ఆయన వాక్యమును రుజువు చేయుట
1ఒక క్షణము పాటు తలలు వంచుదము. ప్రియ పరమతండ్రీ, ఈ రాత్రి ఇక్కడ మేమున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇక్కడ మాతో నీ సన్నిధి ఉన్నదని మేమెరిగినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మా యొక్క ప్రతియొక్కరి అవసరత చొప్పున నీవు పనిచేయమని నీకు ప్రార్థించుచున్నాము. దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనండి.
ఈ మైక్రోఫోనులను మరల పనిచేయించుట చాలా బాగున్నది. నిన్న ఒక రకంగా తికమక పడిపోయినందుకు చాలా విచారించుచున్నాను, మీకు అందించగోరిన వర్తమానము అయన వాక్యమును రుజువు చేయుట దానిని మీరు చూచుటలో ఖచ్చితంగా ఉండవలెనని నా కోరిక. మనకున్న లంగరు అదే. ఒక సంఘము ద్వారా మనము లంగరు వేయబడలేదు, క్రీస్తునందు మనము లంగరు వేయబడియున్నాము. మీరు చూడండి. ఆయన మాత్రమే ఆ మార్గము. ఆయన మాత్రమే దాగు చోటు, దేవుడు ఎన్నటికీ ఆయన నామమునుంచిన చోటు అదే.
ఆయన తన నామము ఉంచుటకు ఏర్పరచుకొనిన స్థలములో మాత్రమే ఆయన జనులను కలిసికొనునని ఆయన చెప్పెను, ఆయన ఏర్పరచుకొనిన గవినిలోనే తప్ప మరే గవినిలోను కాదు. ఆ స్థలములో, అక్కడ మాత్రమే ఆయన జనులను కలిసికొనును. తన కుమారుడగు యేసుక్రీస్తుకు తప్ప మరెక్కడనూ ఆయన తన నామమును పెట్టలేదు, ఎల్లప్పుడూ కుమారుడు మాత్రమే తండ్రి యొక్క నామమును తీసికొనును.
JOHN 1:1,14•
REV 19:13
2"మంచిది, అది ఈనాటికి ఏ విధముగా వర్తించును?" అని మీరనవచ్చును. ఎందుకనగా ప్రతివారు, "మేము యేసు నామములో ఉన్నాము" అని చెప్పుకొనుచున్నారు. ఆయన వాక్యమైయున్నాడు. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెను."
మరలా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో కూడా దీనిని వ్రాయబడియున్నది, ఆయన వచ్చుటను మనము చూచినప్పుడు, వధువు మరియు వరుడు, ఆయన వస్త్రము రక్తములో ముంచబడినదై, ఆయన నామము "దేవుని వాక్యముగా పిలువబడెను." ఆయనే దేవుని వాక్యమైయుండెను. ఆయన జీవింపచేయు శక్తియైయున్నాడు. ఆయనే పరిశుద్దాత్మ, యాంత్రికమైన దానిని కదిలించు శక్తి — వాక్యము, అదే జీవింపజేయుచున్నది. మరియు అవన్నియూ కలిసి ఏకముగా క్రియ చేయవలెను, లేనియెడల అది క్రియచేయదు. పరిశుద్ధ గ్రంథమంతటినీ, క్రీస్తునంతటినీ, సంపూర్ణ సువార్తను తీసికొనవలెను.
3నిన్న రాత్రి తేలివిజన్లో నేను చూచిన ఆ బృందముతో నేను దీనిని చెప్పవలెనని ఆశించుచున్నాను. ఆ కార్యక్రమము ప్రదర్శించబోవుచున్నారని నేను ముందుగానే ఎరిగియుండుట వలన నేను దానిని చూచితిని. ఆ బృందములోయున్న సంహోదరులను నేను మెచ్చుకొనుచున్నాను. ప్రశ్నలకు జవాబిచ్చుటలో వారు ఎంతో పరిపూర్ణ సామర్థ్యమును ప్రదర్శించిరి! నేను చాలా విమర్శకుడను అని మీరెరుగుదురు. కాని అందులో విమర్శించుటకూ ఏమీ లేదు. అది అక్షరాలా వాస్తవమైనది. దానితో నూటికి నూరు పాళ్ళు నేను అంగీకరించుదును. వందనములు. ఆమేన్! ఆ జవాబులు అంశమునకు సూటిగా యున్నవి. దానిని నిశ్చయంగా నేను ప్రశంసించుచున్నాను. ఇంటియొద్దనున్న నా సంఘమునకు అది చూపించ కలుగునట్లు ఒక చిత్రమున్నచో బాగుండునని కోరుచున్నాను. అది నిజంగా ఎంతో బాగున్నది.
MATT 25:10
4మన స్వంత పెంతెకోస్తు పరిధులలోనే గాక, ఇతర పరిధులలోను దేవుడు జీవించుచూ పనిచేయుచున్నాడని ఎరిగి నేను ఎంతగానో వందనములు చెల్లించుచున్నాను. దేవుని బీజములైన తన వారిని, ఆ మనుష్యులను ఏరుకొనుచూ యున్నాడు. ఆ వెలుగు తమ మీద ప్రసరించబడవలెనని ఎన్నో సంవత్సరముల నుండి వారక్కడుండి కనిపెట్టుచున్నారు.
స్నేహితులారా, అది మనకు ఒక హెచ్చరికను కూడా ఇచ్చుచున్నది. యేసు ఈలాగు చెప్పెనని ఎరుగుదుము, "ఈ నిద్రించుచున్న కన్య నూనె కొనుటకు రానారంభించినప్పుడు పెండ్లికుమారుడు వచ్చెను. "ఎపిస్కోపీలియను, ప్రెస్బిటేరియను, మొథడిస్తు, బాప్టిస్తు, లూథరును వారు నూనె కొనుటకు వచ్చుచున్న ఈ ఘడియలో పెండ్లి కుమారుడు వచ్చునని ఇందువలన మనకు తెలియుచున్నది. దానిని మనము జ్ఞాపకము చేసుకొందుము.
5నా కుమారుడగు బిల్లీ ఎన్నడూ నాకు చెప్పని రీతిగా కొద్ది క్షణముల క్రితము చెప్పుట జరిగినది, "నాన్న గారూ, మీరేమి చేయాలో నేను శాసించుట లేదు. ఏదో చెప్పి మిమ్మల్ని వత్తిడి పెట్టుట కాదు, కాని మీరు సమయమంతటినీ రోగుల కొరకు వెచ్చించుట బాగుండును. నేను ఎన్నడూ ఇందరు రోగులను చూడలేదు. దాదాపు ఒకటి రెండు నిమిషాల్లో రెండు వందల కార్డులు నేను ఇచ్చాను. చాలా మంది రోగులున్నారు." అతడు ఎప్పుడో గాని ఆలాగు నాతో చెప్పడు.
ఈ రాత్రి రాబోవు తీర్పును గూర్చిన కొన్ని వ్యాఖ్యాలు కొద్ది నోట్సు వ్రాసికొని మీ యొద్దకు వచ్చాను. దేవుని యొక్క ఉగ్రత మనలను కదిలించబోవు సమయములో నేడు రాత్రి ఇక్కడ కూర్చొనియున్నాము. అది త్వరగానే సంభవించును. దేవుని యొక్క ఉగ్రత కాచుకొనియున్నదని మనము ఎరుగుదుము. ఆలాగు చెప్పబడిన క్షణములోనే మిలియనుల మంది అవకాశము కోల్పోవుదురు. దానిని నేను నా హృదయములో ఎరుగుదును. ఆ విధముగానే యుండునని ఎరుగుదును! చాలామంది రోగులు త్రోసుకుంటూ, లాగుకొనుచు ముందుకు దూసికొని వచ్చుట మనము చూచుచున్నాము.
"ఈ రాత్రి వారిలో అనేకులు క్రైస్తవులే" అని తలంచుచున్నాను. దేవుని పిల్లలగు మీకు దీనిని చెప్పనీయండి. మీరేమి చేసినా గాని దానిని సక్రమముగా జరుగనీయుడి. మీ పూర్ణహృదయములతో మీరు దివారాత్రులు దేవుని సేవించుచున్నారు. ఒక పొరపాటున్నయెడల దానిని మీరు గ్రహించుదురు. మీరు వీధులలో నడచుచూ దానిని చెప్పగలరు. ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పగలరు. మీరు ఆత్మ సంబంధులైన ఎడల దానిని గ్రహించెదరు. మీరు అలాటి వారేనని నాకు తెలియును.
6నేను సహో స్టోమైతో ముచ్చటించుచున్నాను. టోనీ ఇక్కడున్నాడో లేదో నాకు తెలియదు; అతడు [ఒక సహోదరుడు ఏదో పేరు చెప్పెను] టోనీ సలామె, సలామె, సలామె కాదా…? కాదు. ఆ చెప్పినది తప్పు టోనీ. [మరో సహోదరుడు ఇంకేదో చెప్పెను.] కాదు, ఆ టోనీ కాదు. టుసాన్ యోద్ధ ఉండు టోనీ ఇతడు. అతని పేరేమిటి? [ఎవరో "స్టోమై" అని చెప్పిరి.] స్టోమై! సలామె, స్టోమై లేదా మరేదో అట్టి పేరేనని నాకు తెలియును. ఆ గుర్తున్నది.
అతని అంగడిలో ఒక రోజున ఒక వ్యక్తిని చూచాను. అతనిని చూడగా నాకొక జ్ఞాపకము కలిగినది. నేను గతంలో ఇండియాలో దర్శించినప్పటి విషయము అతని మాటలవలన గుర్తుకొచ్చినది. బొంబాయిలో ఇంతవరుకు లేనంతటి గొప్ప గుంపుగల జనులు కూటమునకు ఒకే తరుణమునందు వచ్చినట్లుగా ప్రభువు అనుగ్రహించెనని నేను అనుకొనుచున్నాను. వేల, వేలకొలది జనులు వచ్చుట వలన వారిని ఎచ్చట వుంచాలో తెలియనంతగా ఎచ్చట కూడా మేము ఖాళీ స్థలమును చూడలేకపోతిమి. అక్కడికి మేము చేరుకొన్నప్పుడే ఒక వార్తాపత్రిక అనువదించబడినది. ఇండియా బహు భాషలు గల దేశము. అది ఒక ఆంగ్ల వార్తాపత్రిక. అందులో ఇట్లున్నది, "భూకంపము ఇక రాదు, పక్షులు తమ గూళ్ళకు తిరిగి వెళ్ళుచున్నవి."
7అంతట కొద్ది దినముల ముందు భూకంపము వచ్చెను, కంచెలు గోడలు చిన్నాభిన్నమాయెను… చిన్నపిట్టలు రాళ్ళలో తమ నివాసములు, గూళ్ళు నిర్మించుకొనెను. మధ్యాహ్నమందు సూర్యుడు నిటారుగా పడి బహు వేడిగానుండును. ఆ సమయములో పశువులు గోడల నీడయొద్దకు వచ్చి నిలబడును. రెండు రోజుల పాటు పక్షులు చెట్ల మీదనే నిలచియుండినవి. అవి తమ గూళ్ళ యొద్దకు రాలేదు. రెండు రోజులపాటు ఆ జంతువులు, పశువులు, గొర్రెలు యధాప్రకారము ఆ రాత్రి గోడల నీడ యొద్దకు రాలేదు. అవి ఆ దూరాన పొలములలోనే నిలచియుండి అక్కడే ఒకదానికొకటి నీడగా ఉండినవి. అంతట ఆకస్మాత్తుగా భూకంపము వచ్చెను. గోడలు, భవనములు శిధిలమై పడిపోయినవి. చూడండి, ఆ చిన్నపిట్టలు అక్కడ నిలచియుండినయెడల నాశనమై పోయియుండును. దాని క్రింది పశువులు, గొర్రెలు నిలబడియుండినయెడల నాశనమై పోయియుండెడివి. దేవుడు ప్రకృతికి హెచ్చరిక ఇచ్చుచున్నాడు!
MATT 11:23
8సహో, టోనీ స్టోరులో మాట్లాడుచుండగా ఒక రోజున విన్నాను. అలాస్కాలో భూకంపము సంభవించినప్పుడు ఇతడు మెక్సికోలోని స్టోనీ పాయింట్ అని మనము పిలచు స్థలములో చేపలు వేటాడుచుండెనట. "పక్షులు ఆహారము తినలేదు, చేపలు ఆహారము తినలేదు. ఏదో జరిగినది అనుకొనుచుండగానే, హఠాత్తుగా భూకంపము సంభవించినది" అని చెప్పాడు.
ఇండియాలోగాని లేక మరెక్కడయినా గాని ఆ విధంగా జరిగిన సందర్భములో మరో రోజున ఒక వ్యక్తి చేపలు వేటాడుచుండెను. "ఇది చాలా వింతగా యున్నదే. ఈ సమయంలో ఆ చేపలు ఆహారమునకు రావలెను. నీరు ఎక్కడా కదలిక కూడా లేదు. నీరు బహు నిమ్మళముగా యున్నది — చేపలు ఆహారము కొరకు రావలసిన చక్కని సమయము ఇది. కాని ఎందుకో అవి రాలేదు. ఆ చిన్న చేపలు, నత్తలు మొదలగు వానిని ఏరికోరి తిను చిన్న పిట్టలు ఎప్పుడూ అక్కడ ఉండెడివి గాని ఆ రోజు ఏవీ లేవు. అన్నీ కూడా దూరాన ఒడ్డున ఒకదానికొకటి హత్తుకు పోయి నడుస్తున్నవి. ఆ తరువాత కొద్ది క్షణములకు సముద్రపు అడుగు భాగము నుండి నాచు పైకి వచ్చుచుండెను. భూమి యొక్క మరో వైపున భూకంపము కలిగినది. చూడండి, ఒక ఆపద రానున్నదని, ఏదో జరుగుబోవుచున్నదని ఆ చేపలకు తెలియును. పక్షులకూ ఆలాగే తెలియును.
ఒక చేపకు, ఒక పిట్టకు దేవుడు వివేచనను ఇచ్చినప్పుడు ఎంత ఎక్కువగా ఆయన తన బిడ్డలకు మరి నిశ్చయముగా వివేచన అనుగ్రహించును గదా! మనము అంత్యకాలమందున్నామని మనకు తెలియును, తీర్పు కాచుకొనియున్నది, కాబట్టి బహు భయభక్తులు కలిగియుందుము. మీ హద్భయమంతటితో దేవుని యొద్దకు పారిపోవుడి. "ఓ! కపెర్నహోమా! నీవు ఆకాశము మట్టుకు హెచ్చింపబడినావు గాని పాతాళము మట్టుకు తగ్గించబడుదువు. " ఈ రోజున అది జలముల అడుగున యున్నది. గుర్తు౦చుకొని ప్రార్ధన చేయుడి.
9ఈ రాత్రి, కొద్ది నిమిషములకు పరిశుద్ధ గ్రంథములో ఇచ్చటయున్న ఒక లేఖన భాగమును చదువగోరుచున్నాను. తరువాత మనము రోగుల కొరకు ప్రార్థించుదుము. ఒక కట్ట ప్రార్థనా అట్టలను ఇచ్చినట్లు బిల్లీ చెప్పెను. నిన్నకూడా కొన్నింటిని ఇచ్చెను; వారిలో ఎవ్వరికీ నిన్న రాత్రి సమయమున నేను ప్రార్ధించలేకపోతిని. పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, నాకు ఆశ్చర్యము కలుగును. దానిని నీవు పని చేయించజాలవు. అది ఒక చిన్న లివర్ వలె యున్నది. నిన్ను నీవు గేరులోనికి లాక్కొనవలెను — నేను కాదు. నీవే ఆ పరిశుద్దాత్మను కార్యరూపములో పెట్టుకొనవలసియున్నావు. నీ కొరకు నీవే దానిని చేయుదువు. కాబట్టి గత రాత్రి నేను గమనించాను, వివేచనలో కూడా జనులను సరిగ్గా ఎత్తి చూపలేకపోయాను. దానిని వారు స్వీకరించునట్లుగా కనబడలేదు. ఇక్కడ దానిని ఈ మధ్యనే నేను కనుగొన్నాను. రోగుల మీద నేను చేతులుంచినప్పుడు వారు కొద్దిగానో, గొప్పగానో ఎరిగినట్లుగా నేను తలంచుచున్నాను.
మన అంతరంగమందు మనకు అనుగ్రహించబడిన దానిని మనము గ్రహించవలెను. యేసుక్రీస్తును విశ్వాసించి, ఆయనాత్మ ద్వారా జన్మించి, పునర్జీవింపజేయు శక్తితో మనము నింపబడియున్నాము, నీలోనే ఆ శక్తియున్నది. శిష్యులు, గడచిన కాలముల యందు ఇంకా వారు చేసిన రీతిగానే, ఇతరులపై చేతులుంచుట చేత అది వ్యాధిగ్రస్తులను తప్పక స్వస్థత పరచుచు, మృతులను జీవముతో లేపుచున్నది. అది దర్శనములను చూపించెను, ప్రవచనములను పలికెను. ఆదికాల అపోస్తలలుల మధ్య జీవించిన ఆత్మయే, ఈనాడు సంఘము మధ్యనూ జీవించుచూ అదే కార్యములను చేయుచున్నది. దానిని మనము వీలయినంత త్వరలో గుర్తించవలెను! చూడండి… అదెంతగా క్రియను చేయుచున్నను, మీరు దానిని గుర్తించి దానిని నమ్మవలెను. దానిని మీరు నమ్మువరకు దానివలన మీకేమియూ లాభము కలుగదు. కాని దానిని నీవు నమ్మిన క్షణమందే నీ శ్రమలు అంతమగును. అది నిజము!
LUKE 8:40-56
10ఇప్పుడు, వాక్య భాగమును చూతము. కొద్ది క్షణముల క్రితము అక్కడ నేను కూర్చొని, రాత్రి నా అంశమును మార్చుకొనుట కొరకు మరికొన్ని లేఖనములు వ్రాసికొన్నాను. దేవుని వాక్యములో నుండి కొన్ని నేను చదువగోరుచున్నాను. పరిశుద్ద లూకా 8వ అధ్యాయము 40వ వచనారంభము నుండి చదువుదము. దీనిని నేను పెద్దగా చదువనైయున్నాను. ఇప్పుడు వినండి.
జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. [ఈ రాత్రి జనులయొక్క వైఖిరి కూడా ఆలాగే చక్కగాయున్నది కదా?]
అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి -
ఇంచుమించు పండ్రెండేండ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి.
అప్పుడు పండ్రండేండ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక స్త్రీ యొవని చేతను స్వస్థత నొందనిదై,
ఆయన వెనుకకు వచ్చి - ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును నీ మీద పడుచున్నారనగా.
యేసు - ఎవడో నన్ను ముట్టెను. ప్రభావము నాలో నుండి వెడలి పోయినదని నాకు తెలిసినదనెను.
తాను మరుగైయుండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి యెదుట తెలియ చెప్పెను.
అందుకాయన - కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్మని అమెతో చెప్పెను.
ఆయన ఇంకనూ మాటలాడుచుండగా, సమాజ మందిరపు అధికారి ఇంటనుండి ఒకడు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను.
యేసు ఆ మాట విని - భయపడవద్దు, సమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్తపరచబడునని అతనితో చెప్పి -
ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అనువారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.
అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచూ, రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను.
ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని - చిన్నదానా, లెమ్మని చెప్పగా, ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను.
అప్పుడాయన - ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవరితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
11ఇప్పుడు మనము ప్రార్ధి౦చుదము. ప్రియ పరమతండ్రీ, ఈ వాక్యము చదువుచుండగా అది సత్యము అని మాకు తెలియును. ఇది జరిగినది. ఒక వార్తా పత్రిక నుండి లేదా ఏదో కల్పిత గాథల పుస్తకము నుండి చదివిన ఏదో ఒక పురాణ గాధ కాదు, కాని ఇది మాకు తెలిసిన గ్రంథమునుండి వచ్చిన దేవుని వాక్యమైయున్నది. ఇది సంభవించినదని మేమెరుగుదుము. ఇక్కడ గుర్తించదగిన రెండు సంఘటనలను యేసు చేసినట్లు మేము నమ్ముచున్నాము. రక్తస్రావముగల స్త్రీని, చనిపోయిన బిడ్డను తిరిగి లేవనెత్తు రెండు సంఘటనలు చూచుచున్నాము. ఆయన దేవునియొక్క కుమారుడని, దేవుడాయనను మృతులలో నుండి లేపి, పరిశుద్దాత్మ రూపములో ఈ రాత్రి మాకు ఆయనను అనుగ్రహంచియున్నాడని మేము నమ్ముచున్నాము.
ఈ రాత్రి ఆయన ఇక్కడ మాతో ఉన్నాడని మేము నమ్ముచున్నాము. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నమ్ముచున్నాము. ఆయన కనికరములు జనులను చేరుచున్నవి. ఆ దినమున ప్రజలు ఆయన యొద్దకు చేరినప్పుడు, ఏ ఫలితములు కలిగినవో, ఈనాడును అవే ఫలితములు కలుగచున్నవి. తాజా అభిషేకము మేము కలిగియుండునట్లు తండ్రీ, కృప అనుగ్రహించుము. సహో.పెకారియన్ కొద్దిసేపటి క్రితము ఎంతో యధార్థముగా ఈ జనులను విశ్వసించుమని అడిగినట్లుగానే మేమును మరల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
MARK 5:25,27,29•
LUKE 8:43,44
12కొద్ది క్షణముల పాటు నేను మాట్లాడగోరుచున్నాను. కొద్ది నిమిషముల పాటు మాట్లాడుదును, ఎందుకనగా ప్రజలు ప్రార్ధనా కార్డులతో ఇక్కడికి వచ్చినప్పుడు వారి కొరకు నేను ప్రార్ధించగోరుచున్నాను, అన్నింటినీ మానుకొని రోగుల కొరకు ప్రార్ధి౦చుదును. రోగులకొరకు మనము ప్రార్థించు ముందుగా మనము జనులను ఆ మనోభావము లోనికి తీసికొని రావలెను. ఆ మనోభావమే ఎల్లప్పుడూ ఫలితములను తీసుకొని వచ్చును. దేవుని వైపుగా నిన్ను తీసికొని వెళ్ళునది ఆ మనోభావమే. ఇక్కడ ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె రక్తస్రావ రోగము నుండి స్వస్థతనొందెను. ఒక సైనికుడు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయన శిరము మీద ముళ్ళ కిరీటము పెట్టినను ఏమీ ప్రభావము చూపలేదు. అది మీ యొక్క సమీపించు విధానముగా నున్నది. ఆ మనోభావమే దీనిని పొందుకొనుచున్నది. ప్రియ స్నేహితుడా, దీనిని పొందుకొనే ఆ మనోభావమే, నేటి రాత్రికి అదే కావలసియున్నది.
మనము యేసుక్రీస్తు సన్నిధిలోనే యున్నామని నమ్ముచున్నాము, కాని ఫలితములను తీసుకొను వచ్చునది అది నీ మనోభావమై యున్నది. యా౦త్రికమైనది ఇక్కడున్నవి, ఆలాగే వాటిని కదిలించు శక్తియున్నది. నీవు ప్రారంభించ కలిగిన చాలు, తక్కినదంతయూ దేవుడు చేయును.
1THS 5:21
13కొద్దిక్షణముల పాటు నేను మాట్లాడనైయున్న అంశము ఇది: "ఆయన వాక్యమును రుజువుచేయుట." దానిని గూర్చి ఆలోచించిన, ఇప్పుడు అది ఏదో ఒక గొప్పదిగా యున్నది. ఆయన వాక్యమును రుజువు చేయుట. దేవుడు ఇంతకు ముందు రుజువు చేసినట్లుగానే నేటి రాత్రియందు తన వాక్యమును రుజువు చేయ సమర్దుడు. పరిశుద్ధ గ్రంథము కూడా ఈలాగు చెప్పెను. "అన్నింటినీ పరీక్షించుము. మేలైన దానిని చేపట్టుము."
ఇప్పుడు మీరు విన్నారు, సందేహము లేదు. పాత సామెత ఈలాగు చెప్పుట విన్నారు గదా, "దానిని రుజువు చేయుము. నేను నమ్ముదును." కాని అది అంత సత్యము కాదు. చాలాసార్లు ఎన్నో సంగతులు రుజువు కాబడుట నేను చూశాను, శాస్త్రీయంగా రుజువుపరచుట నిరాక్షేపముగా చూచియున్నాను; అయినా గాని ప్రజలు దానిని నమ్ముట లేదు.
కొద్దికాలము క్రిందట ఒకాయనతో నేను మాట్లాడుచున్నాను. మేము దైవీక స్వస్థత గూర్చి ముచ్చటించుచున్నాము. "దానిని నేను నమ్మను. ఏన్ని జరిగినా, మీరెన్ని రుజువులు చూపినా నాకక్కర్లేదు, అయినప్పటికినీ నేను దానిని నమ్మను," అని చెప్పాడు. మంచిది, నిశ్చయంగా, అట్టి వ్యక్తి నశించిపోవుచున్నాగాని, అతనికి నీవేమీ చేసినా గాని వారికక్కర్లేదు. అతడు నమ్మజాలడు. అతనికి అందులో నమ్మునది ఏదియూ లేదు.
14ఒక వారము క్రిందట చిన్న అనుభవము ఏర్పడినది, నేను వేటాడుదునని మీరెరుగుదురు. నా కూటము నుండి నేను వెనుకకు వచ్చి సింహపు వేటకు వెళ్ళాను. పిదప ఆరిజోనాకు నేను తరలి వెళ్ళితిని… అది బాగుండినది. పెద్ద మృగములను వేటాడుటయందు నేను ఇష్టపడెదను, మరియు నేను ప్రకృతి మధ్యకు వెళ్ళి దానిని పరిశీలించుచు యుండుట యందు నేను ఇష్టపడుదును.
ఇప్పుడు, నేను ఒక హంతకుడిని కాదు. కేవలం వేటాడుదును. కాబట్టి నేను వేటకు వెళ్ళి జంతువులను నాశనము చేయగోరను. ఆ విధముగా చేయుట మంచిది కాదని నేను తలంచెదను. దానిని మీరు ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశ్యము లేకుండా దానిని వేటాడి చంపుటమనేది, వేరే దేనినైనను చంపుట ఎంత పాపమో, అది అంతటి పాపమైన క్రియయని నేను తలంచెదను. అది తప్పు అని నేను నమ్ముచున్నాను. ఆలాగు మనము చేయరాదు. దేవుడు వాటిని మన ఆహారము మరియు ఒక ఉద్దేశ్యము కొరకు ఇచ్చియున్నాడు. వాటిని మనము నాశనము చేయరాదు. కాని ఇప్పుడు మీరు చట్ట ప్రకారము జరిగించవచ్చును, మంచిది. వాటిని పాడుచేయవదు.
నేను అక్కడికి వెళ్ళాను. ప్రతిదానికి అది యుక్తమైన సమయమైయుండెను. సింహములు చాలా పశువులను చంపివేసినవి. దేశములోని చాలామంది కాపరులను నేనెరుగుదును. ఒకటి చంపబడిన ప్రతి సమయములోను వారు నన్ను పిలుచుచుందురు.
సింహము గొర్రెల మధ్యకు వెళ్ళును. నా స్నేహితుడు ఒకాయన ఒకే రాత్రిలో దాదాపు ముప్పది అయిదు వందల డాలర్ల ఖరీదుగల వాటిని పోగొట్టుకొనెను. ఆ గొర్రెలను ఒక సింహము ఒక్క రాత్రిలోనే చంపెను. ఆ సింహము చేసిన పాపమునకు ఆ తక్కిన సింహములన్నియూ మూల్యము చెల్లింపవలసి వచ్చెను. కాబట్టి అది నాకు దొరికినది, అది చాలా పెద్ద సింహము, తొమ్మిది అడుగల పొడవైనది, చాలా బరువు తూగినది. అది చాలా పెద్ద సింహము.
15నేను ఆరిజోనా దేశము నుండి ఊతాకు వేటకు వెళ్ళాను. నాతో పాటు వేటాడనై యున్న వ్యక్తి ఒక ప్రభుత్వము తరపు వేటాడు వ్యక్తియని అచ్చట యుండు జనులు నాతో చెప్పిరి. "దయచేసి మీ మంచి కొరకై అతడితో మతసంబంధమగు దేనిని గూర్చి మాట్లాడవద్దు, అతడు ఒక కఠినమైన వ్యక్తి" అని చెప్పిరి.
నాతో వచ్చుచున్న వ్యక్తితో నేను "దానిని గూర్చి నేను ఏమి మాట్లాడను" అని చెప్పితిని.
అతడిట్లు చెప్పెను, "బోధకుడా, ఏమియూ చెప్పవద్దు. ఏమైనా దానిని గూర్చి చెప్పినచో, నీవు మరలా ఎన్నడూ వేటకు రావు సుమా! అతడు నిన్ను వేటాడ రానీయడు. అతనితో నేను మూడు దినములు వేటాడాను, ప్రతి రాత్రి అతనితో నేను పరుంటిని, ప్రతిరోజు అతనితో భోజనము చేశాను. అతడు కనీసము "శుభోదయము, ఎట్లున్నావు?" అని కూడా ఎన్నడూ పలుకరించలేదు. నీకు తినుటకు ఏమైనా కావాలా? గిన్నెలు కడుగు అని గాని చెప్పలేదు. ఏమి పలుకలేదు. కాబట్టి నేను అతనియొద్ద ఏమీ ప్రస్తావించలేదు."
"నేను ఒక్క మాట కూడా పలుకను," అని చెప్పాను. కాని నేను ప్రార్ధి౦చుదునని మాత్రము చెప్పలేదు, కాని నేను ప్రార్ధి౦చుదునని మాత్రము అతనికి చెప్పుచునేయుంటిని.
16కాబట్టి మేము అక్కడికి చేరుసరికి అర్ధమయినది, అతడు చాలా కఠినమగు గుణము గల వ్యక్తి. అతనికి దేనియందు నమ్మకమే లేదని నేను తలంచితిని. అంతకు కొద్ది రాత్రుల ముందు చనిపోయిన శిశువు అతనికి పుట్లెను.
మేము వేటకు వెళ్ళాము. రెండవ రోజున… నాతో కూడా వేటకు వచ్చిన వ్యక్తి నేను దేశములోని ప్రతి ప్రాంతములోను వేటకు వెళ్ళినట్లుగా అతడితో చెప్పెను. నాతో వచ్చిన వ్యక్తి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయెను. మేము ఆ కొండపైకి వెళ్ళితిమి. ఒక సింహమును మేము తరిమినాము, అది రాళ్ళలోనికి పోయి తప్పించుకొన జూచినది. కాబట్టి మేము ఆ తరిమిన కుక్క తిరిగి వచ్చువరకు కూర్చొని కనిపెట్టుచున్నాము. అప్పుడు ఈయన నాతో ఈలాగు అడిగాడు, "నీ స్నేహితుడగు ఆ వేటగాడు నీవు ప్రతిచోటను వేటాడినట్లుగా చెప్పెను. నీవు చాలా డబ్బు సంపాధించియు౦దువు? అయినా నాకది అనవసరం అన్నాడు.
"లేదండీ. చాలా డబ్బు ఏమీ లేదు. నన్ను ఎవరెవరో ఆర్థిక సహాయము చేసి పంపిరి," అన్నాను.
"ఓ! ఆలాగా! అయినా నాకెందుకు గాని, నీవు పనిచేయు ఒక సంస్థ నీకు ఆర్థిక సహాయము చేసెనా?" అనడిగాడు.
అతడు నా నుండి సూటిగా జవాబు లాగుచున్నాడు! నేనేమో అతనితో ఏమీ మాట్లాడనని వాగ్దానము చేశాను, చూడండి. "అయ్యా నేను ఒక బోధకుడను, ఒక సువార్తకుడిని" అని చెప్పాను.
"ఏమిటి"? అన్నాడు.
సువార్తకుడివి. నావైపు అతడు నిలబడి కొద్ది నిమిషములు చూచాడు. "ఈ జీవితము అయిన పిదప నీకేమైనా నిరీక్షణ గలదా? నీ నిరీక్షణ ఏమిటి?" అనడిగాను.
"నేను జాక్ మార్మన్ను" అని అతడనెను.
"ఏమిటి"? అని అడిగాను.
"జాక్ మార్మన్ను" అని అతడు చెప్పెను.
"అదే రకమైనది?" అనడిగాను.
"ప్రమాణము చేసి కాఫీ త్రాగి సిగరెట్లు కాల్చువారు," అన్నాడు.
"సరే, యధార్ధపు ఒప్పుకోలు ఆత్మకు మేలు" అన్నాను.
17అప్పుడతడు ఇట్లనెను, "ఒక సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. ఉన్న వాటన్నింటిలో మార్మన్ చర్చి ఒక్కటే సత్యమైనది అని నాకు చెప్పిరి, అది మీరు నమ్ముదురా?"
"సంఘము మాటకొస్తే అది తక్కిన సంఘములకు ఏమీ తీసిపోదు. నాకు ఒకే ఒక్క సత్యము తెలియును, అది యేసుక్రీస్తు. ఆయన సత్యవంతుడని నాకు తెలియును," అన్నాను.
"సరే, ముందు రాత్రి నాకు చనిపోయిన బిడ్డ జన్మించెను. ఈ శిశువు జీవము లేక పుట్టెను గనుక దేవుడు అసలు జీవవాయువు ఊదలేదనియు, ఇక నేనెన్నడూ చూడననియు చెప్పిరి. దానిగూర్చి నీ అభిప్రాయమేమిటి?" అని నన్నడిగెను.
"మంచిది," నేనిట్లు చెప్పాను, "నీవు జాక్ మార్మన్ లాగులేవు. నీవు నిశ్చయముగా చూడలేవు. ఒక కార్యము నిశ్చయము. అదేమనగా, నీవు ఒక జాకే మార్మన్ గా యున్నంతవరుకు దానిని నీవు చూడనే చూడలేవు."
అతడు మంచిది, అతడు నన్ను త్రోయుచున్నాడు గనుక నేను అతనిని కొద్దిగా త్రోయసాగాను, మీరు చూచారా.
"సరే నీ సంగతి ఏమిటి?" అని అడిగాను
"ఓ! నాకేమీ తెలియదు. మంచిది, నీవేమీ తలంచుచున్నావు?" అనడిగాడు.
"నాకు చాలా మంది మంచివారితో పరిచయమున్నది," అన్నాను.
JER 1:5
18అతడు మార్మన్ అని నాకు తెలియదు, మరియు నేను… అయితే ఊతా నుండి వచ్చెను — గనుక బహుశా ఇతడు ఆ గుంపుకు చెందియుండు ననుకొన్నాను. అయితే నేను… ఎందుకనగా సాల్ట్ లేక్ పట్టణము చుట్టనున్న వారిలో చాలామంది మార్మన్లే. అయినా ఇది సాల్ట్ లేక్ పట్టణము కాదు. "చాలా చక్కని మార్మన్ స్నేహితులు ప్రార్ధన వరుసలలో నిలబడుటను నేను ఎరుగుదును, మంచివారు" అని తలంచాను. "నేను చాలా చక్కని మార్మన్ వారిని కలిసికొన్నాను."
అతడు చెప్పెను, "మంచిది…"
అతడు చెప్పెను, నేను అయితే వారి బోధ నాకు తెలియదు. వారి బోధకు భిన్నముగా నేను ఏదీ మాట్లాడ తలచుట లేదు, ఎందుకనగా అది మీ విశ్వాసము, దానిని నేను ఎంతగానో గౌరవించుచున్నాను. "సరే, మీరు దానిని నమ్ముచున్నారా?" అనడిగాను.
"అవును. నేను నమ్ముచున్నాను గాని, ఆలాగు జీవించుట లేదు." అన్నాడు.
నేనిట్లు చెప్పాను, "లోకపు పునాది వేయబడకముందే, లక్షలకొలది సంవత్సరాల క్రితమే దేవుడు ఆ శిశువును ఎరుగునని పరిశుద్ధ గ్రంథము ఉపదేశించుచున్నది. దానిని నేను నమ్ముచున్నాను. దేవుడు యిర్మియాతో ఈలాగు చెప్పెను; నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. కాబట్టి ఆ శిశువు గూర్చి ఆయన ఎంతగానో ఎరుగును" అన్నాను.
"సరే వందనములు" అని అతడు పలికెను. అతడు కొండ దిగ నారంభించెను.
అంతట ఈ మరో వ్యక్తిని కలిసికొనెను, అతనితో ఇట్లనెను, "ఆయన బోధకుడని నీవెందుకు నాకు చెప్పలేదు?" అతనితో ఇతడు కొంతసేపు మాట్లాడి కూటముల గూర్చి చెప్పసాగెను.
19కాబట్టి మేము మార్మనులు ప్రవచనమును నమ్ముదురు. నాకు తెలియదు… ప్రవచించువారెవరూ లేకపోవచ్చును గాని ప్రవచనమును నమ్ముదురు. బహుశా నేను వేరే రీతిగా మాట్లాడుచున్నానేమో గాని, అయినా నా అవును. సరే కాని, ఏది ఎలాగయున్నను, నమ్మెదరు. వారు నమ్మెదరు. అతడు నాయొద్దకు వచ్చి ఇట్లనెను, "నీవు ఒక ప్రవక్తవని నాకు అర్ధమయినది."
"కాదండీ. ప్రభువు కొద్ది సంగతులు జరుగబోవునవి చూపించెను," అన్నాను.
ఆ వెంటనే అతడు వెళ్ళిపోయెను. "లోనికి వెళ్ళుదాం," అని చెప్పెను. అతడు తన కారులో ఎక్కి అతడు నివసించుచున్న స్థలమునకు దగ్గరలో గల చిన్న పట్టణమునకు వెళ్ళెను. కొద్దిక్షణముల తరువాత మాకు కనబడలేదు.
మధ్యాహ్న-భోజనము అయిపోయిన వెంటనే వేటకుప్రమించుటకు మేము కుక్కలను తయారు చేయుచుంటిమి. అది మేము సిద్ధపరచగానే అతడు కారులో వెళ్ళిపోయెను. కొద్ది క్షణములలో దాదాపు పదిహేడు సంవత్సరముల చక్కని యువకుడు అక్కడికి వచ్చెను. నిజంగా పవిత్రముగా కనబడుచున్న క్రైస్తవ యువకుడు. "ఈతడు నా సోదరుడు. ఇతడు జాక్ మార్మన్ కాదు, ఒక నిజమగు మార్మన్" అని నాకు పరిచయము చేసెను.
"కుమారుడా, బాగున్నావా?" అనడిగాను.
"నీవు ఒక ప్రవక్తవని నా సోదరుడు చెప్పగా, నేను అర్ధము చేసుకున్నాను" అని అతడు అన్నాడు.
"కాదు. నేను ప్రవక్తను కాదు. జరుగనైయున్న సంగతులను ప్రభువే నాకు చూపించెను," అన్నాను.
అతడిట్లు చెప్పెను, "నా చేతిలో తుపాకీ ప్రేలిపోయినది. నేను శస్త్రచికిత్స బల్ల మీదకు ఎక్కబోవుచున్నాను, కాని నా సోదరుడు నీ గూర్చి చెప్పెను. ఆలాగయితే నాకు శస్త్రచికిత్స అవసరము లేదు అన్నాడు."
అతడు నా కళ్ళలోనికి సూటిగా, యధార్ధంగా, నిజంగా చూచి, "నీవు నా మీద చేతులుంచుము. ఇవి నిజమైనచో, నాకు శస్త్రచికిత్స అక్కర్లేదు" అని చెప్పెను. అతడు స్వస్థత పొందుకొని ఇంటికి వెళ్ళెను!
20నాకు క్రైస్తవ స్నేహితుడుగానున్న నాతో వేటాడుచున్న సోదరుడు ఫోనిక్సు నుండి వచ్చెను. అతడు చెప్పెను, అందులో కొందరు బాలురు ఇప్పుడిక్కడ కూర్చొని యున్నారు. అందులో నాకు తెలిసిన ఒకరు ఇక్కడే కూర్చొనియున్నారు. మేము ఇంటికి వెళ్ళాము. అతడిట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, ప్రభువు నీకు ఒక దర్శనము చూపించి ఏమి జరగనైయున్నదో ఈ మార్మన్లకు చెప్పితే చాలు, ఎందుకనగా వారు అందుకే ఎదురు చూచుచున్నారు."
కాబట్టి నేను ఎంతగానో ప్రార్ధి౦చాను. ఇంటికి తిరిగి వస్తూ మార్గ మధ్యములో… మరుసటి సోమవారము. ఆదివారము దాదాపు పది గంటల ప్రాంతములో ఆ ఉదయకాలపు సంఘారాధన అయిన పిదప గదిలో నిలబడి వెలుపల చూస్తున్నాను. దీపములు ప్రకాశించుచున్నట్లుగా ప్రకాశించుచుండెను, లేదా ఏదో ఒక విధమైన ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించుచున్నట్లుగా నేను చూచాను. ఒక చెట్టులో ఒక సింహము నాకు కనబడుచున్నది. అది నేను గురి చూచి కాల్చుటకు చాలా చిన్నగా యున్నది. దానిని నేను కోరలేదు. దానిని మరెవరో కాల్చిరి. దానిని వారు చాలా పెద్ద తుపాకీతో పేల్చిరి — అది సింహమును చీల్చివేసెను. వారు ఆ విధముగా చేసిన కార్యము నాకు నచ్చలేదు.
21నేను ఫోనిక్సుకు వచ్చినప్పుడు దానిని సోదరులు డాసన్ మరియు మోస్ట్రేలకు చెప్పాను. (అతడిక్కడున్నాడని నాకు తెలియును. ఇక్కడే ఎక్కడో అతనిని నేను చూచాను.) అతడు అతని భార్య నాతో వచ్చుచుండిరి. "మీరు కనిపెట్టి చూడండి. ఇది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇది ఆ రీతిగా జరుగనైయున్నది" అని చెప్పాను.
దాదాపు నాలుగయిదు రాత్రులు మేము కనిపెట్టి చూచాము, కొన్ని దినములు మేము వేటాడాము. రాత్రిలో సింహమును నీవు చెట్టు మీదికి తరుముట అరుదుగా జరుగును. ఇంటికి వచ్చుచుండగా వారు కుక్కలను విడిచిపెట్టిరి, ఈ మార్మను కుర్రవాడు వేటగాడు. కుక్క సింహము వెళ్ళిన జాడను వెంబడించి దానిని చెట్ట మీదికి తరిమెను.
వారు రాత్రి పది గంటల వేళలో మా యొద్దకు వచ్చి మేల్కొలిపిరి. మేము అక్కడికి వెళ్ళాము. అదే రకమగు సింహము చెట్టు మీద ఉండినది. టార్చి లైట్లు వేసి, సహో, మోస్లే నలుబది నాలుగు కాలిబర్ తుపాకితో పేల్చగా సింహము రెండుగా చీలి పోయినది. అది అచ్చట సరిగ్గా చెప్పినట్లుగానే జరిగినది.
ఆ మరుసటి రోజు ఆ ప్రాంతపు ప్రధాన అటవీ అధికారిని కలిసికొన్నాను. అతడు ఒక జాక్ మార్మన్. ఆ కుర్రవాళ్ళను క్రీస్తు యొద్దకు నడిపించుట జరిగినది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నేను మీతో చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యమును ఆ విధముగానే రుజువు చేయుచున్నాడు.
GEN 2:17•
DEUT 18:15
22"చూచుటయే నమ్ముట" అని జనులు చెప్పుట మీరు విందురు. అది పూర్తి సత్యము కాదు. చాలామంది చూచుదురు గాని నమ్మకనేయుందురు.
యేసు భూమి మీద ఉండిన దినములలో, ఆయన దేవుని యొక్క బయలుపరచబడిన వాక్యమని జనులు ఎందుకు గుర్తించలేదు? "మీ ప్రభువగు దేవుడు మీ మధ్య నావంటి ఒక ప్రవక్తను పుట్టించును" అని మోషే చెప్పిన మాటను జనులు ఎందుకు గ్రహించలేదు. పరిశుద్ధ గ్రంథములో ఆయన ఏమి చేయునని ఆయన గూర్చి చెప్పబడినవో, ఆ ప్రతీ వాక్యమును ఆయన అక్షరాలా నెరవేర్చెను. కాని వారు దానిని నమ్మలేదు.
అయితే దేవుడు ప్రతి కాలములోను తన వాక్యము నిజము అని రుజువు చేసెను. ఆయన సదా తన వాక్యమును నిరూపించును. "చూచుటయే నమ్ముట" అని వారు కొన్నిసార్లు చెప్పెదరు గాని. ఆలాగు కాదు. దేవుడు ప్రతి కాలములోను తన వాక్యమును రుజువు చేయుచూ వెళ్ళునని మనకు తెలియును.
"ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోదురు" అని ఆదాము మరియు హవ్వలయందు ఆయన ఆ మాటను చెప్పినప్పుడు దానిని ఆయన నిరూపించెనని మనమెరుగుదుము. అది సత్యమని మనము ఒప్పుకొనక తప్పదు. దానిని మనము నమ్ముదుము, ఎందుకనగా దానిని ఆయన మనకు రుజువు చేసెను. మరియు అది సత్యమని దానిని మనమెరుగుదుము.
GEN 2:5•
MATT 24:37•
LUKE 17:26
23దేవుడు తన వాక్యమును రుజువు చేసిన కొన్ని స్థలములను ఇప్పుడు మనము చూద్దాం. ఉదాహరణకు నోవహు దినములను తీసికొందము. విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధమైనదియు మరియు నమ్ముటకు సాధ్యము కాని ఒక వర్తమానమును దేవుడు నోవహునకు ఇచ్చెను. దానిని ఎవరూ నమ్మజాలరు. ఇంతకు ముందెన్నడూ భూమి మీద వర్షము పడలేదు. విజ్ఞాన శాస్త్రమునకు విరుద్ధమైనది.
బహుశా వారప్పుడు మనమిప్పుడు కలిగియున్నదానికన్నా గొప్ప శాస్త్రీయ యుగములో జీవించియుందురు, ఎందుకనగా వారు త్రిభుజాకారములో నుండు దిబ్బలను (పిరమిడ్లను), స్త్రీ ముఖము మరియు సింహపు శరీరాకారము స్పినిక్ష్ వంటి రాతి శిల్పములను మరియు మొదలగు వాటిని ఆ కాలములోనే నిర్మించియుండిరి. వాటిని ఇప్పుడు మనము నిర్మించలేము. వారు ఒక యాంత్రిక శక్తిని కలిగియుండిరి (బహుశా ఇది అణుశక్తి లేక మరేదో అయియుండును) ఈనాడు మనము ఎత్తజాలని మహాబండలను వారు ఎత్త కలిగిరి. వారు గొప్ప శాస్త్రీయ పనులను చేసిరి. వందలాది సంవత్సరములు స్వాభావికముగా కనబడకలుగునట్లు వారు మృతదేహములను భద్రపరచకలిగిరి. ఆ కళను మనము కోల్పోయాము.
"నోవహు దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడలోను ఉండును" అని యేసు చెప్పెను. మరొక గొప్ప శాస్త్రీయ యుగములోనికి మనము ప్రవేశించనైయున్నామని మనకు తెలియును.
నోవహునకు ఇయ్యబడిన వర్తమానము ఆనాటి సంఘములోని నమ్మకమునకు ఎంతో భిన్నముగా యుండియుండును మరియు శాస్త్రీయ పరిశోధనకు కూడా అది ఎంతో భిన్నముగా యున్నాది. కాని దేవుడు తన వాక్యము సత్యము అని రుజువు చేసెను. ప్రవక్త చెప్పినది సత్యము అని దేవుడు రుజువు చేసెను.
GEN 12:4•
GEN 17:16
24ఒక్క క్షణము పాటు మరియొకనిని మనము తీసికొందము. ప్రభువు యొక్క మరో ప్రవక్తయగు అబ్రహాము, వాక్యము అతని యొద్దకు వచ్చెను. అబ్రహాము డెబ్బది-ఐదు సంవత్సరములు, మరియు శారాకు అరువది-ఐదు సంవత్సరములున్నప్పుడు, శారా ద్వారా అతడికి ఒక బిడ్డ కలుగునని అతడికి చెప్పబడెను. అది అవిశ్వాసికి ఒక పెద్ద విస్మయమును కలిగించును. వీళ్ళు చెప్పుకునే టెస్టు ట్యూబు పిల్లలు మరియు ఇంకా మొదలగునవి ఎన్నెన్నో సాధనలను సాధించిన సమస్త విజ్ఞాన శాస్త్రమును కలిగియున్న మనము, ఈనాడు కూడా అటువంటిది ఒకటి సంబవించునని నమ్మగలరా, మీరు ఊహించి చూడండి!
కాని ఇప్పుడు అరువది-ఐదు సంవత్సరములు గల ఈ వృద్దురాలు మరియు డెబ్బది-ఐదు సంవత్సరములుగల ఈ వృద్దుడైన అబ్రహాము యొద్దకు ప్రభువు వాక్కు పచ్చి, అది సంభవించనై యున్నదని అతడికి చెప్పెను. అబ్రాహాము దేవుని నమ్మెను. దేవుడు ఎంతగా మాట్లాడినా, అదెంత సత్యమయినా, అది జరుగవలెనన్నయెడల దానిని అబ్రాహాము నమ్మవలసియుండెను.
అతడు ఏలాగు పరీక్షించబడెనో చూడండి, తన సాక్ష్యముతో అతడు దానిని నమ్మెను. దేవుని నమ్మితినను ఒప్పుదల కలిగియుండిన ఆ వ్యక్తి, ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియున్న మనవంటివాడే. ఇంకా మనము దేవుని నమ్ముచున్నాము. ఆయన వాక్యము సత్యమని మనము నమ్మవలసియున్నాము. అది సత్యము అని ఆయన దానిని రుజువు చేయును, కాని దానిని మనము నమ్మవలెను.
25ఇప్పుడు అబ్రాహాముకు ఎదురైన అవాంతరమును చూడండి. మొదటిది అతని యొక్క వయస్సు, డెబ్బది-అయిదు సంవత్సరములు, శారాకు అరువది-అయిదు స౦వత్సరములు. ఆమెకు ఎప్పుడో రుతుక్రమము ఆగిపోయెను. అంతకు ఎన్నో సంవత్సరముల ముందే ఆగిపోయెనని నిస్సందేహముగా చెప్పవచ్చును. అబ్రాహాము ఆమెను భార్యగా చేసుకొని ఆమెతో జీవించుచుండెను. ఆమె తన మారు తల్లియొక్క కుమార్తె, ఆమె ఒక యవ్వన బాలికగా యున్నప్పుడే — బహుశా అతడు ఆమెను వివాహమాడియుండును. అతనికి పిల్లలు లేరు. ఆమె పూర్తిగా గొడ్రాలు. ఇప్పుడు, మనము కనుగొనుచున్నదేమనగా, దానిని
అతడు పొందుకొనుటకై, క్రమముగా దానిని వెంబడించుచూ పోవుటకై, దానిని నమ్మలేని జనులందరిలో నుండి అతడు తన్నుతాను వేరు చేసికోవలసి వచ్చెను. నిన్నునీవు జనులలో నుండి వేరుచేసుకొనవలెననే భావముతో నేను దీనిని మీకు చెప్పుటలేదు, కాని సమస్థ వ్యర్ధమైన అవిశ్వాసపు మాటల నుండి నిన్ను వేరుపరచుకొని మరియు దాని నుండి దూరముగా ఉండవలెను. "ఆ సంగతులు జరుగవు. అది ఒక పిచ్చిగుంపు జనులు! ఆ విధముగా జరుగే సంభవమంటూ ఏదీ కూడా లేదు!" అని జనులు చెప్పినప్పుడు, నీ చెవులు మూసికొని దూరముగా పొమ్ము. దానికి ఎట్టి స్పందన చూపవద్దు.
GEN 17:5•
ROM 4:20,21
26"అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్దుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను" అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. అతని పేరు అబ్రాము నుండి అబ్రాహామునకు మార్చబడెను. మార్చబడిన అతని పేరునకు "జనములకు తండ్రి" అని అర్ధము.
ఒక మధురమైన హృదయముగా యున్న భార్యతో ఒక వ్యక్తి జీవించుచు, ఇన్ని సంవత్సరములుగా అతడు ఆమెతో ఆ విధముగా కలిసి జీవించుచున్నను, అతడికి ఎనుబది సంవత్సరములు నిండినను ఒక్క బిడ్డ కూడా లేని పరిస్థితిలో లేదా పిల్లలు పుట్టరనే ఆశలే లేని స్థితిలో, అయినప్పటికిని ఆతడు "జనములకు తండ్రిగా" పిలువబడుటమనే దానిని గూర్చి నీవు ఊహించుచూడు. అతనితో కూడా ఉండినవారు ఏమని విమర్శించియుందురో ఆలోచించండి. "జనములకు తండ్రీ, ఇప్పటికి నీకు ఎందరు పిల్లలు పుట్టిరి?" ఇంకా చాలా విమర్శను అతడు సహించవలసి వచ్చెను. కాని అబ్రాహాము అవిశ్వాసము వలన ఎక్కడా కూడా తడబడనే లేదు. దేవుడు తాను వాగ్దానము చేసిన దానిని నెరవేర్చు సమర్దుడని అతడు నమ్మెను. ఎంతకాలము తీసికొన్నాగాని దేవుడు తన మాటను రుజువు పరచునని నమ్మెను.
అయితే మనవలె దినములు గడుచుచున్నకొలది బలహీనుడగుటకు బదులుగా అతడు మరింతగా బలపడుచుండెను. "ఈనాడు అది జరుగనియెడల రేపు ఒక గొప్ప అద్భుతము జరుగును, ఎందుకనగా ఒక్క రోజు పాతబడినది." అది దేవుడైయున్నాడు, అది అబ్రాహాములోనున్న దేవుడే. దేవుడు తనయొక్క మాటలన్నియూ రుజువు చేసెనని అతడు ఎరిగియుండెను.
JOB 1:21•
JOHN 9:2,3
27ఆయన పిల్లలు ఆయన మాటను మాత్రము స్వీకరించినయెడల, నీ ద్వారా ఆయన దానిని నిరూపించగలడు! ఆయన తన మాటను రుజువు చేయగల మార్గము అదొక్కటే.
అవిశ్వాసులకు ఆయన దానిని రుజువు చేయలేడు. వారికి రుజువు చూపబడదు, వారు అవిశ్వాసులు. కాని అది అవిశ్వాసులకు కాదు, ఇది అవిశ్వాసుల కోసము కానే కాదు. అది ఆయనయందు నమ్మకముగల వారికి మాత్రమే. తన మాటను నమ్ము ఒకనిని ఆయన కనుగొనినయెడల నీ ద్వారా వాక్యమును ఆయన రుజువు చేయును. దేవుడు తన్నుతాను రుజువుపరచుకొనునట్లుగా కొన్నిసార్లు వ్యాధి మొదలగునవి మనకు వచ్చును.
యేసు కనుగొనిన ఆ గ్రుడ్డివాడు నీకు జ్ఞాపకమున్నాడా? "ఎవరు పాపము చేసిరి? వీని తల్లియా లేక తండ్రియా?" అని వారడిగిరి.
"ఈ విషయములో ఎవరును పాపము చేయలేదు గాని దేవునియొక్క కార్యములు ప్రత్యక్షపరచబడునట్లు ఆలాగు జరిగెను" అని ఆయన చెప్పెను. చూడండి. యేసు మహిమపరచబడునట్లుగా ఆ కుర్రవానికి ఆలాగు జరిగెను. కొన్నిసార్లు వ్యాధి శాపము కాదు గాని; అది ఒక దీవెన, మనము మన విశ్వాసమునకు అంటిపెట్టుకొని, లేని వాటిని ఉన్నట్లుగా పిలువ కలుగుదుము, దేవుడాలాగు చెప్పెను. ఆ పరీక్ష క్రింద నీవు మాత్రము ఆ పరీక్ష వలన బలహీనుడవుగా కాకుండినయెడల దేవుడు పలికిన విధముగా ఆయన దానిని ఆలాగే రుజువుపరచును.
ఒకసారి యోబును, ఆయన ముఖము ఎదుటనే ఆయనను అతడు దూషించడనే దానిని ఆయన రుజువు చేసెను. యోబు ఎట్టి శోధనగుండా వెళ్ళెనో చూడండి. అతడు మరణపు కోరలలో ఉండగా, అయినప్పటికిని అతడు "యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొనెను; యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక!" అని చెప్పెను. అతడు నిశ్చయంగా దానిని నమ్మెను.
దేవుడు తన వాక్కును యోబుకు రుజువు చేసెను. అబ్రాహామునకు దానిని ఆయన రుజువు చేసెను. ఆయనలాగు దానిని నిరూపించెను.
28మోషే ద్వారా కూడా ఆయన దానిని రుజువు చేసెను. మోషేకు విరోధముగా ఎంతో కష్టములు కలిగియున్నప్పుడు బహుశా నేనొక విమోచకునిగా వుందునేమోననే తలంపును మోషే తన మనస్సులో కలిగియుండెను… అతని తల్లి బహుశా అతడితో నీవు ఆ ఉద్దేశ్యము కొరకే జన్మించిన బిడ్డవు అని చెప్సియుండును. పిదప అతడు ఎప్పుడైతే భవనములో అతడు పెంచబడినప్పుడు ఆమెయే అతనికి శిక్షణ ఇచ్చెను. ఆమె నిస్సందేహముగా ఇట్లు చెప్పియుండును, "కుమారుడా, మేము విడుదల కొరకు ప్రార్ధి౦చాము. విమోచనకొరకు వాడబడబోవు వానివి నీవేనని మేము నమ్ముచున్నాము."
చూడండి, అతడు ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండుటకు వచ్చెను. ఆ సింహాసనమునకు అతడే వారసుడుగా ఉండగలడనే దానిని మనము చూడగలుగుచున్నాము. తరువాత ఫరో అతడేనను అభిప్రాయము నిస్సందేహముగా వారి మనస్సులలో ఉండియుండును, "తరువాత ఫరో అగుట ద్వారా అతడు ప్రజలను విడిపించగలడు" అని వారు తలంచిరి. కాని దేవుడు ఒక దానిని కలిగి…. అది ఆలాగే అయినచో దానిని అతడు రాజకీయము ద్వారా సాధించియుండును.
కాని దేవుడెల్లప్పుడూ ఆలాగు పనిచేయడు.
GEN 15:13,14
29పనిచేయుటకు దేవునికి తన స్వంత మార్గములున్నవి. "వారిని వెలుపలకు తెచ్చుదును" అని ఆయన చెప్పెను. నాలుగు వందల సంవత్సరముల తరువాత వారిని "వెలుపలకు తెచ్చెదను" అని దేవుడు అబ్రాహామునకు చెప్పెను. "ఒక బలిష్టమగు హస్తము ద్వారా బయటకు తెచ్చెదనని" చెప్పెను. ఆయన "అద్భుతములు, ఆశ్చర్యకార్యములు" జరిగించుదనెను. కాబట్టి ఆయన దానిని ఆలాగు చేయలేడు.
కాబట్టి అబ్రాహాము… అబ్రాహాము దేవుని నమ్మెను అని మనము కనుగొందుము, ఇక్కడ మోషే దేవునిని నమ్మెను. ఫరో చూచిన కిటికిలో నుండియే మోషే చూచెను, అదే ప్రజలను అతడు చూచెను. ఒక శాపగ్రస్త్ర జనాంగముగా, ఏమిలేని ఒక జనాంగమై యుండి ఒక దేవుని కొరకు ఒక ఉన్మాదుల గుంపుగా, ఏదో ఎడారిలో, ఎచ్చటోయున్న దేవుని గురించి ఏమి తెలియనివారై, అచ్చట ఏమీ లేని, ఏదీ కాని — కనబడని ఏదో ఒక దానియందు ప్రార్ధి౦చు "ఒక ఛాందస గుంపుగా." ఒక బానిస గుంపుగా, ఫరో వారిని చూచినప్పుడు తలంచెను, వారి దేవుడు వారిని బానిసలుగా చేసెను గనుక అతడు దేవుడు కాడని రుజువైనదని అతడు తలంచెను."
ఫరో చూచిన కిటికిలో నుండియే మోషే చూచెను, అదే ప్రజలను అతడు చూచెను. ఒక శాపగ్రస్త్ర జనాంగముగా, ఏమిలేని ఒక జనాంగమై యుండి ఒక దేవుని కొరకు ఒక ఉన్మాదుల గుంపుగా, ఏదో ఎడారిలో, ఎచ్చటోయున్న దేవుని గురించి ఏమి తెలియనివారై, అచ్చట ఏమీ లేని, ఏదీ కాని — కనబడని ఏదో ఒక దానియందు ప్రార్ధి౦చు "ఒక ఛాందస గుంపుగా." ఒక బానిస గుంపుగా, ఫరో వారిని చూచినప్పుడు తలంచెను, వారి దేవుడు వారిని బానిసలుగా చేసెను గనుక అతడు దేవుడు కాడని రుజువైనదని అతడు తలంచెను."
EXOD 3:12•
EXOD 4:10,12,17
30అటువంటి సమస్తమైన వాటి మధ్యలో నుండియే ఆయన ఒకనిని లేపుచుండెను.
దేవుడు వింతయగు విధానముల ద్వారా పనిచేయును, వారిలోనే ఉండి పనిచేయును. ఒక వేదాంతి కాడు, ఒక ఉపదేశకుడు కాడు, ఒక యాజకుడు కాడు, పరిశుద్దులలో ఒకడు కాడు, కాని ఒక మామూలు మనిషి ఆ పనికొరకు జన్మించి యుండెను. దేవుడు అతనిని తన ప్రవక్తగా పిలచి, అతడిని అక్కడికి పంపెను. ప్రపంచమంతటినీ జయించిన యాంత్రిక సామర్థ్యముగల ఒక సైన్యమును ఎదుర్కొనుటకు అతని చేతిలో ఒక వంకర కర్ర తప్ప మరేమీ లేదు. కాని ఆ కర్రను చేతితో పట్టుకొని ఇశ్రాయేలును విడిపించుదువని దేవుడాతనితో చెప్పెను, వెళ్ళి అతడు ఆలాగు చేసెను, ఎందుకనగా దేవుడు దానిని వాగ్దానము చేసెను. అతడు దానిని ఏలాగు చేయగలడు? "నేను నీకు తోడైయుందును" ప్రభువా, నీ కృప నాకు చూపించుము. నేను నోటి మాంద్యముగలవాడను. నేను సరిగ్గా మాట్లాడలేను" అని అతడు చెప్పెను. అతడు చెప్పుకొనుటకు లక్లోపలక్ష సాకులున్నవి. కాని ఆయన ఈలాగు చెప్పెను, "నేను నీకు తోడైయుందును." కావలసిన దంతయూ అదే. దేవుని యొక్క మాటను తీసికొని అతడు వెళ్ళెను. ఆ పని ఎంత ప్రమాదకరముగా కనిపించినా గాని, మోషే దేవుని యొక్క మాటను నమ్ముచునే యుండెను. దేవుడు మోషే ద్వారా తమ మాట సత్యము అని రుజువు చేసెను. ఎందుకనగా ఏమి జరిగినా గాని లెక్క చేయక మోషే వాక్యముతో నిలచియుండెను.
యాత్ర సమయమునందు.
EXOD 3:8•
EXOD 15:20•
EXOD 16:15
31ఐగుప్తులో యుండగానే ఆయన వారిని విమోచించుటకు ముందే, దేవుడు వారితో ఈలాగు చెప్చెను: "ఒక వాగ్దాన దేశములోనికి, మంచి భూమిలోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించెదను." అది ఖచ్చితముగా అక్కడ ఉండెను. అది అక్కడుండెనని వారికి తెలియలేదు. కాని ఆయన వారికిట్లు చెప్పెను, "అది అక్కడున్నది. దానిని మీకు ఇచ్చెదను. అది మీరె వెళ్ళి దానిని ఆక్రమించుకొనుడి."
ఆత్మయందు నాట్యము చేయుచూ వారందరూ అరణ్యములో వచ్చుచుండిరి, మిర్యాము తంబుర వాయించెను, పరలోకపు మన్నాను భుజించిరి, మోషే ఆత్మయందు గానము చేయుట వారు వినిరి, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చూచిరి. కాని దేవుని యొక్క వాక్యమంతటిని మరియు సమస్త వాగ్దానమును నమ్మవలసిన ఒక సమయము వచ్చినప్పుడు వారు తప్పిపోయిరి.
NUM 13:26,28,30,31,33
32యెహోషువా, కాలేబులు అనే ఇద్దరు మాత్రమే దానిని నమ్మిరి.
ఆ దేశము బాగున్నదని వారు మంచి రుజువు తీసికొని వచ్చిరి. కాని ఆ పరిస్థితులు వారిని ఆటంకపరచినవి. ఎందుకనగా వారిట్లనిరి, "వారి దేశమును ఆక్రమించు సామర్థ్యము మనకు లేదు, ఎందుకనగా వారి పట్టణములు ప్రాకారము గలవి. వారు ఉన్నత దేహులు, వారి ముందు మేము ఉడుతలవలె కనిపించుచున్నాము."
యెహోషువా, కాలేబులు ఇట్లనిరి, "దానిని మనము జయించగల "సమర్దులము" ఎందువలన? దేవుడు దానిని వారికి ఇచ్చెను. వారెంత ఉన్నత దేహులయినా లెక్కలేదు. ఆటంకము వారికి ఏ మాత్రమూ కనబడలేదు, దేవుడాలాగు చెప్పెను! వారి ద్వారా దేవుడు దానిని రుజువు చేసెను. వారు వెళ్ళి దేశమును స్వాధీన పరచుకొందురు, ఎందుకనగా వారాలాగు చేయుదురని దేవుడు చెప్పెను. దానిని ఆయన వారికి రుజువుచేసెను.
33ఏప్రిలు నెలలో వారు వచ్చుచుండగా కొండలమీద నుండి మంచుగడ్డలగుండా పొంగిపొర్లుచూ క్రిందకు పారుచు వచ్చుచున్నది. దేవుడు తన సైన్యమును అటువంటి ఒక స్థలమునకు తీసుకొని వచ్చుటచే, ఆయన సామర్థ్యము లేని ఒక నాయకుడుగా కనిపించెను. వారు వాగ్దాన దేశమునకు వెళ్ళి చేరలేనట్లుగా ఆ స్థలమునందు చిక్కుబడినట్లు ఆయన చేసెను. ఆయన వారిని నడిపించుచున్న సమయము అది సంవత్సరములో పనికిమాలిన నెల. యోర్దాను పొంగి ప్రవహించు నెల అది. అది కట్టలు తెంచుకొని పొలములో ప్రవహించుచుండెను. ఎండా కాలములో ఆయన వారిని తీసికొని వెళ్ళినచో బాగుండును కదా? తేలికగా ఆవలకు దాటుదురు. కాని నీరు బాగా పొంగిపొర్లు వరకు ఆయన ఆగెను. తాను దేవుడనని ఆయన వారికి చూపించుటకై ఆశించెను. ఏమైనాగాని లెక్కచేయకుండా ఆయన తన వాక్యమును నిరూపించుటకు అశి౦చెను.
"నీవు కాన్సరుతో చనిపోవుచున్నావు" అని వైద్యుడు చెప్పినా నీవు లెక్కచేయ వద్దు. మానవునికి తెలిసినదంతయూ అదే. ఈ రాత్రి మీలో కొందరికి నీరు చాలా లోతుగా యున్నట్లుగా అనిపించవచ్చు. కాని, గుర్తు౦చుకొనండి, దేవుడు వాగ్దానము చేసెను. దేవుడు తన మాట నిలబెట్టుకొనును. దేవుడు తన మాట నిరూపించుకొనును. అది సత్యము. నీరు బురదయగు వరకు, అవి వారి తలలమీద నుండి పొర్లిపారు వరకూ ఆయన కనిపెట్టియుండెను. ఆ తరువాత ఆయన దారి తెరచెను. ఆయన వారికి ముందుగా వెళ్ళి మార్గము ఏర్పాటు చేసెను. చూట్టూ మూయబడియుండిన యెరికో పట్టణములో వారెట్లు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకోగలరు? యెహోషువా ఆశ్చర్యపడుచుండెను. అంతవరకు దేవుడే వారిని నడిపించెనని తరువాత అడుగు కూడా దేవుడే వేయుంచునని అతనికి తెలియును.
JOSH 5:13,14•
JOSH 6:5,20
34ఒకనాడు ఆ ప్రాకారములు చూచుచూ అతడు చుట్టూ తిరుగుచుండెను, ఖడ్గము దూసియున్న ఒకడు అక్కడ నిలబడియుండుట అతనికి కనబడెను. ఇతడు తన ఖడ్గము దూసి అతని యొద్దకు వెళ్ళి, "నీవెరవు? మా పక్షమున నున్నావా? లేక శత్రువు పక్షమున ఉన్నావా?" అని అడిగెను.
"నేను యెహోవా యొక్క సైన్యములకు అధిపతిని" అని అతడు చెప్పెను. ఏమి చేయవలెనో ఆయన అతడికి చెప్పెను.
బూర ఏలాగు ఊదవలెనో, గోడల మీద ఊదుచూ ఏదైన ఒక దానిని చేయగలమా? వారు రథముల పందెములు జరిపించేంత పెద్ద గోడలు ఏ విధముగా కూలునో అది అతనికి చెప్పెను. ఆ ప్రాకారముల మీద రధముల పందెములు జరుగును. ఒక బూర ఊదుచూ ఏదైన ఒకదానిని చేయగలమా? దేవుడు అట్టి సాధారణమైన పద్ధతులను ఉపయోగించును. అవి ఎంతో సామాన్యమైన రీతిగా యుండును, దేవుడు దానిని ఆ విధముగా చేయునని నాకు కనిపించుచున్నది. మనము ఎల్లప్పుడూ గొప్పదైన ఏదో దానిని చూడాలని ప్రయత్నించెదము, గొప్పదైన దానిని చేయాలని ఆశించెదము, మరి దేవుడు ఏదో ఒక పెద్ద సంస్థను, సమస్తమును తీసుకొని, వాటిన్నింటిని తేటపరచునని ఎదురు చూచెదము. దేవుడు ఒక సాధారణ మనుష్యుని తీసికొని, ఆ ఒక్క మనిషిని ఆయన తన చేతులతో పట్టుకొని, ఆయన చెప్పిన ప్రతీ మాటను దానిని ద్వారా ఆయన రుజువుపరచును.
అట్టి సూక్ష్మ-పద్ధతులను తీసికొనుము. "ఒక బూర ఊదుము." గోడను త్రవ్వుట కాదు గాని, ఒక బూర ఊదుము మరియు ఆ ప్రాకారములు కూలిపోవును. ఆ బూర యొక్క తాకిడి గోడలను కూలద్రోయును. శరీరసంబంధమగు మనస్సుకు అదెంత వెర్రితనముగా నుండును! కాని తన మాట సత్యము అని దేవుడు రుజువు చేసెను. ఆ గోడలు ఒకదాని మీద ఒకటి కుప్పగా కూలెను. వారు తిన్నగా వెళ్ళి, వారు ఆ పట్టణమును స్వాధీనపరచుకొనిరి.
JOSH 10:12,13
35ఓ! దేవుడు తన్నుతాను దేవుడనే దానిని రుజువు చేసికోగోరును! యెహోషువా అది ఎరుగును. ఒక రోజున అతడు అచ్చట నిలబడియుండగా, ఎన్నడూ జరుగని ఒక మహా అద్భుతము జరిగెను. యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము మాత్రమే దానికి మినహాయింపు. శత్రువు వారిని చుట్టుముట్టి వివిధ కొండ చరియలలో ఆ సైన్యములు మోహరించినవి. అతడు వారిని మట్టుపెట్టెను, ఆ సమయమున సూర్యుడస్థమించుచుండెను. ఓ! సైన్యాధిపతియగు యెహోషువాకు అదెట్టి వేళ గుర్తు౦చుకొనండి. అతడు పోరాడి దేశమును స్వాధీనపరచుకొనెను. ఒక వైద్యశాల గాని, నర్సు గాని, ప్రధమ చికిత్స దళము గాని, గాయపడిన వ్యక్తి గాని వారికి లేకుండెను.
అంతకన్నా గొప్పది మరేదయినా యున్నదేమో నాకు చెప్పండి. అవునండీ! వారికెన్నడూ వైద్యశాలలు లేవు, నర్సులు లేరు, అతడు ఒక్క మనిషిని కూడా కోల్పోలేదు. ప్రభువు యొక్క వాక్యములోను మరియు చిత్తములోను వారు నడిచినంత కాలము ఆలాగే జరిగెను. తాను వారికి తోడైయుండినట్లు దేవుడు రుజువుపరచెను. అది నిజము!
ఇప్పుడు గమనించండి. రాత్రి వచ్చినయెడల వారు మెల్లగా జారుకుంటూ ఒకరినొకరు కలుసుకొని, ఒక్కటిగా ఏకమై ఒక పెద్ద సైన్యముగా వారందరూ కలిసివచ్చిన యెడల, మరుసటి రోజు యుద్ధము చేయుటకు కష్టతరముగా యుండి మరొక రీతిగా పరిస్థితులు మారుటకు దారితీయునని యెహోషువా ఎరిగియుండెను, అతనికి ఏమి చేయవలెనో తోచలేదు, కనుక అతడు దేవునివైపు చూచెను. అతనికి సహాయము కావలెను, సూర్యుడు ఇంకా నిలచియుండుట అతనికి అవసరమాయెను. కాబట్టి అతడు సూర్యుడు అలాగే నిలచిపోవలెనని ఆజ్ఞాపించెను, మరియు "చంద్రుడా, నీవు అయ్యాలోనులో నిలువుము." అతడు దానికి ఆజ్ఞాపించు వరుకు అది అట్టే కదలక యుండినది అని చెప్పెను. సూర్యుడు, చంద్రుడు ఇరవై-నాలుగు గంటల పాటు నిలచిపోయెను. యెహోషువా యుద్ధము గెలిచి శత్రువును ఓడించెను, ఎందుకనగా అతడు విధినిర్వహణలో యుండెను.
దానిని చేయు హక్కు అతడు కలిగియుండెను, ఎందుకనగా అతడు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడగుచుండెను.
MATT 17:20•
MARK 11:23
36నీవు విధినిర్వహణలో దాని చేయుచూ యున్నంతవరకూ, దేవుని యొక్క వాక్యమును గైకొనుచూ, ఆయన ఏదైతే నీకు చేయమని చెప్పెనో నీవు దానిని మాత్రము చేయుచున్నంత వరకూ, దేవుని యొక్క ఆజ్ఞప్రకారము క్రమముగా అడుగులు వేయుచు నడుచుచున్నంత వరకూ, ఆ కొండను చూచి "కదిలిపో" అని చెప్పుటకు నీకు హక్కు గలదు. దేవుడు తన మాటకు కట్టుబడియుండును. "ఎవరైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక, తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని" అని పరిశుద్ధ మార్కు 11:22లో యేసు అది చెప్పెను. అది సత్యము. అది సత్యము అని నాకు తెలియును. అది దేవుని యొక్క వాక్యమైయున్నది, అది సత్యమని అది రుజువు చేయును.
కొన్నిసార్లు మనము భయపడుచుందుము. ఆయన తన మాటను నెరవేర్చడేమో అని భయపడు స్థితికి మనము వచ్చుచుందుము. ఆయన ఆ మాటను నెరవేర్చును. ఆయన దానిని చేయుదునని ఆయన చెప్పెను. అది సత్యము అని ఇప్పుడు మనము కనుగొందుము. దానిని ఆయన రుజువుపరచెను.
ISA 7:14•
JOHN 1:1,14•
JOHN 8:46
37ఒకసారి యెషయా యొక్క ప్రవచన వాక్యము, అది ఎన్నడూ నెరవేరలేనట్లు కనిపించినది. అంతకు ముందు గాని, ఆ తరువాత గాని అదెన్నడూ జరుగలేదు. "ఒక కన్యక గర్భవతియగును" అని అతడు చెప్పెను. ఒక స్త్రీ ఒక పురుషుడను ఎరుగకుండానే ఎట్లు ఒక బిడ్డను కనగలదో, నీవు ఊహింగలవా? "ఒక కన్యక గర్భవతియగును" అని యెషయా చెప్పెను. తన వాక్యము సత్యము అని రుజువు పరచుటకు దేవుడు ఒక కన్యకను గర్భవతి యగునట్లుగా చేసెను. ఆయన తన మాట రుజువు చేసెను, ఎందుకనగా ఒక కన్యక గర్భవతియై, ఆమె ఒక కుమారుని కనెను.
ఆ వాక్యము ఇప్పుడు శరీరధారియో ఏమి చేసెనో చూడండి. ఆ కుమారుడు వచ్చినప్పుడు, తానే ఆ వాక్యముగా యుండెను. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెను." ఆయనే జీవించుచున్న ఆ వాక్యమైయుండెను. ఆయనే ఆ జీవించుచున్న వాక్యమనే దానిని ఆయన రుజువు చేసెను.
"నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు?" "అవిశ్వాసమే" పాపము. "నేను అవిశ్వాసినని ఎవడు చెప్పగలడు? నా గూర్చి వ్రాయబడిన ప్రతి మాటయు నెరవేరినది" అని ఆయన ఆనాటి బోధకుల యొద్ద చెప్పెను. ఆయన జీవితము యొక్క చివరి ఏడు ప్రవచనములు సిలువ మీద చివరి ఏడు ఘడియలలో నెరవేరినవి. ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రతిదియూ నెరవేరెను, ఎందుకనగా ఆయనే వాక్యము. ఆయనే వాక్యమని ఆయన నిరూపించెను. ఆయన రోగులను స్వస్థపరచెను. మృతులను ఆయన లేపెను. ఆయన మరణమును, పాతాళమును మరియు సమాధిని జయించెను. తాను వాక్యమైయుండెనని ఆయన నిరూపించెను.
MARK 5:25,26•
LUKE 8:43
38యాయీరు ఇంటిలోని ఈ విషయమును గమనించండి. ఆయన వారికి సత్యమును చెప్పెను. ఆయన సముద్రమును దాటుట మనము చూచుచున్నాము. ఆయన వచ్చుచున్నాడు. ఆ కొండ మీద ఒక పేద స్త్రీ యున్నది, ఆమె వైద్యులకు తన డబ్బంతయూ ఖర్చు చేసెను. వైద్యులు ఆమెను బాగుచేయుటకు ఆమెకు చేయకలిగినదంతయూ చేసిరి, ఆమె హెబ్రీయురాలు, బహుశా వైద్యులు కూడా హెబ్రీయులుగా యుండవచ్చు, గనుక ఆ హెబ్రీ సోదరికి వారు చేయకలిగిన సహాయము చేసిరి. అయినా గాని, వారు ఆమె రక్తస్రావమును ఆపలేకపోయిరి, అది బహుశా ఆమె ఋతుక్రమము ఆగిపోయే సమయముగా యుండుట వలన మరియు ఆమె ఎంతో బలహీనురాలుగా అయ్యేంత వరుకు ఆ రక్తమును ఆమె ఆ విధముగా కోల్పోవుటచే, ఆమెకు లేచి నడచుటకు కూడా శక్తి లేకపోయెను. ఆమె యేసును గూర్చి విన్నది. ఆ చిన్న దోనె ఒడ్డుకు చేరుటను ఆమె చూచినప్పుడు, ఆమె ఆయనను కనుగొనుటకు అచ్చటికి వెళ్ళెను.
DEUT 18:15•
MATT 3:3•
JOHN 1:23•
JOHN 5:36,46•
JOHN 10:37
39ఆయనను విమర్శించువారు అనేకులు అక్కడ నిలబడియుందురు. ఈనాడు కూడా ఆయనకు విమర్శకులు తక్కువలేరు. ఆయన ఎవరైయుండెనో వారెరిగి యుండినయెడల వారాయనను విమర్శించియుండెడివారు కారు. కాని ఆయన ఎవరో వారికి తెలియనందునే వారాయనను విమర్శించువారయిరి. ఈనాడు వర్తమానము విషయములో కూడా ఆలాగేయున్నది, చాలామంది మంచి స్త్రీ మరియు పురుషులు దీనిని విమర్శించుచున్నారు, కారణము ఇదేమైయున్నదో వారికి తెలియకుండుటయే.
యేసు ఇట్లనెను, "మీరు మోషేను ఎరిగియుండినయెడల నన్నును ఎరిగి యుందురు. మోషే నన్నుగూర్చి చెప్పెను. చాలామంది గొప్పవారు ఈ దినమును చూడగోరిరి. నా తండ్రి యొక్క క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి. నాకు గొప్ప సాక్ష్యులున్నారు. యోహాను సాక్ష్యముకంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. నేను చేయు క్రియలే తండ్రి నాతో యున్నాడని రుజువు చేయుచున్నవి. "ఆయనకు గొప్ప కార్యములుండెను, ఎందుకనగా ఆయనే గుర్తింపబడినవాడు. యోహాను కూడా ఆరణ్యములో కేకవేయు శబ్దముగా గుర్తింపబడెను. కాని ఆయన వచ్చినప్పుడు, ఆయన మోషే ద్వారా చెప్పబడిన ప్రవక్తగా ఉండెను, ఒక ప్రవక్త లేచునని అతడు చెప్పెను.
40ఆ రాత్రి నేను చెప్పినట్లుగా, ఆయన మూడు నామములలో వచ్చును, దేవుని కుమారుని యొక్క నామము, మనుష్యకుమారుడు, దావీదు కుమారుడు అను నామము. మొదటిసారి ఇక్కడ ఈ భూమి మీద ఆయన ఉండినప్పుడు, ఆయన మనుష్యకుమారుడుగా యుండెను. అప్పుడాయన దేవుని కుమారునిగా ఉండలేడు, ఆలాగు ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. "నేను మనుష్య కుమారుడిని" అని ఆయన చెప్పుకొనెను. ఎవరైనా ఆయనను ఏదయినా ప్రశ్నించినప్పుడు "మీరు మనుష్యకుమారుని చూడుడి. మనుష్యకుమారుడు" అని ఆయన చెప్పెను.
"మనుష్యకుమారుడు" ఒక ప్రవక్త. ఆయన ఆ విధముగానే రావలసియుండెను, ఎందుకనగా అది లేఖనము… ఇప్పుడు, లేఖనమునకు భిన్నముగా ఆయన రాలేడు. అందువలననే ఈ ఘడియ యొక్క వర్తమానము పండితుల ద్వారాగాని, వేదాంతము ద్వారా గాని రాజాలదు. అది ఎట్లు వాగ్దానము చేయబడెనో ఆరీతిగానే తిరిగి రావలసియున్నది. అది తప్పక ఆ విధముగానే యుండవలెను.
కాబట్టి ఈ మనుష్యుడు ప్రవక్తగా ఉండవలసియున్నాడని మనము కనుగొనుచున్నాము. దేవుని కుమారుడు కాడు, ఆయన మనుష్యకుమారునిగా ఉండవలసియున్నాడు. యెహోవా తానే యిర్మియా మొదలగు ప్రవక్తలను "నరపుత్రుడా" అని పిలచెను. "మీరు మనుష్యుకుమారుని చూచునప్పుడు…" "ఎవరు ఆ మనుష్య కుమారుడు?" అని వారు అడుగుచునే యుండిరి.
అప్పుడు, ఆయన మనుష్యకుమారునిగా తన పనిని నిర్వహించెను. ఇప్పుడు, ఆయన దేవుని కుమారునిగా తన కార్యాలయమును నిర్వహించుచున్నాడు. దేవుడు ఒక ఆత్మయై యున్నాడు. సంఘకాలములలో ఆయన దేవుని కుమారునిగా పని చేసెను. ఇప్పుడు వెయ్యేండ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడుగా ఉండును. అప్పుడాయన దావీదు సింహాసనము మీద కూర్చొనును. దావీదు కుమారుడుగా ఆ సింహాసనమునకు ఆయనే వారసుడు. మనుష్యకుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు మరియు ఆయనే అన్ని కాలములలోను అదే మానవుడుగా యుండెను. తండ్రి, కుమార, పరిశుద్దాత్మవలెనె అది ఉన్నది. దేవుని యొక్క కార్యాలయము. తండ్రియగు దేవునిగా ఉండిన ఆయన, కుమారుడగు దేవుడాయెను, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మయగు దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కారు — ఒకే దేవుడు, మూడు ప్రత్యక్షతలుగా కనపరచుకొనుట, మనము ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణములు.
MATT 9:21•
MARK 5:27-31•
LUKE 8:44-46
41అప్పుడు ఆయన చేసినట్లుగానే ఇప్పుడు మనము జీవించుచున్న ఈ ఘడియలలో కూడా దేవుడు తన మాటను నెరవేర్చుచున్నాడని మనము కనుగొనుచున్నాము. ఆయన సముద్రము దాటివచ్చుటను మనము కనుగొంటిమి. ఈ స్త్రీ ఆయనను నమ్మినది, ఆమెలో ఏదో చెప్పనారంభించినది. దానికి ఆమె యొద్ద ఏ వాక్యము లేదు, యెహోషువా సూర్యుని ఆపెనను లేఖనముకంటె గొప్పది ఆమెకు మరేదియూ లేదు. కాని ఆయన దేవుని కుమారుడని ఆమె తన హృదయములో విశ్వసించినది. కాబట్టి ఆమె "ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను తాకిన బాగువుదును" అని అనుకొన్నది. కాబట్టి ఆమె జనసందోహమును త్రోసికొని వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకినది, రక్తస్రావము ఆగిపోయెను.
తననెవరు తాకిరో చూచుటకై ఇప్పుడాయన జన సమూహములోనికి చూచెను. ఎవరో తాకిరనుటలో సందేహము లేదు. ఆయన ఆగెను. ప్రజలందరూ ఆయన చుట్టూ కమ్మియుండిరి. కొందరు ఆయనను ఎగతాళి చేయుచుండిరి, కొందరు ఆయనను చూచి నవ్వుచుండిరి, యాజకుడు, శాస్తులు మరియు ఇంకా తదితరులు నిలబడి ఆయనను ప్రశ్నించుచుండిరి, కాని ఆయనను విశ్వసించిన కొందరు అక్కడుండిరి. కొద్దిసేపటి తరువాత హఠాత్తుగా ఆయన ఆగి, చుట్టూ తిరిగి చూస్తూ, "ఎవరు నన్ను ముట్టిరి?" అని ప్రశ్నించెను.
కొందరు లేక పేతురు ఈలాగు పలికి యుండుననుకొనుచున్నాను, "ఏమిటి బోధకుడా! ఇంతగా జనులు నీ మీద పడుచుండగా, ఎవరు నన్ను తాకిరి? అని అడుగుట ఏల? అందరూ నిన్ను తాకుచున్నారు గదా?" అనెను.
"కాని నాలో నుండి ప్రభావము వెడలిపోయినట్లు నేను చూచుచున్నాను" అని ఆయన చెప్పెను. ఆయన బలహీనుడయ్యెను. అది వేరే విధమగు తాకిడి.
MARK 9:23,24•
MARK 16:17,18
42సోదరీ, సోదరుడా! అది మనము చూడకలిగితే ఎంత మేలు! ఆ ప్రత్యేకమగు తాకిడితో ఆయనను నీవు తాకకలిగిన యెడల తాకుము! ఓ! రోగులారా, కొద్ది క్షణములలో మీకు నేను ప్రార్ధించనైయున్నాను. నాకు పరిశుద్దాత్మ యున్నదని నేను నమ్ముచున్నాను, మీరు పొందుకొనియున్న లేదా ఇచ్చటయున్న ఈ మనుష్యులు పొందుకొనియున్న పరిశుద్దాత్మ కంటే ఎక్కువగా నేను పొందుకోలేదు. అదే పరిశుద్దాత్మ. కాని ఇది దేవుని యొక్క ఆజ్ఞ. రోగుల కొరకు ప్రార్ధి౦చుట, వారి మీద చేతులుంచుట, దురాత్మలను వెళ్ళగొట్టుట, దేవుని యొక్క ఆజ్ఞ అని మీరు విశ్వసించుడి. ఆయన చేసిన వాగ్దానములవి, మీకు కూడా అవి అలాగే యున్నవి. మీరది నమ్మినయెడల మీరడిగినది మీకు దొరకును. "నేను దీనిని చేయగలనని నీవు నమ్ముచున్నావా?" అని యేసు అడిగెను.
"అవును, ప్రభువా, నేను నమ్ముచున్నాను. ఈ లోకములోనికి రావలసియున్న దేవుని కుమారుడవు నీవేనని నమ్ముచున్నాను" అని ఆ బిడ్డ యొక్క తండ్రి పలికెను. ఇప్పుడు అట్టి ఫలితములను తీసికొని వచ్చుటకు అదే మనోభావము మాత్రమే కావలెనని మనకు తెలియును.
MAL 3:1•
MAL 4:1,3,5,6•
MATT 11:10•
ACTS 2:17
43ఇప్పుడు, త్వరగా, ఒక్క క్షణము అతనిని గూర్చి ఆలోచించుదము. ఇక్కడ అతడు తన దారిన వెళ్ళుచున్నాడు. ఒక చిన్న యాజకుడు వచ్చియుండెను, కాని ఆ చిన్న వ్యక్తి ఒక సరిహద్దు విశ్వాసియని చెప్పుటలో సందేహము లేదు. ఈనాడు లోకములో చాలామంది అట్టి సరిహద్దు విశ్వాసులున్నారు. వారు దానిని నమ్మగోరుచున్నారు. పరిశుద్ధాత్మ వాస్తవమైనదని వారు నమ్మగోరుచున్నారు. ఇది అపోస్తులుల కదలికయనియు, అంత్యదినములలో ఆయన తన ఆత్మను కుమ్మరించుదునను వాగ్దానమును వారు నమ్మగోరుచున్నారు. మనము మలాకీ 4లో ఆది పెంతెకోస్తు విశ్వాసమును తిరిగి సంఘమునకు మరలా ఇచ్చుదునని చివరి దినములకు ఆయన వాగ్దానము చేసిన దానిని అతడు నమ్మగోరుచున్నాడు.
మలాకీ 4 ఈలాగు చెప్పుచున్నది, "ఇదిగో, అంత్యదినమున ఏలియాను మీ యొద్దకు పంపుదును." అది నిజము. "అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును," చూచారా? "పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును." గమనించారా? ఇది జరుగవలసియున్నది
"అది బాప్తిస్మమిచ్చు యోహాను" అని మీరందురు. కాదు, కాదు.
మలాకీ 3 బాప్తిస్మమిచ్చు యోహాను. అది నిజము. మత్తయి 11 ఈలాగు చెప్పుచున్నది. "ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే, "ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను" అని ఎవని గూర్చి వ్రాయబడెనో, అతడే ఏలియా. నిశ్చయముగా, యేసు ఆ విధముగా దానిని చెప్పెను. కాని మలాకీ 4లో యున్న ఆ ఏలియా, ఈ ఏలియా కానే కాదు.
44ఎందుకనగా, "ఆ వర్తమానమయిన వెంటనే భూమి అగ్నిచే దహించబడును. నీతిమంతులు దుష్టుల యొక్క ధూళి మీద నడిచిపోవుదురు. "కాబట్టి అది యోహాను కాలములో ఎన్నడునూ జరుగలేదు.
ఊడ్చుకొని పోవునట్లుగా, సమస్తమైన ఈ సంఘశాఖల పరిస్థితులతో కట్టబడియున్న ప్రజలందరినీ వెలుపలకు తిరిగి తీసుకొని వచ్చి, అసలైన ఆది పెంతెకోస్తు విశ్వాసము వైపుకు తిరిగి త్రిప్పునట్లు చేయు ఒక వర్తమానము మనకు కావలసియున్నది. అది జరుగుట మనము చూచుచున్నాము, జరుగనైయున్న ఒక లేఖనమును అది నెరవేర్చుటయై యున్నది.
మరెన్నో లేఖనములను ఇక్కడ మనము అన్వయించగలము గాని వాటిని చూపించుటకు చాలా సమయము పట్టును. ఇప్పటికే నా సమయము దాటినది. కాని ఈ సంగతులను మీరు అర్ధము చేసికొనుడి, ఖచ్చితముగా అది సంభవించిన విధమునే అబ్రాహాము యొక్క పిల్లలకు ఆయన వాగ్దానము చేసినట్లుగానే ఇదియు సంభవించే తీరవలయును.
MATT 9:18•
MARK 5:23•
LUKE 8:41,42•
JOHN 3:2
45ఆ చిన్న బాలికను స్వస్థపరచుటకు యేసు వెళ్ళుటను మనము చూచితిమి, ఎందుకనగా ఆ సరిహద్దు విశ్వాసిగాయున్న ఆ బాలిక తండ్రి, యేసును గుర్తించవలసిన ఒక సమయము వచ్చెను. వైద్యులామె పట్ల ఆశ వదలిరి. కావున అతడు తన చిన్న నల్ల టోపీ ధరించి యేసును కనుగొన బయలుదేరెను. చూడండి, ఆయనను మీరు కోరినప్పుడు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులోయుండును. ఆయన తీరము యొద్దకు వచ్చుటను అతడు చూచెను.
"నా చిన్నపిల్ల యొద్దకు వచ్చి ఆమె మీద చేతులుంచుము. ఆమె బాగవును" అని అతడు పలికెను. "ఆమె చావ సిద్ధమైయున్నది. ఆమె ఒక్కర్తె నా కుమార్తె. ఆమె పండ్రెండేండ్ల ప్రాయములో ఉన్నది, ఇంక మాకు పిల్లలు లేరు. నేను నా భార్య మిగిలియున్నాము. ముసలివారమగుచున్నాము. మాకున్నది ఈ ఒక్కతే, ఆమె చావసిద్ధమైయున్నది. ప్రభువా! నిన్ను నేను నమ్ముచున్నాను. నీవు కాస్త వచ్చి ఆమె మీద చేతులుంచిన ఎడల బాగవును" అని చెప్పెను.
చూడండి, అతడు ఏమి గుర్తించెను? దేవుని యొక్క వాగ్దాన వాక్యము ఈయనయందు బయలుపరచబడెనని అతడు గుర్తించెను. నికోదేము చెప్పినది కూడా అంతే! "రబ్బీ బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. అది మాకు తెలియును. పరిసయ్యులు దానిని ఎరుగుదురు." దానిని వారెందుకు ఒప్పుకొనలేదు? "దేవుడు ఒకనికి తోడైయుంటెనే గాని నీవు చేయుచున్న కార్యములు ఎవడునూ చేయజాలడు. నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చినవాడవని మేమెరుగుదుము," అనెను.
MATT 9:18,23•
MARK 5:23,38•
LUKE 8:41,42,49,50
46యాయీరు కూడా అదే నమ్మెనని ఇక్కడ మనము కనుగొనుచున్నాము. "వచ్చి నీ చేయి వేయుము" అని చెప్పెను. ఆయనలో దేవుడుండెనని అతనికి తెలియును. "నా బిడ్డ మీద నీ చేతులుంచుము. ఆమె చావసిద్ధమైయున్ననూ బ్రదుకును" అని పలికెను
ఆయన అతనితో కూడా నడిచెను. అతడు వెళ్ళుచుండగా ఒకడు పరుగున వచ్చి "ఇక ఆయను శ్రమపెట్టవద్దు. బోధకుని శ్రమపరచవద్దు, బాలిక చనిపోయినది ఆమె గతించిపోయినది" అని చెప్పెను.
యేసు యాయీరు వైపు తిరిగి, "నీవు నమ్మినఎడల దేవుని మహిమను చూతువని నేను చెప్పలేదా? నీవు నమ్మితే చాలును" అని చెప్పెను.
ఆయన గదిలోనికి వెళ్ళెను, అక్కడ వారంతా రోదించుచూ, ఏడ్చుచూ, ప్రలాపించుచున్నారు, అందరూ ఆలాగే చేయుదురు కదా? ఒక చక్కని చిన్న బాలిక, ఒక సంఘకాపరి యొక్క కుమార్తె చనిపోయినది, ఆమె ఈ లోకములో నుండి వెళ్ళిపోయినది. ఆమె చనిపోయి బహుశా కొన్ని గంటలు అయియుండును, ఆమెను పడక మీద సిద్ధపరచిరి, బహుశా ఆమె శరీరమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుటకై యుండిరి. సమాధికి ఆయత్తమగుచుండిరి.
MATT 9:24,25•
MARK 5:37,39-42•
LUKE 8:51-55
47అప్పుడు యేసు ఇంటిలోనికి వచ్చెను. వారందరూ ఏడ్చుచుండిరి. "ఊరకుండుడి. ఆమె చనిపోలేదు గాని నిద్రించుచున్నది" అని ఆయన చెప్పెను.
వారేమి తలంచిరో మీరు ఊహించగలరా? "ఇప్పుడీయన ఎట్టివాడో అర్ధమయినది. అతడు ఒక అక్రమ సంతానము అని మనకు అర్థమగుచున్నది. ఆయన చేసిన దుందుడుకు ప్రవచనములన్నిటి గూర్చి మనము విన్నాము. "అతడు పిచ్చివాడు" అని యాజకుడు చెప్పినది నిజమేయని ఇప్పుడు మనకు తెలియుచున్నది. ఆ బాలిక చనిపోయినదని మనకు తెలియును. ఆమె "చనిపోయినది" అని వైద్యుడు నిర్ధారించెను, అక్కడామె పడియున్నది. ఆమె చనిపోయినది. ఆమె చనిపోయినదని మనకు తెలియును" అని వారు చెప్పి ఆయనను ఎగతాళిగా మాట్లాడి నవ్విరి. ఇంకో రీతిగా చెప్పవలెననిన, వారు ఆయనను సిగ్గుపడునట్లుగా విమర్శించసాగిరి.
కాని ఆమె చనిపోలేదని ఆయన చెప్పెను. ఇక అంతే! "ఆమె నిద్రించుచున్నది." ఎంత మంది విమర్శించినా అక్కర్లేదు, "ఆయన తన వాక్కును రుజువుపరచనైయున్నాడు!"
వారినందరినీ ఆయన ఇంటిలో నుండి పంపివేసెను. అవిశ్వాసులనందరినీ దూరముగా ఉంచెను. విశ్వాసులు మరియు ముగ్గురు సాక్ష్యులు అగు పేతురు, యాకోబు, యోహానులను, ఆమె యొక్క తల్లిదండ్రులను ఆయనలోనికి తీసికొని వెళ్ళెను. ఆమె చేయి పట్టుకొని ఒక భాషలో పిలచెను. ఎక్కడో నిత్యత్వమందున్న ఆమె ఆత్మను తిరిగి ఆయన పిలచెను, మరియు ఆ బాలిక బ్రతికెను.
2KGS 13:21•
MATT 9:24•
MARK 5:39•
LUKE 8:52•
JOHN 11:25,26
48ఆయన ఏమి చేసెను? ఆయన తన వాక్కును నిరూపించెను. తాను చెప్పిన దానిని ఆయన రుజువుచేసెను. ఆమె చనిపోలేదు. ఆమె నిద్రించుచున్నది.
ఆయన దీనిని రుజువు చేయుచూ మరో దానిని నిరూపించుట మనము గ్రహించుదుము.
ఆయన దేవుడనని నిరూపించుకొనెను. ముందు జ్ఞానము తనకున్నదని ఆయన నిరూపించుకొనెను. ఇప్పుడాయన మాట ఏమి చెప్పెనో చూడండి, "ఆమె చనిపోలేదు గాని నిద్రించుచున్నది." చూడండి. అసలు ఆమె చావనే లేదు. ఆమె నిద్రించుచున్నది, తన ముందు జ్ఞానమును చూపించెను.
అదే ఉదయమున ఎందరో ఆలాటి చిన్న బాలికలు చనిపోయియుందురు గాని ఈమె చనిపోలేదు. ఆమె లాజరు వలె నిద్రించుచున్నది. ఆమెను ఆయన నిద్రలో నుండి లేపెను, ఎందుకనగా ఆమె చనిపోలేదు. "నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును, బ్రదికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడునూ చనిపోడు."
ఆయన మరణించుట ద్వారా గొర్రెపిల్ల జీవగ్రంథములో పేరు గలవారు మాత్రమే విమోచించబడి, ఆ దినమున నిద్రలోనుండి లేపబడుదురు, ఆయన శక్తి ద్వారా పునర్జీవింపబడుదురు. వారిలో ఆ పునర్జీవింపబడు శక్తి యున్నది. గతరాత్రి అదే నేను చెప్పాను…. ఏలియా చనిపోయెను, మరియు అతని సమాధిలో ఎముకలు మిగిలెను, ఆ ఎముకలకు కూడా పునర్జీవింపజేయు శక్తి యుండెను.
JOHN 1:42•
HEB 4:12
49నిశ్చయంగా! ఆయన తానెవరో నిరూపించెను.
ఆలాగే మరల హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనములో కూడా ఆయన నిరూపించిన దానిని ఇప్పుడు మనము కనుగొందుము. తానే దేవుని యొక్క వాక్యమైయున్నానని ఆయన రుజువు చేసెను. నిశ్చయంగా ఆయన ఆలాగు చేసెను. ఆయన చేసినది గమనించండి. హెబ్రీ 4:12 ఈలాగు చెప్పుచున్నది, "దేవుని యొక్క వాక్యము బహు శక్తిగలదై, సజీవమై బలము గలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గముకంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది."
ఇప్పుడు ఒక్క క్షణము గమనించండి. అరణ్యములోని శోధన నుండి ఆయన బయటకు వచ్చిన తరువాత ఆయన తానే వాక్యమైయున్నానని చూపించెను. అది ఆయన సేవారంభము. అక్కడ పేతురు అను పేరుగల ఒక మనుష్యుడుండెను, అప్పుడతని పేరు సీమోను. అతడు తన సోదరుడగు అంద్రియతో యేసు దగ్గరకు వచ్చెను. యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి అతడు వచ్చిన వెంటనే యేసు ఇట్లనెను, "నీ పేరు సీమోను మరియు నీ తండ్రి పేరు యోనా. ఇకనుండి నీవు పేతురనబడుదువు." ఆయనే వాక్యము అని అది రుజువుచేసెను, ఎందుకనగా వాక్యము హృదయాలోచనలను, రహస్యములను వివేచించును. ఆయనే వాక్యము.
DEUT 18:15,18•
JOHN 1:42,45,47,48
50ఈ సంఘటనను ఫిలిప్పు చూచెను. అతడు పర్వతము చుట్టి ఒక రోజు తరువాత తిరిగి వచ్చెను. అతడు తనతో కూడా తన స్నేహితుడగు నతానియేలును తీసికొనివచ్చెను. "ఈ సంగతులు నిజముగా జరుగుచున్నవి, "మీ దేవుడగు యెహోవా నావంటి యొక ప్రవక్తను మీలో పుట్టించునని మోషే చెప్పెను గదా? ఆ మనిషి ఈయనే. సీమోనుకు అతడెవరో, అతని తండ్రి పేరు ఏమిటో కూడా చెప్పెను, ఆయన చెప్పునది సత్యమని మనకు తెలియును, ఎందుకనగా దేవుడు దానిని వాక్యములో చెప్పెను, ఆయనే దానిని చేయనైయున్నవాడని ఇక్కడది రుజువాయెను, ఆయనే మెస్సీయా అని అందువలన మనకు రుజువగుచున్నది."
ఆయన సముఖములోనికి అతడు రాగా యేసు అతనితో ఇట్లనెను, "ఇదిగో, ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు!"
"రబ్బీ, నీవు నన్నెప్పుడు ఎరుగుదువు?" అనడిగెను.
"ఫిలిప్పు నిన్ను పిలువకముందే, నీవు ఆ చెట్టు క్రింద నున్నప్పుడే నిన్ను నేను చూచితిని" అని ఆయన చెప్పెను.
ఆయన తన మాట రుజువుచేసెను. ఆయన దేవుని యొక్క మాట రుజువు చేసెను.
JOHN 4:7,9-11,16-19,25,26
51బావినొద్ద స్త్రీని త్రాగుటకు నీళ్ళిమ్మని ఆయన అడిగెను, ఆమె నీరు చేదుకొనుటకు కుండతో బావి యొద్దకు వచ్చెను. "సమరయురాలనగు నన్ను యూదుడవగు నీవు దాహమునకిమ్మని అడుగుట ఏల? మనకు సాంగత్యము లేదే? అన్నది.
"నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు ఎరిగినచో ఆయననే నీవు దాహమునకు ఇమ్మని అడుగుదువు" అని ఆయన పలికెను.
"ఈ బావి లోతైనది కదా?" అన్నదామె. ఆ సంభాషణ ఇంకా కొనసాగెను…
చివరకు ఆమెలోని బాధను ఆయన కనుగొనెను. "వెళ్ళి నీ భర్తను ఇక్కడకు తీసికొని రమ్ము" అని ఆయన చెప్పెను.
ఆమె చెప్పెను, "నాకు భర్త లేడు."
"నీవు సత్యమే చెప్పితివి, ఏలయనగా నీకు అయిదుగురు భర్తలుండిరి. గాని ఇప్పుడు నీతోయున్నవాడు నీ భర్త కాడు," అని ఆయన చెప్పెను.
"అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమె నాలుగువందల సంవత్సరముల నుండి మాకు ఒక్క ప్రవక్త లేడు. నీవు ఒక ప్రవక్తవని నేను తెలిసికొనుచున్నాను. క్రీస్తు అనబడు మెస్సీయా వచ్చునప్పుడు ఇట్టి సంగతులు చెప్పునని మాకు తెలియును. అది ఆయన గురుతు" అని ఆమె అనెను.
"నీతో మాట్లాడుచున్నది నేనే ఆయనను" అని ఆయన పలికెను. ఆయన తమ మాట రుజువు చేసెను. ఆయన చెప్పుకొను దానిని మనమును నిరూపించుదుము. ఆయనే మెస్సీయా, దేవుని కుమారుడు.
MATT 28:20•
MARK 5:27,29•
LUKE 8:43,44•
JOHN 14:12,19•
HEB 3:1•
HEB 4:15•
HEB 13:8
52ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును అంటుకొనెను. ఆయనే దేవుని యొక్క వాక్యమని ఆమెకు కూడా ఆయన నిరూపించుటను ఇప్పుడు మనము కనుగొంటిమి.
ఈ రాత్రి యేసు చెప్పినది గుర్తుంచుకొనండి. ఆలాగే హెబ్రి 3వ అధ్యాయములో ఆయన చెప్పినది గుర్తు౦చుకొనండి. అదే అని నేను నమ్ముచున్నాను, "ఆయన ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడుగా" ఆయన దానిని చెప్పెను, నేడు మనము జీవించుచున్న ఈ కాలములో, "ఆయన ఒక ప్రధానయాజకుడుగా దేవుని యొక్క ఔన్నత్యములో పరలోకములో యుంటూ మన మనోబలహీనతల ద్వారా స్పర్శించగలవాడుగా యున్నాడు. హెబ్రీ 13:8, "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు" అని చెప్పెను. అప్పుడుండిన దేవుడే ఇప్పుడున్నాడు. ఈ రాత్రి ఆయన అదే రీతిగా యున్నాడు.
పరి. యోహాను 14:12లో ఆయన చెప్పెను, "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును; అంతకంటె గొప్పవియూ చేయును, ఎందుకనగా నేను తండ్రియొద్దకు ఎక్కిపోవుచున్నాను." చూచారా. "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును."
మత్తయి 28లో ఆయనిట్లు చెప్పెను, "ఇక కొంతకాలమైన తరువాత లోకము నన్ను చూడదు. అయిననూ మీరు నన్ను చూచెదరు, ఏలయనగా యుగసమాప్తి వరుకు సదాకాలము నేను మీతో యుందును."
యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన తన వాక్యము రుజువు చేసికొనుటకు ఈ రాత్రి ఇక్కడ నిలబడియున్నాడు. (నా సమయము అయిపోయినది.) కాని ఆయన తాను చేయగలనని నిరూపించెను. ఆ దినమునకు వాగ్దానము చేయబడిన దానిని అప్పుడు ఆయన నిరూపించెను. యెషయా యొక్క మాటలను ఆయన రుజువు చేసెను, నోవహు యొక్క మాటలను ఆయన రుజువు చేసెను. మోషే యొక్క మాటలను ఆయన రుజువు చేసెను. ప్రతి ప్రవక్త యొక్క మాటను ఆయన రుజువుపరచెను.
53మనము జీవించుచున్న ఈ దినములలో ప్రపంచము సొదొమ స్థితిలో యుండునని ఆయన వాగ్దానము చేసెను — పురుష సంయోగులు.
ఈనాడు లోకము వైపు చూడండి, నేను ప్రపంచమంతటా తిరిగి చూస్తున్నాను, ఇక్కడే కాదు ప్రతిచోట కూడా. అది క్లిష్ణస్థితి. స్వీడనులో యువ స్త్రీ మరియు పురుషులు నగ్నంగా స్కయింగ్కు వెళ్ళుచున్నారు. జర్మనీ, ఫ్రాన్సు ఎక్కడికయినా వెళ్ళి చూడండి, ఈ ఆమెరికా దేశములో చూస్తున్న విశృంఖలతనే అన్ని చోట్లా చూస్తున్నాము. ఇది అటువంటి ఒక కాలము.
మరలా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చుట జరిగినయెడల మీకు కొన్ని ప్రవచనాత్మక సంగతులను చెప్పి, మనము ఏ కాలములో జీవించుచున్నామో చూపించగోరుచున్నాను. "పిల్లలు తల్లిదండ్రులను పరిపాలించుదురని" పరిశుద్ధ గ్రంథము చెప్పెను.
[టేపు మీద ఖాళీయున్నది] వాక్యము.
GEN 25:1-4
54కాని గుర్తు౦చుకొనండి, అబ్రాహామునకు ఒక సంతానముండెను, అవి ఇస్సాకు సంతానము. శారా మరణము తరువాత అతనికి ఇతర సంతానము కూడా ఉండెను. అతడు నూట-నలుబది-అయిదు సంవత్సరములవాడై మరొక స్త్రీని పెండ్లాడెను, కుమార్తెలు కాక ఏడుగురు కుమారులు అతనికి కలరు — ఎందుకనగా అతనికి వంద సంవత్సరములు వచ్చినప్పుడు దేవుడాతనిని యువకునిగా మార్చెను. అతడు మరలా నలుబది-అయిదేండ్లవానిగా మారిపోయెను. కాబట్టి అతడు… మనకది తెలియును, కొన్ని సంవత్సరాల క్రితం ఈ కాలిఫోర్నియోలో దానిపై బోధించాను.
అబ్రాహాము యొక్క సంతానము శరీరేచ్చ వలన శారా ద్వారా కలిగినది కాదు. ఇస్సాకు ఒక జనాంగ మాయెను. కాని వాగ్దానము ద్వారా రాజ సంతానము కలిగెను, అది యేసుక్రీస్తుగా యుండెను. ఆ సంతానము ద్వారా ఆయన ఒక రాజ సంతానమును లేవనెత్తెను. ఓ! ఇప్పుడు మనము రాజయాజక సమూహమైయున్నాము, ఒక రాజ జనాంగముగా, ఒక పరిశుద్ధ రాజ్యముగా నుండి దేవునికి స్తుతులు అర్పించుచున్నాము. మన పెదవుల యొక్క అర్పణ ఆయన నామమునకు స్తుతిగా మారుచున్నది.
దేవుడు తన వాక్యమును రుజువు చేసెను. మన మీద పరిశుద్దాత్మను ఆయన కుమ్మరించెను.
AMOS 3:7•
LUKE 17:28-30
55ఆయనిట్లు పలికెను, "సొదొమ దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలోను ఉండును." మీరిప్పుడు గమనించారా, దేవుని కుమారుడు నుండి దావీదు కుమారునిగా మారుటకు ముందు ఆయన తన్నుతాను మరల మనుష్యకుమారునిగా ప్రత్యక్షపరచుకొనును.
మీరు ఆ లేఖనము గమనించారా? ప్రవక్తలగు తన దాసులకు ఆయన దేనిని తెలియపరచకుండా ఏమియూ ఆయన ఎన్నడూ చేయడు, ఎప్పుడు ఆయన విధానమది. నిశ్చయంగా! అది ఆయన యొక్క వాగ్దానముగా యున్నది, చూచారా. ఏదీ తెలుపకుండా ఆయన ఏది ఎన్నడూ చేయడు… దేవుడు అబద్దమాడలేడు. మొదట దానిని ఆయన చేయుటకు ముందు ఎల్లప్పుడూ ఆయన దానిని బయలుపరచును.
56నేడు మనము కూర్చొనియున్న ఈ పరిస్థితి వైపు చూడండి. ఎక్కడ మనము ఉన్నామో చూడండి. మనము ఒక ఆధునిక సొదొమలోయున్నామని మీరందరూ ఒప్పుకొందురు. ఈ దేశము అందుకు దాసోహమగుచున్నది అని మీకు తెలియును. ఆశలు అడుగంటిన స్థితిలో వారున్నారు. ఈదేశమునకు గాని, మరే దేశమునకు గాని ఇక రక్షణ ఏమియూ కనబడుట లేదు. దానికి ఆవలనే మనము ఉన్నాము. దీనిని గూర్చి చెప్పబడిన ప్రవచనములు ఇప్పుడు నెరవేరుచున్నవి. దేవుడు ఆ చిన్న గొర్రెపిల్ల ఎక్కడున్నా గాని జాగ్రత్తగా వెదకి దానిని పట్టుకొనుచున్నాడు. అదంతయూ ఒక్క దినములోనే అయిపోవును. మనము అంత్యకాలములో ఉన్నాము. చూడండి, ఆ స్థానము వైపు పరిక్షి౦చండి.
ఈ జనుల కొరకు ప్రార్ధి౦చు ముందు ఎక్కువ విశ్వాసము వృద్ధి చేయుట కొరకు మిమ్మును ఒక సోదరునిగా లేదా సోదరిగా భావించి ఈ క్షణమందు నేను మిమ్మల్ని అడుగుచున్నాను. మనము ఒక ప్రత్యేక సమయములో వెళ్ళవలెనని లేదని నేనెరుగుదును, కాని నేను ప్రార్ధన వరుసను ప్రారంభించెదను, అప్పుడు మీరు వెళ్ళదలచుకొనువారు వెళ్ళవచ్చును, చూచారా. ప్రార్ధన వరుసలో నిలిచియుండవలెనని కోరువారు నిలచియుండవచ్చును. కాని ఒక సోదరునిగా విషయమును మీకు తెలుపనీయండి
JOEL 2:28-30•
MATT 24:37•
LUKE 17:26,28,30
57లూకా 17:30లో యేసును గమనించండి. ఆయన అంత్యకాలము గూర్చి మాట్లాడుచూ, అది నోవహు దినములవలె ఉండునని చెప్పెను. "సొదిమ దినములలో వలెను ఉండును. మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడును" అని చెప్పెను. మరలా మనుష్యకుమారుడే ప్రత్యక్షపరచబడును గాని దేవుని కుమారుడు కాడు. "మనుష్యకుమారుడు."
చూడండి, అది మలాకీ 4ను తిరిగి తీసికొని వచ్చుచున్నది. ఖచ్చితముగా దానిని తీసుకొని వచ్చుచున్నది — తక్కిన ఈ ఇతర ప్రవచనములన్నియూ నెరవేరుచున్నవి — అదెట్లు జరుగవలసియున్నదో చూడండి. తన వాక్యము అలాగే యుండునని ఆయన రుజువు చేయుచున్నాడు. అది నిజము.
గమనించండి, ఆలాగు చేయునప్పుడు, ఆయన సర్వశరీరుల మీద తన ఆత్మను ఎట్లు కుమ్మరించునో, ఏమి జరుగనైయున్నదో, పూర్వస్థితికి తిరిగి ఏ విధముగా వచ్చెదమో చెప్పబడెను. "మీ కుమారులు, కుమార్తెలు ప్రవచించెదరు. నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను. పైన ఆకాశము మీద నేను సూచనలు చూపించెదను."
DAN 11:28,32
58సహో లీవైల్ ఇక్కడుంచిన ఒక పటమున్నది. ఒక రోజున ఆ పర్వతము మీద ఏమి జరిగినదో మీకు చూపించగోరుచున్నాను. ఈ గొప్ప అంశమునకు ముందు బడి పిల్లలందరూ వెలుపలికి వచ్చి దానిని చూచిరి, ఏడు ముద్రలు విప్పబడినవి. నేను ఆ పైన ప్రార్ధి౦చుచూ యున్నప్పుడు, గొట్టము ఆకారములో అగ్ని క్రిందికి దిగివచ్చి తిరిగి పైకి వెళ్ళి బ్రద్దలయినది, సుడులు తిరిగి మరలా మరలా క్రిందికి దిగివచ్చెను. దానిని బడి పిల్లలు చూచిరి. నేను జనుల యొద్దకు వెళ్ళి ఏమి చెప్పవలయునో దానిని ఆయన నాతో చెప్పెను.
మనము టుసాన్లో ఉన్న పాఠశాలలు, అవి అచ్చట యున్నవి. అది గాలిలో పైకి వెళ్ళినది. సైన్సు పటములను తీసినది, దానిని గూర్చి ప్రశ్నించెను. "అదెక్కడున్నది? ఏమి జరిగినది?" అని వారు ప్రశ్నించిరి. దానిని వారు విడమరచి చెప్పలేకపోయిరి. ఓ! ఇది ఏదో మూలన జరిగినది కాదు, వారి మనస్సాక్షియే చీకటి అయినది.
దానిని వారెన్నడూ తెలుసుకో లేరు. యేసు, ఆయన ఇచ్చట వున్నప్పుడు, అచ్చటయున్న లక్షలకొలది మంది ప్రజలకు అసలు భూమిమీద యున్నట్లుగానే తెలియదు. అవును. ఈనాడు కూడా దానిని అర్థము చేసికొలేని వారు లక్షోపలక్షల కొలది మంది ఉన్నారు. కాని అదెవరికొరకు పంపబడెనో వారు దానిని అర్థము చేసికొందురు. "బుద్ధిమంతులు ఆ దినమున తమ దేవుని ఎరుగుదురు, వారు గొప్ప కార్మయులు చేసెదరు." నేడు మనము జీవించుచున్నది ఆ ఘడియేనని గ్రహించుచున్నాము.
LUKE 17:28
59ఇప్పుడు సొదొమ వైపు చూడండి, ఏమి జరిగినదో చూడండి. "సొదొమ దినములలో ఉండినట్లే" అని ఆయన చెప్పెను. వాగ్దాన కుమారుని కొరకు చూచుచున్న ఒక గుంపు అచ్చట యున్నది. దానిని మనము నమ్ముచున్నాము. అది అబ్రాహాము మరియు అతని గుంపు. అక్కడ ఒక నులివెచ్చని గుంపున్నది, లోతు, సగము వెనుకకు జారినవాడు, అయినా గాని ఒక విశ్వాసియే. సొదొమలో యుండెను. మూడు రకముల జనులు ఎప్పుడూ మూడు రకముల వారుందురు. హాము, షేము, యాపెతు యొక్క జనులు, విశ్వాసులు, వేషధారులు, మరియు అవిశ్వాసులు కూడా యుందురు. వారు ప్రతిచోట ఉందురు. వారిని ప్రతి గుంపులోను మనము కనుగొందుము. వారిని మీరు ప్రతిచోట కనుగొందురు. ఆ గుంపులు ఇంకా ఇక్కడ యున్నవి. దానిని మీరు విభాగించవలసియున్నారు. దానిని మీరు లేఖనములలో నుండి గమనించి సరిపోల్చి చూచుకొనగలరు.
దీనిని వినండి. ప్రవచనాత్మకంగా మనము ఎచ్చట ఏ స్థానమందు కూర్చొని యున్నామో చూడండి. ప్రపంచము ఒక సొదొమ స్థితిలో యున్నదని మనలో ప్రతి ఒక్కరికి తెలియును ఇశ్రాయేలు యొక్క ప్రవచనములన్నియూ మనకు తెలియును. అది దాని స్వదేశములోకి చేరినది. మనము జాతీయంగా ఎక్కడ నిలబడియున్నామో మీరు తెలుసు కొనగోరునట్టి అయితే, ఇశ్రాయేలును, అది ఎచ్చట యున్నదో గమనించండి.
సంఘము ఏ స్థితిలోయున్నదో మీరు తెలిసికొనగోరినయెడల, స్త్రీలు ఎట్లు ప్రవర్తించుచున్నారో గమనించండి. ఆమె సంఘమునకు సాదృశ్యముగా యున్నది. ఆమె యొక్క అనైతిక, అపవిత్ర ధోరిణిని గమనించండి, సంఘము ఎక్కడున్నదో చూడండి. దానిని గమనించండి, చూడండి. స్త్రీలను గమనించి చూడండి. మీ స్త్రీలు ఎంతగా దిగజారి కలుషితమైపోయారో, ఏ స్థితిలో వున్నారో మీరు చూడండి — మీ సంఘము కూడా ఆ మాదిరిగానే యున్నది, చూచారా.
ఇశ్రాయేలు ఎచ్చటున్నదో గమనించండి. అప్పుడు మనము ఎంత సమయములో నున్నామో, ఎచ్చట యున్నామో అర్థమగును, చూడండి. ఆ సూచక క్రియలు, అద్భుతములు గమనించండి. ఒకవేళ మీరు, మీ, లేదా మీరు కండ్లు తెరచినట్లయిన మనము ఎక్కడున్నామో చూడగలరు.
GEN 18:1,2,22•
GEN 19:15,26
60ఇప్పుడు మనము ఏ స్థానములో ఎచ్చట కూర్చొనియున్నామో గమనించండి, ప్రపంచము సౌదొమ స్థితిలో యున్నది. ఇప్పుడు గమనించండి, "ఉండినట్లుగా" అనే దానిని ఇప్పుడు చూడండి. ఒక వాగ్దాన కుమారుడు రానైయున్నాడని ఆ రోజున ఒకరు కనిపెట్టి చూచుచుండిరి. అబ్రాహాము, మరియు శారాలు ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుచుండిరి. అది అబ్రాహాము గుంపు. వారు సొదొమలో లేరు.
కాని అదే సమయములో, వాగ్దాన కుమారుడు రానైయున్న చివరి అధ్యాయమందు, పరలోకము నుండి ముగ్గురు మనుష్యులు దిగి వచ్చిరి, ఇద్దరు దూతలు మరియు దేవుడు దిగివచ్చెను. వారు దిగివచ్చి అబ్రాహాముతో సింధూర వృక్షము క్రింద మాట్లాడిరి. అది నిజమేనా?
అందులో ఇద్దరు సోదొమలోనికి దిగిపోయి ఆ పట్టణము యొక్క పాపము గూర్చి కేకవేసిరి. అన్యుల ప్రపంచము అగ్నితో కాల్చబడుటకు ముందుగా అది జరిగెను. అప్పుడు సొదోమ మొత్తము నాశనమాయెను. లోతు అతని ఇద్దరు కుమార్తెలు మాత్రమే బయటకు లాగబడిరి. అతని భార్య కూడా రాలేకపోయెను, ఆమె వెనుకకు తిరిగెను. సంఘము అదే స్థితిలో ఇప్పుడున్నదని మీకు చూపించుటకు నాకు కొంత సమయము కావలెను.
ఇప్పుడు మీరు గమనించవలెనని కోరుచున్నాను.
GAL 3:29
61ఒకాయన నిలిచియుండి అబ్రాహాముతో మాట్లాడెను, అతడు అబ్రాహామునకు ఒక సూచన చూపెను, గమనించండి, అనేక గొప్ప సూచనలలో అబ్రాహాము దేవుని చూచెను. అది మనము నమ్ముచున్నాము. కాదా? కుమారుడు వచ్చుముందుగా, కాని కుమారుడు బయలుపరచబడబోవు ముందు, అతనికి ఒక సూచన ఇవ్వబడెను. ఎందుకనగా, కుమారుడు — నిజకుమారుడు, అబ్రాహాము యొక్క విశ్వాసముబట్టి దేవుని కుమారుడుగా యేసు ఉండెను. అబ్రాహాము సంతానముగా ఉండిన మనము క్రీస్తునందు చనిపోయితిమి, మనము అబ్రాహాము యొక్క సంతానమై యున్నాము.
GEN 17:5,15•
GEN 18:9-13
62ఈ కుమారుడు రాబోవు ముందు ఏమి జరిగెనో ఇప్పుడు గమనించండి.
అబ్రాహాము యొద్ద ఉండి మాట్లాడిన ఈయన, గుడారము తట్టు వీపు త్రిప్పి "అబ్రాహామా? అని పిలచెను. దానికి ఒక్క రోజు ముందే అతడు అబ్రాముగా నుండెను. "అబ్రాహామా, నీ భార్యయగు శారా ఎచ్చట?" అని అడిగెను. శారాయి కాదు, శా-రా-యి. శా-రా, అనగా రాజకుమారి. "నీ భార్యయగు శారా ఎక్కడ?"
"ఆమె నీ వెనుకనున్న గుడారములో యున్నది" అనెను.
"నేను నీకు చేసిన వాగ్దానమును బట్టి నేను నిన్ను దర్శించుదును" అని ఆయన పలికెను. వేరొక విధముగా చెప్పవలెననిన "జీవపు కాలమందు, శారా మరలా తన మామూలు జీవపు కాలమును ప్రారంభించును" అని అర్థము.
శారా వృద్దురాలాయెను, ఇప్పుడు వంద సంవత్సరముల వయస్సు, గుడారములో కూర్చొని చెంగు చాటున నవ్వుచుండెను. చూడండి, ఆమె తనలోతాను నవ్వుకొని, "ఆయన చెప్పినది ఎంతవరకు సత్యము? చూడండి, నేను బలము ఉడిగినదానను, నా యజమానుడును వృద్దుడైయున్నాడు గదా, ఏనాడో దాంపత్య జీవనము నుండి వైదొలగెను. నేను మరల నా యజమానునియందు ఆనందమును పొందుకోగలనా? అతడు వృద్దుడు, మరియు నేను వృద్దురాలను. కానుపు కలుగు కాలము గతించిపోయినదే, నా పాలు నాళములు చచ్చుబడినవి, సమస్తము… "ఆమె గర్భము ఎండిపోయినది." "మరలా ఏ విధముగా మేము సుఖమును పొందుకోగలము?" అని అనుకొన్నది.
గుడారము తట్టు వీపు పెట్టిన ఆ మనిషి, తన వీపును గుడారము వైపు త్రిప్పి కూర్చొనియున్న ఆయన, "శారా ఎందుకు నవ్వుచు ఏ విధముగా ఈ కార్యములు మాకు సంభవించగలవు? అని అనుకొనుచున్నది" అని అడిగెను. అది ఏమిటి? వివేచన, ఒక ప్రవచనము! చూచారా? ఆయన అదే చూచెను.
GEN 18:13
63"మనుష్య కుమారునియందు అది మరల జరుగును, మనుష్య కుమారుడు, అది," అని ఆయన చెప్పెను. అక్కడే మనుష్య కుమారుడుండెను. సరే, అతడు ఆయనను ఎలోహిం అని పిలచెను. "ప్రభువగు దేవుడు," ఎలోహిం అనగా ప్రభువగు దేవుడు ఎవరికయినా గాని తెలియును. "ఆదియందు ఎలోహిం భూమ్యాకాశములను సృజించెను" — అన్నింటికీ సమర్దుడు. మనుష్యకుమారుడు శరీరధారి అయ్యెను, ఆ సమయమందు ఆయన సరే, ఆయన అక్కడ నిలబడి తన వెనుకనున్న గుడారమందు శారా ఏమి తలంచుచున్నదో వివేచించెను. ఆయన వాగ్దానము చేసెను. గమనించండి, అబ్రాహాము యొక్క రాజసంతానము అదే విషయమును చూచునని వాగ్దానము చేయబడెను.
కాని లోతును గమనించండి. అతనియొద్దకు కూడా ఇద్దరు వర్తమానికులు వెళ్ళిరి. ఒకడు ఆ జనులయొద్దకును, మరియొకడు అతనియొద్దకు వెళ్ళి, మరియు వారు రానున్న ఉగ్రతనుండి పారిపోవుడని జనులను హెచ్చరించిరి.
64యేసు వాగ్దానము చేసిన ఆ రోజునుండి నేటివరకు ఎన్నడును ప్రపంచము ఆ స్థాయిలో లేదు.
ఈ భవనంలోనున్న ఏ చరిత్రకారుడయినా చెప్పవచ్చును, లేదా ఈ నా టేపును వినుచున్నవారు ఎప్పుడయినా గాని దానిగూర్చి నాకు వ్రాయవచ్చును. ఇప్పటికీ ముప్ఫయి సంవత్సరాల నుండి చరిత్ర, బైబిలు చరిత్ర చదువుచున్నాను. సంఘ చరిత్ర అంతటిలోనూ, ఏడు సంఘకాలములలోనూ ఎన్నడూ అటువంటి ఒక వ్యక్తి యున్నట్లుగా నేను ఎరుగను. ఇప్పుడు లవొదికయలో ఉన్న మనము మాత్రమే అది ఎరుగుదుము. హాముతో అంతమగు పేరుతో సంఘమంతటికి వర్తమానికునిగా వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకు ఎవరూ లేరు. బిల్లీ గ్రాహం ఇప్పుడు వచ్చెను. గతంలో మూడీ, ఫిన్నీ, సాంకీ, నాక్స్, లూథర్, మొదలగువారున్నారు గాని హాము అను పేరుగల వ్యక్తి లేడు. (జనములకు తండ్రీ). కాని గుర్తుంచుకొనండి, గ్రాహం ( G-R-A-H-A-M) అనునది ఆరు అక్షరములు. కాని అబ్రాహాము (A-B-R-A-H-A-M) ఏడు అక్షరములు.
గమనించండి, వారు అక్కడికి వెళ్ళిరి. బిల్లీగ్రాహం ఈ లోకములోనున్న సమస్త ప్రాంతములకు వెళ్ళి సొదోమ నుండి వెలుపలికి రండంటూ, "రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుడి" అని పిలచుచున్నాడు. బిల్లీ గ్రాహం వలె నీతీకరణమును గూర్చిన వాక్య విషయములో దేవుని యొక్క పట్టు కలిగిన వ్యక్తి నాకు తెలిసినంత వరకూ రంగములో ఎవరూ లేరు. దానిని ఆయన అందించగలడు. అతడు ఒక వేదాంత పండితుడు కాదు — అతడొక వేదాంత పండితుడని నేను అనుకొనుచున్నాను — కాని అతడొక శక్తిగల ఉపదేశకుడు కాడు, కాని దేవుడాతనికి తోడైయున్నాడు. ఒక ఆదివారపు బడిపాఠము వంటి దానిని చెప్పుచూ ప్రజలను వశీకరించుకోగల సామర్ధ్యము ఆయనకున్నది. ఆ ఘడియ యొక్క దేవుని సేవకుడతడు. ఎవరికి? సొదొమలో ఉన్న స్వాభావిక సంఘమునకు దేవుని దాసుడు.
కాని గుర్తుంచుకొనండి, అక్కడ ఒక ఆత్మీయ సంఘము ఉన్నది. అది ఏ సంఘ పద్ధతిలోనూ లేదు. బయటకు పిలువబడిన గుంపు, ఒక వర్తమానము వారు పొందిరి, ఒక వర్తమానికుడు కూడా వారికియున్నాడు. అది ఏమిటి? హృదయములోనున్న రహస్యములను వివేచించుట. దేవుడెల్లప్పుడూ తన వాక్యమును నిరూపించును.
ZECH 14:7
65మనము ప్రార్ధి౦చుదము.
ప్రియ పరమతండ్రీ, ఇది క్లిష్టసమయము, తప్పక నిర్ణయములు గైకొనవలెను… కాలము తరిగి పోవుచున్నది, ఏ ఘడియలో ప్రభువు వచ్చునో మాకు తెలియదు. నీ ప్రవక్తల ద్వారా గతించిన యుగములలో పలుకబడిన ప్రవచనములు ఇప్పుడు నెరవేరుచుండుటను మేము చూచుచున్నాము. ఓ దేవా, దీనినిబట్టి నీకు ఎంతగా వందనములు చెల్లించవలెను! నైపుణ్యతగల వారికిని, వేదాంతము పాండిత్యముగల వారికిని, ఆ గుంపులలో నిలబడియుండి ఈ లోకపుయుక్తిలను, అవిశ్వాసపు యుక్తిలను థెర్యముగా ఎదుర్కొని నిలబడి లేఖనములను తీసుకొని వారు ఎచ్చట నిలబడియున్నారో ఎరిగినవారై, దేవుని వాక్యము సత్యమని ఎటువంటి సందేహము లేకుండా నిరూపించు ఈ ఘడియయందు, ప్రభువా, నీ రాకడకొరకు ఎదురు చూచుచున్న మేము, జరుగునని ప్రవచించబడిన ఇతర సంగతులను నమ్ముచున్నాము. మా మధ్యన నీవు నడిచి ఏది జరుగునని నీవు చెప్పితివో అది జరిగించుట మేము నిలబడి చూచి ఆనందించుచున్నాము. నీ వాక్యము నిజమని నిరూపించబడుచున్నది.
నిత్యుడవగు ప్రభువా, వ్యాధితోనున్న నీ పిల్లలు ఇక్కడ కూర్చొనియున్నారు. ఇంకెంతకాలము మేము పని చేయువవలసియున్నామో మేమెరుగము. సాయంకాలపు సూర్యుడు అస్తమించుచున్నాడు. కాని నీవు ప్రవక్తకు ఈలాగు వాగ్దానము చేసితివి, "సాయంకాలమందు వెలుగు కలుగును." తూర్పున ఉదయించు సూర్యుడే పశ్చిమాన అస్తమించుట మేము చూచుచున్నాము. నాగరికతలో సూర్యునితో పాటు ప్రయాణించినది. ఇప్పుడు మేము పశ్చిమ తీరాన ఉన్నాము. సువార్త కూడా నాగరికతతో పాటు పయనించినది.
తండ్రీ, ఇది సువార్త యొక్క అంతమని మేమెరుగుదుము. కాలాంతము, యుగాంతముగా యున్నది. ఆమె నిత్యత్వములోనికి కనుమరుగవుచున్నది. కాని కుమారుడు బయటకు వచ్చును అని నీవు వాగ్దానము చేసియున్నావు, మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడును. చివరి దినమున ఇది జరుగును. సాయంకాలపు వెలుగులు వచ్చియున్నవి, తండ్రీ, దానినిబట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. అది ఎంతో దీనముగా యున్నది. నీవు ఎంతో సూక్ష్మముగా దానిని చేయుదువు, అది గొప్ప వారుగా, బహు లోతు ఆలోచనగలవారిగా పిలువబడువారి మీద నుండి చాలాసార్లు అది దాటిపోవును. నేర్చుకొనుటకు ఆసక్తిగల పసిబాలుర వంటి వారికి అది బయలుపరచబడును.
JOHN 14:12
66దేవా, ఈ రాత్రి ఆలాగే చేయుమని నిన్ను ప్రార్ధి౦చుచున్నాను, నీ దీన వ్యాధి పిల్లలు ఇక్కడ దేవుని వాగ్దానమును చూతురు గాక, వారు ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుదురు గాక! మరల బాగుపడి రేపు వారు బలమగు శరీరములతో ఇక్కడ నుండి వెళ్ళెదరు గాక, ప్రభువా, చివరి వ్యక్తికూడా లోపలకు చేర్చబడువరకు వారు వర్తమానమును ఒకరియొద్ద నుండి మరియొకరి యొద్దకు తీసికొని వెళ్ళునట్లు కృప చూపుము; అంతట తలుపు మూయబడును. ప్రియదేవా, మాకు సహాయము చేయుము.
తండ్రీ, నా కొరకు మరోసారి ఇది చేయుమని వీరందరి యెదుట ఈ రాత్రి నిన్ను అడుగుచున్నాను. ఒక రాత్రి ప్రజలు అసలు గమనించనట్లుగా కనబడెను, కాని ప్రభువా, ఈ రాత్రి మరల అది జరుగునట్లుగా ప్రార్ధి౦చుచున్నాను, ఎందుకనగా నా సమయమును మించి మాట్లాడాను. కాని ఎంతవరకు ఆలాగు చేయుదుమో మాకు తెలియదు. కాబట్టి తండ్రీ, నేను ప్రార్ధించుచున్నాను. నా మొర వినవా? నీ ఆత్మతో నింపబడి ఈ రాత్రి ఇక్కడ కూర్చొనియుండిన ఈ భక్తిగల స్త్రీ-పురుషల ప్రార్థన ఆలకించుము. ప్రభువా, వారు విశ్వాసులు. నీవు వారిమధ్య పనిచేయుము. నేను ప్రార్ధి౦చుచున్నాను, నీవు చెప్పిన మాటను నీవు స్థిరపరచుదువని నేను ఆశించుచున్నాను. "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును." యేసూ, నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని మరల రుజువు చేయుము. దీనిని దేవుని మహిమకొరకు ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామము ద్వారా అడుగుచున్నాను. ఆమేన్.
67ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగండి, ప్రార్ధనా కార్డులు గలవారు ఎందరున్నారని నేను తెలిసికొనగోరుచున్నాను. ప్రార్ధనా కార్డులు గలవారు చేతులు ఎత్తగలరని నేను కోరుచున్నాను. ఆ ప్రార్థనా అట్ట ప్రతీ ఒక్కొక్కరి దగ్గర యున్నవి. మంచిది, అది మామూలుగానే అందరూ కలిగియున్నారని తలంచుచున్నాను. రోగులుగా ఉండియు ప్రార్థన కార్డులు లేని వారెందురున్నారో చేతులు ఎత్తండి. ఈలాగు చెప్పండి, "నాకు ప్రార్థన కార్డు లేదు గాని వ్యాధిలో, అవసరతలో యున్నాను."
ఒక క్షణము పాటు మర్యాదగా ఉండవలెనని కోరుచున్నాను. మీతో మాట్లాడుట నాకిష్టము. నేను చాలా సమయము తీసికొందును, ఎప్పుడూ అదే నా సమస్య; కాని మీరు రాకముందు, నేను చెప్పినది సత్యమని దేవుడు రుజువు చేయునని నేను నమ్మి నిరీక్షించుచున్నాను. ఆయననే చూడనీయండి రోగులుగా కూర్చొనియుండిన మీలో నన్ను అసలు ఎరుగనివారు ఎందరున్నారో చేతులెత్తండి. అటు చూడండి. వారిగూర్చి నాకసలు ఏమీ తెలియదు. నిజము.
ISA 53:5•
ROM 8:34•
HEB 3:1•
HEB 13:8
68ప్రార్ధన కార్డులు లేనివారిని ఇప్పుడు కోరుచున్నాను. ప్రార్ధన కార్డులు ఇప్పుడు పిలువబడును. మీరు ప్రార్థించుచుయుండవలెనని నేను కోరుచున్నాను.
యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మన ఒప్పుదలనుబట్టి ఆయన ప్రధాన యాజకుడుగా అక్కడ కూర్చొని మధ్యవర్తిగా విజ్ఞాపన చేయుచున్నాడు, అని బైబిలు చెప్పుచున్నది. మొదటగా మనము ఒప్పుకొనవలెను. తరువాత ఆయన ప్రధాన యాజకుని పనిచేయును, ఎందుకనగా మన ఒప్పుదలను బట్టియే ఆయన మధ్యవర్తిత్వము చేయును. సేవక సోదరులారా, అది నిజమేనా? చూడండి. ఆయన మన ఒప్పుదల మీదనే మధ్యవర్తిగా విజ్ఞాపన చేయును. ఆయన ఏమైయున్నాడో, ఆయన మనకొరకు ఏమి చేసెనో దానిని మనము ఒప్పుకొందుము; ఆయన చేయబోవునది కాదు. దానిని ఎప్పుడో ఆయన చేసెను. ఆయన ఎప్పుడో దానిని చేసెనని మనము ఒప్పుకొనవలెను. "అయన మన అతిక్రమములనుబట్టి గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందితిమి."
HEB 4:15
69ఇప్పుడు, పరలోకపు తండ్రి ఎరుగును.
మిమ్మును చూచుచుండగా ఓహియో నుండి వచ్చిన నా మంచి స్నేహితుడు ఒకాయనను నేను గుర్తుపట్టాను, అతడు మరియు అతడి భార్య అచ్చట కూర్చొనియున్నారు. శ్రీ డాచ్ మరియు అతడి భార్య వారి ప్రక్కగా కూర్చొనియుండినవారు రెవరెండ్ బ్లయర్, గతరాత్రి నేను చూచాను. నాకు ఆ జనమున్న చోట చీకటిగా కనబడుచున్నది. ఈ లైట్ల వలన నా కంటికి ఏదో రుద్దినట్లు కనబడుచున్నది. మిమ్మును అంత బాగా చూడలేకున్నాను.
కాని మీరు ప్రార్ధి౦చవలెనని కోరుచున్నాను, మీకు అవసరమగు దానిని మీ హృదయములో నుంచుకొని ప్రధాన యాజకుని అడగండి, ఆయన మన బలహీనతలను తాకగలడు. ఇప్పుడు మిమ్మును నేనెరుగను. మీ సోదరుని, మీ భర్తను, మీ సంఘకాపరిని, మరొకరిని తాకినట్లుగా మీరు ఇప్పుడు నన్ను తాకవచ్చును. అందువలన ఏప్రయోజనము — దానివలన ఏ ప్రయోజనము లేదు. కాని మీరు ఆయనను తాకినచో, మనము నిజంగా ఆయన ఆత్మతో ఏకీభవించినయెడల, అప్పుడు నీ విశ్వాసమును ఆయనను తాకుటకు ఉపయోగించుకొనగలడు, తిరిగి మాట్లాడు వరము ద్వారా ఆయన తాకును, చూడండి. నేను ఇక్కడున్న దీనివలె మాట్లాడలేని స్థితిలోయున్నాను. ఒక స్వరము దానిగుండా మాట్లాడవలెను. అవును… దీనిగుండా ఏదీ మాట్లాడనియెడల ఇది మూగదే. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఆ విధముగా యుంటే అతడు మూగవాడే. దేవుడు వారిద్వారా మాట్లాడి తానే, అప్పుడు ఈ కార్యములు జరుగును.
70ఇప్పుడు మీరు ప్రార్ధించండి, నేను చెప్పిన సంగతులు సత్యమో కాదో చూడండి. దేవా! ఆలాగుండునట్లు సహాయము చేయుము. ఆయన చేయబోవునని నేను చెప్పును. ఆయన చేయునని నేను ఆశించుచున్నాను, ఆయన చేయునని నేను నమ్ముచున్నాను. ప్రపంచమంతటిలోను, ఎన్నో దేశములు దర్శించి, లక్షలకొలది జనులను కలిసికొన్నాను గాని ఇన్ని సంవత్సరములలో ఆయన ఎన్నడూ నన్ను సిగుపరచలేదు. ఆయన నన్ను ఎన్నడూ తప్పనీయలేదు. ఇక్కడ నేను నిలబడియున్నంత ఖచ్చితముగా అది చెప్పగలను. ఇప్పుడును ఆయన నన్ను తప్పిపోనీయుడని నేను నమ్ముచున్నాను.
మీరు భయభక్తితో కూర్చొని యుండవలెనని కొద్ది క్షణములపాటు కోరుచున్నాను. ఒక్క క్షణములో రోగులను మాత్రము ఉంచి తక్కిన వారిని పంపివేయుదుము. విశ్వాసులారా, మీరు నా వైపు చూడవద్దు, కాని నమ్మికయుంచుడి. ఈలాగు చెప్పుడి, "ఈయన చెప్పినది వాక్యమని నేను నమ్ముచున్నాను. మనము ఎంత సమయము మించిపోయి జీవించుచున్నామో నాకు తెలియదు, కాని అది జరుగవలసియున్నది. అతని మాటలు దేవునియొక్క మాటలయినయెడల అవి తప్పిపోవు. మానవుని మాటలు తప్పిపోవును, కాని దేవుని యొక్క మాటలు తప్పవు." దేవునికి తన మాటను నిలబెట్టుకోవలసిన బాధ్యతయున్నది. దానిని ఆయన రుజువు చేయును. దానిని ఆయన రుజువు చేయును. "నాయందు విశ్వాసముంచు వాడు." ఇది అంత్యదినము అని ఆయన రుజువు చేసెను. ఏమి సంభవించునో ఆయన రుజువు చేసెను. ఇది జరుగవలసియున్నదని ఆయన నిరూపించెను.
71గుర్తుంచుకొనండి, అబ్రాహాము, అతని గుంపు వాగ్దాన పుత్రుడు వచ్చువరకు దేవుని నుండి మరి ఏ సూచనను పొందలేదు. అది నిజమని ఎందరికి తెలియును? అది వివేచనా సూచన — రాజ సంతానముగానున్న అబ్రాహాము సంబంధికులకు, మీరు నాకు చెవియొగ్గవలెను, నేను మీకు చెప్పుచున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. "మీరు మీ కడవరి సూచనను పొందుచున్నారు." అది వాక్యానుసారము మరియు నా హృదయములోనున్న దేవుని ప్రత్యక్షతను బట్టి ఇది సత్యమని ఇది చెప్పుచున్నది. అది సత్యమని మీరు దీనిని నమ్ముదురని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, మీరు నమ్మండి. ప్రతి ఒక్కరూ నమ్మి ఈలాగు చెప్పండి. "ప్రభువైన యేసూ, నిన్ను తాకనిమ్ము నా హృదయములో ఒక అవసరమున్నది, నా గూర్చి బ్రెన్హాం సోదరునికి ఏమీ తెలియదని నేనెరుగుదును. అసలు నేను అతడిని ఎరుగను. అతడు నన్నెరుగడు గాని, నీవు ఎరుగుదువు. ఇతడు నాతో సత్యము చెప్పిన యెడల ఇది జరుగును."
ఇప్పుడు ఎవరూ కదలవద్దు, కొద్దిసేపు ఓపిక పట్టండి… చూడండి, మీరు ఆత్మయైయున్నారు. ఆయన వాక్యము నెరవేరునట్లుగా ఇక్కడున్న ప్రతి ఆత్మను యేసుక్రీస్తు నామము పేరట నా అధీనము క్రిందికి తెచ్చుచున్నాను. ఇప్పుడు మర్యాదగా యుండండి. ప్రార్ధించండి. ఆయనవైపు చూచి, ఇట్లు చెప్పండి, "ప్రభువా, దానిని నేను నమ్ముచున్నాను. అపనమ్మిక లేకుండా సహాయము చేయుము."
ప్రారంభించుదము. ఈ భవనములో కొంత భాగమును నేను ఒక రకముగా నియంత్రణలో ఉంచవలసియున్నాను, ఎందుకనగా… చూడండి, అనేకులైన మీరు, మీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మగా ఉన్నారు.
72నేనేమీ చేయలేను.. "నా సంగతి ఏమిటి" అని మీరందురు. నేనేమియూ చెప్పలేను. అది నా వశములో లేదు. దేవుని యొక్క క్రియలన్నియూ సార్వభౌమత్వముగలవే. ఈ విధముగా వేదిక యొద్దకు వచ్చుట ద్వారా అనేకులు నేటి రాత్రియందు స్వస్థత పొందవచ్చును. మరి అనేకులు పొందకుండా ఉండవచ్చును. అదంతయూ దేవుని యొక్క సార్వభౌమాధికారములో యున్నది. ఇది చేయమని ఆయనకు ఎవరు చెప్పగలరు? ఎవ్వరూ చెప్పలేరు. ఆయన తన స్వచిత్తానుసారము స్వసంకల్పానుసారము పనిచేయును.
కాని మీరు నమ్మిక్ర మాత్రముంచండి, దీనులుగా ఉండుడి, ఉద్రిక్తతకు లోనుకావద్దు. దేవుని సమీపించి ఈలాగు చెప్పండి, "ప్రభువగు దేవా, దానిని నేను నమ్ముచున్నాను," చూచారా. "నీ వస్త్రపు చెంగును తాకనిమ్ము నాకు పలాని-పలాని అవసరతయున్నది. సోదరుడు నన్నెరుగడు, నా అవసరత అతడికి తెలియదని నేనెరుగుదును, కాని నీవు చేసిన ఈ కార్యముల గూర్చి అతడు చెప్పెను. నీవు అదే రీతిగా ఇక్కడున్నావని చెప్పెను."
ఈ వేదిక మీద ఉన్న సోదరులు కూడా అందులో ఇమిడియున్నారు. క్రీస్తు సువార్తలో సహపనివారలుగా సోదరులగు మిమ్మును అడుగుచున్నాను. ఈ లోకమును విడిచి చనిపోవుచున్న వ్యక్తి ఎంత యధార్థతగా మాట్లాడునో అంత యధార్థముగా నేను మీతో మాట్లాడుచున్నాను. మనము విడిచిపెట్టవలసియున్నాము. నేను చెప్పుదానికి తీర్పు దినమున లెక్క అప్పగించవలసియున్నాను. అది నేను బాగుగా ఎరిగియున్నాను. ఇక్కడ నిలబడి నాకు మీరు సహాయము చేయుచున్నందుకు మిమ్మును నేను అభినందించుచున్నాను. దేవుని రాజ్యము నిమిత్తము నాకు చేతనయిన సహాయము చేయ ప్రయత్నించుచున్నాను. నేను ప్రార్ధించి మరియు అడుగుచున్నాను.
73ఆ పటములోని వెలుగును ఇక్కడున్నవారెందరు చూచారు? మీరా పటము చూచారా? అది అక్కడ వ్రేలాడుచున్నది. మీకు అది కనబడుచున్నదా? ఒక స్త్రీ చేతిరుమాలు పట్టుకొని కూర్చొనియున్నది. తన కిష్టమగు ఒక వ్యక్తి కొరకు ఆమె ప్రార్ధి౦చుచున్నది. అది నిజమేగదా? ["అది నిజమే బ్రెన్హాం సోదరుడా!" అని ఆమె చెప్పెను.] ఆ ప్రియమైన వ్యక్తి కొరకు… నేను ఆయన ప్రవక్తనని లేదా నన్ను క్షమించండి దాసుడనని నీవు నమ్ముచున్నావా? ["నిశ్చయంగా"] అది నీవు నమ్ముదువు? మంచిది. సంగతిని దేవుడు నాకు బయలుపరచినయెడల అది దేవునియొద్ద నుండి వచ్చినదని నీవు అంగీకరించెదవా? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన స్త్రీవలె నమ్ముదువా? ఇప్పుడు నీకు తెలుసు, నీవు నా నుండి ఇరవై లేదా ముప్పది అడుగుల దూరంలోయున్నావు. నీవు నన్నెన్నడూ తాకలేదు. కాని నీకు తెలిసిన ఒక దానిని నీవు తాకియున్నావు, ఎవరో ఒకరు. అది ఏమిటి, అది ఒక స్త్రీ కొరకు, అది నీ కుమార్తె. అది నిజము. ఆమె బాగవునని నీవు నమ్ముచున్నావా? ఆమె మత్తుమందుకు బానిస. అది అక్షరాలా నిజము. ఆమె త్రాగి ఈదుట నాకు కనబడుచున్నది, చూడండి.
నీ చేతిలోనున్న గుడ్డను ఆమె మీద వేయుము, సందేహించవద్దు. ఆమెను దేవుడు విడిపించునని నేను నమ్ముచున్నాను. నీవు నాతో పాటు అది నమ్ముదువా? ఆమేన్.
ఆమెను నేనెరుగను, కాని దేవుడామెను ఎరుగును. నీ పూర్ణహృదయముతో ఇప్పుడు నీవు నమ్ముదువా?
74చారలు చొక్కాయి వేసికొని అక్కడ కూర్చొనిన వ్యక్తి హెర్నియాతో బాధపడుచున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచి బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? దానిని ఆయన చేయగలడని నీవు విశ్వసించుదువా? నా జీవితంలో ఎన్నడూ అతనిని నేను చూడలేదు. అయ్యా, నీకు ప్రార్థనా అట్ట యున్నదా? నీకు లేదా? నీకు అవసరములేదు. "నమ్మినచో చాలును."
ఇక్కడ కూర్చొనియున్న ఒక స్త్రీ మరో స్త్రీ మీద నుండి ఎగిరి ఎగురుచూ చూచుటకు ప్రయత్నించుచున్నది. ఆమె నాకు అపరిచితురాలు. కాని ఆమె చాలా ఉద్రిక్తతతో యున్నది. ఆమెను నేనెరుగను. నా జీవితంలో ఆమెను ఎన్నడూ నేను చూడలేదు, కాని దేవుడామెను ఎరుగును. ఆమె ఒకదానితో సంబంధము కలిగియున్నట్లు ఇప్పుడే ఆమె గ్రహించినది. ఒకదాని కొరకు నీవు అక్కడ ప్రార్ధి౦చుచున్నావు. ఆ కారణమేమనగా నీవు ఈ రాత్రి మాత్రమే ఉండగలవు, నీవు తప్పక వెళ్ళిపోవలెను. రేపు నీ ఇంటికి వెళ్ళవలెనని తలంచుచున్నావు. నీవు ఇక్కడ నుండి రాలేదు లేదా కాలిఫోర్నియా నుండి కూడా కాదు. ఇక్కడకు తూర్పుగా నీవు వెళ్ళుదువు. నీవు విమానములో వెళ్ళేదవు — విమానములో వెళ్ళవలెనని నీవు సంకల్పించావు. నీవు ఓక్లహామా నుండి వచ్చావు. అవును. అది నిజము. నీవు కూడా ఒక మరణ స్థితిలో యున్నావు. ప్రార్థన చేయించుకొనుటకు ఇక్కడికి వచ్చియున్నావు. నీకు ప్రార్థన కార్డు లేదు. కాని ఇక్కడికి నీవు వచ్చినయెడల బాగుపడునని నీవు నమ్మితివి. అది నిజము.
నీకు కాన్సరు. ఎముకలో ఆ కాన్సరున్నది. ఇప్పుడు నీవు స్వస్థత పొందుదువని నమ్ముచున్నావా? నా సోదరీ, నీవు ఆయనతో సంబంధము కలిగియున్నట్లు నమ్ముదువా? ఒకవేళ నీవెవరివో చూచునట్లు నాకు దేవుడు సహాయము చేసినయెడల నీకు అది సహాయము చేయునా? అది నీకు సహాయపడునని నీవు నమ్ముచున్నయెడల, నీ చేతిని ఎత్తుము. దేవుడు నీకు సహాయము చేయును. మంచిది, శ్రీమతి స్టీల్, నీవు ఓక్లహామాకు తిరిగి వెళ్ళవచ్చును. ఆమె నాకు తెలియదు. ఆమెను ఎన్నడూ నేను చూడలేదు.
75ఆమె వెనుక ఒక స్త్రీ కూర్చొనియున్నది. ఆమె ఉబ్బు నరములు అను వ్యాధితో శ్రమపడుచున్నది. ఆమెకు ఒక త్రాగుబోతు కుమారుడున్నాడు, అతని కొరకు ఆమె ప్రార్ధి౦చుచున్నది. ఆమె నమ్మిన ఎడల ఆమె బాగవును. శ్రీమతి మాసన్, నీకు యేసుక్రీస్తు స్వస్థతను అనుగ్రహించునని పూర్ణహృదయముతో నీవు నమ్ముదువా? నీవు నమ్ముదువు, సరే. అక్కడ నీ ప్రక్కన కూర్చొనియున్న స్త్రీ మీద, నీ చేతిని ఉంచుము. రక్షించబడని తన భర్తకొరకు ఆమె ప్రార్ధి౦చుచున్నది. దేవుడు స్వస్థతను దయచేయుము.
ప్రార్ధి౦చుదము. ప్రియదేవా, ఆమెకు ఆ దీవెనను దయచేయుమని ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, ఆమె హృదయ వాంఛను తీర్చుము. ఆమె విశ్వాసము నీకెంతో దగ్గరగా యున్నది, అది నిన్ను తాకినది. తండ్రీ, నీవు సహాయము చేయుమని దీనిని నేను యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు మీ పూర్ణహృదయముతో నమ్మండి, దానిని మీరు పొందెదరు. మీరు ఆలాగు చేయుదురా? ప్రభువు మిమ్మును దీవించును.
అమ్మా నీ భర్త రక్షించబడనైయున్నాడని నీవు నమ్ముదువా? నీ పూర్ణహృదయముతో నమ్ముదువా? నమ్ముచున్నయెడల నీ చేతిని ఎత్తుము.
76నా ముందు ఎంతో భారముగా నున్నట్లుగా ఒక స్త్రీ కనిపించుచున్నది. ఆమె అక్కడ కూర్చొనియున్నది. నేను దేవుని యొక్క దాసుడనని నీవు నమ్ముచున్నావా? నేను దైవసేవకుడనని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముదువు. మంచిది. నిన్ను నేనెరుగను. నీ బాధ ఏమిటి, అవి గ్రంథులు, నీ వ్యాధి గ్రంధులలో యున్నది. నీవు ఉండవలసిన బరువుకంటే నీవు మించిన బరువుతో ఉన్నావు. నీవు వైద్యుని యొద్దకు వెళ్ళావు గాని అతడు ఏమీ చేయలేనని చెప్పెను, కాని అతడు ఈ లోక వైద్యుడు, చూచారా. నీవు ఎంతో వేదనను కలిగియున్నావు. నీవు నీ భర్తను కోల్పోయావు. నీవు ఇక్కడి వ్యక్తివి కావు — నిజంగా నీవు ఆర్కన్సాస్ నుండి వచ్చావు. నీవు ఉద్యోగమును కూడా వెదకుచున్నావు, నీకు ఉద్యోగము దొరుకుట లేదు. నిన్ను ఉద్యోగమునకు పిలువరేమోనని నీవు భయపడుచున్నావు. పిలువబడనేమోనని నీవు భయపడితివి. కాని ఇప్పుడు నీ విశ్వాసము దేవునిని తాకినది. నా సోదరీ, నీవు వెళ్ళుము. దేవుడు నీకు ఒక ఉద్యోగమును యిచ్చును, నీ హృదయ వాంఛను తీర్చును.
దేవుడు తన మాట నిజమని రుజువుపరచును. అది ఆలాగేనని నీవు నమ్ముదువా? ఇప్పుడు మీరు మరల నాతో ప్రార్ధి౦చవలెనని కోరుచున్నాను.
MATT 9:24•
MARK 5:39•
LUKE 8:52•
LUKE 17:28,30
77తండ్రియగు దేవా, నీవు అదే రీతిగా యున్నావని రుజువు చేశావు. "ఆ చిన్నది చనిపోలేదు గాని నిద్రించుచున్నది" అని నీవు చెప్పినప్పుడు, తరువాత దానిని నీవు నిరూపించవలసి యుండెను. అంత్యకాలము వచ్చుముందు సొదోమ యొద్ద ఆయన తన్నుతాను ప్రత్యక్షపరచుకొనిన రీతిగానే మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచుకొనునని నీవు వాగ్దానము చేసియున్నావు. ప్రభువా, అది నీ వాగ్దానము. ఇప్పుడు భూమి మీదికి నీవు పరిశుద్దాత్మ రూపములో వచ్చియున్నావు, ఈ రాత్రి మా మధ్య ఉన్నావు, మేము విశ్వసించుచున్న ప్రజలము, దానిని రుజువు పరచియున్నావు. ఆ దినము నీవు చేసిన రీతిగానే నీవు నీ వాక్యమును నిరూపించియున్నావు.
ప్రభువా, ఇంకేమీ రుజువు మాకక్కర్లేదు. నీవు మామధ్య ఉన్నావు. మేము నిన్ను ప్రేమించుచున్నాము. వాక్యము ప్రకారము, రాకడ ముందు ఇదే చివరి సూచన అని మేము గ్రహించియున్నాము. ఈ ఛాయలు, మాదిరిలు అన్నియూ ఎన్నడూ విఫలము కావు. అవి అనుకూలముగా ఉండవలసియున్నవి కాబట్టి తండ్రీ, మేము నీ పిల్లలముగా ప్రార్ధన కొరకు వచ్చియున్నాము, ప్రతి ఒక్కరు బాగవుదురు గాక. ఈ స్వస్థత కూటానంతరము మా మధ్య ఏ ఒక్క రోగియు లేకుండును గాక.
ప్రియదేవా, ప్రతి ఒక్కరు స్వస్థత పొందునట్లుగా నీ అభిషేకమును ధారాళముగా ప్రజల మీద కుమ్మరించుము ఇంకా నీ పిల్లలు కానివారు ఎవరైనా ఇక్కడున్నయెడల, ఇప్పుడు వారు వాక్యము వినిరి. కార్యములు జరుగుట చూచిరి, నీ వాక్యము యొక్క ప్రతీ అక్షరము ఖచ్చితముగా నెరవేరిన వాటిని, నీవెవరివో, నీవేమైయున్నావో మరియు నీవు ఇచ్చట ఉన్నావనే దానిని నిరూపించుటకు చూచిరి. ప్రభువా, నీవు అబద్ధమును దీవించెదవా? ప్రభువా, నీవు నిశ్చయంగా దీవించవు. ప్రభువా, కాని నీవు నీ వాక్యమును దీవించుదునని వాగ్దానము చేసియున్నావు. అది వ్యర్ధముగా తిరిగి రాదు. ఎందుకొరకు అది ఉద్దేశించబడినదో దానిని అది నెరవేర్చును. ఇప్పుడు ఎట్టి సందేహ ఛాయలేకుండా, ఈ రాత్రి మా ముందు నీవు దానిని జరిగించితివి.
MARK 8:38•
LUKE 9:26
78ఇంతకు ముందు విశ్వసించని వారెవరైనా యున్నచో తలలు వంచియుండగానే చేతులెత్తగలరా? మీ శిరములు వంచియుండగానే చేతులు ఎత్తండి. నిలబడి ఈలాగు చెప్పండి, "ఇప్పుడు నేను నా పూర్ణహృదయముతో నమ్ముచున్నాను, ఇప్పుడే యేసుక్రీస్తును నేను స్వీకరించగోరుచున్నాను." దానిని నీవు ఆలాగు చేయుదువా? ఇంకా క్రీస్తును అంగీకరించనివారు ఇప్పుడు ఆలాగు చెప్పి ఆయనను అంగీకరించగోరుచున్నారా? నేను మీకు చెప్పును… మీ ఎన్నిక చొప్పున ఆలయానికి వెళ్ళండి. కాని యేసుక్రీస్తును మీరు చేర్చుకొనవలెనని నేను చెప్పుచున్నాను. పరలోకము నుండి ఆయన కనబడే తన శరీరములో వచ్చు వరకూ బహుశా మీరు ఒక వ్యక్తిలో ఆయనను ఇంత దగ్గరగా చూచే మరో అవకాశము ఒకవేళ మరెన్నడూ నీకు కలుగదు. ఇంకా నీవు ఆయనను అంగీకరించనియెడల ఇప్పుడు ఆయనను అంగీకరించెదవా?
ఇక్కడ మీరు ఎవ్వరూ లేచి నిలబడలేదనే దానిని ఆధారము చేసుకొని, మీరందరూ వుంచి అవగాహనగలవారుగా, తెలివిగల ప్రజలుగాను, మరియు మీరు ఏమి చేయుచున్నారనే దానిని గ్రహించు ప్రజలుగా మీరుందురని నేను నమ్ముచున్నాను. అట్లు౦డియు ఒకవేళ మీరు కూర్చొనియున్నయెడల ఈ మాటలు గుర్తు౦చుకొనండి. "మనుష్యుల యెదుట నా గూర్చి సిగ్గుపడు వానిని గూర్చి నేను నా తండ్రి యెదుట సిగ్గుపడుదును. "బహుశా జనసమూహములో ఎవరో నిలబడియుండవచ్చును. అవును, వెనుక నిలబడియున్నారు.
ప్రియదేవా, ఆ నిలబడియున్న వారిని నేను చూడలేను. వారు నిన్ను స్వీకరించగోరుచున్నారు. ప్రభువా, ఇది ఇంతవరకు చెయ్యబడలేదనే దానిని వారు గ్రహించుచున్నారు. దానిని నీవు ఇప్పుడు ధృవపరచి, రుజువు చేయుచున్నావు. ఈ సమయమందు వీరి హృదయములలో ఏర్పడిన అద్భుతమైన ఈ కదలికను బట్టి తండ్రీ, నేను ప్రార్ధి౦చుచున్నాను. ఒకవేళ ఏర్పరచబడిన ఆ చివరి వ్యక్తి అతడేనేమో మేమే విధముగా ఎరుగుదుము? లాస్ ఏంజలస్కు ఇదియే అంతము కావచ్చును. దేవుని రాజ్యములోనికి జన్మించు ఇదే ఆఖరి ఆత్మయై యుండవచ్చును. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. అది వచ్చినప్పుడు తలుపు మూయబడును, శరీరము పరిసమాప్తియగును.
అది ఒక వింత శరీరముగా గాని లేదా వింత వధువుగా గాని ఉండదు. అందులో ఎందరో సభ్యులుందురు, వారి పేర్లన్నియూ గొర్రెపిల్ల జీవగ్రంథములో జగత్తు పునాది వేయబడకముందే వ్రాయబడెను. తన భార్యను రక్షించుటకు ఆదాము వచ్చినట్లుగా యేసు వచ్చెను. ఇప్పుడు వారిని నీ రాజ్యములోనికి చేర్చుకొనమని, దేవా, నీకు ప్రార్ధి౦చుచున్నాను. వారు నీ చేతులలో యున్నారు. ప్రభువా, వారితో మాట్లాడుము, యేసు నామమున నేను ప్రార్ధించుచున్నాను. ఆమెన్.
79నిలబడిన మీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. మీలో కొందరు నిలబడి యున్నారని నాకు తెలియదు. కొందరు వెనుకకు, కొందరు మేడ ముందరి వసారాలో నిలబడియున్నారు. నా కొరకు ఒక పని ఇప్పుడు చేయమని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. దయచేసి నన్ను అర్థము చేసికొనండి. సంఘము అయిపోయిన తరువాత ఇక్కడున్న ఒక సేవకుని కలిసికొని మాట్లాడండి, మీరు ఆలాగు చేయుదురా? దానిని మీరు మరచిపోవద్దు. మీరెన్నడూ క్రైస్తవ బాప్తిస్మము పొందనియెడల వచ్చేసారి పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందువరకు చేతులు పైకెత్తియుండుడి.
ఇక్కడ చాలామందికి ప్రార్ధనా కార్డులున్నవి. వారిని నిలబడి అడ్డంగా నడిచి ఇక్కడికి రమ్మని కోరుచున్నాము. లేక నేను రావలెనా? లేదా నేను మీ యొద్దకు రావలెనా? "వద్దు." (నేను రాలేను. ఈ ప్రక్కనుండి ఇక్కడకు రండి, ఈ ప్రక్క నుండి ఇటు వైపుగా రండి.) ప్రార్ధనా కార్డులున్నవారిని ఈ మార్గము గుండా ఇక్కడకు రండి. ఇప్పుడు, మీరు ఎవరైనా ఒకవేళ వెళ్ళవలెననుకొనేవారు మీరు వెళ్ళవచ్చును, అది నేను ఆలస్యము చేశాను. నన్ను క్షమించండి. రేపు ఇంకా ముందు ముగించ ప్రయత్నించెదను. గోడ గడియారముబట్టి పది గంటల పది నిమిషములయినది.
ఈ రాత్రి మీరు వచ్చినందుకు మీకు చాలా వందనములు. పరమ దేవుడు మిమ్మును ఆశీర్వదించును. మీరు ఉండి ప్రార్ధన వరుసను గమనించగోరినయెడల ఎప్పుడూ మీకు ఆహ్వానమే. కాని ఇప్పుడు మేము రోగులకు ప్రార్ధి౦చ ప్రారంభించుచున్నాము. మీరు ఉండగోరితేనే ఉండండి. ప్రభువగు యేసు నామములో మిమ్ము పంపించుచున్నాను. దేవుని సమాధానము మీతో కూడా వచ్చును గాక, దేవుడు మిమ్మును దీవించి మీ శరీరములకు రాత్రంతయూ విశ్రాంతిని, మంచి ఆరోగ్యమును ఇచ్చి, రేపు రాత్రి మీరు తిరిగి రాకలుగునట్లు చేయును గాక. ఇప్పుడు దేవుడు మీకు తోడైయుండును గాక.
80ఇప్పుడు ప్రార్ధన కార్డులున్నవారు ప్రార్థన కొరకు నిలబడండి. విశ్వవ్యాప్తంగా జనుల కొరకు మేము ప్రార్ధి౦చుదుము. ప్రార్ధన కార్డులు పట్టుకొని నిలబడియున్నవారిని అడుగుచున్నాము. మీకు జీవితములో ఏదయినా సందేహమున్నదా? ఏదైనా యున్నదా (క్షమించండి) మీరు ఇంకా ఒప్పుకొనిన పాపము మీ జీవితములో ఏదయినా ఉన్నదా? ఉన్నచో, నేను మిమ్మల్ని ఈలాగు అడుగుదును. మీ హృదయములో ఇంకా ఒప్పుకొనని పాపము ఉంచుకొని ప్రార్ధన వరుసలోనికి రావద్దు, ఎందుకనగా మీరు… ఇది పిల్లల రొట్టె, చూడండి. మీరింకా క్రైస్తవులు కానియెడల మీ జీవితములను క్రీస్తుకు సమర్పించుకొనుడి. అప్పుడు ప్రార్ధన వరుసలోనికి రండి. అది విశ్వాసిది. ఆలాగు మీరు చేయుదురా? మొదట ఆయనను మీ రక్షకునిగా అంగీకరించుడి, అప్పుడు ప్రార్థన కొరకు వేదిక మీదికి రండి.
81ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ప్రార్ధి౦చబోవుచున్నాను, వారిని దాటిపోవుట కాదు, అలవాటుగా చేయునట్లు చేయను. ఇప్పుడు మనము ఆలయములో ఉన్నాము. మనము ఎంత సమయమైనను ఉండి ప్రార్ధి౦చుకోవచ్చునని సహోదరి వేయుట్ అనుమతించియున్నదని నేను తలంచుచున్నాను. ["అవును. మీరు కోరినచో రాత్రంతయూ ఉండి ప్రార్ధించుదుము" అని ఒకాయన చెప్పెను.] మనము కోరుకున్నంత సేపు ఇచ్చట యుండవచ్చును. సహోదరి వేయట్, మరియు బృందము ఆ విధముగా చేయుటలో తోడ్పడెదరు. దేవుడామెను దీవించును. ఆమె యొక్క యోధుడగు భర్త ఈ వేదిక మీద నిలబడి, చనిపోవు ముందు వరకు రోగులకు ప్రార్ధి౦చెను. నాకు తెలిసినంతవరకూ ఒక నిజమగు సిలువ యోధుడు. జనులను దీవించు ఆ పనినే నేను చేయుటకు ప్రయత్నించుచున్నాను.
మరిప్పుడు, ప్రతీ ఒక్కొక్కరి కొరకు ఇచ్చటకు వచ్చి ప్రార్థించుకోవచ్చు, వారికి నేను ప్రార్ధి౦చెదను. మీ యొక్క అవసరతను మీరు బహిరంగముగా చెప్పకోనవసరము లేదు, మీలోనున్న తప్పిదములను మీరు చెప్పనవసరము లేదు. మీరు నమ్మకముతో రండి. నేను మీ కొరకు ప్రార్ధి౦చెదను.
దీనిని చేయుటకు దేవుడు నన్ను పంపెనని మీరు నమ్ముచున్నారా? మీ చేతులెత్తండి. ప్రభువు యొక్క దూత చెప్పిన దానిని గుర్తుంచుకొనండి. "ప్రజలు నిన్ను నమ్మునట్లు నీవు చేసినయెడల, నీవు ప్రార్ధి౦చునప్పుడు యధార్థముగా ఉండుము, ప్రార్థనముందు ఏదీయూ నిలబడజాలదు." అది సత్యమని మీరెరుగుదురు. అది పదే పదే రుజువైనది.
82"నమ్మిక మాత్రముంచుము" లేదా "ఆ గొప్ప వైద్యుడిప్పుడు చెంతనే యున్నాడు?" అను పాటను వాయించుటకు రమ్మని సహోదరి రోస్ ను కోరుచున్నాను. మీరు ప్రతీ ఒక్కొక్కరు నాతో సహవాసము నందు ఉండవలెనని నేను కోరుచున్నాను. మీరు కూడా నాతో యుండవలెను, ప్రార్ధనా వరుసలో లేని ప్రజలైన మీరు ఈ ప్రజలకోసం మీరు ప్రార్థించుచు యుండగలరా? మంచిది, మీరు మీ చేతులెత్తుట ద్వారా వారికి మీరు వాగ్దానము చేయండి, "నేను ప్రార్ధి౦చుచుయుండెదను, మేమందరము ప్రార్ధి౦చుదము." మంచిది, సరి. మీరు ఇచ్చటనుండి వెళ్ళదలచినయెడల, ఇప్పుడు నెమ్మదిగా లేచి వెళ్ళవలెనని కోరుచున్నాను. మేము ప్రార్ధి౦చుచున్నప్పుడు వారికి ఆటంకము కలుగకుండా వెళ్ళవలెను.
సోదరీ! అది పోవునని నీవు నమ్ముచున్నావా? ["నా పూర్ణహృదయముతో" అని సోదరి చెప్పెను.] ప్రియదేవా, సోదరి మీద నా చేతులుంచి ఆమె శరీరములోని వ్యాధిని సవాలు చేయుచున్నాను; యేసుక్రీస్తు నామమున అది ఆమెను విడిచిపెట్టి పోవును గాక. ఆమేన్. దేవుడు దివించును గాక, సహోదరి.
నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? నీ పాపములన్నియూ ఒప్పుకొన్నావా? నీకు తెలిసినంతవరకు, నీవు స్వస్థత పొందుటకు నీవు సిద్ధముగా యున్నావా? ప్రియదేవా, నీ కుమారుడగు యేసుక్రీస్తు నామమున నా సోదరీ మీద నా చేతులుంచుచున్నాను, యేసు నామములో ఆమె వ్యాధి పోవునట్లుగా అడుగుచున్నాను. యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్.
పాపములన్నియూ ఒప్పుకొని నీ స్వస్థత కొరకు నీవు సిద్ధముగా యున్నావా? సోదరుడా, నీవు నమ్ముచున్నావా? ["నా పూర్ణ హృదయముతో నేను నమ్ముచున్నాను" అని సోదరుడు చెప్పెను.] ప్రియదేవా, నేను నా సోదరుని మీద చేతులుంచుచున్నాను, ప్రభువా, నీవిక్కడ ఉన్నావని మేము ఎరిగియున్నాము. యేసుక్రీస్తు నామమున ఇతనిని నీవు స్వస్థపరచుమని ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.
83పాపములన్నియూ ఒప్పుకొనిరా? లేదా, నీకు వినబడదా. [సోదరియొక్క చెవుడు బట్టి సహో, బ్రెన్హాం నెమ్మదిగా, ప్రత్యేకముగా మాట్లాడుచున్నారు.] నీవు వినగలవని నీవు నమ్ముచున్నావా? ["అవును, నేను నమ్ముచున్నాను, కాని నాకు చెవుడున్నది" అని సోదరి చెప్పెను.]
నీవు నమ్ముము. ఈమెకు ఇప్పుడు చెవుడున్నది. మనము ప్రార్ధి౦చుదము. ప్రియదేవా, మా సోదరిని స్వస్థపరచుదువనియు, ఆమె చెవుడును తీసివేయుదువనియు నమ్మి ప్రార్ధి౦చుచున్నాము. వినలేని ఆమెకు ప్రపంచము మూసివేయబడినట్లే యుండును. యేసు నామము ద్వారా ఆమెకు స్వస్థతను దయచేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను.
ఒక నిమిషము పాటు మీరు శిరములు వంచియుండుడని ప్రార్ధి౦చుచున్నాను. ఆమెకు ఏమి జరిగినదో చూడగోరుచున్నాను. ఇప్పుడు, దయచేసి, ఎవరును తమ తలలు ఎత్తుటగాని, కండ్లు తెరచుటగాని చేయరాదని యేసుక్రీస్తు నామములో కోరుచున్నాను. నేను మీకు చెప్పువరకూ మీరు ఆలాగే యుండండి.
ఇప్పుడు నా మాట మీకు వినబడుచున్నదా? ["ఇంకా వినబడుట లేదు" అని ఆమె చెప్పెను. (సహో, బ్రెన్హాం చప్పట్లు కొట్టెను.) "నేను వినకలుగుచున్నాను."]
వినబడుచున్నదా? [సహో, బ్రెన్హాం మరల చప్పట్లు కొట్టెను.]
["నాకు వినబడుచున్నది."]
వినబడుచున్నదా?
["అవును."]
నీవు వినకలుగుచున్నావా? ఇప్పుడామె వినకలుగుచున్నది. [సహో, బ్రెన్హాం మరోసారి చప్పట్లు కొట్టెను.] వినబడుచున్నదా? ఇప్పుడు నీ పూర్ణహృదయముతో నమ్ముము. నమ్మదువా? నీవు నమ్ముము. దేవుడు పూర్తిగా నిన్ను బాగుచేయును. నేను ఆమె చెవుల మీద చేతులుంచి ప్రార్ధించిన ఎడల చాలునని ఆమె చెప్పినది. ఆమె వినకలుగుచున్నానని పలికినది. మంచిది. మరల విందునని నమ్మి సాగిపొమ్ము. నీవు వినగలవు.
84సోదరీ, పాపములన్నియూ ఒప్పుకొంటివా? ["అవును" అని సోదరి చెప్పెను.] నీ స్వస్థతకొరకు నీవు సిద్ధపడియున్నావా? ["అవును"] ప్రియదేవా, నా సోదరి మీద చేతులుంచుచున్నాను, మాలో మంచి ఏదియు లేదని మాకు తెలియును. కాని మేము క్రైస్తవులమని, దేవుని ఆత్మచేత పుట్టినామని ఎరుగుదుము. మా సోదరి మీద మేము చేతులుంచి యేసుక్రీస్తు నామములో స్వస్థతకొరకు అడుగుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు, నీవు స్వస్థత పొందుదువని నమ్ముచున్నావా? ["అవును" అని సోదరి చెప్పెను, "మంచిది."] మంచిది. ఇప్పుడు నీవు స్వస్థత పొందియున్నావు. ['అవును'] దానిని చేయవలసిన మార్గము అదియే. అది నిజము, నిజము.
పాపములన్నియూ ఒప్పుకొన్నావా? ["అవునండీ" అని సోదరి చెప్పెను.] నీవు నీ స్వస్థత కొరకు సిద్ధముగా యున్నావా? ["అవును"] చేతులుంచుట ద్వారా, జనుల హృదయములను ఎరిగిన దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? ["నమ్ముచున్నాను."] మా పరమతండ్రీ, మా సోదరిని స్వస్థపరచుము, ఆమె మీద మేము చేతులుంచుట ద్వారా యేసుక్రీస్తు నామములో ఆమెను బాగుచేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ఆమెన్.
మీరెట్లున్నారు? మీ వ్యాధి ఏమిటో నాకు తెలియునని మీరెరుగుదురు. ["అవును" అని సోదరి చెప్పెను.] కాని దానిని నేను చెప్పుట లేదు, ఎందుకనగా నేను దానిని నేను చెప్పినయెడల, వాటిని చెప్పుకుంటూ వెళ్ళెదను. ["సరే."] కాని నీవు ఆశించినయెడల పాపములన్నియూ ఒప్పుకొంటివా? ["అవునండీ."] దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? ["అవునండీ."] నీ వ్యాధి పోయినదని నమ్ముచున్నావా? కీళ్ళనొప్పి వ్యాధి… దానిని నేను చెప్పితిని. ప్రియదేవా, ఆమెకు నీవు సహాయము చేసి బాగుచేయుమని ప్రార్ధి౦చుచున్నాను. యేసు నామములో దయచేయుము. నీవిక కుంటిగా ఉండవు. హృదయపూర్తిగా నమ్మి వెళ్ళుము.
దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? ["ఆమేన్" అని సోదరి చెప్పెను.] పాపములన్నియూ ఒప్పుకొని నీవు స్వస్థతకొరకు సిద్ధముగా యున్నావా? నీవు నమ్ముము. నీ వీపు బాగవును. ప్రియ పరమతండ్రీ, నీవు ఆమెను స్వస్థపరచి బాగుచేయమని నేను ప్రార్ధి౦చుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆలాగు జరుగును గాక. ఆమేన్. సోదరీ, దేవుడు నిన్ను దీవించును. నమ్మి ఇప్పుడు వెళ్ళుము.
85సోదరీ! పాపములన్నియూ ఒప్పుకొని నీ స్వస్థత కొరకు నీవు సిద్ధపడితివా? ప్రియదేవా, ఆమె పాపములను ఒప్పుకొన్నదని చెప్పెను. యేసుక్రీస్తు నామము పేరట ఈమె మీద చేతులుంచి స్వస్థత దయచేయుమని ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.
పాపములన్నియూ ఒప్పుకొన్నావా? నీవు చాలా జబ్బుగానున్నావని నాకు తెలియును. తప్పక నీవు బాగయ్యెదవు. నీ వ్యాధి నాకు తెలియును. నీవెరుగుదువా? దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? నీ గుండెను బాగుచేసి నిన్ను పూర్తిగా స్వస్థపరచును. ప్రియదేవా, ఆమెను స్వస్థపరచి బాగుచేయుమని యేసుక్రీస్తు నామము పేరట నేను ప్రార్ధించుచున్నాను. తండ్రీ యేసు నామములో ఇది ఆమెను విడిచిపోవును గాక! ఆమేన్. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించును. సందేహించవద్దు — నమ్మి వెళ్ళుము.
పాపములన్నియూ ఒప్పుకొన్నావా? నీ స్వస్థత కొరకు సిద్ధముగానున్నావా? ప్రియ పరమతండ్రీ, మా సోదరి మీద నేను చేతులుంచుచున్నాను. యేసుక్రీస్తు నామములో, ఆమె బాగవును గాక ఆమేన్. సందేహించవద్దు. నమ్మి వెళ్ళుము.
పాపములన్నియూ ఒప్పుకొని స్వస్థత కొరకు సిద్ధపడితివా?
ప్రియ పరమతండ్రీ, మా సోదరుని స్వస్థపరచి బాగుచేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. తండ్రీ, అది దయచేయుము. యేసుక్రీస్తు నామము పేరట ఈతని మీద ఆ ఉద్దేశ్యముతో నేను చేతులుంచుచున్నాను. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. నా పూర్తి హృదయముతో అది నేను నమ్ముచున్నాను.
సోదరీ, ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? పాపములన్నియూ ఒప్పుకొని స్వస్థత కొరకు నీవు సిద్ధపడితివా? ప్రియదేవా, యేసుక్రీస్తు నామము పేరట మా సోదరిమీద నేను చేతులుంచుచున్నాను. నీ మహిమార్థమై ఆమె బాగవును గాక. ఆమేన్.
86చాలాసార్లు ఆ విధముగా తాకుటవలనే బాగయిరి. యేసు ఇట్లనెను. "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు," దానివలన ఏబది శాతము ఫలితము కలుగుటను నేను కూటములలో గమనించాను, ప్రజలను వరుసలోనికి పిలిచి వివేచన చెప్పుటకంటె ఇది బాగా పనిచేయును, అందువలన కొద్దిమందే బాగయ్యెదరు. మరియు ఈ విధముగా ఎక్కువమంది బాగవుదురు.
నీవు నీ అవిశ్వాస పాపము, ఇంకా అన్నియూ ఒప్పుకొన్నావా? నీవిప్పుడు బాగవునని నీవు నమ్ముచున్నావా? ["అవును, విడిపించబడితిని" అని సోదరి చెప్పెను.] ప్రియదేవా, మా సోదరిని బాగుచేయుమని నేను ఆమె చేయి పట్టుకొనియుండగా యేసుక్రీస్తు నామములో నేను ప్రార్ధి౦చి దీనిని అడుగుచున్నాను. ఆమేన్. సోదరీ, దేవుడు నిన్ను దీవించును.
ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? ["అవును" అని సోదరి చెప్పెను.] పాపములన్నియూ ఒప్పుకొన్నావా? ["అవును"] ప్రియదేవా, యేసుక్రీస్తు నామములో మా సోదరి స్వస్థత కొరకు నేను నా చేతులుంచుచున్నాను. ఆమేన్. సోదరీ! దేవుడు నిన్ను దీవించును. చాలా చిన్న పనివలె కనబడును గాని ఇది దేవుడు చేసిన వాగ్దానమైయున్నది.
పాపములన్నీ ఒప్పుకొంటివా? ప్రియదేవా, ఈ మా సోదరిని బాగుచేయమని నేను ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు నామమున నేను చేతులుంచుచుండగా, ఆమె స్వస్థత నొందుకొని వెళ్ళును గాక. ఆమేన్. పాపములు ఒప్పుకొన్నావా? ప్రియదేవా, యేసుక్రీస్తు నామములో మా సోదరి మీద నేను చేతులుంచియుండగా బాగుచేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.
87మీరు యంత్రములవలె వచ్చియుండగా, మిమ్మును ఆ కదిలించు శక్తి తాకును గాక అది పనిచేయును.
పాపములన్నియూ ఒప్పుకొనిరా? నీవు సిద్ధముగా యున్నావు. ప్రియదేవా, ఆమెను నీవు స్వస్థపరచి బాగుచేయుమని యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. ఆమేన్. సోదరీ, దేవుడు నిన్ను దీవించును!
పాపములన్నీ ఒప్పుకొంటివా? ["అన్నియూ" అని సోదరి చెప్పును.] ప్రియదేవా, ఈమె నా కండ్లలోనికి చూచుచున్నదని నాకు తెలియును. యేసు నామములో నీవు ఈమెను బాగుచేయుమని నేను ప్రార్ధి౦చుచున్నాను.
సోదరీ, నీవామెను తీసికొని వచ్చుచున్నావు గదా? నీవామెను తీసికొని వచ్చుచున్నావు? మంచిది. ["ఈమె గ్రుడ్డిది కూడా" అని సోదరి చెప్పెను.] సోదరీ, దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? ["దేవుడు మరల నాకు దృష్టిని ఇచ్చునని నమ్ముచున్నాను" అని ఆ సోదరి చెప్పెను.] దేవుడు నిన్ను దీవించును. పరమతండ్రీ, నీవు ఎల్లప్పుడు అంధుల పట్ల దయచూపెదవు. అక్కరగల వారికి కృప చూపితివి. ఈ రాత్రి నీవు ఏమి చేసితివో వారు చూచారు, కాబట్టి ఇప్పుడు ఈ గొప్ప చివరి సూచన మామధ్య సంచరించుచున్నదని మేము నమ్ముచున్నాము, ప్రభువా, ఈ గ్రుడ్డి స్త్రీకి మరల చూపు కలుగునట్లుగా, యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. ఆమేన్. ["యేసూ, నీకు వందనములు," అని ఆ గ్రుడ్డి స్త్రీ చెప్పెను.] ఇప్పుడు దీనిని తెలియచేయండి, దీనిని తెలుపండి. ["వందనములు."]
[గ్రుడ్డి స్త్రీని తీసుకొని వచ్చిన వ్యక్తి ప్రార్థన కోరుచున్నది.] ఓ! అవును. దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? ప్రియ పరమతండ్రీ, నా సోదరి మీద నేను చేతులుంచి ఆమెను నీవు బాగు చేయుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. సోదరీలారా, దేవుడు మిమ్ము దీవించును. మీరెట్లున్నారో, మీకేమి జరిగినచో మేము వినగోరుచున్నాము.
88సోదరీ, నీవు నమ్ముచున్నావా? ["అవును, నమ్ముచున్నాను" అని సోదరి చెప్పెను.] ఓ ప్రియ పరమతండ్రీ, మా సోదరి కొరకు నేను ప్రార్ధి౦చుచున్నాను. ఆమెను ఇప్పుడు నీవు బాగుచేయుదువని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు నామములో నేను ఆమె మీద ఇప్పుడు నా చేతులుంచుచున్నాను. ఇప్పుడు నమ్ముము. అది నిజము, నమ్మి వెళ్ళుము.
సోదరుడా, నీవు నమ్ముచున్నావా? ["అవును" అని సోదరుడు చెప్పెను.] పాపములన్నీ ఒప్పుకొన్నావా? ప్రియదేవా, మా సోదరుని స్వస్థపరచి బాగుచేయుమని యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. ఆమేన్.
సోదరీ, నీవు నమ్ముచున్నావా? ఓ, దేవా, దీనముగా, అణుకువగా, ఈ మాధుర్య ఘడియలో యేసుక్రీస్తు నామములో నేను ప్రార్ధించుచున్నాను. పరిశుద్దాత్మ ఈమెను బాగుచేయును గాక!
["నా కుమారుని గూర్చియూ ప్రార్థించమని కోరుచున్నాను. ఇరవై సంవత్సరముల నుండి అతనిని నేను చూడలేదు" అని ఆ సోదరి చెప్పెను.] ప్రియ సోదరీ, దేవుడు నీ కుమారుని నీ యొద్దకు పంపునట్లు నేను ప్రార్థించెదను.
ప్రియమైన దేవుడు నిన్ను దీవించును.
MARK 16:17,18
89ప్రియతండ్రీ, ఇక్కడున్న మా సోదరికొరకు నేను ప్రార్థించుచున్నాను, పరిశుద్దాత్మ మాధుర్యముగా ఇక్కడికి వచ్చి మా సోదరిని బాగుచేయును గాకని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. సోదరీ, దేవుడు నిన్ను దీవించును.
ప్రియదేవా, మా సహోదరుడు ఇచ్చట నిలబడియుండగా నేను నా చేతులుంచి, అతడి కొరకు ప్రార్జించుచున్నాను మరియు యేసు నామములో ఈతని స్వస్థత కొరకు అడుగుచున్నాను. నా సోదరుడా!దీవించబడుదువు. ["దేవుడు నిన్ను దీవించును" అని సోదరుడు చెప్పెను.] మంచిది.
చిన్న బాలుడా? ప్రియదేవా, ఈ చిన్నవాని మీద నా చేతులుంచి, యేసుక్రీస్తు నామములో స్వస్థత, దీవెనకొరకు నేను ప్రార్ధి౦చుచున్నాము. సోదరీ, ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? ["అవును" అని సోదరి చెప్పెను.] నీకూ ప్రార్ధించవలెనా? ప్రియదేవా, ఆమె మీద చేతులుంచి నేను ప్రార్ధి౦చుచున్నాను. ఇప్పుడు, ఈలాగు చేయమని నీవు ఆజ్ఞాపించితివి. "నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు" ఆలాగు జరుగునని నీవు చెప్పితివి.
ఆయన చెప్పలేదా? సోదరీ, అది ఆ విధముగానే యుండును. ప్రియదేవా, మా సోదరిని స్వస్థపరచి ఆమెను బాగుచేయుమని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్. సోదరి! దేవుడు నిన్ను దీవించును.
GEN 6:17•
GEN 17:16•
MARK 16:17,18•
JAS 5:15
90సోదరీ, నీవు నమ్మి వచ్చుచున్నావా? ప్రియపరమ తండ్రీ, మా సోదరి మీద నీ దీవెనల కొరకు నేను అడుగుచున్నాము. నీవు చెప్పినదానికి లోబడుచున్నాము. "నమ్మువారివలన ఈ సూచక క్రియలు కనబడును, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, "వారు బాగవుదురు" అని నీవు చెప్పితివి.
దీనిని చెప్పుటకై కొద్దిసేపు ఇచ్చట నేను ఆగెదను, జనులు కొంచెం విశ్రాంతిని తీసుకొనెదరు. "ఆలాగు జరుగదని" ఒకప్పుడు ఒక విమర్శికుడు చెప్పెను. కాని మీరు చూడండి, "ఈ సూచక క్రియలు కనబడును."
"విచారణ" అను నా ప్రసంగము మీద విన్నాను. యేసును విచారించిరి. చూడండి, ఆయన నోవహుతో ఇట్లనెను, "వర్షము కురియును." నూట-ఇరువది సంవత్సరముల పాటు ఎన్నడూ వర్షి౦చలేదు, కాని మొత్తం మీద వర్షము వచ్చెను. శారా వలన అబ్రాహామునకు ఒక కుమారుడు కలుగునని ఆయన చెప్పెను. అది ఇరవై-అయిదు సంవత్సరముల తరువాత జరిగెను. అది ఎప్పుడు జరుగునని ఆయన ఎన్నడూ చెప్పలేదు. వారికి కుమారుడు కలుగునని మాత్రమే ఆయన చెప్పెను. ఇరువది అయిదు సంవత్సరముల తరువాత అది జరిగెను, చూడండి. అది ఎప్పుడు జరుగునని ఆయన ఎన్నడూ చెప్పలేదు. "విశ్వాస సహితమగు ప్రార్ధన రోగిని రక్షించును. దేవుడు వారిని లేవనెత్తును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు బాగవుదురు" అని ఆయన చెప్పెను. ఆయన చెప్పినది అదేనా? అప్పుడే వారు లేచి గంతులు వేయుదురు అని ఆయన చెప్పలేదు. "వారు బాగవుదురు" అని ఆయన చెప్పెను, చూడండి. అది ఆయన వాగ్దానము, దానిని మనము నమ్ముచున్నాము.
MARK 16:18
91సోదరీ! రమ్ము అది నిజమని నీవు నమ్ముచున్నావా? ["అవును - నేను నమ్ముచున్నాను" అని సోదరి చెప్పెను.] అయితే నిన్ను స్వస్థత పొందకుండా ఆపునది ఏదియూ లేదు. యేసుక్రీస్తు నామము పేరట స్వస్థత కొరకు సోదరిపై నేను నా చేతులుంచుచున్నాను. ఆమేన్.
సోదరీ, నీవు నమ్ముచున్నావా? ["అవును" అని సోదరి చెప్పెను.] పాపములన్నీ ఒప్పుకొని సిద్ధముగా ఉన్నావా? ప్రియదేవా, నీ ఆజ్ఞకు లోబడి సోదరి మీద నేను నా చేతులుంచుచున్నాను. యేసు నామములో స్వస్థతకొరకు అడుగుచున్నాను. ఆమేన్.
ప్రార్ధించబడగోరువారు నాకు ఒక సహాయము చేయమని కోరుచున్నాను. ఈ కూటము అయిపోకముందే ఏమి జరిగినదో మీరు తెలియచేయండి. నిజంగా ఏమి జరిగినదో ప్రజలకు తెలియనీయండి. రేపు లేదా ఎల్లు౦డి ఏమి జరిగినదో మీరు గమనించండి.
వారియొక్క విశ్వాసమును వారు పరీక్షించుకొనుటకు వారు ప్రయత్నించినప్పుడు అది ఎంతో భేదమును కలిగియున్నట్లుగా దానిని నాకు వచ్చు ఉత్తరములు చూపించుచున్నవి. ఎందుకనగా యేసు ఈలాగు చెప్పెను, "వారి మీద వారు చేతులుంచెదరు, వారిమీద చేతులుంచగా వారు బాగవుదురు." ఇప్పుడు ఆయన చెప్పినది గ్రహించారా? వారు గంతులు వేసి పరుగెత్తెదరని ఆయన చెప్పలేదు. వారు ఆలాగును చేయుదురు. "వారు బాగవుదురు," అని ఆయన చెప్పెను. ఆయన చెప్పినది అదే కదా! దానినే ఆయన చెప్పెను. నేను అదే నమ్ముచున్నాను. ఇప్పుడు ఆయన ఇక్కడున్నాడు, మాట చెప్పినవాడు దానిని నెరవేర్చును.
MARK 16:15
92అయ్యా! నీవు నమ్ముచున్నావా? ["అమేన్" అని సోదరుడు చెప్పెను] ప్రియ పరమతండ్రీ, అతని విశ్వాసపు ఒప్పుకోలు, నమ్మకముబట్టి యేసుక్రీస్తు నామములో స్వస్థత కొరకు నేను ఈతని మీద నా చేతులుంచుచున్నాను.
ప్రియదేవా, ఈమె స్వస్థతకొరకు యేసుక్రీస్తు నామమున నేను నా చేతులుంచుచున్నాను. మంచిది.
ప్రియదేవా, ఈమె స్వస్థతకొరకు యేసుక్రీస్తు నామములో నా చేతులు ఈమె మీద ఉంచుచున్నాను. "ఆమె బాగవును" అని నీవు చెప్పావు.
సోదరీ! స్వస్థత కొరకు సిద్ధముగా ఉన్నావా? ప్రియదేవా, యేసుక్రీస్తు నామము పేరట ఈమె మీద నేను నా చేతులుంచుచున్నాను. బాగుచేయుము.
మంచిది. ప్రియ సోదరీ! స్వస్థతకొరకు సిద్ధపడితివా? నీ విశ్వాసము ఇప్పుడు చేరుకొన్నది. నీవు బాగవుదునని నీవు నమ్ముచున్నావా? ప్రియదేవా, నీ ఆజ్ఞకు లోబడి నేను ఆమె మీద నా చేతులు ఉంచుచున్నాను. "సర్వలోకమునకు, సర్వసృష్టిక్రి" ఆమె స్వస్థతకొరకు యేసు నామములో నేను నా చేతులుంచుచున్నాను.
93ప్రియదేవా, యేసుక్రీస్తు నామము పేరట స్వస్థతకొరకు నా సోదరుని మీద చేతులుంచుచున్నాను.
ప్రియదేవా, యేసుక్రీస్తు నామములో ఈమె స్వస్థతకొరకు నేను ఆమె మీద నా చేతులుంచుచున్నాను.
మిమ్మును నేను బాధపరచగోరుట లేదు. ఇప్పుడు, నీవు దానిని నమ్మినయెడల, నీవు బాగపుదువు.
ప్రియదేవా, యేసుక్రీస్తు నామములో మా సోదరిని నీవు బాగుచేయుమని ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్. [టేపు మీద ఖాళీయున్నది] … ఈ జనులకొరకు ప్రార్ధి౦చుటలో నాకు సహాయము చేయండి.
ACTS 19:12
94ప్రార్ధనకొరకు ఇక్కడ కొన్ని చేతిరుమాళ్ళు, గుడ్డలు మా యొద్ద వున్నవి. ఇప్పుడు ఇచ్చట ఉన్నవి. నాతో పాటు ప్రార్ధి౦చుట మీరు మానవద్దని కోరుచున్నాను, చిన్న పొట్లములున్నవి, ఇటువంటి చిన్నచిన్న వాటికి ప్రార్థన చేయుట జనులకు వింతగా కనబడవచ్చును, కాని ఒక్కసారి నా కార్యాలయములోనికి వచ్చి చూడండి. ఈ సంవత్సరములన్నింటను జరిగిన సాక్ష్యములను దాచి పేర్చినచో ఈ వేదిక చాలదు. ప్రపంచమంతటా లక్షలకొలది మంది ఈ చేతిగుడ్డలు పంపుట ద్వారా స్వస్థత పొందిరి. అదేమిటో మీరెరుగుదురా? అచ్చటయున్న చేతి రుమాళ్ళను ఎవరైనా వచ్చి వాటిని తీసుకొనవచ్చును, మీ చేతి రుమాలును మీరు గుర్తించగలరు, అవును కదా! సహోదరుడా? మంచిది.
కుంటివారగు చిన్నపిల్లలు బాగవుట నేను చూచాను. అదేమిటో మీరు చూడండి. ఓరల్ రాబర్ట్స్ చెప్పునట్లుగా అది గురియొక్క సంబంధమైయున్నది. అది కేవలము గురియొక్క సంబంధమైనది. మనము ప్రార్ధి౦చుదము. దీనిని మనంతట మనము చేయుటలేదు గాని దీనిని చేయమని పరిశుద్ధ గ్రంథము మనకు ఆజ్ఞాపించుచున్నది. అది సత్యమని మనందరకు తెలియును.
చేతిరుమాళ్ళు మొదలగు వాటిని అభిషేకించువారు చాలామంది ఉన్నారు. మంచిది, ఇప్పుడు అది మంచిదేయని మనమనుకుంటున్నాము. నిశ్చయముగా. కాని మనము… వారు చేతి గుడ్డలను అభిషేకించిరని పరిశుద్ధ గ్రంథము చెప్పుట లేదు, "కాని వారు పౌలు శరీరము పైనుండి చేతిగుడ్డలను తీసికొనిరి." ఇప్పుడు, చూచారా?
నేనేమి మాట్లాడుచున్నానో ఇప్పుడు చూడండి. పౌలులో ఉన్న పునర్జీవింపజేయు శక్తిని వారు చూచిరి. అతడు దేవునియొక్క దాసుడు అని వారెరిగిరి. అతనిలో దేవుడున్నాడని వారెరిగిరి. అతడు తాకిన ప్రతిదియు దీవించబడెనని వారెరిగిరి. అది ఎందరికి అర్థమయ్యెనో "ఆమేన్" చెప్పండి.
2KGS 4:29•
MARK 16:18•
ACTS 5:15
95పౌలు తాను చేసిన దానిని వాక్యప్రకారమే చేసెనని మీకు తెలియును. మీరాలాగు తలంచుట లేదా? దానిని చేయవలెనని అభిప్రాయము అతనికి ఎక్కడ కలిగెనో మీకు నేను చెప్పవలెనని కోరుచున్నారా? ["ఏలీషా నుండి" అని ఎవరో చెప్పిరి.] అవును. ఎలీషా నుండియే.
చూడండి, ఏలియా చెప్పెను, "ఈ దండము తీసికొని వెళ్ళి ఆ బిడ్డమీద ఉంచుము." ప్రవక్త ఆ దండమును పంపెను, ఎందుకనగా తాను తాకిన ప్రతిదియు దీవించబడెనని అతడు ఎరిగియుండెను. అతడి స్థానమును అతడు ఎరిగియుండెను. అతడి స్థానమును ఎరుగును. ఆ స్త్రీ కూడా దానిని నమ్మియుండినచో సరిపోవును. ఇప్పుడు చూడండి, "వారు రోగుల కొరకు ప్రార్థించెదరు" అది కూడా పరిశుద్ధ గ్రంథము ఎక్కడా చెప్పలేదు. "వారు రోగుల మీద చేతులుంచుదురు" అని అది చెప్పినది.
2KGS 13:21•
ACTS 5:15
96ఇప్పుడు కొద్దిగా ఆలోచించండి, అపోస్తలుడగు పేతురులో, దేవుని యొక్క ప్రసన్నత ఈ మనిషిలో ప్రత్యక్షమవుటను జనులు చూచి వారు అతడి నీడ వారిపై పడవలెనని జనులు అతడి నీడలో పడియుండిరి, వారు స్వస్థతనొందిరి. అది లేఖనపూర్వకమని ఎందరికి తెలియును? అది యోహాను 3:16 వలె లేఖన పూర్వకమైయున్నది. చూడండి. అదంతయూ దేవుని యొక్క వాక్యమైయున్నది.
ఇప్పుడు ఆప్రజలను, వారిని స్వస్థత పరచినది ఆ మనిషి నీడ కాదని మీరెరుగుదురు. కాని, చూడండి, దేవునియొక్క శక్తి ఆ ప్రవక్త మీద ఉన్నయెడల, కొన్ని సంవత్సరముల ముందు అతడు చనిపోయెను. ఎముకలుగా మిగిలిన ఆ మృత శరీరముపై ఒక చనిపోయిన మనిషిని విసిరి వేసినప్పుడు, ఆ మృత శరీరము కూడా అచ్చట లేనేలేదు, ఒట్టి ఎముకలు మాత్రమే అచ్చట యున్నవి. అన్ని సంవత్సరములు అయిపోయిన తరువాత కూడా దేవునియొక్క సన్నిధి ఆ ఎముకల మీద ఉండినందున చనిపోయిన శవము ఆ ఎముకలను తాకినందున లేచి కూర్చొనెను.
ROM 8:34•
EPH 1:4,5•
REV 5:5-7
97ఆ క్రియలన్నియు జరిగించిన ఆ దేవుడే ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడని మీరెరుగరా?
నాకయితే ప్రపంచమంతటిలోనూ సంతోషకరమగు జనులము మనమేననిపించుచున్నది, దీనినిగూర్చి కాస్థ ఆలోచించండి. దీనిని నా యంత నేను చేయుచున్నానన్న అభిప్రాయమును నేను జనులకు కలిగించుట లేదని నా నమ్మకము. అంతకంటె బాగుగా మీరెరుగుదురు, చూచారా. నేను కేవలము మీ సోదరుడను, చూడండి. నేను మీ సోదరుడను.
కాని దేవుడు ఇక్కడున్నాడని నాకు బాగుగా తెలియును. ఏదో ఒక దానిని దేవుడు మనకు అనుగ్రహించెననే దానిని నేనెరుగుదును, దానిని మనము వివరించజాలలేము, దేవుని వాక్యము ద్వారా మాత్రమే దానిని గ్రహించగలము. ఈ సమయములో అది ఇక్కడ ఉండవలెనని అది దానిని హక్కు కోరుచున్నది.
కాబట్టి, మనము చివరి దినములలో జీవించుచున్నామన్న గుర్తింపును కూడా మనమెరుగునట్లుగా అది చేయుచున్నది. ఈ జనులు ఏర్పరచబడి, ఎన్నుకోబడి, బయటకు పిలువబడి, ముందుగా నిర్ణయించబడిరనే గుర్తింపును మనమెరుగునట్లుగా అది చేయుచున్నది. ఇప్పుడు, ముందు నిర్ణయము అనునది పెద్దమాట, కాని అది సత్యమని మనందరకు తెలియును. గొర్రెపిల్ల వధించకబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన ముందు జ్ఞానముద్వారా సమస్తంను ముందుగానే నిర్ణయించెననే దానిని మనము సంపూర్ణముగా ఎరుగుదుము. గ్రంథములో ఉంచబడు ప్రతి పేరు ఆ గ్రంథము అసలు వ్రాయబడక ముందే అక్కడ ఉంచబడెను. అది సత్యమని ఎందరికి తెలియును?
గ్రంథములో నున్నవారిని విమోచించుటకు యేసు వచ్చెను. గొర్రెపిల్ల తెర వెనుకనుండి వచ్చి ముద్రింపబడిన గ్రంథమును తీసుకొని ముద్రలను తెరచెనని పరిశుద్ధ గ్రంథమునందు వ్రాయబడియున్నది. ఎందుకనగా ఆయన విమోచించిన వారినందరినీ చేర్చుకొనుటకు ఆయన వచ్చెను. ఇప్పుడాయనే విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా యుండి తాను విమోచించిన వారి గూర్చి విజ్ఞాపన చేయుచున్నాడు. గొర్రెపిల్ల జీవగ్రంథములో పేరు వ్రాయబడియున్న వారందరూ విమోచించబడిరి.
JOHN 10:27
98ఒక రాత్రి నేను వింతయిన మాట చెప్పాను. (మీరందరూ ఇచ్చటయున్న ఈ చేతి గుడ్డలను తీసుకొనుటకై నేను కనిపెట్టుచున్నాను. మరల నేను బోధించ ప్రయత్నించుట లేదు.) కాని ఒక చిన్నమాట గూర్చి ప్రస్తావించాను. ఇది వ్యంగ్యముగా వినపించదని తలంచుచున్నాను, చూడండి. ఒక వ్యవసాయదారుడు, కోడిపెట్ట క్రింద కొన్ని గ్రుడ్లు పెట్టెను, అతడికి చాలినన్ని గ్రుడ్లు లేనందు వలన అందులో ఒక పక్షిరాజు గ్రుడ్డు కూడా అతడు కలిపెను. కోడిపెట్ట వాటిని పొదగగా పక్షిరాజు పిల్ల బయటకు వచ్చెను. ఆ మిగిలిన కోడిపిల్లల మధ్య అది వింతగా కనబడెను, ఎందుకనగా వాని క్రియలు ఒక్కటిగా లేవు. కాని పక్షిరాజు పిల్ల ఆ కోడి పిల్లలనే చూస్తున్నది, అది ఒకే ఒక స్వరమును మాత్రమే విన్నది, ఆ స్వరము దాని స్వరమువలె లేదు. పక్షిరాజు పిల్ల ప్రయత్నించినా ఆ స్వరము వచ్చుట లేదు. వాటి తిండి దీనికి నచ్చలేదు, అవి ధ్యానపు గాదె త్రవ్వి తినుచుండెను. అయితే ఇది తినలేకుండెను, ఆ తేడా ఎందుకొచ్చెనో తెలియలేదు.
ఒక రోజున ఆ పక్షిరాజు తల్లి తాను పెట్టిన గ్రుడ్లలో ఒకటి తప్పిపోయినట్లు గమనించెను. ఆ తప్పిపోయిన గ్రుడ్లలలో అది తన కుమారుడైయుండెను, కాబట్టి దానికొరకు వెదక వెళ్ళెను. ధాన్యపు గాదె యొద్ద దానిని అది చూచినది. అది అరచినది, అది అరచినప్పుడు ఆ స్వరము తన తల్లిది అని చిన్న పక్షిరాజు గుర్తించెను. "నా గొర్రెలు నా స్వరము ఎరుగును" అని యేసు చెప్పెను.
99గత రాత్రి బాప్టిస్తులు, ప్రెస్బిటేరియనులు, ఇంకా ఎవరెవరో ఒక కోడిపెట్ట క్రిందకు తేబడినట్లుగా తేబడిరి. సోదరులారా, క్షమించండి. చూడండి, కాని తన పిల్లలు ఎక్కడున్నవో ప్రియమగు ఆ తల్లికి తెలియును. తల్లి పెట్ట ద్వారా ఇవ్వబడుచున్న ఆహారమును గూర్చి వివాదపడకుండా వారు అక్కడ నిలబడి చూచుచున్నారు. కాని ఇప్పుడు వారు పక్షిరాజులు, చూడండి, వారు తమ ఆహరము కొరకు ఎగిరి పోవుచున్నారు, చూచారా.
ఫోనిక్సు నుండి లేదా టుసాన్కు వెళ్ళుచూ ఒక రోజున నేను చూచిన ఒక దృశ్యము వలె సంఘము యున్నదని నేను తలంచుచున్నాను. ఒక వింతయగు దృశ్యము నేను చూచాను. అది నా హృదయమును బ్రద్ధలు చేసినది, ఏమి సంభవించినదని నేను చూచినప్పుడు, ఎట్లు ఆకాశములో ఎగిరే గ్రద్ద పక్షిరాజుకు ఒక సహోదరుడు వంటిది, అది సంఘమునకు సాదృశ్యముగా యున్నది. యెహోవాయే ఆ పక్షిరాజు. ఆయన తన ప్రవక్తలను "పక్షిరాజులుగా" నిలచెను. తన్నుతాను ఆయన "పక్షిరాజుగా" యొహోవా పిలచుకొనెను.
100కాని ఆ గ్రద్ద ఎప్పుడో తన గుర్తింపును అది కోల్పోయెను, ఎందుకనగా అది చేయవలసిన రీతిగా గాలిలో ఎగిరి తన ఎరను సంపాదించుకొనదు. అది టెలిఫోను తీగెల మీద కూర్చొని కాకివలె ప్రవర్తించును. కారు క్రింద పడి చచ్చిన కుందేళ్ళ కొరకు అది చూచును, రాబందులతో పాటుగా కూర్చొని అది వాటిని తినును. అది ఒక రాబందులవలె గంతులేయును. నడువవలసిన రీతిగా నడువదు, దాని గుర్తింపును అది కోల్పోయినది.
దీనిని నేను పూర్తి దైవభక్తి, ప్రేమతో చెప్పుచున్నాను, ఒక సహోదరి వంటి పక్షిరాజుగా నుండు గుర్తింపును సంఘము ఏనాడో కోల్పోయినది. ఆమె చుట్టూ కూర్చొన్నది. ఈ సంగతులు నిజమో కాదోనని వాక్యమును త్రవ్వి పరిశోధించుటకు బదులుగా, ఒక గుంపువారియొక్క శరీరసంబంధమైన జ్ఞానముతో ఎవరో తయారు చేసిన ఆదివారపుబడి సాహిత్యము కొరకు ఎదురుచూచుచున్నది. అది ఎక్కడో చచ్చిన కుందేలు వంటిది. రాబందులవలె గంతులు వేయును!
దేవా, ఆ స్థితినుండి ఎగురునట్లు మాకు సహాయము చేయుము. ఈ వాగ్దానములు సత్యము. దానిని గూర్చిఎవరో చెప్పినది కాదు, కాని దానిని గూర్చి దేవుడే చెప్పెను! అవి సత్యము. పక్షిరాజులతో సహవాసము చేయుటకు నేనెంతో సంతోషించుచున్నాను.
రోగులయిన వారి కొరకు ప్రార్ధించుదము.
ACTS 19:12
101ప్రియ పరమతండ్రీ, పౌలు యొక్క అంగీ నుండి, పైవస్త్రము నుండి వారు చేతిగుడ్డలను తీసికొనిరని పరిశుద్ధ గ్రంథములో మాకు నేర్పించబడినది, దయ్యములు, అపవిత్రాత్మలు వారిని విడిచి వెళ్ళిపోయినవి. తండ్రీ, నేను ఈ చేతి రుమాళ్ళయొద్ద నిలబడియున్నాను. ప్రతి వ్యక్తికి అవి ప్రతినిధులుగా యున్నవి. మేమందరము కలిసి క్రీస్తు శరీరమైయున్నాము. కృప మరియు ప్రేమ బట్టి ఇక్కడ మేము ఆయన యొక్క వధువుగా ప్రాతినిధ్యము వహించుచున్నాము, ఆయన రాజ్యములో విశ్వాసముంచి సహవాసము చేయుచున్నాము. మేము పరిశుద్ధ పౌలుము కాదని ఎరుగుదుము, కాని నీవు మారని యేసువని మేమెరుగుదుము.
ఈ ప్రజల యొక్క విశ్వాసమును ఘనపరచుమని మేము ప్రార్ధి౦చుచున్నాము. వీరు పౌలు దినములలో జీవించి యుండిన యెడల ఇదే సువార్తను విని ఇవే అద్భుత కార్యములను చూచియుండెడి వారు. కాబట్టి వీరు అదే రకమగు జనులు. నీవును అదే దేవుడవు. కాబట్టి ప్రియదేవా, బైబిలు దినములలో వలె నేడును వీరి విశ్వాసమును ఆదరించుము. ప్రతి దయ్యపు శక్తి, ప్రతి రోగము, ప్రతి రుగ్మత, దుర్మాత శక్తివలన కలుగు ప్రతి జబ్బు ఈ చేతిగుడ్డలు, పొట్లములను పంపించిన ప్రతి వ్యక్తిని విడిచిపెట్టును గాక!
EXOD 14:21
102ఇశ్రాయేలు విధి నిర్వహణలో యుండి వాగ్దాన దేశమునకు ఒకప్పుడు నడిచిపోవుచుండెను. నేను చెప్పినట్లుగా వారు విధి నిర్వహణలో యుండగానే శత్రువు వెనుక నుండి వచ్చి ఒక మూల వారిని ఎదిరించెను, వారు ముందుకు సాగిపోవుచుండగా ఎర్ర సముద్రము వారికి అడ్డముగా వచ్చెను. దేవుడు అగ్నిస్తంభము గుండా ఆకాశముల నుండి క్రిందకు తొంగిచూడగా, సముద్రము భయపడినది. అది తన అలలను వెనుకకు దొర్లించెను, ఎందుకనగా దేవుని యొక్క అలలు సముద్రటడుగున ఉండెను. విదేయతతో వచ్చుచున్న ఆయన బిడ్డలకు అది త్రోవనిచ్చెను.
ఇప్పుడు దేవునికి భయపడి ఎర్ర సముద్రము అలలను వెనుకకు దొర్లించగా, జలము వెనక్కుపోయెను, విధేయతతో ముందుకు సాగిపోవుచున్న యాత్ర పిల్లలకు వెళ్ళుటకు మార్గము ఇచ్చెను. ప్రియదేవా, ఈ రాత్రి నీ కుమారుడగు యేసు రక్తము క్రిందనుండి చూచుచున్నావు, ఆయనే వాగ్దానము చేసెను,
జనుల యొక్క వ్యాధిగ్రస్త్ర శరీరముల మీద ఈ గుడ్డల నుంచినప్పుడు దేవుని నేత్రములు చూచును గాక ఆ వ్యాధి, దయ్యము, భయపడి పారిపోవును గాక మంచి బలము ఆరోగ్యముతో జనులు వాగ్దాన దేశమునకు ప్రయాణము కొనసాగించెదరు గాక.
ఇశ్రాయేలు వారు అరణ్యములో ముందుకు సాగిపోవుచుండినప్పుడు వారిలో ఏ ఒక్క బలహీనుడను లేడు, అంతము వరకు అలాగేయుండిరి. తండ్రీ, ఆ భాగ్యము ఈ జనులకును అనుగ్రహించుము, ఏలయనగా ఈ చేతి రుమాళ్ళను యేసుక్రీస్తు నామములో మేము పంపించుచున్నాము. ఆమెన్.
103దేవుడు మీ ప్రతి ఒక్కరిని దీవించును. ఇప్పుడు మీరు మీ చేతి రుమాళ్ళను తీసికొనము.
మీ పూర్ణ హృదయముతో విశ్వసించుడి. దేవుడు దీనిని వినునని మీరు నమ్ముచున్నారా? చూచారా, దీనిని నేను చెప్పగోరుచున్నాను. ఏ మాత్రమూ సందేహించవద్దు, ఏ మాత్రమూ సందేహించవద్దు. చూడండి, ఇది చూచుటకు వింతగా యుండవచ్చు. (నన్ను క్షమించండి, ఒక్క నిమిషము.) ఏ మాత్రము కొంచెము కూడా సందేహించవద్దు, కాని నమ్మకము మాత్రము ఇప్పుడు ఉంచండి. దేవుని యొద్ద మనము దేనినైతే అడిగితిమో దానిని దేవుడు యిచ్చునని నమ్మండి! దేవుడు ఇక్కడే యుండి మీ హృదయ రహస్యమును ఎరుగుని మీరు నమ్ముదురా? అది దేవుడేనని మీరు ఎరిగి విశ్వసించుదురా? ఇప్పుడు, అందులో ఆసలు ఏమీ లేదు, మీ మనస్సును మాత్రము దృఢపరచుకొనండి! చూచారా?
ఇప్పుడు గాని ఒక గొప్ప రేపు అనునది యుండినచో, ఎన్నో సంవత్సరముల తరువాత ఇదియే చరిత్రయగును. రాబోవు సంవత్సరములోని జనులు వచ్చి ఇట్లందురు. "అప్పుడు నేను జీవించియుండిన యెడల అది జరుగుట నేను చూచియుందును. నేను తెలిసికొనగోరిన దంతయూ అదే, అప్పుడే వెంటనే నేను దానిని నమ్మియందును." చూడండి, పూర్వము జరిగిన ఆ సంగతిని అప్పుడు నీవు అక్కడుండినయెడల నమ్మియందువు! గుర్తుంచుకొనండి, ఇంకా ఆయనే పనిచేయుచున్నాడు, నీలోనున్నది ఆయన జీవమే. దేవుడు నిన్ను దీవించును!