యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు
బ్రదర్ ఫ్రాంక్, వందనములు...?.. దేవుడు మిమ్మును దీవించును. స్నేహితులారా శుభసాయంకాలం. ఇక్కడుండుట చాలా సంతోషముగా ఉన్నది, ఆయన మన కొరకు చేసిన దానంతటినిబట్టి, ఆయన యొక్క కృపనుబట్టి, ఇక్కడుండే ధన్యతనుబట్టి దేవునికి వందనములు చెల్లించెదము. యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చేంత వరకూ ఎన్నడూ ముగించబడని ఉజ్జీవపుశక్తిని ఈ కూడిక విడుదల చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. అదే మా లోతైన యధార్ధ ప్రార్థన, ప్రభువు మీలో ప్రతీ ఒక్కరినీ అత్యధికముగా దీవించి, మీరు చేయకలిగి, ఆలోచించిన దానికంటే మిక్కిలి సమృద్ధిని మీకు ఇచ్చును గాక. ప్రభువు మీకు అది ఇచ్చునని నా యధార్ధ ప్రార్థన.
నేను-నేను వాటినన్నిటిని గమనించుచున్నాను. అదిసరే. సరే, కేవలం...?...కెమెరాల గురించి నేను సిగ్గుపడుటలేదు, కాని వారికి తెలియని కారణం.... స్వస్థతా పరిచర్య ప్రారంభమైన తరువాత వాటిని తీయవద్దని వారికి చెప్పండి.... ఇప్పుడు మరొక రాత్రి మనమంతా కలసితీసుకుందాము... చూశారా? ఇప్పుడు అది సరే. మీకు కావాల్సినవన్ని తీసుకోండి. నేను...ఎవరైనా నా చిత్రాన్ని తీసుకోవాలంటే నన్ను మాత్రమే అని అనుకుంటే, అప్పుడు నేను.... మీరు చూశారా? అది మంచిదే. నేను దానిని అభినందించుచున్నాను. కాని కొన్నిసార్లు కూడిక కొనసాగుచున్నప్పుడు, ప్రార్థనా వరుస కొనసాగుచున్నప్పుడు (మీరు చూశారా?), అది అదే కార్యము....
ప్రభువు దూత ఆయన సమీపముగా వచ్చినప్పుడు, అది ఒక వెలుగు మరియు ప్రజలు వెలుగుచుండుట కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, (మీరు చూశారా?) మరియు-మరియు అలాంటప్పుడు కొన్నిసార్లు కెమెరా నన్ను ఇబ్బంది పెడుతుంది. చూశారా? అలాంటి వెలుగునే నేను చూసినప్పుడు, నేను చూశాను (మీరు చూశారా?) ఆయన ఎక్కడ కదులుచున్నాడో గమనించవలసియున్నది. ఆయన నన్ను వదిలి సమాజములోనికి వెళ్ళును, మరియు ఆయన ఎవరో ఒకరి మీద నిలబడియుండుట నేను గమనిస్తాను. అది ఒక వెలుగువలె ఉండును. ఆ వెలుతురు ఆవిధంగా ప్రకాశించినప్పుడు, కొద్దిగా (మీరు చూశారా?) అది ఆయన కాకపోయినప్పటికి, అది కొద్దిగా నన్ను గందరగోళపరచును. కాని, అది సరే. అది మంచిదే.
2
ప్రభువు చిత్తమైనట్లయితే, మనము బాటిల్ క్రీక్ (Battle Creek) కు వెళ్తున్నాము. అక్కడ ఎంతకాలము ఉంటామో, నాకు తెలియదు. ఒక్క రాత్రి నుండి యేసు వచ్చేంతవరకూ. అది దేవునికే తెలియును. నాకు తెలియదు. అది ఏర్పర్చబడిన కూడిక. మరియు ఏ సమయములోనైనా ఆయన వెళ్ళమని చెబితే, మేము అక్కడ ఒక్క రాత్రే ఉండవచ్చు. మేము ఒకవేళ రెండు రాత్రులు ఉండవచ్చు. మేము అక్కడ అయిదు రాత్రులు ఉండవచ్చు; మేము అక్కడ అయిదు వారాలైనా ఉండవచ్చు. నాకు తెలియదు. ఒక నిర్ణీత ప్రణాళిక, ఏర్పాట్లు చేయుట ఇవన్నీ నేను ఎన్నడూ ఇష్టపడను; ప్రభువు ఎలా నడిపిస్తే, మేము అదే చేస్తాము. చూశారా? అదే మంచిదని నేను అనుకొంటున్నాను. అది మాత్రమే శుభప్రదమని నేనిప్పటికే కనుగొన్నాను. కాని నేను దీనిని చెప్పాలనుకొంటున్నాను. దేవుడు నన్ను తిరిగి చికాగోకి తీసుకునివచ్చి గొప్ప సముదాయముగా ఉన్న క్రైస్తవ ప్రజలైన మీతో కలసి రాబోవుచున్న కొన్ని నెలలపాటు ఉజ్జీవాన్ని కొనసాగించునని నా హృదయపూర్తిగా నేను నమ్మిక కలిగియున్నాను. నేను అనుకొనుచున్నాను.... ఆయన చేయునట్లుగా నేను ప్రార్థించెదను.
ఎక్కడో ఒకచోట ఆడిటోరియంను పొందుకుని మీలో చివరి వ్యక్తి వరకూ ప్రార్థించబడేలాగున కేవలం రెండు లేక మూడు రాత్రులు మాత్రమే కాకుండా, కొన్ని వారములు లేక ఎన్ని రోజులు అయినా సరే ఉండేలాగున మనము ఏర్పాట్లు చేద్దాం మరియు ప్రభువు నడిపించిన మార్గములో ఒకటి నుండి మరొకటి కొనసాగిద్దాము.
నేనెల్లప్పుడూ చికాగోకి రావాలని ఆశపడుతూ ఉంటాను. మరియు గొప్ప వ్యక్తులయొక్క గౌరవార్ధముగా, మూడీ.... మన పరిచర్యకు ముందు దినములలో పౌలు రాడర్ మరియు మొదలగువారు ఉండియున్నారు. మరియు నేను....
చికాగోలో అప్పటినుండి నిజమైన కదిలింపు లేనేలేదు. మరియు దీనికి నిజముగానే ఒక కదిలింపు (Shaking) అవసరమైయున్నది. మరియు దానిని దానిని ఆ సహజాతీతమైనదే చేయగలదు. ఆయన నన్ను ఇండియాకు పంపినట్లుగా, చికాగోకి వెళ్ళమని మంచి ప్రభువు నాకు చెప్పినట్లయితే, అప్పుడు మాత్రమే దానిని ఆయన చేయును. కాని నాయంతట నేనే దానిని చేస్తే, నేను దానిని కోల్పోతాను. మీరు చూశారా? అదే నా విధానము. కాని దేవుని మార్గమనేది ఒక ప్రత్యేకమైన మార్గము. దేవుడు సమస్తకార్యములు పరిపూర్ణముగా చేయును. మానవుడు ఏది చేసినా, ఏ నిబంధన చేసినా లేక మానవుడు దేవునితో చేసే ఏదైననూ, అతడు ఎల్లప్పుడూ విచ్ఛిన్నము చేయును. కాని దానిని దేవుడు గనుక చేస్తే, అది ఆయన కృప, అది ఆయన శక్తి. చూశారా? దేవుడు ఎల్లప్పుడూ....
3
ఏదెను తోటలో, ఆయన మానవునితో చెప్పారు, ఆ వృక్షఫలమును తినవద్దని మానవునితో నిబంధన చేసారు. కాని ఏమైనప్పటికీ వారు దానిని తినేసారు. దాని తర్వాతే, “నేను వైరము కలుగజేసెదను.” అని ఆయన చెప్పారు. చూశారా? “నేను కలుగజేసెదను.” ఆ నిబంధన విచ్ఛిన్నమవ్వదు. అదే దేవుడు చేసినది. చూశారా? మరియు వారు ఎక్కడనుండి వచ్చారో, ఆ భూమి యొక్క మన్నుగా ఆ పురుషుని మరియు స్త్రీని ఆయన మార్చివేసాడు. వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. మరియు ఒక దినాన దాని అసలైన స్థానానికి మరలా విమోచిస్తానని ఆయన వాగ్ధానం చేసాడు. ఆయన దానిని చేస్తాడు. ఇప్పుడు, దేవుడు దానిని చేస్తాడు. మరియు దానికోసమే నశించిపోతున్న ఆత్మలయొక్క శ్రేష్ఠమైన రక్షణ కొరకే మనమంతా పోరాడుచున్నాము.
మరియు, నేను చేయాలనుకుంటున్నాను... మరియు నేను ఇలా చెప్పవచ్చు, వ్యాధితో ఉన్న శరీరములు. సంపూర్ణ సువార్త అనేది శరీరానికి మరియు ఆత్మకును రెండింటికిని అని నేను నమ్ముచున్నాను. చూశారా? నేను దానిని నమ్ముటలేదని ఇప్పుడు... కొంతకాలము క్రితము ఇక్కడ ఎవరో ఒకరు మాట్లాడుతూ, “బ్రదర్ బ్రాన్హాం ఆ పాపపరిహార ప్రాయశ్చిత్తములో దైవిక స్వస్థత కూడా కలసే ఉన్నదన్న దానిని నీవు నమ్ముచున్నావని నాకు చెప్పాలనుకుంటున్నావా?” అని అడిగాడు.
“అవునయ్యా” అని నేను అన్నాను.
అవునండి. మరియు నా మంచి బాప్టిస్టు సోదరునితో ఆ సంభాషణ జరిగింది.
“అదే మీ భావమా?” అని అడిగాడు, “బ్రదర్ బ్రాన్హాం పాపపరిహార ప్రాయశ్చిత్తములో దైవిక స్వస్థత ఉంటే, దానిని నీవు ఎక్కడ ఆపాదిస్తావు? యెషయా చెప్పినదానికా?” అని అడిగాడు.
“అవునయ్యా” అని నేను అన్నాను
“ఓ, కాదు” అని అతడు అన్నాడు.“అది తప్పు అని నేను నీకు నిరూపించగలను” అని చెప్పాడు
“సరే మంచిది”, అని నేను అన్నాను. అతడు, “యెషయా ప్రవచించినట్లుగా ఆయనే మన బలహీనతలను వహించెను మరియు మన యతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడెను, మరియు ఆయన పొందిన దెబ్బలవలన మనము...” అని చెప్తూ, “మత్తయి 8వ అధ్యాయములో చెప్పుచున్నట్లుగా,
ఆయనే మన బలహీనతలను వహించెను అని ఆయన గూర్చి చెప్పబడినది నెరవేరిపోయింది“ అని చెప్పాడు. ”ఆయన దానిని అప్పుడే నెరవేర్చేసాడు“ అని చెప్పాడు.
4
“నా సహోదరుడా యెషయా చెప్పింది నెరవేర్చడానికే దానిని ఆయన చేసినట్లయితే, పాపపరిహార ప్రాయశ్చిత్తం జరగడానికి ముందే ఆయన ప్రాయశ్చిత్తాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. ప్రాయశ్చిత్తం కోసం రక్తము కార్చి లేక ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరం మీద ఆరు నెలలకు ముందే చేసినట్లు అవుతుంది” అని నేను చెప్పాను. చూశారా? “అలా అయితే.... దాని తరువాత పేతురు, యాకోబు మరియు యోహాను మరియు మిగతావారంతా దేని ద్వారా స్వస్థపరిచారు? దాని తరువాత, అది ఎలా సంభవించింది?” అని నేను అన్నాను.
“వారు ఎన్నుకోబడిన పన్నెండు మంది మాత్రమే” అని అన్నాడు.
“ఇప్పుడు, సహోదరుడా.... ఆ శక్తి పన్నెండు మందికే ఇవ్వబడిందా?” “ఓ, కాదు కదా” అని నేను అన్నాను.
“ఫిలిప్పు వారిలో ఒకడని నీవు అనుకుంటున్నావా? అతడు అపోస్తులలో ఒకడా?” అని నేను అడిగాను. లేదండి, అతడు ఒక సంఘపెద్ద. అతడు సమరయకు వెళ్ళి రోగులను స్వస్థపరిచాడు, మరియు దెయ్యాలు పెద్దగా కేకలు వేసాయి, వారు ఒక నిజమైన ఉజ్జీవాన్ని కలిగియున్నారు. అది నిజమేనా? అతడు పన్నెండు మందిలో ఒకడు కాదు. అది నిజం.
మరియు యేసు తన చివరి ఆజ్ఞగా, దానితో సర్వసృష్టికి వెళ్ళుడి అని చెప్పారు.
5
కాబట్టి అతడు “మంచిది అయితే వారు... బ్రదర్ బ్రాన్హాం ఇక్కడ చూడు” అని అన్నాడు. “పాపపరిహార ప్రాయశ్చిత్తములో నీవు దైవిక స్వస్థతను బోధించినట్లయితే, అక్కడ ఏ బాధ ఉండదు. ఇంకెంత మాత్రము ఏ బాధ ఉండదు” అని చెప్పాడు.
నేను అన్నాను, “ఇప్పుడు” “పాపపరిహార ప్రాయశ్చిత్తములో రక్షణ ఉన్నదని నీవు నమ్ముచున్నావా?” అని నేను అడిగాను.
“అవును”
“అక్కడ శోధన ఉన్నాదా?” అని నేను అడిగాను. అక్కడే మీరున్నారు అవును. “అక్కడ శోధన ఉన్నదా?”
“ఓ, అవును, నీవు శోధించబడగలవు, కానీ ఆయన కృప చాలును.” “అవును, అక్కడ బాధ ఉన్నట్లయితే, ఆయన కృపే చాలును అని నేను చెప్పాను. అది నిజం ఆయన కృప చాలును.
అందుచేతనే తెలివైనవారు దారి తప్పిపోవడం కొన్నిసార్లు వింతగా ఉంటుంది. అలా కాదా?
6
ఒకానొక రోజు దాదాపు బ్రదర్ బాక్స్టర్ (Baxter) తో పోల్చగలిగే, అత్యంత తెలివైన బోధకులలో ఒకరైన, ఒక వ్యక్తి బోధించడం నేను విన్నాను. బ్రదర్ బాక్స్టర్ కోసము నేనేమి తలచుచున్నానో మీరు ఇప్పుడు చూడగలరు. అతడు ఒక యదార్ధమైన బోధకుడని నేను అనుకొంటున్నాను. మరియు మీరంతా నాతో ఏకీభవిస్తారని నేను నమ్ముచున్నాను. అది నిజం. మరియు అతడు ఒక మంచి సందేశాన్ని బోధించాడు. మరియు తర్వాత దైవిక స్వస్థత గురించి మాట్లాడుచున్నాడు. అతడు “వ్యాధి దేవునిదే” అని చెప్పాడు. “మనము ఏమి చేసినప్పటికీ, మనము తప్పకుండా వ్యాధిని కౌగిలించుకుని మరియు 'ఓ, అది మంచిది ప్రభువా' అని చెప్పాలని” అతడు చెప్పాడు. “అలా చేయడం వల్ల దెయ్యము ముఖము మీద మనము దుమ్మును ఉమ్మినట్టు అవుతుందని” చెప్పాడు. మీకు కీళ్ళనొప్పులు ఉన్నా, కీళ్ళ వాతం ఉన్నా, మరియు మరేమున్నా, 'కీళ్ళ వాతమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పండి, లేక మరేమైనా, 'ప్రభువు దానిని నాకు ఇచ్చాడు' అని చెప్పాడు చూశారా? ఓ, మై.
నేను ఊహిస్తున్నాను, పెద్ద కధను చిన్నదిగా చేయుటకు ప్రయత్నిస్తున్నాను, అదే వ్యక్తికి ఆంత్రప్రవాహ రోగము (ఉండకపు జబ్బు) వచ్చినప్పుడు, అతడు హస్పిటల్కి వెళ్ళి మరియు దానిని కత్తిరించి వేసుకున్నాడు. మరియు ఒకవేళ ఆ ఉండుకజబ్బు ఆశీర్వాదాన్ని బయటకు కత్తిరించకూడదు; దానిని అలానే వదిలివేసి, ముందుకు కొనసాగిపోయి మరియు దానితోనే చనిపోవాలి. చూశారా? కాబట్టి అది తప్పు అని మనము మనము చూసాము, చూశారా?
7
లేదు, దానిని చెప్పే ప్రతీ ఒక్కరూ, వారు వ్యాధి బారినపడిన వెనువెంటనే హస్పిటలు పారిపోతారు. వారికి ఏ ప్రమాదం సంభవించినా, మరియు కాలు విరిగినా మరియు మరేమి జరిగినా, వెనువెంటనే హస్పిటల్ కి వెళ్ళిపోతారు. మీకు తెలుసా, వారి కడుపులో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, వెనువెంటనే మొదటిగా వైద్యుడిని పిలిచేస్తారు. మంచిది, అది ఒక ఆశీర్వాదముగా ఉంటే, ఏదో చేయడం ఎందుకు.... మంచిది అప్పుడు, ప్రతీ మందు, ప్రతీ హస్పిటల్, ప్రతీది, భూమిమీద ఉన్న ప్రతీ ఔషదం దేవుని యెడల శాపంగా ఉంటుంది. చూశారా? అది భయంకరముగా లేదా? మై. చూశారా?
కాబట్టి, మీరు రోడ్డుకు ఇరువైపులా చాలా దూరంగా వెళ్ళిపోయారు, అలాగేనని మీరు నమ్మట్లేదా? పాతనాగరికత కలిగిన, నేరుగా రహదారి మధ్యలో ఉండే, దేవునిచే పంపబడిన వర్తమానాన్ని నేను నమ్ముచున్నాను. ఇరువైపులా సిద్ధాంతాలున్నాయి. అది నిజము. “అక్కడ ఒక రాజమార్గముండును” అని ఆయన చెప్పాడు.
“అది పరిశుద్ధ రాజమార్గమని” చాలామంది చెప్తారు. ఉహ్-హు.
“అక్కడ ఒక రాజమార్గముండును, మరియు (మరియు అనేది సముచ్ఛయము) మరియు ఒక దారిగా ఉండును, మరియు అది పరిశుద్ధ (రాజమార్గం కాదు) మార్గమనబడును, పరిశుద్ధమార్గము.” అని బైబిల్ చెప్పుచున్నది. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
8
కొద్ది నిమిషముల క్రితమే, నా కొరకు కానుక పట్టాడని బ్రదర్ బాక్స్టర్ ఇప్పుడే నాకు చెప్పాడు, ఒక ప్రేమకానుక మీరు జీవించేదానిలో నుండి కొద్ది భాగాన్ని, మీరు జీవించడానికి మీకున్న దానిలోనుండి, దేవుడు మీకు ఇచ్చిన దానిలోనుండి మీరు దానిని నాతో కలిసి పంచుకున్నారు. దానినిబట్టి నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. దాని కొరకు మీకు కృతజ్ఞతలు మరియు దానిని నూరంతలుగా దేవుడు మీకు తిరిగి ఇవ్వాలని నేను ప్రార్ధిస్తున్నాను. ఆయన లేఖనాలలో “మిక్కిలి అల్పులైన వారిలో ఒకనికి దీనిని చేసితిరి గనుక” అది నేనే అయియుండవచ్చు, “అల్పులైన ఒకనికి మీరు చేసితిరి గనుక, మీరు నాకు చేసినట్టే” అని చెప్పాడు, ఆ ఆశీర్వాదాలు తిరిగి వచ్చునుగాక.
“ఒక నీతిమంతుని ఆ నీతిమంతుని యొక్క నామములో చేర్చుకున్నట్లయితే, ఒక ప్రవక్తను ఆ ప్రవక్త నామములో చేర్చుకున్నట్లయితే,” మీరు పొందుకొనెదరు.... ఏమైనప్పటికిని “మీరు అల్పులైన వారిలో ఒకనిని, ఆ శిష్యుని నామములో చేర్చుకున్నట్లయితే, మీకు రావలసిన ఫలము మీరు పొగొట్టుకొనరు.”
మరియు ఇప్పుడు, దానిలో నుండి నా జీవనానికి, మరియు చేతిరుమాళ్ళ కోసము, మరియు గుడ్డల కోసము మరియు ఆ కార్యాలన్నింటి కోసము ఆ అభిషేకించబడిన వాటిని ప్రపంచమంతటా, వారానికి వేలకొలదిగా నేను-నేను పంపిస్తాను... ఇప్పుడు, దాని నిమిత్తమే దానిలో నుండి కొంత భాగాన్ని ఉపయోగిస్తాను, ఎందుకంటే నా ఆఫీసుకు వస్తున్న ఉత్తరములలో ఉన్నవాటి కోసము, జాగ్రత్త తీసుకోవడానికి చాలినంత ధనము అక్కడ లేదు. అది అధిక ఖర్చుతో కూడిన కార్యమైయున్నది. మరియు నేను దానిని ఉపయోగిస్తాను? యేసుక్రీస్తు నిన్న, నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు
అంతేకాకుండా, రక్షింపబడినవారికి యేసుక్రీస్తు సువార్తను వెళ్ళి బోధించేటట్లుగా నాకున్న దర్శనం ప్రకారం, నేరుగా ఆఫ్రికాకు మరియు ఇండియాకు వెళ్ళేటట్లుగా ఆ మిషనరీ అర్పణలో వాడతాను.
మరియు అప్పుడు, బహుమతులు పంచిఇచ్చే ఆ దినమున, దేవుడు అక్కడ నిలబడి, మీ తలపై కిరీటములు ఆయన పెట్టుచుండగా, దానికి దగ్గరలో నేను నిలబడి, నా చేతులు పైకెత్తి కేకలు వేస్తానని నేను ఆశిస్తున్నాను. మరియు ఆయన రాజ్యములో ఆయన ముత్యములుగా కిరీటము పొందుకొనెదరు. ప్రభువు మిమ్మును దీవించును గాక.
9
ఇక్కడ ఉండటాన్ని బట్టి మేము చాలా సంతోషముగా ఉన్నాం. బ్రదర్ బోజ్ (Boze) ను దేవుడు దీవించును గాక. మరియు అతడు విశ్వాసముతో ప్రయత్నించాడు. ఇప్పుడు, ఇక్కడున్న మీరంతా, మీరంతా ఇక్కడి వారు కాదని నేనెరుగుదును, కానీ, అతడు-అతడు మమ్ములను చికాగోకు తీసుకురావడానికి అతడు తన వంతు పనిని నిర్వర్తించాడు. అతడు ఖర్చుచేసాడు. అతడు పిలిచాడు, అతడు ప్రార్థించాడు, అతడు... ఈ చిన్న సంఘము మమ్మల్ని ఇక్కడకు తీసుకురావడానికి ప్రార్థించింది మరియు ఈ సమూహానికి మేము యేసుక్రీస్తును చూపించాలన్న ఉద్దేశముతోనే సమస్తము చేసింది.
ఒక మనిషి మరియు ఒక సంఘము అంతటి యధార్ధతతో చేసినందున, ఈ సమూహమంతా వారిని దర్శించడానికి మరియు వారితో మాట్లాడి మరియు వారితో కలిసి ప్రార్థించడానికి మరియు వారితో సహోదర సహోదరిలుగా ఉండటానికి వారికి ఋణపడి ఉన్నది. అది నిజం. చూశారా? అది వారి మేలు కోసమే చేయలేదు. అది సమూహము అంతటికోసం మరియు చుట్టూ ఉన్నవారందరి మేలు నిమిత్తమే. అది చాలా బాగున్నది, అతడే నిజమైన యధార్ధమైన క్రైస్తవుడు. ప్రభువు వారిని అత్యధికముగా ఆశీర్వదించాలని నా ప్రార్థన.
మరియు ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే ఒక దినమున, నేను చికాగోకు తిరిగి వచ్చి, కొన్నినెలల పాటు ఉజ్జీవాన్నికొనసాగిస్తాను. ఇప్పుడు అదిసరి. చూశారా? నేను ఫోటోగ్రాఫర్ కోసం ఎదురుచూస్తూ, అతను వచ్చేవరకూ కొద్దిగా మాట్లాడుచూ ఉన్నాను, ఆ విధంగా నేను పరిచర్యలోనికి వెళ్ళేముందుగా వారు ఫోటోను తీసుకోగలరు.
10
ఇప్పుడు, అతడు సిద్ధము చేస్తుండగా, అక్కడున్న అతడు మరియు ఆ బాలుడు, కొన్ని నిమిషములు నిలిపియుంచమని బ్రదర్ బాక్స్టర్ నాతో గుసగుసలాడాడు అనుకొంటున్నాను, దాని నిమిత్తమే...దాని కొరకే ఈ విధంగా నేను మీతో మాట్లాడాలని కోరుకున్నాను. మరియు ఇప్పుడు బ్రదర్ బోజ్ కొరకు, మరియు ఈ సేవకులందరి కోసము మీరు ప్రార్థించండి. మీరు గనుక నిజమైన సత్యసువార్త, సంపూర్ణసువార్త సంఘమునకు వెళ్ళుచున్నట్లయితే, మీరు దేవునితో యధార్ధముగా జీవించుచున్నట్లుగానే మీ సంఘముతోను యధార్ధముగా జీవించండి... నీవు సంఘముతోనే యధార్ధముగా జీవించలేవు, దేవునితో యధార్ధముగా జీవించినట్లయితే, సంఘముతోనూ యధార్ధముగా ఉండగలవు. చూశారా.
దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడని మేము నమ్ముచున్నాము. మరియు ఆ వాక్యమే మనలో ఉన్నది. అదే దేవుడు మనలో ఉండునట్లు చేయును. అది నిజమేనా? నేను దేవుని కుమారుడిని అయితే, నేను దేవుని కుమారునిగా మారినట్లయితే, నేను దేవుని యొక్క సంతానము.
11
ఆరు సంవత్సరముల వయస్సు ఉన్న సొగసైన తేజస్సుగల నా బాలిక అక్కడ వెనుక కూర్చునియున్నది. ఆమె నా మధురహృదయము—————. మరియు మీకు తెలుసా? మీరు-మీరు నన్ను గాయపరచకుండా ఆ బిడ్డకు మీరు ఏ హాని చేయలేరు. చూశారా, ఆమె నా బిడ్డ, చూశారా? నేను ఆమెను ప్రేమించుచున్నాను. మరియు ఇంటివద్ద కేవలం- ఒక సంవత్సరమే ఉన్న చిన్నబిడ్డ ఉన్నది, ఆమె ఇప్పుడిప్పుడే మాట్లాడుటకు ప్రయత్నించుచున్నది. మరియు ఆమె చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. మరియు ఆమె గూ-గూ (goo-goo), గా-గా (gaa-gaa); అంటూ, ఆమె ఎంత కష్టపడాలో అంత కష్టపడుచున్నది. మరియు మీరు నన్ను గాయపరచకుండా, ఆ చిన్నబిడ్డకు ఏ హాని చేయలేరు. చూశారా? మరియు మీరు ప్రేమించినట్లయితే... నన్ను ప్రేమించేదానికంటే కూడా ఆ బిడ్డను మీరు ఎక్కువగా ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. ఒకరిని ఒకరు ప్రేమించగలిగినట్లయితే, మీరు నాకు బదులుగా నా బిడ్డను కూడా ప్రేమిస్తారు. మరియు దానిని ఏ తండ్రి అయినా ఇష్టపడతారని నేను అనుకొంటున్నాను.
12
తండ్రిగా ఉండుట అనేది, దేవుని యొక్క గుణలక్షణమైయున్నది. మనము దేవుని పిల్లలుగా ఉన్నట్లయితే, మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలని ఆయన మనలను కోరుచున్నాడు. అలా చేయుట వలన మనము దేవుని ప్రేమించెదము. అది నిజమేనా? మనము ఆయన సంఘమును ప్రేమించెదము.
అదిసరి. వారు దాని గురించి, [“వారు అక్కడ ఉన్నారని అని ఒక వ్యక్తి చెప్పుచున్నాడు” -ఎడిటర్] అలాగేనండి. వారు అక్కడ ఉన్నారని నేను అనుకొనుచున్నాను.... [ఒక వ్యక్తి బ్రన్హాంతో మాట్లాడుచున్నాడు-ఎడిటర్] అది మంచిదే. ఇప్పుడు, కేవలం.... అక్కడ వారు ఆ-ఆ ఫోటోలు తీసుకునుచుండగా, ఒక నిముషము ఎదురుచూద్దాం (మీరు చూశారా?) పరిచర్యలోనికి కొనసాగుదాం.
ఇప్పుడు, ఈ రాత్రి మన ప్రభువైన యేసు ఆయన ప్రజలతో గొప్ప కార్యమును చేయబోతున్నాడని మీలో ఎంతమంది ఆశతో ఎదురుచూస్తున్నారు? మీ హస్తములు చూడనివ్వండి. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? మీ హస్తములు చూడనివ్వండి. మీరు ప్రార్ధించినట్లయితే, మీరు ప్రార్థించి, మరియు మీ హృదయపూర్తిగా నమ్మినట్లయితే, ఈ సహజాతీతమైనది కనిపించుట అనేది మీకు ఒక సాధారణ కధవలె ఉంటుంది.... మరియు ఈ మధ్యాహ్నం నేను మాట్లాడటానికి ప్రయత్నించుచుండగా, మీరు దానిని నమ్మినప్పుడు, మీరు దానిని నుండి ఆకర్షించబడెదరు.
దేవుని కుమారుడైన యేసు, ఒకవేళ ఇక్కడ నిలబడియున్నట్లయితే, నీవు దానిని నమ్మినప్పుడు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం చేయగలిగిన దానికన్నా ఎక్కువేమి మీకోసం చేయడు, మీరు దానిని నమ్మినప్పుడు విశ్వాసం....
13
ఒకసారి, కొంతమంది యేసు వద్దకు వచ్చారు... ఆయన ప్రవక్తని మీరు నమ్ముచున్నారా? ఒక దినమున వారు ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయన తలమీద కొట్టి “నీవు ప్రవక్తవైతే, ఎవరు ఎవరు నిన్ను కొట్టారో మాతో చెప్పు, అప్పుడు మేము నిన్ను నమ్ముతున్నాము” అని అన్నారు. యేసు ఏ ఒక్కరికీ బహిరంగ ప్రదర్శన చేసి చూపించలేదు. ఆయనకు చేయవల్సిన తండ్రి చిత్తము అనేది ఒకటున్నది. కానీ అయినప్పటికీ ఆయన నిలబడి, ఆ స్త్రీ చేసిన పాపములన్ని చెప్పాడు. ఆయన చెప్పారు.... దాని నోటిలో షెకెలు ఉన్న చేప ఎక్కడున్నదో ఆయనకు తెలుసు. ఎక్కడ రెండు మార్గములు కలుస్తాయో, ఎక్కడ రెండు గాడిదలు కట్టబడి ఉన్నాయో, ఆయనకు తెలుసు. అది నిజమేనా? చూశారా. ఆ కార్యములన్నీ ఆయన ఎరుగును, కానీ వాటిని ప్రజల కొరకు బహిరంగ ప్రదర్శన చేయలేదు. చూశారా? అది అత్యంత దైవికమైన కార్యము. అదే తండ్రి చిత్తము.
మరియు ఇప్పుడు, ఏదో తెలుసుకోవాలన్నా ఉత్సుకతతో ఈ రాత్రి అక్కడ కూర్చొని “మంచిది, సహోదరుడా... నీవు వెనక్కి తిరిగి నా గురించి ఏదొకటి చెప్పాలని నేను-నేను ఆశిస్తున్నాను” అని మీరు అడుగవచ్చు. దేవుడు దానిని ఎన్నడూ చేయడు.
14
కానీ మీరు లోతైనా యదార్ధతతో “ప్రియమైన ప్రభువా, నా స్థితిగతులు నీవు ఎరుగుదువు. మరియు మా సహోదరుడు వెనక్కి తిరిగి, నాతో ఏదైనా చెప్పినట్లయితే, అది నా విశ్వాసానికి చాలా సహాయపడుతుంది, నా యొక్క దర్శనాన్నిఅగుపడనివ్వండి, అప్పుడు నా పరిస్థితి ఏమిటో మరియు-మరియు నా ఫలితము ఏమైయున్నదో అతడు నాకు చెప్పుతాడు.” అని అడగండి. అప్పుడు మన పరలోకపు తండ్రి, దానిని నీకు అనుగ్రహించును. చూశారా? ఈ కూడికలో ఎక్కడున్ననూ, ఏ స్థలములో ఉన్నా ఆయన దానిని చేయును.
యధార్ధముగా ఉండండి. నేను ఆయనవలె చేయలేను. నేను కేవలం ఆయనను అడుగగలను. ఇప్పుడు మీరు సిద్ధముగా ఉన్నారా? మంచిది. ఒక నిముషం, నన్ను మన్నించండి...?..
15
“నేను వారిని కూడా ప్రేమిస్తున్నాను,” అని చెప్పాను. అలాగే చికాగో అంతటికి కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు దేవుని కృప మీ అందరిపై ఉండును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో నా దీనవంతు రోగుల కొరకు ప్రార్థించుటైయున్నది. ఆ పరలోక దర్శనానికి నేను విధేయునిగా ఉండటానికి మరియు ఖచ్చితంగా ఆయన ఏమి చెప్పాడో దానిని చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను.
ఇప్పుడు, ఈరాత్రి లేఖనములలో నుండి రెండు లేక మూడు చోట్ల చదవాలనుకుంటున్నాను, మరియు తరువాత సరిగ్గా రోగుల కొరకు ప్రార్థన మొదలుపెడదాము; ఎందుకంటే ప్రారంభించడానికే మనము కొద్దిగా ఆలస్యము అయ్యామని నేను అనుకొంటున్నాను. మరియు అందువలన, మనమంతా కలసి సరిగ్గా ఇప్పుడే ప్రారంభించుదాము.
పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయములోనుండి, మా కూడిక ముగింపులో మీరు దానిని గుర్తుపెట్టుకోవాలనుకుంటే, అది నేను.... మరియు నేను కూడా చదివెదను, మరియు దానిలోని మొదట ఉన్న కొన్నింటిని కూడా చదివెదను. మరలా యోహాను సువార్త 16ను చదవాలనుకుంటున్నాను. మరియు ఆ విధంగా మీ వస్తువులన్నీ మీరు సిద్ధం చేసుకుంటూ ఉండగా, నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకొంటున్నాను. హెబ్రీయులకు 13:8 లో యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటేరీతిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది ప్రేరేపితమైనదని మీరు నమ్ముచున్నారా?
16
అది-అది సత్యమని నేను నమ్ముచున్నాను, ఆ తీర్పుదినమున, అది సత్యమైయున్నదని దేవుడు చూచును. సత్యమని ఆయన ఏదైతే చెప్పియున్నాడో దాని వెనకాల దేవుడు నిలబడియుండును. దానిని మీరు నమ్ముటలేదా? మంచిది.
మరియు ఇప్పుడు, యేసుక్రీస్తు ఏ విధమైన వ్యక్తిగా ఉన్నారో అది ఆశ్చర్యమే. ఇప్పుడు, మనకు కొన్ని సిద్ధాంతపు ఆలోచనలు ఉన్నాయని, మరియు కొంతమంది చిత్రకారులు చిత్రాలు చిత్రించారని నేనెరుగుదును. కానీ ఈ రాత్రి నుండి చిత్రపటాలలో ఆయనను చూడవద్దు, ఎందుకంటే మనకు తెలిసియుండకపోవచ్చు. కానీ ఆయన జీవితాన్ని, ఆయన ఆత్మను చూద్దాం. ఒకవేళ యేసు గనుక, ఆయన శరీరరీతిగా మరలా భూమిమీదకు వస్తే, దాని గురించి అసలు మనము ఆలోచించడానికి కూడా చాలా ఆలస్యం అయిపోతుంది. మీరు దానిని నమ్ముచున్నారా? సిద్ధపడి ఉన్నవారు, అప్పుడు మనము ఆయనతో వెళ్ళిపోయెదము.
కాబట్టి ఇప్పుడు మనము ఆయనను శరీరములో చూచినప్పుడు, ఆయన ఒక-ఒక తెల్లరంగు వ్యక్తి అయినా, ఒక పసుపురంగు వ్యక్తి అయినా లేక నలుపురంగు వ్యక్తి అయినా, గోధుమ రంగు వ్యక్తి అయినా, ఆయన ఏమైయున్నప్పటికీ, ఆయన నా రక్షకుడైయున్నాడు. (టేపు మీద ఖాళీస్థలమున్నది-ఎడిటర్).... ఒక చిన్న వ్యక్తి అయినా, లావుపాటి వ్యక్తి అయినా, సన్నపాటి వ్యక్తి అయినా, ఆయన రక్షకుడే. చూశారా? నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఆయనను చాలా ఎక్కువగా ప్రేమించుచున్నాను. నా హృదయమంతటితో నేను ఆయనను ప్రేమించుచున్నాను.
మరియు ఇప్పుడు, ఆయన.... కానీ ఆయన ఏమైయుండెను, శరీరరీతిగా అంతగాకాదు, కానీ శరీరము కూడా అద్భుతమైనదే. అది కన్యక ద్వారా జన్మించినది. మీరు దానిని నమ్ముచున్నారా? సర్వశక్తుడగు దేవుడు కన్య మరియను కమ్ముకుని మరియు మరియ గర్భములో ఒక రక్తకణాన్ని సృష్టించాడని నేను నమ్ముచున్నాను.
17
శిశువుకు ఆ జీవకణం, మగజీవి నుండి వస్తుందని మనము దానిని ఎరిగియున్నాము, మనమెరుగమా? అది ఒక కోడిపెట్ట గుడ్డు పెట్టినట్లు ఉంటుంది, కానీ కోడిపెట్ట కోడిపుంజుతో లేనట్లయితే, అది ఫలదీకరణ చెందదు. చూశారా? అది పొదగబడదు. జీవకణము పురుషుని నుండే రావలసియున్నది. కాబట్టి ఈ చిత్రములో జీవకణము అనేది యేసుక్రీస్తు యొక్క తండ్రియైన ఆ గొప్ప సృష్ఠికర్తగా ఉన్న యెహోవా దేవుని యొద్ద నుండి వచ్చినది. మీరు దానిని నమ్ముచున్నారా? ఈ దీన కన్యకగా ఉన్న ఆ బాలిక గర్భములో ఆయనే సృష్ఠించి, ఆ రక్తకణాన్ని సజీవ దేవుని కుమారునిగా అభివృద్ధి చేసాడు. ఆయన యూదుడు కాదు, అన్యుడు కూడా కాదు. ఆయన దేవుడు, చూశారా.
మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ శిశువులో తల్లికి సంబంధించి ఒక్క రక్తపుబొట్టు కూడా ఉండదు. మీకు అది తెలుసా? లేదండి, తల్లికి సంబంధించిన రక్తమేమి ఆ శిశువులో ఉండదు. తండ్రి రక్తమే ఉంటుంది; తల్లిది కాదు. ఒక శిశువు.... ఒక తల్లి క్షయవ్యాధితో చనిపోతున్నప్పుడు, మరియు ఆ తల్లి నుండే శిశువును తీయవలసియుండగా, మరియు ఆ రక్త ప్రవాహములో ఉన్న ఏదైనాసరే (చూశారా?) అది పగలవలసియున్నది (మీరు చూశారా?), ఎందుకంటే రక్తము పురుషుని నుండే వచ్చును.
18
మరియు యేసు దేవుని రక్తమైయున్నారు. ఒకవేళ ఆయన రక్తము భూసంబంధమైనదైతే, అలాంటప్పుడు అది నీకంటే లేక నాకంటే ఎక్కువేమి కాదు. అది లైంగిక కోరికవలన వచ్చినది అవుతుంది. కానీ ఆయన రక్తము ఆయన తండ్రియైన రక్తము, ఆ గొప్ప సృష్ఠికర్త, యెహోవా .
కొంతకాలం క్రితం ఒక వ్యక్తి నాతో ఇలా చెప్పాడు. అతడు “బ్రదర్ బ్రాన్హాం” అని పిలిచి, అతడు “ఆ సత్యాన్ని- అది సత్యము అని నీవు నమ్ముటలేదు కదా?” అని నన్ను అడిగాడు. అతడు పశువులగడ్డి భూమి యొక్క యజమాని, కొలరాడోలాలో నేను చాలా ఎక్కువగా వేటాడాను.
“అవునయ్యా” (నేను దానినే నమ్ముచున్నాను అని ప్రవక్త ఉద్దేశం-తె త) అని నేను అన్నాను. నేనిప్పుడే అతనిని కలిసాను.
అతడు “చూడు” అని, రెండు గంటలపాటు అతడు నాతో వాదించాడు. “అది తప్పు అని నీకు తెలుసా” అని నాతో అన్నాడు.
నేను అతనితో “లేదయ్యా నాకు తెలియదు, అది సత్యమనే నాకు తెలుసు” అని అన్నాను.
మరియు “అతడు, చూడు, అది విజ్ఞానశాస్త్ర పరిశోధన అంతటికి పూర్తి వ్యతిరేకంగా ఉంది” అని అన్నాడు. అతడు “అలాంటిదేది ఉండదు. చూశారా, పుప్పొడి అనేది లేకుండా ఏదీ ఫలదీకరణము చెందదు” అని చెప్పాడు. “కుచ్చుల నుండి ఫలదీకరణము చెందడానికి మొక్కజొన్నకు కూడా పుప్పొడి కావలసియున్నది” అని చెప్పాడు. “సమస్తానికి” అని చెప్పాడు, “విజ్ఞానశాస్త్రానికి అది పూర్తి వ్యతిరేకం...” అని అన్నాడు.
19
“నేను అలాంటివేమి లెక్కచేయను” అని నేను అన్నాను. నేను అతనితో “మీకు చికాగోలో ఉన్న ఆ వస్తుప్రదర్శనశాలలకు నేను వెళ్ళాను, మరియు అది ఎగతాళి చేసినట్లు ఉంటుందని నేను అనుకొంటున్నాను. అక్కడకు వెళ్ళి ఇరవై రెండు వేల ఐదువందల సంవత్సరాల క్రితం, మానవుడు... పారిస్ ..?... అని అడుగుము” అని చెప్పాను. ఆరువేల సంవత్సరముల క్రితం వరకూ ఆ భూమి మీద ఏ మానవుడు లేడు. అది నిజం. అది బైబిల్ ప్రకారం ఖచ్చితం మరియు అవన్నీ, గుహలకు సంబంధించిన విషయాలు, ఆ చెత్తంతా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి మెదడులో నుండి పుట్టుకొచ్చినవే. దానికి సంబంధించిన లేఖనం ఒక్కటి కూడా లేదు. అక్కడ లేదు... అవన్నీ సరైనవికావు. మరియు మానవుడు ఏ సర్పమునుండి గాని, లేక కోతినుండి గాని, లేదా వేరేదేనినుండి రాలేదు. అతడు దేవుని నుండి వచ్చాడు. అది నిజం. చూశారా? అది అంతటికి మూలమైయున్నది. మీరంతా ఇక్కడుండుట చాలా మంచికార్యం. దక్షిణాదిన, మాకు అదిలేదు, మేము దానిని అనుమతించము. మంచిది. కాని మీరు అక్కడే ఉన్నారు...?... మరియు ఆ కార్యములన్నీ.
20
అతడు “బోధకుడా, చూడు!” అని అన్నాడు, అతడు “అది అసాధ్యం, సంపూర్ణముగా అసాధ్యం” అని అన్నాడు.
అడిగాను.
నేను అతనిని “దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నీకు తెలుసా?” అని అడిగాను.
“అలాంటి కార్యము అక్కడ ఉన్నదని నేను నమ్మను” అని అన్నాడు. మరియు అతడు....
“ఓ,మై” అని నేను అన్నాను. “అలా అయితే ఈ సృష్ఠి ఇక్కడకు ఎలా ఉనికిలోనికి వచ్చింది?” అని నేను అడిగాను.
“అది అలా వచ్చింది అంతే” అని అన్నాడు.
నేను అతనితో “నీవు పుట్టినప్పుడు కూడా ఆ మంచం దానికదే అక్కడ పెట్టబడింది, మరియు ఆ కుర్చీ కూడా దానికదే అక్కడ పెట్టబడింది అని నేను అనుకొంటున్నాను” అని అన్నాను. “అవన్నీ అక్కడ అలా ఉండియుంటే, ఈ చేతి గడియారం కూడా దానికదే గడియారంగ ఏర్పడియుండాలి అని నేను ఊహిస్తున్నాను” అని అన్నాను.
అతడు “ఓ, కాదు. అది అంత అర్ధవంతంగా లేదు” అని అన్నాడు.
21
“నీవు మాట్లాడేది కూడా అంతే అర్ధవంతంగా ఉన్నది” అని నేను అన్నాను. “ఆ చేతి గడియారం దానికదే ఏర్పడడానికి, దాని నియంత్రణ మరియు సమస్తము కూడా సంపూర్ణముగా అసాధ్యం, అవన్నీ అక్కడ కలిపియుంచడానికిగానూ దాని వెనుక ఒక సూత్రధారి ఉండవలసియున్నది” అని నేను చెప్పాను. అది నిజమేనా?
మంచిది, ఆ చేతిగడియారము కంటే కూడా నీవు, నేను ఎంత గొప్పవారమై యున్నాము? చూశారా? కాబట్టి దాని వెనకాల ఖచ్చితంగా ఒక మహోన్నత కళాఖండము అనేది ఉండి తీరాలి. అది నిజమేనా?
మరియు అతడు అన్నాడు.... నేను అతనితో “నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకొంటున్నాను, మరియు మనము వాదించుకొనుట ఆపేద్దాం” అని అన్నాను. “ఈ భూమి మీద ఒక శిశువు జన్మించడానికి, సాధారణముగా... ఒక తల్లి తండ్రి లేకుండా రావడం పూర్తిగా అసాధ్యమని నీవు చెప్పుచున్నావు. అంతేనా” అని నేను అడిగాను.
“అది నిజం,” అని అతడు అన్నాడు.
“మరియ ఆయన తల్లి అని యేసుకు నీవు ఆపాదిస్తున్నావు, కానీ లైంగిక పరంగా కూడా ఒక భూసంబంధమైన తండ్రి లేకుండా ఆయన జన్మించలేడు అని, యోసేపు ఆయన తండ్రి అని నీవు చెప్పుచున్నావు కదా” అని నేను అన్నాను.
“అది ఖచ్చితంగా సత్యమే,” అని అతడు అన్నాడు.
22
“అసలు నీవు చెప్పే ఆ మొట్ట మొదటి మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అతని తల్లి, తండ్రి ఎవరు? అది ఒక టాడ్‌పోల్ (తలకప్ప) అయినా, సర్పము అయినా, నీవు దానిని ఏ విధంగా పిలిచినా సరే, నీవు చెప్పిన మాట ప్రకారము, అతడికి తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఉండి తీరాలి” అని నేను అడిగాను.
ఈరోజు వరకూ కూడా అతడు నాకు జవాబు చెప్పలేదు. అతడు చెప్పలేడు. దాని ప్రకారం, అతనికి తల్లి, తండ్రి ఇద్దరూ ఉండాలి. సృష్టికర్తయైన దేవుడే మానవుని చేసాడు, మరియు మనిషి పడిపోయినప్పుడు మరియు అప్పుడు సృష్టికర్తయైన దేవుడే, క్రీస్తుయేసులో మనకు ప్రత్యక్షపరచుకున్నాడు, మరియు ఆయన తన తండ్రి చిత్తమునే చేసాడు. మేలు చేయడానికే ఆయన బయలువెళ్ళాడు.
మనం ఇప్పుడు ఆయన ఎటువంటి మనుష్యుడో చూద్దాము. మనం దేని కొరకు చూచుటలేదు... మనం పరిశుద్ధ గ్రంధము చదివి, ఆయన ఏ విధంగా కనిపిస్తాడో కనుగొందాం. ఆయన ఘనుడు. ఆయన ఏమైయున్నాడో.... ఆయన ఏ రీతిగా ఉన్నాడనేది భౌతిక అలంకరణలో కాదు కాని, ఆత్మీయ అలంకరణలో ఎలా ఉన్నాడో చూద్దాం. ఆయనే దేవుని కుమారుడు.
మరియు ఆయన బయటకు వెళ్లి రోగులను, కుంటివారిని స్వస్థపరిచాడు. ఆయన దానిని చేసాడని మీరు నమ్ముచున్నారా? మంచిది ఇప్పుడు అలసట తీర్చుకునే ఖాళీ సమయంలో ఆయన దానిని చేసాడా? దానిని మీరు పట్టుకుంటారని నేను అనుకొంటున్నాను, కాని నేనైతే చేయను. బ్రదర్ బోజ్ మంచి బోధకుడు. అది ఎవరు బోధించినా సరే... లేదు, ఆయన చేయలేదు.
“ఆ క్రియలు చేసేది నేను కాదు, నా తండ్రే వీటిని చేయుచున్నాడు” అని ఆయన చెప్పాడు. చూశారా, ఆయనే దేవుని కుమారుడై యుండి, ఒక దైవిక స్వస్థకునిగా ప్రకటించుకోలేదు. అది నిజమేనా? “అది తండ్రే” అని చెప్పాడు. దేవుని ఎదుట ఏ శరీరము మహిమపరచదగినది కాదు. దానిని చేసినది తండ్రి మాత్రమే.
23
ఇప్పుడు ఇక్కడ ఆయనను గురించిన కొన్ని లేఖనములు చదువుదాము. మరియు పరిశుద్ధ గ్రంథములోనికి వెనక్కి వెళ్ళి మరియు ఆయన ఎటువంటి వ్యక్తో చూసి, మరియు ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే, అలాంటి లక్షణములున్న వ్యక్తిని (అది నిజమేనా?), వ్యక్తిత్వాన్ని ఆ ఆత్మను చూద్దాం. ఇప్పుడు గమనించండి;
ఇప్పుడు, ఇక్కడ పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయములో ఆయన ఒకవేళ పండుగకు వెళ్ళుచూయుండవచ్చును;
అటు తరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను.
యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్థ అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.
ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కదిలించుటకలదు. నీరు కదిలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును,
గనుక ఆ మంటపములో... (వినండి)... రోగులు, గ్రుడ్డివారు, కుంటి వారు, ఊచకాలు చేతులుగలవారు... (ఎటువంటి జనసమూహమది)... గుంపులుగా పడియుండిరి.
...అక్కడ ముప్పదియెనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.
యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానినడుగగా ఆ రోగి అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు... స్వస్థతనొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తుకొనతగదే అని స్వస్థతనొందిన వానితో చెప్పిరి.
ఇప్పుడు, కొద్దిసేపు ఆ విషయాలన్ని ఇప్పుడు గమనించండి. ఆ అంశాన్ని పట్టుకొనియుండుడి.
24
ఇప్పుడు, మీరంతా ఆయనను దేవుని కుమారుడని నమ్ముచున్నారా? మంచిది. ఆయన ఇక్కడ ఉన్నారు, ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉండుట. ఇక్కడ ఆయన అయిదు మంటపములు కలిగిన గొఱ్ఱెల సంత యొద్దకు వెళ్ళుచున్నారు. మనము గనుక ఆ పాఠములోనికి వెళ్ళినట్లయితే, ఆ అయిదు మంటపములు అనగా యేసు (J-E-S-U-S) మరియు ఆ కోనేరు, ఆ నీరు (Water) ఆ వెలుగు (Light) మొదలైనవన్నీ. ఆ గొఱ్ఱెల సంత ఎక్కడ ఉందనగా... కానీ యేసు అక్కడ దానిని దాటి వెళ్ళుచున్నప్పుడు, అక్కడ గొప్ప జనసమూహము గుంపులుగా పడియున్నారు. నేను సరిగ్గా ఆలోచించినట్లయితే, ఒక జనసమూహము అనగా రెండువేల మంది అని చెబుతారు, కానీ ఇక్కడ గొప్ప జనసమూహము గుంపులుగా ఉన్నారు.
ఉదాహరణకు అయిదువేలు మరియు పదివేల మంది మధ్యలో వారు ఉన్నారని చెప్పుకుందాం, గొప్ప జనసమూహం రోగులుగా... నిస్సహయులు కుంటివారు అవిటివారు, గ్రుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు ఉన్నారు. ఎటువంటి ఘోరమైన స్థితిలో ఉన్న గొప్ప జనసమూహము వారు? అక్కడ ఎన్ని విధములైనవారు ఉన్నారో చూడండి; కుంటివారు, అవిటివారు, గ్రుడ్డివారు మరియు ఊచకాలు చేతులు గలవారంతా, నీళ్ళ యొక్క కదలిక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కదిలిస్తుంది. ఆ సమయములో మొదట ఎవడు దిగునో, వాడు ఎట్టి వ్యాధిగల వాడైననూ
బాగుపడును.
25
ఇప్పుడు చూడండి, ఒక పడక మీద లేదా చిన్నమంచం మీద ముప్పది యెనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుడు అక్కడ పడియున్నాడు. ఇప్పుడు, యేసు ఈ సంత(Market) గుండా ఆ వైపుకు వచ్చుచున్నారు. ఈ సంతను ఆయన దాటిపోతూ, ఈ సంతగుండా ఆయన ఈ రోగులు, కుంటివారి మధ్యలోనికి నడచి వెళ్ళుచున్నారు. ఆయన దయా హృదయుడని మీకు తెలుసా? ఆయన ప్రేమించుచున్నాడని మీకు తెలుసా? జనుల మీద ఆయన కనికరపడ్డాడని మీకు తెలుసా? అలా అయితే ఆ రోగులనందరినీ ఆయనెందుకు స్వస్థపరచలేదు?
దానికి బదులుగా ఆయన గ్రుడ్డివ్యక్తిని ఆయన దాటిపోయాడు, ఊచచేయిగల వ్యక్తిని ఆయన దాటిపోయాడు. కుంటివానిని ఆయన దాటిపోయాడు. పక్షవాయువుతో బాధపడుతున్న పిల్లవాడిని ఆయన దాటిపోయాడు. వ్యాధితో ఉన్న ఆ మనుష్యుని యొద్దకు ఆయన వెళ్ళారు. షుగర్ డయాబెటిస్ నో లేక అలాంటి వ్యాధేదో లేక మరొకటో అని చెప్పుకుందాం, కాదు... అతడు ముప్పది యెనిమిది సంవత్సరముల నుండి బాధపడుచున్నాడు. మరియు ఆయన ఆ మనుష్యుని యొద్దకు నడుచుకుని వెళ్ళారు. మరియు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఇప్పుడు ఆయన ఎరిగియున్నారు మరియు “నీవు స్వస్థపడగోరుచున్నావా” అని ఆయన అడిగారు.
అతడు “అయ్యా” అని సంభోదిస్తున్నాడు, అతడు అతడు కుంటివాడుకాదు, “నేను నీటిలోనికి వచ్చునంతలో ఎవరొకరు నాకంటే ముందుగా దిగి, స్వస్థపడుతున్నారు” అని చెప్పాడు.
ఆ సమయానికి ఒక్కరు మాత్రమే స్వస్థపడతారు, మరలా మరొక సమయానికి ఆ దేవదూత వచ్చేవరకూ, ఒకవేళ ఒక నెల సమయం పట్టినా లేక మరెంత కాలమయినా అతడు తిరిగి మరొక తరుణం వరకూ ఎదురు చూడవలసినదే. “నేను వచ్చునంతలో ఎవరొకరు నాకంటే ముందుగా దిగుతున్నారు” అని అతడు చెప్పాడు.
26
మరియు అక్కడ గొప్ప జనసమూహముగా కుంటివారు, గ్రుడ్డివారు, అవిటివారు, ఊచకాళ్ళు చేతులు కలిగినవారు, శక్తిహీనులు, అక్కడ పడియుండగా, వారందరిని వదిలి నేరుగా నడిచి వెళ్ళి “నీవు లేచి నీ పరుపెత్తుకొని, ఇంటికి వెళ్ళిపొమ్ము, వెళ్ళుము” అని యేసు చెప్పారు. అది లేఖనమేనా? మంచిది, అదిక్కడ ఉన్నది. దాని నుండే నేను చదువుచున్నాను. అక్కడ నుండి నడచి వెళ్ళిపోయెను...
యూదులు అతనిని చూసి అతనిని ప్రశ్నించారు. అతని పరుపు మోసుకొనిపోతున్న ఆ మనిషిని వారు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత, పూర్తి అధ్యాయాన్ని చదవండి, ఆ పూర్తి చిత్రాన్ని మీరు పొందుకోగలరు. సమయాన్ని సద్వినియోగపరచడానికి 19 మరియు 20 వచనములనే చదవాలనుకుంటున్నాను. ఎందుకో మీకు ఇక్కడ చెప్పబడుతుంది.
ఇప్పుడు, ఆ వచనములు చదివేముందుగా మిమ్ములను ఒకటి అడగాలను కొంటున్నాను. యేసు ఆ గొప్ప సమూహము యొద్దకు వెళ్ళి “నేను దేవుని కుమారుడిని. నేను తండ్రి క్రియలు చేయడానికే వచ్చాను. గ్రుడ్డివారైన మీ అందరి కన్నులు తెరవడానికి, రోగులైన మీ అందరిని స్వస్థపరచడానికి, కుంటివారు నడవడానికి, ఊచచేతులు కలవారు బాగుపడడానికి తండ్రి నాకు శక్తిని ఇచ్చాడు. నేను దానిని ఇప్పటికే ఋజువు చేసాను. ఇప్పుడు, మీరందరూ స్వస్థత పొందియున్నారు. మీరు ఇంటికి వెళ్ళి స్వస్థపడండి” అని చెబితే మీరు నమ్ముతారా?
27
అక్కడున్నప్రతీవ్యక్తి ఖచ్చితంగా బాగుపడతాడని నేను నమ్ముచున్నాను. మీరు దానిని నమ్ముతారా? ఇప్పుడు మీ మధ్యలో ఒక ప్రశ్నను పెట్టియున్నాను. చూశారా? మీ ఆయన దేవుని కుమారుడైతే, ఆయన ఏమైయున్నాడో మనమెరిగియున్నట్లుగా, ఆయన దేవుని కుమారుడైతే, ఆయన దయాహృదయం గలవాడుగా మరియు ప్రజల మీద కనికరపడేవాడుగా ఆయన ఇక్కడే ఉన్నాడు. మరియు అప్పుడు దానిని చెప్పకుండా ఆయన నిలిపియుంచేవాడుకాదు. ఏ విధంగా ఆయన ప్రజల యెడల కనికరము కలిగినవానిగా మరియు దయాహృదయంగల వానిగా అవుతాడు... (టేపు మీద ఖాళీ స్థలమున్నది-ఎడిటర్) మీకు స్పష్టముగా వినిపిస్తుందా? మీలో కొంతమంది మీ చేతులు పైకెత్తలేదు. కానీ ఆ ప్రజలందరినీ ఆయనెందుకు స్వస్థపరచలేదో నేను తెలుసుకోవాలనుకొంటున్నాను. మరియు ఆయన ఇక్కడ వెనక్కి తిరిగి “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; తండ్రి కుమారునికి వాటిని చూపించగా, కుమారుడు వెళ్ళి వాటిని ఆయన చూపించినట్లుగానే అలాగే చేయును” అని చెప్పారు.
ఈ మధ్యాహ్నం ఆ ప్రసంగములోని మన పాఠాన్ని జ్ఞాపకం చేసుకోండి. లాజరు, ఆయన లాజరు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకని ఆయన అక్కడలేడు, ఆయన వెనుదిరిగి వచ్చేటప్పుడు ఆయన “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. మీ నిమిత్తమే నేనక్కడ లేనందుకు సంతోషించుచున్నాను. అతనిని మేలుకొలపడానికి వెళ్ళుచున్నాను”. అని చెప్పారు.
మరియు ఆయన సమాధియొద్దకు వచ్చినప్పుడు చూడండి, ఆయన ఒక దర్శనమును చూసాడు. ఆ కారణము చేతనే ఆయన ఒక దర్శనమును చూసాడు. ఆ కారణము చేతనే ఆయన వెనక్కి వెళ్ళలేదు. ఈ కార్యాలన్నీ జరగడానికి, మరియు ఆయన వెనక్కి తిరిగి వెళ్ళడానికి చాలారోజులు పడుతుందని తండ్రి చెప్పియున్నాడు. ఇక్కడ ఆయన చెప్పియున్న దానిని బట్టి, అది ఖచ్చితంగా సత్యమైయున్నది. “తండ్రి నాకు చూపించే వరకూ నేనేమి చేయలేను” అని ఆయన చెప్పారు.
28
మరియు మూడురోజులు గడచిన తరువాత “లాజరు చనిపోయాడు మరియు మీ నిమిత్తమే నేనక్కడ లేనందుకు నేను సంతోషించుచున్నాను ఎందుకంటే మీరు అక్కడికి అక్కడికి వెళ్ళి అతనిని స్వస్థపరచుము అని నా దగ్గరకు వచ్చి చెప్పడానికి ప్రయత్నించి యుండేవారు”. అని ఆయన చెప్పారు. చూశారా? మరియు అలా చేయడం తండ్రి చిత్తము కాదు. లాజరు సమాధి యొద్దకు ఆయన వచ్చినప్పుడు ఆయనను గమనించండి. “తండ్రీ ఇప్పటికే నీవు నా మనవి వినియున్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కానీ ఇచ్చట నిలిచియున్న వారి నిమిత్తమే, ఈ మాట చెప్పుచున్నాను”. అనెను. ఏమి జరుగబోతుందో ఆయన ఎరిగియున్నారు. మీరు దానిని నమ్ముచున్నారా? తండ్రి ఆయనకు చూపించియున్నారు. ఆ తరువాత ఆయన సమాధినుండి లాజరును లేపియున్నారు. తండ్రి ఆయనకు చూపించకుండా, ఆయన ఏదీ చేయలేదు.
ఒకరాత్రి పరిశుద్ధ యోహాను సువార్తలో నుండి చెప్పబడిన పాఠము మీకు గుర్తున్నదా, ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మరియు వారిని పట్టించుకోకుండా వీధిలో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఒక ఇంటిలోనికి ప్రవేశించగా, వారును ఇంటిలోనికిచ్చి “ప్రభువా, మా మీద కృప చూపవా” అని అడిగారు.
29
ఆయన వారి నేత్రములు ముట్టి “మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక” అని అన్నారు. అది నిజమేనా? “మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక” అని ఆయన వారి నేత్రములు ముట్టారు.
ఆ మనుష్యులు ఆయనతో “నీవు మా నేత్రములు ముట్టినట్లయితే” మరొక మాటలో చెప్పాలంటే “మేము నమ్ముతాము” అని చెప్పారు.
“సరే” అని ఆయన పలికారు. ఆయన వారి నేత్రములు ముట్టి, “ఇప్పుడు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక” అని అన్నారు. మరియు అది అలాగే జరిగింది. లేఖనాలన్నింటిగుండా, మీరు దానిని తీసుకోగలరు. ప్రతీ చోట, ప్రతీ స్థలములలో...
ఇక్కడే కొద్దికాలం క్రితం, ఈ సమాజంలో బాగా తెలిసిన వ్యక్తి, ప్రతీ చోట అందరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వార్తా పత్రిక నా గురించి తప్పుగా, సరికాని విషయాలు ప్రచురించింది. అతడు నాతో, “బ్రదర్ బ్రాన్హాం” “ఆకాశమునుండి అగ్నిని దింపి ఆ స్థలాన్ని కాల్చివేయుము” అని అన్నాడు.
“ఓ, సోదరుడా మై” అని నేను అన్నాను. “మీరెట్టి ఆత్మగలవారో మీరు ఎరుగరు” అని యేసు పలికినది నేను చెప్పాను. చూశారా?
30
“మనకు ఈ దినాన ఏమి అవసరమైయుందనగా, ఏలీయా వంటి మరికొంతమంది ప్రవక్తలు మనకు కావాలి” అని అతడు అన్నాడు. “ఏలియా ఏమి చేయాలన్నా ఏ దర్శనమును అతడేమి చూడలేదు” అని చెప్పాడు. “దేవునికి మహిమ” అని చెప్పాడు, “అతడు వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టాడు” అని చెప్పాడు. మరియు “మీరంతా ఇక్కడకు రండి” అని చెప్పాడు, “ఎవరు దేవుడో మనం ఋజువు చేద్దాం” అని చెప్పాడు. అతడు వారితో అక్కడకు వెళ్ళి “మీ ఎద్దులను తీసుకురండి” అని చెప్పి మరియు పైకి-క్రిందకు నడచి.... బయలును అపహాస్యం చేసాడు.
“ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు” అని చెప్పాడు. అక్కడకు నడచి వెళ్ళి, వారితో... “రండి” అని చెప్పుచున్నాడు. “ఆయన ఏమి చేయబోతున్నాడో చూద్దాం” అని అన్నాడు. అతడెక్కడ ఉన్నాడో అతడు ఎరిగియున్నాడు.
మరియు అన్నాడు, “అతడు... నేటి దినమున మనకు అలాంటి ప్రవక్తలే అవసరం” అని
నేను “అవును, ఏ ప్రవక్తలైనా, ఆ విధంగానే ఉండాలి. కాని నేను...” అని అన్నాను.
అతడు “ఏలీయా ఏ దర్శనము చూచే వరకూ ఎదురుచూడలేదు” అని అన్నాడు.
“బ్రదర్ లిండ్సే, ఒక్క నిముషము ఆగు” అని నేను అన్నాను, లేక క్షమించండి, అదెవరైయున్నారనగా గార్డెన్ లిండ్సే, ఎలాగైతేనేం దానిని నేను చెప్పేసాను. మంచిది దానిని చెప్పాలని నా ఉద్దేశం కాదు.
కానీ “అటువంటి ప్రవక్తలు మనకు కావాలి” అని అతడు అన్నాడు.
31
“బ్రదర్ లిండ్సే లేఖనమును చూచుటలో నీవు తప్పిపోవుచున్నావు” అని నేను అన్నాను. “నీవు బోధకునివైయుండి కూడా లేఖనమును చూచుటలో తప్పిపోతున్నావు. ఏలీయా ఈ కార్యములన్ని క్రమములో చేసిపెట్టేటప్పుడు, ఎద్దులను వధించి, మరియు వాటి మీద నీళ్ళు కుమ్మరించి, అతడు నడచి వెళ్ళి, ”ప్రభువా, నీ సెలవు చేతనే ఆ కార్యములన్నీ నేను చేసాను“ అని చెప్పాడని నేను చెప్పాను. అది నిజమేనా? మొదట ప్రభువు అతనికి చూపించారు. అది నిజం.
మరియు దేవుని ఏ నిజ ప్రవక్తయూ, పాత కాలపు బిలాము చెప్పినట్లుగా చేయరు, అతడు అక్కడ నిలబడి అతనికున్న వరమును వర్తకరూపములో అమ్మివేసుకున్నాడు, అది నిజం, కాని అతడు ప్రవక్త. అతడు ఇశ్రాయేలు కోసం మరియు మొదలైన వారందరి కోసం చెప్పిన కార్యములు నేటికి సరిగ్గా సరిపోవుచున్నది. అతడు ఒక ప్రవక్త. సత్యవంతునిగా అతడు ఉండవలెనంటే “దేవుడు అతని నోటియందు ఉంచకుండా ఒక ప్రవక్త ఎలా మాట్లాడగలడు?” అని అడిగాడు. దేవుడు ఏదయితే చెప్పాడో, నీవు అదే చెప్పాలి, మరియు దాని మించి నీవేమి చెప్పలేవు, దానిని తగ్గించి నీవేమి చెప్పలేవు.
32
“నేనేమి చేయమని తండ్రి చూపించియున్నారో దానినే నేను చేసాను” అని యేసు చెప్పారు. అది నిజమేనా? ఇప్పుడు, “ఈ డయాబెటిక్ వ్యాధి స్వస్థత పొందటం కంటే మించినది మీరు ఆశ్చర్యపోయే గొప్పదానిని ఆయన మీకు చూపించియుండవచ్చు. కానీ ఆయన నాకేమి చెప్పారో, నేను దానిని మాత్రమే చేస్తాను” అని ఆయన చెప్పారు.
ఇప్పుడు, ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే, అప్పుడు ఈరోజు కూడా, అది మాత్రమే... ఇప్పుడు, మనము ఆయనేమి చేసాడో చూద్దాం. మరియు ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని మనము వెంబడిద్దాం. ఆయన పరిచర్యను మొదట ప్రారంభిచినప్పుడు చూడండి. మొట్టమొదటిగా చెప్పుకునే కార్యము ఏదనగా, వారు కూటములు ప్రారంభించినప్పుడు, ఇక్కడ నతానియేలు లేక ఫిలిప్పు అనే పేరు కలిగిన చిన్న వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతడు వచ్చి మరియు రక్షించబడి, చెట్టుక్రింద కూర్చొన్న లేక చెట్టుక్రింద మోకరించి ప్రార్థిస్తున్న అతనికున్న ఒక్కగానొక్క స్నేహితుని యొద్దకు పరుగెత్తాడు.
“మేము కనుగొన్నాము, వచ్చి చూడు. మోషే చెప్పింది, నజరేయుడైన యేసు గురించే” అని అన్నాడు.
అతడు “రాగలదా...” అని అడిగాడు. ఇప్పుడు, ఆ మనిషి తన హృదయములో నీతిమంతుడైయున్నాడు. “నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?” అని అడిగాడు. “నీవే వచ్చి, చూడు” అని ఫిలిప్పి అన్నాడు.
33
కావున యేసు ఇక్కడ ప్రార్ధన వరుసను కలిగియున్నారు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో, పరిశుద్ధ గ్రంథం ప్రస్తావించలేదు కనుక అది ఒక ప్రార్ధనా వరుస అని చెప్పుచున్నాము. కానీ అతడు యేసు యొద్దకు వచ్చినప్పుడు, అతడు రావడం యేసు చూస్తూ, “ఇదిగో, ఏ కపటము లేని ఒక ఇశ్రాయేలీయుడు” అని పలికారు.
వెనువెంటనే అది అతనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. “నా గురించి ఆయనకు ఎలా తెలుసు?” “రబ్బీ నన్ను నీవు ఎలా ఎరుగుదువు?” అని అడిగాడు.
“ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అని ఆయన చెప్పారు.
ఇప్పుడు, అతడు ఒక అడుగు వెనక్కి వేసి, “ఇప్పుడు, ఒక్క నిముషం ఆగు. నీవు నా మనస్సును చదువుతున్నావా? అది మానసిక శాస్త్రమేనా?నీవు-నీవు బయల్జెబూబువా?” అని అడగలేదు. చూశారా? అతడు పరుగెత్తుకెళ్ళి, ఆయన పాదముల మీదపడి “నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు” అని ఉత్తరమిచ్చాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు, అతని పేరు నేటికిని అక్షయముగానే నిలిచియున్నది. అది నిజమేనా?
34
ఇప్పుడు, ఆ వ్యక్తే వచ్చినట్లయితే, ఈ రాత్రి ఈ వేదికపై ఆ యేసే నిలబడియుంటే, ఆ మనిషే ఈ వేదికపైకి వచ్చియున్నట్లయితే ఆయన “నీవు క్రైస్తవునివి, నిజాయితీగల వ్యక్తివి, ఏ కపటములేని ఇశ్రాయేలీయుడివి” అని చెప్పును. చూశారా?
“అది నిజం” అని ఆయన చెప్పగా, “నేను మీకెలా తెలుసు?” అని మీరు అడుగవచ్చు.
“మంచిది, ఆ కడుపునొప్పితో ఆ వైద్యుని కార్యాలయములో నీవు పడియున్నప్పుడే, నేను నిన్ను చూశాను.” అదే యేసుక్రీస్తును నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండునట్లు చేస్తున్నది. అది నిజమేనా? మంచిది. ఆయన ఆ స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు... ఆయనను గమనించండి. ఒక దినమున ఆయన సమరయకు వెళ్ళవలసివచ్చెను. ఆయన అక్కడికి వెళ్ళడం, అత్యవసరమైయున్నది. ఖచ్చితముగా ఆయన దర్శనాన్ని కలిగియున్నాడు, ఆ కారణము వలనే అది అత్యవసరమైయున్నది; ఆయన అక్కడుండుట తండ్రి చిత్తము. ఆయన ప్రతీ ఒక్కరినీ దూరముగా పంపివేసారు. ఎందుకంటే ఆ దర్శనములో ఆయన మరియు ఆ స్త్రీ తప్ప వేరే ఎవ్వరూ లేరు. మధ్యాహ్నవేళ పదకొండు గంటలకు ఆ స్త్రీ బయటకు వచ్చింది, ఒకవేళ రాత్రంతా అటు-ఇటు తిరగడం వల్ల, సమయానికి లేచి యుండకపోవచ్చును. కానీ ఒకవేళ, ఆమె... ఎందుకంటే మిగిలిన వారు, వారితో కలసి ఆమెను నీరు పట్టుకోనివ్వకపోవచ్చును. ఆమె ఒక వేశ్య, ఆమె అక్కడకు వచ్చింది.
“నాకు దాహమునకు నీళ్ళు ఇమ్ము” అని ఆయన అడిగారు.
35
ఇప్పుడు, తండ్రి ఆయనను సమరయ యొక్క మార్గములో అక్కడకు - అక్కడకు వెళ్ళమని మాత్రమే చెప్పారు. కావున ఆయన “నాకు దాహమునకు నీళ్ళు ఇమ్ము” అని అడిగారు. ఆమె వెనక్కి తిరిగింది, “ఒక యూదుడవు” అని ఆమె అన్నది. “యూదుడవైన నీవు సమరయులమైన మమ్ములను అడుగుట ఆచారము కాదే. యూదులతో మాకు ఎటువంటి సహవాసము కానీ, లేక సాంగత్యము కానీ లేదు” అని ఆమె అన్నది. ఇప్పుడు యేసువైపు చూడండి. చూశారా? ఆమె ఆత్మను పట్టుకొనుటకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. నీవు మానవునివి. చూశారా? ఆయన ఆ మనుష్యాత్మను పట్టుకొనుటకు ప్రయత్నిస్తున్నారు. “నీతో మాట్లాడుచున్న వారెవరో నీవు ఎరిగియుంటే, నీవే ఆయనను దాహమునకు నీళ్ళు అడుగుదువు, మరియు చేదుకొనుటకు నీవిక్కడకు రాకుండునట్లు నేనే నీకు నీళ్ళు ఇచ్చెదను” అని ఆయన అన్నారు.
ఇప్పుడు గమనించండి. చూశారా, అయినప్పటికీ ఇంకా అక్కడేమీ లేదు, ఇంకా అప్పటికీ, తండ్రీ దానిని ఆయనకు ఏమి చూపించలేదు. “ఎలా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమి లేదే” అని ఆమె అడిగింది.
“నేను నీకిచ్చు నీళ్ళు నిత్యజీవమునకై ఊరెడి నీటిబుగ్గగా ఉంటాయి” అని ఆయన అన్నారు. అప్పుడు ఆయన.... ఆయన ఆమె ఆత్మను పట్టుకున్న తర్వాత, దర్శనం కదలడం ప్రారంభించింది.
“నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా” అని ఆయన అన్నాడు. ఆమె ఎక్కడ నిలబడియున్నదో ఆయన ఎరిగియున్నాడు.
“నాకు పెనిమిటి లేడు” అని ఆమె చెప్పింది.
“నీవు సత్యమే చెప్పావు, నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు. నీ పెనిమిటి కాడు” అని అన్నాడు.
36
“అయితే”, “నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను” అని ఆమె అన్నది మరియు ఆమె పట్టణములోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి “మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి” అని ఆమె చెప్పింది.
ఆయన ఎన్నడూ... ఆమె చేసిన ఆ ఒక్క కార్యము మాత్రమే ఆమెకు చెప్పబడింది. కానీ, దేవుడు ఆయనకు బయలుపరచాలనుకున్నట్లయితే, ఆయన సమస్తము ఆయనకు బయలుపరచియుండేవాడు. మీరు దానిని నమ్ముచున్నారా? చూశారా? కేవలం తండ్రి ఏదైతే చూపించారో, దానినే ఆయన చేసాడు.
ఇప్పుడు, స్నేహితుడా నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అప్పుడు ఆ యేసే... ఎక్కువ సమయం నేను తీసుకోవాలనుకోవట్లేదు. ఆ యేసే నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటేరీతిగా ఉన్నట్లయితే... ఇప్పుడు, మనస్తత్వ శాస్త్రాన్ని దాని నుండి బయటకు తీసి పడవేయండి, మనస్తత్వశాస్త్రవాది, “మంచిది, ఈ గుంపులో ఎవరో ఒకరు ఉదరసంబంధ సమస్యతో ఉన్నవారు ఉన్నారు” అని చెపుతారు. ఖచ్చితంగా అక్కడ అలాంటివారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరు? కావలిసినది అదే. చూశారా? “ఎవరో ఒకరు చెడుకండ్లు కలవారున్నారు”. అవును, నీవు ఎవరో ఒకరున్నారని సంఖ్యను ఎక్కువచేసి చూపిస్తున్నావు. ఆ ఒక్కరు ఎవరు? దాని గురించిఏమిటి? చూశారా? నీవు అక్కడే ఉన్నావు.
37
ఆ కాలములో రాజైన నెబుకద్నెజరు చెప్పినట్లుగా, “మంచిది, అయితే,... ఆ కలను నేను మరిచిపోయాను” అని అన్నాడు. “సోదెగాండ్రయిన మీరు, మరియు శకునగాండ్రయిన మీరు మరియు మానసిక శాస్త్రవేత్తలైన మీరు” నేనేమి కల కన్నానో దానిని నాకు చెప్పండి అని అడిగాడు.
“ఓహ్”, వారంతా “కల సెలవియ్యుడి, మేము దాని భావమును తెలియజేసెదము” అని చెప్పారు.
“మీరు ఆ కల ఏమిటో చెప్పలేకపోతే, దాని భావము కూడా మీరు చెప్పలేరు. నేను మరచిపోయిన ఆ కల ఏమిటో నాకు చెప్పండి, నాకు దానిని తెలియచెప్పండి, అప్పుడే దాని గురించిన మీరు చెప్పే భావము నిజమని నేను తెలుసుకుంటాను”. అని అన్నాడు.
అక్కడెవడో కడుపు నొప్పితో బాధపడుతున్నవారున్నారు? అక్కడెవరో గుండెనోప్పితో భాదపడుతున్నవారున్నారు? అది ఎవరు? వారు చేసింది ఏమిటో చెప్పగలవా? వారి జీవితములో ఏమి జరిగిందో చెప్పగలవా?
ఓ, సోదరుడా, సోదరీ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ సంఘమునకు కావలసినది ఏదనగా, దానిలో(సంఘములో) ఉన్న మనస్తత్వశాస్త్రాన్ని బయటకు నెట్టివేసి, బలిపీఠము యొద్ద పడియుంచే, ఉన్నతమైన పాత నాగరికత కలిగిన పరిశుద్ధాత్మ వైపు తిరిగే సువార్త కావలసియున్నది. అది సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి.
38
మారుమనస్సు లేకుండానే వరములు మరియు పిలుపులు వచ్చును. ఈ లోకంలోకి జన్మించినప్పుడే వాటిని వాటిని నీవు ఖచ్చితంగా పొందుకున్నావు. పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పుచున్నది. ముందుఏర్పాటును (Predestination), ముందునిర్ణయాన్ని (Foreordination), ఎన్నిక చేయబడుటను (Election), పిలుపును (Calling) మొదలైనవాటినన్నిటిని ఎంతమంది నమ్ముచున్నారు? నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మితే, ఇవన్నీ నమ్మవలసియున్నది. మీలో కొంతమంది చేతులు పైకెత్తి ఆమోదం తెలుపలేదు. అలా అయితే నేను మిమ్ములను ఒకటి అడగాలనుకొంటున్నాను. జగత్తుపునాది వేయబడినప్పటినుండి యేసే దేవుని కుమారుడైయున్నారు. జగత్తు పునాది వేయబడినప్పటి నుండి వధించబడిన గొర్రెపిల్ల ఆయనే. మీరు దానిని నమ్ముచున్నారా? ఆ సర్పము యొక్క తలను చిదుకత్రొక్కిన స్త్రీ సంతానము ఆయనే. మీరు దానిని నమ్ముచున్నారా? ఆయనే దేవుని ద్వారా ముందే ఏర్పరచబడి, ముందుగా నిర్ణయించబడినవాడు. మీరు దానిని నమ్ముచున్నారా?
మోషే జన్మించినప్పుడే, అతడు ఒక ప్రత్యేకింపబడిన శిశువుగా మరియు ఒక ప్రవక్తగా జన్మించాడు. మీరు దానిని నమ్ముచున్నారా? దానిని ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. అబ్రాహాము యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి అతడు జన్మించకముందే దేవుడు అతనిని ఒక ప్రవక్తగా చేసారు.
ఎంతమంది దానిని నమ్ముచున్నారు... బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించడానికి ఏడువందలపన్నెండు సంవత్సరాలకు ముందే, యెషయా అతనిని చూసాడు. “అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అతడే” అని చెప్పాడు. మీరు దానిని నమ్ముచున్నారా?
దీని వైపు చూడండి.
39
యిర్మీయా అప్పుడు యిర్మీయా... యిర్మీయా మొదటి అధ్యాయము, 4వ వచనము అని నమ్ముచున్నాను; అతడు అసలు జన్మించక మునుపే, “నీ తల్లి గర్భములో నీవు రూపింపకబడకమునుపే, నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను, మరియు జనములకు ఒక ప్రవక్తగా నేను నిన్ను నియమించాను” అని దేవుడు చెప్పాడు. ముందు నిర్ణయాన్ని, ముందు ఏర్పాటును మీరు నమ్ముచున్నారా? మనము లేఖనముల గుండా నేరుగా వెళ్లాము. అవునయ్యా అది పూర్తిగా కృప ద్వారానే జరుగవలసియున్నది, ఆశనుబట్టి కాదు, కృప ద్వారా. దేవుడు సర్వ ప్రపంచము నుండి అబ్రాహామును బయటికి రమ్మన్నాడు. ఎందుకని? ఎందుకంటే అబ్రాహాము మంచివాడనా? లేదండీ, అది కృప దేవుని యొక్క ఏర్పాటు, ఎన్నిక మరియు పిలుపు. నీవేమైయున్నావో అదే నీవు, ఎందుకంటే నీవు ఏ విధంగా ఉన్నావో అలా నిన్ను చేసింది దేవునియొక్క కృపే. ఎవరి ఆలోచన తీసుకుని ఆయన స్వరూపమునకు ఇంకొక మూర జతచేయగలము? అది నిజమేనా? అది కేవలం కృప ద్వారానే. ఈ కార్యములన్ని పిలుపులైయున్నవి. సంఘములో దేవుడు వీటిని పెట్టియున్నాడు.
40
ఇప్పుడు, “కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు” అని యేసు దీనిని చెప్పియున్నారు. అనగా అది ఆ-ఆ-ఆ కాస్మస్(kosmos) గా ఉన్నది, దాని అర్ధమేమనగా “ప్రపంచ క్రమం”. “లోకము నన్ను మరెన్నడును చూడదు అయితే మీరు(సంఘము) నన్ను చూతురు” ఇప్పుడు సంఘము, అది ఇక్కడున్న సంఘము, అనగా విశ్వాసులు. “విశ్వాసులు నన్ను చూతురు, యుగసమాప్తి వరకూ వారితోనూ, వారిలోనూ ఉందును” అది నిజమేనా?
అది సత్యమైతే, అదే యేసుక్రీస్తును నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటేరీతిగా ఉండునట్లు చేయుచున్నది. అది నిజమేనా? ఆయన ఆ రీతిగానే ఉండినట్లయితే, ఆయన అప్పుడు చేసిన అవే కార్యాలను ఇప్పుడు కూడా చేయును. అది నిజమేనా? మంచిది.
ఆ యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారని చెప్పడానికే, నేను ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను, మరియు కూడియున్నాము “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యనుందును.” అది నిజమేనా?
ఇప్పుడు, దానిని మనము నమ్ముచున్నాము. సందేహించవద్దు, దానిని నమ్మండి. మనము ఎలా... నా నుండి ప్రతీ సందేహాన్ని దూరపర్చండి. ఆశ్చర్యపోవద్దు. అబ్రాహాము ఆశ్చర్యపోవడానికి ప్రయత్నిస్తే ఏమగును? ఆ మిగిలిన విశ్వాసవీరులంతా ఆశ్చర్యపోతే ఏమగును? అది ఎలా ఉండియుండును? మీరు దానిని గనుక గుర్తించగలిగినట్లయితే, అదెంత మాత్రము విశ్వాసము ద్వారా కాదు, మీరు గుర్తుపట్టలేనిది అక్కడేదో ఉండియున్నది.
41
ఒకరోజు ఇక్కడ, ఒక డాక్టర్ నాతో “నేను-నేను సేవకుడిని అవ్వడానికి చదివాను, నాలుగు సంవత్సరాలు చదివాను. నేను ఒక నాస్థికునిగా అయిపోయాను. నేను ఆ కార్యాలన్నీ వదిలివేసాను. అక్కడ అలాంటిదేమి లేదు” అని చెప్పాడు. అతడు “నేను మహమ్మద్ గురించి చదివాను. కన్యక గర్భవతియగును అన్న కార్యము గురించి వారి దానిలో ఉన్నది. బుద్ధునికి సంబంధించిన దానిలోను కన్యక గర్భవతియగును అన్న కార్యము గురించి ఉంది. ఇక్కడ బైబిల్లోనూ ఉన్నది...” అని అన్నాడు.
“డాక్టర్ గారూ, ఒక్క నిముషం” అని నేను అన్నాను. “మీరు అబద్ధాన్ని సత్యముతో పోల్చడానికి ప్రయత్నిస్తున్నారు.” అని చెప్పాను. అది నిజం.
“ఎందుకనగా, అతడు ఒక... అది మనస్సును చదివే విద్య. అది మనస్సును చదివే కార్యము”, అని ప్రజలు అంటారు. నీవు అబద్ధాన్ని సత్యముతో పోల్చడానికి ప్రయత్నిస్తున్నావు.
“వారిలో ఒకరిదేమో నవ్వు తెప్పించే కార్యము మరియు మరొకటేమో మొత్తానికి శూన్యం. అది నిజం. వారు ఒక్క కార్యాన్ని కూడా నిరూపించలేరు, మహమ్మద్ కూడా నిరూపించలేడు. మరియు ఎవరైననూ...” అని నేను చెప్పాను. “అవి స్థాపించిన వారందరి సమాధులు నేను దర్శించాను. కానీ నేటి దినమున యేసు సమాధి చేయబడింది ఎక్కడ ఉన్నది?” అని నేను అడిగాను. “ఆయన తిరిగిలేచాడు” అని నేను చెప్పాను.
“వారు ఆయనను ఎత్తుకుపోలేదని నీకెలా తెలుసు?” అని అడిగాడు. “ఆయన తిరిగి లేచారు” అని నేను అన్నాను.
“నీకెలా తెలుసు?” అని అడిగాడు.
“ఆయన ఇప్పటికీ జీవిస్తున్నాడు” అని నేను చెప్పాను. “ఎక్కడ?” అని అడిగాడు.
42
“నా హృదయంలో” అని నేను చెప్పాను. అది నిజం. మరియు “డాక్టర్ గారూ అసలు సమస్యంతా ఏదెను తోటలో ఉన్నది. అక్కడ రెండు చెట్లున్నాయి. ఒకటేమో జ్ఞానం మరియు ఇంకొకటి విశ్వాసము. ఒకటేమో జ్ఞానం ద్వారా మరణం, మరొకటేమో విశ్వాసం ద్వారా జీవం. మరియు ఈ చెట్టును ఎంతకాలం విశ్వాసం ద్వారా తింటారో, మంచిది, వారు జీవించే ఉంటారు. కానీ ఈ చెట్టును పొందుకుంటే, అతడు చనిపోతాడు. మొదటిగా దానిని తిన్నప్పుడే, తనకు తానుగా దేవుని నుండి వేరైపోయాడు. మరియు మానవుడు నిరంతరం ఆ చెట్టునుండి తింటూనే ఉన్నాడు. మరియు అతడు జ్ఞానముద్వారా దానిని ప్రతీసారీ, అతడు తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. దేవుడు దేనిని నాశనం చేయడు. మానవుడే జ్ఞానంద్వారా తనను తాను నాశనం చేసుకుంటున్నాడు.” అని చెప్పాను.
43
చూడండి, అతడు కొంత తుపాకీ మందును తనకుతాను తయారుచేసి (తిని), అతని సహచరులను చంపేస్తున్నాడు. అతడు ఆ చెట్టుయొక్క ఒక వాహనాన్ని తనకు తాను తయారుచేసి(తిని), యుద్ధాలన్నీ కలిపి పెట్టినదానికంటే ఎక్కువమందిని చంపేస్తున్నాడు. అది నిజమేనా? జ్ఞానము,ఆ చెట్టు నుండి తినుచున్నది జ్ఞానమే. ఇప్పుడు అతడు తనకు తానుగా ఒక హైడ్రోజన్ బాంబును కనుగొన్నాడు, దానితో అతడు ఏమి చేస్తాడో నాకు ఆశ్చర్యమే. చూశారా?
కానీ దానిలో ఉన్న సమస్య ఏదనగా, ఈ జ్ఞానము యొక్క చెట్టును, ఈ జనులంతా, ఎంతో గొప్పగా ఊహించుకుంటున్నారు, ఇంకెంతోకాలం వారు దానిని అలా ఊహించుకోరు, “అదంతా పనికిమాలినది” అని వారు చెప్పెదరు.
వినండి, ప్రభువు నామములో వినండి: మీరు ఒక కార్యాన్ని పలానా పలానా అని ఇంకెంత మాత్రము ఊహించుకోలేవో, సరిగ్గా అదే మీరు నమ్మిక కలిగియుండే సమయం. అదెలా ఉన్నదనగా ఈదుటకు ఎవరొకరు వెళ్తున్నప్పుడు, నీ పాదములు నేలమీద ఉన్నంతకాలం ఏమీ పరవాలేదు. కానీ మీరు ఎప్పుడైతే, నీటిలోనికి అడుగుపెడతారో దానిని నీవు ఒక ఊహించుకోవు, సరిగ్గా అదే ఈదే సమయం. అక్కడ నుండే నీవు నమ్మవలసియున్నది. నీకు సాధ్యమైనంతగా నీవు ఊహించుకో, ఎప్పుడైతే నీవు అంతకు మించి ఊహించలేవో సరిగ్గా అక్కడ నుండే నమ్ముము, నమ్మడం ప్రారంభించుము.
44
మంచిది, “నేను డాక్టర్ దగ్గరకు వెళ్తాను” అని ఆ డాక్టర్ చెప్పాడు. అతడు “నీ లోపల ఒక కణితి ఉంది అని నాతో చెప్పాడు నేను నీకు ఏ మంచి చేయలేను; అది నీ లోపలికి వెళ్ళిపోయింది నీవు... అది చాలా భయంకరమైనది నేను-నేను నీకు ఏమీ చేయలేను. మరొక వైద్యుని వద్దకు వెళ్ళు, నేను నీకు ఏమీ చేయలేను. అది అయిపోయింది.” అప్పుడు సరిగ్గా అక్కడ నుండే నమ్ముచూ “ప్రభువైన యేసూ, వారు నాకు ఏమీచేయలేరు, కానీ నేను నీ యొద్దకు వచ్చుచున్నాను” అని చెప్పుము. చూశారా? అప్పుడు దేవుడు రంగము మీద కదులుటకు వెళ్ళును. మీరు దానిని నమ్ముచున్నారా?
ఇప్పుడు, శిష్యులు చెప్పేది వినండి, కొద్ది సమయం తరువాత 6లో, అదే అధ్యాయం 36వ వచనములో యేసు ఇక్కడ కొద్దిగా మాట్లాడుచున్నారు. ఇక్కడ ఆయన ఏమి చెప్పుచున్నాడో ఆయనను వినండి. వారంతా “మాకు మోషే ఉన్నాడు. మాకు ఇది ఉన్నది. మేము మరొకరిని కలిగియున్నాము” అని మాట్లాడుచున్నారు. మీరు చూశారా? కానీ యేసు ఏమి చెప్పారో వినండి, “అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు.” ఇప్పుడు, గమనించండి. “అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.”
45
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో చెప్పినట్లుగా “దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి,...” వారు దానిని కాదనలేరు. వారు ఆయనను దెయ్యం అని అన్నారు. కానీ ఇప్పుడు, వేచియుండుడి, దీనిలో చివరి దానియొద్ద ఉన్నాము, యేసు వెళ్ళిపోయే తరుణంలో, ఆ ప్రత్యేకమైన మార్గములోనే ప్రజలకు బోధించారు, దానిని వారు అర్ధం చేసుకోలేకపోయారు. అప్పుడు శిష్యులు, సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నాను... (“నీవు చేసిన సూచకక్రియలు మహత్కార్యముల వలన నీవు దేవుని యొద్ద నుండి వచ్చియున్నావని మేము నమ్ముచున్నాము”) యేసు వారిని చూసి మీరిప్పుడు నమ్ముచున్నారా? అని అడిగెను.
46
ప్రభువైన దేవుడు అదే రీతిగా అనుగ్రహించును గాక... మీరు ఇప్పుడు సమ్ముచున్నారా? మన మధ్యలోనికి పరలోకపు దేవుడు ఈ రాత్రి ఆయన ఆత్మను పంపి, ఆ ఆత్మతో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మతో ఒక మానవుని అభిషేకించి, ఆయన యేసు దినములలో చేసినట్లుగా అవే సూచకక్రియలు, మహత్కార్యములను చేసి చూపించినట్లయితే, అప్పుడు ఆయనను మీరు అంగీకరించగలరా, ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటేరీతిగా ఉన్నాడని మీరు నమ్మగలరా? మరియు ఆయనపై మీకున్న విశ్వాసయోగ్యతలనుబట్టి, మీ స్వస్థతనైనా లేక మీ రక్షణనైనా, లేదా మీకు కావల్సిన దేనికైననూ అంగీకరించడానికి మీరు ఉన్నారా?
మీకిష్టమైతే “కేవలం నమ్ముము” అనే పాట వాయించుచుండగా, మన తలలు వంచుదాము.
47
మా పరలోకపు తండ్రీ, ప్రేమగల దయతో కూడిన కృతజ్ఞతగల హృదయాలతో, పూర్తి నిశ్చయతతో, ఒకరు చెప్పడానికి ఈ మాటలు చాలా గొప్పవని నేను గ్రహించగలను. కానీ నా జీవితకాలమంతటిలో, నీవే నాకు సమీపముగా ఉండి, నాకు సహాయపడి, మరియు నీవే ఆ గొప్ప సూచకక్రియలను, మహత్కార్యములను మరియు దర్శనములను చూపించావని నేనెరెగుదును. మేము నిశ్చయత కలిగియున్నాము, ప్రభువా ఏ ఒక్కరినీ స్వస్థపరచడానికి నీ దీన సామాన్య అయోగ్యమైన సేవకునిలో ఏమీలేదని ఖచ్చితంగా నేనెరుగుదును. కానీ జగత్తు పునాది వేయబడకముందే నీవు పిలిచిన ఆ దైవికవరం వెనుకనే మీ దూత నిలబడి ఉన్నదని నాకు తెలుసు. నేను ఇక్కడ చికాగోలో ఉంటానని నీవెరుగుదవు. జగత్తుపునాది వేయబడకముందే, జనుల కొరకు జీవవాక్యాన్ని నేను కలిగియున్నానని నీవెరిగియున్నావు.
మరియు కెంటకీ రాష్ట్రములో ఎక్కడో మూలలో, క్రిందకు ఒరిగిపోయిన ఆ చిన్న పాత కుటీరములోనికి, వ్యవసాయం చేసుకునే పేదలైన తల్లిదండ్రులు ఉన్న ఒక-ఒక గచ్చు కూడా లేని ఆ ఇంటిలోనికి... అద్భుతమైన ఏప్రిల్ సూర్యోదయమున, ఏదో సిద్ధపరచబడియున్నదానికి ఒక దైవిక ఋజువుగా ఆ గదిలోనికి నీవు పరిశుద్ధాత్మనుపంపి యున్నావు.
మరియు ఇప్పుడు, నా జీవితకాలమంతటిలో నన్ను పోషించిన సర్వశక్తిగలదేవా, నీవే నా హృదయాన్ని ఎరిగియున్నావు. మరియు నా సహోదరుల మధ్య నన్ను ఒక అల్పునిగా భావించుకొనుచున్నాను. మరియు, ఒక వేషధారిగా ఉండడానికి, వారు వినుచున్నారని నేను దీనిని చెప్పట్లేదని నీవే ఎరిగియున్నావు ప్రభువా. తండ్రి, నేను నిన్ను ప్రేమించుచున్న కారణము చేతనే దీనిని చెప్పియున్నాను మరియు ఈ గొప్ప ఘడియ ఆసన్నమైనదని నేనెరిగియున్నాను.
మరియు ఆపై, నీవు దీనిని చేయమని ఆజ్ఞాపించిన తరువాత, ఎటువంటి భయము లేకుండా మరియు ఇది నీ చిత్తమైనట్లయితే, నీవు దీనిని అనుమతించినట్లయితే, ప్రభువా, ఈ మాటలు చెప్పిన తరువాత అనేక సంవత్సరాల క్రితం నీ కుమారునిలో నీవేమైయున్నావో ఈ ప్రజలకు చూపించడానికే, ఈ దీనసంఘము యొక్క ఈ చిన్న వేదిక మీదకునేను వచ్చియున్నాను, మాతోను, మాలోను ఉన్నఆ ప్రభువైన యేసే, అదే రీతిగా ఈ రాత్రి నీ ప్రజలలో ఉండియున్నావు.
48
మరియు ఇప్పుడు, ప్రభువా, నేను వచ్చియున్నాను, మరియు నీవు పలికిన ఈ మాటలను ఈ యుగములో నెరవేర్చవేడానికి నీవు పంపియున్నావని నేను నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు, ప్రభువైన యేసూ, ఈ వేదిక మీదకు ప్రజలు రాబోవుచున్నారు, వారిని నేనెరుగను, వారిలో ప్రతీ ఒక్కరినీ నీవెరుగుదువు. మరియు ప్రతీ ఒక్కరినీ మీరు స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఈ రాత్రి నీ చిత్తమైతే, శక్తితో కదలిరండి, సూచకక్రియలు మరియు మహత్కార్యములతో కదలిరండి, చెట్టు యొద్ద నుండి వచ్చుచున్న ఫిలిప్పువలె, అలా చేయడానికి మీ చిత్తమైయున్నట్లయితే, ప్రభువా, గడచిన రాత్రి వలె, మిగిలిన రాత్రులలో వలె ఈ రాత్రి కూడా మీరు అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాను. ఈ పాపులు వేదిక మీదకు వచ్చి, పొగ త్రాగుతూ మధ్యపానము సేవిస్తూ, మరియు అలా కొనసాగిపోతూ, మరియు తప్పించుకున్నామని వారు అనుకొనుచుండగా, కానీ నీ ఆత్మ వారిని ఎరిగియున్నది, వాటిలోనుండి వారిని బయటకు పిలిచి, వారేమైయున్నారో, మరియు వారేమి చేసియున్నారో వారికి చెప్పండి...
49
ఇప్పుడు, ప్రజలు భయభక్తులతోను మరియు గౌరవంతోను ఉండునట్లు ప్రభువైన యేసూ ఈ కట్టడములో ఆసీనులవ్వండి. మరియు ప్రతీవ్యక్తి నేరుగా ఇప్పుడే కల్వరివైపు చూచెదరు గాక. మరియు దేవుని కుమారునియొక్క రక్తార్పణమును చూచెదరు గాక, ఆయన నుండి బయటకు వచ్చి తండ్రియొద్దకు ఎక్కివెళ్ళిన ఆ పరిశుద్ధాత్మ తిరిగివచ్చి, యేసు చేయవలసిన క్రియలను సంపూర్తి చేసి, సువార్తను బోధించి మరియు భూలోకమంతటికి సూచనలు వెంబడించుట చూచెదరు గాక. దానిని అనుగ్రహించుము, ప్రభువా. మరియు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువనియు, నేను నీ యొక్క సేవకుడనని ఈ రాత్రి చికాగో తెలుసుకొనునుగాక. నేను దీనిని కేవలం ఆయన మహిమార్ధమై యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. కృతజ్ఞతలు.
50
మంచిది. మంచిది, బ్రదర్ బోజ్. బిల్లీపాల్, కుమారుడా నీవెక్కడున్నావ్? అతడెక్కడున్నాడో నాకు కనిపించుటలేదు. అవును, ఏమిటి? నీవెల్లప్పుడు అక్కడే కూర్చుంటావా? మీకిష్టమైతే, ఆ స్త్రీ నా నుండి ఏమి కోరుకుంటుందో మీలో ఎవరైనా చూడండి.
ఏ కార్డులను నీవు ఇచ్చావు, బి (B) నా? అదే కదా? సరే. ప్రార్థనాకార్డు బి (B) కలిగియున్న ప్రజలు ఎంతమందియున్నారో మీ చేతులు పైకెత్తండి? ప్రార్థనా కార్డు B? అక్కడ వారిలో వందమందో లేక ఎంతో కొంతమంది ఇక్కడ ఉండియుండవచ్చును. సరే.
ఇప్పుడు, ప్రారంభిద్దాం... మనమెక్కడ నుండి మొదలు పెడదాం? గతరాత్రి యాభైనుండి ప్రారంభించాం, అంతేనా? సరే, ఈ రాత్రి వెనక్కి వెళ్ళి ఒకటి నుండి మొదలుపెడదాం. B-1 ఎవరు, ప్రార్థనాకార్డు B-1,B-2, B-3, మొదటి పది లేదా పదిహేను తీసుకుందాం. మ నం తీసి... పదిహేను వరకు ప్రయత్నిద్దాము. ఇప్పుడు, మనము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. నేను చెప్పియున్నట్లుగా సంతోషింపచేయడానికి నేను ఇక్కడ లేను; రోగుల కొరకు ప్రార్థించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ప్రార్థన కంటే గొప్పశక్తి ఈ ప్రపంచంలోనే లేదు. మీరు దానిని నమ్ముచున్నారా?
మరియు ఈ ఉజ్జీవపు ముగింపు రాత్రిలో రోగులుగా ఉన్నవారు ఇక్కడ ఎంతమంది నేను మీకు తిరుగులేని సత్యాన్ని చెప్పానని ఎంతమంది నమ్ముచున్నారు, మరియు సత్యమును గూర్చి ఆత్మయే సాక్ష్యమిచ్చుచున్నది, అదే దేవుని ఆత్మయే. మీ హస్తములు పైకెత్తగలరా? మీకు వందనములు, చికాగోలోనికి ఉజ్జీవము రావడానికి కారణము అదే అవ్వబోతుంది. ఆ కారణాన్ని బట్టే మీరు ఆ మేలులను పొందుకొంటున్నారు.
51
ప్రభువు నామములో నేను దీనిని మీకు చెప్పుచున్నాను; మీ కన్నులు ధన్యములైనవి, మీరు చూచుచున్న కార్యములు మీ వెనుక తరములలో ఉన్న అనేకులు చూడాలని ఎంతగానో ఎదురుచూచి, చూడలేకపోయినందున మీ చెవులు ధన్యములైనవి. మీరు వినుచున్న కార్యములు అనేకులు వినగోరియు, వినలేక పోయినందున, వినుచున్న మీ చెవులు ధన్యములైయున్నవి. దేవుడు మిమ్ములను దీవించును గాక.
52
ఇప్పుడు, వీటియొద్దకు వచ్చుచుండగా, మీ కార్డులను చూడండి. ఒకవేళ అక్కడ చెవిటివారు లేక వినలేనివారు ఉండియుండవచ్చు, నేను... నేను ఎంతమందిని పిలిచాను, పదా లేక పదిహేనా? అది పదిహేనుమందినే కదా? పదిహేనేనా? మొదటిగా బి-1 (B-1) నుండి బి-15 (B-15) వరకూ ఉన్న మొదటి పదిహేనుమంది. పరిశుద్ధాత్ముడు ఏమి చేయబోతున్నాడో నీకు తెలియదు. నేనేమి చెప్పలేను. ఆయన ప్రజలతో మాట్లాడాలనుకున్నట్లయితే, దర్శనములను ఇచ్చును, ఆ తర్వాత వారితో నేను మాట్లాడెదను. ఆయన ఇవ్వనట్లయితే, నేనేమి చేయలేను. వారు వెళ్ళుచుండగా రోగుల కొరకు ప్రార్థన మాత్రమే చేయుదును. కానీ సమాజములో ఉన్న ప్రతి ఒక్కరూ, మీరెక్కడున్నా సరే, మీరు ఇక్కడ చూచి, మీ హృదయమంతటితో నమ్మండి, మరియు మీ ఆశకు దేవుడు జవాబిచ్చును. నేనిప్పుడే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము దగ్గరకు సమీపించుచున్నట్లుగా నేను భావించగలుగుచున్నాను.
స్నేహితులారా, ఆ పుస్తకములో ఉన్న ప్రభువుదూత యొక్క చిత్రమును ఎంతమంది చూచారు? ఒకవేళ దానిని మీ గృహములో పెట్టుకొనియుండ వచ్చును. ఎన్నడూ తీయబడని సహజాతీతమైన జీవిగా అక్కడున్న వాషింగ్టన్లో అది ప్రచురణాధికారాన్ని పొందియున్నది.
ఇక్కడున్న పరిశుద్ధమైన బల్లయొద్ద నేను నిలబడియున్నాను; ఇది సత్యమని దేవుడే ఎరిగియున్నాడు. అక్కడ మీరు చూసిన అదే దూతను, పూర్తి దేశమంతా నిందించారు, వారు దానిని పేపర్లలో మరియు ఆ కార్యములలో వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు, కానీ అది జరుగదు. నేను చనిపోయి వెళ్ళిపోయే వరకూ అదెన్నడూ జరుగదు. ఆ తర్వాత అది బయటకు వస్తుంది. కానీ దానిని మీరు కలిగియుండగలరు. దానిని మీరు కొనగలరు. కానీ నా భావమేదనగా అదింకా విడుదల చేయబడలేదు, ఎందుచేతననగా దానికి దేవుడు ఇంకా అనుమతివ్వలేదు. కానీ విజ్ఞానశాస్త్ర పరిశోధన ద్వారా ప్రతిచోట అది వచ్చియున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములలో ముఖ్యుడైన, వేలిముద్రలు మరియు మొదలైన వాటిమీద FBI కు చెందిన FBI ముఖకార్యనిర్వహణాధికారిగా ఉన్న జార్జ్ జె. లేసి తన సొంతపేరును దానిమీద సంతకము పెట్టియున్నాడు. అక్కడ దానిమీద అతను సంతకము చేసియున్నాడు. అతని సంతకము లేకుండా మీరు దాని యొక్క ప్రతిని మీరు పొందుకోలేరు. విజ్ఞాన శాస్త్రపరంగా వాస్తవమని నిరూపించబడింది ఏదైనా ఉన్నదంటే అది ఈ సహజాతీతమైన జీవి మాత్రమే.
53
మరియు అక్కడ, వారు నన్ను ముందు మోసగాడు అని చెప్పినప్పుడు, వేలాది మంది జనుల ముందు, అనేక వేలమంది ముందు నేరుగా అది వచ్చియున్నది. “దేవుని సేవకుడిని అని మాత్రమే నేను ప్రకటించుచున్నాను, నేను దైవిక స్వస్థతను చేసేవాడిని కాను” అని నేను చెప్పాను. “నేను సత్యమే చెప్పుచున్నాను. దేవునిదూత నా యొద్దకు వచ్చి, నేను వెళ్ళి ఈ కార్యాన్ని చేయమని చెప్పియున్నది. నేను సత్యాన్నే చెప్పియున్నట్లయితే, అప్పుడు దేవుడే ఆ సత్యాన్ని ఋజువు చేస్తాడు. కానీ నేను అబద్ధాన్ని చెప్పియున్నట్లయితే, దేవుడు ఒక అబద్ధముతో ఏది చేయడు. మరియు ఆయన అబద్ధాన్ని ఆశీర్వదించలేడు. అది ఎవరికైనా తెలుసు” అని నేను చెప్పాను. “నేను సత్యమే చెప్పియుంటే, అప్పుడు నేను సత్యమే చెప్పానని దేవుడే మాట్లాడతాడు” అని నేను అన్నాను.
మరియు సరిగ్గా ఆ సమయములోనే “వ్యూ” [బ్రదర్ బ్రాన్హాం ఆ గాలి యొక్క శబ్దాన్ని చేయుచున్నారు-ఎడిటర్] అని అక్కడకు వచ్చినది, అగ్నిస్థంభము ఆ రీతిగా నేనున్న చోట వ్రేలడుచూ ఉన్నది. మరియు అమెరికన్ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ వారు ఆ కెమెరాను సరిచేసి ఆ చిత్రాన్ని తీసియున్నారు. దానిని తీసి, “అది ఒక మనస్తత్వ శాస్త్రమైయున్నట్లయితే నేను దానిని చూస్తాను” అని చెప్పారు. మరియు అక్కడకు వెళ్ళి మరియు దానిని ఆమ్లాలలో పెట్టి దాని పరీక్షించి మరియు అదే రాత్రి దానిని వాషింగ్టనికి పంపించి, వెనక్కి తిరిగి వచ్చారు, టెక్సస్ రాష్ట్రాలలోగల హుస్టన్లో ఉన్న డగ్లస్ స్టూడియో వారు దానిని తమ చేతులలో కలిగియున్నారు, ఫోటో తీయబడి మరియు ఋజువు చేయబడిన అతీతమైన జీవి అది మాత్రమే.
ఇప్పుడు, శాస్త్రీయ ప్రపంచం అది నిజమని ఎరిగియున్నది. ఈ కూడికలోనున్న తిరిగి జన్మించిన క్రైస్తవులు మరియు అది క్రియచేయుట చూచియున్నవారు, అది నిజమని ఎరిగియున్నారు. దేవుని నుండి పంపించబడియున్నదని, అది ఒక నిజమైన జీవి అని అంగీకరించుట కంటే, ఇప్పుడు ఈ రాత్రి ఇంకా ఎక్కువేమి కావలిసియున్నది? ప్రభువు మిమ్ములను దీవించును గాక. బిల్లీ సరేనా? మంచిది.
54
ఆ స్త్రీని తీసుకురండి. అక్కడున్నదంతా పదిహేను మందేనా?ఏమిటి చెప్పుచున్నారు? సరే. ప్రార్థనా కార్డు సంఖ్య 5 కలిగియున్న వ్యక్తి ఇక్కడలేరు. మీరు ఇక్కడ ఉంటే, చుట్టూ చూడండి, ఒకవేళ ఆ వ్యక్తి చెవిటివాడైయుండవచ్చు. ప్రార్థనా కార్డుసంఖ్య 5 గలవారు ఇక్కడలేరు. వారి సంఖ్య ప్రకారం వారు రాలేనట్లయితే, వారి వంతును తప్పి పోతారు. B-5 మంచిది.
ఇప్పుడు, ఒక నిముషం ఆగండి “నాతోనే ఉండుము” అనే పాటను, సహోదరి నెమ్మదిగా వాయించగలరా మరియు ఆరీతిగా దేవుని సమీపిద్దాము. గుర్తుంచుకొనండి, మీరు ప్రార్థించుట ప్రారంభించే ముందుగా ఈ వైపు చూడండి. నేను ఎవరి సేవకుడినైయున్నానో, ఆ దేవుని దూత, ఇప్పుడే సరిగ్గా నా నుండి మూడు అడుగులకంటే తక్కువ దూరములో నిలబడియున్నాడు. నేను దానిని చెప్పినప్పుడు,నేను దేని గురించి మాట్లాడుచున్నానో అది నాకే తెలియదని మీరు తలంచుచూ ఉండవచ్చు? ఆయన కుడివైపున కదులుచున్నారు. అది రావడం మీరు అనుభూతి చెందగలరు. అది ఆయన సన్నిధి. ఇప్పుడు, ప్రభువైన యేసూ, సమీపంగా రండి, పరిశుద్ధమైన పవిత్రమైన నెమ్మది ప్రజల మీదకు వచ్చునుగాక. అక్కడ భయభక్తులతో కూడినది ఉండునుగాక. దేవునిశక్తి ఈ రాత్రి ప్రజలను విముక్తులను చేయునుగాక. నీయొక్క ఘనమైన, పరిశుద్ధమైన, దీననామము ఘనపరచబడునుగాక. దానిని అనుగ్రహించుడి, ప్రభువా, దీనిని యేసునామములో అడుగుచున్నాను. ఆమేన్.
55
ఇప్పుడు, స్నేహితులారా... ఇప్పుడు, గడచిన కొన్ని రాత్రులనుండి, ప్రజలను తీసుకుని, వారి కొరకు ప్రార్థిస్తూ మరియు ప్రభువు ఏమి చెప్పినా... ఈ రాత్రికూడా అదే రీతిగా ఉండవచ్చును, నాకు తెలియదు. అది ఆయనకు చెందినది. మీరు ప్రార్థనలో ఉండాలని నేను కోరుచున్నాను. మరియు మీ తలలు వంచమని నేను చెప్పినప్పుడు, మీరు తలలు వంచండి. మరియు మీకు పిల్లలున్నట్లయితే, వారిని మీ దగ్గరే ఉంచుకోండి, వేదిక మీదకు గనుక మూర్ఛరోగము గలవారు వచ్చినట్లయితే, ఆ ఒక్కటే నా నుండి దూరముగా వెళ్ళినది.
ఎంతోకాలం క్రితం కాదు, ఇరవై ఎనిమిదిమంది, అక్కడ కూర్చునియుండగా, ఆ మూర్ఛరోగము తీసివేయబడి వెళ్ళగొట్టబడగా, ఒక సేవకుడు మరియు అతని గుంపు, వేదికమీద ఉన్న ఆ వ్యక్తి నుండి వారు దానిని పొందుకున్నారు. అది సత్యం. ఆ బాలురు వెళ్ళి, ఆ మూర్ఛరోగి దగ్గరకు వెళ్ళి చెప్పినది గుర్తున్నదా, “పౌలు ప్రకటించిన యేసుతోడు, బమటకు రమ్మని నిన్ను ఉచ్ఛాటన చేయుచున్నాము.” మరియు “ఇప్పుడు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరు?” అని ఆ దెయ్యము అడిగింది. అది నిజమేనా? ఏమి జరిగిందో మీకు గుర్తున్నదా? వారు మూర్ఛరోగాన్ని పొందుకున్నారు. మంచిది.
56
ఇప్పుడు, అమ్మా, మీరు ఇక్కడకు సమీపముగారండి ఇప్పుడు, నేను మిమ్మును కొన్ని ప్రశ్నలు అడగాలనుకొంటున్నాను. బయట ఉన్న మీరంతా నన్ను సరిగా వినగలుగుచున్నారా? బ్రదర్ బాక్సర్ ఎక్కడ ఉన్నారు? మీరు గనుక... బ్రదర్ బాక్సర్ను మీరు గమనించండి, నాకు తెలియదు, అభిషేకములోనికి వెళ్ళుచున్నదని నేను నమ్ముచున్నాను, (మీరు చూశారా?) మరియు అది ఎందువలన అనగా, వారు దానిని పొందుకోలేనట్లయితే, మీరు ఈ మైక్రోఫోన్ను గమనించండి. అది ఎంత దూరములో ఉన్నదో కూడా నేను అసలు తెలుసుకోలేను (మీరు చూశారా?) అది చిన్నదిగా, తరువాత మరింత చిన్నదిగా మారిపోతుంటుంది. ఆ అభిషేకము ఎంత అధికముగా ఉంటుందంటే, ఆ పూర్తి గుంపు ప్రజలంతా ఒక సమూహమువలె అగుపిస్తారు, మరియు నేనేమి మాట్లాడుచున్నానో కూడా నేను తెలుసుకోలేను. మీరు చూశారా? మరియు ఇది ప్రారంభించేముందుగా, నేను మిమ్మును ప్రేమించుచున్నాను. క్రీస్తుయేసులో నేను మీ సహోదరుడను. నేనెక్కడకి వెళ్ళినా నా కొరకు ప్రార్థించండి. మరలా తిరిగి రావాలనే ఆశతోనే నేనెల్లప్పుడు చికాగోను జ్ఞాపకములో ఉంచుకుంటాను.
ఇప్పుడు, సహోదరీ. నీవు క్రైస్తవురాలవైయున్నావని నేనెరుగుదును, ఎందుచేతనంటే నీ ఆత్మ స్వాగతాన్ని అనుభూతి చెందుచున్నది. చూశారా? నీవు విశ్వాసివి. కానీ ఇప్పుడు, ఆ క్రమములో కొన్ని నిమిషములు మనము మాట్లాడుకొనెదము. చూశారా? మరియు-మరియు అప్పుడు, బావియొద్ద ఉన్న స్త్రీ యొద్ద మన యజమానుడు చేసిన విధముగా, ఈ సంభాషణలో ఉండును. ఆయన ఇప్పుడే ఆమెతో మాట్లాడియున్నారు, వరకూ... చూశారా, నీవు మానవ మాత్రురాలవు. నేను మానవమాత్రుడిని మరియు మనిద్దరికి మనుష్య ఆత్మలున్నవి. మరియు ఇప్పుడు, అక్కడ... అక్కడ నీలో ఏ పొరపాటు ఉన్నా(చూశారా?), అప్పుడు అది సాతాను దేనినో చేయుటకు ప్రయత్నించును. అది నీ నుండి బయటకు జరిగే కార్యమైయున్నది. మీరు దానిని అర్థము చేసుకున్నారా? ఒకవేళ అది క్యాన్సర్ అయినా, ఒకవేళ అది కణితి అయినా, లేక అదేమైనప్పటికినీ, నీకు వెలుపల జరిగే కార్యమే. అది ఒక జీవం అభివృద్ధి చెందును లేక అదేమైనప్పటికీ ఆ విధంగా ఉండవచ్చును.
57
ఇప్పుడు, ఇక్కడ, నేను కేవలం నీ సహోదరుడైన మనిషిని మాత్రమే. మరియు అప్పుడు, అభిషేకం ఇక్కడకు వచ్చినప్పుడు, ఇప్పుడు దానినుండి దూరమైపోదువు. చూశారా? అది ఏదో అయి ఉన్నదని మీరు ఎరుగుదురు. స్నేహితులారా, గమనించాలాని నేను మిమ్ములను కోరుచున్నాను. వారు ఇక్కడకు సమీపముగా వచ్చుచుండగా వ్యాధిగ్రస్తుల యొక్క ముఖమును గమనించండి. అది ఇప్పుడు వచ్చుచుండగా, దానిని గమనించండి. వారు వచ్చుచుండగా, వారి ముఖములోని హావభావములు మారుట గమనించండి. గమనించుటను మరచిపోవద్దు.
మరియు ఇప్పుడు, ప్రభువు దూత దగ్గరకు సమీపించినప్పుడు, నీలో ఉన్నటువంటి రోగపుదూతను ఆయన గెంటివేయుటను. చూశారా? ప్రభువు దూత సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రెండు శక్తులు ఉన్నవి. మరియు అది ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుకొనును. ఇప్పుడు, అది మన విశ్వాసముపై ఆధారపడియుండును.
ఇప్పుడు, ఆ రోగమైనా, నీవు కలిగిన దేనినైనా, అది నీలో నెట్టుచూ(మీరు చూశారా?) ఇది సత్యమని మీరు నమ్మకుండా, దీనినుండి దూరముగా ఉండడానికి నీ మనస్సులో ప్రతీది పెట్టుటకు అది ప్రయత్నించును, ప్రయత్నించుచుండును. చూశారా? మరియు ఇదైతే, రాబోవుచున్న ఇదైతే, నేను నీతో మాట్లాడుచూ, ఇది సత్యమని మీరు నమ్మాలని చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. మీరు చూశారా? ఇప్పుడు, ఇక్కడ యుద్ధము జరుగుచున్నది. నీవు దీనిని నమ్మినట్లయితే, ఇక్కడున్న పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రకటించగా; సాతాను వదిలిపోవును, అది అలాగే పోవును. ఇప్పుడు, మీరు గనుక... ఇప్పుడు, వాడు బయటకు వెడలిపోయాక, నీవు బాగుపడి, సరిగ్గా అప్పుడే మంచిగా అనుభూతి చెందెదవు. వాడు నీరు లేని చోట్లలో తిరుగుతూ ఉంటాడు. మరియు మరియు వాడు ఎన్నడూలేని విధముగా, ఏడంతలుగా చెడు లక్షణములతో తిరిగివచ్చును. మరియు వాడు అలా వచ్చినప్పుడు, ఇంటియొక్క మంచిమనిషి అక్కడ కాపలాగా లేనట్లయితే, విశ్వాసము “ఇక్కడ నుండి దూరముగా పో”, అని చెప్పును.
58
ఇప్పుడు, “దీనికంటే మరింత చెడ్డది నీ మీదకు రాకుండునట్లుగా, వెళ్ళి, ఇంకెంత మాత్రము పాపము చేయవద్దని” బైబిల్ చెప్పుచున్నది. అది నిజమేనా? దాని అర్థమేదనగా, “వెళ్ళి ఇంకెంత మాత్రము అపనమ్మకముంచవద్దు”. పాపము అనగా అవిశ్వాసమే. చూశారా? అదే మొదటికార్యము. అక్కడున్నదంత అదే, పాపమనగా అవిశ్వాసమే. ఎందుకనగా నీవు నమ్మినప్పుడే...
“ఆయనయందు విశ్వాసముంచినవానికి ఏ శిక్షావిధియులేదు. నామాట విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు,వాడు తీర్పులోనికి రాడు” అని యేసు చెప్పారు. నీవు నమ్మినట్లయితే, అదంతా విశ్వాసములోనే ఉన్నది.
ఇప్పుడు, ఈ వరములన్నీ చేర్చబడ్డాయి. ఇప్పుడు, ప్రధమముగా ఇక్కడ దేవుని వాక్యము ఉన్నది మీరు దానిని నమ్ముచున్నారా? అది దేశానికి, ఆ ప్రపంచానికి. కాని ఇప్పుడు, నీ జీవితములో జరిగిన ఏదో ఒక సందర్భాన్ని, నీవు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఆ కార్యమేమిటో బయటపెట్టడానికే ఈ వరములు, ప్రవచనాత్మక కార్యములు పంపించబడ్డాయి, చూశారా? సార్వభౌమాధికార కృప చేత దేవుడే దానిని చేయును.
59
ఇప్పుడు, ఆమె ఆత్మను పట్టుకునేంతవరకూ, యేసు కొంతసమయం ఆ స్త్రీతో మాట్లాడారు. అప్పుడు ఆమెలో ఉన్న ఆ మాధ్యమమును ఆయన పట్టుకున్నారు, నేను దానిని మాధ్యమము అని పిలిచాను లేక ఆత్మ, ఆత్మలోనికి వెళ్ళి ఆమెను పట్టుకున్నారు, పొరపాటు ఏమిటో ఆయన చూశారు. వెనువెంటనే ఆయన వెళ్ళి అసలు పొరపాటు ఏమిటో ఆమెకు చెప్పియున్నారు. మరియు ఆమె వెనుదిరిగి, మరియు...“నీ పాపములు క్షమించబడినవి” అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన అసలు ఏమీ చెప్పలేదు. కానీ ఆయన సమీపమున ఉండగా, ఆమె తెలుసుకున్నది, మరియు ఆయనే మెస్సీయా అని ఆమె నమ్మింది. అది నిజమేనా? “మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన మెస్సీయా కాడా?” అని ఆమె అన్నది.
ఇప్పుడు, “నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు ఇంకెంత మాత్రము ఆ పెనిమిటిలతో అలా జీవించవద్దు లేక ఆ విధంగా చేయవద్దు” అని ఆయన ఎన్నడూ అలా చెప్పియుండలేదు. అసలు ఆమెతో ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమె కేవలం ఆయనను మెస్సియాగా గుర్తించింది అంతే, ఎందుచేతననగా ఆమె చేసినవన్నీ ఆయన ఎరిగియున్నాడు.
ఇప్పుడు ఆయన దిగివచ్చి, మీలో ఉన్నపొరపాటు ఏమిటో బయలుపరచినట్లయితే, ఆయనే, నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటేరీతిగా ఉన్న మెస్సీయా అని గుర్తించగలరా?
ఇప్పుడు, అక్కడ... ఒక రకమైనదేదో పెరగడంతో నీవు ఇబ్బందిపడుచున్నావు, అది మూలశంఖ వ్యాధి. అది నిజమే అయినట్లయితే నీ చేయి పైకెత్తుము, అది మూలశంఖ వ్యాధేనా? అది నిజమేనా? ఇప్పుడు, ఆ వెనకాల ఉన్నవారి యొద్ద నుండి.
60
మరియు ఒక్కడే కొంతకాలం క్రితమే, నీవేమి చేసావో నీవు గుర్తు తెచ్చుకోలేకపోతున్నావు. నీ వీపు భాగములో ఒకరకమైన బిగుసుదనం లేక అలాంటిదేదో నీకు వచ్చియున్నది, ఒక ఒక బెణికిన వెన్నుపూసలాంటిది, అది నిజమేనా? అది నిజమేనా? అవునండీ నీవు పిల్లగా ఉన్నప్పుడే దానిని చేసావు. నీవు దానిని చేసేటప్పుడు, నీవు గ్రహించుకోలేకపోదువు; నీవు దానిని చేసినప్పుడు నీకేది తెలియలేదు. నీవు చిన్న బాలికగా ఉండి దూకుతున్నప్పుడు నీవు పడిపోయావు, మరియు అదే నీ వెన్నుపూసను స్థానము తప్పించింది, మరియు వారు ఇప్పుడు దానిని కనుగొన్నారు, అదేమిటో ఇప్పుడే గ్రహించుట ప్రారంభించాను. నీవు కలిగియున్న ఆ బిగుసుదనము... కొన్ని సార్లు నీవు ఆ-ఆ పడకమీద నుండి కూడా లేవలేవు లేక అలాంటిది. నీవు కదులుటను నేను చూస్తున్నాను లేక అలాంటిదాని ద్వారా... అదే నీ వెనకాల బాధ కలిగిస్తున్నది. అది నిజమేనా? ఒక కుర్చీద్వారానో లేక ఒక పడక మీదో లేక మరేదో దానిమీద ఒక గదిలో ప్రార్థించడానికి కొన్ని రోజుల క్రితం నీవు మోకరించినప్పుడు... అది నిజమేనా? ఆ గదిలో నీ ఎడమవైపు ఒక చిత్రము వ్రేలాడుచున్నది, నీ వీపు సంబంధ నొప్పివల్ల నీవు అసలు లేవలేక పోయావు. అది నిజమేనా? అది అలానే అయితే, నీ చేతిని ఈ విధంగా ఊపుము.
61
ఇప్పుడు, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ స్వరము మాట్లాడుట నీవు విన్నావు. అది నేను కాదు. నేను నీ ముందు ఇక్కడ నిలబడి చూస్తూ, ఆ దర్శనమును చూసాను, దేవునికి మాత్రమే ఈ విషయాలాన్నీ తెలుసని నీవు ఎరిగియున్నావు అది నిజమేనా? మంచిది. నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? అలా అయితే, నిన్ను స్వస్థపరచువానిగా ఆయనను ఇప్పుడే నీవు అంగీకరిస్తావా? నిన్ను స్వస్థపరచువానిగా సరిగ్గా ఇప్పుడే నీవు అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు నామములో బాగుపడి, ఇంటికివెళు ఎము. మరియు దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, ఎలా ఉన్నావు? నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో ఏదో జరుగుచున్నదని నీవు బాగుగా ఎరిగియున్నావు. నీవు ఎరిగావు. సహజాతీతమైనదెదో అక్కడ ఉన్నదని నమ్ముచూ, దాని గురించి బాగుగా ఎరిగియున్నావు. ఇప్పుడు, అది నీకేమిహాని కలిగించదు. నిన్ను దీవించడానికే అది యున్నది. నీ జీవితంలో ఇంతకుముందెన్నడూ ఆ రీతిగా అనుభూతి చెందలేదు. అది నిజమేనా? అదే అయినట్లయితే, నీ చేతిని పైకెత్తుము, అప్పుడు దానిని పట్టుకోగలరు. అది ప్రభువు యొక్క దూత. ఇప్పుడు నీ విశ్వాసము కదులుచున్నది. మరియు నీవు నేరుగా ఇక్కడికి వచ్చినప్పటికి, నీ విశ్వాసము అంతకంతకు ఆశ్చర్యరీతిగా అభివృద్ధి చెందుచున్నది. అది నిజము కాదా? ఎందుకంటే ఇప్పుడు నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు. దానిని చేయునది అదే.
నీ గొంతులో ఉన్న ఒక విధమైనదేనితోనో నీవు బాధపడుచున్నావు. అది నిజముకాదా? గొంతు సమస్యేనా? ఇప్పుడు అది నన్ను విడిచివెళ్ళింది. అది ఇక్కడ ఉ న్నది. లేదు, నీవు ఆపరేషన్ చేయించుకోలేదా? నీ రొమ్ము మీద రెండింటిని కలిగియున్నావు, అది ఒక నీటి కణితి, లేక అలాంటిది, ఆ రొమ్మును కత్తిరించియున్నారు. అది నిజమేనా? అక్కడున్న గదిలో ఇద్దరు వైద్యులు ఉన్నారు. అది నిజమేనా? నేను చూస్తున్నాను, ఆ ప్రదేశములో, ఒక రకమైన...
62
మంచిది, సహోదరి. దేవుడు నిర్ధారించడానికి రూఢిపరచుచున్నాడు... నీ గొంతు స్వస్థతపొందినది. నీవు ఇంటికి వెళ్ళుము. చూడు. యేసుక్రీస్తు తన యొక్క శక్తితో ఇక్కడ ఉన్నట్లయితే, నీ జీవితములో ఇంతకు ముందెన్నడూలేని రీతిగా నీవు ఇక్కడ అభిషేకించబడియున్నావు, మరియు నీవు ఎరిగియున్నావు... ఇది నీకు క్రొత్తగా ఉన్నది. నేను చెప్పడానికి అక్కడ నిర్ణయించుకున్నప్పుడే నీవు ఎరిగియున్నావు, నీవు అర్ధము చేసుకున్నావు. చూశారా? ఇది నీకు క్రొత్తగా ఉన్నది. మంచిది. ఇప్పుడు, ఆయన ఇక్కడ ఉండి, నీ జీవితంలో ఏమి జరిగిందో ఆయన ఎరిగినట్లయితే మరియు నీ జీవితంలో జరిగిన దానిని ఒక కొత్త వ్యక్తికి బయలుపరచి యున్నట్లయితే, నీ జీవితములో ఇక ముందుజరుగబోవుదానిని ఆయన ఎరుగడా? మంచిది. నీవు స్వస్థత పొందియున్నావు. ఇప్పుడే ఇంటికి వెళ్ళుము.
ప్రతీ ఒక్కరూ గౌరవంతో ఉండండి, నిజమైన గౌరవంతో ఉండండి. ఆ యజమానుడు సమీపముగా ఉన్నాడని మీరు గ్రహించారా? మీరు దానిని నమ్ముచున్నారా? ఇప్పుడు ఆయన ప్రేమ ప్రసన్నతలో, మీరు ఇంకేమి అడగాలనుకుంటున్నారు? మీకు ఇంకేమి కావాలనుకుంటున్నారు? ఈ రాత్రి ఈ సమాజమును స్వస్థపరచాలని ఆయన ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఆ విధముగా చేయుట ఆయన దైవిక చిత్తమైయున్నది. తగినంత విశ్వాసము మాత్రమే మీకు ఉంటే చాలును నేను మాట్లాడుచున్న కారణమేదనగా, ఆ అభిషేకము మరింత ఎక్కువగుచున్నది (మీరు చూశారా?), మరియు నేను-నేను పొందలేను కానీ ఒక్క నిముషం నేను వేచియుండకపోతే కొద్దిమందిని మాత్రమే, మరియు ఆ రీతిగా నేను మరలా సాధారణ స్థితికి వెళ్ళిపోయెదను. ఆ ప్రక్కనున్న పరలోకము, ఒక మానవునిలోనుండి ఎంత ఆర్జిస్తుందో, క్రైస్తవులారా మీరెన్నడూ దానిని తెలుసుకోలేరు.
63
దానియేలు దర్శనమును చూచియున్నాడు, మరియు అది చాలాదినములు అతని మనస్సును కలవరపరిచింది. అది నిజమేనా?
ఆ స్త్రీ ఆయన వస్త్రమును ముట్టినప్పుడు “ఆ ప్రభావము లేక బలము నా నుండి బయలువెళ్ళినదని నేను నమ్ముచున్నాను.” అని యేసు చెప్పారు. విశ్వాసులు ఆ రీతిగా హృదయ రక్తస్రావముతో అక్కడ నిలబడియున్నప్పుడు, మరియు అలా కదిలితే, ఏదో ఒకటి జరిగి తీరును. అది సరిగ్గా అప్పుడే నీలోనుండి జీవమును బయటకు తీసివేయును. మారుమనస్సు దూరముగా తొలగిపోవును. దేవుడులోనికి వచ్చును. కేవలం ఆలోచించండి, దానిని గురించి ఎవ్వరూ ఎన్నడూ ఎరుగలేనటువంటి మరొక పరిమాణము లోనికి అది దూసుకొని పోవును. అది సహజాతీతమైన ప్రపంచములో ఉండి, మరియు సంవత్సరము క్రితం చేసిన కార్యములను తెలియజేయును. దేవుని మీరు ఎలా సందేహించగలరు? ఆ గొంతు ఇప్పుడు బాగుగా ఉన్నది, సహోదరీ, అలా లేదా? అది నిజమేనా? నీ చేతిని పైకెత్తుము. నీవు స్వస్థపడ్డావు. అది ఖచ్చితం. అదేమైయున్నదో కూడా నేనైతే అసలు చెప్పలేను. అసలు ఏమి జరిగినదో అది చెప్పియున్నది. నీవు స్వస్థత పొందియున్నావు. నీవు బాగుగా ఉన్నావు. దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు, కొన్నిసార్లు ఆ వ్యాధిగ్రస్తుని అడుగుచున్నందులకు నన్ను మన్నించండి, కొన్ని సార్లు నేను అభిషేకముతో ఉన్నప్పుడు, ఎవరు ఎవరనేది నేను చెప్పలేను.
64
ఇప్పుడు, అయ్యా, మీరు నాకు కొత్తవ్యక్తి. నేను మీకు తెలుసునని నేను నమ్ముటలేదు. ఒకవేళ నేనెప్పుడైనా నిన్ను కలిసియుంటే, నాకు జ్ఞాపకములేదు. మనము మొదటిగా ఎదురుపడింది ఇప్పుడే. అలా అయితే నీవు నాకు పూర్తిగా క్రొత్త వ్యక్తివి. ఇక్కడున్న వారెవరైనా ఈ మనిషిని ఎరుగుదురా? సరే. ఎవరొకరు అతనిని ఎరిగియుందురు. మరియు ఆ వ్యక్తి ఒక నిజాయితీపరుడని మీకు తెలుసు. ఆయన అలాంటివాడేనని నేను ఊహిస్తున్నాను అతడు-అతడు ఒక క్రైస్తవుడు, నేను దానిని ఎరుగుదును. ఇప్పుడు నన్ను అభిషేకించిన ఈ దూతతో అతని ఆత్మ సాక్ష్యము పలుకుచున్నది, ఈ బలశాలి దేవునియొక్క ప్రసన్నతనుండి వచ్చి, ఇప్పుడు నా మర్త్యశరీరములో ఉన్నాడు. ఆ రీతిగా... అది అక్కడున్న వెలుగునిచ్చే బల్బు కాదు; అది ఆ వెలుగునిచ్చే బల్బులో ఉన్న విద్యుత్ శక్తి. చూశారా? అది నేను కాదు; ఇప్పుడు అది ఆయనే.
65
కొన్ని క్షణముల క్రితం నేను మీ సహోదరుడను; ఇప్పుడైతే నేను దేవుని సేవకుడిని. అయ్యా, ఒక మానవుడు ఏ రకమైన ప్రకటనైననూ చేయగలడు, కానీ దేవుడు దానిని నిర్ధారించి మరియు అది సత్యమని చెబితే, అప్పుడు నీవు దేవుని సందేహించవు లేక నీవు సందేహించలేవు. అది నిజమేనా? మనము కొత్తవారమైనట్లయితే, అక్కడ నీలో ఏదో పొరపాటు ఉన్నది నీలో ఉన్న పొరపాటు ఏమిటో మన ప్రభువైన యేసు నన్ను తెలుసుకోనివ్వగలరని నేను నమ్మకము కలిగియున్నాను. ఆయన చేసినట్లయితే, అప్పుడు... నేను మిమ్ములను స్వస్థపరచలేను, మీరు అర్థము చేసికునియుండవచ్చును. అది మీకు అవసరమైన ఒక-ఒక చిన్నదానిని, విశ్వాసపు చిన్న కదిలింపును, బహుశా, లేక అలాంటిదేదో మీకు ఇచ్చును. సహజాతీతమైన దాని యొక్క ప్రసన్నతలో నీవు కొద్దిగా ఉన్నాసరే, నీకు నీవుగా దూరమైపోతావు. మీరు దానిని ఎరుగుదురు. ఇప్పుడు, సమాజములోనున్న మీరు దానిని ఎరిగియుండవచ్చు, మీ హస్తములు పైకెత్తండి. అది మీరెరిగినట్లుగా, అది నీవెన్నడూ ఎరగనటువంటి అనుభూతియై ఉన్నది. చూశారా? అది నిజం. అది-అది ఒక విదమైనది, సమాజమా, నేను దానిని వివరించలేను. నేను మాట్లాడుచున్నదేమిటో ఖచ్చితంగా నేను ఎరిగే ఉన్నాను.
66
మరియు మహిమ కొరకు నేను దీనిని చెప్పుటలేదు. ఆయన వాక్యములు నెరవేర్చుచూ, ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు యొక్క ఘనత కొరకే నేను దానిని చెప్పుచున్నాను. అర్థమైనదా. మంచిది. ఆ ఒక్కడే ఇక్కడ ఉండి, నీవైపు కదులుచున్నవాడు, ఆనందకారకుడైన ఆ ఒక్కరే, దేవుని కుమారుడైయున్నారు. ఆయనే తండ్రి యొద్దకువెళ్ళి, పరిశుద్ధాత్మను తిరిగి పంపియున్నారు; ఆ పరిశుద్ధాత్మ సత్యాన్ని బయలుపరచి, జరుగబోవు కార్యములను చూపించుచున్నది; పరిశుద్ధ యోహాను సువార్త 17, లేక 15. అది నిజమేనా?
ఇప్పుడు, జీవితమంటే మీకు పూలపాన్పు అంత సులువేమీకాదు. నీకు మరియు నాకు మధ్యను వ్రేలాడుచూ, పొడవాటి చీకటి రహదారి వచ్చినది. మరియు ఈ రహదారి దిగువభాగములో, నీవు వచ్చుచుండుట నేను చూస్తున్నాను. అక్కడ నీతల గురించి ఏదో ఉన్నది; నీవు నీ తలను పట్టుకుని యున్నావు. అది తలపోటు. అదేనా, అది నిజమేనా? సంవత్సరముల తరబడి... నీవు సంగీతకారునివి కావా లేదా ఏదో అయియున్నావు? ఆ విధమైన సంగీతాన్ని వాయించకు, లేక అలాంటిది, ఆ విధమైన తీగ సంబంధ సంగీతాన్ని వాయించవద్దు? అది నిజమేనా? ఇక్కడకు రా సహోదరుడా. తండ్రీ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రినా సహోదరుడిని నేను దీవించుచున్నాను. అతనిని స్వస్థపరచమని నేను నిన్ను అడుగుచున్నాను, ప్రభువా, ఇది అతనిని వదిలిపోవునుగాక. మరియు అతడు ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్ళుచుండగా బాగుపడునుగాక ఈ ఆశీర్వాదమును దేవుని కుమారుడైన యేసు నామములో నేను అడుగుచున్నాను. ఆమెన్.
67
చూడు, సహోదరుడా. అదేమిటో తెలుసుకోవడానికి ఏ ఒక్కరూ కూడా సమర్ధులు లేరు. అది నిజము కాదా? వారు మొదట దానిని పార్శ్వపు నొప్పి అని తలంచువారు, కానీ పొడవుగా ఉండి సన్నగా కనిపించే ఒక వైద్యుడు తన తలను ఊపుతూ అతనికి పార్శ్వపు నొప్పి అని చెప్పుచుండుట నేను చూచుచున్నాను. అది నిజమేనా? అది పార్శ్వపు నొప్పికానే కాదు. లేదు, అది కానేకాదు. అది సాతాను. ఇప్పుడు, అది నీ నుండి వెళ్ళిపోయింది, నమ్ముచూ వెళ్ళుము.
మీరు ఎలా ఉన్నారు? నీవు నమ్మితివా? నీవు ప్రయత్నించుచున్నావు. “నీవు నమ్మితివా?” అని నేనెందుకు అడిగాను. ఇందుకోసమే నేను అడిగాను. నీవు ఇంతకుముందు ప్రార్థన చేయించుకున్నావు. అది నిజమేనా? నీ కడుపులో కణితి ఉన్నది. అది వెళ్ళిపోదు అని నీవు భయపడ్డావు. దానిని ఆధారము చేసికొని దానిని అంగీకరించడానికి నీవు కొద్దిగా భయపడ్డావు. అది నిజమేనా? నేను నీ మనస్సును చదువుటలేదు. కానీ దానిని నీవు అంగీకరించడానికి ప్రయత్నించుటను నేను చూస్తున్నాను, మరియు పరలోకమందున్న దేవుడే ఎరుగును, చూచుట ద్వారా, నేను పొరపాటు పడినట్లయితే దర్శనము ద్వారా ఇప్పుడు నీవెక్కడ నిలబడియున్నావో నేను చూస్తున్నాను, అది ఎక్కడో ఒక-ఒక సమావేశ మందిరములో, దానికి ప్రక్కల రెక్కలు ఉన్నవి, ఈ రీతిగా లేక అలాంటిదేదో. అది సీయోనా? అది నిజమేనా? అక్కడే నీ స్వస్థతను అంగీకరించడానికి నీవు ప్రయత్నించావు. ఇంకెంతమాత్రము సందేహించవద్దు. అదే నీ సమస్య ఇక నీడ వంటిది నీమీద వ్రేలాడుచున్నది. ఇక్కడ నేను నీకేమి చేయాలని నీవు ఆశిస్తున్నావు. అది నీ నుండి దూరముగా వెళ్ళగొట్టబడడానికి నీవు నన్ను కోరుచున్నావు. దాని నిమిత్తమే నీవు తిరిగి వచ్చియున్నావు. అది నిజమేనా? అది నిజమే అయితే, నీ హస్తమును పైకెత్తుము.
యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా మాత్రమే నేను దానిని వెళ్ళగొట్టగలను, కానీ నేనే దానిని వెళ్ళగొట్టలేను. నీ విశ్వాసమే దానిని పారదోలుతుంది. ఆయన ప్రవక్తనని నీవు నన్ను నమ్ముచున్నావా? దేవుడు తప్ప, దానిని నేను తెలుసుకోవడానికి ఈ ప్రపంచములో వేరే ఏ మార్గము లేదు. అది నిజమేనా?
68
ఇప్పుడు సమీపముగా రండి. దేవా, ఏదో సరిగ్గా చేయబడినదని ఈ దీనస్త్రీ గ్రహించియున్నది... తండ్రీ, దానిని చెల్లాచెదురు చేయడానికే ఆమె ప్రయత్నించుచున్నది, కానీ వాడు ఆమెకున్న సమస్యను ఎత్తిచూపించడానికే సాతాను నిశ్చయించుకున్నాడు. కానీ ఆమె యెడల కృప చూపమని నేను అడుగుచున్నాను. ఇప్పుడు, “విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. వారు పాపములు చేసినవారైతే, పాపక్షమాపణ నొందుదురు. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి” అని నీవు చెప్పితివి.
సాతానా, సవాలుతో కూడిన ఈ విశ్వాసపు యుద్ధములోనికి నేను యేసుక్రీస్తు నామములో వచ్చుచున్నాను, నా సొంత శక్తితోనో లేదా పేరుతోనో కాదు, నేనలా చేయలేనని నీకు తెలుసు. కానీ యధార్ధముగా ప్రార్థన చేయబడినప్పుడు, వారి ముందు ఏ రోగము నిలవలేదని ప్రజలను నమ్మునట్లు చేయమని నాకు చెప్పిన, దేవదూత ద్వారా ఆజ్ఞ పొందిన దైవికవరమును ప్రకటించువానిగా నేను వచ్చుచున్నాను. మరియు నేను దేవునికి యధార్ధముగా ప్రార్థించాను. కాబట్టి, నీవు ఇంకెంత మాత్రము ఆ స్త్రీని పట్టుకుని ఉండలేవు. ఆ స్త్రీ నుండి బయటకు రమ్మని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను.
69
మంచిది, సహోదరి. ఇప్పుడు, చూడు. ఇప్పుడు, అది వెళ్ళిపోయింది. దాని జీవము చనిపోయింది. ఇప్పుడు, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు, నీవు దీనిని గమనించుచూ ఉండుము. ఇప్పుడున్నట్టుగానే ఇంకా దానిని నీవు నమ్ముచూ ఉండుము. ఇప్పుడున్నట్టుగానే ఇంకా దానిని నీవు నమ్ముచూ ఉండుము. నీవు వెళ్ళుచున్నావు... నీవు ఇప్పుడు వ్యత్యాసముగా అనుభూతి చెందుచున్నావు. ఇప్పుడు, అది సత్యమైతే, నీ చేతిని ఊపుము. నిజముగా తేలికగా మరియు చల్లగా ఉన్నది, అది నిజమేనా? అది చనిపోయింది. దానిలోనుండి జీవము పోయినది. అది ఏ విధంగా ఉన్నదంటే, నీలోనుండి నీ యొక్క జీవము వెడలిపోతే, నీ శరీరము కుప్పకూలిపోతుంది. ఇప్పుడు, దాని జీవము వెడలిపోయింది. ఇప్పుడు, రాబోయే డబ్భైరెండు గంటలలో అది కుచించుకుపోతుంది. మరియు ఆ తర్వాత, రాబోయే రెండు లేక మూడు రోజుల్లో బాగైనట్టుగా అనుభూతి చెందగలవు. దాని తర్వాతనే, నీవు చాలా ఎక్కువగా రోగగ్రస్తునివై పోతావు. మరొక మాటలో చెప్పాలంటే అది విచ్చిన్నమైపోయి, క్షీణించిపోయి, కుళ్ళిపోతుంది. అది ఎన్నడూ లేని దానికంటే పెద్దదైపోతుంది. అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుము. ఇంకెన్నడూ సందేహించవద్దు. నీ స్వస్థత నిమిత్తమై దేవునికి వందయములు చెల్లించుచూ ఉండుము. అది నీ నుండి వెళ్ళిపోతుంది.
ఏమి జరిగిందో నేను తెలుసుకున్నట్లయితే, ఏమి జరుగుతుందో నేను ఎరిగియుంటే, జరుగబోయేదానిని కూడా నేను ఎరిగియుందును. ఆయన గనుక నాకు బయలుపరచినట్లయితే...ఏమి జరిగిందో ఆయన బయలుపరిచాడు; జరుగబోయేదానిని కూడా ఆయన బయలుపరచగలడు. నీవు దానిని నమ్ముచున్నావా? నీ జీవితములో నీవు విఫలమయ్యావు; నీవు దానిని ఎరిగియున్నావు. ఇప్పుడు, వెళ్ళి, నీ హృదయమంతటితో దేవుని సేవించుము.
సరే. అమ్మా, రండి.
గౌరవముగా ఉండండి. ప్రతీచోట.
సహోదరి ఎలా ఉన్నావు. నేను దేవుని ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా?
నీ హృదయమంతటితో? సరే.