కరుణా సంపన్నుడయిన దేవుడు

కరుణా సంపన్నుడయిన దేవుడు

1నేను ఒక విధంగా క్రిక్కిరిసిపోయి ఉన్నాను, లోనికి వచ్చి సహో. మూర్ మరియు ఇక్కడున్న వారందరినీ, ఎన్నో సంవత్సరాల నుండి నాకు తెలిసిన స్నేహితులను ఇక్కడ ఈ వేదిక మీద చూచాను. ఈ రాత్రి ఇక్కడ వారిని చూచుట నిశ్చయంగా ఒక భాగ్యము. నా వెనుక అటువంటి వేదాంత పండితులు ఉండగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుటకు చిన్న వానిగా భావించుచున్నాను. నేను తప్పు చెప్పినప్పుడు బహుశా వారు నన్ను సరిదిద్దుదురు. ఆలాగు నేను ఆశించుచున్నాను.

ఈ రాత్రి ఇక్కడ ఒక ప్రత్యేకమగు వ్యక్తిని కలిగియున్నందుకు మేము చాలా సంతోషించుచున్నాము, ఆమె సోదరి రోజ్. ఒక చిన్న విందు కొరకు నేను సహో. షోర్స్ మరియు అతని సహకునితో ఈ రోజు మేము వచ్చుచున్నాము, దారిలో వస్తూండగా సహో. విలియమ్స్ సోదరి రోజ్ చాలా జబ్బుగా నున్నదని చెప్పెను, ఒక్క క్షణము ఆమెను చూచుటకుమేము వెళ్ళాము, మోకరించాము, మరియు ఆమెకు తీవ్ర జ్వరము నుండి, నిజంగా జబ్బుగా ఉండెను. కొద్ది మాటలతో ప్రార్థించాము. ప్రభువు మాతో మాట్లాడెను. "ఆమె బాగుపడనున్నదనియు, రేపు రాత్రికి అక్కడ ఆమె ఉండుననియు చెప్పెను." ఆమె ఈ రాత్రి ఇక్కడున్నది, ఇక్కడే కూర్చొని యున్నది.

2సోదరి రోజ్, ఒక్క నిమిషముపైకి లేచి నిలబడుము… ప్రభువుకు మనము వందనములు చెల్లించవలెను.

ఆమె తిండి లేకుండా మంచము పట్టెను. ఆమె ఈలాగు చెప్పెను, "దయ్యము నా వద్ద నుండి అంతా తీసివేసికొన్నది, ఇక్కడకు నేను వచ్చాను, దీనితో మొత్తబడ్డాను." ఒక విధమగు గొంతు వ్యాధి మొదలగునవి వచ్చినవి, కాని ప్రభువు వాటన్నిటి గుండా ఆమెను విడిపించెను. అందుకు మనము సంతోషముగా ఉన్నాము. ప్రియ ప్రభువుకు వందనములు!

ఇపుడు మనము అద్భుతమగు సమయములను కలిగియున్నాము, మరియు రేపు రాత్రికి, రమాడాకి తరలిపోదుము. ఇపుడు, దీనిని మరచిపోవద్దు, రేపు రాత్రికి ఇక్కడ ఉండదు, రమాడాలో అది యుండును, మరుసటి రాత్రి కూటము ప్రారంభమగును. మరొక్క రాత్రి నాతో మీరు ఉండవలసియున్నది.

3గనుక గత రాత్రి నేను పరిమితి దాటి పోయాను… సంవత్సరపు ప్రారంభంలో వర్తమానములను మూడు లేదా నాలుగు లేక అయిదు గంటల నుండి దాదాపు ముప్పది లేదా నలుబది నిమిషములకు కుదించుదునని ఒక విధమగు చిన్న వాగ్ధానము నాకు నేనే చేశాను. గత రాత్రి నేను చెప్పిన రీతిగా నా భార్య ఆదివారము నాతో ఇట్లన్నది, "మీరుచాలా చక్కగా చేశారు." అయితే గత రాత్రి ఆ సమయ హద్దును మీరి నాశనం చేశాననుకోండి. గతరాత్రి ముప్పది నిమిషములకు బదులుగా ఏబది అయిదు నిమిషములు తీసికొన్నాను.

ఈ రాత్రి వచ్చుచుండగా బిల్లీ ఇట్లనెను, "దేనిపై మీరు మాట్లాడుదురు?"

"సరే, నేను కొన్ని చిన్న సూచనలు ఇక్కడ వ్రాసికొనియున్నాను, కొన్ని లేఖనములు వ్రాసి యుంచాను, నాకు తెలియదు. అందులో కొన్ని నాలుగు లేక అయిదు వేర్వేరు వర్తమానములున్నవి. అక్కడికి వెళ్ళినపుడు ఏది చెప్పవలెననుకొందునో అది చెప్పెదను. ఏమి జరుగునో చూద్దాం," అని చెప్పాను.

"ఆ రోగులందరికి ప్రార్థించెదనని వాగ్ధానము చేసారు కదా?" అన్నాడు.

"అవునయ్యా! ఎన్ని కార్డులు వచ్చాయి?" అనడిగాను.

"రెండువందలు" అన్నాడు.

"అయితే ఈ రాత్రి వాటిని ప్రారంభించుట మంచిది," అని చెప్పాను.

అతడిట్లు చెప్పెను, "మాట్లాడుటకు మీకు పదిహేను నిమిషములు మాత్రమే ఉన్నవని ఇప్పుడు గుర్తుంచుకొనండి. దానిలో తక్కినదంతయూ మీరు గత రాత్రి తీసికొన్నారు." పదిహేను నిమిషములు. మనము తొందరపడవలెను, నేను తొందర పడాలి కదా?

4ప్రార్థన కార్డులు గలవారికి ప్రార్థన చేయుదునని మేము వాగ్ధానము చేశాము. మేము ఆ వాగ్థానమునకు కట్టుబడియుండవలెను. ఈ వరుసల గుండా వారినందరినీ మేము తీసికొని రాలేము. ఆలాగే బయట జనములో నుండి వ్యక్తిగతముగా నేను పిలువజాలను కూడా. పరిశుద్ధాత్మ దానిని నాకు ఇచ్చినా గాని, దానిని జరిగించుటకు నేను నిలవజాలను. అది నాకు మించినపని.

కాని వాటన్నింటితో మనకు పరిచయమున్నది. దేవుడు ఇంకనూ దేవుడేనని మనకు తెలియును. స్వస్థపరచునది అది కాదు; అయితే అది మాత్రమే విశ్వాసమును కట్టును, ఆయన సన్నిధానములో మనమున్నామని మనకు తెలియచేయును. ప్రార్థన కార్డులున్న వారందరికీ, ప్రార్థన కావలసిన వారందరికీ, ఆ రోగులందరికీ ఈ రాత్రి మేము ప్రార్థించనైయున్నాము.

రేపు రాత్రి రమాడా యొద్ద మరికొన్ని ఇచ్చుటకు ప్రయత్నించి అక్కడ వారి కొరకు ప్రార్థించ ఆరంభించుదుము, ఎందుకనగా ఇంకా నాకు రేపురాత్రి యున్నది, ఒక రాత్రి కూటము ఉన్నదనుకొంటాను. అల్పాహారము కూడా నాకున్నదనుకొంటాను, అదంతా సంగతులు జరుగుటపై ఆధారపడియున్నది.

5అక్కడ కొందరున్నారు, ఆ ప్రసంగీకులలో ఒకరు ఎన్నడూ బహిర్గతముగా రానేలేదు, ఇంకా రాలేదను కొంటాను, వచ్చినట్లుగా నేననుకోను, సహో. హంబర్గ్ లేక … [ఏంబర్గీ అని ఒక సోదరుడు చెప్పెను] ఏంబర్గీ. ఏంబర్గీ. కాష్ ఏంబర్గీ. నేను అంతా తప్పు చెప్పాను. అది జర్మను పేరు. అది జర్మను పేరు అనుకొంటాను, కనుక నేను ఏదో చిన్న మొదలు పట్టుకొన్నాను. ఆయన గూర్చి నేను చెప్పిన దానిని బట్టి క్షమించండి.

ఏమయినను ప్రభువునందు అద్భుతమగు సమయమును మనము కలిగియున్నాము. మీ అందరికి చెప్పుచున్నాను, ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా క్రొత్తవారున్నచో మిమ్ములను ఆనందముతో ఆహ్వానించుచున్నాము. ప్రభువు మిమ్ము దీవించునని నమ్ముచున్నాము. ఈ రాత్రి మనము ఇక్కడ నుండి వెళ్ళిపోవునప్పటికి ఏ ఒక్క వ్యాధిగ్రస్తుడు ఈ భవనములో ఉండ రాదని నేను ప్రార్థించుచున్నాను. మన ప్రభువు తనయొక్క మహాశక్తితో దిగివచ్చి రోగులను, బాధపడుచున్నవారినందరినీ స్వస్థపరచును.

6ఇక్కడ కొద్ది కాలము క్రిందట, కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూపై వ్యక్తులను స్వీకరించుట వాడుకగా నాకుండెడిది. మనము ఊహించజాలని కొన్ని కఠినమగు కేసులు. ప్రభువు దానిని ఆశీర్వదించుట ప్రారంభమై చివరకు మూడు నాలుగు వందల మంది వరకు వేచియుండు విధముగా అది పెరిగి పోయినది. వారు వేచియుండవలసి వచ్చినందున కొందరు జనులు తమకు బాధ కలిగినట్లుగా భావించుట జరిగినది. అందులోనికి వెళ్ళుటకు సుమారు ఒక్క సంవత్సరము వేచియుండుట చాలా ఎక్కువకాలమే. చూడండి. కూటముల మధ్యలో వారిని ఇంటర్వ్యూ చేసికొనుట జరిగెడిది. ఆ కేసు ఏమిటో ప్రభువు ఖచ్చితంగా చెప్పే వరకు మేము కూర్చొని కనిపెట్టిడి వారము. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూతో వచ్చి కూర్చొన్న వారు. ఈ రాత్రి ఇక్కడున్నారని నిస్సందేహముగా చెప్పగలను. ఉన్నారా? మీరు చేతులెత్తినచో చూచెదము, ప్రత్యేక ఇంటర్వ్యూ ఆహ్వానములతో వచ్చిన వారు. అవును, అక్కడ కూర్చునియున్నారు, కనుక అది నిజమని నేను ఎరుగుదును. ప్రభువు ఏమి చెప్పునో వేచి చూద్దాం. ఆ కేసు ఏమిటో…

ఇక్కడ దానిని కొంత సమయము క్రిందటనే నేను ఆపవలసియున్నాను. మరెట్టి ప్రైవేటు ఇంటర్వ్యూకు చోటివ్వరాదని బిల్లీతో నేను చెప్పాను.

HEB 13:8

 

7చూడండి. నేను ఈ మధ్యనే ఇరవై ఐదును దాటాను, రెండవసారి. మూడోసారి దాటుటకు ఎదురు చూస్తున్నాను. కొద్దిగా ముసలివారగుచున్న కొలది… ఏలాగయినా గాని ఇంతకు ముందున్న రీతిగా మీరు ఉండలేరు. మీ అడుగులు తడబడును. సహో. మూర్. ఇంకనూ అటువంటి దాని గూర్చి ఏమియూ ఎరుగడు. అతడు… మేమందరము దాదాపు ఒకే వయస్సులో ఉన్నామనుకొంటాను.

సహో. పుల్లర్, సహో. గార్సియా, సహో. అవుట్‌లా తో ఇక్కడికి మొదటిసారిగా నీవు, నేను సహో. బ్రవున్ వచ్చినప్పటి నుండి నదిలో నీరు ఎంతో ప్రవహించిపోయినది. ఈ రాత్రి వారిచ్చట ఉన్నారేమోనని నేను ఆశ్చర్యపడుచున్నాను. సహో. గార్సియా, సహో. పుల్లర్, సహో. అవుట్‌లా ఇచ్చటున్నారా? ఇక్కడున్నట్లయితే చేతులు ఎత్తండి. అవును. అక్కడ పుల్లర్ సోదరుడున్నాడని నమ్ముచున్నాను. నేను పొరబడలేదనుకొంటాను. సహో. అవుట్లా ఇక్కడున్నాడు, సహో. గార్సియా ఫీనిక్సుని విడిచి పెట్టినని నమ్ముచున్నాను. అది సరియేననుకొంటాను. అతడు, ఫీనిక్సు విడిచిపెట్టి కాలిఫోర్నియాలో ఉన్నాడు. సరే. అవి గొప్ప దినములు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అను ఒకే వర్తమానమును అప్పటి వలెనె ఇప్పుడును ఇంకా నమ్ముచున్నాను.

అదంతయూ… బెకీ చిన్నపిల్లగా ఉన్నప్పటి సంగతి. దాదాపు పందొమ్మిది సంవత్సరముల నాటి మాట. ఇపుడామె ఒక పెద్ద, వయస్సు వచ్చిన, లావుగా, అందవిహీనంగా ఉన్న స్త్రీగా అక్కడెక్కడో కూర్చొని యున్నది. పందొమ్మిది సంవత్సరముల వయస్సు. బెకీ, నీవు ఎక్కడున్నావు? దాని గూర్చి నన్ను పట్టుకొంటుంది. నా చేతితో ఆమెను తీసికొని ఎత్తికొనుట నాకు గుర్తున్నది. ఈ రాత్రి అదే పని నాకు చేయుటకు నిశ్చయముగా ఉన్నది.

8ఒక రాత్రి సహో. గార్సియా యొక్క సంఘము వద్ద జరిగినది గుర్తున్నది, ఆమె ఒక చిన్నపిల్ల, నేనిట్లు చెప్పాను, "ఈ రాత్రి మాకు ఒక అంతర్జాతీయ కూటమున్నది. నేను స్పానిష్ వారితో మాట్లాడనై యున్నాను." "నా భార్య ఇక్కడ ఒక జర్మను, నేను ఐరిష్ వాడిని," నా చిన్నపిల్ల, అనగా బెకీ ఒక ఇండియను," అని నేను చెప్పాను. నేను ఆ వెనుక తలుపు నొద్దకు వెళ్ళేసరికి అక్కడున్న ఒక చిన్న మెక్సికను బాలిక "సహో. బ్రన్హం" అన్నది.

"ఏమ్మా? ఏం కావలెను?" అనడిగాను.

"నీ కుమార్తె ఇండియను రంగుకంటె కొద్దిగా తెల్లగా ఉన్నదని నీవు తలంచుట లేదా?" అన్నది. ఆమెది ఒక విధమగు ఎర్రని జుట్టు.

"చేతల్లో ఇండియను వలె ఉన్నది," అని నేనన్నాను.

మంచిది, మరల ఈ రాత్రి ఇక్కడుండుటకు వందనములు చెల్లించుచున్నాను. ఇపుడు వాక్యమును సమీపించు ముందుగా ఆయనను సమీపించుదము, ఏలయనగా ఆయనే వాక్యము. వాక్యము ప్రత్యక్షమయినప్పుడు, ఆయనే మీతో ఉండును.

9గత రాత్రి "బేధమైన విత్తనమును" చెప్పుకొన్నాము. దానిని మీరు అభినందించుచున్నారా? దేవుడు మిమ్ము దీవించును గాక. మీకు ఆ వర్తమానమును తెచ్చుటకు తప్పక నేను అభినందించుచున్నాను. ఆ విత్తనములు ఏమిటో మనము చూస్తున్నాము.

ఇప్పుడు, ఏదైనా ఒక ప్రత్యేకమైనది, ఒక ప్రత్యేక మనవి ఈ రాత్రి యున్నదా? ఈ ప్రార్థనవరుసలో ఉన్నవారందరునూ, దేవా, నాకు దయచూపుము. ప్రార్థించబడుటకు నేను వచ్చునపుడు, ఆ షరతులను నెరవేర్చుటకు నా విశ్వాసము ఎత్తబడునట్లు కృప చూపుము, అని చెప్పెదరు. ఎవరికయినా తమ ప్రియులు లేక మరెవరో రోగులుగా నున్న వారు ఉండి యుండివచ్చును. దేవుడు చెప్పునట్లుగా మీరు చేతులెత్తి… ఇపుడది … అక్కడ ఆలాగు చూచుట నాకెంతో బాగుండును. ఇక్కడున్న అక్కర చూచుట! సేవక సోదరులారా, దాని వైపు చూడండి. చూచారా? ఆ విధముగా ఉండునట్లు అది నన్ను చేసినచో మన తండ్రికి అదెట్లు చేయును? నిశ్చయంగా.

ఇపుడు ప్రార్థించుదము.

ACTS 4:12•

ROM 8:37

 

10ప్రియ యేసూ, ఈ అన్నిటికి చాలిన నామము ద్వారా ఇపుడు ఆ గొప్ప కృపా సింహాసన మును మేము సమీపించుచున్నాము. రక్షించబడుటకు మనుష్యుల మధ్య ప్రభువైన యేసు నామము తప్ప మరేదియూ ఇవ్వబడలేదు. మేము ఆయన నామములో వచ్చుచున్నాము. నిన్ను నమ్ము బిడ్డలముగా ఈ రాత్రి మమ్ములను నీవు చేర్చుకొనుమని పరమ తండ్రీ, నీకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, మా అవిశ్వాసమును క్షమించుము. మాకు అవసరముగానున్న ప్రతిదాని కొరకును దేవుని యొక్క ప్రతి మాటను పూర్తిగా మేము నమ్మునట్లుగా ఈ రాత్రి సహాయము చేయుము.

ఎత్తబడిన ఈ చేతుల వెనుక ఏమి యున్నదో నీకు తెలియును. అక్కడ వ్యాధి ఉన్నది, కొందరికి అంతర్గత బాధలు, కొందరికి ఆర్థిక ఇబ్బందులు, కొందరికి అలసట, కొందరు బహుశా వెనుకకు జారి, కొందరు పాపులుగాను ఉండి యుందురు. అవసరము ఏమి అయినప్పటికినీ, ఏ శత్రువువయిననూ ఎదిరించుటకు నీవు అధిక శక్తిమంతుడవు. కనుక ప్రభువా, ఈ రాత్రి మా శత్రువులను మేము గుర్తించి ఓడింపచేసి, మరణమగునట్లు చేయుటకు కృప చూపుమని ప్రార్థించుచున్నాను. మమ్ములను ప్రేమించి, మా కొరకు తన్ను తాను సమర్పించు కొనిన తన రక్తములో మమ్మును కడిగిన ఆయనను బట్టి మేము అత్యధిక జయశీలులము.

2CH 7:14

 

11సమస్త విశ్వాసము, సమస్త సందేహము, సమస్త నిరాశ, సమస్త దేవునిపట్ల అయిష్టత ఈ రాత్రి మా యొద్దనుండి ఎగిరిపోయి, పరిశుద్ధాత్మ మా హృదయాలలో సరయిన మార్గము కనుగొనునట్లు ప్రభువా, మేము ప్రార్థించుచున్నాము. మర్మమగు విధానములలో ఆయన మాతో మాట్లాడును గాక! తన శక్తితో ఆయన మనతో మాట్లాడును గాక! ఆత్మీయముగా చనిపోయినవారిని తిరిగి ఆయన పునరుద్దానపరచునుగాక. రోగులయి బాధపడుచున్నవారికి తిరిగి ఆరోగ్యమును చేకూర్చును గాక. సడలిన మోకాళ్ళను బలపరచును గాక, వడలి వ్రేలాడుచున్న చేతులను లేవనెత్తును గాక.

సంతోషకరమగు సమయము అనుగ్రహించబడును గాక! ప్రభువా, ఈ రాత్రి అది జరుగును గాక. ఈ స్థలమును విడిచి రమాడా సత్రమునకు, ఆ పట్టణములో ఎన్నడూ జరుగని పెద్ద కూటమును ప్రారంభించుటకు వెళ్ళుచున్నాము. ప్రభూ! మేము కూడుకొని ప్రార్థించుచున్నాము! "నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించినచో ఆకాశము నుండి వారి మొరను విందునని," నీవు చెప్పావు. దేవా, ఈ రాత్రి ఇది ఆలాగే అగుగాకని ప్రార్థించుచున్నాము.

ఇపుడు తండ్రీ, మేము వాక్యమును చదువుచుండగా, నీవు తప్ప మరెవరునూ అర్థము చెప్పజాలరు; నీకు నీవే స్వంత అనువాదకునివి. ఈ రాత్రి మేము ప్రార్థించుచున్నాము. దీనిని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్.

12ఇపుడు ఒక సేవకుడు చదువుచుండగా మీలో అనేకులు వాక్యములను గుర్తించుకొందురు. ఈ రాత్రి మీ కొరకు ఎఫెసీ పత్రిక తీయవలెనని కోరుచున్నాను. గత ఆదివారము ఎఫెసీ పత్రిక గూర్చి మాట్లాడుచుంటిని. యెహోషువా గ్రంథము పాత నిబంధన యొక్క ఎఫెసీ పత్రికగా నున్నదని చెప్పాను. అది ఎట్లు విమోచనా గ్రంథముగా నున్నదో వివరించాను. విమోచనలో రెండు వివిధ భాగములున్నవి, బయటకు వచ్చుట మరియు లోనికి ప్రవేశించుట. మొదటగా నీవు వెలుపలకు రావలెను. కొందరు జనులు తమతో పాటు లోకమును లోనికి తేగోరుదురు, కాని నీవు క్రీస్తులోప్రవేశించుటకు లోకములో నుండి బయటకు రావలెను. విశ్వాసములోనికి ప్రవేశించుటకు నీవు అవిశ్వాసము నుండి బయటకు రావలెను. నీ మార్గములో అది ఏ ఒక్కటి ఉండరాదు. నిజంగా అసలయిన విశ్వాసము నీవు కలిగియుండుటకు, విశ్వాసములో ప్రవేశించుటకు తప్పక నీవు దేవుని వాక్యమునకు విరోధమగు ప్రతి దానిని పూర్తిగా వెనుక విడిచిపెట్టవలెను.

యెహోషువా గ్రంథము పాత నిబంధన యొక్క ఎఫెసీ పత్రిక. ధర్మశాస్త్రమునకు ప్రాతినిధ్యము వహించిన మోషే రక్షించలేకపోయెను, కాని కృప ఆ పని చేయగలదు. ఇక్కడ యెహోషువా అనుమాట యేసు అనుమాట వంటిదే. యెహోవా రక్షకుడు.

మనము ఇపుడు మరియొక ఎఫెసీ పత్రిక యొద్దకు వచ్చినట్లుగా కనుగొనుచున్నాము - ఇపుడు మరొక ఎఫెసు - మన యొక్క తెలివితేటల శాఖలుమొదలగునవి, మన యొక్క విద్యా కార్యక్రమములు అన్నియూ యోర్థాను నొద్దకు వచ్చినవి. అపుడు మనము తప్పక తిరిగి ఒక ఎఫెసీని కలిగి యుందుము. బయటకు వచ్చుటకు మనకు తప్పక ఒక నిర్గమనము ఉన్నది. ఎత్తబడుటకు, లోనికి వెళ్ళవలెను.

EPH 2:1-5

 

13ఇపుడు ఎఫెసీ 2వ అధ్యాయముమనము చదువుకొనై యున్నాము. అంశము నొద్దకు మీరు వచ్చునట్లుగా నేను అది మీతో చెప్పుచున్నాను. అధ్యాయమును త్రిప్పండి.

మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రదికించెను.

మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధే యులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడచుకొంటిరి.

వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారివలెనె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

అయినను దేవుడు, కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినపుడు సయితము మన యెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రదికించెను. (కృప చేత మీరు రక్షింపబడియున్నారు.)

అక్కడ నుండి కొద్దిగా లేఖన వచనములోని భాగమును తీసికొనగోరుచున్నాను. కాని దేవుడు "కరుణా సంపన్నుడయిన దేవుడు."

EPH 2:1-4

 

14ఒకసారి చచ్చిన మీరు ఏలాగు ఆయనచే బ్రదికింపబడిరో అను దీనిని అపోస్తలుడగు పౌలు ప్రవక్త ఇక్కడ ఏలాగు ప్రస్తావించెనో మీరు గమనించాలని కోరుచున్నాను. ఒకసారి చచ్చిన మిమ్మును ఆయన బ్రదికించెను, పాపములలోను, అపరాధములలోను చచ్చిన వారయిరి; ప్రపంచ ధర్మము చొప్పుననడచుకొంటిమి; శరీర ఆశను బట్టి, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుచుంటిమి….

ఈ మార్పుకు కారణము ఏమిటి? చూడండి. దానికి కారణము ఏమిటి? ఒకసారి చచ్చిన మనము జీవించబడితిమి? తిరిగి సజీవులమైతిమి, అదే బ్రదికించబడుటకు అర్థము. మరణము నుండి జీవమునకు ఒక మార్పు కలిగినది, మరణము నుండి జీవమునకు మార్చబడుట కంటె ఒక మనిషికి జరుగు గొప్ప మార్పు మరొకటి లేదు. శారీరకంగా చనిపోవుచున్న ఒక మనిషి శారీరకంగా బాగయినచో అది గొప్ప సంగతి; అయితే ఆత్మీయంగా చనిపోయిన వానిని తిరిగి జీవమునకు దేవుడు బ్రదికించుట కంటె గొప్పది ఏదియూ లేదు.

EPH 2:1,4

 

15గత కాలములో మునుపు మీరు చనిపోయిరి, మీరు చచ్చిరి. ఇక్కడ ఈ రాత్రి ఉన్న వారిలో అనేకులు ఒకపుడు చనిపోయిరని వెనుకకు చూచునపుడు తెలిసికోగలరు. కాని ఇపుడు, ఈ రాత్రి మీరెందుకు చనిపోలేదు అప్పటివలె? ఆ విధముగా ఉండుటకు మీరు అర్హులు, ఎందుకనగా మీరు పాపులు. కాని దేవుడు, కరుణా సంపన్నుడు, అదే సంగతి! అక్కడే మార్పు కలిగినది. కరుణాసంపన్నుడగు దేవుడు!

ఓ! దానికొరకు నేనెంతో ఆనందించుచున్నాను, ఆయన కరుణాసంపన్నుడై యున్నాడు. ఆయన డబ్బులో సంపన్నుడయినచో, వస్తువులలో సంపన్నుడయినచో, ఆలాగు కూడా ఆయన సంపన్నుడే కాని ఇంకనూ గొప్ప సంగతి ఏమనగా కరుణా సంపన్నుడు. ఓ! ఎంత గొప్ప మాట అది!

ఒకప్పుడు మనము చచ్చిన వారము.

16విత్తనము ఎట్లు చనిపోవలెనో ఒక రాత్రి మనము చెప్పుకొంటిమి. ఆ జీవకణము చుట్టునున్నది మాత్రమే చనిపోవుట కాదుగాని క్రుళ్ళిపోవలెను. అది క్రుళ్ళిపోనిచో తిరిగి బ్రదుక జాలదు. క్రుళ్ళిపోవుట అనగా, పూర్తిగా నిర్మూలమై సమాప్తమగుట. మన స్వంత ఉద్దేశ్యములు, మన స్వంత ఆలోచనలు పూర్తిగా నిర్మూలమయి, మనలో నుండి అవి క్రుళ్ళిపోవు స్థితికి మనము వచ్చినపుడే జీవకణము జీవించనారంభించును.

ఇక్కడ మనము ఇక్కడ నేను కొద్దిపాటి సిద్దాంతమును లోనికి ఎక్కించ వచ్చును. కాని నేను చేయను, మీరది నమ్మనిచో మంచిదే. పరవాలేదు. నేను దానిని నమ్ముదును. ఈ లోకములోనికి ఒక మనిషి జన్మించినపుడు, నీవు చిన్న బిడ్డగా నున్నపుడు, లోకములోనికి వచ్చినపుడు దేవుని యొక్క ముందు జ్ఞానము లేకుండా నీవు ఇక్కడకు వచ్చుట జరుగదు. ఎందుకనగా ఆయన అనంతుడు, అన్నీంటినీ ఎరుగును. ఆ చిన్న బిడ్డ లోకములోనికి జన్మించినపునడు ఆ బిడ్డలో ఏదో ఉన్నది. అతడు ఎన్నడైనా జీవమును పొందవలెనన్నచో తొందరగానే, ఆలస్యముగానో అతడు పొందబోవునది ఆ బిడ్డలో అప్పుడే యున్నది. ఆ చిన్న బీజము అతనిలో ఉన్నది. మీరు తీసికొన్నచో దానిని గూర్చి వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది.

HEB 7:9,10•

1JN 3:2

 

17ఈ రాత్రి నీవు నిత్యజీవము పొందినచో, మనము నిత్యజీవము కలిగి యున్నచో దానిని ఎల్లపుడు మనము కలిగియున్నాము, ఎందుకనగా ఒకే ఒక రూపమగు నిత్యజీవమున్నది, మనమెల్లపుడు దానిని కలిగియున్నాము; ఆలాగు మనముండుటకు కారణము మనము దేవునిలో ఒక భాగము. దేవుడొక్కడే నిత్యుడగువాడు.

అబ్రహాము యొద్ద నుండి మెల్కీసెదెకు దశమభాగమును పొందిన రీతిగానే; అది ఇంకనూ అబ్రహాము యొక్క గర్భములోనున్న అతని మనమడగు లేవీకి వర్తించబడెను; దశమ భాగములు చెల్లించబడెను, ఎందుకనగా అతడు మెల్కీసెదెకును కలిసికొన్నపుడు ఇంకనూ అతడు అబ్రహాము యొక్క గర్భములో ఉండెను. ఒక ఉదయాన నేను మరొక స్థలములో దాని మీద మాట్లాడగోరుచున్నాను. ఈ మెల్కీసెదెకు ఎవరు? ఇపుడు దానిని గమనించండి, ఎప్పుడో దేవుడు ఈ కుర్రవాడు వచ్చుచున్నాడని ఎరిగి యుండెను. ఆయన సమస్తమూఎరుగును.

ఇపుడు మనము దేవునిలో ఒక భాగము. మీరెల్లపుడూ ఆలగే యున్నారు. అది మీకు గుర్తులేదు, ఎందుకనగా మీరు దేవునిలో ఒక గుణలక్షణమైయున్నారు. మీరు కేవలము ఆయన ఆలోచనలో యున్నారు. జీవగ్రంథములో మీ పేరు ఎన్నడయినా వ్రాయబడియున్నచో, అది జగత్తుపునాది వేయబడకముందే అక్కడ ఉంచబడియున్నది. మీరేమై యున్నారో ఆయన ఎరుగును.

18బోధను మిశ్రితము చేయుటకు కాదు గాని, మనము ఈ భయభీతుల నుండి దూరంగా పోవుటకు, దానిని స్పష్టీకరించుటకు నేను దీనిని చెప్పుచున్నాను. మీరెవరో మీకు తెలియదు. మీరు కాబోవుట లేదు గాని ఇపుడు మీరు దేవుని కుమారులు. చూడండి. మీరెల్లపుడూ దేవుని కుమారులై యున్నారు. చూచారా?

ఆదియందు దేవుడు తన ఆలోచనలో నిన్ను కలిగియున్నపుడు నీవు ఇపుడు నీలో కలిగియున్న నీ జీవము, నీలోని ఒక భాగము, నీవే, అపుడు దేవునితో ఉండియుంటివి. సరే. నీవు ఈ భూమి మీద శరీర సంబంధిగా రాకపూర్వమే, ఏమియూ లేనపుడే, నీవు ఆయన గుణ లక్షణములలో ఒక్కటిగా యున్నావు. నీపేరు ఏమై యుండునో ఆయనెరుగును. నీవు కలిగియుండు జుట్టు యొక్క రంగును ఆయన ఎరుగును. నీ గూర్చి పూర్తిగా ఆయన ఎరుగును.

అయితే నీకు జరిగిన ఒకే ఒక సంగతి, నీవు పాపిగా నుండినపుడు…

19ఈ ఆలోచనపై మీలో అనేకులు నాతో సహవాసము చేయగలరు. నీవు ఒక చిన్న బాలునిగా లేదా బాలికగా ఉండి అటు ఇటూ తిరుగుచుండినపుడు ఇతర పిల్లలు పట్టించుకోని కొన్ని విషయముల కొరకు నీలోనిది ఏదో మొరపెట్టినది. నీవింకా పాపిగా ఉన్నపుడే, ఎక్కడో దేవుడు ఉండియుండెను. అది నీకు గుర్తున్నదా? నిశ్చయంగా. ఇపుడు అది ఏమిటి? అది అపుడే నీలో ఉండిన చిన్న జీవరూపము.

అయితే కొంతకాలము తరువాత నీవు సువార్తను విన్నావు. బహుశా నీవు చర్చికి వెళ్ళి యుందువు. అది, ఇది నీవు తీసికొని యుందువు, శాఖ నుండి శాఖకు వెళ్ళియుందువు. కాని ఒక రోజున, దేవునిలో భాగముగా ఉన్నందున నీవు వాక్యములో భాగముగా ఉండవలసియున్నావు. నీవు ఆ వాక్యము విన్నపుడు ఎక్కడి నుండి వచ్చితివో నీవు తెలిసికొంటివి. సత్యమనగా ఏమిటో తెలిసికొంటివి. ఎల్లపుడునూ నీలో ఆ బీజము ఉండెను. నీతో నున్న ఆ వాక్యమును వాక్యము చూచెను — అది జగత్తు పునాది వేయబడక ముందే జరిగెను — వాక్యమును చూచి దాని యొద్దకు నీవు వచ్చితివి.

EPH 2:1,2

 

20నా చిన్న పక్షిరాజు కథ వలెనె, ఆ చిన్న పక్షిరాజు కోడిపెట్ట క్రింద పొదగబడెను. ఆ చిన్నది కోడి పిల్లలతో కలిసి తిరిగెను. పెట్ట పిలుపును పక్షిరాజు పిల్ల గ్రహించలేకపోయెను. ఆ చిన్న కోడి పిల్లలు - వాటి ఆహారముగాదె క్రింద యుండెను, అది దీనికి అర్థముకాలేదు. అవి ఎట్లు తినుచున్నవో గ్రహించజాలకపోయెను. కాని తనలో ఏదో ప్రత్యేకమైనదియున్నట్లు కనిపించెను, ఎందుకనగా ఆదిలోనే అది పక్షిరాజు పిల్ల. అది నిజము.

ఒక రోజున తన తల్లి వెదకుకొంటూ వచ్చెను, ఆ పక్షిరాజు కేకను వినగానే అది కోడెపెట్ట కూత కంటె వేరేగా కనిపించెను. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసియు ఆలాగే యున్నాడు. కోరిన పాండిత్యమునంతయూ నీవు వినవచ్చును, మనుష్యులు కల్పించినవి మతములను వినవచ్చును, కాని అక్కడ ఆ వాక్యము మెరిసిన వెంటనే దానిని గ్రహించునది ఏదో అక్కడ ఉండి నీవు దాని యొద్దకు వచ్చెదవు. ఒకపుడు నీవు పాపముతో చచ్చితివి, ఆ జీవితమును ఆయన బ్రదికించెను, బ్రదికించబడుటకు మొదటగా ఒక జీవితము అక్కడ ఉండవలెను. దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా అన్నింటిని ఎరుగును. మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలముగా ముందుగానే నిర్ణయించబడితిమి. ఒకపుడు పాపము, అపరాధములలో చచ్చిన మీరు ఆయనచే బ్రదికించబడితిరి. ఒకపుడు మనము అందరము ఆలాగే యున్నాము.

21పౌలు వైపు చూడండి. పౌలు ఒక గొప్ప వేదాంతి, అయితే అతడు యేసును అనగా వాక్యమును ముఖాముఖిగా ఎదుర్కొన్నపుడు అది బ్రదికించెను. వెంటనే అతడు జీవములోనికి వచ్చెను, ఎందుకనగా ఆ విధముగా నుండుటకు అతడు అభిషేకించబడెను. అతడు వాక్యము యొక్క భాగమై యుండెను. వాక్యము వాక్యమును చూచినపుడు అది అతని యొక్క స్వభావము, కోడ పెట్టల కూతల వలె ఉన్న సనాతన సంఘములు అతనిపై ఎట్టి ప్రభావమును చూపించవు. అతడు వాక్యమును చూచెను — అది అతనిలో భాగము. అతడు ఒక పక్షిరాజు; అతడు కోడిపిల్ల కాదు. అతడు కేవలము వాటితో ఆ గాదె యొద్ద నుండెను, కాని అతడు పుట్టుకతోనే పక్షిరాజు పిల్ల.

22అట్టి విధమగు మరో గాధను నేను విన్నాను (అది వ్యంగ్యముగా కనిపించదని అనుకొనుచున్నాను) ఒకసారి కోడి క్రింద చిన్న బాతు జన్మించెను. అది అర్థము చేసికోజాలకపోయెను — వింతగా కనబడుచున్న ఆ చిన్న బాతు ఆ ధూళి మొదలగు వానిని అర్థము చేసికోలేకపోయెను. అవి ఆ గాదె నొద్ద ఆడుకొనుచుండెను, కాని ఒక రోజున ఆ ముసలి పెట్ట చిన్న పిల్లలను గాదె వెనుకకు తీసికొని వెళ్ళెను. బాతు పిల్లకు నీటి వాసన తగిలెను. శాయశక్తులా ప్రయత్నించి నీటి వైపునకు వెళ్ళినది. ఎందుకు?ముందెన్నడూ చెరువులో అది ఉండలేదు. మునుపెన్నడూ నీటిలో దిగలేదు. కాని అది బాతు, పుట్టుకే అది. తన యొద్దకు తాను వచ్చుటయే అది చేయవలసిన పని.

విశ్వాసితో కూడా ఆలాగే యున్నది. దేవునిని ముఖాముఖిగా అతడు కలిసికొన్నపుడు. అతనిలో ఏదో యుండి, అతడు తన యొద్దకు తాను వచ్చును. ఆ విత్తనము అతనిలో ఉన్నది, అది బ్రదికింపబడినది. అది సరి. అతడు లోక సంగతుల నుండి ఎగిరిపోవును, అవి అతనికి చచ్చినవిగా కనబడును. నేను గుర్తుచేసికొనుచున్నాను, మనందరము గత మన జీవిత ములలో ఆ లోక సంగతులలో ఉన్నాము, కాని ఒకసారి ఆ నిజమగు వానిని మనము పట్టుకొని యుండగా ఏదో మనలను బ్రదికించెను — చిన్న బీజము జీవము పొందెను — అపుడు లోక సంగతులన్నియూ అక్కడే కుళ్ళిపోయినవి. దాని యొక్క కోరిక ఇక మనకు ఏదియూ లేదు.

GEN 6:7•

HEB 10:2•

1JN 3:9

 

23దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయజాలడు. ఒకసారి పాప పరిహారము పొందిన ఆరాధికునికి పాప మనస్సు ఇక ఉండదు, పాప కోరిక ఉండదు. పాపపు ప్రశ్న గతించి నది. క్రీస్తులో దేవుని యొక్క ఒక భాగముగా అయ్యెదవు. నిన్ను విడిపించుటకు, క్రీస్తు నీ కోసము చనిపోయెను. మనకున్నదంతయూ దేవుని కొరకు కాదేమో ఆలోచించండి, కాని దేవుడు తన కరుణా సంపన్నతలో ఈ రాత్రి ఎట్లు మనలను విమోచించెను! దేవుని యొక్క కరుణా సంపన్నత మన మీద లేనిచో, ఈ రాత్రి మనము ఎచ్చట ఉండి యుందుము?

ఒకపుడు లోకము ఎంతో పాపయుక్తముగా ఉండెను, భూమి మీదకు చెడుతనము వచ్చునట్లుగా మానవుడు కారణమాయెను. మానవుని తయారు చేసినందుకు దేవుడు తుదకు దుఃఖపడెను. మొత్తము తల, మొత్తము శరీరము ఒక చెడిపోయిన పుండుగా నుండెను. తాను మానవుని చేసినందుకు దేవుడు సంతాపపడెను. "నేను చేసిన మానవుని నాశనము చేసెదను" అని ఆయన అనుకొనెను. ఆయన వారిని నాశనము చేయును, ఎందుకనగా అతని వలన చెడుతనము తప్ప మరేమియూ లేదు.

మొత్తము మానవళి ఆ కాలములో తుడిచి పెట్టబడిపోవలసినదే, కాని దేవుడు, కరుణా సంపన్నుడై దోషులతో అమాయకులు నశించకుండా కాపాడెను. లోనికి రాగోరు వారి కొరకు, సరియైనది చేయగోరు వారికొరకు ఆయన వెళ్ళి ఒక మార్గమును ఏర్పరచెను. కృప కోరు వారి కొరకు ఆయన ఒ కృపా మార్గమును ఏర్పరచెను. ఆయన ఒక ఓడను సిద్ధపరచెను. మరో మాటలో ఆయన తన పక్షిరాజులకు కోడి పిల్లలతో పాటు మునిగి నశించకుండా తీర్పుకు పైగా ఎగిరిపోవునట్లు రెక్కలను ఏర్పరచెను. నోవహు దినములలో తప్పించుకొను ఒక మార్గమును ఆయన ఏర్పరచెను. ఇది చేయుటకు, దీనిని ఏర్పరచుటకు కారణము ఏమనగా ఆయన కరుణలో సంపన్నుడు.

JOHN 6:37,44

 

24కాని ఆయన ప్రజలకు ఒక దారి ఏర్పరచిన పిదప దానిని వారు నిరాకరించిరి.

వారెందుకు నిరాకరించిరనగా దానిని చేర్చుకొనునది వారికి ఏదియూ లేదు. దానిని పొందునది ఏదియూ లేదు. మా అమ్మ ఈలాగు చెప్పెడిది, "ఒక దుంపలో నుండి నీవు రక్తమును రప్పించజాలవు, ఎందుకనగా అందులో రక్తము లేదు." కనుక అక్కడ చేర్చుకొనుటకు ఎట్టి జీవరూపము లేనిచో, అది చేర్చుకొనబడదు. ఆ కారణము చేతనే పరిసయ్యులు యేసు ముఖములోనికి చూచి ఆయనను బయల్జెబూబు అని పిలిచిరి, ఎందుకనగా ఆయనను చేర్చుకొనునది వారిలో ఏమియూలేదు.

కాని "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరని ఆయన చెప్పెను." దానిని అందించు మార్గము ఏదో ఒకటి యున్నది.

25కొన్నిసార్లు వీధులలో నీవు ప్రజలతో ప్రభువును గూర్చి చెప్పినపుడు, వారు నీ ముఖము మీదనే నవ్వుదురు. ఏమయినా గాని మనము ఆలాగు చేయవలసియున్నాము. కాని వినండి, "నా తండ్రి మొదటగా ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాడని," అయన పలికెను. దేవుడే ఆకర్షించవలెను. అక్కడ ఒక జీవము ఉండవలసియున్నది. ఆయన నాకనుగ్రహించిన వారందరూ, నా యొద్దకు వచ్చెదరు. విమోచింపబడగోరు వారి కొరకు ఆయన ఒక ఏర్పాటును తయారు చేసెను. స్వస్థత పొందగోరు వారి కొరకు ఆయన ఒక ఏర్పాటు చేసెను. ఆయన ఈ విధముగా చేసినందున కరుణా సంపన్నుడాయెను. ఆయన ఎల్లపుడూ కరుణలో సంపన్నుడే. అది తప్పక ఆలాగుండవలెను. నీవు దీనిని తిరస్కరించినచో తీర్పు తప్ప మరేమియూ మిగిలి యుండదు, ఎందుకనగా పాపమునకు తప్పక తీర్పు చేయబడవలెను.

ఫరో ఒక అనుకరణ వ్యక్తిగా, సముద్రములోనికి వెళ్ళినపుడు మోషే వలె తానును వెళ్ళుదననుకొనెను. మోషే తన సైన్యముతోను, ఫరో తన సైన్యముతోను, ఇద్దరునూ సముద్రముతో నశించిపోవనట్లుగా కనిపించెను. కాని దేవుడు, కరుణా సంపనుడై హెబ్రీ పిల్లలు తప్పించుకొనుటకు ఒక మార్గమును ఏర్పరచెను. ఎందుకు? వారు విధినిర్వహణలో ఉండిరి — వాక్యమును వెంబడించుచుండిరి. కృపను పొందుటకు అది ఒక్కటే మార్గము. వెంబడించుటకు దేవుడు మనకిచ్చిన ఉపదేశములను వెంబడించవలెను. ఆయన కృప చూపించుటకు మార్గము అది ఒక్కటే, ఆయన చేయమని చెప్పినది మనము వెంబడించవలెను.

ACTS 2:38,39•

REV 22:18,19

 

26ఒక సేవకునితో కొద్ది కాలము క్రిందట చిన్న చర్చ జరిగినది. ఈ నాడు నేను అపోస్తలుల బోధను బోధించుచున్నానని చెప్పెను… ఒకటి రెండు రాత్రుల క్రిందట లేక ఎప్పుడో దాని గూర్చి చెప్పాననుకొనుచున్నాను." ఈ కాలములో అపోస్తలుల బోధను ఎక్కించవలెనని ప్రయత్నించుచున్నావు, అని చెప్పెను. "అపోస్తలుల కాలము అపోస్తలులతోనే అయిపోయినది," అని చెప్పాడు.

సరే. "నీవు వాక్యమును నమ్ముచున్నావా?" అనడిగాను.

"అవును" అని చెప్పెను.

ప్రకటన 22:18 చెప్పుచున్నదేమనగా "దీనిలో నుండి ఒక మాటను తీసివేసినా, దీనికి ఒక మాట చేర్చినా గాని; రెండు మాటలు కాదు, ఒక మాట — ఒక మాటతీసివేయరాదు," అని చెప్పాను.

"అది నేను నమ్మెదను" అన్నాడు.

నేను చెప్పాను, "అయితే అపోస్తలుల కాలము ఎక్కడ ఇయ్యబడినదో నేను చెప్పెదను, అపోస్తలుల ఆశీర్వచనములు సంఘమునకు ఇయ్యబడినవి. ఇప్పుడు వాక్యమును బట్టి దేవుడు దానిని ఎక్కడ బయటకు తీసివేసెనో నాకు చెప్పుము. అది నీవు చెప్పజాలవు. అది అక్కడ లేదు."

నేను చెప్పాను, "ఇపుడు గుర్తుంచుకొనుము, పేతురు పెంతెకోస్తు దినమున, అపోస్తలుల యుగ పరిచయకర్త అతడే. వారందరికి అతడు, మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందమని చెప్పెను.అపుడు, పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు. ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును దూరస్థులందరికిని, ప్రభువు తాను పిలచిన వారికందరికిని చెందును."

27మీరు ఏదో శాఖ యొక్క కోడి కూతను వినగోరినచో, లోక సంగతుల మీద జీవించగోరినచో, ఏదో తప్పు ఉన్నదని అది చూపించెను. ఎందుకనగా అదివాక్యము. ఇచ్చయించు వారందరూ రావచ్చును, నీకు ఇష్టమున్నచో నీవు రావలెను. నీకు ఇష్టము లేనిచో, నీవు విచారస్థితిలో యున్నావు. అయితే నీకు రావలెనన్న ఇచ్చయున్నచో, వచ్చి దేవుని పద్ధతిని వెంబడించుము. ఆయన తాను వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చుటలో ఎన్నడూ విఫలము కాడు. ఒకపుడు నేను యువకుడిని, ఇపుడు వృద్ధుడను. ఆయన తన మాట తప్పుటను ఎన్నడూ నేను చూడలేదు, ఎందుకనగా ఆయన ఏమి చేసినా విఫలము కాదు. ఆయన తప్పిపోజాలడు. దేవుడు తప్పజాలడు. దేవుడు తప్పిపోయి దేవునిగా నిలచి యుండుట అసాధ్యము. ఆయన చెప్పిన దానిని చేయవలయును.

JOHN 1:14

 

28ఇపుడు ఫరో యొక్క సైన్యము అనుకరించ యత్నించెను, ఎందుకనగా వారు పిలువబడ లేదు, వారికి ఆ జీవము లేదు… ఆ వాగ్ధానము ఫరోకు ఇవ్వబడలేదు. ఒక వాగ్ధాన దేశపు వాగ్ధానము అతనికి ఇవ్వబడలేదు. ఒక అనుకరణ కర్తయై అట్టి కార్యము నిజంగా చేయుటకు పిలువబడిన విశ్వాసిని వెంబడించ యత్నించెను, కేవలము దాని వలన వెక్కిరింపబడెను. ఈనాటి మన మత క్రమము సంగతి ఆలాగే యున్నది, చాలామంది పరిశుద్ధాత్మను అనుకరించగోరుచున్నాను; బాప్తిస్మమును చాలామంది అనుకరించుగోరుచున్నారు; అపోస్తలుల కాలమును చాలామంది అనుకరించ యత్నించచున్నారు. అది విశ్వాసులకు మాత్రమే. దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను, కరుణా సంపన్నుడు, ఆయన పిల్లలు నశించకుండ చేసెను. వారికొరకు ఆయన ఒక దారి ఏర్పరచెను.

ఫరో ముందుకు పోవుటకు సంసిద్ధుడై మోషేను అతని గుంపును రక్షించిన ఆ నీటిలోనే మునిగి పోయెను. మోషే మునిగి పోలేదు, ఎందుకనగా ఆయన ఏర్పరచిన మార్గమును వెంబడించు వారికి దేవుడు, కరుణా సంపన్నుడు. ఆమేన్. నా భావము మీరు చూడకలిగారా? దైవిక స్వస్థత యందు నమ్మికయుంచని వారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమునందు నమ్మిక యుంచని వారు ఈ రాత్రి దేనినయినా గాని ఎట్లు పొందగలరు? ఆయనను వెంబడించు వారికి దేవుడు, కరుణా సంపన్నుడు; ఒక మత విశ్వాసము వెంబడించుట కాదు కాని, దేవునిని వెంబడించుట.

1JN 4:12

 

29దేవుడు వాక్యము: అది శరీరధారియై మన మధ్యనివసించెను.

దేవుని యొక్క ఇతర గుణ లక్షణములను ఆయన తీసికొని వచ్చుటకే ఇపుడు ఆయన ఆలాగున్నాడు. శరీరము, యేసు దేవుని యొక్క శరీరము. ఒక గుణలక్షణము. ఆయన వెళ్ళిపోవుట మోషే చూచెను, ఆయన యొక్క వెనుక భాగము; ఏ మనిషియూ ఆయన ముఖమును చూడలేదు. కాని ఇపుడు ఆయనను మనము చూచితిమి, ఆయనను చూచాము. ఒక బలిగా ఆయనను చూచాము. ఇపుడు, ఆయన దేవుని యొక్క గుణలక్షణము బయటకు కనుపరచబడెను. వాక్యము, ఆయన అదే అయి యుండెను.

దేవుని యొద్దకు వచ్చిన ఏ విశ్వాసి అయినను, అతడు ఆయన వాక్యము యొక్క దేవుని రూపమగును. ఆ దినమునకు వాగ్థానము చేయబడిన వాక్యమును అతడు బయలుపరచుచుండెను. అది నిజము. దేవుడు, కరుణాసంపన్నుడై ఒక సాక్షము లేకుండా ఎన్నడునూ మనలను విడిచి పెట్టలేదు. ఆయన కరుణా సంపన్నుడు.

EXOD 19:4

 

30ఆ మృత సముద్రములో, అక్కడున్న ఎర్ర సముద్రములో మోషేకు దేవుడు ఎంతో కరుణ చూపించినట్లు ఇపుడు మనము కనుగొందము. నిర్గమకాండము 19:4లో ఇక్కడ ఆయన ఇట్లు చెప్పెను, "పక్షిరాజు రెక్కల మీద మిమ్మును మోసికొని వచ్చితిని, నా యొద్దకు చేర్చుకొన్నాను." "పక్షిరాజు రెక్కల మీద మోసికొని వచ్చి నా యొద్దకు చేర్చుకొంటిని." ఆ సముద్రము మధ్య మరియొక వ్యక్తి అనుకరణ చేయయత్నించెను, కాని ఏమిటి? ఆయన వారిని పక్షిరాజు రెక్కల మీద మోసికొని వచ్చెను.

దేవుడు ఎల్లపుడూ తన ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చును, అది ఏమిటి? మోషే ఆయన యొక్క వర్తమానికుడు, వారు మోషేను వెంబడించుచుండిరి, వారు మోసికొనిపోబడుచున్న పక్షిరాజు రెక్కలు అవే. ఎందుకనగా అతడు దేవుని వర్తమానమును మోయుచుండెను, మరియు ప్రజలు దానిని వెంబడించిరి. ఆయన యొక్క విమోచనా వర్తమానముతో వారు మోషేను వెంబడించుచున్నపుడు దేవునిని వెంబడించినట్లే. బైబిలు దానిని చెప్పెను… ఆయన అవిశ్వాసులతో వారిని నశించిపోనీయలేదు, ఎందుకనగా వారికి దేవుడు, కరుణా సంపన్నుడు; ఎందుకనగా వారు ఆయన ఆజ్ఞలను వెంబడించుచుండిరి. దేవుడు తన ఆజ్ఞలను వెంబడించవలెనని మనలను కోరుచున్నాడు.

NUM 16:3

 

31అదే రీతిగా మనము కోరహు, దాతాను, వారి అవిశ్వాస గుంపును గూర్చి కూడా చెప్పుకొనవచ్చును, వారు అనుకరించగోరిరి. దేవుని యొక్క కార్యక్రమములోనికి వారు దేనినో ఎక్కించ ప్రయత్నించిరి. ఒక వ్యక్తి కార్యక్రమము వారిష్టపడలేదు. వారికది నచ్చలేదు. వారు చేయుటకు మరేదో కలిగియుండిరి. కోరహు ఇట్లనెను, "మోషే, నీకంటె పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. నీవైతే ఒడ్డున ఉన్న ఒకే గులకరాయి వలె ప్రవర్తించుచున్నావు." మరియు చెప్పెను, "నీవు ఆలాగు చేయరాదు, ఇక్కడ చాలామంది జనులున్నారు…"

ఆ పిల్లలను తాను వాగ్ధాన భూమిలోనికి మోసికొని పోవలసియున్నానని మోషే ఎరుగును, ఎందుకనగా ఆ వాగ్ధానము అతనికి ఇయ్యబడినది. అతడు తప్పక వారిని వాగ్ధాన దేశమునకు తీసికొని వెళ్ళవలెను.

NUM 16:24•

JOHN 6:49

 

32దేవుని వాక్యమును బయలుపరచుటకు ఈనాడు పరిశుద్ధాత్మ ఇక్కడున్నది, మరియు మనము స్వారీ చేయవలసియున్న పక్షిరాజు రెక్క అదే. ఏదో మానవ నిర్మిత వేదాంతము కాదు, కాని మనము వాగ్ధాన దేశమునకు పక్షిరాజు రెక్కల మీద స్వారీ చేయవలసియున్నాము.

ఇక్కడ వారు ఒక కోడి పిల్లల గుంపును బయటకు తేవలెనని తలంచిరి, ఈ పక్షిరాజును అనుకరించవలెనని కోరహు తలంచెనని మీకు తెలియును. వారట్టి విధంగా చేసినపుడు దేవుడిట్లు చెప్పెను, "వారి నుండి మిమ్మును మీరు వేరుపరచుకొనుడి," ఆయన లోకమును మ్రింగి వేసెను. ఆయన పూర్తి సృష్టిని మ్రింగివేసియుండెడి వాడే గాని, ఆయన వాక్యమును వెంబడించ ప్రయత్నించుచున్న వారికి దేవుడు, కరుణా సంపన్నుడు.

వారిలో చాలామంది మోషే పక్షమునకు వచ్చిరి, మరియు దేవుడు భూమిని తెరచి అవిశ్వాసిని మ్రింగి వేసెను. అవిశ్వాసి ఎల్లపుడును నశించును.

JOHN 6:49•

ROM 3:4

 

33నమ్మని వారు, బయటకు వచ్చినను, కొంత సేపు నడిచినను యేసు చెప్పినట్లుగా, వారిలో ప్రతి ఒక్కరు చచ్చిరి. చనిపోవుట అనగా నాశనము. వారు చచ్చిరి. వారిని గూర్చి కాస్త ఆలోచించండి — వారు బయటకు వచ్చిరి, దేవుని యొక్క అద్భుతములను చూచిరి, దేవుని యొక్క గొప్ప హస్తమును చూచిరి, మన్నాను అనుభవించిరి; అక్కడికి వెళ్ళి బిలాము అను పేరుగల ఒకని మాట వినిరి. దేవుని మార్గమును అతడు వంకర చేసెను, దేవుని వాక్యమునకు భిన్నమైన బోధ ద్వారా ఆలాగు చేసెను.

"మనమంతా సోదరులము, కనుక మనమంతా కలిసిపోదము." ఈనాడు మరియొక్క బిలాము క్రమము తలెత్తుచున్నది — "మనమంతా కలిసిపోదము." అది పని చేయదు. మనము పక్షిరాజుతో, యెహోవా పక్షిరాజుతో నడచుదము. మీరు చిన్న పక్షిరాజులు.

ఆ మొత్తము గుంపులో ముగ్గురు మాత్రమే రక్షించబడిరి: మోషే, కాలేబు, యెహోషువాలు. తక్కిన వారందరూ అరణ్యములో నశించిరి. పరి. యోహాను 6వ అధ్యాయములో యేసు ఆలాగు చెప్పెను, ఆ తక్కిన విశ్వాసులందరితో పాటుగా వారు నశించిపోకుండునట్లుగా దేవుడు కరుణ చూపించెను. వారందరూ అక్కడే ఆ అరణ్యములో చనిపోయిరి, వారు మృతిపొందిరి. దేవుడు మోషేను, పక్షిరాజు విశ్వాసులను రక్షించెను, ఎందుకనగా వారు ఆయన వాక్యము పట్ల మర్యాద కలిగి యుండిరి.

34ఈనాడు స్నేహితుడా, దేవునితో మనము ఉపకారము పొందుటకు ఒకే మార్గమున్నది. దేవుడు, కరుణా సంపన్నుడు, కాని ఈనాడు దాని గూర్చి ఆయన ఏమి చెప్పెనో దానిని మనము గౌరవించవలసియున్నాము. ఎవరో ఏదో చెప్పినది నీవు తీసికోరాదు; దేవుడు చెప్పిన దానిని నీవు స్వీకరించవలెను. "ప్రతి మనిషి అబద్ధికుడు, దేవుడొక్కడే సత్యవంతుడు."

అనేకచోట్ల ఈనాడు మనకు చెప్పబడుచున్నదేమనగా, నీవు చేయవలసినదంతయూ సంఘములో చేరుటయే, ఒక మత విశ్వాసము కలిగి యుంటేచాలు, లేదా అట్టిది మరేదో చాలు, లేక ఒక ప్రార్థన చెప్పు, లేదా ఒక గ్రంథములో నీ పేరు వ్రాసికో, లేదా చిలకరించబడి, లేదా ఒక ప్రత్యేక పద్ధతిలో బాప్తిస్మము పొందితే చాలు, లేదా అట్టిది మరేదో చాలు. నీవు చేయ వలసిందంతయూ అదే. కాని అది తప్పు. దేవునియొక్క పక్షిరాజుగా నుండుటకు నీవు వాక్యమును దిన దినము వెంబడించవలసియున్నావు. ఎడతెగక దేవుని వాక్యమును భుజించవలెను.

35ఇప్పుడు ఈ సమయము తరువాత, వారు మరల సణుగుట మనము కనుగొందుము; విశ్వాసములో బలహీనులయిరి, వారికి దేవుడు కృప చూపిన తరువాతనే ఆలాగయిరి. వారు దేవునితో సణుగుట మనము కనుగొందుము, వారాలాగు చేయగా పాము కాటుతో చచ్చిరి. అయితే వారికది తగును. వారు నిశ్చయంగా తగుదురు! దేవుని వాక్యమును తప్పు చేసి, వారు చేసిన క్రియలు చేయువారు, మరణమునకు పాత్రులు. వారిలో ప్రతి ఒక్కరు అరణ్యములో చనిపోవుటకు అర్హులు. అయితే వారెంతో వ్యాధిగ్రస్తులయిరి, వారిలో ఎవరును వైద్యుడగు మోషే సహితము దాని గూర్చి ఏమియూ చేయజాలకపోయిరి; వేలకొలదిగా చనిపోయిరి, అయితే దేవుడు, కరుణా సంపన్నుడై తనను విశ్వసించు వారు తప్పించుకొనుటకు ఒక మార్గమును ఏర్పాటు చేసెను. దానికి ఆయన విరుగుడు తయారు చేసెను. ఒక ఇత్తడి సర్పమును ఏర్పరచెను. దేవుడు సంపన్నతను బట్టి తన యందు విశ్వసించు పిల్లలు తప్పించుకొని స్వస్థత పొందునట్లు దేవుడు ఒక త్రోవ ఏర్పరచెను.

తప్పు అగు ప్రతిదానిలోను, దేవుడు ఆసక్తి కనబరచును. నీవు ఊహించు ప్రతి దానిలోను, ప్రతి జీవితపు నడకలోను దేవుడు ఆసక్తి కనబరచును. నీవు ఆయన బిడ్డవు మరియు ఆయన కరుణా సంపన్నుడు. ఆయన నీ కొరకు చేయగోరును.

36దేవుడు వారి కొరకుక ఏర్పాటు చేసిన ఈ ఇత్తడి సర్పమును తీసికొనియే ఆ తరువాత జనుల పాపము చేసిరి. ముందుగానే తీర్పు చేయబడిన పాపమునకు అది సాదశ్యముగా ఉన్నది. ఆ కానుకను వారు విగ్రహముగా చేసిరి. అది మరల పాపమాయెను.

దేవుడు దేనితోను తన మహిమను పంచుకొనడు. కాబట్టి మనము రెండు మూడు నాలుగు దేవుళ్ళను కలిగి యుండజాలము. ఒకే ఒక దేవుడున్నాడు. దేనితోను ఆయన తన మహిమను పంచుకొనడు. ఆయన ఒక్కడే దేవుడు. చూడండి. అన్యులకు చాలా దేవుళ్ళున్నారు. మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన మరియొకనితో తన మహిమను పంచుకొనడు. తన ముందు ఏలాంటి విగ్రహము ఉండుటకు ఆయన అనుమతించడు. జనులకు ఆయన ఒక పరిహారము చేసినగాని, అది దేవుని యొక్క వాక్యము. అది సరియైనది. కాని వారు దానిని విగ్రహముగా చేయనారంభించినపుడు ఆపదలో పడిరి.

NUM 21:8,9

 

37మన సంఘ కాలములకు అదే జరుగుచున్నదని నేను తలంచుచున్నాను. తన వర్తమానముతో మార్టిన్ లూథర్‌ను, జాన్ వెస్లీని పెంతెకోస్తు వర్తమానమును మనకు పంపించెను. అయితే దానితో మనము ఏమి చేశాము? ఆ ఇత్తడి సర్పముతో వారేమి చేసిరో, అదే మనము చేశాము. దానిని విగ్రహముగా మార్చితిమి. "నేను దీనికి చెందాను; దానికి చెందాను." మీరు చూడండి. వాక్యము యొక్క అసలయిన భక్తిగల ఆరాధనతో ముడి వేయబడిన దానికి యధార్థత లేకుండా మీరు చెందియున్నారు. ఏమి జరిగెను? బైబిలు: బైబిలులో మనకు చెప్పబడినది ఏమనగా, ప్రవక్త ఆ విగ్రహమును తీసికొని నాశనము చేసెను. హల్లెలూయా!

ఈనాడు రంగము మీద మనకు అవసరమైనది ఏదనగా శాఖలు అను విగ్రహమును నాశనము చేయగల ఒక ప్రవక్తయే. ఏదో ఒక మత విశ్వాసము లేదా ఒక శాఖకు చెందినచో పరలోకము వెళ్ళుదుమని తలంచుచున్నారు. అది నాశనము చేయబడి దహించబడి పారవేయబడవలసిన అవసరమున్నది. దేవుడు కరుణాపూర్ణుడు. ఆయన కరుణా సంపన్నుడు, ఆ బయటనున్న గాడాంధకారము యొక్క కూపములో ఆ దినమున ఉండిన మన కొరకు కరుణా సంపన్నుడగు దేవుడు తన స్వంత అనువాదమును ఇచ్చెను. ఇక్కడే ఈ భవనములోనే ప్రతి రాత్రి ఆయన ఇచ్చుచున్నాడు. కరుణా సంపన్నుడగు దేవుడు ఆయనను ఎంత ఆశ్చర్యకరునిగా కనుగొందుము? అవునండి!

ఇప్పుడు, ఈ సర్పము నొద్దకు లేదా ఆ బయట దేవుడు చేసిన ఈ చిన్న వస్తువు యొద్దకు వెళ్ళుటయే తాము చేయకలిగినది అని వారంతా అనుకొన్నారు. మోషే దానిని తయారు చేసి, స్తంభము మీద ఉంచెను. వారెట్టి యధార్థత లేకుండానే స్వస్థతపొందిరి. వారు నిలబడి దాని వైపు చూచిరి. దానిని వారు విగ్రహముగా మార్చిరి, దేవుడు ఒక ప్రవక్తను పంపి దానిని నాశనము చేసెను.

MAL 3:6

 

38ఇప్పుడు, ఆ అరణ్యములో సర్పమును చూడ నిరాకరించిన వారందరునూ నశించిరి.

ఇపుడు, దేవుడు ఒక త్రోవ చూపును, కాని దాని వైపు చూడ నీవు నిరాకరించినచో, నీవు వీధిలో కూర్చొనియుండినచో, నీవు ఒక మత-విశ్వాసము పట్టుకొని యుండినచో, అది నిజమో కాదో అని తిన్నగా వాక్యమును చూడ నిరాకరించినచో, నశించెదవు. చూడ తిరస్కరించిన వారందరూ నశించిరి. దేవుడు ఎన్నడూ మారని దేవుడు, చూడ నిరాకరించిన వారందరూ నశించిరి. నేడునూ ఆలాగే జరుగుచున్నది.

వారెప్పుడూ చేయుచున్నట్లుగానే, ఆ తరువాత ప్రజలు పాపము చేసి దానిలో నుండి ఒక విగ్రహము చేసి యధార్థత లేకుండా ఒక స్వస్థతను పొంద ప్రయత్నించిరి. "దేనికో చెందిన వారుగా వారుండిరి," మరియు నేడు మనమున్నట్లుగానే. దాని యొక్క తేడాను ఇపుడు మనము చూతుము. ఆ కాలమునకు అది ఒక మంచి పరిహారము ఒక మంచి గురుతు. ఆ సమయములో అది సరియే. కాని అది కేవలము ఆ సమయము మాత్రమే, ఆ ప్రయాణమునకు మాత్రమే. ఆ యాత్రకు మాత్రమే అదంతయూ పనిచేయును.

39నీతీకరణమును గూర్చి మార్టిన్ లూథర్ తీసికొని వచ్చిన వర్తమానము లూథర్ కాలమునకు సరిపోవును. అది వెళ్ళిన దూరము వెళ్ళినది. వెస్లీ కాలములో శుద్ధీకరణము మంచిదే, అది వెళ్ళవలసిన దూరము వెళ్ళినది. తరువాత మనము పెంతెకోస్తు కాలమునకు వచ్చాము. వరముల పునరుద్దరణ చాలా మంచిదే. ఆ కాలమునకు అది మంచిదే, కాని ఇపుడు మనము దానికి అవతలకు వెళ్ళుచున్నాము. మనము అది దాటి యున్నాము. ప్రపంచమంత నిశ్చయమది, దీనికి అవతలగా మనము వెళ్ళవలసి యున్నాము, ఎందుకనగా వారింతకు ముందు దానితో ఏమి చేసిరో మనమునూ అదే చేశాము — దానితో ఒక విగ్రహము చేయుట.

"నేను దానిలోని ఆ పద్ధతికి చెందాను."

"నేను దానిలోని ఈ పద్ధతికి చెందాను." దానిని తుత్తునియలు చేసి, దాని ముక్కలుగా చీల్చి ఆయన యొక్క సంపూర్ణ వాక్యమును స్థిరపరచుటకు దేవుడు ఒకరిని పంపును. దేవునికి స్తోత్రము! అది నిజమని మనము చూస్తున్నాము. దేవుడు, కరుణా సంపన్నుడు!

MAL 4:6

 

40దీనిని ప్రవక్త నాశనము చేసినపుడు అది ఎట్టి స్వస్థతా సూచనను వారికి విడిచిపెట్టలేదు, పరిహారము చూపలేదు, ఎందుకనగా వారి విగ్రహము నాశనమాయెను. కాని దేవుడు, కరుణా సంపన్నుడై వారికి మరియొకటి చేసెను. ఆయన దానిని ఏమి చేసెను? దేవాలయము వద్ద నున్న కోనేరులోని నీటిని ఆయన కదిపెను, మరియు అనేకులు వచ్చి స్వస్థత పొందిరి. ఈ నీటిలోనికి అడుగు పెట్టి బాగయిరి. ఇదే కోనేరు యొద్దకు యేసు వచ్చెను, అక్కడ అనేక సంవత్సరముల నుండి పడియున్న ఒకతనిని చూచెను, నీళ్ళు కదపబడుసమయమునకై ఎదురు చూస్తుండెను. చూడండి. దేవుడు, కరుణా సంపన్నుడు! వారు దానిని విగ్రహముగా చేసినా సరే, ప్రవక్త దానిని చీల్చి వేసినా గాని, దేవుడు వారికి మరో త్రోవను ఏర్పాటు చేసెను, ఎందుకనగా ఆయన కరుణా సంపన్నుడు. వారు స్వస్థత పొందవలెనని ఆయన కోరెను, మరియు ఆయన వారి స్వస్థత కొరకు ఒక మార్గము తయారు చేసెను.

ఇప్పుడు, అది ఆ విధంగా కొనసాగెను. సమయము జరుగుచుండగా పాపము మరింతగా విస్తరించుచుండెను, మరియు చివరకు లోకము ఎంతగా పాప భూయిష్టమైనదంటే దేవుడు దానిని నాశనము చేయవలసివచ్చెను. మలాకీ 4లో ఆయన చెప్పెను, "నేను వచ్చి లోకమును శాపముతో మొత్తకుండునట్లుగా," ఆయన దాని చేయకలిగియుండెను; కేవలము ప్రశ్న.

ISA 53:5•

JOHN 3:14

 

41కాని దేవుడు, కరుణా సంపన్నుడై యేసుక్రీస్తు అను ఒక రక్షకుని పంపెను. రక్షకునిగా మరియు స్వస్థపరచువానిగా నుండుటకు ఆయన యేసును పంపించెను. ఎందుకనగా ఆయన ఈలాగు చెప్పెను, "అరణ్యములో మోషే ఏలాగు ఇత్తడి సర్పమును ఎత్తెనో ఆలాగే మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను," అదే పని నిమిత్తము. మనము ఉపయోగించుకొనునట్లుగా ఆయనే పరిహారము ఆయెను. పరిహారము తప్ప మరొక్కటి కాదు — యేసు రక్తము ద్వారా కొనిన దానిని మనము ఉపయోగించుకొనుచున్నాము.

బైబిలు ఇట్లు చెప్పెను, "ఆయన మన అతి క్రమముల నిమిత్తము గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను: మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందియున్నాము." అదే హక్కుగా చెప్పుకోగలము, ఎందుకనగా మనము నిలబడుటకు అదే పరిహారము, మనకొరకు ఇయ్యబడినది. దేవుడు, కరుణా సంపన్నుడు.

ఇది నిత్య పరిహారముగా నుండవలసి యుండెను, ఎందుకనగా ఆయన తానే వచ్చెను. పాప శరీరాకారములో దేవుడు తానే దిగి వచ్చెను, ఒక నిత్యపరిహారము చేయుటకు వచ్చెను, మరియు శరీరమందు శ్రమపడి పరిహారము చేసెను — ఆ పరిహారమును స్థిరపరచుటకు పరిశుద్ధాత్మాకారములో తిరిగి వచ్చెను. ఏ ఇత్తడి సర్పము, ఏ కదిలే నీరు దానిని చేయజాలదు, అదంతయూ ఆ పరిపూర్ణ పరిహారము సూచించెను. కరుణా సంపన్నుడగు దేవుడు దీనిని చేసెను.

42నేడు మనము జీవించుచున్న ఈ దినములలో ఈ సంఘకాలముల నుండి మనము వచ్చియున్నాము, దాని నుండి ప్రతిదియు వివరించబడినది. ఈ నాటి మన వేదాంత పండితులు దాని యొక్క దృష్టిని చాలా పోగొట్టుకొనిరి. దాని నంతటినీ వారు మరొక దినమునకు, మరొక కాలమునకు, మరి దేనికో, ఎప్పటికో, ఒకప్పటికి వివరించుచున్నారు. దైవిక స్వస్థత ముగిసిపోయినట్లుగా భావించుచున్నారు. దాని నమ్మువారిని కనుగొనుట దుర్లభముగా నున్నది; దానిని వారు హేళన చేయుచున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం నుండే దానిని వారు హేళన చేయసాగిరి. పెంతెకోస్తు వారు ఆచరణలో దాని నుండి దూరమైరి. వారు తొలి దినములలో ప్రారంభించిరిగాని దాని నుండి వారు దూరమైపోయిరి. వారెట్లు చేసిరో చూడండి. వారికిప్పుడు శాఖా పిచ్చిపట్టినది, ప్రతి వారికి ఒక విశ్వాసము చేసికొనుటకు వారు పరుగులెత్తుచున్నారు.

వచ్చిన వెలుగును స్వీకరించుటకు బదులుగా వారు ఆలాగు చేయుచున్నారు. వారు సంస్థగా మారి తమకు సిద్ధాంతములు చేసికొనిరి. ప్రతి వారును వచ్చి తనకొక సిద్ధాంతము చేసికొని ఆ సిద్ధాంతములోనే నిలిచియుంటు౦న్నారు. వారెంతగా మునిగిపోయారంటే, చివరకు పరిశుద్ధాత్మ సంఘములోనికి రాలేకపోయినంతగా అడ్డగించువారయిరి. వారుఇత్తడి సర్పము వలెనె మరొక విగ్రహము అయిరి. అది ఒక విగ్రహారాధన ఆయెను. ప్రతి వారును, "నేను దీనికి చెందాను." "నేను దానికి చెందాను," అని చెప్పుచున్నారు.

అది ఒక విగ్రహారాధన. అంత్యకాలములో ఎంత గందరగోళములో మనమున్నాము. కాని దేవుడు, కరుణా సంపన్నుడై మనమీదికి పరిశుద్ధాత్మను తిరిగి పంపెను, తాను చేయుదునని వాగ్ధానము చేసిన రీతిగా ఈ రాత్రి తన వాక్యమును ఆయన బయలుపరచుచున్నాడు. ఈ కార్యములు చేయుదునని దేవుడు వాగ్ధానము చేసెను. ఆయన ఏమి చేసెనోచూడు. ఆయన ఏమి చేసెనో చూడు!

GEN 4:3,5

 

43ప్రతి కాలములోను ఒకప్రత్యేకమైనది జరుగునని ఆయన ఏలాగు వాగ్ధానము చేసెనో ఇపుడు మనము చూడగలము. ఆయన తాను చేయుదునని చెప్పినట్లుగానే సరిగ్గా అది జరుగుట మనము కనుగొందము — ఎందుకనగా తన కరుణ విషయములో ఆయన సంపన్నుడు. తాను వాగ్ధానము చేసిన వాక్యమును నెరవేర్చుటకు ఆయన ఎల్లపుడూ కరుణా సంపన్నుడే. దేవునిగా ఉండవలెనన్నచో ఎల్లపుడును ఆయన ఆలాగు చేయవలసినదే. ఆయన ఎల్లపుడూ దీనిని చేయును.

దాని ఋతువులో ఆయన వాక్యము ఎల్లపుడూ నెరవేరును, భూమిలోనికి ఆయన చల్లిన విత్తనము అదియే. ఆయనేమి చేయును? ఇక్కడ ఆయన వాక్యమును ఉంచెను, అదియే ఒక బీజము. యుగము వచ్చుచున్న ప్రతి సమయములోను ఆ బీజము పక్వత చెంది ఒక సంస్కరణ ఉద్భవించును. దానిని ఆయన వాగ్థానము చేసెను, అది దానిని చేయును.

ఇప్పుడు, వీటిని మనము పొంద తగము. దేవుని యొక్క ఆశీర్వచనములు మనము పొందతగము, ఎందుకనగా లోకపు సంగతులు వెంబడించి మనము వెళ్ళిపోయాము — కయీను తప్పును అనుసరించాము. కయీను చక్కని సంఘము, చక్కని గోపురము కట్టి, మీద పూవులుంచెను, సరిగ్గా అదే అయి యుయుండునని తలంచెను; అది కొన్ని యాపిలు, లేక పియర్సు, లేక దానిమ్మ పండ్లు లేక అట్టిది మరేదో కావచ్చును, తన తల్లిదండ్రులు ఏదెను తోటలో తిన్నది అదే, అది వారిని బయటకు తరిమెను. కనుక దానిని తిరిగి దేవునికి అర్పించెను, దేవుడు దాని విసర్జించెను.

NUM 16:3•

HEB 11:4•

JUDE 1:11

 

44కాని హేబెలు విశ్వాసమును బట్టి, దేవునికి కయీను కంటె శ్రేష్టమైన బలిని అర్పించెను. ఈనాడు వారు కయీను మార్గములో నడిచిరి, కోరహు వలె ఆశించి నశించిరి, అని బైబిలులోని యూదా పత్రికలో చెప్పబడెను. చూడండి. కయీను మార్గమును వెంబడించిరి: వేదికలు నిర్మించి, సంఘములు కట్టి, శాఖలు నిర్మించి, వానిని వికసించునట్లుగా చేసి, తక్కిన వారి కంటె ఎక్కువ సభ్యులుగా ఉండునట్లు చేసిరి. కనబడిన ప్రతిదానిని స్వీకరించి, క్రిందికి పైకి ఎగిరి, చేతులు ఊపి, లేక ఒక ప్రత్యేక రీతిలో బాప్తిస్మమిచ్చి, లేదా భాషలతో మాట్లాడి, లేదా నేల మీద పరుగిడి, వారు తమ పేరును గ్రంథములో వ్రాయించుకొనిరి. అది నిజము. అపుడు నిజమైన సత్యమును బోధించినపుడు దానిని వ్యతిరేకించి కాదందురు. అదెట్లు ఆలాగు కాగలదు? గమనించండి. ఎట్టి గలిబిలిలో మనము ఉన్నామో! గమనించండి, "వారు బిలాము త్రోవలో నడిచిరి, కోరహు వలెతిరస్కారము చేసి నశించిరి."

తిరస్కారము చేసి నశించిరి! కోరహు యొక్క తిరస్కారము ఏమిటి? ఏమిటి? నీవు ఒక్కడివే పరిశుద్ధుడవని అనుకొనుచున్నావు? ఏమి? మేమందరమూ పరిశుద్ధులమే. సంఘమంతా ఆలాగే యున్నది. ప్రతి… మనము చేయవలసినది ఏమనగా మనందరము కూడి చేరుదము. దానిలోనే వారు నశించిరి. నిజంగా అది మనకు తగును. ఆలాగుండుటకు మనము తగిన వారము.

కాని దేవుడు, కరుణా సంపన్నుడై, ఆ కూపములో నుండి బయటకు లాగెను, ఇక్కడ సంగతి జరుగక ముందే దానిని చూచెదము. కరుణా సంపన్నుడు, దైవిక స్వస్థత యొక్క ఉజ్జీవమును పంపెను, మరియు దేవుని యొక్క శక్తి తిరిగి వచ్చెను. చరిత్ర ప్రకారము, ఏ ఉజ్జీవము కూడా మూడు సంవత్సరములు దాటి ఉండలేదు. ఈ ఉజ్జీవము పదిహేను సంవత్సరములు కొనసాగినది. అది దహించు అగ్ని, ప్రపంచము చుట్టూ వచ్చుచున్నది. ఎందువలన? అది మనకు తగినందునా? దేవుడు, కరుణా సంపన్నుడు — అంతే గాని మనము కోరినందున, మనము తగిన వారమగుట వలన కాదు.

అది ఏమి చేసినదో కాస్త ఆలోచించుడి.

45ఇక్కడే ఫీనిక్సులో యున్న ఒక సోదరిని గూర్చి ఆలోచించుచున్నాను, శ్రీమతి హట్టీ వాల్‌డ్రాప్, ఆమె మీలో చాలామందికి తెలియును. ఆమెకు గుండె కాన్సరు, మరియు దాదాపు పదిహేను లేదా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ మొదటిసారిగా సహో. మూర్, నేను కూటములు పెట్టినపుడు ఆమె ప్రార్థనవరుసలో ఉన్నది. ఆమె గుండె కాన్సరుతో మృతి చెందుచున్నది. ఎప్పుడో ఆమె చనిపోయి యుండవలసినది. కాని దేవుడు, కరుణా సంపన్నుడై, ఆమె పైకి తన శక్తిని పంపెను, మరియు ఆమె జీవితమును ఆయన రక్షించెను. నేడు ఆమె జీవించుచున్నది. దేవుడు, కరుణా సంపన్నుడు!

కాంగ్రెస్ వ్యక్తి అప్‌షా, ఒక గొప్పవాడు… ఒకసారి బాప్టిస్టు లేక దక్షిణ బాప్టిస్టు కన్వెన్షనుకు అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు, లేక మరేదో పదవిలో నుండెను. ఆయన అన్నీ చేసెను… అతడు మంచి వ్యక్తి. ఏలాగు చేయుట తనకు తెలియునో ఆలాగే అంతా చేసెను. అతడు ప్రతి వైద్యుని యొద్దకు వెళ్ళెను. ఎవరునూ అతనికి ఏమియూ చేయలేకపోయిరి. అతడు బందీ అయిపోయెను. సేవకులు ఆయనకై ప్రార్థించిరి. ప్రతిచోట ఉన్న వేర్వేరు సేవకులు ఆయన తలపై గ్యాలన్ నూనె పోసి అభిషేకించిరి.

46ఒక రాత్రి లాస్ ఏంజలస్, కాలిఫోర్నియోలో వేదిక యొద్దకు నడిచి వచ్చి ఆ వరుసల మధ్య మామూలు సారి కంటె రెండు మూడు రెట్లు ఎక్కువగా చక్రాల కుర్చీలపై కూర్చొన్న వారిని చూచాను. అప్పుడక్కడ, ఒక మంచము మీద చిన్న నీగ్రో పిల్లను ఉంచారు, తల్లి ప్రక్కనే కూర్చొండెను. నా సోదరుడు ప్రార్థన వరుసను తెచ్చుచుండెను.

ఏమి జరుగుచున్నదో ఎరుగక నేను చూస్తున్నాను. తాబేలు చిప్పల వలె నున్న అద్దములతో ఒక వైద్యుడు ఆ చిన్న నీగ్రో బాలికను ఆపరేషనుచేయుట చూచాను. గొంతుక శస్త్ర చికిత్స, ఆమె పక్షవాతమునకు గురియైనది. నేను చుట్టూ చూచి, "ఈ బిడ్డ ఎక్కడున్నది?" అను కొన్నాను. నేనామెను చూడలేకపోయాను. కొద్దిసేపటి తరువాత, అక్కడే ఆశలేని దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల వయస్సు గల చక్కని చిన్న బాలిక తక్కిన జీవితమంతా చచ్చుబడిపోవలసియుండెను. అక్కడే ఆ బాలిక తల్లి మోకాళ్ళుని ప్రార్థించుచుండెను. ఆ వైద్యుడు, "నీ బాలికను ఆపరేషను చేసెను కదా," అని అంతా వర్ణించాను.

"అది నిజమండీ అన్నదామె." అపుడామె పిల్లను వేదిక నొద్దకు తేవలెనని యత్నించినది. అది చేయవద్దని వారామెకు చెప్పిరి.

ఆమె నిమ్మళపరచవలెనని చూచారు. "ఆమెను వారు నెమ్మదిపరచనై యున్న సమయ ములోనే ఆమెకు ప్రార్థించుటకు కొద్ది నిమిషాలు ఒక తరుణము తీసికొందాము," అని తలంచాను. ఇక్కడున్న జనులు కొందరు ఆ రాత్రి అక్కడ ఉండి యుందురు. నేను జనములోనికి చూస్తున్నాను. ఆ బాలిక దిగిపోవుట చూచాను, చేతిలోచిన్న బొమ్మతో, ఆ బొమ్మను ఊపుకొంటూ ఒక ఇరుకైన త్రోవలో ఆ బాలిక వెళ్ళుట చూచాను. ఆమె తక్కిన జీవితమంతయూ చచ్చుబడియుండునని వైద్యుడు చెప్పిన లెక్కలేదు; దేవుడు, కరుణా సంపన్నుడై, ఒక దర్శనము ద్వారా పరిశుద్ధాత్మను క్రిందికి పంపెను. ఆ చిన్న బాలిక అక్కడ నుండి లేచి వెళ్ళినది. ఆమె, ఆమె తల్లిచేతులు పట్టుకొని దేవుని స్తుతించుచూ, ఆ బల్లల వరుసల మధ్యనుండి నడిచిపోయినది.

47ఎక్కడో వెనుక ఒక ముసలాయన కూర్చొని యుండెను — ఆయనే కాంగ్రెస్ వాడగు అప్‌షా. మీలో అనేకులు అతని సాక్షమును ఎరుగుదురు. ఆయన చాలా మంచివాడు. జీవితమంతా శోధించబడిన వాడు. అరవై-ఆరు సంవత్సరముల వాడు, చక్రాల కుర్చీలో పనికిరాకుండా ఉన్నాడు, పడక మీద ఉంచబడెను, నడచుటకు చేతుల క్రింద కర్రలున్నవి, ఎన్నడూ మామూలుగా నడువలేడు. అది చూచుకొంటూ అక్కడ ఆయన కూర్చొని యున్నాడు, అకస్మాత్తుగా నేను చూచి, దర్శనము పొందాను. ఆయన బాగయిన వ్యక్తివలె తలవంచి, జనము మధ్యలో నుండి ఇక్కడికి మామూలుగా వచ్చుట చూచాను. ఇతరులవలె చాలా చక్కగా నడువసాగెను. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేనిట్లు చెప్పాను, ఆ వెనుక ఒక గొప్ప వ్యక్తి కూర్చొని యున్నాడు. అతడు చిన్న బాలునిగా నున్నపుడు, ఒక వేగము నుండి పడిపోయి చట్రమును గుద్దుకొని వీపుకు గాయము కలిగినది. "ప్రజలు నడచునపుడు అతని వీపునకు తాకిడి కలుగకుండునట్లుగా వారు నేలలో రంధ్రములు చేసి కంపనమును నివారించుటకు చేసిరి." నేను అన్నాను, "ఆయన గొప్పవాడగును, గొప్పవానిగా నుండుట కొనసాగును. వైట్ హవుస్‌లో గొప్ప సమావేశములో అతడు కూర్చొని యున్నాడు."

అపుడు ఈయన వచ్చి నాతో ఇట్లు చెప్పెను, "అది ఆయనే కాంగ్రెస్మెన్ అప్‌షా. నీవెన్నడైనా ఆయన గూర్చి విన్నావా? "

"ఎన్నడూ వినలేదే అన్నాను." ఆ వెనుకకు వారు మైకు తీగెను పొడిగించి వారు వెనుకాల మాట్లాడుచుండిరి.

48అపుడు నేను చుట్టూ చూచుట ప్రారంభించాను, మరియు ఆ వద్ధ కాంగ్రెస్‌మెన్ వైపు నడిచి వచ్చుట దర్శనములో చూచాను, ఎంత మామూలుగా ఉండాలో అంత పరిపూర్ణ స్థితిలో ఉండెను. దేవుడు, కరుణా సంపన్నుడై, ఆ చక్రాల కుర్చీలో నుండి లాగి చనిపోవు దినము వరకు చేతి కర్రలు లేకుండా నడువ చేసెను. దేవుడు, కరుణా సంపన్నుడు! వైద్యులు విఫలమయినపుడు, విజ్ఞానము శాస్త్రము విఫలమయినపుడు, అంతా విఫలమయినపుడు, కాంగ్రెస్‌మన్ అప్ షాకు దేవుడు, కరుణా సంపన్నుడిగా ఉండెను.

నా గూర్చి నేను ఆలోచించుకొన్నాను, చిన్న బాలునిగా. నాకు గుర్తున్నది… ఈ నాడు ప్రజలు నన్ను స్త్రీ-ద్వేషకుడు, అని పిలుచుదురు. కారణమేమనగా, నేను బాలునిగా ఉన్నప్పటి నుండి స్త్రీలలో ఎంతో అవినీతిని నేను చూచాను. వారిని నేను అసహ్యించుకొన్నాను. ఇపుడు అది నేను చేయను, ఎందుకనగా కొందరు మంచి వారున్నారని. కాని నాకు గుర్తున్నది అది ఎంత ఎంత చెడ్డదో, ఎంత అనైతికమైనదో. "నేను ఎన్నడూ ప్రజలలో ఉండను, నాకు విద్యలేదు, కనుక నాకు ఎలాటి…" అని తలంచేవాడిని.

49అక్కడ ఒక పెద్ద బాలుడు కూర్చొని యున్నాడు, షర్టు కూడా వేసికోలేదు, నా కోటును ఈ విధంగా పిన్నుతో తగిలించాను.

చాలా వేడిగా నున్నది, "విలియం, ఆ కోటుతో నీవు ఉడికిపోవుట లేదా?" అని టీచరు అడిగాడు.

"లేదండీ, నాకు కొద్దిగా చలిగా ఉన్నది," అన్నాను. ఆమె నన్ను పొయ్యి దగ్గరకు వెళ్ళమని, పోయ్యిలో కొంత పుల్లలు వేసి మండించినది, ఆ వేడికి కాలిపోవుట ఇష్టపడేవాడిని. ఆ కోటు తీసివేస్తే నాకు లోపల షర్టు లేదు, ఆ కాలమంతా నేను షర్టు లేకుండానే ఉన్నాను. ఎప్పుడైనా నేను డబ్బు సంపాదించితే, 30-30 తుపాకీ సంపాదించుకొని, ఈ పశ్చిమానికి వచ్చి, నా జీవితమంతా ఇక్కడే వేటాడుదును. ప్రజలతో నేను ఏమి చేయను, వారికి దూరంగా ఉందును, ఎందుకనగా వారు నన్ను ఇష్టపడరు. నేను వారి నుండి దూరంగా ఉందును అనుకొన్నాను.

వీధిలో నాకు తెలిసిన కొందిరితో పట్టణములో నేను మాట్లాడు ప్రతిసారి, "హల్లో, జాన్, జిమ్, ఎట్లున్నారు? అనేవాడ్ని."

"ఓ, హలో."

చూడండి, వారు నాతో మాట్లాడుటకు ఇష్టపడే వారు కారు. నాతో ఏమి చేయుటకు వారికిష్టము లేదు, ఎందుకనగా, నా తండ్రి వారు కలిసి విస్కీ తయారుచేసెడి వారు. నేను అది చేయలేదు. నేనది చేయజాలను, నేను ఆ రకపు మనిషిని కాను.

50కొంత కాలము క్రితమే నా భార్యతో ఇట్లన్నాను, "కొనగలిగిన అత్యుత్తమ తుపాకులతో నా గోడను ముంచెత్తాలి." ఓ, నేను పాత మురికి గుడ్డల గూర్చి ఆలోచించాను — ఈ రాత్రి నాకు రెండు, మూడు మంచి సూట్లున్నవి. స్నేహితులు లేరు? జనులనండి దూరముగా ఉండుటకు, నేను అరణ్యములో దాగుకోవలసియున్నాను.

ఏమిటి సంగతి? అది ఎందుకనగా, నా వ్యక్తిత్వమే కారణము? నా చదువును బట్టియా? కాదు. దేవుడు, కరుణా సంపన్నుడై, ఆ స్థితిలో నన్ను చూచి, ఆయన నన్ను రక్షించెను. చేతులు పట్టుకొని గ్రుడ్డివాని వలె నడిపించబడుటకు నాకు గుర్తున్నది. నేను చూడలేదు. నా ముందున్న ప్రతీది మసకగా కనబడేది. నా శేష జీవితమంతా అంధునిగా ఉండవలెను; కాని కరుణా సంపన్నుడగు దేవుడు, నా దృష్టిని తిరిగి నాకిచ్చెను. నా వయస్సు ఏబది-అయిదు సంవత్సరములు. ఇంకా మంచి చూపున్నది. నేను చెప్పగలిగిందంతా; దేవుడు, కరుణా సంపన్నుడు.

51ఒకపుడు సంఘమునకు అందింపబడిన స్వస్థతా విధానము లేదు. వారికి ఒకటి ఉండెను గాని, వారు దానిని త్రోసివేసిరి. కాని దేవుడు, కరుణా సంపన్నడై, వారికి దైవిక స్వస్థతా వరమును పంపెను. మన మధ్యనున్న పరిశుద్ధాత్మ అదే, వెంబడించుచున్న సూచక క్రియలను బట్టి వాక్యమును స్థిరపరచుచుండెను. దేవుడు, కరుణా సంపన్నుడు!

ఇక్కడ రెండు, మూడు పేజీల నోట్సున్నది, కాని దానిని చెప్ప ప్రయత్నించను, ఎందుకనగా ఆ ప్రార్థన వరుస నారంభించుటకు దాదాపు సమయమయినదని ఎరిగియున్నాను. కాని, దేవుడు, కరుణా సంపన్నుడు! ఈ రాత్రి ఇక్కడున్న వారిలో అనేకులను వైద్యులు నిరాకరించి యుందురు. ఆ చక్రాల కుర్చీ మీద జనులు కూర్చొనియున్నారు. వారు బహుశా ఎన్నడూ అందులో నుండి బయటకు రారు. వారక్కడే ఉండవలెను, కొందరు వివిధ రీతిలో చచ్చుబడియున్నారు. అందులో నుండి బయటకు రారు. వారు బయటకు వచ్చు దారిలేదు. కాని, దేవుడు, తన కరుణా సంపన్నతతో ఒక పరిహారమును ఏర్పరచెను. దానిని త్రోసివేయవద్దు; దానిని పొందండి.

అక్కడ ఒకాయన గుండె జబ్బుతో ఉన్నాడు, కాన్సరు రోగులున్నారు మరియు వైద్యులు ఏమి చేయలేరు. ఈ లోకములో మీరు ఆశ లేని వారు, నిస్సహాయులు.

52కాని దేవుడు, కరుణా సంపన్నుడై పరిశుద్ధాత్మను పంపెను, మరియు వాక్యమును ఇక్కడే స్థిరపరచుటకు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఋజువు చేయుటకు మన మందుకు తగినందునా? లేదు. దేవుడు, కరుణా సంపన్నుడైనందున! ఆమేన్!

ఇపుడు ఆయనే. అదే వ్యక్తి — అది ప్రభువైన యేసే. ఆయన చనిపోలేదు, కాని ఆయన మృతులలో నుండి లేచియున్నాడు. ఆయన సదాకాలము సజీవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు, ఆ రక్తస్రావ రోగము గల స్త్రీకి ఎంత కరుణ గలవానిగా నున్నాడో ఇంకనూ అదే కరుణా సంపన్నునిగా ఉన్నాడు. ఆమె జనములో నుండి బయలుదేరెను. ఆమెకు ఏ ఆశయు లేదు. వైద్యులు శాయశక్తులా చేయకలిగినది చేసిరి. ఆమెకు రక్తస్రావ రోగమున్నది. ఆమె మరణించుచున్నది. ఆమె బోధకుని వస్త్రము ముట్టినది. దేవుడు, కరుణా సంపన్నుడై ఆమె వైపు తిరిగి వ్యాధుని చెప్పెను. ఆమె ఈ రక్తస్రావ రోగము నుండి బాగుపడెను.

ఒక రోజున ఒక తప్పుడు, చిన్న వేశ్య బావి యొద్దకు వెళ్ళెను. నీరు తెచ్చుటకు వెళ్ళెను. నిరీక్షణ లేదు — ఆమె జీవితము బాగోలేదు గనుక చుట్టూనున్న జనులలో నుండి, కన్యకలలో నుండి ఆమె వెలివేయబడినది. ఇక ప్రయత్నించి లాభమేమి? ఎలాగో నన్ను వెలివేశారు, నాకేమీ మిగిలిలేదు అనుకొన్నది. కాని ఆమె ఆ ప్రక్కను నిలబడి లేదా బావి ప్రక్కను కూర్చొని తాను చేసిన ప్రతిదియు తనతో చెప్పిన ఆయనను చూచెను. దేవుడు, కరుణా సంపన్నుడు. ఈ రాత్రి ఆ దేవుడే, ఆ రోజులలో ఎంత కరుణా సంపన్నుడై యుండెనో, అంతే కరుణగలవానిగా ఉన్నాడు. [టేపు పై ఖాలీ]

53ఇక్కడ రెండు వందల ప్రార్థన కార్డులున్నవనకొంటాను, లేక మనము రెండు వందలు పిలిచాము. మనము వారిని పిలువనై యున్నాము, ప్రజలను వరుసలో రానీయండి. మేము వారి కొరకు ప్రార్థించనైయున్నాము, కాని అది మనము చేయు ముందుగా, ఇక్కడున్న క్రొత్తవారితో చెప్పుచున్నాను, అన్ని మూఢ నమ్మకముల నుండి తొలగిపోవుడి. ఇది ఒక మూఢ నమ్మకము కాదు; దేవుని వాగ్ధానపు యొక్క వ్యక్తీకరణ. నీవు దేని వైపుచూచుచున్నావో దానిపై అది ఆధారపడియున్నది. ఏ మనిషిలోను ప్రభావము లేదు; ఏ మనిషిలోను శక్తిలేదు. కాని విశ్వాసులముగా మనకు అధికారమున్నది — శక్తి కాదు, కాని అధికారము. కొంతకాలము క్రిందట ఎవరో నన్నడిగారు, "సహో. బ్రన్హం, దీనిని చేయుటకు నీకు శక్తిగలదని నమ్ముచున్నావా?"

"నాకు ఏ శక్తిలేదు. కాని అధికారమున్నది," అన్నాను. ప్రతి విశ్వాసికి అది ఉన్నది. దానిని నీవు త్రోసివేసినచో, నీవెక్కడున్నావో అక్కడే ఉందువు; కాని దానిని నీవు అంగీకరించినచో, అత్యధిక సమృద్ధిని కలుగచేయును, ఎందుకనగా దేవుడు, కరుణా సంపన్నుడు.

MARK 11:23

 

54ఇక్కడ వీధిలో నిలబడియున్న ఒక పోలీసును తీసికొనండి, బలహీనుడుగా నుండి బట్టలు సగం వ్రేలాడుతూ కనిపించును. టోపి చెవుల క్రిందికి వచ్చినది. మూడు వందల అశ్వశక్తిగల కార్లు, గంటకు ఏబది మైళ్ళ వేగంతో వీధిలోబడి వచ్చుచుండగా, అతడు నడిచి వచ్చుచుండును. ఒక సైకిలు అపుశక్తి కూడా అతనికి లేదు. అది నిజము. కాని అతడు ఈల వేసి చేయి ఎత్తితే బ్రేకులు పడును. అతనికి శక్తిలేదు గాని, అధికారమున్నది. పట్టణం మొత్తం అతని వెనుక ఉన్నది.

స్త్రీ గాని, పురుషుడు గాని, ఎట్టి స్థితిలో నీవున్ననూ నాకక్కర లేదు, ఒక వాగ్ధానమును బట్టి దేవుని యొక్క అధికారమును మనము కలిగియున్నాము. ఆయన ధనవంతుడైనందున, అత్యధిక సమద్ధిని కలుగచేతునని వాగ్ధానము చేసెను. నీ హృదయములో సందేహించక, నీవు చెప్పినది జరుగునని, నీవు నమ్మి పడద్రోయబడునని ఈ పర్వతముతో చెప్పినచో, ఆలాగు జరుగును. నీకు ఏ శక్తి లేదు, కాని నీకు అధికారమున్నది.

ఆ వెనుక ఆయన నాతో చెప్పినది గుర్తున్నది, "నీవు హృదయ రహస్యములను బయలు పరచగలవు." మంచిది, ఫీనిక్సులోని చాలా మందికి ఇది గుర్తున్నదా? ఆయనది వాగ్ధానము చేసెను; ఆయన వాగ్ధానము చేసినది ఆయన చేయును.

MATT 24:37•

LUKE 17:29,30•

JOHN 14:12

 

55నిస్సందేహముగా, ఇక్కడ మీలో కొందరికి ప్రార్థన కార్డులు లేవు. జబ్బుగా ఉండియు ప్రార్థన కార్డులు లేనివారు, మీ చేతులెత్తండి? మంచిది. మీరు వాక్యము యొక్క అధికారమును తెలిసికొనవలెను శక్తిని కాదు — అధికారము. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు."

లూకా 17:30లో ఆయన రాకడను ముందుగా నోవహు కాలము వంటి కాలముండునని, యేసు వాగ్ధానము చేసెను. మోషే, లేక నోవహు కాలములో వారు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచునుండిరి, నోవహు ఓడలోనికి వెళ్ళిన రోజు వరకు అది ఎరుగకయుండిరి. అట్టి కాలము వచ్చునని ఆయన వాగ్ధానము చేసెను. "లోతు దినములలో ఉండినట్లును ఉండును, అని చెప్పెను. "మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో ఇది జరుగును," అని చెప్పెను. చివరి దినములలో, మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడును.

GEN 18:9,10

 

56ఈ దేవదూతగా మనుష్య కుమారుడు తన్నుతాను ఏలాగు బయలుపరచుకొనెనో ఇపుడు చూడండి. ఆయనే మనుష్య కుమారుడు. నిశ్చయంగా. అబ్రహాము ఆయనను ఎలోహిం అని పిలిచెను. ఆయన మనుష్య కుమారుడై యుండెను. అన్యుల ప్రపంచము దహించబడు ముందుగా, ఆయన తన్ను తాను బయలుపరచుకొనెను.

అది విశ్వాసికి ఆయన ఏలాగు చేసెను? విశ్వాసికి, వేషధారికి, వారికి బోధించుటకు ఆయన ఇద్దరు బోధకులను పంపెను; కాని నిజ విశ్వాసికి ఆయన తన వీపు వెనుక తట్టు త్రిప్పి, "అబ్రహామా అని పిలచెను (దానికి కొద్ది రోజుల ముందుగా అతడు అబ్రాము), నీ భార్యయగు, శారా ఎక్కడ?"

"ఆమె నీ వెనుక గుడారములో యున్నది," అని చెప్పెను.

"నేను నీ పట్ల వాగ్ధానమును నెరవేర్చెదను. నిన్ను దర్శించనై యున్నాను అనెను." ఓ! అబ్రహాము నూరేండ్ల వయస్సు వాడు, మరియు శారా తొంబది ఏండ్ల ప్రాయములో నున్నది. కాని దేవుడు, కరుణా సంపన్నుడై తన వాగ్ధానమును నెరవేర్చెను. అది బిడ్డను తీసికొని వచ్చెను, ఎందుకనగా దేవుడు కరుణగలవాడు. ఆయన దయాపూర్ణుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన తన వాగ్ధానమును నెరవేర్చును.

GEN 18:12,13•

MAL 4:6•

LUKE 17:30

 

57గమనించండి, ఆయన తన వీపును గుడారము తట్టు త్రిప్పి, శారా నవ్వినపుడు ఇట్లనెను, "ఎట్లు సాధ్యము? నేను వృద్ధురాలను, ఒక పెండ్లయిన యువతి వలె ఎట్లు నేను ఆనందము అనుభవించగలను?అతడు వంద సంవత్సరముల వాడు. ఎన్నో సంవత్సరముల క్రితమే మా సంసార సంబంధము ఆగిపోయినది. ఇదెట్లు జరుగును?" దాని గూర్చి ఆమె నవ్వెను.

మరియు దూత… మనుష్య కుమారుడు, గుడారము వెనుక తట్టు వీపు త్రిప్పి — "ఇవెట్లు జరుగును అని, శారా ఎందుకు నవ్వుచున్నది?" అనడిగెను. ఏమటది? యేసు లూకా17:30లో చెప్పెను, లోతు దినములలో ఉండినట్లుగానే ఉండును. అదే పరిస్థితి అన్యుల లోకము దహించబడు ముందు, ఆ దినమున మనుష్య కుమారడు ప్రత్యక్షపరచబడును, అని చెప్పెను. ఆయన వాగ్ధానము చేసెను, మలాకీ4 వాగ్ధానము అది చెప్పును. అసలు పెంతెకోస్తు వర్తమానమును ప్రజలకు తిరిగి ఇచ్చి, వారిని చక్కబరచు వర్తమానము బయలు వెళ్ళును, ఆ దినమున ఉండిన అవే ఆశీర్వచనములు… ఏమిటది? అది రెండు రెక్కల పక్షిరాజు. క్రొత్త మరియు పాత నిబంధనల ప్రవక్తలు దేవుని వాగ్ధానములను కలిసి నెరవేర్చును. అది ఏమి చేయునని బైబిలు వాగ్ధానములు చెప్పెనో దానిని నెరవేర్చును. ఆమేన్.

58దేవుడు, కరుణా సంపన్నుడై, ఈ శాఖలలోనికి తన జనులను పోనియ్యడు, లోకము యొక్క సంగతులు, వస్తువుల విషయములో సంపన్నమైనది లవొదికయ సంఘకాలము; కాని ఆయన ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరచును. జనులారా, అది నమ్మండి. దేవుడు మిమ్ము దీవించును. ఆమేన్.

దేవుడు, కరుణా సంపన్నుడు — నేను కోరునది దేవుని యొక్క కృపలు మాత్రమే. ఆయన నీతికాదు, ఆయన ధర్మశాస్త్రము కాదు, కాని ఆయన కరుణ కొరకు మొరపెట్టుచున్నాను. దేవుడు నాకు కరుణ చూపును గాక! మనందరము ఆ భావన కలిగియున్నాము.

నేను గమనించుచున్నాను — ఆ చోట చివరన ఒక చిన్నస్త్రీ కూర్చొని యున్నది. నీకు ప్రార్థన కార్డు ఉన్నదామ్మా? నీకు లేదు. దేవుడు, కరుణా సంపన్నుడని నీకు చూపించనిమ్ము. నీవు ఈ మధ్య ఎంతో ఉద్రిక్తతతో యున్నావు. కదా? చాలా తొందరలో ఉన్నావు. నీ కండ్లు దుర్భరంగా ఉన్నాయి. అది నిజమేనా? అది నిజము. ఇపుడు అవి మారబోవుచున్నవి. దేవుడు, కరుణా సంపన్నుడై దీనిని నమ్ముచున్నావా అని అడుగుచున్నాడు. ఇపుడు, నీకు ప్రార్థన కార్డు లేదు. నీకేమియూ లేదు, కాని నీకు అది అవసరము లేదు. చూడు. నీకు కృప అందించబడియున్నది.

59ఆ ముందు చిన్న వ్యక్తి కూర్చొని యుండెను, ఇక్కడే నేరుగా కూర్చొనియున్నాడు. అతడు తన శరీరముపై ఏదో వాపుతో బాధపడుచున్నాడు. ఈ మధ్యనే, క్రొత్తగా అది అక్కడకు వచ్చినది. అయ్యా! అది నిజమా? అవును. అది సరియే. అది ఏమిటో నీకు తెలియదు, దాని గూర్చి నీవు భయపడితివి. అది నిజము. అది ఒక దెబ్బ వలన కలిగినది. కాదా? నీకు ప్రార్థనక కార్డున్నదా? నీకు ప్రార్థన కార్డు లేదు. దేవుడు, కరుణా సంపన్నుడు! ఓ, సోదరీ, సోదరుడా, దేవుని నమ్ము! ఆయనను సందేహించవద్దు. ఆయనను నమ్ము! అది నిజము!

బూడిద రంగు సూటులో, అద్దములు పెట్టుకొని ఇక్కడ ఒకాయన కూర్చొనియున్నాడు. అయ్యా! ఇటు చూడండి! నమ్ముదురా! దేవుడు, కరుణా సంపన్నుడు. హెర్నియాతో నీవు అక్కడ కూర్చొనియునావు. దేవుడు ఆ హెర్నియాను స్వస్థపరచి, నిన్ను బాగు చేయునని నమ్ముదువా? ఆ చోట చివర కూర్చొనియున్న, నీవు నా వైపు చూస్తున్నావు. దేవుడు ఆ హెర్నియాను బాగు చేయగలడని, నీవు నమ్మినచో, దానిని నీవు అంగీకరించినచో దేవుడు నీకు అది చేయును. దానిని నీవు నమ్ముదువా? దానిని అంగీకరించెదవా? మంచిది. నమ్మినచో, నీవు దానిని పొందెదవు. కృప పొందుము. అవును.

60ఇక్కడ ఒకామె కూర్చొని యున్నది. ఆమె తన శరీరములో తగినంత ప్రసరణము లేక బాధపడుచున్నది. ఆమె నమ్మినచో దేవుడు ఆమెను బాగు చేయును. దానిని ఆమె నమ్మవలెను. ఆమె దానిని పొగొట్టుకొన్నదని బహు నిశ్చయముగా నేను నమ్ముచున్నాను. కృప పొందుమని, నా ప్రార్థన. ఆమెను స్పష్టముగా నేను చూస్తున్నాను శ్రీమతి. రైలీ, ఆ ప్రసరణ లోపమును దేవుడు బాగు చేయునని నమ్ముచున్నావా? నీవు నమ్మినచో, దానిని పొందుము! ఆమేన్. కేవలము నమ్ముము. దేవుడు మంచివాడు. కదా స్టెల్లా? అవును. అది నిజము. ఆ స్త్రీని ఎన్నడూ, నా జీవితంలో చూడలేదు, కాని దేవుడు కరుణా సంపన్నుడు!

ఇక్కడ మరో స్త్రీ కూర్చొనియున్నది, ఆ వెనుకన ఆమె కూర్చొన్నది, బాగా వెనుకనున్నది, నా వైపు చూస్తున్నది. ఆమె కూడా ప్రసరణలోపముతో నే యున్నది. అప్పుడే ఆమె దాని గూర్చి ఆలోచించెను. నా జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆ మరో స్త్రీ కూడా అదే కలిగియుండినది. నా వైపు చూడు. దేవుని ప్రవక్తగా లేక ఆయన దాసునిగా, నీవు నన్ను నమ్ముచున్నావా? నీకు గుండెవ్యాధి కూడా ఉన్నది. అది నిజమైనచో, నీ చేతిని ఎత్తుము. ఇపుడు నీకు అది లేదు. దేవుడు, కరుణా సంపన్నుడై యుండి, ఈ రాత్రి ఈ భవనములో, ఆయన సజీవుడని చూపించుచున్నాడు. దేవుడు, కరుణా సంపన్నుడు. ఆమేన్?

61ఎంతమంది పాపులు, వెనుకకు జారినవారు నిలబడి, "కరుణా సంపన్నుడవగు దేవా! నాకు కృప చూపుము అని చెప్పగలరు?" లేచి నిలబడండి. ఇపుడు, కృప కావలెనని మీరు కోరినచో, మీ కొరకు ప్రార్థించుదును. దేవుడు మిమ్ము దీవించును. దేవుడు నిన్ను దీవించును. నిన్ను, నిన్ను, దేవుడు దీవించును. వెనుకకు జారిన వాడా, లేచి నిలబడుము. దేవుడు, కరుణా సంపన్నుడు! నీవు-నీవు.

అదియే వాగ్ధానపు ఘడియ, అని నీవు చూడలేనంతగా ఈ స్థితిలో మొద్దుబారిపోలేదని, నిశ్చయంగా, నేను చెప్పగలను. శాఖ మరియు ఇతరమగు వానిలో ఇదే వాగ్ధానపు ఘడియ అని, చూడలేనంతగా నీవు చుట్టబడియుండలేదు. దేవుడు, కరుణా సంపన్నుడు. నిలబడిన నీవు ఎవరివైనను ఒక్క నిమిషములో నేను ప్రార్థించనైయున్నాను. ఏదయినా మంచి సంపూర్ణ సువార్త సంఘములోనికి నీకు దారి చూపించి — క్రైస్తవ బాప్తిస్మము పొందునట్లుగా చేయగోరుచున్నాను. దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చును.

62ఇంకెవరైనా లేచి నిలబడి, నేను నిలబడెదను, "నాకు కృప కావలెనని దేవుడు తెలిసికొన గోరుదును. నేను గుర్తు చేయబడగోరుచున్నాను. దేవా, నీ కృప లో నన్ను గుర్తుచేసికొనుము. జీవించవలసిన రీతిగా జీవించుట లేదు." బహుశా చెప్పవచ్చును. అమ్మా! దేవుడు, నిన్ను దీవించును. దేవుడు, నిన్ను దీవించును. దేవుడు, నిన్నుదీవించును. దేవుడు, నిన్ను దీవించును. దేవుడు, నిన్ను దీవించును. అది నిజము. కరుణా సంపన్నుడవగు దేవా, నాపై కృప చూపుము. సోదరీ, దేవుడు నిన్ను దీవించును. ఎవరైనా

ఇంకెవరైనా లేచి, "నేను నిలబడెదను. నాకు కృప కావలెనని దేవుడు తెలిసికొనగోరుదును. నేను సరిగా జీవించలేదు. నేను ఆ విధంగా, ఈ విధంగా జీవించాను. నేను ఒడుదుడుకులతో ఉన్నాను, కాని నాకు ఆయన కృప కావలెను," అని చెప్పెదరా? సోదరీ, దేవుడు నిన్ను దీవించుగాక! సోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక! అది మంచిది. దేవుడు, కరుణా సంపన్నుడు! దేవుడు నిన్ను కూడా దీవించును. ఆ వెనుక నున్న, నిన్ను దేవుడు దీవించును. దేవుడు నిన్ను చూస్తున్నాడు, లేచి నిలబడుము.

"దాని వలన ఏమైనా మేలు కలుగునా, సహో. బ్రన్హం?" అని అడుగవచ్చు. నిశ్చయంగా. లేచి నిలబడి, అదెంత తేడా కలుగచేయునో చూడు. నీ హృదయంలో నీవు నిజంగా యధార్థంగా ఉన్నచో, దేవుడు కరుణాక సంపన్నుడు. ఎవరును నశింపక అందరును మారుమనస్సు పొందవలెనని ఆయన కోరుచున్నాడు. దేవుడు, కరుణా సంపన్నుడు. ఓ, దేవా, మాపై కృప చూపుము.

MARK 16:17

 

63ఇక్కడున్న వారెందరు ప్రార్థన కార్డులు పట్టుకొనియున్నారు? అవి ఏమిటి? A, Bలా కాదా? A, Bలు. A ప్రార్థన కార్డులు గల వారందరూ ఇటువైపు నిలబడండి. B ప్రార్థన కార్డులు గలవారు వారి వెనుక నిలబడండి.

నాకు సహాయము చేయనాశించుచున్న సేవకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని, ఆశ్చర్యపడుచున్నాను; ఉన్నచో ఇక్కడకు రండి. ఇక్కడ మీ సహాయము పొందుటకు సంతోషించుచున్నాను, ఎందుకనగా మీతో ప్రార్థించుటకు మేము సంతోషించుదుము.

ఇది బైబిలు చెప్పెను, "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును." అవును. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు." దానిని మనము చేశామా? దేవుని కృపను బట్టి; మనము కాదు, కరుణా సంపన్నుడగు దేవుడు, తన మాట నెరవేర్చును — దేవుడు!

ఇపుడు చక్రాల కుర్చీలు, ఈ ముందు మీరు పెట్టగోరినచో వాటిని ఇక్కడ పెట్టి వచ్చును. ఇక్కడే మేము వాటి కొరకు ప్రార్థించెదము. ఆ బల్లల మధ్య నుండి వాటిని లాగుకొని రావద్దు. సరే. మంచిది. వాటిని ఇక్కడకు రానీయండి. ఆ ప్రతి ఒక్క దాని కొరకు మేము నిశ్చయంగా ప్రార్థించెదము, ప్రతియొక్క దాని కొరకు. దేవుడు కరుణా సంపన్నుడు.

64కొద్ది నిమిషముల పాటు ఇపుడు మీరు కుడిచేతి ప్రక్కకు నిలబడెదరా?

మీతో సహో. బ్రవున్ వచ్చారా? రేపు వచ్చును. నేను ఆయనిచ్చట ఉండునని ఆశతో ఉన్నాను. సహోదరుడు అవుట్ లా? సహోదరుడు పుల్లర్ ఎక్కడ? మొదట నేను ఇక్కడికి వచ్చినపుడు, వారు నాతో ఉండిన వారు. తిరిగి మనము చేరుదం.

ఆ పాత పద్ధతి ప్రార్థన వరుసలు, మీకు గుర్తున్నవా? మీరు నన్ను ఒక ప్రక్కన, మరికొందరు మరో ప్రక్కన నన్ను పట్టుకొని యుండే వరకు ప్రార్థించుచూ నిలబడెడి వారము. నేనెంత బలహీనుడనై పోయేవాన్ని. ఆదిలో ఆ కూటములలో ఎందరున్నారు? ఇక్కడ చూడండి. ఆ వెనుక నేను చెప్పినది గుర్తున్నదా? నేను యధార్థంగా ఉండినచో, ఇవి జరుగునని ప్రభువైన యేసు, నాతో చెప్పెనని చెప్పాను. అది నిజమేనా? అటువంటిది ఆనాడు ఎన్నడునూ మాకు జరుగలేదు, కాని అది జరిగినది — ఎందుకనగా దేవుడు, కరుణా సంపన్నుడు. తన వాగ్ధానమునకు లోబడును. ఆమేన్!ఆమేన్! దేవునికి స్తుతి! హల్లెలూయా! ఓ! వారిలో నేను ఒకనిగా ఉన్నందుకు ఎంతో సంతోషించుచున్నాను! ఆమేన్!

దాదాపు ప్రతిచోట అట్టి ప్రజలున్నారు,

వారి హృదయములు మండుచూ యున్నవి,

పెంతెకోస్తు దినమున మ౦డిన అగ్నితో,

అది వారిని కడిగి శుద్ధి చేసెను;

ఓ! అది ఇపుడు నా హృదయములో మండుచున్నది,

ఓ! ఆయన నామమునకు మహిమ!

నేను వారిలో ఒకడ్ని అని చెప్పకలుగుటకు నాకెంతో ఆనందముగా నున్నది.

65ఓ! నేను ఒక దరిద్రుడను, దిక్కుమాలినవాడను, గ్రుడ్డివాడను, నీచుడను, ఆలాగుంటిని, మరియు ఇపుడు ఆయన కృప ద్వారా, ఆయన కరుణా సంపన్నత ద్వారా నేను దేవుని రాజ్యమును దృష్టితో చూడగలుగుచున్నాను. ఆమేన్! ఆయానాజ్ఞలు ఎంత రమ్యములు! నా సోదరుడా, నీ చేతి కర్రపై సరిగా నిలబడుము, నీవు లేనిచో సరియే, ఇక్కడ నిలబడు. మేము దిగి వచ్చి నీ కొరకు ప్రార్థించుదుము. A, B ప్రార్థన కార్డులు గలవారు అక్కడున్న మరో ప్రక్కన వరుసలో ఉండండి. వారి కొరకు మేము ప్రార్థించనైయున్నాము. సేవక సోదరులారా, మీరు నిశ్చయంగా, రోగులపై చేతులుంచుటను నమ్మినచో, ఇక్కడికి వచ్చి, ఈ వేదిక మీద నాతో నిలబడండి. మేము రోగులకు ప్రార్థించనైయున్నాము.

66ఆ వరుసలో నిలబడియుండిన మీకు: దేవుని యొక్క సన్నిధి ఇక్కడున్నదని మీరు నమ్మగలిగినచో, ఇపుడు పరిశుద్ధాత్మ మనమధ్య ఉన్నదనియు, ఏమి చేయుదునని చెప్పెనో అదే సరిగా చేయుచున్నదని నమ్మినచో చాలును. మిమ్ములను స్వస్థపరచుటకు, నాకు శక్తి యున్నచో దానిని తప్పక నేను చేయుదును. మిమ్ములను స్వస్థపరచుటకు నాకు ఏదైనా మార్గమున్నచో దానిని తప్పకుండా చేయుదును. నాకది లేదు. నాకు దేవుడు చిన్న వరము ఇచ్చెను. నేను గొప్ప బోధకుడ్ని కాను. ఒక బోధకునిగా అర్హత పొందు విద్య నాకు లేదు — ఈ రోజులలో బోధకునిగా పిలువబడవలెనన్నచో, అనుభవములు తప్పకుండా వేదాంత విద్య అనుభవములుగా ఉండవలెను. ప్రత్యేక డాక్టరు పట్టా, లేక అట్టిది మరేదో ఉండవలెను. నేను దానికి అర్హుడను కాను. కాని దేవుడు నా హృదయమును చూచి ఆయన కొరకు నేను ఏదో చేయవలెనని ఎరిగి యుండెను. దానిని నేను అభినందించగోరుచున్నాను.

67ఒక రోజున ఒకాయన ఇట్లనెను, "నీవొక చక్కని మనిషివను కొంటున్నాను, శ్రీ బ్రన్హం, కాని నీవు యధార్థంగా తప్పులోనున్నావు అనుకొంటున్నాను. నీవు చిత్తమునకు బయట ఉన్నావు… అంతమందు నీవు శిక్షించబడుదువని ఎరుగుదువా?"

నేనిట్లు చెప్పాను, "చూడు! ఒక్క సంగతి నీకు చెప్పగోరుచున్నాను. కేవలము వాదము కొరకు నీవు ఆలాగు చెప్పుచున్నాచో నీవు చెప్పినది సరికావచ్చు (నేను తప్పు అని నేను నమ్మను), కాని నేను పొరపాటులో నున్నచో, ఇపుడే, నేను వంద సంవత్సరములు బ్రదికినను మార్గాంతమున ఆయన నన్ను ఖండించి ఈలాగు చెప్పునని నేనెరుగుదును, 'విలియం బ్రన్హం, నీవు నా పరలోకములోనికి, రా తగవు. వెలుపట చీకటిలోనికి పొమ్ము.' ఏమిటో మీకు తెలుసా? ఏమయినా గాని నేను వెళ్ళిపోయే నా చివరి దినము వరకు ప్రతిరోజు నేను ఆయనను సేవించుదును. ఎందుకనగా ఆయన యొక్క ఉచిత దీవెనలను అంతగా నేను పొందుకొన్నాను. ఆయన నాకు జీవితము కంటె ఎక్కువ."

ఆయనే నా సమస్తము….

68నేనేమైయున్నానో ఆ సమస్తము, ఎన్నడైనా నేను ఉండవలెనని ఆశించునది, నేను ఆయన కృప, కరుణలనుండియే పొందాను. నేను నీచుడను, దిక్కుమాలినవాడను, దరిద్రుడను, గ్రుడ్డి వాడను; కాని కృప ద్వారా ఆయన నన్ను స్వస్థపరిచెను. దేవుని కృపను బట్టి నేను ఆరోగ్యంగా, బలంగా ఉన్నాను. నాకు మంచి దృష్టి ఉన్నది. నేను తిని-త్రాగి, నాకవసరమయినది చేయకలుగుచున్నాను. నా కోరికలు, నా అవసరతలు తీర్చుదునని ఆయన ఎన్నడూ వాగ్ధానము చేయలేదు. ఆ దినమున నేను వెళ్ళగొట్టబడియుండినచో, నాకు తెలియును నేనెక్కడ ఉందునో నాకు తెలియదు. కాని నేను తప్పు అని నాకు తెలిసియు, తప్పుగానుండుటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసికొన్నచో, నేను తప్పుగానే నిలిచియుందును. ఎందుకనగా నేను ఆయన చిత్త మును చేయగోరుచున్నాను. ఆయన చిత్తమే నెరవేరునట్లుగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఇపుడు, అది పెద్దమాట, కాని నేను ఏ ఆత్మతో దానిని చెప్పితినో మీరు మార్గములో తెలిసికొందురని ఆశించుచున్నాను. చూడండి.

ఆయన చిత్తమును నేను చేయగోరుచున్నాను, ఒకదాని కొరకు ఒకసారి నేను ఆయనను అడిగాను, "వద్దు," అని ఆయన తల ఊపెను. ఆయన "అవును" అని చెప్పితే ఎంత సంతోషించుదునో అంతే సంతోషించాను.

ఎందుకనగా మనము ఎల్లపుడూ, నీ చిత్తము నెరవేరును గాక అని అడుగవలెను. అది ఆయన చిత్తమయినచో, ఆయన కాదనుట కూడా అంతే మంచిది. అది ఆయన అవును కంటె ఎంతో మంచిది. ఆయన చిత్తమే చేయవలెను. నీవు ఆయనను నిజంగా ప్రేమించినపుడు చేతువు. ఆమేన్.

JOHN 10:30

 

69ఆయనను గురించి నేను మాట్లాడవలసియున్నాను, ఇపుడు దానిని నేను ఆపజాలను, ఓ! ఆయన నాకెంతో వాస్తవము, ఎంతో యధార్థముగా ఉన్నాడు. స్నేహితులారా, నేనేమైయున్నానో, ఎప్పుడైనా నేనేమైయుండగలనో, అదంతయూ ఆయనే. ఎప్పుడైనా నేను ఇట్లుండవలెనని ఊహించునది అంతయూ యేసుక్రీస్తులోను, ఆయన మాటలోను పునాది వేయబడియున్నది.

వర్తమానము కొరకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్షమును బట్టి నేను వందనములు చెల్లించుచున్నాను. కొందరు దానిని సమ్మతింపక పోవచ్చునని నేనెరుగుదును, కాని నేను మీతో చెప్పినట్లుగా ఒక వర్తమానము అందించుటకు బాధ్యుడనైయున్నాను. ఒక సూచన బయలు వెళ్ళెను, తాను దేవుడనని చూపించుకొనుటకు కేవలము దేవుడు ఒక సూచనను పంపడు. ఒక వర్తమానము, ఒక స్వరము ఎల్లప్పుడు సూచనను అనుసరించును. అది ఎవరికైననూ తెలియును. యేసు సూచక క్రియలు అద్భుతములలో వచ్చెను. ఆయన అద్భుతములు, సూచక క్రియలు చేసినంత కాలము గొప్పవానిగా ఉండెను, కాని ఆయన కూర్చొని వర్తమానము తేవలెనని ప్రారంభించగా, "నేను తండ్రి ఏకమైయున్నాము," అని చెప్పగా, ఓ! అది వారికి తప్పుగా ఉండెను. చూడండి?

కాని సూచక క్రియను స్వరము వెంబడించవలెను.

EXOD 4:1-8•

EXOD 16:12-15

 

70మోషేకు రెండు సూచనలు ఇవ్వబడెను, ప్రతి సూచనకు ఒక స్వరముండెను. అది నిజము. "సూచన యొక్క స్వరము" అనుదాని మీద ఇక్కడో, ఎక్కడో, కొంత కాలము క్రిందట బోధించాను. "అది తప్పకుండా సూచన యొక్క స్వరము," అయి ఉండవలెను. అది మారుచున్నది, ఎల్లపుడూ అది ఆలాగే యుండెను; అది ఆలాగు కానిచో, అది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు.

ఒక మనిషి వింతగానున్న పరిచర్యతో వచ్చినచో, అది బైబిలులో సత్యమని కనుగొనబడినచో, ఆ మనిషి ఇంకా అదే పాత శాఖ బోధలో నిలిచియుండినచో, దానిని మరిచిపోమ్ము. దానికి ఏమిలేదు! అటువంటి క్రియ దేవుడు ఏదీ చేయడు. అది క్రుళ్ళిన మన్నా, అందులో పురుగులు, క్రిములు లేక మీరు మరే విధంగానైనా పిలువవచ్చును గాని అవి ఉన్నవి. నలభై, ఏభై సంవత్సరముల నుండి ఎన్నడో సంవత్సరాల క్రితం పడిన మన్నాను ఇంకా తినుటకు ప్రయత్నించుచ్నుచో, అది తప్పు. ఇశ్రాయేలీయులకు వారి యాత్రలో ప్రతి రాత్రి క్రొత్తమన్నా పడెను. అది నిజము. దానిని దాచియుంచలేవు. గతించిన ఏదో కాలమును బట్టి మనము జీవించజాలము; మన యాత్రతో మనము వెళ్ళుచుండగా క్రొత్త మన్నా, తాజా మన్నా, పరలోకము నుండి మనము తినుచున్నాము.

ఇపుడు మన తలలు వంచుదము.

MARK 16:17

 

71ప్రభువగు దేవా, నీవు నీ సన్నిధి, నీవు ఎంతో వాస్తవము. నేను కృపను గూర్చి ఆలోచించాను. ప్రభువా, మేము నీవు ఎన్నో క్రియలు చేయుట ఇప్పుడే చూచాము. నీవు భాషలతో మాట్లాడుట, నీవు దానికి అనువాదము చేయుట, నీ ప్రజల ద్వారా అవి జరిగించుట మేము విన్నాము. చూచాము. ఓ, దేవా, నీవు రోగులను బాగు చేయుట, గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయుట, కుంటి వారిని నడిపించుట, చెవిటి వారికి వినిపింపచేయుట, మూగవారిని మాట్లాడచేయుట చూచాము. నీవు ఎంత గొప్ప శక్తిగల దేవుడవు! ఈ చివరి దినములలో నీవు వాగ్ధానము చేసినదానిని చూచాము. మాకు ఎన్నో శరీర అనుకరణలు ఉన్ననూ, అది ఎక్కడో ఒక నిజ దేవుడు ఉన్నాడన్న సంగతిని ప్రకటించుచున్నది. అది నిజంగా వాస్తవము.

పరమ తండ్రీ, ఈ రాత్రి నా ప్రార్థన ఏమనగా, నీవు ఇక్కడున్నావని ఎరుగునంత దైవ మనస్సు కలిగి యుందుము గాక! ఈ వరుసలో నున్న ప్రజలు, వారీ వరుసలో నుండి వెళ్ళుచుండగా, ప్రభువా, మేము దీనిని ఎందుకు చేయుచున్నామనగా మేము వారికి ఒక వాగ్ధానము చేశాము. "నమ్మిన వారివలన ఈ సూచనలు కనబడును," అని నీవు చెప్పితివి.

ఇక్కడ సేవక సోదరులు, నీవు ఏర్పరచుకొనిన వారు, జగత్తు పునాది వేయబడకముందే వారు ఈ రాత్రి ఏమైయున్నారో అందుకు ఏర్పాటు కాబడి నిలబడియున్నారు. నీవు అనంతుడవు గనుక, ప్రపంచము అనునది లేకముందే మేము ఈ రాత్రి ఇక్కడ నిలబడుదుమని నీవు ఎరుగియున్నావు.

72కనుక మా పరమ తండ్రీ, ఈ రాత్రి ఈ వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గ్రుడ్డివారు, అవిటి వారు, కాన్సరు రోగులు, మరేదైనా గాని, ఈ వరుస ద్వారా వెళ్ళునపుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడే, వారిని స్వస్థపరచునుగాకని వారెరుగునట్లు ప్రార్థించుచున్నాము. వారు కేవలము చూచి, అర్థము చేసికొని, దానిని అంగీకరించినచో చాలును. కేవలము ఒక ఇత్తడి పాత్ర వైపు చూచినట్లుగా, ఆ ఇత్తడి సర్పము వైపు చూచిన మనిషి ఎన్నడునూ స్వస్థత పొందడు, ఎందుకనగా అదేమైయున్నదో దాని యొక్క అవగాహన కలిగిలేడు. ఈనాడు, ప్రభువు, అదే రీతిగా యున్నాడు. తమకేమైనా సహాయము దొరుకునేమోనని చెప్పి వారు ఒక వరము వైపు చూచినచో, వారికి అవగాహన లేదు. ఇక్కడ స్వస్థపరచుటకు దేవుని యొక్క సన్నిధి ఉన్నదని అది ఒక రుజువు మాత్రమే. తండ్రీ, దానిని అనుగ్రహించుము. యేసు నామమున అది జరుగును గాక! ఆమేన్.

HEB 13:8

 

73ఆ పియానో వాయించు వారు (స్త్రీ లేదా పురుషుడు, అది ఎవరైనా గాని) అక్కడకు వెళ్ళి, "ఆ గొప్ప వైద్యుడు ఇపుడు సమీపమందున్నాడు. దయచూపు యేసు," అను పాటను, పియానిస్టు ఇష్టపడినచో వాయించమని కోరుచున్నాను.

ఇపుడు అది నా మొదటి స్వస్థతా కూటములలో ఒక దానిని నేను గుర్తుచేసికొనుచున్నాను. ఇండియానాలోని ఫోర్టువేయిన్‌ లోనిది. ఒక చిన్న ఆమిష్ బాలిక కూర్చొని పియానో వాయించినది. "ఆ గొప్ప వైద్యుడిపుడు దగ్గరలో ఉన్నాడు, దయచూపు యేసు." వేదిక మీదకు ఒక చిన్న బిడ్డను తెచ్చారు. ఆ బిడ్డ కుంటిది, మరియు నేను ఆ బిడ్డకు ప్రార్థించుచుండగా, అది నా చేతులలో నుండి దూకి వేదికపైన పరుగిడినది, తల్లి మూర్చపోయినది, అమ్మమ్మ తన చేతి గుడ్డను విసిరి ఏడ్వ నారంభించెను (ఇపుడు ఈ చిన్న ఆమిష్ బాలిక పెంతెకోస్తు గూర్చి బొత్తిగా ఏమి ఎరుగదు, ఎందుకనగా ఆమె ఆమిష్ సంఘమునకు చెందినది, కాని ఆమె వాయించుచున్నది), ఆమె పొడవైన జుట్టు క్రింద పడినది, ఆమె ఆత్మలో ఎత్తబడి, ఎరుగని భాషలో పాడనారంభించెను, ఆ పాటను రాగముతో పాడసాగినది. ఆపియానో మెట్లు దానికదే క్రిందికి పైకి కదిలినవి, పాడుచు "ఆ గొప్ప వైద్యుడిచ్చటనే యున్నాడు, దయగల యేసు." ఆమేన్! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

లూక 8:50

LUKE 8:50

 

74ఇపుడు మనము ప్రార్థించుదము. ఆ బయటనున్న వారందరూ ప్రార్థించండి. ఆ వరుసలోనికి వచ్చుచున్న మీరు, మీ పై మేము చేతులుంచునపుడు, యేసు చెప్పినది గుర్తుంచుకొనండి. నమ్మినచో మీరు బాగవుదురు. దానిని నమ్ముచున్నారా? ఇపుడు అందరము పాడుదము.

ఆ గొప్ప వైద్యుడిపుడు దగ్గరే యున్నాడు,

దయచూపు యేసు.

ఆయన మాట్లాడును, (మీ కన్నులు మూయండి,

మనము పాడుచుండగా) హృదయములను ఆనందింప చేయును.

ఓ! యేసు స్వరము వినుము.

సెరూపులపాటలో మాధుర్య గొంతు,

మర్తనాలుక మీద మాధుర్యనామము.

మాధుర్యమైనది…. (తండ్రియగు దేవా,

ఇపుడు జనులపై సంచరించుము), గానము.

ఓ, యేసూ, ధన్యుడవగు యేసు.

ఆ గొప్ప….

ఇపుడు మీరు నడచుచుండగా, ఆయనిచ్చటనే యున్నాడు. నా మాట తీసికొనండి, లేదా మీ అంతట మీరే నమ్మండి. ఆయనిక్కడే ఉన్నాడు. ఇపుడు జనుల నిమిత్తము బయటున్న వారందరూ, ప్రార్థనలో ఉండండి.

75ఓ, ప్రభువా, నేను నమ్ముచున్నా;

ఓ ప్రభువా, నేను నమ్ముచున్నాను.

సమస్తమూ సాధ్యమే,

ఓ, ప్రభువా, నేను నమ్ముచున్నాను.

నమ్ముచున్న వారందరూ, మీ చేతులెత్తి, "నేను నమ్ముచున్నాను," అని చెప్పండి. ఇక్కడ ఒకాయన కూర్చొనియున్నాడు. నేను మాట్లాడుటకు కారణము ఆయన కాన్సరుతో మరణించుచున్నాడు. ఆయన ఈ చేతికర్రపై ఉన్నాడు. ఆ మనిషి బ్రదుకుటకు లోకములో దేవుడు తప్ప మరో మార్గము ఏదీ లేదు. ప్రేగులన్నింటిలోను అతనికి కాన్సరున్నది, దేవుని కృప లేనిచో అతడు చనిపోవుట ఆవశ్యకము. ఈయనకు ప్రోత్సాహమిచ్చు మాటను చెప్పవలెను. ఇపుడు వైద్యులు నీకేమియూ చేయలేరని నీవెరుగుదువు; నీవు దానిని దాటిపోయావు. చూడు. నీకు ఒకే అవకాశమున్నది, అది క్రీస్తునందే. చూడు, సోదరుడా, నేనూ ఒక దినమున చనిపోదును. యేసు రాక ఆలస్యమైనచో, నీవు వెళ్ళిపోవలసియున్నావు. అక్కడ నిన్ను నేను కలిసికోవలసియున్నాను. ఆ తీర్పు నొద్ద నిలబడవలసియున్నాను. ఈ రాత్రి…

76టెలివిజనులో మనము వ్రేలు కదిపినా, ఏమి చేసినాగాని అది దానిని ప్రతిసారి స్వీకరించి ప్రసారము చేయును, అది నీవెరుగుదువు. ప్రతి మాట మనము పలుకునది నమోదగుచున్నది. ఇపుడు చూడండి. టెలివిజను దానిని రుజువు చేసినది. ఒక బొమ్మను టెలివిజను ఉత్పత్తి చేయ జాలదు గాని టెలివిజనులోనికి ప్రసారము చేయబడిన దానిని అది బయటకు తెచ్చును. చూడండి. అది దానిని తయారు చేయదు. ఆదాము భూమిపై నడచినపుడు; అక్కడ టెలివిజను ఉండెను. మోషే ఎర్ర సముద్రముగుండా వచ్చినపుడు; అక్కడ టెలివిజను ఉండెను. ఏలియా కర్మెలు కొండపైనున్నపుడు; టెలవిజను ఉండెను. చూడండి. కాని వారు ఇప్పుడే దానిని కనుగొనిరి. చూడండి?

మనము చేయు ప్రతి కదలిక, ప్రతి శబ్దము, నమోదయి తీర్పు దినమున అది తిరిగి చూపబడును. మనము చేయు ప్రతి కదలిక అక్కడ మనలను కలిసికొనును. ఒక సేవకునిగా నేను చెప్పిన ప్రతి మాటకు, నేను జవాబు ఇయ్యవలసియున్నాను, ఎందుకనగా దేవుడు నన్ను దానికి బాధ్యునిగా చేయును.

ISA 53:5

 

77నాకు వీలయితే, నేను మిమ్మును బాగుచేసియుండేవాడ్ని — ఎందుకనగా దేనిలో మీరు లేనిచో మీకున్న సమయము కొద్ది పాటిదే. ఇపుడు నేను, నాకు తెలిసిన రీతిగా వచ్చి మీకు ప్రార్థించాను. సోదరుడా, ఆ స్థితిలో కూర్చొనియున్న మనషికి ఈ లోకములో ఏదయిననూ నేను చేయుదును. నిన్ను అడుగనిమ్ము. చూడు. నీవు నీవెపుడో స్వస్థత పొందావు, ఎందుకనగా నీవు బాగయినావని యేసు చెప్పెను. చూడండి. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత పొందాము. ఇపుడు, మీ హృదయాంతరంగము నుండి మీరు దానిని అంగీకరించకలిగినచో నీవిపుడు చనిపోక బ్రదికెదవు.

ఇప్పుడు చూడు, ఆటెలివిజను ఈ గది ద్వారా వచ్చుచున్నదని మనకు తెలియును. అది మనకు తెలియును. దానిని మనము చూడము. దానిని మనము చూడజాలము; దానిని గ్రహించుటకు మన కండ్లు, మన జ్ఞానేంద్రియములు తయారు చేయబడలేదు. అయితే దానిని పట్టుకొనుటకు ఒక తయారుచేయబడిన గొట్టము లేదా క్రిస్టలు లేదా మరేదో కావలెను. ఆలాగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనను మనము చూడము. కాని ఆయన ఇక్కడు న్నాడని మనకు తెలియును. యేసు ఒకే రీతిగా ఉన్నాడు. చూడు. తన్ను తాను ఏలాగు తయారుచేసికొనునో ఇప్పుడే ఆయన తెలియపరచుకొనెను. స్వస్థత విషయములో ఆయన ఇక్కడ నిలబడియున్నాడు. ఆయన మరొకటి చేయలేడు. దేవుని కుమారుడు ఇక్కడ నిలబడియున్నాడు. ఆయనిక్కడే ఉన్నాడు, కాని ఆయన అంతకన్న మరేమీ నీకు ఎక్కువ చేయలేడు. ఎందుకనగా ఇప్పటికే ఆయన ఇక్కడ తన్ను తాను గుర్తింపచేసికొనియున్నాడు. చూచారా?ఇపుడాయన అదే రీతిగా ఇక్కడే నిన్ను స్వస్థపరచుటకు, బాగుచేయుటకు ఉన్నాడు.

78ఆమె నాతో ఇట్లన్నది, "ఆమెకు నీవు ఆశీర్వచనము చెప్పావు," ప్రవచించావు లేక మరేదో చెప్పావు, ఆమెకు బిడ్డ కలుగునని చెప్పావు. ఆ చక్రాల కుర్చీలో కూర్చొనియున్నది, ఆమె ఆలాగే బిడ్డను కలిగియున్నది,

ఇప్పుడా స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది. ఆమెకు గోయిటర్ ఆపరేషను అయినది, దానివలన ఆమె చచ్చుపడెను. అటువంటివి ఎన్నో జరుగుట చూచాము.

ఇప్పుడు సోదరి, నీవు అసలయిన క్రైస్తవురాలవని నేనెరుగుదును. దేవుడెందుకు నిన్ను ఇచ్చట కూర్చుంనిచ్చెనో, నాకు తెలియదు. బహుశా, నీవు అందులో నుండి బయటకు వచ్చుటకు విశ్వాసము కలిగియుండుటకు ప్రయత్నించుచుండవచ్చును. చూడు. దానిని కలిగియుండుటకు ప్రయత్నించవద్దు. ఇప్పుడే, దానిని కలిగియుండుము. చూడు. ఇప్పుడే అక్కడ వెళ్ళు. చేయవలసినది అదే. ఇప్పుడే, అది ఆరంభము కానున్నది. నీవు బాగుపడనైయున్నావు.

ఆ కుర్చీలలో నున్నవారు, ఎక్కడున్ననూ, ఏమయిననూ, క్రీస్తు ఇక్కడున్నాడని జ్ఞాపకముంచుకొనండి.

79అక్కడెవరైనా ఉన్నారా, "నా పటము వచ్చుట చూచుచున్నావా?" అని మీరు అడుగుదురు. ఓ, అవును. భూమి మీద నుండగా యేసుక్రీస్తు పలికిన మాటలు సహితము ఈ గదిలో నుండి బయలు వెళ్ళుచున్నవి. అదెన్నడూ చూపదు. అది శాస్త్రీయంగా సత్యమని ఎందరు ఎరుగుదురు? సరే. అది ఏమిటి? వ్రాయబడిన ఆ వాక్యమును ఆత్మ ఎత్తి పట్టుకొని దానిని ప్రత్యక్షపరచున.

ఓ, మహిమ! ఆయనిచ్చట ఉన్నాడు. ఇపుడాయన, ఇక్కడే ఉన్నాడు. మనము ఎంతో చూచాము. ఎంతో ఆయన చేసెను, దాని గూర్చి మనము ఒక విధంగా తొట్రిల్లునంతగా ఆయన చేసెను, దానిని మనము గ్రహించవలెను. ఏదో కాల్పనిక గాధ కాదు; ఏదో వేదాంత పదము కాదు; ఈ దినమున, ఆయన తన్నుతాను చూపించుకొనునని చేసిన వాగ్ధానమునకు రుజువు. ఇపుడే, ఆయన మనముందే, ఆయన దానిని ప్రకటించుచున్నాడు. ఎంత అద్భుతమగు సంగతి! అది అద్భుతము కాదా?

2CH 19:7•

ACTS 10:34•

ROM 2:11

 

80ఇపుడు, మీరు నమ్ముడి!

దానిని మీరు నమ్మెదరా? నీవు చనిపోవని నమ్ము; నీవు జీవించుదువు, నీవు దేవుని ఘనపరచెదవు. నీవు దేవుని గౌరవించుదువు. నీవెపుడైనా బాప్తిస్మము పొందావా? నీవు క్రైస్తవునివి, కాదా? నీవు క్రైస్తవునివి! సరే. నీవు దేవుని ఘనత కొరకు జీవించగోరుచున్నావు, అయితే వెళ్ళి జీవించు. నా సోదరుడా, యేసుక్రీస్తు నామమున బ్రదుకుము!

సోదరీ, దేవుని యొక్క మహిమార్థము నడువగోరుచున్నావా? నీ బిడ్డను గూర్చి శ్రద్ధ వహించుము. అయితే యేసుక్రీస్తు నామమున నడువు సోదరీ! మీరు… మీలో ప్రతివారు, యేసుక్రీస్తు నామమున ఆలాగే చేయుడి.

ఈ రాత్రి ఇక్కడున్న వెస్ట్రన్ హోం హాటల్‌ను మరిచపోవద్దు, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ గుర్తింపబడినది. ఆయన పక్షపాతికాడు. నీవు నమ్మవలెనని మాత్రమే, ఆయన కోరుచున్నాడు. నీవు ఇప్పుడు ఆయనను నమ్మెదవా? ఆమెన్. దేవుడు మిమ్ము దీవించును. ఇప్పుడు మనము తలలు వంచెదము. వారు ముగించమని ఎవరితో చెప్పారో నాకు తెలియదు. సహోదరుడా, ఇక్కడకు రమ్ము. ఈయన మనలను ప్రార్ధనలో నడిపించనున్నారు. దేవుడు నిన్ను దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...