భేదమైన విత్తనము

భేదమైన విత్తనము

1ఈ రాత్రి ప్రభువు చిత్రమైనయెడల, ఒక చిన్న అంశమును లేదా కొద్దిపాటి లేఖనము చదువుటకు పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 13:24-30 వరకు మన అంశము యొక్క పూర్వవృత్తాంతము మనము తెలిసికొనుటకు ఎన్నుకున్నాను. మరియు కొద్ది సమయమునకు 36 నుండి 40 వచనములు కూడ నేను చదువనపేక్షించుచున్నాను. ఇప్పుడు మత్తయి 13వ అధ్యాయము 24 నుండి ప్రారంభించుదాము. చదువుచున్న వాక్యమును జాగ్రత్తగా వినండి. నా మాటలు తప్పిపోవును గాని, ఆయన మాటలు ఎన్నడు తప్పిపోవు.

ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా - పరలోక రాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.

మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి - అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివిగదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి.

ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు - మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

అందుకతడు - వద్దు, గురుగులను పెరుకుచుండగా, వాటితో కూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

కోతకాలము వరకు రెంటిని కలిసి యెదుగనియ్యుడి, కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

MATT 13:30

 

2"గురుగులు ముందుగా కూర్చి కట్టలు కట్టమని," చెప్పిన దానిని మీరు గమనించితిరా? గత రాత్రి కటాలినా పర్వతముల మీద కూర్చుండి ప్రార్థనలో నుండగా, ఈ వాక్యము చదువుచుంటిని, ఆ సమయములో నాకో వింత యోచన వచ్చినది. అటు పిమ్మట ఈ రాత్రి అంశముపై మాట్లాడుటకు దీనికి ఉపయోగపడు వాక్యము ఎక్కడ నుండి ప్రోగుచేయాలి? అని నేను అలోచించితిని.

మరియు నేను క్రిందకు దిగి వెళ్ళి, "భేదమైన" అను పదమును వెదకి కనుగొంటిని, గనుక నా దగ్గరయున్న నిఘంటువు నందు "భేదము" అను పదమునకు అర్థమేమిటా అని చూచితిని. మరియు దాని అర్థము. "వ్యత్యాసమైనది విత్తుట," లేదా "పరస్పర విరుద్దము," వెబ్స్టర్ (నిఘంటువులో) చెప్పినట్లుగా, "బేధమైనది విత్తుట, ఏదో భిన్నముగా," లేదా "ముందున్న దానికి వ్యతిరేకమైనది కలిగియుండుట." అందువలన ఈ రాత్రి అంశమును "భేదమైన విత్తనము" అని పిలుచుటకు నేను తలంచితిని. ప్రభువు, తన వాక్యమును మనము ధ్యానించుటకు సమీపించుచుండగా, ఆశీర్వదించునని విశ్వసించుచున్నాను

MATT 13:36-43

 

3మరియు 36 నుండి 43 వచనములలో విత్తనము ఎట్లు పరిపక్వత చెందునని ఆయన అనువదించెనో, దానిని మనమెరుగుదుము. మరియు ఇప్పుడు మనము ఆ భాగమునకు వచ్చినందున, 36-48 వచనములు కూడ చదువుదాము.

అప్పుడాయన జనసమూహములను పంపివేసి, ఇంటిలోనికి వెళ్లగా, ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి - పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పమనిరి.

అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనములు విత్తువాడు మనుష్యకుమారుడు;

పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తన శత్రువు అపవాది.

కోతయుగ సమాప్తి; కోతకోయువారు దేవదూతలు.

గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో, అలాగే యుగ సమాప్తియందు జరుగును.

మనుష్యకుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైనవాటిని, దుర్నీతి పరులను సమకూర్చి

అగ్నిగుండములో పడవేయుదురు: అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును.

అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.

MATT 24:24•

MARK 13:22

 

4యేసు స్వయముగా ఈ ఉపమానము యొక్క భావమును తెలియజేసెను, కాబట్టి ఈ ఉపమానభావము ఏమైయుండునో మనము ఎరుగుదుము. మరియు మనము ఇప్పుడు దీనిని సమీపించుచుండగా, విత్తనము విత్తుటను మరియు కోత కోయుటను గూర్చిన అనువాదమును ఆయన తెలియజేసెను. మరియు యేసు తన దినమున ఈ ఉపమానమును గూర్చి మాటలాడెను, కాని అది లోకము యొక్క అంతము లేదా యుగసమాప్తిని సూచించు ఈ దినమును గూర్చిన భావమైయున్నదని నేను నమ్ముచున్నాను. మరియు ఈ రాత్రి ఈ చిన్న అంశము నేడు మనము జీవించుచున్న ఘడియకు ఎంతో తగియున్నదని నేను విశ్వసించుచున్నాను, ఏలయనగా - "ఈ కూర్చబడుట" యుగ సమాప్తమందు జరుగును," అది అంత్యమందు, అలాగుండును. గోధుమలు కూర్చబడుటయు, గురుగులు కాల్చబడుటకు అవి కూడ కూర్చబడును, గోధుమలను దేవుని రాజ్యములోనికి కొనిపోవుటను యేసు స్పష్టముగా తెలియజేసెను. ఈ విధముగా అది జరుగునని నేను విశ్వసించుచున్నాను.

మరియు వేరొక లేఖనము నన్ను ఈ విధముగా నమ్మునట్లు చేయుచున్నది. నేనిక్కడ వ్రాసియుంచిన మత్తయి 24:24 ప్రకారము, భేదమైన విత్తనమును గూర్చి అది ఈలాగు చెప్పుచున్నది, దరిదాపుగా ఆ రెండునూ ఒకే రీతిగానుండి, "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చునని," యేసు తెలియజేసెను. అది ఇంచుమించు ఒక్కటే రీతిగా నున్నది.

MATT 5:45

 

5మరొక చోట లేఖనమునందు, "నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించబడుచున్నదని," వ్రాయబడియున్నది.

పెంతికోస్తు ప్రజలమధ్యకు నేను వెళ్ళినప్పటి ప్రథమ అనుభవమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. ఇండియానాలోని మిషవాకా (ప్రదేశము) యందుండగా, నేను ఒక పెద్ద సమావేశ సభయందుంటిని, ఉత్తర, దక్షిణముల నుండి ప్రోగుచేయబడిన ప్రజలు కూడుకొనినట్టి ఈ భవనమువలె నుండెను. ఆ దినములలో వర్ణభేదమును బట్టి, వారు ఆ విధముగా కూడుకొనుటకు ఏర్పాటు చేయబడినది. వారు రెండు తెగలు కలిగిన పెంతికోస్తు సహోదరులు. ఇంతకు ముందు ఎన్నడు వారి విషయము నేను వినలేదు, లేదా వారిని కలిసికొనలేదు. నేను మొదటిసారిగా భాషలలో మాట్లాడుట వింటిని. ఆ సభయందు చివరి పంక్తిలో కూర్చుండియుంటిని, ఏలయనగా నేను వారి సభ్యుడను కాను. నేను ఒక యౌవన బాప్టిస్టు పాస్టరును, అందువలన చాల దూరముగా వెనుక కూర్చుండియుంటిని. ఎవరైనా భాషలు మాట్లాడుట నేను వినుట ఇదే మొదటిసారి, అదేమిటో నేను ఎరుగను - అది దేని విషయమైనది నేను ఎరుగను. అటు పిమ్మట, ముఖ్యముగా ముందు కూర్చున్న ఇద్దరిలో ఒక వ్యక్తి అన్యభాష మాట్లాడుచుండెను, మరొక వ్యక్తి దానికి అర్థము చెప్పుచుండెను. వెంటనే అదే సమయమున నా బైబిలు చదువ ప్రారంభించితిని, అప్పుడది వాక్యానుసారముగా నున్నదని, పరిశుద్ధాత్మ ఆ విధముగా చేయునని ఖచ్చితముగా లేఖనములు తెలుపుచున్నవి అని కనుగొంటిని.

6అటు పిమ్మట, ఒక దినమునకు తరువాత ఆ రాత్రి నా హృదయమునందు బహు కలతగా ఉండెను నేను ఒక మొక్కజొన్న పొలములో నిద్రించాను. ఒక పరుపు కొరకు ఖర్చు పెట్టు డబ్బు కూడ నా దగ్గర లేదు, ఇంటికి వెళ్లిపోడానికి సరిపోయే డబ్బులు మాత్రము ఉన్నవి. నా దగ్గర రెండు దినముల క్రితము తయారుచేసిన పక్వము వంటి డోనట్సు ఉండెను, అవి నా ఉదయకాలపు అల్ప ఆహారము నిమిత్తముండెను. వారు నన్ను తమతో భోజనము చేయుటకు ఆహ్వానించిరి గాని, అచ్చట చెల్లించుటకు నా దగ్గర డబ్బులు లేకుండెను. అది 1933 సంవత్సరము. కరువు సంభవించిన సంవత్సరమైయున్నందున జీవించుట బహు కష్టముగా నుండెను. "ఏమి చేయాలి?" అని నేను ఆలోచించితిని. నేను వారితో భోజనము చేయుటకు కోరుటలేదు కాని, వారు దేనిని కలిగియున్నారో, దాని విషయము నేను తెలిసికొనగోరుచున్నాను. నేను కలిగియుండని దానిని వారు కలిగియున్నారు.

కాబట్టి ఉదయకాలమున వారు నాతో, "సేవకులందరు ప్రసంగ వేదికపైకి వచ్చి తమ్మును గూర్చి పరిచయము చేయుచు, ఎవరైనది, ఎక్కడి నుండి వచ్చినది తెలియజేయుమని," చెప్పిరి.

సరే, నేను వెళ్లి - విలియం బ్రెన్హాం, సువార్తికుడను, జెఫర్సన్ విల్, అని చెప్పి కూర్చుంటిని. ఆ సమయమున వేదికపైనున్న వారందరిలో నేను వయస్సులో చిన్నవాడైన పరిచారకుడను. మరియు మరుసటి రోజు నన్ను ప్రసంగ వేదికపైకి పిలిచి, మాట్లాడమనిరి. నేను మాట్లాడిన పిమ్మట, మేమందరము మహా సంతోషముతో సమయము గడిపితిమి. అప్పుడు పలు విధములైన వారితో పరిచయము కలిగెను. అప్పుడు వారు తమ సంఘములకు ఆహ్వానించిరి. అటు తరువాత వారు…

ROM 11:29

 

7అటు పిమ్మట, "భాషలతో మాట్లాడిన, మరియు అర్థము చెప్పిన ఆ ఇద్దరు ముఖ్య వ్యక్తులను ఎక్కడ కలిసికొనగలను," అని తలంచితిని. ఏలయనగా, దానిని పొందుకోవలెనను కోరిక నా హృదయమును మండింపచేయుచున్నది. మంచిది, ఆ చిన్న వరమును మీరు ఉపయోగించుట గూర్చి నేను మీతో ప్రధమముగా చెప్పినట్లు. వరములు మరియు పిలుపు, మారుమనస్సు లేకుండనే అనుగ్రహింపబడునని మీరు ఎరుగుదురు, అది దేవుడు అనుగ్రహించినయెడల, అది నీ జీవితమంతయునుండును, ఏలయనగా వాటితోనే నీవు జన్మించితివి. అందువలన నేను చిన్నవాడిగా నుండినప్పటి నుండి, అట్లు ఎల్లప్పుడు ఆ విధముగా జరుగుచుండెను. ఎందరు నా జీవితమును గూర్చి ఎరిగినవారు అది సత్యమని ఎరుగుదురు? మంచిది, అది ఏమైయున్నదని ఆ సమయమునందు నేను ఎరుగను అని నేను తలంచుచుండిన. అది యొక దర్శనమని చెప్పబడియుండును, అది ఏమైయున్నది నేను ఏ మాత్రము ఎరుగను. అయినను "నేను వారితో మాట్లాడవలెనని కనిపెట్టుటకు!" తలంచితిని. మంచిది. మరియు ఆ భవనములోనున్న ఆత్మ అది నిజముగా దేవుని ఆత్మవలె అనిపించెను.

అందువలన వారిలో ఒకరితో మాట్లాడి, కొన్ని ప్రశ్నలు వేశాను, అతడు నిజమైన క్రైస్తవుడు. అతడు నిజమైన విశ్వాసి అని చెప్పుటకు ఏ సందేహము లేదు. మరొక వ్యక్తితో నేను మాట్లాడినప్పుడు, నేను ఎప్పుడైన ఒక వేషధారిని కలిసికొన్నాననిన, వారిలో ఇతడు ఒకడైయున్నాడు. అతడు వాస్తవముగా రాగి రంగులో తల వెంట్రుకలు కలిగిన స్త్రీని భార్యగా కలిగియుండెను, మరియు అతనికి ఇద్దరు పిల్లలుండిరి, వారు నల్లని వెంట్రుకల స్త్రీ నుండి కలిగిన వారు. నేను అనుకొన్నాను, "అప్పుడు ఇదేమిటి? ఇచ్చట నేను గంధరగోళములో పడ్డాను. నేను మూల సిద్ధాంతవాదిని; అది వాక్యప్రకారము ఉండవలెను, లేనియెడల అది సరి కాదు. ఇచ్చట నేను ఎరిగినంత వరకు ఒకడు నిజముగ ఆత్మను కలిగియున్నాడు, మరొకడు ఎంతమాత్రము సరిగా లేడు, ఆత్మ వారిద్దరిపైకి వచ్చినది. అది అట్లు ఏ విధముగా జరుగగలదు?" అది నన్ను ఆశ్చర్యమునకు గురుచేసినది.

HEB 6:6-8

 

8రెండు సంవత్సరములకు తర్వాత, నేను ప్రార్థన చేయుచుండినట్టి గుహకు ప్రార్థన చేసికొనుటకు వెళ్లితిని. ఆ గుహ దుమ్ముతో నిండియుండెను, ఒక మధ్యాహ్న సమయమున బయటకు వచ్చి నా యొక్క బైబిలును ఒక మొద్దు మీద నుంచితిని, అప్పుడు ఒక పెద్ద గాలి వీచగా - హెబ్రీ 6వ అధ్యాయము తెరచునట్లు చేసినది. అంత్యదినములలో మనము సత్యము నుండి తొలగిపోయినయెడల, ఏమి జరుగబోవునో, అది అచ్చట వ్రాయబడియున్నది. "తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహటముగా ఆయనను అవమాన పరచుచున్నారు. గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా, భూమి తనమీద తరచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలును గచ్ఛ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందినదగును. తుదకది కాల్చివేయబడును. అయితే, గోధుమలు ప్రత్యేకముగా కూర్చబడును." నేను అప్పుడు, "గాలి వీచి దానిని తెరచినది," అని తలంచి మరల బైబిలును అచ్చట ఉంచితిని. మరల గాలి వీచి అదే భాగము తెరువబడినది. ఈ విధముగా ముమ్మారు కలిగెను. "మంచిది, ఇప్పుడు ఇది ఒక వింతైన విషయమై యున్నదని," నేను తలంచితిని.

అప్పుడు అచ్చట నిలువబడి - "ప్రభువా, నీవు ఎందుకు ఈ భాగము చదువుటకు బైబిలు తెరచితివి," అని నేను ఆలోచించుచుంటిని, "ముండ్ల పొదలు, గుచ్చ తీగెలు విసర్జింపబడి తుదకది కాల్చివేయబడునను," వాక్యమును గమనించినప్పుడు, "అది ఎందుకు నీవు నా ముందు తెరచి పెట్టితివి?" అని నేను తలంచితిని. దానిని నేను దీర్ఘముగా తిలకించుచుండగా…

MATT 7:16,20•

MATT 24:24•

MARK 13:22

 

9ఇప్పుడు, ఎలాంటి శ్రమ లేకుండనే నిజ దర్శనము వచ్చును. దేవుడు సరిగ్గా ఆ విధముగా చేయును. చూచారా? నేను చూడగా, భూమి నా యెదుట గుండ్రముగా తిరుగుటను మరియు అది గుండ్రని బిళ్లవలే నగుటను చూచితిని. తెల్లని వస్త్రములు ధరించిన ఒక మనుష్యుడు నలుదిక్కులకు వెళ్లి గోధుమలు విత్తుచుండెను. అతడు భూమి యొక్క వర్తుల భాగమునకు వెళ్లిన పిమ్మట; ఒక భయకరంముగా కనబడు ఒక మనుష్యుడు, నల్లని దుస్తులను ధరించినవాడై పనికిరాని (కలుపుగా పెరుగు) విత్తనములు ఆ గోధుమలు చల్లిన స్థలములోనే చల్లెను. అవి రెండును జతగా కూడుకున్నది. ఆ విధముగా అవి రెండును విత్తబడినపుడు దాహము కలిగియున్నవి, ఏలయనగా వాటికి వర్షము అవసరమైయున్నది. మరియు అవి రెండును తలలువంచి - "ప్రభువా, వర్షము పంపుము, వర్షము పంపుమని" ప్రార్థించునట్లుగా కనబడుచున్న విధానముగా నుండెను. అప్పుడు గొప్ప మేఘములు వచ్చి, వర్షము వాటి రెంటి పైన కురిసెను. ఆ విధముగా సంభవించినప్పుడు గోధుమగింజ నుండి అంకరము పైకివచ్చి - "ప్రభువునకు స్తోత్రములు, ప్రభువునకు స్తోతములు!" చెప్పినట్లుగా చూడగలము, అదే రీతిగా ప్రక్కనున్న కలుపును మొలిపించు గింజనుండి మొలక బయటకు వచ్చి, అదియు "ప్రభువునకు స్తోత్రములు! ప్రభువునకు స్తోత్రములు!" అని చెప్పుచుండినట్లుగా కనిపించును.

మరియు అటుపిమ్మట ఆ దర్శనమునకు అంతరాయము కలిగెను. నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురియును. అదే రీతిగా, అరాధన సభయందు ఆత్మ కుమ్మరింపబడును, అప్పుడు అందున్న ప్రతివారును: వేషధారులేమి, క్రైస్తవులేని ఎల్లరు కూడి ఉల్లసించెదరు. వాస్తవముగా అది సరియే. అయితే, అవి ఏమైయున్నవి? వాటి ఫలముల వలన అవి తెలియబడును. చూచారా? వాటిని తెలిసికొను మార్గము అది మాత్రమే.

ఇప్పుడు దానిని గమనించి చూడుము, ఈ అడవి ధాన్యము లేదా అడవి గోధుమలు మనము ఆహారమునకు ఉపయోగించు అసలైన గోధుమల మాదిరిగా కనబడి, ఏర్పరచబడినవారిని మోసపరచునంత దగ్గరగా నుండును. ఇప్పుడు మనము జీవించుచున్న సమయమే వాటిని గూర్చి బోధించుటకు మరియు సంభాషించుటకు సరియైన కాలమని నేను తలంచుచున్నాను.

MATT 13:37-39,41

 

10గమనించండి - 41వ వచనములో ఆ రెండును బహు సమీపముగా నున్నట్లు చూడగలము, కడవరి కాలమువరకు ఇవి రెండును ఆయన వేరుచేయకుండునంత వరకు ఒకే మాదిరిగా నుండును… వాటిని వేరుపరచుటకు ఫలాని సంఘము పైన అనగా మెథడిస్ట్, లేదా బాప్టిస్టు, లేదా పెంతికోస్తు సంఘములపై ఆయన ఆధారపడడు. "వాటిని ప్రత్యేకించుటకై ఆయన తన దూతలను పంపుదునని," ఆయన చెప్పెను. ఈ ప్రత్యేకతను జరిగించుటకై ఒక దూత వచ్చుచున్నది, మంచి చెడుగులను వేరుపరచునది ప్రభువు దూత తప్ప మరెవరును దానిని చేయలేరు. ఆయన ఒక్కడు మాత్రమే ఏది సరియైనది, ఏది సరికానిదైనది తెలియజేయ బోవుచున్నాడు. కడవరి కాలములో తన దూతలను పంపుదునని దేవుడు చెప్పెను. ఇప్పటివరకు పంపబడిన దూతలు కాదు కాని, కడవరి కాలములో పంపబడు దూత వాటిని వేరుచేయుటకు కూర్చును. ఇదే వచ్చుచున్న కోత సమయము అని మనమెరుగుదుము. ఇప్పుడు, వాస్తవముగా దూత అని చెప్పబడిన దానికి వర్తమానికుడు అని అర్థము. మరియు సంఘ కాలముల గుండా, ఏడు సంఘములకు ఏడుగురు దూతలుండుటను మనము చూచుచున్నాము.

గమనించండి, విత్తువాడెవరో, విత్తనము ఏమిటో కూడ ఆయన చెప్పెను. మొదటిగా, విత్తువాడు ఆయన దేవుని కుమారుడైయుండెను, ఆయన విత్తనము విత్తుచు వెళ్ళెను. ఆయన వెనుకనే శత్రువు ఒకడు వచ్చెను. వాడు సాతానుడు, వాడు మంచి విత్తనము విత్తిన వెనుక భేదమైన విత్తనము విత్తెను. ఇప్పుడు, స్నేహితులారా, లోకము మనము కలిగినప్పటి నుండి ప్రతి యుగములోను ఆ విధముగానే జరుగుచు వచ్చెను. ఖచ్చితముగా. ప్రారంభము నుండి ఆ రీతిగానే జరుగుచు వచ్చుచున్నది.

LUKE 8:11

 

11ఇప్పుడు ఆయన చెప్పినదేమనగా - "దేవుని భీజము, దేవుని వాక్యమైయున్నది." యేసు ఒకచోట, "దేవుని వాక్యమే విత్తనమని," చెప్పెను. మరియు ప్రతి విత్తనము తమ జాతికి చెందిన దానిని మొలిపించును. ఇప్పుడు క్రైస్తవులు దేవుని రాజ్యసంబంధికులైన, దేవుని పిల్లలైనయెడల, వారు దేవుని భీజమైయున్నారు. వారు అలాగైనప్పుడు వారు దేవుని వాక్యమైయున్నారు, అనగా ఆనాడు వారు జీవించుచున్న కాలములో ప్రత్యక్షపరచబడిన ఆ కాలము కొరకు వాగ్దానము చేయబడిన దేవుని వాక్యమైయున్నారు. మరియు ప్రతి యుగమునందు దాని విత్తనమును, దాని కాలమును దాని వాగ్దానములను కలిగియుండునట్లు సృష్టి ప్రారంభముననే దేవుడు తన వాక్యమును ఇచ్చెను.

ఇప్పుడు, మనము నోవహు కాలము యొక్క ఘటనకు వచ్చినప్పుడు, నోవహు ఆ కాలమునకు ఇవ్వబడిన దేవుని వాక్యమైన దేవుని సంతానమై యుండెను.

మోషే వచ్చినప్పుడు నోవహు కాలమునకు గల వర్తమానముతో అతడు రాలేడు, ఆ విధముగా వచ్చినచో అది పని చేయదు, ఏలయనగా అతడు తన కాలమునకు దేవుని వాక్య భీజమైయుండెను.

యేసు వచ్చినప్పుడు, ఆయన నోవహు లేక మోషే కాలముల యొక్క వర్తమానములతో రానేరడు; ఆయన - కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయన మెస్సియాయై యుండునని చెప్పబడిన, ఆయన కాలమునకు గల దేవుని వాక్యమైయుండెను.

MATT 13:38,39

 

12ఇప్పుడు, మనమందరము లూథర్ కాలమందు వెస్లీ యొక్క కాలమందు (మేథోడిస్టు కాలమందు), అన్ని కాలముల తరబడి పెంతెకోస్తు కాలమందును జీవించియుంటిమి మరియు ప్రతి కాలమునకు వాగ్దాన వాక్యము ఇవ్వబడియుండెను. వారు "పరలోక రాజ్యపు పిల్లలు," అని యేసు ఇచ్చట చెప్పినట్లుగా, తమ కాలమునకు వాగ్దాన వాక్యమును ప్రత్యక్షపరచిన ప్రజలు ఆ కాలమునకు భీజమైవున్నారు. అది సరియే. వారు ఆ కాలములకు సంబంధించిన, ఆయన పిల్లల ద్వారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచుటవలన వారు ఆ నాటి కాలమునకు పరలోక రాజ్యపు (సంతానము) భీజము అని బయలుపరచబడిరి.

గమనించుడి, విరోధమును లేదా భేదమైన విత్తనములగు గురుగులను చల్లి పోయినవాడు శత్రువగు సాతానుడు, వాడే ఈ భయంకర కార్యము చేసిన అపరాధియై యున్నాడు. సాతానుడు ఆదినుండియే దేవుడు మానవ ఉత్పత్తి భూమిపై ప్రధముగా కలుగజేసినప్పటి నుండియే వానియొక్క భీజమును చల్లెను, అయితే ఆదాము మంచి మరియు చెడు తెలివినిచ్చే సత్యము అక్కడ ఉండెనని ఎరిగియుండినను ఆయన దాని యొద్దకు వచ్చియుండలేదు.

PS 32:2•

JOHN 1:14•

HEB 10:2

 

13అయితే, దేవుడు తన పిల్లల (రక్షణ) భద్రతకై తన వాక్యమునిచ్చెనని మనము చూడగలము. దేవుని వాక్యము తప్ప మరో భద్రత మనకు లేదు. ఆదియే మనకు సంరక్షణ. బాంబులేగాని, ఆశ్రయ స్థానములేగాని, దాగుకొను చోటులేగాని, ఆరిజోనాలేగాని, కాలిఫోర్నియాలేగాని మరేవేగాని మనలను రక్షింపనేరవు; మనలను రక్షించుటకు కేవలము ఒకటే గలదు, అది దేవుని వాక్యమే. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను, ఆయన క్రీస్తుయేసైయున్నాడు, ఆయనే మన రక్షణయైయున్నాడు. మనము ఆయనయందు ఉండుటవలననే, మనము సురక్షితముగా నున్నాము.

నిజ విశ్వాసి మీద పాపము కూడ ఆరోపించబడదు. దానిని నీ వెరుగుదువా? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, అతడు పాపము చేయజాలడు. చూచారా? అది అతనిని దోషి అని ఆరోపించనేరదు. ఎందుకు, "యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ధన్యుడు," అని దావీదు చెప్పెను. నీవు క్రీస్తులో నున్నప్పుడు పాపము చేయు కోరికను నీవు కలిగియుండవు. "పాపమునకు పరిహారము ఒకసారి పొందిన ఒక ఆరాధకునికి పాపము చేయుటకు మనస్సు కలిగియుండదు," నీవు దానిని ఆశించవు. లోకానికి నీవు పాపిగా కనబడవచ్చును; కాని దేవుని దృష్టిలో, ఆ విధముగా లేవు, ఎందుకనా నీవు క్రీస్తునందున్నావు. పాపరహితునియందు నీవు ఉండినప్పుడు ఏ విధముగా నీవు ఒక పాపిగనుందువు, మరియు దేవుడు ఆయనను మాత్రమే, అనగా, ఎవరిలో నీవు ఉన్నావో ఆయననే చూచును.

HEB 13:8

 

14ఇప్పుడు ఇది కోతకాలము. ఆరంభములో దేవుడు తన విత్తనము భూమి మీద విత్తినప్పుడు ఆయన కుటుంబము, ఆయన పిల్లలు తమ హృదయములో ఆయన వాక్యము భద్రపరచుకొని, దాని ప్రకారము ప్రవర్తించినప్పుడు, అది వారి సంరక్షణగా నుండుటకు వారికిచ్చెను, కావున ఆ వాక్యమును అనుసరించి నడువుము! ఇక్కడకు శత్రువు వచ్చి దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా వుండు భేదమైన విత్తనము చల్లి వారికి కంచెగానున్న దానిని విరుగగొట్టెను. ఆరంభమందు ఆలాగు భేదమైన దానిని జరిగించినయెడల, అది నేడును నుండును… ఏదైనను దేవుని వాక్యమునకు కలిపిన అది భేదమైన విత్తనమే! అది ఎక్కడ నుండి వచ్చినను నేను దాని లక్ష్యపెట్టను. అది ఒక స్థాపన సంస్థ నుండి వచ్చినను, సైనిక శక్తి నుండి వచ్చినను, రాజకీయ శక్తిలో వచ్చినను, ఎక్కడ నుండి వచ్చినా, అది దేవుని వాక్యమునకు విరోధముగా నున్నది, గనుక అది భేదమైన విత్తనమే!

సువార్తికుడనని చెప్పుకొనుచున్న ఒక మనుష్యుడు నిలువబడి అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని చెప్పుచుండినచో, అది బేధమైన విత్తనమే. ఒక మనుష్యుడు నిలువబడి తానొక పరిచారకుడు అనియు, ఎచ్చటనో గల ఒక సంఘమునకు పాస్టరు అని చెప్పుచు, యేసుక్రీస్తు ప్రతియొక్క విషయములోను (మాంస శరీరము తప్పు) ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన నిన్న, నేడు, మరియు యుగయుగములు ఒకే రీతిగా ఉన్నాడని నమ్మనిచో, అది భేదమైన విత్తనమే. అద్భుతములు మరియు అపొస్తలుల కాలము గతించిపోయెనని ఒకడు చెప్పినచో, అది భేదమైన విత్తనమే. దైవిక స్వస్థత అనునది లేదని వారు చెప్పినచో, అది భేదమైన విత్తనమే. ప్రపంచము దానితో విస్తారముగా నిండిపోయినది. అది విస్తరించి గోధుమలను అణిచివేస్తుంది.

MATT 13:39

 

15ఆదికాండము 1వ అధ్యాయములో మొట్టమొదట ఈ భేదమైనది విత్తిననానికి "సాతానుడు" అని పిలువబడుట మనమెరుగుదుము. మత్తయి 13వ అధ్యాయములో యేసు కూడ ఆయన వాక్యమునకు విరోధించువానికి అపవాది (సాతాను) అను పేరు పెట్టెను. ఈ 1956లో వ్రాయబడిన దేవుని వాక్యమునకు విరోధించునది, లేదా స్వంత అనువాదము చేయబడినట్టిది భేదమైన విత్తనమే. దేవుడు దానిని ఘనపరచడు. అది ఆయన చేయడు. అది కలిసియుండలేదు. అది ఖచ్చితముగా కలువదు. అది ఆవగింజను పోలి దేనితోను మిశ్రమము కానేరదు, దానిని నీవు సంకరము చేయజాలవు, అది అసలైనది గానే ఉండును. భేదమైన విత్తనమే!

16ఇప్పుడు మనము జాగ్రత్తగా చూచిన, దేవుడు ఏదెను తోటలో తన విత్తనము విత్తినప్పుడు అది హేబెలును ఉత్పత్తి చేసినది. కాని సాతానుడు విరోధమైన విత్తనము చల్లినప్పుడు, కయీనును అది పుట్టించినది. ఒకటి నీతిమంతునికి జన్మమిచ్చినది. మరొకటి అనీతిమంతుని పుట్టించినది. ఏలయనగా హవ్వ దేవుని వాక్యమునకు విరోధమైన మాటను విని లోబడినందున, పాపము ప్రవేశించి అప్పటినుండి ఆ పాపము బంతివలె పొర్లుచు ఈ రోజు వరకును వచ్చుచున్నది. మరియు మనము వాటిని వేరుచేయలేము, దూతలు వచ్చి వాటిని వేరుపరచును, అప్పుడు దేవుడు తన పిల్లలను ఆయన రాజ్యమునకు తీసికొనిపోవును, మరియు గురుగులు కాల్చబడును. ఈ రెండు ద్రాక్షాతీగలను జాగ్రత్తగా గమనించుము.

ఈ అంశమును గూర్చి మాట్లాడుటకు అధిక సమయముండిన బాగుండును, కాని కొద్ది నిముషములలో రోగుల కొరకు ప్రార్ధించుటకు వెళ్ళుదము, కావున కొన్ని ముఖ్య విషయములను సమీపించెదము.

MATT 13:30•

REV 3:14

 

17గమనించుడి, వారి భీజములు కలిసి మెలసి ఒకే రీతిగా దేవుడు ఈ రాత్రి మత్తాయి 13వ అధ్యాయములో చెప్పినట్లుగా మన శీర్షికను బట్టి, "రెంటిని కలిపి యెదుగనీయ్యుడి," అని చెప్పిన ప్రకారము, సరిగా అవి యెదుగుచుండెను. కయీను నోదు దేశమునకు వెళ్లి తనకొక భార్యను కనుగొని వివాహమాడెను, హేబేలు చంపబడెను, అతని స్థానములో దేవుడు షేతును పుట్టించెను. మంచి మరియు చెడుల తరములు కదలుట ప్రారంభమైనది. ఇప్పుడు గమనించుము - వారు కాలప్రవాహంలో ఇరువురు కలిసే ఎదిగారు. ఆ దుర్బీజులు ఎంత దుష్టులయ్యారో చూడండి, తుదకు దేవుడు వారిని నాశనము చేయవలసి వచ్చెను.

అయితే చివరకు భేదమైన విత్తనము, దేవుని విత్తనము, ఈ రెండు భీజములు వాటి వాటి నిజస్వరూపమును పొందవలసిన సమయము వచ్చెను. గనుక భేదమైన విత్తనము యూదా ఇస్కరియోతుగాను, దేవుని విత్తనము యేసుక్రీస్తుగాను నున్నట్లు ఆ విత్తనములు వాటి తలలు పైకెత్తబడినట్లు అవి పైకెత్తినవి. అయితే యేసు దేవుని భీజమైయుండెను, ఆయన దేవుని యొక్క సృష్టి ప్రారంభమైయుండెను. అందువలన ఆయన, మరెవరో కాదు కాని దేవుడైయుండెను. మరియు యూదా ఇస్కరియోతు నాశన పుత్రుడుగా జన్మించెను. అతడు నరకము నుండి వచ్చెను, తిరిగి అతడు నరకానికే పోయ్యాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైయుండెను, ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయుండెను. యూదా ఇస్కరియోతు భేదమైన భీజమగునట్టి కారణము వలన, అతడు అపవాది సంతానమై, మోసము చేయుటకు లోకములోనికి వచ్చెను. ఆదిలోనున్న తన తండ్రియైన కయిను వలెనే అతడుండెను.

18యూదా ఆనాడు పేరునకు మాత్రము సంఘమందుండెను. వాస్తవముగా అతడు యధార్థపరుడు కాడు, నిజముగా విశ్వాసమే అతడు కలిగియుండలేదు (అతడు విశ్వాసము కలిగియుండినట్లయితే, యేసును ఎన్నడు అప్పగించియుండెడివాడు కాడు). అయితే, మీరు గమనించండి, అతడు ఆ భేదమైన విత్తనము చల్లినట్లుగా మనము చూచుచున్నాము. అతడు లోకముతోను, డబ్బుతో స్నేహం చేస్తూనే యేసుతో కూడ స్నేహం చేయగోరెను, గాని దానిని చేయుటకు సమయము మించిపోయెను. కడవరి సమయము వచ్చినది, అతడు ఆ దుష్టకార్యము చేసినప్పుడు ముందుకు సాగుటయా, వెనుకకు మళ్లుటయా అనువాటి మధ్యలి సరిహద్దు గీతను దాటినవాడై, వెనుకకు రాలేక అతడు మోసగాడిగానే ఉండిపోయెను. అతడు భేదమైన విత్తనము చల్లెను. అతడు ఆనాటి గొప్ప సంస్థల కటాక్షము, పరిసయ్యుల, సద్దూకయుల, మన్నను పొందగోరెను. మరియు అతడు తనకొరకు ధనమును సంపాదించుకొని, ప్రజలలో పేరు సంపాదించుకొన తలంచెను. ఈ కారణమున అనేకులు ఈ భేదమైన భీజములోనికి ప్రవేశించి, మనుష్యుల దయను పొందగోరుచున్నారు! మనుష్యల దయ కాదు గాని, దేవుని అనుగ్రహము పొందుదము. అయితే యూదాయందు ఈ భేదమైనది మొలచి, రేకెత్తినప్పుడు ఆ విధముగానే చేసెను.

JOHN 1:1,14•

REV 22:18,19

 

19యేసే వాక్యమని మనమెరుగుదుము. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయములో చెప్పినట్లుగా - "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద నుండెను, వాక్యము దేవుడైయుండెను… ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను." కావున వాక్యము విత్తనమై ఉన్నది, ఆ విత్తనము అప్పుడు శరీరధారియై మన మధ్య నివసించెను.

యూదా శత్రువైయుండిన భేదమైన విత్తనమైయుండెను, అతడును యూదా ఇస్కరియోతు అనగా, "వ్యక్తిగా" శరీరమందు మన మధ్య నివసించెను. అతడు ఎన్నడును యదార్థముగ నిజవిశ్వాసమును కలిగియుండలేదు. అతడు ఏ విశ్వాసమును కలిగియుండేనో, అదే నిజ విశ్వాసమని అతడు తలంచియుండెను. నిజ విశ్వాసము కలిగియుండక మరియు నటన-విశ్వాసమును కలిగియుండుటను మనము చూడగలము.

మరియు దేవునియందలి నిజ విశ్వాసము, దేవునియందు నమ్మికయుంచును, మరియు దేవుడు వాక్యమైయున్నాడు, దానితో ఏదియు ఎన్నడును చేర్చదు. మనము ఏదైన ఒక మాట చేర్చినా, లేదా తీసివేసినా - జీవగ్రంథములో మనకు పాలులేకుండ తీసివేయబడునని బైబిలునందలి చివరి ముగింపు అధ్యాయమగు ప్రకటన 22:18లో చెప్పబడినది.

MATT 4:4•

LUKE 4:4•

REV 22:18,19

 

20బైబిలు నందు మొదటి గ్రంథములోని ఆయన ఒక్క వాక్యమును కూడ మీరకూడదని దేవుడు వారితో ప్రారంభమందే చెప్పెను. ప్రతి వాక్యమును వారు గైకొనవలసియున్నది. ఆ వాక్యమువలన వారు జీవింపవలెను. యేసు, బైబిలు యొక్క మధ్యకాలములో వచ్చి తన కాలములోని వారితో - "మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించునని చెప్పెను." మరియు ప్రకటన గ్రంథములో చెప్పబడిన ప్రకారము, ముగింపు కాలములో చివరి అధ్యాయములో చెప్పబడిన ప్రకారము ఆ ప్రవచన వాక్యమునకు ఎవరైన ఏదైన కలిపినా, లేదా తీసివేసినా, జీవగ్రంథములో వానికి పాలు ఉండదని ప్రవచింపబడెను.

కాబట్టి అది కల్తీ లేనిది, అసలైన దేవుని వాక్యమైయున్నది! వారు దేవుని కుమారులును, దేవుని కుమార్తెలునైయున్నారు, వీరు మనుష్యుని ఇచ్చనుబట్టి, లేదా కరములు కలుపుట వలన, లేదా ఏదో విధమైన బాప్తీస్మము వలన పుట్టినవారు కారు, గాని దేవుని ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా మరియు ఆ వాక్యము స్వయముగా వారి ద్వారా ప్రత్యక్షపరచబడునట్లు జన్మించిరి. అదే దేవుని యొక్క అసలైన సంతానమైయున్నారు!

21శత్రువు సంఘములో చేరును మరియు అతడు ఆచార పద్దతిలో నిష్టగాను సాంప్రదాయక పూర్వకమైనవానిగాను, సిద్ధాంతపరమైన వాడుగాను నుండును. అయితే అది కాదు… అది భేదమైనది, ఏదైన నిజమైన దేవుని వాక్య సత్యమును వాదించుటకు జోక్యము కలిగియుండునో, అది శత్రువు యొక్క భేదమైన భీజం.

మరియు దానిని మనము ఏలాగు తెలిసికొనగలము? "నీవు దాని అర్థము చెప్పు హక్కు కలిగియున్నావా?" లేదయ్యా! ఏ మనుష్యునికి దేవుని వాక్యమును అనువదించుటకు హక్కులేదు. ఆయనకు ఆయనే స్వంత అనువాదకుడు. దానిని ఆయన వాగ్దానము చేసెను, అప్పుడు ఆయన దానిని చేయును, అదియే దాని అనువాదమైయుండును. ఆయన వాగ్దానం చేసినప్పుడు, ఆయన దానిని నేరవేర్చుటనే దాని అనువాదమైయున్నది. దేవుని వాక్యమునకు, ఏదైన విరుద్ధముగా నుండినయెడల నిశ్చయముగా అది భేదమైన భీజమే!

ఇప్పుడు, యూదాకు నిజమైన విశ్వాసము లేదని నేను చెప్పియుంటిని. అతనికి నటించు-విశ్వాసము కలిగియుండెను. ఆయన దేవుని కుమారుడని ఆలోచన పూర్వకముగా విశ్వసించెను గాని, ఆయనే దేవుని కుమారుడైయుండెనని అతడు ఎరిగియుండలేదు. అతడు ఆ విధముగా చేసియుండువాడు కాడు. మరియు ఏ మనుష్యుడు దేవుని సత్యవాక్యమునకు భిన్నముగా నున్నదానికి రాజీపడినయెడల, అతడు నటించు-విశ్వాసముగలవాడై యుండును. నిజమైన దైవ సేవకుడు వాక్యమునకు బద్దుడైయుండును.

ACTS 2:37-39•

HEB 13:8

 

22కొన్ని రాత్రులకు ముందు, అరిజోనా పట్టణమందలి గొప్పగా ప్రసిద్ధి చెందిన స్కూలులో నుండి వచ్చిన ఒక సేవకుడు నా యొద్దకు వచ్చి, నాతో చెప్పిన దేమనగా - "సమయమునకు అవకాశమిస్తే ఒక విషయములో నిన్ను సరిదిద్దాలనుకుంటున్నాను," అని చెప్పెను.

అప్పుడు నేను అతనితో - "ఇదే మంచి అవకాశమని నేను తలంచుచున్నాను. ఇచ్చటికి రమ్ము," అతనితో చెప్పాను. .

మరియు అప్పుడు అతడు నా యొద్దకు వచ్చి, "మిస్టర్, బ్రెన్హాం, నీవు ప్రయత్నించుచున్నావు… నీవు యదార్థవంతుడవు, నమ్మకమైనవాడవని నేను నమ్ముచున్నాను, అయితే నీవు ఈ లోకానికి అపొస్తలుల సిద్దాంతమును ప్రవేశపెట్టుటకు ప్రయత్నించుచున్నావు." మరియు అతడు - "అపొస్తులలతోనే అపొస్తలుల కాలము ముగిసిపోయింది," అని అన్నాడు.

అందుకు నేను - "సహోదరుడా మొదటిగా నిన్ను ఒక విషయము అడుగవలెనని ఇష్టపడుచున్నదేమనగా - దేవుని ప్రతి వాక్యము దైవాత్మ ప్రేరణవలననైనదని నీవు నమ్ముచున్నావా?

అందుకతడు, - "తప్పకుండా నేను దానిని నమ్ముదును," అని చెప్పాడు.

అప్పుడు అతనితో - "వాక్యములో ఎచ్చట అపొస్తలుల కాలము ముగిసిపోయినదని చెప్పబడిన దానిని నాకు చూపించమని," అడిగాను. ఇప్పుడు, "నీవు దానిని చూపించినయెడల నేనును నమ్ముతాను," అని చెప్పితిని. మరియు అతనితో, అపొస్తులుల కార్యములో వ్రాయబడినట్లుగా - "సహోదరులారా, రక్షింపబడుటకు మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తులులను అడుగగా…" పెంతెకోస్తు దినమందు అపొస్తలుల కాలము ప్రవేపెట్టుటకు పరలోక రాజ్యము యొక్క తాళపు చెవిని కలిగియుండిన అపొస్తులుడైన పేతురు - "మీరు మారు మనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్థులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను." ఇప్పుడు, వాక్యము తనకుతాను ఎట్లు వ్యతిరేకించగలదు?

"ఈ రాత్రి నాకు భయంకరముగా శీతలమైనది," అని ఆ మనుష్యుడు చెప్పెను.

"నేను కూడ అదే తలంచుచున్నాను," అని నేను చెప్పితిని. చూచారా?

ఇప్పుడు నీవు నాకు చెప్పుము, దేవుడు ఇప్పుడు కూడ పిలుచుచున్నాడా? దేవుడు ఇప్పుడునూ పిలుచుచునే యుండినయెడల, అపోస్తులుల కాలము ఇంకను నిలచియున్నది. ఖచ్చితముగా! ప్రభువైన దేవుడు ఎందరిని పిలుచునో, ఎప్పుడు పిలుచునో, ఎందరిని ఆయన పిలుచుచుండునో, అది అపోస్తులుల కాలమే, ఏలయనగా యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు యుగయుగములు ఒకే రీతిగానున్నాడు.

MATT 15:9•

MARK 7:7•

JOHN 5:39

 

23ఈనాడు ఈ భేదమైన విత్తనము ప్రతి కాలములోను విత్తబడుచు వచ్చినట్లుగా ఇప్పుడు మనము చూడగలము. పది లేదా పదిహేను నిముషాల్లో దానిని గూర్చి చెప్పుటకు సాధ్యమైనయెడల, అట్లు చేసియుందును కాని మీ వలన కాదు. ప్రతి కాలములోను… మనలో ప్రతివారు బైబిలు చదివారు. మరియు యేసు వచ్చినప్పుడు కూడ భేదమైన విత్తనము, అది విరోధమైనదని ఆయన కనుగొనెను. ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమైయుండెను, ఆయన దేవుని వాక్యమునకు అనువాదమైయుండెను, ఎందుకనగా ఆయన "లేఖనములయందు మీరు నిత్యజీవము కలదని తలంచుచువాటిని పరిశోధించుచున్నారు; అవే నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవి," అని చెప్పెను. అక్కడే మీరున్నారు. ఆయనే వాక్యము యొక్క అనువాదమైయుండెను. మరియు ఈ యుగమందు దేవుని ఆత్మ వలన క్రొత్తగా జన్మించిన దేవుని కుమారులు, కుమార్తెలు వాక్యము యొక్క అనువాదమైయున్నారు. మీరు మనుష్యులెల్లరు చదువు వ్రాయబడిన పత్రికలైయున్నారు. అవును.

గమనించుము, ఆయన చెప్పినదేమనగా - "దైవోపదేశములకు బదులుగా భేదమైనదానిని బోధించుచు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, దేవుని వాక్యమునకు ఎలాంటి సంబంధములేని, భేదమైన మానవ కల్పితమైనవి, సాంప్రదాయక మానవ కల్పితమైన సిద్ధాంతములు దేవుని వాక్యమని బోధించుచు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని వాక్యముతో వాటికి ఎలాంటి సంబంధములేదు."

MATT 24:24•

MARK 13:22

 

24చూడండి, ప్రతి యుగములోను అట్టి పంటలే పండినది, ప్రతి యుగములోను ఆ విధముగా జరిగినది గనుక మన కాలములో అది జరుగదని మన కాలమును గూర్చి సాకు చెప్పలేము. మనమును అదే కలిగియున్నాము, మన ముందు జరిగిపోయిన కాలములన్నింటిని ఏకము చేసినట్లయితే, మన యుగమందు వాటికంటే అధికమైయున్నది, ఏలయనగా ఇది ప్రపంచ చరిత్ర ముగింపై యున్నది. ఈ రోజున భూమిపై నున్నంతగా భేదమైన విత్తనము మరెన్నడు ఇంతకుముందు ఈ భూమి మీద లేదు. ఈ భేదమైనది ఇతర కాలములలో నున్న వారిని సత్యమునుండియు, నిజమైన జీవముగల దేవుని నుండి విగ్రహములవైపు లాగివేసినది. ఈ రోజున, యేసు మత్తయి 24:24 చెప్పినట్లుగా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయు స్థితిలో వున్నది. భేదమైన దాని విషయము మాట్లాడుదము! ఓ, అది మిక్కిలి కుయుక్తియైయున్నది. సాతానుడు ప్రజల మధ్యలోను, అనగా ధర్మశాస్త్రమును, వాక్యమును ఇంచుమించు పరిపూర్ణముగా బోధించు వేదాంతులు, డాక్టర్-ఆఫ్-డివినిటి, అను డిగ్రీలు కలిగినవారి మధ్యను నున్నది. యేసు ఆ విధముగా చెప్పెను. అయినను వారిని సరిగా కనిపెట్టుడి, అది ఎచ్చటనో ఉండును, "మంచిది, ఇప్పుడు, అది దీనిని గూర్చి లేదని…" చెప్పుదురు. ఓ, అవును, అది ఇక్కడ కూడా ఉన్నది, చూడుము, ఏలయనగా అది ఉండునని దేవుడే చెప్పెను.

25అది ఏమి చేసినదో చూడుము. ఈ భేధమైనది నోవహు కాలములో దేవుని కోపము రేపెను. అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపెను, అతడు ప్రజలు మారుమనస్సు పొందునట్లు అగ్నిజ్వాలల వంటిదిగా, గంభీరముగా ప్రకటించెను, భేదమైనది మునిగిపోయెను. అప్పుడే సాతానుడు చేసినదేమి? అతడు వెనుక వచ్చి, హాములో మరల ఆ చెడ్డ విత్తనము చల్లనారంభించెను. అది ఖచ్చితముగా వాస్తవమైనది.

ఆ తరువాత, ఇశ్రాయేలు జనాంగమును అరణ్యములో నుండి బయటకు రప్పించుటకై గొప్ప ప్రవక్తయగు మోషే వచ్చెను. ఏమి జరిగినది? దేవుని గొప్ప ప్రవక్తయైన మోషే సంపూర్ణ సత్యమును, సూచనల వల్ల స్థిరపరచబడిన సత్యమును వారికి తెచ్చెను. అతడు దేవుని కలిసికొనెను. అతడు ఆయనను కలసికొనెనని దేవుడే రుజువు చేసెను. వారు వారి వెనుక జీవితములో కలిగియున్న యాజకుడు, వారి మతములు, వారి ఆచార క్రియలు, వారి హక్కులు ఆదిగా గలవన్నియు ఎట్లు ఆ ప్రజలు కలిగియుండినను, మోషే సూచనల ద్వారా స్థిరపరచబడిన వాక్యము యొక్క అనువాదమువలె నిలబడియుండెను. అది మరచిపోకండి! మోషే దేవుని వాగ్దానము యొక్క అనువాదమైయుండెను. దానిని దేవుడు చేయునని ఆయన చెప్పెను; అతడు దేవుని అనువాదమైయుండెను.

NUM 23:4

 

26ఏమి జరిగినది? సంఘము ఐగుప్తు నుండి బయటకు వచ్చి తమ కాళ్లపై నిలువబడిన కొద్ది దినములలో ఏమి జరిగినది? సాతానుడు వాని భేదమైనదానితో రెండవ కయీనువలె నున్న బిలాము అను వ్యక్తితో పయనించి ఆ జనుల మధ్య ఈ భేదమైన విత్తనాలు చల్లెను. అది వాస్తవమని, మన మెరుగుదుము. ఆ బిలాము యొక్క బోధ ఏమిటనగా: మనమంతా ఒకటే, మనమందరము ఒకే దేవున్ని సేవించుచున్నాము. మూల సిద్ధాంత ప్రకారము అతడు సరియే, ఏలయనగా దేవుడు ఏ విధముగా బలి అర్పణను చేసెనో, ఆ రీతిగానే అతడును బలి అర్పణను అర్పించెను; ఏడు పొట్టేళ్ళు, ఏడు ఎద్దులు, ఏడు బలి పీఠముల మీద అర్పించి, అదే దేవునికి మోషే అరణ్యములో ప్రార్థన చేసినట్లుగానే, అతడు చేసెను. ఏ బేధము లేకుండ సరిగా మేషేను అనుకరించెను. అయితే, అవి భేదమును కలిగియున్నవి! రాబోవు దినములలో ఏమి సంభవించునో వాటి ఛాయయై యున్నది. మరొకసారి కయీను బిలాము అను వ్యక్తిలో ప్రత్యక్షమాయెను, మరియు మోషే శరీరమందు దేవుడు ప్రత్యక్షతపరచబడి, తాను వాగ్దానము చేసిన వాక్యము యొక్క అర్ధమును ఒక మానవ వ్యక్తి మూలముగా నెరవేర్చి, తన్నుతాను బయలుపరచుకొనెను. మరియు భేదమైన విత్తనమును మొలకెత్తినది.

అదే రీతిగా చేయుటకు యూదా సమయములోను, వాని భేదమైన దానితో ప్రత్యక్షపరచుకొనెను.

NUM 13:30,31•

JOHN 6:49

 

27"మనమంతా ఒకటే ఒక్క దేవున్నే మనము ఆరాధించుచున్నాము, మన మందరము ఒకే సంఘమునకు చెందినవారము, మనమంతా ఒకే జనులము" అను చెప్పు దానిని ప్రజలు నమ్మిరి, అది పాపము అని జ్ఞాపక ముంచుకొనుము - ఇశ్రాయేలీయులు చేసిన ఆ పాపము ఎన్నడు క్షమింపబడలేదు. అందుకే వారందరు చనిపోయ్యారు, అని యేసు స్వయముగా చెప్పెను.

ముగ్గురు తప్ప తక్కిన వారందరు నశించిరి, వారెవరనగా వాగ్దానమును విశ్వసించి, దృఢముగా దానిపై నిలువబడిన వారు. బలహీనులైన వారు వచ్చి - "ఆ దేశమును మనము స్వాధీనపరచుకొనలేము, అది మనకు అసాధ్యమైన కార్యము మరియు ఆ విధంగా తెలుపగా; కాలేబు, మరియు యెహోషువా ప్రజలను నిమ్మళపరచి, "మనము దానిని సులభముగా స్వాధీనపరచుకొనగలము, ఏలయనగా దాని విషయమై దేవుడు మనకు వాగ్దానము చేసియున్నాడు అని చెప్పిరి. ప్రతిపక్షమువారు ఎంతటివారైనను నేను వారిని లక్ష్యపెట్టను, కారణము మనపట్ల దేవుని వాగ్దానమున్నది," అని చెప్పెను.

మేము ఇప్పుడును దైవిక స్వస్థతను గూర్చియు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి బోధించెదము, మరియు ఈ లోకవిషయాల నుండి వేరుపరచు దేవుని శక్తి ఇంకను ఉన్నది. ఆలాగు దేవుడు చెప్పెను! అపోస్తులుల యుగము ఇంకను గడిచిపోలేదు, అది సమాప్తము కాలేదు, అది కొనసాగిపోవుచున్నది.

కాబట్టి, భేదమైనదాని విత్తు ఆ పురాతన వ్యక్తిని మనము చూచుచున్నాము ఆ పాపమునకు ఎన్నడు క్షమాపణలేదని జ్ఞప్తియుంచుకొనుడి. ఇప్పుడు, సహోదరుడా, అప్పుడా పాపానికి క్షమాపణ లేనియెడల, అన్ని కాలములకు సంబంధించిన నిజ విత్తనము దానితో కలిసి వచ్చుచుండగా ఈనాడు నిజ విత్తన విషయమేమగును?

NUM 22:28

 

28బిలాము చేసిన ఘనకార్యమును గమనించుము అది ముందుకు సాగుచువచ్చి, అనంతరము యూదా ఇస్కరియోతులో యేసుతో కూడ కలిసివచ్చినప్పుడు ముగిసినది. అది ఏమిటి? యూదా మరియు యేసును ఖచ్చితముగా కయీను మరియు హేబేలు రూపమునకు సమానముగా నుండిరి. ఎట్లనగా కయీను మత నిష్టత కలిగినట్లుగా యూదా కూడ మత నిష్టత గలవాడు. కయీను బలిపీఠము కట్టెను, అతడు అర్పణను అర్పించెను, అతడు దేవునిని ఆరాధించెను, మరొక వ్యక్తి ఎంత యదార్థముగా ఉండెనో, అతనూ వాటియందు అంతే ఉండెను. వాక్యమేమై యుండెనను ప్రత్యక్షతను అతడు కలిగియుండలేదు. ఆదాము మరియు హవ్వ ఆపిల్ లేదా మరికొన్ని ఏవో ఫలములు తీనియుండిరని అతడు తలంచెను. హేబేలు, ప్రత్యక్షతవలన అది సరికాదని గుర్తించెను; రక్తము వారిని వెలుపలికి రప్పించినది అని ఎరిగి ఒక గొర్రెపిల్లను అర్పి౦చెను. అతని అర్పణ సరియైనదని దేవుడు సాక్ష్యమిచ్చెను. అప్పుడు అతడు ద్వేషముగలవాడై తన తమ్ముని చంపబూనెను. ఏ బలిపీఠము మీదనైతే గొర్రెపిల్ల వధింపబడెనో, ఆ బలిపీఠము మీదనే హేబేలు కూడ చంపబడెను. ఏ విధముగా కయీను హేబేలును చంపేనో, అదే విధముగా యూదా ఇస్కరియోతు దేవుని బలిపీఠము మీద విశ్వాస ఘాతకుడై యేసుక్రీస్తును అప్పగించి, ఆయనను చంపెను, ఏలయనగా కయీను భేదమైన విత్తనము.

అటువలె బిలాము కూడ అద్దెకు తేబడిన లేదా జీతగాడైన ప్రవక్త, మనకంటే అధికముగ ఎరిగిన ఒక మనిషి. దేవుడు సూచక అద్భుత కార్యముల ద్వారా అతనిని హెచ్చరించెను మరియు ఒక గాడిదతో కూడ అన్యభాషలో మాట్లాడించినను అతనిలో ఏ మార్పు కలుగలేదు, అతడు చేయుచుండిన దానినే చేయుచుండెను. భేదమైన విత్తనము చల్లుటకే అతడు పుట్టెను.

REV 3:16

 

29"ఈ యుగములో భేదమైన విత్తనము ఇంతకు ముందు ఎన్నడు లేనంత విస్తారముగా నిండిపోవునని" యేసు ముందుగానే చెప్పెను, ఈ లవొదికియా సంఘ కాలము నులివెచ్చని స్థితిగలదై, ఆయనను వారు సంఘము బయటకు గెంటివేసియున్నారు. అది భేదమైన విత్తనము కాకపోతే, మరెట్లు అది జరుగ గలదు! వాస్తవముగ అదే. అది ఈ కాలమందే అంతమొందును.

కల్వారిపై మరల కయీను మరియు హేబేలు యుండిరి.

ఇప్పుడు గమనించండి, ఎంత త్వరగా యేసు పరలోకమునకు వెళ్ళెను, అంత త్వరగా పరిశుద్ధాత్మను పంపెను. గతరాత్రి నేను మీతో చెప్పిన ప్రకారము, వాక్యమునకు జీవము కలుగజేయు పరిశుద్ధాత్మ ఆ విత్తనమైయుండెను. అది ఒక్కటి మాత్రమే వాక్యమునకు జీవింప చేయును. జీవమిచ్చునదనగా "ప్రాణమునిచ్చునది," అని అర్థము. నిజమైన పరిశుద్ధాత్మయే వాక్యమునకు ప్రాణమునిచ్చును. అదేట్లున్నదో ఆ విధముగా జీవింపజేయును. అది ఒక మత సిద్ధాంతమును జీవములోనికి తేనేరదు, ఏలయనగా అది మత సిద్ధాంతమునకు సంబంధించినది కాదు. అది దేవుని వాక్యమునకు జీవమైయున్నది, ఏలయనగా దేవుడే స్వయముగా అది అగుట వలన, చూచారా. అది ఆ శరీరమును జీవింప చేయును.

1JN 2:18

 

30వారు చేసిన దానిని ఇప్పుడు జాగ్రత్తగా చూడుము. బైబిలు చెప్పిన విధముగా యోహాను తన పిల్లలను - "చిన్న పిల్లలారా, ఈ లోకమునకు రానైయున్న క్రీస్తు విరోధిని గూర్చి మీరు వినియున్నారు గదా. అదిప్పుడు లోకములో నుండి అవిధేయులైన పిల్లలతో పనిచేయచున్నది." ఈ మాట పరిశుద్ధాత్మ వచ్చిన ముప్పది సంవత్సరముల పిదప పలుకబడినది. నిజమైన భీజమునకు జీవమిచ్చు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ప్రక్కనే విరోధి చల్లబడిన భేదమైనది పెరుగుట మనము చూడగలుగుచున్నాము. అది ఏ విధముగా కలిసి పెరుగుచున్నదో జాగ్రత్తగా గమనించుము.

సత్యవాక్యము నిరూపించబడెను, ఆ పూర్వకాలమందలి ప్రవక్తలు వారి కాలములో దేవుని వాక్యము సత్యమని రుజువు చేయుచుండిరి. మీలో ఎవరైన నైసియా ఆలోచన సభను లేదా ముందుగా జరుపబడిన నైసియా ఆలోచన సభను గూర్చి చదివినవారుండినయెడల, రోమీయులు క్రీస్తు సంఘము నుండి ఒక సాంప్రదాయక సంఘమును స్థాపించుటకై జరిగించిన పదిహేను రోజుల రక్తపాత రాజకీయంను గూర్చి ఎరుగుదురు. ప్రవక్తలు గొర్రె చర్మములు వస్త్రములుగా ధరించినవారై, కాయలు, దుంపలు, ఆకులు తినుచు వాక్యము కొరకు నిలువబడీరి! అయితే, అది ఏమి చేసినది? ఒకడు కయీను వలెను, మరొకడు హేబేలు వలెను సమానముగా నుండవలసి వచ్చెను, ఒకడు చంపబడవలెను. నిశ్చయముగా, అది జరిగెను. కాగా, ప్రజల మధ్యలో సత్యవాక్యమునకు ప్రభావము అంతమొందెను, వారంతా సత్యవాక్యాన్ని త్రోసి పుచ్చి, శత్రువు చల్లిన చెడ్డ విత్తన సంబంధమైన ప్రధమ కథోలిక్ సంఘ సిద్ధాంతములను పట్టుకొనిరి, ఒక పోపును, ఒక బిషప్ ను మరియు ఇది, అది, ఏదేదో చేర్చిరి. పేతురు, మరియ మరియు అనేకుల వారి వాస్తవమైన విశ్వాస అర్థమును తొలగించి, విగ్రహములను చేయ మొదలిడిరి. ఆ నామకార్థ క్రైస్తవ సంఘము యొక్క మతము నుండి పలు అన్య ఉత్సావాలను తయారు చేశారు. ఏమిటది? అది భేదమైన భీజమే! ఇదే ప్రప్రధమముగా ఈ భూమి మీద ఒక స్థాపన సంఘ శాఖగా రూపింప చేసినది. ఏమిటది? విత్తుచున్నది, మరొక దానిని కలుపుట, తీసివేయుటను చేయుట ప్రారంభించినది ఆ భేదమైన విత్తనమే.

MATT 3:9•

LUKE 3:8•

JAS 2:10

 

31శుక్రవారము నాడు మాంసము తినరాదని బైబిలులో చెప్పబడుట మీరు మీరెప్పుడైనా విన్నారా? ముంచడము అను బాప్తిస్మము గాక, చిలకరింపు బాప్తిస్మమును గూర్చి బైబిలులో వ్రాయబడినట్లు మీరెప్పుడైన విన్నారా? "మరియకు వందనం," లేక అట్లు మరేదైన చెప్పబడినట్లు మీరు ఎన్నడైన విన్నారా? ఈ ప్రొటస్టెంటులు కూడ చెడిపోయిన వీటి విషయములో ఎన్నడైన ప్రస్తావించారా? కుండ కాగును చూచి నీవు జిడ్డు పట్టినావని ఎగతాళి చేయగలదా? నిజము! చిన్న విషయాల్లో దోషి అని ఎంచబడినవాడు, విషయాలన్నిటిలో అతడు దోషియనీ పిలువబడును. దేవుడెప్పుడైన ఏ సంస్థతోనైన సంప్రదించినట్లుగా ఎవరైన ఎప్పుడైన విన్నారా? అటువంటిది ఏదైన సంస్థగా మారి మరియు జీవించియుండినది ఒక్క దానినైన చూపించండి. అది ఒక స్థాపన సంఘముగా రూపించబడిన వెంటనే అది మరణించును, మరెన్నడును అది లేవదు! ఏదో సంభవించుటకు ఇది ఒక సమయము, ఇది దేవుడు కదలాడు సమయము. ప్రజల మధ్యలోనున్న ప్రభావాన్ని వారు అంతమొదించుచున్నారు.

ఈనాడు అదే జరుగుతోంది. వారు ప్రభావాన్ని అంతమొందింపజేయుచు, "ఓ, వారు పరిశుద్ద గుండ్రాళ్ళు, వారి దగ్గర ఏమియు లేదని," చెప్పుదురు. ఏలయనగా వారు భేదమైన భీజమునకు చెందిన వారు! దేవుని వాక్యమేమైయున్నదో ముఖాముఖిగా వాక్యమును సంధించుము మరియు దేవుడు తానే తన వాక్యమునకు అనువాదము చేయునో, లేదో చూడుము. ఈ రాళ్లవలన దేవుడు అబ్రహామునకు సంతానము కలుగజేయుటకు శక్తిగలవాడైయున్నాడు. ఆమెన్.

32ఆది క్రైస్తవుల వలన వాక్యము సంపూర్ణముగా నిరూపించబడెను. దేవుడు వారిని రోగముల నుండియు, సమస్తమైన వాటినుండి ఏ విధముగా విడిపించెను, మరియు వారు ప్రవక్తలను కలిగియుండిరి, మరియు వారు భాషలు మాట్లాడుచుండిరి. దాని అర్థమును చెప్పుచుండిరి, వారిచ్చుచుండిన వర్తమానము సత్యములని ప్రతి కాలముల యందు రుజువు చేయబడుచుండెను. అయితే, సత్యవాక్యము నిరూపింపబడుచున్న సమయమున కూడ ప్రజలు సత్యవాక్యమును, తోసిపుచ్చి, సాంప్రదాయ స్థాపన సంస్థకే తమ ఓటును ఇచ్చిరి. అది స్థాపన సంఘ శాఖలన్నిటికిని తల్లి.

అవి రెండునూ పరిపూర్ణ పక్వమునకు వచ్చినవి. అవి మరల విత్తబడుటను ప్రారంభించబడెను. అది చనిపోయియుండెను, అయితే లూథర్ కాలములో వికసింప నారంభించెను అని ఉదయ కాలమున అల్పాహారము ముందుగా ఇవ్వబడిన వర్తమానమును బట్టి మన మెరుగుదుము. లూథరు దినములందు అది వికసించెను. ఇప్పుడు వారేమి చేసిరి? ఆ మహా వ్యక్తి చనిపోయిన మరుక్షణమే, వారు ఒక స్థాపన సంస్థను తయారు చేశారు.

అది వికసింపబడెను. అటు తరువాత జూన్ వెస్లీ దినములలో అంగ్లికనులు తమ నిత్యభద్రతతో సమస్తమును ఏకము చేసి దరిదాపుగా ప్రపంచమంతా నమ్మునట్లు చేశారు, అయితే జరిగినదేమి? దేవుడు జాన్ వెస్లీ, అను ఒక వ్యక్తిని లేపెను. అతని ద్వారా దీనినంతటి నాశనము చేసెను. ఆతడును, ఆస్బెరీ తదితరులు చనిపోయిన వెంటనే తరువాత ఏమి జరిగినది? వారంతా ఒక స్థాపన సంస్థగా రూపొందిరి, ఇప్పుడు అన్ని విధములైన మెథడిస్టులను నీవు కలిగితివి. అటు తరువాత అలెగ్జాండరు క్యాంబెల్, జాన్ స్మిత్ ఆ విధంగా కొందరు వచ్చిరి.

33చివరకు వీటి నుండి పెంతెకోస్తు అనునది వెల్లుబికి బయటకు వచ్చింది. అప్పుడు జరిగిన దేమిటి? వారు బాగుగానే పరుగిడిరి, కాని నిన్ను అభ్యంతర పరచినదేమి? నీవు ఏ బురదలో నుండి బయటికి వచ్చియుంటివో, తిరిగి దానిలోనికి వెళ్లితివి, ఆ మురికి నీటిలోనికి తిరిగి వెళ్లితివి, ఆ భేదమైన భీజమునకు తిరిగి వెళ్లితివి, నీవు ఒక స్థాపన సంస్థకై వాక్యమునకు భిన్నమైన దానితో సమ్మతింపవలసి వచ్చెను. మరియు ప్రతి సమయములోను దేవుడు ఏదైనా ఒక నూతనమైన పంపుచుండెను, నీవైతే దానిని స్వీకరించకపోవుచుంటివి. అది సరియే. మరల భేదమైనదే! ఇప్పుడు జాగ్రత్తగా గమనించుము, గత దినమందు నేను చెప్పినట్లుగా, గింజగా కనబడు ఆ చిన్న పొట్టు వేరుగల దాని నుండి బయటకు వచ్చెను, దానికి ఆకులు కలిగి వచ్చిన ఆ చిన్న మొలక పెద్దదై గింజలు పట్టిన కంకిగా బయటకు వచ్చెను. ఆ చిన్న గోధుమ పొట్టు చూడడానికి గోధుమ గింజ వలె ఉండెను. మనము దానిని గోధుమ గింజేయని తలంచితిమి, అయితే దాని చిలకను (పొట్టును) చింపినప్పుడు అందులో గింజ ఏ మాత్రమును లేకుండెను. అయితే, ప్రక్కనున్న గోధుమ గింజకు పెరుగుటకు ఊతనిచ్చింది, కాని అది తదుపరి చనిపోవును, మరియు దాని జీవము తిన్నగా గోధుమ గింజలోనికే ప్రవేశించును. జాగ్రత్తగా గమనించుము, వారు సంఘములను…

34ఈనాడు మనము నామకార్థ సంఘాలను చూస్తున్నాము, పెంతెకోస్తు వారును తమ మార్గము నుండి తప్పిపోయినారు, మనము తృప్తి కలిగియుండనందున మనము మన స్వంత గుంపులు తయారు చేసికొంటిమి. ప్రతీయొక్క విషయము అందు ప్రవేశించెను. మనము ఇది కలిగియుండాలి, మనము అది కలిగియుండాలి, మనము మరొక గుంపు తయారు చేయవలసియుండాలి అంటూ అనేక గుంపులేర్పడినవి. ఒకడు నిలువబడి, "ఆయన తెల్లని మేఘము మీద వచ్చుచున్నాడు," అని చెప్పుచున్నాడు, మరొకడు - "హూ, హూ హు హు ఆయన తెల్లని గుర్రము మీద వచ్చుచున్నాడు," అని చెప్పుచున్నాడు. "సరే, మంచిది, మనము రెండు గుంపులు చేయుదము." చూడుము, అదేమైయున్నది? భేదమైన భీజము విత్తబడుచున్నది! అది ఏమైయుండినను, ఆయన వచ్చినప్పుడు ఆయన తన వాక్యమునకు తానే అనువాదము చేయును. ఆ సమయము వరకు వేచి చూద్దాము. ఆ విషయమును గూర్చి మాట్లాడుటకు మీరు ఈనాటి సందేశమును కలిగియుండనేరరు. దేవుడు చేయబోయే దానిని, లేదా ఆయన ఏమి చేసినది మనమేల్లప్పుడు చెప్పుకుంటాము గాని ఆయన ఇప్పుడు ఏమి చేయునో, దానియెడల లక్ష్యముంచము. ఆ విధముగానే మనము దీనియందు చల్లుబడుటను చూచెదము.

35ఈనాడు మన సంఘాలన్ని గాలిని విత్తి, సుడి గాలిని కోయుచున్నవి అని మనము గమనించాము. మనము ఇంతకు ముందు మనకుండిన ప్రార్ధనా కూటములు గాని, ఆరాధనలు గాని, ఇప్పుడు లేవు అని చూడగలుగుచున్నాము. కారణమేమి? మనము అన్నింటికిని అడ్డు గడియలు పెట్టినట్లు, అన్ని విషయాలు ఆపివేసినాము. చూడుము, మన పెంతెకోస్తు సంఘాలు కూడా జుట్టు కత్తిరించుకొనిన, స్త్రీలతో నిండియున్నది. అసలు ఆ విషయాన్ని అనుమతించబడలేదు. ముఖాలకు రంగులు, గోళ్లకు రంగులు, ఏన్నో ఇలా౦టివి కార్యములు కలిగియున్నారు; పురుషులను చూడండి, రిక్కీలువలె నుండి మూడు, నాలుగు మారులు పెండ్లి చేసుకొనినవారిని డీకన్లుగా నియమిస్తున్నారు. ఓ ఎట్టి భేదమైన విత్తనము! రోతగా నున్నది! వారెట్లు దానిని చేయుచున్నారు? అట్టి వాటిని దేవుడు తన సంఘములో అనుసరించుటకు అనుమతించడు. అట్టి వాటిని కలిగియుండాలంటే స్థాపన సంఘములోనికి వారు పోవలసినదే. కొందరు అట్టి వాటిని గూర్చి ఎరిగియుండినను, దీనిగూర్చి చెప్పలేకపోవుచున్నారు, ఎందుకనగా చెప్పితే వారిని సంస్థలలో నుండి బయటకు తన్ని వేయుదురని భయము. దేవా, ఏ మనుష్యుడు సత్యమును చాటించుచు, దేవునితోను ఆయన వాక్యముతోను తప్ప మరి దేనితోను సంబంధములేని ఆ మనుష్యుని మాకనుగ్రహించుము. మనకు కావలసినది సరిగా అదియే. మనము చేసినదేమి? భేదమైన భీజము చల్లితిమి. మనము గాలిని విత్తితిమి గనుక ఇప్పుడు సుడిగాలిని కోయుచున్నాము.

MATT 13:30•

2TIM 3:5

 

36కాల్చివేయబడుటకు ఇప్పుడు అవి సమకూర్చబడుచున్నవి అని గమనించుము. యేసు చెప్పిన మాటను గమనించితీరా? "ముందుగా వాటిని సమకూర్చి, వాటిని కట్టలు కట్టి, అవి అన్నియు ఒక రాసిగా కూర్చి, వాటినంతటిని కాల్చివేయుదును." ఒక చిన్న కట్టగా కట్టిన దానిని మెథోడిస్టు అన్నియు, బాప్టిస్టు అనియు, ప్రెస్బీటేరియన్ అనియు, లూథరన్ అనియు, ఇవన్నియు ప్రపంచ సంఘముల సమైఖ్య యందు ఒకటిగా కూర్చబడుచున్నవి. అదేమైయున్నది? "ముందుగా వాటిని కూర్చుము!" హల్లేలూయా! నీవు గమనించావా, ప్రధమముగా గురుగలు గోధుమల నుండి వేరుచేసి వాటిని సమకూర్చును. "వాటిని ఒకటిగా కూర్చి మరియు కాల్చివేయును." దేవుని తీర్పుతో అవన్నియు కాల్చబడును, ఏలయనగా వారు ప్రజల మధ్యలో భేదమైన భీజమును చల్లియున్నారు. వారేమైయుండిరో… పైకి భక్తిగలవారివలె ఉండి, దాని శక్తిని ఆశ్రయించనివారు గనుక దేవుని వాక్యమును తిరస్కరింతురు. ఎవరో ప్రవేశపెట్టిన సాంప్రదాయక మత సిద్ధాంతములను, ఆచార విధి ప్రకారము గల క్రియలను అనుసరించునట్లు, వాటిని దేవుని వాక్యముతో కలుపుటకు ప్రయత్నించుచున్నారు. అదెన్నడు పనిచేయదు. అది భేదమైనది.

AMOS 3:8•

AMOS 7:14•

REV 13:17

 

37చాలా కాలము క్రిందట ఆ గొప్ప ప్రవక్తయగు ఆమోసు ఎలుగెత్తి అరచినట్లుగా,, నేనును ఎలుగెత్తి కేకవేయుచున్నాను, ఆమోసు పట్టణములోనికి వచ్చి, "నేను ప్రవక్తను కాను, ప్రవక్త కుమారుని కూడ కాను. కాని సింహము గర్జించినప్పుడు భయపడనివాడెవరు?" "దేవుడు ఆజ్ఞాపించగా, ప్రవచింపనివాడెవడు?" అని అతడు చెప్పెను. ఆ తరమువారి పై రానున్న తీర్పును అతడు ఎలుగెత్తి ప్రకటించెను. మీరు సేవించుచున్నామని చెప్పుచున్న అదే దేవుడు మిమ్ము నాశనము చేయునని పలికెను.

మీకు జ్ఞాపకముండునట్లు దీనిని టేపు మీదనుంచిన ధ్వని ముద్రితము కాగలదు. ఆ దేవుడే… ఈ ప్రజలందరు ప్రపంచ సంఘముల సమితిలో చేరుటకు ఈ గొప్ప కోత కాలమున గుంపుగా కూడుకొనుచున్నారు. మరియు నీవు దానిలో చేరవలసి వచ్చును. వానికి వెలుప ఉండజాలవు. నీవు వ్యక్తిగతముగా అందులో నుండి బయటకు వచ్చుటయో, లేదా అందులో నీవు ఉండుటయో జరుగును. మరొక ప్రత్యామ్నాయము ఉండబోదు. అదే మృగము యొక్క ముద్ర. ఆ ముద్ర లేదా ఆ భేదమైనది లేకుండా, నీవు కొనలేవు లేదా అమ్మ లేవు. ఇప్పుడు, దానినుండి వెలుపలికి రమ్మూ! దానినుండి బయటకు పారిపొమ్ము! దానినుండి దూరముగా పారిపొమ్ము! దానినుండి బయట ఉండుము! వారు తాము ఆరాధించుచున్నామని చెప్పుచుండిన ఆ దేవుడే వారిని నాశనము చేయును. ఆయన గొప్ప ప్రేమగల దేవుడు, ఆయన ఆలాగు…

"మనమంతా ఒకటిగా ఉండాలని యేసు ప్రార్ధించాడు కదా," అని మీరనవచ్చును.

AMOS 3:3•

JOHN 17:11,21,22

 

38"సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడతురా?" అని ఆయనే చెప్పెను గదా. "ఏకత్వము"ను గూర్చి ఆయన చెప్పినదేమనగా - "నేను, తండ్రి ఏకమైయున్నామని" ఆయన చెప్పెను. మరియు తండ్రి వాక్యమైయుండెను, మరియు ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమైయుండెను. ఆయన తండ్రితో ఏకమైయుండెను, ఎట్లనగా ఆయన దేవుని వాగ్దాన సంబంధమైన వాక్య ప్రత్యక్షతయైయుండెను. అదే విధముగా ఈనాడును లేదా మరే ఇతర దినమందును ఉండును. అవునండీ. దేవుడు ఒక్కడైయున్న విధముగా, మనమును ఒక్కటిగా నుండవలెనని ఆయన కోరుచున్నాడు.

కన్యక జన్మమిచ్చిన దానిని నమ్మని వారు, దైవిక స్వస్థతయందు నమ్మనివారు, వారు దేనిపైనను విశ్వసించక - గందరగోళమున నున్న మూకతో వాటిని విశ్వసించుచుండిన వీరు ఎట్లు ఏకముగా కలిసి యుండగలరు? వారిలో కొందరు దేవునియందు విశ్వాసము కూడ లేదు — ఆయన దేవుని కుమారుడనియు నమ్మరు; కొందరైతే ఆయన యోసేపు కుమారుడైయుండి, దేవుని కుమారుడని పిలువబడుచున్నాడని నమ్మురు. నిజముగా. నిస్సందేహముగా ఆయన మంచివాడని కవల సహోదరులగు లూథరనులు, జ్వింగ్లీయనులు నమ్మెదరు. క్రిష్టియన్ సైన్సు వారు ఆయన సామాన్య వ్యక్తియగు ఒక ప్రవక్త అని చెప్పెదరు. కాని ఆయన దేవుడు కాడని అందురు. ఆయనలోనే దైవత్వము లేనియెడల, ప్రపంచాన్నే మోసము చేసిన గొప్ప వంచకుడగును. ఆయన దేవుడేయైయుండాలి, లేదా ఆయన ఏమియు లేదు. ఆయన దేవుడై యున్నాడు! ఆయన స్వయం దేవుడైయుండి, దైవకుమారుని వ్యక్తిత్వములో శరీరుడై మనమధ్య ప్రత్యక్షపరచబడెను. నిశ్చయముగా, ఆయన అదే అయియున్నాడు.

DEUT 6:4•

MARK 12:29•

JOHN 5:43

 

39ఇప్పుడు భేదమైన విత్తనము లోపలికి వచ్చినదని మనము చూచుచున్నాము. అది ఇక్కడనే ఉన్నదని మనమెరుగుదుము. దీనిని ఎవరును కాదనలేరు. ఓ మై! సరిగా గమనించు, మేము దేవుని సేవించుచున్నామని చెప్పు ఆ గుంపును ఆయన నాశనము చేయును. నీవు దానిని జాగ్రత్తగా కని పెట్టుము.

దేవుడు తన విత్తనమును నాటెను. ఈ సమయమము ప్రార్థన వరుసలో నున్న వారికొరకు ప్రార్థించవలెను గనుక నేను ముగించుచున్నాను. దేవుడు తన విత్తనమును నాటెను, ఆ విత్తనము క్రీస్తే, ప్రభువు చిత్తమైనయెడల, ఏదైన ఒక రాత్రి మాట్లాడుదును. ఎక్కడ దేవుడు తన నామము పెట్టుటకు నిశ్చయించునో, బహుశ అది ప్రాతఃకాల అల్ప ఆహార సమయమున ప్రభువు చిత్తమైనయెడల, అధిక సమయము నాకుండినట్లయితే మాట్లాడుదును. చూడుము, మనము తప్పించుకొను మార్గము ఆయనే, ఆయనే మన నిజమైన అధిపతి. ఆయన గాక నిజ దేవుడు మరొకడు లేడు. "దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు," అని ఆయన చెప్పెను. యేసు - ప్రధానమైనదేమనగా - "ఓ ఇశ్రాయేలూ, వినుము, నేను నీ దేవుడను. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఇదే ప్రధానమైన ఆజ్ఞ," అని యేసు చెప్పెను. మరియు నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నా తండ్రి నామమున వచ్చితిని. వేరొకని కొరకు మీరెందుకు చూస్తారు? నేను నా తండ్రి నామమున వచ్చాను, మీరు చేర్చుకొనలేదు. ఇంకొకడు తన స్వంత నామమున వచ్చును, మరియు వాడిని మీరు చేర్చుకొందురు. నికోలాయితు సభలో వారు చేసినది అదే!

"నీవు క్రైస్తవునివా?"

"నేను బాప్టిస్టును."

"నీవు క్రైస్తవునివా?"

"నేను పెంతెకోస్తును."

"నీవు క్రైస్తవునివా?"

"నేను మేథోడిస్టువాడను," - మరొక పేరు.

SONG 2:1•

REV 1:8•

REV 22:16

 

40అయితే, యేసుక్రీస్తు పేరు నొద్దకు వచ్చినప్పుడు, వారు ఎంత దూరము పరుగెత్తిపోవాలో, అంత దూరము పారిపోవుదురు, వారికి దానితో సంబంధమేమియు లేదందురు, ఏలయనగా ఆయన వాక్యము, ఆ వాక్యము తనకుతాను సాక్ష్యమిచ్చుచున్నది. తప్పించుకొనుటకు అదొక్కటే మార్గమని గుర్తించుము! ఆయన షారోను యొక్క రోజా పువ్వు, అని బైబిలు చెప్పుచున్నది. (బైబిలులోని) దేవుని గూర్చి చెప్పబడిన ప్రతి బిరుదు ( title) యేసు క్రీస్తునకు చెందినవే. ఆయన ఆల్ఫా, ఓమేగయు, ఆదియు, అంతము; వర్తమాన, భూత, భవిషత్కాలములో ఉన్నవాడు, మరియు రాబోవువాడు; దావీదు యొక్క వేరు మరియు చిగురును, మరియు సంతానమును, అనగా దావీదు వేరుచిగురును, సంతానము అను రెంటిగానున్నవాడును; ప్రకాశమానమైన వేకువ నక్షత్రమును, షారోను రోజా పుష్పమును, లోయలోని పద్మమును, అల్పాయు, ఓమేగయు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్నీ యేసుక్రీస్తులోనే ఉన్నవి! ఆయన యెహోవా దేవుని సంపూర్ణ ప్రత్యక్షతయై, శరీరమును గుడారముగా కలిగి మనమధ్య నివసించెను. ఖచ్చితముగా ఆయన అదే అయి యుండెను.

షారోను రోజా పూవు అయనే. షారోను రోజా పుష్పమును వారేమి చేసిరి? దానిని నలిపి, పిండి, అందుండిన పరిమళ తైలమును బయటకు తీశారు. ఆ అందమైన రోజా పుష్పము పరిమళ తైలమునకై గట్టిగా పిండబడెను. మరియు అది రమ్యమైన జీవము, అట్టి జీవితము ఇంతకు ముందెవ్వరునూ జీవించియుండలేదు, అయితే ఆ సుందర, పవిత్ర జీవమును వెలువడుటకై కల్వరిలో ఆయన నలుపబడి, పిండబడవలసి వచ్చెను.

EXOD 28:34•

EXOD 29:7,16

 

41చూడుము, ఆ షారోను రోజా పుష్పము నుండి తీసిన పరిమళ తైలమును అహరోను తలపై పోయబడి అభిషేకించబడెను, ఎందుకనగా అతడు అతి పరిశుద్ధ స్థలములోని ప్రభువు సన్నిధికి పవిత్ర తెర ద్వార లోపలికి ప్రవేశించుటకు ప్రతిష్టించబడెను. ప్రతి సంత్సరము అతడు లోపల వెళ్లి, కరుణా పీఠము మీద ప్రోక్షణ జరిపించుటకై అతడు షారోను రోజా పుష్పము నుండి తీయబడిన తైలముతో అభిషేకింపబడవలెను. ఆ అభిషేకమును అతడు తప్పక కలిగియుండవలెను, అది ప్రభువునకు తీయని సువాసన ఇచ్చునదిగా నుండును, మరియు అతడు గొర్రెపిల్ల రక్తమును తీసుకొని ఆయన ఎదుటకు వెళ్ళును, పిమ్మట తాను కూడా గొర్రెపిల్ల రక్తముతో ప్రోక్షించబడును. అతని నిలువుటంగి క్రింది అంచుల చుట్టు దానిమ్మ పండ్లు మరియు గంటలు కలిగి అతడు నియమిత స్థలమందు నడుచుచుండునప్పుడు, గంటలు మ్రోగుచుండగా, "ప్రభువు - పరిశుద్దుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని చెప్పవలసియుండును.

42గమనించుము, ఆయనే తన ప్రజలను అభిషేకించు పరిమళ సుగంధ వాసననిచ్చు షారోను రోజా పుష్పము. నీవు ఆయన సన్నిధికి ఏ స్థాపన సంస్థ సిద్ధాంతములతో, మరి దేనితోను రాజాలవు. ఆయితే వాక్యమైయున్న షారోను పుష్ప అభిషేకముతోనే ఆయనను సమీపించగలవు. ఆయనే లోయలోని పద్మము.

ఇప్పుడు, మత్తుమందు నీవెట్లు సంపాదించగలవు? పద్మమును తీసికొని, దానిని నలిపి పిండినప్పుడే నీవు (ఓపియం) మత్తుమందును నీవు పొందుకోగలవు. వైద్యులు దాని ప్రయోగ శాలలో ఉపయోగింతురు. నరములకు సంబంధించిన రోగమును, కలవరపడుచున్న ఒక మనుష్యుని తీసికొని, లేదా పిచ్చిది కానున్న దానివలె అరుచుచు నేలపై నడుచుచున్నట్టియు, మూర్చ రోగము కలిగిన స్త్రీకి డాక్టరు ఈ పద్మము నుండి తీసి కొద్దిపాటు మత్తు మందును దాని చేతి నరములకును లేదా మరే స్థలమందైనను కొంత నెమ్మది కలుగుటకు ఇచ్చును, అప్పుడు కొంత నెమ్మది కలుగుటకు ఇచ్చును, అప్పుడు కొంత సమయము శాంతముగా నుండును. అయితే ఆ మత్తుమందు యొక్క ప్రభావము విరిగిపోయినపుడు, వారి స్థితి ముందుకంటే ఎక్కువగా అధ్వాన్నముగా నుండును.

ISA 53:5•

HEB 13:8

 

43అయితే, స్నేహితులారా, నేను చెప్పునదేమనగా, నేను ఎరిగిన లోయలోని పద్మము నుండి తీయబడిన నిజమైన (ఓపీయం) మత్తుమందునకు ఇది సాదృశ్యముగా నున్నది. సిలువలో నలుపబడి, పిండబడిన ఆయన లోయలోని పద్మమైయున్నాడు. "మన అతిక్రమ క్రియలనుబట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగినది." ఆ పుష్పము పిండబడినను ఆయన జీవముగల పుష్పమైయుండెను. ఆయన ముందెన్నడు పెరిగియుండని లోయలోని పద్మమును, గొప్ప షారోను రోజా పుష్పము. ఈ రాత్రి ఆయన ఆకాశమునకును భూమికిని మధ్య వ్రేలాడబడుచుండెను, ఆయన లోకపాపమును తీసివేయుటకు, లోకమునకు తిరిగి స్వస్థతను అనుగ్రహించుటకు ఆ సమయమైయుండెనని నేను విశ్వసించుచున్నాను. "ఆయన నిన్న, నేడు, మరియు యుగయుగము ఒకే రీతిగా ఉన్నాడని," బైబిలు చెప్పుచున్నది.

DEUT 28:23•

ISA 53:5

 

44స్నేహితుడా, దేవుడు అరణ్యములో ఇత్తడి సర్పమును ఎత్తి పట్టుము, అని మోషేతో చెప్పినపుడు, అది ఆయనకు సూచనగా ఉన్నది. ఇత్తడి అనగా పాపమునకు శిక్ష విధింపబడినది, అని అర్థమును సూచించుచున్నది. సర్పము పాపమునకు సూచన. ఇత్తడి సర్పమునకు, అనగా పాపమునకు శిక్ష ముందుగానే విధింపబడినదని సూచించును. మరియు ఇత్తడి అనగా "దైవిక తీర్పునకు," గురుతు. ఇత్తడి బలిపీఠంపై బలిఅర్పణలు అర్పించిన దానివలె ఇత్తడి దైవ తీర్పును సూచించును. మరియు ఏలీయా కూడ పైన చూసి, ఆకాశము ఇత్తడివలె నున్నదని చెప్పెను, అది అవిశ్వాసముగల దేశము పైకిని దేవుని నుండి వెనుకకు జారినవారి మీదికి వచ్చిన దైవిక తీర్పును సూచించుచున్నది. ఇత్తడి తీర్పును, దేవుని తీర్పును తెలియజేయుచున్నది. ఆ (ఇత్తడి) సర్పము పాపము ముందుగనే తీర్పుచేయబడిన దానిని సూచించుచున్నది, మరియు మన నిమిత్తము పాపముగా చేయబడిన యేసు సర్పముగా నుండెను, దేవుని తీర్పులన్నియు ఆయనపై వేసికొనెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగినది.

ఓ, ఈ రాత్రి దేవుడు నీ కొరకు బీరువ నిండ నెమ్మది కలుగజేయు ఓపియం ఉంచియున్నాడు. క్రైస్తవ స్నేహితుడా, నీవు వ్యాధితో, మరియు బాధతోనున్నావు. ఓ, నీవు అలసిపోయియున్నావు, అది నీకు కఠినముగా నున్నది. ఎక్కువ కాలము నీవు నిలువబడలేని స్థితిలో ఉండి, ఈనాడు మనము జీవించుచున్న ఈ ఆధునిక కాలములో పిచ్చివాడవై పోదువేమో!

JOHN 3:14•

HEB 13:8

 

45ఈ రాత్రి "లైఫ్ లైన్"నందు వారు చెప్పినది వింటిరా - రష్యా చెప్పిన దేమనగా '55లో సంపూర్తిగా ఈ ప్రపంచమంతటి పై ఆధిపత్యము పొందుదునని చెప్పలేదా? అది జరుగుటకు ముందుగా "ఎత్తబడుట," జరుగవలెను. కాబట్టి స్నేహితుడా, మనము ఎంత దగ్గరగా నున్నామో యోచించితివా? మనము అతి సమీపములోనే నున్నాము.

ఈ రాత్రి మీ పూర్ణహృదయముతో ఆయనను వేదుకరా? లోయలోని పద్మమైన ఆయన నిన్న, నేడు, మరియు యుగయుగములు ఒకే రీతిగా ఉన్నాడు. పాపమునకు తీర్పు తీర్చబడినట్లుగా మోషే పాపపు గురుతును ఎత్తి పట్టినట్లుగా, ఆయన స్వయముగా తన ప్రజల మధ్యలో ఈ రాత్రి ఎత్తబడనైయున్నాడు. పాపమును మాత్రమే కాదు, గాని రోగముల నిమిత్తము కూడ. "మోషే ఇత్తడి సర్పమును ఎత్తి పట్టినట్లుగా, మనుష్యకుమారుడు ఎత్తబడవలెనని," యేసు చెప్పెనని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. మోషే దేనికొరకు దానిని పైకెత్తి పట్టుకొనెను? పాపము, అవిశ్వాసము, రోగముల నిమిత్తము - అదే విధముగా యేసు కూడ పాపము, వ్యాధి, అవిశ్వాసము కొరకు ఆయన ఎత్తబడియుండెను.

GEN 18:9,10•

LUKE 17:28-30•

HEB 13:8

 

46ఇప్పుడు, ఈ రాత్రి, ఈ గొప్ప భేదమైన విత్తనము కలిగియున్న ఈ దినములలో మనము ఉన్నాము, లూకా సువార్తలో యేసుక్రీస్తు వాగ్దానము చేసినట్లుగా - ప్రభువు యొక్క రాకడకు ముందు ఈ భేదమైనది ప్రసరించియుండు దినములుగా నుండి, సోదోమ దినములవలె నుండునప్పుడు మనుష్యకుమారుడు స్వయముగా ఎలోహింగా నున్న దేవుడు మనుష్య శరీరమందు అబ్రహామునకు తన్ను ప్రత్యక్షపరచుకొని, తన వెనుక గుడారములోనున్న శారా హృదయములోని ఆలోచనను, ఆయన ఆమెను చూడకపోయినను అబ్రహామునకు తెలియజేసినట్లుగా, మనుష్యకుమారుడు ఈ దినములలో తన్ను ప్రత్యక్షపరచుకొనును. ఆమె (శారా) ఏమి కానున్నదో ఆమెకు తెలియజేసెను.. ఆమె "శారాయి" కాదు గాని, "శారా" అనియు "అబ్రాము"నకు "అబ్రాహాముగా" వారి పేర్లు మార్చబడి పిలువబడినవి.

"నీ భార్యయైన శారా ఎక్కడ ఉన్నది?" అని ఆయన అడిగినప్పుడు, "వెనుక గుడార మందున్నదని," అతడు చెప్పెను.

జీవకాలమున వచ్చి నిన్ను దర్శించెదను," అని చెప్పెను. అప్పుడు ఆమె నవ్వినది. "శారా ఎందుకు నవ్వెను?" అని ఆయన అడిగెను.

"ఈ గొప్ప భేదమైనదానిని సమకూర్చి కాల్చబడుటకు ముందుగా మనుష్యకుమారుడు గతమున ఆయన జరిగించిన విధముగా, ఇప్పుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనును," అని యేసు చెప్పెను. మరియు అది… అది ఏమిటి? యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు యుగయుగములు ఒకే రీతిగా వున్నాడు, అని మరల నూతనముగా మీ ఎదుట ఎత్తబడుటయైయున్నది. దానిని నీవు నమ్ముచున్నావా? ప్రార్థించుకొనుటకు మన తలలు వంచుదాము.

MATT 28:20•

LUKE 17:29,30•

JOHN 14:19•

1PET 2:24

 

47ప్రియ దేవా, మేము నిన్ను ప్రేమించుచున్నాము. మీ వాక్యము మాకు తృప్తికరమైన ఆహారము, దానిని మేము వాస్తవముగా ప్రేమించుచున్నాము! ప్రభువా, దానివలననే మేము బ్రతుకుచున్నాము. మాకున్న సామర్థ్యత ఎన్నడును చాలదని అది కనుపరచుచున్నది. మేము నీ బల్లయొద్ద, నీ వాక్యము చుట్టూ, నీ రక్తము వలన విలువబెట్టి కొనబడిన వారిని సహోదరులు, సహోదరీలుగా దేవుని కుమారుడు ఆ చిందించిన రక్తము వలన ఒకటిగా సమకూర్చి, నీ ఆశీర్వాదము అనుభవించుటకు ఇచ్చట కూర్చుండియుండుటను మేము ప్రేమించుచున్నాము ప్రభువా, మరియు ఈ రాత్రి ప్రభువా, రోగుల కొరకు ప్రార్థించుటకు ప్రతిష్టించుకొని, ఈ రాత్రి మేము వచ్చినాము. లేఖముల ప్రకారము, "నీవు పొందిన దెబ్బలచేత మేము స్వస్థతను పొందియున్నాము," అని నీవు చెప్పితివి. కావున ప్రార్థించు అవసరత ఇక లేదు (కేవలము మా పాపములను ఒప్పుకోనుచున్నాము), ఎందుకనగా నీవు పొందిన దెబ్బలచేత మాకు స్వస్థత కలిగినది (భూత కాలము). ఓ, ఇది ఎంత గొప్ప రక్షణ దినము! ఇమ్మానుయేలు ద్వారా ఎంత గొప్ప వాగ్దానము! నిశ్చయముగా ఇది సత్యము.

"కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను ("నేను" అనునది వ్యక్తిత్వమును సూచించు సర్వనామమైయున్నది) నేను మీతోను, మీలోను యుగసమాప్తి వరకు ఉందునని," నీవు చెప్పితివి. కడవరి కాలమందు, ఆ మహాయుగ సమాప్తి సమయమందు ఇంతకుముందు సోదాముపై అగ్ని కురిపించబడిన ఘట్టము సంభవించుటకు ముందు ఏ విధముగా మనుష్యకుమారుని ప్రత్యక్షత ఆనాడు కలిగినట్లు, ఈనాడు ఈ అన్యలోకము అగ్నితో కాల్చబడుటకు ముందు మరల మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడుటను సంభవించును," అని నీవు చెప్పితివి. తండ్రి, ఈ జనులు దానిని తప్పిపోకుందురు గాక.

DEUT 18:15•

JOHN 14:12

 

48మరియు దేవా, నేను ఒక చిన్న మోటుతనము కలిగినవాడనుగా ప్రార్థించుచున్నాను, (నేను ఏదైనా పొరపాటు మాట్లాడినయెడల నన్ను క్షమించుము), నన్ను తిన్నని మార్గమున నడిపించుము. నేను వారిని ప్రేమించుచు, వారు తప్పిపోకుండునట్లుగా వారిని హెచ్చరించుచు, ప్రభువా, వారి నిమిత్తము నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఇది ఒక మహత్కరమైన ఒక రాత్రిగా ఉండనిమ్ము, ప్రభువా, ప్రతి వ్యాధి, బాధతోనున్నవారు, గ్రుడ్డివారు ఇచ్చటనున్న వారెల్లరు ఈ రాత్రి స్వస్థతను పొందనిమ్ము. ప్రతి పాపి రక్షణ పొందుదురు గాక. ఇచ్చట ఎవరైన అవిశ్వాసులుండినయెడల, వారి హృదయములను సరిచేసి, వారు ఈ సమయమున క్రీస్తును అంగీకరించుదురు గాక. తండ్రీ, దీనిని అనుగ్రహించుము. ప్రతిదియు నీ హస్తములో వున్నది. మమ్మును నీ హస్తములలో అప్పగించుకొనుచున్నాము; తద్వారా నీవు మా మధ్యకు వచ్చునట్లు చూడనపేక్షించుచున్నాము.

పరిశుద్ధ యోహాను సువార్త 14:12లో "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును," అని నీవు చెప్పితివి. నావంటి ప్రవక్తను లేపునని మోషే చెప్పినట్లుగా, ఆ ప్రవక్తవు నీవే అనియు ప్రజల మధ్య నిన్నునీవే ఎట్లు బయలుపరచుకున్నావనునది మేము బాగుగా ఎరుగుదుము. వందల సంవత్సరాల వరకు వారికి ప్రవక్త లేడు, కావున ఎక్కడ చూచిన భేదమైన విత్తనమే వ్యాపించినది, అయినను దేవుని వాక్యము నెరవేర్చబడవలెను గనుక వాక్యము శరీరమైన రీతిగా భేదమైన విత్తనము కూడ ఆ రీతిగానే తయారైనది. మరియు తండ్రి, ఈనాడు భేదమైన విత్తనము ఒక మోపపుగా కట్టబడుట చూచినట్లుగా, వాక్యము కూడా ఆ విధముగానే వచ్చుట చూచుచున్నాము. తండ్రి, ఈ రాత్రి మమ్మును ఆశీర్వదించుము. నీ వాక్యముతో మమ్మును నీకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, ఏది నీవు మాతో చేయగోరుచున్నావో దానిని మాతో జరిగించుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

49[ఒక సహోదరి అన్యభాషలో మాట్లాడుచుండెను. టేపునందు ఖాళీ స్థలము.] నిజమైన భయభక్తి కలిగియుందము. ఆయన ఏమి చెప్పెనో మనము ఎరుగము, ఆయన మనతో ఏదో చెప్పుచున్నాడు, గనుక వినయ భయభక్తితో కొంత సమయముందాము. [టేపులో ఖాళీ స్థలము. ఒక సహోదరుడు దాని అర్థము చెప్పుచున్నాడు.]

ఆమేన్. మీరు ఎప్పుడైన చదివితిరా? [టేపునందు ఖాళీ స్థలం.] శత్రువు వచ్చునప్పుడు, వారు ఒక గుంపుగా ఏకమై, వారు గొప్ప బలము కలిగినవారగుదురు అను లేఖనము మీరెప్పుడైన చదివితిరా? అప్పుడు దేవుని ఆత్మ ఒక మనుష్యనిపై దిగివచ్చెను, వారు ఎచ్చటకు వెళ్లవలెను, ఎచ్చట పొంచియుండి, శత్రువులను నాశనము చేయవలెనో అతడు ప్రవచించి, అతడు చెప్పెను. అది మరల ఇప్పుడు వచ్చుచున్నది. మీ శత్రువులను నాశనము చేయుటకు ఒక స్థలము కలదు, గమనించుము, దేవుని హస్తమును పట్టుకొనుటయే. క్రీస్తే దేవుని హస్తము, అదే దేవుని వాక్యము గనుక ప్రార్థన వరుసకై పిలచుచుండగా, ఈ రాత్రి దానిని మీ హృదయములలోనికి తీసికొని రండి.

50ఈనాడు బిల్లీ ప్రార్థన కార్డులు మరల ఇచ్చియుండునని నేను నమ్ముచున్నాను. B అను అక్షరముతో ప్రారంభింపబడిన 85 నంబరు నుండి తీసికొందాము. గత రాత్రి పదిహేను తీసుకొనియుంటిని. ఒక రాత్రికి 15 నెంబరులను సాధారణముగా తీసికొనుచుంటిమి. మీరు కలిగియున్న కార్డులను మీరు జాగ్రత్తగా పట్టుకొనుడి. ఇప్పుడు మేము 15 మంది కొరకు ప్రయత్నించెదము. B-85 నుండి B బ్రెన్హాం యొక్క పేరునకు మొదటి అక్షరము వలె, B-85 నుండి నూరు (B-100) వరకు. ఇప్పుడు మనము… B-85 ఎవరైయున్నారో, మీ చేతిని పైకెత్తి చూపించుము. నిశ్చయముగా, నీవే… వెనుక ఉన్నావు. పర్వాలేదు. 85 నీవు ముందుకు రమ్మూ.

ఇప్పుడు నా కుమారుడు… అక్కడ అపరిచయులుండవచ్చును. ఇది ఏ విధముగా జరుపబడునో ఎరుగక నుండవచ్చును. నా కుమారుడు లేదా మరొకరు మీ యొద్దకు రాగలరు; అతడు రాలేకపోయిన, సహోదరుడు బోర్డర్సు, మరెవరైన రాగలరు, మరే మనుష్యుడైన వచ్చును, ఒక నూరు వరకు నంబరు గల కార్డులు వారు తీసికొని మీ దగ్గరకు వచ్చెదరు. వాటిని ప్రజల యెదుట కలిపి, మీకు ఒక్కొక్క కార్డు నిచ్చెదరు. కాని మిమ్మును వేదిక యొద్దకు పిలుచునది లేదా వారు ఎరుగరు. మరియు నేనును ఎరుగను. నేను రాత్రి వచ్చెదను, 10 లేదా 15 కార్డులు అందుండి తీసికొనెదను. అట్లు తీసికొనుటవలన మీ రోగ స్వస్థకు ఏలాటి సంబంధముండదు. నీవు ఎక్కడైనను కూర్చుండియుండవచ్చును, చూడండి, గత రాత్రి, జరిగిన దానిని ఎంతమంది గతరాత్రి వచ్చియుండిరో, మీ చేతులు చూడనివ్వండి? ఆ కుడికలో ఎట్లు ప్రజలు స్వస్థత పొందిరో చూచితిరి!

51అవి ఎనుబది ఐదు, ఎనుబది ఆరు, ఎనుబది ఏడు, ఎనుబది ఎనిమిది, ఎనుబది తొమ్మిది, తొంబది అను నంబరులు. ఆ నంబరు కలిగినవారు సరిగా ఇక్కడకు ఇప్పుడు రండి. B-85, 86, 87, 88, 89, 90. ఓ వ్యక్తి … ఉండవలెను … నిశ్చయముగా, మేము అతడుండవలెనని కోరుచున్నాము. ఆ మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు సంఖ్య సరిగ్గా నున్నది. ఇప్పుడు 90 నుండి 100 వరకు 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 పది మందిగా లెక్కింపబడిరి.

మీరు ఒకవేళ నడువలేని స్థితిలో నుండిన యెడల, మీరాలాగుండిన… మా దగ్గర రెండు, లేదా మూడు చక్రాలు కలిగిన కుర్చీలు, నాలుగు ఉన్నట్లుగా నేను చూచుచున్నాను. మీరు ప్రార్థనా కార్డులు కలిగియుండి, మీ నెంబరు పిలిచినప్పుడు, మీరు నడువలేని స్థితిలో నుండిన, మీరున్న స్థలము నుండి మీ చేతిని పైకెత్తి చూపించుడి, మేము ఆ కుర్చీని మీ దగ్గరగా తెచ్చెదము.

MATT 9:20,21•

MARK 5:27-29•

LUKE 8:44

 

52మీరు ప్రార్థన కార్డును కలిగియుండనియెడల, మీరు కూర్చుండిన స్థలమందే, ఉండి - "ప్రభువైన యేసూ, ఈ రాత్రి నన్ను బాగుపడనిమ్ము," అని ప్రార్థించండి. ప్రార్థన కార్డులు లేనివారు ఎందరు ఉన్నారో, మీ చేతులు పైకెత్తుడి, ఓ, మంచిది. ఇప్పుడు" అది భక్తిహీనము కాదని నేను ఆశీంచుచున్నానని నన్ను చెప్పనిమ్ము. ఒక రోజున ఏ కార్డు లేని ఒక స్త్రీ జనాన్ని త్రోసికుంటూ వచ్చి (జాగ్రత్తగా వినండి) - "అతని వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడుదునని," అని తనలో ఆమె అనుకొనినది." ఎందరు ఈ గాధను ఎరుగుదురు? మంచిది. మరియు ఆమె ఏమి చేసినది? ఆమె ఆయనను తాకి వచ్చి కూర్చుండెను. మరియు యేసు వెనుకకు తిరిగెను. ఆమె ఎక్కడ వుండెనో, ఆయన ఎరిగియుండెను. అది సరియేనా? ఆమె వ్యాధి ఏమిటో ఆయన ఎరుగును. అది నిజమేనా? గనుక ఆమె వ్యాధిని ఎరిగినవాడై, ఆమె వ్యాధిని గూర్చి ఆయన ఆమెతో చెప్పెను. మరియు ఆమె శరీరమందలి రక్తస్రావము వెంటనే నిలిచిపోయెనని తెలిపెను. అది వాస్తవమేనా? అట్లు ఎందుకు జరిగినది? ఎందుకనగా ఆమె ఆయనను తాకినది.

HEB 4:15

 

53ఈ రాత్రి ఎంతమంది క్రైస్తవులు హెబ్రీ పత్రిక ప్రకారముగా యేసు అను ప్రధానయాజకుడు మన సమస్త బలహీనతల అనుభవము కలిగిన ప్రధానయాజకుడు ఈ సమయములో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముచున్నారు? ఆయన అలాగే ఉన్నాడా? మంచిదే, అదే రీతిగా ఆయన ప్రధానయాజకుడుగా, అదే స్థానమందుండినయెడల, ప్రధాన యాజకుడై ఇప్పుడాయన ఏమి చేయును? ఆనాడు ఆయన ఏమి చేసెనో, దానినే చేయును, దానిని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినయెడల, ఆనాడు ఆయన దేనిని చేసెనో, అదే ఆయన చేయును. మంచిది. ఎందరు నమ్ముచున్నారో, మీ చేతులు పైకెత్తి, "వాస్తవముగా నేను దానిని నమ్ముచున్నానని" చెప్పుము.

మంచిది, ఇంతకు ముందు ప్రార్థనా వరుసలో ఉన్నవారు, ఇచ్చట వెలుపల ప్రార్థన వరుసలో నుండండి. ఆయన ఇక్కడ ఉన్నాడని నేను ఎరుగుదును, ఆయన ప్రసన్నతను నేను అనుభూతి చెందుచున్నాను, మరియు ఆయన ఇక్కడ ఉన్నాడని ఎరుగుదును. (ప్రార్థన వరుస సిద్దముగా నున్నదా? నేను అచ్చట పిలువబోవుచున్నాను.) మీరు కేవలము ప్రార్ధన చేయండి, కేవలము ఈ వైపు చూడండి, కేవలము ఆయనపై విశ్వాసముంచుడి, మరియు ప్రార్థించుడి.

HEB 13:8

 

54అచ్చట ఒక చిన్న స్త్రీ కూర్చుండి నేరుగా నావైపు చూచుచున్నది, కన్నులకు అద్దాలు కలిగిన స్త్రీ ప్రక్కన కూర్చుండియున్నది. ఆ స్త్రీ పైగా వ్రేలాడుచున్న దానిని నీవు చూడలేదా? ఇక్కడ చూడుము. గుర్తించితిరా? ఆమె గుండె నొప్పి వ్యాధితో బాధపడుచున్నది. దేవుడు నిన్ను స్వస్థపరచునని నమ్ముము. నీవు ఆ విధముగా చేయకలిగినట్లయితే, నీ చెయ్యి పైకెత్తుము. అదే నీ సమస్యయై యుండెను. అది వాస్తవమైయున్నది. ఇప్పుడు, నీ బాధ అదేయైయుండినయెడల, నీ చెయ్యి పైకెత్తుము, ఆ రీతిగా నీవు చెయ్యి ఎత్తుటను ప్రజలు చూడగలరు. ఇప్పుడు, నీకది ఇక నుండి లేదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచెను.

ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఓ, భేదమైన విత్తనమచ్చట ఉన్నది; అయితే యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒకే రీతిగా నున్నాడు. ఇప్పుడు మీరు కేవలము ప్రార్థన చేయండి, చూడుము, మీరు ఎరుగుటకై ఇక్కడకు మీరు రావలసిన అవసరత లేదు.

55ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. నా జీవితములో నేను ఎరిగినంతవరకు, ఆ స్త్రీని ఎన్నడును చూడలేదు, ఆమె ప్రార్థన కార్డు కలిగి అచ్చట నిలువబడి యున్నది, నీవు పిలువబడుదువో, లేదో నాకు తెలియదు. ప్రార్ధన కార్డును ఎవరో నీకిచ్చరి, నీ నంబరు పిలిచినప్పుడు నీవు ఇక్కడకు రావలెను. అది సరియేనా? నీవు ఏమైయున్నది, నీవు ఎవరైనది, నీవు ఎక్కడ నుండి వచ్చినది, నీ అవసరత ఏమిటో తెలిసికొనుటకు ఏలాంటి మార్గమును నేను ఎరుగను. నేను సాధారణ ఒక మానవుని, నీవొక స్త్రీవై యున్నావు. అది వాస్తవము, ఇదే విధమైన చిత్రమును బైబిలునందు భక్తుడైన యోహాను 4వ అధ్యాయములో ఒక సమయమందు వచ్చియుండెను.

"బ్రెన్హాం సహోదరుడా, ఇప్పుడే, కొంత సమయము క్రితము ఏమి చేసితివి," అని మీరిప్పుడు అడుగుదురు. నేను కొంత సహాయమును చేసితిని, చూడుము. నాకు తెలియదు, చూచారా. దానిని ఆయనే చేయవలసియున్నది. నాకు తెలియదు. ఆ స్త్రీ ఏమి చేసినది? ఆ స్త్రీని నా జీవితములో నేనెన్నడు చూడలేదు. ఆమే నాకు సంపూర్ణముగా అపరిచయురాలు. ఆమె ఒక స్త్రీయని నేను విశ్వసించుచున్నాను. ఇచ్చట వినుటకు వచ్చిన వారిలో ఇప్పుడే స్వస్థత పొందిన ఆ వ్యక్తి ఎవరు? మనము ఒకరికినొకరు అపరిచయులము కాదా? అది నిజమైనయెడల, నీ చేతిని పైకెత్తి ఊపుము, ఈ రీతిగా, చూచారా. ఆ స్త్రీని నేను ఎన్నడును చూడలేదు. అయితే ఆమె నమ్ముచు అక్కడ కూర్చుండియున్నది. ఇప్పుడు, ఆమె ఏదో ముట్టినది, ఆమె ఈ రీతిగా ముట్టలేదా? నన్ను తాకుటవలన ఏమి ప్రయోజనములేదు.

JOHN 4:4,5,8•

HEB 13:8

 

56బైబిలు సంపూర్ణ రీతిగా దేవుని వాక్యమని ఇప్పుడు మీరు చూచుట లేదా? ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. క్రీస్తు అనబడు పరిశుద్ధాత్మకు మనము ఆలయములైయున్నాము, చూచారా. అదే నిజమైన విత్తనము. నిజమైన పరిశుద్ధాత్మ వాక్యమనెడి నిజమైన విత్తనము నందు ప్రవేశించినప్పుడు. వాటిలో ఏదో కొద్ది భాగమును అది తీసికొనదు, ఏలయనగా ఆ విధముగా చేయువాడు సాతానుడు, దానిని సంపూర్ణముగా తీసికొనవలెను, చూచారా, ప్రతి వాక్యమును; ఏలయనగా ఆయన సగము దేవుడు కాడు, ఆయన సంపూర్ణ దేవుడైయున్నాడు, మరియు అదే విషయము జరుగుచుండును.

ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఆమెను నేను ఎన్నడును చూడలేదు. ఒక సమయమున యేసు ఈలాంటి ఒక స్త్రీని కనుగొనెను, ఈ స్థితిలో ఉండకపోవచ్చును, నేను ఎరుగను. మరియు ఆయన ఒక బావి వద్ద కూర్చుండియుండెను. ఆయన సమరయకు వెళ్ళవలసియుండెను. ఆ సమరియ పర్వతమునకు దిగువ భాగమున నున్నదని మనము చూడగలము. ఆయన యెరికోకు పోవుచుండెను గనుక ఆయన సమరియాను చుట్టు వెళ్ళి, సుకారు అను పట్టణమునకు వచ్చెను. మరియు ఆయన బావియొద్ద కూర్చుండి, తన శిష్యులను ఆహారము కొరకు పంపెను.

JOHN 1:42,48•

JOHN 4:7,9,10,16-18

 

57లోకములో ఎన్ని వంశముల వారున్నారు? మూడు వంశముల వారున్నారు. షేము, హాము, మరియు యాపేతు అను వారి సంతానము. మన మందరము నోవహు నుండి వచ్చితిమి. ఆ సమయములో తక్కిన లోకమంతయు నాశనము చేయబడెను, యూదులు, అన్యులు, సమరయులు (సగము యూదులు మరియు సగము అన్యులు) అను మూడు జాతుల వారు మాత్రము ఉండిరి. మరియు ఆ మూడు వంశముల వారు మాత్రమే కేవలము లోకములో నుండుట చూచుచున్నాము.

దేవునిలో నున్న సమస్తము మూడులో పరిపూర్ణతయైయున్నది, ఈ రాత్రి కేవలము ఈ మూడింటి విషయము మాట్లాడుచుంటిని; భేదమైన విత్తనము యొక్క మూడు దశలు, వాక్యము శరీరధారియగుటలోని మూడు దశలు మొదలునవి. చూచారా?

మరియు ఇప్పుడు యూదులలో మాట్లాడిన ఆయనే నతానియేలును తీసికొని వచ్చిన ఫిలిప్పుతో, అతడు ఎక్కడ ఉండినది, "అతడు వృక్షము క్రిందనుండగా అతనిని చూచితినని," చెప్పెను. ఆయన చెప్పెను… ఆంద్రెయ పేతురును తెచ్చినప్పుడు, పేతురుతో - నీ పేరు సీమోను, మరియు నీవు ఇప్పటి నుండి పేతురు అని పిలువబడుదువు," అని చెప్పెను. మరియు "నీవు యోనా కుమారుడవని కూడ ఆయన తెలిపెను." చూచారా? ఇప్పుడు, వారంతా యూదులే.

అయితే, ఇక్కడ అన్యుని యొద్దకు ఆయన పోవుచున్నాడు… అన్యుని యొద్దకు కాదు, కాని సమరయలురాలి యొద్దకు.

ఇది అన్యజనుల కాలము. అన్యజనుల మధ్య అలాంటి ఒక కార్యమును ఆయన చేయలేదు. లేఖనములను పరిశోధించండి. ఎన్నడూ లేదు. అయితే ఆయన లూక 22వ అధ్యాయములో ఆయన రాకడకు ముందు అది చేయుదునని వాగ్దానము చేసెను.

ఆయన అక్కడ కూర్చుండియుండగా, మరియు సగము యూదు మరియు సగము అన్యజాతికి చెందిన ఒక స్త్రీ అక్కడకు వచ్చియుండెను. ఆయన - దాహమునకు నీరు తెమ్మని ఆమెను అడిగెను.

అప్పుడామె చెప్పెను, "ఎందుకు, నీవు దానిని అడుగకూడదు. మనము… ఇక్కడ ఒక బేధమున్నది. నీవు యూదుడవు మరియు నేను సమరయురాలిని."

"నీవు ఎవరితో మాటలాడుచుంటివో నీవు ఎరిగినయెడల నీవే దాహమునకిమ్మని నన్ను అడిగియుందువు," అని ఆయన చెప్పెను. ఆయన ఇచ్చట ఏమి చేయుచున్నాడు? ఆమె ఆత్మను సంధించుచున్నాడు. మరియు ఆమె యొక్క వేదన ఏమైయున్నది, ఆయన బాగుగా ఎరిగిన వెంటనే, నీవు వెళ్లి, నీ భర్తను తీసికొని రమ్మని ఆమెతో చెప్పెను. అందుకా స్త్రీ ఆయనతో - "నాకు పెనిమిటి లేడని చెప్పగా, ఆయన - "నీవు చెప్పినది సరియే, అయితే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి," అని ఆమెతో చెప్పెను.

MATT 12:24,32•

MARK 3:22,29•

LUKE 11:15•

LUKE 12:10•

JOHN 4:19,25

 

58ఆయన ఆ కార్యములు చేయుటను పరిసయ్యులు చూచినప్పుడు, ఇప్పుడు జాగ్రత్తగా గమనించుము. సరిగ్గా, బేధమైన విత్తనము వాక్యము మధ్యకు వచ్చినది, వారేమి చెప్పుచున్నారు? "ఈ మనుష్యుడు బయెల్జేబూబు, జాతకము చెప్పువాడని," వారు చెప్పుచుండిరి. చూచారా?

అందుకు యేసు - "పరిశుద్ధాత్మ అదే కార్యములు ఆయన చేయుచు వచ్చినపుడు ఎవరైనను విరోధముగా మాట్లాడినయెడల వారెన్నడును క్షమింపబడరు" అని చెప్పెను. ఇచ్చట భేదమైన విత్తనము కనబడును. గమనించితివా? అయితే యేసు - అప్పటికింకను పరిశుద్ధాత్మ రాలేదు గనుక వారిని అప్పుడు క్షమించుదునని చెప్పెను; ఏలయనగా, బలి, గొర్రెపిల్ల చనిపోలేదు."

అయితే ఆ స్త్రీ ఆ విషయమును ఆలోచించలేదు. అప్పుడా స్త్రీ, "నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను," అనెను. అప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుండి వారికి ప్రవక్త లేకుండెను. "అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇప్పుడు క్రీస్తు అనబడిన మెస్సియా, ఆయన వచ్చినప్పుడు, ఆయన చేయబోవునది అదే అని మేము ఎరుగుదుము," అని చెప్పెను.

అప్పుడాయన ఆ విధముగా చేసినచో, ఇప్పుడును ఆ రీతిగానే చేయును - ఏలయనగా ఆయన నిన్న, నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అప్పుడాయన తన్ను ఏ విధముగా బయలుపర్చుకున్నాడో, ఈనాడును అదే విధముగా జరుగదా? ఆ విధముగానే జరుగవలసియున్నది! ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ మరియు ఒక మనుష్యుడు మరల కలుసుకొనిరి. ఈ స్త్రీ, ఆ స్త్రీ కాదు; నేను ఆ మనుష్యుడను కాను. అయితే, అదే పరిశుద్ధాత్మ ఇక్కడ నున్నది, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున ఆయన చేసిన కార్యములు ఆయనయందు విశ్వాసముంచు మనమును - అదే కార్యమును చేయుటకు వాగ్దానము చేసియున్నాడు.

59ఇప్పుడు, నేను నిన్ను ఎరుగను (అది సత్యమని నీవెరుగుదువు), మనము కేవలము అపరిచయులము, మరియు నీవు ఇక్కడ నిలువబడి యున్నావు. అక్కడ ఏదో నీలో తప్పిదమేదైన ఉండవచ్చును లేదా లేకపోవచ్చును, నాకు తెలియదు. అయితే, ప్రభువైన యేసు తన పరిశుద్ధాత్మ వలన నీ బాధ ఏమిటో నాకు తెలియచేసినయెడల, ఏ మానవుడు కాడు గాని దేవుని కుమారుడే దానిని బయలుపరచెనని నీవు నమ్ముదువా? ఈ గుడారము కేవలము ఒక పై పొట్టువంటిది. దేవుడు ఎవరిని ఏర్పరచుకొనియుండునో, వారిని ఉపయోగించును. ఆయన తన కృపా బాహుళ్యతను బట్టియు మరియు ఆయన ఏర్పాటునుబట్టి దానిని చేయును. గనుక, అయితే నీవు నమ్ముము. నీవు ఆలాగు నమ్ముదువా?

వినుచున్న మీలో ఎంత మంది దాని నమ్ముచున్నారు? ఈ దీపముల యెదుట మేమిరువురము ఇక్కడ నిలువబడియున్నాము, మా జీవితములో మేమెన్నడును సంధించలేదు. ఆ స్త్రీ ఎవరైనది, ఆమె ఏమైయున్నది, ఆమె ఎక్కడ నుండి వచ్చినది, ఆమె అవసరత ఏమిటైనది ఏ మాత్రము నేను ఎరుగను, ఈ స్త్రీని నా జీవితములో ఎన్నడూ చూడలేదు, అక్కడ కూర్చున్న స్త్రీని తప్ప, మరే స్త్రీని నా జీవితములో చూడలేదు. అయితే, ఇక్కడ మీకు ముఖ్యముగా తెలుపగోరుటకు ప్రయత్నించునదేమనగా: భేదమును నుండి మిమ్మును దూరపరచుటకును, వాక్యమును నమ్ముటకు అనగా వాక్యము శరీరధారియై ఈనాడు మన మధ్యనున్నాడు. వాక్యము మన స్వంత శరీరమునందు జీవించును, అది దేవుని ప్రసన్నతను చూపించును.

60ఇప్పుడు ఆయన దానిని ఆమెకు అనుగ్రహించును గాక. ఆమెకు పిల్లలు లేరు, గనుక ఆమె కోరినది యోగ్యమైనది. ఆమెకు ఒక బిడ్డ కావలసియున్నది. ఆమె నలుబది సంవత్సరములు వయస్సు కలిగియున్నది. అది ఎంత మాత్రమును అసాధ్యమైనది కాదు.

ఇక్కడ కొందరు స్త్రీలు కూర్చుండియున్నారు. వారి జీవితమంతటను గొడ్రాండ్రుగా నుండిరి, వారు ఈమె వలె వేదిక యొద్దకు వచ్చిరి, ప్రభువు వారికి సంతానమిచ్చెను. ఈ విషయమును ఎరిగిన మీలో కొందరు మీ చేతులు పైకెత్తుము. చూచారా? క్రిందటి ఆదివారపు మధ్యాహ్న కాలమందు ఇక్కడ నుండి వెళ్లిన తరువాత ప్రియముగా నున్న ఒక అమ్మాయిని నా చంకలో ఎత్తుకొంటిని; ఆమె తల్లి గొడ్రాలుగా నుండెను, ప్రభువు ఆమెతో మాట్లాడెను. ఆ చక్కని చిన్న అమ్మాయి ఇక్కడ ఉన్నదా? ఎక్కడ ఆ చిన్న బాలిక ఉన్నది? అవును ఇక్కడనే ఆ బాలిక కూర్చుండి ఉన్నది. ఆ తల్లి కూడ ఇక్కడనే కూర్చుండి యున్నదని తలంచుచున్నాను. ఆ చిన్న బాలిక స్వయముగా ఇక్కడనే ఉన్నది, ఆమెను చూచితిరా? ఆ బాలిక దేవుడు పలికిన మాటయైయున్నది.

ఇప్పుడు, మీ హృదయపూర్వకముగా ఆయనను విశ్వసించుచున్నారా? నీవు పొందిన ఆశీర్వాదము, ఇప్పుడు నీవు కలిగిన అనుభూతి దేవుని యొక్క జవాబు అని నీవు నమ్ముచున్నావా? నీ పేరును, పుట్టబోవు బిడ్డకు పెట్టు పేరును దేవుడు తెలియజేసినయెడల, నీవు విశ్వసించెదవా? అలాగైతే శ్రీమతి. థామ్సన్, నీవు ఇంటికి వెళ్లుము, నీ హృదయపూర్వకముగా నీవు నమ్మినయెడల, నీవు బిడ్డను పొందుకుందువు.

61నీ హృదయపూర్వకముగా నీవు నమ్ముచున్నావా? సందేహింపక, విశ్వాసము మాత్రముంచుము, కేవలము దేవునియందు విశ్వాసముంచుము. దేవుడు దేవుడే.

అయ్యా, మీరేలాగున్నారు? మనమును అపరిచయులమని నేను ఊహించుచున్నాను. నా జీవితములో నేను నిన్ను ఎప్పుడైనా చూచినానంటే, నీవు ఇక్కడికి వచ్చునప్పుడు చూచుట. కేవలము ఈ సమయమే. నీవు సహోదరుడు షకారియన్ బంధువు లేదా గాయకుడైన సహోదరుడు మాషెగాన్ గారి బంధువుడవై యుండవచ్చునని నీవు వచ్చుచున్నప్పుడు తలంచితిని. మరియు అటు తరువాత నీవు ప్రార్థనా వరుసలో నుండుటకు వెళ్లుట చూచితిని. ఇప్పుడు నేను నీకు అపరిచయుడను, అటువలె నీవు నాకు అపరిచయుడవు, రెండు విధములుగా మనము అపరిచయులము. ఇప్పుడు, ప్రభువైన యేసు నీవు ఎవరైనది, నీకు ఏమి కావలసినది మరేదైన చెప్పిన, కేవలము అదే చెప్పుదును; ఆయన నీకేమీ చెప్పునో, నీకేమి కావలయునో నాకు చెప్పును. ఇప్పుడు, దేవుడు దానిని ఇంతకు మునుపే నీకు ఇచ్చియున్నాడు. ఒక విషయము మాత్రము, దానిని నమ్మునట్లు కేవలము విశ్వాసము కలిగియుండుము.

ఇప్పుడు, ఎందరు దానిని అర్థము చేసికొంటిరి? నీవు అడిగినది పొందుకొనుటకు చాలిన విశ్వాసము మాత్రమే అవసరము! చూచారా?

62ఇప్పుడు, ఇక్కడకు వచ్చిన మీరు మరేదైన అక్కర్లను కలిగియుండిన, ఆయన ఆ మీ ఆక్కరను నాకు తెలియజేయును, అప్పుడు మీరు, మీ కోరిక నాకు తెలియదని, ఎరుగుదురు, అప్పుడు ఇక్కడ అటువంటి కార్యములు చేయుచుండినది ఏదో ఇచ్చట నుండి తీరవలెను. ఆయన ఆ విధముగా చేయుదునని వాగ్దానము చేసిన వాక్య ప్రకారము ఇప్పుడు నుండవలెను. ఆయన వారి హృదయాలోచనను ఎరిగెను. అది నిజమేనా? మంచిది.

నీవు స్వస్థత పొందవలెనని గొప్ప ఆశ ఉన్నది, ఒక విషయము, నీవు ధైర్యము చెడిన స్థితిలో, వాస్తవముగ నరముల ఉద్రిక్తతో, బాధపడుచున్నావు. అది నిజమే. మరొక విషయము. నీకు వీపు నొప్పి అను ఇంకొక వ్యాధి కలదు, ఆ వీపు శస్త్ర చికిత్స చేయించావు. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది సత్యమే. గమనించుము. అది సరియే. మరొక విషయము, ఆత్మ బాప్తిస్మము పొందవలెనని గాఢమైన కోరిక ఉన్నది. అది ఖచ్చితముగా సత్యము. నీవు ఇక్కడకు రమ్ము.

ప్రియదేవా, యేసుక్రీస్తు నామమున ఈ మనుష్యుడు పరిశుద్ధాత్మతో నింపబడును గాక, అవసరతలు అనుగ్రహించుము, యేసు నామమున ఆమేన్. నా సహోదరుడా, ఇప్పుడు నీవు దీనిని పొందుకొనుము, కేవలము విశ్వాసముంచుము - సందేహించవద్దు.

63మీరెట్లున్నారు? నేను ఎరిగినంతవరకు మనమిరువురము ఒకరి నొకరు అపరిచయులమని అనుకొనుచున్నాను. అది నిజమైనయెడల, నీ చేతిని పైకెత్తుము, అప్పుడు ప్రజలు మనము అపరిచయులమని గుర్తించగలరు. నాకు తెలిసినంత వరకు నా జీవితములో ఆ స్త్రీని ఎన్నడు చూడలేదు. మరియు ఆమె కూడ నన్ను ఎన్నడును చూచియుండలేదని ఊహించుచున్నాను, బహుశ ఇప్పుడు ఈ సమాజము మధ్యలో నన్ను చూచియుండవచ్చును. పరమ తండ్రి, ఎరుగును, ఎట్లనగా, ఆయన వాక్యముగా ఇక్కడ ఉన్నాడు. నా జీవితములో నేను ఎరిగినంతవరకు ఆ స్త్రీని ఎన్నడు ఎరుగను. కాబట్టి, నీవు ఎవరైనది, ఇక్కడికి ఎందుకు ఇచ్చటకు వచ్చినది లేదా నీ యొక్క విషయము నేను ఏమియు ఎరుగను. నీ విషయములో ఏ ఒక్కటి కూడ చెప్పలేను.

కేవలము ఒక విషయము, అది ఒక కృపావరము మాత్రమే. కొంత సమయమునకు ముందు దానిని వివరించినట్లుగా, ఆయన నాకు చూపించినది, చెప్పినది నేను చెప్పగలిగితిని, కేవలము సమీపించి వినండి. ఆయన చెప్పని దానిని నేను చెప్పజాలను. నాయంతట నేను ఏదైన చెప్పిన అది అబద్ధమగును. గమనించితివా? అది అబద్దముగా నుండును అయితే, ఆయన చెపితే, అది ఖచ్చితముగా నిజమగును. అదెన్నడెన్నటికిని తప్పిపోదు. దేవుడు ఉన్నంతవరకు అది తప్పు కానేరదు. చూచారా? గమనించుము, ఎట్లనగా దేవుడెన్నటికి తప్పడు.

64అయితే, దేవుడు నీ విషయము, నీకేమి కావలసినది, నీ కోరిక ఏమిటో, నీవు ఇచ్చటకు ఎందుకు వచ్చినది, నీవు చేసినది ఏదైనను, అలాంటి కొన్ని విషయాలు, నీవు ఎవరైనది లేదా నీవు ఎక్కడినుండి వచ్చినది మరేదైనను నాకు తెలిపినయెడల - దానిని మీరు నమ్మెదరా? మీకు కృతజ్ఞతలు.

ఒక విషయము, నీ కాలు బాధగా ఉన్నది. నీ కాలు నీకు చాల బాధ కలుగజేయుచున్నది. అది వాస్తవమే. నీ చేతిని పైకెత్తుము… స్త్రీలకుండు వ్యాధి నీకున్నది, స్త్రీకుండు సమస్య, స్త్రీ రుగ్మత. నీ హృదయములో ఒక భారమైన కోరిక ఉన్నది, ఎందుకనగా నీవు ఎవరినైనను, లేదా ఏదైనను పోగొట్టుకున్నావు. అది నీ కుమారుడు నీ ఇంటిని వదిలి పారిపోయాడు, అతడు తిరిగి వచ్చునట్లు నన్ను ప్రార్థించమని కోరిక కలిగియున్నావు.

పరలోకమందున్న దేవా, ఆమె బిడ్డను ఆమె యొద్దకు తిరిగి పంపుము. మార్గములో ఈ రాత్రి తిరుగుచున్న ఆ యౌవ్వనస్తుని పరిశుద్ధాత్మ ఆపును గాక! ప్రభువా, అతనిని తన తల్లియొద్దకు తిరిగి చేర్చుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

సమస్తమును ఎరిగిన ఆయన అతనిని నీ యొద్దకు పంపును. బాధపడవద్దు. ఇప్పుడే నమ్ముము, సందేహింపవద్దు. పూర్ణహృదయముతో కేవలము విశ్వాసముంచుము. తక్కిన దానిని దేవుడే చేయునని విశ్వసించుము.

MATT 9:20•

MARK 5:27,30,31•

LUKE 8:44-46•

JOHN 14:12

 

65ఈ మూడు, లేదా నాలుగు వివేచనలను, మరేదైనను విశ్లేషించి చెప్పేసరికి నేను గ్రుడ్డివాడనైనట్లుంటిని, నేను దానిని వివరించలేకపోతిని, ఏ విధముగానైనను నేను దానిని వివరించలేకపోతిని. "నీవు 45 నిమిషములు లేదా అధికముగా ప్రసంగించిన దానికంటే కష్టమా అని నీ యొక్క అర్థమా?" అని మీరు నన్ను అడుగుదురు. అవునయ్యా. మూడు గంటలు బోధించుట దీనికన్న సుళువు.

మన ప్రభువైన యేసు వస్త్రమును ఒక స్త్రీ తాకినది. ఈ ప్రజలు నన్ను తాకుటలేదు. అక్కడ ఒక స్త్రీ నిలువబడి నావైపు చూచుచున్నది. ఆమె నా శరీరము చుట్టు తాకినది, కాని ఆమెకు ఏమి జరుగలేదు, ఎందుకనగా నేను కేవలము మానవుడిని. అయితే ఆమే యేసును తాకవలెను. నేను నాకివ్వబడిన ఆత్మీయ వరము ద్వారా నా యొక్క అస్థిత్వము అంతమొందును. నేను ఏమి చూచెదనో దానినే నేను చెప్పుదును. గ్రహించితివా? అంతవరకే, ఆ స్త్రీ నన్ను తాకుటవల్ల ప్రయోజనమేమియు లేదు, కాని నా ద్వారా యేసును తాకినది. ఆ స్త్రీ యేసు ద్వారా ఆ విధముగా దేవుని తాకినది, అప్పుడు ఆమె విషయము ఏమిటో ఆయన ఎరుగడు. ఆమె ఆయన వస్త్రమును తాకినది, వెళ్ళి కూర్చుండెను. మరియు "నన్ను తాకినది ఎవరు?" అని ఆయన అడిగెను.

అప్పుడు అపోస్తులులు - "జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదేవడని అడుగుచున్నావే?" అనిరి.

యేసు - "ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని," చెప్పెను.

ఇప్పుడు, 'ప్రభావము' అనగా ఏమిటో మీరెరుగుదురా? బలము. ఒక స్త్రీ ఆయనను ముట్టినంతనే, ఆయన బలహీనుడాయెను, మరియు ఆయన దేవుని కుమారుడు ఆయన కృపవలన రక్షింపబడిన పాపియైన నా విషయమేమి? అది మరీ అధికముగా నుండును? దానిని మీరెరుగుదురు. ఎందుకనగా, "నేను చేసిన వాటికంటే అధికముగా నాయందు విశ్వాసముంచువాడు చేయునని ఆయన చెప్పెను. నీ తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, గనుక వీటికంటే అధికముగా మీరు చేయుదురు. గ్రీకు తర్జుమాలో (గొప్పవి) "గ్రేటర్" అను ఆంగ్ల పదమునకు అర్థము - "వీటికంటే అధికమైనవి నీవు చేయుదువు."

HEB 13:8

 

66ఇప్పుడు, ఈ స్త్రీని నేను ఎరుగను. ఆమె విషయము నాకేమి తెలియదు. ఇతర ప్రజలవలే ఈమె నాకు కేవలము అపరిచితురాలు. మేము ఒకరికి నొకరము కొత్తవారము. "మనము అపరిచయులమని ప్రజలు గుర్తించునట్లు నీ చేతిని ఎత్తుము. ఇప్పుడు దేవుని కుమారుడు ఒక సమయమున ఒక స్త్రీని ఒక బావి దగ్గర కలిసి కొన్ని నిమిషములు మాట్లాడుచుండిన చిత్ర దృశ్యమునందు ఆయన ఆమె స్థితిగతులను ఎరిగెను మరియు ఆమె శ్రమను లేదా సమస్య ఏమిటో చెప్పెను. మరియు దానినిబట్టి ఆమె ఆయనను మెస్సియా అని గుర్తించినది. ఇప్పుడు మీరు నన్ను తాకిరి, నేను మిమ్మును తాకితిని కాని ఏమియు జరుగలేదు. (నాకివ్వబడిన ఆత్మీయ వరము ద్వారా) గల మీ విశ్వాసముతో ఆయనను తాకినయెడల, సుకారునందు గల బావియొద్ద జరిగినట్లు ఆయన నా ద్వారా మీతో మాట్లాడుట గుర్తించగలవు. గ్రహించితివా? ఆయన నిన్న, నేడు మరియు యుగయుగములు ఒకే రీతిగా ఉన్నాడు, దానిని మీరు నమ్ముతున్నారా?

నీకు అనేక శ్రమలు, అనేక వ్యసనములు, చిక్కైన సమస్యలు కలిగియున్నావు! వీటన్నిటికంటే ముఖ్యముగా కీళ్లనొప్పుల వ్యాధి నిమిత్తము ప్రార్థింపవలెనని కోరుచున్నావు. అది నిజము. అది వాస్తవమేనా? ఈ కీళ్లనొప్పుల రోగము చేత నీవు బిగుసుకు పోవుచున్నావు. ఆ స్థితి నీవు కలిగిన నీ చెయ్యి పైకెత్తుము…

67నాకు జ్ఞాపకమున్నంతవరకు నీవు నెమ్మదిగా నడుచుచున్నావు. ఒక నిమిషము ఆగండి. మరి కొంత ఏదో చెప్పబడనున్నది అదేమనిన… ప్రజలు నెమ్మదిగా దీనికి విరోధముగా, నేను ఏదో ఊహించి చెప్పుచున్నట్లు వారు చెప్పుట మీరును ఎరుగుదురు.

నీవు ఒక మంచి వ్యక్తిగా నుండినట్లు తెలియచేయబడుచున్నది. ఇంతకు ముందు కొద్ది సమయము నాతో మాట్లాడితివి. కొంత సమయము ఇక్కడ నిలువబడుము, ఎందుకనగా నీ హృదయములో మరేదో దేవునియొద్ద నుండి పొందవలెనని కోరికయున్నది. ఇప్పుడు నేను నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేను, కాని ఆయన ఇవ్వగలడు… ఏలయనగా నీవు విశ్వాసముంచినయెడల నీ ప్రార్థనకు ముందుగానే జవాబు ఇవ్వబడినది. నీకు విశ్వాసము కలిగించుటకు నేను ఇప్పుడు ఈ విషయములను చెప్పుచున్నాను. నీ యొక్క ఒక ప్రియ వ్యక్తిని గూర్చి, ఆతడు నీ సహోదరుడు, అతడు ఈ దేశములో లేడు. అతడు కొన్ని సంతవ్సరముల నుండి అనేక వాగులు కలిగిన దేశము మిచిగన్లో ఉన్నాడు. అతడు మరణకరమైన రోగముతో బాధపడుచున్నాడు. అది బాగుపడని మూత్రపిండ వ్యాధితో బాధపడుచున్నాడు. అది వాస్తవము. సరియేనా? అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," మాటయైయున్నది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న రుమాలును, దేవుని వైపు ఎత్తి, దానిని నీ సహోదరునికి పంపుము. సందేహింపక, నమ్ముము. నీవు స్వస్థత పొందుదువు అని అతనితో చెప్పుము. నమ్మినయెడల అతడు స్వస్థతపొందును.

68నీ హృదయ పూర్వకముగా నమ్ముచున్నావా? చూడుము, నీవు కేవలము విశ్వసించినపుడు, నీవు ఒక కార్యము మాత్రము చేయవలెను, నీవు సంపూర్ణముగా అంగీకరించుము. అది సరియేనా?

ఇప్పుడు మీరు అనవచ్చును - "ఆయన తన ప్రజలవైపు చూచుచున్నాడు. అతడును అదే చేయుచు వారిని చూచుచున్నాడని." అంతవరకే మీరు చూడగలుగుచున్నారు!

అయితే, ఆ విషయము బహుశ మీరు సరిగా ఎరుగలేదు… అక్కడ ఉన్న ఆ స్త్రీ ఇక్కడకు వచ్చినది, ఒక వ్యాధిగ్రస్తురాలు, నీవు ఎవరైన ఉండవచ్చును. నేను ఆమె వైపు చూచుటలేదు. నీ బాధ ఏమిటో దేవుడు నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? నీ చేతులను పైకెత్తుము నీవు చేయగలిగినచో, అక్కడ ఉన్న ఆ స్త్రీ, ఆ స్త్రీ ఒక రోగియై ఉన్నది. మంచిది, ఇప్పుడు నీ హృదయ పూర్వకముగా నమ్మినయెడల, ఉబ్బస రోగ బాధ నిన్ను మరెన్నడును తొందరపెట్టదు. మంచిది, ఇప్పుడు ఇంటికి వెళ్లుము, నీకు కలిగిన స్వస్థతపై విశ్వాసముంచుము!

69కేవలము చూడుము, అది అక్కడ ఉన్నది. ఈ ప్రక్క నుండి చూడుము, అది ఏమైనా పర్వాలేదు, దర్శనము కనబడుచున్నది. ఆమేన్! నీవు దానిని చూడలేవా? దేవుడు ఏ విధముగా పరిపూర్ణుడైయున్నాడో, అది అంత పరిపూర్ణమైనది!

నీవు కూడ నమ్ముచున్నావా? ఆ ఉబ్బస రోగము నిన్ను కూడా విడిచిపోవును, ఆ విధముగా జరుగదా? ఆ వ్యాధి నిన్ను విడచిపోవునని నమ్ముచున్నావా? మంచిదే, ప్రభు యేసు నొద్దకు వెళ్ళి, నీయందు విశ్వాసముంచుచున్నానని చెప్పుము.

ఏదైన ఒక దినమున నీ కీళ్ల నొప్పుల వ్యాధి నిన్ను కుంటివానిగా చేసినయెడల, నీ చుట్టు కేను కర్రతో కట్టబడి సహకరించునట్లు చేయవలసివచ్చును, కాని అది నీకట్లు సంభవింపదు. ఆ రీతిగా జరుగదని నీవు విశ్వసించుచున్నావా? నీవు స్వస్థత పొందుదువు అని విశ్వసించుచున్నావా? నీ మార్గమున నీవు వెళ్లుము, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.

గుండెజబ్బు మనుష్యులను చంపును, అయితే అది నిన్ను చంపదు. దేవుడు నిన్ను స్వస్థపరచి, బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? పూర్ణహృదయముతో, "ప్రార్థన చేయుటవలన నేను స్వస్థత పొందితిని," అని చెప్పుచు, విశ్వాసముతో వెళ్లుము.

70నీవు ఇంగ్లీషు మాట్లాడగలవా? ఇంగ్లీషు నీకు అర్థమగుచున్నదా? [సహోదరుడు బ్రెన్హాం - అనువాదము చేయుటకు ఎవరైన ఉన్నారా? అని అడుగుచున్నాడు, అనువాదము చేయు ఒకడు వచ్చుచున్నాడు - సంపా.] మంచిది. నేను ఆమెకు చెప్పునది నీవు చెప్పగలవా? నీవు ఆమెతో - నీవు నమ్మినయెడల, నీ కడుపు నొప్పి పోవును, అని చెప్పుము. ఆమె నమ్ముచున్నదా? నీ వెన్ను నొప్పి కూడ నిన్ను విడిచిపోవును, ఇప్పుడు నీ మార్గమున నీవు వెళ్లుము, నీవు బాగుపడెదవు.

మీరెలాగున్నారు? నీవు నమ్ముచున్నావా?

ఒక మనుష్యుడు వెన్ను నొప్పిని కలిగి అచ్చట కూర్చుండి నా వైపు చూచుచున్నాడు, నేను దాని విషయము చెప్పినప్పుడు నమ్మినయెడల అతడు కూడా బాగుపడును, అయ్యా, నీవు నమ్మినయెడల బాగుపడును. అయ్యా, మంచిది.

అచ్చట సరిగా నీ ప్రక్కన కూర్చున్న స్త్రీ - నీకు మెడ నొప్పి బాధ కలిగియున్నావు, ఆ విధముగా నీకు లేదా, ఓ స్త్రీ? దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? ఆ చిన్న బాలునిపై చెయ్యి ఉంచాలని నీ కోరిక, అతని మోకాళ్ళ నిమిత్తము, అతడు కూడ బాగుపడును. అది నీవు నమ్ముచున్నావా? నీకు స్త్రీ సంబంధమగు వ్యాధి ఉన్నది. నీ విశ్వాసము నిన్ను సంపూర్ణముగా స్వస్థపరచెను. ఇక ఆ వ్యాధి నీకు లేదు.

71"యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు యుగయుగములు ఒకే రీతిగా ఉన్నాడు," అని మీరు నమ్ముతున్నారా? కాబట్టి మనము మన చేతులను ఒకరిపై ఒకరు నుంచి విశ్వాస సహితమైన ప్రార్థన చేయుదము, మనలో ప్రతి ఒక్కరము విశ్వాస సహితమైన ప్రార్థన చేయుదము.

ప్రియదేవా, ఈ జనసమూహము మధ్య మీరు సంచరించుటకు, ప్రతి స్థలమందున్న రోగులను బాగుచేయుట చూచుటకు మీ దైవిక, ప్రసన్నతో మమ్మును కప్పితివి. నీవే దేవుడవు. ఈ జనసమూహమంతటిని స్వస్థపరచుమని నేను ప్రార్థించుచున్నాను. దేవుని యొక్క విశ్వాసము నూతనముగా వీరి హృదయములోనికి రానిమ్ము, సమయము గతించి పోవుచున్నదని (చెయ్యి దాటిపోవుచున్నది) వారు ఎరుగనట్లు చేయుము. మేము ప్రేమించుచున్న ఆయనతో ఉండబోవు కాలముకంటే ఇప్పుడు మేముండు కాలము. కేవలము ఇది బహు స్వల్ప సమయమై ఉన్నది. మరియు మీ ప్రసన్నత ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించును గాక.

మేము సాతానుని దోషిగా చేయుచు, వాని క్రియలన్నింటిని ఖండించుచున్నాము. యేసుక్రీస్తు నామమున సాతానా, ప్రజలలో నుండి వెలుపలికి రమ్ము.

మేమంతా ఆయన యందు విశ్వాసముంచుచు, మా స్వస్థతను అంగీకరించుచున్నాము. నిలువబడి, "నా స్వస్థతను నేనిపుడు అంగీకరించుచున్నాను, దానిని నేను నమ్ముచున్నాను," అని చెప్పండి. నీవెట్టి స్థితిలో నున్నను, నీవు నిజముగా విశ్వసించినయెడల, లేచి నిలువబడెదము. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి - "ప్రభువైన యేసూ, నన్ను స్వస్థపరచినందులకై నీకు వందనములు," అని చెప్పుడి. దేవుడు మీతో ఉండును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...