ఈ మెల్మీసెదెకు ఎవరు?

ఈ మెల్మీసెదెకు ఎవరు?

1ప్రార్థన కొరకు మన తలలు వంచుదము. ప్రియ పరలోకపు తండ్రీ, "నమ్మిక మాత్రముంచుము" అను ఈ పాటను మేము వినుచున్నాము. దేవుని యొక్క ఏ వాగ్దానములనయినను మేము స్వతంత్రించుకొనవలెనన్నచో, వాటిని నమ్మితే చాలునని అది మాకు తెలియచేయుచున్నది. "నమ్ము వారికి సమస్తమూ సాధ్యమే"నని వ్రాయబడియున్నది. చాంద్ర రోగిగా నుండిన కుమారుడు కలిగిన తండ్రి మొరపెట్టినట్లుగా, "ప్రభువా నేను నమ్ముచున్నాను! అపనమ్మకము లేకుండా సహాయము చేయుము" అని మేము మొరపెట్టుచున్నాము.

ఈ చివరి దినములలో నీ గొప్ప శక్తి కొరకును, మా పట్ల నీ గూర్చిన గొప్ప ప్రత్యక్షత కొరకును నీకు వందనములు చెల్లించుచున్నాము. సజీవ దేవునితో మేము సంబంధము కలిగియుండుటకు వచ్చితిమని ఎరిగినప్పుడు అది మా హృదయములకు ఎంతో ఆనందమును, అత్యధిక సంతోషమును ఇచ్చుచున్నది. గతించిన దినములలో చేసినట్లుగాను, ఈ దినమునకు ఆయన వాగ్దానము చేసినట్లుగాను మరల భౌతిక, వస్తు సంబంధమగు రుజువులను ఆయన బయలుపరచుచున్నాడు. మా దేవునివగు నీకు మేము ఎంతయో కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఎటు వెళ్ళవలెనో ఎవరికీ తోచని ఈ అంధకార దినమున మేము ఆగియుండుటకు రక్షణా స్థలమును కనుగొన్నందుకు ఎంతగానో సంతోషించుచున్నాము.

ప్రభువా, ఇప్పుడు నీ వాక్యమును గూర్చి మేము మాట్లాడుకోనైయుండగా, ఈ రాత్రి దీవించుము. మరియు మాకు ఇవ్వబడిన వాగ్దానములను మా హృదయములలో పెంచుకొని, గౌరవముతో వాటిని ఆదరించి, నిజమగు దైవిక క్రమశిక్షణతో వాటికి విధేయులమగుదుము గాక. యేసు నామమున వీటిని అడుగుచున్నాము. ఆమేన్.

2[సహో, బ్రాన్హాంతో ఎవరో మాట్లాడుచున్నారు.] ప్రేమ కానుకా? మీరది చేయకుండవలసినది. అదెవరు చేశారు? మీరు దోషులా? నేను మేనేజరును అడుగుచున్నాను. నా కొరకు ఒక ప్రేమ కానుక స్వీకరించెనని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఆలాగు చేయకూడదు. దానిని నేను అభినందించుచున్నాను, దానిని దేవుడెరుగును, కాని నేనెన్నడూ దానికొరకు రాలేదు. మీకు వందనములు. ప్రభువు మిమ్మలని దీవించును గాక! నాకు సాధ్యమైన సమస్తమూ నేను చేయుదును. వెంటనే దానిని విదేశీ సేవ కొరకు ఇచ్చెదను, కనుక అది దేవుని రాజ్యము కొరకు వెళ్ళునని నాకు తెలియును. ప్రభుని చిత్తమయితే, ఈ వారమంతా మీరు కూర్చొని విను ఇదే సువార్తను నాయంతట నేనే ఆ దేశమునకు కొనిపోదును. అప్పుడు అది మీరు నమ్మిన విధముగా జరిగినదని నాకు తెలియును. దానిని చేయుటకు దేవుడు నాకు సహాయము చేయును గాక!

ఈ వారము ఎక్కువ మంది హాజరయినందులకు నేను కృతజ్ఞత చెల్లించుచున్నాను. ఆలాగే ఈ రాత్రి మరల టెలిఫోను ద్వారా సంబంధము ఏర్పరచుకొన్న ప్రతివారికి ధన్యవాదములు. మీలో ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.

3ఈ ఉదయమున బిల్లీ ఇట్లనెను, "నాన్నగారూ, ప్రొద్దు విడిచిన వెంటనే, పెందలకడనే, ఈ ఉదయాన మీరు బయలుదేరి నాతో కలిసి ఈ స్థలములకు వచ్చి నిలబడి, కార్లలో బిడ్డలకు పాలిచ్చు తల్లులను, వానలో కూర్చొనిన ఆ పేదవారిని, తలుపు తెరచువరకు ఎదురుచూచుచున్న దీనజనులను గమనించినచో… " నేను సత్యము తప్ప మరేదయినా చెప్పినచో నేనెంత వేషధారిగానుందునో చూడండి? నిజముగా నేను అబద్దపు వ్యక్తినవుదును. కొన్నిసార్లు నేను బాధపెట్టవలసియుందును గాని అది నా కోరిక కాదు. బాధ పెట్టునది నేను కాను గాని ఆ సత్యమే గాయపరచును. కాని అ కారణము చేతనే మీరు వచ్చిరని నమ్ముచున్నాను, ఎందుకనగా మీకు నా చేతనైన సహాయము చేయుటకు బహు యదార్ధముగా మీతో ఉన్నాను. ప్రభువు మీ ప్రతి ఒక్కరికి సహాయము చేయును గాక.

4ప్రజలు అందించిన చక్కని సహకారము నిమిత్తము వందనములు చెల్లించగోరుచున్నాను. ఈ పట్టణ ప్రజలు కూడా, ఈ బడి స్థలము, ఈ ఆడిటోరియం మరియు జిమ్మాజియం మనకు అద్దెకు దొరకునట్లుగా సాయపడిరి. అధికారులు ఇక్కడున్నచో వారికి నా వందనములు తెలుపుచున్నాను. దీనికి సంరక్షుడగు హుస్టన్ కాల్విన్ దీనిని సంపాదించుటలో అందించిన చక్కని సహకారము కొరకును, ప్రతి రాత్రి మనతో ఉండుచున్నందుకును నేను అతనికి వందనములు చెల్లించగోరుచున్నాను.

జెఫర్సన్-విల్ పోలీసు బలగము ఇక్కడికి వచ్చి ఎంతో చవకగా ఇదంతయూ పర్యవేక్షించుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. కార్లు పార్కు చేయు విధిని నిర్వహించుటకు, ఏదీ జరుగకుండా చూచుటకు మరియు అన్ని సరిగా ఉండుటకు పోలీసువారికి గంటకు రెండు డాలర్లు చెల్లించుట చాలా తక్కువ అని భావించుచున్నాను. దానికొరకు వీరికి మేమెంతో ఋణస్తులము. ఆలాగే ఈ బోర్డులోనున్న ఇంజనీరును కూడా నేను గమనించాను. మాతో ఏకీభవించిన వారందరికిని మేము నిశ్చయంగా కృతజ్ఞలమైయున్నాము.

5కానుకల నిమిత్తము మీ ప్రతి ఒక్కరికిని వందనములు చెల్లించుచున్నాను. బిల్లీ ఈ మధ్యాహ్నము ఒక కానుకను తీసికొనివచ్చెను. అందులో చాలా పెట్టెಲು, తిను సామాగ్రి మరియు మొదలగునవి యున్నవి. క్రీస్తు బొమ్మ చిత్రీకరించి ధన్యతలు వ్రాసినది అందులో ఒకటి. అది కొండమీది ప్రసంగము అది నిశ్చయముగా అందముగా యున్నది. దానికొరకు మీకు నిండు వందనములు. ఇంకా చాలా వస్తువులున్నవి. వాటన్నింటికి ఎట్లు వందనములు చెల్లించవలెనో నాకు తెలియడము లేదు. ఆలాగే కూటమునకు ఆర్థిక సహాయము మీరు అందించినందుకు నిజంగా మా పూర్ణ-హృదయముతో మిమ్మను అభినందించుచున్నాము. మీ ప్రతి ఒక్కరిని ఐశర్యవంతముగా ప్రభువు దీవించును.

మధ్య వ్యవధిలో చాలామంది ప్రజలు వ్యక్తిగత పరిచయము కొరకు అవకాశమునిమ్మని అడుగుచున్నారని బిల్లీ చెప్పెను. మరియు చిన్న పిల్లలను ప్రతిష్ఠించవలెనని చాలామంది అడిగారు. ఓ! అది ఎంతగానో చేయగోరుదును!

కాని మీరు చూడండి. ఈ సమయమంతయూ ఈ వాక్యము అధ్యయనము చేయుటకును, ఈ వర్తమానములు తెచ్చుటకు ప్రార్థనలో గడుపుటకును కేటాయించుట అత్యవసరమైనది. చూడండి, అవి మనకు అసామాన్యమైనవి, ఎందుకనగా దేవుని చిత్తమును కనుగొనుటయు, అప్పుడు మాట్లాడుటయు తప్పనిసరి. అవన్నియూ సంఘటితము కావలెను, ఏది తెరువవలెనో దేవునిని అడుగవలెను.

6ప్రభుని చిత్తమయితే వీలయినంత త్వరగా మనము తిరిగి కలిసెదము. ఆ దినమును ఎంత త్వరగా అయితే అంత త్వరగా కనుగొనవలెను. ఈస్టరు గూర్చి చెప్పినది తప్పు కావచ్చు. దానిని తిరిగి సరిచూచుకొనుట మంచిది, ఎందుకనగా కాలిఫోర్నియాలో ఆ సమయములో సూచికయున్నదని నేను తలంచుచున్నాను, కాబట్టి అది తప్పుకావచ్చు. ఏమయినా గాని తిరిగి మనము ఆలయమునకు వచ్చినప్పుడు చర్చి యొక్క కార్డును తేదీ, సమయముతో పంపుదుము. అప్పుడు మరల నేను ఆ సమయమునకు, మరలా…

రోగుల కొరకు ప్రార్థించుటకు మరల నేను ఏ సమయము నిర్ణయించలేదు. ప్రజలను పిలచి వారికి ప్రార్ధించకుండా ఒక్క ఆరాధన కూడా మనము జరుపలేదు. మనము వారిని బయటకు పంపుచున్నాము. ఇక్కడున్న మన సోదరులు లీవైల్, ఇంకా ఈ సోదరులు ఇక్కడ బోధించుచూ, రోగులకు ప్రార్థించుచూ, బాప్తిస్మము ఇచ్చుచూ, నన్ను వాక్యము ధ్యానించుకోనిచ్చుచున్నారు. వీరికి వందనములు చెల్లించుచున్నాము. వారు ఒక సవాలుతో కూడిన పనిని నిర్వహించుచున్నారు.

7ఇక్కడ ఉన్న ఎందరో నా స్నేహితులను కలిసికొనగోరుచున్నాను. నేను చూచినప్పుడు జాన్ మరియు ఎర్ల్ కనబడిరి. అక్కడ డాక్టర్ లీ వైల్, ఈ కూటముల యొక్క నిర్వాహకులలో ఒకరు - సహో, రాయ్ రాబర్ట్సన్ యున్నారు. వారితో కరచాలనము చేయుట తప్ప మరెట్టి అవకాశము దొరకలేదు. కెంటాకీ నుండి వచ్చిన నా స్నేహితుల గూర్చి ఆలోచించుచున్నాను, ఇక్కడే వారుందురు, సేవక సోదరులతో ఎంతగానో కరచాలనము చేయగోరుచున్నాను! సహో, బ్లయర్ను ఒక రోజున ఇక్కడే నేను గమనించాను. నేను ప్రేమించువారు ఇంకా చాలామంది ఉన్నారు. వారు చాలా కూటములకు వచ్చిరి. వారితో కనీసము కరచాలనము కూడా చేయలేదు, ఇష్టము లేక కాదు గాని ఆలాగు చేయుటకు సమయము లేదు. నేను తొందరలోయున్నాను.

8పిల్లలను ప్రతిష్ఠించుట, నిశ్చయంగా నా సొంత కుమారుడు, నా చిన్న మనుమడు ఈ కూటములో ప్రతిష్ఠ కొరకు వచ్చియున్నాడు. అది చేయుటకు నాకు సమయము లేదు; చిన్న డేవిడ్. ఇప్పటికి రెండుసార్లు నేను తాతనయ్యాను. కాబట్టి, శ్రీ. మే ఈ రాత్రి ఇక్కడున్నచో, అతడు నాకిచ్చిన బెత్తమును చాలా త్వరలోనే వాడనైయున్నానని చెప్పుచున్నాను.

కాబట్టి బిల్లీకి ఈలాగు చెప్పాను, "మీరు విస్తరించి భూమిని నింపడి అని బైబిలు చెప్పెను గాని ఆ భారమంతయూ నా ఒక్కడిపైనే పెట్టలేదు." ఈ మనుమలు త్వరగా కనబడుచున్నారు.

కనుక గుర్తుంచుకొనండి, అసలు ప్రారంభము నుండి నా కోడలు గొడ్రాలు, ఆమెకు పిల్లలు పుట్టరు. ఒక రోజు కూటము నుండి వచ్చుచున్నప్పుడు ప్రభువు నాతో ఈలాగు పలికెను, "లోయిస్, నీవు ఒక కుమారుని కనెదవు. ప్రభువు నిన్ను దీవించెను. నీ స్త్రీ వ్యాధిపోయినది." ఆ తరువాత తొమ్మిది నెలలకు చిన్న పాల్ పుట్టెను

9ఈ బిడ్డ పుట్టుటకు రెండు నెలల ముందుగా నేను ఒక ఉదయాన బల్లయొద్ద కూర్చొని అల్పాహారము తినుచున్నాను. నా కెదురుగా బిల్లీ మరియు లోయిస్లు బల్ల మీద కూర్చొనియున్నారు. లోయిస్ నీలపు దుప్పటితో చుట్టబడియున్న బిడ్డకు పాలిచ్చుట చూచాను. మరియు బిల్లీ ములన కూర్చొని యున్నాడు, పాల్ కు తినిపించుకుంటూ. నేను చెప్పాను, "బిల్లీ, నేను ఇప్పుడే దర్శనము చూసాను. లోయిస్ చిన్న బిడ్డకు తినిపించుచున్నది, ఒక నీలము రంగు వస్త్రములో చుట్టి యున్నది.

అతడు చెప్పెను, "ఇదిగో నా వేట యాత్ర. ఇప్పటి నుండి తొమ్మిది నెలలు వరకు."

పదకొండు నెలల తరువాత, చిన్న డేవిడ్ జన్మించెను. మరియు నేను ఆయనను ప్రభువునకు ఇంకను సమర్పించలేక పోయాను, మరియు తిరిగి వచ్చువరకు చేయము. కావున అది ఏలాగున్నదో మీరు చూడండి.

10ప్రజలను, వారితో సహవాసమును ఎంతగా నేను ప్రేమించుదునో చూడండి! కాని నా సోదరులు రోగుల కొరకు ప్రార్థించుచున్నారు. అది విజయవంతమగుచున్నదని నాకు తెలుసు. ప్రతి రాత్రి మేము రోగుల కొరకు ప్రార్థించుచున్నాము. ఒకరి మీద మరొకరు చేతులు వేయుచున్నారు, మనందరము కలియుచున్నాము, ఆ విధంగా మొత్తము అవకాశము దొరకుచున్నది. కాని దేవుని చిత్తమయితే తిరిగి వచ్చునప్పుడు, కార్డు మీద మార్కు చేసి పంపించుదును. రోగుల కొరకు ప్రార్థించుటకు, ఏ విధ౦గా ఏమి చేయగలమో అది చేయుటకు సుమారు రెండు, మూడు రోజులు ప్రత్యేకించుదము. ఇప్పుడు, ప్రజలు తామిచ్చిన సహాయము నిమిత్తము మరల వందనములు చెల్లించుచున్నాము.

ACTS 9:7•

ACTS 22:9

 

11ఉదయకాల వర్తమానము మీద ఒక్క క్షణము నేను వ్యాఖ్యానించ గోరుచున్నాను. దానిని పూర్తిగా విశదీకరించలేకపోయాను అని నిస్సందేహముగా నాకు తెలియును, కాని మీరు అర్థముచేసికొన్నారని తలంచుచున్నాను. అది నన్ను ఏమి చేయమని కోరునో మీరెన్నడునూ ఎరుగరు.

ఇప్పుడు, అది మీకు చాలా సులభముగా కనబడవచ్చును. కాని మీరేమి చేయుచున్నారో చూడండి? ఒక సంగతి చెప్పుటకు మీరు దేవుని స్థానమును తీసికొనుచున్నారు. అది నేను చేయు ముందుగా దానికి దేవునియొద్ద నుండి జవాబు రావలెను. ఆయన దిగి రావలెను, ఆయన తన్నుతాను కనబరచుకొని ప్రత్యక్షతనిచ్చెను. కాబట్టి ఇది సంఘమునకు, చూచారా. కాబట్టి గుర్తుంచుకొనండి, "నేను దీని గూర్చి చెప్పినది సంఘమునకు మాత్రమే చెప్పాను."

అక్కడ ఉడుతలు లేనప్పుడు ఏ దేవుడయితే నాతో మాట్లాడెనో, ఆ దేవుడే అని మీరు తెలిసికొని నమ్మునట్లుగా చెప్పుచున్నాను. "పలుకుము, అవి అక్కడ ఉండును" అనెను. మరియు నేరుగా మూడుసార్లు ఆలాగు అక్కడ జరిగెను. ఇప్పుడు లేనిదానిని ఆయన అక్కడ తన మాట వలన సృజించకలిగినప్పుడు, తీర్పు దినమున మరెంత ఎక్కువగా ఆయన ఆలాగు చేయునోగదా! చూచారా? ఈ సంగతులు చూచుటకు మరియు యెరుగుటకు అక్కడ జనులున్నారు. గతించిన దినములో పౌలు అదే చెప్పెనని తెలిసికొనుడి. భూమి కంపించుట చూచిరి గాని స్వరమును వారు వినలేదు, కాని వారు అగ్ని స్తంభమును చూచిరి.

12నాకు నిజమగు క్రైస్తవులుగా తెలిసిన భార్యభర్తలు ఒకరినొకరు హత్తుకొని ఏడ్చుట చూచినప్పుడు అది అయిపోయిన తరువాత నాకది మేలు చేసినది.

స్నేహితులారా, వినండి, దేవుడు తన వాక్యమును సూచక క్రియలు, ప్రత్యక్షతలుతో ధృవీకరించి అది నిజమని రుజువు చేయును. పలుకబడిన వాక్యము ఆ మేఘములోనున్న ఆ వెలుగు ఆ ప్రత్యక్షతను ఇచ్చెనని ఇప్పుడు గుర్తుంచుకొనండి.

నా చిన్న బాలిక శారా ఇక్కడున్నది. ఆమె ఈలాగు చెప్పినది. ఆరిజోనాలోని ఆ పాఠశాల వారు మేఘములు లేనప్పుడు ఆ పైకి చూచుచుండిరి. అప్పుడు ఈ మేఘమును మర్మయుక్తముగా నుండుట చూచిరి. ఆ కొండమీద దానియందు పసుపు మరియు ఆకు పచ్చ రంగుల గల అగ్ని మండుచుండగా, అది క్రిందికి పైకి వెళ్ళుట చూచిరి. ఉపాధ్యాయుడు తరగతిని ముగించి పంపివేసెను. వారిని ముందుకు తీసికొని వచ్చి "మీరెన్నడైనా అటువంటిది చూసిరా, అదెట్లున్నదో చూడండి? అని చెప్పెను.

గుర్తుంచుకొనండి, ఆ బండపై నున్నది అదే పసుపు మరియు ఆకుపచ్చ రంగుగల వెలుగు! కాబట్టి ఆయన మారని ఆ దేవుడే, అదే ప్రత్యక్షత, "ఇది చేయమని వారికి చెప్పుము," అని పలికెను. ఈ ఉదయమున నేను చెప్పినది అదే, కనుక అది ఆలాగుండెను.

13ఆ విధముగా నుండుటకు అది జరిగినయెడల, నా మంచి స్నేహితుడగు సహో, రాయ్ రాబర్స్న్ టూసాన్లో వినుచున్నాడు. రాయ్, మనము ఆ పర్వతము మీద నిలబడియుండగా నీవు ఆ రోజున చూచిన దర్శనమును గుర్తుంచుకొన్నావా? నీవు నా యొద్దకు వచ్చితివి. ఆ మేఘము పైన లేదా? నడిచి వచ్చుచుండగా ఆయనేమి చెప్పెనో నీకు తెలియును. మరియు ఒకనాడు ఇంటియొద్ద నీకు చెప్పలేదా? అదే ఇది రాయ్! కుమారుడా, ఇక మీదట ఏమీ బాధపడవద్దు. అది సమాప్తమాయెను.

దాని అర్థము ఏమిటో నీకు తెలియదు! అది కృప! ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. మరియు నీవాయనను ప్రేమించుచున్నావు, తక్కిన జీవిత దినములన్నియూ దీనముగా ఆయనకు సేవచేసి ఆయనను ఆరాధించుము. సంతోషముగా ఉండుము, ముందుకు కొనసాగుము మరియు నీవెలాగు యున్నావో ఆలాగే జీవించుము. నీవు సంతోషముగా నున్నయెడల ఆ విధంగానే కొనసాగుము. ఆలాగు ఎన్నడునూ మరల పొరపాటు చేయవద్దు. ముందుకు సాగిపొమ్ము అది దేవుని కృప!

14వాక్యములోనికి మనము ప్రవేశించుముందుగా ఇప్పుడు మరల నేను ప్రార్ధించగోరుచున్నాను. నా కొరకు ఎందరు ప్రార్థించెదరు? నేను కూటము వెంబడి కూటమునకు వెళ్ళుచున్నాను. మీరు ప్రార్థించుదురా?

మీకు ఒక చిన్న పాటను పాడి వినిపించగోరుచున్నాను. అందరమూ కలిసి వాక్యములోనికి వెళ్ళు ముందుగా పాడుదము. ఒక చిన్న సమర్పణ. ఆయన మీ కొరకు చింతించుచున్నాడు, అను పాటను మీరెప్పుడైనా విన్నారా? "సూర్యకాంతి మరియు దుఃఖముల గుండా ఆయన నీ కొరకు చింతించుచున్నాడు."

చిన్న స్త్రీ పియానో యొద్దకు వచ్చుచున్నది. ఈ చిన్న స్త్రీకి కూడా నేను వందనములు చెప్పవలెను, ఆమె ఎవరో నాకు అసలు తెలియదు. ఇక్కడున్న పెద్దల కుమార్తెలలో ఒకామె. సహో. వీలర్ యొక్క చిన్న కుమార్తె, ఇప్పుడామె ఎదిగినది. కొద్ది కాలము క్రిందట ఆమె ఒక చిన్నపిల్లగా నా మోకాలు మీద కూర్చున్నది. ఇప్పుడామె యువతి. సంగీతములో ఆమెకున్న తలాంతు వాడుచున్నందుకు నిశ్చయముగా ఆమెను నేను అభినందించవలెను. ఆమె చాలా మధురముగా ఇప్పుడు వాయించును. సోదరీ, ముందు ప్రారంభించుటకు నడిపించెదవా? ఇప్పుడు మనమందరము కలిసి పాడెదము.

ఆయన నీ కొరకు చింతించుచున్నాడు

ఆయన నీ కొరకు చింతించుచున్నాడు

సూర్యకాంతియైనను, చ్చాయయైనను

ఆయన నీ కొరకు చింతించుచున్నాడు.

మీరు దానిని ప్రేమించుచున్నారా? దానిని మరల మనందరము కలిసి పాడుదము.

ఆయన నీ కొరకు చింతించుచున్నాడు.

ఆయన నీ కొరకు చింతించుచున్నాడు సూర్యకాంతియైనను, ఛాయనైనను

సహోదరుడా డచ్, ఆయన నీ కొరకు కూడా చింతించుచున్నాడు. సహోదరుడా నీవు ఆయనను ప్రేమించవా?

ఇప్పుడు మన తలలు వంచుదము.

LUKE 24:13-16,30-32

 

15ప్రియ కృపగల దేవా, ఇక్కడున్నచిన్న గమనికలో నుండి కొద్ది సంగతులు జనులకు చెప్పాను. ఈ ఉదయమున ప్రజలు వినుటకు వచ్చినది అందుకే. ఆ సంగతులను తిరిగి ప్రస్థావించాను. దేవుడు ప్రేమించుచున్నాడనియు, శ్రద్ధవహించుచున్నాడనియు జనులకు తెలియనిమ్మని, దేవా, నేను ప్రార్థించుచున్నాను. ప్రభూ,

ఇచ్చునది నేను కాను గాని, అది సత్యమని రుజువు పరచబడెను. ప్రియదేవా, నీ ప్రేమ ఎల్లప్పుడూ జనుల మధ్య నిలిచియుండవలెనని ప్రార్థించుచున్నాను. ఈ రాత్రి కూటానంతరము మేము వేరయి మా, మా గృహములకు పోదుము. ప్రభువా, అది ఒక విధంగా మమ్మును లోతుగా కదిలించుచున్నది. ఈ జనులను దీవించమని నీకు నేను ప్రార్థించుచున్నాను.

ఇప్పుడు వాక్యమును ప్రార్ధనలో సమీపించుచుండగా, వ్రాయబడిన వాక్యమును సమీపించుచుండగా, నీవు ఈ వ్రాయబడిన వాక్యమును తీసికొని, ఈ రాత్రి మాకు దానిని సజీవముగా చేయమని నేను అడుగుచున్నాము. మేము ఈ రాత్రి ఈ భవనమును విడిచిపెట్టి, మా, మా గృహములకు తిరిగి వెళ్ళుచున్నప్పుడు ఆ ఎమ్మాయి నుండి వచ్చి దినమంతయూ ఆయనతో నడిచినవారివలె ఉందుము గాక. అయిననూ వారాయనను గుర్తుపట్టలేదు, కాని ఆ రాత్రి ఆయన ఆ గదిలో వారితో నుండగా, తలుపులన్నియూ మూయబడియుండెను. సిలువ మరణమునకు ముందు ఆయన చేసినట్లుగానే అప్పుడు ఆయన చేసెను. దానిని బట్టి ఆయన తిరిగి లేచెనని వారు తెలిసికొనిరి.

ప్రభువా, మరల ఈ రాత్రి ఆలాగు చేయుము. తలుపులు మూసియుండగా, నీ చిన్నగుంపు ఇక్కడ కూర్చొని కనిపెట్టుచుండగా ఆలాగు దయచూపుము. తండ్రీ, మేము గృహములకు వెళ్ళినప్పుడు వారు చెప్పినట్లుగా చెప్పెదము గాక. "మార్గములో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా? మమ్ములను, సమస్తమును నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, ఏలాగు నీకు చేయనిష్టమో ఆలాగు చేయుము. యేసు నామమున. ఆమేన్.

ROM 8:28•

HEB 7:1-3

 

16ఇప్పుడు వెంటనే మనము ఆరాధనలోనికి వెళ్ళెదము. నాతోపాటు మీకిష్టమైనచో హెబ్రీ పత్రిక తీయండి. వర్తమానము మీద మరియొక ప్రత్యక్షత ప్రభుని చిత్తమైనచో ఈ రాత్రికొద్ది క్షణముల పాటు మాట్లాడుకొందము. హెబ్రీ 7: 1 - 8 వచనములు చదువుచూ ఆ తరువాత వ్యాఖ్యానించుదము. ప్రభువు ఏమి చేయునో మనకు తెలియదు; మనమెరుగము. మనము చేయవలసినదంతయూ, విశ్వసించి, కనిపెట్టి ప్రార్థించుటయే. అది నిజమేనా? మరియు "ఆయనను ప్రేమించువారికి సమస్తమూ మేలు కొరకే సమకూడి జరుగునట్లుగా చేయునని నమ్మవలెను," ఎందుకనగా ఆయన వాగ్దానమదియే.

రాజులను సంహారము చేసి, తిరిగివచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని అశీర్వదించెన్లో,

యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగానున్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము.

ఇంకొంత ముందుకు చదువదము.

అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడునై యుండి దేవుని కుమారుని పోలియున్నాడు.

HEB 7:4•

REV 10:7

 

17ఈ గొప్ప వ్యక్తిని గూర్చి ఆలోచించండి, ఈయన ఎంత గొప్పవాడై యుండునో చూడండి! మరియు ఇప్పుడు ప్రశ్న ఏమనగా: "ఈ వ్యక్తి ఎవరు?" వేదాంత పండితులకు వేర్వేరు ఉద్దేశ్యములున్నవి. కాని మర్మమగు గ్రంథముగా నుండిన ఏడు ముద్రలు విప్పబడినప్పటి నుండియూ అది మనకును మర్మముగానే యుండెను…. ప్రకటన 10:1-7 ప్రకారము, ఈ గ్రంథములో వ్రాయబడిన మర్మములన్నియూ, సంస్కర్తల కాలము నుండి మరుగైయున్నవి, చివరి సంఘ కాలపు దూత ద్వారా తేటతెల్లము చేయబడునని చెప్పబడెను. అది నిజమని ఎందరికి తెలియును? అది నిజము. వెలికి తీసికొని రాబడవలసియున్నది. మర్మయుక్తమగు గ్రంథములోని మర్మములన్నియూ లవోదికయ సంఘకాలములోని వర్తమానికునికి బయలు పరచబడును.

ఈ వ్యక్తిని గూర్చి ఎంతో వివాదమున్నదని ఎరిగి ఈ అంశము ద్వారా దానిని జగ్రత్తగా బ్రద్దలు చేసి ఈయనెవరో కనుగొనవలెను. ఆయనను గూర్చి అనేక ఆలోచనా పాఠశాలలున్నవి.

అందులో ఒక పాఠశాల వారు చెప్పుచున్నారు, "అతను కేవలము ఒక కల్పిత వ్యక్తి. అతడు అసలు ఒక వ్యక్తి కాదు."

మరికొందరయితే, "అది ఒక యాజకత్వము అని చెప్పెదరు," అనగా మెల్కీసెదెకు యాజక క్రమము అన్ని అలోచనలకంటె అది కొంత మేరకు సమంజసమగు ఆలోచనగా కనిపించవచ్చును, ఎందుకనగా అది యాజక క్రమము అని వారు చెప్పెదరు.

కాని అది కాదు, ఎందుకనగా 4వ వచనములో అది చెప్పుచున్నది. అతను ఒక వ్యక్తి, ఒక "వ్యక్తి." కాబట్టి ఒక వ్యక్తిగా యుండవలెనంటే, అతడు ఒక వ్యక్తిత్వమును కలిగి యుండవలెను, "ఒక మనిషి" ఒక క్రమము కాదు గాని; ఒక వ్యక్తి. కాబట్టి ఆయన ఒక యాజక క్రమము మాత్రమే కాదు. ఒక కల్పితమైనవాడు కాదు. ఆయన ఒక వ్యక్తి.

1TIM 6:16•

HEB 7:3

 

18ఆ వ్యక్తి నిత్యుడు. మీరు గమనించినచో "ఆయనకు తండ్రి లేడు. ఆయనకు తల్లి లేదు. ఎప్పుడు జన్మించెనో కాలము లేదు. మరియు ఎప్పుడు ముగింపు పొందెనో కాలము లేదు." ఆయన ఎవరైనాగాని ఈ రాత్రి ఇంకా జీవించియున్నాడు, ఎందుకనగా బైబిలు "ఆయనకు తండ్రి, తల్లి, దినముల ప్రారంభము, జీవిత అంతము లేదని చెప్పుచున్నది. కనుక అయన ఒక నిత్యుడగు వ్యక్తి అయియుండవలెను. అది నిజమేనా? ఒక నిత్యుడగు వ్యక్తి, కనుక ఆయన ఒకే ఒక వ్యక్తి అయియుండవలెను, దేవుడే. ఎందుకనగా దేవుడొక్కడే నిత్యుడగువాడు.

ఇప్పుడు, I తిమోతీ 6:15 మరియు 16లో, ఎప్పుడైనా ఒకసారి మీరది చదవండి, దానిని మీకు చదివి వినపించగోరుచున్నాను. నేను గట్టిగా చెప్పునదేమనగా ఆయన దేవుడే, ఎందుకనగా అమర్త్యునిగా ఉండకలిగినవాడు ఆయన ఒక్కడే. దేవుడు తన్ను ఒక వ్యక్తిలోనికి మార్చుకొనుచున్నాడు; ఆయన అదే అయియుండెను. "తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవిత ప్రారంభము లేనివాడు, జీవిత దినములకు అంతములేనివాడు."

MATT 11:25•

LUKE 10:21

 

19"దైవత్వములో ముగ్గురు వ్యక్తులున్నారని" చాలామంది ప్రజలు బోధించుట మనము లేఖనములో కనుగొనుచున్నాము. కాబట్టి వ్యక్తి లేకుండా వ్యక్తిత్వముండదు. ఒక వ్యక్తిత్వమును తయారుచేయవలెనన్నచో ఒక వ్యక్తి కావలెను.

ఒక బాప్టిస్టు సేవకుడు కొద్ది వారముల క్రితము నా ఇంటికి వచ్చి ఇట్లు చెప్పెను, "నీకు సమయమున్నప్పుడు దైవత్వము యొక్క విషయములో నిన్ను నేను సరి చేయవలెనని కోరుచున్నాను." ఇంకా చెప్పవలెనన్నచో నన్ను సరిచేయుటకు పిలిచెను.

"ఇప్పుడు నాకు సమయమున్నది. ఎందుకనగా నేను సరిచేయబడగోరుచున్నాను. అదే చేయుటకు మనము అంతా ఒక ప్రక్కపడవేయుదము" అని చెప్పాను.

అతడు వచ్చి, "బ్రానాం సోదరుడా, కేవలము ఒక్క దేవుడే ఉన్నాడని నీవు బోధించెదవు గదా? అన్నాడు.

"అవునయ్యా" అన్నాను.

"సరే, ఒక్క దేవుడే అని నేను నమ్ముదును. కాని ముగ్గురు వ్యక్తులుగా నున్న ఒకేదేవుడు" అని చెప్పెను.

"అయ్యా! అది మరల చెప్పండి" అనడిగాను.

"ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు" అన్నాడు.

"నీవు ఏ బడిలో చదువుకొన్నావు?" అనడిగాను. చూచారా? ఒక బైబిలు కాలేజిలోనని అతడు చెప్పెను. "అది నేను నమ్ముదును. వ్యక్తిత్వము లేకుండా నీవు వ్యక్తివి కాలేవు. నీకు ఒక వ్యక్తిత్వమున్నది అంటే అది నీకు నీవుగాయున్న ఒక వ్యక్తిత్వము. నీవు వేరుగానున్న వ్యక్తిగత ప్రాణివి? అన్నాను.

"వేదాంత పండితులు సహితము దానిని వివరించలేరు గదా? " అని అతడు పలికాడు.

నేను చెప్పాను, "అది ప్రత్యక్షత ద్వారా వచ్చును."

"నా ప్రత్యక్షతను అంగీకరించలేను?" అని అతను పలికెను.

"దేవుడు నీకు అర్థము చేయాలంటే అది తప్ప మరే మార్గము లేదు, ఎందుకనగా "అది వివేకముగలవారికి, జ్ఞానులకు మరుగుచేయబడి పసిపిల్లలకు బయలుపరచబడియున్నది. బయలుపరచబడుట, ప్రత్యక్షత, "పసిపిల్లలకు బయలుపరుచుట అని చెప్పాను. మరియు అనగా నేర్చుకొని అంగీకరించువారికి" అని చెప్పాను. మరియు "నీకు దానిని అర్ధము చేయుటకు దేవునికి మరే మార్గము లేదు. నీవు ఆయనకు దొరకకుండా మూసికొనుచున్నావు" అని చెప్పాను.

మొత్తము బైబిలు దేవుని యొక్క ప్రత్యక్షతయై యున్నది. సంఘము మొత్తము దేవుని యొక్క ప్రత్యక్షత మీదనే కట్టబడినది. ప్రత్యక్షత ద్వారా తప్ప దేవునిని తెలిసికొను ఇతర మార్గము ఏదియూ లేదు "కుమారుడు ఎవరికి ప్రత్యక్షతను అనుగ్రహించునో వారే తెలిసికొందురు." ప్రత్యక్షత ప్రతిదీ ప్రత్యక్షతయే. ప్రత్యక్షత లేకపోయినచో నీవు చల్లబడిన వేదాంత పండితునివే. నీకు ఏ నిరీక్షణ లేదు" అన్నాను.

HEB 7:3

 

20ఇప్పుడు, "ఈ వ్యక్తికి తండ్రి, తల్లి, జీవిత ప్రారంభము, జీవిత ముగింపు లేదని? మనము కనుగొనుచున్నాము. ఆయన దేవుడే. ఎన్మార్పి.

ఇప్పుడు, ప్రపంచము, ఆ మాట గ్రీకు పదము నుండి వచ్చును, "మార్పు" అని దాని అర్ధము. తన్నుతాను మార్చుకొనుట. ఎన్నార్పి, ఒక వ్యక్తి నుండి మరియొక్క వ్యక్తికి, అక్కడ గ్రీకు పదము ఎన్నార్పినకు అర్ధము స్టేజి మీద నటించు భావనకు సరిపోవును - "ఒక వ్యక్తి తన ముసుగుతో ఒక పాత్రనుండి మరియొక పాత్రలోనికి మారుటను చూపించుచున్నది."

ఈ మధ్యనే స్కూలులో అనుకొంటాను జరిగినట్లుగానే రిబ్కా కళాశాల విద్య పూర్తి చేయకముందు వారు - షేక్స్పియర్ నాటకములలో ఒకదానిని ప్రదర్శించారు. ఒక యువకుడు తన దుస్తులను చాలాసార్లు మార్చుకొనవలసివచ్చెను, ఎందుకనగా అతడు రెండు లేక మూడు పాత్రలు వేయుచుండెను. ఒకే వ్యక్తి కాని వివిధ పాత్రలు ధరించెను. ఒకసారి విలన్లా అతడు బయటకు వచ్చెను, మరోసారి ఇంకో "పాత్రలో అతడు బయటకు వచ్చెను. ఎన్ మార్పి అను గ్రీకు పదమునకు ఆయన తన "ముసుగును మార్చు కొనెనని" అర్థము.

JOHN 1:14

 

21దేవుడు అదే చేసెను. అన్ని కాలములలోను ఒకే దేవుడు. తండ్రి రూపములో యుండిన దేవుడు - ఆత్మ అగ్నిస్తంభము, అదే దేవుడు శరీరధారియై మనమధ్య నివసించెను. ఆయనను చూచునట్లుగా ఎన్మార్చి బయటకు తీసుకొని వచ్చెను. మరియు ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్దాత్మ తండ్రి, కుమార, పరిశుద్దాత్మ - ముగ్గురు దేవుళ్ళు కారు; మూడు కార్యాలయములు, ఒకే దేవుని యొక్క మూడు పాత్రలు.

"దేవుడు ఒక్కడే గాని? ముగ్గురు కారని బైబిలు చెప్పుచున్నది. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి నీవు దీనిని సరిచేయలేవు. ఒక యూదునికి నీవెన్నడూ ఆలాగు చెప్పి ఒప్పించలేవు. దేవుడొక్కడే అని అందరికన్నా బాగా ఎరిగినవాడు యూదుడు తప్ప మరెవరూ కారని చెప్పుచున్నాను.

EXOD 19:12,13•

1TIM 3:16

 

22గమనించండి, శిల్పకారుడు ఒక తెరవేసిదాయును. ఈ కాలమునకు దేవుడు అదే చేసెను. అది దాచబడినది. ఇవన్నియూ దాచబడినవి. మరియు ఈ కాలములో తెలియచేయబడును. అంత్యకాలములో బయలుపరచబడునని బైబిలు చెప్పెను. తాను పనిచేయుచున్నంత కాలము శిల్పకారుడు తన శిల్పమును ముసుగు కప్పి దాచునట్లుగానే, సమయము వచ్చునప్పుడు, అతడు దానిని తీసివేయగా అది అక్కడుండెను.

మరియు బైబిలు కూడ అలాగేయున్నది. దేవునియొక్క ఒక కార్యముగా అది ముసుగు వేయబడియున్నది. మరియు జగత్తు పునాది వేయబడినప్పటి నుండియూ అది దాచబడి యున్నది. మరియు అది ఏడు వంతుల మర్మము. మనము చూచునట్లుగా ఆ సంగతి యంతటికి పైనున్న తెరను తీసివేయుట ఈ లవొదికియ సంఘకాలములోనే, ఈ దినముననే జరుగునని దేవుడు వాగ్దానము చేసెను. ఎంత మహిమకరమగు సంగతి!

ఎన్మార్చి, దేవుడు అగ్నిస్తంభములో ముసుగు ధరించెను. దేవుడు, ఎన్మార్పి,యేసు అను మానవునిలో యుండెను. దేవుడు, ఎన్మార్పి, తన సంఘములో యుండెను - మనకు పైగానున్న దేవుడు, మనతోనున్న దేవుడు, మనలోనున్న దేవుడు, దేవుడు యొక్క నిగర్వమైన కార్యము అది. ఆ పైన ఆయన పరిశుద్దునిగా ఉండెను. ఎవరూ ఆయనను అంటుకొనలేకపోయిరి. ఆయన కొండ మీద కూర్చొనెను; మరియు ఆ కొండను ఒక పశువు తాకినా గాని అది చావవలసియుండెను.

తరువాత దేవుడు క్రిందికి దిగి వచ్చి తన గుడారమును మార్చుకొనెను. దిగి వచ్చి మనతో జీవించెను. "మనలో ఒకడాయెను." మనమాయనను చూచాము. I తిమోతి 3:16లో బైబిలు ఈలాగు చెప్పెను, "నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై యున్నది. ఏలయనగా శరీరమందు దేవుడు ప్రత్యక్షమాయెను, మనము చేతులతో తాకితిమి!" దేవుడు మాంసము తినెను. దేవుడు నీరు త్రాగెను. దేవుడు నిద్రపోయెను. దేవుడు ఏడ్చెను. ఆయన మనలో ఒకడాయెను! చక్కగా బైబిలులో చూపించబడెను.

ఆయనే పైనున్న దేవుడు; మనతోనున్న దేవుడు; ఇప్పుడు మనలో నుండిన దేవుడు, పరిశుద్దాత్మ; మూడవ వ్యక్తి కాదు; అదే వ్యక్తి,

GEN 1:3•

HEB 13:8

 

23దేవుడు క్రిందికి దిగి వచ్చి శరీరధారియయ్యెను, మరియు క్రీస్తులో మృతిచెందెను; సంఘమును పవిత్రపరచి, దానితో సహవాసము చేయుటకై. దేవుడు సహవాసమును ప్రేమించును. అందుకోరకే దేవుడు మానవుని ఆదిలో సృజించెను, సహవాసము కొరకు. దేవుడు కెరూబులతో ఒంటరిగా జీవించెను.

మరియు ఇప్పుడు గమనించండి, ఆయన మానవుని చేసెను, మానవుడు పడిపోయెను. కనుక ఆయననే క్రిందికి దిగి వచ్చి మానవుని విమోచించెను, ఎందుకనగా దేవుడు ఆరాధింపబడుటకు ఇష్టపడును. దేవుడు అను పదమునకు అర్థమే, "ఆరాధనకు పాత్రుడు."

ఆయన అగ్నిస్తంభముగా మన మధ్యకు వచ్చెను. మన హృదయములను మార్చకలుగునది అదే. "వెలుగు కలుగును గాక" అని చెప్పినదే ఆ దేవుడే, అప్పుడు వెలుగు కలిగెను! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు.

24ఈ ఉదయ కాలమున నేను చెప్పినట్లుగా ఆదియందు దేవుడు తన గుణలక్షణములతో మాత్రమే నివసించెను. అనగా అవి ఆయన ఆలోచనలు. అక్కడ ఏమియూ లేదు, దేవుడు మాత్రమే, కాని ఆయనకు ఆలోచనలుండెను.

ఒక గొప్ప నిర్మాణకుడు తన మనస్సులో నిర్ణయించి, తాను నిర్మించబోవునది, తయారు చేయబోవునది కాగితము మీద గీయును. అతడు ఇప్పుడు సృష్టించజాలడు — సృష్టించబడిన. దానిని అతడు తీసికొని దానిని వేరు రూపములోనికి తెచ్చును; ఎందుకనగా దేవుడొక్కడే సృష్టి చేయకలిగినవాడు. కాని తాను చేయబోవు దానిని మొదటగా మనస్సులోనికి తెచ్చుకొనును, అవి ఆతని ఆలోచనలు, అవి అతని కోరికలు.

ఇప్పుడు అది ఒక ఆలోచన. అప్పుడతడు దానిని పలుకును. అప్పుడు అది మాట అగును. ఒక ఆలోచనను వ్యక్తపరచినప్పుడు మాట అగును. వ్యక్తము చేయబడిన ఆలోచనయే మాట, కాని మొదటిగా అది ఆలోచన అయియుండవలెను. కాబట్టి అది దేవుని యొక్క గుణలక్షణము; అప్పుడది ఆలోచన, తరువాత మాటయగును.

25గమనించండి, ఈ రాత్రి నిత్యజీవము కలిగినవారు అసలు దేవదూత, నక్షత్రము, కెరూబులు మొదలగునవి ఏవియూ లేకముందే ఆయనతో, ఆయనలో మరియు ఆయన ఆలోచనలో యున్నారు. అదియే నిత్యజీవము. నీవు కలిగియున్నచో ఎల్లప్పుడునూ నీకు ఉండినట్లే. ఇక్కడ నీవు ప్రాణిగా ఉండుట వలన కాదు గాని దేవుని యొక్క అనంత రూపము, అమరికలోయున్నావు ఆయన అనంతుడు కానిచో ఆయన దేవుడే కాడు.

దేవుడు అనంతుడుగా ఉండవలసియున్నాడు. మనము పరిమితి గలవారము. ఆయన అనంతుడు, ఆయన ప్రతిచోట ఉండువాడు. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఆలాగు కానిచో ఆయన దేవునిగా ఉండజాలడు. అన్ని సంగతులు ఎరుగును. తన సర్వవ్యాప్తిత్వమును బట్టి అన్ని ప్రదేశములను ఎరుగును. సర్వజ్ఞానిగా ఉండుట వల్లనే ఆయన సర్వాంతర్యామి అగుచున్నాడు. ఆయన ఒక జీవి; ఆయన గాలివంటి వాడు కాడు. ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక గృహములో నివాసము చేయును. కాని సర్వజ్ఞానిగా యున్నందువలన అన్ని సంగతులు ఎరుగును. అందువలన ఆయన సర్వాంతర్యామియగుచున్నాడు, ఎందుకనగా జరుగుచున్న సమస్తమూ ఆయన ఎరుగును.

ఒక ఈగ రెప్పలు కొట్టుకొనుట ఆయనెరుగును. అసలు ప్రపంచము అనునది ఒకటి లేక పూర్వమే అది ఎన్నిసార్లు రెప్పలు వేయునో. దాని శరీరపు పరిస్థితులెట్లుండునో ఆయన ఎరుగును. అదియే అనంతము. మన మనస్సులలో దానిని గ్రహించలేము, కాని దేవుడు. దేవుడు — అనంతుడు!

ROM 9:16

 

26గుర్తుంచుకొనండి, మీ నేత్రములు, మీ రూపము, మీకున్నదంతయూ ఆదియందు ఆయన తన ఆలోచనలో కలిగియుండెను. అయితే మాట వ్యక్తము చేసినప్పుడే నీవు ఈలాగు మారితివి. దానిని ఆయన ఆలోచించిన తరువాత, దానిని పలికెను. మరియు నీవు ఇక్కడున్నావు. అది ఆలాగు కానిచో, నీవాయన ఆలోచనలో లేనిచో ఎన్నడునూ అక్కడికి వచ్చుటకు మార్గమే లేదు, ఎందుకనగా ఆయన మాత్రమే నిత్యజీవము ఇచ్చువాడు.

వాక్యములో ఈలాగు మనము చదువుట మీకు గుర్తున్నది? "ప్రయాసపడు వానివలనైనను, ఇచ్చయించు వానివలనైనను కలుగదు కాని దేవుని వలననే … "ఆయన యొక్క ముందు నిర్ణయము నిజముగా నిలబడునట్లుగా అసలు కాలమనునది లేక పూర్వమే దేవుడు తన సార్వభౌమత్వము చొప్పున ఎన్నిక చేసికొనెను. మీరది ఎరుగుదురా? దేవుడు సార్వభౌముడు. ప్రపంచమును మరింత చక్కని రీతిగా తయారు చేయమని ఆ పూర్వమున ఆయనకు ఎవరు చెప్పిరి? ఆయన తన పనిలో తప్పుగా వ్యవహరించుచున్నాడని ఎవడు చెప్పగలడు? వాక్యమే సర్వాధికారము గలది. ప్రత్యక్షతయూ సర్వాధికారము గలది. "ఆయన ఎవరికి బయలుపరచగోరునో వారికే బయలుపరచును." ప్రత్యక్షత సహితము దేవునిలో సార్వభౌమాధికారముగలదిగా యున్నది, అందువలననే జనులు తాము చేయుచున్నది ఎరుగక కొన్ని విషయములలో తికమకపడుచూ, గంతులు వేయుచూ, చిందులు తొక్కుదురు. దేవుడు తన కార్యములలో సార్వభౌముడుగా ఉన్నాడు.

REV 13:8,14

 

27ఇప్పుడు ఆయనలో ఆదియందున్న గుణలక్షణములను కనుగొన్నాము. నీవు అప్పుడే ఆయనతో యున్నావు. జీవగ్రంథము చూడకలుగునట్లుగా ఉనికిలోనికి అప్పుడే వచ్చెను.

ఇక్కడ మనము ప్రకటన 13వ అధ్యాయము, 8వ వచనము చదువుదము. చివరి దినములలో "భూమి మీదికి వచ్చు మృగము జగత్తు పునాది వేయబడక మునుపే గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో భూమిమీద జీవించుచున్న వారినందరినీ అది మోసము చేయును."

దానిగూర్చి ఆలోచన చేయండి! యేసు అసలు పుట్టక పూర్వమే ఆయన భూమి మీదకు వచ్చుటకు నాలుగువేల సంవత్సరములకు ముందే, నీవు ఈ భూమి మీదికి వచ్చుటకు అనేక వేల సంవత్సరములకు ముందే, దేవుని మనస్సులో యేసు ఈ లోకపాపముల నిమిత్తము చనిపోయెను. మరియు జీవగ్రంథము తయారయ్యెను. ఆ జీవగ్రంథము మీద జగత్తు పునాది వేయబడకముందే నీ పేరు వ్రాయబడెను! అది బైబిలు సత్యము. చూచారా, జగత్తుపునాది వేయబడక ముందే దేవుని చేత నీ పేరు నిర్ణయించబడి జీవగ్రంథము మీద వ్రాయబడెను.

నీవు అప్పుడే ఆయన యొక్క గుణలక్షణములో ఉండియున్నావు, నీవు అది గుర్తుచేసికొనలేవు, ఎందుకనగా నీవు ఆయన జీవములో కేవలము ఒక భాగము. నీవు ఒక్క దేవుని కుమార్తె లేక కుమారునిగా అగునప్పుడు నీవు దేవునిలో ఒక భాగము అయ్యెదవు.

నీవు నీ భూలోక తండ్రిలో భాగమైయున్నట్లుగానే! అది నిజము నీవు భాగము. పురుషుడు రక్తమును అనగా హిమోగ్లోబిన్ను మోయును. అది అండము లోనికి పొయినప్పుడు, నీవు నీ తండ్రిలో ఒక భాగముగా అయ్యెదవు. నీ తల్లి కూడా నీ తండ్రిలో ఒక భాగమే. కనుక మీరందరు పూర్తిగా మీ తండ్రిలో ఒక భాగము.

మహిమ! అది శాఖను పూర్తిగా బయటపెట్టును. నిశ్చయముగా చేయును! అందరిలోను దేవుడు ఒక్కటే స్థలము.

JOHN 1:1,14

 

28ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణమును గమనించుదము. మొదటగా దేవుని గుణలక్షణము; ఆలోచన, ఆ గుణలక్షణమే ఆలోచన, వ్యక్తపరచబడకుండా అవన్నియూ ఒక్కనిలోనేయున్నవి. రెండవదిగా, ఆయన దానిని వ్యక్తపరచినప్పుడు అది మాట ఆయ్యెను. "ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య జీవించెను."

పరి. యోహాను I అధ్యాయము 1వ వచనము. దీనిని "ఆదిలో యుండుటకు గమనించండి. కాని నిత్యత్వమునకు ముందు, గమనించండి. "ఆదియందు వాక్యముండెను." కాలము అనునది ఆరంభమైనప్పుడు వాక్కు ఉండెను. కాని ఆ వాక్కు అనునది ఉండుటకు ముందు అది ఒక గుణలక్షణము. ఒక ఆలోచన యుండెను. అప్పుడది వ్యక్తపరచబడెను. "ఆదియందు" వ్యక్తీకరించుట, "వాక్యము."

ఇప్పుడు మెల్మీసెదెకు యున్న చోటునకు మనము వచ్చుచున్నాము. అదియే ఈ మర్మముగానున్న వ్యక్తి, "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడైయుండెను. అప్పుడు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య జీవించెను." ఇప్పుడు అక్కడ ఆగియుండండి, గమనించండి.

ఆయన మొదటి రూపము ఆత్మ దేవుడు సహజాతీతుడు, మంచిది, ఆ గొప్ప నిత్యుడు. రెండవదిగా ఆయన తన్నుతాను ఒక ధియోఫనీగా శరీరమును అమర్చుకొని రూపము ధరించెను, దానినే "వాక్యము, ఒక దేహము," అని పిలచుట జరిగెను. అబ్రాహామును ఆయన కలిసికొనినప్పుడు ఇదే ఆయన స్థితి. మెల్కీసెదెకుగా పిలువబడెను. ఆయన థియోఫనీ అను రూపములో యుండెను. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి దానిని కొద్ది నిమిషములలో రుజువుచేయుదము. దేవుని చిత్తమును బట్టి ఆలాగు చేయుదుము. ఆయనే వాక్యమై యుండెను.

HEB 7:1

 

29థియోఫనీ అనగా నీవు చూడలేకపోవునది. ఇప్పుడది ఇక్కడే యుండవచ్చును అయినను దానిని నీవు చూడలేవు. అది టెలివిజనువలెయున్నది. అది మరొక పరిమాణములో యున్నది. టెలివిజను . ఇప్పుడు ప్రజలు ఈ గదిగుండా పాడుచూ సంచరించుచున్నారు. అందులో రంగులు కూడా యున్నవి. కాని కన్ను అయిదు జ్ఞానేంద్రియములకు మాత్రమే పరిమితము లేక నీ సమస్త శరీరము అయిదు జ్ఞానేంద్రియములకు మాత్రమే పరిమితము. మరియు నీ కంటి ద్వారా చూచువాటికి మాత్రమే నీ దృష్టి పరిమితము. కాని మరియొక్క పరిమాణమున్నది, దానిని టెలివిజను ద్వారా, రూపాంతరము ద్వారా చూడగలవు.

టెలివిజను ఒక చిత్రమును తయారుచేయదు. అయితే అది ఒక చిత్రమును పరివృత్తములోనికి ప్రవేశపెట్టును. దానిని ఆ టెలివిజను తెరపట్టుకొనును. అయితే మొదటగా అక్కడ చిత్రము ఉండవలసియున్నది. ఆదాము ఇక్కడున్నప్పుడే ఇక్కడ టెలివిజను యున్నది. కర్మెలు కొండ మీద ఏలియా కూర్చునప్పుడే ఇక్కడ టెలివిజనుయున్నది. నజరేయుడైన యేసు గలతీయ సముద్రపు ఒడ్డున నడిచినప్పుడు ఇక్కడ టెలివిజనుయున్నది. అయితే దానిని ఇప్పుడే కనుగొనిరి. ఆ వెనుకటి కాలములోని వారు దానిని నమ్మజాలకపోయిరి. అటువంటిది ఏదయినా నీవు చెప్పినచో పిచ్చివానిగా పరిగణించియుందురు. కాని ఇప్పుడది వాస్తవముగా మారెను.

ఇక్కడ క్రీస్తు ఉండుట కూడా ఆలాగే యున్నది. దేవునియొక్క దూతలు ఇచ్చటున్నారు! రానున్న ఆ గొప్ప వెయ్యేండ్ల పాలనలో టెలివిజను లేకమరేదో దానికన్నా అది మరెక్కువ వాస్తవముగా ఉండును, ఎందుకనగా వారు ఇక్కడ యందురు.

ఆయన తన్నుతాను ఎన్మార్పిగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపములో తన్నుతాను తన దాసులకు కనుపరచుకొని రుజువుపరచుకొనెను.

ఇప్పుడాయన ఆత్మ రూపములో ఇచ్చట ఉన్నాడు. అప్పుడాయన ఎన్మార్పి రూపములో వచ్చి అబ్రాహామునకు ఆలాగే ఎన్మార్పిగా ప్రత్యక్షమాయెను. రాజులను సంహారము చేసి అబ్రాహాము తిరిగి వచ్చుచుండగా ఇక్కడ మెల్కీసెదెకు వచ్చి అతనితో మాట్లాడెను.

2COR 5:1

 

30ఒకనాడు నేను టక్సాన్ పత్రికలో ఒక వ్యాసము చదివాను. ఒక స్త్రీ గంటకు నలుబది, ఏబది మైళ్ళ వేగముతో రోడ్డు మీద కారు నడుపుకొని వెళ్ళుచుండగా, కోటు ధరించిన ఒక వృద్దుని డికొట్టినది. ఆమె కేకవేసి కారును ఆపెను. ఆ తాకిడికి అతడు గాలిలోకి విసిరి వేయబడి ఆ విశాల ఎడారిలో పడెను! అతని కనుగొనుటకు ఆమె వెళ్ళెను గాని అక్కడతడు లేడు. అప్పుడామె ఏమి చేసెను? ఆమె వెనుకనున్నవారు కొందరు ఇదంతయూ చూచిరి. ఆ వృద్దుడు గాలిలోనికి విసిరివేయబడుట, అతని కోటు రెపరెపలాడుట వారు చూచిరి, కనుక వారును అతని వెదుకసాగిరి. ఎక్కడునూ వారు అతనిని కనుగొనలేకపోయిరి. వారు పోలీస బలగమును పిలిచిరి. ఆ స్థలమును పరీక్షించుటకు పోలీసువారు వచ్చిరి. అక్కడెవరూ కనబడలేదు.

సరే వారిలో ప్రతిఒక్కరు "ఆ మనిషిని తాకినందున కారు ఏలాగయినదో చూచి సాక్ష్యమిచ్చిరి." అతడు గాలిలోనికి ఎగిరిపోయెను. అది అందరూ చూచిరి. రెండు, మూడు కారులు పట్టునంతమంది సాక్ష్యులు అది జరుగుట చూచిరి. అయితే తెలిసినదేమనగా, అయిదు సంవత్సరముల క్రితము ఆ స్థలమందు కోటు ధరించిన ముసలివాడు కారు డికొని చనిపోయెను.

నీవు ఇక్కడ నుండి వెళ్లిపోయినప్పుడు మరణించుటలేదు. నీవు పాపివి అయినా గాని తిరిగి వచ్చి, శరీరమందు జరిగించిన కార్యముల కొరకు తీర్పు తీర్చబడెదవు. "ఈ భూమి మీదనున్న గుడారము కరిగిపోయినను, మరియొకటి దానికొరకు మనము ఎదురు చూచుచున్నాము." ఎన్మార్పి, అదే వాక్యము.

31సృష్టి చేయునప్పుడు ఈ రూపమందున్న దేవుడు, తరువాత శరీరధారిగా యేసునందు కనబడెను. దేనినుండి? ఆదియందున్న ఆ గొప్ప ఆత్మ నుండి వాక్యముగా దిగి వచ్చి దానిని బయటకు తెచ్చెను. వాక్యము ఇంకా వాక్యముగా మారలేదు. అప్పుడే అది పలుకబడెను. ఎన్మార్పిగా, తరువాత ఆయన యేసుగా శరీరధారియై వచ్చెను. పాపులమగు మనందరి కొరకు మరణమును రుచి చూడకలుగునట్లుగా మర్త్యుడాయెను.

అబ్రాహాము ఆయనను కలిసికొనినప్పుడు ఆయన మెల్కీసెదెకుగా ఉండెను. అంతమందు అబ్రాహాము యొక్క ప్రతి కుమారునికి ఎట్టి గుణలక్షణములు సంప్రాప్తించునో ఇక్కడ ఆయన బయటపెట్టి చూపించెను. విశ్వాసియగు ప్రతి కుమారుడు సరిగ్గా అదియే చేయును. అయితే మనమెట్లు రావలసియున్నామో గమనించవలెనని మిమ్మను కోరుచున్నాను.

రూతు, బోయజులందు ఆయన ఒక సమీపబంధువుడగు విమోచకునిగా బయలుపరచబడియుండుటను మనము చూచాము. ఆయన ఏ రీతిగా శరీరధారిగా రావలసివచ్చెనో చూచాము.

JOHN 6:37,39•

2COR 5:1

 

32గుణలక్షణము, ఆత్మయొక్క కుమారులు ఇంకనూ వాక్యరూపములోయున్న శరీరములోనికి ప్రవేశింపలేదని మనము ఇప్పుడు చూచాము. కాని ఒక ధీయోఫనీ; ఈ శరీరము వాక్యమునకు లోబడియుండి, శరీరము యొక్క మార్పుకొరకు, సంచకరువు కొరకు ఎదురుచూచుచున్నది.

కుమారునిగా ఇప్పుడు నీకు ఆయనకు మధ్యనున్న భేదము చూడండి. ఆదియందు ఆయన వాక్యముగా యుండెను. ఒక ఎన్మార్పి శరీరము. ఆయన వచ్చి ఆ మెల్మీసెదెకు అను వ్యక్తియందు జీవించెను. ఆ తరువాత మరెన్నడునూ మెల్కీసెదెకును గూర్చి వినలేదు. ఎందుకనగా ఆయనే యేసుక్రీస్తు ఆయెను. మెల్కీసెదెకు యాజకుడిగా యుండెను, కాని ఆయన యేసుక్రీస్తు ఆయెను. మీరు అది దాటిపోయియున్నారు, ఎందుకనగా ఆ రూపమందు ఆయన అన్ని సంగతులు ఎరిగియుండెను. దానిని ఇంకనూ మీరు తెలిసికొనుట ఎన్నడూ జరుగలేదు.

మీరు ఆదామువలె, నావలె వచ్చిరి, మీరు ఆ గుణలక్షణము నుండి, శోధనకు గురికాబడు శరీరమును ధరించితిరి. కాని ఇక్కడి ఈ జీవితము అంతమైన పిదప "భూమిమీద ఈ గుడారము కరిగిపోయిన తరువాత, మనకు మరియొకటి వచ్చుటకు ఇదివరకే కాచుకొనియున్నది." అక్కడికే మనము వెళ్ళుదము. అదియే వాక్యము. అప్పుడు మనము గతములోనికి తొంగిచూచి ఏమి చేసితిమో చూచుదుము. ఇప్పుడు దానిని మనము అర్థము చేసికొనము. మనమెన్నడునూ వాక్యముగా మారలేదు. మనము కేవలము మానవుడిగా అయ్యాము, శరీర వాక్యముగా కాదు.

తేటగా చూడండి, ఆదియందు నీవు వాక్యముగా ఉండనిచో ఇప్పుడు నీవు వాక్యముగా ఉండజాలవని స్పష్టముగా తెలియుచున్నది. అది దేవుని యొక్క ముందు నిర్ణయమును రుజువుచేయుచున్నది. చూచారా? నీవు ఒక ఆలోచనగా ఉండనిచో వాక్యముగా ఉండలేవు. మొదటగా నీవు ఆలోచనగా ఉండవలసియున్నావు. కాని మీరు చూడండి, శోధనను జయించుటకు నీవు థియోఫనీని దాటి రావలసివచ్చెను. పాపము ద్వారా శోధించబడుటకు నీవు ఇక్కడికి శరీరమందు రావలసివచ్చెను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, వానిని అంత్యదినమందు నేను లేపెదను." చూడు, మొదట నీవు ఆలాగు ఉండవలసియున్నది.

ROM 8:1•

2COR 5:1•

1JN 3:9

 

33ఆయన ఏలాగు ఒక దశనుండి మరియొక దశలోనికి వచ్చిన క్రమము చూతువు. లోకము యొక్క పునాది వేయబడకముందే అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడియుండెను. అప్పుడు అక్కడి నుండి ఆయన వాక్యముగా, ధియోపనిగా మారెను, అనగా కనబడగలడు, అదృశ్యమవ్వగలడు. అప్పుడాయన శరీరధారియై తిరిగి మరల వచ్చెను. అదే శరీరమును ఒక మహిమాన్విత స్థితిలో పునరుత్థానము పొందించెను.

కాని నీవు ఆ ధియోఫనీని దాటి, పాపము ద్వారా శోధింపబడునట్లు శరీరమానవుడిగా అయితివి. "భూమి మీది ఈ గుడారము కరిగిపోయిననూ, ఒకటి మనకొరకు ఇదివరకే ఎదురు చూచుచున్నది." ఆ శరీరములను ఇంకా మనము పొందలేదు.

కాని చూడండి! ఈ శరీరము దేవుని ఆత్మను పొందినపుడు, నీలోనున్న అమర్త్యజీవము, ఈ శరీరమును దేవునికి లోబడునట్లుగా చేయును. హల్లెలూయా! "దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు." రోమా 8:1. "కాబట్టి క్రీస్తు యేసునందున్నవారికి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు. వారు శరీరానుసారముగా నడువరు, ఆత్మానుసారముగా నడుతురు. మీరు అక్కడే యున్నారు! చూడండి, అది మీ దేహమును వశపరచుచున్నది.

"ఓ! నేను త్రాగుడు మానినచో బాగుండును" అని నీవనుకోనవసరము లేదు. కేవలము క్రీస్తులోనికి వచ్చినచో చాలును. అంతయూ పోవును! చూచారా? చూడండి. మీ శరీరము ఆత్మకు అధీనలైయున్న కారణమున అది లోక క్రియలకు ఇక మీదట వశమైయుండదు; అవి మృతమైనవి; అవి చచ్చినవి; నీ పాపములు బాప్తిస్మమందు పాతిపెట్టబడియున్నది. మరియు నీవు క్రీస్తునందు నూతన సృష్టివి. నీ శరీరము ఆత్మకు లోబడుచున్నది. మంచి విధమగు జీవితము జీవించుటకు ప్రయత్నించెదవు.

ISA 53:5

 

34స్త్రీలైన మీరు పరిశుద్దాత్మను పొందియున్నామని చెప్పుకొనుచూ బయటకు వెళ్ళుచూ పొట్టి దుస్తులు ధరించుచు, అయా రీతులగా కార్యములు చేయుచున్నారు. మీరాలాగు ఎట్లు చేయగలరు? మీలోనున్న పరిశుద్దాత్మ అట్టి కార్యములు ఏలాగ చేయనిచ్చును? అది ఆలాగు ఉండదు. నిశ్చయంగా ఆలాగు జరుగదు! ఆయన అపవిత్ర ఆత్మకాదు. ఆయన ఒక పరిశుద్ధ ఆత్మ

ఆ ఆత్మకు నీవు ఆధీనమయినప్పుడు, అది నీపూర్తి శరీరమును ఆత్మకు వశమగునట్లుగా చేయును. ఆ ఆత్మ ఈలాగు బయలుపరచబడి వాక్యబీజమేగాని ఈ లోకములో మరేదియూ కాదు. లేక జీవింపచేయునది, హల్లెలూయా సజీవముగా చేయబడినది. మరియు "ఇది చేయవద్దు" అని బైబిలు చెప్పినప్పుడు వెంటనే ఆ శరీరము దానినుండి తిరుగును. ఏ ప్రశ్న ఉండదు.

అది ఏమిటి? అదియే పునరాద్ధానము యొక్క సంచకరువు. ఈ శరీరము మరల లేపబడును, ఎందుకనగా ఇప్పటికే అది ప్రారంభమయినది. ఒకప్పుడు పాపము, అపవిత్రత, మరియు మురికి మొదలగువానికి లొంగిన ఆ శరీరము ఇప్పుడు ఆ సంచకరువును పొందియున్నది. అది పరలోకపు శరీరముగా మారినది. నీవు రాకడలో ఎత్తబడుటకు అదియే సంచకరువు. అదియే ముందుగా ఇయ్యబడినది.

ఒక వ్యాధిగ్రస్తుడు మరణశయ్యపై ఉన్నాడు. మరణము తప్ప మరేమియూ లేదు. ఇక జరిగేదంతయూ అదే. నేను ప్రజలయొక్క ఛాయలను చూచాను. కాన్సరు, క్షయరోగములతో తినివేయబడి వారు కొంతసేపటికి పూర్తిగా మామూలుగా మారి, బలముగా ఉండుట నేను చూచాను. దైవిక స్వస్థతలేనిచో పునరుత్థానమే లేదు, ఎందుకనగా దైవిక స్వస్థత, పునరుత్థానమునకు సంచకరువు. ఆమేన్!

బయానా డబ్బు అనగా ఏమిటో మీకు తెలియును. మీకు తెలియును కదా? అది ముందు చెల్లింపు. "ఆయన మన పాపముల నిమిత్తము గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది." గమనించండి! ఎంత అద్భుతమో! మనము ఆయనను ప్రేమిస్తున్నాము.

35ఇప్పుడు, ఈ శరీరము దేవుని ఆత్మకు లోబడియున్నది. వాక్యరూపములోనికి ఇంకనూ మనము ప్రవేశించలేదు, కాని ఇంకనూ మనము శరీర రూపములోనే యున్నాము, కాని వాక్య ఆధీనములో యున్నాము. శరీర మరణము మనలను అక్కడికి కొనిపోవును.

ఒక చిన్నబిడ్డను గూర్చి ఆలోచించండి, ఆలాగే యున్నది. మీరు ఒక స్త్రీ తీసికొనండి, ఆమె ఎంత దుష్టురాలయినా గాని ఆమె గర్భము ధరించి, తల్లి కాబోవునప్పుడు, ఆ బిడ్డను కనుముందు ఆమెను గమనించండి. ఆమె ఎంత చెడ్డదయినా గాని నేను లెక్కచేయను, ఆమె ఎంతో దయగలదిగా మారును. ఆమెను దైవికముగా కనబడునట్లు చేయునది ఏదో యున్నది. బిడ్డను కని తల్లి కాబోవు స్త్రీ సంగతి అది అదెందువలన? ఆ చిన్న శరీరము ఇపుడింకా సజీవము కాలేదు. అది కేవలము శరీరము, కండరములుగా యున్నది. ఆ చిన్న కండరములే గంతులువేయును. కాని అది గర్భములో నుండి బయటకు వచ్చునప్పుడు దేవుడు దానిలోనికి జీవవాయువును ఊదును. మరియు అప్పుడు అది కేకవేయును. చూచారా, స్వాభావిక శరీరము రూపొందుట ఎంత ఖచ్చితముగా జరుగుచున్నదో అదే రీతిగా ఆత్మీయ శరీరము అదిక్కడకు వచ్చిన తక్షణమే పొందుకొనును.

2COR 5:1•

1PET 3:19

 

36పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించినయెడల అతడు క్రీస్తునందు ఒక ఆత్మీయ శిశువు అగును.

అప్పుడు ఈ శరీరము యొక్క అంగీ విడువబడినప్పుడు అక్కడ చేతులతో చేయబడనది, స్త్రీ వలన పుట్టనది అగు థియోఫనీ ఆ శరీరములోనికి వెళ్ళుదము.

అటు తరువాత ఆ శరీరము వచ్చి మహిమాన్వితశరీరమును పైకెత్తి పట్టుకొనును.

ఆ కారణము చేతనే యేసు చనిపోయినప్పుడు పాత్రాళములోనికి వెళ్ళి చెరలోనున్న ఆత్మలకు బోధించెను; ఆ థియోఫనీ లోనికి ఆయన తిరిగి మారెను. ఓ! ఎంత ఆశ్చర్యము! దేవునికి వందనములు!

II కోరింధీ 5:1 "ఈ భూమి మీద మన గుడారము కరిగిపోయినను మరియొకటి కాచుకొనియున్నది." చూడండి, దేవుని నుండి ఒక గుణలక్షణముగా తిన్నగా వచ్చుటకు దానిని దాటి వచ్చియున్నాము. ఆదామువలె పాపముచే శోధింపబడునట్లు మరియు పరీక్షించబడునట్లు శరీరమును ధరించి వచ్చాము. ఆయన వాక్యపరీక్ష అయిపోయినప్పుడు జగత్తు పునాది వేయబడకముందే మనకొరకు సిద్ధపరచబడిన ఈ శరరములోనికి కొనిపోబడుదుము. మనము వాక్యమును అక్కడ దాటి శోధించబడుటకు, పరీక్షించబడుటకు తిన్నగా వచ్చియున్నాము. దానిగుండా మనము వచ్చినయెడల మనకుశోధన ఉండెది కాదు. మనకు అన్ని విషయములు తెలిసియుండును. ఆ కారణము చేతనే యేసు అన్ని సంగతులు ఎరిగియుండెను, ఎందుకనగా శరీరధారి కాకముందు ఆయన వాక్యమైయుండెను. అప్పుడు మనము వాక్యమగుదుము.

ఆది నుండియూ ముందుగా నిర్ణయించబడుట ద్వారా వాక్యము వలన పోషించబడుచూ, వాక్యములో పాలిభాగస్తులుగా ఉండుటకు ఇక్కడ మనము వాక్యరూపమునకు మలచబడినాము. మీరు చూడండి, ఆది నుండియూ, అనగా నీవు ఈ యాత్ర ప్రారంభించినప్పటినుండి నీవు ఆ చిన్నజీవ వెలుగును కలిగియున్నావు. దానిని మీలో అనేకులు గుర్తుచేసికోగలరు. మీరు ఆ సంఘములో, ఈ సంఘములో చేరి అది, ఇది చేయుటకు ప్రయత్నించావు; కాని ఏదీ సంతృప్తి నివ్వలేదు. అది నిజము. కాని ఒక దినమున అది మీరు గుర్తించారు. నిజము.

37ఒక రాత్రి ఎక్కడో నేను బోధించుచున్నాను. కాలిఫోర్నియా లేక అరిజోనాలోనో అనుకొంటాను. ఒక వ్యక్తి కోడిపెట్ట క్రింద పక్షిరాజు గ్రుడ్డును పొదిగిన చిన్న కథ మీకు చెప్పానని నమ్ముచున్నాను. పొదగబడి బయటకు వచ్చిన తరువాత ఆ పక్షిరాజు, ఆ కోడిపిల్లలకు ఎంతో వింతైన పక్షిగా కనబడెను, అది వాటితో సంచరించుచుండెను, వాటిమధ్య అది అసహ్యముగా కనబడెను, ఎందుకనగా ఆ కోడిపెట్ట అరచుచూ ఆ పెంట పోగును త్రవ్వి తినుట దీనికి అర్థము కాలేదు. దానికి ఆ అభిప్రాయమే కలుగలేదు, "బిడ్డలారా, వచ్చి విందు అరగించండి" అని తల్లిపెట్ట పిలచుచుండెను. అది ఒక పక్షిరాజు పిల్ల, దానికి ఆ తిండి ఇష్టపడలేదు. అది దాని ఆహారము కాదు.

అది మిడుతులను, ఇంకా ఏవేవో పట్టుకొని ఆ చిన్నపిల్లలను పిలుచుచుండెను. ఆ చిన్న కోడిపిల్లలన్నియూ ఆ కూతను విని వెళ్ళి తినుచుండెను. కాని ఆ చిన్న పక్షిరాజు పిల్ల తినలేకపోతున్నది. అది తనకు సరిపడుటలేదని గ్రహించినది.

కావున ఒక రోజున దాని తల్లి వెదకుకుంటూ వచ్చెను.

38ఆ కోడి పిలచుటను అది విన్నది. అది కూడా కోడివలె అరచుటకు ఎంతో ప్రయత్నించెను గాని ఆలాగు చేయజాలకపోయెను. కోడిపిల్ల వలె ప్రవర్తించబోయెను గాని కుదరలేదు. చూడండి, అది ఒక పక్షిరాజు, దాని పుట్టకే పక్షిరాజు. అయితే అది ఒక కోడి క్రింద పొదగబడెను.

అది కొందరు సంఘసభ్యుల మాదిరివలెయున్నది. ఆలాగే యున్నది; కూర్చొన్న వారిలో ఒక్కరు దాదాపు ఆలాగున్నారు. ఒకనాడు దాని తల్లి ఎగురుచూ వచ్చెను మరియు అరచెను. దానిని అది గుర్తించెను. దానికి ఆ స్వరము సరియనిపించినది. ఎందువలన? అది పుట్టుకతోనే పక్షిరాజైయుండెను.

సువార్త లేదా వాక్యము లేదా యేసుక్రీస్తు యొక్క శక్తికూడ అదే విధానముతో యున్నది. ఒక వ్యక్తి నిత్యజీవమునకు ముందుగా నిర్ణయించబడినప్పుడు నిజస్వరమును అతడు వినును. దేవుని కేకను వినును. అది వినకుండునట్లుగా ఏదియూ అతని ఆపలేదు.

"అద్భుతములు జరుగు దినములు గతించినవి. కొ, కొ,కొ" అని అ సంఘము కోడివలె అరచి, "ఇది తిను, అది తిను, ఇక్కడ నిలబడు" అని చెప్పినా లెక్కచేయడు.

ఆ గాదె చుట్టూనున్న ఆ చెత్త అతనికేమియూ మేలుగా కనబడదు. ఆయన వెళ్ళిపోయెను! "సమస్తమూ సాధ్యమే" ఆయన భూమి మీదలేడు.

నేడు అనేక మంది క్రైస్తవుల సంగతి ఆలాగే యున్నది. వారు తమ పాదములను నేల మీద నుండి లేవనెత్తుట లేదు.

ఆ ముసలి తల్లి, "కుమారుడా, ఎగురుము. నీవు ఒక పక్షి రాజువి. నేనున్న చోటకు ఎక్కిరమ్ము" అని చెప్పెను.

"ఆమ్మా నా జీవితములో ఎన్నడూ నేను ఎగురలేదు? అని జవాబిచ్చెను.

"అయినా గాని నీవు ఎగురుము. నీవు పుట్టుకతోనే పక్షిరాజు. నీవు కోడిపిల్లవు కాదు" అని తల్లి చెప్పెను. కనుక తను మొదటిగా ఎగిరెను మరియు రెక్కలు విదిలించెను. అంత బాగుగా ఎగురలేకపోయెను గాని నేల మీదనుండి లేచెను.

మనము ఆలాగే చేస్తాము. వ్రాయబడిన వాక్యము యొక్క విశ్వాసము ద్వారా మనము దేవుని అంగీకరించుదుము. అందులో ఏదోయున్నది; ఆ నిత్యజీవమునకే మీరు ముందుగా నిర్ణయించబడితిరి.

దాని పూర్వీకులు పక్షిరాజులు. ఆ గతము నుండి అది పక్షిరాజే. పక్షిరాజు ఇతరమగు వానితో కలువదు. అది అసలు సంకరమే కాదు; లేదు. అది ఒక పక్షిరాజు.

DEUT 34:4-6•

2KGS 2:11•

2COR 5:1

 

39దేవుని వాక్యమే నిజమగు పక్షిరాజు ఆహారమని నీవు గుర్తించినప్పుడు, ఆ తక్కిన దానిని విడిచిపెట్టెదవు. అప్పుడు నీవు సజీవ దేవునియొక్క సజీవ రూపములోనికి రూపుదిద్దుకొందువు. నీవు నీ థియోఫనీ నుండి విన్నావు. "భూమి మీది ఈ గుడారము కరిగిపోయిననూ ఒకటి మనకొరకు కాచుకొనియున్నది."

"అది నిజమేనా బ్రన్హం సోదరుడా?" అని నీవనవచ్చు.

అవును నిజమే. కొన్ని పక్షిరాజులను మనము తీసికొని కొన్ని నిమిషములు వాటివైపు చూద్దాం. మోషే అను పేరుగల ఒకాయన ఉండెను. బైబిలులో ప్రవక్తను పక్షిరాజుగా పిలచుట అందరూ ఎరుగుదురు. మోషే అను పేరుగల ఒక ప్రవక్తయుండెను. ఒక రోజున దేవుడు అతనిని పిలచెను. అతడు ఆ దేశములోనికి వెళ్ళకుండానే ఒక బండమీద చనిపోయెను. దేవదూతలు అతని కొనిపోయి సమాధి చేసెను. మరియొక పక్షిరాజు యుండెను. అతడు అసలు మరణమే చూడనవసరము లేకుండెను. అతడు నడచి యోర్దాను దాటెను. మరియు దేవుడు ఒక రథమును పంపెను. "ఈ శరీరమను వస్త్రమును అతడు విడిచిపెట్టి, లేచి ఆ నిత్య బహుమానము అందుకొనెను.

ఎనిమిది వందల సంవత్సరముల తరువాత రూపాంతరపు కొండ మీద ఆ ఇద్దరు వ్యక్తులు నిలబడిరి. మోషే శరీరము కుళ్ళిపోయి వందలాది సంవత్సరములాయెను. అయితే ఇక్కడ అతడు పేతురు, యాకోబు, యోహానులు గుర్తింపకలిగిన రూపములో యుండెను. ఆమేన్! "భూమి మీది ఈ గుడారము కరిగిపోయిననూ . [నీవు ఒక దేవుని గుణలక్షణముగా ఈ భూమి మీద వ్యక్తపరచబడినచో], "నీవు ఈ లోకమును విడిచిన తరువాత పొందుటకు ఒక శరీరము ఎదురుచూచుచున్నది." అక్కడ వారు ఆ రూపాంతరపు కొండమీద తమ థియోఫనీలో నిలబడియుండిరి. ఏలయనగా ప్రవక్తలగు వారియొద్దకే వాక్యము వచ్చును.

1SAM 12:3,4•

1SAM 28:13

 

40ఆలాగే ఒకనాటి ప్రవక్తయగు సమూయేలును గమనించుదము. అతడు గొప్ప ఇశ్రాయేలునకు నేర్పించినవాడు. రాజు వారికి ఉండవద్దు అని అతడు వారికి చెప్పెను. "ప్రభువు నామము పేరట నేను చెప్పినది ఎన్నడైన నెరవేరకమానెనా? అని వారిని అతడు ప్రశ్నించెను.

"లేదు. ప్రభువు నామములో నీవు చెప్పిన సమస్తమూ జరిగెను" అని వారనిరి.

అతడు ఒక ప్రవక్త, అతడు చనిపోయెను.

ఆ తరువాత దాదాపు మూడు లేక నాలుగు సంవత్సరములకు రాజు ఇరుకులో పడెను. అది యేసుక్రీస్తు రక్తము చిందించక ముందు జరిగినది. అతడు పరదైసులో యుండెను. ఎండోరులోనున్న సోదె చెప్పు స్త్రీ, సౌలును ఓదార్చుటకు ఎవరినో రమ్మని పిలచెను. ఆ సౌదెగత్తె అతడు నిలబడియుండుట చూచి "దేవుడు భూమిలో నుండి పైకి లేచుట కనబడుచున్నది," అని చెప్పెను.

1SAM 28:14,15

 

41అతడు చనిపోయి, పాతిపెట్టబడి, సమాధిలో క్రుళ్ళిపోయిన తరువాత ఇక్కడ ఆ గుహలో అతడు తనప్రవక్త దుస్తులు ధరించి నిలబడియుండెను. ఇంకనూ అతడు ప్రవక్తగా యుండెను. ఆమేన్! "దేవునికి విరోధివిగానుండిన నీవు నా విశ్రాంతిలో నుండి ఎందుకు నన్ను పిలచితివి? అని అతడు అడిగెను. అతడు ప్రవచించుట గమనించండి. "రాత్రి ఈ వేళకు నీవు నాతో యుందువు. ఈ శరీరములో నుండి అతడు విడచిపోయినను, అతను ఇంకనూ ప్రవక్తగానే యుండెను.

చూడండి, ఇక్కడ అతడు వాక్యములో భాగముగా అయ్యెను. అతడు శరీర జీవితమునుండి వేరయిపోయి జగత్తు పునాది వేయకముందునుండి అతని కొరకు సిద్ధపరచబడిన ఆ దేహములోనికి వెళ్ళెను. వాక్యమైయున్న థియోఫనిలో అతడు ప్రవేశించెను. అది మీకు అర్ధమయినదా? ఇక్కడి నుండి వెళ్ళిపోయిన పిదప విశ్వాసులందరూ అందులోనికే వెళ్ళెదరు.

అప్పుడు ఆ రూపములో ఆ ముసుగు ఎత్తి వేయబడినది. ఇక్కడికి మీరు ప్రవేశించినపుడు మీరు వాక్యమై యున్నారని కూడా గమనించవలెను. కొద్దిసేపటి క్రితము నేను చిన్న బిడ్డను గూర్చి చెప్పిన ప్రకారమే.

ఇప్పుడు గమనించండి. ఈ సంగతులు ఎరుగుటకు ముద్రలు తెరచినందుకు నేను దేవుని స్తుతించుచున్నాను. అది నా ప్రార్థన.

HEB 7:2•

REV 19:16

 

42మెల్కీసెదెకు యొక్క నిజ ప్రత్యక్షతమనకు గోచరమగుచున్నది. అదేమిటి? ఆయనే దేవుడు, వాక్యము; శరీరధారికాకముందు ఆయన వాక్యముగానున్న దేవుడు. ఎందుకనగా ఆయన ఆలాగు ఉండవలసియున్నాడు. ఆయనవలె ఎవరును అమర్త్యులుగా ఉండలేరు. చూడండి, నాకు తల్లిదండ్రులున్నారు; మీకును ఉన్నారు. యేసుకు తల్లిదండ్రులు ఉన్నారు. కాని ఈయనకు తల్లిదండ్రులు లేరు. యేసునకు ఒక ప్రారంభకాలమున్నది; ఈయనకు లేదు. యేసు తన జీవమును ఇచ్చెను; ఈయన ఇవ్వజాలడు, ఎందుకనగా ఆయనే జీవము. అయన అన్ని కాలములలో స్వయముగా ఏకరీతిగా యున్నవాడు. దేవుడు దీనిని మీకు బయలుపరచునని నేను ఆశించుచున్నాను. అన్ని కాలములలో ఏకరీతిగా నున్నవాడు. ఆయన బిరుదును

గమనించండి, "నీతికి రాజు!" ఇప్పుడు హెబ్రీ 7:2. "నీతికి రాజు మరియు సమాధానమునకు రాజు. ఆయన ఇద్దరు రాజులు. ఇప్పుడు గమనించండి, హెబ్రి 7:2. "నీతికి రాజు మరియు సమాధానమునకు కూడా రాజు," అక్కడ ఆయన ఇద్దరు రాజులుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరమందు వచ్చి, పైనున్న శరీరమును పొందినందున ప్రకటన 21:16లో "ఆయన రాజులకు రాజుగా" పిలువబడెను. అక్కడ ఆయనలో ఆ ముగ్గురు కలిసియుండిరి. చూచారా, రాజగు దేవుడు, రాజగు థియోఫనీ, రాజగు యేసు. "ఆయనే రాజులకు రాజు."

ఆత్మ శరీరము, ప్రాణములవలె అన్నియూ ఆయనలో ఏకమైనవి. అన్నియూ కలిసి ఒక్కటే అయ్యెను.

ఆయన తండ్రి కూడా అనగా మొదటివాడు, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ ఒక ఆత్మ "నీతికి రాజు," ఆత్మ గుణలక్షణం — థియోఫనీ; సమాధానపు రాజు, థియోఫనీ; శరీరమందు ఆయన "రాజులకు రాజుగా" నుండెను - ఒకే వ్యక్తి

EXOD 33:18,20

 

43థియోఫనిగా ఉన్నప్పుడు మోషే ఆయనను చూచెను. నిర్గమకాండము 33:2 ఆయనే థియోఫనీ. మోషే దేవుని చూడగోరెను. ఆయన స్వరమును వినెను. తనతో మాట్లాడుట వినెను, ఒక పెద్ద అగ్నిస్తంభముగా ఆయనను ఆ పొదలో చూచెను. "నీవెవరవు? నీవెవరవో తెలిసికొనగోరుచున్నాను. నీ ముఖమును నేను చూడగోరుచున్నాను" అని మోషే అడిగెను.

"ఎవరునూ నా ముఖము చూడలేరు. నీ కండ్ల యెదుట నా హస్తమును నేను చాపిదాటిపోవుదును. నీవు నా వెనుక భాగము చూచెదవు గాని ముఖము చూడవు," అని ఆయన చెప్పెను, చూచారా. ఆలాగు చూడగా ఆయన వెనుకభాగము మానవుని వెనుక భాగమువలె నుండెను. అది ఒక థియోఫనీ. ఆ తరువాత, "నేను ఉన్నవాడను" అను మాట మోషేకు వినబడెను. అదియే వాక్యము. మండుచున్న పొదలో అగ్నిస్తంభ రూపముగా మోషే దగ్గరకు వచ్చిన వాక్కు "నేను ఉన్నవాడను" అయియున్నది.

వేదాంత శాస్త్రము నుండి వచ్చిన వాక్యము… లేదా థియోఫనీ నుండి వచ్చిన వాక్యము. నన్ను మన్నించండి. థియోఫనీ నుండి వచ్చిన వాక్కు అబ్రాహాము సింధూర వృక్షము క్రింద నుండగా ఒక మానవునిగా వచ్చెను. ఇప్పుడు అక్కడ చూడండి. అబ్రాహాము యొద్దకు ఒక వ్యక్తి వచ్చెను, ముగ్గురు మనుష్యులు వచ్చిరి. ఆ సింధూర వృక్షము క్రింద ఆ ముగ్గురు కూర్చుండిరి. అబ్రాహాముతో మాట్లాడిన పిదప ఆయనను గమనించండి .

GEN 1:1•

GEN 18:3,12

 

44ఆయన ఎందుకు వచ్చెను? పుట్టబోవు కుమారుని గూర్చిన వాగ్దానము, మరియు వర్తమానము అబ్రాహాము కలిగియుండెను. దేవుని వాక్యమును నమ్ముచున్న దేవుని వాక్య ప్రవక్త కూడా అతడైయుండెను. లేని దానిని, విరోధముగా కనబడుచున్న దానిని ఉన్నట్లుగా పిలచుచుండెను. చూడండి, దేవుని వాక్యమెంత పరిపూర్ణముగా యున్నదో? వాక్యము ప్రవక్తయొద్దకు వచ్చెను. చూడండి, అక్కడ దేవుడు థియోఫనిలో యుండెను. "వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చునని" బైబిలు చెప్పుచున్నది. ఇక్కడ వాక్యము థియోఫనిలో యుండెను.

"అయన దేవుడా?" అని మీరడగవచ్చును. ఆయన దేవుడేనని అబ్రాహాము చెప్పెను. ఆయనను ఎలోహిం అని అతడు పిలచెను. ఇప్పుడు ఆదికాండము 1లో, "ఆదియందు ఎలోహిం భూమ్యాకాశములను సృజించెను" అని మనము కనుగొందుము. అక్కడ కూర్చొని అబ్రాహాముతో మాట్లాడి, అతని హృదయ రహస్యములను, ఆయన వెనుకనున్న శారా ఏమి ఆలోచించుచున్నదో చెప్పిన ఆయనను "ఎలోహిం" అని అబ్రాహాము పిలచెను. ఆయన థియోఫనీ రూపములో యుండెను. మీకది అర్థమైనదా? తరువాత గమనించండి…

GEN 14:18•

GEN 18:3•

GEN 19:2

 

45ఆయన అప్పుడు థియోఫెనీ రూపములో యున్నాడని మనము కనుగొన్నాము. ఆయనను అతడు, "ప్రభువైన దేవా, ఎలోహిం" అని పిలచెను. అది నిజమని ఆదికాండము 18లో మనము కనుగొందుము.

ఇప్పుడు అబ్రాహామును గమనించండి. అక్కడ ముగ్గురు కలిసి ఉండిరి, కాని అబ్రాహాము ఆ ముగ్గురిని కలిసికొన్నప్పుడు "నా ప్రభువా" అని పలికెను.

అయితే సొదొమలోనున్న లోతు యొద్దకు ఇద్దరు దిగిపోయిరి; ఆ ఇద్దరు వచ్చుట లోతు చూచి, "నా ప్రభువులారా? అని పిలచెను. చూడండి, ఏమిటి సంగతి? మొదటిగా లోతు ప్రవక్త కాడు, అది నిజము, లేక ఆ ఘడియకు వర్తమానికుడు కూడా కాదు. కనుక అతనికి ఆయనను గూర్చిన ఎట్టి ప్రత్యక్షత లేదు. అది అక్షరాలా నిజము. లోతు అక్కడ ವ°ರಿನಿ "ప్రభువులారా? అని పిలువగలడు. అక్కడ ఒక డజనుమంది యున్ననూ "ప్రభువులారా" అని మాత్రమే పిలువగలడు.

అయితే అబ్రాహాము ఎందరిని చూచినను ఒకే ప్రభువు అని చెప్పును. అక్కడ దేవుడు యున్నాడు. ఈయనే మెల్కీసెదెకు.

గమనించండి, యుద్ధము అయిపోయిన తరువాత మెల్కీసెదెకు తన జయశీలుడగు కుమారునికి తానే ప్రభురాత్రి భోజనమును అనుగ్రహించెను; దానిని గూర్చి ఆలోచించండి, తనయొక్క భాగము! ఇక్కడ మనము ప్రభురాత్రి భోజన మాదిరిని మనము చూతుము. యుద్ధము అయిపోయిన తరువాత ఆయన తననే ఇచ్చెను, ఎందుకనగా ప్రభురాత్రి భోజనము క్రీస్తులో భాగము. పోరాటము ముగిసిన పిదప, నిన్ను నీవు రిక్తునిగా చేసికొనినప్పుడు, క్రీస్తులో పాలిభాగము పొందినప్పుడు ఈయన యొక్క వ్యక్తిత్వములో భాగమవుదువు. అర్ధమయినదా?

GEN 14:18•

GEN 32:24•

MATT 26:29•

MARK 14:25•

LUKE 22:18

 

46యాకోబు రాత్రంతయూ పోరాడి, మరియు అతడు తనను ఆశీర్వదించే వరకు ఆయనను విడిచిపెట్టలేదు. అది నిజము. జీవము కొరకు పోరాడెను! పోరాటము అయిన పిదప దేవుడు నీకు తననే ఇచ్చును. అది ఆయనయొక్క నిజ ప్రభురాత్రి భోజనము. చిన్న రొట్టెముక్క ద్రాక్షారసము దానికే సాదృశ్యము. పోరాడి దేవునిలో భాగమగునంత వరకు నీవు దానిని తీసికొనగూడదు.

గుర్తుంచుకొనండి, ఈ సమయములో ఇంకా ప్రభురాత్రి భోజనము నియమింపబడలేదు. ఆ తరువాత అనేక వందల సంవత్సరములకు యేసుకీస్తు మరణించక మునుపు అది నియమింపబడెను.

కాని మెల్కీసెదెకు, తన కుమారుడగు అబ్రాహాము జయమును పొందిన తరువాత, అతనిని కలిసికొని రొట్టె, ద్రాక్షారసము ఇచ్చెను. ఈ భూలోక పోరాటము ముగిసిన తరువాత మధ్యాకాశములో ఆయనను కలిసికొని మరల ప్రభు రాత్రి భోజనము తీసికొనుటకు అది చూపించుచున్నది. అది పెండ్లివిందుగా నుండును. "నా తండ్రి రాజ్యములో క్రొత్తగా మీతో తిని త్రాగువరకు నేను ఇక ద్రాక్షారసము త్రాగను. ఫలము భుజించను." అది సరియేనా?

1THS 4:17•

HEB 7:1

 

47మరల గమనించండి, అబ్రాహాము మరల ఇంటికి తిరిగి రాకముందు మెల్మీసెదెకు వెళ్ళి అతనిని కలిసికొనెను. ఎంత చక్కని మాదిరి ఇక్కడ మనకున్నది. యుద్ధము అయిన తరువాత ఇంటికి తిరిగి రాకముందు మెల్మీసెదెకు అబ్రాహామును కలిసికొనెను.

మనము గృహము చేరకముందే యేసును మధ్యాకాశములో కలిసికొందుము. అది నిజము. రెండవ థెస్సలొనీకయులు అది మనకు చెప్పుచున్నది. "మనము ఆయనను మధ్యాకాశములో కలిసికొందుము." చల్లపూట పొలములో ఇస్సాకు రిబ్కాను కలిసికొనుట ఒక చక్కని మాదిరి. "ఆయనను మనము మధ్యాకాశములో కలిసికొందుము." ఆ విధముగా II థెస్సలోనీకయులు మనకు చెప్పుచున్నది. "ఏలయనగా సజీవులమై నిలచియున్న మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. దేవుని బూర మ్రోగును. క్రీస్తునందు మృతులు మొదట లేతురు. సజీలమై నిలచియుండు మనము వారితో కూడ ప్రభువును మధ్యాకాశములో కలిసికొను నిమిత్తము కొనిపోబడుదుము." ఇవన్ని సాదృశ్యములు పరిపూర్ణముగా యున్నవి.

కాబట్టి అది థియోఫనీ, నీవు చనిపోయి థియోఫనీలో ప్రవేశించినచో (ఏమి జరుగును?) విమోచించబడిన శరీరమును పైకెత్తుటకు థియోఫనీ భూమి మీదికి వచ్చును. నీవు మధ్యకాశములోయున్నచో, థియోఫనీని కలిసికొనుటకు దేహమును పొందెదవు. నీవు అక్కడే యున్నావు. "పైకెత్తబడి ప్రభువును మధ్యాకాశములో కలిసికొందుము."

ఈ మెల్కీసెదెకు దేవుడు గాక ఇంకెవరు!

48మన యాత్రలో జీవితము యొక్క పూర్తి రహస్యమును, ఇక్కడ స్పష్టముగా చూచుచున్నాము. మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళుదుమో చూస్తున్నాము. ఆలాగే ఇక్కడ ముందు నిర్ణయము చక్కగా కనబడుచున్నది. ఇప్పుడు దీనిని మేము బోధించుచుండగా జాగ్రత్తగా వినండి.

ఆయన తన రహస్యమందు దాచియుంచిన నిత్యత్వపు ఉద్దేశదశలు ఇప్పుడు బయలుపరచబడినవి. గమనించండి, పరిపూర్ణతకు ఇంకా మూడు దశలున్నవి. లోకమును ఆయన విమోచించిన విధంగానే ఆయన తన సంఘమును విమోచించును. జనులను ఆయన మూడు దశలుగా విమోచించును. ఇప్పుడు చూడండి. మొదటిది లూధరు బోధించునట్లుగా నీతీకరణము. రెండవది వెస్లే బోధించునట్లుగా శుద్దీకరణము. మూడవది పరిశుద్దాత్మ బాప్తిస్మము. అది నిజము. అప్పుడు ఎత్తబడుట జరుగును!

ఇప్పుడు, ప్రపంచము, ఆయన ప్రపంచమును ఎట్లు విమోచించును? అది పాపము చేసినప్పుడు మొదట్లో ఆయన నీటి బాప్తిస్మమందు దానిని కడిగివేసెను. అది నిజము. ఆ తరువాత ఆయన తన రక్తమును సిలువ మీదనుండి కార్చి దానిని శుద్దీకరించి దానిని తన స్వంతదానిగా పిలచుకొనెను. తరువాత ఆయన ఏమి చేయును? నీలోనుండి లోకమునంతటినీ ఆయన చీల్చివేసి, ప్రతిదానిని పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిస్మము ద్వారా నూతనపరచినట్లుగానే ప్రపంచమును కూడా నూతనపరచును. అది అగ్నితో కాల్చబడి, మిలియనుల ఎత్తులోనున్న ప్రతి సూక్ష్మజీవిని పవిత్రపరచును, ప్రతిదియు పరిశుభ్రపరచబడును. అప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఏర్పడును. నిన్ను పరిశుద్దాత్మ పట్టుకొన్నప్పుడు క్రీస్తుయేసునందు నీవు నూతన సృష్టి అయినట్లుగానే అది యుండును. మీరు ఆలాగున్నారు. ప్రతీదియు ఉండవలసినంత స్పష్టముగా యున్నది. ప్రతీదియూ మూడుగానే యున్నది.

49సహజ పుట్టుక మూడుగానే యున్నది. ఒక బిడ్డను కను ముందుగా మొదట స్త్రీకి ఏమి జరుగును? మొదటగా ఏమి వచ్చును? నీరు. తరువాత ఏమి వచ్చును? రక్తము. తరువాత వచ్చునదేమిటి? జీవము. నీరు, రక్తము, జీవము.

మొక్కకు ఏమి జరుగును? క్రుళ్ళిపోవును. మొదటగా వచ్చినదేమిటి? కాండము. తరువాత ఏమిటి? బీజ దళము. తరువాత ఏమిటి? పొట్టు. ఆ తరువాత గింజ బయటకు వచ్చును. అది గింజగా వచ్చువరకు మూడు దశలున్నవి. అది ఖచ్చితము.

దేవుడు దానిని రుజువు పరచును… అది ఎల్లప్పుడూ సత్యముగానే ఉండెను. దానిని సత్యమని దేవుడు రుజువుచేయును. విమోచనలో పరిగణనకు వచ్చువారు ముందు నిర్ణయించబడినవారు మాత్రమేనని తేటగా కనబడుచున్నది. అది మీరు గ్రహించారా? దానిని మరల చెప్పెదను. విమోచనలో పరిగణనకు వచ్చువారు ముందు నిర్ణయించబడినవారు మాత్రమే. ప్రజలు తాము లెక్కలోనికి వచ్చుదుమన్న భావనను కలిగియుండవచ్చును గాని నిజముగా విమోచించబడువారు ముందుగా నిర్ణయించబడినవారు మాత్రమే. ఎందుకనగా విమోచన అను మాటకు "తిరిగి వెనుకకు తెచ్చుట" అని అర్థము. అది సరియేనా? దేనికయినా విమోచించుట అనగా, "దానిని ముందున్న స్థానమునకు తీసికొనివచ్చుటయే." హల్లెలూయా! కనుక ముందుగా ఏర్పాటు చేయబడినవారిని మాత్రమే అది వెనుకకు తీసికొని వచ్చును, ఎందుకనగా తక్కినవారు అక్కడినుండి రాలేదు. చూచారా, "తిరిగి తీసికొని వచ్చుట."

1COR 15:55

 

50ఆదియందు ఆయనతో నిత్యత్వమందుండుట… నీవు కలిగియున్న నిత్యజీవము నీపట్ల ఆయన కలిగియుండిన ఆలోచన మాత్రమే. ఈ వేదిక మీద నిలబడి నన్ను చెప్పమని ఆయన కోరుచున్నాడు. నీవు ఈ రాత్రి కుర్చీలోయుండమని ఆయన కోరుచున్నాడు. అప్పుడు మనము ఆయన నిత్య ఉద్దేశ్యమును నెరవేర్చుచున్నాము. గృహమును విడిచినవారు, ఆయన ఉద్దేశ్యమును నెరవేర్చుటకు మాత్రమే భూమి మీదకు తిరిగి వత్తురు. అది నిజమేనా? మంచిది. అది పరిసమాప్తమయిన పిదప అది తిరిగి మహిమాన్విత దశలోనికి తిరిగి తేబడును. అది పరిపక్వత పొంది మరియు తిరిగి తీసికొనిరాబడును.

తన తలను నరికివేయుటకు వారు ఒక దిమ్మను నిర్మించుచున్నప్పుడు పౌలు చెప్పిన మాటలో ఆశ్చర్యము లేదు. "ఓ, మరణమా, నీ ముల్లెక్కడా? ఓ, సమాధీ, నీ విజయమెక్కడ? అయితే మనకు జయమునను గ్రహించుచున్న దేవునికి వందనములు! మరణమా, నీవు నన్ను ఎక్కడ ఏడిపించగలవో చెప్పుము. సమాధీ, నీవు నన్ను ఎట్లుపట్టుకొని యుండగలవో చెప్పుము! ఎందుకనగా నేను నిత్యజీవమును స్వతంత్రించు కొన్నాను" అని చెప్పెను. ఆమేన్! దానిని అతడు గుర్తించెను. మరణము, పాతాళము, సమాధి ఏదియూ అతనిని పట్టుకొని యుంచజాలదు. మరియు ఏదియూ మనలను బాధించజాలదు. మనము నిత్యజీవము పొందియున్నాము! అతడు నిత్యజీవముతో ఆశీర్వదించబడెనని అతడు గ్రహించెను.

JOHN 12:32

 

51చిన్న మంచు బిందువు వలెనే. నాకు రసాయన శాస్త్రము ఎక్కువగా తెలియదు. కాని అది వాతావరణము లేక శీతలము యొక్క సంయోగము అని నాకర్ధమయినది. రాత్రి చీకటిపడి, చల్లగానున్నప్పుడు అది ఆకాశము నుండి పడును. చుక్కలుగా నేల మీద రాలును. అది ఎక్కడినుండియో పడుచున్నది. కాని మరుసటి ఉదయమున సూర్యుడు వచ్చు ముందే అది అక్కడుండును. ఆ చిన్నది వణకును. కాని సూర్యుడు వచ్చిన తరువాత అది మెరయుటను గమనించండి. అది సంతోషముగా యున్నది. ఎందువలన? అదెక్కడి నుండి వచ్చినదో అక్కడికి తిరిగి సూర్యుడు పిలువనైయున్నాడు.

క్రైస్తవుడు కూడా ఆలాగేయున్నాడు. హల్లెలూయా! మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళునప్పుడు, ఏదో మనలోయుండి మనము ఎక్కడినుండి వచ్చామో చెప్పుచూ, దాని శక్తి మనలను లాగుట ద్వారా అక్కడికే వెళ్ళుచున్నామని చెప్పుటను ఎరుగుదుము.

ఆ చిన్న మంచు బిందువు మెరయుచూ, ప్రకాశించుచూ గంతులు వేయును. ఎందుకనగా అక్కడ పైనుండి తాను వచ్చితిననియు, తిరిగి మరల అక్కడికే సూర్యుడు లాక్కొని వెళ్ళనైయున్నాడనియు దానికి తెలియును.

దేవునియొక్క గుణలక్షణముగల వ్యక్తి, దేవుని వలన జన్మించినవాడు, (హల్లెలూయా!) దేవుని కుమారునితో సంబంధము ఏర్పరచుకొనినప్పుడు ఏదో ఒక దినమున ఇక్కడ నుండి పైకెత్తబడునని ఎరుగును. "నేను భూమిమీద నుండి ఎత్తబడినప్పుడు మనుష్యులందరినీ నా వైపునకు ఆకర్షించుకొందును." ఆమేన్!

JOHN 2:4•

JOHN 5:43•

JOHN 19:26•

HEB 13:8

 

52ఇప్పుడు గమనించండి, మెల్మీసెదెకునకు ఆ మరియ ఎందుకు తల్లి కాదో చూచాము. ఈ కారణము చేతనే ఆయన ఆమెను "స్త్రీ" అని పిలచెను గాని తల్లి అని పిలువ లేదు. ఆయనకు తండ్రి లేడు, ఎందుకనగా ఆయనే తండ్రి. నిత్యుడగు తండ్రి. ఒక్కనిలో మూడు. ఆయనకు తల్లి లేదు, నిశ్చయంగా లేదు. ఆయనకు తండ్రిలేడు, ఎందుకనగా ఆయనే తండ్రి. యేసును గొప్పగా అభినందించుచూ ఒకసారి కవి ఈలాగు చెప్పెను.

అగ్నితో మండుచున్న పొదలో మోషేతో మాట్లాడిన వాడను నేనే

నేను అబ్రహము యొక్క దేవుడను, ప్రకాశించుచున్న ఉదయ నక్షత్రమును,

నేను అల్ఫా ఒమేగను, అదియు అంతమును, నేనే సర్వసృష్టిని నా పేరు యేసు.

( అది నిజము)

ఓ! నేనెవరినని మీరు చెప్పుకొనుచున్నారు? నేనెక్కడినుండి వచ్చానని మీరు చెప్పుకొనుచున్నారు?

మీరు నా తండ్రిని ఎరుగుదురా? లేక ఆయన పేరు చెప్పగలరా?

(హల్లెలూయా!)

అదియే తండ్రి పేరు! అవును, "నేను నా తండ్రి నామములో వచ్చియున్నాను గాని మీరు నన్ను చేర్చుకొనలేదు." నిశ్చయంగా, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

DEUT 18:15•

MATT 16:13

 

53ఈ మెల్మీసెదెకు శరీరధారి ఆయెను. ఆయన ప్రవక్తగా వచ్చినప్పుడు తన్నుతాను మనుష్య కుమారునిగా బయలుపరచుకొనెను. కుమారుని యొక్క మూడు నామములలో అతడు వచ్చెను: మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మరియు దావీదు కుమారుడు.

ఆయన ఈ భూమి మీద ఉండినప్పుడు లేఖనమును నెరవేర్చు వ్యక్తిగా ఉండెను. "ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును" అని మోషే చెప్పెను. కనుక ఆయన ప్రవక్తగా రావలసియుండెను. "నేను దేవుని కుమారుడిని" అని ఎన్నడూ ఆయన చెప్పుకొనలేదు. "నేను మనుష్య కుమారుడిని. మీరు మనుష్య కుమారుని నమ్ముచున్నారా?" అని ఆయన అడిగెను, ఎందుకనగా ఆయన ఆలాగే సాక్షమియ్యవలసియున్నాడు. ఆయన అదే అయియుండెను.

ఇప్పుడు ఆయన మరో కుమారుని నామములో వచ్చెను, దేవుని కుమారుడు; అదృశ్యుడు, ఆత్మ

ఆయన తిరిగి వచ్చునప్పుడు, దావీదు కుమారుడుగా సింహాసనము మీద కూర్చొనును.

NUM 12:6•

DEUT 18:22•

JER 28:9

 

54ఆయన ఇక్కడి యుండి శరీరధారి అయినప్పుడు మనుష్య కుమారునిగా పిలువబడెను. ప్రవక్తగా, మనుష్య కుమారునిగా ఆయన తన్నుతాను ప్రపంచమునకు ఎట్లు తెలియపరచుకొనును?

ఒక రోజున నేను పేతురు, ఆ౦ద్రేయ అతని సోదరుని గూర్చిన కథ చెప్పు చున్నాను. వారు జాలరులు, మరియు వారి తండ్రి యోనా ఒక గొప్ప ప్రాచీన విశ్వాసి. ఒక రోజున అతడు దోనె ప్రక్కన కూర్చొని వారితో మాట్లాడుచున్నాడు, "కుమారుడా, మనకు చేపలు అవసరమయినప్పుడు ఎంత ప్రార్ధన చేశామో ఎరుగుదురు." వారు వ్యాపారపు జాలరులు "మనము దేవుని నమ్ముచున్నాము. యెహోవాను మన జీవనము కొరకు నమ్మాము. ఇప్పుడు నేను ముసలివాడనగుచున్నాను. పిల్లలారా, ఇక ఎక్కువ కాలము నేను మీతో ఉండలేను. నేను నిజ విశ్వాసులందరితో కలిసి కాలమంతా మెస్సీయా కొరకు ఎదురుచూచాను. మన మధ్యకు ఎందరో అబద్ధికులు వచ్చారు, కాని ఒకదినమున నిజమగు మెస్సీయా వచ్చును. ఆ మెస్సీయా వచ్చినప్పుడు, పిల్లలారా, మీరు మోసపోవద్దని కోరుచున్నాను. ఈ మెస్సీయా కేవలము ఒక వేదాంత పండితునిగా మాత్రమే ఉండడు. ఆయన ఒక ప్రవక్తగా ఉండును. మనము ఎవరి మాటలు అనుసరించుచున్నామో ఆ మోషే. ఆయన గూర్చి చెప్పినది అదే" అని చెప్పెను.

ఏ యూదుడయినా గాని తన ప్రవక్తను నమ్మును. ఆలాగు వారు బోధింపబడిరి. అది ఆలాగు అని ఏ ప్రవక్త అయినా చెప్పినచో అది సత్యము. కాని దేవుడు ఈలాగు చెప్పెను, "మీలో ఆత్మసంబంధిగాను లేదా ప్రవక్తగాను ఎవరైనాయున్నచో వారికి ప్రభువునగు నేను బయలుపరచుకొందును. అతడు చెప్పినది జరుగునప్పుడు అతని మాట వినుడి. మరియు అతనికి భయపడుడి, కాని అది ఆలాగు లేనిచో అతనికి అసలు భయపడవద్దు." చూచారా? కాబట్టి అది ప్రవక్త యొక్క రుజువు.

DEUT 18:15,19•

JOHN 1:26,29,41,42,46

 

55"కాబట్టి మోషే నిజముగా ఒక రుజువుపరచబడిన ప్రవక్త మీ మధ్య ప్రభువగు దేవుడు, మీ సోదరులలో నుండియే. నావంటి ఒక ప్రవక్తను లేపును. అతని మాట వినని వారందరు జనులలో నుండి కొట్టివేయబడుదురు. ఇప్పుడు పిల్లలారా గుర్తుంచుకొనండి దేవుని యొక్క రుజువుపరచబడిన ప్రవక్తలను హెబ్రియులమగు మనము నమ్మదుము" అని చెప్పెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది తప్పిపోవద్దు. "మెస్సీయా వచ్చినప్పుడు మీరందరూ ఆయనను ఎరుగుదురు, ఎందుకనగా ఆయన ఒక ప్రవక్త మెస్సీయాగానుండును. మనకు నాలుగు వందల సంవత్సరముల నుండి ప్రవక్తలేడు. మలాకీ దగ్గర నుండి ప్రవక్త రాలేదు, కాని ఆయన వచ్చును" అని చెప్పెను.

అతడు చనిపోయిన కొద్ది సంవత్సరములకు, ఒక రోజున అతని కుమారుడగు అంద్రేయ ఆద్దరిని నడిచిపోవుచూ అడవిలో నుండి వచ్చిన ఒక అడవి మనిషి. "ఆ మెస్సీయా ఇప్పుడు మీ మధ్య నిలబడియున్నాడు" అని చెప్పుట వినెను. అరణ్యములో పెరిగిన ఆ పెద్ద పక్షిరాజు అక్కడికి ఎగిరి వచ్చి "ఇప్పుడు మెస్సీయా మీ మధ్యనే యున్నాడు. ఇంకా ఆయనను మనము ఎరిగియుండలేదు. ఆయన మీ మధ్యనే నిలబడియున్నాడు. నేను ఆయనను తెలిసికొందును, ఎందుకనగా పరలోకము నుండి ఒక సూచన వచ్చుట నేను చూచెదను" అని చెప్పెను.

ఇంకో రోజున అతడు, "అదిగో, లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల" అని చెప్పెను.

ఇతడు తన సోదరుని వెదకుచూ ఇంకా నడిచిపోవుచుండెను,

"సిమోను, నీవిక్కడికి రావలెనని నేను కోరుచున్నాను; మేము మెస్సీయాను కనుగొన్నాము" అని చెప్పెను.

"ఓ అంద్రేయ, అంతకంటె నీకు చెప్పటానికి మరేమీ లేదా?

"ఓ! నాకు తెలియును. కాని ఈయన వేరుగానున్నాడు?

"ఆయన ఎక్కడి వాడు? ఎక్కడి నుండి వచ్చాడు?

"నజరేతువాడైన యేసు."

"ఆ చిన్న దుష్ట పట్టణమా? అటువంటి దుష్ట అపవిత్ర పట్టణము నుండి ఆయన రాడు.

"నీవు కేవలము వచ్చి చూడు."

చివరకు ఒకనాడు అతడు వచ్చి చూచునట్లుగా ఒప్పించకలిగెను. అతడు ఈ మెస్సీయా ముందుకు రాగా, యేసు ఆ జనులతో నిలబడి మాట్లాడుచుండెను. ఆయన ఎదుటకు అతడు నడిచి వచ్చినప్పుడు ఆయన, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడివి? అని చెప్పెను. అదే చేసెను! పరలోక రాజ్యపు తాళపుచెవులు అతనికి దొరికెను. ఎందువలన? ఆ వ్యక్తికి ఇతను తెలియదని ఇతను అనుకొనెను. మెస్సీయాను ఏలాగు నమ్మవలెనో నేర్పించిన ఆ భక్తిగల ముసలి తండ్రిని గూర్చి ఆయనకేలాగు తెలియును?

JOHN 1:45-47

 

56ఫిలిప్పు అను పేరు గల ఒక వ్యక్తి అక్కడ నిలబడియుండెను. ఓ! అతడు నిజముగా ఆశ్చర్యములో మునిగెను! తనతో కలిసి బైబిలు చదువుచున్న మరియొక్క వ్యక్తిని అతడు ఎరుగును. ఆ కొండ చుట్టుముట్టి అతడు వెళ్ళి ఆ ఒలివ తోటలో" అతనిని కనుగొనెను. అతడు మోకరించి ప్రార్థించుచుండెను. వారు కలిసి ఎన్నో బైబిలు పాఠములను పఠించిరి. అతడు దగ్గరకు వచ్చి ప్రార్ధన ముగించిన తరువాత ఈలాగు చెప్పెను," వచ్చి చూడు, మేము మెస్సీయాను కనుగొన్నాము. ఆయన నజరేయుడగు యేసు, యోసేపు కుమారుడు. మనము ఎదురుచూచుచున్న మెస్సీయా ఆయనే."

ఇప్పుడు నతానియేలు ఈలాగు చెప్పుట నేను వినగలను. "ఇదిగో ఫిలిప్పు, నీవు అధోగతికి పోలేదు కదా?

"ఓ, లేదు. లేదు. ఒక్కసంగతి చెప్పెదను మనము కలిసి బైబిలు అధ్యయనము చేశామని నీకు తెలియును. మరియు మెస్సీయా ఏలాగుండునని ప్రవక్త చెప్పెను?"

"ఆయన ఒక ప్రవక్తగా ఉండును."

"నీవు చేపలు కొన్న ఆ ముసలి జాలరి గుర్తున్నాడా, తన సంతకము కూడా పెట్టుకొనలేని విద్యలేనివాడగు సీమోను అతని పేరు?

"ఆ అవును, అవును?"

"అతడు అక్కడికి వచ్చినపుడు ఏమి జరిగిందో తెలియునా? అతని పేర సీమోను అని ఈ నజరేయువాడగు యేసు చెప్పెను. అతని పేరును పేతురుగా మార్చెను, అనగా "చిన్న బండ అని అర్ధము, అతని తండ్రి ఎవరోకూడా ఆయన చెప్పెను."

"మంచిది, " నాకు తెలియుట లేదు. అసలు నజరేతులో నుండి మంచిది ఏదయినా వచ్చునా?" అనడిగెను.

"దాని గూర్చి మాట్లాడవద్దు; కేవలము వచ్చి చూడు," అని చెప్పెను. అది మంచి మాట. "వచ్చి చూడుడి."

కనుక ఫిలిప్పు ఇక్కడ నతానియేలును తీసికొని వచ్చుచున్నాడు. అతడు నడిచి వచ్చుచుండగా, బహశా యేసు నిలబడి మాట్లాడుచూ ప్రార్ధన వరుసలోయున్న రోగులకు ప్రార్థించుచూ యుండవచ్చును. యేసు ఉన్నచోటికి అతడు వచ్చినప్పుడు, యేసు అతనివైపు తిరిగి ఈలాగు పలికెను, "ఇదిగో ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు."

JOHN 1:47-49

 

57"ఆతడు ధరించిన వస్త్రముల తీరును బట్టి ఆయన ఆలాగు చెప్పెను" అని మీరందురేమో, ఓ! కాదు. తూర్పు దేశస్థులందరూ ఒకే రీతగా వస్త్రములు ధరించెదరు. గడ్డము, వస్త్రధారణవలన అతడు సిరియనుడు గాని లేక మరెవరయినా గాని కావచ్చును.

"ఇదిగో, ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు" అని ఆయన చెప్పెను. ఇంకొక మాటలలో "యధార్థవంతుడగు మనిషి" అని అర్థము.

ఆ మాట నతానియేలును తలక్రిందులు చేసెను "రబ్బీ, అనగా "బోధకుడు." రబ్బీ, నీవు నన్నెప్పుడు ఎరుగుదువు? నేను ఒక యూదుడనని నీకెట్లు తెలియును? నేను కపటము లేనివాడినని, యధార్థపరుడనని నీకెట్లు తెలియును? అని అతడు అడిగెను.

"ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నపుడే నేను చూచాను" అని ఆయన చెప్పెను. హు! పదిహేను మైళ్ళ దూరము; ఆ ముందు రోజున ఆ కొండకు ఆ ప్రక్క ఉండెను. అతడు ఏమనెను?

"రబ్బీ, నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలుకు రాజు."

MATT 9:6•

MATT 12:24,31,32•

MARK 2:11•

MARK 3:22•

LUKE 5:22•

LUKE 9:47•

LUKE 11:15•

LUKE 12:10•

JOHN 5:8

 

58అక్కడే ఆ యాజకులు నిలబడిరి, స్వగర్వము, స్వపాండిత్యముతో నిండియుండి "ఈతడు బయల్డెబూబు, అదృష్టములు చెప్పువాడు" అనిరి.

"అందుకు మిమ్మను నేను క్షమించెదను" అని యేసు చెప్పెను.

ఇప్పుడు గుర్తుంచుకొనండి, వారు గట్టిగా బయటకు ఈ మాటలు పలుకలేదు, కాని తమ హృదయములలో పలికిరి. "ఆయన వారి ఆలోచనలను కనుగొనెను." అది నిజము. అదే బైబిలు చెప్పుచున్నది. మీరు దానిని మనస్సును చదువుట అనండి గాని ఆయన వారి ఆలోచనలను గ్రహించెను.

"ఆందుకు మిమ్మను నేను క్షమించుదును. కాని ఒక దినమున పరిశుద్దాత్మ వచ్చి ఇదే క్రియను చేయును." [ఆయన వెళ్ళిపోయిన తరువాత]; "దానికి వ్యతిరేకముగా ఒక్క మాట పలికిననూ ఈ లోకములోగాని, రాబోవు లోకములోగాని క్షమాపణ ఉండదు" అని ఆయన చెప్పెను. అది నిజమేనా? ఇప్పుడు వారు యూదులు.

JOHN 8:44•

JOHN 14:12•

HEB 13:8

 

59ఆ తరువాత ఒక దినమున ఆయన సమరయ వెళ్ళవలసిన అవసరమేర్పడెను. అయితే ఆ స్త్రీ యొద్దకు వెళ్ళు ముందుగా ఆయన శృంగారమను దేవాలయ గుమ్మము దగ్గర ఒకనిని స్వస్థపరచెను. మరియు యేసు అతని స్థితి ఎరిగి, "నీ పరుపు ఎత్తికొని ఇంటికి పొమ్ము" అని అతనితో చెప్పెను. అతడు ఆలాగు చేసి బాగయ్యెను.

అప్పుడు యూదులలో కొందరు ఆయనను చేర్చుకొనుట మనము చూతుము. కొందరు అది నమ్మిరి; కొందరు నమ్మలేదు. ఎందుకు వారు అది నమ్మలేదు? వారు జీవనమునకు నిర్ణయించబడలేదు. ఆ గుణలక్షణములో వారు భాగముగా లేరు.

ఇప్పుడు గుర్తుంచుకొనండి, వారు యాజకులు, మరియు గొప్పవారు. ఆ పాండిత్యము గలవారిని, యాజకులను గూర్చి అలోచించండి. వారి జీవితములో పొరపాటు మీరు కనుగొనలేరు. "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మరియు వాడి క్రియలు మీరు చేయుచున్నారు," అని యేసు చెప్పెను. "మీరు దేవుని సంబంధికులయితే నన్ను నమ్మియుండెడివారు. నన్ను మీరు నమ్మకపోయినచో నేను చేయు కార్యములు నమ్ముడి నేనెవరినో అవి సాక్యమిచ్చుచున్నవి," అని యేసు పలికెను.

"యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని" బైబిలు చెప్పుచున్నది. "నేను చేయు కార్యములు నాయందు విశ్వాసముంచువాడును చేయును," అని యేసు చెప్పెను. అది నిజమేనా? గమనించండి, ఇప్పుడు ఆయన నిజమగు మెల్కీసెదెకు.

ACTS 17:26

 

60ఇప్పుడు మరల గమనించండి, మూడు జాతుల జనులు మాత్రమే యున్నారు. నేను చెప్పుట మీరు వినియున్నారు, నేను విభజన కర్తను. అవును అలాగే. క్రైస్తవులందరూ విబజన కర్తలే; రంగును బట్టి విభజన కాదు గాని, ఆత్మను బట్టి విభజన చేయుదుము. ఒక మనిషి యొక్క చర్మపు రంగు వలన అతనికి ఏమీ బాధ లేదు. అతడు జన్మను బట్టి దేవుని యొక్క బిడ్డ కాని క్రైస్తవునికి దేవుడు ఈలాగు చెప్పెను, "నన్ను ప్రత్యేకించుడి!" "వారిలో నుండి బయటకు రండి," మరియు మొదలగునవి. ఆయన అపవిత్రత నుండి వేరుచేయువాడు, మంచి చెడులకు మధ్య విభజన చేయువాడు.

కాని గమనించండి, అప్పుడు వారికి విభజన కలదు, అదిజాతి భేదము, వారు సమరీయులు. భూమి మీద మూడు జాతుల ప్రజలు మాత్రమే యున్నారు. బైబిలు మనము నమ్మినచో గ్రహింతుము; హాము, షేము. యాపెతు జనులు. వారు నోవహు యొక్క ముగ్గురు కుమారులు. మనమందరమూ అక్కడనుండియే వచ్చాము. అది నిజము. ఆలాగు మనమందరము తిరిగి ఆదాములోనికి వెళ్ళుదము, అనగా మనందరము సోదరులము. "దేవుడు సమస్త దేశములను ఒకే రక్తము ద్వారా సృజించెను," అని బైబిలు చెప్పుచున్నది. రక్త ప్రవాహమును బట్టి మనందరము సోదరులము. ఒక నల్లజాతి వ్యక్తి తెల్లజాతి వ్యక్తికి రక్తమును ఇయ్యగలడు. ఆలాగు రక్త మార్పిడి జరుగును. తెల్లవ్యక్తి, పసుపుగానున్న జపాను వానికి, లేదా ఇండియనుకు, ఎర్రవానికి, ఇంకెవరికయినా గాని రక్తము ఇయ్యగలడు. అతడు రక్తమార్పిడికి ఉపయోగపడగలడు, ఎందుకనగా మనందరము ఒకే రక్తమువలన జన్మించాము. మన చర్మపు రంగు, మన నివాసస్థలముల వలన ఏమీ మనకు తేడాయుండదు.

లోకము నుండి మనము బయటకు వచ్చినప్పుడే మనము విడగొట్టబడియున్నాము. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు వచ్చినట్లుగానే. అనగా మనము లోక విషయముల నుండి వేరు చేయబడియున్నాము.

MATT 10:5,6•

JOHN 1:11

 

61ఇప్పుడు హాము, షేము, మరియు యూపెతు ప్రజలు అక్కడుండిరి. వంశావళులను మనము వెనుకకు వెళ్ళి పరిశీలించుటకు సమయము యున్నచో ఆంగ్లో సాక్సన్ అతడెక్కడి నుండి వచ్చునో మనకు తెలియును. అది యూదా సమరయుల గాధ. సగము యూదులు, సగము అన్యులు ఈ సమరయులు. బిలాము వలన వీరు అన్యులతో వివాహము చేసికొనుటకు ప్రేరణ పొందిరి. మోయుబీయులు. వారే సమరయులు. అక్కడ యూదులు మరియు అన్యులు కూడా ఉండిరి.

ఆంగ్లో-సాక్సనులమగు మనకు వారితో ఎట్టి పొత్తు లేదు. మనము మెస్సీయాను గాని మరేదీ గాని నమ్మము. మనము ఒకనికొకరు ఎదురుచూచుట లేదు. ఆ తరువాత మనము తీసికొని రాబడినాము.

యేసు తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఆయన తన శిష్యులతో ఇట్లు చెప్పెను, "అన్యుల త్రోవలోనికి వెళ్ళకుడి. కాని ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి." ఆయన కేవలము తప్పిపోయిన గొర్రెలగు ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళెను. మరియు గమనించండి, ఆయన యూదుల ఎదుట మనుష్యకుమారునిగా తన్నుతాను బయలుపరచుకొనెను. వారాయనను త్రోసివేసిరి.

సగము యూదులు, సగము అన్యులు అయిన సమరయులు కూడా నమ్మి మెస్సీయా కొరకు ఎదురు చూచుచుండిరి.

మనము చూడలేదు. మనము అన్యులమై వీపు వెనుక కర్రలు మోసికొని విగ్రహములను పూజించితిమి; అన్యులము.

JOHN 4:4,5,8

 

62ఒక దినమున పరి. యోహాను 4, ఆయన యెరికోకు సమరయుల మార్గము గుండా వెళ్ళవలసిన అవసరమొచ్చెను. ఆయన సమరయ చుట్టూ వెళ్ళెను. అక్కడికి ఆయన వెళ్ళుచూ సుకారు అనుపట్టణమునకు బయట ఉన్న ఒక బావి యొద్ద ఆయన కూర్చొనెను. మీరెప్పుడయినా అక్కడికి వెళ్ళి చూచినచో ఆ బావి భయమును కలిగించును. ఇక్కడున్న గొయ్యివలె ఉండును, అక్కడ ఒక ప్రజా ఊట యున్నది, అనగా అందరూ నీటి కొరకు అక్కడికి వచ్చెదరు. స్త్రీలు ఉదయమున వచ్చి తమ కుండలలో నీళ్ళు నింపుకొని తల మీద, నడుముల మీద పెట్టుకొని బహు నిటారుగా నడిచిపోదురు. ఒక చుక్క కూడా తొణకదు. ఒకరితో ఒకరు ముచ్చటించుచూ పోదురు. కాబట్టి ప్రజలు అందరూ ఆ బావి యొద్దకు వచ్చెదరు.

ఇది బహశా పగలు పదకొండు గంటలు కావచ్చును. ఆయన శిష్యులను ఆహారము కొని తెమ్మని పట్టణములోనికి పంపెను.

JOHN 4:7,9-11,14,16-18

 

63వారు వెళ్ళిపోయిన తరువాత ఒక చెడ్డ పేరుగల స్త్రీ వచ్చెను. ఈ రోజున మనము ఆమెను చెడు ప్రదేశములో నివసించే ఒక స్త్రీ (Red-Light Woman), లేదా వేశ్య అని పిలచుదుము. ఆమెకు చాలామంది భర్తలుండిరి. యేసు అక్కడ కూర్చొనియుండగా ఈ స్త్రీ దాదాపు పదకొండు గంటల సమయాన వచ్చెను. చూడండి, ఆమె ఉదయమునే నీళ్ళు తీసికొని వెళ్ళుటకు వచ్చు కన్యలతో కలిసి రాజాలదు. వారందరూ అయిపోవువరకు ఈమె ఆగవలెను. ఇప్పటివలె అప్పుడు వారు కలిసేవారు కారు. ఆమెకు ఒక ముద్రపడినది. ఆమె నీరు చేదుకొనుటకు వచ్చెను. ఆమె ఆ పాత బొక్కెనను లోనవేసి నీళ్ళు చేదుకొననారంభించెను.

"స్త్రీ, నాకు దాహమున కిమ్ము" అని ఒకాయన అడుగుట ఆమె విన్నది. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఈయన మెల్మీసెదెకు. ఆయనే నిన్నటి యేసు. మనుష్యకుమారుడు ఆమె తిరిగి చూడగా, మరియు ఆమె ఒక యూదుడుని చూచెను. అందువలన ఆమె ఇట్లన్నది, "అయ్యా, యూదుడవగు నీవు సమరయురాలనగు నన్ను అడుగుట యుక్తము కాదు. నేను సమరయ స్త్రీని, కనుక నీవు అడుగరాదు. ఆలాగు అడుగుట మంచిది కాదు. మనకు ఒకరితో ఒకరికి సాంగత్యము లేదు?

"అయితే నీవు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నది ఎవరో ఎరిగినచో," నన్నే దాహమునకిమ్మని అడిగెదవు?" అని ఆయన పలికెను.

"నీవేలాగు నీరు చేదగలవు? బావి లోతయినది. మరియు నీ యొద్ద చేదుకొనుటకు ఏదియు లేదు" అని ఆమే చెప్పెను.

"నేనిచ్చెడి నీరు జీవజలమై నిత్య జీవనమును ఇచ్చును" అని ఆయన చెప్పెను. ఆమె పరిస్థితి ఏమిటో కనుగొనువరకూ ఆయన ఆమెతో మాట్లాడెను. ఆమెతో ఇప్పుడు ఆయన ఏమి చెప్పెనో గమనించండి." వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసికొని రమ్ము"

"నాకు భర్తలేడు" అన్నదామె.

"నీవు నిజమే చెప్పితివి, ఎందుకనగా నీకు అయిదుగురు భర్తలు ఉండెను. ఇప్పుడు నీతో జీవించుచున్నవాడు నీ భర్త కాడు. కాబట్టి ఈ విషయములో నీవు సత్యమే చెప్పితివి" అని ఆయన చెప్పెను.

ఆ స్త్రీకి, ఆ యాజకుల గుంపుకు మధ్యనున్న తేడా గమనించండి. ఆ యాజకులందరూ కలిసి ఎరిగిన దానికంటె ఎక్కువగా ఆమె దేవుని గూర్చి ఎరిగియుండెను.

JOHN 4:19,25,26,28,29

 

64"అయ్యా! నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మాకు నాలుగు వందల సంవత్సరముల నుండి ప్రవక్తలేడు. మెస్సీయా వచ్చుచున్నాడని మేమెరుగుదుము. ఆయన వచ్చినప్పుడు ఇదే ఆయన చేయనైయున్నాడు" అని ఆమె చెప్పెను. అదే మెస్సీయా యొక్క గురుతు, ఎందుకనగా ఆయన మనుష్యకుమారుడు. "ఆయన వచ్చినప్పుడు అదే చేయును. నీవు తప్పక ఆయన ప్రవక్తవై యుండాలి" అన్నదామె.

"నేనే ఆయనను" అని ఆయన చెప్పెను. ఎవరునూ ఆలాగు చెప్పలేరు.

ఆమె నీటి కుండను అక్కడే విడిచి పెట్టినది. మరియు పట్టణములోనికి పరుగెత్తినది, "నేను చేసినవన్నియూ నాతో చెప్పిన వానిని వచ్చి చూడుడి. ఈయన మెస్సీయా కాడా? అన్నది.

ఇప్పుడు గుర్తుంచుకొనండి, అన్యుల జాతి అంతమందు ఆయన అదే చేయుదునని వాగ్దానము చేసెను.

ఆ మెస్సీయా కొరకు యూదులు నాలుగువేల సంవత్సరములు ఎదురుచూడలసి వచ్చెను. ఆయన రాకను గూర్చియు, అక్కడికి ఆయన వచ్చినప్పుడు చేయుదానిని గూర్చియు నాలుగువేల సంవత్సరమలు బోధించుట జరిగెను. వారు ఆయనను చూచుటలో విఫలమయిరి లేక దానిని గుర్తించుటలో తప్పిపోయిరి. తాను ఏమి చేయుదునని బైబిలులో వాగ్దానము చేసెనో ఆలాగే ఆయన తన్నుతాను కనుబరచుకొనిననూ వారది చూచుటలో తప్పిపోయిరి. ఆయన ధియోఫనీగా ఉండి, తరువాత శరీరము ధరించి వారిమధ్య జీవించెను. వారు దానిని చూచుటలో తప్పిపోయిరి మరియు ఆయన క్రియలను అపవాది క్రియలని పిలచిరి.

MATT 28:20•

LUKE 17:28,30•

JOHN 14:19•

HEB 13:8

 

65అపోస్తలుల తరువాత రోమను కాథలిక్కు చర్చి ద్వారా మొదలుకొని ఇప్పటి వరకు రెండువేల సంవత్సరముల బోధ మనకు చెప్పబడెను. మనము రోమను కాథలిక్కు గ్రీకు, ఇంకా ఆయా చర్చిలగుండా లూధర్, వెస్లే, ఇంకా ఏవేవో తొమ్మిది వందల సంస్థల నుండి వచ్చాము. వచ్చుచుండగా ఈ కాలములన్నింటిలోను వారు నేర్పించిరి.

ఇప్పుడు ఆయన వాగ్దానము చేసెను, అంత్యకాలము వచ్చేముందు, సోదోమ మరియు గోమొర్రాల యొక్క దృశ్యము మరల వచ్చును, "సోదోమ యొక్క దినముల వలెనే, అంత్యకాలము వచ్చుముందు, మనుష్య కుమారుడు తనను తాను మరల బయలుపరచుకొనును." [టేపు మీద ఖాళీయున్నది]

"ఇంక కొంచెము కాలము అయిన తరువాత లోకము నన్ను చూడదు. అయినను మీరు చూచెదరు. ఎందుకనగా నేను [వ్యక్తిగత నామవాచకము] "నేను మీతోను, మీలోను యుగ సమాప్తి పర్యంతము ఉందును. నేను మీతో ఉందును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మీరు చూచారా?

మీరు చూడండి, అసలు ఈ సమరయులు హాగరు సంబంధులు - నా రాత్రి ప్రసంగము అదే చూచారా, ఒక వక్రసంతానము. యూదులు శారా వారు — లేదా శారా సంతతి; కాని అన్యులు రాజసంతతియగు మరియ సంబంధీకులు, అబహ్రము యొక్క రాజ సంతానము.

HEB 13:8

 

66ఇదే దేవుడు, ఇదే క్రీస్తు తిరిగి ఇక్కడికి వచ్చి ఈ అంత్యదినములలో తన్నుతాను మనుష్యకుమారునిగా బయలుపరచుకొనెదనని వాగ్దానము చేసెను.

ఎందువలన? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. ఆయన యూదులకు మెస్సీయా గురుతును ఇచ్చి అన్యుల కాలాంతమందు అన్యులను వేదాంత జ్ఞానము ద్వారా ముందుకు పోవునట్లు ఆయన చేసినచో ఆయన అన్యాయస్తుడగును. వారికేలాగు చేసెనో వీరికి ఆలాగే చేయవలసియున్నాడు. హెబ్రీ 13:8లో "ఆయన ఏకరీతిగా యున్నాడని" బైబిలు చెప్పుచున్నది.

మలాకీ 4 మరియు చివరి దినములలో సంఘము సరిగ్గా ఈనాడున్నట్లే, లోకము కూడా ఈలాగే యుండునని ఆయన వాగ్దానము చేసెను.

నేటి ప్రపంచమువైపు చూడండి. సౌదొమ స్థితివైపు చూడండి. ఆయా స్థలములలో భూకంపములను చూడండి. జరుగుచున్న సంగతులు చూడండి. సంఘము ఎంత గందరగోళ స్థితిలోయున్నదో చూడండి, బాబెలు యొక్క స్థితి, దానియొక్క వర్తమానికులను చూడండి, ఓరల్ రాబర్ట్స్ మరియు బిల్లీగాహం.

గ్రాహం, అబ్రహాంవలె "హాం" అను అంతముగల పేరుతో సంఘములన్నింటికి ఒక వర్తమానికుడు వచ్చుట ఇదే మొదటిసారి. అబ్రాహాము (A-B-R-A-H-A-M) ఏడు అక్షరములు. గ్రాహం ( G-R-A-H-A-M) ఆరు అక్షరములు. అతడెక్కడున్నాడు? లోకమునకు. ఆరు అనునది మానవ సంఖ్య, మానవుడు అరవ దినమున సృజించబడెను. కాని యేడు దేవుని సంఖ్య.

GEN 18:13•

LUKE 17:28•

HEB 7:3•

HEB 13:8

 

67కాని వారిని ఆ సోదొమలో చూడండి. అక్కడ వారి వర్తమానికులు వారితో మాట్లాడుచున్నారు. అయితే అబ్రాహాము యొక్క రాజసంతానము ఎక్కడ? ఆయన చెప్పిన సూచన ఏది? "సోదొమ దినములలో ఉండినట్లుగా," ఆ దేవుడు దిగివచ్చి మనుష్యశరీరమందు ప్రత్యక్షమయి, ఆయన వెనుకనున్న గుడారమందు శారా తన హృదయమందు ఏమి తలంచుచున్నదో చెప్పెను. ఆ అన్యుల ప్రపంచము అగ్నితో నాశనము చేయబడక ముందున్న చివరి సూచన అదే. సర్వ ప్రపంచము నాశనము కాబడు ముందుగా సంఘము తన చివరి సూచన పొందుకొనెను. ఈ అన్యుల రాజ్యము, దేవుని యొక్క ఉగ్రత మరియు అగ్ని ద్వారా నాశనము చేయబడును. మీరు దానిని నమ్ముచున్నారా?

ఆ మెల్కీసెదెకు శరీరధారై, తన్నుతాను మానవ శరీరములో సాదృశ్య పరచుకొనెను. ఆ తరువాత ఆయన శరీరధారి అయ్యెను. ఈ రాత్రి ఇప్పుడు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది మీరు నమ్ముదురా?

అయితే ఆ మెల్కీసెదెకు ఎవరు, "ఆయనకు తండ్రి ఎన్నడు లేడు; ఎన్నడు తల్లిలేదు; ఆయనకు జీవిత ప్రారంభము లేదు, ఆయనకు జీవిత అంతములేదు." ఆయన అబ్రాహామును కలిసికొనెను. మరియు ఆయన ఎంటువంటి సూచనను అనుగ్రహించెను? అప్పుడు శరీరధారి ఆయిన రీతిగానే అంత్యకాలము ముందు మరల ఆలాగే జరుగునని ఆయన చెప్పెను. అది మీరు నమ్ముచున్నారా? నేను అది నమ్ముదును!

మనము ప్రార్థించుకొందము.

MATT 11:25•

MATT 23:29•

LUKE 10:21•

HEB 13:8

 

68ప్రియదేవా, "నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావని" చెప్పుచున్న లేఖనములను నేను నమ్ముదును. ప్రభువా, నిజంగా నా హృదయములో యదార్ధముగా ఏదో జరుగనైయున్నదని నేను ఎరుగుదును. దానిని ఖచ్చితంగా నేను గుర్తింప చేయలేను. ప్రభువా, ఏది చెప్పుట కయినను నేను భయపడుచున్నాను. నీ దాసునియొక్క హృదయమును నీవెరుగుదువు.

అన్ని కాలములలోను నీవు పంపిన కార్యములను గుర్తించుటలో ప్రజలు ఎన్నోసార్లు తప్పిపోయిరి. దేవుడు గతంలో చేసిన దానిని మానవుడు నిరంతరము గుర్తుంచుకొని స్తుతించును. మరియు ఆయన ఎట్టి గొప్ప కార్యములు చేయనైయున్నాడో చెప్పెదరు, కాని ఆయన చేయుచున్న దానిని అలక్ష్యము చేయుదురు. కాలమంతటిలోనూ అదే జరిగినది. పరిశుద్ధ పాట్రిక్ను దేవుని ప్రవక్తగా చూచుటలో రోమను సంఘము ఎందుకు తప్పిపోయినది? ప్రవక్తినిగా ఉండిన జోన్ ఆఫ్ ఆర్క్ను ఒక మాంత్రికురాలని చెప్పి వారెందుకు కాల్చి చంపిరి? తండ్రి, గతమంతా ఆలాగే యున్నది. వివేకముగల వారికి, జ్ఞానులకు నీవు వారి కన్నులకు దానిని మరుగుచేసితివి. నీవు ఆ యాజకులతో ఈలాగు చెప్పుట ఆశ్చర్యము లేదు, "మీరు ప్రవక్తల సమాధులను శృంగారించుచున్నారు గాని వారిని అందులో పెట్టినవారు మీరే." వారు వెళ్ళిపోయిన తరువాత వీరు తమ తప్పు చూచుకొనిరి. ప్రభువా, నీవు ఏ రూపములో వచ్చినా గాని వారు ఎప్పుడూ నిన్ను హింసించుచునేయున్నారు.

LUKE 24:28-31,34

 

69దేవా, మరల ఒక్కసారి ఈ రాత్రి ప్రార్థించుచున్నాను. రేపు మేము టసాన్ కు వెళ్ళుటకు సిద్ధపడియున్నాము. లోకములో ఇతర భాగములలోను ఇతర పట్టణములలోను మేము తప్పక బోధించవలెను. కాని ప్రియదేవా, బోధించబడిన ఈ వాక్యమును ఎన్నడూ విననివారు, అది బయలుపరచబడుటను ఎన్నడూ చూడని క్రొత్తవారు ఇక్కడ ఈ రాత్రి ఉండియుందురు.

ఆదిలో నిన్ను నేను అడిగినట్లుగా, అనగా ఎమ్మాయి నుండి వచ్చిన క్లియొపా మరియు అతని స్నేహితుడు మార్గములో నడిచిపోవుచుండగా నీవు పొదలోనుండి వారి మధ్యను అడుగుపెట్టి, పునరుత్థానము తరువాత వారితో మాట్లాడి బోధించసాగితివి. ఎందుకు" అవివేకులారా, మందమతులారా, క్రీస్తు ఈ శ్రమలు సహించి మహిమలో ప్రవేశించుట అగత్యము అని మీరెరుగరా? అని గద్దించితివి." "అయిననూ వారింకా గుర్తించలేదు. పగలంతా వారు నీతో నడచిరి. అయినా గాని నిన్ను వారు గుర్తించలేదు. కాని ఒకరాత్రి…

చీకటిపడినది, వారు నిన్ను రమ్మని బలవంతము చేసిరి. వారు ఆ చిన్న సాలలోనికి వెళ్ళి తలుపులు మూయగానే నీవు నీ సిలువ మరణము ముందు చేసినట్లుగానే అప్పుడు చేసితివి. ఆయనే తిరిగి లేచిన క్రీస్తు అని అప్పుడు వారు గుర్తించిరి. కొద్ది క్షణములలో నీవు తెరల వెనుక అదృశ్యమైతివి. వెంటనే వారు పరుగిడివెళ్ళి, శిష్యులకు "ప్రభువు నిశ్చయముగా తిరిగి లేచెను" అని చెప్పిరి.

తండ్రియగు దేవా, నీవు ఇంకనూ సజీవునిగా ఉన్నావని నమ్ముచున్నాను. నీవున్న వాడవని నాకు తెలియును. చాలాసార్లు అది మాకు రుజువుచేసితివి. ప్రభువా, మా కొరకు మరల ఒక్కసారి అది నీవు చేయగలవా? నీ దృష్టిలో మేము కృపను పొందినవారమయినచో మరోసారి ఆలాగు జరుగనిమ్ము. నేను నీ దాసుడను; ఇక్కడ నీ దాసులగువారున్నారు. ప్రభువా, నేను చెప్పిన దానంతటికంటె, లేక అయిదు రాత్రులు - అయిదు వర్తమానములలో నేను చెప్పినదానంతటి కంటె నీ ఒక్కమాట మాకు ఎంతో అర్థవంతముగా నుండును. నీ ఒక్కమాటయే మిన్నగా నుండును. ప్రభువా, నేను సత్యము చెప్పితినని ప్రజలు తెలిసికొనునట్లుగా నీవు మాట్లాడవా? దేవా, అనుగ్రహించుము. మరొకసారి యేసు నామములో దీనిని అడుగుచున్నాను. ఆమేన్.

JOHN 1:11

 

70మిమ్మలను నేనెరుగను. కొందరిని నేనెరుగుదును. ఇక్కడ కూర్చొనియున్న ఈ బాలుని నేను ఎరుగుదును. అక్కడ కూర్చొనియున్న బిల్డాచ్ని నేనెరుగుదును. ఇక్కడ సహో, బ్లయర్, రాడీకాక్స్ ఉన్నారు. ఆవలకు చూచుట కష్టము. ఈ ప్రక్కన ఈ సమయములో నాకు తెలిసినవారెవరూ నాకు కనబడుట లేదు.

నేను అపరిచితుడనని ఎందరు ఎరుగుదురో వారందరూ మీ చేతులు ఎత్తండి? మీగూర్చి నాకేమీ తెలియదను వారు ఈ రెండు వైపులనుండి చేతులెత్తండి.

ఇక్కడ రోగులుగా ఉన్నవారు, మీగూర్చి నాకేమి తెలియదని చెప్పువారు మీ చేతులెత్తండి?

మీ గూర్చి ఇప్పుడు నేను ఏదయినా తెలిసికొనుట పూర్తిగా, సంపూర్ణముగా అసాధ్యము. అయితే, ఇంకొక విధముగా ఆత్మయొక్క ప్రత్యక్షత వలన మాత్రమే తెలిసికొనగలను.

ఈ అన్ని రాత్రులు, ఈ రాత్రి కూడా, ఆయన చనిపోలేదని మీకు చెప్పియున్నాను. ఆయన ఇక్కడున్నాడు, మరియు అదే చేయుటకు వాగ్దానము చేసియున్నాడు. మలాకీ 4 మరియు లూకా సువార్త ప్రకారము చివరి దినములలో ఆయన తన ప్రజలు మధ్య మరల మానవ శరీరములో ప్రత్యక్షమయి అవే కార్యములు, అవే క్రియలు బయలుపరచు సమయము వచ్చునని వాగ్దానము చేసెను. అదే మెస్సీయా గురుతు. ఎందరిది ఎరుగుదురు? బైబిలు చదువుచున్నవారు, అది సత్యమని యెరుగుదురా? "ఆమేన్" అని చెప్పండి. [జనులు "ఆమేన్" అని జవాబిచ్చిరి.] తప్పక అందరూ బైబిలు పాఠకులయియుందురు.

ఈనాడు జనులకు అది క్రొత్తగా నున్నది, కాని ఇంకనూ అది సత్యమే. ఈ కారణము చేతనే వారు నజరేయుడగు యేసును ఎరుగుట లేదు. వారు తమ సంఘ సిద్దాంతమును ఎరుగుదురు గాని ఆయనను ఎరుగరు. అయితే ఆయన బైబిలు చెప్పిన విధముగానే వచ్చును. ఒక వేదాంత పండితుడుగానో, ఒక యాజకుడుగానో రాడు. ఆయన ప్రవక్తగా వచ్చును, మరియు ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు.

MATT 9:20-22•

MARK 5:27,28,30,31,34•

LUKE 8:43-46,48

 

71దేవుడు తన మాట తప్పడు. నాకు తెలిసిన వారి మీద అది పడినచో నేను మరొకరిని తీసికొందును. నాకు తెలియని కొందరు నాకు కావలెను. మీరు ప్రార్ధించవలెనని కోరుచున్నాను.

ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఒక వ్యాధి కలిగిన స్త్రీ యుండెను. ఆమె వైద్యులకు తన డబ్బంతయూ ఖర్చుచేసెను. వారామెకు ఏమి మంచి చేయలేకపోయిరి. "నేను ఆయన వస్త్రమును ముట్టిన బాగవుదును" అని ఆమె తన హృదయములో తలంచినది. ఆ కథ మీకు గుర్తున్నదా? వారందరూ ఆమెను వెనుకకు త్రోయ ప్రయత్నించిరి గాని ఆమె వారిని త్రోసుకొని ఆయన వస్త్రమును తాకి తిరిగి వెళ్ళి కూర్చుండెను.

ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆమె ఆలాగు చేయగా యేసు చుట్టూ చూస్తూ, "నన్నెవరు తాకిరి?" అని ప్రశ్నించెను.

అపోస్తలుడగు పేతురు ఆయనను గద్దించెను. ఆతడు ఈ విధంగా చెప్పియుండవచ్చును, "ప్రభువా, ఆలాటి మాట పలుకవద్దు. ప్రజలు విన్నచో నీకేదో మతిపోయినదని తలంచుదురు, ఎందుకనగా వారికి నీవు నీ రక్తమును త్రాగి, నీ శరీరమును తినమని చెప్పావు. అప్పుడే వారు నీవేదో అయిపోయావని తలంచారు. ఇప్పుడేమో జనసమూహమంతయూ నీ పైన పడుచుండగా, "నన్నెవరు ముట్టుకొనిరి? అని అడుగుచున్నావు.

"అవును." ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని గ్రహించుచున్నాను," అని ఆయన చెప్పెను. అది వేరే విధమగు తాకిడి. ఇప్పుడు ప్రభావము అనగా "బలము" అని ఎవరికైన తెలియును. "నేను బలహీనమైపోయాను. ప్రభావము నాలో నుండి వెడలిపోయెను." ఆ స్త్రీని కనుగొని ఆమెయొక్క రక్తస్రావ రోగము పోయినదని చెప్పువరకు, ఆయన ఆ జనములో ఆమెకొరకు వెదకుచునేయుండెను. తన రక్తస్రావము ఆగిపోయినట్లుగా ఆమె తన శరీరమందు ఎరిగినది. అది నిజమేనా? "నీ విశ్వాసము నిన్ను రక్షించెను" అని ఆయన చెప్పెను.

అక్కడ గ్రీకు పదము (SOZO) అనగా, "శారీరకంగా, ఆత్మీయంగా రక్షించబడుట" అని అర్థము. అతను "రక్షించబడెను" ఆయన నీ రక్షకుడు.

HEB 4:15

 

72నిన్న ఆయన ఆలాగుండెను, ఆయన తన జనులమధ్య ఉన్నట్లుగా రుజువు చేయుటకు ఆలాగు పనిచేసెను. వాగ్దానము చేయబడిన మెస్సీయా బైబిలు ద్వారా వాగ్దానములో ఆయన తన్నుతాను గుర్తింపచేసికొనిన విధానము అదే. ఇప్పుడును ఆయన అదే చేయును. ఆయన అదే పనిచేయవలసిలేడా?

ఈలాగు మీరు అనవచ్చు, "రోగులను బాగుచేయుటను గూర్చి ఆయన దానిని చెప్పెనా?" అవును! బైబిలులోని హెబ్రీయుల గ్రంథములో "యేసుక్రీస్తు మన బలహీనతలను తాకు ప్రధానయాజకుడని" ఇప్పుడే నేను చదివాను. అది నిజమని ఎందరెరుగుదురు? బైబిలు ఆలాగు చెప్పెను. "ఆయన మన బలహీనతలను అంటుకొను ప్రధాన యాజకుడు. ఆయన అప్పుడుండిన ప్రధాన యాజకుడే అయినచో ఇప్పుడు ఏలాగు పనిచేయును? అప్పుడు పనిచేసినట్లుగానే ఇప్పుడును ఆయన పనిచేయవలసియున్నాడు. అదే ప్రధాన యాజకుడయినచో ఆలాగే పనిచేయును.

నేను మీ ప్రధాన యాజకుడిని కాను. నన్ను మీరు అంటుకొనవచ్చును. కాని మీరు మీ భర్తను, నీ సోదరుని లేదా మరే ఇతర మానవుని అంటుకొన్నట్లుగానే అది ఉండును.

HEB 13:8

 

73కాని మీ విశ్వాసము ఆయనను అంటుకోనీయండి, అప్పుడేమి జరుగునో చూడండి.

నేను దేవుని దాసునిగా మీకు సత్యమును చెప్పినయెడల అది సత్యమని దేవుడు రుజువుపరచును. యేసుక్రీస్తు ఈ రాత్రి సజీవుడనియు, ఇక్కడ నిలబడి యున్నాడనియు అది రుజువు చేయును. అది నిజమేనా?

ఒకేసారి ఒకవైపే మీరిప్పుడు విశ్వాసము కలిగియుండుడి. ఆ బయటనున్న వారు విశ్వాసము కలిగియుండుడి. నేను ఇక్కడే మైక్రోఫోను యొద్ద నిలబడియుండుట మంచిది, ఎందుకనగా వారికి వినబడును.

ఎవరయినా గాని దేవుని వైపు చూచి ఈలాగు చెప్పండి, "దేవా, అతను నన్నెరుగడు. నా గూర్చి ఏమియూ అతనికి తెలియదు. నేను పూర్తిగా ఆయనకు క్రొత్త వ్యక్తిని, కాని నా విశ్వాసము నిన్ను అంటుకొననిమ్ము ప్రభూ! నా సంగతి ఏమిటో నీవు ఎరుగుదువు ప్రభువా. నా గూర్చి అంతా నీకు తెలియును. నీవు పేతురును ఎరిగినట్లే, నతానియేలును ఎరిగినట్లే, రక్తస్రావ రోగముతోనున్న స్త్రీ యొక్క వ్యాధిని ఎరిగినట్లే, నేనెవరినో నీవు ఎరుగుదువు. "నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావని అతను చెప్పుచున్నాడు. అయితే ప్రభువా, నా విశ్వాసము నిన్ను అంటుకొననిమ్ము."

ఆయన ఆలాగు చేసినచో, ఇక్కడున్నట్లుగా ఆయన తప్పిపోకుండా రుజువుపరచినచో ఎందరు తమ పూర్ణ హృదయములతో ఆయనను నమ్ముదురు? ఒక సాక్ష్యముగా - కనీసము ఒకరు, ఇద్దరు, ముగ్గురికి చేసినాగాని నమ్మండి. దేవుడు మిమ్మును దీవించును!

HEB 13:8

 

74తండ్రియగు దేవా, ఇది పూర్తిగా మానవ హస్తములకు అందనిది. అది ఒక సహజాతీతమగు సంఘటనగా ఉండవలసియున్నది. కనుక ప్రభువా, ఇప్పుడు నాకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను. నేను నీ చేతులలోయున్నాను. నీకు తగిన విధముగా నాకు చేయుము. యేసు నామమున. ఆమేన్.

ఇప్పుడు ఉద్రిక్తతగా ఉండవద్దు. కేవలము దీనముగా, మర్యాదగా ఈలాగు చెప్పండి, "ప్రభూ, నేను నిన్ను సేవించుదును. నేను నీ వస్త్రమును అంటుకొన్నయెడల అతని ద్వారా నీవు తిరిగి మాట్లాడుము. అప్పుడు అతను చెప్పినది సత్యమని రుజువగును." అది నిజమేనా?

ఆ వెలుగు యొక్క పటమును ఎందరు చూచారు? అది దేశములో ప్రతిచోట ఉన్నది. సైన్సు దానిని స్వీకరించి ప్రతీచోట దానిని పరీక్షించెను. ఇప్పుడు ఆయన ఇక్కడే యున్నాడు. వివాహము మరియు పరిత్యాగము గూర్చి చెప్పిన ఆయనే. ఆయనే ఆ పర్వతము మీద ఉండి ఆ వెనుకనున్న కొండలను కదిలించెను. 33వ సంవత్సరములో ఈ నదియొద్ద ఉండినది ఆయనే. నిన్న నేడు, నిరంతరము ఆయనే ఏకరీతిగా యున్నాడు. ఆయన ఏకరీతిగా యున్నాడు.

75అక్కడ ఒక స్త్రీ యున్నది. ఏదో జరిగినదని ఆమె ఇప్పుడు గుర్తించినది. ఆ వెలుగు ఆమె మీదనే వ్రేలాడుచున్నది. ఆమె ఇక్కడే కూర్చొనియున్నది. ఆమె పచ్చని కోటు లేదా మరొకటి ధరించినది. ఆ స్త్రీని నేనెరుగను. మేము ఒకొరికొకరము పూర్తిగా క్రొత్తవారమని అనుకొనుచున్నాను. అది నిజము. నీవు ఏదో అవసరతలో యున్నావు. నీ బాధ ఏమిటో దేవుడు నాకు బయలుపరచునని నీవు నమ్ముదువా? ఆయన ఆలాగు చేసినచో అది సహజాతీతమగు శక్తియని నీవు తెలిసికొనుము, ఎందుకనగా నిన్ను నేను ఎరుగను. అది సహజాతీతమగు దానివల్లనే రావలసియున్నది. అది ఏమని నీవు తలంచుదువో దాని మీదనే అది ఆధారపడినది. నీవు యాజకుల పక్షాన చేరి దానిని "అపవాది" అనవచ్చును, లేక నీవు విశ్వాసి పక్షము వహించి అది "దేవుని" నుండి కలిగినది అని చెప్పవచ్చును. ఎప్పుడు నీవు విశ్వసించినా గాని నీ ప్రతిఫలము అక్కడ నుండే వచ్చును.

నీ వ్యాధిని ఆయన నాకు బయలుపరచినచో ఆ వ్యాధికి పరిహారము ఆయనే అని నీవు ఆయనను అంగీకరించుదువా? నీ వ్యాధి ఏమిటో నాకు తెలియదు, అయితే ఏదో సంభవించుచున్నదని నీకు, నాకు కూడా తెలియును.

నీవేలాగు బాధపడుచున్నావో నన్ను చెప్పనిమ్ము అప్పుడు నీవు తెలిసికొందువు; నిజముగా వెచ్చని, మధురమైన, హాయి అనుభూతిని కలిగియున్నావు. నేను సూటిగా దానివైపే చూచుచున్నాను. అది ఆ వెలుగే. ఆకుపచ్చ మరియు పసుపు పచ్చ రంగుగల (Amber light) ఆమె మీద నుండి వ్రేలాడుచున్నది. ఆమె కడుపులోని వ్యాధితో బాధపడుచున్నది. ఒక రకమగునది ఏదో ఆమె కడుపులో పెరిగినది. ఆమె ఇక్కడి వ్యక్తి కాదు. కాదు. నీవు దూరము నుండి వచ్చావు. కదా? అది నిజము! నీవు విస్కాన్సిన్ నుండి వచ్చావు. అది నిజమేనా? నిశ్చయంగా, ఇప్పుడు నీవు స్వస్థత పొందావు. నీ విశ్వాసము నిన్ను బాగుచేసినది.

ఆ స్త్రీ ఎవరిని తాకినదో నాకు చెప్పండి? ఆమెకు నేను ఇరవై-అయిదు గజముల దూరములో యున్నాను. ఆమె ప్రధాన యాజకుడగు యేసు క్రీస్తును తాకినది. అది మీరు నమ్ముదురా?

76నేను మాట్లాడిన ఒక స్త్రీ వైపునకు నేను చూచుచున్నాను. ఈ స్త్రీ ఈమెవైపు నేను సూటిగా చూస్తున్నాను, ఎందుకనగా ఆమె ప్రయాసపడి ఒకాయన కొరకు ప్రార్థించుచున్నది. ఆమె నాకు ఎన్నడూ దానిని గూర్చిచెప్పలేదు.

కాని ఆమె పేరు శ్రీమతి వాల్డ్రాప్. ఆమె ఫీనిక్సు నుండి వచ్చినది. ఆమె చావునుండి బ్రదికినది. ఆమె వైద్యుడు ఎక్స్రేతో వచ్చి గుండెలోని కాన్సరును చూపించెను. ఆమె ప్రార్ధన వరుసలో చనిపోయినది. అది ఎంత సమయము క్రితము జరిగినది శ్రీమతి వాల్ డ్రాప్? పద్దెనిమిది సంవత్సరముల క్రితం. ఈ రాత్రి ఆమె ఒక సజీవ సాక్ష్యముగా కూర్చొని యున్నది.

ఆమె వైద్యుడు కూటమునకు వచ్చెను. "ఆ స్త్రీ ఎట్ల బ్రదుకగలదు?" అని అడిగెను. కాని ఆమె ఆవ్యాధి యొక్క గురుతు కూడా లేకుండా అక్కడున్నది. ఆమె ఎవరినో తీసికొని వచ్చినది. అతని కొరకు ఆమె ప్రార్థించుచున్నది. అతడు చక్కెర వ్యాధితో చనిపోవుచున్నాడు. ఇప్పుడు నాకు తెలిసినది. అతడెవరో నాకు తెలియదు శ్రీమతి వాల్డ్రాప్.

అతడు మిస్సోరి నుండి వచ్చెను. మరియు అతని పేరు శ్రీ కూపర్, అది నిజము. ఇప్పుడు నీవు నమ్ముము, నీవు బాగుపడి ఇంటికి వెళ్ళుము, అయ్యా! అది నీ నమ్మిక మీదనే ఆధారపడినది.

GEN 18:13

 

77ఇక్కడ ఒకామె యున్నది. ఆమె ఉబ్బసము వ్యాధి, ఆ తీవ్రతలతో బాధపడుచున్నది. ఆమె ఇక్కడ నుండి రాలేదు. ఆమె ఆ గుంపులో కూర్చొని యున్నది. ఆమె ఇక్కడి స్త్రీ కాదు. ఆమె జార్జియా నుండి వచ్చెను. మిస్ మెకెన్నీ నీ పూర్ణహృదయముతో నమ్ముము. దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముదువా? నీవు నాకు క్రొత్త వ్యక్తివైనచో అది నిజమైనచో లేచి నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. నీవు నమ్ముదువా?

నా వెనుక ఒకాయన కూర్చొనియున్నాడు. అతడు దేవుని సంధించుచున్నాడు. గుండె జబ్బుగల ఒక బిడ్డ అతనికున్నది. ఆ కోరికతో అతడు వచ్చెను. ఆ బిడ్డకు గుండెలో ఏదో రుగ్మత ఏర్పడినది. అది వైద్యుడు చెప్పెను. అతని పేరు శ్రీ కోక్సు, నిలబడు కోక్చు. "ఆయన తన వెనుక నిలబడిన శారా ఏమి తలంచెనో చెప్పెను."

ఆతనియొక్క బల్లల వరుసకు కొద్దివెనుకగా ఇక్కడ నుండి కాదుగాని, న్యూ-మెక్సికో నుండి వచ్చిన ఒకాయన ఉన్నాడు. నా జీవితములో ఎన్నడూ నేను అతనిని చూడలేదు. ఇప్పుడు తిన్నగా అతనివైపే చూస్తున్నాను. ఆతడు నా వెనుక ఉన్నాడు. అతడు న్యూ-మెక్సికో నుండి వచ్చెను. ఆతడు ఆసక్తి చూపుచున్న ఒక బాలిక యున్నది. ఆ బాలిక నోరు ఏదో రుగ్మతకు గురియైనది. ఆమె ఆంగిలికి ఏదో వ్యాధి వచ్చెను. అతని పేరు శ్రీ వెస్ట్ అయ్యా, మీరు నిలబడెదరా, ఆతనికి నేను పూర్తిగా క్రొత్తవ్యక్తిని, కాని ప్రభువగు దేవుడు ఆతని బిడ్డను స్వస్థపరచును. నీ పూర్ణహృదయముతో ఇప్పుడు అది నమ్ముదువా?

2KGS 7:3,4•

HEB 13:8

 

78ఇప్పుడు మీలో ఎందరు మీ పూర్ణహృదయములతో నమ్ముదురు?

యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఎందరు మీ పూర్ణహృదయములతో నమ్ముదురు? ఇప్పుడు నీవు ఆయనను నీ రక్షకునిగా అంగీకరించుదువా? చేతినెత్తుము. ఆయనను నీ స్వస్థపరచువానిగా నమ్ముదువా?

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొనియున్నాడు. కుంటి లేదాఏదో వైకల్యమున్నది. ఒక మంచము మీద పరుండియున్నాడు. ఈ మైకు ద్వారా నా మాట నీవు వినగలుగుచున్నావా? నిన్ను నేను ఎరుగను. అక్కడ స్త్రీవగు నీవు పడియున్నావు. నేను నిన్ను బాగుచేయ కలిగినచో చేయుదును, కాని నేను బాగుచేయలేను.

[ఒక వ్యక్తి ఏడ్వడము ప్రారంభించెను] మంచిది. అతను కేవలము ఒక వ్యక్తి సంతోషించుచున్నది. అతని బిడ్డ స్వస్థపరచబడెను.

నిన్ను నేనెరుగను. నీవు ఒక స్త్రీవి మరియు నేను ఒక పురషుడ్ని మనము జీవితములో కలిసికొనుట ఇదే ప్రధమము అని నేను అనుకొనుచున్నాను. నిన్ను తెచ్చినది? నేననుకొనుచున్నాను. వాస్తవంగా ఇక్కడకు నీవు వచ్చుట ఇదే మొదటిసారి. నిన్ను ఇప్పుడే తీసికొనివచ్చారు. నీవు చాలా దూరమునుండి వచ్చావు. మరణ ఛాయలలో నీవున్నావు. నీకు కాన్సరు. కుంటితనము కాదు. అది ఒక కాన్సరు. వైద్యులు ఇక ఏమీ నీకు చేయలేరు. అది నిజము. నీవు తప్పక చనిపోదువు. ఆ వైద్యులు నీకు ఏమియూ చేయలేరు.

ఒక సమయమున ముగ్గురు కుష్టరోగులు సమరయ గుమ్మము నొద్ద కూర్చుండిరి. వారు ఈలాగు అనకొనిరి, "మనము చనిపోవు వరకు ఇక్కడ కూర్చొనుట ఎందుకు? ఎందుకనగా పిల్లలందరూ ఆకలికి చనిపోవుచున్నారు. ఒకరి పిల్లలను ఒకరు తినుచున్నారు. "మనము శత్రువు యొక్క పాలెములోనికి వెళ్ళినయెడల, ఆ సిరియనులు చంపెదరు; ఏలాగయినా చనిపోదుము, వారు మనలను రక్షించినచో బ్రదుకుదుము." వారు ఒక తరుణము చూచిరి. ఆ విశ్వాసము బట్టి వారు తమ్మను తాము రక్షించుకొనుటయే గాక మొత్తము గుంపును రక్షించిరి.

ఇప్పుడు నీవు చనిపోవుచున్నావు. నీవు బ్రదుకలేవు. కాని వారు వెళ్ళినట్లుగా నిన్ను పాలెములోనికి వెళ్ళమని అడుగుటలేదు గాని తండ్రి ఇంటికి నిన్ను ఆహ్వానించుచున్నాము.

HEB 13:8

 

79నీవు కాన్సరుతో చనిపోవుచున్నావు. దేవుడు లేకుండా నీవు జీవించలేవు. నీవు ఈ పట్టణము నుండి రాలేదు. ఈ చుట్టుప్రక్కన కూడా కాదు. నీవు చాలా దూరము నుండి వచ్చావు. నీవు మిల్వాకీ నుండి వచ్చావు. అది సత్యము.అది నిజము. ఆ పట్టణము నుండి అని నాకు తెలియును. అది నిజము. నీవు నమ్ముచున్నావా?

ఇప్పుడు దేవుని నీ స్వస్థకునిగా అంగీకరించెదవా? అంగీకరించినచో నీవెంత బలహీనముగా ఉన్నాసరే, ఎంతగా పడకపైయున్నాసరే, నీ విషయములో యేసుక్రీస్తు నామము పేరట నిన్ను లేపెదనని నేను నమ్ముచున్నాను. ఆ మంచమును తీసికొని ఇంటికి వెళ్ళి దేవుని యొక్క మహిమకొరకు జీవించుము. దేవుని ప్రవక్తగా నీవు నాకు లోబడెదవా? అయితే లేచి ఇంటికి వెళ్ళుము, మరియు బాగవుము. బాగవుము!భయపడవద్దు. మంచముపై నుండి లెమ్ము దేవుడు నిన్ను బాగుచేయును. చూచారా?

ఆమె లేచి బలమును పొందునట్లుగా ఎవరయినా ఆమెను పట్టుకొనండి. నీవు దేవుని నమ్ముదువా? ఆమెను కొద్దిగా బలము పుంజుకోనీయండి. ఆమె బాగవును. అంతే సోదరీ! ప్రభువైన యేసు నామములో నిలబడును. మనము నిలబడిదేవునికి స్తుతి చెల్లించుదుము. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు! వెళ్ళుము మరియు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...