విత్తనము తొక్కతో వారసురాలు కాదు

విత్తనము తొక్కతో వారసురాలు కాదు

1సహోదరుడు దిమోస్ గారికి చాలా వందనములు, మరియు ఈ ఉదయమున మనమందరము ఇక్కడ వుండి, అనేకమైన ఈ మంచి సాక్ష్యములు మా మంచి దైవబిడ్డల నుండి వినడం ఎంతో సంతోషముగా వుంది. మరియు దేవుడు ఇంకా మనతో నుండి మనలను దీవించునని మనము నమ్ముదాం.

ప్రభువు చిత్తమును బట్టి ఈ రాత్రికి నేను మాట్లాడవలసియున్నదని నేను గ్రహించుచున్నాను. కొన్ని క్షణముల క్రితము నేను సహోదరుడు షకారియన్ను అడిగి "ఇప్పుడు ఏమీ ఇబ్బంది పడవద్దు" అని చెప్పాను. మనము 11 గంటలకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నాకు తెలుసు, మరియు నేను ఇక్కడ నిలబడినప్పుడు సమయము సంగతి అంతా మర్చిపోతాను.

అది మన అందరికి కూడా అలాగే అనిపిస్తుంది. మనము భావిస్తాము… వారంటారు, "రెండు నిమిషాలు, మూడు నిమిషాలు లేక…" స్మిత్ సోదరుడా, మీకు తెలుసు, రెండు మూడు నిమిషములలో దానిని చేయటం కష్టము. అది ఎలా వుంటుందో నాకు తెలుసు, మరియు ప్రతి ఒక్కరి గురించి నేను బాధపడతాను. కాని మనము కాలయుగములో వున్నాము. అక్కడే మనము వున్నాము… మనము నిత్యత్వములోనికి వెళ్ళుచున్నాము, కాని ఇప్పుడు మనము కాలములో వున్నాము.

మరియు నేను చెప్పాను, "సహోదరుడా దిమోస్, కొద్ది సమయము ముందుగా — సిగ్గుపడవద్దు — కొద్దిగా నా కోటును లాగుము, దానివలన నేను సమయము అయిపోయినది అని తెలుసుకుంటాను. ఇప్పుడు నేను ముగించకపొతే, దానిని నేను ఈ రాత్రికి ముగిస్తాను. ఒకవేళ ముగించినట్లయితే, మంచిది, ఈ రాత్రికి నాకు మరొక అంశము ఉన్నది.

2మనము బైబిల్ తెరువక ముందు, మనమందరము తలలు వంచి గ్రంథకర్తతో మాట్లాడుదాం.

ప్రియ పరలోకపు తండ్రి, మేము ఇంతకు ముందు వినినట్లుగా ఈ కూడికను బట్టి ఈ ఉదయమున మీకు వందనములు. మేము ఆశీర్వాదమును ఇప్పుడు అనుమతించినట్లయితే ప్రభువా, ఇక్కడ వుండటం అది ఎంతో మంచిది. కాబట్టి మీరు కొనసాగుదురని నేను ప్రార్థించుదును, మీ దృష్టికి అది మంచిదైనట్లయితే మీరు మాలో కొనసాగి మాకు సహాయము చేయండి. మరియు మమ్మును మేము వాక్యము చుట్టూ ప్రోగుచేసికొనియున్నాము. మేము ఒకరిలో ఒకరము సహవాసమునకు చేరి మీరు మా కొరకు ఏమి చేసియున్నారో ఆ వాక్యములను వినుచుండగా.

మనమంతా వాక్యములోనికి వెళ్ళి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చుచున్నవో కనుగొందాము. అప్పుడు, మనము ఏమి చూచుచున్నామో ఈ రోజున ఏమి సంభవించుచున్నదో అది నిర్ధారణ అగుచున్నది, యేసుక్రీస్తు నామములో ఈ మానవులను దయచేయుము. అమేన్.

3ఇప్పుడు, ఆయన దాసునిగా ఒక వర్తమానమునకు నేను బాధ్యుడనై యున్నాను. మరియు కొన్నిసార్లు నన్ను అపార్థము చేసుకొంటూ వుంటారు. గతించిన కాలములలోనేమి, ఒకవేళ ఎల్లప్పుడూ అలాగే వుంటుందేమో, కొన్నిసార్లు విషయములు నేను బేధము చెప్పను కాని వారు యదార్ధముగా వుండాలని బోధిస్తాను. మరియు నేను తలంచినది యదార్థమయితేనే దాన్ని చెప్పడం నాకిష్టం. ఆ విషయములలో ప్రతి ఒక్కరు వారి వారి ఉద్దేశ్యమును తెలియజేసే హక్కువుంది. అందుచేతనే నేను మీ మధ్య వున్నాను.

సహోదరుడు షకారియన్ గారు పరిశుద్దాత్మ ఏమి చేయునో చూస్తూ, ప్రార్ధనా వరుసలలోని వారికి ప్రార్థనా కార్డు ఇవ్వటం గురించి మాట్లాడుచున్నారు. ఇప్పుడు, ఆయన నన్ను గురించి అది చెప్పలేదు. అది పరిశుద్దాత్మను గురించినది, ఎందుకనగా నేను ఆ పనులను చేయలేను. నేను అది చేయలేనని ఎవరికైనా తెలుసు.

కాని మీరు ఇక్కడ చూచునది చాలా స్వల్పము, మీరు వేరే స్థలములో వుండి చూసినట్లయితే ఆయన జరగబోవు కార్యములు ఎలా చెప్పుచున్నాడో గమనించవచ్చును. ఇక్కడ మీరు మాత్రమే వున్నారు. మీరంతా దేవునియందు విశ్వాసముంచినవారు. మీరే ఆ పని చేశారు.

4మరియు నీవు దేవుని నమ్మనివాడవైనట్లయితే గుర్తుంచుకో, ఆయన ఇక్కడే వేదిక దగ్గర ఆ విధముగా ముందే చెపుతాడు, నీవు పాపములో వున్నట్లయితే ఆయన ముందే ఆ విధముగా చెపుతాడు, నీవు ఇది వరకు చేసిన పనులు, నీవు చెయ్యకూడనివి. ఆయన ఆ విధముగా చెప్పును. వారు ప్రార్ధనా కార్డు మీద అది వ్రాసినంతవరకు మాత్రమే కాదు. వారి ప్రార్ధనా కార్డు మీద వారు దానిని వ్రాయవచ్చు… దాని మీద వారు పాపులని మరియు ఈ స్త్రీ వేరే పురునిషనితో జీవించుచున్నదని ఇంకా ఈ విధమైనవి వ్రాయకూడదు. ప్రార్ధనా కార్డు మీద వారు దానిని వు౦చకూడదు, ఎలాగైన పరిశుద్దాత్మ దానిని కనుగొంటుంది, చూడండి. ఇప్పుడు, … అది ఎలా…

దైవసంబంధమైన భాగము. స్నేహితులారా, చూడండి (గౌరవముగా దీనిని నేను చెపుతాను కారణము ఈ ఉదయమున ఇక్కడ మనలో అనేకమంది లేరు, ఒక చిన్న గుంపు మాత్రమే వున్నది), నాకు ఉద్రేకము కలిగించేటట్లు అది నాకు ఆశ్చర్యమును కలిగించింది. కొన్ని సార్లు నాకు బిగ్గరగా కేక వేయాలనిపిస్తుంది, మరియు నేను కొండ దిగువ భాగములో ఒక నిర్ణీత స్థలములో కూర్చోని గొప్ప సమయమును వ్యయము చేసి దేవుని నుండి అందుకొని, మరలా దిగి వచ్చి ఆయన నాకు ఇచ్చినదేదో అది ప్రజలకు బయట పంచివేస్తాను. ప్రజలతో భేదముగా వుండటం నాకిష్టము లేదు. నేను యధార్ధముగా వుండవలెనంటే దేవునికి, ఆయన వర్తమానమునకును యధార్ధముగా వుండవలెను.

5ప్రభువు చిత్తమయితే, ఇప్పుడు మేము తిన్నగా కొన్ని దినములలో అది ప్రభువు చిత్తప్రకారమయితే విదేశీ యాత్రకు వెళ్ళుటకు నిశ్చయించుకొనుచున్నాము. తప్పకుండా మీరు నా కొరకు ప్రార్ధించాలని వేడుకొంటాను. మీరు చాలా మంచివారు. మనలో మిగతా వారివలె నేను మాట్లాడటం మొదలుపెడితే సమయం గురించి పూర్తిగా మర్చిపోతాను. సహోదరుడు షకారియన్ గారికి, వేదిక దగ్గరనున్న ఈ మంచి సేవకులకు, బయట నున్నవారికి యేసుక్రీస్తు స్నేహితులందరికి, మీతో సిలువ ద్వారా దేవునికి ఒక సహబంధువుగా, సహోదరి సహోదరులుగా - ఆయన నామములో మిమ్ములను నేను అభినందించుచున్నాను.

ఈ ఉదయమున నేను లేఖనములో ప్రభువు చిత్తమయిన గలతీయులకు వ్రాసిన పత్రికకు తిరుగాలని ఆశించుచున్నాను. ఒక లేఖన భాగమును నేను చదువగోరుదును.

6ఇప్పుడు, గతరాత్రి ప్రసంగవేదిక దగ్గర సేవ చేయుచున్న సహోదరుని నుండి బయలు వెళ్ళిన వర్తమానము విన్నప్పుడు, ఆయన భాషలలో మాట్లాడినాడు. సహోదరుడు బ్రెడ్ సెన్ ఒక మంచి మనిషి. నేను… నా నిర్లక్షరాస్యతతో మరియు నా చదువుతో, మాటాల ద్వారా నాకు అర్థం చేసుకొనే శక్తి కొరతగా వుండటం మరియు వర్తమానము యధార్ధమని తెలిసియుండటం ద్వారా మరియు గతరాత్రి అలాంటి వ్యక్తి జాబితాలో వుండగా, అది వివేకము గలవారిని ఎదుర్కొనగలరు. ప్రభువు నన్ను దేనిని చేయమనడానికి పిలిచాడో దానిని వారు చేయలేరు. వారిని దేవుడు ఏమి చేయమనడానికి పిలిచాడో దానిని నేను చేయలేను. కానీ మనము కలిసి పని చేస్తుండగా, మనము దేవుని ముందు కనిపెట్టినట్లయితే మనము తప్పకుండా వర్తమానము మీదికి వెళతామని తప్పకుండా నేను నమ్ముతాను.

గతరాత్రి ఆయన సాక్ష్యమిచ్చినప్పుడు, పరిశుద్దాత్మ భాషలలో మాటలాడి యున్నది, అది జనసమూహములో ఎవరో ఒకరు, నేను ఎల్లప్పుడు దాన్ని గౌరవించటం నాకు తెలుసు. కారణం, అది దేవుని ఆత్మ మనకు ఏదో వర్తమానమును తెచ్చుచున్నదని నేను బైబిలు ద్వారా అర్థం చేసుకొంటాను. మరియు ఆయన కడవరి వర్షము గురించి తొలకరి వర్షము గురించి ఆయన చెప్పాడు.

అది నన్ను ఒక ఉద్దేశ్యమునకు తీసుకొస్తుంది.

7ఆ బోన్హాం సోదరుడు ఇప్పుడే నాకు కొన్ని చెక్కులతో ఒక చిన్న పాకెటును ఇచ్చినాడు, "ఇది ప్రజల వద్ద నుండి ప్రేమాపూర్వకమైన కానుక" అని చెప్పాడు. ఇప్పుడు వారు అది చేయకుండవలసినది. చూడండి, నేను ఈ ఉద్దేశ్యముతో ఇక్కడికి రాలేదు, కాని వారు దానిని నాకిచ్చారు. మరలా దానిని తిరిగి ఇచేంత మార్గం లేదనుకోండి. ప్రభువు చిత్తమయితే, నేను దానిని తీసికొనబోవుచున్నాను, విదేశములు వెళ్ళటానికి నా ఖర్చులకు దానిని కలుపుతాను, ఎందుకనగా నేను ఎవరి ద్వారాను స్పాన్సర్ చేయబడుటలేదు. నేను వెళ్ళేచోట నాకు ఏమీ ఆదాయం లేదు.

అది ఒక విధమైన రహస్యము, ఎందుకనగా అక్కడ సంఘములు నన్ను లోనికి ప్రవేశింపనియ్యరు. మరియు నేను అక్కడికి వేటగాడిగా వెళ్ళుచున్నాను. అది నా ప్రభువు పని మీద, దానిని చేయటానికి దేవుడు నా హృదయములో భారము వుంచాడు. మరియు నేను మరుగు పరచుకొని అక్కడికి వెళ్ళవలసియున్నది, చూడండి. అక్కడ వారికి కొన్ని వింతైన ఉద్దేశ్యములు వున్నవి, ప్రతి ఒక్కరు ఒక కార్డు మీద నేను సంతకము చేయాలంటారు, అది వారు నమ్మిన దానితో నేను ఏకీభవించానని మరియు ఈ వేరే గుంపు వాళ్లు తప్పని చెప్పాలి. అప్పుడు ఈ గుంపు వాళ్ళు నన్ను తీసుకొచ్చామని చెపుతారు, నేను ఈ గుంపు వాళ్ళు తప్పని చెపితే? చూడండి. నాకది ఇష్టము లేదు.

వారి సంస్థలకు మరియు వారి బేధములకు బయట, నేను ఎల్లప్పుడు ప్రజల మధ్యలో నిలబడి, మనము ఒక సంఘ శాఖ కాదని, ఈ ఉదయమున దేవుని ఆత్మ తనకు ఇష్టమైన దానిని సోదరుల ద్వారా ఏమి చెపుతుందో దానికి నేను పిలుపునిస్తాను. మనము ఒక కుటుంబములోని పిల్లలము. ఇక్కడ బ్రెన్హాం గారి సంఘ శాఖ లేదు. ఇక్కడ బ్రెన్హాం గారి కుటుంబమున్నది, మరియు మనము ఆ కుటుంబములో చేరము కాని ఆ కుటుంబములో పుట్టియున్నాము. అందుచేత, నేను నాకు తెలిసినంత మేరకు శ్రేష్టమైనదానినే సూచించుటకు ప్రయత్నించుచున్నాను.

GAL 4:27-31

 

8ఇప్పుడు గలతీయులకు వ్రాసిన పత్రిక 4:27-31, నేను దానిని గుర్తుపెట్టానని నమ్ముదును, దానిని మన అంశము కొరకు నేను చదువగోరుదును.

కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గరగా కేకలు వేయుము: ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లలకంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువమంది వున్నారు అని వ్రాయబడి వున్నది.

సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమైయున్నాము.

అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టెనో యిప్పుడును అలాగే జరుగుతున్నది.

ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దానిని దాని కుమారుని వెళ్ళగొట్టము, దాని కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండడు.

కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

ప్రభువు తన ప్రసస్తమైన వాక్యమును తన ఆశీర్వాదమును చేర్చును గాక.

9గతరాత్రి కొన్ని విషయములను టూకీగా వ్రాసియుంచాను. నేను ఆ విధముగా చేస్తాను, నేను వారమునకు ఒకే కూడిక పెట్టినప్పుడు నేను ఆ లేఖనములను చాలా తేటగా గుర్తుంచుకోగలుగుతాను. ఇప్పుడు నేను దీనిని చిన్న తమాషాగా చెప్పాను, కాని ప్రసంగ వేదిక దగ్గర తమాషాగా ఉండటం నాకిష్టము లేదు. రెండు మారులు 25 సంవత్సరములు దాటిన తరువాత ఇంతకు ముందువలె జ్ఞాపకశక్తి నాకు వుండడం లేదు. నా పాత ఫోర్డు కారు మీద చాలా మైళ్లు పోవలసియున్నది. అందువల్ల నాకు గుర్తువుండడం లేదు, కాని నేను ముందుకు కదిలినంతవరకు, ప్రతి అడుగున నన్ను రక్షించిన ఆయనకు మహిమనివ్వ కోరుదును.

ఇప్పుడు నేను… ఈ ఉదయమును చూస్తున్నప్పుడు దానిని గమనించుచన్నాను. ఇది కొంత వింతగా కనబడవచ్చు, వివేకము గల మనస్సుకు అది అంతా కలగాపులగంగా తోచవచ్చు, కాని నేను పిలువబడిన పిలుపు కొరకు అభినందనము. ప్రతి చిన్న విషయము కూడా నాకు ఒక గురుతే. నేను దాన్ని గమనిస్తాను, అది ఎలా కదులుతుందో చూస్తాను. ఆత్మ ఏ విధముగా కదులుతుందో చూసి గమనిస్తూ, ఇది ఏమి చెబుతుందో, అది ఏమి చెపుతుందో చూస్తూ ఆ విధముగా కొన్నిసార్లు నేను నా వర్తమానమును పొందుతాను.

10మీరు అనేక సార్లు నన్ను గమనించియుంటారు, స్వస్థత కూటమునకు ముందు ప్రసంగవేదిక మీద నిలబడియుండి లేక వెనుక కూర్చొనియుండి కనిపెడుతూ ఉంటాను. నేను ఆత్మ ఏ విధముగా కదులుచున్నాడో ఆ స్పర్శను పొందుతూ మరియూ ఆ కూర్చోనియున్న వ్యక్తి సంగతి ఏమిటో ముందే తెలుసుకొంటాను, చూడండి. అది జరిగిపోయింది, ఇక్కడే జరిగిపోయింది, నీవు దానిని ప్రసంగ వేదికకు వెళ్ళకముందే కనుగొన్నావు.

కొన్నిసార్లు నేను కూడికకు రాకముందు, కాలిఫోర్నియా వంటి చోటికి రాకముందే, నేను నాతో వున్నవారితో కూర్చొని, "అక్కడ ఒక నిర్ణీతమైన విషయము జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది. ఇది ఆ విధముగా వెళుతుంది" అని చెపుతాను. చూచారా, ఎందుకనగా అది దేవుని ఆత్మలో వున్నది. ఆయనకు ప్రారంభము నుండి అన్ని విషయములు తెలుసు, అందువలన ఆయన నిత్యుడైయున్నాడు.

11మరియు ఈ ఉదయమున గమనిస్తున్నప్పుడు, సహోదరుడు జువెల్ రోజ్, ఒక ప్రశస్తమైన స్నేహితుడు మరియు మన అందరికి సోదరుడు, ఆయన నిలబడి ఎలా కీర్తనలను చదివాడో చూడండి. అది ఒకదానిలోనికి ఒకటి ఏ విధముగా అమర్చబడినదో చూడండి, ఆయన చెప్పినట్లుగా, "ఏ రకమైన విత్తనము నీ మీద వ్రేలాడుచున్నదో నేను చూడగోరుచున్నాను."

"అంత్యదినములలో తొలకరి వర్షము కడవరి వర్షము రెండూ కుమ్మరింపబడుచున్నవి" అని గతరాత్రి దేవుని ఆత్మ మాట్లాడి చెప్పియున్నాడు. ఈ ఉదయమున నీ మీద వ్రేలాడుచున్న విత్తనమును గూర్చి ఆత్మ మాట్లాడుచున్నాడు; ఈ సేవకుల ద్వారా ఆత్మ ఏమి చేసియున్నాడో గమనించండి, అందుచేత నేను "విత్తనము తొక్కతో కలసి వారసురాలు కాదు," అను అంశమును తీసికొనుచున్నాను.

అది వింతైన అంశము, కాని విత్తనము తొక్కతో కలసి వారసురాలు కాదు. దీనిని తీసికొని ముగింపును నేను చిత్రీకరించిన తరువాత, నా చర్చనీయాంశము, గలతీ పత్రిక 4:27 నుండి.

ఇక్కడ పౌలు, అబ్రాహాము ఇద్దరు కుమారుల యొక్క విత్తనములను గురించి మాట్లాడుచున్నాడు. ఇప్పుడు నేను దానిని ఉపయోగించాలను కొనుచున్నాను, మీరు దానిని తప్పక పోగొట్టుకొనకూడదు, మరియు నేను ఎక్కువ సమయము తీసికొంటే, దానిని మరలా రాత్రికి తీసికొంటాను. నేను ఆదివారపుబడి పాఠమువలె బోధించాలని కొనుచున్నాను, దానివలన మీకు మంచి గ్రహింపు ఉంటుందని నా విశ్వాసము.

12ఇప్పుడు, మీలో కొందరు నాకంటే ఎక్కువ సామర్థ్యము గల వారున్నారు. ఎందుకనగా నేను ఏ మాత్రము వేదాంత పండితుడను కాను. మీరు దీనిమీద నాతో ఏకీభవించక పోయినట్లయితే, నేను అభిప్రాయపడినట్లు, మీరు కూడా అలా అభిప్రాయపడండి. "మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. నిన్న రాత్రి ఒక ప్రియ సహోదరి నాకు చెర్రి-పై (తినుబండారము)ను ఇచ్చినప్పుడు, ఈ ఉదయం నా హోటలు గదిలో కూర్చొని ఆ పైని తింటుండగా దాని విత్తనము నాకు తగిలినప్పుడు నేను విత్తనమును మాత్రమే తీపివేసి కేవలము పైని తింటూనే వున్నాను. అదే విధంగా మీరు నమ్మని కార్యములను విడచివేసి, మీకు సరియైనవనిపించిన దానిని తినుట కొనసాగించండి.

GAL 3:29•

GAL 4:22

 

13ఇప్పుడు, పౌలు అబ్రాహాము యొక్క ఇద్దరు కుమారులను గూర్చి మాట్లాడుచున్నాడు, వారిలో ఒకడు శారా ద్వారా పుట్టినవాడు. మరియొకడు హాగరు ద్వారా పుట్టినవాడు. ఇప్పుడు మనము ఇక్కడ లేఖనముల ద్వారా అర్థము చేసుకొన్నది ఏమనగా, దేవుడు ఎన్నడు రెండులో సూచించబడడు. అది మూడులోనే, దేవుడు సంపూర్ణము చేయబడినాడు. బైబిలు లెక్కలు సంపూర్ణముగా నడచును. దేవుడు మూడులో పరిపూర్ణము చేయబడెను, ఏడులో ఆరాధించబడెను మరియు ఆ విధము చూడండి, బైబిలు లెక్కలు ఎన్నడూ తప్పిపోవు.

మరియు ఇక్కడ మనకు అబ్రాహాముకు ఇద్దరు కుమారులున్నారు, అయినను ఆ కుమారులలో ఒకరముగా మనము ఉన్నట్లయితేనే మనము వారసులము కాగలము, లేక అబ్రాహాము యొక్క కుమారుడవైనప్పుడు, "మనము క్రీస్తులో మృతి చెందినవారమైతే అప్పుడు మనము అబ్రాహాము యొక్క బీజములు అవుతాము, మరియు వాగ్దానము ప్రకారముగా ఆయనతో వారసులమవుతాము. కాబట్టి అబ్రాహాము మరొక కుమారుని తప్పక కలిగియుండాలి.

ఇప్పుడు ఆయన మొదటి కుమారుడు హాగరు ద్వారా కలిగాడని మనకు తెలుసు. మరియు ఆయన రెండవ కుమారుడు శారా ద్వారా పుట్టాడని మనము తెలుసుకొంటాము. అయితే ఆయనకు మూడవ కుమారుడు వున్నాడు, ఆయన యేసు. ఇప్పుడు అది వింతగా కనబడవచ్చు, కాని దానినే మనము విప్పుటకు ప్రయత్నించబోతున్నాము.

నేను చెప్పినట్లుగా, దేవుడు ఎల్లప్పుడు పరిపూర్ణముగా మూడులో తన్ను తాను సూచించుకొంటాడు. మరియు ఇప్పుడు మీ అందరి ముందు నన్ను నేను తేటగా చేసికొన్నాను, మరి విశేషముగా మన వేదాంత పండితులకు, ఈ విషయములు నేను చూసినవి చూసినట్లుగా, అవి నాకు వచ్చిన విధముగా చెప్పుచున్నాను.

GEN 1:1•

JOHN 1:1,14•

JOHN 14:20

 

14"ప్రారంభములో దేవుడు ఒంటరిగా నివసించెను…" ఎందుకనగా ఆయన నిత్యుడైయున్నాడు, చూడండి. దేవుడై వుండలేదు — దేవుడు ఆరాధనకు పాత్రుడు. మనము పిలుస్తున్నట్లుగా "లోగోస్" అనగా వాక్యము దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళింది. అది ప్రభువు దూత, లేక దేవుని వాక్యము దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళింది. అది ప్రభువు దూత, లేక వాక్యము అని అందరికీ తెలుసు. బయలు వెళ్ళిన వాక్యమే దేవుని దూత. ఈయనే అరణ్యములో ఇశ్రాయేలీయులను వెంబడించినవాడును, నిబంధన దూతయును, దేవుని నుండి బయటికి వచ్చిన 'లోగాసు'ను అయివున్నాడు. తరువాత ఆ లోగోస్ శరీరధారియై మనమధ్య నివసించెను.

ఇప్పుడు మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో వున్నాము. "అదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వుండెను, వాక్యము దేవుడైయుండెను." మరియు ఇప్పుడు, ఆయన మన కొరకు తన జీవమును ఇచ్చినట్లుగా, ఆయన ఆత్మ మన మీదకు తిరిగి వస్తుంది. "నేను నా తండ్రియందును, తండ్రి నా యందును, మీరు నా యందును, నేను మీ యందును వున్నామని ఆ దినమున మీరెరుగుదురు" అని యేసు అనెను.

దేవుడు అంతటిలో తన్నుతాను బయలుపరచుచూ వేరు వేరు యుగముల ద్వారా తనకైతాను పనిచేయుచున్నాడు. అంతయూ దేవునిదైయున్నది. సంఘము కలుగుటకై సంఘమే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని ఆలోచనలోని ఒక గుణమైయున్నది. క్రీస్తులో వున్నవారు ఆదినుండి ఆయన తలంపు ప్రకారము క్రీస్తులో వున్నవారే. ఆయన తలంపులు ఆయన గుణములైయున్నవి.

GEN 15:18•

GEN 16:2

 

15ఇక్కడ వాగ్దానములోని విత్తనము ప్రారంభమవుతుంది. ఇష్మాయేలును బట్టి, అబ్రాహాము ఇక్కడ కొంత అనుమానించాడు. మనము మాట్లాడబోవు విత్తనము యొక్క మూడు దశలను నేను మీకు చూపగోరుదును అది తొక్కతో వారసురాలు కాదు. ఇక్కడ ప్రారంభములో దేవుడు అబ్రాహాముకు వాగ్దానమిచ్చాడని మనము ఇప్పుడది కనుగొందుము. మొదట, ఆయన ఆదామునకు వాగ్దానమిచ్చాడు. ఆ నిబంధన "నీవు ఇది చెయ్యకపోయినట్లయితే" అను షరతుల మీద వుండెను. కాని ఆయన దానిని అబ్రాహామునకు ఇచ్చినప్పుడు, అది షరతులు లేనిదైయుండెను, "నేను దానిని ముందే చేసియున్నాను." ఆయన చేసినది షరతులు లేనిదిగా అబ్రాహామునకు ఇచ్చెను.

ఇప్పుడు, దానివలన అబ్రాహాము వాగ్దానమును పొందిన దానిని బట్టి మనము అబ్రాహాము విత్తనములై యుండవలసియున్నది. అది అబ్రాహామునకు మాత్రమే కాక ఆయన తరువాత ఆయన సంతతి (విత్తనము)కి కూడా, ఇప్పుడు మీరు గమనిస్తే, అది ఆయన తరువాత సంతానములో (విత్తనము)కి? కాదు, కాని ఆయన తరువాత (విత్తనము) సంతతికి మాత్రమే. ఆ వాగ్దానము ఇప్పుడు కొంచెముగా శారా చేత అనుమానించబడినది, మరియు శారా అబ్రాహాముతో ఈ ఐగుప్తియురాలైన హాగరు అను స్త్రీని ఆయనకు భార్యగా తీసికొనటం ద్వారా, దేవుడు ఆ విధముగా ఈ వాగ్దాన విత్తనమును నిలువబెట్టుననుకొన్నది.

NUM 22:12

 

16ఇప్పుడు చూడండి, … నేను గతరాత్రి నుండి చెప్పినట్లు, దేవుని అసలైన ప్రణాళిక నుండి వేరుగా ఎలా కదిలినా అది మొత్తం విషయాన్ని సమకూర్చకుండా బయటకు త్రోసివేస్తుంది. ఆ అసలైన వాక్యము నుండి మనము కదలాకూడదు. మొన్న సాయంకాలము మనము బిలాము మీద మాట్లాడియున్నాము. ఆయనకు "వెళ్ళవద్దు" అని దేవుని జవాబు స్పష్టముగా వచ్చింది, కాని ఆయన అనుమతించబడిన చిత్తమును (permissive will) కలిగియున్నాడు, నీవు కోరినట్లయితే నీవు దానిలో పనిచేయవచ్చు. మరియు దేవుడు దానిని అనుమతించవచ్చు, అయినను అది దేవుని పరిపూర్ణ చిత్తమునకే పోరాడవలెను, కాని అనుమతించబడిన చిత్తమునకు కాదు. ఈ రోజున భూమిమీద నున్న దేవుని రాజ్యము ఎన్నడూ ఆయన ఇచ్చు అనుమతించబడిన చిత్తముపైన వుండదు. అది తప్పక ఆయన పరిపూర్ణ చిత్తమునకు తిరిగి రావలసియున్నది.

GEN 16:2

 

17దేవుడు అబ్రాహాముతో శారా ద్వారా కుమారుడు పుడతాడని, దాని ద్వారా లోకమును దీవించునని చెప్పిన తరువాత కూడా ఇక్కడ శారా దానిని అనుమానించటం మనము చూస్తాము. మీరు ఇక్కడ గమనించాలి. అబ్రాహాము ద్వారా ఆ అనుమానము ఎన్నడూ రాలేదు; కాని స్త్రీయైన శారా ద్వారా వచ్చింది. ఆమె దానిని అనుమానించింది. "హాగరును తీసుకొమ్మని" చెప్పింది. అబ్రాహాముకు దానిని చేయడం ఇష్టము లేదు, కాని దానిని చేయమని దేవుడు అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి కొంచెము అనుమానముగానే అతడు దానిని చేసెను.

ఇప్పుడు ఇస్సాకు, వాగ్దానము చేయబడిన స్త్రీ ద్వారా స్వతంత్రుడైయుండుట వలన, అనుమానము ద్వారా దాసియైన హాగరునకు పుట్టిన ఇష్మాయేలుతో కలసి వారసుడు కాజాలడు. దానినే పౌలు ఇక్కడ చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు. ఎక్కడ ఒక విషయము అనుమానించబడునో, అది దేవుని యొక్క ఒక విధమైన క్రమమును తీసికొని వస్తుంది, కాని అది దేవుని యొక్క అసలైన క్రమములో వారసత్వమును పొందలేదు. మీకు అర్థమవుతుందా? చూచారా, అది వారసురాలు కానేరదు.

REV 17:5

 

18ఈ రోజున నేను అందుచేతనే ఎంతో బలముగా వున్నాను… ఇది మంచి సమయమని నేను తలంచుచున్నాను, ఎందుకనగా ఇంకా ఎంత కాలము మనము కలసియుంటామో నాకు తెలియదు, మరియు నేను ఎందుకు ఇంత ఖండితముగా సంస్థాగతమైన మతమును వ్యతిరేఖించుచున్నానో మీకు చూపుటకు ఏదో విధంగా నాకు దేవుడు సహాయం చేయాలి. అది అసలైన దేవుని ప్రణాళికతో వారసురాలు కాలేదు. ఎందుకనగా సంస్థ దేవునిది కాదు. అది మానవునిది.

ప్రపంచమంతటిలో మొట్టమొదటి సంస్థాగతమైన సంఘము ఎప్పుడయినను వున్నట్లయితే అది రోమన్ కాథలిక్ సంఘమే, ప్రకటన 17 చెపుతుంది, "అమె వేశ్యలకు తల్లి మరియు పిల్లలంతా వేశ్యలైయున్నారు." వ్యభిచారిణి అనగా తన భర్తకు నమ్మకముగా జీవించనిది, వేశ్య కూడా అంతే, కాని ఎలాగైనను అది సంఘమైంది, అది సంస్థాగతమైన పద్ధతి, మరియు అది సహోదర ప్రేమను వేరు చేస్తుంది.

మనము సంఘములన్నిటిని కలిపి సంస్థాగతం చేయాలని ప్రయత్నించాము. అది పని చేయదు, ఎన్నడూ పని చేయదు. ప్రపంచ సంఘముల సమాఖ్య అవి దేవుని ప్రణాళికకు బయట వున్నవి.

19"నీవు ఎవరవు? కనీసము గ్రామరు స్కూలు విద్య కూడా లేకుండా నిలువబడి మాట్లాడుచున్నావు" అని నీవు అనవచ్చు. విద్య పెద్ద భేదమును కలుగచేయదు. నేను మాట్లాడుటకు ప్రయత్నించేది నా చదువు కాదు; నేను మాట్లాడుచున్నది దేవుని వాక్యము గురించి, చూచారా.

మరియు ఈ సేవలోని మీరు చూస్తున్న న్యాయ నిరూపణములు, అవి నావి కాదు గాని, అది సత్యమని దేవుడు నీకిచ్చుటకు ప్రయత్నించటయే. ఒక అబద్ధముతో దేవుడు చేసేది ఏమైనా వున్నదా? అయితే అబద్దాన్ని దీవించే దేవునికి సేవ చేయటం నాకు దూరమగున గాక, సత్యాన్నే ఆయన దీవిస్తాడు, సత్యాన్నే ఆయన ఘనపరుస్తాడు.

20ఇప్పుడు ఇష్మాయేలు, ఇస్సాకుతో వారసుడు కాలేడు, ఎందుకనగా ఒకటి కొంచెముగా అనుమానించబడింది, అది బాలుడే, అది అబ్రాహాము విత్తనమే, కాని ఇష్మాయేలు దేవుని కొరకైన పరిపూర్ణ మార్గము కాదు. ఇక్కడ నేను ఎక్కువ సమయమును గడుపగలను, కాని పరిశుద్దాత్మ అది వుండవలసిన రీతిలో దీనిని మీకు తెలియపరచునని నా నమ్మకము.

ఇష్మాయేలు మరియు ఇస్సాకు కలసి వారసులు కారు, ఎందుకనగా దేవుని యొక్క అసలైన ప్రణాళిక దేవుని అనుమతిచ్చే ప్రణాళికలోనికి బదిలీ చేయబడింది; అనుమతిచ్చే విధానమును దేవుడు దీవించెను, అయినను ఈ దినమున ఆత్మీయ సంఘము సంస్థాగతమైన సంఘముతో కలసి వారసత్వమును పొందలేదు. ఇష్మాయేలును దీవించినట్లు, సంస్థాగతమైన సంఘములను దేవుడు దీవించెను, కానీ ఆత్మీయులు ఇతరులతో వారసులు కారు. అది నిజము. ఎన్నుకొనబడినవారు అనగా క్రీస్తు యొక్క వధువు సంఘశాఖల నుండి బయటకు రావటం జరుగుతుంది.

MATT 24:14•

MATT 25:10

 

21ఈ సంఘశాఖలన్నీ ఇప్పుడు మనము వరిగియుండవలసినట్లు, కడవరి వర్షమునకు లేక ఆత్మ కుమ్మరింపులోనికి తమ్మును లాగుకొనుచున్నవి. ఈ ఘడియలో దీనిని ఎరగడమే నన్ను తొందర చేయుచున్నది. "ఇది నెరవేరినప్పుడు, అదే అంతము" అని యేసు ప్రభువు చెప్పెను, అప్పుడు బుద్దిలేని కన్యకలు మరియు బుద్ధిగల కన్యకలు కలసి వారసులు కారు.

ఏలయనగా అప్పుడు బుద్దిలేని కన్యక, (ఆమె కన్యకయే గాని నూనె కొరత వుండెను) కాని ఆమె నూనెను కొనుటకు వచ్చినప్పుడు, ఆ సమయములోనే పెండ్లికుమారుడు వచ్చెను. మరియు ఆమె నూనెను కొనుటకు ప్రయత్నించుచుండగా, ఆమె విడిచిపెట్టబడెను. మీకు అర్ధమవుతుందా? అది చక్కగా మీలో తడవాలని నా కోరిక. ఇప్పుడు, ఆ అంశమును నేను ముందుకు కదిలించవలసిన పనిలేదు.

ఇప్పుడు ఆత్మీయులు మరియు శరీరులు కలసి వారసులుగా యుండలేరు.

22అందువలననే ఎత్తబడుట, వధువు, బుద్ధిగల కన్యక, బయటకు పిలుబడినవారు, ముందుగా నిర్ణయించబడినవారు, ఎన్నుకోబడినవారు…

దేవుడు తన కార్యములను గజిబిజిగా చేస్తాడు అని కొందరు అనుకొనిన విధముగా వ్యాపారులైన మీరు మీ కార్యములను ఆ విధంగా నడిపించరు. లోకమునకు పునాదులు వేయబడక మునుపే ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షింపబడరో దేవునికి ముందే తెలుసు, సంఘము ప్రారంభము కాకమునుపే దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ఎరిగి నిర్ణయించిన ప్రతి సభ్యుని చూసి ప్రతి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాసెను. ఆ పుస్తకము మీద నన్నువారిని వెదకి రక్షించుటకు యేసు వచ్చెను. ఆయన విమోచనా పుస్తకమును కొనెను — అది పోగొట్టుకొనబడినది. ఆయన మనలను విమోచించెను, ఆయన మనలను విమోచించినప్పుడు ఆ పుస్తకము మీదనున్న పేర్లలన్నియు విమోచించబడియున్నవి.

23మరియు నేను అనేకసార్లు చెప్పాను, మీరు దానిని గమనించియుంటారు. అందుచేతనే మీరు ఈ సంస్థలన్నిటి నుండి బయటకు వచ్చి ఈ ఉదయమున ఇక్కడ వున్నారు. ఏదో నిన్ను లాగుచున్నది. నా చిన్న కథను బట్టి కోడిపెట్ట, పక్షిరాజు పిల్లను పొదిగినట్లు ఏదో భేదమును గ్రహించుచున్నారు. తృప్తినిచ్చేది సంఘమునకు లేదు. కానీ ఏదో వేరైన కేక వంటి దానిని మీరు విన్నారు. మీరు దానిని గ్రహించారు. మరియు దాని కొరకు పుట్టియున్నారు. మీరు దానిలో భాగమైయున్నారు, చేతిమీద మేజోడు వున్నట్లు మీరు దానిలోకి సరిపోయారు.

అందుచేతనే ఆ ఉదయమున మనమంతా కలసి సమావేశమయ్యాము. ఎందుకనగా నా యొక్క దక్షణ ప్రాంతపు తల్లి చెప్పుతూ వుండినట్లు, "ఏ జాతి పక్షి, ఆ జాతి పక్షులతో ఎరుగును," ఎందుకనగా మీకు అన్నియూ ఉమ్మడిగా వున్నవి. డేగలకు మరియు పావురములకు ఉమ్మడిగా ఏమియూ వుండవు. పావురమును డేగ పొదిగినప్పటికి వాటి ఆహారము వేరైనది, అది నిజము. దాని ప్రారంభము ఏమైయున్నదో దాని మీద అది ఆధారపడును. ఇప్పుడు దానిలో పావురమునకు డేగ స్వల్పమును తల్లిగా వున్నప్పటికి, చివరగా అది తన చెలికానిని కనుగొంటుంది.

GEN 1:27•

GEN 2:7,21-23•

JOHN 5:24•

REV 20:5

 

24ఈ దినమున సంఘము చేయుచున్నది అదే. ఏలయనగా యేసు వాక్యము మరియూ పెండ్లికుమారుడైయున్నాడు, వధువు పెండ్లికుమారునితో భాగమైయున్నది. అందువలనన ఈ దినమున నెరవేరవలసిన వాక్యము, ఆయన దినమున నెరవేరిన అదే వాక్యములోని భాగమైయున్నది. మరియు అది అదే వాక్యము, అదే అనుభవము, అదే జీవము.

ఏలయనగా దేవుడు ఆదామును వేరు చేసినప్పుడు ఆయన రెండైయున్నాడు. ప్రారంభములో ఆదాము ఆత్మయైయున్నాడని మనము కనుగొంటాము. "ఆయన మానవుని తన స్వరూపము చొప్పున చేసెను. అతనిని పురుషునిగాను స్త్రీనిగాను చేసెను." మరియు అదికాండము 2వ అధ్యాయంలో దేవుడు నరుని నేల మంటి నుండి సృజించెను. మానవుడు దేవుని స్వరూపమున సృజించబడెను. దేవుడు ఆత్మయైయున్నాడు, కాబట్టి అతను ఆత్మ మనిషైయున్నాడు.

తరువాత అతను మాంసపు మనిషి అయినప్పుడు, భూమి మీద మాంసము వలె వున్నాడు. ఆయన వధువును ఈలాగు చూపుచున్నాడు. ఆయన వేరోకదానిని తీసికొని ఎన్నడూ మరొక మానవ ప్రాణిగా చేయలేదు, కాని ఆయన అసలైన సృష్టియైన ఆధాములోని భాగమును తీసికొని, ఒక ప్రక్కటెముకను ఆయన ప్రక్కనుండి తీసికొని; పురుష సంబంధమైన ఆత్మను దానిలో అక్కడ విడిచిపెట్టి, స్త్రీ సంబంధమైన ఆత్మను ఆదాము నుండి తీసికొని మరియు స్త్రీ సంబంధమైన భాగములో వుంచెను. అందుచేత ఆయన ఆత్మలో ఒక భాగము ఆయన శరీరములో ఒక భాగము; ఆయన మాంసములో మాంసము, ఎముకలలో ఎముకను, ఆయన వాక్యములో వాక్యము, జీవములో జీవము మరియు అదే విధంగా వధువు క్రీసుకైయున్నది.

అందుచేతనే ముందు రాజవిత్తనమునకు ఎత్తబడుట రావలసియున్నది. మరియు కడమ మృతులు వెయ్యి సంవత్సరముల వరకు బ్రతుకలేదు. తరువాత వారు దవళ సింహాసనపు తీర్పు నొద్దకు తేబడిరి. చూడండి, రాజవిత్తనమునకు లేక ముందుగా తన కోసము నిర్ణయించబడిన అబ్రాహాము విత్తనమునకు తీర్పులేదు.

ఇప్పుడు, మీరు యోహాను సువార్త 5:24 తీసుకొన్నట్లయితే, దీనిని వినండి, "నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు."

JOHN 5:24•

JOHN 6:37,44•

JOHN 10:5,27

 

25మన వేదాంతముల నుండి అది ఎంత బేధముగా వున్నది. నేను బయటకు వెళ్ళి ఒక త్రాగుబోతును "నీవు నమ్ముతావా?" అని అడిగితే వాడు

"తప్పకుండా" నమ్ముతానంటాడు.

వేరొకని భార్యను ఉంచుకొనిన వాని దగ్గరకు వెళ్ళి… "నీవు నమ్ముతావా?" అని అడిగితే,

"తప్పకుండా" అంటాడు.

"మరి ఒకని నీవు గతరాత్రి కూటములో వాక్యము వినడానికి కూర్చున్నావా?" అని అడిగితే

"తప్పకుండా" అని అంటాడు.

"నీవు దానిని నమ్ముతావా?"

"తప్పకుండా" అని అంటాడు.

వారు దానిని ఊత పదంగా చెబుతున్నారు. కాని ఈ వాక్యము యొక్క అసలైన అనువాదము ఏమనగా, "నా మాటను గ్రహించువాడు మరియు నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు" అని భావము. "గ్రహించువాడు" అనగా అది తెలియపరచబడినవాడు. యేసు చెప్పెను, "నా తండ్రి ఆకర్షించితేగాని ఏ మానవుడు నా దగ్గరకు రాడు. మరియు నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరు వస్తారు." "నా గొర్రెలు (నా పావురములు) నా స్వరము వినును. అన్యుని అవి ఎంత మాత్రము వెంబడించవు."

దేవుని యొక్క స్వరము ఏమిటి? అది వాక్యమైయున్నది. ఆయన వాక్యము తప్ప ఇంకెవరి స్వరము ఏముంది? అది దేవుని వాక్యమైయ్నది — వారు దేవుని వాక్యమును వింటారు.

26అందువలన మొదటిగా ఇష్మాయేలు ద్వారా రెండవదిగా ఇస్సాకు ద్వారాను విత్తనము వచ్చువరకు వీరు సహజ సంబంధమైన విత్తనమును మోసికొని పోవుటకైన సాధనములు అయివున్నారు. ఇది జోన్న యొక్క కాడ, కుచ్చు తొక్కవలె వున్నది. ఇప్పుడిక్కడ విత్తనము యొక్క మూడు దశలను చూపు నిజమైన రూపమును ఈ ఉదయమున మీరు నాతో కూడా గమనించాలని కోరుతాను. మనము దానిని చూచుచున్నాము… మరియు నేను చదువులేని వాడను కాబట్టి, నాకు తెలియపరచబడిన ఆత్మీయమైన వాటిని పోల్చుటకు నేను చూచుచున్న సహజమైన వాటిని నేను తీసికొనవలసియున్నది, ఎందుకనగా ఏ విధమైన గ్రామరులో కూడా నేను దానిని మీకు వివేకముగా చూపలేను. ఎలాగైనను దేవుడు ఎల్లప్పుడు ఆత్మీయమైన వాటిని సహజ సంబంధమైన వాటితో పోల్చును. ఒకవేళ బైబిలు లేకుండినప్పటికి, నేను ఇంకా క్రైస్తవ్యమే నిజమైనదని తెలుసుకొనే వాడిని, ఎందుకనగా సర్వభూమి అంతా మరణము, సమాధి, పునరుత్తానము మీద తిరుగుచున్నది.

ప్రకృతి మరణము, సమాధి, పునరుత్తానముగా పనిచేస్తుంది. చెట్టులోని సారమును చూడండి. అది ఎలా ఆకును తెస్తుందో, మరియు ఫలములు రాలిపోవటం శీతాకాలమునకు తిరిగి భూమిలోని పచ్చిక బయలు క్రిందకు పోవటం నూతన జీవముతో తిరిగి వసంత ఋతువులో పైకి వస్తుంది. ప్రతి సంవత్సరము జీవము, మరణము, పునరుత్తానమున్నదని సాక్ష్యమిచ్చుచున్నది.

27ఒక చిన్న బిడ్డ చాలా బలహీనముగా అప్పుడే పుట్టినట్లుగా సూర్యుడు ఉదయమున ఉదయిస్తాడు. ఏడు లేక ఎనిమిది గంటల ప్రాయములో అది స్కూలుకు బయలుదేరుతుంది. పది లేక పదకొండు గంటలకు అది కాలేజీ నుండి బయటకొస్తుంది. పదకొండు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అది తన బలమంతటితో ప్రకాశిస్తుంది. తరువాత అది బలహీనమైపోవటం ప్రారంభమవుతుంది. సాయంకాలమున అది క్రిందికి వెళ్ళిపోతుంది. ఒక వృద్దునివలె బలహీనమవుతుంది. అదేనా ఇకదాని అంతము, అది చనిపోతుందా? లేదు, అది మరుసటి ఉదయమున ఉదయిస్తుంది, చూచారా?

మీ నిజమైన అసలు బైబిలు ప్రకృతి, అది ఈ బైబిలులో సాక్ష్యమిచ్చుచున్నది. ఇప్పుడు ఈ ఉదయమున దానినే మీకు చూప ప్రయత్నించుచున్నాను. దేవుని వాక్యమునకు నమూనా చేయబడినట్లుగా, ప్రకృతి ద్వారా మీరు దేవుని వాక్యమును చూస్తారు, ఎందుకనగా ప్రకృతి దేవుని యొక్క నిర్మాణమైయున్నది. సైన్సువలె వారు యంత్రములను మరియు ప్రకృతి యొక్క విధులను కనుగొంటారు, కాని ఆ ప్రకృతి అంటే ఏమిటో వారికి తెలియదు. ప్రకృతి యొక్క జీవమును వారు ఎరుగరు. ఈ జీవము దేవుడే కాబట్టి, చలన శాస్త్రములు లేకుండా యంత్రములు పనికిరావు.

28ఇప్పుడు గమనించండి కాడ, కుచ్చు, తొక్క హగరు ఇక్కడ వాగ్దానములో ప్రారంభమయిన మొదటి జీవమును అనగా కాడను సూచిస్తుంది. శారా కుచ్చును లేక కుచ్చులో వచ్చే పుప్పొడిని సూచిస్తుంది. కన్యక అయిన మరియ నిజమైన కాడను తేవటానికి నిజమైన ఆత్మీయ విత్తనము ఉత్పత్తి చేయటాన్ని సూచించుచున్నది.

హాగరు మరియు శారా ఇద్దరూ సంపర్కము ద్వారానే కాని కన్యయైన మరియ వాగ్దానము చేయబడిన దేవుని వాక్యపు శక్తి ద్వారా కన్యక పుట్టుకతో ఆమె అసలైన విత్తనము తెచ్చింది. కాడైన రెండవ భార్య హాగరు వాగ్దానమును అనుమానించటం ద్వారా కొద్ది అనుమానం ద్వారానే పనిచేసింది. దేవుడు మనకు ఇప్పుడే సహాయము చేయును గాక.

GEN 1:3•

ISA 7:14•

JOEL 2:28•

ACTS 2:17•

2PET 1:20

 

29దీనిని మీరు చాలా తీవ్రముగా తీసుకొనవలెనని ఆశించుచున్నాను. వానిలో దేనిని రవ్వంతైనా అనుమానించరాదు. ఉన్నది ఉన్నట్లుగా నీవు దానిని తీసుకొనవలసియున్నది. దానికి అనువాదము అవసరము లేదు. బైబిలు ఈ విధముగా చెపుతుంది, "దేవుని వాక్యమునకు సొంత అనువాదము అవసరము లేదు. దేవుడు తన వాక్యమును అనువాదము చేయుటకు మన పాఠశాలలు ఆయనకు అవసరములేదు. దేవుడు దానిని స్థిరపరచి జీవింపజేయునప్పుడు, అదే దానియొక్క అనువాదమైయున్నది.

"వెలుగుకమ్మని" చెప్పినప్పుడు వెలుగు కలిగెను. దానికి అనువాదము చేయవలసిన పనిలేదు. "కన్యక గర్భవతి అగునని" ఆయన చెప్పినప్పుడు, దానికి అనువాదము చేయవలసి పనిలేదు. ఆమె గర్భవతి అయినది. "మంచిది, మాకు అనువాదము దొరికింది." "మాకు అనువాదము దొరికింది" అని చెప్పుకొను మనుష్యులను కలిగిన సెమినరీలు మనకు అవసరము లేదు.

దేవుడు తనకుతానే తన వాక్యమును అనువాదము చేయును. ఆయనకు అనువాదము చేసిపెట్టటానికి ఎవ్వరూ అవసరము లేదు. ఆయన "అది జరుగుతుంది" అని చెప్పినప్పుడు అది జరుగుతుంది. "అంత్యదినములలో నా ఆత్మను కుమ్మరించుదును" అని చెప్పినాడు. అలాగే చేసినాడు. సంఘశాఖలు చెప్పుచున్న కార్యములను నేను లెక్క చేయను. ఆయన చేస్తానని సెలవిచ్చినాడు కాబట్టి ఎలాగైనను దానిని చేశాడు.

దానికి అనువాదము అవసరము లేదు ఏలయనగా దేవుడు తనకుతానే స్వంత అనువాదకుడు.

30మరియు మీరు చూస్తున్న ఈ విషయములు, అవి మీకు ఇప్పుడు మూఢమైనవిగా అగుపించవచ్చు. మీకు గుర్తుందా, మీ సేవ, ముప్పై లేక నలభై సంవత్సరముల క్రితం పెంతుకొస్తవారి సేవ, అప్పటి మెథడిస్టు మరియు బాప్టిస్టు సంఘములకు ఎంత మర్మముగా వుండెనో, ఈ రోజున ఈ సేవకూడా మీకు అలానే యున్నది. కాని దానిని వాక్యముతో ఇప్పుడు కనుగొనండి. మీరు వారికి చూపించటానికి ప్రయత్నించినట్లు, నేను మీకు చూపటానికి ప్రయత్నించుచున్నాను. మరియు దేవుడు, వాక్యములో అది అంతేనని చెప్పి దానిని రూఢి పరచినప్పుడు అదే దేవుని యొక్క సొంత అనువాదము. నీ కొరకు అనువాదము చేయటానికి ఎవరూ నీకు అవసరము లేదు.

MATT 4:4•

LUKE 4:4•

REV 22:18,19

 

31ఇప్పుడు హాగరు, కొంచెముగా… గుర్తుంచుకోండి, నీవు ఒక్క మాటను కూడా దాని నుండి తీయకూడదు. యేసు ప్రభువు కడవరి పుస్తకమైన ప్రకటనలోను మరియు పుస్తకము యొక్క ప్రారంభములోను ఇలా చెప్పారు, "ఏ మనిషి అయినను ఆ వాక్యములో నుండి ఒక చిన్న ముక్కను తీసినట్లయితే…"

మనకు కలిగిన ప్రతి రోగము, మరణము ఒక మాటను తప్పుగా అనువాదము చేయటం ద్వారా కలిగినది. మరణము కలిగించింది. పరిశుద్ధుడైన దేవుడు చూపినప్పుడు దేవుని ఒక కూటము కొంచెముగా తప్పు అనువాదము చేయుటవలన అవ్యక్త స్థితిని కలిగించింది. ఆ మహోన్నతమైన వాక్యమునకు వ్యతిరేకముగా ఎంత చిన్న తప్పు అయినా ఆ అవ్యక్త స్థితిని కలిగించింది. ఈ నాశనకరమైన దానిని తిరిగి ఆయనతో సమాధాన పరచుటకు ఆయన సొంత కుమారుడు శ్రమపడి రక్తము కార్చి చనిపోవటం జరిగింది. దేవుని పూర్తి వాక్యమునంతా పాటించకుండా దానికంటే తక్కువలో మనము మరి ఎలా వెళ్ళగలము?

మంచిది, "సహోదరుడా బ్రెన్హాం గారు, ఇది ఆదికాండములో వున్నదని" మీరంటూరు, నాకది తెలుసు. కాని ప్రకటన గ్రంథములోని ఆఖరు భాగమును మీకు నన్ను చెప్పనివ్యండి. "ఎవడైనను వీటిలో మరి ఏదైనన తీసివేసిన యెడల జీవగ్రంథములో వానికి పాలు లేకుండా చేయును."

32యేసు గ్రంథము మధ్యలో చెప్పెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును." ఇక్కడ మీకు మరలా మూడు సాక్ష్యములున్నవి. ఆదికాండము, క్రొత్త నిబంధన మరియు ఈనాటి దినము.

"మంచిది, ఆయన ఆ విధముగా భావించలేదు."

ఇక్కడ ఆయన ఉన్నతమైన వేదాంతులతో మాట్లాడుచున్నాడు. ఆ యాజకులు, వారి తాతలు, వారి ముత్తాతలు, వారి తాతలకు తాతలు యాజకులైయుంటారు. దానిలో ఒక్క వాక్యమును తప్పుగా తీర్మానించటం నిశ్చయముగా మరణ శిక్షయైయున్నది. ఒక మాటను వారు తప్పినందుకు రాళ్ళతో కొట్టవలసి యున్నది. కాని వారు తప్పు అనువాదమును కలిగియున్నారు. అందుచేత వాక్యము తానే వచ్చినప్పుడు దేవుడు మెస్సీయాను పంపుతానని, వాగ్దానము చేసినప్పుడు, మరియు ఆయన రావలసినట్లు, వాగ్దానము చేసినట్లుగా ఆయనను ఆ పొత్తి గుడ్డలలో పంపినప్పుడు, ఆయనకు చుట్టడానికి వారికి వేరైన పొత్తి వుండెను.

నన్ను దీనిని చెప్పనివ్వండి: అదే విధముగా ఈ దినమున జరుగుచున్నది. దానిని వారు అందుకోలేక పోవుచున్నారు. అది సంఘ శాఖీయ పొత్తిలో గాని లేక జ్ఞానములో గాని లేదు అది దేవుని శక్తి మరియు ఆయన పునరుత్తానము యొక్క పొత్తిలో మరియు దేవుడు దానిని వాగ్దానము చేసినట్లు క్రీస్తు పునరుత్తానము యొక్క విశధీకరణములో నున్నది, కాని దానిని గూర్చిన ప్రజల తలంపుల పొత్తిలో లేదు.

LUKE 1:38

 

33ఇక్కడ హాగరు, చిన్న రవ్వంత భేదము ద్వారా, అబ్రాహాము ద్వారా, స్త్రీ ద్వారా పనిచేసింది. అబ్రాహాముకు అది చేయటం ఇష్టంలేదు, కాని దేవుడు అబ్రాహామును చెయ్యనిచ్చాడు, ఎందుకనగా ఆయన… బిలామును కూడా అలాగే వెళ్ళనిచ్చాడు. ఇప్పుడు గమనించండి, దానితో కొంచెముగా భేదించుట వలన ఆమె ఇష్మాయేలును కన్నది. అతను క్రూరమైన మనిషి ఎన్నడూ జయించలేనివాడుగా వుండెను. అతడు తన విల్లు చేత జీవించెను. అతను క్రూరుడైయుండెను. ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు.

ఇప్పుడు శారా, కుచ్చు, లేక పుప్పొడి… నిజమై వాగ్దానపు భార్య, సాధువైన మనిషిని కన్నది — దానికి ఫలితముగా ఒక వాగ్దాన దేశమును తెచ్చింది.

ఇప్పుడు, అయితే మరియ, పురుష సంయోగము లేకుండా వాగ్దానము ద్వారా, (అబ్రాహాము దేవుని నుండి వాగ్దానము పొందినట్లుగా) ఆమె వాగ్దానము నమ్మినది. "ఇదిగో ప్రభువు దాసురాలను," ఆమె కాడను కనలేదు కాని అసలైన విత్తనమును కన్నది. ఏలయనగా ఆయన అబ్రాహాము మరియు మరియ నమ్మిన వాక్యమైయున్నాడు.

34ఇప్పుడు మరియ విత్తనము కాదు. ఆమె విత్తనము ద్వారా తొక్క మాత్రమై యున్నది. మిగతా రెండూ జీవమును మోసే సాదనములు, సహజ సంబంధమైన విత్తమును మాత్రమే. మరియు తనకై తాను విత్తనము కాదు కాని దేవుని వాక్యమందలి విశ్వాసము ద్వారా, వాక్యము యొక్క ఉన్నతమైన నిజ ప్రతిబింబమును తెచ్చింది, ఎందుకనగా ఆయన వాక్యమైయున్నాడు… కాని గోధుమ గింజ తొక్క వలె, గోధుమ గింజలో, తొక్క గింజను లోపలనుండి పట్టుకొని, అది పరిపక్వమై దానంతట అదే వెళ్ళేవరకు దానిని కాస్తుంది. తరువాత, విత్తనము దానంతట అదే తొక్కను విడిచిపెడుతుంది. ఆ విధముగానే విత్తనము ఆమె గర్భములో ఉండెను. కాని ఆమె విత్తనము కాదు. ఆమె విత్తనమును ఉత్పత్తి చేయలేదు. దేవుడే విత్తనమై యున్నాడు.

ఇప్పుడు రక్తము… చాలా మంది మనము యూదుని రక్తము ద్వారా రక్షించబడియున్నామని తలుస్తారు. "వేశ్యయైన రాహాబు మోయబీయురాలైన రూతు, వీరు అన్యులే కాబట్టి అన్యుల ద్వారా మనకు హక్కువున్నది అని కొందరు చెబుతారు." వాటిలో అసలు దేనిని నీవు హక్కుగా చెప్పలేవు. ఆయన యూదూడూ కాదు లేక అన్యుడు కాదు.

GEN 1:3,6,14•

JOHN 1:14

 

35దేవుని నుండి బయలు వెళ్ళిన వాక్యమే లోగోస్, ఆయనే దేవుడు. ఆయన భూమిపై సృష్టిని మొదలుపెట్టునప్పుడు సముద్ర జీవము తెచ్చెను. దేవుని ఆత్మ 'లోగోస్' అను వాక్యముతో "కలుగును గాక," అని సెలవిచ్చినప్పుడు, వాక్యమైయున్న లోగోస్ బయలు వెళ్ళెను.

గనుక దీనినంతా కలుగజేయడం ప్రారంభించినది. బైబిలు అంతయు ప్రతియుగమునకు దేవుని వాక్యమంతయు సమస్తమును లోగోస్ లో ఉండెను. మరియు లోగోస్ భూమి మీద శ్వాసించినప్పుడు, సముద్ర సంబంధమైన జీవము, పక్షిజీవము, అలా జంతుజీవము వరకు నిర్మాణం ప్రారంబమైనది. చివరిగా సృష్టిస్తున్న దేవుని పోలికవలె ఆయన ప్రాతినిధ్యంలో ఒకటి కలిగెను. దేవుని యొక్క స్వరూపములోనే మనిషి కలిగెను. విత్తనము పడిపోవలసిని రీతిగా ఆ మనిషి పడిపోయాడు.

మనిషి పడిపోయిన తరువాత దేవుడు దానిమీద పొదగటం ప్రారంభించాడు. ఆ స్వరూపమును తిరిగి సమకూర్చుటకు ప్రయత్నించుచూ ఆయన హానోకును, ఏలియాను, మోషేను, ప్రవక్త తరువాత ప్రవక్తను లేపినాడు. మరియగా అఖరుగా నిజమైన దేవుని స్వరూపము, తానే మరల భూమి మీదకు వచ్చెను, ఆ లోగోస్ శరీరధారిగా మన మధ్య నివసించెను. ఆయనే దేవుడు.

ఇప్పుడు అదే లోగోస్ కు భాగమున్నది. ఆ భాగము వధువు. ఎంత మాత్రము చెడపకూడదని వాక్యమైన అదే లోగోస్ వాక్యమును తిరిగి దానిని పూర్తిగా వెనకకు విశదీకరించి తెచ్చుటకు ఈనాడు సంఘములపై పొదుగుచున్నాడు. దానికి - ప్రవక్తలు ఆ విత్తనమును మోసే సాధనమలై యున్నారు. మరియు సంఘ శాఖలు ఇప్పుడు ఆ విత్తనమును మోసే సాధనములైయున్నారు. ఇప్పుడు త్వరగా గమనించండి - తొక్క విత్తనమును కౌగలించి పట్టుకొని చివరిలో విడచివేసినట్లుగా ఇది జరుగుతుంది.

36యేసు దేవుడైయున్నాడు. ఆయన దేవుడు… ఆయన తండ్రి తనకు తానే గొప్ప లోగోస్ అయి యున్నాడు. మరియు ఆయన మోషే ప్రవక్త కనుక ఆయనలో అంత పోయలేదు. వేదాంతులకు దేవుని వాక్యమును గూర్చిన సరియైన అవగాహన ఉంటుందని బైబిలులో ఎక్కడైనను ఏ సమయములో అయినను చూపలేదు. అది లేఖనములలో లేదు. పరిసయ్యలకును, సద్దూకయ్యలకును సరియైన అవగాహనలేదు. దేవుడు వారిలో నుండి ఒక ప్రవక్తను కూడా లేపలేదు. ఈ కడవరి కాలంలో కూడా ప్రభువు అలాగే చేస్తున్నాడు. వారు దానిని పైకి లేవనెత్తిన వెంటనే, వారంతా కలిసి దాని నుండి ఒక సంస్థను చేస్తారు. అది అక్కడే చచ్చిపోతుంది. కాని దానిని ఒక ఉద్దేశ్యము కొరకు ఆయన చేశాడు. దేవుని సహాయముతో, దానిని మనము వివరించుటకు ప్రయత్నించుదాం.

గమనించండి, "ఆమె" - సంఘము, విత్తనము — ఇప్పుడు ఎంత దగ్గరగా ఉందో ఇక్కడ చూడండి. చూడటానికి అంతా విత్తనము వలెనే కనబడుతుంది.

37మీరు గమనించండి, విత్తనము నేలలోనికి వెళ్ళినప్పుడు, అది అసలైన విత్తనము. అది పైకొచ్చినప్పుడు జీవమును తెస్తుంది. కాని గోధుమ గింజలోని జీవము ఏమి చేస్తుంది. అది అప్పటికప్పుడే అదే గోధుమ గింజను ఉత్పత్తి చేయదు. అది గోధుమ గింజ జీవమైయున్నది, కాని అది మోసే సాధనము దశలో వున్నది. లూథరు చీకటి అవ్యక్త స్థితిలో నుండి బయటకు వచ్చినప్పుడు అదే మొదటి పునరుద్ధరణ, అది చావవలసి యున్నది.

EXOD 3:6,12•

AMOS 3:8

 

38ఎన్నోసార్లు ప్రజలు సానుబూతి చూపిస్తారు. ఓ, ఈ మధ్య నేను ఈ ఆధునాతన వేధాంతులలో కొందరు వచ్చిన "మౌన దేవుడు" అనే పుస్తకాన్ని చదివాను, వారు నిన్ను దేవుని నుండి త్రిప్పివేస్తారు. దేవుని వాక్యము మరియు దేవుని ప్రణాళిక నీకు తెలియనట్లయితే, మీరు సులువుగా తల్లకిందులై పోగలరు. కాని దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశ్యమును మీరు చూసినప్పుడు, అప్పుడు విశ్వాసము ద్వారా అది దేవుడై యున్నాడని తెలుసుకొంటారు. మరియు దేవుడు, ఇతర కాలాలలో ఏమి చేశాడో అదే సరిగ్గా చేస్తూ నడుస్తూ, నిరూపణ చేస్తూ తన్నుతాను ధృవపరచుకొంటాడు.

ఆ కారణం చేతనే మోషే కదిలించబడలేదు. ఆయన దేవునితో మూఖా ముఖిగా మాట్లాడాడు. "వెనుక అబ్రాహాముతో మాట్లాడినది నేనే. ఆ వాగ్దానమును చేసినది నేనే. నేనే నీతో ఉంటాను" అని దేవుడు అతనితో చెప్పెను. ఇప్పుడు ఆ మనిషిని నీవు ఎలా ఆపగలవు? పూర్వపు ప్రవక్త చెప్పినట్లుగా, "సింహము గర్జించగా, భయపడనివాడువడు? మరియూ దేవుడు పలికియుండగా, ప్రవచింపని వాడెవడు?"

ప్రభువు ఈ ఘడియకు చేసిన వాగ్దాన కార్యములు విప్పబడుట మనం చూస్తున్నప్పుడు, అది దేవుని మార్గమని నీవెరిగి అలా నిలబడడం సాధ్యమా? ఆయన ఏమి చెప్పాడో, అది జరుగుతుంది. ఈ మర్మయుక్తమైన విషయాలన్ని చూడండి. అది దేవుని ఏ విధముగా చెప్పాడో అలానే ఖచ్చితంగా అది జరుగుతుంది.

39ఇప్పుడు గమనించండి, 'ఆమె' మోసే సాధనము ఇక్కడ, హాగరు కాడవలె పైకొచ్చింది, తరువాత పిప్పొడి, తరువాత తొక్క మరియు తరువాత విత్తనమొస్తుంది. ఇప్పుడు ఈ మోసే సాధనములను గమనించండి.

ముందు మీరు పరిశీలించాలని కోరుతాను. ఇప్పుడు, కాడ విత్తనమువలె ఎంతమాత్రము కనబడదు, కాని విత్తనములో వున్న జీవము వున్నది. అది లూథర్. ఇప్పుడు ఆ చిన్నకాడకు ఎన్నో రేకులు వుంటాయి. అది లూథర్ నుండి జ్వింగ్లీలోనికి మరియు కాల్విన్ వరకు ఇంకా అనేక ఇతరులలోనికి వెళ్ళిపోయింది.

40గమనించండి, తరువాత అది దానియొక్క స్థితిని మార్చినది. సూర్యుని మరణము, సమాధి మరియు పునరుత్తానములాగా, దేవుని వాక్యమునకు నమూనా ఇచ్చుచున్న ప్రకృతిని ఇప్పుడు గమనించండి.

తరువాత పిప్పొడి వస్తుంది. అది వెస్లీయై యున్నాడు. తద్వారా అనేక చిన్న పిప్పొడులు దానిమీద వ్రేలాడుచున్నవి. గింజమీద నున్న అది ఆకు కంటె అచ్చం విత్తనమువలె నిజముగా కనబడింది. అనేకమంది దానివలె కనపడ్డారు, ఎందుకనగా వెస్లీ దేవుని యొక్క రెండవ వాక్యముతో, తన సంఘమును శుద్దీకరణము ద్వారా పైకి తెచ్చాడు. అది ఆయన వర్తమానము.

మంచిది. కొద్ది సమయము తరువాత అది పడిపోయినది, మరలా అది కాడలోనికి వెళ్లిపోయి తిరిగి జొన్న యొక్క కంకిని పైకి తీసుకోని వచ్చినది. ఆ కంకి రాకముందు అక్కడ తొక్క ఉండెను — తొక్క, క్రప్పుచుండెను — మరియు ఏ గోధుమను పండించువాడైనను, లేక జొన్న పండించువాడైనను, ఒకవేళ అక్కడ మీరు త్రవ్వి మరియు ఆ యొక్క జొన్న కంకిని లేక గోధుమ యొక్క కంకిని తెసినట్లయితే, అప్పుడు మీరు ఆ మొదట వచ్చినది, ఆ చిన్నది, గోధుమ యొక్క విత్తనము అనుకొందురు. అయితే, ఇప్పుడు, అది పెంతకోస్తు యుగము.

ఇప్పుడు నీవు… ప్రకటన గ్రంథములో ఉన్న సంఘకాలములను మనము గమనిస్తే అవి ఉన్న ప్రకారమే తెరువబడుట చూతము. ఈ యుగములన్నియు, అవి వచ్చిన విధము ఏ చరిత్రకారునికైనను తెలియును.

41వెస్లీ నుండి వచ్చిన పిలిగ్రిమ్ హోలీనెస్, నజరేనులు మరియు అనేక పరిశుద్ద సంఘములు లూథరు యొక్క సంస్కరణ కన్నను వాక్యమునకు చాలా దగ్గరగా ఉన్నవి. లూథరు సంస్థగా మారినప్పుడు, ఆ రేకులు అప్పుడే ప్రారంభమైనవి. ఇవి పైకొచ్చినప్పుడు, ఆత్మ లూథరు సంఘమును విడిచిపెట్టెను. అది ఒట్టి సంస్థ మాత్రముగా యుండెను, మరియు నిజమైన విశ్వాసులు శుద్దీకరణములోనికి వెళ్ళిపోయినది.

తరువాత శుద్దీకరణ మీద కదలినప్పుడు, పిలిగ్రీమ్ హోలీనెస్ వారు హోలీనెస్ ఆర్గనైజేషన్లు అన్నీ నజరేనులు ఇంకా అలాంటి వారంతా, అక్కడ నుండి తిన్నగా పెంతికొస్తు యుగమునకు కదిలినారు. ఈ చిన్న గోధుమ గింజ వైపు ఇప్పుడు చూడండి. గోదుమవలె, భూమిలోనికి వెళ్ళిన దానివలె, కాడ చేసినదానికంటె పిప్పొడి చేసినదానికంటే, అది పదిలక్షల సార్లు అసలైన గోధుమవలె కనబడుతుంది.

కాని మీరు కూర్చొని, దానిని భూత అద్దము క్రిందపెట్టి ఆ చిన్న తొక్కలను తెరచినప్పుడు, అవి వట్టి మోసే సాధనములు మాత్రమే. ఇంకా విత్తనము ప్రారంభమై యుండలేదు. అది వెనుకనే వున్న చిన్న మొగ్గ, భూత అద్దముతో సూదిమొన వలె ఉన్న కొనను చూడవచ్చును. అక్కడే విత్తనము వస్తుంది. మరియు నిజమైన దానివలె కనబడుచున్న ఈ తొక్క, అది నిజమైనది కాదు. అది గర్భము మాత్రమే.

42ఇది మరియ గర్భమువలె ఉన్నది.

మరియ విత్తనము కాదు గాని, ఇక్కడ తొక్కకు ప్రాతినిధ్యం వహించుచన్నది. మిగిలినవాటివలె, ఆమె దానికి మోసే సాధనము మాత్రమే. కాని దేవుని ద్వారానే ఈ ఉద్దేశ్యము కొరకు ముందే ఎన్నుకొనబడి పిలువబడినది కాబట్టి, అది మన కాథలిక్ స్నేహితులు తలుస్తున్నట్లు, ఆమె దాని యొక్క తల్లియై యున్నట్లుగా కనపడింది. ఆమె దేవునికి తల్లియు కాదు. దేవుని విత్తనము కాదు.

స్త్రీ గ్రుడ్డును ఉత్పత్తి చేస్తుంది; దేవుడు జీవమును ఉత్పత్తి చేయును. హెమోగ్లోబిన్, రక్తమును పురుషునిలో ఉన్నది. ఒక కోడిపెట్ట గ్రుడ్డును పెడుతుంది, లేక ఒక పక్షి వసంతకాలములో గూడును కట్టి గ్రుడ్డు పెడుతుంది — కాని ఆ ఆడు పక్షి మగపక్షితో ఉండని యెడల, అది పొదగదు, అవి చచ్చినవి. అవి గూడులోనే మురిగిపోతాయి.

నేను తరచు చెప్పినట్లుగా, అదే ఈ దినమున ఉన్న సంఘముల పరిస్థితి. వారు మెథడిస్టు, బాప్టిస్టు, పెంతికొస్తులు మరియు ఆ విధముగా పిలువబడే గూటిలోనే వారు కుళ్ళిపోవుచున్నారు. వారు దేవుని వాక్యముతోనే సంబంధము కలిగియుండక పోయినట్లయితే వారు వారి గూటిలోనే వారి సంస్థలో అక్కడే కుళ్ళిపోతారు.

JOHN 1:14•

ACTS 20:28

 

43ఇప్పుడు వారిలో కొంతమంది అంటారు, ప్రొటెస్టెంటులు కొంతవరకు మరియయే గ్రుడ్డును ఉత్పత్తి చేసినదని నమ్ముతారు. అది అలాగైతే, నిజమైన యెహోవా దేవుడు చేయుచున్నది చూడు. స్పర్శ లేకుండా గ్రుడు ఉత్పత్తి చేయబడదు. కాబట్టి మీరు చూడండి, గ్రుడును మరియు బీజమును రెండింటినీ దేవుడు తయారు చేశాడు. రెంటిని ఆయన మరియ గర్భములో సృజించాడు.

ఆ మనిషి శరీరధారియైన మన మధ్య నివసించిన దేవుడే ఇమ్మానుయేలు. ఒక మంచి మనిషియు, ప్రవక్తయు, బోధకుడు, వేదాంతియే కాక ఆయన సర్వములో సర్వమైయున్నాడు. వీటి అన్నిటిపైన ఆయన తానే దేవుడైయున్నాడు.

మనము దేవుని రక్తము ద్వారా రక్షించబడియున్నాము — దేవుడుడే తనకుతాను, మూడవ వ్యక్తి కాదు, అని బైబిలు సెలవిచ్చుచున్నది. దేవుని ద్వారా, ఆ గొప్ప యెహోవా దేవుడైన ఆ వ్యక్తి మరియను క్రమ్మెను మరియు సృష్టికర్త రక్త కణమును, జీవమును రెండిటిని మరియు గ్రుడ్డును సృజించెను.

ISA 9:6

 

44మీరు ఒక యూదునికి చూపినట్లయితే… మెస్సీయా ఎవరో అతడు తెలుసుకొంటాడు. నలబై సంవత్సరాలుగా గ్రుడ్డితనంలో ఉన్న జాన్ రియాన్ - బెంటన్ హార్బర్లో స్వస్థత పొందినప్పుడు, ఆ రబ్బీ నాతో సంభాషించి దేవుని మూడు ముక్కలుగా చేసి ఒక యూదునికి నీవు ఇవ్వలేవు అన్నాడు.

నేను చెప్పాను, "కొందరు ఆ విధంగా చేస్తారు. అయితే మేము దేవుని మూడు ముక్కలుగా చేయము." మీరు ప్రవక్తలను నమ్ముతారా?

అతడు, "తప్పకుండా, నేను ప్రవక్తలను నమ్ముతాను," అని అన్నాడు.

నేను చెప్పాను, "యెషయా 9:6లో 'మనకు ఒక శిశువు పుట్టెను' అని యెషయా ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు" అని అడిగాను.

అతడు, "ఎందుకు, మెస్సీయాను గూర్చియే" అని అన్నాడు.

నేను చెప్పాను, "మెస్సీయాకును దేవునికి మధ్యగల సంబంధం ఏమిటి?" అది సరిపోయినది. నేను, "ఇప్పుడు…"

అతడు, "అతడు దేవుడే" అన్నాడు.

నేను చెప్పాను, "ఖచ్చితందగా నిజమే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయన పేరు పిలువబడును."

MATT 1:18

 

45ఏకత్వము వారును, త్రిత్వము వారును దానిని పోగొట్టుకొని రోడ్డుకి ఇరువైపులా వెళ్ళిరి, కాని సంతోషకరమైన సాధనము వాటి రెంటి మధ్యలో ఉన్నది. దేవుడే ఆయన సొంత తండ్రి, యేసు తనకుతానే తండ్రి అవలేడు, పరిశుద్దాత్మ ఆయన తండ్రి అని బైబిలు చెబుతుంది. దేవుడు గాక మరియొక తండ్రిని ఆయన కలిగి ఉంటే తండ్రియు పరిశుద్ధాత్మయు వేరు వేరు ఆత్మలైన యెడల ఆయన అక్రమమమైన జన్మము గలవాడుగా అవుతాడు. అది నిజమే.

ఆయన తండ్రి ఎవరు, దేవుడా లేక పరిశుద్దాత్మడా? ఒక్కరే అని మీరు అనిన ఎడల మీరు ఎటువంటి క్లిష్టస్థితిలో ఉన్నారో చూడండి. దేవుడు ఆయన తండ్రియై యున్నాడు. అది నిజమేనా?

ZECH 14:7•

MATT 1:19,20

 

46మత్తయి 1:18, ఆయన చెప్పాడు, "యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లియైన మరియు యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.

ఇప్పుడు, ఆయన తండ్రి ఎవరు? చూడండి. నా భావము ఏమిటి? గమనించండి, "ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమాన పరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్యయైన మరియను చేర్చకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది… ["పరిశుద్ధాత్మ" వలన కలిగినది అని సమాజము చెప్పింది.]

MATT 24:24•

MARK 13:22•

LUKE 1:38•

JOHN 1:14

 

47తండ్రియైన దేవుడు ఆయన తండ్రి అని వేదాంతులు చెప్పినట్లు నేను అనుకుంటాను. ఓ వేందాంతులారా, మీ గ్రహింపు ఎక్కడున్నది?

గమనించండి, "సాయంకాల సమయమున వెలుగు కలుగును."

మరియ నుండి నిజమైన విత్తనము వచ్చింది, కాని అది ఆమె విత్తనము కాదు. అది దేవుని వాగ్దానమైయున్నది. "ఇదిగో ప్రభువు దాసురాలను" అని ఆమె అన్నది. జీవమును మోసే సాధనములు స్త్రీలై యున్నారు. ఇక్కడ, మరియ, విత్తనము చాలా దగ్గరగా నున్నది. హాగరు దానిని వంకర మార్గములో పొందినది. శారాను అనుమానించి లైంగిక కోరిక ద్వారా దానిని మామూలు సహజ సంబంధమైన విత్తనముగా తెచ్చింది. అయితే మరియ, ఏ మాత్రము సంపర్కము లేకుండా వాక్యమును నమ్మినది, మరియు వాక్యము శరీరధారియైనది.

48అయితే గమనించండి, మరియ అతి సమీపముగా ఉండటము వలన ఆమె తన గర్భములో విత్తనమును పట్టుకొనియ్నుది. అది చూడటానికి ఆమె విత్తనమువలె వున్నది. అలాగే పెంతికొస్తు వారున్నారు. నేను ఇంటికి రాబోవుచున్నాను. కాని గుర్తుంచుకోండి, మత్తయి 24:24లో, యేసు ఈ విధముగా అన్నాడు, "అంత్యదినములలో రెండు ఆత్మలు" (ఇప్పుడు ప్రారంభ దినములలో కాదు,) "అంత్యదినములలో, రెండు ఆత్మలు సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపరచుటకై చాలా దగ్గరగా వుంటాయి." పెంతికొస్తు వారి ఆత్మ నిజమైనదానివలె ఖచ్చితముగా వుంది; ఎంతో పరిపూర్ణముగా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచేటట్లుంది. ఇప్పుడు, అవి నా మాటలు కావు, అవి ఆయన చెప్పినవే. ఇప్పుడు కొంచెము సేపు తరువాత నేను మీకు ఏమి చెప్పుటకు ప్రయత్నించుచున్నానో మీరు గ్రహిస్తారు.

ఇప్పుడు ఆ విత్తనము నిశ్చయముగా ఎక్కువ అలాగే కనబడింది. పుప్పొడి కనబడిన దానికంటే, కాడ కనబడిన దానికంటే, ఆ తొక్క విత్తనమువలె ఎక్కువగా కనబడింది. అయితే అవి విత్తనమును మోసే సాధనములు మాత్రమే. లూథరు సంస్థగా మారింది. కాడ చచ్చింది. వెస్లీ సంస్థగా మారింది. పిప్పొడి చచ్చింది. పెంతికొస్తు సంస్థగా మారింది, జీవము చచ్చింది. మరియు ఇప్పుడు విత్తనము ముందుకొస్తుంది, విత్తనము కంటే ఏ మాత్రము నీవు ముందుకు వెళ్ళలేవు.

GEN 16:2

 

49గమనించండి. గత సంవత్సరములలో గొప్ప ఉజ్జీవము వచ్చినప్పుడు అక్కడే దాని వెనుక ఒక సంస్థ వస్తుంది. ఉజ్జీవము కలిగిన మూడు సంవత్సరములలో లేక ఆ ఉజ్జీవము ముగించిన పిమ్మట వారు ఒక సమావేశముగా కూడి ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. వాటిలో నుండి అనేక శాఖలు కలుగును. లూథరులో నుండి అనేక రేకులు బయటికి వచ్చినవి. వెస్లీలో నుండి అనేక పుప్పొడులు వచ్చినవి. మరియు పెంతుకొస్తు అను ఆకులు బయటికి వచ్చినవి. ఏకత్వము, ద్వయము, త్రిత్వము, చతుర్థము, పంచమము. దేవా! కృప చూపుము. చూచారా.

అయితే గమనించండి, యేసుక్రీస్తు ఇరవై సంవత్సరములుగా విశదీకరించిన తరువాత ఒక్క సంస్థ కూడా లేపబడలేదు. ఒక్కటి కూడా లేవదు. అది ప్రతి కడవరి వర్షపు కదలికవలె చనిపోతుంది. మరియూ ప్రతిది కూడా అంతే. ఇది అంత్యకాలము, విత్తనము. అది తొక్కతో వారసురాలు కాదు, అలాగే ఇస్సాకుతో ఇష్మాయేలు వారసుడు కాదు.

ఇక్కడ చూడండి, ఆమె ఎంత దగ్గరగా ఉన్నదో? మోసగించటానికి తగినంత దగ్గరగా వుంది. లూథరు (కాడ), వెస్లీ (కుచ్చు), మరియ (తొక్క లేక గర్భము) లేక పెంతికొస్తు. నేరుగా అక్కడ తొక్క దగ్గరకు వెళ్లి నేనెలా మీకు చూపించగలను.

యుగముల గుండా, అది ఇప్పుడున్నంత దగ్గరగా ఇదివరకెన్నడూ రాలేదు. ప్రతిది "సంఘమే, సంఘమే," చుడండి "ఆమె." గమనించండి, అది "ఆమె," ప్రారంభములో ఆమెయే దేవుని అసలైన వాగ్దానమును అనుమానించినది. ఆయన యొక్క మాటను వెనక్కు తీసుకొన్నది దేవుడు కాదు; ఈ రోజునా ఆయన తన వాక్యమును వెనుకకు తీసుకొనుటలేదు, ఆయన తన అసలైన వాక్యమును రూఢిపరచుచున్నాడు.

"ఒకవేళ, బహుశా, మనము ఎదురు చూస్తున్నాము," అని శారా అన్నది.

MATT 15:14•

LUKE 6:39

 

50ఈ దినమున ప్రజలలో ఉన్న చిక్కు అదే — నీకు తెలియని దానిలోనికి ఎక్కటానికి నీవు ప్రయత్నించుచున్నావు. నీవు ఏమి చేస్తున్నావో నీకు తెలియకుండా ఆ పని నీవు ఎలా చేయగలవు? నీవు గ్రుడ్డివాడిలా కన్నులు మూసుకొని నడుస్తున్నావా? నీవు ఏమి చేస్తున్నావో నీకు తెలియకుండా ఎక్కటానికి ప్రయత్నిస్తున్నావా? నీవు పడిపోతావు. "గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారిచూపితే, వారిద్దరూ గుంటలో పడతారు." యేసు దానిని వ్యాఖ్యానించాడు.

51అయితే ఇప్పుడు మనము విత్తనము కాలములో నిలబడియున్నాము. ఇప్పుడు విత్తనము ఆధారమును (ఏమిటి?) పట్టుకొని వుంటుంది, విత్తనముతో సహకరిస్తుంది, దానిని పట్టుకొని వుంటుంది. పట్టుకొని వుండటానికి అది అక్కడ ఆ పని కోసము ఉంచబడినది. ప్రకృతి ఋతువులలోను దినమును మనము గమనించినట్లైతే, సమస్తమును క్రమము తప్పక పరిపూర్ణముగా దేవునితో సహకరించుచున్నది.

తీక్షణమైన సూర్యుడు విత్తనముపై ప్రకాశించడం ప్రారంభించినప్పుడు, ఆ విత్తనం పగులుతుంది. అయితే ఆ విత్తనము మట్టిలో నుండి మొలకెత్తుటకు భూమి ఒక నిర్ణీతమైన స్థానమును తీసికొని విత్తనము బయటకు వచ్చేటట్లు చేస్తుంది. చీకటి యుగంలో నుండి పైకి వచ్చుటకు ఆ విధంగా రావలసియున్నది.

52కొందరు… ఈ విమర్శకుడు నేను చెప్పిన ప్రకారము "మౌన దేవుడు' అను పుస్తకములో చీకటి యుగములో పేద క్రైస్తవులు హతసాక్షులై చనిపోతుండగా, దేవుడు పరలోకంలో ఏమీ పట్టనట్లు కూర్చోని ఉన్నాడు" అని వ్రాశాడు. వాడు అజ్ఞానియు, ఆత్మీయంగా గ్రుడ్డివాడునైయున్నాడు. వాని కన్నులు తెరవబడితే బాగుంటుంది. విత్తనము మరల మొలకెత్తుటకు, ముందు భూమిలో పాతిపెట్టబడి, చనిపోయి, క్రుళ్ళిపోవలసియున్నదని నీకు తెలియదా?

ప్రారంభ కాథలిక్ సంఘము గుండా, పెంతికొస్తు సంఘము చనిపోయింది. మరియు ఆమె చక్కగా తొక్క రూపములోనికి వచ్చింది. లూథరన్ ద్వారా, వెస్లీ ద్వారా, పెంతికొస్తు యుగము ద్వారా ప్రతి ఒక్కటి ఎలా ఆమె రూపుదిద్దుకొనుచున్నదో మీరు చూడండి? మీకు అర్థమయిందా?

53ఇప్పుడు, ఆయన భూమిపైన ఇదివరకు చేసిన సేవ మాదిరిగానే మరలా ఆ అసలైన సేవ తిన్నగా తిరిగి రావలసియున్నది. అది వధువైయున్నది. వారు ఒకటైయున్నారు. అంత్యదినములలో, ఈ విషయములు ఎలా జరుగునో, ఆయన వాగ్దానము చేసియున్నాడు. మరియు మిగతా అన్ని వాగ్దానముల వలె అవి జరుగుచూ ఉండటం మనము చూస్తాము, మలాకీ 4, లూకా 17:30, ఓ, ఇంకా ఎన్నో లేఖనములు. వాటికి అంతము లేదు!

ఓ, నేను ముగించబోతున్నాను, ఎందుకనగా ఆలస్యమైంది (మీరు వారికి చెప్పండి. వారు దొరికితే… వారినడగండి, తరువాత వచ్చి నాకు చెప్పండి.) ఇప్పుడు ఒక్క నిముషము. దీనిని మీరు తీవ్రంగా అందుకోవాలని నేను కోరతాను. దీనిని మీరు చూడాలని నేను ఎక్కువగా కోరతాను.

చూడండి. యేసు… గమనించండి, వధువును చూడండి…

REV 17:5

 

54గమనించండి, మనము జీవించుచున్న ఈ యుగములో, చూచారా, (పెంతికొస్తు సంస్థ) సరిగా నిజమైన దానివలె కనబడుచున్నది, అదే గర్భము. కాని మీరు ప్రకటన 17 అధ్యాయము, గ్రహించారా, అది రోమన్ కాథలిక్ సంఘమని పిలువబడనది, మొదటి సంస్థ. వేశ్యలకు తల్లి, అది సత్యమని ఎంతమందికి తెలుసు?

దుర్నీతి గల స్త్రీ అంటే ఏమిటి? ఇక్కడ ఆయన ఈ స్త్రీ "సంఘమని" చెప్పాడు. వేశ్య అంటే ఎవరు? తన వివాహ ప్రతిజ్ఞకు అపనమ్మకముగా జీవించు స్త్రీయే అది - వ్యభిచారిణి అంటే ఎవరు? అలాంటిదే, అదే మాట. ఇప్పుడు ఆమె జన్మించ్చినది, ఏ రకమైన జన్మ? వాక్యమునకు కాదు. సంస్థకు జన్మనిచ్చింది. ఇక్కడ మెథడిస్టువారు, బాప్టిస్టు వారు, పెంతికొస్తు వారు ఉన్నారు. మరియు వారందరూ వారి తల్లి యొక్క అలవాట్లను తీసికొన్నారు. కాలిఫోర్నియాలోని ఏ చెడ్డ స్త్రీ అయిన కన్య బాలికకు జన్మనివ్వగలదు, మరియు అందుచేతనే మొదటి వర్తమానము వచ్చింది.

కాని లూథరు యుగమునకు శుద్దీకరణ యొక్క సత్యము పరిచయము చేయబడినప్పుడు, వారు దానిని తీసికొనలేకపోయారు. తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుమతించబడి మెతడిస్టులకు పరిచయము చేయబడినప్పుడు, వారు దానిని తీసికొనలేకపోయారు. మరియు ఇప్పుడు విత్తనకాలము పెంతికొస్తును ఉత్పత్తి చేసినప్పుడు, ఆమె దానిని తీసుకోనలేక పోయింది. అయితే ఆమె విత్తనమును మోసే సాధనమైయున్నది. [ఒక సోదరుడు అన్యభాషలో మాట్లాడుచున్నాడు.] ఆమేన్.

ఇప్పుడు, సామాన్యతలో చెప్పబడిన వాక్యమును బట్టి, ప్రభువుకు స్తోత్రములు చెప్పండి.

55చూడండి, ఇది చాలా సులువైనది. దీనిలో ఉన్నట్లవలె, గోదుమ గింజ పెరుగుటకు కనిపెట్టుచున్నట్లువలె, దీనికి గొప్ప వేదాంత సంబంధమైన అనువాదము నీకు ఉండవలసిన పనిలేదు. కేవలము దానిని గమనించండి. అన్నివేళలా ఆయన నీ చుట్టూ ఉన్నాడు, చూచారా.

నేను ఆపవలసియున్నది. చిన్నగా లాగటం నేను గమనించాను, మరియు నేను అది చేయమని అతనికి చెప్పాను. మనము ముగించవలసియున్నది. ఇప్పుడు సోదరుడా, ఈ చిన్న విషయాన్ని ఎత్తి చెపుతాను, తరువాత నేను వెళ్ళిపోతాను.

ఇప్పుడు చూడండి, తొక్క, కాడ, ఇంకా అవన్నీ వాక్యమును మోసే సాధనములు మాత్రమే. వారు దిగిపోయే వరకు వారికి వాక్యము యొక్క భాగమున్నది, చూచారా, నీతికరణము, శుద్దీకరణము పెంతుకొస్తవారితో కృపావరములు సమకూర్చబడటం. కాని ఇప్పుడు గమనింంచండి, ఇష్మాయేలు, ఇస్సాకు, చూచారా, తర్వాత యేసు. చూడండి, ఒకడు వంకరైనవాడు, ఒకడు నిజమైనవాడు, మరియు ఇప్పుడు విత్తనము తనంతట తానే వచ్చెను, చూచారా.

ఇప్పుడు సంఘము కూడ దానినుండే రావలసియున్నది, ఒక పుష్పము వలె, లేక మరేదైనా. అది త్రాగును, లోనికి లాగుకొని మరియు ఆలాగు…

56లూథరన్ వారు తప్పిపోయారని దాని అర్ధము కాదు. శుద్దీకరణను తృణీకరించిన లూథరన్ వారు, అది పట్టుకొవాలని కోరి…

ఎదో, మీరు చూచారా… ఇశ్రాయేలీయులు ప్రతి రాత్రి క్రొత్త మన్నా తినేవారు, చూచారా. గమనించండి. అయితే ఇప్పుడు అంత్యకాలమున ఇక్కడ ఈ తొక్క వైపు చూడండి. గోధుమలో, ఇప్పుడు గమనించండి, జీవము యొక్క పూర్తి మర్మము ఆ తొక్కలోపల ముద్రించబడి యున్నది. దానిని మనము లూథరులో పైకి రావటం చూశాము; కుచ్చులో దానిని బయటకు రావటం మనము చూశాము; దానిని మనము కాడలో చూశాము, మనము ఇక్కడకు వచ్చాము, మరియు ఇప్పుడు అది తొక్క రూపములో - దాదాపు మొత్తము పెంతికొస్తు యుగమువలె ఉన్నది. అయితే నిజమైన మర్మము లోపల దాగియున్నది.

REV 5:1•

REV 6:1-4

 

57ఇప్పుడు గుర్తుంచుకోండి, ప్రకటన ప్రకారము, పుస్తకము యొక్క మొత్తము మర్మము ఏడు ముద్రలతో ముద్రించబడియున్నది. సంస్కర్తలు దానిని ముందుకు తేవటానికి వారికి అవకాశము లేదు. సంస్కరించటము యొక్క నాలుగు దశలు, నాలుగు దశల యొక్క నాలుగు జీవులు లోకము యొక్క నాలుగు శక్తులను ఎదుర్కొనుటకు వెళ్ళినవి.

మొదటిగా బయలు వెళ్ళినదేది? ఒక సింహము, రోమా యుగమును ఎదుర్కొనుటకు, అది నిజమైన వాక్యమైయున్నది. ఆయన యూదా గోత్రపు సింహము. క్రీస్తు తానే ఆ యుగమును ఎదుర్కొనుటకు వెళ్ళెను.

తరువాత ఎదుర్కొనుటకు వెళ్ళిన జీవి ఏమిటి? గుర్రము మీద సవారిచేయు వానిని ఎదుర్కొనుటకు బయలు వెళ్ళిన తరువాత జీవి… ఎవరిది? చూడండి, ఆ మొదటి గుర్రపు సవారిచేయువాడు, తెల్లని వస్త్రములు ధరించి తలమీద కిరీటము పెట్టుకొనియున్నాడు, తరువాత అలాగే, బాణములు లేకుండా విల్లు పట్టుకొనియున్నాడు.

ZECH 14:7•

REV 4:7•

REV 4:7•

REV 6:5,6

 

58బయలు వెళ్ళిన రెండవ గుర్రమును గమనించండి, అతనిని ఎదుర్కొనుటకు వెళ్ళిన జీవి ఒక దూడ. దూడ బలి ఆర్పించే జంతువు. అలాగే ఒకటి యుగములో వారు హతసాక్షులైపోయారు.

తరువాత గుర్రమును ఎదుర్కొనుటకు వెళ్ళిన మూడవ జీవి, మృత్యువు మరియు పాతాళ గుర్రమునకు ముందు, బయలు వెళ్ళిన తరువాత గుర్రము, ఆ దినమున గుర్రపు సవారిచేయు వానిని ఎదుర్కొనుటకు బయలు వెళ్ళిన మూడవ జీవి, మనుష్య ముఖము వంటిది. ఎంత మందికి అది తెలుసు? వివేకము గల యుగము, సంస్కర్తలు: లూథర్, వెస్లీ, కాల్విన్, నాక్స్, ఫిన్నీ, మూడీ, చూచారా.

కాని తరువాత గమనించండి, అస్తమయకాలమున బయలు వెళ్ళినదేమిటి? పక్షిరాజు, ప్రవచనాత్మకమైనది మరలా తిరగి వస్తుంది. "పక్షిరాజు కాలములో వెలుగు కలుగును. ఓ జీవము గల దేవుని సంఘమా! మహిమకు దారి మీరు తప్పక కనుగొంటారు."

2COR 6:17

 

59ఒక ఉదయమున ఇక్కడకు వచ్చి కూర్చొని, దినమంతా వుండి, మీతో సహవాసము చేసి ఈ విషయములన్నియూ పంచుకోవాలని ఉంది. వినండి, మీరంటే నాకు ఇష్టము. లేదనుకుంటున్నారా? నా సోదరులారా, నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నేను ప్రతి సంస్థకు వెళ్ళి వారితో సహకరించి… మరియు మీ ప్రతి ఒక్కరితో నమ్మవలెనని కోరతాను. అయితే మీరు చూడండి, అది అసలు కుదరదు.

నాకు ఒక తలుపు అయినను తెరువబడలేదు. ఇప్పుడే నేను సంస్థ కారణంగా ఒక దేశములోనికి చాటుగా వెళ్ళుచున్నాను, ఎందువలననగా దేవుడు ఉద్దేశించిన సేవను వారు రాన్వివరు. నేను వారికి ఉత్తరము తిరిగి వ్రాశాను, "పది సంవత్సరాలుగా నేను మీలోనికి రావాలని ప్రయత్నించాను అని నేను అన్నాను. మీరు, మీ పిచ్చి బాప్తిస్మము!" వారిలో ఒకరు, మీరు మూడు సార్లు బాప్తిస్మమివ్వాలి: ఒకసారి తండ్రి కొరకు, ఒకసారి కుమారుని ఒకరకు, ఒకసారి పరిశుద్దాత్మ కొరకు, ముఖము ముందుకు ముంచాలి, అని నమ్ముతారు. మరోక వ్యక్తి చెప్పాడు. "లేదు, మీరు మూడు సార్లు వెనుకకు బాప్తిస్మమివ్వాలి; ఒకసారి కుమారునికి, ఒకసారి తండ్రికి, మరియు పరిశుద్దాత్మకు."

వారిద్దరిది తప్పే. ఒకరు చెప్పారు, "ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిన మీరు, ఆయన చనిపోయినప్పుడు ఆయన ముందుకు పడిపోయాడు. మనము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి."

మరొక వ్యక్తి చెప్పాడు, "ముఖము మీద ఏ మనిషిని ఎవరూ పాతిపెడతారు? మీరు వెనుకకు అతనిని సమాధి చేస్తారు."

అట్టి బుద్ధిహీనత ప్రజలను వేరు చేస్తున్నది. అది దాని అసూయను చూపుతుంది. అది దేవుని వద్ద నుండి వచ్చినది కాదు. అది సైతాను సంబంధమైనది! రెండు ప్రక్కల మధ్యలో, దేవుడు ఏ ప్రక్కనూ లేడు. కాని ఆయన రెండు ప్రక్కల నుండి పిలుస్తున్నాడు. "మీరు వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి," దేవుడు చెప్పాడు, "మరియు నేను మిమ్మును నాయొద్దకు చేర్చుకుంటాను." దేవుడు మిమ్మును దీవించును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...