఔట్లా పట్ల నేను ఆ విధంగానే భావించుచున్నాను. చెప్పెను, "మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నేను కేవలం… ఎచ్చటికైనా వెళ్ళి కొంత… కేవలం నిన్ను ప్రేమించుటకు మరియు నీతో మాటలాడుటకు మరియు యేసును గూర్చి మాటలాడుటకు కొంత స్థలమును తీసుకొనెదను. మరియు ప్రజలు. సరి, మీకు తెలియునా, "ఒకే జాతి పక్షులు" అవి కలుసుకొని, విషయములు మాటలాడుకొని మరియు సహవాసము చేయుటకు ఇష్టపడునని మీకు తెలియునా.

113మరియు నేను దానిని అభినందించుచున్నాను, కానీ సహోదరుడా, సహోదరీ ఆ కానుకలు నేను తీసుకొనగోరుటలేదు. నేను నా సంఘము నాకు వారానికి ఒక వంద డాలర్లు జీతమును ఇచ్చును మరియు దానితో నేను బాగానేవున్నాను. కావున నేను దానిని అభినందించుచున్నాను. ఇప్పుడు మీలో ఎవరైనా భోజనము చేయదలచినయెడల, మంచిది, ఎవరైనా అచ్చట ఆ వెనుక తలుపునొద్ద ఉండెదరు మరియు నా తరుపున మీరు భోజనం తెచ్చుకొనుడి. మీరు చూడండి, అది బాగుండును. మీలో కొందరు, నేను మిమ్మల్ని బోజనం చేయనీయకుండా ఉంచాను. మీరాయనను ప్రేమించుదురా? అలాగైతే మీరు నన్ను కూడా ప్రేమించవలసియున్నది, ఎందుకనగా నేను ఆయనలో భాగమైయున్నాను, చూశారా. ఆమేన్. ఆ కారణముచేతనే నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ప్రభువు మిమ్మును దీవించు గాక.

114ఇప్పుడు మనము లేచి నిలబడెదము. మన యొక్క రానున్న కూటములను మరచిపోకుడి. ఏ సమయములోనైనా ఇటుగా వచ్చినప్పుడు, కేవలం రావడానికి గుర్తుంచుకొనుడి. సర్వదా మీకు స్వాగతం. నా కొరకు మీరు ప్రార్ధించెదరా? నేను ప్రార్ధన అవసరతగల వ్యక్తినైయున్నాను. మీరు ప్రార్థించెదరా? నేను చేయవలసిన దానికై మరియు నా ముందున్న కార్యములకై నా మీదున్న భారమును ఎంతమంది గ్రహించగలరు? మరియు సరిగ్గా మీదటికి ఏమి జరుగునని నాకు తెలియును. మీరు చూశారా? ఇతర కార్యములు వచ్చుటను నేను చూసినట్లే ఇదియును వచ్చుటను నేను చూడగలుగుచున్నాను. ఏమి వచ్చుచున్నదో నేనెరుగుదును, చూశారా. అయితే దాని గూర్చి మాటలాడుటకు సమయములేదు. సరిగ్గా ఇప్పుడేమి జరుగుచున్నదో దానిగూర్చి మనము మాటలాడుకొనెదము. రేపటిసంగతి రేపు చూచుకొనును, చూశారా. నా కొరకు మీరు ప్రార్థించెదరా? ఇప్పుడు, నా కొరకు ప్రార్థించెదమని మీ చేతులెత్తుదురా? అది సరియే.

ఇప్పుడు దేవుడు మిమ్మును దీవించును. మీ ప్రియమైన సంఘకాపరియైన సహోదరుడు జిమ్మి ఔట్లాకు కూటమును తిరిగి అప్పగించుచున్నాను. సహోదరుడా ఔట్లా దేవుడు నిన్ను దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...