ఈ దినము ఈ లేఖనము నెరవేరినది

ఈ దినము ఈ లేఖనము నెరవేరినది

1అట్లే నిలబడి యుండగా, మీరు కోరినట్లయితే, ప్రార్థనకు మన తలలు వంచుదము.

ప్రియ పరమతండ్రి, ఈ మరియొక అవకాశము బట్టి ఈ రాత్రి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క ఈ మహత్కర మహిమాన్విత సువార్తను న౦దించు భాగ్యము నిమిత్తము వందనములు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ చలి వాతావరణములో ఇక్కడికి చేరి వచ్చిన జనుల నిమిత్తము వందనములు. గొప్పవాటి కొరకు ఆశించి ఎదురుచూచుచున్నాము. దేవుని యొద్ద నుండి ఒక అసాధరణమైనది అనుగ్రహించబడునని నమ్ముచున్నాము. ప్రభువా, ప్రతి కూటమునకు అదే ఆశతో వచ్చుచున్నాము. ఆలయములో మొన్న రాత్రి జరిగిన ఆరాధనలను బట్టి వందనములు. గత సాయంకాలము మరియు నేడు ఆలయములో జరిగిన ఆరాధనలను బట్టి వందనములు. ఈ రాత్రి నీవు మాకిచ్చు దాని కొరకు చూచుచున్నాము.

తండ్రీ, చేతులు కదప కలిగిన వారెవరైనా గాని బైబిలులోని పేజీలను త్రిప్పగలరు, కాని దానిని సజీవముగా, వాస్తవముగా చేయువాడవు నీవు మాత్రమే. తండ్రి, ఈ రాత్రి నీవాలాగు చేయుదువని ఎదురుచూచుచున్నాము. అన్ని విధములుగా మమ్మును దీవించుము. ఇన్ని సంవత్సరములు మేము ఎవరిని ప్రేమించి ఎవరి కొరకు జీవించామో, ఆయనను ముఖాముఖిగా సమీపించు సమయము వచ్చుట చూచి మా హృదయములు ఆనందముతో నిండియున్నవి. ప్రభువా, చాలామంది కొత్తగా వచ్చియున్నారు. గత రాత్రి ఆరాధన వలన నలుబది లేదా ఏబది మంది మూకుమ్మడిగా నీ నామములో బాప్తిస్మము పొందుటకు ఉదయము వచ్చిరి. ఓ దేవా, సువార్త వెలుగును చూచిన ప్రతి దేవుని సంతానము నీ యొక్క మందలోనికి వచ్చునట్లు ముందే నీవు నిర్ణయించితివి. ఆలాగు నీ పని కొనసాగించుమని ప్రార్థించుచున్నాను.

ఈ రాత్రి నీ వాక్యము వెనుక మమ్మును దాయుము. లోక విషయములలో గ్రుడ్డివారినిగా చేయుము మరియు యేసును చూడనిమ్ము. ఈ రాత్రి ఏ మానవుని కాదు గాని యేసును మాత్రమే చూచు ఆ రూపాంతరపు కొండ అనుభవము మేము పొందుదుము గాక. ఆయన సువార్త ప్రత్యక్షత మరియు ఆయన మహిమ నిమిత్తము ఈ మనవులు ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనండి.

2ఈ బల్లను కొద్దిగా ప్రక్కకు జరుపవలెను, అప్పుడు రెండు వైపులలో నున్న జనులను చూడగలను. ఈ మైక్రోఫోనులు ఆటుంచవచ్చును. ఒక్క క్షణము పాటు ఈ మార్పు చేయుదము.

ఆరిజోనా, కాలిఫోర్నియో, టెక్సాస్, ఇంకా అమెరికాలోని పలు ప్రదేశములలో యుండి టెలిఫోను ద్వారా వినుచున్న మా స్నేహితులను ఈ ప్రధాన ఆడిటోరియం నుండి అభినందించుచున్నాము. టెలిఫోను ద్వారా ఈ రాత్రి వర్తమానము దేశవ్యాప్తముగా వెళ్ళుచున్నది. దేవుడు మనలను దీవించునని నమ్ముచున్నాను.

ఆడిటోరియమునకు ఆ ఎడమ ప్రక్క వెనుక కూర్చున్న వారికి వినబడుచున్నదా? మంచిది, ఈ టెలిఫోను వ్యవస్థ సరిగా పనిచేయుచున్నదో లేదో వారు ఇప్పుడు పరీక్షించుచున్నారు.

3ఈ రాత్రి అందరూ ఆనందముగా ఉన్నారా? సరి, అది మంచిది. ఈ వైపునున్న వారు బాగున్నారా? ఆమేన్. మీరందరూ చక్కగా కూర్చోకలిగినందుకు నాకు సంతోషముగా ఉన్నది. రేపు రాత్రి ఇంకా జనులు ఎక్కువగా వచ్చినచో టెలిఫోనును ప్రత్యెకముగా అమర్చుదుము. ఈ రాత్రికి ఆ ఏర్పాటు చేశాము. కొందరు ఆలయములో కూడి యున్నారనుకొనుచున్నాను. రేపు ఉదయము ఆరాధన ఈ ఆలయంలో ఉండదు, ఎందుకనగా రేపు మధ్యాహ్నము జరుగు ఒక పెండ్లి కొరకు ఆలయమును అలంకరించుదురు. మన సహచరులలో ఒకరయిన సహోదరుడు రడెల్ ఆలయమునకు (మన సహచరుడు) రేపటి ఆరాధన మార్చబడినది. అది 62 మార్గములో యున్నది. అది ప్రకటించారా? దానిని ప్రకటించిరి. అది గాని జనులకు సరిపడనిచో కొందరిని క్లార్క్స్-విల్ లో నున్న సహోదరుడు జూనియర్ జాక్సన్ అను మరో సేవకుని యొద్దకు పంపించెదము. సహోదరుడు రడల్ ఆలయము మనకు దగ్గరగా నున్నది గనుక అక్కడ ఏర్పాటు చేశాము. దానిని మీరు తేలికగా కనుగొనగలరని మేము తలంచాము. దాని గూర్చి మేము పనిచేయుదుము. రేపు బాప్తిస్మమునకు ఇంకా వందమందికి పైగా యున్నారని నేను తలంచుచున్నాను.

మరియు రేపు రిత్రి…

4మరి ముందుగా నేను దేనినీ ప్రకటించుటకు ఇష్టపడను. ఒక రోజు ముందుగా మాట్లాడనైయున్న దానిని గూర్చి ప్రకటించుట సరియే. మెల్కీసెదెకు ఎవరు? అను అంశము మీద నేను మాట్లాడెదను. ఈయనెవరు? అని ఈ కాలములో ప్రశ్నించుచున్నారు గనుక ఆ ప్రత్యక్షతను ఇప్పుడు తెలియచేయుట అవసరము. ఆయనెవరో దేవుడు జవాబును దయచేసెను. ఆయన ఒక యాజకత్వమునకు సూచన అని, మరికొందరు రాజు అని చెప్పుచున్నారు. ఒక ప్రశ్న వచ్చినపుడు దానికి జవాబు కూడా ఉండును. జవాబు లేని ప్రశ్న ఉండదు.

5ఇప్పుడు, ఈ రాత్రి ఆయన వాక్యము మనము చదువుచుండగా, ఆయన దీవెన మనపై యుండునని నమ్ముచున్నాను.

కార్లు నిలుపుచోటు పోలీసులతో మీరందరూ చక్కగా సహకరించిరని బిల్లీ చెప్పెను. అలాగే యుండుడి; అది చాలా మంచిది.

సమీప భవిష్యత్తులో మనము ఒక గుడారము తెచ్చి ఈ పట్టణములోని పార్కులో వేసి మూడు, నాలుగు వారముల పాటు నిరాటంకముగా ఉజ్జీవ సభలు జరుపవలెనని ఆశించుచున్నాము. ఇక్కడ మనము ఒకరినొకరము తెలిసికొనకుండానే వీడ్కోలు చెప్పి వెళ్ళిపోవుచున్నాము. కాని ఒకటి రెండు రాత్రులలో ముగించక కొన్ని దివారాత్రులు వాక్యమును నేర్చుకొనుచూ ఉండిపోవలెను. కొందరు వెళ్ళి కోళ్ళకు మేత, ఆవులకు పాలు తీసి మరల వచ్చి ఆరాధనలో పాలు పొందుదురు. నాకది ఇష్టము. ప్రభువు మీకు తోడైయుండును గాక.

6ఇప్పుడు, ఆదివారము ఉదయము లేదా రాత్రి ఆరాధన తరువాత నేను వెళ్ళిపోవు ముందు (వీటిలో ఒకానొక కూడిక), మీరందరూ వివాహము, విడాకులు అను వర్తమానము వినుటకు, సత్యము తెలిసికొనుటకు చాలా ఎదురుచూచుచున్నారని నాకు తెలియును. అది ఈనాటి గొప్ప సమస్య. దేవుని యొక్క వాక్యములో సరియగు జవాబున్నదని నేను ఖచ్చితముగా చెప్పగలను. అందుకొరకే నేను తిరిగి వచ్చెదనని మీతో వాగ్దానము చేయుచున్నాను.

ఈస్టరు ఆదివారము ఈ జెఫర్సన్-విల్ లోని ఆరాధనకు నేను హాజరగుదునని తలంచుచున్నాను. సూర్యోదయ ఆరాధన జరుగును. ముందే దీనిని ప్రకటించెదము. ఆడిటోరియము కొరకు ప్రయత్నించెదము. సాధ్యమైనయెడల శని, ఆదివారములలో ఆరాధన జరుగును. సమయము దగ్గరవుచున్నది గనుక మొదట నా కార్యక్రమము చూచుకొనవలెను. కాలిఫోర్నియాలో నాకు కార్యక్రమమున్నది. అది అయిన వెంటనే ఆఫ్రికాకు వెళ్ళెదను. దానిని గుర్తుంచుకొని మా కొరకు ప్రార్థించండి.

MARK 6:4•

LUKE 4:21,23,24

 

7ఇప్పుడు, ఈ రాత్రి దేవుని వాక్యము వైపు మీరు దృష్టించండి. లూకా 4వ అధ్యాయము 16వ వచనము మొదటి భాగము చదువుదము. యేసు మాట్లాడిన భాగము:

… నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది.

ఆ వాక్యభాగము నుండి మనము దేవుని మాట ఎంత శక్తిగలదో చూడగలము. మనకు యంత్రములు తెలియును, కాని వాటిని కదిలించు శక్తి కావలెను. ఒక కారు యొక్క యంత్రములు మనకు తెలియును. కాని ఆ చక్రములు కదిలి పనిచేయవలెనన్నయెడల, శక్తి కావలెను.

ఇప్పుడు, యేసు పెరిగిన నజరేతునకు వచ్చెను, "నీవు కపేర్నహూములో ఫలాని ఫలానిది చేశావని మేము విన్నాము. నీ స్వదేశములో ఏమి చేయుదువో మేము చూడగోరుచున్నాము," అని వారనినట్లు ఈ వాక్యభాగము ద్వారా గమనించగలము.

ఒక ప్రవక్త తన స్వదేశములో ఘనుడు కాడని యేసు చెప్పెను. నీవక్కడే పెరిగావు, జనులు నిన్ను ఎరుగుదురు. ఆదిలోనే ఆయనకు చెడ్డ పేరున్నది. శరీర సంబంధమగు తండ్రి లేకుండా అతడు జన్మించెనని వారనిరి. వారాయనను అక్రమ సంతానమనిరి. యోసేపును అధికారికంగా పెండ్లి చేసికొనక ముందే మరియ గర్భమును ధరించెను అని వారనిరి. కాని అది అలా కాదు; అది ఆలాగు కాదు అను విషయము మనకు తెలియును.

8ఈ వాక్యము మీద నా కండ్లు పడుటకు ఒక కారణమున్నది. ఆరిజోనాలోని, ఫీనిక్సులో ఒక సంగతి జరిగినది. సంపూర్ణ సువార్తికుల అంతర్జాతీయ సభలో చివరి దినము నేను మాట్లాడవలసియున్నాను. ఈ సభకు ఒకాయన వచ్చెను. ఆయన ఒక కాతలిక్కు బిషప్పు. అతడు కల్ధీయ అపోస్తలుల కాతలిక్కు చర్చి యొక్క రెవరెండ్ జాన్. ఎస్. స్టాన్లీ, ఓ.ఎస్.డి. అమెరికా దేశ మెట్రోపాలిటన్ యొక్క ఆర్చ్-బిషప్పు అతడు. అది ఆతని కార్డు మరియు చిరునామా.

క్రైస్తవ పనివారల సదస్సునకు అతడు అతిధిగా వచ్చెను. ఆ ముందు రోజే అతనిని నేను చూచాను. శనివారము ఉదయాన అల్పాహారము తినుచూ నేను ముచ్చటించాను. అతడు నన్ను గమనించుచుండెను. అతడు నేను చెప్పుచున్న ప్రతిదానితో విభేదించుచున్నట్లు నాకు అర్థమయినది. అతని ముఖము, తల ఊపుట బట్టి అది గమనించెదము. అయితే ఖచ్చితముగా ఏ విషయంలో అతడు నిరాకరించుచున్నాడో నాకు తెలియలేదు.

JOHN 16:21

 

9ఆదివారము మధ్యాహ్నము నేను 'ప్రసవవేదన,' అను అంశము మీద మాట్లాడనైయున్నాను. ఒక స్త్రీ శిశువును కనుటకు ప్రసవవేదన పడునని యేసు చెప్పెను. నేను మాట్లాడవలసిన అంశము ప్రసవవేదన. అప్పుడు ఈ లోకమే ప్రసవ వేదనలో యున్నది. క్రొత్తది పుట్టుటకు గాను పాతది గతించవలెను. ఒక గింజ చనిపోయినపుడే, క్రొత్త మొక్క వచ్చును. ప్రపంచమును ప్రసవ నొప్పులు ఎట్లు తాకుచున్నవో చూడండి! మొదటి ప్రపంచ యుద్ధములో అది భయంకర నొప్పిని అనుభవించెను, ఎందుకనగా వారు విషవాయువు వదిలిరి. ప్రపంచమునే అది నాశనము చేయగలదు. మరియు రెండవ ప్రపంచ యుద్ధములో ఆమె మరొక భయంకర నొప్పిని అనుభవించెను; బ్లాక్-బస్టర్లు మరియు అణుబాంబులు వారి యొద్ద ఉన్నవి. మరో పురిటి నొప్పిని ఆమె తట్టుకొనజాలదు. నేడున్న ఈ క్షిపణులు మొదలగునవి దానిని అంతరిక్షములోనికి విసరివేయును. ఇప్పుడామె ప్రసవించును, మరియు క్రొత్త భూమి వచ్చునని బైబిలు చెప్పుచున్నది.

ప్రతి ప్రవక్త యొక్క వర్తమానము క్రిందను ఇశ్రాయేలు ప్రసవవేదన పొందెను. వేదాంత పండితులు, యాజకులు సంఘమును ఒక సంస్థగా మార్చివేసిన తరువాత ఈ ప్రవక్తలు రంగము మీదికి వచ్చిరి. ఈ ప్రవక్తలు: "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను సందేశము ద్వారా వచ్చిరి. వారు సంఘములను కదిలించిరి, మరియు ఆమె ప్రసవవేదన పొందినది. ఆమె ప్రసవవేదన వలన చివరకు సువార్త పుత్రుని కనినది. అదే శరీరధారియైన వాక్యము.

10మరల ఈ రాత్రి సంఘము నిజంగా ప్రసవ వేదనలో యున్నది. దేవుని కుమారుడు మరల పుట్టును. మన వేదాంత పండితులు, మన పద్ధతులు, మన శాఖలు, పూర్తిగా చెడిపోయినవి. కాబట్టి మనము ప్రసవ వేదనలో యున్నాము. దేవుని నుండి వచ్చిన వర్తమానము మరింత ప్రసవ వేదనను కలిగించును. అయితే కొంతసేపటి తరువాత ఆమె వధువును కనును. ఆమె యేసుక్రీస్తును వధువు యొద్దకు తెచ్చును.

అతడు నాతో చాలా విభేదించుచుండెను. నేను వర్తమానమందించుటకు లేచి నా బైబిలును తెరచాను. నా భార్య క్రిస్మసు కానుకగా నాకు ఒక కొత్త బైబిలు ఇచ్చెను. నా పాత బైబిలు పదిహేనేండ్ల క్రిందటిది. అది దాదాపు ఊడిపోయినది. నేను పేజీలు త్రిప్పుతుంటే అవి ఊడి వచ్చేవి. ఆ బైబిలును చాలా కాలము నేను వాడినందున, ఏ వాక్యము ఎక్కడున్నదో నాకు తెలియును. ఇప్పుడు కొత్తది వచ్చినది, కాని ఆ పాత దానితో చర్చికి వెళ్ళుట కూడా బాగుండలేదు.

11యోహాను సువార్త తెరచి వాక్యభాగము కనుగొనగోరాను. 16వ అధ్యాయము కొరకు వెదకగా, అది కనబడలేదు. చాలా వింతగా యున్నదే అనుకొని మరల తెరిచాను; కాని అది లేదు. లూసియానాలోని, శ్రివ్-పోర్టు నుండి వచ్చిన జాక్ మూర్ సోదరుడు, నాకు ప్రాణ స్నేహితుడు, అతడక్కడ కూర్చుని యుండెను. "అది యోహాను 16వ అధ్యాయములో ఉన్నదా?" అని అతనిని అడిగాను.

అతడు "అవును!" అని చెప్పెను.

అక్కడ దాదాపు వందమంది దైవజనులు కూర్చినియున్నారు. అందరిలో నుండి ఈ కాతలిక్కు గురువు లేచి నా యొద్దకు నడిచి వచ్చెను. అతడు అంగీలు ఇంకా ఏవేవో ధరించి యుండెను. నాకు దగ్గరగా వచ్చి "కుమారుడా! నిబ్బరముగా యుండు. దేవుడు క్రియ జరిగించబోవుచున్నాడు," అని చెప్పెను.

"ఒక కాలిక్కు బిషప్పు ఈలాగు నాకు చెప్పుటా!" అని అనుకొన్నాను.

"నా గ్రంధములో నుండి చదువుము," అని అనెను.

అతని గ్రంధములో నుండి నేను చదివాను, మరియు నా అ౦శము తీసికొని ప్రసగించాను.

నేను ముగించిన తరువాత వెళ్ళిపోయాను. ఆ తరువాత అతడు లేచి, "ఒక సంగతి జరుగనైయున్నది. సంఘము దాని గందరగోళ స్థితి నుండి బయటకు రావలెను, లేదా మనము సంఘము యొక్క గందరగోళ స్థితి నుండి బయటకు రావలెను," అని చెప్పెను. ఏదో ఒకటి చేయవలెను.

12నేను తిరిగి టుసాన్ కు వచ్చుచున్నాను. ఆ సాయంకాలము పిల్లలు రొట్టె కొరకు అడిగిరి. నేను ఒక చోట ఆగినపుడు, నా భార్య నాతో, "బిల్, నా జీవితంలో ఎన్నడూ అంతగా నేను ఆందోళన పడలేదు. నీవు బైబిలులో వెదకి కనుగొనలేక తడబడిపోవుట చూచి నేను వణకిపోయాను, అది నిన్ను ఆందోళన పరచలేదా?" అని అన్నది.

"లేదు!" వారు పేజీ పెట్టలేదు. అది ప్రింటింగ్ లో జరిగిన తప్పు," అన్నాను.

"నేను ఆ బైబిలు నీకు ఇచ్చాను గదా! అందరూ నన్ను చూచినట్లే నాకనిపించినది," అన్నది.

"అ౦దుకు నీవేమి చేయలేవు. అది ప్రింటింగ్ లో జరిగిన తప్పు. వారు ఎన్నడు ఆ పేజీని పెట్టలేదు," అన్నాను.

నేను దానిని మరల చూచాను. అక్కడ 16వ అధ్యాయమున్నది. అయితే రెండు పేజీలు అతుక్కున్నందున నేను 16వ అధ్యాయమునకు బదులుగా 17వ అధ్యాయమే చదువుచున్నాను.

"మంచిది, అది సరి. అది ఎదో ఒక కారణము కొరకే," అని నేను అనుకున్నాను.

ISA 61:1,2•

LUKE 4:16-21

 

13ఒక స్వరము బహు స్పష్టముగా నాతో ఇట్లు చెప్పెను, "ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఒక సమాజ మందిరములో ప్రవేశించెను. అది ఆయనకు వాడుక. యాజకుడు ఆయనకు చదువుటకు లేఖన భాగమిచ్చెను. ఆయన యెషయా 61 చదివెను. ఆయన లేఖనము చదివి కూర్చొనెను. తిరిగి ఆ గ్రంధమును యాజకునికి ఇచ్చెను. సమాజ మందిరములోని వారందరు ఆయననే చూచుచుండిరి. ఆయన నోట నుండి ప్రశస్తమగు మాటలు వచ్చెను, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది," అని ఆయన చెప్పెను.

ఈ దినము ఈ లేఖనము నెరవేరినది." లేఖనము ఎంత ఖచ్చితము! మన ప్రభువు చదివిన యెషయా 61:1-2 చూడండి. యెషయా 61:1-2 వచనము మధ్యలో ఆయన ఆగెను. అక్కడ ఇట్లున్నది, "ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించుటకు ఆయనాత్మ నా మీద యున్నది." ఇది చదివి ఆయన ఆగెను. ఎందువలన? తరువాత భాగము తీర్పునకు సంబంధించినది. ఆయన మొదటి రాకడకు చెందినది కాదు, కాని రెండవ రాకడకు చెందినది! అది అప్పుడు వర్తించదు; లేఖనము ఎన్నడూ తప్పు చేయదు. అదెప్పుడూ పరిపూర్ణము. వాక్యభాగము ఆగిన చోట యేసు ఆగెను, ఎందుకనగా అది ఆయన మొదటి రాకడలో నెరవేరవలసిన భాగము.

ఇప్పుడు, రెండవ రాకడలో ఆయన భూమి మీదికి తీర్పు తెచ్చును, కాని అప్పుడు కాదు. అప్పుడు హితవత్సరము ప్రకటించును.

EXOD 21:5,6•

LEV 25:9,10•

ISA 61:2•

LUKE 4:19

 

14ఆ కాలమునకు వాగ్దానము చేయబడిన వాక్యముతో తన్ను గుర్తింపచేసికొనుటకు మెస్సీయా వేదిక యొద్ద నిలబడియుండుట గమనించండి. సంఘము ముందు ఆ మెస్సీయా నిలబడియుండుట ఎంత వింత! "హితవత్సరము ప్రకటించుటకు," అని ఆయన చెప్పిన మాటలు ఎంత ప్రశస్తమైనవి! వాటిని చూడండి.

హితవత్సరము గూర్చి మనందరకి తెలియును. అది సునాద సంవత్సరమని బైబిలు చదువుచున్న మనకు తెలియును. వారందరూ బానిసలుగా, చెరలో నుండిరి. అప్పును చెల్లించుటకు వారు ఒక కుమారుని లేదా కుమార్తెను అప్పగించవలెను. వారు దాస్యములో నుండిరి. వారు దాస్యములో ఎంత కాలము ఉండవలసియున్ననూ, వారె౦త కాలము నుండి యున్ననూ లెక్క లేదు. సునాద సంవత్సరము వచ్చినపుడు, బూర మ్రోగును, స్వతంత్రునిగా పోదలచిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా పోవచ్చును. అతడు స్వతంత్రుడు; ఇక ఎంత మాత్రము బానిస కారు.

అయితే నీవు బానిసగానే నిలచియుండగోరినచో, నిన్ను ఆలయము నొద్దకు తీసికొని వెళ్ళెదరు. ఆలయపు స్తంభము దగ్గర నిలబెట్టి, ఇనుప పొగరుతో నీ చెవికి రంధ్రము చేయుదురు. అప్పుడు నీవు జీవించు శేష దినములన్నియూ బానిసగా పని చేయువలెను.

15యేసుక్రీస్తు సువార్తకు ఇది ఎంత చక్కని ఉదాహరణ! బోధించబడుచున్న కాలము అనుకూల సమయము. అదే సునాద సంవత్సరము. నీవెవరివైనా, నీ రంగు ఏదయినా, నీ శాఖ ఏదయినా, నీ పాపము, నీ పొరపాటు ఎంత గొప్పదయినా, ఆ సువార్త బూర మ్రోగుట నీవు వినినపుడు స్వతంత్రునిగా పోయేదవు. నీవు స్వతంత్రుడివి! కాని నీవు వర్తమానమునకు వీపు త్రిప్పి, దానిని వినుటకు నిరాకరించిన యెడల, నీ చెవికి ముద్ర వేయబడును. అనగా నీవు కృప మరియు తీర్పుకు మధ్య నున్న గీతను దాటిపోతివి, మరెన్నడు నీవు సువార్తను వినవు! మరెన్నడూ ముందుకు సాగవు; నీవిప్పుడున్న ఆ వ్యవస్థకు బానిసవగుదువు. నీవు సునాద సువత్సరమును వినుటకు నిరాకరించితివి గనుక నీ జీవిత దినములు ఇక అలాగే గడిపెదవు.

ఇప్పుడు, ఆ వాక్యములోని మరో భాగమునకు జవాబు చెప్పవలసిన అవసరము లేదు, ఎందుకనగా మెస్సీయా మరల వచ్చునపుడు తీర్పుండును.

LUKE 4:21

 

16ఇప్పుడు, ఆ జనులు ఆయనను ఎందుకు చూడలేకపోయిరి? ఎందువలన విఫలమయిరి? ఆయన అంత తేటగా చూపించినా, వారెందుకు చూడలేకపోయిరి? వారెందుకు చూడక తప్పిపోయిరి? ఎట్టి మాట! దాని గూర్చి ఆలోచించండి! "మీ కన్నుల యెదుట ఈ దినము ఈ లేఖనము నెరవేరినది!"

దానిని ఎవరు చెప్పిరి? దేవుడే, ఆయనే తన వాక్యమునకు అనువాదకుడు. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. మెస్సీయా ఆ జనుల ఎదుట నిలబడి తనను గూర్చిన వాక్యమును బైబిలులో నుండి చదివి, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది," అని చెప్పెను. అయినా వారు చూడలేకపోయిరి.

అదెంత విషాదము! అదే జరిగినది. చాలాసార్లు ఆలాగు జరుగుచున్నది. అదెట్లు జరుగగలదు? వాక్యమునకు మానవులిచ్చిన అనువాదమును నమ్ముట వలన ఆలాగు ఆయా సమయములలో జరుగుచున్నది. అదే కారణము. ఆనాటి నామకార్థ విశ్వాసులు లేఖనమునకు యాజకులు చెప్పిన అనువాదమునే తీసికొనుచుండిరి. అందుకే యేసు ఆనాటి ఏ సమాజమునకు చెందలేదు. వారి సహవాసము నుండి ఆయన వెలివేయబడెను. కాబట్టి వారు ఆయనను గుర్తించలేకపోయిరి, ఎందుకనగా ఆయన వారికి వేరుగా నుండెను. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము వింతగా నుండెను. ఆయన దేవుని కుమారుడని ఎవరయినా అందుమూలముగా చెప్పగలరు, ఎందుకనగా ఆయన తన్ను గూర్చి వ్రాయబడిన వాక్యమునకు పరిపూర్ణ గుర్తింపును పొందెను. ఏ క్రైస్తవుడయినా అలాగే గుర్తింపబడును — అతని జీవితమే అతడు క్రైస్తవుడని చాటించును.

HOS 11:1•

MATT 2:15•

LUKE 4:21

 

17"మీ కన్నుల యెదుటనే ఈ దినము ఈ లేఖనము నెరవేరినది," అని ఆయన నిలబడి వారితో చెప్పెను. అది ఎంతో తేటగా, సామాన్యముగా నున్నది, అయినాగాని వారు అర్థము చేసికొనలేదు. ఎందువలన? వారు ఎవరో యాజకుడిచ్చిన అనువాదమును వినుచుండిరి. చరిత్ర ఎల్లపుడూ పునరావృతమగును, మరియు వాక్యమునకు నానార్ధములుండును మరియు చాలా ప్రత్యక్షతలుండును.

"ఐగుప్తు నుండి నా కుమారుని పిలచితిని," అని యేసును గూర్చి పలుకబడిన మాట ఉదాహరణకు చూడండి. అతని యొక్క కుమారుడే. యాకోబు అను ఆయన కుమారుని ఐగుప్తు నుండి బయటకు పిలచెను. స్కొఫీల్డు ఇంకా ఆయా రిఫరెన్సులు మనకున్నవి. ఆ వాక్య భావము అదే. దానికి రెండు జవాబులున్నవి. అది యాకోబును పిలచుట, యేసును పిలచుట గూర్చియు చెప్పెను.

నేడును అలాగే యున్నది! మనము ఎంతో సంక్షోభములో యున్నాము. దేవుని యొక్క సత్యమును జనులు చూడలేకపోవుచున్నారు. దేవుని వాక్యమునకు చాలామంది మనవ-కల్పిత అనువాదము చెప్పిరి. ఆయన వాక్యమునకు అనువాదము చెప్పు మనిషి దేవునికి అక్కరలేదు. దేవుడే స్వంత అనువాదకుడు!

GEN 1:3•

ISA 7:14

 

18ఆదియందు దేవుడు వెలుగు కలుగును గాక, అని పలుకగా, వెలుగు కలిగెను. దానికి ఎట్టి అనువాదము చెప్పనక్కరలేదు.

"కన్యక గర్భవతియగును" అని ఆయన చెప్పగా, ఆలాగు జరిగెను. దానికి ఎట్టి అనువాదము అవసరము లేదు.

దేవుడు తన వాక్యమును నిరూపించి మరియు దానిని రుజువు చేయును. అదియే ఆయన అనువాదము — దానిని నెరవేరుట ద్వారా! దేవుని అనువాదము అదే, ఆయన తన వాక్యమును నెరవేర్చునప్పుడు; ఆయన దానిని నీకు అనువాదము చేయుచున్నాడు.

వెలుగు అనునది లేనప్పుడు మరియు ఆయన, "వెలుగు కలుగును గాక," అని పలికెను, వెలుగు కలిగెను; దానికి ఎవ్వరి అనువాదము అవసరము లేదు. కాని మానవ-కల్పిత పద్ధతులను అందులో మనము చేర్చుచున్నాము. మరియు ఆలాగు చేసినప్పుడు, మీరు గీత దాటుచున్నారు. ఎల్లప్పుడూ అలాగే జరుగుచున్నది.

19కాని అదెంత విపులముగా యున్నదో చూడండి. ఆ మెస్సీయా గూర్చి ఆలోచించండి! ఎందుకు వారాయనను చూడలేకపోయిరి? ఆయనను ఎరిగియుండ వలసిన వారి నాయకులే, వాక్యమును ఎరిగి, దానిని అర్ధము చేసికొని యుండవలసిన వారి నాయకులే ఈయనను చిన్నగా చూచిరి. ఆయన అక్రమ సంతామని చెప్పిరి. అందుకే నమ్మలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచినా మనము ఇంకా నమ్ముట లేదు; ఆయన కన్యకకు జన్మించిన కుమారుడు అని చెప్పుట కొరకు మనము చనిపోవుటకైనా సిద్ధమే. ఈనాడు మనము చెప్పుకొనుచున్న సంగతుల కొరకు, నేడు యెహోవా చేయుచున్న కార్యములను గూర్చి సాక్ష్యమిచ్చుట కొరకు రాబోవు కాలములో ప్రాణము పెట్టవలసి యుందుము. మృగపు ముద్ర వచ్చినపుడు వారాలాగు చేయవలసి యుందురు. ఈ విధముగా సువార్త బోధించుటకు మీకు వీలుండదు.

సంఘము అన్నియూ కలిసిపోవును. ప్రపంచ సంఘ సమాఖ్య నేడు ఏర్పడుచున్నది. నీ ప్రాణముతో నీవు నీ స్వంత సాక్ష్యమునకు ముద్ర వేయవలసియుందువు.

HEB 13:8

 

20ఇప్పుడు మీరు దానిని తప్పక నమ్మవలెను. ఆ యాజకులు ఆనాడు ఆయనను ఖండించిరి. "నేను ఆనాడు ఉండినయెడల ఆలాగు చేసియుండెడి వాడిని కానని," నీవనవచ్చు.

"మంచిది, అది నీ కాలము కాదు, అయితే ఇది నీ కాలము! ఇదే సమయము.

"మంచిది, ఇప్పుడాయన ఇచ్చటున్నచో…" అని నీవనవచ్చు.

ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని బైబిలు చెప్పుచున్నది; కాబట్టి ఆయన ఇచ్చటున్నాడు. ప్రపంచము నాగరికతతో గొప్పదైపోయి ఎక్కువగా విద్య నేర్చుకొనుచున్నది. ఆయనిక్కడ ఆత్మ రూపములో యున్నాడు. ఎవరూ ఆయనను చంపలేరు, మరణమునకు అప్పగించలేరు. ఆయన ఒక్కసారే చనిపోయెను; ఆయన మరల చనిపోడు. పాపము కొరకు దేవుడు చనిపోవలెనని తలంచి ఆయన శరీరము ధరించెను. అయితే ఈసారి ఆయన చనిపోడు; అది పరిశుద్ధాత్మ.

JOHN 5:2,3,5-8

 

21ఇప్పుడు, ఆయనకు విరోధముగా వారు జరిగించిన క్రియలను తలపోయలేము. మరొక విషయము, వారి పదవులలో ఆయన చేరలేదు. అయినాగాని వారాయనను చెడ్డవానిగా చిత్రించిరి. ఆయన వారి సంస్థలలో గాని, యాజక ధర్మములోగాని చేరలేదు. వారితో ఆయనకే సంబంధము లేదు. అంతేకాకుండా ఆయన వారు నిర్మించిన దానిని పెరికివేయగోరెను.

ఆయన ఆలయము లోనికి వెళ్ళెను. ఆయనను మనము సాత్వికుడని పిలచుచున్నాము. కాని చాలాసార్లు ఆయన దీనత్వమును మనము గ్రహించము, ఆయన జాలిగలవాడు, కాని కొన్నిసార్లు ఆయన జాలిని మనము చూడక తప్పిపోవుచున్నాము. మానవ సానుభూతి కాదు, కాని దేవుని చిత్తమును చేయుట. ఆయన బేతెస్థ కోనేటి గుమ్మము గుండా వెళ్ళుచుండెను. అక్కడ కుప్పల కొలదిగా జనులు పడియుండిరి. లెక్కకు మించినంత మంది ఉండిరి. కుంటివారు, గ్రుడ్డివారు, ఊచ చేతులు గలవారు ఇంకా చాలామంది రోగులుండిరి. ఆయనకు జనుల మీద దయయుండెను, కాని ఆయన ఒక వ్యక్తి యొద్దకు వెళ్ళెను. అతనికి గ్రుడ్డితనము, కుంటితనము ఏదీ లేదు. కొద్ది బలహీనత వలన లేవలేని స్థితిలో బహుశా ఉండియుండును. ముప్పది-ఎనిమిది సంవత్సరముల నుండి అతడు అలాగే పడియుండెను. ఆ వ్యాధి అతనిని చంపదు. అతడు పరుండి యుండెను.

అతని యొద్దకు వెళ్ళి, "బాగుపడగోరుచున్నావా?" అని ఆయనడిగెను.

"నన్ను నీటిలో దించువారు ఎవరును లేరు. నా కంటే ముందుగా ఎవరో ఒకరు దిగుతున్నారు," అని అతడనెను.

అతడు నడువలేడు; అతడు చూడగలడు; చాలా బలహీనుడు గనుక కదలలేడు.

యేసు అతనితో, "నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళుము," అని చెప్పెను. యేసును అందుకు ప్రశ్నించిరని మీరు వాక్యము బట్టి తెలిసికోగలరు.

DEUT 18:15•

JOHN 5:19

 

22ఆశర్యము లేదు! ఈ రాత్రి ఆయన జెఫర్సన్ విల్ వచ్చి అట్టి కార్యము చేసినా గాని ఆయన గూర్చి ఇంకా చెప్పుకొనుట మానరు. గుర్తుంచుకొనండి, ఆయన దేవుని చిత్తము చేయుటకు వచ్చెను, యోహాను 5:19లో ఆ జవాబు మీరు చూచెదరు, "కుమారుడు తనంతట తాను ఏదియూ చేయడు గాని తండ్రి చేయుచున్న దానిని చూచి కుమారుడు చేయునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని," ఆయన పలికెను.

"మీ ప్రభువగు దేవుడు నా వంటి యొక ప్రవక్తను మాలో పుట్టించునని," మోషే చెప్పిన ప్రవచనమునకు అది నెరవేర్పు అని వారు ఎరిగియుండవలసినది.

గమనించండి, ఆ వ్యక్తి చాలా ఏండ్ల నుండి ఆలాంటి స్థితిలో యున్నాడని యేసు ఎరుగును. ప్రవక్తగా నుండిన ఆయన ఈ వ్యక్తి స్థితిని చూచి అతనిని ఆ జన సమూహములో నుండి లేపెను. కుంటివారిని, గ్రుడ్డివారిని, ఊచ చేతులు గలవారిని ఆయన దాటిపోయెను. ఆయన జాలిగలవాడే; కాని జాలి అనగా దేవుని చిత్తమును చేయుట.

MATT 15:6•

MATT 21:12,13•

MARK 7:13•

LUKE 19:45,46

 

23ఆయన వారితో చేరలేదు, వారి పదవులతో ఆయనకు పొత్తు లేదు. ఆయన ఒక వెలివేయబడినవాడు. అంతే కాదు, ఆయన ఒక దినమున దేవాలయములోనికి వెళ్ళెను. ఆయన లోనికి వెళ్ళి చూడగా, ఆ దేవాలయము నేడు మన సంఘముల వలే చెడిపోయినది. అక్కడ అమ్మకములు, కొనుగోళ్ళు, రూకలు మారుట జరుగుచున్నది. ఆయన రూకలు మార్చు వారి బల్లలు పడద్రోసెను. త్రాళ్ళతో కొరడా పేని ఆ దేవాలయములో నుండి రూకలు మార్చు వారిని వెళ్ళగొట్టెను. వారి వైపు కోపముతో చూచెను. [హల్లెలూయా!] "నా తండ్రి ఇల్లు ఒక ప్రార్థనా గృహము, దానిని మీరు దొంగల గుహగా చేసియున్నారు! మీ పారంపార్యాచారముల వలన దేవుని ఆజ్ఞలను నిరర్థకము చేసియున్నారు," అని వ్రాయబడియున్నది మీ గూర్చేనని ఆయన పలికెను.

అటువంటి గుంపు ఎన్నడైనా ఆయనను నమ్మగలదా? లేదయ్యా! వారు పందుల మురికి వంటి అపవిత్ర సమాజములో దొర్లుచున్నారు. మతముతో కరడు కట్టుకొనిరి. సర్వశక్తుడగు దేవుని సంచారము వారికి కనబడలేదు. ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకి బాగుపడుటలో ఆశర్యము లేదు. త్రాగుబోతు సైనికుడు ఆయన ముఖము మీద ఉమ్మినను ఏ ప్రభావము చూడలేదు. నీవు సమీపించు తీరు పై అది ఆధారపడియుండును. నీవు చూచుచున్న విధానము మీద అది ఆధారపడియుండును. నీవు ఆలయమునకు వెళ్ళినప్పుడు నీవు దేనిగుర్చి చూచుచున్నావో దానిపై ఆధారపడియుండును.

LUKE 4:21

 

24ఆయన అక్కడ నిలబడియుండుట మనము చూచెదము. ప్రజలు ముందే ఆయనకు హెచ్చరిక చేసిరని నిస్సందేహముగా చెప్పగలము. ప్రజలను యాజకుడు హెచ్చరించెను. "ఆయన వచ్చే విశ్రాంతి దినము ఇక్కడికి వచ్చును. ఆయన మాట వినవద్దు. మీరు వెళ్ళి కూర్చోవచ్చుగాని ఆయన మాటలు పట్టించుకోవద్దు, ఎందుకనగా ఆయన మన గుంపుకు చెందిన వాడు కాడు. వెలివేయబడినవాడు. ఆయనకు సహవాస కార్డు లేదు. కనీసము ఏ సంస్థ యొక్క పత్రము ఆయనకు లేదు."

"ఈయనెవరు?"

"ఆయన ఒక తిరుగుబాటు దారుడు, అక్రమంగా పుట్టిన వాడు, వడ్లవాని ఇంటిలో పుట్టెను. పెండ్లికాక ముందే ఆమె గర్భము ధరించినది. వారు అదేదో దైవ కార్యమని చెప్పి ఈ తప్పును కప్పుచున్నారు," అనిరి. "మెస్సీయా ఏలాగు వచ్చునో మాకు తెలియును. ఆయన పరలోక ద్వారముల నుండి దిగును. తిన్నగా ప్రధానయాజకుని యొద్దకు వెళ్ళును. కయపా, నేను వచ్చేశాను అని చెప్పును," అని వారనుకొనుచుండిరి.

అయితే ఆయనాలాగు రాలేదని మనము చూచాము, ఎందుకనగా ఆ విధంగా వాక్యములో వ్రాయబడలేదు. వారు ఒక మానవ-కల్పిత గాధను నమ్మిరి. ఆయన వచ్చిన రీతిగానే వచ్చునని వాక్యము చెప్పెను. అక్కడ ఆయన నిలబడి వాక్యము చదువుచూ, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది," అని వారితో చెప్పెను, అయినను వారాయనను చూడలేకపోయిరి, అన్ని కాలములలోనూ చేసిన విధముగా వారు ఆయనను గుర్తించలేదు.

GEN 7:16

 

25ఆ నోవహు కూడా అదే చెప్పియుండును. అతడు ఓడలోనికి వెళ్ళగా తలుపు మూయబడెను. ఆ పైనున్న కిటికీలో నుండి అతడు జనులను చూచి ఇట్లు చెప్పి యుండును. "ద్వారము మూయబడినదని తెలిసికొనుడి. మీ కండ్ల ఎదుటనే ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. అప్పటికి సమయము మించిపోయినది. అతడు నూట-ఇరవై సంవత్సరములు బోధించెను. అతడు నిర్మించిన ఓడలోనికి వారిని రప్పించగోరెను. వర్షము కురియునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వారికి చెప్పెను. కాని వారు చాలా కాలము కనిపెట్టిరి. కాని "నేడు ఈ లేఖనము నెరవేరినది," అని నోవహు తేలికగా చెప్పియుండును.

సీనాయి కొండ మీదికి అగ్నిస్తంభము దిగివచ్చిన రోజున మోషే తన సాక్ష్యము ఇచ్చెను, ఈలాగు చెప్పియుండును, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది." అతడే సాక్షి.

మోషే దైవజనుడు మరియు ప్రవక్త. ప్రవక్తగా అతడు పిలువబడినపుడు దైవసంబంధ అనుభవమును పొందెను. ప్రవక్తగా నుండుటకై అతడు దేవుని ముఖాముఖిగా కలిసికొని మాట్లాడెను. అతడు చెప్పినది నెరవేరెను, లేనిచో ఎవరును అతనిని నమ్మరు. ఎడారి వెనుక, లేక ఎక్కడో ఒకచోట ఒక వ్యక్తి దేవుని కలిసికొని దేవునితో ముఖాముఖిగా మాట్లాడినపుడే తాను ప్రవక్తనని చెప్పు వాక్కుండును, లోకములో ఉన్న నాస్తికులందరూ కలిసినా అతనిని మోసము చేయలేరు, ఎందుకనగా అతనికి స్వయంగా అది తెలియును. తాను క్రైస్తవుడిని అను చెప్పుకొను ముందుగా ప్రతి వ్యక్తి ఆ అనుభవమును కలిగియుండవలెను — నీ స్వంత అనుభవము!

ACTS 2:1,2

 

26నా మేనల్లునితో కొద్దిసేపటి క్రితం మాట్లాడాను. ఆతడు ఒక కాతలిక్కు, "అంకుల్, నేను తిరుగని చోటు లేదు, ఏదో కనుగొనవలెనని తిరుగుచున్నాను," అని నాతో అన్నాడు. ప్రతి రాత్రి పడుచున్నాడు. వేదిక యొద్దకు వచ్చి తన తప్పును ఒప్పుకొనుచున్నట్లు రాత్రులందు కలగనుచున్నాడు.

"మెల్విన్, నీవు ఎక్కడికో వెళ్ళవలెనని ప్రయత్నించినా కాదు. ఎన్ని సంఘాల్లో చేరినా రాదు. ఎన్నిసార్లు మరియమ్మను స్మరించినా, మానవుల దీవెనలు ఎన్ని పొందినా లాభము లేదు. నీవు దేవుని ఆత్మ ద్వార తిరిగి జన్మించవలెను. అది మాత్రమే మానవ వృదయమును సంతృప్తిపరచును."

ఈనాడు తిరిగి జన్మించుటకు బదులుగా బోధకునితో కరచాలనము చేయుచున్నారు. పుస్తకములో పేరు వ్రాయుచున్నారు. స్నేహితులారా, అది ఒక సిద్ధాంతము. అది బైబిలు సత్యము కాదు! అది నిజమైనచో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఈలాగు చదివి యుందుము. "పెంతెకోస్తు దినము వచ్చినపుడు పాస్టరుగారు వెళ్ళి జనులతో చేతులు కలిపిరి."

కాని ఇట్లున్నది: "ఈ పెంతెకోస్తు అను పండుగ దినము పూర్తిగా వచ్చినపుడు బలమగు గాలి వీచిన శబ్దము వినబడెను. వారు కూర్చొని యుండిన ఇల్లు దానితో నిండెను." పరిశుద్ధాత్మ మొదట అలాగే వచ్చెను.

ఆ తరువాత ఎప్పుడును ఆ ప్రకారమే అది వచ్చెను! ఆయన మారని దేవుడు.

ఇప్పుడు, అది జనులను తొట్రిల్లునట్లుగా చేయును. "అది ఈ రోజుకు కాదు," అని వారనుచున్నారు.

ACTS 2:38,39•

HEB 13:8

 

27ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. సంఘము ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందినాగాని ఆ మొదటిసారి పొందినట్లే పొందిరి, అదే మందుల చీటీ — అపోస్తలుల కార్యములు 2:38. ఎన్నడూ మారదు, ఎన్నడూ మారలేదు.

ఒక వ్యాధికి వైద్యుడిచ్చిన మందు వలె యున్నది. వైద్యుడు చీటి మీద దానిని వ్రాయును. మతిలేని మందుల షాపు వాడు మించిన మోతాదు ఇచ్చిన యెడల, అది విషముగా మారి నిన్ను చంపును. వైద్యుడు చెప్పినట్లే మ౦దు ఇయ్యవలెను. పరిశుద్ధాత్మను పొందుట ఎట్లు అనునది వైద్యుడగు సీమోను పేతురు వ్రాసి ఇచ్చెను. పెంతెకోస్తు దినమున దానిని వ్రాసెను.

"ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందెదరు. ఇది మీకును, దూరస్తులందరికిని, మన ప్రభువగు దేవుడు పిలిచిన వారికందరికిని చెందును." ఇది నిత్యమగు వ్రాత.

EXOD 3:12,14•

LUKE 4:21•

HEB 13:8

 

28మోషే ఈ అనుభవము కలిగియుండెను. అతడు గ్రామమునకు వెళ్ళి జనులతో ఈలాగు చెప్పెను, "నేను అగ్నిస్తంభమును కలిసికొన్నాను. అది ఒక మండుచున్న పొదలో యున్నది. మీతో చెప్పుమని ఆయన నాకు చెప్పెను. నేను ఉన్నవాడను అనువాడననియు, నేను నీకు తోడైయుందుననియు, నీ చేతిలో నున్న కర్రను ఐగుప్తు వైపు చాపమనియు, నీవడిగినది ఇవ్వబడుననియు ఆయన నాకు చెప్పెను."

"బుద్ధిహీనత!" అని ఆ యాజకులనియుందురు.

కాని వారు ఆలాగు జరుగుట చూచిరి. అతడు దేవునిచే పంపబడినవాడని వారు నమ్మకుండా ఉండలేకపోయిరి.

మోషే దానిని చూచితిననియు, అది సత్యమనియు సాక్ష్యమిచ్చెను. అది సత్యమైనచో దేవుడు ఆ వ్యక్తి మాటను నెరవేర్చ బద్ధుడైయున్నాడు. అది బయలుపరచబడినపుడు అది సత్యము.

"ఈ దినము ఈ లేఖనము మీ కన్నుల యెదుట నెరవేరినది," అని యేసు క్రీస్తు చెప్పినపుడు ఆ మాటను నెరవేర్చు బాధ్యత దేవునిది.

ఈ రాత్రి మేము ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడని చెప్పుచున్నాము. దానిని దేవుడు నిరూపించబద్ధుడైయున్నాడు, ఎందుకనగా అది ఆయన వాక్యము. అందువలన ఏమగును? దానిని నమ్మవలెనన్న యెడల విశ్వాసము కావలెను. ఆయన వాక్యము సత్యమని నమ్మవలెను.

EXOD 3:12•

HEB 13:8

 

29మోషే తనను వెంబడించిన వారినందరిని బయటకు తెచ్చినపుడు ఏమి జరిగెనో గమనించండి. నమ్మని వారు ఐగుప్తులోనే నిలిచిరి, కాని మోషేను వెంబడించిన వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్యములోనికి వచ్చిరి. దేవుడు సీనాయి కొండ మీదికి వచ్చెను. ఆ అగ్నిస్తంభము మొత్తము కొండను అగ్నిమయముగా చేసెను. ఒక స్వరము మాట్లాడెను. దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చెను. మోషే ఆ ప్రజల యొద్దకు వెళ్ళి, ఈలాగు చెప్పియుండును, "ఆయన ప్రవక్తగా నేను చెప్పిన ఈ లేఖనము ఈ దినము నెరవేరినది. దేవుడు మండుచున్న పొదలో నన్ను కలిసికొనెనని చెప్పాను. అగ్నిస్తంభములో ఆయన నన్ను దర్శించెను. దానికి ఇదే గురుతు. నీవు జనులను తిరిగి ఈ స్థలమునకు తీసికొని వచ్చెదవు. నేను చెప్పిన ఆ అగ్నిస్తంభము నేడు ఈ పర్వతము మీద నిలచియుండుట మీరు చూచిరి. ఈ దినము ఈ ప్రవచనము నెరవేరినది. నేను చెప్పినవి సత్యమనుటకు ఈ రుజువును అనుగ్రహించెను."

దేవుడు అంతకంటే గొప్పవి మనకిచ్చును, యధార్థముగా నుండవలెను, సత్యమే చెప్పవలెను. సర్వశక్తుడగు దేవుడు తన వాక్యము సత్యమని బయలు పరచును! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. ఎందుకాయన చేయడు? చేయుదునని ఆయన వాగ్దానము చేసెను.

EXOD 3:8•

NUM 13:27•

JOSH 6:3,4,20•

LUKE 4:21

 

30యెహోషువా కూడా అలాగే చెప్పియుండును, వారు అరణ్యములో ప్రయాణము చేసి ఒక దినమున కాదేషు-బర్నెయకు చేరిరి. ఆ దేశము దేవుడు చెప్పినట్లు లేదేమోనని వారు సందేహించుచుండిరి, కాని దేవుడు అది మంచి దేశమని చెప్పెను. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోషువా, కాలేబులు మాత్రమే దానిని నమ్మిరి, మిగిలిన పదిమంది నమ్మలేదు. తిరిగి వారు రుజువుతో వచ్చిరి. ఇద్దరు బలముగల మనుష్యులు మాత్రమే ఆ ద్రాక్షా గెలను మోయకలిగిరి.

యెహోషువా, కాలేబులు నిలబడి ఈలాగు చెప్పియుందురు, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. అది మంచి దేశమని చెప్పుటకు ఇది రుజువు." నిశ్చయముగా. ఎందువలన? అది మంచి భూమి అనుటకు ఇది రుజువు. ఐగుప్తులో ఇటువంటివి ఎక్కడైనా ఉన్నవా? అట్టి స్థలములు లేవు. "కాని ఈ దినము ఈ లేఖనము నెరవేరినది."

ఏడు దినముల పాటు దినమునకు ఏడుసార్లు వారు ఆ ఎరికో గోడల చుట్టు తిరుగగా, అది పడిపోవును అని అతడు ప్రవచించెను. వారు ఆలాగు చేయగా, ఆ గోడలు కూలెను. యెహోషువా నిలబడి వారితో ఇట్లు చెప్పియుండును, "ఈలాగు జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా కొన్ని వారముల క్రితము చెప్పెను. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది." [ఆ గోడలు నేలమీద కూలినవి.] రండి! వెళ్ళి దానిని స్వాధీనపరచుకొందము; అది మనకు చెందును."

ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఎంత ఆశ్చర్యము, సరియైన సంగతుల కొరకు దైవజనులు నిలబడిరి.

JOSH 3:15

 

31ఇశ్రాయేలీయులు నది దాటి దేశమును స్వాధీనపరచుకొనిరి. అదెట్లు సాధ్యము? అది ఏప్రిల్ నెల. పైన యూదయలో మంచు కరుగుచున్నది గనుక నదికి వరదలు వచ్చినవి. ఎన్నడూ లేనంత ఎక్కువగా యోర్దాను నది ప్రవహించుచున్న ఏప్రిల్ నెలలో జనులను నది దాటించు దేవుడు ఎంత అసమర్థ సైన్యాధిపతి అని జనులు అనుకొనియు౦దురు.

ఇక్కడ కొద్దిగా నేను ఆగి వివరించగోరుచున్నాను. మీరు కాన్సరుతో లేదా ఏదో వ్యాధితో కూర్చుని యుండవచ్చు, "క్రైస్తవుడనగు నాకు ఎందుకిది వచ్చినది? అని మీరనుకొందురు. క్రైస్తవుడనగు నేను ఈలాగు కూర్చొనుట ఏల?" అనుకొందురు.

కొన్నిసార్లు దేవుడు నీవు చూడలేని చీకటిని నీకు రానిచ్చును, ఏమీ కనబడదు. అప్పుడు ఆయన వచ్చి మీకు ఒక మార్గము చూపించి దాటించును. అప్పుడు మీరు, "ఆయన వాగ్దానము చేసిన ఈ లేఖనము నేడు నెరవేరినది," అని చెప్పెదరు.

DAN 3:17,18

 

32ఆయన హెబ్రీయులను అగ్నిగుండము గుండా నడువచేసెను. "మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి మమ్మును విడిపించ సమర్థుడు. విడిపించకపోయినా గాని నీ విగ్రహమునకు మొక్కము," అనిరి. వారికి అగ్ని వాసన కూడా అంటుకొనలేదు: "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది" అని వారు చెప్పియుందురు.

సింహపు బోనులో నుండి దాటి వచ్చిన దానియేలు కూడా అలాగే చెప్పియుండవచ్చు.

బాప్తిస్మమిచ్చు యోహాను, నాలుగు వందల సంవత్సరములు ఆత్మీయ ఉపదేశమిచ్చినా గాని సంఘము అయోమయ స్థితిలో ఆనాడుండెను. అతడు అరణ్యములో ఆ యోర్ధాను యొద్ద నిలబడి ఇట్లు చెప్పియుండును, "ఈ దినము ఈ లేఖనము [యెషయా 40] నెరవేరినది."

33ఆ ముసలి యాజకుడు నాతో చెప్పిన దానిని నేనెట్లు చెప్పగలను? "కుమారుడా, నీవెన్నడూ ఆ వర్తమానము ముగించలేవు."

"నెమ్మదిగా యుండు," అన్నాను.

"పెంతెకోస్తువారు దానిని చూడరని నీవనుకొనుచున్నావా?" అని అతడు ప్రశ్నించెను.

"చూడరు," అన్నాను.

"దానిని నేను చూచాను," అని అతడనెను. అతడు కాతలిక్కు గురువు. అయినా చూచెను. ఇంకా ముందుకు సాగిపో అని నాతో చెప్పెను.

"ఊరకుండు," అన్నాను.

"దేవునికి మహిమ, అది నేను చూచాను," అన్నాడు.

ఆ సమయములోనే కూటములో కూర్చొనియున్న అతని సోదరి మీద పరిశుద్ధాత్మ దిగెను. ఆమె లేచి అన్య భాషలతో మాట్లాడినది. వేదిక మీద అతడు మరియు నేను మాట్లాడుకొనుచున్న అదే విషయాన్ని అనువాదము చెప్పినది. ఆ స్థలమంతా, ఆ ఆలయమంతా దద్దరిల్లినది. గతవారం ఓరల్ రాబర్ట్స్ కూటమునకు ఈ వార్త అందినది. వేదిక మీద జరుగుచున్న సంభాషణను ఎక్కడో కూర్చొనియున్న అతని సోదరి వేరొక భాషలో చెప్పి అర్థము కూడా తెలిపెను. ఆమెను పరిశుద్ధాత్మ కమ్ముకొనెను. మేము దాచిన సంగతిని బయలుపరచెను.

మనము జీవించుచున్న ఈ ఘడియలో, ఈ దినము ఈ లేఖనము నెరవేరినది! నేడు సాయంకాల దీపములు వెలిగినవి, దానిని మనము చూచుట తప్పిపోయాము.

గమనించండి.

JOHN 1:19-23,26,27,29

 

34ఆ యోహాను ఇట్లనెను, "ఈ దినము నేను అరణ్యములో కేకవేయు స్వరముగా ఉన్నాను. ప్రవక్తయగు యెషయా చెప్పినది ఇదే. "ప్రభువు, మార్గము సరాళము చేయుడి."

దానిని వారు అర్థము చేసికోలేదు; "ఓ, నీవు క్రీస్తువా… నీవు క్రీస్తువైయుండవచ్చు," అనిరి.

"నేను క్రీస్తును కాను," అని అతడు చెప్పెను. "ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను," అని అతడు చెప్పెను. ఆయన ఎక్కడో మీ మధ్యనే నిలబడియున్నాడు. ఎందుకనగా ఉందునని ఆయన చెప్పెను, ఎందుకనగా మెస్సీయాను పరిచయము చేయుటకే తన్ను దేవుడు పంపెనని చెప్పెను.

ఒక దినమున ఒక యువకుడు నడిచి వచ్చుచుండెను. ఆయన మీద ఒక వెలుగుండెను (ఒక సూచన యున్నది), "ఇదిగో, దేవుని గొర్రెపిల్ల! ఈ దినము మీ యెదుట ఈ లేఖనము నెరవేరినది," అని అతడు కేక వేసెను.

ఖచ్చితముగా.

JOEL 2:28-32•

ACTS 2:3,13,14,16-21

 

35పెంతెకోస్తు దినమున పేతురు లేచి యోవేలు 2:28 ను వారందరూ నవ్వుచుండగా ఎత్తిచూపెను. ఆ జనులు వారి స్వభాషలో మాట్లాడలేనివారు; వారు ఏదో చెప్పుచుండిరి. "అగ్ని నాలుకలు" అని బైబిలు చెప్పెను. వారు త్రాగిన వారివలె ప్రవర్తించిరి.

వీరు మద్యముతో మత్తులయిరి. వారిని చూడండి. వారి పనులు చూడండి. ఆ స్త్రీ పురుషులను చూడండి. క్రమము లేదు అని ఆనాటి మత గుంపు పలికినది.

పేతురు వారి మధ్య లేచి ఇట్లనెను, "అయ్యలారా, సోదరులారా, యెరూషలేము, యూదయ యందంతట నివసించువారలారా, వీరు మద్యముతో మత్తులు కారని తెలిసికొనుడి, ఎందుకనగా ప్రొద్దు పొడిచి ఒక జామైననూ కాలేదు. కాని ప్రవక్తయగు యోవేలు ద్వారా పలుకబడినది ఇదే. అంత్యదినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, అని చెప్పినది ఈ దినము ఈ లేఖనము నెరవేరినది." నిశ్చయంగా.

LUKE 4:21

 

36లూథర్ సరియగు సమయానికి వచ్చెను. వెస్లీ సరియగు సమయానికి వచ్చెను. పెంతెకోస్తు సరియగు సమయానికి వచ్చెను. ఏదీ క్రమము తప్పలేదు.

నేడు మనము జీవించుచున్న సమయము మరియు యుగము గూర్చి ఆలోచించుడి. ఈ నాటికి వాగ్దానము చేయబడిన వాక్యము చూడండి. గడిచిన కాలములలోని వారు వారివారి దినములలో నెరవేరిన లేఖనముల గూర్చి చెప్పగలరు. అయితే నేటి లేఖనము సంగతి ఏమిటి? ఈ నాటికి వాగ్దానము ఏమిటి? మనము ఎక్కడ నిలబడియున్నాము? ఏ ఘడియలో మనము జీవించుచున్నాము? అర్థరాత్రికి మూడే నిమిషముల వ్యవధి కలదని శాస్త్రీయ గడియారము చూపించుచున్నది.

లోకము భీతితో నిండియున్నది. సంఘము కలుషితమై పోయినది. అందరూ అయోమయ స్థితిలో యున్నారు. ఎంత సమయమైనది? ఈనాటి వాక్యము మాట ఏమిటి?

ఈనాటి సంఘము యొక్క స్థితి…

MATT 24:7•

MARK 13:8•

LUKE 21:10,11•

HEB 13:8

 

37ప్రపంచము, రాజకీయము, లోక పోకడలు చెడిపోవలసినంత చెడిపోయినవి. నేను రాజకీయవేత్తను కాను; నేను క్రైస్తవుడను. రాజకీయముల గూర్చి మాట్లాడు పని నాకు లేదు, అయితే ఇరుప్రక్కలా చెడినదని మాత్రమే చెప్పుచున్నాను.

నేను ఒక్కసారే క్రీస్తు పక్షమున ఓటు వేశాను. నేను జయించవలెను. అపవాది నాకు విరోధముగా వోటు వేసినది. క్రీస్తు నా కొరకు ఓటు వేసేను. నా వోటును ఎటు వేయుదునో దాని మీద ఆధారపడియున్నది. నేను ఆయన మీద వేసినందుకు సంతోషించుచున్నాను. లోకము ఏమైనా వారు కోరినది అనుకోనీయండి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఇంకా నేను నమ్ముచున్నాను. దానిని ఆయన నిరూపించును. నిశ్చయంగా ఆయన నిరూపించును.

నేరముల రేటు పెరుగుచున్నది. నైతిక పతనము ఇది. మన దేశమును చూడండి, ఒకప్పుడు ఇది భూమికి పుష్పము వలె నుండెను. స్వాతంత్ర్య ప్రకటనతో మన గొప్ప ప్రజాస్వామ్యము రూపొందినది. స్వాతంత్ర్య ప్రకటన పై సంతకము చేసిరి. మనది ప్రజాస్వామ్యము, మన పితరులు మన కార్యములు చేసిరి. మనది గొప్ప దేశము; కాని ఇపుడది చెడిపోవుచున్నది మరియు తునాతునకలగుచున్నది, వణకుచున్నది, అదరుచున్నది. శత్రువులకు డబ్బు పంపి స్నేహము చేసికొనవలెనని ప్రజల మీద పన్నుల భారము మోపుచున్నది. మన కండ్ల ఎదుటే ఇది జరుగుచున్నది. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, ఇదిగో మూడవ ప్రపంచ యుద్ధమునకు పరుగిడుచున్నారు. నిశ్చయంగా, రాజకీయము చెడిపోయినది, కలుషితమై పోయినది మరియు పూర్తిగా కుళ్ళిపోయినది. మత్తయి 24లో చెప్పినట్లే యున్నది. "జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, ఇవన్నియూ జరుగును. దీనిని ఇప్పుడు ఆలోచించుదము!

DAN 12:4

 

38మంచిది, మరొకటి గమనించండి: శాస్త్రీయ పరిశోధన వృద్ధి చెందినది. మా తాత, మా మామ్మను చూచుటకు ఎడ్ల బండిలో వెళ్ళెను. ఇప్పుడు విమానములు, అంతరిక్ష యానములు, ఎవరు దీనిని గూర్చి చెప్పిరి? దానియేలు 12:4, "అంత్యదినముల యందు జ్ఞానము వృద్ధి చెందును." మనము జీవించుచున్న ఘడియను మనము చూచుచున్నాము.

ప్రపంచము యొక్క స్థితి, సైన్సు యొక్క పరిస్థితి చూడండి. నేటి మన విద్యా విధానమును కూడా గమనించండి. దీనిని తిరస్కరించుటకు ప్రయత్నించవద్దు, మన పాఠశాలలలో లైంగిక విద్యను గూర్చి, ఒకరితో నొకరు సంబంధము కలిగియుండుటను నేర్పుచున్నారు. ఆ వార్తా పత్రిక ముక్కలను నేను కత్తిరించి పెట్టాను. అవునయ్యా!

మన యాజకత్వము ఎట్లున్నది? ఈ రాత్రి నా యొద్ద ఒక పేపరు ఉన్నది. కాలిఫోర్నియాలోని, లాస్-ఏంజలస్ లో నున్న బాప్టిస్టు, ప్రెస్పిటేరియను శాఖల సేవకులు ఒక స్వలింగ సంపర్కుల గుంపును తీసికొని వచ్చి వారిని దేవుని కొరకు సంపాదించుటకు ప్రయత్నములు చేయుచున్నట్లు చెప్పిరి. అది సొదొమ పాపము. నేటి శాపము! శాసనము వారిని అరెస్టు చేసినది.

REV 3:17

 

39ఇప్పుడు, మనము ఎచ్చటున్నాము? మన వ్యవస్థ మొత్తం చెడిపోయినది. ప్రతి సంవత్సరము అమెరికా యంతటా స్వలింగ సంపర్కులు ఇరవై లేదా ముప్పది శాతము పెరుగుచునే యున్నారు. సరిగ్గా సొదొమ వారు చేసినట్లే, పురుషులు-పురుషులతో జీవించుచున్నారు.

బాల నేరస్థులు పెరిగిపోవుచున్నారు, నేరములు పెరుగుచున్నవి. ఏ ఘడియలో మనము జీవించుచున్నాము? ఈ దినము ఈ వాక్య ప్రవచనము నెరవేరినది.

మత ప్రపంచము, మనము బయటకు పిలువబడినదని చెప్పుచున్న సంఘము, చివరి సంఘ కాలము, పెంతెకొస్తు యుగము ఎక్కడున్నది? లేఖనము చెప్పినట్లుగా ఇది లవొదకయతో నున్నది.

ఈనాడు వీరు హద్దు దాటిపోయిరి. స్త్రీలు అర్థనగ్నంగా ఉంటున్నారు. అది భయంకర విషయము! మూడు నాలుగుసార్లు పెండ్లి చేసికొనిన కొందరు డీకన్ బోర్డులో యున్నారు. వారు దిగజారి కలుషితమును తీసికొనివచ్చిరి, ఎందుకనగా వారు ఆలోచన సభలు ఏర్పరచి లోకముతో పొత్తు పెట్టుకొనిరి. ఎన్నడూ లేనట్టి గొప్ప భవనములు వారికున్నవి. వారిలో ఒకరు ఒకచోట ఏభై మిలియను డాలర్ల ఆడిటోరియంను నిర్మించుచున్నారు. పెంతెకోస్తువారు! పాతికేళ్ళ క్రితం వారు తంబుర కొట్టుకొంటూ ఒక మూలన యుండేవారు. లేఖనములో, "నేను ధన సమృద్ధి చేసికొనియున్నాను, రాణి వలె కూర్చున్నాను, నాకేమియు కొదువలేదు," అని చెప్పుకొనుచున్నదని ప్రకటన 3వ అధ్యాయములో కనుగొందుము. కాని అది దిక్కుమాలినది, దౌర్భాగ్యురాలు, దరిద్రురాలు, దిగంబరి, గ్రుడ్డిది అయి కూడా దానిని ఎరుగకున్నది. మీ కన్నులయెదుట ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఆమేన్!

ఆమేన్, అనగా "ఆలాగు జరుగును గాక," అని అర్థము. నాకు నేను ఆమేన్ అని చెప్పుకొనుట కాదు గాని, అది సత్యమని నేను నమ్ముచున్నాను. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది.

40పెంతెకోస్తు సంఘము లవొదికయ స్థితిలో యున్నది. ఓ, వారు ఇంకా కేకలు వేయుచూ గెంతుచున్నారు. సంగీతము మ్రోగుచుండగా ఎగురుచున్నారు. ఆ మోత ఆగిపోగానే వారి పని అయిపోవుచున్నది. వారు ఆ సంగీతమును క్రైస్తవ్యము అని పిలచుచున్నారు. ఆ ధ్వని ఆగినచో మహిమ పోవును.

అది నిజంగా దేవుని స్తుతి అయినచో దానిని లోకములోని ఏ శక్తియు ఆపజాలదు! అది నిజంగా దేవుని నుండి వచ్చినచో దానికి సంగీత ధ్వనులు అక్కర లేదు; దేవుని ఆత్మ దిగి రావలెను; అప్పుడే క్రియ జరుగును. వారు ఎప్పుడో దానిని మరచిపోయిరి, ఎందుకనగా వారు పరిశుద్ధాత్మ వరమునకు భాషలు మాట్లాడుట సూచకము అని చెప్పియున్నారు. దయ్యములు, భూతములు భాషలతో మాట్లాడుట నేను చూచాను.

నీలో నున్న దేవుని వాక్యమే పరిశుద్ధాత్మ. ఆ వాక్యమును అంగీకరించుట ద్వారా నీవు దానితో గుర్తింపబడెదవు. అది లేనియెడల పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ పొందితినని చెప్పి బైబిలులోని ఒక్క వాక్యమును తిరస్కరించినచో, నీవు పొందినది పరిశుద్ధాత్మ కాదు. నీవు నమ్మితివో లేదో అదే సూచన.

MATT 24:7,32•

MARK 13:8•

LUKE 21:10,11

 

41మరో గొప్ప సూచనను గమనించండి. యూదులు వారి స్వదేశము చేరిరి. వారికి స్వంత దేశము, స్వంత ద్రవ్యము, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వము ఉన్నది. వారికి వారి స్వంత సైన్యమున్నది. వారు సమస్తమూ కలిగియున్నారు.

వారు వారి స్వభూమి మీద ఉన్నారు. "అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి," అని యేసు చెప్పెను. వారు వారి స్వదేశములో యున్నారు. యూదులు మాతృభూమి చేరిరి. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది.

యూదులు మాతృభూమి చేరిరి — ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఇది లవొదికయ సంఘకాలము — ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఈ దినము ఈ (మత్తయి 24 అధ్యాయములోని) లేఖనము నెరవేరినది. సర్వ ప్రపంచము చెడిపోయినది, రాజ్యము మీద రాజ్యము లేచుచున్నది, భూకంపములు సంభవించుచున్నవి, గొప్ప సుడిగాలులు చెలరేగుచున్నవి, ఎక్కడ చూచినా గొప్ప విపత్తులు, జనులు అదురుచున్నారు. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది.

MAL 4:5,6

 

42ఇప్పుడు మనము ప్రపంచ పరిస్థితిని చూచాము. సంస్థలు, శాఖలు, సంఘములు ఎక్కుడున్నవో చూచాము. రాజ్యములు ఎచ్చటున్నవో చూచాము. ఈ దినము ఈ వాగ్దానములు నెరవేరియున్నవని మనము చూచియున్నాము. ఈ దినమున అబ్రాహాము యొక్క రాజసంతానము ఒక అగ్ర సంతానముగా వచ్చును. వాగ్దానము చేయబడిన రాజకుమారునికి, ఒక రాజ వధువుగా ఉండును. అది స్వాభావిక సంతానము కాదు గాని, ఆత్మ సంబంధ సంతానమని గతరాత్రి నేను చెప్పాను. ఒక ఆత్మీయ వధువు లేవవలసియున్నది. రాజ విశ్వాసము గల అబ్రాహాము యొక్క రాజకుమార సంతానముగా అది ఉ౦డును. చివరి దినములలో ఆమె రంగము మీదికి రావలసియున్నది. ఆ కాలము, ఆ చోటు ఆమెకు వాగ్దానముగా ఇయ్యబడినది. మలాకీ 4 ప్రకారము, జనుల హృదయములను కదిలించి వారిని తిరిగి అపోస్తలుల విశ్వాసము తట్టు త్రిప్పు ఒక వర్తమానము రావలెను.

ఏలియా శక్తితో ఒక వ్యక్తి రంగము మీదికి రావలసియున్నాడు, అరణ్యములో నుండి వచ్చిన వ్యక్తి వాక్యము నొద్దకు నడిపించు, వర్తమానమును తెచ్చును. ఆ ఘడియలోనే మనము జీవించుచున్నాము.

43ఇప్పుడు ఆలోచించండి. ఈ జెఫర్సన్ విల్లో నున్న జనులను ఈ ఘడియలో అడుగుచున్నాను. (సుమారు ఇరువది ఏండ్ల బాలునిగా నేనున్నపుడు) 1933 సంవత్సరములో ఐదువందల మందికి యేసుక్రీస్తు నామములో ఆ నది యొద్ద బాప్తిస్మమిచ్చుచుండగా, సహజాతీతమగు వెలుగు పడినది. జెఫర్సన్ విల్ కు అదేమి చెప్పుచున్నది? దానిని గూర్చి కొరియర్ జర్నల్ లేదా లూయిస్ విల్ హెరాల్డ్ అను పత్రిక వ్యాసము వ్రాసినది. ఈ స్ప్రింగ్ స్ట్రీట్ యొద్ద అది జరిగినది. అది అసోసియేటెడ్ ప్రెస్ లోనికి, కెనడాలోనికి వెళ్ళినది. కెనడాలో 1933 సంవత్సరములో డాక్టర్ లీ-వైల్ ఆ పత్రిక భాగమును కత్తిరించెను.

ఈ సాక్షి క్రింద నేను నా పదిహేడవ వ్యక్తికి బాప్తిస్మమిచ్చుచున్నాను (ఆ తరువాత గాధ అంతయూ మీరెరుగుదురు), నేను అక్కడ నిలబడి పదిహేడవ వ్యక్తికి బాప్తిస్మమిచ్చుచుండగా, పరలోకము నుండి ఒక వెలుగు దిగి వచ్చినది. ఆకాశము నుండి నక్షత్రము పడినట్లు అది మెరయుచూ దిగినది. ఒక స్వరము ఇట్లన్నది, "క్రీస్తు యొక్క మొదటి రాకను చాటించుటకు బాప్తిస్మమిచ్చు యోహానును నేను పంపినట్లుగా, నా రెండవ రాకడ వర్తమానము ప్రపంచమంతా చాటించుటకు నిన్ను పంపుచున్నాను." ఈ దినము ఈ లేఖనము నెరవేరినది!

44ప్రభువా, వందనములు.

ఈ దినము! దేవుడు దీనిని వాగ్దానము చేసెను. ఏమి జరిగినది? ఈ దినము ప్రపంచమంతా అది వెళ్ళినది. నేను చిన్నవానిగా యున్నపుడు ఒక పొదలో అగ్నిస్తంభము చూచాను. అది యుటికా పైక్లోని వేతన్స్ స్థలము వద్ద ఉన్నది. ఆ సత్యము మీరెరుగుదురు.

ఆ స్వరము నాతో ఈలాగు చెప్పెను, "నీవెన్నడూ పొగ త్రాగరాదు, మద్యము సేవించరాదు, ఏ విధముగా కూడా నీ శరీరమును అపవిత్రపరచుకోరాదు, ఎందుకనగా నీవు పెద్దవాడివైనపుడు ఒక కార్యము చేయవలసియున్నావు."

దానిని నేను చూచాను! అది సత్యమని సాక్ష్యమిచ్చుచున్నాను. దేవుడు మోషేతో చెప్పినట్లే, ఆ జనులకు అది సత్యము అని ముందే చెప్పెను. ఇది సత్యము. ఈ దినము ఈ లేఖనము మనమధ్య నెరవేరినది.

వివేచన గూర్చి ఆయన చెప్పినది గమనించండి, అదెట్లుండెనో చూడండి, వారి మీద చేతులుంచుట మొదలుకొని వారి హృదయ రహస్యములను తెలిసికొనుట వరకు అది నెరవేరెను. మన కన్నుల యెదుట ఈ దినము ఈ లేఖనము నెరవేరినది,

45చేయబడిన ఈ వాగ్దానములు.

చేయబడిన ఈ వాగ్దానములను గమనించండి. ఈ వాగ్దానము లన్నియూ బయలుపరచబడి, దేవుని వాగ్దానము వలన నెరవేరియున్నవి. ప్రభువు దూత యొక్క పటము ఈ రాత్రి వాషింగ్టన్ డి. సి. లో వ్రేలాడుచున్నది. చూడండి. అమెరికా ప్రభుత్వమునకు వేలి ముద్రలు తదితర పత్రముల ఎఫ్. బి. ఐ ప్రధానాధిపతిగాయున్న జార్జి, జె. లేసీ దానిని హుస్టన్, టెక్సాస్లో పరీక్షించెను. అతడిట్లు చెప్పెను, "ప్రపంచములో ఇది మాత్రమే ఫోటో తీయబడిన సహజాతీతమైనది." ఆ విషయము చెప్పగలిగినవాడు ప్రపంచములో ఆయన మాత్రమే.

గమనించండి, ఆ అరణ్యములో ఇశ్రాయేలీయులను నడిపించిన ఆ అగ్నిస్తంభము అక్కడ సత్యముగా వ్రేలాడుచున్నది. దానిని మనము ఈ రోజు చూచుచున్నాము,ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన అదే సన్నిధి! [స్పష్టతలేని మాటలు] ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఆయన చెప్పిన వర్తమానము మీకు తెలియును.

46మూడు సంవత్సరాల క్రితం ఆ వరుసలో నిలబడియుండగా, టుసాన్లో వచ్చిన దర్శనము చూడండి. దానికి అయిదు సంవత్సరముల ముందే ఆయనీలాగు చెప్పెను, "ఆ గుమ్మము ముందు పట్టణపు అధికారులు కొయ్యను పాతు దినమున నీవు పశ్చిమంగా వెళ్ళుము." నా ఆలయ వాసులకు ఆ దినము నుండి ఇది తెలియును. అది నిజము.

గోయనెస్ తదితరులు అక్కడుండిన దినమున వారు ఆ కొయ్యను పాతిరి. నా భార్యతో, "ఇందులో ఏదో కార్యము యున్నదని," చెప్పాను.

"ఏమిటది?" అని ఆమె ప్రశ్నించినది.

నేను వెళ్ళి, నా చిన్న పుస్తకమును చూడగా, అందులో అది ఉన్నది. మరుసటి ఉదయము పది గంటలకు నా గదిలో నేను కూర్చోనియున్నాను. ప్రభువు యొక్క దూత దిగి వచ్చెను. ఆయన ఇట్లు చెప్పెను, "టుసాన్ కు వెళ్ళుము. అక్కడ టుసాన్ కు ఈశాన్య దిశగా నీవు ఉన్నపుడు, ఏడు దేవదూతల సమూహము కనబడును, అప్పుడు నీవున్న చోటు కంపించును. అక్కడ నీకు చెప్పెదను."

అది జరుగుటకు ముందు ఇక్కడున్న వారికి ఎంతమందికి జ్ఞాపకమున్నది. అది జరిగినపుడు అక్కడ నిలబడియున్నవారు, ఈ రాత్రి ఇచ్చట కూర్చొనియున్నారు. బైబిలు అంతటిలో దాగియున్న మర్మములు, అనగా ఏడు ముద్రలు విప్పబడును. ప్రకటన 10 నెరవేరును. ఏడవ దూత వర్తమానములో ఈ సంగతులన్నియూ నెరవేరును! ఈ దినము ఈ లేఖనము మీ కన్నుల యెదుట నెరవేరినది! ఈ దినము ఈ లేఖనము నెరవేరినది.

47గత సంవత్సరం ఇదే స్థలంలో నిలబడియున్నాను (మిస్టర్. ఉడ్స్, మరియు నేను) కొండ ఎక్కుచున్నాము. నా భార్య జబ్బుగా నున్నందున నేను దుఃఖములో యున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను, "అక్కడున్న ఒక రాయిని తీసి గాలిలోకి విసిరి. అది క్రిందపడుచున్నప్పుడు, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!' భూమి మీదికి తీర్పు రానైయున్నది. వచ్చే కొద్ది గంటలలో దేవుని యొక్క హస్తమును అతడు చూచునని అతనితో చెప్పమనెను."

నేను ఉడ్స్ కు అది చెప్పాను (ఈ రాత్రి అతడిచటనే యున్నాడు) మరియు అది జరిగినపుడు ఉన్న వారిలో ఇక్కడ పదిహేనుమంది వరకు ఈ రాత్రి కూర్చినియున్నారు. మరుసటి ఉదయాన ప్రభువు ఒక సుడిగాలిలో దిగి వచ్చి మా చుట్టూనున్న కొండను చీల్చెను. చెట్ల చివర్లు విరిగిపోయినవి. మూడు ప్రేలుళ్ళు జరిగినవి. "పశ్చిమ తీరమునకు తీర్పు కాచుకొనియున్నది," అని చెప్పెను.

దాని తరువాత రెండు రోజులకు అలాస్కా దరిదాపుగా భూమిలోనికి దిగిపోయినది! అప్పటి నుండియు ఆ తీరము కదులుతున్నది. ఆత్మీయ తెర మీద దేవుని తీర్పు మంటలు లేచుచున్నవి.

ఇనుప తెర యున్నది, కొయ్య తెర యున్నది, మరియు పాపపు తెర యున్నది!

ZECH 14:6,7•

HEB 13:8

 

48నాగరికత సూర్యునితో పాటు ప్రయాణము చేయుచున్నది, సువార్త కూడా అలాగే యున్నది. సూర్యుని వలెనె అది తూర్పు నుండి వచ్చి మరియు పశ్చిమమునకు వెళ్ళినది, ఇప్పుడది పశ్చిమ తీరమున యున్నది. ఇంకా అది ముందుకు పోనేరదు; ఇంకా ముందుకు వెళ్ళినచో, మరల తూర్పు వచ్చును.

"పగలు కాదు లేక రాత్రి కాదు," అని ప్రవక్త చెప్పెను. [అది ఒక రకమగు దినము. వర్షము, పొగమంచుగానున్న దినము వలె నుండును. సంఘములో ఎట్లు చేరవలెనో తెలియును. పుస్తకములో పేరు వ్రాయుట గూర్చి ఎరుగుదురు.] అయితే సాయంకాల సమయమున వెలుగుండును. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది!

తూర్పున ఉదయించిన సూర్యుడే పశ్చిమాన అస్తమించును. తూర్పున జన్మించిన దేవుని కుమారుడు దేవునిగా తన్ను బయలుపరచుకొని శరీరము ధరించెను. ఈ పశ్చిమ గోళములోను ఆ దేవుని కుమారుడే తన్ను గుర్తింపచేసికొనుచున్నాడు. ఈ రాత్రి సంఘము మధ్య ఉన్నాడు. నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు! కుమారుని యొక్క సాయంకాలపు వెలుగు వచ్చియున్నది. ఈ దినము ఈ లేఖనము మన యెదుట నెరవేరినది.

49ఈ అబ్రహామీయ యుగములో మనమెక్కడున్నాము? మనము నిలబడి యున్న ఈ గొప్ప కాలములో, మనము జీవించుచున్న ఈ గొప్ప మడియలో ఎక్కడున్నాము? దర్శనములన్నియు నెరవేరియున్నవి. ఇక్కడ మన సంఘ సహవాసమునకు చెందిన జూనియర్ జాక్సన్ యున్నాడు. ఒక రాత్రి నా యొద్దకు పరుగెత్తికొని వచ్చెను. ఒక దర్శనము అతనిని తొందరచేయుచున్నట్లు నాతో చెప్పెను. ఒక కొండ మీద సోదరులందరూ కూడికొనిరి. వారికి రాతి మీద చెక్కిన కొన్ని అక్షరముల గూర్చి నేను బోధించుచున్నాననియు, వారందరూ మరింత నాకు దగ్గరగా వచ్చినట్లును నాతో చెప్పెను. ఎక్కడి నుండో నేను వచ్చి గునపము వంటి సాధనము ఒక దానితో ఆ చిన్న పిరమిడ్ ను కొట్టినపుడు, అందులో నుండి ఏ వ్రాతలేని నల్ల జనపరాయి వచ్చెను. నేను దానిని చూడమని చెప్పగా, వారందరూ చూడసాగిరి. నేను అప్పుడు సూర్యడస్తమించు పశ్చిమానికి వెళ్ళుచున్నట్లు అతడు చెప్పెను. ఎందరికిది గుర్తున్నది?

50పరిశుద్ధాత్మ బయలుపరచు వరకు నేను అక్కడ నిలబడ్డాను. "నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, యేసు నామ బాప్తిస్మము మొదలగు ఇవన్నియూ, అనగా బైబిలు యావత్తు మానవులకు వెల్లడి అయినది; కాని ఆ లోపల కొన్ని రహస్యములు దాగియున్నవి, బైబిలు ఏడు ముద్రలతో ముద్రించబడియున్నది. వాటిని కనుగొనుటకు అచ్చటకు నేను తప్పక వెళ్ళవలెను," అని చెప్పాను.

ఆ ఏడు దూతలు వచ్చి భూమిని ఆ ఉదయాన ప్రేల్చినవి, రాళ్ళు ఎగిరి పడినవి. ఆ ఏడు దూతలు నిలబడి ఇట్లు చెప్పెను, "నీవు తిరిగి జెఫర్సన్ విల్ కు వెళ్ళుము. ఏడు మర్మముల యొక్క ఏడు ముద్రలు విప్పబడును."

ఈ దినము ఇక్కడ మనము ఉన్నాము. నేడు మనము సర్ప సంతానమును అర్థము చేసికొనుచున్నాము; ప్రభుని చిత్తమయితే, మరికొన్ని దినములలో, వివాహము మరియు పరిత్యాగము యొక్క ఖచ్చితత్వమును అర్థము చేసికొందుము. జగత్తు పునాది వేయబడినప్పటి నుండి మర్మములుగా యున్న ఈ ప్రతి ముద్రను దేవుడు విప్పెను. మరియు ఆయన సన్నిధిలో మనము ఆనందించి దీవెనలు పొందుచున్నాము. ఇది సత్యము. ఈ దినము ఈ లేఖనము…

LUKE 4:21

 

51దానిని గూర్చిన వ్యాసము లైఫ్ పత్రికలో పడినది. మర్మయుక్తముగా నున్న వెలుగు వృత్తము టుసాన్, ఫీనిక్సుల పైన ఆవరించినది. అది జరుగుటకు ఒక సంవత్సరము ముందే నేను దానిని గూర్చి చెప్పాను. అది త్రికోణముగా నుండునని చెప్పాను. ఆ పటము ఈ ఆలయంలో వ్రేలాడుచున్నది. ఆ పత్రికలలో నున్నది. అది ఇరవై-ఏడు మైళ్ళ ఎత్తున, ముప్పది మైళ్ళ పొడవున యున్నట్లు వారు చెప్పిరి. ఆ జరిగినది ఇంకా వారికీ అర్థము కాలేదు. అది కనబడుట, వెళ్ళిపోవుట కూడా మర్మముగానే జరిగినది.

సహోదరుడు ఫ్రెడ్ సార్మన్, జీన్ నార్మన్, నేను అక్కడ నిలబడి యున్నాము. ముగ్గురు సాక్షులు, కొండ మీదికి ఆయన తీసికొని వెళ్ళినట్లే యున్నది. పేతురు, యాకోబు, యోహానులు సాక్షులుగా ఉండిరి. ఆ జరిగిన దానిని వారు చూచిరి. అది ఆకాశములో కనబడినది. తేమ లేదు. పొగమంచు లేదు, కాని అది అలాగే వ్రేలాడినది. అవెట్లు రాగలవు? వర్తమానమ౦దించి దేవుని దూతలు తిరిగి వచ్చుచున్నవి. ఈ దినము మన మధ్య ప్రవచనము నెరవేరినది! ఈ దినము ఈ లేఖనము నెరవేరినది.

గమనించండి. ఏడు ముద్రలు విప్పబడినవి, సుడిగాలి పశ్చిమ తీరమును తాకినది. ఇప్పుడు, ఆ వెనుకటి వారి వలె తప్పిపోవద్దు.

DEUT 18:15•

EZEK 2:1•

MATT 16:13•

LUKE 17:28,30•

COL 2:9

 

52ఇప్పుడు, ఈ దినము గూర్చి మనము జాగ్రత్తగా చూద్దాం.

నేటిని గూర్చి, మనము జీవించుచున్న ఈ ఘడియ గూర్చి లేఖనము ఏమి చెప్పుచున్నది? వాటన్నింటిని చెప్పు సమయము లేదు, కాని ముగించు ముందు ఒక్కటి మాత్రము చెప్పెదను. లూకా సువార్త 17వ అధ్యాయము 30వ వచనములో యేసు చెప్పినది చూడండి. యేసు క్రీస్తే వాక్యము. (అది మీరు నమ్ముదురా?) వాక్యమై యున్న యేసుక్రీస్తు శరీరధారియై అంత్యదినముల యందు జరుగు దానిని గూర్చి చెప్పెను. లోకాంతమునకు సూచనలు చెప్పెను. జనము మీదికి జనము లేచుననియు, సొదొమ దినములలో నుండినట్లే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండుననియు చెప్పెను.

ఇప్పుడు, యేసు ఈ భూమి మీదికి ముగ్గురు కుమారుల నామములతో వచ్చెను: మనుష్యకుమారుడు (అనగా ప్రవక్త), దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. ఇప్పుడు, ఆయన ఈ భూమి మీద జీవించెను, తాను దేవుని కుమారుడనని ఆయన ఎన్నడూ చెప్పుకొనలేదు. "నేను మనుష్యకుమారుడిని" అని ఆయన చెప్పెను. (యెహెజ్కేలు తదితర ప్రవక్తలను యెహోవా నరపుత్రులని పిలచెను), ఎందుకనగా ఆయన వాక్యమును నెరవేర్చుటకు ప్రవక్తగా వచ్చెను. మీ ప్రభువగు దేవుడు నా వంటి యొక ప్రవక్తను పుట్టించును, అని మోషే చెప్పెను. ఆ కారణము చేతనే ఆయన అక్కడ దేవుని కుమారునిగా ఉండలేదు. ఆయన మనుష్యకుమారుడు! వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును మరియు ఆయనే సంపూర్ణ వాక్యము! మనుష్యకుమారుడు, ప్రధాన ప్రవక్త… ప్రధాన ప్రవక్త కాదు, కాని దైవ-ప్రవక్త. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరరీత్యా ఆయనలో జీవించెను, కాబట్టి ఆయన మనుష్యకుమారుడు.

రెండువేల సంవత్సరముల నుండి ఆయనను దేవుని కుమారునిగా మనము ఎరుగుదుము. ఆత్మ స్వరూపి. వెయ్యేండ్ల పాలనలో ఆయన దావీదు కుమారునిగా సింహాసనము ఎక్కును. మనందరము అది ఎరుగుదుము, లేఖనములను మనము నమ్ముదుము.

MATT 24:37,38•

LUKE 17:26,27,30

 

53నేడు మనము జీవించుచున్న ఈ సంమ కాలాంతములో యేసు ఇట్లు చెప్పెను, "సొదొమలో ప్రత్యక్షమైన రీతిగానే మనుష్యకుమారుడు మరల ప్రత్యక్షమగును." ఎంత చారిత్రకంగా ఆయన చెప్పెనో చూడండి. మొదట నోవహు దినముల వలె నుండునని ఆయన చెప్పెను. వారు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసికొనుచు ఉండిరి. చివరగా ఆయన సొదొమలో ప్రత్యక్షమైన మనుష్యకుమారుని గూర్చి చెప్పెను. ఆయన యూదులతో మాట్లాడెను. తరువాత సొదొమలో అన్యులతో మాట్లాడెను. వారిని తీర్పులో నీటిలో ముంచివేసెను. ఇక్కడ సొదోమలో అన్యులను ఆయన అగ్నితో దహించెను. అన్యుల ప్రపంచము కాలిపోయెను.

మనుష్యకుమారుడు ప్రత్యక్షమగునపుడు అలాగే యుండును. మొదటిసారి నీరు, కాని ఇప్పుడు అగ్ని, సొదొమ గూర్చి చెప్పినపుడు యేసు మనము చదివిన ఆదికాండము లోనిదే చదివెను.

GEN 17:17•

GEN 21:5•

LUKE 17:29,30

 

54సొదొమ స్థితిలో ఇప్పుడు లోకమున్నదని మనము అంగీకరించెదము. దానికి అందరూ ఆమేన్" అందురు. దానిని మనము నమ్ముచున్నాము. మంచిదే. ప్రకృతి సంబంధమగు లవొదకయ సంఘము ఆత్మీయ స్థితిని చూచి మనము "ఆమేన్" అందుము. వారి సూచనలు చూచాము. ప్రతి గురుతు ఇక్కడున్నదని మనకు తెలియును. సంఘము లవొదకయలో నున్నది. మనకది తెలియును. లోకము సొదొమ స్థితిలో ఉన్నదని మనకు తెలియును. అవునా? దానిని మనము అంగీకరించుచున్నాము. వాగ్దాన కుమారుని కొరకు ఎదురుచూచుచున్న అబ్రాహాము యొక్క సూచన ఏమిటి? అది మరొకటి. గుర్తుంచుకోనండి, వారికి వెనుక ఒక సొదొమ యున్నది. వారికి ఒక వర్తమానికుడున్నాడు. అబ్రాహామునకు ఒక వర్తమానీకుడున్నాడు. దాదాపు అసాధ్యముగా కనబడుచున్న దానిని అబ్రాహాము జరుగునని నమ్మి దినదినము ఎదురుచూచుచున్నాడు. శారాకు తొంబది ఏండ్లు, అతనికి నూరేండ్లు. దేవుని వాగ్దాన ప్రకారము ఇంకా కనిపెట్టుచున్నాడు. విమర్శలన్నిటి మధ్య అతడు కుమారుని కొరకు కనిపెట్టుచుండెను. ఆ విధముగానే నిజ విశ్వాసి వాగ్దాన కుమారుడు తిరిగి వచ్చునని, ఇంకా ఎదురుచూచుచున్నాడు.

గమనించండి, కుమారుడు వచ్చు ముందుగా అతనికి ఒక సూచన ఇవ్వబడెను. తండ్రియగు అబ్రాహాము ప్రకృతి సంబంధియగు కుమారుని కొరకు ఎదురుచూచినట్లుగానే, అబ్రాహాము యొక్క రాజసంతానము రాజ కుమారుని రాక కొరకు ఎదురుచూచుచున్నది. రాబోవు కుమారుని యొక్క సూచన వారికి బయలుపరచబడినది. నిజమేనా? యేసు లూకా 17:30 లో ఆలాగు చెప్పెను. సొదొమ నాశనమునకు ముందుగా మనుష్యకుమారుడు ప్రత్యక్షమైనట్లే అది యుండును. మనము ఒక సూచన కొరకు చూచుచున్నాము.

GEN 14:14•

GEN 18:1,2,22

 

55సొదొమలో నున్న పరిస్థితులు లోకములో ఎట్లున్నవో పోల్చి చూద్దాం. కొంతకాలము క్రిందట సొదొమ అను చిత్రమును నేను చూచుట జరిగినది. నేడు అమెరికాలోని హాలీవుడ్ రూపొందించిన మంచి చిత్రము అది. ఆనాటి వారు ధరించిన దుస్తులు, అలంకరణలు వీరు చక్కగా చూపించిరి, మరియు ఆ సమయములో వారు చేసినవన్ని, త్రాగుబోతులు, వారు మతాసక్తిగల జనులు.

గమనించండి, లోతు అను సాక్షి సొదొమకు ఉండెను. అతడు అబ్రాహాముకు మేనల్లుడు. అబ్రాహాము అతని గుంపు సొదొమలోనికి వెళ్ళలేదు. పండ్రెండుమంది రాజులను, వారి సైన్యములను ఎదిరించగలిగినంత మంది అతనికి ఉండిరి. ఒక రోజున అతడు సింధూర వృక్షము క్రింద నిరాశతో కూర్చొనియుండెను. ఎవరూ అతనితో సంబంధము కలిగిలేరు, కాని ఇంకా అతడు వాగ్దానమును అంటి పెట్టుకొని యుండెను. ముగించు ముందుగా జాగ్రత్తగా గమనించుదం. అతడు అక్కడ కూర్చొని యుండగా, ముగ్గురు మనుష్యులు అతని యొద్దకు నడిచి వచ్చిరి. అందులో ఇద్దరు సొదొమలోనికి వెళ్ళి, వారికి సువార్తను ప్రకటించెను. లోతు యొద్దకు వచ్చిరి. నిజమేనా? కాని ఒక వ్యక్తి అబ్రాహాముతో నిలచిపోయెను. గమనించండి, అబ్రాహాము యొద్ద నిలచినది స్వయానా దేవుడే; మిగిలిన ఇద్దరూ దేవదూతలగు వర్తమానికులు.

GEN 1:1•

GEN 19:11

 

56ఇప్పుడు, వారు సొదొమలోని వారిని గ్రుడ్డివారిగా చేసిరే తప్ప ఏ అద్భుతము చేయలేదు. సువార్త ప్రకటన వారిని ఎప్పుడూ గ్రుడ్డివారినే చేయును.

ఆనాటి పరిస్థితి చూడండి. స్వాభావిక సంఘము అక్కడున్నది. గత రాత్రి చెప్పినట్లుగా, దేవుడెల్లపుడూ మూడు విధములుగా పనిచేయును. అక్కడ సొదొమియులు, లోతు వారు, అబ్రాహాము సంబంధులు ఉన్నారు. ఈ రాత్రి ప్రపంచము కూడా ఆ రీతిగానే యున్నది.

ఒక సంగతి మిమ్మును అడుగుదును. ఈనాటి పరిస్థితి చూడండి. తనతో మాట్లాడిన వ్యక్తిని అబ్రాహాము, "ఎలోహి౦" అని పిలచెను. ఎలోహిం అను హెబ్రీ పదమునకు "అంతటికీ సరిపోయినవాడు, నిత్యుడు అని అర్థము." దేవుడే ఆ ఎలోహి౦.

ఆదికాండము 1లో చూడండి. గ్రీకు పదమును చూడండి. "ఆదియందు ఎలోహి౦ భూమ్యాకాశములను సృజించెను," అని యున్నది. ఆదికాండము 20లో ఈయన పేరును ఎలోహిం అని పిలచెను.

GEN 18:6-10

 

57ఎందువలన? దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. అబ్రాహాముతో కూర్చొని మాంసము తినెను, పాలు త్రాగెను, రొట్టె భుజించెను — స్వయముగా దేవుడు — అబ్రాహాము ఎదుటనే అదృశ్యుడాయెను! కాని అతనికి ఆయన ఒక గురుతును ఇచ్చెను. గమనించండి, ఆ గురుతు ఏమనగా ఆయన ఒక గుడారమునకు వీపు త్రిప్పి కూర్చుండుటయే. గుర్తుంచుకొనండి, అంతకు కొద్ది దినముల ముందు అతని పేరు అబ్రాము, శారా పేరు శారయి. శారయి - శారాగాను, అబ్రాము - అబ్రాహాముగాను మారిరి. అబ్రాహాము అనగా, జనములకు తండ్రి.

ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నేడు మనము జీవించుచున్న ఈ ఘడియ యొక్క ఆస్తమయమును మనము చూచుచున్నాము. ఈ అస్తమయమును చూడవలెనని యేసు చెప్పెను. మిగిలిన దానినంతటినీ మనము చూచాము. రాజ సంతానము ఇప్పుడు ఏ అస్తమయమును చూచెదరో కనుగొందము.

"అబ్రహామా, నీ భార్యయగు శారా ఎక్కడ?" అని అడిగెను.

"ఆమె నీ వెనుకనున్న గుడారములో నున్నది," అని చెప్పెను.

ఆమెను ఆయన ఎన్నడూ చూడలేదు. అతని పేరు అబ్రహామనియు, ఆమె పేరు శారా అనియు అసలు అతనికేలాగు తెలియును? "నీ భార్యయగు శారా ఎక్కడ?" అని అబ్రాహామును అడిగెను.

"ఆమె నీ వెనుక గుడారములో యున్నది," అనెను.

"నీకు వాగ్దానము చేసిన ప్రకారము నేను [నేను, వ్యక్తిగత సర్వనామము], నిన్ను దర్శించెదను. నీ భార్య కుమారుని కనును. నీవు నన్ను నమ్మియున్నావు గనుక నేను దానిని నెరవేర్చెదను," అని ఆయన చెప్పెను.

GEN 18:8,12,13•

JOHN 1:42

 

58ఆ వెనుక నున్న గుడారములో శారా జాగ్రత్తగా ఈ మాటలు వినుచుండెను. ఆమె తన కొంగు చాటున నవ్వినది, "ముసలిదానినయిన నేను ముసలివాడగు నా ప్రభువుతో సంసార సుఖము పొందజాలను. మేమిరువురము వంద సంవత్సరముల వయస్సులోనికి వచియున్నాము. ఇన్ని సంవత్సరములు లేనిది ఇప్పుడు మాకు బిడ్డ పుట్టుటయా?" అని తలంచినది.

మానవ శరీరములో ఒకాయన అక్కడ కూర్చొని ఒక సామాన్య మానవుని వలే తిని త్రాగెను. ఆయన దుస్తుల మీద ధూళి యుండెను, ఆయన పాదములు దుమ్ము కొట్టుకొని యుండెను, మరియు అబ్రాహాము ఆ పాదములు కడిగెను. స్వయానా దేవుడు, చుట్టూ చూచి, "ఈ మాట విని గుడారములో యున్న శారా ఎందుకు నవ్వినది?" అని ఆయన ప్రశ్నించెను. ఆయన తన వెనుక గుడారములో యున్న శారా యొక్క ఆలోచనలను వివేచించగలిగెను. అవునా?

అబ్రాహాము యొక్క రాజసంతానము ఈ భూమి మీదికి వచ్చునపుడు మనుష్యకుమారుడు ఏ సూచన చూపించును? సీమోను ఒక దినమున ఆయన యొద్దకు వచ్చెను. అంద్రెయ అతనిని తీసికొనివచ్చెను. "నీ పేరు సీమోను; నీవు యోనా కుమారునివి," అని ఆయన చెప్పెను. చూడండి, అందువలన అతడు విశ్వాసి అయ్యెను.

JOHN 1:45-49

 

59ఫిలిప్పు వెళ్ళి, నతానియేలును తీసికొనివచ్చెను. "మేము కనుగొనిన ఈ యోసేపు కుమారుడగు నజరేయుడగు యేసును వచ్చి చూడుడి," అని అతడు చెప్పెను.

"ఒక్క నిమిషము ఆగు. ఆ మూఢత్వము నుండి మంచిది ఏదయినా వచ్చునా?" అని అడిగెను.

"వచ్చి చూడుము," అని చెప్పెను.

నతానియేలుతో పాటు ఫీలిప్పు యేసు సన్నిధిలోనికి వచ్చినపుడు యేసు అతనివైపు చూచి ఇట్లనెను, "ఇతడు ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు."

"బోధకుడా, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు?" అనెను.

''ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, ఆ చెట్టు క్రింద నీవున్నపుడే నేను నిన్ను చూచాను," అని ఆయన చెప్పెను.

"రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు," అనెను.

JOHN 4:7-10,16-19,25,26,28,29

 

60బావి నొద్దకు వచ్చిన ఆ స్త్రీ, చెడిపోయిన స్థితిలో ఉండి, నీళ్ళు తెచ్చుకొన వచ్చినది. యేసు భోజనము కొరకు తన శిష్యులను పంపెను. ఆమె నీళ్ళ కొరకు వచ్చినపుడు, ఆయన, "నాకు దాహమునకిమ్ము" అని అడిగెను.

"నీవీలాగు అడుగుట ఆచారము కాదు. ఇక్కడ మనకు తేడా యున్నది. యూదులగు మీతో సమరయులమగు మాకు సంబంధము లేదు. మీతో మాకెట్టి సాంగత్యము లేదు," అని ఆమె చెప్పెను.

"అమ్మా, నిన్ను దాహమున కిమ్మని అడుగునది ఎవరో నీవు ఎరిగి యుండినచో నీవాలాగు అనవు. నీవిక్కిడికి రానవసరము లేకుండా నేను నీళ్ళు ఇచ్చెదను," అని చెప్పెను.

ఆమె స్థితిని ఆయన గ్రహించెను, "వెళ్ళి, నీ భర్తను ఇక్కడికి తీసికొని రమ్ము," అనెను.

"నాకు భర్త లేడు," అన్నదామె.

"నీవు సత్యమే చెప్పితివి. నీకు అయిదుగురు భర్తలున్నారు, కాని ఇప్పుడు నీతో జీవించుచున్నవాడు నీ భర్త కాడు," అన్నాడు.

"అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మెస్సీయా వచ్చుననియు, ఈ సంగతులన్నీ చెప్పుననియు మాకు తెలియును," అని ఆమె అన్నది.

"నేనే ఆయనను!" అని యేసు చెప్పెను.

ఈ మాట విని ఆమె పట్టణములోనికి పరుగిడి వెళ్ళి, ఇట్లు చెప్పెను, "నేను చేసినవన్నియూ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడి: ఈయన మెస్సీయా కాడా?"

MATT 12:24,31,32•

MARK 3:22,28,29•

LUKE 11:15•

LUKE 12:10

 

61గమనించండి. ఆయన యూదుల ఎదుటను సమరయుల ఎదుటను ఆలాగున చేసెను గాని అన్యుల ఎదుట ఆలాగున చేయలేదు. అన్యులమగు మనము గతించిన దినములలో మన వీపుల మీద విగ్రహములను కట్టుకొని ఆరాధించెడివారము; మెస్సీయ కొరకు మనము చూడలేదు. ఎవరు ఆయన కొరకు ఎదురుచూచుచున్నారో వారికే ఆయన ప్రత్యక్షమగును. ఆయన కొరకు మనము చూడవలెను. ఆయన కొరకు ఎదురుచూచుచున్నామని చెప్పుకొనిన సంమమే ఆయన క్రియలను బట్టి ఆయనను, "దయ్యము, సోదే చెప్పువాడు, బయల్జెబూబు," అనిరి.

ఆ పాపము వారికి క్షమించబడునని యేసు చెప్పెను, ఎందుకనగా అప్పటికి ఆయనింకా చనిపోలేదు, కాని ఒక దినమున పరిశుద్ధాత్మ వచ్చును. అవే కార్యములను జరిగించును. దానికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినను క్షమాపణ యుండదు. ఆ దినమున ప్రతి మాటయు లెక్కింపబడును. దానికి విరోధముగా ఒక్క మాట పలికినా ఈ లోకములో గానీ, ఆ రాబోవు లోకములో గాని క్షమాపణ యుండదు.

GEN 17:5•

GEN 18:22•

LUKE 17:28-30

 

62అది అబ్రాహాము యొక్క రాజ సంతానము. ఇక్కడ అబ్రాహాము యొక్క రాజ సంతానము వచ్చినది. అబ్రాహాముతో కూడా ఆ మనిషి కూర్చు౦డుటయే అందుకు గురుతు. అదే దేవుడు ఈ దినమున వాగ్దానము చేయుచున్నాడని రుజువగుచున్నది. సొదొమ దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడయందును ఉండును. ఆయన మనుష్యకుమారునిగా ప్రత్యక్షమగును! ఆమేన్! ఈ లేఖనము నెరవేరవలసిన దినము ఇదే.

నేటి మన పరిస్థితి చూడండి. ఈ పగలు రాత్రి కాని దినమును చూడండి; ప్రవచనములను చూడండి. సొదొమ వలే సమస్తము యున్నది. ఇప్పుడు, ఒక వింత సంగతి — అప్పుడు మన సందర్శకులు రావలెను, ఒకవెళ సొదొమ వలే అది ఉండాలంటే.

పరలోకము నుండి ముగ్గురు అసాధారణమగు జనులు వచ్చి యుండిరి. దానిని మనమందరము అంగీకరించెదము. ముగ్గురు వచ్చిరి. ఒకరు అబ్రాహాముతో నిలచి యుండెను. అందరూ అక్కడే ప్రారంభమైరి, కాని ఒక్కరే అబ్రాహాముతో నిలిచెను. మిగిలిన వారు సొదొమలోనికి వెళ్ళియుండిరి. నిజమేనా? అబ్రాహాము పేరు మార్చబడెను. అబ్రాము నుండి అబ్రాహాముగా మారినది. నిజమేనా? చరిత్రలో గాని, సంఘ ప్రపంచములో గాని ముందెన్నడూ హాము అను చివర పేరుతో వచ్చిన సువార్తీకుడు లేడు. నేడు బిల్లీ గ్రాహం వచ్చెను. అవునా? గ్రహం (G-r-a-h-a-m) ఆంగ్లములో ఆరు అక్షారాలు, అది లోకపు మనిషి. చూచారా?

ZECH 14:7•

LUKE 4:21

 

63ఈనాడు పరలోకము నుండి వర్తమానికులు వచ్చుచున్నారు. బిల్లీ గ్రాహ౦ వలె తేటగా మారుమనస్సును బోధించిన వారు ఎవరైనా యున్నారా? బిల్లీ గ్రావం వలె జనులను ప్రభావితము చేసిన వారు మరెవరైనా యున్నారా? అంతర్జాతీయంగా అంత గొప్ప వ్యక్తి మరెవరూ లేరు. ఈ అమెరికాలో బిల్లీ సండే, ఇంకా చాలా మందియున్నారు గాని, బిల్లీ గ్రాహం ప్రపంచఖ్యాతి చెందెను. ఎక్కడికి వారిని పిలచుచున్నాడు చూడండి? సొదొమలో నున్న వారిని బయటకు! పెంతెకోస్తు సంఘము యొక్క ఓరల్ రాబర్ట్స్ అతనికి ధీటైన బృందమును తయారు చేయుచున్నాడు,

అయితే ఏర్పరచుకొనిన గుంపు సంగతి ఏమిటి? వారెట్టి సూచనను చూడవలసియున్నారు? హల్లెలూయా! "సాయంకాల సమయమందు వెలుగు కలుగును." ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము నెరవేరినది. అది సత్యమని మనకు తెలియును. ఆయన అప్పుడుండినట్లే ఇప్పుడును యున్నాడు.

2KGS 2:9,13,14•

HEB 13:8

 

64నేను ఇంతకు మునుపు చెప్పినట్లు, నీవు సువార్త సత్యమును ప్రకటించినట్లయితే, దేవుడు దానిని రుజువు చేయుటకు బద్ధుడైయున్నాడు. సత్యమేనా? ఇప్పుడు అలాగైతే, వాక్యమున వ్రాసిన దేవుడు, ప్రవచనమును ఇచ్చిన దేవుడు, వాక్యమైయున్న దేవుడు, ముందుకు వచ్చి మరియు తాను ఇంకా దేవునినే అని నిరూపించుకొనును.

ఏలీయా కొండ పైకి వెళ్ళెను, ఎలీషా అతనిని గమనించుచుండెను. తనకు రెండింతల ఆత్మ కావలెనని కోరెను. ఏలీయా మీద ఉన్న దుప్పటి, ఎలీషా మీద పడెను. అతడు దానిని తీసుకొని, నది యొద్దకు వచ్చి, ఏలీయా దేవుడు ఏడని నదిన కొట్టెను. ఏలీయాకు జరిగినదే ఎలీషాకు జరిగెను. అదే సువార్త, అదే శక్తి, అదే మనుష్యకుమారుడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. అది మీరు నమ్ముదురా?

ఇప్పుడు, నేను మిమ్ములను అడుగుదును. నేను ఆయనను కాను గాని, ఆయన ఇక్కడ ఉన్నాడు. మనము కేవలము వాహకులుము.

MATT 9:20-22•

MARK 5:27,28,30,34•

LUKE 8:43-45,48•

HEB 13:8

 

65ఇక్కడ కొందరు రోగులు మరియు బలహీనులు కూర్చుని యుండవచ్చును, మీరు నాకు తెలీదు, ఇప్పుడు దేవుడే చేయనిమ్ము, (నన్ను నేను తగ్గించుకొనవలెను) … మీరు దేవునిని ప్రార్థించండి మరియు అడగండి.

ప్రార్థన కార్డు లేనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరను కొనుచున్నాను. మనము అసలు ప్రర్ధానా కార్డులను ఇవ్వలేదు. రోగుల స్వస్థత కొరకు ఆలయములో ప్రార్థన కూటము జరుపునైయున్నాము. ప్రార్థించండి, మీకు నేను పూర్తిగా క్రొత్తవాడిని అని మీకు తెలియును. నన్ను మీరెరుగుదురు. జెఫర్సన్ విల్లోని వారు ఎరుగుదురు. కాబట్టి ఇక్కడ వారిని కాదు గాని, ఎక్కడో దూరము నుండి వచ్చిన వారిని రమ్మని కోరుచున్నాను. దేవుడు బయలుపరచునేమో చూద్దాం. ఆయన నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా యున్నాడు.

ఆ స్త్రీ వలె చేయండి. ఆయన వెళ్ళుచుండగా, ఆమె ఆయనను నమ్మినది. ఆమెకు రక్త స్రావ రోగమున్నది. "ఆయన వస్త్రపు చెంగును ముట్టినచో నేను బాగవుదునని," ఆమె అనుకొన్నది. అవునా? ఆమె విశ్వాసము బట్టి ఆ దినము వాక్యము నెరవేరినది. ఆయన నలిగిన హృదయము గలిగిన వారిని బాగుచేయును, రోగులను మరియు కుంటివారిని స్వస్థపరచును.

ఆమె, ఆయన వస్త్రమును ముట్టుకొని మరియు వెళ్ళి కూర్చొన్నది, "నన్నెవరు తాకిరి?" అని ఆయన సమూహము లోనికి చూసెను.

ఈ రాత్రి ఇక్కడున్న దినము కంటే, ముప్పది రెట్లు జనులు అనగా వేలాదిమంది వచ్చియుందురు. అది ఒక గొప్ప జన సమూహము. ఆయనకేలాగు తెలిసినది. "నన్నెవరు తాకిరి" అని ఆయన అడిగెను. ఆయన మాటవరుసకు దానిని పలుకలేదు. ఆయన చెప్పినది నిజమే, "నన్నెవరు తాకిరి," అని ఆయన అడిగెను. ఆయన తిన్నగా ఆమెను చూచి, ఆమె రక్తస్రావ రోగము పోయినట్లు ఆమెతో చెప్పెను. అది నిన్న యేసు చేసినది; నేడును ఆయన అదే చేయును.

మీరది నమ్ముదురా?

66మిమ్మును నేనెరుగను; దేవుడెరుగును. నిన్ను ప్రక్కలో నెప్పి బాధించుచున్నది. అది నిజము. నీవక్కడ కూర్చుని దాని గూర్చి ప్రార్థించుచున్నావు, నీకు నేను, నాకు నీవు క్రొత్తవారము. ఇది నిజమేనని నిలబడి చెప్పుము. నిన్ను నేను ఎరుగను. ఈ మూలనున్న యువకునితో చెప్పుచున్నాను. నీకు గొంతు వ్యాధి ఉన్నది. అది సత్యము. దాని గూర్చి నీవు ప్రార్థించుచున్నావు. దేనిగూర్చో నీవు ఆందోళన చెందుచున్నావు. నీవు సేవకునివి. నీకు కార్యక్రమములు ఉన్నందున వెళ్ళిపోవలెనని తలంచుచున్నావు, అది సత్యము. నీ పేరు దేవునికి తెలియునని నమ్ముదువా? రేవ. స్మిత్, వెళ్ళి స్వస్థత పొందుము; యేసుక్రీస్తు నిన్ను బాగుచేసెను. నీ కూటమునకు వెళ్ళుము, నీ గొంతు బాగయినది. ఆయన ఎవరిని తాకెను?

MATT 15:22

 

67ఆ వెనుక ఒకాయన కూర్చొని బాధపడుతున్నాడు. అతని ఎడమ ఊపిరితిత్తులో ఒక కంతి ఉన్నది. ఇక్కడివాడు కాడు. నీవు ఒక గని కార్మికునివి. అది నిజము. నేను పూర్తిగా నీకు కొత్తవాడిని. అది నిజమైతే, చేతినెత్తి చూపుము. ఆ కంతి నీ ఎడమ ఊపిరితిత్తిలో ఉన్నది. వెంటనే అది ఆపరేషను చేయబడవలెనని చెప్పిరి. నిజమేనా? నీవు ఇక్కడి వ్యక్తివి కాదు. మరోచోట నుండి వచ్చితివి. నీవు వర్జీనియా నుండి వచ్చితివి. అది నిజము. నీవెవరివై ఉన్నావో దేవునికి తెలియునని నీవు నమ్ముదువా? నీ పేరు, మీచెల్ (అది నిజము), ఇంటికి వెళ్ళి బాగుపడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. అతడిని అడుగండి; నా జీవితములో ఎన్నడు అతనిని చూడలేదు. అతడు అక్కడ ప్రార్థించుచు కూర్చొనెను. ఈ దినము ఈ లేఖనము…

[బ్రెన్హాం సోదరుడు, జనులకు తన వీపును త్రిప్పియున్నాడు. - సంపా.] ఇక్కడ నా వెనుక ఒక స్త్రీ కూర్చొనియున్నది. గుడారములో శారావలె ఆమె కూర్చొనెను. ఆమె తన కుమార్తె కొరకు ప్రార్థించుచున్నది. లేచి నిలబడుము, ఆ కుమార్తె ఇక్కడ లేదు; ఆమె దూరముగా ఉన్నది. నీవు యేసుక్రీస్తు నొద్దకు దయ్యముతో పీడించబడి వచ్చిన స్త్రీ వలె ఉన్నావు. ఆమెకు దయ్యము పట్టినది. ఆమె ఇక్కడ లేదు; నీవు ఉత్తర కరోలినా నుండి వచ్చావు. నీవది నమ్ముదువా, మరియు అది నిజమే గదా? నీ పేరు ఆర్డర్స్, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళవచ్చును. నీ పూర్ణ హృదయముతో నమ్ముము. యేసుక్రీస్తు దినములలో ఆ కుమార్తె బాగుపడినట్లే, నీ కుమార్తెయు బాగవును.

LUKE 4:20,21•

REV 19:7

 

68ఈ దినము ఈ లేఖనము - సోదోమ సూచన, అగ్ర సంతానపు సూచన. స్వాభావిక సంఘము యొక్క సూచన - ఈ దినము ఈ లేఖనము మీ మధ్య నెరవేరినది! అది నీవు నమ్మెదవా? వెంటనే ఆయనను నీ రక్షకుడిగా, బాగుపరచువానిగా అ౦గీకరించెదవా? మీరందరూ లేచి నిలబడండి, ఈలాగు చెప్పండి, "నా స్వస్థతను అంగీకరించుచున్నాను; ఆయనను నా రక్షకునిగా స్వీకరించెదను; ఆయనను నా రాజుగా అంగీకరించెదను." అందరూ లేచి నిలబడండి.

ఈ దినమును… స్నేహితులారా వినండి. ఆయన లేఖనము తీసికొని, చదివి, తిరిగి దానిని యాజకునికి ఇచ్చెను. జనుల కన్నులు ఆయన మీద యుండెను. ఆయన వారి వైపు చూచి, "ఈ దినము ఈ లేఖనము నెరవేరినది," అని చెప్పెను.

మనము చివరి దినములలో జీవించుచున్నామని నిరూపించు లేఖనములు ఒక డజను చదివి వినిపించాను. యేసుక్రీస్తు తిరిగి భూమి మీదికి వచ్చుట ఈ తరము చూచును. ఈ రాత్రి మరల చెప్పుచున్నాను, ఈ దినము ఈ లేఖనము మీ కన్నుల యెదుట నెరవేరినది!

టుసాన్లోను, కాలిఫోర్నియోలోను, న్యూయార్కులోను, ఈ టెలిఫోనుల ద్వారా మీరు వినుచున్నారు. మీ ఎదుట ఈ దినము ఈ లేఖనము నెరవేరినది! గొర్రెపిల్ల పెండ్లి విందులో ఆనందించెము, అది సమీపముగా యున్నది, మరియు ఆయన వధువు తన్ను తాను సిద్ధపరచుకొనియున్నది!

మన చేతులు ఎత్తి అందరము ఆయనకు మహిమ చెల్లించుదము. దేవుడు మిమ్మును దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...