వివాహము మరియు పరిత్యాగము
1ఒక్క క్షణము ప్రార్థనకు ఇప్పుడు మనము తలలు వంచుదము. అత్యంత కృపగల తండ్రీ, ఈ దినమునకు ఉద్దేశించిన దానిని ఎదుర్కొనుటకు ఈ ఆడిటోరియంలో ఉండు భాగ్యమును అనుగ్రహించినదుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. కాని ఈ దినము మాకేమి జరుగునోమేమెరుగము. అయిననూ ఈ దినమును పట్టుకొనియున్న వానిని మేము ఎరుగుదుము. కాబట్టి నేడు మరియు రేపు, నిత్యత్వమును పట్టుకొనియున్న ఆయనను ఈనాడు ఇక్కడ ఆయన నామములో మేము కూడికొని యుండగా ఆయనను ఇంకా ఎక్కువగా మంచి రీతిలో సేవించుటకు మమ్మును దీవించుమని అడుగుచున్నాము. తండ్రియగు దేవా, ఇదే మా ఉద్దేశ్యము. మా హృదయముల నెరిగిన నీవు ఇది నిజమని ఎరుగుదువు. ఈ దినముయొక్క భవిష్యత్తు భాగమును, నీ సేవ కొరకు మమ్మును మేమునీకు అప్పగించు కొనుచున్నాము. యేసు క్రీస్తు నామమున. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. [''ఇక్కడ మరియొకరున్నారు.'' అని సహో. బ్రన్హాం వేదిక మీద మరియొకరితో చెప్పుచున్నారు.]
2కనబడుచున్న జనాంగమునకు మరియు దేశమంతటా టెలిఫోను సంబంధము ద్వారా వినుటకు కూడికొనియున్న అదృశ్య జనాంగమునకు శుభోదయము చెప్పుచున్నాను. ఈప్రాముఖ్య అంశము మీద మాట్లాడుటకు ఈ ఉదయము ఇక్కడకు వచ్చుట ఒక గొప్ప భాగ్యమని నేను తలంచుచున్నాను. దృశ్యజనాంగమునకు నిశ్చయంగా ఒక చిన్న గలిబిలిగా యుండును. ఎందుకనగా నా ముందు తెరలున్నవి. అందువలన నేను కుడి ఎడమలకు తిరిగి మాట్లాడుదును. ఆ దృశ్యం జనులకు చెప్పుచున్నాను. నా కుడివైపు ఆడిటోరియం, నా ఎడమవైపు జిమ్నాజియం కూడా యున్నవి. తెరలు మధ్యగా తెరువబడి యుండగా, అనగా అవి నాకుడి ఎడమల వైపు ఉండగా నేను నేల మీదియున్నాను. ఆడిటోరియం, మరియు జిమ్నాజియం కూడా, ఆలాగే సంఘము, ఎనిమిది మరియు పెన్ వీధి అనగా ఆలయము క్రింద భాగము కూడా చాలని రీతిలో జనులు వచ్చియున్నారు. ఇతర సంఘములకు, చోటు చాలని వారికి టెలిఫోను సిస్టము సరఫరా అగుచున్నది.
3ప్రభువునందు అద్బుతమగు సమయము మనము కలిగియుంటిమి. ఈ ఉదయము గొప్ప ఆశతో ఈ ఆరాధనకు వచ్చియున్నాము. ఈ నాలుగు దినాల కూటమునకు ఈ రాత్రి ముగింపు కూటము అయినందున ఇక్కడ ఉండకలిగిన వారందరినీ ఆహ్వానించుచున్నాము. పూర్తిగా అసాధారణమైన దానిని ఈ రాత్రి చేయుట ద్వారా ప్రభువు మనకు ఒక గొప్ప ఉచ్చ స్థితిని దయ చేయునని నమ్ముచున్నాము. ఆయన రోగులందరినీ బాగుచేసి, మామూలుగా ఆయన చేయు కార్యములన్నిటినీ చేయునని నమ్ముచున్నాము. ఈ సాయంకాలము కొరకు గొప్ప ఆశను మనము కలిగియున్నాము. ప్రజలందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. ప్రతి శాఖకు చెందిన ప్రతి సంఘమునకు ఆహ్వానించుచున్నాము. మీరు ఇక్కడకు వచ్చుటకు క్రైస్తవులే అయియుండనక్కర్లేదు. పాపులను మేము రమ్మని చెప్పి మా మధ్య కూర్చోమని నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము జీవించునట్లుగా ప్రభువు యొక్క మార్గమేమిటో మాకు తెలిపిన అత్యుత్తమ రీతిలో వారికి నేర్పించుదుము.
ప్రజలు ఇప్పుడు ఆత్మలో ఉద్రిక్తతకు లోనుకాకుందురని నమ్ముచున్నాను. నేను కూడ ఉద్రిక్తతకు లోనుకానని దేవుని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా రాత్రి అద్బుతముగా గడిచింది. ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. ఈ ఉదయున నేను చెప్పవలసియున్న సంగతులకు తీర్పు దినమున నేను జవాబు ఇయ్యవలెనని గ్రహించియున్నాను. నేను నిద్రపోలేకపోయాను. చెప్పవలసియున్నవాటిని నేను చెప్పనియెడల తీర్పు దినమున నేను దోషిగా అగుదును. కాబట్టి అదెంత బాధయో మీరు ఎరుగరు.
4ఈ ఉదయ కాలమున వివాహము మరియు పరిత్యాగము అను గొప్ప అంశముపై చర్చించనై యున్నాము. దీనిని నేను ఆదివారపు బడిగా చేయుటకు కారణమున్నది. ఒక ప్రసంగముగా బోధించుటకు మారుగా సమయము తీసికొని దానిని వివరించవలెనని కోరాను. అది లేఖనములలో నుండిన ఒక ఉపదేశము.
ఒక సంగతి చెప్పగోరుచున్నాను. సేవకుడు లేక సేవకులు ఎవరైనా గాని మేమువిడుదల చేయు ఈ టేపును సంపాదించుకొనుట ఎప్పుడయినా జరుగవచ్చును. దానిగూర్చి సంఘము ఏమి చేయునో నాకు తెలియదు. ఈటేపును విడుదల చేయు ముందుగా చర్చి బోర్డు వారిని సంప్రదించమని సహో. ఫ్రెడ్‌ను నేనుకోరాను. టేపు రికార్డును పెట్టుకొని దేశమంటిలోను వినుచున్నవారికి చెప్పుచున్నాను. సహో. సాద్‌మన్ దానిగూర్చి చెప్పుట వినువరకు బయటకు విడుదల చేయవద్దు.
ఏ విధంగానయినా టేపును సేవక సోదరులలో లేక క్రైస్తవ సోదరులలో ఎవరయినా సంపాదించుట జరిగినచో, ఈ అంశము మీద నేను చెప్పిన సంగతులకు మీరు సమ్మతించనియెడల దానిని మీరు విమర్శించరని నమ్ముచున్నాను. నేను బోధించిన విధముగా దానిని మీరు అర్ధము చేసికొను హక్కున్నది. మీరు విశ్వసించు దేనినయినా గాని నేను గౌరవించుదును.
5దీనిమీద రెండు గొప్ప ఆలోచనా ధోరణులున్నవి. రెండు ప్రశ్నలున్నప్పుడు అందులో ఏదో ఒకటి మాత్రమే సరియైనది గాని రెండూ సరియైనవి కావు అని గ్రహించవలెను. కాబట్టి ఈ ఉదయమున దీనిని నిర్ధారించుటకు దేవునియొక్క ప్రశ్న అయినచో దానికి పరిశుద్ద గ్రంథము తప్పక జవాబును కలిగియుండునని నాకు తోచుచున్నది.
ఈ అంశమును ఆరంభించు ముందుగా, లేదా వాక్యము గూర్చి ప్రార్థించు ముందుగా మీలో ప్రతిఒక్కరికి, ముఖ్యంగా క్రైస్తవులకు నేను చెప్పునదేమనగా, ఈ ఉదయ కాలమున నా కొరకు మీరు ప్రార్థించవలెనని కోరుచున్నాను. ఈ ఉదయకాలమున నా కొరకు కనబడకుండా వినుచున్నవారిని కూడా నాకొరకు ప్రార్థించమని కోరుచున్నాను. ఎందుకనగా నేను యదార్ధముగా, సత్యముగా ఉండగోరుచున్నాను.
6ఈ విషయములను చెప్పుచున్న వ్యక్తి జీవమరణముల మధ్య వ్రేలాడుచున్నట్లుగా యున్నాడని మనుము గ్రహించుచున్నాము. ఇక్కడ మీలో చాలామంది దానిని నమ్మి వెళ్ళుదురు. మీలో చాలామంది నమ్మకుండానే వెళ్ళుట జరుగును. కాని నాకు తెలియును. నీ సేవలో నేను చెప్పువాటిని వినువారందరు, నేను చెప్పవలసియున్నవాటికి చెవియొగ్గెదరు. వారు ఉదయకాలమున ఇక్కడ కూర్చొనియున్నారు. అంతర్జాతీయంగా సుదూర ప్రాంతములనుండి, ఆమెరికా సంయుక్త రాష్ట్రములు మరియు కెనడా దేశములో చాలామంది యున్నారు. అదెంత ఒత్తిడికి గురిచేయునో మీరు ఊహించుడి. ఆ జనుల గమ్యము నీ చేతులలో యున్నదని ఎరిగినప్పుడు ఎంత వ్యధ పొందుదువో గదా! ఎందుకనగా నీవు చెప్పుదానిని బట్టి దేవుడు నన్ను లెక్క అడుగును. కాబట్టి సాధ్యమయినంత యదార్థముగా దీనిని నేను సమీపించవలెను.
7ఇప్పుడు మన సహోదరీలను అడుగుచున్నాను. వారి యెదుట మాట్లాడుటకు వీలుగా కొన్ని మాటలను నేను మార్చివేశాను. కలగలుపుగా నున్న జనుల ఎదుట చెప్పకూడని సంగతులను కొన్నింటిని బిల్లీ ఈ ఉదయమున తీసివేసి తన జేబులో పెట్టుకొనెను. కొన్ని నేను బహుశా చెప్పవలసి యుందును. మీరు తప్పక అర్ధము చేసికొనుడి, నాకు తెలిసినంతవరకూ ఒక సోదరునిగా మీరు నన్ను ఎంచి అవి స్వీకరించుడి. ఒక వైద్యుని కార్యాలయములో మీరు కూర్చోన్నప్పుడు అతడు మీకు తేటగా చెప్పవలసియున్న దానిని దాచకుండా చెప్పును. తప్పు అభిప్రాయమునకు తావు ఇయ్యవద్దని యువకులకు, యువతులకు చెప్పుచున్నాను. మీరు నమ్మవలెనని కోరుచున్నాను. నెమ్మదిగా కూర్చొనండి. గుర్తుంచుకొనండి. సత్యమును సత్యముగానే చెప్పవలసియున్నాము.
చెప్పబోవుదానిని మీలో చాలామంది సమ్మతించరని నాకు నిస్సందేహముగా తెలియును. కాని దానిని బైబిలు ద్వారామీకు రుజువు చేయగోరుచున్నాను. మీరు మర్యాదగా ఉండి వినినయెడల నేను పదే-పదే చెప్పుచున్న దానిని గ్రహించి, భావమును గుర్తించుదురని నమ్ముచున్నాను. దీనిని అది వివరించునని నమ్ముచున్నాను. అది ఆలాగు చేయునని నా విశ్వాసము.
8మనము దీనిని గంటన్నర లేదా ఇంకా ఎక్కువసేపు చెప్పుకొనవలసి యుండును. అదెంత సమయము పట్టునో నాకు తెలియదు.
మరియు ఈ సమయములో మరల దీనిని చెప్పగోరుచున్నాను. ప్రజలుమీ మాటలు పట్టుకొందురని ఎరుగుదును. (తమ సంఘకాపరి చెప్పు మాటలు వారు విందురు, నేను కూడా ఒక సంఘకాపరిగానే యున్నాను); వారు తమ సంఘకాపరి యొక్క మాటలను పట్టుకొందురు, అది జీవమరణముల మధ్య నున్నట్లుగా యుండును. అది జీవమో, మరణమో అన్నట్లుగా వారు తమ యాజకుని మాట పట్టుకొందురు, అయితే సంఘకాపరి తనకు సెమినరీలో ఏది నేర్పించబడెనో దానిని ప్రజలకు బోధించును. అది మాత్రమే అతనికి బహుగా తెలియును. వివిధ మతములలో యాజకులున్నారు. వారును ఆలాగే యున్నారనుటలో సందేహము లేదు. కాని నిజమగు యాజకుడు సంఘకాపరియే. అతడు ఒకమధ్యవర్తి. యాజకుడు తనకు సెమినరీ మరియు మఠములో ఏది నేర్పించబడునో దానినే ఎంతోయధార్థముగా ప్రజలకు బోధించును. అయితే నాకు ఎట్టి సెమినరీ అనుభవము గాని లేదు మఠముయొక్క అనుభవము గాని లేదు. వాటిపట్ల ఎట్టి విరోధము నాకు లేదు, కాని నాకు చాలా వింతైన జీవితమున్నది.
9నేను చిన్న బాలునిగా ఉన్నప్పుడు పిలువబడితిని. ఒక దృశ్యమగు, వినబడు సూచన నాకు ఇయ్యబడినది. ఏడు సంవత్సరముల వయస్సులో ఇక్కడే యెటిక పైక్ యొద్ద ఒక పొదలో ఒక అగ్ని స్తంభము వ్రేలాడుట చూచాను. నా తండ్రి శ్రీ. ఓ.హెచ్ వాతెన్ యొద్ద పనిచేయుచుండెను. ఈ మధ్యనే ఆయన చనిపోయెను. మీరు ఆ పుస్తకము చదివారు. ఆ గాధ మీకు తెలియును. ఆ నదియొద్ద మనుష్యలందరి యెదుటనే అది ప్రత్యక్ష మాయెను. ఇప్పుడు దానియొక్క పటములు చాలాసార్లు తీయబడినవి. ఒక కాపీరైటుగా వాషింగ్‌టన్ డి.సి లోని మతకళల హాలులో వ్రేలాడుచున్నది. సహజాతీతమయినది ఫోటో తీయబడి శాస్త్రీయంగా రుజువు కాబడుట ఈ ఒక్కసారి మాత్రమే జరిగినది. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు తెచ్చిన అగ్నిస్తంభమువలెనె అన్ని విధాలా ఇది కనబడినది. దేవుని యొక్క కుమారత్వములో, ఆత్మ రూపములోనున్న యేసు క్రీస్తు ఆయనే అని నమ్ముచున్నాను. ఆయన మొదటగా వచ్చినప్పుడు ''మనుష్య కుమారునిగా'' పిలువబడెను. ''దేవుని కుమారునిగా ఆయన ఇప్పుడు పిలువబడియున్నాడు. వెయ్యేండ్ల పాలనలో ఆయన ''దావీదు కుమారుని'' గా పిలువబడును. ఆయన ముందే చెప్పబడిన రీతిగా ప్రవక్తగా మనుష్య కుమారుని పోలికలో వచ్చెను. ఇప్పుడాయన సహజాతీతముగా నున్న దేవుని కుమారుడు. రానున్న ఆగొప్ప వెయ్యేండ్ల పాలనలో దావీదు కుమారునిగా యుండి దావీదు సింహాసనము మీద కూర్చొనియుండును. దావీదు సింహాసనముపై కూర్చొనుటకు ఆయన తన కుమారుని లేపునని దేవుడు చేసిన వాగ్దానమును పరిశుద్ద గ్రంథము పాఠకులెందరో ఎరుగుదురు.
10ఇప్పుడు వింతగా, ఆశ్చర్యముగానున్న ఈ సేవలో నేను అన్ని విషయములలోను దేవుని నుండి పిలువబడినను ''అపవాధి'' అని పిలువబడుచున్నాను… ఎప్పుడు అలాగే అది యున్నది.
ఒకనాటి రాత్రి చర్చ జరుగుచుండగా కాథలిక్కు చర్చియొక్క ఆర్చి బిషప్పు పలికినట్లుగా బాప్తిస్మమిచ్చు యోహాను లేఖనములో స్పష్టముగా గుర్తించబడెను.'' ''నీ పరిచర్య స్పష్టముగా సంఘములో గుర్తిచబడియున్నది.'' ''లూథరనులు బైబిలులో యున్నారు." "లూథరనులు లూథర్‌ను ఎరుగుదురు, వెస్లియనులు వెస్లీని ఎరుగుదురు, కాని పెంతెకోస్తువారి మాట ఏమిటి? వారు త్రోవలేక తిరుగుచున్నారు. ఎక్కడికి వెళ్ళవలెనో వారికితెలియదు.''
''అయ్యా, దానిని నేను ప్రశంసించుచున్నా.'' అని చెప్పాను. ఆ సమయంలోనే నన్నెన్నడూ చూడని ఒక స్త్రీ మీద ఆత్మ దిగి మాట్లాడి అదే విషయును చెప్పి గుర్తింపచేసెను.
ఈ ఉదయ కాలమున ఈ వర్తమానమును చెప్పు ముందుగా యదార్థముగా పలుకుచున్నాను. నాకు తెలియదు. అతనితో ఈలాగు చెప్పాను, ''అయ్యా, అది నేను చెప్పలేను. అది చెప్పుటకు పెద్ద సంగతి. అది అలాగే కనిపించుచున్నది.'' ఖచ్చితంగా ఒక సంగతి జరిగినదని మాత్రమునేను ఎరుగుదును. ఈ విషయములన్నియూ శాస్త్రీయంగా రుజువయినవి. లోకమంతటా ఎన్నోసార్లు? ఈ ఉదయముననేను మాట్లాడుటకు ముందుగా ఒప్పుకొనుచున్నాను. నాకు తెలియదు. గతంలో నాతో మాట్లాడి ఈ సంగతులన్నియూ నాకుచెప్పిన ఆయన నుండి నేను విననియెడల ముందుకు వెళ్ళుటకు ఎట్టి తెగింపు నేను చేయజాలను.
JOHN 16:28•
JOHN 18:37•
ACTS 9:3,4
11గుర్తుంచుకొనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తాను దేవుని కుమారునిగా ఎన్నడూ గుర్తింప చేసికొనలేదు. ఆయన ఈలాగు చెప్పెను, ''అందుకొరకే నేను పుట్టియున్నాను. నేను దేవుని కుమారునిగా యున్నానని మీరే చెప్పిరి గదా?'' అంతేగాని ఆయనతన్ను తాన్నెన్నడూ గుర్తింపచేసికొనలేదు.
ఇశ్రాయేలీయులను నడిపించిన ఆ అగ్ని స్తంభము ఆత్మ రూపములోనున్న ప్రభువైన యేసుక్రీస్తు. మీరది నమ్ముచున్నారా? దేవునితో నుండి బయలువెళ్ళిన లోగోస్. ఆయన భూమిమీద నున్నప్పుడు ఈలాగు చెప్పెను, ''నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను. నేను దేవుని యొద్దకు ఎక్కిపోవుచున్నాను.''అది మనందరికీ తెలియును. ఆయన చనిపోయి పాతిపెట్టబడి పునరుద్దానుడైన తరువాత జరిగిన సంగతి. తార్సు వాడగు సౌలు క్రైస్తవులను హింసించుటకు దమస్కుకు పోవుమార్గములో యుండెను, ఎందుకనగా వారు తానునేర్చుకొనిన విషయములకు భిన్నమగు వాటిని బోధించుచుండిరి. అతడు ఒక గొప్ప యోధుడు. ఆనాటి సామాన్యుడగు గమలియేలు అను ఉపాద్యాయుని యొద్ద విద్యనభ్యసించెను. వారి పాఠశాలలో, వారి మఠములో ఒక గొప్పవ్యక్తి. సంఘములో అధికారి. మధ్యాహ్న దినమున ఒకగొప్ప వెలుగు, మరల ఒక అగ్నిస్తంభం అతనిని నేలమీద పడవేసినది. ఒక స్వరము ఇట్లు పలికెను. ''సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?''
MATT 16:19•
JOHN 16:28•
ACTS 9:5•
ACTS 12:7,10•
HEB 13:8
12పౌలు అయిన సౌలు లేచి పలికినది మీరు గమనించండి: ''ప్రభువా, నీవెవరవు?'' యూదుడై యుండిన అతడు దేవుని రూపును లేని దానిని ''ప్రభువా'' అని పిలువజాలడు. కాబట్టి అది మరల అదే అగ్నిస్తంభము.
యేసు చెప్పెను. ''నేను దేవుని యొద్దకు ఎక్కిపోవుచున్నాను. నేను దేవుని యొద్దనుండి వచ్చియున్నాను. తిరిగి దేవుని యొద్దకు ఎక్కిపోవుచున్నాను.'' అప్పుడాయన మరల అగ్ని స్తంభరూపములో వచ్చియుండెను. ఆయనిట్లు చెప్పెను. ''నేను నీవు హింసించుచున్న యేసును. మునికోలలకు ఎదురు తిరుగుట అసాధ్యము.'' సంఘమును నిర్మించుటకు తాళపు చెవులు ఇయ్యబడిన అపోస్తలుడగు పేతురు చెరసాలలో నున్నప్పుడు అదే అగ్నిస్తంభము ఇనుప ఊచల గుండా వచ్చి చెరసాల తలుపులను తెరచి పేతురును మర్మయుక్తముగా బయటకు తీసికొని వచ్చినట్లు కనుగొనగలము. కావలివానిని కలవరపరచనే లేదు. నీకయితే ఆయన నిన్న, నేడు నిరంతరము యేసుక్రీస్తుగా యున్నాడు.
మీరు ప్రతిదానిని దానియొక్క స్వభావమును బట్టి ఎల్లప్పుడూ తెలిసికొందురు. ఏదయినా గాని దాని ఫలమును బట్టి తెలిసి కొనబడును. అదెట్టిఫలము ఫలించుచున్నదో తెలిసికొనుడి, ఈ వెలుగు దేవుడే, ఎందుకనగా అది యెల్లప్పుడు దేవునియొక్క వాక్యము నొద్దకే తిరిగి వెళ్ళును. దేవుని యొక్క వాక్యమును నిరూపించును. దేవునియొక్క వాక్యమును బోధించును. దేవుడు ఆ వాక్యమును నిరూపించును. దేవునియొక్క వాక్యమును భోధించును. దేవుడు ఆవాక్యమును మీ ఎదుట దృశ్యరూపముగా నిరూపించెను. దాని వెనుక ఏదో ఒకటి ఉండవలసియున్నది.
13ప్రజలు నన్ను ప్రవక్తగా పిలచిరి. నన్ను ఏ ప్రవక్తగాను పిలచుకొనలేదు. ఎందుకనగా ఆలాగు చెప్పుకొను ధైర్యము నాకు లేదు. కాని ప్రభువు ముందుగానే సంగతులను చూడనిచ్చుచున్నాడని నేను చెప్పగలను. జరిగిన సంగతులు, జరుగబోవు సంగతులు, నాకు చెప్పెను. వేలాదిసార్లలో ఏఒక్కొసారి అది విఫలమవలేదు. ఆయన చెప్పిన ప్రతీదియూ జరుగును. జరిగినది. మనందరికి అదితెలియును. ఈ ఉదయమున ఇక్కడ కనబడుచున్న జన సమూహములోని వారు ఏ ఒక్కసారయినా జరుగకుండాపోయెనేమో చెప్పండి. చెప్పిన ప్రతిసారి ఖచ్చితంగా జరిగినదేమో ''ఆమేన్'' చెప్పండి. కావున అది ప్రపంచము నలుమూలన ఆ విధముగానే యుండును.
ఒకటి జరుగుటకు సిద్దముగా యున్నది. దానివెనుక ఒకఉద్దేశ్యము లేకుండా దేవుడెన్నడూ ఈ సంగతులను జరుగనీయడు.
14ఇక్కడ నేను ఆలోచించుచున్నాను. నానోట్సులలో ఒకదానిని ఇక్కడ నేను ఉంచియున్నాను. ఈ ఉదయమున నేను ఒక జత కఫ్‌లింక్సు ధరించియున్నాను. జేన్ రస్సెల్ అను ఈ సినీతారను గూర్చి మీలో చాలామంది వినియుందురు. ఆమె తల్లి పెంతెకోస్తు వ్యక్తి. డానీ హెన్రీ ఆమెకు సమీప బంధువు. ఆమె తల్లి చెల్లియొక్క బిడ్డ. అతడు బాప్టిస్టు వ్యక్తి. రెండు సంవత్సరముల క్రితం కాలిఫోర్నియోలోనే లాస్ ఏంజలస్‌లో ఒక వ్యాపసారస్థుల కూటములో అతడుండెను. నేను ఒక గొప్ప, బలవత్తరమగు, శక్తివంతమగు మాటను ఆ సందర్భలో పలుకవలసి వచ్చెను. అసెంబ్లీస్ ఆఫ్గాడ్‌యొక్క జనరల్ ఓవర్‌సీర్‌లలో ఒకరు తాను కూర్చొనియున్న బాల్కనీ మీదనుండి వేదికమీదికి దిగివచ్చి ఇట్లనెను. ''సహో. బ్రెన్హాం దానిని ఆలోచనారహితంగా చెప్పెనని నమ్ముచున్నాను.''
''అయ్యా, నేను దానిని ఆలోచించి చెప్పవలెనని చెప్పాను. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు'' అని చెప్పాను. ఈ కాలములో సంఘమును గూర్చి నేను అది చెప్పాను.
15ఆ సమయములో వ్యాపారియగు ఈ యువకుడచ్చటుండెను. ఈ ఉదయమున టెలివిజను కొరకు అతడు చిత్రములు తీయుచుండెను. (అతని సోదరుడు కాలిఫోర్నియా రాష్ట్రపు రహదారి పర్యవేక్షకుడు.) కూటము అయిపోయిన తరువాత డానీ హెన్రీ వేదిక మీదికి ఈ విధంగా నడచి వచ్చెను. ఆ స్థలంలో వారందరూ కూర్చొనియుండిరి. నన్ను కౌగలించుకొనుటకు అతడు నడిచివచ్చెను. అతడు ఈలాగు పలికెను, ''బ్రెన్హాం సోదరుడా, ఇది విపరీతంగా కనబడదనుకొంటాను. కాని, నీవన్నమాట ప్రకటన 23 అధ్యాయమగును. అది వ్యంగ్యముగా భావించవద్ధు.'' అతడు బాప్టిస్టువాడు గనుక సహజాతీతమగు వానిగూర్చి ఏమీ ఎరుగడు. నన్ను తన చేతులలోనికి తీసికొని అతడు అన్యభాషలో మాట్లాడనారంభించెను.
తెలియని భాషను మాట్లాడుట అతను ముంగించిన తరువాత ఒక స్థూలకాయురాలగు నల్లని స్త్రీ నా ముందుకూర్చొన్నది లేచి ''దానికి ఎట్టి అనువాదము అక్కరలేదు.'' ''నేను లూసియానాలోని ష్రీవ్‌పోర్టునుండి వచ్చాను. లేక లూసియానాలోని బాటన్‌రోగ్ నుండి వచ్చాను. అది స్పష్టముగా ఫ్రెంచ్ బాష'' అన్నది.
ఫ్రెంచ్‌వాడగు విక్టర్ లిడయక్సు కూడా అక్కడ కూర్చొనియుండెను. ''నిశ్చయంగానే నేను ఫ్రెంచివానిని. అది పరిపూర్ణమగు ఫ్రెంచి బాష'' అని పలికెను.
'' ఒక్క నిమిషము ఆగండి. మీరు అతడు చెప్పినది వ్రాశారు. మీరును అతడు పలికినది వ్రాశారు. మీరు చెప్పకముందే దానిని వ్రాసియుంచారు. మీరు చెప్పినది ఒకరికి తెలియకుండా ఒకరు వ్రాయండి. మీ నోట్సు చూద్దాం.'' అన్నాను. వారిరువురూ వ్రాసిరి. అక్షరాలా అది ఒకదానికొకటి సరిపోయినది.
వారునోట్సును పైకి తీసికొని వచ్చిన అదే సమయములో చక్కగా కనబడుచూ మంచి జుట్టుగల ఒకాయన వెనుకనుండి నడిచి వచ్చెను. అతడు కూర్చొనుటకు అక్కడ చాలినంత చోటు కూడా లేదు. అతడు వెనుక నిలబడియే యున్నాడు. అతడు ముందుకు వచ్చి ఈలాగనెను, ''ఒక్క నిమిషము ఆగండి. నేను వ్రాసినది ఇక్కడుంచుదును. నేను ఐక్యరాజ్యసమితికి ఫ్రెంచి అనువాదకునిగా పనిచేయుచున్నాను. నేను వ్రాసినది ఇక్కడ విడిచ పెట్టవలెనని కోరుచున్నాను. ''
16ఆ ముగ్గురు వ్రాసినది అక్షరాల ఒకేలాగున్నవి. ఫ్రెంచి భాషలోనివి. అది ఈ విధముగా యున్నవి. అసలు నోట్సు ఈలాగున్నది. ఇది డానీ వ్రాసికొని వచ్చితన జేబులో నుండి అది క్రైస్తవ వ్యాపారుల తదితరుల యొద్దకు కూడా వెళ్ళినది.
"నీవు ఇరుకు మార్గము ఎన్నుకొన్నందున ఆ దారి కరుకుగా యున్నది. నీవు నీ స్వంత ఎన్నిక ప్రకారమే తీర్మానము చేసికొంటివి. అది నా మార్గము. ఈ రక్షణ తీర్మానమును బట్టి, పరలోకములోని అధిక భాగము నీ కొరకు కాచుకొనియున్నది. ఎంత మహిమకరమగు తీర్మానము నీవు చేసికొంటివి! దైవీక ప్రేమలో అద్భుతమగు విజయమును తీసికొని వచ్చునట్లుగా అది చేయును. ఇక్కడ, అతడు తన సంతకమును చేసెను, ''పైన వ్రాసినది డానీ హెన్రీ ద్వారా అనువదించబడినది. సహో. బ్రెన్హాంను గూర్చి ప్రవచించగా, కాలి ఫోర్నయోలోని లాస్ఏంజలస్ కాలిఫోర్నియాలో ముగ్గురు సాక్షుల ద్వారా అనువాదము ఈయబడినది.''
17ఈ ప్రవచనమును ఇచ్చిన ఆయువకునికి తానేమి చెప్పుచున్నాడో తెలియదు. ఇదే యువకుడు ఒక నెల క్రితం యెరూషలేములో యుండెను. యేసు చనిపోయి పాతిపెట్టబడిన సమాధిలోనికి దిగి బయటకువచ్చు భాగ్యము అతనికి దొరికెను అతడు అక్కడ ఉండగా అతని మనస్సులోనికి బహు బలముగా నేను వచ్చినందున అతడు ఏడ్వనరాంభించెనట. ''సహో. బ్రెన్హాం ఈ లోకము, ఈ పరిస్థితులు మరియు సంఘములన్నింటికీ వ్యతిరేకముగా నిలచియుండుట ఎంత కఠినము!'' అనిచెప్పెను. ఒక సారి బిల్లీగ్రాహం గూర్చి ఇట్లు చెప్పబడెను, ''సంఘములన్నియూ బిల్లీగ్రాహం కొరకు ఏకమైనందున అతడు ఆలాగున్నాడు. ఓరల్ రాబర్ట్స్‌ను పెంతెకోస్తువారు బలపరచుచున్నారు. ప్రజలకు నేర్పించబడుచున్న దానికి విరోధముగా చెప్పుచున్న దానిని మనమెట్లు అంగీకరిచగలము?'' అది దేవునికి చెందినది.
డానీ తన సరదాకొరకు చిన్నరాళ్ళను సమకూర్చుచుండును. సిలువ ఉంచబడిన చోటకు అతడు వెళ్ళెను. వారు సిలువను రాతిలో ఉంచినట్లు అతనికి చెప్పిరి. ఎవరూ అక్కడ లేరు గనుక అతడు ఆ రాతినికొద్దిగా విరచి జ్ఞాపక సూచనగా తన జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చి దానితో నాకు ఒకజత కఫ్ లిక్స్ తయారుచేసి ఇచ్చెను. అతడు వాటిని తయారుచేసినప్పుడు అవి రక్తములో తడిపినట్లుగా వింతగా కనబడెనట. వాటి రెండింటిలోనూ తిన్నని ఇరుకు మార్గము సాగిపోవుట కనబడెను. చూడండి. కొందరు దానిని గమనించక పోవచ్చును. కాని అది నేను నమ్మినవానికి శుభసూచకముగా యున్నది. ప్రతిదానిలో ఒక భాగమున్నదని నేను నమ్ముచున్నాను.
18ఈ సమయములో ప్రభువుకు చెందిన ప్రతిదానిలో అర్థమున్నది. మాలాకీ 4, ఆలాగే లూకా 17 ఇంకా ఈ చివరి దినములలో నేరవేరనైయున్న ఇతర లేఖనముల గూర్చి ఆయన ప్రవచించినది ఇది కాదా? ముగింపులో ఇది నేను చెప్పవచ్చును. ఆయన వచ్చునప్పటికి మానవునికి అది పునాది వేయును. కాబట్టి సర్వశక్తుడగు దేవునికి ఒక కార్యము చేయనిచ్చెను. ఆయన పట్ల నాకున్న ప్రేమను, ప్రజల పట్ల మాకున్న ప్రేమను వెల్లడి చేయుటకు ఈ విధంగా ఆయన జరిగించెను. కాబట్టి యధార్థతలో ఈ వివాహము మరియు పరిత్యాగము అను అంశమును నేను సమీపించుచున్నాను. మనందరి మీద దేవుడు తన కృప చూపును గాక!
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సోదరీలారా, లేచి బయటకు పోవద్దు, కొద్దిసేపు మౌనంగా కూర్చొనండి. సోదరులారా, మీరును అదే చేయండి. దీనితో సంబంధము కల్పించబడిన మీ యంత్రములను ఆపు చేయకండి. ఆప వద్దు. అయిపోవు వరకు కొద్ది నిమిషముల పాటు నెమ్మదిగా కూర్చొనండి. జాగ్రత్తగా వినండి. మీరు సమ్మతించని యెడల నేను చెప్పిన వాక్యములను వ్రాసికొని, మీరు మీ తీర్మానమునకు రాక ముందుప్రార్థనా పూర్వకముగా అధ్యయనము చేయండి.
ఈ అంశమును సమీపించుటకు మనము ప్రయత్నించుచుండగా దేవా, సహాయము చేయుము!
MATT 19:1-8
19ఇది కొద్దిగా దీర్ఘప్రసంగముగా నుండవచ్చును. మీరెట్టి తొందరపాటులోను ఉండరాదని కోరుచున్నాను. మీరందరూ, మనమందరము సమయము తీసికొందము. నిజంగాక్షుణంగా, దానినెట్లు మనము చదువవలయునని ఎరుగదుమో ఆ ప్రకారము దేవుని వాక్యము చదువుదము.
పరిశుద్ద, మత్తయి 19వ అధ్యాయము నుండి ప్రారంభించుదము. 19వ అధ్యాయయము 8 వచనము నుండి ఆరంభించవలెని కోరుచున్నాను. 19 వ అధ్యాయయము 1 నుండి 8 వరకు చదువుటకు కూడా మంచిదని తలంచుచున్నాను.
ఇప్పుడు గుర్తుంచుకొనండి. నేను చెప్పిన ఈసంగతులు దేవునియొక్క వాక్యము నుండియే తప్పక రావలెను. అది నా స్వంత అభిప్రాయము కారాదు. ఎందుకనగా నా అభిప్రాయము మీఅభిప్రాయువలెనె యుండును. కాని అది దేవుని వాక్యముయొక్క కొనసాగింపుగా అయి యుండవలెను. గుర్తించుకొనండి. దేవుడు ప్రతిదానిని కొనసాగించుచుండును. ఆయనెన్నడూ మారడు. ఆయననిన్న నేడు నిరతరము ఏకరీతిగా యున్నాడు. అది మీరు నమ్ముదురా? (జనులందరూ ''ఆమేన్''అని చెప్పిరి - సంపా.) ఆయన ఏకరీతిగా యున్నాడు. ఇప్పుడు 19వ అధ్యాయమునుండి చదివెదను.
యేసు ఈ మాటలు చెప్పిచాలించిన తరువాత గలిలయ నుండి యోర్ధాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను.
బహు జన సమూహములు ఆయనను వెంబడించగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను.
పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి …
ఆయనను శోధించుచున్న వారెవరో మీరు గట్టిగా తెలిసికొనునట్లుగా అక్కడ నేనే ఆగెదను.
ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా,
ఆయన - సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను, స్త్రీనిగాను సృజించెననియు-
ఇందు నిమిత్తముపురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరముగాయుందురని చెప్పెననియు మీరు చదువలేదా?
కాబట్టి వారికను ఇద్దరు కాక, ఏక శరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను.
అందుకు వారు - అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా,
ఆయన - మీ హృదయ కాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి ఆలాగు జరుగలేదు.
ఇప్పుడు దేవా, సహాయము చేయుము.
20ఈ లేఖనము, ఈ ప్రశ్న, తనసేవ ప్రారంభములోనే యేసునకు ఎదురయ్యెను. మోషే యొక్క సేవారంభములోనే అది మోషేకు ఎదురయ్యెను. విశ్వాసుల యొక్క హృదయములలో అది ప్రధాన ప్రశ్న. పాపికి అది లెక్కలేదు. కాని అది విశ్వాసులకు సరిగా జీవించవలెనని ప్రయత్నించుచుండును. కాబట్టి మతము మీదవచ్చు ఏప్రశ్నలోనయిననూ వివాహాము పరిత్యాగమును గూర్చిన ప్రశ్న ఇమిడియుండును. ఎందువలన? ఎందుకనగా మూల పాపమునకు అదే కారణము. పాపము అక్కడే ప్రారంభమాయెను. ప్రతిసారి పాపమునకు అది అక్కడ నుండియే పుట్టుచున్నది, ఎందుకనగా పాపమునకు మూలము అసలు ఆదియే.
ఈ సంగతులన్నియూ వివరించుటకు ఇప్పుడునాకు సమయము లేదు. కాని మీ ఉత్తరము లేదు, కాని మీ ఉత్తరము లేదా ప్రశ్నకు దేనికయినా నా వీలును బట్టి సమాధానమును సంతోషముగా ఇయ్యగలను. దాని మీద గ్రంథములు వ్రాయబడినవి. దీనిని రుజువు చేయుటకు చాలా ప్రశ్నలు, పత్రికలలో కత్తిరించునవి కూడా ఇక్కడున్నవి. అది హవ్వ అని మనకు తెలియును. ఆమె తినవలసియున్న యాపిలు లేఖనార్ధమైనది కాదు., ఇప్పుడు ఆమె తిన్నది యాప్రికాట్ అని వారనుచున్నారు. అదేదీ కాదు. ఆమెవ్యభిచారము చేసెను. అందువలన మొదటి బిడ్డయగు కయీనును కనెను. అతడు సాతాను యొక్క స్వంత కొడుకు. వానియందు చెడుయున్నది. అది హేబేలులోనికి రాలేదు. కయీనును కనెను సాతాను యొక్క కుమారుడు.
GEN 4:1
21ఇప్పుడుమీ ప్రశ్న నాకు తెలియును. ''యెహోవా వలన ఒక మనుష్యుని పొందితిని అని హవ్వ పలికెను. గదా?'' అది నిజమే. ఈ పట్టణములో మహా పతివ్రతయగు స్త్రీని, అతి నీచమగు పురుషుని తీసికొని చూడండి. వారికి పుట్టిన బిడ్డ ప్రభువు యొద్దనుండియే రావలెను. ఎందుకనగా దేవుడు చట్టములను జతపరచెను. ఈ చట్టములు సూర్యోదయమువలె మంచి పొలములో గురుగు మొలచినట్లే యున్నవి, అది ఎదుగ వలసియున్నది, ఎందుకనగా అది దేవునియొక్క ధర్మము. విత్తనము నాటబడినప్పుడు అది తప్పక ఎదుగును. దేవుడు తప్ప జీవమును పోయు వారెవ్వరూ లేరు, ఎందుకనగా అది ఆయన ధర్మమువల్లనే పనిచేయును.
కాబట్టి ఇక చెడ్డ విత్తనము హవ్వ యొక్క గర్భమందు నాటబడినా అది ఉత్పత్తి కాబడవలసియున్నది. ఎందుకనగా అది ఉత్పత్తియొక్క దేవుని ధర్మము. ఉత్పత్తి చేయుట తప్ప మరే ఇతర గత్యంతరం లేదు. అది దేవుని నుండి రావలెను.
అందుకే జనులు ఈలాగందురు. ''చిన్న పిల్లలు'' కొన్నిసార్లు ''క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించనందున నశించిపోవుచున్నారు.'' యేసు క్రీస్తు యొక్క రక్తము బిడ్డ కొరకు పరిహారము చూపును. అదెట్లు జన్మించినా అది ఎంత చెడ్డగా పుట్టినా గాని అది నాకు అక్కర్లేదు. లోక పాపమును మోసికొనిపోవునది దేవుని గొర్రెపిల్ల. చిన్న బిడ్డ పశ్చాత్తాప పడజాలడు. ఎందుకనగా పశ్చాత్తపపడవలసినది బిడ్డకు ఏదీ లేదు. క్రీస్తుయొక్క రక్తము ద్వారా తీసికొనిపోబడునది లోకముయొక్క పాపమే. పిల్లలు పరలోకమునకు వెళ్ళెదరు.
22అది మూల పాపము, అందువల్లనే అది ప్రశ్నించబడినది. మొదటి విషయమును గూర్చి దేవుని యొద్దనుండి ఏదయినా గొప్ప పరిణామము వచ్చినయెడల అది, ''వివాహము పరిత్యాగమును'' గూర్చియే అగును. ఎప్పటి వలెనె ఇంకనూ అది ప్రజల మధ్య ప్రశ్నగానే యున్నది, మోషే కాలములో అది ప్రశ్న; యేసు కాలములో అది ప్రశ్న, ఎప్పుడూ అది ప్రశ్న. ఈనాడు అది ప్రశ్నయే. జనుల మధ్య ఒక ప్రశ్న, ఎందుకనగా జనులు ఏది సత్యమో తెలిసికొనగోరుచున్నారు. ప్రశ్న ఎక్కడుండునో అక్కడ జవాబు కూడా ఉండితీరవలెను. ఈ వారములో ఎక్కడో నేను చెప్పినట్లుగా ఆ జవాబు సరియైన జవాబుగా ఉండి తీరవలెను. దేనికయినా మనము జవాబును పొందినప్పుడు అది సరయినది కానియెడల తప్పు అని ఎరుగుదుము. కాబట్టి ఆ నిజ ప్రశ్నకు జవాబు పొందువరకు అడుగుచునే యుందువు. సత్యము తెలిసికొనవలెనని నీవు ఆశించినయెడల ఆలాగు చేసెదవు. ఇది బైబిలు ప్రశ్న అయియున్నందున, ఆ జవాబు కూడా బైబిలుదే అయి యుండవలెను.
అది నేను తూర్పునకు ఈ ఉదయమున వెళ్ళవలెనని కోరినట్లు గానే యుండును. నాకు తెలిసినంత వరకూ శ్రేష్టమైనది ఇదే. పొలములో ఒక ప్రత్యేకమైనది నేను కనుగొనవలెనని కోరుచున్నాను. అది ప్రత్యక్ష్యంగా తూర్పు. నేను తూర్పుగా వెళ్ళాను. ఎవరో ఈలాగనిరి, ''సహో. బ్రెన్హాం, ఇది తూర్పు.'' ఇది తూర్పు అన్నది నిజమే కాని అది ఉత్తర దిశగా వాలిన తూర్పుదిశ. కాబట్టి నేను వెదకుచున్న దానిని పోగొట్టుకొందును. అది తప్పు అని ఎరిగి మరల వెనక్కు వచ్చుదును. మరొకరు నాతో ఇట్లనిరి, ''సహో. బ్రెన్హాం. నీ కుడివైపుగా ఇటు వెళ్ళు.'' అది ఒకవిధంగా తూర్పు. కాని దక్షిణపు వైపుకు ఒరిగిన తూర్పు. నేను వెదకుచున్న దానిని పోగొట్టుకొందును. ఎందుకనగా నేను ఖచ్చితమగు, ప్రత్యక్షమగు దారిని, హద్దులను దాటిపోయాను.
23ఆ ప్రకారము వివాహము మరియు పరిత్యాగము మీద రెండు రకముల ఆలోచనలున్నవి. ఒకటి ఇట్లు చెప్పుచున్నది, ''ఒక పురుషుడు ఒక్కసారి మాత్రమే పెండ్లి చేసికోవలెను. భార్య చనిపోతే మాత్రమే మరల వివాహము చేసికోవచ్చును.'' అది ఒక జవాబు. దానిని మీరు చూచియున్నారు. మరొకటి ఇట్లున్నది, ''భార్య, లేదా భర్త, ఇరువురిలో ఒకరు వ్యభిచారము చేసినయెడల అట్టివారిని విడిచిపెట్టి మరల పెండ్లి చేసికోవచ్చును.'' దానిని కూడా మీరు విని విసిగియున్నారు.
కాబట్టి చూడండి. అది దక్షిణపు తూర్పు కాదు లేదా ఉత్తరపు తూర్పు కాదు; మనకు తిన్నని తూర్పుయే కావలెను. ఈ వైపుగా వెళ్ళినప్పుడు నీకు వాక్యము దొరకదు. ఆ వైపుగా వెళ్ళినప్పుడు నీకు వాక్యము దొరకదు. వాక్యము ఎక్కడ వాక్యమును కలిసికొనునో దానిని మనము తెలిసికొనగోరుచున్నాము. దానియొక్క సత్యమేమిటో తెలిసికొనగోరుచున్నాను. ప్రతిది వేర్వేరు మార్గమున తీసికొనిపోవును. సరియగు జవాబును తీసికొని వచ్చుటలో విఫలమగును, కాని అక్కడ తప్పక ఒక జవాబు ఉండి తీరవలెను.
24ఈనాడు సంఘములో రెండు ఆలోచనా ధోరణులున్నట్లు గానే అది యున్నది. అందులో ఒకటి కాల్వినిజం. మరి యొకటి ఆర్మీనియనిజం. ఒకటి చట్టబద్దమైనది. మరొకటి కృపతో కూడినది. కృపయందు నమ్మికయుంచు కాల్వినిస్టుల ఈలాగు చెప్పుట మనము కనుగొందుము; ''దేవునికి స్తోత్రము. పొగ త్రాగినందున నాకు హానిలేదు. సారాయి త్రాగినందున హానిలేదు. వీటిని నేను చేయగలను. నాకు నిత్యభద్రతయున్నది.'' ఇప్పుడు చట్ట బద్ధముగా యుండు వారివైపుచూద్దాం. ''ఓ, అతనిని నేను మ్రింగివేయుదును. నా మనస్సుయొక్క చిన్న భాగమును అతనికి చూపించెదను. కాని నేను క్రైస్తవుడనయి పోయాను గనుక నెమ్మదిగా ఉండక తప్పదు.''
చూడండి, మిమ్మును మీరు రెండు విభిన్న మార్గముల మీద కనుగొనుచుందురు. అందులో ఏదీ సరి కాదు. ఇది చెప్పుటకు కఠినమగు మాటగాని అది సత్యము. మనము రెండు వేర్వేరు మార్గముల మీద యున్నట్లు కనుగొనుచున్నాము. ఒకరు ఒకవైపు మరొకరు మరోవైపు వెళ్ళుచున్నారు. ఇప్పుడు సత్యమనగా ఏమిటో చూద్దాం.
25ఇప్పుడు వినండి. ఇది మీకు అర్దవంతముగా వినబడుచున్నదో లేదో చూడండి. ఉదాహరణకు నేను విదేశములకు వెళ్ళుటకు సిద్ధపడుచున్నాననుకొనండి. నేను నా స్వంత కుటుంబమును తీసికొని వెళ్ళుదును. నా స్వంత భార్యను నా యొద్దకు పిలచి ఇట్లందును, ''ప్రియా, నేను విదేశములకు వెళ్ళుచున్నాను.'' ఇక్కడ చట్టబద్ధపు వైఖరి చూద్దాం. ''ఇదిగో, నీ మీద చట్టబద్ధమగు ఆంక్షలు పెట్టుచున్నాను. నేను వెళ్ళిన తరువాత పర పురుషునితో నీవు తిరిగినయెడల నేను తిరిగి వచ్చి నీకు విడాకులిచ్చెదను. నీవు కంటితో గాని, మాటతోగాని ఎవరినీ సమీపించరాదు. అర్దమయినదా? నేను నీ భర్తను! నీవాలాగు చేసినయెడల నేను తిరిగి వచ్చినప్పుడు నిన్ను పరిత్యజించెదను.''
అప్పుడామె నా యొద్దకు వచ్చి టైపట్టుకొని ఇట్లనును, ''ఇదిగో, మీకు ఒక్క మాట చెప్పుచున్నాను. చూడండి. చూడండి. ఏ స్త్రీనయినా కంటితో చూచినా, ఏ స్త్రీతో పరిహాసమాడినా, ఏ స్త్రీతో మీరు తిరిగినా, తిరిగి వచ్చినప్పుడు మీకు విడాకులిచ్చెదను.'' అదిఒక సంతోషకరమగు గృహముగా ఉండునా? వారు చట్టబద్ధులు.
మంచిది. మరోప్రక్క ఇప్పుడు చూద్దాం.నేను విదేశములకు వెళ్ళి ఒకపొరపాటును చేసినట్లయితే ఆమెతో ఇట్లందును. ''ఇదిగో, చూడు. ఈ స్త్రీని నేను తెచ్చు కొందును. ఓ! నా భార్య ఏమీ పట్టించుకొనదు.'' నా భార్య ఇట్లనును, ''నేను ఈ పురుషుని తెచ్చుకొందును. బిల్ ఏమీ పట్టించుకొనడు.'' నేను పట్టించుకొనని యెడల ఏదో పొరపాటున్నదన్నమాట. నేనా స్త్రీని సరిగా ప్రేమించుట లేదన్నమాట. ఆమె నన్ను పట్టించు కొననియెడల ఆమెలో ఏదో పొరపాటున్నది. ఆమెనా భార్య, మరో పురుషునితో ఆమె తిరుగుట నాకు ఇష్టముండదు, ఆమె నా భార్య.
26ఇప్పుడు సరయిన మార్గము ఏమిటో చూద్దాం. ఆ రెండిటిలోనూ కొంత సత్యము లేకపోలేదు. కాని పూర్తి సత్యం అందులో లేదు. సరిగా ఇప్పుడు చెప్పెదను: నేను విదేశములకు వెళ్ళునప్పుడు నా చిన్న కుటుంబము నా చుట్టూ చేరును. మేము ఒకరితో ఒకరము ప్రార్థించుకొందుము. వారిని దేవునికి నేను అప్పగించెదను. నన్ను వారు దేవునికి అప్పగించెదరు. ఆ విధముగా చేసిన తరువాత నేను విదేశములకు వెళ్ళెదను. ఆమె నన్ను ప్రేమించుచున్నదని నాకు తెలియును. ఆమెలో నాకు నమ్మకమున్నది. ఆమెను నేను ప్రేమింతును. నాయందు ఆమెకు నమ్మకమున్నది. ఆ విధంగా ఆమెను నేను ప్రేమించినంత కాలంనేను మరో స్త్రీని తీసికొందునను బాధ ఆమెకెన్నడూ ఉండదు. ఆమె నన్ను సరిగా ప్రేమించుచున్నంత కాలం ఆమె పర పురుషునితో తిరుగునను చింత నాకుండదు, ఎందుకనగా ఆమెనా భార్య, ఆమెను నేను నమ్ముచున్నాను.
ఒక వేళ నేను ఎట్టి పొరపాటు లేక తప్పిదము చేసినయెడల, మరో స్త్రీతో తిరిగినయెడల తిరిగి వచ్చినప్పుడు ఆమెతో ఈలాగు చెప్పెదను. ''మిడా, ఆలాగు చేయవలెనని అనుకోలేదు. నేను ఉరిలో చిక్కుపడితిని. ఈ స్త్రీ నాయొద్దకు పరుగున వచ్చినన్ను కౌగలించుకొని ఏదేదో చేయనారంభించినది.'' ఆమె ఆ మాటను అర్ధము చేసికొనునని నమ్ముదును. దానిని చేసినందుకు ఆమె నన్ను క్షమించునని తలంచుదును. ఆమెను ప్రేమించుచున్నాను గనుకనే ఆలాగు నేను ఒప్పుకొందునుగాని మరెందు కొరకు కాదు. ఆమె నన్ను క్షమించినా గాని నేను ఆ పొరపాటు కొనసాగించను. ఆమెను ఏ విధముగాను బాధపరచను. దానినిఆమె క్షమించునని నాకు తెలిసినా గాని ఆమెను నేను గాయపరచుట ఇష్టముండదు.
27దేవునితో కూడా ఆలాగే యున్నది. ఫిలియో ప్రేమా (అనగా మానవ ప్రేమ, సహవాస ప్రేమ), ఒక పురుషుని అతని భార్యపట్ల ఆలాగు ప్రవర్తింప చేయుచున్న యెడల అగాపే అను ప్రేమ, (అనగా గ్రీకులో ''దేవునియొక్క ప్రేమ''), యేసు క్రీస్తు పట్ల మనమేలాగు ప్రవర్తించునట్లు చేయును? నేను నాయంతట దానిని చేయుటకు వెళ్ళినంత కాలము అది నా హృదయములో యున్నది. నా హృదయములో అది చేయుటకు ప్రేరేపణ ఉన్నంత కాలము అది చేయుదును. చట్టబద్దత అది నన్ను చేయ నియ్యదు, ఎందుకనగా అది నన్ను చేయ్యనియ్యదు. ఎందుకనగా అది చేసి నందుకు నేను శిక్ష పొందుదునని తెలియును. కాని అసలు సత్యము అనగా నీ హృదయములోనికి దేవుని యొక్క ప్రేమ వచ్చినప్పుడు దానిని నీవు చేయగోరుదువు. అది వాస్తవము. రెండు ఆలోచనా ధోరణులున్నవి. చట్టబద్దత లేక కాల్వినిజం రెండు సరికావు.
1COR 12:13•
EPH 4:5
28ఈనాడు మనము వివిధ రకముల శాఖలను చూచుచున్నాము. క్యాతలిక్కు చర్చి, ప్రొటస్టెంటు చర్చి యున్నవి. ''మాది అసలు మార్గము. మాది సత్యము.'' అని ఒక్కొక్కరు చెప్పుకొనుచున్నారు. ''మాది సత్యము.''అని బాప్టిస్టు చెప్పుకొనుచున్నది.
వారు ఆ విధంగా అను కొన్నంత కాలం నా మట్టుకు వారిది ఏ మాత్రము సత్యము కాదు, ఎందుకనగా యేసు ఈలాగు చెప్పెను.'' నేను సత్యమును.'' చూచారా? కాబట్టి గత రాత్రి నా ప్రసంగములో దేవుడు తన నామమును ఉంచిన చోటు ఆయనలోనే యున్నది. అని చెప్పాను. ఆరాధించు ఒక్కేఒక్క స్థలమిది. నీవు ప్రొటస్టెంటువి గనుక నీవు క్రైస్తవునివి కావు; నీవు కాతలిక్కువి గనుక నీవు క్రైస్తవునివి కావు; నీవు మెతడిస్టు, బాప్టిస్టు లేదా పెంతెకోస్తు గనుకనే నీవు క్రైస్తవునివి కావు. నీటి ద్వారా కాక, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తులోనికి నీవు బాప్తిస్మము పొందియున్నావు గనుకనే నీవు క్రైస్తవునివి. ''విశ్వామొక్కటే, బాప్తిస్మము ఒక్కటే, ప్రభువు ఒక్కడే.'' అదియే పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిన్ను ఒక సహవాస ములోనికి చేర్చుచున్నది; పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిన్ను క్రీస్తులోనికి చేర్చుచున్నది. అది సత్యము.
REV 10:7
29ఈ పెండ్లి పరిత్యాగము మీద మనకు రెండు ఆలోచనలున్నవి. ఇప్పుడు ఈ చివరి దినమున ప్రభువు తన వాక్యము యొక్క ఏడు ముద్రల మర్మమును తెరచెను. మీలో చాలా మందికి ఇది గ్రీకు భాషవలె అనిపించవచ్చును, కాని నా చర్చికి అర్ధమగును. దేనిని బట్టి? మీరు దర్శనముల గూర్చి, జరిగిన దానిని గూర్చి విన్నారు. ఈ ప్రశ్న బైబిలు ప్రశ్న. జగత్తు పునాది వేయబడక ముందు నుండియు దాచబడి మరుగైయున్న రహస్యములన్నింటికి ఒక నిజ జవాబు తప్పక యుండునని నమ్మి ఆ బైబిల్ ప్రశ్నలను చూచుటకే ఇచ్చటకు ఆహ్వానించబడితిమి. ఈ దినమున ఈ రహస్యమును తెలియ చేయబడునని బైబిలు ప్రవచించుచున్నది. ప్రకటన 10. '' ఏడవ దూత పలుకు దినములలో, (అనగా లవొదికయ వర్తమానికుడు) దేవుని యొక్క మర్మములు తెలియ చేయబడును.'' ఇదే లవొదికయ అను ఆ చివరి కాలము.
30పదిహేను లేదా ఇంకా ఎక్కువ సంవత్సరముల నుండి బయలువెడలుచున్న ఈ ఉజ్జీవమును చూడండి. ఏ ఒక్క శాఖయు అందులో నుండి బయటకు రాలేదు. జాన్‌స్మిత్, ఇంకా ఆయా వ్యక్తుల నుండి చాలా శాఖలు వచ్చినవి. మూడీ నుండియు వచ్చెను. ఒక ఉజ్జీవము మూడు సంవత్సరముల పాటు మాత్రమే యుండుట పరిపాటి. కాని ఇది పదిహేను సంవత్సరములకు పైగా బయలు వెళ్ళుచున్నది, కాని దీనిలో నుండిఏ ఒక్క శాఖయు పుట్టుకు రాలేదు, ఏలయనగా ఇది విత్తనముల కాలము. ఇక పొట్టు ఉండదు. ఒకపొట్టు పోయిన తరువాత వచ్చునది విత్తనమే. దేవుడు సిద్దముగా యున్నాడు. ఇప్పుడే దానిని ఆయన చేయుచున్నాడు. యేసు క్రీస్తు అను తన వాక్యము ద్వారా సంఘమును పరిపూర్ణతకు ఆయన పిలువబోవుచున్నాడు.
గమనించండి, ఎక్కడో తప్పక ఒక జవాబు ఉండి తీరవలెను. దేవుని యొక్క ఏడు ముద్రల మర్మము అదియే. ఎంత మంది దానిని అర్ధము చేసికొనిరో చేతులెత్తండి. చుద్దాం. చాలా మంది ఇక్కడున్నవారు మన ఆలయములోని వారే అనుకొనుచున్నాను, లేనియెడల ఆ అంశం మీద పుస్తకములు బహు త్వరలో విడుదల చేయబడును. ఇప్పుడు కూడా దానిమీద కొన్ని పుస్తకములు మనయొద్ద నున్నవి.
MATT 19:3,7,8
31మనము చదివిన భాగములో యేసు నిజలేఖను జవాబు కొరకు తిరిగి ఆది యొద్దకు వెళ్ళమని చెప్పుచున్నాడు. ఆయన ఈ ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు రెండు విషయములు ఆయన దృష్టిలో యుండెను. యాజకులు ఆయనతో ఇట్లనిరి. ''ఏ కారణము చేతనయినా గాని పురుషుడు తన భార్యను విడనాడిమరో స్త్రీని పెండ్లి చేసికోనవచ్చునా?''
''ఆది నుండి ఆలాగు జరుగలేదు,'' అని యేసు చెప్పెను.
''అయితే మోషే పరిత్యాగ పత్రిక వ్రాసి ఏ కారణమును బట్టి అయినా గాని ఆమెను విడనాడవచ్చునని చెప్పెను గదా?'' అనిరి.
''మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఆలాగు చేయుటకు అనుమతించెనే గాని ఆది నుండియూ ఆలాగు లేదు,'' అని ఆయన చెప్పెను.
ప్రశ్న!
MATT 24:7,35•
MARK 13:8,31•
LUKE 21:10,33
32ఈనాటి ప్రపంచ శాంతికి సంబంధించిన ప్రశ్న వలెనె అది యున్నది, ''అది రాజకీయము వలన వచ్చునా, ఐక్యరాజ్య సమతి వలన వచ్చునా, ఒక్కటిగా అగుట వలన వచ్చునా?'' ఎందు వలన రాదని మీతో నేను చెప్పుచున్నాను. అది ఎల్లప్పుడు విఫలమయినది. మరల విఫలమగును.కాని ''భూమి మీద సమాధాన ముండునా?'' అనుప్రశ్నకు నిజ జవాబు ఇంకా మిగిలియున్నది. అవును. భూమి మీదనుండి పాపము నిర్మూలించబడినప్పుడు సమాధానముండెను. కాని ఆ సమయము వరకు సమాధానము ఉండదు: ''రాజ్యము మీదికి రాజ్యము, దేశము మీదికి దేశము లేచును.''
దేవుడు పాపమునకు ఒక విరుగుడు ఇచ్చెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీదనుండి పాపమును తొలగించుటకు ఒక విరుగుడు ఇచ్చెను, కాని భూ సంబంధియగు మానవుడు దేవుని విరుగుడును అంగీకరించుట లేదు. మనము భార్యను వివాహము చేసికొని వారితో జీవించుటకు దేవుడు మనకు ఒక చిట్కా ఇచ్చెను, కాని మానవుడు దేవుని యొక్క చిట్కాను అంగీకరించుట లేదు. దానిపై ఆయన వాక్యము చెప్పుచున్న దానిని అంగీకరించడు.
యేసు దీనిని చెప్పెను… ఆయన మాటలు ఆయన పలికినదానిని మనకు గుర్తుచేయును. ''భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవు.''
33ప్రశ్న, నిజ జవాబును కనుగొనుటకు ఆది యొద్దకు వెళ్ళవలెనని యేసు మనలను కోరెను. అది ఆదికాండములోనే యుండును. ఎందు కగనగా బైబిలులోని ప్రతి ప్రశ్నకు మూల అధ్యాయము ఆదికాండమే. మీ పంటలు ఎట్లుండునో చూచుటకు ఎల్లప్పుడూ మీరు అసలు ఆ విత్తనమెట్లున్నదో చూడలవలసి యున్నారు.
ఎట్టి విత్తనములు పొలములో చల్లబడినవి? ఆదికాండము, విత్తనపు అధ్యాయము అయినందున మనము ఆదికాండము యొద్దకు వెళ్ళుదము. యేసు ''ఆదియందు'' అను వాక్యమునే మనకు పరిచయము చేసెను. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, ఆదే కాలము ఆరంభించిన సమయము. దానికి ముందున్నది నిత్యత్వమే. ఇప్పుడు అక్కడున్న మన ప్రశ్నకు ఆది యొద్దకు వెళ్ళవలెనని గమనించండి. ఇప్పుడు దీనిని తప్పిపోకండి. ఆ కారణమును బట్టియే నేను నెమ్మదిగా మాట్లాడ గోరుచున్నాను. వైరుల ద్వారా వినుచున్నవారు, టేపుల ద్వారా వినువారు స్పష్టముగా వినవలెను.
''ఆది యొద్దకు వెళ్ళుడి'' అని యేసు చెప్పెను. భూమి మీద ఒకే ఒక్క జత యుండెను. ఒకే ఆదాము, ఒకే హవ్వ యుండిరి. వారు దేవుని ద్వారా మాత్రమే జత చేయబడిరి, ఒక మగ గుర్రము, ఒక ఆడ గుర్రము, ఒక మగ చిలుక, ఒక ఆడ చిలుక, ''ఆది యొద్దకు'' వెళ్ళమని ఆయన చెప్పెను. ఏదయినా గాని ఒక్క జత మాత్రమే యుండెను. అది నిజమేనా? ''ఆదియందు'' ప్రతిదియు దేవునితో పరిపూర్ణ పొందిక మరియు క్రమముతో కొనసాగుచుండెను. మనము కనుగొందుము, ఏదియూ అక్రమముగా లేదు. పరలోకమందు ప్రతిదియు క్రమములో యున్నది. ఆకాశమందు నక్షత్రము, గెలాక్సీలు, సౌర క్రమము, ప్రతిదియూ క్రమములో తప్పక యున్నది. అందులో ఒకటి తప్పిన యెడల మొత్తం కార్యక్రమమే చిందరవందరయగును.
MATT 19:4
34ఇప్పుడు వినండి. మీరు చూచారా? ఒక అక్రమము మొత్తము కార్యక్రమమునే పాడుచేయును! మానవులు దేవునితో చక్కగా కొనసాగుచుండిరి. ఒక్క పురుషుడు, ఒక్క స్త్రీ కలిసియుండిరి. ఈస్త్రీ పాపము చేయగా మొత్తం భూ కార్యక్రమమే దేవునితో సంబంధము లేకుండా తెగిపోయెను. కాబట్టి ఈ గ్రంథమునకు ఒక మాట చేర్చినా, ఇందులో నుండి ఒక మాట తీసివేసినా ఒక క్రైస్తవునికి దేవునితో సంబంధము లేకుండా పోవును. ఒక సంఘము దేవునితో సంబంధమును తెంపుకొనును. ఒక కుటుంబము దేవునితో సంబంధము కొల్పోవును. దేవుని యొక్క ప్రతి మాటను అంగీకరించని ప్రతి విశ్వాసి బయటకు త్రోసివేయబడును.
చక్కని ఇంటిని వేరుచేసినది స్త్రీయే. భూమిని కలవరపరచినది కెరూబు కాదు. ఇంటిని విచ్చిన్నము చేసినది ఆదాము కాదు. గృహమును, మొత్తము క్రమమును విచ్చిన్నము చేసినది, పారవేసినది స్త్రీ తప్ప మరెవ్వరూ కాదు, హవ్వయే కారణము. ''ఆదిలో'' అని యేసు చెప్పినది. ఇక్కడ అదే. ఆది లోనే విచ్చిన్నమయినది. ''ఆదియందు దేవుడు ప్రతి జాతిలోనూ ఒకటి మగదిగా, ఒకటి ఆడదిగా సృజించెను,'' అని యేసు చెప్పెను. ఆడ గుర్రం కాదు. ఆడ కుక్క కాదు. స్త్రీయే భూమి మీద దేవుని యొక్క కార్యక్రమ కొనసాగింపు యావత్తును విచ్చిన్నము చేసెను. సమస్తమును మరణమునకు నడిపించెను. నిబంధనను పగులగొట్టినది స్త్రీయే గాని పురుషుడు కాదు. ఆమె నిబంధనను బ్రద్దలు చేసినది. ఎందుకు? దేవుని యొక్క వాక్య సరిహద్దులను ఆమె మీరిపోయినది.
తన భర్తతో ఆమె తన నిబంధననుల్లంఘించిన యెడల ఆమె దేవునితో తనకు గల నిబంధనను అతిక్రమించినట్లే. ఆమె దేవునితో తన నిబంధనను అతిక్రమించినది గనుక తన భర్తతో కూడా నిబంధనను అతిక్రమించినది.
ROM 3:4
35దేవుని యొక్క వాక్యములో నీవునీ వాగ్దానమును మరియు నీ నిబంధనను ఉల్లంఘించినప్పుడు అందువలన ఎందరో అక్రమ సంఘ సభ్యులు పుట్టుదురు, ఎందుకనగా కొందరు కూడికొని ఇట్లందురు, ''అది ఆలాగు కాదు.'' అప్పుడు మొత్తము సంస్థ దేవుని వాక్య కొనసాగింపును విచ్చిన్నము చేయును.'' మేము అది నమ్మము. అది ఆలాగు కాదని డాక్టర్ జోన్స్ చెప్పెను.'' కాని దేవుడు అది ఆలాగు అని చెప్పినంత కాలము అది అంతే. ''నా మాట మాత్రమే సత్యము. ప్రతి మనిషి మాట అసత్యము,'' అని ఆయన చెప్పెను. అక్కడే కొనసాగింపు దెబ్బతినును.
ఆ కొనసాగింపు తెగిపోయినప్పుడు జీవిత గీత కూడా తెగిపోవును. కాలపు గీత కూడా తెగిపోవును. నిబంధన తెగిపోవును. అంతయూ పగిలిపోవును! దానికి కారణము ఎవరు? ఒక స్త్రీ నిబంధనను బ్రద్దలు చేసినది అదే. దానిని మీరు చదువగోరినయెడల ఆదికాండము 3వ అధ్యాయము చదవండి.
GEN 3:16
36దేవుని వాక్యప్రకారము పురుషుడు స్త్రీని ఏలవలెను. ఆమె అతనితో ఏ మాత్రము సమానురాలు కాదు. ఆమె ప్రకృతిలో సహ సమానురాలేనని మీకు తెలియును. కాని ఆమె దేవుని యొక్క వాక్యమును బ్రద్దలు చేసినప్పుడు దేవుడామెను పురుషుడు ఏలునట్లు చేసెను. ఆదికాండము 3:16 మీరు కోరినయెడల అది వ్రాసికొనండి. ఆమె యిక ఏ మాత్రము పురుషునితో సమానురాలు కాదు. ఆమె దేవుని వాక్యమును విచ్చినము చేసినది.
ఇక్కడున్న సంఘములో ''ఆమెను'' మీరు చూచుట లేదా? దేవుని వాక్యమును బ్రద్దలు చేసినది. అందువలన ఆమె సంపూర్తిగా ఆ సాగిపోవుటకు కోల్పోయినది. సంఘము అదే చేసినది. అంతటి మీదికి ఆత్మీయ మరణమును తీసికొని వచ్చెను ఈ విధంగా నేను ఈ విషయములను పదే పదే ఎందుకు చెప్పుచున్నానో మీరెరుగుదురు. అది సత్యము! అవి బైబిలు యదార్థములు!
గమనించండి, ఆమె ఇటు వంటి కార్యము ఎందుకు చేసినది? అంత చక్కని అందమగు, పరిపూర్ణురాలగు స్త్రీ ఏలాగు అది చేసెను? ఒకసారి గ్రీసు దేశములో అనుకొంటాను ఒక చిత్రమును చూచాను. ఒక చిత్రకారుడు హవ్వ యొక్క పటమును చిత్రించెను. ఆమెను మీరెన్నడూ చూడని భయంకర రూపములో యుండెను. శరీర సంబంధమగు మనస్సు ఏలాగు చూచునో అది చూపించు చున్నది. ఆమె ఆలాగు లేదు. ఆమె సుందరమైంది, ఎందుకనగా ఆమె పరిపూర్ణ స్త్రీ, మొత్తము స్త్రీ.
GEN 3:16
37గమనించండి, ఉన్నత క్రమములో ఉండి ఆమె ఎందుకాలాగు చేసినది? ఆమెకు పురుషునితో హక్కు, సహ సమానత్వము ఉండెను. కాని ఇప్పుడు ఆమె పాపము చేసినందున అతనితో సహ సమానత్వమును పోగొట్టుకొన్నది. ''ఇక నుండి పురుషుడు నిన్ను ఏలును,'' అని ఆయన చెప్పెను. అది లేఖనము మీరు కావలసినచో అది చదువుకొన వచ్చును. దేశమంతటా జనులు టెలిఫోనులు ద్వారా వినుచున్నారు గనుక సమయమును ఆదా చేయుటకు మీకు వాక్యమును ఇచ్చుచున్నాను. మీకు మీరే చదువు కొనండి.
ఆమె దానిని చేయుటకు కారణమును గమనించండి. సాతాను ఆమెను ఏలాగు వాడుకో కలిగెను?
ఒకనాడు సాతాను దేవునితో సహ సమానత్వము కలిగియుండెననని మీరెరుగుదురా? నిశ్చయంగా. సృష్టికర్తగా తప్ప తక్కినదంతయూ చేయగలిగియుండెను. పరలోకమందు దేవుని యొక్క కుడిచేతి ప్రక్కన నిలబడి గొప్పగా కెరూబులను నడిపించుచుండెను.
దీనిని ఆమె చేయుటకు కారణమును గమనించండి, అమె సృష్టి ఆదిలో లేదు. ఆమె దేవుని యొక్క అసలు సృష్టిలో లేదు. ఆమె ఉప ఉత్పత్తి. కాబట్టి యేసు ''ఆదియందు'' అని ప్రస్తావించెను. ఆమె దేవుని వలన ఆదిలో సృజింపబడినది కాదు! ఆమె పురుషునిలో నుండి తీయబడిన ఉప ఉత్పత్తి. యేసు అందుకే ''ఆదియందు'' అని ప్రస్తావించెను.
GEN 1:27•
GEN 2:21,22
38గుర్తుంచుకొనండి, అసలు సృష్టి యందు ఆదాము స్త్రీ, పురుష భేదము లేక ఒట్టిగానే యుండెను, కాని అతడు ఒక ప్రక్కటెముక ద్వారా వేరు చేయబడెను. గమనించండి, ఒక ఉప ఉత్పత్తి. గమనించండి, దేవుని యొక్క సృష్టి యంతటిలోను, ప్రతి జీవిలోను ఆ ఒక్కతె మాత్రమే ఈలాగు రూపించబడెను. అసలు సృష్టిలో ప్రతి ఆడుదియు ఉండెను. తక్కిన ఇతర ఆడువన్నియూ ఆది సృష్టిలో ఉండెను. చూడండి, అది ఆలాగు చేయబడవలసి యుండెను. కొంతసేపున్న తరువాత అది మనము చూద్దాం.
ఆమె ఈ అసలు సృష్టిలో లేదు గాని ఒక ఉప ఉత్పత్తి. ఇప్పుడు మిమ్మును చిన్న పుచ్చగోరుట లేదు, కాని మీకు సత్యము చెప్పగోరుచున్నాను, నెమ్మదిగా కూర్చొనండి; చక్కగా మీరు వినుచున్నారు.
39స్త్రీ అంత మోసకరముగా రూపొందించబడినది మరేదియూ లేదు. మరొకటేదియూ లేదు; ఆ విధముగా మరేదియూ చేయబడలేదు. అలాగే ఆది సృష్టిలో లేదు. ఆమె ఆదాములో యుండెను.అంతేకాని ఆమె స్త్రీ లింగముగా ఆదియందు లేదు. ఆమె ఉప ఉత్పత్తిగా తయారు చేయబడెను.
ఆమె ఆది సృష్టిలో లేదు. ఆమె ఆదాములో యుండెను, అంతేగాని ఆమె స్త్రీ లింగముగా ఆదియందు లేదు. ఆమె ఉప ఉత్పత్తిగా తయారు చేయబడెను.
స్త్రీ యంత సులభముగా మోసము చేయగలది, మోసపుచ్చబడునది మరేదియూ రూపించబడలేదు. స్త్రీయంత ఎక్కువగా వంగ గలది మరేదియూ లేదు, అట్టిది నిర్మాణము చేయబడలేదు. ఇప్పుడు ఆలోచించండి. స్త్రీ యంత నీచముగా వంగునది సృష్టిలో మరేదియూ రూపొందించబడలేదు. ఒక పురుషుని హృదయమును స్త్రీనే ముక్కలుగా చీల్చ కలిగినది ఈ లోకములో మరేదియూ లేదు — భార్య మాత్రమే ఆ పని చేయగలదు. ఆ చక్కని భార్య మరొక పురుషునితో పోనియండి. ఆ భర్త తన పిల్లలను చేర్చుకొని ఎట్లు కన్నీరు కార్చుచూ కూర్చొనునో చూడండి. ఆమె ఆ విధంగా రూపించబడినది. దీనిని చేయుటకు ఆమె రూపించబడినది.
ఆమె వలె గాని, లేదా ఆమె అంత నీచముగా వంగు నట్లుగాని పంది, కుక్క మరి ఏ ఇతర జంతువు రూపించబడలేదు. అది సత్యము. నా సోదరీల పట్ల గౌరవమున్నది. మీరు గమనించ గోరుచున్నాను.
40ఏ జంతువు అంత అవి నీతిగా ఉండదు. కుక్కను, పందిని మీరు ఎంతో నీచముగా పిలువ వచ్చును. కాని చాలామంది హాలివుడ్ తారలు నైతికంగా వాటికన్న ఎన్నో మిలియనుల మైళ్ళ దూరంలో యున్నారు. ఆమె అంత నీచముగా ప్రవర్తింప కలుగునట్లు చేయబడినది. ఇప్పుడు దీనిని కాస్త ఆలోచించండి. అంత అసభ్యము గాను, అంత నీచము గాను ప్రవర్తించ కలుగునది దేవుని యొక్క సృష్టిలో గాని, ఈ ప్రపంచములో గాని మరేదియూ లేదు.
''ఒక్క నిమిషమాగండి'' అని మీరందరు. దాని యొద్దకు మనము వెళ్ళుచున్నాము. స్త్రీ ''అవును'' అని చెప్పవలసియున్నది.
గమనించండి, స్త్రీ యంత నీచముగా, అపవిత్రముగా ప్రవర్తించ కలిగినది మరేదియూ లేదు. ఒక కుక్క దానిని చేయజాలదు; ఒక పంది దానిని చేయజాలదు; ఒక పక్షి దానిని చేయజాలదు. ఏ జంతువు అపవిత్రముగా ఉండజాలదు, ఎందుకనగా అది అలాగుండుటకు నిర్మించబడలేదు. ఒక ఆడ పంది అంత అనైతికంగా ఉండలేదు; ఒక ఆడ కుక్క అంత అనైతికంగా ఉండదు; ఒక ఆడ పక్షి అంత అనైతికంగా ఉండజాలదు. దానిని చేయునది స్త్రీ మాత్రమే.
41సాతాను ఎక్కడికి వెళ్ళవలెనో ఇప్పుడు మీరు చూచారా? చూడండి? ''అవును'' అని ''లేదు'' అని ఇంకా జవాబు అంటి పెట్టుకొని యుండ గలదో దాని మీదనే అంతా ఆధారపడి యుండును. చూచారా?
ఇక్కడ మనము తేటగా సర్ప సంతానము ఎక్కడి నుండి వచ్చెనో చూడగలము. వాడు వెళ్ళ కలిగిన చోటు ఒకే ఒకటున్నది. గ్రుడ్డివారు తప్ప దానిని చూడలేని వారెవరూ లేరు. చూచారా? చూడండి. అది అక్కడికే వెళ్ళవలసియుండెను.
గమనించండి, జంతువులు లేదా ఒక ఆడ జంతువు దానిని చేయలేక పోవుటకు కారణము అవి ఆది సృష్టిలో ఉండుటయే. కానిస్త్రీ ఆది సృష్టిలో లేదు. దీనిని పైకి త్రవ్వుటకు వెళ్ళనైయున్నాను. అప్పుడు ఈ ఆధునిక దినము యొద్దకు, నిబంధనలోనికి తీసికొని వచ్చెదము.
ఆమె మాత్రమే మురికిగా, అపవిత్రంగా జీవించుటకు నిర్మాణమాయెను. ఒక కుక్కగాని, మరే ఇతర జంతువు గాని ఆలాగు చేయలేదు. స్త్రీ మాత్రమే ఆలాగు చేయ గలుగును. ఒక కుక్క గాని, ఇతర ఏ ఆడ జంతువయినా గాని సంవత్సరమున కొకసారి పిల్లలను కనుటకు సిద్ధపడును. లైంగికానందమునకు కాదు, కాని పిల్లల కోసమే. పంది లేదా కుక్క ఒక క్షణము సంవత్సరమున కొకసారి పిల్లల కొరకు సిద్ధపడును. కాని స్త్రీ తాను ఇష్టపడు ఏ సమయములో నయినా సిద్ధము కాగలుగునట్లుగా రూపించబడెను. (ఇప్పుడు నాయొద్ద కొంత వ్రాసియున్నది గాని మిగిలినది మీరు అర్ధము చేసికోగలరు.) కుక్క ఆలాగు చేయలేదు; స్త్రీ చేయగలదు. (ఇక్కడ నేను విడిచిన తలంపులను పరిశుద్ధాత్మ మీకు బయలుపరచునని నేను ఆశించుచున్నాను.)
42స్త్రీ జాతిలో ఆమె మాత్రమే అతి సుందరముగా రూపొందించబడినది. మగ వానికన్న అందముగా రూపించబడినది. మరే జాతిలోను ఆలాగు లేదు. తక్కిన దేవుని సృష్టి అంతటిలోనూ, అనగా జంతువు, పక్షులు మున్నగు వానిలో మగవే అందమైనవి. ఎల్లప్పుడూ మగవే చక్కగా నుండును.
పెద్ద లేడిని చూడండి చక్కని కొమ్ములుండి గొప్ప అందంగా నుండును. పెద్ద పుంజును చూడండి. చక్కని వెండ్రుకలతో అందంగా నుండును. పెట్ట చిన్నగా నుండును. పక్షులవైపు చూడండి. నెమలిని, కోడిని చూడండి. ఎందుకు? దేవుని సృష్టి మొత్తము చూడండి. ప్రతి సృష్టిలోని మగదే అందమైనది. గొర్రెలు, పందులు, గుర్రములు, వేటిలోనయినా చూడండి. పక్షులలో చూడండి. ఎల్లప్పుడూ పెద్ద మగదే అందముగా యుండును, కాని మానవ జాతిలో అందముగా నున్నది స్త్రీయే, మగవాడు కాదు. మగవాడు అందముగా నున్నచో అది పొరపాటుగా జరిగినదే. ఎక్కడో సంకరము చేయబడిన సంతానమున్నది. ఆదిలో ఆలాగే యుండెను.
ఎందుకాలాగు జరిగినది? మోసము చేయుటకు, ఆమె యొక్క నిర్మాణకుడగు సాతాను ఈ చివరి దినములలో కూడా ఇంకా ఆమె మీద పనిచేయుచున్నాడు.
GEN 6:2
43ఒక్క క్షణము ఇక్కడ నన్ను ఆగనీయండి.
''అందము!'' అంతర్జాతీయంగా, ప్రపంచ వ్యాప్తముగా మొదటి నాశనము అందమగు స్త్రీల మూలము గానే జరిగినదని మీరెరుదురా? ''దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారిని పెండ్లి చేసికొనిరి.'' అది నిజమేనా? ఈనాడు స్త్రీల యొక్క అందము వృద్దియగుట మీరు గమనించారా?
ఒకప్పుడు దేశములో అతి సుందరిగా చెప్పబడిన పెరల్ బ్రియన్ యొక్క పటము చూచాను. అందము మాటకు వచ్చిన యెడల ఈనాడు పాఠశాలలో యున్న ఏ యుక్త వయస్కురాలగు బాలికయినా గాని ఆమె అందమును మించిపోవును. స్త్రీల సౌందర్యము పెరుగుట మోసపు కాలమును చూపించు చున్నది.
నేడున్నంత సౌందర్యమును సంఘము మరెప్పుడయినా గాని చూచెనా? ప్రతిదీ గొప్పగా కనబడుచున్నది. చక్కని పెద్ద భవనములు, మిలియనుల కొలది ఇవి, మిలియనుల కొలది అవినిర్మించబడు చున్నవి. ''ఆమె'' యే మోసము. మీరు చూడలేదా?
44ఆమెయంత నీచముగా ఏదియూ ప్రవర్తించజాలదు. ఆమె మోసపుచ్చబడు రీతిలో చూపించబడెను. ఈనాడు, ఈ చివరి దినములలో సాతాను ఆమె మీద నిజంగా పనిచేయు చున్నది, ఎందుకనగా వాడు ఆమె యొక్క నిర్మాణకుడు. ఇప్పుడు దానిని నేను నిరూపించగలను. ఆదియందు ఆమె మీద ఎవరు పనిచేయనారంభించినారో వెనక్కు వెళ్ళి చూడండి. ఆదామా లేక సాతానా? దేవుడా లేక సాతానా? చూడండి. అదే ఆమె యొక్క రూపుదిద్దెను. ఆమెను అందముగా చేసి ఆమె అపవిత్రతలో పురుషుడు పడునట్లుగా ఒక ఆయుధముగా వాడు చేసికొనెను. ఆమె అందముగా నున్నందున పురుషుని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పుకోగలదు. సోదరుడా! వీధిలో సగము బట్టలు ధరించి త్రిప్పుకొంటూ నడుస్తూన్న స్త్రీయే, అందమగు స్త్రీ పురుషుని పడగొట్టుచున్నది గాని మరొకటి కాదు. మోసపుచ్చువాడు అక్కడే యున్నాడు. ఆమె పూర్తిగా ప్రమాదకరము. సాతాను ఆమెను నిర్మించెనని నేను చెప్పినందుకు మీరు నన్ను ప్రశ్నించుదురు. అది సత్యమే. సాతాను ఆమెను రూపించెను. వాడింకా రూపించుచునే యున్నాడు.
GEN 4:3
45వాక్యములో మీకు ఒక సంగతిని చూపించెదను. మిమ్మును వాక్యము నొద్దకు తీసికొని వెళ్ళి నేడు చూచుచున్న దానితో మీ అభిప్రాయమును పోల్చి చూచుకోనిచ్చెదను.
ఆ విధమగు అందమును సమకూర్చునది సాతాను మాత్రమే. మనము గమనించిన యెడల అది పరలోక మందలి దేవ దూతలన్నింటిలో అందమైనదై యుండెను. అది నిజమేనా? మిఖాయేలు రాజ్యముకంటే పరలోకమును ఒక అందమైన స్థలముగా అతడు తయారు చేయగోరెను. అది నిజమేనా? ఆలాగే కయీనును తన కుమారుడని చూపించుటకు అతడు చాలా అందమగు బలిని అర్పించెను. తన బలిపీఠములను ఫలములు మరియు పూలతో అలంకరించెను. అది నిజమేనా? అందము! అందము అని నేడు మనము పిలచుచున్న ఆ పాపము అందముగా యున్నది. అందము ద్వారా పాపము మోసము చేయుచున్నది. వీధిలో వెళ్ళిపోవుచున్న ఒక స్త్రీని నీవు చూచి ఆమె హృదయములో ఏమి ఉన్నదో ఎన్నడూ చెప్పలేవు. చూచారా? సాతాను ఆమె రూపకర్త అని మీరు చూడకలుగునట్లుగా ఈ సంగతులు మీతో చెప్ప గోరుచున్నాను. అది అక్షరాలా నిజము. దానియొక్క స్వంత కుమారుడగు కయీనును దానిని నిరూపించెను.
ఇప్పుడు, అది అందమైనది గనుక మోసపుచ్చ గలదు.
46లోకము అందమైనది కాబట్టి అది మోసము చేయగలదు. కాస్మాస్ అని నా భావము, అనగా ప్రపంచ క్రమము. అది అందమైనది గనుక మోసము చేయగలదు — చక్కని గొప్ప స్థలములు మరియు విలాసములు.
ప్రవక్తయగు ఆమోసు వచ్చి ఆ పట్టణమును చూడగా అది ఆధునిక హాలివుడ్ వలె కనబడెను. అతని చిన్న ముసలి కండ్లు ముడుచుకొని పోయెను. అతని ముఖము మీద తెల్లని వెండ్రుకలు వ్రేలాడుచుండెను. అక్కడికి అతడు ఒక సందేశముతో వెళ్ళెను. ఆ స్థలములో దానిని వెళ్ళ గ్రక్కెను, ''మీరు ఏ దేవుని సేవించుచున్నారని చెప్పుకొనుచున్నారో ఆ దేవుడే మిమ్మును నాశనము చేయును,'' అని చెప్పెను. అది నిజము.
పాపము అందముగా యుండును.వారు యూదాను ముసలి త్రాగు బోతువలె చిత్రించిన పటము ఇక్కడ ఒక వీధిలో యున్నది. నోరు తెరచుకొని అందులో ఈగలు మూగుట ఆ యూదా పటములో చూతుము. యూదా అందమైన వాడు, బలమగువాడు, మోసగాడు. అతడిని కాదు నీవు పరిక్షించవలసినది… అతడు కాదు, ఆ ముసలి వ్యవసాయదారుడు, అతడు నీ భార్య చుట్టూ తిరిగి మోసము చేయువాడు ఆ దుర్మార్గుడే.
లోకము యొక్క నేత్రములకు పాపము అందముగా కనబడును. కాని దేవుడు అట్టి రకమగు అందములో గోచరించడు. అది మీకు తెలియునా? గుణ శీలములో సుందరమగు శీలములో దేవుడు కనబడెను.
ISA 53:2,3
47పరిశుద్ధ గ్రంథములో (యెషయా 53 చూడండి, గుర్తుపెట్టుకొనండి.) దానికి అనుబంధముగా చాలా వచనములు ఇక్కడ వ్రాసియుంచాను. పరిశుద్ధ గ్రంథములోని యెషయా 53లో మన ప్రభువగు యేసును గూర్చి ఈలాగు చెప్పబడెను. ''మనము చూచి అపేక్షించునట్లుగా ఆయనలో ఎట్టి సౌందర్యము లేదు. మనము ఆయనను చూడకుండా మన ముఖములను దాచుకొన్నాము.'' నిజమేనా? ఆయనను మనము ఆపేక్షించలేదు. ఎందుకనగా ఆయన అందముగా లేడు. బహుశా ఆయన ఒక చిన్న మనిషి. భుజములు వంగిపోయి కరుకుగా కనిపించు చుండెను. ఒక నాయకునిగా ఉండుటకు అతడు కోరబడడు. ఒక నాయకునిగా ఆయన కనిపించలేదు. మామూలు వీధి భాషలో ఆయన మామూలు జనులవలె మాట్లాడెను.సామాన్య మానవులవలె ఉండెను. కాబట్టి ఆయన ఏ గొప్ప పండితుని వలెను, విద్యగల వానివలెను, చక్కని అంగీలు ధరించిన వానివలెను కనబడలేదు. మనము అపేక్షించునది ఆయనలో లేదు. ఆయన మామూలుగా సంచరించుచుండగా ఆయన ఎవరో కూడా జనులకు తెలియలేదు. నడచుచున్న దేవునిగా ఆయన కనిపించలేదు, దేవుడు అని మనము తలంచునట్లు ఆయన కనిపించలేదు. కాని ఆయన దేవుడై యుండెను!
1SAM 10:23•
1SAM 12:3,4,12•
1SAM 16:1
48ప్రభువగు యెహోవా సమూయేలుతో చెప్పినది మీరు గమనించారా? ''యెష్షయి గృహమునకు వెళ్ళి సౌలు స్థానములో రాజుగా నుండుటకు అతని కుమారులలో ఒకనిని అభిషేకించుము.'' ప్రజలు సౌలును ఎన్నుకొనిరి. అలాగు చేయవద్దని సమూయేలు ఖచ్చితముగా చెప్పెను. ''మీ మీద రాజు ఉండవలెనని దేవుడు కోరుట లేదు. దేవుడే మీకు రాజు, యెహోవా నామము పేరట నేను మీతో చెప్పినది ఎన్నడైనా జరుగకమానెనా? నా జీవనము కొరకు మిమ్మును ఎన్నడైనా డబ్బు లేదా మరేదయినా అడిగితినా?''
అందుకు వారిట్లనిరి, ''లేదు. నీవెన్నడూ మమ్మును డబ్బు అడగలేదు. యెహోవా నామము పేరట నీవెన్నడూ మమ్మును డబ్బు అడగలేదు. యెహోవా నామము పేరట నీవు ఏమి పలికితివో అది నెరవేరును. అయినాగాని మాకు రాజు కావలెను.'' కాబట్టి వారు సౌలును ఎన్నుకొనిరి. లోకము దేనిని ఎన్నుకొనెనో చూడండి! దేవునిచే అభిషేకించబడిన ఇశ్రాయేలు దేశములో ఎత్తయిన తల, భుజములు గల మనుష్యుని ఎన్నుకొనెను. పెద్దగా, చక్కగా, గొప్పగా, అందముగా కనబడిన వ్యక్తి ఎల్లప్పుడూ అత్తరు బుడ్డిలో ఈగవలె ఉండెను.
కాని దేవుడిట్లు చెప్పెను, ''నేను నా ఎన్నిక చొప్పున ఒక రాజును మీకు ఎన్నిక చేయుదును. సమూయేలూ నీకు కూడా ఆ వ్యక్తి ఎవరో చెప్పను, కాని నీవుపోమ్ము. యెష్షయి కుమారునిలో ఒకనిని అభిషేకించుము.''
1SAM 16:6,10-13
49యెష్షయి, అతని భార్య, అందరూ కలియ చూచిరి. ''అవును, మా పెద్ద కొడుకు గొప్పవాడు. పొడవుగా, అందంగా ఉండును. రాజు కిరీటము ధరించుకొనుటకు తగును. అతడు చురుకైనవాడు, విద్యగలవాడు, చక్కని మనిషి. అతడు సరిగ్గా సరిపోవునని నాకు తెలియును. అతని భాషా పటిమ బాగుండును,'' అన్నారు.
వారతనిని పిలుచుకొని వచ్చిరి. సమూయేలు తైలపుకొమ్ము తీసికొని అతని వైపుగా వచ్చెను. ''వద్దు. యెహోవా ఇతని కోరుకొనలేదు,'' అని ఆయన చెప్పెను. కాబట్టి ఆ తరువాత తక్కిన అతని ఆరుగురు కుమారుల యొద్దకు వెళ్ళెను. యెహోవా ఆ కుమారులను తిరస్కరించెను. ''ఇంకా ఎవరయినా మిగిలియున్నారా?'' అనడిగాడు.
'' ఓ! అవును, ఒకడున్నాడు. ఎక్కడో అతడు గొర్రెలను కాయుచున్నాడు. అక్కడ కూర్చొని పాటలు పాడుకొంటూ, గట్టిగా అరయుచూ ఏవేవో చేయు చుండెను. అతడు చిన్నగా భుజములు వంగిపోయిన వ్యక్తి. మోటుగా ఎండకు కందిపోయి కనబడును. అతడు రాజుగా ఎన్నడూ ఎన్నిక కాడు,'' అనెను.
''వెళ్ళి అతనిని తీసికొని రండి,'' అని చెప్పెను. దావీదు ఆ ప్రవక్తయొద్దకు రాగానే, ప్రవక్త తైలముతో పరుగిడి వెళ్ళి అతని శిరము మీద పోసి '' దేవుడేర్పచు కొనినవాడు ఇతడే'' అనెను. అందము కాదు గాని గుణశీలము.
దేవుడు శీలము వైపు చూచును.
ISA 53:2
50మనిషి సహజమగు అందము వైపుచూచును. అది మోసము చేయును. మోసపుచ్చుట కొరకే స్త్రీకి ఆ అందము ఈయబడినది. ఒక అందమగు స్త్రీ అందమును సరయిన రీతిలో వాడుకొనని యెడల అది ఆమెకు శాపమగును. నాకు తెలిసిన మరిదేనికంటెను కూడా నరకమునకు ఆమెను త్వరగా పంపునది అదే. నిశ్చయంగా ఆమె అందముగా యుండవచ్చును. అయితే ఆమె తన భర్తతో కూడా యుండి సరిగా జీవించినంత కాలము ముప్పు వాటిల్లదు. కాని ఆమె దానినే తీసికొని దానితో ఆమె ఏలాగు మోసము చేయగలదో చూడండి, ఆలాగు చేయుటకే అది ఆమెకు ఇయ్యబడెను.
గమనించండి, దేవుడు సుశీలము నందు గోచరమగును. ''యేసును అపేక్షించుటకు ఆయనలో ఎట్టి స్వరూపము లేదు,'' కాని భూమీ మీద ఆయన వంటి శీలము మరెవరికిని లేదు.
ఈనాడు మనము సంఘశీలము ఎట్లున్నదో కనుగొందము సాతాను మరియు వాడి గుంపు పెద్ద, అందమగు ఆలయముల కొరకు,సుందరముగు వానికొరకు చూచుచున్నది. నేడు ప్రపంచము దానివైపుకే చూస్తున్నది. ఓ, ఆయన ఆ సంఘకాపరి పలాని-పలాని గొప్ప సంఘము, ఏవేవో పేర్లతో పిలువబడును. ఎంతో భక్తియుతంగా, యాజకునివలె పెద్దఅంగీలు ధరించి, ఏవెవో వేసికొని వచ్చును. దానిని వారు అందమని పిలుచుచున్నారు. కాని నిజమగు దేవుని పరిశుద్దులు బయలు పరచబడిన వాక్యశీలము కొరకు చూచెదరు.
యేసును చూచినప్పుడు ఆనాటి పరిశద్దులు అదే చేసిరి. ఆయనలో చూడతగిన రూపము లేదు, కాని ఆయనలోవారు దేవునిని చూచిరి. ఆయనలో దేవుడున్నట్లు వారు చూచిరి.
2SAM 21:22•
2SAM 23:18•
1CH 11:11,20•
1CH 20:8
51దావీదుతోనున్న యోబు తదితర వ్యక్తులు ఆ చిన్నవానిలో దేవునిని చూచిరి. అతనిలో దేవుడున్నట్లు వారు కనుగొనిరి. ఒక దినమున అతడు అధికారములోనికి వచ్చునని వారెరిగియుండిరి. ఒకడు గొల్యాతు యొక్క అయిదుగురు సోదరులను ఒక్క చేతితో చంపెను. కొందరు స్త్రీలు వంటకొరకు కొన్ని చిక్కుళ్ళు తెంపుచుండిరి. సైన్యము వెళ్ళిపోయెను. అతడు ఈటె తీసికొని మూడువందల మంది ఫిలిష్తీయులను చంపెను. ఎంత గొప్పవ్యక్తి! ఎందుకు వారు దావీదు పక్షమునే నిలచియుండిరి. అతని మీద అభిషేకమున్నదని వారెరుగుదురు. అతడు అధికారములోనికి వచ్చుచున్నాడని వారు తెలిసికొనిరి. వాక్యము పక్షమున నిలబడియుండిన నేటి సంఘమునకిది ప్రత్యక్ష తార్కాణము! అది బయలు పరచబడనైయున్నదని మనకు తెలియును. ఒక దినమున అది అధికారములోనికి వచ్చునని మనకు తెలియును.
ఆ దేశములో నుండి వెడలిపోయి ఒక పరదేశిగా అతడు ఉండెను, కాని అతడు అధికారములోనికి వచ్చుచున్నట్లు వారికి తెలియును. ఆయన అధికారములోనికి వచ్చుచున్నాడని కూడా మనకు తెలియును. కాబట్టి మనము ఆ వాక్యమును తీసికొని వెలఎంత చెల్లించవలసి యున్నాగాని దానితోనే నిలచియున్నాము. మనము ఫిలిష్తీయులను తెగనరకవలసి వచ్చినా, లేదా గుంటలోనికి దూకి సింహమును చంపవలసి వచ్చినా, భయపడక వెళ్ళుదుము, ఎందుకనగా ఆలాగుండుటకే దేవుడు మనలను రూపించెను. మనము శీలము కొరకు చూచుచున్నాము.
ROM 9:14-23
52ఇప్పుడు మీరు ఈలాగు అడుగవచ్చును, ''ఆమె అలాగు రూపొందించబడుటకు ఎందుకాయన అనుమతించెను?'' ఎక్కువ సమయము నేను తీసికొనగోరుట లేదు, ఎందుకనగా నాకు చెప్పవలసినది చాలా యున్నది.''ఎందుకు ఈ స్త్రీని ఈ విధంగా తయారుచేసెను?'' ''అలాగుండునట్లు రూపింపబడుటకు ఎందుకాయన అనుమతి ఇచ్చెను?'' అను ప్రశ్నలు వచ్చును. ఆయన తన స్వంత ఆనందము కొరకే ఆలాగు చేసెను. నిశ్చయంగా!
మీరు మీ పరిశుద్ద గ్రంథములో ఒక నిమిషము చూడండి. రోమా 9 తీయండి. ఒక సంగతి మీకు చూపించెదను. దేవుడు ఈ కార్యములను ఎట్లు చేయునో చూచుటకు అది చదవండి దేవుడు తన స్వంత ఆనందము కొరకు ఏమి చేసెనో ఇక్కడ మనము చూడగలము. రోమా 9:14.
కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా?… ఆయన యాకోబును ఎన్నుకొని ఏశావును తిరస్కరించెను. వారిద్దరూ తమ తమ ఎన్నిక చేసికొను హక్కును పొందకముందే ఆలాగు చేసెను. వారిరువురిలో ఏ ఒక్కరూ స్వంతంగా ఎన్నిక చేసుకోలేదు. వారు పుట్టుకముందే, తల్లి గర్భములో యున్నప్పుడే దేవుడిట్లు చెప్పెను,'' నేను ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించితిని,''చూడండి? ఎందుకు?
అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు - ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని యెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
కాగా పొందగోరు వాని వలననైనను, ప్రయాసపడు వాని వలనననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును.
మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను - నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందును ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.
కావున [గమనించండి] అయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును. ఎవని కఠిన పరచగోరునో వాని కఠిన పరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు.
ఒక ముద్దలో నుండియే ఒకఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా?
ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్దపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి?
53దానితో కొంతసేపు వాదించుడి. దానిని దేవుడు చేసెను. ఈ రీతిగా ఆయన దానిని చేయవలసియుండెను. అది అక్కడ ఉండవలసి యుండెను.
అయిదు నిమిషముల పాటు ఇప్పుడు వినండి, విషయము వైపు మీ దృష్టిని ఇప్పుడు త్రిప్పగోరుచున్నాను. దేవుడు ఏమై యున్నాడు? దేవుడు ఒక గొప్ప నిత్యుడు, ఆదియందు. ఆది అనునది లేక పూర్వమే ఆయన దేవుడు కాడు. అది మీరెరుగుదురా? దేవుడు అనగా ''ఆరాధనకు గురి'' అని భావము. ఆయనను ఆరాధించుటకు ఏదీలేదు. ఆయన ఒంటరిగానే జీవించెను. ఆయనయందు గుణములుండెను. గుణమనగా ఏమిటి? ఒక ఆలోచన. (ఈ రాత్రి పాఠమునకు దరిదాపుగా నున్న ఒకసంగతిని ఇప్పుడు మీరు విందురు.) గమనించండి, ఆయనలో గుణలక్షణములు ఉండెను. తండ్రి ఆయనలోనే యుండెను. దేవుడు ఆయనలోనే యుండెను. కుమారుడు ఆయనలోనే యుండెను. ఇక్కడున్న ఇవన్నియూ ఆయన గుణ లక్షణములను వెల్లడి పరచుచుండెను. ఏది క్రమము లేకుండా లేదు. దేవుడు అంతమును ఆదిలోనే చూచెనని మీరకొనుట లేదా? నిశ్చయంగా ఆయన చూచెను. ఏదియూ క్రమము తప్పలేదు. ఆయన గుణ లక్షణములను వెల్లడి చేయుటయే అది.
54మానవుని పడునట్లుగా చేయుట ద్వారా ఆయన న్యాయవంతుడు కాలేడు. ఆయన మనిషిని సమాన ప్రాతిపదిక మీద ఉంచెను.స్వేచ్చాయుత జీవిగా ఉంచెను. అతడు ఎన్నిక స్వేచ్చాగా చేసికొను వీలు కలుగచేసెను, కాని పతనమగునని ఎరుగును. ఒకటి నశించనిచో ఆయన రక్షకుడు కాజాలడు ఒక వ్యాధి లేనియెడల ఆయన స్వస్థ పరచువాడు కాజాలడు. ఈ రీతిగా అవన్నియూ ఉండవలసి యున్నవి. ఆయన యొక్క గొప్ప గుణ లక్షణములు వెల్లడి కాబడునట్లుగా దేవుడు వాటిని ఆలాగు చేసెను. ఆలాగు కానియెడల ఆయన ఎన్నటికిని రక్షకుడు కాకపోయెడి వాడు. కాని సమయము అనునది లేకముందే ఆయన ఒక రక్షకునిగా ఉండెను. ఆయన రక్షకుడు గనుక ఒకటి నశింపబడవలసియున్నది. అదెట్లు జరుగును.
దానిని ఆయన తీసికొని రక్షించుటకు బదులుగా నాశనము చేసిన యెడల అది ఆయన తీర్పులో న్యాయము కాదు. ఒకనిని నరకమునకు పంపి ఆయన న్యాయవంతుడు కాజాలడు. ఆయన ఒక గొప్ప న్యాయాధిపతి, చూడండి. ఆయన తనకు తానే విరోధముగా పనిచేసికొనుచున్నట్లగును. కాబట్టి ఆయన ఒక మానవుని అక్కడపెట్టి స్వేచ్చాజీవిగా చేయవలసి యుండెను. అతడు పతనమగునని ఆయనకు తెలియును. ఆయన స్వరూపమందున్న మానవుడు ఎట్లు పడిపోవును? మీరిప్పుడు పగటి వెలుగు చూచుచున్నారు? కాబట్టి ఆయన మూల సృష్టి నుండి ఒక ఉప ఉత్పత్తి చేయవలసియుండెను. అదిప్పుడు మీరు చూచుచున్నారు చూచారా? మీరక్కడికి వచ్చుదురు. చూచారా? అదే పడినది. దానిని ఆయన పడునని ఎరిగియుండియే చేసెను. ఒక ఘనహీన పాత్రగా సాతాను చేతులలో అది పెట్టబడెను.
ఈనాడు ఘనత ఎక్కడ పెట్టబడినది? దాని గూర్చిమీరు ఆలోచించండి.
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి.
55ఆమె ఇతర ఆడజాతి వాటివలె గాక ఈ విధముగా రూపించబడును. స్త్రీ ఆ తక్కిన ఆడ వాటివలె రూపింపబడక వేరుగా ఎందుకు రూపించబడెను? అను ప్రశ్నమరల వేయుదురు. ఏ ఇతర ఆడ జాతియు ఆ విధముగా రూపించబడలేదు. ఈనాటిది కాదిది. వారుండలేరు. ఆ విధముగా నుండుటకు వారు తయారు కాలేదు. అది ఆ స్త్రీ వలన కాదు. స్త్రీని దేవుడు ఆ తక్కిన ఆడ వాటివలె ఎందుకు చేయలేదు. ఆ తక్కిన ఆడవాటి వలెనె ఆమె ఉండి పిల్లలను కనవచ్చును గదా? ఆమె భర్తతో యుండి జీవించును. బిడ్డలను కను కాలము వచ్చినప్పుడు బిడ్డలను కనును. ఆ విధముగా ఇతర ఆడ జాతివాటివలె ఆమెను ఆయన ఎందుకు చేయలేదు?
ఈ మాటలను నేను చెప్పలేను. నా మాటలు మీకర్ధమగుచున్నవి. లేదా? మీరు అర్ధము చేసికొనగలుగుచున్న యెడల ''ఆమేన్'' చెప్పండి. అవును . చూడండి? (యువతీ యువకులు ఇక్కడ కూర్చోని యున్నారు. చూడండి?) కాని మీరెరుగుదురు, జంతువులు ఒక ప్రత్యేక సయములోనే ఎదకు వచ్చును, సంవత్సరములో ఒక కాలములోనే అది తన జతను చేరును. కాని స్త్రీకి సమయ అవధిలేదు.
ఈ విధంగా ఆయన ఆమెను ఎందుకు తయారు చేసెను?
56ఆయన యొక్క గొప్ప కార్యక్రమము వెల్లడియగుటను గమనించండి. ఇంకా మనము చెప్పుకొనుచుండగా అది మరింత పూర్తిగా విశదమగును. నిన్నటి వరకు ఇది నాకు తెలియనే తెలియదు. ఆదిలోనే దేవుడు ఆమెను తక్కిన ఆడ జాతివలె ఎందుకు తయారు చేయలేదు? ఎందుకనగా అది ఆయనకు వర్తించదు. అయన సమస్త పవిత్రతకు ఊట. ఆ కారణము చేతనే ఆయన ఆమెను సాతాను పట్టుకొనుటకు తావిచ్చెను. అది వంకర చేయుటలో సఫలమాయెను. అటువంటి జీవి ఆయనకు చెందదు.
ఆదిలోనే ఆలాగు రూపించబడినది. ఆదియందు ఆయన రూపించిన సమస్తమునూ అవిచ్చిన్నముగా యుండెను. ఆయన యొక్క మూల క్రియలన్నియూ అవిచ్చన్నముగానే యుండెను. ఆడ కుక్క, మగ కుక్క; చూడండి. ఆడ ఆవు, మగ ఆవు…ప్రతిదియూ అవిచ్చిన్నముగానే యుండెను. ప్రతి సృష్టియు అవిచ్చిన్నముగనే యుండెను. విత్తనము చనిపోయి భూమి లోనికివెళ్ళును. మరణము, సమాధి మరియు పునరుద్ధానమువలెనె యున్నది.రసము చెట్టులో నుండి బయటకు వచ్చును. ఆకురాల్చును. క్రొత్త అకును తొడిగి మరుసటి ఏట ఆది పునరుద్ధానముతో వచ్చును. నా భావము గ్రహించారా? ప్రతిదియు, ప్రకృతి కూడా దేవునికి చెంది అవిచ్చిన్నముగా కొనసాగుచున్నది. ఏకత్వముతో యున్నది. ఇక్కడ ఒకటి దేవునియొక్క అవిచ్చిన్నతను మీరి రూపించబడినది. ప్రకృతి పాపము చేయలేని రీతిగా రూపించబడెను గనుక పాపము చేయలేదు ఆలోచించండి! దేవునియొక్క మూల సృష్టి పాపము చేయజాలదు.
ఈ ధృక్కోణములో ఇప్పుడు సంఘముయొక్క వంకరతనమును మీరుచూచుట లేదా? దేవుని వాక్యమే అసలయినది! దేవునిలో ఏ పాపమును లేదు. నీ భావము గ్రహించారా? ఒక వంకరతనము ద్వారా ఉనికిలోనికి వచ్చిన ఒ జీవిక్కడున్నది. దేవుడు ఒకసంఘమును కలిగియుండబోవు చున్నాడు, కాని వారిక్కడ పొందిన వంకర దానిని చూడండి. దేవుడు పురుషుడు, స్త్రీ ని సృజించెను, కాని ఈ స్త్రీని చూడండి… దేవుని యొక్క మనస్సులో ఏమిఉండెనో దానిని ఈ చిహ్నములు చూపించు చున్నవి. దానిని వివరించుటకు మనము గంట, రెండు గంటలు తీసికొన వచ్చును. ఈ జీవి ఆలాగు చేయబడెను. వాడు వశపరచుకొనెను. ఇంకా వాడామెను వశపరచుకొని యున్నాడు. పురుషునివలె ఆమె కూడా సిలువ యొద్దకు పరుగిడి వచ్చుట మంచిది.
57గమనించండి, సృష్టి యావత్తు అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నది. అదే మూల సృష్టివలె స్త్రీని ఆయన చేసియుండినచో అక్కడ పాపము ఉండెడిది కాదు, ఎందుకనగా అది ఆమె చేయలేకపోయి యుండెడిది, దానిని ఆమె చేయలేక పోయి యుండెడిది. ఆమె మూల సృష్టికి వంకరయై యున్నది. మూల సృష్టికి వంకర కలుగజేయుటయే పాపము.
అబద్దమనగా ఏమిటి? వంకర చేయబడిన సత్యము. వ్యభిచారమనగా ఏమిటి? మంచి పనిని వంకర చేయుటయే. కాబట్టి అక్కడ వంకరగా చేయబడిన జీవియున్నది. అంతా వంకర అందుకే ప్రశ్న అంత గొప్పగా యున్నది. పురుషుని నుండి తీయబడిన ఒక భాగము, ముక్క అతనిని మోసపుచ్చెను. దానిని దేవుడే చేసెను ఇప్పుడది రుజువు చేశాము. ఆమె అందుకొరకే తయారు కాబడెను.
భూమిమీది అతి నీచమైనది దుర్నీతి స్త్రీ యేనని చెప్పగలము. యువతులారా, దీనిని క్షమించండి. ఒక పెంటవేయు తొట్టె; లైంగిక విశృంఖలతకు మూలము. అసభ్య స్రీ అంతకన్న మరేమీ కాదు. ఆమె అసభ్యతగా ప్రవర్తించిన యెడల ఒక లైంగిక పెంట తొట్టిగా నుండి కలుషితము చేయును. ఆమె ద్వారా మురికి, అపవిత్రత, నీచము, అధఃస్థితి సమకూరును. ఆ విధముగా ఆమె ఎందుకొరకు తయారు చేయబడినది? మోసపుచ్చుటకు భూమి మీదనున్న ప్రతి పాపమునకు కారణము స్త్రీయే.
పోలీసు దళమునకు చెందిన ఒక స్త్రీ షికాగో నుండి ఈ వ్యాసము వ్రాసెను. అమెరికా దేశపు ప్రధాన నగరములో జరిగిన నేరములను పరిశోధించిరి. ఇట్లు తేల్చి చెప్పిరి, ''అమెరికా దేశములో ఏ రూపములో జరిగిన ఏ నేరమున కయినా గాని తొంభై-ఎనిమిది శాతము కారణము స్త్రీయే. ఆ నేరములో గాని, దాని వెనుక గాని స్త్రీ యున్నది.'' చివరలో మీరు సంగతిని గ్రహించునట్లుగా ఇదంతయూ చెప్పుచున్నాను.
GEN 3:6,16
58మోసము చేయుటకు ఆమె తయారు చేయబడెను. ఆది యందు ఆదామును ఆమె ఆలాగు చేసెను. ఆ ఫలము రమ్యమైనది అని చెప్పి అతనిని మోసము చేసి వాక్యము నుండి దూరపరచినది. నేడు సంఘము కూడా అదే చేయుచున్నది, కాని ఆతరువాత అతడు ఆమెను ఏలుబడి చేయువాడాయెను, ఆమె పాలకుడు.
ఈ దినము యొక్క భావనలో ఎంత తేడా వచ్చెను! ఆమెను అతడు ఏలుబడి చేయుటకు బదులుగా ఆమె అతని దేవత అయినది. నిశ్చయంగా, ఆమె అతనిని ఏలుచున్నది. నేను దేనిని గురిపెట్టి చెప్పుచున్నానో మీరు బాగుగా అర్ధము చేసికొని యుందురు. ఆమె యొక్క అందము ద్వారా, లైంగిక నియంత్రణ ద్వారా, సాతాను ఆమెకిచ్చిన రూపము ద్వారా, సాతాను చేసిన ఉప ఉత్పత్తి ద్వారా, ఆమె దేవుని కుమారులను మోసపుచ్చుటకు పంపబడియున్నది. సాతాను యొక్క ఏఇతర సాధనము కంటెను ఆమె ద్వారానే ఎక్కువ మంది నరకమునకు పంపబడుదురు అది అక్షరాలా నిజము. సహోదరీలారా, మీ గూర్చి కాదు. నీతిమాలిన వారిని గూర్చి నేను మాట్లాడుచున్నాను. కొద్ది నిమిషములలో ఇక్కడున్న దేవుని వాక్యములో మీ స్థానమేమిటో చెప్పెదము. ఆది నుండియు అది దేవుని సంకల్పము.
PROV 7:27•
MATT 19:8•
ACTS 19:35
59ఈనాడు అమెరికా దేశముయొక్క దేవుడెవరు? కొన్ని సంవత్సరముల క్రితం ఆలయంలో దానిపై నేను బోధించాను. గుర్తున్నదా? రంగులు పూసికొని, మోకాళ్ళ వరకు బట్టలు ధరించి కూర్చొనియున్న ఆ స్త్రీయే ఈ ఆధునిక దినపు దేవుడు. ''ఇదిగో మీ దేవుడు'' అని నేను చెప్పాను. అది నిజము. ఆమె అర్ధనగ్నంగా ప్రతి వ్యాపార ప్రకటనలోనూ యున్నది. వీధిలోనూ ఆమె ఆ రీతిగానే యున్నది. యేసు చెప్పినట్లుగా ''ఆది నుండియూ'' ఆమె సాతాను యొక్క సాధనము. చూచారా? ఆలాగున్నదని ఇప్పుడు మనము చూస్తున్నాము. ''ఆదినుండి'' ఉన్న దానినిగూర్చి ఆయన మాట్లాడుచున్నాడు.
అన్యులు ఆమెను ఒక దేవతగా చేయుట పరిపాటి అయినది. మీకది తెలియునా? నిశ్చయంగా చేసిరి. వారామెను దేవతగా చేసిరి, ఎందుకనగా వారు తమ పూజలో లైంగిక క్రియలు జరిగించెదరు. ''ఆమెయే సృష్టికర్త. ఆమె తన గర్భములో సంతానమున మోసి సృష్టించినది'' అని వారు చెప్పెదరు. అది అబద్ధము. సృష్టికర్త ఒక్కడే; ఆయన దేవుడే. అక్కడ పౌలును మీరు గుర్తుచేసికొనండి. ''ఎఫెసు యొక్క డయానా, ఒక రాతి ప్రతిమ, ఆకాశపు దేవత అని చెప్పిరి.'' అన్యుల ఆరాధన ఎట్లున్నదో మీరు చూచారా? మనము దానిని ఎరుగకుండానే మరల తిన్నగా అన్యుల ఆరాధనలోనికి, స్త్రీ పూజలోనికి తిరిగియున్నాము. స్త్రీ ఆరాధనయే భూమి మీద అతి నీచమైనది. ఆమె పురుషుని తన ఇష్టము వచ్చినట్లుగా మళ్ళించగలదు. బయట అందము లోపల నరకము ఉన్నదని తెలియుట లేదు. ''ఆమె గవిని పాతాళ ద్వారము,'' అని సొలొమోను చెప్పెను.
REV 2:15
60ప్రకటన 2వ అధ్యాయము 15 వచనములో నికొలాయితుల బోధను గూర్చి యేసు మాట్లాడిన దానిని ఇక్కడ మనము తేటగా చూడగలము. సంఘము వాక్యము నుండి దూరంగా పోవుట రానున్నదని మనకు తెలియుచున్నది.
టెలివిజను మీద ఈ చెడ్డ, భక్తిహీన, మురికి కార్యక్రమమును వచ్చుట కూడా ఇక్కడ మనము చూడగలము. హాలివుడ్ లైంగిక రాణులు కనబడుచున్నారు. ఈ పట్టణములోని అపవిత్రతను మనము చూడగలము. చిన్న బట్టలు ధరించుకొని, ఇరుకుగానున్న వానితో త్రిప్పుకొంటూ వీధుల్లో నడచుచున్న ఈ చిన్నబాలికలను చూడగలము. చలి వారిని గడ్డ కట్టించి చంపగలదు. దానిని దయ్యము చేయుచున్నదని వారికి తెలియదు. వారు ఒక అపవిత్రాత్మతో నింపబడి యున్నారు గాని వారికది తెలియదు. ఒక ఆడ కుక్క అలాగు చేయుట మీరు చూచుట లేదు గదా? చూస్తున్నారా? మరే ఇతర ఆడది ఆలాగు చేయుట మీరు చూడరు. ఏ మగదియు అలాటి దానియొద్దకువెళ్ళదు.
61చూచారా?
ఇప్పుడు, మీరు దృశ్యము గ్రహించారు కదా? ప్రభుని చిత్తమయితే ఒక క్షణంలో మరో సంగతి పరిచయము చేయుదును.
నికోలాయితుల యొక్కబోధను మీరు చూచారు, వారినిఇప్పుడు చూడండి. యుక్త వయస్సు రాణులను మీరు చూడండి, ఆలాగు పిలచుకొను చున్నారు, వీధుల్లో బట్టలు తీసి తిరుగువారు బట్టలు విప్పుకొనిన ప్రదర్శనను చూచుటకు చెడ్డ చిత్రములకు పరుగిడుచున్నారు. మీరు ఒక్కసారి కండ్లు తెరచి, వీధుల్లో చూడండి. మీకదేకనబడును. అంతా నగ్న స్థితియే, నిశ్చయంగా, దానిని వారెందుకు చేయుచున్నారు? శోధించుటకు మాత్రమే ఆమె అలాగు చేయుచున్నది. ఆమె చెడినది గనుక ఆలాగు చేయుచున్నది. ఆ విధంగా ఆమె చేయబడినది గనుక ఆలాగు చేయుచున్నది. ఆమె తాను సాతాను యొక్క చేతులలో ఒక సాధనముగా యున్నదని గ్రహించుట లేదు. ఆమె అదియే అయియున్నది.
ఈనాడు మన పాఠశాలలో సహితము లైంగిక క్రియలను నేర్పించుచున్నారు. స్త్రీ ఆరాధనతో మన ప్రపంచము కుళ్ళిపోయినది. వారది నమ్మగోరుట లేదని నాకు తెలియును. నిలబడి ఒక రకమగుపాట పాడి స్త్రీలతో రాత్రంతా నాట్యము చేయుచూ గడుపుచున్నారు. చూచారా? మంచిది. దేవుని దృష్టిలో, వాక్యపు దృష్టిలో ,దేవుడు భూమి మీద చేసిన జంతువులన్నింటిలోనూ ఆమెయే నీచమైనది. గమనించండి.
1COR 14:34•
1TIM 2:12
62అందుకే దేవుడు ఆమెను వాక్యము బోధించకుండా నిషేదించెను. అది నిజము. 1 తిమోతి 2: 9-15. ''స్త్రీ బోధించుటకు గాని ఏవిధమగు అధికారము కలిగయుండుటకు గాని నేను సెలవియ్యను.'' చూచారా;?ఆలాగే 1 కొరింథీ 14:34. ''సంఘములో మీ స్త్రీలను మౌనముగా ఉండనీయుడి. వారు మాట్లాడుటకు అనుమతి ఇవ్వబడలేదు. ఏలయనగా వారు మౌనముగా ఉండవలెనని ఆజ్ఞాపించబడెను. ధర్మశాస్త్రము కూడాఆలాగు ఆజ్ఞాపించుచున్నది.'' కాని ఈ దినమున సంఘము ఏమి చేయుచున్నదో చూడండి? వారు స్త్రీలను సువార్తికులను గాను, సంఘకాపరులు గాను చేయుచున్నారు. బైబిలు దానిని పూర్తిగా నిషేధించుచున్నది. బైబిలు ఈలాగు చెప్పుచున్నది, ''ధర్మశాస్త్రముకూడా చెప్పుచున్నది,'' అంతయూ అవిచ్చిన్నముగా కొనసాగుచున్నది.
గతరాత్రి చెప్పినట్లే ఆరాధనచేయు ఒకే ఒక స్థలము చిందించబడిన గొర్రెపిల్ల రక్తము క్రిందనే యున్నది. ఈనాడు అది ఒక్కటే స్థలము. క్రీస్తులోనే నీవు ఆయన యొద్దకు వచ్చుట ఒక్కటే మార్గము. ఆరాధన చేయు స్థలము అది ఒక్కటే. అది ఎల్లప్పుడూ అలాగేయున్నది. చిందించబడిన రక్తము క్రింద మాత్రమే ఆరాధనకు స్థలమున్నది.
MATT 19:8•
1TIM 2:12
63కాబట్టి ఇప్పుడు దానియొక్క పూర్తి స్వరూపము విప్పబడియుండుటను మనము చూచుచున్నాము. ఆమె స్థితి అది. అందువలననే దేవుడామెను ఉపదేశించ నీయలేదు. సంఘములో మరేమియూ చేయనీయలేదు. ముఖమునకు ముసుగు వేసికొని ఆమె మౌనముగా కూర్చోండవలసినదే.
నేను చెప్పిన సంగతులను, నేను చేసిన క్రియలకు కారణమును ఇప్పుడు మీరు చూడకలుగుచున్నారా? సోదరీ సోదరులారా, ఇదంతయూ నేను నా హృదయములో ఎరుగుదును. మీ స్థానమేమిటో సోదరీలారా, నాకు తెలియును. (ఒక్క క్షణములో చెప్పెదను) మీలో దేవుడు అద్భుతమగు శీలమును మలచగలడు, కాని ఆది నుండియూ మీరేమైయున్నారో, ఆ అవతల దృశ్యమును మీకు చూపించుటకు ప్రయత్నించుచున్నాను. దానిని కనుగొనుటకు ''ఆది యెద్దకు వెళ్ళుడి'' అని యేసు మనకు చెప్పెను. అదే మనము చేయుచున్నాము.
దీని మీద ఇంకా పెద్ద అంశమును వివరించనై యున్నాను. దానిని మీరు అర్ధము చేసికొందురని ఆశించుచున్నాను. ఈ టేపును వినుచున్న జనులు అర్ధము చేసికొందురని ఆశించుచున్నాను. వెనక్కు వెళ్ళండి. యేసు చెప్పిన దానిని చూపించుటకే ఇది చెప్పుచున్నాను. ''ఆది నుండి ఏది ఉండెనో దాని యొద్దకు వెళ్ళుడి.'' అన్నవిషయములకు ఆది యొద్దకు వెళ్ళవలెను. దానిని ఈనాడు మీరు చూడగలరు.
MATT 19:8•
GAL 1:8
64ప్రజలు నేను స్త్రీ ద్వేషకుడనని చెప్పు కొనుచున్నారు. అది సత్య దూరము. నేను అలాటి వ్యక్తిని కాను. '' స్త్రీ ద్వేషకుడు'' అని పిలుచు చున్నారు. గుర్తుంచుకొనండి. వారు పౌలును ఒక స్త్రీ ద్వేషకుడుని పిలిచారు. ఒక స్త్రీ బోధకురాలు కొద్ది కాలము క్రితం ఈలాగన్నది, ''ఓ, నీవు ఈ ముసలి పౌలువలె ఉన్నావు. ఎప్పుడూ స్త్రీలను ఎత్తి చూపుటయే.'' బైబిలు వ్రాయుటకు అనుమతించబడిన దేవుని పరిశుద్దుడు, క్రొత్త నిబంధన వ్రాసెను. ఆ మాటలలో వాదమేమైనా యున్నాదా? అతడు ఇట్లనెను. ''నేను బోధించినది తప్ప మరొకటి పరలోకము నుండి దేవదూత వచ్చి ప్రకటించిననూ శాపగ్రస్తమగు గాక!'' స్త్రీ బోధకుల జోలికి పోవద్దు.
ఏలియా ఒక స్త్రీ ద్వేషకుడని వారన్నారు. అతడుస్త్రీ ద్వేషకుడు కాడు. నిజమైన స్రీ లను ద్వేషించలేదు. ఆ యెజెబెలులు అంటే అతనికి నచ్చలేదు. వారాలాగుండినప్పుడు దేవుడు కూడా తప్పక ఆలాగే ఉండియుండాలి, ఎందుకనగా ఆయనే వాక్యముగా ప్రవక్తల యొద్దకు వచ్చుచుండెను. కాబట్టి దేవుడు కూడా తప్పక అలాగే ఉండియుండును. చూడండి. ఆయనకు ఆది సృష్టి తెలియును. ''ఆదినుండియూ'' అని ఆయన చెప్పెను. ''ఆదినుండియూ'' ప్రవక్తల యొద్దకు వాక్యము వచ్చెను.
GEN 3:16•
MATT 19:8•
1COR 11:9•
1COR 14:34•
1TIM 2:11
65ఆమెను ఆయన పురుషుని కొరకు చేసెను.పురుషుని ఆమె కొరకు చేయుటకాదు. అది మీకు తెలియునా? ''స్త్రీ, పురుషుని కొరకు తయారు చేయబడెను గాని పురుషుడు స్త్రీ కొరకు తయారు చేయబడలేదు.'' ఎందరికిది తెలియును? బైబిలు దానిని బోధించుచున్నది. మంచిది. పతనమునకు ముందు సర్వసృష్టి యొక్క పురుషునికి సమానముగా ఆమెకు ఒక స్థానము ఇయ్యబడెను, ''కాని పతనము తరువాత.'' ఇప్పుడు ఈ అంశము ప్రస్తావించుదము — కాని పతనము ''తరువాత'' అతడు ఆమె యొక్క ఏలుబడి ఆయ్యెను. ఆమె అన్ని విషయములలోను మౌనముగా ఉండవలసినదే. కాబట్టి ఆది ప్రారంభము ఆలాగు పరిసమాప్తమాయెను. ''ఆదినుండియు ఆలాగు లేదు'' అని యేసు చెప్పెను. (అది సమయము ఆరంభమయినప్పటి సంగతి, దేవుడు దానిని తనయొక్క మూల సృష్టిలో చేసెను.) దానిని అర్ధము చేసికొనిన వారందరూ మరల ''ఆమేన్'' చెప్పండి.
ఆదియందు దేవుడు ఒకే పురుషుని, ఒకే స్త్రీని సృజించెను. అప్పుడు స్త్రీ ఆ ఇతర జంతువులకన్న వేరుగా చేయబడెను, మోసము కొరకు చేయబడెను. ఇప్పుడు గమనించండి, ''ఆదినుండియూ ఆలాగు లేదు.'' ఆమె అసలు స్థితిలో ఉండియుండిన యెడల ఎన్నడునూ ఆమె పడిపోయియుండెడిది కాదు. కాని ఆమె పతనమునకు హేతువాయెను, ఆ అవాంతరము దేవుని యొక్క అవిచ్చిన్నత అంతటినీ పాడుచేసెను. అందువలన భూమి మీదికి మరణము, దుఃఖము వచ్చెను. ఆలాగు ఆమె చేయబడినది.
66ఇప్పుడు గమనించండి. ఆది ''తరువాత,'' ఆది తరువాత, అనగా కాలము ఆరంభమయిన పిదప, నిత్యత్వము గల ఆ వెనుకటి సమయము తరువాత ఇది జరిగెను. గమనించండి. హవ్వ వలన ఆ పతనము జరిగినప్పుడు, పడిపోయిన తరువాత,మరొక నిబంధన చేయవలసిన అవసరము ఏర్పడెను. ఇది మిమ్మును తొట్రిల్లచేయును, కాని ఇది సత్యము అని నిరూపించుటకు మీకు వాక్యం చూపించుదును.
ఇప్పుడు గమనించండి, పతనము తదుపరి: ఆదియందు దేవుడు ఒక జాతిని చేసెను, కాని పడిపోయిన తరువాత మనము దానివెనుకకు వెళ్ళియున్నాము, నిబంధన సహ-సమానము — కాని పతనము తరువాత మరో నిబంధన చేయబడినది. ఇప్పుడు ఆమె అతనితో ఇక ఏలుబడి చేయజాలదు. వారికి విడవిడిగా నిబంధన కావలెను.
GEN 3:14-19
67అది నిజమేనేమో మనము చూద్దాం, ఆదికాండము 3వ అధ్యాయము తీసికొని ఇది సరియేనేమో కనుగొందము. ఎందుకనగా ఈ సంగతుల పట్ల అనుకూల ధోరణిమనము కలిగియుండాలి. అవి ఖచ్చితంగా నిజము అని నేర్పించబడవలెను. ఇంకా కొద్ది సమయము మనకున్నది, ఎందుకనగా ఇప్పుడు అంతమునకు మనము ఎంతో దూరములో లేము. అంశము యొక్క చివరి భాగమును చూడవలెను. విడాకుల గూర్చిన వివరణను చూపించవలెను.
ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనారంభము నుండి 16వ వచనము వరకు చదువవలెను. 14వ వచనము యొద్ద మనము ఆరంభించుదము.
అందుకు దేవుడైన యెహోవా… సర్పముతో , [దానిని దేవుడు శపించుచున్నాడు] నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోను నీవు శపింపబడినదానవై నీ కడుపుతో ప్రాకుచూ నీవు బ్రదుకు దినములన్నియు మన్నుతిందువు.
మరియు నీకును స్త్రీకినినీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును.నీవు దాని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. [స్త్రీ ద్వారా వాగ్దానము వచ్చుచున్నది - అది విమోచించు మెస్సీయ్యా.]
అయన స్త్రీతో … [ఇప్పుడు చూడండి. సర్పముతో ఒక నిబంధన యున్నది, ఆదికి ముందు వారు బాగానే యుండిరి.]
ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛకలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. [ఇప్పుడు ఇక ఇద్దరు సమానులు కారు. ఆమె ఏలుబడి చేయునదే గాని మారిపోయెను.]
ఆయన ఆదాముతో - నీవు నీ భార్య మాట విని తినవద్దిని నేను నీకిజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడియున్నది. [ఆదామును శపించలేదు, నేల శపించబడియున్నది]… ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియూ దాని పంట తిందువు.
అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంటను తిందువు.
నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
GEN 3:16•
MATT 19:8
68రెండు నిబంధనలు! యేసు చెప్పిన ''ఆదియందు'' అను మాటకు అది ముగింపు. ''ఆది నుండియూ ఆలాగు లేదు.'' ఇప్పుడు మరో నిబంధన మనకున్నది. గమనించండి, అది మరొక నిబంధన. ఉత్పత్తికి ఇప్పుడు మరోక నింబంధన యున్నది. గమనించండి, పతనము వలన శ్రమ, మరణము సృష్టిలోని ప్రతి జీవికిని ప్రాప్తించెను. ప్రకృతి యంతటిలో భేదము వచ్చెను.
''ఆది నుండియు ఆలాగు లేదు'' అని యేసు చెప్పిన దానిని గూర్చి గమనించుదము.''ఆది నుండి '' ఆలాగు లేదు. అది ''తరువాతనే'' ఇట్లున్నది. ఒక ద్వి-నిబంధన అక్కడున్నది. మొదటి నిబంధనలో ఆదామవ్వలు సమానులుగా ఉండిరి. ఒకే పురుషుడు. ఒకే స్త్రీ. ఇప్పుడు స్త్రీ పాపము చేసినది. ఆమె ఏమి చేసినది. అందువలన అందరూ మరణమునకు గురి అయిరి. దేవుడు అందువలన మరొక నిబంధన చేయవలసి వచ్చెను. అది ఇక్కడ ఆదికాండము 3:16లో యున్నది. ఆయన మరియొక నిబంధన చేసెను.
69ఇప్పుడు ప్రపంచము మరల జనవృద్ది కావలసియున్నది. ఒకే పురుషుడు, ఒకే స్త్రీ. ఇప్పుడు స్త్రీ పాపము ఆదిలో వలె కాదు. అసలు సృష్టి ద్వారా కాక లైంగిక వాంఛ వలన వృద్ది అయ్యెను ''ఆదియందు'' ఆలాగు లేదు అను మాట దీనికి వర్తించును. కాదా? ఆదియందు ఒకే పురుషుడు, ఒకే స్త్రీ యుండెను. కాని ఆమె హద్దును మీరి పాపము చేసి నప్పుడు ప్రపంచము ఆది సృష్టి ద్వారా కాక, శరీరేచ్చ వలన జనముతో వృధ్ది అయ్యెను. ఇప్పుడు స్త్రీ ఎక్కడున్నదో చూడండి? ఈనాడు లోకము జనము తోనింపబడుచున్నది ఆ విధముగానే.
ఆ కారణము చేతనే యేసు ఒక స్త్రీ ద్వారా రావలసి వచ్చెను. శరీరేచ్చ లేకుండా ఆదియందుండిన విధానమునకు తిరిగి తెచ్చుటకు ఆయన ఉద్దేశించెను. ఆయన కన్యకకు జన్మించినవాడు. కాని, హల్లెలూయా, శరీరవాంఛ లేని కాలము ఒకటి వచ్చును. దేవుడు తన పిల్లలను భూమి యొక్క మట్టిలో నుండి పిలచును. స్త్రీ ద్వారా కాదు గాని ఆదియందుండిన రీతిగానే, మట్టి, సూర్య వెలుగు మరియు పెట్రోలియంను కలిపి మలచుట ద్వారా ఆయన మరల మొదటిసారి ఆదామును చేసినట్లుగానే సృష్టిని చేయును.
యేసు దీనిని సాధ్యపరచెను. దేవుడు ఒక మానవుడై వచ్చుట ద్వారా ఈ లోకములో చనిపోకలిగెను. ఒక స్త్రీ ద్వారా వచ్చెను. ఇప్పుడు పాపము ద్వారా పరీక్ష జరుగుచున్నది.
70ఆది ''తరువాత'' మరొకటి ఉత్పత్తి అయినదని ఇప్పుడు మీరు చూచుచున్నారు. ఇప్పుడిది మిమ్ములను ఆశ్చర్యచకితులను చేయును. మీరు అలసిపోయారా? మరికొంతసేపు నెమ్మదిగా కూర్చొనండి. శరీరేచ్చ ద్వారా స్త్రీ పురుషుల మధ్య ద్వినింబంధన చేయబడెను. (అసలు నిబంధన కాదు, మరొక నిబంధన ఇది) ఇప్పుడు ఏమి పరిచయము చేయబడెను! అన్నింటిలోను బహు భార్యాత్వము. అది తరువాత మానవులు మరియు జంతువుల లోను కూడా బహు భార్యాత్వము ప్రవేశమాయెను. ఆది తరువాత పతనము కలిగెను.
దేవుడు రెండవసారి, శరీరవాంఛ ద్వారా మరొక క్రొత్త సృష్టిని నెలకొల్పెను. దేవుడు ఆది సృష్టిని శరీరేచ్చ లేకుండా తయారు చేసెను. అది మీరు నమ్ముదురా? ఇప్పుడు ప్రకృతితో మరొక నిబంధన చేయబడినది? శరీర వాంఛద్వారా ఆయన మరియొక క్రమమును ప్రవేశపెట్టెను. రెండవ నిబంధన: ఒకపురుషుడు, అనేక స్త్రీలు, ఒక మగ దుప్పి, అనేక లేళ్ళు. అవునా? ఒక ఎద్దు. అనేక ఆవులు, ఒక పుంజు, ఆవరణ నిండా పెట్టలు (అది నిజమేనా?); ఆయనకు ఇష్టానుసారుడగు ఒక దావీదు, అయిదు వందలమంది భార్యలు, ఒక సంవత్సరములో అతనికి వందకుపైగా పిల్లలు పుట్టియుందురు, వివిధ స్త్రీలకు కనెను — దేవునికిష్టానుసారుడగు వాడే ఒక సొలొమోను; వేయిమంది భార్యలు. కాని ఇప్పుడు గమనించండి, ఆదియందు అలాగు లేదు, కాని ''తరువాత'' ఈలాగున్నది. దీనిని స్త్రీయే చేసినది, ఆమె ఇప్పుడెట్లున్నదో అలాగు తయారయినది. చూచారా?
GEN 20:1,2
71రాజగు దావీదు క్రీస్తుకు సాదృశ్యము! (దానిని మీ మనస్సులో గుర్తుంచుకొనండి.) దావీదు క్రీస్తుకు ప్రతినిధి. అది మీరు నమ్ముదురా? క్రీస్తు అతని సింహాసనము మీద కూర్చొనియున్నాడు. దేవునికి ఇష్టానుసారుడగు ఈ దావీదు అయిదువందల మంది భార్యలను చేసికొనెను. నేను చెప్పినది గ్రహించారా? దావీదునకు అయిదు వందల మంది, సొలొమోనుకు వేయిమంది. స్వాభావికంగా సొలొమోను దావీదుకు కుమారుడు. ఆత్మసంబంధముగా దావీదు కుమారుడగు యేసుకు అతడు సాదృశ్యము, కాని అది స్వాభావిక శరీరజీవితము; ఇది ఆత్మ సంబంధమైనదిగా ఉండబోవుచున్నది, సృజించబడెను. సృష్టించబడెను. చూడండి. ఆదియందు అలాగే యుండెను గాని ఇప్పుడు ఇట్టి జీవితము మనము జీవించుచున్నాము.
గమనించండి! (ఇప్పుడిది తప్పిపోవద్దు; దీనినంతటినీ మీ హృదయములో ఉంచుకొనండి.) ఆ స్త్రీలలో ఏఒక్కరు కూడా ఇంకొక భర్తను కలిగియుండలేదు. అతడు అసలు సృష్టిగాని ఆమె కాదు. ఆ స్త్రీలలో ఎవరికీ మరొక పురుషుడు లేడు, కాని ఒక భర్త వేయి మంది భార్యలను కలిగియుండెను. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది బైబిలు.
అయితే వెనక్కు వెళ్ళి, సమయమును తీసికొని ఆదిలో ఎట్లున్నదో మీకు చూపించాను, యేసు అదే చెప్పెను. దానిని మీరు తేటగా చూచుచున్నారా? చాలా మందిని కలిగియుండగలడు.
GEN 20:1,2
72'' ఓ! అది ఇశ్రాయేలీయులకు మాత్రమే'' అని మీరందురు. అంతేనా? అబ్రహాము శారాను ఫిలిష్తీయ దేశములోనికి తీసికొని వెళ్ళెను. అక్కడ అబీమెలెకు అను ఒక రాజు ఉండెను. శారా వంద సంవత్సరముల వయస్సుగలది, కాని ఆమె యువతిగా మార్పుపొంది. అందముగా ఉండెను. అది మీరెరుగుదురా? మంచిది. అబిమెలెకు ఆమెను తన భార్యగా పొందగోరెను. దాని మీది నా వర్తమానము మీకు గుర్తున్నదా? అబీమెలెకు శారాను తన భార్యగా చేసికోగోరెను. ఆమె అబ్రహామునకు పెండ్లి చేయబడినదని ఎరిగినయెడల బహుశా ఆలాగు కోరియుండెడి వాడు కాదు, ''నీవు నా సోదరివి అని చెప్పుము, ఎందుకనగా నిన్ను పొందుట కొరకు నన్ను అతడుచంప వచ్చును,'' అని అబ్రహాము శారాతో అనెను. అతడు అబ్రహామును దేశము నుండి తరిమివేసి ఆమెను తన భార్యగా అతడు ఎందుకు చేసికోలేదు. విశ్వాసులకు మాత్రమే కాక సర్వ సృష్టికిని అది చట్టమై యున్నది. నీవు పాపివైనా, పరిశుద్ధుడవైనా, ఈ క్రియలకు నీవు జవాబు ఇయ్యవలెను.అతడు ఒక అన్య రాజు. ఆ గాధ నిజమని ఎందరు ఎరుగుదురు? పరిశుద్ధ గ్రంథములోని ఆది కాండము 16వ అధ్యాయము అనుకొంటాను.
GEN 20:2,3,5-7
73మీరు గమనించండి. అబీమెలెకుఆమెను తన భార్యగా తీసికొని యుండగలడు. ఈ క్రొత్త హెబ్రీ బాలికపై అతనికి మనస్సుండెను. ''అతడు నాసోదరుడు'' అని ఆమె చెప్పెను.
''ఆమె నా సోదరి'' అని అతడనెను.
''అయితే ఆమెను నాకు భార్యగా చేసికొందును'' అనుకొనెను. ఒక వ్యక్తి అలాగు చేయుట మీరూహించగలరా? కాని అతడు అలాగు తలంచెను.
ఆ రాత్రి అతడు పరుండినప్పుడు ప్రభువు ఒక స్వప్నములో అతనికి కనబడి, ''అబీమెలెకూ, నీవు చచ్చినవానితో సమానము'' అనెను. ఆ యూదా రక్త ప్రవాహమును అతడు అడ్డగించుచున్నాడు, చూచారా. ''నీవు చచ్చెదవు. నీవు మరొకని భార్యను పెండ్లిచేసికొనగోరుచున్నావు,'' అనెను.
''ప్రభువా, నా హృదయ యధార్థాతను నీవెరుగుదువు.'' అతడు తన ''సోదరుడు'' అని ఆమె చెప్పలేదా? ''ఆమె నా సోదరి అని అతడు తానే చెప్పలేదా?'' అని ప్రశ్నించెను.
''నీ హృదయ యధార్థతను నేనెరుగుదును. ఆ కారణము వల్లనే నాకు విరోధముగా నిన్ను పాపము చేయనీయలేదు. అతని భార్యను తిరిగి అతని యొద్దకు పంపించి వేయుము, ఎందుకనగా అతడు నా ప్రవక్త. నీవు అతని భార్యను తిరిగి అతని యొద్దకు పంపించివేయుము. నీ యాజకుడు కాదు. అతడే నీ కొరకు ప్రార్థించును. నీ కొరకు అతడు ప్రార్థించనియెడల నీ దేశమే పాడగును'' అని ఆయన చెప్పెను. ఆమేన్! ఆశ్చర్యకరమగు కృప అక్కడున్నది. నిజము. ''నీ రాజ్యమే నాశనమగును. ఆమె అతని భార్య అతడు నా ప్రవక్త.'' ఆమేన్. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది లేఖనము.
GEN 2:17•
JOB 14:1,2
74స్త్రీ యొక్క పాపము వలన మరణము ప్రాప్తించెనని మనము కనుగొనుచున్నాము, పురుషుని ద్వారా కాక స్త్రీ ద్వారావచ్చెను. ఆమె జీవించిన విధానమును బట్టి మరణము వచ్చెను. జీవము నిచ్చు ఆమె విధానముకూడా మరణమే. ఎందరికి అది తెలియును? మీరు వాక్యభాగము గుర్తుపెట్టుకొనండి. యోబు 14 అది. మీరు దీనినిప్రశ్నించినయెడల దీని యొక్క ప్రతి ప్రశ్నకు నేను వాక్య భాగమును వ్రాసియుంచాను. యోబు14 మీరు చదివినప్పుడు ఇట్లు కనుగొందురు. ''స్త్రీ కనిన నరుడుకొద్ది దినముల వాడై శ్రమతో నిండియుండును.'' అది నిజమేనా ''అతడు పూవ్వువలె వికసించి కోయబడును. ఆ మీదట అది కనబడకపోవును.'' చూచారా?
స్త్రీకి జన్మించిన ప్రతి మనుష్యుడు మరణములోనే జన్మించుచున్నాడు. కాని దేవునియొక్క సృష్టిలోనికి అతడు జన్మించిన వెంటనే అతడు చావక జీవించును. ఏదెను తోటలోనున్న మరొక చెట్టు నుండి అతడు వచ్చియున్నాడు. అది క్రీస్తు ఆ వృక్షము ద్వారా నిత్యజీవము వచ్చును.
''ఓ! ఆమె ఒక చెట్టా'' అని మీరడగవచ్చును.
నిశ్చయంగా. ''ఈ చెట్టు ఫలము నీవు తినరాదని చెప్పెను. ఆదికాండములో దేవుడు ఈలాగు చెప్పెను. ఆ వృక్ష ఫలము నీవు తినరాదు.'' అవును. ఆ స్త్రీ వృక్షమే. ఆమె ఫలము గల చెట్టు. నీవు నీ తల్లి యొక్క ఫలమైయున్నావు; గర్భఫలము నీవే. అది నిజము. ఏదెను తోటలో నుండిన జీవ వృక్ష ఫలము క్రీస్తే. స్త్రీ ద్వారా మరణము వచ్చెను. అది సృష్టియందు పురుషుని ద్వారా జీవము వచ్చెను. స్త్రీకి జన్మించుట మరణమే. క్రీస్తుకు జన్మించుట జీవము. నా అభిప్రాయము గ్రహించారా? అదే సంగతి. ఇప్పుడు మీరు దేవత ఎక్కడికి వెళ్ళెనో చూడండి. కదా?
మొదటి ఆదామవ్వలు కడపటి ఆదామవ్వలకు మాదిరిగా నున్నారు. చూడండి, హెచ్చవేత. ఆదామవ్వల శరీరేచ్చ వలన నరులు వృద్ధిపొందిరి. భూమిని నిండించిరి, కాని ఆదియందు అలాగు లేదు. దేవుడు కేవలము ఒక స్త్రీని, ఒక పురుషుని సృజించెను. తక్కిన జంతుజాలమును అలాగు చేసెను. చూచారా? చట్టబద్దము. సంఘమువలెనె యున్నది.
LEV 21:7•
EZEK 44:22
75ఈ బయలుపరచబడిన దేవుని సత్యముల సమీక్షను బట్టి మరికొంత ముందుకు వెళ్ళి మనము పరిశోధించుదము. మీరు కోరుదురా? మంచిది.
దీనిని బాగా లోతుగా పరీక్షించువరకు మీకు ఇదికొద్దిగా బాధ కలిగించవచ్చును. నేను దానియొక్క సత్యమునకు మీకు చూపించగోరుచున్నాను.
ఒక విధవరాలిని పెండ్లి చేసికొను సేవకుడు ఎవరూ లేరు. అది మీకు తెలియునా? అది మీరు చదువగోరుదురా? మంచిది. మీరు లేవీకాండము 21:7 మరియు యెహెజ్కేలు 44:22 చదవండి. ఒక పురుషుని ద్వారా తాకబడిన స్త్రీని యాజక క్రమములో యున్నవాడు పెండ్లి చేసికొనరాదని అది చూపించుచున్నది. యేసుక్రీస్తు యొక్క కన్యకయగు వధువుకు ఇది సాదృశ్యము, ఎందుకనగా వారు దేవుని యొక్క అగ్నిని అంటుకొనుచుండిరి, వారు యాజకులు, అహరోను యొక్క కుమారులు. (అదంతయూ చదువుటకు మనకు సమయము లేదు, మధ్యాహ్నమగును. ఇంకా మనకు ఇరవై నిమిషముల సమయమే ఉన్నది.) దేవుని అగ్నిని అంటుకొను అహరోను యొక్క కుమారులు ఒక పురుషుని ద్వారా తాకబడిన స్త్రీని పెండ్లాడుట నిషిద్దము. మారని దేవుడు అలాగు చెప్పెను. ఒక పురుషుని ద్వారా తాకబడిన స్త్రీని పెండ్లి చేసికొనుట వారికి తగదు అనునది ఇక్కడ ఒక మాదిరిని చూపించుచున్నది. దానిని మీరు చూడగోరిన యెడల దేవుని వాక్యము చూడండి. సజీవ దేవునియొక్క సంఘము పవిత్రమైనది, కల్తీలేనిది, దేవుని యొక్క వాక్యముగలది. మానవుని చేతులతో తాకబడిన ఒక శాఖ కాదు!
MATT 5:31,32
76గమనించండి, దీనిని చదువుదము. మీరిది గ్రహించవలెనని నేను కోరుచున్నాను. మత్తయి 5లో బహు ప్రాముఖ్యమగు విషయమును చెప్పెను. మత్తయి 5 మనము చూడగోరుచున్నాము. పురుషునికి చెప్పవలసియున్న సంగతులు కొన్ని నేను వ్రాసియుంచాను. మన సహోదరీల ఎదుట చెప్పుటకు చాలా సమయము తీసికొనవలసి వచ్చుచున్నది. సహోదరీ, దేవుని వాక్యము మీకు వాగ్దానము చేసిన స్థానములో నేను మిమ్మును ఉంచగోరుచున్నాను. ఆ చోటులో కూడా మీరు నిలిచియుండునట్లు చూచుకొనవలెను.
మత్తయి 5:32. ''ఒకటి'' మరియు ''అనేకము'' అను ఉద్దేశ్యమును బలపరచుటకు ఇక్కడ మీరు ఇది గమనించవలెనని కోరుచున్నాను. మత్తయి 5:32, 31 నుండి ఆరంభించుదము.
తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడియున్నది గదా? [అది యేసు మాట్లాడినది. ''అది నుండియూ'' అని చెప్పినది. ఇప్పుడు గమనించండి.]
నేను మీతో చెప్పునదేమనగా - వ్యభిచార కారణమును బట్టి కాక, తన భార్యను విడనాడువాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. [ఎందుకనగా ఆమె మరల పెండ్లి చేసికొనియున్నది.] విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు.
MATT 5:32•
MATT 19:9•
LUKE 16:18
77చూడండి, ఆమెకు బ్రదికియున్న ఒక భర్తయున్నాడు, కాబట్టి ఎవరునూ ఆమెను పెండ్లి చేసికొనలేరు. ఆమె ఏమి చేసినా, ఎవరయినా లెక్కలేదు. ఆమె భర్త బ్రదికియున్నాడు. కాబట్టి ఆమెకు ఎట్టి ఆధారము లేనేలేదు. కాని అది అతనికి చెప్పబడలేదు; ''ఆమెకే హేతువుగానున్నది,'' అతనికి కాదు. గ్రహించారా? వాక్యమును మీరు అవిచ్ఛిన్నముగా కొనసాగించ వలసియున్నారు. చూడండి. అతడు చేయజాలడు అని ఏమియూ చెప్పబడలేదు, కాని ఆమె చేయజాలదు అని చెప్పెను. చూడండి. ''ఆమెకు కారణమగును,'' కాని అతనికి కాదు. ''ఆమెకే అది కారణమగును,'' అని బైబిలు ఖచ్చితముగా చెప్పుచున్నది. మరలా వివాహము చేసికొనరాదని అతనికి విరోధముగా చెప్పబడలేదు గాని ''ఆమెకు'' చెప్పబడెను. ఎందువలన?
క్రీస్తు అందుకు మాదిరిగా యున్నాడు. గమనించండి, అతడు ఒక కన్యకను తప్ప మరెవరిని తిరిగి పెండ్లి చేసికొనరాదని చెప్పబడెను. అతడు తిరిగి వివాహము చేసికొనవచ్చును. ఆమె కన్యకయైన యెడల అతడు తిరిగి పెండ్లి చేసికొనగలడు. కాని అతడు మరొకరి భార్యను పెండ్లి చేసికొనజాలడు. నిశ్చయంగా! ఒక పరిత్యాగము పొందిన స్త్రీని పెండ్లి చేసికొనిన వాడు నిశ్చయంగా వ్యభిచారమందు జీవించుచున్నాడు. అతడెవరయినా నాకు లెక్కలేదు. బైబిలు ఈ విధముగా చెప్పెను, ''విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. పరిత్యాగ పత్రిక పొందిన దానిని పెండ్లాడరాదు.''
ఆ వెనుక నున్న మూలము చూడండి. ''ఆది నుండియూ?'' తిరిగి పెండ్లి చేసికొనుట అతనికి వీలగును గాని ఆమెకు కాదు. దావీదు వలె, సొలొమోనువలె,బైబిలు యొక్క అవిచ్ఛిన్నత వలె, దావీదు మరియు తక్కిన వారందరివలెనె.
1COR 7:11
78ఇప్పుడు మీరు 1 కొరింథీ 7:10లో. గమనించండి, తన భర్తని విడిచిపెట్టిన స్త్రీ ఒంటరిగా యుండవలెను లేదా అతనితో తిరిగి సమాధానపడవలెను గాని మరల పెండ్లి చేసికోరాదని పౌలు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమె తప్పక ఒంటరిగా యుండవలెను. లేదా తనభర్తతో తిరిగి సమాధానపడవలెను. ఆమె తిరిగి పెండ్లి చేసికొనరాదు; ఆమె ఒంటరిగా నిలచియుండవలెను. కాని గమనించండి, ఆయన పురుషుని గూర్చి ఎన్నడూనూ చెప్పలేదు. చూడండి, మీరు వాక్యమును అబద్దముగా చేయజాలరు. ''ఆది నుండియూ, ''లైంగిక ధర్మశాస్త్రము బహు భార్యాత్వమే.
దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క స్వభావముతో నిజంగా అనుబంధమై నడచును. అవిచ్ఛిన్నముగా కొనసాగును. దాని మీద తూర్పు వైపుకు ఒక ఆలోచన, పశ్చిమ వైపుకు ఒక ఆలోచన వెళ్ళి యున్నది. దానిని మీరు కనుగొనుటకు తిరిగి సత్యము నొద్దకు రావలెను. అది ఎల్లప్పుడూ అలాగే యుండును. ఆదినుండియూ అది దేవునియొక్క క్రమ నిబంధన.
మొదటిగా, ఆదికి ముందుకు, ఆది నుండి ఒక్కటొక్కటే యుండెను. పాపము వచ్చిన తరువాత, ఒక పురుషుడు మరియు ఒక గుంపు స్త్రీలు యుండిరి. ప్రకృతిలో అలాగే కొనసాగుచున్నది, ప్రతి జంతువు; మానవులు అలాగే యుండిరి మరియు స్వాభావిక శరీరము జంతువే. మనందరమునూ క్షీరద మూలము అని మనకు తెలియును. చూచారా? దేవుని యొక్క సృష్టి యావత్తు అవిచ్ఛిన్నముగా కొనసాగవలెను.
79కాని ఇప్పుడు ముద్రలు విప్పబడినవి, సత్యస్వరూపియగు ఆత్మ మనలను వాక్యము వైపుకు నడిపించుచున్నది. అనాది కాలము నుండి వచ్చుచున్న తప్పిదములను గూర్చి అది వివరించుచున్నది, ఎందుకనగా ముద్రలు అప్పుడు విప్పబడలేదు. ఇది ప్రత్యక్షము కాలేదు. అది సత్యము.
గమనించండి, నీడలు పడకుండా నీవు చేయజాలవు. (నేల మీద నీడ గూర్చి గత రాత్రి మీకు బోధించాను); అది తిన్నగా రావలసియున్నది. ఒక ఏనుగు యొక్క నీడ భూమి మీద ఏనుగుగానే పడును. ఏనుగు నీడ ఒక చిన్న మనిషిగాను, ఒక చిన్న మనిషి నీడ ఏనుగుగాను ఏలాగు పడగలదు? దానిని పరిపూర్ణ మాదిరిలో గమనించండి.
ఒక నిజమగు, కన్యకయగు స్త్రీ యున్నది. భర్తను చేసికొని జీవించుచున్నది. అతనికి ఆమె ఆశీర్వచనముగా యున్నది. ఒక భార్యకంటె శ్రేష్టమైన దానిని దేవుడు తన కుమారునికి ఇయ్యకలిగియుండినచో దేవుడు దానినే ఆయన కిచ్చియుండును. కాని ఆమె ఒక శరీర క్రియకు రూపొందించబడెను. ఏ ఇతరజంతువు అలాగు రూపొందించబడలేదు. భూమి మీద మరి ఏ జీవి అలాగు రూపించబడలేదు — దానిని బట్టియే నేడు మీరు బహు భార్యత్వమును చూచుచున్నారు. అందువల్లనే అది వచ్చినది.
GEN 1:28
80తుది విశ్లేషణలో దీనిని మీరు ఇప్పుడు చూడండి. ఒక్క యేసుక్రీస్తే యున్నాడు. అవునా? ఒక నరుడే, దేవుడే, ఇమ్మానుయేలు. అది మీరు నమ్ముదురా? కాని ఆయన భార్యయగు సభ్యులు చాలామంది యున్నారు. చూడండి. వేలకొలది మంది ఉన్నారు. అవునా? ఆయన భార్య, పెండ్లి కుమార్తె, సంఘమే. ఇప్పుడు మీరు గ్రహించారా?
శరీరేచ్చ అనునది రాకపూర్వము ఆయన ఆదామవ్వలతో చెప్పినది అదే. ''అభివృద్ది పొంది భూమిని నింపుడి.'' ఆదియందు ఆయన చెప్పెను. అతడు ఇంకా స్త్రీ పురుషునిగా ఒక్కడే యున్నప్పుడు ఆయన చెప్పెను. ఆత్మీయ అభివృద్ది ద్వారా, గుణకారముల ద్వారా వాక్యములో నుండి పెండ్లికుమార్తె రావలసియున్నదని అది చూపించుచున్నది. భూమిని నింపవలసియున్నది.
GAL 3:28
81ఇప్పుడు చూడండి, శరీరేచ్చలో రెండు ధోరణుల ఆలోచనలు కలిసియున్నవి. ''ఆదియందు'' అను దేవుని సత్యము నొద్దకు నీవు వెళ్ళకుండా దాని వాస్తవమును నీవు గ్రహించజాలవు. ఆదియందు ఒకే యేసు ప్రభువు ఉండును. ఆయన వధువు అనేకముగానున్న ఏక వచనముగా నుండును. అది మీరు గ్రహించారా? సింహాసనము మీద ఒకే దావీదు, ఒకే రాజు, దేవునికి ఇష్టానుసారుడు, అయిదు వందలమంది భార్యలను కలిగియుండెను. యేసు వెయ్యేండ్ల పాలనలో సింహాసనము మీద కూర్చొనును. హల్లెలూయా! ఒక్క భార్యతో ఉండును. భూమిలో నుండి తీయబడి ఆదియందు సృష్టించిన రీతిగానే యుండును. దేవునియొక్క సర్వశక్తిగల హస్తము ద్వారా పునరుద్దానమందు అనేకమంది సభ్యులు ఉందురు. సత్యమిది.
స్త్రీలారా, క్రీస్తులోనికి వచ్చుటకు ప్రయాసపడండి. అప్పుడు అక్కడ మీరు అటువంటి అపవిత్ర స్థితిలో యుండరు. కాని మీరు కేవలము ఒకసభ్యత్వము పొంది, మీకు మీరు నీతిగా, మంచిగా జీవించవలెననుకొన్నయెడల విఫలమగుదురు, దానిని చేరలేరు. మంచిగా జీవించవలెననుకొన్నయెడల విఫలమగుదురు, దానిని చేరలేరు. క్రీస్తుకు వెలుపల యుండి ఎవడునూ అలాగు ఉండజాలడు. ''కాని క్రీస్తునందు స్త్రీయని, పురుషుడని భేదము లేదు'' అని పౌలు ఇంకా ముందుకు వెళ్ళి చెప్పెను; వారందరూ ఒక్కటే.
1TIM 2:12,15
82కాని ఈ వివాహము మరియు పరిత్యాగము గూర్చి సరియగు రీతిగా అనగా ఏది తప్పు, ఏది ఒప్పు అని మీరెరుగునట్లుగా చెప్పగోరుచున్నాను.
ఈ మాదిరులలో ఆయన చాలా తేటగా ఇక్కడ చెప్పెను. ఒకే క్రీస్తు. ఆ భార్యగా అనేక మంది సభ్యులు గలరు. గమనించండి, ఆత్మ సంబంధ వ్యభిచారము, జారత్వములు, తప్పుడు బోధలు బట్టి ఏ సమయములోనయినా ఆయన మనలను విడిచిపెట్టగలడు, కాని మీరు ఎంత ధైర్యముగా ఆయనను విడిచిపెట్టి అవి జరిగించ ప్రయత్నించుచున్నారు? పురషుడు తన భార్యను విడిచిపెట్టి మరొకతెను పెండ్లి చేసికొనవచ్చును, కాని స్త్రీ తన భర్తను పరిత్యజించి మరొకరిని పెండ్లి చేసికొనరాదు. చూడండి, ఆ సాదృశ్యములు, ఛాయలు అన్నియూ పరిపూర్ణ సమతూకములో యున్నవి? ఆదిసృష్టిని చూడండి, ఉప ఉత్పత్తి ఎక్కడునూ లేదు; సంఘము కాదు, వాక్యము ద్వారా వధువు కావలెను; స్త్రీ కాదు గాని, ప్రతిసారి పురుషుడే. అందువలననే పురుషుడు అలాగు చేయుట గూర్చి ఎన్నడునూ వ్యతిరేకముగా చెప్పబడలేదు. ఎల్లప్పుడూ స్త్రీకే చెప్పబడెను, అది ఖచ్చితము. కాని ఆమె దేవునియొక్క పెండ్లి కుమార్తెగా ఉండగలదు. గుర్తుంచుకొనండి, పురుషునితో ఆమె భాగముగా నున్నది. బైబిలు ఈలాగు బోధించుచున్నది, ''స్త్రీ బోధించుటకు గాని, పురుషునిపై అధికారము చేయుటకు గాని నేను సెలవియ్యను. ఆమె మౌనముగా ఉండవలెను. ఏలయనగా మొదట ఆదాము రూపించబడెను, తరువాత హవ్వ. ఆదాము మోసపుచ్చబడలేదు గాని ఉప ఉత్పత్తియే మోసపుచ్చబడెను. ఆమె పవిత్రముగాను, అణకువగాను యుండి పిల్లలను కనుట ద్వారా రక్షించబడును.'' (ఎందుకనగా అప్పుడు ఈమె పురుషునిలో ఒక భాగమగును.)
GEN 18:8,13,15•
1PET 3:6
83అక్కడ కూర్చొని, దేవుని ముఖము మీదనే అబద్దమాడిన శారాను దేవుడెందుకు చంపలేదు? అక్కడ ఆయన కూర్చొని ఒక మర్త్య మానవునివలె భుజించుచూ, రొట్టె, మాంసము తినుచూ, పాలు త్రాగుచూ యుండెను. ''ఆ వెనుక శారా ఎందుకు నవ్వినది?'' అని గుడారము వెనుక నిలబడియుండిన ఆయన ప్రశ్నించెను. ఆమెను ఆయన చూడనే లేదు. ''ఈ సంగతులు ఎట్లు జరుగును? అని ఆమె ప్రశ్నించుచున్నది.''
''నేనెన్నడూ అలాగు పలుకలేదు'' అని ఆమె చెప్పెను. ఓ!దేవుడు అబద్దికుడని ఆయన ముఖము మీదనే చెప్పుచున్నదా? కాని ఆమెను ఆయన ఏమి చేయజాలకపోయెను. ఎందువలన? ఆమె అబ్రహాములో ఒక భాగము. అబ్రహామును బాధించకుండా ఆమెను ఆయన ఏ విధముగాను బాధించలేడు.
కాబట్టి స్త్రీలారా, ఇప్పుడు మీరెవరికి చెందియున్నారో చూడండి. ''మీరు కూడా శారావలెనె యున్నారు. చక్కని వస్త్రములు ధరించుకొని, తన భర్తపట్ల గౌరవముతో, యధార్థముగా జీవించినది. ఆమె అతనిని ఎంతగానో ప్రేమించినది, ఏలినవాడా'' అని పిలిచినది — అతడు ఆమెను ఏలువాడు, యజమానుడు.
MATT 5:28
84మీలో కొందరు స్త్రీలు ఈ పనికిమాలిన దుస్తులు ధరించి పురుషుల ముందుకు వచ్చుచున్నారు. యేసు ఈలాగు చెప్పెను, '' ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించుచున్నాడు.'' కాబట్టి దోషులెవరు? స్త్రీలా, పురుషులా? అతడు పురుషుడు గనుక అలాగు తలంచు ఆస్కారము కలిగియున్నాడు. చూడండి. మీరు స్త్రీలు. అలాగుండకుండా జీవించ వలసియున్నారు. మీరు బయటకు అలాగు ఎందుకు వచ్చుచున్నారు?అది సుఖముగా కూడా లేదు. అది క్షేమము కాదని మీకు తెలియును. ఆ షర్టులుధరించి చలితో సగం గడ్డకట్టి చచ్చిపోవుచున్నారు. చూడండి. అవి స్త్రీలకు సుఖంగా కూడాలేవు. అయితే ఏమిటది? అపవిత్రత కొరకే! మీరది అంగీకరించరు గాని అది సత్యము, కాని బైబిలు అలాగు చెప్పుచున్నది. అది సత్యము. మీలో నున్నది అపవిత్రాత్మ. మీరు అపవిత్రముగా ఉండగోరరు గాని మీరు గ్రహించుట లేదు. ఆత్మ సంబంధముగా మీరు మురికిగా యున్నారు, ఎందుకనగా మిమ్మును మీరు అపవిత్రముగా ప్రదర్శించుకొనుచున్నారు.
పురుషుడు మోకాళ్ళ వరకు ఎట్టి బట్టలు వేసికొనకపోయినా గాని ఏమీ తేడా యుండదు. అతని శరీరము శోధించుటకు తావియ్యదు. ఎందువలన? మూల సృష్టిలోనే అతని శీలము అలాగు ఉన్నది, అలాగుండవలెను. కాని మీరు ఉప ఉత్పత్తియై యున్నారు. మీ ద్వారా శోధన కలుగును.
దేవా, కృప చూపుము! ఓ, ఇది పాపపు లోకము. ఇది దాటిపోయిన పిదప నేను సంతోషముగా నుందును.
LEV 21:7•
1SAM 25:39•
EZEK 44:22
85గమనించండి, అతడు ఏ సమయములోనయినా తన భార్యను విడనాడ వచ్చును. కాని ఆమె అతనిని విడిచిపెట్టజాలడు. ఆయన నన్ను ఏ సమయము లోనయినా గాని మట్టిలోనికి విసిరివేయగలడు.కాని ఓ సోదరుడా, నేను ఆయనను విసిరి వేయుటకు ప్రయత్నించినప్పుడు నా పని అయిపోయినట్లే.
పెండ్లి కాని స్త్రీనయినా గాని సొలొమోను పెండ్లి చేసికొనగలడు. తాను కోరిన ఏ స్త్రీనయినా వివాహము చేసికొనగలడు. కన్యకయగు స్త్రీని మాత్రమే యాజకుడు పెండ్లి చేసికోవలెను. దావీదు ఒకామెను పెండ్లి చేసికొనెను. ఆమె పేరేమిటి? అబీగయేలు. ''మూర్ఖుడు'' అని పిలుబడిన ఒక మనుష్యుడుండెను, అతనికి చక్కని భార్య యుండెను, అతడు చనిపోయెను. అబీగయేలు దావీదుకు పెండ్లి చేయబడెను. అతడు ఒక రాజు గాని యాజకుడు కాడు. చూచారా? అందుకతడు పెండ్లిచేసికొనెను. కాని ఒక యాజకుడు అలాగు చేయజాలడు, ఎందుకనగా మరియొకనిచే తాకబడిన స్త్రీని అతడు ముట్టుకొనరాదు.
అది ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కన్యాత్వమును చూపించుచున్నది. వధువు కల్తీ లేనిదిగా ఉండవలెను. వాక్యముగా ఉండవలెను. ఎక్కడా ఒక్క మాట కూడా తప్పిపోరాదు. నిశ్చయంగా! ఒక సరియగు పెండ్లికుమార్తె తప్పు చేసి అంగవైకల్యము పొందినదిగా యుండదు. అట్టివారు క్రీస్తు వధువుగా ఉండజాలరు. ఆమె పరిపూర్ణురాలు. ఆమె సంపూర్తిగా వాక్యమై యున్నది. ఎక్కడా ఏ ఒక్క మాట కూడా ఆమె తప్పిపోదు.
86గమనించండి, అతడామెను విడనాడవచ్చును, కాని ఆమె ఆయనను విడిచిపెట్టరాదు. ఆయన అలాగు చేసి దాని నిరూపించెను. లూథర్, వెస్లీ, పెంతెకోస్తుదినములలో ఆయన యొక్క వాక్యమును ఇంకా స్వీకరించక విసర్జించినందున ఆయన వారిని పరిత్యజించెను. ఆత్మీయ సంయోగము ద్వారా ఆయనలో భాగముగా ఉండి మిగిలిన వాక్యముతో గర్భము దాల్చవలసినవారు అందుకు నిరాకరించిరి. మీకర్దమైనదా? ఆమె తిరస్కరించెను. క్రీస్తు తనతో మరెట్టి సంబంధము కలిగియుండనవసరము లేదని లూధరను సంఘము కోరుకొనెను. లూధరు దానిని నిరాకరించెను. నన్ను ఏలాగయినా ఏవేవో పెర్లు పెట్టిపిలచుచున్నారు (అయిననూ నన్ను ఈ విషయము చెప్పనీయండి), నేడు చాలామంది ఆ వాక్యమును స్వీకరించనిరాకరించి క్రీస్తునే విసర్జించుచున్నారు. ఏ స్త్రీ అయినా గాని ఒక పురుషుని తిరస్కరించినయెడల ఆమె అతని భార్యగా నుండు హక్కును కోల్పోవును. ఆమేన్.
మీకు గుర్తున్నదా? బైబిలులో రాజు ఎప్పుడు ఎస్తేరును పెండ్లి చేసికొనెను. రాణి నిరాకనించెను గనుక మరొకరిని తెచ్చుకొనెను. రాజుతో బయటకు రానొల్లక అవిధేయత చూపెను గనుక ఏమాయెను? భర్తను కాదన్న భార్యకు కూడా ఈనాడు అదే జరుగును.
87మనము జీవించుచున్న ఈ దినములలో, గర్భము ధరించి ఈ కాలము పిల్లలను కనుటకు నిరాకరించుచున్న సంఘము కూడా అలాగే యున్నది. మేము లూథరనులము కాదు, మేము వెస్లీవారము కాదు, మేము పెంతెకోస్తు వారము కూడా కాదు! మనము ఈ యుగపు పిల్లలము కావలసియున్నాము. దేవుని వాక్యము వలన గర్భము ధరించి ఈ యుగపు బిడ్డను, విత్తనపు శిశువును కనవలసియున్నాము. ఆమేన్. మీరు అర్థము చేసికొనిరని తలంచుచున్నాను. గర్భము ధరించలేక పోయినప్పుడు ఆయన ఏమి చేయును? ఆమెకు పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టును. అది నిజము. కాని ఆమె ఆయనను విడిచిపెట్టుటకు తెగించరాదు. అతడు ఆమెను దూరంగా ఉంచును.
శరీరమునకు ఆయన తన వాక్కును బయలుపరచుచునే యున్నాడు. తన్ను తాను వెల్లడి చేసికొనుచున్నాడు. ఆయన పిల్లలు ఆయన పోలికతో కనబడుట ఆరంభమైనది, ఎందుకనగా పరిపక్వతవచ్చుచున్నది. వారు వాక్యము యొక్క పిల్లలుగా మారుచున్నారు. సంఘము యొక్క పిల్లలు కారు. వాక్యము యొక్క పిల్లలు! వధువు వాక్యము యొక్క చక్కని సుందరమగు యువతి, కళంకము లేనిది, ఏ మానవ సంస్థ ద్వారా కూడా తాకబడనిది. ఏ మానవ కల్పిత సిద్ధాంతమును అంటుకొనదు. ఆమె పూర్తిగా కల్తీలేనిది. వాక్యము యొక్క వధువు! ఆమేన్! ఆమేన్! గాలిలో నుండి వినుచున్న మీరు దానిని గ్రహించిరని ఆశించుచున్నాను. ఆమె దేవుని యొక్క గర్భము ధరించిన కుమార్తెగా ఉండును.
88చూడండి స్త్రీకి ఎంత గొప్ప ఘనత యున్నదో! సంఘము ఎటువంటి గొప్ప దానిగా ఉండబోవుచున్నదో చూడండి! కాని ఆమెకు అపవిత్రత ఎక్కడ అంటుకొన్నదో మీరు చూచారా? అక్కడుండు ఆ సంఘముతో ఇక్కడున్న ఈ సంఘమును పోల్చి చూడండి; దానితో మీరు పోల్చలేరు. వీధిలోని వేశ్యతో సజీవ దేవుని సంఘమును పోల్చుటకు ప్రయత్నించుచున్నారా? లేదా ఒక స్త్రీని, సద్గుణురాలగు స్త్రీని, వేశ్యతో పోల్చుటయా? అసలు అటువంటిది అక్కడ ఎందుకున్నది? అది దేవుని యొక్క ధర్మశాస్త్రము, తారతమ్యముల సిద్ధాంతము.
రాత్రి అనునది లేకపోయినచో పగటి వెలుగును అనుభవించుట ఏలాగో మనకెట్లు తెలియును? వర్షము లేనియెడల పొడి వాతావరణమును అనుభవించుట ఎట్లో మనకేలాగు తెలియును? అసహ్యమగు స్త్రీ లేనియెడల పతివ్రతను గౌరవించుట ఎట్లో మనకు ఏలాగు తెలియును?
MATT 28:19•
ACTS 2:38
89దానిని బయలుపరచుచూ ఆయన వెళ్ళెను. ఆయన వాక్యము బయలు పరచెను, మనలో ఎవరికయినాగాని ఆయనను పరిత్యజించి మరొకరిని పెండ్లి చేసికోగల ధైర్యమున్నదా? ఆ రెండు సిద్ధాంతములు ఎందుకు తప్పో ఇప్పుడు తేటగా మనకు తెలియచేయబడెను. ఇటువైపు వెళ్ళునట్లుగా నీవు దానిని చేయజాలవు; అది గతించును. అటువైపు వెళ్ళునట్లుగా నీవు చేసిన యెడల అది వాగ్దానమును నేలకూల్చును. వాగ్దానము ఇక్కడున్నది. అసలు సంగతి ఇక్కడున్నది. అది వాక్యము. అందులో విభేదములు లేవు. ఇప్పుడది తెగిపోక కొనసాగవలసియున్నది. మత్తయి 28:19తో అపో.కా. 2:38నకు ఎట్టి విభేధము లేదు.
మీలో కొందరు స్త్రీలు, పురుషులు దానితో ఏకీభవించుటలేదని నాకు తెలియును, కాని దానిని మీరిప్పుడు దాచియుంచలేరు. మీరు మూయలేరు, కాని ఒక్క సంగతి మీకు చూపించెదను, మత్తయి 28:19 ఇట్లు చెప్పెను, ''మీరు సర్వలోకములోనికి వెళ్లి, సర్వ సృష్టికిని సువార్త ప్రకటించి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి.'' దానికి వ్యతిరేకముగా బాప్తిస్మము పొందిన వారందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. బైబిలు కాలములోను, ఆ తరవాత మూడువందల సంవత్సరముల వరకు, అనగా, నైసియన్ సభ వరకూ అలాగే యుండెను. ఆ తరువాత అందుకు మారుగా మానవ అభిప్రాయములను ప్రవేశపెట్టిరి. అది ప్రత్యక్ష పరచబడక పోయినచో ఆ భేదము ఏమిటి?
MATT 16:17,18
90పరిశుద్ధ గ్రంథము మొత్తము ఒక ప్రత్యక్షత అని మీకు తెలియునా? దీనికి మరియు దానికి మధ్యనున్న సత్యమును నీవు ఆ విధముగానే తెలిసికొనవలెను. ఎందుకనగా అది ఒక ప్రత్యక్షతయై యున్నది, ప్రత్యక్షత తప్పక వాక్యమునకు సరిపోయి ఉండవలెను. వాక్యమునకు వేరుగా ఉండరాదు.
''అది నాకు ప్రత్యక్షపరచబడినది,'' అని నీవు చెప్పవచ్చును. అయితే అది వాక్యమునకు వేరుగా నున్నయెడల అది దేవుని యొద్ద నుండి రాలేదు. అది నిజము.
మత్తయి 16:18 మీరు తీసికొనండి. తాను ఎవరైయున్నాడోదానిని ఎరుగుట మీదనే, ఆ ఆత్మీయ ప్రత్యక్షత మీదనే సంఘము యావత్తు నిర్మించబడునని యేసు చెప్పెను, ఆయనే వాక్యము. ''నీవుపేతురువు, రక్త మాంసములు దీనిని నీకు బయలు పరచలేదు గాని, పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. ఈ బండ మీద…!''
మన కాథలిక్కు స్నేహితులు అక్కడుండి ఏమనుకొనుచున్నారో నాకు తెలియును. ''అది పేతురు మీద కట్టబడినది, పేతురు అపోస్తలుడు లేక మరేదో ఏదో అని'' చెప్పుదురు. ప్రొటస్టెంటు వారు ఇట్లందురు, ''యేసుక్రీస్తు మీద అది కట్టబడినది.'' విభేధములు లేవు, ఆయన చెప్పినది చెప్పినట్లు తీసికొనండి. ''రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని, పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. వాక్యము ఏమైయున్నదో ఆత్మీయ ప్రత్యక్షత అను బండ మీద నేను నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దానిని ఎన్నడూ కదపజాలవు.''
GEN 4:3•
HEB 11:4
91ఏదేను తోటలో నుండిన హేబెలు, కయీనులను చూడండి. కయీనును తన స్వంత ఉద్దేశ్యముతో ఇట్లు తలంచెను, ''దేవుడు చాలా మంచివాడు. సర్వ ప్రకృతి మీదను ఆయన ఉన్నాడు. కాబట్టి నేను చిక్కుళ్ళు, బంగాళ దుంపలు, పూలుతీసికొని వచ్చి అందమగు బలిపీఠమును నిర్మించుదును.'' (అది ఒక సంఘము.) అతడు మోకాళ్ళూనెను, అతడు దేవుని యందు విశ్వాసముగలవాడు, దేవుని ఆరాధించెను, తన చేతులు పైకి ఎత్తెను, తన బలిని సమర్పించెను. హేబెలు చేసిన ప్రతి భక్తి క్రియను ఇతడు చేసెను.
హేబెలు కూడా అదే విధమగు బలిపీఠమును కట్టెను, కాని హేబెలు ఒక గొర్రెపిల్లను తీసికొనివచ్చెను. తమ తల్లితండ్రులగు ఆదామవ్వలు ఏదెను తోటలో ఉండగా ఫలము తిని పాపము చేసిరి గనుక దానికి విరుగుడు ఫలమే అని కయీనును తలంచెను. కాని హేబెలు, దైవ ప్రత్యక్షత ద్వారా, రక్తమే దానికి పరిహారము కలుగచేయునని ఎరిగియుండెను. దైవ ప్రత్యక్షత ద్వారా! హెబ్రీ 11వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథము ఈలాగు చెప్పుచున్నది, ''విశ్వాసమును బట్టి, ప్రత్యక్షతను బట్టి, హేబెలు కయీనును కంటె అతిశ్రేష్టమగు బలిని దేవునికి అర్పించెను. అందువలన అతడు నీతిమంతునిగా సాక్ష్యముపొందెను.'' అది నిజమేనా? ఆమేన్! సోదరుడా, సోదరీ, నాకు ఇంతకన్న తేటగా మరేదియూ కనబడుట లేదు. అంతా అక్కడే యున్నది.
REV 10:7
92ఇప్పుడు వివాహము మరియు పరిత్యాగము గూర్చి చూడండి. అది బయలు పరచబడవలసియున్నది, బయలుపరచబడు వరకు దానిని మీరు ఎరుగరు. బైబిలులో దాయబడిన ప్రతి మర్మమును ఈ చివరి దినములలో, ఈ కాలములో బయలు పరచబడునని ఆయన వాగ్దానము చేసెను. ఎందరు దానిని ఎరుగుదురు? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము! వివాహము, విడాకులు, ఇంకా ఈ మరుగుగా నున్న ఇతర మర్మములన్నియూ అంత్యకాలములో బయలుపరచబడునని యేసు వాగ్దానము చేసెను.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, ''టుసాన్‌కు వెళ్ళుము'' అని స్వరము చెప్పెను. ఆకాశములో మర్మముగానున్న వెలుగును గుర్తుంచుకొనండి. ఏడు దూతలు అక్కడ నిలబడియుండినవి. తిరిగి వచ్చి ఏడు ముద్రలను విప్పినవి. ఏమి జరిగినదో గమనించండి. అది సత్యము. ఇంకొద్దిగా ముందుకు ఇప్పుడు వెళ్ళుదము.
కాని ఇప్పుడు మీరు వినండి!
భోజనమునకు మీకు సమయమగుచున్నదని నాకు తెలియును; కాని నేను చక్కగా భోజనము చేయుచున్నాను.
ECCL 7:28
93గమనించండి, స్త్రీకి తన స్థానమున్నది, ఆమె ఒక ముత్యము. వేయి మంది భార్యలు కలిగిన సొలొమోను ఈ మాట చెప్పెను, ''భార్య దొరికిన వానికి మేలు దొరికెను. సద్గుణురాలు అతని కిరీటములో ఒక ముత్యము వంటిది. కాని దుర్ణీతి పరురాలు అతని రక్తములో నీరుగా నుండును. వేయి మందిలోఒక నీతిమంతుని కనుగొనవచ్చును. కాని ఒక వేయి మంది స్త్రీలలో ఒక్క నీతిమంతురాలిన నీవు కనుగొనలేవు.'' చూడండి. దానిని సొలొమోను చెప్పెను. ఆమె ఒక ఘనురాలు. ఒకనికి ఆమె జీవము.
కాని అదెట్లున్నదో ఇప్పుడు గమనించండి. కాని స్త్రీలారా, మీరు చూడండి. ఒక ముత్యముగా మీరు ఉండగోరిన యెడల మీరు ఒక ముత్యముగానే యుందురు, కాని మీలో ఆ కోరిక ఉండవలెను. వివాహము మరియు విడాకులు ఎందుకో మీరు ఇప్పుడు చూచారు. యేసు ఆ వెనుకకు మరల చూపించెను, ఎందుకనగా మీ జాతివలనే పాపము సంప్రాప్తించెను. ఆ కారణము చేతనే, బహు భార్యాత్వము, పరిత్యాగము, మొదలగునవన్నియూ ప్రవేశపరచబడినవి. ఆదియందు ఎన్నడూ ఆలాగుండలేదు. రాబోవు లోకములో కూడా అలాగు ఉండదు.
94యాకోబును చూడండి. అందులో నుండి పితరులు వచ్చిరి. అతనికి కనీసము పండ్రెండు మంది భార్యలుండిరి. అతడు ఇద్దరు సహోదరీలను పెండ్లాడెను, అంతేకాక ఉప పత్నులుండిరి. సామాన్య ధర్మశాస్త్రప్రకారము కొందరు స్త్రీలతో జీవించెను. ఆ ఉపపత్నుల వల్లనే ఆ పితరులు జన్మించిరి. అది నిజమేనా? చూడండి, మీరు వాక్యమును సౌమ్యముగా పోనీయవలెను. ఓ! దాని మీద నాయొద్ద ఇంకా పేజీల కొలది యున్నది. దానిమీద ఒక సేవకుడెవరైనా ఎన్నడైనా నన్ను ప్రశ్నించినయెడల మేము కలిసి దాని గూర్చి మాట్లాడుదుము; కాని నిశ్చయంగా, అతడు ఎట్టి ఆత్మీయత కలిగియున్నాగాని ఇది సత్యము అని అతడు చూడగలడు. దానికిక ప్రశ్న ఏదీ లేదు.
ఒక మంచి స్త్రీ మేలుగా నుండును. నాకది తెలియును. నిజమగు స్త్రీలను బట్టి అది నాకు తెలియును. యధార్థముగా నడచుకొనిన ముత్యముల వంటి స్త్రీలను నేను కలిసికొన్నాను. ఆమె అతనిలో నుండి తయారు చేయబడినది. అతనిలో ఒక భాగము. పతనమందు అతడు ఆమె మాట వినెను. ఆమె అతనిలో భాగము, కాని ఆమె మురికిగానుండునట్లు సృజంపబడినది. ఆమెకు విసర్జించు మరియు స్వీకరించు హక్కు ఇవ్వబడినది. ఆదియందున్న అసలు ప్రకృతికి అది విరుద్ధము. చూడండి. కాని మీ స్థితి అది.
95ఇప్పుడు పండ్రెండు గంటలు అయినది, కాబట్టి కొద్ది నిమిషముల పాటు కొంత విడిచి పెట్టుదును. ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను.
ఇప్పుడు గుర్తుంచుకొనండి, దీనిని నా గుంపునకు మాత్రమే చెప్పుచున్నాను. బయట వినుచున్నవారికి చెప్పున దేమనగా, దీనిని నేను నా అనుచరులకు మాత్రమే చెప్పుచున్నాను. ఇక్కడ నేను చెప్పబోవునది, ఆవర్తమానము వారికి మాత్రమే. మందను కాయుచున్న కాపరి ఎవరైనా యున్నయెడల అతడు తన ఇష్టానుసారము ఈ విషయములో చేయును. అది అతనికి దేవునికి మధ్యనున్నది. యాజకులు లేదా సేవకులు ఎవరున్నాగాని, అది మీ బాధ్యతే సహోదరులారా. నేను ఇక్కడ జెఫర్‌సన్‌విల్‌లో మాత్రమే మాట్లాడుచున్నాను. దీనిని ఈ ఒక్క స్థలములో మాత్రమే చెప్పగలను, ఎందుకనగా వీరు నా స్వంత గొర్రెలు. పరిశుద్ధాత్మ ఈ మందను నాకిచ్చి వారిపై కావలివానిగా నన్నుంచెను. వారు అర్ధము చేసికొందురు. దానికి ఆయన నన్ను నిలబెట్టి అడుగును.
ఇక్కడున్న జనులు ఈ ప్రాంతములో నా ద్వారా క్రీస్తు నొద్దకు నడిపించబడినవారు. చిన్న పిల్లలారా, ఇక్కడ నేను మీకు సహాయము చేయుటకున్నాను. నేను మీ స్నేహితుడను. మీకు విరోధముగా నేను మాట్లాడుచున్నానని మీరను కొనవచ్చును. మీ మేలు కొరకు ఇది నేను చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించుచున్నాను. అలాగు కాని యెడల దేవుడే నా తీర్పరి. నేను మిమ్మును ప్రేమించుచున్నానని మీరెరుగుదురు.
MATT 19:6
96ఇది చాలా బలమగు విషయము. దీనినెట్లు బయట పెట్టవలెనో నాకు తెలియుట లేదు. నా సభలో స్త్రీ పురుషులు కూర్చొని యున్నారు. అందులో కొందరు రెండు లేదా మూడు సార్లు పెండ్లి చేసికొనియున్నారు. నేనేమి చేయగలను? మంచి మగవారు, మంచి స్త్రీలు అంతా కలిసిపోయి యున్నారు. ఏమిటి దానికి కారణము? అబద్ధ బోధ. ఖచ్చితంగా. ప్రభువు యొద్ద కనిపెట్టకపోవుట అందుకు కారణము. ''దేవుడు జతపరచిన దానిని ఎవరునూ వేరు చేయరాదు.'' మనిషి జత చేసినది కాదు. ''దేవుడు'' జత చేసినదానిని!
ఆమె నీ భార్యగా నీవు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షముగా పొందినయెడల నీ తక్కిన జీవిత కాలమంతయూ ఆమె నీభార్యగా యుండును. చూచారా? కాని మనిషి జతపరచిన దానిని ఎవరైనా వేరు చేయగలరు. కాని దేవుడు జతపరచిన వారిని అంటుకొను ధైర్యము ఎవరికీ లేదు. ''దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరు చేయరాదు.'' సగం త్రాగుబోతుగా నున్న మెజిస్ట్రేటు లేదా ఎవరో వెనక్కు జారిన బోధకుడు చేతిలో విశ్వాస సూత్రములు వల్లించు గ్రంథముతో వచ్చి పెండ్లి చేసి లోకములో ఇష్టము వచ్చినట్లు తిరుగుడి అని చెప్పుట కాదు. దేవుని వాక్యము అక్కడ యున్నది. చూచారా? దేవుడు జతపరచిన దాని గూర్చి నేను మాట్లాడుచున్నాను.
97ఇప్పుడు, దీనిని మీకు నేను చెప్పబోవుచున్నాను. నేను మీతో చెప్పు దాని విషయములో బహు జాగ్రత్తగా ఉన్నాను. మీతో కరుకుగా నేనుండగోరుట లేదు. నా సేవక సోదరులారా, మీతో నేను కరుకుగా ఉండగోరుట లేదు. నా భావము అది కానే కాదు. కాని నా బాధ్యత, ఇది నా చేతులలోపెట్టబడినదని నేను గ్రహించియున్నాను, దానిని పట్టుకొని యుండలేను, దానినెట్లు ఇయ్యవలెనో నాకు తెలియదు; ఈ టేపు మీరు విందురని నాకు తెలియును. ఓ! ఇప్పుడు నేను సిద్దపడియున్నాను. నా పని చేయవలెను, ఎందుకనగా అది వచ్చుచున్నది. చూచారా? సర్ప సంతానము బోధవలెనె అది యుండును, కాని అది సంపూర్తిగా నిజమని నిరూపించబడినది.
ఇక్కడే కాగితములున్నవి, కొన్ని గొప్ప శాఖల వారు మూలము యొక్క చిత్రములను తీసియున్నారు. సర్పము స్త్రీ యొక్క కాలు మీదికి ప్రాకివెళ్ళుట, ఆమెను చుట్టుకొనుట చిత్రించిరి. దానికి అన్ని విధముల అనుభూతులు యున్నవి. మానవుడెన్నడూ తాకజాలనిది. ఈ పెద్ద సర్పము ఆమెను చుట్టుకొని యుండుట గూర్చి పటములు తీసిరి. అది అక్షరాలా సత్యము. అది మరింత చెడుగా దిగజారును. సర్పము, అనగా ఇప్పుడు ఆ స్వరూపము లేదు — కాని ఆ సర్పము శరీర సంబంధమును ఆమెతో కలిగియుండ గలదు. కాని మరచిపోవద్దు.
GEN 1:24,25•
MATT 10:19
98అసెంబ్లీ ఆఫ్ గాడ్ సేవకుడొకరు వచ్చి ''నీవు చెప్పినది తప్పు'' అనెను.
''మంచిది. మరి మీరేమి చెప్పెదరు?'' అనడిగాను.
అప్పుడతడు దానిగూర్చి చెప్ప నారంభించెను. అతడు అసలు గాడి తప్పెను అని మీరు మొదట తెలిసికొనండి. అతడు చెప్పిన ఒక సంగతి ఇట్లున్నది, ''బ్రెన్హాం సహోదరుడా, ఆ జాతి ఎక్కడున్నది? దాని జాతిలో ఒకటి దేవుడు చెప్పెను. మానవునికి మృగమునకు మధ్యస్థముగా నున్న ఆ జాతి ఇప్పుడెక్కడున్నది? ఎక్కడున్నది? అది భూమి మీద ఉన్నదా? చింపాజీయా?''
కాదు, ఎందుకనగా చింపాంజి యొక్క రక్తము స్త్రీతో కలియదు. ఏ ఇతర జంతువుయొక్క రక్తము కూడా స్త్రీతో కలియదు. అలాగే ఏ పురుషునియొక్క వీర్యము కూడా జంతు స్త్రీతో కలియదు. అది కలియదు.
''అయితే ఆ ప్రత్యేక జంతువు ఎక్కడున్నది? ప్రతిదియు దాని దాని జాతిని పుట్టించును గాక, అని దేవుడు చెప్పెను.''
ఒక్క నిమిషము నేను ఆగాను. పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యము ఇట్లు చెప్పెను, ''అది ఇక్కడే యున్నది అని అతనితో చెప్పుము.'' మొదటగా నేనిట్లు చెప్పాను, ''సరే. అది నశించిపోయి యుండ వచ్చును.''
అందుకు అతడు ఇట్లనెను, ''సహో బ్రెన్హాం, మనము వాక్యము గూర్చి మాట్లాడుకొనుచున్నాము. కాదా?''
''అవునండీ! డైనోసార్స్, మమ్మోత్ మొదలగునవి కాలక్రమేపీ నశించిపోయెనని వారు చెప్పుచున్నారుగదా? అలాగే ఇది అయియుండును. ఆ నశించినవానిలోనే ఇది కావచ్చును,'' అన్నాను.
''సహో బ్రెన్హాం, మనము వాక్యము యొక్క రుజువును బట్టి మాట్లాడుకొనుచున్నాము. పాపము, అది పాపము అనునది ఉండినయెడల అది ఇక్కడ కూడా ఉండవలసియున్నది,'' అని అతడనెను.
నేనిట్లు పలికాను, ''ప్రభువైన యేసూ, మనుష్యులకు ఏమి జవాబు ఇచ్చుదుమా అని ఆలోచించవద్దని నీవు చెప్పావు. ఏమి చెప్పవలెనో ఆ ఘడియలోనే అనుగ్రహించబడునన్నావు. ప్రభువా నేనేమి చెప్పదును?'' ఆయన ఇట్లు చెప్పెను, ''అది ఇక్కడే యున్నదని చెప్పుము. '' (వేదిక మీద నేను దర్శనములు చూచిన రీతిగానే అది ఉన్నది.) ''అది ఇక్కడే యున్నది,'' అని చెప్పాను, కాని నాకది ఎక్కడున్నదో తెలియదు.
''ఎక్కడ?'' అని అతడు అడిగాడు.
నేను ఆలోచించుటకు ముందే ఆయన ''సర్పము అని నాకు చెప్పెను.''
GEN 3:14
99అది అక్షరాలా నిజము, ఎందుకనగా అది ఒక మృగము కాదు; అది శపించబడి బ్రదుకు దినములన్నియూ పొట్టతో ప్రాకును. వాడిక్కడేయున్నాడు. అది నిజమేనా? వాడు చేసిన కార్యమునే ఇంకా చేయుచూయున్నడు, పురుషునివలె చేయుచున్నాడు. స్త్రీలు అలాగు పాపము చేయుచూ తిరుగునట్లు రేపుచున్నాడు. ఆమె యొక్క చేష్టలు, క్రియలు సమస్తమూ అవే. ఆమె యొక్క అభిప్రాయములు, వ్యామోహములు మానవులకు అందజాలని రీతిగా యున్నవి.
దానిని నేను అక్కడ ఆపుదును, ఎందుకనగా మనమధ్య మిశ్రిత జనులున్నారు. దానిగూర్చి ఎక్కువగా తరువాత చెప్పుకొందము. దానికి సంబంధించిన పత్రములు, సంగతులు అన్నియును ఇప్పుడు నా చేతిలో యున్నవి. ఈ ఉదయమున వాటిని మీ యొద్దకు తీసికొనిరాగోరాను. దీనిని చెప్పుటకు పూర్తి రోజు నేను తీసికొందును, కాని దీనిని చెప్పి నేను ముగించెదను.
100ఇది నా సంఘమునకు మాత్రమే — నా సంఘము కాదు, నన్ను నమ్మి వెంబడించుచున్న చిన్న గొర్రెలకు మందకు మాత్రమే ఇది చెప్పుచున్నాను.
నేను మీకు ఏది చెప్పినా అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అయియుండవలెను. అది నాకు తెలియును. దానిని నాకు ఆయన బయలుపరచుచుండగా లేఖనములు నేను సంగ్రహించాను. ''ప్రభవగు దేవా, ఈ జనులకు ఏలాగు చెప్పుదును? పరిత్యాగములు సంభవించును. లోపల, బయట, ఇంకా ఆయా చోట్ల కూర్చొని విను జనులు నేనామెను విడిచిపెట్టవలెనా? అనియు, నేను నా భర్తను విడిచిపెట్టవలెనా? అని స్త్రీలును అడుగుదురు. ప్రభువా, నేనేమి చేయగలను?'' అని ప్రశ్నించాను.
ఏదో నాతో ఇట్లనెను, '' అ పర్వతము యొద్దకు వెళ్ళుము. నేను నీతో మాట్లాడుదును.''
నేను ఆ పర్వతము మీద ఉంటిని. క్రింద టుసాన్‌లో నున్నవారు చూచుచున్నారని నాకు తెలియదు. ఉపాధ్యాయులు సహితము పిల్లలను పిలిచిరి. నా చిన్న పిల్ల తదితరులు తరగతి గదిలో నుండి బయటకు వచ్చిరి, ఇట్లు చెప్పుకొనిరి, '' ఆ పర్వతము అవతలకు చూడండి. అగ్నివలె కనబడుచున్న ఒక విల్లు గాలిలోనికి పైకి పోవుచూ, క్రిందికి దిగూచూ యున్నది, పైకి ఎక్కుచూ, క్రిందికి దిగుచూ యున్నది.''
101శ్రీమతి ఇవాన్స్, మీరిక్కడే ఉన్నారా? రోనీ, నీవిక్కడే ఉన్నావా? నేను స్టేషను యొద్దకు తిరిగి వచ్చాను. ఈ యువకుడు ఆ ఇవాన్సు ఇంధన స్టేషను యొద్ద ఉండెను. ఆ యువకుడు ఆశ్చర్యము కలుగు రీతిగా ఇట్లు పలికెను, ''బ్రెన్హాం సోదరుడా, నీవు ఆవలనున్న పర్వతము మీద ఉన్నావు గదా?''
''రోనీ, నీవు చెప్పునదేమిటి?'' అనడిగాను. చూడండి. జరిగిన సంగతులను జనులకు చెప్పుము. మీరు ఎంత ఎక్కువగా ఒక దానిని చూతురో అది అంత సామాన్యమై పోవును. చూచారా? నేను జనులకు చెప్పను.
అతడీలాగు చెప్పెను, ''నీవు ఎక్కడున్నావో నేన చూపించగలను. నేను అమ్మను పిలిచాను. ఇక్కడ మేము నిలబడి దానిని పరీక్షగా చూచాము. ఆమేఘము అక్కడ నిలచియుండి పైకి వెళ్ళుచూ, క్రిందికి దిగుచూయుండెను. అది సహో బ్రెన్హాం, ఎక్కడో అక్కడ కూర్చొనియుండుట వలననే జరుగుచున్నది. దేవుడాయనతో మాట్లాడుచున్నాడు,'' అని నేను చెప్పానని పలికాడు.
పట్టణమంతయూ, జనులందరూ దానిని చూచిరి. అది ఎక్కడా మేఘములు లేని ప్రకాశమానమగు దినము. ఈ పెద్ద మేఘము అక్కడ వ్రేలాడుచుండెను, అది క్రిందికి పైకి వచ్చుచూ వ్యాపించుచుండెను.
MATT 19:8
102స్నేహితుడా, నేను ముగించుచున్నాను. ఇక్కడి నుండి నీవు వెళ్ళిపోవచ్చును, అప్పుడు నాకు బయలుపరచబడిన దానిని ఇప్పుడు మీకు చెప్పబోవుచున్నాను. తప్పిపోకుండా వినుడి.
నా అనుచరులకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పుచున్నాను. నన్ను, నా వర్తమానమును వెంబడించు వారికి మాత్రమే బయట వారికి కాదు. దీనికి దేవుని ఎదుట నేనే సాక్షిని. ఈ గుంపునకు మాత్రమే చెప్పుచున్నాను.
తప్పుగా అర్ధము చెప్పబడిన వేదాంతము వలన మనము ఈ గందరగోళములో చిక్కుకొనియున్నాము. నిజమేనా? అందుచేతనే మీలో కొందరు స్త్రీలు రెండవసారి పెండ్లి చేసికొనిరి. పురుషులూ అంతే. తప్పు భావముతో చెప్పబడిన వేదాంత విద్య వల్లనే. ఇప్పుడు నేను నాకు ఆయన చూపించిన ఒక సంగతిని చూపించగోరుచున్నాను.
మన సృష్టికర్తయగు దేవుడు, యేసుక్రీస్తు, ఈ భూమి మీద ఉండినప్పుడు ఈ ప్రశ్నను ఎదుర్కొనెను. ఐగుప్తు నుండి ప్రజలను విమోచించి వాగ్దాన దేశములో ప్రవేశపెట్టు విమోచన ప్రవక్త వచ్చెను. అతడు మోషే ప్రజలుఈ స్థితిలో యుండుట మోషే చూచెనని యేసు చెప్పెను. వారికి పరిత్యాగ పత్రిక వ్రాసికొనుటకు అనుమతి ఇచ్చెను, ఎందుకనగా ఆ పరిస్థితి అటువంటిది, మోషే ఆ స్థితిని కనుగొనెను. దేవుడు మోషేకు అనుమతి ఇచ్చెను, అతడు జనుల కొరకు పంపబడిన ప్రవక్త, వారికి ఈ పరిత్యాగ పత్రిక వ్రాసికొనుటకు అనుమతి ఇచ్చెను.
MATT 19:8•
1COR 7:10,12
1031 కొరింధీ 7వ అధ్యాయము 12 నుండి 15 వచనములు. క్రొత్త నిబంధనలో ప్రవక్తయగు పౌలు ఇదే పరిస్థితిని ఎదుర్కొనెను. అందుకే సంఘములో ఈలాగు చెప్పెను, '' ఇది నా మాట, ప్రభువు మాట కాదు. ''అది నిజమేనా? పరిత్యాగ పరిస్థితిని బట్టి అలాగు చెప్పెను.
''ఆది నుండియూ అలాగు లేదు.'' కాని మోషే దానిని అనుమతించెను. దానిని నీతిగా దేవుడు గుర్తించెను. తన సంఘము ఆ స్థితిలో యుండుట చూచిన పౌలునకు కూడా హక్కున్నది.
ఇప్పుడు ఇది నిజమని మీరు నమ్ముడి. ఇది దేవుని యొద్ద నుండి వచ్చినదని నమ్ముడి. ఆయన మేఘము యొక్క ప్రత్యక్షత ద్వారాను, ఇంతవరకూ నన్ను తీసికొని వచ్చిన ఆయన వర్తమానము ద్వారాను దేవుడు ఆ పర్వతము మీద ఉండగా మీరు నడచిపోవుచున్న దాని నుండి తొలగి మరెన్నడూ దానిని చేయకుండునట్లుగా ఈ మాట చెప్పుటకు అనుమతించెను. ఇక మీదట చేయవద్దు. మీ భార్యలతో వెళ్ళి సమాధానముగా జీవించుడి, ఎందుకనగా సమయము చాలా గడిచినది. ప్రభువు యొక్క రాకడ సమీపముగా యున్నది. ఈ సంగతులన్నియూ విడమరచుటకు మనకు సమయము లేదు. మరల అలాగు చేయుటకు తెగించవద్దు. నా జనులకు మాత్రమే నేను చెప్పుచున్నాను. మీరు పెండ్లికాబడిన వారయినచో — దానికి దేవుడే సాక్షి, ఆ పర్వతము మీద ఆయన నాకు సాక్షి, దీనిని నేను చెప్పగలను (ఒక సహజాతీతమగు ప్రత్యక్షత, ఏడు ముద్రలు విప్పబడుట వలన ఇది జరిగినది. దేవుని వాక్యములో ఇది ఒక ప్రశ్న): ''వారు ఇప్పుడున్నట్లుగా సాగిపోనిమ్ము. ఇకను పాపము చేయవద్దు.''
104''ఆది నుండియూ అలాగు లేదు.'' అది నిజము. అలాగది లేదు. అంత మందును అలాగుండదు, కాని ఆధునిక పరిస్థితుల క్రింద దేవుని దాసునిగా… నన్ను నేను ఆయన ప్రవక్తగా చెప్పుకొనను, కాని నేను కావచ్చునని నమ్ముచున్నాను. ఒకవేళ అందుకొరకు నేను పంపబడని యెడల ఆ రాబోవువానికి నేను పునాదిని వేయుచున్నాను — కాబట్టి ఆధునిక పరిస్థితుల క్రింద, ఇప్పుడు మీ భార్యతో మీరు మీ ఇంటికి వెళ్ళుడి. మీరామెతో సంతోషముగా ఉన్నయెడల ఆమెతో జీవించుడి. మీ పిల్లలను దేవుని యొక్క శిక్షణతో పెంచుడి; కాని అలాగు మీరెన్నడైనా తిరిగి చేసినయెడల దేవుడు మీ పట్ల కృప చూపును గాక! అటువంటి పని ఎన్నడూ చేయవద్దని మీ పిల్లలకు మీరు బోధించుడి. దేవుని యొక్క భయభక్తులలో వారిని పెంచుడి. ఇప్పుడు మీరు ఉన్న రీతిగానే వెళ్ళండి, మనము ఆఖరి ఘడియలో జీవించుచున్నాము. ''క్రీస్తునందు ఉన్నత పిలుపుతో గురియొద్దకు పరుగెత్తుడి.'' అక్కడ అన్నియూ సాధ్యమే.
ఈ రాత్రి మిమ్మును మరల చూచువరకు ప్రభువగు దేవుడు మిమ్ము దీవించు గాక, ప్రార్థించుదము.
DEUT 24:1•
1COR 7:12
105ప్రభువగు దేవా, మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. నీకు స్తుతి చెల్లించుచున్నాము. మోషేను అలాగు చేయనిచ్చిన ఆ గొప్ప యెహోవావు నీవు. అలాగే యున్నావు. మోషే నీ సేవకుడు. తన ప్రజలకు అతడేమి చెప్పును? దేవా, పరిత్యాగ పత్రిక వ్రాసికొనమని అతనికి నీవు అనుమతిచ్చితివి.
క్రొత్త నిబంధన రచయిత మరియు గొప్ప అపోస్తలుడగు పౌలు కూడా పాత నిబంధనలోని మోషే వంటివాడే. మోషే ధర్మశాస్త్రమును, ధర్మశాస్త్రముల యుగమును వ్రాసెను. చాలామంది ప్రవక్తల యొక్క మాటలు అందులోనికి ఎక్కించబడినవి. కాని మోషే ధర్మశాస్త్రమును వ్రాసెను. వారికి పరిత్యాగ పత్రికను వ్రాసి ఇచ్చునట్లుగా అతనిని వారి హృదయ కాఠిన్యమును బట్టి నీవు అనుమతించితివి.
ఆ గొప్ప పరిశుద్ధ పౌలు క్రొత్తనిబంధన గ్రంథకర్తయై యుండి అటువంటి ఒక తీర్మానమును చేయ కలిగెను. '' ఈ పరిస్థితుల క్రింద నేనే చెప్పుచున్నాను గాని ప్రభువు కాదు.'' అనెను.
106ప్రభువగు దేవా, నేడును అలాగే యున్నది. లోక సమాప్తియందున్నాము. దేవుని కృప క్రిందనే ఇక్కడున్నాము. త్వరలోనే ఆయన యొక్క సన్నిధిలో మేము జవాబు ఇయ్యనై యన్నామని ఎరుగుదుము. ప్రభువా, నీవు ఎంతో చేసియున్నావు, ఖచ్చితంగా ఈ ప్రజల దృష్టిలో నేను చెప్పగలను. అది నీ యొద్ద ను౦డి వచ్చినట్లుగా భావించి దానికి వారు బద్ధులైయుందురు. ఈనాడు ఇక్కడ సాక్షులు చాలామంది యున్నారు. ఆ పర్వతము మీద సూచనను చూచినవారు సహితము ఇక్కడ కూర్చొని యున్నారు. సుడిగాలిలో దేవుని యొక్క దూతలు వచ్చిరి. ఏడుగురు దూతలు వచ్చిరి. ఏడు మర్మములు బయలుపరచుట అక్కడ జరిగినది. అదే దేవదూత, అదే దిశలో, అదే పర్వతము మీద ఇది బయలుపరచబడినప్పుడు ఉండినది!
దేవా, వారికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనములు చెల్లించుచూ ఇంటికి వెళ్ళునట్లుగా ప్రార్థించుచున్నాను. అనుమతిని బట్టి మాత్రమే ప్రభువా, దానిని నేను చెప్పాను. ప్రభువా, అనుమతిని బట్టి మాత్రమే నేను చెప్పగలను. ఆ పాపమును తిరిగి మరెన్నడూ చేయకుండా జనులు కృతజ్ఞతకలిగి జీవించునట్లు కృపచూపుము. ఏ పాపము మరెన్నడూ వారు చేయ ప్రయత్నించకుందురు గాక! తమ పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించుదురు గాక!
ప్రభువా, ఈ కుటుంబములను సంతోషముగా ఉంచుము. వారు ఎదిగి, పిల్లలను దేవుని యొక్క భయములో పెంచుదురు గాక!
107ప్రభువా, నా హృదయము మీదనుండిన వర్తమానమ అందించబడినది. నాకు తెలిసిన రీతిగా శక్తి వంచన లేకుండా చేశాను. వారముల తరబడి, గంటల కొలది నిద్రలేకుండా సాతాను నాతో పోరాడెను. ప్రభువా, ఇప్పుడు దానిని ఆజ్ఞాపించుచున్నాను. దానిని అధ్యయనం చేసి, వెళ్ళి నీ కొరకు వారు జీవించునట్లుగా ఈ జనులకు చెప్పాను. ప్రభువా, అలాగు దయచేయుము. ఇప్పుడు అది నా భుజముల మీద నుండి పోయినది. వారు నీ చేతులలో యున్నారు. వారిని నీవు దీవించమని ప్రార్థించుచున్నాను.
ప్రభువా, రోగులు శ్రమపడుచున్న వారి తరపున ఇక్కడ పెట్టబడిన చేతిరుమాళ్ళును దీవించుము. ప్రజలందరూ స్వస్థత పొందు ఒక మహాశక్తిగల రాత్రిగా ఈ రాత్రి ఉండును గాక. ప్రభువా, అది దయచేయుము. మమ్ములను కలిపి ఆశీర్వదించుము.
108మేము సమాధానము, సంతోషము, ఆనందములతో వెళ్ళుదము గాక. ఎందుకనగా సృష్టి యొక్క దేవుడు మాకు ''ఆది నుండి యున్న దానిని'' చూపించెను. మేమున్న ఈ అయోమయ పరిస్థితిలో మరల మాకు తన కృపను పొడిగించెను. ఈ చివరి దినమున మరల కృప ఇచ్చెను. ఓ, మహా, నిత్యుడవగు దేవా, దానిని బట్టి ఎంతగా నిన్ను మేము స్తుతించవలసియున్నాము! మీకు వ్యతిరేకముగా మరెన్నడు పాపము చేయు వాంఛ లేకుండునట్లుగా మా హృదయములు ఆనందముతో నిండిపోవును గాక. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
నే నాయనను ప్రేమించుదును.
(మీరెందుకు ప్రేమించుదురు?)
నేనాయనను ప్రేమించుదును.
ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.
నా రక్షణను కల్వరిలో కొనెను.
సేవకులు అర్ధము చేసుకొనునట్లుగా ఇప్పుడు దీనిని మరల చెప్పుచున్నాను. ఈ వర్తమానము వెంబడించుచున్న వారికి మాత్రమే ఇది వర్తించునట్లు చెప్పితిని.
ఓ! మీరు సంతోషముగా నున్నారా? నేను మీకు సత్యమును చెప్పాను. యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడు. అంతయూ అదే. ఇప్పుడు మనము నిలబడి దానిని మరల పాడుచుండగా, మన చేతులు ఎత్తుదము ''నేనాయనను ప్రేమించుదును. '' ఆయన కృపను బట్టి నే నాయనను ప్రేమించెదను. ఆయన దయ నిమిత్తము నేనాయనను ప్రేమించెదను. ఆయన వాక్యము నిమిత్తము నేనాయనను ప్రేమించెదను. ''యెహోవా వాక్కు ఆయన ప్రవక్త యొద్దకు వచ్చును.''