ఒక నమ్మలేని నిజము

ఒక నమ్మలేని నిజము

మీరు కూర్చోండి. చాలా కాలము నుండి ఫినెక్స్ కు తిరిగి వచ్చుటకు వేచి చూచుచుంటిని, ఈ మధ్యాహ్నం మరిచ్చటకి వచ్చుట గొప్ప బాగ్యమునై యున్నది. ఫినెక్స్ సముదాయం, దీని గురించి ఎప్పుడూ ఏదో ప్రత్యేకత ఉంటూనే వుంది. నన్ను ప్రేమించే నా మిత్రుల మధ్య కూర్చొన్నట్టుగా అది నాకు ఎల్లప్పుడు వుండును. సంవత్సరాల తరబడి నా కొరకు ప్రార్ధి౦చే గొప్ప ప్రార్ధనా యోధులు ఇచ్చట నుండే వచ్చిరి. సహోదరుడు అవుట్లా, సహోదరుడు గార్జియా మరియు ఈ నగరములో వున్న మరి కొద్దిమంది సేవకులు కలిసి ఆరంభమందు నాతో కూటములు ఏర్పాటు చేసికొనిన సంగతి నాకెల్లప్పుడు జ్ఞాపకమే. ఇక్కడ నా ఆరంభపు కూటములను ప్రభువు ఎంతగానో దీవించెను.

ఇక అప్పటి నుండి ఫినెక్స్ నా హృదయములో చోటును సంపాదించుకొనెను. వివరించుటకు కష్టతరమైన శ్రేష్టమైన భావన దీనిపట్ల నా హృదయములో కలిగివుంటిని. ఫినెక్స్ రావాలనే కోరిక నాకు చిన్న తనమునుండే కలిగినది. బాల్యమందు దాని ఎడారులను గూర్చి చదివాను. అరిజోనా గూర్చి బాల్యమందు నేను అనేక వ్యాసములను చదివాను. అప్పుడే ఇచ్చటికి రావాలనే తలంపు కలిగినది.

ఇప్పుడు నేను ఈ ప్రాంతవాసినైనందుకు ఎంతో సంతోషించుచున్నాను. నేనిక్కడికి వచ్చి బహుశా ఒక ఏడాది లేకుంటే మరి అంతకంటే కొద్దిగా ఎక్కువ అనుకొంటాను. మరీ ఎక్కువ కాలము నుండి నేను నివాసముంటునట్లుగా మీరు కనుగొనలేరు. నేను వెళ్ళు ప్రతిచోట ఇలా అడుగుతాను "మీరు స్థానికులేనా?"

"మంచిది, సాధ్యమైనంతమట్టుకు నేను కూడా చాలా కాలము నుండి ఇక్కడే వుంటున్నాను…."

మరియు నిజమైన స్థానికున్ని నేను అనిపించుకోవాలంటే బహుశా నేను అపాచి జాతి లేక మరటు వంటివారి దగ్గరకు నేను వెళ్ళవల్సినవాడనై యున్నాను. కొద్ది కాలము క్రితం ఒకరు నన్నిలా అడిగారు "సహోదరుడా బ్రెన్హా౦ నీకు అరిజోనా ఎలా నచ్చింది?" అప్పుడు నేను ఇలా అన్నాను. "మంచిది, అరిజోనాలో నివాసముండటమనేది నా చిరకాల వాంఛ (నా జీవిత గొప్ప ద్యేయము) గనుక దేవుడు దానిని నాకు అనుమతించెను."

2మనకు అత్యంత ప్రాముఖ్యమైన బిజినెస్ మెన్స్ కూడికల నిమిత్తం మనమిక్కడ వున్నాము. గురువారం రాత్రి నుండి జరుగబోయే పెద్ద కూటాల నిమిత్తం మనము ఈ మధ్యాహ్నం ఇచ్చట కూడుకొనియున్నామని నేననుకొనుచున్నాను. పెద్ద కూటములు జరుపుటకు ముందు దానికి సంభందించిన చిన్న కూటములు జరుపుదుము, మరి వాటిలోకి నేను వచ్చి పాల్గొనటం చాలా ఏండ్ల నుండి అది నాకొక చక్కని అవకాశమైవుండెను. దానికి సంభందించిన సహోదరుడు విలియమ్స్ మరియు సిస్టర్ విలియమ్స్ నాకు అతి సన్నిహితులగు స్నేహితులు. అటువంటి వారికొరకు నా హృదయములో ప్రత్యేక చోటు కలదు. వారు నిరంతరం నన్ను తిరిగి రమ్మని ఆహ్వానించుచూనే వుండిరి. దానిలో బాగంగానే నేను ఈ మధ్యాహ్నం ఇక్కడుంటిని.

మరిప్పుడు వేదిక మీద సహోదరుడు పుల్లర్, సహోదరుడు జూవేల్ రోజ్, అలాగే టూసాన్ నుండి సహోదరుడు టోనీ స్టోమై మరియు మన సభల మేనేజర్ సహోదరుడు బోర్డర్స్ వున్నారు. మరలాగే మన ప్రశస్తమగు సహోదరుడగు చిరకాల మిత్రుడు ఆర్గన్ బ్రైట్ కూడా వున్నారు. అతడు నేను కలిసి ఆ వైపున అనేక కఠినమైన పోరాటములను ఎదుర్కొన్నాము. ఒక దినాన నేను అతనితో కలిసి ఆవలి ప్రక్కన నివసించుటకు నేను ఎదురు చూచుచున్నాను.

3నేను ప్రయత్నించుచున్నాను… కానీ ఆ సహోదరుని పేరు గుర్తుకు రావట్లేదు. సహోదరుడా మీ పేరేమిటి? ["ఆల్ బ్రూవర్" అని ఒక సహోదరుడు అనుచున్నాడు] బ్రూవర్, సహోదరుడు బ్రూవర్, అతని ముఖం నాకు తెలుసును. ఒకసారి "చెవిటివాని కొరకు అనువాదం చేసిన వ్యక్తివి నీవే" కదా. మీరందరు ఇక్కడుండుటను బట్టి మేమెంతో సంతోషించుచున్నాను.

ఇక్కడ నాకెదురుగా క్రింద వరుసలో కొంతమంది ఆర్క్న్సాస్ నుండి వచ్చిన నా స్నేహితులను నేనిప్పుడు చూచుచున్నాను. మొదటిసారి నేనిక్కడ ఉన్నప్పుడు ఒక సంగతిని నేను మీకు చెప్పితిని అదేమనగా నేనెక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు ఆర్క్న్సాస్ నుండి వచ్చిన వారు వుందురని, నేను పరలోకం వెళ్ళినా నిశ్చయంగా అక్కడ కూడా ఆర్క్న్సాన్ నుండి వచ్చిన వారిని కనుగొందునని నమ్ముచున్నాను, ఎందుకనగా వారు నిశ్చయంగా ఎంతో నీతిమంతులు, యధార్థవంతులైన ప్రజలు.

4సాధారణంగా నేనెక్కువసేపు బోధిస్తాను. కానిప్పుడు మాత్రం నేను వ్రాసికొని వచ్చిన లేఖన భాగాలను, నోట్సును కుదించి చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. నేను ఫినెక్స్ లో వుండగానే రోగుల నిమిత్తం ప్రార్ధి౦చగోరుచున్నాను.

ఇప్పుడు, ప్రభువు నా హృదయమందుంచిన వర్తమానము, కొన్నిసార్లు అవి లోతుగా తాకేవిగా వుండునని మీకు తెలుసా, అవి చాలా ఆశ్చర్యంగా వుంటాయి. ప్రతీ కాలములోను అది ఆ విధంగానే వుండును. దానితో నిలిచియుండుటకు నా శాయశక్తులా ప్రయత్నింతును. అదొక ప్రత్యేకమైనది. దేవుడు నాతో చెప్పిన దానిని నేను మాట్లాడకున్నట్లైతే, అది దేవునికి చెందనిదైనట్లైతే మరప్పుడు అది. అది వాక్యమందు ఉండదు. ఒకవేళ అది వాక్యమందు వున్నట్లైతే, అది గడియ వాగ్దానమైతే, అప్పుడు నేను సరైనది చేస్తున్నానని బావించుదును, ఎందుకనగా ఈ గడియ కొరకు ఆయన దేనినైతే వాగ్దానం చేసెనో, దానినే నేను చేయుటకు ప్రయత్నించుదును.

అనేక సార్లు నీవు ఎవరో ఒకరితో వారి వేదాంతం, సిద్ధాంతాల మీద మాట్లాడుచున్నావనుకో, వారు చాలా త్వరగా నీతో వాదనలు పెట్టుకొందురు. అయితే అది తప్పు, నాకు అన్ని సంఘ శాఖల్లోను నాకు స్నేహితులున్నారు. కానీ నేను ఎన్నడు సహోదరులతో వాదనలు పెట్టుకొనలేదు. మై, నేను వారి సంఘాలకి వెళాను, వారు నన్ను రమ్మను ప్రతి చోటకి వెళాను. చిన్న చిన్న ఉద్దేశములను బట్టి మనము పడిపోకూడదు.

5సరే, మీకు తెలుసా, నా హృదయములో ఉన్న దానికి భిన్నముగా నేనేదైనా చెప్పిన యెడల నేను వేషదారినగుదును. మరియు నాకు, అది నాకు దూరమగును గాక! ఒక దినాన నేను ఆయనను ఒక పాపిగా కలుసుకొందునేమో గానీ, ఒక వేషదారిగా మాత్రం కాదండీ. నేను యధార్థంగా ఉండగోరుచున్నాను. "మంచిది, మిగతావారు పలాని పలానిది నమ్ముదురు గనుక వారికిష్టంలేని దానిని వారిని బట్టి నేను విడిచిపెట్టెదును" అని నేను అన్నట్లేతే అప్పుడు నేను ఎలాంటి వాడినగుదును? ప్రతి దానికి రాజీపడితే మీరు నన్ను నమ్మలేరు. అలాగే దేవుని యందును మరియు నా యందు నేను నమ్మకం వుంచుకోలేను కదా, ప్రతి ఒక్కరు తాము నమ్మిన దానిమీద పూర్తి నిశ్చయతను కలిగియుండెదరు. ఎప్పుడైతే నీవు నమ్మి దాని మీద విశ్వాసమును ఆధారం చేసికొందువో అప్పుడే నిశ్చయతను కలిగియుండగలవు. అయితే నిశ్చయత నీకు కుదరనట్లైతే, ఏదైనా ప్రశ్న తలెత్తితే, నిశ్చయత దొరికే వరకు దానిని అలాగే వదిలివేయుము.

6ఇప్పుడు బిల్లీ కొన్ని ప్రార్ధనా కార్డులను పంచియున్నాడని నేను అనుకొనుచున్నాను. అవును దానిని చేయమని నేను అతనితో చెప్పితిని. అవును, కొద్దిసేపటి క్రితం తాను దానిని చేసినట్లుగా గుర్తుంది.

దానితో పాటు ప్రార్థనా కార్డులు ఇంకా అందనివారి కొరకు కూడా కొద్ది సేపటి తర్వాత నేను ప్రార్ధి౦చెదను. ఒకవేళ నీకివ్వబడిన ప్రార్థనా కార్డును పిలవనట్లైతే, లేక పిలిచినట్లైతే, దేవుడు స్వస్థపర్చువాడని, ఆయన నిన్ను ఇప్పుడే స్వస్థపర్చునని నమ్మని యెడల, ఆ ప్రార్థనా కార్డు వలన నీకే ప్రయోజనము వుండదు సుమా! ఎందుకనగా స్వస్థత నీకు జరగదనే బావన నీలో వుంది కాదా? ఒక వేళ నీలో ఏదైనా ప్రశ్న లేక అలాంటిదేదైనా వున్నట్లైతే, "అవును నాలో పలాని పొరపాటు వున్నది, కావున ఇప్పుడే నేను దానిని సరి చేసికోవలయును" అనుచూ యధార్థముగా ఒప్పుకొనుము, అలా చేసిన తర్వాతనే ప్రార్థన వరసలోనికి రమ్ము, చూచారా.

ఎందుకనగా స్వస్థత అనేది పిల్లలకియ్యబడిన రొట్టె అయివున్నది. దానిని మనము గుర్తించాము. అది దేవుడు మన కొరకు చేసిన బలియాగములో అంతర్భాగమై యున్నది. ఆ ప్రాయశ్చిత్తము మొదటిగా మన ఆత్మలకు అన్వయించబడినది. స్వస్థత అనేది ఎల్లప్పుడు వర్తమానమునకు ముందు వెళ్ళును. స్వస్థత ఎల్లప్పుడు జనులను సమకూర్చేదిగా వున్నది. స్వస్థత కూటం అంటే జనులు కుప్పలు తెప్పలుగా వస్తారు. స్వస్థత కూటానికి అవసరమగు ధన సహాయం చెయ్యమంటే ఎంతో మంది మేము సహాయం చేస్తామంటూ ముందుకు వస్తారు. సంగీత మహోత్సవాలన్నా విరివిగా వస్తుంటారు, కానీ నశించిపోతున్న దీన ఆత్మల రక్షణ పొందటానికి రమ్మంటే మాత్రం జనులకు అది నచ్చదు. వారు ఆత్మ రక్షణే అతి ప్రాముఖ్యమైనది.

స్వస్థత మహాసభలు, సంగీత మహోత్సవాలు, మరి అలాంటివి కేవలం గాలానికి వుండే ఎర లాంటిదని సహోదరుడు బోస్వర్త్ తరచు చెప్తు౦టాడు, "చేపకు నీవు కేవలం ఎరను మాత్రమే చూపుతావు; కానీ దానికున్న గాలాన్ని మాత్రం చూపవు."

7జనులను రాబట్టుటకు అవి అవసరమే, ఎంతవరకు? వారికి నీవు వర్తమానము అందించే వరకు. ప్రతీకాలములో దేవుడు దానిని అలానే చేసెను. ప్రతీకాలమందు స్వస్థత సభలు వుంటూనే వున్నాయి. నిజమగు స్వస్థత సభలు వున్నాయంటే, దాని వెనుక ఎల్లప్పుడు ఒక వర్తమానం వుండుననే సత్యాన్ని నీవు గ్రహించుము. ఏ కారణం లేకుండా సూచన అనేది ఇవ్వబడదు. ఒక వర్తమానానికి ముందు ఎల్లప్పుడు సూచన అనేది బయలువెళ్ళును.

మరి అదే కార్యాన్ని ప్రభువు పదిహేడు లేక పద్దెనిమిదేళ్ళ క్రితం ఇచ్చెనని నా నమ్మకం. రోగుల కోసం ప్రార్థించుటకు ప్రభువు నన్ను పంపాడు. ఆ సూచనవలన ప్రజల మధ్య ఎంతో గొప్ప ఉజ్జీవం చోటుచేసుకొన్నది. అనేకమంది గొప్ప దైవ సేవకులు దాని తర్వాత గొప్ప గొప్ప స్వస్థత కూటాలు జరిపియుండిరి. అలాగని నీవు ఆ స్వస్థత కూటాలనే ఇక ఎల్లప్పుడు అంటిపెట్టుకొని యున్నట్లేతే, దానిలో ఏదో తేడా వుందని నీవు గమనించుము, ఆ స్వస్థత కూటాలు ప్రభువు నుండి వచ్చినవి కావని గుర్తించుము. స్వస్థత కూటాలు మొదటిగా జనులను ఆకర్షించుటకే ఇవ్వబడ్డాయి, చూచారా. వారి దృష్టిని ఆకర్షించుటకే, స్వస్థత తర్వాత వర్తమానం వుండును.

యేసు, ఆయన ముందుకు వచ్చి రోగులను స్వస్థపర్చుట ఇంకా అలాంటి కార్యాలు చేసి యుండుటను బట్టి జనుల మధ్య ప్రవక్తగా ప్రసిద్ధినొందెను. కానీ ఆయన ఎప్పుడైతే సువార్త సత్యమును చెప్పటం ఆరంభించాడో, ఆయన ఎప్పుడైతే తనను గూర్చి తాను చెప్పటం ఆరంభించాడో, అనగా తాను ఎవరో అనేది మరియు తాను ఎందుకొరకు వచ్చాడో అను లోతైన సంగతులు చెప్పనారంభించినప్పుడు, ఆయన ఖ్యాతి తగ్గుచూ వచ్చెను. ప్రతీ కాలములోను అది అలానే వున్నది. మరియు అది అలానే కొనసాగుచూ వుండును.

8ఈ మధ్యాహ్నం మనమిప్పుడెక్కడైతే వున్నామో, మరి ఈ ఆడిటోరియంనందే రేపు మధ్యాహ్నం కూడా వుండెదము. ఏడు గంటలకే, అది అంతేనా సహోదరుడా? ఏడున్నరా, రేపు మధ్యాహ్నం, (లేక సాయంకాలం), తదుపరి మంగళవారం సాయంకాలం. బహుశా బుధవారం సాయాకాలం కూడా వుండునని నేను భావించుచున్నాను, [లేదండీ, బుధవారం ఇక్కడ కాదు. అది "రామడా ఇన్ లో"] ఆ, అవును బుధవారం మరియు గురువారం రమడా ఇన్ లో కూటాలు ఆరంభమౌతాయి. ప్రభువు చిత్తమైతే వీటన్నిటిలోను నేను పాల్గొనవలెనని కోరుచున్నాను.

ఒక సహోదరునిగా నేనిక్కడ వుండి దేవుని రాజ్యంలో ఒక సహాయకునిగా మీకు చెయ్యగలిగినంతగా చేయుటకే ఇక్కడ వున్నాను. మీ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు, నేనది చేయలేనేమో కానీ ప్రార్థనా పూర్వకముగా, దాని విషయమై మనం ప్రార్ధి౦చి, దేవుని యొద్దకు వెళ్ళిన యెడల ప్రతిదానికి జవాబును పొందుకోగలము, అంతే కానీ నాకు తోచినది నేను చెప్పుట కాదండీ.

ISA 53:5•

1PET 2:24

 

9నీవు రోగివైతే నిన్ను స్వస్థపర్చాలని నాకు వుంది, కానీ నేనొక సాధారణమైన మనిషిని, నేను స్వస్థపర్చలేను. స్వస్థత అనేది దేవుని కార్యం. ఇదివరకే జరిగిన కార్యం, స్వస్థత నీలోన వున్నది. కల్వరి మీద యేసుక్రీస్తుతో దేవుని ద్వారా ముగించబడిన కార్యమది. కేవలం దానిమిదే నీ విశ్వాసం నిలకడగా వుండి తీరాలి. దానికి బయట ఏ స్వస్థత లేదు. దానికి బయట ఏ రక్షణ లేదు.

ఏ సంఘము, ఏ శాఖ, ఏ ఆచారాలు నీకు రక్షణ ఇవ్వలేవు. యేసుక్రీస్తు మన దోషముల నిమిత్తం గాయపర్చబడెను, ఆయన పొందిన దెబ్బలచేత మనం స్వస్థత నొందితిమి. ఆయన మన నిమిత్తం, మన దోషముల నిమిత్తం గాయములొందెను. "ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది." అదంతా భూత కాలము (జరిగిపోయిన కాలం). "ఇదివరకే మనం స్వస్థత నొందాం" ఇప్పుడు, దాని మీద…

నాకెక్కువ సమయము లేదు, ఈ మధ్యాహ్నం నేను బహుశా ఇరవై లేక ముప్పై నిమిషములు బోధించి ఆ తదుపరి ప్రార్ధనా వరసను ఆరంభింతును. ప్రతిదినము, ఎప్పటివలే, లోపలికి క్రొత్తవారు వత్తురు గనుక ప్రతీసారి ప్రార్థనా కార్డులు ఇవ్వబడతాయి. దానిని మనం మన సొంత బలముతో చెయ్యమని, దేవుడు అనుమతించిన మట్టుకు దానిని చేతుము. స్వస్థత కొరకు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థింతుము,

సరే, మీలో ఎవరైనా అత్యవసరమైన పరిస్థితులలో వుండి, చనిపోవుచూ, విమానం ద్వారా తీసికొని రాబడి వున్నట్లైతే, అట్టివారు అదిగో అక్కడ సహోదరుడు విలియమ్స్ మరలాగే బిల్లీపాల్ వున్నారు. దయచేసి వారిని కలవండి. అట్టివారు ఇక్కడికి వచ్చి ఎక్కువ సేపు కూర్చోలేరు కదా. వారిది క్లిష్టపరిస్థితి, అట్టివారికి ముందు అవకాశం ఇచ్చి వారిని ఏదో ఒక గదిలో వుంచినట్లైతే, వారి యొద్దకు నేనే స్వయంగా వెళ్ళి ప్రార్థింతును.

EPH 2:8

 

10అలా కాకుండా, నేను కూర్చోగలను, నా పరిస్థితి మరీ అంత క్లిష్టమైనది కాదు అనేవారు దయచేసి ఇక్కడికి వచ్చి కొద్దిగాసేపు మీ శాఖా సిద్దాంతాలను, మరియు వివిధ రకాలైన నమ్మకాలను ప్రక్కకు నెట్టి బోధింపబడుచున్న లేఖనాలను మరియు ఆయన చేసిన వాగ్దానాలను ఓపికతో వినవలెనని నేను కోరుచున్నాను. అప్పుడు అలాగు విన్నట్లైతే విశ్వాసం కలుగుతుంది. ఇక అప్పుడు నీకు కనీసం ప్రార్ధనా వరసలో నిలబడే అవసరం కూడా వుండదు, మరి నీకెవ్వరు ప్రార్ధి౦చే అవసరం కూడా ఉండదు, గమనించారా.

యేసు నీ కొరకు ఏమి చేసెనో దానిని నీవు తెలిసికోవాలని మరియు పొందుకోవాలని, ఆ ఉద్దేశ్యముతోనే నిన్నిక్కడికి రమ్మనుచున్నాను. రక్షించబడుటకు నీవెంతో ప్రయాసపడుచూ, ఇక్కడికి వచ్చి, మోకరించి ప్రార్ధి౦చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణ ఇదివరకే ముగించబడిన కార్యం. నీవు దానిని కేవలం అంగీకరిస్తేనే చాలు. నీ ప్రార్ధన దానికేం అవసరంలేదు. నిన్ను రక్షించేది నీ విశ్వాసమే తప్ప నీ ప్రార్ధన కాదు. "విశ్వాసము చేతనే మీరు రక్షించబడితిరి."

ఈ సూత్రం కేవలం రక్షణ కొరకు మాత్రమే కాదు, స్వస్థతకు కూడా ఇది వర్తించును. దానిని మనమందరము గ్రహించితిమని నేననుకొనుచున్నాను.

11మనమధ్యలో ఎవరైనా క్రొత్తవారు వున్నయెడల, అట్టివారు ఒక విషయం తెలిసికోవాలని నేను కోరుచున్నాను, అదేమనగా మేము ఏ సంఘ శాఖకు చెందినవారము కాదు. నేను ఇక్కడ సంపూర్ణ సువార్త బిజినెస్ మెన్ వారితో మాత్రమే వున్నాము. వారు మరియు నేను సమస్త సంఘశాఖల్లో నుండి వచ్చిన క్రైస్తవ విశ్వాసులుగా మాత్రమే ఇక్కడ కూడుకొనియున్నాము. కావున ఇచ్చటికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. మీరిక్కడికి రావటం మాకెంతో సంతోషం.

"నేను పలాని సంఘానికి చెందినవాడని, నా కొరకు కూడా ప్రార్ధన చేతురా?" అని నీవు అనుకొనవచ్చు. నీవు ఎదో ఒక సంఘానికి చెందినవాడివై యుండాల్సిన పనిలేదు, దానితో అసలు పనిలేదు, నీవు నిరభ్యతరంగా ఇక్కడికి వచ్చి దేవున్ని నమ్మవచ్చును. నీవు చేయాల్సిందంతా అదే మరి. మిగతాది దేవుడు చూసుకొంటాడు.

12రోగుల కొరకు ప్రార్ధన చేయుట, స్వస్థత కూటాలు అనేవాటిని ఆరంభించినప్పటి నుండి నేనొక బైబిల్ని వాడుచున్నాను. కానీ అది పాతబడి చినిగిపోవుచుండెను. టెక్సాస్ రాష్ట్రం హూస్టన్లో కొన్నేళ్ళ క్రితం, బహుశా పద్దేనిమిదేళ్ళ క్రితం కావచ్చు, సహోదరుడు కిడ్సన్ మరియు అతని గుంపువారు నాకొక బైబిల్ని బహుకరించారు. అయితే అంతటను నేను దానిని విరివిగా వాడినందున, అది పాతబడి చినిగిపోచుండెను, దాని పేజీలు ఊడిపోవుచుండెను. గనుక మరోక క్రొత్త బైబిల్ ప్రతి నాకివ్వబడెను.

క్రొత్త సంగతేంటంటే. నేను చెప్పేదానిని బట్టి ఇదేదో మూఢభక్తి అని అనుకోకండి. దానిని మీరు అలా అర్థం చేసికోరని అనుకొనుచున్నాను. ఈ బైబిల్ నాకివ్వబడినప్పుడు, దానిలో రెండు రిబ్బన్లు (దారాలు) వున్నాయి. ఇలాంటి బైబిల్ని నేనిప్పుడు కలిగియున్నాను.

MARK 11:23

 

13సహోదరుడు కిడ్సన్ నాకొక స్కోఫీల్డ్ బైబిల్ ను యిచ్చెను.

డాక్టర్ స్కోఫీల్డ్ వ్యాకరణలన్నిటితో నేను ఏకీభవించను, బహుశా మీలో కొందరు వాటితో ఏకీభవించవచ్చు లేక ఏకీభవించకపోవచ్చు. అయితే ఒక సంగతిని మీరు తెలుసుకోవాలనుకొంటున్నాను, అదేమిటంటే నేను మొదట్నుంచి స్కోఫీల్డ్ బైబిల్ నే వాడుచున్నాను. ఎందుకనగా అది నాకు ఎంతో విపులముగా అగుపడును, గనుక దానిని చదువుటకే నేను అలవాటు పడితిని. ఒకవేళ మొదట్నుంచి థాంప్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్ ని వాడుంటే అదింకా బాగుండేదేమో, ఎందుకనగా నేను ఎంచుకొనే అంశములను స్కోఫీల్డ్ బైబిల్ కన్నా త్వరగా థాంప్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్ నందు తీసికొని వుండేవాడిని.

సరే, నాకివ్వబడిన క్రొత్త బైబిల్ని తెరచినప్పుడు, దానిలో రిబ్బన్ (దారం) వున్న చోటు నాకు ఆశ్చర్యంను గొల్పింది. ఆ దారం ఎక్కడ వుందంటే దేవుని ఆలయమును సాలోమోను ప్రతిష్టించినప్పుడు దేవుని మహిమ షెకీనా మహిమ బలముగా దిగివచ్చుట చేత యాజకులు పరిచర్య చేయలేకుండిరి అనే చోటు యొద్ద అది (దారం) వుండెను. తర్వాత దారమున్న ఆ రెండవ చోటు ఏదనగా ఎజ్రా తిరిగి వచ్చి దేవుని ఆలయమును ప్రతిష్టించెను. ఇక మూడవ చోట, నా భార్య తనకు తెలియకుండానే ఒక పేపరు గుర్తును అచ్చట పెట్టెను. మార్కు 11:22 దగ్గర దానిని పెట్టెను. అక్కడ ఇలా వ్రాయబడింది. "కదలిపొమ్ము అని నీవు ఈ పర్వతముతో చెప్పిన యెడల…" టేపు జనులారా ఉడతల సృష్టి జరిగినప్పుడు, ఆ లేఖన భాగము నా మదిలో వున్నట్లు మీ అందరికి తెలుసును. ఖచ్చితంగా అది నా మదిలో వుండెను.

14గమనించదగిన మరొక సంగతేంటంటే, రాబిన్ పిట్ట నాకు ప్రీతిపాత్రమగు పక్షి. రాబిన్ పిట్ట బొమ్మను నా భార్య అచ్చట వుంచెను. ఆ రాబిన్ పిట్ట ఛాతి మీద ఎర్రని మచ్చ వుంది. ఒకప్పుడు దానికి గొధుమ రంగు వుండేది. కానీ ఒకనాడు ఆ కల్వరి సిలువ మీద ఒకాయన మేకులతో కొట్టబడి వ్రేలాడియున్నప్పుడు, ఈ చిన్న రాబిన్ పిట్ట అక్కడికి ఎగురుకొంటు వచ్చి ఆవేదనతో ఆయనకు కొట్టిన మేకులను తీయుటకు తెగ ప్రయత్నించుచుండెను, అప్పుడే దాని ఛాతి మీద ఆ ఎరుపు రంగు అంటుకొనెను. ఇక అది అక్కడ్నుంచి అలానే కొనసాగుతూ వచ్చుచుండెను. నిశ్చయముగా మరి నేను కూడా సరిగ్గా అలాగే నా విమోచకున్ని కలుసుకొనగోరుచున్నాను. ఆయన యొక్క రక్తము, నా ఛాతి మీద, ఆ రక్తము పూయబడవలెనని కోరుచున్నాను.

సరే, అరిజోనా, ఫినెక్స్ లో ఇప్పుడిది నా మొదటి కూటము. ఏమీ లేనిచోట ఏదో ఒకటి లేచినట్లుగా ఫినిక్స్ వున్నది. దేవుడు కూడా అలానే జరిగించును. ఏది లేనిచోట ఆయన ఏదో చేయగలడు. ఈ మధ్యాహ్నం, రాబోయే ముప్పై లేక నలభై నిమిషముల పాటు "నమ్మలేని నిజం" అనే అంశం మీద నా వర్తమానము ఉండబోతున్నది. దానికి సంబంధించిన లేఖనమును చదువగోరుచున్నాను.

15కొద్ది సంవత్సరాల క్రితం, నా పరిచర్య ఆరంభపు దినాలలో, నేను బైబిల్ ని తీసికొని "ప్రభువా నాకు కావలసిన వర్తమానము చూపండి" అంటూ బైబిల్ ని తెరిచేవాడిని. ఒకసారి నేనలా చేసినప్పుడు, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం నాకు తెరువబడింది. నేనలా చేయుదునని మీలో అనేకులుకి తెలుసు. మీరు నాకు ఏ బైబిల్ ని ఇచ్చినా నేనలాగే చేసేవాడిని. అయితే ఒక రాత్రి ఒక దర్శనము నాకొచ్చింది, అది మీ అందరికి బాగా తెలుసు, అందులో ఒక బైబిల్ ఆకాశము నుండి దిగివచ్చియుండెను, మరియు చేతి గుండీలతో ఉండిన ఒక చెయ్యి తెరువబడిన ఆ బైబిల్ నందు యెహోషువా గ్రంథం మొదటి అధ్యాయములోని తొమ్మిది వచనాలను నాకు చూసింది.

ఇదిగో ఆ వచనాలనే నేనిప్పుడు ఈ మధ్యాహ్నం నా అంశానికి సంబంధించిన నా లేఖనముగా చదువగోరుచున్నాను. నా అంశము పదియవ అధ్యాయము మరియు. నా భావ పదవ అధ్యాయం పండ్రెండవ వచనం, వాక్యము చదువుటకు ముందుగా, ప్రార్ధన కొరకు ఒక నిమిషం తలలు వంచుదుము, మరలాగే మన తలలు మరియు హృదయములు వంచి, దీనిని మనస్కరించుదుము. మనకెప్పుడునట్లు కాక ఈ కూటము అసాధారణమైనదిగా ఉండునట్లు మనం కోరుదుము. ఈ కూటము ముగింపు వరకు దేవుని సన్నిధి బహుబలముగా మనందరి మధ్యలో పనిచేయునట్లు దేవునికి ప్రార్థించెదము.

JOHN 1:14

 

16పరమ తండ్రీ, ఈ మధ్యాహ్నం ఫినిక్స్ లో వున్న ఈ ఆడిటోరియంలో ఒకటిగా కూడి వచ్చిన ఈ జనులతో ఉండే గొప్ప అతి శ్రేష్టమగు ఆధిక్యతను బట్టి మేము నీకెంతో కృతజ్ఞలము. ఇప్పుడు మేము నీ వాక్యాన్ని సమిపించుచున్నాము. "వాక్యము శరీరధారియై మా మధ్య నివసించెను." ప్రభువా అది మరోకసారి మా మధ్యలో శరీర రూపము దాల్చును గాక, ఈ ఘడియకు చేయబడిన వాగ్దానములను నెరవేర్చు నిమిత్తం అది నీ సంఘము గుండా, నీ జనుల గుండా పోయబడును గాక, మేము కాలమును ముగింపులోనికి తెచ్చుచున్నామని మేము గుర్తించుచున్నాము, కాలము గడిచిపోవుచున్నది. అది నిత్యత్వములో కలిసిపోవుచున్నది. మేము ఇప్పుడు పశ్చిమ తీరానా ఉన్నాము. తూర్పు నుండి పశ్చిమమునకు నాగరికత ఏలాగైతే ప్రయాణించినదో, మరలాగే సువార్త కూడా ప్రయాణించినది. ఇప్పుడు పశ్చిమానికి వచ్చిన ఈ సువార్త ముందుకు ఇక ఎక్కడికి సాగగలదు? వెళ్ళుటకు ఇక చోటు లేనందున తిరిగి అది తూర్పునకే సాగవలెను. అది సమాప్తమైనది.

పరమ తండ్రీ, మా అందరికి ఇదొక గొప్ప సమయము కావాలని, పరిశుద్దాత్మ సన్నిధిని మేము అనుభవించాలని, ఈ గ్రంథకర్త శరీరమందు తిరిగి ఈ భవనములోనికి రావాలని, వచ్చి మా పాపములను క్షమించుట ద్వారాను, మా దోషములను పరిహారించుట ద్వారాను, మరియు విశ్వాసికి పాపము అనే దానిని ఆయన ఇక ఎన్నటికి ఆపాదించడనే నిశ్చయతను, దానియొక్క నిశ్చయతను ఇచ్చుట ద్వారా తన్ను తాను బయలుపరచుకోవాలని ప్రార్ధించుచున్నాము. మరలాగే ఆయన మా బలహీనతలు తొలగించి, సమస్తమగు చక్రాల కుర్చీల నుండి చంక-కర్రల నుండి విడిపించాలని, మరలాగే గ్రుడ్డివారికి దృష్టినొసగాలని, వైద్యులకి అంతు చిక్కని వింతరోగాల నుండి మరియు క్యాన్సర్ ఇంకా తదితర భయంకరమైన జబ్బుల నుండి జనులను విడిపించాలని ప్రార్ధి౦చుచున్నాము. దేవా! శాస్త్రీయ పరిశోధకులకు పైగా నీ కార్యములను జరిగించుము. ఈ మధ్యాహ్నము "ఒక నమ్మలేని నిజము" అనే అంశం మీద నీ వాక్యమును మాట్లాడుచుండగా మరియు వినుచుండగా నీ యొక్క అనుమతిని నీ సేవకులగు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్ధి౦చుచున్నాము. ఆమేన్.

JOSH 1:1-9•

JOSH 10:12-14

 

17ఇప్పుడు బైబిల్ తెరిచి యొహోషువా గ్రంథం మొదటి అధ్యాయము మరియు పదవ అధ్యాయమును చదువుకొందుము. మొదటి అధ్యాము మొదటి వచనం:

యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడైను మోషే పరిచారకుడునైన యొహోషువాకు ఈలాగు సెలవిచ్చెను -

నా సేవకుడైన మోషే మృతినొందెను కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలియుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి.

నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.

అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూవ్రటీసు నది వరకు మియాకు సరిహద్దు.

నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేకయుండును; నేను మోషేకు తోడై యుండునట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను.

నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చె దనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.

అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.

ఈ ధర్మశాస్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దానిని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.

నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము, జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్ధన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము.

జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొనువరకు సుర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యూషారు గ్రంథములో వ్రాయబడి యున్నది గదా, సుర్యుడు ఆకాశమధ్యమున నిలచి యించుమించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు.

యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దాని ముందే గాని దాని తరువాతనే గాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్దము చేసెను.

18చదువబడిన ఆయన మాటలకు ఆయన తన దీవెనలను జతపర్చును గాక.

ఇప్పుడు, ఈ మధ్యాహ్నం అంశమేదనగా, "ఒక నమ్మలేని నిజం." ఇప్పుడు నమ్మలేని నిజం అనే మాటను మనం గమనించుదుము. దానిని నేను లోతుగా వెతికాను. నాకు దొరికిన దాని అర్థం సరైనదేనని నేను చెప్పగలను. వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం నమ్మలేని నిజం (పారడాక్స్) "అసంభవము కానీ వాస్తవం" మనకొక పాత సామెత వుండేది అదేదనగా "సత్యమనేది కల్పన కథ కంటే గొప్ప వింత (విచిత్రం)గా వుండును," అవును అది వాస్తవం ఒకడు సత్యం చెబితే, అది అందరికి విడ్డురంగా వున్నట్లు అనిపిస్తుంది.

19కొలరాడలో నాకున్న ఒక స్నేహితున్ని నేనెరుగుదును, దుప్పిజాతికి చెందిన కనుజుల సంఖ్యను తెలిసికొనుటకు వారొక సర్వేను చేపట్టారు. అక్కడ ఇరవై ఒక్క కనుజులు గుంపుగా ఉన్నవని వారు కనుగొన్నారు, నా స్నేహితుడు వేటలో వుంటుండగా సర్వే చేసే గుంపు అచ్చటికి వచ్చిందట. భయంకరమగు మంచు కొండల మధ్య వారు సంచరించుచు అక్కడికి చేరుకొన్నారు. నా స్నేహితుడు వారి యొద్ద విషయం తెలిసికొని వారితో ఇలా అన్నాడట "సర్వే కొరకు మీరింత ఎక్కువ ధనం ఖర్చు చేయనవసరంలేదు. అక్కడెన్ని కనుజులున్నవో నేనెరుగుదును, కావాలంటే దానిని మీకు చెప్పగలను."

అందుకు వారు అతనిని చూచి నవ్వి "ఎనున్నాయో తెలిస్తే చెప్పు?" అని హేళనగా అడిగారు.

అందుకతడు, "అక్కడ కేవలం పందొమ్మిది మాత్రమే వున్నాయి, నిజానికి అక్కడ ఇరవై రెండు వుండేవి, అయితే వాటిలో రెంటిని నేను వేటాడి చంపాను" అని వారికి బదులిచ్చాడు.

వారిలో ఒకడు మరల అతడిని చూచి నవ్వి "ఒకటి కంటే ఎక్కువ నీవు చంపుటకు నీకు అనుమతి లేదని నీకు తెలుసా?" అని అన్నాడు. అందుకు నా స్నేహితుడు "అవును, నాకు ఆ విషయం తెలుసును" అని తిరిగి బదులిచ్చాడు.

"చేసేదేం లేదు, వాస్తవానికి అక్కడ ఇరువై-రెండున్నవి, కానీ వాటిలో రెంటిని చంపాను."

అలా నవ్వి వార్డన్ (సర్వే అధికారి) తన దారిన వెళ్ళిపోయెను. అతడెంత చెప్పినా వారది నమ్మలేదు.

అతడు నావైపు తిరిగి "చూశావా, పార్సన్ నిజం చెబితే జనులు ఎలా నమ్మకున్నారో?" అని పలికాడు. గమనించారా, ఉన్నది ఉన్నట్లు చెప్పండి.

సత్యమనేది కల్పనా కథ కంటే విచిత్రంగా (విడూరంగా) వుంటుంది.

JOHN 14:2

 

20యోహోషువా ఇక్కడ ఒక గ్రంథము… నిజానికిది పాత నిబంధన యొక్క విమోచన గ్రంథమైయున్నది. యెహోషువా, ఒక విమోచన గ్రంథముగా దానిని మనం ఖచ్చితంగా ఎంచవలెను. ఎందుకనగా దీనిలో రెండు భాగాలుండెను. అందులో ఒకటి "బయటకు వెళ్ళుట" మరొకటి "లోనికి వచ్చుట," విమోచనలో ఈ రెండు భాగాలు ఖచ్చితంగా వుండును.

ఐగుప్తులో నుండి బయటకు తీసికొనివచ్చిన మోషే ధర్మశాస్త్రమునకు సాదృశ్యముగా వున్నాడు. మరి వాగ్దాన దేశములోనికి తీసికొనివెళ్ళిన యెహోషువా కృపకు సాదృశ్యముగా వున్నాడు. ఇంకోరీతిలో చెప్పాలంటే ధర్మశాస్త్రము, కృప అనే ఈ రెండు దేవుని ఆజ్ఞలో అంతర్లీనంగా భాగమై వున్నవి. ధర్మశాస్త్రము (మోషే) వారిని బయటకు తెచ్చెను, యెహోషువా వారిని లోనికి తెచ్చెను.

నేటి మన దినానికి ఇవి చక్కని మాదిరిగా వున్నాయి. వారు ఏలాగున ఐగుప్తులో నుండి బయటకు వచ్చారో, మరి మనం కూడా ఈ లోకమనే ఐగుప్తులో నుండి, సంఘశాఖలనే ఐగుప్తు నుండి బయటకు వచ్చాము. వారు ఎలాగున యాత్రలో వుండి వాగ్దాన దేశమును చేరుకున్నారో, మరి మనం కూడా నేడు ఆలాగునే వాగ్దాన దేశమును చేరుకొనే యాత్రలో వున్నాం, యొహాను 14లో ఆయన ఇలా అన్నాడు, "నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు: లేనియెడల నేను మీకు చెప్పుదును."

బయటకు వచ్చుట, లోనికి వెళ్ళుట.

21మన యొక్క తప్పులను తెలుపునది ధర్మశాస్త్రము; కానీ మనలను క్షమించేది కృప. విమోచన విషయంలో ధర్మశాస్త్రము మనకేమి చేయలేదు. ధర్మశాస్త్రము పాపమును ఎత్తి మాత్రమే చూపగలదు, కానీ కృప ఆ పాపములో నుండి ఎలా బయట పడాలో దారి చూపును. తప్పు చేస్తే తీసికెళ్ళి జైల్లోపెట్టె పోలీసు లాంటిది ధర్మశాస్రం, కానీ కృప అనేది అందులో నుండి నిన్ను విడిపించుటకు నీ వెలను చెల్లించి, నిన్ను బయటకి తీసికొని వచ్చె వ్యక్తి లాంటిది.

ఎఫెసి పత్రిక, పాత నిబంధనలోని యెహోషువా గ్రంథము సరిగ్గా ఎఫెసి పత్రిక లాంటిదే. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన యొక్క ఎఫెసి పత్రిక అనేది యెహోషువా గ్రంథమై యున్నది. ఈ రెంటికి చక్కని పోలికలు గలవు. ఇవి ఒక దానికొకటి చాలా చక్కగా పొసగుతాయి.

JOSH 1:2•

MATT 9:16,17

 

22ఇప్పుడు, కృపకి గుర్తుగా యెహోషువా ఉన్నట్లు మనం కనుగొన్నాం, ప్రాయశ్చిత్తం, లేదా కృప అనేది ధర్మశాస్రం తర్వాత వచ్చినది. ఇవి రెండు ఏక కాలములో నిలిచి యుండలేవు. మరి అదే విధముగా ఏ కాలవర్తమానమైన సరే, అది ప్రజలను ముందుకు నడిపించును, కాని ఎన్నడూ గతకాలపు వర్తమానముతో కలువదు. అవి అలా ఉండలేవు.

కానీ నేటి సమస్యంతా అక్కడే వుంది. యేసు చెప్పెను, "పాతబట్టకు ఎవడును కొత్త మాసికను వేయజాలడు, పాత తిత్తులలో ఎవడును కొత్త ద్రాక్షారసం పోయనేరడు. ఒకవేళ అలా చేస్తే మాసిక తేటగా కనబడును, తిత్తులు పగిలిపోవును." అదలా కుదరదు. మోషే తెరనుండి నిష్కరమించేవరకు యెహోషువ తన పరిచర్యలోకి రంగప్రవేశం చేయలేదు. గనుక ఇక్కడ ఆరంభ వచనంలోనే నీవు దీనిని చూడవచ్చును, "నా సేవకుడైన మోషే చనిపోయెను. ఇప్పుడు, నీవు లేచి ప్రజలను వాగ్దాన భూమిలోనికి నడిపించుము."

తన కాలమందు పనిచేసిన ధర్మశాస్త్రమును మోషే సూచిస్తున్నాడు. ధర్మశాస్త్రము దాని సమయమందు పనిచేసెను.

23నిజానికి వారు కృపతోనే అక్కడ ప్రారంభమైరి, ధర్మశాస్త్రమియ్యబడక ముందే వారు కృపను కలిగియుండిరి. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రము లేకుండా వారుండిరి, వారికి యాజకులుండిరి, అయితే పలానిది పలానిది అని చెప్పుటకు అప్పటికింకా ధర్మశాస్త్రమియ్యబడలేదు.

కృపయే వారికొక ప్రవక్తనిచ్చెను. కృపయే వారికొక ప్రాయశ్చిత్తమును అనగా బలికొరకు గొర్రెను యిచ్చెను. ఈ వారమందు మనం బలియాగం, రక్తం అను దానిని పొందుకోబోవుచున్నాము, ఎందుకనగా మనస్వస్థత దానియందే అనగా ప్రాయశ్చిత్తం నందే వుండివున్నది. గనుక… ధర్మశాస్తమియ్యకముందే ప్రాయశ్చిత్తమనేది సమకూర్చబడినది. కృప అనేది ధర్మశాస్త్రమునకు ముందు మరియు తర్వాత మరియు జరుగుచున్నప్పుడు వుండెను. కావున అక్కడ… యొహోషువా కృపకు మాదిరిగా యుండెను, మరియు ధర్మశాస్త్రముతో ఉండెను, అయితే ధర్మశాస్త్రము దానియొక్క సరైన స్థానములో ఉన్నంత కాలము అతడు అమలుపరచలేకుండెను.

మరదే విధంగా ఆఖరు దినమున సంఘ ప్రపంచం కూడా వుండెను. దానితో పాటు అది కూడా వచ్చుచుండెను. దాని పని అది చేయుచుండెను. అయితే అది పనిచేయటం ఆగిపోయే ఒక సమయం రాబోవుచున్నది. అది ఖచ్చితంగా చేయవలెను. మిగతా యాత్రల వలె ఈ యాత్రలో కూడా ఒక ఎఫెసి వుండవలెను. ఒక ఎఫెసీయులు రావల్సి వుండెను, ఈ యాత్రలో ఒక ఎఫెసీ వుండవలెను. గమనించండి. నేనింతక ముందే చెప్పినట్లు ధర్మశాస్త్రము ఒక పాపిని ఎన్నడు రక్షించలేదు.

కావున వాగ్దాన భూమి అనేది ఒక కృపా దినమునకు గుర్తుగా వున్నది. గమనించారా, ఆ యాత్రలో అతడు వారిని లోనికి తీసికొని వెళ్ళజాలడు.

24ఆ యాత్రను మీరు గమనించినట్లైతే, ఆ యాత్రలో వారికి మూడు దశలు వుండెను. మొదటిగా ఐగుప్తులో వారు పస్కా గొర్రే క్రింద విశ్వాసమును బట్టి సిద్దపాటును కలిగి యుండిరి.

తర్వాత వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్యములోనికి వచ్చిరి, ఇది వేరవటం లేదా ప్రత్యేకింపబడటం, యాత్రలో ఇది మరొక దశ సిద్దపాటు సమయమందు వారందరు సిద్దపడిరి, ఎర్ర సముద్రము నొద్దకు వారు వచ్చేసరికి వారు అక్కడ అపజయమును పొందిరి. ఎందుకనగా వారు దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాములను కళ్ళారా చూసి కూడా నమ్మలేకపోయిరి. ఇంకను వారు నమ్మలేకుండిరి, దేవుడు ఎట్లు సముద్రమును చీల్చి వారిని ముందుకు తీసికొనిపోయెను. వారందరు మోషేను బట్టి మేఘములోను, సముద్రములోను బాప్తిస్మము పొందిరని మనకు లేఖనం ద్వారా బోధింపబడినది.

JOSH 1:2

 

25వారు బాప్తిస్మము పొందారు, పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందారు, నూతన భూమిలో యాత్రలో నూతనమగు జనుల మధ్య నూతన జీవితమును జీవించుటకు వారు బయటకు వచ్చిరి, మరియు దేవుని హస్తము వారి మీద వుండెను. కానీ కృపలో ప్రారంభమైన వారి నడక వారికి తృప్తికరముగా లేనందున, వారు కృపలో ఇక ఎంత మాత్రం నడువలేని ముగింపునకు వచ్చిరి. వారు తమ సొంత సామర్థ్యం, తెలివి తేటలను బట్టి నడువజూచిరి.

నేడు దైవీక స్వస్థతను గూర్చి లేదా దేవుని యొక్క కృప గల ఏ కార్యమును గూర్చియైనను వారు ఎంతో నీచ భావమును కలిగియుండిరి. దేవుడు చేసి ముగించిన కార్యానికి నీవేమి చేయనవసరం లేదు, కానీ నమ్ము. కేవలం దానిని నమ్మటం మాత్రం చేయాలి. వారు ముందుకు సాగినట్లయితే…. వారికి వాగ్ధానము ధర్మ శాస్త్రము క్రింద ఇవ్వబడలేదు; ధర్మశాస్త్రమునకు ముందే వాగ్ధానము వారికివ్వబడింది, ఏ షరతులు లేకుండా అది ఇవ్వబడింది. "ఈ దేశమును నేను నీకిచ్చితిని, వెళ్ళి దానిని స్వాధీనపర్చుకొనుము." అయితే ఆ వాగ్దానమును వారు పొందుకొనుటకు ముందు, వారు తమకు తామే ఏదో ఒకటి చేయలని తీర్మానించుకొనిరి.

మరి, మానవుల మధ్య ఇంకనూ అది వున్నట్లుగా నేడు మనం కనుగొనగలము. ఆలాగు ఉండుటకు మనము మొగ్గు చూపుతాము. మనము ఏదో ఒకటి చేయవలసియున్నది. దానిలో కూడా ఎదో ఒకటి అందులో ఉన్నది అని మనము అనుకుంటాము. అయితే నీకు ఎదో ఒకటి అందులో ఉన్నది; అదేమనగా, నీ సొంత చిత్తాన్ని, నీ స్వభిప్రాయాల్ని, నీ ఇష్ణా ఇష్టాలను పూర్తిగా సర్వశక్తిగల దేవుని చిత్తానికి, ఆయన ఆలోచనకు మరియు ఆయన చేసి ముగించిన పనికి అప్పగించుకోవటమే. దేవుడు నీ నుండి కోరుకొనేదంతా మరి అదే. నీవు ఆయన వాగ్దానాన్ని మాత్రమే తీసికొనుము, మరి దేనిగురించి ఆలోచించకు. దానితో నడువుము, మరియు దేవుడు తక్కినదానిని చేయును.

EXOD 15:26•

PS 103:3•

JAS 5:14

 

26వారు ధర్మశాస్త్రమును కోరుకొనిరి. ఆయన నీకు చేసిన వాగ్దానములను బట్టి దేవుడెల్లప్పుడు నీ హృదయ వాంఛలను తీర్చును. అయితే దేవుని వాగ్దానాల నుండి వారు ఒక అడుగు తప్పిపోయినప్పుడు, అది వారి శరీరములయందు ఒక ముళ్ళు అగును. అది ఎప్పటి వరకనగా ధర్మశాస్తము వచ్చువరకు, యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రము తీసివేయుటకు సిలువ వేయబడెను. అది శరీరమందు ఒక ముళ్ళు అయ్యెను.

నీ స్వబుద్ధి మరియు స్వశక్తి మీద నీవు ఆధారపడి చేసినంత కాలం, అది నీకు అపకీర్తినే మిగుల్చును. అది నీకు నష్టముగానే అగును. గనుక పూర్తిగా దేవుని మీదనే నమ్మకం పెట్టుకొనుము. అప్పుడు అన్నీ కుదురుకొనును. దేవుడు నీ కిచ్చిన వాగ్దానమేమిటి, "నీ రోగాలన్నిటిలో నుండి నిన్ను స్వస్థపర్చు యెహోవాను నేనే," చూశారా. "మీలో ఎవరైనా రోగిగా వున్నాడా అయితే వాడు సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్ధన చేయించుకొనవలెను." అలాగే తాను చేసిన కార్యములు తన సంఘములో కూడా జరుగునని ఆయన వాగ్దానం చేసాడు.

27మనమెందుకు సంస్థలను అంగీకరించాలి, అవి గ్రంథానికి బయట వున్నవి. చూచారా, అవి మన శరీరమందు ముళ్ళుగా వున్నవి. ఇప్పుడు ఇక్కడ, ఈ అంత్యకాలమందు అదే కార్యమును మనం ముఖాముఖిగా కలుసుకొనుచుంటిమి, కానీ అది మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్పిటేరియన్, ఇంకా రకరకాల వాటి విజ్ఞతకే విడవబడియున్నది, చూశారా. నీవు వాటి వెంట వెళ్ళజాలవు. నీవు సంపూర్ణ సువార్త యొద్దకు తిరిగి రావల్సివుంది. శరీరధారియై మన మధ్య నివశించిన పరిపూర్ణ దేవుని ద్వారా అది ఒక పరిపూర్ణ మానవున్ని చేయును. అవి వాస్తవమైన కార్యములని మన మెరుగుదుము.

28ఇప్పుడు మనం గమనించినట్లైతే వారు అరణ్య యాత్రలో వున్నప్పుడు, కల్వరికి ముందు వారు చేసిన అతి ఘోరమైన తప్పిదము ఏదనగా కృపకు బదులుగా వారు ధర్మశాస్త్రమును అంగీకరించారు (నిర్గమ 19లో) వారికి కృపవున్నది. వారికి ఒక ప్రవక్త వున్నాడు. వారికి బలిపశువు (గొర్రె) వున్నది. వారికి విమోచన వున్నది. వారు ఎర్ర సముద్రము గుండా రప్పింపబడిరి. వారి రోగాల నుండి వారు స్వస్థపర్చబడిరి. కొట్టబడిన బండలో నుండి వచ్చిన నీరు వారికున్నది. పరలోకము నుండి పంపబడిన మన్నా వారికున్నది. వారికావల్సిందంతా సరఫరా చేయబడింది. అయినా వారు ఇంకా ఏదో కావాలని కోరుకొన్నారు.

అది సరిగ్గా నేటి ఎఫెసీ పత్రికకు మాదిరిగా వున్నది. అవును, మనం లూధర్లో నుండి బయటకు వచ్చాము, మెథడిస్తు ద్వారా శుద్దీకరణ పొందియున్నాము, పెంతెకోస్తు ద్వారా పునరుద్ధరణలోనికి ప్రవేశించాము. అరణ్య యాత్రలో వారు వున్నట్లుగానే ఇది వున్నది. దేవుడు మనల్ని బయటకు రప్పించినప్పుడు మనం చాలా బాగా స్పందించాం. తర్వాత మనం చేసిందేమిటి? ఇతరులవలే మనం కూడా చేయగోరితిమి.

ఇప్పుడు, మనల్ని నడిపించేది కేవలం కృప; ధర్మశాస్త్రము కాదు అని మనం గమనించాలి.

29అంత్యకాల పరిచర్యకు మాదిరిగా ఇక్కడ యెహోషువా ఉన్నాడు, గమనించారా. ఆ యాత్రలో వున్న మూడు దశలను గుర్తుంచుకొండి, అవన్నియు ముగియును. మొదట ధర్మశాస్త్రము మరియు ప్రతీది ఆగిపోవలయును, అప్పుడే యెహోషువా…. యెహోషువా, యేసు అను ఈ రెండు పేర్లకి ఒకే అర్ధము కలదు. "యెహోవా రక్షకుడు" అనే అర్థం ఈ రెండింటికి వుంది. అరణ్యములో నుండి వాగ్దాన భూమిలోనికి వారిని యెహోషువా నడిపించెను. ఇప్పుడు అనేకులు ఇలా అందురు.

వేదాంత పండితులతో నేను విభేదించగోరట్లేదు — కానీ వారిలో అనేకులు వాగ్దాన దేశము పరలోకమునకు మాదిరిగా వున్నదని వాదింతురు. కానీ వాస్తవానికి అది పరలోకానికి మాదిరి కాదు. దానిని మనం అలా పోల్చకూడదు, ఎందుకనగా వాగ్దాన దేశములో అనేక యుద్దములు జరిగినవి, అనేక సమస్యలు, అనేక కలవరములు వుండెను. పరలోకములో అవి వుండవు. గనుక వాగ్దాన దేశం పరలోకానికి సాదృశ్యము కాదని నేనందును.

JOHN 6:31,49

 

30అయితే వాగ్దాన దేశములో వారు ప్రవేశించుటకు ముందు వారి మధ్య అనేక విభేదములు పుట్టినవి మీరు గమనించండి.

వారు విభేదములను పుట్టించిన వారిలో ముఖ్యుడు కోరహు అతడికి ఒక వ్యక్తి (మోషే) నాయకత్వం గిట్టలేదు. అలాగే త్రోవలో దాతాను కూడా చేరిపోయాడు. వారు మోషేకి విరోధముగా లేచి తారతమ్యములను పుట్టించారు. "అసలు వర్తమానమంటే ఇలా వుండాలి అలా వుండాలి," అంటూ మోషేకి చెప్ప ప్రయత్నించారు. దేవుడు పంపిన దానికి వారు మరో రకంగా అనువాదం ఇచ్చారు, తమ స్వభిప్రాయాలను దానికి జోడించి చెప్పారు. గనుక వారందరు నశించిపోయారు. వారిలో ప్రతి ఒక్కరు పతనమైపోయారు. యేసు చెప్పెను, "వారందరు (ఒక్కరు కూడా మిగల్లేదు) నశించిపోయారు."

యూదులన్నారు "మా పితరులు అరణ్యంలో నలభై ఏండ్ల మన్నా తిన్నారు."

యోహాను 6 అందుకు యేసు, "వారిలో ప్రతి ఒక్కరు మరణించెను" అని బదులిచ్చాడు. మరణం అనగా నిత్య ఎడబాటు, వారందరు చచ్చారు. దానికి ముందు వారంతా వర్తమానము విని ఎంతో ఆనందించారు, వారి కొరకు కురిసిన మన్నాను బట్టి ఎంతో ఆనందించారు, వేరొక మన్నా కాదండీ, నిజమైన మన్నా.

NUM 25:1•

NUM 31:16

 

31కానీ ఒక సమయమొచ్చింది, బిలాము తన తప్పుడు బోధతో వచ్చి "మనమందరం ఒక్కటే. మనమెందుకు కలిసి మెలిసి ఉండకూడదు, మన పిల్లలు ఒకరినినొకరు పెళ్ళిళ్ళు చేసుకోనిమ్ము. మనమొక గొప్ప దేశమగుదుము. మీరు మాతో కలిస్తే మాలాగే మిమ్ములను కూడా గొప్ప చేస్తాం," అని హితువు పలికాడు.

నేడు కూడా ఇదే తంతు నడుస్తున్నదని, కనీస ఆత్మీయ అవగాహన వున్న వారెవరైనా చెప్పగలరు — వివాహమందు వారందరు ఒకరికొకరు కలిసిపోతున్నారు. అయితే అది క్షమించబడని (హేయమైన) పాపము. ఇశ్రాయేలుకి ఈ విషయంలో ఎన్నటికి క్షమాపణ లేదు. అయితే మరొక నిర్గమము కొరకు యెహోషువా లేపబడెను.

REV 10:4,7

 

32ఇప్పుడు ప్రకటన గ్రంధం 6వ అధ్యాయములో వున్న ఏడు ముద్రలు గురించి మనకి బోధింపబడినదని, అది ప్రకటన 6వ అధ్యాయమని నేను నమ్ముచున్నాను. అది ప్రకటనలో 6లో వున్న ఆ గ్రంథము ఏడు మర్మములతో, ఏడు ముద్రలతో ముద్రింపబడినది. అంత్యదినముల యందు, ప్రకటన 10, అది ప్రకటన 10లో లవోదిక సంఘ కాలము యొక్క చివరి వర్తమానికుడు ప్రవచించు సమయమున ఏడు ముద్రలు విప్పబడును, ఏడు మర్మములు, కాలములన్నిటిలో దాచబడిన ఏడు మర్మముల అర్ధం విప్పబడును.

ప్రతి సంఘకాలములో కొంత దాచబడి మరుగున వుంచబడెను. సంస్కర్తలు దానిని గూర్చిన శ్రద్ద తీసికొనుటకు మనస్కరించలేదు. లూధర్ దినములలో అతడు కేవలం విశ్వాసములముగా నీతీకరణ అనే దానిపైన దృష్టి నిలిపెను. అతడు వెళ్ళిపొయిన తర్వాత వారు దానిని సంస్థాగత సంఘముగా మార్చారు. ఆ తదుపరి వెస్లీ వచ్చెను, శుద్దీకరణను అతడు బోధించెను, గనుక అది అక్కడుండెను. దాని వెంట పెంతెకోస్తులు వచ్చిరి.

33ప్రకటన 10, మలాకీ 4, లూకా 22:17 తదితర లేఖనాల ప్రకారం ఒక ఎఫెసీ అనేది వచ్చునని మనకి వాగ్దానం చేయబడినది. స్నేహితులారా అది మనకి వాగ్దానము చేయబడినది. మనకొక ఎఫెసీ పత్రిక రావలెనని, మర్మముగా వున్న ఏడు ముద్రలు వివ్పబడుట జరుగునని చెప్పబడినది. లవోదికయు సంఘ కాలములో అది జరుగునని చెప్పబడినది. ఇప్పుడది జరుగుచున్నదని నేను నమ్ముచున్నాను.

మనం ఇప్పుడు ఆందులోనే వున్నాము. దేవుని కుమారుడు యొక్క రాకడ చాయల్లో మనమున్నామని నేను నమ్ముచున్నాను. ఎఫెసీకి ముందు యెహోషువా లేపబడినట్లు, మరొక ఎఫెసీకి ముందు బాప్తిస్మమిచ్చు యొహాను లేపబడెను. మరలాగే మరొక ఎఫెసీ మనకు వాగ్దానము చేయబడినది, మరొక ఎఫెసీ వాగ్దానము చేయబడినది. లేఖనంలో అది ముందుగానే చెప్పబడియున్నది. గనుక ఆ ప్రకారమే మనమిప్పుడు దానిలో ఉన్నామని నేను నమ్ముచున్నాను. తిరిగి అందులోనికి వచ్చాం. ఏడు సంఘకాల౦లో ఏదైతే విడిచిపెట్టబడియున్నదో, దానంతటిని మనము వాగ్దానముగా పొందుకొని యున్నాము.

REV 22:18,19

 

34గ్రంధానికి నీవు దేనిని చేర్చలేవు, దేనిని దానిలో నుండి తొలగించలేవు. ప్రకటన 22:18 చెప్పుచున్నది, "ఎవడైనను వీటితో ఒక మాట కలిపినా లేక తీసివేసినా జీవగ్రంథములో నుండి అతని పేరు తొలగించబడును." మనం దీనికి ఏమీ కలపలేము, తీసివేయలేము.

గనుక లూధర్ దీనికి ఏమీ కలుపజాలడని మనమెరుగుదుము. వెస్లీ ఇంకా సంస్కర్తలగు నాక్స్, ఫిన్నీ, కాల్విన్ తదితరులు పూర్తి వాక్యమును పొందుకోలేదు, గానీ సువార్త సత్యమును కొద్దికొద్దిగా మాత్రమే పొందుకొనిరి. కానీ ఈ అంత్యదినముల యందు వాక్యమును బట్టి మనకియ్యబడిన గ్రహింపు ఏదనగా పూర్తి వాక్యమును మనం అర్థం చేసికొందుము, ఎందుకనగా మరొక ఎఫెసీ కాలము మనకొరకు వాగ్దానము చేయబడినది. అది వచ్చియున్నది. మనమిప్పుడు అందులోనే ఉన్నాం.

ఇప్పుడు, ఇదోక నమ్మలేని నిజం. సరే దానిని అలా వుంచుదును, ఎందుకనగా ప్రార్ధనా వరసకు వెళ్ళడానికి నాకింకా పది నిమిషములే మిగిలియున్నవి.

నమ్మలేని నిజం.

35నేడు అద్భుతములు నమ్మని జనులు కొందరున్నారు. వారు ఇలా అందురు "నవీన యుగంలో కూడా ఇంకా అద్భుతములు, మరలాంటి వాటిని నమ్మటం వెర్రితనం, గనుక మేమైతే వాటిని నమ్మం." సరే, అలాంటి వ్యక్తిని గూర్చి నేను చెడు మాట్లాడగోరుటలేదు. అలాంటి వారు కేవలం చలన రహితులు (భావావేశములు లేనివారు, స్థబ్దత లేనివారు). ఆత్మీయముగా వారు గ్రుడ్డివారు వారికి ఆత్మీయ దృష్టిలేదు, వారికెంత మాత్రం ఆత్మీయ భావావేశాలు లేవు. జనసమూహముల మధ్య పరిశుద్దాత్మ బలముగా కుమ్మరించబడినప్పుడు ఎంత ఘోర పాపైనా సరే దేవుని సన్నిధిని స్పంధిస్తాడు. ఆయన వాగ్దానము చేసిన వాక్య నెరవేర్పును చూస్తాడు. ఒకవేళ అతడు స్పందించలేదంటే వాక్యనెరవేర్పును చూడలేదంటే, అతడు తప్పక చలన రహితుడని చెప్పవచ్చును. వాక్యనెరవేర్పులను నీవు కళ్ళారా చూడలేదంటే నీవు ఆత్మీయ గ్రుడ్డివాడివి కాక మరేమిటి? భౌతికంగా కాదు, కాని నేను ఆత్మీయంగా మాట్లాడుచున్నాను. నీ భౌతిక నేత్రాలు నూటికి నూరుశాతం సరిగ్గానే వుండొచ్చు గానీ ఆత్మీయంగా నీవు గ్రుడ్డివాడవు.

2KGS 6:18

 

36దాతానులో ఎలీషా వున్నప్పుడు జరిగినది నీవు గుర్తుచేసికొనుము, అతడు బయటకు వచ్చి శత్రు-సైన్యమంతటిని పూర్తిగా గ్రుడ్డితనముతో మొత్తెను. అతడు దానిని చేసెనని బైబిల్ సెలవిచ్చుచున్నది. వారు అతనిని పట్టుకొనే ఉద్దేశ్యముతో అచ్చటికి రాగా, స్వయంగా అతడే అకస్మాత్తుగా వారియెదుటకు వచ్చెను, అయినను వారతనిని చూడలేకపొయిరి. ఎందుకనగా అతడు వారిని అందత్వముతో మొత్తగా వారు గ్రుడ్డివారైరి.

నీవు జీవముగల దేవుని సన్నిధిలో నిలబడవచ్చును, నీవు పరిశుద్దాత్మ అభిషేకము క్రింద నిలబడి అది కదులుటను కూడా చూడనువచ్చును. అయితే అంత మాత్రానా అది నీకేం ప్రయోజనము వుండదు. దేవుడు చెప్పిన దానిని నీవు చూచి ఉండవచ్చును, అది నీకు పూర్తిగా ప్రకటింపబడి యుండవచ్చును, దాని ఋజువును సహితం నీవు చూచి ఉండవచ్చును. అయినను దానిని నీవు పొందలేవు, ఎందుకనగా దానిని నీవు నమ్ముటలేదు. అలా అయినట్లైతే అది నా తలపై నుండిపోవును, దానిని నీవు అందుకోలేన౦త దూరంన నీవు౦టివి. నీవు నిజంగా మృతుడివే, అచేతనమైనవాడవే, గ్రుడ్డివాడివే. వారు పూర్తిగా ఆ స్థితిలోనే వుండిపోయిరి.

37ప్రపంచము…

నేను ఆశ్చర్యపోవుదును, అద్భుతములు నమ్మని అదే వ్యక్తి, విజ్ఞాన శాస్త్రము ప్రకారం ఋజువు కానీ వాటిని ఏలాగు నమ్మగలడు. ఈ భూగోళము దాని కక్ష్యలో ఏలాగు నిలిచియుందో చెప్పమనండి? ఏ శాస్త్రజ్ఞుడైనా, లేక అద్భుతములు నమ్మని ఏ వ్యక్తియైనా దానిని నాకు వివరించగలడేమో చెప్పండి? అదెంత చక్కగా కాలమును బట్టి అక్షరేఖ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నదో చూడండి. దానిని అలా నడిపించుటకు ఏ యంత్రం, ఏ గడియారం, మరేదైనా వుందో చెప్పండి? మనకు ఆలాంటి పరికరము కాని, లేదా గడియారము గాని, మరేవిధమైనది కాని అంత కచ్చితముగా సమయమును చుపగలిగేది ఏది లేదు. మానవుడు నిర్మించిన గడియారము ప్రతి నెలా కొన్ని నిమిషాలు మారుతూ ఉండును. అయితే సూర్యుడు ఎంత ఖచ్చితంగా కాలానుగుణంగా పనిచేయుచున్నాడు. వేలాది సంవత్సరాలు దొర్లినా అది ఎన్నడూ కదలదు. నిశ్చయంగా పరిపూర్ణంగా అది నిర్మించబడింది.

38భూమికి కోట్ల కొలది దూరంలోవున్న చంద్రుడు సముద్రపు ఆటుపోటులను ఏ విధముగా నియంత్రించుచుచున్నాడు? మనం నివసించే పాలపుంత భూమిమీదనున్న సముద్రమును ఏ విధముగా నియంత్రించుచున్నదో నాకు చెప్పండి? సైన్స్ పరంగా అదెలా జరుగునో నాకు చెప్పండి? సైన్స్ ప్రకారం దానిని మనం చెప్పలేం.

కానీ దేవుడే చంద్రున్ని సముద్రము మీద కావలివానిగా నియమించాడు, చంద్రగ్రహణం జరిగినప్పుడు లేదా భూమి ప్రక్కకు తిరిగినప్పుడు సముద్రము అల్లకల్లోలముగా మారును. ఆటుపోట్లు అధికమగును. తరువాత చంద్రుడు కనబడినప్పుడు, సముద్రము నిమ్మళించును. చంద్రుడు సముద్రము మీద కావలివాడు.

"సరే, అది కేవలము సముద్రతీరం" అని నీవనవచ్చును.

లేదు, ఇక్కడ అరిజోనాలో అది అంతే, కెంటకీ రాష్ట్రంలో నీవెక్కడ భూమిలో బోరు వేసినా ఉప్పు నీరే పడును. ఎక్కడ పరిశోధించినా, ఆ ప్రాంతం అలానే వుండును. కారణం సముద్రపు ఆటుపోటులు వెళ్ళిపోయినప్పుడు భూమిలోపలి పొరల్లోకి ఉప్పు నీరు వెళ్ళిపోవును. మరలా ఆటుపోటులు వచ్చినప్పుడు సముద్ర తీరానికి వందలాది మైళ్ళ దూరంలో అవి లేచును.

దాని మీద మనమొక ప్రసంగమే చేయవచ్చును. మహిమలో వున్న దేవుడు మాత్రమే దానిని చేయుచున్నాడు, ఆయన మహిమలో ఉన్నప్పటికి ఆయన ఆజ్ఞలు భూప్రపంచమంతట ఒకటే రీతిన ప్రభావవంతముగా పనిచేయుచుండెను. అలాగే ఆయన వాగ్దానాలను ఎవరు నమ్మినా అవి అందరికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆయన ఆజ్ఞలు యివ్వబడినవి, ఆయన ప్రకృతికి నియమములను నియమించాడు, గనుక అవి కార్యరూపం దాల్చును. దేవుడెన్నడైనా ఒక వాగ్దానం చేసినట్లైతే, జనులతో నిమిత్తం లేదు, ఎన్ని వేలసంవత్సరాలు గడిచినప్పటకిని ఆయన దానితోనే నిలుచును. ఆయన ఆజ్ఞలు ఎన్నటికిని మారవు.

39ఒక విత్తనం భూమిలో పడి కుళ్ళిపోయి తిరిగి జీవితంతో ఎలా బయటకు వస్తుందో నీవెన్నడైనా గమనించావా? అది భూమిలో పడినప్పుడు అంతటితో దాని పనైపోయిందని అందరు అనుకొందురు, కానీ అందులో జీవము వున్నందువల్ల ఒకనాటికి అది పైకి వస్తుంది. ఆ విత్తనంలో ఏదో ఒక మూలన జీవం ఉంది గనుక అది పైకి వచ్చును. అయితే మనిషి దానిని కనుగొనలేడు. అది భూమిలో పడి చచ్చి, మరియు క్రుళ్ళిపోవును, దాని కాలమందు అది తిరిగి అంకురించి బయటకు వచ్చును.

40మరి ఇదే సూత్రం మనిషికి కూడా వర్తించును. ఒకనిలో మానవుని వలన పెట్టబడినవి, మానవుని ఆలోచనలు వున్నంతకాలం దేవుని జీవకణమగు పరిశుద్దాత్మ అతనిలో పనిచేయలేదు. "అద్భుతాలు జరిగే దినములు అయిపోయినవి" అనే భిన్నాబిప్రాయాలు, విజ్ఞానపు తలంపులు, మానవుని స్వప్రయత్నాలు అను మొదలగునవి వున్నంత కాలం నీకు స్వస్థత జరుగదు. గనుక మొదట అవి నీలో నుండి నశించిపోవాలి… చనిపోవటం మాత్రమే కాదు, పూర్తిగా అవి కుళ్ళిపోవాలి, అప్పుడే జీవకణము నీలో నూతన జీవాన్ని అంకురింపజేస్తుంది. అది అంకురించె విధానం కేవలం అది మాత్రమే. ఆ కారణము చేతనే మనము అడిగినవాటన్నిటిని పొందలేక పోవుచున్నాము. మనము మన స్వబలం మరియు స్వప్రయత్నాల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటాం.

అందువలనే లూధరన్ సంఘం ముందుకు కదలలేక అక్కడే వుండిపోయినది, మరలాగే పెంతెకోస్తులు తదితరులందరు అలానే వుండిపొయారు, వారు వేదాంత గుంపు చేత నేర్పించబడ్డారు. గనుక వారిలా అందరూ, "ఇది ఈలాగుండాలి, ఇది మరోక దినానికి చెందినది, ఇది దానికొరకు." కావున వారు అక్కడే నిలబడిపోయారు. వారు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన సారూప్యములోనికి ఎదగలేకపోవుచుండిరి. ఆ సారూప్యం నీలోకి రావాలంటే భూమిలో పడిన విత్తనం తిరిగి మొలకెత్తినట్లు నీలో కూడా దేవుని ప్రతివాక్యము పడి నీవు పూర్తి వాక్యముగా మారాలి.

41హెబ్రీ 11:3 ని నేను వారికి వివరింపగోరుచున్నాను. ఇప్పటి వరకు మనకున్న శాస్త్రజ్ఞులలో అతి ప్రాముఖ్యుడగు ఐన్స్టిన్ కొద్దికాలము క్రితం న్యూయార్క్ లో అతడు చెప్పిన దానిని నేను విన్నాము. నక్షత్ర మండలం (గెలాక్సీ)ను గూర్చి అతడు చెప్పుచున్నాడు, దాని దూరం అనంతమన్నాడు. మరియు నిత్యత్వమనేది వున్నదని అతడు నిరూపించాడు. మానవుడు గంటకు లక్షలాది మైళ్ళ దూరం, గంటకు లక్షలాది కాంతి వేగంతో ఎంతో ఎత్తుకి ఎగిరిపోవుచున్నాడు. అయినను అతడు అక్కడికి చేరాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టును. బహుశ అతడు అక్కడికి వెళ్ళిరావటానికి సుమారు మూడు లక్షల సంవత్సరాలు పట్టునేమో, అయితే ఆ ప్రయోగము ద్వారా అతడు ఏమి చెప్పాడంటే, మానవునికి వున్న ఆయుష్షు కేవలం యాభై సంవత్సరాలే గనుక అక్కడికి వెళ్ళి రావటం మానవునికి అసాధ్యం. నిత్యత్వము.

GEN 2:5,6•

HEB 11:3

 

42అదొక చిన్న నక్షత్ర మండలం (గెలాక్సీ) వలె వున్నది. దేవుడు తన చేతిలో నుండి వాటిని వదిలెను.

బైబిల్ దానిని చెప్పుచున్నది. గనుక చివరిగా ఐన్స్టీన్ ఈ విధముగా ప్రకటన ఇచ్చాడు "ఈ సృష్టి రహస్యమును తెలిసికొనుటకు (వివరించుటకు) మానవునికున్న ఏకైక మార్గం హెబ్రీ 11:3లో వున్నది. అది ఇలా చెప్పుచున్నది "ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవి," నిశ్చయముగా అది వాస్తవం, సైన్స్ దానిని కనీసం తాకలేదు. సృష్టి మీదనే నీకు సరైన అవగహన లేదు. మరియు నీవు అద్భుతములు నమ్మము అని చెప్పెదవు? దానిని నీవు ఎలా చేయగలవు?

నోవాహ కాలములో పడిన వర్షమును గూర్చి ఏ శాస్త్రజ్ఞుడు వివరించగలడు? అంతకుముందు ఆకాశము నుండి ఒక్క చుక్క నీరు భూమి మీద పడి యుండలేదు. కానీ నోవాహు వెళ్ళి వర్షం పడును అని ప్రసంగించాడు. అతడు చెప్పినట్టుగానే వర్షం భూమి మీద పడెను. కానీ అది శాస్త్రజ్ఞుల మేథస్సుకు పూర్తి భిన్నముగా వుండెను. ఎందుకని? అంతకు మునుపు ఆకాశంలో కనీసం ఒక మేఘమైనా లేకుండెను, కనీసం ఒక్కసారైనా ఆకాశము నుండి వర్షం కురవకుండెను. ఆకాశములో ఒక్క మేఘము కూడా లేదు గనుక వర్షమనేది కురియుటకు అవకాశమే లేదని వారు తమ సైన్స్ ప్రయోగము ద్వారా నిరూపించి యుండొచ్చును. కానీ దేవుడు ఆకాశ తూములను విప్పాడు. ప్రచండ వర్షం దాటికి సర్వ భూమి నీటిలో నశించిపోయెను. అదొక నమ్మలేని నిజం. నిశ్చయముగా అది ఎన్నశక్యము కానిది (గ్రహింపుకు అందనిది), వివరించజాలనిది. అయినను దేవుడు దానిని చేయుదునని ముందే పలికాడు. అది వాస్తవమని చెప్పుటకు దాని యొక్క ఋజువు నేడు మనకున్నది. దేవుడు దానిని చేసెను. అదొక నమ్మలేని నిజం.

GEN 17:19•

GEN 21:5

 

43దేవుడు అబ్రహాము అనే వృద్ధుడను తీసికొన్నాడు, అప్పుడు అతడి వయస్సు డెభ్పై-అయిదేళ్ళు అతని భార్య వయస్సు అరవై-అయిదేళ్ళు అప్పటికి ఆమె వృద్ధురాలైనందున స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయెను. దేవుడు అతనిని తీసికొని, అతనికొక వాగ్దానమును ఇచ్చెను, అప్పుడతని ప్రాయం డెభ్బై అయిదేళ్ళు. అతడు వివాహాము చేసికొనిన అమ్మాయి అతనికి వరసకు చెల్లెలు. ఆమె బాలికగా వున్నప్పటి నుండే అతడామెను ఎరిగియుండెను. ఇద్దరు ఒక చోటనే పెరిగిరి, బహుశా ఆమె యవ్వనప్రాయములో వున్నప్పుడే అతడామెను వివాహం చేసికొని యుండెనేమో, అయితే ఇప్పుడామె వయస్సు అరవై-అయిదేళ్ళు. "ఆమె వలన నీకొక బిడ్డ పుట్టును" అని ఆ వయస్సులో అతడికి చెప్పబడినది.

ఒకవేళ అబ్రహాము ఇలా అని వున్నట్లైతే, "దానిని నేను ఆ నమ్మలేని నిజాలను నమ్మను. వాటిని నేను అంగీకరించను." ఒకవేళ అతడు అలాగున చెప్పినట్లైతే, అతనికి ఎన్నడు దేవుని కార్యం జరిగియుండెది కాదు. పలాని దానిని నేను నమ్ముచున్నాను అని నీవు అన్నట్లైతే, క్రియారూపముగా దానిని నీవు చూపించవల్సివుంది. మీరు గమనించారా? సమస్త అవిశ్వాసములో నుండి వేరై కేవలం దేవునితోనే నడువవలెనని అబ్రహామునకు ఆజ్ఞాపించబడినది. బలహీనమగుటకు బదులుగా అతడు అంతకంతకు బలమునొందెను గనుక అబ్రహాముకి వందేళ్ళ ప్రాయం, శారాకి తొంభై ఏళ్ళ ప్రాయం వచ్చినప్పుడు కుమారుడు పుట్టెను.

GEN 22:6,12•

HEB 11:19

 

44ఇస్సాకు అను సొంత కొడుకును తీసికొని అబ్రహాము మూడు దినములంత దూరం ప్రయాణించాడు. నాగరికత ప్రపంచానికి అది తొంబై మైళ్ళ దూరానా, ఆ పర్వతము వుంది, అక్కడ తన కుమారున్ని బలిగా అర్పించమని దేవుడు అతనికి తెలిపెను. ఇస్సాకు కట్టెలను మోయుచు తండ్రితో కలిసి ఆ పర్వతమెక్కుచుండెను. ఇది క్రీస్తుకి సాదృశ్యం.

వారు అక్కడికి ఎక్కి వెళ్ళిన తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం అతడు తన కుమారుని మీద కత్తి పైకెత్తెను. అతడు దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, తన కుమారున్ని బలిగా యిచ్చుటకు తన కత్తిని పైకెత్తెను. బైబిల్ ఇలా అంటున్నది, "దేవుడు ఏదైనా వాగ్దానం చేసినట్లైతే దానిని ఆయన తప్పక నెరవేర్చునని అతడెరిగి యుండెను, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మృతులలో నుండి సహితం తన కుమారున్ని లేపి తనకు ఇవ్వగల శక్తిమంతునిగా దేవుడున్నాడని అతడు రూఢిగా ఎరిగియుండెను."

GEN 22:13,14

 

45కావున దేవుడు చెప్పిన దానికి అతడు పూర్తిగా లోబడి తన కుమారుని మీదికి కత్తినెత్తి వధించుటకు సంసిద్దుడైనప్పుడు, "అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము," అని చెప్పి దేవుడు అతని చేతిని పట్టుకొనెను.

అప్పుడక్కడ ఒక పొట్టేలు పొదలో కొమ్ములు తగులుకొని కనబడెను. ఆ పర్వత ప్రాంతంలో సింహాలు, ఎలుగు బంటులు, గురుపోతులు, అడవి కుక్కలు, గొర్రెలను తినే క్రూరమృగాలు ఎక్కువగా వుంటాయి. అంతే కాదు త్రాగుటకు నీరు కూడా అక్కడ లభ్యమవదు. అలాంటి ప్రదేశంలో పొట్టేలు కనబడటం ఆశ్చర్యం కదూ! అది అక్కడికి ఎలా వచ్చింది? అబ్రహాము ఆ పర్వతము మీద రాళ్ళన్నిటిని పొగుచేసి బలిపీంఠం కట్టాడు, ఏదోలా అక్కడ పొట్టేలు వుండెను. అదొక నమ్మలేని నిజం.

దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాక్యాన్ని తిసుకోనువాడు ఏ పరిస్థితిని లెక్క చేయడు, దేవుడు తానిచ్చిన మాటచొప్పున తన కొరకు మరొక నమ్మలేని నిజాన్ని చేయును. అబ్రహాము ఆ చోటికి యెహోవా-యీరే అని పేరు పెట్టాడు. "దాహనార్థ బలి కొరకు ప్రభువే స్వయంగా సమకూర్చుకొనును." ఆయన ఇంకను, నేడు కూడా ఒక నమ్మలేని నిజాన్ని చేయగలడు. మీరు పూర్తిగా ఆయన వాక్యాన్ని నమ్మి, దానిని అనుసరిస్తే ఈ మధ్యాహ్నం కూడా ఆయన మీ కొరకు ఒక నమ్మలేని నిజాన్ని జరిగించును.

DAN 3:22,25•

DAN 6:22

 

46బాగా ఆకలితో వున్న సింహాల గుహాలో దానియేలు వేయబడెను, అతడు అక్కడ ఎలా సురక్షితంగా వుండగలిగెను. ఎంతో ఆకలితో వున్న ఆ సింహాల గుంపు మధ్య ఆ గుహాలో అతడు రాత్రంతా ఏ హానియు జరుగకుండా ఎలా వుండగలిగెను? అక్కడ అదృశ్యముగా ప్రభువు దూత వుండెను. అదొక నమ్మలేని నిజం. అతడికి ఏ హాని జరుగకుండా ప్రభువు దూత అతనిని రాత్రంతా కాపాడెను.

హెబ్రీ పిల్లలు మండుచున్న అగ్ని గుండములోనికి నెట్టివేయబడ్డారు. ఆ గొప్ప కాలమందు శాస్త్రీయ అవగాహనకు అది పూర్తి విరుద్ధం, అగ్నిలోకి త్రోయబడిన వ్యక్తులు క్షేమంగా వున్నారు, కానీ వారిని త్రోసినవారు మాత్రం పూర్తిగా కాలిపోయారు. గ్రహించుటకు ఇది వారికి అశాస్త్రీయముగా వుండెను. వారు అగ్నిలోకి నడుచుకొంటు వెళ్ళారు. వారికేమి కాలేదు. ఆ అగ్నివల్ల వారికి జరిగిందల్లా ఒక్కటే, అదేదనగా వారికున్న బంధకాలు తెగిపోయాయి. అదొక నమ్మలేని నిజం. అది వివరించజాలనిది, హేయబద్దము కానిది, అయినను అది సత్యమునై యు౦డెను.

JOSH 1:2•

JOSH 10:12

 

47ఇక్కడ మనం మాట్లాడుకొనుచున్నది యెహోషువా గూర్చి. అతడొక సాధారణమైనవాడు, మానవ కల్పిత సిద్దాంతాల గుంపులో నుండి వచ్చినవాడు, ధర్మశాస్త్రము, నీతినిబంధనలు నుండి వచ్చినవాడు. సూర్యున్ని ఆపే శక్తి ఒక మనిషిలో వుంటుందని వాటిలో ఎక్కడా చెప్పబడలేదు. అలాంటివాటిలో నుండి వచ్చిన అతడు ఎలా దానిని చేయగలిగాడు…

దేవుని యొద్ద నుండి అతడికి పరిచర్య (ఆజ్ఞ) జారిచేయబడినది. "నీ పాదము పెట్టే భూమంతటిని నేను నీకిచ్చెదను. నేను నీతో కూడా నీవు వెళ్ళు ప్రతిచోటకి వచ్చెదను." శత్రువు అతడి యెదుట నిలువబడలేకపోయెను. సూర్యుడు అస్తమించుచున్నాడు. యుద్ధం మరొక దినానికి పొడిగించబడినట్లైతే శత్రు రాజులదే పై చేయి అగును, తన వాళ్ళని నష్టపోవల్సి వచ్చును. గనుక యుద్ధం తప్పక అప్పుడే కొనసాగి తీరవలెనని అతడు ఎరిగియుండెను. అందుకతడికి సూర్యుని వెలుగు అవసరమై వుండెను. కావున అతడిలా పలికెను, "సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యోలోను లోయలో నిలువుము." గనుక చీకటి పడలేదు. యుద్ధం కొనసాగినది, సూర్యుడు, చంద్రులు అలానే నిలిచిపోయారు. అదోక నమ్మలేని నిజం. దేవుని చిత్తములో నడిచే వ్యక్తి మాత్రమే అలాంటి కార్యములను చేయగలడు, ఎందుకనగా అతడొక… తిరిగి అతడొక ఎఫెసీ అయివుండెను. సువార్తతో ఎఫెసీ పత్రికయై యుండెను. నిశ్చయంగా అదొక నమ్మలేని నిజమై వుండెను.

ఐగుప్తు సైన్యంలో సుశిక్షితులున్నారు, బలమైన సైన్యం వారికుండెను. అయితే మోషే తన చేతిలో ఒక కొంకి కర్రను మాత్రమే కలిగి వుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు అచ్చటికి వెళ్ళెను. అదొక నమ్మలేని నిజం. అవును, అదొక నమ్మలేని నిజం.

MATT 14:19,21,25•

MARK 6:41,44,48•

LUKE 9:14,16,17•

JOHN 1:14•

JOHN 6:10-12,19

 

48కన్యక గర్భము ధరించి కుమారుని కనుట అనేది ఒక నమ్మలేని నిజం. పురుషుణ్ణి ఎరుగని స్త్రీ , కన్యక ఏలాగున ఒక శిశువుకి జన్మనివ్వగలదు? నిజానికి శాస్త్రీయ అవగహనకు అది అందనిది, కానీ అది వాస్తవం. ఏదైతే జరుగునని చెప్పెనో, దానినే ఆయన ఇమ్మానుయేలుగా జన్మించుటను బట్టి ఋజువు చేసెను. అదెలా జరుగగలదు? అదొక నమ్మలేని నిజం. వందల ఏళ్ళ క్రితమే దేవుడు తన ప్రవక్తలకు దానిని తెలియపర్చెను. ప్రవక్తలు వాక్యానికి లోబడి దానిని ప్రకటించెను. వాక్యమిలా సెలవిచ్చెను, "వాక్యము శరీరధారియై మన మధ్య నివసి౦చెను." దానిని మనం నమ్మితిమి, నిశ్చయముగా అదొక నమ్మలేని నిజం.

నీటి మీద ఆయన ఏలాగు నడువగలడు? అదొక నమ్మలేని నిజం. పాదాల కొలత ప్రకారం ఒక మానవుడు దానిని చేయజాలడు, కానీ ఆయన దానిని చేసాడు. అదేమిటి? వివరింపలేనిది, అదొక నమ్మలేని నిజం. దేవుడు దానిని చేసాడు, మనం దానిని నమ్మాము.

ఐదు రొట్టెల చేత, రెండు చేపల చేత ఐదు వేల మందిని పోషించుట ఎలా? అది అసాధ్యం. కానీ ఆయన దానిని సుసాధ్యం చేసి చూపించాడు. ఆయన అభివృద్ధి చేసింది కేవలం పచ్చి చేపలు, కాలని రొట్టెలు కాదు కానీ ఉడికిన (వండిన) రొట్టెలు చేపలవి. నీటిని ఆయన ద్రాక్షారసంగా ఎలా మార్చాడు? అవన్ని నమ్మలేని నిజాలు.

DEUT 18:15•

MARK 5:41,42•

LUKE 7:14,15•

LUKE 8:54,55•

JOHN 11:43,44•

HEB 13:8

 

49ఆయన కుష్టు రోగులను బాగు చేసాడు, నేటి సైన్స్ ఆ వ్యాధిని నయం చేయలేకపోతున్నది, కానీ యేసు తన వాక్యము చేత ఆ వ్యాధిని నయం చేయగలిగెను. అదొక నమ్మలేని నిజం. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన వాక్యం ఈ రోజున కూడా రోగులను బాగుచేయుచున్నది. నిశ్చయంగా. అదొక నమ్మలేని నిజం.

భౌతిక దేహమునుండి ప్రాణం వెడలిపొయినవారిని అనగా చనిపోయినవారిని ఆయన తిరిగి లేపాడు. లాజరును, విధవరాలి కుమారుణ్ణి యాయీరు కుమార్తెను. ఆయన తన వాక్యము చేత లేపాడు, ఆయన మరియు ఆయన వాక్యము ఒకటే.

మనం ప్రస్తవించవల్సిన (ముగింపులో) మరో గొప్ప సంగతేంటంటే తానే మెస్పీయానని ఆయన తన్ను తాను నిరూపించుకొనుచూ వచ్చెను. ఆయన ఎవరో అనే దానిని నిరూపించుకొనుటకు స్వయంగా తానే వరసులోనికి వచ్చి వాక్యానికి జవాబు చెప్పవల్సి వచ్చెను. ఆయన ఎలా వుండును, ఏమేమి చేయును అని తన్ను గూర్చి వాక్యం ఏలాగు సెలవిచ్చెనో, సరిగ్గా అలాగునే ఆయన వాటిని చేసి తన్నుతాను నిరూపించుకొనెను. ఆయన తన ప్రవక్తల ద్వారా ఇలా తెలిపెను, "నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీలో నుండి లేవనెత్తును."

JOHN 1:42

 

50అనేక మంది లేచారు. ఎంతోమంది లేచారు, వందల సంవత్సరాల నుండి వారికొక ప్రవక్త లేకుండెను.

మలాకీ నుండి మత్తయి వరకు నాలువందల సంవత్సరాలు వారికి ప్రవక్త లేకుండెను. ఆ ఖాళీని గూర్చి చరిత్రలో మనకి చెప్పబడిన రీతిన వారి మధ్య యాజకులున్నారు, గొప్ప వ్యక్తులు వున్నారు. వారికి ఒక ప్రవక్త లేకుండెను.

బయలుపర్చబడిన ఎఫెసీ తానేనని ఋజువు పర్చుకొనుటకు ఆయన రంగము మీదికి వచ్చినప్పుడు, యెహాను దానిని బహిరంగపర్చెను. కానీ అది ఆయనే. యేసే ఆ బయలుపర్చబడిన వాక్యం, స్వయంగా తానే బయలుపర్చబడిన వాక్యం.

ఒక రోజు పేతురు తన సహోదరుడగు ఆంద్రెయతో వచ్చెను. అతనికి మరో పేరు సీమోను. యేసు అక్కడ నిలబడి జీవితంలో ఎన్నడూ చూడని అతని వైపు చూసి (చాలా జాగ్రత్తగా వినండి) ఈలాగు పలికెను, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారునివి" — అదొక నమ్మలేని నిజం. నిజంగా నిశ్చయంగా అదొక నమ్మలేని నిజం.

JOHN 1:47,48

 

51ఫిలిప్పు అక్కడ నిలబడి వున్నాడు, ఈయనే మెస్సీయా అని అన్ని రకముల గుర్తులను ఖచ్చితముగా ఎరిగినవాడై ఉన్నాడు. వాటిని అతడు నమ్మాడు, ఎందుకనగా అతడు మొద్దుబారినవాడు కాదు, లేక గ్రుడ్డి వాడు అంతకంటే కాదు. తరువాత అతడు కొన్ని మైళ్ళు ప్రయాణించి నదిని దాటి తన స్నేహితుడగు నతానియేలును పిలిచెను. అతడు నడుచుకొంటు వచ్చినప్పుడు… అతని విశ్వాసము మరొక వ్యక్తిని కూటానికి తీసికొని వచ్చినది. గమనించారా, అతడు యేసు ఎదుటికి నడిచివచ్చినప్పుడు, యేసు ఇలా అనెను, "ఇదిగో ఏ కపటములేని ఇశ్రాయేలీయుడు ఇతడు." అతడు దానికెంతో ఆశ్చర్యపోయాడు, గనుక అతడు ఇలా అడిగాడు "నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు." ఇప్పుడు గమనించండి, ఇది గ్రహింపశక్యముకానిది. అవునండీ, ఇది వివరింపజాలనిది. నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు అని ఆయనను అడిగాడు.

అందుకాయన, "పిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని" అని బదులిచ్చెను. ఇది ఒక నమ్మలేని నిజం!

JOHN 4:7,9,10,16-19,25,26

 

52ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సుఖారు అను గ్రామమునకు బయట వున్న బావి యొద్దకు వచ్చి కూర్చోని, తినుటకు అవసరమగు ఆహారమును తీసికొని రమ్మని తన శిష్యులను ఊరిలోనికి పంపి అక్కడ ఎదురు చూచుచుండెను. మరి గమనించండి, ఎంతో ప్రాముఖ్యమైన ఆ బావి యొద్దకు ఒక స్త్రీ నీటి కొరకు వచ్చింది. ఆమెతో ఆయన "అమ్మా (స్త్రీ) దాహమునకు నాకు నీళ్ళు ఇమ్ము త్రాగుటకు దాహమునకిమ్ము," అని అడిగాడు.

అందుకామె "నీవొక యూదుడవై వుండి సమరయురాలునగు నన్ను దాహమునకు నీళ్ళు ఇమ్మని ఎలాగు అడుగుచున్నావు. మీకు మాకు మధ్య ఎలాంటి సాంగత్యము లేదు కదా?" అని ఆయనతో చెప్పినది.

ఆయన ఇలా అన్నాడు, "నీవు ఎవరితో మాట్లాడుచున్నావో అను దానిని నీవు ఎరిగియుంటే" ఇక్కడ జరుగనైయున్న నమ్మలేని నిజమును గమనించండి. దీనిని తప్పిపోవద్దు.

"ఎలా నీవు దీనిని అడగగలవు? నేను ఒక సమరయరాలుని, నీవు ఒక యూదుడవు. మనమద్య ఏ సాంగత్యములేదు కదా! " అని ఆమె ఆయనతో అనెను.

అందుకాయన "నీతో మాట్లాడుచున్నది ఎవరో అనుదానిని నీవు ఎరిగియున్నట్లైతే, నీళ్ళీమని అడిగినది ఎవరో నీకు తెలిసివుంటే" అని ఆమెతో అనెను. అలా తన సంబాషణను ముందుకు కొనసాగించుచు ఆమె ఎక్కడ సమస్యాత్మకంగా వుందో అక్కడికి ఆమెను తీసికొని వచ్చెను. తర్వాత ఆయన "నీవెళ్ళి నీ భర్తను తీసికొని రమ్ము" అని అడిగెను.

అందుకామె "నాకు ఏ భర్త లేడు" అని బదులిచ్చింది.

ఆయన ఇలా పలికాడు, "అది నిజం. నాకు భర్తలేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు ఐదుగురు భర్తలున్నారు, కానీ ఇప్పుడున్న వాడు నీ భర్త కాడు, సత్యమే చెప్పితివని" ఆమెతో అనెను.

అప్పుడా స్త్రీ, "అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను" అని అన్నది. వందల సంవత్సరాల నుండి వారు ఒక్క ప్రవక్తను కూడా చూచియుండలేదు. "క్రీస్తనబడిన మెస్సీయా వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని" ఆమె అన్నది.

అందుకాయన "నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే" అని పలికెను.

MATT 24:35•

MARK 13:31•

MARK 16:15-17•

LUKE 21:33•

JOHN 14:12•

HEB 13:8

 

53ఒక నమ్మలేని నిజం బుజువు చేయబడినది! అది సువార్త సత్యముగా కనుగొనబడినది, సువార్త దానిని వాగ్దానం చేసెను, అదిక్కడ ఋజువు చేయబడుచున్నది.

ఇక్కడొక నిమిషం ఆగండి, ఇప్పుడు నేనొక అతి ప్రాముఖ్యమైన నమ్మలేని నిజాన్ని మీకు చూపగోరుచున్నాను. దానిని యోహాను 14:12లో యేసు వాగ్దానము చేసాడు, "ఆయన యందు విశ్వాసముంచు విశ్వాసి ఆయన చేసిన అవే కార్యములను చేయును." అది నిజమేనా? మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు తనను తాను దేవునిగా నిరూపించుకోవాలంటే తానిచ్చిన వాగ్దానమును, మాటను తప్పక నెరవేర్చుకోవల్సివుంది. తలంచుటకు, దేవుడు. దానికదే ఇదొక నమ్మలేని నిజం, వాగ్దానము చేసిన దేవుడు దాని విషయంలో ఎన్నడు తప్పిపోడు, ఆయన తిరిగి వచ్చేవరకు కాలములన్నిటిలో ఆయన చేయుదునని ఇచ్చిన వాగ్దానంను ఆయన ఏ మాత్రం మరచిపోడు.

"సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు వెంబడించును."

ఆయన ఈ వాగ్దానమును నెరవేర్చవల్సివుంది. స్వయంగా ఆయనే దీనిని చెప్పాడు, ఇది ఆయన నోటి నుండి వెలువడినది గనుక ఇది తప్పక నెరవేరవల్సివుంది. లేఖనములన్నియు నెరవేరవలసియున్నది. "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయునని" దేవుని కుమారుడగు యేసు చెప్పెను. ఇది ఒక నమ్మలేని నిజం.

హెబ్రీ 13:8లో బైబిల్ ఇలా చెప్పుచున్నది, "ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు." అదొక నమ్మలేని నిజం, ఎందుకంటే అది జరుగవల్సివున్నది. "భూమ్యాకాశములు గతించును కానీ నేను పలికిన ఏ ఒక్కమాట ఎన్నడూ తప్పిపోదు" అని ఆయన అనెను. ఆయన అన్నది ఖచ్చితంగా నెరవేరవలసివున్నది.

HEB 13:8

 

54ఇప్పుడు, మిత్రులారా, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈ మధ్యాహ్నం ఈ భవనములో ఆయన ఒక నమ్మలేని నిజమును జరిగించునని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా చేస్తానని ఆయన మనకి వాగ్దానం చేసాడు. మనం జీవించుచున్న ఈ కాలమందు, సంఘకాలములలో మరొక ఎఫెసీ వచ్చునని ఆయన మనకి వాగ్దానం చేసాడు, బైబిల్ నందు అది మన కొరకు ఇవ్వబడినది.

మనకి ఏడు సంఘకాలములున్నవి, చివరదగు ఏడవ సంఘకాలమైన లవోదికయలో ఆయన మరొక ఎఫెసీ వచ్చునని వాగ్దానం చేసాడు. అది నిజం. మనమిప్పుడు అక్కడే వున్నాం. ఆ వాగ్దానమును స్వయంగా యేసుక్రీస్తే చేసాడని నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను.

కొద్ది వారాల క్రితం నేనిక్కడున్నప్పుడు, ఆ గోడకు ఎదురుగా నిలబడి నేను నా వర్తమానమును ఇచ్చితిని. నీ వ్రేలును జరిపిన ప్రతిసారీ, అది నిరాటంకముగా లోకమంతటికి వెళ్ళును. నీవు కదిలే ప్రతి కదలికను నీవు తీర్పునొద్ద చూచెదవు. నాల్గవ పరిమాణమగు టెలివిజన్ దానిని నిరూపించుచున్నది. చిత్రములను టెలివిజన్ తయారు చేయదు గానీ అది కేవలం వాటిని తన ద్వారా ప్రసారము చేయును. తరంగముల గుండా అది ప్రయాణించి దాని ట్యూబ్ వాటిని మోసికొని పోయి తెర మీద చూపించును. రంగులు, ప్రతీది, లోకములో జరుగు ప్రతీ కార్యము ఇక్కడే రికార్డగును.

ఒక రోజున నీ రికార్డులు బహిర్గతమగును. దానికి నీవు జవాబుదారిగా వు౦డెదవు. అది నిజం. దేవా! నన్ను నాటండి. నా స్వచిత్తాన్ని మరియు నా చుట్టూన్న ప్రాపంచిక కార్యములను నశింపచేయండి. నేడు మా మధ్యలో నివశించుచున్న దేవుని వాక్యము పట్ల మాకు చైతన్యం నివ్వండి! మనము ప్రార్ధి౦చుకొందాం.

JOHN 14:12

 

55ప్రభువైనా యేసూ, దేవుడగు నీవు శరీరధారియైనప్పుడు నీవే ఒక నమ్మలేని నిజముగా వు౦టివి. పరలోకపు తండ్రీ, నేడు ఈ మధ్యహ్నం నిన్నునీవే కనబర్చుకొనుట ద్వారా ఋజువు పర్చుకొనుము. కేవలం మాకే కాదు (ఇక్కడ కూర్చున్న వారిలో తొంభై శాతం మంది లేక అంత కంటే మరేక్కువ మంది నీ యొక్క ప్రతి మాటను నమ్మువారు ఉన్నారని నేను బావించుచున్నాను) తద్వారా తిరిగి నిన్ను చూచెదము. నీవు మాట్లాడిన ఈ వాక్యము ఇంకను లోకము చుట్టూ రికార్డు అయినది తిరుగునట్లు ఇది కూడా సంచరించుచున్నది, ప్రభువా. ఆ రికార్డులోనికి మేము కదిలి వెళ్ళుదుము గాక. మేము దానిలోనికి ప్రవేశించి మనిషి నోటి ద్వారా వినినట్లు కాక నీవే దీనిని మాట్లాడావని గ్రహించి, ఇక్కడ కూర్చొనియున్న మేము కూడా ఆ వాక్యముగా మారుదుము గాక.

"నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను చేయును" అనే నీ వాగ్దానమును జరిపించు నిమిత్తం మేము సొంత ఆలోచనలను, అభిప్రాయాలను ప్రక్కకు నెట్టుటకు, ప్రభువా, మేమిప్పుడు సంసిద్దులమై యుంటిమి. యేసుక్రీస్తు నామములో దీనిని మాకు అనుగ్రహించమని ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్

56ప్రార్ధనా వరసను పిలుచుటకు ముందు చిన్న సంగతిని నేను చెప్పగోరుచున్నాను. ఒక రోజు నేను మరియు వైద్యుడగు నా పాతమిత్రుడు కలిసి ఐస్క్రీం తినుచుంటిమి. అప్పుడు అతడు నన్ను ఇలా అడిగాడు "బిల్లీ నేనొక విషయాన్ని నిన్ను అడుగగోరుచున్నాను."

"సరే అడగండి" అని నేనన్నాను.

"నీవు నమ్ముదువా…" అని అనెను. (అక్కడే నేను ఈ అంశం, "నమ్మలేని నిజము" అనుదాని గురించి తలంచాను.) నీవు నమ్మలేని నిజాన్ని (పారడాక్స్ ను) నమ్ముదువా?" అని అతడు నన్నడిగాడు.

అందుకు నేను "నిశ్చయంగా నమ్ముదును" అని అతనికి బదులిచ్చాను.

అప్పుడతడు, "నీవు నమ్ముదువని నాకు తెలుసు." అంటూ జరిగిన ఒక సంఘటనను చెప్పెను. సంవత్సరాల తరబడి మూర్చ వ్యాధితో వున్న ఒకడు ప్రార్ధన ద్వారా ఎలా విడుదల పొందాడో చెప్పాడు, వైద్య చికిత్స కోసము వాడు తన యొద్దకు వస్తుండేవాడట. దినములో ఏదేనిమిది సార్లు వాడికి మూర్చలు వచ్చేవట గనుక కొ౦చెం గట్టి మందులే తీసికొనెడివాడు. అయితే ఒకనాడు వాడు ప్రార్ధన ద్వారా బాగుపడ్డాడు.

ఇక అప్పటి నుండి తన మందుల షాపు వైపు తిరిగి కూడా చూడలేదట, అందును బట్టి వైద్యుడగు నా మిత్రుడు నాతో ఇలా అనెను, "నీవు దేనిని గూర్చి చెప్పుచున్నావో దానిని నేను పూర్తిగా నమ్ముచున్నానని నీవు తెలిసికొనుము."

57అతడు ఇంకను నాతో ఇలా అన్నాడు, "ఆర్థిక మాంద్యం ఎక్కువగా వున్న ఆ కాలమందు నేను కుమారున్ని మందుల షాపులో ఉంచితిని. నా కుమారుడు ఒక రోజున ఒక యవ్వనస్తుడు నిండు సూలాలగు తన యవ్వన భార్యతో వచ్చుటకొరకు గమనించుచున్నాడు. మందుల కొరకు వారతనిని వరుసలోకి పంపారు. ఆ యవ్వనస్తుడు ఇలా అడిగాడు, "నీవు ఆమెను చూడుము, ఆమె ఏ క్షణములోనైనా ప్రసవించవచ్చును. అంతే కాదు ఇంకెంత మాత్రం ఆమె ఆ వరసలో నిలబడలేదు." అతడు తన భార్యను తన భుజాల మీద వాల్చుకొని ద్వారము నొద్దకు తీసికొని వచ్చెను.

వైద్యుడగు నా మిత్రుడు ఇలా అన్నాడు, "నా కుమారుడు అక్కడికి వెళ్ళి నేను మీకు ఏదైనా సహాయం చేయగలనా" అని అడిగాడు.

అందుకా యవ్వనస్తుడు "ఇదిగో వైద్యుడు వ్రాసిన మందుల చీటి, మాకింక డబ్బులు అందలేదు. కౌంటి నుండి అవి ఇంకా రావల్సివుంది. ఈ మందులు తక్షణమే నా భార్యకు అవసరం, నాకు డబ్బులు అందేటంత వరకు ఆమె తట్టుకోలేదు గనుక దయచేసి నాకు త్వరగా మందులివ్వండి. డబ్బులు అందిన వెంటనే మీకు తిరిగి ఇచ్చివేస్తాను" అని నా కుమారున్ని ఆ యవ్వనస్తుడు అభ్యర్తించాడు.

అందుకు ఆ కుమారుడు, "అయ్యా, క్షమించండి, నిమయము ప్రకారం డబ్బులు చెల్లించకుండా మందులు ఇవ్వటం కుదరదు. ఈ విషయంలో నన్ను మన్నించండి, మీ పరిస్థితిని చూచి నాకు చాలా బాధగా వుంది. కానీ నేనేం చెయ్యలేను," అప్పుడు డబ్బులు దొరకటమంటే చాలా కష్టం.

MATT 25:40

 

58ఆ సమయమందు వైద్యుడగు నా స్నేహితుడు అక్కడే వెనుక కూర్చొని పేపరు చదువుచుండెను. దీనిని గమనించి తన తల ఎత్తి చూశాడు. తన హృదయంలో ఏదో అయినట్లు అనిపించిందట గనుక అతడు అక్కడికి వెళ్ళి, "కుమారుడా ఒక్క నిమిషం ఆగుము, ఏమిటి సంగతి?" అని అడిగెను. ఆ కుమారుడు సంగతంతటిని అతనికి వివరించి చెప్పెను.

అందుకు అతడు "సరే, ఆ మందులు చీటిని నాకివ్వండి ఒక్క నిమిషంలో ఆ మందులు నీకు ఇప్పించుదును" అని పలికెను.

గనుక అతడు తిరిగి వెళ్ళి అవసరమైన మందులు తీసికొనివచ్చి ఆమె చేతిలో వాటిని వుంచెను. వారు తిరిగి డబ్బులు చెల్లిస్తారో లేదో నాకు తెలియనప్పటికి, వారికి ఆ సహాయం చేసెను. వారికి సహాయం చేయ్యాలని ప్రేరణ కలిగింది గనుక వెనుకాడకుండా దానిని చేశాడట.

అంతట అతడు నాతో "బిల్లీ ఎప్పుడైతే నేనా మందులు ఆమె చేతిలో నుంచానో సరిగ్గా అప్పుడే ఆమె ప్రక్కన ఒక వ్యక్తి నిలిచి వుండటాన్ని నేను చూశాను" అని నాతో అన్నాడు. అది ప్రభువైన యేసు అయివున్నాడని నేను అతనితో చెప్పాను. తరువాత అతడు లేఖనాలు చదువుతుండగా "మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మిరు చేసితిరి గనుక అది నాకు చేసినట్లే" అనే వాక్యం అతని కళ్ళ యెదుటకి వచ్చింది. "బిల్లీ నా కళ్ళకేమైంది? నిజంగానే నేను దానిని చూశాను?" అని నాకు చెప్పాడు.

అందుకు నేను, "అవునయ్యా, ఒక మందులమ్మువాడిగా నీ విధిని నీవు జరిగించావు. అత్యవసర పరిస్థితిలో వున్న వారి యెడల దయచూపావు. అందుకే యేసు అన్నాడు, "మిక్కిలి అల్పులైనా ఈనా సహోదరులలో ఒకనికి చేసినయెడల అది నాకు చేసినట్లే." నీవు చేసినది ఎంతో మంచి కార్యం అని నేను నమ్ముచున్నాను," అని వైద్యుడగు నా మిత్రునితో అన్నాను.

59అత్యవసర పరిస్థితిల్లో మందులమ్మే వ్యక్తి ఏలాగైతే రంగము మీదకి వచ్చి నిస్సహాయ స్థితిలో వున్న ఆ నిండు సూలాలగు ఆమెకి సహాయం చేసాడో సరిగ్గా యేసు కూడా ఈ మద్యాహ్నం మన మధ్యకి వచ్చి వాక్యము శరీరము దాల్చునట్లుగా ఆయన తన్నుతాను మనకు బయలుపర్చుకొనునని నేను నమ్ముచున్నాను. దానిని మీరు నమ్ముచున్నారా? ప్రభువు మిమ్ములను దీవించును గాక.

జనులు ముందుకు వచ్చునట్లు మనమిప్పుడు ప్రార్ధనా కార్డులున్న వారిని పిలవబోవుచున్నాము. ఎక్కువ మందిని పిలువటం సాద్యపడదు, ఎందుకనగా నేను ఇప్పుడు గడియారము వైపు చూస్తున్నట్లేతే సరిగ్గా నాలుగు గంటలకు నేను ఈ కూటంను ముగించవల్సి వుంది. దానికి ఇరువై-ఐదు నిమిషములు మాత్రమే మిగిలి వున్నది. కావున ఎక్కువ మందికి ప్రార్ధి౦చుట వీలుపడదని అనుకొనుచున్నాను. అయితే ఇప్పుడు కాకపోయిన, తర్వాతైన సరే దానిని నేను చేసెదను. ఇప్పుడు ప్రార్ధనా కార్డు "ఏ" నుండి ఆరంభిదాం. అంతేనా? మొదటిగా "ఏ." "ఏ ప్రార్థన కార్డు ఎవరి యొద్ద వున్నది? " ఏ ఒకటి" ఒక దాని వెంట మరొకటి పిలుచుదును. పిలిచిన వారిలో ఎవరైనా నడువలేని స్థితి, కుంటి వారున్న యెడల మీరు ఇక్కడికి వచ్చునట్లు సహాయం చేసెదం. మంచిది ప్రార్ధనా కార్డు ఏ ఒకటి ఎవరి యెద్ద ఉన్నది? మి చేతిని ఎత్తి చూపండి, ఈ భవనములో అది ఎవరి యెద్ద ఉన్నది? సరే, ఇక్కడికి రండి. అదిగో ఆమె వద్ద వున్నట్టుంది. ఆమెను రానివ్వండి. ఓ, స్త్రీ, మీరు ఇచ్చటికి రాగలరా?

మంచిది, ఇప్పుడు రెండవ నంబరు ప్రార్ధనా కార్డు ఎవరి ఎవరి వద్ద వున్నది? ఏ రెండు ఉన్నవారు మీ చేతిని చూపగలరా. మీరు నడిచి రాగలరా? మంచిది. మీరు ఈ ప్రక్కకు రండి. తర్వాత మూడు, దీనిని వున్నవారు మీ చేతిని పైకి చూపండి. కాలం వృదా అవకుండా వుండు నిమిత్తం నేనే మీ యెద్దకు వస్తాను. ప్రార్ధనా కార్డు మూడు ఎవరి వద్ద వున్నది? మీరు మీ చేతిని పైకెత్త గలరా? మంచిది, అదిగో అతని యొద్ద అది వున్నది. సరే, అయ్యా, ఇచ్చటికి రండి.

ప్రార్ధనా కార్డు నాలుగు, మీరు మీ చేతిని ఎత్తి చూపగలరా? చేతనైనంత త్వరగా, మంచిది, అయిదవ నంబర్ని నేను పిలుస్తూ వుండగా మీరు లేచి నిలబడండి. ఆరవ నంబరు ఏడవ నంబరు, ఎనిమిదవ నంబరు, తొమ్మిదిపది, పది వరకు పిలచిన వారు ఇచ్చటికి రండి. అయ్యా, ఇప్పుడు పదకొండు, పండ్రెండు, పదమూడు, పద్నాలు. అయ్యా, పద్నాల్గు వచ్చుచున్నారా? మంచిది. పద్నాల్గు, పదిహేను.

సరే, అంతవరకు… ఇప్పటికి అంతమట్టుకు చాలు, ఈ మద్యాహ్నం అంతమట్టుకు చాలు, మనకి ఎక్కువ సమయం లేదు.

MATT 28:20•

JOHN 14:19•

HEB 13:8

 

60ఇప్పుడు చూడండి, మీ దృష్టిని అటు ఇటు మరల్చకండి, ఏకాగ్రత కలిగి వుండండి. ఇప్పుడు, యేసు మనకి వాగ్దానం చేశాడు, అదేదనగా, "ఇంకా కొద్దికాలం తర్వాత లోకం నన్ను చూడదు, కానీ మిరు నన్ను చూతురు." మీరు దానిని నమ్ముదురా? లోకము అనగా లోక పద్దతులు, దానిని గమనించారా, వారు తమ లోకపోకడల వైపు, అలాంటి వాటివైపు వెళ్ళేదరని ఆయన ఎరిగియున్నాడు. "వారు ఇంకను నన్ను చూడలేరు, కానీ మీరు నన్ను చూతురు.

నేను మీతోను, యుగ సమాప్తి వరకు మీలోను ఉందును" అని ఆయన వాగ్దానం చేశాడు. అది వాస్తవమేనా. హెబ్రీ 13:8లో బైబిల్ ఇలా చెప్పుచున్నది, "ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకటేరీతిగా ఉన్నాడు." దానిని మీరు నమ్ముచున్నారా? అది మనకివ్వబడిన వాగ్దానం. ఇప్పుడు, స్వస్థత నొందే వరకు మీరిక్కడ వేచి వుండాల్సిన పనిలేదు. మీరు చేయవల్సిందంతా ఒక్కటే, అదేదనగా చెప్పబడిన వాక్యము సత్యమైనదని నమ్ముటయే.

ఇప్పుడు, మీరు ఉండగల్గినంత గౌరవంగాను, మర్యాదగాను వుండండి. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా వుండండి.

61బిల్లీ! పిలువబడినవారందరు వచ్చారా? ఇద్దరు ముగ్గురు రావల్సివుందా? ఇంకా ముగ్గురా? మూడవ నంబరు ప్రార్థనా కార్డు, మూడవ నంబరు ప్రార్ధనా కార్డు. సరే, మెక్సికో బాషలో మూడును ఏమందురు? ఎవరైనా చెప్పగలరా? మంచిది, నిశ్చయంగా దానిని వారు విన్నారని అనుకొనుచున్నాను. ఆ నంబరు ప్రార్థనా కార్డు కలిగిన వారు వున్నట్లైతే వరుసలోనికి దయచేసి రండి. ఓ అవును, ఓ దానిని ఎవరు కలిగి వున్నారో బహుశా అది వారికి తెలియకుండెనని నేను అనుకొనుచున్నాను, లేదా బయటకు వెళ్ళారను కొనుచున్నాను.

సరే ఇప్పుడు, ఎలా దాని గూర్చి… మీలో ప్రతి ఒక్కరు మీ హృదయపూర్వకంగా నమ్ముచున్నారా? మంచిది, మరలా ప్రార్ధి౦చుకొందాం.

62ప్రభువైన యేసూ, మాకున్న తెలివిని బట్టి మేము నీ వాక్యమును చదువగలమని, దానిని వివరించగలమని మాకిప్పుడు అర్థమైంది. అయితే ప్రభువా దానిని స్థిరపర్చగల్గినవాడివి నీవొక్కడివే. అది తప్పా ఒప్పా అని చెప్పగల్గినవాడివి నీవొక్కడివే. తండ్రీ, జనుల నేత్రములను తెరువమని నేడు నీకు ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, ఈ మధ్యాహ్నం మేమొక నమ్మలేని నిజమును చూచునట్లు చేయుము, నీ విక్కడ ఉన్నావని, నీవు ఉనికిలో లేనివాడవు కాదని, నీ వాక్యము నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నదని జనులకు కనబర్చుము, ఎందుకనగా నీవే వాక్యమై యున్నావు.

ప్రభువా, దేశ నలుమూలల నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారిలో అనేకులు వ్యాదిగ్రస్తులైయున్నారు. వివిధ రోగముల చేత బాధపడుచున్నారు. వారిని నీవే స్వస్థపర్చుము లేకుంటే ఈ కూటాల సంతోషాన్ని వారు పూర్తిగా అనుభవించలేరు, వారిని స్వస్థపర్చమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మేమైతే కేవలం నిమిత్త మాత్రులం. నీవు చెప్పినది సత్యమని మాత్రమే మేం ప్రకటించగలం, కానీ మేము ప్రకటించిన దానిని వాస్తవముగా చేయగల్గినవాడవు నీవొక్కడివే. దీనిని దయచేయుమని యేసు నామమున ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.

MATT 9:20•

MARK 5:27,29,30•

LUKE 8:44,45

 

63ఇప్పుడు మీరందరు జాగ్రత్తగా నా మీద దృష్టి నిలిపి కొద్ది నిమిషముల పాటు ప్రతి ఒక్కరు మౌనముగా కూర్చోవల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు, ఈ భవనములో వున్నవారిలో అనేక మందిని నేనెరుగను, బహుశా వారిని గూర్చి నేను తెలిసికొందును. మీరిప్పుడు స్వస్థత కొరకు వేచి వుండొద్దు, ప్రతిఒక్కరికి అర్థమైందా, చూచారా.

ఒకసారి ఒకామె వున్నది, ఆమెకి ప్రార్ధనా కార్డు దొరకలేదు అని మేమందుము. అయితే ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడెను. అప్పుడు ఆయన చుట్టూ తేరి చూచి, "నన్ను ముట్టినది ఎవరు" అని అడిగెను. మాకు తెలియదు అని అక్కడున్న వారంతా అనిరి. అంతటా ఆయన చుట్టూ చూచి ఈ స్త్రీని కనుగొనెను, ఆమె దాగియుండలేకపోయినది, ఎందుచేతననగా దేవుని ఆత్మ ఆయనలో వుండి ఆయనను నడిపించుచుండెను. ఆయనే వాక్యమై యుండెను, గనుక దేవుని ఆత్మ ఆయనను ఆమె యొద్దకు నడిపెను. అంతట ఆయన ఆమె సమస్యను చెప్పెను. ఆమెకున్న జబ్బు రక్తస్రావం, దాని నుండి ఆమె బాగుపడినది. ఆమె దానిని నమ్మినది వెంటనే తన శరీరమందు రక్తస్రావం ఆగిపోవుటను ఆమె గ్రహించినది. అది నిజమేనా? అది అక్కడే ఆగిపోయింది.

1TIM 2:5•

HEB 4:15•

HEB 9:11•

HEB 13:8

 

64ఇప్పుడు, నేడు కూడా ఆయన మరనివాడుగా వున్నాడు. గనుక స్వస్థత కోసం నీవు వేచి ఉండాల్సిన పనిలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడైయున్నాడని బైబిల్ చెప్పుచున్నది. దానిని మీరు నమ్ముచున్నారా? దేవునికి మానవునికి మధ్యనున్న ఏకైక మధ్యవర్తి ఏకైక ప్రధాన యాజకుడు నరుడైన యేసుక్రీస్తు, దానిని మీరు నమ్ముచున్నారా? "మన బలహీనతలను అర్థం చేసికోగలిగిన ప్రధాన యాజకుడు ఆయనే." అది నిజమేనా? అది సత్యమని మీలో ఎందరు ఎరుగుదురు? ఎరిగినవారు చేతులెత్తండి. మంచిది, ఈ వాక్యము బట్టి నేను క్రొత్తవారి మధ్యలేను.

ఇప్పుడు, మీరు ఆయనను తాకినయెడల ఆయన ఎలా స్పందించును? ఆయన శరీరధారియై భూమి మీద వున్నప్పుడు ఆయనను తాకినప్పుడు ఆయనెలా స్పందించాడో, మరి ఇప్పుడు కూడా ఆయన అలానే స్పందించును. ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. అది సరియేనా? ఇప్పుడు కేవలం నమ్ముడి, ఇలా చెప్పండి, "ప్రభువా, ఇప్పటి వరకు జరిగిన కూటములలో నేను వుంటూ వచ్చాను, అయితే నేడు నేను నమ్ముచున్నాను. ఇక దేనిని నేను మనస్కరించను. నీవు ఇక్కడ ఉన్నావని నా హృదయపూర్వకముగా నమ్ముచున్నాను. నేనిప్పుడు అక్కరలో ఉన్నాను. నీవు… ప్రభువా! నాకు సహాయం చేయుము," చూచారా. నీవు ఇప్పుడు దానిని చేయుము. భయమును విడిచిపెట్టండి, విశ్వాసముతో మౌనంగా ఉండండి…

65విశ్వాసమను వరము అనే దానిని నీవు తీసికొని, దానితో నీవు ఏదో చేసేది కాదు. నీ స్వప్రయత్నాలు, నీ స్వంత మార్గములలో నుండి వైదొలుగునట్లు చేయమనేదే విశ్వాసమను వరము. ఈ వరము నిన్ను పూర్తిగా లోక కార్యముల నుండి వేరు చేయును.

ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ నిలబడి వున్నది. తండ్రియైన దేవా, నాకు తెలిసినంతమట్టుకు నా జీవితంలో నేను ఈ స్త్రీని ఇంతవరకు చూడనేలేదు. ఆమె నాకు పూర్తిగా క్రొత్త, కానీ అక్కడున్న వారిలో ఇద్దరినో లేక ముగ్గురినో నేను చూడగలుగుచున్నాను, అవును నేను, సహోదరుడు లీ సతీమణి శ్రీమతి లీవెయిల్ ఇచ్చట కూర్చున్నదనుకొనుచున్నాను. అది ఖచ్చితమని నేను చెప్పలేను. ఇక్కడ కూర్చొనియున్న ఆ ముగ్గురు లేక నలుగురు బాలురలను నేనెరుగుదును. నాకు తెలిసినంతమట్టుకు, ఈ సమయములో నేనెరిగిన వారిని నేను చూడగలుగుచున్నాను. వారిలో సహోదరుడు ఆంతోని మిలానో ఇచ్చట కూర్చోనియున్నాడు. అతడు న్యూయార్క్ నుండి వచ్చాడు. అలాగే కెంటకీ నుండి సహోదరుడు పాట్ టైలర్ వున్నారు. బయట ఇక్కడే బయట ఎక్కడో ఫ్రెడ్ సోత్మన్ వున్నట్లు నాకు తెలుసు, కొద్దిసేపటి క్రితం అతడు "ఆమేన్!" అని గట్టిగా చెప్పటం నేను విన్నాను. అది పరిమితం. పరలోకపు తండ్రికి అదంతయూ తెలుసును.

JOHN 14:12

 

66ఇదిగో ఇక్కడ నిలబడి వున్న ఈ స్త్రీని ఇది వరకెన్నడు నేను చూడలేదు. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చినదో తెలియదు. మీరక్కడ కూర్చున్నరీతిగానే ఈమె ఈ వేదిక మీదకి వచ్చినది, కారణం నాకు తెలియదు. ఇప్పుడు ఈమె అక్కరలో ఉన్నది, అవును నేను చేయగల్గిన సహాయం ఆమెకు చేయుదును, తప్పక చేస్తాను. కానీ ఇప్పుడు, నేను నేను… అది ఆమె అవసరత మీద ఆధారపడివుంది. ఆమెకు ధన సహాయం కావలయునంటే, నేను ఏదో రకంగా అయిదు లేక పది డాలర్లు పోగుచేసి ఇచ్చెదనేమో.

ఒక వేళ ఆమెకి ఇంట్లో సమస్యలుంటే, "అమ్మా వెళ్ళి నీ భర్తను తోడుకొని రా, మనం కలిసి మాట్లాడుకొందాం, ఏదో రీతిగా నీకు కొన్ని సలహాలు ఇవ్వగలనని చెప్పుదునేమో."

ఒకవేళ అయ్యా, "నేను ఇంటికి చేరుకొనుటకు కష్టం" అని అన్నట్లేతే, మరి నేను ఎవరినో బ్రతిమలాడి ఆమెను గమ్యం చేర్చే ప్రయత్నం చేయుదునేమో, ఆమెకున్న సమస్య ఏమిటో నాకు ఇప్పటికి తెలియదు.

అది అనారోగ్యమా లేక మరొకటా! అదేదో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఒకాయన ఉన్నాడు. ఆయన వాక్యం ఇలా వాగ్దానం చేసింది. "నేను చేయు క్రియలు మీరునూ చేయుదురు."

JOHN 1:42

 

67ఇప్పుడు బహుశా, ఆమె అనారోగ్యముతో ఉన్నట్లైతే, ఇప్పుడు ఆమెకి మానవ వైద్యం నయం చేయలేని ఏ టిబి నో, లేక కాన్సర్ వున్నట్లేతే, నేనేమాత్రం ఆమెను నయం చేయలేను.

బావి వద్ద స్త్రీకి, లేక నతానుయేలుకి, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారునివి, "ఇక నుంచి నీ పేరు పేతురు, దానర్థం చిన్నరాయి" అని చెప్పిన పేతురుకి ఎలాగైతే ఆయన తన్నుతాను తెలియపర్చుకొన్నాడో మరి అదే రీతిగా ఆయన ఇప్పుడు ఈమెను గూర్చి నాకు తెలియపర్చునని నేను నమ్ముచున్నాను. మంచిది, ఇప్పుడు అలాంటి కార్యాన్నే ఆయన మన మధ్య చేసినట్లైతే ఆయన వాక్యం సత్యమని మీలో ఎంత మంది నమ్మగలరు? సరే, ఈ స్త్రీని ఎరిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? మీ చేతులను ఎత్తి చూపండి. ఓ అనేకమందికి ఈమె తెలుసు. సరే, నాకు తెలియదని తండ్రికి తెలుసు.

మంచిది, ఇప్పుడు ఆయన ఏం చెబుతాడో చూద్దాం. ఆయన చెప్పునది ఒక నమ్మలేని నిజమగునా? ఆమెకున్న సమస్య ఏమిటో నేనెరుగను. ఆమె ఇక్కడ ఎందుకు ఉన్నదో నేనెరుగను, ఆమె గూర్చి నాకసలు తెలియదు. కానీ దేవునికి అంతా తెలుసు.

68ఈమెతో నేను మాట్లాడబోవుచున్నాను. సుమారు మూడు నెలల తర్వాత నేను ఈ విధంగా మాట్లాడు మొదటి వ్యక్తి ఈమెయే. ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడుదును. ఏమిటది? ఆమె ఆత్మను సంధించుట. బావియెద్ద యేసు చేసినట్లే ఇది వున్నది. ఆయన ఆమె ఆత్మను సంధించెను.

అమ్మా నీ సమస్యను నీవిక్కడ ఎందుకొరకు నున్నావో సంగతిని మరియు మిగతా విషయాలను ప్రభువైన యేసు నాకు తెలియపర్చునని నీవు నమ్ముదువా? ఆయన మాత్రమే వాటిని నాకు చూపునని నీవు నమ్ముదువా? [అవునండి.] కేవలం ఆయన మాత్రమే వాటిని నాకు తెలియపర్చును. దానిని ఆయన చేసినట్లేతే మనం ఆయన వాక్యం సత్యమని నమ్మి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించెదము.

ఇప్పుడు, నీ సమస్యను ఆయన నాకు బయలుపరచును, నాకైతే అది తెలియదు, కానీ ఆయన దానిని నాకు తెలియపరుచును. తద్వారా ఇక్కడ దేవుని ఆత్మ వుండెనని, ఆ ఆత్మయే వాటిని నాకు తెలియపర్చునని ఋజువగును. కావున చెప్పేది నేను కాదు గానీ దేవుని ఆత్మయే, ఆయన ఇక్కడ వున్నాడు. నీవెవరివో ఆయనకు తెలుసు నాకు మాత్రం తెలియదండీ. ఇప్పుడు ఈ ఎఫెసీ కాలమందు అవి జరుగునని దేవుడు వాగ్దానం చేశాడు. అది సత్యమని నీవు నమ్ముదువా? దానిని ఆయన నీకనుగ్రహించును గాక.

69నేనొక విషయాన్ని చూస్తున్నాను. ఈమె సైనస్ తల నొప్పితో బాధపడుచున్నది. అది నిజమేనా? అది సరైనచో నీ చేతిని పైకెత్తండి. నీ తుమ్ములకు కారణం అది మాత్రము కాదు. నీవు జ్వరము చేత బాధపడుచున్నావు. అది వాస్తవం. నీవు ఫినెక్స్ వాసివి కావు. విస్తారమైన కొండలు చెట్లు అధికముగా వున్న ప్రాంతం నుండి వచ్చావు, నీవు ప్లాగ్స్టాఫ్ నుండి వచ్చావు. అది వాస్తవం. నీవెవరివో దేవుడు నాకు చెప్తాడని నీవు నమ్ముదువా? నీ పేరు శ్రీమతి ఇయార్ల్ అవును, అది నిజమేనా? ఇప్పుడు నీవు నమ్ముచు తిరిగి వెళ్ళుము, అంతయూ సరియగును.

ఇప్పుడు, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగాయున్నాడు. అవునా? ఇప్పుడు, నేను ఈమెను చూడటం ఇదే మొదటిసారి అని పరలోకపు తండ్రి ఎరుగును. వాక్యము నిరూపించినది. గమనించారా, నేను కాదు, నేను కేవలం నరమాత్రున్నే — ఇదిగో నాయెదుట వున్న ఈ మైక్రోఫోన్ నేను మాట్లాడకపోతే ఎలాగు మూగబోవునో, మరి నేను కూడా అంతే. మీ మధ్యనున్న ఆయన ఆత్మయే నా ద్వారా మాట్లాడుచుండెను. గమనించారా? నేను కాదు, ఆయనే స్వస్థపర్చును.

JOHN 14:10

 

70అయ్యా, ఎలా వున్నారు? నాకు పరిచయంలేని మరో వ్యక్తి ఇతడు. ఇతడిని నేను ఎరుగను, నాకు తెలిసినంతమట్టుకు జీవితంలో నేనింత వరకు ఇతడిని చూచియుండలేదు. కానీ ఇప్పుడు ఈ ఆత్మ, పరిశుద్దాత్మ, పరిశుద్దాత్మ మరియు యేసుక్రీను ఒకే ఆత్మయై యుండిరి. అభిషిక్తుడగు యేసు అను మనిషి దేవుని కుమారుడై యున్నాడు. కానీ ఆయనలో వున్న పరిశుద్దాత్మ దేవుడైయున్నాడు. "నా తండ్రి నాలో నివసించుచున్నాడు," చూచారా. అది పరిశుద్దాత్మ, అది ఇంకను దేవుడుగానే వుండెను.

ఇప్పుడు దేహములో నుండి ప్రాణం తొలగిపోతే అది మృతతుల్యమే కదా, అయితే దానిలోకి జీవించే ఆత్మ తిరిగి వచ్చినట్లైతే, అది తిరిగి పని చేయును, గమనించారా. అందుకొరకే వేచి యుంటున్నాను, అభిషేకం తిరిగి ఆరంభమగుటకు.

71అయ్యా, మనమందరం ఏ ప్రభువగు దేవుని సన్నిధిలోనైతే వున్నామో ఆయనే నాకు నీ సమస్యను, నీవు చేసిన దానిని, మరియు నీ గూర్చి ఇంకేదైనను తెలియపర్చునని, అయ్యా నీవు నమ్ముదువా? మనమెంత ఎక్కువగా మాట్లాడితే మనకు అంత ఆలస్యమగును. ప్రార్ధనా వరసలో ఇంకా చాలా మంది వున్నారు. నీ సమస్యను ఆయన నాకు బయలుపరిస్తే ఆయన సేవకునిగా నీవు నన్నుగుర్తించుదువా, ఆయన ఇక్కడ వున్నాడని నమ్ముదువా? నీకు శరీరములోపల అవయవాలు పగిలిపోయె వ్యాధి వున్నది అది నిజమేనా?

"అదెలా జరిగినదని?" నీవనవచ్చును. దానిని తెలిసికొనుటకు ఇష్టపడుచున్నాను. అయితే దానిని ఎవ్వరూ వివరించలేరు. అదొక నమ్మలేని నిజం, గమనించారా. అవును, నేను ఇంకా ఏదో చూస్తున్నాను, ఒక పరీక్ష, మిస్టర్ ఆండర్సన్ నీకు గుండె సమస్య వున్నది. నీ చేతిని ఎత్తండి. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును, గనుక నీవు ఇంటికి వెళ్ళవచ్చును. అది సరియగును. కేవలం నమ్ముము, విశ్వాసముంచుము.

72అయ్యా, ఎలా ఉన్నారు? మనమిరువురం ఒకరికొకరం క్రొత్తవారిమి. నీవెవరివో నాకు తెలియదు నాకు తెలిసినంతమట్టుకు నిన్ను చూడటం మరియు నీ గురించి తెలిసికోవటం ఇదే మొదటిసారి. అది వాస్తవం. అయితే మన ఇద్దరి గురించి ఆయనకు ఇంకా బాగా తెలుసును, ఇది ఎందుకు ఇవ్వబడినదో మీకు తెలుసా? ఆయన కృప దీనిని అనుమతించినది. దీని ద్వారా జనులు దేవున్ని తెలుసుకోటానికే ఇది ఇవ్వబడినది.

ఇప్పుడు, నీ గురించి నాకేం తెలియదు, తెలుసుకొనేందుకు ఇప్పటి వరకు నాకు అవకాశమే రాలేదు. ఇప్పుడు ఏదో జరుగుటకు ఇదోక నమ్మలేని నిజమగును. అది నీలో వున్న సమస్య లేక నీవు చేసిన కార్యాలు, లేక నీవు ఏదో తప్పక చెయ్యవల్సినవి చెయ్యకపోటం, లేక తప్పకుండా నీవు చెయ్యవల్సినవి చేసియుండటం లేక నీ గురించి ఏదో నాకు తెలుపబడటం లాంటివి, అగపడని వాటిని గూర్చి దైవ ప్రత్యక్షత లేకుండా ఏ ఒక్కరు ఈ విషయాలను తెలుపలేరు. గనుక ఇదోక నమ్మలేని నిజమగును. అది నిజం. ఇప్పుడు నీకు నాకు మధ్య ఆయన దానిని చేసినట్లైతే ప్రేక్షకులు… ఇదొక బహిరంగ ప్రదర్శన కాదు, కానీ అది ఇక్కడ ఒక ఎఫెసుగా వారు చూతురు, అంతే కాక సంఘ శాఖలలో నుండి మహిమగల దేశములోనికి ప్రవేశించుటకు ఒక వంతెనగా అది వున్నది. దానిని ఆయన వాగ్దానం చేశాడు, దాని ద్వారా మనం సత్యం చెప్పుచున్నామని వారు నమ్మగలుగుదురు. ఇప్పుడు, నీ వెవరివో నాకు తెలియదు, అది, జనులు చూచునట్లు నీ చేతులెత్తి చూపుము. ఇతడిని నా జీవితంలో నేనెన్నడూ చూచి యుండలేదు. కేవలం ఇక్కడ నిలబడిన వ్యక్తిగా మాత్రమే నాకు తెలుసును, కావాలంటే ఎవరినైనా అడగండి. అయ్యా, నీవు శరీరములోని అవయవాలు పగిలిపోవు వ్యాదితో బాధపడుచున్నావు. అంతే కాదు నీకు మూల వ్యాది (అధిక రక్తస్రావమగుట) కూడా కలదు, అది వాస్తవం.

నీవు చాలా దూరము నుండి ఇక్కడికి వచ్చావు. నీవు అమెరికా పౌరుడవు కావు, నీవొక కెనడా జాతీయుడవు, మానసిక రుగ్మతతో బాధపడుచున్న నీ కుమారున్ని కూడా ఇచ్చటికి తెచ్చావు. అది నిజం. ఇంకా క్షుణ్ణంగా నీవు ఏ పట్టణం నుండి వచ్చితివో చెప్పమంటావా? నీవు సస్కట్వాన్ ప్రాంతము నుండి వచ్చావు, సస్కట్వాన్ పట్టణ వాసివి, దేవుడు మిమ్ములను పూర్తిగా ఆరోగ్యవంతులుగా గృహమునకు పంపునని హృదయపూర్వకముగా నమ్మండి. దానిని నీవు నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక. మీరు నమ్ముచున్నారా? దేవుడు యింకను దేవుడుగా ఉన్నాడు. ఆయన కాక ఇంకెవరున్నారు.

73అమ్మా, ఎలా ఉన్నారు? ఇక్కడొక స్త్రీ వున్నది, ఆమె ఎవరో నాకు తెలియదు. కొంచెం పెద్ద వయస్కురాలు కావచ్చును. నేనెన్నడు ఆమెను చూడలేదు, కానీ ఆమె కేవలం ఒక స్త్రీగా ఇక్కడ నిలబడియున్నది. నాకింక ఏడు లేక ఎనిమిది నిమిషములు మాత్రమే మిగిలి యున్నవి గనుక నేను త్వరగా జరిగింతును. సరే, చూడండి. ఇలా చూడండి. ఈ సంగతులు వాస్తవమని నీవు నమ్ముదువా? నీ పూర్ణహృదయముతో నమ్ముదువా? నీ గురించి నీ సమస్య గురించి తెలిసికోవటం నాకు అసాధ్యమని నీకు తెలుసా, కానీ దేవునికి మాత్రం అది అసాద్యం కాదు. ఆయన నిన్ను లోకమనేది లేనప్పుడే ఎరిగివున్నాడు. అది నిజమేనా? అది నిజమని మీలో ఎందరు నమ్మెదరు? నిశ్చయంగా.

నీవు ఎన్నిసార్లు నీ కను రెప్పలను ఆడించుచుంటివో ఆయన ఎరిగి యున్నాడు. ఆయన అనంతుడు. ఆయన కృపను బట్టి ఆయన తన సువార్తనందు దేనినైతే వాగ్దానం చేసివున్నాడో, దాన్ని బట్టియే ఆయన ఇక్కడ ఉన్నాడు. వీటన్నిటి తర్వాత పరలోకమనే చోటుకి మనం వెళ్ళుదుము. ఇప్పుడు మనము ఈ ఎఫెసీలో వుంటిమి, ఒక దానివెంట మరొకటి దాటుకొంటూ మనమిచ్చటికి వచ్చితిమి.

అమ్మా, నీవు అనేకమగు చిక్కైన జాడ్యములతో సతమగుచున్నావు. చాలా కీడులను ఎదుర్కొనుచున్నావు. నీవు ఈ ప్రాంతానికి చెందిన దానవు కావు. ఇచ్చట నుండి పశ్చిమ వైపునున్న ప్రాంతము నుండి అనగా కాలిఫోర్నియా నుండి వచ్చితివి. అది నిజం. అలాగే బాధనొందుచున్న ఒక కుమారుడు నీకు వున్నాడు. అది నిజం… నీవు… ఇంకా వుంది, పెద్ద చెరువు నిండా నీరు వుండుటను నేను చూస్తున్నాను. ఓ, చికాగోలో ఉండే వ్యక్తి నీకు సన్నిహితముగా వున్నాడు. ఆ వ్యక్తికి నేను తెలుసును. అది నిజం. అది వాస్తవం. నీ గూర్చి నాకు తెలియదని నీకు తెలుసును, నీ గూర్చి దేవునికి తెలియునని నీవిప్పుడు నమ్ముచున్నావా? శ్రీమతి మైక్గూర్ నీ విన్నపము అంగీరించబడింది. దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించుకొంటూ వెళ్ళుము.

ఎలా ఉన్నారు? నీవొక బలమైన యవ్వన వ్యక్తివి.

74అయితే రోగములు సంకటములు అనేవి వ్యక్తిని బట్టి రావండీ. అది ఎంతమందికి తెలుసు? మనందరికి సాధారణముగానే ఆ సంగతి తెలుసును.

"నీ పూర్ణహృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీవు నమ్ముము." నీ పూర్ణహృదయముతో ఆ ఆస్తమా రోగము విడిచిపోవునని నమ్ముము.

సహోదరి నీకున్న ఆ రొమ్ము సమస్య కూడా పూర్తిగా తొలగిపోవునని, నీవు పూర్తిగా బాగవుదువని నమ్ముచున్నావా? నీవు దేవునిని తాకావు? ఆమె నాకు ఇరవై అడుగుల దూరంలో లేక ఇంకా ఎక్కువ దూరంలోనే ఉంది. అయితే ఆమె తాకినది ప్రభువును. నీ నరములలో గడ్డ కట్టుకొనియున్న రక్తము సాఫీ అగును. నీకు నయమగును.

ఈ యవ్వనస్తురాలు ఇక్కడ ఒక గొప్ప కార్యము కొరకు నిలబడియున్నది. ఆమె పూర్తిగా నాకు అపరిచితురాలు. నేనెన్నడు ఆమెను చూడలేదు. వేరొకరి ద్వారా ఆమె ఇక్కడికి తీసికొని రాబడింది. ఆమె ఇక్కడికి రావటానికి కారణమేమనగా, ఆమె నా టేపును విన్నది. పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందుటకు ఆమె ఇక్కడికి వచ్చినది. నిశ్చయంగా ఆమె అందుకొరకే యిక్కడ వున్నది. అది వాస్తవం. అవునా యవ్వన బాలికా? అది నిజం. ఇచ్చటికి రమ్ము. ప్రియ దేవా, ఇచ్చట నిలబడియున్న ఈ బిడ్డ చీకటిని చేదించుకొని వెలుగులోనికి వచ్చియున్నది, ఈమె పరిశుద్దాత్మను పొందుకొని, యేసు ఈమెకి చేసిన గొప్ప కార్యములను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత తన ప్రియమైనవారందరికి తెలుపును గాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. సందేహపడొద్దు, నమ్ముము.

75దేవుడు సమస్తమగు నరాల బలహీనతలను, ఆస్థమా రోగములను స్వస్థపర్చునని నమ్ముదురా. దానిని మీరు నమ్ముదురా? అలాగైతే హృదయపూర్వకముగా నమ్మి వెళ్ళండి. సహోదరుడా దేవుడు మిమ్ములను దీవించును గాక.

మీ వయస్సెంత? నీవు ఇంతక మునుపే నరముల ఒత్తిడి (ఉద్రిక్తత) నుండి బయట పడితివి, కాదా? అన్ని రకములగు చింతలు, మాయా ప్రభావములు నిన్ను కలవరపెట్టి యున్నవి, అయితే అవి ఇప్పుడే నిన్ను విడిచి పోయినవి. అది నిజం. దానిని నమ్ముము.

నరముల ఉద్రిక్తతలను మరియు కడుపులోని సమస్యలను కూడా దేవుడు బాగుచేయును. దానిని నీవు నమ్ముచున్నావా? అయితే వెళ్ళి నీకిష్టమైన దానిని భుజించుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపర్చియున్నాడు.

అక్కడ బయటనున్న మీరందరు నమ్ముచున్నారా? చొక్కా ధరించిన వ్యక్తి అక్కడ కూర్చొని, నా తట్టు చూచుచున్నాడు. అవును. అతడు తర్వాత తల క్రిందకి దించి తన చొక్కాను చూచుకొనుచుండెను. అవును, దేవుడు నీ యొక్క మాంస గ్రంథులలో నున్న సమస్యను తొలగించి, ఆరోగ్యవంతునిగా నిన్ను చేయునని నమ్ముదువా? ఆస్తమా సమస్య నుండి ఈ చిన్న పిల్లవాడు స్వస్థత నొందిన సమయముననే నీవు నమ్ముటను ఆరంభించితివి, అవునంటావా? నీ హృదయపూర్వకముగా నమ్ముము. నీవు కూడా బాగుపడబోవుచున్నావు.

అక్కడ నీ భార్య ప్రక్కన ఒక చిన్న బాలిక కూర్చొనియున్నది. నీ కను దృష్టి మామూలు స్థితిలోకి వచ్చునని నీవు నమ్ముచున్నావా? ఆ కంటి సమస్యను దేవుడు తీసివేయునని నమ్ముచున్నావా? అందుకొరకే నీవు ప్రార్ధి౦చుచున్నట్లైతే నీ చేతిని పైకెత్తుము. చూశారా, వారు దేనిని తాకిరి? దేవుని కుమారుడగు యేసు క్రీస్తును.

76నీవు నమ్ముచున్నావా? యవ్వనుడా నీవు నమ్ముచున్నావా? దేవుడు రక్తమందున్న సమస్యను తొలగించి, నీ మధుమేహ వ్యాధి నుండి నిన్ను పూర్తిగా స్వస్థపర్చునని నీవు నమ్ముచున్నావా? దానిని నమ్ముచున్నట్లు ఆయనకు తెలుపుచూ వెళ్ళుము.

అయ్యా, రండి, నీ కడుపు నందున బాధను తీసివేసి నిన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా దేవుడు చేయునని నీవు నమ్ముచున్నావా? నమ్ముచూ వెళ్ళుము, బాగుపడతావు, స్వస్థచిత్తుడవు అవుతావు.

రండి, ఈ చిన్న బిడ్డలను తీసికొని రండి, బిడ్డా ఇలా చూడుము. దూర ప్రయాణము చేయుట వలన కొన్నిసార్లు సముద్ర మట్టానికి ఎత్తునకు ప్రయాణము చేయుటచేత వాతావరణ మార్పు కలుగును. తద్వారా ఆస్థమా స్థితి మెరుగవునని కొందరు తలంతురు, కానీ నిశ్చయంగా మెరుగుపర్చగలిగినవాడు, స్వస్థపర్చగలిగినవాడు దేవుని కుమారుడగు యేసుక్రీస్తు, నీవు స్వస్థతనొందుటకై ఆయన తన కుమారున్ని అనుగ్రహించెను. దానిని మీరు నమ్ముచున్నారా? పూర్ణహృదయంతో నమ్మితే అది అతనిని విడిచిపోవును. అప్పుడతడు సాధారణ స్థితికి వచ్చును, పూర్తి ఆరోగ్యవంతుడగును. దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరి.

దానిని నీవు నమ్ముచున్నావా? ఇప్పటికి కూడా దేవుడు నమ్మలేని నిజాలను జరిగించునా? అవి వివరింపజాలనివి, గ్రహింపజాలనివి. జనులు వాటిని గ్రహించజాలనప్పటికిని అవి పూర్తిగా వాస్తవమైనవి, కాదంటారా? ఇక్కడ ఏదో ఒక అతీతమైనది ఉన్నదని, జరుగుచున్నదని గ్రహించుచున్నాను? అది మీ తలంపులకు అందనంత ఉన్నతంగా ఉన్నది.

HEB 13:8

 

77ఇప్పుడు, వరసులో సుమారు పదిహేను మందిని పిలిచామని నేననుకొనుచున్నాను. వరుసలో లేని నలుగుర్ని లేక ఐదుగుర్ని మరియు ప్రార్ధనా కార్డులు లేని వారిని, జనసమూహంలో వున్న వారిని పిలిచామని అనుకొనుచున్నాను.

ఇప్పుడు ముగించుటకు మనకు కేవలం ఒక్క నిమిషం మాత్రమే మిగిలివున్నది. ఏ విధముగానైతే ఆయన చేయుదునని పలికాడో, మరదే విధముగా ఆయన ఇప్పుడు చేయుచున్నాడా? ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని, మేము ఆయన సన్నిధిని స్పర్శించామని మీలో ఎంత మంది నమ్ముచున్నారు? ఇప్పుడు మీరు ఆయన సన్నిధిని చూచితిరి. ఇప్పుడు మీ కన్నుల యెదుట దేవుడు తన సన్నిధిని స్థిరపరచియున్నాడు. ఇప్పుడు మీ కన్నులు దానిని చూచి యున్నవి, మీ చెవులకు అది వినబడినది. మీరు పొరపాటు చేసినప్పుడు ఏదైతే మిమ్మును ఎడతెగక గ్రుచ్చునో (పశ్చాతాపపడునట్లు చేయునో), మరలాగే ఇక ఎన్నడూ వాటిని చేయొద్దని మీతో చెప్పునో, మరదే అనగా ఆ దేవుడే ఈ మధ్యాహ్నం తన కార్యములయందు కనబడియుండెను. దానికి "ఆమేన్" అని ఎందరు చెప్పుదురు? నిశ్చయంగా అది ఇదే. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు.

78అయ్యా, నేనింకా క్రైస్తవుణ్ణి కాలేదు అనేవారు ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్నారా? ఏ ఒప్పుకోలు చేయనివారు, ఇంతవరకు సంఘమునకు వెళ్ళనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే దయతో అట్టివారు లేచి "సేవకుడా నేను లేచి నిలబడగోరుచున్నాను. అయితే అది నీ ముందు కాదు గానీ మన మధ్య పరిశుద్దాత్మగా వుండి తన సన్నిధిలో మనల్ని వంచిన యేసుక్రీస్తు అను వ్యక్తి ముందు నిలబడగోరుచున్నాను. నేనిప్పుడు నిలబడి ఇలా చెప్పగోరుచున్నాను, 'యేసుక్రీస్తు నా పాపముల నుండి నన్ను రక్షించండి అని చెప్పగోరుచున్నాను.'"

లేచి నిలబడవలెనని కోరుచున్నాను, అంతే, అది సాక్ష్యమిచ్చును. అలా చెప్పువారు ఎవరైనా వుంటే ఇప్పుడే లేచి నిలబడండి. దానిని చేసి తిరిగి మీ స్థలములో కూర్చొండి. అలా చెప్పేవారు ఈ భవనములో ఒక్కరైనా ఉన్నారా? ఎంత మంది అలా చేయగలరు? ఒక్కరైనా ఉన్నారా అని నేను అనకూడదు, ఎందుకనగా ఒక్కరికంటే ఎక్కువమందే ఉండొచ్చును.

ఈ భవనములో వున్న ఎంతమంది ఇప్పుడు లేచి నిలబడి ఇలా చెప్పుదురు "దేవా, ఇప్పటి వరకు నేను తప్పు చేయుచూ వచ్చాను. నన్ను క్షమించు. నా తప్పును ఒప్పుకొనుటకు నేను లేచి నిలబడగోరుచున్నాను. నేనిక్కడ వున్నంతసేపు ఆయన సన్నిధిలో కూర్చొనగోరుచున్నాను." అలాంటి వారు ఇప్పుడే లేచి నిలబడండి. ఒక్కరైనా వున్నారా, ఒక్కరున్నట్టున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను దీవించును గాక, యవ్వనుడా.

దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా. ఇంకా ఎవరైనా? ఓ వెనకున్నవారు దేవుడు నిన్ను దీవించును గాక, ఇంకా ఎవరైనా, "దేవా, నేనిప్పటి వరకు తప్పిదములో వుంటూ వచ్చాను. నన్ను క్షమించండి," అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక, "ప్రభువా నేనిప్పటి వరకు తప్పులో ఉన్నాను, నన్ను క్షమించు." దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక.

79ఈ పరిచర్యను ఇప్పటి వరకు సందేహిస్తు, సంశయిస్తూ వచ్చిన వారు, దేవుని ద్వారా అది వాస్తవమని ఒప్పింపబడిన వారు ఇప్పుడు ఎవరైనా ఉన్నట్లైతే, ఇప్పుడే లేచి నిలబడి ఇలా చెప్పండి, "దేవా, నన్ను క్షమించు." "సహోదరుడా బ్రెన్హా౦ ఈ పరిచర్య విషయంలో నాకున్న సంశయములన్ని తొలగిపోయాయి," ఇలా చెప్పేవారు వుంటే మీ చెయ్యినెత్తండి. ఒక్కరైనా ఉన్నారా? ధన్యవాధములు.

దీనిని ఎందరు నమ్ముదురు? ఈ పరిచర్య నాది కాదు. దేవుని కుమారుడగు క్రీస్తుది. ధన్యవాధములు. నీవు నమ్మినంతకాలం వీటి కంటే గొప్ప కార్యాములను చూచెదవు. కేవలం క్రీస్తుతో మాత్రమే నిలిచి యుండుము. నా మట్టుకు నేను ఆయనతో ఉండుటకు చేయగల్గినది అ౦తా చేయుదును.

ఇప్పుడు, రోగములతోను అవసరతలతోను వున్నవారు ఎంతమంది ఉన్నారు? అట్టివారు మీ చేతిని ఎత్తి చూపండి, "సహోదరుడా బ్రెన్హా౦ నేను రోగములో ఉన్నాను. నేను అవసరతలో ఉన్నాను" అనేవారు. మీ చేతిని చూపండి. ఓ! చూడండి, జనులవైపు చూడండి. నా మాటను నమ్మి మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచగలరా? నేను మీతట్టు నా చేతులెత్తెదను.

మనము ప్రార్ధించుకొందుము.

80ప్రియమైన దేవా, ఈ మధ్నాహ్నాం నేను ఈ చిన్న ప్రేక్షక గుంపును నీ యొద్దకు తెచ్చుచుంటిని. మేము నీ వాక్యమును చదివి దానిని వినియుంటిమి. దానిలోని ప్రతిమాట సత్యమని మేము నమ్ముచున్నాము, ఎందుకనగా అది నీ వాక్యమై వున్నది. అది సత్యమని నమ్ముట మాత్రమే కాదు గానీ, అది సత్యమని మేము ఎరిగియుంటిమి.

ప్రభువా మేము చూచితిమి, అదేదనగా ఇంకా జనులు తేల్చుకోవల్సినది వుందని. భూలోకసంబంధమైన నమ్మలేని నిజాలు, అంతరిక్షపు నమ్మలేని నిజాలు, ప్రకృతి సంబంధమైన దేవుని నియమాలు కంటే ప్రత్యేకమైన నమ్మలేని నిజాన్ని మేమిక్కడ చూచియున్నాము. ఇక్కడ చావు నియమము శరీరమందు పనిచేయుచున్నది, దానిని విడిపించుటకు విజ్ఞాన శాస్త్రము తన పరిశోధనల ద్వారా విఫలమైంది.

కానీ ప్రభువా వారిని (శాస్త్రజ్ఞులను) మేము కించ పర్చుటలేదు, వారికొరకు ఎంతో కృతజ్ఞలమై యున్నాము. వారిని తక్కువ చేయుట లేదు గానీ, వారి కొరకు కృతజ్ఞులముగా యున్నాము. అయితే ప్రభువా, ఎక్కడైతే వారు నిస్సహాయులై చేతులెత్తారో, అక్కడికి నీ బాహు బలము దిగివచ్చుటను మేము చూచి యున్నాము. నీవు తప్ప స్వస్థపర్చేవారెవరు లేరు. వైద్యుడైతే ఒక ఔషద పరిష్కారం కొరకు ప్రయత్నించును, కానీ వాగ్దాన రీతిగా దేవుని కుమారుడు దిగి వచ్చి స్వస్థపర్చెను, దానిని మేమంతా నమ్మితిమి.

81రక్షింపబడని ప్రతి ఒక్కరు రక్షణ కొరకు చేతులెత్తిరి. దేవా తాము తప్పులో ఉన్నామని వారిలో కొందరు చెప్పారు. వారు వెనక్కి పడిపోయారని ఒప్పుకొన్నారు. కావున అటువంటివారందరిని పునరుద్ధించండి. ప్రభువా, వారు ఎరిగియున్నారు, వారిలో అనేకులు నన్నెరిగియున్నారు. సంవత్సరాలు తరబడి వారు నన్నెరిగియున్నారు. అలాగే మనిషిలో, విశేషంగా నాలో ఏ మంచి లేదని వారికి తెలుసు, అటువంటిది నాలో ఏ మంచి తనమును వారు అపేక్షించుదురు? వారు వాగ్దానం చేయబడిన వాక్యాన్ని చూచియున్నారు. అది సత్యమని ఒప్పింపబడియున్నారు. దానిని వారు అంగీకరించియున్నారు.

ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారందరిని నేను ఈ వేదిక మీదకి తీసికొని రాలేను. తండ్రీ, వీటిని చేసేది నేనే అని నేనెన్నడు చెప్పలేదు, మార్గములో నుండి నన్ను తప్పించి, అక్కడ నీ ఆత్మ పనిచేయునట్లు నన్ను పూర్తిగా నీకు సమర్పించుకొన్నానని అనుటకు నీవే సాక్షివి.

ఇప్పుడు తండ్రీ, ఒక వ్యక్తి దానిని చేయగలుటను లేక మరోకరు దానిని చేయుటను కాకా, అందరం కలిసి ఒకరిమీద నొకరు చేతులుంచుకొని రోగులు స్వస్థత నొందుటను చూచుటకు అనుమతించండి. ఇప్పుడు, ఆ గొప్ప పరిశుద్దాత్మ ఈ భవనము అంతటిలో కదులుచూ ప్రతి ఒక్కరిని స్వస్థపర్చును గాక.

ప్రతి ఒక్కరిని రక్షించును గాక, ప్రభువా, అటువంటి అనుభవమును మాకనుగ్రహించండి — వీరిమీద నీ పరిశుద్దాత్మను కుమ్మరించండి. ఓ, రానున్న వారములో నీ గొప్ప కార్యములను మేము అపేక్షించుచున్నాము. ప్రభువా, అది అట్లు౦డును గాక, ఇప్పుడు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్ధన చేయుచున్నాను.

82మనమందరం ఇప్పుడు లేచి నిల్చుందాం. మీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా? మన సహోదరి వచ్చి "నేను ఆయనను స్తుతింతును, నేను ఆయనను స్తుతింతును" అను పాటకు పియోనా వాయించినట్లైతే బావుండునని నేననుకొనుచున్నాను. మీకు ఆ పాట తెలుసా? అయితే అందరం కలిసి పాడుదాం. రేపు సాయంత్రం మనం మరలా కలుసుకొంటామని నిరీక్షించుచున్నాను. ఇప్పుడు అధికారికంగా ముగించుటకు ముందు మీతో కలిసి ఈ పాటను పాడగోరుచున్నాను. మంచిది, పాట ఆరంభిదాం.

నేను ఆయనను స్తుతింతును, (అందరం చేతులు పైకెత్తుదుము),

నేను ఆయనను స్తుతింతును,

పాపుల కొరకు వధింపబడిన గొర్రేపిల్లకు స్తోత్రం;

జనులారా ఆయనకు మహిమను ఇవ్వండి,

ప్రతి మరకను ఆయన రక్తము కడిగివేసెను.

ముగింపు ప్రార్థన కొరకు తలలు వంచుదాం. మంచిది. సహోదరుడు జ్యూయల్ రోజ్ మనల్ని విడిచిపెట్టును. దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడు రోజ్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...