దేవుని చిత్తము లేకుండా దేవునికొక సేవచేయ యత్నించుట

దేవుని చిత్తము లేకుండా దేవునికొక సేవచేయ యత్నించుట

1మనము ప్రార్థించుచుండగా ఇప్పుడు ఒక క్షణము నిలబడియుందము. మన తలలు వంచుదము.

ప్రభువా, ఈ ఉదయమున మరో ఆరాధన కొరకు దేవుని మందిరమునకు తిరిగి వచ్చినందుకు మేము సంతోషించుచున్నాను. దేవా, మా తప్పులన్నింటిలో నుండి ఈ ఉదయము మమ్మును సరి చేయుమని ప్రార్థించుచున్నాము. మేము నడచుటకు నీవు ఆజ్ఞాపించిన మార్గములలో నడచునట్లుగా ఆ మార్గములను చూపించుము. కృపను, ప్రేమను మాకు చూపించుము, అప్పుడు మేము ఆ మార్గములలో నడచెదము. మా హృదయములతో ఆ ఉపదేశములు గైకొందుము. ఆ దినమున మేము క్రీస్తునందు నిందారహితులముగా కనబడుదుము, ప్రభువా, ఆయన రాకడ త్వరగా యున్నదని మేము నమ్ముచున్నాము.

ఆయన రాకకు ముందుగా ఏ ఏ గురుతులు కనబడునని ఆయన చెప్పెనో, అవన్నియూ ఇప్పుడు నెరవేరుచున్నవి. ఆనందముతో ఆ క్షణము కొరకు మేము చూచుచున్నాము. ఆనాటి అబ్రహాము వాగ్ధాన కుమారుని కొరకు ఎదురుచూచెను. ఈ చివరి సూచనలను భూమి మీద చూచెను. దేవుడు త్వరగా రానైయున్నట్లు గ్రహించెను. ఆ కుమారుడు వచ్చు దినము ఎంతో దూరములో లేదని అతడు గ్రహించెను. అదే మరల ఇప్పుడు పునరావృతమగుట చూచుచున్నాము. ఈ సంగతులు జరుగనారంభించినప్పుడు మీ తలలు పైకి ఎత్తుకొనుడి, అని యేసు చెప్పెను, మా విడుదల సమీపమయినది; కాలము భయంకరముగా యున్నది, దేశముల మధ్య శాంతి లేదు, ఆయా స్థలములలో భూకంపములు, సముద్రము ఘోషించుచున్నది, మానవుల గుండెలు భయముతో దద్దరిల్లుచున్నవి, దేశములకు ఏమి చేయవలనో తోచుట లేదు.

ఆ ఘడియలో మేమున్నట్లు గ్రహించాము, మరొక యుద్ధము వచ్చుచున్నట్లు కనిపించుచున్నది, అదెంత భయంకరముగా ఉండునో గదా! భూమి తునాతునకలగుచున్నది; ఏదో భయంకర పరిస్థితి పొంచి యున్నదని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. బైబిలు దీనిని గూర్చి చెప్పుట మేము చూచుచున్నాము. ప్రభువా, ఈ దినమున మేము సరిదిద్దబడు గృహములో నిలబడునట్లు కృప చూపుము. ఈ చీకటి కాలములో వెలుగుగా ప్రకాశించునట్లుగా మేము ముందుకు సాగుటకు మా దేవుని నుండి ఆజ్ఞను పొందుదుము గాక! ఆలాగు చేయుటకు ఇదే మా చివరి అవకాశము కావచ్చును. దీనిని యేసు నామములో ఆయన నిమిత్తము అడుగుచున్నాము. ఆమేన్.

2ఈ ఉదయమున ఈ ఆలయములో ఉండుట నిశ్చయంగా ఒక మహా భాగ్యముగా నేను ఎంచుచున్నాను. మీ కొరకు కావలసినంత చోటును చూపించలేక పోయినందుకు చింతించుచున్నాము. స్థలము క్రిక్కిరిసి యున్నది. బయట ఎక్కడ చూచినా జనులు నిలబడియున్నారు. బయట ఉన్న జనులను అడుగుచున్నాను. రేడియోలో మీకిది వినబడుచున్నదా? మరచి పోయాను [ఏబది-అయిదు నుండి ఏబది-ఏడు వరకు అని ఎవరో చెప్పిరి] ఏబది-అయిదు నుండి ఏబది-ఏడు. బయట జనులున్నారు, కార్లు నిలుపు స్థలములో యున్నారు, వీధులలో నిలబడియున్నారు, ఈ రేడియో ద్వారా వినండి. మీ రేడియోలో ఏబది-అయిదు మరియు ఏబది-ఏడు మీటర్లలో వినండి.

మేము దానిని ప్రయత్నించాము… ఇక్కడికి నేను వచ్చుచున్నాను. పది దినముల కూటమును ఏర్పాటు చేయవలెనని ఉద్దేశించాను. ఏడు చివరి పాత్రలు అను అంశము మీద ప్రసంగించెదను. ఆ పాత్రలకు మధ్యలో బూరలున్నవి. ఏడు బూరల గూర్చి మాట్లాడుదునని మీతో నేను చెప్పాను, వాటితో పాటుగా పాత్రలను, తెగుళ్ళను కూడా బోధించెదను. ఇది మంచి సమయమని నేననుకొనుచున్నాను. ఈ మధ్యనే ఆఫ్రికా నుండి నేను వచ్చియున్నాను. పిల్లలకు ఇంకా సెలవులు ఇయ్యలేదు. నా చిన్న కుమారుడు జోసెఫ్‌నకు కొద్ది వారములు చదువవలసిన కార్యక్రమమున్నది. అతడు ఉత్తీర్ణుడాయెను, కాని అంత చక్కగా మార్కులు రాలేదు, కావున అతనిని మేము టుసాన్‌లో యుంచాము. నేను ఆఫ్రికాలో యుండగా, అతడు తన చదువులో నిమగ్నమైయుండెను. ఇప్పుడు బాగుగానే చదువుచున్నాడు. ఒక పాఠశాలలో చేరియున్నాడు, ఆ తరువాత మేము వచ్చాము. పిల్లలకు సెలవులు ఇచ్చు సమయములో ఇక్కడ నేను కొన్ని రోజులు కూటములు ఏర్పాటు చేయవలెనని కోరుచున్నాను. జనులకు ఈ అంశములు చెప్పగోరుచున్నాను, కాని ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆ పాఠశాల ఆడిటోరియం దొరకలేదు.

3జనులు కూర్చొనుటకు ఆలయము చాలదని నాకు తెలియును. వారికి సదుపాయము కల్పించవలసిన బాధ్యత మాపై ఉన్నది. ఈ వర్తమానము నేను అందించవలెను గనుక మేము వేరే ఏర్పాటు చేయవలసి వచ్చినది. ముందు పది రాత్రుల కూటమును ఏర్పరచ ఉద్దేశించాము, కాని అందుకు బదులుగా ఆదివారమున రెండు ఆరాధనలు ఏర్పాటు చేశాను. ఈ ఆదివారం, వచ్చే ఆదివారం, ఆ పై ఆదివారం, రెండేసి చొప్పున ఆరాధనలుండును, దానిని మేము ప్రకటించనే లేదు. ఎవరైనను ఏదో ఒక విధముగా స్కూలు ఆడిటోరియంలో దేవుని చిత్తమయితే, 28 నుండి కూడికలు జరుగునని వినియుండవచ్చు. ఎవరైనా స్నేహితులు హోటళ్లల్లో కూడా ముందుగానే నమోదు చేసుకుని యుండవచ్చు. వాటిని నేను రద్దు చేయుచున్నాను, ఎందుకనగా వాటిని జరుపుకొనుటకు మనకు సౌకర్యము లేదు; వారు స్కూలు ఆడిటోరియంను పొందలేకపోయారు.

4సౌవార్తిక ఆరాధనలలోనే ఆదివారం ఉదయమున నేను మాట్లాడగోరుచున్నాను. ఆదివారం రాత్రి రోగుల కొరకు ప్రార్దించుదును. రోగులుగా ఉన్న జనులను దేవుడు దర్శించునని మేము నమ్ముచున్నాను. మీ గూర్చి బిల్లీ ఏమి చేయుచున్నాడో నాకు తెలియదు; ప్రార్థన కార్డులు ఇచ్చెననుకొనుచున్నాను, లేక జనులను అదుపులో నుంచు మార్గములను యోచించవలెను. వచ్చే మూడు వారములలో మేము ఆరాధనలు ఉద్ధేశించియుండగా ప్రతి వ్యక్తి కొరకు సాధ్యమైనంత వరకు ప్రార్థించుదును, ప్రభుని చిత్తమైతే జరుగును.

చాలాసార్లు వ్యక్తులు నన్ను వ్యక్తిగత ఇంటర్వ్యూ కొరకు కలిసికొన ఆశించుదురు; ఒక నిమిషము మమ్మును మాట్లాడనీయమని అడిగెదరు. ఎంతమందికి ఇక్కడ ఇంటర్వ్యూ కొరకు కలిసికొనవలసిన అవసరతయున్నదో చేతులెత్తండి. హు! చూడండి?

అందరూ! వారందరినీ కలిసికొనుట ఒక రకంగా కష్టము, కావున మీ విన్నపమును వ్రాసి పంపండి. బిల్లీకి అందించండి, అప్పుడు నేను వాటిని చూచెదను. ప్రార్థన కార్డులు ఎప్పుడియ్యబడునో, అతడు ప్రకటన చేయునని తలంచుచున్నాను.

5ఈ ఉదయమున ఇక్కడ సేవకులగు మన సోదరులు ఎంత మంది యున్నారు? మనకు అవకాశము లేదని అనుకొనుచున్నాను. వారెవరినయినా మీరు గుర్తించారా? ఈ ఉదయమున ఇక్కడ ఎందరు సేవకులున్నారో మీ చేతులెత్తి చూపించగలరా? లేదా లేచి నిలబడండి. ఈ ఉదయమున ఈ జనుల మధ్య ఎందరు సేవకులున్నారో చూద్దాం. చాలా మంచిది. ఈ జనులనుబట్టి ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను, కాని మీరు వారిని చూచుచున్నారని నిశ్చయంగా చెప్పగలను, వారి ఆరాధనలలో దేవుడు వారిని ఎరుగును; దేవుడు వారిని అధికముగా ఆశీర్వదించవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడికి వచ్చుటకై వారు తమ ఆరాధనలను ఆపు చేసికొనిరని నిస్సందేహముగా నేను చెప్పగలను. సహోదరులు జూనియర్ జాక్సన్, డాన్ రడెల్ యొక్క సంఘముల యొద్దకు రేడియో ప్రసారము వెళ్ళుచున్నదని తలంచుచున్నాను. న్యూయార్కుకు, ఇంకా దేశములోని ఇతర స్థలములకు వెళ్ళుచున్నదని తలంచుచున్నాను. ఈ ఉదయమున ప్రతి సంఘమునకు స్వంత టెలిఫోను ఏర్పాటు ద్వారా ఇది సాధ్యమైనది.

MATT 18:20

 

6సహో॥ రిచర్డ్ బ్లయర్ ఇక్కడ కూర్చొని యుండుట చూచి నేను ఎంతో సంతోషించుచున్నాను. అక్కడున్న జనుల మధ్య దేవుడు జరిగించిన గొప్ప కార్యము గూర్చి వ్రాసిన ఉత్తరమును ఈ మధ్య చదివాను. (బ్లెయిర్ సోదరుడా, ఒక వేళ నేను తప్పు చెప్పినయెడల సరిచేయుము.) ఒక రోజున అతడు పని చేయుచుండెను. ఒక వ్యక్తికి పనిలో సహాయపడుచుండెను. (అతని ఉత్తరము చదివి అర్థము చేసికొంటిని.) ఆ ట్రాక్టరును వెనుకకు నడిపించుచుండగా అది జారి నీటిలోపడినది. అందులో ఉన్న అతని చిన్న కొడుకు చనిపోయెను, అతని కడుపు ఉబ్బిపోయినది. కరెంటు షాకు తగిలినప్పుడు ఏమి జరుగునో మనకు తెలియును, ఆ పిల్లవానికి అదే జరిగినది. ఆ చిన్న కన్నులు మూతపడినవి, అతని పండ్లు దగ్గరగా బిగుసుకున్నవి.

అది సోదరులను ఎంతో కలవరపరచినది. నేను ఎక్కడున్నా గాని పట్టుకొని ఆ బాలుని కొరకు ప్రార్థన చేయమని చెప్పవలెనని సహో॥ బ్లయర్ ఆలోచించెను, కాని "ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి యుందురో వారి మధ్యను నేనుందునని," ఆయన చెప్పిన మాట వారికి జ్ఞాపకము వచ్చెను. ఆ తండ్రి ఆ చిన్నవాని యొక్క నోరు తెరచి తన వ్రేళ్ళు పెట్టుటకు ప్రయత్నించెను. వారు మోకరించి, ఆ బాలుని కొరకు ప్రార్థించ మొదలిడిరి. అతడు సజీవుడాయెను.

PS 46:1•

MATT 18:20

 

7అది నిజమేనా బ్లయర్ సోదరుడా? మన సోదరులలో ఒక దీన సోదరుడు ఇచ్చటున్నాడు. ఆ చిన్న బాలుడు ఇచ్చట యున్నాడు. ప్రభువుకు, దీనిని బట్టి ప్రియ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాము. ఆ బాలుని యొక్క తండ్రి ఆయనే గదా? మీరేనా తండ్రి? చాలా మంచిది. ఇక్కడ సహో॥ రిచర్డ్ బ్లయర్ యున్నాడు. మన దేవుడు దేనినయినా చేయగల సమర్ధుడు. అవునండి. దానిని ఆయన వాగ్ధానము చేసెను. మహా మహిమగల పరలోక తండ్రి యొక్క దైవ సాన్నిధ్యములో మనము జీవించుచున్నాము. మనము నమ్మిక మాత్రము ఉంచవలెను. సమస్తమూ సాధ్యమగును.

ఆ వ్యక్తి తన జీవితములో ఆలాగున నమ్ముట వలన ఏమయినదో మీరు చూచారా? తన చిన్న బాలుని రక్షంచుకోగలిగెను. దేవుని యొక్క దీనదాసులు ఇక్కడున్నారు. సహో॥ బ్లయర్ ఆ స్థితిలో యుండిన బాలుని కొరకు ప్రార్థించిరి. మీకు ఏదయినా సంభవించినప్పుడు, మీరు సజీవుడగు దేవుని పిల్లలని గుర్తుంచుకొనండి. "ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి యుందురో, వారి మధ్యను నేనుందునని," ఆయన చెప్పెను. "ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని" కూడా వ్రాయబడి యున్నది. ఆపదను గమనించండి. ఆ చిన్న బాలుడు కరెంటు షాకు వలన మరణించి పడియుండెను. ఆ బాలుని దేవుడు లేపెను. ఈ ఉదయమున మన పూర్ణ హృదయములతో దేవునికి వందనములు చెల్లించుదము, ఎందుకనగా ఆయన మన కొరకు ఈ కార్యములను జరిగించెను.

ఈ నమ్మకస్థులగు వీరిని కూడా దేవుడు దీవించును. అత్యవసర పరిస్థితులో వారు దేవుని వైపు చూచిరి; ఆయన తట్టు చూచిరి, అత్యవసర పరిస్థితి ఏర్పడక మునుపే వారు దేవునితో స్నేహము కలిగియుండిరి. దీనిని మనము ఎరుగుదుము: దేవుని కృపను మనము సంపాదించుకొనిన యెడల, ఆయనను ఏదయినా మనము అడుగ గలము. ఈ లోకములో ఏ స్నేహితుని కంటెను ఆయన నమ్ముకొనదగినవాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.

PS 46:1•

ACTS 4:14

 

8నిన్న నేను వీధిలో సహో॥ జాన్ మార్టిన్స్ యొక్క సోదరిని కలిసికొన్నాను. ఎవరో నన్ను వీధిలో ఆపిరి. ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఎవరో చేయి ఊపిరి. ఇంటికి తిరిగి వస్తూండగా పలుచోట్ల జనులు ఆపి కరచాలనము చేయుచుండిరి. ఈ స్త్రీ ఈ మధ్యనే నన్ను పిలచినది. ఆమెను కారులో నుండి వచ్చి ఎవరో గుద్దిరని చెప్పినది, ఆమె వెన్నెముక విరిగి చిందరవందరయినది. ఆమె శేషజీవితమంతా చచ్చుబడి పరుండవలసినదే. ఆమె ఈ ఉదయమున ఈ కూటములో కూర్చొని యున్నది, దేవుని సన్నిధిని అనుభవించుచున్నది. ఆమెతో నేను గదిలో ముచ్చటించాను; మరల ఆమెతో కలిసి నేను ప్రార్థించగోరుచున్నాను, ఆమె ఇక్కడే ఎక్కడో యున్నది. ఆమె లోనికి ప్రవేశించలేకపోయినదని తలంచుచున్నాను. ఆమె ఇక్కడే మన మధ్య కూర్చొని యున్నది. ఇది సత్యము. సోదరీ, జనులు చూచునట్లు ఒకసారి లేచి నిలబడుదువా? ఆమె ఎన్నడూ నడువదని కొన్ని వారముల క్రితం డాక్టర్లు చెప్పిరి. వెన్నెముక విరిగిపోయినది, కాని ఆమె ఇప్పుడు పూర్తిగా నిలబడినది. బైబిలు చెప్పిన దానిని మీరెరుగుదురు. ఆ మనుష్యుడు వారి మధ్యను నిలబడియుండెను గనుక వారు మారు మాట్లాడలేకపోయిరి. ఇది నిజము. ఇక్కడ ఒక చిన్నవాడు మరణములో నుండి లేపబడియున్నాడు, వెన్నెముక విరిగిపోయిన ఒకామె ఇప్పుడు మన మధ్యన నిలబడియున్నది. ఇది జరిగి ఎంతో కాలము కాలేదు. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ప్రభువు నామము స్తుతింపబడును గాక! ఆయన సన్నిధిలో ఇప్పుడు జీవించుచున్నందులకు ఎంతగానో మనము సంతోషించవలసి యున్నాము. "ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని" ఎరుగుదుము.

సహో॥ వైల్, సహో॥ మార్టిన్, ఇంకా చాలా మందిని, ఈ ఉదయము చూచుచున్నందుకు సంతోషించుచున్నాను. సోదరులారా, ప్రభువు మిమ్మును అధికముగా ఆశీర్వదించును గాక.

9ఇక్కడ అంత చల్లగా లేదని తలంచుచున్నాను, చాలామంది జనులు వచ్చిరి; నేను టుసాన్ విడిచి వచ్చినప్పుడు, నూట-నాలుగు లేక అయిదు ఉన్నది; దాదాపు మధ్య రాత్రిలో తొంబది-మూడున్నది, కావున ఇది నాకు చాలా చక్కగా యున్నది. శుక్రవారం మేము రాకముందే పార్కర్ యొద్ద నూట-నలువది యున్నట్లు వారు చెప్పిరి. అదెంత వేడియో మీరూహించగలరు. అయితే అది ఎడారి ఉష్ణోగ్రత గదా!

వచ్చే మూడు ఆదివారములు చూడండి. ఈ రోజు పదిహేను, తప్పు చెప్పలేను గదా? పదహారా? కాదు. పదిహేను. పద్దెనిమిది మరియు ఇరవై-ఎనిమిది. ఆగస్టు ఒకటి. (అంతే గదా?) ఆగస్టు. పద్దెనిమిది, ఇరవై-అయిదు, మరియు ఒకటి. ఆ తేదిలలో ఆలయములో కూటములుండును. అప్పుడేమి జరుగునో మనకు తెలియదు, లేని దానిని…. ఈ లోపల ఏమి ఉన్నదో మీరెరుగుదురు, (వాతావరణము) ఇంకా కష్టతరముగా మారును. మీకు వీలయితే రండి.

10నేను ఇక్కడ ట్రస్టీలను ఒక దగ్గరికి తేవాలని ఉన్నాను. నేను ఒక స్థలములో కుడికాలు నిర్వహించుటకు నడిపింపబడినప్పుడు, ఒక విధముగా నేను క్రిందకు నేట్టబడుచున్నాను. కావున నేను వారిని అడుగబోవుచున్నాను, ఒకవేళ మేము టెంటును పొందలేకపొయినట్లయితే, దేవుడు నడిపించిన విధముగా ఒక స్థలము నుండి మరొక స్థలమునకు మారెదము. ఆయన అదే చేయబోవుచున్నాడు అని నేను అనుకుంటున్నాను. దాని గురించి దర్శనములు ఉన్నవి. అందు కారణముబట్టియే ఆలాగు జరుగుచున్నది… (మీకు తెలుసు) చాలా సార్లు మనము అది కష్టతరముగా ఉన్నది అని మనము అనుకుంటాము, ఎందుకనగా కొన్ని విషయాలు జరుగును, అయితే (మీకు తెలుసు) అది దేవుడు కావచ్చు (చూడండి) ఆ విధముగా నడిపించుచున్నాడు. ఆయన చెప్పినప్పుడు, ఆయన అది చేయును.

MATT 11:23•

LUKE 10:15

 

11ఒక నెలకు నేను ఆఫ్రికాకు వెళ్ళుదుననగా జరిగిన సంగతి మీకు గుర్తుండియుండును. మీలో చాలామంది బహుశా విని యుందురు. "వధువు నెన్నుకొనుట," అను అంశము వినండి. కాలిఫోర్నియోలో దానిని బోధించాను. ఆ చివరి భాగము వినండి — నేనక్కడ నివసించుట నాకెన్నడూ గుర్తులేదు — కాని ప్రభువు యొక్క ఆత్మ ఆ విధంగా వచ్చినది. వారు జీవన విధానమును, వారి పనులను నేను ఖండించాను. సువార్తను బోధించిన తరువాత వారిముందే ఆ విధంగా ప్రకటన చేసాను. మరియు ఆకస్మాత్తుగా పరిశుద్ధాత్మ మాట్లాడినది, "కపెర్నహూమా (చూడండి), ఆ పట్టణము దూతల పేరును పెట్టుకొనినది (అదే లాస్ ఏంజలస్.) నీవు ఆకాశము మట్టుకు హెచ్చింపబడినా, పాతాళము మట్టుకు దిగి పోయెదవు," చూచారా. అదంతా అయిన తరువాత బయటకు వచ్చాను. నాతో కూడా సహో॥ మోస్‌లీ, బిల్లీ యున్నారు… వెళ్ళి చూచాను. ఆ స్థలమంతా జనులతో నిండిపోయినది, సేవకులు ఏడ్చుచుండిరి.

MATT 11:23•

LUKE 10:15

 

12వెళ్ళి నేను లేఖనము తెరిచాను; "దానిని గూర్చి ఏదో బైబిలులో యున్నదని," చెప్పాను. యేసు కపెర్నహూమును గద్దించుచుండెను, ఆయన ఆ తీర ప్రాంతములన్నింటినీ దర్శించెను. "కపెర్నహూమా, నీవు ఆకాశము మట్టుకు హెచ్చింపబడితివి గాని పాతాళము మట్టుకు దిగిపోయెదవు. నీలో చేయబడిన కార్యములు సొదొమ గొమొర్రాలలో చేయబడి యుండినయెడల, అవి నేటికిని నిలచియుండెడివి," అని ఆయన పలికెను. ఆ సమయములో సొదొమ గొమొర్రాలు సముద్రపుటడుగున ఉండెను. ఆ తరువాత దాదాపు వంద సంవత్సరములకు యేసు ప్రవచనము ప్రకారము, కపెర్నహూములో భూకంపము వచ్చి, సముద్రపుటడుగునకు వెళ్ళిపోయినది. యేసు ఆ తీర పట్టణమును మాత్రమే దర్శించెను. కాలిఫోర్నియో — లాస్ ఏంజలస్‌కు అదే ప్రత్యక్ష జవాబని తెలిసికొనుడి.

13ఒక రోజున టుసాన్‌లో గొప్ప భూకంపము వచ్చెను, దానికి ముందే నేనచ్చట నుండి వచ్చాను. శాస్త్రజ్ఞులు టెలివిజను మీద దానిని గీయుచుండిరి. అది పత్రికలలో యున్నది, అలేషియను ద్వీపముల నుండి అలస్కా వరకు భూమి నెరవిడిచినది. అలేషియను ద్వీపముల చుట్టూ దాదాపు రెండువందల మైళ్ళు సముద్రములోనికి వెళ్ళిపోయినది. సాన్-డియాగోలో మరల వచ్చినది, లాస్‌ఏంజలస్ చుట్టూ వచ్చినది. చాలా సత్రములు భూమిలోనికి వదులయి పోయినవి. ఇండ్లు కుప్పకూలిపోయినవి. బసచేయు అంగుళములు భూమిలోనికి పోయినవి. శాస్త్రజ్ఞులను కొందరు ప్రశ్నించిరి. అప్పుడు వారు ఇట్లు చెప్పిరి, అది ఒక దినమున కూలును.

"అది జరుగగలదు, జరుగును" అని వారు పలికారు. అతడు లావాను గూర్చి శాస్త్రీయ పదములలో వివరించెను. ఈ భూకంపములన్నింటికీ ఇదే కారణము, సాన్‌డియాగో చుట్టు ప్రక్కల వచ్చుచున్నది; అది గుల్ల స్థలము. అది ఇసుక మేట వలె కుప్పకూలును. ఇప్పుడది ఆకారముగా నిలబడియున్నది, అది గుల్లగా మారినది. చాలా అంగుళముల వరకు ఆలాగే మారిపోయెను. వారు రాడార్‌లు ఇంకా ఆయా పరికరములతో ఆ బీటను వెంబడించి గుర్తించారు, దాని స్థితి ఏమగునో నేను చూచుచున్నాను; అది గుల్లగా మారినది. మరెన్నో అంగుళములు ఆలాగగును. ఆ ప్రవచనము చెప్పిన వెంటనే అది రెండు లేదా మూడు అంగుళములు గుల్లగా తయారైనది.

శాస్త్రజ్ఞులను ప్రశ్నించుచుండిరి, "అది బహుశా మన కాలములో జరుగక పోవచ్చునని జవాబిచ్చిరి."

అది అయిదు నిమిషములలో జరుగవచ్చు లేదా అయిదు సంవత్సరములలో జరుగవచ్చు, కాని అది కూలిపోనైయున్నది," అని ఆయన చెప్పాడు.

14ఈ రోజు శ్రీమతి సింప్సన్ — మనతో లేదనుకొనుచున్నాను; సహో॥ ఫ్రెడ్ అక్కడ కూర్చొని యుండుట కనబడుచున్నది. శ్రీమతి సింప్సన్, ఎక్కడున్నదో నాకు తెలియదు. ఆమె వెళ్ళి ప్రవచించినది. నేను దానిని గూర్చి 1935 సంవత్సరములోనే ప్రవచించాను. "సముద్రము ఎడారిలోనికి చొచ్చుకొని వచ్చుకాలము వచ్చునని," చెప్పిన మాట (ఎక్కడో పుస్తకంలో వ్రాయబడినది) ఏమి జరుగునో చూడండి. వేలాది చదరపు మైళ్ళు భూమిలోని లావాలోనికి కూరుకొనిపోయినయెడల, భూమి నెరవిడిచినయెడల ఒకేసారి మిలియనుల మంది చనిపోవుదురు. అందువలన సముద్రపు అలలు పైకి లేచి వచ్చును… గుర్తుంచుకొనండి, సాల్టన్ సముద్రములోనికి దిగిపోవును. అది సముద్రము కంటె వంద లేక రెండువందల అడుగుల పల్లములో యున్నది. నీరు దాదాపు టూసాన్‌లోనికి వచ్చును. తుఫాను అల రాగలదు. సముద్రము ఎడారిలోనికి చొచ్చుకొని వచ్చును.

దేశములు విచ్ఛిన్నమగుచున్నవి;

ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

మన ప్రవక్తలు ముందే ఈ గురుతులు చెప్పిరి;

అన్యుల దినములు లెక్కించబడినవి,

భయము హెచ్చగుచున్నది;

విడువబడిన దానా, నీ యజమాని యొద్దకు రమ్ము.

మనము అంత్యకాలములో యున్నాము. ప్రభువు మిమ్ము అధికముగా దీవించును గాక! దానిని నేను ప్రారంభించి, సమయమే మరచిపోయాను. మనము త్వరగా ముగించవలెను. బహు తొందరగా పూర్తి చేయవలెను. ఏమయినా గాని నిత్యత్వములోనికి వెళ్ళుదము.

MARK 7:7

 

15ఇప్పుడు పరిశుద్ధ మార్కు 7వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుదము. ఒక అంశమును తీసికొని వచ్చుదము. మొదటి దినవత్తాంతములు 13 నుండి చదివాము. దీనిని అంశముగా చేయుటకు మార్కు 7:7 చదువగోరుచున్నాను.

వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు.

ఇప్పుడు, ప్రభువు నాకిచ్చిన వర్తమానమును తప్ప మరి దేనినీ నేనెరుగను, దానిని మాత్రమే నేను చెప్పెదను. ఈ ఉదయమున ఒక అంశము మీద మాట్లాడగోరుచున్నాను, అది మంచిదని నేను తలంచుచున్నాను. ఈ రాత్రికి నేను రుతువునకు తగిన ఆహారము అను అంశము మీద మాట్లాడుదును. దేవుని చిత్తము బట్టి మాట్లాడుదను. "రుతువునకు సరిపడు ఆత్మీయాహారము" అను అంశము. దానినెట్లు పొందవలెనో చెప్పెదను. ఈ ఉదయకాల వర్తమానము ఇది. "దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవచేయ ప్రయత్నించుట."

దేవుడు సర్వాధికారము గలవాడు. దావీదు ఏమి చేసెనో మనము ఇక్కడ చూచాము. మొదటి దినవత్తాంతములు 13వ అధ్యాయము చదవండి. అతని ఉద్ధేశ్యములు మంచివే, కాని దేవుడు మన మంచి ఉద్ధేశ్యములను బట్టి ప్రతిఫలమును ఇవ్వడు. దేవునిని సేవించుటకు ఒకే ఒక మార్గమున్నది, ఆయనాజ్ఞానుసారముగా ఆయన చిత్తమును చేయవలెను. దేవుడు సార్వభౌముడు గనుక ఆయనకు ఏమి చేయవలెనో, ఏలాగు చేయవలెనో, ఎవరూ చెప్పనవ సరము లేదు. ఆయనకు మార్గము తెలియును; ఆయనకు సరయిన విధానము తెలియును. అందువలన నాకు చాల బాగున్నది. అందువలన మనందరికి బాగుండవలెను, నిశ్చయంగా అది అలాగే మనలను చేయును. మానవులయితే ఒకరు ఒక విధానములోను, మరియొకరు మరో మార్గములోను, ఇంకొకరు ఇంకో దారిలోను వెళ్ళుదురు.

16దేవునిని గూర్చిన మరో సంగతిని చూడండి; ఆయన మనలను విడిచి పెట్టలేదు, సత్యము ఏమిటో మనమెరుగము మరియు ఎట్లు జీవించవలెనో కూడా ఎరుగము. ఒక దానిని ఎట్లు చేయవలెనో మనకు తెలియనప్పుడు అందుకు మనలను దేవుడు శిక్షించినయెడల ఆయన అన్యాయస్థుడగును, మనము తొట్రిల్లి మరో దానిలో పడుదుము. ఆయన అటువంటి దేవుడు కాడు. ఆయన మాట పలుకు దేవుడు. తన పిల్లలు దానియందు విశ్వాసముంచవలెనని ఆయన కోరును. కాబట్టి ఏది శ్రేష్టమో ఆయనకు తెలియును, మరియు ఎప్పుడు దానిని చేయవలెనో, ఎట్లు దానిని చేయవలెనో ఆయనకు మనం చెప్పనక్కరలేదు. దానిని గూర్చి మనకు ఏవో అభిప్రాయములుండవచ్చును, కాని ఆయనకు తెలియును.

ఆయన ఒక వ్యవస్థను ఏర్పరచును, అదే ఆయన చేయనైయున్నాడు మరియు ఏమి జరుగునో మనకు ఆయన చెప్పలేదు. అదెట్లు జరుగనై యున్నదో, ఆయన మనకు చెప్పలేదు. అప్పుడు ఆ విషయములో మనము తొట్రిల్లుదుము, మనము తప్పిపోయినందుకు సరిపెట్టుకొందుము, లేక మరేదో చేయుటకు ప్రయత్నము చేయుచుందుము. ప్రతి ఒక్కరము మనలను మనము నీతిమంతులనుగా తీర్చుకొందుము. కాని ఒకే ఒక మార్గమున్నది, అది ఆయన వాక్యము.

17మరో సంగతి ఇక్కడ చూడండి, దావీదును చూద్దాం. అతని హృదయములో ఒక మంచి పని చేయవలెనను కోరిక ఉన్నది. అతనికి చెడు అభిప్రాయము లేదు, చెడ్డ గురిలేదు, కాని ఆ మందిరము లేదా దేవుని మందసము — జనులకు దూరంగా యున్నది. దేవుని యొక్క మందసమును అతడు తిరిగి దాని స్థానములోనికి తేగోరెను, అప్పుడు జనులు తాము కోరిన విషయములను గూర్చి దేవునితో సంప్రదించగలరు.

సహో॥ బ్లయర్ మరియు ఆ బాలుని తండ్రి దేవునికి ప్రార్థించుటకు బదులుగా ఈలాగనినచో ఎట్లుండేది, "చాలా కీడు జరిగినది, బాలుడు చనిపోయెను; ఎదో జరిగినది?" వారాలాగు భావించకుండా వెంటనే దేవుని యొద్దకు వెళ్ళిరి.

ఆ స్త్రీని చూడండి, ఆమె భర్త — సువార్తను బోధించువాడు — కొన్ని రోజుల క్రితం ఆమె యొక్క వెన్నెముక విరిగినది. "ఆమె జీవిత కాలమంతా చచ్చుబడియుండవలసిందే," అని వైద్యులు చెప్పిరి. "ఇక ఏమి చేయలేములే అని ఆ భర్త భార్యను ఓదార్చలేదు." కాని వెంటనే వారు దేవుని యొద్దకు వెళ్ళిరి. బైబిలులోని ఎన్నో సందర్భములను మనము చూడగలము. ఆపదలలో పడిన మానవులు చాలామంది దేవుని యొద్దకు వెళ్ళిరి.

DEUT 16:11

 

18ఆ రోజులలో వారికి దేవునిని కలిసికొను చోటు ఒకే ఒకటుండెడిది, అదే ఆ మందసము, రక్తము క్రిందకు వచ్చెడి వారు. రక్తము క్రింద మాత్రమే వారు దేవునిని కలిసికొనగలరు. కరుణా పీఠము ప్రోక్షించబడెను. ఆరాధించు వానికి కృప ఇచ్చెను. అడుగువానికి కరుణ చూపబడెను. తన విన్నపము దేవునికి తెలియచేసికొనెడి వాడు… దేవునికి ఒక ప్రత్యేక విధానమున్నది, ఆ విధానములోనే నీవు కూడా తప్పకుండా వెళ్ళవలసి యున్నావు. మరే ఇతర మార్గమును ఆయన అంగీకరించడు, మరే ఇతర ఏర్పాటును ఆయన అంగీకరించడు. ఆయన ఏర్పరచిన దానిని వెంబడించవలెను.

ఈ మధ్య ఒక వర్తమానం నేను బోధించాను, దానిని గూర్చి మీలో చాలామందికి తెలియును. ఆరాధికుని దేవుడు కలిసికొనుటకు దేవుడేర్పరచిన విధానము ఒకే ఒకటున్నది. "ఆ స్థలమునకు తన పేరును పెట్టుదునని," ఆయన చెప్పెను. ఆయన తన నామమున ఉంచిన ఒక సంఘమును మనము కనుగొనినయెడల, మనకు ఆ స్థలము దొరికినట్లే. "అన్ని మార్గములలోను నిన్ను నేను ఆశీర్వదించను గాని, నా నామముంచబడిన స్థలములోనే నిన్ను ఆశీర్వదించుదునని ఆయన చెప్పెను. ఒక స్థలమును ఆయన ఏర్పాటు చేసెను, అక్కడ ఆయనను నీవు కలిసికొనవలసియున్నావు; ఆ స్థానములో మాత్రమే ఆయన నిన్ను కలిసికొనును." ఆయన తన నామమును ఎక్కడ ఉంచెనో మనము కనుగొనియున్నాము. ఆ స్థలములో మాత్రమే ఆరాధికునిని ఆయన కలిసికొనును; ఆయన పేరు యేసుక్రీస్తు. దేవుని యొక్క పేరు యేసుక్రీస్తు.

JOHN 5:43

 

19"నేను నా తండ్రి నామమున వచ్చియున్నానని," యేసు చెప్పెను. ప్రతి కుమారుడు తన తండ్రి నామములోనే వచ్చును. ఆయన తండ్రి నామములోనే వచ్చెను. ఆకాశము క్రింద మానవులకు మరి ఏ నామము ఇయ్యబడలేదు. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, క్రీస్తు సంఘము మరే పేరయినా కావచ్చును — కాని దేవుడు మానవునిని కలిసికొను చోటు ఒకే ఒకటున్నది, ఆ చోటు యేసుక్రీస్తు మాత్రమే. పాత నిబంధనలోని సంగతులన్నియూ దానికి మాదిరిగా యున్నవి. దానిని మీరు స్పష్టముగా అర్థము చేసికొనవలెనని కోరుచున్నాను. అది ఒక ఆదివారబడి పాఠము. నా యొద్ద కొన్ని లేఖనములు ఉన్నవి, అవి ఇక్కడ వ్రాసి ఉన్నవి. ఇది మీరు అర్థము చేసికొనుటకు సహాయపడునని తలంచాను, ఆ పాత జరిగిన సంగతులన్నియూ మనకు ఉదాహరణలుగా యున్నవి.

20దేవుడు ఒక విధానములో కార్యములు జరిగించును, కాని దావీదు దేవునిచేత దీవించబడిన వాడు, రాజు అయ్యెను, దేవుని కొరకు ఒక పని చేయగోరెను. ఏలాగయినా గాని దానిని చేయగోరెను. అతడు ఎన్నడును సరయిన విధంగా వెళ్ళలేదు.

మనము గమనించవలెను: దేవుడు తన వాక్యమును తాను స్వంతగా ముందు నిర్ణయించుకొనిన కాలములో బయలుపరచును. ఈనాటి వర్తమానమును గూర్చి మార్టిన్ లూథర్‌కు ఎట్లు తెలియగలదు? ప్రెస్బిటేరియనులకు ఎట్లు తెలియగలదు? మార్టిన్ లూథర్ యొక్క వర్తమానము, కాతలిక్కు సంఘమునకు ఎట్లు తెలియగలదు? లూథర్ యొక్క వర్తమానమును, జాన్ వెస్లీ ఎట్లు తెలిసికొనగలడు? పెంతెకోస్తు వర్తమానమును, జాన్ వెస్లీ ఎట్లు తెలిసికొనగలడు? ఈ వర్తమానమును పెంతెకోస్తు వారు ఎట్లు తెలిసికొనగలరు? చూచారా, ఆయన దానిని తన కాలములలో బయలుపరచును, ఎందుకనగా అది విత్తనము; అది ఎదిగి పరిపక్వమగుచుండగా, ఆయన తన్నుతాను బయలుపరచుకొనును.

21సూర్యుని యొక్క ఎండవలె వచ్చును. భూమిలోనున్న విత్తనమును అది బయటకు తీసికొని వచ్చును. అది పసితనపు ఎండ, ఆ తరువాత మరో దశలోని సూర్యునివలన ఆకులు తొడుగును. పండే సమయములో పండిన దానినైనను, తీవ్రమైన వేడిగల సూర్యుడు చంపును. అందువల్లనే ఆయన సూర్యుని, ప్రకృతిని క్రమములో ఉంచును, తన వాక్కును నెరవేర్చుటకే. ముందుగా నిర్ణయించబడిన సంఘమును, వధువును ఆయన క్రమపరచును, వారు జీవించుచున్న కాలమును ఎదుర్కొనునట్లుగా చేయును.

ఈనాడు ప్రకృతి కూడా చెప్పుచున్నది, దేశములు విచ్ఛిన్నమగుట మనము చూచుచున్నాము, భూమి దిగిపోవుచున్నది, గోడ మీది చేవ్రాత కనబడుచున్నది. సంఘమును మనము చూస్తున్నాము, అదే స్థితిలో యున్నదో చూచుచున్నాము. వధువును, ఆమె యున్న స్థితిని మనము చూచుచున్నాము. ప్రకృతి ద్వారా మనము తెలిసికొనుచున్నాము. సంఘము వెళ్ళిపోవుటకు సిద్ధముగా యున్నది. ఎంత మహిమకరమగు సమయము! ఈ సమయమును, ఈ ఘడియను ప్రవక్తలందరూ చూడగోరిరి.

22ఆయన తన వాక్యమును, దాని ఋతువులో మాత్రమే బయలు పరుచును. మనము చదివిన బైబిలులోనే, మార్టిన్ లూథర్ చదివెను. మార్టిన్ లూథర్ చదివిన బైబిలునే, వెస్లీ చదివెను. మనము చదివిన బైబిలునే, పెంతెకోస్తువారు చదువుచున్నారు. పరిసయ్యులు చదివిన బైబిలునే, యేసు కూడా చదివెను. కాలము రాకుండా వారు పంటను కోయగోరిరి, కాని అది పండుచున్నప్పుడు వారు చూడకుండా విఫలమయిరి. ఆ ఘడియ చూడలేదు.

ఇక్కడ దావీదు కూడా అదే చేసెను. దేవుడు ఈ వాక్యమును తగిన కాలములో బయలుపరచును. దానిని ఆయన తాను ఎన్నుకొనిన వారికి బయలుపరచును. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వారిని ఎన్నుకొనెను. ఆయన క్రియలన్నియూ ముందే ఆయనకు తెలియును. మానవునికి అవి మరుగుగా యున్నవి; ఆయన తన ఇష్టానుసారముగా వాటిని బయలు పరుచును. అది ఆయన యొక్క ఎన్నిక కాలము. ఆ వ్యక్తిని ఆయన ఎన్నుకొనును. ఆయన ఎన్నడూ ఒక పార్టీని గాని, తెగను కాని ఎన్నుకొనడు; ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకొనును. ఆయన ఆలాగు చేయును.

ISA 40:31

 

23ఆయనను సరిదిద్దగల ధైర్యము ఎవరికున్నది? "ప్రభువా, ఈ వ్యక్తిని సేవలోనికి తీసికొని వచ్చుట నీ తప్పు. ఇతడు మేము నమ్మిన దానిని నమ్ముట లేదు," అని ఎవడనగలడు? దేవుడు చేసినది తప్పు అని ఎవరు చెప్పగలరు? ఆ విధంగా ఒక వేళ ఎవడయినా చెప్పినచో, వాడు ఏమీ ఎరుగని బుద్దిహీనుడనబడును. ఆయనకు ఆయన చేయుచున్నది తెలియును. ఎవరిని ఎన్నుకొనవలెనో, ఎవరిని ఎన్నుకొనరాదో, ఏది చేయవలెనో, ఎప్పుడు చేయవలెనో ఆయనకు తెలియును. ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక పని చేయుటకు అన్ని విధాలా తగినవాడని మనము అనుకొందము. ఆ కాలమునకు, రుతువునకు ఎవరు అర్హులో ఆయనకు తెలియును. దానిని చేయు సరయిన సమయము ఆయనకు తెలియును.

నిజమగు మంచి క్రైస్తవుడు, నిజముగా దేవునియందు విశ్వాసముంచువాడు, దేవుని మీద ఆనుకొని ఈ సంగతులన్నింటి కొరకు ఎదురుచూచును. నీ సేవలో కనిపెట్టుము. నీకు వచ్చిన పిలుపు దేవునిదో కాదో, నిశ్చయముగా తెలిసికొనుము. అది సరయినదని నిశ్చయముగా గ్రహించుము. నీవు చెప్పుచున్నది సమయానుసారమైనదను నిశ్చయత కలిగియుండుము. బైబిలు ఈలాగు చెప్పుచున్నది, "యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజువలే పైకెగిరి పోయెదరు. వారు అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోయెదరు."

1SAM 16:13•

1CH 13:3

 

24దావీదును గమనించండి, ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడెను. అతని మీద సమూయేలు తైలము పోసెను. ఇశ్రాయేలు మీద రాజుగా యుండుటకు అతడు దేవునిచే ఎన్నుకొనబడెను. దావీదు పట్టణమునకు యెహోవా యొక్క నిబంధన మందసమును తీసికొని రావలెనను ప్రత్యక్షతను అతడు కలిగియుండెను. అందులో ఏమీ తప్పులేదు, కాని చూడండి, దావీదు ఆ విషయములో తప్పు చేసెను.

అతడు చాలా గొప్పవాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన రాజు. (క్రీస్తు తరువాత ఈ భూమి మీద జీవించిన రాజులందరిలో అతడే గొప్పవాడు, ప్రత్యక్షతను పొందినవానిగా కనబడును. దావీదు అంత గొప్పవాడు, ఎందుకనగా క్రీస్తు దావీదు కుమారుడు.) చాలా గొప్పవాడు, నూతనముగా అభిషేకించబడెను, దేవుని యొక్క సన్నిధి నుండి అతడు వచ్చుచుండెను, దేవుని కొరకే ఏదో చేయవలెనను ప్రత్యక్షత కలిగియుండెను, దేవుని కొరకే అతడు దానిని చేయగోరెను, కాని ఆ ప్రత్యక్షత తప్పు. ఇప్పుడు, అది గొప్ప సంగతి. అది మన అంశమునకు సంబంధించినది. చేయుటకు పిలుపు లేకుండా దేవుని కొరకు ఒక సేవచేయ ప్రయత్నించుట.

1CH 13:1-3

 

25చూడండి, దావీదు ప్రత్యక్షత పొందెను. గమనించండి, ప్రవక్తయగు నతానియేలుకు ఆ ప్రత్యక్షత రాలేదు, రాజగు దావీదుకు ఆ ప్రత్యక్షత వచ్చెను. ఆ విషయములో నాతానును సంప్రదించలేదు. ఎన్నడూ అతడు నాతానును అడుగలేదు. కాని ఇక్కడ మీరు చూడండి, మొదటి దినవత్తాంతములలో యున్నది. అతడు శతాధిపతులను, సహస్త్రాధిపతులను పిలచి ఆలోచన చేసెను. ఎన్నడూ నాతానుతో ఆలోచన చేయలేదు. జనులతో అతడు ఆలోచన చేసెను, యాజకులతో ఆలోచించెను, ఆనాటి వేదాంత పండితులతో ఆలోచించెను, శాస్త్రులను, పండితులను సంప్రదించెను. దావీదు మొదటగా ఆలోచించెను, "ఇది దేవుని వలన కలిగినదయిన యెడల మనము వెళ్ళి మన దేవుని నిబంధన మందసమును పట్టణములోనికి తీసికొని వచ్చుదము అనెను. మనము కార్యములు చేయు ముందు దేవుని సంప్రదించవలెను."

1CH 13:3

 

26కాని సౌలు దినములలోనే వారు దేవునిని సంప్రదించ మానివేసిరి. నిబంధన మందసమును, ఊరీమును, తమ్మీమును అలక్ష్యము చేసిరి. వారు వాటిని విడిచిపెట్టిరి. దావీదు ఇట్లనెను, "ఇప్పుడు మనందరము దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుదము. సరయిన పని చేయుటకు వెళ్ళుదము. వెళ్ళి, మనము మందసమును తీసికొని వచ్చుదము. (దేవుని యొక్క సన్నిధిని తీసికొని వచ్చుదము. పట్టణములో ఉజ్జీవమును తీసికొని వచ్చుదము.) జనులను తిరిగి తీసుకుని వచ్చెదము." మంచిదిగా కనబడినట్లున్న ప్రత్యక్షతను అతడు పొందెను, కాని అది దేవుని చిత్తము కాదు.

అతడు ఎవరిని అడుగవలసి యుండెనో వారిని అడుగలేదు. వెళ్ళవలసిన వారి యొద్దకు వెళ్ళుట మాని, బదులుగా, తన అధిపతులను సంప్రదించెను, ఎందుకనగా అతడు అప్పుడే రాజాయెను. అతడు తన ఆలోచనకర్తలను, తన ప్రధానాధిపతులును, తన బలాఢ్యులను అనుసరించెను.

నామకార్థ సంఘము యొద్దకు అతడు వెళ్ళెను, ఉజ్జీవమును తీసికొని వచ్చుదమనెను. యాజకులను, శాస్త్రులను, శతాధిపతులును, సహస్రాధిపతులును అతడు సంప్రదించెను. ఇది యెహోవాకు ఇష్టమేనని వారు చెప్పిరి. కాని మీరు చూడండి, అతడు ప్రధాన ఆధారమును అడుగలేదు. దేవుడెల్లప్పుడూ అతని ద్వారానే వ్యవహరించును (చూడండి); దానిని అతడు చూడలేక విఫలమాయెను.

27ఇప్పుడతని ఉద్ధేశ్యము మంచిదే. అతని అభిప్రాయము మంచిదే. అతని గురి మంచిదే. పట్టణములోనికి ఉజ్జీవమును తేగోరెను. జనులను తిరిగి తీసుకొని రాగోరెను, కానీ దానిని చేయుటకై దేవుడు చెప్పిన విధానములో ఆలోచన చేయలేదు, చూచారా.

జనులందరూ అంగీకరించిరి, రాజు చేయుచున్న పని మంచిదేనని యాజకులు పలికిరి. మందసము తిరిగి పట్టణములోనికి రావలసిన అవసరమున్నది. దేవుని యొక్క సన్నిధి వారికి అవసరము. ఒక ఉజ్జీవము వారికి కావలెను. కాని దేవుడు తన వాక్యమును బయలు పరచుటకు ఉద్దేశించలేదు, దాని కాలములో అది జనుల యొద్దకు వచ్చును. ఆ కాలములో రాజుకు దానిని బయలుపరచుదునని దేవుడెన్నడూ వాగ్ధానము చేయలేదు. దేవుడు ఏమీ మారడు. దానిని చేయుటకు ఆయన వాగ్ధానము చేయలేదు.

28ఎంత యధార్థముగా యున్నాగాని, ఎంత మంచి ఉద్ధేశమున్నాగాని ఎంత మంచి అభిప్రాయమున్నాగాని, దాని యొక్క అవసరతను ఎంతగా జనులు గుర్తించినాగాని, వీటన్నింటిలోను దేవుని చిత్తమే నెరవేరును. ఈ విషయమునే నేను గట్టిగా నొక్కి చెప్పుచున్నాను. దీనిని మీరు చూచునట్లుగా చెప్పగోరుచున్నాను. దేవుని యొక్క ఆత్మ మీలో నివాసము చేయవలెను. ఆ కారణము చేతనే ఈ విషయమును ఇంతసేపు చెప్పుచున్నాను. టెలిఫోను ద్వారా వినుచున్న జనుల సమయమును నేను తీసికొనుట లేదు, కాని మీరు గ్రహించవలెనని కోరుచున్నాను. మీకు సమయము చాలనియెడల టేపును తీసుకోని వినండి.

అదెంత అవసరమయినా గాని, ఆ విషయములో జనులందరూ సమ్మతించినాగాని, అదెంత సత్యమయినా గాని, ఇంకా ఒక సంగతిని చూడవలెను. అది దేవుని చిత్తమా అని చూడవలెను.

దేవుడు తన రాజుకు తన రహస్యములను బయలుపరచుదునని ఎన్నడూ వాగ్ధానము చేయలేదు. దేవుడు తన ప్రజలకు తన రహస్యములను వెల్లడి చేయును.

1KGS 22:6•

2CH 18:5

 

29ఇమ్లా కుమారుడగు మీకాయా కాలమును చూడండి. మనము అంశమును విడిచిపెట్టుట లేదు, కాని మరోసారి దీనిని మీకు చెప్పగోరుచున్నాను. దీనిని నిజమని మీరు గ్రహించవలెను, ఇది వాస్తవమని మీరు గ్రహించినప్పుడు దానిని చూడగలరు.

మీకాయా దినములను చూడండి… అతడు పేదవాడు, పేద కుటుంబము నుండి అతడు వచ్చెను. ఇశ్రాయేలునకు ఆహాబు, రాజు. దేవుని ఆధిపత్యము క్రిందనున్న దేశము, కానీ అతడు పాఠశాలను ఏర్పాటు చేసి, ప్రవక్తలను ఎన్నుకొనెను. తానే స్వయంగా వారిని ఏరుకొనెను. నాలుగు వందల మంది పాఠశాలలో యుండిరి. వారు గొప్పవారు. వారు అబద్ధ ప్రవక్తలు కారు. వారు హెబ్రీ ప్రవక్తలు, అసలయిన వారే. వారి ద్వారా ఇతడు దేవునిని సంప్రదించెను. వారు ప్రవచించిరి. కాని మీరు చూడండి, నిజమగు రూపము బయటపడినది. వారిలో ఏ ఒక్కరును దేవుని వాక్యములో గాని, దేవుని చిత్తములో గాని లేరు.

1KGS 22:2-5•

2CH 18:3,4

 

30ఆహాబు రాజును కలిసికొనుటకు యెహోషాపాతు యెరూషలేము నుండి వచ్చెను, వారు తమ వస్త్రములు ధరించుకొనిరి, రాజ మార్గములో కూర్చొని యుండిరి, ప్రవక్తలను వారి ఎదుటికి నడిపించుకొని వచ్చిరి. "రామోత్గిలాదు యొద్ద నున్న స్థలము మనకే చెందునని," మొదట ఆహాబు పలికెను. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ప్రజలకు "దానిని యెహోషువా పంచి ఇచ్చెను," అది వారిది, కాని ఫిలిష్తీయులు దానిని తీసికొనిరి. "ఇక్కడ మన పిల్లలకు ఆహారము లేదు, పంట పండించుటకు కావలసిన స్థలము మనకు లేదు; మన శత్రువులగు ఫిలిష్తీయులు చక్కగా తమ పిల్లలను పోషించుకొనుచున్నారు. యెహోవా దేవుడు మనకిచ్చిన స్థలమును అన్యులు అనుభవించుచున్నారు." "మనము దేవుని పిల్లలము, మన పిల్లలు ఇక్కడ అవసరతలో యున్నారు, దేవుడు మనలను ఐగుప్తులో నుండి బయటకు పిలచి ఈ నేలను ఇచ్చెను, కాని శత్రువు దానిని అనుభవించుచున్నాడు. కావున దేవుడు మనకిచ్చిన ఆ నేలను మనము వెళ్ళి స్వాధీనపరచుకొందము అన్నాడు." అది చాలా సబబుగానే యున్నది, వేదాంత పండితులు దానిని కాదనరు. "మనము సోదరులము గనుక నేను నీకు సహాయపడెదనని," యెహోషాపాతు చెప్పెను. నీవు యూదయలోను, నేను యెరూషలేములోను యున్నాను, అంతే తేడా అన్నాడు. ఏమయినా గాని యెహోషాపాతు చాలా మంచివాడు, నీతిమంతుడగు రాజు, యెహోవాను ప్రేమించిన వాడు. ఆహాబు నులివెచ్చని విశ్వాసి. వారిద్దరు కూడివచ్చిరి, "మొదట మనము యెహోవాను సంప్రదించి, ఈ విషయమును గనుగొందమని," యహోషాపాతు పలికెను. (యెహోషాపాతు చేసినట్లుగానే దావీదు కూడా చేయవలెను.) అతడు చెప్పెను, "దీనిని మనము చేయకుడదా?"

ఇశ్రాయేలీయుడను ఆహాబు వెంటనే ఇట్లనెను, "నిశ్చయంగా! నా యొద్ద నాలుగువందల మంది హెబ్రీ ప్రవక్తలున్నారు — ఆ హెబ్రీ ప్రవక్తలు మన స్వంత సంస్థకు చెందిన వారు. వారిని నేను సంప్రదించెదను. వారు ప్రవక్తలు."

ఇప్పుడు మీరు చూడండి…

1KGS 22:6,11,12•

2CH 18:5,10,11•

JER 28:10

 

31బ్రెన్‌హాం సోదరుడా, ఆ విషయములో నేను తికమకపడుచున్నానని నీవందువు. అవును. వారు ప్రవక్తలే. యిర్మియా కాలములో ఒక ప్రవక్త యుండెను. అక్కడ వారు రెండు సంత్సరములు మాత్రమే యుందురని అతడు చెప్పెను. డెబ్బది సంవత్సరములుందురని దేవుడు యిర్మియాతో చెప్పెను. అతని మెడ మీద కాడినుంచగా ప్రవక్త దాని విరుగగొట్టెను — హనన్యా. కాని అతనికేమి సంభవించినదో మీకు తెలియును. మీరు వాక్యముతో నిలచియుండ వలసియున్నారు.

కావున ఈ ప్రవక్తలు వచ్చి ప్రవచించిరి, "వారి మీదికి వెళ్ళుము. యెహోవా నీకు తోడై యుండునని చెప్పిరి." వారిలో ప్రధానుడు సిద్కియా అని నేను తలంచుచున్నాను. అతని పేరు మరువలేదు గదా? అతడు ఇనుప కొమ్ములు పట్టుకొని యుండెను. అతడు ఇట్లు పలికెను. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు శత్రువును బొత్తిగా నిర్మూలము చేయుదురు, దేవునికి చెందిన భూమిని స్వాధీనపరచుకొందురు; అది మీ కియ్యబడును." [అతడు యధార్థపరుడే], అతడు వేషధారి అని నేను తలంచను. అతడు మంచివాడని నమ్ముచున్నాను. ఆ ప్రవక్తలందరూ అట్టివారేనని నమ్ముచున్నాను.

32"ప్రవక్తలు" కారని మీరనుకోవద్దు. గుర్తుంచుకొనండి, యేసుక్రీస్తును చంపుటకు సమ్మతించిన వ్యక్తి ప్రవచించెను, ఎందుకనగా అది అతని పని. అతడు ఆ సంవత్సరమునకు ప్రధాన యాజకుడు, అతడు ఆ పనికి నియమింపబడినందున దేవుని యొక్క ఆత్మ అతని మీదికి వచ్చెను. అందువలన అతడు రక్షించబడెనని అర్థము కాదు. కయప ప్రవచించెను, ఎందుకనగా అది అతని పని.

వీరును ప్రవక్తలే, ప్రవక్త పనిని నిర్వహించుచుండిరి, అందుకే ప్రవచించిరి. దేవుని యొక్క ఆత్మ వారి పైకి వచ్చెను, ఆత్మ వరములు కలిగిన వారు.

33నేను తొంబది-తొమ్మిది శాతం మంది పెంతెకోస్తు వారితో మాట్లాడుచున్నట్లు గ్రహించుచున్నాను. దేవుడు చాలాసార్లు మానవులతో వ్యవహరించుచుండును, వారికి వరమును ఇచ్చును, జనులు వారిని తొందర చేయుదురు. వారు దేవుని చేత పరిపూర్ణముగా పిలువబడి పంపబడని యెడల ఆ స్త్రీ లేక పురుషుడు దేవుని చిత్తము కాని దానిని ప్రవచించును, ఎందుకనగా వారిని జనులు బలవంతము చేయుచున్నారు గనుక ఆ విధముగా ప్రవచించెదరు.

మన సంఘకాపరిని ఇక్కడ నేను చూచుచున్నాను. ఒక ఉదయము దాదాపు మూడు గంటలకు అరణ్యములో దేవుడు నాతో, "సహో॥ నెవిల్‌కు వెళ్ళి చెప్పమనెను." నేను నీ యొద్దకు వచ్చాను గదా నెవిల్ సోదరుడా?

అందరూ, "నా గూర్చి సహో. నెవిల్ ప్రవచించెను. ఏదోదో చెప్పెను." చూచారా? నెరవేరని సంగతులు ఎన్నయినా మీరు చెప్పవచ్చును. కనిపెట్టవలెను, ప్రభువు చేయమనుచున్న దానిని తెలిసికొనవలెను.

1KGS 22:14•

2CH 18:13

 

34ఈ మనుష్యులు శారీరక ధృష్టితో దీనిని చూచిరి. "అది మనకు చెందుననిరి." వారు వాక్యము గాని, దేవుని చిత్తము గాని కనుగొనలేదు.

అంతట మికాయా వచ్చెను, అతడు దర్శనము చూచెను. మొదట అతడు పరీక్షించెనని గమనించండి. "ఈ రాత్రికి కనిపెట్టి, రేపు మీకు జవాబు ఇయ్యగలనని," చెప్పెను. వెంటనే అతడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పలేదు. ఇతర ప్రవక్తలతో సమ్మతించలేదు. "దేవుడు చెప్పినదే చెప్పుదుననెను." ఏమి జరుగునో ఆ మరుసటి రోజున దేవుడు చెప్పెను. మిగిలిన వారు చెప్పిన దానికి అది పూర్తి వ్యతిరేకము. మొత్తం పాఠశాలకు అతడు విరోధి అయ్యెను. ఆలాగు చెప్పినందులకు వారిలో ఒకడు వెళ్ళి అతనిని ముఖము మీద కొట్టెను. కాని అతడు కనిపెట్టెనని గ్రహించండి. అతడు తన దర్శనముతో ప్రవచనమును సరిపోల్చుకొనెను. వ్రాయబడిన వాక్యముతో పోల్చి చూచుకొనెను, అది వాక్యమునకు సరిపోవును.

35తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో జనులకు బాప్తిస్మమిచ్చుటకు తాము ప్రత్యక్షత పొందియున్నామని ఎవరయినా చెప్పినచో, అది వాక్యమునకు విరోధము. సర్ప సంతానమును నమ్మమని ఎవరయినా చెప్పినయెడల, అది వాక్య విరుద్ధము. వారు ఏదయినా చెప్పవచ్చును గాని, అది వాక్య విరోధము. అందులో ఏదియూ నిజము కాదు. వాక్యమునకును, ఆ కాలమునకును అది సరిపోయి యుండవలెను.

1CH 13:1

 

36దావీదు ఆలాగు చేసియుంటే ఎంతో బాగుండెడిది! మందసము వచ్చుచున్నది గాని కాలము సరియైనది కాదు. దానికి స్థలము లేదు.

వారు మందసమును తీసికొని వచ్చుటకు వెళ్ళుటను మీరు గమనించండి. "ఆ హోదా గల వారందరూ దావీదుతో అది దేవుని చిత్తము, అందువలన దేవునికి మహిమ, మనకు ఉజ్జీవము కలుగునని చెప్పిరి." ఈనాడు అదే నిజమగు పెంతెకోస్తు — బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్. "దావీదూ, నీవు మా రాజువు. ప్రధానులు, సైన్యాధిపతులు, అధ్యక్షులు మొదలగు వారందరూ నీ కూటమునకు వచ్చుదురు. దావీదూ, నీవు చేయుచున్నది సరి, మొత్తం దేశమంతా నీ వెనుక ఉన్నది అన్నారు." ఈనాడు పరిస్థితి ఆలాగే యున్నది. దేశము నాకు అక్కర లేదు. దేవుడు నాకు కావలెను, ఎవరూ నా ప్రక్క నిలబడకపోయినా పరవాలేదు.

దావీదు యొద్ద సైన్యాధిపతులందరూ యుండిరి. సైనిక బలగముతో అతనికి పూర్తి సహకారమున్నది. శాఖలన్నియూ అతనితో సహకరించుచున్నవి, వేదాంత పండితులందరూ ఏకీభవించుచున్నారు, ప్రతివారు అతనితో సమ్మతించుచున్నారు. ఆహాబు ఇంకా ఇతరులు, చాలామంది ఆలాగే యున్నట్లు మీరు లేఖనములో చూడగలరు; కాని వారికి దేవుడు లేడు, ఎందుకనగా దేవుని చిత్తము కాని దానిని జరిగించుచుండిరి. మీరు గ్రహించిరని నమ్ముచున్నాను.

2SAM 6:15

 

37గమనించండి. వారు చేయవలసిన ప్రతి మత కార్యక్రమమునూ చేసిరి. వారు బహుశా ప్రకటనలు భారీగా చేసి యుందురు. "గొప్ప ఉజ్జీవము. మందసము తిరిగి తీసికొని రాబడుచున్నది. మనకు మహా ఉజ్జీవము రానైయున్నది. మనము దీనిని చేయనైయున్నాము."

చూడండి, అతడు గాయకులను పంపెను. బూరలు, కొమ్ములు ఊదువారిని పంపించెను. మత సంబంధముగా ఏమేమి చేయవలెనో వాటన్నింటినీ వారు చేసిరి. అయినా గాని అందులో దేవుడు లేడు. అది మరల పునరావృతమగుచున్నది గదా?

వారు గాయకులనందరినీ పంపిరి. కొమ్ములూదు వారిని, బూరలూదు వారిని, స్త్రీలను, పురుషులను, గాయకులందరినీ పంపిరి. మత సంబంధముగా చేయవలసిన ప్రతి కార్యమును వారక్కడికి వెళ్ళి నెరవేర్చిరి. ఇది నేను చెప్పవలెననుకొనలేదు గాని, చెప్పవలసి వచ్చినది: ఈనాడు శాఖలు కూడా ఆలాగే యున్నవి. పెంతెకోస్తు వారి వరకు ఆ విధంగానే యున్నారు. పాటలు, గంతులు మొదలగు మత ఉద్రేక క్రియలు పూర్తిగా నెరవేర్చుచున్నారు.

గమనించండి, దావీదు తన శక్తి యంతటితో కేకలు వేసెను, గంతులు వేసెను, నాట్యమాడెను, మత సంబంధముగా ఎన్ని చేయవలెనో అవన్నియూ చేసెను; అయినా గాని అందులో దేవుడు లేడు. అతని యొక్క ఉద్ధేశ్యము, అతని యొక్క గురి సమస్తమూ మంచిదే; కాని అతని మార్గము తప్పు, చూచారా. మత ఉద్యమమును చక్కగా అతడు నెరవేర్చెను: కేకలు వేసెను, పాటలు పాడెను, ప్రత్యేక గాయకులను నియమించెను, ప్రత్యేక గంతులు వేయువారిని ఏర్పరచెను, అంతయూ బాగానే యున్నది. వారు ఆత్మలోనే నాట్యము చేసిరి. వారు చేసినదంతయూ మత ధర్మము చొప్పునే యున్నది.

38అది మన కాలములోని గొప్ప దండయాత్రవలె యున్నది. వారు క్రీస్తు కొరకు లోకమును సంపాదించుగోరుచున్నారు. అటువంటి కార్యము చాలా మంచిది. గొప్ప అమోఘమగు ఉజ్జీవములు, గొప్ప కార్యములు జరుగుచున్నవి; కాని ఆ దినము గతించినదని వారు గుర్తించినచో చాలును. ఆమె తీర్పుకు గురియైనది. అయినా గాని వారు భవనములు నిర్మించుచున్నారు, దండయాత్రలు జరుపుచున్నారు సంస్థలు నెలకొల్పుచున్నారు, అంతయూ బాగానే యున్నది; కాని దాని ఫలితములు దావీదు కాలములో యున్నట్లుగానే యున్నవి; అది పని చేయలేదు.

మనము వెళ్లి మరియు ఉజ్జివమును కలిగియుందుము. మన గొప్ప… కొ౦దరు మన యొక్క గొప్ప సువర్తికులు ఈరోజు, ఆరు వారాల కాలములో వారు ముప్పైవేల మంది మార్పుచెందియున్నారు అని చెప్పుదురు; ఒక సంవత్సరము గడిచిన తరువాత, వారు ఆ ముప్పైవేల మందిని కనుగోనలేరు. అక్కడ ఎదో పొరపాటు ఉన్నది. అది ఏమిటి, అది దావీదు చేసిన విధముగానే యున్నది. గొప్ప హోదాగలవారు, గొప్పవారు, గొప్ప ప్రసింగీకులు, గొప్ప కళాశాలలు, గొప్ప అధికారము, అయినను ఆ కాలమునకు కావలిసిన విధముగా దేవుని ముఖమును లక్ష్యపెట్టుటకు బదులు వారు ఒక పాత సంఘశాఖను వారు సంప్రదించుదురు. కొన్ని కాలములలో మీరు కొన్ని పంటలను పండించలేరు, కానీ ఆ నియమింపబడిన కాలములోనే ఆ పంట పండును.

39ఏమి జరిగినదో మనం చూద్దాం. వారి యొక్క మతోద్రేకము, మతాచారములు గొప్పవే, వారి అభిప్రాయములు గొప్పవే, వారి దండయాత్ర గొప్పదే, వారి గానము గొప్పదే, వారి నాట్యము గొప్పదే, వారి అల్లరి గొప్పదే, వారి సంగీతము గొప్పదే; వారి యొద్ద మందసమున్నది. దేవుడు లేని మందసము వలన ఏమి ప్రయోజనము? కేవలము ఒక చెక్క పెట్టెగా ఉండును, అందులో రెండు రాతి పలకలున్నవి. బాప్తిస్మము పొంది, ప్రభురాత్రి భోజనమును తినినట్లు అది యున్నది. మొదట మీరు మారుమనస్సు పొందనియెడల ఏమి లాభము? ప్రభురాత్రి భోజనము తీసికొనుటవలన ఏమి లాభము? వేషధారివగుదువు. జీవితమును నీవు జీవించవలెను, దేవుని వాక్యమంతటినీ నీవు నమ్మవలెను. అందులో కొంత భాగము తీసికొనుచున్నావు, తక్కినది విడిచిపెట్టుచున్నావు, ఏదో పొరపాటున్నదని ఇందువలన అర్థమగుచున్నది.

ISA 40:31

 

40ఇప్పుడు, ఇదంతయూ జరుగట చూచుచున్నాము. దేవుని యొక్క కాలమును, దేవుని య్కొ సమయమును గుర్తించకపోతే ఏమి జరుగునో ఇప్పుడు మనం చూద్దాం, అది జనుల ఉద్ధేశ్యము.

చాలామంది నాతో ఇట్లనిరి, "నీవు ఇక్కడికి వచ్చి కూటము ఎందుకు పెట్టవు? మేము నిన్ను పిలచెదము. నీవు పలాని పత్రముపై సంతకము పెట్టితే చాలును." ఆగండి! మీరు కోరవచ్చును, కాని దాని విషయములో దేవుడేమి చెప్పును? చాలామంది నన్ను ఆహ్వానించుచున్నారు. నేను సంభాషణలను, వ్యక్తిగత సంభాషణలను చేయవలసియున్నది — సంవత్సరము నుండి ఎదురుచూచుచున్నారు. ఆగండి! దేవుడు నాకు చెప్పకుండా నేను మీకు ఏమి చెప్పగలను? చూడండి? కనిపెట్టవలసి యున్నది. ఆ కారణము చేతనే దానిని నేను చెప్పవలసి యున్నాను, మీరు ఎన్ని ఆహ్వానములు పంపినా "ఆయన మాట కొరకు నేను వేచియుందును," చూచారా. ఆగండి. "యెహోవా కొరకు ఎదురుచూచువారు, నూతన బలము పొందుదురు." అది నిజమేనా?

41గమనించండి, ఆ దినమున ఉండిన యాజకులను — వేదాంత పండితులను, శాఖలను మాత్రమే వారు సంప్రదించిరి. చూడండి, యాజకులను, సమాజమును, జనులను వారు సంప్రదించుట తప్పు — అదే వారు చేసిన పొరపాటు.

చూడండి. మందసము దేవుని వాక్యమై యున్నది. అది నిజమని మనకు తెలియును. ఎందుకనగా ఆ మందసము క్రీస్తే, క్రీస్తే వాక్యమై యున్నాడు, చూచారా. మందసము లేదా వాక్యము దాని అసలు స్థానములో లేదు. దాని మొదటి స్థానము, దానికి నిర్ణయించబడిన స్థానము వేరు. సంఘమా! దీనిని మరువవద్దు. అంతయూ పరిపూర్ణముగానే యున్నది. అంతయూ మంచిగానే కనబడినది. గొప్ప ఉజ్జీవము వచ్చుచున్నట్లు యున్నది, కాని వారు దానిని గూర్చి సరయిన వ్యక్తిని సంప్రదించలేదు. వారు యాజకులను సంప్రదించిరి, హోదాగల వారిని సంప్రదించిరి, వేదాంత పండితులను సంప్రదించిరి, గాయకులను సంప్రదించిరి, అందరూ ఏకాభిప్రాయమును కలిగియుండిరి, వారికి గొప్ప సైనిక సంస్థ యున్నది, దేశమునకు గొప్ప బలమున్నది; గొప్పకూటము కొరకు అందరూ ఏక మనస్కులయిరి; కాని వారు దేవునిని సంప్రదించుటలో విఫలమయిరి. ఆహాబు, ఇంకా చాలామంది ఆ విధంగానే తప్పిపోయిరి. ఎటువంటి సమయము!

42ఇప్పుడు, దీనిని మరువవద్దు. దానిని వారు చూడలేకపోయిరి, ఎందుకనగా వారు ఆలోచన చేయలేదు. (గమనించండి), యాజకుల యొద్దకు, వేదాంత పండితుల యొద్దకు, సైనిక కూటమి యొద్దకు వెళ్ళుట ద్వారా వారు తప్పుచేసిరి. ఆ ఘడియ కొరకు దేవుని చేత పంపబడిన వర్తమానికుడగు నాతానును వారు సంప్రదించలేదు. అక్కడే వారు తప్పు చేసిరి. వారు వెళ్ళి మందసమును తీసికొని క్రొత్తబండి మీద ఎక్కించిరి. క్రొత్త ఎడ్లబండి (వారు ప్రారంభించబోయే కొత్త శాఖ) మీద ఎక్కించిరి. దేవుడు వారికిచ్చిన మార్గము అది కాదు. దానిని తేవలసిన పద్ధతి అది కాదు. అది లేవీయుల భుజముల మీద మోయబడవలసియున్నది. కాని మీరు చూడండి, మీరు తప్పుతో ఏదయినా ఆరంభించినప్పుడు, అంతా తప్పే అగును.

43ఒక గురి వైపుకు నీవు తుపాకీని ఎక్కుపెట్టి యుంచావు, నీవు వెయ్యిలో ఒక వంతు దానిని జరిపినా గాని, లేదా వంద గజములకు నాలుగు లేక అయిదు అంగుళములు గురి తప్పినా గాని ఫలితముండదు. నీ ప్రారంభమే తప్పు. ఓ, దేవా, ఈ ప్రారంభమే తప్పు అని గ్రహించునట్లు సహాయము చేయుము. దీనిని వారు ఈ ఘడియలోని గొప్ప దండయాత్ర అని పిలచుచున్నారు.

వారు దానిని గూర్చి దేవునిని సంప్రదించలేదు. "యాజకులను, మత నాయకులను సంప్రదించారు; సంస్థలను వారు సంప్రదించారు. అందరినీ ఏకము చేయవలెనను తలంపు కలిగియున్నారు." అందరినీ ఏకము చేయవద్దు. దానిని గూర్చి దేవుని వాక్యమేమి చెప్పుచున్నదో చూడుము.

JOHN 5:46•

JOHN 6:31,49•

JOHN 8:24

 

44వారి విధముగా చేసినప్పుడు, ఏమయినదో మనము చూచాము. వారు తమ పాత మత కార్యక్రమముతోనే నిరంతరము కొనసాగిరి. అది దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క చిత్తమునకు విరోధము. అది చచ్చిన కార్యము, ఎన్నో సంవత్సరముల క్రితమే అది చచ్చినది. ఎన్నో సంవత్సరాల క్రితమే అది ఎండిపోయినది.

ప్రభువైన యేసు దినములలోనే అది ఎండిపోయినది. ఆ సంగతి వారెరుగరు. "మీరు మోషేను ఎరిగియుండినయెడల, నన్నును ఎరిగియుందురు, ఎందుకనగా నా రాకను గూర్చి మోషే చెప్పెనని," ఆయన వారితో అనెను.

"మా పితరులు అరణ్యములో మన్నాను తినిరి," అన్నారు.

"వారందరూ చచ్చిరని," ఆయన చెప్పెను. వారిని గ్రుడ్డివారిని ఆయన పిలచెను. వారు పరిసయ్యులు, మత నాయకులు. "నేను ఆయననని మీరు నమ్మని యెడల, మీరు మా పాపములలోనే చనిపోయెదరు," అని ఆయననెను. కాని వారాలాగు చేయలేదు. వారు తమ మార్గములలో అంతగా స్థిరపడిపోయిరి. వారు ఆ మార్గమే సరియైనదని తలంచిరి.

DEUT 18:15•

MATT 4:6,7•

LUKE 4:10•

JOHN 5:46

 

45దావీదు ఆ ప్రకారముగానే చేసెను. అతనికి ఒక మార్గమున్నది, ఆ మార్గములోనే అతడు ముందుకు పయనించెను. అతనికి ఒక ప్రత్యక్షత యున్నది. "ఒక క్రొత్త విధానములో దానిని చేయుదుమని వారు తలంచిరి. అద్భుతములు జరుగు దినములు గతించినవనుచున్నారు. మరియొక సంస్థను తయారు చేయుదుమను కొనుచున్నారు. ఒక క్రొత్త బండిని నిర్మించిరి, ఒక క్రొత్త సంగతిని ప్రారంభించిరి." ఎంత అబద్ధ ప్రవచనము. దేవుడు చెప్పిన ప్రకారము నీవు వెనుకకు రావలసియున్నావు.

లేవీయుల భుజముల మీద దానిని మోయవలెను, అనగా హృదయమని అర్థము. మందసమనగా వాక్యము, దానిని ఒక శాఖలో బంధించరాదు, ఏదో మానవ సిద్ధాంతముల మీద పెట్టరాదు, హృదయములో మోయవలెను. దేవుని వాక్యమును శాఖలు మలచరాదు; మానవుని యొక్క హృదయము ద్వారా దానిని మలచవలెను, అక్కడికి దేవుడు వచ్చి తన్ను బయలుపరచుకొనును. వాక్య ప్రకారముగా దానిని ఆయన బయలుపరచవలెను, అది దేవుని వలన కలిగినది. ఆలాగు కాని యెడల, అది దైవ సంబంధము కాదు. ఋతువునకు సరిపడు వాక్యము.

ఒక పరిసయ్యుడు నిశ్చయంగా ఇట్లనును, "మేము ఇది చేయగలము, అది చేయగలము. మోషే మాకు అధికారము ఇచ్చెను." కాని మోషే మరొకటి కూడా చెప్పెను…

"ఈలాగు వ్రాయబడియున్నదని…" సాతాను కూడా చెప్పెను.

"ఈలాగున కూడా వ్రాయబడియున్నదని," యేసు చెప్పెను.

కాలమును, రుతువును గమనించుము! "మీరు మోషేను ఎరిగియుండిన యెడల నన్ను ఎరిగియుందురు. ఎందుకనగా మోషే నన్ను ఎరుగును." "మోషే నన్ను గూర్చి వ్రాసెను. మీ ప్రభువగు దేవుడు నా వంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును; మీరాయన మాటను వినవలెను." వారు మోషేను ఎరిగియుండిన యెడల ఆయనను వారు ఎరిగియుందురు.

46ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడిది తప్పిపోవద్దు. మొదటి విషయమును చూడండి. వారు యాజకులతో ఆలోచన చేసిరి, హోదాగల వారితో ఆలోచన చేసిరి, సైన్యముతో ఆలోచన చేసిరి, సమూహముతో ఆలోచన చేసిరి, పొరుగు వారిని సంప్రదించిరి, రాబోవుచున్న ఈ గొప్ప కూటమునకు వారందరూ ఏకమయిరి, వారు సరిగా దానిని చేయలేకపోయిరి. వారు దేవునిని సంప్రదించలేదు, వారు ఆలాగు చేయుట వలన — వారు ఆ కాలము ఏమిటో గమనించలేకపోయిరి.

ఓ సోదరుడా వినుము. ఏ కాలములో మనము జీవించుచున్నాము? ఏ కాలమిది? ఏ ఘడియలో మనము జీవించుచున్నాము? వారు మాట్లాడుకొనుచున్న ఈ కార్యములు చేయుటకు ఇది తగిన సమయము కాదు. అది అయిపోయినది. ఇప్పుడు తీర్పు సమీపమాయెను. దానిని మీరిప్పుడు చూడగలరు. కొండ మీది రాయిని గూర్చి మీకు గుర్తున్నదా? తీర్పు ఘడియ! వధువు యొక్క ప్రత్యక్షతను లేదా దర్శనమును మీరు గుర్తుంచుకొనండి. ఆమె నడకను గమనించండి. ఆమె అడుగు తప్పిపోవునట్లుగా చేయవద్దు.

చూడండి, యాజకుల భుజముల మీద దానిని మోయవలెను…

47దావీదు మరియు యాజకులందరూ ఆ సంగతిని బాగుగా ఎరిగి యుండవలసినది, కాని ఏమి జరిగినది? యాజకులు ఇంకా బాగుగా ఎరిగి యుండవలసినది. శాస్త్రులు, వేదాంత పండితులు ఇంకా బాగుగా ఎరిగి యుండవలసినది, కాని వారు ఆలాగున చేయవద్దని వాక్యము చెప్పుచున్నది.

ఈ రోజు వారు ఈలాగున చెప్పగోరుచున్నారు, "ఓ! యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా లేడు; అది మానసిక పరిశోధన;" అది మరేదో; "అది గతించిపోయిన మాట." వాగ్థానము చేయబడిన మాటను వారు చూడక తప్పిపోవుచున్నారు.

దావీదు చెప్పెను," ఒక్క నిమిషం ఆగండి! యాజకుల భుజముల మీద మోషే దినములలో దానిని మోసిరి, కాని మనము దీనిని క్రొత్త బండి మీద నేడు తీసికొని వద్దాము. దానిని గూర్చి నాకు ఒక ప్రత్యక్షత వచ్చియున్నది."

"ఆలాగే జరుగును గాక," దావీదూ, అని యాజకులు చెప్పిరి, చూడండి.

వారి యొక్క ఐక్య సంఘ ఆలోచనచే అతడు ప్రభావితుడాయెను, వారందరూ ఏకీభవించిరి, ఏదేదో చెప్పిరి, యాజకులు తొట్రిల్లిరి. సరయిన వ్యక్తిని వారు సంప్రదించలేదు. వారు దానిని సరిగా చేయలేదు; అందువలన వారు ఆపదలో పడిరి.

48ఈనాడు చాలా సంగతులను చూచి నాకు భయము కలుగుచున్నది… పెంతెకోస్తు యొక్క ఒక గొప్ప ఉపదేశకుడు ఒక మత గుంపు యెదుట షికాగోలో ఒక రాత్రి నిలబడెను, చాలా గొప్పబోధకుడు, ఆ వ్యాపారస్థుల కూడికలో నేను ఉండవలసియున్నది, కాగా ఆ సమయములో నేను ఆఫ్రికాలో ఉన్నాను; కావున ఆ ప్రారంభమునకు ముందు రోజే నేను వెనక్కి వచ్చాను, వారు ఒక గొప్ప పెంతెకోస్తు నాయకుని ఎన్నుకొనిరి. అతడు లేచి నిలబడి ఈ ఐక్య సంఘసమితి దేవుని యొక్క గొప్ప ఉద్యమము అనెను. వారందరు ఒకటి అగుచున్నారని అతడు చెప్పెను; కాతలిక్కు సంఘము కూడా దాని యొక్క అసలు స్థితికి వచ్చుచున్నది, అందరూ కూడా సూచన కొరకు భాషలు మాట్లాడుచున్నారు అని చెప్పాడు. అది అపవాది యొక్క ఉరి అని వారెరుగరు.

ఆ మనిషిని నేనెరుగను… కొన్ని మీరు విత్తనము నాటుదురు. ఏమీ జరుగునో మీకు తెలియదు. సంపూర్ణ సువార్త పనివారల సంఘ అధ్యక్షుడు ఆ గొప్ప బోధకుడు ప్రసంగించి ముగించి కూర్చొన్న వెంటనే లేచి నిలబడి ఇట్లనెను, "మన యొద్దకు ప్రసంగీకులుగా వచ్చిన వారికి వ్యతిరేకముగా ఏమియూ నేను మాట్లాడకూడదు, కాని సహో॥ బ్రెన్‌హాం చెప్పినది ఆలాగున లేదు. అది చివరకు మృగము యొక్క ముద్రకు నడిపించునని," ఆయన చెప్పెను.

"సహో. బ్రెన్‌హాంనకు ఏమి మాట్లాడుచున్నది తెలియదు," అని చెప్పెను.

"ఆయనకు తెలియునని మాకు నమ్మకమున్నది," అన్నాడు.

49చికాగోలో చెప్పాను, నేను వచ్చి ఆ విషయము గూర్చి నా అభిప్రాయమును వెలిబుచ్చవలెనని ఇక్కడ ఎందరో కోరుచున్నారు? అని అడుగగా, అందరును కేకలు వేసి ఆహ్వానించిరి. చూడండి, మీరు విత్తనములను నాటుచున్నారు. ఏమి జరుగునో మీకు తెలియదు. దాని విత్తనమును అది పైకి తెచ్చును. ఆ ఘడియ వచ్చినప్పుడు వారిలో కొందరు…

తోమా వలె యుండును, ప్రభువును చూచినవారిలో అతడే చివరివాడు, కాని అతడు ఆయనను చూచి నమ్మవలసియున్నాడు, చూడండి. అది జరుగుటను వారు చూచిరి… ఓ, తోమా వచ్చెను, కాని అతడు కొద్ది ఆలస్యంగా వచ్చెను.

ముందుగా చెప్పబడిన సంగతులను వారు చూచిరి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని వారు చెప్పిరి. "మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడి," అని వారడిగిరి.

50కాని ఇప్పుడు, ఆ ప్రభావమును గమనించండి… కొన్నిసార్లు గొప్పవారు ఏకమగుదురు. పలాని గొప్ప ఆయన, పలాని గొప్ప ఆయన వచ్చి యున్నాడని వారందురు. ఎన్నడునూ ఆలాగు అనరాదు. మన మధ్య గొప్ప వారెవరునూ లేరు, ఒకే ఒక గొప్పవాడున్నాడు, ఆయన దేవుడు. మనము సోదరీ సోదరులము. అయిదుగురు మనుష్యులున్న సంఘమునకు నీవు కాపరిగా యుండవచ్చు, అందువలన నీవు చిన్నవాడివి కావు; నీవు ఒక సోదరునివి. దేవుని వాక్యము పట్ల నీవు నమ్మకముగా ఉన్న యెడల దేనినీ నేను లెక్క చేయను, నీవు చిన్నవానివి కావు. దేవునికి చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు లేరు. ఆయనకు పిల్లలున్నారు, వారందరూ ఒక్కటే.

గమనించండి. దేవుడు మహిమతో నిండిన దంతపు నగరులో నుండి క్రిందికి దిగి వచ్చి మనలో ఒకటివంటి వాడాయెను. ఇప్పుడు పెద్దవారెవరు? యాజకుని రూపము ధరించుకొనుటకు రాలేదు గాని, దాసుని రూపము ధరించుటకు వచ్చెను. ఆయన సృష్టించిన మట్టిని ఆయన శుద్ధి చేసెను. తన అపోస్తలుల యొక్క పాదములను కడిగెను… ఇప్పుడెవరు గొప్పవారు?

51కాని ప్రభావము పడినది, ఈ జనులను చూడండి. వారికి అర్థము కాలేదు. ఏదో క్రొత్తది జరుగునని వారు తలంచారు (కాదు), ఏదో క్రొత్తది జరుగునని దేవుడు చెప్పలేదు. వారు తప్పు త్రోవలో నడిచిరి. ఈ ఆసక్తి అంతటికి అదే కారణము… ఎప్పుడో చాలా కాలము క్రితమే అది ప్రారంభమాయెను. ప్రతి శాఖకు ఒక దైవ స్వస్థకుడు ఉండవలెనని తలంచుచున్నారు. ప్రతి శాఖకూడా ఏదేదో చేయుచున్నది. ప్రతిశాఖకు కూడా ఒక చిన్న దావీదు ఉండవలసియున్నాడు. ప్రతివారు ఏదేదో కలిగి యుండవలసియున్నారు. ఏమి జరిగినదో చూచారా? అప్పుడు జరిగిన ప్రకారమే ఇప్పుడును జరుగుచున్నది. అదే సంగతి. ప్రభావము…

రుతువునకు సరిపడు వాక్యము — వారు ఏ కాలములో జీవించుచున్నారో — ఆ కాలమును నిర్లక్షము చేసిరి.

గమనించండి. లేవీయుల యొక్క భుజములను ఈ పని చేయుటకు దేవుడు అసలు నిర్ణయించెను. భుజముల మీద మందసమును మోసికొని రావలెను. దానికి భిన్నముగా ఉన్నది ఏదయినా గాని అది పొరపాటే. ఆయన భావముతోనే ఏదయినా చెప్పును. దేవుడు మారడు. ఆ కారణము చేతనే వాక్యముతో నిలిచియుండుము.

నేను వ్రాసియుంచాను, మొదటి దినవత్తాంతము 15:15, మీరు వ్రాసికొనవచ్చును.

52ఇప్పుడు చూడండి. దేవునిని వెంబడించవలెను… దీనిని మీరు మనస్సులో గుర్తుంచుకొనవలెను. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు గాని, దేవుని కొరకు సరయినది ఏదయినది చేయవలెనన్నా గాని, దేవునికి సరిగ్గా సేవ చేయవలెనన్నాగాని తప్పక అనుసరించవలసిన సంగతులు అయిదున్నవి.

ఇప్పుడు దావీదు దేవునికి ఒక సేవ చేయుచుండెను. తనకు తెలిసిన ప్రతి దానిని అతడు చేయుచుండెను, అయితే దేవునిని విడిచిపెట్టెను, చూచారా. అతడు మంచి కార్యమే చేయుచుండెను, జనుల యొక్క మేలుకొరకే సంఘము యొక్క మేలుకొరకే దానిని చేయుచుండెను.

కాని తప్పక చేయవలసినవి అయిదున్నవి: వీటిని మీరు గుర్తుంచుకోవలెనని కోరుచున్నాను. ఒక వ్యక్తి ఎంత యధార్థంగా ఒక కార్యము చేయుచున్నా — దేవునికే సేవ చేయుచుండవచ్చును — ఈ అయిదు సంగతులు తప్పక పాటించవలెను.

మొదటగా, దానిని చేయుటకు ఆయన సమయము రావలెను.

మనము కూడా "ఒక ఓడను నిర్మించి నైలు నదిలో నోవహు చేసినట్లుగా తేల చేయుదమని మోషే చెప్పినచో ఎట్లుండును?" నోవహు ఓడ చేయవలసిన కాలములో యుండెను, కాని మోషే కాలము అది కాదు.

"మోషేవలె మనము కూడా కొండ మీదికి వెళ్ళి, క్రొత్త శాసనములను తయారు చేయుదమని, యేసు చెప్పినచో ఎట్లుండును?" చూచారా, ఆయనే ఆ ధర్మశాస్త్రము. ఆయన కాలమును నీవు గుర్తించుట అగత్యము. ఆయన కాలములోనే అది చేయవలెను. ఇప్పుడు దానిని గ్రహించారా?

ఆయన కాలములోనే తప్పక జరిగించవలెను, తప్పక అది ఆయన కాలమై యుండవలెను.

53ఆయన పలికిన మాట ప్రకారముగా అది యుండవలసియున్నది. ఇది తప్పని సరి…

ఈలాగుండాలి, ఆలాగుండాలి, మరో రకంగా యుండాలి అని నీవెంత చెప్పినా ప్రయోజనము లేదు. "అది ఆయన యొక్క ఋతువు మరియు కాలములోని ఆయన వాక్య ప్రకారముగానే యుండవలెను." దానిని చేయుటకు ఆయన ఎన్నుకొనిన వ్యక్తి ద్వారానే తప్పక దానిని చేయవలెను.

వారికెంత హోదాయున్నా నేను లెక్క చేయను… రాజగు దావీదు వారందరి కంటెను గొప్పవాడు. అతడు దేశమునకు రాజు, కాని అతడు చేయవలసిన మార్గమున్నది; వారికి ఎట్లు చేయవలెనో ఆయనే చెప్పవలెను, కాని ఆలాగు చేయుటలో వారు విఫలమయిరి.

తప్పకుండా అది ఆయన వాక్య ప్రకారముగా యుండవలెను, ఆయన సమయము ప్రకారము ఉండవలెను, ఆయన కార్యక్రమము ప్రకారము యుండవలెను.

AMOS 3:7

 

54ఆ కార్యమును చేయుటకు ఆయన ఎన్నుకొనిన వ్యక్తి ద్వారానే, తప్పకుండా దానిని చేయవలెను.

మోషే పారిపోవలెనని తలంచెను. "మరొకరిని ఎన్నుకోమనెను!" కాని దానిని చేయుటకు దేవుడు మోషేను ఎన్నుకొనెను. చాలామంది యున్నారు… పౌలు తప్పించు కొనుటకు ప్రయత్నించెను, ఇంకా అనేకులున్నారు. కాని దానిని చేయుటకు ఎవరిని ఆయన ఎన్నుకొనెనో, వారి ద్వారానే ఆయన చేయును. తప్పకుండా ముందు ఆయన ప్రవక్తల యొద్దకు వచ్చును. "దేవుని యొక్క వాక్యము తప్పకుండా ముందు తన ప్రవక్తల యొద్దకు వచ్చును." (ఆమోసు 3:7). "తన ప్రవక్తలగు దాసులకు, ఆయన మొదట బయలుపరచకుండా ప్రభువగు దేవుడు ఏమియూ చేయడు." నాలుగు:

ప్రవక్తలు తప్పకుండా, దేవుని వాక్యము ద్వారానే ఋజువు చేయబడవలెను.

ఈ అయిదు కచ్చితము. అది ఆ విధముగా ఉండవలెను; ఆయన సమయము; ఆయన సమయము (ఆయన ఆలాగు జరుగును అని చెప్పు సమయము); ఆయన ఎన్నుకొనినవాడై యుండవలెను; మరియు ప్రవక్త ఒక రుజువుపరచబడిన ప్రవక్త అయి యుండవలెను. మనము వారిలో చాలా వ్యక్తులను బైబిలులో చుచాము, అది ప్రవక్తల యొద్దకు వచ్చెను మరియు అది రుజువుపరచబడలేదు. మన ప్రవక్త యేసుక్రీస్తు అయి యున్నాడు.

55కాబట్టి ఇప్పుడు గమనించండి. దేవుడు దానిని చేయుటకు తాను ఏర్పరచిన మార్గమును వారికి బయలుపరచలేదు. వారు దావీదు యొక్క మార్గమును అంగీకరించిరి. యాజకుల యొక్క మార్గమును వారు అంగీకరించిరి. శాస్త్రుల యొక్క మార్గమును వారు అంగీకరించిరి, వేదాంత పండితుల మార్గమును వారు అంగీకరించిరి, దేవుని మార్గమును అంగీకరించలేదు. ఆ దినమునకు దేవుని ప్రవక్తగా నాతాను ఉండెను. ఆ తరువాత నాతాను వారికి ఎట్లు చేయవలెనో చెప్పెను. కాని చూడండి, వారు నాతానుతో సంప్రదించకుండా చేయసాగిరి. నాతానుకు ఒక్క మాట కూడ వారు చెప్పలేదు, ప్రభావమంతా చూడండి, గొప్ప కార్యము చేయుచుండిరి. ఒక పాట నాకు గుర్తుకు వచ్చుచున్నది:

హృదయములు మండుచుండగా, ప్రభువా, నాకు సహాయము చేయుము.

నా గర్వమును అణచుచు. (మిగిలిన వారందరితోను వెళ్ళుటకు),

నీ నామమునకు ప్రార్థించుచున్నాను;

ఇతరులు చేయుచున్న దాని మీద ఆధారపడకుండా నాకు బోధించుము.

నీ యొద్దనుండి జవాబు కొరకు ప్రార్థనలో వేచియుందును.

అది విధానము. సరయిన రీతిలో అది జరుగునట్లుగా మనము చూడవలెను, దానిని నమ్ముదుము.

56దావీదు ద్వారాను, సేవకుల ద్వారాను, జనుల ద్వారాను, శతాధిపతులు, సహస్రాధిపతులు ద్వారాను, ఆ సంగతిని దేవుడు బయలుపరచెను గాని, "యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు" కలిగియున్న నాతాను ద్వారా బయలుపరచలేదు. మొదటగా ఆ కాలములో యుండిన ప్రవక్తకు చూపించకుండా తాను ఏదియూ చేయనని ప్రభువు చెప్పెను. వారేమి చేసిరో చూడండి? వారు దేవుని వాక్యమును పూర్తిగా త్రోసివేసి, ఒక క్రొత్త బండిని తయారు చేయించి దానిమీద ఆ మందసమును తెచ్చుటకు వెళ్ళిరి. చూచారా? దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుడేర్పాటు చేసిన విధానమును కాలదన్ని వారి పని చేయుటకు బయలుదేరిరి. స్నేహితులారా, నేడు అదే జరుగుచున్నది. ఆ కారణము చేతనే మనకు చాలా గొప్ప దండయాత్రలు జరుగుచున్నవి. కాని ఫలితములు లేవు. నాస్తికత్వము, పాపము ఇంకా ఎక్కువగుచున్నవి. ఈ దేశము పని అయిపోయినదని మీకు నేను చెప్పుచున్నాను. ఈ దేశమే కాదు. ఇతర దేశములు అన్నీ ఆలాగే యున్నవి. ఈ దేశము, మరో యుగములో నున్న ఇంగ్లాండు వలె మిగిలిన దేశములన్నింటి యొక్క వేశ్యగా యున్నది.

REV 3:17

 

57మొజాంబిక్‌లో పిల్లలు ఏల్విస్ ప్రిస్లే పాట వినుచున్నారు. అది అరణ్యము. నాగరికతకు అది నాలుగు వందల ఎనబది మైళ్ళు దూరములో యున్నది. వారు ఆ పాటలు వినుచు తలలూపుకొంటూ నాట్యము చేయుచున్నారు. రాత్రంతా పాటలు పాడుచున్నారు. ఆ ప్రభావము వేలాది మైళ్ళ దూరము వెళ్ళి పోయినది. రొడీషియాలోనికి కూడా ఎల్విస్ ప్రిస్లే వెళ్ళిపోయాడు. అతడు, ఇంకా "పాట్ బూన్ చాలా భక్తిగలవారని వీరచుచున్నారు." ఇది యూదా యొక్క ఘడియ. దానిని వారెరుగరు. అది చెడ్డ భాగము. వారు తాము నమ్ముచున్నదే నిజమని తలంచుచున్నారు. ఆ లవొదికయ సంఘ కాలముతో యేసు చెప్పినది వినలేదా? "నీవు దిగంబరివియు, దిక్కుమాలినవాడవును, దౌర్భాగ్యుడవును, గ్రుడ్డివాడవును అయియున్నావని ఎరుగకున్నావు." ఆ సంగతిని ఎరుగదు.

"ఆఫ్రికాలోని పెంతెకోస్తు పిల్లలు ఈ ఎల్విస్ ప్రిస్లే పాటలు బహు మధురముగా యున్నవని" చెప్పుచున్నారు. దావీదు చేసినది కూడా నిస్సందేహముగా ఆలాగే యున్నది. కాని ఆ గాయకులు చేసిన దాని వలన పాళెములోనికి మరణము వచ్చినది. స్నేహితులారా, మనము ఎక్కడున్నామో చూచారా?

58లేవీయుల భుజములు దానిని మోయవలెనని దేవుడు అసలు ఉద్దేశించెను. వారయితే దానిని క్రొత్త బండి మీద ఎక్కించిరి. అదెన్నడూ పని చేయదు. వారు సరయిన మార్గమును సంప్రదించలేదు. చూచారా? కావున వారు తప్పు విధానములో దానిని తీసికొని వచ్చిరి. నేడును అదే జరుగుచున్నది.

మానవుడు ఎంత యధార్థముగా ఆయనకు సేవ చేయ ప్రయత్నించుచున్నా గాని, ఆయన ఏర్పరచిన మార్గములో నడువనియెడల చివరకు అంతయూ గందరగోళమే అగును. దేవుడు తన మార్గములో పనిచేయును. అందులో నీవు లేకుండా, ఎంత యధార్థముగా ఆయనకు సేవ చేయ ప్రయత్నించినా అది వ్యర్థమగును. దానిని నీవు గందరగోళముగా చేసెదవు.

59బిలాము వలె యుండును, బిలాము దినములను చూడండి. బిలాముతో దేవుడు చెప్పెను… బిలాము ఒక ప్రవక్తయై యుండెను. వాక్యము ఖచ్చితంగా అతని యొద్దకే వచ్చును. వారు "నేను ఏర్పరచుకొనిన జనాంగము, గనుక వారి యొద్దకు వెళ్ళవద్దని," దేవుడు చెప్పెను.

బిలాము అధికారులతో లాలూచీపడెను, సైనికులతోను, బోధకులతోను, పలుకుబడిగల వారితోను లాలూచీపడెను. దావీదుకును, ఈనాటి వారికిని మాదిరిగా యున్నాడు, ప్రతిదీ మాదిరిగా తీసికొనండి. దానిని మీరు గమనించగలరు. దానిని మీరు చూచారా, "ఆమేన్!" చెప్పండి.

ఇప్పుడున్నట్లే యున్నది చూడండి. ఇదే విధానము, ఈ విధంగానే అది జరుగవలసియున్నది అని ఆ యాజకులు, శాస్త్రులు, వేదాంత నిపుణులు చెప్పిరి. కాని "అది దేవుడేర్పాటు చేసిన మార్గము కాదు."

NUM 22:12•

JOHN 6:49

 

60దేవుడు బిలాముతో చెప్పెను — అతడు మొదట ఒక ప్రవక్త — "వెళ్ళవద్దు," అని దేవుడు చెప్పెను.

కాని ఈ మిగిలిన వారి యొక్క ప్రభావము అతడు ఆలాగున చేయుటకు కారణమాయెను. దేవుడు చేయమని చెప్పిన దానికి అది విరుద్ధము. అది ఉజ్జీవమునకు బదులుగా శాపమాయెను. ఓ! నిశ్చయంగా అక్కడికి అతడు వెళ్ళెను. ప్రజలకు ఈలాగు నేర్పించెను, ఓ! "వేచి చూడండి! మనము మోయాబీయులము. గుర్తుంచుకొనండి, లోతు యొక్క కుమార్తె మనకు రాణి. ఆమె మనకు ఆదియైయున్నది. మనమందరము ఒకే రక్తమునకు సంబంధించిన వారము. మన శాఖలన్నియూ ఒక్కటే." కాని మీరు వాటినన్నింటినీ కలగలుపు చేయరాదు. అక్కడ నుండి దూరంగా పొండి, చూచారా. కాని అతడు మనమంతా ఒక్కటేనని చెప్పుచున్నాడు. "మీరు కూడా మా వంటి వారే అనుచున్నాడు. మనము ఒకరితో ఒకరము పెండ్లి చేసికొనవచ్చును. నిజమైన ఐక్య ఆలోచన సభను ఏర్పాటు చేసికొనవచ్చును, చూచారా. మనందరము కలిసికొని మరల ఆదియందున్న దాని యొద్దకు రావచ్చును." కాని దేవుడు దానిని శపించెను. ఆ పాపము ఎన్నడును ఇశ్రాయేలునకు క్షమించబడదు. శేష దినములన్నిటను అది వారితో నిలచియుండెను. అదెన్నడునూ క్షమించబడదు. దానితోనే వారు అరణ్యములో నశించిరి. ఇది నిజము. ఎందుకనగా వారు దేవుడేర్పాటు చేసిన మార్గమును ఎన్నుకొనలేదు, దానిని చేయవలసిన విధానమును దేవుడు బయలుపరచెను.

గమనించండి, వారు చేసిన ఈ కార్యము వలన ఇశ్రాయేలీయులకు మరణము వచ్చెను. వారు అరణ్యములో చనిపోయిరి. "వారందరునూ అరణ్యములో నశించిపోయిరని," యేసు చెప్పెను. ఆ సమయములో ఎవరు మోషేతో నిలచియుండిరో గుర్తించండి — యెహోషువా, కాలేబులు ఆ కార్యక్రమములో నిలచియుండిరి.

61ఇక్కడ మరల దావీదును గమనించండి, అతడేమి చేసెనో చూడండి? అందువలన ఒక యధార్థవంతుడు చనిపోవలసివచ్చెను. ఇంకా ఆ టెలిఫోను సంబంధమును మనము కలిగియున్నామని తలంచుచున్నాను. దేశమంతటా ఉన్నవారు దీనిని వినవలెను. నాతానును సంప్రదించకుండా దావీదు ఈ కార్యమును చేసెను, అందుకొరకు ప్రభుని యొక్క మాట ఏమిటో గ్రహించలేదు. అందువలన యధార్థవంతులు చనిపోయిరి. అతడు తన చేయి చాపెను, నిబంధన మందసములో ఆయన సజీవునిగా యున్నాడు. ఆయన తన గృహములో నుండి వచ్చెను. ఎద్దులు కాలు జారెను. మందసము జారిపోయెను.

అంతక్రితమే వారు ఒక తప్పు చేసిరి… ఇప్పుడు రెండవ తప్పు చేసిరి. మొదటగా వారు నాతానును సంప్రదించలేదు. తరువాత వారు దేవుని మాటను తెలిసికొనకుండా, ఆ స్థలమునకు వారు వెళ్ళిరి. ఆ దినములలో సమూయేలే వాక్కుగా నుండెను, వారు ప్రభుని వాక్యమును సంప్రదించలేదు. ఆ విధముగా వారు దేవుని వాక్యమునకు విరోధముగా ప్రవర్తించసాగిరి. ఇక్కడ మంచి వ్యక్తికి ఏమి జరిగెనో చూడండి. అతడు కావలివాడు — బిషప్పుగా యున్నాడు — "దేవునిని క్రింద పడనీయరాదనుకొనెను." కావున అతడు మందసము మీద తన చేతిని వేసెను, అతడు చనిపోయెను, ఎందుకనగా అతడు లేవీయుడు కాడు — మూడు విషయములు.

62జాగ్రత్తగా ఇప్పుడు ఆలోచించండి, ఈనాడు శాఖలు ఏమి చేయుచున్నావో గమనించండి. వారు దానిని పడద్రోసిరి, అబద్ధ సిద్ధాంతమని పిలచిరి, చూచారా. వారెక్కడున్నారో చూడండి. వారికి సార్వత్రిక ఆలోచన సభయున్నది. దానిని వారు మానసిక వివేచన అని పిలచుచున్నారు, అది సత్యమని దేవుడే స్వయంగా నిరూపించుచున్నాడు. అది సత్యమని బయలు పరచబడెను. వారు "విమర్శకుల గుంపుగా యున్నారు." "వారేమి మాట్లాడుచున్నారో వారికే తెలియదు." అది నిజము; అందులో సందేహము లేదు. కాని ఆయన మాటలను మనము చెప్పుచున్నాము, ఆయనకయితే ఆయనేమి మాట్లాడుచున్నాడో తెలియును, చూడండి. దానిని నేను వివరించలేను — ఆయన తప్ప ఎవరును దానిని రుజువు చేయజాలరు.

ఇప్పుడు గమనించండి. చాలామంది యధార్థమగు విశ్వాసులు ఈనాడు క్రీస్తు యొద్దకు వచ్చుచున్నారు. హృదయమంతటితో నమ్మి వారు రాగోరుచున్నారు, కాని ఆత్మ సంబంధముగా చంపబడుచున్నారు. చాలా మంది యధార్థపరులు కాతలిక్కు చర్చికి వెళ్ళుచున్నారు, క్రైస్తవులు కాగోరుచున్నారు, మెతడిస్టు, బాప్టిస్టు, క్రీస్తు సంఘము, పెంతెకోస్తు శాఖలకు వెళ్ళి క్రైస్తవులు కాగోరుచున్నారు. దాని మీద తమ చేతినుంచుచున్నారు, వారితో ఏకమగుచున్నారు.

63దావీదు ఈ సంగతి జరుగుట చూచినప్పుడు, మేల్కొనెను. సోదరుడా, ఆలస్యము కాకముందే మేల్కొనుము. అతడు మరణము సంభవించుటను చూచెను. ఫలితములు నాకు చూపించండి. ఈ నామకార్థ ఉజ్జీవము ఏమయినది? ప్రజలు తిరిగి సంఘములో చేరియున్నారు. దేశమునకు ఏమి జరిగినదో చూడండి. విశ్వాసుల శరీరమునకు ఏమయినదో చూచారా? క్రొత్త సంస్థలను, క్రొత్త శాఖలను తయారు చేయుచున్నారు గాని మరేమియూ లేదు. చాలామంది సభ్యులు చేరుచున్నారు. దేశము ఏమయినా బాగయినదా?

వారు ఏవో సంగతులు చెప్పుకొనుచున్నారు… "అమెరికా… దేవుడు అమెరికాను దీవించును. ఇది ఒక క్రైస్తవ దేశము," అని వారు చెప్పుచున్నారు. ఇప్పుడు ఈ దేశము క్రైస్తవ్యమునకు కొన్ని మిలియనుల మైళ్ళ దూరములో యున్నది. దాని కొరకు అసలు నేను ప్రార్థించుట లేదు. ఏలాగు నేను ప్రార్థించగలను? దాని ఎదుట దేవుని యొక్క అద్భుత శక్తులు బయలుపరచబడుచున్నాగాని మారుమనస్సు పొందుట లేదు. తలుపులు మూసికొని, దానిని నిరాకరించుచున్నది, వద్దని వెళ్ళిపోవుచున్నది. దానిని నేను దేవునికి అప్పగించియున్నాను. అది ఇంకా దూరముగా పోవుచున్నది. ఇప్పుడది మునిగిపోసాగినది. ఏమి జరుగునో గమనించుము.

64చాలామంది యధార్థమగు వారు వెళ్ళి ఒక సంస్థలోనో, లేక ఒక గుంపులోనో, లేదా ఏదో ఒక రకమగు మత విశ్వాసములోను చేరుచున్నారు. అక్కడే వారు ఆత్మీయముగా చనిపోవుచున్నారు. వారికి మీరేమియూ చెప్పజాలరు. ఆ బోధ వారిలోనికి పూర్తిగా ఎక్కించబడినది. "బిషప్పులు ఈలాగు చెప్పిరి, లేదా మరెవరో ఈలాగు చెప్పిరి" అనుచున్నారు. దేవుని యొక్క వాక్యమును వారికి చూపించండి. అందులో "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" యున్నది. "కానీ మా సంఘ కాపరి…" మీ సంఘ కాపరి ఏమి చెప్పినను నేను లెక్క చేయను. నేను లేక మరెవరైనా , ఏమి చెప్పినను లెక్క కాదు. దేవుడు బయలుపరచిన వాక్యమునకు గాని, ఘడియకు గాని, కాలమునకు గాని, వర్తమానమునకు గాని అది వేరుగా యున్నచో, దానిని మరిచిపోమ్ము. దాని నుండి నీవు దూరముగా పొమ్ము. తీర్పు దినమున మీ ప్రతి ఒక్కరి యెదుట నేను నిలబడవలసియున్నాను, మరియు దానిని మీరెరుగుదురు. ఇప్పుడు నేను ముసలి వాడనగుచున్నాను, నాకేమీ తెలియదు. అంతా ఆయనకే తెలియును. ఆయన చెప్పిన దానినే నేను వెంబడించెదను.

MATT 15:9•

MARK 7:7

 

65దేశమంతటా జరుగుచున్న ఈనాటి పెద్ద దండయాత్రలను చూడండి; అవన్నియూ ప్రయోజనము లేనివని రుజువయినది. లూకా7:7లో యేసు చెప్పలేదా? "వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు (వ్యర్థముగా దావీదు మందసమును తీసికొని వచ్చెను; వ్యర్థముగా ఆహాబు ఆ ప్రవక్తలకు తర్ఫీదు ఇచ్చెను; వ్యర్థముగా బిలాము ఆ డబ్బు తీసికొనెను), మానవుని బోధలను దేవుని ఆజ్ఞలను వారు బోధించుచున్నారు." దేవుని ఆజ్ఞలకే విలువ యుండును.

"ఆ జనులు నిజంగా యధార్థపరులుగా యున్నారు." వారు ఎంతగానో ఆ మాటను చెప్పుచుందురు. "వారు చాలా యధార్థపరులు." అవన్నీ ఆయనకు లెక్క కాదు. యెహోవా సాక్ష్యులు, సెవెన్త్ డే అడ్వెంటిస్టులు, ఇంకా చాలా రకముల వారున్నారు. మనలో ఏ ఒక్కరము చేయలేని రీతిగా, వారు వీధిలో సువార్తను బోధించుచున్నారు. కాతలిక్కులు వీధి మూలలలో నిలబడి ప్రార్థించుచున్నారు, వారికి ఎన్నో క్రమములున్నవి, వారికి ఎన్నో బిలియనులు-బిలయనులు ఆస్తులున్నా గాని ఇంకా డబ్బు కొరకు అడుగుచుందురు. యధార్థపరులే, అందులో సందేహము లేదు. సంఘములు వెళ్ళి బోధించుచున్నవి. సేవకులు వేదికల మీద నిలబడి ఏవేవో చేయుచున్నారు. క్రొత్త సభ్యులను సంఘములోనికి ఆకర్షించుటకు ఎన్నో పనులు చేయుచున్నారు; కాని అది ఒక క్రొత్త మందసము. ఒకే ఒక మందసమును వెంబడించవలెను; అది దేవుని వాక్యము. ఆ మందస మునకు వేరుగా నున్న ప్రతిదియు వ్యతిరేకమైనదే, దానితో దూరముగా ఉండుము; అది క్రొత్త బండి మీద యున్నది మరియు దేవుని భుజముల కాదు. అది నిజము. అట్టి వాటి నుండి దూరము కమ్ము. దానితో నీకు ఎట్టి సంబంధము లేదు.

MATT 23:37•

LUKE 13:34

 

66మన పెద్ద సువార్త దండయాత్రల మూలముగా మిలియనులు-బిలయనులు మంది మారుచున్నట్లు చెప్పచున్నారు. అసలు వందమంది అయినా గాని ఉన్నారా అని నా అనుమానము, చూడండి. అలాంటి సంగతులు జరుగుచున్నవి. వాగ్ధానము చేయబడిన వాక్యమును చూడండి.

అది విఫలమాయెనని మీరనుకొనుచున్నారు, అది విఫలమాయెనని మనకు తెలియును. ఈనాడు మన దేశములోయున్న గొప్ప సువార్తికులే, అది పూర్తిగా విఫలమాయెనని చెప్పుచున్నారు. అది విఫలమాయెనని సంఘమునకు తెలియును. అది విఫలమాయెనని అందరికీ తెలియును. దీనికి కారణము ఏమిటి? అదెందుకు విఫలమయినది? అది మంచి ఉద్ధేశ్యమునకే జరిగినది; దేవుని సన్నిధిలోనికి జనులను తీసికొని వచ్చు నిమిత్తమే ఇది జరిగినది, పెద్ద సువార్త దండయాత్రలు. మిలియనుల కొలది జనులు తమ డబ్బు ఖర్చుపెట్టిరి, గొప్ప సువార్త దండయాత్రల కొరకు వారు ఖర్చు చేసిరి, సంఘము లన్నియూ ఏకమయినవి, గొప్ప ఆడిటోరియంలు నిర్మించిరి, గొప్ప కార్యములు చేసిరి, గొప్ప సంగతులు జరిగినవి; ఎందుకది విఫలమైనది? వారు ఏ ఘడియలో జీవించుచున్నారో వారికి తెలియకపోవటయే అందుకు కారణము. యేసు నిలబడి తన హృదయములో ఏడ్చినందుకు ఏమీ ఆశ్చర్యపడనవసరము లేదు; ఆయన కన్నుల నుండి నీరు కారెను, "యెరూషలేమా, ఓ యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లుగా ఎన్నోసార్లు నిన్ను కప్ప చూచితిని. కాని నీవు నేను పంపిన ప్రతి ప్రవక్తను రాళ్ళతో కొట్టి చంపియున్నావు. నీవు విననొల్లనైతివి. కాని ఇప్పుడు నీ ఘడియ వచ్చియున్నది," అని ఆయన పలికెను.

67నీలోనుండి పరిశుద్ధాత్మ కేకవేయుటను నీవు వినగలుగుచున్నావా? "ఓ అమెరికా దేశమా, ప్రపంచమా, ఎన్నోసార్లు నిన్ను నేను నా యొద్దకు చేర్చుకోగోరాను, కాని నీవు విననొల్లవు. ఇప్పుడు నీ ఘడియ వచ్చియున్నది. సుఖభోగములే, నీ దేవుడు; అపవిత్రతే, నీ దేవుడు; సొదొమ మరియు గొమొర్రా, నీ దేవుడు;" మన చిన్న పిల్లలు కూడా జుట్టు కత్తిరించుకొనుచున్న విధానమును చూడండి. వారి ముఖముల మీద జట్టు పడుచున్నది. చిన్నవారిలోనే ఈ వంకరతనము ప్రారంభమగుచున్నది. మన స్త్రీలు చెడిపోయిరి, విడిపించలేని స్థితికి వచ్చిరి. మన మగవారు పెద్ద ఆడంగులుగా తయారయిరి, చిన్న చిన్న పాంట్లు చేసికొని ఆడపిల్లల వలె ప్రవర్తించుచున్నారు, జుట్టు వారి మెడ మీద పడుచున్నది… మనము సొదొమీయులము, అగ్ని మరియు దేవుని ఉగ్రత మన కొరకు ఎదురుచూచుచున్నది.

ఆయన ఎట్లు చంపునో, దానిన ఎట్లు నాశనము చేయునో మీకు తెలియునా? ఎల్లప్పుడూ ఆయన చేసిన విధముగానే. ఒక స్త్రీ తప్పు చేసినప్పుడు, ఆమెను రాళ్ళతో కొట్టి చంపుదురు. వేశ్యయగు స్త్రీని వారు రాళ్ళుపెట్టి కొట్టి చంపుదురు. ఆయన తన సంఘమును ఆ విధముగానే చంపును. ఆకాశములో నుండి వడగండ్లు కురియునని బైబిలు చెప్పుచున్నది. అది ఒక్కొక్కటి నూరు పౌనులు బరువుండును. వారిని రాళ్ళతో కొట్టి చంపును. ఆయనను ఎవరు ఆపగలరు? సైన్సు ఆలాగు జరుగదని చెప్పగలదా? ఆయన ఆలాగున చేయును. ఆయన ఒక ఓడను తయారు చేయించి, నోవాహు క్షేమముగా యుండునట్లు చేసెను. ఆయన మరల అదే పనిని తన సంఘము కొరకు చేయును. ఆయన తన స్వంత శాసనముల ద్వారాను, తన స్వంత విధానము ద్వారాను ఆ వేశ్యను రాళ్ళుపెట్టి కొట్టును. అది రాజులతోను, సహస్త్రాధిపతులు, శతాధిపతులతోను వ్యభిచారము చేసినది. ఆయన రాళ్ళతో కొట్టి చంపును. ఆయన తన స్వంత శాసనములను అమలు చేయును. ఆయన వడగండ్లు తయారు చేయలేడని ఎవరు చెప్పగలరు?

68వర్షపు చుక్క ఎట్లు ప్రారంభమగునో ఎవరినయినా అడగండి, ఒక వలయము తయారగును, ఒక చక్రము గుండా మరల వెళ్ళును. ఆలాగు చాలా, చాలా లాక్కొని ఒక బరువును పొందును, అప్పుడది క్రింద పడును. భూమ్యాకర్షణ శక్తి ఆయనను భూమి మీద నిలిపి యుంచలేకపోయెను, ఆయన పరమునకు ఆరోహణమాయెను. భూమ్యాకర్షణను చేసినవాడు ఆయనే, దేవుడు ఆ నీటికి బరువును ఇయ్యగలడు. వంద పౌనుల బరువుగల దానిగా ఆయన చేయగలడు. దానిని చేయుదునని ఆయన సెలవిచ్చుచున్నాడు, మరియు దానిని ఆయన చేయును. ఆలాగు చేయవద్దని ఆయనకు ఎవరు చెప్పగలరు? ఆయన దానిని చేయును, ఎందుకనగా ఆయన చేయుదునని సెలవిచ్చెను.

69మనము చివరి దినములలో యున్నాము. తీర్పుకు సమీపములో మనము నిలబడియున్నాము. ఎందువలన? ఏబది సంవత్సరాల క్రితం పడిన పాత మన్నాను వారు ఇంకా భుజించుటకు ప్రయత్నించుచున్నారు. అదే పెంతెకోస్తు సంఘము. రెండువందల సంవత్సరముల నుండి హోలీనెస్ సంఘము ప్రయత్నించుచున్నది, మూడువందలు, లేదా ఇంకా ఎన్నో వందల సంవత్సరముల నుండి లూథరనులు ప్రయత్నించుచున్నారు. వారు పాత మన్నా తినుటకు ప్రయత్నించుచున్నారు. ఓ సోదరుడా, అది చెడిపోయినది. అది "క్రుళ్ళిపోయినది." అందులో పురుగులున్నవని నేను చెప్పుచున్నాను. దానిని నీవు తినినచో, చనిపోయెదవు.

ఆ ఘడియకు సంబంధించిన ఆహారముతో దావీదు గాని, ఇంకా ఇతరులెవరయినా గాని సంప్రదించిరేమో కనుగొనండి. యాజకులు, ప్రవక్తలు, బోధకులు, వేదాంత పండితులు పాఠశాలలు, శాఖలు ఆ ఘడియను సంప్రదించెను, కాని ఇప్పుడు వారికి ఏ మేలు జరుగలేదు. దాని పని అయిపోయినది. ఇంకేమీ మేలు జరుగదు. ఇప్పుడది నశించిపోయెను. దాదాపు అయిదు సంవత్సరాల క్రితమే ఆ గీతను దాటిపోయెను. అది మారు మనస్సు తీర్పు మరియు కృప యొక్క గీత.

REV 10:7

 

70ఏమి జరిగినదో చూచారా? ఇంకేమి జరుగగలదు? ప్రవక్తను సంప్రదించుదము, అదే బైబిలు, దానికి ఏమీ మనము చేర్చరాదు మరియు దానిలో నుండి ఏమియూ తీసివేయరాదు. ఆలాగు మనము చేసిన యెడల, జీవగ్రంథములో నుండి దేవుడు మన పేరును తీసివేయును. ఈనాడు ఏమి జరుగునో మలాకీ 4లో బైబిలు చెప్పుచున్నది; ప్రకటన 10, ఏడు ముద్రలు ఎట్లు విప్పబడునో, ఈ సంస్కర్తల కాలములన్నింటిలో దాగియుండిన మర్మములన్నియూ ఎట్లు ప్రత్యక్షమగునో చెప్పబడెను. అదెట్లు జరుగునో ఆయన చెప్పెను; అది బైబిలులో యున్నది, "యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు." దేవుడు దానిని సంపూర్తిగాను, పరిపూర్ణముగాను గుర్తించెను. ముప్పది-మూడు సంవత్సరముల నుండి సూచక క్రియల ద్వారాను, ఆకాశములో అద్భుతము ద్వారాను, మేఘముల ద్వారాను అది సత్యమని నిరూపించుచున్నాడు. దాని వారు విందురని మీరు తలంచుచున్నారా? వినరు, వారు చనిపోయిరి. వారు మరో దాని మీద తమ చేతి నుంచినందున, మొత్తంగా చనిపోయిరి. వారు వినరు — ఏ మాత్రమూ ఆలకించరు.

1KGS 21:19

 

71ఇదంతా జరిగిన తరువాత దావీదు కన్నులు తెరచెను. ఓ, దేవా, తానెక్కడ నిలబడియున్నాడో చూచుకొను ఒక దావీదును మాకు పంపించుము, దేవుడు చేసిన వాగ్ధానమును చూడగలడు… ఈనాడు ఏమి చేయవలెనో గ్రహించగలడు. దేవుడు తన వాక్యములోనే దీనిని చేప్పెను, దానిని ఎట్లు చేయగలడో చూడండి.

మీకాయాకు దేవుడు చెప్పెను; నాలుగువందల మంది హోదా గల ప్రవక్తల ఎదుట మీకాయా తన దర్శనమును పరీక్షించుకొనెను. అది సరిగా ఉన్నదో లేదో పరీక్షించుకొనెను. అతడు తన కంటెముందుగా ఉండిన ప్రవక్త ఏమి చెప్పెనో చూచుకొనెను. ఏమీ జరిగినదో చూచెను, అతడు వెనుకకు చూచినప్పుడు ఏలీయా అక్కడ నిలబడియుండి ఏమి చెప్పెనో చూచెను. "ఆహాబూ, నీ రక్తమును కుక్కలు నాకును." ఆ దర్శనము అక్షరాలా దేవుని యొక్క వాక్యానుసారముగా యున్నది, దానిని అతడు పలికెను; అతడు పలికినది సరి. అది నిజము. మిగిలిన వారందరూ ఏమి చెప్పినా గాని, అతడు ఆ వాక్యముతోనే నిలచియుండెను.

JOEL 2:25

 

72నేడు మనకున్న దర్శనమును చూద్దాం. సంఘములను నిర్మించుటయా? క్రొత్తవాటిని చేయుటయా? గొప్ప సంగతులు జరుగనై యున్నవా? లేదా తీర్పు కాచుకొని యున్నదా? వెనుదిరిగి ఈనాటి వాగ్థానమును చూడండి. మనము ఏ కాలములో జీవించుచున్నామో గమనించండి.

"సోదరుడా! నిన్ను దేవుడు దీవించును గాక! నేను యధార్థపరుడను. నేను సంఘములో చేరాను. నేను డిగ్రీ సంపాదించాను అని నీవు చెప్పవచ్చు." అదంతయూ మంచిదే; దానికి ఏమి విరోధము కాను. దావీదు కూడా ఆలాగే చేసెను; ఆనాటి యాజకులు కూడా అదే పని చేసిరి; వేదాంత పండితులు అదే చేసిరి; కాని అది వాక్యమునకు విరోధము. దానిని ఈ దినము ఎట్లు చేయుదునని దేవుడు చెప్పెనో చూడండి, అన్ని సంగతులను ఆయన ఎట్లు చక్కదిద్దునో చూడండి. మరల ఆయన ఏమి చేయునో చూడండి, తిరిగి సమకూర్చుదునని ఆయన వాగ్థానము చేసెను. అది పూర్తిగా నిజము. యోవేలు 2:28 లో ఆయన చెప్పెను, సమకూర్చుదునని ఆయన వాగ్ధానము చేసెను: "పసర పురుగులు తినివేసిన పంటను నేను మీకు తిరిగి ఇచ్చెదను," అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, పంటను తినే అదే పురుగు. అది వివిధ జీవనదశలలో యున్నది. కతోలిసిజం తినసాగినది, లూథరను, మెతడిస్టు, పెంతెకోస్తు తదితరులు తినసాగిరి. "ప్రతిదానిని నేను తిరిగి ఇచ్చుదుననియు, ఆదియందుండిన సంఘమువలె చేయుదుననియు," ఆయన సెలవిచ్చుచున్నాడు.

73ఆ రాత్రి వచ్చిన దర్శనమును గమనించండి. అదే పెండ్లి కుమార్తె ఆ వైపు నుండి , ఈవైపు నుండి వచ్చినది. ఆ వేశ్యలు గౌనులు ధరించుకొని వెళ్ళిపోయిన తరువాత ఇది జరిగినది, వారి పాత క్రియలు పోలేదు. రాక్-ఎన్-రోల్ డాన్సులు పోలేదు, కాని మాదే క్రైస్తవ సంఘమని చెప్పుకొనుచున్నారు. "మేమది చేయము," అని మీరందురు. ఆ విధంగానే దేవుడు మిమ్మును చూచును. నిన్నునీవు చూచుకొనుట కాదు; దేవుడు నిన్ను చూచు తీరు గమనించుము. ఏ మానవుడు కూడా తన తప్పును తాను చూడలేడు. దేవుని వాక్యమను అద్ధములో నిన్ను నీవు చూచుకొనుము. నీది తప్పో, ఒప్పో అది నీకు తెలుపును. దావీదు ఆలాగున చేసియుండిన యెడల తన తప్పును గ్రహించియుండెడివాడు. ఆహాబు ఆలాగున చేసియుండిన యెడల లేదా ఆ ప్రవక్తలు ఆలాగు చేసి యుండినయెడల వారి తప్పును వారు గ్రహించి యుందురు.

ప్రత్యక్షత గలిగిన ఒక ప్రవక్త ఇట్లు చెప్పెను, ఆహాబు చనిపోవును మరియు కుక్కలు అతని రక్తమును నాకును. అతని ప్రవచనము అక్కడున్నది అది సత్యమని అతడెరుగును. యెహోషాపాతు కూడా దానిని చూచి దానిని ఎరిగియుండెను. మీకాయా దర్శనమును చూచెను, ఆ దినములలో అతడు ప్రజలతో ఎక్కువగా లేడు, కాని అతనికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఉన్నది." అతడు సరిగానే యున్నాడు.

74గమనించండి, ఈ దినమున మనము ఈ విషయమును తీసికొని వచ్చుచున్నాము. గొప్ప ఘడియకు మనము వచ్చుచున్నట్లు చూచుచున్నాము. దావీదు కూడా ఏమి చేయ ప్రయత్నించుచున్నాడో మీరు చూడండి. దాని మీద నేను చిన్న నోట్సు వ్రాశాను. అతడు దావీదు పట్టణమునకు దేవుని మందసమును తీసికొని రాగోరెను, తన స్వంత శాఖ.

ఆవలకు చూడండి, ప్రభువు మొదటగా నాతో ఆ నది యొద్ద మాట్లాడెను. "యోహాను యేసు రాకకు ముందుగా వచ్చినట్లుగానే యుండునని," చెప్పెను. సోదరుడా, సంఘములు దాని కొరకు నిలబడలేవు, వారందరినీ ఏకము కూడా చేయలేవు, వారికి ఎక్కడో ఒకటి ఉండవలసియున్నది. వారందరూ ఆలాగు చేయవలసియున్నారు. దానిని తమ స్వంత ఇంటికి, వారు తీసికొని రావలసియున్నారు.

దావీదు పట్టణమునకు దానిని తేగోరెను. ఎందువలన? అందుకొరకు ఏ స్థలము కూడా సిద్ధము కాలేదు. ఆ కారణము చేతనే ఒక శాఖ యొద్దకు నీవు వర్తమానమును తీసికొని రాలేవు. వాక్యము; నిబంధన మందసము; క్రీస్తు నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా యున్నాడు; ఆయన యొక్క సమస్త గుర్తింపు; నీవు శాఖ యొద్దకు తీసికొని రాజాలవు. నీ సంస్థ యొద్దకు తీసికొని రాలేవు. వారు ఎన్నడునూ దానిని నమ్మరు, ఎందుకనగా దాని కొరకు వారు చోటియ్యరు. లవొదికయ సంఘకాలములో ఆయన సంఘమునకు బయట ఉన్నాడని మీరు బైబిలులో చదువలేదా? లోనికి రావలెనని యత్నించుచున్నాడు. దావీదు పట్టణములో చోటు లేదు, వారెంత విధేయులుగా కనబడినా అంతే, అదెంతో గొప్పగా కనబడినది. అయినా గాని అది ఆ చోటు కాదు; యెరూషలేములో అది ఉండనైయున్నది. దానిని ఏమి చేయవలెనో ప్రవక్త చెప్పినప్పుడు, దావీదు దానిని తన స్వంత పట్టణమునకు తీసుకుని రావలసియుండెను. దాని కొరకు స్థలము సిద్ధముగా లేదు.

75క్రీస్తే మన మందసము, దానిని వారు చేర్చుకొనరు. క్రీస్తు వాక్యమై యున్నాడు, దానిని వారు చేర్చుకొనరు. వారి ఆచారములు, వారి శాఖలే వారికి కావలెను. ఒక క్రొత్త మందసము లేక ఒక క్రొత్త బండి, వారికి కావలెను. దానిని మోయుటకు ఒక శాఖ కావలెను. అదే క్రొత్త బండి. గుర్తుంచుకొనండి, క్రీస్తే మన మందసము. క్రీస్తే వాక్యమని మీరు నమ్ముచున్నారా? అదే ఆనాడు మందసము. అది నిజమేనా? సరే. క్రీస్తును సరయిన స్థానమునకు మోసికొని పోవుట లేదు, శాఖ అను బండి దానిని మోయజాలదు. ఆయన ఒక్క వ్యక్తితో సంప్రదించును గాని గుంపుతో కాదు. దానిలో ఆయన పని చేయడు. ఆలాగు చేసినట్లయితే, అది వాక్యమునకు విరోధము, (ఆమోసు 3:7). దానిని నీవు అబద్ధముగా మార్చలేవు. లేదండి! అది సత్యము.

కాని చూడండి. వారు ప్రయత్నిచిరి… ఒక సంస్థ ఆ మందసమును మోయజాలదు; అందులో చాలామంది అధిపతులున్నారు, చూచారా. ఆలాగు జరుగదు. దానిని ఆలాగు చేయనని ఆయన వాగ్థానము చేసెను. ఆలాగున ఆయన చేయడు. ఆయ మరియొక విధముగా చేయుదునని వాగ్ధానము చేయలేదా? ఆ కారణము చేతనే ఆయన ఆలాగు చేయనని వాగ్ధానము చేసెను. (ఆ విధమగు ఆలోచనలు కలిగి యుండవద్దు, దానిని నేను చూడగలను, చూచారా.)

76ఒక ప్రత్యేకమగు విధముగా దానిని చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను, దానికి విరోధముగా ఉన్న దేనిని ఆయన చేయడు, చూచారా. కాని ఆయన తన మూల విధానములో జరిగించును. ఆమోసు 3:7లో ఆయన చెప్పిన ప్రకారమే చేయును. ఆయన జరిగించు విధానము అదే. అది నిజమని బయలుపరచబడుటయు, రుజువు చేయబడుటయు అవసరము. నేడు ఆయన వాగ్ధానము చేసిన దానిని మీరెరుగుదురు, దానిని ఆయన ఈ దినము చేయుచున్నాడు. దానిని ఆయన చేయుదునని చెప్పెను; ఆయన ఏడు ముద్రలను విప్పును, ఆ వెనుక ఉండిన మర్మములన్నింటినీ ఆయన విప్పును. బాప్తిస్మమును గూర్చి చాలా తికమక పడుచున్నారు. అది ఇక్కడ యున్నది, అది ఆయన సన్నిధిలో యున్నది. దానిని సైన్సు రుజువు చేయుచున్నది. ఆకాశములు దానిని వివరించెను. మానవుడు దానిని నిలబడి చూచుచున్నాడు, అది జరుగుచున్నది. ఆయన చెప్పిన ప్రతిదియూ నెరవేరకుండా తప్పిపోలేదు. అక్కడే మీరున్నారు. ఈ రోజున మనం ఎచ్చటున్నామో మీరు చూడగలరు

77ఇప్పుడు, ఆయన యొక్క ఆత్మ కలిగిన ఏ మనిషి అయినా గాని దానిని ఎరుగును. దేవుని ఆత్మ అతనిపై యున్నది, గనుక ఎరుగును, ఇది సత్యమని ఎరుగును; ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ, వాక్యమునకు విరోధముగా ఏదియూ చెప్పదు. అది వాక్యముతోనే నిలచియుండును. "నాకు పరిశుద్ధాత్మ యున్నది. నేను కేకలు వేశాను; నేను భాషల్లో మాట్లాడాను. నేను ఆత్మలో నాట్యమాడాను," అని నీవందువు. దానిని దేవునితో ఏ మాత్రమూ సంబంధమూ లేదు, చూచారా. పూర్వము అదే కార్యము జరిగియుండెను. దావీదు కూడా అదే చేసెను. ఆచరణలో అన్ని విధములా అతడు కొనసాగించెను. వారు తమ బలమంతటితో పాడిరి, తమ బలమంతటితో వారు కేకలువేసిరి; తక్కిన వారందరూ ఆలాగే చేసిరి, వారు మరణములోనికి నడచుచుండిరి. అది నిజము. దానితో వారికి ఏమి సంబంధము లేదనుకొనిరి.

JOHN 4:25,26,29

 

78వాక్యమే లెక్కలోనికి వచ్చును. ప్రభుని వాక్యమే లెక్క. యెహోవా కొరకు ఎదురుచూడవలెను. అవునండి.

దేవుని ఆత్మను కలిగినవారు, ఈ దినపు వాగ్ధానము కొరకు కనిపెట్టెదరు, దానిని వారు చూచువరకూ ఎదురు చూచెదరు. అప్పుడు "అదియే ఇది" అని చెప్పెదరు. దేవుడు వారికి దానిని బయలుపరచును.

నతానియేలువలె యుండును. ఫిలిప్పు వెళ్ళి నతానియేలును కనుగొనెను. నతానియేలు ఇట్లనెను, "ఒక నిమిషం ఆగుము. అది వాగ్ధానము చేయబడినదని నాకు తెలియును, కాని దానిని నేను చూడవలెను. దానిని అతడు చూచినప్పుడు, "అదియే ఇది" అని పలికెను."

ఆ స్త్రీ ఇట్లన్నది, "నేను అన్ని రకముల వేదాంతములు విన్నాను. నేను దీనిని మరియు దానిని చేస్తాను. నేను బైబిలు చదివాను, మెస్సీయా వచ్చుచున్నాడని నా యంతట నాకు తెలియును. ఆయన ప్రవక్తగా యుండునని తప్పక తెలియును. ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులు జరుగును."

"నేనే ఆయనను" అన్నాడాయన.

ఆమె ఇట్లన్నది, "వచ్చి ఆయనను చూడుడి. అది ఆయనే. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ మెస్సీయా గుర్తించబడువరకు ఆమె ఎదురుచూచినది." "నాలుగువందల సంవత్సరముల నుండి వారు ఆయన కొరకు ఎదురుచూచుచుండిరి. వారికి ప్రవక్తలేడు. ఈయన ప్రవక్తగా స్వయంగానే చెప్పుకొనెను [టేపు మీద ఖాళీ యున్నది.] నేను చేసిన వన్నియూ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడని," ఆమె పిలచినది. కాని యాజకులు ఆయనను చంపగోరిరి, చివరకు వారు అదే చేసిరి, చూచారా. కాని ఈనాడు ఆయన ఆత్మను వారు చంపజాలరు. అది నిజము. దానిని వారు చంపలేరు. మనలను లోనికి తెచ్చుటకు అది ఇచ్చటయున్నది, మనము వందనములు చెల్లించవలెను.

దేవుడెంత గొప్పవాడో గమనించండి, ఆయన కార్యములు ఎంత గొప్పవో చూడండి, ఆయన ఎన్నడూ విఫలుడు కాడు.

REV 10:7

 

79కార్యములు చేయుటకు దేవునికి ఒక ఏర్పరచబడిన, మూల మార్గమున్నది. దానికి విరోధముగా ఆయన ఏదియూ చేయడు.

ఆయన తాను చేయబోవు దానిని ముందే వాగ్ధానము చేసెను, చివరి దినములలో దానిని చేయును. మనకు వర్తమానము పంపబడి యున్నది. ఈ వర్తమానమునకు ఏలియాకు కలిగిన గుర్తింపే వచ్చును, ఎలీషాకున్న గుర్తింపే వచ్చును. బాప్తిస్మమిచ్చు యోహానువలె యుండును. జనుల యొక్క హృదయములను అది త్రిప్పును, శాఖ వైపుకు కాదు; అసలయిన దాని వైపుకు, అపోస్తలుల వైపుకు, వాక్యమువైపుకు అది త్రిప్పును. ఈ సంగతులు ఎట్లు బయలుపరచబడునో చూడండి. చివరి దూత బూర ఊదుటను ప్రకటనలో 10లో చూడగలము. ఏడవ దూత పలుకు దినములలో మర్మములన్నియూ బయలుపడును. మెతడిస్టులు, బాప్టిస్టులు, క్రీస్తు సంఘము, యెహోవా సాక్ష్యులు ఎందుకీలాగు చేయుచున్నారు? ఆ మర్మములు చివరి దినములలో బయలుపరచబడును. ఏడవ దూత వర్తమానము దానిని చేయును. దీనిని చేయుటకు ఆయన ప్రారంభించునప్పుడు. అతడు కాక, వర్తమానము నందించనారంభించునప్పుడే, చూచారా. సిద్ధపాటు కొరకు సంవత్సరములు లేవు, కాని అతడు వర్తమానము అందించు సమయములో ఈ మర్మములన్నియూ బయలుపరచబడును. అవి ఇక్కడే యున్నవి, వారు గ్రహించుట లేదు, దానికి మీరే సాక్ష్యులు.

MATT 24:29,30•

MARK 13:24-26•

LUKE 17:28-30•

LUKE 21:25-27

 

80ఆ గొప్ప పరిశోధనాగారములో దానిని పరీక్షించండి… ఏమి జరిగినదోనని ప్రపంచమంతయూ ఆశ్చర్యముగా చూచుచున్నది.

టుసాన్‌లో ఆ పెద్ద పరిశోధనాలయములు దాని యొక్క చిత్రమును తీసిరి, జరిగిన దానిని వారు చూచి ఇంకా ఆశ్చర్యపడుచున్నారు. ఏమిటది? వారింకా పేపరులో ఈలాగు వ్రాయుచున్నారు, "ఏమి జరిగినదో, ఎట్లు జరిగినదో ఎవరయినా చెప్పగలరా?" అని ప్రశ్నించుచున్నారు. అక్కడ ఏ మంచు పొగ లేదు; గాలి లేదు; తేమ లేదు; గాలిలో ముప్పది మైళ్ళ ఎత్తున యున్నది. "పైన ఆకాశమందు సూచనలు కనబడును. ఆ యా స్థలములలో భూకంపములు కలుగును, అప్పుడు మనుష్య కుమారుడు మేఘారూఢుడై ప్రత్యక్షమగును. ఆ దినమున మనుష్య కుమారుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనును." ప్రపంచము సొదొమ గొమొర్రాల వలె కనిపించును. ఓ, సోదరులారా, ఆత్మీయ విషయముల గూర్చి అజ్ఞానులుగా యుండవద్దు. లేఖన ములను పరిశోధించుడి, ఎందుకనగా అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. వాక్యమును గూర్చి అవే సాక్ష్యమిచ్చుచున్నవి, సత్యమును గూర్చి వారు సాక్ష్యమిచ్చెదరు. ఈ ఘడియలో దేవుడు చేయుచున్న కార్యములే దానికి సాక్ష్యము.

JOHN 6:37,44

 

81ఇప్పుడు ఏమిటి? దేవుని యొక్క ఆత్మ గలిగిన వారు ఈ సంగతుల కొరకు ఎదురు చూచెదరు. ఈ సంగతులను వారు చూచి ఆ సంగతులను విశ్వసించెదరు. "నా తండ్రి ఒకనిని మొదట ఆకర్షించనియెడల, వాడు నా యొద్దకు రాలేడని యేసు చెప్పెను. నా తండ్రి నా కనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చుదురు (ఆయనే వాక్యము), వారు నా యొద్దకు వచ్చుదురు; వారు నా చెంతకు చేరెదరు."

ఈ ఉదయమున నేను చాలా కరకుగా యున్నాను. వారు ప్రభువు యొద్ద కనిపెట్టుదురు; వారు ఎదురుచూచుదురు, ఆ విధముగా యున్నందున, వారు ఈ దినము యొక్క వాగ్ధానమును చూడగలరు. అది నెరవేరుచున్నది. వారికి ఆయన వాక్యమందున్న విశ్వాసము అప్పుడు మరింత నూతన పరచబడును, ఎందుకనగా దానిని చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను. ఇక్కడ దానిని ఆయన చేయుచున్నాడు, అయితే ఏ సందేహము లేదు. దేవుడు మాట్లాడును; మొదట ఆయన వాక్యము మాట్లాడును, వాక్యము ఏమి చేయుదునని చెప్పునో దానిని ఆత్మ నెరవేర్చును. మనకు చాలా అనుకరణలున్నవి. ఇంకా అవి మనమధ్య ఉన్నవి, యధార్థ హృదయము గల జనులు ఏదేదో చేయుచున్నారు, కాని జరిగిన దానిని గమనించండి. ప్రజలు తమ చేతులుంచుచున్నారు, అప్పుడు చనిపోవుదురు.

గమనించండి.

82మానవుడు ఉద్ధేశించి ఏర్పరచిన శాఖల వలన పని ఏమియూ జరుగదు. వారు తమ స్వంతము కొరకు ఆ మందసములను తయారు చేసికొనుచున్నారు. సభ్యులను ఆ శాఖలలో చేర్చుకొనుచున్నారు. ఆయనకు ఎన్నడూ ఒక శాఖ లేదు. అది మానవులు చేసినది.

83ఈనాడు మన యొక్క గొప్ప సువార్త దండయాత్రలతోను, ఉజ్జీవములతోను, మెతడిస్టు మందసములను, బాప్టిస్టు మందసములను, ప్రెస్బిటేరియను మందసములను నింపలేకపోవు చున్నాము. కాని వాక్యమై యున్న క్రీస్తు మందసము మాట ఏమిటి? వధువు వాక్యముగా ఉండబోవుచున్నది. ఆమె క్రీస్తును కలిగి యుండవలెను, పెండ్లి కుమారునిలో భాగముగా యుండవలెను. ఆమె వాక్యముగా యుండవలెను, ఆయన దినమునకు వాక్యము కాదు, ఈ దినమునకు వాక్యము. ఈ దినమునకు వాక్యముగా ఉండవలసియున్నది, ఈ దినమునకు వాక్యముగా యుండునని ఆయన వాగ్ధానము చేసెను. తన వధువును మలచుటకు, ఆమెను తయారు చేయుటకు ఆయన తన వాక్యమును పంపెను. దానిని మనము చూతుమని ఆశించుచున్నాను. మీరిప్పుడు మీ స్వంత ఉద్దేశ్యమును కలిగియుండరాదు. మరియొకరి ఉద్దేశ్యమును అంగీకరించవద్దు. ఇక్కడ బయలు పరచబడిన వాక్యమును, అనగా బైబిలును తీసికొనుము. ఆలాగు చెప్పబడెను.

ఈ చివరి దినమున దేవుడు తన వధువును ఎట్లు ఎన్నుకొనునో తన వాక్యములో వాగ్ధానము చేసెను. దానిని మీరెరుగుదురా? దానిని ఆయన వాగ్ధానము చేసెను, దాని నెట్లు చేయునో చెప్పెను, ఆయన తన మూల సంకల్పము చొప్పున క్రీస్తును, ఎన్నుకొనిన కాలములో, ఎన్నుకొనిన రుతువులో పంపెను. ఆయన తన వధువునును పోగొట్టుకొనడు, ఎందుకనగా ఆమె ఆ వాక్యములో భాగమైయున్నది. ఒక శాఖ ద్వారా ఆయన ఆమెను ఎన్నుకొనజాలడు. ఒక శాఖ ద్వారా ఆయన క్రీస్తును ఎన్నుకొనలేదు. క్రీస్తు ఒక శాఖ యొద్దకు వచ్చెనా? ఒక శాఖ ద్వారా ఆయన వచ్చెనా? లేదు! వారాయనను తిరస్కరించిరి. అప్పుడు శాఖ చేసిన పని అదే; ఆయన వధువును ఎన్నుకొనినప్పుడు మరో మార్గములో ఎట్లు రాగలడు? క్రీస్తును ఇక్కడికి ఎట్లు ఆయన తీసికొని వచ్చెను? ప్రవక్తల యొక్క వాక్యము ద్వారా. అది నిజమేనా? ఆయన తన వధువును ఇక్కడికి ఎట్లు తీసికొని వచ్చును? ప్రవక్తల యొక్క వాక్యము ద్వారానే. ఆయన వచ్చినప్పుడు ఎట్లు ఆయనను గుర్తించెను? ఏలియా ఆత్మను కలిగియుండిన ఒక మనిషిద్వారా గుర్తించెను అతడు అరణ్యములో నుండి బయటకు వచ్చెను. ఆయన తన వధువును ఎట్లు గుర్తించును? మలాకీ 4లో దానినే ఆయన వాగ్ధానము చేసెను. ఆయన భూమిని నాశనము చేయకముందు, భూమి సొదొమవలె యుండును.

MAL 4:3•

LUKE 17:28-30

 

84గుర్తుంచుకొనండి, సొదొమ కాలిపోయెను. అది నిజమేనా? ఈ ప్రపంచము మండిపోవలసియున్నది. యేసు ఆలాగున చెప్పెను. లూకా17వ అధ్యాయము 30వ వచనములో చెప్పినట్లుగా ఆ కాలము ఉండును. సొదొమ, గొమొర్రా దినములవలె యుండును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడును. అయితే ఏమి జరుగును? మలాకీ ప్రకారము, ఆయన భూమిని మరల దహించును. దుర్మార్గుల యొక్క ధూళి మీద నీతిమంతులు నడిచిపోయెదరు, వెయ్యేండ్లపాలన. అది నిజమేనా? చూచారా, కావున మనము అంత్య కాలములో యున్నాము. ఇప్పుడు మనము ద్వారము యొద్ద యున్నాము. ఆయన రాక కొరకు ఎదురుచూచుచున్నాము.

MARK 1:7•

LUKE 3:16•

JOHN 1:27•

JOHN 14:20

 

85చూడండి, దేవుడు తన యొక్క ఆది విధానము ద్వారా తన వధువును ఎన్నుకొనును. దేవుడు తన వాక్యములో ఆలాగున వాగ్థానము చేసెను. ఆయనే పెండ్లి కుమారుడు. దానిని ఆయన ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పెను, దానిని గుర్తింపచేయుటకు ఆయన ప్రవక్తను పంపెను. యోర్దాను నది యొడ్డున ఆ ప్రవక్త నిలబడి, ఇదిగో అని కేక వేసెను.

"నీవు మెస్సీయావు, కాదా?" అని వారడిగిరి.

"కాదు, నేను మెస్సీయాను కాదు," అని చెప్పెను.

"నీవు తప్పకుండా మెస్సీయావై యుందువు."

"నేను ఆయనను కాను, కాని ఆయన మీ మధ్యనే నిలబడియున్నాడు. ఆయన చెప్పులు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఆయన వచ్చినప్పుడు, తన్నుతాను బయలుపరచుకొనును. ఈ దినము ఆయన మీ మధ్య నిలబడియున్నాడు, పరిశుద్ధాత్మ రూపములో యున్నాడు. అంతకంతకు ఎక్కువగా ఆయన తన్ను బయలు పరచుకొనుచున్నాడు." తన సంఘములోనికి వచ్చుచున్నాడు, తన్నుతాను బయలు పరచుకొనుచున్నాడు; ఎందుకనగా ఆయన మరియు వధువు మరియు పెండ్లి కుమారుడు ఒక్కటై యున్నారు. ఆయన తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. నీ హృదయములో నీవు అనుభవించుచున్న వానిని ఒక దినమున నీవు చూచెదవు. ఆయన గుర్తింపును చూచెదవు, నీ ఎదుట ఆయన వ్యక్తిగా కనబడును. అప్పుడు మరియు నీవు ఒకటిగా యుందువు. మీరు వాక్యము ద్వారా ఏకమై యున్నారు. ఆది యందు వాక్యముండెను; ఆది యొద్దకు మరల వెళ్ళెదరు, అనగా దేవుడే. "నేను తండ్రి యందును, తండ్రి యందు నేనును, మీరు నాలోను, నేను మీలోను యున్నట్లుగా ఆ దినమున మీరు తెలిసికొందురు." హల్లెలూయా! ఇక్కడ మనం ఉన్నాము. హల్లెలూయా! ఆయన మనమధ్య బయలుపరచు కొనుచున్నందుకు ఎంతగానో నేను సంతోషించుచున్నాను. వాక్యము నిమిత్తము ఆయన చేసిన వాగ్ధానమును చూచుచున్నాను, ఎవరిదో ఉద్రేకము కాదు, పాటలు కాదు, గంతులు కాదు, నాట్యము కాదు, కాని ఆయన వాక్యము ద్వారానే (ఆమెన్). ఆయన తన్ను తాను బయలుపరచుకొనుచున్నాడు.

86చూడండి, వారు దేవాలయమును నిర్మించి, అందులోనికి మందసమును తీసికొని వచ్చిరి, దేవుడు అగ్ని స్తంభముతో అందులోనికి వచ్చెను. ఆమేన్. దావీదు కేకలు వేయుచూ గంతులు వేయుచుండెను. గాయకులు, ఆ యాజకులు నాట్యమాడుచుండిరి, వారు దేవుని చిత్తమునకు బయట ఉండిరి. దేవుడు మందసమును, దానినుంచవలసిన స్థానమును, చోటును దేవుడు గుర్తించెను. వారు ఆ మందసమును ఆ చోటిలోనికి తీసికొని వచ్చుటకు ముందుగా, అగ్ని స్తంభము దిగి వచ్చి దారి చూపించెను, దాని క్రింద కెరూబుల యొక్క రెక్కలున్నవి; అతి పరిశుద్ధ స్థలములో వెనుకన ఆయన విశ్రాంతి స్థానము, అగ్ని స్తంభము. దేవుని యొక్క మహిమ అక్కడ ఉండెను, ఎట్లు పరిచర్య చేయవలెనో ఆ ప్రజలకు తెలియలేదు. ఆమేన్. తన వధువు కొరకు ఆయన వచ్చునప్పుడు, ప్రతి వేదాంత పండితుని యొక్క కన్నులను అది మూయును. అర్థ రాత్రిలో ఆమె కొనిపోబడును, వారికది అర్థరాత్రి వలె యుండును. ఆమె వెళ్ళిపోవుట కూడా వారు చూడరు. ఓ! దేవునికి స్తోత్రము!

87గమనించండి. తన వధువును బయటకు తీసికొని వచ్చుదునని దేవుడు వాగ్ధానము చేసెను, దానిని ఆయన చేయును. ఒక సంతానము ఉండును; సాయంకాల సమయమందు వెలుగుండున,. పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను, ఆదియందు ఆయన సంకల్పించిన ప్రకారమే ఆయన ఈ కార్యములన్నియూ చేయును; దానిని ఆయన శాఖ ద్వారా చేయడు. నేడు మనము ఉపయోగించుచున్న క్రమము ద్వారా ఆయన దానిని చేయడు. మనము మరణమునకు కారకులమగుచున్నాము. ప్రజలు దానితో చేతులు కలుపుచున్నారు మరియు దాని వలన చనిపోవుచున్నారు, చూచారా.

88వాక్యము… సాయంకాల వర్తమానము తప్పకుండా సాయంకాల ఫలితములను తీసికొని వచ్చును. సాయంకాల వర్తమానము తప్పకుండా సాయంకాల విత్తనమును చల్లవలెను, ఉదయకాల విత్తనము కాదు, సాయంకాల విత్తనము. అది నిజమేనా? మధ్యాహ్నకాల రంగము… ఆ విత్తనము శాఖగా ఉన్నది. అది చనిపోయి, నశించినది. కాని సాయంకాల వర్తమానము సాయంకాల వెలుగును చూపించును, సాయంకాల ఫలితములను చూపించును. సాయంకాల వర్తమానము… యేసు కాలము మధ్యాహ్న వర్తమానము, మధ్యాహ్న ఫలితములను చూపించును. ప్రారంభ వర్తమానము ప్రారంభ ఫలితములను చూపించెను: సృష్టిని తయారుచేసెను. మధ్యాహ్నములో ఆయన తన కుమారుని తన స్వరూపమునందు సృజించెను. సాయంకాల సమయములో ఆయన అతడి కొరకు ఒక వధువును తయారు చేసెను, చూచారా. దేని ద్వారా? ఆయన వాక్యము ద్వారా. ఆయన భూమిని ఎట్లు రూపొందించెను? ఆయన దానిని ఎట్లు ఉనికిలోనికి తెచ్చెను? తన వాక్కు ద్వారా! ఆయన కుమారుడు ఎవరు? వాక్యము! "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను." ఆయన తన వధువును ఎట్లు స్వీకరించును? వాక్యము ద్వారానే, క్రొత్త బండి ద్వారా కాదు, ఎవరో వేదాంత పండితుని యొక్క అభిప్రాయము ద్వారా కాదు, కాని ఆయన వాక్యము ప్రకారము ఆమెను గుర్తించును. దానికి ఏమియూ చేర్చరాదు లేదా దానిలో నుండి ఏమియూ తీసివేయరాదు. దానిని ఉన్నది ఉన్నట్లుగానే ఉంచండి, చూచారా.

89సాయంకాల సమయము. ఏడు ముద్రలను విప్పెదనని — ఆ వెనుక ఉండిన సంఘములు చూడలేకపోయిన దానిని ఆయన చూపించెదనని, తానే బయటిపరచెదనని వాగ్ధానము చేసెను. ప్రకటన10, మలాకీ 4, లూకా 17:30, దానిని ఆయన చేయుదునని వాగ్ధానము చేసెను. ఇప్పుడు దానిని మనము మిశ్రము చేయరాదు; దానిని ఉన్నరీతిగానే ఉంచుదము.

ముగించుచున్నాను… పావు తక్కువ పండ్రెండు గంటలయినది. దీనిని చెప్పి ముగించెదను: స్నేహితులారా, వినండి. ప్రభువైన యేసు నామములో చెప్పుచున్నాను; ఈ సంగతులు చాలా తేటగా యున్నవి. దానిని మీరు నమ్మగలరు. దానిని మీరు నమ్మలేనంత గలిబిలిగా లేదు. నిశ్చయంగా మీరు దానిని చూడగలరు. నిశ్చయంగా ప్రపంచము దానిని చూడగలదు. ఈనాడు పుట్టుకొని వచ్చుచున్న ఈ క్రొత్త సంగతులను చూచి మీరు మోసపోవద్దు. వారెంత మంచివారయినా లెక్కకు రారు, వారెంత యధార్థపరులయినా గాని లెక్కకు రారు. ధర్మశాస్త్రము ప్రకారమును, ప్రవక్తల ప్రకారముగాను వారు మాట్లాడనియెడల, వారిలో జీవము లేదని బైబిలు చెప్పుచున్నది, చూచారా.

90తాను చేసినది సరియని దావీదు అనుకొనెను; అతడు యధార్థపరుడు. ఆ మత యాజకులు తాము చేసినది సరియనుకొనిరి; వారు యధార్థపరులు. కాని వారు దానిని గూర్చి ప్రభువును సంప్రదించుటలో విఫలమయిరి. దానిని వారెట్లు చేయగలిగిరి? "మేము చాలా ప్రార్థించామని" వారను యుందురు. కాని అది దేవుని విధానము కాదు. ఆయన తన దాసులగు ప్రవక్తలకు మొదట బయలు పరచకుండా ఏదియూ చేయనని వాగ్ధానము చేసెను. నాతాను వారి యొద్దనే యున్నాడు, కాని వారతనితో సంప్రదించనే లేదు.

1CH 17:1,4,8,11,12

 

91ఇక్కడ దినవృత్తాంముల గ్రంథములోని తరువాత కొద్ది అధ్యాయములను చదువుదము, మీరు కనుగొందురు. దావీదు గృహములో కూర్చొని ఇది సరియేననుకొనెను (అతనితో పాటు నాతాను కూర్చొని యుండెను) "నేను దేవదారు మ్రానులతో కట్టబడిన గృహములో నివసించుచుండగా, దేవుని మందసము గుడారములో యుండుట ఏల అని ప్రశ్నించెను." ప్రభువు ఏమి చెప్పుచున్నాడో నాతానుకు తెలియును.

అతడు పొరపాటు చేసెను, కావున దేవుడిట్లు చెప్పెను, "నా సేవకుడగు దావీదును నేను ప్రేమించుచున్నానని చెప్పుము. భూమి మీద అతనిని నేను గొప్ప పేరు కలుగజేసియున్నాను, కాని అతనిని ఈ పని చేయనియ్యను (చూచారా); అతడు నా మాట తప్పిపోయెను (చూచారా). అతనిని నేను ఈ కార్యము జరిగించనియ్యను. అతని కుమారుని ద్వారా నేను జరిగించుదును: దేవునికి నిత్య నివాస స్థలమును నేనతని చేత నిర్మించెదను." దావీదు తరువాత సొలొమోను వచ్చెను, కాని అతడు కూడా తప్పిపోయెను. ప్రతి మానవుడూ తప్పిపోవును. ప్రతి మనిషి తప్పిపోవును. దేవుడు మాత్రమే తప్పిపోని వాడు. ఆయన తప్పిపోడు. దేవుడు తప్పి పోవుటను మాత్రము చేయజాలడు. దేవుడు వాక్యమై యున్నాడు. ఆ వాక్యము ఎంతగా క్రియ ధరించలేదని అనిపించినా గాని, అది జరుగక మానదు. అది ఖచ్చితముగా చెప్పబడిన విధముగానే నెరవేరును.

92ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆ కాలమును, ఋతువును నీవు వెంబడించవలెను (చూచారా). ఏ ఋతువులో నీవున్నావు? ఏ సమయములో యున్నావు? ఖచ్చితముగా సత్యము బయలుపరచబడుటను నీవు చూచెదవు.

తప్పని సరివన్నియూ నీవు తీసికొనుము, వాక్యమంతయూ తీసికొనుము, మాదిరులన్నియూ, ఉదాహరణలన్నియూ తీసికొనుము, నీవెక్కడున్నావో చూచుకొనుము. మనము జీవించుచున్న ఘడియను గూర్చి ఆలోచించవలెను. అటువైపుకు చూడండి, భూమిలో పదియవ భాగము కూలిపోవుటకు సిద్ధముగా యున్నది. సైన్సు దానిని గూర్చి చెప్పుచున్నది. వారు గడియారము వైపు చూచుచున్నారు. "అర్థరాత్రికి ఇంకా మూడే నిమిషముల సమయమున్నదని," వారు కొద్ది సంవత్సరముల క్రితమే చెప్పిరి. ఒక నిమిషమే ఉండియుండును; అర నిమిషమే ఉండి యుండును.

"మన తరములో అది జరుగదని," వారు చెప్పుచున్నారు.

"అయిదు నిమిషములలో అది జరుగవచ్చును." వారు ఆ తరువాత చెప్పినది గమనించండి. "అయిదు సంవత్సరములలో" అది జరుగునని చెప్పుచున్నారు. ఆలాగున నేనెన్నడూ చెప్పలేదే? శాస్త్రజ్ఞులు ఆలాగు చెప్పిరి. ఈగలు పోయినట్లుగా వారు కాలిఫోర్నియో నుండి వెళ్ళిపోవు చున్నారు, చూచారా. సొదొమ నుండి లోతు బయటకు వచ్చిన దినమునే భూమి మీదికి అగ్ని కురిసెను. ఈ దినములలోనే ఒక దినమున మన వర్తమానమును దేవుడు తీసివేయనై యున్నాడు. ఈ స్థలమును మనము విడిచిపెట్టనై యున్నాము. ఏదో జరుగనైయున్నది, నిశ్చయంగా ఇది జరుగును. సంఘము వెళ్ళిపోవును, అది ఆయన శరీరము, ఆయన వధువు.

DEUT 4:1-4,25,26

 

93ఒక లేఖనమును మీకు చూపించగోరుచున్నాను, దానిని నాతో పాటు మీరు చదవండి. ముగింపులో మీరు ద్వితీయోపదేశకాండము చదువవలెనని కోరుచున్నాను. చెప్పవలసినదంతా చెప్పాననుకొనుచున్నాను, మీరు అర్థము చేసికొనిరి. ద్వితీయోపదేశకాండము 4. రెండు స్థలములలో చదువుదును. సంఘములోని వారు, వినుచున్న వారు దేశములోని ఆయా ప్రాంతములలో టెలిఫోను ద్వారా వినుచున్న వారు తప్పిపోకుండా జాగ్రత్తగా దీనిని వినవలెనని కోరుచున్నాను. ఈ విషయమును గమనించండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. 1వ వచనము నుండి నేను ప్రారంభించుచున్నాను. మొదటి వచనము చదువగోరుచున్నాను, 25 మరియు 26 వచనములు కూడా చదివెదను. మీరు ఇంటికి వెళ్ళి వానిని చదువుకొనవచ్చును. సమయ మును ఆదా చేయుటకు దానిని నేను చదువుచున్నాను. మనము సమయమునకు ముగించుకోవచ్చును. ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రికి మరల నేను తిరిగి రావలసియున్నాను. ఈ ప్రవక్త మాట్లాడుటను మీరు వినండి. అతడు దేవుని సన్నిధానములో యుండెను. అతడు ఎరిగియుండిన దానిని గూర్చి మాట్లాడుచున్నాడు. వినండి.

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రదికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోకి పోయి సాధీనపరచుకొనునట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. [అది మన వెయ్యేండ్లపాలనకు మాదిరి.]

మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. [దానిలో నుండి ఒక్క మాటను తీసివేయరాదు, దానికి ఒక్క మాట కలుపరాదు. దానిని ఉన్నట్లుగానే యుంచవలెను.]

బయల్పెయోరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులార చూచితిరి గదా? బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను. [ఇప్పుడు మీరు ప్రత్యేకమగు జనులు, ఆ శాఖలలో నుండి బయటకు వచ్చితిరి, చూచారా.]

మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటి వరకు సజీవులై యున్నారు. [మీరు మీ శాఖతో కూడా చావలేదు; ఇప్పుడు మీరు సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో యున్నారు. వినండి, దీనిని మరువవద్దు.]

ఇప్పుడు 25వ వచనము. వారు ఆ దేశములోనికి వెళ్ళుచున్నారు, ఏమి జరిగినదో చూడండి.

మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, [అదే జరిగినది.] ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసిన యెడల. [వినండి.]

మీరు ఈ యోర్థాను దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించెదరు.

DEUT 4:2,26

 

94ఇశ్రాయేలీయులతో మోషే మాట్లాడుచున్నాడు. అప్పటికే దేవుని ద్వారాను, అగ్నిస్తంభము ద్వారాను అతడు ధృవపరచబడెను. వారిని నడిపించుటకు దేవుని సేవకునిగా నియమించబడినట్లు రుజువాయెను. వారు ఆ దేశములోనికి ప్రవేశించక ముందు మోషే చెప్పిన మాటలివి, "ఇప్పుడు నేను మీతో చెప్పియున్నాను, మీకు భూమ్యాకాశములను నేను సాక్షులుగా నియమించుచున్నాను. దానికి మీరు ఒక్కటి చేర్చినా, లేదా దానిలో నుండి ఒక్కటి తీసివేసినా మీకు యెహోవా అనుగ్రహించుచున్న దేశములో మీరు నివాసము చేయరు." ఆ విధముగానే నేను కూడా యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను. "ఏదీ కూడా దానికి చేర్చవద్దు, అందులోనుండి ఏదియూ తీసివేయవద్దు. మీ స్వంత అభిప్రాయములు అందులో చేర్చవద్దు. టేపులో చెప్పబడిన దానినే మీరు చెప్పండి. ప్రభువగు దేవుడు మీకు ఏమి చేయమని ఆజ్ఞాపించెనో దానినే చేయండి. దానికి మరేదియూ చేర్చరాదు

MATT 5:5•

REV 22:14,15

 

95ఆయన తన వాగ్ధానమును ఎల్లప్పుడూ మన పట్ల నెరవేర్చును. ఆయన చేసిన ప్రతి వాగ్ధానమును ఆయన నెరవేర్చెను. ఏమి జరుగునో ఆయన చెప్పలేదా, అది జరగలేదా? ఈ రోజు నేను భూమ్యాకాశములను మీ యొదుటకు తీసికొని వచ్చుచున్నాను, సవాలు చేయుచున్నాను: దేవుడు తాను చెప్పిన దానిని అక్షరాలా మన పట్ల నెరవేర్చలేదా? ఆయన చెప్పిన ప్రతి దానిని మనకు చేసి చూపించెను. ఆయన ఏ విధముగా దానిని చేయుదునని చెప్పెనో, ఆ విధముగానే దానిని చేసెను. అది ఖచ్చితముగా జరిగినది. ఆ విధముగానే దానిని ఆయన కొనసాగించును. కావున దానికి ఏదియూ చేర్చరాదు, దానిలో నుండి ఏదియూ తీసివేయరాదు. దానిని నమ్ముము, నీ ప్రభువగు దేవుని యెదుట నమ్రతతో నడువుము, ఎందుకనగా మనము ఆ దేశములోనికి ప్రవేశించు ఘడియ సమీపించినది. అపుడు మీరు ఈలాగుండరు. ఈ రకమగు జీవితము వైపు మీరిక తిరుగరు. మీరు అమర్త్యులుగా యుందురు. పాపము గతించిపోవును, సాతాను బంధింపబడును. నీ దేవుడైన ప్రభువు నీకిచ్చిన నీ దేశములో వెయ్యి సంవత్సరముల పాటు నీవు జీవించెదవు. "సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు." "ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించువాడు ధన్యుడు. వానికి ఆ పట్టణములో ప్రవేశించు అర్హత యుండును. మాంత్రికులు, అబద్ధికులు, జారత్వము చేయువారు, కుక్కలు అందులో ప్రవేశింపరు." అది విమోచించబడిన వారికి మాత్రమే మరియు ఆయన ఆజ్ఞానుసారముగా నడచువారే ప్రవేశించెదరు.

ZECH 4:6•

JOHN 4:24•

JOHN 17:17•

HEB 13:8

 

96ఏదో క్రొత్త దానిని నీవు తీసికొనవద్దు. వారు అన్ని చోట్లకు తిరుగుచున్నారు, అక్కడ చాలామంది యుందురు. కాని నీవు ఆ క్రొత్త సంగతులను స్వీకరించవద్దు. ఏది సత్యమో మీ ప్రభువగు దేవుడు మీకు బయలుపరచెను. ఆయన తన వాక్యము ద్వారాను, తన ఆత్మ ద్వారాను దానిని బయలుపరచినందున ఆ సత్యమును మీరెరుగుదురు. "బలము చేతనే కాదు, శక్తిచేత కాదు గాని, నా ఆత్మద్వారా," అని చెప్పుచున్నాడు. సత్యముతోను, ఆత్మతోను ఆయనను ఆరాధించువారి కొరకు దేవుడు వెదకుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని ఆయన ఎంతగానో బయలు పరచెను. "ఆయన వాక్యమే సత్యము." ఆయన మీకు సాయంకాల విత్తనములను చూపించెను. దానిని ఆయన మీకు బయలు పరచెను. వాక్యములో దానిని ఆయన నిరూపించెను. ఆయన తన ఆత్మద్వారా దానిని మీకు నిరూపించెను.

97ఒక సంస్థను స్థాపించుటకు లేదా ప్రారంభించుటకు ఎన్నడూ ప్రయత్నము చేయవద్దు. దేనినీ నిర్మించుటకు ప్రయత్నము చేయవద్దు, నీ దేవుడగు యెహోవా యెదుట దీనునిగా యుండుము, వాగ్ధాన భూమి యొక్క ద్వారము చాలా త్వరగా తెరచుకొనునట్లుగా కనిపించుచున్నది. నిజమగు ఆనందము మరియు గానముతో మనము వెళ్ళుదము, పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె సింహాసనము నొద్ద గల తమ స్థానమును అలంకరించుదురు.

దీనులుగా జీవించండి; ప్రేమతో జీవించుడి. ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీ మధ్యకు దేనినీ రానియ్యవద్దు. ఎవరి మీదనయినా మీ హృదయములో ఏదయినా వ్యతిరేక భావము కలుగుచున్న యెడల వెంటనే దానిని సరి చేసికొనండి. మీ మధ్యకు చొరబడవలెనని సాతాను సకల ప్రయత్నములు చేయుచున్నాడు, చూచారా. దానికి చోటియ్యకుడి. ఎవరో కొండెగాడు మీ మధ్యకు వచ్చి మిమ్మును దూరము చేయవలెనని ప్రయత్నించును. దేవుని సన్నిధిలో యుండిన మోషేకు విరోధముగా వారు మాట్లాడిరి. అతడు అక్కడే నిలబడి దానిని చూడలేదా? మనము దానికి ఏదియూ చేర్చరాదు, దానిలో నుండి ఏదియూ తీసివేయరాదు. ప్రభువు చెప్పినట్లుగానే దానిని ఉండనీయుడి. మనకు ఏ శాఖయూ వద్దు; ఏ సంస్థయూ మనకు వద్దు. ఏ అపవిత్రత మనకు వద్దు; ఏ వివాదము మనకు వద్దు. మనకు దేవుడు కావలెను, ఆయన వాక్యమైయున్నాడు. ఇప్పుడు, మన తలలు వంచుము.

1THS 4:16

 

98ఓ దేవా, ఆత్మీయ ధృష్టితో నేను చూచుచున్నాను; ఏమి జరుగుచున్నదో చూడవలెనని ప్రయత్నించుచున్నాను. నీ వాక్యమును చూచుచున్నాను, అదెట్లు బయలు పరచబడుచున్నదో చూచుచున్నాను, అదెట్లు రుజువగుచున్నదో చూచుచున్నాను. ముప్పది-మూడు సంవత్సరాల క్రితం ఆ నది యొద్ద నీవు చెప్పియున్నావు, ఆనాడు నీవు చెప్పినది ముప్పది-మూడు సంవత్సరాల తరువాత నెరవేరుచున్నది. నీవు చెప్పిన దానినే ఇప్పుడు చేయుచున్నావు. నీవు చెప్పిన దానినే చేసియున్నావు. ప్రభువా, దానిని మేము చిన్నదిగా లేదా పెద్దదిగా చేయుట దూరమగును గాక! ఆ ప్రయత్నమును మాకు దూరము చేయుము. దానిని నీవు చేసిన ప్రకారమే మేము చెప్పుదుము గాక! దీనులముగా నడిచి నిన్ను మేము వెంబడించుదుము గాక!

ప్రభువా, సేవకు నీవు ఇచ్చిన వారే వీరు. దేశములోను, ప్రపంచమంతటిలోను మరెందరో నిద్రించుచున్నారు. ఆశీర్వదించబడి ఎదురు చూచుచుండిన ఎందరో పరిశుద్ధులను సమాధులను దాచి యుంచినవి. కాని దాని గూర్చి ఈలాగు వ్రాయబడినది, సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారి కంటె ముందుగా ప్రభుని సన్నిధిని చేరము. బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేచెదరు; ఆ మీదట సజీవులమై యున్న మనము వారితో కొనిపోబడుదుము. అప్పుడు భూమి మీద దేవుని మహిమ యుండును, అది లోకములో నుండి సంఘమును దాయును. అదెప్పుడు పోవునో వారు చూడరు.

99తండ్రియగు దేవా, వీరిని నీ చేతులలో యుంచుము. వారు నీవారు. నీ యెదుట ఎల్లప్పుడూ దీనులుగా ఉండునట్లు మమ్మును చేయుమని ప్రర్దించుచున్నాము. ఎంత కాలమో మాకు తెలియదు. ఎంతకాలమోనని తెలుసుకోవాలని కోరిక మాకు లేదు; అది మా పని కాదు. అది నీ పని. నీవు ఎప్పుడు వచ్చెదవో తెలుసుకొనుట మా చిత్తము కాదు; ప్రభువా, నీవు వచ్చు వరకు మేము దీనులుగా ఉండి, నీతో నడచుటయే మా చిత్తము. అప్పుడప్పుడు నిన్నునీవు మాకు బయలుపరచుకోమని కోరుచున్నాము, తండ్రీ, మేము నీతో నడచుచున్నామని అందువలన మాకు రుజువగును.

మా గత పాపములను మమ్ములను క్షమించుము. మమ్మును నడిపించుము, అపవాది యొక్క ప్రతి ఉరి నుండి మమ్మును కాపాడుము. నడిపించుము మరియు మార్గము చూపుము. మా తండ్రియగు దేవా, మా పాపములను క్షమించి, నీ పిల్లలుగా ఉండుటకు సహాయము చేయుము. మేము పేద తరగతి ప్రజలము. మేము బహిష్కరించబడిన ప్రజలము; ఈ ప్రపంచము, ఈ సంఘశఖలు, ఈ లోక సమాజము మమ్మును వేలివేసినది. అంతమును మేము చూచుచున్నాము, నీ వాక్యమును చూడగల ఆత్మీయ దృష్టిని ఇచ్చినందుకు మేము వందనములు చెల్లించుచున్నాము. అంత్యకాలము మేము చూచుచున్నాము. ఈ సంగతులన్నీయు ఆ పరకలోకము నుండి వచ్చు ఆ గొప్ప రాళ్ల కొరకు సమకూడి జరుగవలసియున్నది. ఆ దినమున మేము ఇక్కడ లేకుండా నీ సన్నిధి లోని ఉండు భాగ్యము మాకు దయచేయుము, నీ రొమ్మున అనుకొని యుండునట్లు చేయుము.

100ప్రభువా, రోగులను, శ్రమపడుచున్నవారిని బాగుచేయుము. అటువంటి గొప్ప ఆరాధనను ఈ రాత్రి మాకు ఇమ్మని కోరుచున్నాము. మా మధ్య ఒక్క బలహీన వ్యక్తియూ లేకుండా చేయుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, నీ సన్నిధి మా మధ్య యున్నది. మా కన్నులు నిరంతరము నిన్నే చూచును గాక! ప్రభువా, మాకున్న డబ్బు, ఆస్తి, ఈ లోక వస్తువులు ఏమీ శాశ్వతములు కావని మేమెరుగుదుము. అవన్నియూ తప్పక గతించును. మా ఉద్యోగములు, మా స్థలములు, మా స్నేహితులు, సమస్తమూ తప్పక గతించును. ఎంత పేద వారయినా, ఎంత ధనికులయినా, ఎంత పేరు సంపాదించినా, సంపాదించకపోయినా, తప్పకుండా అన్నియూ గతించును. కాని ఒకే ఒక దాని మీద మేము కేంద్రీకృతమై యుండవలెను, ఆ కేంద్రము యేసు క్రీస్తే. కాబట్టి దేవా, ప్రతి దానిని మేము విడిచిపెట్టి ఆయననే పట్టుకొందుము గాక; ఆయనే వాక్యము. (ప్రభువా, దీనిని అనుగ్రహించుము.) ఈ ఘడియకు వాక్యము బయలుపరచబడినది!

మోషే దినములలో బయలుపరచబడిన వాక్యము యేసే. యెషయా, ఏలియా, యోహాను మొదలగు వారి దినములలో బయలుపరచబడిన వాక్యము యేసే. ఈనాడు బయలుపరచబడిన వాక్యము యేసే; ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ప్రభువా, దానిని నమ్ముటకు సహాయము చేయుము, దానిని చూచుటకు, దానిలో నడచుటకు సహాయము చేయుము. యేసు నామములో మేము అడుగుచున్నాము.

101మనము తలలు వంచి యుంచుదము. గొప్పవాడును, అన్నింటికీ చాలిన వాడును అగు ఆయనను ఇంకా నిజంగా హత్తుకొనని వారు ఇక్కడ కొందరు ఉండి యుందురు. దానిని మీరు నమ్ముచున్నారు, కాని నమ్మవలసినంతగా నమ్ముట లేదు. నా భార్య మంచి బాలికయని నేను నమ్ముచున్నాను. ఆమె తల్లిదండ్రులను నేనెరుగుదును. ఆమెను ఎన్నో సంవత్సరముల నుండి నేనెరుగుదును. ఆమె తిన్నని జీవితము జీవించినది. ఆమె మంచిదని నేను నమ్మాను, కాని అంత మాత్రమున ఆమె నా సొత్తు కాలేదు. ఆమెను నేను అంగీకరించు వరకు, ఆమె నన్ను అంగీకరించువరకు, ఆమె నాది కాలేదు. ఇప్పుడు యేసు నిన్ను అంగీకరించగోరుచున్నాడు. ఆయనను నీవు అంగీకరించి, ఆయన వాక్యములో భాగముగా మారవా? నీవది ఇంకా చేయనియెడల, నీ తలను వంచియుండగా, నీ హృహదయమును కూడా వంచుము.

102వేదిక పిలుపు ఇచ్చుటకు ఇచ్చట స్థలము లేదు. నేను దాని మీద పూర్తిగా ఆధారపడుట లేదు. నీవున్న చోటనే దేవుడు నిన్ను దర్శించునని నేను నమ్ముచున్నాను. మీరు మీ చేతులెత్తి ఈలాగు చెప్పండి, "బ్రెన్‌హాం సోదరుడా, నన్ను ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనుము. ఆలాగు నేను చేయగోరుచున్నాను." ఆలాగు నేనుండగోరుచున్నాను. "నిజంగా నేనావిధంగా ఉండగోరుచున్నాను, నాకది కావలెను." దేవుడు మిమ్మును దీవించును, దేవుడు మిమ్ము దీవించును. ఎక్కడ చూచినా చేతులు ఎత్తుట కనబడుచున్నది. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. మీ అందరినీ దేవుడు దీవించును గాక! స్నేహితులారా, ఇప్పుడు చూడండి. ఎక్కడో చిన్నది ఉండి యుండును. నీవింకా ఆయనను విశ్వసించలేదంటే అర్థము మరి దేనినో హత్తుకొనియున్నావు. నీవు దానికి సమీపముగా యున్నావు, దానిని చూచుచున్నావు, దాని వైపు నీవు దృష్టి నిలిపావు. చాలా సంవత్సరాల నుండి అది కదలుటను నీవు చూచుచున్నావు. ఇప్పుడది పరిపక్వము పొందుటను నీవు చూచుచున్నావు. అదే మనకు సర్వస్వమని భావించవలెను, అది తప్ప మరేదియూ శాశ్వతముగా నిలవదు, కావున నీవు అన్నియూ విడిచిపెట్టి ఆయన వైపు చూచి ఆయన మీదే దృష్టి నిలుపుము. ఆయనే జీవనమునకు కేంద్రము. అంతా ఆయన మూలముగానే కలిగియున్నది. అందరము కలిసి ప్రార్థించుచుండగా మీరు అంగీకరించరా?

HEB 12:1

 

103ప్రియదేవా, స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, సేవకులు సహితము తమ చేతులు పైకెత్తియున్నారు. ప్రభువైన యేసునే వారు కేంద్రముగా చేసికొనవలెనని ఆశించుచున్నారు, కాని అది వారి వలన కానట్లుగా కనిపించుచున్నది; వారిని ఏదో ఇటు వైపు, అటువైపు లాగుచున్నది: అది ఒక శాఖ కావచ్చును; అది ఒక వ్యక్తి కావచ్చును, అది పాపము కావచ్చును; అది వారి హృదయములో దాగియుండిన మరేదో కావచ్చును. ప్రభువా, నాకు తెలియదు. నీవెరుగుదువు, ప్రభువా; అది ఏదయినా గాని, వారిని నీవు పిలచుచున్నావు… నీవు వారిని పిలచియున్నావు; వారు నీ వారు. వారిని నీవు పిలచుచుండగా, వారు అందులో నుండి విడిపించబడుదురు గాక! సుళువుగా చిక్కులు బెట్టు పాపము అని బైబిలు పిలచుచున్నది. "సుళువుగా చిక్కులు బెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచూ, మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము." మన ఉద్యోగము యొద్దకు గాని, మన శాఖ, మన సంస్థ, మన ఆలోచన సభ యొద్దకు కాదు గాని, విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసు యొద్దకు పరుగెత్తుదము. తండ్రీ, ఈ రోజు మా కొరకు దానిని చేయుము. దీనిని ఆయన నామములో, ఆయన మహిమార్థమై అడుగుచున్నాము.

ప్రభువా, ఇప్పుడు వారు నీ వారు. నీవు తగిన విధముగా, వారిని వాడుకొనుము. నీకెట్లు ప్రయోజనకరమో, ఆ ప్రకారముగా మమ్ము వాడుకొనుము. మేము నీవారము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

నేనాయనను ప్రేమింతును, ప్రేమింతును,

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రానుపైన.

104మీరు మీ భోజనమును మరచిపోయారా? ఆ బయట కారులో పిల్లల సంగతి మరచిపోయరా? గతం గూర్చి పూర్తిగా మీరు మరచిపోయారా? ఇప్పుడు మీరు ఏమనుకొనుచున్నారు? ఏ గ్రహింపును కలిగియున్నారు? దిన దినము అది మీ యెదుట వాస్తవరూపము దాల్చుచున్నది. ఏమైనా గాని దానినే మీ కేంద్రముగా ఉండనీయుడి, తక్కినవన్నియూ గతించిపోనీయుడి; ఏమైనా గాని అవి నశించును. ఓ! ఆయనను ఎడతెగక వెంబడించుడి. ఏలియాను ఎలీషా వెంబడించి నట్లుగా ఆయనను మనము వెంబడించుదము, ఎందుకనగా ఒక దినమున మనము కూడా కొనిపోబడుదుము. ఆయనను సమాధిలో నుండి బయటకు లేపిన అగ్నిస్తంభమును మనము చూచియున్నాము. ఇప్పుడది మనమధ్యనే యున్నదని భావించుచున్నాము. ఒక దినమున ఆయన ఆ పొదలలోని గుర్రములను విప్పును. మనము పైకి వెళ్ళుచున్నాము.

………………..

మీరాయనను ప్రేమించరా?

నా రక్షణను కొనెను కల్వరి మ్రాను పైన.

మీరు మీ కన్నులు మూసికొని,

ఆవల ఆయనను చూడలేరా?

నేనాయనను ప్రేమింతును, ప్రేమింతును.

(మరెవరిని నేను ప్రేమించగలను?)

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను పైన.

105నేను ఇంటికి తిరిగి వచ్చుచున్న ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోయినట్లు వినుచున్నాను. కొన్ని నెలలు నేను బయట పర్యటించి తిరిగి వచ్చుసరికి ఎవరో నిద్రించిరని వినుచున్నాను. నేను చాలా విచారించుచుందును. నిన్న నేను వస్తూండగా, నాతోపాటు బడిలో చదువుకొన్న ఒకతను, "బిల్లీ, బాగున్నావా?" అనడిగాడు.

అతనివైపు నేను చూచాను. అతడు చాలా అందముగా ఉండేవాడు. అతని జుట్టు నల్లగాను నిగనిగలాడుచును ఉండెడిది. వెనక్కు దువ్వేవాడు. ఇప్పుడది హిమమంత తెల్లగా అయిపోయినది. అతడు నిటారుగా నిలబడేవాడు, ఇప్పుడు పొట్ట పెరిగినది. "హల్లో జిమ్ అన్నాను." "దేవా, అతడు నేను ఒకే వయస్సుగలవారము," అని అనుకొన్నాను. నా దినములు లెక్కించబడుచున్నవని నేనెరుగుదును. ఇంకెంతో దూరము లేదని నాకు తెలియును.

ప్రభువా, నేనేమి చేయగలను? నాకు సహాయము చేయుము. నిన్ను దాటి నేను వెళ్ళగోరుట లేదు. నీ వెనుకే నేను ఉండగోరుచున్నాను. నీవే దారి చూపించుము. నేను వెనుదిరిగి ఆలోచించాను, ఏబది-ఆరు సంవత్సరములు, ఇంకెంతో దూరము లేదు.

HEB 11:6

 

106నా మంచి స్నేహితుడు బిల్ డాచ్ అక్కడ కూర్చొని యుండుట నాకు కనిపించుచున్నది. డెబ్బది-రెండు లేదా డెబ్బది-మూడు సంవత్సరముల వయస్సు.

పిల్లలను చూచుచున్నాను. "సహో॥ బ్రెన్‌హాం అంత వయస్సు వచ్చు వరకు మేము కనిపెట్టు చూతుమని," వారనుకొనుచున్నారేమో. పిల్లలారా, మీరెన్నడూ ఆ వయస్సును చూడక పోవచ్చును. దానిని మీరు చూడలేరని నాకు సందేహము కలుగుచున్నది, చూచారా. బిల్ డాచ్ సోదరుడు ఇంత కాలము జీవించియున్నాడు. అతడు వందలాది పదిహేను లేదా పదహారు సంవత్సరముల పిల్లలు మరణించుట చూచియుండును. ప్రతి ఘడియలోను వారు చనిపోవుచున్నారు. కాబట్టి మీ వయస్సును బట్టి ఏమియూ మీరు తలంచరాదు. మీరు జీవించుచున్న ఈ ఘడియలో మీరేమీ చేయుచున్నారు? ఈ సమయములో మీరు యేసు కొరకు ఏమి చేయుచున్నారు? చూచారా? ఓ! ఆయనను నేను చూడగోరుచున్నాను? ఈ ఘడియ ఎట్టిదో నేను చూడగోరుచున్నాను. శరీరములు రూపాంతరము పొందుచున్నవి, రెప్పపాటు కాలములో అవి మారుచున్నవి. ఆలాగు కానియెడల, అందరికంటె మనము బుద్ధిహీనులమగుదుము; తిని, త్రాగి, సంతోషించుదము, ఏలయనగా రేపు మనము చనిపోవుదుము. మీరిప్పుడు జంతువులవలె యుందురు. మీరు చనిపోయి మన్నగుదురు. అంతే. సోదరుడా, అమర్త్య ఆత్మ నీలో జీవించుచున్నది. ఆకాశము నుండి మనము విన్నాము. అది రుజువగుట చూచాము. ఆయన ఉన్నాడనియు, ఆయనను శ్రద్దగా వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు మనమెరుగుదుము. క్రీస్తు యొక్క శరీరములో ఇప్పుడు మనము సభ్యులము. దానిని మరల పాడుదము. మీరు కూర్చొని యుండియే ఈ పాట పాడుచుండగా ఒకరితో ఒకరు కరచాలనము చేయుడి.

నేనాయనను ప్రేమింతును.

(నీ సోదరుని, సోదరిని అభినందించుము.)

ఎందుకనగా నా రక్షణను కొనెను

కల్వరి మ్రాను మీద.

JOHN 13:35

 

107మీరాయనను ప్రేమించుచున్నారా? "ఆమేన్" చెప్పండి. మీరాయన వాక్యమును ప్రేమించినయెడల, "ఆమేన్" చెప్పండి. ["ఆమేన్‌"] ఆయన పనిని ప్రేమించుచున్నారా? "ఆమేన్" చెప్పండి." ["ఆమేన్‌"] ఆయన శరీరమును మీరు ప్రేమించుచున్నారా? "ఆమేన్" చెప్పండి. ["ఆమేన్‌"] మీరు ఒకని నొకడు ప్రేమించుకొనండి. "ఆమేన్." అది మంచిది. మీరు ఒకని నొకరు ప్రేమించుకొనుటను బట్టి, ఆయన శిష్యులని జనులందరును తెలిసికొందురు.

నేనిప్పుడు ఈ చేతి గుడ్డలపై చేతులుంచాను. రాత్రికి ముందే మీరు కావలసినచో తీసికొనవచ్చును.

108సహో॥ రిచర్డ్ బ్లయర్‌ను గూర్చి ప్రార్థించాను. అతనికి దేవుడు జవాబు ఇచ్చెను. అతడు, అతని సోదరుడు ఇచ్చటుండి ఒక రోజున ప్రార్థించారు. వారి ప్రార్థన వలన ఆ చిన్న బాలుడు నేడు మన మధ్య సజీవునిగా యున్నాడు, వారికి దేవుని యందు విశ్వాసమున్నది. కొద్ది నిమిషములలో అతనిని వచ్చి ప్రార్థించి ఈ కూటమును ముగించమని కోరుచున్నాను, కావున తిరిగి రాత్రికి రాగలము. గడియారము ప్రకారము పన్నెండు అయినది. వీలయితే మీరు తిరిగి రాత్రికి రావలెనని కోరుచున్నాను. మీరు ఇంటికి వెళ్ళుచున్నచో, రహదారిలో దేవుడు మీకు తోడుగా యుండి, మీకు సహాయముచేసి కాపాడు గాక! మీరు ఉండగోరినయెడల మిమ్మును సంతోషముగా ఆహ్వానించుచున్నాము. దేవుడిప్పుడు మీకు తోడుగా యుండును గాక!

తిరిగి మనం కలిసికొను వరకూ, కలిసికొను వరకూ!

యేసు పాదముల యొద్ద కలిసికొను వరకూ, (ఆయన వైపు చేతులు ఎత్తుదము..)

తిరిగి మనం కలిసికొను వరకూ, కలిసికొను వరకూ!

తిరిగి మనం కలిసికొను వరకూ, దేవుడు మీకు తోడైయుండును గాక!

[దేవుడు మీతో యుండుగాక! అను పాటను సహో॥ బ్రెన్‌హాం పాడుచున్నారు] (దేవుని యొక్క గృహమును ఆ విధంగానే మనము విడిచిపెట్టవలెను; ప్రార్థనా పూర్వకంగాను, దీనత్వముతోను, తిరిగి ఈ రాత్రికి కలిసికొందుమను విశ్వాసముతోను విడిచిపెట్టవలెను.) మీకు దేవుడు తిరిగి మనం కలిసికొను వరకు తోడై యుండును గాక!

ఇప్పుడు మన తలలు వంచుదము. సహో. బ్లయర్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...