పదిలక్షలలో ఒక్కరు
1సహో, షకారియన్ నీకు ధన్యవాదాలు, మరియు స్నేహితులారా!ప్రాతఃకాలవేళ శుభోదయము. ఈ ఘనమైన మహాసభకు ముందుగా, ఎంబసీ హోటలులో ఈ వారంలో జరుగనైయున్న కూడికలకు ముందు లాస్ ఏంజల్స్ లో ఈ ఉదయం, మరలా యిక్కడ యుండుట నిజంగా మంచిది. మిమ్మలనందరిని అక్కడ చూడాలని నేను అపేక్షిస్తున్నాను. మనమందరము కూడా, ప్రభువైన యేసును అక్కడ కలవాలని, ఆయనను అక్కడ చూడాలని ఎంతో ఆపేక్షతో యున్నాము.
"ఎక్కడ యిద్దరు ముగ్గురు కూడి యుందురో," అక్కడ ఆయన యుండునని వాగ్దానము చేశాడు. ప్రజలందరు ప్రాతఃకాల అల్ఫాహారము కొరకు, మరియు ఉపదేశము కొరకు అత్యాశలతో ఎదురుచూచుచుండగా, ఈ సభా-భవనపు మెట్ల మీదనుండి నేనిక్కడకు ఈఉదయం వచ్చుచున్నప్పుడు, నేను నిజంగా ఆయనను కలసికున్నాను. మరియు యిక్కడ మిమ్మలను మరియు రేడియో సభికులను సమావేశపరచుట మంచిది. తరువాత అంతస్తుకు వెళ్ళుటకు ఇక్కడున్న వారిలో చాలామంది యున్నారు. మాట్లాడుటకు కొద్దిమంది యిక్కడున్నారు. గుండెజబ్బుతో, నున్నవారు, వారి శరీరములో పలువిధాలైన బాధలతోనున్నవారు, వారి చాలా-చాలా విన్నపాలు చూశాను. వ్యాధి బాధలతోనున్న వారికి ప్రార్ధించుటకే యిక్కడ మేమున్నాము.
2ఇప్పుడే మెట్లపైన నేను నిలబడియున్నపుడు — ఆ వృద్దుడైన పెద్దాయనను నేను చూస్తున్నాను. అతడు నా యొద్దకు వచ్చి "సహోదరుడా. బ్రన్హం! సంవత్సరాల క్రితం…" అతడు చెప్పాడు, ఎంతో ముదిరిపోయిన గుండె జబ్బు అతని కున్నదని చెప్పాడు. అతడు చనిపోతాడని వారు అనుకున్నారని చెప్పాడు. అతనికై ప్రార్ధన చేయబడినది. దేవుని కృప అతనిని స్వస్థపరచినది. అతడిపుడు యిక్కడ ఈ ఉదయం ఉన్నాడు, అతడు ఎనభైలో ఉన్నాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. కనుక, మనకది ఒక క్రొత్త పట్టును స్వీకరించినట్లు జేస్తుంది.
ఇపుడు నేను నిజముగా, అక్కడనున్నరేడియో ప్రాంతమందున్న ప్రజల ప్రార్ధనలను, యింకా యిక్కడున్నవారి ప్రార్ధనలను నేను వేడుకుంటున్నాను. ఈ కూడిక అయిపోయిన తరువాత, నేను యూరప్ కు, అక్కడ నుండి ఆఫ్రికా, మరియు ఆ చుట్టు ప్రాంతములకు కూటముల నిమిత్తమై నేను వెళ్ళుచున్నాను. ఇది దర్శనం ద్వారా వెళ్ళట యౌతున్నది, కాబట్టి అది ఘనమైన కూటము అక్కడ జరుగబోతున్నది. అది ఖచ్చితమని నేను నిశ్చయించుకొనుచున్నాను, నన్ను ప్రభువు తిరిగి వెనుకకు రమ్మని కోరినట్లుగా అనేక సంవత్సరములు నేను భావించాను. ఆయన నాకు అనుగ్రహించిన అతి స్వల్పమైన దీన-పరిచర్య అక్కడ దానితో ఆయన ఆలాగే ముగింప చేయునని నేనకొనుటలేదు. సువార్త వలద్వారా నేను పట్టుకోవలసిన ఒక ఆత్మ అక్కడున్నట్లుగా అగుపిస్తున్నది. దైవిక స్వస్థత వలన, రోగులకై ప్రార్ధించుట వలన, ప్రజలలో వలవేయుట వలన, ఆయన నాకిచ్చును. మీ ప్రార్ధనలను నేను నిజముగా ఆశపడుచున్నాను, ఇక్కడున్న మీరు మరియు బయట రేడియో సభికులలో ఎవరున్నారో వారిని నేను వేడుకొనుచున్నాను.
3ఇపుడు ఆలా పాఠము తీసికొని బోధించుటకు నాకు సమయము లేదు. కొద్ది నిముషాల తరువాత యిక్కడ, ఈ సభాశాలలో నేను దానినే ఎదురుచూచుచున్నది బోధించుటకు సమయము లేదు. అయితే కొద్ది నిముషాలు మీతో పరచయ మాటకు మరియు మాట్లాడుటకు ఆశించుచున్నాను. దూర ప్రాంతముననున్న అక్కడ యున్నవారిని, నేను ప్రార్ధన అడుగుచున్నాను. ఆలాగే యిక్కడున్న వారిని కూడా అడుగుచున్నాను. మంచివారైన, ఈ క్రొత్త స్నేహితులను నేను క్రితం, కలవనివారిని. ఈ ఉదయము వారిని కలసికొనుటకు నేను వచ్చినందులకు నిజముగా ఆనందంగా యున్నాను.
వేరు-వేరు స్థలములలోని కూటములలో, ఎంతో గొప్ప సమయ సందర్భాలు మాకు సంభవించినవి. ఎక్కువగా దూరప్రాంతాలకు నేను దాటిపోను — ఆదెంతో విరామములేకున్నది. ఇండియానాలోని జఫర్సర్విల్ నుండి ఆరిజోనాలోని టూసన్ వరకు మేము రహదారిని వేడిగా వుంచుటకు ప్రయత్నించాము. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడకైతే ప్రభువు యొక్క దర్శనం ద్వారా మేము కదలి వెళ్ళితిమో, నేనెక్కడకు వెళ్ళుచుంటినో తెలియకనే అక్కడకు అది, మమ్ములను పంపియుండెను. ఇక్కడ క్లిఫ్టన్ లోనున్న మీలో అనేక మందితో ఫీనిక్స్ కూటములు ముగియక ముందు వచ్చినటువంటి దర్శనమును గూర్చి నేను చెప్పియుంటిని. ఒక కుచ్చులో (గుమికూర్పు) ఏడుగురు దూతలను నేను చూచితిని.
4రేడియో సభికులకు, మీలో అనేక మంది బహుశా సంపూర్ణ సువార్తకు చెందినవారు కారని నాకు తెలుసు. ఇది కొద్దిగా మీకు మర్మముగా అగుపించవచ్చును, అది నాకైతే, కాని అది… ఎవరైన, దేనినైనా వివరించగలిగితే, విశ్వాసము ద్వారా కాకుండా మరో విధముగా అంగీకరించనవసరం లేదు. మనము వివరించలేని విషయం అది. విశ్వాసము ద్వారానే మనమది అంగీకరించవలసియున్నది.
దేవుని మనము అర్ధం చెప్పలేము. ఏ మనుష్యుడు దేవుని గూర్చి అర్ధం చెప్పలేడు. ఆయన సార్వభౌమ పరిపాలకుడు. ఆయన మహా-బలవంతుడు, శక్తిమంతుడు మనము అలాగు అంగీకరించవలసినదే, ఎందుకనగా ఆయన అక్కడ యున్నాడని మనమెరుగుదుము కనుక, ఆ తరువాత మన విశ్వాసము ద్వారా దానిని అంగీకరించుట వలన తిరిగి మనకు ఆయన క్రియా రూపకమైన ప్రత్యుత్తరము పరిశుద్దాత్మ బాప్తిస్మము తెచ్చును. దానినే కొద్ది నిముషాలలో మీతో మాట్లాడనైయున్నాను "దేవుని మార్గము, ఒక ఆరాధన స్థలము," అను దానిపై మాట్లాడనైయున్నాను.
నీవు ఆయనను ఆరాధింపగల ఒకే ఒక స్థలము, నిన్ను కలసికొను ఒకే ఒక స్థలము, ఒకటి అక్కడయున్నది. అన్నిటిలో దేవుడు కలసికొను ఒక సంఘమున్నది. ఒక స్థలమున్నది. ఒక సమయమున్నది. ఒక జనము ఉంటున్నది. ఇక్కడున్న మీ హృదయాలలో ప్రభువు వర్తమానమును దీవించునని నేను నిరీక్షించుచున్నాను.
5ఇప్పుడు టూసన్ కు వచ్చునప్పుడు. ప్రభువు నామమును బట్టి, మీతో ఆ దర్శనములను మాట్లాడుట అది వింతగా ఉన్నది. వాటిలో ఏ ఒక్కటైనా జ్ఞప్తికితెచ్చి దానినెపుడైనా జ్ఞప్తికి తెచ్చుకొనమని ఎవరినైనా అడిగినట్లు లేదు. సత్యము తప్ప ఏనాడు కూడా మరేదైనా ఆయన చెప్పలేదు. అది ఏ విధముగా జరుగునని ఆయన చెప్పియుండెనో, ఆలాగే ఎల్లప్పుడూ జరిగియుండెను.
లేఖనముల ప్రకారముగా, ఈ కడవరి దినములలో ఆయన మన యొద్దకు ఈ విధమైన పరిచర్య ద్వారా తిరిగి రావలసియున్నది: ఆత్మ బాప్తిస్మము తరువాత భాషలు మాట్లాడుట, దైవిక స్వస్థత ఈ మొదలైనవాటి తరువాత ఆదియుండును. పెంతెకోస్తు వర్తమానమును సంపూర్తి చేయుట గురించి ఈ దినమున మనము మాట్లాడుచున్నాము. ఆయన భూమి మీదనున్నపుడు ఏ కార్యములను చేసియున్నాడో, అదే కార్యాలు చేయచు క్రీస్తు యొక్క ఈ స్వంత పరిచర్య ఆయన ప్రజల మధ్య అవతారమెత్తినది. ఆయన శరీరములో ఆయన యొక్క భాగమైన వధువు ఒక భర్త, భార్యవలె, లేక రాజువలె, రాణివలె పెళ్ళి వేడుక జరుగక మునుపు, కొంచెము ముందుగా అవే కార్యాలను చేయుచుండును.
6ఈ వారములో ప్రభువు చిత్తమైతే, ఇక్కడే ఎంబెసీ హోటల్ నందు మన సేవాకార్యక్రమములో దానిపైన మాట్లాడ ఆశపడుచున్నాను. దీనత్వముతో నేనది చేయుట వలన ఒక విధంగా పరిచయం చేయాలనుకుంటున్నాను. అది మనము నివసిస్తున్న కాలము ఘడియలో ఏ దారిన వెళ్ళవలెనో ఒక వ్యక్తి ఎరుగక పోయినట్లయితే, ఏమి చేయాలో లేక ఎలా త్రిప్పాలో ఎరుగక పోతే, నీవు యిక విశ్వానము ద్వారా నడచుట లేదు, నీవు ఊహిస్తున్నావు. నీవు అనుకొనుచున్నావు, అనుకొనుచున్నావనగా అర్థం "అధికారకంగా హక్కు లేకుండ ముందంజవేయుట" యౌతుంది. కాబట్టి, ఈ ఘడియలో ఏమి జరుగునని దేవుడు చెప్పెనో, దాని నిజమైన అధికారపు హక్కు మనకు లేకుండ ఈ ఘడియను మనమెట్ల ఎదుర్కొనగలము? మనమది ఎదుర్కొనవలసియున్నది, ఆయన వాక్యములో విశ్వానవయించుట ద్వారా ఇవుడు జరగవలసిన నంగతులు ఎరిగి ఎదుర్కొనవలసియున్నది. మరియు దేశము యొక్క పరిస్థితులు ప్రజల యొక్క పరిస్తితులు, సంఘము యొక్క పరిస్థితులు మొదలగునవి ఎరిగి ఎదుర్కొనవలసియున్నది.
మనమది ఎరుగవలసియున్నది, తరువాత దానిని ఎదుర్కొనుటకు ఏలాగు నడువ వలయునో అదీ ఎరుగవలసియున్నది. అది ఏ విధముగా చేయవలెనో నీకు తెలియకపోతే నీవలా అనాలోచితముగా (మనం పిలిచినట్లుగా) చేయుదువు ఎగిరి దూకుట, అది యిక్కడే యుందనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను, అది అనుకుంటున్నాను, మరియు అలాగుండును? అని నీవుండెదవు. అయితే మనము అది చేయుటకు దేవుడు అంగీకరించడు. ఆయన ఈ దినమును గూర్చి ఏమి చెప్పియున్నాడో అది మనము తెలుసుకోవాలని ఆయన ఆశపడుచున్నాడు, తరువాత దానిని విశ్వాసము ద్వారా ఎదుర్కొనవలయును, ఎందుకనగా అది ఆ విధముగా యుండునని ఆయనే చెప్పియుండెను. తరువాత నీవు సత్యమందున్నావని మేము తెలుసుకుంటాము, ఎందుకనగా దానికై, నీవు ఒక వ్యక్తి మాట తీసుకొనలేదు కనుక: మనము ఏమి చేయవలసియున్నదో అట్టి ఆయన వాక్యమును నీవు పొందుకున్నావు. మనయొక్క పరలోకపు తండ్రి ఈ వారములో దీనిని మనకనుగ్రహించునని మనము ఆశపడుచున్నాము.
7కొన్నిక్షణాల క్రితము టూసన్ కు వచ్చుచుండుటను గూర్చి, నేనేమి చెప్తున్నానో, నేను నిలిపివేసినందుకు నన్ను క్షమించండి. నాకు నేననుకున్నాను, అది నా బ్రతుకు యొక్క అంతమని అనుకున్నాను. ఆ ఉదయం, ఆ దర్శనములో జరిగిన పరిస్థితి యొక్క దెబ్బకు ఏ మనుష్యుడు నిలవలేడని నేననుకొన్నాను. ఇంటి యొద్ద షుమారు పదిగంటలు సమయమది. దాని తరువాత బ్రతుకలేరు, ఎందుకు? నేను టూసన్ కు వచ్చుచుంటిని. నా భార్యకు, బిడ్డలకు నేను వెళ్ళిపోయిన తరువాత, అతనితో నివాసముండుటకై, నా కుమారునితో ఏర్పాట్లు చేయుచుంటిని. ఎందుకనగా అది నా జీవిత అంతము అని అనుకున్నాను. నేను ఫీనిక్స్ లో ఉన్నాను, అది జరుగకముందు నేను అది ఏ విధంగా జరుగునో మీకు తెలియజెప్పాను.
మంచిది, దాని తరువాత కొద్ది నెలలకు, నేను సెబినో కొండలపైన ఒక ఉదయము యున్నాను (అది టూసన్ కు కొద్దిగా ఉత్తరం). ఒక ఉదయం ప్రార్ధించుకొనుటకై పైన నేనక్కడయున్నాను. నేను ప్రార్ధించుచున్నపుడు, నా చేతులు పైకెత్తి "తండ్రీ! ఏ విధంగానైనా నీవు నాకు సహాయము చేయమని, నేను నీకు ప్రార్ధిస్తున్నాను. యిపుడు నేనెదుర్కొనుచున్న ఘడియకు నాకు బలము అడుగుచున్నాను. ఇక్కడ భూమి మీద నాపని సంపూర్తియైనట్లయితే, ఆలాగైతే, నేను నీ యొద్దకు రావసియున్నది. వచ్చుటకు నేను విముఖత చూపుట కాదు.నీవు నా కుంటుంబమును జాగ్రత్త తీసుకుంటావని నాకు తెలుసు. నేను ఈ ఘడియకు బలముకొరకై అడుగుచున్నాను," అని అడిగాను. ఒకటి నా చేయిని తగిలినది!
8ఇపుడు, రేడియో వినుచున్న వారు మీరు, నేను చెప్పినది ఇది వింతగా ఉండవచ్చును, అయితే అది అది సత్యము! దేవుడు నా తీర్పరి. నా చేతిలో నేను చూచుకున్నాను. ఒక కత్తి ఉన్నది. పట్టుకొనే భాగమునకు ఒర యున్నది. పిడిభాగము ముత్యముతో చేయబడినది, మరియు పిడిభాగము ఒక విధంగా బంగారము పొదిగినట్లుగా కాన్పించినది. కత్తి అంతా తలుక్కుమని మెరసినట్లుగా యున్నది. ఓ, ఒక విధంగా పసుపు వర్ణముగా లేదా సూర్యునిలో మెరుస్తున్నట్లుగా యున్నది.
దూరంగా పర్వతపు శిఖరముపైన, అది షుమారు ఉదయం పది లేక వద కొండు గంటలయినది. (నేను నా నరియైన మనన్సుతో నేనున్నట్లుగా భావిస్తున్నాను.) మీరు ఊహించవచ్చును. మైళ్ళ-మైళ్ళ దూరంలో ప్రజలు లేకుండ నీ చేతిలో కత్తితో అక్కడ నిలబడియుండుట ఆలోచించు! నేనది తాకితిని. కత్తి మొనను ముందు వెనుకకు త్రిప్పాను. ఎందుకని? అది కత్తి!
9నేను చుట్టూరా చూశాను. "అరే, అది ఏలాగు జరిగినది? ఇక్కడే, నేను నిలబడియున్నాను. యిక్కడే మైళ్ళ-మైళ్ళ దూరములో ఎవ్వరూలేరు. అది ఎక్కడ నుండి వచ్చినది? నా అంత్య-కాలమని ప్రభువు చెప్పుట కాబోలు," అని నేననుకున్నాను. ఒక స్వరము పలకబడి చెప్పెను. "ఇది ప్రభువు యొక్క ఖడ్గము" అని. "సరె, ఒక ఖడ్గము. ఆలాగైతే యిది ఒక రాజు యొక్క ఒక యోధుని యొక్క ఖడ్గము," అని అనుకున్నాను. ఇంగ్లండులోను మరియు ఇతర స్థలాలలో అదెలాగు వాడెదరో మీకు తెలుసా! "అది, ఒక యుద్ద వీరుని కొరకు అది యుండునది," అని నేననుకున్నాను. మరియు నేను తలంచాను. "ఓహో, బహుశా, ప్రజలపైన నేను చేతులు పెట్టవలెనేమో లేక. అన్ని విధములైనవి నేను తాకాను. మానవ మనస్సు అంతా, కలగలుపులు చేయును. ఔనా! మీకు తెలియదు. మనమనసు సంకుచితమైనది. ఆయన అగమ్యగోచరుడు, కాబట్టి నేనలా ఉండగా… అది నా చేతులో నుండి వెడలిపోయినది. అదెటు వెళ్ళినదో నాకు తెలియదు. ఆలా కనబడకుండపోయినది.
ఎందుకు? ఆత్మసంబంధమైన వాటిని ఒక వ్యక్తి కొద్దిగా నైనా అర్థంచేసుకొనకపోతే, నీవు ఆలాగు తికమకలైపోతావు. అక్కడే నిలబడి, ఏంజరిగినదాయని ఆశ్చర్యపడతావు. ఆయన చెప్పాడు "ఈ దర్శనము నీ అంత్య-కాలము కాదు. అది నీ పరిచర్య కొరకైనది. ఖడ్గము వాక్యమై యున్నది. ఏడుముద్రలు తెరువబడును, మర్మములు."
10అది జరిగిన రెండు వారముల తరువాత, లేక రెండు నెలల తరువాత, అది జరిగినపుడు, అటు తరువాత నేను కొందరు స్నేహితులతో పర్వతంపైనయున్నాను. మీరు యిక్కడ నిలబడియుండుట ఎంత స్పష్టమో, అంత స్పష్టముగా ఏడుగురు దూతలు పరలోకము నుండి క్రిందకు దిగి వచ్చారు. పర్వతాలలోని రాళ్ళు దొరుకుంటూ కొండల క్రిందకి వచ్చినవి. మరియు అక్కడ ప్రజలు నిలబడి వారు కేకలు పెడతూ వెళ్తున్నారు. మీకు తెలుసా! ప్రతి చోట దుమ్ము లేచిపోతున్నది. అది ఆలాగైనపుడు "నీ యింటికి తిరిగి యిపుడు వెళ్ళము. ఇపుడు,… ప్రతి ఒక్క దూత ఏడు ముద్రలలోని ఒక్కొక్క ముద్ర యౌతుంది," అని ఆయన చెప్పాడు.
అది టేపు మీదనున్నది. ఒక విధంగా వ్యాకరణం చేయబడి చాలా త్వరలో పుస్తకమౌతుంది. మీకు తెలిసినట్లుగా నా వ్యాకరణము బాగుగా ఉండదు. ప్రజలకది అందదు. నన్ను ప్రేమించే మికైతే నా వ్యాకరణమును బట్టి నన్ను ఏలాగు అర్ధం చేసికొంటారు. అయితే, ఒక వేదాంత పండితుడు నాకై దానిని వ్యాకరణీకరిస్తున్నాడు. దానినంతా తీసుకొని, దానిని ఒకవేళ నేను పొరపాటు మాట అక్కడ చెప్పవచ్చును, చివరకు నాకది తెలియదు. కాబట్టి ఒకరు నవ్వటం నేను విన్నాను; కనుక ఆ వ్యాకరణము సరియైనది కాదని నేనూహిస్తున్నాను. కాబట్టి డచ్మన్ వలె నా భావమేదో అది తీసుకోండి. నేను చెప్పినది కాదు, నిజం.
MARK 16:17,18
11ఇపుడు కేవలం ప్రకటన ముగింపునకు మూడు నిముషాలని నేను చెప్పాను. ఇపుడు బయట రేడియో ప్రాంతములందున్న ప్రియమైన వారలగు మీరు! ఇక్కడ సభికులలో వ్యాధులతో, అక్కరలతో నున్న మీరు! రోగుల నిమిత్తమై ఈ ప్రార్ధన పలుకు మనము చెప్పుచుండగా మీరు ఒకరిపైన ఒకరు చేయి పెట్టుకుంటారా? సంఘమునకు ఆయన ఆఖరి ఆజ్ఞ; యేసు చెప్పెను,"నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు కనబడును," అని. "వారి వలన" నమ్మిన వారివలన "వారు రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థతనొందుదురు."
MARK 16:17,18
12ప్రియమైన పరలోకపు తండ్రీ! ఈ దినమున మేము బిడ్డలవలెయుండి నీవేమని చేయమని చెప్పితివో దానికి మేము విధేయులమౌతున్నాము. ఈ అన్నిటెలిఫోన్ విన్నపముల పైన మేము చేతులు పేడుతున్నాము. అక్కడ దూర ప్రాంతములోనున్నవారు వారెటువంటి అక్కరతో నున్నారో, వారే బాధతోనున్నారో నీవు వారిని చూచుచూన్నావు. ఇక్కడ ఎవరు అక్కరతో బాధతో నున్నారో వారినీ, నీవు చూచుచున్నావు. ప్రియమైన దేవా! "నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును; రోగుల మీద వారు చేతులుంచినపుడు, వారు స్వస్థత పొందుకొందురు," అని నీవు పలికిన నీ వాక్యముపై నున్న ఈ విశ్వాసముతో వారిని నీకు అప్పజెప్పుకొనుచున్నాము. ప్రభువా! అది అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో. ఆమేన్. [మొదటి రేడియో ప్రసారమును సహాదరుడు బ్రన్హం గారు ముగించిరి]
13సహోదరా, షకారియన్ ధన్యావాదాలు మీకు! అక్కడ రేడియో ప్రాంతములందున్న కొంతమందిమన స్నేహితులతోను, యింకా ప్రస్తుతమందు యిక్కడున్న వారితోను కలసి మాట్లాడుటకు ఆకాశవాణి ప్రసారము యొద్దకు మరల వచ్చుట, నిజంగా ఘనమైన తరుణమైయున్నది.
రేపు మధ్యాహ్నం ప్రార్థన చేయించుకొనుటకై ఎంబసీ హోటలుకు మీరు వచ్చుటకై మేము నిజంగా ఈ ఆహ్వానమును మీకై విస్తరింపజేయుచున్నాము. అది మాత్రమే కాదు, పాపులుగా యున్నవారిని, ఎవరైతే తప్పిపోయారో అట్టివారిని కూడా తీసుకురండి. మనకు, రోగులకు మాత్రమే ప్రార్థన యుండినట్లయితే, దేవుడు ఆలాగు గొప్ప అద్భుతాలు కొనసాగించుట మనము చూచెదము, అయితే అది రెండవ విషయం. రక్షించబడుట ప్రాముఖ్యమైన విషయమైయున్నది. దేవుని ఆత్మతో నింపబడుట ప్రాముఖ్యమైన విషయం. దానినే నేను యిక్కడ కొద్ది క్షణాలు మీతో మాట్లాడబోవుచున్నాను. దేవుని ఆత్మ వలన మనమెలా సరిపోయేంతగా నింపబడవలెనో, అదీ నేను మాట్లాడగోరుచున్నాను.
JOHN 8:24
14సహజంగా, దైవిక స్వస్థత ప్రజల గమనమును ఆకర్షించును. మరియు దేవుని సన్నిధికి వారిని తీసుకొనివచ్చును. దేవుడు అలాటిది ఒకటి చేసినపుడు వారెరిగినది. సరే, అది అర్థం కాదు. అది ఏలా జరిగినదో యాంత్రికంగా చూయించలేము. దేవుడే ఆయన యొక్క ఘనమైన మార్గమున దానిని చేయును. అప్పుడది మానవ గ్రాహ్యానికి మిన్నయిన చేయగల యొకటి, ఒక చోట శక్తి యొక్క సన్నిధియున్నదని ఎరుగునట్లు; ప్రజల గమనమును అది ఆకర్షించును. అది ఎరుగునట్లు చేయును. దేవుని గొర్రెపిల్లవైపు వారు చూచునట్లుగా చేయును.
అది ఎల్లపుడు కూడ దైవిక స్వస్థత ఆలాగు చేయును. నీకు చెప్పబడినది మరియు నాకై-నేను నమ్ముతున్నాను. మన ప్రభువు పరిచర్యలో షుమారు నూటికి అరవై, బహుశ డెబ్బై పాళ్ళు మధ్య మన ప్రభువు పరిచర్య దైవిక స్వస్థతపైనే యుండెను. ప్రజలను ఆకర్షించుటకై అది ఆయన చేశాడు. తరువాత వారు అక్కడున్నపుడు, నేను ఆయననని మీరు నమ్మనట్లయితే, మీ పాపములోనే యుండి మీరు చనిపోవుదురు," అని ఆయన చెప్పెను.
HEB 13:8
15ఇపుడు, ప్రజలకు ప్రభువైన యేసును చూచునట్లుగా వారిని తెచ్చుటకు, దైవిక స్వస్థత ఒక ఘనమైన ఆకర్షణ పత్రము.
డాక్టర్. యఫ్.యఫ్. బోస్వర్త్, (మీలో అనేకులు అతనికి స్నేహితులు కుడా, అతనిని ఎరుగుదురు మరియు ఆయన పరిచర్యను), ఒక యౌవన సేవకునిగా అతని పరచర్య నాకెంతో ఆదర్శము. నా కూటములు, నేను ప్రారంభించాను. నేను సహోదరుడు బోస్వర్త్ యొద్దకు వెళ్ళాను. దైవిక స్వస్థత గూర్చి అతడిలాగు చెప్పెడివాడు. "దైవిక స్వస్థత" (అది యిపుడు యొక మోటు వివరణయౌతుంది.) "దైవిక స్వస్థత, చేప గాలమునకు తగిలించిన ఎర," అని అన్నాడతడు. "నీవెప్పుడు చేపకు గాలాన్ని చూయించవు, దానికి నీవు ఎరను చూపుతావు, తరువాత అది ఎరను తీసికున్న తరువాత గాలములో చిక్కుకొనును," అని అన్నాడతడు.
కాబట్టి అదే మనము చేయుటకు ప్రయత్నించునది. అది… మనము ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తునొద్దకు తీసుకొనివచ్చుటే మన యొక్క ఉద్దేశ్యము. ఆయన నిన్న, నేడు, యుగముగములు ఒకేరీతిగా ఉన్నాడు. కాబట్టి గతించిన దినాలలో ఆయన స్వస్థపరచువాడైనట్లయితే, ఈ రోజూ ఆయన స్వస్థపరచువాడే.
16అక్కడ రేడియో ప్రాంతములలోనున్న రోగులకు నేను ప్రార్ధన చేయకముందు కొద్దిగా వ్యక్తిగత సాక్ష్యము. అది కొద్ది దినాల క్రితము; ఎక్కడైతే ప్రభువు దూత క్రిందికి దిగివచ్చెనో, ఆ పర్వతాలపైన నేను కూర్చొనియున్నాను. అక్కడ పదిహేను లేక ఇరువది మంది సహోదరుల యెదుట గంభీరమైనది యొక సంఘటన జరిగినది. ఒక గొప్ప వెలుగు తోక చుక్కవలె ఎగురుతూ వచ్చినది. పర్వతాల చుట్టూరా ప్రేలిపోయినది. నేలచుట్టూ రెండు వందల అడుగులు లేక యింకా ఎక్కువ దూరం రాళ్ళు చిమ్ముకుంటూ చెట్ల శిఖరము నరికివేసినది.
సాక్షాతూ దాని క్రిందనే నేను నిలబడియుంటిని. అది సంభవించక ముందు కొద్ది క్షణాల క్రితమే నేను వారితో చెప్పాను. అది అక్కడ యుండునని మరియు ఏమేమి జరగబోతుందని విశదంగా వారికి చెప్పాను. అది ఆ దినమునకు ముందు చెప్పబడినది. వీరందరు కూడా వారికి వారు తప్పించుకొనుటకై ట్రక్కు బండ్ల క్రిందకు తదితరమైన వాటి క్రిందకు పరుగులు తీశారు. ఏమి జరిగినదో వారికి తెలియదు. ఆ తరువాత వెంటనే ఏమి జరుగునో ఆయన మాట్లాడి చెప్పాడు.
17ఆయన ఎక్కడైతే అగుపించాడో, అక్కడున్న ఒక రాయిపైన కూర్చున్నాను. నాకు మిన్నిసోట నుండి వచ్చినటువంటి స్నేహితుడు మాతో ఉన్నాడు. అతని వారు, ఈ ఉదయం యిక్కడేయున్నారు. బహాశా యిక్కడ, మరో అంతస్తులలో ఉన్నారేమోనని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది, అతడు డోనావాన్ వీర్స్ ఒక మంచి యావన కుర్రవాడు. ఒక లూథర్ నమ్మకంలో యుండి, ఈ మధ్యనే తన జీవితాన్ని క్రీస్తుకు అర్పించుకొని, ఆత్మతో నింపబడినవాడు. చాలా దీనుడైన జర్మను అబ్బాయి. షుమారు ముప్పయి సంవత్సరముల వయస్కుడు, కుటుంబీకుడు, ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలున్నారు. మూడు నాలుగు వందలమంది ఎక్కడైతే మా యిరుగు-పొరుగుగా, అక్కడ టూసన్కు, నాతో ప్రక్కనే యుండుటకై వచ్చారో, ఇతడు, అక్కడే టూసన్కు, అక్కడ నాతో ప్రక్కనుండుటకై కదలివచ్చాడు. కనుక అతడు, ఆలాటివారు యిరుగు-పొరుగుగా ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. వారు అక్కడ దక్షిణ ఆఫ్రికా నుండి చుట్టు ప్రక్కల నుండి నన్నువెంబడించి నాకు దగ్గరగా వుండుటకు. నాతో ఉండి, ప్రభువు ఆనందాలు ఆనందించుటకు వారు నా వెంట వచ్చారు. ఎంతో దీనుడగువాడు. అతని నెక్కువగా నేను గమనించలేదు.
18కారణము, నేను ఎరిగినవారు, నాతో కూడా వుంటున్నవారు నా స్వంత సహోదరుడు, సహోదరిలాటివారు. నేను వారిని గమనిస్తాను, వారు దారి తప్పుతున్నారు అని నేను భావించినట్లయితే, వారిని ఒక ప్రక్కకు తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడుతాను, ఎందుకనగా నేను వారిని ప్రేమిస్తున్నాను. మనము మహిమలో కలసి నివసింపగోరుచున్నాము. మరి కొన్నిసార్లు, కూటములలో నేను మీతో బహుశా కఠినంగా మాట్లాడానని నీవనుకొనవచ్చును. అది దానివలన కలిగినది కాదు, అది నేను నిన్ను ప్రేమించలేదని కాదు. అది నా హృదయములో నుండి వచ్చినది, ఎందుకంటే నేను అది ఒకే విధంగా యుండవలసియున్నది. దేవుని సేవించు ఒకే ఒక మార్గమున్నది, అది… మనయొక్క ఆలోచనలు ఏమైయున్ననూ, ఆయన మార్గములోనే మనం నిలబడవలసియున్నది. ఆయన మార్గము!
19నేను డోనావాన్ను గమనించాను, అతని చెవి కుడిమొన, బహుశా దాని కొలతకు మూడురెట్ల ఉబ్బిపోయి చాలా ఎర్రగా ఉన్నది. సరే. మేమిక్కెడున్నామో ఎడారిలో కొన్ని దినములు ఉండుటవలన అని అనుకున్నాను. బహుశా మేము అక్కడయుంటిమి కనుక, అతని చెవిలో ఒక నాగజముడు ఉందనుకున్నాను. అయితే, అతని చెయ్యి పట్టుకొన్నందున, అది కాన్సర్ అని నేను తెలుసుకున్నాను.
కాబట్టి, నేను డోనావాన్! నీకు అది ఎంతకాలము నుండి నీ చెవిలో ఉంది? అని అడిగాను. నేనెరుగనట్టగనే అలా అతన్ని కదిలించాను. "డోనావాన్ అది అక్కడ ఎంతకాలము నుండి ఉన్నది?" అని నేనడిగాను.
"సహో, బ్రన్హం! షుమారు ఆరు మాసముల నుండి," అని అతడు చెప్పాడు.
నేనడిగాను, "ఎందుకని నీవు నాతో తెలుపలేదు?"
అతడు చెప్పాడు, "ఓ, నీవు చాలా పనితొంరదలో యున్నట్లుగా యున్నావు కదా అని," ఇలా చెప్పాడు. "నేనది చేయదలచుకోలేదు". ఇంకా అన్నాడు, "బహుశా ఒక సమయమందు, ప్రభువు నీకు తెలియజేయునేమోనని నేను అనుకున్నాను," అని చెప్పాడు.
కాబట్టి "అదేమిటో నీవు గ్రహించావా?" అని నేనడిగాను.
"నాకొక మంచి ఆలోచన ఉంది," అని చెప్పాడు.
"అది మంచిదే," అని నేనన్నాను.
రెండవ ఉదయం, ఆ అబ్బాయి చేయి చేతితో పట్టుకున్నాను. రెండవ ఉదయము, అతని చెవి పైన మచ్చ కూడా లేదు. అదంతా సంపూర్తిగా పోయినది.
MARK 16:17,18•
JOHN 21:25
20కాబట్టి చాలాసార్లు మనము త్రోసికొనిపోతాము. మనము ఇది అదీ లేక చూశారా, అది, పొందుటకై ముందుకు నెట్టుకుంటూ ప్రయత్నాలు చేస్తాము. "ఈ సూచక క్రియలు విశ్వాసిని వెంబడించును?" అది వారు రోగులు కొరకు ప్రార్ధన చేసినట్లయితే," అని చెప్పుటలేదు.
"వారు రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థత పొందుదురు." మనమేమి చేయుచున్నామో, వాటిలో మనకై మనకు విశ్వాసము కలిగియుండవలసియున్నది.
మంచిది. బహుశా డోనావాన్ యిక్కడుండియుండును. అతన్ని మీరు కలవండి. అతడిక్కడే ఉంటాడు. ఏదో ఓక అంతస్తులో ఈ ఉదయం అతడు యిక్కడ ఉంటాడు. మీరు అతన్ని కలవండి. సాక్ష్యం అతనికి తెలుసును. ఇక నేనేమి చెప్పగలను? లూకా, లేక యోహాను వారిలో ఒకరు చెప్పారనుకుంటాను. భూలోకమైనను చాలదని, ఈ కడవరి దినములలో ఆయన ప్రజల మధ్య ఏమేమి చేసెనో వ్రాయబడిన యెడల, అనగా ఏ ఏ విధముగా వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందియుండిరో, త్రాగుబోతులు విడుదల పొందియుండిరో, వేల-వేల మంది అన్ని విధములైన వ్యాధి, బాధలతో నున్నవారు ఏలాగు విడుదల పొందారో మొదలైనవన్ని వ్రాయబడినయొడల, లోకములోని గ్రంధములన్ని చాలవు.
21రేడియో ప్రాంతములందున్న వారగు మీరు, యిక్కడున్నవారు కూడా. ఇక్కడ మేము యుండినప్పటి నుండి, నిర్విరామముగా ఈ ఉదయం మ్రోగుతున్న ఫోన్ ద్వారా వచ్చిన అనేకములైన విన్నపములను యిపుడు యిక్కడ నేను పట్టుకుంటున్నాను. మేమిక్కడున్నప్పటి నుండి, ఫోన్ ద్వారా నూట-తొంబై-ఆరు విన్నప్రములు ఈ ఉదయం వచ్చినవి.
కాబట్టి, మనమిపుడు, ప్రార్ధనలో ఒకరికొకరము ఏకీభవిద్దాము, అక్కడ దూరప్రాంతమున, మీరు ఎక్కడున్నప్పటికి, మీరు విశ్వాసులైనట్లయితే ఒకరిపై ఒకరు చేయిపెట్టడి. కానట్లయితే, మీ చేయిని బైబిలుపైన లేదా అక్కడున్న ఒక దానిపైన పెట్టడి. మనము ఇక్కడ మరియు అక్కడ ప్రార్ధిస్తున్నపుడు ఆలాగు చేయుడి.
ప్రియమైన పరలోకపు తండ్రీ! వేల-వేలమందిలో ఒకరుగా కేవలం డోనావాన్ వీర్స్ యొక్క చిన్న సాక్ష్యం. ప్రభువా! నీవెంతో కటాక్షము గలవాడవు. ఇక్కడయున్నవారిని, రేడియో ప్రాంతమందున్న వారిని, వారి హృదయాలును నీవు తొంగి చూడమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు, వారిలో ప్రతి ఒక్కరు స్వస్థత పొందుదురు గాక! కీడు వారిని విడిచిపెట్టునుగాక. వారి యొక్క ప్రతి బాధ నుండి వారు విడుదల నొందుదురు గాక! తండ్రీ! అనుగ్రహము చూపుము. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అది మేమడుగుచున్నాము. ఆమేన్. ప్రభువా! ధన్యవాదములు [రెండవ రేడియో ప్రసంగమును సహోదరుడు బ్రన్హం గారు ముగించిరి]
22మంచిది. ఈ ఉదయం ఇక్కడ పైకి నేను రావడం ఇది ముడు సార్లు, షుమారు పండ్రెండు, పదునాలుగు లేక మరికొద్ది నిముషాలో భవనాన్ని ఖాళీ చేయవలసియున్నదని తెలియజేయడమైనది. యాజమాన్యం వారు అడిగారు, అక్కడ మరొక్క అంతస్తులో ఎవరున్నారో, వారికి భోజనం వడ్డించబడదు, అని అన్నారు. మన భోజనము పొడిగించబడినది. మనకు అనేకములైనవి యున్నవి, మీకు తెలుసా! కాబట్టి, మనమెంతో ఎంతో ఆనందముగా ఉన్నాము. ఈ ఘనమైన ఆత్మ సంబంధమైన తినుబండారాలు రుచి గల సునాద సంవత్సర కూటములకై ఈ ఉదయం ఈ మంచి సముదాయ ప్రజలను బట్టి నేనలా పిలుస్తున్నట్లుగా, యుంటానన్నాను.
మరలా మనకున్న కూటములు రేపు మధ్యాహ్నం, అక్కడ ఎంబసీలో కూటముంటున్నదని, నేను పేర్కొనగోరుచున్నాను. అక్కడ వ్యాధిగ్రస్తుల కొరకు మేము ప్రార్థన చేయుదుము మరియు దేవుడు మనలను కలసికొనునట్లుగా ఎదురుచూచుచున్నాము. నేను, నా పరిచర్య భాగాన్ని పెట్టుటకై నేను వచ్చాను. ఈ కూటములలో మనము చేయగలిగిన దానంతటితో జయప్రదమగునట్లుగా, నా భాగమును నేను చేయుదును. ఇది మన కూటములు కనుక, జయము పొందుట అని కాదు. అయితే, యేసుక్రీస్తును ప్రజలు తెలుసుకొనుటయను విజయము. అదీ విజయము యౌతుంది. అది, ఎటువంటి కూటములైనా, మనమెంతగా దేవుని స్తుతించామని కాదు; ఆయన ఎన్ని ఘనకార్యాలు చేసియుండుట మనం చూశామని కాదు; ఆత్మ ద్వారా ఎన్నిసార్లు ఆయన మనతో మాట్లాడని కాదు. ఇంకా మొదలైనవి చేశామని కాదు. ఒకటి సంపూర్తి చేయబడకపోతే, రాజ్యములోకి కొన్ని ఆత్మలు తీసుకొనిరాబడక పోయినట్లయితే…
23మరియు మనమిపుడు జీవించు దినములను గూర్చి యిప్పుడే సహోదరుడు షకారియన్, ఒక నిజమైన వివరణ యిచ్చియున్నాడు. నేను నిజంగా, నా నిండైన హృదయంతో అది నమ్ముతున్నాను. మనము కేవలం ముగింపు కాలములో, కేవలం సాయంత్రపు చాయలలో జీవిస్తున్నామని నమ్ముతున్నాను. సూర్యుడు ఎంతో ముందుకు వెళ్ళిపోయాడు. ఈ దినమున జరుగుచున్నటువంటి సంగతులు మనము చూస్తున్నపుడు, మరొక తరము ఏమి తీసుకొని వచ్చునోనని చెప్పుట కష్టమైన పని యౌతుంది.
కొద్ది దినాల క్రితం… లోవలనున్న ఓక దానిని మీకు యివ్వనీయండి. నేనెక్కడ నివాసముంటున్నానో, అక్కడ పాటశాలలను గూర్చి ఆరిజోనా అంతటా విశ్లేషణము ఒకటి వారు చేశారు. వారు చిన్న పిల్లలకు (వారికి తెలియకుండానే) మానసిక పరీక్ష పెట్టారు. మరియు ఏమిటో అంచనా వేయండి?
ఉన్నత పాఠశాలలోను, మరియు వ్యాకరణ పాటశాలలోను కలిపినట్లయితే నూటికి, ఎనబైపాళ్ళు పిల్లలు మానసిక రుగ్మతతో బాధపడుచున్నారు. వారిలో నూటికి, డెబ్బయి మంది టెలివిజన్ చూచే వారు. చూశారా! దురాత్మలను వారు అలా మనపైకి వదలివేశారు. మరి, మనకు తెలియదు. అదెందుకు వచ్చినదో నీవు ఆశ్చర్యపడతావు. దానికి వ్యతిరేకముగా దేవుని స్వరము అరచుచుండుట నీవు వినగలవు. అయినను మనము యిక్కడ దానిలోనికి మెలికలు వేసికున్నాము.
MATT 7:21
24మిమ్మలను అదరుగొట్టునది యొకటి మీతో చెప్పనీయండి. చూడండి, "ప్రభువా, ప్రభువా అని నాతో చెప్పువారందరు లోపల ప్రవేశించరు, అయితే నా తండ్రి చిత్తము ఎవరు చేయుదురో వారు ప్రవేశించుదురు." అయన చిత్తము ఆయన యొక్క వాక్యము. మనమెంతగానో ఎల్లపుడూ భక్తిపూర్వకంగా ఉంటాము; మంచి సమయం కలిగియుంటాము, మనకున్న ఈ కూటములలో, కేకలుబెడుతూ, గెంతులు వేస్తూ మనముంటాము. నేను విమర్శకునిగా ఉండాలని అనుకొనుటలేదు, అయితే నాకొకటియున్నది. దేవునికి నేను చేయవలసిన విధి యొకటి ఉన్నది. ఆ విధి యేదనగా, నేను ఆయన యెడల నమ్మకముగా ఉండుట, ఆయనేమని చెప్పాడో అది చెప్పుటయే యౌతుంది. నేను నా యొక్క ధృఢ విశ్వాసమును సహించినటువంటి కాలిఫోర్నియా సర్వసభ్య సమావేశమునకు, నేను నిజంగా కృతజ్ఞడనై యుంటున్నాను. నా ధృఢవిశ్వాసమును నేను మాట్లాడకపోతే, నేను వేషదారినౌతాను, మరియు యిపుడు, మీ యెడల కూడా యదార్థవంతునిగా నేనుండను. నేను మీ యెడల నమ్మకస్తునిగా యుండకపోతే, దేవునియెడల ఏలాగు నేను నమ్మకస్తుడనౌతాను? ఎందుకనగా మిమ్మలను చూచుచున్నాను, మీతో మాట్లాడుతున్నాను (సందేహము లేదు మనము దేవునితో కూడా మాట్లాడతాము), కాని మనము నిజముగా ఒకరి యెడల ఒకరము నమ్మకంగా యదార్థంగా ఉండవలసియున్నది.
మనము నిజంగా ఒక భయంకరమైన కాలంలో ఉన్నాము. నీవు ఎప్పుడైనా ఆగితివా…
GEN 2:17•
GEN 3:4•
DEUT 8:3•
MATT 4:4•
MATT 7:21•
MATT 20:16•
MATT 22:14•
LUKE 4:4
25చిన్న వివరణను మీకు యివ్వనివ్వండి! "ప్రభువా, ప్రభువా అని పిలచువారందరూ అందులో ప్రవేశించరు, అయితే నా తండ్రి చిత్తము చేయువారు మాత్రమే ప్రవేశించెదరు." యేసు భూమిపైనున్నపుడు యిలాగు చెప్పియుండెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని. ప్రతి మాటవలన జీవించును…" ప్రతి ఒక్క వాక్యమువలన జీవించునది. ఏదో యిపుడు, అప్పుడు కాదు. వాక్యము వలన, ప్రతి ఒక్క మాట వలన జీవించును.
దేవుని ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలలో ఒక్క మాటను అనుమానించుటవలన, మరణము, దుఃఖము, ప్రతి వ్యాధి, గుండె జబ్బులకు అది కారణమాయెను. ఒక్క దేవుని మాటను తప్పుట వలన, ఒక్క వాక్యమును తప్పుట వలన ఆలాగున జరిగెను. "తప్పక," నిజముగా అను మాటను అపనమ్మకపడుట వలన మానవాళిని అతడు మరణమునకు తీసికొని పోయినట్లయితే! అయితే అది జరుగునని ఆయన చెప్పెను. సాతానుడు "తప్పక అది జరగదు," అని చెప్పెను. అయితే అది జరిగినది.
కాబట్టి దేవుని యొక్క ప్రతి మాటను మనం గైకొనవలసియున్నది. ఒక్క మాటను అనుమానించుట వలన లేక తప్పుడుగా కట్టుట వలన ఈ బాధలు, తదితరమైనవి మానవజాతికి సంభవించినట్లయితే, దీనినంతటికి వెల, చివరకు ఆయన కుమారుని స్వంత ప్రాణమేయై యున్నట్లయితే? మనం తిరిగి వెనుకకు వెళ్ళిపోయి, ఒకదానిని వదలిపెడదామా? పిలువబడినవారు అనేకులు… ఏర్పరచబడిన వారు కొద్దిమంది; పిలువబడినవారు అనేకులు… ఏర్పరచబడిన వారు కొద్దిమంది
దీని నుండి నేను పారమును తీసికొనను, ఎందుకనగా మనకు సమయం లేదు కనుక. అయితే ఒకటి మీతో విడచిపెట్టుచున్నాను. మనము ఆలోచనచేద్దాం…
26పశువులను వారు ఎక్కడైతే సంకరము చేస్తున్నారో అక్కడకు, ఒక రోజు షకారియన్తో నేను వెళ్ళితిని. మరియు నేను చూచితిని… ఎక్కడైతే సహోదరుడు షకారియన్ నన్ను తీసుకొని వెళ్ళెనో, ఆ ప్రయోగశాలను నేను చూశాను. ఒకలాటి చిన్న సాధనమును, ఒక అగ్గి పుల్లను వారు ఎద్దు రేతస్సులో మంచిరి. ఆ రేతస్సు యొక్క మద్దను తీసి, దానిని ఈ గ్లాసు క్రింద పెట్టగా, అది నూరు రెట్ల పెద్దదైపోయినది.
మరియు ఆ రేతస్సులో, దానిలో చిన్న బీజకణములు ఎగురుతున్నవి. బీజకణము మగదాని నుండి వచ్చునదని, అండము ఆడదాని నుండి వచ్చునదని మనకు తెలియును. ఇంకా అక్కడున్న రసాయన శాస్రజ్ఞనితో "ఆ విధముగా చిన్నదానిని ఎగురునట్లు చేయునది ఏంటి?" అని నేనడిగాను.
అతడు చెప్పాడు. "అవి చిన్న ఎద్దులు మరియు చిన్న ఆవులు," అని గమనిస్తున్నారా?
ఆ చిన్న బొట్టు లోనా? అని అడిగాను.
"అవును," అని చెప్పాడు.
నేనడిగాను "ఆలాగైతే ఆ మొత్తం రేతస్సులో ఒకవేళ, పదిలక్షలు వుండునుగదా?"
"ఓ! అవును," అని అతడు చెప్పాడు.
గమనిస్తున్నారా! నేను దగ్గరగా గమనించాను.
27ఇపుడు, ఈ గంభీర విషయం జరిగినపుడు, ఆ పదిలక్షలలో నున్న ఒక్క బీజకణము కొరకు ఒక్క అండము ఎదురుచూచును. అది ఏ బీజకణము అది, లేక ఏ అండము అదియని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ప్రకృతి జన్మను నీవు కనిపెట్టినట్లయితే. అది కన్య వలన కలిగిన జన్మకంటె అదెంతో మర్మముగా యుంటుంది. ఎందుకనగా ఈ రేతస్సులో జీవించుటకు ముందుగా నిర్ణయించబడినది ఒక్కటే యుంటుంది. వాటిలో మిగలినవి చనిపోవును. అది మొదట కలసికున్నది కాదు.
అది అండముతో మొదట కలిసి జతగా కొనుటకు కలసివచ్చినది. బహుశా, రేతస్సు వెనుక నుండి అండము ఎగురవచ్చును. లేక రేతస్సు మధ్యలోకి రావచ్చును. అండమువలె, రేతస్సు అదేపని చేయవచ్చును. బీజకణము అండములోకి దోగాడుకుంటు వెళ్ళును. చిన్న తోకలు, దాని నుండి రాలిపోతవి. అక్కడే వెన్నుపూస ఆరంభమౌతది. ఆ పదిలక్షల దాని నుండి, పెద్ద ముద్దంతటిలో, ఒకటే ఓకటి తెలియబడనటువంటి శక్తి ద్వారా నరుడు అగుటకై అది నిర్ణయించబడినది. అయినను, నీవు, ప్రతి ఒక్కరు ఒకటిగా నేయున్నారు. ఆ బీజకణములలో ప్రతి ఒక్కటి ఒకే విధముగా యుండునట్లుగా యున్నారు.
జంతువులలోను ఆ విధంగానే యుండును. మానవులలోను ఆ విధముగానే యుండును. అది అబ్బాయా? అమ్మాయా? ఎర్రజుట్టా? నల్ల జుట్టా? లేక ఏది అనునది అది నిర్ణయించును. అది దేవుని ద్వారా నిర్ణయించబడుతుంది. స్వాభావికంగా వాటిలో అన్ని కూడా ఒకే విధముగా ఉండును, అయితే బ్రతుకుటకు నిర్ణయించబడినది అందులో ఒకటే ఉంటుంది. పదిలక్షలలో ఒక్కటి మాత్రమే! అయినను అన్నియును ఒకే విధముగా యుండును.
EXOD 12:37•
EXOD 15:20•
NUM 13:25-33•
MATT 17:10•
MARK 9:11•
1COR 10:2-4
28ఇజ్రాయేలీయులు ఐగుపును విడచినపుడు, ఒకే సమయమందు షుమారు ఇరవై-లక్షల మంది విడచిపెట్టారు వారిలో ప్రతి ఒక్కరు ప్రవక్త వర్తమానమును విన్నారు. వారిలో ప్రతి ఒక్కరు అగ్నిస్థంభమును చూశారు; వారిలో ప్రతి ఒక్కరు ఎర్ర సముద్రములో, మోషేను బట్టి బాప్తిస్మము పొందారు. వారిలో ప్రతి ఒక్కరు ఆత్మలో కేకలు పెట్టారు. మోషే ఆత్మతో పాటపాడినపుడు; తంబురలు వాయించి, ఒడ్డున పైకి క్రిందకు, మిర్యాముతో గంతులు వేశారు. వారు, వారిలో ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వారు ప్రతి ఒక్కరు ప్రతి రాత్రి స్వచ్ఛమైన మన్నాను తిన్నారు. వారిలో ప్రతి ఒక్కరు ఆలాగు చేశారు. అయితే యిద్దరు ఆ దేశమును చేరిరి. పదిలక్షలలో ఒక్కరు.
పరీక్ష ఏమైయుండెను? ఒకే బండలోనిది వారందరు త్రాగారు; ఈ ఉదయవేళ మనము భుజించిన రీతిగా, వారు అందరు ఒకే ఆత్మ సంబంధమైన మన్నాను భుజించిరి. అయితే వాక్యపరీక్ష వారిని ఋజువు చేసినది. కాదేషు-బర్నెయాకు వారు వచ్చిన సమయమందు, వాగ్ధన దేశములోకి వారు ప్రవేశించుట మొదలు పెట్టగనే, వారు వాక్యము ద్వారా పరీక్ష చేయబడువరకు వారు వెళ్ళలేకపోయారు. అందరు-మిగతా పదిమంది తిరిగి వచ్చి "మనమది చేయలేము. ప్రజలు మనము వారి యెదుట మిడతలవలె యున్నాము. వారివి గంభీరమైన కోట గోడలు గల పట్టణము. ప్రత్యర్ధి చాలా ఎక్కువ మంది," అని చెప్పారు.
అయితే, యెహోషువా, కాలేబులు ప్రజలను నిమ్మలపరచారు, "మనమది చేయుటకు చాలినవారము," అని వారు చెప్పారు.
ఎందుకని, వారు వాగ్దాన భూమిని విడువకముందు "నేను ఈ దేశమును మీకు యిచ్చియున్నాను. అది మీకు యిచ్చియున్నాను, అది మీది," అని దేవుడు చెప్పాడు కనుక. అయితే వారిలో ప్రతి పదిలక్షలలో ఒక్కరే…
MATT 17:11•
MATT 24:37,39•
MARK 9:12•
LUKE 17:26,30
29షుమారు నామకార్ధముగా పిలువబడు క్రైస్తవులు ఈ దినమందు ఐదు-వందల మిలియన్లు ఉన్నారు. ప్రతి దినము ఒక తరము ముగియుచున్నది. ఈ రోజు ఎత్తబడుట జరిగినట్లయితే ఏమౌతుంది?సార్వత్రికంగా ఐదు-వందలు ఎత్తబడుటలో ఉండెదరు? వారు వెళ్ళిపోవుట, నీవు వార్తా పత్రికలో కూడా చూడవు. లేక నీవు ఎరుగలేవు. ప్రభువు యొక్క రాకడ రహస్యమైన రాకడ. ఆయన వచ్చి, దొంగిలించుకొనిపోవును. అది అంతటి చిన్న సంఖ్య ఎంతవరకనగా, "ఏలీయా ముందుగా రావలెనని, శాస్త్రులెందుకు చెప్పుచున్నారు," అని శిష్యులు యేసును అడిగినట్లుగా యుండు దినముల వలెయుండును.
"అతడు ఎప్పుడో వచ్చెను. మీరు అది ఎరుగలేదు," అని ఆయన చెప్పెను.
ప్రజలు ఏమి చేసియుండిరో, మీరు ఎప్పుడైనా ఆలోచించారా! ఏలీయా వచ్చుననే, వారు నమ్ముతూయుండిరి; అతడు వారిమధ్యనే యుండెను, మరి అది వారు ఎరుగలేదు.
ఆ విధముగానే మనుష్య కుమారుని రాకడయు ఉండును! ఆయన యెడల వారు ఆలాగుననే చేయుదురు. దేవుని ఆత్మ యిక్కడనేయున్నది. సరే. దానితో మనమేమి చేయబోవుచున్నాము? మన్నా తదితరమైన వాటిని భుజించి, మనము ఎదుగుతున్నట్లుగా కొనసాగకుండ ఆలాగు ఉండెదమా?
30నేలలోకి విత్తనం ఏలా వెళ్ళునో? (రెవ. పిట్స్ కొద్ది క్షణాల క్రితం మాట్లాడుచున్నట్లుగా) విత్తనమును మీరెపుడైనా గమనించారా? భూమిలో అనేక విత్తనములు కలవు.
దేవుడు నీటిపైన వెలుగుతో కదలినపుడు వెలుగు పుట్టినది. దేవుని యొక్క ప్రప్రధమ సన్నిదానము పలుకబడిన వెలుగు; అది దేవుని వాక్యము వలన కలిగినది. వెలుగు తీసికొనివచ్చునది, దేవుని యొక్క వాక్యము మాత్రమే. నీరు వెనుకకు వెళ్ళిపోయినపుడు, విత్తనము ముందుగానే భూమిలోనున్నది. మరియు వెలుగు మాత్రమే వచ్చెను… విత్తనములను మాత్రమే మరియు వాటితో యుండిన బీజమును మాత్రమే మొలచెను, దేవుడు తన సృష్టిని చేయుంచుచుండెను.
పరిశుద్ధాత్మ యివ్వబడినపుడు, ఈష్టరు ఉదయవేళ, మరొక వెలుగు భుమిని తాకినది. దేవుడు ఆయన భవిష్యజ్ఞానమును బట్టి, భూమిపై యిక్కడ యుండునని ముందుగా ఎరిగిన ఆ విత్తనములకు వెలుగును తెచ్చుటకు అది యివ్వబడెను. మొదటి ప్రకృతి విత్తనమును ఆయన ఎరిగినట్లుగానే, ఆత్మీయ విత్తనము ఎక్కడనున్నదో ఆయన ఎరిగియుండెను.
దేవుడు మొదట భూమిని ఉనికిలోకి తెచ్చినపుడే, అప్పుడే నీ శరీరము యిక్కడే భూమిపై పెట్టబడియుండెను. మనము భుమిలో ఒక భాగమై మనమిక్కడ పడియున్నాము. ఆయన భవిష్యజ్ఞానమును బట్టి ఆయనను ఎందరు ప్రేమించెదరో, ఎవరు ఆయనను సేవించెదరో, ఎవరు ఆలాగు చేయరో అదీ ఆయన ఖచ్చితముగా ఎరిగియుండెను. ఆయన భవిష్యజ్ఞానమును అది తెలియజేస్తుంది. అది ఆలాగు కాకపోతే, ఆయన దేవుడు కాదు. ఆయన అనంతుడు కాకుండ దేవుడు కాలేడు. ఆయన అనంతుడైతే, ఆయన అన్నియు ఎరిగియున్నాడు.
31కాబట్టి, ప్రజలు తప్పులు చేయుచుండుట మీరు గమనించుడి. దానియెడల వారు తొట్రిల్లుచున్నారు, దానియెడల వారు పరుగెత్తిపోవుచున్నారు, అది, ఇదీ అని వారు తలంచుచున్నారు. అయితే అది సరిగా పని చేయదు! మనమది చూచుచున్నాము. అయితే సరిగా పనిచేయుచున్నది ఒకటియుంటున్నది — అదేదనగా దేవుని యొక్క సంపూర్ణ చిత్తము కనుగొని, అందులో నిలబడి, ఎందుకొరకు దేవుడు నిన్ను పిలచెనో అందులో యుండుట వలన సరిగా పనిచేయును.
సహోదరుడు జాక్, కొద్ది క్షణాల క్రితం అక్కడ పెర్షియన్ స్క్వేర్లో: గజిబిజిలును గూర్చినదంతా చెప్పెను. ఒకటి ఇటు మరియు ఒకటి అటూ వేదాంతులును తదితరమైన వారిని గూర్చి చెప్పెను. ఒక వేదాంతం, నీవు నేర్చుకోవాలంటే, అక్కడకు వెళ్ళుము.
లండన్లోని హైడ్ పార్క్ లో అది ఆలాగేయుంటుందని నేనూహిస్తున్నాను. నేనక్కడయుంటిని. ప్రతి ఒక్కరికి వారి స్వంత తలంపుయున్నది. అది ఓక బబులోనులోని ఆధునిక-దినపు లోకము యొక్క కలగలుపైయున్నది.
32అయితే, సహోదరుడు పిట్స్, ఈ ఉదయం మనకిచ్చినటువంటి, తన మనోహరమైన వర్తమానమును మీరు గమనించారా? అతడు విరామ స్థలములో నుండి బయటకు వచ్చుచుండగా అక్కడతడు చిన్న ఈస్టరు లిల్లీని కనుగొన్నాడు. "ఆ గందరగోళమంతటి మధ్య" అది మనకు అది తెలియజేస్తూ "దానికి ఔనని" గానీ "కాదని" గాని అను చెప్పు, వేరే దారి దానికి లేదు. ఆ గందర గోళాల మధ్య అందులో ప్రకాశించుచున్న దేవునియొక్క జీవము తన పరిమళముతో అదక్కడే యున్నది. కారణం అదక్కడ యుండుటకు దేవుడు దానిని నియమించాడు. అన్ని పోరాటములన్నిటిలో, ఎవరూ దానిని గమనించలేదు. ఆత్మసంబంధమైన దాని పోలికను వారు చూడలేదు.
ఆలాగే, ఈ రోజు కూడా మన యొక్క గొప్ప గొప్ప కూడికలలో, గుంపులలో, సంఘములలో సంఘశాఖల మొదలగు వాటి మధ్య ఆ విధంగా ఉన్నది. ఒకరు ఈ వైపునకు లాగుతున్నారు. మనం బాప్టిస్టులమై యుండవలసియున్నది, లేక ప్రేస్బెటేరియన్ గా యుండవలసి ఉన్నది, ఈ విధంగాయండాలి, లేక ఆ విధంగాయండాలి, లేక మరో విధంగా యుండవలసియున్నదియని లాగుచున్నారు. వాటిన్నిటి మధ్యలో ఎదుగుతున్న పువ్వు యొకటి ఉన్నది. దేవుని యొక్క శక్తి నేరుగా మన మధ్యనేయున్నది, మనమందరి మధ్యలో పుట్టి మన మధ్యనేయున్నది! కొద్దిగా, మనము నిలుపు చేసి, కొద్ది నిముషాలు చూద్దాము, నేరుగా మనమధ్యనే అది తెరవబడుట ఈ వారం కనిపెట్టి దానిని చూద్దాము. దేవుడు అది చేయునని మనము నమ్ముతున్నాము. మరి మీరు?
MATT 7:14•
MATT 20:16•
MATT 22:14
33మనమిప్పటికే క్రింద అంతస్తులో ఉండవలసియున్నది అనుకుంటున్నాను, కావున మనము ప్రార్ధి౦చుకొందుము, మనలో ప్రతి ఒక్కరు.
ప్రియమైన దేవా! నీ సన్నిధిలో మేము తలలు వంచినపుడు, అడుగుటకు మేము తగినవారము కామని మేము భావిస్తున్నాము. అయితే మేము వచ్చినట్లయితే, నీవు మమ్మలను త్రోసివేయనని వాగ్దానము చేసితివి. ఇప్పుడే, తెలియజేయబడిన అనాగరికమైన ఈ వివరణలు అవి ఏ విధముగాను సిద్దాంతములు కాదు. "పదిలక్షలలో నుండి ఒక స్వరము," అయితే ఒక విధముగా జ్ఞప్తించుకొనుటకే అవి యున్నవి. ఎందుకనగా నీవు చెప్పియుంటివి. "జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి నంకుచితమునై యిన్నది దానికనుగొనువారు కొందరే… కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే." ఓ! నిత్యుడగు తండ్రీ, ఈ రాబోతున్న వారములోని మహాసభల ద్వారా సువార్త వెలుగును ఈ నగరము పైకి పంపుము. పురుష, స్త్రీ రేతస్సులో ఉదహరించుటకు ప్రయత్నించినట్లుగా, నీ యొక్క స్వంత గంభీరమైన జ్ఞాన ఆలోచనలో ఏలాగైనా ఏ విత్తనమైన ఉన్నట్లయితే, వారు మహాసభలోని హాజరు పట్టీలోకి వచ్చెదరు గాక! పరిశుద్ధాత్మ వారికి వెలుగు దయ చేయును గాక.
మేము తలంచిన దానికంటే సమయము ఆలస్యమై పోయినదని మేము గ్రహిస్తున్నాము. దేవా! బహుశా ప్రజలకు ఉపయుక్తము కాగలదని. యిక్కడ యొక్కటి జరగాలని లేదా, ఆ ఆఖరి గొర్రెను పట్టుకొందుమని నమ్మకముతో యిక్కడకు వచ్చుచున్నామని ప్రార్ధించుచున్నాము.
గొర్రెల దొడ్డి నిండిపోతే, ఆ తరువాత గొర్రెల కాపరి తలుపు మూయునని మాకు తెలుసు.
GEN 7:13,16•
JOHN 6:37,44•
JOHN 10:7
34నోవహు దినములలో ఉన్నరీతిగా యుండును, కుటుంబములోని ఆఖరి సభ్యుడు లోపలకు రాగానే దేవుడు ద్వారమును మూసివేసెను. వారు దెబ్బలు కొట్టారు, బాదులు బాదారు, అయితే ఎంతో ఆలస్యమై పోయెను. ప్రియమైన దేవా! వారికి తరుణముండెను.
"గొర్రెలు పోవు ద్వారము నేనే," అని నీవు చెప్పియుంటివి. పధ్యకారుని పాట ఎంతగా తాకుతుందో గదా! "తొంబది-తొమ్మిది నీకు చాలవా?" అయితే, లేదు; యింకొకటి కూడా ఉన్నది. అతడొక వేళ చిన్న నల్ల గొర్రె కావచ్చు; లేక అతడు ఒకచిన్నది కాని వాడు కాకపోవచ్చును, చిన్న ఆమె కావచ్చును, లేక చిన్న అతను కావచ్చును — వారెక్కడ ఉన్నారో మనకు తెలియదు. అయితే, ఆఖరిది లోపలకు రావలసియున్నది, అటు తరువాత తలుపు వేయబడును.
ఓ దేవా! అన్ని సంగతులు ఎరిగిన వాడా! ఈ ఉదయం మా బ్రతుకులు పరిశోధించుము. ఆ ఆఖరి వానిని మేము కనుగొనునట్లు మేము ఎక్కడకు వెళ్ళగలమో అక్కడకు మమ్మలను పంపుము. అప్పుడు తలుపు మూయబడుతుంది. గొర్రెలకాపరి గొర్రెలతో కలసి లోపల ఉండును. ప్రభువా! అనుగ్రహము చూపుము.
ఆ ఒక్కరు లోపలకు రావలసియుండినట్లయితే ఆ ఒక్కడు యిక్కడే యుండినట్లయితే… "తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వత్తురు. నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాడు."
35ఏదైనా బలవంతము చేయునది ఈడ్పు ఉన్నను, లేక చిన్న భావనయున్ననూ, యిక్కడ ఈ సభలో, సభికులలో, యిక్కడ గాని లేక క్రింద అంతస్తులో లేక వారెక్కడయుండినను వారు జవాబిచ్చుటకు, ఒకరికి యిది సమయమౌతున్నది. "ఔను, ప్రభువా! దూరమైపోయిన దేశ దిమ్మరిని నేనే, నా జీవితమంతా దానితో పోరాడాను. నేను రావలసియున్నదని భావించాను, అయితే ఈ రోజు నేను ఓటమివైపునకు ఊగులాడుచున్నాను. నేను పైకి వెళ్ళలేకున్నాను, క్రిందకు రాలేకున్నాను, నేను ఎటు వెళ్ళలేకున్నాను," అని వారు జవాబు చెప్పవచ్చును. ఓ! ఆ గొప్ప కాపరి వచ్చి, జాలిగల హస్తాలు చాచి, క్రిందకి వచ్చి అతనిని క్షేమంగా లోపలకు తీసుకొనివచ్చును గాక. ఆయన భుజములపై దానిని పెట్టుకొని క్షేమంగా తిరిగి తెచ్చును గాక.
ప్రభువా! యిక్కడ ఒకరు ఉ౦డవచ్చును ప్రభువా! వ్యాధిగ్రస్తునిగా, అదే స్థితిలో ఉండి ఉ౦డవచ్చును. "ఇక ఏదీ చేయలేము," అని వైధ్యుడు చెప్పాడు. దానినుండి విముక్తికై అతడు గట్టి ప్రయత్నము చేశాడు. అయితే అతడు తప్పించుకో లేక పోయాడు, అది అతనికి మించినదై పోయినది. అతడు అక్కడ చేయగలిగినది ఏమి లేదు. అతని ఔషదము, ఆతని కత్తి అది చేయలేకపోయినది. అయితే, ఓ ప్రభువా! నీ బలమైన బాహువుకు దూరమైనది ఏది లేదు. నీ వాక్యమే, నీ బాహువు. అందుచేత, ప్రియమైన దేవా! ఈ ఉదయం నీతో మాట్లాడుచున్నపుడు, నీవు దిగి వచ్చి వ్యాధితో నున్నవానిని, తనకుతాను సహాయం చేసికోలేని వానిని పట్టుకొనుము. అన్ని శాస్త్ర పరిశీలనలో యుండి, వైద్యుని యొద్ద నుండి దూరమైన వారు స్వస్థత పొందుదురు గాక. ప్రభువా! అనుగ్రహము చూపుము.
1SAM 17:34,35
36దావీదును గూర్చి మేము తలంచుచున్నపుడు, కొద్ది గొర్రెలను కాయుటకు అతనికి బాధ్యత అప్పజెప్పబడెను, అవి కేవలం కొద్ది మాత్రమే. అయితే ఒక రోజు ఒక ఎలుగుబంటి వచ్చి, ఒక చిన్న గొర్రెను పట్టుకొని తీసికొని వెళ్ళినది. దానిని తినివేయుటకు వెళ్ళినది, (కేన్సరు శరీరాన్ని తినివేసినరీతిగా) లేక, భీకరమైన సింహమువలె అదియున్నది. అయితే దావీదు — మరిన్ని తుపాకులు కలిగియుండినవాడు కాదు, కత్తులు కలిగినవాడు కాదు — అయితే ఒడిశెల మాత్రమే అతని యొద్దయున్నది. దానితో గొర్రె వెంటబడ్డాడు, ఆ చిన్న గొర్రెను ఆ జంతువు చంపుటకు సంసిద్ధపడగానే, వడిశెలతో అతడు దానిని చంపాడు. కేవలం ఆ చిన్న ఆయుధము, చర్మపు ముక్కదానికి దారము అది… అయితే దానియందు అతడు నమ్మకముంచాడు.
ప్రభువా! మాలో గొప్ప ప్రజ్ఞావంతులు మా మధ్య లేరు; మేము చిన్నవారము, చిన్న ప్రార్థనాపరులమైయున్నాము. అయితే ఈ ఉదయం, తండ్రి గొర్రెల వెంబడి వచ్చుచున్నాము: ఆ స్త్రీ వీధులలో భయంకరముగా తిరుగుతూ సిగరెట్లు త్రాగుతున్న ఆ స్త్రీ, సిగరెట్ల వలన సమాదానం కోరుకుంటున్నది; ఆ పురుషుడు గ్లాసును వాసన చూచి, వెనుక పెట్టుకొనుటకు ప్రయత్నంచేస్తున్న ఆ పురుషుడు; అయితే శత్రువు అతన్ని గట్టిగా పట్టుకున్నది. మంచి చేయాలనుకుంటున్న ఆ అబ్బాయి, లేక అమ్మాయి, చెడ్డ కార్యాల నుండి విడుదల పొందుటకు బలము లేనివారైపోయారు. ఈ ఉదయం, ఆ గొర్రెను కోరుతూ ప్రభువైన యేసు నామములో మేము వచ్చుచున్నాము.
మేము శత్రువును ఎదిరించుచున్నాము, ఎందుకనగా, అది సాధారణ విషయము — ఒక వడిశెల, ఒక ప్రార్ధన. అయితే తండ్రి, మందలోకి తిరిగి దానిని తెచ్చుటకై మేము వచ్చుచున్నాము. మా చేతులలోకి అప్పజెప్పబడిన వాటి నిమిత్తం మేము లెక్కచెప్పవలసివారమై యున్నాము. ప్రజల హృదాయాలలో నున్న విశ్వాసమును తాకినట్లుగా దేవుని శక్తియుండును గాక. పడిపోయిన ఆ ఆత్మ ఈ ఉదయం తిరిగి వచ్చునుగాక. ఈ జీవితము యొక్క శోధనలు వాటిని విడచిపోవునుగాక. అతడు వెళ్ళునుగాక. యజమాని భుజాలపై క్షేమంగా యుండి, తిరిగి తాను క్షేమముతో కొనిపోబడునుగాక. యేసు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
దేవుడు మిమ్మలనందరిని దీవించునుగాక! రేపు మిమ్మలను చూచువరకు, నేను పరిచర్యను సహోదరుడు షకారియన్కు అప్పగించుచున్నాను.
37ఇది నేను అనుకుంటున్నాను. మీ ఎదుట మరియు దేవుని దృష్టికి నేను ఎక్కువ కృపను పొందియుంటినని నిరీక్షణను కలిగియున్నాను. మీ ఎదుట ఒక తప్పయిన దానిని మీకు తెలియజెప్పుటకు నేనిక్కడ నిలబడియున్నానని నమ్ముచున్నాను, నిన్ననే నేను నా యొక్క యాబై-ఆరవ పుట్టిన రోజును దాటియున్నాను. ఇది యొక ముసలివాడైన, ఒక మనుష్యుని వర్తమానము కాదు. నేను చిన్న బాలుడైనైయుండినప్పటి నుండి ఇది నేను నమ్మియన్నాను.
మరియు ఇది సత్యము కానట్లయితే, దేవుడు భుమిపై కలిగియున్నటువంటి అతి బుద్ధిహీనుడను, నేనే ఔతాను. ఈ కారణముకోసమే నేను, నా సంపూర్ణ జీవితమును యిచ్చియున్నాను. మరి నేనిది విధేయతో చెప్పవచ్చా: నాకు పది వేల జన్మలున్నా, నా అభిప్రాయాన్ని నేను మార్చుకొనను.
ఇప్పుడు, స్వస్థత అనునది ప్రతి వ్యక్తికి అందుబాటులో నున్నది, జ్ఞప్తించుకో! స్వస్థత నీలోనే యున్నది. దేవుడు, అత్తి చెట్టును (పీచ్ చెట్టును) ఏదెను తోటలో ఎప్పుడు నాటియుండెనో, అప్పుడే అందులో ఉండే ప్రతి పీచ్ను, ఆయన పీచ్ చెట్టులో ఉంచెను. మీరు చూశారా! పీచ్ చెట్టు లేదా ఏపిల్ చెట్టు, లేదా ఏ పండు చెట్టు భూమిలోని నీరు త్రాగి, అది ఎదగవలసినదే. ఇపుడు, ఆ సంభావృతా బలములు కలిగిన ప్రతి ఒక్కరు మీకు అందించుటకు మీలో మీరే కలిగియున్నారు, ఎందుకనగా, అది దేవుడైయున్నాడు. మీరు క్రీస్తులో బాప్తిస్మము వలన (నీటి బాప్తిస్మము వలన కాదు) ఆత్మ బాప్తిస్మము వలన నాటబడినప్పటి నుండి కలిగియున్నారు. నీటి బాప్తిస్మము వలన మీరు క్రీస్తులోనికి రారు — ఆత్మ సంబంధమైన బాప్తిస్మము వలన వచ్చెదరు. ప్రభువు చిత్తమైతే, రేపు మధ్యహ్నాం, దాని మీద నేను మాట్లాడబోవుచున్నాను. దాని యొక్క నిజమైన సారాంశము ఏంటి-ఏలాగు అనునది మాట్లాడుదును. మధ్యహ్నాం మనకది ఉన్నది కనుక, అది మీ యితర కూటములతో అడ్డుతగులదు.
38ఇపుడు, చూడుడి! ఇక్కడున్న మీరు ఒక్కొక్కరు విశ్వాసులుగా నిలబడియున్నారు. ఔనా! ఆలాగైతే క్రీస్తులో నున్న జీవము మీలోనున్నది. మీరది గ్రహించగలిగితే, అది చేయగలదు. మిమ్మలను దాని నుండి నిలుపచేయుట, మిమ్మలను అంధులనుగా చేయుట, అది సాతాను పనియౌతుంది. వాడు మిమ్మలను గ్రుడ్డివారగునట్లు చేయగలదు. గమనిస్తున్నారా! అనగా నీవెక్కడకు వెళ్ళుచున్నావో, నీకు తెలియదు. గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు అతడెక్కడకు వెళ్ళుచున్నది, ఆతనికి తెలియదు. చూడగలిగిన ఒకని అంతర్ద్రుష్టి అతడు వెదక వలసి ఉన్నది. మనం అర్థం చేసుకొనే వరకు సత్యమనగా ఏమిటో ఒకరు మనకు చెప్పవలసియున్నది.
క్రీస్తు, నీ కొరకు చనిపోయాడు, నీవు లోకములో నుండి తీయబడి క్రీస్తులో నాటబడితివి. నీలో అవసరమైన ప్రతిది కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మము వలన నీలోనేయున్నది. అది నిజము కాదా? నీవు చేయవలసినది ఓకటే, కేవలము దానిలోనిది త్రాగుటకు మొదలు పెట్టుము.
39చెట్టు ఏలాగు త్రాగుచు, అది దాని ఆకులును దాని మొగ్గలును మొలిపించును, మరియు ప్రతి సంవత్సరము ఫలము యిచ్చుచున్నది. ఫలము నేలలో లేదు, ఫలము చెట్టులో ఉన్నది. ఎంతమంది అది అర్థం చేసుకున్నారు, వారు "ఆమేన్" అని చెప్పండి.
కనుక, చూడుడి! ఫలము చెట్టులో ఉన్నది. ప్రతి చెట్టు కూడా దాని ఊటలోనిది త్రాగవలెను. వర్షము వచ్చి ఆ మొక్క త్రాగుటకు, దానికి ప్రాణముయిచ్చును. అది త్రాగుకొలది, అది పెరుగుతుంది. నిండుగా మొగ్గవేయు స్థితికి వచ్చువరకు పెరుగుతుంది. సంఘము ఏలాగు వర్ధిల్లి అత్యున్నత దశనొందుకొనునో ఆలాగుండును. ఈ కాలములో ఏలాగు వికసించునట్లు చేయునో ఆలాగు చేయును. మనము త్రాగుతూ, ఎదుగుతాము. అయితే మొక్క త్రాగుటకు నిరాకరించినట్లయితే, ఆలాగైతే మొక్క ఎదుగలేదు. అది యిప్పుడు, నీవు కేవలము నమ్మినట్లయితే!
MARK 16:17,18
40పరంపరంగా, నీవు ఏ కార్యాలు చేసితివో, నీవేమి చేయకూడదో మొదలైనవి కూటములలో ప్రభువు పలువిషయాలు చూపించును! ఔనా! ఈ ఉదయం పరిశుద్ధాత్మ మనపైకి దిగి వచ్చి, ఆలాటివి మనము నిలబడియుండుగనే చేయునని మనం నిరీక్షించియుంటిమి. అయితే నేను ఎదురుచూచున్నాను. ఇది ఉద్రేకముగల భాగమని అనుకుంటున్నాము. క్రింద అంతస్త వారు యిక్కడ నుండి మనలను రమ్మని కోరుచున్నారని అనుకొంటున్నాను. చూశారా! వారు మనకై ఎదురుచూచుచున్నారు. మనమే యిపుడు ఆలసమైపోయాము. అయితే ఇది విశ్వసించుము, నీ నిండు హృదయంతో, దయతో చేయుము!
నేను ఒక నమ్మకమైన వ్యక్తిగా మీ దృష్టికి నేను కృప పొందితే, ఇది నమ్మండి. ఇప్పుడు ఒకరిపై-ఒకరు చేతులుంచండి. చూడుడి, "విలియం బ్రన్హం వలన ఈ సూచక క్రియలు జరుగును," అని బైబిల్ చెప్పుట లేదు. "ఇది ఓరల్ రాబర్ట్ ను మాత్రమే వెంబడించును," అని చెప్పలేదు. "ఇది సహో, కోప్ ను లేక మరోకరినే,"అని చెప్పులేదు.
"ఈ సూచక క్రియలు వారిని వెంబడించును (బహువచనము) నమ్మిన వారివలన; వారు రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థతనొందుదురు. నీలో నున్న దేవుని యొక్క శక్తి అది. నీవు చేయి పెట్టిన వ్యక్తికి జీవము తెచ్చునది. పరిశుద్ధాత్మ యొక్క జీవమిచ్చు వనరు అది.
MARK 16:18
41ప్రియమైన దేవా! యేసు క్రీస్తు నామములో సంఘమున్నటువంటి ఈ సంకట సమయమున, భయభీతులు లేనివారై ఈ రెండవ దానిలో నిలబడుదురుగాక. సమాధిలో నుండి క్రీస్తును లేపిన శక్తి, వారు రోగుల మీద చేతులుంచినపుడు "వారు స్వస్థతనొందుదురు" అను యేసు ఆజ్ఞయగు, సువార్త సత్యముకై వారిని జీవింపజేయును గాక. ప్రతి ఒక్క దయ్యపు శక్తి, ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రజలకు సంభవించే ప్రతి హింస, విశ్వాసమును బట్టి ఇపుడే, అది విడచిపోవును గాక! నమ్ముచున్న వారముగా, యేసుక్రీస్తు నామములో మేమది అడుగుచున్నాము. ఆమేన్. అది ఆయన చేయునుయని మీరు అది నమ్మినట్లయితే, యిపుడు మీ చేతులు పైకెత్తి, ఆయనకు స్తుతి సమర్పించుడి.
ప్రియమైన దేవా! ఇది జరుగకపోతే, ఈ బిడ్డ చనిపోతుంది, ప్రభువా! యేసుక్రీస్తు నామమున ఈ ముడిని నేను గద్దిస్తున్నాను. ఈ అమాయిక బిడ్డను ఇది విడచిపెట్టును గాక. ఆమేన్. వైధ్యులు ప్రయత్నించారు. విఫలులైపోయారు. నమ్మికమాత్రము ఉ౦చుము.