ప్రసవ నొప్పులు
1మన తలలు వంచుదము.
ప్రియదేవా, ఇప్పటికే మా మధ్య నీ సన్నిధిని గొప్పగా కుమ్మరించినందులకు నేడు మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈ మధ్యాహ్నాము ఇది మరింత అధికముగా, సమృద్ధిగా దయచేయుదువని ఆశించుచున్నాము. ఈ చక్కని క్రైస్తవ స్త్రీలు పాడిన ఈ అద్భుతమగు పాటను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. నీ ఆత్మ క్రిందికి దిగివచ్చి దాని భావము మాకు చెప్పినది. ప్రభువా, అది ఆ ప్రకారమే జరుగవలెనని ప్రార్థించుచున్నాము. మరియు, దేవా, మా ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించుమని ప్రార్ధి౦చుచున్నాము, ఇది జరుగుట మేము చూచినప్పుడు మా హృదయములు ఆనందముతో ని౦డిపొయినవి!
ప్రియదేవా, నిన్ను కలిసికొనుటకు ఇంకా సిద్ధపడనివారు ఈ మధ్యాహ్నము ఇచ్చటున్న యెడల వారు తమ తుది నిర్ణయమును చేసికొను ఘడియ ఇదే అగును గాక! మరియు క్రొత్తజన్మ ద్వారా నీలోనికి వచ్చెదరు గాక. ఆలాగు అనుగ్రహించుము.
ప్రభువా, మా అందరినీ దీవించుము. ఎంతో కాలమునుండి మేము దారిలో యున్నాము. నీ వాక్యము ద్వారా మాకు క్రొత్త సంగతులు బోధించుమని ప్రార్ధి౦చుచున్నాము. ప్రభువా, నీ ఆత్మద్వారా గొప్ప అవగాహన మాకిమ్ము. ఆయనే వచ్చి వాక్యమునకు అర్థము చెప్పును గాక. మాకు గల ఒకే అనువాదకుడు ఆత్మయే. నేడు దానిని ఆయన మాకు దయచేయునట్లు ప్రార్థించుచున్నాము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము.
[జన సమూహములోని ఒక సహోదరి ప్రవచించుచుండెను]
2అది చాలును. ఎట్టి సమయము! ఇంతకంటె గొప్ప స్థలము పరలోకము తప్ప మరొకటి లేదని నాకు తోచుచున్నది. దాని అనుభూతి, అభిషేకము ఇప్పుడు మనము చూచుచున్నాము, చూచారా? యేసుక్రీస్తుతో కూడా పరలోక స్థలములందు కూర్చుండియున్నాము. పరలోక స్థలములో కూడియున్నాము.
ఫ్లోరెన్సు సోదరిని దేవుడు దీవించును! ఆమె దుఃఖము, నిటూర్పు మరియు చీకటి గల సమయములో నున్నది — ఆమె తండ్రి ఈ మధ్యనే చనిపోయెను. "దేవా, ఆ బిడ్డను దీవించుమని" ప్రార్ధి౦చుచున్నాను.
సహో, డిమోస్ కు రెండు భుజముల మీద భారమున్నది, ఈ కూటముల బరువు ఆయనే వహించుచున్నాడు. ఆయన కూడా మన ప్రార్థనలు కోరుచున్నాడు. సహో. పెకారియన్ను దేవుడు ఆశీర్వదించును గాక!
సహో, కార్ల్ విలియమ్స్, ఇంకా ఈ చక్కని సోదరులందరి మధ్య ఈ కూటములో యున్నందుకు నాకు నిశ్చయముగా ఆనందముగా నున్నది. మరియు మరికొందరిని కూడా కలుసుకొను భాగ్యము కలిగినది. ఈ భాగము కూడికలలో నా చివరి భాగము. (నాకు తెలిసినంతవరకు) కనుక, ఈ చక్కని జనులతో నేను కరచాలనము చేయవలెనని కోరుచున్నాను. మరియు కలుసుకొనగోరుచున్నాను. మరియు వారితో శ్రేష్టమగు దేశములో నిత్యత్వమును గడపుటకు ఎదురు చూచుచున్నాను.
3ఒక చిన్న సంగతి, నన్ను అపార్ధము చేసికోరని తలంచుచున్నాను. అది యాధృచికముగా జరిగినది కాదు, అని తలంచుచున్నాను గాని, ఒక ఏర్పాటుగా ఎంచుచున్నాను, అది నా స్నేహితుడగు డానీ హెన్రీ, నిన్న నాకు ఒక బహుమానము ఇచ్చెను. ఒక రోజున, కాలిఫోర్నియోలోని క్రైస్తవ వ్యాపారుల కూటములో నేనున్నాను. ఆ కాల పరిస్థితిని గూర్చి చాలా కఠినముగా నేను మాట్లాడుచుంటిని. నా హృదయములో చెడు ఉన్నదని అందరూ తలంచిరని నాకు తెలియును, కాని అది కాదు. ఆ విధముగా ఉద్దేశించి నేను పలుకలేదు. కాని నాకు చెప్పమని ఆజ్ఞాపించబడినది చెప్పాను. అంతే మీరు గ్రహించండి.
మరియు దాని తరువాత, ఈ బాప్టిస్టు సోదరుడు. అతడు ఒక సినీ తారకు బంధువనుకొనుచున్నాను. అతను నన్ను అలింగనము చేసికొనుటకు నా యొద్దకు వచ్చి ఇట్లనెను, "ప్రభువు నిన్ను దీవించును గాక, బ్రెన్హాం సోదరుడా! నేను కొద్ది ప్రార్ధన చేయగోరుచున్నాను," అని చెప్పి అతడు ఫ్రెంచి భాషలో ఆరంభించెను. అతనికి ఒక్క ఫ్రెంచి మాట కూడా తెలియదు. మరియు ఒక లావుగానున్న స్త్రీ లేచినది, ఆమె లూయిస్విల్ నుండి వచ్చెను. ఆమె "అది ఫ్రెంచి" అన్నది. అక్కడున్న మరో వ్యక్తి కూడా "అది ఫ్రెంచి" అని చెప్పెను. మరియు ఆ చెప్పినదానిని వారు వ్రాసిరి. నా యొద్ద ఆ అసలు ప్రతి ఉన్నది. అంతట ఆ వెనుక నుండి ఒక యువకుడు ఆ వ్రాసినదానిని చూచుటకు ముందుకు వచ్చెను. అతడు ఐక్యరాజ్యసమితిలో ఫ్రెంచి అనువాదకుడు. "ఖచ్చితముగా అది ఫ్రెంచి."
4మరియు ఆ వ్రాసిన దానిని నేను చదివెదను. ఇది అసలు ప్రతిలోని ఒక భాగము, మరియు ఆ తర్జుమా చేసిన వాని దగ్గర తీసుకున్నది. అతని పేరు నాకు త్వరగా గుర్తు రాదు. విక్టర్ లా డ్యూక్సు, అతడు జన్మతహ ఫ్రెంచివాడు. ఆ వర్తమానము ఇది.
"నీవు ఇరుకు మార్గము, కరకు మార్గము ఎన్నుకొని, నీవు నీ స్వ ఎన్నికనుబట్టి సడచుకొని, నీవు సరియైన ఖచ్చితమైన నిర్ణయము చేసితివి, కనుక అది నా మార్గము. ఈ సమయానుకూల తీర్మానము బట్టి నీ కొరకు పరలోకములోని గొప్ప భాగము ఎదురు చూచుచున్నది. నీవు ఎంత మహిమకరమగు నిర్ణయము చేసికొంటివి! దీనివలన నీకు ఇవ్వబడిన దైవిక ప్రేమలో అద్భుతమగు జయము నీకు వచ్చును."
జనులు మొదట భాషలలో మాట్లాడటం నేను విమర్శించను, చూడండి, ఎందుకనగా నిజమగు భాషలలో మాట్లాడుట నేను విన్నాను. కానీ నాకెప్పుడూ ఆశ్చర్యమే. కానీ అది జరిగినప్పుడు, దాని వెనుకనున్న ఆజ్ఞ నాకు తెలియును, మరియు అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నేనెరుగుదును.
5అతని సోదరుడు ఇక్కడ కూర్చొనియున్నాడు, అందరికి తెలిసిన న్యాయవాది డానీ యొద్దనుండి నాకు బహుమానము తెచ్చెను. డానీ ఈ మధ్యనే పరిశుద్ధ దేశమునకు వెళ్ళెను. మరియు అతడు సమాధిలో ఉంచబడెను, ఎలాగనగా, యేసు మరణమొందిన తరువాత పెట్టబడినట్లుగా అది చేసినప్పుడు, ఆ సమయములో అతడు నన్ను గూర్చి ఆలోచించెనని చెప్పెను. మరియు ప్రభుని ఆత్మ అతని మీదికి వచ్చెను, సిలువ మరణము జరిగిన కల్వరి కొండ పైకి అతను ఎక్కెను, అక్కడ నుండి ఒక రాయి తెచ్చెను. దాని ద్వారా నా చొక్కా చేతులకు పెట్టుకొను చేతి గుండీలు తయారుచేయించి ఇచ్చెను. నిజంగా అవి నాకు గౌరవ సూచకములు. డానీకి ఈ సంగతి తెలియదు, కాని ఈ ఉదయమున ప్రార్ధనలో యుండగా ఆ చేతి లింకుల వైపు చూచాను, ఆ రెండింటి మీద రక్తపు చారవంటి చారయున్నది. అది ఇరుకు మార్గము, కరకు త్రోవ అని దేవుడిచ్చిన వర్తమానము సరియే. దానికి చక్కగా సరిపడినది, అది ఏర్పాటు ప్రకారమే జరిగెను. డానీకి నిశ్చయముగా వందనములు చెల్లించుచున్నాను. దానిని ఎంతగా ప్రశంసించుచున్నానో నీవతనికి చెప్పుము.
మరో వింత సంగతి, ఉదయాన నా భార్యను అడిగాను. లింకులు ఉండవలసిన ఒక షర్టు నేను ధరించాను. లింకులు ఎక్కడ అని నేను అడిగినప్పుడు, ఆమె ఇట్లనెను, "మీ చేతి లింకులు తెచ్చుట మరచిపోయాను." కావున అందుకే ప్రభువు నా కొరకు ఇవి సమకూర్చెను.
6ఓ! అది మహికరమగు జీవితము; కాదా, సోదరులారా? సువార్త యొక్క సామాన్యత్వములో నడుచుట, ఇంకా తగ్గించుకొనుటకంటె గొప్పది మరేదియూ లేదని నేను తలంచుచున్నాను. అంతకన్నా గొప్పది నాకు తెలియదు. నేను దానిలోనికి వచ్చు అవకాశము కలుగునట్లు అది సాధారణముగా చేయబడెను. చూడండి, ఇది దేవుని కృప ద్వారా.
7ఈ మధ్యాహ్నము ఎక్కువ సమయము నేను తీసికొనను, ఎందుకనగా ఈ రాత్రి మీరు మీ సంఘములకు వెళ్ళుదురని నాకు తెలియును. ఈ వేదిక మీదికి మీరందరూ వచ్చి కనబడవలెనని ఆశించెదరు. ఈ రాత్రి మీరు వారి ఆరాధనలో సంతోషముగా పాలుపొందుటకు ఆశించెదరు. వారు మీకు మేలుచేయుదురు. ఈ ఉదయము పట్టణములోని ఏదో ఒక ఆదివారపుబడికి మీరు నిస్సందేహముగా వెళ్ళియందురు. ఈ కూటములకు మన సంపూర్ణ మద్దతు ఇవ్వవలెనని నేను కోరుచున్నాను. సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల కూటము, ఎందుకనగా వారు వెళ్ళుచున్నది దేవుని గృహము. మరియు ఈ రాత్రి ఏదో ఒక సంఘమును దర్శించెదరని ఆశించుచున్నాను.
రేపు రాత్రి కూడికల యొక్క చివరి కూటము, నేను నమ్ముచున్నాను, మాట్లాడువారిని గూర్చి వారు ప్రకటించిరని నేను తలంచుచున్నాను. అతని వర్తమానము వినుటకు ప్రభుని చిత్తమయితే ఇచ్చట నేనుందును. ప్రభువు మీ ప్రతి ఒక్కరిని దీవించు గాక!
8ఇప్పుడు, నేను బోధకునికిగా చెప్పుకొనను. బోధకునిగా పిలిపించుకొను చదువు నాకు లేదు. బోధకునిగా నీవు చెప్పుకొనుటకు కాలేజీ డిగ్రీలు రెండు కావలెను అని వారు ఆశించెదరు. నేను ఏమీ విద్యలేని వాడిని, కానీ నేను జబ్బుగానున్న గొర్రెలను తండ్రి యొక్క పచ్చిక బయళ్ళలోనికి తిరిగి తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నాను. అదే నా ప్రయత్నము.
నేను తప్పులు చేసినయెడల క్షమించండి. నేను వేదాంత పండితుని కాను. నేను వేదాంత పండితులను విమర్శించను; వేదాంతము మంచిదే. అది మనకు అవసరము. కాని కొన్నిసార్లు మనమున్న పరిస్థితిని నేను విమర్శించెదను. అది ఏ ప్రత్యేక వ్యక్తిని ఉద్దేశించి కాదు. అది వర్తమానము మాత్రమే. నేను ఇచ్చుటకు అది నాది కాదని నమ్ముచున్నాను. అది నన్ను ముక్కలుగా చీల్చుచున్నట్లు భావించెదను, ఎందుకనగా మీ పిల్లల పట్ల ఏ భావమును కలిగియుందురో మీకు తెలుసు.
చూడండి. మీ యొక్క స్వంత పిల్లలను తిట్టుటయందు, అరచుటయందు, మరేదో చేయుట బట్టి మీరు ఇష్టపడరు. నేను కూడా తండ్రినే, అది నాకునూ తెలియును. మరియు నన్ను క్షమించెదరని నేను నమ్ముచున్నాను.
9ఈ విధముగా మీరు చేయవలెనని కోరుచున్నాను. ఈ మధ్యాహ్నము మీరు కూర్బోనియుండగా నాకు ఒక మేలు చేయ అడుగుచున్నాను. ఇక్కడ కొద్ది వాక్యములు ఉన్నవి, నేను వాక్యములు వ్రాసియుంచెదని మీకు చెప్పాను. ఒకప్పుడు నేను బైబిలంతా చెప్పెడి వాడను, కాని ఇప్పుడు కాదు. ఎన్నో కఠిన పోరాటములు ఎదుర్కొన్నాను, అందుకే ముసలివాడనైతిని. కానీ ఈ మధ్యాహ్నము కొంతసేపు నా మాట వినెదరని నమ్ముచున్నాను. నిజంగా మీ హృదయాలను తెరచి నేను చెప్పేదానిని అర్థము చేసికొన ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ పట్టణ సంఘ కాపరులు జాగ్రత్తగా వినవలెను.
మీరాలాగు చేయుదురని నమ్ముచున్నాను. నాకిష్టమగు చెర్రీ వంటకము, కోడి మాంస వంటకము ఎట్లు తిందునో మీరును ఆ విధంగానే దీనిని గ్రహించండి. కానీ నేను చెర్రీ పండ్ల వంటకము తినుచుండగా అందులో ఒక గింజ ఉన్నాగాని దానిని తినుట నేను ఆపను. నేను ఆ గింజ బయట పారవేసి ఆ వంటకమును మానక తిందును. చూడండి? ఆలాగే కోడి మాంసము తినునప్పుడు ఎముక తగిలినాగాని నేను ఆ మాంసమును పారవేయను గానీ, ఎముకను పారవేసెదను. నేను చెప్పినదానిని మీరు అంగీకరించనిచో దానిని మీరు చూడక మంచి భాగమును మీరు చూడండి. ఆ ఎముకను మీరు పారేయండి, కాని అది విత్తనమయితే క్రొత్త జీవము ఇచ్చునని మరచిపోవద్దు. కాబట్టి చాలా కఠినంగా కనిపించవచ్చును గాని ప్రభువు మిమ్ము దీవించును.
10గత రాత్రి రోగులకు ప్రార్ధి౦చుచున్నప్పుడు విడిచిపెట్టుట గూర్చి సహో, కార్ల్ విలియం చెప్పెను, అది మంచిదే. అది చాలా బాగున్నది అని నాకు తెలియును. కాని అందుకొరకే ఇక్కడ మనము లేము: ప్రార్ధన వరుసను ఏర్పరుచుట కొరకు. మరియు సహో, ఓరల్ ఇంకా తదితరులు ఎన్నడైనా ప్రార్ధన వరుసలను తమ కూటములలో ఏర్పరచుచున్నారో లేదో నాకు తెలియదు. నేను రెండు మూడుసార్లు ప్రయత్నించాను, కాని ఇంత జనము వచ్చినప్పుడు క్రమములోనుంచుటకు కార్డులు ఇవ్వవలెను, ఎందుకనగా ఇది ఒక పందెపు రంగము కాదు. ఇది దేవుని ಇల్లు చూడండి. అందుకొరకు ప్రతిష్టించబడినది, ప్రార్థన కార్డులున్న యెడల వారిని క్రమములో నుంచెదరు, లేని యెడల త్రోసికొందురు.
కనుక బిల్లీ నన్ను ఇట్లడిగెను, "నేను వెళ్ళి ప్రార్ధన కార్డులు ఇయ్యవలెనా? జనులు ప్రార్ధనా కార్డులు అడుగుచున్నారు."
నేనిట్లు చెప్పాను, "వద్దు బిల్లీ, పరిశుద్ధాత్మను తనకిష్టము వచ్చినది చేయునట్లు విడిచిపెట్టెదము." మీరున్న చోటనే విశ్వాసము నిర్మించబడి మీరు స్వస్థత పొందవచ్చు. చూచారా?
చూడండి. సువార్తలో దైవిక స్వస్థత చాలా అల్పమైనది. ఒక అల్పమైన దానిని నీవు ఎన్నడూ గొప్పదానిగా చేయలేవు. అందరూ అది ఎరుగుదురు, కాని దేవుని యొక్క మహోన్నత సన్నిధిని జనులు నమ్మునట్లు చేయుటకు అది ఒక ఎరగానున్నది. ఆ మహోన్నతుడు ఇచ్చటున్నాడు. దాని ద్వారా వారాయన సన్నిధిని గుర్తించకలిగినచో, వారు స్వస్థతపొందెదరు, దానిని వారు విశ్వాసము ద్వారా నమ్మినచో.
1TIM 2:8
11ఇప్పుడు, నేను దేవుని వాక్యములో, క్రొత్త నిబంధన నుండి ఒక వాక్యము చదువగోరుచున్నాను. ఈ క్రొత్త నిబంధన నుండి ఒక అంశము తీసికొనగోరుచున్నాను. ఈ వాక్యము మీద ఈ మధ్యాహ్నాము కొంతసేపు నేను మాట్లాడెదను, మరియు ఈ రాత్రి ఆరాధన యున్నది గనుక ఎక్కువసేపు మిమ్మును ఉంచను. కానీ గుర్తుంచుకొనండి, నేను అంతా తేటపరచాను, కొద్ది సేపు మీ దృష్టి ఇట్లు నిలుపగలిగిన యెడల నిలుపుడి,
దీనిని మనము చేయు ముందుగా మరల మన తలలు వంచెదము. మీకు తెలుసు, మనము ఎంతో పాడవచ్చును, మన గొంతు పోయే వరకు అరవ వచ్చును. మరియు మనము పాడినది, అరచినది తప్పు సమయము కావచ్చును, కాని మనము ఎన్నడూ క్రమము తప్పనిది ఇక్కడ ఒకటున్నది. అది మనము ప్రార్ధి౦చుట. "సంశయించక అందరూ ప్రతి చోట చేతులెత్తి మానక ప్రార్ధి౦చవలెనని నేను కోరుచున్నాను."
JOHN 14:14
12తండ్రీ, ఒక మానవుడు కండ్లు మూసికొని తన హృదయము తెరచి నీతో మాట్లాడుట ఒక గొప్ప భాగ్యము. నీవు వినుచున్నావని మేము నమ్మిన యెడల నీవు విందువు. యేసు ఇట్లనెను, "నా నామమందు మీరు తండ్రిని ఏది అడిగినను అది అనుగ్రహించబడును," అయితే, సందేహించరాదను షరతు ఉన్నది. కాబట్టి తండ్రీ, మా మనవులు విందువను నమ్మకము మాకుండునట్లు ఈ మధ్యాహ్నము సహాయము చేయుము. ఎక్కడ అవిశ్వాసపు ఛాయ లేకుండు గాక! మేమడిగినది నెరవేరును గాక!
నీ స్వరము వినబడుట ద్వారాను, అన్యుల దేశములలోనికి ఈ టేపులు ప్రపంచమంతా వెళ్ళుట ద్వారాను, ఎన్నో త్రోవ తప్పి నశించుచున్న ఆత్మలు నీ రాజ్యములోనికి తేబడి, నేడు నీ గొప్ప నామము ఘనపరచబడును గాక!
పరమతండ్రీ! నేడు మా మధ్య ఒక్క బలహీనుడును లేకుండునట్లు చేయుము. ఈ కూటము గూర్చి పూర్తి అగువరికి ప్రభువగు దేవుడు ప్రతి ఆత్మను రక్షించి, ప్రతి రోగ శరీరమును స్వస్థపరచును గాక. తన పిల్లల హృదయములను సంతోషముతో నింపును గాక! కనుక యేసు నామములో అడుగుటకు మాకు విశ్వాసము దయచేయుము. ఎందుకనగా ఆయన విందునని వాగ్దానము చేసెను, కనుక ఇది ఆయన మహిమ కొరకే. ఆమెన్.
JOHN 17:20
13పరిశుద్ధ. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము మొదలుకొని చదువుదుము. ఒక అంశము కొరకు చదవండి.
మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. నేను ప్రార్ధించుట లేదు.
అది…
నేను తప్పు చెప్పాననుకొనుచున్నాను. ఒక్క క్షణము నన్ను క్షమించండి. నేను తప్పు వ్రాశాను. "ఒక స్త్రీ బిడ్డను కనునప్పుడు పడు వేదన గూర్చి," యేసు చెప్పిన సందర్భము. అది లూకా లేదా యోహాను? జాక్, అది ఎచ్చటున్నది? యోహాను పదహారవ అధ్యాయము. నేను అదే అనుకొన్నాను గాని మరల తప్పుగా తలంచాను. యోహాను పదహారు. ["21వ వచనము" అని వేదిక మీది వ్యక్తి చెప్పెను] పరి. యోహాను 16:21. ఖచ్చితముగా 21వపచనము.
వారును కావచ్చును…
JOHN 16:20,21
14లేదు జాక్ సోదరుడా ఇది కూడా తప్పు. పదహారు ఇరవై ఒకటి. యోహాను 16 అధ్యాయము 21 వచనమే నేను తీసితిని. అది తప్పు. ఈ బైబిలు చాలా అచ్చు తప్పుతో యున్నది. అవును. ఇది సరిక్రొత్త బైబిలు. కాని చూచారా? ఇది సత్యము. ఈ మధ్యనే దీనిని సంపాదించాను. అచ్చు తప్పు. [ఒక కాథలిక్కు బోధకుడు వేదిక పైకి ఎక్కి తన బైబిలును ఇచ్చి, సహో, బ్రెన్హాంతో ఇట్లు మాట్లాడెను. "నీవు ఇందులో నుండి తీయునట్లు దేవుడు చేయుటకు ఒక కారణమున్నది, ఆయన అద్భుత.. (స్పష్టత లేని మాటలు.) "]
సరే. మంచిది. మీకు వందనములు. చాలా వందనములు. పదహారు ఇరవై ఒక్కటి. చాలా వందనములు. అది సత్యము.
ఒక స్త్రీ ఎప్పుడైతే ఆమె…
మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకముచేసికొనదు.
నా సోదరులారా, చాలా వందనములు. దానిని నిజంగా నేను అభినందించుచున్నాను. (సహో, బ్రెన్హాం, ఆ బైబిల్ ను తిరిగి కాథలిక్కు బోధకునికి ఇచ్చెను.) అది బైబిలులోని అచ్చు తప్పు. పేజీని తప్పుగా పెట్టిరి. దీనిని నా పాత స్కోఫీల్డ్ బైబిలులో చూచాను, మరియు దీనిని కొద్ది క్షణముల క్రితమే ఇక్కడకు తీసుకొని వచ్చాను, (ఎందుకనగా దీనిని నా భార్య క్రిస్మసు కానుకగా ఇచ్చినది.)
JOHN 16:20
15నేను ప్రకటించిన అంశము మీదనే ఈ మధ్యాహ్నము మాట్లాడుదును: "ప్రసవ నొపులు"? ఇది చక్కగా కనిపించకపోవచ్చును గాని ఇది బైబిలులో యున్నది. యేసు ఇక్కడ దీని గూర్చి చెప్పెను, "మీకు దుఃఖము కలుగును గాని అది సంతోషముగా మారును." క్రైస్తవ్యము యొక్క పుట్టుక ఉనికిలోనికి వచ్చుచున్నది గనుక ఆయన తన శిష్యులతో ఇది చెప్పెను.
క్రొత్తది పుట్టవలెనన్నచో పాతది చనిపోవలెను. జన్మ ఇచ్చునది ఏదయినా గాని వేదన, నొప్పి అనుభవించవలెను, మరియు ధర్మశాస్త్రము నుండి కృపలోనికి రావలెనన్న నొప్పి, వేదన కలుగును.
మామూలు పుట్టుక ఆత్మీయ పుట్టుకకు మాదిరి. ప్రకృతి సంబంధమగునవన్నియూ ఆత్మసంబంధమగు వాటికి మాదిరులే. ఈ భూమి మీద మనము చెట్టును చూచుచున్నాము, అది ఎంతో శ్రమించి ఎదుగుచున్నది. చావు లేని చెట్లు ఒకటి ఆవల ఉన్నదని ఇది చూపించుచున్నది. అది దేని కొరకో మొర పెట్టుచున్నది.
వృద్దులు, జబ్బుతోనున్న వారు, ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నవారయినా గాని జీవించవలెనని ఆకాంక్షించెదరు, ఎందుకనగా ఎక్కడో నిత్యజీవమున్నదని అది చూపించుచున్నది. ఎంత చక్కగా యున్నదో గమనించండి
1JN 5:7,8
16ఇప్పుడు "I యోహాను 5:7 (తప్పు కాదు అని నేను నమ్ముచున్నాను) "పరలోకమందు సాక్ష్యమిచ్చువారు ముగ్గురున్నారు. వారు తండ్రి, వాక్యము, పరిశుద్దాత్మ; ఈ ముగురు ఒక్కరే. భూమి మీద సాక్ష్యమిచ్చువారు ముగ్గురు; అవి నీరు, రక్తము, ఆత్మ అవి ఒక్కటిగా సమ్మతించుచున్నవి." ఇప్పుడు గమనించండి, మొదటి ముగ్గురూ ఒక్కటే; రెండవ ముగ్గురూ భూసంబంధమైన వారు, మరియు ఒక్కటిగా ఏకీభవించుచున్నారు. తండ్రి లేకుండా కుమారుడు లేడు. పరిశుద్దాత్మ లేకుండా కుమారుడు లేడు. కాని రక్తము లేకుండా నీటిని, ఆత్మ లేకుండా రక్తమును నీవు కలిగియుండగలవు.
ఇది సత్యమని యుగముల నుండి రుజువగుచున్నది. నీరు, రక్తము, ఆత్మ; నీతీకరణము, శుద్దీకరణము, పరిశుద్దాత్మ బాప్తీస్మము. స్వాభావిక జన్మకు అవి వ్యతిరేకములు. స్త్రీ గాని మరేదయినా గాని ప్రసవ వేదన పడునప్పుడు మొదటగా నీరు బయటకు వచ్చును, మామూలు జన్మ రెండవదిగా రక్తము, ఆ తరువాత జీవము వచ్చును. — నీరు, రక్తము, ప్రాణము. మరియు ఇది స్వాభావిక జన్మలో వచ్చును.
17మరియు ఆత్మ సంబంధముగాను ఆ విధంగానే యున్నది. అది నీరు, విశ్వాసముంచుట ద్వారా నీతీకరణము, దేవునిని నమ్మి నీ స్వరక్షకునిగా ఆయనను అంగీకరించెదవు. తరువాత ఆత్మ శుద్దీకరణము
అనగా దేవుడు లోకము యొక్క సమస్త ఆశలు, కోరికలనుండి శుద్ధిచేయును. అప్పుడు, పరిశుద్ధాత్మలోనికి వచ్చి, నూతన జన్మ ఇచ్చి, ఆ కడుగబడిన పాత్రను నింపును.
ఈ ఉదాహరణ చూడండి; ఇప్పుడు… మీరు నమ్మిన దానిని ప్రక్కకు పెట్టి మిగిలినది స్వీకరించమని చెప్పాను. గమనించండి. కోళ్ళశాలలో ఒక గ్లాసు పడియున్నది. దానిని నీవు తీసి నీరు లేదా పాలు పోసి బల్లమీద పెట్టవు. దానిని పైకి లేపుట నీతీకరణము. శుద్ధిచేయుట శుద్దీకరణము - ఈ మాటకు గ్రీకులో, "కడిగి సేవ కొరకు ప్రక్కకు పెటుట," అని అర్థము. సేవలో కాదు, సేవకొరకు. దానిని నింపినప్పుడు అది సేవకు ఉపయోగపడును.
18నన్ను క్షమించండి, (మిమ్మును గాయపరచుట కాదు), పరిశుద్ధ యాత్రికులు, నజరేన్ అను శాఖల వారు పెంతెకోస్తులోనికి రాలేకపోవుటకు ఇదియే కారణము. మీరు శుద్దీకరణము ద్వారా కడుగబడిరి, కానీ భాషలు మాట్లాడుట, ఇంకా ఆయా వరముల ద్వారా సేవలోనికి మీరు తేబడినప్పుడు దానిని మీరు నిరాకరించి మరల ఆ శాఖలలోనికి వెళ్ళిపోయిరి. చూచారా? అదే జరుగుచున్నది. ఇది వాడుక అయినది.
ఇప్పుడు మిమ్మును నేను విమర్శించుట కాదు గాని, దీనిని నా హృదయములో నుండి తీసివేయగోరుచున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పటినుండియు ఇది నా హృదయములో మండుచున్నది. కార్ల్ మరియు డిమోస్ తదితరులు మీరందరూ… నేను చేయవలసినంత ఉత్తమమైనది నా హృదయమ౦తటితో అందచేయుటకు ప్రయత్నము చేయుదును, చూచారా; ఆ తరువాత అది మీకే వదిలేస్తున్నాను.
స్వాభావికమైనది ఆత్మ సంబంధమగు దానికి మాదిరి. ఇప్పుడు, పూర్తిగా జన్మించుటను మనము కనుగొందము. నీరు వచ్చినప్పుడు, నీవేమీ చేయవు. రక్తము వచ్చినా నీవేమీ చేయవు. కాని జీవము బయటకు వచ్చినప్పుడు, నీవు కుదిపి ఆ బిడ్డ ఏడ్చునట్లు చేయుదువు. చదువు లేకుండానే ఈ నా సోదరులు ఈ విషయంలో చక్కని శిక్షణ పొందిరి. కాని నేను స్వాభావికమగు దానిని మాదిరిగా చూపుచున్నాను. మరియు మీరు అక్కడే ఉన్నారు, అదే జరుగుచున్నది. వారిని ఈ స్థితికి తెచ్చుటకు చాలా కుదపవలసియున్నది.
19ఇప్పుడు, మీరు ఒక చిన్న… ఓక రకమైన కుదుపు. మీరు ఆ బిడ్డను కుదుపనవసరం లేదు గాని, ఒక చిన్న జడి ఇవ్వండి. అతని పుట్టుక యొక్క ఒక గొప్ప ఆలోచన, కొన్నిసార్లు ,అది చేయును. మీరు కుదుపుదురు. పుట్టిన బిడ్డకు ఆలాగు చేయుదురు. ఇటు అటు కుదుపుదురు. ఊపిరి తీసికొనకున్నచో చిన్నగా కొట్టుదురు, అప్పుడు వాడు తెలియని భాషలో కేకవేయును. వానికే తెలియని భాషలో ఒక ధ్వనిచేయును. శబ్దము, కదలిక లేకుండా యున్నచో వానిని పురటిలోనే చచ్చిన బిడ్డ అందుము.
నేడు సంఘము యొక్క స్థితి అలాగే యున్నది, వ్యవస్థ విధానమట్టే ఉన్నది. మనకు చాల మంది నిర్జీవ శిశువులు ఉన్నారు. ఇది నిజము. వారికి సువార్త చురక వేయవలెను. మీరు చూడండి, లేచుటకు, వారిని వారిగా ఉంచుటకు, దేవుడు వారిలోనికి జీవవాయువు ఊదునట్లు చేయవలెను. అది నిజమని మనకు తెలియును. ఇది చాలా మొరటు వేదాంతము, కాని ఏ విధముగానైన అది సత్యము.
20ఒక గింజ పుట్టుట చూడండి, క్రొత్తది పుట్టు ముందు పాత గింజ చావవలెను. ఎప్పుడయినా గాని మరణము కష్టమే. అది బాధాకరము, వేదనా మయము. పుటుక కూడా అంతే, ఎందుకనగా నీవు లోకములోనికి జీవము తెచ్చుచున్నావు. అది బాధాపూరితము.
విత్తువాడు విత్తుటకు తీసికొని వెళ్ళిన విత్తనమువలె ఆయన వాక్యమున్నదని యేసు చెప్పెను. ఇది మనందరికీ తెలియును మరియు దీనిని ఆదివారపుబడి పాఠము వలె బోధించగోరుచున్నాను, ఎందుకనగా ఇది ఆదివారము. గమనించండి, ఈ వాక్యము విత్తనమైయుండి — కానీ విత్తనము చనిపోయినప్పుడే క్రొత్త జీవము వచ్చునని గుర్తుంచుకొనండి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తును అర్ధము చేసికొనుట ఆ పరిసయ్యలకు అంత కష్టముగా ఉ౦డెను, ఎందుకనగా వారు ధర్మశాస్త్రము క్రిందనుండిరి. మరియు ధర్మశాస్త్రమనగా విత్తన రూపములోనున్న వాక్యము. కానీ వాక్యము శరీరధారియైనప్పుడు ధర్మశాస్త్రము కాదు గాని, కృప. ఒకే సమయములో ధర్మశాస్త్రము, కృప ఉండజాలవు, ఎందుకనగా కృప ధర్మశాస్త్రముకంటె ఎంతో పైనున్నది, ధర్మశాస్త్రము అసలు దృశ్యములోనే లేదు. కాబట్టి పరిసయ్యలుకు కృపలో జన్మించుటకు ముందుగా వారి యొక్క ధర్మశాస్త్ర విషయములో చనిపోవుట చాలా కష్టమాయెను, కాని అది తప్పదు. ఒకే సమయములో రెండు ధర్మశాస్త్రములు ఉండలేవు.
రెండు ధర్మశాస్త్రములుండి వేరు వేరుగా చెప్పుట జరుగదు. ఒకటి చేయమనియు, మరొకటి చేయ వద్దనియు చెప్పగలవా? కాబట్టి ఒక సమయములో ఒక్క ధర్మశాస్త్రమే ఉండును. ఒక్కసారిగా నీవు, దానివలన ప్రభావితుడవగుదువు. కాని ఇప్పుడు అది ఆగు! అను ఎర్ర దీపము చూపును. చూచారా? కాబట్టి ఒకేసారి రెండు ధర్మశాస్త్రములు ఉండవు.
21ఇప్పుడు, ప్రతీసారి మనము గమనించిన యెడల. నా ఆలోచన మీకు వేదన, బాధ, శ్రమ కలిగించును. బాధ, నొప్పి, శ్రమ ద్వారా ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర విషయములో ఎట్లు చనిపోయిరో చూడండి. కాని అది తప్పదు.
ఇప్పుడు మనము భూమి మీద పంటను పండించు వానను కనుగొనియున్నాము. ఒక కవి ఇట్లనెను, "కరకయిన మేఘములలో, ఉరుముల పొలములలో అది పుట్టినది." కానీ ఉరుములు, కరకు మేఘములు రాని యెడల సముద్రముల నుండి ఆవిరిగా పైకి వెళ్ళిన నీటి బిందువులు క్రిందపడవు. ఆ మెరుపులు, ఉరుములు, ప్రేలుళ్ళు, భయంకర మేఘములు నీటి బిందువులను క్రిందికి దించును. జన్మించవలెనన్నచో వేదన తప్పదు. అది చనిపోవలెను. మబ్బులు చనిపోవుచుండగా వాన రూపుదిద్దుకొనును. ఎందుకనగా వర్షము ఆ మేఘములో భాగము, ఒకటి జీవించవలెనన్న మరొకటి చనిపోవలెను. మరియు ఇప్పుడు, ఆ విషయముల గూర్చి సామర్థ్యముతో చెప్పగల సోదరులు (కొందరు) ఇచ్చటున్నారు. నేను చెప్పలేను.
22ఇప్పుడు, మరో చిన్న రుజువు కొరకు ఇంకో సంగతి చూద్దాం. నేను చూచిన పుష్పములన్నింటిలో అందమైనది, మన చెరువులోని పద్మమే. ఎంతమంది దీనిని చూచారు? నా వరకూ, దాని వంటిది మరేదియూ లేదు. అయితే దాని గూర్చి ఎప్పుడైనా ఆలోచించారా? యేసు చెప్పినది నాకు గుర్తుకొచ్చినది. "అడవి పువ్వులను చూడండి, అవి కష్టపడవు, ఒడకవు, అయినను సొలోమోను సహితము వీటిలో ఒక దానివలెనైనను అలంకరించబడలేదు." ఎందుకనగా సొలోమోను వైభవము కృత్రిమమైనది, కాని అడవి పువ్వు అందము సహజమైనది. కృత్రిమ రంగు, పూత కాదు.
మన స్త్రీలను చూడండి. కళ్ళకు, ముఖమునకు ఈ రంగులు పూసికొనవసరం లేదు. అందముగా కనబడుటకు మీరిది చేయుచున్నారు. మీరు అపొ.కా 2:4నకు కొద్దిగా యోహాను 3:16 కలిపిన యెడల అది ఆ మాక్స్ ఫాక్టర్ తయారు చేయు ఏ రంగునయినా గాని మించిపోవును. నీ భర్త నిన్ను మరెక్కువగా ప్రేమించును. దేవుడు మరెక్కువగా నిన్ను ప్రేమించునని నిశ్చయముగా చెప్పగలను.
23"పద్మము" ఎట్లు పెరుగుచున్నదో ఆలోచించమని ఆయన చెప్పెను. ఈ చెరువు పువ్వు ఎట్లు పైకి వచ్చునో చూడండి. మురికి నీరు, బురద నీరు అడుగు నుండి పైకి వచ్చును. ఆ చిన్న జీవము, అట్టి దానిలో నుండి అది పైకి వచ్చును. ఆ బురద నీటి అడుగున కప్పలు ఇంకా ఏవేవో యుండును. కాని అది సూర్యుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు జన్మించును. ఆ చిన్న బీజము జీవమును పొందును. ఆ విధానము గుండా రానిచో దానికి జన్మలేదు, అది దాని ద్వారానే రావలయును. దానిని సూర్యుడే బయటకు లాగుచున్నాడు. ఆ మురికి, బురద నీరులో నుండి పైకి వచ్చిన తరువాత అది చాలా ఆనందించును. తన జీవమును అది ఉచితముగా ఇచ్చును. దానిని బయటకు లాగిన వాని సన్నిధిలో జీవించుట ఎంతో ఆనందముగా నుండును.
అది క్రైస్తవ జీవితమునకు అందమగు మాదిరి అని నేననుకొనుచున్నాను. లోకములో నుండి నిన్ను ఏదో బయటకు లాగుచున్నప్పుడు, మరియు ఒక రోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సన్నిధిలో మీరు జన్మించిరి. ఎంత అందము! దానికి నీవు ఏ సహాయమందించ తలంచిన అది చనిపోవును.
24మీరు గమనించిన యెడల అప్పుడే పుట్టుచున్న చిన్న కోడి పిల్లను, దాని చిన్న ముక్కును చూడండి, లేదా గ్రుడ్డులో నుండి వచ్చిన ఏ పక్షినయినా చూడండి. ఈ గుడ్డు గుల్ల పరిపక్వము చెందినది. ఆ గుడ్డులోని భాగము క్రుళ్ళిపోవలసినదే. ఆ గుల్లను పగులగొట్టుటకు దాని చిన్న ముక్కుతో అటు ఇటు పొడిచినది. దానిని నేను జన్మించిన కెంటాకీలో పొడుచుకొనుట అందురు. పొడుచుట ద్వారా తన మార్గమును ఏర్పరచుకొనుట, వేరే మార్గము లేదు. ఎందువలన? అది దేవుడేర్పాటు చేసిన మార్గము. దానికి నీవు సహాయము చేసిన యెడల అది చనిపోవును. ఆ గుల్లను వలిచేయండి, అది చచ్చును. అది శ్రమించి, బాధపడి బ్రద్దలు చేసుకోవలయును.
ఒక క్రైస్తవుడును ఆలాగే చేయవలసి యున్నాడు. ఎవరో నీకు కరచాలనము చేసి లోపలకు తీసికొనుట కాదు. నీవు చచ్చిపోయి కుళ్ళిపోవు వరకు అక్కడే పడియుండవలెను. అప్పుడు దేవుని రాజ్యములోనికి జన్మించెదవు. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఒక పుస్తకము ద్వారా గాని, కరచాలనము ద్వారా గాని, క్రిందికి పైకి ఎగురుట ద్వారా గాని నీవు ప్రవేశించలేవు. నీవు ఆ పాత గుల్లను విడిచి రావలెను. గమనించు, అంత కంటె శ్రేష్టమైన మార్గము లేదు.
25దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా తప్ప మరే ఇతర మంచి మార్గము నుంచి ఒక బిడ్డ వచ్చుటకు లేదు. ఆ చిన్నబిడ్డ జన్మించినప్పుడు నీవు ఆ ఉయ్యాల ప్రక్కనే ఒక చిన్న గంటను కట్టెదవు. నీ వీలాగు చెప్పెదవనుకొందము, "నా చిన్న కుమారుడా, నేను వేదాంత పండితుడ్ని పిల్లలను ఎట్లు పెంచవలెనో తెలుపు పుస్తకములు నేను చదివాను. నీవు ఒక ఆధునిక బిడ్డవని నేను చెప్పుచున్నాను. నీవు ఆధునిక తల్లిదండ్రులకు ఆధునిక ఇంటిలో పుట్టితివి. నీవు ఆకలిగా ఉన్నప్పుడు, నేను గాని మీ అమ్మ గాని కావలసి వచ్చినప్పుడు గంట మ్రోగించుము." దాని వలన ఏమీ ప్రయోజనముండదు, కానీ ఆ బిడ్డ ఏడ్చినప్పుడే దానికి ఏదయినా దొరకగలదు. అది దేవుని విధానము.
మనకు కావలసినదియు ఆలాగే మనకు దొరకును - దాని కొరకు ఏడ్వవలెను, మొరపెట్టుము! సిగుపడవద్దు. "నేను దేవుని కొరకు ఆకలిగొనియున్నాను," అని చెప్పుము. నీ చుట్టూ పెద్దలు, కాపరులు మరెవరున్నా గాని లెక్క చేయవద్దు, ఏమైనా గాని మొర పెట్టుము. జోన్స్ ఇక్కడ కూర్చొనియున్నా మనకేమీ సిగ్గులేదు. మొర పెట్టుము! నీవు సహాయము పొందుటకు అదియే మార్గము. ఆయన ఈ భూమి మీదనుండగా అన్యాయస్తుడగు న్యాయాధిపతిని గూర్చి ఆయన నేర్పించెను.
26ఒక చిన్న మంచు బిందువు ఎట్లు ఏర్పడునో నాకు తెలియదు. ఒకవేళ ఇక్కడ శాస్త్రజ్ఞులెవరైనా ఉండవచ్చును. నేను నా తలంపు ప్రకారము చెప్పుచున్నాను. అది చీకటి రాత్రియందు భూమి మీద పడు ఒక విధమగు వాతావరణ మిశ్రమము. అది రాత్రియందు జరుగునప్పుడు, జన్మించును. ఉదయ కాలమున, అది ఆ చిన్న గడ్డి పరక మీద పడియుండును, కాని ఒక్కసారి సూర్యుని ప్రకాశించనీయండి! అదెంత ఆనందము పొందునో మీరెరుగుదురా? అది మెరయుచూ గంతులు వేయును. ఎందుకు? ఆ సూర్యుని కాంతి దానిని తిరిగి ఆ ప్రారంభములో ఎక్కడున్నదో అక్కడికి తీసికొనిపోవునని దానికి తెలియును.
దేవుని ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి స్త్రీ పురుషుడు ఆ రీతిగానే యున్నాడు. ఆ వెలుగు మన మీద పడినప్పుడు, మనము సంతోషించెదము. మనము ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఆ దేవుని రొమ్ము నొద్దకు తిరిగి వెళ్ళుదుమని మనకు తెలియును. సూర్యుడు తాకినప్పుడు ఆనందముతో అది మొరయును. తాను వచ్చిన చోటికి తిరిగి వెళ్ళుదునని తెలియును. ఈ చిన్న సంగతులు, మనము వాటితో ఉన్న యెడల. కానీ ఒక వేరైనది మనము కనుగొందుము.
27క్రొత్త విత్తనము వచ్చుటకు ముందు పాత విత్తనము కుళ్ళిపోయి చావవలెను. తప్పక అది జరుగవలెను. చనిపోవుట మాత్రమే కాదు గాని, అది కుళ్ళిపోవలెను. అది సత్యమని మనకు తెలియును. క్రొత్త జన్మ విషయములోను అంతే! తిరిగి మనము జన్మించినప్పుడు ఎన్నడూ వెనుకకు వెళ్ళము గాని ముందుకు సాగిపోదుము.
అందుకే ఈ దినమున అసలైన క్రొత్త జన్మ జన్మించినవారు కొద్దిగానున్నారు. వారు వాక్యమును అంగీకరించుచున్నారు గాని వారుంటున్న ఆ పాత వ్యవస్థలో నుండి బయటకు వచ్చి కుళ్ళిపోవుటకు ఇష్టపడుట లేదు. వారు ఆ పాత వ్యవస్థలోనే యుండి క్రొత్త జన్మను లేదా కాలపు వర్తమానమును ఒప్పుకో గోరుచున్నారు.
లూథర్, వెస్లీ, పెంతెకోస్తు ఇంకా అన్ని కాలములలోను దానిని మనము కనుగొందుము. వారు ఇంకా ఆ పాత వ్యవస్థను పట్టుకొని దీనిని ఒప్పుకో చూచుచున్నారు, కాని ఆ పాత వ్యవస్థ యొక్క కాలము చచ్చిపోవలెను, కుళ్ళిపోవలెను, క్రొత్తది బయటకు రావలెనన్నచో వారింకా దానిని హత్తుకొనుచున్నారు.
ROM 1:17
28గమనించండి, ఆ పాత వ్యవస్థ చనిపోయినదని వారికి తెలియును, కానీ ఆ విషయంలో వారు కుళ్ళుట లేదు. కుళ్ళిపోవుట అనగా పూర్తిగా దానిపని అయిపోవుట.
వారు క్రొత్తగా జన్మించినట్లు చెప్పుకొనుచున్నారు, కాని అది ఒక అద్వితీయ సూచన మాత్రమే. కుళ్ళిపోవుట వలన క్రొత్త జన్మ వచ్చును. వెస్లీ, లూథర్ తదితర కాలములన్నింటిలోను మనము కుళ్ళిపోయినట్లే ఇప్పుడును కుళ్ళిపోవలెను. కానీ సంగతి ఏదనగా, దాని తర్వాత, ఒక క్రొత్త జన్మ జన్మించవలెను. ఆ తరువాత ఒక్క మాట మాత్రమే నీవు చెప్చెదవు. "నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును." ఇక అతడు ఆ పాత వ్యవస్థను హత్తుకొని యుండడు. దానిలో నుండి అతడు బయటకు రావలసియున్నాడు.
దేవుడు ఆర్మీనియను బోధను లేపు వరకు కాల్వినిస్తులు, ఆంగ్లికను చర్చిని కాల్విను సిద్దాంతము క్రింద ఆ విధముగానే యుంచిరి. క్రొత్తది రావలెనన్నచో పాత విధానము చావవలెను. అదే వెస్లీ కాలము. వెస్లీ కాలములో లేచిన చిన్న దళములు ఆగిపోయినవి. వరముల పునరుద్ధరణతో పెంతెకోస్తు వచ్చెను. వారు బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పిలిగ్రీం హోలినెస్, నజరేను, క్రీస్తు సంఘము నామకార్థ మొదలగు గుంపులలో నుండి బయటకు రావలసియుండెను, క్రొత్త జన్మను అంగీకరించుటకు వారు కుళ్ళిపోయిరి.
MATT 6:33•
ACTS 24:14
29నిన్ను ఎప్పుడూ పిచ్చివాడని పిలచుదురు, కాని ఒకసారి పౌలు కూడా కుళ్ళిపోయినని చెప్పెను. "విశ్వాస భ్రష్టత్వము అని మీరనుచున్న విధానములో మన పితరుల దేవునిని నేను ఆరాధించుచున్నాను." విశ్వాస భ్రష్టత్వము అనుచున్న దానిలోనే చూడండి! క్రొత్తజీవమును అతడు అంగీకరించెను, ఆ పాత నిబంధన క్రొత్త దానికి జన్మను ఇయ్యవలెను. మరియు దానిని ఒక ఛాయగా చేయుటకు పాతదాని విషయములో అతడు కుళ్ళిపోవలసి యుండెను.
ఇప్పుడు మనము అక్కడే యున్నాము. ఇప్పుడు, నాతో సహించుడి. ఇది నా అభిప్రాయము. ఇప్పుడు సంఘములన్నియూ ఒక పద్ధతి ప్రకారము ఏకమగుచున్నవి. నీవు అందులో చేరవలెననిన ఏదో ఒకదానిలో భాగమవ్వవలెను. నీకు ఒక సహవాస కార్డు గాని గుర్తింపు గాని కలిగియుండవలెను. దీనిని నమ్ముట వలన, నాకు తెరువబడిన ఒకే ఒక ద్వారము ఈ వ్యాపారసుల కూటమియే. వారు సంస్థగా మారనంత వరకు, నేను అందులోనికి వెళ్ళగలను. నా హృదయములోనున్న వర్తమానమును జనులకు అందించగలను. అది ఎంతో హేతుబద్ధంగా యున్నది… మరియు ఈ పెంతెకోస్తు జనులను నేను ప్రేమించుచున్నాను. అది ఒక సంస్థ కాదు. కాని మీరు ఆలాగు పిలచుకొనుచున్నారు. పెంతెకోస్తు అనునది ఒక అనుభవమే గాని ఒక శాఖ కాదు.
కాని మీరు చూడండి, సంగతి ఏమనగా, చాలా మందికి అది కష్టముగా ఉండును. దేవుని వాక్యము ద్వారా దానిని గుర్తించెదరు. కాని మీరున్న స్థితి నుండి కుళ్ళిపోవుట చాలా కష్టము. "నేనేమి చేయుదును? నా భోజనము ఎక్కడ దొరుకును?" దేవుడే నీ భోజనము, దేవునినే నీవు పట్టుకోవలెను. "మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి." దానిని నేను అలాగే విడిచిపెట్టెదను; నేను చెప్పుచున్న దానిని మీరు గ్రహించెదరు!
REV 21:1
30క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనము పొందెదమని ప్రవక్తలు చెప్పిరి. మీకు లేఖనము కావలెనన్నచొ, అది ప్రకటన 21లోనున్నది. అది నా దగ్గర ఇక్కడ ఉన్నది. యోహాను ఆలాగున చెప్పెను:
"అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను."
అది గతించినది. పాత భూమి, క్రొత్త భూమి, పాత ప్రపంచము మరియు క్రొత్త ప్రపంచము ఒకే సమయమున ఉండవు. ఒకే కాలములో రెండుప్రపంచ వ్యవస్థలు ఉండజాలవు. క్రొత్త భూమిని పొందవలెనన్నచో పాతది చావవలెను. పాతది చావవలసి యున్నయెడల అది క్రొత్త దాని కొరకు ప్రసవనొప్పులను ఇయ్యవలసియున్నది.
31మరియు ప్రసవ వేదన పడుచున్న ఒక స్త్రీని వైద్యుడు పరీక్షించుట చూచాను. ఇద్దరు ముగ్గురు ఎదుట నేను మాట్లాడుచున్నాను, మరియు నాకు తెలిసిన క్రైస్తవ వైద్యులను ఇక్కడ చూచాను. వారిని నేనెరుగుదును. వైద్యుడు మొదటగా ఆ స్త్రీ యొక్క నొప్పుల సమయమును గమనించును. అవి ఎంత తరచుగా వచ్చుచున్నవో, ఎంత భయంకరముగా నున్నవో గమనించును. ఒకదానికంటె మరొకటి ఎక్కువ నొప్పిని కలిగించును. ఆ తరువాతది ఇంకా నొప్పిగా నుండును. ప్రసవ నొప్పుల తీవ్రతను బట్టి వైద్యుడు ఆ రోగిని పరీక్షించును.
ఒక క్రొత్త ప్రపంచ పుట్టుకకు ఈ ప్రపంచము దారి చూపవలెనన్నచో ఈ భూమి ఎట్టి ప్రసవ నొప్పులు ఇచ్చుచున్నదో కొన్ని గమనించుదము. దాని ప్రసవ వేదనలో అది ఎంత దూరము వెళ్ళినదో, ఏ దినమునకు వచ్చినదో చూద్దాం.
32మొదటి ప్రపంచ యుద్ధము గొప్ప నొప్పిని చూపించినది. ఆమె మొదటి ప్రసవ నొప్పులలో అది ఒకటిగా మనము చూచాము. ఆ సమయములో మనము బాంబులు వేసియున్నాము, మర తుపాకులు, విషవాయువు వదిలియున్నాము. మీలో చాలామందికి అది జ్ఞాపకముండదు. అప్పుడు నేను ఎనిమిది సంవత్సరముల బాలుడను. మస్టర్డ్ మరియు క్లోరీన్ వాయువుల గూర్చి వినెడివారము. "అది భూమి యావత్తును దహించగలదని జనులు చెప్పుకొనుట నేను విన్నాను. అది అందరినీ చంపివేయగలదు. భూమియంతటా గాలులు వీచును." మరియు ఆ మహా భయంకర విష వాయువునకు జనులు భయ కంపితులయిరి. అది భూమికి వచ్చిన మొదటి ప్రసవ నొప్పి.
మరియు ఆ తరువాత మనము రెండవ ప్రపంచ యుద్ధమును చూచాము. ఆమె నొప్పులు మరింత అధికమైనవి. బహు భయంకర సమయము, అవి భూమి యొక్క నొప్పులు. అణు బాంబు మొత్తం పట్టణమునే నాశనము చేయు పరిస్థితి వచ్చెను. అప్పుడు దాదాపు ఆమె ప్రసవించినట్లాయెను. మొదటి ప్రపంచ నొప్పులకంటె ఇవి మరింత ఎక్కువాయెను. భూమి వినాశపుటంచుకు వచ్చెను.
33ఇప్పుడు, ఆమె యొక్క ప్రసవ సమయము ఆసన్నమైనదని ఆమెకు తెలియును. ఆ కారణము చేతనే ఆమె అంత ఉద్రిక్తతలో యున్నది. హైడ్రోజను బాంబులు, ఆకాశ క్షిపణులు మొత్తం ప్రపంచమును నాశనము చేయగలవు. అది ఎంత చిన్న దేశమైనా గాని మరోదేశమును బెదిరించుచున్నది. వారు నక్షత్రపు దిశ వైపునకు ఆ క్షిపణులను పంపి ప్రపంచములోని ఏ చోటును వారు నాశనము చేయవలెనని కోరుదురో ఆ చోటునకు దానిని దించగలరు.
రష్యా గూర్చిన వార్త నేను విన్నాను. ఈ దేశమును అది నాశనము చేయగలనని చెప్పుకొన్నది. తన దేశమునకు ఏమీ హాని జరగకుండా అణు పాటవమును అదుపులో పెట్టగలనని చెప్పుకొన్నది. దాని గూర్చి మనకేమీ చేయవలెనో తెలియుట లేదు. అందరూ ఆ విధంగా చెప్పుకొనుచున్నారు. అది నిజమే కావచ్చు. దేవుని యొక్క గొప్ప పరిశోధన శాలను సైన్సు విచ్చిన్నము చేసినది. చివరకు వారి స్వ నాశనమును తెచ్చుకొనుచున్నారు.
జ్ఞానము వల్లనే ఒకడు తన్నుతాను చంపుకొనును. దేవుడు దేనినీ నాశనము చేయడు. ఆది యందు మానవుడు దేవుని మాటకు బదులుగా సాతాను జ్ఞానమును తీసికొని తన్నుతాను నాశనము చేసికొనెనో, నేడు అదే జరుగుచున్నది.
ఆమె తప్పక ప్రసవించవలసియున్నది. దానిని ఆమె తట్టుకోజాలదు.
34రష్యా, నేడు ఈ దేశమును నాశనము చేయగలదు. తన్నుతాను రక్షించుకొనగలదు. ఏ చిన్న దేశము అయినా గాని ఆలాగు చేయగలదు. కాని అట్టి పరిస్థతులలో భూ కక్ష్యలో ఏ దేశమూ మనుగడ సాగించజాలదు. తన ప్రసవ నొప్పులు చాలా గొప్పగా నున్నవని ప్రపంచమునకు తెలియును. ఆమె ప్రసవించవలసియున్నది. త్వరలోనే ఒక క్రొత్త భూమి జన్మించవలసి యున్నది.
దానిని బట్టి నేను వందనములు చెల్లించుచున్నాను. దీనియందు నాకు విసుగు వచ్చినది. ఈ స్థలములో మరణము, వేదన, నానా రకముల భేదములున్నవని మీ అందరికి తెలియును. ప్రసవించవలసి యున్నందుకు నేను సంతోషించుచున్నాను. ఆ సమయము సమీపించినందుకు ఆనందించుచున్నాను. అందుకే ఆనాడు యోహాను ఇట్లనెను, "ప్రభువైన యేసూ, రమ్ము!"
35క్రొత్త జన్మను తీసికొని వచ్చుటకు అది తప్పక కుళ్ళిపోవలెనని (ఇది వరకే) మీకు చెప్పాను. అదెట్లు కుళ్ళిపోయినదో మీరు చూడండి. గమనించండి, నా సోదరులారా! ఆమె పూర్తిగా కుళ్ళిపోయినది, దాని రాజకీయములు, విధానములు ఎంతగానో కుళ్ళిపోయినవి. ప్రపంచ విధానములో సరయినది ఒక్కటి కూడా లేదు. దాని రాజకీయములు, మత రాజకీయములు చెడిపోయినవి. "నేను డెమోక్రాట్ను," "నేను రిపబ్లికను," "నేను మెతడిస్తును," "నేను బాప్టిస్తును," అని చెప్పుకొనుచున్నారు గాని, వారు పూర్తిగా చెడిపోయిరి. ప్రసవించవలసియున్నది. దానిని ఆమె తాళలేదు. ఈ అమెరికాలోని "ప్రతి రాష్ట్రము" మీరు ఒక జార్జి వాషింగ్టన్ను గాని, ఒక అబ్రహాములింకన్ను గాని పెట్టినా అది వెనుకకు రాజాలదు. అది విమోచనను దాటిపోయినది. సృష్టికర్త యొక్క రాకడ మాత్రమే దీనికి సహాయపడగలదు.
ఆమె ప్రసవించవలెనని ఆమెకు తెలియును. ఆమె నొప్పులు, బాధలు పడుచున్నది. ఏమి చేయవలెనో ఎవరికీ తెలియదు. ఒకరు ఇటు వైపుకు, మరొకరు అటు వైపుకు చూచుచున్నారు. ఒకరికి ఒకరు భయపడుచూ ఒకరినొకరు నాశనము చేసికొన ప్రయత్నించుచున్నారు. ఒకరినొకరు విభేదించుకొనుచున్నారు. ఒకరి వినాశమును మరొకరు కోరుచున్నారు. అయిదు నిమిషముల సమయములో లోకమును నాశనము చేయగల శక్తి ఇప్పుడు పాపాత్ముల చేతులలోనికి వచ్చెను. చూచారా?
కాబట్టి తాను నిలబడజాలనని దానికి తెలియును. ఆమె నిలబడదని జనులకు తెలియును.
36దేవుడు చెప్పెను గనుక ఆ విధముగా జరుగునని ప్రపంచమునకు తెలియును. "సమస్త భూమి, ఆకాశము అగ్నితో దహించబడనైయున్నది." సమస్తము క్రొత్తదిగా చేయబడును, అప్పుడు నూతన ప్రపంచము జన్మించగలదు. దేవుడు దానిని ప్రవచించెను.
ఆమె దాని విధానములన్నింటిలోనూ కుళ్ళిపోయినది, కుళ్ళిపోవుటకు ఆమె అది చేయవలసియున్నది. అది ఎంతో ఉద్రిక్తతతో నిండియున్నది. అందుకు అది, నేను చెప్పాను, దాని ముఖము ఎర్రబడియున్నది. మరియు ఆశను పోగొట్టుకొన్నది. ఎక్కడ చూచినా భూకంపములే, తీరమంతటా ఆటుపోటులే, మరియు అలాస్కాను ఉప్పెనలు కదుల్చుచున్నవి. ఆ తీరమున భూమి కంపించుచున్నది. "మేము విడచిపెట్టిపోవలెనా? వెళ్ళిపోవలెనా?" అని జనులు అడుగుచున్నారు. చూడండి? ఏమి చేయవలెనో వారెరుగుదురు. మరియు రక్షిత ప్రాంతము ఏదీ లేదు, సజీవ దేవుని కుమారుడగు క్రీస్తు మాత్రమే రక్షించును, ఆయనలో మాత్రమే భద్రత యున్నది. ఆయనకు బయటనున్న వారందురును నశించుదురు. నిశ్చయముగా దేవుడు అది పలికినట్లుగా.
MATT 24:24•
MARK 13:22
37ఇప్పుడు, మనము వైద్యుని గ్రంథము చూద్దాం, (ఒకవేళ ఆమె ఈ స్థితిలో అది ఉన్నదో లేదో చూద్దాం) మరియు క్రొత్త భూమి జన్మించు ముందు ఈలాగు జరుగునో లేదో చూద్దాం. వైద్యుని గ్రంథమనగా బైబిలు, మత్తయి 24లో ఏమి ప్రవచించబడినదో చూద్దాం, దాని చిహ్నములు ఎట్లు౦డునో చూద్దాం. ఒక బిడ్డ పుట్టు ముందుండు చిహ్నములు వైద్యునికి తెలియును. సరిగ్గా బిడ్డ బయటకు వచ్చు సమయమునకు అతడు అన్నీ సిద్ధము చేయును. ఎందుకనగా అతనికి సమయము తెలియును, ఎందుకనగా ఆ చిహ్నములు అతనికి చూపించినవి. నీరు, రక్తము, ఉబికి వచ్చును - బిడ్డ బయటపడును. బిడ్డ జన్మించు సమయము అది. మరియు అతడు అందుకోసము అంతా సిద్ధపరచును.
ఈ సమయములో ఏమి జరుగునో యేసు ఖచ్చితముగా చెప్పెను. మత్తయి 24లో ఆయన సంఘము గూర్చి చెప్పెను. నిజ సంఘము, ఆత్మ సంబంధమగు సంఘము, శరీర సంబంధమగు సంఘము ఒకే విధముగా కనిపించుచు. అనుకరణ చేయువారు, సాధ్యమైతే వారు ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చెదరు. నోవహు దినములలో అది ఎట్లు౦డెనో చూడండి; "వారు తినుచూ, త్రాగుచూ, పెండ్లికిచ్చుచూ, పెండ్లి చేసికొనుచూ ఉండిరి." నేడు ప్రపంచములో ఈ అవినీతిని మనము చూచుచున్నాము. ఇది జరుగునని బైబిలు చెప్పెను, వైద్యుని గ్రంథము. ఇది జరుగుట మనము చూచినప్పుడు, ఆ జన్మ సమీపములోనే యున్నదని మనకు తెలియును, దగ్గర పడినది. అవునండీ!
ఇప్పుడు, ఒక దేశము కాదు గాని ప్రపంచము మొత్తమును మనము చూడవలెను.
38ఇప్పుడు, సంఘముగానున్న ఇశ్రాయేలును గూర్చి కొద్ది నిమిషములు ప్రారంభించి ఆమెను మరి తరువాతి పదినిమిషముల వరకు మనము వెంబడించుదము.
భూమి మీదికి వచ్చిన ప్రతి ప్రవక్త వలనను ఇశ్రాయేలు ప్రసవ నొప్పులను పొందినది. అతని వర్తమానము విని ఆమె ప్రసవవేదన పొందెను. కాని అతడేమీ చేసెను? ప్రవక్త యొద్దకు వాక్యము వచ్చెను. ఆమె బహుగా చెడిపోయినది, ఒక విధానమును ఏర్పరచుకొని అందులో స్థిరపడినది. చివరకి ఈ ప్రవక్త వచ్చి ఈమెను పునాదులతో కుదిపివేసెను, వారు అందరి చేత ద్వేషించబడిరి కనుక, దేవుడు ఒక ప్రవక్తను పంపినప్పుడు సంఘము ప్రసవ వేదన పడినది. కానీ "దేవుని యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు మాత్రమే వచ్చును, ఆ దినమునకు పలుకబడిన వాక్యము ఆ కాలపు ప్రవక్త ద్వారా బయలుపరచబడును." ఎల్లప్పుడూ ఆలాగే జరుగును. సంఘములు ఎన్నో సంస్థలు ఏర్పరచుకొన్నవి, ఆయన వచ్చినప్పుడు వాటినన్నింటినీ కుదిపి ఆయన కూల్చివేయును! ఆమెకు ప్రవస వేదన వచ్చును.
ఏమిటది? "తిరిగి వాక్యము నొద్దకు, తిరిగి జీవము నొద్దకు!" వ్యవస్థలో జీవము లేదు! దేవుని వాక్యములో మాత్రమే జీవమున్నది! దాని చుట్టూ ఈ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొనిరి, కాని దానికి జీవము లేదు. జీవమిచ్చినది వాక్యము మాత్రమే!
ఆయన వర్తమానము శేషిత జనాంగమును వాక్యము తట్టు త్రిప్పును. ఒక చిన్న గుంపు బయటకు వచ్చి విశ్వసించును. నోవహు కాలములో ఎనిమిదిమంది కలరు, కాని దేవుడు ఆ తక్కినవారిని నాశనము చేసెను. వారిని ఆలాగే కుదిపివేసెను.
MATT 4:4•
LUKE 4:4•
JOHN 1:1,14
39అన్ని యుగములలోనూ ఆలాగే జరిగినది, చివరకు సంఘము వారికి ఒక బిడ్డకు జన్మను ఇచ్చినది. ఆ మగబిడ్డ ఎవరనగా శరీరధారియైన వాక్యమే. "ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెను." ఆయన తనకు విరోధముగా వచ్చిన ప్రతి అపవాదిని, భూమి మీదిప్రతి శక్తిని తండ్రి మాటతో జయించెను. సాతాను ఆయనకు ఎన్నో శోధనలు తెచ్చినను, ఆయన సాతానును గద్దించెను. తనకున్న స్వశక్తితో కాదు గాని దేవుని వాక్యముతో గద్దించెను. "ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది! ఈలాగు వ్రాయబడియున్నది!" ఎందుకనగా ఆయనే వాక్యము.
అవ్వకు వ్యతిరేకముగా సాతాను లేచినప్పుడు, ఆమె వాక్యము కాదు, అందువలన విఫలమాయెను. మోషేకు విరోధముగా అది లేచినప్పుడు, ఆ విధముగానే అది చేసెను. దేవుని కుమారునికి విరోధముగా లేచెను, ఆయన 10,000 వాట్ల శక్తిగలవాడు. ఆయన యొక్క కదలిన వెంట్రుకలు మాత్రమే అందువలన ఊడినవి. ఆయన దానితో ఇట్లనెను, "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును," అని వ్రాయబడియున్నదనెను. ఆ మగ శిశువు శరీరధారి అయ్యెను, దేవుని యొక్క నిత్యవాక్యము, శరీరమందు ప్రత్యక్షమాయెను, వాక్యమునకు ఈ భూమి మీద ఆయనే ప్రతినిధి.
HEB 4:12
40అందుకే ఆయన వారి హృదయములో నుండిన దానిని ఎరిగెను. కనుకనే ఫిలిప్పు ఎవరో, ఎక్కడున్నాడో ఆయన చెప్పెను. సీమోను పేతురు ఎవరో ఆయన చెప్పెను. బావినొద్దనున్న స్త్రీకి చెప్పగలిగెను. ఎందుకు? ఆయనే వాక్యము. ఇది సత్యము. హెబ్రి నాలుగవ అధ్యాయములో బైబిలు ఆలాగున చెప్పెను, "దేవునియొక్క వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకంటెను వాడిగలదియై, ఎముకలలోని మూలుగులోనికి దూరుచూ హృదయాలోచనలను, రహస్యములను బయటపెట్టుచున్నది." ఆ గ్రుడ్డి పరిసయ్య యాజకులు శరీరధారియైన వాక్యమును చూడలేకపోయిరి, ఎందుకనగా వారా యాజకత్వమును, ఆ వ్యవస్థను చుట్టుకొనిరి. ఆ పాత పద్ధతి చావవలెను. అది వాక్యము, కాని వాగ్దానము చేయబడినది నెరవేరవలెను; కాబట్టి అది నెరవేరినచో ఇది కుళ్ళిపోవలెను. అది కేవలము పొట్టు; విత్తనము ముందుకు పోవలెను.
నోవహు వర్తమానమును మోషే ప్రకటించలేదు. నోవహు వర్తమానమును యేసు ప్రకటించలేదు, ఎందుకనగా అది మరో కాలము. ఆ పాత గింజలో జీవముండెను గాని, దాని పని అదిచేసినది. చచ్చి గతించినది. పాత దాని నుండి క్రొత్త దానికి రూపాంతరము జరుగుచున్నది. జీవము వచ్చుచున్నది, కాని జనులను ఏది తొందరచేయుచున్నది? ఇంకా నేడు వారిని ఏది బాధించుచున్నది? లూథర్ వర్తమానము ద్వారా ప్రారంభించబడిన మనము ఒక గోడ కట్టుట లేదు, వారు తిన్నగా ఒక గీత ద్వారా వెళ్ళుచున్నారు. పెంతెకోస్తు వర్తమానము చుట్టూ వారు ఒక గీతను గీసికొనిరి. మనము మూలాలను త్రిప్పుచున్నాము. ఒక భవనము నిర్మించుచున్నాము. దేవుని వాక్యమే మన నమూనా! ఎవరైనా గాని ఒక వరుస గీత గీయగలరు, కాని మూలను త్రిప్పువాడు (mason) వేరేయుండును. అది చేయుటకు దేవుని శక్తి కావలెను! దానిని చేయుటకు పరలోకము నుండి అభిషేకము పొందిన ఒక వ్యక్తి కావలెను. ప్రతి కాలములోను అది ఆలాగే జరుగుచున్నది.
మరియు ప్రవక్తల కాలములో, దేవుని యొక్క వాక్యము ప్రవక్తల వద్దకు వచ్చును, మరియు వారు మూలాలను త్రిప్పెను, మార్పును తెచ్చిరి. కాని ఆ కట్టువారు వేరే గోడను కట్టుటకు కోరుచున్నారు. అది అసలు గోడ కాదు; అది ఒక ఆలయము, దేవుని యొక్క ఒక ఆలయము.
JOHN 5:18•
JOHN 10:34-36•
COL 2:9
41ఇప్పుడు, ఇది సత్యమని మనకు తెలియుచున్నది, ప్రతి కాలములోను ఆ సంస్థలు చెడిపోయినవి, వారి ప్రతి వ్యవస్థ చచ్చి కుళ్ళిపోవలెను. ఆ కుళ్ళిన స్థితి నుండి సంఘమును అది బయటకు తీసికొని రావలసియున్నది. వాక్యము దానికది వచ్చును. "యెహోవా యొక్క వాక్కు ప్రవక్తల యొద్దకు వచ్చును," అదెన్నడును యాజకుల యొద్దకు రాదు; ప్రవక్త యొద్దకు వచ్చును. గమనించండి, చివరకు వాక్యము ఒక శరీరధారిగా పుట్టెను, దైవత్వము యొక్క సర్వసంపూర్ణత ఆయన యందు శరీరరీత్యా నివసించెను. ఆయనే వాక్యమై యుండెను. ప్రవక్తలు వాక్యములో భాగమైయున్నారు, అది వారి కాలపు వాక్యము. నేడు, మనము, వాక్యములోని భాగమైయున్నాము, వాక్యమును వెంబడించువారము. కాని ఆయన వాక్యము యొక్క సర్వసంపూర్ణత! ఆయనే వాక్యము! ఆయన దేవునితో సమానముగా చేసికొనుచున్నాడని వారు నేరము మోపినప్పుడు ఆయన దేవుని కుమారుడే. వారాయనను "నిన్ను నీవు దేవుడనుచున్నావనిరి."
"దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో, ప్రవక్తలు? వారు దైవములని వ్రాయబడిన ఆ మాట మీరు చదువలేదా?" అని ఆయన అడిగెను. అయితే దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్న నన్ను మీరెలాగు ఖండించగలరు?
42దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరరీత్యా ఆయనలో నివసించెను. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని యొక్క సర్వ సంపూర్ణత.
ఆ ప్రవక్తల మూలముగా కలిగిన ప్రసవ వేదనకు అదే ఫలితము. వాక్యమైయున్న వారు సంపూర్ణ వాక్యము వైపు చూపించుచుండిరి. చివరకు ఆ వ్యవస్థలు చనిపోయెను."వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను."
GEN 41:43•
PHIL 2:10
43యాకోబులో అదెట్లున్నదో చూడండి. యోసేపులో అదెట్లు చూపబడినదో చూడండి. తన తండ్రి చేత ప్రేమించబడి నిష్కారణంగా తన సోదరులచే ద్వేషింపబడెను. అతడు ఆత్మ సంబంధి, సంగతులను ముందుగానే చెప్పగలడు, కలలకు భావము చెప్పగలడు. ఆ విధముగా అతడు పుట్టెను. ఆలాగు చేయకుండా జీవించలేడు. ఆ విధముగా ఉండుటకు అతడు ముందు నిర్ణయించబడెను, కానీ అతని సోదరులు అతనిని ద్వేషించిరి. ముప్పది వెండి నాణేములకు అమ్మి వేసిరి. దాదాపుగా ముప్పది వెండి రూకలు, మరియు ఫరో కుడి పార్శ్వమునకు లేపబడెను. చెరసాలలో అతనిని పెట్టిరి, అక్కడ వంటవాడు, రొట్టెలు చేయువాడు ఉండిరి. ఒకడు రక్షించబడెను మరియు ఒకడు నశించెను. యేసు సిలువ మీద నున్నప్పుడును ఒకడు రక్షించబడెను మరియు ఒకడు నశించెను. తరువాత పరలోకమునకు హెచ్చింపబడెను. దేవుని సింహాసనము మీద కూర్చొనెను. ఆయన మరల వచ్చునప్పుడు బూరధ్వని వినబడెను. "ప్రతి మోకాలు వంగును," ప్రతి నాలుక ఒప్పుకొనును. యోసేపు సింహాసనము దిగి ముందుకు వచ్చునారంభించినప్పుడు ఒక బూర మ్రోగెను. "యోసేపు వచ్చుచున్నాడు" గనుక ప్రతి మోకాలు వంగవలెను.
ROM 14:11
44ఒక దినమున దేవుని యొక్క గొప్ప బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు లేచెదరు, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఈ వాక్యమును ఒప్పుకొనును. మంచిది, ఆయన ఎందుకొరకు వచ్చుచున్నాడు? ఆయన ఇక్కడికీ ఎందుకు వచ్చుచున్నాడు?
గమనించండి, "ఆయన వచ్చుచున్నాడు! ఆయన వచ్చుచున్నాడు! ఆయనవచ్చుచున్నాడు," అని ఎలుగెత్తి చాటిన ప్రవక్తల ద్వారా ప్రసవనొప్పులు ఏర్పడి ఆమె ఈ సంపూర్ణ వాక్యమును శరీరధారిగా ప్రసవించినది. చరిత్ర ప్రకారము మరియు వాక్య ప్రకారము ఆమె నాలుగు వందల సంవత్సరముల పాటు ప్రవక్తను లేకయే యున్నది - మలాకీ నుండి యోహాను వరకు. వేదాంత పండితులు, యాజకులు, సంఘ కాపరులు మాత్రమే వారికి ఉండిరి. దాని వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయినదో దీనిని బట్టి మనము ఊహించగలము. దేవుని యొద్ద నుండి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అను ప్రత్యక్ష వర్తమానము లేకుండా నాలుగు వందల సంవత్సరములున్నది. కాబట్టి యాజకులు, ప్రవక్తలు అందరూ భయంకర గందరగోళములో నుండిరి. ఆమె పూర్తిగా కుళ్ళిపోయినది.
MAL 3:1•
MAL 4:1,3,5•
MATT 11:3-10•
LUKE 3:7,8•
LUKE 7:19-27
45మలాకీ 3లోవాగ్దానము చేయబడిన యోహాను - మలాకీ 4 కాదు గాని, మలాకీ 3; ఎందుకనగా మత్తయి 11లో యేసు అదే చెప్పెను. యోహానువి పక్షిరాజు నేత్రములు. (పెంబర్టన్ తన "ఆది యుగములు" గ్రంథములో ఆలాగు చెప్పెను). "ఆయనో లేక మరొకరి కొరకు మనము కనిపెట్టవలెనో వెళ్ళి అడుగమని," చెప్పెను. యేసు తన శిష్యులను కూటములో ఏమి జరుగుచున్నదో చూపించెను. "వెళ్ళి యోహానుకు ఈ సంగతులు చెప్పుడనెను. అభ్యంతరపడనివాడు ధన్యుడని చెప్పెను." ఆయన శిష్యులు, ఆ జనులు ఆయన మాటలు వినుటకు తిరిగినప్పుడు అప్పుడాయన ఇట్టడిగెను, "మీరు ఏమి చూచుటకు యోహాను యొద్దకు వెళ్ళిరి? మెత్తని వస్త్రములు ధరించుకొనిన వారిని చూచుటకు వెళ్ళితిరా?" అటువంటి వారు రాజ భవనములలో యున్నారు. గాలికి కదులుచున్న రెల్లును మీరు చూచుటకు వెళ్ళితిరా?"
చిన్న ముల్లు గుచ్చుకొనినా వారు కదిలిపోయిరని అర్ధము. "మీరు వచ్చి మా గుంపులో చేరినచో మంచి జీతములు ఇచ్చెదము. దీనికి విరోధముగా, దానికి విరోధంగా నీవు బోధించిన యెడల నీవు మా గుంపులో చేరవచ్చును'' అనిరి. యోహాను కాదు.
"అయితే, మీరు ఎవరిని చూడ వెళ్ళిరి? ఒక ప్రవక్తనా? ప్రవక్త కంటె గొప్సవానిని," అని నేను మీతో చెప్పుచున్నాను. "ప్రవక్త ద్వారా పలుకబడిన వాడితడే. ఈతనిని మీరు చేర్చుకొనుడి. నాకంటె ముందుగా మార్గము సిద్ధపరచుటకు నా దూతను పంపెదను," అని మలాకీ 3:1. మలాకీ4 కాదు. ఎందుకనగా ఏలియా వచ్చును, ఆ వెంటనే లోకము దహించబడును. దుర్మారుల ధూళి మీద నీతిమంతులు నడిచిపోయెదరు అని యున్నది.
46ఇప్పుడు గమనించండి, అతని వర్తమానము వారిని ఆ మగత నిద్రత నుండి ఎన్నడూ మేల్కొలప లేదు. "వారతనిని పిచ్చివారనిరి. అతని మాట విననక్కర లేదనిరి. జనులను నదిలోని నీటిలో ముంచుచున్నాడనిరి. చూచారా? ఆ ముసలివాని సంగతి మనకు వద్దనిరి. అతనికి మంచి బట్టలు కూడా లేవు, గొర్రె చర్మము చుట్టుకొనెను. అంతకన్న దరిద్రుడు మరెవరూ ఉండరనిరి. అతడు ఏ సెమినరీలోను చదువలేదు, ఏ సహవాసపు కార్డు లేదు, అతని కూటములకు మన సహకారముండదు. అతనిని అక్కడే ఆకలితో చావనీయండి అనిరి." చూచారా? లోకము ఏమీ మారలేదు; దాని వ్యవస్థలు మారలేదు. "అయితే మనము అతనిని కేవలము అక్కడే ఉండనిచ్చెదము.''
అతను ఆలాగు ఎందుకు కాదో మీకు తెలుసునా? గుర్తించుకొనండి, అతని తండ్రి ఒక యాజకుడు. కానీ అతను తన తండ్రిని ఎందుకు వెంబడించలేదు? ఆ రోజులలో పిల్లలు తల్లిదండ్రుల పనిచేసెడివారు. కాని ఇతనికి వేరొక ముఖ్య వర్తమానమున్నది. అతడు మెస్సీయాను పరిచయము చేయనైయున్నాడు, పరిశుద్ధాత్మ ఆలాగు చెప్పెను. గాబ్రియేలు సందేశము ద్వారా వెనుకకు తిరిగిన ఆ అల్ప శేషిత జనము అది సరియేనని ఎరుగుదురు. కాబట్టి దాదాపు తొమ్మిదేండ్ల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన అతడు అరణ్యమునకు వెల్లెనని చెప్పెను. ఎందుకనగా చెప్పినది సరిగ్గా వినవలెను గనుక అతడు అరణ్యములోనికి వెళ్ళేను. ఎందుకనగా ఆ గొప్ప వేదాంత భవనములో వారీలాగు చెప్పుచుండిరి, "మెస్సీయా రాకగూర్చి ప్రకటించువాడవు నీవేనని మాకు తెలియును. నిన్ను గూర్చి యొషయా చెప్పెను, కాబట్టి నీవే ఆ స్వరముగా నుందువు. ఇక్కడున్న జోన్స్ కూడా నీ వలెయున్నాడని నీవెరుగుదువా?" అతనిని తేలికగా వారు నమ్మించగలరు. కానీ అతడు వారి పద్ధతులను ఎన్నడూ నేర్చుకొనలేదు. అతని వర్తమానము చాలా ముఖ్యమైనది. అతడు నివసించుటకు అరణ్యములోనికి వెళ్ళెను.
MATT 3:7,9,10•
LUKE 3:9
47గమనించండి, అతని వర్తమానము వేదాంత పండితుల వర్తమానమువలె లేదు. అతడు మాదిరిలనుపయోగించెను. "ఓ! సర్ప సంతానమా?" అని ఆ యాజకులను పాములని పిలచెను. అతనికి అరణ్యములో ఎదురయిన చెడ్డ జంతువు పాము, (గుట్టుగా ప్రాకే జీవులు) అవి తప్పించుకొనును. "ఇది చాలా మంచి పోలిక అనుకొనెను," "సర్ప సంతానామా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు"? మేము దీనికి, దానికి చెందితిమని చెప్పవదు. దేవుడు రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు." అరణ్యములోని సెలయేటి యొద్ద ఈ రాళ్ళు కనుగొనెను.
"గొడ్డలి చెట్లు మొదలున పెట్టబడియున్నది." దీనిని అతడు అరణ్యములో చూచెను, "మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను." చూడండి. అతని వర్తమానము అసలు యాజకునిగా లేదు. అది ప్రకృతి గూర్చి చెప్పినట్లున్నది. కాని అతనికి ప్రకటించవలసిన ఒక వర్తమానముండెను, అతని వర్తమానములో అతనికి విశ్వాసమున్నది. "మెస్సీయా రానైయున్నాడు, ఇప్పుడాయన మీ మధ్యనే యున్నాడు, ఆయన మీ మధ్యనే నిలబడియున్నాడు గాని, మీరాయనను ఎరుగరు. ఆయన చెప్పులు విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను, అగ్నితోను మీకు బాప్తీస్మమిచ్చును."
"యోహాను! అతడెవరు"?
"నాకు తెలియదు."
JOHN 1:29,33
48కాని ఒకరోజున ఒక యువకుడు నదియొద్దకు నడిచి వచ్చెను, మామూలుగా కనబడిన ఒక మనిషి బాప్తీస్మమిచ్చు యోహాను అచ్చట నిలబడియుండెను, ధన్యుడగు ప్రవక్త ఆ యోర్దాను వైపు చూచి ఇట్లనెను, "ఇదిగో, లోక పాపమును మోసికొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల!"
"యోహానూ! ఆయనను నీవెట్లు ఎరుగుదువు?"
"ఆయనే అరణ్యములో నాతో, వెళ్ళి బాప్తీస్మమిమ్మని చెప్పెను. ఎవరి మీదికి ఆత్మ దిగుట నీవు చూచెదవో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తీస్మమిచ్చువాడు," అని నాతో చెప్పెను.
అతని వర్తమానము వేదాంత విద్యనుండి రాలేదు, మానవ నిర్మిత వ్యవస్థ నుండి రాలేదు. అది తిన్నగా దేవుని యొద్దనుండి రావలసియున్నది.
అతని వర్తమానము వారిని అంత పెద్దగా కదిలించలేదు. అతడు చూచెనోలేదో మనకు నమ్మకము ఏమిటి? అని వారిలో వారనుకొనిరి. ఆ యాజకులు సందేహ పడిరి, కాని అతడు చూచెను. అతడు చూచెనని మనము నమ్ముచున్నాము. నిశ్చయంగా అతడు చూచెను, కాని ఏమి జరిగినదో మీరు గమనించారా? వారి నిద్ర నుండి వారిని లేపలేదు; వారు అలాగే ముందుకు సాగి; వారతని తలను నరికిరి. అది వారిని ఎన్నడూ కదల్చలేదు.
LUKE 2:26
49కానీ ఆ చిన్న గుంపును, జీవము గల ఆ శేష జనులు, అన్నా మరియు సిమియోను, మరికొందరు ఆ ప్రభువు యొక్క రాక కొరకు ఎదురు చూచుచుండిరి.
ఆలయములో హన్నా గ్రుడ్డిదిగా నుండెను, ప్రవక్తినిగా ప్రార్ధనల ద్వారా ప్రభువును సేవించెను. మరియు ఒక రోజు ఆమె ఆత్మపూర్ణురాలై ఉన్నప్పుడు. సిమియోను (వృదుడు) ప్రవచించెను. "ప్రభువైన క్రీస్తును చూచువరకు నేను మరణించనని పరిశుద్ధత్మ నాతో చెప్పెనని" పలికెను.
కొందరు యాజకులు ఈలాగని యుందురు, "ముసలివాడు, మతి చెడినది, ఒక కాలు సమాధిలోనికి వెళ్ళియున్నది, ఇంకో కాలు గోతిలోనికి జారిపోవుచున్నది. అతని సంగతి మనకు వద్దు. అతడు గౌరవనీయుడే గాని కొద్దిగా మతిచెడినది." కాని మీరు చూడండి, అతడేమి పొందెను? పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రత్యక్షతను పొందెను.
అదే మీకునూ, ఈ మధ్యాహ్నాము బయలుపరచబడియున్నది. ఒక కారణముతో పరిశుద్ధాత్మ ఇచ్చటకి మిమ్మును తీసికొని వచ్చెను. ఈ మెథడిస్టు, బాప్టిస్టు, కాథలిక్కు బోధకులను చూడండి. వారు పరిశుద్ధాత్మచే కదిలించబడిరి. పరిశుద్ధాత్మ వారిని కదిలించినందునే, ఆకలితో ఎదురు చూచుచున్నారు.
అప్పుడు కొంచము…
50మీకు తెలుసా - ఒకనాడు, టెలివిజను లేదు. ఆ రోజును గూర్చి ప్రభువుకు వందనములు. కావున వారు యూదయలోని కొండ ప్రాంతమును ఎక్కిరి. అక్కడ ఒక శిశువు పుట్టెను. ఒక నక్షత్రము కనబడెను. కానీ ఎనిమిది దినములయిన తరువాత పొత్తి గుడ్డలలో ఆ తల్లి శిశువును చుట్టి తెచ్చినది. అది పొత్తిగుడ్డ. వారికి మరేదీ ధరించుటకు లేదు. ఎద్దు కాడి మీద పెట్టు ఒక చిన్న గుడ్డ పేలిక. యోసేపు తన శిశువుతో కూడా వచ్చుచున్నాడు.
కొందరు తల్లులు తమ పిల్లలకు చేయుచూ దూరము నుండి వీరిని చూచుచున్నారనుకొంటాను. "అదిగో చూడండి? చూడండి? అతని ద్వారా గర్భము ధరించిన స్త్రీ వచ్చుచున్నది. ఆమె ఇటు వస్తున్నది. దూరంగా తొలగండి." వారింకా ఆ విధంగానే తలంచుచున్నారు.
కాని మరియ తన చేతిలో ఆ బిడ్డను ఎత్తికొనెను. వారేమనుకొన్నా తాను పట్టించుకొనదు. ఆయనెవరి కుమారుడో ఆమె ఎరుగును.
51దేవుని వాక్యమును హృదయములో అంగీకరించిన ప్రతి విశ్వాసియు దీనిని ఎరుగును. వారి సంస్థ ఏమి చెప్పినా నాకు అక్కరలేదు. అదేమిటో నీకు తెలియును. అది దేవుని యొక్క వాగ్దానము. నీవాయన శక్తితో కమ్మబడినప్పుడు పరిశుద్దాత్మ ద్వారా అది నీకు బయలుపరచబడినది. అది ఎక్కడున్నదో నీకు తెలియును.
ఎడారి వెనుక భాగమున, మండుచున్న పొద యొద్ద దేవుని కలిసికొను వరకు సువార్త ప్రకటించు హక్కు ఎవరికిని లేదు. ఈ లోకములోన ఏ దైవ క్రమము దానిని నీకు వివరించజాలదు. నీవు అక్కడుండవలెను, అది నీకు జరగవలెను. ఆ సంస్థ ఏమి చెప్పినా నాకక్కరలేదు. నీవే దానికి సాక్షివి. హల్లెలూయా! ఒకసారి ముసలి నల్లజాతి సోదరునితో మాట్లాడాను, "ఇక్కడ నాకు చోటు లేదు!" నేను చాలా ఆధ్యాత్మికతను పొందుచున్నాను, ఈ సమయములో నేను ఆలోచించగా అది సరియైనది, దేవుడు తనకు తానే నీకు బయలుపరచుకొనెను.
52సిమియోను ఆ ఉదయమున తన గదిలో అధ్యయనము చేయుచుండెను. అతనికి వాగ్దానమున్నది. ఓ! ప్రతి ఉదయము కొన్ని వందలమంది పిల్లలను అక్కడికి తెచ్చెదరనుకొందును. ఎందుకనగా దాదాపు రెండున్నర మిలియనుల యూదులుండిరి. చాలా మంది బిడ్డలు జన్మించిరి. ప్రతి తల్లి ఎనిమిదవ దినము తరువాత వచ్చి శుద్ధీకరణ అర్పణ అర్పించవలెను. సిమియోను అచ్చట కూర్చొనియుండి యెషయా గ్రంథపు చుట్టను చుదువుచున్నాడేమో; నాకు తెలియదు. కాని అంతలోనే…
పరిశుద్ధాత్మ నీకు ఒక వాగ్దానము చేసినయెడల పరిశుద్ధాత్మ ఆ వాగ్దానమును నిలబెట్టుకోవలసియున్నది. ఒక వ్యక్తి చెప్పిన దానిని దేవుడు బలపరచనియెడల అది వాక్యానుసారమే కాదు. దానిని మరచిపోమ్కు అతడు ఇంకా దానిని చెప్పుచున్నా గాని, దేవుడు దానిని బలపరచిన యెడల అది తప్పు, ఎందుకనగా దేవుడు తన వాక్యమునకు అర్ధము చెప్పుకొనును. ఆయనే తన స్వంత అనువాదకుడు, ఆయన చెప్పినది జరుగును. "ఆయనను వినుము, ఎందుకనగా అది సత్యము" అని దేవుడు చెప్పాడు. అది కేవలము వివేకము. అది జరుగునని ఆయన చెప్పిన యెడల అది జరుగును. అది ఖచ్చితంగా సమయానుసారముగా జరుగును, ఎందుకనగా దేవుడు అబద్దమాడడు.
LUKE 2:29
53సిమియోను ఈ హింసపొందుచూ అక్కడ కూర్చొనియుండెను. అతడే మిగిలెను. అతడు యోహాను వర్తమానము విన్నాడు, ఆ దినానికి చెందిన ఒక చిన్న గుంపు. ఈ పుస్తకపు చుట్టలోనిది అతడు వినుచుండెను, యోహాను వచ్చుటను అతడు ఎరిగియుండెను. ఎందుకనగా అతడు మిగిలియున్నవారిలో ఒకడు. వాక్యము అతనికి ప్రత్యక్ష మాయెను. ఆకస్మాత్తుగా ఆబిడ్డ ఆలయములోనికి వచ్చినప్పుడు, దానిని బయలుపరచుట పరిశుద్ధాత్మ పని. కాబట్టి అతడు పరిశుద్ధాత్మ చే కదిలించబడి, చిన్న పఠన గదిలో నుండి బయటకు వచ్చి ఆ స్త్రీని చూచెను. వారందరూ ఆ వరుసలో నిలబడి యుండగా, ఇతడు ఈ శిశువును చేతుల లోనికి ఎత్తుకొని ఇట్లనెను. "ప్రభువా, నీ దాసుని సమాధానముగా పోనిమ్ము, ఎందుకనగా నా కన్నులు నీ రక్షణను చూచెను."
ఆ కాలములో, ఏర్పరచబడినమరో స్త్రీ యుండెను, ఆమె ప్రవక్తియగు హన్నా, ఆమె గ్రుడ్డిదై ఆ మూలన కూర్చొనియుండెను. ఆమె ఆత్మచేత నడిపించబడివచ్చుచుండెను, ఆలయము స్త్రీలు, ప్రజలతో కిక్కిరిసియుండెను. బాలుడగు క్రీస్తు ఉన్న చోటికి ఆమె వచ్చెను. ఒక గ్రుడ్డి స్త్రీని పరిశుద్ధాత్మ ఆయన యొద్దకు నడిపించిన యెడల, దృష్టి కలిగి ఉన్నామని చెప్పుకొనుచున్న పెంతెకోస్తు గుంపు మాట ఏమిటి? ఇంకా ఎక్కువ నేను చెప్పను. మీరే దానిని బట్టి తెలిసికొందురు.
గమనించండి, మరల సంఘము ఘోరమగు స్థితిలో యున్నది! ఆ దినమున నిశ్చయముగా అది ఆలాగే ఉండియుండును. కాని నేను చెప్పినట్లుగా, శేష జనులను అది లేపెను.
54ఇప్పుడు మనము యధార్థముగా ఉందము. సంఘము ఆ స్థితిలో నుండుట మనము చూచుచున్నాము, గనుక మరల ఆ కాలమునకు మనము రాలేదా? ఈ కాలములో జరుగవలసియున్న బైబిలులోని ప్రవచనములను చూడండి. ప్రపంచములో ఏమి జరుగుచున్నదో మనము చూచాము, అంతము వచ్చియున్నది. ఇప్పుడు, సంఘము వైపు చూద్దాం.
లూథర్ ద్వారా సంఘము ప్రసవ వేదన పడినది. ప్రకటన గ్రంథ ప్రకారము ఏడు సంఘ కాలములు, ఏడుగురు వర్తమానికులు ఉన్నట్లు మనకు తెలియును. మరియు ఇప్పుడు, లూథరు బయటకు వచ్చినప్పుడు సంఘమునకు ప్రసవ నొప్పులు వచ్చెను. అందువలన లూథరు పుట్టెను. అది నిజము.
ఆ తరువాత ఇది మరల ఇబ్బందిలో పడినది, కాబట్టి అది వెస్లీని ప్రసవించెను. అది నిజము. అది మరల పెంతెకోస్తును ప్రసవించెను. ఆ కాలములోని ప్రతీ వర్తమానికుడు తమ కాల వర్తమానముతో ఒక ఊపు ఊపిరి. ప్రకటన గ్రంథములోని మొదటి నాలుగు అధ్యాయముల మీద ఒక వ్యాఖ్యానము గ్రంథస్థము చేశాను. దానిని అచ్చు వేసిన వెంటనే మీరు చదవండి. లూథర్ వార్తమానమేమిటో అది మీకు నిస్సందేహముగా చెప్పెను, అది నీతీకరణము, ఆ తరువాత శుద్దీకరణ, మరియు స్వాభావికమైన పుట్టుకలో తదుపరి క్రమము. మరియు పెంతెకోస్తు వరుసగా వచ్చును. కచ్చితముగా.
REV 3:17,18
55ఇప్పుడు - గమనించండి, ప్రతికాలము సంఘమును కుదిపి ప్రసవ నొప్పులను రప్పించెను. కాని వారేమి చేసిరి? ప్రసవ నొప్పులు వచ్చిన తరువాత, వారు వాక్యమునొద్దకు వచ్చుటకు బదులుగా కొందరు మనుష్యులు గుంపుగా కూడికొనిరి. మొదటివారివలెనె చేసిరి. అపోస్తలులు కదిలించిన తరువాత ఆమె మరల దారి తప్పుట మనము చూడగలము. ఆ తరువాత చాలా మంది వచ్చిరి అని మనము కనుగొనగలము. ఆదియందే అగబు ఇంకా చాలా మంది సంస్కర్తలు వచ్చిరి. ప్రతి యుగము ఆలాగే ముగిసినది, మీరు దీనిని ప్రూర్య నైసియా సమితి, నైసియా పితరులు అను పుస్తకములలో చదివియందురు. ప్రతి కాలములోను ఒక వర్తమానికుడు వచ్చి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని ఆ కాలమును కుదిపెను.
ఇప్పుడామె లేఖనము ప్రకారము నీచ స్థితిలో యున్నది, ముందెన్నడూ లేని స్థితి. మనము లవొదికయ సంఘ కాలములో ఉన్నాము. "ధనవంతురాలే గాని గ్రుడ్డిది, మరియు దానిని ఎరుగదు." లవొదికయ సంఘ కాలములో తప్ప మరే ఇతర కాలములోను క్రీస్తు బయట ఉండుట బైబిలులో చూడలేము. ఆమె నీచ స్థితిలో యున్నది, ఎన్నడూ లేనంతగా కుళ్ళిపోయినది. "ఏదీ అవసరము లేదని తలంచుచున్నది." "అయితే, అది గ్రుడ్డిదనియు, దిగంబరియనియు, దరిద్రురాలు, దౌర్భాగ్యురాలు అనియు ఎరుగకున్నది." "నీ కనుదృష్టి కలుగునట్లు నా యొద్దకు వచ్చి కళ్ళకు కాటుక కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను." మరియు అది నిశ్చయముగా… దేవుని యొక్క కాటుక సంఘమునకు నిజముగా వెలుగును ఇచ్చును. దేవుడు చెప్పినది చూచునట్లు అది కన్నులు తెరచును.
MAL 4:5,6
56ఇప్పుడు త్వరగా గమనించండి. ఆమె ఆ దశలోనున్నది, ఎట్టి సందేహము లేకుండా. మనము లవొదికయ సంఘ కాలములో ఉన్నాము. దాని యొక్క వర్తమానికుని గూర్చి మలాకి 4లో చెప్పబడెను. దానిని చేయుటకు ఆయన వాగ్దానము చేసెను. ప్రజలను వాక్యము నొద్దకు తిరిగి తెచ్చుటయే ఆ వర్తమానము. మలాకీ4 ప్రకారము ఆమె ఒక క్రొత్త దానిని ప్రసవించనై యున్నది.
ఈనాడు ప్రపంచ సంఘములో రెండు విధానములు పనిచేయుచున్నవి. ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి. దీనికి మీరు "ఆమేన్" చెప్పెదరో లేదో వినగోరుచున్నాను. సంఘ ప్రపంచములో రెండు విధానములు నేడు పనిచేయుచున్నవి. దీనిని నేను నా భుజముల మీద నుండి దించివేయగోరుచున్నాను. దానిని మనందరము ఎరుగుదుము, అది దేవుని వాక్యము మరియు శాఖా విధానము. రెండు వ్యవస్థలు పనిచేయుచున్నవి. యాకోబు, ఏశావులవలెనె ఒకటి ఆత్మ సంబంధమైనది, మరొకటి శరీరసంబంధమైనది. అది ఏమిటి? ఏశావు మరియు యాకోబుల తల్లి గర్భములో నుండి రాకముందే పోరాడు కొనుచుండిరి. ఆ విధముగానే శాఖవారు, మరియు వాక్యము ఒకరిపై ఒకరు పోరాడుకొనుచుండిరి. లూథర్ మొదట సంస్కరణ తెచ్చినప్పటినుండియు వారు పోరాడుకొనుచున్నారు. ఇది చాలా సూక్ష్యముగా నున్నది గనుక మీరు అర్ధముచేసికొందురు. చూచారా?
వీరు దీనిని పట్టుకొని వెళ్ళి అందులో నుండి మరింత భావమును గ్రహించగలరు. చూడండి. ఈ విత్తనమును నేను వేయగోరుచున్నాను. వారు దానిని జీవించునటు చేయుదురని ఆశించుచున్నాను.
గమనించండి.
57చూడండి, ఎప్పుడూ ఆ విధంగానే ఉన్నది. ఆ కారణము చేత ఆమె ప్రసవ నొప్పులు పడుచున్నది, ఎందుకనగా ఆమెలో ఒక పోరాటము జరుగుచున్నది. ఒక ఏశావు అక్కడున్నాడు, లోకసంబంధి, చాలా మతనిష్టగలవాడు. అతడు మంచివాడు, పరిశుద్ధుడు, చాలా నీతిపరుడు. కాని ఆ జ్యేష్టత్వపు హక్కు గూర్చి ఎరుగనివాడు. ఆ రీతిగా అతడు జన్మించెను. ఆ విధముగా అతడు రూపొందెను. యాకోబు ఎట్టివాడో నాకక్కర్లేదు. అతడు జ్యేష్ఠత్వపు హక్కును కోరుకొనెను. అతడు ఆత్మ సంబంధి. ఈనాడు సంఘ గర్భములో ఆ ఇద్దరు ఉన్నారు.
ఒక గొప్ప సంస్థ తయారగుటకు ప్రయత్నించుచున్నది. అది ప్రపంచ సంఘసమితిగా పిలువబడుచున్నది, మరియు సంఘము యొక్క గర్భములో నుండి ఇద్దరు పిల్లలు పుట్టుచున్నారు. నా మాటలు గుర్తించండి! వాక్యము వాక్యమును పెండ్లి కుమార్తె సంఘమునే ప్రసవించును. క్రీస్తు కొరకు ఒక పెండ్లికుమార్తె సంఘమును తనలో నుండి కనును. యుగములన్నింటిలోను నిద్రించినవారు ఆ శరీరముగా నుందురు, వారు వాక్యము వలన ఆ విధముగా తయారయితిరి గనుక తిరిగి వాక్యమే ఆగుదురు. శరీరము ఎదుగుచున్నట్లు అనగా పాదములు మొదలుకొని శిరస్సు వరకు ఎటు ఎదుగుచున్నదో ఆలాగే క్రీస్తు శరీరము ఎదుగును. చివరగా దాని శిరస్సు ఏర్పడును.
గమనించండి, అంతయూ శిరస్సునకు అతుకబడియున్నది. తిరుగుట, లాగుట తలయే చేయవలెను.
ROM 1:17
58కాని ఈ సంస్థలు ఏమీ ఎదుగజాలవు, ఎందుకనగా అది ఒక వ్యవస్థ. గురుగు, గోధుమ గింజను కాయదు. కాని ఆ రెండు ఒకే చోట ఉండవచ్చును. ఒకే నీరు, ఒకే సూర్యరశ్ని పొందవచ్చును. ఒకటి వాక్యము; మరొకటి వాక్యము కాదు. ఆ రెండును పోరాడుచున్నవి. మొదటి సంస్కరణ కాలము నుండి అవి పోరాడుచున్నవి, ఇంకనూ పోరాడుచున్నవి.
దాని మీద ఇంకా ఎక్కువ నేను చెప్పనవసరము లేదు. చెప్పవలెనా? నిశ్చయముగా నేను చెప్పుచున్నది మీరు ఎరుగుదురు. అది సరే. అక్కడనే మనమున్నాము. అక్కడనే మీరూ ఉన్నారు, ఒక పద్ధతిగా, మీరు ఏ పద్ధతిలో యున్నారు? అది మీ పద్ధతి కావచ్చు.
ఇప్పుడు ఊహించుకొనండి. మీరు ప్రవక్తలుండిన కాలములో జీవించియుండినచో అప్పుడు ఎవరి పక్షమున ఉండియుందురు? వారియొద్దకు వాక్యము వచ్చెను, నేడును మీకు అదే ఎన్నిక చేసికొను అవకాశమున్నది. పరిపూర్ణ వాక్యమును తిరిగి కనుటకు ఆమె ప్రసవ వేదన పడుచున్నది. మరియు వాక్య వధువు కొరకు వాక్యము వచ్చుచున్నది. స్త్రీ, పురుషునిలోని భాగము, (అతనిలో నుండి తీయబడినది), ఆలాగే సంఘము కూడా వాక్యములో నిలచియుండు సంఘమై యుండవలసియున్నది. బైబిలులోని ప్రతి మాటతో నిలచియుండవలెను. వ్యవస్థలు కాదు, సిద్దాంతములు కాదు, మరేది కలుపుట కాదు. అది కల్తి లేని పరిశుద్ధ వాక్యముగా నుండవలెను! నిజము!
లూథరు వెలుగు కలిగిన దినములలో సంఘము బ్రద్ధలయినది. ఆమెకు నొప్పి వచ్చెను, అందువలన లూథరు పుట్టెను. "నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రదుకును. మరియు ఇది ప్రభురాత్రి భోజనము కాదు."
ఇప్పుడు, మనము కొనుగొనెదము, జాన్ వెస్లీ దినములలో మరల ఆమెకు నొప్పి వచ్చెను. అప్పుడు వెస్లీ పుట్టెను! కాని అతడేమి చేసెను? ఆ తల్లివలెనె మరల మొదటికి వెళ్ళెను.
పెంతెకోస్తు వారి దినములలో మీ తల్లిదండ్రులు దానిలో నుండి బయటకు వచ్చి ద్వేషించిరి. వట్టి కాళ్ళతో వీధిలో నడుచుకొంటూ ఒక పాత డబ్బా మీద కొట్టుతూ పరిశుద్ధాత్మ బాప్తీస్మము గూర్చి చెప్పుచుండెడి వారు, పాత గిటారు వాయించెడివారు. వీధి మూలల్లోను, రోడ్డు మీద, చెరసాలలోను రాత్రంతయూ గడిపెడివారు! ఇప్పుడు, మనము గ౦జివలే మెత్తబడిపోయి తిరిగి సంస్థలోనికి వెళ్ళిపోయాము. వారెందులో నుండి వచ్చిరో అందులోనికి తిరిగి వెళ్ళిపోయారు! (వారు పిల్లలను తిరిగి లాగిరి). వారు తమ సమాధులలోనికి తామే దిగిరి! వారు మిమ్మును గూర్చి సిగ్గుపడెదరు! అది కఠినమని నాకు తెలియును గాని ఇది సత్యము.
59"నేను జనులను ప్రేమించుచున్నానని," మీరు అనవచ్చును. ప్రేమ సరిచేయనియెడల ప్రేమ ఎట్లు పుట్టును? ప్రేమ సరి దిద్దును. నేను దేవుని సంఘము గూర్చి పౌరుషము కలిగియున్నాను. సిద్దాంతముల ద్వారా కట్టబడుచున్న ఈ సంస్థలు పూర్తిగా కుళ్ళిపోయి యున్నవి. మరియు దేవుడు తన మాటను సత్యమని ప్రకటించుచున్నాడు. అయినా గాని వారింకా అది పట్టుకొనియున్నారు. ఆమేన్! అది సత్యము. సోదరీ, సోదరుడా, అది నిజమని మీకు తెలియును. ఇంతకంటె సూక్ష్మముగా ఇక చెప్పజాలము. ఇది గ్రీకు పదజాలము కాదు, మరేదీ కాదు. కేవలము సామాన్య పరిజ్ఞానమున్న వ్యక్తికి ఇది తెలియును. మీరు నిశ్చయంగా దీనిని అర్ధముచేసికొనగలరు. రెండు రెళ్ళు నాలుగు. అది సత్యమని మనందరికి తెలియును. చూడండి?
ఇప్పుడు, వాక్యమే ఇప్పుడు పెండ్లి కుమార్తెను తయారు చేయవలెను.
60కాని ఆ పాత పద్ధతి ఆలాగే యుండును. అది తన జ్యేష్టత్వమును అమ్మిన ఏశావును ఉత్పత్తి చేయును.
అది ఇలా ఉన్నది; నేను ఈ అనుభూతిని పొందుచున్నాను! నేను పిచ్చివాడినని మీరు ఎంచవద్దు, అయితే నేను పిచ్చివాడినైతే, నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. ఈ విధంగానే నాకు బాగున్నది. ఇంకో రీతిగా ఉండేకంటే ఈ రీతిగా ఉండుటయే నాకు మేలు. లోకమునకు నేను పిచ్చివాడిని కావచ్చు, కాని నేనున్న చోట నాకు తెలియును. నేనెక్కడ నిలబడియున్నానో నాకు తెలియును.
చూడండి, ఒక చచ్చిన బిడ్డను అది ప్రసవించును. ఈ శాఖలన్నింటిని ఏకము చేయు ఒక మతపరమైన వ్యవస్థ రూపొందుచున్నది. అది యాకోబును ద్వేషించు ఏశావును ఉత్పత్తి చేయుచున్నది! ఆమెన్. మీరు అది చూచారని అనుకోనుచున్నాను. ఒక చచ్చిన బిడ్డ, మృతమైన సంఘశాఖ — అవి అన్నియు ఒకే చోట సమకూడుచున్నవి.
ఓ! వాక్య విశ్వాసులారా, నా వర్తమానమునకు చెవియొగ్గుడి! నా వర్తమానము కాదు, అయితే ఆయన వర్తమానము వినండి. అది సత్యమని ఆయన దృఢముగా బయలుపరచుచున్నాడు. మీరు ఎన్నిక చేసికొనవలెను. దీని తరువాత మీరు నిలకడగా కూర్చొన లేరు. మీరు ఎన్నిక చేసుకొనవలెను.
MATT 24:24
61వెస్ట్ వార్డ్ లోని ఆ దినము మీకు గుర్తుందా. (ఆ ఉదయము మీరందరూ అల్పాహారము తినిరి). లూథర్ మొదలగువారి ద్వారా ఒక చెట్టు మొదలు నుండి దళములు, ఆకులు, గింజలు ఎట్లువచ్చునో దృష్టాంత రూపముగా ప్రభువు నా ద్వారా మీకు చూపించెను. గోధుమ గింజవలె కనిపించిన పొట్టు యున్నది. మీరు అదే గోధుమ గింజ అనుకొందురు, కాని అది పొట్టు మాత్రమే. దానిని విప్పి మీరు చూచిన యెడల లోపల ఏమీ ఉండదు. ఆ తొక్క లోపల ఎక్కడో చిన్న ఎండిన జీవముండును పైకి వచ్చుట మీరు చూచుదురు. మీరు మీ అద్దములు తీసుకోని దానిని చూడగలరు. మొదటగా పెంతెకోస్తు వచ్చినప్పుడు దానికి దగ్గరగా ఉన్నదియు ఒకటుండెను. "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని కూడా మోసపుచ్చునని," మత్తయి 24:24లో యేసు చెప్పెను.
అది ఏమి చేయును? గింజకు బలమిచ్చును. నిజమేనా? అటు చూడండి. ఆకు గింజవలె కనిపించదు. చెట్టులో మరే భాగము గింజవలె కనిపించదు గాని, పొట్టు మాత్రము గింజవలె కనబడును; కాని అది గింజ కాదు. గింజను మోసికొనిపోవు పొట్టు.
62ఆ వర్తమానములు ప్రసవ నొప్పలతో ఎట్లు వచ్చెనో చూడండి? కాని జీవము అక్కడి నుండి వదలి, మరొక వర్తమానములోనికి వెళ్ళెను. జీవము లూథర్లో నుండి వెంటనే వెస్లీ వర్తమానములోనికి వెళ్ళినది, ఆ తరువాత వెస్లీ వర్తమానములో నుండి పెంతెకోస్తు వర్తమానములోనికి వెళ్ళినది. ఇది మరల పొట్టును విడిచిపెట్టు నమయము. ఏమిటి సంగతి? అది సత్యమని ప్రకృతిలోని ప్రతిదియు తెలియచేయుచున్నది.
ఇప్పుడు ఎందుకో చూచారా… నేను పిచ్చివాడనని మీరనుకోవచ్చును. నేను చెప్పినట్లుగా, బహుశా నేను కావచ్చు, కానీ ఒకటి నాలో యున్నది; దానిని నేను ఆపలేను. దానిని అక్కడ నేనెన్నడూ ఉంచలేదు. నేను నా ఎన్నిక చొప్పున ఎన్నడూ రాలేదు. దేవుడే ఎన్నుకొనెను! అది సత్యమని ఆయన నిరూపించుచూ ధృవపరచుచున్నాడు. లూథర్, వెస్లీ, పెంతెకోస్తు, బాప్టిస్తు మొదలగు వారికి నేను విరోధిని కాదు; కాని వాటి పద్ధతులకు నేను విరోధిని, ఎందుకనగా దేవుని వాక్యము అందుకు విరోధము, మానవులకు విరోధము కాదు. చూడండి, ఇక్కడ యాజకులు, బోధకులు కూర్చొనియున్నారు. వారు ఆ పద్ధతి ప్రకారము నడిచిన యెడల ఇక్కడ కూర్చొనుటకు రారు. కాని వారు దేవుని వాక్యమును సామాన్యముగ విని అంగీకరించి అడుగు ముందుకు వేసిరి. హల్లెలూయా! అనగా "మన దేవునికి సోత్రము" అని అర్థము. అది మిమ్మును బాధించదు. ఆమేన్ అనగా "ఆలాగు జరుగును గాక!" దానిని నేను నమ్ముచున్నాను. అది సత్యమని నేను నమ్ముచున్నాను. అది సత్యమని ధృవపరచబడెను. ఒక దినమున మీరు గ్రహించెదరు, కాని ఆలస్యము కావచ్చును.
ఇప్పుడు గమనించండి.
REV 19:7,8
63యుగాంతములో, "ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది." ఆమె ఎట్లు తన్ను సిద్ధపరచుకొన్నది? ఆయనకు భార్యగా అగుటకు, ఆమె ఎట్టి వస్త్రము ధరించినది? ఆయన స్వంత వాక్యము. ఆయన నీతి అను వస్త్రము ధరించినది. అది అదే చూచారా? దర్శనములు.
గమనించండి, ఇప్పుడు ముగించుచున్నాను. ముగించు ముందుగా ఈ ఒక్క సంగతి చెప్పగోరుచున్నాను. దీనిని చెప్పవలెనని నడిపించబడితిని. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఒకడు తన స్వంత ఆలోచనతో దీనిని చెప్పిన యెడల వాడు వేషధారి. అందు నిమిత్తము నరకమునకు వెళ్ళును. ఇంత చక్కని జనులను కూడా వాడు మోసము చేయుటకు ప్రయత్నించును. వాడు శరీర రూపములోనున్న అపవాది. దేవుడు వానిని గౌరవించడు. దేవుడు అపవాదిని గాని, అబద్ధమును గాని ఘనపరచునా? ఎన్నడూ ఘనపరచడు. చూడండి? అది వారి తలల మీద నుండి పోవును, వారది గ్రహించరు. ఆయన ఏర్పరచుకొను వారిని బయటకులాగును.
64అన్ని కాలములలోను ఉన్న ప్రవక్తలను చూడండి. వారిని ఆయన ఎలా ఏర్పరచుకొనెనో, సంస్కరణ వరకు మీరు చూడండి. రోమను కాథలిక్కు సంఘము జోనా ఆఫ్ ఆర్క్ను ఒక పిశాచిగా ఎంచి స్తంభమునకు కట్టి దహించెను. ఇది నిజము. ఆ తరువాత వారు ఆమె పరిశుద్దురాలని గ్రహించిరి. వారు ఆ తరువాత పశ్చాత్తాపపడిరి. యాజకుల శరీరములను త్రవ్వి నదిలో పారవేసిరి, మీకు తెలుసా, కాని అది దేవుని గ్రంథములో ఎక్కదు. లేదు!
వారు పరిశుద్ధ పాట్రిక్ను కూడా ఆలాగే పిలచిరి. అతడు నాలాంటి వాడే. అతని పిల్లలను చూడండి; ఆయన స్థలమును చూడండి; ఎందరు చంపబడిరో చూడండి; హత సాక్ష్యుల చరిత్ర చూడండి, ఎందరు చ౦పబడెనో చూడండి. అది ఆలాగు లేదా. కాని ప్రజలు వారు చేయలేదని అందురు. ఆ సత్యమును దేవుడే చెప్పెను మరియు ధృవపరచెను. "అన్నిటిని పరీక్షించుడి. మేలైన దానిని చేపట్టుడి."
65ఇప్పుడు, కొన్నినెలల క్రితం ఇది జరిగినది, ఒక ఉదయాన నేను ఇంటిలో నుండి బయటకు వెళ్ళుచుండగా ఒక దర్శనము వచ్చినది. ప్రభువు నాతో "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" చెప్పిన ప్రతిసారి అది నెరవేరుట ఈ సంవత్సరములన్నిటిలో మీకు ఎప్పుడైనా తప్పిపోయినదేమో చూడండి. నేను సవాలు చేయుచున్నాను. ఇది సత్యమని ఎందరికి తెలియును? చేతులెత్తండి. ఎవరైనా విరోధముగా చెప్పగలరా? అది సత్యము.
వర్తమానికుని వైపు దృష్టి నిలపవద్దు; వర్తమానమువైపు చూడండి. అది ముఖ్యము. అది అదేయై యున్నది. అది కాదా? చిన్న బట్టతల మనిషిని గమనించకండి (మీకు తెలియును), ఎందుకనగా అతడు కేవలము మానవమాత్రుడు, మనందరమూ ఒక్కటే. అయితే ఏమి జరుగుచున్నదో గమనించండి. అదే దానిని తెలియజేయును.
నేను పట్టబడితిని. ఇప్పుడు, నేను ఎదో అయిపోయానని జనులు చెప్పుకొనుట నాకు తెలియును, మనకు అందులో చాలావరకు నిజము లేదు అని తెలియును. మనిషి చెప్పిన దానికి నేను జవాబు చెప్పలేను. నేను చెప్పేదానికే నేను జవాబు ఇయ్యవలెను. అది సత్యమో కాదో నేనే చెప్పగలను, మరియు దానికి నేనే బాధ్యుడను, ఎవరేమన్నా నాకక్కరలేదు. ఎవరినీ నేను విమర్శించలేను. నేను తీర్పు తీర్చుటకు రాలేదు గాని, వర్తమానము అ౦దించుటకు వచ్చాను.
66గమనించండి, సంఘమును గూర్చి నాకు ఒక ముందు దృష్టియున్నది. నాకు కనబడని ఒకని వలన నేను పట్టబడితిని, మరియు నేను పైన నిలబెట్టబడియున్నాను. అతి మాధుర్యమగు సంగీతము నేను విన్నాను. మరెన్నడూ అట్టిది వినలేదు. మరియు ఇరవై సంవత్సరముల వయస్సున్న స్త్రీలు, పద్దెనిమిది, ఇరవై వచ్చుట నేను చూచాను. వారందరికి పొడవైన జాట్టు ఉన్నది, వివిధ రకముల వస్త్రములు ధరించిరి. ఆ సంగీతముతో పాటు వారు చక్కగా అడుగులు వేయుచూ ముందుకు పోవుచున్నారు. వారు నా ఎడమవైపు నుండి నన్ను దాటిపోయిరి. మరియు వారిని నేను గమనించాను. నాతో మాట్లాడుచున్నది ఎవరో చూడగోరాను, కాని నాకు కనబడలేదు.
ఆ తరువాత రాక్-అండ్-రోల్ మేళము వచ్చుట విన్నాను. మరియు నా కుడి వైపుకు చూచినప్పుడు ప్రపంచ సంఘములు వచ్చుట కనపడెను. వారు తమ తమ ధ్వజములను ఎత్తి పట్టుకొనిరి. వారు చాలా అసహ్యముగానున్నారు. నా జీవితములో ఎన్నడూ అటువంటి వారిని నేను చూడలేదు. ఆ తరువాత అమెరికను సంఘము వచ్చెను, అది చాలా అసహ్యముగా నున్నది. పరలోకపు తండ్రియే నాకు తీర్పరి. వారు ఆ మధ్యపుశాలలో ధరించు వస్త్రములు ధరించిరి. బాలికలు వారికి రంగులు, చిన్న జుట్టు, సిగరెట్టు త్రాగుట, రాక్-అండ్-రోల్ నాట్యము అలవాటుగా మారెను.
"అమెరికా దేశ సంఘము ఇదేనా?" అనడిగాను.
"అవును, ఇదే!" అని ఆ స్వరము చెప్పెను.
67మరియు వారు దాటునపుడు, వారు ఆ కాగితము వంటి దానితో శరీరమును కప్పుకొని వెళ్ళుచుండిరి.
నేను ఏడవసాగాను. "నేను, ఈ సేవకులు పడిన శ్రమ అంతయూ ఏమయినది అనుకొన్నాను." సోదరులారా, ఈ దర్శనములను మీరెంత వరకు నమ్ముదురో నాకు తెలియదు, కానీ నాకు ఇది సత్యము; అది నిజమని రుజువైనది. ఆ జరుగుచున్న దానిని చూచి నా హృదయము బ్రద్దలయినది. "నేనేమి చేశాను? నేను దానిని ఎలా కోల్పోయాను ప్రభువా, వాక్యము మీదే నేను నిలబడితిని మరియు నేను ఎలా చేయగలిగాను…?" నేను అనుకున్నాను, "ఇంత క్రితమే ఈ దర్శనము నాకిచ్చి ఎందుకు చూపించలేదు?" మరియు నేను అన్నాను, "వారు తీర్పుకు గురవుదురా?"
"పౌలు గుంపు కూడా," అని అతడు చెప్పెను.
నేనిట్లు చెప్పాను, "అతడు బోధించినట్లే నేనును బోధించాను." (క్రైస్తవ వ్యాపారులు ఆ రచనను తిసుకెళ్ళిరి). అప్పుడు, నేను అన్నాను, "ఎందుకు? ఈలాగు జరిగినది?" ఆ వేశ్యలవలెనున్న గుంపు అటువంటి బట్టలు ధరించుకొని వెళ్ళుట నేను చూచాను, ఆ సంఘము మిస్ అమెరికాగా పిలువబడినది. అది చూచి నా మతిపోయినది.
MAL 4:6
68ఆ తరువాత ఆ మధుర సంగీతము నాకు సూటిగా వినబడినది. ఆ చిన్న పెండ్లికుమార్తె మరల వచ్చుట కనబడెను. ఆమె నడక వేరుగా నున్నది. ఆమె ఆ మొదటిగా వచ్చిన దానివలె ఉన్నది. దేవుని వాక్య సంగీతమునకు ఆమె అడుగు వేయుచున్నది, ముందుకు సాగిపోవుచున్నది. అది చూచి నా రెండు చేతులు ఎత్తి ఏడ్వనారంభించాను. నేను ఆ సమయంలో ఇంటి పెరటిలో కూర్చొని పొలమువైపు చూస్తున్నాను.
ఏమిటి? ఆమె మొదటి స్థితిలో ఏ రకమగు పెండ్లి కుమార్తెగానున్నదో ఆ రకమగు పెండ్లి కుమార్తెగానే ఉండబోవుచున్నది. ఆ రకమగు వస్తువులతోనే నిర్మాణమయినది.
ఇప్పుడు, మాలకి 4 చదవండి, చివరి దినములలో మనకు ఒక వర్తమానము ఉండవలసి యున్నది, అందువలన "పిల్లల హృదయములు తండ్రుల తట్టు తిరుగును," అసలు పెంతెకోస్తు వర్తమానమువైపు, అనగా వాక్యము వైపు తిరుగుదురు. సోదరులారా? మనమిచ్చట ఉన్నాము.
ఇప్పుడు, ఈ సంఘము ఒక సూచనను పొందబోవుచున్నది, మరియు అది చివరి సూచన. ఇప్పుడు చూడండి, లేఖనములో మనము కనుగొనెదము. ఈ లవొదికయ సంఘ కాలములో గొప్ప ప్రసవ నొప్పులు కలుగును. సంఘము మరలా తిరిగి జన్మించును.
69మరో సంస్థ ఇక ఉండదు. ఈ చరిత్రకారులను అడగండి. ఒక వర్తమానము బయలు వెళ్ళిన తరువాత… ఒక సంస్థ బయలుదేరును. ఓ! అలెగ్జాండరు కేంప్బెల్, మార్టిన్ లూథర్, ఇంకా తదితరుల పేరు మీద వారు ఒక సంస్థను కట్టిరి. ఒక ఉజ్జీవము మామూలుగా మూడు సంవత్సరములు మాత్రమే యుండును. ఇది పదిహేను సంత్సరముల నుండి బయలు వెళ్ళుచున్నది. దానిలో నుండి ఏ సంస్థ ఇంకా రాలేదు. ఎందువలన? పొట్టు మాత్రమే చివరది. మనము అంతమందున్నాము.
ప్రసవ నొప్పులు చూచారా? ఏమిటి సంగతి? ఒక శేషము మాత్రమే బయటకు వచ్చును. ఒక శేషమే బయటకు వచ్చును. అందుకే నేను ఎలుగెత్తి, ఏడ్చుచున్నాను, శ్రమపడుచున్నాను. భూమి మీదనున్న ఏ మానవుని ఇష్టమును పొందక దేవునిచే మెప్పు పొందగోరుచున్నాను. మరియు ఆయన వాక్యములో నడచుచున్నాను.
ఆమె నొప్పితో నున్నది. అదియే సంగతి. ఆమె ప్రసవించనై యున్నది. ఆమె తన ఎన్నికను చేసికోవలెను. గోడమీద చేవ్రాత చూడండి. భూమి గతించుటకు సిద్ధముగా నున్నది. అది నిజము. మరియు సంఘమును మనము చూచినట్లయితే; అది చెడిపోయినది, ఆమె వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది. లోకము మరియు సంఘము కూడా ప్రసవ నొప్పులు పడుచున్నవి. ఒక క్రొత్త లోకము, ఒక క్రొత్త సంఘము పుట్టనైయున్నది, అవి వెయ్యేండ్ల పాలనలో వెళ్ళుటకు. మనకు అది తెలుసు.
MATT 24:37•
LUKE 17:26
70చూడండి. దేవుడు ఆమెకు ఇచ్చును (మరియు ఈ మాటలు జాగ్రత్తగా వినండి). ఆమె యొక్క చివరి గురుతు, ఆమె చివరి వర్తమానము, ఆమె చివరి సూచన, ఆమె ఆది యందు ఎటుండెనో అదే స్థితిలో ఇప్పుడు ఆమె యుండనైయున్నది. లోకము మరియు సంఘము… ఆదిలో ఎలాగు ఉండేనో, అన్ని సంవత్సరములలో ప్రవక్త లేకనే, మలాకీ నుండి యేసు వరకు చూడండి. ఈ సంవత్సరములన్నింటిలో ఆమె స్థితి చూడండి, దుర్నీతి అందులో దిగిపోయినది. భూమిని చూడండి, ప్రతి సమయములో అది ఎలాగుండెనో — నోవహు కాలములో ఉండినట్టున్నది, ఆ రకముగానే. అది అదే మాదిరి ఉండవలసియున్నది, మరియు మనము అది చూచుచున్నాము. "నోవహు దినములలో ఉండినట్లే ఉండును." ఈ సంగతులన్నియూ ఎంత మాదిరిగా యున్నవో చూచుచున్నాము.
GEN 13:13•
GEN 19:5•
LUKE 17:28-30
71అప్పుడు మనకు చివరి సూచన వచ్చును.
లూకా 17:28లో, యేసు చెప్పెను, "సోదొమ దినములలో ఉండినట్టే మనుష్యకుమారుని దినములలోను ఉండును." చూచారా? సోదొమ వలెనె యుండును. చూచారా?
ఇప్పుడు, మనము చదివిన ఆది కాండమునే, అదే బైబిల్ యేసు చదివెను. వినండి, దీనిని తప్పిపోవద్దు. మనము చదివిన బైబిల్, యేసు చదివెను. "వెనుకకు తిరిగి సొదొమ దినములు చూడుడని" ఆయన తన సంఘముతో చెప్పెను. వక్ర ప్రజలు, స్వాభావికతను విడిచిరి… ప్రపంచమంతా ఈ దినము పురుష సంయోగులు ఎక్కువగుచున్నారు. ఈ మధ్యనే వార్తా పత్రికలో… మీరు నా ఆఫీసుకు వచ్చి వారి బాలురను గూర్చి తల్లులు వ్రాసిన ఉత్తరములు చదవండి. పురుష సంయోగులు పెరిగిపోవుచున్నారు, గత సంవత్సరములో కాలిఫోర్నియోలోనే ఇరవై, ముప్ఫయి శాతం పెరిగిపోయిరి. ప్రభుత్వములోని చాలా మంది పురుష సంయోగులని తేలినది. నేను పత్రికలలో చదివాను. వివిధ రకమగు సంగతులు జరుగుచున్నవి… [జనులలో ఒక సహోదరి ప్రవచించగా దానికి అర్థము చెప్పిరి]
GEN 18:9,10•
LUKE 17:28,29•
1COR 14:13
72సరైన వాక్యమును యొక్క అర్ధము నాకున్న యెడల, కచ్చితముగా దేవుడు చెప్పినదే జరుగును. "భాషలలో మాట్లాడువాడు దానికి అర్ధము చెప్పునట్లు ప్రార్ధి౦చవలెను." నేను మీకు సత్యమే చెప్పాను, దానిని దేవుడు ఇక్కడ స్థిరపరచెను. అదే సత్యము - అది సత్యము.
ఇప్పుడు చూడండి. యేసు చెప్పిన చివరి వర్తమానము ఏమిటి? "సొదొమ దినములలో ఉ౦డినట్లే." ఇప్పుడు గమనించండి. అన్యుల ప్రపంచము అగ్నితో కాల్చబడే ముందు. ఇప్పుడు, దానిని గ్రహించ ప్రయత్నించండి. ఏమి జరిగినది? సొదొమలోనున్న లోతు, అతని కుటుంబము నులివెచ్చని సంఘ సభ్యులు. అందులో నుండి ముందే ఒక వ్యక్తి బయటకు వచ్చెను. అసలు ముందే అతడు అక్కడికి వెళ్ళ లేదు. అబ్రహామునకు కుమారుడు పుట్టునను వాగ్దానము కలిగియున్నాడు. మీకర్దమైనదా? "ఆమేన్" చెప్పండి. మంచిది.
నాశనము ఇక జరుగుటకు ముందు, దేవుడు చాలా రూపములలో అబ్రహామునకు ప్రత్యక్షమాయెను. కాని ఈసారి ఆయన మానవునిగా కనబడెను. ఆయన ఒక నరుడు. మరియు దేవుని దగ్గరకు వచ్చాడు…
"ఆయన నరుడు కాడు" గాని, మానవునిలోనున్న దేవుడు అని మీరనవచ్చు. అబ్రహాము ఆయనను "ఎలోహిం!" అని పిలచెను. ఆయన నరుడు.
మరియు చూడండి. ఆయన తన వీపును గుడారము తట్టు త్రిప్పి, "నీ భార్యయగు శారా ఎక్కడ?" అని అడిగెను.
"ఆమె నీవెనుకనున్న గుడారములో ఉన్నది," అనెను.
"నేను నీకు వాగ్దానము చేసిన రీతిగా నిర్ణయకాలములో నీ యొద్దకు వచ్చెదను." అని ఆయన చెప్పగా, శారా నవ్వెను. "శారా ఎందుకు నవ్వినది?" అని ఆయనడిగెను. చూచారా?
GEN 18:13,15•
GEN 19:1,11
73ఆ దినమున జరిగినది అదే. అబ్రహాముకు చివరి గురుతు చూపించెను. ఎన్నుకొనబడిన గుంపు సొదోమ నుండి బయటకు వచ్చిరి. మీరు ఏమైనాగాని ఈ ఉపమానము తప్పిపోక వినండి. ఆ గుంపు అసలు ఆది నుండి సొదొమలో లేదు. కానీ ఇద్దరు దేవదూతలు సొదొమలోనికి వెళ్ళిరి, మరియు అక్కడికి వెళ్ళినప్పుడు వెనుకకు జారిన స్థితిలో లోతును చూచిరి, కానీ అందరూ తప్పిపోయినవారు మరియు పురుష సంయోగులుండిరి; ఈ కథ మీరెరుగుదురు. అక్కడ అబ్రహాముతో ఒకాయన నిలచియుండెను. ఆయన ఎలోహిం. వారక్కడ వాక్యము ప్రకటించిరి, వాక్యమును ప్రకటించి, వారిని అంధులగునట్లు మొత్తెను — మరియు వారు ద్వారమును కనుగొనలేకపోయిరి. నేడును ఆలాగే యున్నది. కాని ఆ గుంపుతోనున్న ఆయన అబ్రహాము ఎదుట ఒక అద్భుతము చూపి తానెవరో తెలియచేసెను, మరియు ఆయన అబ్రహాముతో నుండెను.
ఆయన అడిగెను, "శారా ఎందుకు నవ్వినది?" (ఈ బిడ్డ విషయము గూర్చి)?" శారా వచ్చి నవ్వలేదనెను. కాని "నీవు నవ్వితివనెను." అమె అబ్రహాములో భాగముగా లేనియెడల వెంటనే ఆమెను ఆయన చంపియుండును. మనము క్రీస్తులో భాగము కాని యెడల ఆలాగే దేవుడు మనలను చంపియుండును. వాక్యమును సందేహించి, వంకరగానున్న మనలను క్రీస్తు కృప ఇంకా పట్టుకొనియున్నది.
MATT 24:37•
LUKE 17:26,28,30
74కాని గమనించండి, ఏమి జరిగినదో చూడండి. యేసు వెనుకకు తిరిగి ఇట్లనెను, "లోతు దినములలో ఉండినట్లే, అంత్యకాలమున మనుష్యకుమారుడు తన్నుతాను బయలుపరచుకొను దినమున ఉండును." చూచారా?
బైబిలులో మనుష్యుకుమారుడు, ఎల్లప్పుడూ ఒక ప్రవక్తగా నున్నాడు. ఆయన మూడు కుమార నామములలో వచ్చెను: మనుష్యు కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, చూచారా? మరియు ఆయన మనుష్యకుమారుడనని చెప్పుకొనెను, ఎందుకనగా ఆయన ప్రవక్త, భవిష్యత్తును చూచువాడు. మరియు ఆయన చెప్పెను, "నోవహు దినములు ఎలాగు౦డునో, మనుష్య కుమారుడు తన్నుతాను బయలుపరచుకొను సమయమును అలాగే ఉండును, అదే అంత్యకాలము యొక్క సమయమైయుండును.
75ఇప్పుడు, మనము ఒక్క నిమిషము ఆలోచించుదము. ప్రపంచమునకు ఉన్న ఒక్క వర్తమానికుడు కూడా మనకు లేడు. మనకు ఫిన్నీలు, సాంకీలు, మూడీలు, నాక్స్, కాల్విన్ మొదలగు ప్రపంచ ప్రఖ్యాత వర్తమానికులు, ఈ ప్రసవ నొప్పులలో సంఘమునకు వర్తమానికులుగా ఉన్నారు. కాని హాము (H-A-M) అను చివరి పేరుతో అంతర్జాతీయ వర్తమానికునిగా వచ్చిన వారు ఒక్కరే యున్నారు. A-B-R-A-H-A-M. అబ్రహాము అను ఆంగ్ల పేరులో ఏడు అక్షరములున్నవి. నేడు మనకు G-R-A-H-A-M, గ్రాహం అను పేరుగల ఒకాయన ఉన్నాడు. ఆరు అక్షరములు, అది లోక సంఖ్య, సృష్టి దినము. ఈ భూమి మీద ఆ విధముగా వర్తమానము బోధించుచున్నవారు మరెవరూ లేరు. (భూమి మీద) క్రింద అక్కడ ప్రజలను బయటకు పిలచుచు, "మారుమనస్సు పొందుడి, పశ్చాత్తాప పడుడి! నశించుడి లేదా దానినుండి బయకు రండి!" అని పిలచుచున్నాడు. G-R-A-H-A-M ఆయన చేయుచున్నది చూడండి, వాక్యమును బోధించుచున్నాడు, బయట వారిని గ్రుడ్డివారిగా చేయుచున్నాడు, "బయటకు రండి" అని పిలచుచున్నాడు — దేవుని వర్తమానికుడు. మనుష్యకుమారుడు తన్ను తానూ ప్రత్యక్షమగు దినమున ఈలాగు జరుగునని యేసు చెప్పెను. ఇప్పుడు, అది ఎక్కడ ఉన్నది? ఆ సంఘ ప్రపంచ విధానములో. మరియు దానిని బట్టి వారాయనను ఆది నుండియు ద్వేషించుచుండిరి.
GEN 18:13
76కాని మరువవద్దు, ఒక ఆత్మీయ గుంపు కూడా ఉన్నది. యాకోబు గుంపు. ఏశావు గుంపు కాదు. బబులోనులో లేని కుమారుని కొరకు యాకోబు గుంపు చూచుచున్నది. వారు ఒక వర్తమానికుని పొందిరి. మీకు అర్థమైనదా? A-B-R-A-H-A-M. అబ్రహాము, వారొక వర్తమానికుని చేర్చుకొనిరి. అది ఒక గొప్ప అసామాన్య విషయము, వారు అంత్యకాలములో ఉన్నారని చూపించుటకు అది చేసెను. శారా మనస్సులోనున్న ఆలోచనలను బయట పెట్టెను. దేవుని కుమారుడగు యేసు శరీరధారియై ఆ చిన్న ఏర్పరచబడిన గుంపు మధ్యకు అంత్యకాలములో వచ్చి అదే రీతిగా తన్నుతాను ప్రత్యక్షపరచుకొనును.
ప్రసవ నొప్పులు! ఓ, సోదరుడా, దయచేసి అర్థము చేసికొన ప్రయత్నించుము. ఒక్క నిమిషము నీ హృదయము తెరవము. క్రీస్తువైపు చూడుము. ఆ దేవుడే ఇప్పుడు ఇక్కడున్నాడు. ఆయనే; ఈ వాగ్దాసములను చేసెను. ఆయన వాగ్దానము చేసిన యెడల తప్పక వాటిని చేయగల సమర్దుడు. ఒక్క నిమిషము మన తలలు వంచుదము. మీరు నిశితంగా ఆలోచించవలెనని నా కోరిక.
MATT 9:20•
MARK 5:27,29•
LUKE 8:44•
ACTS 3:4
77తండ్రీ, ఇప్పుడు ఇది నీ చేతిలో యున్నది, నేను చేయకలిగినది చేశాను. ఈ జనులు అర్ధము చేసికొనునట్లు సహాయము చేయుమని ప్రార్ధి౦చుచున్నాను. విత్తనములు నాటబడినవి. ప్రభువా, దానిమీద ఆత్మను, నీరును పోయుము, మరియు నీ మహిమ కొరకు నీరు పోయుము. ప్రభువా, ఒక వేళ నేను తప్పు చేసియుండినయెడల ఆది తెలిసి చేసినది కాదు, వారు చూచి అర్థము చేసికొనునట్లు వారి హృదయములకు దానిని బోధించుము. ప్రభువా, దయచేయుము. యేసు నామమున ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.
ప్రభువు మిమ్మను దీవించును గాక. నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. ఈ వాక్యమును ప్రసంగించిన ఈ దేవుడు, ఈ వాక్యము కొరకు బద్ధుడైయున్న ఈ దేవుడు — నేను కేవలము చెప్పుట కొరకు మాత్రమే బాధ్యత కలిగియున్నాను; ఆయన మాత్రమే దానిని త్వరపరచును. ఆ దేవుడే ఇక్కడ ఉన్నాడు.
అక్కడున్న మీలో ఎందరికి అక్కరయున్నదో, మీ చేతులు ఎత్తుడి. చివరి దినములలో ఆయన ఈ కార్యములు చేయుదునని చెప్పలేదా? ఇప్పుడు, నావైపు చూడండి. "మా వైపు చూడుమని," పేతురు యోహానులు చెప్పినట్లే ఇది యున్నది. ఇప్పుడు, మీరు ఇటువైపు చూడండి. దయచేసి అటూ ఇటూ కదలవద్దు. నిజంగా మర్యాదగా ఉండవలెనని నా పూర్ణహృదయముతో నాలో నేను ప్రయత్నము చేయుచున్నాను. చూడండి, మీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆత్మ; మీరు కదలినప్పుడు… సందేహము లేదు మీరందరూ ఒకే గుంపు, మరియు నేను జనుల యొక్క విశ్వాసమును పట్టుకొనుటకు ప్రయత్నము చేయుచున్నాను.
ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెళ్ళి కూర్చొన్నది. ఆమె వ్యాధి ఏమిటో యేసు చెప్పెను మరియు ఆమె బాగుపడినది. సొదొమలో వలెనె మనుష్యకుమారుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనిన యెడల, మరలా ఆలాగు చేయుదునని ఆయన వాగ్దానము చేసెను. ప్రపంచము ఆ స్థితిలోనే యున్నది. సంఘము ఆ స్థితిలోనే యున్నది. ఇప్పుడు దేవుడు తన మాట ప్రకారమే చేసెనా? మీరే చూడండి. ఓ! మనకు సూచక క్రియలు, గంతులు, భాషలు, ప్రవచనము మొదలగునవి యున్నవి, కాని ఆగండి; మరో సూచన యున్నది. ఓ! మనకు చాలా శరీరసంబంధ అనుకరణలున్నవి. అయితే అవి అన్నియు నిజమైన దానిని ప్రకాశింపజేయును. నకిలీ నోటు అసలు దానిని మరింత ప్రకాశింప చేయును.
78మీరిప్పుడు నమ్మి ప్రార్ధి౦చండి. మీరాలాగు చేయవలెనని సవాలు చేయుచున్నారు. నేను చెప్పిన దానిని చూచి మీరు నమ్మండి. ఇది సత్యమని ఎందరు నమ్ముచున్నారు? మీరెవరైనా; ఎక్కడున్నా తప్పక నమ్మండి. అక్కడ కూర్చొనియున్న బిల్ డచ్ మరియు అతని భార్య మరియు ఇక్కడ కూర్చొనియున్న జర్మనీ బోధకుని ఎరుగుదును. ఆ వెనుక కూర్చొనియున్న ఇద్దరి ముగ్గురిని ఎరుగుదును. ఆ వెనుక జన సమూహములో కొందరికి తెలియును. నేను చెప్పినది సత్యమని మీరు నమ్మవలెనని సవాలు చేయుచున్నాను.
ముప్పది మూడు సంవత్సరాల క్రితం ఆ నది యొద్దకు ప్రభువు యొక్క దూత వచ్చి ఈ మాట చెప్పెను గదా? నా స్వంత బాప్తిస్తు సంఘకాపరి నన్ను సంఘము నుండి త్రోసివేసెను. "బిల్లీ, నీకు పీడకల వచ్చినది," అన్నాడు.
"డాక్టర్ డేవిస్, ఇది పీడకల కాదు." నీకు ఆ వైఖిరి ఉన్న యెడల… నా సహవాసపు కార్డు కూడా తీసుకో" అన్నాను. ఎవరో ఎక్కడో దీనిని నమ్మువారున్నారని నాకు తెలియును! దేవుడు, చేర్చుకొనని వారు లేకుండా తన వర్తమానమును పంపడు. ఓ! నిశ్చయంగా, నేను రోగులకు ప్రార్ధించ వెళ్ళుచున్నప్పుడు చాలా బాగున్నది. కాని నేను వాక్య సత్యము చెప్పనారంభించితేనే అంతా వేరుగా ఉంటున్నది.
ప్రతి వర్తమానము ఆ విధంగానే యున్నదని మీరు తప్పక తెలిసికొనవలెను.
JOHN 5:39•
JOHN 6:52,53•
JOHN 10:30
79సంఘము లోనికి వెళ్ళి రోగులను బాగుచేసి ఆయా కార్యములు చేసినప్పుడు యేసు అద్భుతమైన వాడే, కాని ఒక రోజున ఆయన కూర్చొని, "నేను నా తండ్రి ఏకమైయున్నామని" చెప్పగా కలవరము వచ్చెను. "మీరు మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగితేనే గాని జీవము పొందరనగా" వారు వెనుకకు పోయిరి. దానిని ఆయన వివరించలేదు. ఎవరు నిలబడుదురో చూడగోరెను. ఆ గుంపులో వైద్యులు మరియు ఇతరులు ఉండిరి, వారు అనెను "అతడు ఒక పిచాచి… ఎందుకు, అతడు పిచాచి. లేని యెడల రక్తము త్రాగి శరీరము తినమని చెప్పడు అనుకొనిరి." దానిని ఆయన వివరించలేదు. కాని ఆ వాక్యమే అపొస్తలులను ఇంకా పట్టుకొన్నది. వారికి అర్ధము కాకపోయినా లెక్కచేయలేదు; ఏమయినా వారు నమ్మిరి. దేవుని క్రియలను వారు చూచిరి గనుక నమ్మిరి. మరియు వారికి ఆయనెవరో తెలియును. "అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి," అని ఆయన చెప్పెను.
EXOD 3:14•
JOHN 14:19•
JOHN 16:28
80ఇక్కడ ఒక స్త్రీ చేయి పైకెత్తి కూర్చొన్నది, మీరు కోరినట్లయితే నన్ను మూఢభక్తి అనవచ్చు గాని, అరణ్యములో ఇశ్రాయేలీయులను నడిపించిన అదే అగ్నిస్తంభము సరిగ్గా ఈమె పై యున్నది.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, యేసు ఇట్లు చెప్పెను, "ఇక కొంచెము కాలము అయిన పిమ్మట లోకము నన్ను చూడదు. అయినను మీరు నన్నుచూతురు. నేను దేవుని యొద్దనుండి వచ్చియున్నాను; దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను." ఆయన తన మరణము, పునరుద్ధానముల తరువాత యూదులతో ఇట్లు చెప్పెను. "అరణ్యములో యుండిన బండను నేనే. నేను ఉన్నవాడను, అనువాడను."ఆయనే ఆ అగ్నిస్తంభము. ఆయనెవరు? మండుచున్న పొదలోనున్న అగ్నిస్తంభము ఆయనే. అది నిజమైయుండును. అది మన మధ్య శరీరధారియై నిలచియుండెను. "నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ రూపములో వచ్చును." ఆయన ఈ రోజు ఇక్కడే యున్నాడు. దాని గూర్చి శాస్త్రీయపరమైన పటములు తీయబడియున్నవి. ఏ శాస్త్రీయపరమైన చిత్రముకన్నను ఆయన మరి ఎక్కువగా నేడు రుజువైయున్నాడు. దానిని రుజువుచేయుటకు ఆయన ఇక్కడున్నాడు, ఇది ఆయనే. "మనుష్య కుమారుడనగు నేను ఈ దినమున ప్రత్యక్షపరచబడియున్నాను." ఆయన ఇక్కడున్నాడు; దానివైపు నేను చూచుచున్నాను. మీరు అనవచ్చు, "దానిని మీరు చూచెదరా?" యోహాను దానిని చూచెను గాని తక్కినవారు చూడలేదు.
81చూడండి, ఇప్పుడు రుజవు చేయుటకు. ఆమె నాకు తెలియదు. నా జీవితంలో ఎన్నడూ ఆమెను నేను చూడలేదు. కాని ఆమె ఒక జబ్బు అవయవము గూర్చి ప్రార్ధి౦చుచున్నది. అది నిజమే గదా? నీకు ఆపరేషను అయినది, నీ ప్రక్కన నీ భర్త కూర్చొనియున్నాడు, నీవు ఈ పట్టణస్తురాలవు కాదు; నీవు కాలిఫోర్నియా నుండి వచ్చియున్నావు. నీ పేరు రోవాన్. నీ కడుపు వ్యాధి కూడా నయమైనది. నీకు కడుపు వ్యాధి ఉన్నది కదా? అది పోయినది. నీ కాలు బాగయినది.
"మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు ఆ దినమున."
ఈ వెనుక ఒకాయన కూర్చొనియున్నాడు. అతడు నల్లజాతి సోదరుడు, అతని కళ్ళకు వ్యాధియున్నది. అతడు కారులకు పాలిష్ పెట్టను. నిజము. నీ కన్నులు పాడయినవి. నీవు ఈ మధ్యే నమ్మితివి కదా? నీకు ఏదో ఒక వింత సంగతి జరిగినది. నీ మొదటి పేరు ఫ్రెడ్. అది నిజము. నీ చివరి పేరు కాన్, అది నిజము. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? ఇక మీదట నీ కన్నులు నీకు తొందర కలిగించవు. నేనతనిని నా జీవితములో ఎన్నడనూ చూడలేదు.
82ఆ వెనుకనున్న వ్యక్తి కాలిఫోర్నియా నుండి వచ్చెను. శ్రీ ఓవెన్స్, వీపు నొప్పి యున్నది. చూచారా? ప్రభువైన యేసు నిన్ను బాగుచేయును.
అతనిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు, అతని గూర్చి ఏమియూ తెలియదు. ఆ వెలుగు వెళ్ళుచుండగా నేను దానిని అనుసరించుచున్నాను. "నీవు నమ్మిన ఎడల నమ్మువారికి సమస్తమూ సాధ్యము."
ఇక్కడ ఒక వ్యక్తి హెర్నియా వ్యాధితో కూర్చొనియున్నాడు. అతడు కండ్లద్దములు పెట్టుకొని బూడిద రంగు సూటు ధరించియున్నాడు. ఫ్రెడ్, నీవు దేవుని నమ్మిన ఎడల స్వస్థత నొందెదవు. నీవది అంగీకరించెదవా? మంచిది. నా జీవితంలో ఎన్నడూ అతనిని నేను చూడలేదు.
అతనికి దూరంగా శ్రీమతి హోల్డెన్ కూర్చొనియున్నది, కంటి వ్యాధితో బాధపడుచున్నది. ఆమెను నేను ఎరుగను, నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అది సత్యము. చూచారా? నీవు నమ్మినట్లయితే.
సోదరీ, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీకు నరముల ఉద్రిక్తత యున్నది, శ్వాస నాళము యొక్క వ్యాది, గుండె జబ్బుయున్నది. దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? (ఆ సీటు చివరిలో కూర్చొనియున్నది), యేసు క్రీస్తు నిన్ను బాగుచేయుననియు, ఆ నరముల ఉద్రిక్తత నిన్ను విడిచిపెట్టుననియు నీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నావా? నీవు నీ ముందు స్థితిలో యున్నట్లు తలంచుము. అపవాది నీకు అబద్ధము చెప్పుచున్నది. దానిని నీవు అంగీకరించుచున్నావా? నీవు నీ చేతిని ఎత్తి "దానిని అంగీకరించుచున్నాను" అని చెప్పుము. మంచిది; అది పోయినది.
2COR 6:17•
HEB 4:12
83ఎందువలన? ఈ సంఘము ప్రసవ వేదన పడుచున్నది. ఆయన సన్నిధిలో నీవు నీ తీర్మానము చేసికొన్నవా? ఆయన ఏమి చేయుదునని చెప్పెనో దానిని నీకు అక్షరాలా చెప్పాను. ఈ ఆలయము గుండా ఆయన వచ్చుచున్నాడు. ఎవరినైనా అడగండి, నేను వారిని చూడలేదు, వారిని ఎరుగను, వారితో మాట్లాడలేదు, లేదా వారి గూర్చి ఏమీ తెలియదు. ఒక మనిషి ఆలాగు చేయగలడని మీరనుకొనుచున్నారా? అది ఒక మానవునికి పూర్తిగా అసాధ్యము. కాని అది ఏమిటి? మనుష్యకుమారుడు. "దేవుని యొక్క ఖడ్గము రెండంచుల ఎటువంటి ఖడ్గముకంటెను వాడిగలదై ఆత్మను వివేచించుచూ, హృదయ రహస్యములను వెల్లడి చేయుచున్నది."
దేవుని కుమారుడు భూమిమీద ఉండగా శరీరధారిగా ఆలాగే చేసెను. కనుక దేవుని కుమారుని ద్వారా అది బయలుపరచబడుచున్నది. ఆ సంస్థలో నుండి పెండ్లికుమార్తెను పిలచుటకు ఆయన వచ్చుచున్నాడు.
"దానిలో నుండి బయటకు రండి! ప్రత్యేకముగా ఉ౦డుడి. వారి అపవిత్ర క్రియలను ముట్టకుడి. దేవుడు మిమ్మును చేర్చుకొనును" అని దేవుడు చెప్పుచున్నాడు. నీ సంపూర్తి జీవితమును దేవునికి సమర్పించుటకు సిద్ధముగా నున్నావా? అట్లయితే లేచి నిలబడి ఇట్లు చెప్పుము. "దేవుని కృప ద్వారా నాలో ఉన్నదానినంతటిని బట్టి ఇప్పుడే నేను అంగీకరించుచున్నాను."
84హల్లేలూయా! దేవునికి స్తుతి! మీరాయనను నమ్ముచున్నారా? మీరు చేతులెత్తి నాతో కూడా ప్రార్ధి౦చుడి. మీ తప్పును ఒప్పుకొనండి. ప్రసవ నొప్పులు చనిపోవుట కష్టమే. కాని ఇప్పుడే చనిపొమ్ము! చచ్చిపొమ్ము! నీ అవిశ్వాసము నుండి బయటకు రమ్కు, దానినుండి బయటకు రండి! దేవుని వాక్యము బయలుపరచబడియున్నది. యేసు భూమి మీద ఉన్నప్పటివలె ఇప్పుడును యున్నది. మీ మధ్య యేసు క్రీస్తు రుజువుపరచబడియున్నాడు.
అది జరిగిన వెంటనే అబ్రహాము ఒక కుమారుని పొందెను, వాగ్దాన కుమారుని పొందెను. యేసు తిరిగి వచ్చుచున్నాడు. అది ఆయన ఆత్మ ఆయన భూమికి అతి దగ్గరగా యున్నాడు. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. నీవు చేర్చుకొనుటకు సిద్ధపడిన యెడల ఆయన నిన్ను చేర్చుకొనుటకు సిద్ధముగా నున్నాడు. మీ చేతులు ఇప్పుడు ఎత్తి నాతో కలిసి ప్రార్ధి౦చుడి.
85ప్రభువగు దేవా, వేదిక మీదికి యాజకులందరు వచ్చి ప్రజలు మొర పెట్టునట్లు నడిపించుదురు గాక! నేడు జనులు అగ్ని స్తంభము మరియు మేఘ స్తంభములోనికి కదిలి వచ్చుదురు గాక, వారిని మేల్కోలుపుము. ప్రభువా, సజీవ దేవుని, బలమగు దేవుని సన్నిధిలోనికి వారు వచ్చుదురు గాక. ప్రభువా, ఇది అనుగ్రహించు! వారిని చేర్చుకొమము! ఈ ప్రార్థనను వారిలో ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్ధి౦చుచున్నాను. పరిశుద్ధాత్మ లేని ప్రతివారిని పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, ఈ కూటము యొక్క ఉజ్జీవము ఇప్పుడు ఒక శక్తిగా మార్చుటకు పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేయుము! రోగులు బాగగుదురు గాక, గ్రుడ్డివారు చూచెదరు గాక, కుంటివారు నడిచెదరు గాక. సజీవ దేవుని యొక్క బయలుపాటు ఈ జనులు మధ్యకు తీసుకొని రమ్కు, ఎందుకనగా ఈ మధ్యాహ్నము జరిగినట్లే, ప్రజలు దానిని చేర్చుకొందురు గాక. యేసు క్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాను.
ఇప్పుడు, మీరు చేతులెత్తి స్తుతించుడి. మీరు అడిగిన దానిని పొందుడి.