వాక్య విషయములో దేవుడెన్నడైనా తన మనసు మార్చుకొనునా?

వాక్య విషయములో దేవుడెన్నడైనా తన మనసు మార్చుకొనునా?

1మన శిరములు వంచుదము.

ప్రియ ప్రభువైన యేసూ, మరల నీ నామములో గొప్ప ఆశతో కూడికొనియున్నాము. దేవుని యొక్క పునరుత్థాన శక్తిని కుమ్మరించుము, మా స్థానమును మా చోటును గుర్తించగలుగునట్లు చేయుము. దేవుని పిలువబడిన ప్రజలముగా మాకు గల బాధ్యతను గ్రహించునట్లు చేయుము. లోకములో నుండి వేరై, దేవునికి సమర్పించుకొనియున్నాము. దేవుని ఆశీర్వచనములు మమ్మును నడిపించి, మా మాటలలోను, క్రియలలోను మాదిరిగా యుండునట్లు, ప్రభువా, నీవే ఆదేశించమని ఈ రాత్రి మనవి చేయుచున్నాము. అందుమూలముగా నీవే మహిమ మరియు ఘనతను పొందుమని అడుగుచున్నాము. ఆమేన్.

2ఈ రాత్రి మరల ఆలయములోనికి వచ్చినందుకు చాలా సంతోషముగా యున్నది. నీ ప్రియ జనులతో నుండుము. వేడిగా యున్నదని నాకు తెలియును. నా భార్యను పిలిచాను. అక్కడ దాదాపు 90° లేదా 96° ఉష్ణోగ్రత యున్నది. ఇక్కడి కంటి కొద్దిగా వేడిగా యున్నది. నేను వేడి వాతావరణమునకు అలవాటయ్యాను. ఈ అద్భుతమగు ఈస్టరు సమయములో ఆలయమునకు తిరిగి వచ్చుట చాలా సంతోషముగా యున్నది.

ఈ ఉదయమున పొడవైన వర్తమానమును చెప్పుదునని నేను ముందే ఊహించి, క్షమాపణ అడగలేను. మీకు అసహనము కలిగించను. ఈ రాత్రికి మరల వచ్చుదుము. ఈ పునరుత్థాన వర్తమానమును నేను మీకు అందించగోరుచున్నాను, చూచారా. దానిని గూర్చి ఏమి చింతించనవసరము లేదు, చూచారా. దాని విషయములో ఆనందించుచున్నాను. దాని నుండి వేరు చేయునది ఏదియూ లేదు. దేవుని యొక్క రాజ్యములో నిత్యము భద్రముగా యున్నారు. దేవుడు మా మీద తన ముద్రను కొట్టెను — మీరు మీ యొక్క గురి యొద్దకు చేరెదరు.

EPH 4:30

 

3ఒక పాకెట్టు మీద ప్రభుత్వము ముద్రవేసినప్పుడు, దానిని రైలులో వేసి ఆ తలుపు మీద ముద్ర వేయుదురు. అది దాని గమ్యమును చేరువరకు ఎవరూ దానిని విప్పరు. దేవుడు తన ముద్రను ఒకని మీద వేయును. (పరిశుద్ధాత్మయే ఆ ముద్ర) మానవుని అలాగు ఆయన ముద్రించును. అతడు తన నిత్య గమ్యమును చేరును. మరల ఎన్నడునూ వెనుకకు జారీపోడు. ఎందుకనగా ఎఫెసీ 4:30లో చెప్పబడినది గుర్తుంచుకోనండి: "దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీరు దాని చేత ముద్రింపబడితిరి…" చూచారా! మీరు ఎల్లకాలమునకు ముద్రింపబడితిరి. మీరు నిత్య ముద్రను వేయించుకొనిరి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యములోకి ముద్రింపబడితిరి. దానిని గూర్చి ఇప్పుడు ఆలోచించుడి!

1JN 3:14

 

4అప్పుడు మీరు…

ఆపవాది మి మీదికి తన పిడికిలిని చూపవచ్చును, ఎన్నో మాటలన వచ్చును, మిమ్మును దూషింపవచ్చును. మాకు ఆ ముద్ర లేదని చెప్ప వచ్చును, కాని వాని మాటను వినవద్దు.

ఇప్పుడు, మీరు మరణములో నుండి జీవములోనికి దాటియున్నారని ఎరుగుదురు. ఒకప్పుడు మీరు ప్రేమించినవాటిని ఇప్పుడు ప్రేమించుట లేదు. దేవుని యొక్క ప్రతి మాటను మీరు నమ్ముతున్నారని మీకే తెలియును. మన మధ్య దేవుడు పని చేయనున్నాడని మీరెరుగుదురు. అందుకు తప్పిపోని రుజువులు మనకున్నవి. ఆయనే ఆ గొప్ప ఉన్నవాడు. ఆయన నామములో పలుకబడిన ప్రతి మాటయు, ఆయన నామములో ప్రవచించిన ప్రతి వాక్కు చెప్పు బడిన రీతిగానే అక్షరాలా నెరవేరినది. సైన్సు, వార్తాపత్రిక కెమేరా చిత్రము, రచయితలు, అన్నియూ దానిని గుర్తించినవి, చూచారా. వారు ఇష్టముండి, ఇష్టము లేకయో దానిని గుర్తించారు. దేవుడు ఏ విధముగానయినా దానిని వారికి తెలియచేయును, చూచారా.

LUKE 12:32

 

5గుర్తుంచుకొనండి, ఆయన పెద్ద గుంపు కొరకు వచ్చుట లేదు: "చిన్న మందా భయపడకుడి: మీకు రాజ్యమ అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైయున్నది."

ఆశర్యము గొలుపు ఒక మాటను నేను మీకు విడిచి పెట్టెదను. ఆ తరువాత ఒక సేవకునికి అభిషేకము చేయుదుము. ఇది చాలా సంచలనము కలిగించును. మీరు దీనిని తెలిసికొనవలెను. ఇది ఖచ్చితమని నేను చెప్పను గానీ ఆ నిర్ణయము మీకే విడిచి పెట్టుచున్నాను.

పశువులను సంకరము చేయువారెవరైనా ఇచటున్నారో లేదో నాకు తెలియదు. దానిని నేను నమ్మను, కాని దానిని నేను గమనించాను. మగదానిలో నుండి వారు వీర్యమును తీయుదురు. బహు కొద్దిగా యుండును. సన్నని నాలుక బద్ద వంటి దానికి అది అంటుకొంటే చాలును. దానిని ఒక చలువ రాయి మీద యుంచెదరు. భూతద్దములో దానిని చూచెదరు. ఎన్నిసార్లో నాకు తెలియదు, మామూలు కంటితో మీరు దానిని చూడలేదు. మామూలు అద్దమునకు కనబడదు, కానీ దానిని నూరు రెట్లు లేదా నూట-ఏబది రెట్లు పెద్దదిగా చేసి చూచెదరు. ఆ సూక్ష్మ వీర్యములో దాదాపు ఏభై లేదా వంద కణములు అటు ఇటు దొర్లుతూ కనబడును. అలాగే ఆడ పశువులో కూడా అన్నీ అండములుండును. అవి సంయోగము చెందినప్పుడు, అనగా ఏవి మొదటగా సంయోగము చెందునో అదే జీవిగా మారును.

6ఆ మిలియను సంఖ్యలో ఒక్కటి మాత్రమే జీవించును. దానిని గూర్చి మారెన్నడయినా ఆలోచించారా? అవన్నియూ ఒకే అండములు, ఒకే జన్యువులు. అవన్నీ ఒకే విధంగా యుండును, కాని వాటిలో ఒక్కటి మాత్రమే జీవించును. దానినెవరూ నిర్ణయించలేరు. కొన్నిసార్లు ఆ ఫలదీకరణము చెందనైయున్న అండము ఎక్కడో వెనక యుండును. దానితో సంయోగమగు వీర్యకణము మధ్యలో యుండును. అవి ప్రాకుకొంటూ వచ్చి ఒకదానితో మరొకటి విలీనమగును. ఆ జీవి స్త్రీయో, పురుషుడో, ఎర్రని జట్టు గలవారో, నల్లని జుట్టు గలవారో తెలిసికొను జ్ఞానము ఎవరికినీ లేదు. అది దేవుని యొక్క ఎన్నిక; మరొకటి కాదు. ఎన్నిక!

ఈ లోక సంబంధమగు జన్మలో ఎన్నిక పని చేయుచున్నది. స్త్రీయో, పురుషుడో, మరేమగునో అన్నియూ నిర్ణయింపబడినవి. ఆ చిన్న వీర్య కణము ప్రాకుకొంటూ ఈ చిన్న అండమును చేరును. ఆ చిన్న తోక ఊడిపోవును. అది ఆ జీవి యొక్క వెన్నెముకగా తయారు కానారంభించును. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు. పద్ధతి ఒక్కటే. మిగిలిన ఆ మిలియను వీర్య కణములు, మిలియను అండములు, మిలియను క్రిములు నశించును. ఒకే ఒక్కటి బ్రదుకును. అన్నీ ఒకేలాగుండును, కాని ఏది జీవమును పొందవలెనో దేవుడు ఎన్నిక చేయును. తక్కినవన్నియూ నశించును. మిలియనులో ఒక్కటే బ్రదుకును!

JOHN 6:49•

1COR 10:2-4

 

7ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి పెట్టిరి. వారందరూ ఒకే ప్రవక్త యొక్క వర్తమానమను నమ్మిరి. వారు మోషే ద్వారా దేవుని యొక్క సూచక క్రియలను చూచిరి. వారందరూ చూచిరి. వారందరూ ఐగుప్తులో నుండి బయటకు వచ్చి, ఎర్ర సముద్రమును దాటిరి. మోషే ద్వారా బాప్తిస్మమును పొందిరి. ప్రతి ఒక్కరు దేవుని యొక్క శక్తిని చూచిరి. అతడు ఆత్మతో పాడగా, మిరియాము తంబురను వాయించుట వారు చూచిరి. ఆ సముద్ర తీరములో పరుగిడిరి. ప్రతి ఒక్కరూ ఆకాశము నుండి కురిసిన తాజా మన్నాను తిన్నారు. వారిలో ప్రతి ఒక్కరు కొట్టబడిన బండలోని నీటిని త్రాగిరి. అది ఆత్మీయ జలము. ఐగుప్తులో నుండి రెండు మిలియనుల మంది జనులు బయటకు వచ్చిరి. అయితే వాగ్దాన దేశమును ఎందరు చేరుకొనిరి? ఇద్దరే - మిలియనకు ఒక్కరు చొప్పున చేరిరి. వారందరూ ఏమయిరి? వారు నశించిరని యేసు చెప్పెను. "మీ పితరులు అరణ్యములో మప్పది సంవత్సరముల పాటు మన్నాను భుజించిరి, మరియు నేను మీకు చెప్పుచున్నాను, అయినా గాని వారందరూ నశించిరి."

8ఈ రాత్రి భూమి మీద అయిదు వందల మిలియనుల మంది క్రైస్తవులున్నారు, కాతలిక్కులు, ప్రొటస్టెంటులు అందరినీ కలిపి చూడండి. యేసు రాకడ వచ్చినట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారము అయిదు వందల మంది రాకడలో ఎత్తబడుదురు. వారే ఈ రాత్రి కనబడకుండా పోవుదురు. ప్రతి దినమును ఆ విధంగానే జరుగుచున్నది. భూమి మీద గల దేశములలో అంత మంది ప్రతి రోజూ తప్పిపోయి కనబడుట లేదు. వారి జాడ ఏమాయెనో తెలియుట లేదు. అది ఏ సమయములోనయినా కావచ్చును, చూచారా.

ఓ, క్రైస్తవులారా, దేవుని యొక్క సర్వాంగ కవచము మనము ధరించుకొందము. మనము చేతనయిన విధంగా ఆయనను ప్రేమించి సేవ చేయుదము, మరియు ఆ గొప్ప సమయము కొరకు కని పెట్టుదము.

MATT 24:37•

LUKE 17:26•

1PET 3:20

 

9ఇప్పుడు, ఒక తరములో నుండి గొప్ప జన సమూహములు గాని, ఎన్నో మిలియనుల మంది గాని బయటకు వచ్చి దేవుని వెంబడించరు. అది జరుగదు. గుర్తుంచుకొనండి. ప్రతి రోజూ ఒక తరము గతించుచున్నది, ప్రతి దినమును. "నోవహు దినములో ఎట్లుండెనో మనుష్యకుమారుని రాకడ యందును అలాగే యుండును. అప్పుడు నీటి ద్వారా ఎనిమిది ఆత్మలు రక్షించబడినవి. ప్రతి దినమున ఎవరో ఒకరికి నలుబది సంవత్సరములు గతించుచున్నవి, చూచారా. ప్రతి దినము ఆ రాజ్యము లోనికి ఎందరో ముద్రించబడుచున్నారు. ఒక రోజుకు చివరి దినము వచ్చును. మనము ఇంకా సరయిన మనస్సులో యుండగానే నిశ్చయముగా తెలిసికొందము, సంఘములో మిరున్నారు, పరిశుద్ధాత్మ తన్నుతాను తన మధ్య గుర్తింపచేసికొనినది. అంతా సరిగా యుండునట్లు మనము నిశ్చయత కలిగియుందము. అంతా సరిగా యుండునట్లు మీరు చూచుకొనుడి.

మీరు ఆగవద్దు. ఆ పునరుత్థాన శక్తి మిమ్మును ఈ లోక సంగతులలో నుండి దేవుని రాజ్యములోనికి లేవనెత్తు వరకు మీరు దివా రాత్రులు విశ్రమించవద్దు. దేవుని రాజ్యము లోనికి నిజముగా వచ్చిన మీకు, దేవుని ఆత్మ ద్వారా మేల్కొలుపబడిన వారికి ఆ సంతోషము తెలియును. ఆనంద బాష్పములు రాలుచున్నవి. దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి మనము మోకాళ్ళూని, దివా రాత్రులు ఆయనకు వందనములు చెల్లించవలెను.

10ఈ రాత్రికి మన ఆరాధనలో చిన్న మార్పు ఉండును. ఇక్కడ మనతో ఒక చక్కని సోదరుడున్నాడు. సహూదరుడు కాప్స్. నజరీన్ చర్చి నుండి అతడు మన యొద్దకు వచ్చియున్నాడు. కాప్స్ సోదరుడా, అది నిజమేనా? ఈ రాత్రి మనము అతని మీద చేతులుంచి అభిషేకించవలెనని కోరియున్నాడు.

ఎవరికిని పేపర్లు ఇచ్చుటకు మన యొద్ద లేవు, అయినా గుర్తింపు ఉన్నది. కావాలన్నచో మనకు పత్రములు దొరకును, కాని మన నమ్మకము ఏమనగా నిజమైన అభిషేకము గలిగిన సేవకునికి పత్రములు పరలోకములో యుండును. అతని జీవితమును బైబిలు గుర్తించినంత కాలము అతడు దేవుని యొక్క బైబిలును బోధించు హక్కును కలిగియుండును. అది అతని రాజపత్రమని మనము నమ్ముచున్నాము.

నజరీన్ చర్చిలో సహూ కాప్స్నకు అధికారపూర్వకంగా అభిషేకము జరిగియున్నది, కానీ ఈ రాత్రి పెద్దలను, ఇంకా దైవజనులను తన పైన చేతులు వేయమని కోరుచున్నాడు. ఈ వర్తమానమును కొనిపోవుటకు అతడు అభిషేకము పొందును. ఎంత ఘనమైన సంగతి!

2TIM 1:5

 

11టుసాన్ లో ఉన్నప్పటి నుండి వార్తా పత్రికల విలేకరులు పంపుచున్న వివేదికలను వినుచున్నాను. చాలా అద్భుతమగు నివేదికలు. మన ప్రియ సోదరుడగు నెవిల్ కు సహాయకునిగా కాప్స్ సోదరుడు పని చేయును. వెలుగు దీపమును ఎంతో బలముగా వారు ప్రజ్వరిల్ల చేయవలెనని కోరుచున్నాము. ఇద్దరూ కలిసి ఈ పనిని కొనసాగించెదరు. వీరిద్దరునూ యోధులే. నెవిల్ సోదరుని మీద మనము చేతులుంచి యున్నాము, కాని సహూదరుడు కాప్స్ మీద చేతులుంచ లేదు. సేవకులగు సహోదరుడు జాక్సన్ ను, సహోదరుడు రడెల్ ను, ఇంకా సంఘ పెద్దలను కొద్ది నిమిషముల పాటు ఇక్కడికి రమ్మని కోరుచున్నాను. కాప్స్ సోదరుని మీద చేతులుంచవలెను.

బైబిలులో ఆ విధముగా చేసిరని మనము చూచాదము. హస్తనిక్షేపణము ద్వారా వారిని ప్రత్యేక పరచిరి. వారు తిమోతికి అదే చేసిరి. "నీ అవ్వయగు లోయి ద్వారా నీకు ఈ వరము వచ్చినదని," చెప్పెను. దానిని వారు గుర్తించిరి. పెద్దలు, బోధకులు హస్తనిక్షేపణము చేయుట ద్వారా అతని లోనికి ఆ వరము వచ్చినట్లు వారు గుర్తించిరి.

12కడవరి వర్షమును గూర్చి సోదరులు గందరగోళములో యుంటున్నారు. వారు ఒక వరమును పొందినట్లుగా తలంచుచున్నారు. కాదు, ఆ వరము ఎప్పుడో వారిలో యున్నది. ఒక అనుమతికి చిహ్నముగా వారు హస్తనిక్షేపణము చేయుచున్నారు. దేవుడు ముందే వారిలో ఆ వరము నుంచినట్లుగా విశ్వసించుచున్నారు: దానిని వారు హస్తనిక్షేపణము ద్వారా విడుదల చేయుచున్నామందురు.

ఈ సంఘములో యున్న ఈ జనులు తమ ఆత్మలలో మేల్కొను శక్తిని కలిగి యున్నారని నేను నమ్ముచున్నాను. సోదరులారా, ఇప్పుడు రండి. రడెల్ సోదరుడు, ఇంకా ఈ ఆలయములోని పెద్దలు, సోదర సంఘముల కాపరులు అందరూ వచ్చి సహోదరుడు కాప్స్ మీద చేతులుంచండి. మన యొక్క అనుమతిని ఈ జనుల యొదట ఇతనికి ఇచ్చుదము. అభిషేకించుదము. ప్రభువైన యేసు సువార్తను ప్రకటించుటకు పంపుదము. దేవుడు పిలచిన చోటికి వెళ్ళును. జన్మ ద్వారా అతడు ఎప్పుడో మనలో ఒకడాయెను. అతడు మనలో ఒకడు, ఎందుకనగా వర్తమానమును నమ్మెను. వాక్యము యొక్క సత్యము కొరకు అతడు నిలబడుచున్నాడు గనుక అతడు మనలో ఒకడాయెను. ఇప్పుడు మీ అందరి యెదుట సహోదరుడు కాప్స్ మీద చేతులుంచి అధికారపూర్వకంగా అభిషేకించుచున్నాము. అతడు మనలో ఒకడు. [సహో! బ్రెహాం సేవకులతో ప్రక్కన మాట్లాడుచున్నాడు.]

సహోదరుడు కాప్స్ ను ఎరిగిన వారిచ్చట ఎందరున్నారో చేతులెత్తండి. సరే, మీ చేతులు క్రిందికి దించవచ్చు. అతడు దేవుని సేవకుడని ఎందరు నమ్ముతున్నారో చేతులెత్త వలెను. మా సోదరునిగా ఇతనిని ప్రేమించుచున్నాము.

ISA 6:5

 

13ఇప్పుడు, మనము దీనిని అభిషేకమని పిలచుచున్నాము గాని ఇది అక్షరాలా అభిషేఅకము కాదు. నేను ఈ పాటను పాడలేను గాని ఈ జనులను పాడుటలో సహాయము చేయవలెనని కోరుచున్నాను.

ఒకనాడు ఒక ప్రవక్త ఆలయములోని బలిపీఠము నొద్దకు వెళ్ళెను. అతడు ఆలయములో యుండెను. అతడు మంచి మనిషి. రాజగు ఉజ్జీయా మీద చేతులుంచుచుండెను. అతడు మంచి వాడే. ఒక దినమున అతడు ఆలయములో ఒక దానిని చూచెను. అటువంటి దర్శనమును ముందెన్నడూ అతడు చూచి యుండలేదు. దేవదూతలు రెక్కలను కలిగి యుండి ఆలయములో ఎగురుచున్నవి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, దేవుడగు యెహోవా పరిశుద్ధుడు," అని కేకలు వేయుచుండెను. "సర్వశక్తి గల యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" అని కేకలు చేయుచుండెను.

ISA 6:3,6,7

 

14అది జరుగుచున్నప్పుడు దేవాలయపు కమ్ములు కదలుచుండెను. అతడు ఇట్లనెను, "అయ్యో! నేను అపవిత్రమగు పెదవులు గలవాడను." దేవుని యొక్క సన్నిధిలో ఉండగా అతడు గుర్తించేను. అతడు ప్రవక్తయై ఉండినా గాని అయోగ్యుడనని తలంచెను. "నేను అపవిత్రమగు పెదవులు గలవాడను. అపవిత్రమగు పెదవులు గల జనుల మధ్య నివాసము చేయుచున్నాను," అనెను.

ఆందులో ఒక దేవదూత ఎగిరి వచ్చి అగ్నిలో నుండి ఒక నిప్పును తీసి అతని పెదవులకు అంటించెను. "నరపుత్రుడా, ప్రవచింపుము" అనెను.

సోదరీ, మాకు ఆ పాటను ఎత్తి చూపించగలవా? ఈ పాటను ఎందరెరుగుదురు? ఒక వచనము… సరే.

నిప్పు రవ్వ ప్రవక్తను తాకినప్పుడు,

శుద్ధునిగా అతడు మారెను, బహు శుద్ధి పొందెను.

"మా కొరకు ఎవరు పోవుదురు? అని దేవుని స్వరము పలుకగా

"ఇదిగో నేనున్నాను, పంపుము" అని జవాబిచ్చెను.

మాట్లాడుము నా ప్రభువా, మాట్లాడుము నా ప్రభువా;

మాట్లాడుము, నీకు త్వరగా జవాబును ఇచ్చెదను.

మాట్లాడుము నా ప్రభువా, మాట్లాడుము నా ప్రభువా.

మాట్లాడుము, నేను జవాబును ఇచ్చెదను.

"ప్రభువా, నన్ను పంపుము."

ఇపుడు మిలియనుల మంది పాపములో యున్నారు,

సిగ్గుతో అవమానముతో చనిపోవుచున్నారు.

వారి యొక్క విషాదపు, వికారపు కేకను వినుము;

త్వరపడుము, సోదరుడా, వారిని రక్షించుటకు త్వరపడుము.

"యజమానుడా, ఇదిగో నేనున్నాను" అని జవాబిమ్ము.

మాట్లాడుము, నా ప్రభువా, మాట్లాడుము నా ప్రభువా.

మాట్లాడుము, నీకు త్వరగా నేను జవాబును ఇచ్చెదను.

మాట్లాడుము నా ప్రభువా, మాట్లాడుము నా ప్రభువా.

మాట్లాడుము, నేను జవాబును ఇచ్చెదను.

"ప్రభువా నన్ను పంపుము."

ఇపుడు పెద్దలు వచ్చి సహోదరుడు కాప్స్ మిద చేతులు వేయగోరుచున్నాను. మనందరమూ తలలు వంచుదము.

2TIM 4:2

 

15ప్రియదేవా, దేవాలయపు స్తంభము మరల కదిలియున్నది. మా సోదరునిలో పునరుత్థానపు ఆత్మ యొక్క జీవము పనిచేయటను చూచుచున్నాము. తప్పక వెళ్ళవలెనను గురిని కలిగియున్న ఈ సోదరుని గూర్చి ప్రార్థించుచున్నాను; ప్రభువా, నీ పెద్దలముగా మేము ఇతని మీద చేతులుంచుచున్నాము. కుడి చేతి సహవాసమును ఇతనికి దయచేయుము. అతని మీద చేతులుంచుచున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదములను అతని మీదికి రానిమ్ము. అతని పెదవులను ఆలోచనలను, మొత్తం శరీరమును నీవు అభిషేకించుము. ఈ సువార్త యొక్క వర్తమానమును ప్రతి మూలకు, సందుకు తీసికొని వెళ్ళునట్లు కృప చూపుము. నీ పిలుపును అందించుము. ప్రభువా, నీ దాసునిగా మా సోదరుని సమరించుచున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

నా యువ సోదరుడా, వాక్యము బోధించుము. సమయమనక, అసమయమునక ప్రకటించుము. ఖండించుము, గద్దించుము. దీర్ఘశాంతముతో, హితబోధను బోధించుము. దేవుడు నిన్ను దీవించును.

2TIM 3:12

 

16సహోదరుడు బెన్ మనతో ఉండుటకు వచ్చెను. కొంత కాలము నుండి అతడు బోధించుచున్నాడని తలంచుచున్నాను. అయితే అధికారపూర్వకంగా అతనిని అభిషేకించలేదు, లేదా చేతులుంచలేదు. (అతడు అభిషేకము పొందాడు అని అనుకున్నాను; అందుకే అతడిని పిలిచాను.)

ఇప్పుడు, సహోదరుడు బెన్ యొక్క సోదరి ఇక్కడే ఎక్కడో ఉండి యుండును. ఆమె చాలా చక్కని వ్యక్తి. ఆమె స్త్రీ బోధకురాలు. ఆమె మరియు మన సోదరుడు పెండ్లి చేసికొనినప్పుడు… ఆమెనతడు ఆలయమునకు తీసికొని వచ్చెను. ఆమె దీనిని చూచినది. వాక్యమును వినినది. ఆమె చక్కని వ్యక్తిత్వము గలిగిన స్త్రీ. ఆలాగు చేయుట తప్పు అని ఆమే గ్రహించినది, ఆమె విడచి పెట్టినది; ఆమె భర్త మిద అదనపు భారము పడినది. ఇది నిజము. అది అపోస్తలిక్ బోధ. ఆ విధముగానే, అది యుండవలెను.

సహోదరుడు బెన్ టేపులు తీసికొని తన భార్యతో కూడా వినెనని నాకు తెలియును. వారు బహు దూర స్థలములకు వెళ్ళుదురు. కొండలకు వారు వెళ్ళియున్నారు. అడవుల లోనికి వెళ్ళియున్నారు. వారు ఈ టేపులను అక్కడికి తీసికొని వెళ్ళి వినిపించి దానిని వివరించెదరు. వారికి చాలా సార్లు టేపుల కొరత ఏర్పడును. వారిని చాలా సార్లు తరుముట, త్రోసివేయుట, వెలివేయుట జరుగును. ఆలాగు జరుగుననీ మనకు ముందే తెలియును. యేసుక్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు హింసననుభవించుదురు.

17ఇక్కడున్న వారిలో ఎందరికి బెన్ సోదరుని గూర్చి తెలియును. అతడు దేవుని దాసుడని ఎందరు నమ్ముచున్నారు. మనము అతని పై దేవుని ఆశీర్వచనములుండవలెనని అందుకు అతడు యోగ్యుడని మనము కోరుచున్నాము. చూడండి, అతడు క్రొత్తవాడు కాదు. ఎన్నో సంవత్సరాల నుండి అతనిని మనము ఎరుగుదుము. అతడు దీనుడని నేనెరుగుదును. అతడు నా వంటివాడే. చాలా తప్పులు చేయును. మనందరము అలాగే యున్నాము. కాని బెన్ సోదరుని విషయములో నాకు నచ్చినది ఒకటున్నది, అదేమనగా, అతడు మోకరించి తన తప్పును సరిదిద్దుకొనును. ఒక రోజున అతడు వివాహము, పరిత్యాగము అను ప్రసంగమును వినెను… అతడు, అతని భార్య వేరగుటకు సిద్ధపడిరి, ఎందుకనగా వారిరువురు ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగియున్నారు. వారు దేవుని వాక్యముతో సహకరించగోరుచున్నారు. వాక్యము చెప్పిన దానికి వారు లోబడగోరుచున్నారు. బెన్ సోదరుని, అతని భార్యను అయన తన సేవలో ఆశీర్వదించవలెనని దేవుని ప్రార్థించుచున్నాను. మన సోదరుని మీద చేతులుంచుదము.

18ప్రియదేవా, మా సోదరుడగు బెన్ మీద మేము చేతులుంచుచున్నాము. అతనిని ప్రేమించుచున్నామని ఇది సూచన. ప్రభువా, అతడు నీ కోరకు పని చేయుటకు ఇష్టపడుతున్నాడని మేము నమ్ముచున్నాము. ఈ టేపులను బయటకు పంపించుచున్నాడు. కొందరు కొండజాతి వారి మధ్యకు వాటిని తీసికొని వెళ్ళి, వాటిని వినిపించుచున్నాడు. చాలా దూర ప్రదేశములకు తీసికొని వెళ్ళుచున్నాడు. ఆ స్థలములకు మనలో చాలా మందిమి ఎన్నడూ వెళ్ళజాలము. వర్తమానము ప్రపంచమంతా వెళ్ళవలెను. మా సోదరుని దీవించి, అతనికి నీ ఆత్మను అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాము. అది అతని మీది వచ్చి, అతనిని, అతని భార్యను ఆ దూర ప్రాంతములలో తోడుగా యుండి నడిపించవలెనని కోరుచున్నాము. బహుశా అచట ఒక్క ఆత్మ యుండియుండును. ఆ ఒక్క గొర్రె లోనికి వచ్చు వరకు తలుపులు మూయబడవు. తొంబది-తొమ్మిది గొర్రెలతో నీవు సంతృప్తి చెందవు. ఆ గ్రంధములోని ప్రతి పేరు విడిపించబడవలెను. ప్రభువా, అతనికి సహాయము చేయుము. మాతో సహవాసము చేయుచూ, మా సోదరునిగా యున్న ఇతని మీద చేతులుంచి ప్రార్థించుచున్నాము. మా సహాయము అతనికి అందించుచున్నాము. ప్రభువా, అతడు వెళ్ళు ప్రతి చోటను అతనిని దీవించుమని ప్రార్థించుచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

బెన్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. సేవక సోదరులముగా మేము మా కుడి చేతి సహవాసమును అందించుచున్నాము. దేవుడు నిన్ను దీవించును.

19జాన్ మార్టిన్ … ఎర్ల్. ఎర్ల్ మార్టిన్ ను ఎందరెరుగుదురు? అతడు క్రీస్తు దాసుడని ఎందరికి తెలియును? అసలతడు పెంతెకోస్తు గుంపు నుండి వచ్చెను. మన యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడతడు సంఘ కాపరిగా యున్నాడు. స్వతంత్రముగా పనిచేయుచున్నాడు.

ఎర్ల్ ను క్రీస్తు దాసునిగా నేనెరుగుదును. ఎర్ల్ చేసిన కార్యములు చాలా యున్నవి. కాని ఒక కార్యమును నేను మరచిపోలేను. నేను టెక్సాస్ లోని డల్లాస్ లో ఒక రాత్రి యున్నపుడు, వారు అతనిని పిలచిన సంగతి నాకు ఎప్పుడూ జ్ఞాపకమే. కాదు, అది టెక్సాస్ లోని బ్యూమవుంట్. నిజమే గదా సోదరి! అతని బాలిక మరణ శయ్య మీద యున్నది. అసలు చనిపోయినదనియే వారనుకొనిరి. ఊపిరి ఆడుట లేదు. ఎర్ల్ నా గదికి వచ్చెను. నన్ను తండ్రిగా భావించును. నా ముందుకు వచ్చి చేతులు కట్టుకొని వంగి నిలబడెను. నేను పడక మీద యున్నాను. నన్ను ఆలింగనము చేసికొని, ఇట్లనెను, "సోదరుడా, నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. ఆ విషయంలో నాకెన్నడూ సందేహం లేదు. నీవు మాట పలికితే చాలును, నా బాలిక చనిపోయినా గాని బ్రదుకును." అతని కుమార్తె ప్రాణము తెప్పరిల్లి జీవించినది.

20విశ్వాసుల యొక్క కుడి చేతి సహవాసమును అందుకొనుటకు అతడు యోగ్యుడని మీరు విశ్వసించుచున్నారా? అతని మీద చేతులుంచి సోదరులమగు మనము ప్రార్థించుదము.

కృప గల పరమ తండ్రి, మరల మా చేతులను మార్టిన్ సోదరుని మీద వేయుచునున్నాము. ప్రభువా, అతనిని మేము భూదిగంతములకు పంపుచున్నాము. ఏది ఏమయినా గాని అతడు వెళ్ళవలెనని నీవు ముందుగా ఉద్దేశించియున్నావు. ప్రభువా, సందులలోను, త్రోవలలోను, పొదలలోను, రాజ మార్గములలోను యున్న వారిని పిలువవలెనని నీవు చెప్పియున్నావు. నీ యొక్క ఆశీర్వచనములు అతనితో వెళ్ళును గాక! అతని మీద మేము చేతులుంచుచున్నాము. నీ వేగమును అతనికి దయ చేయుము. మా దీవెనలను అతనికి అందించుచున్నాము. ప్రభువా, మా మీద నున్న ఆత్మ అతనితో కూడా వెళ్ళును గాక. అతనిని నడిపించును గాక. సందులలోను, మార్గములలోను ఉన్న నశించిన ఆత్మలను రక్షించుటకు వాడుకొనుము. యేసుక్రీస్తు నామములో అతనిని పంపించుచున్నాము. ఆమేన్. మార్టిన్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ఇపుడు వెళ్ళుము. దేవుడు నీకు తోడుగా నుండును.

21నీ పేరు రిచర్డ్. ఎంతమందికి రిచర్డ్ బ్లయర్ తెలియును? అతడు దేవుని దాసుడని ఎందరు నమ్ముచున్నారు? అతడు యునైటెడ్ పెంతెకోస్తు గుంపు నుండి వచ్చియున్నాడు. బ్లయర్ సోదరునికి గొప్ప పిలుపున్నదని నాకు తెలియును. బ్లయర్ సోదరుడు నన్ను నమ్మని కాలమును నేనెరుగుదును. అతనిలో ఒక ఆత్మ పని చేయుచున్నందున నాది అబద్ధమని చెప్పెను. అతడు కూటములో కూర్చొని యండగానే పరిశుద్ధాత్మ పిలచినది. అతడు కుప్పకూలిపోవుటకు సిద్ధముగా యుండెను, అందువలననే అతడు ఆ రూపములో యుండెను. ఒక రోజున అతని ప్రియమగు భార్య నన్ను పిలచుట నాకు గుర్తున్నది, "బ్రెన్హాం సోదరుడా, రిచర్డ్ చనిపోవుచున్నాడు," అని అన్నాది. ఆమె తన చేతి రుమాలును అతని మీద ఉంచినది, ఎందుకనగా నేను ఆ రుమాలుకు ప్రార్థించి ఆమెకు ఇచ్చాను. అతడు సజీవముగా ఇచ్చటున్నాడు.

ఒక చిన్న బాలిక ప్రమాదమునకు గురియైనది. ఇంక బ్రదుకునను ఆశ లేదు. మెదడు అదిరినది. ఫోనులో ప్రార్థన చేయగా ఆ బిడ్డ బ్రదికినది. సహోదరుడు బ్లయర్ క్రీస్తు యొక్క నిజమైన సాక్షియని ఎందరికి తెలియును. నీ ఆశీర్వచనములు అతని మీద యుండవలెనని ప్రార్థించుచున్నాము. సోదరులారా, అతని మీద చేతులుంచండి.

22ప్రియదేవా, మా ఘనుడగు ప్రియ సోదరుని నీ దాసునిగా గుర్తించుచున్నాము. వెలుగులో నడచుటకు అతడు తన స్వంత గుంపును విడిచి వచ్చెను. తండ్రీ, మా సోదరుడు బ్లయర్ ను దీవించుమని ప్రార్థించుచున్నాము. అతనిని మా దీవెనలతోను, అనుమతితోను పంపుచున్నాము. ప్రభువా, నీవు ఏ పనితో అతనిని పంపుదువో దానిలో అతనిని దీవించుము. బ్లయర్ సోదరునితో నీ ఆత్మ వెళ్ళును గాక. ఈ లోకములోని నశించి మరణించిపోవుచున్న వారిని నడిపించి రక్షించుటకు అతనిని పంపించుము. నశించిన గొర్రెను వెదకి తిరిగి మందలోనికి చేరునట్లు అతనికి సహాయము చేయుము. ఏ స్థలములో అయినా గాని, అతనికి నీవు ఏమి దాచి యుంచినా గాని దానిని బయలుపరచుమని అడుగుచున్నాము. అతని యొక్క జీవిత ప్రయాణమంతటిలోను నీ ఆత్మ చేత అతనిని నడిపించమని అడుగుచున్నాను. మేము అతని సోదరులము. కుడి చేతి సహవాసమును మేనతనికి అందించుచున్నాము. యేసుక్రీస్తు నామములో నీవతనితో వెళ్ళుమని అడుగుచున్నాము. ఆమేన్.

కుడి చేతి సహవాసము, బ్లయర్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. మేము నూటికి నూరు పాళ్ళు నీకు తోడుగా యుందుము. నీ కొరకు ప్రార్థించుదుము. మాకు చేతనయిన ఏ సహాయము నయినా గాని నీకు చేయుదుము. దేవుడు నిన్ను దీవించును.

23[సోదరుడు అంతోన్ తో బ్రెన్హాం సోదరుడు సంభాషించుచున్నాడు.] సహోదరుడు మెర్లిన్ అంతోన్ను ఎందరు ఎరుగుదురు? నాకు అపరిచితుడు. [సోదరుడు మరల సహోదరుడు బ్రెన్హాంతో ముచ్చటించుచున్నాడు.] సోదరుడా, నన్ను క్షమించుము. సాల్వేషన్ ఆర్మీ అను సంఘము నుండి వచ్చినవాడు. నిన్ను గుర్తుచేసికొన్నాను. నిశ్చయంగా, ఇతనిని ఇప్పుడు నేనెరుగుదును. అతని ముఖము నాకు ఎక్కువ తెలిసినట్లు కనిపించలేదు. అతడు దైవజనుడని మీలో ఎందరికి తెలియును? దేవుడతనికీ తోడై యుండి పనిచేయుచున్నాడని ఎందరు నమ్ముచున్నారో చేతులెత్తండి. అతని కొరకు మీరు ప్రార్థించెదరా?

సోదరుడా, నీవు పెద్ద సంస్థ నుండి వచ్చితివని మేమెరుగుదుము. సాల్వేషన్ ఆర్మీ. వారు గొప్ప జనులు. సాల్వేషన్ ఆర్మీ సంఘపు వారు వీధిలో చాలా గొప్ప పని చేయుచున్నారు. నాజరీనులకు విరోధముగా నేనేమియూ మాట్లాడుటలేదు. పెంతెకోస్తు సంఘమునకు విరోధముగా గాని, సాల్వేషన్ ఆర్మీనకు విరోధముగా గాని మరెవరికి విరోధముగా గాని నేను మాట్లాడుట లేదు. వారు మన సోదరులు. కాని మీరు చూడండి, ఈ ఘడియకు సంబంధించిన గొప్ప వర్తమానమును మనము మోసికొని పోవుచున్నాము. ఈ ఘడియలో మనము జీవించుచున్నాము. మీరు మాతో కూడా ఆ పని చేయుదురా? మన సోదరుని మీద చేతులుంచుచుండగా శిరములు వంచుదము.

24ప్రియ పరలోకపు తండ్రి, పిలిచిన వాడవు నీవే. వాక్యమును జీవింపజేయువాడవు నీవే. వారు నమ్ముచున్నారు. అనుమతికి చిహ్నముగా మేము మా ప్రశస్త సోదరుని మీద చేతులుంచుచున్నాము. నీవతనితో యుండి, అతనికి సహాయము చేయుదువని నమ్ముచున్నాము. మా దీవెనలను అతనితో కూడా మేము పంపుచున్నాము. మరణములో నుండి జీవములోనికి మేము దాటియున్నామని నమ్ముచున్నాము. ఇప్పుడు మా హృదయములలో మేల్కొలుపు ఆత్మ యున్నది. దేవుని కృప బట్టి మా సోదరుని మీద మేము చేతులుంచుచున్నాము. మా దీవెనలతో ఇతనిని పంపించుచున్నాము. ప్రభువా, నీవతనిని దీవించి, భూమి మీద ఏ ఏ స్థలములకు వెళ్ళుచుండునో ఆ స్థలములన్నిటి యందు నడిపించుము. అతనిని నీవు వెళ్ళుమని ఆదేశించియున్నావు. నీ ఆత్మను అతనితో కూడా పంపించుము. ఆరోగ్యమును, బలమును, సేవలో జయమును దయచేయుము. యేసుక్రీస్తు నామములో అతనిని పంపించుచున్నాము. ఆమేన్.

సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అది కుడి చేతి సహవాసము. సోదరులందరూ ఈ సోదరులతో కరచాలనము చేయండి. మీ అందరిని ప్రభువు దీవించును గాక.

25[ఒక సోదరుడు బ్రెన్హాం సోదరునితో ముచ్చటించుచున్నాడు.] మీ పేరేమిటి? సహోదరుడు కారెల్. ఈయన సహూ కారెల్. సిన్ సినాటి నుండి వచ్చెను. కారెల్ సోదరుని ఎరిగిన వారు చేతులెత్తండి. సీన్ సినాటి నుండి వచ్చెనావని నా సందేహము. స్త్రీ బోధకురాండ్రను నియమించు ఒక గుంపుతో అతడున్నట్లుగా చెప్పెను. దానినతడు ఒప్పుకొనలేదు. దానిలో నుండి బయటకు వచ్చెను. మిషనరీ బాప్టిస్టు సంఘములో నుండి నేను కూడా అందుకే బయటకు రావలసి వచ్చెను. మీలో ఎందరు డాక్టర్ రాయ్. ఈ. డేవిస్ గూర్చి విన్నారు? నిశ్చయంగా , మీరు వినియుందురు. అతడు కొందరు స్త్రీలను బోధకులుగా అభిషేకించగోరెను. అది తప్పు అన్నాను. పెద్దగా "నేను మనస్సాక్షిని చంపుకొని ఆలాగు చేయలేను అన్నాను. అది దేవుని వాక్యమునకు విరోధమని చెప్పాను."

కారెల్ సోదరుడా, నిన్ను నేనెరుగను, కాని నీవిచ్చిన సాక్ష్యము బట్టి, సత్యము కొరకు నీవు నిలబడుట బట్టి నిన్ను ప్రేమించుచున్నాను. స్త్రీలకు మేము విరోధులము కాము. వారు మా సోదరీలు. వారిని ప్రేమించుచున్నాము. కాని వారి చోటు ఏమిటో మేమెరుగుదుము. వారచ్చటే నిలచియుండవలెను. ఒక పురుషునికి వారు ప్రియమైన వారు, సహాయకులుగా నున్నారు. పురుషులకు రక్షణ తరువాత దేవుడిచ్చిన గొప్ప బహుమానము స్త్రీయే. కాని దేవుని యొక్క వాక్య ప్రకారము ఆమెకు బలిపీఠము మీద చోటు లేదు. ఆ ప్రాతిపదిక మీద, దేవుని యందు నీకు గల విశ్వాసము బట్టి మేము నీ మీద చేతులుంచి సహవాసము అందించుచున్నాము. మనము చేతులుంచుదము.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

26మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యువకుని నేనెరుగుదును. నిజమగు సత్యమును అంగీకరించినందున ఇతనిని త్రోసివేసిరి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును. ఇప్పుడు మేమతని మీద చేతులుంచుచున్నాము. అతనికి మా దీవెనలు దయ చేయుచున్నాము. నీ ఆత్మ అతనిని నడిపించును గాక. అతనికి దారి చూపును గాక. అతని జీవన ప్రమాణములో త్రోవ చూపును గాక. నీవెచ్చటికి పంపినా మంచిదే. అతని కొరకు మేము ప్రార్థించుచున్నాము. అతనికి సహాయము చేయుదుము. సత్యము కొరకు నిలబడినంత కాలము బలపరచుదుము. ప్రభువా, దయ చూపుము. యేసుక్రీస్తు నామములో మేమతనిని పంపుచున్నాము. ఆమేన్. కాలేల్ సోదరుడో, దేవుడు నిన్ను దీవించును.

చాలామంది మిద చేతులుంచి యున్నాము. మీరందరూ కుడిచేయి సహవాసమును అందించండి.

27"రడేల్ సోదరుని ఇచ్చట ఎన్నడూ అధికారపూర్వకంగా అభిషేకించలేదు. రడేల్ సోదరుని ఎందరెరుగుదురు? మనందరికీ తెలియును. అతడు దైవజనుడని ఎందరెరుగుదురు?

ప్రియ పరలోకపు తండ్రి, నీ పెద్దలముగా మేము ఈ సోదరుని మీద చేతులుంచుచున్నాము. ఎన్నో ప్రవాహములను దాటి ఇతడు వచ్చి యున్నాడు. అతని జనులు పతనమగుటను అతడు చూచియున్నాడు. ఎన్నో మార్పులను చూచెను. మరియొకరు ప్రార్థన చేయుచున్నారు గనుక [స్పష్టతలేని మాటలు] అతని మీద మేము చేతులుంచుచున్నాము. మా దీవెనలను దయచేయుచున్నాము. ప్రభువా, అతనిని అభిషేకించుము, భూమి మీది ప్రతి మూలకు అతని పంపుము. యేసుక్రీస్తు నామములో అతనిని పంపించుము. ఆమేన్.

రడెల్ సోదరుడా, నీకు ఎల్లప్పుడూ కుడి చేతి సహవాసము అందించుచున్నాము. రడెల్ సోదరుని నేనెరుగుదును. నా స్వపుత్రుని వంటివాడు. అతని తండ్రి, నేను తల్లి చాలా కాలము నుండి ఒకరినొకరము ఎరుగుదుము. రడెల్ సోదరుడు దేవుని దాసుడని నాకు తెలియును. అతనితో నేను సేవ చేయుచున్నాను. రడేల్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక!

28సోదరుడా, మీరెవరు? "మీ పేరేమిటి?" మార్టిన్ సోదరుడా, అతనిని "నీవెరుగుదువా? సహోదరుడు మేక్ కూమ్స్. అతనిని ఎరిగిన వారెవరూ ఇచ్చట లేరని తలంచుచున్నాను. టైలర్ సోదరునికి తెలియునని చెప్పుచున్నాడు. సువార్తను మోసికొనిపోవునట్లుగా ఇతని మీద చేతులుంచెదము. సహూ మేక్ కూమ్స్. సోదరుడా, మెక్ కూమ్స్, నీవెచ్చట నుండి వచ్చావు? ఇల్లినాయ్ లోని రాక్ఫోర్డ్. [తన భార్య యొక్క స్వస్ధత గూర్చి అతడు బ్రెన్హాం సోదరునికి చెప్పుచున్నాడు.] అది నిజమా? టుసాన్ నుండి. ఓ, ఇప్పుడు నాకు ఆ పిలుపు గుర్తుకు వచ్చుచున్నది. దేవునికి స్తుతులు! [సహూ మార్టిన్, సహూ బ్రెన్హాంతో మాట్లాడుచున్నోడు.] మీ సోదరి. ఇప్పుడామె ఇచ్చట ఉన్నది. టుసాన్ లో నుండి ఒక రాత్రి టెలిఫోను ద్వారా ప్రార్థించుట జరిగినది. పక్షవాతము, కొద్ది రాత్రుల క్రితం ఆమెకు పక్షవాతము వచ్చెను. ఇప్పుడామె ఇచ్చట యున్నది. వర్తమానమును తీసికొని వెళ్ళవలెననుకొనుటలో అశ్చర్యము లేదు. సోదరుని మీద మనము చేతులుంచుదము.

29ప్రియదేవా, నీ సేవకుని మీద పెద్దలముగా మేము చేతులుంచుచున్నాము. కుడి చేతి సహవాసమునందించుచున్నాము. దైవాశీర్వచనములు కుమ్మరించుమని ప్రార్థించుచున్నాము. [స్పష్టతలేని మాటలు] అతనికి మార్గము చూపించి నడిపించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. నా సోదరుడా, కుడి చేతి సహవాసమును ఇచ్చుచున్నాము. దేవుడు నీకు తోడై యుండును గాక.

30ఆవును, సోదరుడా? మంచిది. ఇతడు డారియస్ సోదరుడని నేననుకొనుచున్నాను. ఇతడు డారియస్ సోదరుడు. సోదరుడా, నీవెచ్చట నుండి వచ్చావు? అర్కన్సాస్ లోని బ్లాక్ రాక్ నుండి సోదరుని ఎరుగుదును. సహూదరుడు బ్రీవర్ గూర్చి ఎవరో ఇచ్చట చెప్పిరి. ఈ ఉదయమున నేను వైల్ సోదరులను కలిసికొన్నాను. వారికి అతడు తెలియును. అతడు దైవజనుడని వారెరుగుదురు. అద్భుతము!

నా ప్రియ సోదరుడా, వర్తమానమును మోసికొనిపోవువానిగా యుండుము. నీ వెనుక మేము నిలబడియుండగోరుచున్నాము. మాకు చేతనయిన సహాయము చేయుదుము. మేము నీ కొరకు ప్రార్థించెదము. భూదిగంతముల వరకు నీవు ఈ వర్తమానమును కొనిపొమ్ము. దేవుడు నిన్ను పిలచు చోటికి వెళ్ళుము. సహోదరుడు డారియస్ మీద చేతులు వేయుదము.

ప్రియ దేవా, మా సోదరుని మీద చేతులుంచుచున్నాము. కుడి చేతి సహవాసమును ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తు నామములో అతనిని పంపించుచున్నాము. [స్పష్టతలేని మాటలు] నీ యొక్క ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతడితో వెళ్లి, మరియు నడిపించి, మరియు మార్గమును చూపును గాక. దేవుడు నిన్ను దీవించును గాక.

31సహోదరుడు అంతోనే. మనతో చాలాకాలము నుండి సహోదరుడు అంతోనే యున్నాడు. మీలో చాలామంది ఎరుగుదురు. అతనిని క్రీస్తు దాసునిగా నేనే ఎరుగుదును. అతడు తీర్మానము గల యువకుడు. అధికారపూర్వకంగా అతని మీద ఇంకా చేతులు వేయలేదు. స్నేహితులారా, ఈలాగు జరుగునని అతనికి తెలియదు, చూచారా. అయితే ఇది మేలుకరమగు కార్యము. సహోదరుడు అంతోనే మిద చేతులుంచుదుము. కుడి చేతి సహవాసమును ఇచ్చెదము. దేవుడే అభిషేకించవలసియున్నాడు. ఈ సోదరుని మనము నమ్ముచున్నామని తెలియచేయుటకే, ఇది చేయుచున్నాము. ఇతనిని మనము ప్రేమించుచున్నాము. మనలో ఒకనిగా యుండి వర్తమానమును వెంబడించుచున్నాడు. దేవుని ఆశీర్వచనములు అతనికి కావలెను. అదే మనము కోరుచున్నాము. సోదరుని మీద చేతులుంచి ప్రార్థించుదము.

32ప్రియదేవా, ఈ దీనమగు ఇటాలియను నీ దాసుడు. ప్రభువా, ఈ రాత్రి ఇతని మీద చేతులుంచుచున్నాము. కుడి చేయి సహవాసమును ఇచ్చుచున్నాము. ఈ సంఘము ద్వారా దానిని అధికారపూర్వకంగా అందించుచున్నాము. ప్రభువా, నీ యొక్క గొప్ప శక్తితో ఈ యవ్వనుని ఈ లోకములోని పంపుము, నీవు పిలచియున్నావు. ఇతడు వెళ్లి రోగము మరియు పాపములో ఉన్న ప్రజలను విడుల చేయును గాక అని ప్రార్ధన చేయుచున్నాము [స్పష్టతలేని మాటలు] ప్రభువా, తన జీవిత కాలమంతటనూ నీ కొరకు నిలబడి సేవ చేయును. నీవతనిని నడిపించుము. మార్గము చూపుము. మా దీవెనలతో ఇతనిని పంపుచున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును.

33(ఓ, నాకు తెలియదు. టెలిఫోను ప్రసారమును మనము కలిగియున్నాము; నిమిషమునకు ఏబై సెంట్లగును.) ఇంకా ఎవరయినా యున్నచో ఇక్కడికి వచ్చి మైక్రోఫోనులో చెప్పవచ్చును. సోదరులారా, ఇచ్చటికి రండి. [ఇంకొందరు తమ పేర్లు చెప్పిరి: పాట్ టైలర్, క్లైవుడ్ బాగ్స్, డేల్ హార్జీస్, జేము హ్యూమ్స్, ఎర్ల్ హార్నర్.] వారేనా? సోదరులారా, ఇచ్చటికి రండి. మీరు వర్తమాన సత్యమును నమ్ముచున్నారు. దానిని మీ పూర్ణహృదయముతో నమ్ముచున్నారా? మీరు కోరినట్లయితే, మీ మీద చేతులుంచెదము. మేము మీతో యున్నామని తెలియచేయుచున్నాము. మాకు చేతనయిన ఏ సహాయమునయినా చేయగలము. సోదరులారా, మీ పైని చేతులుంచునట్లుగా మీరిచ్చటికి రావలెనని కోరుచున్నాను. వారి మీద చేతులుంచుచుండగా మనము తలలు వంచుదము.

ప్రియదేవా, ఇక్కడ ఒక గుంపు జనుల మీద నేను చేతులుంచుచున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి మీద చేతులుంచుచున్నాము. నీవే వారిని పిలచియున్నావు. వారికి మేము కుడి చేయి సహవాసమును ఇచ్చుచున్నాము. ప్రభువా, వారికి నీ ఆశీర్వచనములు దయ చేయుమని ప్రార్థించుచున్నాము. [స్పష్టతలేని మాటలు] నీవు వారిని పిలచిన సామర్థ్యము చొప్పున వారు పని చేసి మరియు నీకు సేవ చేయుదురు గాక. వారు నీ యొక్క ధైర్యమైన నిజ సేవకులుగా ఉందురు గాక. దయచేయుము ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్దించుచున్నాము. ఆమెన్.

34సోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. మిమ్మును దేవుడు ఆశీర్వదించును. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. సోదరులారా, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. మా ప్రతి ఒక్కరితో ప్రభువు తోడైయుండును. బంధించు బంధము దీవించబడు గాక. క్రైస్తవ ప్రేమతో మన హృదయములు ఏక మనస్సు కలిగిన సహవాసము ఆ పైనున్న దానికి సమానముగా ఉన్నది.

ఆయన అద్భుతకరుడు గదా? ఈ రాత్రి ఎందరు సేవకుల పైన చేతులుంచి యున్నామో వారి గూర్చి ఆలోచించుడి.

మనము టెలిఫోను ప్రసారములో యున్నామని నాకు తెలియ లేదు. దానిని గూర్చి అక్కడి వారు నన్ను క్షమించవలెను. దానిని నేనెరుగను, చూచారా. ఈ రాత్రి చిన్న వర్తమానమును వారు ప్రసారము చేయుచున్నట్లుగా నేనెరుగను.

35ఇప్పుడు, మనము వాక్యము చదువుదము మరియు ప్రార్థించిన వెంటనే వర్తమానము లోనికి వెళ్ళుదము. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దీనిని తీసికొని వచ్చుచున్నదని నాకు తెలియును.

అంశము కొరకు మనము తీయుదము. (ఒక క్షణములో చెప్పెదను.) సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనము - సంఖ్యా కాండము 22:31.

మనము త్రిప్పుచుండగా, దానిని మీరు వ్రాసికొన వచ్చును. మీరందరూ దానిని గుర్తుంచుకొనవలెనని కోరుచున్నాను. ప్రభుని చిత్తమయితే, ఈ ఎండాకాలము వరకు మిమ్మును నేను చూడను. నేను అడ్డంకులేర్పడినయెడల విదేశములకు వెళ్ళను, తిరిగి వచ్చెదను. పరిశుద్ధాత్మ ఏ స్థలమునకు నిర్ణయించి పంపునో ఆ స్థలమునకు వెళ్ళుదుము. ఆయన ఏర్పాటు చేసిన మార్గములోనే నడువ వలెను. ఆ విధమగానే మనము చేయగోరుచున్నాము. ప్రభువు దీవించును.

NUM 22:31

 

36తండ్రి, మేము. నీ వాక్యమును చదువనైయున్నాము. నీవు దానిని దీవించి మాకర్థమగునట్లుగా అభిషేకించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనము.

"ఆంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలచియున్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి, సాష్టాంగ నమస్కారము చేయగా."

ఇప్పుడు, దీనిని చదివి ఒక అంశమును నిర్మించాను, ఆ అంశము ఇది, "వాక్య విషయములో దేవుడెన్నడైనా తన మనసు మార్చుకొనునా?"

అది గొప్ప అంశము, మరియు ఈ గొప్ప సత్యమును మనము అర్థము చేసికొనవలెను. దేవుడు ఒక మాటను పలికి, ఆ తరువాత దానిని పలికినందును క్షమించండి" అనునా? దేవుడు తన మాటను తిరిగి తీసికోనునా? చెప్పిన మాటను కాదనునా?

37ఈ మాటను నేనెన్నుకొనుటకు కారణమున్నది. దేవుడు ఒక మాటను పలికి, ఆ తరువాత దానిని కాదనునని ఎవరైనా బైబిలును చదివి చెప్ప ప్రయత్నించినచో అది నిరాధారమగు మాటయని నిరూపించగలను. బైబిలులో ఏ స్థలములోను నాకు కనబడదు. బిలామునకు ఒకసారి ఆయన చెప్పెను. దానిని మార్చుకొనలేదు. బిలామును చాలామంది సోదే చెప్పువాడని అందురు గాని అది తప్పు. అతడు యెహోవా యొక్క ప్రవక్త.

మొదటగా వర్తమానము యొక్క బాహ్య రూపము చూద్దాం. ఇశ్రాయేలీయులు ప్రయాణములో యున్నారు. ఐగుప్తు నుండి పాలస్తీనాకు వచ్చుచున్నారు. ప్రభువు వారికి తోడైయుండెను. ఇశ్రాయేలునకు విరోధముగా లేచిన ప్రతి శత్రువు తొలగిపోయెను. శత్రువును ఓడించెదనని ఆయన వారికి సెలవిచ్చెను, అయితే వారాయన ఆజ్ఞకు లోబడినంత కాలమే ఈలాగు జరుగును. పని ఎన్నడు కూడా పెద్దది కాదు. ఆనాటి రాక్షసులగు అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు లెక్కలేరు. వీరు శారీరకంగా చిన్నవారుగా కనబడవచ్చును గానీ "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" లో వారు నడచుచున్నారు. కావున విరోధి ఎంత గొప్పవాడయినా లెక్క కాదు, యెహోవా ఎల్లప్పుడూ ఇశ్రాయేలీయుల యొక్క బాగును చూచు వాగ్దానమును అనుగ్రహించువాడు. ఆ వాగ్దానమెన్నడూ తప్పిపోదు.

GEN 19:36,37

 

38పాత నిబంధనలోని ఇశ్రాయేలు, క్రొత్త నిబంధనలోని పెండ్లి కుమార్తెకు సాదృశ్యముగా యున్నది. లోకములో నుండి వచ్చుచున్నది. కానానుకు వచ్చు దారిలో యున్నది. వెయ్యేండ్ల పాలనకు సిద్ధమగుచున్నది. అదియే కానాను.

ఇక్కడ మోయాబు కూడా సంఘమునకు మాదిరిగా యున్నది. వారు కొందరు రాజులను చంపిరి, శత్రువును నిర్మూలించిరి, అన్నిటినీ సంహారము చేసిరి, భూమిని స్వాధీనము చేసికొనిరి. మోయాబు ద్వరా కదిలింపబడిరి మోయోబు ఒక అన్య రాజ్యము కాదు. ఇశ్రాయేలు వారు సేచించిన దేవునినే మోయాబు కూడా సేవించెను. మోయాబు దేశము అసలు లోతు కుమార్తె యొక్క కుమారుని ద్వారా ప్రారంభమాయెను. అతడే ఈ దేశమునకు స్థాపకుడై యున్నాడు. దానిని సంస్థగా మార్చెను, ప్రముఖులు మరియు మొదలగువారు, దానిని గొప్ప దేశముగా చేసెను. వారు విస్తరింపసాగిరి.

ఇశ్రాయేలు అబ్రహాము యొక్క సంతానము, లోతు సంతానము కాదు. ఇస్సాకు మరియు యాకోబులలో నుండి ఇశ్రాయేలు వచ్చెను. యాకోబు యొక్క పండ్రెండు గోత్రములలో నుండి ఇశ్రాయేలు వచ్చెను. (ప్రభువుతో పోరాడిన యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారెను.)

39టెలిఫోనుల ద్వారా జనులు వినుచున్నారు, నేను విమర్శకునిగా ఉండగోరుట లేదని మొదట చెప్పుచున్నాను, నేను ఆలాగు ఉండదలంచుకోలేదు; కాని నాకియ్యబడిన వర్తమానము పట్ల నేను నమ్మకముగా ఉండవలెను లేనియెడల నేను వేషధారినవుదును, చూచారా. ఏది చెప్పవలెనని నన్ను ఆయన పంపెనో అంతకంటే ఎక్కువగా ఏమియూ చెప్పను. ఈనాడు క్రైస్తవ సమాజనమునకు గొప్ప శత్రువు ఏదనగా, సంస్థాగత సంఘమే. అది చివరకు మృగపు ముద్రగా మారునని నేను గట్టిగా నా హృదయములో నమ్ముతున్నాను. (బైబిలుతో నేనది నిరూపించగలను, దేవుని సహాయముతో ఎప్పుడో అది చేశాను.) — అది సంఘముల సమాఖ్యలో మృగపు ముద్రగా మారును. ఎందుకనగా దేవుడు తానభిషేకించిన ఏ సంఘమును సంస్థగా ఏ సమయములోను మార్చలేదు. దానిని ఒకరు సంస్థగా మారగానే దేవుని ఆత్మ దానిని విడిచిపోవును. మరెన్నడును తిరిగి రాదు. ఏ చరిత్రకారుడయినా అడుగుడి, లేక నీవయినా చదువుము. ఎన్నడునూ మారలేదు. వారు సంస్థగా మార్చిన వెంటనే దేవుడు దానిని విసర్జించెను. దానికి ఏమయినదో చూడండి. సభ్యులు విస్తరించుదురు గాని దేవుని ఆత్మ మేల్కొలుపు మరెన్నడునూ తిరిగి రాలేదు.

40మోయాబు ఇక్కడ అటువంటి దానికి మాదిరి, ఎందుకనగా వారు స్వదేశములోనే సంస్థగా మారిరి (ఒక శాఖగా యుండిరి), వారికి ఒక స్వంత మతమున్నది. వారి మతము కూడా ఇశ్రాయేలీయుల మతము వంటిదే. వారు మోయాబీయులు. వారు యెహోవా దేవుని యందు విశ్వాసముంచిరి. వారు ఒక సంస్ధగా మారిన గుంపు.

వారు ప్రకృతి సంబంధియగు సంఘమునకు మాదిరి. ఇశ్రాయేలు ఆత్మసంబంధమగు సంఘమునకు మాదిరి. వారు ప్రయాణములో యున్నారు. ఇశ్రాయేలు ఒక సంస్థాగత రాజ్యము కాదు. వారు దేవునిని వెంబడించినంత కాలము స్వచ్ఛందముగానే యుండిరి. వారు యాత్రికులుగా ఉండిరి. నిలువరమగు చోటు లేదు. అగ్నిస్తంభము వెళ్ళిన చోటికి వారు వెళ్ళిరి. వారిది ఒక సంస్థాపక దేశము కాదు. వారి మధ్య ఒక వ్యవస్థ యున్నది, వారికి దేవుడు సున్నతిని ఇచ్చెను, అది ఆయన ఆజ్ఞ, కాని సంస్థాగత దేశముగా మత్రము లేదు. వారు చివరగా సంస్థాగత దేశమయినప్పుడు మెస్సీయాను విసర్జించి పతనమయిరి.

GEN 4:8•

HEB 11:4

 

41ఇప్పుడు, ప్రకృతి సంబంధమగు, ఆత్మ సంబంధమగు ఈ ఆత్మలు సంఘములు మరియు సంస్థలలో కలిసికొనును అని మనము కనుగొన్నాము, వాటి మధ్య ఎప్పుడూ పోరాటమే. పోరాటము లేని సమయమే లేదు, ఎల్లప్పుడూ పోరాటమే. అక్కడ మనము అసూయను కనుగొందుము. ఈ అసూయ వలన శరీరసంబంధమగు తారతమ్యములు, అనుకరణలు ఏర్పడును. అప్పుడున్నట్లుగానే ఇప్పుడును యుండుట మనము చూడగలము: దేవుడు ఒక వ్యక్తికి ఏదయినా చేసినప్పుడు, ప్రతి ఒక్కరూ దేవుడు ఆ వ్యక్తికి చేసిన విధంగానే యుండుటకు నటించుదురు. చూడండి, దాని వలన పోటీ ఏర్పడును. అందువలన శరీర అనుకరణలు తలెత్తును. వారు ఆత్మ సంబంధమగు ఫలితములను (అనుకరణలు చేయువారు) చూడరు గనుక రాజకీయాధికారమును లేదా మరేదో ప్రత్యామ్నాయమును అనుకరించెదరు. జనుల మనస్సులను కలవరపరచుటకు తమ కొరకు కొందరు శిష్యులను తయారు చేసికొందురు.

ఆదియందు అక్షరాలా అదే జరిగెను. కయీను మరియు హేబెలులు ఇద్దరూ భూమి మీద యుండిరి. కయీను కంటే హేబెలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించెను. హేబెలుకు దేవుడు దానిని బయలుపరచెను. అతని అర్పణను అంగీకరించెను, అది కయీను పట్ల అసూయ కలుగజేసెను — తన సోదరుని పట్ల అసూయ కలిగి అతనిని చంపెను.

GEN 4:3

 

42ఆదియందు అది ప్రారంభమాయెను, శరీరసంబంధులు మరియు ఆత్మ సంబంధులు. కయీను మరియు హేబెలులు ఒకే దేవుని ఆరాధించిరి. వారిద్దరును ఒకే విధమగు బలిపీఠమును నిర్మించిరి. ఒకే రకమగు బలిపీఠమును నిర్మించిరి. వారు ఒకే దేవునిని ఒకే సంఘము యొద్ద ఆరాధించిరి. కయీను తన శరీరసంబంధమగు హేతుబుద్ధి ద్వారా నేలలో పండిన ఫలములను తీసికొని వచ్చెను, వాటిని బలిపీఠము మీద అర్పించెను. నిశ్చయముగా ఇది దేవుని పరిహారమునకు జవాబుగా యుండునని తలంచెను. ఈనాడు కూడా జనులు దానినే తలంచుచున్నారు. ఆదామవ్వలు యాపిలు పండ్లు తినినందున పాపము వచ్చినదని తలంచుచున్నారు. వారు దానిమ్మ పండ్లు తినిరని చెప్పినా మనము ఆశ్చర్యపడనవసరము లేదు. కొంతకాలము క్రిందట మరొకరు ఇంకో విధంగా చెప్పిరి…

హేబెలు సరియైన అర్పణను అరించెను. రక్తము చిందించుటయే సరియగు బలి అని తెలిసికొనెను. కావున అతడు గొర్రెపిల్లను తీసికొని వచ్చెను. విశ్వాసము ద్వారాను, ప్రత్యక్షత ద్వారాను హేబెలు దీనిని తెలిసికొనెను. మరే ఇతర మార్గము బైబిలులో వ్రాయబడలేదు. కనుగ మీరు గమనించండి, దేవుని యొక్క బయలుపరచబడిన సత్యమే దేవుని యొక్క నీతికి ప్రారంభమైయున్నది. సజీవ దేవుని యొక్క పూర్తి సంఘము దాని మీదనే నిర్మింపబడియున్నది.

MATT 16:13-18•

MARK 8:27-29•

LUKE 9:18-20•

JOHN 6:37,44

 

43యేసు ఒక దినమున, కొండ మీద నుండి దిగి వచ్చుచూ తన శిష్యులను ఈలాగు ప్రశ్నించెను, "నన్ను మనుష్యులు ఏమని చెప్పుకొనుచున్నారు?"

"కొందరు నీవు మోషేవనియు, మరికొందరు నీవు ఏలియవనియు, కొందరయితే యిర్మియా వనియు, మరికొందరియితే ప్రవక్తలలో ఒకనివనియు చెప్పుకొనుచున్నారు," అనిరి.

"ఆయితే మీరు నేనెవరినని తలంచుచున్నారు?" అనడిగెను.

అప్పుడు అపోస్తలుడగు పేతురు, దైవావేశము పొంది, ఆత్మ ద్వారా మేల్కొనబడి అద్భుతమగు మాటను పలికెను, "నీవు క్రీస్తువు, సజీవుడగు దేవుని కుమారుడవు," అనెను.

ఆ మాటను గమనించండి: "సీమోను! యోనా కుమారుడవు, నీవు ధన్యుడవు: రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని, నా పరలోకపు తండ్రియే దానిని బయలుపరచెను. నీవు సీమోనును; ఈ బండ మీద…" ఏ బండ మీద? పేతురు అను బండ, మీద అని కాతలిక్కులందరు (చిన్న రాయి) క్రీస్తు అను బండ మీద అని ప్రొటస్టెంటు వారందురు. ఏదీ సరికాదు. ఆయన ఎవరై యుండెనో అను ప్రత్యక్షతను పేతురు పొందెను. "మొదట నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును తండ్రి యొద్దకు రాజాలడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచెదరు," అని యేసు చెప్పెను.

"నీవు క్రీస్తువు, సజీవుడగు దేవుని కుమారుడవు."

"యోనా - కుమారుడవగు సీమోనూ, నీవు ధన్యుడవు. రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రి దీనిని బయలుపరచెను. ఈ బండ మీద నేను నా సంఘమును నిర్మించుదును. పాతాళ లోక ద్వారములు దీని యెదుట నిలువజాలవు." — బయలుపరచబడిన ఆత్మ సంబంధమగు దేవుని వాక్యము.

NUM 16:3,21•

HEB 11:4

 

44గమనించండి, విశ్వాసము ద్వారా హేబెలు దేవునికి మరి శ్రేష్టమైన బలిని అర్పించెను. శరీరసంబంధియగు విశ్వాసి దానిని మరో విధంగా తలంచెను. తన చేతుల కష్టార్జితమని అతడు తలంచెను. ఫలములను, చక్కని పదార్థములను తీసికొని వచ్చి అర్పించెను. దేవుడు వాటిని గుర్తించుననుకొనెను. కాని అందువలన పోరాటము వచ్చెను.

అబ్రహాము మరియు లోతుల మధ్య వివాదము పుట్టెను. ఆలాగే మోషే మరియు దాతాను, కోరహుల మధ్య వివాదము వచ్చెను. మోషే అభిషేకము పొందిన ప్రవక్త. దేవుని యొక్క వాక్కు కలిగినవాడు. ఆ ఘడియగు నాయకునిగా ఎన్నుకోబడినవాడు. ఈ సంగతులన్నియూ అబ్రహామునకు వాగ్దానము చేయబడెను. "దేవుడు ఏది జరుగునని వాగ్దానము చేసెనో, ఆ క్రియలనే మోషే చేసెను. శరీరసంబంధియగు కోరహు వారి మధ్య ఒక సంస్థను లేపుటకు చూచెను. ఒక మనుష్యుల గుంపును తయారు చేయగోరెను — దేవుడు అటువంటి మనుష్యులతో పనిచేయడు. లేఖన భాగములో ఈనాటి ఒక మాదిరిని మనము చూచుచున్నాము, సంస్థ అనగా దానిని దేవుడు అభిషేకించడు. కోరహు ఆలాగు చేసిన వెంటనే మోషేతో ఆయన ఏమి చేసెనో వినండి. "నీవు నీ మీద అదనపు భాగమును మోపుకొనియున్నావు." అతడు ఏమనేనో వినండి, "నీవొక్కడివే పరిశుద్ధుడవా? మొత్తం సమాజమంతయూ పరిశుద్ధమే. నీవొక్కడివే పరిశుద్ధుడవని ఏల చెప్పుకొనుచున్నావు? నీవు అటువంటి దానిని చేయుటకు ఏ హక్కూ నీకు లేదు. నీవు చాలా గొప్పవాడినని చెప్పుకొనుచున్నావు. మేమందరమూ పరిశుద్ధులమే. మేమందరమూ దేవుని పిల్లలమే."

మోషే తన దారిన తాను వెళ్ళిపోయెను. "ప్రభువా, నేనేమి చేయవలెను?" అనడిగెను.

"నీవు వారిలో నుండి వేరగుము. అంతయూ చూచియున్నాను," అని దేవుడు చెప్పెను. భూమి నెరవిడిచి వారిని మ్రింగివేసెను.

45చూడండి, అక్కడ ఒక పోరాటము వచ్చెను. శరీరసంబంధులు ఆత్మ సంబంధులు ఎదురయినప్పుడు ఎల్లప్పుడూ ఒక పోరాటము ఏర్పడును. యూదా మరియు యేసు మధ్య ఒక పోరాటము వచ్చెను. ఒకరు దేవుని కుమారుడు మరియొకడు సాతాను కుమారుడు. కయీను మరియు హేబెలుల వలెనే యుండిరి. వారి మధ్య ఒక పోరాటముండెను. అందులో ఒకరు సంఘము యొక్క ఖజానా దారుడు, మరియొకరు సంఘ కాపరి. ఈ రోజున మరల మనం దాని యొద్దకే వచ్చుచున్నాము. శరీరసంబంధమగు శాఖ మరియు ఆత్మ సంబంధమగు క్రీస్తు వధువు. ఆత్మ సంబంధియగు క్రీస్తు యొక్క వధువుకు, శరీరసంబంధమగు సంస్థలకు మధ్య చాలా తేడా యున్నది. అసలు ఏమి పోలికయే లేదు.

46ఇప్పుడు చూడండి. శరీరసంబంధి ఎప్పుడునూ, ఆత్మ సంబంధి వలె ఉండుటకు ప్రయత్నించును. కానీ యాకోబు మరియు ఏశావుల మధ్య ఉన్నట్లే యుండును, అది పని చేయదు. అది చేయదు. మంచి పనులు చేయు విషయములో అయితే మానవుల దృష్టికి యాకోబు కంటి ఏశావే మంచివానిగా కనిపించును. తన తండ్రి గూర్చి శ్రద్ధ వహించగోరెను. (అతడు గ్రుడ్డివాడు, ప్రవక్త), ఎన్నో మంచి పనులు చేయగోరెను. ఏశావు శరీరసంబంధమగు కార్యములు చేయుచున్నట్లుగా గమనించుకోలేదు. తాను చేసిన పనులను బట్టి మంచి వాడిననిపించుకొందునని తలంచెను - ఎవరికొరకైనా మంచి పని చేయుట, హర్షణీయమే. కాని యాకోబు మనసంతా జ్యేష్ఠత్వపు హక్కు మీదనే యుండెను, అతని యొక్క ఆత్మ సంబంధపు కోరికనే ఆయన చూచెను.

47గమనించండి. శరీరసంబంధులు, ఆత్మ సంబంధులను ద్వేషించుట కొత్త కాదు. కయీను హేబెలును ద్వేషించెను, కోరహు మోషేను ద్వేషించెను, యూదా యేసును ద్వేషించెను, ఆ విధముగా పెద్ద జాబితా ఇయ్యగలము. శరీరసంబంధులు ఆత్మ సంబంధులను ద్వేషించుచున్నారు. ఆదియందు కయీను హేబేలును ద్వేషించెను. ఒకరి అర్పణను దేవుడు అంగీకరించెనని మరియొకనిని నాశనము చేయగోరెను. బలము గల వానిని నాశనము చేయ ప్రయత్నించెను. నాశనము చేయగోరుటకు కారణము అసూయ తప్ప మరేమియూ కాదు. ఈనాడు కూడా అదే జరుగుచున్నది. అది కయీనులో ప్రారంభమయినది. అసూయ వలన ఇది జరిగినది. నేడు కూడా అదే జరుగుచున్నది. ప్రకృతి సంబంధియగువాడు. శరీరసంబంధియగువాడు, ఆత్మ సంబంధియగు వానిని ద్వేషించును. అది తాను అని ఇందువలన రుజువగుచున్నది, మరియొక దారి లేదు, ఎందుకనగా అసూయ సాతాను నుండి వచుచున్నది. అందువలన సత్యమును అనుకరించుదురు. వారందుకు నిర్ణయించబడలేదు గాని అనుకరణ చేయుదురు. ఈ చివరి దినములలో ఇటువంటి దానిని మనము ఎంతో చూచుచున్నాము. ఓ, మై! చాలా ఎక్కువగా యున్నది!

దేవుడు తన మూల వాక్య విషయములో ఎన్నడునూ మనస్సును మార్చుకొనడని ఇందువలన మనము తెలిసికొనుచున్నాము. పిలచువాడను, నిర్ణయించువాడును ఆయనే. ఆ స్థానమును మరెవరునూ ఆక్రమించలేరు. మోషే స్థానమును ఎవరునూ ఆక్రమించజాలరు. ఎంతమంది కోరహులు లేచినా, మరెంత మంది దాతానులు లేచినా పిలువబడినవాడు మోషే.

GEN 2:7

 

48జనులు ఆయన యొక్క పరిపూర్ణ చిత్రములో నడువలేక పోవచ్చును. ఆయన యొక్క అనుమతి పూర్వక చిత్తములో వారు నడువవచ్చును గమనించండి, ఆయన దానిని అనుమతించవచ్చును, కాని ఆయన తన మహిమార్థమై తన పరిపూర్ణ చిత్తమును జరిగించును.

ఆదియందు, లైంగిక సంపర్కము ద్వారా భూమి మీద జనులు జన్మించుట దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. దేవుడు నేల మట్టిలో నుండి మానవుని సృజించెను. అతని లోనికి జీవ వాయువును ఊదెను. అప్పుడతడు జీవాత్మ అయ్యెను. ఆయన నరునిలో నుండి సాటియైన సహాయమును తీసెను. ఆమెను అతనికి భార్యగా చేసెను. అది దేవుని యొక్క మొదటి అసలు పరిపూర్ణ చిత్తము. కాని ఎప్పుడయితే పాపము ప్రవేశించెనో, అప్పుడాయన తన అనుమతిపూర్వక చిత్తమును ఇచ్చెను. నరుడు చట్టరీత్యా ఒక భార్యను పెండ్లి చేసికొని పిల్లలను కనవచ్చును. "మీరు ఫలించి మరియు భూమిని నింపుడి. అదే ఇక మార్గము." కాని గమనించండి, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు.

49ప్రారంభమును కలిగియున్న ఈ సంగతులన్నింటికిని ఒక అంశము కూడా యుండును. సమస్త పాపమునకు ఒక వినాశనముండును. ప్రతి పాపము నిర్మూలమగును. పునరుత్థానము వచ్చినప్పుడు, ఆ వెయ్యేండ్ల పాలనలో ఇక తల్లిదండ్రుల ద్వారా జన్మించుట యుండదు. ఆదియందు దేవుడు నేలమంటిలో నుండి నరుని సృజించి ఆయనే సాటియైన సహాయమును చేసినట్లుండును. ఇది నిజము. ఆదియందు ఆయన ఆ విధముగానే చేసెను.

కాబట్టి దేవుడు ఏ విషయములోను తన మనస్సును మార్చుకొనడు, కాని ఆయన నీకు ముందుకు వెళ్ళుటకు అనుమతి ఇచ్చును. దీనిని గూర్చీ, ఇక్కడ నేను చెప్పవలసిన దానికి ఇది చాలా దూరములో యున్నది. మీరిదీ అర్థము చేసికొనవలెనని కోరుచున్నాను, చూచారా. దేవుడు ఒక కార్యమును చేయుటకు నిన్ను అనుమతించవచ్చును, ఆ పనిలో నిన్ను ఆశీర్వదించవచ్చును, అయినను అది ఆయన పరిపూర్ణ చిత్తము కాదు.

MATT 6:10•

LUKE 11:2

 

50ధర్మశాస్త్రమును తీసికొనునట్లు దేవుడు ఇశ్రాయేలును అనుమతించెను. నిర్గమకాండము 19వ అధ్యాయము, కృప వారికి అప్పటికే ఒక ప్రవక్తను ఇచ్చెను, అగ్నిస్తంభముండెను, వధించబడిన గొర్రెపిల్ల యుండెను, విమోచన శక్తి యుండెను. కాని వారు ధర్మ శాస్త్రము కావలెనని కోరిరి. అది దేవుని చిత్తము కాదు, కాని మానవుడు కోరుకొనినందువలన దానిని ఇవ్వవలసి వచ్చెను. తాను కోరుకొనిన ఆ ధర్మశాస్త్రమే అతనికి శాపమాయేను. దేవుని చిత్తమును కలిగి యుండుటయే శ్రేష్ఠము. దానినే ఆయన మనకు నేర్పించెను: "నీ చిత్తము జరుగును గాక. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక."

మనలను మనము ఆయన యొక్క చిత్తమునకు, ఆయన యొక్క వాక్యమునకు అప్పగించుకొనవలెను. దానిని ప్రశ్నించవద్దు; దానిని నమ్ముము. దానికి విపరీతార్థమును కనుగొనుటకు ప్రయత్నించవద్దు; దానిని ఉన్నది ఉన్నట్లుగా తీసికొనుము. చాలామంది అడ్డదారిన వెళ్ళగోరుదురు, మరేదో మార్గము వెదకుచుందురు. ఆలాగు చేసినా గాని నీకు దేవుని ఆశీర్వచనము రావచ్చును; కాని నీవు ఆయన అనుమతి చిత్తమును వెంబడించుచున్నావే గాని ఆయన యొక్క పరిపూర్ణ చిత్తము కాదని గ్రహింపవలెను.

దానిని ఆయన అనుమతించవచ్చును, దానిని ఆయన పరిపూర్ణ చిత్తముగా ఎంచడు. కాని ఆయన తన ఘనత కొరకు దానిని ఉపయోగించును, తన పరిపూర్ణ చిత్తమును ఆశీర్వదించును. శరీరేచ్ఛ ద్వారా పిల్లలను కనుట ఆందుకు ఒక ఉదాహరణ.

51ఇప్పుడు గమనించండి, ప్రాంరభములోనే మోయోబు ఒక అక్రమసంతానపు దేశము. అక్రమముతోనే ప్రారంభమయినది. తండ్రి విశ్వాసి, కుమార్తె విశ్వాసి, దానిని మీరు ఆత్మీయ మనస్సుతో చూడండి. నిశ్చయంగాను, తేటగాను మీరు శాఖను అందులో చూడగలరు. ఖచ్చితంగా! చూచారా, కాని అది పూర్తిగా చెడిపోయినది. కొద్ది కొద్దిగా ప్రారభమయినది రాను రాను విస్తరించినది. ఒక తప్పును ప్రారంభించిన వ్యక్తి దానిని సరిచేయుటకు లేదా సరిపుచ్చుకొనుటకు తప్పు వెంబడి తప్పును చేయును. సంఘము ఆ విధంగానే ప్రారంభమయినది.

రోమ్ లోని నైసియా యొద్ద అలాగే అది ప్రారంభమాయెను. ఆదియందు పెంతెకోస్తు యుండెను, వారు దానిని సంస్థగా మార్చిరి. సంఘములోనికి పండుగలను తీసికొని వచ్చిరి. వారు ప్రార్థనలను, జపమాలలను, మృతులకు విజ్ఞాపన చేయుటను, ఇంకా ఆ యా సంగతులను ప్రవేశపెట్టిరి. ఒక తప్పు నుండి మరియొక తప్పు దొర్లుకొంటూ వచ్చినది. చివరకు అది తప్పు వలె కనిపించదు. పెంతెకోస్తు యొక్క ఒక ప్రత్యక్ష్యత అసలు లేనే లేదు. చూచారా? ఒక తప్పు నుండి మరియొక తప్పు వచ్చినది, మరొక దానిని తీసుకొన్నది. చేయవలసిన ఒకే కార్యము ఉన్నది — దానినంతటిని కొట్టి వేసినయెడల ఆది యొద్దకు మీరు రాగలరు.

మార్టిన్ లూధరు నీతీకరణముతో ప్రారంభించెను. లూధరను సంఘము దీనితో ఇంకా ముందుకు కొనసాగవలసియుండెను. చూచారా? కాని అది సంస్థగా మారినది. వెస్లీ యొక్క శుద్ధీకరణను అతడు తీసికొని రాలేకపోయేను, ఎందుకనగా అది సంస్థగా మారిపోయినది. దానిని ఆతడు సహించలేకపోయెను. అందువలన ఆత్మ అచ్చట నుండి ముందుకు పోయేను.

52ఇప్పుడు, లోతు గుంపును ఇచ్చట చూడండి, లేదా… లోతు కుమార్తె యొక్క కుమారుడే మోయాబు. ప్రారంభమే అక్రమము. ఇప్పుడు చూడండి. ప్రకృతి సంబంధియగు మోయాబు. శరీరసంబంధమగు శాఖకు మాదిరిగా యున్నది. ఆత్మ సంబంధమగు సంఘమునకు ఇశ్రాయేలు మాదిరిగా యున్నది. ఇశ్రాయేలు నిజమగు సంఘము. ఆ దినమునకు వధువు, ఐగుప్తులో నుండి బయటకు పిలువబడినది. సత్యముగా నిరూపించబడినది.

వారిద్దరూ కలిసివచ్చుటను గమనించండి. వారిరువురునూ ఒకే విధమగు బలిని అర్చించిరి. ఇరువురును ఏడు బలిపీఠములను నిర్మించిరి. ఇద్దరునూ పవిత్రమగు బలిపశువులను అర్పించిరి. వారు పొట్టేళ్ళను సమర్పించిరి. రాబోవు మెస్సీయాకు అది సాదృశ్యముగా యున్నది. మౌలికంగా వారిరువురునూ ఒకే విధంగా ఆరాధించిరి. ఇశ్రాయేలు ఇచ్చట లోయలో యున్నది, మోయాబు కొండ మీద ఉన్నది; మోయాబుకు ఏడు బలి పీఠములున్నవి, ఇశ్రాయేలుకు ఏడు బలి పీఠములున్నవి; మోయాబుకు ఏడు ఎడ్లున్నవి, ఇశ్రాయేలుకు ఏడు ఎడ్లున్నవి, రాబోవు మెస్సీయాకు సూచనగా యున్న ఏడు పొట్టేళ్ళు ఇశ్రాయేలునకు ఉన్నవి. మోయాబునకును ఉన్నవి. వారి మధ్యగల భేదము ఏమిటి? ప్రాధమికంగా వారిద్దరిది సరియే. కాని మీరు చూడండి, మోయాబునకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. వారు ఒక దేశముగా మాత్రమే యున్నారు. విందులు, పండుగలు వారికి ఉన్నవి. కాని ఇశ్రాయేలునకు ప్రవక్త యున్నాడు. కొట్టబడిన బండ వారితో యున్నది. వారికి అగ్నిస్తంభమున్నది. వారి స్వస్థత కొరకు ఇత్తడి సర్పమున్నది. దేవుని యొక్క ఆశీర్వచనములు వారితో కూడా కదలుచున్నవి. వారు దేవుని చేత పిలువబడిన పిల్లలయి యున్నారు.

53ఈనాటి సంఘముల యొక్క మాదిరిని ఇచ్చట చాలా చక్కగా మనం చూడగలము. ఇశ్రాయేలు ఒక చోట నుండి మరో చోటికి యాత్ర చేయుచున్నది. అగ్నిస్తంభము ఎచటికి కదలుచున్నదో అచ్చటికే వీరు కదలుచుండిరి. మోయాబు అలాగు కాదు. వారు తమ స్వంత శాఖలో తమ స్వంత దేశములో స్థిరపడిరి. వారు కదల లేదు. వారు అచ్చటనే నిలచియుండిరి. వారికి వారి ప్రముఖులు ఉండిరి. వారికి కట్టుబాట్లు, కార్యక్రమములు ఉన్నవి. వారికి యోధులు, పోరాడు వారు, రాజు, ఆజ్ఞలు మొదలగునవి ఉన్నవి.

కాని తమకు లేనిదేదో ఇశ్రాయేలు యొద్ద ఉన్నదని మోయాబు గ్రహించెను. ఇశ్రాయేలు మధ్య ఒక బలమగు శక్తి యుండుటను చూచిరి. ప్రవక్తయే ఆ శక్తి. ఆ ప్రవక్త మోషే. వారికది తెలియును. యుద్ధములో ఓడిపోవుచుండగా వారతని చేతులు ఎత్తి పట్టుకొనిరి. అంతే! యుద్ధము మారిపోయినది. దానికి సాటియైన రాజకీయ శక్తి వారికి దొరకలేదు. దానిని వారు సమానముగా ఢీ కొనవలెనని ఎంతో ప్రయత్నించిరి. వారు మరియొక దేశమునకు కబురు పంపిరి. ఒక ప్రవక్తను అద్దెకు తెచ్చుకొనిరి, కావున వారు ఒక ప్రవక్తను కలిగియుందురు, ఇశ్రాయేలునకున్న శక్తి తమకును కావలెనని వారు కోరుకొని, అలాగు ప్రవక్తను రప్పించుకొనిరి.

శరీరసంబంధమగు పోలికను చూచారా? ఈనాటి శారీరక సంఘమును చూచారా? అదే పనిని చేయుచున్నది.

NUM 22:5,6

 

54గమనించండి. వారిద్దరికి ప్రవక్తలున్నారు, కాని తేడాను చూడండి. మోషే దేవుని యొక్క ప్రవక్త. దేవుడే అతని రాజు. అతనికి ఆజ్ఞలు అచ్చట నుండియే వచ్చును. యెహోవా వాక్కు అతనికున్నది. బిలామునకు ఒక రాజుండెను. ఆ రాజు బాలాకు. మోయోబు రాజు. అక్కడి నుండి ఇతనికి ఆజ్ఞలు, ఆశీర్వచనములు వచ్చుచుండెను. మోయాబు రాజు బాలాకు బిలాముతో ఇట్లనెను, "నీవు వచ్చి, నా నిమిత్తము ఈ జనులను శపింపుము, ఎందుకనగా వారు భూమిని నింపుచున్నారు. ఎద్దు గడ్డిని మేయునట్లుగా వారు వచ్చి సమస్తమును మేయుచున్నారు. నీవు రమ్ము, శపించుట, దీవించుట నీ చేతగునని మాకు తెలిసినది. నీవు చేసిన ప్రతి కార్యము గుర్తించబడును."

ఇతడు దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్తయని మనము గ్రహింపవలెను. రాజకీయ లబ్ధి కొరకు ఇతడు తన జన్మహక్కును అమ్ముకొనెను. ఈనాటి సంఘమును ఆ విధంగానే యున్నది - లూధర్, వెస్లీ, పెంతెకోస్తు, ఇంకా ఆ గుంపుల వారందరూ - తమ సంస్థల కొరకు అమ్ముడుపోయిరి. మోషే దేవుని క్రింద ఉన్నాడు. బిలాము బాలాకు క్రింద ఉన్నాడు. అయినా గాని ఈ ఇద్దరు ప్రవక్తలూ దేవుని చేత పిలువబడినవారే. ఇద్దరూ ఆత్మ సంబంధులే. ఆ తేడాను గమనించండి. ప్రతి ఒక్కరికి ఒక నాయకుడున్నాడు: మోషేకు దేవుడు; బిలాముకు బాలాకు శిరస్సుగా యున్నారు.

55ఇక్కడ గమనించండి, ప్రకృతి సంబంధమైనది తప్పు అని రుజువు చేయుటకు ఆత్మ సంబంధమైనది ఎట్లు అన్వయించబడెనో చూడండి. మోషే దేవుని ద్వారా పంపబడెను. విధినిర్వహణలో యుండెను. మరియొక దేవుని ప్రవక్త ఇతనిని సవాలు చేయుచుండెను. దానిని ఆలోచించండి! మోషే దేవుని చేత పిలువబడినవాడు. దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని పనిలో నిలబడియున్నవాడు. ఈ సవాలు చేయుచున్న ప్రవక్తను చూడండి. చల్లబడిన నామకార్థ గుంపులో యున్నాడు. దేవుడు దీవించిన దానిని అభిషేకించిన దానిని సవాలు చేయుచుండెను. ఆ భేదమును నీవెట్లు చెప్పగలవు? వారిరువురూ ప్రవక్తలే. దేవుడు, ఇద్దరు ప్రవక్తలతోను మాట్లాడెను.

"దేవుడీలాగు చెప్పెను" చేయుము, "దేవుడాలాగు చెప్పెను, చేయుము" అన్నారు. దానికి నేనేమి ప్రశ్న వేయను. కాని అది దేవుని వాక్యమునకు సంబంధము లేనిది. అతడు ప్రవక్త అయితే కావచ్చును గాని అతడు మార్గము తప్పియున్నాడు. చాలామంది ప్రజలు ఈలాగే మోసపుచ్చబడుచున్నారు.

"ఓ, ఈ సోదరుడు దానిని చేయగలడు, ఆ సోదరుడు దానిని చేయగలడు," అని చెప్పుచుందురు. కాని వాక్యమును తిరస్కరించెదరు?

MATT 7:22,23•

1COR 13:1,2

 

56"మనుష్యులు భాషతోను, దేవదూతల భాషతోను, నేను మాట్లాడినను, పర్వతములను పెకలించగల విశ్వాసమున్ననూ, బీదలను పోషించుటకు నాకు కలిగిన సమస్తమూ ఇచ్చినప్పటికిని, నేను వట్టివాడనే." "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? గొప్ప కార్యములు చేయలేదా?" అందురు. అందుకు నేను వారితో "అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. మిమ్మును నేనెన్నడూ ఎరుగను," అని చెప్పుదునని ఆయన అనెను. వారు తాము చేసిన గొప్ప కార్యములను ఎత్తి చూపించెదరు, కాని వారు అక్రమము చేయువారని యేసు చెప్పెను. అక్రమమనగా ఏమిటి? నీకు చేయవలెనని తెలిసియుండిన దానిని చేయకుండుటయే. అది చేయుట మంచిదని నీకు తెలిసినా దానిని నీవు చేయవు. చివరి దినములలో ఏమి జరుగునో చూడండి. మొత్తం సంగతిని వినుడి.

ఈ రాత్రి అదే నా ఉద్దేశ్యము. 9.00 గంటలకు ముగించేదనని మీతో చెప్పాను. కొద్దిగా ఆలస్యము కావచ్చును. చూడండి, నా యొక్క ఉద్దేశ్యమదే. దేవుని వాక్యము ద్వారా ఈ వరుసను చూపించెదను, చూచారా, ఆయన దేవునిగా ఉండవలెనన్నచో తన మాటను నిలబెట్టుకొనవలెను.

57ఇప్పుడు, దీనిని మనము గమనించవలెను. వీరిరువురును ఆత్మ సంబంధమగు జనులే, ఇద్దరూ ప్రవక్తలే, ఇద్దరూ పిలువబడిన వారే. మోషే దేవుని పరిచర్యలో యున్నాడు. ప్రతి దినము అతని యెదుట నూతనమగు అగ్నిస్తంభము ఉండెను. దేవుని యొక్క ఆత్మ అతని మీద యుండెను. విధి నిర్వర్తించుచుండెను. ఇక్కడ మరియొక దైవ దాసుడు వచ్చుచున్నాడు. దేవుని చేత పిలువబడినవాడు. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినవాడు. ఒక ప్రవక్త, దేవుని యొక్క వాక్కు అతనికి వచ్చును. ఇక్కడే ప్రమాదము ఏర్పడెను. అతడు దైవజనుడు కాడని ఎవరూ వాదించలేరు, ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ అతనితో మాట్లాడినదని బైబిలు చెప్పుచున్నది. అతడు ప్రవక్త. దేవుని యొద్ద నుండి నిజమైన జవాబు అతనికి వచ్చెను గాని దానినతడు గైకొనలేదు. దానినతడు లెక్క చేయలేదు. మోషేను అతడు సవాలు చేయుటకు బయలు వెళ్ళెను.

NUM 22:5,6

 

58బిలాము తన పూర్ణహృదయములో దేవుని చిత్తమును వెదకెను. ఇతడు గొప్పవాడని వారందరూ తలంచిరి. "బిలామా, రాజగు బాలాకు నిన్ను త్వరగా రమ్మనుచున్నాడు. ఇశ్రాయేలీయులను నీవు శపించవలెను, ఎందుకనగా వారు భూమి మీద విస్తరించియున్నారు. వారిప్పుడు నాకు విరోధముగా దిగియున్నారు. వారు తమ చుట్టూ వున్న ప్రతి రాజ్యమును మ్రింగివేసిరి. నీవిప్పుడు వచ్చి, వారిని శపించవలెనని కోరుచున్నాము. నీవు ఎవరిని శపించుదువో, వారు శపించబడుదురని మాకు తెలియును. నీవు ఎవరిని దీవించెదవో, వారు దీవించబడెదరు." [ఇప్పుడు మీరు చూడండి, అతడు దైవజనుడు.] అతడు దేవుని యొక్క దాసుడు.

ప్రవక్తయగు బిలాము ఇట్లు తలంచెను, "నేను ఒకే ఒకటి చేయవలెను, దేవుని యొక్క చిత్తమేమిటో తెలిసికొనవలెను."

NUM 22:12

 

59ప్రవక్తగా పిలువబడినవాడు ఆ ప్రకారముగానే చేయవలసియున్నాడు.

మొదటగా, ప్రవక్త ఏమి చేయవలెను? దేవుని యొక్క చిత్తమును వెదుకవలెను. అదే దేవుని వాక్యము. అది అతని ప్రధమ కర్తవ్యము! ఎందుకనగా ప్రవక్త యొద్దకు దేవుని వాక్యము వచ్చును. "నీవు వేదాంత పండితునివి కావు గదా?" అని వారు చెప్పవచ్చు. వేదాంత పండితుని యొద్దకు దేవుని వాక్యము వచ్చునని బైబిలులో ఎచ్చటనూ లేదు. వేదాంత పండితులు వాక్యమును గందరగోళముగా చేయుదురు. దేవుని యొక్క ప్రవక్త యొద్దకే వాక్యము వచ్చును.

దేవుని యొక్క ప్రవక్త ఇచ్చటయున్నాడు. అతనిని వారు అద్దెకు తోసికొని వచ్చిరి. దేవుని యొక్క ప్రజలను శపించమని కోరిరి. గమనించండి, ఇతడు దేవుని చిత్తమును తెలిసికొనుటకు వెళ్ళుచున్నాడు. ఆయన యొక్క పరిపూర్ణ చిత్తమును అతడు తెలిసికొనగోరెను. దేవుడు తన పరిపూర్ణ చిత్తమును అతనికి తెలియపరచెను. ఆయన యొక్క పరిపూర్ణ చిత్తము అతనికి తెలియబడెను. ఆయన యొక్క చిత్తము ఏమిటి? "వెళ్ళ వద్దు!" అది దేవుని యొక్క మొదటి మాట. "వారితో కూడా వెళ్ళవద్దు. నా జనులను ఎదిరించుటకు వెళ్ళరాదు. వారు నా పరిపూర్ణ మార్గములలో నడచుచున్నారు."

నేడును అలాగే యున్నది! మా మధ్య దేవుని ఆత్మ పనిచేయుట చూచి వారు ఏవేవో వాదములాడుచున్నారు. దానిని వారు చల్లార్చుటకు చాలా సంవత్సరముల నుండి ప్రయత్నించుచున్నారు, కాని దానిని వారెంత ఎక్కువగా ప్రతిఘటించుచున్నారో అంత ఎక్కువగా అది ఎదుగుచున్నది. దేవుడు దీవించిన దానిని నీవు శపించలేవు. ఆ పనిని నీవు చేయజాలవు.

NUM 22:12

 

60కావున మీరు చూడండి, వారు దేవుని ప్రజలు. ఆ ప్రవక్త అక్కడ ఉండినా గాని దేవుని యొక్క వాక్కు అతని యొద్దకు వచ్చినది. అతనిని రాజు అద్దెకు తెచ్చుకొనెను, ప్రముఖులు మరియు మొదలగువారు, మరియు దేవుని యొక్క వాక్కు అతని యొద్దకు వచ్చెను — దేవుని యొక్క చిత్తమును అతడు వెదకెను; దేవుని జవాబును అతడు వినెను. "ఈ జనులను శపించవద్దు! వారిని నేను దీవించియున్నాను."

ఇప్పుడు, మనము బోధించుచున్న ఈ వర్తమానమును తిరస్కరించు వేదాంత పండితుడు ఈ ఆకాశము క్రింద ఎవరూ లేరు. ఇది ఈ కాలమునకు సరిపడు దేవుని వాక్యము చేసినది లేదా చెప్పబడినది పూర్తిగా దేవుని ప్రత్యక్ష్యతయే. దానిని ఆయన సరియని రుజువు చేసెను. ఏ వేదాంత పండితుడును, ఏ బైబిలు పాఠకుడును, ఏ ప్రవక్తయు దేవుని వాక్యమును ఒకే విధంగా చూడక తప్పదు. వాక్యమును వేరుగా ఎవరయినా చూచినయెడల, వారు ఏదో తప్పులోయున్నారని తెలిసికొనవలెను.

నేను ఉన్నది ఉన్నట్లుగానే చూచుచున్నానని నీవనవచ్చును. బాలాగు, బిలాములు ఆ విధంగానే యుండిరి. చూచారా? కాని దేవుడు మోషేను గుర్తించెను. దాని రుజువేమిటి? దేవుని యొక్క వాక్యమే. స్పష్టమయిన, సూటి అయిన దేవుని తీర్మానమును అతడు వినెను. "వెళ్ళ వద్దు," అనెను. నేను దీవించిన దానిని శపించుటకు ప్రయత్నము చేయవద్దు. వారు నా ప్రజలు." కాని నీకు తెలుసా? ఆ ప్రజలంటే బిలాముకు ఇష్టము లేదు. ఓ, ఏమిటి… ఈనాడు ప్రపంచములో ఎందరు బిలాములున్నారు? అసలు ప్రారంభము ఆ గుంపంటే అతనికి ఇష్టము లేదు.

NUM 22:12,13

 

61దేవుని యొక్క స్పష్టమయిన తీర్మానమును అతడు వినెను, వెళ్ళ వద్దు!" … కాని మీరు చూడండి, దానిని చేయుటకు బదులుగా అనుకొనిన దానిని చేయుటకే ప్రయత్నించెను. కయీను మరియు కోరహులు అలాగే చేసిరి. దీనికి కారణము అసూయ, మరియు ఏది ఏమైనా వెళ్ళుటకు అతడికి ఒక కారణము కావలసియుండెను.

గమనించండి, అతని యొక్క శాఖకు ప్రధాన కార్యాలయమున్నది. "నేను వెళ్ళుదుననుకొనుట లేదు. వారితో నాకే సంబంధము లేదు. వారిని నేనేమియూ చేయజాలను. ఆ జనులతో నేను వాదించలేను, ఎందుకనగా వారు దేవుని ప్రజలని దేవుడు నాతో చెప్పెను. కావున నేను వెళ్ళను," అని యుండినచో," ఎంత బాగుండును. కాని అతని హృదయములో వారి పట్ల ఇష్టము లేదు. చూచారా? వారతని గుంపు వారు కారు. తన గుంపు కానీ దానిని అతడు సహించలేడు. చూచారా? వారిని చూచి అసహ్యించుకొనెను. ఈ జనులు చాలా ఘోర కార్యములను చేసియున్నారనెను. అటువంటి ప్రజలను పరిశుద్ధుడగు దేవుడు శపించక మానడనుకొనెను. వారు విద్యలేనివారు. మాకున్న తెలివి వారికి లేదనుకొనెను. మేము చాలా తెలివైనవారమని చెప్పెను. వారు దేవుని సేవించుచున్నామని చెప్పుకొనుచున్నారు గాని వారిని చూడండి. వారెవరు? బానిసలు, అడుసు తొక్కువారు. ఐగుప్తువారు వీరిని తరిమి వేసిరి. ఇటువంటి నీచపు గుంపుతో దేవునికి ఏమి సంబంధము అని తలంచెను.

NUM 22:12

 

62కొట్టబడిన బండను, ఇత్తడి సర్పమును, అగ్నిస్తంభమును అతడు మరిచిపోయెను. నైతిక ధృక్కోణములో వారిని చూచి తీర్పు చేయగోరెను. దేవుని యొక్క ఉన్నత పిలుపును అతడు చూడలేదు. కృప ద్వారాను, ఎన్నిక ద్వారాను, వారా వరుసలోయుండిరి. దేవుని యొక్క వాక్యముతో వారుండిరి. వారిని శపించబోగా, దేవుడు వద్దనెను. "వారు నా జనులు గనుక వారి జోలికి పోరాదని దేవుడు చెప్పెను. వారిని ముట్టుకోవద్దనెను."

ఇప్పుడు, ఆ మనుష్యుడు వెనుకకు తిరిగి పోయిరి. అతని శాఖ యొక్క ప్రధాన కార్యాలయమును చూడండి. వారు వెనుకకు వెళ్ళి ఇంకా ఎక్కువ పలుకబడిగల వారిని పంపెను. ఈసారి వచ్చినవారు ముందు వచ్చిన వారి వలె సామాన్యులు కారు గాని డాక్టరు డిగ్రీ గలవారు. వారు బిషప్పులు, లేదా రాష్ట్ర ప్రెస్బిటేరియనులు కావచ్చును. మంచి తెలివిగల గుంపును అతడు పంపెను. ఇంకా బలముగల వారిని పంపెను. ఇంకా ఎక్కువ విద్యగల వారిని, ఇంకా మంచి ఎత్తులు వేయగలవారిని, ఇంకా ఎక్కువగా వాదించగలవారిని పంపెను.

63చూడండి, కయీను కూడా అదే చేసెను. వాదించెను. కోరహు అదే చేసెను. అతడు వాదించెను. హేతువాదము మనకు అక్కర లేదు. ఎవరేమి చెప్పినా గాని మనము దేవుని యందే విశ్వసించవలెను. దేవుడు చెప్పిన దానికి మీరు ఎదురు చెప్పవద్దు. విశ్వాసము ద్వారా దానిని మీరు అంగీకరించవలెను. నీకు ఎంతయినా తెలిసియుండ వచ్చును గాని వాదించవద్దు. ఆయనెట్లు చేయునో నాకు తెలియదు, కాని ఆయన దానిని చేయునని నేను నమ్ముచున్నాను. ఆయన తన వాగ్దానమును ఎట్లు నెరవేర్చునో నేనెరుగను గాని ఆయన తాను చేయుదునని సెలవిచ్చెను. దానిని నేను నమ్ముచున్నాను. అది దేవుని వాక్యమని నేను నమ్ముచున్నాను గనుక దానిని నేను అంగీకరించుచున్నాను.

"ఆ విధంగా నీవు ముందుకు పోలేవు," అని మీరనవచ్చును. ఎలాగో నాకు తెలియదు గాని ఆయన చెప్పెను గనుక సాగిపోయెదను. ఆయన మాటను నమ్ముచున్నాను.

నా బాప్టిస్టు పాస్టరు చెప్పిన మాటను నేను మరువలేదు, "బిల్లీ, నీవు స్తంభములకు బోధించవలసియుందువు. నీ మాటలు ఎవరయినా విందురనుకొనుచున్నావా?" అనెను.

"దేవుడు నన్ను చెప్పమనెను," అన్నాను.

"ఏడవ తరగతి చదువుకొనిన నీవు, రాజుల కొరకు ఎట్లు ప్రార్థించెదవు, ప్రపంచమంతా ఎట్లు బోదించగలవు?"

64"ఎట్లు ఇవన్నీ చేయుదునో, నాకు తెలియదు, కాని ఆయన అలాగున చెప్పెను, మరియు అది నాకు చాలును, ఆయనే చెప్పెను గనుక దానిని ఎట్లు చేయునో ఆయనకే తెలియును," అన్నాను.

"ఈ ప్రపంచములోని గొప్పవారు, విద్యాధికులు నీవు బోధించే దైవిక స్వస్థతను నమ్ముదురని తలంచుచున్నావా? నీ అంశమును వారు వ్యతిరేకించి నిలచెదరు," అన్నాడు.

"వారు నమ్ముదురో లేదో నాకనవసరము. బోధించుటే నా పని, ఆదే ఆయన నాకు చెప్పెను. నాకు తోడుగా ఉందునని ఆయన చెప్పెను. ఆలాగు జరుగునని ఆయన చెప్పెను. ఆయన చెప్పినట్లుగానే ఖచ్చితంగా జరుగును. మొదట వారి చేతులను పట్టుకొందునని ఆయన చెప్పెను; తరువాత వారి హృదయ రహస్యములను కూడా నేను తెలిసికొందునని ఆయన చెప్పెను," అన్నాను. దానిని గూర్చి మీతో నేను చెప్పాను, ఆ విధంగానే అది జరిగెను. అదేలాగు జరిగెను? ఇంకా నాకు తెలియదు. దానిని తెలిసికొనవలసిన పని నాకు లేదు. అది జరిగినది అంతే.

65"నీవు వెళ్ళి ఆ కొండ మీద కూర్చొనుము, నిన్ను నేను పోషించెదను. నిన్ను పోషించుటకు నేను కాకులను నియమించియున్నాను," అని ఏలియాతో దేవుడు చెప్పిన దానిని ఎవరు వివరించగలరు? రొట్టెను, మాంసమును ఒక కాకి ఎట్లు మోసికొని వచ్చి ప్రవక్తకు ఇయ్యగలదు? దానిని నేను వివరించలేను. మీరు అది వివరించలేరు. ఎవరూ దానిని వివరించజాలరు, కాని ఆయన దానిని నెరవేర్చెను. ఆదే మనకు కావలెను. ఆయన దానిని చేసెను. ఆదే దాని యొక్క సత్యము. ఏలాగు ఆయన చేయునో నాకు తెలియదు గాని చేయును. వివరించుట నా పని కాదు, కాని దానిని ఆయన చేయును. ఆయన భూమిని ఎట్లు తయారు చేసెనో నాకు తెలియదు గాని, ఆయన దానిని చేసెను. ఆయన తన కుమారుని ఎట్లు పంపెనో నాకు తెలియదు గాని, ఆయన పంపెను. ఆయన మృతులలో నుండి ఎట్లు లేచెనో నాకు తెలియదు గాని, లేచెను. ఆయన నన్ను ఎట్లు రక్షించెను? నాకు తెలియదు గాని ఆయన రక్షించెను. ఇది నిజము. ఆయన నిన్ను ఎట్లు రక్షించును? నేను చెప్పజాలను; కాని ఆయన రక్షించెను. అది నిజము. ఆయన నన్ను ఎట్లు బాగుచేసెను? నాకు తెలియదు; కాని ఆయన దానిని చేసెను. దానిని చేయుదునని ఆయన వాగ్దానము చేసెను, ఆయన తన మాటను నిలబెట్టుకొనును.

ఇప్పుడు, బిలాము దీనిని తెలిసికొని యుండవలసినది, ఇంకా ఎక్కువగా అతనికి తెలిసియుండవలెను.

66చూడండి, ఇంకా గొప్ప బలమగు గుంపు వచ్చెను. ఏమిటి మంచిది? వారిలో ఉన్న మెరుగు ఏమిటి? వారికి ఇంకా మంచి బహుమతులున్నవి. అంతే కాదు, ఇంకా ఎక్కువ డబ్బు వారతనికి ఇయ్యగలరు. ఇంకా మంచి స్థానమును వారతనికి ఇవ్వగలరు. వారి సంస్థలో ఒక సామాన్య సేవకునిగా యండనవసరము లేదు గాని జిల్లా పర్యవేక్షకునిగా చేయుదుమని చెప్పిరి. చూచారా? "ఆ గుంపు ప్రజలను నీవు తరిమివేసినయెడల, నీ కొరకు దేనినయినా మేము చేయగలమనిరి." చూచారా? వారతనికి గొప్ప స్థానమును ఇయ్యగోరిరి. "వారతనికి గొప్ప పదవిని ఇయ్యగలరు."

ఆ దేశము యొక్క అధ్యక్షుని యొద్ద నుండి ఈ వాగ్దానములు అతనికి వచ్చినవి.

EXOD 23:28

 

67మోషేకు తన మాటలు ఎక్కడ నుండి వచ్చినవి? పరలోకపు రాజు నుండి. అది దేవుని యొక్క వాగ్దాన వచనము. "నిన్ను నేను వాగ్దాన దేశమునకు తీసికొని పోవుదును. ఏ మనుష్యుడును నీ యెదుట నిలువజాలడు. వారిని నేను కుడి, ఎడమలకు చెదరగొట్టుదురు. నీకు ముందుగా నేను వచ్చెదను. నీవు ఆ భూమిని స్వాధీనము చేసికొందువు. నీకు ఎప్పుడో దానిని ఇచ్చియున్నాను. వెళ్ళి, దానిని స్వాధీనము చేసికొనుము. అది నీదే. "ఇప్పుడు చూడండి, మోషే దేవుని మాట వినెను. బిలాము ఆ దేశాధిపతి యొక్క మాటను వినెను. అతని హృదయము అసూయతో నిండియుండెను. ఆ మత సంబంధమగు అధిపతి యొక్క మాటను వినెను.

చూచారా, ఒక మంచి స్థానమును ఇచ్చెదనని వాగ్దానము చేసెను. "నీకు అత్యున్నత పదవిని నేనియ్యగలను. నీ ఉద్యోగములో నీకు పై స్థానము ఇయ్యగలను. నీ కొరకు నేను ఏదయినా చేయగలను. నీ జీతమును పెంచెదను. నీ రాబడిని అధికము చేసెదను. ఇవన్నీ అతడు విని గ్రుడ్డివాడాయెను.

ఈనాడు ప్రపంచములో ఎందరు బిలాములున్నారో చూడండి, వారికి మంచి స్థానము, మంచి ఆలయము, మంచి వాగ్దానము కావలెను. ఒక వ్యక్తి తన నేత్రములను వాక్యము వైపునకు తెరచినప్పుడు, దేవుని కార్యముల వైపుకు తెరచినప్పుడు - దేవుని ప్రభావము అతని మీద పడును. అతడు దేవుని దాసునిగా మారనారంభించును. అతని సంఘము ఆ ప్రభావమును కలిగియుండును. ఆ తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అతడు పొందును. యేసు నామములో బాప్తిస్మమును పొందును - అది వాక్యభాగమై యున్నది. లేఖనపూర్వకముగా బాప్తిస్మ విధానము అదే. అది అతనికి ఇయ్యబడినది, అది లేఖనానుసారము. బాప్తిస్మము పొందు మాదిరి అదే. అది అతనికి చూపించబడును. ఆ శాఖ వారికి అతడు బయటకు పోవునని తెలియును. అతడు ఈ రీతిగా ప్రవర్తించనారంభించగానే వారతనికి సంఘములో మంచి స్థానమును, చక్కని పదవిని ఇయ్యచూచెదరు. చూడండి, ఆ ముసలి బిలాము మరల బయలుదేరెను, ఆదియందు ఉన్నట్లే ఖచ్చితంగా యున్నది.

68అది సత్యమని చూచు వరకు ఒక వ్యక్తి బైబిలును చదువజాలడు. దానిని చూడవలెను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను బిరుదులను ఉపయోగించి ఎవరూ బాప్తిస్మము పొందలేదు. అది కాతలిక్కు మత క్రమమే గాని బైబిలు బోధ కాదు. బైబిలులో ఎవరూ ఎన్నడూ ఆ విధముగా బాప్తిస్మము పొందలేదు. చివరి అపోస్తలుడు చనిపోయిన మూడు వందల సంవత్సరముల తరువాత ఇది జరిగినది. అంత వరకు బాప్తిస్మము యేసుక్రీస్తు నామములోనే. కాతలిక్కు చర్చి దానిని మార్చి వేసెను. మిగిలిన వారందరూ అందులోనికి వచ్చిరి. బాగా అధ్యయనము చేసిన సేవకునికి ఇది సత్యమని తెలియును, కాని పేరుప్రతిష్టల కొరకు, పదవి కొరకు, జనుల మధ్య గొప్పవానిగా పిలువబడుట కొరకు అతడు రాజీపడును.

"దేవుడతనిని దీవించెను," అని మీరందురు.

నిశ్చయంగా. అందులో కొందరికి గొప్ప స్వస్థతా వరములున్నవి. అందులో కొందరు గొప్ప కూటములు ఏర్పాటు చేయుచున్నారు. వారు తమ ముఖములను రుద్దుకొనుచున్నారు. వారు దేవుని యొక్క వాక్యములో నుండి అదే జవాబును పొందుచున్నారు. ఎవరికయినా అదే వాక్యము దొరకును. దేవుడు మారడు. నా భావమును మీరు గ్రహించారా?

REV 22:18,19

 

69బిలాము మంచి పదవిని ఆశించెను. ఇప్పుడు చూడండి, ఇంకా మంచి అవకాశము వచ్చినది. బిలాము ఇక్కడ ఇరుకులో పడిపోయెను, చూచారా. ఇంకా మంచి గుంపు వచ్చినది. అతడు అసలు ఈలాగు చెప్పవలెను, "నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుని వాక్కును మీకు చెప్పాను. అంతే! ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." కాని చూడండి, బహుమతులు, మరియు ఎక్కువ పలుకుబడి కొరకు…

ఓ, వారికి ఆలాగు చేయుట చాలా ఇష్టము. "మిమ్మును ప్రపంచమంతా మేము పంపెదము. మాకు ఒక ప్రత్యేక విమానము ఇచ్చేదము. మీరెచ్చట కూటములు పెట్టినా మేము డబ్బు ఇచ్చెదము.'' ఓ, లేదు. చూచారా, వాక్యమేమి చెప్పుచున్నదో మనకు తెలియును. దేవుడు చెప్పిన దానిని మనము ఎరుగుదుము. దేవుని యొక్క సహాయముతోనే మనము నిలచియుందము, చూచారా. ఆ వాగ్దానము ఏ రకమయినదయినా పరవాలేదు. నీకు వారెంత డబ్బు ఇచ్చెదరనునది ముఖ్యము కాదు. అది, ఇది మరేదో వారు నీకు ఇయ్యవచ్చును. మనకు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" కావలెను. ఆయన చెప్పినదే మనకు కావలెను. సంఘము మాట ఆ తరువాత, దేవుడు ఆదియందు చెప్పినదే స్థిరము. దానికి మరేమియూ చేర్చరాదు, దానిలో నుండి మరేమియూ తీసివేయరాదు. ఆలాగు చేసినయెడల నీ పేరును జీవగ్రంధములో నుండి తొలగించును. దానికి ఒక్క మాట చేర్చరాదు, ఒక్క మాట దానిలో నుండి తీసివేయరాదు. ఆయన చెప్పినదే మనకు కావలెను; సంఘము చెప్పినది కాదు, డాక్టర్ జోన్సు చెప్పినది కాదు, మరెవరో చెప్పినది కాదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మాత్రమే మనకు కావలెను. వాక్యమేమి చెప్పుచున్నదో వినవలెను.

70బిలామును చూడండి, దేవుని దాసుడే. చాలామంది యొక్క ప్రారంభము బాగున్నది. దేవుని చేత అభిషేకించబడినవారే. చాలా విషయములలో దేవుని మాటనే పలుకుదురు, కాని సంపూర్ణ సత్యమును వారు అంగీకరించవలసి వచ్చినప్పుడు, వారది చేయరు.

ఇక్కడ గమనించండి, అసలు ప్రారంభములోనే అతడు అటువంటి గుంపులో చిక్కుకొనరాదు. అతడు దేవుని ప్రవక్త, అతడు వారితో వెళ్ళకుండా యుండవలెను. కాని చూడండి, పలుకుబడి సంపాదించుకోవలెనని, చూచారా, తన మనస్సాక్షిని ధిక్కరించలేక, "సరే, ఈ రాత్రంతా ప్రార్థన చేసి ప్రయత్నించెదను," అనెను.

చూచారా, "నేను మరల ప్రయత్నము చేయుదును." దేనిగురించి నీవు ప్రయత్నము చేయగోరుచున్నావు? చెప్పవలసిన దానిని దేవుడు ముందే అతనికి చెప్పెను. వెళ్ళ వద్దని దేవుడు చెప్పెను. అది ఆయన యొక్క మూల వచనము. నేను రానని అతడు చెప్పవలెను. దేవుడు ఆశీర్వదించిన దానిని అతడు శపించజాలడు. కొంత సేపటి తరువాత అది తిరిగి అతని మీదికి ఎట్లు వచ్చెనో చూడండి. ప్రతిసారియు అలాగే జరుగును. దేవుడు ఏదయినా చెప్పినయెడల, దానిని అర్థముతోనే చెప్పును. ఆయన దాని విషయములో తన మనస్సు మార్చుకొనడు. ఆయన తన వాక్యముతోనే నిలచియుండును. ఎవరు ఏమి చెప్పినా గాని ఆయన తన వాక్యముతోనే నిలచియుండును.

71బిలామునకు బాగుగా తెలిసియుండవలెను. అటువంటి సహవాసము నుండి అతడు వేరవ్వవలెను, కాని ఆ చక్కని బహుమతులు అతనికి కావలెను. ఈ రాజు యొక్క వాగ్దానము కావలెను. "నీకిష్టమయిన దానిని నీకియ్యగలను. నేను బిషప్పును. నేను కోరినది నేను చేయగలను. నీవు వచ్చి నాకు ఈ పని చేయకలిగినచో నిన్ను పై పదవికి నియమించగలను.

కాని వారితో "దానిని చేయవద్దు," అని దేవుడు అతనికి ముందే చెప్పెను, అయినా బిలాము వారితో, "మరల ఈ రాత్రంతా కనిపెట్టి ప్రయత్నించెదననెను," చూచారా. అతడు వాక్యమును కలిగియుండెను. దాని గురించి నీవు ఇక ఎంతమాత్రము వాదము చేయనవసరములేదు. దేవుడు ఒక్కసారి చెప్పియున్నాడు. నీవు అనుమతించినచొ, అలంటి గుంపువారు ఎల్లప్పుడు దేవుని చిత్తములో నుండి నిన్ను వేరుచేయుదురు.

72యోబు అను ప్రవక్త యొద్దకు ఒకసారి ఒక గుంపు వారు వచ్చిరి, వారతనితో మాట్లాడలేకపోయిరి. అతడు దర్శనమును చూచెను, ఏది సరియో అతనికి తెలియును. బిలాము దర్శనమును చూచెను మరియు అయినా దానితో అతడు నీలచియుండలేదు.

ఈ సంఘ గుంపులు ఎన్ని చెప్పినా గాని అతడు వినలేదు, "ఓ యోబూ, నీవు ఫలానిది చేసియుందువు. ఫలాని పని చేసియుందువు," అన్నారు. అతని భార్యను కూడా అతడు మందలించెను. "నీవు బుద్ధిహీనురాలి వలె మాట్లాడియున్నావు." ప్రభువు చెప్పినది నాకు తెలియును. ఆయన ఏమి కోరునో నాకు తెలియును. నేను దానినే చేసితిని." చూడండి, దేవుడు తనతో చెప్పిన దానితోనే అతడు నిలచియుండెను.

చూడండి. బిలాము ఇచ్చట తన మనస్సాక్షిని అణచివేసెను, చూచారా. నేను మరల కనిపెట్టి ప్రయత్నించెదననెను. అది నీవు చేయవలసిన పని కాదు. ఈ రాత్రి ఎందరు బిలాములు మనకున్నారు. మత్తయి 28:19ని వారు తమ మనస్సాక్షిని అణచుకొనుటకు వాడుకొనుచున్నారు. మరి కొందరు మలాకీ 4ను తమ మనస్సాక్షి నిమిత్తము ఉపయోగించుచున్నారు. మరి కొందరు లూకా 17:30ని తమ మనసాక్షి కొరకు ఉపయోగించుకొనుచున్నారు. ఎందరో వీటిని ఉపయోగించుకొనుచున్నారు, అయినను, "మంచిది, నేను మీకు చెప్పుదును, వారు అందరు ఆ విషయములలో అయోమయ స్థితిలోయున్నారు అని నేను నమ్ముచున్నాను."

73ఇక్కడ బిలాము అదే చెప్పుటకు ప్రయత్నము చేయుచున్నాడు, "బహుశా దేవుడు ఆయోమయ స్థితిలోయున్నాడేమో. నేను మరల ప్రయత్నించెదను, ఆయన ఏమి చెప్పునో చూచెదము" అనెను. నీ హృదయము ఆయనకు తెలియును. చూడండి, బిలాము తన మనస్సాక్షిని ప్రక్కకు త్రోయలేక దీనిని పలికెను, ఎందుకనగా అతనికి నిజానికి డబ్బు కావలెను. ఆ పదవి కావలెను. అతనికి పదవి కావలెను. అ హోదా అతనికి కావలెను. డాక్టరు ఫలానీ ఫలాని అని జనులు అతనికి పిలువవలెను. అందుకే మరల ప్రయత్నించెదననెను.

ఈ రాత్రి ప్రపంచములోని బిలాములను చూడండి! పదవులు, పేరు ప్రతిష్టలు, స్థానములు వాగ్దానము చేయబడుచున్నవి. వారు వాటి ద్వారా తను మనస్సాక్షిని అణగదొక్కుచుచ్నారు. ఎందుకనగా వారి శాఖలే వారికి కావలెను: "ఫలానిది చేసినచో నిన్ను బయటకు పంపివేయుదుమందురు. నీవు మంచి వాడవే, నిన్ను మేము ప్రేమించుచున్నాము. [అతడు మంచి మనిషే.] మేము నిన్ను ప్రేమించుచున్నాము, కాని నీవది బోధించకూడదు. మా సిద్ధాంతము వేరు గనుక నీవది చెప్పనే రాదు. ఫలాని డాక్టరు డిగ్రీ గలవారు దీనిని చెప్పెను గనుక అదే సరి. నీవు మాతో ఒకనిగా యుండవలెనన్నచో, ఆ విధంగానే నమ్మి, బోధించవలెను — నీ కష్టము మాకు తెలియును — మంచిది, నీకు పై పదవి రానియెడల నీ సంఘమను మార్చుదుము." ఓ, నీవు బిలామువు! నీకు దేవుని చిత్తము తెలియును గనుక ఆ ప్రకారము చేయుము! దేవుడు తన మనస్సును మార్చుకొనడు. లేదు!

74ఆయితే ఇతడు తనకు తెలిసిన సత్యమును, దేవుని ఆజ్ఞను మీరిపోవుచున్నాడు. మరల ప్రయత్నించెదననుచున్నాడు. బిలాములను గమనించండి.

కావున ఇది మరువకుడి, ఈ గొప్ప సందడితో ఈ రెండవ రాత్రి అతడు వచ్చెను. అతని మనస్సాక్షి గట్టిపడి చచ్చుబడినది, దేవుడతనిని పోనిచ్చేను. దేవుడెన్నడూ తన మనస్సు మార్చుకొనడు. ఆయన తన అనుమతితో కూడిన చిత్తమును ఇచ్చెను. అయితే "వెళ్ళు," అనెను. కానీ అది సరి కాదని మనకు తెలియును.

బిలాము యొక్క హృదయములో ఉన్న దానిని దేవుడెరుగును. అతడు ప్రవక్త అయినా గాని అతడు పరిశుద్ధులను ద్వేషించుచున్నాడు. వారిని ఏలాగయినా ద్వేషించవలెనని వెళ్ళుచున్నాడు. ఆలాగు చేయరాదని దేవుడతనికి చేప్పెను, అయినా గాని అతడు వినకుండా ఆ పని చేయగోరెను గనుక 'పొమ్మని' దేవుడు పలికేను. గుర్తుంచుకొనండి, దేవుడు తన మనస్సును మార్చుకొనలేడు, కాని వెళ్ళుమనెను.

75వారిని శపించవలెనని అతడు కోరెను. అతడు వారిని మూఢభక్తి గలవారని పిలచెను, వారినతడు శపించగోరెను. అతనికి ఒక పదవి కావలెను. వారితో అతడు చేరదలచుకోలేదు. రాజు కొరకు ఈ చిన్న పనిని చేసినయెడల తనకు గొప్ప పదవి వచ్చునని అతడనుకొనెను. దేవుడు తన మనస్సును గాని, మాటను గాని ఎన్నడును మార్చుకొనడు. ఆయన నీ హృదయ వాంఛనే ఇచ్చును. అలాగని ఆయన వాగ్దానము చేసెను. దానిని నీవెరుగుదువా? నీ హృదయ కోరికనే ఆయన తీర్చుదునని వాగ్దానము చేసెను. దేవుని యొక్క వాక్యమే, నీ కోరికగా యుండనిమ్ము. ఆయన చిత్తమునే నీ కోరికగా యుండనిమ్ము. నీ స్వచిత్తము కాదు; ఆయన చిత్తమునే కోరుకొనుము. ఆయనను నీవు ఒకటి అడుగవచ్చును. దానిని నీకు ఆయన ఇవ్వక పోయినా గాని "ప్రభువా, నీకు వందనములు. నీకు ఏది మేలుగాయున్నదో తెలియును" అని చెప్పుము.

2KGS 20:1,5

 

76రాజయిన హిజ్కియాను చూడుము. ఆ ప్రవక్తను అచ్చటికి పంపెను, "నీ ఇంటిని క్రమములో పెట్టుకొనుము. నీవు చనిపోయెదవు" అని దేవుడు చెప్పెను. హిజ్కియా తన ముఖమును గోడ వైపు త్రిప్పుకొని, గట్టిగా ఏడ్చేను, "ప్రభువైన యెహోవా, నీవు నన్ను కరుణించుము. నేను నీ యెదుట పరిపూర్ణ హృదయముతో నడచియున్నాను. ఇంకా పదిహేను సంవత్సరములు నేను జీవించునట్లు కృప చూపుము" అని పలికెను.

దేవుడు మరల ప్రవక్తతో మాట్లాడెను. "అతని మొరను నేను వినినట్లు, వెళ్ళి, అతనితో చెప్పుము" అనెను. అతడేమి చేసెను? మొత్తం దేశము మీదికి అవమానమును తీసికొని వచ్చెను. దేవుని కోపమును అతడు రాజేసెను. చివరకు దేవుడతనిని చంపబోయెను. ఇది నిజము. దానిని మీరెరుగుదురు. దేవుని విషయములో వెనుకకు జారెను. మొదట దేవుడతనితో చెప్పిన ప్రకారము జరిగియుండినయెడల, ఆ దేశము మీదికి రాజు మీదికి ఇంత శాపము రాదు. దేవుని యొక్క మాటను తీసికొని వెళ్ళి చెప్పుట ఆ ప్రవక్తకు కష్టమే. కానీ అతడు దేవుడు చెప్పిన దానిని చెప్పక తప్పదు. దేవుడతనిని చెప్పమనెను. కాని మీరు చూడండి, దాని వలన అవమానము వచ్చెను.

బిలాము ఏమి చేసెను? దేవుని యొక్క చిత్తమును ఎరిగిన తరువాత ఇక మొండిపట్టు పట్టి యుండెను, ఏమయినా గాని తాను అనుకొనిన దానిని చేయగోరెను. దాని వలన ఏమాయెనో గమనించారా? దేవుడు తన మనస్సును మార్చుకొనలేదు. అతని హృదయములో ఉన్న దానిని ఆయన ఎరుగును.

JOHN 20:25,27-29

 

77తోమాను మీరెరుగుదురు. ఒకసారి అతడు నమ్మలేదు. "నేను దానిని నమ్మలేను. నేను నా చేతిని ఆయన ప్రక్కలో ఉంచవలెను. ఆయన గాయపు చేతులలో ఉంచవలెను, అప్పుడే నేను నమ్ముదును," అనెను.

"తోమా, ఇటు రమ్ము. ఇప్పుడు నీ చేతులుంచుము," అని ఆయన పలికెను, చూచారా?

"నా ప్రభువా, దేవా" అని తోమా అనెను.

"అవును. నీవు చూచి నమ్మితివి. అయితే ఎన్నడూ చూడకయే నమ్మనివారికి మరెంత గొప్ప బహుమానము దాగియున్నది?'' అని చెప్పెను. భాషలతో మాట్లాడితేనే గాని మేము పరిశుద్ధాత్మను పొందినట్లుగా నమ్మము అని కొందరందురు. భాషలతో మాట్లాడుటను నేను నమ్ముదును. నిశ్చయంగా! ఆయన మంచి దేవుడు. ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. కాని వాక్యమును తిరస్కరించి నీవు భాషలతో ఎంతగా మాట్లాడినా ప్రయోజనము లేదు. అది తప్పు, చూచారా. కేవలము భాషలు మాట్లాడుట ద్వారానే మీరు కొనసాగలేరు. ప్రతి వాక్యమును గైకొనుట ద్వారానే మీరు కొనసాగెదరు. అదే పరిశుద్ధాత్మ యొక్క రుజువు. దేవుని వాక్యమును మీరు నమ్మవలెను. చూచారా?

MATT 7:22,23

 

78భాషలతో మాట్లాడుటను నేను నమ్ముదును. ఈ ఉదయమున నేను చెప్పినట్లుగా భాషలతో మాట్లాడు శక్తిని మీరు పొందవచ్చును. నా మట్టుకు నాకు ఈ సత్యము స్వయంగా తెలియును. అది నిజమే, కాని దేవుడు నిన్ను ఎన్నుకొనినట్లుగా అది సూచన కాదు, చూచారా. నిశయంగా! "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, "ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామములో ఈ గొప్ప కార్యములు చేయలేదా?" అని వారనగా, అందుకు వారితో ఆయన ఇట్లనును, "అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపొండి, మిమ్మును నేనెన్నడూ ఎరుగను."

నీవు భాషలతో మాట్లాడవచ్చును, కాని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును తిరస్కరించవచ్చును. అయితే ఎక్కడో పొరపాటున్నది. నిశ్చయంగా. దేవుని యొక్క ఏ క్రమమును పాటించకపోయినా నీది తప్పు. నీ స్వంత మనస్సాక్షిని పరిశోధించుకొనుము. బైబిలు ఏమి చెప్పుచున్నదో చూడుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరయినా ఎన్నడయినా బాప్తిస్మము పొందిరేమో, బైబిలులో ఒక్క చోట చూపించండి. చూచారా? ఎక్కడా లేదు. కాని నీవు కొన్నిసార్లు, నీ మనస్సాక్షి నిమిత్తము సరిపెట్టుకొందువు. స్త్రీలు ఏ విధముగా ఉండవలెనో దేవుడు చెప్పుచున్నాడు. వారి వస్త్రధారణ ఎట్లుండవలెనో, దేవుడు చెప్పుచున్నాడు, కాని మా సంఘ కాపరి …" కావున వారు దానిని చాలా తేలికగా తీసికొందురు.

79ఇక్కడ దానిని గూర్చి దేవుడేమి చెప్పెనో వారెరుగుదురు, చూచారా. నిశ్చయంగా! దేవుడాలాగు చెప్పినా, వారు తమకిష్టమయిన దానిని చేయుదురు. వారు ఒక నెపము ఎత్తి చూపుదురు. మేము వారి కంటే చాలా బాగున్నామని అందురు. కాని దేవుడు చెప్పినది వినండి. స్త్రీ యొక్క దుస్తులు, పురుషుల యొక్క దుస్తులు వేరుగా యండవలెను. మగవారి దుస్తులను స్త్రీ ధరించుట దేవుని దృష్టిలో హేయము. అది సరి కాదు. ఆలాగు నీవు చేయరాదు. చూచారా?

కావున అది తప్పు. కాని వారు ఏదో సాకు చెప్పగోరుదురు, "ఈలాగు చేయమని, దేవుడు నాతో చెప్పెనందురు." ఆయన చెప్పలేదని నేననను, కాని చూడండి. అది ఆయన పరిపూర్ణ చిత్తము కాదు. అది ఆయన అనుమతించిన చిత్తము. దానివలన ఏమి జరుగునో మీరెరుగుదురా? మొత్తం గుంపును అది చెరచును. సమాజమునంతటిని అది పాడుచేసెను.

NUM 20:10,11

 

80ఇక్కడ గమనించండి. దేవుడెన్నడూ తన మనస్సును మార్చుకొనడు. తన మాటను ఆయన మార్చుకొనడు. ఆయన మంచి దేవుడు గనుక నీ హృదయ వాంఛను తీర్చును. అది ఆయన చిత్తమునకు విరోధమయినా గాని దానిని ఇచ్చును. దానిని మీరు నమ్ముతున్నారా? చూడండి. దేవుడు మోషేతో [అభిషేకించబడిన ప్రవక్త]… ఇట్లనెను, "నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడుము. అది ఇది వరకే కొట్టబడినది."

మోషే కోపముతో అచ్చటికి వెళ్ళెను, కర్రను తీసికొని ఇట్లనెను, "విద్రోహులారా, మీ కొరకు నేను ఈ బండలో నుండి నీళ్ళు రప్పించవలెనా?" అని చెప్పి ఆ బండను కొట్టేను. నీరు రాలేదు కాని మరల కొట్టెను. నీరు వచ్చెను. అది దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకము. బైబిలులోని ప్రణాళికను అది భగ్నము చేసెను. క్రీస్తు రెండవ సారి కొట్టబడవలెను. చూచారా? క్రీస్తు ఒక్కసారే కొట్టబడెను. మొత్తం పధకమును అది విచ్చిన్నము చేసెను. కాని ఆయన తన అనుమతి పూర్వక చిత్తమును ఇచ్చెను. ఆ తరువాత అతడు వారితో ఇట్లనెను, "అవిధేయులారా, మీ కొరకు మేము నీరు తీసికొనివచ్చి యున్నాము."

NUM 20:12

 

81దేవుడు ఇట్లనెను, "మోషే, ఇటు రమ్ము. ఇక్కడికి రా. ఈ శిఖరము మీదికి ఎక్కుము. నీవు నమ్మకమగు దాసుడవు. [ఎత్తుమడమలు గల జోళ్ళు వేసికొని యున్న స్త్రీలను వలె] అదిగో, ఆవలకు చూడుము. వాగ్దాన దేశము కనబడుచున్నది."

"ఓ ప్రభువా…"

"నీవు ఆవలకు వెళ్ళవు. నీవు ఆ బండ యొద్ద నా అనుమతితో కూడిన చిత్తమును పొందియున్నావు. నిన్ను నీవు మహిమపరచుకొంటివి గాని నన్ను మహిమపరచలేదు. [చూచారా?] నిన్ను నీవు పవిత్రపరచుకొంటివి గాని నన్ను నీవు పవిత్రపరచ లేదు. నీవు నా మూల వాక్యమును గైకొనలేదు. నీకు చేయమని చెప్పిన దానిని చేయలేదు. అయినా గాని నీరు వచ్చెను. నీవు రోగులు మీద చేతులుంచగా వారు స్వస్థత పొందవచ్చును. నీవు ప్రవచించ వచ్చును, లేదా భాషలతో మాట్లాడ వచ్చును. కాని ఆయన యొక్క అసలు మాటను గైకొనవలెను. స్నేహితుడా, దేవుడు తన మనస్సును మార్చుకొనడు. నీవు ఆయన అజ్ఞను, చిత్తమును అనుసరించవలెను.

"ఓ, మంచిది, అది శిష్యులకు మాత్రమేనని నీవు చెప్పవచ్చును."

MARK 16:15,17

 

82ఆయన మారడు. ఒకవేళ శిష్యుడనువాడిని ఆయన ఇప్పుడు కలిగియున్నాను, అదే ఆజ్ఞ: "మీరు సర్వ లోకమునకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును." అదెన్నడూ మారదు. ఆయన మారజాలడు.

అది ఈ దినమునకు కాదని నేను చెప్పవచ్చును. నీవు బిలామువు. మీరు చూచారా? గమనించారా? దేవుడు మారడు. ఆయన నిన్ను, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

ఈనాటి బిలాములను చూడండి. "వారు యేసు నామములో బాప్తిస్మమిచ్చినట్లుగా బైబిలులో చూచుచున్నాను, కాని జనులందరిని చూడండి…" జనులు ఏమి చేసిరో నాకు లెక్క లేదు. రక్షించబడుటకు ఆ నామము మాత్రమే ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడినది. యేసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే పాపములకు క్షమాపణ. నీవెంత మంచివాడవని కాదు, ఏమి చేశావని కాదు. దానితో ఏమి సంబంధము లేదు. అది దేవుని యొక్క అసలు వాక్యము. నీవు దానితోనే నిలచియుండవలెను. మంచిది.

ఆయన మాటకు లోబడుట, బాలి అర్పించుట కంటే శ్రేష్ఠము. సౌలు తిరిగి వచ్చినప్పుడు మీకు జ్ఞాపకము ఉన్నదా.

83బిలామునకు విశ్వాస వరమున్నది మరియు దానిని సంపూర్ణమగు మూల వచనము కొరకు ఉపయోగించగలడు. ఈనాడు విదేశములలో పనీ చేయు చాలా మంది సేవకులకు స్వస్థతావరమున్నది. ఇక్కడ చాలామంది జనులు భాషలతో మాట్లాడుతున్నారు, చాలామంది ప్రవచించుచున్నారు. ఆ వరమును దేవుని రాజ్యము కొరకు ఉపయోగించ వచ్చును, కాని వారాలాగు చేయుటలేదు. అయినా గాని దేవుడు వారిని దీవించుచున్నాడు. అనుమతి పూర్వక చిత్తమును తీసికొనుచున్నారు. పేరు ప్రతిష్టల కొరకు, ఆనందము కొరకు, వ్యక్తిగత సంపాదన కొరకు, ఏశావు చేసినట్లుగా - ఒక సంస్థ కొరకు వారు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనుచున్నారు, చూచారా. బిలాము వలె అమ్ముడు పోవుచున్నారు, చూచారా. ఈనాడు చాలామంది ఆదే చేయుచున్నారు. అది మనకు తెలియును. వారు తమ జన్మహక్కును అమ్ముకొనుచున్నారు. పరిశుద్ధాత్మను కలిగియున్నామని చెప్పుకొనుచున్న స్త్రీలు మగవారి దుస్తులు ధరించుచున్నారు. మగవారి వలె వారు వేదిక లెక్కుచున్నారు. జుట్టు కత్తిరించుకొనిన ఆడవారు బలి పీఠముల మీద నిలబడుచున్నారు. ముఖములకు రంగులు పులుముకొనుచున్నారు. మత సంబంధమగు గౌనులు ధరించుచున్నారు. సంఘమునకు ఇంతకన్న అడ్డుబండ మరెన్నడూ లేదు.

84యూదులు ఏ కాలములో యున్నారో మీరు చూడండి. రాజకీయాధికారము గూర్చి మీరు తెలిసికొనుడి. యూదులు ఎట్లున్నారో మీరు చూడండి. వారు ఒక దేశముగా యున్నారు. రాజ్యముల పరిస్థితిని మీరు చూడవలెనన్నచో, యూదులను గమనించండి. సంఘము ఎక్కడ నిలబడియున్నదో చూడవలెనన్నచో, స్త్రీని గమనించండి. స్త్రీల యొక్క నైతిక స్థితిని చూడండి. ఆమె సంఘమునకు సాదృశ్యముగా యున్నది. స్త్రీల మధ్య మీరు కలుషితమును చూచుచున్నారు. అదే విధంగా సంఘము మధ్య కలుషితమును చూచెదరు. స్త్రీ యెజెబెలు వలె రంగుల పూసికొనుచున్నది. సంఘము కూడా అలాగే తయారయినది, చూచారా. అది సత్యము. దానిని మీరెరుగుదురు, చూచారా. సంఘము ఏలాగున్నదో మీరు గమనించవలెనన్నచో, స్త్రీల మధ్య నైతిక స్థాయి ఎట్లున్నదో చూడండి, ఎందుకనగా స్త్రీయే సంఘమునకు మాదిరి. రాజ్యముల యొక్క పరిస్థితిని మీరు చూడగోరినచో, యూదులను గమనించండి.

NUM 22:12,20•

2COR 6:14,17

 

85బిలామునకు దేవుడు నిజమగు సూటియగు తీర్మానపు మాటను చెప్పియున్నాడు. వెళ్ళవద్దని ఆయన చెప్పిన దానిని వినెను. అతని హృదయములో యున్న దానిని అతడు చూచెను. అందుకాయన వెళ్ళమని చెప్పెను. అది ఆయన యొక్క అనుమతి పూర్వక చిత్తము.

నీవు కూడా అలాగే చేయవచ్చును. నీవు సత్యములో నడచుటకు ఇష్టపడనప్పుడు నిన్ను ఆయన విడిచి పెట్టును. గొప్ప సేవను చేయుదువు. నిశ్చయంగా నీవు చేయగలవు, కాని అది ఆయన యొక్క అనుమతితో కూడిన చిత్తము. నీవాయన మాటను మీరి నడచుచున్నావు. ఆయన నిన్ను వర్థిల్ల చేయును, నిశ్చయంగా, బిలాము పట్ల ఆయన దానినే చేసెను. అతడు జయమును పొందెను, కాని జనులను శపించలేకపోయెను. దానినతడు చేయజాలడు, ఎందుకనగా శపించుటకు బయలుదేరిన ప్రతిసారి దీవించెను. చూడండి, అతడది చేయలేక పోయెను. అతడు తాననుకొన్న దానిని సాధించెను. ఆ జనులను వ్యభిచరించునట్లు బాలాకు ద్వారా ప్రోత్సహించెను. వారిని ఇశ్రాయేలీయుల పాలెములోనికి తీసికొని వచ్చెను. వారితో పెండ్లి చేసెను. మనమంతా ఒక్కటే, మనందరము ఒకే దేవుని ఆరాధించుచున్నాము. మనకు ఒక ప్రవక్త యున్నాడు, మీకు ఒక ప్రవక్త యున్నాడు, మనందరమూ ఒకే బలిని అర్పించుచున్నాము. మన పితరులందరికి యెహోవాయే దేవుడు, మీరందరూ వచ్చి మాతో ఎందుకు సహవాసము చేయరని అడిగెను. అవిశ్వాసులతో సహవాసము చేయరాదని బైబిలు చెప్పుచున్నది. వారితో మిరసలు విజ్జోడు కాకూడదు. వారు నమ్మనియెడల, మీరు వారి జోలికి పోక, దూరముగా యుండుడి. వారిలో నుండి బయటకు వచ్చి ప్రత్యేకించుబడుడని వాక్యము చెప్పుచున్నది. అప్పుడాయన మనలను చేరుకోనును. వారి యొక్క అపవిత్ర కార్యములతో పాలు పొందరాదు. అది నిజము. వారు వాక్యమునకు విరోధముగా అపవిత్రులైయున్నారు. వారి క్రియలు అపవిత్రము. వారి నుండి దూరంగా పొండి. వారి మాటను వినరాదు.

NUM 25:6,7

 

86బిలాము అచ్చటికి వెళ్ళెను, వారికి నేర్పించెను, మరియు అతడు తప్పు చేయుట నేర్పించెను. బిలాము నడిచిన త్రోవలో వారు నడిచిరి. బిలామునకు అతడేమి నేర్పించెనో వినవలెను. ఇశ్రాయేలీయులు వ్యభిచారము చేయునట్లు ప్రోత్సహించెను. ఇశ్రాయేలు దేశమును, జనులను ఒక తెగులు మొత్తినది. ఒక్క దినములోనే వేలాది మంది చనిపోయిరి. వారందరూ దేవుని యొక్క బలిపీఠము ముందర ప్రార్థించుచుండిరి. ఆ సమయాన ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యానీయ స్త్రీతో వచ్చెను (ఒక శాఖకు చెందిన స్త్రీ), గుడారము లోనికి వెళ్ళెను. యాజకుని యొక్క కుమారుడు అచ్చటికి వెళ్ళెను, ఒక ఈటెను తీసికుని వారిద్దరినీ చంపెను. అంతటితో దేవుని ఉగ్రత ఆగెను. ఆ వాక్యభాగము మీరెరుగుదురు. అది నిజమేనా? చూచారా?

REV 22:18,19

 

87అయితే ఏమి జరిగినది? బిలాము, ఇశ్రాయేలీయులను బలహీనపరచుటలో అతడు సఫలమాయెను. అతడేమి చేసెను? సమాజమును బలహీనము చేసెను. దేవుడు అతనిని ఆ పని చేయుటకు అనుమతించెను. పాలెము బలహీనమయ్యెను. మొత్తం సమాజము చెడిపోయెను. బైబిలు సత్యము కాని ఒక బోధ ప్రారంభమయినప్పుడు, దాని వలన మొత్తం సమాజము చెడిపోవును. కోరహు వలె వేరే అభిప్రాయముతో ఒకరు లేచెదరు. ఇది, అది, అన్నీ ఒకటే అందురు. వేరే అభిప్రాయమును వ్యక్తము చేయును. దాని వలన మొత్తం పాలెము చెడిపోవును. ఈనాడు సంఘమను సమాజము అలాగే చెడిపోవుచున్నది. ఇది నిజము.

అతని బోధ సమాజమును బలహీనపరచినది. కాదేషు బర్నేయలోని సమాజమంతా చెడిపోయెను. సమాజము యావత్తు పాడయెను. గుర్తుంచుకొనండి, వారు దేవదూతల ఆహారమును తినిరి. ప్రతి రాత్రి వారికి దేవుని యొక్క వాక్యము బయలుపరచబడినది, వారు ఆహారమును తినిరి. బండలోనిది వారు పానము చేసిరి. వారందరును అద్భుతములు చూచిరి. వారు మోషేను గమనించిరి. అతని మాటను వినిరి. అతని ప్రవచనములను, సమస్తమును చూచిరి. చివరికి వారు తమ మధ్యకు వచ్చిన ఈ అబద్ధ ప్రవక్త యొక్క బోధను వినిరి. తప్పు బోధ చేత సమాజమును బలహీనపరచిరి. దాని ద్వారా వర్థిల్లెను. ఒక మిలియను డాలరు భవనమును అతడు నిర్మించియుండ వచ్చును. అతనికి గొప్ప శాఖ ఉండియుండ వచ్చును. వేలకొలది మంది శిష్యులు అతనికి ఉండియుండ వచ్చును. గొప్ప కార్యములు చేసియుండ వచ్చును. మహా క్రియలు జరిగించియుండ వచ్చును, ప్రవక్తగా ఉండెను. అంతా మంచిదే, కాని అది దేవుని వాక్యానుసారముగా లేనంత కాలము నీవు దాని నుండి దూరముగా యుండుట మంచిది. దేవుడు తన మనస్సును మార్చుకొనడు. తన వాక్యముతోనే నిలచియుండుము, ఎందుకనగా చివరగా మిగిలేది అదే. వాక్యము వెంబడి వాక్యము వచ్చును. "దాని నుండి ఒక్క మాట తీసివేయరాదు లేక దానికి ఒక్క మాట చేర్చరాదు." అది వాక్యముగానే నిలచి యుండవలెను.

NUM 13:28,31,33

 

88ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాక్య పరీక్ష వచ్చినప్పుడు, వారు వెళ్ళి ఆ గొప్ప ప్రతి పక్షమును చూచినప్పుడు… అంత గొప్ప విరోధులను వారెన్నడూ చూడలేదు. అమాలేకీయుల యొక్క పరిమాణము వారి కంటే పదిరెట్లున్నది. "వారి ఎదుట వీరు మిడుతలవలె కనబడిరి. వారి పట్టణములు ప్రాకారము గలవి. ఆ ప్రాకారముల మిద వరుసగా రెండు రథములను నడిపించగలరు. ఆ గోడల మీద రధముల పందెములు జరిగెడివి. ఆ పట్టణముల ప్రాకారములు ఎంత గొప్పవో చూడండి. వారి ఈటెలు చాలా పొడవైనవి. వారు రాక్షసుల వంటివారు. వీరు మిడతల వలె కనబడుచున్నారు. వారిని జయించలేమనిరి!" కాని ఇద్దరు మనుష్యులు ఆ వాక్యము మీద నిలబడి యుండిరి. కాలేబు మరియు యెహోషువాలు ఇట్లు పలికిరి, "ఒక్క నిమిషము ఆగండి. రెండు మిలియనుల మంది జనులు ఒక్కసారి నోరు మూయవలెను. వారిని జయించుటకు మనకు శక్తి చాలును. మనము వారిని తేలికగా జయించగలము. వారు దేనిమీద ఆధారపడిరి? దేవుడు ఇట్లు చెప్పెను, "నేను ఆ భూమిని మికిచ్చియున్నాను. అది మీది." వారు దాని మీద నిలబడియుండిరి. కాని జనులు అన్య జనులను వివాహము చేసికొనిరి, వారి ఆచారములను, అలవాట్లను పాటించుచుండిరి. వారి మత విశ్వాసములను వెంబడించిరి. వారు బలహీనులయిరి, వారితో చేతులు కలిపిరి. ఎటు తిరుగవలెనో, ఏమి చేయవలెనో వారికి తెలియదు. ఇది నిజము. అక్కడ వాక్యపు పరీక్ష వచ్చెను.

89ఆయినా గాని నీకు ఆయన అనుమతిని ఇచ్చును. దానిని అనుమతి పూర్వక చిత్తమందురు. నీ హృదయములో యున్న దానిని ఆయన ఎరుగును. "బ్రెన్హాం సోదరుడా, నేను ఇది చేయుచున్నాను. అది నన్ను ఇబ్బంది పెట్టదు. ప్రతి దినము దేవుడు నన్ను దీవించుచున్నాడు. నేను ఆత్మలో గానము చేయుచున్నాను. నేను ఆత్మలో నాట్యము చేయుచున్నాను" అని నీవు చెప్పవచ్చును. దానిని ఆయన అనుమతించును. ముందుకు పొమ్ము. ఇది నిజము. కాని నీవేమి చేయబోవుచున్నావు?

"నేను పొట్టి బట్టలు ధరించుచున్నాను, మరియు నేను ఇది చేయుచున్నాను. అది నన్ను ఇబ్బంది పెట్టుటలేదు. నేను క్రీస్తునందు విశ్వాసముంచుచున్నానని ఎరుగుదును. నేను ధరించువాటిలో ఏమియూ లేదు," అని నీవనవచ్చు గాని బైబిలు దానిని గూర్చి చెప్పుచున్న దానిని వినవలెను. నీవు ఏమి చేయుచున్నావు? బిలాము ఆ స్త్రీలందరి ముందు ఒక అడ్డు బండగా నిలచియున్నట్లుగా నీవును నిలబడియున్నావు. మీ యువ బాలికలకు మీరేమి చేయుచున్నారు? రంగులు పూసికొని యున్న చిన్న గుంపును, అన్య జనాంగమును తయారు చేయుచున్నారు. (ఇది ఖచ్చితంగా నిజము) చూచారా? యెజెబెలులు తయారు అగుచున్నారు.

90అయినా దేవుడు నిన్ను వర్దిల్లచేయుచున్నాడు. "ఆయన నన్ను దీవించుచున్నాడని," నీవు చెప్పెదవు. ఆ విషయములో నేనేమియూ సందేహించుట లేదు. బిలామును కూడా ఆయన దీవించెను, చూచారా. నిశ్చయంగా ఆయన దీవించును. నీవు ఆయన అనుమతి చిత్తములోనే నడచుచున్నావు గాని పరిపూర్ణ చిత్తములో నడచుట లేదు. దేవుడు తన మనస్సు మారుకొనడు గనుకనే దీవించుచున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను నలుబది సంవత్సరముల పాటు దీవించెను. వారేమి చేసిరి? భార్యలను పెండ్లి చేసికొనిరి, కుటుంబములను పెంచిరి, బిడ్డలను ముద్దు పెట్టుకొనిరి, దశమ భాగములను చెల్లించిరి, అక్కడే జీవించిరి. అరణ్యములో వారిని దేవుడు దీవించెను. మన్నాతో ఆయన పోషించెను. అయినా వారందరూ నశించిరి, ఎందుకనగా వారాయన యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చలేదు. ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తమును నెరవేర్చిరి - దేవుడు "వెళ్ళమని" చెప్పెను.

కాని గుర్తుంచుకొనండి, వారు కాదేషును విడిచి పెట్టిరి, కాని ఇంక ముందుకు మాత్రము వెళ్ళలేకపోయిరి. వారు అరణ్యములోనే అటూ ఇటూ తిరిగిరి. వారు ఆ తరువాత రెండు రోజులలో వాగ్ధాన దేశమును చేరియుండవలసినది. వారు నలుబది సంవత్సరములు ప్రయాణము చేసిరి. యెహోషువా మరియు కాలేబులు తప్ప మిగిలిన వారందరూ చనిపోయిరి, వారు మాత్రమే మూల వాక్యములో నిలచియుండిరి.

91ఓ, దేవా, మాకు సహాయము చేయుము. దేవుడు తన చిత్తమును మార్చుకొనడు, ఆయన తన మనస్సు మార్చుకొనడు; కాని ఆయన నిన్ను దీవించును. నిశ్చయంగా, ఆయన బిలామును దీవించెను. అతడు అచ్చటికి వెళ్ళి ఏమి చేసెను? మొత్తం సమాజమును అతడు నాశనము చేసెను. చూడండి, ఆయన చెప్పిన దానితోనే నీవు నిలచియుండవలెను. ఆయన తన మూల పధకమును మార్చుకొనడు.

ఈనాడు దేశములో యున్న బిలాములను చూడండి. తిరిగి చూడండి: వర్థిల్లుచున్నారు, భాషలలో మాట్లాడుతున్నారు, నిశ్చయంగా, దేవుని వరమును సంపాదన కొరకు ఉపయోగించుకొనుచున్నారు. కాని వారి చెడు బోధవలన మొత్తం దేవుని సంఘము చెడిపోవుచున్నది. ఇది నిజము.

"దీనిని నీవెందుకొరకు చేయుచున్నావు? దీనిని నీవు ఎందుకొరకు చేయుచున్నావు?" అని ఒకరు నన్ను అడిగిరి.

"అది సత్యమని నీవు నమ్ముట లేదా?" అన్నాను.

"సత్యమే గాని అది నీ పని కాదు. నీవు రోగుల కొరకు ప్రార్ధింపవలెను. వారు నిన్ను ప్రవక్తగా నమ్ముతున్నారు. నీవు ఆ స్త్రీలకు మరియు లేదా…" అన్నాడు. అసలు అక్షరములే నేర్చుకోనప్పుడు వారికి బీజ గణితము ఎట్లు నేర్పించగలము? అనడిగాను. వారు ప్రాధమిక విషయాలు నేర్చుకొనకుండా మిగిలిన సంగతులు ఎట్లు నేర్చుకొనగలరు? చూచారా? నీవు వెనక్కి రావలసియున్నది మరియు నీవు తిరిగి ప్రారంభించిన స్థలము నుండి లేక నీవు విడిచిపెట్టిన చోటినుండి ప్రారంభించవలసియున్నది, మరియు దేవుని ప్రతి మాటలు తీసుకోనవలసియున్నది.

REV 17:5

 

92ఈనాడు పొలములో దాని పరిస్థితిని చూడండి. దేవుని యొక్క సంఘమునకు ఒక వేశ్యను బిలాము పెండ్లి చేసెను. దేవుని ఆలయము లోనికి ఒక వేశ్య వచ్చినది. ఈనాడు అబద్ధ బోధకులు దానినే చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. ప్రకటన 17లోని వేశ్యతో ఈ సంస్థలు మరియు జనులు ఏకమగుచున్నారు. అది బిలాము బోధ, "మనందరమూ ఒక్కటే. మనమంతా క్రైస్తవులము" అని వారు ఈనాడు చెప్పుచున్నారు. మత గురువులు, పోపులు, తదితరులందరూ రాజీపడి ఇది చేయుచున్నారు.

ఒక పెంతెకోస్తు బోధకుని నేనెరుగుదును. వారందరూ ఇప్పుడు గుండ్రని రొట్టెను ఇచ్చుటకు మొదలు పెట్టిరి. దానికి అష్టారేతు అని అర్థము. చంద్ర దేవుడు. అది ఒక గుండ్రని రొట్టె. నీ మనస్సాక్షి గద్దించినా గాని కండ్లు మూసికొని దానిని తినుమని వారందురు. కళ్ళు మూసుకోనుటా? గుండ్రని రొట్టెనా? దాని భావము ఏమిటి? మనము విరువబడిన శరీరమును తీసికొనుచున్నాము. యేసుక్రీస్తు విరుగగొట్టబడెను; గుండ్రని చంద్ర దేవుడు కాడు, అష్టారేతు కాదు, మరియకు బదులుగా వారు చంద్ర దేవతను స్వీకరించిరి, దేవుడు కాడు. రోమనుల గుండ్రని రొట్టె మనకు విరువబడిన రొట్టి యున్నది. నిశ్చయముగా. ఓ!

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

93ప్రకటన 17లోని మహావేశ్యను చూడండి, ఈ బిలాము బోధకులు తప్పు బోధను బోధించుచున్నారు, సంఘమును గందరగోళముతో పెండ్లిచేయుచున్నారు. అంత్యకాలమందు బలప్రదర్శనకు వచ్చినప్పుడు గమనించండి, ఇప్పుడు దాని యొక్క బలహీతను చూడండి. తొమ్మిది వందలకు పైగా సంస్థలున్నవి. ఒకటి ఇటు లాగుతుంటే మరియొకటి అటు లాగుచున్నది. వారి మధ్య ఐక్యత ఏమియూ లేదు. వారు ఐక్యతను తీసికొని రావలెనని ప్రయత్నించుచున్నారు గాని దేవుని వాక్యము ద్వారా కాదు, దేవుని యొక్క మూల ప్రణాళిక ద్వారా కాదు; రాజకీయము ద్వారాను, సంస్థ ద్వారాను. దానిని తీసికొని రాగోరుచున్నారు. దేవుడు తన మనస్సును మార్చుకొనడు. ఆయన తన మాటతోనే నిలచియుండును. "భూమ్యాకాశములు గతించినా నా మాటలేమాత్రమును గతించవు," అని ఆయన చెప్పెను. అది నిజము. ఆయన తన మూల వచనముతోనే నిలచియుండును.

వారింకా దాని వ్యతిరేకముగా హేతుబుద్ధిని ఉపయోగించుచున్నారు, వారిదివరకును అలాగే చేసియుండిరి, మరియు కేవలము… చేయవలసినది ఒకే కార్యము ఉన్నది — ఆయన దానిని మర్చడు — కేవలము నమ్ముము, ఎందుకనగా భూమ్యాకాశములు గతించినా ఆయన మాటలేమాత్రమును గతించవు. చూచారా?

REV 22:18,19

 

94అందులోనికి ఎవరు వివాహము కాబడిలో మీరెరుగుదురా? రాజకీయమును మరియు ఇతరమైన చూడండి, సంఘములోని రాజకీయముతో సంఘమును కలుపుటకు ఎలా ప్రయత్నము చేయుచున్నారో చూడండి. రాజకీయము ద్వారా మనము క్రీస్తులోనికి చేరలేదు గాని సంఘము లోనికి చేరియున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించుచున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మ విధానమును నీవెరుగుదువు. నీలోయున్న ఆత్మ దేవుని యొక్క ప్రతి మాట సత్యమేనని గ్రహించును. ఇది నిజము. "దానిలో నుండి ఒక్క మాటను తీసివేసినా, దానికి ఒక్క మాట కలిపినా, అట్టివానికి జీవగ్రంధములో పాలు లేకుండా చేయును.'' అయినా అతడు వర్థిల్లును.

వర్ధిల్లుట ద్వారా దానిని మనము నిర్ణయించజాలము. వర్థిల్లుటను బట్టి నీవు దేవునిని విమర్శించలేవు. లోకము వర్ధిల్లుచున్నది. బిలాము వర్ధిల్లెను, కానీ సోదరుడా, దేవుని వాక్కు బట్టియే నీకు తీర్పు తీర్చబడును. ఆయన తన మాటను నిలబెట్టుకొనును, అది సత్యమని ఆయన గుర్తించును. స్నేహితుడా, గుర్తుంచుకొనుము, నీవు జీవించినంత కాలము దీనిని మరువరాదు: దేవుడు తన మనస్సును మార్చుకొనడు. అయినా ఆయన దీవించును. తన అనుమతిపూర్వక చిత్తమును తెలియచేసి నిన్ను వెళ్ళమనును. కాని తన మనస్సును మార్చుకొనడు. ఆయన తన పధకమును మార్చుకొనడు. నీ కొరకు ఆయన తన మాటను మారడు. నీ అనుభవమునకు తగినట్లుగా దేవుని వాక్యము జోడు కావలెనని నీవు తలంచరాదు. నీ అనుభవము దేవుని వాక్యముతోనే సరిపోవలెను, చూచారా. ఆ విధంగానే నీ వుండవలెను…

"నేను చాలా మంచివాడిని. నాకు దేవుడు ఇది చేసెను, అది చేసేను," అని చెప్పెదవు.

"కాని నీవాయన మాటను గైకొనుచున్నావా?"

"ఓ, మంచిది, నేను నీకు చెప్పెదను, అది కేవలము…" మంచిది, ఎక్కడో ఏదో పొరపాటున్నది. అవును, దేవుడు నిన్ను వర్థిల్లజేయును. ఖచ్చితముగా, ఆయన నిన్ను చేయును…

95శాఖలు వర్ధిల్లవచ్చును. వాటి గుడారములు విస్తరించవచ్చును. వారికి చాలా గొప్ప భవనములు ఉండవచ్చును. వారి సంఘములు దేశమంతా వ్యాపించవచ్చును. ధనికులు, బాగా డబ్బు కుమ్మరించు సభ్యులు చాలా మంది వారికి ఉండి యుండవచ్చును. బైబిలు ఆ విషయము చెప్పలేదా? లోకము యొక్క సంపదలు, మానవులు యొక్క ఆత్మలు, ఈ వేశ్యలో కనబడెను. దీనంతటికిని తల్లి అదే. చెడిపోయిన రాజకీయము మరియు సంఘమును చూడండి.

96కాని దేవుని యొక్క చిన్న గుంపు వాక్యములోనే కేంద్రీకృతమై యున్నది.

ప్రియమగు పరలోకపు తండ్రి నిత్యమూ నిన్ను అక్కడే స్థిరముగాయుంచును గాక. ఆ వాక్యము నుండి నీవెన్నడునూ కదల వద్దు. నీవు దీవింపబడ వచ్చును. దేవుడు నీ వ్యాధిని బాగు చేయవచ్చును. నీ రోగియగు బిడ్డను దేవుడు బాగుచేయవచ్చును. నీ భర్తను, నీ భార్యను, నీ తల్లిని ఆయన బాగుచేయవచ్చును. నీవు ఆత్మలో నాట్యము చేయుచూ, క్రిందికి, పైకి ఎగుచుచుండవచ్చును. మరువవద్దు, వర్షము నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను కురియుచున్నది. ఆ విత్తనము అచ్చట పడియున్నయెడల అది నిర్ణయ ప్రకారము మొలకెత్తును. అది గోధుమ గింజగా నిర్ణయించబడినయెడల, గోధుమనే కాయును. అది దేవుని వాక్యమయినయెడల, అది తిరిగి దేవుని వాక్యమునే ఉత్పత్తి చేయును, చూచారా. మీరిప్పుడు దీనిని గమనించారా?

97ప్రభువు మిమ్ము దీవించును.

తొమ్మిది గంటలకు నేను ముగించెదనని చెప్పాను. ఇప్పుడు ఇరవై నిమిషాలు తక్కువ పది గంటలయినది. మాలో చాలామంది జనులు ఇంకా ఎంతో దూరం రావలసియున్నారు. మిమ్మును ప్రేమించుచున్నాను. నేను మా యెడల క్రూరముతో ఈలాగు ప్రవర్తించాననుకోనవద్దు. మిమ్మును నేను ప్రేమించుచున్నాను. నాకు తెలిసిన దానిని మాకు దాయకుండా చెప్పితిని. నేను సత్యమునే మీతో చెప్పుచున్నాను.

నేను కూటములకు వెళ్ళుచుందును. అక్కడ ఈ వర్తమానములను నేనెన్నడూ చెప్పను. ఈ ఆలయమునకు వచ్చినప్పుడే నేను చెప్పెదనని వాగ్దానము చేశాను. నా వర్తమానములను ఇక్కడే అందించెదను. ఇంకా నాకు దేవుడిచ్చిన వర్తమానములు మూడు లేదా నాలుగు ఉన్నవి. దాని కొరకు లేఖనములున్నవి. ఇక్కడ తప్ప మరెచ్చటనూ నేను బోధింప తెగింపను. దేవుని యొక్క వాక్యము ఇచ్చట నుండియే బయలు వెళ్ళును. దేవుడు దానిని మార్చు వరకూ ఇక్కడే నేను నిలచియుందును. ఇది నిజము. ఆ బయట కూటములు జరుగుచున్నవి. నేను రోగుల కొరకు ప్రార్థించుచున్నాను. అన్ని విషయములను నేను చెప్పుచున్నాను. గొర్రెలు దానిని వినుచున్నవి. వారికి ఆ సంగతులేమిటో తెలియును, లేనియెడల అది గాలపు ముల్లు యొక్క ఎర వలె కనిపించును. గమనించారా? గురుతులు మీకు చూపించాను. దేవునికి వివేచన తెలియునని చూపించ ప్రయత్నించాను. ఆయనకు ప్రజల హృదయములు, సంగతులు తెలియును. జనులను పురికొల్పుట. ఒక సౌవార్తిక వరము. మొదట సంగతి మీరు తెలిసికొనుడి. వారి ఇంటిలోనికి ఒక టేపు వచ్చును. అది పట్టుకొనును. అది గొర్రెయైనచో దానిని వెంబడించి వచ్చును. అది మేక అయినచో, కాళ్ళతో తన్ని వేయును. అది… మీరు కూడా అలాగే చేశారు. నిజమే కదా, బెన్? అది ఖచ్చితంగా నిజము. బేన్ కు కొంత అనుభవమున్నది. మంచిది.

అవును. అది సరియే.

98నీవాయనవాడివైనందుకు సంతోషించుట లేదా? చాలాకాలం క్రితం మనం "ఒక చిన్న పెంతెకోస్తు పాటను పాడుచుండే వారము:

ప్రభువు నన్ను బయటకు తెచ్చినందుకు ఎంతో సంతోషించుచున్నాను;

ప్రభువునన్ను బయటకు తెచ్చినందుకు ఎంతో సంతోషించుచున్నాను;

యేసు ఆలాగు చేసియుండనిచో, ఎక్కడుండేవాడిని?

ప్రభువు నన్ను బయటకు తెచ్చినందుకు ఎంతో సంతోషించుచున్నాను.

ఓ, ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి ఎంతో సంతోషించుచున్నాను.

ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి ఎంతో

సంతోషించుచున్నాను.

యేసు ఆలాగు చేసియుండనిచో ఎక్కడుండేవాడిని!

ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి ఎంతో సంతోషించుచున్నాను.

ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి కేకలు వేయుచున్నాను.

ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి చప్పట్లు కొట్టుచున్నాను.

యేసు ఆలాగు చేసి యుండనిచో నేనెక్కడుండే వాడిని?

ప్రభువు నన్ను బయటకు రప్పించినందుకు సంతోషముగా యున్నాను.

మహిమ! మీరు ఆనందముగా లేరా?

మీకు సంతోషము లేదా? … (మనము పాడుదము!)

ప్రభువు మిమ్ము బయటకు రప్పించినందుకు సంతోషముగా లేదా?

ప్రభువు నిన్ను బయటకు రప్పించినందుకు ఆనందముగా లేదా?

యేసు ఆలాగు చేసి యుండని యెడల ఎక్కడుండేవాడిని?

ప్రభువు నన్ను బయటకు రప్పించినందుకు ఆనందముగా యున్నాను,

ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి పాడుచున్నాను.

ప్రభువు నన్ను బయటకు తెచ్చినప్పటి నుండి పాడుచున్నాను.

యేసు ఆలాగు చేసియుండని యెడల ఏమగుదును?

ప్రభువు నన్ను బయటకు రప్పించినప్పటి నుండి సంతోషించుచున్నాను.

ఆ విషయములో మీరు ఆనందించుట లేదా?

ఆలాగయితే "మనము వెలుగులో నడచెదము." ఆ పాట మీరెరుగుదురా?

మనము వెలుగులో నడతుము. అది అందమగు వెలుగు;

కృప యొక్క హిమబిందువులు తెల్లగా నున్న చోట నుండి అది వచ్చుచున్నది.

దివా రాత్రులు మన చుట్టూ ప్రశించుచున్నవి.

ఓ, యేసే లోకమునకు వెలుగు! (అది సూర్యోదయం!).

పరిశుద్ధులందరూ ప్రేమను చాటింతురు యేసే లోకమునకు వెలుగు

సత్యము మరియు కృప

ఆయన నామము యేసే లోకమునకు వెలుగు.

ఆ పాటను పాడచుండగా మనము చేతులెత్తుదము.

ఓ, ఆయన వెలుగులో మనం నడచెదము అదిఅంత అందమగు వెలుగు

కృపా హిమ బిందువులు మొరయుచున్న చోట నుండి అది వచ్చుచున్నది.

దివా రాత్రులు మన చుట్టూ ప్రకాశించుచున్నది.

యేసే - లోకమునకు వెలుగు!

ఒకరితో ఒకరు కరచాలనము చేయుడి,

ఓ, కృపా హిమబిందువులు మెరయుచున్న చోటు నుండి అది వచ్చుచున్నది.

మీరు వెలుగు పిల్లలుగా ఉన్నందుకు సంతోషించుట లేదా?

సూర్యోదయ మయినది!

దివా రాత్రులు మన చుట్టూ ప్రకాశించుచున్నది

(చిన్న పిల్లలారా, ఒకరినొకరు ప్రేమించుకొనుడి.)

…లోకమునకు వెలుగు.

ఓ, మనము వెలుగులో నడచెదము అది అంత అందము!

(ఆయన వాక్య ప్రత్యక్షత)

కృపా హిమ బిందువులు మెరయుచున్న చోట నుండి అది వచ్చుచున్నది.

దివా రాత్రులు మనచుట్టూ ప్రకాశించుచున్నది.

యేసే లోకమునకు వెలుగు.

దానిని మీరు నమ్ముచున్నారా?

మనము సీయోనుకు వెళ్ళుచున్నాం,

ఆందమగు, సుందరమగు సీయోను.

మనము సీయోనుకు వెళ్ళుచున్నాము.

అది అందమగు దేవుని పట్టణము.

ఓ, మనము సీయోనుకు వెళ్ళుచున్నాం,

ఆందమగు, సుందరమగు సీయోను.

మనము సీయోనుకు వెళ్ళుచున్నాం,

అది అందమగు దేవుని పట్టణము.

పాడుటకు తిరస్కరించువారు,

మన దేవుని ఎన్నడూ ఎరుగని వారు,

కాని పరలోకపు రాజు పిల్లలు,

కాని పరలోకపు రాజు పిల్లలు,

తమ సంతోషమును ప్రపంచమంతా చాటుదురు.

తమ ఆనందమును ప్రపంచమంతా చాటెదరు,

ఎందుకనగా మనం సీయోనుకు వెళ్ళుచున్నాం (మహిమ!)

ఆందమగు సుందరమగు పట్టణము,

మనము సీయోనుకు సాగిపోవుచున్నాం,

అందమగు దేవుని పట్టణము.

ఓ, మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

ఓ, అందమగు, సుందరమగు పట్టణము.

మనము సీయోనుకు సాగిపోవుచున్నాం,

అది అందమగు దేవుని పట్టణము.

99మీ చేతిరుమాళ్ళను బయటకు తీయండి. మా చేతిగుడ్డలను బయటకు తీయండి. ప్రభువుకు మనం అల్లాడించు అర్పణను అర్పించుదము. అది చాలినంత పన కాదు, కానీ వారు పౌలు యొక్క శరీరము మీది వస్త్రమును చంపి తీసికొనిరి.

ఓ, మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

అందమగు, సుందరమగు పట్టణము;

మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

అది అందమగు దేవుని పట్టణము.

ఓ, మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

ఓ, అందమగు, సుందరమగు పట్టణము;

మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

అది అందమగు దేవుని పట్టణము.

100ఆమేన్! ఓ, ఇది మీకు చక్కగా యుండుట లేదా? ఆ వెనుకటి పరిశుద్ధులు నాకు జ్ఞాపకము వచ్చుచున్నారు. వారు ఆ రోమనుల చిత్రహింసలకు గురయి చనిపోయిరి. వారు ఆ చిన్న కొండలను దాటి సింహముల గుహలోనికి వెళ్ళుట నాకు కనిపించుచున్నది. వారిట్లు పాడుకొనిరని నేను భావించుచున్నాను.

ఓ, మనం సీయోనుకు వెళ్ళుచున్నాం,

ఈ అందమగు, సుందరమగు సీయోను;

మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

అది అంధమగు దేవుని పట్టణము.

సీయోను పొలములు పండుచున్నవి,

ఒక వేయి పవిత్ర తియ్యని పదార్థములు కాసినవి,

పరలోక సింహాసనమును మనం చేరుకోను ముందుగా,

పరలోక పొలములను మనం చేరుకొను ముందుగా,

బంగారు వీధులలో నడచు ముందుగా,

బంగారు వీధులలో నడచుచుండగా,

మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

ఆందమగు, సుందరమగు సీయోను;

మనము సీయోనుకు సాగిపోవుచున్నాం,

అది అందమగు దేవుని పట్టణము.

101నా వెనుక చెప్పండి [సహూ బ్రెన్హాం చెప్పిన తరువాత జనులందరూ వెనుక చెప్పిరి]: ప్రభువైన దేవా, నన్ను నేను నీకు క్రొత్తగా సమర్పించుకొనుచున్నాను. సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రపరచుము. నీ వాక్యములో నాకు సందేహమున్నయెడల దాని నుండి నన్ను శుద్ధి చేయుము. ఈ ఈస్టరు నుండి నన్ను నూతన సృష్టిగా చేయుము. క్రీస్తు యేసులో నన్ను సృష్టించుము. నా హృదయములో నిన్ను కలిగియుండనిమ్ము. నీ వాక్యము నా పాదమునకు దీపముగా యుండును గాక. నా త్రోవకు వెలుగుగాయుండును గాక. ఇక నుండి నేను నిన్ను వెంబడించుదును. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

మనం సీయోనుకు సాగిపోవుచున్నాం,

ఓ అందమగు, సుందరమగు సీయోను,

మనము సీయోనుకు సాగిపోవుచున్నాం,

అది అందమగు దేవుని పట్టణము.

MATT 25:40

 

102అది మీకు చక్కగా కనిపించుట లేదా? మనలను మనం క్రొత్తగా సమర్పించుకొనియున్నాము. మృతులలో నుండి తిరిగి లేపబడియున్నామని మన హృదయములలో ఎరుగుదుము. అందువలన మీకు బాగుగా లేదా? మై, ఓ మై! నేను మిమ్మును అమర్త్య ప్రేమతో ప్రేమించుచున్నాను. వినండి. ఒకరినొకరు ప్రేమించుకొనుడి. కనబడుచున్న నీ సోదరుని ప్రేమింపని నీవు, కనబడని దేవుని నీవెట్లు ప్రేమించగలవు? కావున ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఒకరికొకరు పరిచర్య చేసికొనుడి. ఆ విధముగా మీరు దేవునికి పరిచర్య చేయుదురు. అది నిజమేనా? తమలో జీవపు శక్తి కలిగియున్న ఈ మిక్కిలి అల్పులలో ఒకరికి చేసినయెడల, నాకు చేసినట్లే అని ఆయన చెప్పెను.

"నీవు అవసరతలో యుండుట మేము ఎప్పుడు చూచాము? నీవు చెరసాలలో యుండగా మేమెప్పుడు నిన్ను దర్శించితిమి? ఈ క్రియలు మేమెప్పుడు చేసియున్నాము?"

"మీరు వారికి చేసితిరి గనుక నాకు చేసినట్లే." అది ఆశ్చర్యము కాదా? నేనాయనను ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించుట లేదా?

103ఇంకా ఒక్క నిమిషము మిరు వేచియున్నయెడల మరియొక్క, చిన్న పాటను పాడుదము. దానిని గానము చేయుదము. మంచిదండీ! యేసు నామమును నీతో కొనిపొమ్ము. స్నేహితుడా, దానిని మరచిపోవద్దు. దానిని ఇప్పుడు మనందరం పాడుదము. అందరం ఏకీభవించి హృదయపూర్వకంగా దానిని పాడుదము. మనలను మనము ఆయనకు సమర్పించుకొందము.

యేసు నామమును నీతో కొనిపొమ్ము,

దుఃఖము మరియు వేదనతో నిండిన బిడ్డా;

అది నీకు ఆనందమును, ఆదరణను ఇచ్చును,

నీవు వెళ్ళు ప్రతి చోటకూ దానిని తీసికొని పొమ్ము.

ప్రశస్త నామము, ఓ, ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము;

ప్రశస్త నామము, ఓ, ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.

104ఇప్పుడు గుర్తుంచుకొనండి. వేడియగు హింసా గాలి వీచుచున్నది గనుక నా కొరకు ప్రార్థించండి. అన్ని వైపుల నుండి దయ్యములు సవాలు చేయుచున్నవి. మీరు దివా రాత్రులు నా కొరకు ప్రార్థించుచున్నారని ఎరుగుదును. నేను మీ కొరకు ప్రార్థించెదను. మా మంచి సంఘ కాపరియగు నెవిల్ సోదరుని పక్షము గాను, సహ కాపరియగు సహోదరుడు కాప్స్ పక్షముగాను నిలబడియుండండి. వారి మాట వినండి. జీవవాక్యమును వారు మీకు బోధించెదరు. దానిని నేను నమ్ముచున్నాను. దానిని నేను నమ్మనియెడల వారిని ఇచ్చటికి రానిచ్చెడివాడిని కాను. నిశ్చయంగా నేనిది చేసియుండను. వారు వర్తమానము నమ్ముచున్నారని నేను విశ్వసించుచున్నాను. వారు దానితో నిలచి యుంటున్నారని నేను గట్టిగా నమ్ముచున్నాను. వారిరువురిలోను నాకు విశ్వాసమున్నది. వారితో నిలచి యుండుడి. ఇంకా కొందరు సోదరులు కూటములను ఏర్పాటు చేయుచున్నారు. ఈ రాత్రి వారు నిలబడియున్నారు. మీరు వారి పొరుగు వారయినచో, వారి పక్షముగా నిలచియుండండి. ఈ రాత్రి వారు ఎందుకొరకు వచ్చిరో మీరు వినియున్నారు.

యేసు నామమును నీతో కొనిపొమ్ము,

ప్రతి బంధకము నుండి రక్షణగా

(దీనిని వినుము!);

నిన్ను శోధనలు చుట్ట ముట్టినప్పుడు

ఆ పవిత్ర నామమును ప్రార్థనలో ఊదుము.

ప్రశస్త నామము! (ప్రశస్త నామము)

ఓ, ఎంత మధరము! (ఓ! ఎంత మధురము)

భూలోక నిరీక్షణ… (ప్రియ దేవా, వీరిని స్వస్థపరచుమని

ప్రార్థించుచున్నాను. పరమ తండ్రి! యేసు నామములో

దీనిని దయచేయుమని అడుగుచున్నాము,

ప్రభువా, ఇమ్ము.)

ఓ, ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము

తిరిగి మనం కలిసికొను వరకు,

మనం కలిసికొను వరకూ

యేసు పాదముల యొద్ద మనం కలియు వరకూ…

మనం కలిసికొను వరకు, మనం కలిసికొను వరకు.

తిరిగి మనం కలిసికొను వరకు దేవుడు మితో, ఉండు గాక!

ఇప్పుడు మన తలలు వంచుదము. [తిరిగి మనం కలిసికొనువరకు అను పాటను సహూ బ్రెన్హాం పాడుచున్నారు.] ఓ, దేవా, మాతో యుండుము; ప్రభువా, మాకు సహాయపడుము.

తిరిగి మనం కలిసికొనువరకు,

తిరిగి మనం కలిసికొనువరకు,

మనం కలిసికొను వరకు దేవుడు మీకు తోడై యుండు గాక.

105తిరిగి మనం కలిసికొనువరకు, అదే నిజంగా నా ప్రార్థన. దేవుడు మిమ్ము దీవించును. ఈ చక్కని జనులను పంపించుటకు ముగింపు ప్రార్థనను మన ప్రశస్త సోదరుడు నెవిల్ చేయవలెనని అడుగుచున్నాను. మీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. మీ వంటి జనులను నేను కలిగియుండినందుకు ఎంతో సంతోషించి వందనములు చెల్లించుచున్నాను. నమ్మువారు లేనియెడల నా వర్తమానము వలన ఏమి లాభము? ఇక్కడ దాని కొరకు చనిపోవుటకైనా సిద్ధమేనను జనులున్నారు. మీ ప్రతిఒక్కరికి దేవుడు సహాయము చేయును గాక! నా ప్రార్థనలు మీతో యున్నవి. నా దీవెనలు మీ ప్రతి ఒక్కరితోను వెళ్ళును. అ పునరుత్థానములో మీరు భాగస్తులని మరువకుడి. ఇప్పుడు మీలో జీవపు శక్తి యున్నది. అంతా స్థిరపరచబడినది. మీరు దేవుని పిల్లలు. మన శిరములు వంచుదము. సహూ నెవిల్, ముగింపు ప్రార్థనను చేయును. దేవుడు మిమ్ము దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...