ఒక మనుష్యుడు ప్రభుని సన్నిధి నుండి పారిపోవుట
1మన శిరములను వంచుదము. ప్రియదేవా, మరోసారి మేము ఇక్కడ తిరిగి కూడుకొను భాగ్యము ఇచ్చినందులకు ఈ మధ్యాహ్నము చాలా సంతోషముగా యున్నాము. ప్రభువా, ఈ ఘడియ కొరకు మా హృదయములు ఎంతగా ఆతురత పడినవో నీకు మాత్రమే తెలియును. నీ జనుల ఎదుట మరల మేము నిలబడవలెనని ఎదురు చూచాము. ఈ వర్తమానమును అందించవలెనని కోరాము. ఈ ఘడియకు ఇది ఎంతో అత్యవసరమైనదని మేము భావించుచున్నాము. ఇపుడు నీవు మాకు ఈ కొద్ది దినములు అందించి యున్నావు. ప్రియదేవా, నీ కృపా హస్తము మా మీద యుండవలెనని మేము ప్రార్థించుచున్నాము. నీవే మమ్ములను నడిపించి మార్గమును చూపించవలెను. ప్రభువా, మాకు అవసరమగు వాటిని దయ చేయుము. నిన్ను మరిఎక్కువగా తెలిసికొనవలెనని మా హృదయములు వాంఛించుచున్నవి.
గొప్ప కోత పొలము తెల్లబారి పండి యుండుటను మేము చూచుచున్నాము. ఆ మహా నూర్పిడి కాలము కొరకు పంట సిద్ధముగా యున్నదని మేమెరుగుదము. ప్రియదేవా, మా చుట్టూ యున్న పొట్టును ఒలిచివేయుమని ప్రార్థించుచున్నాము. కుమారుని యొక్క సన్నిధిలో మమ్మును ఉంచుము. రాబోవు కొద్ది దినములలో మేము పరిపక్వము చెంది దేవుని రాజ్యమునకు పనికి వచ్చునట్లు చేయుము.
HEB 12:1
2పాడు ప్రతి పాటను దీవించుము. ప్రతి ప్రార్థనను ఆశీర్వదించుము. ప్రభువా, ప్రార్థించుచున్న ప్రతి వారికి జవాబును దయచేయుము. నశించిన వారినందరినీ రక్షించుము. దేవుని మందిరమునకు తిరిగి రప్పించుము. బయట దారితప్పి తిరుగుచున్న వారిని సహవాసమునకు పిలువుము.
దేవా, మా కప్పు క్రిందికి వచ్చు ప్రతి వ్యాధిగ్రస్తుని నీవు బాగు చేయుము. ప్రభువా, నీ కృప చూపుము. ఈ కూటములు అయిపోవుసరికి మామధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండునట్లు చేయుము.
ప్రియదేవా, మేము ఈ ఘడియలో సంఘముగా యున్నామని చెప్పుకొనుచున్నాను. బయటకు పిలువబడినవారము. బబులోను నుండి బయటకు వచ్చి ఈ చివరి దినపు అద్భుత సహవాసములో పాలిభాగస్థులుగా యున్నవారు ప్రపంచమంతా చెదరియున్నారు. దేవా, మా హృదయములను నీవు ఆ విధముగా ఆశీర్వదించవలెనని కోరుచున్నాము. ప్రభువా, మేము నిజముగా ఆకలి కలిగియున్నాము. లోకపు సంగతులను మేము మాలో నుండి తీసివేసికొని ఖాళీగా యున్నాము. ప్రభువా, మేము దీనిని నిజముగానే ఎరుగుదుము. సుళువుగా చిక్కులుపెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి యున్నాము. ఓపికతో పందెమును పరుగిడుదుము. మా ముందున్నది ఆ పందెము. తండ్రీ, నీ కృప చూపుము. మేము ఇక్కడికి వచ్చినపుడు ఉండిన దానికంటె బలమగు, నాడు క్రైస్తవులుగా ఈ కూటానంతరము ఉండగలుగునట్లు చేయుము. దేవునికే సమస్త మహిమ చెల్లును గాక. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమెన్.
3ఈ రాత్రి కొరకు చాలా కాలము నుండి నేను ఎదురుచూచుచున్నాను. ఇది మహా భాగ్యమని ఎంచుచున్నాను. ఒక రోజున నా భార్యతో చెప్పాను. ఆలయమునకు రావలెనని బహుగా ఆశించుచున్నాను. నాకు ప్రపంచమంతటా ఎందరో స్నేహితులున్నారు. కాని ఈ ఆలయములో ఏదో ప్రత్యక్షత యున్నది . దేవుడు నన్ను భూమి మీదికి పంపించునపుడు ఈ నేలమట్టితో నన్ను తయారు చేసెనేమో అని తలంచుచుందును. ఆయన రాకడ ఆలస్యమయిన యెడల ఇక్కడే నేను పాతిపెట్టబడుదును. ఆయన వచ్చినపుడు ఇక్కడే నన్ను కనుగొనును.
జెఫర్‌సన్‌విల్ గూర్చి తలంచుచున్నపుడు నాకు ఏదో ఆలోచన కలుగుచున్నది. ఒకరోజు నేను ఒంటరిగా యున్నాను.నాకు ఇంటి మీద బెంగగా యున్నది. కాని ఆ బెంగ ఎందుకొరకో అర్థము కాలేదని నా భార్యతో చెప్పాను. ఆ జనులు నా కొరకు ప్రార్థించుచున్నారని ఎరుగుదును. నేను కొద్ది రోజుల పాటు అక్కడుండి కూటమును ఏర్పాటు చేయవలెనని తలంచాను. ప్రభువు మనకు ఏదో తెలియచేయును గనుక ఎదురుచూద్దామని చెప్పాను. మన ముందుర గొప్ప అంశమున్నది. అది వివాహము మరియు పరిత్యాగము. [పలుక బడిన వాక్యము. Vol 3. No.13-సంపా॥] ప్రశ్నకు తప్పక జవాబు ఉండును. జవాబు లేకుండా ప్రశ్న అనునది యుండదు. అది ఏమైనాగాని దానికి ఒక జవాబు ఉండును. ప్రభుని చిత్తమయితే ఆదివారము ఉదయమున నేను దానిని గూర్చి మాట్లాడుటకు ప్రయత్నించెదను.
4రేపు రాత్రి మనము ఇక్కడే ఒక పాఠశాల యొద్ద కూడి యుందుము. ఆ పాఠశాల పేరుఏమిటి? పార్క్‌వ్యూ ఆడిటోరియం.ఏమిటండీ? [సహో॥ నెవిల్‌తో సహో॥ బ్రెన్‌హాం మాట్లాడుచున్నారు- సంపా॥] పార్క్ వ్యూ జూనియరు హైస్కూలు. అదెక్కడున్నదో ఎంతమందికి తెలియును? దానికి బోర్డులు వ్రాసియున్నవి కదా నెవిల్ సోదరుడా? పావు మైలు దూరములో యున్నది. ఒక బోర్డు యుండును. మీరు రోడ్డు నుండి వెనుకకు తిరుగ వలెను. అది చక్కని అందమగు భవనము. మీరు చేతులు చాపి చెప్పిన దానిని చక్కగా వ్రాసికొనుటకు వీలుండు ఏర్పాట్లు అక్కడ యున్నవి. ఆలయములోని కూటములు క్రిక్కిరిసి పోవుచున్నందున అది మీకు బాగుగా యుండును. తప్పకుండా దానిని మీరు ఆనందించగలరని ఎరుగుదును. కావలసినంత చోటుయున్నది. కార్లు నిలుపుకొనుటకు కావలసినంత చోటు యున్నది.
వారికి చిన్న చట్టమున్నది. దానికి మనము కట్టుబడి యుండవలెను. అదేమనగా 6:30 వరకు ఆవరణములోనికి రాకూడదు. [5:30 కు ముందు ఆవరణలోనికి రారాదని సహో॥ నెవిల్ చెప్పుచున్నాడు-సంపా॥] మనము 6:30 అచ్చటకు వెళ్ళుట మంచిది. వారికి మరియొక ఆడిటోరియం ఉన్నది. ఈ పట్టణములోనే అది యున్నది. మనము సరిగా ప్రవర్తించుచున్నామని వారికి నమ్మకము తోచిన యెడల మనము పెద్ద కూటమును ఏర్పాటు చేసికొనుటకు దానిని ఇచ్చెదరు. నేను విదేశముల నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ వేసవి కాలములో బహుశా కూటముండును.
5అక్కడ ఎంతమంది కూర్చొనుటకు స్థలముండును? [నాలుగు వేలమంది అని సహో॥ నెవిల్ చెప్పెను సంపా॥] నాలుగువేలమంది. మనకు చాలా చోటున్నది. ఏమీ క్రిక్కిరిసిపోవుట యుండదు. కావున 6:30 గంటలకు రండి అందరూ సరయిన సమయానికే రావచ్చును. కలిసి రండి. మీకు మంచిగానే స్థలము దొరకును. మీరు నోట్సు వ్రాసికోవడానికి వీలుగా చోటు ఏర్పాటు చేయబడినది.కావున ప్రభుని చిత్తమయితే అక్కడ కూటము జరుగును.
ఈ రాత్రి నేను ఆలోచించుదును. ఇది బుధవారపు రాత్రి ప్రార్థన కూటము. స్థలము దాదాపు నిండిపోయినది. కావున రేపు రాత్రికి కూటమును ఆరంభించవలెనని తలంచాను. ఇక్కడ జనులకు చోటు సరిపడని యెడల అక్కడకు వెళ్ళవచ్చునని నేను ఆ స్థలమును కూడా ఏర్పాటు చేయించుట జరిగినది. కాని అక్కడికి వెళ్ళుటయే చాలా మంచిది. కదా నెవిల్ సోదరుడా? రేపు రాత్రికి వెళ్ళవచ్చును గదా? అది మంచి అభిప్రాయమని ఎందరు తలంచుచున్నారు.? మీకు చాలా స్థలము దొరకును. దానిని అద్దెకు తీసికొనుట జరిగినది. ఈ సంఘములోని కొందరు సోదరులు దానికి డబ్బు చెల్లించిరి. ఒక రాత్రికి ఏబది డాలర్లు చెల్లించవలెను. ఒక రాత్రికి ఏబది డాలర్లు చెల్లించి అంత పెద్ద స్థలమును అన్నిచోట్లా సంపాదించగలిగినచో ఎంత బాగుండును. అది సరిక్రొత్త భవనము. చక్కని స్టేజి యున్నది.
MARK 12:41-44•
LUKE 21:1-4
6మనము కానుకలు తీసికొన వచ్చునని తలంచుచున్నాను. అంతా వారే చెల్లించనవసరము లేదు. వారు చెల్లించినదానిని తిరిగి వారికి ఇచ్చి వేయవచ్చును. మన ఖర్చులు చెల్లించివేసిన తరువాత ఆర్పణలు తీసికొనుట ఆపివేయవచ్చును.
మనతో ఎవరయినా క్రొత్తవారు ఆరాధనకు వచ్చుచున్నచో వారిని అడగరాదను విధానము అమలు చేయుచున్నాము. ప్రజలను డబ్బు గూర్చి ఇబ్బంది పెట్టరాదు. మనము అర్పణ ప్లేటును అందరి ముందుకు తీసికొని వచ్చెదము. అది ఒక మత కార్యము. నేను చాలాసార్లు అర్పణల ప్లేటును ముందుకు తీసికొని రాకుండా యుండవలెనని ప్రయత్నించాను. కాని అది నెరవేరలేదు. చూచారా? ఎందుకనగా ఇచ్చుట అనునది మన మతములో ఒక భాగము. అది మన విధినిర్వహణయై యున్నది. అది పైసా కావచ్చును. ఇంకెంత తక్కువైనా కావచ్చు.
ఒక రోజున యేసు ఒక విధవరాలును గుర్తుచేసికొనెను. ఆ చోట చాలామంది ధనికులు తమ ధనమును ఇచ్చుచుండిరి. ఈ విధవరాలు బహుశా రెండు కాసులు వేసి యుండును. ఆమెకు బహుశా ఆకలితోనుండు పిల్లలు ఉండియుందురు. ఆమె తనయొద్ద ఉన్న సమస్తమును ఇచ్చినది. మూడు పెన్నీలు కావచ్చును. ఎవరు ఎక్కువ చెల్లించిరని యేసు చెప్పెను?
7అక్కడ నేను నిలబడియుండినచో, సోదరీ, ఆలాగు చేయవద్దని చెప్పియుందును. చూడు! మాకు కావలసినంత డబ్బున్నది. కాని ఆయన ఎన్నడూ ఆమెను ఆపలేదు. చూచారా? ఆమెకు ఆ మార్గములోఇంకా గొప్పది దొరకునని ఆయనకు తెలియును. ఆమె మహిమ గృహమునకు వెళ్ళుచున్నది చూడండి. ఆమెను ఆయన ఎన్నడూ ఆపలేదు. ఆమె తన మూడు కాసులను వేసినది. ఎందుకనగా ఆమె దానిని చేయగోరినది. ఆమె పిల్లలకు అది చాలా ఉపయోగపడును. ఆమె విధవరాలు. ఆ మూడు ఆమె యొక్క ఆస్తి. వాటితోనే ఆమె జీవించవలెనని తలంచునపుడు వారు ఇచ్చుటకు నీవు అవకాశము ఇవ్వవలెను.
8కాని ఈ నిలబడియున్న జనులను చూచి నేనిట్లు తలంచుచున్నాను. ఏబది డాలర్లు ఎవరిచ్చెదరు? ఇరవై డాలర్లు ఎవరిచ్చెదరు? అది మీ జ్ఞానమునకు చెందిన విషయము. కూటమును జరిపించుటకు డబ్బు కావలెనని ప్రజలకు తెలియును. ఏర్పాటు చేసిన వారిని నేను ఎన్నడూ ఆలాగు చేయమని కోరను. మీరాలాగు చేయవలసిన సమయము వచ్చినపుడు నేను ఆలయమునకు తిరిగి వచ్చి వేయుదును. కావున ఆ విధముగా మనము చేయము. దీనిని సంపూర్ణ మత కార్య క్రమముగా చేయుటకు ఈ కానుకల పళ్ళెమును అందరి యొద్దకు అందించెదము.
కావున వారు ప్రతి రాత్రి కానుకల పళ్ళెమును త్రిప్పుచున్నారు. కానుకలను సమర్పించువారు సమర్పించ వచ్చును. అంతటితో ముగియును.
9ప్రభుని చిత్తమయితే ప్రతి రాత్రి సంఘము కొరకు ఒక ప్రత్యేక వర్తమానమును ప్రభువు నా హృదయములో ఉంచియున్నాడు గనుక దానిని అందించెదను. నేను చాలా దినములు ప్రార్థనలో యున్నాను. అందులోనికి నేను వెళ్ళను. ఎందుకనగా నిజంగా చాలా గొప్పదగు ఒక సంఘటన జరిగియున్నది. దానిని గూర్చి చెప్పవలెనని నేను ఆశించుచున్నాను. అన్నిటికన్న ప్రధానమయిన అంశము వివాహము మరియు పరిత్యాగము అని వారు తలంచుచున్నట్లు బిల్లీ చెప్పెను. అది గొప్ప అంశము. దానినెట్లు సమీపించవలెనో నాకు తెలియదు. దానిని గూర్చి ప్రార్థించుటకు నేను వెళ్ళాను. ప్రభువు దానిని ఇచ్చెను. నాకు తెలియదు గాని ప్రభువే దానిని ఇచ్చెను. ఇపుడు నాకు అది తెలియును. దేవుడు నాకు సరయిన జవాబును ఇచ్చెను. (చూచారా?) అది సత్యమని నాకు తెలియును.
ఇంకా సరిగ్గా అది నాకు తెలియదు. స్త్రీలు తమంత తాము కూటమునకు రాకుండా యుండవలెనని ఆదివారము నేను వారిని అడుగుదును. నాకు తెలియదు. వారి నిర్ణయము మీద ఆధారపడియుండును. పెండ్లి అయిన స్త్రీలు తమ భర్తలతో కూడా రావచ్చును. కొన్ని ప్రత్యేక విషయములు చెప్పవలెను. అది సత్యము. అది పూర్తిగా యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు అని చెప్పుచున్నాను. అపుడు సత్యము ఏమిటో మీకు తెలియును. ఆయన దానిని తెలియచేయునని నేను నమ్ముచున్నాను.
10ఒక రోజున నేను రెస్టారెంటులో భోజనము చేయుచున్నాను. జెర్రీ, ఇంకా తదితరులు కూర్చొని యున్నారు. ఆ రెండు వారములు అక్కడ కూటములు జరుగును. బ్రెన్‌హాం కూటమునకు వచ్చిన వారందరికీ భోజనములు ఏర్పాటు చేయు బాధ్యతను వారు తీసికొన్నట్లు చెప్పిరి. రాంచ్ గృహము యొద్ద, ఇంకా ఆయా స్థలముల యొద్ద వారు భోజన ఏర్పాట్లుచేసిరి. నిజంగా చాలా మంచిది.
మీ అందరినీ నేను ప్రశంసించుచున్నాను. వారు గొప్ప చెప్పుకొనుట లేదు. నిజంగానే మంచిపని చేయుచున్నారు.
రాంచ్ గృహము యొద్ద నున్న మేనేజరు నన్ను ఒక ఉదయమున కలిసికొనెను. ఆరిజోనా నుండి దాదాపు 2:30 కు నేను వచ్చాను. అతడిట్లు చెప్పెను, బ్రెన్‌హాం సోదరుడా, నీవు మరియొక కూటమును ఏర్పాటు చేయుచున్నావని విన్నాను. నేను మరికొంత సహాయము చేయుదును. నిజంగా నీ కూటములకు వచ్చు జనులు చాలా చక్కని వారు. మాట వినినపుడు నాకెంతో ఆనందము కలిగినది. (చూచారా?) మీరు నా పిల్లలని నేను తలంచుచున్నాను. మీరు నా గొర్రెలు. అదెట్లు? మీరు ప్రభువు యొక్క గొర్రెలు. మిమ్మును పోషించుటకు నన్ను ఆయన నియమించెను. ఈ పనిని ఆయనే నాకు అప్పగించెనని నమ్ముచున్నాను. మనము మార్గములో పయనించుచున్నాము.
11ఈ వివాహము మరియు పరిత్యాగము గురించి మాట్లాడవలెనని ఏడుముద్రల గూర్చి చెప్పిన నాటి నుండి నేను ప్రయత్నించుచున్నాను. ఏడు ముద్రలు విప్పబడినప్పటి నుండియూ ఈ మర్మములన్నియూ బయలుపరచబడవలసి యున్నవి. బైబిలులోని మర్మములన్నియూ బయలుపరచబడవలెను. ఇపుడు నేను ఆలోచించుచున్నాను. వాటిని మీద కనీసము ఉంచితే బాగుండును. ఏదయినా జరిగిన యెడలసంఘము ఆశ్చర్యపడును.ఆయన మనస్సులో ఏమున్నది? ఆయన ఏమి చెప్పును? ఆ అంశములన్నియూ చాలా కఠినముగా కనబడుచున్నవి. దేవుని సహాయము ద్వారా వాటిని మీకు అందించవలెనని ప్రయత్నించుచున్నాను. అపుడు ఏదయినా జరిగినాగాని, నేను ఆయనరాకకు ముందు వెళ్ళిపోయినా గాని, ఆ రికార్డు మీకు ఉండును.
12కొన్ని క్రొత్త పుస్తకములు విడుదల అయినవని నేను తలంచుచున్నాను. సోదరి వైల్ నాకు కనబడుచున్నది. డాక్టర్ ఇచ్చటున్నాడో లేదో నాకు తెలియదు. వైల్ సోదరీ, ఆయన ఇచ్చటే యున్నాడా? బహుశా కూటములో ఉండియుండును. నాకు కనబడలేదు. ఆ వెనుకన యున్నాడు. సహో॥ వైల్ ఒక పుస్తకమును వ్రాసెను. ఈ రోజే నాకు చెప్పిరి. అది నిజమేనా వైల్ సోదరుడా? రెండు పుస్తకములు ఇచ్చటున్నవి గదా? రెండు పుస్తకములు. నాకు తెలియదు. ప్రతి వారు ఒక ప్రతిని తీసికొని వెళ్ళ వచ్చును. ఆ విధంగా నేను అర్థము చేసికొన్నాను. ఆ విషయములో నేను తప్పు చెప్పి యుండవచ్చును.
ఏడు సంఘకాలముల పుస్తకము పూర్తి అయినది. అవునా వైల్ సోదరుడా? ఇపుడు అచ్చగుచున్నదా? మీకవి అవసరమని నాకు తెలియును. మీ హృదయములో యున్న అనేక ప్రశ్నలకు అందులో జవాబు దొరకును. ఏడుముద్రలు విప్పవలెనని మనము ప్రయత్నించాము. పుస్తకమును అందరూ చదువగలరు. దానిని అధ్యయనము చేసిన యెడల గ్రహించగలరు.
13దానిని వ్రాయుట జరిగినది. మొదట దానిని తీశాము. పలుకబడిన దానిని ఏమీ మార్చలేదు. మీరు ఎరుగుదురు. ప్రసంగము చేయుట ఒక వంతు పుస్తకము వ్రాయుట మరో వంతు. చూడండి. ఆ అంశము విషయములో నాకు అనుభవము కావలెను. మీకు అర్థమగునట్లు వ్రాయవలెను. సర్ప సంతానము గూర్చి చూచారా? ఆ పుస్తకమును చదువు వాడు సర్ప సంతానమనగా ఏమిటని ఆశ్చర్యపడును. చూచారా? వారెరుగరు. ప్రిన్స్‌టన్ లేదా అటువంటి మరొక చోటునకు అది వెళ్ళిన యెడల ఎట్లుండునో మీరెరుగుదురు. మనము బుద్ధిహీన జనులమని వారు తలంచుదురు. కాబట్టి సహో॥ వైల్ వంటి వారు నాకు సహాయము చేయవలెనని కోరాను. ఆలోచనను మార్చరు గాని దానిని వరుసలో పెట్టి వ్యాకరణమును సరి చేయుదురు.నా వ్యాకరణము వారికి ఒక మర్మముగా యుండునని మీరెరుగుదురు. ఇందులో సందేహము లేదు. సహో॥వైల్ నిజంగా ఆ విషయంలో చాలా పండితుడు.
14మన ప్రశస్త సోదరుడు అదనంగా ఆత్మాభిషేకమును పొందియుండునని నేను తలంచుచున్నాను. అటువంటి గ్రంథములు రెండింటిని తాను స్వయంగా వ్రాయదలచుకొన్నట్లు అతడు చెప్పెను. ఒక దానికి ఇరవయ్యవ శతాబ్దపు ప్రవక్త అని, మరో దానికి లవొదికయ సంఘము అని పేర్లు పెట్టెను. నేను ఆ విధంగా తలంచుచున్నాను.
ఈ దినము వేలాది మంది వచ్చినట్లుగా బిల్లీ ఈ రాత్రి నాకు చెప్పెను. టెక్సాస్నుండి కొందరు వచ్చిరి. వారిచ్చట యున్నారు. వారిని గూర్చి ప్రకటన చేయుదురు. నాకు నిశ్చయంగా తెలియదు గాని వారికి ఎవరో సహాయము చేసిరి. పుస్తకములను మీకు ఉచితంగానే ఇచ్చెదరు. దానిని మీరు అనుభవించెదరని తలంచుచున్నాను. ఆలాగయినచో సహో. వైల్‌తో వెనుక కరచాలనము చేయండి. మీరెంతగా ప్రశంసించుచున్నారో చెప్పండి. నేను ఇంకా చదువలేదు. నేను దానిని చదివినపుడు నా మనస్సు మారవచ్చును. నాకు వీలయిన యెడల ఈ వారము చదువుదును.
15బుధవారము రాత్రి గనుక మన కూటము అధికారికంగా రేపు రాత్రి నుండి ప్రారంభమగును. మీ మధ్యయుండవలెనని నేను తలంచుచున్నాను. ఇంటి యొద్ద కూర్చొని యుండలేను. మీరందరూ ఇక్కడున్నారని నాకు తెలియును. మీ బంధువులు కొందరు వచ్చియుందురు. వారిని కలిసికొనుటకు మీరు పరుగెత్తుదురు. నేనూ అంతే! పరుగిడి వచ్చి మిమ్మును జెఫర్‌సన్‌విల్ ఆలయములోనికి ఆహ్వానించవలెననుకొందును. నేను మూడు వారముల క్రితం ఇంటికి వచ్చాను.ఆరిజోనాలో కూటములను జరిగించాను. విశ్రాంతి కొరకు వచ్చాను. వేట పర్యటనకు వెళ్ళాను. నేను ఆరిజోనా సింహమును చూచాను. ఇరవై మైళ్ళు దానివెనుక అరణ్యంలో పరుగెత్తాను.
16నా బాల్యములోనే ఈ సంగతులు జరుగునని నాకు చెప్పబడినది. ఒక చిన్న స్థలమును ప్రభువు అక్కడ నాకు ఇచ్చెను. మాకు ఒక నివాసమున్నది. పిల్లలకు బడియున్నది. ఈ రాత్రి జిమ్మిపూల్ ఇచ్చటున్నాడనుకొనుచున్నాను. అతని తండ్రి పెద్ద జిమ్. ఇక్కడుండి యుండును. మేమందరం కలిసి చదువుకొన్నాము. చినిగిన పాత బట్టలు మరియు చెప్పులతో కూర్చొని యుండిన రోజులు గుర్తుకు వచ్చుచున్నవి. అవి పాత టెన్నిస్ బూట్లు. వ్రేళ్ళు బయటేయుండెడివి. ఒకరి యొద్ద నుండి కాగితమును, మరియొకరి వద్ద నుండి పెన్సిలును అప్పు తీసికొనేవాడిని.
నేను పద్యములు వ్రాయుచుండెడివాడిని. శ్రీమతి ఉడ్ ఇక్కడున్నది. నా పాతఫోర్డ్ గూర్చి వ్రాసిన పద్యమును వినిపించాను. అది మంచి పద్యము. ఆ పద్యమును శ్రీఫోర్డ్‌కు పంపించవలసి యుండవలసినది అన్నదామె.
అందులో చాలా నిజమున్నదని చెప్పాను. ముందు గరగర మనేది. గేరు వేస్తుంటే వింతధ్వని వచ్చేది. చైనా విప్పుడు కథలాగే ఆ స్టీరింగు గేరు ఉండేది. నేను నాలుగు టైర్లు ఉన్నాయో లేవో చూచి అప్పుడు బయలుదేరేవాడిని. ఎత్తు ఎక్కేటపుడు నేను గుండె భయంతో ఎక్కించుచుండేవాడిని. నేను బహుగా ప్రయాసపడుచుండే వాడిని. యాత్రికుని ప్రయాణములో అతడు బరువుతో ఆలాగే ఎక్కుచుండును.
PS 22:1,16,17
17నేను చిన్న పద్యము వ్రాశాను. నాకప్పుడు పన్నెండు సంవత్సరములు మాత్రమే. ఆ కొండను ఒక రోజున చూస్తూ నిలబడ్డాను. ఆ చిన్నగుహలో సింహము యుండునని ఊహించుకొన్నాను. గాజు కిటికీలో నుండి దానినిచూస్తూ పద్యం వ్రాశాను. నేను దానిని గుర్తించుకొన్నాను.
సమస్త ఆవేశములోను దేవుడుండునని మీరెరుగుదురా?పాటను దేవుడే వ్రాయవలెను. పాటలలో దేవుడుండునని మీరు నమ్ముచున్నారా? ఆలాగని యేసు చెప్పెను. ఆయన దావీదును ఎత్తి చూపెను. కీర్తనలలోదావీదు ఏమి వ్రాసెనో మీరెరుగుదురా?
సిలువ మరణమును చూడండి. 22వ కీర్తనలోదావీదు దానిని పాడెను. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి? నా ఎముకలన్నియు విరిగి యున్నవి. వారు నా చేతులను,పాదములను గాయపరచిరి. మీరెరుగుదురు. అది ఒక పాట. కీర్తన అనగా ఒక గీతము.
18ఈ పద్యము ఎట్లున్నదో చూడండి. చిన్న బాలునిగా నేను నిలువబడి యున్నాను. కాగితమును అప్పు తీసికొని యుంటిని. ఇట్లు వ్రాశాను :
నేను ఒంటరి జీవిని, ఓ
ఆ సుదూర నైరుతి నుంచి ఎంతో ఒంటరిని,
అక్కడ పర్వతశిఖరాల మీద
నీడలు దట్టంగా అలముకొన్నాయి.
చిక్కుముడిలాయున్న దారిలో
అందమగుదశ్యం కనిపి స్తోంది.
జంతువులుతిరిగే చోట
ఆభీకర ధ్వని వినిపిస్తోంది
సుదూర లోయలో సింహగర్జన ప్రతిధ్వనిస్తోంది.
ఆరిజోనాశ్రేణిలోని కాటలినా పర్వతాలలో
ఎక్కడో దూరంగా అవి దాగియున్నవి.
19నలుబది సంవత్సరాల తరువాత ఆ పర్వతాల్లో నేను కూర్చొనియుండి సింహమును ముఖాముఖిగా చూచాను. స్నేహితులారా, ఆ నదికావల ఒక దేశమున్నది. అక్కడ నేను ఉందును. చూచారా? దానిని గూర్చి చెప్పవలసినది చాలాయున్నది. ఈ సంగతులన్నియూ కేవలము కట్టుకథలు కావు. అవి వాస్తవములు. అవి యధార్థములు. ఈ జనులతో ఈ రాత్రి ఇక్కడుండుటకు నేను ఎంతగానో సంతోషించుచున్నాను. వారితో అక్కడ నేనుందునని ఆశించు చున్నాను. అక్కడ వ్యాధిలేదు. మరణములేదు. ఎడబాటు లేదు. అపుడు మనకు ప్రయాణము ఒక పనికాదు.
20వాక్యము చదువకుండా ఏ కూటమును ముగించజాలము. అది సంపూర్ణము కాదు. సహో. నెవిల్, నేను అక్కడికి నడిచి వెళ్ళాను. నీవు నన్ను మాట్లాడమన్నట్లుగా బిల్లీ చెప్పెను. అది నిజమేనా సహో॥ నెవిల్? నేను మితిమీరి ప్రవర్తించుచున్నానేమో. కాని నీవు చెప్పిన దానిని బట్టి హాయిగా ఊపిరి పీల్చుచున్నాను. పాటలను, సంగతులను గమనించండి. మీరు పాడునపుడు సహో॥ నెవిల్‌ను చూడండి. అరగంటసేపు పాడిన తరువాత ఈ లోతయిన వర్తమానములోనికి వెళ్ళుదము. ప్రభువు ఏమీచేయునో చూద్దాం. నేను నమ్ముచున్నాను.
21మనకు సత్యము ఉన్నదని నేను నమ్ముచున్నాను. దానితో నేను సంతృప్తిచెందాను. గోధుమలు పండియున్నవని నేను నమ్ముచున్నాను. పొట్టు ఊడిపోవుచున్నది. మీరెరుగుదురా? చూడండి. దానిని గూర్చి రేపు రాత్రికి కొద్దిగా నేను చెప్పెదను. గోధుమ గింజయొక్క పొట్టు ఎట్లు ఊడిపోవుచున్నదో చూడండి. సూర్యుని కాంతిలో యున్నపుడు గోధుమ గింజ పరిపక్వము చెందును. స్నేహితులారా, మనము అందుకొరకే ఇచ్చట యున్నాము. కుమారుని యొక్క సన్నిధానములో పడియుండుడి. మనము కొద్ది గుంపు జనులముగా ఇచ్చటున్నాము. క్రీస్తు కొరకు పరిపక్వము చెందవలెను. అపుడాయన బల్ల మీద రొట్టెగా యుందుము. ఆ విధముగానే నేను చేయవలెనని కోరుచున్నాను.
వాక్యమును మనము సమీపించు ముందుగా పద్యమును చూచాము. ఇపుడు ప్రార్థించుదము. ఆ తరువాత ఒక అంశమును తీసికొందును.
22ప్రియమైన యేసూ ఈ రాత్రి ఈ కొద్ది మాటకు నీవు సహాయము చేయుము. నీ కొరకు మేము కనిపెట్టుకొని యున్నాము. నీ కృప మరియు కరుణ మాతో యుండవలెనని ప్రభువా మేము ప్రార్థించుచున్నాము. మా హృదయములను మెత్తబరచుము. సమస్త పొట్టును ,ముండ్ల పొదలను, గచ్చ పొదలను తొలగించుము. దేవుని యొక్క దీవెనకరమగు సూర్యకాంతి వాక్యము మీద పడునట్లు చేయుము. ప్రభువా, మా మధ్య రక్షించబడని వ్యక్తి ఏ ఒక్కడును లేకుండునట్లుగా ఈ కూటమును ఆశీర్వదించుము. పిల్లలందరూ దేవుని రాజ్యములో యుండునట్లు కృప చూపుము. తండ్రీ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందనివారందరూ పొందునట్లు కృపచూపుము. ప్రభువా, ఈ కాలములో మేము తెలిసికొనవలసిన సంగతులన్నియూ తెలిసికొనగలుగునట్లు కృప చూపుము. ఆ సంగతులను అనుసరించి మేము నడచునట్లుగా సహాయము చేయుము. మమ్ములను సరిచేయుము. వాక్య క్రమశిక్షణలోనికి మమ్మును తీసికొనిరమ్ము. నీ శరీరములో సభ్యులనుగా మమ్ముచేయుము. యేసు ప్రభువు యొక్క రాకడ సమీపించుచున్న ఈ దినములలో ఎట్లు జీవించవలెనో మాకు తెలియచేయుము.
ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యము చదివించనైయున్నాను. నాకు విద్య సరిగా లేనందున సరిగా చెప్పలేను. నా మాటలు కొన్ని ఇతరులకు తప్పుగా వినిపించవచ్చును. కాని ప్రభువగు దేవా, నీవు మాత్రమే ఆ సందర్భమును తీసికొని రాగలవు. దానిని చేయగలవాడవు నీవు మాత్రమే. ఈ మానవమాత్రుడూ దానిని చేయలేడు. ప్రభువా, అది నీ చేతులలోనే యున్నది. కావున నీ వాక్యములో దాగియున్న సంగతులను ప్రతి రాత్రి మాకు ఇమ్ము. అందువలన మేము మంచి క్రైస్తవులముగా మారుదుము. మేము ఈ కాలానుగుణముగా జీవించగలము. క్రైస్తవ్యపు మాదిరులుగా జీవించగలము. ప్రభువైన యేసునామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
JON 1:1-3
23మీరందరూ మీ బైబిలులను తెరచి యోనా గ్రంథమును చూడండి. యోనా వెనుకకు జారిన వాడని సాధరణంగా మనం చెప్పుకొనుచుందుము. నేను ఎప్పుడూ యోనాను ఎత్తిపట్టుకొందును. యోనా వెనుకకు జారిపోయినట్లుగా నేను నమ్ముట లేదు. కొన్నిసార్లు మనము అతడు యోనావంటివాడని చెప్పుచుందుము. నేను ఇంతకు ముందుగానే యోనాను గూర్చి నా ఆలోచనను మీకు చెప్పాను. ఏమి జరిగినదో చెప్పాను.
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.
నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను.
గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి (దుర్గతి కలుగునని) ప్రకటింపుము.
అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడ తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను.
అది ఒక విచారకరమగు అంతము కదా? ఒక మనిషి యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నాడు. అదే నా అంశము.
JON 1:2
24మొదలు దీనిని గూర్చి ఆలోచించుదము. దీనికి ప్రధానమగు కారణమును నేను ఇది అని నమ్ముచున్నాను. అదేమనగా యోనా ఒక యూదుడు. అతనిని ఒక అన్యపట్టణమునకు వెళ్ళి దానికి విరోధముగా ప్రకటించమని చెప్పెను. అతనిని ఎవరూ చేర్చుకొనరని అతడనుకొనెను. ఎందుకనగా ఈయూదునితో మాకేమి పని అని అన్యజనులనుకొందురు. కాని చూడండి. మరొకటి జరిగినది.ఇక్కడ మనము చూడవలసినది ఒక గొప్ప సంగతి యున్నది. అదేమనగా దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాడు గాని అన్యులకు కూడా ఆయన దేవుడు. ఆయన జనులందరికిని దేవుడే. ఆయన యూదులను ఏర్పరచుకొనెను.
25యూదులు దేవుని చేత ఏర్పరచబడిన వారిగా పిలువబడిరి. ఒక ప్రత్యేక పనికొరకు వారు ఎన్నుకొనబడిరి. వారికి ధర్మశాస్త్రమిచ్చుటయే ఆయన పని. దానిని వారు గైకొనలేరు. ధర్మశాస్త్ర మును గైకొనజాలరని అందుమూలముగా జనులకు ఆయన చూపించెను. ఆయన నీతి మంతుడగు దేవుడు గనుక ధర్మశాస్త్రము నీతిని జరిగించవలెనని కోరును. మానవుని బయటకు తీసికొని వచ్చు కృప ఆ ధర్మశాస్త్రములో లేదు. ధర్మశాస్త్రము ద్వారా వెల చెల్లించబడలేదు. కాని వెల చెల్లించుటకు కృప కావలెను. అపుడిక ధర్మశాస్త్రము పనిచేయదు.
PROV 6:6
26బైబిలులోని చిన్న ప్రవక్తలలో ఒకనిగా యోనా పిలువబడెను. ఆ పట్టణమునకు వెళ్ళమని చెప్పబడెను. మనందరి యొక్క మాదిరిని అందులో మనము చూడగలము. మనందరము, ప్రతి ఒక్కరము ఏదో ఒకదానిలో నుండి ఎప్పుడూ పారిపోవుచూ యుందుము. ఆపద వచ్చినపుడు పారిపోవుదుము. బాధ్యతలను వదిలి పారిపోవుచుందుము. మనమందరమూ ఆలాగే యున్నాము. ఒక చోట నిలబడి దానిని ఎదుర్కొనుటకు బదులుగా పారిపోవుచుండుటయే ఎక్కువగా చేయుచుందుము. చూచారా? మనము పారిపోవు చున్నాము. కొన్నిసార్లు మనము పని నుండి పారిపోవుచుందుము. మనకు పనిచేయుట ఇష్టముండదు. కొందరయితే పని చేయకపోయినా జీవించగలమను కొందురు. కాని సొలోమోను చీమను గూర్చి చెప్పెను. మంచి జవాబును చూడగలము.
చిన్న చీమను మీరు ఎరుగుదురు. పని చేయకుండా కూర్చొనియున్న చీమకు చలి కాలములో తినుటకు ఆహారముండదు. కావున ప్రతి ఒక్కరును పనిచేయవలెను.
27మనము చేయుటకు చాలా పనులున్నవి. ఎన్నో బాధ్యతలను మనము ఎదుర్కొనవలసియున్నాము. ప్రతి వారికి వారెదుర్కొనవలసిన బాధ్యత ఒకటుండును.
నీ భార్యను ఎన్నుకొనవలసిన సమయము వచ్చును. నీవు పెండ్లి చేసికొనవలెను. నీవు నీ భర్తకు ఎన్నిక చేసికొనవలసి యుందువు. ఒక బాధ్యతను నీవు తీసికొనుచున్నావు. నీవు ఒక ఇల్లు నిర్మించవచ్చును. అది చాలా చక్కని గృహము. గుర్తుంచుకొనవలసిన సంగతి ఏమనగా నీవు పెండ్లి చేసికొనిన తరువాత పిల్లలను పెంచవలసియుందువు. ఆ అందముగా అలంకరించిన గోడలు మురికి చేతుల మచ్చలతోను, చిన్న మరకలతోను నిండియుండును. ఆ తరువాత నీ పిల్లలను చదివించవలసిన బాధ్యత నీకు యుండును. వారికి వస్త్రములు ఇచ్చి పోషించవలసిన బాధ్యత యుండును. అన్నియూ బాధ్యతలే. ఆ బాధ్యతలు మనలను ఎదుర్కొనినపుడు మనము వెనుకకు జారిపోవుచుందుము. ఇది చాలాతేలిక.
అన్ని విధములుగాను పెండ్లి అనునది ఒక బాధ్యతయే.
ఇది చెప్పుటకు కష్టముగా నుండును గాని ఇది సత్యము. చాలాసార్లు దైవసేవకులు దేవుని వాక్యము కొరకు నిలబడకుండా జారిపోవుదురు. నిజమగు వాక్యమును వారెదుర్కొనరు. ఆ బాధ్యతను చూచి వారు వెనుకకు పోవుదురు. దేవుని యొక్క వాక్య సత్యమును మానవుల ఎదుటికి ఉన్నది ఉన్నట్లుగా తీసికొనిరావలసి వచ్చినపుడు చివరకు వెనుకంజ వేయచుందుము. ఇంక ఆఖరి ఆధారమును వెదుకుకొందుము.
28ఈ మధ్య నేను నా చిన్న మేనల్లుడిని అక్కడికి తీసికొని వెళ్ళాను. అతడు కాతలిక్కు. కొద్ది సంవత్సరముల క్రితం ఇక్కడే అతనికి నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాను. అతడు ఒకామెతో స్నేహము చేసి కాతలిక్కుగా మారిపోయెను. అతని తల్లి చనిపోవుచుండగా ఆమె చేయిని నేను పట్టుకొని యున్నాను. ఆమె నాతో చెప్పిన చివరి మాటలివి. మెల్విన్ గూర్చి శ్రద్ధ వహించు. అతడు అప్పుడే కలలు కనుచున్నాడు. చివరి వారములోని ప్రతి రోజు అతడు కలలు కనుచుండును. బిల్ అంకుల్, నేను నీతో కూడా ఆలయమునకు వచ్చుదును. నీవు నిలబడి బోధించుచుండగా నేను వచ్చి ఒప్పుకొందును. నేను మరల మేల్కొందును. నేను చేసినది తప్పు అనుచుండెడి వాడు.
"మెల్విన్, ఆ విషయములో నీవేమీ ఇంక చెప్పవద్దు. నీ స్థలము అదిగో అక్కడున్నది. వెళ్ళి కూర్చో అన్నాను." అది నిజము. చూచారా?
PROV 13:24
29కాని బాధ్యతను ఎదుర్కొనుట కొన్నిసార్లు చాలా కష్టముగా యుండును. మనము దాగుకొనుచుందుము. కొన్నిసార్లు నీవు తండ్రివిగా నీ పిల్లవానిని దండించవలసిన బాధ్యతను కలిగియుందువు. ఆ చిన్న పిల్లలను కొట్టవలెనని నీవు అనుకొనవు. పిల్లలను పెంచునపుడు నీవు తల్లిగా, తండ్రిగాకొన్ని బాధ్యతలను ఎదుర్కొనవలసి యుందువు. ఎందుకనగా బెత్తము వాడని కుమారుడు చెడిపోవునని బైబిలు చెప్పుచున్నది. ప్రపంచములో యున్న ప్రతి మానసిక శాస్త్రవేత్త అది మంచిదని ఇంకా ఒప్పుకొనుచున్నాడు. అది ఇంకనూ దేవుని సత్యముగానే నిలచియున్నది. దానిని ఇంకా ఎక్కువగా ఆచరణలో పెట్టిన యెడల ఈ బాలల నేరములు, క్రమ శిక్షణారాహిత్యము మనకుండదు. నేడు పిల్లలు చెడిపోయి యున్నారు. గృహములను ఏలవలసిన ఆ పాత బంగారు సూత్రమును ఎప్పుడో విచ్ఛిన్నము చేయుట జరిగినది. పిల్లలు ఇష్టానుసారముగా జీవించుటకు వారు అనుమతించుచున్నారు.
JOHN 5:39
30దైవసేవకుల గురించి కూడా నేను చెప్పాను. వారు సత్యమును బోధించవలసి వచ్చినపుడు పారిపోవుచుందురు. చూడండి. వారు దానిని ఎదుర్కొనుటకు ఇష్టపడరు.
చాలాసార్లు ప్రజలు నాతో ఈలాగు చెప్పుచుందురు, బ్రెన్‌హాం సోదరుడా, అది నిజమేనని మాకు తెలియును. కాని నేను ఆ విధముగా చేసిన యెడల వారు నన్ను బయటకు గెంటి వేయుదురు. ఏమిటది? నిన్ను వారు బయటకు త్రోసివేయుదురని భయపడి పారిపోవుచున్నావు. నీవు దానిని ఎదుర్కొనుటమంచిది. ఆ చోట నుండి పారిపోవుటకు బదులుగా ఆ బాధ్యతను ఎదుర్కొని బలముగా పని చేయుము. నిశ్చయంగా నీవు దానిని వినుము. ఆ లేఖనములను పరిశోధించుము. యేసు ఈలాగుచెప్పెను, లేఖనములను పరిశోధించుడి. అందులో నిత్యజీవమున్నదని మీరు తలంచుచున్నారు గదా? అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చియున్నారు. దేవుడు చేసిన వాగ్ధానమును చూచి యున్నారు. దేవుడు ఆ వాగ్ధానమును నెరవేర్చబద్ధుడై యున్నాడు. ఆయన వాగ్ధానమును నెరవేర్చినపుడు ప్రజలు ఆఘడియకు చెందిన వర్తమానముతో సహకరించి తమ బాధ్యతను నెరవేర్చుటకు వెనుకాడుదురు. ప్రతిచోట దీనిని మనము చూచుచుందుము.
31లూథరనుల మాట ఏమిటి? లూథరు యొక్క సత్యమగు నీతికరణమును ఎదుర్కొనుటకు ఎందరు జనులు వెనుకంజవేయలేదు? దానికి నీవు వెల చెల్లించవలసియుందువు. నీ స్వంత జీవితమే సమర్పించవలసి యుందువు. యేసుక్రీస్తును ఒప్పుకొని బయటకు వచ్చి లూథరనుగా యుండుటకు భయపడుచుందువు.
మెతడిస్టుల వైపుచూడండి. మిమ్ములను ఇంతకు ముందు పరిశుద్ధులని పిలచెడివారు. దానిని మీరెరుగుదురనుకొంటాను. వారు ఆత్మ ఆధ్వర్యములో ఎంతో సంతోషించిరి. వారిని చూచి ఎందరో హేళన చేసేవారు. వారు పెంతెకోస్తువారు కారు. కొన్ని సంవత్సరాల క్రితం మెతడిస్టులు ఆలాగుండెడివారు. వారు ఊగిపోయెడివారు. ఆత్మ ప్రేరితులాయెడి వారు. వారు దేవుని శక్తితో నింపబడెడి వారు. వారు ముఖముల మీద నీరు పోసి గాలి విసిరెడి వారు. వారు పడిపోయిరని తలంచెడి వారు. మిమ్మును పరిశుద్ధుల గుంపు అని పిలచెడివారు. మీ తల్లిదండ్రులు ఆలాగు ఉండిరి. సత్యమును అంగీకరించారు. వాస్తవమును ఎదుర్కొన్నారు.
32వరముల యొక్క పునరుద్ధరణను పొందిన ఈ పెంతెకోస్తు వారిమాట ఏమిటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చినప్పుడు భాషలతో మాట్లాడిరి. సంఘములోనికి పరిశుద్ధాత్మ యొక్క వరములు వచ్చి యున్నవి. మీరు ఆలాగు చేసినందునే మెతడిస్టులు మిమ్మును బయటకు తన్నిరి. మీరు దానిని గూర్చి ఏదయినా చేయవలసిన పరిస్థితి వచ్చినది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుట నిజమని మీరు తెలిసికొనినపుడు ఏమిచేశారు? దాని విషయములో మీరుకొన్ని పరిస్థితులను ఎదుర్కొనవలసివచ్చినది. దానిని సత్యముగా మీరు గ్రహించారు. మీకు ఒక బాధ్యత యున్నది. అందరూ ఆ విధంగానే యున్నారు. మీరు ఈసంగతులను ఎదుర్కొనవలసియున్నారు.
33(29:36)
దేవుడు ఈ దినములలో ఈ వాగ్ధానములను నెరవేర్చుటను మీరు చూచుచున్నారు. దేవుని వాక్యము ఇపుడు బయలుపడుచున్నది. నీ మీద ఇపుడు ఒక బాధ్యత యున్నది. దానిని ఎదుర్కొనవలెను లేదా దాని నుండి పారిపోవలెను. నీవు తటస్థముగాయుండలేవు. దానిని గూర్చి నీవు ఏదో చేయలెను. ఏదో ఒక కదలికను నీవు కలిగి యుండవలసియున్నావు. ఆలయ ద్వారములో నుండి వచ్చిన నీవు మరల వచ్చిన స్థితిలోనే వెళ్ళుట జరుగదు. నీవు దేవునితో మరింత దగ్గరగా అయినా రావలెను లేదా మరింత దూరంగా అయినా పోవలెను. ఏదో ఒకటి చేయవలసి యుందువు.
జనులు వీటి నుండి దూరముగా పోవుట ఎంతో సులభము! రేపు రాత్రికి అధికారికంగా మనము ఆరాధనలు ప్రారంభమగును గనుక ఈ సంగతులను గూర్చి ఆలోచించవలెనని కోరుచున్నాను. ఏదయినా మీరు ఎదుర్కొనునపుడు దానిని గూర్చి ఆలోచించవలసి యుందురు. ప్రశ్న ఉన్న యెడల దానికి జవాబు కూడా యుండునని మరువ వద్దు.
34ఉదాహరణకు నేను పశ్చిమంగా పయనించుచున్నాననుకోండి. మీరు నాకు ఆ దిశను చూపించారు. నేను నాగురిని తప్పిపోవచ్చును. నేను కొద్దిగా ఉత్తరము వైపు వెళ్ళవచ్చును.మరొకరు వచ్చి ఇంకో దిశను చూపించగా నేను ఆ వైపుకు వెళ్ళుదును. మరల నేను నా గురిని తప్పిపోదును. నేను దక్షిణానికి వెళ్ళాను. పడమర ఎటు ఉన్నదను ప్రశ్న నాకున్నది. కావున దానికి ప్రత్యక్ష జవాబు కూడా యున్నది. బైబిలు సత్యములను గూర్చిన ప్రశ్నలు మనలను ఎదుర్కొనునపుడు ఎక్కడో జవాబు ఉండి తీరును. సరయిన జవాబు అచ్చట ఉండవలసి యున్నది.
ఒక విషయము మన ఎదుటికి తీసికొని రాబడినపుడు పారిపోవుటకు బదులుగా ఇట్లు ప్రశ్నించవలెను, ఓ! అటువంటి దానిని నేను నమ్మను. దానియందు నేను విశ్వాసముంచలేను. అపుడు నీవు బైబిలు తీసికొని కూర్చొని దానిని ఎదుర్కొనుము. దానిని చదువుము. ఇపుడు నీవు ఈ కూటములో యున్నావు. అటువైపు చూడుము. నీవు పరీక్షించుము. వాక్యముతో సరి చూడుము. వాక్యము వెంబడి వాక్యమును చూడుము. ఆలాగు మాత్రమే నీవు సత్యమును ఆచరించగలవు. ఆదికాండము నుండి ప్రకటన వరకు గల వాక్యము తప్పక సత్యమును చెప్పును.
బైబిలు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత క్రీస్తే. క్రీస్తులో సర్వసంపూర్ణత నిండియున్నది. బైబిలు లోని ప్రవచనములన్నీ క్రీస్తుయేసులో నిరాక్షేపముగా నెరవేరియున్నవి. ఆయన శరీరమందు ప్రత్యక్షమైన దేవుడు.
35ఈ సంగతులను మనము చూచుచున్నాము. కూటమునకు వచ్చినపుడు దేవుని శక్తిని చూచుచున్నాము. అది కదులుచూ ఎన్నో అస్వాభావిక కార్యములు చేయుటను చూచుచున్నాము. దైవ సంబంధమగు క్రియలు జరుగుటను చూచుచున్నాము. అది ఈ ఘడియకు వాగ్థానము చేయబడినదని తెలిసికొనుచున్నాము. ఈ సంగతులను మనము చూచునపుడు ఒక బాధ్యతను మనము ఎదుర్కొనుచున్నాము. అదేమనగా దానిని అంగీకరించవలెను లేదా తిరస్కరించవలెను.
చాలామంది రాజీపడుదురు.అది సరియేనని పలికెదరు. కాని దాని బాధ్యతను మాత్రము స్వీకరించరు.
36నేను ఒక యువకునిగా యుండి భార్య కొరకు వెదకుచున్నాననుకోండి. పెండ్లి చేసికొనవలెను. నేను కోరినవి కలిగిన ఒక స్త్రీని కనుగొన్నాను. ఆమె నైతికంగా రాణి వంటిది. చాలా చక్కని వ్యక్తిత్వము కలిగి యున్నది. నిజమైన క్రైస్తవురాలు. నేననుకొనినవన్నియూ ఆమెలో యుండినవి. కాని ఆమెను నేను స్వీకరించి నా భార్యగా ఆమె బాధ్యతను వహించువరకు ఆమె నాది కాదు. ఆమెను గూర్చి ఎంతో నేను ఆలోచించవచ్చును. ఆమె చాలా చక్కనిదే కావచ్చును. కాని నాది కాదు.
వర్తమానము కూడా ఆ విధంగానే యున్నది. అది సరిగానే యున్నది, మంచిదే అని నీవు చెప్పవచ్చును. దానితో నీవు సమ్మతించవచ్చును. దానిని సత్యమని నీవు నమ్మవచ్చును. కాని దానిని నీవు అంగీకరించవలసి యున్నావు. అది నీలోభాగము కావలెను. నీవు దానిలో భాగమై యుండవలెను. అపుడది నీదగును.
నీవు ఎన్నుకొనిన ఒక స్త్రీని నీవు పెండ్లి చేసికొనునపుడు ఆమె నీదగును. క్రీస్తుతో నీవు ఆ విధంగానే యున్నావు. ఆయన ప్రత్యక్షతను, వాస్తవితను నీవు చూచుచున్నావు. ఆయనలో నీవు భాగముగా యుండవలెను. నీలో ఆయన భాగముగా యుండవలెను. మీరిరువురు కలిసి వర్తమానములో భాగమై యుందురు.
JON 1:3,5•
JON 3:4
37ఎన్నో శాఖా సంబంధమగు ఓడలు, నేడు ఈ యోనాలను ఎక్కించుకొని తర్షీషునకు వెళ్ళుచున్నవి. తొమ్మిది వందలకు పైగా యున్నవి. సుళువయిన త్రోవకు కొనిపోవు ఓడ. దానిని ఎదుర్కొనవెళ్ళవద్దు. అన్యుల యొద్దకు వెళ్ళరాదని యోనా తలంచెను. ఆ క్రూరమగు వర్తమానము వారికి అందించగోరలేదు. మీరు మారుమనస్సు పొందని యెడల నలువది దినములలో నశించెదరని చెప్పగోరలేదు. దానిని అతడు అందించుటకు ఇష్టపడలేదు. ఆ అన్యులతో ఈ మాటలు చెప్పిన యెడల వారు నన్నేమి చేయుదురో గదా అనుకొనెను. వారిని ఎదుర్కొనుట కష్టము. కాని దానిని అతడు ఎదుర్కొనవలసి యుండెను. చూచారా? అతడు తేలికయిన మార్గమును ఎన్నుకొనెను. ఒక ఓడను ఎక్కెను. తర్షీషునకు వెళ్ళెను. ఆ ఓడ పైభాగమునకు ఎక్కిపోయి నిద్రించుచుండెను. తేలిక మార్గమును సుళువు దారిని ఎన్నుకొనెను.
38అది జనులందరికీ తెలిసిన మార్గము. అందరూ నీ వీపు తట్టి నీవు మంచివాడవని పొగడుచున్నచో నీకు చాలా తేలికగా యుండును. లోకము నీ వైపు చూచును. పేరు వచ్చు మార్గమున వెళ్ళుట చాలా సుళువు. కాని దానికి వేరుగా నీవు జీవించుట, నీవు సత్యమని నమ్మిన దాని కొరకు నిలబడుట చాలా కష్టము. అక్కడే ఎదురు దెబ్బ తగులును.
(34:28) ఆ పాతపాటను తరచుగా మనము పాడుచుందుము; సముద్రము నిమ్మళముగా యున్నపుడు పయనించుట ఎంతోతేలిక!
యెహోవా యొక్క గొప్ప హస్తములోని బలమును నమ్ముట అపుడు తేలిక! కాని అలలురేగినచో ఎట్లుండును? గాలి వీచును.
అలలు పైకి ఎగురును.
అపుడు నీవు ఏమిచేయుదువు?
ఒకసారి ఎవరో నాకు ఒక సంగతి చెప్పిరి. గుర్రపు బండి కాలములో జరిగినది. ఒకామె ఆలయము నుండి వచ్చుచుండగా గుర్రము బండితో కూడ పారిపోయినది.అపుడు నీవేమి చేయుదువు?
ప్రభువు దానిని మళ్ళించు వరకు నమ్ముటయే శరణ్యము. అదే ప్రభువును నమ్మవలసిన సమయము అన్నీ విఫలమయినవి. ఇక నీవు దేవుని యందే నమ్మిక యుంచవలెను. అవును.
39మనము వెళ్ళుటకు చాలా తేలిక మార్గములు కనిపించును. తర్షీషుకు ఓడలు వెళ్ళుచున్నవి. అది చాలా తేలిక. బాధ్యతలు లేవు. అన్నీ నీకు అనుకూలముగా యుండును. అందరూ నిన్ను మెచ్చుకొందురు. ఎవరూ నీతోవాదించరు. నీవు ఎవరితోనూ విభేదించవు. నీవు ఏదయితే నిజమని నమ్ముచున్నావో దానికొరకు నిలబడవలెను. అపుడు నీగూర్చి మంచిగా తలంచు జనులు చెప్పుకొందురు.
40ఏమీ లెక్కచేయవద్దు. ఒక స్త్రీ అందహీనముగా యుండవచ్చును. ఆకర్షణ లేనిదిగా యుండవచ్చును. కాని ఆ స్త్రీ స్త్రీత్వము యొక్క నియమముల ననుసరించి నిలబడినపుడు దానిని చూచి ఆమెను వివాహము చేసికొనుటకు ఒక పురుషుడు ఇష్టపడును. నీవు సత్యమని నమ్ముచున్న దాని కొరకు ఏమైనా గాని నిలబడుము.
ఈనాడు చాలామంది క్రైస్తవులు ఆషామాషీగా కాలము గడుపుచున్నారు. చాలా నులివెచ్చనిగా యున్నారు. సంఘములో చేరితే చాలుననుకొనుచున్నారు. పుస్తకములో పేరు వ్రాసికొనినచో చాలనుకొనుచున్నారు. గంతులు వేసినచో చాలుననుకొనుచున్నారు. కేకలు వేసినచో చాలుననుకొనుచున్నారు. దానినే క్రైస్తవ్యమని వారు పిలచుచున్నారు. క్రైస్తవ్యమనగా ప్రతి దినము దేవుని కొరకు జీవించుటయై యున్నది. ఈ ప్రస్తుత లోకములో జీవించవలెను. హృదయములో దేవుని యొక్క ప్రేమ, మంట నిరంతరము ఉండవలెను. క్రీస్తుకొరకు ఆత్మలను సంపాదించును.
41బాధ్యత! లోకము పోవుదారిని పోవుట చాలా సులభము. ప్రవాహములో కొట్టుకొని పోవుట చాలా తేలిక. నీ దోనె ఎక్కి అక్కడ కూర్చొంటే చాలును. కాని ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళవలెనన్నచో నీ తెడ్లు బలముగా వేయవలెను. శక్తిని ఉపయోగించవలెను. చాలా కష్టపడ వలెను. కాని ప్రవాహముతో పాటు వెళ్ళుట చాలా తేలికగాయుండును. చెట్లు ఏలాగు కొట్టుకొని పోవునో చూడండి. నీవెక్కడికి వెళ్ళుచున్నావో చూడుము. అన్నియూ సక్రమముగా జరుగుచు న్నపుడు నీవు తేలికగానే పయనించెదవు. కాని గుర్తుంచుకొనుము. జలపాతము ఎదురగును. సుడిగుండములో చిక్కుకొందువు. లోకముతో పయనించుట చాలా తేలికగా యుండును గాని నీవు జలపాతములో పడిపోదువని మరచిపోవద్దు. నీవు నీ బాధ్యతను అంగీకరించుము.
దానిని నీవు నమ్ముచున్నావు. అది సత్యమని నీవు తలంచుచున్నావు.
42ఈ వర్తమానమును ఈ దినము అందించవలసిన బాధ్యత దేవుడు ఇచ్చెను. నేను వృద్ధుడనవుచున్నాను. నా దినములు తక్కువగుచున్నవని నాకు తెలియును. ఎన్నడూ లేని బాధ్యత నాపై యున్నదని తలంచుచున్నాను. ముందుకు సాగిపోవలెను. దానిని తప్పక చేయవలెను. ఎక్కడికి వెళ్ళినా గాని మనము ఈ వర్తమానమును తీసికొని వెళ్ళవలెను. యేసుక్రీస్తు వచ్చుచున్నాడను వర్తమానమును అందించవలెను. ఆయనే దేవుడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రభువు యొక్క రాకడతప్ప ఈలోకమునకు మరొక ఆశ లేదు.
43ప్రభువు దూత నాతో మాట్లాడినపుడు నాతో కూడా యుండిన స్నేహితులను నేను గుర్తు చేసికొనుచున్నాను. వారిచ్చట కూర్చొనియున్నారు. అది జరిగిన స్థలమును వారు ఎరుగు దురు. మేము కొండ మీదికి ఎక్కుచుండగా ఆ దినమున ప్రభువు సహో. వుడ్‌కు ఏమి చెప్పెనో గుర్తుచేసికొనండి. అతని భార్య జబ్బుగా నున్నందున అతడు ఏడ్చుచుండెను. ప్రభువు ఇట్లు చెప్పెను, ఆ రాయిని తీసికొని దానిని గాలిలోనికి విసరుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. ఆలాగే నేను చేశాను. దానికి సహో. ఉడ్ సాక్షిగా యున్నాడు.
వుడ్ సోదరుడా,త్వరలోనే నీవు ఒక సంగతి జరుగుటను చూచెదవు అని పలికాను. ఆ మరుసటి రోజున మేమందరము అక్కడ నిలబడియున్నాము. ఈ రాత్రి అందులో కొందరు ఇక్కడ యున్నారు.
44అక్కడ ఒక యువ బోధకుడుండెను. ఆ ముందు రాత్రి నేనతని కలిసికొన్నాను. అతడు మా శిబిరములో యుండెను. అతడు మాతో యుండుటకు వచ్చెను. బ్రెన్‌హాం సోదరుడా, ఈ విధముగా నీవు దర్శనములను చూచుట ఎప్పుడయినా జరుగునా? అని అతడు నన్ను ప్రశ్నించెను.
అవును. అందుకొరకే నేను ఈలాగు బయటకు వచ్చుచుందును. కొద్దిగా విశ్రాంతి పొందుచుందును. ఆయన నాకు కొన్ని విషయములు చూపించును. "ఆ కొండకు ఆవల యున్నపుడే నాకు ఏడు దూతలు ప్రత్యక్షమయినవి" అని అతనితో చెప్పాను.
"నేను గ్రహించగలను." కాలిఫోర్నియోలో నీ కూటములు జరిపించుటకు సహాయ పడినవారిలో నేను ఒకనిని అని అతడు చెప్పెను.
"ఆ విషయం తెలిసినందుకు నిశ్చయంగా సంతోషించుచున్నాను" అని చెప్పాను.
అక్కడ నిలబడి యుండగా నేనుచుట్టూ చూచాను. అతని కండ్లలోనికి ఒక లావుగా యున్న వైద్యుడు తొంగి చూచుట నాకు కనబడినది. ఆ కంటిలో ఏదో వ్యాధి సోకినందున ఆ కన్నును పోగొట్టుకొందువని అతడు చెప్పుట నాకు వినబడినది. అతడు రెండు సంవత్సర ములు చికిత్స చేసెను. అయినా గాని కన్ను పోవునని చెప్పెను. నీ కన్ను పోవునని వైద్యుడు నీకు చెప్పెను గదా అని నేనతనిని ప్రశ్నించాను.
"అది నిజమే" అన్నాడు.
అతడు చుట్టూ చూచాడు. అతని తల్లిని చూచాను. ఆమె తన మేజోడు తీసి ఆ వ్రేళ్ళ మధ్య నున్న కురుపును చూపించుచుండెను. ఆమె పాదమును చూచాను. దీని నిమిత్తము "బ్రెన్‌హాం సోదరుని ప్రార్థించమని" ఆమె అతనితో చెప్పుచుండెను. ఈ విషయమంతా నేను అతనితో చెప్పాను. ఇది జరిగినది కదా అనడిగాను.
"బ్రెన్‌హాం సోదరుడా, అది సత్యము" అని చెప్పెను.
నేను వెనక్కి తిరిగి చూచాను. అతడు నావైపు చూచుట కనబడినది. అతని కండ్లు ప్రకాశించుచున్నవి. ఈ ఆకురాలు కాలములో అతనిని కలిసికొన్నాను. అతని కండ్లు అక్కడున్న వారందరి కండ్ల కన్న బాగా యున్నవి. ప్రభువు అతనిని స్వస్థపరచెను. అతడు బాగయెను.
45అక్కడ నేను నిలబడియుండగా ఆ జరుగబోవు దానిని ప్రభువు నాకు చూపించెను. పశ్చిమ తీరమును తీర్పు తాకనై యున్నదని చెప్పెను. ఆ కుంపటి యున్న స్థలమునకు వెళ్ళమని ఆయన చెప్పెను.
నా చేతిలో ఒక పార యున్నది. దానితోనే అక్కడికి నడిచి వెళ్ళాను. సహో. రాయ్ రాబర్సన్‌ను మీరందరూ ఎరుగుదురు. నాకు తెలిసినంతవరకూ ఈ రాత్రి ఇక్కడ అతడు లేడు. అతడు ఆరిజోనాలో యున్నాడు. ఇక్కడున్న ట్రస్టీలకు అతడు చైర్మన్‌గా యున్నాడు. అతడు చాలా యోధుడని నాకు తెలియును. ఒక సంగతి జరుగునైయున్నది. అది చాలా ప్రశాంతముగాను చక్కగాను ఉన్న ఉదయము. పది గంటలయినది. మేము పన్నెండు మందిమి వరకు ఆ గుడారములోయున్నాము. కొన్ని పండ్లు బాగుచేయుచున్నాము. నేను వెళ్ళి రాయ్‌ను త్వరగా దాగుకొనుమని చెప్పాను. ఏదో జరుగబోవుచున్నదని చెప్పాను. ఇంకేమీ నేనతనికి చెప్పలేకపోయాను. అక్కడికి నేను వెళ్ళిన సమయములోనే ఆకాశము నుండి దేవుని యొక్క సుడిగాలి రాసాగినది .ఆ పర్వతము కదిలిపోయినట్లయినది. ఆ పర్వతము లోపట దాదాపు అయిదడుగుల గొయ్యి పడినది. చెట్లన్నియు తెగిపోయి పడినవి. రాళ్ళు గాలిలోనికి లేచి యున్నవి. పెద్ద బాప్తిస్మము వలె యున్నది. పర్వతములోనుండి రాళ్ళు చెల్లాచెదురై పడిపోయినవి. మూడుసార్లు అది ఆలాగున చేసి ఆ తరువాత గాలిలో కలిసిపోయినది.సహో॥ బాంక్స్ నా యొద్దకు వచ్చి నిన్న నీవు చెప్పినది ఇదేనా? అనడిగెను.
అవును. "ఖచ్చితంగా ఇదే!" అన్నాను. చూచారా? ఆ తరువాత రెండు రోజులకు దాదాపు అలస్కా మునిగిపోయినది. ఆ పశ్చిమ తీరమంతటా మెరుపులు, ఉరుములు మొదలగునవి వచ్చినవి. ఏదో ఒక దినమున అది సముద్రములోనికి జారిపోవును. అది నిజము. ఏమిటది? మనము ప్రభుని రాకడ ఘడియలో జీవించుచున్నాము
MATT 24:36•
MARK 13:22
46మనము వాదములను చూచాము. ఎన్నో సంగతులు చూచాము. మరెన్నో విషయములు లేచుట చూచాము. దీనికి ఒక జవాబు ఉండవలసియున్నదని మనకు తెలియును. ఆ ప్రాంత ములోని జనులు గుహలలోనికి, ఇతర చోట్లకు పారిపోవుచున్నారు. ప్రభువు మార్చి 16న వచ్చుచున్నాడని వ్రాసిరి. అది తప్పు అని మీకు తెలియును. ఆ ఘడియగాని, ఆ నిమిషముగాని ఎవరికిని తెలియదని యేసు చెప్పెను.
ఇవన్నియూ జరుగుట మనము చూచినపుడు సరియగు జవాబు ఎక్కడో యున్నదని గ్రహించవలెను. సత్యము ఉన్నది. తూర్పు యున్నది. పడమర యున్నది. ఆ విధంగానే వాటిమధ్యగా నున్న మూలలును యున్నవి. కాని ఒక సమస్య ఉన్నట్లయితే దానికి నిజమగు జవాబు కూడా ఉండవలసియున్నది.
GEN 2:17
47బాధ్యతను తప్పించుకొందుమా? దేవుని కుమారుడు రానై యున్న ఘడియలో మనము జీవించుచున్నామని జనులకు చెప్పవలెను. మనము సంగతులను గమనించుచూ ఎల్లపుడూ ముందుకు పోవుచుండవలెను. మానవునికి సరయిన జవాబును ఇచ్చుటకు సిద్ధముగా యుండవలెను.
ఎల్లపుడూ అది ఆ విధముగానే యుండును. మానవులు బాధ్యతలను విస్మరించి దేవుని నుండి పారిపోవుట ఏదెను తోటలో ఆదాము యొద్ద నుండియూ జరుగుట చూచుచున్నాము. ఆదాము ఏదెను తోటలో యుండెను. అతడు ఎన్నిక చేసికొను ఒక బాధ్యతను కలిగియుండెను. అతడు దేవునితో యుండవలెనా? తన భార్యతో యుండవలెనా? అతనికి ఒక బాధ్యత యున్నది. ఒక ఎన్నికను చేసికోవలసియున్నాడు. తన భార్య చెప్పిన మాటనయినా తీసికొనవలెను లేదా దేవుడు చెప్పిన మాటనయినా స్వీకరించవలెను. అతడు తన భార్య మాటకు చెవి ఇచ్చెను. ఆ విధముగా అతడు చేసినపుడు అతడు తన పూర్వస్థితిని పోగొట్టుకొనెను. అందువలన మొత్తం మరణము వచ్చెను. తన భార్య కనుగొనిన క్రొత్త వెలుగును అతడు వెంబడించెను. దానిని గూర్చి ఆలోచించండి. దేవుడు వారు అనుసరించుటకు ఇచ్చిన మాటలు పదిలోపునే యున్నవి. ఆ చెట్టు ఫలము నీవు తినరాదు. వారు దానినే అనుసరించవలెను. ఆ మాటనే వారు పాటించలేకపోయిరి. తన భార్య మాటను ఆదాము విని దేవుని మాటను త్రోసివేసెను. అతని కన్నులు తెరువబడెను. అతడు తన బాధ్యతను కలిగి యుండెను. కాని ఆ బాధ్యతను తప్పించుకొనినందున మొత్తం మానవజాతి మరణములోనికి పోయినది.
JOHN 1:14•
1TIM 3:16
48ఆ తరువాత క్రీస్తు అను మరో ఆదాము వచ్చెను. ఈయన అతని వంటి వాడు కాడు. ఆయన దేవుడు కాడని కొందరు చెప్పిరి. ఆయన యొక్క ప్రత్యేకతయే ఆయన దేవుడని నిరూపించెను. ఆయన వలె జీవించిన వారెవరునూ లేరు. ఆయనది వేరే ప్రపంచము. ప్రకృతి సంబంధియగు వానిగా ఆయన లేడు. హల్లెలూయా! ఆయన సృష్టికర్తగా యుండి శరీరధారి అయ్యెను. ఆయన స్థానములో ఎవరు నిలబడగలరు? ఆయన వలె ఎవరుమాట్లాడగలరు? ఆయన చేసిన కార్యములు ఎవరు చేయగలరు? ఆయన చెప్పిన సంగతులు ఎవరు చెప్పగలరు? ఆయన వ్యక్తిత్వమే ఆయనను దేవునిగా నిరూపించెను. ఏ ప్రవక్తయూ ఆయన చేసిన కార్యములను చేయలేదు. సమాధిలోని మృతులను ఆయన బ్రదికించెను. ఆయన మేఘములను ఆపెను. ఆయన తన ఇష్టానుసారముగా చేయగలిగెను. ఆయన దేవుడు. ఆయన స్థానములో ఎవరు నిలబడగలరు? ఆయన పరిపూర్ణుడు. అమర్తుడగు దేవుడు. శరీరధారియై మన మధ్య నివసించెను.
JOHN 1:14•
COL 2:9
49ఆయనకు సాటి ఎవరూ ఎన్నడూ లేరు. ఆయన ప్రపంచమే వేరు. ఎవరూ ఆయనవలె మాట్లాడలేదు. ఆయన నోరు తెరువగా అందులో నుండి ఏదో వచ్చెను. ఎవరూ చెప్పలేనది చెప్పెను. కొందరాయనను ఒక సాధారణ మనిషి అనిరి. ఆయన దేవుడు. ఏ మనిషి ఆయననూ అధిగమించి మాట్లాడజాలడు. ఆయన వలె ఎవరూ మాట్లాడజాలరు. ఎందుకనగా ఆయన జీవముగల దేవుడు. శరీరమును ధరించెను. దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత ఆయనే.
ప్రవక్తలు తమ వర్తమానమును అందించిరని నేను ఒప్పుకొనుచున్నాను. అపుడు వారుండిరి. ఇపుడును వారు ఉన్నారు. కాని శరీరరీత్యా దేవుని యొక్క సంపూర్ణత అక్కడ ప్రత్యక్షమాయెను. ఆయన వింత వానిగా ఉండెను. ఆయన తన మహా శక్తితో సమస్తమును ఎదుర్కొనెను. ఆయన ప్రపంచ రాజుగా ఖచ్చితంగా ఉండగలడు. ఇపుడాయన తన పరిశుద్ధులకు రాజుగా యున్నాడు.
MATT 8:20•
MATT 17:27•
LUKE 9:58•
JOHN 2:7-9•
JOHN 11:39,43,44
50ఆయన అక్కడ నిలబడి యుండెను. ఆయన పేదవానిగా కనబడెను. ఆయనకు తలవాల్చుకొను స్థలము లేదు. కాని ఆయనకు ఏ చేప నోటిలో నాణెమున్నదో తెలియును. ఆయన రాతి బానలోని నీటిని ద్రాక్షారసముగా మార్చెను. కాని ఆయనకు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఆయన చేతికి కొన్ని బాధ్యతలు అప్పగించబడెను. సమాధిలో నుండి చనిపోయిన వానిని లేపిన ఆయన నాలుగు రోజులు ఎందుకు కుళ్ళిపోవలసి వచ్చినది? ఆయన తన్ను తాను రక్షించుకోలేడా? నిశ్చయంగా రక్షించుకోగలడు. కాని ఆలాగు చేసినచో ఆయన మనలను రక్షించగలడు. ఆయన తన బాధ్యతలను ఎదుర్కొనెను. ఆయన వాక్యమునకు లోబడి యున్నందున రక్షించెను. ఆదాము అవిధేయత చూపెను. అతడు అడ్డదారి త్రొక్కెను. తర్షీషుకు పోయెను. కాని యేసు నీనెవేలోని అన్యుల యొద్దకు వచ్చి ఒక పెండ్లి కుమార్తెను ఎన్నుకొనెను. ఈ రాత్రి ఆయనను గూర్చి నేను సంతోషించుచున్నాను. ఆయనకు మనము చెందియున్నాము గనుక ఆయన నిమిత్తము బాధ్యతలను ఎదుర్కొందుము. లోకమును దూరము చేయుదము. ఆమేన్.
GEN 2:5•
GEN 6:17
51ప్రతిమనిషి దేవుని ఎదుట ఒక బాధ్యతను ఎదుర్కొనవలసియున్నాడు. ఉదాహరణకు నోవహును చూడండి. నోవహు, మోషే, ఏలియా మొదలగు వారందరూ తమ తమ కాలములలో తమ బాధ్యతలను ఎదుర్కొనిరి. అది వారివంతు. వారందుకే ఆ ఘడియలో పంపించబడిరి.
నోవహు ఒక శాస్త్రీయ కాలములో జీవించెను. అశాస్త్రీయమగు సంగతిని అతడు ఎదుర్కొనవలసి వచ్చెను. అది అశాస్త్రీయమనుటను ఏ కారణమును లేదు. చూచారా? అది అశాస్త్రీయముగానే కనిపించును. ఆకాశములలో నుండి వర్షము కురియునని చెప్పెను. పైనుండి ఎన్నడూ వర్షము పడుట వారెరుగరు. దానిని అతడు ఎదుర్కొనవలసి వచ్చెను. వర్షము కురియబోవుచున్నదని ఆయన చెప్పెను.
JAS 2:20,26
52క్రియలు లేని విశ్వాసము మృతము. "నేను నమ్ముచున్నానని" నీవు చెప్పవచ్చును. కాని ఏ పనిని చేయవు. వర్తమానమువలెనె యున్నది. నమ్ముచున్నానని చెప్పి కూడా నీవు ఏమీ పని చేయని యెడల ఆ నమ్మిక వలన ఏమి ప్రయోజనము? చూచారా? నోవహు తన సుత్తెను పట్టుకొని ఓడను కట్టుటకు పని చేయ ప్రారంభించెను. తాను చెప్పుచున్న దానిని చేయుటకు పూనుకొనెను. మనము కూడా అదే చేయవలెను. మనము పని చేయుచూ మన విశ్వాస మును క్రియల ద్వారా రుజువు చేయవలెను. మన క్రియలు మన విశ్వాసమును రుజువు చేయును.
మోషే ఆలాగు చేయవలసి యుండెను. ఏలియా ఆలాగు చేయవలసి యుండెను. ప్రతి ప్రవక్తయు తమ కాలములో ఇటువంటి బాధ్యతలను ఎదుర్కొనవలసి వచ్చెను. కాని వారిలో ఎక్కువ మంది యోనా వలె లేరు. అతడు పారిపోయెను గాని వారు పారిపోలేదు.
53గమనించండి."దానికి వ్యతిరేకముగా మాట్లాడవలెను." అదియే అసలు సంగతి. దానికి విరోధముగా ప్రకటించవలెను. అది చాలా కష్టము అతడు వారి యొద్దకు వెళ్ళి వారందరితో చేరుట సులభము. అందరినీ ఏకము చేయుటకు వచ్చానంటే వారు అంగీకరించుదురు. కాని దానికి విరోధముగా ప్రకటించుట చాలా కష్టమయిన పని. ఆ పట్టణమునకు విరోధముగా మాట్లాడవలెను. వారి క్రియలకు విరోధముగా మాట్లాడవలెను. వారి సంఘమునకు విరోధముగా మాట్లాడవలెను. వారి యొక్క ప్రవక్తకు విరోధముగా మాట్లాడవలెను. వారి సేవకులకు విరోధముగా మాట్లాడవలెను. వారి యాజకులకు విరోధముగా మాట్లాడవలెను. మొత్తం అన్నింటికీ విరోధముగా మాట్లాడవలెను.
నోవహు తన కాలమునకు విరోధముగా మాట్లాడెను. తన కాలములోని సంఘములకు విరోధముగా మాట్లాడెను. మోషే కూడా తన కాలమునకు విరోధముగా మాట్లాడెను. ప్రజలకు, యాజకులకు విరోధముగా మాట్లాడెను. అరణ్య ప్రయాణమంతటిలో అతడు మాట్లాడెను. ప్రతి కూడలిలోను అతడు మాట్లాడెను. నిరంతరము జనులకు విరోధముగా మాట్లాడెను. ఏలియా తన కాలములో పేరు సంపాదించుకోలేదు. ఆ కాలమునకు విరోధముగా మాట్లాడెను. నిశ్చయంగా ఇది నిజము.
MATT 14:4
54బాప్తిస్మమిచ్చు యోహాను తన కాలములో పేరు సంపాదించుకొనలేదు. తన కాలమునకు విరోధముగా అతడు మాట్లాడెను. దేశపు రాజుకు విరోధముగా మాట్లాడెను. ఆ రాజు తన సోదరుని భార్యను ఉంచుకొనెను. ఆ ఉదయమున అతడు వివాహము మరియు పరిత్యాగము మీద మాట్లాడెను. దానికి విరోధముగా అతడు మాట్లాడెను. ఆమెను ఉంచుకొనుట నీకు ధర్మము కాదని అతడు చెప్పెను. దానికి అతడు తన శిరస్సును వెలగా చెల్లించవలసి వచ్చెను. అయినా గాని అతడు తన విధిని నిర్వర్తించెను. తర్షీషునకు పోవు ఓడను ఎక్కలేదు. హేరోదూ, నీతో నేను సమ్మతించెదననలేదు. ఆమె చాలా మంచిది గనుక నీ భార్యగా ఉండదగునని పలుకలేదు. మీరు గమనించారా? అతడు అంతయూ పవిత్రపరచెను.
MATT 14:4
55చూడండి. యోహాను ఆ విధంగా లేడు. అతడు దానిని ఎదుర్కొనెను. ఆమెను ఉంచుకొనుట నీకు ధర్మము కాదనెను. అవును. అతడు దానికి విరోధముగా నిలబడెను.
వారెన్నడూ పారిపోలేదు. వారు నిలబడి సవాలును ఎదుర్కొనిరి. మోషే కూడా ఒకసారి యోనా వలె పారిపోవుటకు ప్రయత్నించెను. కాని అతనిని దేవుడు తిరిగి రప్పించెను. చాలా మంది ఆలాగున పారిపోవుటకు ప్రయత్నములు చేసిరి. కాని చూడండి. దేవుడు మిమ్ములను పిలచిన యెడల మీరు తప్పకుండా వర్తమానములో యుందురు. ఏదియూ నిన్ను వెనుకకు మళ్ళించజాలదు. యోనాను అది దూరపరచలేకపోయెను.
AMOS 3:8
56ఆకాలపు ఆమోసు ఇట్లనెను, "సింహము గర్జించగా భయపడని వాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవచించని వాడెవడు?" ప్రవచించకుండా ఎవరుండగలరు? దేవుడు మాట్లాడి ఒక ప్రత్యేక కార్యము జరుగునని చెప్పిన యెడల అది ఆ ప్రకారమే జరుగును.
ఒక సింహము గర్జించగా అందరూ భయపడుదురు. అరణ్యములో సింహపు గర్జనను మీరెన్నడయినా విన్నారా? మీరు బోనులోయున్న వాటి అరపులు వినియుందురు. అవి పెంపుడు సింహములు. కాని నీవు నిజమగు అడవిసింహపు గర్జనను ఒకసారి అరణ్యములో వినవలెను. అయిదు వందల గజముల దూరములో యున్న కొండ మీదిరాళ్ళు దొర్లి పడును. దాని ఊపిరితిత్తులలో అంత భీకర ధ్వని ఎక్కడ దాగియున్నదో నాకు అర్థము కాదు. భయపడని వారెవరు? సింహము చేత చంపబడిన మనిషికి బాధ ఉండదని చెప్పెదరు. తన గర్జనతో నిన్ను భయపెట్టి చంపును. నీ యొద్దకు అది రాక ముందే చనిపోదువు. మీరు దానిని గమనించండి. ఆ మహాభయంకర గర్జనతోనే అది నిన్ను భయపెట్టి చంపును. నిన్ను కనురెప్పపాటులో చీల్చివేయును.
AMOS 3:8
57"సింహము గర్జించగా భయపడని వాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవచించనివాడెవడు?" దేవుడు కార్యము చేయుటను నీవు చూచుచున్నావు. నేను ప్రవక్తను కానని నీవు చెప్పవచ్చును. నేను ప్రవక్తను కాకపోవచ్చును. ప్రవక్త కుమారుని కాకపోవచ్చును. కాని దేవుడు మాట్లాడగా ప్రవచించనివాడెవడు?
నేను ప్రవక్తను కాకపోవచ్చును. కాని నేను వాక్యమును చూచుచున్నాను. దేవుడు దానిని జరిగించుట చూచుచున్నాను. దానిని ఆయన వాగ్థానము చేసెను. ఎవరు మౌనముగా యుండగలరు? దానిని ఆయన చేయుచున్నాడు. నిశ్చయంగా! ఇందులో సంశయము లేదు.
మనము ఆధారములు వెనుక దాగి యుండజాలము. ఈ సహవాసములు తర్షీషుకు పోవుచున్నవి. ఆ సహవాసములలోనికి మనము వెళ్ళగోరుట లేదు.
GEN 3:7
58కాని అనేకులు ఆదాము వలెనె యున్నారు. ప్రత్యామ్నాయమును ఏర్పాటు చేసికొనుటకు ప్రయత్నించుచున్నారు. బయటపడు మార్గమును వెదకుచున్నారు. తాము తప్పులో యున్నామని తెలిసి యుండియు ఒక ప్రత్యామ్నాయమును ఏర్పాటు చేసికొని దేవుని ఎదుర్కొనగోరుచున్నారు. సత్యమును దూరము చేసికొనుచున్నారు. ఆదాము తన భార్య మాటను విని దేవుడు చేయమనిన దానిని చేయకుండా పోయెను. అతడు లెక్క చేయకుండా ఆపనిని చేసెను. అపుడతడు దిగంబరియాయెనని గ్రహించెను. వారిరువురును ఏదెను తోటలో ఆలాగే యుండిరి. వారి కన్నులు తెరువబడినవి. తప్పు, ఒప్పులు వారెరిగిరి. వారిని కప్పుటకు ఆయన ఒక ప్రత్యామ్నాయమును ఏర్పరచెను. నేడు కూడా మనము నెపములు చెప్పుచు న్నాము. కాని నీవు వాస్తవమును ఎదుర్కొనవలసియున్నావు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దానితోనే మనము నిలచి యుందము. అది చెడు అయినచో దూరంగా పోవుదము. నిజమయిన దానిని కనుగొందము. ఇంక మీరే మాత్రము తడవు చేయరాదు. సత్యమును వెదకి కనుగొందము. నిజమయిన దానితో నిలచియుందము. అది నిజమని మన మెరుగుదుము.
59ఈనాడు జనులను చూడండి. సంఘములలో అసలు యధార్థత లేనట్లుగా కనిపించుచున్నది.
ఈ ఆలయమునకు వచ్చుచున్న ఒక ప్రశస్త సోదరి గృహములో మేముంటున్నాము. ఆమె బహుశా ఈరాత్రి ఇక్కడ కూర్చొని యుండవచ్చును. ఆమె తన వారికి దానిని అద్దెకు ఇచ్చినది. ఆమె మాటపట్ల ఎంతో ఔదార్యము చూపినది. ఆ స్థలమునకు మమ్మును ఆహ్వానించినది. ఆమె పేరు నేను చెప్పుదును గాని అది ఆమెకు ఇష్టముండదు. ఆమె మనందరికిని చాలా ప్రియమైనదే. ఆమెను మేము నిశ్చయంగా బహిర్గతము చేయము. కాని ఆమె చాలా ప్రియ మగు స్త్రీ. ఆ గృహములో ఒక ప్రక్కన టెలివిజను యున్నది. నాకు పెద్ద కుటుంబమున్నది. వారందరూ యువకులు. అక్కడ చాలా పడకలు ఉన్నవి. మేము వాటన్నింటినీ ఒక చోట చేర్చి లోపలకు బయటకు నడిచాము.
60వారికి ఒక టెలివిజనుయున్నది. ఆదివారము ఉదయమున ఏదో పాటను గానము చేయుచుండగా ఈ పిల్లలు వినుచున్నారు. దానిని క్రైస్తవ్యమని వారు పిలిచారు. ఎవరైనా నిజమయిన క్రైస్తవులు గాని దానిని చూచినట్లయితే సిగ్గుపడి చేతులతో కండ్లు మూసికొనవలసినదే. యధార్థత పూర్తిగా పోయినది. వారక్కడ నిలబడిన తీరు చాలా భయంకరముగాయున్నది. వారు తమ పిడికిండ్లతో ఒకరి నొకరు బాదుకొనుచున్నారు. పాటలు పాడుటకు ప్రయత్నములు చేయుచున్నారు. ఛలోక్తులు విసురుకొనుచున్నారు. అల్లరి మూకవలె ప్రవర్తించుచున్నారు. క్రైస్తవ్యములోనికి పవిత్రత పూర్తిగా పోయినట్లనిపించుచున్నది.
61సంఘకాపరి ఆలయమునకు వెళ్ళి ఏదో ఏదో ప్రకటన చేయును. అంతటితో ఆ కార్యక్రమము ముగియును. స్త్రీలందరూ స్నానపు బట్టలతో యుందురు. ఆలాగే వారు బయట నడచుచున్నారు. ఈ స్త్రీలు ఈత పోటీలో యున్నారు. ఒక రకమగు విందులకు వారు వెళ్ళుచున్నారు. కోడి వేపుళ్ళు తినుచున్నారు. జూదమాడుచున్నారు. క్రైస్తవ్యములో నుండి నిజత్వము పోయినది. ఇష్టము వచ్చినట్లుగా వారు జీవించుచున్నారు.
62మన సోదరీలు చాలామంది ఈ చలి దేశములో కురచ బట్టలు ధరించుచున్నారు. వేడి దేశములలో కూడా అట్టివి ధరించరు. చూచారా? ఇది సత్యము. ఆ బయట చాలా వేడిగా యున్నది. కాని అక్కడ ఎవరూ అటువంటి బట్టలు ధరించరు. కాని ఈ చలి దేశములో వీరి బట్టలు చూడండి. దీనిని అపవాది చేయుచున్నదని వీరు గ్రహించలేకపోవుచున్నారు. చూచారా? ఆ బట్టల వలన సౌకర్యము పొందుచున్నచో, అవి మీకు సహాయపడుచున్నచో అది వేరే సంగతి. మగవారి వలె జీవించండి. మగవారు చేతకాని వారయినట్లు కనిపించుచున్నారు. కాని మీరు మగవారి వలె ప్రవర్తించండి. స్త్రీలారా, మీ శరీరము పవిత్రమైనది. దానిని ఆ విధముగా మీరు బహిర్గతము చేయరాదు.
63ఈనాడు ప్రజలను చూడండి. రెండు ఆత్మలు పనిచేయుచున్నవి. ఒకటి పరిశుద్ధాత్మ. మరియొకటి అపవిత్రాత్మ. వారు వాటిలో ఏదో ఒక దాని ద్వారా ఏలబడుచున్నారు. వారిద్దరునూ భక్తిగానే కనబడుదురు. అదే చాలా వింతగా యున్నది.వారిరువురు మతనిష్ట కలిగియుందురు. ఏశావు మరియు యాకోబులు ఆలాగే యుండిరి. భక్తిగానే కనబడిరి. కయీను, హేబెలు ఇద్దరు భక్తిగానే యుండిరి. యూదా మరియు యేసు ఇద్దరూ ఒకేలా కనిపించిరి. నేడు దానినే మనము చూచుచున్నాము. ఒకేలా కనిపించుచుండును. చూడండి. ఆత్మ ఒక్కటే. జనులు చనిపోవుదురు. కాని ఆత్మ చనిపోదు. అది సదా జీవించును. ఇరువురూ భక్తిగానే కనిపించుచుందురు. కాని అందులో ఒకరు పరిశుద్ధాత్మను కలిగియున్నారు. జీవించవలసిన రీతిగా జీవించుచున్నారు. భక్తిగాను యధార్థముగాను నడచుచున్నారు. వారు కూడా ఏ మాత్రమూ వీరికి తీసిపోరు. వారు అన్ని విధములా యధార్థము గానే కనిపించుదురు. ఇతరుల వలెనె చక్కగా కనిపించుచుందురు. వారు నీకు సహాయము చేయగోరుదురు. వారిరువురూ మత సంబంధమగు ఆత్మనే కలిగియున్నారు. అందులో ఒకటి పరిశుద్ధాత్మ. మరియొకటి అపవిత్రాత్మ. మీరు గమనించండి. మతం చాలా యుండవచ్చును. వారు నిన్ను హేళన చేయుదురు. పరిశుద్ధుడని ఎగతాలిగా అందురు వారు ఇష్టమొచ్చినదంతయూ చేయుదురు.
64వారు మార్పులేని దేవుని యొక్క వాక్యమును అలక్షము చేయుదురు. అది వ్రాయబడిలేదన్నట్లుగా ప్రవర్తించెదరు. మాకును పరిశుద్ధాత్మ యున్నదని చెప్పుకొందురు. చేతిలో సిగరెట్లు పట్టుకొని నిలబడుచుందురు. అయినా వారు పరిశుద్ధాత్మను పొందియున్నామని చెప్పుకొందురు. కొద్దిగా త్రాగితే తప్పు లేదని పలికెదరు. చూచారా? ఆలాగని నీవనుకొనవచ్చును. కాని దేవుని తలంపు వేరుగా యున్నది. ఆయన వాక్యమును మీరు చూడవలెను. చూచారా? వారు దాని మీద సంకోచించక ఉమ్మి వేయుదురు. ఇది అక్షరాలా నిజము.
2SAM 15:30•
2SAM 16:5,9,10•
MATT 26:67
65దావీదు సింహాసన భ్రష్టుడయిన సమయములో ఒక కుంటివాడు ప్రాకుకొంటూ వచ్చెను. అతడు ఒలీవల కొండమీదికి ఎక్కుచుండెను. అతడు ఏడ్చుచూ ఆ కొండ ఎక్కుచుండెను. అతడు వెనక్కు తిరిగి చూచినపుడు ఆ కుంటివాడు ఊయుట కనబడెను. రాజు మీద ఉమ్మివేయుచున్న ఈ కుక్క యొక్క తలను ఛేదించుదునని ఆ సైనికుడు అడిగెను.
వాని జోలికి పోవద్దని దావీదు పలికెను. చూడండి. వాడతని మీద ఉమ్మివేసెను. దాదాపు ఎనిమిది వందల సంవత్సరముల తరువాత వారతని కుమారుడగు యేసుక్రీస్తు మీద కూడా ఉమ్మివేసిరి. ఈనాడు కూడా వారు మరల ఆయనపై ఉమ్మివేయుచున్నారు. వారు పూర్తిగా అగౌరవము చూపుచున్నారు. లెక్కలేకుండాయుంటున్నారు. తమ తలను ఊపుచున్నారు. దానిని లెక్క చేయకుండా పోతున్నారు. నీ ముఖం మీదనే ఉమ్మివేయుదును. ఎందువలన అది జరుగుచున్నది? వారు తర్షీషు వెళ్ళు ఓడను ఎక్కియున్నారు. అది నిశ్చయము.
దేవుని బట్టియే నీవు చెడుకు వ్యతిరేకముగా కేక వేయుచున్నావు. పాపమునకు విరోధముగా కేక వేయుచున్నావు. తప్పు విషయములకు విరోధముగా గొంతెత్తుచున్నావు.
ఇపుడు గుర్తుంచుకొనవలెను. ఈ సమయమును నీవు ఎరుగుము. రెండు గంటల తేడాలో నేనున్నాను. టూసాన్‌లో 7:00 దాటి పది నిమిషములగును. ఇక్కడ నేను కొద్దిగా స్థానభ్రంశము చెందియున్నాను. మంచిది.
2SAM 19:18-20•
REV 22:18,19
66మరువవద్దు. దానికి మనము జవాబు చెప్పవలసియున్నాము. క్రీస్తు మీద ఉమ్మివేసిన వారు జవాబు చెప్పవలసి వచ్చెనని మీరు గుర్తుంచుకొనండి. దావీదు తన దేశబహిష్కరణ నుండి తిరిగి వచ్చెను. అతడపుడు దేశ దిమ్మరి. కాని తిరిగి వచ్చెను. ఈ మనిషి విలపించుచూ అతని దయ కొరకు వేడుకొనెనని మరవ వద్దు. అతడు బహిష్కరింపబడి వెళ్ళిన దావీదు మీద ఉమ్మివేసెను. కాని ఇపుడు దుఃఖసాగరములో మునిగిపోయి ఉన్నాడు. ఇపుడతడు తిరిగి వచ్చెను. యేసును పొడిచిన వారు ఒక దినమున చూచెదరు. ఈనాడు ఆయనను పొడుచుచున్నవారు చూచెదరు. ఆ దినము తిరిగి వచ్చును. ప్రకటన 22ను గుర్తుచేసికొనండి. ఆయన వ్రాసిన ప్రతిమాటను మనము గైకొనవలసి యున్నాము. ఆలాగని ఆయన మనలను కోరుచున్నాడు.
NUM 32:23
67ఆయన సన్నిధి ఇచ్చటున్నదని ఇపుడు మనము ఎరుగుదుము. అది బయలుపరచబడినది. దానిని మనము కలిగియున్నాము. అది మన మధ్య ఈ వచ్చే వారము ఇంకా బయలుపరచబడునని నమ్ముచున్నాము. రోగులు బాగవుదురు. గొప్ప సంగతులు జరుగును. మనకు కావలసినది పేరు కాదు గాని సత్యము. దేవుడు దేనిని సత్యమని చెప్పెనో దానినే మనము కోరుకొందము. మీ పాపములు మిమ్మును పట్టుకొనునని ఎల్లపుడూ గుర్తుంచుకొనండి. ఇపుడు అది జరుగని యెడల తీర్పు దినమున అది జరుగును. కావున ఎక్కడో నిన్ను పట్టుకొనును. ఇది సత్యము.
కాని నీవు నిజ క్రైస్తవునివైన యెడల, యోనా వలె నిజంగా పిలువబడిన యెడల ఎప్పుడో దేవుడు నీ వెలను చెల్లించెను. ఏమయినా గాని తర్షీషునకు పోయి ఓడ నుండి దిగుము. దేవుడు నిన్ను ఈ జీవితమునకు నిర్ణయించెను. నీవు నిజముగా దేవుని చేత పిలువబడిన బిడ్డవైనచో క్రీస్తు నొద్దకు రమ్ము. ఆయన యొక్క సంపూర్ణతలోనికి రమ్ము. నీ వెల ఎక్కడికి చెల్లించబడినది? నీనెవేకు చెల్లించబడినది గాని తర్షీషునకు కాదు. నీవు ముందుగా నిర్ణయింపబడినావు. ఇప్పుడే ఆ ఓడ దారిలో పయనించుచూ యున్నది. నీవు అందులో ప్రవేశించుము. అది మాత్రమే నీవు చేయవలెను. నీవు యోనా వలెయున్నట్లయినచో ఎన్నడూ నీకు సమాధానముండదు.
68నా మేనల్లుడు కొంతకాల క్రితం ఆలాగే యుండెను. ఇప్పటికి పది సంవత్సరాల క్రితం అతడు తిరుగని చోటు లేదు. ఒక ఉదయాన అతడు ఈ కాతలిక్కు చర్చికి వెళ్ళెను. ఎవరో పరిశుద్ధ తండ్రి మాట్లాడెను. చాలా మందితో ముచ్చటించెను. దాని వలన అతడేమి సంపాదించెను? చూచారా? ఇంకా అతనిలో ఆకలి దప్పిక పోలేదు. కుమారుడా, నీవు వచ్చి వేదిక యొద్ద మోకరించుమని చెప్పాను. చూచారా? మరో మార్గము లేదు. దేవుడు నిన్ను సంధించునపుడు ఒప్పుకొనవలెను.
69దేవునిని గుర్తుచేసికొనుము. ఆ ఓడలో ఆయన ఉండెను. ఆ తుఫానులో ఆయన ఉండెను. ఆ తిమింగలములో ఆయన ఉండెను. అతడు ఎటు తిరిగితే అటు దేవుడు ఉండెను. చూచారా? అచ్చట దేవుడున్నాడు. ఆయన నిన్ను వెంటాడుచునే యుండును. కావున ఇంకా ఎందుకు మనము ఆలస్యము చేయవలెను? ఇప్పుడే ఈ ఉజ్జీవమును ప్రారంభించుదము. ఇది సరి. నీవు దేని కొరకు కనిపెట్టుచున్నావు? ప్రభుని యొక్క రాకడ సమీపమందున్నదని మనము నమ్ముచున్నాము. ఆయన తన పెండ్లి కుమార్తెను సిద్ధపరచుచున్నాడు. తర్షీషుకు వెళ్ళు ఓడను మనం ఎక్కనవసరము లేదు. మనము నీనెవేకు వెళ్ళుచున్నాము. మనము మహిమలోనికి వెళ్ళుచున్నాము. ఆమేన్. అది నిజము. దేవుని దీవెన దొరుకు చోటికి మనము వెళ్ళుచున్నాము. అదే మనకు కావలెను.
70దేవుని సన్నిధిలో నిలచియుండుము. దేవుని ఎదుట మన హృదయములను కుమ్మరించెదము. ఆయన మహిమా కిరణములు మనలో దూసికొనిపోవు వరకు కనిపెట్టుదము. ఆయన యొక్క మంచితనము మనలో ప్రవేశించవలెను. మనము పరిపక్వమై వాస్తవికతను ధరించుకొనవలెను. (చూచారా?) యేసుక్రీస్తు జీవించుచున్నాడని ఇతరులకు మనము చూపించ గలము. ఆలాగు మనము ఉండగోరుచున్నాము.
71గుర్తుంచుకొనండి. యోనా ఎక్కిన ఓడలో దేవుడు ఉండెను. ఆ తుఫానులో దేవుడు ఉండెను. ఆ తిమింగలములో దేవుడు ఉండెను. దేవుడు తన యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చు వరకు యోనాతో ఉండెను. అది నిజము. ఎన్నడయినా ఆయన నిన్ను వెంటాడుచున్న యెడల నీవు అటు ఇటు పోవుచుందువు. కాని నీవు తిరిగి వచ్చువరకు బహుగా వేదనపడెదవు. నీవు మొదట జీవించిన విధంగా దేవుని కొరకు జీవించవలసియుందువు. చూచావా? దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోవద్దు. దానిని ఎదుర్కొనుము. అది సత్యమని నీవు నమ్ముచున్నావు. అది సత్యమైన యెడల ఆలాగు నీవు జీవించవలెను. దాని కొరకు మరణించుము. ఏమయినా సరే జీవించుము.అది సత్యమని ఆయన నీకు ఎన్నడయినా బయలుపరచిన యెడల దాని నుండి మరెచ్చటికి మనం పారిపోలేము. ఆయన అక్కడే నిలచి యుండును. నీవు ఎదురు తిరుగజాలవు.
72తానేర్పరచుకొనిన ప్రవక్త ద్వారా ఆయన వర్తమానము పంపెను. అతడే అచ్చటికి వెళ్ళవలెను. మరో ప్రవక్తను ఆయన పంపించగలడు. కాని ఆయన యోనాను ఎన్నుకొనెను. ఏలియా ఆ పని చేయజాలడు. యిర్మియా ఆ పని చేయజాలడు. మోషే ఆ పని చేయజాలడు. యోనాయే నీనెవేకు వెళ్ళవలసి యుండెను. వెళ్ళమని దేవుడతనికి ఆజ్ఞాపించెను. యోనా, నీనెవేకు వెళ్ళుము అని చెప్పెను. యోనా తప్ప దానిని మరెవరూ చేయలేరు. దేవుడు నీకు దేనినయినా చెప్పినపుడు దానిని నీవు చేయవలెను. మరెవరో కాదు. నీవే దానిని ఎదుర్కొనవలెను. వెళ్ళి నీవు దానిని చేయవలెను.
దేవుడు కార్యము చేయుచున్న ఘడియలో మనము జీవించుచున్నామని నమ్ముచున్నాము. వాటి మధ్యనే మనం ఉన్నామని నమ్ముచున్నాము. అటువంటి సమాజమునకు ఈ రాత్రి నేను బోధించుచున్నానని నమ్ముచున్నాను. పరిపక్వమగుటకు సిద్ధముగా యున్నది. దానిని నేను నా పూర్ణహదయముతో నేను నమ్ముచున్నాను. ఎప్పుడూ ఉండిన విధంగానే ఇపుడును యున్నదని నేను నమ్ముచున్నాను.
MAL 4:5,6•
LUKE 17:30•
JOHN 14:12
73పరిశుద్ధ యోహాను 14:12 తప్పక నెరవేరవలసియున్న ఘడియ ఇదేనని నేను నమ్ముచున్నాను. మలాకీ 4 తప్పక నెరవేరబడవలెనని మనము నమ్ముచున్నాము. లూకా 17:30 తప్పక నెరవేరబడవలెనని మనము నమ్ముచున్నాము. ఆయన చెప్పిన ఈ ప్రవచనములన్నియూ ఈ దినములోనే నెరవేరునని ఆయన చెప్పెను. అవి తప్పక నెరవేరునని మనము నమ్ముచున్నాము. ఇపుడవి నెరవేరుచున్నవని మనము చూచుచున్నాము. అది అక్షరాలా నిజము.
పారిపోవద్దు. ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోవద్దు. ఆయన సన్నిధిలోనికి రమ్ము. అది మంచిది. మీరు దానిని చేయగోరుచున్నారని నమ్ముచున్నాను. టెక్సాస్, లూసియానా, ఇంకా చాలా చోట్ల దానిని నేను చూచుచున్నాను. అందుకొరకే ఇచ్చటికి మనము వచ్చియున్నాము. ఆయన సన్నిధిలో నుండి పారిపోవుటకు కాదు గాని ఆయన సన్నిధిలోనికి పరుగిడి వచ్చుటకే వచ్చాము. వెనక్కు మళ్ళండి. యోనా వలెఎటు వెళ్ళవలెను, ఏమి చేయవలెను అని ఆలోచించుచున్నావా? ఈ రాత్రి మాతో కూడా ఓడను ఎక్కుము. నీనెవేను హెచ్చరించుటకు మనము వెళ్ళుచున్నాము. తర్షీషు ఓడలో వెళ్ళుచున్న వారిని వెళ్ళనీయండి. దేవుని యెదుట మనకు ఒక విధియున్నది. ఆ వర్తమానము విషయములో మనము బాధ్యులమై యున్నాము.
74వచ్చే వారమునకు సంబంధించిన కొద్ది పరిచయ పలుకులు మీకు చెప్పాను. నేనేమని హెచ్చరించుచున్నానో మీకు తెలియును. సోదరులారా, వర్తమానమునకు మాత్రమే నేను బాధ్యుడను. ఇక్కడ సేవకులు కూర్చొని యున్నారు. మీకు నేను బాధ కలిగించగోరుట లేదు. ఈ వివాహము విడాకులు గూర్చి స్త్రీ, పురుషులు నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ రాత్రి మీరు జ్ఞాపకముంచుకొనండి. నేను దేవునికి మాత్రమే బాధ్యుడను. అందుకే ఇదంతా చెప్పి యున్నాను. మీకు సత్యమును చెప్పవలసిన బాధ్యత నాకున్నది. దేవుడు నాకు సత్యమును బయలుపరచినంత కాలము నేను సత్యమును మాత్రమే చెప్పెదను. సత్యమని ఎరుగువరకు ఏదియూ నేను చెప్పను. దానిని గూర్చి ఏమియూ చెప్పను. కాని వివాహము విడాకులు మీద దేవుడు నాకు సత్యమును చూపించునని నేను నమ్ముచున్నాను. దానిని ఆయన బయటకు తెచ్చునని నేను నమ్ముచున్నాను.
75ఇంకా ఈ వారములో నేను కొన్ని వర్తమానములు చెప్పవలసియున్నాను. అవి: "ఈ మెల్కీసెదెకు ఎవరు?" మరియు "దేవుడు ఎక్కడ తన నామము నుంచుటకు ఎన్నుకొనెను?" అటువంటి కొన్ని వర్తమానములున్నవి. "ప్రసవ నొప్పులు." అట్టివి కొన్ని యున్నవి. మానవుడు తన భార్యను ఎన్నుకొనుట హర్షణీయము. ఈ వారములో అటువంటి కొన్ని వర్తమానములను తీసికొని వచ్చెదను. కాని సంఘము దీని విషయమై ఆలోచించవలెను.
మీలో కొందరు మీ సంఘములకు తిరిగి వెళ్ళెదరు. బ్రెన్‌హాం సోదరుడు పలాని పలాని విధంగా చెప్పెనని మీరందురు. సర్వశక్తుడగుదేవుని యొద్ద నుండి నాకియ్యబడిన వర్తమానమును అందించవలసిన బాధ్యత నామీద యున్నది. ఈ రాత్రి ఇక్కడ నేను నిలబడియున్నాను. అది సత్యమని దేవుడెరుగును. 1933లో దేవుని యొక్క దూత ఆ నది యొద్దకు వచ్చి నాతో ఏమిచెప్పెనో వినిన వారు ఇక్కడ బహుశా కొందరున్నారు. స్ప్రింగ్వీధిలో అది జరిగినది. మీరు క్రొత్తవారయితే ఆ నది యొద్ద గల స్ప్రింగ్ వీధికి వెళ్ళి చూడండి. అక్కడ ఇది జరిగినది.1933వ సంవత్సరము. దాదాపు ముప్పది రెండు సంవత్సరములయినది. ముప్పది రెండు సంవత్సరములగును. ఆయన సమస్తమును క్రియా రూపములోనికి తెచ్చెను. మనము బయటకు వచ్చి వర్తమానమును అందించుచున్నాము. రోగులు బాగవుట, గ్రుడ్డివారు, కుంటివారు, అవిటి వారు, చెవిటి వారుబాగవుట మనము చూచుచున్నాము. మృతులు కూడా తిరిగి లేచుట మనము చూచుచున్నాము. అది ధృవీకరించబడినది. చనిపోయిన వారు మరల తిరిగి జీవించుచున్నారు. ఎన్నోకార్యములు మనము చూచుచున్నాము.
76ఒక వర్తమానము బయలు వెళ్ళిన యెడల దానితో పాటు అద్భుతములు, సూచకక్రియలు, బయలు వెళ్ళును. అయినా గాని మీరు ముందున్న వైఖరిని విడిచి పెట్టుట లేదు. అవి దేవుని వలన జరుగుట లేదని చెప్పుచున్నారు. దేవుడు మిమ్మును ఒక సంగతి వైపునకు ఆకర్షించుచున్నాడు. కావున ఆలాగపలుక వద్దు.
యేసు అక్కడికి వెళ్ళి రోగులను బాగుచేయుచూ, అద్భుతములు, సూచకక్రియలు చేయుచూ ఉండెను. యేసు ఎల్లపుడూ ఆలాగే చేసెను. మోషే మరియు యేసు ఆలాగే చేసిరి. మిగిలిన వారును ఆలాగే చేసిరి. ఆయన ఇక్కడుండగా ఆలాగు చేసెను. ఈనాడు కూడా ఆయన దానినే చేయుచున్నాడు. ఆయన ఉజ్జీవమును ఈ భూమి మీదికి పంపుచున్నాడు. గొప్ప అద్భుతములు మరియు సూచక క్రియల ద్వారా ఒక కదిలింపు తీసికొని వచ్చుచున్నాడు. మీరు ఇవన్నీ చూచియూ మీ మీ పాత ఆలోచనలను, ధోరణులను విడిచిపెట్టుట లేదు. ఎక్కడో పొరపాటున్నది. ఒక నూతనమైనది బయలుదేరి వచ్చుచున్నది.
MATT 12:24•
MARK 3:22•
LUKE 5:22•
LUKE 11:15•
JOHN 1:14•
JOHN 6:53,54•
JOHN 8:29•
JOHN 10:30
77యేసును మంచి రబ్బీ అని వారు ఒకపుడు మెచ్చుకొనిరి. ఆయన రోగులను బాగుచేయుచుండెను. గనుక అందరూ తమ తమ వేదికల మీదికి ఆహ్వానించిరి. వారాయన కొరకు ఇష్టపడుచుండిరి. కాని ఒక దినమున ఆయనకూర్చొని నేను, తండ్రి ఏకమైయున్నామని చెప్పెను. సోదరుడా, ఆ తరువాత ఆయన ప్రసిద్ధి చెందలేదు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున వానిని నేను లేపుదును. అని ఆయన చెప్పగానే ప్రసిద్ధిని పొగోట్టుకొనెను.
ఇతడు పిశాచి, ఇతడు బయల్జెబూబు. ఇతడు అదృష్టములు చూచును. ఇతడు ఈలాగే క్రియలు చేయుచున్నాడు. ఇతడు మనస్సులను చదువుచున్నాడు. ఆలోచనలను బయటపెట్టుచున్నాడు అనిరి. కాని ఆయన ఆ ఘడియకు బయలుపరచబడిన వాక్యమై యున్నాడు. ఆయనకు పనియున్నది. తండ్రిని సంతోషపరచు కార్యములనే ఆయన ఎల్లపుడును చేయుచుండెను. తండ్రిని సంతోషపరచు కార్యములనే ఎల్లపుడూ మనము చేయుటకు దేవుడు సహాయము చేయును గాక!
మీరందరూ అర్థము చేసికొనిరని నేను నమ్ముచున్నాను. ఈ వర్తమానములు మరియు సంగతులు గూర్చి మీరు నాతో ఏకీభవించని యెడల కనీసము నా పట్ల మర్యాద చూపండి. నేను తర్షీషుకు వెళ్ళుట లేదు. నాకు ఒక బాధ్యత యున్నది. నేను నీనెవేకు పయనించుచున్నాను. నేను హెచ్చరించవలసి యున్నాను. ప్రభువు మిమ్మునందరినీ దీవించునుగాక!
78ఇపుడు ఒక క్షణము మనము తలలు వంచుదము. ఇపుడు 9:30 అయినది. మిమ్మును ఇక పంపించుదును. కాని ఈ రాత్రికి నేను చెప్పవలసినది చెప్పగోరాను. క్రీస్తునందుండగోరు వారు ఇచ్చట కొందరుండియుందురు. మీకు ఆ కోరిక యున్నది. మీరు చేతులెత్తి ఇట్లు చెప్పండి, బ్రెన్‌హాం సోదరుడా, నా కొరకు ప్రార్థించుము. దేవుడు మిమ్ము దీవించును. ఆ చేతుల వైపు చూడండి. బ్రెన్‌హాం సోదరుడా, నేను దేవునికి దగ్గరగా జీవించగోరుచున్నానని చెప్పండి. మీరు శిరములు నెత్తి యున్నారు. నా చేతులను ఎత్తియున్నాను. అందుకొరకే నేనిచ్చట యున్నాను. నాకు మీవలెనె ఆకలియున్నది.
ఒక దినమున ఒక గొప్ప సంగతి జరిగినది. ఏమి చేయవలెనో ఇపుడు నాకు తెలిసినది. దేవుడు మీకు సరియగు అవగాహన ఇచ్చునట్లుగా ప్రార్థించుచున్నాను. మీ మనస్సులో ఏదయినా ప్రశ్న యున్నచో దానికి ఎక్కడో ఒక జవాబు కూడా ఉండి యుండునని మరువ వద్దు. ఈ సమయములో దేవుడు ఆ ప్రశ్నకు జవాబు ఇయ్యవలెనని ప్రార్థించుచున్నాను.
మీరు రోగులయినచో దేవుడు మిమ్మును బాగుచేయును. స్వస్థతా కూటములు మీకుండును. ప్రతి రాత్రి జరుగుచున్నవి. రోగులకు ప్రార్థించనైయున్నాము. మీకు మేము చేయకలిగిన ప్రతి సహాయమును చేయుదుము. మీకు చేతనైన సహాయము మాకు చేయుడి. మనమందరము కలిసి పని చేయుదము. దేవుడు గొప్ప కూటమును ఇచ్చునని నమ్ముచున్నాను.
MATT 5:6•
MATT 24:28•
LUKE 17:37
79తండ్రియగు దేవా, ఈ కొద్ది మాటలు నేను వచ్చిరానట్లు చెప్పియున్నాను. ప్రభువా, ఆ చెప్పబడిన ఈ మాటలు నీ చేతిలో యున్నవి. వాటిని నేను ఎదుర్కొందును. ఆ మాటలు ఎన్నడునూ గతించవు. అవి భూమి చుట్టూ పరిభ్రమించుచున్నవి. అవి నమోదగుచున్నవి. వాటిని ఒక దినమున మరల నేను ఎదుర్కొందును. ప్రభువా, బహు యధార్థతతో నేను వీటిని చెప్పి యున్నట్లుగా గ్రహించియున్నాను.
ప్రభువా, ఈ రాత్రి ఈప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుచున్నాను. వారు నీ పిల్లలు. ఓ దేవా, ఈ వారము గతించక ముందే వారి మనస్సులలో యుండిన ప్రశ్నలు పరిష్కరించబడునట్లు కృప చూపుడి. వారు దానిని గ్రహించెదరు గాక! ప్రభువా, నీ కృప చూపుము.
తండ్రీ, ఇంకా నిన్ను రక్షకునిగా ఎరుగని వారు కొందరు ఇక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడని వారు ఇచ్చటున్నారు.ఈ రాత్రి వారికి దయ చూపుము.
ప్రభువా, నేను ఎవరినీ పరిశుద్ధాత్మతో నింపజాలను. ఎవరినీ నేను రక్షించలేను. నీవు చెప్పినది మాత్రమే వారికి నేను చెప్పగలను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తప్తిపరచబడుదురు. ప్రభువా, వారి హృదయములో అటువంటి ఆకలిని పుట్టించుము. ప్రభువా, చాలామందిలోఆకలిని కలుగజేయుము. ఈ మంచులో వారు వందల మైళ్ళు కారు నడుపుకొని వచ్చియున్నారు. ఎక్కడో మూలనయున్న ఈ చిన్న స్థలమునకు వర్షపు పర్వతములు, ఎడారులు దాటి వచ్చియున్నారు. పీనుగు ఎక్కడుండునో గద్దలు అక్కడ పోగవును అని నీవు చెప్పి యున్నావు. ప్రభువా, నీ దైవ మన్నాతో మమ్మును పోషించుము. మాకు నిజంగా అవసరమయిన దానిని మా ఆత్మలకు దయచేయుము. తండ్రీ, మేము నీ కొరకు తృష్ణగొని యున్నాము. ఇపుడు మేము నీచేతులలో యున్నాము.
ఆ దినమున ఆ కొండ మీదికి దిగివచ్చిన ఆమహా పరిశుద్ధాత్మ ఈ దినమున ఇక్కడ చేరియున్న ప్రతి హృదయములోనికి వచ్చునట్లు కృప చేయుము. నీ మేలులతోను, కృప తోను నింపుము. ప్రభువా, మాకు అవసరమైన దానిని మేమ గ్రహించి యున్నాము. మేము అర్థము చేసికొనవలసి యున్నాము. మేము ఏమి చేయుచున్నామో మాకు తెలియని యెడల ఎట్లు మేము చేయవలెనో తెలియదు గదా? మాకు అవగాహన తప్పక కావలెను. ప్రవక్తయగు యిర్మీయా వ్రాతల ద్వారా దానియేలు గ్రహించెనని మేమెరుగుదుము. తండ్రీ, పరిశుద్ధాత్మ యొక్క వ్రాతల ద్వారా మేము గ్రహించుచున్నాము. ఈ ఘడియలో మాకది బయలుపరచును. దేవా, మా హృదయములో నీపట్ల గలవాంఛను నీవు తీర్చుము. తండ్రీ, నీ మహిమకొరకే మేము మెల్లగా దీనిని అడుగుచున్నాము. యేసు క్రీస్తు నామములో దయచేయుము.
80ఇపుడు మనము తలలు వంచియుండగా మన సోదరి పాటను ఎత్తును, ఆయన నాకు కృపను, మహిమను ఇచ్చును. నాతో కూడా సదా కాలము వచ్చును. మీరిపుడు నెమ్మదిగా ప్రార్థించండి. పరలోక తండ్రిని అడగండి. మీకవసరమయిన దానిని ఆయన ఈ రాత్రి మీకు అనుగ్రహించును.
ప్రియ సోదరీ, సోదరుడా, నీ హస్తము నీకుఎంత దగ్గరగా యున్నదో ఆయన నీకు అంత దగ్గరగా యున్నాడు. ఇతర విషయములలో మీరు నన్ను నమ్ముచున్నారు గదా ఆలాగే ఇందులోను నమ్మండి. ఇక్కడ ఆయన మీకు అవసరమగు ప్రతి దానిని అనుగ్రహించును.
గత చివరి కొద్ది వారములు నేను చాలా ఆకలి దప్పిక కలిగియున్నాను. మిమ్మును చూడవలెనను బెంగ కలిగియున్నాను. ఆ కారణము చేతనే నేను బిల్లీతో ఇంటికి వెళ్ళుదమని చెప్పాను.
ఆ చలి ప్రాంతమునకు వెళ్ళి మీరు ఏమి చేయుదురని నా భార్య ప్రశ్నించినది. నాకు గొంతు పుండుపడుచుండును. ఆ చలి వలన నా గొంతు బొంగురుపోవును. మాట కూడా రాదు.
అయినా ఎందుకో నాకు తెలియదు. నా స్నేహితుడు చార్లీ కాక్స్ వెనుక కూర్చొని యున్నాడు. అతడు ఉడుతను గూర్చి ఉప్పుడు చెప్పునా అని కుతూహలముతో చూచుచుందును. ఆ మాట వినవలెనని నేను ఆకలిగొనుచుందును. అది చెట్టు ఎక్కుట నేను చూడవలెను.
2KGS 20:1-6•
ISA 38:1-5
81నా సహోదరుడు బాంక్స్ చాలా జబ్బుపడెనని నాకు తెలియును. కొంత కాలం క్రిందట అతనిని గూర్చిన దర్శనం నేను చూచాను. అతడు పరుండి యున్నాడు. ఈ మధ్య అతడు దాదాపు మన నుండి దూరమై పోయినట్లు తలంచాము. చాలామందిని నేనుచూచుచున్నాను.
ఒక రాత్రి నేను క్రైస్తవ వ్యాపారుల కూటమునకు వచ్చాను. అది అంతర్జాతీయ కూటము. పేరు గల షకారియన్. అనగా డిమోస్ తండ్రి. అక్కడ కూర్చొని యుండి నా రాక కొరకు ఎదురు చూచెడి వాడు. నన్ను చూచి నవ్వెడి వాడు. చేయిని ఊపెడు వాడు. ఇపుడతడు లేడు. వెళ్ళిపోయెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో నేను వారి కుటుంబము యొద్దకు వెళ్ళాను. వారి కుమార్తె ప్లారెన్సు చావుబ్రతుకుల మధ్యయున్నది. ఆమె వెళ్ళిపోవుటను నేను దర్శనంలో చూచాను. ఆమె వెళ్ళిపోవుచున్నదని నాకు తెలియును. అయినా గాని ప్రార్థించుదమని నేను చెప్పాను. ఒకసారి ఒక ప్రవక్త ఒక రాజును ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పెను. అతడు ప్రార్థించెను. అతనికి పదిహేను సంవత్సరములు అదనంగా ఇవ్వబడెను. అందుకే నేను కూడా ప్రార్థించుదం అన్నాను.
82నేను విచ్చేసి ఒక రెస్టారెంటులో కూర్చొని భోజనము చేయుచున్నాను. ఒక వ్యక్తి నాయొద్దకు వచ్చి "నీవు బిల్లీ బ్రన్హం గదా?" అనడిగాడు.
"అవును" అన్నాను. నేను బహుశా అతనికి తెలియక పోవచ్చు. ఎందుకనగా నా బట్ట తలమీద చిన్న జుట్టు వంటిది అతికించుకొన్నాను. ఎందుకనగా చలి నుండి అది రక్షించును. చలి వలన గొంతు బొంగురు పోకుండా నేను దానిని తగిలించుకొన్నాను. అతడు నాకు దగ్గరగా వచ్చి బిల్లీ, నీవు నాకు తెలియును అన్నాడు.
"అవును. మరి నీవెవరవు?" అన్నాను.
"నేను జాన్‌వార్మన్‌ను" అన్నాడు.
"డిప్ ఎట్లున్నాడు?" అనడిగాను.
"బిల్లీ, అతడు చనిపోయాడు" అనెను.
83నేను కోర్టు నుండి వచ్చి నా పన్నులు చెల్లించాను. కోర్టు నుండి వచ్చుచుండగా ఒకామె నన్ను పిలచినది. జాన్ లేదా ఎడ్ అనుపేరు గలవ్యక్తి చనిపోయెనని నీకు తెలియునా అన్నది. ఆమెను నేనెరుగను. నేను సిగ్గుపడ్డాను. ఆమె ఎవరూ అని నేను ఆలోచించసాగాను. నాకు తెలియలేదు. ఆమె నన్ను ఇట్లు అడిగినది, ఒక చీకటి రాత్రి యందునది పొంగి పొర్లుచున్నపుడు చెస్ట్‌నట్ వీధి మొత్తం కొట్టుకొని పోయినది గదా? ఆ సమయంలో నీవు నీ ప్రాణమును సహితం లెక్కచేయక ఒకామెను, ఆమె పిల్లలను రక్షించావు గుర్తున్నదా?
"నీవు ఆమెవేనా?" అనడిగాను.
నేనే ఆమెను అని చెప్పి ఆమె ఆ పోయిన బిడ్డ గురించి ఏడ్వసాగినది. నా గాధను మీరెరుగుదురు. నా పిల్ల అని చెప్పిన ఆమెకు పెండ్లి అయి ఒక కుటుంబము ఉన్నది. చూచారా? ఇపుడామె ముసలిగా మారినది. జుట్టు పండినది. నేను కూడా ఆలాగే యున్నాను. ఒకరి తరువాత ఒకరు గతించిపోవుచున్నారు.
మాకు కూటములున్నవి. అందులో ఒక్కొక్కరు కనబడరు. దినములు గతించుచుండగా మనమందరమును కనబడకపోవుదము. కాని సోదరీ సోదరుడా, మనకు ఒక సమావేశ స్థలమున్నది. మనము సరిగానే యున్నామని నిశ్చయత కలిగి యుందము. మీరు ఆలాగు చేయరా? దేవునిని గూర్చిన మన అవగాహన, సంగతులు మొదలగునవన్నియూ వ్యర్థమగునట్లు చేయకుడి. మనము నమ్ముదము.
PROV 3:5
84తండ్రీ, వారు నీ చేతులలో యున్నారు. ప్రభువా, నేను నీ చేతులలో యున్నాను. రేపు రాత్రి నుండి ప్రారంభమగు కూటమునకు ఇపుడు సిద్ధపాటులో యున్నాము. అంతే. ప్రభువా, నీవు మాకు సహాయము చేయవా? మా యొక్క సంభాషణ నిరంతరము నీమీదే యుండును గాక. మా హృదయములు మరియు మనసులు నీ మీదనే యుండును గాక. మమ్మును పరిపూర్ణ సమాధానముతో ఉంచుదువని నీవు వాగ్ధానము చేసియున్నావు. బైబిలులోకూడా వ్రాయబడి యున్నది, మీ స్వబుద్ధిని ఆధారము చేసికోవద్దు. ఓ దేవా, మా స్వబుద్ధి అవసరము లేదు. నీ బుద్ధి మాకు కావలెను. ఓ దేవా, దానిని మాకు ఇమ్ము. మా ఆత్మలోనికి ఉజ్జీవము వచ్చును గాక. ఈ జనులు ఏకాత్మ, ఏక మనస్సు కలిగి యుందురు గాక! తండ్రీ, దానిని దయచేయుము. ఈ మనవులను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము.
నా ఆనందభరిత ఆత్మ
ఆ నదికవతల విశ్రాంతిని పొందు వరకు
సిలువ యందే నా మహిమ సదా యుండును. (మన చేతులెత్తెదము)
నా ఆనందభరిత ఆత్మ
ఆ నదికావల విశ్రాంతిని పొందువరకు.
యేసు నన్ను సిలువ యొద్ద ఉంచును
అక్కడ ఒక ప్రశస్త ప్రవాహమున్నది
ఉచితపు స్వస్థతా ప్రవాహమున్నది (అవును ప్రభూ, ఉచితమే)
కల్వరి కొండ నుండి ప్రవహించుచున్నది.
సిలువ యందే సిలువ యందే
నా మహిమ సదాయుండును
నా ఆనందభరిత ఆత్మ
ఆ నదికావల విశ్రాంతిని పొందువరకు.
85[సంగీతమును సహో. బ్రెన్‌హాం పాడనారంభించుచున్నారు-సంపా॥] ఓ దేవా! మీలో ఎవరయినా గాని ఇక్కడి బలిపీఠము వద్దకు వచ్చి మోకరించవలెనని కోరుచున్న యెడల రండి. వచ్చి ఈలాగు చెప్పండి. ప్రభువా, నేను ఉండవలసిన రీతిలో లేను. నేను మరల సమర్పించకొనగోరుచున్నాను. ప్రభువా, ఈ రాత్రే దానిని చేయగోరుచున్నాను. మిమ్ము ఆహ్వానించుచున్నాము. నీతో కలిసి ప్రార్థించుట కొరకే మేము ఇచ్చట యున్నాము. సిలువయందే,సిలువ యందే
ఓ! సదా నేను అతిశయించుదును
నా ఆనందభరిత ఆత్మ
నదికావల విశ్రాంతిని పొందువరకు.
యేసూ, నన్ను సిలువ చెంతనుంచుము.
ఒక ప్రశస్త ప్రవాహమున్నది.
అందరికీ ఉచిత స్వస్థత ప్రవాహమున్నది
కల్వరి కొండ నుండి ప్రవహించుచున్నది.
సిలువ యందే, సిలువ యందే
సదా నేను అతిశయించుదును.
నా ఆనందభరిత ఆత్మ
నదికావల విశ్రాంతిని పొందువరకు.
86మనము ప్రార్థించుదము. మీరు ఒక్కొక్కరు ఇపుడు మీ స్వంత విధానములోప్రార్థన చేయండి. సమయము గూర్చి మరచిపొండి. ఆయన సన్నిధిలోమనము తలలు వంచుదము. యేసూ, నిన్ను ప్రేమించుచున్నాను అని ఈ స్త్రీ మొరపెట్టుచున్నది. ఎన్నో సంవత్సరాల క్రితం నీవు రక్షింపబడియుండుట నీకు గుర్తున్నది. అది ఎంత మాధుర్యముగా ఉన్నదో నీవెరుగుదువు. ఈ రాత్రి ఆయన అంతే మాధుర్యముగా యున్నాడు. మనము ప్రార్థించుదము. అందరూ తమ స్వంత విధానములో ప్రార్థించుకొనండి. మనందరము దేవునికి సమర్పించు కొందము. ప్రభువునకు మనలను సమర్పించుకొందము.
87ప్రియ ప్రభువగు యేసూ, నీవే నా ఆదరణకర్తవు. ఈ జీవితము కంటె మిన్నయైన వాడవు. ఈ భూమి మీద నాకు నీవు గాక ఇంకెవరున్నారు? పరలోకమందు నీవు తప్పనాకు ఎవరు ఉన్నారు? ప్రియదేవా, మా ప్రతి ఒక్కరి మీదికిని నీకృప మరియు దయ పంపించబడునట్లుగా ప్రార్థించుచున్నాము. మేము ఈ బలిపీఠము యొద్ద చేరియున్నాము. చాలా మంది రాలేక పోయిరి. వారు కూర్చొనియున్న స్థలములోనే నీవు వారిని కలిసికొనుము. ప్రభువా, మేము దేనిని సమర్పించినా గాని నీవు ఇష్టపూర్వకముగా స్వీకరించెదవు. మా సమయమును మేము సమర్పించిన యెడలనీవు స్వీకరించెదవు. మా తలాంతును నీవు స్వీకరించెదవు. కాని ప్రభువగు దేవా, ఈ దినము మేము దానిని దాటి వచ్చుచున్నాము. మా సమస్తమును నీకు సమర్పించుచున్నాము. ప్రభువా, నాకున్నదంతయూ, ఉండబోవునదంతయూ నీలోనే యున్నది. ప్రభువా, నాకున్నదంతయూ, నీలోనే యున్నది. ప్రభువా, మా ప్రార్థనలను నీ హృదయములో చేర్చుకొనుమని అడుగుచున్నాము. పరిశుద్ధాత్మ యొక్క మహా లోతును మాకు దయచేయుము. మా జీవితములు మారిపోవును. ఇపుడు మేము అంతమునకు సమీపించియున్నామని ఎరుగుదుము. ఎంతో కాలముండదు.మా ప్రియులు దినదినము గతించిపోవుటను మేము చూచుచున్నాము. వృద్దులు, యువకులు రాలిపోవుచున్నారు. త్వర లోనే అది మా తలుపును తట్టునని మేమెరుగుదుము. ప్రభువా, ఈ రాత్రి ఇంకా మామతి బాగున్నది. ఇక్కడ కూర్చొని యున్నాము. మోకరించి యున్నాము. నిలబడియున్నాము. మేము ఏ స్థితిలోయున్నాగాని ప్రభువగు దేవా మమ్మును చేర్చుకొనుము.
ప్రభువా, నన్ను తీసికొనుము. నా యొద్ద ఏమియూ లేదు. కాని ప్రభువా, నా యొద్ద ఏమి యున్నా గాని అని నీకు ఉపయోగపడినచో వాడుకొనమని నీకు సమర్పించుకొనుచున్నాను.
88ప్రియదేవా, ఈ ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఈ ప్రియ జనుల కొరకు నేను ఆరిజోనా కొండల్లో నిలబడి నీకు మొరపెట్టాను. వారిపుడు ఈ బలిపీఠము చుట్టూ మోకరించి ప్రార్థించుచున్నారు. వారు ఈ రాత్రి తమ జీవితములను సమర్పించుకొనుచున్నారు. తండ్రీ, మా ప్రాణముల కంటె ఎక్కువగా నిన్ను మేము ప్రేమించుచున్నాము. మా కుటుంబముల కంటె ఎక్కువగా నిన్ను మేము ప్రేమించుచున్నాము. మా కుటుంబముల కంటె ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్నాము. మా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీలు మొదలగు వారిని ప్రేమించిన దాని కంటె ఎక్కువగానిన్ను మేము ప్రేమించుచున్నాము. ప్రభువైన యేసూ, నిన్ను మేము ప్రేమించుచున్నాము. ప్రభువా, దానిని మా హృదయములో ఒక వాస్తవికతగా మార్చుము. ప్రభువా, ఈ వారములో మా హృదయములందు నీ ఆనందతైలమును పోయుము. మాకు వాక్యపు స్నానమును దయచేయుము. వాక్యమను నీటితో కడుగుము. సత్యముతో మమ్ము విభజించుము.
ప్రభువా, ప్రాముఖ్యమగు విషయముల గూర్చి తికమకపడుచున్న వారు ఈరాత్రి చాలామంది ఇక్కడ ఉండి యుందురు. ఓ దేవా, దేవుని గృహములో యున్న ప్రవాహమును మా కొరకు తెరచి శుద్ధీకరించుము. నీ రక్తములో మమ్మును కడిగి శుద్ధి చేయుమనియు, నూతన సష్టిగా మమ్మును చేయమనియు నీకు ప్రార్థించుచున్నాను. దైవ ప్రత్యక్షతతో వాక్య సత్యమును బోధించు బలము మరియు కృపలను దయ చేయుము. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మాకిమ్ము. ప్రభువా, ఆయనే మా ముందర ప్రత్యక్ష మగును గాక! ఆయన వచ్చి మా రోగములను బాగు చేసి, మా పాపములను క్షమించి, మంచి సంతోష సంగతులతో మా ఆకలిగల హృదయములను నింపును గాక! మా జీవితములో సువార్త బయలుపరచబడు గాక! ప్రతి సంఘకాపరిని, ప్రతి గాననాయకుని, ప్రతి ఆదివారపు బడి ఉపాధ్యాయుని దీవించుము. ప్రభువా, మా అందరినీ కలిపి దీవించుము. ఏలయనగా నిజంగా మేము నిన్ను ప్రేమించుచున్నాము. ప్రభువా, ఇపుడు మేము నీకు సమర్పించుకొని నీవారమైనాము. యేసు క్రీస్తు నామములో నీ స్వచిత్తానుసారముగా ఇపుడు మమ్మును వాడుకొనుము.
89నా విశ్వాసము నీవైపే చూచును
ఓకల్వరి గొర్రెపిల్లా, దైవ రక్షకా,
నా ప్రార్థనను వినుము
నా పాపమంతయూ పరిహరించుము
ఈ దినము నుండి
పూర్తిగా నీవానిగా చేయుము.
మీకది ఇష్టమేనా? మరల దానిని పాడుదము.
జీవితపు చీకటిపుంతను నేను తొక్కుచుండగా
నా చుట్టూ దుఃఖమావరించుచుండగా
నీవేనా మార్గదర్శకునిగా యుండుము
చీకటిని పగటిగా మార్చుము.
దుఃఖమును, కన్నీటిని తుడిచివేయుము
నీ ప్రక్కనుండి
ఎన్నడూ తొలగిపోనియ్యకుము.
అది మీకు సంతోషము కలిగించుట లేదా? ఆ పాత పాటలను ఎందరు ఇష్టపూర్వకముగా పాడుచున్నారు? నాకవి చాలాఇష్టము. మీకు ఇష్టమేనా?
మనము సీయోనుకు వెళ్ళుచున్నాము
అందమగు, సుందరమగు సీయోను.
మనము సీయోనులోనికి వెళ్ళుచున్నాము
అది అందమగు దేవుని పట్టణము.
ఓ! మనము సీయోనుకు వెళ్ళుచున్నాము
ఓ! అందమగు, సుందరమగుసీయోను
అది అందమగు దేవుని పట్టణము
మనము సీయోనుకు వెళ్ళుచున్నాము.
ఓ! మనము సీయోనుకు వెళ్ళుచున్నాము
ఓ! అందమగు, సుందరమగుసీయోను
మనము సీయోనుకు వెళ్ళుచున్నాము
అది అందమగు దేవుని పట్టణము.
ప్రభువును ప్రేమించు మనం వచ్చుదం
మన ఆనందము తెలియచేయుదము
మధురఐక్యతతో ఆపాట పాడుదం
మధురఐక్యతతో ఆపాట పాడుదం
ఆలాగు సింహాసనమును చుట్టుదం
ఆలాగు సింహాసనమును చుట్టుదం
దానిని పాడుచుండగా మనం లేచినిలబడి ఒకరితో ఒకరం కరచాలనం చేయుదము.
మనం సీయోనుకు వెళ్ళుదం
అందమగు, సుందరమగు సీయోను
మనం సీయోనుకు వెళ్ళుదం
అది అందమగు దేవుని పట్టణము.
ఇపుడు మనము మన చేతులు దేవుని వైపుకు ఎత్తుదము.
ఓ, మనం సీయోనుకు వెళ్ళుదం
అందమగు, సుందరమగు సీయోను
మనం సీయోనుకు వెళ్ళుదం
అది అందమగు దేవుని పట్టణము.
ఓ, మనం సీయోనుకు వెళ్ళుదం
ఓ, అందమగు, సుందరమగుసీయోను
మనం సీయోనుకు వెళ్ళుదం
అది అందమగు దేవుని పట్టణము.
అది మీకు అద్భుతముగా లేదా? మనం చేతులెత్తిమన స్వంత విధానములో ఆయనను స్తుతించుదము.
90ప్రభువైన యేసూ, నీవు షారోను పుష్పము, లోయలోని పద్మము, కాంతి గల ఉదయ నక్షత్రము, పదివేలలో అతి ప్రియునిగా యున్నావు. నా జీవితమంతటికీ నీవే ఆధారము. నా ప్రాణము కంటెమిన్నయైన వాడవు. మేము నిన్ను ప్రేమించుచున్నాము. [సహో॥ బ్రెన్‌హాం దేవుని ఆరాధించి స్తుతించుచూనే యున్నారు-సంపా॥]
…సిలువ చెంత
నామహిమ యుండును
నా ఆనందభరిత ఆత్మ
నదికావల విశ్రమించు వరకూ
మన కొరకు మన ముందు ఏదో యున్నదని నా కనిపించుచున్నది. గుర్తుంచుకొనండి. నేను ప్రవచించుచున్నానని నమ్ముచున్నాను. గొప్ప ఆనందము, చాలా మంది విషాద హృదయములతో యున్నారు. గొప్ప మర్మములు బయలు పరచబడును. చింతగా నున్న వారు ఆనందములోనికి మారుదురు. వారి దుఃఖము, సంతోషముగా మారును.
సిలువ చెంత, సిలువ యందు
నామహిమ సదాయుండును
నా ఆనందభరిత ఆత్మ
నదికావల విశ్రాంతిని పొందు వరకూ.
1JN 4:7
91ఆనాటి యోహాను బోధించలేనంత ముసలివాడాయెను. అయితే అతడు తన బలమంతటితో ఇట్లనెను, చిన్న పిల్లలారా, ఒకరి నొకరు ప్రేమించుడి. ఒకరినొకరు ప్రేమించుట, మీ మధ్యకు మరి దేనినీ రానీయదవద్దు. చూచారా? ఏది ఏమైనా గాని దానిని ఎదుర్కొనండి. మనం నీనెవే మార్గంలో యున్నాము. చూచారా? మిమ్మును సహవాసము నుండి వేరు చేయు ఆ పాత తర్షీషు ఓడనుఎక్కకండి. దేవుని దీవెన యొక్క ప్రవాహములోనికి మనం కదలుదము. దానిని మనము పొందబోవుచున్నాము. మన తండ్రిని నమ్ముచున్నాను.
92సోదరీ, ఇపుడు బావున్నదా?మంచిది. ఆ విధంగా పుట్టిన పిల్లలను నేను చూడగోరుచున్నాను. ఈ నేల మీద ఇదే ప్రాతిపదిక చొప్పున ఎన్నివేలమంది దేవుని యొక్క రాజ్యములోనికి ఇన్ని సంవత్సరముల నుండి వచ్చియున్నారో నేనూహించలేను. ఎనబది సెంట్లు పుచ్చుకొని ఈ ఆలయం నిర్మించటానికి మనం నిలబడియున్నపుడు ఎందరో నవ్వారు. కాని ఆయన ఇట్లు చెప్పెను, యెహోవానగు నేను దానిని నాటియున్నాను. దానికి దివారాత్రులు నేను నీరు పోయుచున్నాను. దానిని ఆయనే చేసెను. దానిని ఆయనే చేసెను. దేవుడు మిమ్ము దీవించును!
93మనం తలలు వంచియున్నాము. రేపు రాత్రి గూర్చి గుర్తుంచుకొనండి. ఇక్కడి స్కూలు ఆడిటోరియంలో ఆరాధన జరుగును. అక్కడికి జనులకు దాని చూపించుటకు ఇక్కడ ఒకరిని ఉంచెదము. ఎందుకనగా క్రొత్తవారు వచ్చెదరు.
ఆయనను ప్రేమించువారు "ఆమేన్" చెప్పండి. ఓ! ఈయన అద్భుతమైన వాడుకాడా?
నేను ఈ దరిని నిలబడి ఆపాత పాట పాడితిని.
యోర్దాను యొక్క తుఫాను దరిని నేను నిలబడి యున్నాను.
ఆలోచించండి. అది ముప్పది సంవత్సరాల క్రితం మాట.
ముప్పది మూడు సంవత్సరాలాయెను)
దాని వైపు తేరి చూచాను.
కనాను యొక్క అందమగు, చక్కని భూమిని చూచాను
అక్కడే నా స్వాస్థమున్నది.
ఆ సాయంకాలమున నేను బాప్తిస్మమిచ్చిన వారు ఇపుడిచట చాలామంది యున్నారు. వారచట నిలబడి పరలోకము నుండి ఉదయ నక్షత్రము దిగివచ్చి వృత్తము వలె ఏర్పడుటను చూచిరి. అపుడిట్లు చెప్పబడెను, క్రీస్తు యొక్క మొదటి రాకకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లుగా నీ వర్తమానము రెండవ రాకడను చాటించును! దానినెట్లు తలంచుదురు? కాని దేవుని మాటలన్నీ సత్యము. మనము గొప్ప రాజు యొక్క సన్నిధిలో జీవించుచున్నాము. దేవుడు మిమ్ము దీవించు గాక!
మనము తలలు వంచి యుండగా మన ప్రశస్త సంఘకాపరియగు సహో. నెవిల్ ఇక్కడికి వచ్చి ప్రార్థించి ముగించవలెనని కోరుచున్నాను. నెవిల్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక!