దేవుడు ఏర్పరచుకొనిన ఆరాధన స్థలము
1మనము ప్రార్ధన కొరకు తలలు వంచియుండగా ఒక-క్షణము లేచి నిలబడుదము. మరియు ఇప్పుడు మనము తలలు వంచియుండగా (మరియు మన హృదయములను కూడా వంచియున్నామని నేను విశ్వసించుచున్నాను.) ఈ రాత్రి ప్రార్ధనలో జ్ఞాపకము చేసికొనుటకు ప్రత్యేకమైన విన్నపములు ఎందరికున్నని? మీ చేతులెత్తి, ఈలాగు చెప్పండి, "దేవా, నేను వెదకుచున్న దానిని ఈ రాత్రి నాకు దయచేయుము." ప్రభువు మిమ్మును దీవించును.
MATT 10:29•
LUKE 12:6
2మా పరమతండ్రీ, ఇప్పుడు మేము ఈ గొప్ప కృపా సింహాసనమును దీనముగా సమీపించుచుండగా దేవుడు, మరియు దూతలు, మరియు కెరూబులు, మరియు పరలోక సైన్యమంతయు కూడుకొనియున్న ఆవలకు విశ్వాసము ద్వారా మేము కదలుచున్నాము. పరమందలి తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల రాలదని ఆయన చెప్పెను. ఇక్కడ వందలాదిమంది జనులు తలలు వంచి నిన్ను ప్రత్యేక మనవుల నిమిత్తము అడుగుచుండగా మరెంతగానో నీకు తెలియును. ఈ రాత్రి అవసరతలోవున్న లోకమువైపు చూడుము, ఏలయనగా మేము అవసరతలోవున్న జనులము.
దేవా, ఇక్కడ మేము కూడుకొని ప్రార్ధనకు జవాబును ఇచ్చు సజీవ దేవుని యందు మా విశ్వాసమును వ్యక్తము చేయుచున్నాము. హృదయము మరియు చెవులు సున్నతి పొందని ఈ జనుల మధ్యనుండి మేము బయటకు వచ్చియున్నాము, ఒక ప్రత్యేక జీవితమును జీవించుటకు వచ్చియున్నాము, మరియు నీయందు మా విశ్వాసమును ఒప్పుకొనగోరుచున్నాము. మరియు మేము అవసరతలో ఉన్న జనులము అని ఈ రాత్రి మేము చేతులెత్తి చెప్పుచున్నాము. ప్రియమైన దేవా, వారి ప్రతి మనవికి జవాబును దయచేయుము.
3ఆ తరువాత తండ్రీ, వాక్యములో ఈ రాత్రి మమ్ములను దర్శించుమని ప్రార్ధి౦చుచున్నాము. ఇక్కడికి మేము దిద్దుబాటు కొరకు, అవగాహన కొరకు వచ్చియున్నాము, ఈ ప్రస్తుత దినములలో ఏలాగు జీవించవలెనో తెలిసికొనగోరుచున్నాము, ఏమి చేయవలెనో అని ముందుకు చూచుచున్నాము. ఎందుకనగా ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలను బట్టి ప్రభుని రాకడ సమీపించుచున్నదని మేమెరుగుదుము. నీ బిడ్డలకు సంపూర్ణ విడుదల అనుగ్రహించబడునప్పుడు, ప్రభువా, ఆ సమయమును మేము సమీపించుచున్నాము. దేవా, మాలో ప్రతి ఒక్కరము అక్కడ ఉండునట్లు చేయుము; ఒక్కరు కూడా తప్పిపోకుండును గాక. ప్రభూ, వేుము ఇక్కడ ఉండుటలో గల ఉద్దేశ్యము అదియే. మేము నిన్ను ప్రేమించుచున్నాము, మరియు ఆ ఘడియ కొరకు సిద్దపడుటకు ప్రయత్నించుచున్నాము.
మాతో మాట్లాడుమని మరల ఈ రాత్రి అడుగుచున్నాము, మరియు రోగులను బాగుచేయుము. ఈ భవనములో వున్న రోగులనందరిని, శ్రమపడుచున్న వారినందరిని నీవు బాగుచేయుమని ప్రార్ధి౦చుచున్నాము, మరియు ముఖ్యంగా వారి ఆత్మీయ అవసరతలను తీర్చుము. నశించిన ప్రతి ఆత్మను నీవు రక్షించుమని ప్రార్థి౦చుచున్నాము, ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్మతో నింపుము, నీయందు విశ్వాసముంచుచున్న ప్రతి బిడ్డను నీ శక్తి మరియు బలముతో నూతన పరచుము. తండ్రి, వీటిని దయచేయుము. మేము విస్తారముగా నిన్ను అడుగుచున్నాము, ఎందుకనగా నీవు సమృద్దిగా, గొప్ప వాటికొరకు ఎక్కువగా అడుగుమని చెప్పితివి. మా సంతోషము అప్పుడు సంపూర్ణమగును. మరియు యేసు క్రీస్తు నామములో వీటిని అడుగుచున్నాము. ఆమేన్. (కూర్చొనండి.)
4సువార్త వినుటకు కూడుకొనిన ఈ చక్కని జనుల ముందు ఈ పాఠశాల వేదిక మీద, నేను తిరిగి ఈ రాత్రి నిలబడుట ఒక గొప్ప భాగ్యమని నిశ్చయముగా తలంచుచున్నాను. సత్యమని నాకు తెలిసినది మీకు చెప్పుటకు దేవుని కృపను నేను కోరుచున్నాను. సింహపు నోటిని ఆయన మూసినట్టే మానవుని నోటిని మూసివేయగలడని నేను ఇంకను నమ్ముచున్నాను. మరియు ఆయన చిత్తమునకు తప్పైన మరియు భేదమైన దానిని ఎన్నడయినా నేను చెప్పినయెడల, దానిని నేను చెప్పకుండునట్టు ఆయన నా నోటిని మూసివేయవలెనని నేను యథార్థముగా ప్రార్థి౦చున్నాను. ఎందుకనగా నా మట్టుకు, నేను నిజంగా పరలోకములో ఉండగోరుచున్నాను, మరియు అబద్ద నాయకునిగా యుండి, మోసముతో జనులను నడిపించినయెడల, ఎన్నడూ నేను అచ్చట వుండను. నేను దానిని చేసినట్టయిన, దానికి కారణము ఏ వ్యత్యాసము నాకు తెలియకపోవుటయే. ప్రభువు మిమ్మును దీవించును.
5ఇప్పుడు, అది దేవుని చిత్తమయినచో, రేపు ఉదయము, "వివాహము మరియు పరిత్యాగము," అను అంశము మీద నేను మాట్లాడగోరుచున్నాను. మరియు మీరు మీ పెన్సిళ్ళను మరియు కాగితములను తీసికొని వచ్చెదరని నమ్ముచున్నాను. ఎక్కువ సేపు మేము తీసికొనము, అయితే నేను కోరుచున్నాను… ఈ ఇండియానాలో నేనుందునని వాగ్దానము చేసినందున మొదటి ప్రాధాన్యత మీకిచ్చి వచ్చాను. మరియు రేపు ఉదయము ప్రయత్నించెదను; రేపు ఉదయము విఫలమైనచో, రేపు రాత్రికి ప్రయత్నించెదను, అయితే ప్రభుని చిత్తమయితే రేపు ఉదయము ఆ అంశము మీద గల రెండు రకముల ఆలోచనలను మీ ము౦దు వుంచుటకు ప్రయత్నించెదను. మరియు ఏది సత్యమో తెలిసికొనుటకు, కేవలము ఏది సత్యమో తెలిసికొనుటకు, దేవుడు మనకు సహాయము చేయును గాక, అందువలన మనము సత్యములో మరియు వెలుగులో నడువగలము.
6మాకు ఒక నల్లజాతి స్నేహితుడు ఉండేవాడని మీకు తెలియును. అతడు నాతో చెప్పెను; అతడు చెప్పెను, "బిల్లీ సోదరుడా" చెప్పెను, "అద్దరి నదియొద్ద ఎట్టి శ్రమను నేను ఎదుర్కొనగోరుట లేదు." అతడు చెప్పెను, "నేను నా చేతిలో ఆ టిక్కెట్టును పట్టుకోగోరుదును. మరియు ఈల ఊదబడిప్పుడు, అక్కడ సమస్యలు ఉండకూడదని నేను కోరుచున్నాను. నాలో ఏదయినా తప్పున్నచో, ఇక్కడే నేను దానిని సరిచేసికొనునట్టు చేయుము, గనుక నాకు తెలియచేయుమని కొంతకాలం క్రితం ప్రభువును అడిగాను, ఎందుకనగా అవతలి ఒడ్డుకు ఓడ కదలి వెళ్ళు ఆ ఉదయము చీకటిగాను, తుఫానుతోను యుండును. ఎట్టి అవాంతరమును నేను ఎదుర్కొన గోరుట లేదు; అంతా ఇక్కడే చక్కపెట్టుకొన గోరుచున్నాను." అందుకొరకే మనము ఇక్కడ వున్నాము, ఆ ఘడియలో ఓడలోనికి నడచునట్టు ప్రతి ఒక్క అడ్డంకులను తొలగించుకొనుటకు ప్రయత్నించుచున్నాము.
ఇప్పుడు ఈ రాత్రి మీతో ఎక్కువ సేపు నేను మాట్లాడను, ఎందుకనగా రేపు మనకు రెండు ఆరాధనలున్నవి. ఆ తరువాత నేను మరెక్కడికో లేక మరొకరి వద్దకు వెళ్ళి, మరిన్ని ఆరాధనలు చూడవలెను.
DEUT 16:1,2
7అయితే ఇప్పుడు, ద్వితీయోపదేశకాండము పుస్తకములో 16వ అధ్యాయము నుండి, మొదటి మూడు వచనములను చదువగోరుచున్నాను, ద్వితీయోప దేశకాండము 16:1-3 వచనములు చదువగోరుచున్నాను.
అబీబు నెలను ఆచరించి, నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను…నీ దేవుడైన యెహోవా:… అబీబు నాలుగో నెలలో నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి రాత్రి వేళ నిన్ను రక్షించెను.
యెహోవా తన నామమును స్థాపించుకొనుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొర్రె మేకలలో గాని, గోవులలో గాని బలి అర్పి౦చవలెను.
8ఇప్పుడు, ఈ రాత్రి నా అంశము ఏమనగా, "దేవుడేర్పరచుకొనిన ఆరాధనా స్థలము." మీరు గమనించినట్లయిన, అ-బీ-బు నెల అనగా, అర్ధము ఏప్రిలు. వారు బయటుకు రప్పించబడినది ఏప్రిల్ నెలలోనే. మరియు ఇప్పుడు, ఈ రాత్రి వింతైన సంగతి ఏవనగా దేవుని ఆరాధించుచున్న మనము ఈ దినములలో ఎన్నో వేర్వేరు మానవ ఉద్దేశ్యములను మనము కనుగొనుచున్నాము. మరియు ఒక సంగతి మీద ఎప్పుడయితే వివిధ అభిప్రాయములుండునో, అక్కడ చాలా ప్రశ్నలుండును, అడుగబడుచున్న ప్రతి ప్రశ్నకు ఒక నిజమైన జవాబు ఉండి తీరవలెను. "ఇదేమిటి?" అని నేను ప్రశ్నించాననుకోండి?"
"మంచిది, ఒక మేజా," అని వారు చెప్పుదురు.
"అది ఎందుకొరకు?" చూసారా?
ఇప్పుడు, అక్కడ ఒక "అది ఒక బల్ల కాదు; అది పలక." అని ఎవరైనా చెప్పవచ్చును. మంచిది, అది ఒక పలక, గాని అది ఒక బల్ల కూడా. మీరు చూడండి, దానికి ఒక నిజమైన జవాబు వుండియుండవలెను. మరియు నేను దేనిగూర్చి అయినా ప్రశ్నించునప్పుడు, దానికి ఒక నిజమైన జవాబు ఉండవలెను. ఏదైనా దానికి దగ్గరగా ఉండియుండవచ్చు, ప్రతి ప్రశ్నకు ఒక నిజమైన, సూటియైన జవాబు ఉండవలసియున్నది. అందువలన, మన జీవితములలో వచ్చు ప్రతి ప్రశ్నకు ఒక నిజమగు, సరియగు జవాబు ఉండవలెను.
9మరియు ఇప్పుడు, నేడు ప్రపంచములో చాలామంది నోట మనము ఈనాడు వినుచున్నాము. ఒక మిషనరీగా వుంటూ, సముద్రము పైన, ప్రపంచమంతటా పలుసార్లు పర్యటించియున్నాను, బౌద్ద, మహమ్మదీయ, మరియు సిక్కులు, మరియు జైనులు, మొదలగు చాలా మతముల వారితో నేను మాట్లాడియున్నాను. ఆ తరువాత ఇక్కడ మన స్వంత అమెరికా దేశములోనూ, మరియు విదేశములలో మాట్లాడాను, మన వివిధములైన అన్ని శాఖల సంఘములను దర్శించాను, అప్పటి రోమను కాథలిక్కు, మరియు గ్రీకు, ఇంకా ఆ యా సంపద్రాయ, శాఖా సంఘములను కలిసికొన్నాను, ఆ తరువాత తొమ్మిది వందలకు పైనున్న వివిధ ప్రొటెస్టెంటు శాఖలను కలిసికొన్నాను. ఇప్పుడు, వారిలో ప్రతి ఒక్కరు ప్రతివారి అభిప్రాయమును మీరు చూడగలరు, మరియు వారిని నేను నిందించలేను, ప్రతివారు తమదే సత్యమని వారు సత్యమును కలిగియున్నారని చెప్పుకొనుచున్నారు, మరియు ఆ సంఘములకు చెందినవారు దానిని నమ్మవలెను, ఎందుకనగా వారు తమ-తమ గురిని, నిత్యత్వపు గురిని, ఆ సంఘ బోధన మీదనే నిర్మించుకొనియున్నారు. మరియు వారు ఒకరికొకరు ఎంతో వేరుగా వున్నారు, ఇంకను అది తొమ్మిది వందలకు పైబడిన ప్రశ్నలుగా అగుచున్నది. కాబట్టి, తొమ్మిది వందలకు పైగా ప్రశ్నలున్నను, అక్కడ ఒక సరియైన జవాబు ఉండవలసియున్నది. మరియు మనందరము ప్రభువైన యేసును ప్రేమించుచూ, ఆయనను పరమ౦దు కలిసికొనుటకు ప్రయత్నించుచున్నాము గనుక లేఖనములను వెదకి ఆ జవాబును కనుగొ౦దము.
DEUT 16:1
10ఇప్పుడు, అది ఒక బైబిలు ప్రశ్న అయినచో, అప్పుడు దానికి ఒక బైబిలు జవాబు ఉండవలెను. ఒక మనుష్యుల గుంపు నుండి గాని, ఏదయినా ఒక ప్రత్యేక సహవాసము నుండి గాని, ఎవరో విద్యావేత్త నుండి గాని, ఏదో శాఖనుండి గాని అది రాజాలదు; అది తిన్నగా దేవుడు కలిసికొను ఆరాధన స్థలమైన వాక్యము నుండియే రావలెను. మరియు ఆయన దేవుడైయున్నాడు గనుక, ఆయనను కలసికొనునటు, ఎక్కడో ఒక చోటు ప్రారంభమందు, నిశ్చయముగా ఒక స్థలము వుండును.
ఇప్పుడు, ఇక్కడ ద్వితీయోపదేశకాండములో ఇచ్చట మనము కనుగొన్నాము, మోషె జనులతో వాక్యమును, సంగతులను తిరిగి ఐగుప్తులో నుండి ఒక బలమగు, గొప్ప హస్తము ద్వారా ఏలాగు తాను వారిని బయటకు తీసికొనివచ్చెనో, ఎట్లు వారిని స్థిరపరచెనో తిరిగి చెప్పుచున్నాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చువరకు వారు "దేవుని ప్రజలు," అని పిలువబడిరి. తరువాత వారు "దేవుని సంఘము" అనబడిరి, ఎందుకనగా సంఘము అనునది ఒక సమాజము లేక… వాస్తవముగా "సంఘము అనగా బయటకు 'పిలువబడిన వారు,'" అని అర్ధము, వారు బయటకు పిలువబడిరి. మరియు వారు సంఘముగా వుండుటకు ఐగుప్తులో నుండి బయటకు పిలువబడిరి.
DEUT 16:2
11ఇప్పుడు, వారు దేవాలయమును ఏర్పాటు చేసికొనకముందే ఆయన ఇట్లు చెప్పెను, "నా ఆరాధన స్థలమును నేను ఏర్పాటు చేసికొందును, మరియు నేను దానికి నా పేరును పెట్టెదను." మరియు దేవుడు తన స్వంత ఎన్నిక అయిన ఆ స్థలములో మాత్రమే ఎవరినయినా గాని కలసికొనును. ఆయన తన స్థలమును ఎన్నుకొనెను; మరియు ఆయన తాను ఎన్నుకొనినచోటికి తన పేరును పెట్టెను. ఇక్కడ రెండవ వచనము దానిని మనకు చెప్పుచున్నది. జనులు చేరి ఆయునను ఆరాధించునట్లు ఆయన ఎన్నుకొనిన స్థలమునకు ఆయన తన పేరును పెట్టును. ఇప్పుడు, దానిని గురించిన విషయమేదనగా, ఆ స్థలము ఎక్కడ వున్నదని మనము కనుగొనగోరుచున్నాము.
తొమ్మిది వందలకు మించిన అబిప్రాయములున్నవి, అన్ని అన్య మతములను మనము దాటి వచ్చి, క్రైస్తవ మతమును గూర్చియే మాట్లాడుచున్నాము. నాకు అన్యుల పట్ల విచారమున్నది, లేనియెడల నిశ్చయముగా వారియొద్దకు వెళ్ళి మాట్లాడను, అయితే వారిది తప్పు. క్రైస్తవ్యము మాత్రమే సరియైనది. నేను కేవలము క్రైస్తవుడయినందున ఆ మాటను చెప్పుటలేదు, ఏలయనగా అది సత్యమని నేను నమ్ముచున్నాను. అది మాత్రమే సరియైన మతము.
JOHN 10:18
12ప్రతి నాలుగు గంటలకు తెల్లని గుర్రమును మార్చు సమాధికి నేను వెళ్ళాను, (క్రీస్తు తరువాత వచ్చిన గొప్ప పూజారి మరియు నాయకుడైన మహమ్మదు, అతనిని ప్రవక్త అనుచున్నారు; మకాబీ (Maccabee) సోదరుల తరువాత అతడు వచ్చెను, అందులో సందేహము లేదు), కాని వారు- అతడు చనిపోయిన తరువాత మరలా తాను తిరిగి లేచి మరియు ప్రపంచ మును జయించుదునని చెప్పెను. ఇప్పుడు, ప్రతి నాలుగు గంటలకు వారు రక్షక భటులను మార్చుదురు, మరియు అతని సమాధి యొద్ద తెల్లని గుర్రమును ఉంచెదరు. అతడు లేచి ప్రపంచమంతటినీ జయించునని రెండు వేల సంవత్సరముల నుండి వారు ఎదురుచూచుచున్నారు. కాని మీరు చూడండి…
మరియు మీరు బుద్దుని యొద్దకు వెళ్ళండి. దాదాపు ఇరవై మూడు వందల సంవత్సరముల క్రితము బుద్దుడు జీవించెను, జపాను దేశపు దేవుడు. అందువలన అతడు ఒక వేదాంతి, కన్పూషియస్ (Confucius) వంటివాడు. కాని ఈ మతస్థాపకులందరూ, వారందరూ తమ వేదాంతముతోనే చనిపోయి మరియు సమాధి చేయబడిరి. కాని యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన క్రైస్తవ్యము, ఒక ఖాళీ సమాధిని కలిగియున్నది. ఈ భూమి మీద జీవించినవారిలో "నా ప్రాణమును పెట్టుటకు, తిరిగి దానిని లేపుటుకు నాకు అధికారమున్నది," అని చెప్పిన మనిషి ఆయన మాత్రమే. మరియు ఆయన దానిని చేసెను, మరియు అతడు నేడును జీవించుచున్నాడు. ఆయన జీవించియున్నాడని మనకు తెలియును, ఎందుకనగా ఆయన మనతో కూడా వుండి మరియు భౌతిక సూచక క్రియలు మరియు మహత్కార్యముల ద్వారా తనను తానే రుజువు చేసికొనుచున్నాడు, ఆలాగు చేయుదునని ఆయన వాగ్దానము చేసెను; అరణ్యము గుండా ఇశ్రాయేలీయులను నడిపించిన ఒక అగ్నిస్తంభమువలె, అది నేడు మనతో వున్నది. దాని పటము కూడా తీయబడినది, ఈ దినమున తాను చేయుదునని వాగ్దానము చేసిన అద్భుతములను మరియు సూచక క్రియలను జరిగించుచున్నాడు, ఆయన వాగ్దానము చేసిన వాక్యములన్నియూ ఈ దినమున బయలుపడుచున్నవి. కాబట్టి, మిగిలిన అన్య ప్రపంచము ఆశ వదలుకొన్నది; అది క్రైస్తవ్యము.
PHIL 2:12
13ఇప్పుడు, దేవుడు ఎక్కడ కలసికొనును అను విషయము మీద తొమ్మిది వందలకు పైగా ప్రశ్నలున్నవి — "ఆయన మెథడిస్టులతో కలిసికొనును," లేక "ఆయన బాస్టిస్టులతో కలిసికొనును," మరియు "ఆయన దీనిలో, మరియు దానిలో," "మరియు మరొక దానిలో కలిసికొనును"— ఇప్పుడు, అక్కడ ఒక ప్రశ్నవున్నది. కావున ప్రతివారు తమ స్వకీయ రక్షణను భయముతోను వణకుతోను వెదుకవలసియున్నారు. కాని ఈ రాత్రి జనులతో ఆరాధనలో దేవుడు ఎక్కడ కలిసికొనును అను ప్రశ్నకు సరియగు సమాధానమును వాక్యములో వెదకి రుజువు చేయుటకు ప్రయత్నించవలెనని నేను కోరుచున్నాను. మరియు ఆయన కలిసికొను చోటు అది మాత్రమే అని చూడగలము.
ROM 6:23
14ఇప్పుడు, ఈ అంశమును మనము ద్వితీయోపదేశకాండము ను౦డి తీసికొన్నాను. ఇది ఒక గ్రీకు పదము, దీనికి పలు అర్ధములున్నవి, లేక దాని అర్ధము "రెండు ధర్మశాస్త్రములు." "ద్వితీయోపదేశకాండము" అను గ్రీకు పదమునకు రెండు "వేర్వేరు ధర్మశాస్త్రములు," అని అర్ధము. మరియు దేవుడు కలిగియున్నది అదే. రెండు వేర్వేరు ధర్మశాస్త్రములు. మరియు వాటిలో ఒకటి ఒక మరణ శాసనము, రెండవది ఒక జీవశాసనము. దేవునికి రెండు ధర్మ శాస్త్రములు కలవు. ఆయనను వెంబడించి, ఆయనను సేవించి, ఆయనను ఆరాధించుట జీవము; దానిని తిరస్కరించుట మరణము. దేవునిలో రెండు ధర్మశాస్త్రములున్నవి.
ఇప్పుడు, సీనాయి కొండ యొద్ద ఆ ధర్మశాస్త్రములలో ఒక స్త్రీ ప్రపంచమునకు తెలియచేయబడెను. దేవుడు మోషేకు, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఇచ్చెను. ధర్మశాస్త్రము వారికి సహాయపడునని కాదు గాని, అది వారు పాపులని చూపించెను. ఆ సమయము వరకును అనగా ధర్మశాస్త్రము వచ్చు వరకును పాపమనగా ఏమిటో వారెరుగరు. శిక్షలేకుండా ధర్మశాస్త్రము వుండదు. శిక్షలేని ఒక శాసనము శాసనమే కాదు. కాబట్టి, ధర్మశాస్త్రమును అతిక్రమించుటయే పాపము. పాపమునకు వచ్చు జీతము మరణము. కావున, దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రమును ఇచ్చువరకు వారికి ఏ పాపము ఆరోపించబడలేదు. ఒక గంటకు ఇరవై మైళ్ళ వేగమును మించి వెళ్ళరాదను చట్టము ఇక్కడున్నదనుకొనండి, అప్పుడు నీవు ఒక గంటకు ఇరవై మైళ్ళ వేగముతోనే వెళ్ళుదువు. అయితే దానిని నీవు చేయకూడదు అని ఒక చట్టము వున్నప్పుడు, అప్పుడు అక్కడ ఒక చట్టము మరియు దాని వెనుక ఒక శిక్ష వున్నది.
EPH 2:5
15ఇప్పుడు, సీనాయి కొండ మీద ఇయ్యబడిన మరణ-శాసనములు, అవి మానవుడు పాపియని అని చెప్పెను, మరియు దేవుని ధర్మశాస్త్రమును మీరుట వలన అతడు మరణించెను. కాని ఆ ధర్మశాస్త్రములో ఏ రక్షణయూ లేదు. అది నిన్ను కారాగారంలో పెట్టు కాపలాదారుడు మాత్రమే; అందులో నుండి అది నిన్ను బయటకు తేజాలదు. అయితే కారాగారం తరువాత ఆయన మరియొక ధర్మశాస్త్రమును ఇచ్చెను. అది కల్వరి కొండవద్ద యేసు క్రీస్తులో పాపము ఆరోపించబడినప్పుడు. మరియు అక్కడ క్రయుధనము చెల్లించబడినది, మరియు ధర్మశాస్త్రముతో కాదు… ధర్మశాస్త్రము లేకుండా, అయితే కృప వలన. మీరు దేవుని కృపవలన జీవమును గురించిన దేవుని పూర్వజ్ఞానము యొక్క ముందు నిర్ణయము ద్వారా రక్షించబడితిరి.
ఇప్పుడు, ఈ రెండు చట్టములను మనము చూచుచున్నాము, ద్వితీయోపదేశకాండము రెండు శాసనములను గూర్చి చెప్పుచున్నది. అక్కడ రెండు చట్టములున్నవి: ఒకటి మరణచట్టము. రెండవది జీవపు చట్టము.
ROM 2:28,29•
ROM 11:26
16జనులకు రెండు నిబంధనలు కూడా ఇవ్వబడెను. ఉదయమున వాటి గూర్చి మనము మాట్లాడుకొనబోవుచున్నాము. "నీవు దీనిని చేసినట్టయిన మరియు దానిని చేయవద్దు…" అందులో ఒకటి ఆదాముకు షరతుమీద ఇవ్వబడినది: "నీవు దీనిని చేసినట్టయిన మరియు దానిని చేయవద్దు…" కాని ఆ చట్టము అతిక్రమించబడినది. ఏదెను తోటలో ఆదాము హవ్వలు దానిని అతిక్రమించిరి. అప్పుడు దేవుడు రెండవ నిబంధనను చేసెను, మరియు అబ్రాహామునకు ఇచ్చెను; మరియు ఆ శాసనము షరతులు లేనిది. "అది నీవేమి చేశావు లేక నీవు ఏమి చేయుదువు అని కాదు;" "నేను ముందుగానే దానిని చేశాను," అని ఆయన చెప్పెను. అదియే కృప. అది జీవశాసనము. దేవుడు దానిని అబ్రాహామునకు, అతని తరువాత వచ్చు సంతానమునకు చేసెను. అబ్రాహాము యొక్క సంతానమ౦తయు, బైబిలు చెప్పినట్టుగా, "ఇశ్రాయేలీయులందరూ రక్షించబడుదురు." అయితే దాని అర్ధము యూదులందరూ అని కాదు, పౌలు చెప్పినట్లుగా "బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాడు." బాహ్యముగా, గత రాత్రి మనము చెప్పుకొనినట్టుగా, అది సంపర్కము ద్వారా ఇస్సాకుకు కలిగిన పిల్లలు. కాని దేవుని ధర్మశాస్త్రము క్రీస్తు మూలముగా వచ్చెను, అది అబ్రాహాము యొక్క రాజరిక సంతానము, కృప ద్వారా ఇశ్రాయేలీయులందరూ రక్షించబడిరి. అనగా క్రీస్తునందున్నవారందరూ రక్షించబడిరి, దేవుని రెండవ నిబంధన. కాని ఇవన్నియూ క్రీస్తుకు ముందస్తు సూచనలు.
DEUT 16:2•
JOHN 8:32
17ఇప్పుడు, 2వ వచనమును గమనించుడి. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 16:2 "నేనేర్పరచుకొనిన స్థలములో ఆరాధించుడి." ఇప్పుడు, "మీరు దేవుని ఆరాధించవలసియున్నారు," ఆయన చెప్పెను, "నేనేర్పరచుకొనిన స్థలములోనే" — ఎవరో ఏర్పాటు చేసికొనినది కాదు, "కాని నేనేర్పరచుకొనిన స్థలములో ఆరాధించుడి." ఇప్పుడు, దేవుడు ఒక స్థలమును ఎన్నుకొనినట్టయిన, అప్పుడు దానిని గురించి ఆయన చెప్పిన దానిని మనము కనుగొనుటకు శ్రద్ద వహించవలెను. మరియు అది ఎక్కడున్నది? నేను దానిని కనుగొనగోరుచున్నాను, ఎందుకనగా నేను నిజంగా ఆయనను ఆరాధించవలెనని కోరుచున్నాను. ఈ రాత్రి మనమందరము ఆయనను ఆరాధించుటకు ఇక్కడ వున్నాము. ఈ రాత్రి ఇక్కడ కూర్చొన్నవారిలో మెథడిస్టు, బాప్టిస్టు, కాథలిక్కు, యేహోవా సాక్షి, క్రైస్తవ విజ్ఞానశాస్త్రము, ఇంకా తదితర శాఖలవారు వున్నారు, కాని మనమందరమును దేనికొరకో వెదకుచున్నాము. మనము సత్యమును తెలిసికోగోరుచున్నాము. "మీరు సత్యమును తెలిసికొందురు, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును," అని బైబిలు చెప్పెను. కొంతమంది…. నీవు ఏమి చేయుచున్నావో నీవు తెలిసికొనలేవు, దానిని ఎలా చేయవలెనో నీవు తెలిసికొనునంతవరకు దానిని ఎలా చేయవలెనో నీకు తెలియదు — లేనట్లయిన దానిని ఎలా చేయవలెనో నీవు తెలిసికొనునంతవరకు ఏమి చేయవలెనని నీకు తెలియదు. నీవు చేయుచున్నదేమిటో మరియు దానిని ఎలా చేయవలెనో నీకు తెలిసియుండవలెను.
దేవుడు తనను ఆరాధించువారికి ఒక ప్రత్యేక ఆరాధన స్థలమును ఏర్పరచెనని ఇది చూపించుచున్నది, మరియు ఆ స్థలములో మాత్రమే దేవుడు తన ఆరాధికులను కలసికొనును.
18ఇప్పుడు, ఆయనను ఆరాధించువారికి ఆయన ఏర్పరచిన స్థలములో తన నామమును ఉంచుదునని కూడా ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు, ఈ చోటు ఎక్కడున్నదో మనము వాక్యము ద్వారా పరిశీలించి కనుగొందము. నిశ్చయముగా, జనులు తనను కలసికొని తనను ఆరాధించు ఆ స్థలములో ఆయన తన నామమును ఉంచెదనని దేవుడు చెప్పినట్టయిన అది బైబిలులో ఎక్కడో వున్నది, ఎందుకంటే అది అన్ని కాలములకు చెందును.
మరియు ఆ గొప్ప మారని దేవుడు మారలేడు. మానవుడు మారును. దేవుడు ఏ సమయములో ఏది చెప్పినా దానికి నీవు నీ ప్రాణమును పెట్టవచ్చును, ఎందుకనగా అది సత్యము. అది నిజము. ఎందుకనగా నాకు బైబిలులో మాత్రమే నమ్మకమున్నది, ఎందుకనగా మానవుని మాట తప్పిపోవును, గాని దేవుడు అత్యున్నతుడు. గత సంవత్సరములో నేను తెలిసికొనిన దానికంటె ఎక్కువగా ఈ సంవత్సరము నేను తెలిసికొనవలెను. మీరును తెలిసికొనవలెను… ప్రతి దినము మనము అంతము గలవారము, గనుక జ్ఞానము సంపాదించుకోవలెను. కాని దేవుడు అనంతుడు. ఆయనకు అంతము లేదు; మరియు అనంతుడుగా వున్నందువలన ఆయన జ్ఞానము సంపాదించనవసరములేదు. ఆదినుండియు ఆయన పరిపూర్ణుడు. ప్రతి నిర్ణయము అక్షరాలా ఖచ్చితమైయుండవలెను.
మరియు ఒకసారి దేవుడు ఎట్లు వ్యవహరించెనో, ఆ రీతిగానే ఆయన ఎల్లప్పుడూ వ్యవహరించి తీరవలెను లేనియెడల ఆయన మొదటగా వ్యవహరించినది తప్పు. దేవుని అంగీకరించుటవలన మానవునికి రక్షణ అని ఒకసారి నిర్ణయించబడినది గనుక అన్ని సమయములలోను మానవుని రక్షణకు అదియే ప్రాతిపదికగా ఉండును. ఒక వ్యక్తి దైవస్వస్థతకొరకు రాగా, మరియు ఆయన ఒక విధానము ద్వారా అతనిని అంగీకరించెననుకొనండి, ఆ తరువాత వచ్చువానిని అదే రీతిగా ఆయన స్వీకరించవలెను, మొదటివానివలె గాక రెండవవానిని వేరుగా ఆయన అంగీకరించినయెడల ఆయన మొదట చేసినది తప్పు అగును. ఒకనిని కలసికొనుటకు దేవుడు ఒక ప్రాతిపదికను ఏర్పరచెను. ఆయన తాను ఏమి చేయునో ఎట్లు చేయునో ఒక మూలమును ఏర్పరచెను, ఏదెను తోటలో గొర్రెపిల్లను బలిగా అర్పించుట ద్వారా ఒక విధానమును ఏర్పరచెను. దేవుడు దానిని ఏ సమయములోనూ ఎన్నడూ మార్చలేదు.
19మానవుని ఎట్లు రక్షించవలెనో ఆయన నిర్ణయించుకొనెను. ఈనాడు మనము మనుష్యులను దానిలోనికి విద్యావంతులను చేయజూచాము, మనము వారికి శిక్షణను ఇవ్వజూచాము, వారిని విద్యావంతులను చేయజూచాము, శాఖగా చేయుటకు ప్రయత్నించాము, వారిని లోనికి తెచ్చుటకు, వారిని లోపల కరచాలనము చేయుటకు, వారికిలోనికి బాప్తిస్మము ఇచ్చుటకు, ఏయే మార్గములైతే ఉన్నవో అన్ని విధములుగా మనము ప్రయత్నించాము, ఉత్తరముల ద్వారా వారిని లోపలకు తెచ్చుటకు ప్రయత్నించాము, కాని (దేవుని విధానము) ఇంకను మారలేదు: గొర్రెపిల్ల యొక్క వధించబడిన రక్తము క్రింద దేవుడు మానవుని కలసికొనుచున్నాడు. ఆదియందు రక్తమే దేవుని యొక్క మార్గము, మరియు ఈ రాత్రి రక్తమే దేవుని మార్గమైయున్నది. అన్ని విషయములలో పశ్చాత్తాపపడుట మ౦చిదే, కాని రక్షణ కేవలము రక్తము ద్వారానే వచ్చును. మానవుని రక్షించుటకు దేవుడు రక్తమును మాత్రమే ఏర్పాటు చేసికొనెను, మరియు దానిని ఆయన మార్చలేడు.
యోబు కూడా దానినే కలిగియుండెను. అతడు తాను నీతిమంతుడనని ఎరిగియుండెను, ఎందుకనగా దేవుడు కోరు బలులను అతడు అర్పించెను.
20ఈ స్థలము ఏమిటో ఇప్పుడు మనము పరిశోధించుదము, మరియు ఆ స్థలములో ఆయన తన నామమునుంచును. ఆయన తన నామమును ఎచ్చటయు౦చునో మనము చూడబోవుచున్నాము. దేవుని నామము ఏమిటో, దానిని ఆయన ఎక్కడ ఉంచునో మనము చూచినయెడల ఆ వెంటనే మనము ఆరాధన స్థలమును కనుగొందుము, ఇవన్నియూ రానున్న వాటికి ఛాయలు.
ధర్మశాస్త్రమంతయూ రాబోవు సంగతులను గూర్చిన ఛాయగాయున్నది. సూర్యుని ఛాయగా చంద్రుడు వున్నట్లుగానే. అది సూర్యుడు లేని సమయములో పనిచేయును, దే-వు- ని కుమారుడు లేని సమయములో సంఘము పనిచేయుచున్నట్టే అదియున్నది. కుమారుడు లేని సమయుములో, తక్కువ వెలుగుగానున్న సంఘము, విశ్వాసులు దేవునికి సేవ చేయుచూ కుమారుడు లేనప్పుడు వెలుగును ఇచ్చుచున్నారు. సూర్యుడు ఉదయించునప్పుడు ఇక నీవు చంద్రుని చూడలేవు, ఎందుకనగా అది అస్తమించినది. దానియొక్క వెలుగు ఇకపై అవసరము లేదు, ఎందుకనగా అది రెండవది మాత్రమే, సూర్యుడే ప్రధానము.
ఇప్పుడు, భార్యాభర్తలవలె సూర్యచంద్రులున్నవి, క్రీస్తు మరియు సంఘము అలాగేయున్నారు. ఇప్పుడు, ఇవన్నియూ క్రీస్తుకు ఛాయగా వున్నవని మనము కనుగొన్నాము. ప్రతి బలి, పండుగ, పాత నిబంధనలో వున్న సమస్తము క్రీస్తుకు ఛాయగా వున్నవి. నేల మీద నీడ పడినట్లేయున్నది. ఇప్పుడు, ఈ పాత నిబంధనలో ఆరాధన స్థలము ఇవ్వబడినది, ఇప్పుడు, దీనిని మనము కనుగొననైయున్నాము, ఈ సంగతులన్నియూ మనము చూచెదము.
21ఇప్పుడు, నేల మీద ఒక నీడ పడినప్పుడు, అది పురుషునిదో, స్త్రీదో, జంతువుదో లేదా మరి దేనిదో నీవు చెప్పగలవు, ఎందుకనగా దాని నీడ నేల మీద ప్రాకును. మరియు ఆ నీడ పొట్టిదగుచుండగా తలక్రిందులుగా కనబడుట నీవు కనుగొందువు, మరియు సరియగు రూపము లేకుండా ఆ తలక్రిందులు రూపమును నీవు కనుగొనజాలవు; కాబట్టి నిజరూపము (Positive) ఛాయకు ( negative)కు దగ్గరగా వచ్చునప్పుడు, నిజరూపములో ఛాయ మ్రి౦గివేయబడును. నీడ మరియు నిజరూపము దగ్గరగా వచ్చునపుడు, మరియు ఆ తరువాత అదే దానిని ఒక నిజరూపముగా మార్చుచున్నది. మరియు పాత నిబంధనలో యున్న సంగతులు రాబోవు సంగతులకు ఛాయలుగా వున్నట్టయిన, క్రీస్తు రానున్న సంగతులకు నీడయైయున్నాడు.
కావున ఆయన తన నామమును వుంచుటకు ఒక స్థలమును ఎన్నుకొనెనని ఇప్పుడు పాత నిబంధనలో మనము చూడగలము. ఇప్పుడు, నీడ నేల మీద అడ్డముగా పడునని నేను చెప్పినట్టుగా, అది ఒక మాదిరి, అలాగే పాత నిబంధనలోని నీడలు క్రొత్త నిబంధనలో వాస్తవములుగా వచ్చును ఆరాధికులమగు మనము చూడగలము.
ఇప్పుడు, పండుగలన్నియు, సెలవు దినములు, గుడారమంతయు, అరణ్యమంతయు, గుడారములో వున్నదంతయు, అన్నియును క్రీస్తుకు మాదిరిగానున్నవి. అర్పణలన్నియు, ధర్మశాస్త్రములన్నియు క్రీస్తుకు మాదిరిగా వుండినవి. ఇక్కడ గుడారము వద్ద మనము కాలకాలములుగా దాని ద్వారా వచ్చియున్నాము. అప్పుడు ప్రతి సిద్దా౦తము, సంఘము మరియు శాఖ ఎంతో దూరముగా పోయినదని మనము చూచుచున్నాము. అది అసలు పోలికలోనే లేదు. ప్రతి సిద్దాంతము, ప్రతి సంఘము, ప్రతి శాఖ పూర్తిగా త్రోవ తప్పెను. వాటికి అసలు స్థానమే లేదు.
GEN 11:4
22బాబెలు గోపురమును కట్టుటకు వారు అందరూ ఏకమయిరి, బైబిలు యందంతట, పాత నిబంధనలో, ఐక్యతకు మాదిరి మరేదియూ లేదు. ఐక్యతకు సాదృశ్యము అదొక్కటియే. నిమ్రోదు అను ఒక దుర్మారుడు వెళ్ళి చిన్న దేశములన్నియు ఒక చోటు చేర్చి ఈ గోపురమును నిర్మించవలెనని బలవంతముగా ఏకము చేసెను. అది ఒక మతారాధనయే, కాని దేవుని వాక్యములో కలియదు. కావున శాఖా సంబంధమగు మతమునకు ఈ పాత నిబంధనలోని బాబెలు గోపురము మాదిరి. ఇది నిశ్చయంగా మతమే గాని దేవుని వాక్యము యొక్క మతము కాదు.
ఏ శాఖలోనూ దేవుడు తన నామమును ఉంచుకొనుటకు నిర్ణయించలేదు. అది ఉన్నట్టయిన దానికి వాక్యమును నేను చూపించగోరుచున్నాను. ఆయన (తమ శాఖలో) వున్నాడని చెప్పుకొనుచున్నారని నాకు తెలియును, గాని ఆయన లేడు. ఆయన పలుస్థలములలో తన నామమును ఉంచలేడు, ఎందుకనగా ఆయన తన నామమును ఒక్క చోటు మాత్రమే ఉంచెదనని చెప్పెను. ప్రతి శాఖవారు ఆ చోటు మేమే అని చెప్పుకొనుచున్నారు గాని అది తప్పు, అయితే ఎక్కడ ఆయన తన నామమును౦చెను?
EXOD 3:14•
JOHN 8:57,58
23మొదటగా ఆయన నామము ఏది? ఏ స్థలములో ఆయన తన నామమునుంచుచున్నాడో తెలిసికొను ముందుగా దేవుని (నామము) ఏమిటో కనుగొనవలెను. ఇప్పుడు, ఆయనకు చాలా బిరుదులున్నట్లు మనము కనుగొన్నాము. ఆయనను "తండ్రి"గా పిలిచాము, అది ఒక బిరుదు; మరియు "కుమారుని"గా ఆయన పిలువబడెను, అది ఒక బిరుదు; ఆయన "పరిశుద్దాత్మ"గా పిలువబడెను, అది ఒక బిరుదు; "షారోను రోజా" అని ఆయన పిలువబడెను, అది ఒక బిరుదు; లోయలోని పద్మము, ఒక బిరుదు; "ఉదయ నక్షత్రము," "యెహోవా-యీరే, యెహోవా-రాఫా" అను వివిధ విమోచక నామములు ఆయనకున్నవి, కానీ అవన్నియు బిరుదులు. అవి ఏవియూ ఆయన నామములు కావు. కాని ఆయనకు ఒక నామమున్నది.
ఆయన మోషేను కలసికొన్నప్పుడు ఇంకా పేరును కలిగియుండలేదు, మరియు "నేను ఉన్నవాడను అనువాడను," అని ఆయన మోషేతో చెప్పెను. "నేను ఉన్నవాడను అనువాడను" అని యేసు భూమిమీద ఉండగా హెబ్రియులు 6వ అధ్యాయములో, నన్ను మన్నించండి, పరిశుద్ద యోహాను 6వ అధ్యాయములో ఆయన చెప్పెను. ఎందుకు, "ఇంకా నీకు ఏబది సంవత్సరవులయినా లేవు గాని అబ్రాహామును చూచితినని చెప్పుచున్నావే?" అని వారనిరి.
"అబ్రాహామునకు ముందే నేను ఉన్నాను." మరియు ఉన్నవాడను అనువాడనైన నేను — మోషే దినములలో మండుచున్న పొదను — ఆ మండుచున్న పొదలోనున్న అగ్నిస్తంభములో ఉన్నవాడను అనువాడను నేనే అని ఆయన చెప్పెను.
LUKE 1:31•
JOHN 5:43
24మరియు ఇప్పుడు, యేసు ఈలాగు కూడ చెప్పెనని మనము కనుగొందుము, "నేను నా తండ్రి నామమ౦దు వచ్చియున్నాను, మరియు మీరు నన్ను చేర్చుకొనలేదు." కాబట్టి తండ్రి యొక్క పేరు యేసుగా ఉండవలెను. అది నిజము. తండ్రి యొక్క పేరు యేసు, ఎందుకనగా యేసు వారితో చెప్పెను, "నేను నా తండ్రి నామమును తీసికొని వచ్చితిని. నేను నా తండ్రి నామములో వచ్చితిని, మరియు మీరు చేర్చుకొనలేదు. అప్పుడు, ఆయన పేరు యేసు, మరియు, గాబ్రియేలు ఆయనను యేసు అని పిలచెను, ప్రవక్తలు ఆయనను యేసు అని పిలిచిరి, మరియు ఆయన పరిపూర్ణముగా యేసు. ఆయన జన్మకు ము౦దే పరిశుద్ద ప్రవక్త ఆయనను ఇమ్మానుయేలను పేరుతో పిలచెను, దానికి "దేవుడు మనకు తోడు," అని అర్ధము. లోక పాపమును తీసివేయుటకు దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను, ఆలాగు చేయుటలో ఆయనకు యేసు అని పేరు వచ్చెను. కాబట్టి యేసు అనునది ఒక నామము, మరియు ఆ నామము ఒక మనుష్యునిలో ఉంచబడెను, ఒక సంఘము కాదు, ఒక శాఖ కాదు, ఒక సిద్దాంతము కాదు, గాని ఒక మానవుడు. యేసుక్రీస్తునందు ఆయన తన నామమునుంచుటకు ఎన్నుకొనెను.
ఇప్పుడు, అప్పుడు ఆయన దేవుని యొక్క ఆరాధన స్థలముగా మారెనని మనము కనుగొన్నాము, అక్కడే ఆయనను మీరు ఆరాధించుదురు. ఆయన జన్మించుటకు ము౦దే ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. అది ఎంతో ప్రాముఖ్యమైనది, గాబ్రియేలు దూత ద్వారా ఆయన తల్లికి ఆ పేరు చెప్పబడెను, దేవుని కుమారుడగు యేసుగా ఆయన పిలువబడెను, ఆయన అలాగే యుండెను.
ROM 8:1
25అప్పుడు మనము అక్కడ దానిని కలిగియున్నాము. ఇది మాత్రమే. ఇది ఆయన కొరకు మాత్రమే. దేవుడేర్పాటు చేసికొనిన ఆరాధన స్థలము, ఆ చోటును దేవుడెన్నుకొనెను, మానవుని కలసికొనుటకు ఎన్నుకొనెను, ఒక సంఘములో కాదు, ఒక శాఖలో కాదు, ఒక సిద్దాంతములో కాదు, గాని క్రీస్తులోనే. ఒక మానవుని దేవుడు ఆ స్థలములోనే కలసికొనును, మరియు క్రీస్తునందే మానవుడు దేవుని ఆరాధించగలడు. అదొక్కటే చోటు. నీవు మెథడిస్టువైనా, బాప్టిస్టువైనా, కాథలిక్కువైనా, ప్రొటస్టెంటువైనా, మరెవరినైనా దేవుని సరిగా ఆరాధించగల స్థలము ఒక్కటేయున్నది; అది క్రీస్తులోనే. రోమా 8:1, "కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు, వారు శరీరానుసారముగా నడువక, ఆత్మానుసారముగా నడచెదరు," అని చెప్పబడెను. అదియే సువార్త.
26మనము సిద్దాంతముల విషయములో విభేదించుకోవచ్చును; మానవ-కల్పిత సిద్దాంతముల విషయములో మనము వ్యతిరేకించుకోవచ్చును. నీవు మెథడిస్టువి కాగోరినచో, మెథడిస్టు సంఘమునకు వెల్లెదవు; బాప్తిస్టువి కాగోరినచో బాప్టిస్టు సంఘమునకు వెల్లెదవు; కాథలిక్కువి కాగోరినచో, కాథలిక్కు సంఘమునకు వెళ్ళేదవు; కాని ఒక్కసారి నీవు క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది మరియు ఆయన శరీరములోని ఒక అవయవమైనప్పుడు, నీకు ఎట్టి భేదములు ఉండవు. మధ్య గోడలు కూలిపోయి నీవు స్వతంత్రుడవగుదువు, ఎందుకనగా నీవు యేసు క్రీస్తునందున్నావు; మరియు నీవు క్రీస్తు యేసునందున్నప్పుడు దేవుని ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించెదవు. క్రీస్తు యేసునందు నీవు ఆరాధించుట నీపట్ల దేవుని ఉద్దేశ్యమైయున్నది.
ఇప్పుడు, ఏ సంఘశాఖయు దీనిని చెప్పుకొనలేదు, ఎవరునూ దీనిని చెప్పుకోలేరు. ఆ విధముగా చెప్పుకొనుటకు మీకు ఎంత ధైర్యము? ఆ పనిచేయుట క్రీస్తు విరోధి ఆత్మగా వుండును, క్రీస్తు నుండి దూరమగుదువు, ఆయనలో నుండి తీసివేయబడుదువు. దానిని నీవు చేయలేవు. ఆరాధికులను దేవుడు కలిసికొనుచోటు, క్రీస్తు మాత్రమే.
27మాకు చెప్పేవారు చాలామందియున్నారు అని నేడు వారనుచున్నారు. టెక్సాస్లోని బ్యూమోంట్ నుండి కొద్దికాలం క్రితం ఒక వ్యక్తి నన్ను పిలచెను; "శ్రీ. బ్రన్హం, నీ పేరు మా సంఘ పుస్తకములో లేనిచో నీవు పరలోకమునకు వెళ్ళవు," అని అతడు చెప్పెను. దానిగూర్చి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అట్టి మాటలను ఎన్నడూ నమ్మవద్దు! ఏదో ఒక ప్రత్యేక సంఘమునకు చెందనిచో నీవు పరలోకమునకు వెళ్ళవని వారు తలంచుచుందురు. అది తప్పు. దానిని నమ్ముట క్రీస్తు విరోధిని నమ్ముటయే. దీనిని నేను చెప్పగలను: అట్టి ఆత్మను నీవు నమ్మినయెడల, నీవు నశించినట్లే. నీవు నశించితివనుటకు అది మంచి సూచన, ఎందుకనగా అది దేవుడు చేసిన దానిని త్రోసివేయుటయే. ఏ సంఘములోను దేవుడు తన నామమునుంచలేదు. ఆయన తన కుమారుడగు క్రీస్తుయేసు లోనే దానినుంచెను, ఆయన మరియు ఆయన కుమారుడు ఒక్కటయిరి. అది అసలైన ఆరాధన స్థలము. మరి ఏ ఇతర పునాది వేయబడలేదు, ఏ బండలేదు. "క్రీస్తు అను గట్టి బండమీదనే నిలబడియున్నారు, మిగిలిన నేలంతయూ కూలిపోవుచున్న ఇసుకయే." శాఖలు కదలి, కూలిపోవును, దేశములు పతనమగును, కాని ఆయన నిరంతరము నిలుచును. యేసుక్రీస్తులో మాత్రమే దేవుని ఆరాధించు చోటును మానవుడు కనుగొనగలడు, ఆయన తిరిగి మాట్లాడును, మరి ఏ ఇతర స్థలము లేదు. ఆ స్థలములో మాత్రమే దేవుడు తన నామమునుంచుటకు ఎన్నుకొనెను, మరియు మనము ఆరాధించుటకు ఆయన వారిని అక్కడే కలిసికొనును. అది తప్ప మరి ఏది నమ్మినా నీవు నశించినట్లే.
28గమనించండి, ఏడు యూదుల పండుగలు ఒకే స్థలములో ఉంచబడెను. ఇక్కడ మెథడిస్టు కొరకు ఒక పండుగ, బాప్టిస్టుకొరకు ఒక పండుగ, ప్రెస్బిటేరియను కొరకు ఒక పండుగ, కాథలిక్కు కొరకు ఒక పండుగ, ప్రొటస్టెంటు కొరకు ఒక పండుగను వారెన్నడూ ఏర్పరచియుంచలేదు. ఏడు పండుగలు ఒకే చోటు యుంచబడినవి.
ఇది చాలా చక్కని మాదిరి. ఏడు సంఘకాలము లన్నింటిని దేవుడు వాక్యములో ఉంచెనని చూపుటకు మనము ఏడు సంఘకాలములను చూచాము. ప్రతి సంఘకాలము వాక్యములో ఒక భాగమును ఉత్పత్తి చేసెను. దేవుడు దానిని ఉత్పత్తి చేసినప్పుడెల్లా వారు వెలుగును చూచిరి. యేసు నామములో బాప్తిస్మమును మొదలుగా కనుగొనినవారివలె, వారు ఏమి చేసిరి? వారు దాని నుండి ఒక శాఖను చేసిరి, మరియు అది అక్కడే చచ్చినది. ఆ వెంటనే దేవుడు మరొకరిలోనికి వెళ్ళెను. ఆయన ఈ సిద్దాంతములు మరియు వాదములలో నిలచియుండలేడు. దానికి ఆయనకు సంబంధము లేదు. దేవుని వక్రీకరించుట అనునది లేనేలేదు. దేవుని వాక్యము పరిశుద్దమైనది, కల్తిలేనిది. దేవుని యొక్క ఆరాధనా కేంద్రము క్రీస్తే, ఆయన దేవుడు.
ఈ ఒక్క స్థలములోనే ఈ ఏడు పండుగలు తప్పక ఉండవలెను. మరి ఇతర స్థలములోను మీరు దానిని జరుపలేరు, కాని సంవత్సరములోని ఏడు పండుగలు ఒక్క చోటునే ఆచరించవలెను. కాబట్టి, ఏడు సంఘకాలములు ఒక్క చోటు నుండియే సంఘకాలములన్నింటినిలోను క్రీస్తు మాట్లాడుచున్నాడు. అది ఖచ్చితముగా నిజము. ఏడు సంఘకాలములకు అవి మాదిరి. కాని వారు దాని నుండి శాఖలను చేసిరి.
EXOD 12:13•
JOHN 1:29
29ఇప్పుడు మనము దీనితో పాటు మరో మాదిరిని ఇక్కడ చూద్దాం. అది పస్కా — యేసుకు ము౦దస్తు సూచన. ఇక్కడ మరణము ద్వారా బలి అర్పించబడినది. అది క్రీస్తు బలియాగామునకు ము౦దస్తు సూచన. ఒక శాఖ రక్తము కార్చగలదా? ఒక సంఘము రక్తము కార్చునా, ఒక శంఘ శాఖ రక్తము కార్చునా, నిశ్యాముగా కార్చదు. ఒక జీవి నుండి మాత్రమే రక్తము కారును.. ఇక్కడ యేసు గొర్రె పిల్లగా కనబడెను. ఆ గొర్రెపిల్ల క్రీస్తుకు మాదిరి. మరియు క్రీస్తుకు అది ము౦దస్తు సూచన, ఎందుకనగా లోక పాపమును మోసికోనిపోవు దేవుని గొర్రెపిల్ల ఆయెనే అని యోహాను చెప్పిన విధముగా.
నిర్గమకాండము 12వ అధ్యాయములో యేసు కనబడుటను మనము కనుగొన్నాము. గమనించండి, అక్కడ మాత్రమే మరణమునకు చోటు లేదు. ఆ దేశమును మరణము తాకనైయుండెను, అయితే ఒక్క చోటు వున్నవారు తప్ప తక్కిన వారందరూ మరణించిరి! ఒకే ఒక్క చోటు! ఇప్పుడు, అది ఒక ఇల్లు అని దాని అర్ధము కాదు, కాని అక్కడ ఒక స్థలము ఉన్నది; అక్కడే గొర్రెపిల్ల చంపబడెను. గొర్రెపిల్ల రక్తమున్న చోటుకు మరణదూత రాలేకపోయినది, ఎందుకనగా దేవుడు ఆ ఒక్క స్థలములో మాత్రమే తన నామమునుంచెను. మరియు ఆదియందే ఆ గొర్రెపిల్ల నామము చెప్పబడెను, గొర్రెపిల్ల. గమనించండి, ఆ ఒక్క చోటునే మరణము సమీపించలేకపోయెను.
30మరియు ఇప్పుడు, నేడును అలాగేయున్నది. ఆత్మీయ మరణము తాకని చోటు ఒకటే ఒకటున్నది; అది వాక్యము. మరణము వాక్యమును తాకజాలదు, ఎందుకనగా అది దేవుని యొక్క సజీవ వాక్యము. కాని దానికి నీవు సిద్దాంతములను కలిపినచో, వాక్యము అక్కడ నుండి కదిలిపోవును. నూనె నుండి నీరు వేరైనట్లుగా అది వేరై పోవును. ఆ రెంటినీ నీవు కలుపలేవు. కాబట్టి మీరు చూడండి, ఒక శాఖలోనికి ఆచారము ప్రవేశించినప్పుడు, అందరూ దానినే వెంబడించెదరు, వాక్యము చనిపోవును. దానిని మరెవరో ఇంకా ఎక్కువ చేయుదురు, అది హెచ్చు స్థాయికి చేరును. నీతీకరణము నుండి శుద్దీకరణము, పరిశుద్దాత్మ బాప్తిస్మమునకు, అక్కడ నుండి గింజ స్థాయికి ఎదుగును. దేవుడు నడచిన మార్గమును నీవు చూచితివా, అన్ని సమయములలోను ఆయన తన నామమును అదే రీతిగా తీసికొని వచ్చుచున్నాడు, ఎందుకనగా ఆయనే వాక్యము.
గమనించండి, అది చావదు. జీవవాక్యము చనిపోజాలదు. ఇప్పుడు ఎంత పరిపూర్ణముగా యున్నదో గమనించండి. ఐగుప్తు యొక్క జ్ఞానులను మరణ దూత సంహరించకుండా పోలేదు; దాని యొక్క పవిత్ర స్థలములను, దాని గొప్ప భవనములను, దాని ఫరోలను అది తాకెను, లేక దేశములోని పూజారులను అది తాకెను. ప్రతి భవనమును, ప్రతి స్థలమును అది తాకెను గొర్రేపిల్ల గల చోటును తాకలేదు. దేవుడేర్పాటు చేసిన ఈ స్థలమును మరణము తాకజాలదు, మరియు అక్కడ గొర్రెపిల్ల యుండెను.
గమనించండి, ఇశ్రాయేలీయులను గాని, లేక హెబ్రియుల యాజకులను గాని, మరియు వారిశాఖలను గాని, తాకలేదు. అందరు దేవుడేర్పరచుకొనిన స్థలములో ఉండవలెను, లేనియెడల మరణము తాకగలదు.
31సంఘమా, నీవు ఎక్కడున్నను, దేనికి సంబంధించియున్నను నాకు వ్యత్యాసము కనబడదు. ఒక్క సంగతి నీవు తప్పక తెలిసికొనవలెను. క్రీస్తునందు నీవుండవలెను లేనిచో మరణమే. ఆయనకు వేరై నీవు బ్రదుకవు. ఒక భవనముగా నీ సంఘము చక్కగా యుండవచ్చును, మనుష్యులతో నీ సహవాసము బాగుండవచ్చును, కాని శరీరమును, రక్తమును, యేసుక్రీస్తు వాక్యమును నీవు తిరస్కరించిన నిమిషమందే చనిపోయెదవు. అది దేవుడేర్పరచుకొనిన ఆరాధన స్థలము. అక్కడే ఆయన నామమున్నది. అందులోనే ఆయన తన నామమునుంచుటకు ఎన్నుకొనెను, సంఘములో కాదు గాని, కుమారుడగు యేసుక్రీస్తులోనే.
గమనించండి, ఆయన ఏర్పాటు చేసికొనిన స్థలములోనే భద్రతయున్నది, ఆయన గొర్రెపిల్లలో, మరియు ఆ గొర్రెపిల్ల నామములోనే.
గమనించండి, అది ఒక మగ గొర్రెపిల్ల, ఒక మగది, ఒక ఆడది కాదు. ఒక సంఘము కాదు, కాని ఆయన నామము, ఆమె పేరు కాదు. ఆమె నామములో కాదు, గాని ఆయన నామములోనే జనులను కలసికొనును, ఆయన, గొర్రెపిల్ల!
COL 3:17
32ఇప్పుడు, మనము చెప్పెదము, "సంఘమును గూర్చి దాని గొప్పతనమును గూర్చి, దీనిని చేసెను, దానిని చేసెను. అది ఎన్నో తుఫానులను ఎదుర్కొనెను. మా జనాభా పెరిగినది; మేము అధిక జనాభాగా వున్నాము; మేము ఒక బలమైన సంఘముగా వున్నాము; అది ఒక గొప్ప సంగతి," అని చెప్పెదము. కాని దేవుడు "ఆమెను" గూర్చి ఎన్నడూ చెప్పలేదు, "ఆయన"ను గూర్చియే చెప్పెను. "ఆయనే" గొర్రెపిల్ల కలసికొను చోటు, సంఘము కాదు. అది ఆమె పేరు కాదు, కాని ఆయన పేరు. ఆమె పేరును ఎక్కడను ఆయన పెట్టలేదు, ఆయన ఆయనలో ఆయన పేరును పెట్టెను. ఆ కారణము చేతనే మనమందరము మాటలో గాని, క్రియలో గాని, ఏమి చేసినా, యేసు క్రీస్తు నామములోనే చేయవలెను. మనము ప్రార్ధి౦చినా, యేసు నామములోనే ప్రార్ధి౦చవలెను. ఏది అడిగినా, యేసు నామములోనే అడుగవలెను. మనము నడిచినా, యేసు నామములోనే నడువవలెను. మనము మాట్లాడినా,, యేసు నామములోనే మాట్లాడవలెను. మనము బాప్తిస్మమిచ్చినా, యేసు నామములోనే బాప్తిస్మము ఇయ్యవలెను. ఎందుకనగా మనము మాట్లాడినా, క్రియచేసినా, అంతయూ యేసుక్రీస్తు నామములోనే చేయవలెను.
33ఒకసారి దానిని చర్చించుచుండగా ఒక వ్యక్తి ఇట్లనెను, "బ్రన్హం సోదరుడా, (అతడు ఒక సేవకుడు, ఒకవేళ ఇక్కడ ఇప్పుడు కూర్చొనియుండవచ్చును). మరియు అతడు చెప్పెను, "నా భార్య, ఆమెకు నా పేరు పెట్టబడినది." ఆమె ప్రతి ఉదయము లేచి, జోన్స్ పేరులో వాకిలి ఊడ్చుచున్నాను, మరియు జోన్స్ నామములో అ౦ట్లు తోముచున్నాను, మరియు జోన్స్ నామములో బట్టలకు అతుకులు వేయుచున్నాను," అని చెప్పనక్కర లేదు. "ఏ పేరును చెప్పనవసరము లేదు," అని అతడనెను.
"మీ వలెనే నేను నమ్ముచున్నాను," అని నేను అన్నాను. అది నిజము.
మరియు అతడు, "మంచిది, ఆమె అన్నియూ జోన్స్ నామములోనే చేయుచున్నది గదా… అయినా గాని ఆమె చెప్పనక్కరలేదు," అని అన్నాడు.
నేనిట్లు చెప్పాను, "కాని నీవు వీధిలో వెళ్ళుచూ మరియు ఆమె వద్దకు వెళ్ళి మరియు 'జోన్స్, రమ్ము' అని చెప్పలేవు గదా, ఆమెను ఒక విధానము ద్వారా పెండ్లి చేసికొని జోన్స్ గా స్వీకరించబడవలెను. ఆలాగు చేయనియెడల నీవు వ్యభిచారములో జీవించుచున్నట్టే." యేసుక్రీస్తు నామములో కాక మరి ఏ విధముగా నీవు బాప్తిస్మము పొందినా గాని, అది బైబిలులోనే లేదు. అది వ్యభిచార బాప్తిస్మము, అప్పుడు నీవు మాటలో, క్రియలో ఏది చేసినా యేసు నామములోనే చేయుము. మొదటగా నీవు ఆయన నామములోనికి రావలసియున్నావు. దాని తరువాతనే నీవు చేయవలసినవి.
ACTS 4:12•
EPH 3:15
34ఈ భవనంలో ఈ రాత్రి చాలా మంది విధేయులగు చక్కని స్త్రీలున్నారు, కాని శ్రమతి. విలియం బ్రన్హం ఒక్కతేయున్నది ఆమె మాత్రమే నాతో ఇంటికి వచ్చును. ఆమె మాత్రమే నా భార్య.
లోకంలో చక్కని మనుష్యులున్నారు, చక్కని సంఘములున్నవి, కాని కుమారి యేసుక్రీస్తు ఒక్కతే అయివున్నది, మరియు ఆమె కోసమే ఆయన వచ్చుచున్నాడు. ఆయన నామము అక్కడే ఉండును. ఆయన ఆరాధన అక్కడే యున్నది, ఆమెలో మరియు ఆమెలో మాత్రమే. అది నిజము. ఓ, అవునండీ. అది సత్యమైయుండునని మనము కనుగొంటిమి.
ఇప్పుడు, మనము మాటలో లేదా క్రియలో ఏది చేసినా, యేసుక్రీస్తు నామములోనే చేయుచున్నాము. రక్షించబడుటకు యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ ఇతర నామము ఆకాశము క్రింద ఇవ్వబడలేదు. అపొ. కా. 2వ అధ్యాయము, ఇలా చెప్పుచున్నది. "ఆకాశము క్రింద ఉన్న మరి ఏ ఇతర నామములోను మానవునికి రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములో మాత్రమే." ఆమేన్. దానిని మీరు గ్రహించారని నేను ఆశించుచున్నాను. యేసుక్రీస్తు నామము, ఆయన నామము అత్యున్నతమైనది. పరలోకమందున్న కుటుంబమంతయూ యేసు నామమును కలిగియున్నది, బైబిలు ఆలాగు చెప్పెను. భూమి మీదవున్న ఆయన కుటుంబమంతయూ యేసు నామమును కలిగియున్నది. కావున అది దేవుడేర్పరచుకొనిన నామము మరియు అందులోనే ఆయన దానిని ఉంచెను. యేసుక్రీస్తులోనే ఆయన ఆరాధన స్థలమున్నది.
35అది నిజమని మనకు తెలియును. ఆయనలోనే తప్ప ఆరాధించుటకు మరి ఏ ఇతర స్థలము లేదు. ఆకాశము క్రింద మనుష్యుల మధ్య ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. ఆయనే దేవుని యొక్క విమోచనా నామము. దేవునికి యెహోవా-యీరే అను నామము కలదు, యొహోవా- రాఫా, యెహోవా-యీరే, "నీ పాపములన్నియు ప్రభువు క్షమించును," యొహోవా-రాఫా, "నీ రోగములన్నియు యెహోవా స్వస్టపరచును." ఆయనకు చాలా బిరుదులున్నవి, ఆయనకు ఒక విమోచనా నామమున్నది, అది మానవజాతికి చెందును, మరియు అది యేసు నామము. దానిని ఆయన వుంచుటకు నిర్ణయించెను.
ఆయన దానిని ఎక్కడ ఉంచెను? ఆయన దానిని క్రీస్తులో ఉంచెను. ఇతర సంఘ నామములను, ఆచారములను, బిరుదులను నమ్ము వారికి మరణము వచ్చును. మెథడిస్టు సంఘము పరలోకమునకు తీసికొని వెళ్ళునని మీరు నమ్మినచో, నశించెదరు. పెంతెకోస్తు సంఘము మిమ్మును పరలోకమునకు తీసికొని వెళ్ళునని నమ్మినచో, నశించెదరు. బాప్టిస్టు, లూథరను, ప్రెస్బిటేరియను, కాథలిక్కు మొదలగు ఏ సంఘమును నమ్మినా, ఏ పేరును, బిరుదును, ఆచారమును నమ్మినా, మీరు నశి౦చెదరు.
LUKE 23:4•
JOHN 8:46•
JOHN 18:38•
JOHN 19:4
36ఆయన కూడ. యేసు యొక్క మరో నీడను సూచించు వాక్యమును ఇక్కడ నేను వ్రాసియుంచాను. ఇంకను ఆయన ఇక్కడ ముందస్తు గుర్తుగా ఉన్నాడు; ఆయన నిష్కళంకముగా ఉండవలెను. ఆయన తన నామమును ఉంచుచోటు, ఈ గొర్రెపిల్ల నిష్కళంకమైనదిగా ఉండవలెను. ఇప్పుడు, ఏ శాఖ లేక ఏ విధానము ఈలాగున్నదని నీవు చెప్పగలవు? ఏ సంఘము? కాథలిక్కు, ప్రాటస్టెంటు, యూదయ, అది ఏదైనా కాని, ఏ శాఖ, ఏ సంస్థ నిష్కళంకముగా వున్నది? వాటిని ఆయన విసర్జించి త్రోసివేసెను, కాని ఒక చోటున్నది. హల్లెలూయ! ఆ చోటు యేసు క్రీస్తులో యున్నది. ఆయనలో ఏ మచ్చయు లేదు. ఆయనలో ఏ పొరపాటు లేదు. ఏదియూ ఆయనలో నీవు కనుగొనలేవు. అందరూ తమ సంఘములు ఏ పొరపాటు లేనివని చెప్పుచుందురు; మరియు అది మురికితో యున్నది, వాక్యమును మీరిరి, సగం చచ్చిన వారు, లవొదికయ, ఆచారమును ప్రేమించువారు, కాని అది సత్యము కాదు. అయితే ఆయన శత్రువగు పిలాతు ఇట్లనెను, "ఈయనలో ఏ తప్పిదము నాకు కనబడలేదు." ఆయనలో ఏ దోషము లేదని ఆయన శత్రువే సాక్ష్యమిచ్చెను. ఆయనకు ఏ పాపమును నీవు అంటగట్టలేవు.
"నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు. "నాలో పాపమును ఎవరు చూపించగలరు?" అని ఆయన ఆనాటి యాజకులను అడిగెను. తప్పు ఎన్నడూ చేయని ఒక్క సంఘమును నాకు చూపించండి. ఒక్కటియు లేదు. ఎందరినో చంపి నానారీతులుగా వ్యవహరించినవి. ఇంకను వారు వారిని (ఆ విధముగా) పిలచుకొనుచున్నారు… లేదు, ఏ శాఖలోను లేక సిద్దాంతములోను దేవుడు కలసికొను ఆరాధన స్థలము లేదు.
DEUT 16:2•
MATT 3:17•
MARK 1:11•
LUKE 3:22
37నా స్నేహితులారా, మీ భావాలను నేను చిన్నబుచ్చుట కాదు, కాని నేను ఒక వర్తమానమునకు బాధ్యత వహించవలెను, మరియు "ఈ గందరగోళము నుండి బయటకు రండి," అన్నదే ఆ వర్తమానము. మరియు నేను మిమ్మును బయటకు పిలచి ఎక్కడికి తీసికొని వెళ్ళుదును? బ్రన్హం ఆలయమునకా? అలాగయితే అందరూ చేసిన తప్పు నేనును చేసిన వాడనగుదును. కాని ఒక్క చోటుకు మిమ్మును నేను తీసికొని వెళ్ళగలను, అక్కడ మీరు క్షేమముగావుందురు మరియు మరణము నుండి తప్పించబడెదరు, అది యేసుక్రీస్తులోనే యున్నది, అది దేవుని ఆరాధన స్థలము. ఈ రాత్రి ఆ స్థలమును మీకు పరిచయము చేయుచున్నాను, అక్కడ దేవుడు తన నామముంచును, అక్కడికి వచ్చిన ప్రతి మనిషిని ఆయన కలిసికొందునని వాగ్దానము చేసెను; అతనితో ఆయన ఆరాధించును మరియు భోజనము చేయును; ఒక సంఘములో, ఒక ఆలయములో కాదు గాని, క్రీస్తులోనే ఆయన దేవుని ఆలయమై యున్నాడు. దేవుడు ఆయనలోనికి వచ్చి ఆయనలో నివాసముండే స్థలము ఆయనే. "ఈయనే నా ప్రియు కుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను." ఈయన ఆలయము యేసులోనె యున్నది. తన నామమగు యేసు క్రీస్తును అందులోనికి తీసికొనివచ్చి ఉంచెను. కాబట్టి ఒక నరునిలో ఆయన తన నామమునుంచెను. యేసుక్రీస్తులోనే ఆయన నివసించెను. తన నివాస స్థలమును ఏర్పరచుకొనెను. మరియు ఆ గుడారములో, పాత యెరూషలేము, పాత పండుగలు, పాత దేవాలయము ఒక మాదిరిగా నున్నవి, నిబంధన మందసము వెళ్ళిన దినమున మేఘము వచ్చి దిగెను, మరియు దేవుని స్వరము వినబడెను. కావున యేసుక్రీస్తు అను దేవాలయము వచ్చినప్పుడు అలాగే స్వరము వినబడెను, పాతది క్రొత్తదానికి ఒక ఛాయ, అది ప్రకృతి సంబంధమైనది. ఆయన క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఇట్లనెను, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో జీవించ నేనానందించుచున్నాను. మరియు నా నామమునుంచు స్థలమును ఏర్పరచుకొన్నాను, మానవులను ఇక్కడే కలసికొందును, అక్కడే ఆరాధన చేతును." దేవుడు స్థలమును ఏర్పరచుకొనెను, ఏ సంఘశాఖలో కాదు, కాని యేసు క్రీస్తులోనే. అవునండి!
EXOD 12:3-6•
LUKE 23:4•
JOHN 18:38•
JOHN 19:4
38నేను చెప్పినట్లుగా, ఆయన నిష్కళంకుడుగా కూడా ఉండవలెను. ఏ శాఖయూ ఆలాగు చెప్పుకోజాలదు. ఆలాగు చెప్పుకొన్నచో, వారు క్రీస్తు విరోధులే.
ఇప్పుడు, ఇక్కడ మనము కనుగొంటిమి, ఆయన ఛాయను మరల గమనించండి. గొర్రెపిల్లను తీసికొని రావలెను. (ఇప్పుడు, దీనిని నిర్గమకాండము 12లో కనుగొంటిమి, మీరు వ్రాసికొనుచున్నట్టయిన అది, నిర్గమకాండము 12:3-6.), ఆ గొర్రెపిల్ల బలిగా వధించబడుటకు యోగ్యమైనదో కాదో నాలుగు దినములు వారు పరీక్షించవలెను. నాలుగు దినముల పాటు దానిని వారు పదే-పదే పరీక్షించవలెను, ఆ గొర్రెపిల్ల మీద ఏ మచ్చ, వ్యాధి, పొరపాటు ఉండరాదు. దానిని నాలుగు దినములు పరీక్షించవలెను.
ఇప్పుడు, పధ్నాలుగవ దినమున దానిని కొద్దిగా చంపియుందురని మీలో కొందరు తలంచుచుండవచ్చునని నాకు తెలియును, కాని మీరు గుర్తుంచుకొనండి, వారు నెలలోని పదవ దినమున ఆ గొర్రెపిల్లను తీసికొని నెలలోని పదునాలుగవ దినమున దానిని చంపిరి. (చూచారా?), నాలుగు దినములు అది పరీక్షించబడినది.
ఇప్పుడు, యేసే దేవుని గొర్రెపిల్ల, నామము. యెరూషలేమునకు వెళ్ళి మరణించి, సమాధి చేయబడి, పునరుత్తానుడగునంతవరకు తిరిగి వెలుపలకు రాలేదు. నాలుగు దివారాత్రులు ఆయన విమర్శకుల యొద్ద ఉంచబడెను. గొర్రెపిల్లకు ఎంత చక్కని మాదిరి. నాలుగు దినములు సరీక్షించబడెను. పిలాతు చివరగా ఇట్లనెను, "ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు."
EXOD 12:46•
NUM 9:12•
2KGS 4:38-41•
JOHN 19:33,34,36
39ఆయన యొక్క మరో ఛాయ: ఆయనలో ఏ ఎముకయు విరువబడదు, వారు ఆలాగుననే ఖచ్చితంగా చేసిరి… బలిని అర్పించినప్పుడు, దాని ఎముకను విరువరాదు. ఎముక విరిగినచో, అది పనికిరాదు. మరియు క్రీస్తు కాళ్ళలోని ఎముకలను విరచుటకు వారు సుత్తెను తీసిరి గాని, "అప్పటికే ఆయన చనిపోయినట్టు" వారు కనుగొనిరి. వారాయన ప్రక్కలో పొడువగా రక్తము, నీరు కారెను.
మరల ఇక్కడ మరో గొప్ప సంగతిని గమనించండి. దానిని నేను దాటలేను, ఎందుకనగా ఆయనను రొట్టెల అర్పణలో కనుగొనగలవు. నాకు జ్ఞాపకమున్నది బైబిలులో ఒక కాలములో వారికి ఒక పాఠశాల ఉండెను, దానిని ప్రవక్తల పాఠశాల అందురు, మరియు అది ఒక క్రమమైన పాఠశాల, మరియు ఏలియా ఒకరోజు ఆ పాఠశాలకు వెళ్ళెనని మనము కనుగొంటిమి, మరియు వారు, "మనము" అనిరి. వారు అతడు వెళ్ళిపోవలెనని ప్రార్ధించిరి, "నీవు ఇక్కడ వున్నట్లయితే, పరిస్థితులు వేరుగా వుండును," అని చెప్పిరి. కావున వారు అతనిని పంపివేయదలచిరి. మరియు అయితే వారతనికి రాత్రి ఆహారము పెట్టగోరిరి, అతనికి భోజనము తయారు చేయుటకు గాను ఒక యాజకుల గుంపు లేక ప్రవక్తల గుంపుకొన్ని బఠాణీలను తీసికొని వచ్చుటకు వెళ్ళిరి. మరియు వారు ఒడి నిండుగా వాటిని ఏరుకొని వచ్చిరి, మరియు వాటిని తీసికొని వారు తిరిగి వచ్చినప్పుడు వాటిలో వెర్రి ద్రాక్షాతీగలు వుండెను, అది విషముగా ఉండెను, మరియు వారు వాటిని కుండలో వేసిరి. మరియు కుండలోనిది ఉడుకుటకు ప్రారంభించెను, మరియు వారు, ఎవడో, "అయ్యో, ఆ కుండలో మరణమున్నది. ఇప్పుడు, (దానిని) మనము తినజాలము," అని చెప్పెను.
మరియు ఏలియా, "గుప్పెడు పిండి" ని తెమ్మనెను. మరియు అతడు ఆ పిండిని కుండలో వేసి, తినుడి, కుండ (లోనిది) బాగాయెను, అని చెప్పెను.
ఆ రొట్టె అర్పణము క్రీస్తే, పిండిగా చేయబడిన తరువాతనే గోధుమ గింజ రొట్టెయగును, ఆయనే స్వస్థపరచువాడని ఇది చూపించుచున్నది, మరియు ఆయన మరణమును తీసివేసి రెండు ధర్మశాస్త్రముల ద్వారా జీవమును ప్రతిగా ఇచ్చును, హల్లెలూయ! ఒక చోటు మరణమున్నప్పుడు, క్రీస్తు రాగా, జీవములోనికి వచ్చెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మరియు మరణమున్నచోటు జీవము వచ్చెను, ఎందుకనగా ఆ రొట్టెల అర్పణముగా యేసే వచ్చెను.
సమయము వుండి వీటన్నింటిని మనము విభాగించినచో ఎంత చక్కని పాఠములను మనకిచ్చును.
MATT 15:9•
MARK 7:7•
JOHN 10:7,8•
JOHN 14:6
40ఇప్పుడు, గమనించండి. వాక్యములోని ఏ ఛాయయు విఫలము కాదు. ఏ ఒక్క మాట, నీడ తప్పిపోదు. అంతయూ పరిపూర్ణమైన మాదిరిగా యున్నది. ఆయనే దేవుడేర్పరచుకొనిన ఆరాధనస్థలము, మరియు ఆయనకే దేవుని నామము ఇయ్యబడినది. ఆయన దేవుని ఆరాధన స్థలము. ఆయనకే దేవుని యొక్క నామము ఇవ్వబడినది. ఆయనే దేవుని వాక్యము మరియు ఆయనే దేవుని నామము. ఆయనే దేవుని యొక్క వాక్యము మరియు దేవుని నామము కూడా అయివున్నాడు. ఆయనే శరీరధారియైన వాక్యము. ఆయనే దేవుని వాక్యము, దేవుని గొర్రెపిల్ల, దేవుని నామము, మరియు దేవుడు. ఆయనే ఏర్పరచుకోబడినవాడు మరియు దేవునికి ఒకే ఒక ఆరాధన స్థలము.
మరియు యేసు క్రీస్తు తప్ప మరి ఏ స్థలమునయినా గాని దేవుడు నిరాకరించును. మరెక్కడా ఆయనను నీవు ఆరాధించలేవు. "వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు, పాత బోధకు బదులుగా మానవ ఆచారములను పాటించుచున్నారు," అని ఆయన చెప్పెను. నేడు మనకు ఆచారములు, శాఖలు ఉన్నవి మరియు అన్నియూ "ఇదే ఆ మార్గము," మరియు "అదే ఆ మార్గము" అని చెప్పుకొనుచున్నవి, మరియు "నేనే మార్గమును, సత్యమును, మరియు జీవమునైయున్నాను, నా ద్వారానే తప్ప ఎవడును దేవుని యొద్దకు రాలేడు." "నేనే గొర్రెలు పోవు ద్వారమును. మిగిలినవారందరూ దొంగలే," అని యేసు చెప్పెను. మరొక విధముగా చెప్పవలెనన్న, ఆయన మాత్రమే దారి. ఆయనే ద్వారము; ఆయనే మార్గము, సత్యము, జీవము, ఆయనే ప్రవేశ ద్వారము, ఆయన మాత్రమే ఆ ఒక్క స్థలము, అదే ఆరాధన, అదే నామము. ప్రతిదియు యేసుక్రీస్తుతో ముడివేయబడియున్నది. పాత నిబంధన మొత్తము ఆయనతో ముడివేయబడియున్నది, క్రొత్త నిబంధన ఆయనకు ముడివేయబడియున్నది మరియు ఆయన ఆజ్ఞ యొక్క మాట ద్వారా సంఘము ఆయనకు కట్టబడియున్నది. మరో స్థలము గాని లేక మరో నామము గాని, దేవుడు మానవుని కలసికొనుటకు లేదు, యేసు క్రీస్తులోనే కలసికొందునని ఆయన వాగ్దానము చేసెను, ఆయనేర్పరచుకొనిన ఆరాధన స్థలము యేసుక్రీస్తులోనే.
DEUT 16:2•
ACTS 2:13
41గమనించండి, ఈ ఒక్క స్థలములో మాత్రమే దేవుడు తన ఆరాధికులను కలసికొందునని వాగ్దానము చేసెను, మరియు అది ఆయన స్వంత ఎన్నిక, మన ఎన్నిక కాదు, మన ఆలోచన కాదు, గాని ఆయన ఆలోచన, ఆయన ఎన్నిక, మరియు అది ఆయన ఎన్నుకొనిన, ఆయన నామము ఉంచబడిన స్థలముగా వుండును. కావున ఆయన నామము ఏమిటో, ఆయన దేనిని ఎన్నుకొనెనో దానిని మనము కనుగొన్నాము. తన స్వంత ఎన్నిక ద్వారా.
ఇప్పుడు, ఆయన తన నామమును ఉంచిన ఆ స్థలమును మనము కనుగొన్నాము (అది, యేసుక్రీస్తులోనే), మరియు మరో చోటు లేదు లేక మరో నామము లేదు… దాని గూర్చి మీరు సంతృప్తి చెందారా? "ఆమేన్," చెప్పండి. ఇప్పుడు, దానిని గూర్చిన విషయమేదనగా, ఆ స్థలము ఎక్కడున్నదని మనము కనుగొనినట్లయిన. క్రీస్తునందు మాత్రమే ఆరాధన స్థలము స్వీకరించబడెను. నీవు పశ్చాత్తాపపడవచ్చును; నీవు దానిని చేయగలవు; కానీ నీవు ఇంకను ఆరాధించుట లేదు; నీవు క్షమాపణ కొరకు వేడుకొనుచున్నావు. పేతురు చెప్పెను… పెంతెకోస్తు దినమున వారందరూ భాషలతో మాట్లాడుటను చూచి మరియు గొప్ప సూచక క్రియలు మరియు అద్భుతములు జరుగుటను చూచి, వారు నవ్వసాగిరి (సంఘము ఆ విధముగా చేసినది) మరియు, "వీరు క్రొత్త మద్యముతో నిండుకొనిరి. వీరు త్రాగినవారివలె వ్యవహరించుచున్నారు," అనిరి. ఒక కన్యయైన మరియతో సహా, నూట ఇరవైమంది అక్కడ కూడుకొనిరి, మరియు వారు త్రాగినవారివలె తూలుచుండిరి, మరియు భాషలతో మాట్లాడుచుండిరి, మరియు అలా చేయుచుండిరి. అందుకే వారు, "వీరు క్రొత్త మద్యముతో నిండుకొనిరి," అని చెప్పిరి.
ACTS 2:15-21,37-39
42కాని పేతురు లేచి, "అయ్యలారా మరియు సోదరులారా, వీరు క్రొత్త మద్యముతో నిండినవారు కారు, ఎందుకనగా ప్రొద్దుపొడిచి ఇంకా జామైనా కాలేదు. ప్రవక్తయుగు యావేలు ద్వారా పలుకబడినది ఇదే. అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను క్రుమ్మరించెదను, అని దేవుడు సెలవిచ్చెను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీదను, దాసురాండ్రమీదను, నా ఆత్మను క్రుమ్మరించెదను. పైన ఆకాశమందు క్రింద భూమిమీద నేను సూచక క్రియలను కనపరచెదను. అగ్ని అగ్నిస్తంభములు, ధూమములు కనబడును. ప్రభువు యొక్క ఆ మహాభయంకరమగు దినము రాకముందు ఇది జరుగును. ప్రభువు నామమున ప్రార్ధి౦చువారు రక్షించబడుదురు," అనెను.
వారు దీనిని విని, హృదయములో నొచ్చుకొని, "అయ్యలారా మరియు సోదరులారా, మేమేమి చేయవలెను?" అని ప్రశ్నించిరి.
పేతురు ఇట్లనెను, "ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరమును పొందుదురు, ఆ వాగ్దానము భవిష్యత్ తరముల వారికందరికి చెందును."
JOHN 1:1,14•
1COR 12:13
43ఇప్పుడు, మనము దానిని కనుగొనెదము. ఆయనలోనికి ఎట్లు వెళ్ళగలమో ఇప్పుడు మనము చూద్దాం. ఈ ఆరాధన స్థలములోనికి ఎట్లు మనము ప్రవేశించగలము? I కొరింథీయులు 12 దీనిని స్థిరపరచును. "ఒక్క ఆత్మ ద్వారానే," అని చెప్పెను, ఒక్క సంఘము ద్వారా కాదు, ఒక్క ఆచారము ద్వారా కాదు, ఒక్క సంఘకాపరి ద్వారా కాదు, ఒక బిషప్పు ద్వారా కాదు, ఒక మత యాజకుని ద్వారా కాదు, గాని ఒక ఆత్మ ద్వారానే మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము, అది యేసుక్రీస్తు యొక్క శరీరము, మరియు ఆ శరీరములోనున్న ప్రతి వరము మనదగును. అవునండి. చేరుట కాదు, సూత్రములు వల్లించుట కాదు, పొగడ్త కాదు, కించపరచుట కాదు, కరచాలనము కాదు, లేక మరేదీ కాదు, జన్మించుట ద్వారా యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి మనము బాప్తిస్మము పొందియున్నాము. ఆమేన్. ఒకే పరిశుద్ధాత్మ ద్వారా మన మందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. మరియు ఆ శరీరము ఏమిటి?
"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను.
మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను…
మనము ఆ శరీరములో వుండి మరియు దాని యొక్క ఒక వాక్యమును ఎలా తిరస్కరించగలము, లేక ఆ శరీరములో లేని దానిని ఎక్కడో ఒక చోటు ఎలా ఉంచగలము? ఏలాగు ఆ పనిచేయుదుము.
44దేవుడు ఎన్నుకొన్న చోటు. గమనించండి. మరియు నిజంగా ఆయనలోనికి మీరు బాప్తిస్మము పొందితిరనుటకు నిజమగు సూచన ఏమనగా వాక్యమైన ఆయనను మీరు నమ్ముదురు. ఆయనలో భాగమైయుండి ఆయనను మీరేలాగు తిరస్కరించగలరు? ఒకవేళ, నాలోనున్న చేతిని నేనెట్లు తిరస్కరించెదను? ఆలాగు చేసినచో, నా మతిస్థిమితముగా లేదు. దేవుడు చెప్పిన, వాగ్దానము చేసిన మాటను తిరస్కరించు విశ్వాసి ఆత్మీయంగా చెడిపోయెనని గ్రహించండి. ఆ నామకార్థ విశ్వాసి ఆత్మీయంగా ఏదో పొరపాటులో ఉన్నాడు.
ఆయన యొక్క మాటులోని ఒక్క అక్షరమును నీవు కాదనజాలవు, ఎందుకనగా అందులో నీవు భాగమైనావు. నీవు ఆయనలో భాగము, ఏలయనగా ఆయనలోనికి నీవు బాప్తిస్మము పొందితివి, ఆ పరిశుద్ధాత్మ నిన్ను యేసుక్రీస్తు శరీరములోనికి తీసికొని వచ్చినది.
MARK 16:17•
1COR 12:13•
HEB 13:8
45ఎంత చక్కని సంగతి. దేవుడు ఒక ప్రత్యేక స్థలములో అబ్రాహామును కలసికొనెను, మరియు అక్కడ అబ్రాహాము ఆరాధించెను. ఆ నిబంధనలో అంతయూ అలాగే జరిగినది. మరియు ఆయన వాగ్దాన వాక్యము ద్వారా ఆయన ద్వారా నీలోనికి భాషాంతరము చేయబడును. మీరది గ్రహించారా? నీవు జీవించుచున్న ఈ దినములలో ఆయన నెరవేర్చుదునని వాగ్దానము చేసిన వాక్యము, దేవునిచే వ్రాయబడిన పత్రికయై మనుష్యులందరిచే చదువబడును. నీవు చెప్పుకొనుట కాదు, గాని నీ ద్వారా దేవుడు చేయునది. నీవు చెప్పుకొనుదానికంటె బిగ్గరగా మాట్లాడును. "నమ్మినవారివలన ఈ సూచక క్రియులు కనబడును," అని దేవుడు చెప్పెను. నీ ద్వారా మాట్లాడును.
ఈ కాలములో ఇప్పుడు జరుగబోవు దాని గూర్చి ఆయన చెప్పెను. నేటి కొరకు వాగ్దానము చేయబడిన దానిని ఈ కాలపు విశ్వాసులు నమ్మవలెను. రక్షించబడుటకు ఓడలోనికి రావలసియున్నట్లే అదియున్నది, రక్షించబడుటకు ఐగుప్తు నుండి బయటకు రావలెను, వారు రక్షించబడుటకు గాను ఇప్పుడు క్రీస్తులోనికి రావలెను, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు అను వాక్యము వర్తమానము లోనికి రావలెను.
అందులోనికి నీవెట్లు రాగలవు? బాప్తిస్మము ద్వారా, ఏ బాప్తిస్మము ద్వారా, నీటి ద్వారానా? పరిశుద్ధాత్మ ద్వారా, ఒక్క ఆత్మ ద్వారా, మనమందరము ఈ ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.
LUKE 2:49•
ACTS 4:13,14•
HEB 13:8
46మరియు ఆయన వాగ్దాన వాక్యమును నీవు భాషాంతరము చేయనవసరము లేదు, ఆయనే దానిని భాషాంతరము చేసికొనును, ఆయన చేయుదునని వాగ్దానము చేసిన దానిని నీవు చేయుదువు. ఆయనను వెంబడించు సంఘము ఆయనవలెనె యుండును, జనులు దానిని ఎరుగుదురు. శృంగారమను దేవాలయ గుమ్మమునొద్ద పేతురు, యోహానులు ఒకనిని బాగుచేసినప్పుడు, స్వస్టతను గూర్చి వారిని ప్రశ్నించిరి. చూడుడి. వారు, వారిరువురూ విద్యలేని పామరులని మాకు తెలియును అనిరి, అయితే వారు యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తించిరి. దేనినిబట్టి? వారు ఆయన చేసిన క్రియలను చేయుచుండిరి.
ఆయన తండ్రి పనిమీద ఉండవలెను. మరియు నేడును అది అలాగే యుండవలెను.
ఇప్పుడు, గుర్తుంచుకొనుడి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. దేవుడు ఆయనలోనే నిన్ను కలసికొనును. గనుక, ఒక్కచోటు మాత్రమే ఉన్నది, ఆయన తన నామమును పెట్టుటకు ఏర్పరచుకొన్నది యేసులోనే. యేసే దేవుని యొక్క నామము. యేసుక్రీస్తు అను పేరుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు బిరుదులని గుర్తుంచుకొనండి.
MATT 28:19•
ACTS 2:38
47మత్తయి ఇట్లనెను, "కాబట్టి, మీరు సర్వలోకమునకు వెళ్ళి వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇయ్యుడి." దీనికి నేడు ఎంత తప్పుగా అర్ధము చెప్పుచున్నారు, మరియు, చూడండి. "తండ్రి యొక్క నామములో, కుమారుని నామములో, పరిశుద్దాత్మ యొక్క నామములో, అని చెప్పుచున్నారు. ఇది వ్రాయబడి ఉండలేదు. ఇది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామము (ఏకవచనము)లో తండ్రి అనునది పేరు కాదు; కుమారుడు అనునది పేరు కాదు; పరిశుద్దాత్మ అనునది పేరు కాదు; అది ఒక బిరుదు. పది దినముల తరువాత పేతురు లేచి ఇట్లనెను, "మారుమనస్సు పొంది ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి." ఆయన అతనికి చేయుమని చెప్పినది అతడు చేయలేదా? ఆయన చెప్పినదే అతడు చేసెను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్ముని యొక్కయు నామము ప్రభువైన యేసుక్రీస్తు.
REV 22:18,19
48క్రొత్త నిబంధనలోని ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందెను. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అను బిరుదులలో బైబిలులోని ఏ వ్యక్తియు ఎన్నడూ బాప్తిస్మము పొందలేదు. రోమ్ లోని నైసియావద్ద నైసియా ఆలోచన పుట్టువరకు అది ఎన్నడూ ఉనికిలోనికి రాలేదు. అది కాథలిక్కు సంఘ క్రమము, వారి చేతి పుస్తకములలో అది బయలుపడినది. (అది నిజము!) "మన విశ్వాస వాస్తవములు," అను పుస్తకము నా యొద్ద ఉన్నది, అది పూర్తిగా రోమను కాథలిక్కు సిద్దాంతము. అది బైబిలులో లేదని వారే నీకు చెప్పెదరు, అయితే పోపు తన ఇష్టము చొప్పున ఆ మాటలను మార్చు అధికారమును కలిగియున్నాడని వారందురు. దానితో నేను సమ్మతించను. యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు, మరియు "ఈ బైబిలులో నుండి ఒక్కమాట తీసివేసినయెడల లేదా ఒక్కమాట దానికి కలిపినయెడల అట్టివానికి జీవగ్రంథములో పాలులేకుండా చేతును," అని యేసు చెప్పెను. ఒక్క వచనము కాదు, ఒక్క మాట, ఒక పేరా కాదు, గాని ఒక్క మాట "ఎవడైనను దానినుండి ఒక మాటను తీసివేసిన …"
MATT 4:4•
LUKE 4:4•
HEB 13:8•
REV 22:18,19
49ఆదియందు దేవుడు తన జనులకు వాక్యమునే కంచెగా వేసెను. ఒక్క మాట తప్పుగా మార్చినచో, ఏమవును? మరణము, గుండెపోటు, దుఃఖమునకు కారణమయ్యెను. హవ్వ ఒక్క మాటను పూర్తిగా మీరలేదు, ఆమె ఒక చిన్న పదమును మీరెను. మధ్యలో యేసు వచ్చినప్పుడు… అది బైబిలులో మొదటి గ్రంథము. గ్రంథము మధ్యలో యేసు వచ్చినప్పుడు, ఆయన ఏమి చెప్పెను? "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును, అని వ్రాయబడియున్నది." గ్రంథములోని చివరిదగు ప్రకటన 22వ అధ్యాయము, 18వ వచనములో, అనగా బైబిలులోని చివరి భాగములో యేసు తానే ఇట్లనెను, "ఈ గ్రంథములో నుండి ఎవరైనా ఒక మాట తీసివేసినా, ఒక్క మాట కలిపినా, జీవ గ్రంథములో వానికి పాలులేకుండా చేయుదును, ఎందుకనగా అట్టివాడు అబద్ద ప్రవక్తయై జనులను త్రోవ తప్పించును, వారి రక్తాపరాధము వానిమీదకు వచ్చును."
వాక్యమైయున్న యేసుక్రీస్తులోనే మనము ఆరాధించవలెను, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆమేన్. మంచిది. గుర్తుంచుకొనండి, మరో ఆరాధన స్థలము లేదు. దేవుడే దానిని ఏర్పరచుకొనెను.
MATT 3:9,11,12•
MARK 1:7,8•
LUKE 3:8,16,17•
JOHN 1:26,27
50పాత మరియు క్రొత్త నిబంధనలను యోహాను ఎట్లు ముడివేసెనో చూడండి. (దీనిని జాగ్రత్తగా వినండి; జాగ్రత్తగా గమనించండి.) గొప్ప పక్షిరాజగు యోహాను ఒక దినమున అరణ్యములో నుండి ఎగురుచూ వచ్చెను, అతని గొప్ప రెక్కలు చాచబడినవి. గొప్ప పక్షిరాజు ప్రవక్తయగు అతడు యొర్తాను నదియొడ్డున నిలచి పాత మరియు క్రొత్త నిబంధనలకు వారధి వేసెను వారిని ఎడా పెడా ఖండించెను. మారుమనస్సు దినమును అతడు ప్రకటించెను. పరిసయ్యులు మరియు సద్ధూకయ్యలు బయటకు వచ్చిరి, అతడు వారితో ఇట్లనెను, "మా తండ్రి అబ్రాహాము అని మీరు చెప్పవద్దు," ఏలయనగా దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహాముకు సంతానము పుట్టించగలడు. ఓ, మై! అతడు సువార్తను బయటపెట్టెను. "మీ మధ్య ఒకాయన నిలబడియున్నాడు. ఆయనను మీరెరుగరు. ఇంకా ఆయనను నేను గుర్తించలేదు, కాని ఆయన వచ్చునప్పుడు నేను తెలిసికొందును. ఆయన చెప్పులు విప్పుటకు నేను యోగ్యుడను కాను, కాని ఆయన మీకు అగ్నితోను మరియు పరిశుద్ధాత్మతోను బాప్తిస్మము ఇచ్చును. మరియు ఆయన చేట ఆయన చేతిలో యున్నది. ఆయన కళ్ళమును బాగుగా నూర్చి పొట్టును ఆరని అగ్నితో దహించును."
MATT 14:4•
MARK 6:18
51ఆ గొప్ప సువార్త పక్షిరాజు అక్కడ కూర్చొనియుండెను. మరియు ఎన్నో బెదిరింపులు వచ్చుచున్నవి, ఆ కాలములో చక్రవర్తిగావున్న దుష్టహేరోదు బయటకు వచ్చెను, అతడు తన సోదరుని భార్యను పె౦డ్లి చేసుకొనెను. మరియు ఆ గొప్ప సువార్త పక్షిరాజు దానిని చూస్తూ నెమ్మదిగా వుండునని మీరు తలంచగలరా?
వారిలో కొందరు, "వివాహము మరియు విడాకులు గూర్చి ఇప్పుడు మాట్లాడవద్దు యోహాను, ఎందుకనగా హేరోదు అక్కడ కూర్చొన్నాడు," అనిరి.
కాని అతడు తిన్నగా అతని యొద్దకు వెళ్ళి ఇట్లనెను, "నీవు ఆమె కలిగియుండుట ధర్మము కాదు." అది సత్యము. అతడెవరు- అదేమిటి? అతడు అరణ్యము నుండి వచ్చిన పక్షిరాజు. మనుష్యుల బెదిరింపులు, భయములు, శాఖల కేకల క్రింద అతడు శిక్షణ పొందలేదు, కాని అతడు ఏది సరిగా వుండునో తెలిసికొనుటకు గాను సర్వశక్తుడగు దేవుని శక్తి క్రింద శిక్షణ పొందెను. మెస్సీయా యొక్క గుర్తింపును ఎరిగియుండెను. హల్లెలూయ! (దానికి అర్ధము "మన దేవుని స్తుతించుడి!" భయపడకుడి; ఎవరిని ఇంకా నేను గాయపరచలేదు. నేను పరవశుడనగుట లేదు; నేను ఎక్కడున్నానో నాకు తెలియును!) ఓ, ఆ గొప్ప పక్షిరాజును గూర్చి నేను తలంచుచున్నాను, ఎగిరి వచ్చి అక్కడ కూర్చొనెను. "ఆయన వచ్చిప్పుడు నాకు తెలియును," అని చెప్పెను.
JOHN 1:29
52ఒక రోజున ఆయన బోధించుచూ నిలబడెను. యాజకులు అవతలి ఒడ్డున యుండిరి, "అనుదిన బలి ఆగిపోవు కాలము వచ్చునని నీవు తలంచుచున్నావా, ఈ గొప్ప దేవాలయమును మేము నిర్మించాము. మరియు మాది పెద్ద శాఖ, ఈ పని ఆగిపోవునా అనిరి."
"ఇదంతయూ ఆగిపోవు ఒక కాలము వచ్చును," అని ఆయన పలికెను.
"అది జరుగదు, నీవు అబద్ద ప్రవక్తవు," అనిరి.
మరియు అతడు చూట్టు చూచెను, అతడు చెప్పెను, "అదిగో, ఆయన అక్కడ వున్నాడు. దేవుడు ఎన్నుకొనిన ఆరాధన స్థలము అక్కడున్నది; గొర్రెపిల్ల, లోక పాపమును మోసికొనిపోవు నిజమైన గొర్రెపిల్ల అక్కడున్నది." అతడు చెప్పలేదు: "మెథడిస్టు ఇక్కడకు వచ్చుచున్నది! బాప్టిస్టులు, లేక కాథలిక్కు ఇక్కడకు వచ్చుచున్నది! అతడు చెప్పెను: "లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల వచ్చుచున్నది." దేవుని గొర్రెపిల్లలోనే భద్రత యున్నది, ఆయనలో మాత్రమే రక్షణ యున్నది, ఏ సంఘములోనూ లేదు. ఏ సిద్దాంతములోను, ఏ మనిషిలోను, ఏ తండ్రిలోను, ఏ తల్లిలోను, ఏ పరిశుద్దునిలోను, లేక దేనిలోను ఏ పవిత్ర స్థలములోను లేదు; అది పరిశుద్ద దేవునిలోనే యున్నది, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, విమోచన కొరకు దేవుడు తన నామమును ఆ స్థలములోనే యుంచెను, పాపులమగు మనకొరకు ఆయన వెల చెల్లించెను. ఆ స్థలములో మాత్రమే రక్షణయున్నది.
JOHN 1:34•
ACTS 4:12
53ఆ బండ మీద నేను నిలబడుదును. యోహాను ఆయనను గుర్తించెను. అతడు చెప్పెను, "ఆయన వచ్చుటను నేను చూచినప్పుడు ఆయనను నేను ఎరుగను, కానీ అక్కడ వెలుపల నేను శిక్షణ పొందుచున్నప్పుడు…" అతని తండ్రివలె అతడు సెమినరీలో చదువుకోలేదు, అతని తండ్రి శిక్షణ పొందిన యూజకుడు, కాని అరణ్యములో సర్వశక్తుడగు దేవుని వేదాంత పాఠశాలలో వుండి, దేవుని వాక్యము కొరకు కనిపెట్టెను; ఏదో ఒక గుంపువారి మాటకొరకు కాదు, గాని దేవుడు దానిగురించి చెప్పిన మాట కొరకు అతడు కాచుకొనియుండెను. మరియు యోహాను పైకి చూచి మరియు ఆత్మ దిగివచ్పుటను చూచినప్పుడు, అతడు, "ఇది ఆయనే అని, నేను సాక్యమిచ్చుచున్నాను," అని చెప్పెను. ఓ, మై, అది మీ ఆరాధన స్థలము, అక్కడే వున్నది. అదే మీరు దాగుచోటు. లోక పాపమును మోసికొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల అదియే. ఏ సంఘము కాదు, ఏ సిద్దాంతము కాదు, లేక మరేదియూ కాదు. దేవుని గొర్రెపిల్లయే లోక పాపమును మోసికొనిపోవును.
యోహాను దానిని ఎట్లు చెప్పెనో చూడండి? అతడు, "పరిసయ్యులారా, సద్ధూకయ్యులారా, హేరోదీయులారా, మీది సరియైనది," అని చెప్పలేదు. "అదిగో గొర్రెపిల్ల. అదియే స్థలము. ఆయనకు నామమున్నది. అది ఆయనే. ఆకాశము క్రింద మరి ఏ నామము లేదు."
MAL 3:1•
JOHN 5:35
54ఇప్పుడు యోహాను గూర్చి యేసు ఏమి చెప్పెనో గమనించండి. ఆయనేమి చేయుచున్నాడో చూచిరండి, అని యోహాను తన శిష్యులను ఒకనాడు ప౦పెను. ఆయన మొదటి రాకకు ముందు సరియైన త్రోవను జనులు వెంబడించునట్లు చేయు "ప్రకాశించుచున్న గొప్ప వెలుగు," అని యేసు అతనిగూర్చి చెప్పెను. జాగ్రత్తగా వినండి. దీనిని తప్పిపోవద్దు, యోహానే ఆ వెలుగు అని యేసు చెప్పెను, మలాకీ 3. ఏ తప్పు లేదు. గొప్ప ప్రకాశమానమగు వెలుగు గల ప్రవక్త, యేసును గొర్రెపిల్లగా గుర్తించెను. ఆ యాజకులు మాట్లాడుకొనుచున్న తక్కిన గొర్రెపిల్లలు, సంగతులన్నియూ అవివేకము. ఆయనే గొర్రెపిల్ల. అతడు ప్రకాశించుచున్న వెలుగు, అని యేసు చెప్పెను. మలాకీ 3 ఇట్లు చెప్పెను, "నాకంటె ముందుగా మార్గమును సిద్దపరచుటకు నా దూతను పంపించుదును." మరియు మార్గమును సిద్దపరచుటకు పంపబడిన ఇతడు ఆ స్థలము. "అది ఆయనే; ఏ పొరపాటు లేదు; "అది ఆయనే," అని అతడు చెప్పెను. "ఆయనే! ఆయన వెనుక వచ్చుచున్న సూచక క్రియను నేను చూచాను. అది ఆయనే అని నాకు తెలియును, పరలోకమునుండి ఒక వెలుగు దిగి వచ్చి ఆయన మీద కమ్ముచున్నది." అది ఆయనే అను నిజరూపము (positive)ను అతడు కలిగియుండెను.
MAL 4:5,6•
LUKE 17:30•
HEB 13:8
55అప్పుడు, నా సోదరుడా, ముగింపులో ఒక్క సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. దీనిని మనము చెప్పుకోవచ్చును: మలాకీ 4లో మరో పక్షిరాజు మనకు వాగ్దానము చేయబడియున్నది, ఈ దినమున ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడను హెబ్రియులు 13:8ని సంఘమునకు చూపించుటకు అగ్నిస్తంభము వచ్చుచున్నది. అరణ్యము నుండి మరో పక్షిరాజు ఎగిరివచ్చునని మనకు వాగ్దానము చేయబడలేదా? ఆమేన్. అది ఖచ్చితముగా నిజము. లూకా 17:30కి ఇదెంతగానో తగియున్నది, ఆరాధన స్థలములు అనగా, శాఖలు వ్యర్థపరచుటకు మనుష్య-కుమారుడు-పక్షిరాజు తానే ప్రత్యక్ష్యమగుచున్నాడు.
దేవుడు తన స్థలమును ఎన్నుకొనెను. "అదిగో" అని యోహాను పలికెను. ఆ తరువాత ఈ దినమున మనకు అదే వాగ్దానము చేయబడియున్నది, మలాకీ 4 ఆయన మరణించలేదని చెప్పుటకు పిల్లల హృదయములను వెనుకకు త్రిప్పెను, ఈ సంగతులు మరియొక కాలమునకు చెందినవి కాదు, యేసు నామములో బాప్తిస్మము అప్పుడు లేదనుట తప్పు, కాని ఆయన ఇప్పుడును అదే రీతిగా ఉన్నాడు. ఆమేన్! అన్ని ఆరాధన స్థలములు తప్ప, చివరి దినపు పక్షిరాజు దానినే చూపించవలెను, అవన్నియు బుద్ధిహీనములనియు, శాఖ తప్పు అనియు మరల అదే సూచనతో ఆయన చూపించుచున్నాడు; ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. హల్లెలూయ!
ZECH 14:7•
REV 4:7
56ప్రకటన 4:7లో కూడ నాలుగు జీవులు ఉన్నవని మనము చూచాము. మొదటిది, సింహమని మనము కనుగొన్నాము. ఆ దినపు సవాలును ఎదుర్కొనుటకు బయలు వెళ్ళిన మొదటి జీవి అదియే, యూదా గోత్రపు సింహము. దాని తరువాత మరో జీవివచ్చెను. మరియు అది ఎద్దు అని మనము కనుగొన్నాము, అది భారమును మోయును, ఒక బలిపశువు. రోమా సంఘకాలములో సంఘము చనిపోయినది: బలి అయినది. తరువాత నరుడు — నరుని ముఖముగల మృగము వచ్చెను. మరియు సంస్కర్తలు వారే: మానవ విద్య, వేదాంతము, అటువంటివి. కాని చివరి జీవి ఎగురును, ఆఖరి మృగము రావలసియున్నది, అది ఎగురుచున్న పక్షిరాజు అని బైబిలు చెప్పెను. హల్లెలూయ! మరియు ఈ దినమున వెలుగు వుండునని ప్రవక్త చెప్పెను. "ఆ దినమున వెలుగు కలుగును."
సంస్కర్తల కాలము ఒకటి వుండెను; పగలు లేక రాత్రి కాని ఛాయా దినము ఒకటుండెను. కాని సాయంకాల సమయములో, పక్షిరాజు సమయములో.
పక్షిరాజు సమయమందు వెలుగు కలుగును,
మహిమ మార్గమును నీవు తప్పక కనుగొందువు;
నీటి మార్గమే నేటి వెలుగు,
ప్రశస్త యేసు నామములో సమాధి చేయబడుము.
యువకులు మరియు వృద్దులు, మీ పాపములన్నిటి నిమిత్తము పశ్చాత్తాపపడుడి
పరిశుద్దాత్మ నిశ్చయముగా నీకు లోనికి బాప్తిస్మమిచ్చును;
దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే అనునది సత్యము.
ఆమేన్! సాయంకాల సమయమందు వెలుగు కలుగును. దేవుని ఒకే ఒక ఏర్పరచబడిన స్థలము,
ZECH 14:7
57ఈ వర్తమానము ఎక్కడికి వెళ్ళును? ఆయనేమి చేయబోవుచున్నాడు? "ఆయన రోజుల్లో సాయుంకాల సమయుమ౦దు వెలుగు కలుగును." మరియు ఏమిటి? నిజముగా వాగ్దానము చేయబడిన దేశములోని గృహమునకు ఆయన పిల్లలను ఆహ్వానించుటకు అరణ్యముగుండా ఇశ్రాయేలీయులను నడిపించిన అగ్నిస్తంభపు గురుతు వచ్చుచున్నది. యేసుక్రీస్తే దేవుడేర్పరచుకొనిన ఆరాధన స్థలము, ఉన్నది అది ఒక్కటే స్థలము. దేవుడు రక్షణ కొరకు ఇచ్చిన స్థలము అది ఒక్కటే. భూమి మీదను, పరలోకమందును ఆయనిచ్చిన ఇంటి పేరు యేసుక్రీస్తే.
ఓ, సంఘమా, ఓ, జనులారా, పాపియగు స్నేహితుడా, యేసుక్రీస్తును తప్ప మరెవరిని నమ్మవద్దు. ఏ బోధకుని నమ్మవద్దు. ఎవరూ నిన్ను రక్షించరు. ఏ సంఘమును, ఏ సిద్దాంతమును, ఏ శాఖను నీవు నమ్మవద్దు; యేసు క్రీస్తును మాత్రమే నమ్ముము, ఆయనే ఈ ఘడియ యొక్క వెలుగు. మన తలలు వంచుదము.
సాయంకాల సమయమందు వెలుగు కలుగును,
మహిమ బాట నిశ్చయముగా నీవు కనుగొందువు;
నీటిబాటయే నేటి వెలుగు,
ప్రశస్త యేసు నామములో సమాధియగుము.
యువకులారా మరియు వృద్దులారా, మీ పాపములన్నింటికై పశ్చాత్తాపపడుడి;
నిశ్చయయముగా పరిశుద్దాత్మ (నీ)లోనికి ప్రవేశించును;
సాయంకాల దీపములు వచ్చినవి;
దేవునిలో క్రీస్తు ఒక్కటే యన్నది సత్యము.
MAL 4:6
58ఓ సోదరుడా, సోదరీ, ఇంకా నీవు మారుమనస్సు పొందనిచో, యేసుక్రీస్తు నామములో ఇంకా బాప్తిస్మము నీవు పొందనిచో, ఈ రాత్రికే ఆ ఆరంభమును చేయుదువా, ఆయనను ఆరాధించగల స్థలమునకు నిన్ను ఆహ్వానించుటకు ఆ తరుణమును నీవు దేవునికి ఇచ్చెదవా? గుర్తు౦చుకో, నిన్ను కలసికొని నీ సహవాసమును ఆహ్వానించుటకు దేవుడు వాగ్దానము చేసిన ఆ స్థలము తప్ప మరొకటి లేదు.
"బ్రన్హం సోదరుడా, ఎంతో యథార్థముగా నేను ఆరాధించుచున్నాను," అని నీవనవచ్చును. కయీను అలాగే చేసెను. హేబెలువలెనే అతడు అర్పించెను, కాని అది ఒక తప్పైన అర్పణ. నీవు సంఘమునకు వెళ్ళుచూ, దశమభాగములు చెల్లించుచూ, క్రైస్తవునిగా నీ విధులను నీవు నిర్వర్తించుచుండవచ్చును, ఇతర స్త్రీ పురుషులవలె బహు యథార్థపరునిగా యుండవచ్చును. నేను నగరమంతటిలో ఇదే వర్తమానమును ముప్పది సంవత్సరములుగా ప్రకటించుచు, మరియు ఇప్పుడు ఇక్కడ నిలబడి యున్నాను. నేను వృద్ధుడనగుచున్నాను. నేను ఎంతో కాలము మీతో ఉండను. కానీ గుర్తుంచుకొనుడి, నా స్వరము పదిలపరచబడుచున్నది (record), మరియు న్యాయతీర్పు దినమున అది మీకు నిరోధముగా మాట్లాడును.
దేవుడు తన నామమునుంచిన చోటు ఒక్కటే యున్నది, మరియు అది ఒక సంఘము కాదు, గాని యేసులోనే. ఒకే ఒక ఆరాధన స్థలమున్నది, నిన్ను చేర్చుకొను స్థలము ఒక్కటేయున్నది, మరియు అది ప్రియుడగు యేసుక్రీస్తులోనే. రక్షించుటకు ఆకాశము క్రింద మరి ఏ ఇతర నామము ఇయ్యబడలేదు, ఏ సంఘము, సిద్దాంతము, ఏదీ కాదు యేసుక్రీస్తే, మరియు, పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము వైపునకు పిల్లల హృదయములను త్రిప్పుటయే ఈ ఘడియ యొక్క వర్తమానము. ఈ రాత్రి దానిని మీరు అంగీకరించరా?
1COR 12:13
59మరియు మన తలలు వంచియుండగా మరియు ప్రార్ధనలో జ్ఞాపకము చేయబడవలెనని కోరువారు చేతులు ఎత్తేదరా? చాలామంది యున్నారు గనుక మేము వేదిక యొద్దకు పిలువలేము.
దేవుడు మిమ్మును దీవించును. నా ఎడమవైపు మూడు వందలమంది పైగా ఉన్నారు. ఇప్పుడు, నా కుడివైపునున్నవారును, "నన్ను జ్ఞాపకము చేసికొనుడి," అని చేతులు ఎత్తేదరా, నా కుడివైపు నూట-ఏబదిమందికి పైగా ఉన్నారు. నీరు నిండుగా యున్న పెద్దతొట్టి ఈ ఆలయములో ఉన్నది. సంఘకాపరి, చక్కని సంఘకాపరి, సహోదరుడు, ఓర్మన్ నెవిల్ ఇంకా చాలామంది యున్నారు, ఇక్కడ మీరు వారిని కలసికోవచ్చును మరియు చూడవచ్చును. ప్రతి రోజు, ప్రతి పగలు, ప్రతి గంట, మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసికోగోరువారు, అది ఎల్లప్పుడు ఎదురుచూచుచున్నది. మరియు ఆ ఆజ్ఞకు మీరు విధేయులైనచో, నిశ్చయముగా దేవుని వాగ్దానము ద్వారా మారుమనస్సు పొంది పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందుదురు.
ఒకే ఒక ఆరాధన స్థలమున్నది. ఇప్పుడు, అది ఈ గుడారము కాదు; అది క్రీస్తులో యున్నది. ఆయనలోనికి మనము ఏలాగు వెళ్ళగలము? ఒకే ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి మనమందరము బాప్తిస్మము పొందియున్నాము. మనము ప్రార్ధి౦చుదము.
JOHN 5:24
60ప్రియదేవా, ఈ పైకెత్తబడిన చేతులు, ఆ చేతుల వెనుక హృదయములో వున్న దానిని చూపించుచున్నవి, నీ యొద్ద నుండి నిశ్చయముగా సహాయము కావలెనని వారు ఒప్పించబడియున్నారు. తండ్రీ, ఆ ప్రతి ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్ధి౦చుచున్నాను, మరియు నీ వాక్యమును నేను ఎత్తి చూపబోవుచున్నాను. "నా మాటలు నిని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు," అని నీవు చెప్పితివి.
తండ్రీ, కొన్ని వారములపాటు ఈ పట్టణము నుండి దూరమై మరల వచ్చినప్పుడు పలానివారు ఎక్కడ? అనడిగినప్పుడు, "వారు వెళ్ళిపోయిరి," అని చెప్పుచున్నారు.
"మంచిది, ఏమయింది…?"
"వారు వెళ్ళిపోయారు."
ప్రియదేవా ఒకరి తరువాత ఒకరము పిలువబడితిమి. మరణ చాయగుండా ఆ లోయద్వారా మేము నడువవలసిన సవాలును ఎదుర్కొనవలసియున్నాము. మరియు మర్త్యులమగు మా అందరికి అది సహజమే. కాని ఈ రాత్రి నీ విన్నపమును నీవు మాకు తెలియజేసియున్నావు, ఆయనందు నిశ్వాసముంచి ఆయన నామములో బాప్తిస్మము పొందినచో మమ్ములను స్వీకరించెదవు, అప్పుడు మేము క్రీస్తు శరీరములో యుందుము, సంఘములో కాదు, కాని క్రీస్తు శరీరము ముందే తీర్పు తీర్చబడినది. అది తీర్పులోనికి రానవసరము లేదు. దేవుడు ఆ శరీరముపై తన ఉగ్రతను కుమ్మరించెను. మరియు ఆ శరీరము పాపమునకు గురి కాలేదు. మరియు ఆయనలో ఉన్నప్పుడు మనకొరకు ఆయన పరిహారము చెల్లించుట ద్వారా మనమును పాపము నుండి స్వతంత్రులమగుదుము. యేసుక్రీస్తు యొక్క శరీరములో మనకు ఒకరితో ఒకరికి సహవాసమున్నది, దేవుని రక్తము మనలను సమస్త పాపము నుండి మరియు మురికి నుండి శుద్దులనుగా చేయును.
61తండ్రీ, దేవా, ఈ ప్రతి ఒక్కరిని నీ రాజ్యములోనికి చేర్చుకొమ్మని ప్రార్ధి౦చుచున్నాను. దేవా, దీనిని అనుగ్రహించుము. అక్కడున్న ఏ ఒక్కరును నశించిపోకుందురు గాక; ప్రతి బాలుడు లేక బాలిక, స్త్రీ, లేక పురుషుడు నశించిపోకుందురు గాక. ప్రభువా, ఈ రాత్రి నా స్వకీయులే కొందరు రక్తమునకు వెలుపటనున్నారు. నా తండ్రి యొక్క మాటలు నాకు ఎంతో జ్ఞాపకమున్నవి. మరియు ప్రియదేవా, వారిలో ఎవరును నశించకుందురు గాక, అని నేను ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, దీనిని దయచేయుము. ప్రభువా, నా సమస్తముతో ఇప్పుడు నీయందు విశ్వాసముంచుచున్నాను.
రాత్రి ఈ స్థలమందును, అవతల ఫోనులోయున్న నా సోదరులను. సోదరీలను,స్నేహితుల మీద కదలాడుము. తూర్పు-తీరము నుండి పశ్చిమ-తీరము వరకు గల ఎన్నో రాష్ట్రముల వారు వినుచున్నారు. ప్రియదేవా, టుసాన్ ఎడారులలోను, కాలిఫోర్నియాలోను, నెవెడా, ఇడాహోలోను, తూర్పున, టెక్సాస్లోను ఉన్నవారందరికి ఈ ఆహ్వానము ఇయ్యబడుచున్నది, జనులు ఈ చిన్న సంఘములలోను, పెట్రోలు బంకులలోను, ఇండ్లలోను కూర్చొని వినుచున్నారు. ఓ దేవా, నశించిన బాలుడు లేక బాలిక, స్త్రీ లేక పురుషుడు ఈ ఘడియలో నీ యొద్దకు వచ్చెదరు గాక. ఇప్పుడే ఈ మనవి ఆలకించును. సమయము౦డగానే వారు ఈ సురక్షిత స్థలమును కనుగొనునట్లు యేసు నామములో అడుగుచున్నాము, గోడమీద చేవ్రాతను మేము చూచుచుండగా, భూమి ఉద్రిక్తతతో నిండియున్నది, విమోచనా కాలము ఆసన్నమయినది. మా దేశములో ఒక భాగము మునిగిపోవుచున్నది, యేసు జరుగునని చెప్పినట్లు మరో భాగము భూకంపములతో దద్దరిల్లిపోవుచున్నది. ప్రభువా, వారి సమయమును మించిపోనీయకుము. ఇప్పుడే, వారు స్వీకరించెదరు గాక, ఈ కూటముల యొక్క సువార్త విజేతలుగా వీరిని నీకు మేము సమర్పించుచున్నాము. యేసు నామములో, ఆమేన్.
ISA 53:5
62ఆయనను మీరు నమ్ముచున్నారా? దేవుడు మిమ్మును దీవించును. అది సత్యమని ఎందరు నమ్ముచున్నారో, నా ఎడమవైపున వున్నవారు చేతులెత్తండి. కుడివైపున ఎందరున్నారో, చేతులెత్తండి. దేవుడు మిమ్మును దీవించును. నా కనుచూపు మేరకు అందరూ కనబడుచున్నారు. స్నేహితులారా, అది సత్యము. ఇది నిజమని దేవునికి తెలియును.
ఇప్పుడు, ఆయనలో మీరుండగా, ఆయనలో మీరున్నందున ఆయన ఎందుకొరకు చనిపోయెనో అవన్నియు మీవగును. మరియు ఆయన దేని కొరకు చనిపోయెను? "ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బలవలన మనకు స్వస్థత కలిగియున్నది." దానిని మీరు నమ్ముదురా? ఇప్పుడు స్వస్థత కొరకు ఆయన పరిహారమును మీరు నమ్ముచున్నారా?
MARK 16:17,18
63మనమధ్య ఎవరైనా రోగులున్నారా? కుడివైపునున్నా, ఎడమవైపునున్నా; చేతులు ఎత్తండి. రోగులు గుంపులుగా యున్నారు. వరుసలో పెట్టలేను. మీరు చూడండి, వేదిక మీదకు వారిని పిలువలేను. దానిని చేయు మార్గము లేదు. ఇతర స్థలములలో, సంఘములలో, గుడారములో రోగుల కొరకు ప్రార్ధన కూటములు జరుగుచున్నవి. ఒక సంగతి మిమ్మును అడిగెదను: అక్కడ ఎందరు విశ్వాసులువున్నారు? చేతులెత్తండి. మంచిది. క్రీస్తయియున్న వాక్యమును నేను ప్రస్తావించబోవుచున్నాను. లోకమునకు, సంఘమునకు యేసు ఇచ్చిన చివరి ఆజ్ఞ, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును: వారు రోగులమీద చేతులుంచగా బాగవుదురు." మార్కు 16 నిజమని ఎందరికి తెలియును. "ఆమేన్" చెప్పండి. మ౦చిది. మీ ముందున్న ఒకరి మీద విశ్వాసిగా మీరు చేతినుంచుడి. మీ ముందున్న వారిమీద మీ చేతినుంచండి, మరియు మనందరము ఇప్పుడు ఒకరికొరకు ఒకరము ప్రార్ధి౦చుదము. మీ చుట్టూనున్న వారిలో ఒకరి మీద మీ చేతులు వేయుడి.
ACTS 19:12
64ప్రభువా, నా ముందున్నపెట్టెలో చేతిరుమాళ్ళు, చిన్న వస్తువులున్నవి, ఎక్కడో ఒక ముసలి తల్లి, ఒక శిశువు, రోగులు ప్రతి చోటు మరణదశలో ఉన్నారు. పౌలు యొక్క అంగీ నుండి వస్త్రమును చింపి వారు రోగుల మీదను, దురాత్మలు పట్టినవారి మీదను, అపవిత్రాత్మలు పట్టినవారి మీదను ఉంచగా ఆ రోగములు, అపవిత్రాత్మలు జనులను విడిచెను, అని మేము బైబిలులో చదివియున్నాము. ఇప్పుడు, ప్రభువా, మేము పరిశుద్ద పౌలులము కాదని ఎరుగుదుము, కాని నీవు ఇంకను యేసు గానే నిలచియున్నావు, నీవే దేవుడేర్పరచిన ఆరాధనస్థలమైయున్నావు. మరియు ఇప్పుడు ఆనాటి ప్రజలవలెనే, నేడును ఈ జనులు నిశ్వాసము కలిగియున్నారు. నిశ్చయంగా వారికి నీవు ఒక మార్గము ఏర్పరచితివి, మరియు నేను ఈ చేతి గుడ్డల మీద నా చేతులుంచుచున్నాను, మరియు యేసుక్రీస్తు నామములో ఏ శరీరము మీద ఇవి ఉంచబడునో ఆ శరీరములోని వ్యాధులు, బలహీనతలు పోవునట్టు అడుగుచున్నాము.
MARK 16:17•
3JN 1:2
65ఇప్పుడు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు విధి నిర్వహణలో బయటకు వచ్చి, వాగ్ధాన దేశమునకు వచ్చు మార్గములో యుండిరని మనకు చెప్పబడినది. వారి మార్గములో ఎర్ర సముద్రవు అడ్డవుగా వచ్చెను; మరియు దేవుడు అగ్ని స్తంభములో నుండి క్రిందికి చూచెను, మరియు సముద్రము భయపడినది, వెనక్కు దొర్లినది, మరియు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములోనికి పయనించునట్లు త్రోవ ఇచ్చెను. ఓ దేవా, ఈ రాత్రి యేసు రక్తముక్రింద వుండి, నీవు చూడుము, వారి రోగము వెనక్కి దొర్లిపోవును, మరియు సాతాను వెళ్ళగొట్టబడును; మ౦చి ఆరోగ్యము, బలము యొక్క వాగ్దానములోనికి జనులు దాటిపోవుదురు గాక, "అన్నిటికంటె ఎక్కువగా నీవు ఆరోగ్యములో వర్ధిల్లవలెనని కోరుచున్నాను," అని దేవుడు చెప్పెను.
ఇప్పుడు, ప్రభువైన యేసూ, ఈ జనులు ఒకరి మీద ఒకరు చేతులుంచు కొనుటను నీవు చూచుచున్నావు, నీవు చెప్పిన మాటకు వారి విశ్వాసము గురుతుగా యున్నది. "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును." వారు తమకొచ్చిన రీతిలో ఒకరికొకరు ఒకరు ప్రార్ధి౦చుచున్నారు. వారి ప్రకనున్న వ్యక్తి వారి కొరకు ప్రార్ధి౦చుచున్నారు.
ఇప్పుడు, ప్రభువా, ఈ సవాలును ఎదుర్కొన్నాము, గొప్ప మోసగాడగు సాతాను దేవుని బిడ్డను పట్టుకొనియుండు హక్కు లేకయున్నాడు. వాడు ఓడిపోయినవాడు. యేసుక్రీస్తే ఏర్పరచబడిన ఆరాధన స్థలము, ఒకే ఒక నిజమైన నామము, కల్వరియొద్ద వాడిని ఓడించెను, మరియు ఆయన ప్రతి రోగమును, రుగ్మతను ఓడించెను; ఇప్పుడే ఆయన రక్తమును మేము ప్రకటించుచున్నాము; ఈ జనులలో నుండి వెళ్ళిపొమ్మని యేసుక్రీస్తు నామములో సాతానును ఆజ్ఞాపించుచున్నాను. వారు స్వతంత్రులగుదురు!
66వ్రాయబడిన వాక్యమును ఆధారము చేసికొని మీ స్వస్థతను అంగీకరించిన వారు లేచి, నిలబడి ఈలాగు సాక్ష్యము చెప్పండి, "ఇప్పుడు నేను యేసుక్రీస్తు నామములో నా స్వస్థతను అంగీకరించుచున్నాను." లేచి నిలబడండి. దేవునికి స్తోత్రము. మీ స్థానము అది. ఇక్కడ పరీక్షించండి, కుంటి వారు తదితరులు వచ్చుచున్నారు, దేవునికి స్తోత్రము, అంతే; కేవలము విశ్వసించండి. ఆయన ఇచ్చటున్నాడు. ఎంత అద్భుతము!
బయట జన సమూహములోను, వెలుపటను, తీగల (wires) ద్వారాను మీరు చూడండి; నాకు తెలిసినంతవరకు, ఇక్కడ ప్రతి వ్యక్తియు, లేదా వీరిలో ఎక్కువ మంది ఈ సమయములో నిలబడియున్నారు. ఓ, ఎంత అద్భుతమగు సమయము. ఇది ప్రభుని సన్నిధి, ప్రభుని సన్నిధి ఎచ్చటుండునో అచ్చటు స్వాతంత్ర్యము, స్వేచ్చ ఉన్నవి. దేవుని ఆత్మ మనలను స్వతంత్రులనుగా చేయును.
ఆయన ఇప్పుడు మనలను బాగుచేసెను, దానిని మనము నమ్ముచున్నాము. ఆయన మనలను రక్షించెను; దానిని మనము నమ్ముచున్నాము. బాప్తిస్మము పొందగోరు వారికి నీరు సిద్దముగా వున్నది. ఏ సమయములోనయినా గాని, ఏ ఘడియలోనయినా గాని మీరు రాగోరినచో మిమ్మును స్వీకరించెదము. మరియు ఇప్పుడు, మనము ముగించుముందుగా, సంఘములో పాడు ఒక పాత పాటను పాడుకొందను. "నేనాయనను ప్రేమించెదను, నేను ఆయనను ప్రేమించెదను, ఎందుకనగా ఆయనే మొదలు నన్ను ప్రేమించెను." మీ చేతులెత్తి మరియు మీహృదయమంతటితో దేవునికి పాడండి. ఇదే భవనములో ఉదయము తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడే కలసి కొందుము, "వివాహము మరియు విడాకులు," అను అంశముపై మాట్లాడుదుము. మంచిది. దీనిని అందరం కలిసి ఇప్పుడు పాడుదాం:
నేనాయనను ప్రేమింతును, (ఇపుడు, ఈ గొప్ప జన సమూహము
దానిని పాడెదరు. తీగలద్వారా
వినుచున్నవారు కూడా దానిని పాడండి.)
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
మరియు నా రక్షణను కొనెను
కల్వరి మ్రాను మీద.
67అదెక్కడ జరిగినది? కల్వరి మ్రాను మీద. దానిని మరల మనము పాడుచుండగా మీ దగ్గరున్న వారితో కరచాలనము చేయుచూ, "యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును," అని చెప్పండి.
నేనాయనను ప్రేమింతును,
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
మరియు నా రక్షణను కొనెను
కల్వరి మ్రానుమీద.
ఓ, మీరాయనను ప్రేమించరా? ఆయన ఆశ్చర్యకరుడు కడా? దాగుచోటు కాదా? అలసిన భూమిలో ఆయనే బండ, తుఫాను సమయములో ఒక ఆశ్రయము, నేను ఆ ఆశ్రయపురమునే ఎరుగుదును; కాబట్టి:
నా విశ్వాసము నీవైపు చూచును,
కల్వరి గొర్రేపిల్ల
దైవ రక్షకా!
ఇపుడు నేను ప్రార్ధి౦చుచుండగా,
నా మొర వినుము,
నా దోషమంతా పరిహరించుము,
ఈ దినమునుండే
పూర్తిగా నీవానిగా చేయుము!
దీనిని పాడుచుండగా మన చేతులు ఎత్తుదము.
నా విశ్వాసము నీవైపు చూచును,
కల్వరి గొర్రేపిల్ల
దైవ రక్షకా!
ఇప్పుడు, నేను ప్రార్ధి౦చుచుండగా నా మొర వినుము,
ఇపుడు నేను ప్రార్ధి౦చుచుండగా,
నా మొర వినుము,
నా దోషమంతా పరిహరించుము,
ఈ దినమునుండే
పూర్తిగా నీవానిగా చేయుము!
దీనిని పాడుచుండగా మన చేతులు ఎత్తుదము.
నా విశ్వాసము నీవైపు చూచును,
కల్వరి గొర్రేపిల్ల
దైవ రక్షకా!
ఇప్పుడు, నేను ప్రార్ధి౦చుచుండగా నా మొర వినుము,
నా పాపమంత తీసివేయుము,
నా దినము నుండి పూర్తిగా నీవానిగా చేయుము!
దానిని మనము ఆలపించుచుండగా, ఇప్పుడు మన తలలు వంచుదము. మన ప్రియమగు, సహోదరుడు, పాస్టర్ ఓర్మన్ నెవిల్ జనులను పంపించుదురు.