నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు

1ఒక్క క్షణము ప్రార్ధన కొరకు ఆలాగుననే నిలబడియుందాము. ఈ సభలో, దేవుడు తమకు ఒక ప్రత్యేకమైన కార్యమును చేయవలెనని, మీలో ఎంతమంది మీ హృదయములలో ఒక అభ్యర్థనను కలిగియున్నారు? ఇప్పుడు మన తలలను ఆయనకు వంచుదాము.

పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసు నామములో, ఒక స్వేచ్చాయుతమైన దేశములో, మా మనస్సాక్షి ఆదేశించిన ప్రకారము, నిన్ను ఆరాధించుటకు, మేము ఏకముగా సమాజముగా కూడుటకు, మేము ఒక ఆధిక్యత గల ప్రజలమైయున్నాము. మరియు తండ్రీ, ఇది ధీర్ఘముగా యుండాలని, మేము ప్రార్థిస్తాము. మేము కలిగియున్న ఈ ఆధిక్యత యొక్క అవకాశమును సద్వినియోగము చేసికొందుము గాక. నిన్ను ఆరాధించుటకు, మా హృదయమంతటిని, ఈ రాత్రి కూడికలో యుంచుదుము గాక. దేవుడు మనమధ్య ఈ రాత్రియున్నాడని, ఆయన ప్రజలను దీవించుచున్నాడని, అది చెప్పబడును గాక.

ప్రభువా, ఈ రాత్రి తప్పిపోయిన ప్రతి ఆత్మను ఇక్కడ రక్షించుము. మరియు వెనుకకు జారిన ప్రతి వ్యక్తి, వారు తిరిగి దేవుని గృహములోనికి వచ్చుదురు గాక. ప్రతి రోగి స్వస్థపడును గాక, పీడించబడుచున్న వారు నడుచుదురు గాక, గ్రుడ్డివారు చూచుదురు గాక, చెవిటి వారు విందురు గాక, స్తుతి మరియు ఆరాధన, ఆయన ప్రజల మధ్య, యేసుక్రీస్తుకు ఇవ్వబడును గాక. ప్రభువా, ఇది ధీర్ఘకాలము గుర్తుచేసికొనబడును గాక, ఏలయనగా మేము ఏకముగా కూడి, యేసు నామములో ఈ దీవెనల కొరకు అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనవచ్చును.

2ఎందుకో, రమడా ఇన్ లోనికి వచ్చుట, ఒక విధముగా, ఇంటికి తిరిగి వచ్చినట్లుగా కనబడుతుంది, ఎందుకనగా నేను ఎంత ఎక్కువుగా ఇక్కడ యుండియున్నాననగా, వారు తప్పక నన్ను గుర్తించుట ప్రారంభిస్తారని నేను తలస్తాను. దానిని బట్టి నాకు సంతోషము, ఎందుకనగా ఒక చక్కని గుంపు ప్రజలను, ఈ రమడా ఇన్ లో నేను కనుగొన్నాను. టుసాన్ లో ఒకటున్నది, ఒకటి ఇక్కడున్నది, ఈ కూటములను మనము కలిగియుండుటకు, వారు ఎంతో దయగలవారుగాయున్నారు. ఈ మధ్యనే, రమడా ఇన్ లో, నా సొంత కూటమును ఒక దానిని కలిగియున్నాను, ఆ మేనేజరు, ఆ బిల్డింగు అద్దెను సహితము, నన్ను కట్టనియ్యలేదు అది నిజముగా చక్కగాయున్నది. నేను దేశములను దాటుచుండగా కూడా, ఇప్పుడు, వారు దేవుని యొక్క ఇంటివారికి వారు మంచిగాయున్నారు.

3ఆదివారము రాత్రి, లేక ఆదివారము మధ్యాహ్నము నుండి, మనము కొన్ని గొప్ప సమయములను ప్రభువుతో కలిగియున్నాము, లేక కనీసము నేను కలిగియున్నాను. ఆయన ప్రజలతో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో, ఆయన దీవెనలను అనుభవించుచు, నేను అద్భతమైన సమయమును కలిగియున్నాను. మనము ఏకముగా దేవునిని ఆరాధించుచున్నామని, నేను గుర్తుంచుకొనగోరుదును. నీవు దేవుని కుమారుడిగా లేక దేవుని కుమార్తెగా మారినపుడు నీవు దేవుని యొక్క గుణలక్షణమైయున్నావు, దేవునిలో భాగమైయున్నావు. దేవుడు నీలోయున్నాడు, ఆయనను ఇష్టమును జరిగించుచున్నాడు, నీకు ఇష్టమైన దానిని ఆయన చేయనిమ్ము.

కాబట్టి ఈ రాత్రి, నేను ఆశించునది ఏమనగా, ప్రతి వ్యక్తి, గత దినములలో జరిగిన వాటన్నిటిని మర్చిపోయి, సమస్తమును ఒక ప్రక్కకు పెట్టి, తిన్నగా కూటములోనికి, మీ హృదయములనుయుంచండి — ఈ రాత్రి మాత్రమే కాదు, కాని రాబోవు సభలలో కూడా. సందేహము లేదు, అనేకమంది ప్రతినిధులు ప్రోగైయున్నారు. రేపటి నుండి ఆరంభమయ్యే సభల కొరకు, కూడుకొనుచున్నవారిని, కొంతమందిని ఎక్కువుగా నేను చూస్తాను. ఇప్పుడే మనము కలిగియున్న ఉజ్జీవము కొరకు, ఇక్కడయున్న ప్రజలను నేను అడుగుతాను, అది సాధ్యమైనట్లైతే, మీరు సభల కొరకు వేచియుండమని కోరుచున్నాను. చక్కని ప్రసంగీకులు, మన జాబితాలో కలిగియుండబోవుచున్నాము. ఒక సోదరుడు రాలేకపోయాడు, అయితే ఆయన స్థానమును తీసుకొనుటకు మనకిక్కడ అనేకమంది యున్నారు. సహవాసములో ఆనందించుటకు, నాకునేనుగా ఈ పూర్తి సభలలో యుండగోరుచున్నాను.

MATT 6:25,28

 

4మీకు తెలుసా, సేవకులుగా మనము లేచి, మనము మాట్లాడి, మనలోయున్న సమస్తమును ప్రజలకు ఇస్తున్నాము. ఒకసారి ఒక అంశమును గూర్చి నేను బోధించాను, యేసు అన్నాడు, "అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము, వీటిలో ఒక దానివలెనైనను అలంకరించబడలేదు."

నేను కనుగొన్నాను, లిల్లీ పువ్వు ఎదుగుటకు గాను, దానికై అది ప్రకాశించుటకుగాను, అది కష్టపడి, వడకవలసియున్నది. కాని అది దానికై అది, దాని నుండి ఏ దీవెనయు పొందదు. వాడు తన్నుతాను తెరచుకొని, దానిగుండా దాటి వెళ్ళేవారిని, వాటి నుండి సువాసనను వెద జల్లుతుంది. తేనేటీగ తిన్నగా వాటి హృదయము నుండి, తేనెను పొందుతుంది. వాడు ప్రయాసపడి లోనికి దేనిని తీసుకొంటాడో, ఆ సమస్తమును బయటకు ఇచ్చివేస్తాడు. నేను నా వర్తమానమును, రెవరెండ్ మిస్టర్ లిల్లీ, అని పిలుస్తాను. అది ఒక వింతైన అంశము. అయితే, తమ్మును తాము ప్రజలకు ఇచ్చి వేసుకొనేది, సేవకులైయున్నారు, అలాగైతే కూర్చొని మాట్లాడుటను వినుట మంచిది. అది మంట ద్వారా చలి కాచుకొనుట వలెయున్నది. మన సోదరులు ప్రజలకు బోధించుచున్న సువార్తతో, ఒక ప్రక్కన ఒకరము కూర్చొని, ఆ అగ్నిమంటలు ద్వారా వెచ్చ చేసుకొందాము. మరియు దీనిని చేయుటలో, ఈ అవకాశమును బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను.

ఇప్పుడు ఈ రాత్రి నేను నమ్ముచున్నాను…

5ప్రార్థనా కార్డులను పూర్తిగా ఇచ్చివేసియున్నానని, బిల్లీ నాతో చెప్పాడు. మనము కలిగియుండవలసినట్లైతే, మనము ప్రార్థనా వరుసను ఇక్కడ పొందలేము. చూడండి, ఒక చీకటి హాలు గుండా మీరు చుట్టూ వెళ్ళి, ఈ దారిగుండా పైకి రావాలి. ఇక్కడకు ఆలాగున వచ్చుటకు, మీరు ప్రతి దాని మీద తబ్బిబ్బుపడతారు. రోగముతో పీడించబడుచున్నవారు, కుంటివారు, ఆలాగు చేయుట, భయంకరముగా యుంటుంది. అయితే మన ప్రభువు ఏమి చేస్తాడో, మనకు తెలియదు. ఆయన తిన్నగా ఈ రాత్రి, మన మీద కుమ్మరించబడవచ్చు, మరియు ఇక్కడయున్న ప్రతి ఒక్కరిని స్వస్థపర్చి, ప్రతి వ్యాధిని బాగుచేయగలడు. ఓ, నా జీవితములో నేను కలిగియున్న ప్రార్థనా వరుసల కంటే ఎక్కువుగా, ఆయనకు విధేయులైన పిల్లల మధ్య, దేవుని యొక్క సార్వభౌమత్వము కుమ్మరించబడాలని, సరిగ్గా నేను చూస్తాను. అది ఎల్లప్పుడు నాకు ఇష్టము.

6సాధారణముగా, రోగుల మీద చేతులు యుంచునట్లుగా, ప్రజలతో మీకు వ్యక్తిగతమైన పరిచయమున్నట్లైతే, అది జరుగవచ్చు, అనేకులు దానిని చేస్తారని నేను అనుకోను. వారంటారు, "ఫలానా-ఫలానా సేవకుడు, నా మీద చేతులుంచాడు, దేవునికి మహిమ!" అప్పుడు, అది ప్రజలు, ఆ మనిషి వైపు చూచునట్లు చేస్తుంది.

అయితే నీవు కేవలము ఇక్కడ నిలబడి, వాక్యమును బోధించు పరిశుద్ధాత్ముడు, ప్రతి ఒక్కరిని స్వస్థపర్చనిచ్చినట్లైతే, అప్పుడు అది అక్కడ పరిపూర్ణమైన దేవుని కృపగా యుంటుంది. అప్పుడు స్తుతినంతా, మహిమనంతా దేవుడు పొందుతాడు. అప్పుడు అక్కడ మరి ఏ ఒక్కరిపై ఛాయ యుండదు.

నా సేవలో, నేను ఆ విధానములోనే యున్నాను, నేను ఎక్కువ మందిని తీసుకొనని కారణమేమనగా… నిన్న రాత్రి, మనము ప్రార్థించగలిగిన, అనేకమందికి ప్రార్థించుటకు ప్రయత్నించాము. కాని రోగులపై చేతులుంచుట,

7మరియు అది సాధారణముగా… ఈ రాత్రి వేళలలో… బహుశ పరిశుద్ధాత్ముడు, తిన్నగా మన మధ్యకు వచ్చి, తన్ను తాను ప్రత్యక్షపర్చుకొంటాడు, మన మధ్య తన్ను తాను తెలియపర్చుకొంటాడు. అప్పుడు దాని ద్వారా, నేను అనుకుటాను అది నిజమైనడి, ఆయన అది చేయునప్పుడు, బహుశా, ఆయన యొక్క సార్వభౌమాధికారముతో…

చూడండి, ఇప్పుడు నేను చెప్పలేను, "ఈ మనిషి, లేక ఈ స్త్రీ, ఆ బాలుడు." చూచారా? పరిశుద్ధాత్ముడు, ఈ కట్టడములోనికి కదిలివచ్చి, ఆయన ఎవరితో మాట్లాడాలనుకొంటాడో, వారితో మాట్లాడతాడు. చూడండి, అది సార్వభౌమాధికారమైయున్నది. అప్పుడు అది జ్ఞానమును తెస్తుంది, ఏలయనగా అది దేవుని యొక్క వాగ్దానమైయున్నది, మరియు అది సార్వభౌముడైన దేవుని యొక్క జ్ఞానమును తెస్తుంది, మరియు ఇంకా ఆయన సన్నిధిని మన మధ్యకు తెస్తుంది. మనము తప్పక దానిని చూడాలి, మరియు సంతోషించాలి!

నీవంటావు, "సరే, నా చేయిలో వికలాంగుడను. గత రాత్రి నేను అక్కడయున్నాను. నాకు ఏమీ బాగుగా లేదు." అది దానితో చేయునది ఏమియు లేదు. నీకైతే, అది ఇదివరకే ముగించబడింది. అప్పుడు నీవు నీ చేతి వైపు చూడుట లేదు, కాని ఒక వాగ్దానము వైపు నీవు చూస్తున్నావు, చూచారా.

అందుచేత, "మంచిది, సోదరుడు ఫలానా-ఫలానా, లేక ఫలానా-ఫలానా విశ్వాస సహితమైన ప్రార్థన చేయలేదు," అని నీవు చెప్పలేవు.

అది ప్రభువు యొక్క సన్నిధి నీకు విశ్వాసమునిచ్చియున్నది, నీవు చూడు. మరియు తరువాత ఆయన వాక్యమును పంపి వారిని స్వస్థపరిచాడు.

EPH 2:1

 

8ఇప్పుడు, గత రాత్రి నేను నా వాగ్దానమును బ్రద్దలు చేశాను. నేను చేయగలిగితే దానిని ఈ రాత్రి నిశ్చయముగా నిలబెట్టుకొంటాను. ఇప్పుడు ఎవరో అన్నారు, "గతరాత్రి నీవు నీ అంశము మీద నిలచియుండలేదు."

లేదు, నేను నిలచియుండలేదు. కారణమేమనగా, ఎందుకో నేను నీకు చెపుతాను. నేను ఒక అంశము మీద మాట్లాడుచుంటిని, ఇప్పుడు అది సరిగ్గా ఏమిటో మర్చిపోయాను, అయితే, "కరుణా సంపన్నుడైన దేవుడు." పౌలు చెప్పిన దానిని నేను వివరించుటకు ప్రయత్నము చేశాను, అక్కడ అతడన్నాడు, "మనము గతకాలములలో, మునుపు, ఇప్పటికంటే వేరే కాలములో, "పాపముల చేతను, అపరాధముల చేతను మనము చచ్చినవారమైయుండగా; దేవుడు మనలను ఉజ్జీవింపజేసెను, సజీవముగా చేశాడు."

ఇప్పుడు చూడండి, మొదటిగా ఏదైనను ఉజ్జీవింపబడుటకు, ముందుగా అక్కడ ఎదో ఉజ్జీవింపజేయుటకు వుండాలి. అది నిజము.

9కాబట్టి, నీవు చూడు, నీవు దేవుని యొక్క ముందు జ్ఞానములోయుండియున్నట్లైతే, అప్పుడు నీవు దేవుని యొక్క భాగముగా మారుచున్నావు. మరియు నీవు ఒక దేవుని కుమారుడివిగా, లేక ఒక దేవుని కుమార్తెగా యుండే ఒకే మార్గము, నీవు దేవునిలో ఒక భాగముగా యుండవలసియున్నావు. మరియు నీవు లేకుండా దేవుడు సంపూర్ణము చేయబడడు. ఆలాగున యుండవలసియున్నది. అది నిజము, ఏలయనగా అక్కడ ఒకే ఒక నిత్యజీవపు మూలమున్నది, మరియు అది దేవుడైయున్నాడు, ఆయన మాత్రమే నిత్యజీవమును కలిగియున్నాడు, చూడండి. నీవు ఆయనలో ఒక భాగమైయున్నావు, ఎంతమట్టుకనగా నీవు ఒక గుణలక్షణమైయున్నావు, లేక ఆదిలో ఆయన ఆలోచనలో యున్నావు. అదే, కారణము ఆదిలో ఆయన నిన్ను గూర్చి తలంచియున్నాడు, అదే ఆయనవైపు చిన్నగా నిన్ను లాగుచున్నది. అదే ఉజ్జీవింపజేయవలసియున్నది.

వారిలో కొందరు ఎన్నడూ ఉజ్జీవింపబడరు. వారు దానిని కలిగిలేరు, అది అంతే. సరిగా నీవు ఒక మొక్క జొన్నగింజను నేలలో యుంచినట్లుగానే, అది ఎంత చక్కగా యున్నప్పటికీ, దానిలో జీవపు అంకురము లేనట్లైతే, అది ఎన్నడూ ఉజ్జీవింపబడదు. అయితే మొదట జీవపు అంకురము అక్కడ యుండాలి.

10ఆ చిన్న కథను ఆ పక్షిరాజును గూర్చి, నేను కలిగియున్నాను, అది కోడి పిల్లలతో నడుస్తుంది, ఎందుకనగా అది అక్కడ పొదగబడి, పుట్టియున్నది. అది ఆ కోడి పిల్లల వలె ఎన్నడూ భావించలేదు. మీకు తెలుసా, వాడి తల్లి అక్కడకి వచ్చి అరచినపుడు, ఎంతో మంచి అనుభూతిని కలిగించే శబ్దమును వాడు వినియున్నాడు, ఎందుకనగా గుర్తుంచుకోండి, వాడు ప్రారంభము నుండియే ఒక పక్షిరాజైయున్నాడు. వాడు సరిగ్గా వాని స్థానమును, తన్ను తాను కనుగొనవలసియుండెను.

ప్రతి విశ్వాసి ఆ విధముగానే యున్నాడు. నీవు లోకము కొరకు పుట్టలేదు. ఒక దేవుని కుమారుడిగా యుండుటకు. దేవుని యొక్క పోలికలో నీవు సృజించబడియున్నావు. నీవు బయట కోడి పిల్లల దొడ్డికి చెందినవాడవు కాదు. నీవు ఒక పక్షిరాజువు! మీకు తెలుసా, నేను ఆ "పక్షిరాజు" మీదకు వెళ్ళి, నేను పాదములను భూమి మీద తిరిగియుంచలేకపోయాను, కాబట్టి నేను ఎంతో దూరమువెళ్ళి… నా అంశమేమిటో మర్చిపోయి, నా వ్రాతలను సమస్తమును మర్చిపోయాను. నేను ఒక అద్భుతమైన సమయమును కలిగియుంటిని. అయితే అది ఏమిటో, అదేమైయున్నది, అది సరిగ్గా "పక్షిరాజు" మీదయై యున్నది.

11ఇప్పుడు ఆ పక్షిరాజు, దేవా… మీకు తెలుసు, దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులుగా పోల్చియున్నాడు, మరియు ఆయన తన్ను తాను ఒక పక్షిరాజుగా పిలుచుకొంటాడు, ఆయన యెహోవా-పక్షిరాజు, తండ్రి-పక్షిరాజు. అతడు దానిని చేయు కారణమేమనగా, అక్కడయున్న ఏ ఇతర పక్షికంటెను, పక్షిరాజు ఎంతో ఎత్తుగా ఎగరగలడు, ఎందుకనగా ఏ ఇతర పక్షికంటెను అతడు భిన్నముగా తయారు చేయబడ్డాడు.

ఇప్పుడు, వాడు తన గూడును కోడి పిల్లల వలె, నేలమీద నిర్మించడు, కాని అతడు ఎత్తుగా వెళ్ళి, ఎత్తైన స్థలములలో తన గూడును కట్టుకొంటాడు. మరొక విషయమేమనగా, అతడు ఒక ప్రత్యేకముగా నిర్మించిన పక్షియైయున్నాడు. ఒక రాబందు గాని, ఒక కాకి గాని, ఒక డేగ గాని, లేక ఏ ఇతర పక్షియైనా, అతనిని ఆకాశములో వెంబడించుటకు ప్రయత్నించినట్లైతే, అది ముక్కలు ముక్కలుగా వేరైపోయి పడిపోతాడు. అతడు పైకి వెళ్ళుటకు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా యుండవలసియున్నాడు. ఏ ఇతర పక్షికంటెను, వాని ఈకలు ఎంతో బిగువుగావుంటాయి. అతని కన్నులు, ఏ ఇతర పక్షికంటెను ఎంతో పదునుగా వుంటాయి. అతడు ఎంత ఎత్తుగా ఎగిరితే, అంత ఎక్కవ దూరము చూడగలడు. సరే, వాటిలో కొన్ని పక్షులు, అవి యుండవలసినంత ఎత్తులోనికి వెళ్ళినను, అవి ఒక గబ్బిలము వలె గ్రుడ్డిగాయుంటాయి.

వారి సిద్ధాంతమును విడిచినపుడు, వారు ఆ విధముగానే యుంటారు, అప్పుడు దానిని గూర్చి వారికి ఏమియు తెలియదు. "అద్భుతములు జరుగు రోజులు గతించిపోయినవి," అంటారు. ఎందుచేత? అవి దానిని చూడలేవు. కాని పక్షిరాజులు, ఆకాశములోనికి వెళ్ళగలవు, ఆకాశములలోని ఆకాశముల పైకి వెళ్ళగలవు. అక్కడ నీవు చూడలేకపోయినట్లైతే, అది ఏ మేలు చేస్తుంది?

ఓ, నేను వారిలో ఒకడినైనందుకు, నేను ఎంతో సంతోషిస్తాను, ఇప్పుడు పూర్తిగా గూటి నిండా వారితోనే నేను జతకలిగియున్నాను.

PROV 3:1-6

 

12మన ప్రభువైన యేసుకు బయట, ప్రపంచములోని అత్యంతమైన జ్ఞానులలో ఒకడు, సొలొమోను చేత వ్రాయబడిన సామెతల గ్రంథము, పాత నిబంధన వైపు మనము తిరుగుదాము. కాని ఆయన ఖచ్చితముగా సొలొమోను వంటివాడు కాదు, ఎంతమట్టుకనగా సొలొమోను ఒక స్త్రీ ద్వారా, ఒక భూ సంబంధమైన తండ్రియైన దావీదు ద్వారా పుట్టాడు. కాని యేసు, కన్యకకు జన్మించిన కుమారుడు, ఆయన మొత్తానికి ఒక మనిషి కాదు, కాని ఆయన దేవుడైయున్నాడు, దైవ-మానవుడు. మరియు ఆయన మనిషికంటే ఎక్కువైనవాడు. ఆయన ఒక మనిషైయున్నాడు, ఇంకా, చూడండి.

సొలొమోను నీ వలె, నా వలె ఒక మనిషైయున్నాడు, తన రాజ్యమును నడుపుటకు, అతడు జ్ఞానము కొరకు దేవుని అడిగాడు. అతడు జ్ఞాన వరమును కలిగియున్నాడు, మన ప్రభువుకు బయట, మనము ఎన్నడైనా ఎరిగిన బహు తెలివిగల మనిషి, అతడు సామెతలను వ్రాశాడు, అవి చాలా మంచివని నేను తలస్తాను.

ఇప్పుడు మనము సామెతలు గ్రంథము వైపు, త్రిప్పగోరుచున్నాము 1వ అధ్యాయము, లేక 2వ అధ్యాయము, మొదట కొన్ని వచనములు, సామెతలులోని, రెండవ అధ్యాయము, 1వ వచనము ప్రారంభము నుండి, సామెతలు 2వ అధ్యాయము 1వ ప్రారంభము నుండి, అతని పిల్లలకు సలహా ఇచ్చుచూ సొలోమోను, కొనసాగుట, "నా కుమారుడా, నా మాట అంగీకరించినట్లే…"నన్ను మన్నించండి. అది సామెతలు 3:1, నన్ను మన్నించండి. నేను ఈ పైన నా గ్రంథములో చూశాను, అది 1 లేక 2 అధ్యాయములకు బదులుగా, సామెతలు 8వ అధ్యాయము. సామెతలు 3:1.

నా, కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము:అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును.దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసికొనుము.అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయపొంది మంచివాడవని అనిపించుకొందువు.నీ స్వబుద్దిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.ఓ, అది ఎంతో రమ్యమైన లేఖనమని నేను తలస్తాను! ఇప్పుడు, 5వ వచనము నుండి, ఒక అంశమును తీసుకొనగోరుదును, "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు."

13ఇప్పుడు ఇది మనము జీవించుచున్న దినము కొరకు, ఒక చాలా వింతైన అంశమైయున్నది, ఎందుకనగా ఈ రోజున నిశ్చయముగా, విద్య మీద, కార్యములపై వారి సొంత గ్రహింపు మీద, నేర్చుకొనుచున్న ఈ దినముపై నొక్కి చెప్పుచున్నారు. అయితే ఇతర లేఖనముల వలె, ఈ వింతైన మాటల మీద, అది దాని స్థానమును కలిగియున్నది, మరియు ఆ స్థలము ఎక్కడయున్నదో, దేవుడు మనలను చూడనిస్తాడని, మనము నమ్ముచున్నాము.

గ్రహింపును కలిగియుండుటకు, ఈ రోజున మన పిల్లలను బడికి పంపుచున్నాము. అప్పుడు వ్యాకరణపు బడులు తరువాత, ఇంకా మంచి గ్రహింపు కొరకు, జ్ఞానము కొరకు మనము వారిని హైస్కూలుకు పంపుచున్నాము. అప్పుడు వారక్కడ ముగించిన తరువాత, కొందరు పిల్లలు, తగినంతగా కాలేజికి వెళ్ళుటకు అదృష్టవంతులవుతారు, మరియు కాలేజి గుండా వెళ్ళి వారి విద్యను, వారి జ్ఞానము యొక్క గ్రహింపును పూర్తి చేస్తారు.

వారు దేనినైతే సంపాదించారో, దాని ద్వారా అనేకసార్లు, ఒక ఉద్యోగమును పొందుటకు కనీసము హైస్కూలు విద్య గాని, లేక కాలేజి విద్య గాని, నీవు కలిగియుండాలి.

14అయినను, జ్ఞానియైన సొలొమోను మనకు అది చెప్పాడు, "దానిపై ఆనుకొనవద్దు, మన సొంత గ్రహింపు పై ఆనుకొనవద్దు; ఇవన్నియూ నేర్చుకొనవద్దు." ఎందుకనగా…

ఇలాంటి విషయాన్ని అతడు ఎందుకు చెప్పాడని, మనము ఆశ్చర్యపడతాము… ఎందుకనగా, సాధారణముగా మన అధునాతన అవగాహన, సాధారణముగా మానవ జ్ఞానమైయున్నది, అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమైయున్నది. దానినే సొలొమోను, తన పిల్లలకు సలహా ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాడు, చదువులేని వారిగా యుండాలని కాదు, కాని వారి సొంత స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దనుచున్నాడు.

ఈ రోజున అది ఒక మంచి హెచ్చరికయైయున్నదని నేను తలంచెదను. మన కుమారులకు, దేవుని యొక్క కుమారులను, విద్యను కలిగియుండుట సరియేనని చెప్పినట్లైతే, దానికి వ్యతిరేకముగా ఏమియు లేదు; ఆ విద్య దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా యున్నప్పుడు, అప్పుడు వాక్యముపై ఆధారపడు, నీ విద్యను వెళ్ళిపోనియ్యి, చూడు, ఎందుకనగా వాక్యము… విద్య నిలబడి నీకు మంచి ఉద్యోగమునిస్తుంది, బహుశ తెలివిగల ప్రజల మధ్యలో ఒక మంచి హోదాను ఇస్తుంది, అయితే అది మంచిదే, అది బహుశ నీకు గొప్ప సహాయముగా ఉండవచ్చు, ఆర్థికముగాను మరియు నీ జీవనోపాదిగాను, బహుశ కొంచెము ఎక్కువుగా జీవనోపాధిని ఇవ్వవచ్చు.

JOHN 6:63•

HEB 9:27

 

15కాని ఒక విషయము గుర్తుంచుకో, నా కుమారుడా, నీవు తప్పక చనిపోవాలి. నీవు ఎంత విద్యను కలిగియున్నప్పటికిని లెక్క కాదు, నీవు ఎంత నాగరికతను ప్రోగుచేసుకొన్నప్పటికి లెక్క కాదు, నీవు తప్పక మరణమును ఎదుర్కోవాలి. ఎందుకనగా అది ఈలాగు వ్రాయబడింది, అదే, "మనుషులు ఒక్కసారే మరణించవలెను, అటు తరువాత తీర్పు జరుగును." మరణము ఎంతో చెడ్డది కాదు, తీర్పు నొద్దకు వచ్చుట చెడ్డ భాగమైయున్నది.

ఇప్పుడు నీవు చనిపోవచ్చును, "కాని దాని తరువాత తీర్పు జరుగుతుంది." నీవు ఈ భూమి మీదయుండగా ఎంత విద్యను నీ కొరకు సేకరించావని దేవుడు నిన్ను అడుగడు, నీవు ఎంత జ్ఞానమును కూడబెట్టావు, ఒక సేవకుడిగా, నీకు బ్యాచిలర్-ఆఫ్-ఆర్ట్ పట్టా వుందా, లేక నీవు ఏ డిగ్రీ కలిగియున్నప్పటికి, లెక్క కాదు.

అది నీ నుండి కోరబడదు, దేవుని యొక్క వాక్య అవగాహనలో, నీవు ఏమి చేశావో, అది నీ నుండి కోరబడుతుంది. అక్కడే అవసరతవస్తుంది, ఏలయనగా అదియే అవసరము, నీ విద్య మంచిదే, కాని దేవుని యొక్క కార్యము జీవమైయున్నది. "నా మాటలు జీవమైయున్నవి, మరియు దానిని ఎరుగుటయే జీవము."

ఆయన అన్నాడు, "ఆయనను తెలుసుకోండి. ఆయన వాక్యమైయున్నాడు." కాబట్టి వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయనను ఎరుగగలవు, ఏలయనగా ఆయన వాక్యమైయున్నాడు. ఆ మార్గము ద్వారా మాత్రమే, ఆయన వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయనను ఎరుగగలవు.

16ఎవరో వచ్చి, "ఇది దేవుడు," లేక "అది దేవుడు" లేక "ఇది దేవుడైయున్నాడు," లేక "ఇది సరియైనది," మరియు, "అది సరియైనది," అని అంటే. మనము వాక్యమునొద్దకు తిరిగి వస్తాము, అదే సత్యమైయున్నది.

వాక్యము సరిగ్గా ఉత్తర నక్షత్రము వలెయున్నది, అది నిజమైన నక్షత్రము. ప్రపంచము ఏ మార్గములో తేలి ఆడుచున్నప్పటికి లెక్క కాదు, ఉత్తర నక్షత్రము భూమికి కేంద్రములోయుంటుంది. నీ దిక్సూచిని ఉత్తర నక్షత్రము వైపు త్రిప్పుము. అది ఎల్లప్పుడు భూమికి మధ్యలో యుంటుంది. ఇతర నక్షత్రములన్నీ, ప్రపంచముతో తేలి ఆడుతుంటాయి, కాని ఉత్తర నక్షత్రము నిలకడగా నిలిచియుంటుంది.

ఇప్పుడు దిక్సూచి పరిశుద్ధాత్ముడైయున్నాడు… మరియు నీ యొక్క కట్టు కొయ్య, ఉత్తర నక్షత్రముగా యుంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు వాక్యము వైపు చూపుతాడు. పరిశుద్ధాత్ముడు, నిన్ను దేని యొద్దకు నడిపించడు కాని, వాక్యము యొద్దకు నడిపిస్తాడు.

అది వాక్యమునకు భిన్నముగా యున్నప్పుడు, ఒక మనిషి ఎలా ఒక ఆచారమును అంగీకరించి, అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మను కలిగియున్నానని ఎలా చెప్పగలడు? పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు వాక్యము వైపు చూపుతాడు, ఏలయనగా ఆయన వాక్యమైయున్నాడు, ఆయన వాక్యమైయున్నాడు.

ఆ దిక్సూచిలోని ఆయస్కాంతము, ఎల్లప్పుడు ఉత్తర నక్షత్రము వైపే లాగుతుంది. ఆ మార్గములోనే అది ఆకర్షిస్తుంది. పరిశుద్ధాత్ముడు, లేఖకుడు మరియు గ్రంథకర్తయైయున్నప్పుడు, మరియు వాక్యమును ఉజ్జీవింపచేయువాడైయున్నప్పుడు, అది ఒక వ్యక్తిని వాక్యము వైపు కాక, మరి దేని వైపు చూపుతుంది?

17కాబట్టి ఒక వ్యక్తి తాను పరిశుద్ధాత్మను కలిగియున్నానని చెప్పినపుడు, వాక్యమునకు వ్యతిరేకమైన దానిని, ఎలా అంగీకరిస్తాడు. అది చూపేదేమనగా, వారు కలిగియున్నది నిజమైన పరిశుద్ధాత్మ కాదు, చూడండి. అది పరిశుద్ధాత్మ కావచ్చు, నేను దానితో వాదించను, కాని అది క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ కాదు.

ఇప్పుడు, మీకు తెలుసా, అనేకసార్లు వారు ఒకరి ఆత్మను ఒకరు తీసుకొంటారు, అది ఒక గుంపు మనుషుల వైపు, ఒక నిర్ణీతమైన దాని వైపు ఎత్తి చూపుతుంది, అది క్రీస్తు వైపు వారిని ఎత్తి చూపదు. అయితే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు క్రీస్తు వైపు ఎత్తిచూపుతాడు, మరియు క్రీస్తు వాక్యమైయున్నాడు.

దీనిని ఎంతో తేటగా బైబిలులో మనము చూస్తాము, లేక నేను చూస్తాను. బహుశ, నా ఆలోచనలో నేను తప్పు కావచ్చు, కాని నేను తప్పు అని అనుకోను. ఎందుకనగా అది, విషయములపై నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనవద్దు… నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొంటే, నీవు తప్పక సరియైన మార్గము నుండి పక్కకు తప్పిపోతావు.

అది జీవమునకు వచ్చినపుడు, ఏ ఒక్కరి స్వబుద్ధిపై నీవు ఆనుకొనవద్దు. జీవమును కనుగొనుటకు, నీవు వాక్యముపై ఆనుకొనవలసియున్నది, అది నిజము.

18ప్రారంభము నుండి, దీనిని మనము చూస్తాము. అది ఎంతో తేటగా మనకు తెలియపర్చబడింది. ఆదినుండియూ, వారు జీవించుటకు, ఆయన మొదటి కుటుంబమునకు, ఆయన వాక్యమును ఇచ్చాడు. కేవలము ఆయన వాక్యము ద్వారా, వారు జీవించవలసియున్నది. అది ఆహారమును భుజించుట, అలాటిది కాదు. అయితే వారు, శాశ్వతముగా జీవించవలసియున్నది, ఆయన వాక్యము ద్వారా. వారు ఆ వాక్యమును పాటించినంత కాలము, వారు శాశ్వతముగా జీవించారు కాని వాక్యములోని, ఆ చిన్న వచనమును, తప్పు స్థానములో యుంచినపుడు, గొలుసు మొత్తము తెగిపోయింది, మరియు మానవాళి మరణములో మునిగిపోయింది.

చూడండి, ఇప్పుడు మనము గమనిస్తాము. హవ్వ, సందేహము లేదు, ఆమె ఒక తెలివిగల వ్యక్తియైయున్నది; ఆదాము తరువాత, రెండవ వ్యక్తియైయున్నది, అతడు దేవుని యొక్క కుమారుడైయున్నాడు. హవ్వ, నిశ్చయముగా ఆ స్థలములో పాపము లేదు, అక్కడ పాపమునకు స్థానము లేదు, నిశ్చయముగా, ఆమె తప్పక, దేవుడేమైయున్నాడో, ఒక అద్భుతమైన ఆలోచనయైయున్నది. ఏలయనగా ప్రతి మధ్యాహ్నము, ఆమె మరియు ఆమె భర్త, సాయంకాలమున, చల్ల పూట, దేవునితో నడిచియున్నారు, మరియు దేవునితో ముఖాముఖిగా మాట్లాడియున్నారు.

ప్రతి రోజు ముఖాముఖిగా, ఒక వ్యక్తి దేవునితో ఎలాటి తర్కము లేని విషయము, మరియు తరువాత, దేనితోనో తర్కము చేసి, దేవుని వాక్యము నుండి తర్కము ద్వారా, ఆమెను దూరముగా తీసుకు వెళ్ళిపోయింది.

19మనము ఇంకా అలాటి వారిని కలిగియున్నాము. దేవుని సన్నిధిలో వారు కూర్చొన్న తరువాత, దేవుని వాక్యముతో తర్కము చేసి, చాలా సులువుగా దూరముగా వెళ్ళిపోతారు. దేవుని యొక్క వాక్యము బోధించబడుట చూసి, దేవుని వాక్యము ప్రత్యక్షపర్చబడుట చూసి, త్రాగుబోతులు మరియు పాపులు, వేదిక నొద్దకు వచ్చి, క్రీస్తులో నూతన వ్యక్తులుగా మారుట చూచి, చెడ్డ పేరు గల స్త్రీలు, మర్యాద గల మనుషులుగా మారుట, మరియు తరువాత ఈ ధన్యమైన జీవమునకు నడిపిన కార్యము నుండి, వెనుకకు తిరిగిపోవుట. తరువాత ఏదో ఒక రకమైన ఆచారములోనికి తిరిగి వెళ్ళిపోవుట, ఎక్కువ పేరు ప్రఖ్యాతుల కొరకు, ఒక మంచి హోదా గల ప్రజలుగా పిలవబడుట లోనికి తిరిగి వెళ్ళిపోవుట.

ఎందుచేత, అక్కడ శ్రేష్టమైన తరగతి ప్రజల మధ్యలో నీవు యున్నావు, వారే దేవుని యొక్క కుమారులు మరియు దేవుని యొక్క కుమార్తెలు. మంచిది, రాజులందరితో అధిపతులందరితో, అలాటి సమస్తమైన వారిలో యుండుటకంటె, ఆ గుంపే నాకు శ్రేష్టమైన వారు. నాకు దీనులైన గుంపు ప్రజలను ఇవ్వండి, వారికి వారి కుడి చెయ్యి ఏదో లేక ఎడమ చెయ్యి ఏదో తెలియకపోయినను పరవాలేదు. వారు దేవుని ఎరిగియున్నంతకాలము, ఆయనను ప్రేమించి సేవించినంత కాలము, వారు నాకు పరలోకపు ఘనులు! అవునండి!

20ఇప్పుడు, హవ్వ ఎంతో సులువుగా దేవుని వాక్యము నుండి ప్రక్కకు ఒప్పించబడింది, ఆమె తన స్వబుద్ది పై ఆధారపడింది, ఏలయనగా సాతానుడు ఆమెకు నిజమైన గ్రహింపు నుండి, ఆమెకు మరొక దానిని ప్రతిబింబింప చేసింది. అయితే శత్రువైన సాతాను చేత, ఆమెకు వేరైనది చెప్పబడింది, మరియు ఆమె దానిని నమ్మింది. ఇప్పుడు దాని ఫలితములను మనము కనుగొంటాము, అది మొత్తం మానవాళిని మరణములో ముంచివేసింది. ఎందుకనగా, భూమి మీద యున్న మొదటి తల్లి, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగాయున్న స్వబుద్ధిపై ఆధారపడింది, మరియు మొత్తము మానవాళిని మరణములోనికి ముంచివేసింది. ఇప్పుడు మీరు దానిని నమ్ముతారా? అది వాక్యమైయున్నది,

ఒక స్త్రీ ఎల్లప్పుడు… సంఘము, బైబిలులో, ఒక స్త్రీగా పోల్చబడింది. మరియు ఈ రోజున ఒక సంఘము సిద్ధాంతములను లేక ఆచారములను అంగీకరించి, సంఘము మొత్తమును దేవుని నుండి దూరముగా ముంచివేస్తుంది. హవ్వవలె దేవుని యొక్క వాక్యమునకు బదులుగా, ఈ విషయములను అంగీకరిస్తారు. అది ఎన్నో, ఎన్నో సార్లు జరిగియున్నది, చివరకు మొత్తము సంఘము, దేవుని వాక్యము నుండి దూరముగా మునిగిపోయింది.

PROV 3:5

 

21వాక్యము ప్రత్యక్షపర్చబడినపుడు, వాక్యము బయలుపర్చబడినపుడు, వారు దానిని అంగీకరించరు, కారణము… వారు దానిని చేయరు, ఎందుకనగా వారు వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడతారు. "ఈ సంఘము ఇక్కడ నిర్మించబడింది. ఇది ఒక అందమైన స్థలము, అది ఒక గొప్ప సంఘ సంస్థయైయున్నది. అది ప్రజల యొక్క గొప్ప సమూహములో సభ్యత్వము కలిగియున్నది. మనము తప్పక దానికి ఎందుకు చెందియుండకూడదు? నేను దానిని నమ్ముతాను." నీ స్వబుద్ధిని నమ్మవద్దు, అయితే ప్రభువు యొక్క మాటను నమ్ముము.

నేను చెప్పినట్లుగా, మొత్తము మానవాళి, చివరగా మరణముతో సమాప్తమైంది, వారి స్వబుద్ధిపై, వారి సిద్ధాంతములు, ఆచారములపై ఆనుకొనే వారికి, ఇప్పుడును ఆలాగునే యున్నది, వారంటారు, దేవుని వాక్యము మొత్తము సత్యము కాదు, దానిలో కొంత ప్రేరేపించబడింది మరియు కొంత ప్రేరేపించబడలేదు.

దానిలో ఒక భాగము ప్రేరేపించబడి, మరొక భాగము ప్రేరేపించబడనప్పుడు, ఎలా నీవు బైబిలునందు విశ్వాసము కలిగియుంటావు? ఒక వచనము తప్పైనట్లైతే, మొత్తమూ తప్పుయైయున్నది. అదంతయూ తప్పక సరిగా యుండవలసియున్నది, ఖచ్చితముగా సత్యము.

22పేరుగాంచిన, వంకరగా చేయబడి, బైబిలు పాఠశాలలో కొన్ని మానవ జ్ఞానమును ప్రోగుచేసుకొని ఉపదేశించుచున్నారు, అక్కడ వారందరూ సభగా కూడి, ఇలా అంటారు, "ఇప్పుడు చూడండి, అద్భుతములు జరిగే రోజులు అపొస్తలులతోనే అంతమైపోయినవి."

ఆ బిషప్పు క్రింద లేక పైవారి క్రిందయున్న అనేక మంది మనుషులు, అక్కడ కూర్చొని ఇలా అంటారు, "బాగుంది, నేను అతనితో సరిగ్గా సమ్మతించినట్లైతే, సందేహము లేదు, తరువాత హోదా వచ్చే వరుసలోయున్నది నేనే." చూడండి, అప్పుడు నీవు దేవుని వాక్యము కొరకు నీ రెండు కాళ్ళపై నిలబడుటకు బదులుగా, నీ స్వబుద్ధిపై ఆధారపడుచున్నావు. ఈ కార్యములన్నిటికి కారణము అదియే.

23కొద్దికాలము క్రితము, ఒకరు… నేను ఆదాయపు పన్ను వివాదములోయున్నాను. వారు నాతో అన్నారు, "ఎందుకు, నీ ధర్మకర్తలు, కీలు బొమ్మలు కాక ఏమీ కాదు అని నేననుకొంటాను."

నేనన్నాను, "నేను బోర్డులో ఒక ధర్మకర్తను కలిగియుంటే, భిన్నమైన అభిప్రాయములను కలిగియుంటే, దాని కొరకు నిలబడకుండా — దానిని గూర్చి ఎవరు మాట్లాడుతున్నారో నేను లెక్క చేయను — తన సొంత ఉద్దేశ్యములను దానిని గూర్చి వ్యక్తపర్చకపోయినట్లైతే, నేను అతనిని బోర్డు నుండి బయటకు విసిరివేస్తాను!" అవునండి. అది నా నమ్మకమునకు విరుద్ధముగా వున్నా అతడు సరి అని ఆలోచించే దాన్ని వ్యక్తపర్చాలి. అందుకొరకే నేను అతనిని అక్కడ కలిగియున్నాను, చూడండి, అతడు దానిని గూర్చి ఏమి చెపుతాడో. అయితే మనము దానిని కలిగియున్నాము.

JOHN 10:4,5

 

24గమనించండి, యేసు అన్నాడు, "నా గొర్రెలు నా స్వరము గుర్తిస్తాయి." ఒక స్వరము, నిజానికి ఆయన వాక్యమైయున్నది, ఆయన మాట్లాడుతున్నప్పుడు. "నా గొర్రెలు నా స్వరము గుర్తిస్తాయి. నా స్వరము వారికి సత్యమని రుజువు చేయబడింది, అది నా స్వరమని రుజువు చేయబడియున్నది." ఇప్పుడు, ఇప్పుడు గమనించండి, వారు ఏ ఇతర స్వరమును వెంబడించుటకు లోబడరు. "నా గొర్రెలు నా స్వరమును వినును మరియు క్రొత్త వ్యక్తిని వారు వెంబడించరు. వారు వెంబడించరు."

మరొక మాటలో, వారు వాక్యమునకు భిన్నముగా ఉపదేశించే, ఒక వేదాంత స్వరమును వారు గ్రహించరు. పక్షిరాజు ఎంత మాత్రము గ్రహించనట్లు, గొర్రెలును గ్రహించలేవు, గత రాత్రి విన్నట్లుగా, అవి కోడిపెట్ల అరుపులను, అవి గ్రహించలేదు. వాటికి అది అర్థము కాదు, ఎందుకనగా వాడు ఒక పక్షిరాజైయున్నాడు. నిజమైన తిరిగి జన్మించిన, దేవుని బిడ్డ విషయములోనూ, అది ఆలాగునే యుంటుంది, వారు దేవుని యొక్క సంగతులను మాత్రమే గ్రహిస్తారు.

ఇప్పుడు, ఒకరు అంటారు, "బాగుంది, ఇప్పుడు చూడండి దీనిని మీరు చేయవచ్చని, నేను అనుకొంటాను."

"అది ఈ విధముగా కాదని నేను నమ్ముతాను."

"అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. దైవిక స్వస్థతను నేను నమ్మను."

"నేను దీనిని నమ్మను."

ఇప్పుడు, నిజముగా తిరిగి-జన్మించిన ఒక క్రైస్తవుడు, అది ఎన్నడూ అతని చెవులలోను ఆపదు. అతడు దానిని ఏ మాత్రమును గ్రహించలేడు. మరియు దేవునియందు విశ్వాసముంచిన ఒక మనిషి, ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగాయున్నాడని చదివి, అలాటి కార్యమును ఎన్నడైనా ఎలా అంగీకరించగలడు, అది నాకు అర్థమగుట లేదు. కాబట్టి వారు తమ స్వబుద్దిపై ఆధారపడరు.

25ఒక చిన్న బిడ్డవలెయున్నది. ఒక చిన్న బిడ్డను నీవు తీసుకొన్నప్పుడు, అతడు పుట్టిన తరువాత, ఒక్కసారి తన తల్లి రొమ్ముపై ఆనుకొని, ఆమె నుండి పాలు త్రాగగానే, ఆ వెచ్చని పాలు, ఆమె రొమ్ముపై అతని తలను వాల్చుతాడు, అతడు కొన్ని గంటలైనప్పటికీ. అటు తరువాత, ఒకటి లేక రెండు రోజులలో, అతనిని తన తల్లి నుండి దూరము చేసి, మరొక క్రొత్త తల్లి రొమ్ముకు అతనిని ఇవ్వండి, అతడు తన చిన్న కాళ్ళను గాలిలో తన్నుచూ కేకలు పెడతాడు, ఎందుకనగా అది అతని తల్లి కాదు. చూడండి, అతనిని గూర్చి ఇదివరకే ఒకటియున్నది, ఏలయనగా అతడు తన తల్లిలో ఒక భాగమైయున్నాడు, ఇంకనూ ప్రకృతి, తన సొంత తల్లిని గుర్తించినట్లుగా ఒక మార్గము సిద్ధపరచినది.

ఒక చిన్న బిడ్డ తన తల్లిని గుర్తించినట్లుగా ప్రకృతియే, ఒక మార్గమును సిద్ధపరచినయెడల, అలాటప్పుడు దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ఒక దేవుని కుమారునికి, అది ఎంత ఎక్కువగా చేస్తుంది. అతనికి తన తల్లి తెలుసు! అతనికి తెలుసు, ఎందుకనగా అతడు వాక్యము ద్వారా పుట్టాడు, మరియు అతడు వాక్యమును గ్రహిస్తాడు! అతనిని ఒక క్రొత్త స్థలములో యుంచినపుడు, అతడు… నిజముగా అతడు తన స్థలములో లేడు. ఎంత త్వరగా వెళ్ళాలో, అంత త్వరగా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు, ఎందుకనగా అతడు కలిగియున్నాడు… అతడుదానిపై ఆనుకొనడు… ఎవరో అంటారు, "ప్రియమైనవాడా, ఆగు, ఇప్పుడు ఈమె నీ తల్లియైయున్నది." అది అతని తల్లి కాదు, ఎందుకనగా అతడు తన తల్లిలో ఒక భాగమైయున్నాడని, దానిని ఎరుగు మార్గమును అతడు తెలుసుకొన్నాడు. అది అతని తల్లియైయున్నది, మరి ఎవ్వరూ ఆ స్థానమును తీసుకొనరు, అతనికి తన సొంత తల్లి తెలుసు.

గమనించండి, ఎలా అది ఆలాగున యధార్థముగా యున్నదో. దేవుడు సమస్తమును దాని దాని జాతి ప్రకారము చేశాడు.

26వాటి జాతి ప్రకారము పశువులు అనేకసార్లు ఆ మొత్తము పశువుల మందలను, కలిపి తోలుకొని వస్తున్నప్పుడు, ఆ చిన్న ఆవులు, వారి తల్లిని ఎలాగు తెలుసుకొంటాయో నేను ఆశ్చర్యపడ్డాను.

అవి పర్వతముల మీద నుండి దిగి వస్తున్నాయి, పశువులన్నియూ కలగలుపైనవి. ఒక చిన్న ఆవు, దాని దూడతో యున్నప్పుడు, బహుశ అది నిజముగా ఆకలితో యున్న ఒక దూడ, తన తల్లి నుండి కొంచెము పాలు త్రాగాలనుకొన్నప్పుడు. మేము వాటి పచ్చిక బయళ్ళులో వాటిని ఆపినపుడు, దాని తల్లి, ఆ ఆవుల గుంపు గుండా, తన సొంత దూడను కనుగొను వరకు పరుగు తీస్తుంది, మరియు దాని దూడ దాని తల్లి కొరకు పరుగెత్తుతుంది. అది ఆ చిన్న నిర్ణీతమైన అరుపును, ఏడ్పును తెలుసుకొంటుంది. ఆమె తన దూడ కొరకు ఏడ్చుచున్నది, ఇతర తల్లులూ ఆ దూడల కొరకు మూల్గుచూ యుంటాయి, కనీసము నీకై నీవు దానిని యోచించలేవు, అయితే ఆ చిన్న దూడ, ఆ నిర్ణీతమైన తన తల్లిని కనుగొంటుంది, ఎందుకనగా అది దాని తల్లిలో భాగమైయున్నది.

JOHN 10:5•

1COR 14:8

 

27పరలోకము నుండి తిరిగి-జన్మించిన క్రైస్తవుడు, అతడు ఈ వాక్యములో భాగమైయున్నాడు. నిజము. మరొక తల్లిని అతడు వెంబడించడు. అతడు వాక్యములో భాగమైయున్నాడు. అతడు వాక్యముతో నిలిచియుంటాడు. "బూర స్పష్టమైన ధ్వనిని ఇవ్వకపోయినట్లైతే, యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలడు?" అని పౌలు అన్నాడు. వాక్య శబ్దమును అతడు ఎరుగును.

గమనించండి, ఇది ఎలాయున్నదో, ముందుగా నిర్ణయించబడిన దేవుని హస్తము, మార్గము గుండా వారిని వెంబడించుచున్నది. అతడు దేవుని ఆత్మ ద్వారా జన్మించియున్నాడని ఎరుగును. కాబట్టి, అందువలన, ఒక కొత్త వ్యక్తిని వారు వెంబడించరు.

ఎలాగో దానిని గమనించండి…

MATT 4:19•

JOHN 1:41,42

 

28ఇక్కడ నేను వ్రాసుకొన్న ఒక చిన్న గమనిక కొరకు వెనుక చూస్తున్నాను. నేను దానిని దాటిపోయాను, అయితే లేఖన పఠనమును నేను చూచుట సంభవించింది, నేను తిరిగి దానిని సూచిద్దామని తలంచాను.

గమనించండి, మనము ఎన్నడైనా కలిగియున్న, అతి గొప్ప వేదాంత పండితుల కాలములో, ఎలా ఆయన సొంత ముందు నిర్ణయించబడిన గొర్రెలు, ఆయనను వెంబడించియున్నవో, వారు తిన్నగా ముందుకు వచ్చేసారు, ఎందుకనగా వారు ఆయనను ఎరిగియున్నారు. వాక్యము ఆ దినమునకు ఏమి వాగ్దానము చేసియున్నదో వారు ఎరిగియుండిరి. ఆయన వచ్చినపుడు మెస్సీయా ఎలాయుంటాడో, వారు ఎరిగియుండిరి. మరియు సీమోను పేతురు ఆయన యొద్దకు వచ్చాడు, అప్పుడు, అతడు, "సీమోను," మాత్రమే… అంద్రెయ దానిని గూర్చి అతనికి చెప్పుటకు ప్రయత్నించాడు. "ఈ మనిషి మెస్సీయాయైయున్నాడు." సరే, సీమోను, నిజానికి, ఒక చిన్న కఠినమైన తత్వముగలవాడు, అతడు వెళ్ళలేదు.

కాని అతడు యేసు సముఖములోనికి నడిచినపుడు, అప్పుడు యేసు అన్నాడు, "నీ పేరు సీమోను, మరియు నీ తండ్రి పేరు యోనా," "జగత్తు పునాదికి ముందే," యేసు తన శిష్యులను ఎరిగియున్నానని, ఆయన చెప్పాడని మనకు తెలుసు. వారు ఆయన తలంపుల యొక్క గుణలక్షణములైయున్నారు. అందుచేత, ఆ విత్తనము అతనిలో ఉంచబడియున్నందున, మెస్సీయా ఒక ప్రవక్తగా యుంటాడని వాగ్దానము చేయబడియున్నదని, వాక్యము దానిని చెప్పియున్నదని అతడు ఎరిగియుండెను. అతడు దానిని చూసినపుడు, అతడు చేపలు పట్టుట ముగించబడింది. అతడు తన వలను వేసి, మనుష్యులను పట్టబోవు జాలరిగా యుండబోవుచున్నాడని, అప్పుడు ఆయన ఎరిగియుండెను.

JOHN 5:39

 

29ఇప్పుడు, ఇతరులు అక్కడ నిలబడిన వారన్నారు, అదే కార్యము జరిగించబడుటను వారు చూశారు, మరియు వారు దానిని "ఒక దురాత్మ అని," వర్గీకరించారు. వారే వేదాంత పండితులు, కారణము అది వారి వేదాంత ఉపదేశపు రుచి ప్రకారము ఉండలేదు. వారు దానిని త్రోసివేశారు, వారు వారి వేదాంత పండితుల ద్వారా, వారి స్వబుద్ధిపై ఆనుకొనియున్నారు. వాక్య వాగ్దానమును నెరవేర్చుచూ, యేసు వచ్చినపుడు, వారు దానిని చూచుటలో ఎంతో గ్రుడ్డివారయ్యారు. దేవుని వాక్యము ఏమని చెప్పిందో దాని మీద కాకుండా వారి యొక్క యాజకులు చెప్పిన దాని మీద, సంఘము చెప్పిన దాని మీద వారు ఆనుకొనియున్నారు.

ఇప్పుడు యేసు దానిని బట్టి వారిని గద్దించాడు. ఆయన అన్నాడు, "లేఖనములను పరిశోధించుడి, వాటియందు నిత్యజీవము కలదని మీరు నమ్ముచున్నారు, అవే నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నాయి. మీరు పరిశోధించమని, నేను మిమ్మును అడుగుచున్న లేఖనములు, నేను ఎవరినో అవియే చెపుతాయి." అయితే వాక్యము ఏమి చెప్పిందో దానిపై వారు ఆనుకొనుట లేదు కాని వారు వారి స్వబుద్ధిపై ఆధారపడుతున్నారు. వారు వారి స్వబుద్ధిపై ఆధారపడియున్నారు. మరియు లేఖనము చెపుతుంది, వారు ముసుకు వేయబడ్డారు. వారి సొంత వేదాంతము వారిని గ్రుడ్డివారిగా చేసింది.

నీవంటావు, "బ్రెన్హాం సోదరుడా, నీవు ఎక్కడకు వచ్చుచున్నావు?"

30నేను దీని యొద్దకు వస్తున్నాను. అదే విషయము మళ్ళీ సంభవించుచున్నది, చివరకు ప్రజలు, దేవుని వాక్యము దానిని గూర్చి ఏమి చెప్పిందో లెక్క చేయక, వారు ఒక నిర్ణీతమైన సంఘముపై, వారు చేరిన దేనిపైనో, ఆనుకొనియున్నారు. వారు తిన్నగా వారి స్వబుద్ధిపై ఆధారపడి ముందుకు వెళ్ళుచూ, అది ఎన్నడూ వ్రాయబడియుండనట్లుగానే, దేవుని వాక్యమును ఎరగనట్లు దాటిపోవుచున్నారు. అది మానవ జీవితములోని జీవపు అంకురము లేని విత్తనమైయున్నది. అది భౌతికమైన జీవమును కలిగియున్నది, కాని ఉజ్జీవింపజేయుటకు దానిలో ఆత్మ సంబంధమైన జీవము లేదు.

ఆ ముసుకు వారి ముఖముపై యున్నది. ఇప్పుడు గమనించండి, దేవుడు తప్పక ఎలాగుయుంటాడో వారి సొంత తలంపులను కలిగియున్నారు, మెస్సీయా తప్పక ఎలా యుంటాడో, వారి సొంత ఆలోచనలను కలిగియున్నారు. కాని మెస్సీయా తప్పక ఏమైయుంటాడో, వాక్యము చెప్పింది. ఇప్పుడు, చూడండి, ఆయన ఎలాగుయుంటాడో, వారి సొంత అవగాహనను కలిగియున్నారు.

సందేహము లేదు, ప్రధానయాజకుడు ఏమన్నాడో, "ఇప్పుడు యాజకులందరు నా క్రిందయున్నారు, ఇప్పుడు మెస్సీయా వచ్చినపుడు… మనము గొప్ప ఆలయమును నిర్మించియున్నాము. ఇదంతా మనము జరిగించాము. మరియు బైబిలు చెప్పుచున్నది, ఆయన అకస్మాత్తుగా తన ఆలయములోనికి వచ్చును, ఈ కార్యములన్ని. ఆయన వచ్చినపుడు, మెస్సీయా తిన్నగా ఇక్కడకు వచ్చి, మనతో తన్ను తాను గుర్తింపచేసుకొంటాడు, 'మరియు నేను మెస్సీయాను, నేను వచ్చాను, అంటాడు. మీరు ఎదురు చూచుచున్నమెస్సీయాను నేనే.'" బాగుంది, ఆయన వచ్చినపుడు, వారు తలంచిన దానికి భిన్నమైన విధానములో ఆయన వచ్చాడు, వారు ఆయనను గుర్తించలేదు. ఆయన ఎవరైయున్నాడో, వారు ఎరుగలేదు.

JOHN 10:37

 

31కాని ఆయన స్వంత… ఒకవేళ ఎవరో ఒక వేషధారి, అక్కడకు నడిచి వెళ్ళి ఇలా అంటే, "నేనే మెస్సీయాను, నేను డాక్టర్ ఫలానా-ఫలానా వ్యక్తిని?" వారు దానిని నమ్మియుండేవారు. అయితే ఒక చీకటి ఛాయ తన వెనుక కలిగి జన్మించిన ఒక మనిషి యొద్దకు నీవు వచ్చినపుడు, ఆయన ఎన్నడూ ఏ హైస్కూలుకు వెళ్ళలేదు, ఏ విద్యయు లేదు, ఏ వేదాంత పాఠశాల విద్య నేర్చుకోలేదు, ఏ సహవాసపు కార్డు లేదు… కాని ఆయన ప్రత్యక్షపర్చబడిన, దేవుని వాక్యము యొక్క అనువాదమైయున్నాడు. "నేను చేయు క్రియలే, నేను ఎవరినో చెపుతాయి. నేను ఏ కార్యములు చేస్తానని వాగ్దానము చేయబడిందో, ఆ కార్యములు చేయనియెడల అప్పుడు నన్ను నమ్మవద్దు."

దానిని ఈ దినమునకు మనము అన్వయించగలమా? పరిశుద్ధాత్ముడు వచ్చినపుడే, మరొక యుగమునకు వారు దానిని అన్వయించాలనుకొనుచున్నారు, ఆయన తన నిత్యజీవపు శక్తితో, చర్యతో లోనికి వచ్చినపుడు, ప్రజలు దానిని, "ఒక క్రూరమైన మూఢభక్తి" అని పిలువగోరుచున్నారు. ఎందుచేత? వారు స్వబుద్ధిపై ఆధారపడుచున్నారు, కాని ప్రభువు యొక్క వాక్యము మీద కాదు. అది నిజమని మీకు తెలుసు.

GEN 1:3•

ISA 7:14•

JOEL 2:28

 

32గుర్తింపు, అనగా దేవుడు, వాగ్దానము యొక్క ప్రత్యక్షతను దేవుడు అనువదించుట.

బహుశ నేను దానిని, ఇంకా కొంచెము తేటగా చెపుతాను. దేవుడు వాక్యమును మాట్లాడినపుడు, ఏ పురుషుడు లేక ఏ స్త్రీ, లేక ఏ ఒక్కరూ, దాని భావమేమిటోనని, ఎవరూ చెప్పనవసరము లేదు. ఆయన చెప్పినపుడు… బాగుంది, నీవంటావు, "దేవుని భావము ఇది." దేవుడు ఏమి చెప్పాడో, సరిగ్గా ఆయన భావము అదేమైయున్నది, చూడండి.

ఇప్పుడు, ఎలా ఆయన వాక్యమును ఎలా అనువదిస్తాడు? దానిని నెరవేర్చుట ద్వారా!

బైబిలు చెప్పెను, "ఒక కన్యక గర్భవతి అగును," ఆమె గర్భవతియైనది. దానికి ఏ అనువాదము అవసరము లేదు. దేవుడన్నాడు, "వెలుగు కలుగును గాక," అక్కడ వెలుగు కలిగింది. దానికి ఏ అనువాదము అక్కరలేదు. ఇంకా, ఈ చివరి దినములలో దేవుడు చెప్పెను, "ఆయన తన ఆత్మను సర్వశరీరులపై క్రుమ్మరిస్తానన్నాడు. దానికి ఏ అనువాదము అవసరము లేదు. అది అంగీకరించబడుట మాత్రమే అవసరమైయున్నది — దేవుడు ఏమి చేసియున్నాడో, ఎవరో దానిని అంగీకరించవలసియున్నది. దానికి అనువాదము అవసరము లేదు.

దేవుడే తన సొంత వాక్యమును అనువదించును. దేవుడు వాగ్దానము చేసిన సంగతులను చివరి దినమున ఆయన చేయు కార్యములను, మనము చూస్తాము.

REV 3:17•

REV 18:7

 

33అది అప్పుడు జరిగియున్నట్లుగా, ఈ దినమునయున్న ప్రజలు — వారు తమ స్వబుద్ధిపై ఆధారపడతారు, "నా సంఘ కాపరి అది మూఢత్వము," అని చెప్పాడు. కాని అది సంభవిస్తుందని బైబిలు చెప్పెను. ఎవరి యొక్క గ్రహింపుపై నీవు ఆధారబడబోవుచున్నావు?

ఈ చివరి దినములలో బైబిలు వాగ్దానము చేసింది. అదే, "ఈ లవొదకయ సంఘము ఎంతో ధనవృద్ది చేసుకొని, సొంతముగా ఎంతో వారి సమృద్దిని కలిగియున్నారు, "నేను ధనవంతురాలను, నాకు ఏ కొదువయు లేదు. నేను ఒక రాణి వలె కూర్చొన్నాను." ఆమె ధనవంతురాలు!

ఆయన అన్నాడు, "నీవు దిక్కుమాలినవాడవని ఎరుగవు." ఇప్పుడు, అది పూర్తి సంఘకాలము. సంఘము!

"లవొదకయ సంఘమునకు, నీవు దిగంబరుడవు, గ్రుడ్డివాడవు, నీవు దౌర్బాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దానిని ఎరుగవు," ఆమె తన ధన సమృద్ధిపై కూర్చొన్నది, పదివేల కొలదిగా పదివేలసార్లు, వేలకొలది సభ్యులను, దరిదాపుగా ప్రపంచములోని సంపదనంతటిని కలిగియున్నది. కాథలిక్కు వారిని, ప్రొటెస్టెంటువారిని, ఈ రోజుకు ఏకము చేస్తే, వారు ఇప్పుడు ఏకముగా వెళ్ళునట్లుగా, వారు ప్రపంచములోని సంపదనంతటిని కలిగియున్నారు.

REV 17:4

 

34ఈ దేశములో మనము దరిదాపుగా విరిగిపోయాము. ఇప్పటి నుండి నలుబది సంవత్సరములకు మనము చెల్లించు పన్నును, వారు అప్పు తీసుకొనుచున్నారు, వారు నాతో అన్నారు, కాబట్టి వారు దానిని లైఫ్-లైన్ మీద చెప్పియున్నారు. పన్నులు, ఇప్పటినుండి నలుబది సంవత్సరముల వరకు చెల్లించు పన్నులను మనము ఖర్చు చేయుచున్నాము. యేసు ఆలస్యము చేసినట్లైతే, నా చిన్న మనమడు, అతనికి నలుబది సంవత్సరములు వచ్చిన తరువాత, అతడు చెల్లించే పన్నులను, ఇప్పుడు వాటి మీద మనము ఖర్చుపెట్టుచున్నాము. విదేశీ నిధి కొరకు పంపుతున్నాము, మన సొంత ఇండియనులు ఆకలితో చనిపోవుచున్నారు; సహవాసమును కొనుటకు ప్రయత్నము చేయుచున్నారు.

నీవు సహవాసమును కొనలేవు. నీవు ఒక స్నేహితుని కొనలేవు. లేదు. ఇప్పుడు మనము దానినే చేయుచున్నాము. ఆ విధముగానే మనము ఏర్పాటు చేసుకొన్నాము, వారు కొనే ప్రతి దానికి మనము పన్ను వేయుచున్నాము. పన్ను, పన్ను, పన్ను!

కొన్ని వందల సంవత్సరములైనను, మనము అప్పు యుద్దము నుండి బయట పడము అని నేననుకొంటాను, ఆ విధముగా రాజకీయ నాయకుల చేత మనము దానిలోనికి త్రోయబడియున్నాము. ఇప్పుడు ఆ మార్గములో, మనము తప్పక యుండరాదు, మనము ఆ విధానములో యుండవలసిన కారణము లేదు.

కాని సంఘములు తమకు తామే, ధనవంతులుగా మారారు. ప్రపంచ సంపదకే ఎంతో దగ్గరగాయుందని, కాథలిక్ సంఘములో అది ఉంచబడిందని, బైబిలు చెప్పుచున్నది. ఆ కారణము చేతనే రష్యా ఆమెను తరిమి వేసింది, రష్యా ఆమెను వెలివేసింది. అవే కమ్యూనిజం ఆరంభమునకు కూకటి వేళ్ళుయైయున్నవి, ఎందుకనగా సంఘము వేరుగాయుండాలని బోధించబడింది, కాని లోకములో యున్న దాని కంటే ఎక్కువ ఏమీ అక్కడ లేదు.

35మేము ఫిన్లాండ్ దేశములో యున్నప్పుడు, ఆ చిన్న బాలుడు మృతులలో నుండి లేపబడ్డాడు. అక్కడ రష్యా సైనికులు కవాతుగా నిలబడి, వారన్నారు, "మృతులను బ్రతికించే దేవుని మేము స్వీకరిస్తాము." యేసు మనలను ఏమి చేయమని చెప్పాడో, దానిని చేయకుండా మనము విఫలమై, "సువార్త ప్రకటించకుండా," సంఘ శాఖలను, పాఠశాలలను, కట్టడములను నిర్మించాము. మనము లోకమునకు చదువు నేర్పుటకు ప్రయత్నించాము. "ప్రపంచానికి విద్యావంతులుగా చేయండి, విద్య వారిని రక్షించును," అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. నీవు తప్పక తిరిగి జన్మించి, ఆత్మతో నింపబడవలసియున్నది.

ఆ కారణము చేతనే, ప్రతి చోట, ఎంతో దౌర్భాగ్యముగా మనము విఫలమైపోయాము. చూడండి, మనకు సంపదయున్నది, మనకు అదియున్నది. ఇప్పుడు ఏమి సంభవిస్తుంది? ఈ సంఘము, ప్రపంచ సంఘముల సమాఖ్య, ఏకముగా వెళుతుంది, దానిని ఎవరు నడిపించుచున్నారో నీవు చూడలేవా? మెథడిస్టువారలారా, ప్రెస్బిటేరియన్ వారలారా, మిగిలినవారందరూ, కనీసము పెంతెకొస్తు వారు సహితము గ్రహించలేదా? దానిలోనికి మేము వెళ్ళుట లేదని నీవంటావు. నీవు లోనికైనా వెళ్ళాలి లేక సంఘశాఖనన్నా బ్రద్దలు చేయాలి. నీవు అది గాని, ఇది గాని చేయాలి. అది తిన్నగా నీముందున్నది, నీవు తప్పక దానిని చేయాలి. అది ఒత్తిడి చేయుచున్నది — మృగపు ముద్ర.

ఖచ్చితముగా అది అదేయైయున్నది. సంఘ శాఖా వాదము, పరిపూర్ణముగా మృగపు ముద్రయైయున్నది (నేను బైబిలు ద్వారా దానిని రుజువు చేస్తాను). ఆమె ఒక వేశ్యయైయున్నది. ఆమె వేశ్యాత్వము చేయు కుమార్తెలను కలిగియున్నది. మరియు అది సత్యమని మనకు తెలుసు. సంస్థగా మారిన మతము, అది వాక్యమునకు వ్యతిరేకమైయున్నది, మరియు దాని సిద్ధాంతములోనే అది, క్రీస్తువిరోధియై యున్నది. దానిలోయున్న సమస్తమూ క్రీస్తువిరోధి కాదు; కాని దాని నియమములు, దాని పద్ధతి క్రీస్తువిరోధియై యున్నది, ఎందుకనగా అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమైయున్నది. సంస్థగా మారిన ప్రతి పద్ధతి ఆ మార్గములోనే యున్నది!

ROM 3:4•

REV 17:4

 

36అక్కడే నీవున్నావు, చూచారా? దానిని గూర్చి దేవుడు ఏమి చెప్పాడో, దేవుని యొక్క గ్రహింపుపై ఆనుకొనటకు బదులుగా, నీవు ఎవరో ఒకరి స్వబుద్ధిపై ఆధారపడుచున్నావు. ఆ కారణమును బట్టియే అది తప్పు. కుర్రవాళ్ళు, మంచి విద్య కలిగిన వారు, పేరు గాంచిన ఈ వేదాంత పాఠశాలలకు, బైబిలు పాఠశాలలకు వెళతారు, బహుశ వారి హృదయములలో వారు దేవుని యొక్క పిలుపును కలిగియుండవచ్చు. వారు బయటకు వెళ్ళి, ఎంతో ఆత్మసంబంధమైన దృష్టిలేనివారుగా మారుచున్నారు, ఒకే అభిప్రాయము గలవారై: "ఫలానా-ఫలానా వారు దానిని చెప్పారు. ఫలానా-ఫలానా బిషప్పు చెప్పాడు. ఈయన అన్నాడు, ఆయన అన్నాడు, అంటున్నారు. ఆ కౌన్సిల్ లోని మనుషులందరూ, ఇది ఆ విధముగా తప్పకయుండాలని, వారు సమ్మతించారు, అంటున్నారు.

ఎవరు చెప్పినా లెక్క చేయవద్దు! యేసు చెప్పెను,, "ప్రతిమనిషి మాట అబద్ధము, కాని నా మాట సత్యము." అది ఎవరైనను లెక్క కాదు… నా మాట సత్యము!

ఇప్పుడు, ఏది సత్యమని మనకు ఎలా తెలుసు? ఏదో సంభవించబోవుచున్నదని బైబిలు ప్రకటించినపుడు, ఏదో సంభవించబోవుచున్నది. మరియు అది ఆలాగున జరిగింది.

ఇప్పుడు, బైబిలు చెప్పెను, "ప్రపంచములోని సంపద ఆమె యొద్ద యున్నది - బంగారము, వెండి." ఇప్పుడు, మనము బంగారపు ప్రమాణముపై యున్నట్లైతే, మనము బ్రద్దలైపోయాము, ఇప్పుడు ఏమి సంభవించబోవుచున్నది? ఏమి సంభవించబోవుచున్నది?

మీకు తెలుసా, ఈ దేశములోని ధనంతులు, ఈ పెద్ద కర్మాగారములు, విస్కీ ప్రజలు మరియు పొగాకు ప్రజలు, అలాటి వారు డబ్బును మార్పిడి చేసుకొనుటకు నిలబడలేరు, మనము చేయగలిగే ఒకే పని, అప్పు తీసుకొనుటయే. మనము ఆ పని చేసినపుడు మనము దానికి మన జేష్ఠత్వమును అమ్మివేసుకొంటాము. అది నిజము.

అలాగైతే మీరు ఏమి చేయబోవుచున్నారు? మీరు దాని ద్వారా, ఆ వ్యవస్థ వశములోనికి వెళ్ళిపోతారు. నీవు చేయగలిగేది అక్కడ ఏమియు లేదు.

37ఓ, ప్రజలారా, నేను వెర్రివాడనని మీరు తలంచవచ్చు. అలా తలంచవద్దు, కాని నా స్వరము మరణము ద్వారా నిశ్శబ్దమైనపుడు, ఈ టేపులు ఇంకనూ ఆడుతూనే యుంటాయి మరియు నేను ఏమి చెప్పానో, అది నెరవేరుటను మీరు గుర్తిస్తారు.

నేను తీసుకొన్న నిర్ణయాన్ని బట్టి, దేవుడు అని పిలవబడు ప్రతిదానికి అది వ్యతిరేకముగా యుంటుంది. నేను నా ఆలోచనలో, నా పిలుపులో తప్పైయున్నట్లైతే, అది దేవునికి వ్యతిరేకముగా యుంటుంది.

నేను నా నిర్ణయాన్ని తీసుకొన్నాను, ఎందుకనగా దానిని అక్కడ వాక్యములో నేను చూస్తాను, అది దేవుని వాక్యమైయున్నది. అప్పుడు అది రుజువు చేయబడుటను నేను చూస్తాను, అది సత్యమని నిర్ధారించబడింది. అది దేవుని వాక్యమునకు దేవుడిచ్చు అనువాదమైయున్నది. ఆయన వాక్యము యొక్క దేవుని సొంత అనువాదము, అదే నిర్ధారణ, అదే దానిని సత్యము చేస్తుంది.

1COR 11:5•

1TIM 2:12

 

38ఎందుకు ఈ పరిసయ్యులు గ్రుడ్డివారుగా యున్నారు? ఏది వారిని అంత గ్రుడ్డిగా చేసింది? ఎందుకనగా వారు ప్రత్యక్షతను వారు అంగీకరించరు. ఆ కారణమును బట్టియే ఈ రోజున సంఘములు గ్రుడ్డిగా యున్నాయి, ఎందుకనగా రుజువు చేయబడిన ప్రత్యక్షతను వారు అంగీకరించరు. వాక్యము ఈలాగుయున్నదని చెప్పినట్లైతే, అది బయలుపర్చబడినపుడు, అది రుజువు చేయబడినపుడు, వారు ఇంకనూ దానిని అంగీకరించరు.

ఆ కారణమును బట్టియే యూదులు, ఈ రోజు వరకు అంగీకరించరు. క్రీస్తు గూర్చి నీవు వారితో మాట్లాడలేవు, ఎందుకనగా ఇంకా ఆ ముసుగు వారి ముఖముపై యున్నది. వారిని గ్రుడ్డి వారిగా చేసింది. సంపూర్ణ సువార్తను గూర్చి మరియు దేవుని యొక్క శక్తిని గూర్చి మీరు సంఘముతో మాట్లాడలేరు, ఎందుకనగా ఈ లోక దేవత, దేవుని సత్యముల నుండి వారిని గ్రుడ్డివారిగా చేసింది, మరియు వారు - వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడతారు.

స్త్రీలు సంఘములోనికి జుట్టు కత్తిరించుకొని వస్తున్నారు, ఎందుకనగా వారి కాపరులు, "ఓ, అది పరవాలేదు. ఆ మనిషి పిచ్చివాడు!" అని చెపుతున్నారు. కాని బైబిలు చెపుతుంది, ఆమె జట్టు కత్తిరించుకొనుట తప్పు, ఆమె ఆలాగు చేసినపుడు, ఆమె ప్రార్థనను నిరాకరిస్తాడు. మరి కొందరు స్త్రీలు, ఒక సువార్త బోధకుడిగా యుండుటకు ప్రయత్నించుట ద్వారా, మరొక అపకీర్తిని తెస్తున్నారు, అప్పుడు ఆమె దానిని రెండంతలుగా చేసింది. ఆమె దానిని తప్పక చేయరాదని, దానిలో ఏదీ చేయకూడదని బైబిలు చెప్పెను.

కాని సంఘ సంస్థ దానిని స్వీకరించి, ఆమెను నియమించి బయటకు పంపుతుంది. వారు వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడుచున్నారు.

DEUT 8:3•

PROV 3:5•

MATT 4:4•

LUKE 4:4

 

39దేవుని వాక్యములో ఒక్క మాట, తప్పు స్థానములో యుంచినపుడు, తప్పుగా అనువాదము చేసినపుడు, లేక అది అంగీకరించబడనపుడు, అది మొత్తము గొలుసును విరుగగొడుతుంది. "మనిషి రొట్టె వలన మాత్రము కాక, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును."

ఎందుచేత స్త్రీలు, పొట్టిబట్టలు ధరించుటను గూర్చి, రంగులు వేసుకొనుట జుట్టు కత్తిరించుకొనుట, నగిషీగా జుట్టును తయారుచేయుట, ఈ సరుకంతటిని గూర్చి, ఈ కార్యములన్నిటిని గూర్చి నేను వ్యతిరేకముగా బోధించుట వినియు, నేను మరలా మరుసటి సంవత్సరము వచ్చే సరికి, మీరు అదే స్థితిలో ఇంకా కూర్చొనియుంటున్నారు? దానికి కారణము, దేవుని వాక్యమునకు బదులుగా మీ స్వబుద్దిపై మీరు ఆధారపడుతున్నారు.

సంఘ కాపరులారా, నీ సంఘమును ఎందుకు శుద్దిచేయవు? ఎందుకనగా ప్రభువు యొక్క వాక్యమునకు బదులు, మీరు మీ శాఖా సంబంధమైన ఆచారములోనికి వెళ్ళుచున్నారు. నిజము. నీ స్వబుద్ధిని ఆధారముచేసికొనవద్దు

మంచిది. నీ స్వబుద్ధిని ఆధారముచేసికొనవద్దు, కాని ప్రభువు మాటపై ఆధారపడుము.

MATT 3:12,17•

MATT 11:3•

LUKE 7:19•

JOHN 1:32

 

40వారు దానిని అంగీకరించరు, ఎందుకనగా వారు రుజువును అంగీకరించరు. ఖచ్చితముగా ఆయన వస్తాడని చెప్పిన విధానములోనే, యేసు సువార్తతో వచ్చాడు. కనీసము అనేకసార్లు…

యోహాను చెరసాలలో వేయబడినపుడు, కొంచెము చిన్నగా కంగారుపడ్డాడు, మరియు అతడు అక్కడకు వెళ్ళినపుడు, "మెస్సీయా వస్తున్నాడని. ఆయన చేట ఆయన చేతిలోయున్నదని; ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, గోధుమలను కొట్టులోనికి ప్రోగుచేసి, పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయునని," అతడు అక్కడ బోధించాడు. దేవుని యొక్క ఆత్మ ముందుకు వస్తూ, ఒక ఊటవలె, ఆయన నుండి ఉబుకుచున్నది.

మరియు అప్పుడు యేసు రంగము మీదికి వచ్చుట అతడు చూసినపుడు, ఒక చిన్న, సాత్వికము గల, ఒక విధముగా వంగిపోయినవాడు, చుట్టూ నెట్టివేయబడినవాడు, తన ప్రాణము కాపాడుకొనుటకు, ఇక్కడకు, మరియు అక్కడకు పరుగెత్తినవాడు — ఎందుకు, వారు… యోహాను దానిని గ్రహించలేకపోయాడు. కాబట్టి ఆయన నిజముగా అతడేనేమో అని తెలుసుకొనుటకు, యేసు నొద్దకు అతని శిష్యులలో కొందరిని పంపాడు.

యేసునకు ఎలాటి ఒక అగౌరవము! దేవుని యొక్క వాక్యముతో ప్రవక్త, నీళ్ళలో నిలబడిన తరువాత అన్నాడు, "నేను ఆయనను ఎరుగుదును, ఏలయనగా పరిశుద్ధాత్ముడు పావురము వలె — దేవుడు పావురము వలె, పరలోకము నుండి దిగివస్తూ — ఆయనలోనికి వెళ్ళుచున్నాడు మరియు పరలోకము నుండి ఒక స్వరము ఈలాగు చెప్పుట విన్నాడు, "ఈయన నా ప్రియ కుమారుడు."

మరియు తరువాత యోహాను అంటున్నాడు, "వెళ్ళి, ఆయనను అడగండి, ఆయన నిజముగా ఆయనేనా, లేక మనము మరొకరి కొరకు ఎదురు చూడాలా?"

MATT 11:4,6•

LUKE 7:22,23

 

41ఇప్పుడు, అతడు చెరసాలలో ఎలా ప్రవర్తించాలో, యేసు ఎన్నడూ అతనికి ఒక పుస్తకమును పంపలేదు, లేక ఏ సంఘములో అతడు తప్పక చేరియున్నాడో, అడుగలేదు, కాని ఆయన అన్నాడు, "ఇక్కడ ఈ చుట్టూ కొంచెము సేపు నిలిచియుండండి, మరియు ఏమి సంభవిస్తుందో చూడండి, అప్పుడు వెళ్ళి మీరు చూసినవన్నియూ జరిగినవన్నియూ, యోహానుకు చూపండి." ఎందుకనగా ఆయన కార్యములే, ఆయన మెస్సీయా అని, దేవుని కుమారుడని రుజువు చేస్తాయి. "నన్ను గూర్చి అభ్యంతరపడనివాడు ధన్యుడు."

కాబట్టి అనేకులు అభ్యంతరపడ్డారు. అనేక మంది దేవుని యొక్క వాక్యమునొద్ద, ఎంతో సులువుగా అభ్యంతరపడతారు. అది విరుద్ధముగా వుండి, వారు వారి స్వబుద్ధిపై ఆధారపడతారు. ప్రభువు యొక్క వాక్యమును తీసుకొనుట వారికి ఇష్టముండదు. వారు ఎలా వెళ్ళాలని బోధించబడ్డారో, వారు సరిగ్గా ఆ మార్గములో వెళతారు. వారు నేర్చుకొన్న మార్గములో, వారి సంఘము దానిపై ఆధారపడుతుంది. రేపు ఉదయమున, దేవుడు వర్షమును పంపుతానని, వాగ్దానము చేసి, వర్షము పంపినను లెక్క కాదు, సంఘము దానిని, "బుద్దిహీనత," అంటుంది, దేవుని వాక్యమునకు బదులుగా వారు సంఘమును నమ్ముతారు.

కారణము ఎందుకు? వారు సంఘము నుండి పుట్టినవారు. కాని దేవుడు మూలముగా పుట్టిన మనిషి, దేవుని విత్తనమైయున్నాడు, మరియు దేవుని యొక్క విత్తనము, దేవుని వాక్యమైయున్నది, మరియు అతడు దాని ద్వారా మాత్రమే జీవిస్తాడు. అది అతని జీవితమైయున్నది.

JOHN 9:10,11,19-22,24,30,32

 

42ఇప్పుడు, వారు వారి స్వబుద్ధిపై ఆధారపడుచున్నారు. కాని దేవుని వాక్యముపై ఆనుకొనుట వారికి ఇష్టము లేదు. వారు బాగా ఎరుగుదురు — అది లేఖనములో యున్నది. వారు దానిని ఒక దురాత్మ గల మనిషి అని పిలిచారు. కారణము ఎందుచేత? వారి యాజకులు అన్నారు, "ఎవరైనా ఈ మనిషి బోధ వినుటకు వెళ్ళినట్లైతే, వారిని సమాజ మందిరములో నుండి వెలివేస్తాము."

యేసు ద్వారా స్వస్థపడిన మనిషి, ఒకప్పుడు గ్రుడ్డివాడు, అతని తల్లి తండ్రి సహితము, అతని స్వస్థతను బట్టి ఎంతో సంతోషించారు, అయితే అది చేసినది యేసు అని, ఒప్పుకొనుటకు వారు భయపడ్డారు. అవును. అతడన్నాడు,"ఇతడు మీ కుమారుడేనా?" వారన్నారు,

"అవును."

"ఇతనిని బాగుచేసింది ఎవరు?" అన్నారు.

వారన్నారు, "మాకు తెలియదు." "అతడు వయస్సు వచ్చినవాడు అతనిని అడగండి, అతడు తనకై తాను తన కొరకు మాట్లాడగలడు." ఎందుకనగా ఎవరైనను వారి స్వబుద్ధిపై గాక, ఒక మనిషి క్రీస్తు యొక్క గ్రహింపును ఆధారము చేసికొంటే, వారిని వారి సంఘము నుండి వెలివేస్తామని, అక్కడ చెప్పబడియున్నది. ఇప్పుడు అది సరిగ్గా అదే కాదా? నేను ఒక సూటి ప్రశ్నను మిమ్మును అడుగుతాను. అది నిజము.

అది అదే కార్యము చేయుచున్నది. దేవుడు ఏమి చేసినను, అది సత్యమని దేవుడు రుజువు చేసినను లెక్క కాదు, అది వారి యొక్క అవగాహన ప్రకారము యుండాలి.

అయినను, ఇప్పుడు ఆ మనిషి జవాబును కలిగియున్నాడు. వారన్నారు, "నిన్ను ఎవరు స్వస్థపరిచారు?"

అతడన్నాడు, "నజరేయుడగు యేసు అని పిలవబడు వ్యక్తి."

వారన్నారు, "అతడు ఒక పాపి. అతడు ఎక్కడ నుండి వచ్చాడో మాకు తెలియదు."

అతడన్నాడు, "ఇప్పుడు అది వింతగా వుంది. మీరు ఈ ఘడియ యొక్క నాయకులుగా యుండవలసినవారు. ఇక్కడ ఒక మనిషి నా కన్నులను తెరిచాడు. లోకము ప్రారంభమైనప్పటి నుండి అది జరిగియుండలేదు, మరియు ఇంకనూ అతడు ఎక్కడ నుండి వచ్చాడో, మాకు తెలియదని మీరు చెపుతున్నారు."

ఓ, అయ్యో!

ISA 35:1,2,5,6

 

43ఎందుచేత? ప్రభువు యొక్క వాక్యమునకు బదులుగా వారు, వారి స్వబుద్ధిపై ఆధారపడుచున్నారు. ఎందుకనగా యెషయా చెప్పెను, "గ్రుడ్డివారు చూస్తారు, కుంటివాడు దుప్పివలె గంతులు వేస్తాడు, ఎండిన భూములు ఉల్లసించును." కాని మీరు చూడండి, వారు తమ స్వబుద్ధిపై ఆధారపడియున్నారు, వాక్యముపై కాదు — వారు గీచుకొన్న వారి సొంత పద్ధతి.

గమనించండి, ఈ దినమున సంఘములు దానినే చేస్తున్నారు. వారి యొక్క సంఘ శాఖ పద్ధతులతో, వారు ఒక గొప్ప తెలివైన ప్రజల గ్రహింపును ఏర్పర్చుకొనియున్నాను. అదే, వారు కలిగియున్న అతీతమైన గ్రహింపు, ఎవ్వరూ దానిని వెర్రిగా చేయరుట వారికి ఇష్టము లేదు, వారి గుంపుకు చెందిన వారే తప్ప, మరి ఎవ్వరూ వారి యొద్దకు వచ్చుట వారికి ఇష్టము లేదు.

నాకు చెప్పవద్దు. ఆరిజోనాలోని, టుసాన్ లో నేను జీవిస్తాను. మూడు సంవత్సరముల క్రితము నేను అక్కడికి వచ్చియున్నాను, నేను ఆ సంఘముల సమాఖ్యను కలుసుకొన్నప్పుడు, నేనన్నాను, "నేను ఒక సంఘమును ప్రారంభించుటకు ఎన్నడూ రాలేదు. నేను మీతో సహవాసము చేయటానికి వచ్చాను. మీకు సహాయపడుటకు వచ్చాను. నేను ఏమి చేసినను ఒక సువార్తికుడను, మిషనరీని."

వారన్నారు, "నీవు ఇక్కడ ఒక సంఘమును ప్రారంభించుటకు వస్తున్నావా?"

నేనన్నాను, "లేదండి, నాకు సంఘము కావాలంటే, నేను ఇండియానాలో ఒక సంఘమును కలిగియున్నాను." "నేను ఇక్కడకు వచ్చే కారణము ఏమనగా, ప్రభువు ఒక దర్శనములో నన్ను ఇక్కడకు నడిపించాడు. ఆయన నన్ను దూరముగా తీసుకొని వెళ్ళు వరకు కొద్ది కాలము నేను ఇక్కడ యుంటాను, కాని ఒక సంఘమును ప్రారంభించుటకు నేను ఎన్నడూ రాలేదు. సోదరులారా, మీకు సహాయము చేయుటకు నేను వచ్చాను."

44అది మూడు సంత్సరాల క్రితమైయున్నది. నేను ఎన్నడూ ఒక స్థలమునకు ఆహ్వానించబడలేదు? ఎందుకనగా దాని తరువాత అక్కడ ఒక కూడిక జరిగింది, మరియు వారన్నారు, ఏ మనిషి వారి వేదికను, నాకిచ్చినా, వారు ఆ బోధకుని వెలివేస్తామన్నారు.

చూడండి? ఎందుచేత? వారి స్వబుద్ధిపై ఆధారపడుతున్నారు. నిశ్చయముగా. వారే పేరు పొందినవారు… వారు వారి అతీతమైన అవగాహనను నిర్మించుకొన్నారు. వారి పుస్తకముపై నీ పేరును ఉంచితేనే తప్ప, నీవు తప్పిపోయినవాడవే. ఒక సేవకుడు నాకు దానిని చెప్పాడు.

"ఓ, అతడు ఒక మోసపూరితమైన వాడంటావా." అది ఒక పెంతెకొస్తువాడైయున్నాడు జాక్ మూర్ మరియు నేను, టెక్సాస్ లోని డల్లాస్ లో అతడు మాట్లాడుటను మేము విన్నాము. "అతని పేరును పుస్తకములో నుండి తీసివేయబోవుచున్నాను, అని అన్నాడు. నేనన్నాను, "ఎందుకు?"

"కారణము అతడు మీతో సహవాసము చేశాడు."

నేనన్నాను, "మంచిది, దానిని తీసివేయి."

అతడన్నాడు, "సరే, అతడు తప్పిపోయాడు."

నేనన్నాను, "తప్పిపోయాడా?"

"ఎందుకు," అతడన్నాడు, "అతని పేరు దానిమీద లేకపోయినట్లేతే…"

నేనన్నాను, "నీ భావము నీవు ఒక జిల్లా పెద్దవైయుండి, దానిని నమ్ముతావా?"

అతడన్నాడు, "అది సత్యము."

నేనన్నాను, "మిస్టర్! ఫోను పెట్టి వెయ్యి."

అది దేవుని కృప కాదు. అది, చూడండి…

JOHN 6:37,44•

1COR 12:13

 

45ఏలయనగా ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము, మరియు ఆ శరీరములో సభ్యులుగా మారాము. నీ మీద ఏ ముద్ర యున్నదో అది లెక్క కాదు. అది దానితో చేయునది ఏదియు లేదు. జన్మ ద్వారా నీవు పరిపూర్ణముగా నీవు ఒక క్రైస్తవుడవైయున్నావు. అది ఒక్కటే మార్గము, ఆ మార్గములో మాత్రమే నీవు యుండగలవు, చేరుట ద్వారా కాదు, సిద్ధాంతముల ద్వారా కాదు, ఇది అత్యాశక్తి ద్వారా కాదు, ఇది శ్రోతల ముందు ఒక వృత్తాంతమును తిరిగి తిరిగి వల్లించుట ద్వారా కాదు, మరే ఇతర కార్యము ద్వారా కాదు, విద్య ద్వారా కాదు, వేదాంతము ద్వారా కాదు. నీవు తిరిగి జన్మించినపుడు ఒక క్రైస్తవుడవై యున్నావు, మరియు తిరిగి జన్మించుటకు, "నీవు ఎన్నుకొనబడితేనే తప్ప, నీవు తిరిగి జన్మించలేవు. "నా తండ్రి ఆకర్షి౦చితేనే గాని యెవడును నా యొద్దకు రాడు, నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు." ఆమేన్. "అంత్యదినమున నేను వానిని లేపుదును."

ఈ గొప్ప పేరు గాంచిన, మనము కలిగియన్న బైబిలు పాఠశాలలు, వారంటారు, నీవు నేర్చుకొన్న దానిపై ఆనుకొనుము. ఓ, అయ్యో! వాక్యము ఏమి చెప్పినను వారికి లెక్క కాదు, వారు ఎంతో తేటగా దానిని వివరిస్తారు, వారి సొంతవారు దానిని నమ్మటానికి, మరియు వారి సొంతజాతి దానిని నమ్ముతుంది: అదేమనగా "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. అక్కడ ప్రవక్త అనునది, ప్రవక్తలు, అపొస్తలులు అలాటి వారు లేరు. అక్కడ స్వస్థత వరములు అనేవి, తదితరములైనవి లేవు. బైబిలు దినములలోనే అదంతా సమాప్తమైపోయింది."

వారు తమ్మును తాము, అది నమ్ముకొనునట్లు చేస్తారు.

2THS 2:12

 

46నీకు తెలుసా, బైబిలు చెప్పెను, "నీవు అబద్ధమును నమ్మి దాని ద్వారా నాశనము కావచ్చును." చూడండి, అది అక్షరాలా సత్యము, దేవుని వాక్యము ఏమి చెప్పినప్పటికి లెక్క కాదు, వారు తమ స్వబుద్దిపై ఆనుకొనుటకు కూడుకొంటారు. వారు, దానిపై ఆనుకొంటారు, వారు దానిని నమ్ముతారు, అది సత్యమని వారు అనుకొంటారు. నీవు తిరిగి, తిరిగి, తిరిగి, ఒక అబద్ధమును నమ్ముతూయుండగా, చివరకు అది నీకు సత్యముగా యుంటుంది. అది నిజము.

అయితే అది సత్యమో లేక కాదో ఎలా మనము తెలుసుకొంటాము? అది సత్యమని దేవుడు రుజువు చేస్తాడు, ఏలయనగా అది వాక్యములో యున్నది మరియు ఆయన దానిని రుజువు చేస్తాడు. దాని యొక్క తన సొంత అనువాదాన్ని ఆయనే చేస్తాడు.

వారు ఎలా దాని యొద్దకు వెళతారు? వారి నాగరికత ద్వారా, వారి విద్య ద్వారా, వారి డాక్టరు పట్టా యొక్క గ్రహింపులు ద్వారా, వారు ఒక నిర్ణీతమైన వేదాంత పాఠశాల నుండి వచ్చినవారమని, వీటిని నేర్చుకొన్నామని చెప్పుట ద్వారా, వారు దానిని చేస్తారు.

HEB 13:8

 

47స్నేహితులారా, చూడండి, వినండి. బైబిలులో ఎక్కడను, మీరు గ్రహించారా అని మనము అడుగబడలేదు. మనము దానిని గ్రహించాలని అడుగబడలేదు; దానిని మనము నమ్ముటకు అడుగబడ్డాము. ఎలా దానిని నమ్ముతాము? విశ్వాసము ద్వారా. నీవు దానిని గ్రహించగలిగినట్లైతే, అప్పుడు అది విశ్వాసమును చెల్లనిదిగా ప్రకటిస్తుంది. నీవు దానిని గ్రహించలేవు, కాని నీవు ఎలాగైనా దానిని నమ్ముతావు.

నేను దేవుని గ్రహించగలిగినట్లైతే, నేను దేవునిని నమ్మవలసిన పనిలేదు. నేను దేవునిని గ్రహించలేను. ఏ మనిషి దేవుని గ్రహించలేడు. నేను దేవుని వాక్యమును గ్రహించలేను, కాని నేను దానిని అంగీకరిస్తాను. నేను దానిని నమ్ముతాను. దానిని గ్రహించవలెనని నేను అడుగబడలేదు. ఈ గొప్ప మానవ జ్ఞానము యొక్క గ్రహింపు నాకు అర్థము కాదు, నేను ఏ వేదాంత పాఠశాలకు వెళ్ళలేదు. బైబిలు చెప్పిందే సరిగ్గా నాకు తెలుసు, అదే, "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు," నేను అదే జాబితాలో ఆయన కొరకు ఎదురుచూస్తాను. ఈ దినమున ఆయన ఏమి చేస్తానని వాగ్దానము చేశాడో నాకు తెలుసు. దానిని చేయుటకు నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను, మరియు ఆయన అది చేస్తాడు, అది నిజము. ఆయన కృపను వాగ్దానము చేశాడు, నేను దాని కొరకు ఎదురు చూశాను, మరియు దానిని నేను స్వీకరించాను. ఆయన స్వస్థతను వాగ్దానము చేశాడు, నేను దానిని నమ్మాను, దానిని అంగీకరించాను, మరియు నేను దానిని స్వీకరించాను.

MATT 24:37•

LUKE 17:26

 

48ఇప్పుడు నేను మీ సమయమును ఎక్కువ తీసుకోను, ఒక్క నిమిషము మీరు నాతో భరించినట్లైతే, ఈ ఒక్కటిని అడుగగోరుచున్నాను, తమ సొంత గ్రహింపుపై ఆనుకొనని కొందరిని లెక్కలోనికి తీసుకోండి; వారి యుగము యొక్క గ్రహింపు ఏమి చెప్పినను లెక్క కాదు, తమ సొంత గ్రహింపుపై ఆనుకొనని వారిని, కొందరిని, బైబిలులోని కొన్ని గుణశీలములను తీసుకొందాము.

ఉదాహరణకు నోవహును తీసుకొందాము. గొప్ప శాస్త్రీయ పరిశోధన దినములో నోవహు జీవించాడు. నోవహు దినములలో, వారు బహుశ పిరమిడ్లు కట్టారు, వాటిని తిరిగి వారు ఉత్పత్తి చేయలేరు. ఇప్పుడు మనము దానితో ఏమీ చేయలేము. ఆ బండలను ఏదియు ఇప్పుడు పైకి ఎత్తలేదు. ఈ రోజున వారు దానిని చేయలేరు. ఆ దినములలో వారు ఒక విధమైన రసాయనిక అద్దకమును, వస్త్రములకు వేసేవారు, ఈ రోజువరకు అవి సహజముగా కనబడతాయి. వారు ఒక శవమును భద్రపర్చుటకు, ఒక విధమైన తైలమును రాసి మమ్మీని తయారు చేసేవారు. ఈ రోజు మనము, అలాటి ఒక దానిని చేయవలసియుంటే, దానిని మనము చేయలేము. ఎన్నో కళలను మనము పోగొట్టుకొనియున్నాము. ఎంతో తెలివైన శాస్త్రీయ యుగములో అతడు జీవించాడు.

ఆయన రాకముందు, అదే రకమైన యుగము తిరిగి వస్తుందని. యేసు దానిని సూచించాడు, "ఏలయనగా నోవహు దినములలో జరిగినట్లుగా యుండును," ఇప్పుడు, మీరు దానిని నమ్ముతారా, అదే, మీరు నమ్మరా? యేసు దానిని చెప్పియున్నాడని మీరు దానిని నమ్ముతారా? తిరిగి మనము ఆ యుగమునకు వచ్చామని, మీరు నమ్ముతారా? అది లూకా సువార్తలో యున్నది 17వ అధ్యాయము, 29వ వచనము.

MATT 24:38,39•

LUKE 17:27,28

 

49ఇప్పుడు లూకా 17:30లో ఆయన చెప్పెను, "లోతు దినములో జరిగినట్లుగా యుండును, అప్పుడు ప్రభువు యొక్క దూత…" ఇప్పుడు, ఆయన మనము చదివిన బైబిలునే చదువుచుండెను, నోవహు యొక్క జల ప్రళయమునకు ముందు, అది ఎలాటి దినమైయుండెనో, మీరు వెనుకకు వెళ్ళి చూడండి. లోతు దినములలో ప్రపంచము నాశనము కాక మునుపు అది ఎలాటి దినమైయున్నదో, వెనుకకు వెళ్ళి చూడండి. అది ఏమైయుండెనో కనుగొనండి, యేసు దేనిని గూర్చి మాట్లాడుతున్నాడో, మీరు చూస్తారు.

"నోవహు దినములలో, వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసికొనుచు, పెండ్లికిచ్చుకొనుచుండిరి; నోవహు ఓడలోనికి వెళ్ళు వరకు దానిని ఎరుగకుండిరి, మరియు జలప్రళయము వచ్చి, వారందరిని తీసుకొనిపోయెను."

లోతు దినములలో, అన్యప్రపంచము కాల్చివేయబడుటకు ముందు, అక్కడ సొదొమీయులు, స్వలింగ సంపర్కులుయున్నారు, సమస్తమైన వంకరలు ప్రపంచములోయున్నవి. అది ఒక గొప్ప… అధునాతన లాస్-ఏంజల్స్ గా యున్నది; అధునాతన లాస్-ఏంజల్స్ మాత్రమే కాదు, కాని అమెరికా సంయుక్త రాష్ట్రములు; అమెరికా సంయుక్త రాష్ట్రములే కాదు, కాని ఒక ప్రపంచము. అది నిశ్చయముగా వంకరచేయుట!

మనుషులు వారి యొక్క సహజమైన జీవపు మూలమును, వారి సహజమైన బుద్ధి జ్ఞానమును పోగొట్టుకొని, దురాత్మ ద్వారా వంకరగా చేయబడినారు, అది వారి సహజ జీవితము యొక్క మొత్తము మార్గమును మార్చివేసింది, మరియు వారు దురాత్మలతో ఆవరించబడ్డారు. అది నోవహు దినములలోని చిత్రము కాదా, మరి నాకు తెలియదు.

లోతు దినములలో, నా భావము. నోవహు దినములలో కూడా వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు - పెండ్లికిచ్చుచుండిరి, సరిగ్గా ఇప్పుడుయున్నట్లుగానే, సమస్తమూ విడాకుల కోర్టులు నిండిపోవుచున్నవి.

GEN 17:5,15,16•

GEN 18:9,10,12,13

 

50కాని, గుర్తుంచుకోండి, ప్రపంచము నాశనము కాక మునుపు, అబ్రాహాము భూమి మీదకు పంపబడ్డాడు, మరియు ఒక కుమారుని వాగ్దానము ఆయనకు ఇవ్వబడింది. సంఘము ఒక ఛాయగా దేవునిని కలుసుకొన్నట్లుగా, అబ్రాహాము అనేక దశలలో దేవుని కలుసుకొన్నాడు. అయితే సరిగ్గా నాశనమునకు ముందు మరియు వాగ్దాన కుమారుడు రాకముందు, దేవుడు దిగి వచ్చి మానవ శరీరములో, ఒక మనిషిలో ప్రత్యక్షమయ్యాడు, ముగ్గురు మనుషులు. వారు లోతు దగ్గరకు వచ్చారు — మొదట అబ్రాహాము దగ్గరకు వచ్చారు. మరియు వారు కూర్చొన్నారు. మరియు అబ్రాహాము యొక్క పేరు అబ్రాము నుండి అబ్రాహాముగా, శారాయి - శారాగా మార్చబడింది.

ఈ మనిషి ప్రసంగీకుడు, ఎలోహిం, అతనితో మాట్లాడుటకు ఆయన దిగి వచ్చినపుడు, ఆయన ఏమన్నాడు? "నీ భార్యయైన శారా ఎక్కడ," అన్నాడు.

అతడన్నాడు, "నీ వెనుక గుడారములోయున్నది."

ఆయనన్నాడు, "జీవపు కాలము ప్రకారము నేను నిన్ను దర్శిస్తాను." మరియు ఆమె, ఆయన వెనుక గుడారములో యుండి నవ్వినది. ఆయన అన్నాడు, "శారా నవ్వనేల?"

ఇప్పుడు, ఆయన వాక్యమును చూసి నవ్వినందుకు, ఆయన శారా ప్రాణమును తీసివేసేవాడే. కాని ఆయన దానిని చేయలేడు, ఏలయనగా శారా, అబ్రాహాములో భాగమైయున్నది.

LUKE 17:28,30

 

51ఈ దినమున, లూకా 17వ అధ్యాయము, 30వ వచనములో యేసు చెప్పెను, "లోతు దినములలో జరిగియున్నట్లుగా, అంత్యకాలములోను జరుగును, మనుష్యకుమారుడు…"

ఇప్పుడు గుర్తుంచుకోండి, "మనుష్య కుమారుడు," ప్రవక్తయైయున్నాడు. యెహెజ్కేలును, "మనుష్య కుమారుడా," అని యెహోవా పిలిచాడు. యేసు మూడు నామములలో వచ్చాడు: మనుష్యకుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన తన్నుతాను, "మనుష్యకుమారుడు," అని పిలుచుకొన్నాడు. ఆ ప్రకారము ప్రజలు గ్రహిస్తారు, కారణము, ప్రభువైన దేవుడు లేపబోయే ప్రవక్తయైయున్నాడు.

ఇప్పుడు గమనించండి, అప్పుడు ఆయన ఏమి వాగ్దానము చేశాడు? అగ్నికి ముందు, ఆ సమయమునకు ముందు తిరిగి మనుష్యకుమారుడు తన్ను తాను బయలుపర్చుకొంటాడు. మరియు వాగ్దానము చేయబడిన కుమారుడు రాకముందు, అబ్రాహాము చూసిన చివరి గురుతు అదియే. మరియు తిరిగి అతడు ఒక యవ్వనస్తుడుగా, ఆమె ఒక యవ్వనస్తురాలిగా మారిపోయింది, దానికి ముందు..

ఇప్పుడు, గమనించండి. లేఖనము దానిని ప్రత్యేకముగా చెపుతుంది, మనము తప్పక దాని కొరకు చూడాలి. అలాగైతే ఈ దినమునయున్నట్లుగా, ప్రపంచము వంకరి తనములో ఉంచుట చూసి, అది ఇప్పుడు కొనసాగుతున్నట్లుగా, అప్పుడు అది సరియని, ఇది సరి కాదని మనము ఎలా చెప్పగలము? ఎందుకనగా నీవు ఎవరో గ్రహింపు మీద ఆధారపడియున్నావు, సొదొమ గవిని యొద్దనున్న వ్యక్తి, ఆ జీవాధిపతి గ్రహింపు మీద కాదు.

ఇప్పుడు, గమనించండి… మనము మన స్వబుద్ధిపై ఆధారపడరాదు.

GEN 17:16•

ROM 4:19,20

 

52నోవహు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. అది ఒక గొప్ప శాస్త్రీయ యుగమైయున్నది, కాని అతడు తన దినము యొక్క గ్రహింపుపై అతడు ఆధారపడలేదు. కాని అతడు దేవుని యొక్క వాగ్దానముపై ఆధారపడ్డాడు, మరియు దేవుని శక్తి ద్వారా కదిలించబడ్డాడు, మరియు తన ఇంటి వారి రక్షణ కొరకు, ఒక ఓడను సిద్ధపరిచాడు. అది పరిపూర్ణముగా సహజ జ్ఞానమునకు వ్యతిరేకముగా యున్నప్పుడు, అక్కడ ఎన్నడూ ఆ పైన నీళ్ళు లేవు. కాని అతనికి తెలుసు, అక్కడ నీళ్ళు ఉంటవి అని దేవుడు చెప్పినట్లైతే, అవి అక్కడ యుంటాయి. కాబట్టి అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు, కాని విశ్వాసము ద్వారా, దేవుని వాక్య వాగ్దానము ద్వారా అతడు కదిలించబడ్డాడు. ఆత్మ అతనిని కదిలించింది, మరియు అతడు కదిలాడు.

అబ్రాహాము, మానవ జీవితమును గూర్చి అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. అతడు తన భార్యను పదహారవయేట వివాహము చేసికొనియున్నాడు. ఇక్కడ అతడు డెబ్బది సంవత్సరముల వయస్సు గలవాడుగాయున్నాడు. మరియు ఆమెకు అరవై-ఐదు సంవత్సరములు, అతని కంటే పది సంవత్సరములు చిన్నది. కాని అబ్రాహాము తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. శారా ద్వారా తనకు కుమారుని ఇస్తానని దేవుడు చెప్పినపుడు, కాని అతడు దేనినైనను, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగాయున్న ఏ రుజువునైనను, దేవుని వాక్యమునకు బయట, ఏ జ్ఞానమైనను, అది లేదు అన్నట్లుగా అతడు పిలిచాడు. అతడు బలముగలవాడై, దేవునిని స్తుతించెను.

అతడు కనీసము తన సొంత శరీరము మృతతుల్యమైనదని గాని, శారా దేహము మృతతుల్యమైనదని గాని, అతడు వాటివైపు చూడలేదు. అతడు దేనినీ లెక్కించలేదు, కాని దేవుని యొక్క వాగ్దానముపై ఆనుకొన్నాడు. అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. అతడు తర్కములపై ఆధారపడలేదు.

ROM 4:17•

2COR 10:5

 

53"బ్రెనాం సోదరుడా, ఎందుకు, నీవంటావు, ఈ కారణమును బట్టియేనా దేవుడు రోగులను బాగు చేయుటలేదు, మనము ఎంతో మంది చక్కని వైద్యులను కలిగియున్నాము." బైబిలు చెప్పెను, "మనము తర్కములను క్రిందపడవేస్తాము." మనము తర్కించము. విశ్వాసము తర్కించదు; విశ్వాసము నమ్ముతుంది మరియు అంగీకరిస్తుంది.

గమనించండి. అయితే దేవుని వాక్యమును అతడు సందేహించక నమ్మియున్నాడు, మరియు లేనివి యున్నట్లుగానే పిలిచాడు, అది పరిపూర్ణముగా ఏ తర్కమునకైనను వ్యతిరేకమైనది. అయితే అతడు తర్కించలేదు. అతడు కేవలము నమ్మాడు. పిల్లవాడు జన్మించగలడని, ఏ తర్కములు రుజువు చేయలేవు. ఆ స్త్రీకి ఋతుస్రావము ఆగిపోయి ఇరవై సంవత్సరములైనది, మరియు అతని దేహము మృతతుల్యమైనది. అతనికి నూరేళ్ళు వచ్చినపుడు, ఇరవై-ఐదు సంత్సరముల తరువాత, ఏ విధమైన గ్రహింపునకైనను వ్యతిరేకముగా, అతడు ఇంకనూ దేవునికి స్తుతి చెల్లించుచుండెను. విశ్వాసమును బట్టి, దేవుడు తన మాటను నిలబెట్టుకొంటాడని, అతడు ఎరిగియుండెను. అతడు తన స్వబుద్దిపై ఆధారపడలేదు.

EXOD 3:12

 

54ఫరో చేతి నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొని రమ్మని అతనికి చెప్పినపుడు, ఒక వేళ మోషే, తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏమి జరిగేది? ఆ అగ్నిస్తంభము నొద్ద "ముందుకు వెళ్ళు, నేను నీతోయున్నాను?" అని దేవుడు చెప్పినపుడు.

ఒక వేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏమి జరిగేది? దేవుడు వారిని ఎర్ర సముద్రము నొద్దకు తెచ్చినపుడు, వారు అక్కడ నీళ్ళు యొద్ద యున్నారు, ఇక్కడ దేవుడు వారికి వాగ్దాన భూమిని వాగ్దానము చేసినపుడు, ఒకవేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏమి జరిగేది? ఒక వేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏమి జరిగేది, "నేను ఎలా ఈవైపు నుండి ఆ వైపుకు వెళ్ళగలను? ఒక వంతెనను నిర్మించుటకు మనకు సమయము లేదు. ఇక్కడ సైన్యము తిన్నగా మన వెనుక వస్తున్నారు. ఇక్కడ రెండు వైపుల పర్వతములున్నవి. ఇక్కడ మనముందు నీరున్నదీ, ఎర్ర సముద్రము."

ఇప్పుడు, ఒకవేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడి, పరుగెత్తుకొంటూ చేతులు పైకెత్తి, ఫరో పాదముల మీదపడి, "ఫరో నన్ను క్షమించు, నేను తప్పు చేశాను," అంటే. అయితే అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. కాని అతడు ప్రార్థించాడు, దేవుడు అడుగు ముందుకు వేయమని చెప్పాడు, మరియు సముద్రము తెరవబడింది అది ఎన్ని తర్కములకు వ్యతిరేకముగాయున్నది. కాని అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు.

JOSH 1:3

 

55ఒకవేళ యోహోషువ, అతడు ఆ ఇతర పది సంఘ శాఖలతో అక్కడకు వెళ్ళి, అక్కడ దేవుని యొక్క వాగ్దాన భూమిని చూసి, మరియు వారితో తిరిగి వచ్చి ఇలా అనియుంటే, "ఇప్పుడు ఒక్క నిమిషము ఆగండి, అది సత్యము, మనము మిడతలవలె కనబడ్డాము. వారు ఆజానభావులు. మనము ఏ విధముగా వారిని తీసుకొనగలము? మనము ఏరుకొన్నవి తప్ప, కనీసము ఖడ్గములు లేవు. మనము ఏలాగు వెళ్ళి, ఆ దేశమును తీసుకొనగలము? ఎందుకు, అది సంపూర్ణముగా అసాధ్యము. ఒక్కరికి ఏభై చొప్పున, మన పై లెక్కలో వారి సంఖ్య మించిపోతుంది. వారు తర్ఫీదు పొందిన సైనికులు, మనము ఐగుప్తు నుండి వచ్చిన గొర్రెల కాపరులము, మరియు బురద పిసికేవారము తప్ప ఏమీ కాదు. ఎలా? కనీసము డాలు అలాటివి మనకు లేవు, మనము ఎలా దానిని తీసుకొనగలము?"

ఎందుకు, నిశ్చయముగా వారి స్వబుద్ది, వారు దానిని చేయలేరని నిశ్చయముగా రుజువుచేస్తుంది. ఏ మిలిటరీ వ్యక్తియైనా, లేక మోషేయైనా, వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడలేరు. అయితే వారి స్వబుద్ధిపై వారు ఆధారపడలేదు. కాని దేవుడు చెప్పిన దానిని వారు ఎరిగియున్నారు, "నేను ఆ దేశమును మీకిచ్చాను, వెళ్ళి దానిని తీసుకోండి."

JOSH 6:5

 

56నీ స్వబుదిపై ఆధారపడవదు.

నీవు నీ స్వబుద్దిపై ఆధారపడినటైతే, ఈ రోజున నీవు రోగిగాయున్నప్పుడు, బహుశ చక్రాల కుర్చీలో కూర్చొనియుండవచ్చు, బహుశ క్యాన్సర్ తో, గుండె జబ్బుతో చనిపోతూయుండవచ్చు, మరియు వైద్యుడు నీవు చనిపోవుచున్నావు అని చెప్పవచ్చు, నీవు నీ స్వబుద్ధిపై ఆధారపడినట్లైతే, నీవు చనిపోతావు. అయితే ఆ బుద్ధిపై ఆధారపడవద్దు. నిశ్చయముగా వద్దు.

యెరికో గోడల సంగతియేమిటి, ఆ గోడలపైన వారు రథముల పందెమును వేస్తారు, ఆ పెద్ద గోడలు? దేవుడు అన్నాడు, "మీరు అక్కడికి వెళ్ళి దాని చుట్టూ ప్రదక్షిణము చేసి, బూర ఊది, ఆర్భాటముగా కేకలు వేయండి, ఆ గోడలు కూలిపోతాయి." బాగుంది, శరీర మనస్సుకు అది పరిపూర్ణముగా వెర్రితనముగా యుంటుంది.

కాని యెహోషువా, ఆ గోడలు ఎంత మందమైనవో ఎరిగియున్నాడు, "కారణము అతడు ఎన్నో గోడలు ఐగుప్తులో నిర్మించియున్నాడు. దానిలోయున్న సున్నమును అతడు ఎరిగియున్నాడు, ఆ పైన గుర్రపు పందెములు వేయుటకు, అది ఎంత బిగువుగా వుంటుందో, ఇళ్ళు సహితము దాని పైన నిర్మిస్తారు. అయితే అతడు, తన స్వబుద్దిపై ఆధారపడలేదు. దేవుడు ఏమి చెప్పాడో అది సత్యమని అతడు నమ్మాడు, ఆయన వాక్యమునకు విధేయుడయ్యాడు, మరియు గోడలు కూలిపోయినవి.

JOSH 10:12

 

57నేను ఆదివారము బోధించియున్నట్లుగా, అతడు యుద్ధములో పోరాడుతున్నట్లైతే, అప్పుడు సూర్యుడు దిగిపోవుచున్నాడు, శత్రువులు ముట్టడి వేశారు. ఆ రాత్రి వారందరు ప్రోగై, మరియు మరొక శక్తితో వారు వచ్చి, అతని మనుషులలో అనేకమందిని చంపుతారు. ఇప్పుడు "నాకు కొంత పగటి వెలుగు కావలసియున్నది, అని చెప్పినట్లైతే, నాకు తప్పక మరికొంత సూర్యుని వెలుగు కావాలి. బాగుంది, ఒక్క నిమిషము ఆగు. దేవుడు ఈ క్రమమును ఏర్పరచాడు. సూర్యుడు తిరుగుచూయుండగా… ప్రపంచము తిరుగుతుంది… ఇప్పుడు మనము చూద్దాము, నేను సూర్యుని ఆగమని చెప్పినట్లెతే… బహుశ ప్రపంచము ఇప్పుడు ఆగిపోతుంది, అప్పుడు అది దాని గురుత్వాకర్షణ శక్తిని పోగొట్టుకొంటుంది. నేను పడిపోతాను?" అంటే.

తన స్వబుద్ధిని అతడు వినలేదు. అతడు చెప్పిన ఒకే విషయము ఏమైయున్నదనగా, "సూర్యుడా, నీవు ఆగిపొమ్ము మరియు చంద్రుడా, నీవు ఎక్కడయున్నావో అక్కడ ఆగిపొమ్ము." అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. కాని దేవుని వాగ్దానముపై అతడు ఆనుకొన్నాడు, "నేను ఆ దేశమును మీకు ఇచ్చాను. వెళ్ళి దానిని తీసుకోండి!"

EXOD 15:26•

PS 103:3•

ACTS 2:39

 

58పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానమును ఆయన నీకిచ్చియున్నాడు. ఈ సభలో మీరు దానిని పొందవచ్చు, ఇప్పుడే నీవు దానిని పొందవచ్చు! నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు, "నేను అలసిపోయాను."

"నీకు తెలుసా, నేను ఎక్కువుగా రాత్రి భోజనము తిన్నాను."

"నేను దానిని చేయుట, యోహాను చూచుటను నేను అసహ్యించుకొంటాను."

ఓ, మేలు కొరకు నీవు నీ స్వబుద్ధిపై ఆధారపడుచున్నావు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్థులందరికి, మన ప్రభువైన దేవుడు పిలిచిన వారందరికి చెందును." "నేను చనిపోవబోవుచున్నానని, వైద్యుడు చెప్పాడు. అతడు నన్ను పరీక్షించాడు, నాకు కాన్సర్ ఉందని చెప్పాడు. నేను దానిని కలిగియున్నాను, లేక అది ఏమైయున్నప్పటికి. నేను తప్పక చనిపోతాను." ఆ బుద్ధిపై ఆధారపడవద్దు. నీ రోగములన్నిటిని బాగు చేయు నీ దేవుడైన ప్రభువును నేనే. కాబట్టి ఆ బుద్ధిపై ఆధారపడవద్దు, ఏ మనిషి బుద్దిపై ఆధారపడవద్దు. దేవుని యొక్క జ్ఞానముపై ఆధారపడుము.

JUDG 15:15

 

59సమ్సోను పొలములో యుండగా ఏమిటి, ఒక వెయ్యిమంది ఫిలిష్తియులు అతని మీదకు పరుగెత్తి వచ్చారు? అక్కడ అతడు నిలబడియున్నాడు, ఒక చిన్న, ఉంగరాలు తిరిగిన రొయ్యి, దరిదాపుగా ఎత్తుయున్నాడు. అతడు భయపడలేదు. మంచిది, అతడు ఒక ఖడ్గదారి కాదు, "ఏలయనగా అది అతనికి తెలియదు… అతనికి ఏ మిలిటరీ తర్పీదు లేదు.

అతడు కేవలము ఒక చిన్న ఉంగరాల జుట్లు తల కలిగిన ఆడపిల్ల వలె, ఏడు జడలు కలిగియున్నాడు, తల్లి, కొడుకు, అక్కడ నిలబడియున్నాడు, అక్కడకు వెయ్యిమంది ఫిలిష్తియులువచ్చారు. సరే, అతని చేతిలో ఏదియు లేదు. అతడు క్రిందగా చూడగా, ఒక ఎండిపోయిన, ఒక తెల్లని మాసిపోయిన గాడిద దవడ ఎముకను కనుగొన్నాడు, మరియు అతడు దానిని ఏరుకొన్నాడు. ఇప్పుడన్నాడు, "ఇప్పుడు మనము చూద్దాం, దీనితో నేను ఎక్కువ చేయలేను, ఎందుకనగా ఫిలిష్తియులందరు వారి తలలపై శిరస్త్రాణములను, అందరూ ఈటెలను కలిగియున్నారు. వారందరు లోహముతో తయారుచేయబడిన కోటులను కలిగియున్నారు, వారి శిరస్త్రాణములను ఒక్కొక్కటి పదిహేను పౌండ్ల బరువు కలది, అందరు గొప్ప బలము గల మనుషులు. సరే, ఈ సులువుగా విరిగిపోయే, గాడిద దవడ ఎముకతో, నేను ఎన్నడైనా నేను వారి శిరస్త్రాణములపై కొట్టినట్లైతే, ఎందుకు, అది ముక్కలుగా బ్రద్దలైపోతుంది. అది అంతే?"

అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. అతడు సరిగ్గా తన చేతిలో యున్న దానినే తీసుకొని, వారిలో వెయ్యమందిని కొట్టాడు, ఇంకనూ అతడు ఆ దవడ ఎముకను తన చేతిలో కలిగియున్నాడు! ఆమేన్!

1SAM 17:9,26•

HEB 13:8

 

60మనిషి, వేదాంతము ఏమి చెపుతుందో నేను లెక్క చెయ్యను, దానిపై ఆనుకొనవద్దు. దేవుని యొక్క వాక్యముపై ఆనుకొనుము, "యేసుక్రీస్తు, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు." అతడు దానిని నమ్మాడు.

సౌలు యొక్క వేదాంతమును దావీదు వినియుంటే ఏమయ్యేది? అక్కడ గొల్యాతు నిలబడియున్నాడు, మరియు అందరూ భయపడ్డారు. సౌలు సైన్యమంతటికి పైగా, ఎత్తైన భుజములు, తలను కలిగియున్నాడు. గొల్యాతు అన్నాడు, "ఎవరైనా వచ్చి నాతో పోరాడండి. మనమందరము చావవలసిన అవసరము లేదు. నేను నిన్ను చంపితే, అప్పుడు మీరందరు మమ్మును సేవించాలి. మీరు నన్ను చంపితే, మేము మిమ్మును సేవిస్తాము."

ఏలయనగా అతడు అతనిపై సరిహద్దును కలిగియున్నాడు. ఆ విధానములోనే దయ్యము దానిని చేయుటకు ఇష్టపడుతుంది, వాడు మొత్తము వేదాంత పాఠశాలను బయటకు తెచ్చినపుడు, వారందరూ, వాడు మార్గముగుండా వస్తున్నప్పుడు, చూడండి.

ఆ చిన్న మాసిపోయిన దావీదు, ఎర్రని వాడు, వంగిపోయిన భుజములుగలవాడు, చిన్న గొర్రె చర్మమును ధరించి నడుచుకొంటూ వచ్చాడు, ఒక చిన్నవాడు, వంద లేక నూట-పది పౌనులు బరువుగలవాడు. "సజీవుడైన దేవుని యొక్క సైన్యము, ఒక నిబంధనకు సున్నతి పొందిన వారు యుండగా, ఒక సున్నతి లేని ఫిలిష్తియుడు, సజీవ దేవుని సంఘము యొక్క సైన్యమును బాహాటముగా సవాలు చేయుట అని నాకు చెపుతావా."

1SAM 17:34,37

 

61సౌలు అన్నాడు, "కుర్రవాడా, ఇక్కడకు రా," "నేను నీ ధైర్యాన్ని మెచ్చుకొంటాను, కాని అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. చూడు, అలాటివి మనమధ్య లేవు అన్నాడు, మరియు నన్ను మీకు కొంత చెప్పనివ్వండి, ఏ సహవాసపు కార్డును నీవు చూపిస్తావు? చూచారా?

"కనీసము నీకు కవచము లేదు, వడిసెల తప్ప నీ యొద్ద ఏమియు లేదు. చూడు? నీకు పి.హెచ్.డి లేక ఎల్. ఎల్.డి లేదు, నీవు దీనిని ఎలా చేయబోవుచున్నావు? ఎందుకు, వాడు ఒక యుద్ధ వీరుడు, ఎందుకనగా వాడు డి.డి డబుల్ ఎల్.పి.హెచ్.డి, ఎల్.ఎల్.క్యూ, కలిగియున్నాడు, ఎందుకనగా వాడు ఎన్నో డిగ్రీలు కలిగియున్నాడు, వాడు ఒక గోడనిండా వాటిని అతికిస్తాడు. మరియు నీవు ఎవరవు? ఒక గొర్రెల కాపరివి!"

అతడన్నాడు, "నేను నీకు ఒకటి చెప్పాలనుకొన్నాను," అతడన్నాడు, "అది ఏమిటో నీకు తెలుసా?" "నేను బయట నా తండ్రి గొర్రెలను కాయుచుండగా, ఒక సింహము వచ్చివాటిలో ఒక దానిని లాగుకొని పరుగెత్తింది. నీకు తెలుసా, నేను ఈ చిన్న వడిసెను తీసుకొని వాడి వెనుక వెళ్ళి, వాడిని గుద్ది క్రిందపడవేశాను. వాడి నోటిలో నుండి గొర్రెపిల్లను బయటకు తీసినపుడు, వాడు నా పైకి లేచాడు. నేను కత్తి తీసుకొని వాడిని చంపి వేశాను."

"నేను వెనుకకు తిరిగి ముందుకు వెళ్ళాను, మరలా ఒక ఎలుగుబంటి వచ్చి, ఒక గొర్రెను లాగుకొనిపోయింది. నేను వాడిని కూడా చంపివేశాను." అతడన్నాడు, "ఇప్పుడు దేవుడు, నా పి.హెచ్.డి., కాదు, నా స్వబుద్ది కాదు. నేను దానిని ఎలా చేశానో, నేను మీకు చెప్పలేను. అది ఎలా జరిగించబడిందో, నాకు తెలియదు. కాని దేవుడు — (ఆమేన్!), ఎలుగుబంటి మరియు సింహము పంజా నుండి నన్ను తప్పించిన దేవుడు, మరి ఎంత ఎక్కువుగా, ఆ సున్నతిలేని ఫిలిష్తియుని చేతి నుండి విడిపించగలడు!"

1SAM 17:38,39

 

62బిషప్ సౌలు అన్నాడు, "కుర్రవాడా, నీవు పిలుపును కలిగియున్నావని నాకు తెలుసు. నేను నీకు చెపుతాను, నీవు ఇక్కడకు వచ్చినట్లైతే, నీవు అతనితో ఎలా పోరాడాలో నీకు నేర్పుతాను, చూడు. నేను నీకు చెపుతాను, నేను ఒక డాక్టర్ను, కాబట్టి నా కవచమును నీ మీద వేసుకొనుము. నేను నీకు వస్త్రములు ధరింపచేస్తాను."

దావీదు అక్కడ నిలబడ్డాడు, వారు అతనికి ఒక పి.హెచ్.డిని, ఒక ఎల్. ఎల్.డిని, మరియు అవన్నియూ ఇచ్చారు, మరియు దీనమైన చిన్న దావీదు, కనీసము కదలలేకపోయాడు. అది ఎలాగో అతనికి తెలియలేదు.

అతడన్నాడు, "నేను ఎన్నడూ దీనిని రుజువు చేయలేదు. శాఖా సంబంధమైన అంగీ నాకు ఇమడదు. దానిని తీసివేయండి. దేవుడు నాకు సహాయము చేసిన దానితోనే వెళ్ళనివ్వండి." అదే దేవుని యొక్క శక్తినందలి విశ్వాసము. మరియు అతడు తన స్వబుద్దిపై ఆధారపడలేదు. ఎవరో చెప్పిన దానిపై కూడా అతడు ఆధారపడలేదు. అతడు విశ్వాసముపై ఆనుకొన్నాడు, కారణము దేవుడు ఎలుగుబంటి నుండి విడిపించినట్లైతే, మరి ఎంత ఎక్కువగా, ఆయన ఆ ఫిలిష్తియుని నుండి విడిపించగలడు.

సరే, పాపము నుండి నిన్ను విడిపించి మరియు పరిశుద్ధాత్మతో నింపుటకు, తగినంత సమృద్ధిగా దేవుడు నిన్ను ప్రేమించినట్లైతే, వెన్ను ఎముకలేని, ఈ ఊరు చుట్టూయున్న బలహీనతలతో యున్న చిక్కు ఏమిటి? ఆయన దానిని చేస్తానని వాగ్దానము చేసినపుడు, మరి ఎక్కువుగా నీ యొక్క బాధ నుండి విడిపించడా? దేవుని వాక్యము ఆ రీతిగా చెప్పియున్నది. ఆయన దాని చేస్తాడు. నిశ్చయముగా, అతనిని శత్రువు చేతిలో నుండి విడిపిస్తాడు.

MATT 14:4•

ACTS 23:3

 

63ఓ, ప్రతి ప్రవక్త, వారి యుగములోయున్న వారి స్వబుద్దిపై ఆధారపడితే ఏమి జరిగేది? అలాగైతే వారు ఎన్నడూ ఆ యాజకులు, ఆ ప్రధానయాజకుల యొద్దకు వెళ్ళి, "మీరు సున్నము కొట్టిన సమాధులు," అని పిలిచేవారు కాదు. వారికి ఎన్నడూ విరుద్దముగా ప్రవచించే వారు కాదు. ఈ అధునాతన ప్రవక్తలలో కొందరి వలె, అన్నిటితో సమ్మతించి, చక్కని దుస్తులు ధరించి, రాజ భవనములలో యుండి యుండేవారు.

ఒకవేళ యోహాను, తన స్వబుద్ధిపై ఆధారపడియుంటే, ఏమి జరిగియుండేది? కాని అతడు తిన్నగా పైకి నడిచి వెళ్ళాడు. వారన్నారు, "ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగు, యోహాను, నీవు వివాహము మరియు విడాకులు, మీద బోధించవద్దు."

అతడు తిన్నగా హేరోదు రాజభవనము నొద్దకు నడిచి వెళ్ళి, "నీవు ఆమెను యుంచుకొనుట న్యాయము కాదు!" అవునండి.

చెప్పెను, "సరే, అతను ఎవరో నీకు తెలుసా? అతనొక ప్రవక్త."

"అతను ఎవరైనా నాకు లెక్క కాదు!" అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు.

వారన్నారు, "ఇప్పుడు నీకు తెలుసా, నీ దగ్గర ఎక్కువలేదు — నీవు కేవలము అరణ్యములో క్రిందయున్నావు. నీవు ఆలాగున ప్రవర్తించినట్లైతే, సంఘ సమాఖ్య నిన్ను స్వీకరించదు." అతడు ఏ సంఘ సమాఖ్యను గూర్చి లెక్క చెయ్యలేదు. అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు, కాని దేవుని గ్రహింపుపై ఆధారపడ్డాడు. నిశ్చయముగా.

64అక్కడ ఒక మనిషియున్నాడు, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడ్డాడు, అతని పేరు యూదా ఇస్కరియోతు.

ఓ, అతడు… దానిని ఎలా చేశాడో నేను చూడలేను. ఆదిలో సరిగా హవ్వ చేసినట్లుగానే, అతడు ముఖాముఖిగా క్రీస్తుతో నడిచాడు. ఆయన సత్యము అనే రుజువును అతడు చూసియున్నాడు, సాయంకాలము చల్లపూట గెత్సెమనే తోటలో మరియు ఇతర స్థలములలో కూర్చొన్నాడు, మరి అదే క్రీస్తు వైపు చూసియున్నాడు, ఆయన ఉపదేశించుటను విన్నాడు, వాక్యము ద్వారా ఆయన రుఋజువు చేయబడుట, మోషే వంటి ప్రవక్త లేపబడతాడని, అది సత్యమని రుజువు చేయబడుటను చూశాడు. ఆయన ఎవరైయున్నారో, దానినంతటిని గూర్చి లేఖనములో వారికి చెప్పియున్నాడు. అది ఆయనేమైయున్నాడని, దేవుని చేత అది రుజువు చేయబడుటను వారు చూసియున్నారు, మరియు తరువాత అతడు తన స్వబుద్ధి పై ఆధారపడ్డాడు. హ!

REV 3:20

 

65అతడు దానిని చేయవచ్చునా? దానికి ఎందుకనగా మొదటి స్థానములోనే అతడు దానిని లోపల కలిగిలేడు. అతడు జీవపు అంకురముగల విత్తనము కాదు. అతడు నాశన పుత్రుని కుమారుడైయున్నాడు, తిరిగి నాశన పాత్రునిలోనికి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు మనము గమనిస్తాము… కాని అతడు బయలు వెళ్ళినపుడు, అతడు తన సొంత ఆలోచనను కలిగియున్నాడు. యేసు నా పట్ల ఎంతో గౌరవములను కలిగియున్నాడని అతడు తలంచాడు." ఇప్పుడు, నీకు తెలుసా, నేను ఆయనను ముప్పది వెండి నాణెములకు అమ్ముతాను. మరియు నేను దానిని చేసినట్లైతే, నాకు కొంత డబ్బు వుంటుంది, నేను దానితో ఏదైనను చేయవచ్చును. ఆయననే అప్పగించుటకు సిద్ధమయ్యాడు." చూడండి, లేఖనములో ఆ స్థానమును తీసుకొనుటకే అతడు లేపబడియున్నాడని, అతనికి తెలియదు.

ఆలాగుననే ఈ దినమునయున్న ప్రజలు, వారు ఏ స్థితిలోయున్నారో గ్రహించరు. లవొదకయ సంఘము, ఆ స్థితిలోనే యుండుటకు నిర్ణయించబడింది, క్రీస్తును బయట ఉంచింది. ఆయన తిరిగి లోనికి వచ్చుటకు ప్రయత్నము చేస్తూ, తలుపు తట్టుచున్నాడు, అయినను ఎక్కడా సహకారము లేదు. ప్రతి దినమున చేసినట్లుగా, ఈ దినము వాక్యమును రుజువు చేయుచున్నాడు, మరియు వారు దాని నుండి తిన్నగా, దూరముగా నడిచి వెళ్ళిపోవుచున్నారు. వారి స్వబుద్ధిపై ఆధారపడుచున్నారు, దానికున్నది అంతమట్టుకే.

2TIM 3:5

 

66ఓ, బహుశ, అతడు ఏమి తలంచాడో, దీనిని మనము చెపుదాము. బహుశ, ముప్పది వెండి నాణెములకు క్రీస్తును అమ్మి వేసినట్లైతే, ఎందుకనగా ఆ దినమునయున్న గొప్ప సంఘ శాఖలతో అతడు సహవాసమును కలిగియుంటాడు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. "ఇప్పుడు ఆగండి, తన పట్ల తాను శ్రద్ద వహించగలడని, అతడు చెపుతాడు. గొప్ప పోరాటములలో నేను ఆయనను చూసియున్నాను. నాకు అది తెలుసు… ఇప్పుడు అతడు తన పట్ల తాను శ్రద్దవహించగలడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకొని, ఒక రకముగా, అది యున్నట్లుగా, పదవీ విరమణ చేస్తాను. మరియు అప్పుడు, తరువాత, ఈ దినమునయున్న సంఘములతో ఒక గొప్ప స్థానమును కలిగియుంటాను, నేను ఆయనను వారికి అప్పగించినట్లైతే." చూడండి?

ఆయన రుజువు చేయబడిన దేవుని వాక్యమైయున్నాడు అని గ్రహింపుకు బదులుగా, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడ్డాడు. లేఖనము అతడు ఏమి చేస్తాడని చెప్పిందో, దానినే అతడు యేసుకు చేశాడు. ఈ రోజున, ఈ చివరి దినములలో సంఘ ప్రపంచము, క్రీస్తును బయటకు త్రోసివేసింది. ఖచ్చితముగా ప్రకటన గ్రంథములో వారు చేస్తారని చెప్పినట్లుగా చేసింది. అది సంఘ రూపములో యున్న యూదాయైయున్నాడు, "పైకి భక్తిగల వారివలెయుండియూ దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు." అది నిజము.

ఇప్పుడు, ఓ, మై! దాని ఫలితము ఏమిటి? మరణము, అది సరిగ్గా హవ్వకు చేసినట్లుగానే. దేవుని వాక్యమును వక్రీకరించి, వారి స్వబుద్దిపై ఆనుకొనే వారందరికీ, అది దానినే చేస్తుంది. ఇప్పుడు కూడా వారు అమ్ముచున్నారు, ముప్పది వెండి నాణెముల కొరకు కాదు, కాని వారు బహుశ గొప్ప అధికారిగా మారుతున్నారు, ఏదో వేదాంత అనుభవము. కనీసము ముప్పది వెండి నాణెముల విలువ వుండదు, కాని ఎలాగైనా వారు దానిని అమ్ముతారు. అలాటి దాని కొరకు, వారి గ్రహింపును అమ్ముతున్నారు.

JOHN 4:29•

ACTS 22:6•

1COR 2:1,4•

GAL 1:8

 

67తాను నేర్చుకొన్న జ్ఞానమంతటిని బట్టి, గొప్పలు చెప్పుకొనగలిగే పరిశుద్ద పౌలు నుండి అది ఎంత భిన్నముగాయున్నదో కదా. కాని అతడన్నాడు, "నా తర్కములన్నిటిని, మొత్తము నేను క్రింద పడవేసియున్నాను. దమస్కునకు వెళ్ళే మార్గమున, ఒక దినమున నేను అగ్నిస్తంభమును కలుసుకొన్నాను."

అతడన్నాడు, "నేను ఎన్నడూ మీ యొద్దకు వాక్చాతుర్యముతో రాలేదు, ఎందుకనగా నేను అలా వస్తే, మీరు మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనేవారు. కాని మీరు దేవుని యొక్క వాక్యముపై ఆనుకొనునట్లు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కనపరుస్తూ మీ యొద్దకు వచ్చాను." ఆమేన్.

"పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతయైనను, దీనికి వ్యతిరేకముగా బోధించినట్లైతే, వాడు శాపగ్రస్తుడగును గాక!" గలతీ 1:8. అది నిజము. లేదండి, అతడు ఎన్నడూ.

బావి నొద్దయున్న ఆ చిన్న స్త్రీ, ఆమె ఒక చెడ్డ స్త్రీ, అయితే సంఘములన్నీ ఆమెను వెలివేసియున్నవని ఆమెకు తెలుసు. కాని ఆమె ఎన్నడూ తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. ఆమె బావినొద్ద ఈ మనిషిని కలుసుకొన్నప్పుడు, ఆయన ఆమె చేసిన పాపములన్నిటిని, ఆమెతో చెప్పియున్నాడు, అప్పుడు ఆమె పట్టణములోనికి పరుగెత్తుకొని వెళ్ళింది. లోనికి వెళ్ళి ఏదైనా చెప్పుట, ఇప్పుడు అలాటి దానిని చేయుట ఆమెకు సరి కాదు, ఎందుకనగా ఆమె ఒక వేశ్యయైయున్నది.

ఆమె యేసును కలుసుకొన్నప్పుడు, ఆ దినముల ప్రజల యొక్క గ్రహింపుపై, ఆమె ఎన్నడూ ఆధారపడలేదు. ఆమె వచ్చి, చెప్పింది, "రండి, ఈ విషయములన్నియూ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఈయన మెస్సీయా కాడా?" ఆమె ఎన్నడూ తన స్వబుద్దిపై ఆధారపడలేదు. లేదు.

LUKE 1:35,38

 

68కన్య మరియ, పురుషుని ఎరుగకుండా, ఆమె ఒక బిడ్డను కనబోవుచున్నదని, గబ్రియేలు ఆమెను కలుసుకొని చెప్పినపుడు… అయ్యో! ఎన్నడూ జరిగియుండలేదు! ఆమె ఎప్పుడూ తన స్వబుద్ధిపై ఆధారపడలేదు, ఒక భర్త లేకుండా ఒక స్త్రీ, ఒక బిడ్డను పొందలేదు. ఆమె దానిపై ఆధారపడలేదు.

కాని ఆమె అన్నది, "ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట ప్రకారము నాకు జరుగనిమ్ము." "నేను దానిని ఎలా చేయబోవుచున్నాను?" అని ఆమె చెప్పలేదు. "ఎప్పుడు నేను దానిని చేయగలను? మరియు ఇదంతా ఎలాగు సంభవించబోవుచున్నది?"

దూత చెప్పెను, "పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు; నీ నుండి పుట్టబోయే పరిశుద్ధమైనది, దేవుని కుమారుడుగా పిలువబడతాడు."

ఆమె అన్నది, "ఇదిగో ప్రభువు దాసురాలను." అది జరుగదని ఆమె తన తర్కమును తీసుకొనలేదు. ఆమె కేవలము అన్నది, "ఇదిగో ప్రభువు దాసురాలను." అది నిజము.

MATT 9:20,21•

MARK 5:26-30•

LUKE 8:43-45

 

69గమనించండి. రక్తస్రావముగల స్త్రీతో వైద్యుడన్నాడు, "నీకు ఏ ఆశయు లేదు." ఆమె తన జీవనమంతయూ, వైద్యులకు ఖర్చు పెట్టింది, కాని ఎవరూ ఆమెకు సహాయము చేయలేదు. మరియు ఆమె దానిపై ఆనుకొనలేదు. యేసు జన సమూహము గుండా వెళ్ళుచున్నప్పుడు, ఆమె అనుకొన్నది, "నేను ఆ మనిషి వస్త్రములను ముట్టినట్లైతే, నేను బాగుపడతాను." ఆమె పైగా వెళ్ళింది.

"ఇప్పుడు ఆగు," వైద్యుడు అన్నాడు, "నీవు స్వస్థపడలేవు." ఆమె ఈ రక్త స్రావమును ఎన్నో సంవత్సరముల నుండి కలిగియున్నది. ఆమె ఎల్లవేళలా బలహీనముగా మారి, అధ్వాన్నముగా మారింది. వైద్యులు ఆమెను వదిలి వేసుకొన్నారు. వారు కలిగియున్న అవగాహన అంతయూ అదియే.

కాని ఆమె చెప్పింది, "విశ్వాసము ద్వారా!" ఆమె దానిని చేయాలని అక్కడ ఏ లేఖనము చెప్పలేదు. అయితే ఆమె అన్నది, "నేను ఆయన వస్తపు చెంగును తాకితే చాలును, నేను బాగుపడతాను." ఆమె చుట్టూ జారుకొంటూ ఆయనను తాకింది. ఆమె వెనుకకు నడిచి, కూర్చొంది.

యేసు చుట్టూ తిరిగి అన్నాడు, "నన్ను ఎవరు ముట్టారు?" ఆమెను కనుగొను వరకు ఆయన చుట్టూ చూశాడు. ఆమె రక్తస్రావమును గూర్చి ఆయన చెప్పాడు. ఆమె తన సొంత శరీరములో దానిని గ్రహించింది. అప్పుడు ఆమె దానిని రుజువు చేయలేకపోయింది, కాని ఆమె సొంత శరీరములో రక్తస్రావము ఆగిపోయినట్లు ఆమె గమనించింది. ఆమె ఎన్నడూ తర్కించలేదు. "వైద్యులు ఆమెను త్రోసివేసియున్నట్లైతే, ఇంకా ఏదైనా ఎలా ఆమెకు సహాయము చేయగలదు?" ఆమె ఎన్నడూ తర్కములోనికి వెళ్ళలేదు, కాని ఆమె విశ్వాసములోనికి వెళ్ళింది.

HEB 4:15•

HEB 13:8

 

70ఇప్పుడు, బైబిలు చెప్పెను, "ఈ రోజున, మన రోగముల చేత ఆయనను తాకగలుగునట్లు, ఆయన మన ప్రధానయాజకుడైయున్నాడు." అది నిజము? తర్కములోనికి వెళ్ళవద్దు. "ఓ, అది.."

ఆయన అన్నాడు, "ఈ రోజు." ఆయన ఇప్పుడే తిన్నగా, మన రోగముల చేత తాకగలుగునట్లు, ఆయన మన ప్రధానయాజకుడైయున్నాడు… నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు!

ఒక బాప్టిస్ట్ బోధకుడిగా నేను అక్కడయున్నప్పుడు, ప్రభువు దూత నన్ను అక్కడ కలుసుకొని, ఇప్పుడు నేను చేయుచున్న దానిని చేయమని చెప్పినప్పుడు, మీరు ఏమని ఆలోచిస్తారు? ఎందుకు నా సంఘ కాపరి అన్నాడు, "నీవు పిచ్చివాడవైపోయావు, నీకు ఒక పీడ కలవచ్చింది."

నేనన్నాను, "ఇప్పుడే నా సహవాసపు కార్డును నీవు తీసివేయుట మంచిది."

ఇప్పుడు, అతడన్నాడు, "కనీసము నీకు వ్యాకరణము పాఠశాల విద్యలేకుండా, ప్రపంచము చుట్టూ ఎలా బోధించగలవు? రాజుల కొరకు అధిపతుల కొరకు నీవు ఎలా ప్రార్థన చేయగలవు, కనీసము వ్యాకరణపు విద్య నీకు సరిగ్గా లేదు?"

నేను నా వ్యాకరణ విద్యను నమ్మలేదు. నాకున్న ఏ సామర్ధ్యమును నేను నమ్మలేదు. నేను ఆజ్ఞాపించబడ్డాను. హల్లెలూయ! మరియు నేను తర్కములోనికి వెళ్ళలేదు, నేను తర్కములను విన్నట్లైతే, బహుశ వేలమంది ప్రజలు, కొన్ని సంవత్సరముల క్రితము చనిపోయియుండేవారు. అయితే ప్రపంచము చుట్టూ, చుట్టూ, ఆయన ఖచ్చితముగా చెప్పినట్లుగా, ఒక వర్తమానమును మోసుకొని వెళ్ళాను.

71దేవుని కృపను బట్టి, నేను మరలా వెళ్ళుచున్నాను — తర్కముల ద్వారా కాదు, కాని ఒక ఆజ్ఞ ద్వారా. హల్లెలూయ!

నీవంటావు, "నీకు ఏభై-ఐదు యేళ్ళు?" నేను దానిపై ఆనుకొనను. నాకు తొంబై-ఐదు యేళ్ళయైనా, అది నాకు ఒక లెక్క కాదు. ఆయన ఇంకనూ అబ్రాహాములో యున్న, అదే దేవుడైయున్నాడు. అవునండి! నీ స్వబుద్దిపై ఆధారపడవద్దు.

సూచన బయలువెళ్ళిన తరువాత, మరియు స్వరము దానిని వెంబడించుచుండగా, సిద్ధాంతముపై సంఘము నన్ను తోసివేసి, మరియు ద్వారములను మూసివేశారు, వారిలో ఎవరైనను నా ముందు ధైర్యముగా నిలబడి, అది నిజమో లేక తప్పో చెప్పమనండి.

వారిలో ఎవరినైనా నేను సవాలు చేస్తాను! తెలివిగా యుండాలని కాదు, కాని నేను ఎక్కడ నిలబడియున్నానో, నాకు తెలుసు. అది నిజము. వారు ఏమి చేశారు, వారు ఎందుకు చేశారు? వారు ప్రతి తలుపును మూసివేశారు. ఇప్పుడు, నీవు ఏమి చేయబోవుచున్నావు?

72మొన్నటి దినమున, ఆ పర్వతము మీద నేను నిలబడియున్నాను, "ప్రభువా, నేను ఎరిగియున్నంత వరకు, మొత్తము దేశములో నాకు ఒకే తెరువబడిన ద్వారమున్నది, అదే ఆరిజోనాలోని, ఫినిక్సు. నేను కలిగియున్న ఒకే ఒక్కటి."

నేను పర్వతము మీద నుండి క్రిందికి వచ్చుట ప్రారంభించాను. నేను ఎన్నడైనా ఎవరైనా మాట్లాడుట వినియున్నంత తేటగా చెప్పింది, "దాని వలన నీకు ఏమిటి? నీవు నన్ను వెంబడించుము." అలాగైతే, నా స్వబుద్ది పై ఆధారపడను. నేను ఆయన వాగ్దానముపై ఆనుకొంటాను!

ఓ, స్నేహితుడా, తర్కములపై ఆనుకొనవద్దు. అప్పుడు, ఆ పాతకాలపు ఎడ్డీ పెర్ నెట్ తో నీవు, బిగ్గరగా కేక వేస్తావు:

యేసు నామము శక్తికి అందరూ నమస్కారము చేస్తారు!

దూతలు క్రిందపడి సాగిలపడెదరు;

రాజరికపు కిరీటమును ముందుకు తెద్దాము,

మరియు అందరికి ప్రభువుగా కిరీటము పెడదాము;

అందరికి ప్రభువుగా కిరీటము పెడదాము.

అది నిజము. నీవు ఆలోచించే దాని మీద, ఎవరో ఆలోచించే దాని మీద ఆధారపడవద్దు. విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానమును స్వీకరించుము. మీరు దానిని చేస్తారా? ఇప్పుడు దానిని ఎవరో చేసినా, లేక వారు దానిని చేయకపోయినా, నీ సంగతి ఏమిటి?

ఆ దినమున చేసినట్లుగానే, ఈ దినమున తన్ను తాను తెలియపర్చుకొన్న, క్రీస్తు అనబడిన యేసుతో నీవు ఏమి చేస్తావు? నీవు ఆయనను నమ్ముతావా? మనము ప్రార్థించుకొందాము.

HEB 13:8•

REV 1:8•

REV 22:16

 

73ప్రభువైన యేసు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, అధిపతులందరికి దేవుడా; మొదటి వాడా, కడపటి వాడా; అల్ఫా, ఓమెగయు; ఆదియు మరియు అంతమునైయున్నవాడా; ప్రకాశమానమైన వేకువ నక్షత్రమా, షారోను పద్మమా, లోయలోని పద్మమా, దావీదు వేరు చిగురు; రమ్ము, ప్రభువైన దేవా, నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నవాడా! ప్రభువా, ఈ జన సమూహమును దీవించండి.

ఇది… సరిగ్గా రేపు ప్రారంభించుటకు సిద్ధమగుచున్నాము, ఇక్కడ మేము ఒక చిన్న కూటమును కలిగియున్నాము దానిలో నీవు మమ్మును దీవించావు. నిన్నునీవు మాకు తెలియపర్చుకొన్నావు. దేవా, నా ప్రార్థనయేమనగా, మాకు, నిన్ను నీవు ఇంకా తెలియపర్చుకోండి, ఈ రాత్రి మమ్మును దీవించండి. ఇప్పుడు మాకు సహాయము చేయండి. మేము అవసరతలోయున్న ప్రజలము.

ప్రభువా, ప్రజలను గద్దించుట నాకు ఇష్టము లేదు, అయితే నేను ఎలా ఆపరిశుద్ధమైన మంటను నిశ్శబ్దము చేయగలను? ప్రభువా, అది చేయుట నాకు ఇష్టము లేదు. నా జీవితము, నా హృదయము నీకు తెలుసు. నేను దానిని తప్పక చేయాలి. దేవా, దానిని చేయుటకు నీవు నాకు సహాయము చేయుమని ప్రార్థిస్తాను. మరియు నా స్వబుద్ధిపై నేను ఎన్నడూ ఆధారపడకుండా, నీ వాగ్దానముపై ఆనుకొనునట్లు, నాకు కృపనిమ్ము. యేసు నామములో. ఆమేన్.

74కొన్ని నిమిషములు, మీలో ప్రతి ఒక్కరూ నిజముగా గౌరవముగా యుండండి. ఈ జనసమూహములో, అక్కడ స్త్రీలు మరియు పురుషులు కూర్చొనియున్నారు, సందేహము లేదు, వారు రోగులైయున్నారు. ఇక్కడ ఎంతమంది రోగులు, బాధించబడుచున్నవారు యున్నారో, మీ చేతులను ఎత్తి చెప్పండి, "నాకు దేవుడు అవసరము." ఇప్పుడే తిన్నగా మీ చేతులను ఎత్తండి, "నాకు దేవుడు అవసరము."

ఇప్పుడు, ఎక్కువ మంది నాకు తెలియదు. ఇక్కడే కూర్చొనియున్న ముగ్గురు కుర్రవాళ్ళు నాకు తెలుసు. నాకు తెలుసు, అక్కడ డౌ ఆయన భార్య కూర్చొనియున్నారు. ఈమె సహోదరి మూర్ అనుకొంటాను. అది నిజమేనా, సహోదరి మూర్? దానికి బయట, నేను చూడగలిగినంత వరకు, వేదిక నొద్ద సోదరుడు మైక్, నీకు తెలుసు. అంత మట్టుకే. అయితే, పరలోకపు తండ్రీ, సొదొమ నొద్ద ఖచ్చితముగా ఆయన చేసినట్లుగా, ఈ దినమున ఆయన తన్ను తాను రుఋజువు చేసుకొంటాడు… దానిని ఆయన వాగ్దానము చేశాడా? తన్ను తాను ప్రత్యక్షపర్చుకున్నడా? నీవు దానిని నమ్ముతావా?

1TIM 2:5•

HEB 4:15•

HEB 13:8

 

75ఇప్పుడు, నీవు విశ్వాసమును బట్టి ప్రార్థించినట్లైతే…

ఇప్పుడు, తర్కించుటకు ప్రయత్నము చేయవద్దు, "ప్రధానయాజకుడిగా నేను ఎలా తీయనను తాకగలను?" ఇప్పుడు, బైబిలు చెప్పుచున్నది, క్రొత్త నిబంధనలో, "ఇప్పుడే ఆయన ప్రధానయాజకుడైయున్నాడు. మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున, ఆయన ప్రధాన యాజకుడిగా, ఆయన కొనసాగుతాడు. ఆయన ఎల్లప్పుడు మన ప్రధానయాజకుడైయున్నాడు. అక్కడ ఆయన తప్ప ఏ ఇతర ప్రధానయాజకుడు లేడు. దేవునికి మరియు మనుష్యులకు మధ్య ఏ మధ్యవర్తియు లేడు, క్రీస్తు యేసు అను నరుడు తప్ప." అది నిజము. ఆయన ఒక్కడు మాత్రమేయున్నాడు, మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

ఇప్పుడు ఆయన అదే ప్రధాన యాజకుడిగా నిలిచియున్నట్లైతే, బైబిలు చెప్పెను, మనము మన వ్యాధులు, బాధల ద్వారా ఆయనను తాకవచ్చును — ఆ స్త్రీ ఆయన యొక్క వస్తపు చెంగును తాకినట్లుగా — నీ విశ్వాసమును ఈ రాత్రి ఆయనను తాకవచ్చును. మరియు శరీరములో యుండగా ప్రవర్తించినట్లుగా, అబ్రాహాము యొక్క సింధూర వనము నొద్ద, మానవ శరీరములో యున్నట్లుగానే, ఆయన అదే ప్రకారము ఇప్పుడును పని చేస్తాడు. నీవు దానిని నమ్ముతావా? దానిని ఆయన చేస్తాడని వాగ్దానము చేసియున్నాడు.

అవసరతలో యున్న ఎవరైనా… కేవలము ప్రార్ధించండి. మరియు నేను…

ROM 11:29

 

76అది నేను చెప్పినట్లుగా, ఒక వరమనగా ఏదో నీవు ఒక కత్తిని తీసుకొని, మరియు దానితో దీనిని కోయుట కాదు, నీవు దానిని కోయగలవు. లేక నీవు దీనిని కోయగలవు, నీవు కోరిన దానిని నీవు కోయగలవు. అది ఒక దేవుని యొక్క వరము కాదు చూడండి. కాదు.

ఒక దేవుని వరమనగా, నీవు ఒక విధముగా, మార్గములో నుండి నిన్ను నీవు తొలగించుకొనుటయే. వరములు మరియు పిలుపులు, దేవుని యొక్క ముందు నిర్ణయమైయున్నది. "వరములు మరియు పిలుపులు మారుమనస్సుతో ప్రమేయములేనివి." నీవు దానితో జన్మించియున్నావు. ఒక చిన్న గేరు పైకి నిన్ను నీవు లోనికి లాగుకొనవచ్చును, కాని నీవు పెడలు మీద కాలు పెట్టలేవు, చూడండి. దేవుడు దానిని నడపవలసియున్నది.

నిన్నునీవు మార్గము నుండి, బయటకు తొలగించుకొనవలసియున్నది.

నీ విశ్వాసము దానిని నడిపించగలదు, నా విశ్వాసము కాదు. నాదేమనగా మార్గములో నుండి దానిని బయటకు తొలగించుటయే. ఈ దినమున యేసుక్రీస్తు జీవించుచున్నాడని, నీ హృదయమంతటితో నమ్ముతావా?

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15

 

77నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు, నీవంటావు, "సరే, ఇప్పుడు చూడు, సోదరుడా, నేను చాలా తీవ్రమైన స్థితిలోయున్నాను. నీకు నేను తెలియదు. నేను ఈ చక్రాల కుర్చీలో యుండియున్నాను, నేను యుండియున్నాను…"

నీవు ఏ స్థితిలో యుండియున్నా నేను లెక్క చేయను. ఆయన భూమి మీద భౌతికమైన శరీరములోయుండగా, ఖచ్చితముగా ఏమి చేసియున్నాడో, దేవుడు ఇప్పుడు దిగి వచ్చి దానినే చేయడేమో చూడు. ఏకముగా ఆయనను నమ్ముచున్న ఒక భాగముగా, నీ శరీరములో, నా శరీరములో ఆయన చేస్తాడు, ఎందుకనగా ఆయన దానిని చేస్తానని వాగ్దానము చేశాడు.

ఇప్పుడు, ఎవరో చెప్పిన దానిపై ఆధారపడవద్దు, "ఓ, అది మనసు చదువుట," అని వారు దానిని పిలుస్తారు. యేసును కూడా వారు అలాగే అన్నారు. ఆయన ఒక జాతకము చెప్పేవాడని, "ఒక దయ్యము," అని వారన్నారు. అయితే ఆయన దేవుని కుమారుడైయున్నాడు, ఎందుకనగా ఆయన వాగ్దానము చేయబడిన దేవుని వాక్యమైయున్నాడు.

JOHN 10:37,38•

HEB 13:8

 

78ఇప్పుడు, నేను చెప్పినట్లుగా, మన స్థలములలో… మేము అక్కడకు వచ్చి ప్రజలపై చేతులను ఉంచనవసరము లేదు, గత రాత్రి మేము వారిపై చేతులుంచాము, కాని మీరు కలిగియుండవలసిన ఒకటి మాత్రమే, అదే విశ్వాసము, విశ్వాసము ద్వారా దానిని అంగీకరించుము. ఇంకా దేని ద్వారా కాదు…

"సరే, ఇప్పుడు అది ఎలా సంభవిస్తుంది?" అని చెప్పవద్దు. అది ఎలా జరుగుతుంతో నేను మీకు చెప్పగలిగినట్లైతే, అప్పుడు అది ఎంత మాత్రము విశ్వాసము కాదు. అది ఎలా జరుగుతుంతో నాకు తెలియదు. నాకు తెలియదు, కాని నేను దానిని నమ్ముతాను దేవుడు ఒక పాపిని ఎలా రక్షిస్తాడో నాకు తెలియదు, కాని ఆయన దానిని చేస్తాడు. ఈ కార్యములలో ఏదైనా దేవుడు ఎలాగు చేస్తాడో నాకు తెలియదు, కాని నేను అది అంగీకరిస్తాను. ఆయన దానిని చేస్తాడు, అదే మార్గము… ఏలయనగా నేను దానిని వివరించలేను. అది ఎన్నడూ వివరించబడదు. ఎవరూ వివరించలేరు, ఏలయనగా నీవు వివరించినట్లైతే, అప్పుడు అది ఎంత మాత్రమును విశ్వాసము కాదు.

దేవుడు మరియు క్రీస్తు, ఎలా ఒకే వ్యక్తి, నేను చూడలేను, కాని వారు ఒకే వ్యక్తి. లేఖనము చెప్పుచున్నది. సరే, నీవు దానిని వివరించలేవు, కాని, వారు ఒక్కటే. "నా తండ్రి నాలో యున్నాడు, ఆ క్రియలు చేయునది నేను కాదు, నాలోయున్న తండ్రి. నేను ఆయన క్రియలు చేయనట్లైతే, అప్పుడు నేను ఆయనవాడను కాదని, అది చూపుతుంది. కాని నేను ఆయన క్రియలు చేసినట్లైతే, అప్పుడు నేను ఆయన వాడనని, ఆయన తన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు." సరే, ఇప్పుడు అదే కార్యమైయున్నది. ఇప్పుడు, ఖచ్చితముగా అదే కార్యము. మీరు నమ్మినట్లైతే, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు.

79అక్కడ తిన్నగా నా ముందు ఒక మనిషి కూర్చొనియున్నాడు, అతడు నల్లని వెంట్రుకలను కలిగియున్నాడు. అతని చేతికి గడియారము పెట్టుకొన్నాడు, నల్లటి సూటు ధరించాడు. అతడు కళ్ళజోడు పెట్టుకొన్నాడు. తిన్నగా మీరు ఇక్కడ చూసినట్లైతే, కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయుటను మీరు చూస్తారు. ఆ మనిషి నాకు తెలియదు. నాకు అతడు తెలియదని పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఒక్క నిమిషము, నేను అతనిని చూడగోరుచున్నాను, ఎందుకనగా అతడు అక్కడ కూర్చొని, ఎంతో యధార్థముగా యున్నట్లు కనబడుచున్నాడు.

నేను చెప్పినప్పటి నుండి, ఆ మనిషి తన కన్నులు మూసుకొని ప్రార్థన చేయుచున్నాడు. ఆ మనిషి నాకు కొత్తవాడైయున్నాడు. అతడు నాకు తెలియదు. ఆ మనిషి దేవునికి తెలుసు, మరియు ఆయన నాకు దానిని బయలుపర్చుతాడు. బైబిలులోని ఆ వాగ్దానము నిజమైయున్నట్లైతే, అతడు ఎందుకు కళ్ళు మూసుకొనియున్నాడో, దేవుని కొరకు ప్రార్ధన చేస్తున్నాడో, ఆయన నాకు బయలుపర్చగలడు. మీరు దానిని నమ్ముతారా? అయ్యా, నీవు దానిని నమ్ముతావా? నీవు కళ్ళు తెరిచి తిన్నగా ఇక్కడ చూడు. నీవు దానిని నమ్ముతావా? మంచిది. ఇప్పుడు మీకు తెలుసు, నేను నిన్ను ఎరుగను. నీవు నాకు క్రొత్తవాడవైయున్నావు, కాని నీవు దేవునికి తెలుసు. ఇప్పుడు అతడు ఏడ్చుట, దుఃఖించుట ప్రారంభించాడు, ఎందుకనగా దేవుడు అతని మనవికి జవాబు ఇవ్వబోవుచున్నాడని నేను చెప్పగలను, చూచారా? ఎందుకనగా ఆ వెలుగు, అదే అతనిని తాకినది. ఆ వెలుగు — చీకటి నుండి వెలుగుగా మారింది, చూడండి.

80ఇప్పుడు, ఆ మనిషి — వేరొకరి కొరకు ప్రార్థన చేయుచున్నాడు. తన ప్రక్కన కూర్చొనియున్న ఈ చిన్న బాలుని కొరకు. అది అతని సొంత కుమారుడు. అది నిజము. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ కడుపు జబ్బుతో బాధపడుతున్నాడు, ఇంకా అతని ప్రేవులలో కూడా బాధయున్నది. అది నిజము. అది నిజము, నీవు ఇక్కడి వారు కాదు. నీవు ఆరిజోనా వాడివి కాదు, నీవు కాలిఫోర్నియా నుండి వచ్చావు. నిజము. నీవు ఒక సేవకుడవు, నీ సహవాసము అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ తో యున్నది, అది సత్యము. రెవరెండ్ మెక్ కె నీ పేరు, లేక రెవరెండ్ కెబ్, అది నిజము. అది నిజమేనా? నీ చేతిని ఇలాగు ఆడించు. ఇప్పుడు నీ చిన్న బాలుడు స్వస్థపడబోవుచున్నాడు.

నీ విశ్వాసము… ఇప్పుడు ఏమిటి… అక్కడ చేతులను ఎత్తిన మనిషియున్నాడు. అతడు నాకు తెలియదు, నేను అతనికి తెలియదు. కాని అది ఏమైయున్నది? అతడు ప్రధానయాజకుని కలుసుకొన్నాడు. ఇప్పుడు, చూడండి, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. ఇప్పుడు అతడు తప్పక ఏమి చేయాలి, అతడు ఇప్పుడు ఏమి చేశాడు? అతనికి చెప్పబడినది, సత్యమైయున్నదని అతడు తప్పక నమ్మాలి, ఎందుకనగా నేను అతనికి తెలియదు. అది నిజము.

81ఇక్కడ, ఇక్కడే ఒక స్త్రీ, ఆ దిగువన నాముందు కూర్చొన్నది, ఆమె కూడా, తలవంచియున్నది. ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్నది. ఆమె కూడా కాలిఫోర్నియా నుండి వచ్చింది. ఇది ఆమె తప్పిపోదని నేను ఆశిస్తాను. మిస్ ఆడమ్స్, అది ఆమె పేరు. నా జీవితములో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. అవును. అది నిజము.

ఆ వెనుక తిన్నగా అక్కడ ఒక స్త్రీ కూర్చొన్నది. నేను సరిగ్గా ఆమె వైపు వ్రేలు చూపలేను, కాని వెలుగు ఆమె పై వ్రేలాడుతున్నట్లుగా నేను చూస్తాను. ఆమె చాలా ఇబ్బందిలో యున్నది. ఒకటి, ఆమె మెడలో బాధను కలిగియున్నది. మరొకటి, ఆమెకు ఆత్మ సంబంధమైన ఇబ్బందులున్నాయి. ఆమె ఇబ్బంది కలత చెందుట. ఆమెకు కుటుంబ సమస్యలున్నాయి — ఆమె కుమార్తె ఇంటి నుండి పారిపోయింది. అది నిజము. అది సత్యము. అది నిజమేనా? ఆమె తన చేతులను ఎత్తియున్నది. శ్రీమతి. మిల్లర్, అది నిజము. నీవు నమ్ముతావా? దేవుడు ఆమెను ఇంటికి పంపుతాడు, నీ దేహమును బాగు చేస్తాడు. ఇప్పుడు, నా జీవితములో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. ఆమె సంపూర్ణముగా, మొత్తము క్రొత్త వ్యక్తి.

ఇక్కడ శ్రోతలలో ఒక స్త్రీ కూర్చొనియున్నది. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు, ఆమె కూడా కాలిఫోర్నియా నుండి వచ్చింది. ఆమె క్యాన్సర్ వ్యాధిని కలిగియున్నది, మరియు అది ఆమె రొమ్ముపై యున్నది. ఆమె రొమ్మునకు శస్త్ర చికిత్స జరిగియున్నది, మరియు అది మరొక రొమ్ములోనికి వెళ్ళింది నిజము. మిస్ కాల్విన్, అది నిజము. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నవా? నీవు నమ్ముచున్నావా? మనము ఎప్పుడు కలుసుకోలేదు. నీవు నాకు తెలియదు, అది నిజాము, చూచారా.

దేవుడు ఇక్కడ హాజరైయున్నాడని నీవు తెలుసుకోవాలి!

PROV 3:5

 

82అక్కడ ఒక స్త్రీ తిన్నగా ఆమె ప్రక్కనే కూర్చొన్నది. ఆమె పేరు శ్రీమతి. హారిస్. ఆమె నాకు పరిపూర్ణముగా ఒక కొత్త వ్యక్తి. కాని ఆత్మ ఈ స్త్రీని తాకినపుడు, ఆమెయు ఆ స్త్రీతో పాటు జాలిపడ్డది. ఆమె కాలిఫోర్నియా నుండి వచ్చింది. అది నిజము. ఆమె భుజముల బాధతో యున్నది. అది నిజము. దేవుడు నిన్ను స్వస్థపర్చుతాడని నమ్ముతావా? అది సత్యమైతే, నీ చేతిని ఎత్తుము, ఆ ప్రకారము ప్రజలు నిన్ను చూస్తారు; పరిపూర్ణముగా క్రొత్త వ్యక్తి. నీ స్వబుద్దిపై ఆధారపడవద్దు.

అది ఏమి చేయగలదు? నీవు దానిని వివరించలేవు. అది ఒక నమ్మలేని నిజం. అది వివరణకు అందదు. ఆ ప్రజలను అడుగుము. నా జీవితములో నేను ఎన్నడూ వారిని చూడలేదు, వారిని గూర్చి నాకు ఏమియు తెలియదు. అది ఆలాగునే ఈ కూటములో ముందుకు వెళుతుంది. కాని, ఇప్పుడు చూడు, నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. కాని ఆయన ఏమి చేస్తానని వాగ్దానము చేశాడో, దానిపై ఆనుకొనుము. అది మానవ శరీరములో జీవించుచున్న అదే ఆత్మయైనట్లైతే, ఆ మనిషి వెనుక గుడారములో కూర్చొన్న శారా నవ్వియున్నదని ఎరిగెను. అది నిజమేనా…?

మరియు ఈ ప్రపంచము అగ్నితో నాశనము చేయబడుటకు ముందు, ఆయన వాగ్దానము చేశాడు, అప్పుడు మనుష్యకుమారుడు అదే ప్రకారము ప్రత్యక్షపర్చబడతాడు… మనుష్యకుమారుడిగా (ప్రవచనాత్మకమైనది), ఈ రాత్రి ఆయన మనతోయున్నట్లుగా, మానవ శరీరములో తన్ను తాను ప్రత్యక్షపర్చుకొంటాడు, అప్పుడు చేసియున్నట్లుగా, ఇప్పుడు ఏ ఘడియలో మనము జీవిస్తున్నాము? సరిగ్గా నాశనమునకు దగ్గరగా యున్నాము.

83స్నేహితుడా, ఇక ఎంతమాత్రము, ఒక పాపిగా అక్కడ నిలబడియుండవద్దు. నీవు ఆయన సన్నిధిలో యుండగానే, యేసుక్రీస్తును అంగీకరించుము. ఇప్పుడు, నీకు తెలుసు, సాధారణముగా సేవకులు బ్రతిమిలాడుట, కథలు చెప్పుట, అమ్మ చనిపోయింది, వెళ్ళిపోయింది, అది ఆచారమైయున్నది. అది మంచిదే. కాని మనము అమ్మ చనిపోయింది, అనే ఆధారముపై రాము. నా తల్లి కూడా చనిపోయింది, నా తండ్రి కూడా చనిపోయాడు. మనము జ్ఞానయుక్తముగా పైకి వస్తాము, కాని లోక పాపమును తీసివేయుటకై, దేవుడు, యేసుక్రీస్తుగా తన్ను తాను ప్రత్యక్షపర్చుకొనుట, అనే ఆధారముపై, మనము వచ్చి ప్రాయశ్చిత్తముపై నమ్మకముంచాలి, మరియు ఆయన తన వాక్యమును రుజువు చేసియుండగా.

నీవు ఏ సంఘమునకు వెళ్ళావో నాకు లెక్క కాదు — మెథడిష్ణు, బాప్టిష్టు, కాథలిక్, ప్రెస్బిటేరియన్, లేక ఏ సంఘమునకు వెళ్ళకపోయినా నాకు లెక్క కాదు, నీవు యున్నట్లైతే, కాని ఇప్పుడు దానిని అంగీకరించగోరినట్లైతే, ఇప్పుడు ఆ వాగ్దానము ఇప్పుడు నీవు నింపబడకపోయినట్లైతే, కూటములు ముందుకు వెళ్ళుచుండగా, నీవు నింపబడతావు. ఆ ఆధారముపై నీవు అంగీకరించగోరినట్లైతే, నీవు నీ పాదముల మీద నిలబడతావా, తిన్నగా నీవు నిలబడిన చోటనే, నన్ను దేవునికి ప్రార్థన చేయనిమ్ము, ప్రతి ఒక్కరూ ఇక్కడ, దానిని ఎరిగినవారు.

84నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు…

సరే, "నేను భాషలతో మాట్లాడియున్నాను," అని చెప్పవచ్చు. అది దానితో చేయునది ఏదియు లేదు. నాకును భాషలు మాట్లాడుటయందు నమ్మకమున్నది. మాంత్రికులు, దయ్యములు భాషలతో మాట్లాడుటను, దానికి అనువాదము చేయుటను నేను చూశాను. అది నిజము. ఇక్కడయున్న మిషనరీలను అడగండి, మనము కనుగొనగలము, క్రేచి సోదరుడా, అది సత్యమని నీకు తెలుసు.

వారు భాషలతో మాట్లాడి మరియు ఒక మనిషి పుర్రెలోని రక్తమును త్రాగి, దయ్యమును పిలుచుట నేను చూశాను. నిశ్చయముగా, వారు ఒక పెన్సిల్ ను క్రింద యుంచినపుడు, అది పైకి లేచి అన్య భాషలు వ్రాయుటను నేను చూసియున్నాను; మరియు మాంత్రికుడు, లేక భూత వైద్యుడు, పైకి నిలబడి, దానిని అనువదించుటను నేను చూశాను.

కాబట్టి భాషలు మాట్లాడుట, నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నావనుటకు రుజువు కాదు. అలాగైతే, నీవు భాషలతో మాట్లాడి వాక్యమును నిరాకరించినట్లైతే, ఎక్కడో ఏదో అక్కడ తప్పున్నది. నిజము. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. మీలో ఎవరో, "నేను కేకలు వేశాను." అంటారు. నేనునూ కేకలు వేశాను, కాని దానిపై ఆధారపడవద్దు. అన్నిరకముల దయ్యపు శక్తులు కేకలు వేయుట మరియు బిగ్గరగా అరచుట నేను చూశాను. మహమ్మదీయులు అరచి బిగ్గరగా కేకలు వేసి చివరకు, వారి చేతులగుండా సూదులను ఈ వైపు నుండి ఆ వైపునకు లాగుచున్నారు.

ఇండియా దేశములో, నేను చూశాను. వారు అరుస్తూ, పైకి కిందికి ఎగురుచూ, యేసుక్రీస్తును నిరాకరిస్తూ, గాలములతో నీటి బంతులను తీసుకొని, వాటిని వారి చర్మము గుండా నెట్టి, మండుచున్న నిప్పు కొరివీలపై నడుస్తున్నారు. అది నిజము.

85చూడు? నీ స్వబుద్దిపై ఆధారపడవద్దు, కాని వాక్యము మీద ఆధారపడుము.

బైబిలుతో నీ జీవితము, దానిలోని ప్రతి మాటను నమ్ముటకు సరితూగనట్లైతే నీవు దానిని నమ్మగోరినట్లైతే, మరియు ఆయన చిత్తమును నీ ద్వారా పనిచేయుటకు ఇష్టపడినట్లైతే, కారణము నీవు దేవునిలో ఒక భాగము కాగలవు. అలాగైతే నీవు నిలబడి చెపుతావా, "సోదరుడా, ఇప్పుడే నేను దానిని అంగీకరిస్తున్నాను."

నీకు వందనములు. నీకు వందనములు. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. నిలబడుతూనే యుండండి, ఈ యధార్ధమైన వారందరిని, దేవుడు మీకు దయచేయును గాక… నీవంటావు, "బ్రెన్హాం సోదరుడా, నేను ఒక సంఘ సభ్యుడను, నేను నిజముగా ఒక పెంతెకొస్తును, అది నిజముగా చెప్పవలసి వచ్చినపుడు, నేను వాక్యమునంతా నమ్ముట సత్యమైయున్నది, నేను దానిని సరిగ్గా చేయలేకపోయాను, కాని నేను దానిని చేయగోరుచున్నాను. నీవు నాకు సహాయము చెయ్యి. నా కొరకు ప్రార్థించుము. నేను నిలబడి చెప్పగోరుదును…"

నీవంటావు, "మంచిది, మనము ఇక్కడ కూర్చొనియుందుము."

లేక, "సంఘములో కూర్చొనియుండగా నేను ఆలాగుయుండియున్నానని సాక్ష్యమిచ్చాను," కాని నీ హృదయములో నీకు తెలుసు, నీవు యధార్థముగా లేవని. దేవునికి తెలుసు, చూడు.

కాబట్టి కేవలము ఎందుకు నిలబడకూడదు? నీ స్వబుద్దిపై ఆధారపడవద్దు, కాని దేవుని వాక్యముపై ఆనుకొనుము.

MATT 5:16

 

86మీరు నిలబడతారా? ఇంకొందరు, ఎవరైనా, నిలబడ కోరుదురా? దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును. నీవు. "దేవా, నాకు సహాయము చేయుము." ప్రభువు మీ అందరిని దీవించును గాక. అది మంచిది నిలబడుతూనే యుండండి.

"అది నాకేదైనా మంచి చేస్తుందా?" అంటావు. ఒకసారి నిలబడుము, అది నిజముగా భావము కాదేమో చూడు, "బ్రెన్హాం సోదరుడా, నేను యధార్థముగా యుండగోరుచున్నాను. నేను యధార్థముగా యుండగోరుచున్నాను."

ఇప్పుడు, నీ సంఘమును విడిచిపెట్టమని నేను చెప్పుటలేదు. లేదండి. నీవు ఎక్కడ యున్నావో, అక్కడే సరిగ్గా నిలబడుము, నిజముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆ సంఘములోనే యుండును.

నీవంటావు, "సరే, నా కాపరి ఏమని అంటాడో." ఆయన ఒక దైవజనుడైయున్నట్లైతే, నీవు దానిని చేసినట్లైతే ఆయన నిన్ను మెచ్చుకొంటాడు, అది నిజము. "ప్రజలు మీ సత్క్రియలను చూసి, పరలోకమందున మీ తండ్రిని మహిమపర్చునట్లు, మీ వెలుగును ఎంతో వారి యెదుట ప్రకాశింపనియ్యుడి."

దేవుడు నిన్ను దీవించును. మంచిది, మీ ఇద్దరు, దేవుడు దీవించును, మరియు నీవు, మరియు సోదరుడా, నీవు. ప్రతి ఒక్కరిని, దేవుడు మిమ్ములను దీవించును. దేవుడు నిన్ను దీవించును.

MARK 8:38•

LUKE 9:26

 

87ఇప్పుడు, చేతులను ఎత్తిన మీరు, చేతులు ఎత్తిన తరువాత మీరు మంచి అనుభూతిని కలిగియున్నట్లైతే, ఇతరులకు మీ చేతులను ఎత్తి, చేతులను ఎత్తిన తరువాత మీకు మంచి అనుభూతి కలిగిందని, చెప్పండి. చూడండి? ప్రతి ఒక్కరు. నిశ్చయముగా, మీరు చేస్తారు, చూడు.

నీవు యధార్థముగా యున్నట్లయితే, నీవు నిలబడియున్నావు, మరియు చెప్పుము, "నేను ఒక సాక్షిగా యుంటాను."

"నా కొరకు ఇక్కడ నిలబడువాని కొరకు, అక్కడ నేను వాని కొరకు నిలబడతాను. మనుషులు ముందు నన్ను గూర్చి సిగ్గుపడువాడు, నేనును నా తండ్రి యెదుట మరియు పరిశుద్ధ దూతల యెదుట వానిని గూర్చి సిగ్గుపడతాను."

ఆయనను గూర్చి సిగ్గుపడవద్దు. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. దేవుని యొక్క వాక్యముపై ఆధారపడుము. "మనుషుల యెదుట నన్ను ఒప్పుకొనువాడు, నేనును నా తండ్రి యెదుట ఆయన పరిశుద్ధ దూతల యెదుట అతనిని గూర్చి ఒప్పుకొంటాను." మనము ప్రార్థించక ముందు, అక్కడ ఇంకా ఎవరైనాయున్నారా? అలాగైతే, మన తలలను వంచుదాము.

సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును. నిశ్చయముగా, దేవుడు నిన్ను దీవించును మరియు నీవు, సోదరుడా, నిశ్చయముగా. మనము తలలు వంచుచుండగా, మరొకరున్నారా? ప్రభువు నిన్ను దీవించును, నిన్ను. ఇప్పుడు, అది సత్యము, మీరు ఇంకనూ నిలబడుచున్నారు. మేము ఒక్క క్షణము వేచియుంటాము, ఒక్క క్షణము. సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును. ప్రభువు నిన్ను దీవించును.

చెప్పండి, "దానికి ఏదైనా అర్థమున్నదా? చెప్పండి "దేవుడు నిన్ను దీవించును?" అది నా దీవెనలను మీ పై ఉచ్చరించుటైయున్నది. దేవుడు మిమ్మును దీవించును గాక.

88కూర్చొనుటకు స్థలము లేకుండా ఆ గోడల చుట్టూ నిలబడియున్న మీలో కొందరు, మీ చేతులను ఎత్తుతారా, "దేవా, అది నేను, నేను," అని చెప్పండి. దేవుడు నిన్ను దీవించును, సోదరుడా. దేవుడు నిన్ను దీవించును, మరియు నీవు, నీవు, సహోదరీ. మరియు నీవు, నా సహోదరుడా, నీవు, నా సహోదరీ.

ఓ, పరిశుద్ధాత్ముడు, శ్రోతల మీద మాధుర్యముగా కదలాడుచున్నాడు, నీవు దానిని స్పర్శింగలవా? ఆ వేదిక మీదయున్న యవ్వనస్తుడా, ప్రభువు నిన్ను దీవించును. ఆ మూలన, దేవుడు నిన్ను దీవించును. యవ్వనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. అవును.

ఓ, పరిశుద్ధాత్ముడా, మా హృదయములలో ఇప్పుడు తాజాగా కదులుము. ప్రభువా, మా పొరపాట్లు చూపించుము. మా స్వబుద్ధిపై, మా సొంత తర్కములపై ఆధారపడము. కాని మేము నీ మీద ఆధారపడతాము, ఎందుకనగా ఈ దినమున సత్యమని రుజువు చేయబడిన, దైవిక వాగ్దానములో మేము నిలబడియున్నాము.

ఏ తర్కమునకైనను పైగా, నిన్నునీవు తెలియపర్చుకొన్నావు. దానిని మేము తర్కించలేము లేక వివరించలేము, అయితే ఇప్పుడు తిన్నగా నీవు మా మధ్యకు వచ్చియున్నావు, నీవు ఇక్కడయున్నావని మాకు తెలియపర్చుకొన్నావు, మరియు స్త్రీలు, పురుషులు దానిని నమ్మి, అంగీకరించుచున్నారు.

దేవా, వారిలో ప్రతి ఒక్కరిని నీ రొమ్ములోనికి తీసుకొనండి, అగ్ని మంటలు దాటిపోవు వరకు, యుగముల బండలో వారిని దాయుము. ప్రభువా, మేము కాలిపోవుటకు నియమించబడియున్నది. అది మాకు తెలుసు. మేము తిరిగి సొదొమలో యున్నాము, అయితే నీతిమంతులు దుష్టులతో పాటు నశించరు.

ప్రభువా, నీ పిల్లలను నీవు పిలుస్తావు. నీవు లోతుతో చెప్పావు, "ఇక్కడ నుండి వెళ్ళిపో, బయటకు వెళ్ళు." దేవా, నేను ప్రార్థిస్తాను, ఈ రాత్రి వారు ఎక్కడ నిలబడియున్నారో నిశ్చయత లేనివారు, ఆ స్థితిలో యున్న ప్రతి ఒక్కరూ… దేవా, ఒకే మార్గమున్న దారిలో వెళుతూ, ఒక అవకాశమును వారు తీసుకొనకుందురు గాక. ఎర్రని దీపము మీదుగా పరుగెత్తు అవకాశమును వారు తీసుకొనకుందురు గాక, వారు సరైన మనస్సుతో యున్నట్లైతే, కారణము వారు చంపబడవచ్చును. అప్పుడు నిత్యత్వపు గమ్యముపై ఒక వ్యక్తి, ఎలా ఒక అవకాశమును తీసుకొనగలడు, కేవలము ఊహిస్తూ, తలపోస్తూ, కారణము ఏదో సంఘమునకు లేక ఒక శాఖకు చెందినందువల్ల, అధికారము లేకుండా ఎలా సాహసానికి వెళతారు?

నిజముగా వారు వెళ్ళలేరు. అప్పుడు యుండియున్నట్లుగానే, "ఇప్పుడు"ను దేవుని వాక్యము యుంటుందని, ఈ వాగ్దానములు ఎలా ప్రత్యక్షపర్చబడతాయో, ఎందుకు వారు గ్రహించలేదు? "అపొస్తలిక యుగము వెళ్ళిపోయింది," అంటున్నారు, తండ్రి, వారికి సహాయము చేయుము. యేసుక్రీస్తు నామములో మీలో నేను వారిని నీకు అప్పగిస్తాను. ఆమేన్.

MARK 16:17,18•

HEB 13:8

 

89నా సహోదరుడా, సహోదరీ, నీకు వందనములు. మిమ్ములను నా సోదరుడా, సహోదరీ అని పిలుచుట, నాకు ఎంతోసంతోషము. గుర్తుంచుకోండి, నేను చెప్పిన ప్రతి మాటకు, తీర్పు దినమున దేవుడు నన్ను జవాబుదారిగా చేస్తాడు. ఈ రాత్రి నేను బోధించిన సమస్తమునకు, నేను తప్పక జవాబు చెప్పాలి. దానిని నేను ఎరుగుదును. మరియు చిన్నప్పటి నుండి, ఈ సువార్తను నేను బోధించి, తరువాత త్రోసివేయబడ్డాను?

ఈ రాత్రి ఇక్కడ, రోగులు మరియు బాధించబడుచున్న వారు ప్రార్థించబడుటకు ఎంతమంది యున్నారు? మీ చేతులను ఎత్తండి. ఇప్పుడు మరొక కార్యము నాకు చేస్తారా? మీ చేతులను ఎత్తండి. ఇప్పుడు మరొక కార్యము నాకు చేస్తారా? మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచండి. సంఘములో చేసినట్లుగా, ఈ పైన వేదిక నొద్ద, ప్రతి ఒక్కరూ తలలు వంచండి. ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో, ఆయన సన్నిధిలో — ఒక రుజువు చేయబడిన సన్నిధి — బోధించబడియున్న వాక్యమే, నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నావని నిర్ధారించియున్నది. ఇప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఈ జనసమూహముపై శుద్ధిచేయును గాక, అనేకమంది వచ్చి, వారి స్వరక్షకుడిగా నిన్ను అంగీకరించారు. అనేకమంది వెనుకకు జారిపోయిన వారు, నిన్ను అంగీకరించి తిరిగి వచ్చియున్నారు.

ఓ, దేవా యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాము. ప్రతి వ్యక్తిని స్వస్థపర్చుము. నీవన్నావు, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును: వారు రోగులమీద చేతులుంచినపుడు, వారు స్వస్థతనొందుతారు." ప్రభువా, నీవు దానిని వాగ్దానము చేశావు, మరియు నమ్మియున్న పిల్లలు, వారు ఒకరిపై ఒకరు చేతులుంచియున్నారు. సాతానా, నీవు ఓడిపోయావు, యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలలో నుండి బయటకు రమ్ము. దేవుని రాజ్యము కొరకు, ఈ ప్రజలను వెళ్ళనిమ్ము, యేసు నామములో. ఆమేన్.

HEB 13:8

 

90ఇప్పుడు మిమ్మును స్వస్థపర్చేవాడిగా, ఆలాగుననే మా రక్షకుడిగా, మరియు అదే ఆధారములపై, యేసుక్రీస్తును మా రక్షకుడిగా నమ్మినవారందరూ, మీ పాదములపై నిలబడండి. చెప్పండి, "ఇప్పుడు నేను యేసును నన్ను స్వస్థపర్చేవాడిగా, నా రక్షకుడిగా అంగీకరిస్తాను." అద్బుతము! ప్రభువుకు స్తోత్రము! ప్రభువుకు వందనములు! ఇప్పుడు మన చేతులను పైకెత్తి ఆయనకు పాడుదాము.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తుతులు;

ప్రజలందరూ, ఆయనకు మహిమ ఇవ్వండి,

ఏలయనగా ప్రతి మరకను ఆయన రక్తము కడిగివేసింది.

ఓ, మీరు మంచి అనుభూతిని పొందుట లేదా? మీ చేతులను ఎత్తండి. ఓ,మై, మరలా మనము దానిని పాడుదాము.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

గొర్రెపిల్లను స్తుతిద్దాము…

గుర్తుంచుకోండి, "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నవాడు. ఆ మనుష్యుడు ఇక్కడ ఉన్నాడు.

ప్రజలందరూ ఆయనకు మహిమ ఇవ్వండి,

ఏలయనగా ప్రతి మరకను ఆయన రక్తము కడిగివేసింది.

91మీరు దానిని ప్రేమిస్తారా? మనము వెళ్ళి ఎవరితోనైనా కరచాలనము చేద్దాము. ఇది సభ ఆరంభము, ఇది కూటమి ప్రారంభమైయున్నది. చెప్పండి, "సోదరుడా, యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును." అది మంచిది! అది బాగు౦ది! అద్భుతము! ఇప్పుడు దీని తరువాత మనము గొప్ప సభను కలిగియుండబోవుచున్నాము? మంచి కూటమును బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాము, ఇప్పుడు మనము ఒక గొప్ప సభను కలిగియుండబోవుచున్నాము. దానిని నమ్ము వారందరూ, "ఆమేన్" చెప్పండి.

నా విశ్వాసము నీ వైపు చూస్తుంది,

ఓ కల్వరి గొర్రెపిల్ల,

(ఇప్పుడు మనము ఆయన వైపు చూద్దాం)

ఓ, దైవ రక్షకుడా;

ఇప్పుడు నేను ప్రార్థించుచుండగా వినుము,

నా పాపమంతా దూరముగా తీసివేయుము,

ఓ, ఈ దినము నుండి సంపూర్ణముగా నీ తోడుగా ఉండనిమ్ము!

జీవితపు చీకటి చిక్కు దారిని నేను తొక్కుచుండగా,

దుఃఖములు నా చుట్టూ ఆవరించగా,

నీవు నాకు మార్గదర్శిగాయుండు,

చీకటి పగలుగా మారుటకు ప్రతిపాదించబడుతుంది,

చింతలను భయములను తుడిచి వేస్తుంది,

ఓ ఈ దినము నుండి సంపూర్ణముగా నీ వాడియుండనిమ్ము

ఆమేన్! సంఘము "ఆమేన్," చెప్పింది. హల్లెలూయ!

…………

ఓ, ఆయనను స్తుతించండి,

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తుతులు;

ప్రజలందరూ, ఆయనకు మహిమను ఇవ్వండి,

ఏలయనగా ప్రతి మరకను ఆయన రక్తము కడిగి వేసింది.

ఎంత అద్భుతము!

92మంచిది, ఆశీర్వాదము కొరకు మనము తలలువంచుదాము. ఎవరు దానిని చేయుటకు ఎన్నుకొనబడ్డారో నాకు తెలియదు. కాలిఫోర్నియా నుండి వచ్చిన, సోదరుడు జానీ మనాదాల్, మనము మన తలలు వంచియుండగా. ఇప్పుడు రేపు రాత్రి మరువవద్దు. అది మొదటి, ప్రారంభమైయున్నది — రేపు రాత్రి. ఇక్కడే తిన్నగా, ఈ హాలులోనే, ఏడున్నర గంటలకు. ప్రభువు మిమ్ములను దీవించును గాక. దేవుని యొక్క సన్నిధిని మీరు అనంధించారా? ఇప్పుడు జానీ మనకు సెలవిస్తూయుండగా, మన తలలు వంచుదాం.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...