ఋతువునకు సరిపడు ఆత్మీయాహారము

ఋతువునకు సరిపడు ఆత్మీయాహారము

1మన తలలు వంచి, ఇప్పుడు మనము నిలబడియుందము.

ప్రభువా ఇది కేవలము ఒక పాటగా మాత్రమే ఉండనీయ వద్దు గాని హృదయ లోతుల్లోంచి, "ఇప్పుడు నేను నమ్ముచున్నాను," అని పాడుదుము గాక. యేసు ఎన్నో గొప్ప కార్యములు చేసిన తరువాత శిష్యులు వచ్చి ఒకసారి ఇట్లనిరి, "ప్రభువా, ఇప్పుడు మేము నమ్ముచున్నాము."

"ఇప్పుడు మీరు నమ్ముచున్నారా," అని యేసు అడిగెను.

"నీకు సమస్తమూ తెలుసుననియు ఎవడును నీకేమియూ బోధించనక్కరలేదనియు మేము నమ్ముచున్నాము," అని వారనిరి. కనుక తండ్రి, ఈ రాత్రి మా బోధ నీకు అవసరము లేదని గ్రహించియున్నాము. కాని నీ బోధ మాకు కావలెను. కనుక ప్రభువా, ఎట్లు ప్రార్థించవలెనో, ఎట్లు జీవించవలెనో, ఎట్లు నమ్మవలెనో నీవు మాకు బోధించమని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, ఈ రాత్రి ఆరాధన ద్వారా అది మాకు అనుగ్రహించుము. ప్రభువా, మాకేదయినా లోటున్నచో దానిని మాకు అనుగ్రహించుము. యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.

2మీలో చాలామంది మరల ఈ రాత్రి నిలబడియున్నారని నాకు తెలియును. బయట కొందరిని కలిసికొనగా, వారు లోపలికి వచ్చుటకు వీలు కాక వేర్వేరు కార్లలో రేడియోలలో వినుచున్నారని చెప్పిరి. ఈ రాత్రి వీలయినంత త్వరగా ముగించ ప్రయత్నించుదము. ఆదివారము రాత్రి రోగులకు ప్రార్థించుటకు ఇచ్చెదము. ఇక్కడికి మనము ఒకరు వచ్చి ఒకరు ప్రార్థన వరుస నేర్పరుచుదము. కాని ఈ రాత్రి ఈ ఆరాధనను రోగులకు ప్రార్థించుటకు సమర్పించుచున్నాము.

ఈ పరిశుద్ధ దేవుని వాక్యములో… మీరిప్పుడు కట్టబడవలెనని మిమ్ము కోరుచున్నాను. విశ్వాసములో, ఈ ఘడియ విశ్వాసములో నిర్మించబడవలెను. విశ్వాసము… ఏ కాలములో కంటేను ఎక్కువైన విశ్వాసము కావలెను, ఎందుకనగా ఎత్తబడు విశ్వాసము, పైకెత్త బడవలెను. కాబట్టి ఈ రాత్రి మీరు విన్నది, చూచిన దాని అ౦తటితో, బోధించగా వినిన వాక్యమంతటితో, జరుగగా చూచిన ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు అంతటితో మీరు నమ్మవలెనని మేము కోరుచున్నాము. మీ హృదయమందున్న దానంతటితో మేము మిమ్మును విస్తరింప చేయగోరుచున్నాము. అది దేవుడో కాదో ఆలోచించండి.

ఆనాటి ఎలీషా చెప్పినట్లే చెప్పండి, "యెహోవాయే యెహోవా అయితే ఆయననే సేవించుడి." క్రైస్తవులకు అన్నింటికి కేంద్రము యేసే, అయితే మనము అన్నింటినీ విడిచిపెట్టి, ఆయననే హత్తు కొనవలసియున్నామని నేననుకొనుచున్నాను. గుర్తుంచుకొనండి, ఆయనే కేంద్రము, ఆయనే ఉత్తర నక్షత్రము, ఆయనే గమ్యము, ఆయనే సర్వస్వము. ఆయన ఉత్తర నక్షత్రమయితే… ఉత్తర నక్షత్రమునకు గురి చూపించునది ఒకే ఒకటి యున్నది. అది నీవు ప్రయాణములో కొనిపోవు దిక్సూచి. నేను ప్రయాణములో ఉపయోగించ ప్రయత్నించుచున్న దిక్సూచి వాక్యమే. వాక్యము ఎల్లప్పుడూ ఆయననే సూచించును.

3గొప్ప కల్లోలము, శోధనలు, కలవరము, దేశముల మధ్య కలవరము కలిగిన సమయము గుండా మనము వెళ్ళుచున్నట్లుగా భావించుచున్నాము. ఆయా విధముల సంగతులు జరుగుచున్నవి, కొన్నిసార్లు నేను సముద్రములో యుండిన ఓడవలే… నేను ఎక్కడ చూచినా, అది సముద్రములో ఒక ఓడలో ఉన్నట్లుగా కనబడుతున్నది. ఓడను నడుపు బాధ్యత నాకియ్యబడినది. దానినెట్లు నడుపగలము? నా "ఓడ కంటే వంద రెట్లు పెద్దవాడయిన ఒకాయన తెల్లని టోపీతో వచ్చుచున్నాడు. ప్రతి దానిని మనము అణగ దొక్కుదుము. ఆయన ద్వారా అత్యధిక విజయవంతులము. నావికుడు, ప్రధాన నావికుడు, ఓడ చివరన గల త్రాడును పట్టుకొనియున్నాడు; ఆయన దానిని కడవరకు లాగును. వారిలో ప్రతి ఒక్కరిని మనము జయించుదుము.

4ఇప్పుడు, ఈ రాత్రి, మనము తొందర పడవచ్చును మరియు పెందలకడనే పోనిచ్చుదుము. చాలా దూరము నుండి మీరు కారు నడుపుకొని వచ్చుటను మేము అభినందించుచున్నాము. ఎట్లు నడుపుకొని రావలెనో, ఎంత త్యాగము చేయవలెనో ఎరుగుదును. చూడండి, దాని వలన నేను మీతో ఎట్లు మాట్లాడి, ఎట్లు నిలబడి అన్ని విషయములలో మీకు సహాయము చేయవలెనో అర్థమగుచున్నది. కాని ఇక్కడ నేను ఉన్నప్పుడు ప్రతి దానిని గట్టిగా చెప్ప ప్రయత్నించి, ఆ క్షణమునకు కావలసిన సహాయమును సాధ్యమైనంత వరకు అందించగోరుచున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాము. జనులకు మరీ ఎక్కువ ఒక్కసారే ఇచ్చినచో వారు గుర్తుంచుకొనరు. నీవు ఒక్క విషయమును తీసికొని దానిని ఆ వ్యక్తి చూచు వరకు దానిని గట్టిగా పట్టుకొని బోధించవలెను. అప్పుడు దానిని వారు తమ హృదయములలో గట్టిగా పట్టుకొనిన తరువాత… వారికి మరొకటి బోధించండి. ఒక దాని తరువాత ఒకటిగా మనము వెళ్ళవలెను.

ఇప్పుడు, మీరు ప్రార్థించండి. మంచి ధైర్యము కలిగి యుండుడి. ఈ రాత్రి స్వస్థత కొరకు నమ్మండి. మనము జీవించుచున్న కాలము గూర్చి ఏదైనా ప్రశ్న మీ మనసులో ఉన్నదని నేను అనుకోను. దేవుడు తన జనుల మధ్య ఉన్నాడా లేదా అను ప్రశ్న మీ మనస్సులో ఉందని నేను అనుకొనను. మీరందరూ అది నమ్ముచున్నారని నేను నమ్ముచున్నాను. దాని గూర్చి నా మనస్సులో ఎట్టి సందేహము లేదు. నాకు తెలుసు, నా ప్రజలు అది నమ్ముచున్నారు (నా స్నేహితులు, క్రీస్తు స్నేహితులు, క్రీస్తు బిడ్డలు.)

5దేవుని నుండి ఒక వర్తమానము మీరు కలిగియున్నారని మీరు తెలిసికొనుట నేను చూచినప్పుడు నాకది ఎంతో సంతోషమును ఇచ్చును. దానిని నీవు ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు దానికి స్పందించుదురు. అప్పుడు నీవు వెనుకకు చూచి ఇట్లు చెప్పగలవు, "తండ్రి నీకు వందనములు." బిడ్డలు తమకు పంపబడిన ఆహారమును తినుట చూచినప్పుడు ఎట్టి ఆనందము కలుగును! ఈ ఆలయములో సంవత్సరముల క్రితము అది ఒక దర్శనమని మీరెరుగుదురు. అది నిజము. "జీవాహారము." సహోదరుడా నెవిల్, నీకది జ్ఞాపకమే. బలమగు కాలము!

MARK 9:23•

LUKE 1:37

 

6ఇప్పుడు, చదువుచుండగా వెంబడించుటకు లేదా గీత గీయుటకు… అది స్వస్థత కూటమైనా, మరేదైనా గాని దేవుని వాక్యము చదివి కొన్ని మాటలు చెప్పకుండా ఆరాధన జరిగించుట మంచిది కాదని నేను నమ్ముచున్నాను, మనందరము అర్థము చేసికొందుము. మన మధ్య కొత్త వారెవరూ లేరని అనుకొనుచున్నాను. స్వస్థత అనగా ఏమిటో మనందరము అర్థము చేసికొందుము: ఎవరో నీకు చేయునది కాదు, అది దేవుడు నీ కొరకు ఎన్నడో చేసినది. రక్షణ కూడా అదే వరుసలో యున్నది. చేయవలసినదంతా అది సత్యమని ప్రజలు నమ్మునట్లు చేయుటయే. దేవుడు దానిని తన వాక్యముతో బోధించును. తరువాత దానిని నమ్మువారికి దానిని రుజువు చేయును. ఆయనలాగు చెప్పెను, "నమ్మువానికి సమస్తమూ సాధ్యమే."

"దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదని" మీరందురా? అది మీరు నమ్ముదురా? "మాకు కూడా ఏది అసాధ్యము లేదు." "నమ్మువారికి సమస్తమూ సాధ్యమే." [దేవుడు ఒక వ్యక్తి] చూచారా. మీకును అసాధ్యమైనది ఏదియు లేదు, కేవలము మీరు నమ్మినచో చాలును.

1KGS 17:1-7

 

7ఇప్పుడు I రాజులు 17వ అధ్యాయము, దేవుని చిత్తమయితే, మొదటి ఏడు వచనములు చదువగోరుచున్నాను.

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బియుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడియున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచయినను, వర్షమైనను పడదని ప్రకటించెను.

పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,

నీవు ఇచ్చటనుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము.

ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా.

అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.

అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు తీసికొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.

కొంత కాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.

8చదువబడిన ఆయన వాక్యమునకు ప్రభువు తన ఆశీర్వచనములు దయచేయును గాక. ఈ రాత్రి అందులో నుండి నేను, "ఋతువునకు సరిపడు ఆహారము," అను అంశమును తీసికొనగోరుచున్నాను. ఈ ఉదయమున మనము దేవునికి ఒక పని చేయుట… లేక సమయము, కాలము, స్థలము లేదా వ్యక్తి లేకుండా ఆయనకు సేవ చేయుట. ఇప్పుడిది: ఋతువునకు సరిపడు ఆత్మీయాహారము.

9ఈ ప్రవక్త ఏలియా గూర్చి మనకు బహు కొద్దిగా తెలియును. కాని ఆయన దైవ సేవకుడని మనకు తెలియును. ఆ ఘడియకు దేవుని సేవకుడు.

ఏలియా మీద ఉన్న ఆయన ఆత్మను దేవుడిప్పటికే మూడుసార్లు వాడుకొనెను. రెండు సార్లు వాడుకొనుటకు మరల వాగ్దానమున్నది; అయిదు సార్లు, కృపకు గురుతు. ఆయన దానిని ఏలియా మీద వాడుకొనెను; ఎలీషా మీద రెండు పాళ్ళు ఆత్మతో వాడుకొనెను; బాప్తిస్మమిచ్చు యోహాను మీద ఉండెను; మరియు అన్యుల పెండ్లి కుమార్తె ఆవిర్భావమందు మరల రానైయున్నది; మోషేతో వచ్చి యూదులను ఇంటికి కొనిపోవును. అది సరియే. ఏలియా ఆత్మను అయిదు సార్లు వాడుకొందునని దేవుడు వాగ్దానము చేసెను, ఇప్పటికే మూడుసార్లు జరిగెను.

ఇప్పుడీ గొప్ప ప్రవక్త ఎక్కడి నుండి వచ్చెనో మనకు తెలియదు. అతడు తిష్బియుడని మనకు తెలియును. కాని ఎట్లు అతడు వచ్చెనో…

2KGS 1:8

 

10ప్రవక్తల గూర్చి మనకు కొద్దిగానే తెలియును. వారెచ్చట నుండి వచ్చిరో మనకు తెలియదు. బహు అరుదుగా… సంఘము నుండి గాని లేదా వారి వెనుక ఆట్టి వంశావళి గాని ఉండి వచ్చినట్లు నాకు ఎవరూ గుర్తుకు వచ్చుట లేదు. వారు కేవలము భయము లేని సామాన్య వ్యక్తులు, చాలామంది విద్యలేని వారే. వారు తమకు తాముగా ఎట్టి రచన చేయలేదు. యెషయా, యిర్మియా మొదలగు కొద్ది మందియే ఏదో కొంత వ్రాసిరి, కాని ఈ గొప్ప ఏలియా ఏ ఒక్కటియూ వ్రాయలేదు, చాలా మంది అందులో వ్రాయలేదు. బహుశ వారు వ్రాయలేరేమో. వారు కరుకయిన మనుష్యులు. ఆ పురాతన ప్రవక్తల వలె ఎవరునూ బైబిలులో లేరు. వారు రాజ్యములను, రాజులను, జనులను, సంఘములను, సమస్తమును వారు ఎదిరించి, దేవుని వాక్యము మీద గట్టిగా నిలబడిరి. వారు సరియైన వారని దేవుడు రుజువు చేసెను. వారు చాలా కరుకైన వ్యక్తిత్వముగలవారు.

వారందరిలోను బాగా కరుకయిన వ్యక్తులలో ఏలియా ఒకడు. అతడు అడవి మనిషి. అతడు అరణ్యము నుండి బయటకు వచ్చెను. అతడు అడవిలో జీవించెను. అతడు ఒంటి రోమము, గొర్రె చర్మము ధరించుకొనెనని, చర్మపు పీలిక చుట్టుకొనెనని బైబిలు చెప్పెను. ముఖము నిండా వెంట్రుకలు కలిగి చూచుటకు చాలా మోటు వ్యక్తిగా కనిపించెనని నేననుకొనుచున్నాను.

11కాని వారందరూ చనిపోలేదు. వారందరూ చనిపోలేదు. నైసియా సమితి దినములలో… మీలో చాలామంది ఆది సంఘపు నైసియా సమితి గూర్చి చదివియే యుందురు. వారు దానిలో నుండి ఒక సంస్థను తయారు చేసి, తక్కిన సంమములన్నింటిని విచ్చిన్నము చేసి, ఒక్కదానిగా రూపొందించగోరిరి. ఆ నైసియా సమితి వారు కలిగి యున్నప్పుడు అరణ్యము నుండి కేవలము ఆకులు తినుకొంటూ ఎలీషా అక్కడికి వచ్చెను. గొప్ప మోటు మనిషి, కాని హోదా గలవారు, ఉన్నత శ్రేణి వారు, కాన్స్టాంటయిన్ క్రింద వారి స్వరములను చల్లబరచుకొనిరి. ఎందుకనగా వారు ప్రవక్తలయి యుండి సంఘ వధువు గింజ భూమిలో పడవలెనని ఎరిగియుండిరి. పెండ్లి కుమారుడగు గోధుమ గింజ భూమిలో పడినట్లుగానే పడెను. అక్కడ అది వేయి సంవత్సరములుండెను.

అందుకే వారు ఈనాడు పుస్తకములలో ఈలాగు వ్రాయుచున్నారు, "చిన్న పిల్లలు హత్య చేయబడుచూ, స్త్రీలు సింహముల ద్వారా ముక్కలుగా చీల్బబడుచుండగా, ఆకాశములలో కూర్చొని దాని గూర్చి ఏమీ పట్టించుకోని ఆ మౌన దేవుడు ఎక్కడ? ఏలాగు నిలబడి చూడగలుగుచున్నాడు?" వారికి వాక్యము తెలియదు. ఆ గోధుమ గింజ నేలలో పడవలెను. నీతిమంతుడగు దేవుడు తన స్వంత కుమారుడు ఉమ్మి వేయబడి, చంపబడుతూ ఉంటే నిలబడి ఎట్లు చూడగలిగెను? కాని అది వాక్యానుసారము. అది ఆలాగు కావలసియున్నది. ఈ ఘడియ వరకును అది ఆలాగే యున్నది.

1KGS 17:1

 

12ఇతడు గొప్ప వ్యక్తి. అతని ఎదుట ఒక పాపపు తరము ఉండెను. ఆహాబు రాజుగా ఉండెను. అతనికి ముందున్న అతని తండ్రి చెడ్డవాడు. సొలోమోను తరువాత నుండి ఒకరి తరువాత ఒకరు చెడ్డ రాజులే వచ్చుచుండిరి. ఆ సమయoలో ఇరవై-రెండేండ్లు పాలించిన ఈ ఆహాబు అందరిలోను దుష్టుడు. అతడు అసలయిన ఆధునికవేత్త, నిశ్చయంగా అతడు మతము నందు విశ్వాసముంచెను. అతడు సమస్తమును ఆధునిక పోకడలో ఉంచెను. అతనికి నాలుగు వందల మంది పోటీ ప్రవక్తలుండిరి. వారందరూ బాగా చదువుకొని, శిక్షణ పొందిన వారు. దేవుడు ఒకని పంపెను, అతనిని నమ్మలేదు, మరియు అతడు ఏలియా.

అయితే తిష్బియుడగు ఏలియా ఆరణ్యమునకు చెందినవాడు. సుత మెత్తని వాడు కాడు, చాలా కరుకువాడు. ఆహాబు పాపమును దేవుడు ఇక ఏ మాత్రము సహించనిజాలని ఒక రోజు వచ్చెను. ఆయన అరణ్యములోని ఏలియాతో మాట్లాడెను. ఇక్కడతడు సమరయకు వచ్చు మార్గములో ఉండెను. నేను ఎల్లపుడూ వివరించినట్లుగానే, ఆతని ముఖము చుట్టూ తెల్లని గడ్డము వ్రేలాడుచుండి యుండెను. బట్టతల ఎండలో మెరయుచుండెను. చిన్న ముసలి కండ్లు. చేతిలో ఒక కర్ర, ముఖము మీది చిరునవ్వుతో ఇశ్రాయేలు రాజు యొద్దకు తిన్నగా నడిచి వచ్చెను. ఇట్లు చెప్పెను, "నేను తిరిగి ప్రార్థించు వరకు మంచు కూడా కురియదు."

దేవా, మాకును అటువంటి వ్యక్తిని ఇవ్వండి. చూడండి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" వారేమి చేయుచున్నారో ఎరిగిన వ్యక్తి అతడు.

13దీనిని అతడు చేయుటకు ముందు దేవుడు అతనిని పిలిచెను. దేవుడు అతనితో మాట్లాడెను. కాబట్టి అతడు దేనికి భయపడలేదు. తన వర్తమానము గూర్చియు భయపడలేదు. (అది జరుగదు), అది జరుగును అతనికి తెలియును. అది యెహోవా వాక్కు ప్రకారము అని అతడెరుగును. అతడు ఆ ఘడియకు దేవుని ప్రవక్త అని ఎరుగును. కాబట్టి రాజు తల నరికివేసినను, చెరసాలలో విసిరి వేసినను, వారేమి చేసినా అతనికేమి భేదము లేదు. అతనికి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అను ఆజ్ఞ యున్నది. రాజు ముఖము మీదనే చెప్పెను. ఎంత గడ్డు వ్యక్తి! కాని ఇది చేయుముందుగా, ఈ గొప్ప క్షామమును ప్రవచించెను…

దేవుడు పాపమును శిక్షించకుండా విడిచి పెట్టాడు. అక్కడ తప్పక శిక్ష ఉండును. శిక్ష లేకుండా చట్టము వలన ఏమి ప్రయోజనము? "దీపమును వెలిగించుట చట్ట విరుద్ధము," అని చెప్పి దానికి వెనుక ఎట్టి జరిమానా లేదా శిక్ష విధించకుండా ఉన్నట్లయితే చెప్పుట వలన ఏమి ప్రయోజనము? అది చట్టము కానేరదు. కాబట్టి పాపమునకు శిక్ష గలదు. దేవుడు ఒక చట్టమును తయారు చేసినప్పుడు ఆ చట్టమును మీరినప్పుడు - దానికి శిక్ష విధించబడవలెను.

ఈ దేశము అన్ని చట్టములను అతిక్రమించెను. ఓ, వారికి పెద్ద సంఘమున్నది. వారికి ఆలయమున్నది. వారికి సమృద్ధిగా చదువుగల వారున్నారు. వారికి దేశమంతటనూ ప్రవక్తలున్నారు. వారికి పాఠశాలలున్నవి. ఒక యంత్రము వలె వారిని త్రిప్పుచున్నారు. వారికి సమృద్ధిగా యాజకులున్నారు. వారికి సమృద్ధిగా శాస్త్రులున్నారు. వారికి సమృద్ధిగా మతమున్నది. కాని వారు దేవుని వాక్యము నుండి దూరమయిరి. కనుక వారి యొక్క ఏ హోదాకు చెందని దూరపు వాడయిన ఒక వ్యక్తిని దేవుడు పిలిచెను, "యెహోవా ఈలాగు సెలవిచ్పుచున్నాడుతో" అతనిని పంపెను.

14ఆయన తన స్వంత వారికొరకు ఎట్లు శ్రద్ధ వహించెనో గమనించండి. వర్తమానముతో ఈ ప్రవక్తను ఆయన పంపు ముందుగా ఆయనిట్లు చెప్పెను, "ఏలియా, నీవు ఆహాబు రాజు యొద్దకు పోయి ఈలాగు చెప్పుము. ఈ పని అయిన వెంటనే అతని యొద్ద నుండి నీవు తొలగుము, ఎందుకనగా కరువు సమయమున నీవుండుటకు ఒక స్థలమును నేను తయారుచేసి యున్నాను. ఏలియా, నీ గూర్చి నేను శ్రద్ధ తీసికొనగోరుచున్నాను. నీవు నా వాక్యమును బోధించి నేను నీకు చేయమని చెప్పినది చేసినచో చాలును."

నేడు మనము జీవించుచున్న ఈ ఘడియతో ఏలియాను, ఏలియా "కాలమును, ఈ గొప్ప సేవను ఈ రాత్రి నేను పొల్చనై యున్నాను. అది పరిపూర్ణ మాదిరి అని నేను నమ్ముచున్నాను. నేను దేశముల గూర్చి ఆలోచించుచున్నాను…" వెనక్కు వెళ్ళి చూచుటకు మనకు సమయముండినచో బాగుండేది, కాని ప్రార్థన వరుసకు సమృద్ధిగా సమయము పెట్టగోరుచున్నాను.

15మీరు వెనక్కు వెళ్ళి ఇశ్రాయేలును చూడండి, ఈ అమెరికా దేశమును ఏ ప్రాతిపదిక మీద మనము తీసికొన్నామో పాలస్తీనాను వారాలాగు తీసికొనిరి. మనము అమెరికాకు వచ్చి దాని నివాసులగు ఇండియనులను తరిమి దేశమును స్వాధీనము చేసికొన్నాము. యెహోషువా, మరియు దేవుని నాయకత్వము క్రింద ఆలాగే ఇశ్రాయేలు పాలస్తీనాలోనికి వచ్చి, ఆ నివాసులను పారద్రోలి భూమిని స్వాధీనము చేసికొనెను.

వారి మొదటి రాజులు బలమైన వారు. దావీదు, సొలోమోను బలమగువారు. మన మొదటి దేశాధ్యక్షులు గొప్పవారు: వాషింగ్టన్, లింకన్ మొదలగు వారు. అయితే తుదకు అధ్యక్షులు లేదా రాజులు అంతకంతకు చెడిపోవుచునే వచ్చిరి. చివరగా ఈ ఆహాబుతో ముగింపు వచ్చినది. నేటి మన దినమునకు చాలా మాదిరిగా యున్నది. ప్రజలు ఎంత ఆధునికులుగా తయారయిరనగా నిజమగు దేవుని వాక్యమును వినుటకు వారికి ఇష్టమే లేదు.

16అటువంటి ఆధునిక జనులకు నిజమగు దైవ సేవకుడు ఏలాగు కనిపించునో మీరే ఊహించగలరు. "వాడు వెర్రివాడు, వాడికి మతి పోయినది. అటువంటిది ఏదీ ఉండదు." వారు భక్తిగల వారే. చాలా భక్తిగల వారు. వారికి యధార్థపరులున్నారు. యధార్ధమగు ప్రజలున్నారు. వారు చాలా మతనిష్ట కలిగినవారు.

కనుక వారి రాతి హృదయాలను బ్రద్దలు చేయవలెనంటే ఒక మామూలు వేదాంత విద్య కన్న మిన్నయైనది, ఎట్టి సామాన్య వర్తమానము కన్నను మిన్నయైనది, మామూలుగా వాక్యము బోధించుట కంటే మిన్నయైనది కావలెనని అతడు ఎరుగును. ఆ జనుల మీదికి తీర్పును తీసికొని వచ్చుటకు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అవసరమైనదని అతడెరుగును. కనుక అతడు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" బయలు వెళ్ళినప్పుడు ఎరిగియే యుండెను. అది తీర్పు అని హెచ్చరించునది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయే." దానిని మనము మన దినములలో కూడా చూస్తున్నాము. ఏ దినమునయినా దానిని మనము చూతుము. కృపా గీతను దాటిన తరువాత నీకు తీర్పు తప్ప మరేమియూ మిగిలియుండదు.

1KGS 17:1•

AMOS 8:11

 

17నేటి సంఘమును, లేదా నేటి యొక్క ఆలయమును ఏలియాతో నేను పోల్చవలెనని కోరుచున్నాను. తీర్పునకు ముందుగా అతడు ఈ వర్తమానమును పొందెను. ఏలియా, స్వాభావికముగా శ్రద్ధ తీసికొనబడి ప్రతినిధిగా పోల్చబడియున్నాడు, అతని స్వాభావిక ఆహారము, ఎందుకనగా తిరిగి ఏలియా ఆజ్ఞాపించు వరకు మూడున్నర సంవత్సరముల పాటు, యెహోవా వాక్కు ప్రకారము వర్షము కురియదు. "ఏలియా, నీవు ఏ సమయము చెప్పుదువో ఆలాగే జరుగును." కాబట్టి అతడు రాజు దగ్గరకు వచ్చి, నేను తిరిగి ఆజ్ఞాపించు వరకు మంచు కూడా పడదు." అది ఎంతో భారము కాదా? అది ఎంతో గొప్ప వర్తమానము.

ఇప్పుడు మనము దానిని బట్టి ఈనాటి ఆత్మీయ క్షామముతో పోల్చుదము. ఆత్మీయముగా మాట్లాడుతున్నాను, మీ అందరు ఎరుగుదురు, మనందరకు తెలియును. ఈనాడు దేశములో గొప్ప ఆత్మీయ కరవు వచ్చియున్నది. క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా ఆలాగు జరుగునని ప్రవక్తలు ముందే చెప్పిరి. "దేశములో ఒక కరవు వుండును. అది ఆహారము లేకపోవుట వలన వచ్చు కరవు కాదు గాని, దేవుని వాక్యమును వినుటలో సంభవించు కరవు." ఆ రోజు ఇప్పుడే వచ్చియున్నది. "నిజమగు దేవుని వాక్యమును వినుట." ఇది ప్రకృతి సంబంధమగు కరవుతో ఆత్మసంబంధమగు కరవును పోల్చుటయైయున్నది.

పాపము, అవిశ్వాసము సంఘములోని అబద్ధ బోధకులు, ఆధునిక వేత్తల ద్వారా కలుగుచున్నది. అది మనలను ఈ ముంచుకొచ్చుచున్న తీర్పు యొద్దకు తీసికొని వచ్చినది. అప్పుడు వారు దేవుని వాక్యము నుండియు, ఆయన ప్రవక్తనుండియు తిరిగిపోయి వాక్యము యొక్క ఆధునిక పోకడల వైపు మళ్ళిరి.

AMOS 3:7

 

18సరిగ్గా అదే సమయములో ఎల్లపుడూ దేవుడు ఒక దానిని లేవనెత్తునని మీరు గమనించారా? ఎందుకనగా (ఆయనెల్లపుడూ) మొదటగా ఆయన జనులకు బయలుపరచకుండా ఏదియూ చేయడు. ఆయనెల్లప్పుడు దానిని తన ప్రవక్తల ద్వారా బయలుపరచును.

ఇప్పుడు, అయితే ఏలియా ఈ కాలములో వెళ్ళి యుండుటకు దేవుడు ఒక రహస్య స్థలమును నిర్ణయించెను. ఈ ప్రార్థన వరుసను మనము ప్రార్థించు ముందుగా, ఇప్పుడు మనము చూడవలసినది అదే. ఏలియా యొక్క రహస్య స్థలము దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడెను. దానిని సంఘము అతనికి ఏర్పాటు చేయలేదు. దానిని రాజు ఎన్నడూ ఏర్పాటు చేయలేదు. తనకు తాను అతడు ఏర్పరచుకోలేదు, కాని ఆ కరవు కాలమంతటిలో దిన దినము ఆహారము అనుగ్రహించబడి, ఏలియా పోషించబడునట్లుగా దేవుడు ఒక రహస్య స్థలమును ఏర్పరచెను. సరఫరా ఆగిపోవునని గాని, రేపు ఏమి జరుగునో అని గాని అతడు ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు. "నిన్ను పోషించుటకు కాకోలములకు ఆజ్ఞాపించితినని," దేవుడు చెప్పెను. ఎంత గొప్ప సంగతి, క్రీస్తునందు మనకుండిన రహస్య స్థలమునకు ఒక మాదిరి.

19ప్రపంచ నంఘ సమితి, ఈనాడు జరుగుచున్న ప్రతిదియు అద్భుతములు జరుగు దినములు గతించినవని," చెప్పుచున్నారు. దేవుని యొక్క గొప్ప శక్తులు సంఘములో నుండి తీసివేయబడినవి. "మ్రోగెడి కంచును గణగణ లాడెడు తాళము," తప్ప మరేమియూ వారికి మిగిలినట్లుగా లేదు. అది సత్యమని మనకు తెలియును. పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు."

దేవుని వాక్యము నుండి దూరమై ఎద్దు బండితో ఈ ఉదయమున దావీదు చేసిన పని అదే. వాక్యము వారికి బయలుపరచబడి వారికి అనుగ్రహించబడినప్పుడు వారు వద్దనిరి, అందుకే వారు దాని నుండి దూరమయిరి.

ఏలియా దినములలో ఈ జనులు చేసినది అదే. వాక్యము నుండి దూరమయిరి. వారు తమకు వాక్యమున్నదని అనుకొనిరి గాని, దానిని వారు కలిగి లేరు.

20కనుక గమనించండి, అవిశ్వాసిని శిక్షించగోరిన, ఆ కాలములో ఆయన విశ్వాసికి ఒక మార్గమును ఏర్పాటు చేసెను. ప్రతిసారి ఆయన ఆలాగే చేయును. లోకమును నీటి ద్వారా నాశనము చేయదలచిన ఆ దినములలో నోవహు తప్పించుకొనుటకు ఒక మార్గమును ఆయన తయారు చేసెను. ఐగుప్తును ఆయన ముంచివేయనైయుండిన ఆ దినములలో, తన ప్రజలు సముద్రమును దాటిపోవుటకు ఆయన ఒక త్రోవను ఏర్పరచెను. దేవుడెట్లు మార్గమును ఏర్పాటు చేయును, ఏ దారి లేని చోట ఆయనే దారి. ఆయనే ఆ మార్గము.

మనము కొన్నింటిని ఎదుర్కొనుచున్నట్లుగా ఇప్పుడు గ్రహించి యున్నాము… చరిత్ర ఎన్నడూ ఎరుగని గొప్ప ఘడియలలో ఇది ఒకటి. మనము భయపడవలసినది కాంతివంతముగా యుద్ధ శిరస్సుతో మెరయుచున్న క్షిపణులకు కాదు (దాని పైని శిరస్సున్నది) మనము భయపడవలసినది సంఘములకే. మనము జీవించుచున్న ఘడియను మనము గమనించవలెను.

21ఇప్పుడు గమనించండి, కాని దానిని తప్పించుకొనుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. అలాగే ఇప్పుడును తనను నమ్మిన ప్రజలు రానున్న ఉగ్రత, శిక్షల నుండి తప్పించుకొనుటకు ఆయన ఒక త్రోవను ఏర్పరచి యున్నాడు.

ఎందుకనగా దేవుడు ఆ జనులను తీర్పు చేసి, వారిని శిక్షలోనికి పంపి, సొదొమ గొమొర్రాలను ముంచి, కపెర్నహోమును సముద్ర మధ్యములో ముంచి, ఆ తరములను శిక్షించి, సొదొమ గొమొర్రాలను శిక్షించి, మనలను ఆలాటి పనులు చేస్తూండగా చూస్తూ పోనిచ్చినచో ఆయన న్యాయవంతుడు కాజాలడు.

22ఈ సంగతులు జరుగుచున్నప్పుడు, ఆనాటి ఆధునిక పోకడ, తిరిగి తల ఎత్తినప్పుడు ఆ దినమున ఒక మనిషిని దేవుడు లేపెను అని మనము గమనించవలెను… ఒక వ్యక్తిని లేపెను, ఆ శక్తులను పోరాడుటకు లేపెను. దానిని వారు వినలేదు. వారు అతడిని వెర్రివాడనుకొనిరి, "అతని మతిపోయినది. అతడు కేవలము ఒక పురాతన మూఢభక్తి గలవాడు, అడవి నుండి వచ్చిన వెర్రివాడు, ఒక రకమగు అడవి వెర్రివాడు," అనుకొనిరి. కాని, అయినను, అతడు యెహోవా వాక్కు కలిగియుండెను."

23"ఆ వాక్యము అర్థము అది చెప్పునట్లుగా కాదు," అని వారీనాడు చెప్పుచున్నారు. "ఓ, సరే, బైబిలు ఒక చరిత్ర గ్రంథము." మీరిది చూచారని నేను తలంచుచున్నాను. "హవ్వ పండు తినలేదని," ఇప్పుడు వారు చెప్పుచున్నారు. అది ఏమిటి? అది "ఏప్రికాట్" అనుకొంటున్నానని వారిప్పుడు చెప్పుచున్నారు. "అది ఒక ఏప్రికాట్ పండు," ఇంకా ఇట్లనుచున్నారు. ఎర్ర సముద్రము గుండా మోషే ఎన్నడూ తన బిడ్డలను తీసికొని రాలేదు. అక్కడ పెద్ద సముద్రపు రెల్లు ఉన్నది. అది సముద్ర చివర వరకు ఉన్నది. అతడు ఆ రెల్లు గుండా వెళ్ళెను." అయితే ఇరుప్రక్కల నీరు గోడవలె ఎట్లు నిలబడగలదు? ఎట్లు వారు ఆరిన నేలను వెళ్ళగలరు? ఓ, ఎట్టి బుద్ధిహీనత! కాని, మీరు చూడండి, అటువంటి దినమే దేవుని ఉగ్రతను ప్రజల మీదికి రప్పించును. అది జరిగెను.

ఇటువంటిది ఏదీ లేదని వారు చెప్పిరి… సంఘస్తులు కూడా ఆద్భుతములను నమ్ముట లేదు. "నీకు ఒక వెయ్యి డాలర్లు ఇస్తాను. నాకు ఒక ఆద్భుతము చూపించు," అనుచున్నారు. వారి యెదుట పదివేల కార్యములు జరిగిననూ వారు చూడలేదు. ఎందుకు, దానిని వారెన్నడూ చూడరు.

"అది అసాధ్యము," అని నీవనవచ్చును. ఓ, కాదు, అది కాదు.

2KGS 6:12-17

 

24ఏలియా ఒకసారి దోతాను యొద్ద ఉండెను. సిరియా సైన్యము వచ్చి పట్టణమును చుట్టు ముట్టి అతనిని తీసికొని పోగోరెను, ఎందుకనగా ఆ దేశము యొక్క శక్తి ప్రవక్తలోనే యున్నట్లు వారెరుగుదురు. ఆ రాజు… వారిలో ఒకడు సిరియా రాజుతో ఇట్లనెను, "నీ రహస్య గదిలో నీవు మాట్లాడుతున్న దానిని ప్రవక్తయు, తిష్బియుడునగు ఏలియా ఇశ్రాయేలు రాజుకు తెలియచేయుచున్నాడు."

"వెళ్ళి, అతనిని పట్టుకొని రండి." వాడే మనలను ఆటంకపరచుచున్నాడు అని చెప్పెను. సిరియా సైన్యము మొత్తము దోతానును చుట్టు ముట్టెను. దానిని ముట్టడి వేసిరి.

ప్రవక్త యొక్క దాసుడగు గేహజీ, మేల్కొని, "ఓ, నా తండ్రి, సైన్యములు మనలను చుట్టుముట్టినవి. మనము పూర్తిగా ముట్టడి చేయబడినాము," అని చెప్పెను.

"వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు గొప్పవారు," అని అతడు చెప్పెను. చూచారా?

గేహాజీ చుట్టూ చూచి, "నాకెవరూ కనబడుట లేదే?" అన్నాడు.

"యెహోవా దేవా, వీని కన్నులు చూడకలుగునట్లు తెరువుము," అని అతడు పలికెను. అతని కండ్లు తెరువబడి పర్వతములన్నియూ దేవదూతలతో నిండియుండి, చుట్టూ రధములు నిలబడియుండుటయు, కనబడని శక్తులు ఉండుటయు చూచెను.

2KGS 6:18,19

 

25ఏలియా అక్కడకు నడిచి వెళ్ళెను, "వారిని గ్రుడ్డితనముతో మొత్తెను," అని బైబిలులో వ్రాయబడెను. అతడు వారి యొద్దకు నడిచి వెళ్ళెను. వారు గ్రుడ్డివారుగా అతనికి కనబడిరి. "మీరు ఏలియా కొరకు చూస్తున్నారా?" అని నడిచి వెళ్ళి అడిగెను.

"అవును, మేము అతని కొరకు చూస్తున్నాము," అన్నాడు.

"అతడెక్కడున్నాడో చెప్పెదను రండి," అని చెప్పి వారిని సైన్యముల చోటకు, వారి మధ్యకు నడిపించి పట్టుకో చేసెను.

"వారిని అంధత్వముతో మొత్తెను," అని బైబిలు చెప్పెను. అది దానిని స్థిరపరుచును. ఈనాడు ప్రజలు ఆత్మీయంగా ఎంత గ్రుడ్డివారయి పోయారంటే, ప్రజల మధ్యకు ప్రభువగు దేవుడు దిగివచ్చి ఎన్ని చేసిననూ, ఆయన వాగ్దానము చేసినవి చేయుచున్ననూ, వారింకనూ దానిని చూడలేకపోవుచున్నారు. వారు ఆత్మీయముగా అ౦ధులు. దేవునిని ఎరుగరు. ఆయన గొప్ప శక్తిని ఎరుగరు. ఇప్పుడు, ఏలియా దినములలో చేసినదే ఈనాడు వీరును చేయుచున్నారని ఇప్పుడు మనము గమనించవలెను. దేవుడు వారిని అంధులుగా మొత్తెను. అందుకే వారు ఈనాడు, "ఏ అద్భుతములు లేవు, అట్టిది ఏదీ లేదు, ఇదంతా ఉద్రేకము," అని చెప్పుచున్నారు.

2KGS 2:11,23,24

 

26ఏలియాను గూర్చి కూడా వారు అదే చెప్పిరి, ఎందుకనగా అతడు కొనిపోబడి, యవ్వనుడగు ఎలీషా అతని స్థానమును తీసికొనెను. యవ్వనములోనే బట్టతలగల వాడాయెను. పిల్లలు ఆతని వెనుకపడి, "ముసలివాడా, బోడివాడా, ఏలియాతో నీవెందుకు పోలేదు?" అని కేకలు వేయుచుండిరి. చూడండి, ప్రజలు ఆదియందు అసలు నమ్మనే లేదు. ఎన్నో కార్యములు జరిగిన తరువాతనే. ఈ గొప్ప దైవజనుడు అగ్ని రథము ద్వారా పరమునకు రూపాంతరము చెంది వెళ్ళెను, దానిని ప్రజలు ఇంకనూ చూడలేకపోయిరి. బోడివాడా, నీవెందుకు ఎక్కిపోలేదు?" అని వారి పిల్లలు అనుకొంటూ వెనుక పరుగెత్తియుండెడి వారా? చూచారా, ప్రవక్త పిల్లలను శపించెను. ఒక ఆడ ఎలుగు వచ్చి వారిలో నలువది ఇద్దరిని చ౦పెను.

GEN 1:3•

ISA 7:14•

JOEL 2:28,29•

2PET 1:20

 

27ఇప్పుడు గమనించండి. అప్పుటి వలెనే ఇప్పుడును వాక్యమునకు తమ స్వంత అనువాదము వారు చేయుచున్నారు. వారిలాగు చేయగోరినచో అది వారిదే, కాని వారు మనలను నమ్మింప చేయుచున్నారు. "దేవుని వాక్యమునకు ఎట్టి స్వంత అనువాదము అవసరము లేదు," అని బైబిలు చెప్పెను. దేవుడు తన స్వంత అనువాదమును చేసికొనును. దేవుడు తన మాటను స్థిరపరచుకొనును. అదే దానికి అనువాదము. నేను చాలాసార్లు చెప్పినట్లుగా, ఆదిలో ఆయన ఈ వెలుగు కలుగును గాక!" అని పలుకగా, వెలుగు కలిగెను. దానికి అనువాదము చెప్పనవసరము లేదు. అది జరిగెను. "ఒక కన్యక గర్భవతియగును," అని ఆయన పలుకగా, ఆలాగు ఆయెను. "ఆయన తన ఆత్మను కుమ్మరించుదును," అని చెప్పెను; ఆలాగు చేసెను. "చివరి దినములలో ఆయన చేయుదునని చెప్పిన సంగతులు చేయుచున్నాడు! దానికి ఎట్టి అనువాదము అవసరము లేదు. దేవుడు తన స్వంత అనువాదమును చేయుచున్నాడు. బుద్ధిలేనివాడు ఏమి అన్ననూ పరవాలేదు. అది దేవునిని ఏ మాత్రము ఆపజాలదు.

JOHN 5:39•

JOHN 10:30,37,38•

HEB 13:8

 

28యేసు భూమి మీద ఉండగా, నేడు మనకున్న అవిశ్వాసము, లేదా అంత కంటే ఎక్కువ దానితోనే ఆయన పోరాడవలసి వచ్చెను, కాని అది ఆయనను ఆపలేదు. తన బాధ్యతను మోయుచూ, జరిగించుచునే ఆయన ముందుకు పోయెను. ఆయన తాను చేసిన ప్రతి దానిని స్థిరపరచెను. "నేను నాయంతట నేను - లేను. నేను, నా తండ్రియు ఒక్కటి. ఆయన నా యందు నివసించుచున్నాడు. కార్యములు చేయునది నేను కాదు గాని, నా యందు నివసించుచున్న తండ్రియే నేను క్రియలు చేయనిచో నన్ను నమ్మకుడి. కాని నేను క్రియలు చేసినను, మీరు నన్ను నమ్మనియెడల, నా క్రియలను నమ్ముడి." చూచారా? మరో మాటలో, "లేఖనములను పరిశోధించుడి, లేఖనములను తెలిసికొనుట ద్వారా నిత్యజీవము గలదని మీరు తలంచుచున్నారు గదా?" అని చెప్పెను. ఈ లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." ఆమేన్! ఎట్టి మాటది! "నేను ఎవరినై యున్నానో అవి [లేఖనాలు] చెప్పుచున్నవి," అని యేసు చెప్పెను.

నేడు మనము జీవించుచున్న ఘడియను చెప్పునవి లేఖనములే మరియు జరుగుతున్న కార్యములు మీరు చూచుచున్నారు. అది జనుల మధ్య ఉన్న దేవుడే. దేవుడు తప్ప మృతులను లేపునది మరేదియూ లేదు. ఆయన తప్ప ఇప్పుడు జరుగుచున్న కార్యములను మరెవరును చేయజాలరు. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు," అని బైబిలు చెప్పుచున్నది.

AMOS 3:7

 

29అయితే ఇప్పుడు మనము ప్రజల ఆధునిక పోకడను చూచుచున్నాము. "ఓ, దీనములు గతించినవి; అద్భుతములు అనునట్టివి లేవు. ప్రజలందరూ ఉద్రేకంగా పనిచేయుచున్నారు."

ప్రవక్తయగు ఏలియా వారి వేదాంత పండితులకును, వారికిని వ్యతిరేకముగా కేక వేసెను. గమనించండి, గమనించండి, దేవుడు తానే మాట్లాడినట్లుగా అతడు పలికెను. "నేను తిరిగి ఆజ్ఞాపించువరకు మంచు కూడా ఆకాశము నుండి పడదు." ఆమేన్! అవునండి! ప్రవక్త దేవుని సన్నిధిలో అంతకాలము ఉండెను…

పాత నిబంధన ప్రవక్తలు లేదా ఏ కాలములోని వారయిననూ, వారు దేవుని సన్నిధిలో జీవించి, చివరకు వాక్యముగా మారిరి. వారి వర్తమానము వాక్యమే. గుర్తించుకొన౦డి, అతడు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అనెను. వారు దేవుని యొద్ద నుండి వర్తమానము కలిగి వారు తమ స్వంత ఆలోచనలలో ఎంతగా చుట్టబడిరనగా…. అది వారి ఆలోచనలకు విరోధముగా ఉన్నందున, దానిని వారు సరిగా చూడలేకపోయిరి. కాని వారు దేవుని వాక్యమును మాట్లాడుచుండిరి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!"

"నేను తిరిగి ఆజ్ఞాపించు వరకు వర్షము కురవదు!" ఓ, ఎట్టి మాట! అతడు దేవుని సన్నిధానములో ఉండి అంత ఖచ్చితమగు ప్రత్యక్షతను పొందెను. గుర్తుంచుకొనండి, అది ఆమోసు 3:7ను వెంబడించును. "దేవుడు తన ప్రవక్తలగు దాసులకు మొదట బయలుపరచితేనే గానీ ఏదియూ చేయడు." "వర్షము రాదు!" అని అతడు చెప్పెను. మొదట ఆయన …

JAS 5:17

 

30వారతనిని చూచి నవ్విరి. అతడు వెర్రివాడని తలంచిరి. "ఆ మూఢభక్తి గలవాడు!" కాని చూడండి, అతనికి "యెహొవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" ఉండెను, అందువల్లనే వర్షము రాదని పలికెను. దేవుడు దానిని చేయుటకు ముందుగా, తన దాసుడగు ఏలియాకు దానిని బయలుపరచెను. అతడు బయలుపరచబడిన, రుజువు కాబడిన ప్రవక్త గనుక జనులు మారుమనస్సు పొందియుండవలసినది. కాని దానికి బదులుగా వారు అతనిని చూచి నవ్విరి. "ఓ, మాకు సమృద్ధిగా వర్షము ఉన్నది. మా జలాశయములు నిండుగా ఉన్నవి. నదులు చాలా చక్కగా ప్రవహించుచున్నవి."

"మూడున్నర సంవత్సరముల పాటు వర్షించలేదని, బైబిలు చెప్పెను. అన్ని ఏరులు, జలములు ఎండిపోయెను. అన్ని చోట్లను! అది ఆ మనిషి కాదు, ఆ మనిషి ద్వారా దేవుడు మాట్లాడెను. అది ఆలాగుండెను. మనకు ఎల్లప్పుడునూ తెలియును.

JOHN 1:1

 

31ఒక మనిషి దేవుని యొద్దనుండి, దేవుని అభిషేకము పొంది, నిజమగు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" వచ్చినప్పుడు, వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కరే, అని కనుగొందము, ఎందుకనగా "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" నకు ప్రాతినిధ్యము వహించుటకు అతడు పంపబడెను. వాక్యము వెంబడి వాక్యము; కాబట్టి అతడు మరియు ఆ వర్తమానము ఒక్కటే.

శాఖా సారధ్యము క్రింద ఒక శాఖీయ మనిషి, అనగా అతడు, సంఘము "ఒక్కటే." వేదాంత విద్య క్రిందున్న ఒక వేదాంత పండితుడు, ఏదో శాఖ ద్వారా తయారుకాబడినవాడు, అతడు అతని వర్తమానము ఒక్కటే. వేదాంతము యొక్క సంఘము, ఒక వేదాంత పండితుడు. అది సరియే.

"యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతడు అతని వర్తమానము ఒక్కటే. ఏలియా "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" వచ్చినప్పుడు అతడు అతని వర్తమానము ఒక్కటే ఆయెను. యేసు వచ్చినప్పుడు ఆయన వాక్యమై యుండెను - పరిశుద్ధ యోహాను 1. కనుక దేవుని యొక్క వాక్యము, ఆ కాలపు వర్తమానికుడు ఒక్కటే, అన్ని సమయములలోనూ అంతే. అది నిజము. .

GEN 3:15•

ISA 7:14

 

32ప్రవచించబడిన వాక్యము యేసే. ప్రవక్తలు జరుగునని చెప్పినది ఆయనే, "ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును." ఎక్కడో ఆదిలో దేవుడు వారికిట్లు చెప్పెను, "స్త్రీ సంతానము సర్పము యొక్క తలను చితుక గొట్టును. అది ఆమె యొక్క మడిమను కరచును." ఈ ప్రవచనములన్నియూ ఇవ్వబడినవి. ఆయనను గూర్చియే దావీదు ఎలుగెత్తి చెప్పెను. అనాది కాలము నుండి తక్కిన ప్రవక్తలందరూ పలికిరి. ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యము! హల్లెలూయా!

1KGS 17:1

 

33నేను ఎక్కడికి రావలెనని ప్రయత్నించుచున్నానో మీరు చూచారా? బహు తేటగా ఈ ఉదయాన నేను మీతో మాట్లాడాను. "వధువు అను సజీవ సంఘములో సజీవ దేవుని యొక్క అధికారమును మీరు చూడలేదా? రోగులు బాగవుచున్నారు, మృతులు లేపబడుచున్నారు, కుంటివారు నడచుచున్నారు, గ్రుడ్డివారు చూచుచున్నారు, సువార్త దాని శక్తితో సాగిపోవుచున్నది, ఏలయనగా వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటే. సంఘములోను, వ్యక్తిలోను వాక్యమున్నది.

"యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" చెప్పి ఏలియా నడచి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము అతనిలో ఉండెను మరియు "వర్షము కురియదు," అని చెప్పెను. అది ఏలియా కాదు, ఏలియాలో నున్న దేవుడే.

MATT 8:24,26•

MATT 14:19-21•

MARK 4:38,39•

MARK 6:41-44•

MARK 11:12•

LUKE 9:14-17•

JOHN 6:9-11•

JOHN 10:30•

JOHN 11:35•

JOHN 14:10•

COL 2:9

 

34ఒకసారి క్రైస్తవ సైన్సు స్త్రీ నాకు చెప్పినట్లుగా చాలాసార్లు నేను చెప్పాను. దాని గూర్చి మీకు చాలాసార్లు చెప్పాను. ఆమె అన్నది, "మిస్టర్ బ్రెన్హాం, నీవు యేసును గూర్చి చాలా ఎక్కువగా గొప్ప చెప్పుచున్నావు."

"నేను దానికి మాత్రమే జవాబు చెప్పవలసియున్నా అనుకొనుచున్నాను," అని చెప్పాను.

"నీవాయనను దేవునిగా చేస్తున్నావు," అన్నది.

"ఆయన దైవమే," అన్నాను.

"ఓ, ఆయన ప్రవక్త, ఆయన మంచి మనిషి, కాని దేవుడు కాడు," అన్నది.

"మంచిది, ఆయన దేవుడు కాడని చెప్పు ఒక్క వాక్యము చూపించు," అన్నాను.

"యోహాను సువార్తలో లాజరు సమాధి యొద్ద ఆయన కన్నీరు విడచెను అని వ్రాయబడియున్నది గదా," అన్నది.

"ఓ, నిశ్చయంగా, ఆయన ఏడ్చెను. ఆయన నరుడు మరియు దేవుడు కూడాను. ఆయన నరునిగా ఏడ్చెను; కాని మృతుని లేపుటకు ఆయన దేవుడై యుండెను." అది నిజము. ఆయన నరునిగా ఆకలిగొనెను, కాని ఆయన దేవుడు. రెండు రొట్టెలు, అయిదు చేపలతో ఆయన అయిదు వేలమందికి ఆహారమిచ్చెను. అది నిజము. ఆయన నరునిగా దోనే వెనుక నిద్రించెను; కాని దేవునిగా జలములను నిమ్మళపరచెను," అన్నాను; అయితే ఎందువలన? ఆయన మరియు అయన యొక్క వర్తమానము ఒక్కటే.

"నేను నా తండ్రి ఏకమైయున్నాము. నా తండ్రి నాయందు నివాసము చేయుచున్నాడు," అని ఆయన చెప్పెను. ఆయన శరీరరీత్యా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత.

REV 1:14

 

35ఆ రోజున నేను ఏడు సంఘ కాలములను తెచ్చుచుండగా, అది ఎంతో సంభ్రమముగా ఉండెనని అనుకొనుచున్నాను. యేసు అక్కడ నిలబడి యుండుట ప్రారంభించి… ఆయన మీది ఆ తెల్లనిది ఉండెను. "ఆయన తల వెంట్రుకలు ఉన్నిని పోలియుండెను." ముప్పయి-మూడు సంవత్సరముల వ్యక్తి హిమమంత తెల్లని జుట్టు ఎట్లు వచ్చెనో, నాకు అర్థము కాలేదు.

నేను ఒక మంచి వేదాంత పండితుని, పెంతెకోస్తు వేదాంత పండితుని పిలిచాను. నాకు ప్రియమైన మంచి స్నేహితుడు. ఆయన సహోదరుడు జాక్ మూర్. అతడు చురుకైనవాడు, తెలివిగల వ్యక్తి. "సహోదరుడా బ్రెన్హాం, అది మహిమాన్వితుడగు యేసు. ఆయన మహిమ పొందిన తరువాత ఆలాగే కనబడెను," అని చెప్పెను. లేదు, నేను దానిని నమ్మలేకపోయాను. లేదు.

"మంచిది, సహోదరుడా మూర్, వందనములు," అన్నాను.

DAN 7:9•

MATT 17:5•

MARK 9:7•

LUKE 9:35

 

36అక్కడున్న గదిలోనికి నేను వెళ్ళి దేవునితో మాట్లాడసాగెను. నా కంకర్డెన్స్ ను తీసి, ఆయనను తిరిగి దానియేలు నొద్దకు తీసికొని వెళ్ళాను. అక్కడ ఇట్లు చెప్పబడెను, "అతడు దినముల యొక్క ప్రాచీనత్వము నొద్దకు వచ్చెను. అతని తల ఉన్ని వలె తెల్లగా ఉండెను." "ప్రభువా, ఏమి చెప్పవలెనో నాకు తెలియదు. నాకు చెప్పవలసిన బాధ్యతయున్నది," అని పలికెను. అది ఏడు ముద్రలు విప్పబడుటకు ముందు ఒక సంవత్సరము లేదా అంతకు ముందుగా జరిగెను. "ప్రభువా, అది ఏమిటి?" అని నేను ప్రార్థించుచుంటిని.

నేను చూడగా, నా ఎదుట ఒకాయన నిలబడి యుండెను. అతడు ఒక న్యాయాధిపతి, అతని తల పై తెల్లని విగ్గు ఉన్నది. పురాతన దినములలోని న్యాయాధిపతులు తాము అత్యున్నత అధికారము గలవారమని చూపి౦చుటకు తెల్లని విగ్గు ధరించెడి వారు.

ఆ తెల్లని విగ్గుతో నేను యేసును చూచిన తరువాత నేను చెప్పినది ఏమనగా, ఆయనే అత్యున్నత అధికారి అన్న సత్యమును అది బయలుపరచుచున్నది. రూపాంతరపు కొండ మీదను దేవుడు అదే సాక్ష్యమిచ్చెను, చెప్పెను, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, అత్యున్నత అధికారి!"

REV 22:18,19

 

37అప్పుడు ఆ వెనుక ఏడు ముద్రల ప్రారంభములో, పిరమిడ్ ఆకారములో - ఏడు దూతలు క్రిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఈ ఏడు ముద్రలను గూర్చి ఇక్కడికి వచ్చి చెప్పమని పలికెను. ఆయన నాతో ఉండును. తప్పి పోయిన సంగతులు ఏమిటో ఆయన నాకు చూపించెను. ఆ గ్రంధము వెనుక ముద్రింపబడి యున్నదని నేను ఎల్లపుడూ అనుకునేవాడిని - ఆ గ్రంథములో ఏది వ్రాయబడి యుండలేదని తలంచాను, కాని దానిని ఆయన చేయజాలడని తెలియబడునట్లుగా అది తిరిగినది. అది ఆ గ్రంథములో వ్రాయబడినది ఎదో కాదు. అది ఆ గ్రంథములో దాగియున్నది ప్రత్యేకమైనది. "ఎందుకనగా ఈ గ్రంథములో నుండి ఒక్క మాట తీసివేసినా, దానికి ఒక్క మాట చేర్చినా, అట్టివానికి…" కాబట్టి ఈ ఏడు సంఘ కాలములలోను ఉన్న ఆ గ్రంథములోనిది ఒక మర్మము. ఆ ప్రతి ఒక్కటి ఒక మర్మమును ఉత్పత్తి చేసెను. నీటి బాప్తిస్మము, ఇంకా ఈ విషయములు అన్నియూ ఎంతో కాలము నుండి తొట్రిల్ల చేయుచున్నవి.

అంతట అది పైకి వెళ్ళినప్పుడు, కాలిఫోర్నియా నుండి పెద్ద పరిశీలన శాలలు టుసాన్ మీదుగా మెక్సికో లోనికి దిగి వచ్చినవి. ప్రతి చోటనూ దాని చిత్రమును తీసెను. అది ఒక మర్మయుక్తమగు దృశ్యము. సహోదరుడు ఫ్రెడ్ సాద్మన్, అక్కడ కూర్చొని యుండెను. అది "పైకి ఎక్కి పోవుచున్నప్పుడు నేను మరియు సహోదరుడు జీన్ నార్మన్ అక్కడే నిలబడియున్నాము. వారు చిత్రమును తీసిరి గాని ఇంకనూ అది ఏమిటో ఎరుగరు. ఇక్కడ కొంతకాలము క్రితము అందరూ ఇట్లనుచుండిరి, "ఇటు చూడండి, ఆ దేవదూతల రెక్కల వలె ఎట్లు ముడుచుకొని యున్నవో చూడండి," అని చెప్పుకొనిరి.

38ఒకనాడు అది కుడివైపుకు తిరుగుట చూచాను. హాఫ్మన్ ఆయనను చిత్రించినంత ఖచ్చితముగా అక్కడ యేసుక్రీస్తు ఉండెను. తెల్లని విగ్గు ధరించుకొని నిలబడి యుండెను. భూమి వైపునకు క్రిందిగా చూచుచుండెను. తానే అత్యున్నత ఆధికారిని, అని చూపించుచుండెను. ఆకాశములు దానిని ప్రకటించినవి. దానిని బైబిలు ప్రకటించెను. దానిని వర్తమానము ప్రకటించెను. అది అంతా ఒక్కటే. తెల్లని విగ్గు ధరించిన మహోన్నత అధికారి. మీరు ఆయన నల్లని గడ్డమును క్రింద చూడండి. మీలో చాలామంది ఆ చిత్రమును చూచారు. అది, ఆ వెనుక ఉంచాము. ఆ ప్రక్కలందు కుడిగా తిరిగి దానిని చూడండి. ఆయన అక్కడ నిలబడియున్నాడు. ఆయనను ఫోటో తీసినంత ఖచ్చితముగా ఉన్నాడు. వారు తప్పు కోణము నుండి ఆయనను చూస్తున్నారు. నీవు సరియగు కోణములో దానిని చూడవలెను. ఏది సరియైన కోణమో ప్రభువగు దేవుడు మాత్రమే బయలుపరచగలడు. మీ కుడివైపుకు తిరిగి దానిని చూడండి. అక్కడ ఆయన ఉన్నాడు. అక్కడ ఫోటోగ్రాఫ్ తీయబడినంత పరిపూర్ణముగా ఉన్నాడు.

ఆయన హాఫ్మన్ (హాఫ్మన్ అను చిత్రకారుడు - చిత్రీకరించిన) శిరస్సు వలె కనిపించుట నాకు ఇదే మొదటిసారి. ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు; మరియు బిల్లి సండే ఆలయములో సంవత్సరాల తరువాత దానిని నేను చూచాను. అప్పటి నుండి ఆ చిత్రములలో ఒక్కటి కూడా నా ఇంట్లో లేకుండా ఉండలేదు.

అప్పుడు, ఇక్కడి ఆకాశములో ఇక్కడి దర్శనములో నేను చూచిన ఆ దేవుడే ఈ బడి ఇల్లు నిలబడిన చోట చిన్న బాలునిగా కనబడెను. ఆలాగు ఆయన కనిపించెను. ఇక్కడ ఆకాశములలో ముప్పయి-మూడు సంవత్సరముల తరువాత, అది సత్యమని ప్రకటించబడెను. ఏదో మర్మయుక్తముగా ఎవరో ఒకరి ఉద్దేశ్యము కాదు, ఆయన ఆలాగే కనబడును.

39వాటికనులో వలెనే, వారు ఒక క్రీస్తును అక్కడ చిత్రీకరించారు. ఆయన గడ్డమును అర్థ అంగుళము పొడవుగా, తెల్లగా, నోటి చుట్టూ ఈలాగు గీసి క్రీస్తు అని పిలిచారు.

ఆదామవ్వలు ఎట్లుండిరో చూపించు చిత్రమును ఒక గ్రీకు చిత్రకారుడు గీచిన దానిని, ఒక పురాతన దేవాలయములో ఎప్పుడో చూచిన దానిని అది గుర్తుకు తెచ్చినది. వారు మృగములుగా లేదా మరేదోగా కనిపించిరి. శరీర సంబంధమగు మనసు ఆత్మీయమగు దానిని ఆలాగే కనుగొనును. జీవించిన వారందరిలోను ఆదామంత అందగాడు లేడని, నేను తలంచుచున్నాను మరియు హవ్వ అన్నివిధాలా పరిపూర్ణురాలగు స్త్రీ.

ఇప్పుడు, శరీర సంబంధమగు మనసులు, తన స్వంత అభిప్రాయముల చొప్పున సంగతిని మలచును, అంతట దేవుడు తన శక్తి ద్వారా విషయమును క్రిందికి పంపి మరియు బయలుపరచును. సరిగ్గా అదే ఆహాబు దినములలో జరిగినది.

JOHN 10:37

 

40ఇప్పుడు, ఏలియా దానిని చెప్పుగలడు అని మనము కనుగొన్నాము, ఎందుకనగా ఘడియ యొక్క వర్తమానము మరియు దేవుని వాక్యము… లేదా వర్తమానికుడు, వర్తమానము, మరియు వాక్యము సరిగ్గా ఒక్కటే. ప్రవక్త, వాక్యము, వర్తమానము; వర్తమానికుడు మరియు వర్తమానము ఒక్కటే. యేసు చెప్పెను, "నన్ను గూర్చి వ్రాయబడిన కార్యములు నేను చేయనిచో నన్ను నమ్మకుడి." అది మంచిది. ఏ వ్యక్తి అయినా మరియు అతని వర్ణమానము ఒక్కటే.

అందుకే వారు ఈనాడు దేవుని క్రియలు చేయుటయందు విశ్వాసముంచుట లేదు, ఎందుకనగా వారు దేవుని వర్తమానమును అంగీకరించరు. వారు వర్తమానము నమ్మరు.

నేడు మనము జీవించుచున్న దేవుని ఘడియను నమ్మువారికి ఈ సంగతులు దాచబడిన ఆహారము. కాస్త ఆలోచించండి, దేవుడు దానిని ఎట్లు మరుగుపరచెననగా, వారు దానిని చూచియు కానకుండా ఉన్నారు. అదే రీతిగా ఏలియా సిరియా సైన్యమును గ్రుడ్డివారినిగా చేసెను. ఆ రీతిగానే దేవుడు అవిశ్వాసిని బిడ్డ యొక్క అనగా, విశ్వాసి యొక్క అసలయిన భోజనము నుండి గ్రుడ్డి వారినిగా చేయుచున్నాడు.

1COR 3:19•

HEB 13:8

 

41ఓడను కట్టుచున్న నోవహును, వారు, "మూఢభక్తి గలవాడు" అనిరి. అతని కండ్లు వాగ్దానము వైపునకును, దేవుని వాక్యము వైపునకును తెరువబడెను. మూఢభక్తి గలవాడు, అని వారు దేనిని పిలిచారో అదే - నోవహును, అతని కుటుంబమును రక్షించెను — చూచారా, అదే విషయము. ప్రజలు నవ్వినది, దానికే మనము ప్రార్థించుచున్నాము. ప్రజలు "వెర్రి" అను దానిని మనము "గొప్పది" అ౦దుము. దేవుడు వారిని వెర్రివారనును. లోకము వెర్రితనమను దానిని దేవుడు "గొప్ప!" అని పిలచును. తప్పు ఒప్పులకు మధ్య నున్న తారతమ్యము వలెనే ఉన్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నాడు.

42గుర్తుంచుకొనండి, దేవుని యొక్క పధకమును బట్టి, దేవుని పిలుపు, దేవుని వాక్యము బట్టి అతడు తన రహాస్య స్థలములోనికి వెళ్ళెను. దేవుని ముందు జ్ఞానము (ప్రణాళిక) ద్వారాను, తన జీవితములోని పిలుపు ద్వారాను, వాక్యప్రకారమును ఏలియా తన రహస్య స్థలములోనికి ప్రవేశించెను. ఆ విధంగానే మనము ప్రవేశించియుండనిచో ఎక్కడికి మనము వెళ్ళుదుమో నాకు తెలియదు.

గమనించండి, క్షామము మొదలగుటకు ముందు తన జీవనము కొరకు ఏలియా ఈ రహస్య స్థలమునకు వెళ్ళెను. భూమి మీదికి తీర్పు వచ్చు ముందుగా సంఘము పిలువబడి యున్నది. ఎంత చక్కని మాదిరి. వధువు ఇప్పటికే ఎన్నుకోబడినది. తీర్పు వచ్చు ముందు కనిపెట్టుచున్నది. ఇప్పటికే కనిపెట్టుచున్నది, దేవుని ఆహారము తినుచున్నది, దేవుని ఆశీర్వచనములు అనుభవించుచున్నది. మాములు మానసిక స్థితిలో యున్న ఎవరైనను మనము నేరుగా పయనించుచున్నామని ఎరుగుదురు. మనము తీర్పు ఘడియలోనే ఉన్నాము.

43చూడండి! సహోదరుడు బాంక్స్ మరియు ఇక్కడ ఈ రాత్రి మీలో ఉన్న చాలా మంది ఆ ఉదయాన ఆ కొండ మీద నిలబడి యున్నారు.

ప్రభుని చిత్తమయితే, వచ్చే ఆదివారము ఉదయాన ఆ పర్వతము గూర్చి మాట్లాడగోరుచున్నాను. గొప్ప ప్రత్యక్షతను పొందాను. దానిని ఈ రాత్రి చెప్పకుండా ఉండుట బహు కష్టముగా ఉన్నది. కాని నిరంతరము ఒకదాని తరువాత మరొకటి జరుగుచూ యున్నది. చూచారా, ఇది జరుగుట ఎన్నడూ ఆగదు, ఎందుకనగా అదీ "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అయి యుండెను.

ఇక్కడున్న ప్రతి ఒక్కరు, టేపు మీద వేలకొలది సార్లు నేను నిలబడి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని" చెప్పుట విన్నారు. అది ఆలాగే మరియు ఆలాగే ఉండును. అది అలాగే ఉండునని వార్తాపత్రికలు, మాస పత్రికలు కూడా ప్రకటించవలసియున్నవి. అదంతా దేని గూర్చియో వారెరుగరు గాని, దానిని వారు చూచారు. అది ఏమైయున్నదో వారెరుగరు, కాని వాక్యము ఖచ్చితంగా సత్యముగా చేయుటను వారు చూచారు.

44ఆ నది యొద్ద మేము నిలబడియుండగా, ప్రభుని దూత ఆ దినమున దిగివచ్చి, ముప్పది-మూడు సంవత్సరములు లేదా 1933 అయి యుండెను, అతడు చేసిన కార్యములను చెప్పెను. నడిచి బయటకు వచ్చి, చాలామంది ఆ ఒడ్డున నిలబడి, "దాని భావము ఏమిటి బిల్లీ?" అనడిగారు.

"అది నా కొరకు కాదు; అది మీ కొరకే. నేను నమ్ముచున్నాను; మీరు నమ్మరు," అన్నాను. నడిచి వెళ్ళిపోయిరి.

అంతట సంఘ కాపరి నాతో ఇట్లనెను, "నీవు నీ ఏడవ తరగతి చదువుతో ప్రపంచమంతా పర్యటించి, రాజులు, అధిపతులు, చక్రవర్తులు, మొదలగు వారి కొరకు ప్రార్థించుదునను కొనుచున్నావా?" "ఓ, దానిని మరచిపో," అన్నాడు.

దానిని నేను మరువజాలను; అది నా హృదయము మీద చెక్కబడి యున్నది. ఇప్పుడు ఇక్కడ ముప్పుది-మూడు సంవత్సరాల తరువాత ఆయన ఏ విధముగా జరుగునని చెప్పెనో, సరిగ్గా ఆ విధముగానే సమస్తమును జరిగెను. ఆయన దేవుడు, తప్పిపోడు. ఆయన ఎల్లపుడూ తన మాటను నిలబెట్టుకొనును. దానినెన్నడూ సందేహించవద్దు.

45ఇప్పుడు, గమనించండి, అతడు దేవుని ప్రణాళికను బట్టి (దేవుని ముందు జ్ఞానము), దేవుని పిలుపును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి కరవు రాకముందే నెరవేరెను.

తీర్పు వచ్చుటకు సిద్ధముగా యున్నదని ఇప్పుడు మనకు తెలియును.

ఆ దినమున ఆ కొండ మీద నిలబడియుండిన సహోదరుడు బాంక్స్ ఉడ్ ఇక్కడ నిలబడియున్నాడు, కొండమీద నడిచాడు. వచ్చే పది, పదిహేను నిమిషములలో ఏర్పరచనైయుండిన ఈ ప్రార్ధన వరుసలో మీ విశ్వాసము కట్టబడుటకు దానిని మరలా నేను ప్రస్తావించ వచ్చును. నేను సహోదరుడు బాంక్స్ కంటే ముందుగా నడచుచున్నాను. సోదరి రూబీ జబ్బుగా నున్నందున ఆమెను విడిచిపెట్టానని అనుకొనుచున్నాను. అతడు నా వెనుక వచ్చుచున్నాడు. అతని ముఖము ఎర్రబడి యుండుట నేను గ్రహించాను. నేను వెనుకకు తిరిగి చూచాను. ఆ కొండ అతడు ఎక్కుటకు కొద్దిగా కష్టపడుచున్నాడేమో అనుకొన్నాను, కనుక నేను కొద్దిగా ఆగాను. దానికి కొన్ని నెలల ముందు ప్రభువు యొక్క దూతలు ప్రత్యక్షమైన ఆ కొండలు, ఎడారులలో కనబడిన ఆ వైపుగానే మేము వెళ్ళుచున్నాము.

నేను కొండ పైకి వెళ్ళగా, దేవుని ఆత్మ… కొండ శిరము చూచుటకు నేను తిరుగగా, ఆయన నాతో, "ఆ రాయిని తీసికొని దానితో 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు' వచ్చే కొద్ది గంటలలో దేవుని మహిమను నీవు చూతువు," అని అతనితో పలుకుము అనెను.

నేను ఆ రాయిని తీసి, "సహోదరుడా బాంక్స్, ఎందుకో నాకు తెలియదు" అని చెప్పి దానిని గాలిలోనికి విసిరి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు దేవుని మహిమను చూడనైయున్నావు," అని చెప్పాను.

"దాని భావము రూబీయా?" అనడిగాడు.

"కాదు, దానితో బాంక్స్, రూబీ, మరెవరికిని సంబంధమున్నదని నేను తలంచుట లేదు. అది కేవలము 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయి యున్నది, ఎదో జరుగనైయున్నది," అన్నాను.

46మరియు మరుసటి ఉదయము మేము అక్కడ నిలబడియుండగా చాలా మంది పురుషులు, ఇక్కడెంత మంది కూర్చొనియున్నారో నాకు తెలియదు గాని అక్కడ పండ్రెండు, పధ్నాలుగు, లేదా పదిహేను మందిమి కూర్చొనియున్నాము. ఆకస్మాత్తుగా, ఒక సేవకుడు నా యొద్దకు నడిచి వచ్చి, ఇట్లనెను, "సహోదరుడా బ్రెన్హాం, నా పేరు ఫలాని-ఫలాని. నేను కాలిఫోర్నియాలో మీకు సహాయము అందించు వారిలో ఒకడిని."

"మిమ్ములను కలిసికొనుట సంతోషమండి," అన్నాను. డగ్లస్ మెక్ హ్యుగ్స్. "మిమ్ములను కలిసికొనుట సంతోషము," అని చెప్పి కరచాలనము చేశాను.

అతడిట్లు పలికెను, "సరే, ఇప్పుడు మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను." "రాయ్ రాబర్సన్ ఇక్కడ ట్రస్టీ: సహోదరుడు ఉడ్, టెర్రీ, మరియు బిల్లీ, సహోదరుడా మేక్ నెల్లి, ఇంకా ఎవరెవరు అక్కడ నిలబడియున్నారో నాకు తెలియదు. "మిమ్మును ఒక సంగతి అడుగగోరుచున్నాను." ఇటువంటి దర్శనములను ప్రభువు ఎన్నడైనా మీకిచ్చెనా?" అనడిగాడు.

"అవును. సోదరుడా, కాని ఇక్కడికి నేను ఒక విధంగా వాటికి దూరము కావాలని, విశ్రాంతి కోసము వచ్చాను," అని చెప్పాను. ఈ విధంగా చుట్టూ చూచాను, ఒక బలమగు వైద్యుడు అతడి వైపు చూస్తు ఈలాగు చెప్పుట నేను చూచాను, ఇట్లనెను, "రెవరెండ్, మెక్ హ్యుగ్స్, నీ కంటిలో నున్న ఈ ఎలర్టీ త్వరలోనే నీ కంటిని బయట పెట్టును. నీకు రెండు సంవత్సరములు నేను చికిత్స చేశాను. దానికి నేను ఇక ఏమి చేయజాలను." నేను అతని వైపు తిరిగి ఇట్లన్నాను, "నీ వైద్యుడు ఆ రోజున దాని గూర్చి నీకు చెప్పెను గదా! దేని కొరకు నన్ను అడిగావు? నీ కంటిలోని ఆ ఎలర్జీ కొరకు," "అది మధ్యాహ్నము దాదాపుగా పదకొండు అగును. అతడు కండ్లద్దాలు నల్లవి పెట్టుకొని యుండెను. నీవు నీ కంటిని గూర్చి, సూర్యుని గూర్చి ఆ కండ్లద్దాలు పెట్టుకొన్నావు. నీవు ఆ కన్నును పోగొట్టుకొందువని వైద్యుడు చెప్పెను," అని అన్నాను.

"అది నిజము" అని చెప్పి ఎడ్వనారంభించాడు.

47నేను మరలా నడచుటకు చుట్టూ తిరిగాను. నా చేతిలో ఒక పార వంటిదియున్నది. అతడు నిలబడి నావైపు చూచుట గమనించాను. అతని కండ్లు ఎంతో కాంతివంతముగా ఉన్నవి. "నీవు ఆ కంటిని పోగొట్టుకొనవని "యెహోవా సెలవిచ్చుచున్నాడు," అని పలికాను. గడచిన ఆకురాలు కాలములో అతనితో నేను వేటాడాను. ఆ గుంపులోని అందరి కంటేను, నా కంటేను బాగుగా అతడు చూడగలిగెను. అవును.

ఒక పెద్దావిడ తన మేజోడు క్రిందికి లాగి తన వస్త్రము ప్రక్క భాగమును ఎత్తి చూపించుట నేను చూచాను. ఆమె ఇట్లన్నది, "కుమారుడా, నీవు సహోదరుడు బ్రెన్హాంను చూచినట్లయితే, నా పాదము కొరకు ప్రార్థించమని చెప్పుము." ఇక్కడ నేను చూచాను, మరియు కంతులు వంటివి ఆ పాదము మీద వ్రేలాడుచుండెను, అంతటా ఉన్నవి.

"నీ తల్లి తెల్లని జుట్టు కలిగిన స్త్రీ," అని అన్నాను. (నా కుమారుడా," చూడండి). నీవు వచ్చు ముందుగా ఆమె నీతో చెప్పినదేమనగా నేను కనబడితే ఆమె పాదము కొరకు ప్రార్థించమని చెప్పినది. ఆమె పాదమంతటను చిన్న కంతులు వంటివి వ్రేలాడుచుండినవి." అతడు సృహ తప్పి పడిపోయినట్లుగా ఆయెను.

"అది సత్యము," అని చెప్పెను.

"అది బాగవును, ఆమెను బాధ పడవద్దని చెప్పుము," అన్నాను.

48నేను నడువసాగాను. అప్పుడు దేవుని స్వరము మాట్లాడుట విన్నాను, "వెంటనే దారిలో నుండి తప్పుకో." రాయ్ రాబర్సన్ అక్కడ నిలబడి యుండెను. అతడు యుద్ధ వీరుడని ఎరిగియుండి, అతని భుజముల మీద నా చేతులుంచి, "సహోదరుడా రాయ్, వీలయినంత త్వరగా దాగుకో!" అని చెప్పాను.

"ఏమిటి సంగతి?" అనడిగాడు.

"మార్గములో నుండి తప్పుకొని దాగుకొను," అన్నాను.

అప్పుడే నేను నడువసాగాను, నా పార క్రింద పడవేశాను, చుట్టూ చూచాను. నా టోపీని తీసివేశాను. ఇక్కడ ఆయన వచ్చెను, దేవుని యొక్క మహిమ ఒక సుడిగాలిలో పడినది. ఆ విధంగా పర్వతము ప్రక్కను అది చీల్చి వేసినది. ఆ ప్రాంతమును చీల్చివేసి, ఆ విధంగా ఊపి వేసెను. పొదల యొక్క చివరలను నరికివేసెను. నా తల పైన మూడు, నాలుగు అయిదు అడుగుల పైనే ఇది జరిగెను. సుడిగుండము వలె వెనుకకు తిరిగి వెళ్ళి, మరల పేల్చినది. ఇక్కడికది మూడుసార్లు వచ్చెను.

అదెప్పుడు వెళ్ళిపోయెనో, మూడవసారి, సహోదరుడు బాంక్స్ వచ్చి, "నీవు దాని గూర్చియే మాట్లాడుచున్నావా?" అని చెప్పెను.

"అవును," అని నేనన్నాను.

"అది ఏమైయుండెను?" అనడిగారు.

"దేవుడు సుడిగాలులందు ప్రత్యక్షమగును," అని చెప్పాను. ప్రజలకు చెప్పవలెనని ఆయన కోరెనో లేదో నాకు తెలియదు.

తరువాత నేను ముందుకు వెళ్ళి, కొద్దిగా ప్రార్థించాను. అప్పుడు నేను వారికి చెప్పవచ్చునని ఆయన పలికెను. "పశ్చిమ తీరమును తీర్పు తాకనై యున్నది," అని చెప్పాను. నేడు అది చూడండి! దాని తరువాత కొద్ది గంటలకు ఏమి సంభవించినది: అలాస్కా మునిగిపోయెను. ఇపుడదంతయూ క్రిందికి పోవుచున్నది. మనము తీర్పులోనికి ప్రవేశించుచున్నాము; కృప దాటిపోవుచున్నది.

1KGS 17:13,14

 

49కాని దేవునికి వందనములు! మనకు దాచబడిన ఆహారమున్నది, ఆత్మీయాహారము, ఈ చివరి దినములలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత యొక్క కృప మరియు మంచితనము మీద మనము బ్రతుకుచున్నాము. జనుల మధ్య తన్ను తాను బయలుపరచుకొనుచున్నాడు. ఆమేన్! వారు లోనికి వెళ్ళిరి. కరవు రాక ముందే ఏలియా లోనికి పోయెను. తీర్పు రాక ముందే లోనికి పోయి యుండుటను బట్టి దేవునికి వందనములు. ఇది బయటకు వచ్చుటకు, లోనికి పోవుటకు తగిన సమయము. ఆ సంస్థలలో నుండి బయటకు వచ్చి, క్రీస్తులోనికి రావలెను. నిజ విశ్వాసులందరికి బయటకు వచ్చి, లోనికి వెళ్ళు సమయము.

అప్పుడు అతడు పిలువబడి, అక్కడ నిలచియుండెను. గుర్తుంచుకొనండి, దేవుడతనిని పిలచు వరకు ఎన్నడూ అతడు ఆ వాగును విడిచిపెట్టలేదు.

కరవు ఇక ముగియుననగా, ఆయన అక్కడి నుండి అతనిని పిలచి, ఒక విధవరాలు ఇల్లు చూపించెను. గమనించండి, ఆయన ఈ విధవరాలి యొద్దకు పిలిచెను, మరియు ఈ విధవరాలు అవిశ్వాసులతో తన్ను తాను ఏకము చేసికోలేదు (కరవు కాలములో మృగపు ముద్రను వారు వేసికొనిరి), కాబట్టి ఈ విధవరాలిని పోషించుటకు ఆయన ఏలియాను పిలచెను. ఆమె ఒక చిన్న అప్పమును మాత్రమే, ఒక్క దానినే హత్తుకొనియుండెను. మొదట దానిని తనకిమ్మని ఏలియా, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడైన యెహోవా భూమి మీద తిరిగి వర్షమును పంపించు వరకు తొట్టెలోని పిండి అయిపోదు. బుడ్డిలోని నూనె తరగదు," అని చెప్పెను. దేవునిని ముందుంచుట, ఆయన వాక్యమును ముందుంచుట!

1KGS 17:16•

JOHN 14:12

 

50గమనించండి, తొట్టెలో పిండి ఉన్నది. ఆమె ప్రతిసారి తీసివేయుచున్ననూ తిరిగి అందులో పిండి ఉండెను. ప్రతిసారి ఆమె నూనెను తీసివేయుచుండినను బుడ్డిలో నూనే ఉండెను. ఎందువలన? రొట్టె అర్పణలో పిండి క్రీస్తుకు సూచనగా ఉండెను. రోకలిని చక్కగా ఉంచినచో ప్రతిదియు నలుగును. ఆ పిండిలోని ప్రతి గింజయు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా ఉన్నాడని చూపించుచున్నది. అది వాక్యము. జీవాహారము వర్తమానమును, బయలుపరచబడిన వాక్యమును వెంబండించుచున్నది.

స్నేహితులారా, నేడును ఆలాగే యున్నది. నేడును ఆలాగే యున్నది, పిల్లలు తిను జీవాహారము దేవుని వర్తమానమును వెంబడించును. కరవు కాలములో వారిని పోషించుటకు సరిపోవును, నేడు ఆయన మన సన్నిధిలో నిలబడినచో ఎట్లుండును? ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఏ కార్యములు చేసెనో, సరిగ్గా అవే కార్యములు చేయును. వధువు భర్తలో భాగమైయున్నది; సంఘము, క్రీస్తు వలెనే యున్నది. "నేను చేయు క్రియలు మీరును చేయుదురు." దానిని చేసినది వాక్యమే. ఆయన చేసిన కార్యములు మనమును చేయుదుమని ఆయన చెప్పెను.

ZECH 14:7

 

51ఇక్కడ మరల మనము గమనించుదుము, ఆ దినముల ఏలియాలో వలెనే వాక్యము మనలోనికి వచ్చి, మన యొద్దకు వచ్చినప్పుడు అతడు చేసిన కార్యమునే చేయును. లోకమునకు మరుగుగా ఉండిన దేవుని యొక్క రహస్య సంగతుల మీద మనలను పోషించును. ఓ! మరల అది వర్తమానికుని, వర్తమానమును ఒక్కటిగా చేయుచున్నది. ఆత్మీయాహారము సిద్ధముగా ఉన్నది. ఇప్పుడది ఋతువులో నున్నది. దానిని మీరు కోరినచో ప్రతి ఒక్కరును పొందగలరు. ఈ ఘడియ యొక్క ప్రతి అవిశ్వాసము నుండి తొలగిపోయినచో, క్రీస్తు లోనికి వచ్చుటకు నీవు సిద్ధపడినచో, ఆయన వాగ్దానము లోనికి రమ్ము. మలాకీ 4, లూకా 17:30, యోహాను 14:12 (మరెన్ని వచనములు చెప్పగలము!) యోవేలు 2:38లో నున్న ఆయన వాగ్దానములను గుర్తుచేసికొనండి. ఆయన చేయకలవన్నియూ, లేక 2:28. ఈ చివరి దినములలో ఏమి చేయునో ఉన్నవి. ఈ చివరి దినములలో వెలుగు కలుగునని ఆ ప్రవక్త చెప్పెను. అదెట్లు పని చేయునో చెప్పెను. అది ఏమి చేయునో తెలిపెను. వాక్యములన్నియూ చివరి దినములనే చూపించుచున్నవి. అదీ క్రీస్తే! దానిలో ఇప్పుడు నీవు దాగుకొనియున్నచో, ఆ రహస్య స్థలములో నీవున్నచో, నీవు తినగలవు. దేవుని యొక్క కృప మంచితనములను చూడగలవు. నీవు జబ్బుపడినచో అక్కడ నీకు స్వస్థతయున్నది.

52ఆ తరువాత ఎలీషా పిలువబడెను, మీకు గుర్తుండును, అతనికి కలిగిన ఆ రొట్టె అర్పణ తరువాత అనగా క్రీస్తే, దానితో విధవరాలి ఇంటిని బ్రతికించెను. గమనించండి, తరువాత ఆకాశము నుండి అగ్నిని రప్పించిన తరువాత, ఆయా కార్యములు జరిగించి దేవుడు తనను పంపెననియు, ప్రవక్త ఆత్మను తాను కలిగియున్నాననియు నిరూపించెను..

గమనించండి, అరణ్యములో, బదరీ వృక్షము క్రింద తాను పరుండి యున్నప్పుడు అదే రకమగు ఆహారముతో ఒక దేవదూత దిగి వచ్చెను. అతనికి కొన్ని రొట్టెలు తయారు చేసి తినిపించెను. కొద్దిసేపటి తరువాత అతనికి నిద్ర కలుగజేసి మరల మేల్కొలిపి, అతని కొరకు మరికొన్ని రొట్టెలు తయారు చేయించి ఇచ్చెను. ఆ రొట్టెల బలముతో అతడు నలువది దినములు వెళ్ళెను. దేవునికి మహిమ! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఓ, ఆయనను ఎంతగా మనము ప్రేమించుచున్నాము. దాని ఋతువులో ఆత్మీయాహారము.

MATT 15:27•

MARK 7:28

 

53"చిన్న పిల్లలు రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు." యేసు సురోఫెనికయ స్త్రీకి అదే చెప్పలేదా? ఆయన తన స్వంత వారి యొద్దకు పంపబడెను. అది నిజము. ఆయన అన్యుల యొద్దకు ఎన్నడూ వెళ్ళలేదు.

ఇప్పుడు ఈ దినమున నేడు వారి కాలములో అన్యులను ఆయన దర్శించుచున్నాడు…

"ఆ బయటనున్న ఈ గొప్ప స్థలములకు, ఈ పెద్ద క్రూసేడులకు అట్టి పెద్ద శాఖల మధ్యకు ఈ వర్తమానము ఎందుకు వెళ్ళుట లేదని?" మీరు అడువచ్చును.

అది వారి ఆహారము కాదు; అది సంఘముల (నామకార్థపు సంఘాల) ఆహారము కాదు. అది వధువు యొక్క ఆహారము. అది ఋతువునకు తగిన ఆత్మీయాహారము. అది వారి కడుపులకు జబ్బు చేయును. అది వారు తినలేనంత బలమైనది, చూచారా, చూచారా, మీరది చేయలేరు. కాని పిల్లలకు అది రొట్టె, అది జీవము, అది యేసుక్రీస్తు - నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నుండుటయే.

JOHN 5:19

 

54ఇప్పుడు మనము ప్రార్థన వరుస ప్రారంభించినచో మనకు చాలా ఆలస్యమగును, కనుక ఒక్క క్షణము మనము తలలు వంచుదము.

ప్రియ దేవా, తగిన ఋతువులో ఆహారము, ఆత్మీయాహారము. లోకము ఎరుగనట్టిదది. ఆ దినమున ఎలీషా నిలబడి, "తిరిగి నేను ఆజ్ఞాపించు వరకు ముంచు కూడా పడదని," చెప్పిన అదే స్థలమునందు, అనగా సమరయలో మన ప్రభువు అదే రాత్రి లేదా ఆ పగలు పలికినది వినలేదా? ఇక్కడ యేసు నిలబడి తన శిష్యులతో చెప్పెను.

"బోధకుడా, ఎందుకు నీవు తినవు?" అనడిగిరి.

"మీకు తెలియని ఆహారము నా వద్ద ఉన్నది," అని ఆయన చెప్పెను.

నిజముగా, ప్రభువా, దేవుని చిత్తమును నేరవేరుటయే ఆయన ఆహారము. ఆయన ఘడియలో దేవుడు బయలుపరచిన క్రియలను చూచుటయే. అది జరుగునట్లుగా చూచుటకు ఆయన అక్కడుండెను. "మొదటగా నా తండ్రి నాకు చూపించినవి తప్ప మరేమియూ నేను చేయజాలను. తండ్రి చూపించునదియే నేను చేయుదును."

తండ్రి, నేడును ఆలాగే యున్నది. సంఘము, నిజ విశ్వాసుల శరీరము, ఆహారమునకు వాంఛ కలిగియున్నది. నామకార్థులకు ఏమి తెలియని అత్మీయాహారము. తండ్రి, ఈ ఆహారమును గూర్చి లోకము ఏమియూ ఎరుగదు. కాని నీ సంఘము, నా ప్రజలు, నీ కుమారుని యొక్క వధువు, దానిని ప్రేమించుదురు.

వైద్యులు విఫలమయినప్పుడు మన శరీరములకు స్వస్థత కలుగు మార్గమున్నది. దీనికి మనకు మార్గమున్నది. ఆయన తన సంఘమునకిచ్చిన దేవుని ఆహారములలో ఇది ఒకటి. విశ్వాసముంచు తన బిడ్డలకు చివరి దినములలో దానిని వాగ్దానము చేసెను. తండ్రి, నమ్ము బిడ్డలముగా మేముండునట్లు సహాయము చేయుము, ఎందుకనగా విశ్వాసులకు సమస్తమూ సాధ్యమే. ప్రియ దేవా, దానిని అనుగ్రహించుము. యేసు నామమున దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

55"వారు కొన్ని ప్రార్థన కార్డులు ఇచ్చినట్లుగా, బిల్లీ చెప్పినట్లుగా నేను నమ్ముచున్నాను. ప్రార్థన కార్డు మీద ఉన్న అక్షరమును ఎవరయినా నాకు చెప్పినచో చాలును. C , సరే. మనము C , ఒకటిని తీసికొని ఆరంభించుదుము. చిన్న వరుస ప్రారంభమగు వరకు ఆలాగు చేయుదును. చూడండి, ఇప్పుడు వారందరూ ఆయిపోయియుందురు. ఇపుడు ప్రతివారును… సరే, చూడండి, నేను దీనిని ప్రయత్నించబోవుచున్నాను. దీనిని మనము చేయగలమో లేదో నాకు తెలియదు. లేదా మనము ఒక పిలుపు వరుసను ఏర్పరచుదము. మీరు నెమ్మదిగా కూర్చొనవచ్చును. అది నాకేమో పరవాలేదు. మీరు ఇక్కడి వేదిక పైకి వచ్చినచో, లేదా పిలువబడినచో, ఏలాగయిననూ పరవాలేదు. నేను పూర్తిగా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి యున్నాను. నేను బోధించిన ఈ వాక్యమును పరిరక్షించుటకు ఆయన మీదనే నేను ఆధారపడియున్నాను.

సహోదరుడు జార్జి రైట్ అని నేను నమ్ముచున్నాను. చిన్న బాలునిగా ఉన్నప్పటి నుండి ఎన్నో సంవత్సరాల క్రితం మీ ఇంటికి వస్తూండి, ఆ చెట్టులో అమర్చబడిన పాత యంత్రములో నుండి వచ్చు వర్తమానము వింటూండే వారము. ఇంకా నేను అదే వర్తమానమును నమ్ముచున్నాను. అది ఏకరీతిగా ఉన్నదని నమ్ముచున్నాను.

2TIM 3:8,9•

2TIM 4:3-5

 

56సరే, మంచిది. ప్రార్థన వరుసకు వారిక్కడ సర్దుతున్నారని నేను చూచుచున్నాను. మంచిది. ప్రార్థన కార్డు C, ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, మొదటగా వచ్చి ఇక్కడ నిలబడండి. మీరు లేవలేనిచో చేతులు పైకి ఎత్తండి. ఎవరైనా వచ్చి మిమ్మును మోసికొని వత్తురు. ఎందుకు …. అవును. ప్రార్థన కార్డు C , ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు. ఇప్పుడు ప్రార్థన కార్డులు లేని వారు గమనించండి …

చాలా కాలము నుండి ఇటువంటి ప్రార్థన వరుసను నేను ఏర్పాటు చేయలేదు. మనమిక్కడ ఆలయమును నిర్మించినప్పుడు నా ఆజ్ఞను ఎందరు గుర్తుంచుకొన్నారు! "సువార్తికుని పని చేయుము" అని ఆయన చెప్పెను. నేను సువార్తికునని చెప్పలేదా? "సువార్తికుని పని చేయుము," అని చెప్పెను. చూడండి, "అది మార్పునొందు ఘడియ వచ్చుచున్నది." ఆ ఘడియ వచ్చే యున్నది. మంచిది.

ఇప్పుడు ఈ… మీరు రెండు లేక మూడు వేర్వేరు పరిచర్యలను కలుప జాలరు. ఒకేసారి సంఘ కాపరి, సువార్తీకరణ చేయలేము. ఒకేసారి నీవు ప్రవక్తగాను, సంఘ కాపరిగాను ఉండజాలవు. చూడండి, ఎందుకనగా మీకు వివిధ కార్యములు, వేర్వేరు సేవలు ఉన్నవి.

నా వర్తమానములో నేను ఏమి చేయవలెనో ప్రభువు నాకు ఇచ్చెను. కాని అప్పుడాయన ఈలాగు చెప్పెను, "సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యకు పూర్తి రుజువు తయారు చేసికొనుము, ఎందుకనగా వారు పాత బోధను సహించని కాలము వచ్చుచున్నది." అది ఇప్పుడు రాలేదా! ప్రతి సంఘ శాఖ నన్ను తిరస్కరించినది. వారు పాత బోధను సహించజాలరు. "కాని వారు తమ దురాశ చొప్పున తమ స్వంత బోధకులను ప్రోగు చేసికొందురు. అవి కల్పనా-కథలుగా మార్చబడును. మోషేను ఎదిరించిన యన్నే, యంబ్రేల వలె వారు గొప్ప కార్యములు చేయుదురు, కాని వారి దుష్టత్వము బయలుపడును. చూచారా, చూడండి. మంచిది, అనుకరణ చేయువారు! యంబ్రే ఎట్లు…

2TIM 3:8,9

 

57పరమందున్న దేవునికి తెలియును. ఆ ఆలయము మూలలో 1933 నుండి బైబిలులోని ఒక పేజీని వ్రాసియుంచిన రాయి పడియున్నది. వారెట్లు దానిని చేసిరో చూడండి. ఏది జరుగనైయున్నదో చూడండి. ఖచ్చితంగా ఆలాగే అనుకరణలు. "వారిని ఆలాగే విడిచి పెట్టుడి, యన్నే యంబ్రెల వలెనే వారి తప్పిదము కూడా తెలియబడును," అని చెప్పెను. మనము ఇక్కడ ఆ దినములో ఉన్నాము.

ఆ రోజున మూలరాయి వేసినపుడే నేను సంఘమును చూచాను. జనులు అక్కడ ఇక్కడ చోటు లేక నిలబడి యుండుట, గోడల చుట్టూ ఉండుట చూచాను. అక్కడ ఉన్నారు మీరు. ఈ విధముగా జరుగుట పట్టణపు వారు చూచి ఇట్లనిరి, "ఆరు నెలల కాలములోనే…" ఒక ఆలయమును కట్టుట ఒక డాలరు-ఎనభై సెంట్లుతో ప్రారంభించారా? అది తమ కార్లు బాగుచేసికొను స్థలముగా ఉండునని, చాలామంది కార్లు బాగుచేయువారు తలంచారు. కాని ఇంకనూ అది దేవుని గొర్రెల కొరకు గొర్రెల దొడ్డిగానే యున్నది.

58ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. C, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. సరే మంచిది.

"ప్రభువునకు నేను దానిని నాటి యున్నాను. నా చేతిలో నుండి ఎవరును లాక్కొని పోకుండా దివా రాత్రులు దానికి నేను నీరు కట్టుదును." విమర్శ వైపు చూడండి! ఏ శాఖయు దానికి మద్దతు ఇవ్వలేదు. ఇక్కడున్న ప్రాంతములో ఏ సంఘము దానిని ఇష్టపడలేదు. దేశంలోని ఏ పెంతెకొస్తు, మరెవరునూ దానిని సహింపలేక పోయిరి. నీటి బాప్తిస్మమునకు అందరూ వ్యతిరేకులయ్యారు. ఈ సంగతులన్నింటిని అందరూ వ్యతిరేకించారు. నా స్వంత కుటుంబము సహితము, నా స్వంత తండ్రి నన్ను ఇంట్లో నుండి గెంటివేసెను. నేను నా బట్టలను చిన్న పేపరులో కట్టుకొని న్యూ-ఆల్బనీకి వెళ్ళి జీవించాను. నిజము!

కాని చాలా అపాయములు,

శ్రమలు, ఉరుల గుండా నేనిప్పటికే వచ్చాను;

ఇంతవరకు నన్ను క్షేమంగా తీసికొని వచ్చినది కృపయే

(నాకు ఏబది-ఆరు ఏండ్లు,

త్వరలోనే నదిని దాటవలసి యున్నాను)

కృప నన్ను తోడుకొని పోవును.

అక్కడ నేను పదివేల సంవత్సరములున్నాను,

సూర్యుని వలె ప్రకాశించుదును;

దేవుని స్తుతిని పాడుటకు కొద్ది దినములు అక్కడుండవు.

మనము మొదట ప్రారంభించినప్పటికంటే.

ఓ, యేసును నేను ఎంతగా ప్రేమించుచున్నాను,

నాకు ఆయనే సర్వ ప్రపంచము!

59ఓ మంచిది, ఎందరిని నేను… ఎక్కడ నేను విడిచి పెట్టాను. పది? మరికొన్ని మనము తీసికొందామా? మంచిది. అదేమిటి, పది? పదిహేను, మంచిది. C, పది, పదిహేను, మీరెక్కడున్నా సరే, నిలబడ కలిగినచో రావచ్చును. ఏమంటారు? వూ? మంచిది. C, పదిహేను నుండి ఇరవై. అది C, పదిహేను నుండి ఇరవైగా ఉంచండి. పది మంది ఎక్కువ అగును. మేము… మీరు చూడండి ఆ వరుస ఎక్కడ నిలబడి యున్నదో చూడండి, వారిని గుమి కూడనీయకండి. మనము… సరే, మంచిది.

దృష్టి నా మీద ఉంచండి, ఎక్కువ సేపు ఉండము. కాని ఇప్పుడు, ఓ, ఎట్టి ఘడియ, ఎట్టి సమయము ప్రతి వారు ప్రభువును ప్రేమించవలెనని కోరుచున్నాను. ఈ నిమిషము యొక్క ప్రాముఖ్యతను గ్రహించు స్థానమునకు మనందరమూ వచ్చినట్లయిన బాగుండును. దాని కొరకు ప్రయత్నించుదము. మీ దృష్టిని ఇటు నిలుపుడి.

1KGS 18:24,28,36,38

 

60ఇక్కడ మనము ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాము? దేవుని వాక్యమును పరీక్ష కొరకు మనము పెట్టుచున్నాము. ఏలీయా అదే చేసెను. దానిని చేయుటకు దేవుని చేత పంపబడితినని ఎరిగినవాడై యుండి, కొండ మీదికి నడిచి వెళ్ళెను. "ఇప్పుడు ఎవరు దేవుడో రుజువు చేద్దాం. అగ్ని ద్వారా జవాబిచ్చు దేవుడే, దేవుడు" అని చెప్పెను.

అన్యులు కోసికొన్నారు… ఓ, "ఖచ్చితంగా…" అన్నారు. అగ్ని పడదని అన్యులకు తెలియును గనుక వారు కేకలు వేయ ప్రారంభించారు.

కాని అది దిగునని ఏలియాకు తెలియును, ఎందుకనగా యెహోవా యొద్దనుండి దర్శనమును పొందెను.

"అతడు దర్శనము పొందెను అని నీవెట్లు అందువు?" అని మీరన వచ్చును.

అవునండి! అతడు సమస్తము క్రమములో ఉంచినప్పుడు ఇట్లనెను, "ప్రభువా, ఇదంతయు నీ ఆజ్ఞ చొప్పున చేశాను." అప్పుడు అగ్ని పడసాగెను. అక్షరాలా దేవుని వాక్యము పాటించినప్పుడు, తక్కిన పని ఆంతయు చేయవలసిన బాధ్యత దేవునిదే. అది అక్కడ పెట్టమని మాత్రమే ఆయన అడుగును. నీవు అక్కడ పెట్టుటకు పిలువబడితివో లేదో నిశ్చయత కలిగియుండు, చూచారా. ఆ నిశ్చయత ఉన్నచో తక్కినదంతయూ ఆయనే చూచుకొనును.

MATT 9:22•

MATT 15:28•

MARK 5:30,32,34•

MARK 7:29•

LUKE 8:45,48

 

61ప్రార్ధన కొరకు ఇక్కడ వరుసలో వచ్చుచున్న మనుష్యులలో… మీరిప్పుడు గోడ యొద్ద ఉన్నారు. వరుస ఆరంభమగును. ఎంతమంది ఈ భవనములో జబ్బుగా ఉండియు ప్రార్థన కార్డులు లేని వారున్నారు? చేతులెత్తండి. చూడండి. అంతటా ఉన్నారు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు గనుక ఆయన చేయగలదని నేను నముచున్నాను. ఆయన ప్రార్ధన వరుసలను నడిపించును. గొప్ప సమూహములు, వరుసలలో జనులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారిని ఆయన ఆశీర్వదించెను. అంతట ఆయన కొద్దిసేపు ఆగి, "నన్నెవరు తాకిరి?" అనడిగెను. చుట్టూ కలియ చూచెను. ఒక స్త్రీని పిలచి ఎందుకొరకు ఆమె తాకినదో చెప్పెను. ఆమె తన రక్తస్రావ రోగము ఆగిపోయినట్లు చెప్పెను. ఆమె విశ్వాసము ఆమెను బాగుచేసెను.

"ప్రభువా, నాకు తెలియదు. ఎంతో కాలము నుండి ఇది నాకున్నది?" అని ఆమె అని యుండినచో ఎట్లుండును? అది జరిగియుండేది కాదు. కాదు, జరిగేది కాదు. కాదు.

సురోఫెనికయ స్త్రీతో ఆయన ఇట్లు చెప్పెను, "నీవు చెప్పిన మాట చొప్పున నీ కుమార్తెలో నుండి దయ్యము పోయినది." "ప్రభువా, నీవు ఈ విధంగా చేసినచో బాగుండును," అని ఆమె అన్నచో ఎట్లుండేది? ఆ పిల్లలో ఇంకా దయ్యము ఉండి యుండును. కాని ఆయన చెప్పిన విధముగానే తన బాలికను కనుగొందునని ఆమె ఆశించియుండెను.

MATT 17:20•

MARK 9:23•

MARK 11:23

 

62"మీరు నమ్మినట్లయితే, హృదయములో సందేహించక నీవు చెప్పినది జరుగునని నమ్మి, ఈ పర్వతమును కదిలి పొమ్మన్నచో అది జరుగును. మీరు ప్రార్థించునప్పుడు అది పొంది యున్నామని నమ్మినయెడల, అది మీకు అనుగ్రహించబడును," అని ఆయన మనకు చెప్పెను. ఎట్టి వాగ్దానము!

ఇప్పుడు, సామాజిక సువార్తను ప్రకటించు వారు దానిని నమ్మనే నమ్మరు. అతడు తలుపు యొద్దకు వచ్చి తొంగి చూచి, లేదా అక్కడ నిలబడి, "వీరు మరో పరిశుద్ధు గుండ్రాళ్ళ గుంపు," అని హేళన చేయును. వెళ్ళి పోవును, చూచారా. అది దాచబడిన ఆహారమని అతడు ఎరుగడు. అతనికి మరుగయిన రహాస్య సంగతి ఇదేనని ఎరుగడు. దానిని అతడు ఎరుగడు. అది విచారకరము, దిగంబరము, నీచత్వము, అ౦ధత్వము అయిన మనసు దానిని కానరు. అది చెడ్డ సంగతి.

ఓ, దేవా, మొదటగా నన్ను చనిపోనిమ్ము, అంతేగాని ఆలాగు నన్ను ఉండనీయ వద్దు. అది చేయుట కంటే నేను మరణించుటయే మేలు. (అవునండి). మనందరమూ ఆలాగే అనుకొందుము, కాదా?

GEN 18:2,8•

MAL 4:5,6•

LUKE 17:28-30•

REV 10:7

 

63కాని, ఇప్పుడు, ఈ చివరి దినములలో దేవుడు ఈ సంగతులను వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు వచ్చి సొదొమలో చేసినట్లుగానే శరీరము ధరించి తన్ను తాను బయలుపరచుకొనును అని మలాకీ 4లో చెప్పెను. అది నిజము. ప్రపంచము సొదొమ స్థితిలో ఉండును, అని చెప్పెను. "అప్పటి వలెనే మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడును," అని చెప్పెను. చూడండి, మానవ రూపములో దిగి వచ్చిన ఈయన "ఎలోహం." వాగ్దాన కుమారుని ఇవ్వబోవు ముందుగా, అబ్రాహాము యొద్దకు వచ్చెను. అది ఏమైయుండెనో చూడండి. అది దేవుడని అబ్రాహాము చెప్పెను. ముగ్గురు మనుష్యులు వచ్చిరని బైబిలు చెప్పెను. వారి బట్టల మీద ధూళి ఉండెను. ప్రయాణము చేసి వచ్చి, మనుష్యుల వలె కూర్చొని భుజించిరి. "ప్రపంచము సొదొమ స్థితిలోనికి వచ్చినప్పుడు మరల మనుష్యకుమారుడు తన్ను తాను బయలుపరచుకొనును, అని యేసు చెప్పెను. (దేవుని కుమారుడు కాడు), మనుష్యకుమారుడు, చూడండి, తన్నుతాను బయలుపరచుకొనును."

చివరి ప్రవక్త చెప్పిన దానితో దానిని గుర్తించండి, "ఇదిగో, ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపింతును. అతడు వచ్చి పిల్లల హృదయములను తండ్రుల వైపు త్రిప్పును," చూచారా. వారిని తిరిగి బైబిలు యొద్దకు తీసికొని వచ్చు ఒక వర్తమానము, ఆ దినమున మనుష్యకుమారుడు తన్ను తాను బయలుపరచుకొనును. ఏడవ దూత, చివరి సంఘ కాలములో బూర ఊదునపుడు దేవుని మర్మములన్నియూ ఆ దినమున తెలియ చేయబడును. ఏడు ముద్రలు విప్పుబడును. ఈ అన్ని సంఘముల, సంగతుల మర్మములన్నియు, అవి ఎట్లు జరిగెనో, ఏమి సంభవించెనో తెలియ చేయబడును.

MATT 15:14•

MATT 23:26•

LUKE 6:39

 

64చూడండి, వారు దానిని ఎరుగరు. యేసు చెప్పెను, "అంధులగు పరిసయ్యులారా." గ్రుడ్డివారిని గ్రుడ్డివారు నడిపించినచో వారిద్దరును గుంటలో పడరా?" ఆ కారణము వల్లనే వారు దానిని చూడలేక పోవుచున్నారు.

దాని యొక్క మర్మము ఆ ముద్రలే… ఆ సంఘములలో ప్రతిదియు ఒక సంస్థగా మారి దానిలోనికి వెళ్ళెను, దేవుని ఎదుట తప్పుకోబడిన రహాస్య సంగతులలో అది ఒకటి. మీరది చూడండి, డాక్టర్ లీ? చూడు! పరికించు! అక్కడున్న అదియే. అదియే రహస్యములలో ఒకటి. వారు సంస్థగా మారిరి, చూడండి, పూర్తిగా దేవుని చిత్తమునకు విరోధము. అది చివరి దినములలో వెల్లడి అయి జనులను ఒక మత విశ్వాసము లేదా ఒక శాఖలోనికి కాదు గాని, దేవుని నిజ వాక్యము యొద్దకు నడిపించును. నీజ వాక్యము ఒక ప్రత్యేక గుంపు యొద్దకే వచ్చును. "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా," వారి మధ్య మనుష్యకుమారుడు తన్ను తాను బయలుపరచుకొనును.

ఓ, అది నాకిష్టము. ఆయన గూర్చి అతిశయించుట నా కిష్టము. జనుల ఎదుట ఆయనను నేను గొప్పగా చేయుట ఇష్టము. ఆయనను నేను పెద్దగా చేయనవసరము లేదు. ముందే ఆయన పెద్దవాడు. ఆయన నీకు అందనంత ఉన్నతమైనవాడు, దూరలేనంత లోతైనవాడు, ఆయన చుట్టుకొనలేనంత వెడల్పయిన వాడు, అయినను ఆయన కొరకు నీవు నీ హృదయములో స్థలము కలిగియున్నావు. ఆయనను చేర్చుకొనవా? మన ప్రభువు ఎంత అద్భుతమగు వాడు! మంచిది.

65అందరము చాలా నిశ్శబ్దముగా ఉందము. దీని గూర్చి మనము మాట్లాడుకొన్నాము. ఇప్పుడు ఆ విషయము నిజమేనా? ఇక్కడ కొందరు క్రొత్తవారుండి యుండ వచ్చును. క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నట్లయితే, ఈ నిమిషములో ఆయన ఏమి చేయును అని మీరడుగవచ్చును. మునుపు ఇక్కడున్నప్పుడు ఏమి చేసెనో, అదే ఆయన చేయును. అది నిజమేనా? జనుల విశ్వాసము ఆయన వస్త్రమును తాకును, మరియు ఆయన తిరుగును. బావినొద్దనున్న స్త్రీకి చేసినట్లుగానే, ఇంకా ఆయా చోట్ల చేసినట్లుగానే, వారి ఆలోచనలను వెలికి తీయును.

"ఆయన నన్ను బాగుచేయగలడా?" అని నీవనవచ్చు.

ఇంతకు ముందే చేసెనని ఆయన వాక్యము చెప్పెను. అయితే సంగతి ఏమనగా, ఆయన ఇక్కడున్నట్లుగా తన్ను తాను బయలుపరచుకొనుటయే.

MATT 24:27•

PHIL 2:11

 

66ఆయన ఒక భౌతిక దేహములో ఇక్కడ కనబడినచో, ముప్పది-మూడేండ్ల ప్రాయంలో హాఫ్మన్ యొక్క క్రీస్తు శిరస్సు వలె సరిగ్గా కనబడినచో, ఆయన వస్త్రముల నుండి రక్తము కారుట మొదలగునవి జరిగినచో, ఆయన మీద మేకుల గురుతులు ఉన్నచో దానిని నేను అంగీకరించను. కాదు, కాదు - కాదు, కాదు. ఆయన తనంతట తాను వచ్చినప్పుడు, "ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనును. తూర్పున మెరుపు పుట్టి పడమరకు వెళ్ళినట్లే యుండును," చూచారా. ఈ గాధలు, మరియు మూఢ నమ్మకములు మనము నమ్మరాదు. దేవుడే వాక్యమైయున్నాడని మనము నమ్ముచున్నాము.

కాని ఆయన తనకు తాను శరీరము ధరించుకొనును. నీ శరీరమును, నా శరీరమును తీసికొని నీకు వరములను, నాకు వరములను ఇచ్చును. ఈ వరముల ద్వారా ఆయన తన్ను తాను తెలియపరచుకొనును. అదే రహాస్య ఆహారము. నా ద్వారా ఆయన తన్నుతాను ఎంతగా తెలియబరచుకొన్ననూ మరది నమ్మవలసియున్నారు. దానిని నమ్ముటకు మీకు విశ్వాస వరము కూడా ఉండవలెను. అది మీరు నమ్ముచున్నారా? ఆ విధంగా ఆయన తన్ను తాను బయలుపరచుకొన్నచో, మీ పూర్ణహృదయముతో ఆయనను మీరు నమ్ముదురా? ఆయనను నమ్ముదురా? ఓ, ఎంత అద్భుతము, ఆయనపై వేచియుండుట, ఆయన ఏమి చెప్పునో అని చూచుట కొరకు కనిపెట్టుకొని యుండుట.

GEN 17:5•

GEN 18:9,10,12-14•

LUKE 17:28,30

 

67ఇక్కడ ఒకాయన నిలబడియున్నాడు. నా జీవితంలో ఎన్నడూ ఆయనను నేను చూడలేదు. నాకు తెలిసినంత వరకూ, ఒక మంచి, బలమగు, ఆరోగ్యవంతుని వలె కనబడుచున్నాడు. బహుశా అయియుండును. నాకు తెలియదు, కాని అక్కడ ఆయన నిలబడి యున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థించగలను. అతడు నమ్మునో లేదో అడుగుదును. అతడు ఇక్కడ నిలబడి నాకిట్లు చెప్పవచ్చును, "నేను ఫలాని దాని కొరకు నేను ప్రార్థన కోరుచున్నాను. నాకు నిరంతర తలనొప్పి లేదా మరో వ్యాధి ఉన్నది, కడుపులో పుండున్నది," లేదా మరేదో ఉన్నది. నేను ఎరుగను. అతడు అందులో ఏదయినా చెప్పగలడు.

"మంచిది సోదరుడా, నేను నీ మీద చేతులుంచి నీ కొరకు ప్రార్థించుదును," అని నేను చెప్పెదను. అది పరిపూర్ణముగా బాగవును. ఈ కాలమంతటిలోనూ మేము చేయుచూ వచ్చుచున్నది సరిగ్గా అదే. నిజమేనా? .

కాని గుర్తుంచుకొనండి, ఆయన రాకడ యందు అది వేరుగా ఉండును, అని యేసు చెప్పెను. సొదొమ దినములలో ఉండినట్లుగా ఉండును. ఆ వచ్చిన మనుష్యుడు శారా ఉండిన గుడారము తట్టు తన వీపును త్రిప్పి, "అబ్రాహామా" అని పిలిచెను. (ఇప్పుడు "అబ్రాము" కాదు.)

చూడండి, అంతకు ముందు రోజు అబ్రామే కాని అతడు ఒక దర్శనమును పొందెను. "నీ పేరును మార్చనై యున్నానని," ప్రభువు అతనితో చెప్పెను.

ఇక్కడ ప్రభువు తానే మానవాకారములో యుండి, అతనితో తిని, త్రాగి, "అబ్రాహామా, నీ భార్యయైన శారా ఎక్కడ?" అని అడిగెను. శారాయి కాదు; శారా.

"ఆమెనే వెనుక నున్న గుడారములో ఉన్నది," అని చెప్పెను.

"పాతికేళ్ళ క్రితం నేను ఇచ్చిన వాగ్దానము ప్రకారము నిన్ను దర్శించనైయున్నాను," అని చెప్పెను.

శారా తనలో తాను ఒక విధంగా నవ్వుకొనెను. "ఈ సంగతులు ఏలాగు జరుగును, అని చెప్పి, తనలో తాను నవ్వుకొనుచున్నది కదా!" అని అడిగాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూచారా? ఏదియూ లేదు. లేదు.

LUKE 17:28-30

 

68"వాక్యమైయున్న [మీరది నమ్ముచున్నారా?] ఆయన [మనుష్యకుమారుడు] చివరి దినములలో వచ్చి సొదొమ గొమొర్రా వలె లోకముండిన సమయములో తన్నుతాను ప్రత్యక్షపరచుకొనును," అని యేసు వాగ్దానము చేసెను. అది నిజమని మీరు నమ్ముదురా?

ఒక ప్రార్థన మనము చేయు ముందుగా బయటనున్న వారిలో కొందరు ప్రార్థించి మనుష్యకుమారుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడేమో చూడండి. ఆయనాలాగున్నాడేమో అడగండి, "ప్రభువా, అతడు నన్ను ఎరుగడు, కాని నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని నేనెరుగుదును," అని చెప్పండి. ఆయన అది చెప్పునేమో చూడండి. అవునండీ. ఇప్పుడు ఒక్క క్షణము తలను ఎత్తండి.

నా వెనుక నున్నారు. ఒక బిడ్డ జ్వరముతో మండిపోవుచున్నది. ఆమె చిన్న బాలిక. నీవు పట్టణము బయట నుండి వచ్చావు. బిడ్డకు కడుపు సమస్య యున్నది. అవును. కేవలము నమ్ముము.

ఆయన తాను చేయుదునని చెప్పినది అదేనా? నా జీవితంలో ఎన్నడూ ఆ వ్యక్తిని నేను చూడలేదు. దానిని పరమందున్న దేవుడు ఎరుగును.

69ఇక్కడున్న ఈ వ్యక్తి చాలా బలంగా, ఆరోగ్యంగా కనబడుచున్నాడు. కాని అక్కడున్న ఆ నీడను చూచారా? అనగా దేవుడు అతనికి సహాయము చేయనిచో, ఇక్కడ ఎంతో కాలము ఉండలేడు. నీకు కాన్సరున్నది. అది నీ ఊపిరి తిత్తిలో యున్నది. (ఇప్పుడిక్కడ మనుష్యకుమారుడున్నాడు) ఒక చిన్న బిడ్డ కొరకు తన హృదయంలో భారము కలిగియున్నాడు. అది నిజమేనా? ఆ బిడ్డ జబ్బు ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నమ్ముచున్నావా? ఆయన చెప్పగలడు. అతనికి మూర్చ వంటిది యున్నది. ఈ మధ్యనే ఒకసారి వచ్చినది. అది నిజము. ఈ ఉదయాన్నే వచ్చెను. ఆ బాలుని పెంచుటకు నీవు బ్రదుకుదువని, అతడు బాగవునని నమ్ముచున్నావా?

చార్లీ కాక్ ఎక్కడున్నాడు? అతడు ఎచ్చట? చార్లీ, నీవెచ్చట! ఈ రాత్రి ఇక్కడ అతడున్నాడనుకొన్నాను. ఇక్కడే చార్లీ ఉన్నాడు. గౌరీ, నీవెక్కడ? లారీ, ఇచ్చటున్నాడా?, అతని చిన్న పిల్లవానికిని సరిగ్గా అదే వచ్చెను. లారీ, ఎక్కడున్నావు? ఒక్క నిమిషము ఇటు రమ్ము, సరే, నీవిక్కడున్నావు. ఇక్కడున్న బాలునికి అదే వచ్చెను. ఇతని తల్లిదండ్రులు నాకు మంచి స్నేహితులు. సంవత్సరాల క్రితం నేను అచ్చటున్నాను. ఈ బాలుడు ఆయా సమయములందు పడిపోయెడివాడు. అది మూర్ఛ రోగము. ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని బాగుచేయుమని దేవుడ్ని అడిగాను. అప్పటి నుండి ఎన్నడూ రాలేదు. అతని తల్లిదండ్రులు ఇక్కడే ఎక్కడో కూర్చొని యున్నారు. ఆ బాలుడే వచ్చాడు గదా! అయ్యా! మీరిప్పుడు నమ్ముచున్నారా? లారీ, నీకు వందనములు.

మీరు నమ్ముచున్నారా? పరలోక దేవుడు నీకును అను గ్రహించును గాక! బిడ్డను పెంచుటకు నీవు జీవించెదవు. దేవుడు నిన్ను దీవించును. మనము ప్రార్థింతము.

ప్రియ దేవా, అతనికి సహాయము చేయుము. నీ కృప మరియు కరుణ అతని పై నుండి దీవించునట్లుగా ప్రార్థించుచున్నాను. యేసు నామమున.

సంతోషంగా అతనిని బట్టి దేవుని స్తుతించుచూ తిరిగి లూసియానాకు వెళ్ళుము.

ఓ, అవును, అతడు లూసియానా నుండి సాయంగా వచ్చియున్నాడు. చార్లెస్ సరస్సు చుట్టున, అవును. చూడండి, ఇప్పుడు ఆలోచనలను నేను పట్టుకోగలను. అవును. దేవునికి స్తోత్రము!

70మంచిది, నీవు ఒక మంచి విషయమును అడుగుచున్నాను. ఒక బిడ్డ కావలెనని కోరుచున్నావు. ఇప్పటికే నీకు ఇద్దరు పిల్లలున్నారు, కాని మరొకరు కావాలని అడుగుతున్నావు. నా సోదరి, పరమందలి దేవుడు అది నీకు అనుగ్రహించును గాక! ఇక్కడికి రమ్ము. నేను చేతులుంచగోరుచున్నాను.

ప్రియ దేవా, ఈ స్త్రీకి - ఆమె హృదయ వాంఛను ఇమ్ము, ఎందుకనగా అది యోగ్యమగు కారణము. యేసు నామమున. ఆమేన్.

ఇప్పుడు, వెళ్ళుము, బిడ్డను పొందుము.

దేవుడు మంచి దేవుడు. అది నీవు నమ్ముచున్నావా? మన అవసరత అన్నింటిని ఆయన ఎరుగును. నమ్మినచో ఆయన మన ప్రతి అవసరతను తీర్చును. "నమ్ముట నీవలనైతే" అని ఆయన చెప్పెను.

71నీ చేతిని ఎక్కడో నేను కలిపాను. ఎక్కడో నాకు గుర్తు వచ్చుట లేదు. కాని ఎక్కడో నీతో కరచాలనము చేశాను. సరిగ్గా నాకు గుర్తు లేదు. కాని ఎక్కడో, ఈ రోజేనేమో, గాని ఎక్కడో నాకు గుర్తు లేదు. అయితే ఎవరి కొరకో నన్ను ప్రార్థించమని కోరి వచ్చావు. అది నిజము. అతడు ఇక్కడ లేదు. జార్జియాలో జబ్బుగా ఉన్నాడు. నీ సోదరుడు శారీరకంగా వ్యాధిగ్రస్తుడే కాదు గాని, ఆత్మీయంగానూ జబ్బుగా ఉన్నాడు. నీవు ఆయన పక్షమున నిలబడి యున్నావు గనుక దేవుడిది చేయునని నమ్ముచున్నావా? నమ్ముదువా? ఇక్కడికి రమ్ము. మనము కలిసి ప్రార్థించుదము.

ప్రియ దేవా, ఈ వ్యక్తి హృదయ వాంఛను అనుగ్రహించుము. ఈ మనిషి దేవుని కొరకు మొరపెట్టుటను వెళ్ళి కనుగొనునట్లు చేయుము. యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్.

దేవుడు నిన్ను దీవించును. సందేహించవద్దు. నీ పూర్ణహృదయముతో నమ్ముము.

72ఎలా ఉన్నారు? నీవు నా చేతిని బయట పెట్టినప్పుడు నీ చేతిని నేను కరచాలనము కొరకు అందుకోలేదు గాని ఏదో నేను గమనించుచున్నాను. అది ఒక ఛాయ, చాలా నల్లగా, చీకటిగా ఉన్నది. ఆ కారమును బట్టియే నీ చేతిని నేను ఆలాగు పట్టుకొన్నానని తెలిసికొనుచున్నాను, చూచారా. అది కాన్సరు. దానిని దేవుడు తీసివేయునని నమ్ముచున్నావా? అది నీ రోమ్ము మిద ఎడమవైపు ఉన్నది. బాగయినందుకు నీవు ప్రభువును స్తుతించుచూ తిరిగి కరోలినాకు వెళ్ళాలని కోరుచున్నావా, నీవు అనుకోవట్లేదా? మనము ప్రార్థించుదము.

ప్రియ దేవా, యేసుక్రీస్తు నామమున, ఆయనే ఇప్పుడిచటున్నాడు. పిల్లలు దేవుని రొట్టెను తినుచున్నారు. ఈ బిడ్డ కూడా విశ్వాసమును అనుభవించును గాక! ఇప్పుడు ఇతని స్వస్థత కొరకు దేవుడు తన ఆహారమును ఇచ్చుచున్నాడు. వెళ్ళి, ఇతడు బాగవును గాక! యేసు నామములో. ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. నీ పూర్ణహృదయముతో నమ్ముము.

మీరు ఎట్లున్నారు?

MAL 4:5,6•

LUKE 17:28-30

 

73ఇది అద్భుతమగు సమయము కాదా? ప్రజల మీద ఒక ప్రసన్నత యున్నట్లుగా కనబడుచున్నది. "వూష్.ష్.ష్" అని గాలి శబ్దము చేయుచున్నట్లుగా, నా చెవులకు వినబడుచున్నది. [సహోదరుడు బ్రెన్హాం బలమైన సుడిగాలి విసరిన శబ్దమును మైకులో ఊది చూపించారు.] చూడండి. అది పిల్లల రొట్టె, చూచారా. అది మీదే; అది నీ కొరకే. నా కొరకు కాదు; అది నీ కొరకు. నాకు తెలిసినంత వరకు నేను బాగానే యున్నాను. వందనములు చెల్లించుచున్నాను, కాని అది నాకును ఆహారమే. నాకు అవసరమయినప్పుడు. మీకు ఇది ఆహారము. అది ప్రోత్సాహము. జబ్బులేని వారికి సహితము. అది మన హృదయములను దేవుని ఎదుటికి తెచ్చును. ఇది సరిగ్గా ఋతువులోనే, తాను చెప్పినది ఆయన చేయును. "సొదొమ దినములలో ఉండినట్లుగానే మనుష్యకుమారుని రాకడ యందును, ఆయన ప్రత్యక్షమగునప్పుడును ఉందును," చూచారా. "యెహోవా యొక్క ఆ మహా భయంకరమగు దినము రాక మునుపు, ఏలియాను మీ యొద్దకు ప౦పుదును. అతడు వచ్చి పిల్లల హృదయములను తండ్రుల తట్టునకు త్రిప్పును," చూచారా, చూచారా.

"అప్పుడు నీతిమంతులు, దుర్మార్గుల యొక్క బూడిద మీద నడచుదురు." చూడండి, భూమి కొలిమి కాలినట్లు కాలును. అది అవతల రాలిపడుటను చూచెదము. భూమి అంతటా అగ్ని గంధకము వ్యాపించును. ఆకాశములు మండిపోవును.

ఓ యుగముల బండా, అయితే ఇప్పుడు నా పై కృప చూపుము.

74ఎట్లున్నారు? సరే, ఒక విషయము, నీకు ఒక స్త్రీ వ్యాధి ఉన్నది. స్త్రీ జబ్బు. తక్కినవి ఉన్నవి. నీవు ఉద్రిక్తంగా ఉన్నావు. ఉద్రిక్తత కలుగు వయసున. అన్ని విధముల బాధలు ఉన్నవి. కాని నీకు ఒక వాంఛ కూడా ఉన్నది. అది పరిశుద్ధాత్మను పొందవలెనని. అది నిజము. నీవు అన్నీ ఒప్పుకొన్నావా? నేను నీ మీద చేతులుంచి, దానిని నీ కొరకు చేయుమని దేవునిని అడిగినయెడల, పరిశుద్ధాత్మ వచ్చునని నీవు నమ్ముచున్నావా? అది నమ్మెదవా? ప్రార్థించుదము.

ప్రియ దేవా, అపొస్తలుల విధానములో ఈమె మీద నా చేతులుంచి, ఆమె పరిశద్ధాత్మ బాప్తిస్మము పొందునట్లుగా అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామమున ఆమె దానిని పొందును గాక. ఆమేన్.

దానిని సందేహించవద్దు. అది నీకు చెందినది, చూచావా. అది నీదే. అది పిల్లల రొట్టె.

"స్త్రీ వ్యాధి," అని నేను చెప్పినప్పుడు నీకు చిన్నగా ఏదో విచిత్రమగు అనుభూతి కలిగినది కాదా? ఎందుకనగా నీకు కూడా అది ఉన్నది. ఇప్పుడు నీవు బాగవుదువని నమ్ముచున్నావా? వెళ్ళి, ప్రభువును స్తుతించుము.

75మీరెట్లున్నారు? నీ పూర్ణహృదయముతో నమ్ముదువా? చాలా కాలము క్రిందట మీరు తినుచుండిన రీతిగా మరల తీనగలరని నమ్మగలరా? మంచిది. "ప్రభువా, నీకు వందనములు. దానిని నమ్ముచున్నాను," అని చెప్పుము. ప్రభువు యొక్క సన్నిధి!

ఆ వెన్ను సమస్య నిన్ను విడిచిపెట్టి నీవు బాగవుదువని నమ్ముచున్నావా? "ప్రియ దేవా, నీకు వందనములు," అని చెప్పి వెళ్ళుము. దేవుడు దానిని అనుగ్రహించును.

నీవు బాగవగలవని నమ్ముచున్నావా? ప్రభువు నిన్ను బాగుచేయును. నీకు కీళ్ళనొప్పులు ఇక ఉండదు. బాగయి ఆరోగ్యముగా ఉందువు. అది నీవు నమ్ముచున్నావా?' "ప్రభువా, నా నిండు హృదయముతో దానిని అంగీకరించుచున్నాను. దానిని నేను నమ్ముచున్నాను," అని ఆయనకు వందనములు చెల్లించుచూ వెళ్ళుము.

దాని గూర్చి బయట ఉన్న వారందరూ నమ్ముచున్నారా?

76ఇక్కడున్న నీవు, నీ ప్రక్కన కూర్చొనియున్న స్త్రీ మీద నీ చేతిని ఉంచుము. ఆమె కేవలము నమ్మినచో ఆమె యొక్క నరముల జబ్బు, ఎముకల వ్యాధి విడిచిపోవునని చెప్పుము.

ప్రభువు నిన్ను దీవించును. ఇప్పుడు నీవు బాగవుదువని నమ్ముచున్నావా? ఇంటికి వెళ్ళి బాగుపడుము. దేవుడు నిన్ను దీవించును. నీ దారిన వెళ్ళి, "ప్రభువైన యేసూ, వందనములు" అని చెప్పుము.

నీవెట్లున్నావు? నిన్ను కూడా ఈ స్త్రీ సంబంధమగు వ్యాధి విడిచిపెట్టుననియు, బాగవుదువనియు, నమ్ముచున్నావా? "ప్రభువా, నీకు వందనములు," అని చెప్పి, వెళ్ళుము.

నీవెట్లున్నావు? ఏమిటి? నీ పేరు నాకు తెలియును. నేను బాప్టిస్టు సంఘ కాపరిగా ఉండేటప్పుడు. టాడిన్, సోదరి డిల్లీ టాడిన్, ఇప్పుడు నీవు వెన్ను సమస్యతో బాధపడుతున్నావు. అది బాగవును. ఆయన నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? సంవత్సరాల క్రితం మిల్-టవున్ బాప్టిస్టు చర్చిలో ఏమి జరిగినదో నీకు గుర్తున్నదా? నేడును ఆయన అదే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించును. (జార్జి రైట్, నీవెక్కడున్నావు? నీకు గుర్తున్నదా?) మై, మై! ఈ అభిషేకముతో నేను నీ మీద చేతులుంచినచో నీవు బాగవుదువని నమ్ముచున్నావా? ఇక్కడికి రమ్ము. యేసుక్రీస్తు నామమున ఆమె బాగవును గాక. ఆమేన్. విశ్వాసముంచుము.

సరే, మీరు మీ హృదయమంతటితో నమ్ముచున్నారా?

77ఆమెను చూచినప్పుడు ఎంత చక్కని పాత జ్ఞాపకములు వచ్చుచున్నవి! ఇంకనూ ఆమె పేరును నేను గుర్తు చేసికోలేదు. కాని నేను… టాడిన్ - టాడిన్, అది సరియే. ఓ, అవును, ఆమె కుమార్తె జెర్టీ, అది నిజము. అది సరిగ్గా నిజము. నాకు నేను దాటిపోయి నేను లేను; ఒక విధమగు చిన్న, మీకు తెలియును, దానిని నేను వివరించలేను.

అమ్మా! నీ వెన్ను సమస్య పోయినది. ప్రభువును స్తుతించి వెళ్ళుము. "ప్రభువా, వందనములు," అని చెప్పుము.

నీ గుండె వ్యాధి కూడా బాగవును అని నీవు నమ్మెదవా?

సంతోషించుచూ ఇట్లు చెప్పి వెళ్ళుము, "ప్రభువైన యేసూ, నీకు వందనములు." దానిని నమ్ముము. మంచిది. ఇప్పుడు విశ్వాసము కలిగియుండుము. సందేహించ వద్దు.

అమ్మా, రమ్ము. నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముదువా? నీకు చాలా బలహీనతలున్నవి. నీకు వెన్ను నొప్పి కూడా యున్నది. దేవుడు నిన్ను బాగుచేయనై యున్నాడని నమ్ముదువా? మంచిది. సంతోషించుచూ వెళ్ళుము. ఆ విధంగా నీవుండునట్లు చేయునది ఆయనే. ప్రభువుకు వందనములు చెల్లించుము.

సోదరీ, దేవుడు నిన్ను దీవించును.

78కుమారుడా, ఆ బిడ్డ యొక్క నరముల ఉద్రిక్తతను దేవుడు బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? అది నమ్ముదువా? మంచిది. బిడ్డా, నీతో కరచాలనము చేయనిమ్ము.

ప్రియ దేవా, ఈ చిన్న బిడ్డలో నుండి చెడ్డ దానిని తీసివేయుము. అతడు బ్రదికి మామూలుగా అవును గాక! యేసు నామమున. ఆమేన్.

సోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అది నీవు నమ్ముచున్నావు. కదా? అతడు బాగవును. అసలు సందేహించవద్దు.

గుండె జబ్బు రావలసిన స్థితిలో లేవు. చాలా చిన్నవాడివి. దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? "ప్రభువా, నీకు వందనములు, నన్ను బాగుచేసినందులకు వందనములు," అని చెప్పి వెళ్ళుము.

కడుపు సమస్యను దేవుడు బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? సంతోషించి వెళ్ళుము. "ప్రభువా, వందనములు," అని చెప్పుము.

ఆయన ఇంకనూ దేవుడే, కాదా? నీవు చేయవలసినదంతయూ నమ్ముట మాత్రమే. నిజము కాదా? చివరి దినములలో మనుష్యకుమారుని నీవు నమ్ముచున్నావా?

79ఇక్కడ కొద్ది నిమిషాల క్రితం ఏదో జరిగినది. అదెక్కడో నేను కనుగొన ప్రయత్నించుచున్నాను. విశ్వాశమును కలిగియుండిన ఒకరు ఏదో చేశారు. లేక వచ్చే ఆదివారము లేదా నాకు సాధ్యమైనప్పుడు వారిని కలిసికొందును. అది మరల అక్కడున్నది. నీవు నీ చేతిని పైకెత్తుము. దేవుడు ఆ గుండె వ్యాధిని బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? అక్కడున్న నీ కుమార్తెను బాగుచేయునని నమ్ముదువా? అది నమ్మెదవా? శ్రీమతి నెఫ్, లియో నెఫ్, నిన్ను నేనెరుగను. కాని నీవు ఆమెవే. నీకు గుండె జబ్బున్నది. నీ చిన్న కుమార్తెకు మూత్ర పిండపు వ్యాధి గలదు. ఆమె బాగవునని నమ్ముచున్నావా? నీ విశ్వాసము నిన్ను బాగుచేయును. నీ నిండు హృదయముతో నమ్ముము.

ఆ వెనుక గుంపులో నిలబడియున్న నీవు, కడుపు జబ్బుతో బాధపడుతున్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.

నీవు నమ్ముదువా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకరి మీద ఒకరము చేతులుంచుదము. మనమెక్కడున్నామో ఆ ఘడియను, ఆ సమయమును ఆలోచించండి. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు సన్నిధిలోనే మనమున్నామని తలంచుడి. చివరి దినములలో ఆయన దీనిని చేయుదునని వాగ్దానము చేసెను. నేను ఈ చేతిరుమాళ్ళ మీద చేతులుంచి యున్నాను.

ప్రియ దేవా, యేసుక్రీస్తు నామము ద్వారా ప్రజల శరీర స్వస్థత కొరకు ఈ చేతి గుడ్డలను ఆశీర్వదించమని నేను ప్రార్థించుచున్నాను.

MARK 16:17,18

 

80ఇప్పుడు, మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచండి. మీ ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరములో సభ్యులైయున్నారు. హృదయ రహస్యములను బయలుపరచి, ఈ సంగతులను జరిగించుచున్న అదే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీరు ఆయనలో భాగము, ఆయన మీలో భాగము. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడునని," ఆయన చెప్పెను. అది నీవే. "వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు." ఇప్పుడు, నీ కొరకు నీవు ప్రార్థించుకోవద్దు. ఎవరి మీద చేతులుంచావో వారికొరకు ప్రార్థించు, ఎందుకనగా వారు నీ కొరకు ప్రార్థించుచున్నారు. ఇప్పుడు అందరము కలిసి ప్రార్థింతము. ఈ భవనములో ఏ ఒక్క బలహీన వ్యక్తియు లేకుండు గాక. నా ప్రియ సోదరీ, సోదరుడా, ఇక్కడ పరిశుద్ధాత్మ యున్నది, దేవుడు ఇక్కడ ఉన్నాడు. మనము దేని గూర్చి మాట్లాడుకొన్నామో అదిక్కడుండగా ఇంకెందుకు తడవు చేయవలెను.

MARK 16:17

 

81ప్రియ యేసూ, నీ సన్నిధిని మేము గుర్తించియున్నాము. విశ్వాససహితమగు ప్రార్థన ద్వారా (చనిపోయిన పిదప) నీవు ఒక రోజున ఆ చిన్న బిడ్డను తిరిగి జీవింపచేసితివి. ప్రియ దేవా, మేము ఎందరినో సమీపించలేకపోవుచున్నాము. కాలము గతించిపోతున్నది — కాని వారు ఒకరి మీద ఒకరు చేతులుంచుకొనిరి. వారు విశ్వసులు. మృతులలో నుండి లేచి - నిన్న, నేడు, నిరంతరముగా ఏకరీతిగా నున్న ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో మేము కూర్చొనియున్నాము.

సాతానా, నీవు ఓడిపోతివి! యేసుక్రీస్తు నిన్ను ఓడించెను! ఆయన మృతులలో నుండి లేచి - మా మధ్య ఈ రాత్రి నిలబడి, ఈ చివరి దినపు వర్తమానమును బయలుపరచుచున్నాడు. ఈ జనులలో నుండి బయటకు రమ్ము! యేసుక్రీస్తు నామములో వారిని విడిచిపెట్టుము! "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు," మరియు నీవు వెళ్ళగొట్టబడితివి! యేసుక్రీస్తు నామము పేరట, ఈ జనులను విడిచిపొమ్ము!

82మీ స్వస్థతను స్వీకరించుచున్న ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. స్వస్థతను అంగీకరించుచున్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. మీ చేతులు ఇప్పుడు పైకెత్తి ఆయనకు స్తుతి చెల్లించుడి. "ఇప్పుడు నేను నా స్వస్థతను అంగీకరించుచున్నాను," అని దేవునికి చెప్పండి. "ఇప్పుడు నేను నా స్వస్థతను అంగీకరించుచున్నాను. క్రీస్తూ - నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. ఇప్పుడు నిన్ను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండా సహాయము చేయుము." ఆమేన్.

నేనాయనను స్తుతింతును,

నేనాయనను స్తుతింతును,

పాపులకై వధించబడిన గొర్రెపిల్లను స్తుతించుడి;

జనులారా, మీరందరూ ఆయనకు మహిమ చెల్లించుడి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతి మచ్చను కడిగివేసెను.

మీరాయనను ప్రేమించరా? అయితే ఆయనను స్తుతించుదము. ప్రతివారును మీ చేతులు పైకెత్తి, కూటమును ముగించుటకు ఇక్కడికి సోదరుడు వచ్చుచుండగా, ఆయనకు స్తుతి చెల్లించుడి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...