అది సూర్యోదయము
1మనం తలలు వంచుదము. ప్రభువా, ఈ చక్కని ఈస్టరు ఉదయమున ఇక్కడ మేము చేరి లేత చిగుళ్ళు బయటకు తన్నుకొని వచ్చుటయు, తేనెటీగలు ఎగురుచూ తమ వంతును పొందుటయు, పక్షులు తమ హృదయములు ఆనందముతో పగులుచున్నవన్నట్లుగా గానము చేయుటయు చూచుచున్నాము, ఎందుకనగా అదొక ఈస్టరు — అనేక సంవత్సరముల క్రితము ఈలాంటి ఒక దినమున నీవు యేసును మృతులలో నుండి లేపియున్నావని నమ్ముచున్నాము. ఈ జ్ఞాపకార్థ దినమును మేము జరుపుకొనుచున్నాము.
నేడు మా అందరి మధ్యలోకి ఒక ఈస్టరు వచ్చును గాక. మేమాయన సహవాసములో యున్నచో ఇప్పుడు మేమాయనతో కూడా లేపబడి పరలోక స్థలములందు కూర్చొండ పెట్టబడియున్నామని ఆయన దాసులుగా ఆయన వాక్యమును అర్థము చేసికొనియున్నాము.
ఇక్కడ ఈ టబర్నికల్ లో ఉన్న కూటమును నీవు దీవించుము. అలాగే ఈ టెలిఫోను ద్వారా దేశములో ఇది ఎక్కడెక్కడకి వెళ్ళుచున్నదో ప్రతీచోట ఆశీర్వచనమును దయచేయుము.
రోగులందరినీ మరియు బాధపడుచున్నవారందరిని బాగుచేయుము. వారికి కూడా ఇదొక ఈస్టరుగా ఉండును గాక. వ్యాధి నుండి బలములోనికి సాగిపోదురు గాక! పాపములోను, అతిక్రమములోను చనిపోయినవారు, క్రీస్తు ద్వారా నేడు జీవించెదరు గాక! మేము నిన్ను స్తుతించుచున్నాము. ఆయన నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
2ఈ గొప్ప సమూహముతో ఇండియానాలోని జఫర్సన్విల్లో ఈ ఉదయాన తిరిగి కూడుకొనుట నిశ్చయంగా ఒక గొప్ప భాగ్యమని ఎంచుచున్నాను - సంఘము నిండిపొయి, జనులు బయట నిలబడిరి. ఈ చుట్టు ప్రక్కల ఖాళీ స్థలములందు, ఎక్కడ చూచిన జనులు నిలబడియుండిరి. దేశములోని పలు ప్రాంతములలో ఫోనులు యొద్ద కూర్చొనిన మీకు ఇక్కడి చక్కని ఉదయమని చెప్పుచున్నాము.
ఈ ఉదయము అయిదు గంటలకి ఎర్రని గుండెతో నున్న నా చిన్న మిత్రుడు (చిన్నపక్షి) కిటికి యొద్దకు ఎగిరి వచ్చి నన్ను మేల్కొలిపెను. అతడు తన హృదయమందు ఉప్పొంగినవాడై "ఆయన లేచియున్నాడు" అని పలికినట్లు కనబడెను. ఆ చిన్న పక్షి నాకెంతో ప్రియమైనది. అది నాకు స్నేహితురాలు.
ఆ పక్షిని గూర్చి ఒక ప్రముఖ గాధ యుండెను. "పాపమనేది ఆయనను సిలువపైకి ఎక్కించి ఆయనను బాధపరచుచున్నప్పుడు, ఒక చిన్న గోధుమ రంగు పిట్ట చూచెను. ఆ చిన్న పిట్టకు ఏ పాపమూ లేదు. ఆయన ఆ చిన్న పిట్ట కొరకు చనిపోవలసిన పనిలేదు, కాని అది సిలువయొద్దకు ఎగిరి వెళ్ళి తన చిన్ని ముక్కుతో సీలలను ఊడపీకుటకు ప్రయత్నించెను. అప్పుడు దాని ఉదర భాగమంతయూ ఎర్రబడినది." నాదియు ఆ విధముగానే ఉండవలెనని కోరుచున్నాను. ఆయన దేనికొరకు చనిపోయెనో, ఆ గొప్ప మహిమకరమగు దానిని పరిరక్షించు ప్రయత్నములో ఈ కేడెముగా ఉండగోరుచున్నాము.
3ఇక్కడ మన సమయము పరిమితమని నేను గ్రహించియున్నాను, ప్రత్యేకంగా టెలిఫోను ద్వారా వినుచున్న స్నేహితులు సహితం ఈ ఉదయమున కొద్దికాలం క్రితం తీయబడిన ఒక ఫోటో మీద దృష్టిని కేంద్రీకరించమని కోరుచున్నాను. ఇండియానా విడచి అరిజోనాకు వెళ్ళమని కొద్దికాలం క్రితం నాకు దర్శనం కలిగెను. అక్కడ నేను పిరమిడ్ ఆకారములో నున్న ఏడుగురు దూతలను కలవనైయుంటిని, అక్కడ ఏమి జరుగునో తెలియక యుంటిని, ఆ తరువాత అక్కడికి వెళ్ళినప్పుడు అది నా జీవిత అంతము అని తలంచాను. ఆ ప్రేలుడును ఎవరూ తట్టుకొలేరు. (ఆ వృత్తాంతము మీ అందరికి నిశ్చయముగా తెలియునని తలంచుచున్నాను) ఇటువంటి ఒక ఉదయమున సాబినో కాన్యన్లో ప్రార్థనలో యుండగా, నా చేతిలో ఒక ఖడ్గము పెట్టబడినది. "ఇది వాక్యము - వాక్య ఖడ్గము" అనీ చెప్పబడెను.
తరువాత దూతలు ప్రవచనము చేయబడిన రీతిగానే ప్రత్యక్షమాయెను. అదే సమయమున నేను నిలబడియుండిన చోటికి ఒక గొప్ప కాంతిపుంజము కదిలివచ్చెను. ఆ వృత్తము చుటూ ముప్పది మైళ్ళ ఎత్తున అది కదిలినది. దూతల రెక్కలవలెయుండెను, ప్రత్యక్షమయిన ఆ దూతల వరుసలోనే ఒక పిరమిడ్ ఆకారము మేఘములో రూపొందినది.
4ఉత్తర ఆరిజోనా నుండి అది కదిలినప్పుడు మెక్సికో నుండి విజ్ఞాన శాస్త్రము దానిని చిత్రపటములను తీసెను. అక్కడ నిలబడుదునని పరిశుద్దాత్మ నాకు చెప్పెను. (టుసాన్కు నలుబది మైళ్ళ ఉత్తర దిశగా) అది గాలిలోనికి వెళ్ళినది. లైఫ్ పత్రిక ఆ పటములను ప్రచురించెను. తేమ గాని, ఎటువంటి ఆవిరులు గాని ఉండజాలని ఆ ముప్పది మైళ్ళ ఎత్తులో, ఇరవై-ఏడు మైళ్ళ అడ్డములో, ఆ పరిధులలో ఏదో ఒక మర్మయుక్తమైనదిగా గోచరించెను. ఆ దూతలు ఉండిన చోటనే, ఆ పై నుండియే వచ్చుచుండెను.
ఇప్పుడు వారు తెలిసికొనుటకు అడిగిరి — విజ్ఞాన శాస్త్రము… టుసాన్లో — ఒకరు దానియొక్క గుర్తింపును గూర్చి తెలిసికొనగోరెను. కాని వారికి నేను చెప్పలేదు, అది ముందుగానే చెప్పబడుట మీర౦దరూ ఎరుగుదురు. కాని అది వారి కొరకు కాదు; అది మీకొరకే.
5ఆలాగు ఆయన అక్కడ నాతో మాట్లాడి ఈలాగు చెప్పెను, "ఏడు ముద్రలు విప్పబడును. ఏడు మర్మములు - జగత్తు పునాది నుండి బైబిలులో దాచియుంచబడిన ఏడు విధముల మర్మములు విప్పబడును." మనము లోకములోని వారితో పోల్చబడినచో చాలా చిన్న గుంపుగా తక్కువవారిగా ఉన్నాము. అయిననూ ఈ ఆశీర్వచనములను మనము అనుభవించియున్నాము. ఆ మర్మములను విన్నాము; వివాహము, పరిత్యాగము, సర్ప సంతానము, వివిధ ప్రశ్నలన్నియూ మనకు పూర్తిగా ప్రత్యక్షపరచబడినవి. మానవుని ద్వారా కాదు గాని, దేవుని ద్వారానే తనకుతానుగా… సంఘము ఏమై యుండెను, ఆది యందు క్రీస్తులో అది ఎట్లు౦డెను, చివరి దినమందు అది ఎట్లు ప్రత్యక్షపరచబడునన్న ఆ ఏడు మర్మములు మనకు విప్పబడినవి.
ఇది పైకి వెళ్ళుచుండగా… ఆ బయట ఆ పటము తగిలించబడినది. కాని, మీరు గమనించినచో లైఫ్ పత్రిక ప్రచురించిన ఆ పటము ఇక్కడే నాయొద్ద ఉన్నది. అది ఉండవలసిన రీతిగా ఆ పటమువైపు నా మాటలు వినుచున్న జనులు ఎన్నడైనా చూచారా అని నేను ఆశ్చర్యపడుచున్నాను.
REV 1:14
6మీరు మరువవద్దు, ఈ దర్శనము వచ్చినప్పుడు నేను ప్రకటన గ్రంధపు ఆంశము మీద బోధించుచున్నాను. ప్రకటన 1లో యేసును పాతకాలపు న్యాయాధిపతివలె ఉండుట చూచాము. ఏడు ముద్రలు - లేదా ఏడు సంఘ కాలములను ఏడు ముద్రలకు కొద్ది ముందుగా మనము తెరువ ప్రారంభించగా, క్రీస్తు అక్కడ ఉన్నివలె నున్న తెల్లని జుట్టుతో నిలబడియుండెను. ఆ ప్రాచీన ఇంగ్లీషు న్యాయాధిపతులు, పాతకాలపు న్యాయాధికారులు ఆ బల్లయొద్దకు ప్రమాణము చేయుటకు వారు వెళ్ళినప్పుడు, వారికి మహోన్నతాధికారము ఇయ్యబడెనని మీకు వివరించాను. వారు తెల్లని విగ్గు ధరించెడివారు. వారి మహోన్నత అధికారము చూపించుటకు తలపై ధరించెడి వారు.
7ఈ విధముగా మీరు ఆ బొమ్మను త్రిప్పినచో, అది క్రీస్తుగా మీకు కనిపించును. (బహుశా మీరు దానిని జనములో నుండి చూడగలరు), ఉండవలసినంత పరిపూర్ణముగా ఆయన కన్నులు ఇటువైపు చూచుట మీకు కనబడును. భూమ్యాకాశములకు న్యాయాధిపతిగా మహోన్నత దైవత్వము యొక్క విగ్గును, తెల్లని దానిని శిరస్సు మీద ధరించెను. ఆయన కండ్లు, ముక్కు, ఆయన నోరు, మీరు చూడగలుగుచున్నారా? ఈ వైపునకు ఆ పటమును త్రిప్పండి. అది ఆలాగే ఉండవలసియున్నది. (ఆలాగే వారు చిత్రించిరి) మీరు అది చూడకలుగుచున్నారా? ఆయన మహోన్నత న్యాయాధిపతి. ఆయన తప్ప మరెవరూ లేరు. ఈ వర్తమానము సత్యమని ఒక బయలుపాటు. మరల అది పరిపూర్ణ గుర్తింపు అది సత్యము. ఆయనను మూడవ వ్యక్తిని చేయుట కాదు, కాని ఒకే వ్యక్తి!
తెల్లని దానిని, చూడండి, మీరు నల్లనిది చూచుచున్నారు — ఆయన ముఖము, ఆయన గడ్డము, ఆయన నేత్రములు? గమనించండి. ఆయన చూచుచున్నాడు… ఆయన చూచుచున్న ఆ కుడిచేత వైపునకు ప్రకాశించుచున్న ఆ వెలుగు ఆయన నుండి వచ్చినది. సిలువ మీద ఆయన కుడి వైపునకే చూచి, పాపిని రక్షించెను. ఆయన పునరుత్థాన వెలుగులో ఇంకా ఆయన నామములో మనము వెళ్ళుచున్నాము.
8నిసందేహముగా అసాధారణమగు ఈ కార్యమును గురించి చెప్పుటకు నేను అధిక సమయమును కలిగియుంటిని, కావున ఈ ఉదయం నేను దాని గురించి మాట్లాడగోరుచున్నాను. "క్రీసు యొక్క మొదటి రాకను చాటించుటకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహానును పంపినట్లుగా, నీ వర్తమానము రెండవ రాకడకు ముందుగా ఉండును" అని జఫర్సన్విల్లో వెలుగు వచ్చి ఆ నదియొద్ద చెప్పినప్పటి నుండి, ఈ సంఘములో గత ముప్పది, ముప్పది-ఐదు సంవత్సరముల నుండి నిస్సందేహముగా రుజువగుచున్నవి. ఈ ఉదయాన ఆ సంభవముల గూర్చి చెప్పుటకు సమయమును తీసికొనగోరుచున్నాను. మనము అంత్యకాలములో యున్నాము. దానిని మనము చూచుచున్నాము. భూమియందంతటా ఎందుకు వ్యాపించలేదని కొన్నిసార్లు మనము ఆశ్చర్యపడుదుము. దేవుని చిత్తమయితే, దానిని వివరించుటకు మరొకసారి సమయమును తీసికొందము.
REV 1:14,15
9ఇప్పుడు మీ బైబిల్లును తెరువవలెనని కోరుచున్నాను. మొదటగా దేవుని వాక్యమును చదవవలెనని మనము గట్టిగా నమ్ముచున్నాము. నేనెల్లపుడూ అది చదువుదును, ఎందుకనగా నా మాటలు మానవ మాటలు, అవి తప్పిపోవును; కాని దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు.
ఇప్పుడు ఒక అంశము కొరకు పరిశుద్ద లేఖనముల నుండి చదువనై యున్నాము. బైబిలులోని మూడు స్థలములలో నుండి నేను చదువుటకు ఎన్నుకొన్నాను, మీరు తీయవచ్చును. అందులో ఒకటి, ప్రకటన 1 అధ్యాయము 17 మరియు 18 వచనములు. ఇక్కడ ఆయన శిరస్సు ఉన్నివలె తెల్లగాను, ఆయన పాదములు ఇత్తడివలెను కనిపించెను. ఆ తరువాత మీ బైబిలునందు రోమా 8:11 తీయండి. ఈ ఉదయమున నేను చదువుటకు పరిశుద్ద లేఖనముల నుండి మూడు భాగములను ఎన్నుకొన్నాను. నా వర్తమానము అందులో నుండియే వచ్చును. పునరుత్థానము కొరకు ప్రభువు నా హృదయములో ఉంచినది అదే, ఆ తరువాత మీరు మార్కు 16:1 మరియు 2 కూడా తీయండి. నా సందర్భము అందులోనుండియే వచ్చును.
MARK 16:1,2•
ROM 8:11•
REV 1:17,18
10ఇప్పుడు ప్రకటన 1:18, మనము - 17మరియు 18 వచనములు చదువుదుము.
నేనాయనను చూడగానే చచ్చినవాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను - భయపడకుము. నేను మొదటివాడను కడపటివాడను,
మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. ఆమేన్; మరణముయొక్క పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
రోమా 8వ అధ్యాయము 11వ వచనములో ఇట్లు చదువుదుము: మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినయెడల మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనయిన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును.
ఇప్పుడు మార్కు 16వ అధ్యాయము (పునరుత్థాన అధ్యాయము) - 16వ అధ్యాయము, 1,2 వచనములు:
విశ్రాంతిదినము గడిచిపోగానే, మగ్ధలేని మరియయు, యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
వారు ఆదివారము పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా -
11ఈ ఉదయాన నా అంశము: "అది సూర్యోదయము." అంశముగా నేను జీవింపజేయు శక్తిని ఉపయోగించుచున్నాను.
బహుశా మీరు రేడియోలో అనేకమంది సేవకులు మాట్లాడుట వినియుందురు. మన ఘనమగు సోదరుడు నెవిల్ ఈ ఈస్టరు ఉదయమున పునరుత్థానము అను అంశముపై మాట్లాడెను. నేను కొద్దిగా వేరయిన మార్గమును తీసికొని తలంచాను — భేదమైనది కాదు. ఇంకొంచెము కలుపుటకు లేదా మరో కోణము నుండి తీసికొనగోరుచున్నాను. మీకు ఏ కోణము నుండి మీరు వాక్యమును సమీపించిననూ అది ఎల్లప్పుడూ యేసుక్రీస్తునే ప్రకటించును. ఏ విధముగాను మీరు దానిలో నుండి తొలగిపోరు. అది ఎల్లప్పుడూ ఆయననే ప్రకటించును.
12ఈనాడు, ప్రపంచము మానవజాతి ఎన్నడూ మరవజాలని మహాజయము యొక్క జ్ఞాపకార్ధమును - ఒక జ్ఞాపకార్థ ఆరాధనను జరుపుకొనుచున్నది. కనీసము ఈ అమెరికాలో అనగా భూమియొక్క ఈ ప్రక్క, ఈ ఉదయమున సంఘములన్నింటిలో జరుపుకొనుచున్నారు.
రక్షకునిగా ఆయన మరణించినప్పుడు, లేదా పసివానిగా ఆయన జన్మించినప్పుడు, లేకపోయినచో ఆయన ఈ భూమి మీదకు వచ్చియుండెడి వాడు కాదు. ఆయన చనిపోయినప్పుడు నిశ్చయంగా మన పాపములకు పరిహారము చేసెను. ఎందరో చిన్న అందమైన పిల్లలు జన్మించిరి. నిజమగు మంచి హేతువు కొరకు ఎందరో శ్రమపడి మరణించారు; కాని ఈ రోజువరకు తిరిగి ఎవరునూ జీవముతో లేచి యుండలేదు.
1THS 5:21
13ఇప్పుడిది చరిత్రలో గొప్పవారము. అన్ని కాలములలోను అతిగొప్ప ఉత్సవము., ఆయన చెప్పునది రుజువు చేయబడినది ఈ ఈస్టరులోనే. మానవుడు సంగతులు చెప్పవచ్చు, కాని అది సత్యమని రుజువగు వరకు నమ్ముట అంత తేలిక కాదు. దేవుడు ఇట్లు చెప్పెను, "అన్నింటిని పరీక్షించుము; మేలైనది చేపట్టుము." ఆయన తాను చేయలేని దానిని చేయమని నీతో చెప్పడు. కనుక మన పాపముల కొరకు చనిపోయినది ఎవరో రుజువు చేయును.
ఈ గొప్ప ఈస్టరు పూలు, ఈస్టరు దండలు, రంగుల కుందేళ్ళు, ఇంకా ఏవేవో మనకు సాంప్రదాయికంగా పరిశుద్ద ఉత్సవములోనికి వచ్చాయి, అది పరవాలేదు… అయితే ఆ విధముగా అది అంతయూ వాస్తవం కాదు.
14ఈనాడు జనులు, "సంవత్సరమునకొకసారి - గురువారమునో, శుక్రవారమునాడో పాదములు కడుగుకొని ప్రభురాత్రి భోజనమునకు కూర్చుందుమని," చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. వివిధ సిద్దాంతములు… ఈ దినమా కాదా లేక విశ్రాంతి దినమా, ఆదివారమా అని వారు వాదించుకొనుచున్నారు… ఈ సంగతులన్నియూ కేవలము ఆచారము. మీలో జీవము లేనిచో మీరు శ్రమదినముల ఉపవాసమును పాటించినా, పాటించకపోయినా ఒకటే. ఏ మేలు కలుగదు, అది కేవలము ఒక జ్ఞాపకార్ధము, దానికి ఏమి వ్యతిరేకము కాదు, కాని వారు నిశ్చయంగా ఆ సంప్రదాయమును మోసికొని వస్తూ, అసలు సంగతిని విడిచిపెట్టిరి.
మీరెంత భక్తిగా యున్నా, మీరు మీ సిద్దాంత విషయములో ఎంత సరిగా ఉన్నా సాతాను లెక్క చేయడు. మీరు ఆ జీవమును తప్పిపోయినచో ఏ విధముగానైనను పైకి రాలేరు. ఎంతభక్తి ఎంత మంచితనమున్నా ఎన్ని సంఘములకు చెందినా గానీ, లేక చెందబోవుచున్నాగానీ, నీవు తిరిగి జన్మించక దానివలన ఒక్క ప్రయోజనము కూడా ఉండదు.
కాబట్టి దేవుడు యేసును మృతులలో నుండి లేపెను. ఒక జ్ఞాపకార్ధముగా అయనను లేవనెత్తెను. ఈ పునరుత్థాన ఉదయకాలమున దీనిని సంవత్సరమునకు ఒకసారి, లేదా ఏదో ప్రత్యేక దినమున ఉత్సవముగా జరుపుచున్నామా? లేక మనము ఆయన పునరుత్థానము వలన ప్రయోజనము పొందువారముగా ఉన్నామా? అది నాకు ఏమైయున్నాది?ఆయన మృతులలో నుండి లేపబడియున్నాడని మనము విశ్వాసము ద్వారా నమ్ముచున్నాము, కానీ దానివలన నాకేమి లాభము? అది రెండువేల సంవత్సరముల క్రితం మాట.
ఈ అంశమును కనుగొనుటకు.
MATT 22:21•
MARK 12:17•
LUKE 20:25
15నేను అలసిపోతిని, నా చేతులుకి నర్సు ఇచ్చిన సూదిమందు వలన నొప్పిగా నుండెను… కొద్దిరోజులలో విదేశములకు వెళ్ళుచున్నాను, కనుక నేను, నా కుమారుడు ఈ సూదిమందులు తీసికొనవలసిన వచ్చెను. కలరా, ఎల్లో-ఫీవర్, ఇంకా మొదలగునవి నాకిచ్చిన సూదిమందుల వలన నేనెంతో అలసిపోయి, బాధతో ఉంటిని. ఇతర దేశములకు వెళ్ళేముందు అవి వేసికొనవలెను. "కైసరువి కైసరునకు చెల్లించుడి" అని ఆయన చెప్పెను. అలాగే దేవునివి దేవునికి చెల్లించవలెను.
నేను అక్కడ కూర్చొని ఈ ఉదయము ఎదురుచూచు జనులకు ఏమి చెప్పవలెనా, అని ఆలోచించుకొనుచున్నాను. (వారికి నేనెంతో వందనములు చెల్లించుచున్నాను, నేను చెప్పుదాని కొరకు తమ జీవితములను పణముగా పెట్టుచున్న ఆ స్త్రీ - పురుషులు)… నేనెట్లు భోధించవలెను? నేను అంశముగా ఇది తీసికొనవలెను?
16నేనక్కడ కూర్చొనియుండగా దాదాపు నిద్రపోయాను. నా ఇంటి ముందున్న తలుపు కొట్టుకొన్నది. నాకు తెలిసినంత వరకు నేను తప్ప అక్కడ ఎవరు లేరు, నేను విన్నాను. సరిగ్గా అది నాకు భోధపడలేదు. కొంతసేపటికి నేను నా అధ్యయన గదిగా మార్చుకొన్న ఆ చిన్న గది తలుపు కొట్టుకొన్నది. ఎవరో ఆ తలుపు కదుపుచుండిరి. నేను తలుపు యొద్దకు వెళ్ళి, తలుపు తెరచాను. ఒక అందమగు, చిన్న పసుపు జుట్టు, నీలపు కండ్లుగల బాలిక అక్కడ నిలబడియుండుట చూచి ఆశ్చర్యపోయాను. చిన్న ఈస్టరు పూవువలే కనిపించెను. (ఇప్పుడు కూర్చొని నా వైపుకు చూస్తునది).
MARK 16:2
17ఆమె నాకు ఒక కార్డు ఇచ్చినది. ఇంటికి వెళ్ళనప్పటికి చాలా ఈస్టరు కార్డులు మొదలగునవి ఉండుననుకోండి. ఇల్లు విడిచి వచ్చునప్పుడు నాకీయబడిన కార్డు అది ఒక్కటే, ఆమె ఇట్లనెను, "బ్రదర్ బ్రెన్హాం, ఇది నేను, నాన్న కలిసి ఇస్తున్నాము." అందులో "నేను" అను మాట ఉ౦డవలెనని ఆమె గట్టిగా కోరుచున్నది. ఎముకుల జబ్బుతో చక్రాల కుర్చిలో కూర్చొని యుండిన ఆమె తండ్రి ఈ కార్డును పంపెను. నేను దానిని తీసికొని ఆ చిన్న ప్రియ బాలికకు వందనములు చెల్లించినప్పుడు, ఆమె వెనుదిరిగి తలుపు గుండా వెళ్ళిపోయినది. నేను కార్డు తెరిచాను,
ఆ కార్డులో నుండియే నేను ఈ అంశమును లాగాను. ఆ కార్డు మీద పరిశుద్ద మార్కు 16:12 వచనములు వ్రాయబడి యుండెను. సూర్యుడు పైకి వచ్చెను - సూర్యుడుదయించసాగెను. అప్పుడు నేను దానిగూర్చి ఆలోచించుచూ, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన జీవమును నా అ౦శముగా తీసికొన్నాను.
GEN 1:2,3
18ఇప్పుడు, సూర్యుడు, సూర్యోదయము… మంచిది, ప్రపంచము అంధకారములో పడియుండిన కాలము ఒకటుండెను. అది శూన్యముగాను నిరాకారముగాను ఉండెను. అదంతయూ జలముతో కప్పబడియుండెను. ఆ అంధకార చీకటి, శూన్యవాతావరణములో అది పడియుండెను. ఆత్మ, ఆ జలములపై అల్లాడుచూ, "వెలుగు కలుగును గాక!" అనెను. దానిని చేయుటకు దేవునికొక కారణముండెను, ఎందుకనగా ఆ జలముల క్రింద ఆయన నాటిన విత్తనములుండెను. అది జీవించవలెనన్నచో వెలుగు కావలెను.
GEN 1:3•
MATT 28:6•
MARK 16:6
19ఈ భూమిలో ఇవ్వబడిన మొదటి వెలుగు దేవుని పలుకబడిన మాట ద్వారానే కలిగెను. ఈ భూమిని మొదటిగా తాకిన వెలుగు దేవుని పలుకబడిన మాటయే. "వెలుగు కలుగును గాక!" అని ఆయన చెప్పెను. అప్పుడు వెలుగు కలిగెను. భూమి మీద సంతోషము, జీవము గల సృష్టిని తీసికొనివచ్చుటకు అది చీకటిని వెలుగుగా మార్చెను.
దేవుని ఆత్మ ఆ దినమున ప్రేమ, దయతో కదలుచుండగా భూమి మీద సృష్టి యొక్క మొదటి ఉదయమున సూర్యుడు పైకి వచ్చి తన కిరణములను వెదజల్లి, భూమి మీద జలములను ఆరిపోజేసి, పైనున్న వాతావరణమును తయారు చేసెను. ఒక విత్తనము ద్వారా భూమి మీదకు జీవము, సంతోషము తీసికొని రాబడిన మొదటి కాలము అదే. అదొక గొప్ప గడియ.
కానీ, ఆ ఈస్టరు ఉదయాన కలిగిన సూర్యోదయము ముందు అదెంతకు కొరగాదు, ఈసారి సూర్యుడు మేఘములలోనికి గంతులు వేయుచూ, ఎన్నడూ లేనొక మహాసూర్యోదయమును తీసికొనివచ్చెను; ఎందుకనగా ఆదియందు సూర్యోదయముతో వచ్చిన వర్తమానముకంటే గొప్ప వర్తమానముతో ఈ సూర్యోదయమున తెచ్చెను, "ఆయన లేచియున్నాడు! ఆయన వాగ్దానముచేసిన రీతిగా మృతులలో నుండి జీవమును పొందియున్నాడు. ఆయన మృతులలో నుండి లేచియున్నాడు" అను వార్తను ఈ సూర్యోదయము తెచ్చెను.
20ఆదికాండములో మొదటిసారి సూర్యుడు లేచినప్పుడు ఇకమీదట భూమిమీద జీవముండునను వర్తమానమును తెచ్చెను - అదీ మర్త్య జీవము,
కాని ఈసారి సూర్యోదయమైనప్పుడు - ద్వంద్వ సూర్యోదయము - మరొక సూర్యోదయము, అది కేవలము సూర్యుని ఉదయమే కాక వాగ్దానము చేయబడిన దేవుని పిల్లలందరికి నిత్యజీవమును తెచ్చుటకు ఒక కుమారుడు లేచెను. తన ముందు జ్ఞానము ద్వారా భూమి మీద పడియుండిన తన బీజములను చూచెను.
సూర్యుడు జీవము కలుగజేయకుండా ఆదియందు వృక్షజీవము తిరిగి లేవలేదు. ఈనాడు భూమి మీదనున్న దేవుని కుమారులందరినీ నిత్యజీవమునకు తీసికొని వచ్చునది కుమారుని వెలుగే. ఆయన తాను ఏర్పరచుకొన్న వారిని జగత్తు పునాది ఎరిగెను. జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన తనలో వారిని ఏర్పరచుకొనెను.
ఆనాటి ఈస్టరు ఉదయమున ఎక్కడో ఈ మట్టిలో మన శరీరముల పడియుండెను, ఎందుకనగా మనము నేలమంటియై యున్నాము. పరలోకములో ఒక జ్ఞాపకార్ధ గ్రంధమున్నది. ఆయన గుణలక్షణములు ఆయనలో వున్నవి. ఈ దేవుని కుమారుడు లేచునని ఎరుగును. ఈ గొప్ప కాలమునకు ముందే నిర్ణయించబడిన ప్రతి కుమారుడు దానివలన జీవమునకు లేపబడును. అది ఉండును అని ఆయనెరుగును. ఆ మొదటి సూర్యోదయము కంటే, అది ఎంత మహిమగల సూర్యోదయము!
ఇప్పుడు, ఈస్టరు ముద్రను ఇంత గొప్పగా పగలగొట్టు ఇది.
21ఇప్పుడు ఈనాడు మనము క్షయరోగ ఈస్టరు ముద్రను కలిగియున్నాము. ఈ గొప్ప నిధికి సమకూర్చుటలో, లేదా క్షయవ్యాధిని నిరోధించుటలో వైద్యులు, వైద్యశాస్త్రము సహాయపడునట్లుగా పనిచేయుటకు నిధిని సమీకరించుటకు ప్రజలు ఒకరికొకరు సందేశము పంపించుచున్నారు. ఒకరునొకరం మనము వర్తమానము పంపునప్పుడు దానిని ఈస్టరు ముద్ర అందుము. కానీ వర్తమానమును మనము అందుకొన్నప్పుడు ఆ ముద్రను చించి వేయుదుము, ఎందుకనగా లోపట ఉన్న వర్తమానమును బంధించునదే ముద్ర.
ఈ సూర్యోదయమున నిజమగు ఈస్టరు ముద్ర పగిలిపోయినది; మరణము తర్వాత జీవమున్నదను రహస్యము బయలుపరచబడినది. అంతకుముందు కాలములో మనకు తెలియదు. లోకము అంధకారములో తడవులాడెను. మానవ సంశయములో అది తడవులాడెను. మానవ హృదయములో సిద్దాంతములు రూపొందెను, ఆచారములు రూపొందెను. మానవుడు విగ్రహములను ఆరాధించెను, వారు సూర్యుని పూజించిరి, వారు అన్ని రకముల దేవతలను ఆరాధించిరి. ఏవేవో చెప్పుకొనిన వివిధ జనులు సమాధిలలోనికి వెళ్ళిపోయిరి. ఆ సమాధిలోనే వారు నిలిచియుండిరి.
కాని నిజమగు ముద్ర పగులగొట్టబడెను, ఒకప్పుడు మనవలెనె జీవించిన ఒకాయన, మనము చనిపోవునట్లుగానే చనిపోయెను, మృతులలో నుండి లేచెను. ఎంత గొప్ప ఉదయము! ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఆలాంటి ఉదయము లేదు. ఆయనే జీవము, పునరుత్థానము అయియున్నాడన్న రహస్యము తెలియచేయబడెను.
JOHN 10:18•
JOHN 14:19
22ఆ ఉదయమున ఆయన బయటకు వచ్చుచూ, "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచున్నారు" అని చెప్పెను. పునరుత్థానము వలన లాభము ఆయన మాత్రమే పొందుటగాక దేవుని గొప్ప ఏర్పాటులో విశ్రమించుచున్న సంతానమంతయూ ఆ పునరుత్థానము వలన జీవము పొంది లాభము కలిగియుండెను. ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పెను, "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు." ముద్రను బ్రద్దలు చేయుట అదే. ఆయన పైకి తేబడినందున, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరును ఆయనతో పాటుగా తేబడుదురు.
ఈ మహిమకరమగు సూర్యోదయమున దేవుడు తనమాటను రుజువుచేసెను. ప్రజలు మనస్సులలో మెదలుచుండిన అనుమానములు చీకట్లు తొలగింపబడెను, ఎందుకనగా ఒకప్పుడు జీవించి, తిని, త్రాగి, మానవులతో సహవాసము చేసి, "నా ప్రాణమును పెట్టుటకును, తిరిగి దానిని తీసికొనుటకు అధికారము గలదు" అని చెప్పిన ఆయన ఇక్కడున్నాడు. ఆయన ఆ మాట చెప్పుట మాత్రమే కాదు గాని, అది సత్యమని రుజువుచేసెను. ఓ, అదెంత మహిమకరమగు సంగతి!
దానిని నమ్ముచున్న మనము సహితము అదెంత గొప్ప సంగతియో వివేచించలేమని ఈ ఉదయమున ఖచ్చితముగా నేను చెప్పగలను. ఆయన మృతులలో నుండి లేచియున్నాడు, ఆయనలోవున్న మనమునూ ఎప్పుడో మృతులలో నుండి లేచియున్నాము.
LUKE 24:6
23ఇప్పుడు గమనించండి, చీకటనేది భూమిని, విత్తనములను కముకొన్నందున సూర్యోదయము కాకుండా అవి బ్రదుకవు. భూమిని చీకటి కమ్మియున్నది… ఇప్పుడు కుమారుడు లేచియున్నాడు, ఈ వెలుగు వలన చీకటి అంతయూ అదృశ్యమాయెను. దేశములలోని జనులందరికిని ఈ వార్త ప్రాకిపోయెను, "ఆయన ఇక్కడ లేడు గానీ, ఆయన లేచియున్నాడు." ఎంత గొప్ప సంగతి! ఆయన తన మాటను రుజువుపరచెను. అది నిజమని ఆయన రుజువుచేసెను, ఎందుకనగా ఆయన ఇప్పుడు మరణమును, సమాధిని, పాతాళమును జయించెను.
మరణము, పాతాళము, సమాధి, అనేవి అపవాది యొక్క త్రిత్వము — మరణమునకు కర్త సాతాను, మరియు వాడు పాతాళము మరియు సమాధి పై అధికారము కలిగియుండెను. మరియు అది సాతాను యొక్క త్రిత్వము — ఒక్కటే కారణమాయెను, అది మరణము. మరణము వలన నీవు సమాధిలోనికి; పాపివైనందున, నరకములోనికి వెళ్ళెదవు. అన్నింటిలోని ఒకే విషయము, సాతాను యొక్క త్రిత్వము, అది మరణమైయున్నది. ఈ సంవత్సములన్నింటిలోనూ మానవుని చెరగా పట్టుకొనెను.
MATT 28:18•
ACTS 1:8•
1TIM 3:16•
REV 1:18
24కాని ఇప్పుడు దేవుడు ఒక్కడైయున్నాడన్న నిజత్రిత్వము క్రీస్తునందు బయలుపరచబడి, ముద్రలను పగలగొట్టి, శత్రువును జయించి — ఒక్కడైయున్న సత్యమైయున్న సజీవ దేవునిని లేవనెత్తినది. "నేను మృతుడనైతిని గాని, ఇదిగో సదాకాలము జీవించియున్నాను. మరణము మరియు పాతాళము యొక్క తాళపుచెవులు పట్టుకొనియున్నాను." ఒక్కడైయున్న దేవుడు మానవుడై మనమధ్య జీవించి ప్రతి శత్రువును జయించి, సాతాను యొక్క త్రిత్వమును జయించితినని రుజువుచేసి, దేవుని యొక్క త్రిత్వమును తెలియపరచెను, ఎందుకనగా ఒక్కడైన దేవునికి మాత్రమే తిరిగి జీవమును తీసికొనివచ్చు శక్తియున్నది. ఆయనే ఇమ్మానుయేలు. దేవుడు శరీరమందు బయలుపరచబడెను.
అక్కడ ఆయన మత్తయి 27వ అధ్యాయము ప్రకటించుటలో ఆశ్చర్యములేదు. "భూమి మీదను, పరలోకమందును సర్వాధికారము నా చేతులలో పెట్టబడినది. మిమ్మును నా సాక్షులుగా సర్వలోకములోనికి పంపుచుచున్నాను." మరణము పాతాళము, సమాధిని ఆయన జయించెను. ఆయన ఆలాగు చేయుట మాత్రమే గాక, పరలోకమందును, భూమిమీదను సర్వాధికారముతో వచ్చును, జయశీలుడై వచ్చును… తండ్రికున్నదంతయూ, పరిశుద్దాత్మకున్నదంతయూ, సమస్తమూ ఆయనలో ఉండెను. "భూమి మీదను, పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడినది." సమస్తమూ శక్తిహీనమాయెను. ఆయన దానిని జయించెను.
REV 1:17,18
25అంతేకాదు, ఆయన తన శిష్యులకు మాటను పంపెను. ఆయనను విశ్వసించువారు వారే, "భయపడకుడి, నేను మృతుడనైతిని గాని సదాకాలము జీవించుచున్నాను. మరణముయొక్కయు, పాతాళముయొక్కయు తాళపుచెవులు నాయొద్ద ఉన్నవి. నేను ఎప్పుడో దానిని జయించియున్నాను." ఇకమీదట ఏ మాత్రము భయపడకుడి, ముందుగా నిర్ణయించబడిన ప్రతి ఒక్కరు, ముందుగా ఏర్పాటు చేయబడిన దేవుని సంతానము, మహిమకరమగు సువార్త వెలుగు భూమిమీద ఉదయించినప్పుడు జీవములోనికి వత్తురు, ప్రతికాలములోను అది ఏమి పండవలెనని దేవుడు ముందుగా నిర్ణయించెనో అదే పంటను అది తీసికొనివచ్చును. ఆయన మృతులలో నుండి లేచెను.
ఓ, అదెంత ఆశ్చర్యకరమగు సంగతి: "నేను జీవించుచున్నాను [లేదా జీవింపజేయుట]." జీవింపజేయుట అను గ్రీకు పదమునకు చనిపోయిన తరువాత బ్రతికించుట అని అర్ధము.
భూమిలో పడిన విత్తనము చనిపోవలెను, గింజ మొత్తం చనిపోవలెను, విత్తనములోని ప్రతిభాగము క్రుళ్ళిపోవలెను, గింజలోవున్న ప్రతిజీవము మొదట బయటకు తిరిగి రావలెను.
ఆయన సజీవుడాయెను. అంతే కాదు: "నన్ను సజీవుని చేసిన జీవమును, సమాధి నుండి నన్ను తీసికొనివచ్చిన శక్తిని మిమ్మును బ్రదికించుటకు మీ మీదికి పంపించుదును, నేనుండుచోటున మీరును ఉండెదరు."
LUKE 24:49
26లుకా 24వ అధ్యాయము 49వ వచనములో ఆయనీలాగు చెప్పెను, "ఇదిగో, తండ్రి వాగ్దానము చేసిన దానిని మీ మీదికి పంపుచున్నాను; కాని యెరూషలేములో మీరు కనిపెట్ట౦డి [లేదా నిలిచి యుండుడి] పై నుండి శక్తిని పొందువరకు వేచియుండుడి." దానిని చూపించుటకు ఆయన దానిలోని లాభములను మాత్రమే బయటకు లాగుట కాదు గాని, ఆ ఈవులను ఆయన పంచెను.
దేవుడు జగత్తుపునాది వేయబడకముందే చూచి, నిర్ణయించిన సంతానమును జీవములోనికి తెచ్చుట (విడిపించుట)కు ఆయన వచ్చెను. ఆయన జీవగ్రంధములో వారి పేర్లు ఉంచెను. ఇక్కడ వారు ఈ భూమి మీద నిరీక్షణలేక యుండిరి. ఆశీర్వచనముగా ఉండుటకు మాత్రమే ఆయన రాలేదు గాని, ముందుగా నిర్ణయించబడిన ప్రతి సంతానముతో ఆ దీవెనను పంచుటకు వచ్చెను. విత్తనము భూమి మీద లేనిచో, అది జీవించజాలదు. అది భూమి మీద ఉండవలసియున్నది, మరియు మొలకెత్తవలసియున్నది. దానిని ఎంతకాలము చీకటిలో ఉంచినా గానీ, కుమారుడు దాని మీద ప్రకాశించినప్పుడు, అది పైకి వచ్చును. ఇప్పుడు గమనించండి, ఆయన దానిని మనతో పంచుటకు వచ్చెను.
27సువార్త, మంచి వార్త అనుటలో ఆశ్చర్యములేదు. సువార్త అనగానే మంచివార్త అని అర్థము. "సువార్త" ఏమిటి? మనకొరకు ఒక మనిషి చనిపోయినచో, అది మంచివార్త. క్రీస్తు జన్మించినచో, అది మంచివార్త. వాగ్దానము చేసినవాడు వాగ్దానమును స్థిరపరచెను. ఆయన సదాకాలము జీవించియున్నాడు. మరణముయొక్కయు, పాతాళముయొక్కయు తాళపుచెవులను ఆయన తనచేతిలో పట్టుకొనియున్నాడను. ఈ వార్తకంటె మంచివార్త ముందెన్నడు ఉండలేదు, ఎన్నటికిని ఉండదు. చీకటి యావత్తు తొలగిపోయెను. ఇక చూచుటకు చీకటి కనబడనే లేదు, ఎందుకనగా కుమారుడు సమాధి నుండి లేచెను. "ఆయన వచ్చును" లేదా "ఆయన రావచ్చును" అని కాదు గాని, ఆయన ఇప్పటికే వచ్చియున్నాడు — సువార్త, మంచి వార్త.
MATT 28:7,10•
MARK 16:7
28గమనించండి, సువార్త యొక్క సందేశము ఆయన లేచియున్నాడని ప్రజలకు రుజువు చేయుటయే. "నేను మృతులలో నుండి లేచియున్నానని, వెళ్ళి, నా శిష్యులతో చెప్ప౦డి. దీనిని వారికి స్థిరపరుచుటకు, నేను వెళ్ళి, వారిని కలిసికొందును." ఓ దేవా, ఈ చివరి దినములలో మరల ఈ భూమి మీద ఎట్లు వెలుగుండును, "నేను నా శిష్యులకు రుజువు చేయుదును… నేను చనిపోలేదని వారికి చెప్ప౦డి, నేను ఒక ఆచారమును కాదు గానీ, నేను సజీవుడనగు క్రీస్తును. వారిని నేను కలిసికొందును. నేను మృతులలో నుండి లేచితినను వర్తమానమును నా శిష్యులు యొద్దకు కొనిపోవుడి," — సువార్త మంచి వార్త.
"అది నిజమా?" అని మీరనవచ్చును.
HEB 13:8
29ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగాయున్నాడని, హెబ్రి13:8 చెప్పుచున్నది. దాని వలన లాభము పొందిన మనము ఇప్పుడు మనలోయున్న ఆయన జీవమును రుజవు చేయవలసియున్నాను. ఈ జీవితములోని ఈవులను, జీవము. దానివలె ముందెన్నడూ జీవము ఉ౦డి యుండలేదు; ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయెను, అది దానిని మూసివేసెను. ఈస్టరు ఉదయమున ఆయన తిరిగి మృతులలో నుండి లేచినప్పుడు, ఆయన తన దాసులను సర్వలోకములోనికి వెళ్ళి, ఆయన సజీవుడను ఈ మంచివార్తను ప్రతి వ్యక్తికి అందించమని ఆజ్ఞాపించెను. కేవలము మాటవలన దానినెట్ల మనం చేయగలము? ఈలాగు వ్రాయబడియున్నది, "సువార్త మాట వలన మాత్రమే రాలేదు గాని, ఆయన సజీవుడని రుజువు చేయుటకు పరిశుద్దాత్మ యొక్క శక్తి మరియు ప్రత్యక్షతల ద్వారా వచ్చెను."
ZECH 14:7•
JOHN 14:12,19•
GAL 1:6
30గుంపులలో ఒకదానితో పౌలు చెప్పినట్లుగా మరో సువార్త యున్నచో, "మీరు మరియొక సువార్త వైపునకు తిరుగుట చూచి నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. వేషధారణ అను సువార్త తప్ప, మరొకటి లేదు, శాఖా సంబంధమగు కల్పన, మంచి వార్త నుండి తొలుగుట.
"నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు. నేను మీలో జీవించుచున్నాను. నేను చేయు క్రియలు [యోహాను 14:12], నేను చేయు క్రియలు మిలో నన్ను గుర్తింపచేయును." ఎట్టి వర్తమానము! వేదాంతము అను చీకటి ప్రపంచము మనకున్నదనుటలో ఆశ్చర్యములేదు; కాని సాయంకాలమున మరల వెలుగు కలుగును. సాయంకాల సమయమున మరల ఒక పునరుత్థానము కలుగును. సాయంకాల సమయమున వెలుగుండును.
MATT 28:6•
MARK 16:6•
ROM 8:11•
1JN 5:12
31ఆ పంపబడిన వర్తమానము యొక్క సారాంశము ఇదే — ఆయన మృతులలో నుండి లేచి యున్నాడు — ఆయన ఈవులమగు మనము, ఆయనతో పునరుత్థామును పంచుకొనుచున్న మనము, ఆయన సజీవునిగా ఉన్నాడని లోకమునకు రుజువుచేయుట ద్వారా దీనినుండి ఈవులను పొందుచున్నాము. కేవలము మాట ద్వారా ఇది మనము చేయలేము. ఏదో మానవుని యొక్క ఆచారము ద్వారా దానిని మనం చేయలేము. మనము దేనివైపు గురి కలిగియున్నామో సరిగ్గా దానినే ప్రతిఫలీంప చేయుదుము.
ఈనాడు మనలో చాలామంది క్రీస్తునొద్దకు జనులను తీసికొని రాలేకపోవుచున్నారని నాకు భయము కలుగుచున్నది. వారిని మనము ఒక సంఘమునొద్దకు, ఒక సిద్దాంతమునొద్దకు తీసికొని వచ్చుచున్నాము. కాని వారిని మనము క్రీస్తునొద్దకు తీసుకు రావలసియున్నాము. ఆయన మాత్రమే, ఆయనొక్కడే జీవముగలవాడు. "కుమారుని కలిగియున్నవాడే జీవము గలవాడు."
ఒక చనిపోయిన మనిషి యొక్క జీవమును నీలో ఎక్కించినచో, ఆ చనిపోయిన వ్యక్తి జీవించిన జీవితమునే నీవు జీవించెదవు.
ఒక ప్రత్యేక విధమగు రక్తపు గుంపుకు చెందిన వ్యక్తిలో నుండి ఆ రక్తమును తీసివేసి మరియొక మనిషిలోనికి ఎక్కించినచో అతడు ఆ రక్తపు గుంపుకు చెందినవాడగును.
నీలోనున్న ఆత్మ చనిపోయినదని నీవు భావించి, క్రీస్తులోనున్న జీవముతో నీవు అభిషేకించబడినచో, రోమా 8:12 చెప్పుచున్నది, "క్రీస్తును మృతులలో నుండి లేపినవాని ఆత్మ మీలో నివసించుచున్నచో అది మీ మర్త్య-శరీరములను కూడా జీవి౦పచేయును." — అదే జీవము, అదే శక్తి, ఆయన భూమిమీద నుండగా పొందిన అవే ఈవులను పొందుదుము. ఆయన నిన్ను విడిపించును. దేవుని ద్వారా ముందుగా తెలియబడిన విత్తనము. జగత్తు పునాది వేయబడకమునుపే గొర్రెపిల్ల జీవగ్రంధమందు పేరు వ్రాయబడిన వారు.
32పునరుత్థానము యొక్క ఆ సువార్త వెలుగు, వాక్యము యొక్క స్థిరత… ఆయనే క్రీస్తు అని మనకు ఎట్లు తెలియును? ఎందుకనగా ఆయన దేని గూర్చి మాట్లాడెనో దానిని రుజువు చేసెను. ఈ గడీయ వర్తమానమును నేనెట్లు తెలిసికొందును? దేవుడు తాను వాగ్దానము చేసిన దానిని రుజవు చేయును. దాని గూర్చి ఆయన మాట్లాడును. పునరుత్థానములో ఆయనతో పాటుగా మనము లాభము పొందియున్నామనునదియే గుర్తింపు. ఆయన దేనిగూర్చి మాట్లాడెనో దానిని రుజువు చేయును.
క్రీస్తునందు ఏమి చేయుదునని ఆయన వాగ్దానము చేసెనో, దానిని ఆయన పునరుత్థానమందు రుజువుచేసెను. మోషే దినములందు ఆయన ఏమి చేయుదునని వాగ్దానము చేసెనో, దానిని ఆయన రుజువు చేసెను. హనోకు దినములలో ఆయన ఏమి వాగ్దానముచేసెనో, దానిని ఆయన రుజువు చేసెను. అపోస్తలుల దినములన్నింటిలోను ఆయన దానిని రుజువుచేసెను.
ఇప్పుడు ఈ దినమున ఆయన తాను చెప్పిన దానిని రుజువు చేయుచున్నాడు, ఎందుకనగా వారు జీవగ్రంధమందు ప్రాతినిధ్యము వహించబడిన ఆ సంతతిలో భాగమునైయున్నారు. తిరిగి దేవుని యొద్దకు నడిపించుటకు ఆయన వచ్చెను. ఓ, ఎంత అద్భుతమైన వర్తమానము అది!
PS 16:10•
ACTS 2:27
33ఒక ఈస్టరు ఉదయమున ఆయన లేచుట మాత్రమేగాక, ఆయన వలన ఈవులు పొందిన వారును ఆయనతో లేచిరి. వారు క్రీస్తుతో కూడా ఆయన సిలువ మరణములో యున్నారు. వారు ఆయనతో కూడా ఆయన పునరుత్థానమందుండిరి. మనము ఆయన ఈవులు పొందిన వారము, అంధకారములో మృతిపొందిన తరువాత తిరిగి లేచియున్నాము, అవిశ్వాసపు చీకటి ప్రపంచము, సంఘములు మరియు శాఖలు మొదలుగునవి మనలను బయటకు లాగివేసినవి.
ఏదో మనలో యుండి ఇట్లు పిలుచుచున్నది, "ఓ, మాకు దేవుడు కావలెను! దేవుని కొరకు మేము ఆకలి దప్పులుగొనుచున్నాము." మనము మెతడిస్టు, బాప్టిస్టు,పెంతెకోస్తు, ప్రెస్పిటేరియను ఇంకా ఏవేవో వానిలో చేరియన్నాము. ఇంకా అందులో ఏదో పొరపాటున్నది. దానినింకనూ మనము కనుగొనలేదు. అకస్మాత్తుగా, ఇంకనూ మనము చీకటిలో తడవులాడుచుండగా, దేవుని వాక్యపు వాగ్దాన ప్రత్యక్షత ద్వారా ఆ గొప్ప పునరుత్థానము మనకు వచ్చియున్నది.
దేవుని వాక్యపు వాగ్దాన ప్రత్యక్షతగా ఆయనుండినట్లుగానే "నేను ఆయనాత్మను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్దుని కుళ్ళుపట్టనీయను." ఆయన దానిని బయలుపరచెను, ఆయన నిమిత్తము వాగ్దానము చేయబడిన ప్రతి మాటయు నెరవేర్చెను. ఈస్టరు ఉదయమున ఆయన లేచినప్పుడు దానిని రుజువు చేసెను.
34వారు ఒకప్పుడు చీకటిలో తడవులాడుచూ దిక్కు తోచక తిరుగుచుండిరి. ఈ దినమున పాదశుద్ధి చేసికొనవలెను, ఈ దినమున ప్రత్యేకమైనది చేయవలెను లేదా ప్రత్యేక విధులు పాటించవలెను అను ఆ సంగతులన్నియూ గతించిపోయెను. ప్రతి మానవ-కల్పిత సంగతిని, ప్రతి మానవ-కల్పిత హేతువును ప్రతిఘటించిన ఒక మహిమాన్విత పునరుత్థానము అది.
అప్పటి వరకు ఎన్నడునూ, ఆ సమయము వరకు, ఏ మానవుడును తన ప్రాణమునుపెట్టి, తిరిగి తీసికొనలేకపోయెను. మరలా తిరిగి లేచుట ద్వారా ఆయన వారి యొక్క శాస్త్రీయ రుజువును కొట్టివేసెను.
ROM 8:11
35యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా లేడని వారు చెప్పిరి. ఆయన శక్తి ఏకరీతిగా లేదనిరి. ఆయన సువార్త ఏకరీతిగా లేదనిరి. అయితే బైబిలు ఏకరీతిగానే యున్నదని చెప్పెను… దేవుడు ప్రతి శాఖను, ప్రతి మతవిశ్వాసమును పెల్లగించెను. మరియు ఆయన వాగ్ధానము చేసిన రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా కదలాడెను, మరియు ఆయన సజీవునిగా ఉన్నానన్న సంగతిని మనకు రుజువు చేసెను.
ఆయన పునరుత్థానము వలన లాభమునొందినవారము, పాపము మరియు అతిక్రమములందు లోకములో చనిపోయిన తరువాత జీవింపచేయబడితిమి, ఆయనతో పాటుగా మనలను సజీవులనుగా లేపెను. ఇప్పుడు క్రీస్తుయేసుతోపాటు పరలోకస్థలములందు కూర్చోనియున్నాము.
ఆయనాత్మ, ఆయన యొక్క అదే జీవమును భూమ్మీదికి తీసికొనివచ్చెను. దేవుని ఆత్మ క్రీస్తును, శరీరమును లేపెను. అభిషేకించబడిన శరీరము - దేవుని ఆత్మ ఆ శరీరమును ఆ విధముగా అభిషేకించెను… ఆ విత్తనము భూమిలో పడెను. దానినక్కడ ఆయన ఉండనీయడు. లేదు. ఆయనను జీవింపజేసి, ఆయనను తిరిగి లేవనెత్తెను. అదే ఆత్మ (అవే క్రియలు ద్వారా, అదే శక్తి వలన, అవే సూచక క్రియలు ద్వారా) నీలో యుండి, అది నిన్ను కూడా పైకి లేవనెత్తును.
LEV 23:9-11
36ఇక్కడ మీ కొరకు ఒక చిన్న వాక్యమును చదువుదును. ఇక్కడ నేను వ్రాసియుంచిన మరి యొక వాక్యమును త్రిప్పవలెనని కోరుచున్నాను. అది కొద్దిగా మీకు సహాయపడవచ్చును. అది లేవీకాండము 23వ అధ్యాయము 9 నుండి 11 వచనము వరకును, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్రమందు, లేవీయ ధర్మశాస్త్రమందు, దేవుడు మోషేతో మాట్లాడెను. వినండి! ఈ సంగతులన్నియూ ఇప్పుడు మాదిరి. ఈ మాదిరిలోనికి వెళ్ళుటకు ఇక్కడ కొద్ది నిమిషములు ఆగుదము.
మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు, మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
"నేను మీకిచ్చిన స్థలము, స్థానము నొద్దకు తేవలెను. నేను మిమ్మును తీసికొని వచ్చెదనని చెప్పిన ఆ ప్రత్యేక స్థలమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులతో ఇట్లు పలుకుము…" ఇక్కడ ప్రకృతి సంబంధముగా మాట్లాడుచున్నది ఆత్మసంబంధమగు దానికి మాదిరి.
… మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు [నేను చెప్పినది మీరు పొందియున్నారు], మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
యెహోవా మిమ్మునంగీకరించునట్లు, అతడు యెహోవా సన్నిధినీ ఆ పనను అల్లాడించవలెను: విశ్రాంతి దినమునకు మరు దినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.
LEV 23:10,11
37ఏదయినా పరిశుద్ద సంప్రదాయమనునది ఉన్నట్లయితే, అది సబ్బాతు దినమునే రావలెను. అది వారములో ఏడవరోజూ, అనగా శనివారము. కానీ మీరు గమనించారా, ఈ జ్ఞాపకార్ధములో ఆ పనను వారము యొక్క మొదటి దినమున అల్లాడించవలెను?
నీవు నాటిన విత్తనములోని ప్రధమఫలము. ఆ పంట పండినప్పుడు ఆ పనను కోసి యాజకుని యొద్దకు తేవలెను. అతడు దానిని తీసికొని మీ అంగీకారము కొరకు యెహోవా యొదుట అల్లాడించును. మీరు అంగీకరించబడుటకు ఆలాగు చేసెదరు. నీవు నీ పనతో వచ్చియున్నావు. అతడు దానిని యెహోవా యెదుట అల్లాడింపవలెను.
ఏడవ దినమగు విశ్రాంతి దినమందు కాదు; కాని మొదటి దినమున, అనగా మనము ఆదివారము అని పిలుచుచున్న దినము.
అదొక రోమా పదము, సూర్య దేవతల పేరున దానిని పిలచిరి. కాని అదెట్లు మారెనో చూడండి!
ఇక మీదట సూర్యుని వారము కాదు. అది కుమారుని వారము, కుమారుని వారమున ఆ గోధుమ గింజ (మృతులలో నుండి ప్రధమఫలముగా బయటకు వచ్చెను) మనమాయన సంతానమని సమాజము యెదుట అల్లాడింపవలెను; నిద్రించిన వారిలో ప్రధమ ఫలము ఆయనే, మొదటి పంట ఆయనే, వారము యొక్క మెదటి దినమున అల్లాడింపబడెను. అదివారమున ఆయన తిరిగి లేచెను. వీడ్కోలు చెప్పెను, మరియు జనులు చూచుచుండగానే పైకి ఆరోహణమాయెను.
38గమనించండి, మృతులలో నుండి లేపబడిన దేవుని యొక్క గోధుమ గింజలలో మొదటిది అదే, దేవుని యొక్క మొదటి గోధుమ గింజ. దేవుని జీవింపజేయు శక్తి ద్వారా, దేవుడాయన జీవమును తిరిగి లేపెను. మృతులలో నుండి ఆయనను లేపెను, నిద్రించిన వారిలో ప్రథమ ఫలము ఆయనే. ప్రధమ-ఫలము ఆయనే — ఆ పన ఆయనే.
అందువలననే వారు ఆ పనను అల్లాడింపవలసియుండిరి, ఎందుకనగా మొదట పరిపక్వమునకు వచ్చినది అదే. మరియు అది దేవునికి వందనములు చెల్లించుటకు జ్ఞాపకార్ధముగా అల్లాడింపబడెను, తక్కిన వారందరూ వచ్చెదరని నమ్మబడెను. అది ఒక గురుతు అయి యుండెను.
LUKE 17:30•
ACTS 2:2
39మరియు, ఈ దినమున, దేవునిలో నుండుటకు పూర్తి పరిపక్వతకు వచ్చుటకు ఆయన మొదటి దేవుని కుమారుడై యుండెను గనుక, ఆయన భూమి మీద నుండి త్రుంచబడి జీవింపచేయు శక్తి ద్వారా జనులపైన అల్లాడించబడెను. ఓ, ఎంత మహిమకరమగు పాఠము! జీవింపజేయు శక్తి ద్వారా, మొదటివాడు! చాలాసార్లు ఆయన మాదిరిగా చూపించబడిననూ, ఆయన ఏ విధముగా మాదిరిగా యుండెనో మనము తరువాత చూతుము, ఆయన మాదిరిగాయుండెను — కాని ఇది నిజంగా నిద్రించిన వారిలో ప్రధమ-ఫలము. జీవమునకు వాగ్దానము చేయబడిన వాగ్దాన సంతానముపై ఆయన అల్లాడించబడెను.
ఆకాశము నుండి బలముగా, సర్వశక్తితో, వీచిన గాలివంటి యొక శబ్దము వచ్చినప్పుడు, పెంతెకోస్తు దినమున జనులపైన ఆయన అల్లాడించబడెను. పెంతెకోస్తు పండుగనాడు పెంతెకోస్తు జనులు ఆశీర్వచనము కొరుకు కనిపెట్టుచుండిరి.
మరల అల్లాడించబడుటకు, మనము గ్రహించుచున్నాము, లుకా 17:30 ప్రకారము, అంత్యదినమున, మరలా కుమారుని-దినమునే, "… ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున," లేదా జనుల మీద మరలా అల్లాడించబడును.
JOHN 1:1,14
40ఇప్పుడు, ఈ మనుష్యకుమారుడు ఎవరు? "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను… ఆ వాక్యమే శరీరధారియై, మనమధ్య నివసించెను." మనము కలిగియుండిన బోధ అంతయూ దేవుని వాక్యముబట్టి నిర్ధారించబడినది — దేవుని వాక్యమును బట్టి, సూచిక క్రియలు బట్టి, అద్బుత కార్యములను బట్టి, ప్రజలు మీద వాక్యము మరల అల్లాడింపబడుటను నేడు చూచుచున్నాము, ఇక్కడ లుకా సువార్తలో, (మనము ఇప్పుడే లుకా 17:30 నుండి మాట్లాడిన విధముగా), మరియు మలాకి 4, మనకు తెలిసిన ఇతర లేఖనభాగముల ప్రకారము — మరలా వాక్యము జనులపై అల్లడించబడును; ఆ చచ్చిన మానవ ఆచారములు మృతిచెందెను, మరియు దేవుని కుమారుడు మన మధ్యనే మరల పరిశుద్దాత్మ బాప్తిస్మముతో తిరిగి సజీవుడై, మనకు జీవమునిచ్చుచున్నాడు.
41మొదటగా లేచినవాడు క్రీస్తే — ప్రవక్తలు అందరు మరియు మొదలగువారు, వారందరూ చాలా చోట్ల మాదిరిగా ఉన్ననూ, నిద్రించినవారిలో ఆయన ప్రధమ-ఫలము — క్రీస్తు రాకడయందు వదువు వచ్చును, సంఘము నుండి బయటకు వచ్చును, చివరి దినములలో మరల ఒక పన అల్లాడించుట యుండును.
పన అల్లాడించుట, పన అనగా ఏమిటి? మొదటగా పరిపక్వమునకు వచ్చినది. అది గోధుమ గింజ అని మొదట రుజువు చేయబడినది. పన అని నీరూపణ అయినది. హల్లెలూయా! నేను దేనిగూర్చి మాట్లాడుచున్నానో దానిని మీరు చూడగలరని నిశ్చయంగా తలంచుచున్నాను! అది జనుల పైన అల్లాడించబడెను. వధువు కాలము కొరకు మొదటిసారిగా రానైయున్నది, చీకటి శాఖాత్వము నుండి పునరుత్థానము కొరకు రానైయున్నది. వాక్యసంపూర్ణ పరిపక్వతలో కూడిన ఒక వర్తమానము. అది దాని నిండు శక్తితో వెనుదిరిగి యున్నదీ. వెనుక అక్కడ ఆయన చేసిన అవే అద్భుతములు, సూచక క్రియలు ద్వారా ప్రజలు పైన అల్లాడుచున్నది.
JOHN 14:19
42"నేను జీవించియున్నందున మీరును జీవించెదరు." తన భార్యతో మాట్లాడుచుండెను. "నేను జీవించుచున్నాను గనుక మిరును జీవించుదురు." అది ఎట్టి పునరుత్థానము! ఇది ఎట్టి పునరుత్థానము! మృతులలో నుండి లేపబడుట, దేవుని జీవింపచేయు శక్తి ద్వారా క్రీస్తుయేసు నందు సజీవులుగా చేయబడుట.
ఆయన వారికి అల్లాడించబడెను. వాక్యము ఆయనే అయియుండెను. పెంతెకోస్తు దినమున తిరిగి అల్లాడించబడెను. వాక్యము ప్రత్యక్షమాయెను. ఇప్పుడు, నేను చెప్పురీతిగా అంత్యదినమున అది మరల అల్లాడింపబడవలెను.
43ఉదాహరణ మీరీలాగు చెప్పవచ్చును "బ్రదర్ బ్రెన్హాం, ఒక్క నిమిషము ఆగుము. ఒక చర్చిని నేనెరుగుదును…." నేను కూడా ఎరుగుదును, చూచారా?
కాని ఇప్పుడు, ఉదాహరణకు, ఈ మధ్యాహ్నము మనము టుసాన్కు, మనలో ప్రతి ఒక్కరము ఒక్కొక్క పెద్ద సరిక్రొత్త కాడిలాక్ కార్లలో వెళ్ళుచున్నామనుకోనండి. సీట్ల అతి మెత్తని జంతు చర్మముతో చేయబడినవనుకొందాం. కూర్చొనుటకు మెత్తని సీట్లు, ఖరీదైన చెక్కలు వీలునకు నికెల్ పూత, దాని పైన ముత్యపు పొదుగులు, ఇంజను యాంత్రికముగా పరీక్షించబడి చక్కగా అమర్చబడినది, చక్రములన్నియూ బేరింగులు, గ్రీజు కలిగియున్నవి; టైర్లు రంధ్రము పడని, తేలికగా గాలి ఎక్కించగలవి. శాస్త్రీయంగా అన్నియూ పరిక్షించబడినవి.
అవి అమరికలో నుండి ముందుకు తేబడినవి, అవి రెండూను, అవి రెండు ఇందానముతో నిమ్పబడెను. అది నడిపించు శక్తి, ఇందనము, ఎందుకనగా అందులో ఆక్టేన్ అనునది యున్నది. అయితే ఇప్పుడు నీవు వాటిని స్టార్ట్ చేయుటకు ప్రత్నించునప్పుడు, అవి రెండూను ఒకేలా కనబడినప్పటికిని, కాని ఒక దానిలో నిప్పును రగులజేయు శక్తి లేదు.
"బ్రదర్ బ్రెన్హాం, శక్తి ఆ ఇంధనములో యున్నది" అని మీరనవచ్చును." ఆ ఇంధనములో ఎంత శక్తియున్నా, నేను లెక్క చేయను, ఎందుకనగా ఆ శక్తిని బయటకు రగుల్చు నిప్పు లేనిచో అది నీటితో సమానమే. అది మంచి ఇంధనమని ధృడపరచు శక్తి కావలెను.
44ఎంత పాండిత్యము గల వారున్నా లెక్కకు రాదు. మీ సంఘము ఎంత చక్కగా కట్టినా లెక్కకు రాదు. నీకెంత విద్య ఉన్నా లెక్కకు రాదు. ఎంతగా బైబిలువలె ఉన్నా సరే, ఆ పన అల్లాడించబడు వరకు, వాక్యమును జీవింపచేయుటకు పరిశుద్దాత్మ ఆ వ్యక్తి మీదకు వచ్చు వరకు… ఇంధనము వాక్యమును సాదృశ్యము. అదియే సత్యము, కాని ఆత్మ లేకుండా అది చలించదు.
మనము యంత్రముల (మెకానిక్స్) మీద ఎంతో ఒత్తిడిని పెట్టితిమి, మరియు కదిలించు శక్తి (డైనమిక్స్) మీద ఏమి కేంద్రీకృతము చేయలేదు. దేవుని యొక్క కదిలించు శక్తి కావలెను, ఇది ఆ ఇంధనము అని తెలియచేయుటకు సంఘము మీద యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి అవసరము. అది ఇంధనం డబ్బాలో యుండవచ్చును, అయినను అది నీటిలో సమానముగా నుండును. చూచారా? దాని మీద జీవము నుంచినప్పుడే, ఆ రుజువు కనబడును. అది శక్తిగల ఇంధనమో కాదో తెలియును.
45ఒక శాఖలో పరిశుద్దాత్మ ఉంచుటకు నీవు ప్రయత్మించినప్పుడు, నీవు మసిపట్టిపోదువు. పూర్తిగా మసిపట్టుట వలన నీ ఇంజను నాశనమగును.
కానీ పదివేల ఆక్టేన్-న్ల శక్తిగల ఇంధనము ఉన్నందుకు నేను సంతోషించుచున్నాను. దేవుని వాక్యము మరియు పరిశుద్దాత్మ కలిసి దానిని మండించును. ఒక మనిషి జీవితము లోనికి, దేవుని శక్తిని పునరుత్థానపరచుటకు, ఒక స్త్రీ జీవితములోనికి లేదా ఒక సంఘము లోనికి, దేవుని శక్తిని ప్రవేశపెట్టుటకు, పరిశుద్దాత్మ యొక్క చలింపచేయు శక్తియే కావలెను. అవతలి రహదారి మీదకు ఆ కాడిలాక్ కారును అది తీసికొనిపోవును. అదే పెంతెకోస్తు దినమున ప్రజల మీదికి దిగివచ్చి వారిమీద అల్లాడెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నట్లుగా చూపెను.
46ప్రవక్తలందరిలో నుండి మొదటి పన బయటకు వచ్చెను. అది దేవునికుమారుడు, ప్రవక్తలందరికి రాజు,
సంఘములు, సంఘములు, వధువులు, వధువులు, సంఘములు, వధువులు, వధువులు ఎందరో యున్నారు. కాని ఒక వ్యక్తి రావలసియుండెను (హల్లెలూయా!) ఒక నిజమగు వధువు రావలసి యుండెను! యంత్రము మాత్రమే గాక, దానియొక్క చలన శక్తిని కలిగిన ఒకాయన తప్పక వచ్చును. అది సంఘమును జీవింపచేయును. ఆయన పునరుత్థానము యొక్క శక్తితో కదిలింపచేయును. ఆ స్థానమునకు మనము వచ్చువరకు, ఆ స్థలమును మనము కనుగొను వరకు కేవలము చక్రపు ఇరుసులను మెరుగు పెట్టినంత మాత్రమున ఏమి లాభము? దానిలో చలింప చేయు శక్తి లేనప్పుడు. పైపై మెరుగులు దిద్ది చక్కగా కనబడునట్లు చేయుటవలన ఏమి లాభము? ఆ యంత్రములు ఎంతో బాగున్నవని రుజువు కాబడినా గాని, దానిని పని చేయించు చలన శక్తి లేనిచో, ఏమి లాభము లేదు.
GEN 1:23•
EPH 5:30•
REV 1:18
47అదే ఆయన రుజువు చేసెను! హల్లెలూయ! ఈస్టరు అదే రుజవు చేయును. ఆయన కేవలము మాట మాత్రమే కాక, తనకుతానే దేవుడైయుండెను, వాక్యములోని చలన శక్తి. ఆ శక్తియే చల్లగా, కొరడబారి, సమాధిలో చనిపోయి పెట్టబడిన యేసుక్రీస్తు శరీరమును జీవములోనికి కుదిపి, తిరిగి లేపెను మరియు రాతిని దొర్లించెను. "మృతుడనైన వాడను నేనే." ఆయన చనిపోయినట్లు సూర్యుడు కూడా ప్రకటించెను, ఆయన చనిపోయెనని చంద్రుడు చెప్పెను, ఆయన చనిపోయెనని నక్షత్రములు చెప్పెను, ఆయన చనిపోయెనని ప్రకృతి యావత్తు చెప్పెను. ఇప్పుడు ఆయన తిరిగి లేచెనని సర్వప్రపంచము గుర్తించవలిసి యున్నది! ఆయన కేవలము యంత్రమే కాదు గాని, దేవుని వాక్యము; దానిని రుజువు చేయుటకు చలన శక్తియై యున్నాడు.
పెండ్లికుమారునిగా ఉండిన ఆయన బయటకు వచ్చినప్పుడు వధువు కూడా బయటకు రావలెను. ఎందుకనగా అది ఆయనలో భాగము. వధువును గూర్చి ఎందరు మాట్లాడిరో వారందరి యొక్క ప్రత్యక్షతలను నెరవేర్చు ప్రత్యక్షతగా మాత్రమే అది ఉండగలదు. అది కేవలము పెండ్లికుమారునికి వేరుగా అది ఏదయినా చేసినచో, అది వధువు కాదు. ఎందుకనగా ఆమె ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలలో ఎముక, జీవములో జీవము, ఆయన శక్తిలో శక్తి అయియున్నది. ఆమె ఆయనయే! స్త్రీ పురుషులు ఒక్కటైనట్లుగా, స్త్రీ ఆయన ప్రక్క నుండి తీయబడినది. అది ఆయన ఆత్మను తీసికొన్నది, స్త్రీ ఆత్మ, ఆయన ప్రక్కలో నుండి మాంసం తీయబడినది — యంత్రములను మరియు చలింపచేయు శక్తి రెండూను రూపొందించుకొన్నది, భార్య. ఆయన యొక్క ఆత్మ మరియు ఆయన యొక్క మాంసము, ఆ రెండింటినీ ఒక చోట చేర్చినప్పుడు యంత్రములు, చలింపచేయు శక్తి రూపొందును.
సంఘము లేదా జనులు…
JOHN 6:39•
JOHN 14:12•
HEB 13:8
48ఈ ఈస్టరు బొమ్మలు, ఉత్సవములు,పెద్ద సంఘములు, మొదలగునవన్నియూ విఫలమగును, గతించును.
ఆ సంఘము చలించు శక్తిగా, యంత్రముగా రూపొందును, ఆయన చేసిన క్రియలు చేయుటకు ఆయనను కదిలించిన సంఘము, ఆయన పదహారు సిలిండరులను తాకినచో, ఆయన వధువునూ ఆలాగే చేయును. ఆమేన్! ఎందుకనగా ఆయన యోహాను 14:12లో ఈలాగు చెప్పెను, "నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయును. అతని యంత్రములలోనికి నా చలించు శక్తిని పంపించుదును, లోకము దాని ఎదుట నిలువ జాలదు; అంత్యదినమున నేను వానిని తిరిగి లేపుదును." అదే ఈస్టరు సందేశము, యంత్రములు మరియు చలింపచేయు శక్తి ఏకమయినవి. చలింపచేయు శక్తి లేకుండా యంత్రములు విఫలమగును. యంత్రములు లేనిచో చలింపచేయు శక్తియు విఫలమే.
నీవు కేకలు, చప్పట్లు ఇష్టమొచ్చినట్లు క్రిందికి పైకి ఎగురుట చేయుచూ వాక్యమును తిరస్కరించుదువు, దానివలన ఏమి లాభము లేదు. నీవు అగ్నిని అంటించుటకు ప్రయత్నించుచున్నావే గాని అసలు మండుటకు అక్కడ ఇంధనము లేదు.
అవన్ని కలిసి ఏకమయినప్పుడే పని జరుగును. ఆమేన్! ఒకటి నెమ్మదిగా యుండును మరియొకటి పైకి వెళ్ళును. దానికి అది ఒక్కటే సంగతి. అయిననూ అవి రెండూ ఒకే రీతిగా కనిపించవచ్చును. రెండునూ సంఘములుగా చెప్పుకోవచ్చును. రెండునూ వధువుగా ప్రకటించుకోవచ్చును. కాని ఒక్కదానికి మాత్రమే యంత్రములు, వానిని చలింపచేయు శక్తి యున్నది. అది దానిని నేరవేర్చును, ఆయన చెప్పినది సత్యము.
ఆ యంత్రములు ఎంత మంచివయిననూ, అది కదలదు, కదిలించు శక్తి రావలెను. ఆ కదిలించు శక్తి వచ్చినప్పుడు, ఆ నిప్పు ఇంధనములోయున్న ప్రజ్వాలన శక్తితో అనుసంధానమగును. అది దానిని ప్రేల్చినప్పుడు, ముందుకు కదిలించు శక్తి ఉత్పన్నమగును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అదే పునరుత్థానము. అదే దేవుని యొక్క నిజశక్తి — చలింపచేయు శక్తితో కూడిన యంత్రములు. గమనించండి, జీవింపచేయునది ఆత్మ మండించునది ఆ అగ్ని ఇంధనము మండించదు. ఆ ఇంధనమును మండించునది అగ్ని రవ్వ, చూచారా.
JOHN 15:5•
JOHN 20:21•
PHIL 4:13
49"నేను లేకుండా మీరేమియూ చేయలేరు, కాని నావలన అన్నియూ మీరు చేయగలరు. (ఆయనే వాక్యము, జీవించుచున్నవాడు తండ్రి) తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మును పంపుచున్నాను. తండ్రి నాలో అగ్ని,పుట్టించి సమస్తము చేయుటకు త్రోసినందు వలన దేవునికి ఇష్టమైనదే నేను చేయుచున్నాను. ఆయన నన్ను పంపినట్లుగా అదే యంత్రములతో మిమ్మును నేను పంపుచున్నాను. దానిని నిర్వహించుటకు అదే చలింపచేయు శక్తి కావలెను, యంత్రములున్నవని చెప్పుకొనుచున్న వారిద్వారా ఈ సూచకక్రియలు కనబడును. చలింపచేయు శక్తి దాని స్థానమును ఆక్రమించును.
ROM 8:11•
1THS 1:5
50పౌలు చెప్పెను, "సువార్త మాటలో మనయొద్దకు రాలేదు గాని, దానిని కదిలింపచేయు అగ్ని ద్వారా వచ్చెను." [ఇంధనము ద్వారా మాత్రమే], అంతే! ఆ విధముగానే అది మన యొద్దకు వచ్చెను.
ఆయనను లేపిన ఆ ఆత్మయే నిజ విశ్వాసిని నిత్యజీవమునకు లేపెను. ఇప్పుడు గుర్తుంచుకొనండి, సమర్థవంతంగా… గమనించండి (మనకు సమయము అయిపోవుచున్నది). గమనించండి. "అదే ఆత్మ," ఇప్పుడు, రోమా 8:1. దానిని మరల మనము రోమా 8:1లో చదివి అదేమి చెప్పుచున్నదో చూద్దాం. మంచిది. క్షమించండి.
రోమా 8:11, "కాని.." అక్కడ సమస్య ఉన్నది. అక్కడే ముఖ్యమైన ఉన్నది.
మృతులలో నుండి యేసును లేపిన ఆయన యొక్క ఆత్మ [దేవుడు, పరిశుద్ధాత్మ] మీలో నివసించినచో…
ఓ, అక్కడే మీరున్నారు: పెండ్లి కుమారుని ఆత్మ వధువులో నివసించినచో.
GEN 2:7•
ROM 8:11•
EPH 5:30
51దేవుని తన మొదటి కుమారుని రూపొందించినప్పుడు, మొదటగా పెండ్లికుమారునే చేసెను, ఆయన స్త్రీ మరియు పురుషునిగా ఉండెను, ఆత్మగా; అతనిని శరీరసంబంధిగా చేయుటకు నేల మ౦టితో తయారు చేసెను. గమనించండి, ఆదాము నుండి హవ్వను ఆయన తయారు చేసినప్పుడు ఆయన మరొక మట్టి ముద్దను తీసికోలేదు గాని; అదే మట్టి ముద్ద నుండి చేసెను. అదే వాక్యము, ఎందుకనగా ఆదాము పలుకబడిన వాక్యము, చూచారా. అతనిలో నుండి చేసెను, స్త్రీ మరియు పురుష ఆత్మలు రెండూ అతనిలో యుండెను. ఆయన ఆదాములో నుండి స్త్రీ ఆత్మను వేరు చేసి దానిని హవ్వలో యుంచెను; కనుక ఇంకనూ అది ఆదాములో బాగమే. అది ఆదాము యొక్క మాంసము; ఆయన శరీరము యొక్క యంత్రములను చలింపచేసినది ఆదాము ఆత్మయే.
అలాగే వధువునూ ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలలో ఎముక అయియుండెను. ఈ మర్త్య-శరీరము ఆయన శరీరముగా ఎట్లు ఉండబోవుచున్నది? ఒక్క నిమిషములో మనము అక్కడికి వచ్చుదము, చూచారా. అదెట్లు జరిగెను? ఈ గొప్ప రూపాంతరము ఏమిటి? గమనించండి.
యేసును మృతులలో నుండి లేపిన ఆయన ఆత్మ [దేవుడు] మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆయన మీ మర్త్య-శరీరములను కూడా మీలో నివసించు ఆయన ఆత్మ ద్వారా జీవింపచేయును.
52ఓ, మై! ముందుగా నిర్ణయించబడినవాడు, భూమిలోపడియుండిన బీజమువలె తనలోతాను జీవము కలిగియుండును. వారిలో అనేకులు చనిపోయిరి. అవి కేవలము క్రుళ్ళిన గింజలు. నీరు మరియు ఇతరములు వాటిని ఆ విధముగా క్రుళ్ళిపోచేసెను. కానీ మీకు తెలుసా, జీవము కొరకు సిద్దపడి అక్కడొక బీజము పడియున్నది. అది అక్కడ పడియుండెనని దేవుడు ఎరిగియుండెను.
ముందుగా నిర్ణయించబడిన వారు పరిశుద్దాత్మ ద్వారా మొదట జీవింపచేయబడుదురు, ఎందుకనగా పరిశుద్దాత్మ తన స్వకీయులను స్వంతము చేసికొనుటకు వచ్చును. (ఇది లోతుగా యున్నది, ఈ చక్కగా పట్టుకొనుటకు నిశ్చయత కలిగియుండుడి.)
53ఇప్పుడు, రాళ్ళను (అది కూడా మట్టియే) జీవింపచేయుటకు సూర్యుడు భూమి మీదకు పంపబడలేదు. మురికినంతటినీ జీవింపచేయుటకు అది రాలేదు, కానీ మట్టితో ఒక భాగము కప్పబడియుండి లోపట జీవము దాగియుండిన దానిని లేపుటకు వచ్చెను.
మనుష్యలందరూ క్రీస్తును చేర్చుకొనరు. ఓ, కాదు. కాని జీవమునకు దేవునిచే ముందుగా నిర్ణయించబడిన వారే. భూమీలోని ఏదో మట్టితో జీవము దాగియున్నది. ఆయన వారిని లేపుటకే వచ్చెను. అది వారే.
ఆ మట్టి సూర్యుని క్రింద పడియుండి ఇట్లు చెప్పెను, "ఓ, ఈ పాత సూర్యుడు చాలా వేడిగా యున్నాడు!" "ఈ పాత సూర్యుని చాలా వేడిగా యున్నాడు" అని ఆ రాయి చెప్పును. కాని ఆ చిన్న విత్తనము ఇట్లనును, "నేను దాని కోసమే చూస్తున్నాను," అది జీవమును పైకి తీసికొనివచ్చును. మట్టిలోని ఆ భాగమును అది జీవింపచేయును, ఎందుకనగా ఆ సూర్యుడు బండను లేక మట్టిని జీవింపచేయుటకు కాదు గాని, ఆ విత్తనములోని జీవమును మేల్కోలుపుటకు పంపబడును.
54ఇప్పుడు, పరిశుద్దాత్మ వచ్చుచున్నది. మనుష్యులందరూ దానిని ఎందుకు పొందరు? అది వారికొరకు పంపబడలేదు.
ఒక వ్యక్తి నాతో అనెను, "నేను నమ్మను. నీవేం చెప్పినా నాకక్కర్లేదు. నీవు మృతులను లేపినా, రోగులను బాగుచేసినా, ఇంకా ఏమేమి చేసినా - నేను మాత్రం నమ్మను."
"నిశ్చయంగా నీవు నమ్మవు. నీవు ఒక అవిశ్వాసివి. ఆ విషయము నీకేమి అర్థము కాదు. అది నీ కొరకు పంపబడలేదు. అది నమ్మువారి కొరకు పంపబడెను," అని చెప్పాను.
వర్తమానము విశ్వాసి కొరకే పంపబడెను. నశించువారికి అది వెర్రితనము; కాని క్రీస్తునందున్నవారికి మరియు ఆ విత్తనములోని భాగమునకు, అది జీవము.
55కోడిపెట్ట క్రింద పక్షిరాజు గ్రుడ్డును పెట్టిన వ్యవసాయకుని గూర్చిన నా చిన్న కధ మీరెరుగుదురు, చూచారా. ఆ చిన్న గ్రుడ్డు వింతగా కనపడినదనుటలో సందేహము లేదు. అది వింతగా కనబడుచున్న ఒక కోడిపిల్లను పొదిగెను. అది చూచుటకు వింతగా నుండెను. అది వానివలె కనిపించలేదు, దాని ఈకెలు తక్కిన వానివలె లేవు, అది విడ్డురముగా ఉండెను. తక్కిన కోడిపిల్లలన్నియూ దానిని వింతపక్షిగా గుర్తించెను.
తల్లి పెట్ట యొక్క మేత దానికి నచ్చలేదు. గాదె యొద్ద త్రవ్వుకొనుట దానికి నచ్చలేదు. దానికి అట్టి వానితో పొత్తు లేదు. ఇంత తేడాగాయున్న తాను ఇక్కడి వీటితో ఎందుకు కలిసి తిరిగి వచ్చెనో అర్థంకాక ఆశ్చర్యపడుచున్నది. చూచారా? ఏదియూ అది రుచి చూడలేదు. జీవించుటకు కావలసినంతా మాత్రమే తినుచున్నది, ఎందుకనగా దాని రుచి సహించలేకపోతున్నది, చూచారా, ఎందుకనగా చెప్పాలంటే అసలు అది కోడిపిల్లనే కాదు, చూచారా.
56కోడిపిల్ల కొక్కొక్కో అనుట మీరెరుగుదురు. "అద్భుతములు జరుగు దినములు అయిపోయినవి. అటువంటిది ఏదీ లేదు. సంఘములో చేరండి." ఆ మాటలు ఆ పక్షిరాజు పిల్లకు ఏమీ సరిపడలేదు. అయినా అది తల్లి పెట్టను వెంబడించక తప్పలేదు.
ఆ పక్షిరాజు తల్లి తాను చాలా గ్రుడ్డు పెట్టినట్లు అందులో ఒకటి తప్పిపోయినట్లు కనుగొన్నది. ఆ పక్షిరాజు పిల్ల ఎక్కడో ఉండియుండునని తలంచినది. దానికొరకు వెదుకుటకు ప్రారంబించెను. అది కొండ శిఖరముల మీద, క్రిందలోయలలోను, అది ఎక్కడుండుటకు ఆస్కారమున్నదో ఆ ప్రతిచోటకు గట్టిగా పిలువసాగినది. చుట్టూ ఎగిరి వెదకినది, ఎందుకనగా దాని సమయమునకు అది జన్మించియుండును. ఈ పాటికి అది పొదగబడియుండును. "ఒకవేళ ఒక కాకి వచ్చి లేక ఒక డేగ వచ్చి నా పిల్లలను తన్నుకు పోయిందేమో నాకు తెలియదు. ఏదో నా గ్రుడ్డును ఎత్తుకుపోయెను. కాని నాకు తెలుసు… అదింకా నా మనస్సులోనే యున్నది. నా కుమారుడు ఎక్కడో ఉండియున్నాడు. నేను వెదకి కనుగొందును" అనుకొన్నది.
57దేవుడు ఆలాగే చేయును. ఆయనే ఆ గొప్ప పక్షిరాజు. తాను ఒక సంఘమును కలిగి, యున్నామని ఆయన తన ఆలోచనలో ఎరుగును. తనకొక జనమున్నదని ఆయనెరుగును. ఏది వాటిని దాచిపెట్టినా, ఎక్కడ అవి పొదగబడినా గాని దానికొరకు వెదుకుచున్నాడు. ఆయన తన స్వకీయుల కొరకు వెంటాడుచున్నాడు.
ఆ గాధ ఇట్లు సాగెను, ఒక రోజున ఈ తల్లి పక్షిరాజు గాదె వైపుగా ఎగిరి వచ్చెను. అది బిడ్డ కొరకు ప్రతిచోట వెదుకుచునేయున్నది, ఇక్కడ దానిని కనుగొనెను. తాను కోడిపిల్లను కానని గుర్తుంచుటయే పునరుత్థానము! అది ఒక పక్షిరాజు! కోడిపిల్ల ఎల్లప్పుడూ క్రిందికి చూచుటకు నేర్పించబడినది. గాదె యొద్ద ఏదో పురుగును చూచుటకు అలవాటుపడెను. "ఇటువైపుకు చూడు," అను కేక వినబడినది. అది పైకి చూచినది. అక్కడ పధ్నాలుగు అడుగుల పొడవైన రెక్కలతో, ఈ గాదెవద్దనున్న కోళ్ళన్నిటి కంటెను బలమైన ఒక జీవిని చూచినది. నేను దాని బిడ్డనే అనుకొన్నది.
"అమ్మా! నీ యొద్దకు నేనెట్లు రావలెను?" అనడిగినది.
"పైకి ఎగురు, నీ రెక్కలు కొట్టుకొనుటకు ప్రారంభించు. నీవు ఒక పక్షిరాజువు" అన్నది.
చూచారా, తన బిడ్డ ఎక్కడో ఉండెనని అది ఎరిగియుండెను. అదెక్కడ పెరిగిననూ పరవాలేదు, తన కుమారుడు ఎక్కడో యున్నాడు.
HEB 13:8
58దేవునికి తెలియును. హల్లెలూయ! ముందుగా నిర్ణయించబడిన, ముందుగా అభిషేకించబడిన ఒక సంఘమును ఆయన కలిగియున్నాడు. తాను కుమారులు, కుమార్తెలను కలిగియున్నానని ఆయనకు తెలియును. వధువు ఎక్కడో కనిపెట్టుచున్నది. పరిశుద్ధాత్మ దాని మీద ఎగురుట ప్రారంభించినప్పుడు. ఆ అల్లాడు పన! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. ఏదో ఒక కట్టుకధ కాదు గానీ, ఒక వాస్తవము.
మనుష్యులు ఏదేదో అతడికి చెప్ప ప్రయత్నించినా గానీ , అతడు పక్షిరాజే. తానకి పక్షిరాజు అంటే ఎంటో అతడికి తెలియదు, తనను ప్రతిబింబించినది ఏదో ఒకటి పైన ఎగురునంతవరకు దానిని అతడు అర్ధము చేసికొలేడు.
ఒక శాఖను లేక పి.హెచ్.డిని లేదా ఎల్.ఎల్.డిని, ఒక మంచి పొరుగువానిని చూచుట కాదు గాని, ఒక దేవుని కుమారుని, దేవుని చలన శక్తితో దేవుని స్వరూపమందు మలచబడిన ఒక దేవుని కుమారుని చూడవలెను. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడని నేడు అడుగువారికి జవాబునిచ్చు వ్యక్తిని కనుగొన్నప్పుడు, ఏ కోడిపెట్టయు నిన్ను పట్టుకొని ఉంచజాలరు. అది తన తల్లి కొరకు వెదకును, ఎందుకనగా దాని ప్రారంభమే పక్షిరాజు, అది గుర్తించును. ఈ నిజమగు పక్షిరాజు దేవుని వాక్యపిలుపును గుర్తించును. ఎందువలన? అది ఒక పక్షిరాజు, పక్షిరాజుకు అది ఒక పక్షిరాజు, వాక్యమునకు అది జగతు పునాది వేయబడక ముందే యున్న వాక్యము, గడియకు వ్రాయబడీన వాక్యమునకు ముందే నిర్నయి౦చబడిన వాక్యము. నీవు నీ స్థానమును గ్రహించెదవు. ఆయన దానికొరకు వెదకును.
JOHN 14:12,19•
ROM 8:11
59ఈ భూసంబంధమగు శరీరము జీవింపచేయబడి, దేవుని యొక్క జీవింపజేయు ఆత్మ ద్వారా దేవుని వాక్యమునకు లోబడునట్లు చేయును.
(త్వరగా.) అది ఎట్లు తల్లిని చేరుకొనవలెనో తెలిసికోగోరెను. తాను అది చేయజాలనని దానికి నేర్పించబడెను. "నీవు ఎగరకలిగినంత కంటే పైకి వెళ్ళలేవు" అని కోడిపిల్ల అనెను, చూచారా.
కాని ఈ పక్షిరాజు ఇట్లన్నది, "అది తప్పు."
"సరే, ఆ కోడిపిల్లలను చూడు."
"ఆ కోడిపిల్లల సంగతి ఆలోచించవద్దు, నీవు పక్షిరాజువు. ఆ రెక్కలు చాపుటకు ప్రారంభించు. చిన్నపాటి వ్యాయాయము చేయుము. కడుపుటకు ఆరంభించుము."
వాక్యమునకు వాక్యము. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును," చూచారా. "నేను జీవించుచున్చాను గనుక మీరును జీవించెదరు." "ఆయనను మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ మీలో నివాసము చేయుచున్న యెడల అది మీ మర్త్యశరీరము కూడా లేపును," చూచారా.
ROM 8:11
60అది ఏమి చేయును? ఈ ఈస్టరును మీరు తెలిసికొనునట్లుగా ఇప్పుడు మీరు వినండి. మీరు ఎన్నడూ ఏ ఈస్టరును అర్థము చేసికోనంత ప్రగాఢంగా దీనిని మీరు అర్థము చేసికొనునట్లు చేయవలెనని కోరుచున్నాను. దానిని మీరు చూడవలెనని కోరుచున్నాను; ఏమి చేయును అని కాదు, ఏమి చేసెనో దానిని మీరు చూడగోరుచున్నాను, చూచారా. అది ఏమి చేయును? అది మర్త్య-శరీరము జీవింపచేయును. మనము కలిగియున్న ఈ మర్త్య-శరీరమును అది లేపును. మరో మాటలో చెప్పవలెనన్నచో అది జీవమును తీసికొనివచ్చును.
ఒకప్పుడు నీవు నీ నోటిలో ఒక పెద్ద సిగరెట్టు పెట్టుకొని నడిచావు, ఎన్నో సిగరెట్లు త్రాగావు, స్త్రీలగు మీరు జుట్టు కత్తిరించుకొని, రంగులు పూసికొని, షార్టులు ధరించుకొని ఇంకా అలాంటివి ఏవేవో చేశారు. అకస్మాత్తుగా ఏదో కేక వినబడినది. ఇక్కడికి మీరు చూచారు. అది వాక్యము. చూచారా, అది మిమ్ములను జీవింపచేసినది… "ఇక నాకు షర్టులు వద్దు, ఇక నాకు సారాయి వద్దు, ఇక అబద్దములు వద్దు, ఇక దొంగతనములు వద్దు. ఇకమీదట ఇది చేయను, అది చేయను" అనుకొన్నారు, చూచారా. మృతులలో నుండి ఆయనను లేపిన ఆత్మ మీలో నివసించి మీ మర్త్య-శరీరములను లోబడునట్లుగా చేసెను, నేలమట్టి. మీరు చూచారా? ఏమిటిది? దేనికి లోబడుట? క్రీస్తునకు. క్రీస్తు ఎవరు? వాక్యము. వేదాంత పాండిత్యము కాదు గాని, వాక్యము.
అప్పుడు నీవు ఈ సంగతులను గూర్చి ఇట్లందువు… "ఓ, స్త్రీలు షార్టులు ధరించుట మంచిదే అనుకొన్నాను." కాని వాక్యము "కాదు" అని చెప్పినప్పుడు.
చూచారా, అది నిన్ను ఆలాగు మేల్కోలిపినది. చూచారా? మీరు దాని యొద్దకు ఆకర్షింపబడితిరి. చూచారా, అది అప్పుడు మీరే. మీరిప్పుడు వాక్యములో భాగమైపోయారు.
HEB 13:8
61"నా పాస్టరు ఇట్లు చెప్పుచున్నాడని" మీరనవచ్చును. మీ పాస్టరు చెప్పునది నేను లెక్క చేయను; వాక్యం చెప్పునది కావలెను. నీవు ఒక కోడిపిల్లగా ఉండగోరినచో, అతనితోనే వెళ్ళండి. ఈ వాక్యమునకు వేరయిన దానిని పాస్టరు చెప్పుచున్నచో అతడు పక్షిరాజు పిల్లలను పోషించువాడు కాదు; కోడి పిల్లలను మేపువాడు, చూచారా. పక్షిరాజు పోషకుడు కాడు — పక్షిరాజులు పక్షిరాజుల ఆహారమునే భుజించును, చూచారా. అది జీవింపచేయును.
అది చేయుట తప్పు అని బైబిలు చెప్పెను. మీరు మానవ మాటను బట్టి చేయునదంతయూ తప్పు, "అద్భుతములు జరుగు దినములు అయిపోయినవి" అందురు. బైబిలయితే ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చెప్పుచున్నది. "అది మనస్సు చదువుట, లేదా ఎదో మానసిక వివేచన, ఈ వివేచన ఈ దర్శనములన్నియూ వ్యర్థమని చెప్పినచో," వారు కోడిపిల్లలు, చూచారా. పక్షిరాజు ఆహారమనగా ఏమిటో వారెరుగరు.
62కానీ సోదరుడా, నీవు ఆ కేకను వినినప్పుడు నీలో ఏదో ఉండి, ఆదిలోనే నీవు పక్షిరాజువైనందున పైకి చూతువు, ఎందువలన? కుమారుని యొక్క పునరుత్థానము నీ మీద ప్రకాశించినది. నీవే ఆ బీజమై యున్నావు. భూమి మీదనున్న అల్లాడించు పన నీవు పక్షిరాజవనియు, ఆ శాఖకు చెందిన కోడిపిల్లవు కాదనియు గుర్తించునట్లు చేసెను. నీవు అది చూచావా?
ఇప్పుడు, ఆయనను మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ అనగా వాక్యము, చలింపచేయ శక్తిగల వాక్కు, నీలో నివాసము చేయుచున్నచో అది నీ మర్త్య-శరీరమును కూడా లేపును. మనము ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలలో ఎముక ఎట్లు అయినాము? ఎందుకనగా (త్వరగా) ఇంకా మనము మర్త్య పాపులమై యుండగానే (చావసిద్దమైయున్న ఈ శరీరము మర్త్యమైనది) అది ఆ శరీరమును జీవింపచేసెను. మేల్కోలుపుట అనగా ఏమిటి? జీవములోనికి తెచ్చుట. ఒకప్పుడు త్రాగుడుకు, తిరుగుటకు, వ్యభిచరించుటకు ఈ కార్యములన్నింటికీ ఇష్టత చూపిన శరీరము లేపబడినది. ఆ కార్యములు చనిపోయినవి. నీవు పునరుత్థానము చెందితివి. అది నీ మర్త్య-శరీరమును జీవింపచేసెను.
కాబట్టి, నీ శరీరము చలనశక్తి ఆలయమైయున్నది. ఎందుకని? ఆది నుండి నీవు ఆ యంత్రములో భాగమే. ఓ! అదే నీ పునరుత్థానము. ఆయనతో పాటు సంఘము అక్కడ పునరుత్థానమందున్నది. ఈ శరీరము ఇప్పుడే జీంపచేయబడినది, చూచారా. మీరు విన్నారు, మీరు నమ్మినప్పుడు, అది మిమ్మును ఒక శాఖ నుండి వాక్యములోనికి మార్చినది, చూచారా.
63చలనచేయు శక్తి నీటి మీదికి వచ్చినచో, అది చిందును: "అద్భుతములు జరుగు దినములు అయిపోయినవి. ఓ, నేను బైబిల్ ను నమ్ముదును, అలాంటిది లేదు," అనుచున్నారు. చూచారా?
కానీ అది ఇంధనములో ఉన్న ఒక వెయ్యి ఆక్టేన్ శక్తిని తకినచో, "ర్రుర్రు," అని దొర్లిపోవును, మీరు చూచారా. ఓ, మై, దానిని చలన శక్తి తాకవలెను! కానీ అది కోడిపిల్లను తాకినచో దానివలన ఎట్టి మేలు కలుగదు. కానీ అది పక్షిరాజును తాకినప్పుడు, అది బయటకు కదులును. ఆమేన్. యంత్రములోకి కదలించు శక్తి రావలెను. నేను చెప్పునది అర్థమైనదా? అతడు నిజమగు పక్షిరాజు అయినచో, అతడు అర్థము చేసికొనును.
JOHN 5:24•
JOHN 10:5,27
64ఇక్కడ మీ కొరకు ఒక చిన్న వాక్యమును చెప్పెదను. (మనము ఫోనును విడిచిపెట్టామనుకొంటాను, అయినా ఇంకా ఇక్కడే యున్నాము.) యోహాను 5:24లో యేసు చెప్పెను, "నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు." ఇప్పుడు చూడండి, నేను వీధిలోనికి వెళ్ళి ఆత్మీయ అవగాహన లేకుండా అక్షరార్ధమును తీసికొన్నాననుకోండి. చెప్పబడిన అర్ధమే గాని మరొక అర్థము తీసికోకుండా ఉండినచో, చూచారా. ఆదిమ గ్రీకు భాష ఇట్లు దానికి భావము చెప్పుచున్నది, "నా వాక్కును అర్ధము చేసికొనువాడు."
అది సరియని నేను రుజువు చేయుటకు నేను అక్కడికి వచ్చుచుండగా, ఒక త్రాగుబోతు మరియొకని భార్యను తీసికొని దేవుని నామమును వ్యర్ధముగా ఉచ్చరించుచూ "ఆ భోధకుడు చెప్పినది విన్నారా? మీరు విన్నారా?" అని గోలచేయుచున్నాడకోండి.
"అవును, అది నేను విన్నాను!" దాని అర్థము అతడు నిత్యజీవము పొందెనని కాదు. చూచారా?
"నా మాటను అర్థము చేసికొనినవాడు," వాడే పక్షిరాజు.
"ఇప్పుడు, బ్రదర్ బ్రెన్హాం, దానికి ఇప్పుడు నాకు ఇంకా వాక్యము కావలెను."
మంచిది. "నా గొర్రెలు నా స్వరము వినును. మరియొకని స్వరమును అవి వెంబడించవు."
MATT 16:16-19
65ఒక రోజున వివాహము - విడాకులు గూర్చిన కేసులో పరిశుద్దాత్మ నాకు ఏలాగు చెప్పెనో ఆలాగే వచ్చి చెప్పాను.
ఒక సేవకురాలు నాకు చక్కటి చురక వేసినది. నా మీద కేకలు వేసినది. "నీవు దేవుని స్థానమును అక్రమించుచున్నావనుకొంటున్నాను," అన్నది.
"లేదమ్మా" అని అన్నాను.
"వారి పాపములు క్షమించబడినవని నీవు చెప్పావు గదా? దేవునికి మాత్రమే ఆలాగు చెప్పు హక్కుగలదు" అన్నది. మరొక పరిసయ్యురాలు, చూచారా.
"'మీరు చూడండి, నీవు క్రీస్తువు, దేవుని కుమారునవి' అని ప్రత్యక్షత ద్వారా ఆయనెవరో అనేది పేతురు, మిగతా అపోస్తులులు చెప్పిన తరువాత యేసు వారు తెలిసికొనునట్లుగా ఇట్లు చెప్పెను."
"సిమోను, నీవు ధన్యుడవు [చూచారా], రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు గానీ, పరమందున్న నా తండ్రియే దీనిని బయలుపర్చెను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును; పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువజాలవు. నేను నీకు తాళపుచెవులు ఇచ్చుచున్నాను: నీవు భూమీమీద దేనిని బంధించుదువో అది బంధించబడును. దేనిని విప్పుదువో…."
MATT 28:19•
JOHN 20:23
66అది వాక్యమే శరీరధారీయైనదను దైవప్రత్యక్షత. ఆనాడు కుమారుడు, పెండ్లికుమారుడు శరీరధారియైనచో ఈనాడు వధువు శరీరధారియైనది.
"ఎవరి పాపములు మీరు క్షమించెదరో అవి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును." కాతలిక్కు సంఘము దానిని పట్టుకొని యాజకుల యొద్దకు తీసికొనిపోయెను, కాని అది శరీరసంబంధము.
గమనించండి, అది ఆత్మసంబంధముగు ప్రత్యక్షపరచబడిన వాక్యము దానిని చేసెను. ఆ కారణము బట్టియే ఆయన వారితో మీరు వెళ్ళి తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇయ్యుడి అని చెప్పెను. ఆయనెవరైయుండెనో వారికి తెలియునని ఆయన ఎరుగును.
ACTS 10:44,47
67ఒక రోజున ఒక చిన్న బోధకునితో మాట్లాడుచుండగా, అతడీలాగు పలికెను "బ్రెన్హా౦ సోదరుడా, నేను బయటకు వచ్చి పలాని పలాని పెంతెకోస్తు సంఘములో చేరాను."
ఇప్పుడు పెంతెకోస్తులు గుండ్రని రొట్టె ముక్కలను సంస్కారమందు ఇయ్యనారంభించారు, మీరది విన్నారనుకొంటాను. కోషెరు, చంద్ర దేవుడు, మీకు తెలియునా. అందరూ దానిని అంగీకరించి తీసికొనుచున్నారు. జనులందరూ అతని యొద్దకు వెళ్ళిరని ఈయన చెప్పాడు. అతడు చెప్పెను, "నేను దేనిని దీవింతునో అది దీవించబడును." మతగురువు చెప్పునది అదే కదా? క్రీస్తు శరీరముగా దానిని మార్చుటకు అతనికి శక్తి కలదా? ఒకటిలో ఆరు అయినా, తక్కినవానిలో అరడజను అన్నా ఒకటి.
"ఒక సంగతి నిన్ను అడిగెదనని," నాతో చెప్పెను. అతడు యేసు నామములో బాప్తిస్మము గూర్చి ఏదో అడుగ ప్రయత్నించుచున్నాడు, ఎందుకనగా ఆలాగు చేయునది క్రీస్తువిరోది అని చెప్పిన వాడితడే.
"యేసుక్రీస్తు నామములో ఒక వ్యక్తి బాప్తిస్మము పొందుట అంత అవసరమనుకొనుచున్నావా?" అనడిగాడు.
"అవునండి" అన్నాను.
"తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామమును బాప్తిస్మము పొందిన తరువాత కూడా అవసరమా?" అనడిగెను.
"అవునండీ, ఎందుకనగా అతడు అసలు బాప్తిస్మమే పొందలేదు. అక్కడ పేరు లేదు గనుక బాప్తిస్మము పొందనే లేదు. అది ఒక బిరుదు. అది గుర్తించబడదు. ఎందుకు పేతురు….?" అని నేనడిగాను.
"అయితే ఒక సంగతి నేను చెప్పెదను. అపో.కా., 10:49లో పేతురు ఇంకా ఈ మాటలు పలుకుచుండగా, పరిశుద్దాత్మ దిగెను అని వ్రాయబడెను కదా?" అన్నాడు.
"కానీ, అతడు వెంటనే వారివైపు తిరిగి వీరు బాప్తిస్మము పొందకుండా నీళ్ళను ఆటంకము ఎవరైన చేయగలరా?" అనడిగెను కదా అని నేనన్నాను.
LUKE 24:47•
ACTS 4:12•
ACTS 19:1,4•
COL 3:17
68"నీవు కొంతసేపటి క్రితం అక్కడ అపో.కా.,19 మీద మాట్లాడుచూ, పౌలు ఎఫెసు ఎగువ తీరము గుండా వెళ్ళుచూ ఆ శిష్యులను కనుగొనెను అని చదివితిని గదా, వారెందుకు తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామమందు బాప్తిస్మము పొందలేదు?" అనడిగాడు.
"లేదు, వారు మారుమనస్సు బాప్తిస్మమే పొందిరి గాని పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు కొరకు కాదు, ఎందుకనగా యేసు ఇంకా తెలియబడలేదు. బలి ఇంకా అర్పించబడలేదు" అన్నాను.
"వారెందుకు మరల బాప్తిస్మము పొందవలసి వచ్చెను?" అనడిగెను.
"తాళపుచెవులు కలిగిన వ్యక్తి ఇట్లు పలికెను: రక్షణ పొందుటకు ఆకాశము క్రింద మరి ఏ నామమును ఇయ్యబడలేదని మీకు తెలియచేయబడి యున్నది."
యేసుక్రీస్తు నామమును బట్టియే తప్పక రక్షణ పోందవలెను. "మాటలోను లేక క్రియలోను మీరేమి చేసినను సమస్తము యేసుక్రీస్తు నామమందే చేయవలెను." మరియొక నామము గాని, సంఘము గాని, వారసత్వము గాని, బిరుదులు గాని మరేవియూ లేవు, అయిననూ ఆయన షారోను పుష్పము, లోయలోని పద్మము, ఉదయ నక్షత్రము, అల్పా - ఒమేగా, మొదటి వాడు - కడపటివాడు. యెహోవా యీరే - రాఫా, - మనష్శే, ఇవన్నియూ. ఇవన్నీ ఆయనే, అయిననూ ఆ బిరుదులలో ఏ రక్షణలేదు. యెహోవా, రక్షణ లేదు; షారోను పుష్పము (ఆయనే), రక్షణలేదు; తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ - రక్షణలేదు. "యేసుక్రీస్తు నామము మాత్రమే. మారుమనస్సు, పాపక్షమాపణ యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన నామములోనే ప్రకటించబడవలెను అని బైబిలు చెప్పుచున్నది."
"దాని వలన ఏదయినా భేదము కలుగునని తలంచుచున్నావా?" అని ప్రశ్నించాడు.
MATT 28:19•
JOHN 5:24•
JOHN 10:27
69"అయ్యా, ఒక్క సంగతి నేను అడుగగోరుచున్నాను" అని పలికాను. ఆయన, నేను మరియు నా భార్య బల్లయొద్ద కూర్చొనియున్నాము. అతడు నన్ను చూచుటకు ముందుకు జరిగెను… "మేమిద్దరము ఆరిజోనా వాసులము. ఇక్కడ మనము జీవించుచున్నాము, మన పరిపాలక సంస్థ, మన వర్డు, మన మేయరు, మరియు గవర్నరు అందరినీ మన మెరుగుదుము కదా," అని అన్నాను.
"అవును" అని జవాబిచ్చెను.
"సహోదరుడా, ఇప్పుడు నీవు వెళ్ళి మన విందునకు ఆరిజోనా రాష్ట్ర గవర్నరు పేరున సంతకము చేయమని చెప్పినచో, నీవు వెళ్ళి అలాగే సంతకము చేసెదనా? ఆలాగు చేసినచో వారు స్వీకరించుదురా" అనడిగాను.
"వారు స్వీకరించరనుకొంటాను. ఎందుకు యేసు అది చెప్పెను?" అనడిగాడు.
"అది ఇదే, చూచారా. ఎందుకు? ఆరిజోనా రాష్ట్ర గవర్నరు పేరున ఈ విందునకు సంతకము చేయమని నేను నీకు చెప్పినచో, ఆరిజోనా పౌరులమగు మనము గవర్నరు ఎవరో ఎరుగుదుము. సామ్ గొడ్దార్డ్ మీద నీవు సంతకము చేయుటను ఎరుగుదువు, చూచారా, ఎందుకనగా ఆయనే రాష్ట్ర గవర్నరు. అప్పుడు నేను నిన్ను ప్రశ్నించను. గవర్నరు ఎవరో నీవెరుగుదువు. 'తండ్రి. కుమార, పరిశుద్దాత్మ' అని ఆయన చెప్పినప్పుడు వారెట్లు బాప్తిస్మమిచ్పుదురో ఆయనకు తెలియును. ఆయనెవరైయుండెనో వారెరుగుదురు. 'నా గొర్రెలు నా స్వరము వినును' అని చెప్పాను, చూచారా."
"ఓ, ఆలాగా" అని చెప్పెను. "కాని ఇప్పుడు మరో సంగతి, నీవు నమ్ముదువా, చూడండి? "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు." ఈ క్రొత్త జీవము నీలో నివసించినప్పుడు, అదే శక్తి.
ACTS 19:2
70వారు పెంతెకోస్తునాడు పొందిన పరిశుద్దాత్మ నీవు పొందినప్పుడు, వారు పెంతకోస్తున పొందిన… వారు యంత్రములు; ఇప్పుడు చలన శక్తి వచ్చెను. వారు నమ్మిరి. మనము నమ్మినప్పుడే దానిని పొందియున్నామని మన మంచి బాప్టిస్టు స్నేహితులు చెప్పుట మీరు ఎరుగుదురు. కాని, వారు దానిని కలిగిలేరు, అయినను వారు నమ్మిరి.
అపొ.కా., 19ని వారు విశ్వసించిరి, కానీ పొందలేదు. "విశ్వాసించినప్పటి నుండి మీరు పరిశుద్దాత్మ పొందిరా?" చూడండి? వారు యంత్రములను, అనగా యేసే క్రీస్తుని వారికి రుజువు చేయుచుండెను, కాని ఇంకనూ వారు చలింపచేయు శక్తిని పొందలేదు, చూచారా. అదే. సరే.
[టేపు పై ఖాళి కలదు.] మీరు సంచకరువును కలిగియుండి ఎదురు చూచుచున్నారు.
ఆ చలింపచేయు శక్తిని పొందినప్పుడు, మీరు మర్త్యత నుండి అమర్త్యత లోనికి జీవించుచున్నాము. మన కౌన్సిల్ను, మన వార్డును, మన మేయరును, లేపబడుదురు. అది శరీరము యావత్తు వాక్యమును లోబడునట్లుగా చేయును. అది నీవు వేరుగా పని చేయునట్లు చేయును.
EPH 2:1
71ఇప్పుడు చూడండి. [టేపు పై ఖాళి కలదు.] లేపబడియున్నారు. "పాపము లోను అతిక్రమములోను, అంధకారములోను మునుపు చనిపోయిన మిమ్మును ఆయన బ్రదికించెను." దేని ద్వారా? మృతులలో నుండి యేసును ఈస్టరు ఉదయమున లేపిన ఆయన ఆత్మ ద్వారానే. అది మీ మర్త్య-శరీరములో ఉన్నట్లయితే (ఇప్పుడు గమనించండి), అది జీవింపచేయును, జీవమునకు తెచ్చును, వాక్యమునకు లోబడునట్లు చేయును.
ఇప్పుడు ఆ ఆత్మను కలిగియున్నానని చెప్పి నిన్నునీవు వాక్యము నుండి దూరముగా ఎట్లు ఉంచుకొనగలవు? నీవు మరేదో దాని దగ్గర లేపబడి యున్నావు. ఎందుకనగా అది మీ మర్త్య-శరీరములను వాక్యమునకు లేపును. నిశ్చయంగా, అది చేయును.
అది లేకుండా నీవు పరిగిడలేవు. అదంతయూ నీవు నమ్మినచో తూలి అవతల పడెదవు. నీవు సగము ఇంధనము, సగము నీరు యున్నచో నీవెక్కడికిని వేళ్ళలేవు, చూచారా. నీవు వందశాతం ఇంధనమే తీసుకొవలెను, లేనిచో నీవు బుస్సు మని శక్తి విహీనమగుదువు, చూచారా. "మంచిది, నేను ఇది నమ్ముదును, అది నమ్మను," అయితే నీవు ఎక్కడికి వెళ్ళలేవు.
కానీ నీవా సంపూర్ణతను స్వీకరించినప్పుడు! అదే వెలిగించబడనిమ్ము! ప్రతి మాట సత్యము.
72మనం ముగించుచుండగా, ఇది గమనించండి. అది భూమిలో పడిన చిన్న గింజవలె యున్నది. మీరు పునరుత్థానము పొందితిరి. మీరు మీ లోనికి పరిశుద్దాత్మను పొందినప్పుడు, మీరు పునరుత్థానులయిరి. అప్పుడే మీరు పునరుత్థానము పొందితిరి. మీ శరీరము పునరుత్థానము పొందెను.
ఒక చిన్న గింజ భూమిలో పాతిపెట్టబడుట చూడండి. అది ఆయన ప్రవాహములో నుండియే, అనగా, జలములు క్రుమ్మరించబడినప్పుడు త్రాగవలసియున్నది, అది త్రాగుచుండగా ఆయనవైపే కదలివచ్చును. భూమిలోనికి వెళ్ళిన ఆ గింజవలెనె, ఆ రూపములోనే వచ్చుచుండును, చూచారా.
సంఘము ఆ విధముగానే వచ్చును, నీతీకరణము ద్వారా, శుద్దీకరణము, పరిశుద్దాత్మ బాప్తిస్మము గుండా వచ్చి, ఇప్పుడు వికసించుచున్నది, చూచారా. ఆ విధముగానే దేవుని ఆత్మ వచ్చును.
ఆ రీతిగానే క్రీస్తువిరోధి ఆత్మ కూడా వచ్చి, ఇప్పుడు లోకములో ఒక గొప్ప సంఘ సమాఖ్యగా వికసించుచున్నది. దానంతటిని చూచారా.
HEB 13:8
73మరి వ్యక్తిగతముగా కూడా ఆలాగే వచ్చును. ప్రతిదియు దేవుని యొక్క అదే కొలబద్ద ప్రకారము పని చేయును, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. గమనించండి, పునరుత్థాన సంపూర్ణతలోనికి మీరు ఎదుగుటకు ఆత్మ ద్వారా నడిపించబడుడి.
దేవుని ఊటలో నుండి త్రాగిన మొక్కను సూర్యుడు లాగుచున్న రీతిగానే… చూచారా, అది ఒక్కదాని నుండి మాత్రమే త్రాగగలదు. నీవు ఒకసారి ఆ చిన్న విత్తనముపై నూనె పోసి చూడు — అది చచ్చును. నిజము. నిలువ నీరు, పాతనీరు దానిమీద పోసినచో, దానికి క్రీడు కలుగును, అది కలుషితమగును, దాని ఎదుగుదలను ఆపును. అది ఫలించదు. నిజమే కదా? కానీ మీరు నిజమయిన చక్కని వర్షపు నీరును పోయండి, ఆమేన్, అందులో ఏ మానవ-కల్పిత రసాయనములు లేవు. పైనున్న ఆకాశము నుండి దానిని పడనీయండి - అప్పుడు ఆ మొక్కను గమనించండి. ఆ వర్షపు నీరునకు ఎదిగినట్లుగా మరి ఏ నీటికి ఎదుగును. క్లోరీను, ఇంకా ఏవేవో మాకు వేసినట్లుగా నీటిలో కలిపి దానికి పోసినచో, అది ఆ మొక్కను చంపునని మొదట నీవు తెలిసికొందువు.
74ఈనాడు అదే సంగతి. వారు శాఖా-ప్రవాహములు నుండి జలములను ఇవ్వవలెనని, ప్రయత్నించుచున్నారు. అది ఎదుగుదలను ఆపును, చూచారా. కానీ దానిని వర్షపు….
కృపా హిమబిందువులు మెరుయుచున్న చోటికి రమ్ము;
దివారాత్రులు నా చుట్టూ ప్రకాశించుము,
లోకమునకు వెలుగైయున్న యేసూ!
(అప్పుడు అది నీవు పొందెదవు.)
మనము వెలుగులో నడతుము, అందమగు వెలుగు,
కృపా హిమబిందువులు మెరుయుచున్న చోటికీ వచ్చును;
నా చుట్టూ ప్రకాశించుము…
నా యొద్దనుండి ఈ మానవ-నిర్మిత ఊటలను తీసివేయుము! "మరి ఏ ఇతర ప్రవాహము నేనెరుగును; కేవలము యేసు రక్తము తప్ప! నేను ఆ ఊటను గూర్చి మాత్రమే తెలిసికొన గోరుచున్నాను. ప్రభువా, వాక్యము నాలో నివసించనిమ్ము. నీ ఆత్మతో దానికి నీరు కట్టుము.
75గమనించండి, ఇప్పుడు, యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించుచున్నచో, మీరు జీవమును నిండుగా కలిగియుందురు; వాక్యమును నమ్ముటకు ఆత్మ జీవింపచేయబడి నడిపించబడుదురు. ఎదుగుచుండగా ఆ చిన్న జీవము పైకి వెళ్ళుచుండును.
గమనించండి, పెంతెకోస్తునాడు వారి శరీరములు ఒక క్రొత్త జీవమునకు లేపబడినవి. చిన్న పిరికి గుంపును చూడండి. (ఎక్కువసేపు నేను మిమ్మునుంచుచున్నానా? చూడండి, నాకిప్పుడు వేడి కలిగినది, అంతే, మంచిగా అనుభూతి చెందుచున్నాను. ఓ, మై!)
ACTS 2:14,15,17
76గమనించండి, వారు పిరికివారు. గమనించండి. కాని, వారికి యంత్రములు లేవు చూచారా? అయిననూ వారందరూ ఆ వెనుక నిలబడి, "ఓ, వారికి నేను భయపడుచున్నాను. నేను బయటకు వెళ్ళి చెప్పుటకు భయపడుచున్నాను, ఎందుకనగా, ఓ! వారందరూ పెద్ద బిషప్పులు. ఓ! నేను భయపడుచున్నాను. వారందరూ యాజకులు, నేను చెప్పుటకు భయపడుచున్నాను, ఆయనయందు విశ్వాసముంచానని చెప్పుటకు భయపడుచున్నాను. ఓ! నేనది మాత్రము చేయజాలను" అనుచున్నారు, మీరు చూచారా."
కానీ, అకస్మాత్తుగా కదిలించు శక్తి వచ్చెను. అవును. అది ఏమి చేసెను? అది వారి అంతరంగ ఆత్మలను నింపుట మాత్రమే కాదు గానీ, వారి యంత్రములను అది కదిలించినది. వారి శరీరములు లేపబడినవి. వారిక పిరికివారుగా ఉండలేదు. వారు తిన్నగా ప్రజలలోనికి వెళ్ళిరి. అవునండి! "యూదయ మనుష్యులారా, యెరుషలేములో నివసించువారలారా!" ఆ కదిలించు శక్తి రాకముందు వారు కేవలము యంత్రములుగానే యుండిరి, చూచారా. "యెరూషలేము నివాసులారా, ఇది మీరు తెలిసికొనుడి, మరియు నా మాటలు వినుడి! మీరనుకొనుచున్నట్లుగా, వీరు మద్యముతో మత్తులు కాలేదు.
"నేను వారిలో ఒకడిని. ఇది అదే! అది ఏమిటో నేను మీకు చూపించెదను. అది లేఖనము. అది ఇదే!
నేనెల్లపుడూ ఈలాగందును, "ఇది అది కానిచో, అది వచ్చువరకు దీనిని పట్టుకొననీయుడి."
"కాదు, ఇది ప్రవక్తయగు యోవేలు ద్వారా పలుకబడినది, 'అంత్యదినములలో ఈలాగు జరుగునని దేవుడు సర్వశరీరుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను.'" చూడండి, యంత్రములలోనికి కదిలిక శక్తి వచ్చినది. ఇక వారెంతమాత్రమూ భయపడలేదు.
77పొడవగు జుట్టును కలిగియున్నందుకు, రంగులు పూసుకొని ముస్తాబగుట మానివేసి నందుకు ఎవరో కొందరు స్త్రీలు నవ్వుదురని మీలో కొ౦దరు భయపడుచున్నారు. లేఖనపూర్వకమగు బాప్తిస్మములో మీ సంఘజనులకు బాప్తిస్మమిచ్చినచో, మీ సంస్థ మిమ్మును త్రోసివేయునని మీలో కొందరు పురుషులు భయపడుచున్నారు. ఆ చలింపచేయు శక్తి వచ్చువరకు మీరు మేడగదిలో తలుపువేసికొని కనిపెట్టవలసియున్నది. అది నిజము.
అది వారిని మార్చెను. అది వారిని లేవనెత్తెను. అది వారిని వేరయిన వారినిగా చేసెను. అప్పటి నుండియూ వారు మారిన ప్రజలయిరి. పిరికి వారుగా ఉండు పాత జీవితము నుండి అది వారిని యూదా గోత్రపు సింహముగా మార్చెను. వారు నిశ్చయముగా హతసాక్షులయిరి, సిలువలకు కొట్టబడిరి, తల-క్రిందులుగా సిలువ వేయబడిరి, కాల్చబడిరి, సింహములు గుహలో త్రోయబడిరి. ఇ౦కా ఏ మాత్రమూ పిరికి వారుగా ఉండలేరు. వారిపై మరణమునకు ఎట్టి విజయము రాలేదు. యంత్రములలో కదిలెడి శక్తి వచ్చెను. అవునండి. అది వారి మర్త్య-శరీరములను జీవింపచేసెను.
78ఇప్పుడు వినండి, ఇక్కడ రుజువు కొరకు మరియొక సంగతి యున్నది. అది వారిని ఎంతగా జీవింపచేసెనో మిరెరుగుదురా? వారు పరలోక స్థలములలోనికి ఎత్తబడిరి. వారి మర్త్య-శరీరములు ఎంతగా ఎత్తబడినవనగా, వారి భాష కూడా మారిపోయెను. అది వారి భాషను లేపెను. ఆలాగు బైబిలు చెప్పుచున్నది. వారి మర్త్య-శరీరములు జీవింపచేయబడినవి, వారి భాష లేపబడినది. వారి ఆలోచనలు లేపబడినవి, వారి ఆత్మలు లేపబడినది. అసలు వారే ఏకముగా పైకి లేపబడిరి! వారు మాట్లాడవలెనని ప్రయత్నించిననూ, మానవ భాషలను ఏ మాత్రము మాట్లాడలేకపోయిరి. దేవుని సన్నిధిలో వారు క్రొత్తభాష మాట్లాడునట్లుగా లేవనెత్తబడిరి. ఒక పరలోక భాష. హూ! ఎటువంటి జీవింపచేయు శక్తి!
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4•
ROM 8:11
79"యేసును మృతులలో నుండి లేపినవాని ఆత్మ మీలో నివసి౦చునయెడల అది మీ మర్త్య-శరీరములను జీవింపజేయును. [ఓ, హల్లెలూయా!] ఇంతకు ముందు నీవు చేయని కార్యములు చేయనట్లుగా చేయును. అప్పుడు వారు పూర్ణ జీవింపచేయు శక్తితో నిండియుండిరి, చూచారా.
ఇక మీదట మీ శరీరము పాపమునకు లోను కాదు, మీ కోరికలు.
"ఇక్కడికి రా" అని వాడు మీతో చెప్పగా.
"నీ నోరు మూయుము" అని మీరందురు."
"ఓ! మాకు అతి పెద్ద…."
"నీ నోరు మూయుము."
ఆహా, ఆ నీవు పక్షిరాజువి! ఒక వృద్ద పక్షిరాజు ఎంత ఠీవిగా నడచునో మీరెన్నడైన చూచారా? ప్రతి చచ్చిన దానిని చూచి రాబందువలె గంతులు వేయదు, చూచారా, భూమిమీద పడియున్న ఆ కళేబరములను చూడదు. లేదండి. అది గర్వముగా నడచును.
"నీ నోరు మూయుము."
"ఓ, ఇక్కడ ఒక మంచి విందుయున్నది."
"నాకు కొరకు కాదు. నా కోరికలు మారిపోయెను. నా ఆకలి వేరుగా నున్నది. 'మనుష్యుడు చచ్చిన [కళేబరము] లోకము వలన మాత్రమే బ్రదుకడు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన బ్రదుకును." ఒక అసలయిన పైకి లేపబడిన పక్షిరాజు దాని వలనే జీవించును. ఆమేన్!
80ఆయన సమాధిలో నుండి క్రీస్తును లేపెను, ఆయన మీలో నివసించినప్పుడు మీ మర్త్య-శరీరములను ఆయన సన్నిధిలోనికి జీవింపచేసెను. దానిని మీరు గుర్తించెదరు. నీవు ఇక మీదట పారిశుధ్య పనివాడవు [రాబందువు] కాదు గానీ; నీవు ఒక పక్షిరాజువు. లోకపు సంగతుల నీవు కోరవు. నీవు దేవుని యొక్క కుమారునివి - కుమార్తెవు. లోకమునకు తెలియని నీటి ప్రవాహము యొద్ద నీవు సేదదీర్చుకొందువు. నీవు త్రాగుచున్న ఆ నీరు గూర్చి లోకమునకు ఏమీ తెలియదు. లోకమునకు ఎన్నడూ తెలియని మరుగైన మన్నాను నీవు తిందువు, ఎందుకనగా నీవు పక్షిరాజువు. దానిని నీవు అందుకొన కలిగిన రీతిగా లేపబడితివి. నీవు ఈ క్రిందకి చూడవు గాని పైకి చూచెదవు. నీవు పైకి లేపబడవలసియున్నావు, అక్కడికి లేపబడవలెను, ఆలాగు అది లేపును.
REV 12:11
81వారేమి చేసిరి? వారు మరియొక భాషలో మాట్లాడిరి. వారాలాగు చేసిరని బైబిలు చెప్పెను. ఆకాశము క్రిందనున్న ప్రతి భాషలోను వారు మాట్లాడిరి.
దానిని మీరు ఊహించగలరా? అక్కడుండిన ఆ మర్త్య-శరీరములు ఇట్లు పలికెను, "ఇది నమ్మవలెనో లేదో నాకిప్పుడు అర్ధము అగుట లేదు?"
అకస్మాత్తుగా వారు యూదా గోత్రపు సింహము వంటి ధైర్యము లేవనెత్తబడిరి వారిపై పడినది, ఆ అల్లాడు పనపై. ఓ, ఆ పక్షిరాజు తన స్వకీయులను పిలచుటకు వచ్చెను. "వారు మరణవరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు." ఆమేన్.
తమ జీవిత రక్తమును ధారపోయు వారు ఇంకా ఎందరో యున్నారు. ఎందుకనగా ఇది పరిశుద్దాత్మ సువార్త దాని యొక్క ఎర్రని ప్రవాహము.
చివరి దినములలో కుమారుడు మరలా వధువులో ప్రత్యక్షమవ్వవలిసి యున్నాడు. ఒక జీవింపజేయు శక్తి రావలసియున్నది, ఈ చచ్చిన శాఖల నుండి, మత సిద్దాంతముల నుండి, లేపబడి సజీవ దేవుని యొక్క సజీవవాక్యము లోనికి జీవింపచేయుటకు. ఓ!
82కాదు, అది వారిని నూతన జీవములోనికి లేవనెత్తెను. ఇప్పుడది మనకును అదే చేయుచున్నది. గమనించండి, అప్పుడు వారు ఆ జీవింపజేయు శక్తితో అంతగా లేపబడిరి. (ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను మీకు చూపించ ప్రయత్ని౦చుచున్నాను.), జీవింపజేయు శక్తి కేవలం వారి ఆత్మలో యుండుటయే గాక, వారిలో మొత్తము యుండెను. అది జీవింపజేయుటకు కదిలించు శక్తి వచ్చుటయే కాదు గాని, అది యంత్రములను కదిలించెను. నా భావము మీకు అర్థమయినదా?
వారి నాలుకలు మరొక భాషలో మాట్లాడునంతగా వారు పైకి లేపబడిరి. తమ చేతులుంచి ప్రార్ధి౦చగలుగునట్లుగా క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తితో వారు లేపబడిరి… వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు బాగవునంత పునరుత్థాన శక్తితో లేపబడిరి. అది మీ మర్త్య-శరీరములను జీవింపజేయును. వారి చేతలుంచుట వలన స్వస్థత పొందిరి.
83దేవునితో వారి సహావాసమును ఆత్మ లేవనెత్తెను. ఒక వ్యక్తి చనిపోయి ఆ ఆత్మ వెదలిపోగా, ఆ వ్యక్తిని కూడా తిరిగి జీవింపచేయనంతగా దేవుని సన్నిధిలో పునరుత్థాన శక్తి ఎత్తబడిరి. ఆమేన్! మహిమ! నాకు ఎంతో భక్తిపరమైన అనుభూతి కలుగుచున్నది.
అది నిజము, జీవింపజేయబడెను! పునరుత్థానము ఆయనకు మాత్రమే కాక, ఇచ్చయించు వారందరికి, అక్కడ పడియుండిన ముందు నిర్ణయించబడిన విత్తనములన్నింటికి. మర్త్య-శరీరమును జేవింపచేయును!
వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు బాగయిరి. వారు ఆత్మలో ప్రార్ధించిరి, దర్శనములను చూచిరి, చచ్చిన వారిని తిరిగి బ్రదికించిరి. అది నిజము. వారి మర్య-శరీరములను బ్రదికించెను.
ఆది నీలోనికి వచ్చియున్నచో, అది ఆలాగయినచో… ఇప్పుడు, నీవును దానిని ఆలాగు చెప్పగలవు; కానీ అది ఆలాగయినచో, ఈ సూచనలు వారిని వెంబడించును, మీరు చూచారా. అది మీ మర్త్య-శరీరమును జీవింపజేయును. అది నిన్ను జీవింపజేయును.
ఇప్పుడు గమనించండి, దేవుని సన్నిధిలోనికి జీవము పొందియున్నావు. ఎందువలన? యేసును సమాధిలో నుండి లేవనేట్టినది దేవుని ఆత్మయే. దేవుని ఆత్మ… "నేను వారికి నిత్యజీవము ఇచ్చుచున్నాను." మీరు చూచినచో, అది "జో" అను గ్రీకు పదము నుండి వచ్చెను. అది నీ గుండా సంచరించి మరియు వారిని వారి మనస్సులను సహితము లేవనెత్తును.
JOHN 10:27
84ఇప్పుడు చుడండి. నీవు సరిగా యున్నది అని తలంచుచున్న ప్రతిదియు నీవు చేయుచున్నావు గదా, నీలో ఆత్మ నివసించుచున్నదని ఎట్లు చెప్పగలవు? అది నీవు పొందియున్నావో లేదో తెలుసుకొనుటకు రుజువున్నది. క్రీస్తులోనున్న ఆత్మ నీలో యున్నచో, అది నిన్ను వాక్యమునకు జీవింపజేయును, ఎందుకనగా ఆయనే వాక్యము. అది అందుకు వ్యతిరేకముగా నున్నచో, వాక్యము నుండి అవతలకు నిన్ను లేపును, అప్పుడు అది క్రీస్తు యొక్క ఆత్మ కాదు! అది నిన్ను వాక్యములో కదిపితేనే గానీ, నీవేమి చేసిన నేను లెక్క చేయను. "నా గొర్రెలు నా స్వరము వినును. వారు ప్రతిమాట వలనను జీవించెదరు." ప్రతి మాట! దాని గురించి నేను మరుసటి రోజున మాట్లాడుచు౦టిని.
85నా ముసలి తల్లి, ఇప్పుడు వెళ్ళిపోయినది, ఆమె చాలా వింత స్త్రీ. ఆమె సగం ఇండియను అయినందువల్ల ఆ విధంగా ఉండేనని మీరెరుగుదురు. ఆమె ఎప్పుడూ కలలు కనేది కాదు. ఆమె జీవితమంతటిలో నాలుగయిదు కలలు మాత్రమే కన్నది. కానీ ఆమె కనిన ప్రతికల సత్యమే. ఆమెకు కల వచ్చినచో; అది వాస్తవము.
చాలా సంవత్సరముల క్రితం ఒక సంగతి గుర్తున్నది, అప్పుడు నేను బోధించుట ప్రారంభించాను. ఇక్కడికి ఎగువన ఉన్న రోడ్డు యొద్ద మేము నివసించుచున్నాము. నేను ఈ సంఘములోనే బోధించుచున్నాను. మూడు మెట్ల ప్రక్కన నేను నిలబడియున్నట్లుగా, ఆమె కల కన్నది. వారు రాజమార్గములోనికి వెళ్ళు ముందుగా తప్పనిసరిగా ఈ మూడు మెట్లను ప్రతివారు తాకునట్లుగా నేను బోధించుచున్నాను. ఆ రాజమార్గము మీద ఒక చిన్న ముత్యమువలెనున్న తెల్లని వరుస, పరలోక ద్వారములోనికి వెళ్ళుచున్నది. అవి ముత్యముల గుమ్మములు. ఈ మెట్లకు పైగా ఆ ముత్యములు పరచబడినది. అది సరిగ్గా నేటి నా వర్తమానము కాదా: నీతీకరణము, శుద్దీకరణము, పరిశుద్దాత్మ బాప్తిస్మము. ఆ రాజమార్గములో నడువవలెనన్నచో, - ఈ మూడు మెట్ల ద్వారానే ఒక వ్యక్తి రావలసి యుండునని నేను చెప్పుచున్నాను.
ISA 3:16
86ఒక స్త్రీ వచ్చెనని చెప్పెను. ముప్పది-అయిదు సంవత్సరాల క్రితం ఎటువంటి చెప్పులు ప్రజలు వేసికొన్నారో మీకు తెలియును. ఒక స్త్రీ వచ్చినది, ఈనాడు వారు వేసికొనుచున్న సన్నని మొనలుగల ఎత్తు జోళ్ళు పెద్దవి వేసికొనియున్నది. ఆమె దగ్గరకు రాగా, నేనిట్లు చెప్పాను "ఒక్క నిమిషం ఆగుము సోదరీ, దానితో నీవు ఆ రాజబాటలో నడువలేవు. నీవది చేయజాలవు."
ఆమె ఇట్లన్నది, "హు!" అని ఆ తక్కిన స్త్రీలందరి వైపు చూస్తూ, ఇట్లు చెప్పినది, "అతని మాటలు నమ్మకండి. అతడు పిచ్చివాడు, చూచారా. అతడిని నమ్మకండి. నేను నీతిమంతురాలిగా తీర్చబడి, శుద్దీకరించబడి, పరిశుద్దాత్మతో నింపబడియు ఆ విధమగు జోళ్ళతో ఎట్లు నడువగలనో చూపించెదను." నేను ఆమెను అలాగే పోనిచ్చాను. ఆమె అంత కంటె ఏమి చేయలేకపోయాను, ఆమెను ఆపలేకపోయాను. ఆమె రహదారి మార్గములోనికి పోయినది. ఆమె సోదరి వైపు చూచి ఇట్లన్నది, "చూచారా, నేను చెప్పాను గదా." ఆ విధముగా అనుకొంటూ ఆమె పరుగిడుతున్నది, మరియు ఆమె…
యెషయా 5వ అధ్యాయంలో బైబిల్ ఏమి చెప్పెనో మీరెరుగుదురు, వారు "మెడ చాచి నడచువారు." వారు అలాగే యుండవలసి యున్నారు, వారు దాటిపోయారు, చూడండి. తమ ఎత్తు జోళ్ళతో త్రిప్పుకొంటూ నడుచుచున్నారు, వంకరలు తిరుగుదురు." చూచారా, చివరి దినములలో సియోను కుమారైలు."
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4
87ఆమె రాజమార్గములో తన శక్తి అంతటితో పరుగిడ నారంభించెను. కొంతసేపటికి ఆ మార్గము సన్నగా ఇరుకుగా అయిపోవుచున్నది. ఆమె మెలికలు తిరుగుచూ, ఆ విధంగా వంకరులు తిరిగిపోయి, దారి బయటకు వెళ్ళిపోయినది.
అమ్మ ఇంకా నాతో ఇట్లనెను, "ఆమె ఆ మంటలు, పొగలలోనికి ఆ విధంగా దిగిపోతూ, పడిపోవుచూ, భయంకరముగా కేకలు వేసినది. నా జీవితంలో అంత భయంకర కేకలును ఎన్నడూ వినలేదు."
అప్పుడు నేను ఆమె వైపు తిరిగి "చూచావా?" అనడిగాను.
ఆమె ఒక్క మాట తప్ప అంతటికి లోబడినది, చూచారా, ఒక్క మాట తప్ప సమస్తమూ నిశ్చయంగా, పెంతెకోస్తు స్త్రీలు రక్షింపబడి, శుద్దీకరించబడి, పరిశుద్దాత్మతో నింపబడి యుండవచ్చును; అయినా గానీ తప్పిపోదురు. ఏ సందేహము లేదు! "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గానీ, దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును.." చూడండి? చూచారా? ఆమె దానిని తప్పిపోయినది. నేను చెప్పినట్లుగా, చూచారా, ఆమె అందులోనికి సరిగానే వెళ్ళినది, కాని చూచారా, ఆమె వినుటలో తప్పిపోయినది — ముందు ఏమున్నదో ఆమెకు చెప్పాను. ఆయన సువార్తను శిష్యుల ద్వారా, అపోస్తలుల ద్వారా వ్రాయించెను. అపోస్తలుల, ప్రవక్తలు యొక్క బోధ మరియు మొదలగునవి వారు వినరు.
88ఇప్పుడు, జీవిమ్పజేయు శక్తిని గమనించండి. జో, అనగా, నిత్యజీవము - వాక్యమును తీసికొని వచ్చుచున్నది. అప్పుడు క్రీస్తులో యుండిన మనసు మీలో యుండును. దేవుడు యేసును మృతులలో నుండి లేపినప్పుడు మిమ్మును కూడా ఆయన లేపెను. ఆయనతో పాటు జీవములోనికి మిమ్మును బ్రతికించెను. అదే మీకు చూపించుటకు ప్రయత్నించుచున్నాను… ఇప్పుడు మీరు జీవమునకు లేపబడియున్నారు, అప్పుడు మీరు ఆయన తలంపులలో ఒక గుణలక్షణముగా యున్ననూ, దేవుడు ఆయనయందు సమాప్తి ఆగుట కూడా చూచెను, చూచారా. దేవుడు శరీరమును చూచినప్పుడు…
గెత్సెమనె తోటలో ఆత్మ ఆయనను విడిచిపెట్టెను. ఒక మానవునిగా ఆయన మరణించవలసి వచ్చెను. స్నేహితులారా, గుర్తుంచుకొనండి, ఆయన అలాగు చేయనవసరం లేదు. ఆయన దేవుడు. ఆ మానవశరీరమును దేవుడు అభిషేకించెను. ఆయన ఆ స్థలమునకు దేవునిగా వెళ్ళి యుండినచో, ఆయన అలాంటి మరణమును మరణించవలసి లేకుండెను — దేవునిని చంపలేరు. కానీ ఆయన ఆ విధంగా చేయవలసిలేడు.
కానీ గుర్తుంచుకొనండి, ఆయనలో నీవున్నావు గనుక, నీతో ఆయన అక్కడికి వెళ్ళెన. చూచారా, దేవుడు వధువును పెండ్లికుమారుని నుండి ఇంకా విడదీయుట జరుగలేదు. కనుక దేవుడు క్రీస్తు యొక్క శరీరమును చూచినప్పుడు, ఆయన స్త్రీ పురుషులు ఇరువురిని చూచెను. ఆ ఒక్క శరీరములోనే ఆయన వారిద్దరిని విమోచించెను, చూచారా. వారు ఒక్కటే — అదే వాక్యము.పెండ్లికుమారుని గూర్చి పలికిన ఆ వాక్యమే వధువును గూర్చియు పలికెను.
89మంచిది, ఆయనను గూర్చి వాగ్దానము చేయబడిన సమస్తమును వధువు ప్రత్యక్షపరచుటలో విఫలమగుట ఎలాగు జరుగును? పెండ్లికుమారుడు వచ్చును. ఆయన వధువుగా ఉండడు కదా? కాని ఆయన సమస్తము జరిగించెను. ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా దానిని రుజువు చేసెను. ఆ తరువాత వధువుయు అదే చేయవలసియున్నది. చివరి దినములలో ఏమి చేయునని ఆయన వధువును గూర్చి చెప్పెనో, సరిగ్గా అదే ఆమె చేయవలసిలేదా? మలాకీ 4 ద్వారా ఆమె మరలి రావలసి లేదా?సొదొమ దినములవలెనే ప్రత్యక్షపరచబడవలసి లేదా? లోకము మరియు సమస్తము అవి ఏ విధముగా ఉండునని చెప్పబడెనో, ఆ విధముగా ఉండవలసిలేవా? మనకు దేవుని వాక్యము బయలుపరచబడినదని తెలియచెప్పుటకు, ఈ సంగతులన్నియూ పరిపూర్ణ గుర్తింపు కావా?
మంచిది, స్నేహితులారా, నేనెక్కువసేపు మిమ్మునుంచానని తెలియును, ఇంకా భోజనమునకు పదిహేను నిమిషములున్నవి. అప్పటికి ముగించుదునని తలంచుచున్నాను. కానీ గమనించండి, ఇటువైపు చూడండి, అదెంత పరిపూర్ణమగు సంగతి. మరల ఎప్పుడు మిమ్మును చూచుదునో, నాకు తెలియదు, చూసారా.
90చూడండి, దీనిని గమనించండి. కానీ దేవుడు వధువును ముందుగానే పెండ్లికుమారునిలో చూచెను. హల్లెలూయా! చూచారా, ఆదామువలే తన భార్యను రక్షించుకొనుటకు ఆయన ఆమెతో వెళ్ళవలసి యుండెను. ఆదాము తాను చేయుచున్న దానిని ఎరుగును. హవ్వ తానేమి చేయుచున్నదో ఎరుగదు. కాని ఆదాము తన భార్యతో కూడా నడిచెను, చూచారా. యేసు తన భార్య స్థానమును తీసికొని ఆమె కొరకు పాపమాయెను. గుర్తుంచుకొనండి, ఆయన నీవుగా మారెను. నీవు ఆయన స్థానములో నిలబడునట్లుగా, ఆయన నీ శిక్షను భరించెను. ఆయన చోటులో నీవు నిలబడునట్లుగా, నీ చోటులో ఆయన నిలబడెను. ఎంత ప్రేమ! ఎంత గొప్ప సహవాసము! దానినెట్లు మనము తిరస్కరించుదుము? స్నేహితుడా, ఆయనను ప్రేమించుట తప్ప మరేమి చేయగలము? దాని మీద నేను గంటలకొలది చెప్పగలను, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళుదము.
91నేడు పెంతెకోస్తు అనుభవమువలె, అంత్యదినములలో పరిశుద్దాత్మ వచ్చునని వాగ్దానము చేయబడినట్లుగా, అది అసలు కార్యమునకు ముందు బయానా.
ఇప్పుడు, నీవు ఒక బిరుదును పొందవచ్చును. నిశ్చయంగా. చూచారా, ఒక స్థలమునకు నీవు కొంత బయానా చెల్లించి యుండవచ్చును, కాని అది నీదేనని నీవు చెప్పజాలవు. అవునండీ. వెనుకనుండిన ఎవరో వచ్చి దానిని నాదని చెప్పుకొనవచ్చును. కానీ నీవు అసలు పత్రమును దక్కించుకొన్నప్పుడు, దానికి విరోధముగా ఎందరు వచ్చినను మౌనముగా ఉండవలసినదే, అది పునాదినుండియు నీదే అగును. అది నిజమేనా?
వాక్యమును నమ్ముచున్నానని ఒక వ్యక్తి చెప్పుకొనుచున్నప్పుడు, అప్పుడు పరిశుద్దాత్మ వచ్చినచో, అది ఆ కార్యమునకు అసలు పత్రమువంటిదగును. ఆ మూలపత్రము నీవు కలిగియున్నప్పుడు, దానియొక్క యావత్తు నీకే చెందుననియు, దాని మీదనున్న ప్రతిదియు నీదే అగుననీయు, అది నీకు అనుమతి ఇచ్చును. ఆమేన్! అది మనకు మూలహక్కునిచ్చును. ఈ పేరు పెట్టబడిన దానిమీదకి పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, దేవుడు దానిని జగత్తుపునాది వేయబడక ముందే చూచి జీవగ్రంధమందు పేరు వ్రాసెను. కానీ స్త్రీ-పురుష సంపర్కము వలన జన్మించి, పాపమునకు లోబడి పాపభరితులమైతిమి. కానీ నేను దానిని నమ్మినప్పుడు, ఆ అసలు దానిని నేను పొందినట్లే; అయితే పరిశుద్దాత్మ వచ్చినప్పుడు నాకు మూలహక్కు వచ్చును. నాకు విరోధముగానున్న ప్రతి దానిని, అనగా, అది నా తల్లి చేసినా, తండ్రి చేసినా, నా తాత చేసినా గాని కొట్టివేయబడును…
కొద్ది నిమిషముల క్రితం ఒక మూర్చ బాలునికి నేను ప్రార్ధించాను. అది అతనికి తాత నుండి సంక్రమించినది, ఆ రోగము బాలుని మీద పడినది అని నేను చెప్పాను.
92ఆలాగే ఇదియున్నది, కానీ ఆ మూలహక్కు వచ్చినప్పుడు, అది సమస్తమును చెరిపివేయును, కొట్టివేయును. అప్పుడు నేను మూలహక్కును పొందినవానినగుదును. ఆమేన్! ఆత్మ క్రీస్తును మృతులలో నుండి లేపినంత ఖచ్చితముగా, నేనాయన శరీరములో భాగమన్న మూలహక్కును కలిగియున్నాను. పరిశుద్దాత్మ అను ఆ మూలహక్కుతో ఆ వాక్యశరీరము జీవించినది. అంత్యదినమున వాగ్దానము చేసినట్లుగానే, ఆయనలో సరిగ్గా ఆలాగే అదీ జరిగినది. మూల హక్కు నా పాపములన్నియూ కొట్టివేయబడినవి. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపములన్నియూ కొట్టివేయబడినవి. బయానా చెల్లించిన దానికి మూలహక్కును ఇచ్చినట్లుగా, పరిశుద్దాత్మ వచ్చెను. దేవుడు తన ముందు జ్ఞానమును బట్టి కృప ద్వారా దానిని అనుగ్రహించెను. ఓ, మై!
MARK 16:17•
REV 1:17,18
93నీవు దేనిగూర్చి భయపడుచున్నావు? ఆయన ఈలాగు చెప్పుటలో ఆశ్చర్యంలేదు. "భయపడకుడి; ఇదిగో నేను మృతుడనైతిని గానీ సదాకాలము జీవించుచునేయున్నాను; పాతాళముయొక్కయు, మరణముయొక్కయు తాళపు చెవులు నేను కలిగియున్నాను." దేని గూర్చియు భయపడవద్దు, మరణము కూడా నిన్ను బాధించజాలదు. గమనించండి. ఎంత సుందరము!
ఇప్పుడు త్వరగా వెళ్ళుదము. మూలహక్కు. అప్పు తీరినది. దానికి విరోధముగానున్న ప్రతిదియు కొట్టివేయబడినది. మహిమ! నేను చిలిపిగా ప్రవర్తించవచ్చును, కాని నాకెంతో బాగున్నది. లేదు, చూచారా? ఓ, ఒక మూలహక్కు. దాని అర్థమేమిటో మీరు గ్రహించారా? సోదరుడా, దాని అర్థము ఏమిటో గ్రహించావా? నీ యొద్దనుండి ఏదియూ దానిని తీసివేయజాలదు. ఆమేన్. నేను దాని స్వంతదారుడ్ని. ఆమేన్.
ఏమి హక్కు? ఆయన మరణము, సమాధి, పునరుత్థానముల వలన వచ్చు ఈవులను నేను సొమ్ముచేసికొన్నాను. ఆయన నేనుగా మారెను, నేను ఆయనను అగునట్లుగా ఇది చేసెను. నేను కుమారుని అగునట్లుగా ఆయన పాపమాయెను, ఆమేన్, ఆయన యొక్క అసలు హక్కును నేను పట్టుకొని యున్నాను. "నమ్మువారివలన ఈ సూచక క్రియలు కనబడును." చూచారా, అసలు హక్కు.
ఇప్పుడు తొందరగా… ఇంకా మనకు పది నిమిషములున్నవి.
ACTS 7:51,52,56-59
94ఆత్మ యొక్క జీవింపజేయు శక్తిని గూర్చి త్వరగా మనము గుమనించుదము. మికు అర్థమగునట్లుగా నేను కొన్ని సూచనలను మీకు చూపించగోరుచున్నాను. చూడండి, ఇప్పుడు గమనించండి, ఈ "జీవింపజేయు శక్తి" అనునదే నా అంశము. కుమారుడు లేచిన తరువాత, పెంతెకోస్తు దినమున అది వారిపై ఎట్టి విధంగా పనిచేసెనో చూడండి. అది వారికి ఏమి చేసెను, ఆ జీవింపచేయు శక్తి వారికి ఏమి చేసెను? అది వారిని బ్రతికించెను.
అది సైఫనుకు ఏమి చేసెనో ఇప్పుడు మనము గమనించుదము. సైఫను పూర్తిగా జీవపు శక్తితో నిండియుండెను. అది నిజం కాదా? చూడండి, అతడు జీవింపచేయు శక్తితో నిండియుండెను. అది అతనిని భయపడునట్లు చేయలేదు. "హృదయమందును, చెవులలోను సున్నతి లేక మెడవంచని వారలారా. మీరెల్లపుడూ పరిశుద్దాత్మను ఎదిరించుచున్నారు: మీ పితరుల వలెనె మీరును చేయుచున్నారు. నీతిమంతుడగు ఆయన రాకను గూర్చి చూపించిన ప్రవక్తలను మీ తండ్రులు రాళ్ళతో కొట్టి చంపలేదా?" ఓ, అతనికి అది ఎదో చేసెను. నిశ్చయంగా, అతడు జీవింపజేయు శక్తితో నిండి యుండెను.
"వీడిని మనము వదిలించుకొందుము" అని వారు చెప్పిరి.
అతడు చనిపోయినప్పుడు… పైకి తేరి చూచి, "పరలోకము తెరువబడుట చూచుచున్నాను" అని చెప్పెను. వారతని రాళ్ళతో కొట్టి చంపిరి. రాళ్ళు అతనిపై ఆలాగు పడుచున్నవి. జీవింపచేయు శక్తి పనిచేయుచుండెను. "ఆకాశములు తెరువబడుటయు, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడుటయు నాకు కనబడుచున్నది" అని పలికెను. జీవింపచేయు శక్తి సైఫనుకు అదే చేసెను.
ACTS 7:5,7,12,26•
ACTS 8:26,27,38
95గమనించండి. మరో వ్యక్తి ఈ జీవింపజేయు శక్తిని కలిగియుండెను. అతని పేరు ఫిలిప్పు, అతడు సంపూర్తిగా ఈ జీవపు శక్తితో నిండియుండి సమరయలో నొక పెద్దకూటమునకు హాజరయ్యెను. దయ్యములు వెళ్ళగొట్టబడినవి. ప్రజలు యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందిరి, గంభీరమగు కూటమది. ఆత్మ అతనితో మాట్లాడెను. ఓ, కదిలించు శక్తి దిగివచ్చినది. "ఈ ఉజ్జీవమును విడువుము" అని అది చెప్పెను.
కాని సేవకులు ఏమి చెప్పెదరు? వారేమి చెప్పినా అది ఏ మార్పును తీసుకోని రాదు, చూచారా. అతడు జీవింపచేయు శక్తితో నిండుకొనియుండెను. అతనిలో ఇంధనమున్నది, అందులోనికి చలింపజేయు శక్తి పడుచుండెను. "ఎడారిలోనికి వెళ్ళుము" అని చెప్పెను.
అక్కడ ఒక నపుంసకుని కనుగొని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చెను — ఒక్క మనిషే, ఇథియోపియాకు వర్తమానమును కొనిపోయెను. అది నిజమేనా? అతడు దేవునికీ లోబడెను.
దేవునికి లోబడి , నీవెన్నడూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందనిచో, ఇప్పుడే పొందుము, అప్పుడు ఆ జీవింప శక్తి నిన్ను ఏలాగు జీవింపజేయునో గమనించుము, చూచారా.
ACTS 8:39•
ROM 8:11
96స్టెఫను ఈ గొప్ప పనిచేసెను… స్టెఫను కాదు గాని, ఫిలిప్పు ఆ గొప్ప ఉజ్జీవమును విడిచిపెట్టుట అను ఈ గొప్ప పనిచేసి, దేవుని ఆజ్ఞలకు లోబడి, ఈ నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చుట ద్వారా దీనిని అతడు నెరవేర్చెను. అతడు ఆ జీవింపజేయు శక్తితో నిండినవాడై ఎత్తుకొని పోబడెను.
"అది మీ మర్త్య-శరీరములను జీవింపజేయును, యేసును మృతులలో నుండి లేపిన ఈ ఆత్మ…" ఫిలిప్పును ఎత్తికొనిపోయి నూటయాబై మైళ్ళకు పైగా ప్రయాణము చేసి, ఎక్కడో మరొక దేశములో దించెను. అది అతని మర్త్య-శరీరమును లేపుకొనిపోయెను. ఏలాగు అతడు ఇది చేసెను? అతడు అంత నిండుగా ఆ జీవమిచ్చు శక్తితో నింపబడి యుండెను.
GEN 5:23,24•
HEB 11:5
97ఓ, సజీవ దేవుని సంఘమా, ఈనాడు ఇక్కడ మనము ఆ పంచదార-పూత బిళ్ళల మీద పోషించబడుతూ నిలబడజాలము. మనము ఆ జీవపు శక్తితో పూర్తిగా నింపబడి ప్రార్ధి౦చుచుండవలెను. పరిశుద్దాత్మ జీవింపజేయు శక్తి వచ్చు వరకూ అలాగు చేయవలెను. ఒక దినమున మనము రాకడలో ఎత్తబడి అవలకు కొనిపోబడవలెను. అవునండీ! ఆమేన్! ఓ, మై!
ఆ విధముగా వ్యక్తపరచినందుకు క్షమించండి. చిన్నపిల్ల కొరకు అటువంటి చిన్న అప్పములను తయారు చేయు ఒక తల్లిని నేను జ్ఞాపకము చేసికొన్నాను, ఒకప్పుడు, మీలో కొందరు ముసలి తల్లులకు గుర్తుండును. కాఫీ మరియు పంచదార కలిపిన చిన్న పొట్లము వంటి దానిలో పోసి ఏడ్చుచున్న పిల్లలను చల్లబరచుటకు వాటికి చీకించుదురు. దానీతో ఎట్టి బలము లేదు; అది అతనిని చంపును, చూచారా. ఆ పాత కెఫీన్ అను పదార్ధమును ఆ తీపితో పాటుగా వారు లోపలికి మ్రి౦గివేయుచున్నారు.
మనము అటువంటి పదార్ధములతో ఇక విసిగిపోయాము. వెనక్కు రండి — మీరు పక్షిరాజులు — దేవుని వాక్యము నొద్దకు రండి! ధైర్యముగా ఉండండి. ఏదీ మీ భావములను బాధించనేరదు, కాబట్టి మీరు మానవుల యొక్క ప్రతివిధమగు కుంభకోణము నుండి విడుదల పొందారు. మీకు విరోధముగా ఎవరు ఏమి చెప్పిననూ, దాని వలన మరెక్కువ ప్రేమ కలుగును. జీవింపచేయు శక్తి ఆకాశములలోనికి ఎత్తికొనిపోవును. ఒక పక్షిరాజు ఆ కోడిపిల్లల కంటె అవతలకు ఎగిరిపోవును. యేసుక్రీస్తు నందు ఆవలి పరలోక స్థలములకు ఎగిరి వెళ్ళును. ఓ, అది ఫిలిప్పు. మీద ఉండి అతనిని మేల్కొలిపెను, అతనిని ఎత్తికొనిపోయెను.
GEN 5:23,24•
HEB 11:5
98మరియొక మనుష్యుని మనము తీసికొందము. హనోకు అను పేరుగల ఒక మనుష్యుడుండెను. అతడు దేవుని యొక్క ప్రతి మాటతో అయిదువందల సంవత్సరములు నడిచెను, "నేను ఒక్కసారి కూడా ఆయన మాటను తప్పిపోలేదు" అను సాక్ష్యమును అతడు కలిగి యుండెను. అతడు ఎంతగా జీవింపజేయు శక్తిని కలిగి యుండెననగా, ఆ చలింపచేయు శక్తి ఆ యంత్రగతిని తాకినప్పుడు అతడు చనిపోవనవసరము కూడా లేకుండెను. అతడు ఇంటికి కొనిపోబడెను. నడచుట ప్రారంభించెను. అతడు ఎంతో… ఫిలిప్పువలె ఉండెను, అతడు నిండుగా జీవింపజేయు శక్తిని కలిగియుండెను. గాజాకు వెళ్ళుటకు, మరియొక స్థలము మారి వెళ్ళుటకు బదులుగా లేదా ఆలాగు వెళ్ళినచో పై తీరములందు వారతనిని కనుగొని యుందురు. ఆ మార్గమునకు బదులుగా, అతడు ఇట్లనుకొనెను, "ఏలాగయినా నేను వృద్ధుడను. నాకు ఎంతో జీవింపజేయు శక్తి యున్నది గదా! నేను భూమి మీదనుండి పైకి ఎగిరిపోవుదును."
ఇప్పుడు మనము కలిగియున్నది అదే జీవింపజేయు శక్తి. చూచారా, అది మీ మర్త్య-శరీరములను జీవింపజేయును, అది నిజము కాదా? అది జీవింపజేయు శక్తి.
హనోకు అట్టి పరిపూర్ణ సాక్ష్యమును కలిగియుండెను, "దేవుడు నాకు చేయమని చెప్పిన ప్రతిదియూ నేను చేసితిని." అతడు ఎంతో చలింపచేయు శక్తితో నింపబడెను, జీవింపజేయు శక్తి అతనిని తాకినప్పుడు, ఆ యంత్రగతిని తాకినప్పుడు, అది అతనిని పైకి లేపెను. అతడు భూమిమీద నుండి పరలోకమునకు నడిచి వెళ్ళెను.
2KGS 2:11,13
99ఇప్పుడు, ఇప్పుడు ఏలియా గమనించండి! ఆ గొప్ప ప్రవక్త ఏలియాను చూడండి, ఆయన దినమునకు. సోదరుడా, నన్ను క్షమించుము, సోదరీ, ఆ దినమున అతడు రంగులు ముఖమునకు పూసికొని ఆ యొజెబెలులు, ఆహాబులమీద విరుచుకు పడెను. ఎవరునూ అతనితో పాటుగా నిలబడినట్లుగా కనబడదు. అతడు గద్దించెను మరియు నాశనము చేసెను మరియు అక్కడే నిలబడెను, మరియు దేవుడు అతని గూర్చి శ్రద్దవహించెను మరియు ప్రతి స్థలములోను సహాయము చేసెను. మీకు తెలియును, ఒక దినమున ఆ ముసలివాడు అలసిపోయెను. అతడు ఇట్లనుకొనెను, "నేను ముసలివాడినగుచున్నాను, ఇక నేను ముందుకు వెళ్ళలేను." అతడు తొంబది సంవత్సరములవాడయేనని వారు చెప్పెదరు — చాలా వృద్ధుడు. మరియు అతడు పూర్తి జీవింపజేయు శక్తితో అక్కడ సంచరించుచుండెను, ఏమిటో, మీరెరుగుదురా? అతడు యోర్దాను వైపు చూచెను… (ఓ దేవా! నేను దరిదాపుగా అవతలి ఒడ్డును చూడకలుగుచున్నాను. నీవు చూడలేవా?)
అతడు నిండు జీవింపజేయు శక్తి కలిగి అక్కడున్న ఒక రథమును, కొన్ని అగ్ని గుర్రములను అక్కడ చెట్టుకు కట్టబడియుండుట చూచెను. అతడు ఆ నదిని నడిచి దాటి ఆ గృహమునకు పోయెను, అసలు చనిపోలేదు. జీవింపజేయు శక్తి పంపబడెను. పరలోకము నుండి ఒక రధము పంపబడి అతనిని కొనిపోయెను. తన అంగీని సహితము అతడు ఊడదీసి ఎలీషా కొరకు పడవేసెను. అది నిజము.
2KGS 13:21•
JOHN 14:12
100అతడు ఆ దుప్పటిని తీసికొనెను. మరలా సంఘమునకు మాదిరి. చూచారా, — ఆ దుప్పటిని తీసికొనెను. అతడు రె౦డు రెట్ల అద్భుతములను చేసెను. అది క్రీస్తు ఆయన సంఘమునకు సాదృశ్యము, చూచారా. ఏలియా నాలుగు; ఇతడు ఎనిమిది, చూచారా. అతడు రెండింతల శక్తి కలిగియుండెను, ఎందుకనగా అతడు అది అడిగెను. నేను చేయుచున్న ఈ కార్యముల కంటె గొప్పవి మీరు చేయుదురు. అతడు జీవింపజేయు శక్తితో పూర్తిగా నిండియుండెను. ఏలియా చేసిన దానికంటె రెండురెట్ల అధికమగు గొప్ప కార్యములు చేసెను. గమనించండి, అతడు ఎనబది లేదా తొంబది సంవత్సరముల జీవితమును జీవించెను. వృద్ధుడయి చనిపోయెను. వారతనిని తీసికొని వెళ్ళి పాతిపెట్టిరి.
మీకు తెలియును, అయితే ఆ జీవింపజేయు శక్తి అతనిని విడిచిపెట్టలేదు. అది జరిగిన చాలా చాలా సంవత్సరముల తరువాత అతని ఎముకల నుండి శరీరము వేరై చీకిపోయిన తరువాత, అతడు పడియుండిన సమాధిలో ఒక రోజున ఒక చనిపోయిన వానిని శత్రుసమూహామునకు భయపడి ఎలీషా ఎముకల మీద పడవేసిరి. ఆ ఎముకలలో ఎంత జీవింపజేయు శక్తి యున్నదంటే, ఆ మనిషి బ్రతికి గంతులు వేసెను.
ఓ!
2KGS 13:21•
ROM 8:11
101ఆయన మీ మర్య-శరీరములను జీవింపజేయును. సమాధిలో చనిపోయి క్రుళ్ళిపోయిననూ, అయిననూ ఆ జీవింపజేయు శక్తి ఆ ధూళి మీద ఉండును. హల్లెలూయా! "క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆయన మీ మర్య-శరీరములను లేపును." ఆ వెనుక ఏలియా - ఏలీషా మరియు ఏలియా.
చనిపోయిన ఆ మనిషిని, ప్రవక్తను గుర్తుచేసికొనండి, ఆ సమాధిలో పడియుండి మరియు క్రుళ్ళిపోయియున్ననూ; జీవింపజేయు శక్తి ఇంకనూ ఎంతో నిండుగా యుండెను. అతని మీద శవమునుంచగా, అతడు ప్రాణమునకు తిరిగ వచ్చెను. ఆయన ఇంకనూ రోగుల మీద చేతులుంచగలడు, ఆయన ఉంచలేడా? ఆమేన్. అక్కడే నీవున్నావు.
1COR 15:55,57•
EPH 2:5,6•
EPH 5:30
102మరియు గుర్తుంచుకొనండి, మనం ఆయన మాంసములో మాంసము — యేసుక్రీస్తు. మనము ఆయన మాంసములో మాంసము, ఎముకలలో ఎముక అయియున్నాము. ఓ, దానికి వేరయిన మార్గము మరొకటి లేదు, మనము లేవనైయున్నాము, అంతే. మీరు లేవనైయున్నారు, అంతే.
ఈస్టరు అంటే ఆచారము కాదు, అంతకన్న గొప్పది. ఇప్పుడు కూడా అది మన శరీరములను ఆయనతో పాటు సజీవంగా లేపినందున పరలోక స్థలములందు కూర్చుంటిమి.
ఈ శరీరము సముద్రములో క్రుళ్ళిపోవచ్చును, అది నేలలో క్రుళ్ళిపోవచ్చును, ఒక చెంచాడు బూడిద కూడా మిగిలి యుండకపోవచ్చును, అయినా గాని అది బయటకు వచ్చును, ఎందుకనగా మృతులలో నుండి నా ప్రభువును లేపిన ఆ ఆత్మ ఈ మర్త్య-శరీరమును లేపెను. మనము ఆయన పునరుత్థానము యొక్క ఈవులము. నేనెంతగానో మాట్లాడుచున్న ఆయన నిత్యజీవము యొక్క విధానమును మీరెరుగుదురు. "భయపడకుడి" అని ఆయన చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఆయన ఎరిగియుండెను.
ఎందుకనగా పౌలు ఇట్లు చెప్పెను, "మరణమా, నీ ముల్లెక్కడ? సమాధి, నీ విజయమెక్కడ? నేను జీవింపజేయు శక్తితో సంపూర్తిగా నిండియున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి వందనములు." అవునండీ, జీవింపజేయు శక్తి. ఓ, మై!
MATT 17:3•
MARK 9:4•
LUKE 9:30•
JOHN 2:19•
HEB 13:8•
REV 1:8
103ఆయన సదా కాలము జీవించుచున్నాడు, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు, హెబ్రి 13:8. గమనించండి, మెస్సీయా, అభిషిక్తుడు. ఆలాగే ఆయన వధువునగు మెస్సీయమ్మ, కూడా అభిషిక్తురాలే.
గమనించండి, దేవుని యొక్క జీవింపజేయు శక్తిని మరణము ఆపజాలకపోయెను. దానిని మరణము ఆపలేదు. నీవు దానిని పొందినప్పుడు, అది నిత్యజీవము. దానిని ఆపునది ఏదియూ లేదు. దానిని నీవు నియంత్రించలేవు, దానికి నీవు ఏమియూ చేయజాలవు. నీవు నీ జీవితమును చాలించినా గాని, దానిని అది ఆపజాలదు. అది ముందుండినంత మంచిగానే ఎప్పుడును ఉండును.
గమనించండి! మోషే ఆ జీవింపజేయు శక్తితో పూర్తిగా నిండియుండెను. అవునా? అతడు ప్రవక్త వాక్యము అతని యొద్దకు వచ్చెను. అతడు వాక్యములో భాగము. అతడు ఆనాటి వాక్యము. ఆది నిజమేనా? మరియు అతడు చనిపోయి ఎనిమిదివ౦దల సంవతరములయిన పిదప రూపాంతరపు కొండ మీద ఏలియాతో నిలబడెను. అది నిజమేనా? జీవింపజేయు శక్తి, మరణము ఎన్నడూ దానిని తీసికొనిపోజాలదు. లేదు. లేదు! "దానిని మరల నేను లేపెదను." దేవదూతలు వచ్చెను, అక్కడున్న ఒక లోయలో అతనిని పాతిపెట్టెను. అతడు క్రుళ్ళిపోయి గతించెను, అతని ఎముకలు పోయినవి, మరియు అంతాయూ మట్టి అయినది, కాని ఆ జీవింపజేయు శక్తి ఇంకనూ అక్కడుండెను. అతనిని అది లేపి, పైకి తీసికొని వచ్చెను. అక్కడ అతడు నిలబడియుండెను. గమనించండి.
MATT 27:52,53
104"ఎనిమిది వందల సంవత్సరముల తరువాత, అది నిజమా బ్రెన్హా౦ సహోదరుడా?" అని మీరడుగ వచ్చును.
మీరు మత్తయి 27:51 చదవండి, ఇక్కడొక వాక్యమన్నది, మీరు వ్రాసికొనవచ్చును, దానిని వ్రాయండి. ఆయన వచ్చునని ఆ వెనుక నమ్మిన వారందరూ… ఇక్కడ బైబిలు చెప్పుచున్నది, ఆయన వచ్చిన పిదప…. వారు భూమిలో నిద్రించుచుండిరి. జీవింపజేయు శక్తి వారి మీద ఉండెను, వారు ఆయనతో ఒక భాగము, వారు పరిశుద్దులు. వారాయనలో భాగము, ఎందుకనగా వారాయన యందు విశ్వసించిరి.
గొర్రె యొక్క బలి ద్వారా వారు నిజంగా ఆ జీవమును కలిగియుండిరి. ఒక పరిహారము, అది ఎన్నడూ గొర్రె ఆత్మను మానవుని మీదకి తీసికొనిరాజాలదు. ఇప్పుడు మానవుని ఆత్మ, అనగా, దేవుడే అతని మీదకి వచ్చెను గదా మరి దాని మాట ఏమిటి? చూచారా, మనము ఇంకెంత అధికముగా జీవింపజేయు శక్తిని కలిగి యుందుము? పాపపరిహారార్ధము ఒక గొర్రెపిల్ల మాదిరిగా అర్పించబడెను. మనకున్నది మాదిరి కాదు; వాస్తవము. దేని గురించి మనము భయపడవలెను? మాదిరి మాత్రమే కలిగియున్న ఆ జనులు ఆయన పునరుత్థానము మాత్రమే చూపించుచూ సమాధిలోనికి వెళ్ళిరి.
JOB 1:11,12,21•
JOB 2:9,10
105ఆ వెనుక యోబు తన గొప్ప బాధను వ్యక్తము చేసెను — మై, సమస్తమూ అతని యొద్ద నుండి తీసికొనబడెను. "అతని నా వశము చేయుము. నిన్ను ముఖము మీదే శపించునట్లు చేయుదును" అని అపవాది చెప్పెను. అప్పుడాయన అనుమతి ఇచ్చెను.
"అతని ప్రాణమును ముట్టుకోవద్దు" అని చెప్పెను. అలాగే వాడు అతని ప్రాణమును తప్ప అంతయూ తీసికొనెను.
అతని భార్య సహితము అతనికి విరోధిగా మారెను. తన ఊపిరి ఆమెకు అసహ్యమాయెనని చెప్పెను, మరో మాటలో, ఆమె అతని పట్టించుకోనేలేదు. ఇక ఆమె అతనిని ప్రేమించుచున్నట్టుగా కనిపించలేదు. అతనిని దూరంగా త్రోసివేసెను. "యోబూ, నీవొక దరిద్రుడవు, నీవు దేవునిని దూషించి ఎందుకు చనిపోరాదు?"
"నీవు బుద్ధిహీనురాలి వలె మాట్లాడుచున్నావు," అనెను. ఓ, మై!
చూడండి, అతడు తాను కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనెను. ఇప్పుడు, అతడు ఒక ప్రవక్త. "నేను పాపిని కాను. నేను కావలసిన బలిని అర్పించాను" అనెను. ఆమేన్. తానెక్కడ నిలబడెనో అతడెరుగును. అతడు వాక్యముపైన యుండెను. ఇతరులు ఏమి చెప్పినా గాని అతడు అక్కడే ఆ వాక్యము మీదే నిలిచియుండెను. ఆ గొప్ప గంభీర గడియలో ఈలాగనెను, "నీవు బుద్ధిహీనురాలివలె మాట్లాడుచున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను; యెహోవా నామము స్తుతించబడును గాక! ఈ లోకములోనికి నేను ఏమియూ తేలేదు. ఇక్కడికి నేను దిగంబరినిగా వచ్చాను, ఆలాగే వెళ్ళుదును; యెహోవా నామము స్తుతినొందబడును గాక." అక్కడ కూర్చొని పుండ్లు గోకుకొనుచుండెను, అతని పిల్లలు చనిపోయిరి, పేదరికముతో మొత్తబడెను, అతని స్నేహితులందరునూ ఎదురుతిరిగిరి. అతని సంఘ సభ్యులు అందరూ తిరస్కరించిరి. ఎంత విషాదకరమగు దరిద్రుడు! మీలో ఎవరునూ ఇంకా ఆలాంటి స్థితికి రాలేదు. అయిననూ, అతడు ఆ వాక్యమును పట్టుకొని యుండెను.
JOB 19:25-27
106అతడు పక్షిరాజు. ఓ, నీవు అతని కండ్ల మీద నుండి ఆ దృశ్యమును ఎప్పుడూ తొలిగించజాలవు. లేదు, లేదు. ఆ వాక్యము మీద నిలబడియుండగా, అకస్మాత్తుగా ఏమి జరిగెను? మేఘములు వెనుకకు త్రోసికొని వచ్చినవి, ఉరుములు గర్జి౦చసాగెను, మెరుపులు మెరియసాగెను, యోబు పైకి చూచి దర్శనములు పొందెను. "నా విమోచకుడు సజీవుడనియు, అంత్యదినమున ఆయన భూమిమీద నిలచుననియు నేనెరుగుదును. చర్మపు పురుగులు ఈ శరీరమును నాశనము చేసిననూ, ఎముకలు మొదలగువన్నియూ, జీవింపజేయు శక్తి అచ్చట ఉ౦డును. నాయంతట నేనే దేవుని చూచెదను. నాకు నేనే ఆయనను చూతును, నా నేత్రములే ఆయనను చూచును. మరియొకని కండ్లు కావు" అని పలికెను. అది నిజమేనా? "నా నరములు
నాతో సహకరించకపోయిననూ, నా శరీరములో యున్న చర్మపు పురుగులు దానిని నాశనము చేసిననూ…"
JOB 19:26•
MATT 27:52,53•
ROM 8:11•
1THS 4:16
107మీకు తెలుసా, చర్మపు పురుగు మీ యొద్దకు రావు. ఆ పురుగులు మీ లోనే యుండును. అవి మీ స్వంత చర్మపు పురుగులు, దానిని ఎప్పుడైనా మీరు గమనించారా? సమాధి పెట్టెలో నిన్ను భద్రంగా పెట్టి, గాలి చొరకుండా ఉంచినా గాని ఆ పురుగులు నిన్ను ఎప్పటి మాదిరిగానే తినును, ఎందుకనగా అవి నీలోనే యున్నవి. అసలు నీవు లోపల పురుగులతోనే ప్రారంభమైనావు.
"చర్మపు పురుగులు, నా చర్మపు పురుగులు నన్ను నాశనము చేసినను, నా శరీరము, అయినను నా శరీరముతోనే నేను దేవుని చూచెదను."
మరియు ఆ పునరుత్థాన ఉదయమున… మహిమ! హల్లెలూయా! మత్తయి అను ఈ గొప్ప రచయిత 27:51లో, ఆయన పునరుత్థానుడై లేచిన తరువాత, పాత నిబంధన పరిశుద్దులను జీవింపజేయునని చెప్పెను. భూమి యొక్క ధూళిలో నిద్రించిన వారు సమాధులలో నుండి బయటకు వచ్చి, పట్టణములోనికి ప్రవేశించి అనేకులకు కనబడిరి. ఆ జీవింపజేయు శక్తి ఇంకా ఎలీషా ఎముకలలో యున్నది. అక్కడ ఎముకలు లేకపోయిననూ, యోబు పైన అది యుండెను. అతని శరీరము యొక్క చెంచాడు మట్టి కూడా లేనప్పుడు కూడా ఇంకా ఆ జీవింపజేయు శక్తి అక్కడ యుండెను.
"యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించుచున్నచో, ఆయన మీ మర్త్య-శరీరములను కూడా లేపును. ఇప్పుడు, త్వరగా గమనించండి.
1COR 15:52•
1THS 4:17
108"ఓ, నేను ఆ వెనుక జీవించియుంటే బాగుండును" అని నీవనుచుందువు. నీవు అంతకంటె మంచి సమయములో జీవించుచున్నావు. ఇప్పుడు మీరందరూ…
కొన్ని వాక్యములను వ్రాసికొనుట నేను చూచుచున్నాను. మంచిది, I థెస్సలోని 4:16 కూడా వ్రాసుకొనండి. గమనించండి! ఎంత చక్కగాయున్నది, చూచారా. "క్రీస్తునందు నిద్రించిన పరిశుద్దులను దేవుడు తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును," చూచారా —సమాధులలోని పరిశుద్దులు. ఏలియావలె విశ్రమించుచుండిరి; కొందరు ఎలీషా వలె యుండిరి, చూచారా. అందులో కొందరు లేపబడెదరు, కొందరు ఎత్తికొనిపోబడుదురు. కొందరు సమాధులలోయుందురు; వారు ఆయనతో కూడా వెళ్ళుదురు. "దేవుని బూర మ్రోగును, మరియు క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియున్న మనము, ప్రభువును మధ్యాకాశములో కలిసికొనుటకు కొనిపోబడుదుము." సజీవుల మీద జీవింపజేయు శక్తి; మృతుల మీద జీవింపజేయు శక్తి.
109చూచారా, అదే దేవుని జీవింపజేయు శక్తి ఈ ఇద్దరు ప్రవక్తలను కమ్ముకొన్నది. వారి పేర్లను చూడండి, దాదాపు ఒకేలాయున్నవి: ఎలీషా, ఏలియా. వధువును,పెండ్లి కుమారుని చూడండి? అందులో ఒకరు శ్రీ. యేసు; మరియొకరు శ్రీమతి. యేసు. మీరు చూచారా, దాదాపు ఒకేలా యున్నవి, ఆమెకు ఆయనకు మధ్య వున్న తేడా అదే, చూచారా.
ఏలియా… ఇక్కడ అదెట్లు సూచించబడినదో చూడండి. ఏలియా పైకి కొనిపోబడి తీసికొనిపోబడెను - సంఘమునకు సాదృశ్యము. సరే. మరియు ఎలీషా పునరుత్థానము వరకు విశ్రమించెను, చూచారా. ఒక పక్షి సమతూళముగా ఎగురుటకు రెండు రెక్కలు కలిగియుండు విధముగానే అది యున్నది, చూచారా. ఆ ఇద్దరు ప్రవక్తలలో సంఘము సాదృశ్యముగా చూపబడినది. "ఏలయనగా సజీవులమై నిలిచియుండు మనము ప్రభువు రాకడయందు నిద్రించిన వారికంటె ముందు చేరము; దేవుని బూర మ్రోగును…" రెండు రెక్కలు బయటకు వచ్చును, మరియు మనము ఎగిరిపోదుము, హల్లెలూయా, ఎగిరిపోదుము. ఏమిటి కారణము? సజీవులమైనా, మృతులమైననూ ఇంకా ఆ లెవనెత్తు శక్తి నిలిచియున్నది.
గమనించండి. గుర్తుంచుకొనండి. ఇప్పుడు జ్ఞాపకముంచుకొనండి, ఈ సంగతులు ఏమైయున్నవో చూచుటకు లేపబడితిమి. ఈ దినము యొక్క జీవింపజేయు శక్తిని గమనించండి. మనము లేపబడితిమని గుర్తుంచుకొనండి.
కొద్ది కాలము క్రిందట, ఒక సహాయము కొరకు…
110మన ప్రభువు చెప్పెనని తలంచుచున్నాను, మరియు పౌలును, ఆ విధముగానే, "తండ్రి నాకు దేనిని చూపించెనో దానిని దాచుకోకుండా మీకు చెప్పియున్నాను." ఈ చివరి దినములలో మనపైని ఈ జీవింపజేయు శక్తిని చూచుచున్నాము. రోగులు స్వస్థత పొందుటను చూచుటకు సహితము ఆయన జీవింపజేయు శక్తిని మనకు ఇచ్చెను. ఆ దినములలో వారి మీద పనిచేసినట్లుగానే, అప్పుడు జరిగినట్లుగానే, ఆ జీవింపజేయు శక్తి మనమధ్య పనిచేయుట చూచుచున్నాము - చూచారా దర్శనము ద్వారాను, మృతులు లేపబడుట ద్వారాను, అది తిరిగి తేబడుట మనము చూచుచున్నాము, చూచారా అది రోగులను బాగుచేయును.
111ఒక రోజున ఒక వ్యక్తితో అనగా, చిన్న దోనోవాన్ వీర్ట్స్ తో ఇక్కడ చెప్పుచున్నాను, మీరందరూ అతనిని ఎరుగుదురు. అతనితో కలసి నేను వేటాడుచుంటిని. ఆ దీనుడగు వ్యక్తి చక్కనివాడు. ఇక్కడి ఈ సంఘమునకు వచ్చుచుండును. నాకు చాలా మంచి స్నేహితుడు. అతడు ఇట్లు పలికెను, "నిన్ను నేను తొందర చేయదలుచుకోలేదు."
నేను అతని చెవి వైపు చూచాను. అతని చెవులు లోపల బయట "డోనావన్ ఎట్లున్నావు?" అనడిగాను. ఆ విధముగా అతని చేయి పట్టుకొన్నాను. అది క్యాన్సర్ "డోనావన్, నీ చెవి సంగతేమిటి?" అన్నాను.
"తెలియదు, బ్రెన్హా౦ సోదరుడా, దాదాపు ఆరు, ఏడు నెలల నుండి ఈలాగున్నది," అని చెప్పెను.
"దానిగూర్చి నీవు ఏమియూ ఎందుకు చెప్పవు?" అనడిగాను.
"బ్రెన్హా౦ సోదరుడా, నిన్ను తొందర చేయదలచుకోలేదు" అని చెప్పెను.
"అది ఏమిటో నీకు తెలుయునా?" అనడిగాను.
"నాకు అది ఏమిటో తెలియదు," అన్నాడు.
నేను కేవలము నా చేతిని అతని మీద ఉంచాను, ఎన్నడూ ఒక్క మాటయు చెప్పలేదు. అది జరిగిన రెండు రోజుల తరువాత, కనీసము ఒక మచ్చ కూడా లేదు. ఏమిటది? ఆ జీవింపజేయు శక్తి, చూచారా. అది మీ మర్త్యశరీరమును లేపును. అతని చెవి తినివేయబడెను, అతని మెదడు పోయినది, చూచారా, అతడు చావవలసియుండెను. కాని, జీవింపజేయు శక్తి, చూచారా?
ROM 8:11
112ఒక రోజు నేను అలసిపోయిన స్థితిలోయున్నాను, నాకునేను ఇట్లనుకొన్నాను, "అబ్బాయీ, నీవు ముందుకు వెళ్ళుట మంచిది. నీకు ఏబది సంవత్సరముల వయస్సు, నీవు ప్రభుని కొరకు ఏదయినా చేయవలెననుకొన్నచో, నీవు త్వరపడి అది చేయుట మంచిది. నీవు వృద్దునివగుచున్నావు," చూచారా. అక్కడ ఆ ఉదయమున జీవింపజేయు శక్తి వచ్చెను. ఆ తెరకు ఆవల నేను చూచునట్లు చేసెను. మీ అందరిని అక్కడ నేను చూచాను. ఆయనిట్లు పలికెను, "నీవు ఇప్పటి వరకు ప్రేమించినవారందరు, మరియు ప్రేమించువారందరిని ఆయన నీకిచ్చును." నేను వారిని ఆ విధంగా వారిని అక్కడ చూచాను. అది ఏమిటి? జీవింపజేయు శక్తి.
ప్రకటన గ్రంధకర్తయగు యోహాను జీవింపజేయు శక్తితో పూర్తిగా నిండుకొనినవాడై నిలబడి ఆది నుండి అంతమువరకు చూచెను.
యెషయా జీవింపజేయు శక్తితో పూర్తిగా నిండుకొనినవాడై లేచి నిలబడి, వెయ్యేండ్ల పాలనను అదంతయూ చూసెను.
"జీవింపజేయు శక్తి." "క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివశించుచున్నయెడల, అది మీ మర్త్య శరీరములను లేపును. గుర్తుంచుకొనండి, జీవింపజేయు శక్తి.
113ఈ దినమున మనము ఏమి చూచామో చూడండి, ఆ జీవింపజేయు శక్తి ఏడు ముద్రలను విప్పుటకు మన యొద్దకు వచ్చినది. అది ఏమిటి? మానవజ్ఞానమా? కాదు, దేవుని యొక్క జీవింపజేయు శక్తి. చూచారా! ఇది జరుగునని దేవుని యొక్క పైకి జీవింపజేయు శక్తి ముందే తెలియజేసెను. చూచారా? అది సత్యమని లోకము దానిని గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా, ఆ జీవింపజేయు శక్తి చేసినది. ప్రభువు యొక్క దూత, నేను మికు చెప్పిన దానిని సత్యము అని లోకమునకు సాక్ష్యము చెప్పునట్లు ఆ అగ్నిస్తంభము, ఆ జీవింపజేయు శక్తి సహాయము చేయును గాక, అది ఏమైయుండెనో వారికి తెలియదు. మనము ఈ విధంగా చూచాము. అక్కడ మన ప్రభువున్నాడు, చూచారా.
114ఆ ముద్రలను విప్పినవాడు ఆయనే. ఆయనే ఆ ముద్రలైయియున్నాడు, ఎందుకనగా దేవుని వాక్యమంతయూ క్రీస్తే అయియున్నాడు. ఆ తెరువబడిన ముద్రలు క్రీస్తే అయియున్నాడు. అయితే ఆ తెరువబడిన ముద్రలు ఏమిటి? క్రీస్తును బయలుపరచుట.
ఏడు సంఘములు సమాప్తమైనవని ఏ ఏడు దూతలయితే సాదృశ్యముగా చూపించినవో, వారిని మనము చూడనైన చూడలేకపోయాము. మనము కాదు, వారే ఆ పటములను తీసిరి. అక్కడ ఆయన సర్వోన్నత న్యాయధిపతిగా నిలబడియుండి, తానే అల్ఫా మరియు ఓమేగాగా ఆది, అంతముగా చూపించుకొనుచున్నాడు. ఎట్టి విధమగు గుర్తింపు!
సజీవ శక్తియే దానిని మనకు చేసెను. ఆయన రాకడను చూచునట్లుగా సజీవపు శక్తియే మనలు చేసినది. సజీవపు శక్తి మనలను మరణము నుండి జీవములోనికి దాటించినది. మీలో తప్పు ఏమిటో, ఏమిచేయవలెనో, మీరేమి చేసిరో మీరేమి చేయకుండవలసినదో, ఏమి చేసియుండవలసినదో, ఏమైయుందురో తెలిసికొనుటకు వివేచనను సజీవపు శక్తియే ఇచ్చినది. ఈ సంగతులన్నియూ, జీవింపజేయు శక్తి!
PS 16:10•
MATT 28:10•
JOHN 2:19•
ACTS 2:27
115మన ప్రభువగు యేసు ఈ జీవపు శక్తితో నిండుకొని యుండును. అసలు అదంతయూ ఆయనే. ఆయన సజీవపు శక్తితో ఎంతో నిండుకొని యుండును. ఆయన ఇది చెప్పెను, "మీరు ఈ శరీరమును నాశనము చేయుడి, నేను దానిని మూడు దినములలో లేపుదును." జీవింపజేయు శక్తిలో యున్న నమ్మకమును గూర్చి మాట్లాడెను! "ఈ శరీరమును ఈ దేవాలయమును మీరు నాశనము చేసినచో, దానిని నేను మూడు దినములలో తిరిగి లేపుదును."
ఎందువలన? ఎందుకది ఆయన చెప్పెను? అది ఆయన గూర్చి వ్రాయబడినదని ఆయనకు తెలియును, చూచారా — అది ఆయన గూర్చియే దేవుని వాక్యము వ్రాసినది, అది తప్పిపోదు. వాక్యమీలాగు చెప్పెను, "నా పరిశుద్దుని కుళ్ళుపట్టనీయను. ఆయన ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను." ఆ జీవింపజేయు శక్తి తనను లేపునని ఆయన ఎరుగును. ఒక్క కణము కూడా క్షయమవదని ఆయనెరుగును.
"మీరు ఈ దేవాలయమును పాడుచేయుడి, నేను దానిని తిరిగి మూడు దినములలో లేపుదును."
ఎందువలన? అది ప్రవచనము, దేవుని వాక్యము, ఆ ప్రవచనము నిజముగా దేవుని నుండి వచ్చిందయినచో అది తప్పిపోదు. ఆయనను లేపెదనని చెప్పిన అదే ప్రవచనము, అదే దేవుని వాక్యము, మనము ఆయనతో కూడా ఎప్పుడో లేపబడి యున్నామని చెప్పెను. "భయపడకుడి" అని ఆయన చెప్పుటలో ఆశ్చర్యములేదు. ఇప్పుడు ఆయనయందు ఉండిన ఆత్మ ఇప్పుడు మనయందును ఉండి మన మర్త్య-శరీరములను లేపునని వ్రాయబడియున్నది. భయపడకుము, స్నేహితుడా, కుమారుడు లేచియున్నాడు. కుమారుడు లేచియున్నాడు.
MATT 17:3•
MARK 9:4•
LUKE 9:30
116ఇప్పుడు, రూపాంతరమువైపు చూడండి. మనమందరము అక్కడ ప్రాతినిధ్యము వహించాము. ఎత్తబడిన సజీవ పరిశుద్దులున్నారు, వారికి చిహ్నముగా ఏలియా అక్కడ నిలబడియున్నాడు, అక్కడ మోషే నిలబడియుండెను. మృతి పొందిన పరిశుద్దులకు సాదృశ్యము. వారిరువురును లేపబడు శక్తిని పొందియుండిరి. ఒకరు చనిపోయినా మరొకరు చనిపోకపోయినా గాని, వారందరూ అచ్చటనే యుండిరి.
గమనించండి, ఓ, ఆ చివరి దినములలో ఏమి మనము చూస్తున్నామో చూడండి. యోహాను 14:12లో ఆయన వాగ్దానము చేసినదే. ఇప్పుడు చూడండి! [టేపు పై ఖాలీ.] నిశ్చయంగా.
"మీరు శక్తి పొందితిరని చెప్పుకొనుచున్నారు గదా?" అని జనులు చెప్పుకొనుచున్నారు. కాదు, కాదు.
మనము ఆ రూపాంతరపు కొండమీద ఉండినవారివలె ఉన్నాము, చూచారా. నిశ్చయంగా, మనము శక్తి ఉన్నదని ప్రకటించుకొనుటలేదు. కానీ మనం ఆ రూపాంతరపు కొండమీద ఉన్న వారి వలె ఉన్నాము… "నేను ఎవరినో చూడండి" అని మోషే అక్కడ చెప్పుకొనలేదు. "నేనెవరినో చూడండి. మేమెవరిమో చూడండి" అని శిష్యులు చెప్పుకోలేదు. ఏమి జరిగినదో మీరెరుగుదురా? గమనించ౦డి! వారు మహిమపరచబడిన యేసును చూచిరి. అక్కడ ప్రాతినిధ్యము వహించిన వారందరూ అదే చూడగోరిరి. మహిమపరచబడిన యేసును.
117నేడును ఆలాగేయున్నది, మనము ఏదో ఒక గొప్ప వ్యక్తిగా కనపరచుకొనుటకు ప్రయత్ని౦చుట లేదు. మన గురించి ప్రజలు ఏమి చెప్పుకొన్నా మనకు అక్కరలేదు. మన పేరు అసలు ఏమి కాదు; ఆయన నామమే గొప్పది. మన జీవితము ఏమి కాదు; అది ఆయన జీవితమే. ఆయన శక్తియే కాని, మన శక్తి కాదు. మనం ఒక పనిచేయుటకు ఇష్టపడుచున్నాము, అదేమనగా మహిమపరచబడిన ఆయనను చూచుటయే. అదెట్లుండును? మనలో నుండిన ఆయన పునరుత్థానము ద్వారా ఆయన మహిమపరచబడినప్పుడు అది జరుగును. ఆయన గతములో ఉండిన రీతిగానే నేడు సాదృశ్యముగా ఉండుట ఆయనలో చూచుచున్నాము.
అది మీరు గ్రహించారా? చూచారా, మనము మహిమపరచబడుట మన కోరిక కాదు. ఏదో పెద్ద పేరు మన కోరిక కాదు. ఏదో పెద్ద సంఘమును కట్టుట మన కోరిక కాదు, లేక ఆదివారపు బడిని పెంచుట లేక ఎక్కువ మందిని తెచ్చుట, విందు - వినోదములు కల్పించుట, తారలను తీసికొనివచ్చుట, లేక అటువంటివి చేయుట మన కోరిక కాదు. మన కోరిక అంతయూ మహిమపరచబడిన ఆయనను చూచుటయే. దేనిని మహిమపరచుట? స్వగర్వముతో కాదు, కాని మనలో, మన జీవితములలో ఆయన జీవించియున్నాడని రుజువు చేయుటయే.
నన్నునేను మార్గము నుండి తప్పించుకొన్నచో, అసలు విలియం బ్రెన్హా౦ను గూర్చి ఆలోచించినచో, నీ గురించి నీవు ఆలోచించుకొననిచో, మన మధ్య మహిమాన్వితుడగు యేసును చూడగలము. ఆయనను చూచుటయే. మన కోరిక అదియే. మనకు లేవగల శక్తిని ఇచ్చును, మనము ఆయనతో ఉన్నామను సంతోషమును అది మనకు ఇచ్చును. ఆయన మాంసములో మాంసము, ఎముకలలో ఎముక, ఆయన యొక్క వధువు అయి యుండి; ఆయన యొక్క అదే ప్రత్యక్షతా పద్దతి మనలో బయలుపరచబడుటను చూతుము, ఆయన ఇప్పుడు మృతులలో నుండీ లేచియున్నాడని చూతుము, చూచారా.
MATT 28:10•
JOHN 6:37
118"భయపడకుడి?" అని ఆయన చెప్పిన మాటలో ఆశ్చర్యములేదు. ఏలయనగా ఇప్పుడు గమనించండి! ఆయన ద్వారా మనము విమోచించబడియున్నాము. ఇప్పుడు ఆయనతో కూడా లేపబడియున్నాము, అదే ఈష్టరు అనగా ప్రజలకు అర్థము. ఆయనతో కూడా లేచుట. గమనించండి, ఇప్పుడు మనలో ఆయనాత్మను కలిగియున్నాము. హక్కుపత్రము పూర్తిగా చెల్లించబడినది.
కాదు, "దానిని నేను చెల్లించగలననుకొనుచున్నాను" అని నీవు చెప్పవద్దు. నీవెప్పుడో దానిని చెల్లించావు. "నేను చెల్లించుదును" కాదు. ఎప్పుడో నేను చెల్లించాను. నేనెన్నడూ చేయలేదు; నాకొరకు ఆయనే చేసెను, చూచారా. నేను కాదు; ఆయనే! "సరే, బ్రెన్హా౦ సాహోదరుడా, వారంటున్నారు…" వారేమన్నా నాకు అక్కరలేదు. అక్కడ, ఆయన నా కొరకు దానిని చేసెను. నాకు కావలసినది అంతే… నేను శ్రద్ద చూపునదంతయూ దాని గూర్చియే.
ఆయన ప్రత్యక్షపరచబడుటను నేను చూడగోరుచున్నారు. దానిని నీవెట్లు చేయగలవు? ఆయనను క్రిందికి పిలుచుట ద్వారానా? కాదు! ఆయన నీలో ఉన్నాడు. చూచావా, ఆయన నీలో ఉన్నాడు. "మంచిది, అయితే, ప్రభువా, నన్నునేను మార్గములో నుండి తొలగించుకొన్నచో, నీవు ప్రత్యక్షపరచగలవు. దానిని నీవు ఎట్లు చేయగలవు? ఎందుకనగా ఆలాగు నీవు అభిషేకించితివి. "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నాయొద్దకు వచ్చెదరు." గమనించండి. మహిమ!
EPH 2:1
119ఈ ఉదయమున ఆ రుజువులన్నియూ మనలో సమకూర్చబడియుండగా, ఓ, నేను ఆ పాట గూర్చి ఆలోచించుచున్నాను:
ఆ పునరుత్థాన ఉదయమున,
మరణపు త్రాళ్ళు తెగిపోవును,
మనము లేచుదుము, హల్లెలూయా, మనము లేచుదుము!
అది మీరు నమ్ముచున్నారా? మనము లేచెదము. ఆయనలో మనం ఆయన భాగమైయున్నాము. ఈస్టరు అప్పటి వలనే బయలుపరచబడిన దేవుని రహస్యము, మరణము తరువాత జీవము. ఒకప్పుడు పాపము మరియు అతిక్రమములలో చచ్చిన మనము ఇప్పుడు జీవించియున్నాము. నిజమగు ఈస్టరు ముద్ర నా చుట్టునున్న మరణమును బద్దలు చేసినది. నేను సజీవుడను. ఈస్టరు ముద్ర ఆదియందు రోమను ముద్రను బ్రద్దలు చేసినది, ఈస్టరు ముద్ర, ఆయన ముద్రించబడియున్నాడనునది. మనుష్యులు చనిపోయి గతించిరి; కాని ఆయన ఆ ముద్రను బ్రద్దలు చేసి రహస్యమును బయలుపరచేను. దేవుడు తన పరిశుద్దాత్మ ద్వారా ఇప్పుడు మన జీవీతములను చుట్టుముట్టిన ముద్రను బ్రద్దలు చేసి, క్రీస్తు మనలో జీవించుచున్నాడన్న సంగతి బయలుపరచబడినది, ఏలయనగా ఇప్పుడు మనము ఆయనతో పాటు లేపబడియున్నాము. ఓ, పేజీ తర్వాత పేజీ.
మనము లేచుదుము, హల్లెలూయా!
మనము లేదుదుము! ఆమేన్!
ఆ పునరుత్థాన ఉదయమున,
మరణపు గడియలు విరుగగొట్టబడినప్పుడు,
మనము లేచుదుము, హల్లెలూయా! మనము లేచుదుము!
ఓ, మీరు సంతోషముగా లేరా? నాకు చాలా ఆనందముగా యున్నది. ఆ వెనుక అవతల నున్న ఒక చిన్న పాత బొగ్గుల సావిడిలో ఒక ఉదయమున ముద్రలు విరుగగొట్టబడినవి. నేను ఆయనతో పాటు నూతన సృష్టిగా లేచియున్నాను, ఆయన యొక్క జీవింపజేయు శక్తి. కుమారుడు లేచి యున్నాడు.
120కొద్దికాలము క్రిందట నాకు ఒక జాలరిని గూర్చి కథ చెప్పబడెను. ఒకడు వచ్చి ఒక ముసలి జాలరిని పశ్చిమ తీరమందు చేపలు పట్టుటకు కూలికి నియమించెను. ఆ ఉదయము వారు వెళ్ళిరి.
మీలో ఎవరయినా గాని సాల్మన్ చేపల కొరకు అక్కడ వేటాడినచో దానిసంగతి మీరెరుగుదురు. అక్కడ భయంకరముగా పొగమంచు ఆవరించియుండును. అక్కడ నా చిన్ని సోదరుడు ఎడ్డి బిస్కెల్ ను నేను చూచాను (అక్కడున్న ఇండియనులకు ఒక మిషనెరీగా యున్నాడు.) మాయంతట మేమే వేటాడాము, ఆ తీరములందునే.
కనుక ఈ జాలరి ఒక విధముగా కరుకయినవాడని మీకు తెలియును. అతడు వేటకు వెళ్ళెను, వారు చెదరిపోయిరి, పగలు కొరకు ఎదురు చూచుచున్నారు, మికు తెలియును. వారు పొగమంచు హారన్ వినలేదు, ఈ జాలరి ఆశ్చర్యపడసాగెను, "మేము వేటకు సముద్రములోనికి వెళ్ళుచున్నాము! హే" అన్నాడు ఎంతో ఆశ్చర్యచకితుడైనాడు.
"కుమారుడా, కూర్చో, క్రింద కూర్చో" అని అతడు చెప్పెను. ఆ ముసలి జాలరి, నెమ్మదిగా యున్నాడని మిరెరుగుదురు. తాను దేనిగూర్చి మాట్లాడుచున్నాడో అది అతడెరుగును. "సూర్యుడు వచ్చువరకు వేచియుండండి, అప్పుడు మనం ఎక్కడున్నామో చూచుకొందుము" అనెను.
"నేను మేతడిస్టుగా ఉండాలా, బాప్టిస్టుగానా, పెంతెకోస్తుగానా?" అని మీరనవచ్చు.
121కాస్త ఆగండి. కుమారుడు పైకి వచ్చుచున్నాడు. మనము ఎక్కడున్నామో చూద్దాం. ఆయనే వాక్యము. వాక్యము బయలుపరచబడువరకు ఆగి చూడండి. విత్తనము మీద ప్రకాశించుచున్నది, అల్లాడు పన, మనం ఎక్కడున్నామో చూద్దాం. ఆయనను మీరు ప్రేమించుచున్నారా?
క్షమించండి ఇంతసేపు మిమ్ము నేనుంచాను. మీలో ఎందరు ఈ రాత్రికి ఉండిపోతున్నారు? ఓ, అయితే నేను మరల ఈ సాయంకాలము వచ్చెదను. ఏడుగంటలకా? నీకు వేరే ఏమైనా ఉన్నదా? [సాహో నెవిల్ "లేదు'' అని చెప్పుచున్నారు.]
మనము తలలు వంచుదుము.
122ఇంకా మాలో ఆ జీవింపజేయు శక్తి లేదు అని చెప్పువారు ఇక్కడ ఎందరున్నారు? కుమారుడు ఉదయించియున్నాడు, మీరు ఈ ఆలయములో కూర్చొని యున్నారు, మీరు టేపులు విన్నారు, అయినా ఇంకా ఆత్మ మిమ్మును లేవనెత్తలేదు, నీవు దేవుని వాక్యమును వెంబడించున౦తమట్టుకు? స్త్రీలు, పురుషులు మీరందరూ ఆయన వ్రాసిన ప్రతి మాట వినినచో ఎంత బాగుండును!
ఓ, అది ప్రమాదకరమగు సంగతి. మీరు జీవములేని చచ్చిన గింజలయిన ఎట్లు౦డును? కానీ మీలో ఒకటి ఉండి ఈలాగు చెప్పుచున్నది, "ఈ ఉదయమున నేను లేవగోరుచున్నాను. నేనున్న స్థితి నుండి నేను లేవగోరుచున్నాను. కేవలం మట్టిలో కలిసిపోవు మృత బీజముగా నేనుండగోరుటలేదు, ఎండిన మోడుగా ఉండను. నేను తిరిగి లేవగోరుచున్నాను."
"నా కొరకు ప్రార్ధి౦చు సోదరుడా" అని మీరు మీ చేతిని ఎత్తి పలుకగలరా? దేవుడు మిమ్మును దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఆ చేతులు చూడండి. వేదిక పిలుపునకు ఇక ఏ మార్గము లేదు. ప్రజలు వేదిక చుట్టూ చేరిరి. నేను దానిమీద ఏమైనా గాని అంతగా శ్రద్ద ఇప్పుడు చూపను, మెతడిస్టు ఉజ్జీవ సమయములో అది సంఘమునకు అదనముగా చేర్చబడినది, చూచారా.
ACTS 2:38,39,41
123బైబిల్ ఇట్లు చెప్పెను, "నమ్మినవారందరూ బాప్తిస్మము పొందిరి." ఎవరయినా తమ కొరకు తాము చావసిద్దపడిన వారికి ఇక్కడ కోనేరు నిండా నీరు ఎదురు చూస్తున్నది.
నీవు ప్రభువైన యేసు నామములో చాలాసార్లు సమాధి చేయబడి యుండవచ్చును, కానీ ఆ విత్తనం జీవమగువరకు, చూచారా, అది దానిని లేవనెత్తదు. లేవదు, లేవదు. నీటి బాప్తిస్మము ఆకాశము నుండి పడిన మంచు బిందువులవలెనుండును. అది గింజ పైన పడగలదు, కాని దానిని బ్రతికించుటకు అందులో జీవము లేదు, అది బ్రతుకలేదు.
కానీ నిజముగా ఆ నీటి బాప్తీస్మము ద్వారా నీవు మరణించినచో, వాక్యమునకు విరోధముగా నీకు నేర్పించబడిన ఆ నమ్మకములు, శాఖల బోధలు మొదలగువాటన్నీంటికీ చనిపోవుటకు సిద్దముగా నున్నచో, నీవు దేవుని కుమారుడు, కుమార్తెలవలె నడిచెదవు. నీ హృదయములో అర్థవంతముగా భావించుము. ఈ ఉదయమున ఆ నీటి బాప్తిస్మము నీకు ఏమి చేయునో గమనించుము. ప్రతివాడును మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్రము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. నీ తప్పులు, నీ పాపములు ఒప్పుకొనవలెను. నీవు పనను, అల్లాడించు అర్పణను పొందెదవు. నీవు కదిలింపజేయు శక్తిని, పరిశుద్ధాత్మను పొందెదవు. ఎందుకనగా ఆ వాగ్దానము మీకును, వారందరికిని, తరములోని వారందరికిని చెందును.
124తండ్రియగు దేవా, ఎంతోసేపు నేను మాట్లాడాను, ప్రజల యొక్క ఎంతో సమయమును తీసికొన్నాను, కాని ప్రభువగు దేవా, దానికి ఆపుదల లేదు. విడిచిపెట్టి వెళ్ళి, విశ్రాంతి తీసికొని మరల రావలెనన్నట్లుగా కనిపించుచున్నది. మేము చనిపోవుచున్న లోకములో చనిపోవుచున్న జనులమద్య జీవపు వర్తమానముతో, పునరుత్థాన రుజువుతో మేము జీవించుచున్నాము. ప్రియ దేవా, ఒక్కసారి మాత్రమే మేము మర్త్యులుముగా ఉందుము. ఈ అవకాశము మేము దాటిపోనిచ్చినచో ఎట్లు౦డును?
మా హృదయములు మండుచున్నవి, మా ఆత్మలు ఆశ్చర్యముతో నిండినవి, వచ్చిన వారిని బట్టియే. ఈ ఉదయమున ఈ వర్తమానమును చాలా మంది వినుచున్నారు. అవును, రెండు, మూడు వందలమంది తమ చేతులు ఎత్తి, ప్రభువా, వారు నమ్మగోరుచున్నారు. ఓ! ప్రభువా, నిశ్చయంగా ఆ గింజ చనిపోలేదు. అలాగు వారు చేతులు ఎట్లు లేపగలరు? ఏదో యున్నది. ఓ, దేవా, అది ముసలి స్వార్ధము. అది ఆ యోబు భార్య అక్కడ నిలబడి చెప్పుచున్నది. "ఓ!" కాని ప్రభువా, ఆ యోబును, ఆ విశ్వాసిని ఈ ఉదయమున ఇక్కడ నడువనిమ్ము, పూర్తిగా చనిపోయి, ఈ బాప్తిస్మపు నీటిలో సమాధి చేయబడవలెను.
పరలోకము నుండి వచ్చిన హిమబిందువులు, ప్రతి పాపమును కడిగివేసి, దానిని క్షమించునని దేవుని వాక్యము చెప్పుచున్నది. మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందియున్నారు. దేని కొరకు? మీ పాపక్షమాపణ నిమిత్తము. పాపములు యేసుక్రీస్తు నామములో క్షమించబడును.
125అయితే తండ్రీ, అక్కడ రోగులున్నచో వారు బాగయి నడిచిపోవుదురు గాక. వారు కుంటివారయితే, ఆవలి పరిశుద్దాత్మ శక్తిలోనికి వారు నడిచిపోవుదురు గాక. వారు పాపులయినచో, కడుగబడి శుద్దులుగా నడిచిపోవుదురు గాక. యంత్రములుగా, వారు మారి వెళ్ళుచుండగా, పైనుండి కదిలించు శక్తి, పరిశుద్ధాత్మ వచ్చి వారిని పట్టుకొనిపోవును గాక, ప్రభువా. వారి మర్త్య-శరీరమును జీవింపజేయుము, అప్పుడు మేము అసలయిన క్రొత్తభాషలు విందుము, దేవుని శక్తులు, చెప్పనశక్యమగు ప్రేమ, మరణమందు నీవు చూపిన కృప, జీవించుచూ నీవు చూపిన కృప, పునరుత్థానుడగు క్రీస్తు, ఒక శరరము, ఒక వధువు, ఈ భూమి మీద ఆయనకు సాదృశ్యము.
తండ్రీ, వారు నీ వారు. వారు తమ చేతులు ఎత్తి యున్నారు, నేను వాక్యమును బోధించాను; ఇప్పుడు, తండ్రీ, వారిని స్వీకరించుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. యేసుక్రీస్తు నామమున దానిని నేను అడుగుచున్నాను. ఆమేన్.
126మీరాయనను ప్రేమించుదురా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆ ఈస్టరు పునరుత్థానములో మీరు భాగమైయున్నారనియు, ఆయనతో పాటు మీరు లేపబడిరనియు సంతృప్తి చెందుచున్నారా? మీ చేతిని ఎత్తుడి! మీరును అందులో యున్నారు.
"నా చిన్నపిల్లలారా" అని పౌలు చెప్పియు౦డునట్లుగా (అతనిని అనుకరించుట కాదు కాని ప్రేమ), "నేను మిమ్ము ప్రేమించుచున్నాను." ఇక్కడికి వచ్చుటకు రోడ్డు దూసుకొని, అన్నియూ దాటి, మీతో మాట్లాడుటకు వచ్చాను. ఎడారిలోనుండి, మంచు చరియల నుండి, ఇంకా ఎన్నో దాటి ఇక్కడకి వచ్చాను. మనము వీమానములో ఎగురుదుము. మీరు గ్రామసీమల గుండా కారు నడుపుకు వచ్చిరి కావున ఆలాగు మనము కూడికొనియున్నాము. మనము ఒకరి నొకరము ప్రేమించుకొనుచున్నాము.
మనము ఒకరిలో ఒకరము భాగమై యున్నాము. సాతాను మీకు ఎన్నడును మరేదియూ చెప్పుటకు తావీయవద్దు! ఒకరిలో ఒకరము భాగమైయుండుట ద్వారా మనము ఆయనలో భాగము. మనము ఆ రాజ్యము యొక్క సహ పౌరులము. పునరుత్థానము యొక్క ఈ దీవెనలను కలసి అనుభవించుచున్నాము.
ROM 8:39•
REV 16:3
127ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు పునరుత్థానము పొందియున్నారు. దేవుడు ఆయనను లేపినప్పుడు, నిన్ను లేపెను. ఇప్పుడు కుమారుడు మీ మీదయున్నాడు, అంత్యదినమున సంపూర్తిగా పునరుత్థానము పొందుటకు ఆయనవలె యుండుటకు వికసిత జీవితములోనికి ఇప్పుడు మీరు ఎదుగుచున్నారు. ఇప్పుడు మీరు మీ శక్తిని పొందియున్నారు. ఎందుకు మీరు ఎగిరియున్నారు? మీ ఆత్మ మార్పు చెందెను, కాదా? మీ శరీరము దాని ఆధీనములోనికి వచ్చినది, రాలేదా? దేనీ ఆధీనములోనికి? సంఘము యొక్క ఆధీనములోనికా? వాక్యమునకు, అదే జీవము. అయితే ఇప్పుడు నీవు మృతులలో నుండి పునరుత్థానము పొందితివి. నేను యేసుతో నుండిన ఈస్టరు అది. నీవు మరియు యేసు కలిసిన ఈస్టరు అది. నేను, నీవు యేసుతోనుండిన ఈస్టరు. అది మనమందరమూ… యేసు నీవు నేను-మనమందరము కలిసి పునరుత్థానము పొందియున్నాము.
మన శరీరమును ఆత్మ విడిచిపెట్టిననూ, శరీరములు చీకిపోయిననూ, అవి మట్టి అయిపోయిననూ, అవి దహించబడిననూ, అవి సముద్రపుటడుగున ఉన్నా గాని — అంత్య దినమున మనము లేచెదము. దేవదూత సముద్రము మీద చేయి చాపగా చనిపోయిన వారందరూ బయటకు వచ్చిరని బైబిలు చెప్పుచున్నది. మనలందరిని కలిపి లేపిన, ఎంతగానో మనం ప్రేమించుచున్న వని నుండి వేరుచేయునది గాని, దాచునది గాని ఏదియూ లేదు.
128దేవుడు మిమ్మును దీవించును. ఇక్కడ చాలాసేపు మిమ్మునుంచాను. ఆ జనులింకా ఆ టెలిఫోన్ మీదయున్నచో, వారు కచ్చితముగా… నిమిషమునకు ఏబది సెంట్ల, నిజంగా ఈ ఉదయము వారు చెల్లించియుందురు. కానీ నేను ఆ గడియలో ఆపలేకపోయాను. నేను కొనసాగించవలసియుండెను.
ఇప్పుడు, ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రికి మరల వచ్చి మీతో మాట్లాడుదును. నేను చేయజాలనిచో, మీకు తెలియును… ఇక టెలిఫోను ద్వారా ఉండమని నేను అనుకొనుచున్నాను? ఇక మీదట టెలిఫోను మీద ఉండము.
నేనెక్కడికి వెళ్ళుచున్నానో మీరందరూ ఎరుగుదురు కదా? ఆఫ్రికా!చాలాకాలము నుండి పిలుపు వచ్చుచున్నది; తిరిగి వెళ్ళాలని సంవత్సరాల తరబడి ప్రయత్నించాను. ఇప్పుడు ఒక దర్శనము, ప్రభువు ఆత్మ మార్గమును సిద్ధపరచెను. గత పర్యాయము నేను రాలేదని విని ఆ బీద స్థానికులు, వారు దివారాత్రులు ఆ నేల మీద పడి మూలుగుతూ ఈలాగు మొరపెట్టిరి, "ప్రభువా, మేమేమి చేశాము?" వారిలో వేలాదిమందికి తమలో ఆత్మ అనేది ఉన్నదన్న సంగతి కూడా ఆ ప్రజలకు తేలీదు, చూచారా. వారు మొరపెట్టిరి మరియు వారు మూలిగిరి, వారు కేకలు వేసిరి.
129ముందుగా ఏ మాట పంపవద్దు. దయచేసి పంపవద్దు. చూచారా, ఆ వీసా వారి మద్యకు వెళ్ళినచో, ఆ సేవకుల మధ్యకు వెళ్ళినచో, వారు నన్ను అక్కడే ఆపియుందురు. నేను ఒక వేటగాని వలె వెళ్ళవలసియున్నాను. పదిహేడు ట్రైన్స్ నిండా జనములను తీసికొని కూటమునకు వచ్చిన ఆ రాణి యొద్దకు నేను వెళ్ళుచున్నాను. నేను ఆమె ప్రాంతములో వేటాడుదును. నా పాస్-పోర్ట్, అన్నీ వేటగానిగానే చూపించుచున్నవి, మతపరమైన సేవా మీద కాదు.
అప్పుడు ఒక సోదరుడు నన్ను కలిసికొని "మా కొరకు చిన్న కూటము ఎందుకు ఏర్పాటు చేయరాదు?" అని అడగవలసియున్నాడు. స్టేడియంలు ఇప్పటికే అద్దెకు తీసికొనబడినవి. దానిని వారు ఏ మాత్రము ఎరుగనే ఎరుగరు, చూచారా. ఓ, మహిమ!
2TIM 1:12
130దేవుని చిత్తము ఆటంకపరచబడకుండా ప్రార్ధి౦చండి. నేను విడిచిపెట్టినప్పటి నుండియు నా ఆత్మ ఆఫ్రికా కొరకు మొరపెట్టుచున్నది. నేను మరల తిరిగి వచ్చి గొప్ప కూటము జరిగినదని మీకు వార్త అందించుదును గాక! ఈనాటి నుండి తిరిగి మరల నేను వచ్చువరకు, బహుశా మిమ్ములను చూడను. ఇక కొద్ది దినములలో, అనగా మే 10న మేము వెళ్ళుచున్నాము. మీరు నా కొరకు ప్రార్ధి౦చుదురా?
అక్కడికి వెళ్ళువరకు అక్కడే బాధలు ఎదురవునో మనకు తెలియదు - ప్రతిచోటను క్షుద్రశక్తులు గలవారు, దయ్యములు; ఏమి చేయవలెనో వాటికి తెలియదని మీరు అనుకోకండి, చూచారా. నీవు మాట్లాడుచున్న దానిగూర్చి నీవు ఎరిగియుండుట మంచిది. అలాగే వారి యెదుట నీవు నిలబడవలెను. "నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. ఆయనకు నేను అప్పగించిన దానిని ఆ దినమున ఆయన కాపాడుటకు సమర్ధుడని నమ్ముచున్నాను."
ఇప్పుడు, ఇక్కడ కొన్ని చేతిరుమాళ్ళు పడియున్నవి. ప్రియదేవా, ఈ ఉదయమున ఈ పునరుత్థాన వర్తమానమును, ప్రభువా, ఇక్కడ నిలబడి నమ్ము బిడ్డలో జీవింపజేయు శక్తియున్నదని వాక్యము ద్వారా నిరూపించాను. కాబట్టి వీశ్వసించుట ద్వారా, నమ్మిక చొప్పున జీవింపజేయు శక్తి నా జీవితమును మార్చినది. ప్రభువా, ఈ ప్రజలు నమ్ముచున్నారు. అది వారి జీవితములను మార్పు చేసెను. మేము ఒకరి కొరకు ఒకరము ప్రార్ధన చేసికొనుచున్నాము.
మృతులలో నుండి యేసుక్రీస్తును లేపి తీసికొనివచ్చిన దేవుడు, మృతులలో నుండి ఆయనను లేపిన ఆత్మ మన శరీరములలో నివాసము చేయుచుండగా, నేను ఈ చేతిరుమాళ్ళ మీద నా చేతులుంచుచున్నాను.
ఎలీషా మీద, అనగా చనిపోయి, ఎముకల మీద నుండిన ఆత్మ వాటిని లేపు శక్తిని ఇచ్చెను. అపోస్తులుల చేతులు లేపు శక్తిని కలిగియుండెను. అపోస్తులుల మనస్సు, అపోస్తులుల దృష్టి, విశ్వాసుల నాలుక అన్నియూ జీవింపజేయు శక్తిని కలిగియుండెను.
నేను వాటిమీద ఈ వాక్యమును నుంచుచుండగా, ఆ జీవింపజేయు శక్తి వచ్చును గాక! ఆ లేపు శక్తికి ప్రతినిధిగా కృపను బట్టి స్వతంత్రించుకొనియుండి. ఆ లేపు శక్తికి ఈ వ్యాధి శరీరములను ప్రతిదానిని బ్రతికించి శుద్ధిచేయును గాక! యేసుక్రీస్తు నామమును బట్టియే. కేవలము ఈ చేతిరుమాళ్ళకు మాత్రమే కాదు గాని, ఆ జనములో యుండి ప్రజలకును, బాధపడుచున్న ప్రతి వారికిని, ఆ చిన్న పిల్లలకును పెద్దవారికిని, వారెవరైనను సరే, ఇప్పుడు, ఆ జీవింపజేయు శక్తి యేసు నామములో లేపును గాక. ఆమేన్.
MATT 9:20,22•
MATT 26:67•
MARK 5:27,34•
LUKE 8:44,48
131ఇప్పుడు, మీలో ఎందరు జీవింపజేయు శక్తి కలిగియున్నారు? ఇప్పుడు ఒకరిమీద ఒకరు చేతులుంచుకొండి, ఆ జీవింపజేయు శక్తి మీలో యున్నచో.
ఇప్పుడు, మీకు అవరోదముగా ఒకే ఒకటున్నది అదేమనగా, మీ అవిశ్వాసము. ఒక స్త్రీ ఆయన వస్తపు చెంగును ముట్టి శుద్ధురాలాయెను. ఒక రోమా సైనికుడు ఆయన ముఖము మీద ఉమ్మివేసి నరకమునకు పోయెను, చూశారా. కావున అది నీవు ఎచ్చట వున్నావో అనే దానిమీద అది ఆధారపడివున్నది. దానిని నీవు నమ్ముదువా ? దానిని నీవు నమ్ముచున్నావా?
ఇప్పుడు మీరు శిరములు వంచి, ఒకరికొకరు ప్రార్ధించండి. ఇప్పుడే ప్రార్ధించండి. చెప్పండి, "ప్రభువా, ఈ వ్యక్తిని….." చూచారా, కేవలం, ఒకరికొకరు ప్రార్ధి౦చుకోండి.
132ప్రియమైన దేవా, రక్షింపబడుటకు స్వస్థపర్చబడుటకు మనష్యులకివ్వబడిన ఏకైక నామమగు యేసుక్రీస్తు నామమున మేము దీనిని చేయుచున్నాము. ఎవరైతే రాజ్యపు సహపౌరులుగా వున్నారో, సజీవ శక్తికి వారసులుగా ఉండిరో, అట్టివారికి దీనిని సజీవ శక్తిగా ఇప్పుడే చేయుము, ప్రభువా. పక్షిరాజు నుండి పక్షిరాజు యొద్దకు ఆత్మ వెళ్ళును గాక, ఎంతవరకు అనగా, మా భౌతిక మరియు ఆత్మీయ దేహములలో యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత వచ్చు వరకు వెళ్ళును గాక, వారియొక్క ప్రతి అక్కరికి అది వెళ్ళును గాక, ఆ విధముగా జరుగుటకు మేము ఒకరిమీద ఒకరము చేతులుంచుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామమున.