మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము

మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము

VGR PARA COUNT-248

ఇప్పుడు కలిసి, అది పట్టుకొనండి, చాల పెద్దగా.

ఆశ్చర్యమైన కృప! ఆ శబ్దం ఎంత మాధుర్యం,

నా వంటి దౌర్బాగున్ని అదే రక్షించినది!

ఒకనాడు నశించియుంటిని, ఇప్పుడు కనుగొనబడ్డాను,

అంధుడనైయుంటిని ఇప్పుడు చూచుచున్నాను.

ఇప్పుడు మనము తలలు వంచుకుందాము. మా పరలోకపు తండ్రీ, నీ యొద్దకు మేము వచ్చుటకు మేము కలిగియుయున్న ఘనమైన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకొంటున్నాము. మొదటిగా క్రీస్తు ద్వారా తప్ప మేము రాలేము. అందుచేత మా ప్రార్ధనకి ముందు ఆయన నామమును ఉంచుతున్నాము. ఆ తరువాత ఆయన నామాన్ని బట్టి, మేము అడిగితే దానికి నీవు జవాబు దయచేయుదువని, ఆయన వాక్యము వలన మేము తెలుసుకొనియున్నాము. మా స్వంత నీతి అనేది మాకు లేదు, మేము చేసి పొందుకోగలిగినది ఏది లేదు; అయితే క్రీస్తు నామమున మేము వేడుకొంటూ, కృప ద్వారానే మేము వచ్చుచున్నాము.

తండ్రీ, అనేకులైన స్త్రీలు పురుషులు పాపులు ఇక్కడ ఉన్నారు, ఈ రాత్రి ఈ భవనములో ఉన్నారు. పాపి కొరకై నీవు చనిపోతివి. దేవుడు వారి హృదయాలతో మాట్లాడి అయన రాజ్యములోకి ఆయన కృపను బట్టి వారిని పిలచునది ఒకవేళ ఈ రాత్రి అవునుగాక. తండ్రీ, అనుగ్రహము చూపుము. పాపములో అనేక సంవత్సరాలు తిరుగుతూ వృధా చేసి ఉండవచ్చును, అయితే ఇదే ఘడియ కావచ్చును.

2

ఈ రాత్రిలో బిల్లీ పాల్ కొరకై నీకు కృతజ్ఞతలు ప్రభువా, అనిశ్చలముగా ఉన్నటువంటి దీనుడగు చిన్నవాడైన తల్లి లేని నా బిడ్డ అతడు. అతనికి పరిశుద్దాత్మను అనుగ్రహించినందుకు ఒక మహిమ గలిగిన దినము తిరిగి తల్లిని చూస్తాము. అన్నీ మంచిగా ఉండును. మంచిగా ఉంటవి. ఓ దేవా, ఈ దినాన దేవదూతలు ఆమెకు అదే తెలియచేయుదురు గాక. ఆమె మరణమప్పుడు ఆమె ఎంతగానో ఏడ్చినది, “ఒక దినమున బిల్లీపాల్ పెద్దవాడై పరిశుద్దాత్మను పొందుకోవాలని.” ప్రార్ధనలు వినబడినవి. దేవా, ఇప్పుడు బిడ్డను దీవించుము. యజమాని యొక్క అడుగు జాడలలో అతడు వెంబడించును గాక. అతడు “నాన్నా, నేను ఇప్పుడే పరిశుద్దాత్మను పొందుకునన్నాను.” నేను ఎంతగానో ఆనందంగా ఉన్నానని అతడు చెప్పినప్పుడు అతని చిన్న స్వరము వణకుచుండేను.

దేవా, ఇక్కడ ఈ రాత్రిలో తిరిగి జన్మించని ప్రతి వ్యక్తి యొక్క అనుభవము అదే అగును గాక. ఈ రాత్రి వారు పరిశుదాత్మను పొందుకొందురుగాక. మేము ఏ పాపము చేసినను మమ్ములను క్షమించు ప్రభువా, రోగులను స్వస్ధపరచుము. పగిలిన హృదయములతో ఉన్నవారిని కట్టుము.

ప్రభువా, ఈ రాత్రి ఎక్కడ మాట్లాడవలెనో కూడా నాకు తెలియదు. అయితే నీవే అనుగ్రహించుము. ప్రజలకు ఉపయుక్తమగు ఒకదానిని నీవు మాకు దయచేయుమని నిన్ను నేను నమ్మి అడుగుతున్నాను. ఆయన నామమున అడుగుచున్నాము. ఆమెన్.

3

కొద్దిగా లేఖనము ఇక్కడ చదవటానికి యెషయా 35లో నేను చదవాలని అనుకుంటున్నాను కారణం నా మాటలు గతించవు. దేవుని వాక్యము ఏ మాత్రము గతించదు. అందుచేత ఏ కూటము కూడా మొదట లేఖనము చదువకుండా ముగింపు చేయబడదు.

అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును; అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును.

అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును: లేబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృడపరచుడి.

తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి ... భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును; ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.

గ్రుడ్డివాని కన్నులు తెరువబడును, చెవిటి వారి చెవులు విప్పబడును.

కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్ళు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును: నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ద మార్గామనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు.

అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడచుదురు.

యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

4

చదవబడిన ఆయన వాక్యానికి ప్రభువు ఆయన ఆశీర్వాదములు తోడు చేయును గాక. దేవుని చిత్తమయితే ఈ రాత్రి కొన్ని క్షణాలు మీతో మాట్లాడ ఆశపడుతున్నాను. నా గడియారాన్ని ఇక్కడ గమనించుకొంటూ ఈ రాత్రి మిమ్ములను ఎక్కువ సేపు ఉంచకున్నట్లుగా ఉంటాను.

5

ఈ వారము కూటములు తరువాత భయపడటానికి ఎలాంటి అవసరము లేదని ప్రజలకు చూపించ ప్రయత్నిస్తాను. దయ్యము నీ మీద పెట్టే బహు చెడ్డ వస్తువు భయము. నీకు చివరి కాన్సర్ ఉన్నప్పటికి దేవుడు నిన్ను స్వస్థపరిచునని నమ్మి భయపడకుండా ఉన్నట్లయితే నీవు బహు కురూపివి కాదు. దేవుడు దానిని జాగర్త తీసుకుంటాడు; నీవు వ్యాధితో ఉన్నట్లయితే అది ఏమైనప్పటికీ, నీవు భయపడకుండా ఉన్నట్లయితే....... కనుక ఒక వ్యక్తి మీద సాతాను పెట్టినటువంటి చెడ్డ వస్తువులలో ఒకటి భయము.

ఇప్పుడు, ఈ వారములో లేఖనములు ద్వారా దేవుని రాజ్యములో తిరిగి జన్మించిన ఒక మనుషి దేవునికి భయము చెందనవసరము లేదని లేఖనాల ద్వారా నేను నిరూపించాను. నీవు ఖచ్చితంగా యేసుక్రీస్తులో క్షేమంగా సురక్షితంగా ఉంటావు. “తండ్రీ నాకు అనుగ్రహించిన వారందరూ” ఆయనే చెప్పాడు, “నా యొద్దకు వత్తురు. తండ్రి పిలవనిదే ఎవరు రారు. తండ్రే అతనిని నా యొద్దకు నడపవలసి ఉన్నది. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా తండ్రీ చేతిలో నుండి ఎవడును వారిని పెరికివేయలేడు. ఆయనకంటే బలవంతులు ఎవరు లేరు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటి యున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు,” యుండును అని కాదు, “ప్రస్తుత కాలము నిత్యజీవము కలవాడు మరియు అంత్య దినమున నేను వానిని లేపుదును.”

“అందుచేత దేవుని పరిశుద్దాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు ముద్రించబడితిరి.” అక్కడే మీరు ఉన్నారు. “విమోచన దినము వరకు ముద్రించబడి యున్నారు.” ఎదో ఒక ఉజ్జీవము నుండి మరియొక ఉజ్జీవము వరకు కాదు అయితే విమోచనా దినము వరకు.

6

ఈ ఉదయం పరిశుద్దాత్మ ఇలాగు వచ్చి ఆ విధంగా మిమ్ములను దీవించును కదా. ఇక్కడ మిమ్ములను ఈ ఉదయం, షుమారు తొమ్మిదిన్నర (9:30) నుండి ఒక్కటిన్నర (1:30) వరకు ఇక్కడే ఉంచి, ఆయన ఎంతగా మనలను దీవించెను.

ఇక్కడ, ఈ రాత్రి, నేను మాట్లాడాలనుకొంటున్నాను .... ఇక్కడ యెషయా చెబుతున్నాడు “అక్కడ ఒక రాజమర్గముండునని, అది పరిశుద్ద మార్గమనబడును.” నేను “దేవుని మార్గము, మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము అను దాని పైన మాట్లాడగోరుచున్నాను.”

7

నేను న్యూయార్క్ నగరానికి వెళ్ళుచున్నట్లైతే, నాకు శ్రేష్టమైన విషయం బహుగోళికంగా నేను ఇక్కడ ఉంటున్నానా, ఉత్తరం విడువాలా అని తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుట కాదు. అయితే శ్రేష్టమైన విషయం పటము తీసుకొని అనుసరించడం ప్రాముఖ్య మార్గం, రాజమార్గము తెలుసుకొనుటకు (అవును అది నిజమేనా?) నేను అలాగా చేయకపోతే, ఇబ్బందిలో పడిపోతాను.

దేవుని యొక్క రాజ్యానికి దగ్గర దారులు లేవు. నీకు తెలుసా, దగ్గర దారులు చేయుటకు మనము ప్రయత్నము చేస్తాము. మనము ఇక్కడ ఒక చెరువులో లేక బురదగుంటలో చేరుతాము. అందుచేత ఘనమైన పురాతనమైన దేవుని రాజమార్గాన్ని మనము దిగునప్పుడు అది మనము చేయునది, దేవుడు ఒక మార్గమును ఒక దారిని ఏర్పాటు చేసాడు.

8

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చిన తరువాత వారు దేవుని దారిని వెంబడించారు. అది ఎర్ర సముద్రము యొద్దకు నడిపించినది. దేవుడు ఆయన దారిన ఆ మార్గము నొద్దకు నడిపించుట అనునది వింతైన విషయమే. అయితే ఆయన దారి సముద్రము గుండా వెళ్ళిపోయినది.

అయితే ఒక సమయము వచ్చేసరికి తెలియబడినప్పటికి, ఇశ్రాయేలీయులు సముద్రము ఎదుట నిలబడ్డారు. దేవుని మార్గము సముద్రము గుండా నడచిపోయినది. కాబట్టి దేవుడు అగ్ని స్ధంభములో గుండా చూడగా, సముద్రము భయపడి వెనుకకు కదిలిపోయినది. ఇశ్రాయేలీయులు ఎండిన నేలన వెళ్ళిపోయారు. దేవుని మార్గము దాని గుండా వెళ్ళిపోయినది.

9

ఆ తరువాత ఆయన నేరుగా అరణ్యమలోనికి మారా యొద్దకు “చేదు” నీటి ఊట యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు. చేదు నీళ్ళ యొద్దకు చేదు నీళ్ళ గుండా దేవుడు ఆయన బిడ్డలను నడిపించుట వింతగా లేదా? అయితే వారందరూ అదే దారిన వెళ్ళారు. కనుక ఆయన అక్కడ ఉండినప్పుడు చేదు నీళ్ళకు విరుగుడు ఒడ్డున నిలబడుటయైనది, మోషే చెట్టు నరికి దానిని నీటిలో వేసాడు, తిరిగి మధురముగా మారినవి.

కొందరు జలముల ద్వారా, కొందరు జలప్రళయము ద్వారా,

కొందరు బలమైన శ్రమల ద్వారా, అయితే అందరు రక్తము ద్వారా వచ్చారు.

దేవుడు ఆ విధముగా ఆయన బిడ్డలను నడిపిస్తాడు: దేవుని దారి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఇశ్రాయేలీయులు ప్రక్క దారిన వచ్చుటకు ప్రయత్నిస్తే చుట్టూ తిరిగి ఈ వైపు వస్తే వారు ఇబ్బందిలో పడతారు. వారు వారిని నడిపించిన మేఘ స్ధంభమును అగ్నిస్ధంభమును వెంబడింపవలసి ఉన్నది. వారు దానిని వెంబడించిరి.

ఈ రాత్రి సంఘము అగ్నిస్ధంభమును మాత్రమే వెంబడించితే, పరిశుద్దాత్మను, కానను నీవు దేనిగానైన చేయగలవు. దేవునికి ఒక మార్గమున్నది, సిద్దపరచబడిన మార్గము.

10

మనుష్యుడు వెళ్ళుటకు రెండు మార్గాలున్నవి: అవి అతని మార్గము లేదా దేవుని యొక్క మార్గము అనగా సరియైన మార్గము లేదా సరికాని మార్గము. నీ మార్గము ఎల్లప్పుడు కూడా తప్పుడు మార్గము, దేవుని మార్గము సరియైన మార్గము. ఒకేసారిగా నీ సొంత మార్గములో నీవు ఉండలేవు, దేవుని యొక్క మార్గములో ఉండలేవు. కాబట్టి నీ సొంత మార్గము నుండి నీవు బయటికి రావలసి ఉన్నది. తద్వారా దేవుడు ఆయన సొంత మార్గమును నీలో ఉంచు నిమిత్తము, అవును అది నిజం. దేవుడు సిద్ధపరచిన మార్గమును ఉంచును.

మనుష్యుడు ఎప్పుడు కూడా తన సొంత మార్గాన్ని కావాలనుకుంటాడు. ఏదేను తోటలో దేవుడు నరుని చేశాడు, అతడు దేనికి తొలగిపోకుండునట్లుగా. దేవుడు అతనిని పరిపూర్ణుడుగా చేశాడు, అయితే మనుష్యుడు తన సొంత మార్గాన్ని కోరుకున్నాడు. అతడు చెరపాలనుకున్నాడు. అతడు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తరువాత తను పడిపోయిన వెంటనే లేఖనములు పటనము చేస్తూ..... ఈ వారము దానిని మనము చదివాము, అతడు తన కొరకు మతమును తయారు చేసుకున్నాడు. దేవుడు అతనికి ఒకటి చేయుట కొరకై అతడు వేచి యుండలేదు. తానే తనకొకటి తయారు చేసుకున్నాడు. అయితే తన మతము తాను కప్పుకొనుటకు పని చేయలేదని అతడు తెలుసుకున్నాడు. ఆ విధముగా మానవుడు ఎల్లప్పుడు చేస్తూ ఉంటాడు. తన సొంత మార్గాన్ని అతడు కోరుకుంటాడు. అయితే దేవునికి ఒక మార్గమున్నది. కనుక మానవుడు అంజూరపు ఆకులను తీసుకొని తన చుట్టూ చుట్టుకున్నాడు. అతను అతని భార్యకు, అయితే దేవుని చూచు సమయము వచ్చేటప్పటికి అవి పని చేయవని అతడు తెలుసుకున్నాడు.

స్నేహితులారా, నేను మీతో చెబుతున్నాను, అనేకులైన మనుష్యలు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. రహదారి అంతానికి వచ్చుచున్నవారు. నీవు దేనిపై ఆనుకున్నవో పని చేయని ఆ చిన్న పైపైన భక్తి నీవు తెలుసుకుంటావు. తిరిగి జన్మించుటయే పని చేయును. దానికి దగ్గర దారులు లేవు. “ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేగాని పరలోక రాజ్యములో ప్రవేశించడు.” మరి ఏ విధముగా కాదు అవి ఏమైనప్పటికి అతడు మెథడిస్ట్ అయినా బాప్టిస్ట్ అయినా ప్రేస్బిటేరియన్ అయినా అతడు ఏమైనప్పటికి, అతడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించే వరకు అతడు ప్రవేశించడు. “జన్మించుట” అనగా అతడు “మార్చబడెను.” అతడు జన్మించక ముందు అతడు చనిపోవాల్సి ఉన్నది. కాబట్టి నీవు క్రీస్తు యేసులో తిరిగి జన్మించుట కొరకై, నీవు మరల చావవలసి ఉన్నది. అవునది నిజం.

11

ఇప్పుడు మీరు గమనించగోరుతున్నారు. తనకు మార్గాన్ని తయారు చేసుకుంటానికి తానే సంక్షిద్దపడ్డాడు. ఈ ఉదయం కయీను తన మార్గామును తయారు చేసుకున్నది మనము తెలుసుకుందాము. అతడు కొన్ని ఆపిల్లు, పియర్ పళ్ళు, కలియ కాయలు, పీచ్ పండ్లు, గుమ్మడి కాయలు ఇంకా ఏవేవో తీసుకొని వచ్చాడు. వాటిని బలిపీటం పైన పెట్టి, “ప్రభువా నీకు బలిపీటంను కట్టాను, నేను ఆలయాన్ని కట్టాను. నేను మంచి సంఘ సభ్యుడను అని చెప్పాడు.” గమనిస్తున్నారా, “ప్రతి దినము నేను ఆలయానికి వెళ్ళుచున్నాను. నేను ఇక్కడికి వచ్చి బలిపీటము కట్టాను. దానిపైన అర్పణను పెట్టియున్నాను. ఇప్పుడు నేను మోకరించి ప్రార్ధన చేయబోతున్నాను. ప్రభువా, ఇప్పుడు నన్ను అంగీకరించుము.” అయితే దేవుడు అతనిని తృణీరించాడు.

పాతదైన మత సంభంధమైన అదే ఆత్మ ఈ దినమున సంఘములో నివశిస్తున్నది. సాక్షాత్తు అదే, ఎంతో భక్తిగా యుండాలో అంతగా ఈజిప్ట్ యోధుడను గూర్చి హోట్టేన్ టోట్ కి తెలుసునంతగా దేవుని గూర్చి ఏమి తెలియదు. అది సత్యమని నీకు తెలుసా. భక్తి సంబంధమైన మతసంబంధమైన ఆత్మలు. స్టాలిన్ అంత్యక్రీస్తు అని అనుకోవద్దు. బైబిలు తెలియజేస్తున్నది సాధ్యమయితే ఏర్పరచుకున్నవారిని మోసము చేయుటకు రెండు ఆత్మలు ఎంతో సమీపంగా ఉండును.

12

మనము చూస్తున్నాము ఇస్కరియోతు యూదా నేరుగా వచ్చి వెళ్ళిపోయాడు, ఆనందించాడు, బోధ చేశాడు, తిరిగి వచ్చి అరుపులు అరచి కేకలు పెట్టాడు. మిగతా శిష్యులతో మంచి సమయాన్ని గడిపాడు. పరిశుద్ద మత్తయి 10వ అధ్యాయము. అయితే నేరుగా శిష్యులని అనుసరించాడు. అయినను అవతారం ఎత్తిన దెయ్యం నేరుగా వచ్చాడు అవతారం ఎత్తిన దేవుడగు యేసువలె. ఏదేను తోటలో నుండి వచ్చిన కయీను హేబేలువలె. అయితే పెంతెకోస్తుకు వచ్చు సమయము అతనికి వచ్చినప్పటికి, ఆశీర్వాదము పొందు సమయము వచ్చునప్పటికీ, అతని రంగులు అతను చూపించాడు.

తిరిగి జన్మించుట అను దానిని నీవు మాట్లాడినప్పుడు పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందుకొంటానికి పరిశుద్దాత్మ బాప్తిస్మము గురించి మాట్లాడితే పది మందిలో తొమ్మిది మంది వారు ఎవరై ఉన్నారు, వారి ఆత్మలు వారి రంగులు చూపును. వారు ఏమై ఉన్నారో చెప్పును. వారంటారు, “అది యొక మూడుల గుంపు, దానిని వొదిలేసేయి.” సహోదరుడా, ఈ దినానికి అది దేవుడు సిద్దపరచిన మార్గము. హల్లెలుయా.

13

చూడు, దేవుడు ఎల్లప్పుడు సిద్దపరచిన మార్గమును ఏర్పాటు చేశాడు. మార్గము సిద్దపరచుటకు దేవుడు భద్ధుడై ఉంటాడు. సృష్టికి దేవుడు మార్గమును ఏర్పాటు చేశాడు. దేశమంతట ఈ పెద్ద పెద్ద వరదలు మనకు ఎందుకు? అంతా కలుపును మొదలైన అలాంటి వాటిని నరికి వేశారు. అది కొట్టుకొనుపోయినది. నీవు ఇక్కడ ఆనకట్టను కడతావు. నది అడుగు మట్టాన్ని నీవు నింపాలి. అక్కడ నీళ్ళు పోతవి. ప్రకృతిలో నీవు జోక్యము కలుగజేసుకుంటున్నావు. దేవుడు సిద్ధపరచిన ఒక మార్గమున్నది. ఆ కారణము చేతనే వరదలు వచ్చుటకు కారణమవుతున్నది. దేనినైన, దేవుడు సంపూర్ణముగా చేసిన దానిని దేనినైన మనుష్యుడు అనవసరముగా చెరపినట్లైతే అలాగైతే నీవు దానిని అసంపూర్ణముగా చేస్తున్నావు. అవునది నిజం.

14

ఉదాహరణముగా బాతులు, నేను పర్వతాలకు వేట కొరకై వెళ్తున్నప్పుడు బాతులను నేను గమనించుటకు ఆశపడతాను, సంవత్సరంలోని ఆకురాలు కాలములో నేనక్కడ ఉంటాను. అక్కడ లూసియానా అక్కడ నుండి అక్కడ బురద నేల నుండి బాతులు అన్నీ వస్తాయి. ఉత్తర దశకు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతవి. గూళ్ళు కట్టుకొని పిల్లలను పెడతాయి. తరువాత ఆ చిన్నవి ఎగురుతాయి. బహుశా సెప్టెంబరు సంవత్సరం ఈ కాలంలో లేదా సెప్టెంబరు చివరిలో. ఆ తరువాత ఆ మగబాతు అది ఎన్నడు నీటి కొలను బయటికి వెళ్ళదు. నీటి కొలనులోనే అది ఉంటున్నది.

కొంచెము కాలమైన తరువాత మంచు ఈ పర్వతము పైన వేస్తుంది. కొద్దిగా మంచు దానిని తాకుతున్నది. చల్లని వీదురు గాలులు పర్వతానికి అడ్డంగా వీస్తావి. పెద్దదైన ఆ బాతు దాని యొక్క అనుభూతిని గమనిస్తున్నది. ఆ నీటి కొలనులో తప్పా అది మరొక చోట ఉండదు. దానికింకా సంవత్సరము కూడా రాలేదు. అది దాని తలను గాలిలోకి ఎత్తుకొని ఆ చిన్న మెడతో నీటి కొలను మధ్యలోకి పరుగులు తీస్తూ “హంక్-హంక్” అంటూ వెళ్ళిపోతుంది. నీటి కుంటలో నున్న ప్రతి బాతు దాని దగ్గరకు వస్తవి. నీటి కుంటలో ఉన్న ప్రతి దానికి తెలుసు జన్మతోనే అది నాయకునిగా ఉండెనని. ఆ చిన్న పెద్దదైన బాతు నీటి కుంటలోనుండి పైకి వెళ్తున్నది. ఎటువంటి దిక్సూచి లేకుండగానే మరి ఏది లేకుండగానే నేరుగా లూసియానా వైపునున్న వారి పొలాల వైపునకు ఎంత త్వరగా వెళ్ళిపోవాలో అంత త్వరగా వెళ్ళిపోతుంది.

15

క్రైస్తవులకు బాతు నైజం ఉండవలసి ఉన్నది అని అన్నట్లుగా, అవును కదా? అవును అది నిజమే. అవును.

ఎందుకని? నీవు చెబుతావు, “అది సహజబుద్ధి అని.” కాదు అవి దేవుడు ఏర్పరచిన మార్గమున వెళ్ళును అని. దేవుడు వాటికొక మార్గమును ఇచ్చాడు. వాటిని అక్కడకు నడిపించుటకు ఒక సహజ బుద్ధిని దేవుడు ఇచ్చాడు. దానిని అది నమ్ముతాయి.

అయితే దేవుడు మానవునికి పరిశుద్దాత్మను ఇచ్చాడు. అతడు దానిని నిరాకరించాడు. దేవుడు మనకు ఒక మార్గమును సిద్దపరిచాడు. హల్లెలూయ. ఈ రాత్రి నేను భక్తి పులకింతతో ఊగిపోతున్నాను. దీని తరువాత ఈ కొద్ది రాత్రుల ఉజ్జీవము.

గమనించు, అక్కడ అది ఉన్నది. అవునండి. ఆ చిన్న బాతు అక్కడికి వెళ్ళెను.

16

ఇంకొకటి కూడా చెబుతాను. ఒక వార్త పత్రిక యొద్దకు నీవు వెళ్ళు. “రేపు మంచి వాతావరణం ఉండబోతుంది అని చెప్పు,” నీవు వేటకు వెళ్ళు. ఆ గడ్డిలో కుందేళ్ళు కాపురం ఉండుట గమనించు. ఆ వార్తా పత్రికలో ఆసక్తి నీవు ఉంచవు.

అక్కడ దూరన్న కొండ ఉత్తర ప్రక్కన నున్న దుంపలు తీసుకున్నా దక్షిణ దిక్కు నున్న దుంపలు తీసుకున్న ఆ పాత ఆడ పందిని నీవు గమనించు. కొండకు దక్షినాన దానికి పడకగా అది తయారు చేసుకుంటున్నది. లోకములో నున్న అందరు వార్తపత్రిక విలేఖరుల కంటే దానికి బాగా తెలుసు. అవును. దానికి ఒక సహజ లక్షణము ఉంటున్నది. వచ్చేటటివంటి చల్లని ఉత్తర గాలిని తప్పించుకొంటానికై దక్షిణ దిక్కునకు అది వస్తున్నది.

17

ఓ, చల్లని గాలి నుండి దాక్కొంటానికై ఒక పందికి బుద్ది విజ్ఞత ఉంటే పరిశుద్దాత్మ కలిగిన నీ సంగతి ఏంటి? హల్లెలూయా. అది నీ సహజ లక్షణము, అవునండి.

దేవుడు వాటికి ఒక సహజ జ్ఞానాన్ని ఇచ్చాడు. వాటికి దేవుడు ఏర్పరచిన మార్గము అదే. అవి దేవుడు ఏర్పరచిన మార్గము వలన అవి జీవిస్తావి.

నీవు ఒక పువ్వును తీసుకో. అది చనిపోయినప్పుడు నేలకు రాలిపోతుంది. దాని అంతానికి కాదు, అది తిరిగి బ్రతుకుతుంది. దేవుడు దానికి ఒక మార్గమును సిద్దపరిచాడు, దానియందు అది నమ్మకము ఉంచుతుంది.

18

దేవుడు ఎల్లప్పుడు కూడా మార్గమును సిద్దపరచును. కొన్ని సార్లు అది సంతోషకరమైన వాటిగుండా వెళ్ళదు. కొన్ని సార్లు అది కష్టాల గుండా వెళ్ళుతుంది. అయితే అది దేవుడు ఏర్పరచిన మార్గము. ఎలగైతేనేమి దేవుడే దానిని చేశాడు.

ఒకసారి దేవుడు ఏర్పరచిన మార్గమున ఆయన మనిషి ఒకడున్నాడు. అతడు అందులో సింహము గుహలోగుండా వెళ్ళవలసి ఉండెను. అయితే అతడు దేవుడు సిద్దపరచిన మార్గముననే వెళ్ళిపోయాడు. దేవుడు అతనిని తిరిగి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా.

19

ఒక ఉదయ వేళ బబులోనులో కొందరు హెబ్రీ బాలురు కూర్చోని యుండుట నేను చూడగలుచుతున్నాను. విగ్రహానికి సాగిలపడుటకు వారు నిరాకరించారు. అవును, అది నిజం. “మేము అది చేయము. మీరు పాడగాలిగిని సంగీతం మీరు కొట్టండి. మీ బూరలు మృదంగాలు వాయించుడి. అయితే మీ విగ్రహానికి మేము సాగిలపడము” అని వారు చెప్పారు. హల్లెలుయా.

లోక చెత్తకు లోబడని కొందరు షద్రక్, మెషాకు, అబేద్నెగోలను కొందరిని నాకు ఇవ్వు. అవునండి. దానిని మనము క్రిందకు నెట్టివేయనవసరము లేదు. పరిశుద్దాత్మ వలన దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. అవునండి.

20

ఇప్పుడు నేను అక్కడ చూడగలుగుచున్నాను. ఒక ఉదయ వేళ ఇప్పుడు మన కెమెరాలను ఒక నిముషం అటు త్రిప్పుదాం. కనిపెట్టి చూద్దాం. ఒక ఉదయం అక్కడ ఉన్న అబ్బాయిలను నేను చూడగలుగుతున్నాను. “ఇప్పుడు చూడండి, రాజు చెప్పాడు, సాగిలపడని ప్రతి ఒక్కరు, అతని ద్వారా మండుచున్న అగ్నిగుండములో మనము త్రోయబడతాము” అని చెప్పారు.

ఒక రాత్రి వారు వెళ్ళిపోయి ప్రార్దించారు. మరుసటి రోజు, బాకానాధ వినపడగా ప్రతిమ ఎదుట వారు సాగిలపడతారు, ఎందుకని? వారు దానికి వారి వీపును చూపారు.

కనుక అతడు వచ్చి అడిగాడు, “అబ్బాయిలు మీరు అది చేసారా?”

“ఆ”

“సరే, అగ్ని గుండమును మేము ముందున్న దాని కంటే ఏడురెట్లు అధికము చేస్తాము.”

21

ఇప్పుడు అది వింతగా లేదా? అక్కడ ఒక పెద్ద బల్ల అగ్ని గుండములోనికి వెళ్ళు ముఖద్వారము ఎదుట ఆ పెద్ద బల్ల పెట్టబడి యున్నది.

ఆ ఉదయం బులోనంతట ఎర్రగా అగ్ని ఒరుగుతున్నట్టుగా ఉన్నది, ఈ దినమున నాగరికత పురుషుని వలె అక్కడ రాజైన నేబుకద్నేజరు కూర్చుని ఉండుట నేను చూస్తున్నాను. అక్కడ ఉన్న అబ్బాయిలలో ఉన్న పరిశుద్దాత్మ భక్తిని మనము కాల్చివేద్దాం అని అంటున్నాడు అతడు.

ఆ, దయ్యము నిన్ను కాల్చివెయ్యదు అని అనుకోవద్దు. అది తప్పక చేయును. జ్ఞప్తి ఉంచుకో, పరిశుద్దత్మే అగ్నియై ఉన్నది.

22

నీవు గమనించు, ఆశిస్తున్నావా. దేవుని యొక్క మార్గము నేరుగా ఆ పెద్ద పలక యెద్దకు నడిపించినది. షద్రక్, మెషాక్, అబేద్నగోలు మరణపు అడుగులు వేయుట నేను చూచుచున్నాను. షద్రక్ ఇలాగు చెప్పటం నేను వింటున్నాను. “అబేద్నగో నీవు ప్రార్ధన చేశావా?”

“ఆ.”

“అలాగైతే సరే.”

“నీవు దేవుని మార్గమున ఉన్నావని నీకు నిశ్చయమేన?”

“అవునండి, దేవుడు ఆయన వాక్యములో మనకు ఇలాగు చెప్పాడు, విగ్రహాలకు సాగిలపడవద్దని. మనము అది చేయము. ఈ అగ్ని గుండములో నుండి మనలను విడిపించుటకు దేవుడు సమర్దుడు. అయితే ఆయన చేయడా, అది ఏమౌతున్నది. మేము సాగిలపడము. దేవుడు ఏర్పరచిన మార్గాన మేము వెళ్తాము.

ఒకరు ఇలా చెప్పడము నేను వింటున్నాను, “ఆయన సిద్దపరచిన మార్గాన నీవు ఉన్నావని నీకు నమ్మకమేనా?”

“ఔను.” హల్లేలూయా.

ఒకరు అన్నారు, “నీకు బదులుగా వారందరూ సరేమో అని నీవు అనుకోవట్లేదా?”

“లేదండి, బైబిలు అలాగని చెబుతున్నది. దానితోనే మనము ఉంటామని. నేరుగా ఆ పెద్ద పలక యొద్దకు వారు వెళ్ళిపోయారు. వేడి అధికమౌతున్నది.... ఆ తీవ్రమైన వేడిమి వారిని..... తెచ్చిన వారిని అది చంపివేసింది.

23

వారు అలా లోపలికి అడుగువేయబోతున్నారు. దేవుడు ఒక మాట చెప్పలేదు. వారు ఇంకా సిద్ధపరచబడిన మార్గాముననే వెళ్తున్నారు. అగ్నిగుండము యొక్క ముఖ ద్వారము యొద్దకు నేరుగా వెళ్ళిపోయారు. మండుచున్న అగ్ని గుండములో అలా కాలు వేయబోయినప్పటికీ .... మీకు తెలుసా ఇప్పుడే నా ఎదుట వింతైన నల్లటి పటమున్నది. దేవుని ఎదుట యదార్ధంగా బ్రతకాలనుకొనే వారు దేవుడు ఏర్పరిచిన మార్గమున వెళ్ళుదురు. మండుటకు సంక్షిద్దముగా ఉన్నది, ఓ ఎటువంటి పటమది......

24

గమనించు, ఎల్లవేళలో ఒకటి ఇక్కడ ఉండబోతున్నది. అక్కడ ఒకటి ఉండబోతున్నది, ఒక్కటే. కొద్దిగా అక్కడ మనము చూద్దాము. ఏమి జరుగబోతుందో చూద్దాము. ఆయన రాజవస్త్రములు ధరించుకొని అక్కడ నిలబడియుండుట నేను చూస్తున్నాను. హల్లెలూయ. మొట్టమొదటిగా నేను చుడగాలిగినది పెద్ద దేవదూత మికాయేలు అను పిలువబడు దేవదూత కుడివైపు నుండి వచ్చుచుండెను. ఒకరు అక్కడ వారికున్నాడు. అది మీకు తెలుసా? ఆయన ప్రక్కకు ఒకరు పరిగెత్తుకొని వచ్చి “అయ్యా!” అని అడిగారు. ఆయన ఈ విధముగా తన పలకములో నుండి ఖడ్గమును తీస్తున్నాడు. “ఈ ఉదయం బాబులోనుని చూశావా” అని అడిగాడు. దేవుడు ఏర్పరచిన మార్గమున అక్కడ ఆ మనుష్యులు వెళ్తున్నారు. ఈ ఉదయం తమ సాక్ష్యాన్ని ముద్రించుటకు ఇష్టపడు జనులు ఉన్నారు. మన ప్రియులు కాల్చబడుటకు సంక్షిద్దముగా ఉన్నారు. ఆయన చెప్పుట నేను వినగలుగుతున్నాను. “నేను అక్కడకు వెళ్లనివ్వుడి. నేను పటమును మారుస్తాను.” ఆయన దానిని చేయునని నమ్ముతున్నాను; నేను నమ్ముతాను.

ఆయన ఇలాగు చెప్పుట నేను వింటున్నాను. “వద్దు, నీవు అది చేయలేవు. గాబ్రియేలు, లేదా .... మిఖాయేలు, నీవు చాల మంచి దూతవు వెళ్ళు, తిరిగి నీ ఖడ్గము నీ ఒరలో ఉంచు. అక్కడ చక్కగా నిలబడు.”

25

ఇక్కడకి మరొక దేవదూత వచ్చాడు. అతడు మాచిపత్రి; అని పిలువబడినవాడు. అతడు నీళ్ళను చేదుగా చేయును. అతడు ఇక్కడకు వచ్చి అడిగాడు, “అయ్యా, అక్కడ చూడు నీళ్ళంతటిని నేను స్వాధీనము చెసుకోగలను. జలప్రళయపు నాశనపు దినాన దాన్ని నా మీదకు త్రిప్పితివి. నేను ప్రపంచపు మొత్తాన్ని తుడిచి పెట్టితిని. అయితే నోవాహును అతని వారిని తప్పా. అతను అడిగాడు, ”నేను అక్కడికి వెళ్ళిపోయి బబులోను దేశాన్ని పటములో లేకుండా కడిగి వేస్తాను, అనుమతి ఇవ్వు, అని అన్నాడు.“

ఆయన ఇలాగు చెప్పుట నేను వింటున్నాను. “మాచిపత్రి, నీవు అది చేయగలవు, అది నిజమే. అయితే నీవు వెళ్ళటానికి అనుమతించను. అది మనుష్యుని అంత పని.” హా, హా.

26

ఓహ్, ఆయనే లేచి నిలబడుటం నేను చూస్తున్నాను. ఆ విధముగా వారిక ఆఖరి అడుగు వేయబోతున్నారు, ఆయనే అక్కడికి చేరుకొని “ఇక్కడికి రండి,” అని చెప్పుట వినగలుగుతున్నాను. అక్కడ పెద్ద ఉరుము- వ్రేలాడుతూ ఉన్నది. ఓహో, అది ఆయనకు లోబడినది.

ఆయన ఇలాగు చెప్పుట వింటున్నాను. “తూర్పు గాలి, ఉత్తరం, పశ్చిమం, దక్షిణపు గాలులు ఇక్కడకు వచ్చి ఈ ఉరుమును మోసుకొని వెళ్ళుడి. నేను మిమ్ములను గుఱ్ఱముల వలె నడిపించనై ఉన్నాను. ఈ ఉదయం ఒక రధం వలె ఈ ఉరుముపై కూర్చొనబోతున్నాను, నాకై నేనే బబులోనుకు వెళ్ళనైయున్నాను.” హల్లెలూయా.

ఆయన అక్కడకు చేరుకొని చిందరబందరగా ఉన్న వెలుగు కాంతులు పట్టుకొని ఆకాశ మధ్యన దానిని విరజిమ్మాడు. అలా వారు అలా ఆఖరి అడుగు దేవుడు ఏర్పరచిన మార్గములో వేయుచున్నప్పుడు లోపల వారు తాకిన సమయానికి ఆయన ప్రాణమగు సముద్రాన్ని దాటిపోయి ఒక కర్జూరపు మట్టను తీసుకొని అక్కడ నిలబడి వారికి ఆయన విసరుచున్నాడు. హల్లెలుయా. మనుష్యుడు దేవుడు సిద్దపరచిన మార్గమున నడచుచున్నప్పుడు ఆయన ఎల్లప్పుడు అక్కడ ఉంటాడు. అవునండి.

27

ఒకప్పుడు ఒక ముసలివాడైన అరుపులు అరచే బోధకుడు పరిశుద్దమైన ముసలి బోధకుడు ఎంతో కాలం క్రితం ఉన్నాడు. అతడు చెప్పాడు, “మీకు తెలుసా, వర్షం రాబోవుతున్నది, తుఫాను రాబోవుతున్నది,” అని అన్నాడు.

చుట్టూ ప్రక్కల ఉండే ప్రజలు చెప్పుకొనుట నేను వింటున్నాను. “విన్నారా, అక్కడ ఆ పాత పరిశుద్ధ గుండ్రాయి అక్కడ చెప్పటం విన్నారా? వర్షం రాబోవుతుంది అని చెప్పాడు. ఎలాగు, భూమిపైన ఎప్పుడు వర్షం లేదే? వర్షం రాబోవుతున్నది. ఎలాగు. ఎక్కడి నుండి ఆ నీరు వస్తున్నది. సరి మనము వెళ్ళిపోయి అక్కడ విజ్ఞానశాస్త్రాన్ని తెచ్చి పైన వర్షం ఉన్నదేమో తెలుసుకుందాము. లేదు, పైన నీళ్ళు లేవు, విషయం ఏమిటి? ఆ ముసలి బోధకుడు సగం తలతో ఉన్నాడు.”

అయితే అలాగునని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు, “నోవాహు, నీ ఇంటివారి రక్షణ కొరకు ప్రజలను రక్షించుట కొరకై నీవొక ఓడను కట్టుము. నోవాహు అది చేయుటకు చాలినంత విజ్ఞత కలిగి ఉన్నాడు. అంతే. అతను వచ్చి ఓడను సిద్దపరిచాడు.

28

ఒక దినాన వారిలో కొందరు ఒక మూలాన వ్యాపారం మూలాన మాట్లాడుకొనటం నేను వినగలుగుచున్నాను. వారిలో కొందరు అన్నారు, “హేయ్, అక్కడ ఆ వర్షపు కథ ఏమిటి, ఆ ఊరక వాగే బోధకుడు వర్షము రాబోవుతున్నదని అతను చెబుతున్నది ఏమిటి? అలాంటిది ఎప్పుడైన మీరు విన్నారా? అతను దేవుడు సిద్దపరచిన మార్గన ఉన్నట్టుగా అనుకొంటున్నాడు.” అతడు అలాగే ఉన్నాడు. ఆమెన్

మొదట ఏమి జరిగినదో తెలుసా, అక్కడ ఉరుములు, మెరుపులు వచ్చినవి. అక్కడ పెద్ద ముసలి తల్లి ఒంటె ఉన్నది, పైకి చూచి “ఒంటె బిడ్డా, అదేంటో నీవు వింటున్నావా? అది ఉరుము. నోవాహు చెప్పినది అదే. మనము ఓడలోనికి వెళ్ళిపోదాము. ఇక్కడ కొండ వెనుకకు అవి వెళ్ళిపోయినవి. ఇక్కడ చిన్న గుఱ్ఱము, తల్లి గుఱ్ఱము వచ్చినవి. మగ గుఱ్ఱము వచ్చినవి, మిగతావన్ని జతలుగా ఒకటి తర్వాత ఒకటి ఓడలోనికి వెళ్ళిపోయినవి. దేవుడు తలుపు మూసాడు. వర్షాన్ని పంపాడు. నోవాహు దేవుడు సిద్దపరచిన మార్గమున ఉన్నాడు.

వారిలో కొందరు మొద్దులు తెచ్చుకొని, నేను దీని మీద తేలాడుతాను అని అన్నారు. అయితే నేను మీతో చెబుతున్నాను, తుఫాను పెద్దదై పోయినప్పటికి ఓడ పైకి వెళ్ళిపోతుంది. హల్లెలుయా. ఎందుకని వారు దేవుడు సిద్దపరచిన మార్గమున ఉన్నారు. దేవుడు వారి కొరకై సిద్దపరచిన మార్గాన నడచువారిని ఆయన ఎల్లప్పుడు దీవించును. ఆయన దూలమును సిద్దపరచలేదు. ఆయన దీనిని సిద్దపరచలేదు, ఓడను సిద్దపరిచాడు.

29

ఈ దినమున, నా సహోదరి సహూదరులారా, స్త్రీ పురుషులకు సిద్దపరచబడిన మార్గము ఒకటి ఉన్నది. ఎవరైతే ఆనాడు కల్వరి సిలువలో అక్కడ చనిపోయారో అట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపములకు విముక్తి కలుగుతున్నది. దేవుని అంగీకారానికిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మనలను అంగీకరించినందున మనలను మనము పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందుకోగలుగుతాము, క్షేమకరమైన భద్రత. హల్లెలుయా.

30

పరిశుద్ద గుండ్రాయిగా పిలువబోతున్నావు. నీవు కూడా అది ప్రారంభించుట కొరకు. సరే. నేను మంచిగానే ఉన్నాను. మంచిదే.

31

దాని యందు విశ్వాసముంచుచున్నారా. అదే దేవుని మార్గము. ఒకే ఒక మార్గము. అది మెథడిస్టు మార్గము కాదు, బాప్టిస్టు మార్గము కాదు. ప్రేస్బిటేరియన్ మార్గాము కాదు, పెంతెకోస్తు మార్గము కాదు. అది క్రీస్తు మార్గము. క్రీస్తే దేవుడు సిద్దపరచిన మార్గము. ఆయన దేవుడు సిద్దపరచిన అర్పణ. ఆయన యెహోవా రాఫా. ఆయన యెహోవా ఈరే. ఆయన యెహోవా మనస్శే.

అబ్రహాము తన కుమారుడను అర్పించినప్పుడు, ఆ స్దలమునకు అతడు యెహోవా ఈరే అని పేరు పెట్టెను. “యెహోవా తనకు తానే అర్పణను చూచుకొనును.” అదే అక్కడ, దేవుని కుమారుడు ఆమెన్. తప్పించుకొను ఒక మార్గాన్ని దేవుడు ఎల్లప్పుడు చేయును. అవునండి.

32

ఒకప్పుడు ఒక వృద్ధ బోధకుడు అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు, పేరు ఎలిషా. అతను అక్కడికి చేరుకొని ఆ దేశము అంతా చూచి అతడు చెప్పాడు, “నేను మీతో చెబుతున్నాను, నేను చూచిన దానినంతటిలో అది బహు హీనమైనది.”

అక్కడ వున్న వ్రుద్దుడైన రాజు వెళ్ళిపోయి ఒక రంగులు పుసుకున్న యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. చాలినంత రంగు ఆమె ముఖానికి ఉన్నది. ముఖానికి రంగులు పూసుకున్న ఒకే ఒక స్త్రీ బైబిలులో ఒకర్తే. దేవుడు ఆమెకు ఏమి చేసాడో తెలుసా? కుక్కలకు పోషణగా ఆమెను దేవుడు చేశాడు. అది ఒకటి మాత్రమే నేను ఎరుగుదును.

ఒక స్త్రీ ఎంతో ఆమె ముఖానికి రంగు పూసుకొని ఉండుట నీవు చూచినప్పుడు, ఆమెను నీవు ఏమని పిలుస్తావో తెలుసా? “హలో, కుమారీ కుక్క మాంసమా.” అదే ఆమె అయ్యి ఉంటున్నది, కుక్క మాంసము వలె. ఓహ్, విను సహోదరుడా, నేను ఆఫ్రికా నుండి తిరిగి వచ్చాను. అన్య వంశము నుండి ఆ చెత్త వచ్చినది. అన్యులు రంగులు పూసుకుంటారు.

ఓ, సహోదరుడా, ఒక పురుషుడు లేక స్త్రీ దేవునితో సరియైనట్లైతే అది వారికి చెప్పనవసరం లేదు, వారికి సిగ్గు, హల్లెలూయ. అవును అది నిజం.

33

“అబ్బాయ్, మొదటిగా ఏమిటో తెలుసా, ఈ ఇశ్రాయేలీయులందరూ అది చేయుటకు ఆమె అవుతున్నది. ఏలీయా చెప్పాడు, ”ప్రభువా ఆకాశములు మూసి వెయ్యి. దానిని గూర్చి ఒకటి చెయ్యి.“

దేవుడు చెప్పాడు, “ఏలీయా నీవు చేయవలసినది చెబుతాను, వెళ్ళిపోయి ఆహాబుతో చెప్పు.”

ఇక్కడ ఒక వ్రుద్దుడైన బోధకుడు నడుచుకొంటూ వస్తున్నాడు. అతని చుట్టూ ఒక పెద్ద గొర్రెచర్మపు ముక్కను చుట్టుకొని, ముఖము చికిలించుకొని, మీసాలు నూలు పురుగులవలె ఉంచుకొని ఉన్నాడు. రాజు ఎదుటకు నడచుకొని వచ్చి, నేను చెప్పే వరకు మంచైనను కురువదు అని చెప్పాడు. హల్లెలూయ, అతడు దేవుడు సిద్ధపరచిన మార్గాన ఉన్నాడు. అవునండి.

“ఏయ్ మూర్ఖుడా, ఇక్కడ నుండి వెళ్ళిపో. సరే, మేము చేస్తున్నది ఎదో మాకు తెలుసు.”

34

వృద్దుడైన ఏలీయా అన్నాడు, “ప్రభువా, నేను ఏమి చెయ్యను? మిగతాది నీవు సమకూర్చు. నేనది చేసాను.

“అక్కడకు కెరీతు వాగు యొద్దకు వెళ్ళి అక్కడ కూర్చో,” అని చెప్పాడు.

“మంచిది చాలా చెడ్డ స్ధలము. అయితే నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కుర్చుంటాను. అక్కడికి వెళ్ళమని నీవు చెప్పావు. నీ మార్గము అక్కడకు నడిపించినట్లైతే నేను అక్కడికి వెళ్తాను.”

వెళ్ళిపోయి కూర్చున్నాడు. ప్రభువా ఇక్కడ నేను ఏమి చెయ్యబోతున్నాను?“

“అక్కడే కూర్చో. అక్కడే ఉండు.”

35

మొదటి విషయము ఏమిటో తెలుసా, అతనికి ఆకలి అవుతున్నది. అతడు అడిగాడు “ప్రభువా, నాకు కొద్దిగా ఆకలి అవుతున్నది అని అడిగాడు.” ఇక్కడికి ఒక కాకోలము వచ్చినది.

వారిలో కొందరు అన్నారు, “ఆ కొండ మీద కూర్చున్న పరిశుద్ధ గుండ్రాయి ముసలి బోధకుని చూడు. అతడు పిచ్చి వాడు కాదా? అతడు, అక్కడ ఎండలో కూర్చొని ఉన్నాడు, చచ్చిపోతాడు. అతడు మూర్ఖుడు.”

మొదటి విషయము ఏమిటో తెలుసా, నీళ్ళు అన్నీ ఎండిపోయినవి, త్రాగటానికి నీళ్ళు లేవు. ఆ దేశములో నీళ్ళు లేవు. అయితే ఏలీయా నీళ్ళు త్రాగాలి అనుకున్నప్పుడల్లా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి, వంగి నీళ్ళు త్రాగుతాడు. తరువాత అతనికి ఆకలి అయినప్పుడు కాకోలము ఆ శాండ్విచ్ రొట్టెను తన నోట కరచుకొని ఇక్కడకు తెచ్చి, “ఇదిగో ఏలీయా అని అనేది.”

“ఎక్కడి నుండి కాకోలము తెచ్చినది అని నీవు అడుగుతావు....? నీవు నమ్ముతున్నావా అని నీ భావమా సహోదరుడా బ్రాన్హాం?” అవునండి. అవునండి. “మూడు సంవత్సరములు ఆరు మాసములు ఏలీయాకు కాకి ఒకటి తీసుకొని వచ్చినదని నీ భావమా?” నేనది నమ్ముతున్నాను. “అది ఎక్కడ నుండి తెచ్చినదని నీవు అడుగుతావు.” నాకు తెలియదు. నాకు తెలిసినది ఒకటే ఒకటి. అది కాకి ఒక చోట నుండి దానిని తీసుకొని వచ్చినది. అది ఏలీయా యొద్దకు దానిని తెచ్చినది. ఏలీయా తిన్నాడు. దాని ద్వారా మూడు సంవత్సరములు ఆరు మాసములు జీవించాడు. అవునది నిజం. నేను అది నమ్ముతున్నాను.

36

నీవు అడుగుతావు “ఏది నిన్ను అంత ఆనందభరితునిగా చేసినది? ఏది నిన్ను నీ చేతులను వణికింపచేసినది అని?” నాకు తెలియదు, నేను ఎరిగినది ఒకటే ఒకటి, కల్వరి దాని కొరకై చెల్లించినది, బైబిలు దానిని బోధించినది, పరిశుద్దాత్మ దానిని తెచ్చినది, అయితే నేనైతే అది పొందుకున్నాను. హల్లెలూయ. అది ఎక్కడ నుండి వచ్చినదో కూడా నాకు తెలియదు. అయితే నేను అది పొందుకున్నాను. హల్లెలుయ. అవునది నిజం. అది ఎక్కడ నుండి వచ్చినదో కూడా నాకు తెలియదు. అయితే నేను అది పొందుకున్నాను హల్లెలూయ. మీరు ఉత్సాహపడిపోవద్దు. దాని అర్ధం “మన దేవునికి స్తోత్రం.” ఆమెన్. దాని అర్ధం “అలాగ అవునుగాక అని అర్ధం.” ఓ, నిజం అది ఉండును. నాకు తెలియదు....

37

అక్కడ కూర్చున్న వారు అంటున్నారు, అతడు పిచ్చివాడు అని. అయ్యో భుజించు సమయము వచ్చినది. ఇక్కడ రంగుజాతి ద్వారపాలకుడు వచ్చాడు ఇక్కడకు. “ఏలీయా, ఇక్కడ నీవు ఉన్నావు.” ఇక్కడ నీ ప్రాతఃకాల ఫలహారం ఉన్నది. అతడు ఈ రాత్రి ఇక్కడున్న సగం మంది కంటే పర్వాలేదు. నేను ఊహిస్తున్నాను రంగుజాతి సేవకులు ఇక్కడ అనేకులు లేరనుకుంటాను. అయితే అతనికి కొందరు రంగుజాతి సేవకులు ఉన్నారు. కొన్ని కాకులు అతని ప్రతి ఆహారము కొరకు ఒకటి తీసుకొని వచ్చుచున్నవి, భుజించుటకు. హల్లెలూయ. మహిమ. దేవునికి ఒక చోట ఒక భోజనశాల ఉన్నది. ఆయన అది అక్కడ పెట్టి అది వడ్డించి దానిని అతనికి పంపించాడు. హల్లెలూయ. అదే దేవుడు ఈ దినమున జీవిస్తున్నాడు. పరిపాలన చేయుచున్నాడు.

ఆయన సిద్దపరచిన ఆయన మార్గమున ఉంటాడు. దేవుడు చెప్పియున్నాడు నీవు అక్కడికి వెళ్ళిపోయి కూర్చోనుము కనుక అతడు అలాగు చేశాడు. అది చేయుట మాత్రమే అతడు ఎరిగి ఉన్నాడు. దాని గూర్చి నీవేమి తలస్తున్నావు. అది నిజమని నీవు నమ్ముతున్నావా? అది అదే. ఆమేన్. అవునండి.

38

ఒక రోజు ఒక చిన్న బాలిక వీధుల గుండా వెళ్ళుతున్నది. ఆమె అన్నది .....“ఓహ్, హల్లెలూయ. హల్లెలూయ.” అప్పుడే ఆమె పరిశుద్దాత్మను పొందుకున్నది.

కనుక ఒక మూలన ఒక వృద్ధుడైన నాస్తికుడు కూర్చొని ఉన్నాడు. అమ్మాయి, “దేని గురుంచి నీవు అంత ఆనందంగా ఉన్నావు” అని అడిగాడు.

ఆమె అన్నది, “యేసు నన్ను రక్షించాడు పరిశుద్దాత్మతో నన్ను నింపాడు.” ఇంకా చెప్పినది, “నేను అందుకే ఆనందంగా ఉన్నాను అని.”

అతడు అన్నాడు, “చూడు నీ చేతిలో ఉన్నది ఏమిటి?”

“నా బైబిలు గ్రంధము” అని ఆమె చెప్పినది.

“నీవది నమ్ముతున్నావా?” అని అడిగాడు

“ఖచ్చితంగా.”

“అదంతా నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు

“అదంతా” అని ఆమె చెప్పినది.

“యోనా గూర్చిన ఆ కధను నీవు నమ్ముతున్నావా”?

“అవును” అని ఆమె చెప్పినది.

అతడు అడిగాడు, “ఆ మనిషిని నిజంగా తిమింగలం మింగినదని నీవు నమ్ముతున్నావా?”

“అవునండి నేను దానిని నమ్ముతున్నాను.”

“విశ్వాసము ద్వారా కాకుండా మరి ఏ విధముగా నీవు అది రుజువు చేయగలవు అని అడిగాడు?”

ఆమె అన్నది, “సరే, నేను పరలోకానికి వెళ్ళిన తరువాత అక్కడ నేను సహోదరుడు యోనాను అడుగుతాను అని అన్నదామె.”

ఈ నాస్తికుడు ఆమెను అడిగాడు, సహోదరుడు యోనా పరలోకములో లేనట్లైతే ఏంటి?“

“అలాగైతే నీవే అతనిని అడగవలసి ఉంటున్నది.” హల్లెలూయ. అతని కొరకు ఒకే ఒక స్ధలము విడచి ఉంటున్నది, అది నరకము.

దేవుడు ఆయన మార్గమున ఆయన విడచినట్లైతే, నీవు నరకానికి వెళ్ళవలసి ఉంటున్నది. నీకు తప్పదు. అది మాత్రమే ఇంకొక మార్గము. కాబట్టి నీవు ఎదో ఒక దానిలో ఉండవలసి ఉంటున్నది ఆమేన్. మంచిది.

39

అతను అక్కడ కూర్చొని ఉండుట నేను చూస్తున్నాను. తింటానికి కాకోలములు ఒకటి తెచ్చుచున్నవి.

అక్కడ వెనుకకు వెళ్ళిపోయాడు. ఒకానొక కొండ యొద్దకు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, “ఇప్పుడు వాగు ఎండిపోయినది. అక్కడ ఒక వెధవరాలి ఇంటికి నీవు వెళ్ళాలని నేను కోరుతున్నాను.” బోధకుడు వెళ్ళుటకు ఎటువంటి స్ధలమో. వెళ్ళమని దేవుడే చెప్పాడు, అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. అతడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆమె ఇశ్రాయేలీయులరాలు కూడా కాదు. కాదు. ఆమె కాదు. ఆ కొండ దగ్గరకు అతను వెళ్ళిపోయాడు.

40

అతడు ఆ కొండ యొద్దకు వెళ్ళినప్పటికి ఒక వెధవరాలగు వృద్ధ స్త్రీ కట్టెను చీల్చుకుంటూ పెరటిలో నిలబడి ఉన్నది. అడిగాడు, “లోపలికి వెళ్ళి తినుటకు నాకు ఒకటి తీసుకొని రా, కొంచెం నీరు తెమ్ము.”

ఆమె చెప్పినది, “యెహోవా జీవము తోడు నీవు నిరంతరము జీవించుదువు గాక. నా కుమారునికి ఒక చిన్న అప్పము చేసుకొనటానికి కొంచెం పిండి మాత్రమే ఉన్నది. ఈ రొట్టెను చేసుకొంటాని కొరకై రెండు పుల్లలు తీసుకొని వెళ్తున్నాను. నేను నా కుమారుడు తిని చనిపోతాము.”

అడిగాడు, “వెళ్ళిపోయి మొదట నాకు కొంచెం నీళ్ళు తీసుకొని రా, రొట్టె చేసి దానిని నా యొద్దకు తెమ్ము.” హల్లెలూయ.

ఆమె ఏమి చేయబోతున్నది? దేవుడు ఏర్పాటు చేసిన మార్గమొకటున్నది. “మొదట ఆయన నీతిని అంతటిని దేవుని రాజ్యమును వేదకుడి.”

41

“సహోదరుడా బిల్, నా తల్లి ఇంట్లో నుండి వెళ్ళిపొయినది, నా భర్త నాతో ఉండుటలేదు.”

మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి (హల్లెలూయ); మిగతావన్ని కలిసి ఉంటవి. అవునది నిజం.

“సహోదరుడా బిల్, నేను ఎలా అది చేయగలను?”

వెళ్ళిపోయి అది చెయ్యి, యేసు చెప్పాడు, “నన్ను వెంబడించుము.” అంతే. ఏక దృష్టి కలిగియుండు. సరే.

42

మొదటిగా ఏమి జరిగిందో తెలుసా ఆమె లోపలికి వెళ్ళిపోయి ఈ రెండు పుల్లలు తీసుకొని వాటిని చీల్చినది. పురాతన కాలపు ఇండియా వారు ఏ విధముగా పుల్లలను చీల్చుతారో మీకు తెలుసా? అది ఒక సిలువ అనుకోవలసి ఉంటున్నది. సిలువలో, మధ్యలో వారు మంట పెడతారు. అక్కడే మంట మండుతుంది. రొట్టెల పెనము పొయ్యి. కాల్చిన రొట్టెను బయటకు తెచ్చి బోధకునికి దానిని ఇచ్చింది. అతడు అక్కడ నిలబడి భుజించాడు. అన్నాడు, “నీవు తిరిగి వెళ్ళిపోయి నీకు నీ కుమారునికి ఒకటి తెచ్చుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు భూమి పైకి వర్షము పంపువరకు తొట్టిలోని పిండి తరిగిపోదు, బుడ్డి ఎండిపోదు.” హల్లెలూయ.

ఏంటి? ఆమె మొదట దేవుని రాజ్యమును వెదకినది, కారణం ఆమె దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున నడచినది. దేవుడు ఆమెకు బహుమతి ఇచ్చాడు లేక ఫలము అనుగ్రహించాడు. మీరది నమ్ముతున్నారా, అవునండి.

43

ఒకప్పుడు తన సహోదరుడుని పోగొట్టుకున్న ఒక స్త్రీ ఉన్నది. అతని పేరు లాజరు. అతడు మంచి అబ్బాయి. అతని వొదులుకొనుటకు ఆమెకు ఇష్టము లేదు. అతడు చనిపోయాడు. ఆమె తన పాదిరిగారి కొరకు కబురు చేసినది లేక సువార్తకుని కొరకై కబురు చేసినది. ఆయన యేసు. ఆమె తన సంఘము నుండి బయటకు వచ్చినది. ఆమె కలిగినదంతా ఆమె వొదులుకున్నది. వచ్చి ప్రార్ధన చేయుట కొరకై యేసుకు ఆమె కబురు పంపినది. ఆయన వెళ్ళిపోయాడు. మరలా పంపినది. ఆయన అలాగే వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాడు, “నాకు చూపించు వరకు నేను ఏది చెయ్యను.” లాజరు చనిపోబోతున్నాడని తండ్రి ముందుగానే చూపించాడు.

ఆయన వచ్చాడు, కొద్ది కాలమైన తరువాత, మూడు నాలుగు దినాలు తరువాత ఆయన వచ్చాడు. ఆయన చెప్పాడు, లాజరు చనిపోయాడు, నేను ఇక్కడ ఉండనందుకు మీ నిమిత్తమై నేను ఆనందిస్తున్నాను, అయితే నేను వెళ్ళి అతని మేల్కొల్పుదును.

కనుక యేసు వచ్చుచున్నాడని ఆమె విని, ఆయనను కలసుకొన వెళ్ళినది.

44

అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, వెళ్ళి యేసుని కలయుట. అవునది నిజం. ఎల్లప్పుడు కూడా. నీ గృహములో నాకు దుఃఖమున్నప్పుడు వెళ్ళి యేసుని కలువు. నీ ఇంటిలో వ్యాధి ఉన్నప్పుడు వెళ్ళి యేసుని కలువు. నీ ఇంటిలో గుండె జబ్బు ఉన్నప్పుడు వెళ్ళి యేసుని కలువు. హల్లెలూయ. నీకు ఏదైనా అవసరము ఉన్నట్లైతే వెళ్ళి యేసుని కలువు. వెళ్ళి ఆయనను కలసుకో. ప్రతీ దానికి ఆయనే సహకారి. ఆయన కార్యసాఫల్యత కాదు, ఆయన యొద్ద బాగు చేయునది వున్నది. ఆమేన్. తరువాత ఆమె ఆయన కలుసుకొన వెళ్ళిపోయినది, ఆమె ఆయన పాదముల పైన పడినది.

45

ఆమె ఒకసారి ఒక కధ చదివినది. పాత కాలములో బైబిలు గ్రంధములో ఉన్న ఒక షునేమియురాలు ఉన్నది. ఎలిషా అను పేరుగల ఒక బోధకుని గూర్చి ఆమె ఎంతో జాగ్రత్త కలిగి యుండెను. కనుక అక్కడ ఆమె ఇంటి ప్రక్కన చిన్న గది ఒకటి కట్టించినది. అక్కడ ఒక పడక, దీపము, పీట పెట్టినది. బోధకునికి ఆమె చేసిన ఈ మంచి అంతటిని ఎలిషా వచ్చి చూచాడు. ఆమె దశమభాగాలు చెల్లించుట ప్రతిది. ఔనా. కాబట్టి అతడు అడిగాడు, “వెళ్ళిపోయి అడుగు, మనము ఏమి చేయగలమో, నేను వెళ్ళి రాజుతో మాట్లాడవలెనో లేక సైన్యాధిపతితో మాట్లాడవలెనో.”

ఆమె అన్నది, “నేను నా ప్రజల మద్య ఉంటున్నాను, ప్రతిది సబబే” అని చెప్పినది.

“సరే నేను ఆమెకు ఏమి చేయ్యాలో వెళ్ళి అడుగు,” అని అన్నాడు.

గేహజీ చెప్పాడు, “ఆమె గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.”

“వెళ్ళి ఆమెతో చెప్పు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీదటికి ఈ సమయానికి జీవము ప్రకారముగా ఆమె కుమారుని కనును.” ఆమె అలా కన్నది.

46

బిడ్డ షుమారు పదకొండు పన్నెండు సంవత్సరముల వయస్కుడై ఉంటాడు. ఒక రోజు షుమారు మధ్యాహ్నం వేళ తన తండ్రితో కలసి పొలములో ఉన్నాడు. అతనికి వడ దెబ్బ తగిలినదని నేను అనుకుంటున్నాను. “నా తల. నా తల.” అని అతడు కేకలు పెడతున్నాడు. పనివారిలో ఒకనితో బిడ్డను పంపాడు అతడు. తల్లి వడిలో అతని పెట్టారు. మధ్యాహ్ననికి అతను చనిపోయాడు.

ఎలాంటి సరియైన స్ధలము. అతని ఆమె తీసుకొని ప్రవక్త ఎక్కడ పడుకుంటాడో ఆ బోధకుని పడకపైన అతని పరుండబెట్టినది. వెళ్ళటానికి మంచి సమయమది. నేరుగా బోధకుని పడకపైనే.

ఆమె చెప్పినది “నా కొరకై గాడిదకు గంత కట్టి ముందుకు సాగు. నేను నీకు ఆఙ్ఞ చ్చు వరకు నీవు నిలుపు చేయవద్దు.”

47

నేను దానిని ఇష్టపడతున్నాను. ముందుకు సాగి వెళ్ళు. నిలుపు చేయవద్దు. ముందుకు సాగుతూ ఉండు. అవును.

దాని ఇబ్బంది ఎదనగా మనము నిలుపు చేసి అనేక మందితో మాట్లాడుతున్నాము. అనేకములైన సాంఘిక సంక్షేమ కార్యక్రమముల కొరకై మనము నిలుపు చేయుచున్నాము. మనకు అనేకములైన కుట్లు-కుట్లు యంత్రాలున్నవి. “కుట్లు-కుట్లు సమూహమును నిర్మాణము చేయుట కుట్టు కుట్టటం తెలుసా. ఫలానా కుమారిని గూర్చి మాట్లాడటం.” అది ఎలా ఉంటున్నదో తెలుసా. పలు విధములైన ఇవన్నీ కూడా ఆలయములోనికి వస్తాయి, ఈ కాలువ కడిగినదంతా నీవు త్రోసివేయవలసి ఉన్నది. దేవుడు పంపిన పాత కాలపు ఉజ్జీవాన్ని పొందుకోవలసి ఉంటుంన్నది. ప్రార్ధించు, తిరిగి వచ్చే వరకు ప్రార్ధించు. పరలోకము దిగివచ్చి పరిశుద్దాత్మ బలమైన గాలివలె దిగివచ్చి ప్రజలను స్ధలాన్ని నింపును. ఆమేన్. అది మనకు కావలసి ఉన్నది.

ఆమె చెప్పినది, “నిలుపు చేయవద్దు.”

48

ఆమె భర్త అన్నాడు, “ఆ మనుష్యుడు కర్మేలులో లేడే.” అన్నాడు, “ఈ రోజు అమావాస్య కాదు సబ్బాతు కాదు.”

ఆమె చెప్పినది, “అంతా క్షేమమే” అని. ప్రవక్త యొద్దకు చేరాలని ఆమె కోరినది. కాబట్టి ఆమె నేరుగా వెళ్ళిపోయినది.

ఏలీషా బయటికి చూచి అడిగాడు, “ఆ షునేమియురాలు ఇక్కడకు వచ్చినది. ఎదో ఒక పొరపాటు ఆమెకు జరిగినది, అది ఎదో నాకు తెలియదు.”

ఆమె పరుగు తీసినది. అతడు అడిగాడు, “నీ భర్త, నీ బిడ్డా, నీవు అంతా క్షేమమా?”

“అంతా క్షేమమే” అని ఆమె చెప్పినది. నేను అది ఇష్టపడుతున్నాను. దేవుడు సిద్దపరచిన మార్గమును ఆమె స్వీకరించినది.

అన్నది, “ఇప్పుడు అంతా క్షేమమే.” ఆ తరువాత ఆమె దానిని బయలుపరచుటకు మొదలు పెట్టినది.

అతడు ఏలీయాతో అన్నాడు, కాదు గెహజీతో చెప్పాడు, “వెళ్ళి నా కర్ర తీసుకొని పైన పెట్టు....” “వెళ్ళి నా కర్ర తీసుకొని బిడ్డ పైన పెట్టు.”

ఆమె చెప్పినది, “నేను నిన్ను విడువను.” కనుక ప్రవక్త మరలా వచ్చి ప్రార్దించాడు, పైకి క్రిందకి గదిలో నడిచాడు, చనిపోయిన బిడ్డ మీద అతడు తన శరీరాన్ని పెట్టాడు, పరుండాడు, ప్రాణం వచ్చినది.

49

మార్త అను స్త్రీ, దేవుడు ఆయన ప్రవక్తలో యున్నాడని షునేమియురాలు గ్రహించినదని మార్త ఎరిగియుండెను. మరి దేవుడు ఆయన ప్రవక్తలో ఉన్నట్లైతే దేవుడు తప్పక ఆయన కుమారునిలో ఉండును. కనుక ఆమె యేసు యొద్దకు చేరుకున్నట్లైతే ఆమెకు నివారణ దొరుకుతుంది. కాబట్టి ఆమె పరుగెత్తి ఆయన ఎదుట సాగిలపడినది. ఆమె చెప్పినది, “ప్రభువా, ఒకవేళ ......” అదే ఆయనయై యుండెను. “ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్లైతే నా సహోదరుడు చావక యుండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు అది చేయును.” ఓహ్, నేను దానిని ఇష్టపడుతున్నాను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు అది చేయును.

50

అది ఈ రాత్రిలో మంచిది. “సహోదరుడా బ్రాన్హాం, నేను పాపిని,” అని చెప్తావు. ఎప్పుడైనను నీవు దేవుడిని ఏమి అడిగినను దేవుడు అది చేయును. “నేను పాపిని, నా మీద జాలి చూపుము,” ఆయన అది చేయును. నీవు వ్యాధిగ్రస్తుడవైతే, “ప్రభువా నా మీద జాలి చూపుము.” ఆయన ఇప్పుడు చేయును. నీవు చెప్తావు, “వైద్యుడు విడచిపెట్టాడు; అయితే ”ఇప్పుడైనను, ప్రభువా.“ ఐదు సంవత్సరాల నుండి నేను నడచుట లేదు; ప్రభువా ఇప్పుడైనను. నాకు ఏమి వినపడుట లేదు, నాకు ఏమి తెలియదు. ప్రభువా ఇప్పుడైనను. ఒక్క మాటయైనను నేను మాట్లాడను, ఇప్పుడు అది చెప్పలేను నీకు ప్రభువా, ఇప్పుడైనను. నీవు దేవుని ఏమి అడిగినను ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి నీ ఒప్పుకోలు నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయ.

ఎప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను ఆయన అది చేయును.

51

ఆయన తనను కొంచెం సవరించుకొని ఈలాగున చెప్పెను, “నీ సహోదరుడు తప్పక తిరిగి లేచును అని అన్నాడు.”

ఆమె అన్నది, అవును ప్రభువా, కడవరి దినమున సాధారణ పునరుద్ధానమున అతడు తిరిగి లేచును.

ఆయన ఈలాగున సెలవిచ్చెను , “నేను పురుద్దానమును మరియు జీవమునై ఉన్నాను.” ఎంత గొప్ప మాట.

బైబిలు చెప్పుచున్నది, “మనము అతని చూచి అపేక్షించునట్లుగా అతనియందు సురూపమైనను సొగసైనను లేదు, కొంచెము బలహీనముగా ఉన్నాడు. కాని ఎప్పుడైతే తనను తాను సవరించుకొని ఈలాగు సెలవిచ్చేనో, అక్కడ ఆయన దేవుడుగా ఉన్నాడు.

52

ఆయన చెప్పాడు, “నీ సహోదరుడు తిరిగి లేచునని”, చెప్పాడు, “నేనే పునరుద్ధానమును జేవమునై యున్నాను”, దేవుడు చెప్పాడు. “నా యందు విస్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నడు చనిపోడు. దీనిని నమ్ముతున్నావా?”

ఆమె చెప్పినది, “అవును ప్రభువా. నీవు లోకమునకు రావలిసిన దేవుని కుమారుడవు, నేను నమ్ముచున్నాను.

“అతనిని ఎక్కడ పెట్టారు,” అని అడిగాడు. ఇక్కడ ఆయన సమాధి యొద్దకు బయలుదేరాడు. యేసు ఏడ్చాడు.

53

కొద్ది కాలము క్రితము ఒక స్త్రీ నాతో అన్నది, చాల మంచి స్త్రీ, యేసు యొక్క దైవత్వాన్ని నమ్మని ఒక క్రిష్టియన్ సైన్సుకు సంబంధించినది, క్రైస్తవ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినది. ఆయన ప్రవక్త అని ఆమె నమ్మినది. ఆయన మంచి మనిషి అని ఆమె నమ్మినది. అయితే ఆయన కన్య వలన జన్మించెనని కాదు. వారు కన్యను త్రుణీకరిస్తారు.

54

అది మాత్రమే కాదు, ఒక సర్వే ప్రకారము సంయుక్త రాష్ట్రమందలి ప్రొటస్టంట్ బోధకులు ఎనభై ఐదు శాతం కన్య జన్మము కల్పితం అని అంటున్నారని కొలతల విచారణ చూపిస్తున్నది. అవును. నేనది సులభముగా చేయగలను. నీవు జీవించేదాన్ని బట్టి నేను సులభముగా తలంచగలను. అది ఖచ్చితముగా సత్యము. అది కల్పన అని నమ్ముట. తిరిగి యేసు కనిపిస్తూ తిరిగి వచ్చెనని అనేక శాతము నమ్మరు. మనకు ఉజ్జీవము లేదంటే ఆశ్చర్యమేమి కాదు.

సహోదరుడా, ఇక్కడ విను. ఈ రోజు ఎంతో ఎక్కువ మనకు ఉజ్జీవము ఉన్నదని నీవు వింటున్నావు. మనకు ఉజ్జీవము లేదు.

55

ఇక్కడే కొంచెం కాలము క్రితము దీన్ని గూర్చి ఎంతో చెప్పుకొన్న మరొక మనుష్యుని నేను వెంబడించాను. అది చెప్పారు, “అతను ఒక నగరానికి వెళ్ళాడు. ఐదు వేల మంది మార్పు చెందారు.” దాని వెనుకనే మనము వెళ్ళిపోయాము. నేను కాదు ఒక గుంపు పరిచారకులు. పత్రములు తీసుకొని వారి వెనుకనే వెంబడిపోయారు. ముప్పై రోజుల సమయంలో రక్షించబడిన వారు ముప్పై మంది కూడా కనబడలేదు. నేను ఏమనుకున్నానో తెలుసా అది మారుమనస్సుకి బదులు మార్పు చెందుటకు బదులు తప్పు మోపడం అవుతున్నది. ఒక మనుష్యుడు దేవుని ఆత్మ మూలముగా జన్మించినప్పుడు ......

మనకి ఈ దినాన కావలసినవి సుధీర్ఘమైన కూటములు కాదు కాని పాత కాలపు దేవుడు పంపిన పరిశుద్దాత్మ ఉజ్జీవము కావలసియున్నది. ఒక పాతకాలపు మబ్బులు కమ్మిన పాపమును చంపివేయు రక్తముచే కడగబడిన భక్తి కావలసియున్నది. ఆమేన్. ఆ చక్రాల పరికరాలు తీసుకొని నీవు పశ్చాతాపము పొందునట్లుగా చేయునవి. అవునది నిజం.

56

అమె అన్నది. తరువాత ఆమె అడిగినది, “సహోదరుడా బ్రాన్హాం, ఇటు చూడు, ఆయన మనుష్యుడు కాక మరొకటి కాదని నేను నీకు నిరూపణ చేస్తాను.”

“నీవది చెయ్యి, ఆయన దేవుడు కాదని నీవు రుజువు చేయగలిగితే అలాగయితే నేను అది అంగీరిస్తాను.”

ఆమె అన్నది, “లేదు, ఆయన దైవ సంబంధమైనవాడు కాదు, ఆయన కేవలము మనుష్యుడు.”

నేను బైబిలు ద్వారా రుజువు చేస్తాను ఆయన కేవలము మనుష్యుడని.

“నీవు బైబిలు ద్వారా రుజువు చేసినట్లైతే అలాగైతే నేను దానిని అంగీకరిస్తాను.

ఆమె అన్నది, “నీవు సంక్షిద్దమేన.”

“నేను సంక్షిద్దమే.” అని నేను అన్నాను.

57

ఆమె చెప్పినది, ఆయన వెళ్ళినప్పుడు, పరిశుద్ద యోహాను 11లో ఆయన లాజారు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన ఏడ్చాడు.

“అందువలన ఏంటి?” అని నేను అడిగాను.

ఆమె అడిగినది, “ఏంటి, ఆయన మనిషి తప్పా మరొకటి కాదని అది రుజువు అవుతున్నది; ఆయన ఏడ్చాడు.”

నేను చెప్పాను, “అమ్మా ఇటు చూడు, ఆయన నిజమే మానవుడు, అయితే మానవుని కంటే ఆయన మిన్నైనవాడు, ఆయన దేవుడు-మనుష్యుడు.” క్రీస్తులో దేవుడుండేను, లోకమును తనతో సమాధానపరచుకుంటానికి. అవునండి తండ్రి యొక్క చిత్తమును చేయటకు ఆయన వచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున ఆయన నడిచాడు. ఆయన ఎన్నడు ఎడముకుగాని కుడికిగాని చూడలేదు. దేవుడు ఏది చేయమని చెప్పాడో అదే చేసాడు. ఆయన దేవుడు సిద్దపరచిన మార్గము.

58

లాజారు యొద్దకు వెళ్ళుచున్న రహదారి యందు ఆయన ఏడ్చాడు. ఆయన ఏడ్చుచున్నప్పుడు ఆయన మానవుడు. అయితే ఎక్కడైతే నాలుగు దినాల క్రితము ఒక మనుష్యుడు చనిపోయాడో, ఆ సమాధి ప్రక్కన ఆయన నిలబడియున్నాడు. ప్రాకుతున్న పురుగులు అతిని శరీరములో నుండి లోపలికి బయటికి వచ్చుచున్నవి. చుట్టూ కంపు కొడుతున్నది. “లాజారు, బయటికి రా,” అని ఆయన చెప్పగానే, నాలుగు దినాల క్రితం చనిపోయిన మనుష్యుడు లేచి నిలబడ్డాడు తిరిగి బ్రతికాడు, ఆయన మనుష్యుని కంటే మిన్నైనవాడు. హల్లెలూయ. అవునండి ఆయన ఎడ్చుచున్న మానవుడు, అయితే పునరుద్డానములో ఆయన దేవుడై యుండెను.

59

ఆ రాత్రి పర్వతము దిగి వస్తున్నప్పుడు ఆయన మనుష్యుడు. ఆకలితో ఉన్నాడు, చుట్టూ చెట్లవైపు చూసాడు. తింటానికి ఒక దాని కొరకై ఆయన ఆకలిగొన్నప్పుడు ఆయన మానవుడు.

అయితే ఆయన అయిదు రొట్టెలు రెండు చిన్న చేప ముక్కలు తీసుకొని ఐదు వేల మందికి ఆహారము పెట్టినప్పుడు ఆయన మనుష్యుని కంటే మిన్నైనవాడు. అది శరీరరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయ.

60

ఆ రాత్రి ఆయన పడవలో పడుకున్నప్పుడు ఆయన మానవుడు. ఆయన వస్త్రములో నుండి ప్రభావము బయలు వెళ్ళినప్పుడు ఆయనెంతో బలహీనపడిపోయెను. బలమైన హోరెత్తుతున్న సముద్రం ఆ రాత్రి ఆయనను ముంచేస్తామని పదివెల దయ్యములు శపదము చేసినవి. ఆ చిన్న పడవ అటు ఇటు ఊగులాడుతున్నది. ఆ గొప్ప సముదము పైన చిన్న సీసా బిరడావలె, ఆయన అక్కడ పండుకొని నిద్రిస్తున్నప్పుడు ఆయన మనుష్యుడే అని నేను ఎరుగుదును అయితే మేము నశించిపోచున్నాము, “మమ్ము గూర్చి జాగ్రత్త తీసుకోవా?” అని వారు అడిగారు. పడవ మొనన ఆయన తన పాదము త్రొక్కి, సమాధానమగునుగాక, నిమ్మళముగా ఉండు అని అన్నాడు. అక్కడ నిశ్శబ్దమైపోయినది, అది ఆయన మానవుడు కంటే మిన్నయైనవాడు. హల్లెలూయ. ఆయన దేవుడు, హల్లెలూయ. అవును, ఆయన ఆయనయై యుండెను. అవును నిజం, ఆయన ఆయనయై ఉన్నాడు.

61

కల్వరీలో ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు, ఏనాడు ఇవ్వనటువంటి ఘనమైన కానుక ఆయనకు యిచ్చినప్పుడు ఆయన మానవుడైయుండెను. వారు ఆయనతో అన్నారు, “అతడు ఇతరులను రక్షించెను, అతడు తనకు తాను రక్షించుకొనలేడు.” ఓ, ఎటువంటి ఆశ్చర్యకరమైన కానుక అది లేక అభినందనము అది, వారు ఆయనకు చెల్లించినది. ఇతడు ఇతరులను రక్షించితే తనకు తాను రక్షించుకోకపోతే ఇతరులను రక్షించలేడు కాబట్టి ఆయన ఇతరులను రక్షించుకొనుటకై ఆయన తనకు తానే అర్పించుకొనెను. కనికరము కొరకు ఆయన మొర్రపెట్టినప్పుడు, “నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడచితివి,” అని ఆయన అన్నప్పుడు, ఆయన మానవుడు, ఆయన మానవునివలె జన్మించెను. ఔను.

అయితే ఆయన ఈస్టర్ ఉదయాన్న ఆయన లేచి, ఆయన దేవుడని రుజువు చేశాడు.

జీవించుచూ, ఆయన నన్ను ప్రేమించెను; మృతి నొంది, ఆయన నన్ను రక్షించెను;

పాతిపెట్టబడి ఆయన నా పాపములను బహు దూరమునకు మోసికొనపోయెను;

తిరిగి లేచి, ఆయన నన్ను ఉచితముగా నీతిమంతునిగా చేసెను.

ఒకానొక దినమున రాబోవుతున్నాడు, ఎంతటి మహిమకరమైన దినమో.

హల్లేలూయ. నేను ఆయనను ప్రేమిస్తాను. మీరు? దేవుడు ఏర్పరచిన మార్గమున నడవుడి.

62

ఆయన ఆరాధన చేయుట కొరకై ఒకసారి ఆయన జన్మను కొందరు జ్ఞానులు వెళ్ళుట నేను చూడగల్గుచున్నాను. వారు అన్నింటిని సిద్ధము చేసుకొనుట నేను చూస్తున్నాను. వారు వారి ఒంటెలు సిద్దపరచుకుంటున్నారు.

జిమ్ జోన్స్ మిగతా వారందరూ, జాన్ డోయి సంక్షిద్దమవుట నేను చూడగలుగుతున్నాను. ఈ అట్ట బల్లలు ఇక్కడ ఈ విధముగా సంక్షిద్దము చేసుకొని ప్రతిది కూడా అక్కడ పెట్టుకొని యేసుని వారు ఆరాధించటానికి వెళ్ళుట నేను చూస్తున్నాను. వారు అక్కడికి చేరుకున్నప్పటికి, ఆ ముసలి ఒంటెలు నడువలేకుండునట్లుగా వారు తెలుసుకున్నారు.

63

ఖచ్చితముగా ఆ విధముగానే ఉన్నది ఈ రోజు సంఘము. దాంతో నీవు ఎంతో లోకాన్ని మూటగట్టుకున్నావు. అది నిన్ను వెనుకకు త్రిప్పినది. అవును. వారందరూ కూడా ఆ విధముగా సాగి వెళ్ళుట నేను చూస్తున్నాను. అక్కడ దూరాన నున్న పర్వత ప్రక్కకు వారు చేరుకున్నారు. వారు అసలు లోపల గుండా వెళ్ళలేక ఉన్నారు. ఎందుకనగా ద్వారము ఇరుకుగా ఉన్నది. దారి సంకుచితముగా ఉన్నది. దాని కనుగొను వారు కొందరే. అవునండి.

ఒక ముసలివాడు కట్టు కట్టుకొనటం నేను చూస్తున్నాను. అతడు దానిని తేలిక చేసుకొంటున్నాడు. “ఎందుకంటే పరలోకానికి వెళ్ళుటకు నేను కట్టుకుంటున్నాను.”

సహూదరుడా, నేను పరలోకానికి వెళ్ళటానికి మూట కట్టుకొనుట లేదు. నేను పరలోకానికి వెళ్ళుటకు మూట ఊడతీసుకుంటున్నాను. హల్లేలూయ. ఆ తరువాత రాకడ; ప్రతిది కూడా సులువుగా కత్తిరించు. బైబిలు తెలుపుతున్నది, “మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడచిపెట్టి ఓపికతో ఈ పందెపు రంగములో పరుగెత్తునట్లుగా.”

64

ఆ వృద్దుడు వెళ్ళు చోట నేను చూస్తున్నాను. అతని భార్య చుట్టుకొని వచ్చి, “జాన్, ఏంటి విషయము? నీవేక్కడికి వెళ్ళుచున్నావు” అబ్బాయ్? అని అడుగుట నేను చూడగల్గుచున్నాను.

“నేను ప్రభువును ఆరధించుటకు వెల్తున్నాను.”

“నీవు వెళ్తున్నావని నీకు ఎలా తెలుసు?”

“సరే నేను వెళ్తున్నాను.”

“నీకు చిట్టచివరికి దిక్సూచి కుడా లేదే. చివరకు నీకు బోధకుని అనుమతి పట్టా లేదే. ఎలాగు? లోకములో ఉన్నది నీ యొద్ద లేదే. వారు నిన్ను అంగీకరిస్తారా? నీవు ప్రభువును ఆరాధించటానికి వెళ్తూన్నావా?”

“అవును.”

నీ దిక్సూచి తీసుకో.“

“వద్దు, అది అవసరం లేదు.”

“అది వద్దా? అక్కడకు నీవు ఎలాగు చేరుకుంటావు?”

65

అతడు వేకువ నక్షత్రాన్ని చూపిస్తూ, “నేను దేవుడు ఏర్పరచిన మార్గమున వెళ్ళుచున్నాను” అని అతడు చెప్పుట నేను వినగల్గుతున్నాను.“ ఆమెన్. దేవుడు ఏర్పరచిన నక్షత్రం జ్ఞానులను నడిపించుటకు, వారికి దిక్సూచి అవసరం లేదు. దేవుడు సిద్దపరచిన మార్గము, నక్షత్రం వారికి కావలసియున్నది. మహిమ.

నక్షత్రం ద్వారా జ్ఞానులను క్రీస్తు నొద్దకు నడిపించిన ఆ దేవుడే నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించుటకు పరిశుద్దాత్మ రూపమున ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. క్రొత్త జన్మలోనికి పరిశుద్దాత్మ బాప్తిస్మములోనికి అనగా దేవుడు ఏర్పరచిన మార్గములోనికి నడిపించుటకు ఇక్కడ ఉన్నాడు. “ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితెనే కాని చివరికి అతడు దేవుని రాజ్యమును చూడలేడు.” పురుషులు స్త్రీలు, దానిని మీరు పొందుకున్నారా?

66

నా సమయం పైన ఉన్నది అందులోనికి వెల్లునట్లుగా భావిస్తున్నాను. నా చేతులు నా ఫాంటు జేబులో పెట్టుకొని ఒక ముసలివాడైన సస్సఫ్రాస్ భోదకుని వలె భోదించువానిగా ఉంటాను. ఎందుకని నేనది ప్రేమిస్తున్నాను. అబ్బాయ్, ఐస్క్రీంలు కావాలనుకుంటున్నావా? అయితే నీకు కొద్దిగా పంది మాంసము, చిక్కుడి కాయలు నీ ప్రక్కన తగిలించుకోవలసి ఉన్నది. మనకు పోషణగా ఉండుటకు, నీకు మెలకువ ఇచ్చుటకు అది మనకు కావలసి ఉన్నది. నీవు అది నమ్మవా? నిజం.

67

దేవుడు ఏర్పరచిన మార్గం ఉన్నది. ఈ రాత్రి నీవు అందులో ఉన్నావా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా? నా మంచి బాప్టిస్టు స్నేహితులైన మీరు, నేను బాప్టిస్టునై యుంటిని.... ఇక్కడ ఉన్న నా పాస్టర్ గారు బాప్టిస్టు అయితే నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అపోస్తులుల కార్యముల 19 చెబుతున్నది, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా, “మీరు నమ్మినప్పుడు అని కాదు అయితే మీరు నమ్మినప్పటినుండి.” అవునండి. మీరు పొందనట్లైతే ఈ రాత్రి అది మీకే. దేవునికి సిద్దపరచబడిన మార్గమున్నది.

68

సహూదరుడా, సహూదరీ, నీ స్వంత మార్గమున వెళ్ళుటకు ప్రయత్నము చేయవద్దు. అంజూరపు ఆకుల ద్వారా వెళ్ళవద్దు. దుంగ మీద తేలాడుటకు వెళ్ళిపోవద్దు. జలప్రళయపు నాశనమందు వారు చేయుటకు ప్రయత్నించునట్లుగా చేయవద్దు. ఆదాము పెట్టుకున్నట్లుగా పైన అంజూరపు ఆకులు పెట్టుకోవద్దు. దేవుని సంఘాన్ని హింసించుటకు నెబుకద్నేజరు వెళ్ళిన మార్గమున వెళ్ళుటకు ప్రయత్నము చేయవద్దు. ఈ మిగతా మార్గాలలలో వెళ్ళవద్దు. ఈ పై రూపములకు, దారులకు వెళ్ళిపోవద్దు. ఎన్నో మనము ఉదహరించగలము.

పరిసయ్యిలు చేసినట్లుగా అందులోకి వెళ్ళవద్దు, ఎంతో భక్తిగలవాడు, అన్నాడు, “చూడు, మనము ఉన్నత స్ధలములో ఉన్నాము. ఏదైనా జరుగుతున్నట్లైతే అందును గూర్చి మనకు అంతా తెలుసును.”

దేవుడు అక్కడికి వచ్చాడు. బెత్లేహేములో పశువుల తొట్టెలో శిశువు జన్మించాడు. ఆయన లోకమునకు వచ్చాడు; లోకములో నుండి దేశ ద్రోహపు శిక్ష; అందును గూర్చి వారికి ఏమి తెలియదు. నిజం. దేవుడు సిద్ధపరచిన మార్గము.

69

ఒకప్పుడు ఒక స్త్రీ ఉన్నది. ఆమెకున్న ధనమంతా కర్చు చేసినది. హల్లేలూయ. వైద్యులు ఆమెకు ఏ మేలు చేయలేకపోయిరి. ఒకరోజు ఆమె మూర్చిల్లబోతున్నది. ఆమెకు అనేకనేక సంవత్సరముల నుండి రక్త స్రావ రోగాము కలిగి ఉన్నది. ఒక రోజు పడవలో ఒక గొప్ప ధ్వని విన్నది. ఆమె పైకి చూచినది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము అక్కడకు వస్తున్నది. ఓహ్, మై.

ఉన్నత స్ధలములో ఉన్న ఉత్తమమైన బాప్టిస్టు వారి యొద్దకు ఆమె వెళ్ళుట నేను చూచుచున్నాను. “అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించిపోయినవి.” వారి పాదాల మధ్య గుండా ఆమె దూరిపోయినది. వారు జరుగవలసియుండెను.

ఆమె బ్రిఘం యంగ్ యొద్దకు అతని భార్య యొద్దకు ఆమె అక్కడికి వచ్చుట చూచుచున్నాను. ఆమె నేరుగా అందులో నుండి వెళ్ళిపోయినది. ఆమె ఏమని చెప్పినది?

70

వారు చెప్పుట నేను వింటున్నాను, “మార్తా, అక్కడే ఆయుండేనుగు ఎక్కడికి వెళ్తున్నావు, వైద్యుడు నీకు ఇక ఏ మంచి చేయలేడు, తరువాత నీవు ఎక్కడికి వెళ్తావు? రక్త స్రావముతో నీవు అక్కడ ఉండుట నేను చూస్తున్నాను.

ఆమె చెప్పినది, “నేను దేవుడు ఏర్పరచిన మార్గమున వెళ్తున్నాను.”

“అది ఎక్కడ ఉన్నది? అక్కడ ఉన్నది వేషధారి అని నీకు అర్ధము కాదా?”

“అదే అక్కడ ఉన్నది. నేను దాని ద్వారానే వెళ్తున్నాను.”

ఆమె అటు ఇటు పిండబడినది, ఇక్కడ ఉన్న అతనిని చేరే వరకు. అతడు ఈ విధమైన సంఘానికి చెందినవాడు. అది ఇది వారందరు ఆమెను వెనుకకు నెట్టుట ప్రయత్నము చేసారు. అయితే యేసు నొద్దకు తన మార్గమును సిద్దపరచుకున్నది.

వారిలో కొందరు అన్నారు, “సహోదరి ఒక్క నిముషము ఆగు, నీవు మాంసము తిన్నట్లైతే నీవు అది చేయలేవు.” ఆమె దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున వెళ్ళుచుండేను.

“మీరు సర్పములను ఎత్తి పట్టుకొనక పోయినట్లైతే, మీరు అది చేయలేరు.” ఆమె దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున వెళ్ళిపోయినది. యెసును ఆమె చేరుకోగోరినది. అవును. అది నిజం.

71

పితరుడైన దావీదుని గూర్చి నేను అలోచన చేస్తున్నాను. హల్లేలూయ. అవునండి. అతడు చెప్పాడు, “యోహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అది బండలోని తేనె వంటి రుచిగా ఉంటుంది.” ఒక పురాతన చిన్న వివరణ నేను ఇచ్చుచుంటిని. ఒక పాత జోలె సంచి ఈ ప్రక్కన పెట్టుకుంటారు. తేనె పెట్టుకునే చిన్న సంచి. పాత కాలపు గొర్రెల కాపరులు చేస్తూ ఉంటారు. గొర్రె జబ్బు పడిన వెంటనే ఆ జోలె సంచిలో నుండి కొంచెం తేనె తీసుకొని అది సున్నపు రాయిపై పెడతారు. జబ్బు పడిన గొర్రెను పిలచి జబ్బుగా నున్న గొర్రె నాకునట్లుగా చేస్తారు. బండ మీద నుండి అవి నాకుటకు వెళ్ళగానే అతడు వెళ్ళిపోయి కొంత సున్నపు రాయిని అతడు నాకుతాడు. తేనె నాకుతునప్పుడు ఏమి జరుగునో తెలుసా? వ్యాధితో ఉన్న గొర్రెలు ఆరోగ్యము పొందుకుంటవి.

72

సహూదరుడా ఇటు చూడు, ఈ రాత్రి దానితో ఉన్నపెద్ద జోలె నాయొద్ద ఉన్నది. నేను దానిని బాప్టిస్టు సంఘము మీద మెతోడిస్టు సంఘము మీద ప్రెస్బిటేరియన్ సంఘము మీద లేక పెంతేకోస్తు సంఘము మీద పెట్టుటలేదు. అది ఎక్కడికి సంబంధించినదో అట్టి యేసుక్రీస్తు మీద దానిని పెట్టుచున్నాను. వ్యాధితో ఉన్న గొర్రెలైన మీరు నాకబోతున్నారు. దానిలో నుండి తప్పక ఒకటి పొందుకోబోతున్నారు. అవునండి. ఆయనను నాకండి. ఆ పురాతన వృద్దుడు పాతిపెట్టబడినట్లుగా ఆయనను నాకండ; మీరు పొందుకుంటారు.

నీ సంఘము చెప్పిన దానికి ఎటువంటి జాగ్రత్తనివ్వద్దు. నీవివ్వ వద్దు, క్రీస్తుకే సానుకూలత నివ్వు. ఆయనను వెంబడించు. ఎందుకనగా ఆయనే సంఘము. నేను చూస్తున్నాను, దేవుడు సిద్దపరచిన మార్గమున వెళ్ళు. మెతడిస్టు దేవుడు సిద్దపరచిన మార్గమని ఆయన చెప్పలేదు లేక బాప్టిస్టు దేవుడు సిద్దపరచిన మార్గమని చెప్పలేదు లేక ఏ సంఘమని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పాడు, “నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని.''

''నేను ఆయనలో ఉన్నానని ఎలాగు తెలియును?'' ఒక్క ఆత్మ వలన. ఒక్క శరీరములోనికి మనమందరము బాప్తిస్మము పొందితిమి. 1 కొరింధీయులకు 12. ఆ శరీరము యొక్క అవయవములుగా అయిపోతిమి. అవును అది నిజం.

73

ఆయన రాజ్యములో ఆయన కలిగియున్న ప్రతిది మనకు సంబంధించినది. ఆయన నిండారుగా చెక్కులతో ఉన్న ఆ పెద్ద పుస్తకమును ఆయన తీసుకొని క్రింద ఆయన పేరును సంతకము చేసి “కుమారుడా ఇక్కడే నీవి. ఏదైన నీకు అవసరము ఉన్నాదా, వెళ్ళి అది తీసుకో” అని చెప్పును, ఆమేన్.

దానిని పూర్తి చేయుటకు భయపడవద్దు. అది పూర్తి చేసి, చేత్తో తీసుకొని “ప్రభువా, నీకు కృతజ్ఞతలు అని చెప్పు.” హాల్లెలుయా. అది జరుగుతుంది.

మీరు ఏమి కావాలని కోరుదురో (మార్కు 11:24), మీరు ప్రార్ధించునప్పుడు మీరు పొందియుందురని నమ్ముడి, మీరది పొందుకొందురు.“

74

చెక్కు మీద సంతకము పెట్టి “ప్రభువా నాకు స్వస్థత కావలెను” అని చెప్పుడి. చింపి వేసి “ప్రభువా, అక్కడ నీవే యున్నావు, స్వస్థత కొరకు యేసు నామమున నేను అడుగుచున్నాను అని చెప్పుడి. ”ప్రభువా కృతజ్ఞతలు“ అని చెప్పుడి. స్వస్థతకై నమ్మి నడచి వెళ్ళిపొండి. ఏలీ యొద్దకు ఆ ఆహారమును ఆ కాకుల ద్వారా పంపినట్లుగా అది నేరుగా వచ్చేస్తోంది. అది అక్కడే ఉన్నది.

“నా ఆత్మకు రక్షణ అవసరం,” అని చెప్పుడి. మీరేమి చేయుదురు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైనవారలారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పబడినది, ప్రభువా అది నా కొరకని చెప్పబడినది అని వ్రాసి చెప్పండి. “నాకు రక్షణ అవసరమైయున్నది. ప్రభువా నా చేతికి ఇవ్వుడి” అని చెక్కును పూర్తి చెయ్.

“అది అక్కడే ఉన్నది.” ప్రభువా, ధన్యవాదాలు మీకు. దానితో వెళ్ళిపొండి.

పరిశుద్దాత్మ అవసరమా? అవునండి. పైనుండి మీరు శక్తిని పొందువరకు యెరుషలేములో పట్టణములో కనిపెట్టి యుండుడి. ఈ పరిశుద్దాత్మ మీ మీదకి వచ్చిన తరువాత మీరు యెరుషలేము, యూదయ, సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. మీరది నమ్ముతున్నారా? చెక్కును పూర్తి చేసి పైకి పంపుడి. సంతకము చేసి ఏమి జరుగుతుందో చూడుడి. దేవుడు అది ఇచ్చును. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. చెక్కు పుస్తకమును ఆయన ఏర్పాటు చేశాడు. ముందుకు వెళ్ళిపోయి దానిని పూర్తి చేయుడి. దేవుడు దానిని వాగ్ధానము చేశాడు. మీరు అది నమ్ముతున్నారా? తప్పకుండా. దేవునికి ఎల్లప్పుడు ఏర్పాటు చేసిన మార్గమున్నది.

75

ఒక దినాన యాయీరు అను పేరుగల ఒకతను ఉన్నాడు. ఓ, ఒక విధంగా అతడు కొందరు అవిశ్వాసుల గుంపుతో తనను కలుసుకోపోయాడు ఎంతో మంది భోదకుల వలె. ఈ దినాన ఆ విధంగా కలసిపోయారు. బైబిలు తెలియజేస్తున్నది, “అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి.” మంచిది మొదటి విషయము ఏంటో.....

ఆశ్చర్యము ఎవరది చెప్పారు? నీవే?

76

బైబిలు చెబుతున్నది నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు జరుగును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగుదురు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. నీవు దానిని భోధించు. ఈ దినమున సంఘములో సగం నిన్ను తలుపు బయటికి తన్నివేస్తారు. అవునది నిజం. అవును. దేవుడు ఏర్పరచిన మార్గము తెలియదు. అయితే అది ఆయన చెప్పినదే. అది యేసు చెప్పినది. నీవు దానిని నమ్ముతున్నావా? అవునండి.

ఆలాగున ఆయన చెప్పినట్లయితే “ఆమెన్, నేను అది నమ్ముతున్నాను.” అది సత్యమని నేను తలస్తున్నాను. ఆయన ఏమి చేయమని చెప్పాడో ఆయన మార్గమందు నేను నడుస్తాను. దానిని అద్బుత కార్యములు సూచనలు వెంబడించుట ద్వారా ఆయన దానిని నిర్దారిస్తాడు. అవునది నిజం.

కాబట్టి అదే విషయం చేస్తూ అందులో నడవుడి. ఇచ్చయించు ప్రతివానిని లోపలికి రానిమ్ము. రండి దేవుడు నిన్ను పిలిచాడు. నీవు రావలసి వున్నది. కాబట్టి అందులోనికి నేరుగా రమ్ము. ఇక ఆలస్యము చేయవద్దు. ఈ రాత్రి దానిని తీసుకో.

77

నేను ఈ చిన్న పెద్ద మనిషిని చూస్తున్నాను. అతనికతనే కలసిపోయాడు. అతడు యేసుని ప్రేమించాడు, అయితే అతడు ఒక విధంగా ఉన్నాడు. అతడు తన ఘనతను పోగొట్టుకుంటానికి ఇష్టపడలేదు. తెలుసా, ఆశీర్వాదములు. కనుక వారు బయటికి వచ్చారు. వారు చేసారు.

కాబట్టి ప్రభువు చెప్పాడు, “అక్కడ ఉన్న ఆ చిన్న పెద్ద మనుష్యుడను చూడుడి. అతనిని నేను నిత్యజీవము కొరకు ఏర్పరచుకున్నాను. అతడు అక్కడ అవిశ్వాసుల గుంపుతో ఉండిపోయాడు. కనుక నేను అతనిని స్థిరపరుస్తాను.” ఆయన అతని కుమార్తె రోగి అగుట అనుమతించాడు.

అతడు చెప్పాడు, “డాక్టర్ డోయ్ని పిలుస్తాను.”

డాక్టర్ డోయి ఆమెను చూసాడు. “యాయీరు నాడి తగ్గిపోతున్నది,” అని చెప్పాడు. మేము ఏమి చెయ్యాలో అంతా మేము చెప్పాము, ఏది అది చేస్తే బాగుండునని, అన్నీ మందులన్నీ ఆమెకు ఇచ్చాడు. ఆమె నేరుగా చనిపోయినది.

తరువాత అతను అన్నాడు, “దేవుడు ఏదైనా ఏర్పరచిన మార్గము ఉందేమో అని ఆశ్చర్యపడుతున్నాను.”

78

దైవిక స్వస్థతను అతడు ఎంతగానో విమర్శించిన ఆ మనిషి లేదా అతని గూర్చి విన్నాడు. అతడు అన్నాడు, “అవును ఓ-ఓ.”

“యాయీరు, అతడు వేషదారి అని నీవు అనుకోవటంలేదా?”

“లేదు,” పరిశుద్దాత్మ చెప్పాడు, “అతడు వేషదారి కాదు. నీవు ఆయనను నమ్ము.”

“సరే, అలాగేమోనని అనుకుంటున్నానే.”

79

చూస్తున్నారా, ఈ మద్యస్తు భోదకుల మార్గము అలాగుంటున్ననది. (అవును), భయపడుట. ఓ, నీ ఇష్టమనే ఎముకను నీలో నుండి తీసి దేవుడు నీలో వెన్నెముకను పెట్టును.

పెద్ద రాబిన్సన్ సాక్ష్యాన్ని నేను ఇష్టపడతాను. అతడు చెప్పాడు, “ప్రభువ, రంపపు దూలమంత వెన్నెముకను నాకు దయచేయుము. నా ఆత్మ పై అంచులో ఎక్కువ ధ్వని పెట్టుము. నా ఒక్క పన్ను మిగిలినంత వరకు దయ్యముతో నన్ను పోరాడనిమ్ము. తరువాత నేను చనిపోయేవరకు వారిని అతికించుము.” నేను అది ఇష్టపడుతున్నాను. అవునది నిజం. అతడు చెప్పాడు, “నాకు ఒక ముసలి కూన్ కుక్క ఉన్నది. ముసలిదై అది చనిపోయినది. ఒక పన్ను కూడా మిగిలిపోయేంత వరకు అది కూను తెచ్చినది. తరువాత ఆ కూనను అతికించి కూత కూచినది. నేను అది ఇష్టపడుతున్నాను, అవును హల్లెలుయా.

80

నీవు చెబుతావు, “సహోదరుడా బ్రాన్హాం, నాకు ఎక్కువ విద్య లేదు. నేను ఎంతో చిన్నవాడను. భోదకులు నన్ను త్రిప్పి వేస్తారు అని అంటావు.”

తిరిగి కధ యొద్దకు తిరిగి వెళ్దాము. “అది కుక్క యొక్క కొలతలు కాదు, పోరాటము ఉండేది. అది కుక్కలో ఉన్నా పోరాటపు కొలతపై అది ఆధారపడి ఉంటుంది.” అదే ఈ రోజు ఉన్నది. నిలబడు. అక్కడ కుక్కతో నిన్ను పోల్చుట లేదు అయితే అక్కడ నిలబడు.

81

అతడు బయటకు వెళ్ళిపోతూ ఆ వ్రుద్దుడైన ప్రధాని ఒకనాడు ఇలాగు చెప్పాడు.

అడిగాడు,“ ప్రధాని ఎలాగు ఉన్నావు.” సహోదరుడా నీకు చెప్పాలనుకుంటున్నాను.

చెప్పాడు, “నాలో రెండు కుక్కలున్నవి. ఒకటి నల్లనిది, ఒకటి తెల్లనిది. నల్లనిది నన్ను తప్పు చేయమని కోరుతుంది, తెల్లనిది మంచి చేయమని కోరుతుంది.” ఇంకా చెప్పాడు అవి ఎల్లప్పుడు పోట్లాడుకుంటూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటవి.

నేను అడిగాను, “ప్రధాని ఏది గెలుస్తుంది.”

అతడు అన్నాడు, “ప్రధాని దేనికి ఎక్కువగా ఆహారము పెడితే అది గెలుస్తుంది.”

82

అది ఖచ్చితముగా నిజము కూడా. అవునండి, సరే. మంచిది సహోదరుడా. నేను నీకు చెబుతున్నాను ఈ రాత్రికి ప్రపంచానికి అవసరమైనది ఏదనగా పాతదైన కదిలించే మంచివి కావాలి.

83

యాయీరు చెప్పాడు, “ఇప్పుడు ఒక నిముషము ఆగు అని.” కుమార్తె బాగా జబ్బు పడిపోయినది. ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ, ఆమె యొద్దకు చేరుట, యేసు యొద్దకు వెళ్ళుట, యేసు కొరకు వారు బయలుదేరారు.

అతను అక్కడికి వచ్చుట నేను చూస్తున్నాను. రక్తస్రావ స్త్రీ అప్పుడే ఆమె స్వస్థత పొందుకున్నది. ఇతడు ఇక్కడికి వస్తున్నాడు. అతడు అన్నాడు, “నా కుమార్తె పడకలో ఉన్నది.... యాజకుడు ఏమి చెప్పినా నాకు లెక్క లేదు. ఎవరు ఏమి చెప్పినా నాకు లెక్క లేదు. నీవు వచ్చి ఆమెపై చేతులు పెట్టు. ఆమె స్వస్థత కొరకు దేవుడు సిద్దపరచిన మార్గము నీవే అని నేను నమ్ముతున్నాను. నీవు వస్తావా, ఆమె పై చేయి పెట్టు, అమె స్వస్థత పొందుకుంటున్నది.

“నేను వస్తాను.”

ఆయన బయలుదేరాడు, వెళుతూ ఉన్నాడు. మొదట ఏమి జరిగినదో తెలుసా, వారిలో ఇంటిలో నుండి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, “యాయీరు భోధకుని శ్రమ పెట్టవద్దు. ఎందుకంటే ఆమె ఎప్పుడో చనిపోయినది.” ఓ, అయ్యో, అతని చిన్న గుండె అతనిలో అలా ఎగరటం నేను చూస్తున్నాను.

ఆ ప్రేమగల జాలిగల యేసు కన్నులు అతనిపై దొరలిపోయి, “భయపడకుము, దేవుని మహిమను నీవు చూతువు, అని నేను చెప్పలేదా” అని చెప్పుట నేను చూడగలుగుతున్నాను. ఆయనే దేవుడు ఏర్పాటు చేసిన మార్గము.

84

ఒక దినాన బర్తిమయి అను పేరుగల ఒక వృద్ధుడు గవిని యొద్ద కూర్చోని బిక్షమడుగుతున్నాడు. అది అక్టోబర్ మాసము. చల్లని వాతావరణము. వీధిలో నుండి వచ్చుచున్న ఒక శబ్దాన్ని అతడు విన్నాడు. “ఏంటది.”

“ఎందుకు,” అతడు అన్నాడు, “అది నజరేయుడైన యేసు.”

అతడు తన పై బట్ట తీసివేసాడు. అది ఎన్నడు దానిని క్రింద పెట్టలేదు, పైకెత్త లేదు, తెలుసా, గ్రుడ్డిగా దాని యొద్దకు తన దారిని తెలుసుకునేవాడు. అతని పై వస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు. ఏర్పరచబడిన మార్గము దేవుని ఎదుట ఉన్నది. దాని వెంట ఇతడు వెళ్ళాడు. అతడు ఇక్కడకు పరుగులు తీసాడు.

కొందరు అన్నారు, “కూర్చో. క్రింద కూర్చో. నీతో బుద్ధిహీనముగా గడపదానికి ఆయనకు సమయము లేదు అని అన్నారు.”

అతడు ఇంకా బిగ్గరగా కేకలు పెట్టాడు, “యేసు, దావీదు కుమారుడా నాయందు కనికరము చూపు. నాయందు కనికరము చూపు.” ఆయనను నెట్టుకొని పోతున్నాడు. “నా యందు కనికరము చూపుము. నా కండ్లకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును నీవని నాకు తెలుసును. ఓ ప్రభువా నాయందు కనికరము చూపుము.” అవునది నిజం.

85

ఒక రోజు గ్రుడ్డి బర్తిమయి ఒక చిన్న కధ ఒకటి నేను చదివాను. వారు చెప్పారు సంవత్సములు తరబడిగా అతడు గ్రుడ్డి వాడిగా అతడు ఉన్నాడు. తానెన్నడూ చూడని చిన్న కుమార్తె తనకు ఉన్నది. అతడు అలవాటుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు. వీధిలో కూర్చోని ఉండేవాడు. అతనికి ఒక చిన్న గొర్రెపిల్ల కుడా ఉన్నది. ఈ దినమున కుక్కలు ఎలాగు చేస్తావో గొర్రెపిల్లలు గ్రుడ్డి వారిని నడిపించేవి. కుక్కలు గ్రుడ్డి వారిని నడిపించును. గ్రుడ్డి వారిని నడిపించుటకు వారు గొర్రెపిల్లకు తర్ఫీదునిస్తారు.

అతనికి రెండు చిన్న గువ్వలున్నవి. అవి ఆ విధముగా గంతులు వేస్తావి. యెరుషలేముకు లేక పట్టణములోనికు వెళ్ళు యాత్రికులను ఆకర్షించుట కొరకై, అతని గిన్నెలో వారు నాణ్యములు వేస్తారు. అతడు గ్రుడ్డివాడు.

ఒక రాత్రి అతని భార్య ఎంతో జబ్బుపడిపోయినది. కనుక అతడు ప్రభువు యొద్దకు వెళ్ళాడు. అతడు అన్నాడు, “ప్రభువా, నాకు ఏమి లేదు. నేను పేదవాడను. నేను గ్రుడ్డివాడను. నీకు ఇచ్చుటకు నాకు ఏమి లేదు. అయితే ప్రభువా, నేను నిన్ను నమ్మాను. నీవు నాపై జాలిపడి నా దీనురాలైన భార్యను బ్రతికించితే రేపు నీకు అర్పణగా నా గువ్వలు అర్పిస్తాను. ఆ రాత్రి ప్రభు అతని భార్యను స్వస్థపరిచాడు.

మరుసటి రోజు అతడు మరలిపోయి యాజకుని ద్వారా అర్పణ కొరకై రెండు గువ్వలను అర్పించాడు. ఇక అతనికి గొర్రెపిల్ల తప్పా మరి ఏమి లేదు.

86

కొంత కాలం తరువాతనే అతని చిన్నబాలిక జబ్బు పడిపోయినది. వైద్యులు ఏమి చెయ్యలేకపోయారు. అతడు అన్నాడు, “ప్రభువా నాకు మిగిలియున్నది ఒకటే ఒకటి, అది గొర్రెపిల్ల. అయితే నేను ఎన్నడు చూడని నా చిన్న కుమార్తెను బాగుపరచినట్లయితే అప్పుడు అర్పణకై నా గొర్రెపిల్లను నీకు ఇస్తాను.” అప్పుడు ప్రభువు అతని చిన్న బిడ్డను స్వస్థపరిచాడు.

ఆ తరువాత కొన్ని దినాలకు అతను వీధిలోనుండి వెళ్తూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల అతనిని నడిపించుచున్నది. ప్రధాన యాజకుడైన కైఫా వచ్చి “గ్రుడ్డి బర్తిమయా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు.”

అతడు చెప్పాడు, “ఓ ప్రధాన యజకా నేను ఆలయములోనికి వెళ్తున్నాను. గొర్రెపిల్ల నన్ను ఆలయములోకి నడిపిస్తున్నది. అర్పణకై గొర్రె పిల్లను అర్పించుట కొరకై.”

“ఓ,” “నీవు అలాగు చేయకూడదు.”

“ఔనా,” బర్తిమయి అన్నాడు.

“ఇదిగో గొర్రెపిల్ల యొక్క ఖరీదు నేను ఇస్తాను. నీవు వెళ్ళిపోయి ఒకటి కొను.”

ఇతను అన్నాడు, ఒక గొర్రెపిల్లను ఇస్తాను అని నేను దేవునికి వాగ్ధానము చేయలేదు. ఈ గొర్రెపిల్లను ఇస్తానని నేను ఆయనకు వాగ్ధానము చేసాను అని చెప్పాడు.“

అతడు అన్నాడు, గ్రుడ్డి బర్తిమయా, నీవు ఆ గొర్రెపిల్లను తీసుకొనకూడదు. ఆ గొర్రెపిల్ల నీ కళ్ళు, ఆ గొర్రెపిల్ల లేకుండా నీవు చూడలేవు. ఆ గొర్రెపిల్ల నిన్ను నడిపించును, గ్రుడ్డి బర్తిమయా. అవి నీ కళ్ళు, ఆ గొర్రెపిల్లను నీవు అర్పణ చేయకూడదు.

అన్నాడు, ఆ ముసలివాడు కొద్దిగా వణుకుతూ, “ఓ ప్రధాన యాజకుడా, గ్రుడ్డి బర్తిమయి కళ్ళకు దేవుడు గొర్రెపిల్లను ఏర్పాటు చేయును. దేవుడు అతని హృదయమును దీవించును. అది వచ్చుచుండుట అతను విన్నప్పుడు దేవుడు ఒక గొర్రెపిల్లను సిద్దపరచును. ఆయన అక్కడే ఉన్నాడు.

87

ఈ రాత్రిలో దేవుడు ఏర్పరచిన గొర్రెపిల్ల ఆయనే. మన యొక్క నేత్రములకు మీ ఆత్మ నేత్రములకు ఆయన ఏర్పరచబడిన గొర్రెపిల్ల ఆయనే. మీ యొక్క ఆత్మలకు సిద్దపరచబడిన గొర్రెపిల్ల ఆయన. నరకమును తప్పించుకుంటానికి సిద్దపరచబడిన గొర్రెపిల్ల ఆయనే. పరలోకములో మీ మహిమకు సిద్దపరచబడిన గొర్రెపిల్ల ఆయనే.

మేము ప్రార్ధిస్తూ ఉండగా మీరు ఆయనను స్వీకరిస్తారా, మనము తలలు వంచియుండగానే.

88

ఓ ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్తా, నిత్య జీవానికి కర్తా, ప్రతి మంచి ఈవికి ప్రదాత, ఈ ప్రజలపైకి నీ ఆశీర్వాదాలను పంపుము. ఈ దీనమైన చిన్న విషయాలు ప్రభువా వారికి సిద్దపరచిన వివరణలు అయితే సిద్దపరచబడిన మార్గము నీకున్నదని నాకు తెలియును. “నోవాహు దినములలో ఈలాగుండును, మనుష్య కుమారుని రాకడయందు అలాగుండునని” నీవు చెప్పియుంటివి. ఒక సిద్దపాటు సమయం, ఉగ్రతను తప్పించుకుంటానికి ఎవరైతే ఆశించారో వారి కొరకై సిద్దపరచబడు ఒక స్ధలము. దేవా, ఇప్పుడే నేను ప్రార్ధిస్తున్నాను, గ్రుడ్డి వాని కన్నుల కొరకు సిద్దపరచబడిన ఆ దేవుని గొర్రెపిల్ల లేక రక్తస్రావ రోగికై సిద్దపరచబడిన లేక రక్తస్రావ నిలుపు చేసిన ఆ గొర్రెపిల్ల, చనిపోయిన లాజారు కొరకు ఆ గొర్రెపిల్ల సిద్దపరచబడెను.... దేవా, కనికరము చూపుము.

దానిని గూర్చి నేను తలుస్తున్నప్పుడు ఒక దినమున నా గ్రుడ్డి కన్నులకు అదే గొర్రెపిల్ల సిద్దపరచబడెను. మూడు సంవత్సరముల క్రితము మాయో సహోదరులు బాగుపడటానికి నాకు ఎటువంటి నిరీక్షణ లేదని చెప్పారు. దేవుడు గొర్రెపిల్లను సిద్దపరచెను.

89

గ్రీన్ మిల్ యొద్ద అక్కడ నీవు నీ దూతను పంపి, “వెళ్ళిపోయి ఇది చేయ్” అని చెప్పియుంటివి. నాస్తికులు అవిశ్వాసులు ఉన్న ఈ గంభీరమైన ప్రపంచం నేనది ఎలాగు చేయగలను? అయితే దేవుడు గొర్రెపిల్లను సిద్దపరచెను.

దేవా, నా యొక్క పేద చిన్న సంఘము, దాని వైపు నేను చూస్తున్నాను... మరియు సముద్రపు ఆవల వేల వేల మైళ్ళ దూరాన ఉన్న హిమపు ముద్దలు, గడ్డ కట్టిన మైదానములు నేను తలస్తున్నాను. ఒంటరి స్దలాలలో అనేకసార్లు నేను అక్కడ కూర్చోని ప్రార్ధిస్తుంటిని. వారు ఇక్కడకు వచ్చి నా కరస్పర్శ చేసిన సమయాలను గూర్చి ఆలోచన చేస్తుంటిని. పాతబడిన రంపపు పొట్టు నేలపైపరచబడి యుండగా, గాలి వచ్చినప్పుడు కిటికీలు కొట్టుకొనిపోయినవి....

90

నా స్వంత ప్రియమైన భార్యను ఇక్కడే సిలువ నొద్ద పరుండబెట్టి ఆమె భూస్ధాపన గూర్చి ప్రసంగించినది నేను తలస్తునాను. నా చిన్న బిడ్డ ఆమె హస్తాలలో పరుండబెట్టుట జ్ఞాపకము చేసుకుంటున్నాను.

కొన్ని గంటల క్రితము నీవు పరిశుద్దాత్మతో నింపిన దీనుడైన చిన్న బిల్లీ పౌలును నేను జ్ఞాపకము చెసుకుంటున్నాను. అక్కడ ఆ ఉదయం దాని పైన ఒక ఈస్టర్ పువ్వును పెట్టుటకు ఆమె సమాధి యొద్దకు అతడు వచ్చి ఏడ్చుట నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఆ చిన్నవాని చుట్టూ నా హస్తాలు చుట్టి, “దేవుడు సిద్దపరచిన గొర్రెపిల్ల ఒక పాపపరిహార్దపు బలి అని చెప్పియుంటిని. ఓ ఒకానొక రోజు ఆ చిన్న సమాధి తెరువబడుతున్నది. తల్లి బయటికి వచ్చును అలాగే చిన్న చెల్లి కూడా అని చెప్పితిని. సిద్దపరచిన గొర్రెపిల్ల దేవునికి కలదు.”

91

ఈ ఒకానొక దినాలలో, దేవా నా ఆఖరి ప్రసంగం ప్రసంగించబడును. బహుశా గది బయట నన్ను ఉంచుతారు. నా ముంచేతుల నాడి పైకి కొట్టుకొనుట నేను భావిస్తాను. నా గదిలోనికి చల్లని మరణపు కెరటాలు వచ్చుట కిటికీ తెరుచుకున్న రీతిగా తెరలు కొట్టుకున్న రేతిగా నేను భావిస్తాను. ప్రభువా జీవిత నావ బలవంతముగా నెట్టబడుతుంది. ఆఖరి నా స్వారి నేను చేస్తాను. పట్టాను నేను పరుస్తాను. మూత మూసుకుంటున్నది, పట్టా నన్ను కప్పుతుంది.

మరణపుచాయ లోయలలో నేను నడువవలసి ఉంటున్నది. నా దారి తెరచుకొనుటకు నేను యోర్దాను యొద్దకు రావలసియుంటుంన్నది. యోర్దానా, “ప్రక్కకు జరుగు” దాటిపోవలసియున్నది అని కేకపెడతాను. ప్రభువా, అప్పుడు జీవిత నావను నా ప్రక్కకు నెట్టు, నన్ను చేర్చుకో. ప్రభువా చేయవా, అప్పుడు నన్ను స్వీకరించు. ప్రభువా చేయవా? నన్ను మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ సమయమందు స్వీకరించు. ప్రభువా చేయవా? అది అనుగ్రహించు. అప్పటినుండి అనేకులమైన మేము దాటుతాము. తిరిగి పరదైసుకు వెళతాము. తరువాత నిరంతరము ఉంటాము.

తండ్రీ, ఈ రాత్రి నేనెరిగిన వారు స్త్రీగాని పురుషుడుగాని ఇక్కడ ఉన్నట్లయితే, ఆ విలువనంతా ఎరిగినవారు ఉన్నట్లయితే, తిరిగి జన్మించిన వారు ఉండినట్లైతే ఎన్నడు దేవుడు ఏర్పరచిన మార్గమును ఎరిగినవారు ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామమున మేము ప్రార్ధిస్తుండగా వారు ఇక్కడే కనుగొనుదురు గాక.

92

తలలు వంచియుండగనే పాపియైన నా స్నేహితుడా, నీ హృదయాన్ని దేవుడు దీవించును. అనేకమంది బయటివారు లోపటివారు..... పరిశుద్దాత్మ ఇక్కడే ఉన్నాడు. నీకై సిద్ధపరచిన దేవుని మార్గమును అంగీకరించితివా. దాని యోగ్యతకై నీవు ఏమి ఇవ్వనవసరం లేదు. నీ కొరకై దేవుడు దానిని సిద్ధపరచియున్నాడు. నీవు రావా, స్వీకరించుటకు, నీవు రావా, ఈ రాత్రి? ఇక్కడ పాపియైన స్నేహితుడు ఉన్నట్లైతే నీ చేయి పైకెత్తి “సహోదరుడా బ్రాన్హాం నాకై ప్రార్ధించు అని చెప్తావా? నా జీవితానికి దేవుడు సిద్ధపరచిన గొర్రెపిల్ల కావాలి” అని అన్నాడు.

బలిపీటం చుట్టూ బలిపీటపు పిలుపును కొరకై మనకిక్కడ స్ధలము లేదు. స్ధలము లేదు కనుక మీ చేతిని పైకెత్తమని అడుగుతున్నాను. పాపి నీవది చేస్తావా. అయ్యా, దేవుడు మిమ్మును దీవించును. అయ్యా, దేవుడు మిమ్మును దీవించును. సహోదరి దేవుడు మిమ్ములను దీవించును. దేవుడు మిమ్ములను దీవించును, మిమ్ములను, వెనుక వెనుక మరల వెనుక ఎవరైనా ఉన్నారా?

ఇప్పుడు నాకు కుడివైపున ఉన్నవారు, దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. “నన్ను జ్ఞాపకమునకు ఉంచుకొనుము. ఇంకొకరు చెయ్యి ఎత్తి చెప్పగలరా, ఓ దేవా ఈ రాత్రి కృప దయచేయుము..... మీ గొర్రెపిల్ల జీవము.” సహోదరి, దేవుడు మిమ్ములను దీవించును. ఇక్కడే కూర్చోని యుండుట నేను చూస్తున్నాను.

బయట ఉన్న ఒకరు, నడచుకుంటూ వచ్చి తెరకు ఎదురుగా మీ చేతులు పెడతారా, “సహోదరుడా బ్రాన్హాం, నన్ను జ్ఞాపకముంచుకో అని చెబుతారా, దేవుడు ఏర్పరచిన మార్గము నాకు కావాలి అని చెప్తారా.”

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...