ఒక వధువును ఎంచుకొనుట
1రోగులైన ప్రజలు విశేషముగా ఉన్నారు, మరియు వారందరినీ ఒకేసారి నేను కలవలేను. ఈ రాత్రి మరలా ఈ సుందరమైన ఆడిటోరియం (వినువారు కూర్చుండు స్థలము) భవనమందు మరియు ఆశ్చర్యకరమైన ఈ ప్రజల మధ్య ఉండుటకు నేను వాస్తవముగా సంతోషించుచున్నాను. మరియు కొంత సేపటి క్రితము మేము బయట నుండి లోనికి ప్రవేశించుచుండగా, బయట వీధిలో నిలబడియున్న ప్రజలు వారు లోనికి రాలేకున్నారని చెప్పారు. మరియు నేను "మంచిది, బహుశా నేను మీకు కొంత స్థలము పొందగలను" అని చెప్పియుంటిని, మరియు వారు క్రింది భాగమునకు దిగలేక పోయారు. అందుచేత, మీ కొరకు కావలసిన స్థలము లేనందున నేను చింతించుచున్నాను. ఆ ఆడిటోరియం యొక్క క్రింది భాగము కూడా నిండియున్నదని వారు చెప్పారు, మరియు అందుచేత, దాని నిమిత్తము మేము చింతించుచున్నాము. అయితే మేము ఇక్కడ ఉండుటకు సంతోషముగా ఉన్నది మరియు దేశము యొక్క అనేక భాగముల నుండి వచ్చిన ఈ మంచి సేవకుల బృందమును, మరియు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను, మరియు అందరి ప్రతినిధులను చూచుటకు ఆనందించుచున్నాము.
2ఈ ఉదయ కాలమున, అలాంటి మంచి ప్రజల ముందు ప్రాతఃకాల భోజన సమయమున మాట్లాడుట నిజముగా యోగ్యమైన మంచి అవకాశము నేను పొందితిని. మరియు నేను "గోధుమ గింజ పొట్టుతో వారసురాలు కాదు" అను అంశము మీద మాట్లాడుచుంటిని. నేను దానిని ముగించలేదు, మరియు అది సహోదరుని తప్పిదము కాదు. మరి కొంత కాలము గడుపుటకు అతడు కార్యనిర్వాహకులతో ప్రయత్నించెను, కాని అతడు దానిని చేయలేక పోయెను. నేను ఖచ్చితముగా ఆ సహోదరుడు డెమోస్ని అభినందించినాను. అది చాలా చాలా బాగుగా ఉండినది. మీ దయగల స్వభావమునకు ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితముగా వందనములు తెలియజేయుచున్నాను. అయితే దానిని మేము ముగించుటకు వారు అవకాశము ఇవ్వలేదు, కనుక దానిని అంత వరకే ముగించితిమి. నేను దానిని ఎప్పుడైనా తీసుకొనెదను, — "గోధుమ గింజ పొట్టుతో వారసురాలు కాదు." అక్కడ ఉండిన మీరు దానిని అర్థము చేసికొంటిరా? అర్థము చేసికొనుటకు కావలసినంత అక్కడ ఉండినది అని నేను ఆశించుచున్నాను.
3దానిని ముగించుటకు మరొక సమయమును నేను ఇప్పుడు, ఈ రాత్రి ప్రశ్నల జాబితా కూడ ఉన్నదని నేను ఎరుగుదును. గనుక మిమ్మును ఎక్కువ సమయము ఇక్కడ ఉంచిన మీరు దానిని చూచుటకు తప్పిపోదురు, ఏలయనగా, పెంతెకోస్తు విశ్వాసము గల ప్రజలకు ఒకనాడు మనము చూచిన ప్రశ్నోత్తరముల జాబితా వాస్తవముగా అది వారికొక ధననిధియై యుండెనని నేను తలంచుచున్నాను. అటువంటి చక్కని మానవ బృందమును, తిన్నగా యివ్వబడిన జవాబులు - నన్ను అవి చూచుటకు వాస్తవముగా యోగ్యమైనట్టుగా సృజింప జేసినవి. ప్రభువు ఈ రాత్రి దానిని ఆశీర్వదించునని నేను నమ్ముచున్నాను. మరియు ఎవరైనను దానిని చూచిన యెడల, వారు నమ్ముదురు గాక. అది నా యొక్క మనఃపూర్వకమైన ప్రార్థనయై యున్నది.
4మరియు ఈ కూటములలో అనేకులు స్వస్థత పొందుచుండినట్టుగా తపాలా ద్వారా మరియు పిలుపుల ద్వారా (ఫోనుల ద్వారా) అనేక సమాచారములు ఈ రోజు సమాచారములు వచ్చుచున్నవి. దాని విషయములో నేను చాలా సంతోషించుచున్నాను. వ్యాధిగ్రస్తులైన ప్రజలను చూచుట, అది ఒక రకమైన సేవ. నేను ప్రసంగించుటకు ఇక్కడ ఉన్నాను. మీకు తెలియును, నేను ఒక ప్రసంగీకుడను కాను, అయితే నేను… ఈ నా కెంటకీ వ్యాకరణముతో, నేను ఈనాటి ఆధునిక ప్రసంగీకుడివలె చెప్పలేను. ఆ స్థానమును నేను పొందలేను ఎందుకనగా నాకు లేదు. అయితే ఏ విధముగా నేను నేర్చుకొంటినో, ఆయన నాకు ఏ విధముగా ఉండెనో, నాకు దాని గురించి ఏమి తెలియునో దానిని వేరొకరికి వ్యక్తపరచుట నాకు ఇష్టము. ఆయన నా సమస్త జీవమైయున్నాడు. నేను ఏదైనా అపేక్షించిన యెడల దానంతటి కంటెను మరియు నేను ఏదైనా అధికముగా ఆలోచించిన నేను చిన్న బాలునిగా ఉండినప్పటి నుండి ఎప్పుడైనా ఒక్క స్నేహితుని కలిగియుండుట కూడా బహు అరుదు. అయితే ఇప్పుడు నాకున్న గొప్ప స్నేహితులకు నేను ఖచ్చితముగా కృతజ్ఞుడనై యున్నాను. నన్ను మన్నించండి. నేను ఇక్కడ వేరే ప్రక్కకు తప్పాను [జనులను గుర్చిన సంబోధి౦చు వ్యవస్థ].
5ఇప్పుడు, కొంత లేఖన భాగమును చదువుకొని, మనము నేరుగా ఆరాధన కార్యక్రమములో ప్రవేశించెదము. నేను ఎప్పుడూ బైబిలును చదువుటకు ఇష్టపడుదును, ఎందుకనగా అది దేవుని వాక్యమైయున్నది. నేను దానిని నమ్ముచున్నాను, మరియు అది దేవుని తప్పిపోని వాక్యమని నేను దానిని నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు, కొంతసేపు చూచుటకు, నా యొద్ద ఇక్కడ కాగితములలో కొన్నిలేఖనములు ఉన్నవి, ఒక నలుబది-ఐదు నిమిషములు అది ఉండ వచ్చును, మరియు తరువాత ఈ రాత్రి అద్భుతమైన ఆ ప్రశ్నోత్తరముల జాబితాను సకాలములో మరలా దానిని చూచుటకు మనము బయటకు వెళ్లగలము. మరియు దాని ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించుట కొనసాగించునని నేను నమ్ముచున్నాను. మరియు, మీరు ఏమి చేయవలెనో నాకు తెలియును, మరియు నేను ట్యూసాన్కు ఈ రాత్రి ప్రయాణము చేయవలసి యున్నది. చూశారా? కాబట్టి మీరు ఊహించగలరు. అది పది గంటల ప్రయాణము. మరియు నేను విదేశములకు వెళ్లుచున్నాను. మరియు ఉదయకాలము నేను ఒక కుంభ కామిళ్ల జ్వరము పరీక్ష కొరకు ప్రభుత్వము దగ్గరకు వెళ్లవలసియున్నది. అందుచేత నేను అక్కడకు వెళ్లవలెను. నేను దానిని మరొక దినమునకు ముందుకు మార్చవలసియున్నది, మరియు వారు "లేదు" అను జవాబును ఇప్పుడు మరలా అంగీకరించరు. మరియు ధనుర్వాతమునకు, జన్నితో కూడిన విషజ్వరమునకును నేనును నాతో వచ్చువారును ఇంజక్షను తీసుకొన వలసియున్నది.
6కాబట్టి ఈ అవకాశము కొరకు నేను ఎంతో వందనస్తుడను, మరియు ఒడంబడిక సమావేశమునకు ముందు జరిగిన ఈ మంచి కూటము నా హృదయమును ఆనందింపజేసినది. మీరు ఒక మంచి ప్రజా సమూహము, దేవుడు మిమ్మును దీవించునని నేను నమ్ముచున్నాను. మరియు ఎప్పడైనా ఆ గొప్ప ఘడియ సంభవించెననిన… కొన్ని దినములకు క్రితము అలాస్కాలో దూరముగా కనబడుచున్న సారాంశం మిళితమైన ద్రవము వంటి భయంకర నాశనము కలుగ జేయునది స్వయముగా ప్రవేశించినది, దాని వాలము వాషింగ్టన్ పరిసర ప్రాంతములలో చుట్టుముట్టినట్లుగా ఈ ఉదయ కాలము చేసినది. ఈ గొప్ప మార్గమున అడ్డు లేకుండా ఏ సునాయాసముగా అతడు జరిగించగలడు.
మరియు పరిశుద్ధాత్మ ఎప్పుడైన నాకు చెప్పిన యెడల ఖచ్చితముగా . "బ్రన్హాం సహోదరుడా, అది అక్కడ సంభవించునా?" అని మీలో కొందరు అడుగబోవుచున్నారు. లేదు, దానిని నేను ఎరుగను. నాకు తెలియ జేయబడు వరకు, దానిని నేను ఎరుగను. అది సత్యము. ఎల్లప్పుడు నేను మీ యెడల నిజాయితీ గలవాడనుగా ఉండగోరుచున్నాను. ఏదైనను లేదా మరేదైనా అభిప్రాయము తీసుకొని, ఊహించుకొనినదానిని తెలియజేయు వాడను కాను. దేనిని నేను నమ్ముదునో లేదా ఆ విధముగా నేను విశ్వసించు వాటిని నేను మీకు చెప్పినప్పుడు, అవి సంభవింపబోవుచుండును. మంచిది, మొదట ఆయన నాకు తెలియజేయవలెను, అటు పిమ్మట మీకు నేను తెలియ జేసెదను. ప్రపంచమంతా కంపించబడు స్థితిలో ఉన్నదని నేను ఎరుగుదును. మనము కడవరికాలములో ఉంటున్నాము. అయితే, ఒక విషయము, నేను ఆ రీతిగా ఉండుటకు ప్రయత్నించుచుంటిని…
7సహోదరుడు షెకారియన్ ప్రజలు ప్రార్థనా వరుసలో నిలువబడినవారిని దాటి ప్రార్థనా కార్డులను ఎట్లు పొందుకొన్నది ఈ ఉదయ కాలమున చెప్పుచుండెను మరియు వారు వాటిపై ఏమి వ్రాసియుండిరో నేను చెప్పుచుండిన దానిని ఆలాగున్నదేమో చూచుచుండెను. ఆ ప్రార్థనా కార్డుల మీద నానా విధములైనవి వారు వ్రాసియుండిరి, నేను చెప్పినట్టుగా అవి సరిగా ఉన్నవేమో చూచుటకు వెళ్లి యుండెనని మీరు ఎరుగుదురు. అతడు సరి చూచిన వందలాది కార్డులలో ఒక్కటి అయిననూ తప్పుగా లేదు అని అతడు చెప్పెను. ఎన్నడూ అక్కడ ఒక్క తప్పు లేదు, చూశారా, ఎందుకనగా అది దేవునిదై యున్నది. ఎప్పుడైన నన్ను నేను అందులో ప్రదర్శించుకొనిన యెడల అప్పుడు సరిగా అక్కడనే తప్పుతో ప్రారంభించబడును.
ఇక్కడ కూర్చుండి నేను చెప్పినది వినుచున్న ఒక తండ్రి యొక్క చిన్న బాలిక నా దగ్గరకు కొంతసేపు క్రితమే వచ్చినది. ఆమెకు ఒక కల వచ్చినది. ఆమె "సహో, బ్రెన్హాం, ఈ కల భావము ఏమిటి?" అని అడిగినది.
అందుకు నేను "సహోదరీ, నాకు తెలియదు. ప్రభువు నాకు చెప్పునేమో నేను కనుగొనెదను" అని చెప్పితిని. కనుక నేను వెళ్లి ప్రభువును అడుగుటకు ప్రయత్నించినాను. అయితే నాకు ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆ చిన్న బాలిక మరలా వచ్చి
"మంచిది ఇప్పుడు, నా కల యొక్క భావము ఏది?" అని అడిగినది.
అందుకు నేను "ప్రియమైనదానా, ఇక్కడకు రా, వచ్చి కూర్చొనుము" అని చెప్పాను. "నీ తల్లి మరియు తండ్రి నాకు మంచి స్నేహితులు, చూడండి. మరియు వారు కెనడా నుండి వచ్చినారు, ఒంటరిగా, మరియు నాతో విదేశీవాసము చేసియుండిరి. నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నది వారు నమ్ముచున్నారు, మరియు నేను ఇష్టపూర్వకముగా ఎవరికినీ ఏ తప్పిదమైన దానిని నా జీవితములో చెప్పలేదు. నేను కలకు భావము తెలియును అని తలంచుచున్నాను, అయితే నాకు నేనుగా ఆ కలను చూచువరకు, అటు తరువాత ఆయన దాని భావము చెప్పువరకు, నేను నీకు చెప్పలేను. చూడండి, నేను ఏదో ఒకటి కల్పించినయెడల, నీవు చావుబ్రతుకుల మధ్యగల సమయమందు నా సహాయము పొందగోరే సమయము రావచ్చును, మరియు "అప్పుడు నీవు నన్ను నమ్మవలెనో లేదో నీకు తెలియదు" అని నేను చెప్పితిని.
8ప్రభువు నామమున నేను నీకు ఏదైనా చెప్పినయెడల, ఆ చెప్పబడినది నాకు, అది సత్యమై యున్నది.
మరియు ఇప్పటి వరకు, ఈ సంవత్సరములందంతట ప్రపంచమంతటను, ప్రపంచము యొక్క చుట్టుప్రక్కలను ఒక్క సమయమందైనా ఆ విధముగా చెప్పబడినది తప్పి పోలేదు. ఏలయనగా… ఇప్పుడు, మానవుడు తప్పిపోనివాడు కాడు అని మీరు ఎరుగుదురు. దానిని (తప్పకుండ ఉండాలంటే) దేవుని ఆత్మయే చేయును.
మరియు ఇప్పుడు, నేను బాధ్యత గలిగిన ఒక సందేశము నా దగ్గర ఉన్నది. అనేక మారులు ప్రజలలో నన్ను గూర్చి — మంచిది, ఎవరైనా ఒకరు ఒక నిమిషము కూర్చుని ఆలోచించని కొందరు — నేను ఒక భయంకర వ్యక్తిననియు; నేను ప్రజలను ఇష్టపడుట లేదనియు మరియు ఎల్లప్పుడు నేను వారిని ఖండించుదుననియు ఆలోచన కలిగియున్నారు. ఆ విధముగా కాదు. ఆలాగు కాదు. ప్రజలను నేను ప్రేమించుచున్నాను.
ప్రేమ సరిదిద్దును అని మీరు ఎరుగుదురు.
9మీ యొక్క చిన్న బాలుడు వీధిలో కూర్చుండి వెలుపట నుండగా, "ప్రియమైన చిన్నారి, నీవు అచ్చట ఉండుట నాకు ఇష్టము లేదని" నీవు చెప్పితివి, కాని…" మరియు కారులు ఝూంకారము చేయుచు వాని ప్రక్కనే వెళ్లుచున్నవి. నీవు వానిని లోపలకు తీసుకొని వచ్చితివి, మరల అతడు వెలుపలకు పరుగెత్తును. ఎందుకు, నీవు వానికి బుద్ధి చెప్పవలెను. నీవు వానిని ప్రేమించిన యెడల నీవు చేయుదువు. నీవు చేయాలి…
ఒక మనుష్యుడు ఒక చిన్న నావలో నదియందు కొట్టుకొని పోవుచు జలపాతము వైపు వెళ్లుచుండగా, ఆ నావ ఆ జలపాతముకు తగిలినప్పుడు మునిగి పోనున్నదని నీవు ఎరిగినప్పుడు, "జాన్, నీవు, కొంత సమయము ఆలోచించుము దానిని నీవు తప్పించుకొనలేవు" అని నీవు చెప్పియందువా, అతడు ఆ ప్రమాదము నుండి తప్పించుకొను స్థితిలో లేకుండుట నేను ఎరిగిన యెడల, ఆనావ నుండి అతనిని సాధ్యమైనంత వరకు చివుక్కున బయటకు లాగి వేయుదును, నేను చేయగలిగిన యెడల, ఎందుకనగా ప్రేమ ఆ విధముగా చేయును.
10ఇప్పుడు, మాట్లాడు ఈ వర్తమానములయందు ఏదైన సిద్దాంతమును లేదా ఇతరమైనవి తెచ్చుటకు నేను ఎన్నడును ప్రయత్నించను. నేను దానిని నా స్వంత సంఘమందు చేయుదును. అయితే, వేర్వేరు స్థాపన సంఘముల నుండి మరియు వేర్వేరు అభిప్రాయములు కలిగిన స్త్రీ , పురుషుల మధ్య మృదువుగా దానిని తీసుకొని వివరించుటకు నేను ప్రయత్నించుదును, కాని మీరు దేవుని ఆత్మ వలన జన్మించబడిన యెడల ఆ స్థితికి తగినంత వరకు, నా యొక్క భావమేమిటో మీరు గ్రహించియుందురని నేను నమ్ముచున్నాను, క్రైస్తవ మనుష్యుల మధ్య — అనగా మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియనులు, మరియు ఇంకేంటి.
GEN 24:12-14
11ఇప్పుడు ఈ రాత్రి ఆదికాండము 24వ అధ్యాయునకు మరలుదము, 12వ వచనము నుండి ఆ 24వ అధ్యాయము నందలి దానితో నేను చదువుటకు మొదలు పెట్టెదను.
నా యజమానుడగు అబ్రాహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము.
చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.
కాబట్టి నేను త్రాగునట్టు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా - నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక; అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.
REV 21:9
12అటు పిమ్మట ప్రకటన గ్రంథములో… ఆదికాండము బైబిలులో మొదటి పుస్తకమునకు చదివిన ఈ భాగము అన్వయించుచున్నది. ఇప్పుడ బైబిలులోని కడవరి పుస్తకమగు ప్రకటన గ్రంథము నందలి 21వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుటకు అపేక్షించుచున్నాను. ఆదికాండము యొక్క లేఖనము మనము ఎరుగుదుము ఇక్కడ… మీరు చదున గోరిన యెడల సంపూర్ణముగా ఆ అధ్యాయమును చదువుము. ఎలియాజరును దేవుడే పంపినది లేదా అబ్రాహాము ఎలియాజరును ఇస్సాకునకు (నన్ను క్షమించండి) వధువును ఎంచుకొనుటకు పంపుచుండెను. అబ్రాహాము యొక్కసేవకుడైన ఎలియాజరు చేసిన ప్రార్థనకు సరిగా చక్కని సుందరమైన రిబ్కా బయటకు వచ్చినది.
ఇప్పుడు ప్రకటన 21వ అధ్యాయములోని 9వ వచనము:
అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి - ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పెను.
13ఇప్పుడు దాని నిమిత్తముగా నా విషయమునకు అంశముగా ఈ రాత్రి "ఒక వధువును ఎంచుకొనుట" అనునదిగా తీసుకొనుచున్నాను. రికార్డు చేయుచున్న నా సహోదరుడు ఇక్కడ ఉండిన యెడల, అది టేపు గనుక నీవు ముందుకు సాగుము మరియు దానిని బయటకు పోనిమ్ము, ఇప్పుడు ఇందులో మాట్లాడుట ఇక్కడ హాజరైన సమూహమునకని వాస్తవముగా నా ఉద్దేశ్యము కాదు, కాని టేపులు ప్రపంచము యొక్క నలుదిక్కులకు వెళ్లును. అవి (విస్తారమైన) అధిక భాషలలో అనుభవముతో అనువాదము చేయబడి ఈ టేపులు ప్రపంచ నలుదిక్కులనున్న అన్యజనుల ప్రదేశములకు వెళ్ళును. ఆఫ్రికా అడవులలోకి, ఇండియాకు, ప్రపంచము యొక్క నలుదిక్కులకు అవి అనువాదము చేయబడి, సంఘము యొక్క ఐక్యతతో మేము ఉచితముగా ఈ టేపులను పంపుదుము.
ఇప్పుడు (అంశము) ఒక వధువును ఎంచుకొనుట…
14జీవితము యొక్క మార్గమే ఒక కోరుకొను అవకాశముపై వున్నది. మన ఇష్టమైన మార్గమును అవలంబించుట మన హక్కుగా ఉన్నది, మనము జీవించుటకు గల కోరిక అది మన స్వంత ఎంపికయై ఉన్నది. విద్యాభ్యాసము నీ ఇష్టముపై ఉన్నది. విద్యాభ్యాసము చేయుటయా లేక చేయక పోవుటయా అనునది మనము ఎంచుకొందుము. మనము దేనిని కలిగియున్నామో దానిని మనము మన ఇష్టానుసారముగా ఎంచుకొన్నదై యున్నది. మంచి చెడ్డలు మనము ఎంచుకొన్నవై యున్నవి. ప్రతి మనుష్యుడు లేక ప్రతి స్త్రీయు, బాలుడు లేక బాలిక గాని వారు మంచిగా జీవించుటకు ప్రయత్నించుటయా లేక మంచిగా జీవించక పోవుటయా అనునది వారి ఇష్టానుసారమైనది. ఎంచుకొనుట ఒక గొప్ప విషయము.
మీ నిత్య గమ్యస్థానము ఒక ఎంపికయై యున్నది, ఈ రాత్రి ఈ ఆరాధన ముగింపునకు ముందు మీ నిత్య గమ్య స్థానము ఎక్కడ గడుప ఉద్దేశించుచున్నారో తీర్మానము చేసికొనుటకు మీలో కొందరికి ఈ రాత్రి ఆ తరుణము కలిగి యుండవచ్చును. అది ఒకే సమయమై యుండును — అనేక మారులు నీవు దేవుని నిరాకరించి యుండిన యెడల — ఇది కడవరిగా నీవు ఆయనను త్రోసిపుచ్చు సమయము కావచ్చును. కృపకును న్యాయ తీర్పునకు మధ్య ఒక గీత గల సరిహద్దు ఉన్నది, మరియు అది ప్రమాదకరమైన విషయము. ఒక పురుషునికి లేక ఒక స్త్రీకి, బాలునికి లేక బాలికకు ఆ సరిహద్దు మరణకరమైన గీతను దాటినయెడల తీర్మానము చేసికొనుటకు ఇదే సమయమై యుండవచ్చును. ఎందుకనగా ఒకసారి ఆ గీతను దాటుటకు అడుగిడినయెడల తిరిగి రావడము అనేది లేదు.
15మన జీవితములో మరొక ఎంచుకొనుట మనకు కలదు, అదేమనగా జీవితము యొక్క సహచారి. ఒక యవ్వన పురుషుడు లేదా ఒక యవ్వన స్త్రీ తమ జీవితమును తీర్మానము కలిగి బయటకు వచ్చుటకు. వారిని ఎంచుకొనుటకు హక్కు ఇవ్వబడియున్నది. ఒక యవ్వనస్తుడు ఎంచుకొనుచున్నప్పుడు, అయితే ఆ యవ్వన స్త్రీ అంగీకరించుటయా లేక దానిని నిరాకరించుటయా అను హక్కును కలిగియున్నది, అయితే అది ఇరు ప్రక్కల వారు ఇంకను ఎంచుకొనుట (సమ్మతి) పై ఆధారపడి యున్నది; ఆ ఇరువురు స్త్రీ, పురుషులు ఎంచుకొను హక్కును కలిగి యున్నారు.
ఒక క్రైస్తవుడిగా ఉండుట కూడా నీ ఎంపికయై యున్నది. ఇచ్చట అమెరికాలో నీవు ఏ సంఘమునకైనా పోవుట అనునది నీ యొక్క ఎంచుకొనుటను (ఇంత వరకు) కలిగియున్నారు. నీవు ఏ సంఘమునకు చెందవలెనని కోరుకొందునో, దానిని ఎంచుకొనుట అనునది మీ స్వంత అమెరికా యొక్క అవకాశమై యున్నది. అది ఎంపికయై యున్నది. మీకు ఇష్టము లేనియెడల, ఏ సంఘమునకు వెళ్లవలసిన (పని) అవసరత లేదు, అయితే నీవు మెథడిస్టు నుండి బాప్తిస్టునకు మార్చుకో దలచిన లేదా కేథలిక్ నుండి ప్రొటెస్టంటునకు, లేదా మరే రకముగానైనను సరే, ఎవరును నిన్ను ఫలాని సంఘమునకు రమ్మని పిలువరు. లేదా, ఏదైనా సంఘమునకు చెందినవానివిగా చేయరు. అది మన యొక్క స్వాతంత్ర్యమై యున్నది. అది మన ప్రజా ప్రభుత్వము. మతస్వాతంత్ర్యత గలదు కావున ప్రతివారు తమకు ఇష్టమైన దానిని ఎంచుకొనగలరు, అది ఒక గొప్ప విషయము. మనము దానిని కలిగి యున్నంత వరకు, మనము దానిని చేయ గలిగినంత వరకు, అనుసరించుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక.
16ఈ సంఘములో ఉండుటకు ఈ సంఘమును ఎంచుకొనుట కూడా నీ ఇష్టమై యున్నది. నిన్ను నిత్య గమ్య స్థానమునకు నడిపించు సంఘమును ఎంచుకొనుట అది నీవు ఏర్పాటు చేసుకొను దానిపై ఆధారపడి యున్నది. ఫలాని మత సిద్దాంతము నీకు ఇష్టముగా ఉండినందున, ఆ సంఘమును నీవు ఎంచుకొనుట నీ యొక్క ఇష్టము లేదా అటువలె మరొక మతము యొక్క సిద్దాంతమును అవి ఆలోచించుకొనినయెడల దానిని ఎంచుకొనుట నీ ఇష్టము. మరియు దేవుని వాక్యము నీవు ఎంచుకొను సంఘము ఆ నిమిత్తము అచ్చట కలదు. ఇప్పుడు నీ ఎంపికను నీవు చేసికొనవలసి యున్నావు. వ్రాయబడని నియమమగు ఎంచుకొనుట మన మధ్య ఉన్నది.
ఒక సమయమున కర్మేలు పర్వతము మీద ఏలియా, ఆ మహా సంకట కాలమున దేనిని మనము ఇప్పుడు ఎదుర్కొనబోవుచున్నామో, ఆ సమయమందు కనుపరచిన దృశ్యమునకు తర్వాత ఉండెనని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఈ రాత్రి కర్మేలు పర్వత అనుభవమువలె ఎంపిక చేసికొనుట ఒకవేళ నీకు కావచ్చు లేదా నాకు కావచ్చు. యదార్ధముగా, ఇది లోకమందంతట సంభవింపబోవుచున్నదని నేను తలంచుచున్నాను.
అయితే, నీవు ఎంచుకొనుటకు గల సమయము త్వరితముగా నుండును.
17మరియు స్థాపన సంఘములోనున్న మనుష్యులారా, మీరు ఎంచుకొను సమయము సరిగా మీ మీద ఉన్నట్లు కేవలం నమ్ముడి, మీరు ప్రపంచ సంఘముల యొక్క సమాఖ్యలో చేరుటయో లేక స్థాపన సంఘముగా మరెన్నటికిని కాకుండుటయా అనునది జరుగును. నీవు దానిని తప్పక చేయబోవుచున్నావు. మరియు ఆ ఎంచుకొను సమయము త్వరలో వచ్చుచున్నది. ఆఖరి ఘడియ వరకు కనిపెట్టుట అనునది ఒక ప్రమాదకరమైన విషయము కూడాను, ఏలయనగా నీవు దానిని విడిచిపెట్టి రాకుండునట్లు ఏదైనా నీవు ఒక దానిని తీసుకొనవలసివచ్చును. హెచ్చరింపబడుటకు నీకు ఒక సమయమున్నదని నీవు ఎరుగుదువు, అప్పుడు ఆ హెచ్చరిక సరిహద్దు గీతను దాటిన, అప్పుడు ఆవలి వైపున నీవు ముందుగానే ముద్రింపబడుదువు - గురుతు వేయబడెదవు.
EXOD 21:5,6•
LEV 25:9,10•
1KGS 18:21•
ROM 10:17
18జ్ఞాపకము చేసికొనుము, జూబిలీ సంవత్సరము వచ్చునపుడు యాజకుడు తన శృంగనాదమును ప్రతి బానిస స్వతంత్రుడై వెళ్లిపోవలెనని వినిపించుచుండగా. అయితే, వారు ఆ విమోచనమును అంగీకరించని యెడల, అతనిని దేవాలయములోనికి తీసికొని వెళ్లి ఒక స్తంభము యొద్ద నిలువబెట్టి ఇనుప కదురు పనిముట్టుతో, వాని చెవికి రంధ్రము వేయుదురు, అటు పిమ్మటు అతడు తన యాజకునికి ఎప్పటికి బానిసగా నుండి సేవ చేయుచుండును. వినుట ద్వారా విశ్వాసము కలుగునను దానికి మాదిరిగా అది వినుట వలన కలిగినది అనునట్లు అతని చెవికి వేయబడినది, అతడు ఆ శృంగనాదము వినెను గాని, అతడు దానిని వినుటకు ఇష్టపడలేదు.
మరియు అనేక సమయములు పురుషులు మరియు స్త్రీలు దేవుని సత్యమును విందురు మరియు సత్యము సూచక క్రియల ద్వారా నిరూపింపబడుట చూచెదరు, అయినను దానిని వినుటకు వారు ఇష్టపడరు. దానికి మరొక కారణము గలదు. సత్యమును, ఉన్న వాటిని అంగీకరించుట కంటె వారు వేరే కొన్నిటిని ఎంచుకొనియున్నారు. కాబట్టి, వారి చెవులు సువార్తకై మూయబడినవి. మరెన్నడును వారు దానిని మరల విననేరరు. దేవుడు మీ హృదయముతో మాట్లాడునప్పుడు, అప్పుడే దాని ప్రకారము ప్రవర్తించవలెనని మీకు నా యొక్క సలహాయైయున్నది.
ఏలియా వారిని - "ఈనాడు మీరు ఎవరిని సేవించెదరో ఎంచుకొనుడని (నిర్ణయించుకొనుడని) వారి ఇష్టమునకు అప్పగించెను. మరియు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరించుడి" అని వారికి ఎంచుకొను అవకాశము ఇచ్చియుండెను.
19ఇప్పుడు, ఈ ప్రాతఃకాలమున మనము ధ్యానించుచున్న పాఠము ద్వారా - సూర్యుడు మరియు సృష్టిని పోలి. ఇప్పుడు మనము చూచుచున్న స్వాభావిక విషయములు ఆత్మీయ విషయములకు మాదిరిగా ఉన్నవి. అది నా మొదటి బైబిలుగా ఉండెను, బైబిలులో ఏ ఒక్క ఫుటనైనను చదువుటకు ముందు, నేను దేవుని ఎరుగుదును. ఏలయనగా ప్రకృతిలో ప్రతి చోటను బైబిలు వ్రాయబడియున్నది, అది (సృష్టి) సరిగా దేవుని వాక్యమునకు అన్వయించి యున్నది: ఏ విధముగా మరణము, సమాధి చేయబడుట, మరల జీవము గలిగిన ఉత్పత్తిగా వెలువడుటను మరియు సూర్యుడు ఉదయించుట, దాటుట, అస్తమించుట చనిపోవుట, మరలా ఉదయించుట పోలియుండిన రీతిగా - ఆ విధముగా సరిగా అనేక విషయములు దేవుడు ప్రకృతియందుండినట్లు మాదిరిగా ఈ సందేశము వలన సంక్షిప్తముగా తెలియజేయబడుచున్నది.
20ఇప్పుడు, ఆత్మ సంబంధమైనవి… లేక ప్రకృతి సంబంధమైనవి ఆత్మీయమైన వాటికి మాదిరిగా ఉన్నవి, అప్పుడు ప్రకృతి సంబంధమైన వధువును ఎంచుకొనుట ఆత్మ సంబంధమైన వధువును ఎంచుకొను మాదిరిగా ఉన్నది. ఇప్పుడు, మనము భార్యను ఎంచుకొనబోవుచున్నప్పుడు, అది ముఖ్యమైన విషయముగా ఉన్నది. ఒక మనిషి, మనము విడిపోము అనునది ఒక ప్రమాణముగా ఇచ్చట ఉన్నది. ఆ విధముగా మనము ఉండవలసి యున్నాము. మరియు మరణము ఒక్కటే నిన్ను వేరు చేయునని ఆ ప్రమాణమును నీవు దేవుని ఎదుట తీసుకొనుము.
మరియు మనము చేయునది సరిగా ఆలోచించి చేయవలెను… ఒక పురుషుడు చిత్తవృత్తితో తన భవిష్యత్తును ఏర్పాటు చేసుకొనుచున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా ఆ భార్యను ఎంచుకొనవలెను. నీవు చేయు దానిలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మరియు, ఒక స్త్రీ పురుషుని ఎంచుకొనునప్పుడు, లేక ఒక భర్త యొక్క ఎంపికను అంగీకరించునప్పుడు, ఆమె చేయు దానిలో ఆమె నిజమైన జాగ్రత్త కలిగియుండవలెను, మరియు ప్రత్యేకముగా ఈ దినములలో ఒక మనిషి ఒక భార్యను ఎంచుకొనుటకు ముందు అతను ఆలోచించవలెను మరియు ప్రార్దించవలెను.
21ఈనాడు ఏది ఎక్కువ వివాహ-పరిత్యాగ నేరములు కలిగి యున్నదని నేను ఆలోచించుచుండిన… మనము ప్రపంచమును నడుపుచున్నామను అమెరికాలోని వివాహ-పరిత్యాగ నేరములలోని మిగిలిన ప్రపంచమును ఆ స్థితిలో నడిపించుచున్నాము. ఇక్కడ ఇతర ప్రదేశములకంటే ఎక్కువ వివాహ-పరిత్యాగములు (విడాకులు) కలవు (ఈ దేశము), మరియు అది ఒక క్రైస్తవ దేశముగా ఉన్నది, ఆ విధముగా తలంచబడినది. ఏమి అపవాది (నింద); మన వివాహ-పరిత్యాగ న్యాయాలయము. దానికి కారణము పురుషులు దేవుని యొద్ద నుండి తొలగి పోవుటయేనని నేను తలంచుచున్నాను. మరియు ఈ విషయము నిమిత్తము ఒక పురుషుడు ప్రార్ధించిన మరియు ఒక స్త్రీ ప్రార్ధించినట్లైన — కేవలం అందమైన కనులను చూడకుండ, లేక ఎత్తయిన బలము గల భుజముల కొరకు కాకుండ, లేక అటువంటి లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండ — ముందుగా దేవుని వైపు చూచి, "దేవా, ఇది నీ ఏర్పాటేనా?" అని అడుగుము.
22ఈనాడు పాఠశాలలో సరిగా జరుగుచున్న దానివలె అనేక వంచనలున్నవని నేను తలంచుచున్నాను. ఇరుగు పొరుగుననున్న నా స్నేహితుల యొక్క పిల్లలు, ప్రాతఃకాలముననే వచ్చి "సహోదరుడా బ్రెన్హాం, మా గురించి ప్రార్థించెదరా? ఈనాడు మాకు పరీక్ష ఉన్నది. క్రితము రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, మరియు నేను దానిని పూర్తి చేయగలనని తలంచుట లేదు. నన్ను గురించి ప్రార్ధించుము" అని చెప్పుదురు.
అటువలె మీరును అలాంటి పాఠశాలకు వెళ్ళు పిల్లలను కలిగి యుండినయెడల… మరియు తల్లిదండ్రులు వేకువ జామున బల్ల యొద్ద, నీవు అమ్మా, జాన్ కు ఈనాడు పరీక్ష ఉన్నది, అతని గూర్చి ఇప్పుడు ప్రార్థించుదము అని చెప్పిన యెడల, నీవు చేయవలసిన బాధ్యత ఏమిటో నీవు చేసితివని నేను తలంచుచున్నాను. ఎందుకనగా వేరొకరి కాగితము చూచి, వంచన చేయకుండునట్లు నీవు చేయవలసినది చేసితివి. నేను తలంచునదేమనగా, నీవు ఆ విషయము నిమిత్తము బయటకు వచ్చి ప్రార్థించుము…
23మరియు మనము వివాహము చేసికొనుటకు వెళ్లుచుండగా, మనము ఏమి చేయుచున్నామో బాగుగా ఆలోచన చేసిన యెడల, భార్యను లేక బర్తను ఎంచుకొనునప్పుడు. ఒక మనుష్యుడు తన జీవితమంతయు నాశనము చేసికొనకుండ ఉండునట్లు వినయముతో ప్రార్థించవలెను. "మరణము మనలను వేరుచేయుట తప్ప" అను ప్రమాణమున్నదని జ్ఞాపక ముంచుకొనుము. అయుక్తమైన (తగని) దానిని ఎంచుకొనుటవలన అతడు తన జీవితమును పాడుచేసికొనును. అతడు తాను ఎంచుకొనునది అయుక్తమైనదని ఎరిగియు, ఆ స్త్రీ అతనికి భార్యగా ఉండుటకు తగదని గుర్తించియు, అతడు చేసికొనిన యెడల, ఆ తప్పిదము అతనిదై యున్నది. ఆ స్త్రీ తనకు భర్తగా ఉండుటకు అతడు యోగ్యుడు కాడని ఎరిగియు అతనిని తనకు భర్తగా స్వీకరించిన యెడల, నీవు మంచి, చెడులను ఎరిగియు ఆ విధముగా ప్రవర్తించుట వలన అది నీ యొక్క స్వంత తప్పిదమై యున్నది. గనుక, నీవు సంపూర్ణముగా ప్రార్ధించి తెలిసికొను వరకు, దానిని నీవు చేయకూడదు.
24అదే రీతిగా, నీవు ఎంచుకొను సంఘమునకు అన్వయించుచున్నది. ఇప్పుడు, ఏ సహవాసములో ఉన్నావో, ఆ సంఘమును గూర్చి నీవు ప్రార్ధించవలెను. సంఘములు ఆత్మలను కలిగి యున్నవని జ్ఞాపకముంచుకొనుము.
నేను విమర్శించువానిగా ఉండగోరుట లేదు, కాని నేను ఇప్పుడు ఒక వయస్సు నిండినవాడను, ఈ ఏదో ఒక దినములలో నేను ఇక్కడ నుండి వెళ్ల వలసి యున్నాను. కాబట్టి ఈ రాత్రియే గాని లేక మరి ఏ సమయమందేగాని ఏమి మాట్లాడితినో దాని విషయమై నేను ఉత్తరవాదినై యుందునని సంపూర్ణ మనఃపూర్వమైన నిశ్చయతను వాస్తవముగా నేను కలిగియున్నాను.
అయితే నీవు ఒక సంఘుమునకు వెళ్లుము, ఆ సంఘము యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూడుము, మరియు కొంత సమయుము అచ్చట సంఘ కాపరిని కనిపెట్టుము. మరియు, సాధారణముగా ఆ సంఘ కాపరి ఎలా ఉండునో, ఆ సంఘము కూడా ఆవిధముగానే ప్రవర్తించును. కొన్ని సమయముల యందు పరిశుద్దాత్మను పొందుకొనుటకు బదులుగా పరస్పరము ఒకరి ఆత్మను మరొకరు పొందని యెడల నేను ఆశ్చర్య పడుచుందును. నీవు మూల సిద్దాంతములు కలిగి వాటిని జరిగించుచున్న సంఘ కాపరిగల స్థలమునకు వెళ్ళుము, ఆ సంఘ సభ్యులందరు దానినే అనుసరించుచుండినట్లుగా చూడగలవు.
ఒక పాస్టరు నిలువబడి నేను చూచినట్లుగా వారు తమ తలలను దిగ్గున ముందుకు వెనుకకు ఆడించుచుండు (చోటునకు) సంఘమునకు నిన్ను తీసుకొని వెళ్ళేదను. నీవు ఆ సంఘమును గమనించుము; ఆ సంఘస్తులు ఆ విధముగానే చేయుట నీవు చూచెదవు. వడిగా గుర్రము వలె గంతులు వేయునట్టి ఒక పాస్టరును తీసుకొనుము, సాధారణముగా ఆ సంఘము అదే మాదిరిని అవలంబించును.
గనుక నేను ఒక సంఘమును ఎంపిక చేయునప్పుడు, అది సరియైనదియు, మూల సిద్దాంతము కలిగినదియు, సంపూర్ణ సువార్త బైబిల్ సంఘముగానుండిన యెడల నా యొక్క కుటుంబమును పెట్టుదును.
నేను చూసాను….
25ముందు రోజు ఆ బాలురు, సహో. షెకారియన్ యొక్క కుమారుడు మరియు అతని అల్లుడు, గాయకుడునూ, అందగాడునైన ఒక యువకునికి ప్రార్థించు నిమిత్తము నన్ను తీసుకొని పోయిరి. (ఫ్రెడ్ బార్కర్, అది అతని పేరు), అప్పుడే ఒక యాత్ర నుండి వచ్చినారు, మరియు ఫ్రెడ్ చనిపోవుచున్నాడని నన్ను పిలచిరి, మరియు నేను ఆ ఇంటి లోనికి ప్రవేశించక మునుపు "అతను ఇప్పుడే చనిపోయి ఉండవచ్చు" అను మరొక సమాచారము వచ్చినది. అతడు మెదడు నుండి రక్తము వచ్చు వ్యాధిని కలిగి ఉన్నాడు, మరియు అతనికి పక్షవాతము వచ్చి చనిపోనున్నాడు. మరియు అతని కొరకు ప్రార్థించమని అతని భార్య నన్ను కోరెను.
మరియు నేను తలంచాను, "ఓ, నేను విమానము ద్వారా వెళ్ళుటకు ప్రయత్నించిన యెడల, నేను అక్కడకు వెళ్లక మునుపే అతను చనిపోవచ్చును, మరియు ఇప్పుడు చనిపోయి ఉండవచ్చును." కనుక, వెంటనే ఆ చిన్న స్త్రీని (అతని భార్యను) ఫోను ద్వారా పిలచితిని; మరియు ఆ ఫోనును ఫ్రెడ్ యొక్క చెవి దగ్గర కొక్కెము ద్వారా వ్రేలాడునట్లుగా ఏర్పరచబడినది, అతడు మ్రింగలేకున్నాడు. వారు అతను కృత్రిమంగా మ్రింగు ఏర్పాటు చేయుచున్నారు. అతని కొరకు మేము ప్రార్ధించినప్పుడు, అతడు కదలుచుండెను, తన నోటి నుండి దానిని తీసివేయమని అతడు చెప్పెను. అతడు మ్రింగ గలుగుచున్నాడు! వైద్యులు ఇది నమ్మలేదు; దానిని బయటుకు తీసినారు, అయినా అతడు మ్రింగ గలుగుచున్నాడు. మరియు మరునాడు అతడు కూర్చుండి యుండెను.
ఒక సంఘము - సంఘమును ఎంచుకొనుట
26ఈ ఉదయ కాలమున కొంత సమయమునకు క్రిందట ఒక ఫోను వర్తమానము వచ్చెను. ఈ ఉదయ కాలమున నా సంఘ సభ్యురాలు, వాస్తవముగా ఆమె లూయిస్విల్ లోని బాస్టిస్టు స్త్రీ, ఆమె చనిపోయినది. ఇంటి వద్ద ఉన్న నా సంఘము నందు నిజముగా దేవునికి సమర్పించుకొనిన (పవిత్ర) ఒక సముదాయము కలదు, ఆమెను క్రుళ్ళు వాసన రాకుండా సుగంధ ద్రవ్యములతో - సిద్ధ పరచుటకు ముందు, వారందరు ఒకటిగా కూడుకొని అచ్చటకు వెళ్లి, ఆమెకు తిరిగి ప్రాణము వచ్చువరకు ఆమె ప్రక్కన నిలుచుండి ప్రార్థన చేసిరి. మరియు ఆమె ఈ రాత్రి జీవించుచున్నది. వారు మా సంఘ పెద్దలు. ఎందువలన? సమస్తమునూ సాధ్యము అని వారికి బోధించబడినది. విధేయతతో దేవుని దగ్గరకు రండి.
కావున మీరు సరియైన ఎంపిక తీసుకొనండి.
27మరల, ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకొనునో, అది అతని వాంఛను అతని స్వభావమును ప్రతిబింబింపజేయును. ఒక పురుషుడు అయుక్తమైన స్త్రీని ఎంచుకొనిన యెడల, అది అతని స్వభావమును ప్రతిబింబింప జేయును. అతడు దేనితో బంధము కలుగ చేసికొనుచున్నాడో, వాస్తవముగా అది వానిలో ఉన్న దానిని తెలియ జేయుచున్నది. ఒక స్త్రీ తనను భార్యగా ఎంచుకొను పురుషునిలో అతని మనస్సులో ఏమున్నదో దానిని ప్రతిబింబింపజేయుచున్నది. అతడు బాహ్యముగా ఏది మాట్లాడినను సరే, అతడు దేనిని వివాహము చేసికొనుచున్నాడో కనిపెట్టుము.
నేను ఒక మనుష్యుని కార్యాలయమునకు పోయినప్పుడు, అతడు (తానొక) క్రైస్తవుడనని చెప్పవచ్చును, చుట్టుప్రక్కల గోడల మీద పలు విధములైనవి అంటించుకొనియుండెను. అసహ్యమైన సంగీతము వచ్చుచున్నది, అతడు ఏమి చెప్పినను దానితో నాకు అవసరము లేదు. అతని సాక్ష్యమును నేను నమ్మను, ఏలయనగా లోక సంబంధమైన ఆ వ్యర్థమైనది, అసహ్యమైన వాటితో తన ఆత్మకు ఆహారముగా ఇచ్చుచున్నాడు.
గాయకురాలిని అతడు వివాహము చేసికొన దలచిన ఏమి చెప్పుదువు లేక కామాతురత కలిగిన రాణిని పెండ్లిచేసికొనిన యెడల ఏమి లేక ఆధునిక అలంకారము గల రికెట్టాను చేసికొనిన ఏమి? అతని మనస్సులో అతని భవిష్య గృహము ఎటువంటిదై యుండునది అది ప్రతిబింబింపజేయుచున్నది — ఏలయనగా ఆమె వలన సంతానము కలిగి యుండుటకు ఆమెను తీసుకొనెను, ఆమె ఏ మార్గమును అవలంబించి యుండునో, ఆ మార్గమునందే వారిని నడిపించును అనునది సూచించుచున్నది. కావున ఆ పురుషుని యందు ఏమున్నదో, అది ప్రతిబింబింప జేయుచున్నది. ఒక పురుషుడు ఎటువంటి స్త్రీని ఎంచుకొనునో, అది అతని భవిష్య జీవితమును గూర్చిన ఆలోచనను తెలియజేయుచున్నది. ఒక క్రైస్తవుడు ఆ విధముగా చేయునని యోచించగలవా? లేదు, అయ్యా, ఆ విధముగాచేయునని నేను యోచించ లేను. ఒక నిజ క్రైస్తవుడు అలాంటి సుందరమైన రాణులను, మరియు గాయకురాళ్లను మరియు కామాతురతను కలిగించురాణులను చూడడు. అతడు క్రైస్తవ స్వభావము కలిగినదాని కొరకై (కనిపెట్టును) చూచును.
28ఇప్పుడు, సమస్తమును నీవు కలిగి యుండలేవు. అచ్చట ఒక కన్యక వాస్తవముగా సుందరమైనదే మరియు మరో కన్యక చూచుటకు ఈమె కంటే రూపవతియై యున్నది. మరియు ఒకదాని కొరకు మరొకటి సమర్పించుకొనవలెను. అయితే ఆ స్త్రీ వలె, ఈమె రూపవతి కాకపోవచ్చును… నేను దానిని లక్ష్యపెట్టను. ఆమె చక్కని అందము కలిగినదా లేదా అనునది కాదు, నీవు ఆమె గుణమును చూచుట మంచిది. ఆమె రూపవతిగా ఉండినను లేక రూపవతి కాకుండినను దానితో నిమిత్తము లేదు. ఒక క్రైస్తవుడు ఒక భార్యను ఎంచుకొనుచుండిన యెడల నిజముగా తిరిగి జన్మించిన (మారు మనస్సు పొందిన) ఒక స్త్రీని అతడు తప్పక ఎంచుకొనవలెను. ఆమె చూచుటకు ఏలాగుండినను, ఆమె ఏమై యున్నదో అది ఆమెను దానిని కలుగ చేయును. పిమ్మట అతని దైవిక స్వభావమును ప్రతిబింబింపజేయును. మరియు అతని మనస్సులో ఏమి ఉన్నది, ఆ స్త్రీ వలన అతని భవిష్యత్తు ఏర్పాటును, గృహమును కట్టుటకు కలుగు సంతానములో నిలువబెట్టు దానిని ప్రతిబింబింపజేయును.
అతడు ఈ ఆధునిక అలంకార వేషము ధరించిన వారిలో ఒకరిని కామ వికారమైన రాణులలో ఒకరిని వివాహము చేసుకొనిన యెడల, అతడు అపేక్షించునదేమిటి? ఏ తీరైన గృహమును ఆ పురుషుడు కలిగియుండుటకు అపేక్షించగలడు? తగినంత నైతిక బుద్ధి కలిగి ఇంటి యొద్ద నిలువక, తన ఇల్లును పరామర్శించుటను మాని ఎవరిదో ఆఫీసునందు ఉద్యోగము చేయగోరు యువతిని అతడు వివాహము చేసుకొనిన యెడల, ఆమె ఎటువంటి గృహ సంరక్షకురాలిగా ఉండగలదు? నీవు పసి బిడ్డను పరామర్శించు వారిని మరియు ఇంకేమైనను కలిగి యుండెదవు. అది వాస్తవము.
29ఇప్పుడు, స్త్రీలు ఉద్యోగము చేయునట్టి ఈ ఆధునిక ఇంపైన దానిని నేను ఎక్కువగా ఇష్టము కలిగి యుండలేదు. పోలీసుకు విధించిన వస్త్రములను స్త్రీలు ధరించి మోటారు సైకిళ్ల మీద ఈ పట్టణములో చుట్టు ప్రక్కల తిరుగుట నేను చూచినప్పుడు, అనేకమంది పురుషులు ఉద్యోగము లేని స్థితిలో ఉండగా, స్త్రీలను ఈ విధముగా చేయుటకు అంగీకరించిన ఆ పట్టణమునకు అది అవమానకరము. అది ఆ పట్టణము యొక్క ఆధునిక ఆలోచనలను చూపించుచున్నది. అది అగౌరవమును చూపించుచున్నది. ఆ రీతిగా బయటకు వచ్చు స్త్రీలను మనము కలిగియుండ వలసిన అవసరము లేదు. ఆ రీతిగా బయట తిరుగుటుకు వారికేమియూ పనిలేదు.
ఒక పురుషునికి ఒక భార్యను ఇచ్చినప్పుడు, రక్షించబడిన వారిలో నుండి, ఉత్తమమైన దానిని అతనికి ఇచ్చును, అయితే పురుషుని స్థానమును తీసుకొనుటకు వెళ్ళునది, అతడు పొందవలసిన దానంతటి కంటే ఆమె మిక్కిలి చెడ్డదిగా ఉండును. ఇప్పుడు, అది సరియే.
ఇప్పుడు, మనము ఆత్మీయమైన దానికి అన్వయించి చూడగలము. అది చెడ్డదని నేను ఎరుగుదును. అది చెడ్డదని నీవును తలంచెదవు, అయితే అది సత్యము. అది ఎంత చెడుగా కనిపించిననూ మనము లక్య పెట్టము. మనము నిజాయితీ విషయములకై నిలువబడ వలసియున్నది, బైబిలు బోధించునది అదియే.
30ఇప్పుడు, ఆత్మానుసారమైన దేవుని యొక్క సంకల్పము ప్రకారము - కాబోవు తన వధువుతో ఆయన భవిష్య గృహము వచ్చు అవలోకమును స్పష్టముగా మనము చూచుచున్నాము. ఒక పురుషుడు కామరాణిని వివాహము చేసుకొనిన యెడల, అతడు ఎటువంటి తన భవిష్య గృహమును కట్టబోవుచున్నాడో నీవు చూడగలవు. ఇంటి యొద్ద నిలువ ఇష్టము లేని స్త్రీని ఒక పురుషుడు వివాహము చేసుకొనిన యెడల, అతడు ఎటువంటి తన భవిష్యత్తు కొరకు అతడు చూచుచున్నాడో నీవు చూడుము.
మరియు నేను, ఒక సమయములో… వినుటకు అది ఘోరమైనదిగా ఉండును, మరియు నేను… నేను దానిని చెప్పవలెనని భావించినాను — సాధారణముగా ఒక విషయము నేను చెప్పవలెనని భావించిన, దానిని తప్పక చెప్పుదును, మరియు అది సాధారణముగా దేవుని విధానము. నేను గోవులకు సంబంధించిన వ్యక్తి (రాంచర్ - Rancher) తో నేను పని చేసినప్పుడు, పశువులు కొనుటకు అతనితో వెళ్ళుచు ఉండేవాడిని. మరియు ఒక ఆవును కొనుటకు ముందు ఆ వయస్సుమళ్లిన వ్యక్తి దాని ముఖములోకి ఎల్లప్పుడు సూటిగా చూచుటను నేను గమనించితిని. పిమ్మట అతడు దాని తలను త్రిప్పిముందు వెనుక చూచెను. నేను అతని వెనుకనే ఉండి అతనిని గమనించుచుంటిని, మరియు అతడు దానిని క్రిందికి, పైకి చూచెను. మరియు అది రూపములో అంతా చక్కగా యుండిన యెడల, పిమ్మట అతడు, తిరిగి దాని ముఖమును చూచెను, మరియు కొన్ని సార్లు అతని తలను ఆడించి మరియు వెళ్లిపోవును.
నేను అతనితో "జేఫ్, నేను నిన్ను ఒక విషయము అడుగవలెనని ఆశించుచున్నాను," అని చెప్పితిని.
అతడు, "చెప్పుము, బిల్లీ" అని చెప్పెను.
మరియు నేను, "ఎందుకు నీవు ఆ ఆవు ముఖమును ఎల్లప్పుడును చూచెదవు?" అని అడిగితిని.
నేను, "అది చూచుటకు బాగుగానే యున్నది, ఒక మంచి బలిష్టమైన ఆవు" అని చెప్పితిని.
దానికి అతడు "నేను నీకు చెప్పుటకు ఇష్టపడుచున్నాను, కుర్రవాడా. నీవు నేర్చుకొన వలసినది చాలా ఉన్నది," అని చెప్పెను.
మరియు అతడు చెప్పిన తరువాత నేను ఎరిగితిని. అతడు "అది ఆ ఆవు ఏ విధముగా చేయబడినది అని నేను పట్టించుకొనను. అది మాంసముతో డెక్కలు బలిష్టముగా ఉండవచ్చును, కాని దానికి క్రూరమైన చూపు ఉండిన యెడల, నీవు దానిని ఎన్నడూ కొనవద్దు," అని చెప్పెను.
అందుకు నేను, "జెఫ్, ఆలాగు ఎందుకు?" అని అడిగితిని.
"మంచిది, మొదటి విషయము, అది ఎన్నడూ ఒక చోటు నిలువబడదు," అని చెప్పెను, మరియు అతడు "తరువాత విషయము ఏమనగా, అది ఎన్నటికిని దూడకు తల్లిగా ఉండనేరదు," అని చెప్పెను. మరియు అతడు "వారు దానిని ఇప్పుడు పశువుల దొడ్డిలో ఉంచుదురు, ఎందుకనగా అది చాలా లావుగా ఉన్నది. దానిని నీవు విడిపించిన, ఆ క్రూరమైన దృష్టితో పరుగులెత్తుచు స్వయముగా మరణమునకు గురియగును," అని చెప్పెను.
మరియు నేను అన్నాను, "నీకు తెలియునా, నేను కొంత విషయము నేర్చుకున్నానని ఎరుగుదును, అది స్త్రీలకు కూడ వర్తించునని నేను నమ్ముచున్నాను."
ఆ క్రూరమైన, రెప్ప వేయకుండా చూచు దృష్టిగలిగిన, రికెట్టా చూపు కలిగినటువంటి ఆమె నుండి దూరముగా ఉండుట మంచిది, బాలుడా, ఆమె కన్నులకు పై గల ఆ నీలి రంగు అంతా, మరియు నేను దానిని ఇష్టపడను. అది క్రైస్తవురాలు అగునని నేను తలంచుట లేదు. అది అందగత్తె అని టెలివిజన్ గాని, వార్తాపత్రికలు ఎంతగా చెప్పినను నేను దానిని లక్ష్యపెట్టను; అది వికారమైన చూపును, నా జీవితములో ఎన్నడు చూడని భయంకరమైన దృష్టి కలిగియున్నది.
31ఒక ఉదయ కాలమున, ప్రాతఃకాల మొదటి భోజనము చేయు సమయమున క్లిస్టన్ యొక్క కేఫ్లేరియా యందు మొదటిసారి నేను చూచినప్పుడు కొందరు యౌవ్వన స్త్రీలు వచ్చుట చూచితిని. సహోదరుడు ఆర్గన్ బ్రైట్ మరియు నేను లోపలకు వచ్చితిమి. అతడు క్రింది అంతస్థునకు దిగివెళ్లేను. మరియు ఒక యౌవ్వన స్త్రీ లోపలకు వచ్పుటు చూచితిని. "మంచిది, నేను ఎరుగనని" తలంచితిని. ఇంతకు ముందెన్నడు దానిని చూడలేదు. ఇది ఒక రకమైనదిగా ఉండెను. ఓహో, చూచుటకు ఆమె మనస్సు చెడిన (తిక్క) దాని వలె యున్నది, మీకు తెలియును, హాస్యముతో కూడిన ఒక విధమైన చూపు, అది హాస్యముగా ఉన్నదని నేను చెప్పుట లేదు అని మీరు ఎరుగుదురు. నేను మీతో చెప్పునది…
నేను మిషనరీగా ఉన్నాను. నేను కుష్ఠ రోగమును చూచితినని మీకు తెలుసు. పలు విధములైన చాపల్యము (చపల చిత్తము) ను నేను చూచితిననియు, ఆ రోగములు ఎట్లు వచ్చునని నేను ఎరుగుదునని మీకు తెలుసు… తిన్నగా నేను ఆ యౌవ్వనస్తురాలి యొద్దకు వెళ్లి నేను దేవుని సేవకుడను, నేను రోగుల కొరకు ప్రార్ధించుదును. నీ రోగము కొరకు ప్రార్ధించదలచితిని, "నేను నీ కొరకు ప్రార్ధించవలెనా?" అని ఆమెను అడిగితిని. అట్టి విధమైన దానిని నేను ఎన్నడునూ చూడలేదు. మరియు ఇద్దరు లేక ముగ్గురు లోపలకు వచ్చిరి, అంతట నేను ఒక విధముగా కొంత వెనుకకు వేచియుంటిని. అప్పుడు సహోదరుడు ఆర్గన్ బ్రైట్ వచ్చెను. "సహోదరుడు ఆర్గన్ బ్రైట్ (ఆయన ఇక్కడ ఉండ వచ్చును), ఈస్త్రీ విషయము ఏమిటి?" అని నేను అడిగితిని.
"అది రంగు పూయబడినది" అని అతడు చెప్పెను.
"మంచిది, మై, మై!" మంచి వారు ఏదో ఒక చోటు రోగుల శాలయందు తప్పక ఉండవలసి వచ్చును, ఏలయనగా తక్కిన స్త్రీలలో అది వ్యాపించి నాశనము చేయకుండునట్టు వారిని దూరముగా ఉంచవలెనని మీకు తెలియును.
32అయితే మీకు తెలియును, ఎంచుకొనునప్పుడు నీవు పథకము వేయవలెను, మరియు చూడవలెను, మరియు ప్రార్థించవలెను. దీని మూలముగా వాగ్ధాన సంబంధమైన వాక్యమును బట్టి అతడు ఏ వధువును ఎంచుకొనునో ఆమె అతని గుణమును ప్రతిబింబింప జేయును. అతనిలో ఏమి ఉన్నదో అది ప్రతి బింబింపజేయును. ఇప్పుడు, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి అటువంటి దానిని భార్యగా చేసికొనగలడని నీవు ఊహించగలవా? సహోదరుడా, అలా జరుగుట నేను చూడను. ఇప్పుడు, నేను చపల చిత్తము గల ఒక వృద్ధుడను కావచ్చు, అయితే మీకు తెలియును, దానిని నేను సరిగా అర్థము చేసుకొనలేను, చూచారా. అతనిలో ఏమి ఉన్నదో అది దానిని ప్రతిబింబించును అని గమనించండి. అతని భవిష్య గృహమును కట్టుటకు ఆమె సహాయపడును.
ఇప్పుడు, దీనిని మనము ఆత్మీయమైన దానికి మార్చినపుడు, కొంత సమయము వరకు ఈ లోకములో ఉన్న ఒక సంఘము, లోకములో ఉన్నవారు ప్రవర్తించునట్లుగా ప్రవర్తించుచు, లోకముతో సంప్రదించుకొని యున్న లోకాభిలాషల యందు పాలివారై, దేవుడు తన ఆజ్ఞలను వ్రాయలేదు అనునట్లుగా ఉండు దాని విషయము ఆలోచించిన అటువంటి దానిని క్రీస్తు తన వధువుగా తీసుకొనబోడు అని నీవు కొంచెము ఊహించ గలవు. ఈనాటి ఆధునిక సాంప్రదాయములతో కూడిన సంఘమును వధువుగా తీసుకొనుచున్నాడని నీవు యోచించితివా? నా ప్రభువు ఆ రీతిగా చేయడు. ఆ రీతిగా జరుగుట దుర్లభము. ఆ విధముగా జరుగదు. లేదు!
ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఒక పురుషుడు అతని భార్య ఒకటైయున్నారు. ఆ విధముగా నిన్నునీవు ఒక వ్యక్తితో ఒకటై యుండగలవా? ఆ రీతిగా నుండగలిగిన యెడల అది వాస్తవముగా నీ యందలి నా విశ్వాసము ఒక రకముగా నిరాశపరచును.
2TIM 3:5
33అటువలెనున్న దేవుడు ఏ విధముగా తన్నుతాను దానితో చేర్చుకొన గలడు - అది ఒక నియమిత సాంప్రదాయక వ్యభిచారిణి? ఆయన దానిని చేయునని నీవు తలంచుదువా? "పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు." దానిని ఆయన ఎన్నడు చేయడు. ఆమె యందు ఆయన స్వభావమును ఆమె కలిగి యుండవలెను. క్రీస్తులో ఉన్న స్వభావమును నిజమైన క్రొత్తగా జన్మించిన (సత్య) వాస్తవమైన సంఘము, తప్పక కలిగియుండును, ఏలయనగా భార్య మరియు భర్త ఒక్కటై యున్నారు. మరియు యేసు, దేవుని సంతోషపరచునది (ఆయన చిత్తమును) మాత్రమే (ఆయన వాక్యమునకు విధేయుడుగా ఉండి, ఆయన వాక్యమును ప్రత్యేక పరచెను) చేసిన యెడల, ఆయన యొక్క వధువు కూడ అదే విధముగా అదే స్వభావమును కలిగియుండునదై యుండును. ఆమె సాంప్రదాయక సంఘముగా ఏ కారణము చేతనైనను ఉండజాలదు, ఎందుకంటే "కాదు," అని నీవు ఎంతగా చెప్పగోరినను, ఆమె సాంప్రదాయక సంఘము, ఎచ్చటనో గల ఒక స్థాపన సంస్థకు స్వాధీనమందుండి, అది ఏది చేయమని చెప్పునో , ఏది చేయకూడదని చెప్పునో ఆ విధముగానే అది నడచుకొనవలసి యుండును — అనేక మార్లు అది సత్యవాక్యము నుండి లక్షలాది మైళ్ల దూరముగా ఉన్నది.
JOHN 14:26•
JOHN 16:13
34దేవుడు సంఘమును నిజమైన నాయకుడుగా ఉండి నడిపించుటకు మనలను విడిచిన దానినుండి మనమెప్పుడైన దూరముగా నుండిన అది భయంకరము. ఆయన రాష్ట్రపు ప్రెస్బిటేరియన్ను ఎన్నడును పంపలేదు, ఆయన ఎన్నడును బిషప్పును గాని, కార్డినల్ ను గాని, ప్రీస్టును గాని, పోపును గాని పంపలేదు. ఆయన సంఘమును నడుపుటకు పరిశుద్ధాత్మను సంఘము కొరకు పంపెను. "ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును." పరిశుద్ధాత్మ దానిని చేయును. ఇప్పుడు, ఆధునిక సంఘము దానిని ద్వేషించుచున్నది. వారు దానిని ఇష్టపడరు, కనుక ఆమె క్రీస్తు యొక్క వధువుగా ఏ విధముగా కాగలదు?
ఈనాటి ప్రజలు, ఆధునిక సాంప్రదాయక సంఘమును ఎంచుకొను చున్నారు, అది ఏమి చేయును, కేవలం దేవుని వాక్యమును గూర్చిన అజ్ఞాన గ్రహింపును ప్రతిబింబింప జేయును. బాధ పరచవలెనని నా ఉద్దేశ్యము కాదు, కాని దానిని (వాక్యము) చూచునంత వరకు లోతుగా వెళ్లనివ్వవలెనని నా ఉద్దేశ్యము.
35నేను అనేక జంటలకు వివాహములు జరిగించితిని, అయితే నేను ఎల్లప్పుడు క్రీస్తు ఆయన యొక్క వధువును గూర్చి జ్ఞాపకము చేసుకొనుచుందును. కొంత కాలము క్రితము నేను చేసిన వివాహము నా జీవితములో నేను జరిగించిన వివాహములన్నింటిని మించిన దానిగా యున్నది. నేను కేవలం ఒక యువకునిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరముల క్రితము అది జరిగినది.
నా సహోదరుడు పి.డబ్లు.ఏ. నందు పని చేయుచుండెను. ఎవరైనా ఎప్పుడైనా, నా వయస్సు గలవారు ఎవరైనా దానిని జ్ఞాపకముంచుకొని యుందురో లేదో నేను ఎరుగను. ముప్పది మైళ్ల దూరములో గల సర్కారు నియమిత పనియందు పని చేయుచుండెను. వారు ఒక రేవు కొరకు ఒక సరస్సును త్రవ్వుచుండిరి. అతనితో ఒక యౌవ్వనుడు నేను నివసించు జెఫర్సన్-విల్ నుండి సుమారు నూరు మైళ్ల దూరమున గల ఇండియానా-పోలీస్ నుండి అచ్చట పని చేయుచుండెను. అతడు ఒకనాడు నా సహోదరునితో, "డాక్, నేను బోధకునికి చెల్లించగల పైకము ఉండిన యెడల, నేను వివాహము చేసికొనబోవుచున్నాను," అని చెప్పెను. "నా లైసెన్సు కొరకు తగినంత పైకము మాత్రము ఉన్నది గాని, బోధకునికి చెల్లించ వలసినంత పైకము నా దగ్గర లేదు," అని అతడు చెప్పెను.
"మంచిది, నా సహోదరుడు ఒక బోధకుడు, మరియు అతడు నీకు వివాహము చేయవచ్చు, అటువంటి విషయములకు అతడు ఎన్నడూ పైకము తీసుకొనడు," అని డాక్ చెప్పెను.
అందుకతడు "నాకు వివాహము చేయమని నీవు అడిగెదవా?" అని అడిగెను.
36మంచిది, ఆ రాత్రి నా సహోదరుడు నన్ను అడిగెను, మరియు నేను వారిద్దరిలో ఎవరును ఎన్నడునూ ఇంతకు ముందు వివాహము చేసుకొననియెడల, అవన్నియు క్రమముగా నుండిన యెడల జరుగగలదని" నేను జవాబిచ్చితిని.
"మంచిది, అతనిని ఇచ్చటకు రమ్మని" నేను చెప్పితిని.
శనివారము వచ్చినప్పుడు ఆ యౌవ్వనునితో కూడ వచ్చెను… నాకు ఎల్లప్పుడు అది గుర్తుంచుకొనుటకు ఒక గొప్ప విషయముగా గోచరమగుచుండెను, వర్షము కురియుచున్న మధ్యాహ్నము, మరియు ఎక్కువ వెలుగునిచ్చుచు తిరుగుచున్నట్టి హెడ్లైట్ కలిగినది పాత చెవర్లేట్ కారు ముందుగా నడిపింపబడి వచ్చి నిలచినది. అప్పుడే నా భార్యను పోగొట్టుకొనిన కొంత కాలము తరువాత, నేను రెండు గదులను జతపరచుచుంటిని. డాక్ నాతో కూడ వారి కొరకు కనిపెట్టుచుండెను. మరియు అప్పుడు ఆ కారులో నుండి యౌవ్వనుడు బయటకు వచ్చెను. అతడు ఒక పెండ్లి కుమారుడుగా నుండినట్టు నాకును లేక మరెవరికి తోచలేదని, నేను ఊహించుచుంటిని. అతని చిరిగిపోయిన కాలి జోళ్లను చూచి, ఒకటిన్నర డాలరు ఇచ్చి మంచి కాలి జోడును కొంటిని; అతని జోళ్ళు వాస్తవముగా పాతదిగా ఉండెను, మరియు అతడి ప్యాంటు వదులుగా ఉండెను. అతడు ఒక పాత కుడత (పొట్టిగానున్న కోటు) ను, అట్టి దానిని వయస్సు కలిగిన మీలో కొందరైనా జ్ఞాపకము కలిగి యుందురని నేను తలంచుట లేదు. అది బట్టలు ఉతుకు యంత్రములో వేయబడి చక్కగా మురికి పోవునట్లుగా చేయబడలేదు, అది రేగలు కలిగినట్టుగా ముడతలు కలిగి దాని అంచులు పైకెత్తు కొనినట్లుగానుండెను.
37మరి కొందరు స్త్రీలతో కూడ ఒక పేద అమ్మాయి బయటకు వచ్చెను. ఓ, వారిలో కొందరు చూచుటకు ఆటంక పరచు వస్త్రములను కలిగియుండిరి, నేను ఎరుగను. ఒకవేళ నేను ఆ రకముగా పిలచి నేను పొరబాటు చేసియున్నాను. గింగ్-హమ్ అని ఆ రీతిగా నేను పిలచితినని నమ్ముచున్నాను. ఆ విధముగా జరిగియుండెను… మరల తప్పిదమాయెనని నేను చెప్పితిని. నేను ప్రతి సమయమున ఆలాగు చేయుదును. ఆవిడ కారు నుండి బయటకు వచ్చినది. వారు మెట్టు యొద్దకు వచ్చిరి. వారు లోపలికి వచ్చుచున్నప్పుడు, ఆ దీన స్థితిని గమనించగా… ఆమె కలిగియున్నదంతయు ఆమె ధరించిన ఫ్రాకు మాత్రమే. ఆమెకు కాళ్ల జోడి కూడ లేకుండెను. అయితే ఆమె ఇండియానా-పోలిస్ నుండి మరొకరి కారు నందు కూర్చుండి ప్రయాణము చేయుటకు వినంతీతో (ఇతరుల సహాయము ద్వారా) ఇచ్చటకు చేరుకున్నది. జడగా అల్లిన వెనుక వీపుపై వ్రేలాడుచుండిన వెంట్రుకలను కలిగి, చూచుటకు చిన్న యౌవ్వనస్తురాలుగా నుండెను.
"నీవు వివాహము చేసికొనుటకు గల వయస్సును కలిగియున్నావా?" అని నేను ఆ అమ్మాయిని అడిగితిని.
"అవును, అయ్యా" అని ఆమె ఉత్తరమిచ్చెను. మరియు ఆ అమ్మాయి, "నా తండ్రి మరియు నా తల్లి దగ్గర నుండి వ్రాత మూలముగా అనుమతిని తెచ్చితిని" అని చెప్పినది. "దానిని న్యాయాలయము నందు చూపించి అనుమతిని పొందితిని" అని ఆమె చెప్పినది.
"మంచిది, వివాహము జరిగించుటకు ముందు కొంచెము మీతో మాట్లాడవలెనని కోరుచున్నాను," అని నేను చెప్పితిని.
వారు కూర్చుండిరి. ఆ యవ్వనస్తుడు ఆ గది లోపల అంతటనా చూచుచుండెను. అతడు వాస్తవముగా వెంట్రుకలు కత్తిరించు కొనుటకు అవసరత కలిగియుండెను. అందువలన ఆ గదిలో చుట్టు చూచుచుండెను. అతడు నేను చెప్పునది వినుట లేదు. "కుమారుడా, నేను ఏమి చెప్పుచున్నానో, దానిని బాగుగా వినుము" అని నేను చెప్పితిని.
"సరే, అయ్యా" అని అతడు అనెను.
"ఈ అమ్మాయిని నీవు ప్రేమించుచున్నావా?" అని నేను అడిగితిని.
"అవును, అయ్యా, నేను ప్రేమించెదను" అని అతడు ఉత్తరమిచ్చెను.
"నీవు అతనిని ప్రేమించుచున్నావా?" అని నేను ఆమెను అడిగితిని.
"అవును, అయ్యా, నేను ప్రేమించుచున్నాను" అని ఆ యౌవ్వనస్తురాలు ఉత్తరమిచ్చెను.
"మీకు వివాహమైన పిమ్మట, ఆమెను తీసుకొనివెళ్ళుటకు నీకు స్థలమున్నదా?" అని నేను అడిగితిని.
"అవును, అయ్యా" అని అతడు చెప్పెను.
"అంతా బాగున్నది," "ఇప్పుడు మరొక విషయమును అడుగ గోరుచున్నాను. నీవు పి.డబ్లు.ఏ. యందు పనిచేయుచున్నావని నేను ఎరుగుదును" అని నేను చెప్పితిని.
"అవును, అయ్యా."
అచ్చట వారమునకు పండ్రెండు డాలర్లు నాకు వచ్చును, అని అతడు చెప్పెను. "నీవు ఆమెను పోషించగలవని తలంచుచున్నావా?" అని నేను అడిగితిని.
"నేను చేయ గలిగినదంతయు నేను చేయుదును" అని అతడు చెప్పెను.
"అది చాలా మంచిది," అని నేను అంటిని. మరియు "ఇప్పుడు అతడు అచ్చట నుండి బయటకు వచ్చెను అనుకొనుము … సహోదరీ, అతడు తన ఉద్యోగము పోగొట్టుకొనెనని అనుకొనుము. నీవు ఏమి చేయబోవుదువు? తిరిగి అమ్మ నాన్నగారి ఇంటికి పరుగెత్తి పోయెదవా?" అని నేను అడిగితిని.
"లేదు, అయ్యా, నేను అతనితోనే ఉండబోవుచున్నాను," అని ఆమె చెప్పెను.
"నీకు ముగ్గురు లేక నలుగురు పిల్లలు కలిగి యుండి, వారిని పోషించుటకు ఏమియు లేనియెడల, ఏ ఉద్యోగము కూడ లేనియెడల, నీవు ఏమి చేయుదువు? ఆమెను పంపి వేయుదువా?" అని అడిగితిని.
"లేదు, అయ్యా, నేను వాటితో పోరాడుదును. మేము దానిని ఏదో ఒక విధముగా సరి చేసికొందుము" అని అతడు జవాబు ఇచ్చెను.
అతడు వాస్తవముగా ఆ అమ్మాయిని ప్రేమించుచున్నట్లు చూచితిని, వారిరువురు ఒకరినొకరు ప్రేమించి యుండిరని నేను కొంత (గమనించితిని) తెలిసికొంటిని. వారికి వివాహము చేసితిని.
38అతడు ఆ అమ్మాయిని ఎక్కడకు తీసుకొని వెళ్లివుంటాడని పిమ్మట తలంచి ఆశ్చర్యపడితిని. కొన్ని దినములైన తరువాత, వారెక్కడ ఉన్నారని నేను నా సహోదరుడు డాక్ ను అడిగితిని.
"మనకు దిగువన ఉన్న చిన్న పట్టణమగు క్రొత్త ఆల్బనీకు వెళ్లిరి" అని చెప్పెను. నదీ తీరమున ఇనుప రేకులతో ప్రోగు చేయబడి నిలువబెట్టబడిన స్థలమునకు, నేను లైన్ మెన్ గా పని చేయుచున్నప్పుడు ప్రతిరోజు అక్కడకు నేను వెళ్ళుదును, తక్కినవారు అచ్చట కూడుకొని పరిహాస సంబంధముగా వారు చెప్పుకొనుచుండగా, నేను నా ట్రక్కు నందు కూర్చుండి, నదీతీరమున చేరి, కమ్మరి పని చేయబడునట్టి ఆ స్థలమందు గల ఒక ఇనుప రేకు క్రింద ప్రార్థించుచు లేక బైబిలు చదువుచుందును.
అచ్చట పాత కార్డు వంటి పెట్టెల సముదాయము ఉండెను. ఆ కారు వంటి పెట్టెలలోఒక దాని యందు అతడు ప్రవేశించి, దానికి ఒక ద్వారమును మూయు తలుపును తయారు చేసికొని యుండెను, మరియు వార్తా పత్రిక కాగితమును టాకీ బటన్స్ ను తీసుకొని యుండెను. ఎందరు టాకీ బటన్ గూర్చి ఎరుగుదురు? - అప్పటిలో కెంటకీయన్లు అచ్చట లేకుండెను. ఒక ముక్క కార్డుబోర్డును తీసుకొని, దానితో ఒక స్ప్రింగును జోడించి, దానిని ముందుకు అప్పుడు నెట్టుము, అది టాకీ బటన్ అని చెప్పబడును. (మరుగుగా చేయు పరదా వంటిది అని చెప్ప వచ్చును.)
39గనుక దానిని వారు అంతట (తగిలించిరి) పెట్టిరి. దాని లోనికి ఎక్కి పోవుటకు ఆ కమ్మరి పనివాని యొద్ద నుండి ఒక విధమైన మెట్టుగా దానిని చేయించెను, మరియు ఆ పాత కారు వంటి పెట్టెలో మేజా లాంటిది ఒక బల్లను అందులో కలిగియుండెను. ఒక రోజున వారిని చూచుటకు వెళ్ళుటకు ఆశించితిని, "వారు ఎట్ల తమ జీవితమును గడుపుచున్నారు" అని చూడ నపేక్షించితిని.
సుమారు ఆరు నెలల క్రితము (అనగా ఈ వివాహమునకు) ముందు ఇ.వి. నైట్ యొక్క కుమార్తెకు ఇ.టి. స్లైడర్ యొక్క కుమారునితో నేను వివాహము జరిపించితిని. ఇ.వి. నైట్ ఓహియోనది తీరమున నివసించుచున్న ధనికులలో ఒకడు. అతడు గృహ కట్టడమునకు ఉపయోగపడు సామాగ్రిని ముందుగా తయారు చేయునటువంటి పెద్ద కర్మాగారములను నడిపించువాడై యుండెను. మిస్టర్ ఇ. టి. స్లైడర్ సమూహమునకు చెందిన కోటీశ్వరుల యొక్క పిల్లలు. మరియు నేను వారికి కంకర రాళ్ల వ్యాపారము చేయు సముహమునకు చెందిన కోటిశ్వరుల యొక్క పిల్లలు, మరియు నేను వారికీ వివాహము చేసితిని.
నేను వెనుకకు వెళ్లి రెండు వారములు ఆ స్థలమందు గల పాకలో ప్రవేశించుటకు మోకాళ్ల క్రింద దిండ్లు ఉంచుకొని, లోపలకు బయటకు వచ్చుటకు తర్ఫీదును పొందితిని, తద్వారా నా ఆడంబరము, సమస్తమును నేను ఎప్పుడు అనుభవించని దానిని దగ్గరగా కలిగి, దానిలో నివసించుచున్న దంపతులకు వివాహము జరిగించుటకు పోవలసివచ్చెను. వారు బయటకు వచ్చినప్పుడు, వారు అక్కడ ఉండిరి, ఏలయనగా - మరొక ఇద్దరు పడుచువారు (దంపతులు కానున్నవారు) అక్కడ ఆ పాత గదిలో నిలువబడి యుండిరి, అక్కడ మాకు ఒక మంచము - మడత వేయు పరుపు ఉండెను, అయితే అదే కార్యమునందు వారిరువురి వివాహము కూడ చేయబడెను.
40మరియు ఒకనాడు, ఈ ధనిక దంపతులను దర్శించవలెనని నేను తలంచితిని. వారు ఏ ఉద్యోగము చేయవలసిన అవసరము లేదు; ఏలయనగా వారి తల్లిదండ్రులు లక్షాధికారులు, వారి కొరకు వారు చక్కని గృహమును కట్టించిరి. వాస్తవముగా ఈ ఇ.వి. నైట్ కొండ మీద కట్టబడిన పెద్ద భవనమును కలిగి దాని ద్వారము యొక్క పట్టుకొను గడి పదునాలుగు (కారెట్లు) వన్నెయైన బంగారముతో చేయబడియుండిన యెడల, వారు ఎటువంటి భవనములో నివసించుచున్నారో మీరు ఊహించగలరు, వారు పని చేయవలసిన అవసరము లేదు. వారికి ప్రతి సంవత్సరము కాడిలాక్ కారు పారితోషికము ఇవ్వబడుచుండును, అది సరిగా పిల్లలకు మాత్రమే, వారికి కావలసినదంతయూ వారు సరిగా కలిగి యుండిరి.
ఒక దినమున తిన్నగా అక్కడికి నడుచుచూ వెళ్లితిని… ఇప్పుడు వారితో ఎలా పరిచయము కలిగినదనగా, వారి స్నేహితులలో ఒకడు నాకు మంచి పరిచయము గల స్నేహితుడై యుండెను, అన్ని రకములైన స్నేహితులుగా మేము కూడుకొని యుంటిమి. ఆ విధముగా వారితో నాకు పరిచయమై, వారి వివాహము చేయమని వారు నన్ను కోరిరి.
41కావున వారిని చూచుటకు నేను వెళ్లితిని. నా పాత ఫోర్డు కారును బయట నిలువ బెట్టి, కొన్ని అడుగులు నడచి ద్వారమున వద్దకు చేరితిని. ఆ మెట్లు ఎక్కి మిక్కిలి సమీపమునకు చేరి, వారు మాట్లాడుకొనుటను వింటిని. వారు వాస్తవముగా రచ్చ చేయు సద్దును కలిగియుండిరి. ఒకరి యెడల ఒకరు ద్వేషమును వారు కలిగియుండిరి. వారు నృత్యము చేయుటకు వెళ్లి యుండిరి. ఆమె బహు చక్కని సౌందర్యము గల స్త్రీ, మరియు ఆవిడ సౌందర్య రాణి అని పిలువబడు వారిలో ఒకరు. ఆమె రాణిగా నుండదగిన అందమును కలిగి యుండుటను బట్టి కొన్ని కారులు, కొన్ని బహుమానములు ఆదిగా పొందియుండి అక్కడ ఆమె చుట్టు పెట్టబడి యుండెను.
నేను వారిని చూడగా - అనావశ్యకమైన సద్దు చేయుచు - ఆమె ఏదో ఒక యవ్వనునితో నాట్యమాడుటను, లేదా ఒక యవ్వనురాలితో అతడు నాట్యమాడుట లేక ఏదో ఒకటి కలిగి తొందరలు కలిగి, వారు ఒక్కొక్కరు, ఒక్కొక్క మూలలో కూర్చుండి యుండిరి. నేను పైకివెళ్లగా, వారు త్రుళ్లి పడినట్లుగా లేచి, వారిరువురు ఏకముగా వున్నట్లు హత్తుకొని తమ చేతులు నేలకు తాకునంతగా చేయుచు ద్వారము నొద్దకు వచ్చిరి. "హలో సహోదర బ్రెన్హాం, అక్కడ ఎందుకు, నీవు ఎలా ఉన్నావు?" అని అడిగిరి.
"అంతయు మంచిగా ఉన్నది. మీరంతా ఎలాగున్నారు?" అని నేను అడిగితిని.
"ఓ, మేము సంతోషముగా నున్నాము. ఆ విధముగా మనము ఉన్నాము కదా, మధురమైనదానా?" అని అతడు జవాబిచ్చెను.
అందుకు ఆమె "అది వాస్తవమే ప్రియుడా" అని జవాబిచ్చెను.
42ఇప్పుడు, చూడండి, ఏది వాస్తవమైనది కాదో దానిని నీవు కలిగి యున్నట్లు చూపించుచున్నావు. అగ్నివలె రంగువేయబడి చిత్రింపబడిన దానితో నీవు వెచ్చదనమును పొందలేవు. అదే రీతిగా కొన్ని సంఘములు వెయ్యి సంవత్సరముల క్రితము లేక రెండు వేల సంవత్సరముల క్రితము సంభవించిన పెంతెకోస్తు లాంటి దానిని అనుసరించుచున్నట్టి వేషమును ధరించుటకు ప్రయత్నించుచున్నారు. రంగులతో చిత్రించబడిన అగ్నితో నీకు ఉష్ణము కలుగనేరదు. పెంతెకోస్తు ఆనాడు ఏలాగుండెనో ఈనాడును అదే రీతిగా నున్నది, చూచారా. ఆ అగ్ని ఇంకను మండించుచున్నది. అది చిత్రింపబడిన అగ్ని కాదు; అది వాస్తవమైన (పెంతెకోస్తు) అగ్నియై ఉన్నది. గనుక వారు అచ్చట ఆ విధముగా నుండిరి, చూడుము, నేను ఆ రీతిగా జీవించుటను ఇష్టపడను.
43"మంచిది, నిట్రముగా నుండిన నదిని ఆనుకొని యున్న ఆ స్థలమందు మరొక జతపరచబడిన దంపతులను చూడవలెను" అని నేను తలంచితిని. ఒక శనివారము కాలమందు వూరి యొద్దకు వెళ్లి, వారు ఎలా ఉన్నారో చూడవలెనని ఆశించితిని. కావున, నా ముఖము అశుభ్రముగా నుండి, నా శరీరమంతయు మలినముతో, పని చేయు పని ముట్టులు కలిగి యుంటిని. వారిని తప్పించుకొని దాటిపోవాలని తలంచితిని, మెరుపు లేక మరొకటి ఏదైనా హఠాత్తుగా వేరు చేయుదాని వలె టెలిఫోను తీగలు, విద్యుత్తు లావైన తీగను నదీతీరముననున్న వాటినే అనుసరించుచు వాటి ప్రక్కనే నడుచుచు వారి నుండి వేరుగా నడిచిపోవుటకు కనిపెట్టుచు దాటిపోవుచుంటిని. ఒక సంవత్సరము క్రిందట ఏ పాత చెవర్లేట్ కారులో నుండి వారు దిగి వచ్చి వివాహము చేసుకొన్నారో, వారుండు స్థలమునకు ముందు ఆ చెవర్లెట్ అచ్చట నుండెను. ద్వారము తెరువబడి యుండెను, వారు మాట్లాడునది నేను వినగలుగు చుంటిని.
గనుక అది ఒక వేషధారి వలె కనిపించ వచ్చును, కాని నేను వారు మాట్లాడునది ఏమిటో బాగుగా వినగలిగినంత సమీపమునకు చేరితిని. వారేమి మాట్లాడుచున్నారో విననపేక్షించిన వాడనై అచ్చట నిలువ బడితిని. నేను ఏమి మాట్లాడుచున్నానో, అది వాస్తవమైనదని నేను ఎరుగునట్లు కోరుచున్నాను. అదే రీతిగా దేవుని వాక్యము విషయమై నేను ఆ విధముగా చేయుదును. అది సత్యము, లేక సత్యమేనా? ఆయన తన వాక్యమును నెరవేర్చునా లేక ఆయన తన వాక్యమును విడచునా? ఆయన తన వాక్యమును నెరవేర్చని యెడల, ఆయన దేవుడు కానేరడు, చూడుము. ఆయన తన వాక్యమును నెరవేర్చిన యెడల ఆయన దేవుడే, చూచారా.
44మరియు కాబట్టి, వారు ఏలాగు జీవించుచున్నారో నేను వారిని చూడనపేక్షించినాను, నేను బహు తేలికగా ప్రక్కకు తప్పుకొని అచ్చట నుంటిని. "మంచిది, మధురమైనదానా, దానిని నీ కొరకు తీసుకొని రావలెనని నేనెంతగానో అపేక్షించుచున్నాను" అని అతడు చెప్పుచుండుటను నేను వింటిని.
ఆమె చెప్పెను, "ఇప్పుడు, గమనించుము, దయార్థ సహృదయము గల ప్రియుడా, ఇప్పుడు నేను కలిగియున్న ఈ దుస్తులు సరిపోవును," మరియు "ఎందుకనగా, ఇప్పుడు ఇవి చాలా బాగున్నవి." "దానిని నేను ప్రశంసించుచున్నాను, అయితే నీవు గమనించుము…"
నేను చుట్టును దాటి రాగా ద్వారపు సందులో నుండి వారిని చూడగలుగునట్లు ద్వారము తెరువబడిన పెట్టె లాంటి కారు నందు వారుండుట చూడగలిగితిని. ఆమె అతని తొడలపై కూర్చుండి యుండెను, అతని చేతులు ఆమె మెడచుట్టును, ఆమె చేతులు అతని మెడ చుట్టును వేయబడి యుండెను. మరియు అతడు పాత రకపు తలవాల్పు కలిగిన టోపీని కలిగియుండెను, దానిపై ఒక రంధ్రము పడి, దాని పైన చిరిగి, అందులో ఉంచబడియున్న జీతము యొక్క పట్టీ కనబడుచుండెను. అతడు దానిని బల్ల మీద పెట్టెను. అతడు చెప్పెను, "తేయాకు, కాఫీ తదితర కిరాణా సామానులకు ఇంత భీమా కొరకు కొంత, కారు నిమిత్తము కొంత, ఆలాగు వారి అవసరతలు తీరునంతగా లేకుండెను. ఇక్కడకు రమ్ము, బయటకు వచ్చి ఆ కిటికి దగ్గర తగిలించిన డ్రస్సు చూడుము; అతడు రెండు వారముల నుండి దానిని చూచుచుండెను, దాని వెల ఒక డాలరు లేదా మరెంతో కలిగియున్నది. దానిని అతడు తీసుకొనవలెనని అపేక్షించుచున్నాడు. "మంచిది, ప్రియా, దానిలో నీవు చాలా ముచ్చటగా కనబడెదవు" అని అతడు చెప్పెను.
ఆమె చెప్పెను, "అయితే, మధురమైనవాడా, నేను దుస్తులను కలిగియున్నాను. నాకు నిజముగానే అది అవసరము లేదు." చూశారా.
మరియు ఆ చిన్న రాణి…
45మరియు నేను వెనుకకు మళ్లి తిరిగి చూచితిని మరొక ఇంటి మీద గోపురము వంటి ఎత్తయినది ఒకటి చూడగలిగితిని. నేను అక్కడ నిలచి దానిని నిదానించి కొన్ని నిమిషములు చూచితిని. ధనికుడు అనగా ఎవరు? అని నేను తలంచితిని. ఆ స్థలమును బిల్లీ బ్రెన్హాం, నీవు తీసుకొనిన యెడల నీవు ఎక్కడకు వెళ్లియుందువు? అని నేను ఆలోచించితిని.
నేనైతే, ఆ చక్కని వస్తువును ఎత్తయిన ఆ కొండ ప్రదేశమునకు తీసుకొని పోను గాని, ఆడంబరమైన వాటికై నీ రక్తమును కార్పింపజేయక, నీతో ఏకీభవించి, నీలో భాగమైయుండి గృహమును చక్కగా కట్టుటకు ప్రయత్నించుచున్నట్టిదియు, ఏదైతే నన్ను ప్రేమించి, నాతో వుండి నిజమైన గృహమును కట్టటకు తోడ్పడు సహాయకారి స్వభావమును కలిగిన ఆ నాజూకైన (సున్నితమైన) పాత్రను నేను ఆ ప్రాంతమునకు తీసుకొని పోను.
46ఆ విధముగా ఎందుకున్నది, ప్రతి సమయమందును నా మనస్సును తట్టుచుండెను. ఒకడు అందమైన అమ్మాయిని ఎంచుకొనెను; మరొకడు గుణమును ఎంచుకొనెను. ఇప్పుడు, నీవు ఎంచుకొను మార్గము అది ఒక్కటి మాత్రమే. మొదట గుణమును చూడుము, మరియు అటు తరువాత నీవు ప్రేమించినయెడల, అది మంచిది.
గమనించండి, దేవుని యొక్క మొదటి ఆదాముకు అతని భార్యను ఎంచుకొనుట కొరకు ఎలాంటి ఎంపిక లేదు. అతడు ఎంపికను పొందలేదు. దేవుడు అతనిని ఒకటిగా చేసెను, అతనికి ఎంచుకొనుటకు ఆమె తప్ప వేరొకటి లేకుండెను. కాబట్టి ఆమె అతనిని దేవుని వాక్యము నుండి దూరపరచినదిగా చూడగలము. అతడు ఆ విషయమును గూర్చి ప్రార్థన చేయలేదు. మరియు మరలా, అతడు నీవలెను లేదా నా వలెను లేకుండెను. అతడు ఎంచుకొనుటను కలిగియుండలేదు.
అతడు దేవుని కుమారుని స్థానమును కలిగియున్న దాని నుండి ఆమె అతనిని దూరపరచినది, ఏదైతే వారు చేయకుండ నుండవలెనో, దానిని ఆధునిక పద్దతిలో జీవించు మార్గమును ఆమె చూపించుటవలన, ఆమె స్వభావమును, ఉద్దేశ్యమును సరికానటువంటిదైనను ఆధునిక క్రొత్త నాగరికత వెలుగు అను హేతువాదముతో (ఆదామును) అతనిని తనను వెంబడించు వానిగా చేసి దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా అది ఉన్నను, అది మంచి మార్గముగా జీవించుటకు ఉండినట్లుగా చేసినది.
1COR 14:34•
1TIM 2:12
47అట్టి రీతిగా ఈనాడు ఎందరు స్త్రీలు మంచి పురుషులను, అటువలె ఎందరు పురుషులు మంచి స్త్రీలను దేవుని నుండి దూరము చేయుటకు - ఈ మతము (పెంతెకోస్తువారైన మీరు) - "ఓ అది ఒక పాత పద్ధతిని అనుసరించు అనాగరిక సంబంధమైన వారు" ఆదిగా హేళన చేయునట్టు చెప్పునట్లుగా చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. "వారిని నమ్మవద్దని చెప్పుదురు." నీవు మాత్రము ఒక అమ్మాయిని వివాహము చేసుకొనుటకు ముందు బాగుగా ప్రార్థించుము. అది ఎంత అందముగానైనా ఉండ వచ్చును, నేను లెక్క చేయను; అదే (ప్రార్థించుటయే) ఒక పురుషుడు చేయవలసినది.
ఆమె అనేక కారణములతో అతనిని (ఆదామును) సమ్మతించునట్టు చేసి దేవుని చిత్తము నుండి తొలగించెను, అతడు ఏది చేయకుండా ఉండవలెనో దానిని అతడు చేయుట వలన సమస్త మానవ జాతి మరణమునకు కారణమాయెను. అందువలననే బైబిలు ఆమె ఉపదేశము చేయుటకు గాని లేక నేర్పించుటకు గాని, లేక ఏ రీతిగానైననూ దేవుని వాక్యమును ఉపయోగించ కుండునట్లు ఆమె నిషేధింపబడెను.
ఇప్పుడు, సహోదరీ, "ప్రభువు బోధించుటకు నిన్ను పిలచెనని," మీలో అనేకులు చెప్పుదురని నేను ఎరుగుదును. మీతో నేను వాదించ బోవుటలేదు. అయితే నేను చెప్పుట లేదు గాని, ఆ విధముగా మీరు చేయ కూడదని వాక్యము చెప్పుచున్నది. "ఆమె బోధించుటకైనను, అధికారము చేయుటకైనను లేక, మౌనముగా ఉండ వలెను" అని వాక్యము చెప్పుచున్నది.
మంచిది, నీవు "దానిని నీవు చేయుము అని ప్రభువు నాకు చెప్పెను," అని చెప్పుదువు.
దానిని కొంచెమైనను నేను అనుమానించను. గత రాత్రి బిలామును గూర్చి చెప్పబడిన నా వర్తమానము నీవు వింటివా? బిలాము ప్రథమముగా దేవుని ఉద్దేశ్యమును - "అది చేయ వద్దని" ఖచ్చితముగా తెలియజేసెను. అయితే, దేవుడు తుదకు - అది చేయుటకు పొమ్ము అని చెప్పు వరకు అతడు బుద్ధిహీనముగా ప్రవర్తించెను. నిన్ను ఉపదేశించుటకు (అటువలె) దేవుడు అనుమతించి యుండవచ్చును. ఆయన నీతో చెప్పలేదని నేను చెప్పుట లేదు. అయితే, అది దేవుని మూల వాక్యప్రకారము లేదు మరియు ఆయన సంకల్పమునూ కాదు, ఏలయనగా ధర్మశాస్త్రము కూడ ఆమె సంపూర్ణ విధేయతతో లోబడి యుండవలెనని చెప్పబడినది. అది సత్యము కాబట్టి ఆమె ఆ విధముగా చేయకుండ ఉండవలసి యున్నది.
ACTS 3:22•
1COR 11:9
48ఇప్పుడు, స్వాభావిక వధువును ఎట్లు ఆత్మీయ వధువుతో పోల్చబడినదో మరలా గమనించుము. ఆమె పురుషుని కొరకు చేయబడినది. కాని పురుషుడు ఆమె కొరకు చేయబడలేదని వాక్యము చెప్పుచున్నది. ఇప్పుడు, నేను ఎందుకు కొన్నినిమిషములు క్రీస్తు యొక్క వధువును గూర్చి మాట్లాడబోవుచున్నాను, అయితే, దాని పూర్వ వృత్తాంతమును చూపించుటకు ప్రయత్నించుచున్నాను.
స్త్రీ పురుషుని కొరకు చేయబడినది, పురుషుడు స్త్రీ కొరకు కాదు. (పాత నిబంధనలో) ధర్మ శాస్త్రము క్రింద బహు భార్యాత్వము న్యాయచట్టబద్దముగా వుండుటకు అదే కారణము. దావీదు ఐదు వందల మంది భార్యలతో ఉండుటను చూడుము. అతడు ఐదు వందల మంది భార్యలతో దేవుని హృదయమునకు బహు ఇష్టుడని బైబిలు చెప్పుచున్నది, మరియు సొలోమోను వెయ్యి మంది భార్యలను కలిగి ఉండెననియు వారిలో ఏ ఒక్క స్త్రీ మరొక భర్తను కలిగియుండలేదు.
49చాలా కాలము క్రిందట కాదు, ట్యూసాన్ యొద్దనున్న పర్వతము మీద నేను దాని విషయమై ప్రార్ధించుచుంటిని, "వివాహము మరియు పరిత్యాగము" అను అంశము కలిగిన నా టేపును మీరు పొందండి. అగ్ని స్తంభము ఆ పర్వతము చుట్టు తిరుగుచు గరాటు గొట్టము నందు ప్రవేశించి మరలా అది వెలుపలకు వచ్చుచున్న దృశ్యమును చూచుటకు పాఠశాలలకు సెలవిచ్చిరి. ప్రస్తుతము ఇక్కడ ఉన్న వారును దానిని ఎరుగుదురు; దానిని ఎరిగిన వారును ఉన్నారు - అచ్చట మరియు అది చూడబడెను. మరియు అది… వివాహము మరియు పరిత్యాగము ప్రశ్నల సత్యమును ఆయన నాకు చెప్పినప్పుడు. ఒకటి ఈ మార్గమున మరొకటి మరొక మార్గమున పోవుచుండిన యెడల, ఎక్కడో ఒక చోటు సత్యము ఉండి తీరవలెను. మరియు ఆ ఏడు ముద్రల తరువాత, అందులో ఉన్న సత్యమేమిటో ఆయన నాకు చూపించెను.
50ఇప్పుడు గమనించుము, ఆమె మరొకరిని కలిగి యుండ నేరదు కాని ఒకే భర్త, ఏలయనగా స్త్రీ పురుషుని కొరకు చేయబడినది, మరియు పురుషుడు స్త్రీ కొరకు కాదు. ఆ ఐదు వందల మంది స్త్రీలందరు కలసి దావీదు యొక్క భార్యగా ఉండెను. క్రీస్తు వెయ్యేండ్ల పాలనలో సింహాసనము మీద కూర్చుండినప్పుడు ఆయన వధువు ఒక వ్యక్తిగా కాక - పది వేల, వేల కొలదిగా వారంతా ఒక్క వధువుగా నుండు మాదిరిని అది సూచించుచుండెను. మరియు దావీదునకు అనేక మంది భార్యలు వేర్వేరు వ్యక్తులుగా కలిగి యుండినను - వారందరు ఏకముగా అతనికి భార్యగా ఉండెను. విశ్వాసులందరు కలిసి క్రీస్తు యొక్క వధువు అనబడిన శరీరమువలె ఉన్నారు, ఎందుకనగా అది ఆమెగా ఉన్నది, ఆ స్త్రీ ఆయన పురుషుడై ఉన్నాడు.
ఇప్పుడు, మనము క్రీస్తు కొరకు చేయబడితిమి; క్రీస్తు మన కొరకు చేయబడలేదు. ఈనాడు మన పాఠ్య పుస్తకములందు దానినే మనము చేయుటకు ప్రయత్నించుచున్నాము, అనగా క్రీస్తు అనబడు వాక్యమునకు మనము తగినట్టుగా చేయబడుటకు (బదులుగా) మారుగా, క్రీస్తు అనబడు వాక్యమును మనకు సరి పడునట్లుగా అదే ప్రయత్నించుచున్నాము. అదే ఆ వ్యత్యాసము.
PROV 31:30
51ఒక పురుషుడు ఒక కుటుంబము నుండి ఒకానొక అమ్మాయిని ఎంచుకొనునప్పుడు, అతడు అందముపై ఆధారపడకూడదు, ఏలయనగా అందము మోసకరమైనది, మరియు అందము, ఆధునిక ప్రపంచ సంబంధమైన అందము సాతాను సంబంధమైనది. ఓ, ఎవరో ఒకరు - "బోధకుడా ఇచ్చట జాగ్రత్తగా ఉండుము!" అని అచ్చట చెప్పినట్టుగా నేను వింటిని, ఈ లోకమునందు ఏదైతే అందము అని పిలువబడుచున్నదో సంపూర్ణముగా సాతాను సంబంధమైనది అని నేను చెప్పుచున్నాను, దానిని నేను మీకు రుజువు చేయుదును. నేను (చెప్పిన) విశేషముగా ఎత్తి చెప్పబడిన దాని సందర్భమందు అది సరియేనా, కాదా అని దేవుని పవిత్ర వాక్యము నందు కనుగొందము. మీలో కొందరు స్త్రీలు చాలా అందముగా నుండ గోరిన యెడల అది ఎక్కడ నుండి వచ్చినదో గమనించుము.
ఆదియందు దూతలను మోసము చేయు వరకు సాతానుడు ఎంతో సౌందర్యమైన దూతగా వుండెను మరియు అతడు దేవుని దూతలందరిలో ఎంతో అందముగానుండెను. అది (అందము) సాతాను నందు ఉంచబడి యున్నట్లుగా అది చూపుచున్నది. సామెతలు చెప్పెను సొలోమోను చెప్పెను, అది సరియే. పాపము సౌందర్యముగా నుండును. అది వాస్తవమై యున్నది, అది ఆకర్షణీయముగా వున్నది.
52నేను మిమ్మును అడుగుటకు, మరియు ఇక్కడ కొంత విషయమును మీకు చెప్పగోరుచున్నాను, మీరు కొన్ని నిమిషములు గమనించవలయునని నేను కోరుచున్నాను. మనము పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు ఈ లోకమందు అన్ని జీవరాశులలో (పక్షులు, జంతువులు), వాటి జీవితములో మగ పక్షి, మగ జంతువు అందముగా నుండును, మానవ జాతి కాకుండా ఆడ పక్ష్మి, ఆడ జంతువు (అందముగా) ఆ రీతిగా నుండవు. ఆ విధముగా ఎందుకు? దుప్పిని చూడుము - చక్కని ఎత్తయిన అల్లిన కొమ్ములు కలిగియుండును, మరియు ఆ చిన్న సున్నితమైన ఆడ జింకను గమనించుము. చిన్న మచ్చలుగా ఈకలుగా కలిగిన కోడి పెట్టను, కొయ్య మీద నిలుచుండి నిద్రపోవు పొడవుగను, అందమైన ఈకలు కలిగిన కోడిపుంజును చూడుమ. చూచారా? స్త్రీ తప్ప ధర్మము తప్పి ప్రవర్తించునది, మరియు స్త్రీ అంత నీచముగా ఆ ఆడ జాతిలో ఏదియు లేదు.
ఇప్పుడు, సహోదరి, లేచి వెళ్లిపోవద్దు. దీని అంతము వినువరకు కేవలము వేచియుండండి. చూచారా? చూచారా?
స్త్రీ తప్ప ధర్మము తప్పి ప్రవర్తించునది ఆ ఆడ జాతిలో ఏదియు లేదు. నీవు ఆడ కుక్కను, ఆడ పందిని అసహ్య మైనదిగా చెప్పుదువు; కాని ధర్మముగా (నీతిగా) ప్రవర్తించుటలో, ఇక్కడున్న సగము మంది సినీతారల కంటే, అవి ఎక్కువ ధర్మ ప్రవర్తనను పాటించుచున్నవి.
ISA 3:12
53స్త్రీ అనునది ఒక్కటియే ఆ ఆడ జాతిలో అక్రమమైన మార్పును కలుగ చేసినది. అది సరియే. ఆమె అందము ఆమెను ఎక్కడికి తీసుకొని వెళ్లినదో చూడుము. అందువలన, ఇప్పుడు, స్త్రీలు ఈనాడు అందమును హెచ్చుగా చేయుచున్నారు. పెరల్ బ్రియన్ ను నీవు గమనించుము. ఆమె చిత్రమును నీవు ఎప్పుడైనా చూచితివా, ఆమె అమెరికా యొక్క గొప్ప సౌందర్యముగా నుండవలసియుండెను? ఏ పాఠశాలలోనైనా దానిని ఎరుగని విద్యార్థి లేడు. ఏ పాఠశాలలోని విద్యార్థి అయినా ఆమె వెనుక పంక్తిలో కూర్చుండుటకు ఆశపడని విద్యార్థి లేడు.
అది ఆ రీతిగా ఉండవలసి యున్నదని నీవు ఎరుగుదువా? ఆ విధముగానే జరుగ బోవునని బైబిలు చెప్పుచున్నదని నీవు ఎరుగుదువా?ప్రారంభమందు స్త్రీ మూలముగానే పడిపోవుట సంభవించెనని మీరు ఎరుగుదురా? అదే పడిపోవు స్థితి - చివరకు స్త్రీ పురుషునిపై అధికారము కలిగినదై, అధికార చలామణిని ఆదిగాకలదై అదే భ్రష్టత్వముతో తుదముట్టించుటకు ఈడ్చుకొని పోవుచున్నది. దానిని లేఖనము చెప్పుచున్నదని నీవు ఎరుగుదువా?
దేవుని వాక్యమునకు విరోధముగా పురుషుని వస్త్రములు స్త్రీ ధరించుట, తల వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకొనుట, అవన్నియు ఆ దినమందు జరుగుట నీవు ఎరుగుచున్నావు. ఆమె సంఘమునకు సాదృశ్యముగా ఉన్నదని నీవు ఎరుగుదువా? స్త్రీ ఏమి చేయుచున్నదో, అదే సంఘము కూడ చేయుటను నీవు చూచుచున్నావు. అది వాస్తవముగా సరియే.
ఇప్పుడు, దేవుని వాక్యము సత్యమైయున్న రీతిగా, ఇప్పుడు సరిగా అది సత్యమైయున్నది.
54స్త్రీ వలె అవినీతి కార్యములకు సమ్మతించినట్లుగా మరొక ఆడ జాతి వర్గము చేయబడలేదు. అయినను తద్వారా దానికి అంతము కలుగచేయబడెను… ఆమె మూల సృష్టి యందు లేకుండెను. పక్షిలో ఆడ, మగ జంతువులలో ఆడ, మగదిగా మూల సృష్టి యందు ఇతరమైన వాటన్నిటిలో ఆడదానిని సృజించెను. అయితే, మానవ జీవితములో, దేవుడు పురుషుని మాత్రమే చేసెను. ఆయన స్త్రీని అతని నుండి తీసెను - కావున స్త్రీ, పురుషుని నుండి ఉత్పన్నమైనది, ఏలయనగా ప్రధానముగా నుండునట్టిదిగా దేవుడు నిర్మించలేదు. లేఖనములను పరిశీలించుము. అది వాస్తవముగా సరిగా ఉన్నది. దేవుడు… ఆ విధముగా కాదండి. ఆయన మూల సృష్టి యందు ఆచ్చట నుండి తొలగించును.
అయితే, ఆమె తన్నుతానే సరియైన రీతిగా పట్టుకొనిన యెడల, పురుషుని కంటే ఎంతో శ్రేష్టమైన ప్రతి ఫలమును పొందియుండగలదు. ఆమె శోధన స్థలమందు ఉంచబడెను. ఆ విధముగా కాదండి. ఆయన మూల సృష్టియందు ఆమెను అచ్చట ఆమె మూలముగా మరణము వచ్చెను. ప్రతి వారి మరణమునకు ఆమె అపరాధియైయున్నది. అయితే, దేవుడు తిరిగి మరలా విధేయురాలైన ఒక స్త్రీ వలన ఆయన కుమారుని తీసుకొని వచ్చెను, ఆ ఒకని ద్వారా నిత్య జీవమును తెచ్చెను. కాని అచ్చట చెడ్డదైనది ఒకటి కలదు, అంత కంటే నీచమైనమరొకటి లేదు.
1JN 3:12
55సాతాను యొక్క కుమారుడైన కయీను, దేవుడు అందమును అంగీకరించునని తలంచెను. ఈనాడునూ అతడు చేయుచున్నాడు. కయీను? నీవు చెప్పుదువు. ఇప్పుడు దానిని (విశదముగా) వివరించుట లేదు కాని, మీ నిమిత్తము తీరనియ్యుడి. అతడు దుష్టుని సంబంధి అని బైబిలు చెప్పుచున్నది. గనుక అందువలన అది స్థిరపరచబడినది. అది సరియే.
సాతానుని కుమారుడై యుండెను. "మంచిది, అతడు ఇప్పుడు సాతాను కుమారుడు. వాటిని అర్పించు వేదిక యందు ఆరాధించుటకు తెచ్చినయెడల అని వాస్తవముగా మనోహరముగా (అంగీకరించుటకు) యుండునని అతడు తలంచెను, దేవుడు లక్ష్యపెట్టునది అదేనని (అతడు తలంచెను), వారు తలంచిరి - ఈనాడును వారు ఆలోచించుచున్నది అదియే. నిజముగా, "గొప్ప భవనములను కట్టుదము, మనము గొప్ప సాంప్రదాయక స్థాపన సంఘములను కలిగి యందము. పెద్ద భవనములను కలిగి యుండుటకు, వస్త్రములతో అలంకరింపబడిన ప్రజలను, ఉన్నత నాగరికత గల సంఘ పెద్దలను తయారు చేయదము." కొన్ని మార్లు దేవుడు అట్టి దానికి పది మిలియన్ల మైళ్ల దూరముగా నుండును. అది నిజము. అయినను అది సంఘము.
56దేవుడు ఆరాధనను, అర్పణను, వినయమును లక్యపెట్టిన యెడల, కయిను హేబేలు వలె నీతిమంతుడుగా ఎంచబడి సంఘముగా ఉన్నది. అయితే, అతడు (హేబేలు) అతని తల్లిదండ్రులు భుజించినది ఆపిల్ పండు కాదని (ఆత్మ) ప్రత్యక్షత వలన అతడు తెలిసికొనెను.
నేను చెప్పబోవునది ఏదో ఆ విషయము ఒక సేవకునికి మంచిగా తోచకపోవచ్చును, అయితే నేను ఏదో ఒక విధముగా దానిని గూర్చి చెప్పబోవుచున్నాను. నేను చిన్న పరిహాసములు చెప్పుచుందునని కొందరు చెప్పుకొనుచుండుటను నేను వినుచున్నాను. ఇక్కడ అది నా యొక్క భావము కాదు. ఆపిల్ తినుట వలన ఆ స్త్రీ తాము దిగంబరులైవున్నట్లు తెలిసికొనిరి అని నేను చెప్పిన యెడల, ఆపిల్ పండ్లను మరలా ఇచ్చెదము. అది సరియే. ఆ విధముగా చెప్పినందుకు నన్ను క్షమించండి. అయితే, అది సరిగా ఆ రీతిగా మార్చునేమో… ఆ స్త్రీ విషయము మరియు ఇతరమైనవి మాట్లాడుచు మిమ్మును ఇచ్చట బంధించిన వారిగా చేసితిని, ముందు ఏవి రానున్నవో వాటి కొరకు, ఒక నిమిషము మీరు విరామము కలిగి యుండవలెనని నేను కోరుచున్నాను.
ఇప్పుడు, నీవు గమనించుము, అది ఆపిల్ పండు కాదు. అది మనము ఎరుగుదుము.
57ఈ దినములలో క్రైస్తవ సంఘము ఇతర మానవ నిర్మితమైన సాధనలవలె సాధించు సాధన నియమములతో విజ్ఞాన శాస్త్రయుక్త మైనదిగా మార్చబడుచున్నది. చిత్రములతోను, ఎత్తయిన శిఖరములు కలిగిన దానితోను ఆకర్షింపబడునట్టి శాస్త్రయుక్త సంఘముగా చేయుటకు వారు ప్రయత్నించుచున్నారు.
అదే మార్గమును పెంతెకోస్తు వారును అనుసరించుట మిక్కిలి చెడ్డదైయున్నది. నీవు కంజెరతో ఒక మూలను ఆత్మ నిన్ను ఆవరించియుండిన అది ఎంతో మంచిగా నిన్ను వేరుపరచెను. నీవు ఇతరమైన (స్థాపన సంఘములైన వాటితో) వాటితో పోల్చుకొను ప్రయత్నము చేయుచున్నావు, ఎందుకనగా నీవు స్థాపన సంఘమైతివి. అది జరిగించినది అదియే, చూచారా.
క్రీస్తు సంఘములు విజ్ఞాన శాస్త్రయుక్తమైనవిగా నుండుటకు ప్రయత్నించుచున్నవి. మరియు మానవుడు విజ్ఞాన శాస్త్రయుక్తముగా అభివృద్ధి పొందుటకు సాధించు కార్యములు, జ్ఞాపకము ఉంచుకొనుము, వాటి వలన, తన్ను తానే ప్రతి నిత్యము చంపుకొనుచున్నాడు. అతడు తుపాకి ప్రేల్చు మందును కనిపెట్టుటవలన, అది ఏమి జరిగించుచున్నదో చూడుము. అతడు స్వయంచోదకమును కనిపెట్టిన దాని వలన తుపాకి ప్రేల్చు మందు చంపు దాని కంటే, అధికముగా చంపుచున్నది. ఇప్పుడైతే హైడ్రోజన్ బాంబును అతడు స్వయముగా కలిగియున్నాడు. ఆశ్చర్యము, దానితో అతడు ఏమి చేయబోవుచున్నాడు? సరియే.
1COR 11:5
58మరియు అటువలె క్రైస్తవ సంఘము ఉన్నది. మానవ ఉద్దేశ్య మరియు విజ్ఞాన శాస్త్రము ద్వారా సాధించుటకు గల ప్రయత్నాలు, దేవుని నుండి ఎంతో దూరమునకు కొనిపోవుచు మొదలు ఉన్న స్థితి కంటే అధికముగా మరణము లోనికి తీసుకొని పోవుచున్నది. అది సరియే. నీవు నీ యొక్క భార్యను ఎంచుకొనిన రీతిగా నీ సంఘమును ఎంచుకొనవద్దు, చూడండి. ఏ విజ్ఞాన శాస్త్రము ఆమె ప్రవర్తనకు సహాయపడగలదు అటువంటి సంఘము నుండి నీవు తొలగిపొమ్ము. అతడు రంగులను, పౌడర్లను మరియు ఈ అన్నింటిని చేసెను. ఆయన వాక్యము యొక్క స్వభావము కలిగిన దానిని ఎంచుకొనుము.
ఇప్పుడు, స్వాభావికమైన ఈనాటి వధువును, పేరుకు మాత్రము సంఘము అని పిలువబడు వధువుతో పోల్చుదము. ఈనాడు వివాహము చేసుకొనుటకు పోవుచున్న స్త్రీకి పోల్చి - ఇప్పుడు, ఆమె కొరకు విజ్ఞాన శాస్త్రయుక్త మైనది ఏమి చేసినదో సరిగా చూడుము. మొదటిగా కత్తిరించబడిన పొట్టి వెంట్రుకలతో బయటకు వచ్చుచున్నది - జాక్ష్విలైన్ కెనడీ తల వెంట్రుకలు గల వారిలో ఒకరిగా (చూడండి?) లేక దానిని పోలిన ఏదో ఒకటిగా కలిగియుండుట చూడుము.
బైబిలు ఏమి చెప్పుచున్నదో నీకు తెలియునా? ఆమె ఆ విధముగా (వేషము ధరించిన) వుండిన యెడల, ఆమెను విడనాడుటకు అతడు కోరిన యెడల విడాకులు ఇచ్చుటకు పురుషునికి అధికారము బైబిలు వాస్తవముగా యున్నది. తన తల వెంట్రుకలను కత్తిరించుకొనుట వలన అగౌరవమైన స్త్రీగా ఆమె యగును. ఆ విధముగా బైబిలు చెప్పుచున్నది. అది నిజమై యున్నది.
దానిని నీవు ఎరుగవా, హూ? ఓ, అవును. దానిని నీవు ఎరుగకుండునట్టు కాలిఫోర్నియాలో మించి పోయిన సమయముతో నేను ప్రసంగించితిని. అది సరియే. అది నాకు ఏమి ప్రయోజనము చేయును? ఏలాగైనను వారు దానినే చేయుదురు. నీవు పందిని తీసుకొని, దానిని - గొర్రెపిల్లగా మార్చలేవు కదా.
59గమనించండి, మీరు దీని తరువాత నన్ను ద్వేషించుదురు, అయితే మీరు సత్యమును తెలిసికొనబోవుచున్నారు.
మనము దానిని పోల్చదము. ఇచ్చట ఏదైతే తాను కాదో, ఆ వేషముతో పలు రంగులతో అలంకరించుకొని ఒక ఆధునిక వధువు వచ్చుచున్నది. ఆమె ధరించిన సరకు అంతా తీసివేసి, దాని ముఖము మీద రంగులు అన్నియు కడిగి వేసినయెడల చనిపోవునంతటి భీతి కలిగి దాని నుండి పరుగెత్తి పోవుదువు.
అదే రీతిగా క్రైస్తవ సంఘము సంపూర్ణముగా థియాలజీతో కూడిన పారంపర్య ఆచార నియమములు గల పెద్ద అలంకారమును ఎదుటు కలిగియున్నది. ఇవి రెండునూ మానవ కృత్రిమ (స్వాభావిక అందము కాక) సరి కాని అలంకారమును కలిగియున్నవి, అది దేవుని వలన కలిగిన అందము కాదు. ఆ రెండింటిలోను తగినంత స్వభావము లేదు.
గమనించండి, కేవలం సాతాను ద్వారా మోసపోవుటకు అది చాలును. ఇప్పుడు ఆమెతో ఆధునిక వధువును పోల్చము. పొట్టి వస్త్రములను ధరించును, రంగులు వేసికొనును, ఆమె యొక్క వెంట్రుకలను కత్తిరించుకొని పొట్టిగా చేసికొనును, పురుషులను పోలియుండు వస్త్రములను ధరించును, మరియు సరిగా యున్నదని చెప్పుట వంటి సేవకుని మాటలు ఆమె వినును. అతడు (అటువంటి సేవకుడు) ఒక మోసకారి. రాబోవు తీర్పునందు అతడు శిక్షను పొందును. అది సరియే. ఆమె ఏదైతే కాదో, అది తానైయుండునట్లు చూపించుచు మోసము చేయుచున్నది.
60ఆ రీతిగా క్రైస్తవ సంఘము చేయు చున్నది. డి.డి., పి.హెచ్.డి., ఎల్.ఎల్.డి., కలిగియున్నది. "మా పాస్టరు అటువంటి వాడు, ఇలాంటి వాడు, మరోలాంటివాడు" అని మీరు చెప్పవచ్చును, హోట్టెన్టోట్ ఈజిప్షియన్ నైటును గూర్చి ఎరిగియున్న దాని కంటే, అతడు (ఆ పాస్టరు) దేవుని గూర్చి ఏమియు ఎరుగడు. అది వాస్తవము. ఏదో కొంత థియాలజీ సెమినరీ అనుభవము కలిగి బయటకు వచ్చెను, దేవుని గూర్చి అల్పమైన దానికంటే ఏమియు ఎరుగడు.
ఆధునిక క్రైస్తవ సంఘము రిక్కీ అనుభవము కలిగి యుండుటకు ఒప్పుకొనిన పాస్టరును మరియు, స్త్రీలకు గౌరవముగా ఇవ్వబడిన దానిని కత్తిరించుకొనిన స్త్రీలును అను సెమినరీ రంగుల అలంకారమును కలిగి యున్నది. యొజెబెలును పోలి ఎప్పుడైనా వెంట్రుకలను కత్తిరించుకొనినదియు, చొక్కాలను ధరించునదియు, ముఖముపై రంగులు పూసుకొని థియాలజీ తర్ఫీదునకు రుచికరముగా ఉండునట్లు, అటువంటి స్థితికి ఈ సంఘము తేబడినది. ఆ స్థితి యందు క్రైస్తవ సంఘము నిలువబడి యున్నది. అది వాస్తవమే. అయితే ఆమె ఆత్మీయ స్వభావము యేసుక్రీస్తు రాకడలో ఆమెను స్వీకరించు స్థితి నుండి ఎంతో దూరముగా ఉన్నది, ఆత్మీయ వధువు లేక క్రీస్తు గృహ నిర్వాహకత్వ స్వభావమునకు ఎంతో దూరముగా ఉన్నది.
61అటువంటి స్త్రీని ఒక క్రైస్తవుడు వివాహము చేసుకొనిన యెడల, అతడు కృప నుండి తొలగిపోయినవాడని చూపించుచున్నది. అటువంటి స్త్రీని (వివాహము చేసుకొనిన యెడల) ఎంచుకొనినప్పుడు దేవుని సన్నిధి యొక్క రుచి నుండియు, (ఎటువంటి గృహమును అతడు కట్టవలసియుండెనో) దూరమైన వాడగును. కాదు, అయ్యా, ఆమె క్రైస్తవ జీవితమునకు తప్పక అనుగుణమైనది కాదు. ఆమె ఆత్మీయ జీవితము క్షీణదశకు చెందిన నీచత్వమును కలిగినదై యున్నది. స్థాపన సంఘము యొక్క అలంకారము నందును, ఈ లోక కామ కోరికల యందును చచ్చిపోయినదై ఉన్నది.
ఈనాడు క్రైస్తవ సంఘము సరిగ్గా ఆ స్థలమందే నిలువబడి యున్నది. అది వాస్తవమైన విషయము. వాక్యము - అనుగ్రహించిన ఆమె శీలమును సైన్సునకు, మానవులు నిర్మించిన స్థాపన మతమునకై తనను సాతానుకు అమ్ముకొన్నది, వాస్తవముగా ఆమె దేవుని వాక్యముతో నిలువబడి దేవుని సంఘముగా నుండుటకు హక్కును కలిగియుండెను మరియు పరిశుద్ధాత్మ వలన పనిచేయుచు దేవుని వాక్యముతోను, దేవుని ప్రేమతో అతుకబడునట్టు మనమధ్య కార్యనిర్వాహియై యుండెను. దానికి బదులుగా ఆమె తన జన్మహక్కును, ఆమెకు ఇష్టమైన దానిని అంతటిని చేయుటకు స్థాపన సంఘమునకు ఏశావు వలె అమ్మివేసుకొన్నది. అది వాస్తవము. తన తల్లి నైసియా రోమ్ యొద్ద చేసినట్లు అదియు సరిగ్గా నామ కీర్తికై చేసినది. దేవుని యొక్క వాక్యము! ఓ, ఏ విధముగా అది మన పెంతెకోస్తు సంబంధమైన స్థితి లోనికి ప్రవేశించెను. అది మిక్కిలి చెడుగా నున్నది, అయినను అది దానిని చేసినది.
PHIL 2:5
62ఒక్క నిమిషము గమనించుము. కేథలిక్ సంఘమునందు గల ఒక సన్యాసిని విషయము — ఆ స్త్రీ సన్యాసిని అగుటకు ఆమె ఆఖరి ముసుగును తీసివేసి, ఆమె తన్ను సంపూర్ణముగా సంఘమునకు అమ్మివేసుకొన్నది. ఆమె ప్రాణము, శరీరము, ఆత్మయు చర్చి యొక్క ఆస్తి. ఆమెకు తన స్వంతముగా మనస్సు లేదు, ఆమె ఆఖరి ముసుగును తీసివేసినప్పుడు, ఆమెకు తన స్వంతముగా మనస్సు గాని, తన స్వంతముగా ఇష్టము గాని లేదు. సాతానుడు, తన బూటకము (అబద్దము)ను సత్యమని వారికి కలుగజేయుచున్న దానిని ఇచ్చట చూడుము. నిజమైన క్రీస్తు సంఘము, వధువు, అటువలె క్రీస్తు నందున్న అదే మనస్సును నీ యందును ఉండునట్టు ఆయనకు, ఆయన వలె వాగ్దాన వాక్యమును అమ్మివేసుకొన్నది. ఏమి ఆ వ్యత్యాసము!
ఈనాడు ఆధునిక క్రైస్తవ సంఘము, ఆధునిక ప్రపంచ క్రైస్తవ సంఘమును మనము చూచుచున్నాము. ఆధునిక ప్రపంచ క్రైస్తవ సంఘము మరియు ఆత్మీయ క్రీస్తు సంఘము కుమారులను కనుటకు రెండునూ గర్భమును ధరించినవి. అందులో ఒకటి, ప్రపంచ క్రైస్తవ ఆలోచన సభయందు ఈ దినములలో ఒక దినమందు సాంప్రదాయక స్థాపన సంఘపు జన్మము ద్వారా ఒక స్థాపన సంఘము ద్వారా ప్రపంచమునకు అంత్యక్రీస్తును ఇవ్వబోవుచున్నది. అది ఖచ్చితముగా వాస్తవమైన సత్యము. దానిని చూచుటకు నేను జీవించి యుండక పోవచ్చును. అది జరుగునని నేను నమ్ముచున్నాను. అయితే యవ్వన ప్రజలైన మీరు - ఒక దేవుని పరిచారకుడు దాని విషయమును చెప్పగా మీరు వింటిరనియు, చివరికి అది ఆ క్రూర మృగము యొక్క ముద్ర యొక్క సంఖ్యకు నడిపించుచున్నదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఆమె ప్రపంచ క్రైస్తవ సంఘముల ఆలోచన సభను ఏర్పరచినప్పుడు, అంత్యక్రీస్తు అను కుమారునికి జన్మ నిచ్చును.
63దేవుని వాక్యము వలన గర్భమును ధరించిన మరొకటి - క్రీస్తు శరీరము - సంపూర్ణ సిద్ది నొందిన క్రీస్తు శరీరము, అనగా వధువును తెచ్చుచున్నది. ఆ క్రీస్తు యొక్క శరీరము ఇంకను సంపూర్ణ సిద్దికి రాలేదు. ఎందరు ఆ విషయమును ఎరుగుదురు? ఒక పురుషుడు మరియు స్త్రీయును ఒక్కటైయున్నారు. క్రీస్తు ఒకే శరీరమును, వాక్యమునై యున్నాడు. ఆదియందు ఆదాము ఉండిన విధముగా - వధువు ఆ శరీరము యొక్క మిగతా భాగమై యున్నది, మరియు ఆ రెండునూ ఒక్కటిగా చేరినప్పుడు ఒక్క శరీరముగా మరలా ఏర్పడును. ఒక పురుషుడును అతని భార్యయు ఒక్కటై యున్నారు.
ఇప్పుడు, ఆమె, నిజ వధువు ఆయనకు అమ్మివేసికొన్నది గనుక తన స్వంత ఆలోచన కలిగిన మనస్సును ఉపయోగింప నేరదు. ఆయన మనస్సు, వాస్తవముగా, ఆయన చిత్తమై యున్నది. మరియు ఆయన చిత్తము ఆయన వాక్యమై యున్నది.
REV 3:17
64ఇప్పుడు, మనుష్యుడు ఎంచుకొనిన, పేరునకు - వధువు అని పిలువబడు దానిని చూడుము, ఆత్మీయమైనదానిని ఈనాటి స్వాభావికమైన దానికి పోల్చుము. ఆహాబు ఆధునిక యెజబెలు వలన ఆకర్షించబడెను, దానికి గల కారణము అందము ఆదిగాగల అలంకారమునకు ప్రాధాన్యత నిచ్చుటయే. క్రైస్తవ సంఘమును చూడుము, అదే రీతిగా, పెద్ద స్థాపన సంఘములకు, పెద్దకట్టడము గల దానికి, గొప్ప ధనమునకు, అధికమైన జీతాలకు తన్నుతాను అమ్మివేసికొని, జీవము దేవుని వాక్యమునకు వ్యభిచారిణిగా ఉన్నది. ప్రసంగ వేదికపై నిలుచుకొనియున్న మనుష్యులు - అది అంతయు సరిగ్గా ఉన్నది. దానితో వారిని నడువనివ్వుడి అని అనుమతించి వారిని వాటియందు బలపరచుచున్నారు. అది అంతయు సరిగ్గా మోసమే.
వాస్తవముగా అంధత్వము కలిగిన లవొదికయ సంఘ కాలము ఏలాగుండునని బైబిలు చెప్పెనో, ఖచ్చితముగా అదే రీతిగా యున్నది. "నేను ధనికురాలను, నేను రాణి వలె యున్నాను, నాకేమియు కొదువ లేదు, అని చెప్పుకొనుచున్నాము; నీవు దౌర్భాగ్యుడవును, దిక్కులేని వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరివై యున్నావని తెలిసికొనుము." ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము నందు ప్రభువు ఈలాగు సెలవిచ్చెను అని కాకపోయినట్లయితే, నేను దానిని చదివి వుండేవాడిని కాదు. ఆమె ఆ రీతిగా యున్నది మరియు దానిని ఎరుగ కున్నది.
ఈ విషయమును గూర్చి ఆలోచించుము!
65నీవు ఒక పురుషునికే గాని, స్త్రీకే గాని వీధియందు ఉండగా - నీవు పూర్తిగా దిగంబరిగా ఉన్నావని చెప్పిన యెడల, వారు - "నీవు నీ పనిని చూచుకొనుమని," వారు చెప్పెదరు. ఎందుకనగా, వారి ఆలోచనా శక్తిలో ఎక్కడో లోపము కలిగియుండునట్టు ఏ విషయములోనో (మనస్సు) తప్పియున్నారు. మరియు ప్రజలు ఏ విధముగా ఉండవలెనని నీవు దేవుని వాక్యమును చదువ గలిగినప్పుడు, మరియు మనము ఈనాడు కలిగియున్న పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము, మరియు ప్రజలు ఎందుకు, నిన్ను వెర్రివాడినిగా చూచెదరు.
నీవు వారికి, వారు తిరిగి జన్మించవలెనని చెప్పుము, వారు బైబిలును నమ్మవలెను.
66"అది కొన్ని సంవత్సరముల క్రితము ఉండిన యూదుల కల్పనా కథయై యున్నది. మా క్రైస్తవ సంఘము ఆ మార్గమును కలిగియున్నది" అని చెప్పెదరు. దౌర్భాగ్యుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును మరియు దాని గురించి ఏమి కూడ తెలియదు. ఎటువంటి…. మరియు వారు ఆలాటి స్థితి యందు ప్రవేశించుదురని బైబిలు చెప్పెను.
ఒక నిజమైన ప్రవక్త దానిని ఎప్పుడైనను చూడకుండ ఎట్లు తప్పిపోవును? నేను ఎరుగను, అది అన్ని సంఘముల లోనికి, ప్రతి చోటునకు కొట్టుకొని పోయినది. దానిని నిదానించి సరిగ్గా చూడుము. సరిగ్గా ఆధునిక స్థితి లోనికి చొచ్చినది. ప్రకటన గ్రంథము నందలి 17వ అధ్యాయములోని వయస్సు మహావేశ్య మరియు దాని కుమార్తెలు - దరిద్రులును, గ్రుడ్డి వారును, దిక్కుమాలిన ప్రజలకు దేవుని వాక్యమునకు ప్రతికూలముగా వున్న దాని యొక్క వేదాంత సిద్దాంతముల నిచ్చుచున్నది. ఆమెయందు పురుషులు, స్త్రీలు ప్రతి చోటున నెలకు కొనబడిన దాస్యమగు ప్రాణములు ఉండినట్లు వారు చూచిరి.
ప్రజలను ఆకర్షించుటకు బదులు…. క్రీస్తు తన వాక్యము రుజువుపరచును, అదే ప్రజలను ఆకర్షించును. పెద్దపెద్ద స్థాపన సంఘాల వలనను, భ్రమింపజేయు కల్పనా శక్తితో కూడిన వస్తువుల వలనను, పెద్ద పనులు, గొప్ప భారములు భరించునట్లు చూపించుట వలన ఆకర్షింపబడిన క్రైస్తవ సంఘములలో వున్న ప్రజలను ఆయన ఆకర్షించుటకు చేయుట లేదు, అయితే దేవుని వాక్యము క్రీస్తు వధువును ఆకర్షించుచున్నది.
67ఇప్పుడు, గమనించుము, ఆ క్రైస్తవ సంఘము ఏరీతిగా చక్కని గౌరవ సూచకమైన పొడవాటి అంగీని ధరింపజేయుట వలనను, గాయక సమూహము ఒకే విధముగా ఉండెడి దుస్తులను ధరింపజేయుట వలనను, వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకొని ముఖమునకు రంగులు వేసికొని యున్న స్త్రీలు తాము దూతలవలె పాడగలమని తలంచుచు వాటితో ఆకర్షింపబడుటకు ప్రయత్నించుచున్నదో, దానిని చూచుట వింతను కలిగించుచున్నది. సాతానువలె బూటకము కలిగి, రాత్రి అంతయు చుట్టు పరుగులెత్తుచు, నాట్యమునకై తిరుగులాడుచు, తాము ఏ వేషము ధరించి గాయక సమూహముగా దేనిని పాడిరో, దాని విషయమును ఏమాత్రము ఆలోచింపరు. వారు తలంచునది ఏదో అది సరియైనదని, అదే అందమైనదని వారు ఎంచుకొనుచున్నారు. అయితే మీరు చూడండి, అది తప్పుడు పద్దతి — అది దేవుని వాక్యము కాదు.
ISA 53:2
68నిజమైన వధువు దేవుని వాక్యమును గైకొని నడచుట వలన దేవుని ప్రసన్నతను ఆకర్షించుచున్నది.
ఇప్పుడు గమనించుము, మనము క్రీస్తును ఇప్పుడు గమనించెదము. నీవు "మంచిది, ఒక నిమిషము ఆగుము, నీవు మాటలాడుచున్న ఈ అందమును గూర్చిన విషయమేమి?" అని మీరు అడుగుదురు. యేసు వచ్చునప్పుడు ఆయనయందు మనము అపేక్షించునట్టుగా సురూపమైనను సొగసైనను లేకుండెనని, బైబిలులో యెషయా గ్రంథము 53:2లో చెప్పబడెను. అది వాస్తవమేనా? అందమైనను సొగసైనను లేకుండెను. సాతానుడు ఈనాడు ఉండినట్లుగా ఆయన ఈ లోక అందమును కలిగి వచ్చి యుండిన యెడల, ప్రజలు ఈనాడు తమ స్థాపన సంఘముల యెడల జరిగించినట్లు ఆయన చుట్టూ తిరుగుచు ఆయనను అంగీకరించి యుండెడి వారు. వారు సాతాను యెడల చేయుచుండినట్లు ఆయన యందు విశ్వాసము వుంచి, ఆయనను అంగీకరించి యుందురు. వాస్తవముగా వారు ఆ విధముగా చేసి యుందురు.
ఆయన అలాంటి అందమును కలిగి రాలేదు. అయితే స్వభావము అను సౌందర్యమును కలిగి ఎల్లప్పుడును వచ్చు చుండును. క్రీస్తు సొగసైన, గొప్పదైన, దృఢమైన, బలమైనవానిగా వుండియుండ లేదు. దేవుడు ఆ రకమైన (లోక సంబంధమైన సొగసును) దానిని ఎంచుకొనడు.
1SAM 16:7-13
69ఒక కాలములో ఒక ప్రవక్త రాజును తీసికొనుటకు, యెషయి కుమారులలో ఒకనిని రాజైన సౌలు స్థానములో రాజుగా చేయుటకు అతడు వెళ్లిన సంగతి నేను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచున్నాను. మరియు కావున యెషయి - ఎత్తయిన, బలము కలిగిన, చక్కని పడుచు వానిని బయటకు తీసుకొనివచ్చెను - "అతని శిరస్సు మీద కిరీటము పెట్టిన మిక్కిలి సౌందర్యముగా నుండి ఒప్పదగినవాడుగా నుండునని" చెప్పెను.
అప్పుడు ఆ ప్రవక్త అతనిపై ఆ అభిషేక తైలమును పోయుటకు వెళ్లేను; కాని "దేవుడు అతనిని నిరాకరించెను" అని అతడు చెప్పెను. మరియు అతని ఎదుటు నిలువబెట్టబడిన వారందరిలో ప్రతి ఒక్కరిని నిరాకరించెను, చివరికి అతడు వంగిన భుజములను గలిగి, ఎర్రగా కనబడు ఒక చిన్నవాని యొద్దకు వచ్చి, అతనిపై ఆ అభిషేక తైలమును పోసి - "దేవుడు ఇతనిని ఎంచుకొనెను" అని చెప్పెను. చూడుము, మనము చూపును బట్టి ఎంచుకొందుము, దేవుడు స్వభావమును (గుణ లక్షణమును) బట్టి ఎంచుకొనును.
స్వభావము — యేసుక్రీస్తు స్వభావము కలిగినటు వంటి స్వభావము లేదు. అది ఆయనలో జీవించుచున్నది, ఆయనలో అది ప్రత్యక్షమగుచున్నది. సత్యమని మనము చూచుచున్నాము. ఆయన వధువును ఆకర్షించుచున్నది, లోక సంబంధమైన సొగసు కాదు; అది ఆయన యందు ప్రత్యక్ష పరచబడిన (గుణము) స్వభావము, యేసుక్రీస్తు సంఘము యొక్క స్వభావము కొరకు చూచుచున్నాడు. కాని పెద్ద కట్టడములను, గొప్ప స్థాపన సంఘములను, ఎక్కువ సభ్యత్వము కలిగిన దానిని ఆయన లక్ష్యపెట్టడు. వాస్తవముగా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడుకొనెదరో అచ్చట నేను వారిని కలసికొందునని ఆయన వాగ్దానము చేసెను. నిజముగా, ఒక నిజవిశ్వాసి నిలయము, నిరీక్షణ దేవుని వాక్యముపై యున్నది, అది ఏమై యున్నదో ఆ సత్యమును అది నిరూపించుచున్నది. తన వాక్యము వలన ఎంచుకొనును.
అది సత్యమును నిరాకరించి, లోకమును ప్రేమించు గుంపు కాదు. ఆమె ఆయన నుండి విడనాడబడినది అనుటలో ఆశ్చర్యము లేదు, ఏలయనగా ఆమె ఆయన ప్రత్యక్షతను పోగొట్టుకొనినది, మరియు ఆమె దానిని కలిగియుండ నేరదు. దాని విషయమును గూర్చి ఆయన చింతించడు. ఆమె ప్రవర్తన, చేయు క్రియలను కనుపరచు మార్గము, ఆమె లోక రీతిగా ఎంతగా అలంకరించుకొని యున్నను.
70ఆమె స్వభావము, క్రీస్తు యొక్క స్వభావమును కలిగియుండు దాని కొరకై ఆయన చూచుచున్నాడు.
ఇప్పుడు, కొంత సమయము ఆగుము. ఆ విధముగా సరిగ్గా ఆయన చేయును. ఆయన స్వభావమును ప్రతిబింబింప జేయునటువంటి వధువును ఆయన ఎంచుకొనుచున్నాడు, ఆయన ఈ సంకల్పమునకు ఈనాటి ఆధునిక క్రైస్తవ సంఘములు వాస్తవముగా లక్షలాది మైళ్ల దూరముగా తప్పి పోయారు, ఏలయనగా దీనిని సత్యమని వారు (ఎరుగక) తిరస్కరించుచున్నారు. కాబట్టి అది ఎట్లుండ గలదు?
ఇప్పుడు, ఆయన (హెబ్రి 13:8) వధువు ఖచ్చితముగా ఆయన ఏ విధముగా రూపొందు దినము కొరకు కనిపెట్టుకొని యున్నాడు - ఆయన అదే మాంసమును, అవే ఎముకలును, అదే ఆత్మను అదే అన్నియుగా, ఆయన ఏ ఏ విధముగా ఉన్నాడో — ఆ విధముగా సరిగా నిర్మింపబడేనో — అట్టి రీతిగా వారు ఇరువురు నిర్మింపబడినప్పుడు, వారు ఒక్కరిగా అయ్యెదరు. క్రీస్తు సంఘము ఆ రీతిగా అయ్యేంత వరకు, వారు ఒక్కటిగా ఉండలేరు. ఆయన యొక్క స్వభావము, ఈ కాలము యొక్క వాక్యము, తప్పక రూపొందబడి, ఆమె ఆయనను పోలిన స్వభావమునకు తప్పక రూపొందబడవలెను.
71ఇప్పుడు, నేను ముగించుటలో ఈ విషయములను ఎందుకు చెప్పవలెనని కోరితినో, దాని కారణములను తెలియజేసి నేను ముగించెదను. క్రితము రాత్రి సుమారు 3 గంటల ఉదయ కాలమందు, నేను మేలుకొనియుంటిని. నేను ఎప్పుడైనా ఏదైనా ప్రభువు నామమున చెప్పియుంటిని, అయితే అది ఏది వాస్తవమై యుండెను గదా? దానికి జవాబు ఇవ్వడానికి మీలో ఎవరినైనా నేను ఇప్పుడు తీసుకొనెదను. అది ఎల్లప్పుడును వాస్తవమై యుండెను. కావున నాకు సహాయపడుడి. అది సత్యమని దేవుడు ఎరుగును. ఆయన చెప్పిన వేలకొలది వాటిలో ఏ ఒక్కటైనను, ఎక్కడైనను ఆయన ఎన్నడును తప్పిపోలేదు, అన్ని సమయములలో చెప్పబడిన రీతిగా తప్పిపోకుండా సరిగ్గా జరిగెను.
మరొక దినమందు (సుమారు ఒక సంవత్సరము క్రిందలు) నేను ఫోనిక్స్ లో ఉండినప్పుడు మీతో ఆ విషయమును గూర్చి చెప్పితిని. "అయ్యలారా, ఇది ఏ సమయము," అను దానిపై వర్తమానమును, మరియు ఏడుగురు దూతలు అచ్చట కూడుకొని యుండుటయు, మరియు ఏడు ముద్రలు విప్పబడియుండుటను గూర్చి… ఆకాశము లోనికి, 30 మైళ్లు ఎత్తు లోను, 27 మైళ్ల విస్తీర్ణము గలదిగా ఎక్కి పోవుటను - అదేమై యున్నదో, అదివారు ఎరుగని దృశ్యముల చిత్రములతో "లైఫ్" మ్యాగజీన్ అంతటను క్రమ్మి యుండెను - ఇప్పటికిని అది ఏమైయున్నదో వారు ఎరుగలేదు.
ఈ రాత్రి ఈ భవనములో సరిగ్గా ఇక్కడ కూర్చుండి యుండిన మనుష్యులు అది సంభవించినప్పుడు, నాతో కూడ అక్కడ నిలువబడి యున్నారు, అది చెప్పబడిన రీతిగా సరిగ్గా ఖచ్చితముగా ఆ విధముగా ఉండెను. ఈ గొప్ప అగ్నిజ్వాల ఏవి జరుగనైయున్నవో, వాటి విషయమును ఆయన నాకు తెలియజేసెను. ఆ ప్రతియొక్క ముద్ర ఎట్ల విప్పబడినది, యుగయుగముల నుండి మరుగైయున్న మర్మములు, సంస్కర్తల యొక్కయు ఆదిగా గలవి, సరిగ్గా వాటి సంపూర్ణ స్థితిని.
72నేను ఆ పర్వతము మీద ఒక మనుష్యుని వలె ఎటు నిలువబడి యున్నది, ప్రస్తుతము ఇక్కడవున్న ముగ్గురు లేక నలుగురు అచ్చట, అవును మరి దాని కంటే అధికముగా నిలువబడి యుండిన వారిని గూర్చి చెప్పబడినవి, సరిగ్గా అవి చూపించబడిన రీతిగానే సంభవించెను. పర్వతము మీదికి పోవుచున్నాము, "ఆ బండను తీసుకొనుమని పరిశుద్ధాత్మ చెప్పెను. (మేము వేటాడుచుంటిమి) దానిని ఆకాశమునకు విసిరి వేయుము అని, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పమని అతడు చెప్పెను.
నేను చేసితిని. కుప్పే (గరాటు గొట్టము) వలె ఒక చిన్న వీచుచున్న వాయువు క్రింద నుండి అచ్చటకు వచ్చెను. మరియు " 24 గంటలలోపుగా దేవుని హస్తము నీవు చూచెదవు" అని నేను చెప్పితిని.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనుష్యులు అక్కడ హాజరుగా నుండెను, మరునాడు సుమారు 10 గంటలకు అచ్చట నిలువబడి యుంటిమి. "సిద్ధముగా నుండుము, అచ్చటనున్న కారు క్రిందకు వెళ్ళుము." (బహు కాల అనుభవము గల వాడు), అని నేను చెప్పితిని, "ఏదో సంభవింపబోవుచున్నది," అని నేను చెప్పితిని. ఆకాశము నిర్మల మైనదిగా వుండెను. ఆకాశము నుండి సుడిగాలి వలె అగ్ని క్రిందికి పెద్ద ప్రవాహ కృతమైన నదిగా గొప్ప శబ్దముతో తిన్నగా నా మీదుగా గోడలను బలముగా మొత్తినట్లుగా వచ్చెను, నేను సరిగా దాని క్రింద నిలుచుకొని యున్నాను. నేను నా టోపీని తొలగించి, నా తలను పట్టుకొని యుంటిని. నా తలకు మూడు లేక నాలుగు అడుగుల ఎత్తున నా పైకి వచ్చి నా చుట్టూ సరియైన పరిమాణము గల కందకముగా చెక్కింపబడిన గోడల వలె వడి గాలి దెబ్బ బట్టితో చేయబడి, ఆకాశమునకు తిరిగి పోయి, సుడిగాలి వలె మరల నా చుట్టూ ఆవరించుచు ఇట్లు మూడు సార్లు క్రిందికి వచ్చుట జరిగెను, 200 గజముల వరకు గల దోమల పొదల పై భాగము కూడ తెగ వేయబడినది. దానిని వినినవారు " ఆమేన్" అని చెప్పుదురా? అది జరిగినప్పుడు వారు అక్కడ ఉన్నారు, చూచారా.
మూడుసార్లు ఆ వడి గాలి (వీచినప్పుడు కలిగిన) బట్టి (ప్రేల్చు) శబ్దమును కలిగించెను.
73వారు కారుల క్రింద నుండి బయటకు (వెలుపలకు) వచ్చినప్పుడు, మరియు తమ్మును మరుగు పరచుకొనినవాటన్నిటి నుండి అచ్చటకు కూడి వచ్చినప్పుడు - "అది నిన్ను (మొత్తినపుడు) తాకిన యెడల నీవు ఆ స్థలము ఉన్నట్లు ఒక మచ్చ అయినను ఉండదు," అని చెప్పిరి.
"అది ఆ విధముగా జరుగదు… అది ఆయనయే యుండెను. ఆయన నాతో మాట్లాడుచుండెను. సుడి గాలి ద్వారా దేవుడు మాట్లాడుచుండెను, చూచారా.
మరియు అచ్చట వ్రేలాడుచున్న ఆ చిత్రములో మీరు చూచుచున్నది అదే అగ్ని స్తంభము. మరియు అది పైకి వెళ్లినప్పుడు "అదేమిటి?" అని వారు చెప్పిరి.
"పశ్చిమ తీరమును న్యాయతీర్పు మొత్తబోవుచున్నది" అని నేను చెప్పితిని. ఆ సమయము నుండి రెండవ దినమున అలస్కా మునిగి పోవునట్టుగా ఉండెను. చూడుము, ఒకసారి అది అచ్చట ఒక దెబ్బ కొట్టినది, మొదటి ప్రేలుడు అచ్చట…
దానికి చిహ్నముగా నీవు ఏదైనా చేయవలయును. ఒక మనుష్యుడు ఒక కూజాలో కొంత ఉప్పును వేసి, దానిని నీళ్లలో విసరివేసి, ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చెను? "ఈ నీళ్లు తియ్యగా, అగును గాక" అని చెప్పిన విధముగా, మరొకటి యేసు నీళ్లను తీసుకొని కూజాలో పోసి, మరియు, అందులోనుండి ద్రాక్షారసమును కలుగజేసినట్టు నీవును ఏదైనా దానికి (గురుతు) చిహ్న రీతిగా చేయవలసియున్నది,
అదే ఆకాశమునకు వెళ్లినది, అది ఈ చిన్న సుడిగాలి వలె క్రిందికి వచ్చుటకు ప్రారంభించెను. పర్వతముల వరుస చుట్టు చీలిక ఏర్పడు వరకు ఆ పర్వతము 24 గంటలలో కంపింపబడునట్టు అది చేసినది.
74ఇచ్చట కూర్చుండి తిన్నగా నా వైపుచూచుచున్న రెవ. బ్లయర్ అక్కడ ఉండెను, అతడు దాని యొక్క కొన్ని ముక్కలు, మొదలైనవి తీసికొనెను. ఇక్కడ నిలువబడియున్న టెర్రీ సోత్మాన్, బిల్లీ పాల్ మరియు సహోదరుడు, కొందరు… ఇతర అనేక మంది ఇక్కడ కూర్చుండి, చీల్చబడినప్పుడు అచ్చట ఉండిరి. అది ఒక కల్పితమైనది కాదు, అది సత్యమైనది.
గత బైబిలు దినములలో అది లేకుండెను, ఇప్పుడు ఉన్నది, చూచారా. అదే దేవుడు ఎల్లప్పుడు వీటిని చూపించుచుండెను, అవి శబ్దర్ధముగా నెరవేరుచు వచ్చెను, అవి ఎన్నడును ఒక్క సమయమునందును తప్పిపోలేదు. ఇప్పుడు, నేను ఆయనను కొనియాడుదును.
75కొన్ని వారముల క్రిందట నేను ఒక దర్శనము నందుంటిని, మరియు నేను ఒక ఎత్తయిన స్థలము నందు నిలువబడి యుంటిని మరియు క్రీస్తు సంఘము యొక్క రాబోవు దృశ్యమును నేను చూచుటకు ఉంటిని. పశ్చిమమునకు నా ముఖమును త్రిప్పుకొని, ఈ విధముగా నేను నిలువబడి యుండి ఆమె వచ్చుచుండుటను చూచితిని. వాస్తవముగా చక్కని దుస్తులు ధరించి, వెనుక (వీపుపైన) చక్కగా వ్రేలాడుచున్న పొడవైన వెంట్రుకలను కలిగి, మోకాళ్ల క్రిందకి వ్రేలాడుచున్న అంచులు గల దుస్తులు ధరించి, చిరునవ్వుతో కూడిన సుందరమైన స్త్రీల సమూహము సేనల వలె నడుచుచు" సిలువతో యుద్దమునకు ముందుగా పోవుచున్న రీతిగా ముందుకు సాగిపోవు క్రైస్తవ సైనికులారా, ముందుకు సాగి పోవుదము" అను గీతముతో పాడుచుండిరి.
వారు నా ముందు పోవుచు, నన్ను దాటి పోయిరి, అచ్చటనే నేను నిలువబడి యుంటిని. అచ్చట ఏదో ఉండెను… ఆత్మ, దేవుడు. "అచ్చట వధువు ఉన్నది" అని ఆయన చెప్పెను. నేను (అది) చూచితిని, నా హృదయము సంతోషభరితమాయెను. మరియు ఆమె ఈ మార్గమును చుట్టి వెళ్లినది మరియు నా వెనుకను చుట్టి నన్ను దాటిపోయెను.
మరియు కొంత సమయము తరువాత ఆమె ఈ మార్గమున తిరిగి వచ్చెను, "ఇప్పుడు, ఆధునిక సంఘము ముందుగా బయులు పరచబడును" అని చెప్పబడెను. ఆసియా క్రైస్తవ సంఘము వెలువడెను. అటువంటి మలినమైన అటువంటి దానిని నేను ఎన్నడునూ చూడలేదు! ఇక్కడికి వేర్వేరు దేశముల నుండి ఇతర క్రైస్తవ సంఘములు వచ్చుచున్నవి, అవి చూచుటకు భయంకరముగా ఉండెను.
76దేవుని పక్షముగా సత్యమునే చెప్పునట్టి విధిని కలిగి యున్నాను గనుక నేను మీకు చెప్పుచున్నాను. "అమెరికా యొక్క క్రైస్తవ సంఘము యొక్క దృశ్యము ముందుగా బయలుపరచబడబోవుచు ఇక్కడికి వచ్చుచున్నదని ఆయన చెప్పినప్పుడు, నేను ఎప్పుడైనా దయ్యముల గుంపును చూచినానంటే, అది అదే!
అది స్త్రీలు ఏనుగు యొక్క ఆచ్చాదనపు రంగును పోలిన వస్తువగు పురాతన ధూమ్రవర్ణపు చూపుతో దిగంబరులుగా నుండి, తమ ఎదుటి భాగము నందు ఏ మాత్రము పై వస్త్రమును కలిగియుండలేదు, మరియు వారు మెలికలు, మెలికలుగా తిరుగుచు నాట్యమాడు సాధనములను కలిగి, సంగీత నాదము వినిపించుచుండగా దాని ప్రకారము ఇక్కడ ఉన్న చిన్న పిల్లల వలె నాట్యమాడుచుండిరి. మిస్ యు.యస్.ఎ., వచ్చుటను నేను చూచినప్పుడు ఇంచు మించుగా మూర్చిల్లితిని.
ఇప్పుడు, ఇది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనునదై యున్నది. ఆయన సేవకుడనై యున్నానని మీరు నన్నునమ్మిన యెడల, ఇప్పుడు మీరు నన్ను నమ్ముడి. నేను ఈ లోకమందు ఏదియు వ్యర్ధముగా చెప్పను. అది సత్యము కాదని నాచేత చెప్పించుటకు ఈ లోకములో ఉన్న ధనము సరిపోదు.
మరియు ఆమె వచ్చుచున్నపుడు, నేను ఎన్నడును చూడని అసహ్యమైన చూపును ఆమె కలిగియున్నది. "దేవా, బోధకులును, సహోదరులగు మేము ఎంత మంచిగా చేయవలెనో, అంతగా కష్టపడి నీకు వధువును తెచ్చుటకు అలయక కష్టపడుదుము" అని నేను తలంచితిని!
ఆమె హూలా? దుస్తులను అనగా హువాయిన్ — స్త్రీలు నాట్యమాడునప్పుడు ధరించు ఒక రకమగు దుస్తులలో ఒకటి ధరించినదై, శరీరమును మెలికలుగా వంపుగా చేయుచు ఎదుటి భాగమును, క్రింది భాగమును నాట్యమాడుటకు తగినట్టుగా ఆదుస్తులను (హూలా షర్టులను) కలిగియుండి, పామరులు అసహ్యముగా (నీచముగా) నాట్యమాడిన రీతిగా ఆమె తన శరీరమును మెలికలుగా త్రిప్పుచు వచ్చుచున్నది. అదే అమెరికా యొక్క క్రైస్తవ్య కన్యక అయియున్నది.
77గనుక దేవుని సహాయము వలన, నాకు సహాయము కలుగనిమ్ము ఆయన ముఖము నందు అదే చూచునట్లుగా కనబడుచున్నది. నేను సరిగ్గా… నేను మూర్చిల్లి యుందును.
ఉపదేశించుట వలన, వారిని వెంటాడుచు ప్రయత్నించుట వలన వారిని త్రిప్పుటకు నేను ఆలోచించితిని. వారిలో ప్రతి ఒక్కరును కత్తిరించిన పొట్టి వెంట్రుకలతోను, మరియు శరీరములను వంపుచేయుచు ఎదుట వీపు భాగమును మూసినట్టుగా పట్టుకొని నడచుచుండిరి. నేను అ సహజాతితమైన ఆయనతో నిలువబడిన స్థలము చుట్టూ వచ్చిరి. ఆయనను నేను చూడ లేకున్నాను — నాతో ఆయన మాట్లాడుటను మాత్రము వినగలుగుచున్నాను. ఆయన నా చుట్టూ ఆవరించి యుండెను. అయితే వారు ఈ మార్గము వైపు తిరిగినప్పుడు, హూలా వంటిది వారు పట్టుకొని యుండిరి… వంపు కలిగిన శరీరముతోను, నవ్వుచు దానిని ఎదుటి భాగము నందుంచుకొని మోయుచు పోవుచుండిరి.
ఇప్పుడు, ఆయన సన్నిధిని అచ్చట, ఆయన సేవకుడనగు నేను నిలువబడి యున్నాను, వారిని తిన్నని మార్గమునకు నడిపించుటకు నా శక్తి కొలది నేను చేయ గలిగినంత మంచితనముతో చేయుటకు నేను ప్రయత్నించితిని. "దేవా, అది నాకు ఏమి మంచి కలిగించినది? అది నాకు ఏమి మంచి కలుగ జేసినది? — వారంతా రోదన చేయుచున్నారు, వేడుకొనుచున్నారు మరియు వెంటాడుచున్నారు, వారికి నీవు గొప్ప సూచనలను మరియు అద్భుత కార్యములు, చమత్కారములు చూపించితివి? మరియు నేను అచ్చట ఎట్లు నిలువబడితిని, వారికి బోధించిన తరువాత, వాటి అన్నింటి విషయమై ఇంటికి పోయి, ఎట్లు రోదన చేయగలను, అది నాకు ఏమి మంచి కలిగించినది? అటుపిమ్మట నీ కొరకు, ఒక వధువు కొరకు ఏదైనా అర్పించవలెను," అని నేను తలంచితిని.
78నేను అచ్చట నిలువబడి, ఆమె వెళ్ళుటను నేను చూచుచుండగా, ఆమె వెనుక భాగమున ఏమియు లేకుండెను, నీవు ఆలోచించుము - ఆమె తన ఎదుటి భాగమును దీనితో (హూలా దుస్తులతో) పట్టుకొని, కృత్రిమ ప్రకాశముతో తన శరీర మందలి అవయవములు వెలుపలికి చొచ్చుకొని వచ్చునట్టుగా వంపు శరీరముతో వెళ్లుచుండెను. ఓ, అది ఎంత నీచముగా నున్నది - అట్లే ఆమె తన శరీరమును కదిలింప జేయుచు ప్రవర్తించుచున్నది!
"దాని భావమేమి, బ్రెన్హాం సోదరుడా?" అని అడుగుదురు. అది నేను ఎరుగను. నేను ఏమి చూచితినో సరిగా అది మాత్రమే నేను చెప్పుచున్నాను.
ఆమె ఆ రీతిగా వెళ్ళుట నేను చూచినప్పుడు, ఓ, వాస్తవముగా నాకు మూర్చ వచ్చినట్లు ఆయెను. అప్పుడు నేను సరిగా చుట్టూ చూచుటకు తిరిగితిని. అప్పుడు, "దేవా నేను దోషిగా చేయబడితిని. కాబట్టి నేను చేయు ప్రయత్నముల వలన ఏమి ప్రయోజనము లేదు. నేను మౌనముగా నుండుట మంచిదని" నేను తలంచితిని.
మిస్సెస్. కార్ల్ విలియమ్స్, నీవు ఇచ్చట కూర్చుండియుండిన యెడల కొంత సమయమునకు ముందు క్రితము రాత్రి యందు వచ్చిన స్వప్నము నాకు తెలియజేసినది, అది నిన్ను తొందర పరచుచున్నది, అదేమనగా, నా చేతి నుండి స్టీరింగ్ వీల్ తీసివేయబడెను.
79అప్పుడు, దానివిషయము ఆలోచించి, నేను మరచి పోతిని. నేను వెళ్లిపోతిని. అటు పిమ్మటు వెనువెంటనే వారు (తిరిగి) మరల వచ్చుట నేను వింటిని. ఈ మార్గమున చుట్టూ వెళ్లిన అదే వధువు ఈ ప్రక్కను వచ్చు చుండెను. పడుచు స్త్రీలు ఇచ్చటకు మరలా వచ్చుచుండిరి మరియు వారిలో ప్రతి ఒక్కరును ఏ దేశముల నుండి వచ్చిరో - స్వీట్జర్లాండ్, జర్మని మొదలైన - వారి దేశ వస్త్రములను ధరించి యుండిరి. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన దుస్తులను దరించి. అందరును పొడవైన వెంట్రుకలను కలిగి, సరిగా ప్రధమమున ఉన్న దాని వలె ఇక్కడకు, క్రైస్తవ సైనికులారా ముందుకు సాగిపొమ్ము" అను అర్థము నిచ్చుగీతమును పాడుచు నడచుచు ఇచ్చటకు వచ్చుచుండిరి.
మేము నిలువబడి యున్న ప్రదర్శింపబడబోవు దృశ్య స్థలమును వారు దాటినప్పుడు, ప్రతి వారి కన్ను సరిగా ఆ మార్గమున వెల్లెను, వారు వెనుకకు తిరిగి సైనికుల వలె నడచుచు వెళ్లిరి. వారు ఆకాశమునకు తిన్నగా పైకి పోవుచుండగా, ఈ మరొకటి పర్వతము యొక్క తీరమునకు వెళ్లి, ఆ రీతిగా క్రిందికి పోయిరి. ఆకాశము లోనికి నడచుచు వెళ్ళుటకు బయలు దేరిన వారు ఎక్కి వెళ్లిపోయిరి.
మరియు ఆ విధముగా ప్రయాణము చేయుచు నడచుచున్నవారిలో వెనుకనున్న ఇద్దరు పడుచు బాలికలు — వారు స్వీడన్ లేక స్విట్జర్లాండ్ లో మరెచ్చటనుండో వారో, పరదేశస్థులైన పడుచు బాలికలు, వారు చుట్టు ప్రక్కల చూచుచుండుట నేను చూచితిని. "ఆ విధముగా చేయవద్దు!" అని నేను చెప్పితిని. "దానిలో నుండి బయటకు రావద్దు!" అని నేను అరచితిని. ఆ రీతిగా నేను కేక వేయుచు, నా చేతిని బైటకు ఈ విధముగా చాచి నిలువబడినట్లుగా నా దర్శనమునకు వచ్చితిని. "మంచిది…" అని నేను తలంచితిని.
80అందువలననే నేను ఏమి కలిగి యుంటినో ఈ రాత్రి నేను చెప్పితిని. నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగ కోరుచున్నాను. మనము తలంచిన దాని కంటే అది ఆలస్యముగా నుండునా? ఇది వరకే ఆమె పిలువబడి, ఎంచుకొనబడి, ముద్రింపబడి యుండునా? ఒక్కరును అధికముగా లేరు, నీవు ఎరుగుదువు. అది సాధ్యమా? ఓ, అవును, ఓ,
ముందు దినము ప్రాతఃకాల భోజన సమయమందు నేను ఏమి చెప్పితినో జ్ఞాపకము చేసికొనుడి. మగ, ఆడ ఉత్పత్తి కలుగజేయు పుష్పరజస్సులో ఒక లక్ష క్రిములును, ఒక లక్ష అండములును వెలువడును అయితే వాటిలో ఒకటి మాత్రమే జీవము కలిగియుండును, అయినను అవి అన్నియూ ఒకే మాదిరిగా ఉండును. పదిలక్షలో ఒకటి మాత్రమే. వాటిలో ప్రతి ఒక్కటియు అదే మాదిరి అండము, అదే మాదిరి బీజ క్రిమిగా నుండును. వాటిలో ఒక్కటి మాత్రమే జీవించును; మిగిలినవి చనిపోవును. ఎవడును ఏది పరిపక్వమై యున్న అండము అని చెప్పజాలడు. దేవుడే దానిని నిర్ణయించవలెను. కలుగబోవునది మగ పిల్లవాడా లేక ఆడ పిల్లా, తెల్లగానా (సొగసుగా) లేక కొంత ఛాయ తక్కువగా లేక అది ఏమిగా నుండబోవుచున్నదో, దేవుడే దానిని నిర్ణయించును. మొదటిగా వచ్చి కలియునది కాదు గాని, దేవుడే దానిని నిర్ణయించును. ఇక్కడకు ఒకరు రావచ్చును మరియు ఒకరు… అవి ఒకటిగా కూడు కొనుటను గాజు పరీక్ష గొట్టము నందు నీవు ఎప్పుడైనా చూచి యుండినయెడల — దానిని నేను కనిపెట్టి చూచితిని. దేవుడే దానిని నిర్ణయించవలెను. వాటిలో ప్రతి ఒక్కటియు ఒకే మాదిరిగా ఉన్నవి, అయితే ఎన్నుకొనుట వలననే — స్వాభావిక జన్మము ఎన్నిక వలన కలిగినది — దేవుడు పది లక్షలలో నుండి ఒక దానిని తీసుకొనును.
1COR 10:2,3
81ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు ఐగుప్తును విడచి వెళ్లిన వారు ఇంచుమించు రెండు లక్షల ప్రజలు. వారిలో ప్రతి ఒక్కరును అర్పింపబడిన గొర్రెపిల్ల (రక్త నిబంధన) క్రింద నుండిరి, లేనిచో వారు జీవించియుండేవారు కారు. వారిలో ప్రతి ఒక్కరును ప్రవక్తయైన మోషే మాటను వినుచుండిరి. అతని బట్టి వారిలో ప్రతి ఒక్కరును ఎర్ర సముద్రములో బాప్తిస్మము పొందిరి. వారిలో ప్రతి ఒక్కరును ఆ సముద్ర తీరమున, దేవుడు శత్రువులను నాశనము చేసినప్పుడు, మిరియాముతో కలసి వారి స్త్రీలు పైకి, క్రిందికి దుముకుచు నాట్యమాడిరి. వారిలో ప్రతి ఒక్కరును మోషేతో నిలువబడియుండిరి. మరియు అతడు ఆత్మ యందు పాడుచుండగా వారు వినిరి. వారిలో ప్రతి ఒక్కరును అరణ్యములో ఆకాశము నుండి కురిపించ బడిన మన్నాను భుజించిరి — ప్రతి రాత్రి క్రొత్త మన్నా, అది వర్తమానమునకు సాదృశ్యముగా నున్నది. వారిలో ప్రతి ఒక్కరును దాని నుండి భుజించిరి. అయితే, ఆ రెండు లక్షల మందిలో నుండి ఎందరు (నిలువబడిరి) దేవునికి ఇష్టులుగా నుండ గలిగిరి? ఇద్దరు. పదిలక్షలో ఒకరు!
ఈ రాత్రి కేథలిక్లు మరియు అందరిని లెక్కించిన యెడల సుమారు ఐదు వందల మిలియనుల తెలియజేయబడుచున్నది. పేరుకు క్రైస్తవులు అనబడువారు ఐదు వందల మిలియనుల మంది ఉన్నారు. ఎత్తబడుట ఈ రాత్రి వచ్చిన యెడల, దాని అర్థము ఒక మిలియనులో నుండి ఒక్కరు అని లెక్కించిన (అది ఆ రీతిగా ఉండునని నేను చెప్పుట లేదు, కాని ఆ రీతిగా ఉండిన యెడల), ఐదు వందల మంది మరుసటి (తరువాత) ఇరువది-నాలుగు గంటల పిమ్మట కనబడకపోదురు. దాని విషయము నీవు ఎన్నడును (ఎరుగవు) వినియుండవు. అనేకులు కనబడక పోవుదురు, ఎలాగైతే ఏమి నీవు దానిని లెక్కించుటకు కూడ ఆలోచించవు.
MATT 17:10,12•
MARK 9:11,13
82అప్పుడు అది ఆ విధముగా వుండును, స్నేహితులారా, బాప్తిస్మము ఇచ్చు యోహాను వచ్చినప్పుడు జరిగినట్లుగానే మనకు సంభవించగలదు.
శిష్యులు కూడ, "ఏలియా ముందుగా రావలెనని, మరియు సమస్తమును చక్కపెట్టునని ఎందుకు లేఖనములు చెప్పుచున్నవి అపొస్తలులు చెప్పుచున్నారు, ప్రవక్తలు చెప్పుచున్నారు?" అని అడిగిరి.
అందుకు ఆయన, "అయినను ఏలియా ఇది వరకే వచ్చెను, మీరు దానిని ఎరుగకున్నారని" చెప్పెను. ఈ దినములలో ఒక దినమందు ఇచ్చట కూర్చుండినట్లుగా మనము ఇక్కడ విడువబడుదుము. "మహా శ్రమల కాలము ప్రవేశించుటకు ముందు ఎరుగవలసిన ఎత్తబడుట ఏమైనది?" అని వారు అడుగుదురు.
83ఆ శరీరమంతయు ముద్రించబడి, సరిగ్గా ద్వారము యొద్ద సిద్దముగా ఉంచబడినది. ఆ రీతిగా వుండునని నేను చెప్పుట లేదు. ఆ రీతిగా ఉండదని నా నమ్మిక.
అయితే, స్నేహితుడా, మీరు అనుమతించినప్పుడు… ఈ రాత్రి మన హృదయములలో మన జీవితములను సరిచేసికొనవలసిన చింత కలిగినయెడల, మరియు మనము ఏదేని చేసినయెడల పరిచార సహోదరునిగా మీకు బుద్ధి చెప్పనిమ్ము…. ఇది ప్రథమముగా ప్రసంగ వేదికయందు దీనిని చెప్పబోవుచున్నాను. నేను ఎప్పుడైనా ఏదైనా సమాజమునకు ముందు తెలియజేసిన దాని కంటే ఈ రాత్రి ఎంతో ఎక్కువ విషయములను తెలియజేయుచున్నాను, ఏలయనగా ఈ సభల యందు నేను గొప్ప స్వాతంత్ర్యము కలిగియుంటిని. నేను దేవుని ప్రవక్తనని మీరు విశ్వసించిన యెడల, నేను మీతో చెప్పినది వినుడి. ఒకవేళ మీ హృదయములలో ఒక చిన్న ధ్వని మనస్సున కలిగినయెడల, దేవుని సన్నిధికి నేరుగా ఇప్పుడే వెళ్ళుము. నీవు దానిని చేయుము.
84ఒక నిమిషము ఆగుము. మీరు సేవించుచున్న మతమును గమనించుము. మీ క్రైస్తవ సంఘములలో చూడుము. అది దేవుని వాక్యముతో సరిగా ఉన్నదా? ప్రతి అర్హతను నీవు పొందితివా? "నేను మంచివాడను" అని చెప్పుచున్నావు. అటువలె నికోదేము కూడ ఉండెను, మరియు వారిలో అందరును అటువలె ఉండిరి. వారు చక్కనివారు, చూచారా. దానితో చేయవలసినది ఏమియు లేదు.
మరియు స్త్రీలారా, మీరు అద్దములో చూచుకొనుమని నేను కోరుచున్నాను, మరియు దేవుడు ఒక స్త్రీ ఏమి చేయవలెనని కోరుచున్నాడో చూడుము, దానిని దేవుని అద్దములో చూడుము, మీ స్థాపన సంఘ అద్దములో కాదు, ఇప్పుడు దేవుని అద్దములో, మరియు యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ వధువుకు వున్నట్లుగా నీ జీవితములో యోగ్యత నుండెనేమో చూడుము.
సేవకులు, అదే తలంచవలసియున్నది. దూరము నుండి నీ వలన అభ్యంతరపడుచున్నవాని రక్షించుటకై నిన్నునీవు సరి చేసుకొందువా? ఆ విధముగా లేకుండినయెడల, దీనిని నీవు చేయుదువా… వారు సంఘమునకు వెలుపల నిన్ను పెట్టిన ఏమగును? ఆ విధముగా నీవు చితించిన యెడల, నా ప్రియ సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ఇప్పుడే అచ్చట నుండి పారిపొమ్ము అని హెచ్చరిక చేయుచున్నాను. మరియు యౌవ్వనురాలా, నీవు ఒక నామధేయ క్రైస్తవురాలిగా కాక, ఒక క్రైస్తవురాలికి ఉండ వలసిన యోగ్యతకు గల పరిమాణమును నీవు చేయక పోయిన యెడల, అయితే నీ హృదయములో మరియు నీ జీవితము దేవుని యొక్క నిదర్శన పత్రిక అట్టి విధముగా వుండవలెనని చెప్పబడిన (రీతిని) మాదిరిని కలిగి యుండవలెను. మరియు సంఘ సభ్యుడా, మీ యొక్క సంఘము ఆయన వాక్యము యొక్క దేవుని కొరకు అర్హతను పరిమాణము చూడనియెడల — దాని నుండి బయటకు పొమ్ము మరియు క్రీస్తు నందు ప్రవేశించుము.
MATT 11:23
85అది గంభీరమైన పవిత్ర హెచ్చరికయై యున్నది. ఏ సమయమో మనము ఎరుగము. మరియు ఈ పట్టణము ఒక దినమందు ఏ సమయమున ఈ మహాసముద్రము యొక్క అడుగు భాగమునకు పోనున్నదో మీరు ఎరుగరు.
"ఓ, కపెర్నహోమా, ఆకాశము వరకు హెచ్చింపబడి, పాతాళము లోనికి త్రోయబడుదువు: నీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు సొదొమ, గొమొర్రాలయందు జరిగియుండినయెడల, ఈనాటి వరకు అది నిలువబడియుండునని," యేసు చెప్పెను. సౌదొమ, గొమొర్రాలు మృతసముద్రము అడుగు భాగమునవున్నవి మరియు కపెర్నహోము కూడ సముద్ర అడుగు భాగమున ఉన్నది.
దేవదూతల పట్టణమని అధికారముతో చెప్పుకొను, పట్టణమా; ఆకాశము వరకు నిన్ను నీవు హెచ్చించుకొనుచున్నదానా, మలినమైనట్టి అసహ్యమైన సొగసు అను రూపమును కలుగజేయు వస్తువులను పంపితివి. అన్య దేశములు సహితము ఇచ్చటకు వచ్చి ఈ అసహ్యమైన వాటిని తీసుకొని, వాటిని తమ దేశములకు పంపుచున్నారు; మీ అలంకార కట్టడముల గదులతోను, గోపురములతోను ఆదిగా గల వాటితో నీవు చేయురీతిని; జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, ఒక దినమున నీవు సముద్రము యొక్క అడుగు భాగమున ఉండెదవు.
నీ యొక్క గొప్ప సుఖభోగము తిన్నగా నీతో కూడ క్రిందికి ఇప్పుడు వచ్చుచున్నది. దేవుని కోపము నీ అడుగు నుండి రగులు కొనుచున్నది. నిన్ను కప్పుటకు నిలువ బెట్టబడిన ఇసుక దిబ్బను ఎంత కాలము ఆయన తాలీమితో పట్టుకొనగలడు, ఆ మహా సముద్రము ఒక మైలు ఆవలి లోతున ఉప్పు సముద్రమున సీసపు గుండును క్రిందికి జారవిడిచినట్లుగా నిర్ణయించబడినప్పుడు తాలిమితో ఆయన పట్టుకొనియున్నాడు. అది పాంపే యొక్క కడవరి దినము కంటే చెడ్డదిగా నుండును.
లాస్ ఏంజల్స్ పట్టణమా, పశ్చాత్తాప పడుము. మిగతావారు కూడ పశ్చాత్తాప పడుడి, మరియు దేవుని వైపుకు తిరుగుడి. ఆయన కోపము భూమి మీదికి వచ్చుసమయమై యున్నది. సమయము ఉన్నప్పుడే పరుగెత్తుము, క్రీస్తునొద్దకు చేరుకొనుము.
మనము ప్రార్థించుకుందాము.
DAN 5:1-4
86ప్రియమైన దేవా, నా ఆత్మ కంపింపబడుచు, నా హృదయము కన్నీటినీ బిందువులతో కూడిన హెచ్చరికను జార విడుచుచుండగా, ఏవైతే నేను చెప్పితినో వాటిని ఆ పురుషులు మరియు స్త్రీలు పరిహాసముగా తీసుకొనకుండునట్లును, స్థాపన సంఘ ప్రజలు వారిపై నాకేదో తప్పు అభిప్రాయము కలిగి నేను చెప్పితినని వారు తలంచకుండునట్లు, ఓ, దేవా, కృప దయచేయుము. ప్రభువా, ప్రేమయందు వారు చూడనిమ్ము, నా విషయము నీవు సాక్ష్యము కలిగియున్నావు. సర్వశక్తి గల దేవా, ఈ తీర ప్రాంతమందు పైనున్న దిగువనున్న ప్రదేశములకు వెళ్లి సంవత్సరము తరువాత సంవత్సరము వెళ్లి, నీ వాక్యమును ప్రకటించితిని. ఓ, దేవా, నీవు సాక్ష్యముగా యున్నావు. అది ఈ రాత్రి సంభవించిన యెడల నేను సత్యమును ప్రకటించితిని. సత్యమైన వధువు యొక్క ఈ దర్శనమును నీవు ఎరుగుదువు. దాని వలన నీ నామమును నేను తీసుకొని, ప్రభువా, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పబడినది, మరియు ప్రభువా, నేను ఏమి చేయుచున్నానో, నేను ఎరుగుదునని నేను తలంచుచున్నాను.
గనుక ప్రజలు ఈ రాత్రి కదలింపబడి, ఆ రాబోవు ఉగ్రత నుండి పారిపోవునట్లు యేసు నామమున నేను ప్రార్థించుచున్నాను, ఏలయనగా ద్వారముల మీదను, రాష్ట్రముల మీదను "ఈకాబోదు" అని వ్రాయబడినది. ఒక నిర్బంధమైన నల్లని చిహ్నం మరొక ప్రక్కను బయలు దేరినది. దేవుని ఆత్మ దానిలో నుండి బయటకు వెళ్లి దుఃఖిపబడుచున్నది. మరియు త్రాసులో దానిని తూచగా అది కొదువగా ఉన్నట్లు కనబడెను.
రాజైన నెబుకద్నెజరు మద్యపాన విందు మరలా మరియొక సారి మేము క్రైస్తవులమని పిలువబడుచు సగము దుస్తులు ధరించిన స్త్రీలతోను, మద్యపాన విందు ఆరగించు గుంపుతో చేయబడుచున్నది.
HEB 12:17
87పరలోకము యొక్క దేవా, ఈ పాపపు ప్రజల పైనను, పాపముతో నిండిన ఈ లోకముపైనను నీ కృపను దయ చేయుము, ప్రభువా, మేము ఇచ్చట ఉన్నపాటున ఉన్నాము.
దేవా, ఈ రాత్రి ఈ గుంపులో నీవు మాట్లాడుటకు, నీ యొక్క వధువును ఆసక్తి కలిగి యుండుటకు పిలువబడునట్లు దైవీక కృపను వేడుకొనుటకు, మధ్య నేను నిలువబడుటకు నేను ప్రయత్నించుచున్నాను. ప్రభువా, — ఏలాటి స్థాపన సంస్థ గురుతులో గాక — ప్రభువైన యేసుక్రీస్తు సువార్త స్వరముతో సాగిపోవుచు వేడుకొనుచున్నాను. దాని అనుగ్రహించుము, ఓ, దేవా.
ఈ రాత్రి నీవే దేవుడవనియు, నీ వాక్యము సత్యమని తెలియబడనిమ్ము. ఈ ప్రజలయెదుట యధావిధిగా నీ వాక్యము ఎడల లక్ష్యముంచు వారి శ్రద్ధను మేము పిలుచుచున్నాము.
యేసుక్రీస్తు నామమున వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము, ప్రభువా. వారు ఏలాంటి అపనమ్మకము గల గురుతు నీ వెనుక కలిగియుండలేదు, వారి గుంపును ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు కదిలించి, వారి హృదయములో ఉన్న దానిని బయలు పరచుము. ప్రభువా, ఇక్కడ ఏమి జరుగుచున్నదో నీవు సరిగా ఎరుగుదువు. అది సత్యమై యున్నదని, ఓ దేవా, నీవు ఎరుగుదువు.
మరియు యేసు నామమున నిన్ను ప్రార్థించుచున్నాను,
ప్రభువా, పరిశుద్ధాత్మ మరలా మధ్యవర్తిగా సమాధానము చేయనిమ్ము, ప్రభువా, ఎవరి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడినవో వారిని ఈ సమాజము నుండి బయటుకు తీసుకొని రమ్ము దేవా. నా హృదయపూర్వకముగా ప్రార్థించుచున్నాను, దానిని అనుగ్రహించుము.
ప్రభువా, ఈ ప్రజలు స్వాభావికముగా ఈ వర్తమానమునకు సహాయపడుట తమ ఆఖరి పైసాను ఇచ్చుటకు మనస్సు కలిగియున్నారు. వారు చేయగలిగినది ఏదైనా చేయుటకు సిద్దముగా ఉన్నారు. అయితే, ఓ దేవా, నీవు ప్రతిఫలము అనుగ్రహించుటకు ఈ రాత్రియై యున్నది, ఈ సభల సమావేశము నందు నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించుము.
ఇది ఒక తుళ్లిపడునట్టిది లేక చుట్టు గంతులువేయుచున్నట్టిదిగా వుండక, అయితే న్యాయ తీర్పు గర్జించుచు, ఈ రాత్రి మన క్రిందికి వచ్చి యుండగా — బలిపీఠము యొక్క కొమ్ములను పట్టుకొని, ఏడ్చుచు, రోదన చేయుచు, పశ్చాత్తాప పడుట అవసరమైయున్నది, దేవా, దానిని అనుగ్రహించుము. నేను ఎరిగినంత వరకు విధేయతతో యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.
HEB 12:17
88నా సహోదరుడా, సహోదరీ, ఇంకా ఏమి చెప్పవలెనో నేను ఎరుగను. దేవుని శక్తి వలన మీ దృష్టిలో కృపయందు నేను కనబడినయెడలను, నేను ఆయన ప్రవక్తనని మీరు నమ్మిన యెడలను. ఎప్పుడైనా చెప్పితిననిన ఇదే మొదటి సారి, అది ఏదో ఒక వింతైన హెచ్చరిక అని నేను తలంచితిని, అయితే దానిని చేయుటకు నాకు ఇష్టము లేదు. నేను అట్టి వాడను కానని మీరును ఎరుగుదురు. ఈ విధముగా నేను ప్రవర్తించను.
ఈ విషయములు చెప్పుటకు, ఆ సందేశము మాట్లాడుటకు శంకించియుందును. ప్రతి వాటిని చేయుటకును దానినుండి తొలగిపోయి వేరొక ప్రక్క మార్గము హెచ్చరికను బహిరంగముగా నేను పరుగెత్తితిని. అయితే అది పలుకబడినది, మరియు ఆ న్యాయ తీర్పు దినమున అది సాక్షిగా నిలువబడును. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు" అని చెప్పబడునదై యున్నది.
ఓ పెంతెకొస్తు, నీ ప్రాణ రక్షణ కొరకై పరుగెత్తుము. బాగా ఆలస్యమైనది అని చెప్పబడుటకు ముందే, నీవు రోదన చేసినను, ఏ మంచిది కలుగ నేరదు అని చెప్పబడు సమయము రాక ముందే బలిపీఠము నందు శరణాగతులను రక్షించుటకు ఉంచబడిన కొమ్ములను పట్టుకొనుటకు పారిపొమ్ము. ఏశావు పోగొట్టు కొనిన తన జ్యేష్టత్వమును తిరిగి పొందుకొనుటకై ప్రయాసపడెను, అయితే అతడు దానిని పొందుకొనలేకపోయెను.
ఓ కాలిఫోర్నియా, నేను ఎవరిని ప్రేమించి, నా హృదయముతో హత్తుకొని యుండి, నేను విడిచిపెట్టిన సంపూర్ణ సువార్త వ్యాపార బృంద సమ్మతితో ఏర్పాటు చేసిన కూటమా, నేను మిమ్మును ఈ రాత్రి యేసుక్రీస్తునకు అప్పగించితిని. ఆయన యొద్దకు పారిపొండి. దీని నుండి సాతానుడు మిమ్మును ఎన్నడును మోసగించకుండా చూచుకొనుడి. మీలో ప్రతి ఒక్కరును ఈ వాక్యము నొద్దకు వచ్చి, ఆ వాక్యము వలన స్త్రీ, పురుషులు తమ జీవితములు సరళ ప్రవర్తనగా మార్పు కలిగించునంత మట్టుకు పరిశుద్ధాత్మ వలన నింపబడు వరకు దానితో తిన్నగా కాచుకొని యుండుడి. నీవు పరిశుద్ధాత్మను కలిగి యున్నావని నీవు చెప్పుకొనుచు, వాక్యముతో ఏకీభవించకపోయిన యెడల, నీలో ఉన్న ఆత్మ అది మరొకటైయున్నది. ఆయన వాక్యము మీద దేవుని ఆత్మ ఉండును, మెస్సియా — అభిషేకింపబడిన వాక్యము. ఆయన అభిషేకింపబడిన వాక్యమైయున్నలాగున, వధువునూ అభిషేకింపబడిన వాక్యమై తప్పక ఉండవలెను.
MATT 25:10
89ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము నిలువబడుదము. మీరు నా స్వరమును మరలా వినకుండని యెడల… కొద్ది గంటలలో దేవుని చిత్తమైనయెడల ఆఫ్రికాకు సముద్ర ప్రయాణము చేయబోవుచున్నాను, నేను తిరిగి మరెన్నడును రాకపోవచ్చును — నాకు తెలియదు. అయితే నేను సత్యమునే చెప్పితినని నా హృదయ పూర్వకముగా నేను మీతో చెప్పుచున్నాను. దేవుడు మీతో చెప్పుటకు నాకు చెప్పిన ప్రతి ఒక్కటియు ఏమియు దాచకుండ మీకు తెలిపితిని. మరియు ప్రభువు నామమున నేను మీకు తెలిపితిని మరియు ప్రభువు నామమున నేను మీకు తెలిపితిని. అది ఒక పావన సమయము, దానిని ఎట్లు వివరించవలెనో నేను ఎరుగకున్నాను. మూడు-లేక-నాలుగు సార్లు ఈ ప్రసంగ వేదికను విడచిపెట్టుటకు ప్రయత్నించితిని, అది నేను చేయలేకపోతిని. ఇది ఒక పవిత్ర సమయము. ఎన్నడునూ దానిని మరచిపోకుడి.
బహుశ, దేవుడు మిమ్మును పిలుచుటకు ఆఖరుగా ఉపయోగించు సమయమైయుండవచ్చును. నాకు తెలియదు. ఎవరి కొరకో ఆయన కడవరి పిలుపు ఆయన చేయుచున్నాడు. ఎప్పుడు? నేను ఎరుగను. అయితే, ఆ దర్శన ప్రకారము, వధువును గూర్చినది ముగింపునకు వచ్చినట్లుగా అది కనబడుచున్నదని మీతో నేను చెప్పుచున్నాను.
లోపల ప్రవేశింపనున్న నామకార్ధ-సంఘములను చూడుము. నిద్రించుచు ఉన్న (బుద్ధి లేని) కన్యకలు నూనెకై వచ్చినప్పుడు, దానిని వారు పొందుకొనలేకపోయిరి. వధువు లోపలకు ప్రవేశించెను. ఎత్తబడుట జరిగి పోయెను. వారు నూనెను కొనుటకు వెళ్లినప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చెను.
నీవు నిద్ర పోవుచున్నావా? త్వరగా మేలుకొనుము, త్వరగా నిన్నునీవు జాగ్రత్త పరచుకొనుము. ఈ క్షణములో చనిపోవు వారముగా వుండినట్లైనయెడల ప్రభువు నామమున మనము ప్రతి ఒక్కరు ప్రార్థించుకొందాము. ప్రతివారు తమతమ స్వంత విధానములో ప్రార్థించుకొందాము.
90సర్వశక్తి గల దేవా, మాపై కృపను చూపుము. ప్రభువా, నాపై కృపను చూపుము. మా అందరి పైన కృపను దయ చేయుము, ఈ విషయములలో మేము తప్పి పోయినయెడల — మేము ఏది చేసినను విశేషత లేదు — అది మాకు ఏ మంచిని చేయనేరదు, ఓ దేవా, ఈ గొప్ప పట్టణము సముద్రము అడుగు భాగమునకు మునిగిపోవుటకు ముందు, మరియు దేవుని న్యాయ తీర్పు ఈ తీరమును ఊడ్చివేయక మునుపు నేను నిలువబడి కృప కొరకు వేడుకొనుచున్నాను. దేవా, నీ వధువును నీవు పిలచుచున్నావు. వారిని నీకు అర్పించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్ధించుచున్నాను. ఆమేన్