ఈ దినము ఈ లేఖనము నెరవేరినది

ఈ దినము ఈ లేఖనము నెరవేరినది

1మీకు ధన్యవాదములు, బ్రదర్ డీమస్, బ్రదర్ కారల్. షెకారియన్ లేక డీమస్ షెకారియన్ మరియు బ్రదర్ కారల్ విలియమ్స్, మరలాగే ప్రతినిధులందరికి. ఇప్పుడు నేను ఆ సహోదరుని గూర్చి ఆలోచించుచున్నాను, అతడు భూమిని దున్నేవాడు. ఇక్కడ, నేను ఏమి చెప్పవలెనో అనే దానిని వ్యక్తపర్చియున్నాడు, ఈ రాత్రి, నా యొద్ద నుండి నా ప్రసంగమును తీసికొన్నాడు. ఎందుకనగా కూటములను నేనెంతో ఆస్వాదించాను, ఇప్పటి వరకు జరిగిన కూటములన్నిటికంటే ఇదెంతో ఉన్నతమైనదిగా వుండెననేది నా భావము. ఇంతటి సామరస్యతను, చక్కని సహవాసమును మరలాగే సహోదర ప్రేమను ఈ కూటాములలో చూచిన దానికంటే మరెన్నడు దీనిని ఈలాగు నేను చూడలేదని నేనుకొనుచున్నాను.

నేను చేసిన మరో కార్యం ఏమనగా, క్రొత్తవారైన పరలోక ప్రతినిధులనేకమందిని కలుసుకొన్నాను, క్రొత్త వారగు సహాదరులతో కరచాలనము చేసి, మాట్లాడు మంచి తరుణమును నేను కలిగియుంటిని.

2ఈ మధ్య కొద్దివారాల క్రితం, అక్కడ వున్న ఒక బాప్టిస్టు సహోదరుడు చెప్పునది వినుచుంటిని. అతని పేరు నాకు జ్ఞాపకం రావటం లేదు - ఇర్విన్, మరి అతడు ఒక ప్రార్ధనా కార్డుని తీసికొని వచ్చాడు. అది అతని యొక్క ఆంటీకి చెందిన కార్డు అని నేను నమ్ముచున్నాను, ఆమె ఈ రాత్రి ఇచ్చట కూర్చొనియున్నది. ఆమె ఆ యొక్క కార్డును గత 20 సంవత్సరాల నుండి జాగ్రత్తగా దగ్గర పెట్టుకొనియున్నది.

జబ్బు చేసి చనిపోబోవుచున్న ఆమెను కూటమునకు తీసికొనివచ్చారు, బహుశా ఆ రోగం ఏమైయుండునో కేవలం వైద్యుడు మాత్రమే వివరించి చెప్పగలడు, అది కుష్ఠు అయితే మాత్రం కాదు. నీవు కేవలం… అక్కడొక శస్త్రచికిత్స, వారు ఒక రకమైన శరీర భాగమును, లేదా అటువంటి దానిని కోసెదరు; ఆమె కదలని ఒక చెట్టులా అలా కుర్చుండవలసినది. ఆమె అక్కడ కూర్చొని వున్నప్పుడు, బహుశా ఆమెకివ్వబడిన కార్డు పిలువబడక పోయివుండొచ్చును లేక ప్రార్ధన వరుసలోనికి రాలేకపోయివుండొచ్చును, అయితే పరిశుద్ధాత్మ నన్ను ఆమె దగ్గరికి నడిపించెను. మరి ఆమె ఈ రాత్రి వెనుక వున్నది, ఆరోగ్యవంతురాలుగా కూర్చొన్నది, దాన్నిబట్టి మేమెంతో కృతజ్ఞలము.

ECCL 11:1

 

3సహోదరి, దయతో మీరు నిలబడగలరా; నీ చేతిని పైకెత్తి ఊపండి, నీ చేతిని ఊపండి. దేవుని కుమారుని యందు నీకున్న ధీరత్వము గల విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను దీవించును గాక నా సహోదరీ. ఈ క్షయత అక్షతను ధరించుకొన్నప్పుడు అనగా ఆయన నిన్ను గృహమునకు పిలిచేటంత వరకు ఆయన నిన్ను గాచును గాక.

ఇన్ని సంవత్సరాలు ఆమె ఆ ప్రార్ధనా కార్డును దాచి పెట్టి ఇప్పుడు దానిని తీసికొని వచ్చి నాకు ఈ రాత్రి చూపినదని నేను అనుకొనుచున్నాను, అందును బట్టి నేనెంతగానో ధన్యవాధములు తెలుపుచున్నాను. మీకు తెలుసా, ఇది ఒకరకంగా చెప్పాలంటే, అది నీటి మీద వేసిన ఆహారము ఒకనాటికి నీ యొద్దకు తిరిగి వచ్చేదిగా అది వున్నది, అది ఎవరి కోసమో ఏదో చేసినట్టుగా అది వున్నది.

4ఇప్పుడు, ఈ చక్కని సేవకులగు అనేకులను కలుసుకొనే అవకాశమును నేను కలిగియున్నాను, వారి యొక్క చక్కని సహవాసమును, సహకారమును నేను నిశ్చయముగా అభినందించుచున్నాను. ప్రభువు చిత్తమైతే, మనం ఈ భూమి మీద సజీవులముగా వున్నట్లైతే వచ్చే సంవత్సరము నేను ఇక్కడ వుండాలని బ్రదర్ కారల్ ప్రకటనను చేసియున్నాడు. మరి, మంచిది, వచ్చే సంవత్సరము ఇక్కడ మీ అందరిని కలుసుకోవాలని నేను నిరీక్షిస్తున్నాను, అంతేకాక ప్రతి ఒక్కరు తమతో మరోక ప్రతినిధిని మీ వెంట తీసికొనిరావాలని నేను కోరుచున్నాను.

ఇప్పుడు, ఒక నిముషం పాటు నేను ఒక చిన్న విషయాన్ని గురించి ఒక సంగతిని చెప్పగోరుచున్నాను, ఎందుకనగా నా తరువాత డాక్టర్ రీడ్ మాట్లాడగైయున్నాడు, డాక్టర్ రీడ్ చెప్పుదానిని వినుటకే నేను ఇంత దూరము ప్రయాణం చేసి వచ్చాను, రెండు వందల-యాబై మైళ్ళ ప్రయాణం చేసివచ్చాను, కొద్దిసేపటి క్రితం ఒక సంగతి జరిగినది. కానీ డాక్టర్ రీడ్ ప్రసంగం వినటానికి వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసైనా నేను వస్తాను. నేను ఇక్కడ వుండుటకు, కొద్ది సేపటి క్రితం నేను దేనినైనా వింటినో దాని నిమిత్తం వేయిమైళ్ళు దూరం అయినా సరే నేను ప్రయాణం చేసి వచ్చెదను, అది అంత అద్భుతమైన సంగతి. అటువంటి దానిని రక్తమాంసములు బయలుపర్చలేవు. అది జరుగుటకు పరిశుద్ధాత్మయే కావలెను. ఆ విధంగా నా జీవితమును ప్రోత్సహించిన వానిని చూచుటకు, నా జీవితకాలమంతయు నిశ్చయంగా నేను ఎంతో కృతజ్ఞునిగా అతని యెడల వుండెదను. నేను ఏమి చెప్పాలనుకొన్నానంటే, నేను గనుక ఒక ఆపరేషన్ చేయించుకోవాల్సివస్తే, వైద్యున్ని పిలువవల్సివస్తే, డాక్టర్ రీడ్ నీవు వున్నపాటునే నా యొద్దకి రండి. ఒకవేళ నాకు ఆపరేషన్ చేయవాల్సివస్తే ఆపరేషన్ చేయుటకు నేను నమ్ముకొనదగిన వ్యక్తి అతడు, దేవుని నమ్మిన చేతులు గల అతడు నా మీద చేతులుంచి నాకు ఆపరేషన్ చేయుటను నేను కోరుకొందును. నాకెన్నడు అటువంటిది అవసరం రాదని నేను అనుకొనుచున్నాను. ఒకవేళ వస్తే, నేను అతనినే కోరుకొందును, ఒకవేళ అతడు అందుబాటులో లేకపోయినటైతే, అతనివంటి ఒక వ్యక్తి కావాలని నేను కోరుకొందును.

ROM 8:28

 

5గత రాత్రి లేదా నిన్ను మధ్యాహ్నం ఒక కార్యం జరిగినది, అది నాకెంతో వింతగా వుండినది. దానిని నేను సంక్షిప్తముగా చెప్పెదను, ఎందుకనగా నా సహోదరుని సమయాన్ని నేను తీసికోను, అతడు మాట్లాడబోవుచున్నాడు. అయితే నా పరిచర్యను గూర్చి అదొకరకమైన అభినందన. నేను చిన్న సంగతులను గమనించుదును, ప్రతి చిన్న కార్యములో ఒక అర్ధాన్ని నేను చూచెదను. క్రైస్తవులకి ఏదీ కూడా అనుకోకుండా జరగదని నా నమ్మకం. జరిగే ప్రతీది దేవుని చేత ముందుగానే నిర్ణయింపబడినదని నా నమ్మకం, ఎందుకనగా దేవున్ని ప్రేమించువారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుచున్ననని యేసు చెప్పెను. కావున ఆయన నాకనుగ్రహించిన ఈ దీన పరిచర్యలో జరిగే ప్రతి చిన్న కార్యము ప్రజలగు మీకు సహాయపడుటకేనని, ప్రతి ఒక్కరికి సహాయపడుటకేనని, మరలాగే మీరంతా నాకు సహాయపడుచున్నారని, మనమంతా మహిమలోకి ప్రవేశించుటకు ఒకరికొకరం సహాయపడుచున్నామని నేను నమ్ముచున్నాను. దానియందు, జరిగే ప్రతి చిన్న కార్యము నాకు ఒక అర్ధాన్ని ఇస్తుంది.

అయితే నిన్న మధ్యాహ్నాం నేను ఇక్కడ నా అంశమును పోగొట్టుకొన్నప్పుడు దానిని నమ్మటం నాకది కష్టముగా ఉండెను. నా జీవితంలో అలా నాకెన్నడు కాలేదని నేను మీకు చెప్పుచున్నాను. మరప్పుడు, నా భార్య క్రిస్మస్ కు నాకొక క్రొత్త బైబిల్ని బహుకరించినది.

6నాకున్న పాత బైబిల్ చాలా ఎక్కువుగా చినిగిపోయింది. దానిని ఇంచుమించు 20ఏళ్ళ నుండి ఇప్పటివరకు వాడుచున్నాను, ఎన్నో ఏళ్ళ క్రితం, బహిరంగ కూటములు ఆరంభమైనప్పుడు హుస్టన్ గాస్పల్ టబర్నికల్ ప్రజలు దానిని నాకు బహుకరించారు. మరి దానియందు నేనెంతో మక్కువ కలిగియున్నాను, మరి దానియందున్న పేజీలు ముక్కలు ముక్కలుగా చినిగిపోయి అక్కడ వుండాల్సిన కాగితం ఇక్కడ, మరి ఇక్కడుండాల్సింది మరెక్కడోవుండెను. ఆదికాండములో ఒక పేజీని నేను తీయుదును, మరి దానిని కనుగొనుటకు ఎక్కడో ద్వితీయోపదేశకాండములో చూడవల్సివచ్చేది, మీకు తెలిసిందా, అలా అది బైబిల్ నందు కరుసుకొనిపోయేది. కనుక ఆమె క్రిస్మస్ కి ఒక దానిని నాకిచ్చినది. నా పాత బైబిల్ని ప్రక్కన బెట్టటం నాకసులు ఇష్టం లేదండి, అది నాకెంతో ప్రియమైనది. నేను అన్నాను, "యేసు రాకడకి ముందే నేను చనిపోయినటైతే, ఈ పాత బైబిల్ ను నా మీదనే వుంచండి. దీనితోనే నన్ను పూడ్చి పెట్టండి, మరి ఒక రోజు మనమంతా పైకి లేచినప్పుడు, నేను దీనితోనే తిరిగిలేస్తాను." మరప్పుడు అది నా అభిప్రాయము.

7నేనెప్పుడు ఒక చిన్న కథ చెప్పుచుండేవాడిని, ఇదొక భక్తిహీనతగా ఉండదు అని నేను అనుకొనుచున్నాను. కానీ నేను వెళ్ళాను… ఒకసారి ఒకడు నాతో అన్నాడు, అది ఎరల్ ప్రిక్కెట్ అని నేను నమ్ముచున్నాను, న్యూయార్క్ లో జరిగే కూటములో. మరి నేనొక వ్యక్తిని కలుసుకొన్నాను, అతడు అన్నాడు, "ఒక బోధకుడవైన నీకు ఈ వ్యాపారస్థులతో పనేంటో కాస్త చెప్పండి?"

అందుకు నేను అన్నాను, "ఓ, నేను కూడా ఒక వ్యాపారుస్థుడనే."

మరి అతడు అడిగాడు, "ఏ రకమైన వ్యాపారం నీది?"

"అషూరెన్స్ (హామీ లేదా నిశ్చయత)" అని నేనన్నాను. ఇప్పుడు, "ఇన్సురెన్స్ గా అని నేనన్నానని అతడు అనుకొన్నాడు, మీరు చూశారా నిజానికి నేనన్నది ఇన్సురెన్స్ కాదు, "అషూరెన్స్."

అప్పుడు అతడు, "ఓ ఎటువంటి ఇన్సురెన్సులను నీవు అమ్ముతావు?"

"నిత్యజీవము," అని అన్నాను. ఇంకా అన్నాను, "వాస్తవానికి నేను వాటిని నేను అమ్మను. నేను కేవలం దానిని తీసికొన్నాను మరలాగే మరికొందరిని దానిలో సభ్యత్వం తీసికొనేటట్లు ప్రయాసపడుచున్నాను."

8నేను బాలునిగా బడికిపోయే దగ్గర్నుండే అతడొక ఇన్సురెన్సులను అమ్మే వ్యక్తి అని నాకు గుర్తు. ఇప్పుడు ఇన్సురెన్స్ అనేది మంచిదే, అయితే నాకంటూ అలాంటివి ఏమీ లేవండి. అప్పుడతడు నా ఇంటికి వచ్చి అతడు అడిగాడు, "బిల్లీ, కొంత ఇన్సురెన్స్ ను నీతో కట్టించాలని నేను వచ్చాను." అప్పుడు అతడు, "నీ సోదరున్ని నేను ఎరుగుదును," అని అన్నాను. (నా సోదరుడు మెట్రోపోలిటన్ లో వీటిని కట్టిస్తాడు.) "మంచిది, నీకొకటి అమ్మాలని నేను కోరుకొనుచున్నాను," అని అతడన్నాడు.

నేను అన్నాను, "ఓ, విల్మర్, నీకు ధన్యవాదములు." బహుశా అతడు ఆ రాత్రి ఇక్కడే వుండొచ్చును, అతని సోదరుడు, "మేడగది" అనే పత్రికలో, మేడగది అనేదాన్లో అతడు వ్యాసములు వ్రాయుచుండేవాడు.

ఆ "నాకు అష్యురెన్స్ వుందిగా," అని నేనన్నాను.

అందుకతడు ఏమిటీ?" అని అడిగాడు. నేనొక వేషదారినేమో అన్నట్లుగా అప్పుడు నా భార్య నా వైపు చూసింది.

ఆమె అడిగినది, "బిల్లీ?"

అంతట నేను అన్నాను, " హె-హెూ నాకు అషూరెన్స్ వుంది!"

అతడన్నాడు, "ఓ, నన్ను మన్నించండి." మీకు ఏ ఇన్సురెన్స్ లేదని నీవన్నట్టు నాకు వినబడింది."

అందుకు నేను, "లేదమ్మ, నాకు అషూరెన్స్ వుంది!" మరి నేనన్నదానిని బట్టి అతడు నన్ను పట్టుకొని, అడిగాడు "నీవు అనేది ఏమిటి?"

"అషూరెన్స్," అని నేను అన్నాను.

అందుకతడు, "మంచిది, దానర్ధం ఏంటి?"

నేనన్నాను "ధన్యకరమైన నిశ్చయత, యేసు నావాడు!

ఓ, దైవిక మహిమను ముందుగా రుచించితిని,

నేను రక్షణ యొక్క స్వాస్థ్యమును,

దేవునివలన కొనబడితిని,

ఆయన ఆత్మలో జన్మించితిని, ఆయన రక్తములో కడగబడితిని."

అతడన్నాడు "బిల్లీ, నీకు తెలుసా నీవు చెప్పిన దానిని నేను అభినందిస్తున్నాను. అది ఎంతో మంచిది. కానీ కుమారా, అది నిన్ను సమాధిలోకి చేర్చలేదు."

అందుకు నేను, "కానీ అది నన్ను సమాధిలో నుండి లేపును! సమాధిలోకి పోవుట గూర్చి నేను చింతపడుట లేదు గానీ, నా చింత అంతా అందులో నుండి పైకి లేచుటే!" మనమంతా ఆ విధంగా అనుభూతి చెందుచున్నాము అని నేను అనుకొనుచున్నాను.

9నిన్న సాయంకాలం, నేను ఆ బైబిల్ని తీసుకొన్నాను,

కానీ ఆ అంశాన్ని నేను కనుగొనలేక పోయాను. నేను క్రొత్త బైబిల్ తీసికొన్నాను. చదవటానికైతే దానిని పాత బైబిల్లో చదివాను, అయితే వచ్చేటప్పుడు క్రొత్త బైబిల్ని చంకలో పెట్టుకొని ఇక్కడికి పరుగెత్తుకొని వచ్చాను. పాత బైబిల్లో నేను ఎక్కడైతే చదివానో, దానికోసం నేను తెచ్చుకొన్న క్రొత్త బైబిల్లో చూచాను. "మంచిది, ఇక్కడ, పరిశుద్ధ యెహాను 16:21 వున్నదనుకొంటున్నాను, అయితే అది ఏది మరి." అది అక్కడ ఎంత చూచినా కనబడలేదు.

అప్పుడు బ్రదర్ మూర్ ని అడిగాను, "అది వుండేది అక్కడేనా?" "అవును."

నేను మళ్ళీ చూసాను, కానీ అది అక్కడ కనిపించలేదు, అంతట నేను అనుకొన్నాను, "మంచిది, ఇది ముద్రించినవారి పొరపాటు అయివుంటుందేమో. అప్పుడు నా సహోదరుడు ఇక్కడికి వచ్చాడు, అతడు బ్రదర్ స్టాన్లీ, అతడు నా దగ్గరికి వచ్చాడు, అతడు బిషప్ స్టాన్లీ… అతడి ఉద్దేశ్యము ఏమిటో నేనెరుగను, నేను… అయినా అది నాకెంతో ఆదరణగా వుండినది. అతడు నాకు దగ్గరగా నడిచివచ్చి, అతడు అన్నాడు, "అలాగే నిలకడగా పట్టుకోండి, నా సహోదరుడా, బహుశా దేవుడు ఏదో చేయబోవుచున్నాడు."

మరియు అది నన్ను ప్రోత్సాహపరచినది, అతడు నన్ను అలా అనుట… అతడు ప్రవచనం చెప్పుచున్నాడన్నా సంగతిని అతడు గ్రహించాడో, లేదోనని నేను ఆశ్చర్యపోవుచున్నాను, కాని కొద్ది నిముషాల క్రితం, ఇక్కడికి వచ్చుటకు ముందు, అతనితో మాట్లాడాను. అతడు పలికినది ప్రవచనమేనని నా ప్రగాఢ నమ్మకం.

10కావున దానిని నేను నేను బోధించిన "ప్రసవ నొప్పులు," తదితర వర్తమానాలలో ప్రస్తావించాను. లిల్లీ పుష్పమును గూర్చి నేను కొద్ది మొరట విధానంలో చెప్పితిని. అది ఎలా అక్కడ జన్మించినది, మరియు ప్రియమైనదిగా పుట్టి ఎలా పైకి వచ్చినది, సూర్యుని చేత ఎలా ఆకర్షింపబడినది, మంచు చేత ఎలా కప్పబడినది, అనే మొదలగు సంగతులు చెప్పితిని. అది అంత అందముగా పైకి రావాలంటే మొదట దానికి కుళ్ళు అనేది పట్టాలి. దానిని నేను సంఘమునకు సాదృశ్యముగా చెప్ప ప్రయత్నించితిని. అది ఇక్కడున్న ఒక డాక్టరు వలే వున్నది. అతడు ఒక రోగిని చూచే విధానంలా అది వున్నది. నేడు మనకి ఎలాంటి డాక్టర్లు వున్నారంటే, వారంటారు, నీ కాళు ని రుద్దుకొనుము, మడెమ వెనుక భాగాన దానిని రుద్దుకొనుము, అప్పుడు "నీ ముఖం మీదున్న క్యాన్సర్ పోతుంది, చూశారా." కానీ ఒక మంచి వైద్యుడైతే అలాంటి పిచ్చి పనులు చేయించడు. వైద్య శాస్త్రం మీద తాను అభ్యసించిన దాని ప్రకారం అతడు రోగికి చికిత్స చేస్తాడు.

సరిగ్గా అట్లానే నేను కూడా రోగికి జరిగిస్తాను. సంఘము రోగి అయినప్పుడు, వారికి ఒక కరచాలనము సరిపోతుందిలే, లేదా ఒక క్రొత్త సంస్థ సరిపోతుందిలే, అని చెప్పుటకు నేను ప్రయత్నించను. అయితే నాకు తెలిసిన గ్రంథము ద్వారా నేను దానికి చికిత్స చేస్తాను. సంఘానికి దద్దుర్లు నుండి నయంచేయటకు ఏదైతే సరైన మందు అని గ్రంథము చెప్పునో, మరిదాని ప్రకారమే నేను మందుల చీటి వ్రాసి ఇస్తాను; పాపమనేది సంఘాన్ని బ్రద్దలు చేసినప్పుడు సరిగ్గా దానికి తగిన మందునే నేను దానికి అన్వయిస్తాను. విధానం అదేనండీ.

HOS 11:1•

MATT 2:15•

LUKE 17:26,28-30•

REV 3:17

 

11ఏశావు, యాకోబుల సరిపోలికను చెప్పి, తదుపరి కాలములన్నిటిని చెప్పుకొంటు వచ్చుటకు నేను ప్రయత్నింతును. మరి నేను దానిలోకి వెళ్ళను, అయితే నేను చివరిగా ఉపయోగించే నా లేఖన భాగములో చివరి భాగమునకు నేను దానిని తీసికొని వచ్చెదను, దానిని పోల్చి చెప్పెదను, లేఖనానికి విరుద్ధంగా మాత్రం కాదండీ, అది సరిగ్గా యేసు చెప్పినట్టే.

ముఖ్య వైద్యుడు చివరి కాలమందు సంఘము ఏ పరిస్థితుల మధ్య ఉండునని చెప్పెనో సరిగ్గా అలానే అది వుండును; అది లవోదికయగా వుండును, ధనికురాలు, గ్రుడ్డిది, దిగంబరిది, పేద సంఘము. మరి, అది సొదొమో దినములతో సరిపోల్చి చెప్పబడినది. ఇప్పుడు, అది వాస్తవమని మనమెరుగుదుము.

చారిత్రాత్మకంగా నీవు దానిని గమనించినట్లైతే, మొదటిగా ఆయన దానిని నోవాహు దినములలో తీసికొనివచ్చెను, అటు పిదప సొదొమో దినములలో తెచ్చెను. అది ఆ విధముగా పయనించినది, మరి అదే రీతిలో అది పయనించును. మరియు చరిత్ర దానంతటికి అదే పునరావృతమగును, మరలాగే బైబిల్ యొక్క వాగ్దానములు కూడా అంతేనండీ.

ఉదాహరణకు, మత్తయి 3లో ఇలా చెప్పబడినది, "ఐగుప్తులో నుండి నేను నా కుమారుని పిలిచితిని." ఇప్పుడు నీవు దానిని క్షుణ్ణంగా వ్యాఖరణంలో చూస్తే అది యాకోబు అని, ఆయన యాకోబుని తన కుమారునిగా బయటకి పిలుచుచున్నాడని గ్రహించవచ్చును. అది ఆయన యొక్క చిన్న కుమారుడు, కానీ ఆయనకి పెద్ద కుమారుడున్నాడు, ఆయనే యేసు, ఆయన కూడా ఐగుప్తులో నుండే బయటకి పిలువబడియున్నాడు. కావున అది మిశ్రమ సమాధమును కలిగియున్నది.

12గనుక, వారు దానిని అలా మాట్లాడుకొంటు వెళ్ళుటకు చూచుట ద్వారా నేను దాని మీద ఆలోచనలను పట్టుకొని వచ్చాను. మరియు నేను వేదిక మీద నుండి దిగి వెళ్ళిపోయాను. నా పిల్లలు ఇంటికి వెళ్ళిగోరిరి, వారిని తీసికొని పోవుచుండగా, వారికి ఆకలి వేసినందున సాండివిచ్ తినుటకు ఒక చోట ఆగితిమి. నేను లోపలికి వెళ్ళాను.

అప్పుడు భార్య నాతో ఇలా అన్నది, "బిల్లీ, నేను ఎంతో ఉద్రిక్తతకు గురి అయ్యాను. ఏం చెయ్యాలో నాకు పాలుపోలేదు, ఎందుకనగా ఆ బైబిలును ఇచ్చింది నేను కదా."

నేనన్నాను, "దానిని వ్రాసింది నువ్వు కాదుగా, దాని సమకూర్పు చేసింది నువ్వు కాదుగా ప్రియమైనదానా."

ఆమె అన్నది, "కానీ దాన్ని ఆలోచించు, లోపమువున్న బైబిల్ ని నేను నీకిచ్చాను కదా!"

నేను అన్నాను, "మంచిది, బహుశా అందు అలాంటిది ఏమి లేదనుకొంటా." మరి పిల్లలలో ఒకరు దానిని పట్టుకొని వచ్చారు, ఆ పేజీలను మేము త్రిప్పాము, అయితే ఏ లోపము మాకు కనబడలేదు, అదంతా బాగానే వున్నట్టుగా వుంది. అయితే కాగితముకి అడుగుభాగాన చూశాము, అక్కడ రెండు కాగితములు అతికించినట్టు వుండినవి, 16వ అధ్యాయము ఇటువైపున వున్నది, మరి అటువైపు 16వ యొక్క కొనసాగింపు వుండినది. మరి 17వ అధ్యాయము దాని తర్వాత ప్రారంభమైనది… చూశారా, అది చక్కగానే వున్నది, వుండాల్సినట్లుగానే వున్నది.

అయితే 16వ అధ్యాయమునకు బదులుగా నేను ఎప్పుడు 17వ అధ్యాయమునే చదువుచుంటిని.

13మరి నేను అనుకున్నాను, దేవా, నీవెందుకు దానిని చేసితివి? అటువంటి ఒక కార్యము ఎందుకు?" అది నా భావము, మీకు తెలుసా, దానంతటిని గూర్చిన అర్ధమును చూచుటకు, ఎందుకనగా ఏదియు అనుకోకుండా జరగదని నా నమ్మకం.

వేదిక మీద నా దగ్గరకి వచ్చి, నన్ను ఆదరించిన ఈ సహోదరుని గురించి నేను తలంచుచున్నాను, అతడు నాతో "నిలకడగా పట్టుకోండి," అని పలికాడు, అంతే కాదు అతడొక యాజకుడు లేదా అటువంటి వృత్తిగలవాడు. మరి నేననుకున్నాను, "అదెలా సాధ్యం?"

మరప్పుడు, అక్కడ కూర్చొనియున్నప్పుడు, ఒక పిడుగు ఆకాశము నుండి నా పైన పడినట్టు అనిపించినది. ఇప్పుడు, ఇది మీకు భావయుక్తముగా యుండకపోవచ్చును, అయితే నాకు మాత్రం అది అలానే వుండెను, చూశారా.

ISA 61:1,2•

LUKE 4:16-21

 

14నాకు గుర్తుకొచ్చినది, అది లుకా 4వ అధ్యాయములో యేసు తాను పెరిగిన నజరేతులో వున్న ఒక సమాజ మందిరములోనికి ప్రవేశించెను, సంఘమునకు వెళ్ళుటనేది ఆయన యొక్క వాడుకగా యున్నది. విశ్రాంతి దినమున సమాజమందిరముకి వెళ్ళుట. ఆయన ప్రవేశించిన తర్వాత మనం గనుక గమనిస్తే అక్కడున్న యాజకుడు ఆయన చేతికి బైబిల్ని, గ్రంధపు చుట్టని అందించాడు. యేసు ఆ గ్రంధపు చుట్టలలో చూచి, ఒక నిర్ణీత చోటును, యెషయా 61ని కనుగొని, మరియు ఆయన ఆ లేఖన భాగమును చదివెను. అంతట అయన బైబిల్ని తిరిగి పరిచారకునికి ఇచ్చెను. మరప్పుడు ఆయన శ్రోతల తట్టు తిరిగెను, అందరు ఆయన వైపు తధేకముగా చూచుచుండగా, ఆయన ఇలా పలికాడు, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది."

మరి ఆ లేఖన భాగము పఠించుట అసాధారణగా వున్నదని మనకి తెలుసును, ఎందుకనగా ఆయన యెషయా గ్రంధము 61వ అధ్యాయం ఒకటి రెండు వచనాలను చదివాడు: "నలిగిన హృదములను కట్టుటకు, రోగులకు స్వస్థత నిచ్చుటకు, గ్రుడ్డివారి కళ్ళు తెరుచుటకు, మరియు ప్రభువు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు ప్రభువు ఆత్మ నా మీద వున్నది." మరి తదుపరి వరుసను ఆయన చదువుటను నిలిపివేసాడు, తర్వాత వచ్చేది తీర్పు, అది తన యొక్క మొదట రాకడకి కాక తన యొక్క రెండవ రాకడికి చెందినదిగా యుండినది, కనుకనే దానిని అనగా దిగువ భాగమును ఆయన చదువుకుండా నిల్పివేసెను మరి ఆయన ఆగి, కలియతిరిగి, ఇలా అన్నాడు, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది." అదెంత తిన్నగా వున్నదో చూడండి!

LUKE 4:21

 

15మరి "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది" అని జనులకి ఆయన ఎంతో సూటిగా చక్కగా తెలిపాడు, బోధకులకి, ప్రజలకి అదెంతో గొప్ప ప్రకటనగా యున్నది, ఆయన ఇక్కడ మెస్సియాగా యుండినను వారు ఆయనను నమ్మకుండిరి. ఇక్కడ ఆయన, ఆ గడియకి వర్తమానికుడిగా వున్నాడు. ఆయన పుట్టుక మొదలుకొని, ఆయన పరిచర్యలో జరిగిన ప్రతీ కార్యము ఆయన ఎలాంటివాడిగా వుండవల్సినదని చెప్పినదో సరిగ్గా ఆయన అలాగునే వుండెను, అయినప్పటికి వారు దానిని నమ్మలేకపోయిరి. ఎంత గొప్ప ప్రకటన అది. కాని ఆయన నేడు చెప్పగలడు, ఎవరైన ఒకవ్యక్తి వారి కన్నులను తెరిపించిన యెడల, వారే దినములో జీవిస్తున్నారనే సంగతిని, అది ఆయన యొక్క గడియని, లేఖనము ఎలాగైతే చెప్పినదో సరిగ్గా అలాగుననే ఆయన అక్కడవుండి జరిగించుచున్నాడని, ప్రవక్తలందరు చెప్పినట్టే ఆ దినము జరుగునని తెలిసికొందురు. ఏది జరుగునని దేవుడు ప్రవచించి చెప్పియుండెనో, అదే ఇక్కడ ఆయన జరిగించుచున్నాడు! దానిని చూచుటలో వారెలా తప్పిపోయారు? ఆయన పరిచర్య ఏమిటోనన్న సంగతిని వారక్కడ తక్షనమే తెలిసికొనియుండవల్సింది. వారు దానిని తెలిసికొనియుండవల్సింది, ఎందుకనగా "లేఖనము నెరవేరినది," అని ఆయన పలికెను.

LUKE 17:28,30

 

16నేటి దినము గూర్చి నేను ఆలోచిస్తున్నాను. యాజకుడు వాక్యమును ఇక్కడ ఇచ్చుట అనగా ఏమిటో గమనించుము. వాక్యము చదవబడినది, తిరిగి యాజకుని చేతికి ఇయ్యబడినది. నా అంశములో నేను రాసికొని వచ్చిన లేఖన భాగాలలో చిట్టచివరిది పరిశుద్ద లూకా 17:30, అక్కడ మనం జీవిస్తున్న దినమును గూర్చి ప్రస్తావిస్తున్నాడు, అది ధనికురాలు, లవోదికయ కాలము, అయినను అది రాజకీయాలలోను సంఘ రాజకీయాలలోను కుళ్ళుపట్టిపోయినది, చెడిపోవాల్సినంతగా అది చెడిపోయింది. మరప్పుడు ఆయన అన్నాడు, "లోతు దినములలో జరిగినట్టు చివరి దినాలలోను అలాగుండును."

అక్కడ ఆయన ఏం చెప్పాడో గమనించండి: "మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలో," చూశారా, "మనుష్యుకుమారుడు ప్రత్యక్షమగు దినములలో ఆలాగు వుండును."

దీని మీద మీ ఏకాగ్రతను నిలపాలని కోరుచున్నాను, చూశారా, ఆయన మూడు నామములలో వచ్చాడు. ఆయన మనుష్యుకుమారునిగా వచ్చాడు అనగా ప్రవక్తగా వచ్చాడు. ఒక ప్రవక్తగా వుండేదానినే ఆయన జరిగించాడు, ఆయన తన పరిచర్యను రుజువుపరచుకొన్నాడు. మనందరికి అది తెలుసు. మనలో ప్రతి ఒక్కరికి అది తెలుసును. తాను దేవుని కుమారున్నీ అని ఆయన ఎన్నడు అనలేదు, తాను మనుష్యకుమారున్ని అని ఆయన అన్నాడు. ఇప్పుడు నేడు, ఆయన దేవుని కూమారుడు, ఆయన తిరిగి వచ్చి, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో అనగా అదృశ్యమగు వ్యక్తిగా ఉన్నాడు, అయినప్పుటికిని ఆయన దేవుని కుమారుడు, దేవుడే. వెయ్యేండ్ల పాలనలో ఆయన తన తండ్రి సింహాసనము మీద ఆసీనుడైయుండును, అప్పుడు ఆయన దేవుని కుమారునిగా పిలువబడును. ఆయన మొదటిగా తన్నుతాను మనుష్యకుమారునిగా బయలుపర్చుకొన్నాడు, ఒక ప్రవక్తగా, ఈ కాలమందు, సంఘ కాలమంతటా, మనుష్యకుమారునిగా, లేదా దేవుని కుమారునిగా. మరొక కాలములో దావీదు కుమారునిగా, మూడు కుమారుల నామములలో.

GEN 18:3•

GEN 19:2•

LUKE 17:30•

COL 2:9

 

17కానీ మీరిక్కడ గమనించండి, చివరి సంఘ కాలము యొక్క ముగింపునందు, అది ఎంతో గందరగోళములో ఉన్నది… ఆయన మరలా మనుష్యకుమారునిగా తన్నుతాను బయలుపర్చుకొనును: "మనుష్యకుమారుడు బయలుపర్చబడినప్పుడు." నిన్నటికి తగినట్టు అది ఎంత కలగలువుగా అయ్యిందో చూడండి; మీరు దీన్ని పోగొట్టుకొనరని నేననుకొనుచున్నాను. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షతను మనము కలిగియున్నాము, కుమారుడు పుట్టక మునుపు, ఉనికిలోకి రాక మునుపు అబ్రాహాము కలిగియున్న చివరి వాగ్దానము, అతనికి చేయబడిన వాగ్దానము, వాగ్దాన పుత్రుడు అగుపర్చబడక మునుపు దేవుడు అక్కడ సొదొమో దగ్గర ఒక ప్రవక్తగా, ఒక మానవునిగా, శరీరమందు దేవునిగా తన్నుతాను కనపర్చుకొన్నాడు. ఎలోహిం గూర్చి కొద్దిసేపటి క్రితం ఎవరో దానిని గూర్చి మాట్లాడారు, దైవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరములో ఆయనయందు నివసించెను. మరి మనము గమనించితిమి అక్కడ లోతు చూచినప్పుడు… ఆయన రాకను అబ్రాహాము చూచినప్పుడు, "నా ప్రభువా," అని ఆయనని పిలిచెను. వారు ముగ్గురు. సొదొమోలో లోతు ఇద్దరిని చూచి, "నా ప్రభువులారా," అని పిలిచాడు. అతనికి ప్రత్యక్షత లోపము.

కావున ఇక్కడ జరిగినది ఏమిటో గమనించండి, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా తన్నుతాను బయలుపర్చుకొన్నాడో అనే ప్రత్యక్షత.

LUKE 4:21•

LUKE 17:30

 

18మనము చెప్పలేమా, ఆ సహోదరుడు తాను చేసిన దానిని నాతో చెప్పినప్పుడు అతడు ప్రవచించియున్నాడని నేను నా వ్రేళ్ళ మీద నిలబడి దానిని నేను చెప్పలేనా! "ఈ దినము!" ఆ లేఖనమును చదివిన వెంటనే ఆయన ఏమి చేసినో గమనించండి, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలో ఒక మనిషి కాదండీ ఒక మానవమాత్రుడు కాదండీ, మనుష్యకుమారుడు మరొకసారి తన్నుతాను తన ప్రజలకి ప్రత్యక్షపర్చుకొంటాడు. ఈ దినమందు ఈ వాగ్దానము, ఇప్పుడు మనం జీవించుచున్న ఈ గడియనందు మన కన్నుల ఎదుటే అది నెరవేరినది.

తక్షణమే ఆయన సమాజము వైపు తిరిగి, మరి అక్కడ పది లేక పండ్రెండు మంది, లేదంటే కొంతమంది వుండొచ్చును. తెలీదు, సొదొమోలో ఆయన దేనినైతే చేసెనో, సరిగ్గా దానినే ఆయన అక్కడ చేసెను. ఈ దినము ఈ లేఖనము మీ ముందు ప్రత్యక్షమైనది. మీ ముందు అది వాస్తవరూపము దాల్చినది. నా సహోదరుడా, సహోదరీ, ప్రతినిధులారా, సేవకులారా, ఇక్కడున్న వారలారా, దేవుని పిల్లలారా.

అలాగైతే మనం ఆయన రాకడికి ఎంత సమీపముగా వున్నామో చూడండి? కాల్చి వేయబడుటకు అగ్ని సొదొమ మీద పడుటకు ముందే అనే దానిని ఆయన వాగ్దానం చేసిన లేఖనమును మనమిప్పుడు చూచినట్లైతే, అది నేటి దినానికి అనుసంధానం చేసి, మరి ఆ లేఖనము మన కళ్ళముందే నెరువేరుచుండుటను చూచుటనుబట్టి దేవుని కుమారుని రాకడ ఎంతో సమీపముగా వున్నదో మనం చూచుచుంటిమి. లేఖన బయలుపాటుకు ఎంతో సమీపముగా వున్నాము, అది అబ్రాహామును బయటికి తెచ్చినట్టే ఆయన సంఘమును తెచ్చెను, ఆయనే సంఘమునకు చేయబడిన వాగ్దానము!

మరిప్పుడు అబ్రాహాము యొక్క శరీరసంబంధమైన సంతానం విఫలమైనట్టు మనము కనుగోనగలము. కానీ అబ్రాహాము యొక్క రాజసంతానము, అనగా వాగ్దానము చేయబడిన వాక్యమందు, విశ్వాముంచిన రాజసంతానము ఇప్పుడు భూమి మీద నేడు బయలుపర్చపడుచున్నది. నా సహోదర సహోదరీలారా, మనమిప్పుడు అంత్యకాలమందున్నాము. మనము ముగింపులో వున్నాము.

19మరి మనకి కేవలం ఒక మాదిరి మాత్రమే కాదు వుంది.

నేను లేఖనాలను సరిపోల్చి చెప్పుచుందును ఏలయనగా మాటలను, కార్యములను తీసికొనివచ్చుటకు నాకు తగినంత చదువులేదు. నేను మాదిరులను చూపుచుందును, కానీ చాయలలో నేను వాటిని నేను చూచినట్లైతే, నా చేతిని నేను ఎన్నడూ చూడకపోయినా దాని చాయని మాత్రం చూస్తే చాలు, అప్పుడు నాకు అయిదు వ్రేళ్ళు ఆ చేతికి వున్నాయి అని నేను తెలిసికొందును. సరిగ్గా మీరును ఆలాగునే పాత నిబంధన లేఖనములను, దాని మాదిరులను చూచి గమనించవలెను. అవి ఏలాగు వున్నవి? అవి ముందస్తు సూచనగా వున్నదని యేసు చెప్పెను. సోదోమోకి ఏ వాగ్దానమైతే ఇవ్వబడినదో, సొదొమోలో నెరవేరిన ఆ వాగ్దానము తిరిగి నేటి దినమందు పునరావృతమగునని, నేడు అది మన కళ్ళముందే తెలియపర్చబడునని యేసు అనెను.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దానిని పోగొట్టుకోవద్దు! వచ్చే సంవత్సరం నేను మిమ్ములను ఇక్కడ చూడనట్లైతే, వారు బంగారు మెట్లు ఎక్కుచుండగా, అక్కడ మిమ్మును చూచుదునని నేను నిరీక్షిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. [టేపు పై ఖాలీ ఉన్నది]

20…లేఖనములు ప్రకారం, చివరి సూచన మారలాగే మాదిరి మా యెదుట బయలుపర్చబడుటను మేము చూచుచున్నాము. యేసుక్రీస్తు మాటలు వాటిని అలా చెప్పియుండెను. సొదొమోలో వున్నట్టుగానే నేడు లోకము యొక్క పరిస్థితులుండుటను, సంఘమందు అలాంటి పరిస్థితులేవుండుటను మేము కళ్లార చూచుచున్నాము, మరి అంతేకాక ప్రతీ సంఘ శాఖలో నుండి ఎన్నిక చేయబడిన వారు బయటకు పిలవబడుటను కూడా చూచుచున్నాము. ఆయా స్థలాలలో వుండిన జీవము విత్తన రూపము దాల్చుటకు బయటకి వచ్చుచుండెను.

పరలోకపు తండ్రి, తక్షణమే మేము మేల్కొల్పబడునట్లు మేము ప్రార్ధించుచుంటిమి. ఒక సహోదరుడు తాను కళ్ళు ముసికొన్నప్పుడు తనముందే జనసమూహములు వెళుచున్నట్టు ఇప్పుడే చెప్పియున్నాడు. ఓ దేవా, ఇంకను తాకబడని ఒక జనసమూహము వున్నదని మేము నమ్ముచున్నాము. ప్రియ దేవా, మాకు సహాయం చేయండి; ఈ దినము ఈ లేఖనము నెరవేరినది అనే దానిని తెలిసికొన్నవారమై, అటువంటి ఒక హెచ్చరికను మేము మా హృదయమందుంచుకొని మేము ఈ కూటమునుండి వెళ్ళుదుము గాక. యేసు నామములో ప్రార్ధించుచున్నాము ఆమేన్.

21[బ్రదర్ డీమోస్ షెకారియన్ మాట్లాడుచున్నాడు, మరియు ఒక ప్రార్ధనా విన్నపమును తెచ్చుచున్నాడు.]

దూరము అనేది దేవునికి ఏ వ్యత్యాసము లేదండి. ఆయన అంతట సర్వవ్యాప్తి. అలాగుంటేనే ఆయన దేవుడిగా వుండగలడు. నాకు తెలిసి, నా దీన పరిచర్యలో జరిగిన కొన్ని గొప్ప కార్యలు కేవలం టెలిఫోన్ ద్వారానే జరిగియుండెను, ఎవరో నాకు ఫోన్ చేస్తారు, అప్పుడు గొప్ప కార్యలు చోటుచేసికొంటాయి. రోగములతో వున్న ఈ జనులు స్వస్థత నొందునట్లు మనమంతా ఏకీభవిద్దాము.

MARK 11:24•

ACTS 12:7,10,12

 

22ప్రియ పరలోకపు తండ్రీ, ప్రార్ధనలో మేము వారిని నీ సన్నిదికి తీసుకొని వచ్చుచున్నాము. ఒక రాత్రి అపోస్తులుడు తన పనులన్నిటిని నుండి ఆపు చేయబడియుండుటను మేము ఎరిగియున్నాము; అతడు చెరసాలలో వేయబడెను, మరి మరుసటి దినమున శిరచ్ఛేదనము చేయబడబోవుచుండెను. అయితే జాన్ మార్క్ గృహములో వారొక ప్రార్ధన కూడికను కలిగియున్నారు. మరి ఆ గది లోపలికి ఇశ్రాయేలీయులను వెంబడించిన అదే అగ్నిస్తంభము, అరణ్యమార్గమున ఇశ్రాయేలీయుల పిల్లలు వెంబడించిన అదే అగ్నిస్తంభము దిగివచ్చెనది, వారి మధ్యలోకి దిగివచ్చినది, కారణం వారి యొక్క ప్రార్ధనా కూటమే, అంతట అది ప్రతి తలుపును తెరిచి స్వేచ్చగా బోధించుటకు అపోస్తలులను తిరిగి విధులలోనికి తీసుకొని వచ్చెను. ఈ సేవకులు, మిషనరి జనులు ఇప్పుడు బంధింపబడియున్నారని; వారు అపస్మారక స్థితిలో ఉన్నారని మేము తెలుసుకొనియున్నాము. ప్రభువా, నీవు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా యున్నావు. ఓ దేవా, ఈ రాత్రి మా ప్రార్ధన ఆలకింపుము. నీవు అన్నావు, "మీరు ప్రార్ధించినప్పుడు, మీరు అడిగిన వాటినెల్ల పొందియున్నామని నమ్ముము. అవి మీకు అనుగ్రహింపబడును." ప్రభువా, నీ మహిమ కొరకు వారిని స్వస్థపర్చమని యేసు నామమున ప్రార్ధించి నమ్ముచున్నాము, ప్రభువా. అది ఇదివరకే చెప్పబడినది అడుగబడినది, ఇప్పుడు అది అలాగు జరుగును గాక. ఆమేన్.

23[టేపు ముగిసినది]

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...