అంత్యకాలమందు అభిషిక్తులు

అంత్యకాలమందు అభిషిక్తులు

1జనులారా, శుభోదయము! ఇప్పుడు మన ప్రభువుతో మాట్లాడుదుము. గొప్పదేవా, భూమ్యాకాశముల సృష్టికర్తా నిన్ను ఆరాధించుటకు ఈ ఉదయమున ఈ సమయము నీవే మాకు దైవికముగా ఏర్పాటు చేసితివి. ప్రభువా, మా హృదయములలో మమ్మల్ని మేము సంపూర్తిగా నీ దైవ చిత్తమునకు అప్పగించుకొందుము గాక, మరియు మాలో పరిశుద్ధాత్మను పనిచేసి నీవు కోరునది మాలో నుండి తీసికొనివచ్చును గాక మేము మంచి క్రైస్తవులముగాను, నీకు మ౦చి ప్రతినిధిలుగాను మేము ఉండగోరుచున్నాము. నీ మీద మేము ఆనుకొనియుండగా ఈ ఉదయమున ఇవి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనండి.

2గొప్ప రాజును ఆరాధించుటకు ఈ ఉదయము మరల ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషించుచున్నాము. ప్రజలకు చోటు లేనందున మేము మరలా విచారించుచున్నాము, అయితే మేము కేవలము… ఈ పరిస్థితుల వలన మేము సాధ్యమైన మంచిది చేయుటకు ప్రయత్నించుచున్నాము.

ఇప్పుడు చాలామంది చేతిరుమాళ్ళు, విన్నపములు ఇక్కడకు ప్రార్ధనకై తెచ్చియుంచారు. నేను వాటిని ఒక ప్రక్కన పెట్టాను; అంతేగాని వాటిని నిర్లక్ష్యము చేయుట కాదు, కాని వాటిగూర్చి నేను ప్రార్థించెదను. ఈ ఉదయమున నేను ప్రార్ధి౦చెదను మరియు తరువాత మరలా ఈ రాత్రి ప్రార్ధి౦చెదను, ఎప్పుడైతే… అప్పుడు నేను ప్రార్ధి౦చెదను మరియు దేవునియొక్క ఆత్మపైన స్వస్థత కొరకు వేచియుందును. మరియు అప్పుడు నేను చేతిరుమాళ్ళ గూర్చి మరియు విషయముల గూర్చి ప్రార్ధి౦చుటకు యిష్టపడుదును.

3మీ అందరియొక్క ప్రత్యేక మనవులను బిల్లీ నాకు ఇచ్చెను. అక్కడ సుమారు మూడు వందల మందివి యున్నవి మరియు నేను అప్పుడే గదిని విడిచి వచ్చాను. మీరు చూచారా, నేను వీలయినంత త్వరగా అందరికి ప్రార్ధి౦చగోరుచున్నాను. వారియొద్దకు వీలయినంత త్వరగా వెళ్ళెదను. వారందరి యొద్దకు నేను వెళ్ళజాలను. నేను ప్రతి ఒక్కరి యొద్దకు వెళ్ళి "ప్రభువా ఇది నీ చిత్తమా? ఇది నీకిష్టమా?" అని అడుగుదును; ఎందుకనగా వారందరూ నిజంగా అక్కరలో అవసరతలలో యున్నారు. అందులో ఏమీ సందేహము లేదు. కొన్నిసార్లు పరిశుద్దాత్మ నన్ను ఒక ప్రత్యేకమైనది చదువమని కోరును. దానిని నా హృదయములో ఉంచుకొందును; నేను దానిని పదే - పదే చదివి దానిని కనుగొందును, లేకపోతే సాధారణముగా దానిని తీసికొందును.

4ఇప్పుడు, దేశములోని ఇతర ప్రాంతములలో ఉన్న వారిని కూడా ఈ ఉదయమున మేము అభినందించ గోరుచున్నాము. న్యూయార్కు పట్టణము, టెక్సాస్లోని — భ్యూమవుంట్, అరిజోనాలోని — ప్రెస్కాట్, అరిజోనాలోని — టుసాన్, కాలిఫోర్నియాలోని — సాన్జోస్, కాలిఫోర్నియా, కనెక్కికాట్, జార్జియాలోని — జేయిన్స్-విల్, మరియు ఇండియానాలోని — న్యూ-ఆల్బనీ, ఇంకా తదితర ప్రదేశములలో టెలిఫోను ద్వారా ఈ ఉదయము వినుచున్నవారిని మేము అభినందించుచున్నాము. ప్రభువైన యేసు నామములో మీకు మేము శుభములు తెలియజేయుచున్నాము.

ఇండియానాలో ఈ ఉదయము చాలా నిర్మలముగా ఉన్నది. గతరాత్రి వర్షము పడినందున వాతావరణము చల్లబడినది. మరియు మేము ఆలయము క్రిక్కిరిసియున్నది. మరియు ఆదివారపు పాఠము కొరకు అందరు గొప్ప ఆశతో ఎదురుచూచుచున్నారు. మరియు అక్కడున్న మీ మీద దేవుని దీవెనలు అధికముగా క్రుమ్మరించబడవలెనని కోరుచున్నాను.

బైబిలులోని చివరి ఏడు పాత్రలగూర్చి బోధించుటకు అందరిని ఒక పెద్ద గుడారము క్రిందకు తీసికొని రావలెనని ఆశించుచున్నాము. సాధ్యమైనంత త్వరగా అది చేయవలెనని కోరుచున్నాను. నిజముగా నాకు ఆ నడిపింపు వచ్చుచున్నది.

5కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాల గొప్ప పాఠము ఎక్కువ సేపు ఉండదని చెప్పుచున్నాను. "నేను ఏమి చెప్పవలెను?" అని ఆలోచించుచు ప్రభువును అడిగాను, మనకున్న దానిలో యిదే చివరి ఆరాధన కావచ్చని అనుకొనుచున్నాను; ప్రభువు యొక్క రాకడ అంత సమీపముగా యున్నది.

కాలిఫోర్నియోలో ముందుగానే జరుగబోవు వాటిని నేను చెప్పినప్పుడు, నేను చూడగలుగుచున్నాను. అక్కడ ఇండ్లు, స్థలములు గంటకు ముప్పది అంగుళముల చొప్పున మునిగిపోతున్నవి — దూలములు బ్రద్దలగుచున్నవి. మరియు పగుళ్ళు ఏర్పడుచున్నవి. ఎందుకాలాగు జరుగుచున్నదో వారెరుగరు. మనము అంతమందున్నాము. వందల-వేలు డాలర్లు వెచ్చించి నిర్మించిన ఇండ్లు మునిగిపోవుచున్నవి. పేపర్లో పెద్ద అక్షరములతో బొమ్మలు చేసి వ్రాసిరి. ఈ రాత్రి దాని మీద కొంత మాట్లాడగోరవలెనని నేను కోరుచున్నాను.

6మరియు పిమ్మట, ఈ రాత్రి రోగులకై ప్రార్థనయున్నది. సాయంత్రము అయిదు లేదా ఆరు గంటలకు మీరు రండి. ప్రజలు త్వరగా ప్రార్థనా కార్డులు తీసికొని వెళ్ళిపోవునట్లుగా పెందలకడ మనము ప్రారంభించుదము. ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రికి రోగులకు ప్రార్ధి౦చెదము.

AMOS 3:7

 

7ఇప్పుడు, ఈ దినము ఇక్కడ నేను చెప్పిన దానికి నేను ఒక దినమున జవాబు ఇయ్యవలెనని ఎరుగుదును గనుకే ప్రార్థనా పూర్వకముగా ఆలోచించిన తరువాత "నేనేమి చేయవలెను?" అని అనుకున్నాను. ఈ ఉదయమున నేను ప్రవచనము మీద మాట్లాడుటకు నేను నిర్ణయించుకున్నాను… లేక పరిశుద్దాత్మ ద్వారా ప్రేరేపించబడితిని. చూచారా? అది ఏదో కొంత మనము… ముందు మనకు చెప్పబడకుండా ఏది జరిగినా అది దానంతట అది జరిగినదని చెప్పెదము. పరిశుద్దాత్మ జనులకు ముందు హెచ్చరిక చేయును. "దేవుడు తన మొదట దాసులగు ప్రవక్తలకు తెలియచేయకుండా ఏదియూ చేయడని" బైబిలు చెప్పెనని మీకు తెలియును. మరియు ఏమి జరుగబోవుచున్నదో దానిని ఆ యేసు ఏ విధముగా జనులను హెచ్చరించెను. అది జరుగునని ప్రవక్తలు ప్రజలను ఏ విధముగా హెచ్చరించెనో, మరియు అది ఇప్పుడు మనకు తగియున్నది, మనము జీవించుచున్న ఈ గొప్ప ఘడియలో, మనము ఏ కాలములో జీవించుచున్నామో చూడవచ్చు మరియు ఏమి జరుగుచున్నదో చూడవచ్చు, ఈ కాలములో ఏమి జరుగబోవుచున్నదని చూడవచ్చు. కాబట్టి మనము బహుశా చాలా సార్లు చదువుకొనిన ఈ వింత అంశములలో ఒక దానిని తీసికొని ఈ ఉదయమున జనులతో మాట్లాడవలెనని అది హృదయములో పడినది.

8ఇప్పుడు మనము బైబిలులోని మత్తయి 24వ అధ్యాయము తీసి ఒక వాక్యభాగమును చదువుదుము. [సహో, బ్రెన్హాం తన గొంతు సవరించుకొనిరి.] నన్ను క్షమించండి. మన పాఠము మరియు అంశము కొరకు ఒక సందర్భమును చూచుచున్నాము.

దీనిని మనము బైబిలు తరగతి వలె నెమ్మదిగా చెప్పుకొనబోవుచున్నామని ఇప్పుడు మరువవద్దు. మీ పెన్సిలు, పేపరు తీసికొనండి. మీరు వ్రాసుకొనుటకు వీలుగా ఇక్కడ చాలా వాక్యభాగములు వ్రాసియుంచాను. పిమ్మట ఇంటికి వెళ్ళి వాటిని చదవండి. ఇది ఆదివారపు-బడి పాఠమువలె ఉండును. మనము జీవించుచున్న ఈ ఘడియ గూర్చి హెచ్చరించి సిద్ధపరచును.

MATT 24:15-28

 

9పరిశుద్ధ మత్తయి గ్రంథము [సహో, బ్రెన్హాం తన గొంతు సవరించుకొనుచున్నారు.] క్షమించండి. 24వ వచనము లేక 24వ అధ్యాయము 15వ వచనము నుండి ప్రారంభము. ఆయన వాక్యములోని ఒక భాగమును నేను చదువగోరుచున్నాను.

కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన

హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే -చదువువాడు గ్రహించు గాక!

యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.

మిద్ది మీద ఉండువాడు తన యింటిలో నుండి ఏదయినను తీసికొని పోవుటకు దిగకూడదు.

పొలములో ఉండువాడు తన బట్టలు తీసికొనిపోవుటకు ఇంటికి రాకూడదు.

అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.

అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను, విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్ధి౦చుడి.

లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.

ఆ కాలమందు ఎవడైనను - ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల సమ్మకుడి,

అబద్దపు క్రీస్తులును, అబద్దపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. కాబట్టి ఎవరైనను -

ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి — ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు ఉండును.

పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.

MATT 24:24

 

10ఇప్పుడు, ఈ ఉదయము ఆదివార పాఠము కొరకు 24వ వచనమును ఒక అంశముగా నేను తీసికొనవలెనని కోరుచున్నాను. మరియు నేను మరలా దీనిని చదువుచుండగా జాగ్రత్తగా వినండి.

అబద్దపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

ఇప్పుడు, ఈ ఉదయము ఒక అంశము కొరకు లేక పాఠము కొరకు, నేను తీసికొనగోరుచున్నాను: అంత్యకాలమందు అభిషిక్తులు, ఆ అంశము లేక పాఠము మీదనే నేను మాట్లాడగోరుచున్నాము. అంత్యకాలమందు అభిషిక్తులు.

LUKE 21:28

 

11మనము చివరి కాలములో జీవించుచున్నామని నమ్ముచున్నాను. ప్రపంచ చరిత్ర యొక్క ముగింపు కాలములో మనము జీవించుచున్నామని వాక్యమును చదివినవారు లేక విశ్వసించు వారెవరయినా గాని గ్రహించగలరు. దానిని గూర్చి వ్రాయుట వలన ప్రయోజనము లేదు, ఎందుకనగా ఎవరూ దానిని చదువుటకు ఉండరు. ఇది కాలము యొక్క అంతము, ఎప్పుడో నాకు తెలియదు. అది కేవలము యింకెంత కాలమని ఆ ఘడియయైనను లేక ఆ నిమిషమైనను పరమందలి ఏ దూతయు ఎరుగదు. అయితే ప్రభువైన యేసు మనకు ఇట్లు చెప్పెను. ఈ సంగతులన్నియూ జరుగనారంభించినప్పుడు మీ తలలు పైకి ఎత్తికొనుడి, ఏలయనగా మీ విడుదల సమీపించియున్నది.

ఇప్పుడు "సమీపించుట" అనగా ఏమిటో నాకు తెలియదు.

12శాస్త్రజ్ఞులు టెలివిజనులో చూపించినది ఒకనాడు చూచాను. భూమి ఎన్నో వేలమైళ్ళు బీటలువారి దిగిపోవుటకు సిద్ధముగానున్నదని చెప్పిరి. పశ్చిమ తీరమునున్న లాస్ఏంజలస్ "అది అక్కడ మునిగిపోవుచున్నదా?" అని అతనికి ప్రశ్న వేయబడెను. మరియు రాడార్ వలన వారు దానిని కనుగొనిరని మీలో చాలామంది చూచిరి. సాన్-జోస్ నుండి అలాస్కా వరకు వారు వెళ్ళిరి. సముద్రములో రెండు వందల మైళ్ళు వెళ్ళిరి. అలూటియన్ ద్వీపము దాటి వెళ్ళి లాస్ఏంజలస్ చుట్టూ తిరిగి సాన్-డియాగోకు వచ్చిరి. ఎంతో గొప్ప ప్రదిక్షిణము. అగ్నిపర్వతములు గొప్ప శూన్యముగా యున్న పల్లమును ఢీకొనినప్పుడు మనకు ఈ భూకంపములు వచ్చుచున్నవి. వారు పిలిచిన ఆ పేరును నేను పిలువలేక పోవుచున్నాను. ఏది ఏమైనప్పటికీ, అది ఎప్పుడైతే కదిలిపోవుచున్నదో, అది ఈ భూకంపములను యిచ్చుచున్నవి. అందుకే పశ్చిమ తీరమున అనేక సంవత్సరములతరబడి భూకంపములు వచ్చుచున్నవి. ఇప్పుడు, అది భూమి చుట్టూ బీటలు వారినవి. అన్నీ బీటలు వారినవి.

శాస్త్రజ్ఞలు చెప్పినది వినండి.

13"అది కూలిపోవునా?" అని ఒక వ్యక్తి ప్రశ్నించెను.

"ఇప్పుడు కాకపోవచ్చు, కాని అది జరుగును" అని అతడు జవాబు ఇచ్చెను.

"బహుశా మన తరములో జరుగకపోవచ్చును" అని అతడనెను.

"వచ్చే అయిదు నిమిషాల్లోగాని, లేదా అయిదేండ్లలో గాని జరుగవచ్చు. ఎప్పుడో మనకు తెలియదు" అని జవాబిచ్చెను.

ఈ వారములో పేపరులో పడిన ప్రధాన వార్తను నాకు పంపిరి. వందల వేల డాలర్లు ఖర్చుపెట్టి కట్టిన ఇండ్లు బీటలు వారుచున్నవనియు, జనులు వెళ్ళిపోవుచున్నారనియు అందులో యున్నది. దానిని ఎట్లు ఆపవలెనో వారికి తెలియుట లేదు; దానిని ఆపు మార్గము లేదు. చూడండి, దేవుడు తనకు ఇష్టమైన దానిని చేయగలడు. మరియు దానినెట్లు చేయవలెనో ఎవరూ ఆయనకు చెప్పనక్కరలేదు.

మీరు ఇండ్లు నిర్మించుదురు; శాస్త్రీయమగు వాటిని తయారు చేయుదురు. దేవుడు సైన్సుకు సృష్టికర్త, ఆయనను మీరెట్లు ఆపగలరు? ఆయన తలంచిన ఎడల ఈ ఉదయమున ఈగల ద్వారా భూమిని నాశనము చేయగలడు. మీరు గ్రహించండి, ఆయన మాట ద్వారా ఈగలను సృజించగలడు. మరియు అరగంట వ్యవధిలో అవి నలుబది మైళ్ళ లోతుకు పెరుగగలవు. మరియు భూమి మీద మనుష్యులను తినివేయును. ఆయన దేవుడు. ఆయన తన కిష్టమైనట్లు చేయగలడు. ఆయన స్వయముగా సౌర్వభౌముడై యున్నాడు.

14ఇప్పుడు, ఈ రుజువులన్నిటిని మనము చూచుచున్నాము. నేడు మనము జీవించుచున్న ఘడియ ఇది. ముద్రలు విప్పబడినప్పటి నుండియు జరిగిన సంగతులన్నియు నెమరు వేసికొందము. ఈ సంగతులన్నియూ చూచి వాటి సత్యమును కనుగొందము. దేవుడు మనపట్ల ఎంతో అణకువ చూపుచున్నాడు. తన కృపతో ఆయన ఈ సంగతులను చూపించుచున్నాడు.

మత్తయి 24లోని వాక్యమును మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. "క్రీస్తులు" అను పదమును యేసు ఇక్కడ వాడెను. క్రీస్తులు, క్రీస్తు కాదు గాని క్రీస్తులు. ఏక వచనము కాదు, బహు వచనము — క్రీస్తులు. కావున, క్రీస్తు అను మాటకు "అభిషిక్తుడు" అని అర్ధము. మరియు అది అభిషిక్తుడు అయిన యెడల, ఒకడు మాత్రమే యుండడు, కాని చాలామంది అభిషేకించబడిన వారు యుందురు — అభిషిక్తులు, చూసారా.

లేనియెడల ఆయన చెప్పిన దానిని మరింత విశదముగా గ్రహించుటకు దానిని విడమరచి చూద్దాం. ఆయన చెప్పెను, "అంత్యదినములలో అబద్ధ అభిషిక్తులు లేచెదరు." ఇప్పుడు అది దాదాపు అసాధ్యముగా కనిపించవచ్చును (చూచారా)… అభిషిక్తుడు అను మాటలు. అయితే గమనించండి, "అబద్ధ ప్రవక్తలు" అని దాని వెంటనే వ్రాయబడెను — బహువచనము.

15ఇప్పుడు, అభిషిక్తుడు అనగా "ఒక వర్తమానముతో వచ్చువాడు." మరియు వర్తమానము బయటకు వచ్చుటకు అభిషిక్తుడు మాత్రమే దారి. అతడు అభిషేకించబడిన ప్రవక్త అయి యుండెను. "అబద్ధ అభిషిక్త బోధకులు లేచెదరు." ఒక ప్రవక్త తనకున్న వర్తమానమును బోధించును. అభిషేకించబడిన బోధకులు, తప్పుడు బోధతో అభిషేకి౦చబడిన వ్యక్తులు. అభిషేకించబడిన వారు: క్రీస్తులు, బహువచనము; ప్రవక్తలు బహువచనము. ఒక క్రీస్తు అను ఒక కార్యము ఉన్నట్లయితే, ఏకవచనము, అప్పుడు వీరు అభిషిక్తులు అయి యుండవలెను, వారు బోధించునది వ్యత్యాసముగా యుండునని వారి గూర్చిన ప్రవచనము, ఎందుకనగా వారు అభిషిక్తులు, అభిషేకించబడెను.

16ఇప్పుడు, ఇది ఒక ఆదివారపు-బడి పాఠము. నిజమైన కార్యముగా అగుపరచుటకు దీనిని మీకు లేఖనముల ద్వారా తీసుకొని రావలెనని మేము ప్రయత్నించుచున్నాము. దానిని గూర్చి ఎవరో చెప్పిన దానిని బట్టి కాదు గాని, లేఖనములను చదువుట ద్వారా మాత్రమే.

"ఇదెట్లు సాధ్యము?" అని మీరడుగవచ్చును. "అభిషిక్తులు… వారెవరు?" క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు. అభిషిక్తులు, కాని అబద్ధ ప్రవక్తలు!

"నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను వర్షము పడునని" యేసు చెప్పెను. ఇప్పుడు, ఎవరో ఒకరు నన్ను యిలా అడుగవచ్చును, "ఆ వ్యక్తులపై యున్న అభిషేకము అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమని నీవు నమ్ముచున్నావా?" అవునండీ, దేవునియొక్క నిజమైన పరిశుద్దాత్మ ఆ వ్యక్తిపై యున్నది. మరియు అయినను వారు అబద్ధికులే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి మరియు ఆయన చెప్పినది చూడండి. "వారు సూచక క్రియలను మహత్కార్యములను చూపించెదరు. అందువలన సాధ్యమైతే ఏర్పరచబడిన వారును మోసపుచ్చబడుదురు." వారు నిజమగు పరిశుద్దాత్మ చేతనే అభిషేకము పొందిరి. ఇది చాలా తేలివిలేని మాటగా వినిపించునని నాకు తెలియును, కాని సమయము తీసికొని వాక్యము ద్వారా దీనిని వివరించుదుము. అది సంపూర్ణ సత్యము మరియు "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

17ఇప్పుడు, ఒక నిముషము పాటు బైబిల్లోని మత్తయి 5వ అధ్యాయము 45 వచనారంభము నుండి కొన్ని వచనములు ఇప్పుడు చదివి చూద్దాం. వాటన్నింటినీ చదువుటకు విఫలమైన ఎడల మీ బైబిల్ను మీరు తీసుకొనండి, మరియు దానిగూర్చి మీ బైబిల్ ఏమి చెప్పుచున్నదో మీరు యిక్కడ నుండి విడిచి వెళ్ళిన తరువాత, మీ యింటికి వెళ్ళి చదవండి.

MATT 5:44,45

 

18ఇప్పుడు, మనము సమయము తీసికొని మూల సత్యమును చూద్దాం, ఎందుకనగా మీకు ఆశ్చర్యము కలిగించిన మాట నేను చెప్పాను. ఒక అబద్ధ బోధకుని పరిశుద్దాత్మ ఎట్లు అభిషేకించును? అయితే ఆలాగు జరుగునని యేసు చెప్పెను.

ఇప్పుడు ముత్తయి 5వ అధ్యాయము 45వ వచనము. ఇప్పుడు మనము చదువుదము. 44వ వచనము నుండి ఆరంభించుదాం.

నేను మీతో చెప్పునదేమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్ధన చేయుడి.

ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. (వర్షము మంచి వారి మీద కురిసినట్లే, చెడ్డవారి మీదను కురియను.)

HEB 6:1-8

 

19ఇప్పుడు, దీనిని వెంబడించుటకు దీనికి సంబంధించిన మరో ప్రవచనమును హెబ్రీ 6వ అధ్యాయములోయున్నది. యేసు చెప్పిన దానినే పౌలు మరల గుర్తుకు తెచ్చుచున్నాడు. ఇప్పుడు పౌలు మాట్లాడుచున్నాడు. దూరముగా ఉండి వినుచున్నవారు కూడా బైబిలు, కాగితము దగ్గరకు తెచ్చుకోవలెనని కోరుచున్నాను, ఇప్పుడు దీనిని చూడండి. హెబ్రి 6వ అధ్యాయములో పౌలు హెబ్రీయులకు వ్రాయుచున్నాడు. వారికి మాదిరులు, ఛాయలు చూపించుచున్నాడు. యూదత్వము నుండి క్రైస్తవ్యమునకు వారిని త్రిప్పుచున్నాడు. ఆ పాత సంగతులు రాబోవు వాటికి నీడవలెనున్నవి అని వారికి చూపించుచున్నాడు. హెబ్రి 6లో పౌలు మాట్లాడుచున్నాడు.

కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసమును,

బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును (క్రీస్తు, ఏకవచనము) గూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము,

దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము. ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్దాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము.

ఎట్లనగా, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, యెవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

అయితే ముండ్ల తుప్పలును గచ్చ తీగలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.

HEB 6:7

 

20ఇప్పుడు, మత్తయి 5:24తో దానిని ఇప్పుడు మరలా పోల్చిచూడండి. గమనించండి, భూమి మీదికి దేవుడు వర్షమును, సూర్యుని పంపుచున్నట్లు యేసు చెప్పెను. భూమి మీదనున్న జనులకు ఆహారము సిద్ధపరచుటకు ఆయనాలాగు చేయుచున్నాడు. వర్షము మొక్కలకు ఆహరముగా పంపబడుచున్నది. అయితే పొలములోని గురుగులు, ముండ్ల విత్తనములు కూడా దానిని త్రాగుచున్నవి. గోధుమ గింజలు ఎదుగుటకును, గురుగులు పెరుగుటకును అదే వర్షము ఉపయోగపడుచున్నది.

21మొదటిసారి పెంతెకోస్తు వారిని కలిసికొన్నప్పుడు నాకు ఆ పాఠము తెలిసినది! మరియు అది నాకు ఒక గొప్ప పాఠము. నేను ఇద్దరిని చూచాను. అంతకు ముందు భాషలు మాట్లాడుట నేను వినలేదు. ఒకరు భాషలు మాట్లాడుచుండగా, మరొకరు దానికి అర్థము చెప్పుచుండిరి. "ఇక్కడ ఈ రాత్రి మారుమనస్సు పొందు స్త్రీ పురుషులున్నారు" అని వారు చెప్పుచుండిరి. జనులు లేచి వేదిక యొద్దకు వెళ్ళుచుండిరి.

"అది ఎంత మహిమకరము!" అని తలంచాను.

22చిన్న పరిశుద్దాత్మ వరము కలిగిన నేను, వారితో మాట్లాడాను. వివేచన ద్వారా వారిని తెలిసికొన్నాను. అందులో ఒకరు నిజమయిన క్రైస్తవుడు. మరియు అతడు నిజముగా క్రీస్తు దాసుడు. మరియొకడు వేషధారి. ఆ వేషధారి ఒక నల్లజాతి స్త్రీతో జీవించుచున్నాడు. మరో స్త్రీ ద్వారా పిల్లలను కనెను. మంచిది, అక్కడే దర్శనములో అది చూచాను. దానిని కాదనలేకపోయాను. నేను దానిగూర్చి అతనితో మాట్లాడాను. అతడు నా వైపు చూచి ఆ భవనములోనికి వెళ్ళిపోయెను.

MATT 7:16•

HEB 6:7

 

23నిజంగా నేను అయోమయములో పడితిని. నేను దేవదూతల మధ్యకు వచ్చాననుకొన్నాను; కాని దయ్యముల మధ్య ఉన్నానన్న ఆశ్చర్యము కలిగినది. ఇదెట్లు సాధ్యము? అది నాకు అర్ధము కాలేదు. మరియు సంవత్సరముల తరబడి దానికి నేను దూరముగానున్నాను, ఒక రోజు… (నా కుమార్తె భర్తయగు జార్జ్ స్మిత్తో కలిసి నిన్నటి రోజు నేను ఎక్కడైతే ప్రార్ధించుటకు వెళ్ళుదునో, ఆ పాత మిల్లు స్థలమునకు మేము వెళ్ళియున్నాము.) మరియు అక్కడున్న రెండు రోజుల తరువాత పరిశుద్దాత్మ నాకు మరల ఆ వాక్యమును గుర్తు తెచ్చెను. "భూమి మీదికి తరచుగా కురియు వర్షము వలన మంచి చెట్లు, ముండ్ల పొదలు కూడా పెరుగును. అయితే ముండ్ల పొదలను కాల్చివేయుదురు." దేవునియొద్ద నుండి వచ్చిన ఒకే జీవనాధారము వలన అవి జీవించుచున్నవి. అప్పుడు నాకు అది అర్ధమయినది. "వాటి ఫలముల వలన వాటిని మీరు తెలిసికొందురని" యేసు చెప్పెను.

24భూమిమీద వర్షము పడినప్పుడు ప్రకృతి పెరుగుచున్నది, ఇది ఆత్మీయ వానకు సాదృశ్యముగా ఉన్నది, ఇది నిత్యజీవమును ఇచ్చును, సంఘము మీద పడుచున్నది; దానిని తొలకరి వర్షముము, కడవరి వర్షము అనుచున్నాము. మరియు అది దేవుని ఆత్మవలన సంఘము మీద కురియుచున్న ఒక వర్షము.

MATT 24:24•

MARK 13:22

 

25ఇక్కడ అది చాలా వింతైన కార్యముగా యున్నది, చూచారా. ము౦డ్ల పొదల విత్తనములు ఆదిలోనే ఉన్నవి. ఆలాగే మ౦చి విత్తనములును మరియు గోధుమ విత్తనములను యున్నవి. వాటి ఆదియే మంచి చెట్ల విత్తనములుగా యున్నవి. మరియు ప్రతి విత్తనము దాని - దాని జాతిని మరలా మొలిపించుచున్నవి. అది ఆదిలోనే ఆలాగు ప్రారంభించబడినదని చూపించుచున్నది.

"మరియు సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని అవి మోసపుచ్చును," ఎందుకనగా అవి అదే వర్షమును, అదే ఆశీర్వచనమును, అదే అద్భుతములను, అదే సూచక క్రియలను చూపించుచున్నవి, చూచారా. "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును." ఇప్పుడు, ఒక ముండ్ల చెట్లు తనకుతాను ముండ్ల చెట్లుగా చేసుకొనజాలదు మరియు గోధుమ కూడ తనకుతాను గోధుమగా చేసుకొనజాలదు. ఆదియందు సృష్టికర్తయే ప్రతిదానిని ఆ విధముగా నిర్ణయించెను. అదే ఎన్నుకొనుట.

ఒకే వర్షము…

26ఉదయమున సూర్యుడు వచ్చి భూమి మీద తన కాంతిని వెదజల్లును. భూమి మీద పగలగుచున్నది. దానివలన మనము జీవించుచున్నాము. తూర్పున ఉదయించు సూర్యుడు, పశ్చిమాన ఆస్తమించు సూర్యుడు ఒక్కటే. భూమిమీద ధాన్యమును పండించుటకు సూర్యుడు పంపబడెను. దాని ద్వారానే మన శరీరములు తయారు చేయబడినవి.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

JOHN 1:1,14

 

27మనము చచ్చిన వాటి ద్వారా బ్రదుకుచున్నాము. మీరు ఆ విధముగా మాత్రమే జీవించగలరు. ఈ సహజ శరీరము జీవించుటకు మృత పదార్ధము ఏలాగు అవసరమో, ఆ రీతిగానే నీ ఆత్మీయ జీవితమును జీవింపచేయుటకు ఆత్మీయమైనది చావవలసియున్నది. మరియు దేవుడు పధార్థమై, శరీరధారియో, మరియు మనము జీవించునట్లు చనిపోయెను. దేవుడు తప్ప ఈ లోకములో మరి ఏ సంఘము ఏ యితర కార్యమును మనలను రక్షించజాలదు. దేవుని వలన మాత్రమే నీవు జీవించగలవు.

ఇప్పుడు, లేఖనములను చూడండి. యేసే వాక్యము. "ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను. మరియు ఆ వాక్యమే శరీరధారియై మనమధ్యలో సంచరించి నివసించెను." "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." కావున, మీరు చూచారా, మనము వాక్యము ద్వారా జీవించెదము. మరియు అది దేవుడైయున్నాడు.

28ఇప్పుడు, సూర్యుని రాక వలన గింజ పండుచున్నది. ఇప్పుడు అది ఒకసారి పండదు. పూర్తి వెన్నుగా మారు వరకు అది ఆగక పరిపక్వమగుచునే యుండును. నేడు సంఘము కూడా ఆలాగేయున్నది. అంధకార యుగములో అది భూమిలో దాగెను, అది మొదటి దశ. ఇప్పుడది పరిపక్వతకు వచ్చియున్నది. మరియు దేవుడు ఎల్లప్పుడు ప్రకృతి ద్వారా పనిచేయునని మనము దానిని పరిపూర్ణముగా చూడగలము.

మీరు ప్రకృతిని చెరచలేరు. ఈ రోజు సంగతి అదే. మనము సముద్రముల లోనికి బాంబులు విసరుచున్నాము, వాటిని పేల్చుచున్నాము. మరియు వాటి చుట్టు అణుబాంబులు పేల్చుచున్నాము. కేవలము మీరు ఆ చెత్తనంత అందులో పడవేస్తు ఎల్లప్పుడు వాటిని పేల్చుచున్నారు. మీరు చెట్లు నరకుచున్నారు. అందువలన తుఫానులు వచ్చుచున్నవి. నదులకు ఆనకట్ట కట్టుచున్నారు; అది పొంగి పారుచున్నది. మీరు దేవుడు క్రియ చేయు విధానమును కనుగొని దానితో నిలిచియుండవలెను. మనము సంఘములోని ప్రజలను మరియు సంస్థలను మతశాఖగా మర్చియున్నాము; మనము ఏమి కలిగియున్నామో చూడండి! దేవుడు ఏర్పరచిన మార్గములో నిలచియుండుడి.

MATT 5:45

 

29అయితే మీరు చూడండి, మన అంశము వైపునకు తిరుగెదము, "ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును పంపించుచున్నాడు." అంత్యకాలమందు ఇది సూచనగా యుండునని యేసు ఇప్పుడిక్కడ మత్తయి 24లో చెప్పుచున్నాడు. ఇప్పుడు, ఈ సూచన అంత్యకాలమందు మాత్రమే తెలియజేయబడినట్లయితే, అప్పుడు అది ఆ ముద్రలు విప్పబడిన తరువాతనే ఉండును. ఇది చివరి సూచన. ఈ సంగతులు జరుగుచున్నప్పుడు అంత్యకాలమని గ్రహించుడి. మరియు ఇప్పుడిది ఒక సూచన కాబట్టి ఏర్పరచబడినవారు ఈ విషయములో అయోమయముగా ఉండరాదు. దీనిని మీరు చూచారా? కావున, అది బయలుపరచబడవలెను, తేటతెల్లమగువలెను.

30గమనించండి. ఆకాశము నుండి వచ్చిన ఒకే అభిషేకము వలన గోధుమలు మరియు గురుగులు జీవించుచున్నవి. దానిని బట్టి రెండునూ ఆనందించుచున్నవి. ఆ రోజు గ్రిన్స్ విల్ యొద్ద జరిగిన దానిని బట్టి దీనిని మీకు ఎత్తి చూపుచున్నాను. ఆ దర్శనము వచ్చుట నేను చూచాను. మరియు అక్కడ ఒక గొప్ప భూమి యున్నది. దానిని పూర్తిగా దున్నియుండిరి. మరియు అక్కడ మొదట విత్తువాడు బయలు వెళ్ళెను. మీ యెదుట నేను దానిని ఉంచగోరుచున్నాను. మొదట ఏది బయలు వెళ్ళెనో అటు తరువాత దానిని ఏది వెంబడించెనో గమనించండి. తెల్లని వస్త్రము ధరించిన ఒకాయన భూమియంతట విత్తనములు చల్లుచూ వెళ్ళిపోయెను, తరువాత ఆయన వెనుకనే నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వచ్చెను, చాలా నీచమైన స్వభావముగలవాడిగా కనబడెను, ఆయన వెనుకనే తెలియకుండ పోవుచు కొన్ని చెడ్డ విత్తనములు విత్తుచుండెను. మరియు ఇది జరిగిన పిమ్మట నేను రెండు పంటలు పైకి వచ్చుట చూచాను. అవి పైకి యెదిగినప్పుడు, అందులో ఒకటి గోధుమ, మరొకటి గురుగు. మరియు అక్కడ ఒక కరువు వచ్చెను, అప్పుడు అవి రెండును తమ తలలను వంచి వర్షము కొరకు మొరపెట్టినట్లు కనబడెను. అప్పుడక్కడ ఒక గొప్ప మేఘము భూమిని కమ్మి వర్షము కురిసెను. గోధుమ పంట లేచి "ప్రభువుకు స్తోత్రము! ప్రభువుకు స్తోత్రము!" అనెను. ఆలాగే గురుగులును లేచి "ప్రభువుకు స్తోత్రము! ప్రభువుకు స్తోత్రము!" అని కేకలు వేసెను. ఒకే ఫలితము. అంతకు ముందు ఆ రెండూ నశించిపోవుచున్నట్లుండినవి. గోధుమ చెట్లు దాహము గొనెను. గురుగులును దాహముగొనెను. ఎందుకనగా అవి రెండు ఒకే పొలములో యున్నవి. ఒకే పొలములోయున్నవి, ఒకే నీటి ధార క్రింద యున్నవి, అక్కడ గోధుమయు మరియు గురుగులును ఒకే కార్యము కొరకు పైకి లేచెను.

గమనించండి. ఒకే అభిషేకించు నీరు గోధుమను తీసుకొని వచ్చుచున్నది, గురుగును కూడ తీసుకొని వచ్చుచున్నది.

MATT 24:24•

MARK 13:22

 

31సంఘమును అభిషేకించి, ఆత్మలను రక్షించవలెనను కోరికను, అద్భుతములు జరిగించు శక్తిని ఇచ్చు పరిశుద్దాత్మయే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడుచున్నది. అదే ఆత్మ మరో రీతిలో మీరు మత్తయి 24:24ను అర్థము చేసికొనజాలరు. ఆయన చెప్పెను, "అబద్ధ క్రీస్తులు లేచెదరు," అబద్ద అభిషిక్తులు నిజమగు కార్యముతోనే అభిషేకించబడెను, కాని వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులుగా యుందురు. సత్యమును తప్పుగా ఒకడు ఎందువలన బోధించును? ఇప్పుడు మృగము యొక్క ముద్రను కొద్ది నిమిషములలో చూద్దాం, మరియు అది ఒక మతశాఖ అని మీరు చూచెదరు. అబద్ద బోధకులు, అబద్ధముగా అభిషేకించబడెను, అభిషిక్త క్రీస్తులు, కాని అబద్ధ బోధకులు. ఆ విధముగానే మాత్రమే మీరు దానిని చూడగలరు.

32ఇక్కడ కొంతకాలము క్రిందట మీకు దీనిగూర్చి చెప్పాను. దేశమంతటా జనులు వినుచున్నారు గనుక మరల చెప్పెదను. ఒకనాడు నేను ఒక స్నేహితునితో మాట్లాడుచున్నాను. అతనికి నిమ్మతోట యున్నది. అతని తోటలోనున్న ఒక నారింజ చెట్లు ద్రాక్ష పండ్లను కాయుచున్నది. అందులో నిమ్మ, దబ్బకాయ, ఇంకా ఇతర పుల్లని పండ్లు ఉన్నవి. ఆ ఒక్క చెట్టుపైన ఎన్నిరకముల పండ్లున్నవో నేను మరచిపోయాను. అతనిని నేను ఇట్లు అడిగాను, "ఇదెట్లు సాధ్యము" ? "అసలు ఇది ఏ చెట్టు?"

"ఇది అసలు నారింజచెట్టు" అనెను.

"అయితే ద్రాక్షపండును, నిమ్మకాయలు ఎందుకున్నవి?" అనడిగాను.

"అది అంటు కట్టబడినది" అని చెప్పెను.

నేను చెప్పాను, "ఆలాగా, మంచిది, ఇప్పుడు వచ్చే సంవత్సరమున ఆ చెట్టు ఇంకొక కాపును కాయునప్పుడు," అవన్నియు ఒకే సమయమున కాపుకు వచ్చును. నేను అన్నాను, "అప్పుడు అవిన్నియు నారింజకాయులే అది తీసుకొని వచ్చును. అది నారింజ చెట్టయినట్లయితే, అది నారింజ కాయలనే కాయును, కాయదా అండి?"

"కాయదు, అంటుకట్టబడిన ప్రతి కొమ్మ దాని - దాని జాతి ఫలములనే కాయును" అని చెప్పెను.

"అనగా ఆ నారింజ చెట్టులోనున్న నిమ్మకొమ్మ, నిమ్మకాయలే కాయునని నీ అర్థమా?" అని అడిగాను.

"అవునండీ" అని అతను చెప్పెను.

"ఆ నారింజ చెట్టులోనున్న ద్రాక్ష కొమ్మ ద్రాక్షపండునే కాయునా?"

"అవునండీ. ఏ కొమ్మ ఆ కాయనే కాయును" అని అతను చెప్పెను.

"దేవునికి స్తోత్రము!" అని చెప్పాను.

"నీ ఉద్దేశమేమిటి?' అని అతడు నన్నడిగెను.

"మరియొక్క ప్రశ్న. ఇప్పుడు, ఇక ఆ నారింజ చెట్టు ఎన్నడైనా నారింజ కాయలు కాయునా?" అని నేను ప్రశ్నించాను.

"మరో కొమ్మ అందులో నుండి వచ్చినప్పుడు ఆలాగు జరుగును." మరో కొమ్మను అంటు కట్టినప్పుడే అది కాయును అని అతడు చెప్పలేదు గాని, మరో కొమ్మ అందులో నుండి వచ్చినప్పుడే ఆలాగు జరుగును అని చెప్పెను. అయితే అవన్నియు పుల్లని ఫలములే, ఆ పుల్లని చెట్టులోనున్న పుల్లని జీవము వలన అవి జీవించుచున్నవి.

33నేను చెప్పాను, "అక్కడే మీరున్నారు! మెథడిస్టు తిరిగి ప్రతిసారి మెథడిస్తునే పుట్టించును. బాప్టిస్తు తిరిగి ప్రతిసారి బాప్టిస్తునే పుట్టించును. కాథలిక్కు మరల కాథలిక్కునే ప్రతిసారి పుట్టించును. అయితే సజీవ దేవుని సంఘము వేరు నుండి క్రీస్తునే ఉత్పత్తి చేయును. అది గనుక సొంత ద్రాక్ష తీగను తీసుకొని వచ్చినట్లయితే! అది ప్రతిసారి వాక్యమునే ఉత్పత్తి చేయును."

MARK 16:15,17,18

 

34ఇప్పుడు మీరు దానిలోనికి అంటుకట్టగలరు. మీరు చూచారా? ప్రతి ద్రాక్షపండు, నిమ్మకాయ, నారింజకాయ, బత్తాయి కాయ, ఇంకా ఆయా పుల్లని ఫలములన్నియూ ఆ వృక్షపు కొమ్మలుగా జీవించవచ్చును. అయితే ఆ చెట్టు వలననే బ్రతుకుచున్నను, ఆ చెట్టు యొక్క అబద్ధ సాక్ష్యములుగా కాపుకాయుచున్నవి. దానిని మీరు చూచారా? ఆ చెట్టులోనున్న నిజజీవమును ఇవి పీల్చుకొని జీవించుచున్నవి. ఇప్పుడు, అక్కడే మత్తయి 24:24 యున్నది. అదే జీవము ద్వారా బ్రదుకుచున్నది, కాని దాని ప్రారంభము సరియైనది కాదు. అవి చెట్టునకు అబద్ద సాక్షులుగా కాపు కాయుచున్నవి! అది నారింజ చెట్టు గాని పుల్లని జాతికి చెందినది. మరియు "ఈ సంఘము, ఈ మతశాఖ క్రీస్తుకు సాక్షిగా నున్నదని" వారందురు, మరియు తప్పు బాప్తిస్మము పొందియున్నారు. వాక్యమునకు తప్పు సాక్ష్యమిచ్చుచున్నారు. దేవుని యొక్క శక్తి శిష్యులకు మాత్రమేనని చెప్పుటకు ప్రయత్నించుచున్నారు? యేసు తానే ఈలాగు చెప్పెను, "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ప్రతియొక్క చెట్టు దానిని దాని కొమ్మలను తీసుకొనివచ్చును. ఈ సూచక క్రియలు అసలయిన కొమ్మలలో కనబడును." ఎక్కడ? అది చెట్లుగా నున్నంతకాలము, అది కొమ్మలను వేయుచున్నంత కాలము, లోకాంతము వరకు ఫలించును. "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాట్లాడెదరు; సర్పములను ఎత్తిపట్టుకొందురు; విషకరమైనది త్రాగుదురు; రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు బాగుపడుదురు." మనము జీవించుచున్న ఘడియను మీరు చూచారా? యేసు చెప్పినది చూచారా?

JOHN 5:39•

JOHN 14:12

 

35ఇది అంత్యకాలములోనని గుర్తుంచుకొనండి, వెస్లీ కాలము కాదు మరియు మరొక్క కాలములో కాదు. ఇప్పుడు ఇది అంత్యకాలము గనుక ఈలాగు జరుగవలసి యున్నది. ఇప్పుడు లేఖనములను గమనించండి, వాటినే సాక్ష్యము చెప్పనీయండి. "లేఖనములను పరిశోధించుడి, వాటియందు నిత్యజీవముగలదని మీరు తలంచుచున్నారు లేక నమ్ముచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి" అని యేసు చెప్పెను. మరో మాటలలో చెప్పవలెనంటే, ఈ చెట్టు గనుక ఒక కొమ్మను తీసుకొని వచ్చినట్లయితే… "నేను ద్రాక్షావల్లిని, చెట్టు; మీరు తీగెలు; నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయుదురు" అని ఆయన చెప్పెను. (పరి. యోహాను 14:12.)

MATT 7:21•

JOHN 15:5•

COL 2:9•

REV 1:8•

REV 22:16

 

36ఇప్పుడు, "నాయందు ఆదినుండి నిలచియుండువాడు ఫలించును."ఆ కారణము చేతనే యేసు దావీదు సంతతికి వేరు మరియు చిగురునై యున్నాడు. ఆయన దావీదుకంటె ముందే ఉండెను, దావీదులో యుండెను. మరియు దావీదు తరువాత ఉండెను. దావీదు యొక్క వేరు మరియు చిగురు రెండును ఆయనే. వేకువ చుక్క, షారోను పూవు, లోయలోని పద్మము, అల్ఫా మరియు ఒమేగా; తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. "దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఆయన యందు నివసించుచున్నది." దావీదు యొక్క వేరు మరియు చిగురు! "ఎన్నుకొనిన జీవము, ముందు నిర్ణయించబడిన జీవము కలిగిన వాడే నాలో యుండును. (ఆయనే వాక్యము, ఆదినుండి యున్నవాడు), ఆయన వచ్చినప్పుడు, నా ఫలములను ఫలించును." పరి. యోహాను 14:12. దాని ద్వారానే జీవించువారు మరికొందరున్నారు. వారు తాము క్రైస్తవులమనియు, విశ్వాసులమనియు చెప్పుకొందురు. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలచు వారందరు ప్రవేశించరు."

ఇప్పుడు, దేవుని యొక్క మర్మములన్నియు సమాప్తమగునపుడు, చివరి దినములలో ఇది జరుగవలెను మరియు బయలుపరచబడవలెను. తేటతెల్లమగును. (మరికొద్ది సేపటి తరువాత చూడబోవుచున్నాము).

MATT 16:13,16-18•

MARK 8:27,29•

LUKE 9:18,20•

HEB 11:4

 

37ఇవి నిజ ద్రాక్షావల్లి మరియు కారు ద్రాక్షావల్లి అని చెప్పవచ్చును… అవి ఎట్లు పెరిగియున్నవో ఎన్నో సంవత్సరముల క్రితము నేను బోధించుట మీరు వినియుండవచ్చు. కయీను మరియు హేబెలులు ఆలాంటి వారేనని వివరించాను. బలిపీఠమునొద్ద ఆ రెండు ద్రాక్షావళ్ళులు కలిసికొనెను. ఇద్దరూ మతభక్తిగలవారే, ఇద్దరు అభిషేకం పొందిరి, ఇద్దరూ జీవమును ఆశించిరి మరియు ఒకే దేవుని ఆరాధించిరి. ఒకరు విసర్జించబడిరి మరియు మరొకరు స్వీకరించబడిరి. స్వీకరించబడినవాడు తన సహోదరుడికి వ్యత్యాసముగా ఎదైన చేసినాడంటే, అది మాత్రమే మార్గమైయున్నది, అది అతనికి బయలుపరచబడెను గనుక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, "విశ్వాసమును బట్టి" (హెబ్రీ 11వ అధ్యాయము)… "విశ్వాసమును బట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించెనని, అతడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యమిచ్చెను."

ఆయన ఏమైయున్నాడో యొక్క ఆత్మీయ ప్రత్యక్షత అని యేసు చెప్పెను! "మనుష్యకుమారుడైన నన్ను గూర్చి జనులు ఎవరని చెప్పు

కొనుచున్నారు?"

"నీవు క్రీస్తువు. సజీవ దేవుని కుమారునివి" అని పేతురు చెప్పెను.

"యోనా కుమారుడవగు సీమోనూ, నీవు ధన్యుడవు. రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. ఈ బండమీద నా సంఘమును కట్టుదును? ఏమిటి? వాక్యము యొక్క నిజప్రత్యక్షత, అక్కడ మరలా నిజ ద్రాక్షావల్లియున్నది. "హేబెలు, విశ్వాసము ద్వారా…"

"అది ప్రత్యక్షత కాదు" అని నీవనవచ్చు.

38విశ్వాసమనగా ఏమిటి? విశ్వాసమనగా ఏదో నీకు బయలుపరచబడినది. ఇంకా అది లేదు గాని ఉండునని నమ్ముచున్నావు. దేవుని చిత్తము యొక్క ప్రత్యక్షతయే విశ్వాసము. కాబట్టి, ప్రత్యక్షత ద్వారానే!

మరియు ఈనాడు సంఘములు ఆత్మీయ ప్రత్యక్షతను కూడ నమ్ముట లేదు. వారు ఏదో సంస్థ యొక్క హేతుబోధను నమ్ముచున్నారు. "ప్రత్యక్షత ద్వారా హేబెలు కయీను కంటె శ్రేష్టమగు బలిని అర్పించి నీతిమంతునిగా తీర్చబడెనని దేవుడు సాక్ష్యమిచ్చెను." ఆమేన్! మీరది గ్రహించారనుకొనుచున్నాను. మనమెక్కడ జీవించుచున్నామో చూచారా, ఆ ఘడియను మీరు చూచారా?

కొంతకాలము క్రిందట ఒక పెద్ద మనిషితో నేను మాట్లాడుచున్నాను. మరియు ఆయన ఒక క్రైస్తవ పండితుడు, "మేము అన్ని ప్రత్యక్షతలను తిరస్కరించుదుము బ్రన్హా౦," అని అతడు అనెను.

JOHN 8:24

 

39"అయితే మీరు యేసుక్రీస్తును తిరస్కరించవలెను, ఎందుకనగా ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు శరీరమందు బయలుపరచబడెను" అని చెప్పాను. దానిని నీవు చూడనిచో, నీవు నశించినట్లే. "నేనే ఆయననని మీరు నమ్మనియెడల మీరు మీ పాపములోనే చనిపోయెదరు" అని యేసు చెప్పెను. ఆయనే దేవుని ప్రత్యక్షత. దేవుని ఆత్మ మానవ రూపములో ప్రత్యక్షమాయెను. దానిని వీవు నమ్మజాలనియెడల నీవు నశించెదవు. నీవాయనను మూడవవానిగా, రెండవవానిగా, దేవునిగా కాకుండా మరో వ్యక్తివిగా నీవాయనను చేయుచున్నావు, నీవు నశించినట్లే. "నేనే ఆయననని మీరు నమ్మనిచో, మీరు మీ పాపములోనే నశించెదరు." ఒక ప్రత్యక్షత!

JOHN 6:37,44

 

40వారాయనను చూడలేకపోవుటలో ఆశ్చర్యము లేదు. "ఒకనిని నా తండ్రి ఆకర్షించినప్పుడే నా యొద్దకు వచ్చును. తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." వారు వేరులో నున్నారు. "నా యొద్దకు వత్తురు." చూచారా, అది మీరు గమనించారా? ఓ! ఆయనను ఎంతగా మనము ప్రేమించవలెను! ఎంతగా గౌరవించవలెను! ఎంతగా స్తుతించవలెను! చివరి దినములలో ఆత్మఫలమును చూచినప్పుడు మరియు వధువు వృక్షము పరిపక్వమగు కొలము వచ్చుచున్నది.

MATT 7:20•

MATT 24:24•

MARK 13:22•

HEB 13:8

 

41మంచి ద్రాక్ష మరియు కారు ద్రాక్ష, రెండూ ఒకే అభిషేకమును కలిగియున్నవి. ఆ రెంటి మీద నీరు పడినది. "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చును" అని ఆయన చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు.

గమనించండి. ఆ రెండూ ఒకే విధముగా కనిపించును. ఆ రెండూ ఒకే విధంగా అభిషేకము పొందెను. అయితే గమనించండి, వాటిని ఏలాగు తెలిసికొందురు? "వాటి ఫలము ద్వారా …. అది నారింజ కాదని మికేలాగు తెలియును? ఎందుకనగా అది ద్రాక్ష పండ్లు కాయుచున్నది. ఆ తీగ సరియైనదే; అది చెట్టులోనే జీవించుచున్నది; కాని అది ద్రాక్షపండ్లు కాయుచున్నది. అది మొదటి దానివలే లేదు. మరియు "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని" వారు నమ్ముచున్నారని ఒక సంఘము చెప్పుచున్నట్లయితే, మరియు ఆయన శక్తిని, ఆయన క్రియలను, ఆయన వాక్యమును త్రోసివేయుచున్నట్లయితే… అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు సంఘము యేసుక్రీస్తు క్రియలను చేయును. యేసుక్రీస్తు జీవమును అది కలిగియుండును. లేనియెడల… దానిలోనికి ఎంత జీవము పోయబడిననూ ఫలితము లేదు. ఆదినుండియు అది వేరులో స్థానము నిర్ణయించబడినదయినచో, అది నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్న యేసులో నిర్ణయించబడినదయినచో అది నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్న యేసుక్రీస్తునే ఫలించును. ఆ వేరు ద్వారా వాక్యము రావలెను. ఆయననే ఆ వేరు, కాలమునకు ఆది.

MATT 7:20

 

42గమనించండి. అయితే దాని ఫలమును బట్టి దాని తేడాను మీకు చెప్పుచున్నది. "వారి ఫలమును బట్టి వారిని మీరు తెలిసికొందురు" అని యేసు చెప్పెను. "మనుష్యులు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను వెదకరు." ద్రాక్షా తోటలో ముండు పొదలుండవచ్చును. అది సాధ్యము కావచ్చు, కాని ఫలముబట్టి అది తెలియును. ఫలము అనగా ఏమిటి? ఆ సమయమునకు తగిన వాక్యము… కాలమునకు తగిన ఫలము; అది అదే అయి యున్నది: వారి బోధ. దేని గురించిన బోధ? కాలము యొక్క బోధ, ఇది ఏ సమయము: మనుష్యుని సిద్ధాంతము, మతశాఖ సిద్ధాంతము, లేదా సమయమునకు తగిన దేవుని వాక్యము.

ఇప్పుడు, సమయము బహు త్వరగా వెళ్ళిపోవుచున్నది… దాని పై ఎక్కువ సేపు ఉండవచ్చును, అయితే మీరు ఇక్కడ ఉన్నారు, మరియు మీరు దూర ప్రాంతముల నుండి వచ్చినవారు అని నేను ఎరుగుదును, నేను ఏమి చెప్పుచున్నానో మీరు చూడగలరు, ఎందుకనగా దాని పై గడుపుటకు మనకు కావలసినంత సమయము లేదు.

MATT 24:24•

MARK 13:22

 

43అనీతిమంతులగు అబద్ధ బోధకుల మీదను అభిషేకము వచ్చునని మీరు గ్రహించగలరు. దేవుడు దేనిని చేయవద్దని చెప్పునో సరిగ్గా దానినే వారు చేయుటకు వెళ్ళెదరు; అయితే వారు అది ఏది ఏమైనప్పటికిని చేయుదురు. ఎందువలన? అది వారి వశములో లేదు. ఒక ముండ్ల పొద ముండ్ల పొదగా కాక మరిదేనిగా యుండును? ఎంత మంచి వర్షము దాని మీద పడినాగాని అది ముండ్ల పొదయే అగును. అందుకే యేసు ఇట్లనెను, "సాధ్యమైనచో ఏర్పరచబడిన వారిని సహితము వారు మోసపుచ్చుటకు చాలా దగ్గరగా యుందురు," (వేరులోయున్న వారిని కూడా), సాధ్యమైతే. కాని అది సాధ్యము కాదు. ఒక గోధుమ చెట్లు గోధుమలను గాక మరి దేనినీ కాయదు; అది మాత్రమే కాయును.

44గమనించండి. దేవుడు సంస్థకు కారకుడు కాదని గుర్తుంచుకొనండి. అపవాదియే సంస్థకు మూలము. వాక్యమును నలువైపులా చూపించి దానిని మీకు రుజవు చేశాను. ఈ ఉదయమున మన అంశము అది కాదు. దేవుడు ఒక సంస్థను చేయుటకు అ విధముగా సంస్థాపకమైన జనులుగా ఐక్యపరచుడని మనకు తెలియును. చివరి శిష్యుడు చనిపోయిన కొన్ని వందల సంవత్సరముల తరువాత మొదటి సంస్థ ఏర్పడినది. అది ఎప్పుడూ తప్పిపోవుటయే మనము చూతుము. అది ఆలాగు కానియెడల మెథడిస్తు, బాప్టిస్తు, ప్రెస్బిటేరియను, కాథలిక్కు మొదలగు మనమందరము ఈ రోజు ఒక దగ్గర ప్రేమలో ఎందుకు కలిసిలేము? దేవుని క్రియలు మనలను ఎందుకు వెంబడించుట లేదు? ప్రతి సంఘము అదే కార్యమైన వాక్యముపై యున్నట్లయితే, దేవుని క్రియలు ఎందుకు వెంబడించుట లేదు? ఆ కార్యములే మనుష్యుని వేరుచేయును. సోదర భావమును వేరుచేయును. మనము ము౦దెన్నడు లేనంతగా దేవునికి దూరముగా నున్నాము. సంఘముల గూర్చి మాట్లాడుచున్నాము

1COR 10:11

 

45ఇప్పుడు, "జరిగిన సంగతులన్నియూ మనకు బుద్ధి చెప్పుటకు, పాఠములుగా, దృష్టాంతములుగా యున్నవి" అని మనకు చెప్పెను. పాత నిబంధనలో జరిగిన ఆ పాత సంగతులు క్రొత్త నిబంధనలోని వున్న దినములో జరుగు వాటికి ముందు ఛాయగానున్నవి. నీవు ఎన్నడు నీ చేయి చూడనట్లయితే మరియు నా చెయ్యి వెలుగు యొద్ద యుండినప్పుడు, నీవు గోడపైకి చూచినప్పుడు, నీవు ఒక ఛాయను చూచెదవు. ఛాయలో (నెగిటివ్) దానికి అయిదు వ్రేళ్ళు కలిగియున్నట్లయితే, నీ నిజస్వరూపగాయున్న (పాజిటివ్) నీ చెయ్యిని నీడ వైపునకు ఛాయను తీసుకొని వెళ్ళితే, దానికి కూడ అయిదు వ్రేళ్ళు కలిగి యుండవలెను. బైబిల్ చెప్పిన విధముగా, రాబోవు వాటికి, పాత నిభందన ఒక ఛాయగా, ఒక మాదిరి. ఉన్నవాటికి కాదు, కాని అది ఒక ఛాయ — ఒక మాదిరి — రాబోవు వాటికీ.

ROM 3:4

 

46ఇటువంటిది ఎన్నడైనా మరే యుగములోనయినా జరిగినదో మనము వెనుకకు వెళ్లి చూద్దాం. మీరు ఇష్టపడుచున్నారా? కాబట్టి దీనిని మనము వెనుకా మరియు ముందు ఒక మానవుని ఉద్దేశ్యము లేదా ఎదో సిద్ధాంతము బట్టి రుజవుచేయము గాని వాక్యము ద్వారానే రుజము చేయుదుమని మనము యొరుగుదుము. నేనయినా లేదా ఎంతటి గొప్ప వ్యక్తి అయినా కావచ్చు అతను ఎవరైనా కావచ్చు నేను లెక్క చేయను, "అతను గనుక ధర్మశాస్త్ర ప్రకారముగాను మరియు ప్రవక్తల మూలముగాను మాట్లాడనియెడల అతనిలో వెలుగు లేదు," చూచారా. పరిశుద్ధ గ్రంథము ఆలాగు చెప్పుచున్నది "ప్రతి మనుష్యుని మాట అభద్దము మరియు నా మాట సత్యముగానుండును గాక," అతను ఎవరైన కావచ్చు.

AMOS 3:7

 

47మనకు ఉదాహరణగా చూపించుటకు ఇది ఎప్పుడైన జరిగినేమో మనము ఇప్పుడు వెనక్కు వెళ్ళి కనుగొందాము. ఇప్పుడు మనము నిర్గమకాండము యొక్క పుస్తకములోనికి వెళ్ళి మోషేయను పేర్లు గల పాత్రను గూర్చి మాట్లాడుకొందము. అతడు అభిషేకించబడి దేవునిచే పంపబడెను. అతని తరము కొరకు అతను దేవుని యొక్క వాక్యముతో మరియు దేవుని యొక్క చిత్త ప్రకారము పంపబడెను. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిరంతరాయముగా కొనసాగును. ఆయన చెప్పెను, "ఆయన మొదటగా తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏదియూ చేయడు," అప్పుడు ఆయన దానిని చేయును.

ఇప్పుడు, ఆయన అబద్దమాడజాలడు. అబద్దమాడి ఆయన దేవునిగా ఉండజాలడు. లేదండీ! ఆయన సత్యవంతునిగా నిలిచి యుండవలసినదే. ఆయనలో ఒక అబద్దమూ లేదు. ఆయన మరియు ఆయన దానిని మార్చజాలడు. ఆలాగు మార్చిన యెడల అప్పుడాయన దేవుడు కాడు; ఆయన తప్పు చేసెను. ఆయన అనంతుడిగా యుండవలెను. మరియు అనంతుడు తప్పు చేయజాలడు, చూచారా. కావున దేవుడేది చెప్పినా గాని అది నిత్య సత్యము, చూచారా. మరియు ఆయన దానిని వాగ్దానము చేసెను. కాబట్టి, గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా నీవు శేషము కనుగొనలేవు.

GEN 15:13

 

48ఇప్పుడు, అబ్రహాము యొక్క సంతానము ఒక అన్యదేశములో నాలుగు వందల సంవత్సరములుండునని, తరువాత ఆయన ఒక బలిష్టమగు బాహువు చేత వారిని బయటకు తెచ్చుదుననియు, వారు నివసించుచున్న జనుల మధ్య అద్భుతకార్యములు, ఆశ్చర్యక్రియలు చూపించుదునని దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసెను. ఆ వాగ్దాన కాలము సమీపించెను. దానిగూర్చి జనులు మరచిపోయిరి. వారికి పరిస్యయులు, సద్దూకయ్యులు మరియు మొదలగు మతశాఖలున్నవి; అయితే ఆకస్మాత్తుగా, దేవుడు ఒంటరిగా అక్కడకు వచ్చి మరియు వారిలోనుండి, వారికి దూరముగా బయటకు తీసుకొని వచ్చెను. దేవుడు ఎన్నడూ, ఎనాడయినా లేక ఏ సమయములోను ఒక మతశాఖలో నుండి ఒక ప్రవక్తను పిలుచుట ఎప్పుడూ చేయలేదు. లేదండీ! అతను మతశాఖతో చాలా పెనవేసికొనియుండును. అతను దానిని చేయజాలడు. అతను ఆ మతశాఖతోనే నిలిచియుండవలెను.

NUM 24:5,8,9

 

49మోషే, దేవుని ద్వారా మరియు దేవుని వాక్యముతో పంపించబడిన ఒక మనుష్యుడు. మరియు ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమికి దేవుని ఆజ్ఞవలన యాత్రలో నడిపించుచుండగా, అతను మరియొక్క ప్రవక్తను కలిసెను. మోషే మీద ఉండిన అదే పరిశుద్దాత్మ యొక్క నిజమగు అభిషేకము ఆ మరియొక్క అభిషిక్తుని మీదనూ ఉండెను. అది నిజము. అతడునూ ఒక ప్రవక్త. పరిశుద్దాత్మ ఈ వ్యక్తి మీద యు౦డెను. అతను పేరు బిలాము. మనందరికీ అతని గూర్చి తెలియును. సరే, దాదాపు ఇరవై-ఎనిమిది వందల సంవత్సరముల క్రితం అతడు చెప్పిన సంగతులు ఇంకా నెరవేరుచున్నవి. "ఓ ఇశ్రాయేలు, నీవు ఒక కొమ్ముగల యొక మృగమువలె యున్నావు. నిన్ను దీవించినవాడు దీవించబడును; నిన్ను శపించువాడు శపించబడును. నీ బలము మరియు నీ శక్తి ఎంత గొప్పది! యాకోబు గుడారములలో నివసించువారు ఎంత నీతిమంతులు." చూడండి, అతడు చెప్పవలెనని తలంచకుండానే చెప్పెను. అతడు ప్రజలను శపించవలెనని హృదయమందు ఉద్దేశించుకొని అక్కడకు వచ్చెను.

50ఓ! అబద్ధ బోధకులైన మీరు, ఈ టేపులను ఎన్నో సంవత్సరముల నుండి వినుచున్నారు, మరియు దేవుడు చెప్పినది అక్షరాలా దేవుడు నిరూపించుట చూచుచున్నారు మరియు అది సత్యము అని దీనిని అధ్యయనము చేయుచున్న మీరెరుగుదురు; మరియు మీ మతశాఖల విబేధముల వలన, మీరు తర్కించి, మీ జనులకు అది ఆలాగు కాదని చెప్పుచున్నారు. మీకు శ్రమ! మీ సమయము ముగింపునకు వచ్చినది.

2PET 2:15

 

51మోషే మీదనున్న అదే ఆత్మతో బిలాము అభిషేకించబడెను. బేధమెక్కడ? మోషే యొక్క బోధ ఖచ్చితముగా ఉన్నది. రెండవ పేతురులోని యిక్కడ పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, అది బిలాము యొక్క బోధను ఆ ఇశ్రాయేలు చేర్చుకొనెను. దానిని దేవుడెన్నడూ క్షమించలేదు. క్షమించబడని పాపము! వారు దేవుని యొక్క ఆశీర్వాదముల క్రింద బయటకు వచ్చిననూ మరియు ఆ శక్తిగల ప్రవక్త ద్వారా దేవుని హస్తము కదులుట చూచిననూ మరియు అది అక్షరాలా దేవునిచే నిరూపించబడుట చూచిననూ, వారందరిలో ఒక్కడయిననూ రక్షించబడలేదు. మరియు కారణము, మరియొక ప్రవక్త ఒక వ్యతిరేక బోధతో వచ్చి, మోషేతో తర్కించి మరియు మోషే తప్పుయని జనులకు నిరూపించుటకు ప్రయత్నించెను. దాతాను, కోరహు మరియు వారిలో చాలామంది అతనితో ఏకీభవించి మరియు ఇశ్రాయేలు యొక్క పిల్లలను జారత్వము చేయుటకు బోధించిరి. "మనమందరమూ ఒక్కటే" అని అతని సంఘ సంస్థల వైపునకు వెళ్ళెదమని బోధించిరి. "మనము మెథడిస్తులమైనా, బాప్టిస్తులమైనా, ప్రెస్బిటేరియనులమైనా, లేక పెంతెకోస్తులమైన మరియు ఇంకేమైననూ, మనమంతా ఒక్కటే." మనమంతా ఒకటి కాదు! మీరు ప్రత్యేకించబడినవారు, ప్రభువుకు పరిశుద్ధ జనాంగముగానున్నారు. ఈ దినపు ఆయన వాగ్దాన ఫలమును ఫలించుటకు వాక్యమునకు, ఆయనాత్మకు అంకితమయినవారు. మీరు వారిలోని వారు కారు!

ఇది చాలా కఠినమగు మాట అని నాకు తెలియును. ఏమయినా గాని అది సత్యము. ఈ చివరి దినములలో ఆయనను సేవించుటకు సమర్పించబడినవారు మీరు! వారి మధ్య నుండి బయటికి రండి.

MATT 24:24

 

52ఇప్పుడు, "అది బిలామ యొక్క బోధ," బిలామ యొక్క ప్రవచనము కాదు. అది సరియై, అది దేవుడైయున్నది. ఎంతమంది దానిని నమ్ముచున్నారు? బిలాము యొక్క ప్రవచనము ఖచ్చితముగా నిజము, ఎందుకనగా అది తప్ప వేరొకటి అతను పలుకలేకపోయెను. దేవుని అభిషేకము వేరొక దానిని పలుకలేకపోయెను. మరియు దేవుడు దానిని సత్యమని రుజవు చేయుట ద్వారా తెలియజేసెను. అయితే అది బిలాము యొక్క బోధ అయి యున్నది. ఇప్పుడు దానిని మత్తయి 24:24 తో పోల్చి చూడండి.

అభిషేకించబడిరి గాని వారిది అబద్ధ బోధ త్రిత్వములు ఇంకా ఏవేవో క్రీస్తువిరోధి బోధలు బోధించుచున్నారు! మీరెవరూ తప్పుగా భావించుట లేదని నేను తలంచుచున్నాను. ఫోనులు ఆపు చేయవద్దు, లేచి బయటకు పోవద్దు. నిశ్శబ్దముగా కూర్చోండి, పరిశుద్దాత్మ దానిని మనకు బయలుపరచి దానిని నిరూపించుట మనము చూద్దాం. మీరు దేనిని నమ్ముచున్నాగాని కూర్చోని వినండి. మీ హృదయములను తెరువమని దేవుని అడగండి. మీరు ముండ్లపొదగా యున్నారో, లేక గోధుమగా నున్నారో, లేక ఎక్కడ మీరు నిలుచుచున్నారో మీరు కనుగొనండి, చూచారా.

MARK 13:22•

JOHN 13:27

 

53ఇప్పుడు శిక్ష కొరకు యూదా కూడా ముందుగా అభిషేకి౦చబడెను. యేసు ఎదుట కూర్చొనెను. మరియు "నీవే ఆ వ్యక్తివి! నీవు ఏదైతే చేయబోవుచున్నావో మరియు నీవు ఏదైతే చేయవలసియున్నదో, వెళ్ళి త్వరగా చేయుము" అని యేసు అతనితో చెప్పెను. అతడు చేయునది ఆయనెరుగును. ముప్పది వెండి నాణములు మరియు పేరు, కీర్తి కొరకు ప్రభువైన యేసుక్రీస్తును అమ్మివేసెను. ఆయన శిష్యులలో ఒకడు, సంఘకోశాధికారి. అతడు తన స్నేహితుడని యేసు పిలచెను, చూచారా. పరిశుద్ధ గ్రంథము చెప్పెను, "అతడు నాశన పుత్రునిగా జన్మించెను," యేసు దేవుని కుమారునిగా జన్మించిన రీతిగానే. "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయుటకు."

MATT 24:24•

MARK 13:22

 

54మనము అధ్యయనము చేయుచుండగా దానిని జాగ్రత్తగా గమనించండి. రాజుల గ్రంథములోయున్న మరియొక ఉదాహరణను మనము తీసికొందము. మీకాయా అను ఒక ప్రవక్త యుండెను. అతడు ఇమ్లా యొక్క కుమారుడు. మరియు అతడు ఒక ప్రవక్త అతను ప్రవక్తే మరియొక ప్రవక్త అచ్చటుండెను. అతడు ఒక అభిషిక్తులకు, ప్రవక్తల యొక్క సంస్థకు అధిపతి. వారు "ప్రవక్తలని" పరిశుద్ధ గ్రంథము చెప్పెను. బిలామును కూడా ప్రవక్త అని పిలిచినట్లే అది యున్నది. మరియు మికాయా అను పేరుగల ఒకడు వారిలోనుండెను. అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు మరియు దేవుని వాక్యము చేత, దేవుని వలన పంపబడిన వాడు. సీద్కియా అను ఒకడు కూడా తాను దేవుని వలన పంపబడినట్లు అనుకొనెను. అతడు దేవునిచే అభిషేకము పొందినవాడు, కాని అతని బోధ దేవుని వాక్యమునకు విరోధము. "అబద్ధ క్రీస్తులు లేచి గొప్ప సూచక క్రియలు చూపించి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చెదరు."

1KGS 21:19,23•

2KGS 9:37

 

55గమనించండి, వారిద్దరును అభిషేకించబడిరి. అయితే వారిలో ఎవరు అబద్ధికులో, ఎవరు సరియైన వారో ఎట్లు చెప్పగలరు? అహాబునకు వాక్యము ఏమి వాగ్దానము చేసెనో గమనించండి. అతనికి ముందున్న ప్రవక్తయగు ఏలియా ఆ కాలములోని గొప్ప ప్రవక్తలలో ఒకడు. నిరూపించబడిన ఒక ప్రవక్త, ఆ రుజవు చేయబడిన ప్రవక్త ఈలాగు చెప్పెను, "ఆహాబు జరిగించిన చెడు వలన కుక్కలు అతని రక్తము నాకును. నాబోతు యొక్క ప్రాణమును తీసెను. మరియు ఆ కుక్కలు యేజెబెలు శరీరము తినును. ఆమె దేహము పొలములో పెంటగా నుండును." ఇప్పుడు దేవుడు శపించిన దానిని నీవు ఎట్లు ఆశీర్వదించగలవు? ఆలాగే బిలాము చెప్పినట్లుగా, దేవుడు దీవించిన దానిని నీవు ఎట్లు శపించగలవు? చూచారా. అయితే ఈ ప్రవక్తలు యధార్థవంతులు. వారు నిస్సందేహముగా మంచివారు మరియు గౌరవనీయులు. ఇశ్రాయేలులో నీవు ప్రవక్తగా ఉండవలెనన్నచో లేక ఒక ఇశ్రాయేలీయుడిగా ఉండవలెనన్నచో, ఘనత వహించవలసి యుండవలెను. లేనియెడల రాళ్ళతో కొట్టి చంపుదురు. వారు ఘనతవహించినవారు. వారు తెలివిగలవారు. వారు విద్యావ౦తులు. వారు రాజ్యాధిపతియగు ఆహాబుచే ఎన్నుకోబడిరి. (రైట్ సాహోదరి దానిని చూచావా?) దేశపు ఎన్నిక, చక్కగా సరిపోయేవారు .

56మరియు ఇప్పుడు మీకాయా తన దర్శనమును చూచినప్పుడు వాక్యము ఏమి చెప్పుచున్నదో తన హృదయములో ఎరిగియుండెను, కాని అతినిలోనున్న ఆత్మ ఏమి చెప్పునో చూడగోరెను. కనుక వారతనితో ఇట్లనిరి, "నీవు ఇతర ప్రవక్తలు చెప్పినట్లే చెప్పుము. నీవాలాగు చేసినయెడల నిన్ను మరలా మా సహవాసములోనికి చేర్చుకొందుము. సందేహమక్కరలేదు." చూచారా? "నిన్ను మాలో ఒకనిగా చేయుదుము. మా మతఖలోనికి నిన్ను మరల తీసికొందుము. నీవు ప్రవక్తవని మాకు తెలియును, కాని వీవు ఎప్పుడూ శాపవచనములే పలుకుదువు. నీవు ఎప్పుడూ ఆహాబును శపించెదవు. ఇప్పుడు ప్రధాన ప్రవక్తయగు సిద్కియా ఆహాబును దీవించి వెళ్ళమని సెలవిచ్చెను. ఇమర్గా కుమారుడా నీవును ఆలాగే పలుకుము ఎందుకు, అసలే నీవు పేదవాడవు; నీకు అసలే జనులు లేరు, ఏమీ లేదు. మరియు వీరికి మిలియనులున్నవి. దేశమంతా వారి పక్షమున ఉన్నది. కనుక వారు చెప్పినదే నీవును చెప్పుము. ఆలాగే చేయుము. నీవును దేశములో ధనికునిగా ఉందువు." అక్కడ తప్పుడు వ్యక్తితో అతను మాట్లాడుచున్నాడు!

57"మీకాయా, నీకు సిద్కియాలో పొరపాటు ఏదయినా కనబడినదా?" అని ఈలాగు చెప్పినట్లయితే ఏమగును?

"లేదు."

"అతడు పాపము చేయుచున్నప్పుడు నీవెన్నడైన పట్టుకొంటివా?"

"లేదు."

"అతడెవరినైనా శపించుట విన్నావా?"

"లేదు."

అతడు త్రాగియుండుట నీవు చూచావా?

"లేదు."

"అతను విద్య తక్కువ వాడా?"

"లేదు."

"అతని డాక్టరు డిగ్రీ అసలయినది కాదనుకొనుచున్నావా?"

"లేదు"

అతని పి.హెచ్.డి సరియైనదని నీవు నమ్ముచున్నావా?"

"నిశ్చయంగా!" "సనైడ్రిను ఆలోచన సభ అతనిని అమోదించినది" అని చెప్పును.

"మంచిది, అయితే ఎందుకు నీవు అతనితో చేరవు?"

"అతడు వాక్యము నుండి తొలగిపోయెను గనుక!"

"మంచిది, అయితే మనము ఒక బలపరీక్షను కలిగియుందుము."

అంతకు ముందున్న ఏలియూ ప్రవక్తవలెనె వారందరునూ బహిరంగముగా నిరూపించుకొనిరి. నీవు దేవుని బిడ్డవైనచో నీవు ఈ బైబిలు యొక్క ప్రవక్తతో నిలచియుందువు. అది వాక్యము.

ఈ ఘడియను, కాలమును గమనించండి.

1KGS 22:14•

2CH 18:13

 

58మంచిది, "ఓ! ఆ ప్రవక్త చెప్పినది నాకు తెలియును, కాని అది మరియొక తరమునకు చెందినది. అది ఎప్పుడో రాబోవు కాలమునకు చెందినది" అని సిద్కియా ఈలాగు పలికినచో ఎట్లు౦డును?

"నేను దేవునియొద్ద నుండి దర్శనము చూచువరకు వేచియుండుము. ఆ తరువాత నేను చెప్పెదను" అని ఇతడనెను.

"నీవును అదే చెప్పెదవు" అన్నాడు.

"నేను దేవుడు చెప్పినదే చెప్పెదను. అంతకంటె ఎక్కువగా ఏదియూ చెప్పను. దానికి ఒక్క మాట కలుపలేను లేక దానినుండి ఒక్క మాట తీసివేయలేను" అని ఇతడనెను. కాబట్టి ఆ రాత్రి దర్శనమందు ప్రభువు ప్రత్యక్షమాయెను. మరుసటి ఉదయము అక్కడికి వెళ్ళెను. అతను చెప్పెను, "అక్కడ…"

ఇద్దరు ప్రవక్తలు అక్కడ ఉండిరి!

59దేశములో చాలా గొప్పవాడిగా పిలువబడుచున్నాడు. దేశ దృష్టిలో, సైనిక దృష్టిలో సిద్కియా గొప్పవాడు. రాజు ద్వారా అతడు ప్రవక్తలకు ప్రధానుడుగా నియమించబడెను. సంస్థలోనున్న ఇతర ప్రవక్తలందరికి ఇతడు ప్రధానుడు. బహుశా అతడు మంచి విద్య మంచి అర్హతలు పొందినవాడై యుండెను. గనుకనే ప్రవక్తలకు ప్రధాన పదవిని పొందెను. మరియు అతడు పరిశుద్దాత్మచే అభిషేకించబడెను, ఎందుకనగా అతడు ప్రవక్తగా పిలువబడెను. నిశ్చయంగా, అతడు ఒక సామాన్య ప్రవక్త కాడు గాని హెబ్రీ ప్రవక్త. ఇప్పుడతనిని గమనించండి.

NUM 23:1•

1KGS 22:11•

2CH 18:10

 

60సిద్కియా ఇట్లనెను, "ప్రభువు నాతో మాట్లాడెను, గనుక అందుకు గురుతుగా రెండు ఇనుప కొమ్ములు నాకు తయారు చేయుడి." ఒక ప్రవక్త సాధారణముగా గుర్తులను యిచ్చును. "అతడు చెప్పెను రెండు ఇనుప కొమ్ములు తయారు చేయుడి పరిశుద్దాత్మ నాకు చెప్పెను, "వీటిని తీసుకొనుము, అభిషేకము నన్ను దీవించెను." (అది ఒక బలియర్పణగా తలంచకండి, కాని అసలైన విషయమునకు వెళ్ళుదము.) భాషల ద్వారా నాతో మాట్లాడుచున్న పరిశుద్దాత్మయే దీనిని నాకు బయలుపరచెను. అతను చెప్పెను, "ఈ కొమ్ములను తీసికొనుము మరియు ఈ కొమ్ముల ద్వారా ఆ సిరియూ రాజును పారద్రోలుదువని రాజుతో చెప్పమని నాకు ఆజ్ఞాపించెను. సంఘమగు ఇశ్రాయేలునకు చట్టరీత్యా చెందవలసిన భూమిని అతనికి తిరిగి ఇచ్చెదనని ఆయన నాతో చెప్పెను." సోదరుడా, బిలాము యిక్కడ యున్న రీతిగానే అది చక్కని ప్రధానమైనదిగా యున్నది.

మోషే మాట్లాడినట్లుగానే బిలాము కూడ మూలాధారముగానే మాట్లాడుచుండెను. దేవుని యొక్క సరియైన సంఖ్య ఏడు. బిలాము ఇట్లనెను, "నాకు ఏడు బలిపీఠములు కట్టుము. ఏడు పవిత్ర బలులను తీసికొని రావలెను. ఎద్దులు మరియు ఏడు పొట్టేళ్ళు తేవలెను." రానున్న దేవుని కుమారుడికి అవి గురుతు. మూలాధారముగా, అతడును వారందరివలె సరియైన రీతిగానే యున్నాడు.

61మరియు సిద్కియా కూడా ఇక్కడ మూలాధారముగా ఖచ్చితమును కలిగియున్నాడు. "ఈ దేశము మనకు చెందినది. ఆ సిరియనులు, ఫిలిష్తియులు తమ కడుపు నింపుకొనుచున్నారు. మన పిల్లలకు తిండిలేదు గాని మన శత్రువారియొక్క పిల్లలు భుజించుచున్నారు! దేవుడు ఈ భూమి మనకిచ్చెను!" సోదరుడా, అది మంచి వాదము. ఇశ్రాయేలు ఎదుట ఎలుగెత్తి దానిని అతడు చెప్పగలడు. వారు తమ శక్తి అంతటితో చాటించగలరు. నేను నేటిగూర్చి ఇప్పుడు మాట్లాడుచున్నాను; మీరు నన్ను వెంబడించుచున్నారని నమ్ముచున్నాను. కేకలు మరియు అరుపులు వినబడినది!

62గత ఆదివారము దావీదు గూర్చి చెప్పినది మీకు గుర్తున్నదా? బయట రేడియోల ద్వారా, టెలిఫోనుల ద్వారా వినుచున్నవారిని అడుగుచున్నాను. గత ఆదివారపు వర్తమానము వినని యెడల తప్పక వినండి. దేవుని పనిచేయుటకు అభిషేకించబడకుండానే ఆ పనిచేయ ప్రయత్నించుట. ఎంత యధార్థత, మంచితనము ఉన్నా లాభము లేదు. దేవునికి అది ప్రీతికరము కాదు, చూచారా.

ఇప్పుడు ఇక్కడ సిద్కియా తాను చేయుచున్నది సరియైనదే అనుకొనెను.

63మీకాయా అనెను, "నేను దేవుని అడిగెదను." కావున అతడు మరుసటి ఉదయమున "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు"తో వచ్చెను. తన దర్శనమును వాక్యముతో పోల్చి చూచుకొనెను.

ఇప్పుడు సిద్కియాతో అతడు యిలాగు చెప్పియంటే, "ఈ వ్యక్తికి ఏమి జరుగునో పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవక్త యిక్కడ చెప్పినది నీకు తెలియునా?"

"కాని అది ఈసారి కాదు, ఎందుకనగా అతడు గౌరవముగలవాడు. (దీనిని తప్పక గమనించండి) సంఘమునకు చెందవలసిన వాటిని సంఘమునకు ఇయ్యగోరుచున్నాడు. తిరిగి దాని ఆస్తిని దానికి ఇయ్యగోరుచున్నాడు," ఆత్మీయ సంబంధమైనది కావు; అంత శక్తి అతనికున్నచో ఏలియావలె దేశమును ఊపి యుండెడివాడు. కాని వారికి వస్తు సంపద ఇయ్య ప్రయత్నించుచున్నాడు: "ఈ ఆస్తి మనది. మనది గొప్ప సంస్థ. మనము దానికి చెందినవారము. ప్రొటస్టెంటు వారందరూ మాతో చేరండి" అని పిలిచెను. ఇంకా ముందుకు చూద్దాం. "అందరూ సోదరీ సోదరీలే," అనుటకు వీలు లేదు. నిజమగు దేవుని సంఘము ఎన్నడూ ఆలాగుండదు. మరియు ఆలాగుండలేదు.

1KGS 22:11,17•

2CH 18:10,16

 

64గమనించండి, అతడు దర్శనమును చూచెను. అందుకే అతడు, "దేవుడు నాతో మాట్లాడెను" అని చెప్పెను. "అతడు యధార్థపరుడని ఇప్పుడు చూడండి. 'ఈ కొమ్ములు తయారు చేసికొని రాజు యొద్దకు వెళ్ళి వారిని పశ్చిమంగా త్రోసివేయుదువని" అతను చెప్పెను [లేక వారు నిలబడిన చోటునుండి ఆ ప్రదేశము ఏ దిక్కువైపుయున్న]… నెట్టుము మరియు అది "ప్రభువు సెలవిచ్చుచున్నాడు," అతడు జయము పొందబోవుచున్నాడు. సంఘమునకు జయమును తెచ్చును.'" వెళ్ళగొట్టుటకు పోదువనెను. అది చాలా దగ్గరగా యున్నది. కాదా? విషయమేమి? ఇక్కడ మీకాయా వచ్చుచున్నాడు. "ఇప్పుడు, నీ ప్రవచనము చెప్పమని" వారతనితో అనిరి

"ఎదుర్కొన పొమ్ము! అయితే ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెవలె చెదరిపోవుట నేను చూచాను" అని చెప్పెను. వ్యూ! దానికి ఖచ్చితమైన వ్యతిరేకము.

1KGS 22:11,19•

2CH 18:10,18

 

65ఇప్పుడు, మీరు జనులు. ఏది నిజమని ఇప్పుడు చెప్పెదరు? వారిద్దరూ ప్రవక్తలే. వారి మధ్యనున్న వ్యత్యాసమును దానిని వాక్యము ద్వారా పరీక్షించు మార్గము ద్వారా మాత్రమే మీరు చెప్పగలరు.

"నీకిది ఎట్లు వచ్చినది?" అనడిగిరి.

"దేవుడు సింహాసనాసీనుడై యుండుటయు, ఆయన చుట్టూ ఆలోచన చెప్పు వారుండుటయు చూచితిని" అనెను.

ఇప్పుడు గుర్తు౦చుకొనండి, సిద్కియా కూడా దేవునిని చూచితినని చెప్పెను, ఒకే ఆత్మ కలిగియుండిరి. "నేను దేవునిని చూచాను. ఇనుప కొమ్ములు తయారు చేసికొనమని నాతో చెప్పెను. వెళ్ళి ఆ రాజ్యమును బయటకు వెళ్ళగొట్టము. అది మనకు చెందినది కాబట్టి. వారికి ఆందులో ఏ హక్కు లేదు." వారు దేవునితో నిలచియుండినచో వారికి హక్కుండును. వారికది చెందియుండేది, కాని వారు దేవునికి దూరస్తులయిరి. సంఘమను సంస్థ కూడా ఆలాగే యున్నది. ఇవన్నీ కార్యములు చేయుటకు దానికి హక్కున్నది, కాని దానిని పాడుచేసికొనెను, ఎందుకనగా దేవుని వాక్యము నుండియు, దేవుని ఆత్మ అభిషేకము నుండియు దూరమాయెను. ఆ కాలపు వాక్కు ప్రత్యక్షము కాలేదు. ఈ వర్తమానము వినుటకు మీరు తప్పిపోవద్దు.

1KGS 22:19-22•

2CH 18:18-21•

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

66ఇప్పుడు ఏమి జరిగెనో గమనించండి. మీకాయా ఇట్లనెను, "నేను పరలోకమందు సింహాసనాసీనుడైన దేవునిని చూచాను. ఆయన చుట్టూ ఆయనకు ఆలోచన చెప్పు వారుండిరి. ఏలియా మాటలు నెరవేర్చుటకు ఆహాబు నొద్దకు మోసపుచ్చు మాటలు చెప్పుటకు ఎవరిని పంపుదును? అని వారడిగిరి. ఏలియా నా ప్రవక్త, అతనికి నా వాక్కు బయలుపరచాను! భూమ్యాకాశములు గతించును గాని నా మాటలేమాత్రమును గతించవు. వారెంత ఆధునికత సంపాదించినా, ఎంత మ౦చి పొందినా, ఎంత చదివినా, ఎంత పెద్దవారయినా నాకు లెక్కలేదు. నా మాటలెన్నడును విఫలము కావు." "మరియు పాతాళము నుండి ఒక అబద్ధపు ఆత్మ వచ్చినది. అది సాష్టాంగపడి ఇట్లనెను, "నీవు నన్ను అనుమతించినయెడల వారికి నేను నా అభిషేకమును ఇచ్చెదను. వారు ఏ విధమగు సూచక క్రియ, అద్భుతము కోరితే అది చేయకలుగునట్లు చేయుదును. వారిని వాక్యము నుండి దూరపరచుదును. అది నీ వాక్యమని కూడా వారెరుగుదురు. పేరు, కీర్తి కొరకు అతను దానిని ప్రక్కకు పెట్టును. ("సోదరుడా, కాలములు మారలేదు. నెవిల్ సోదరుడా, అది నిజము. నీవది సత్యమని గుర్తుచేసికో!) "నేను అతనిని వశపరచుకొందును, అందరూ చేసినట్టే అతడును చేయును. అతడు ప్రవచించి అబద్ధము చెప్పునట్లు చేయుదును." అదెట్లు అబద్ధమగును? వాక్యమునకు విరోధము గనుక.

67ఈ తప్పు బాప్తిస్మములు మొదలగునవి మీరు తీసుకొనండి, పలానా-పలానా. అదెంత వాస్తవముగా కనబడుచున్నాగాని, దానిని వారెంతగా అనుకరించి ప్రయత్నించినా గాని నాకు లెక్కలేదు. ఈ ఘడియ యొక్క దేవుని వాక్యమునకు అది విరోధమైనచో అబద్ధమే. నిశ్చయంగా! మీరు చెప్పుదురు, "మంచిది, మా… మంచిది, మేము ఇది చేశాము, మేము అది చేశాము; మా సంఘము ఈ విధముగా, మరియు.." అది ఏమైనా నేను లెక్క చేయను; ఈ ఘడియ యొక్క వ్రాయబడిన వాక్యమునకు విరోధమైనయెడల, అది అబద్ధము! దానితో దేవునికి ఏమి సంబంధము లేదు. అది ఎంత యధార్ధముగా, ఎంత విధ్యావంతముగా, ఎంత తెలివిగా, ఎంత సత్యముగా అనిపించినా, ఎంత సమంజసముగా అనిపించినా; అది ఈ ఘడియ యొక్క వాక్యము… సమయము చాలినట్లయితే, మనము కొద్ది నిమిషములలో దానిగూర్చి కొద్ది లోతుగా వెళ్ళుదము. మనకు సమయము లేకపోయినయెడల, మనము దానిని మరలా ఈ రాత్రి చూచెదము.

1KGS 22:23-25•

2CH 18:22-24

 

68గమనించండి. అతడు యధార్థపరుడు, మంచివాడు, అందులో సందేహములేదు. మీకాయా (అతని ముఖము మీద చెప్పలేదు గాని మరోక మాటలో ఇట్లనెను), "నీవు అబద్దమాడు ఆత్మచేత అభిషేకించబడితివి." ఒక బిషప్పుకు అది చెప్పగలమా? అయితే ఇతడు చెప్పకలిగెను.

మరియు కాబట్టి ఈ బిషప్పు అతని యొద్దకు వెళ్ళి ఇట్లనెను, "మరెన్నడూ నీకు మాతో సహవాసము లేదు." మరియు అతని ముఖము మీద కొట్టెను. "నేను నిరూపించబడిన వ్యక్తినని నీవెరుగుదువా? మా సంఘము నన్ను ఈ కార్యమునకు ప్రధానునిగా చేసెను. దేవుని ప్రజలుయొక్క పేరు, కీర్తి కలిగిన వోటు నన్ను ఎన్నుకొనిరి. నా సంస్థ నన్ను ఈలాగు నియమించెను. దేవుడు మాకు ఈ భూమిని ఇచ్చెను. అది మాకు చెందవలెనని ఆయన ఉద్దేశ్యము. నాకు ప్రభువు 'ఈలాగు సెలవిచ్చుచున్నాడు యున్నది,'" అని చెప్పి అతనిని కొట్టి, "దేవుని ఆత్మ నన్ను విడిచి ఎటువైపు పోయినదో చెప్పుము" అనెను.

మీకాయా చెప్పెను, "ఒక దినమున నీకే తెలియును, కాలిఫోర్నియా సముద్రము క్రిందికి వెళ్ళుచున్నది." ఈ సంగతులు జరుగుచున్నవి, చూచారా. "నీవు చెరసాల లోపట కూర్చొని యున్నప్పుడు అది ఎటువైపు వెళ్ళినదో తెలిసికొందువు," అని అతడు చెప్పెను.

MATT 24:24•

MARK 13:22

 

69ఇప్పుడు, ఆహాబూ, నీవేమి చెప్పబోవుచున్నావు? "నా ప్రవక్తను నేను నమ్ముచున్నాను" అని అతడనెను. అతడు వాక్యమును ఎందుకు పరిశోధించలేదు? చూచారా, తాను శాపగ్రస్తునిగా తనను చూచుకొనుట తనకు ఇష్టము లేదు. నా మాట వినండి! తనకుతాను శాపగ్రస్తునిగా చూచుకొనుట తనకు ఇష్టము లేదు. ఎవరును ఆలాగు ఇష్టపడరు. సంస్థలోనున్న నా సోదరులారా, మీ సంగతి ఆలాగే యున్నది. నీవు బాగున్నావని తలంచుచున్నావు. ఎప్పుడంటే నీవు "తండ్రి, కుమార, పరిశుద్దాత్మ" నామములో బాప్తిస్మమిచ్చునప్పుడు, అనగా, నీవు అబద్దమాడుచున్నావు! మీ హృదయములో అది మీకు తెలియును. మీరు చేయునవి తప్పు. మీరు అసలైన సాక్ష్యములను మరియు అలాంటి అన్ని కార్యములను తీసికొనినట్లయితే — మీరు తప్పులో యున్నారని మీకు తెలియును. భాషలలో మాట్లాడుట ప్రధమ సూచన ఎట్లగును? ఈ ఘడియలోని దేవుని వాగ్దానమునకు విరోధముగా మాట్లాడుచు, భాషలలో మాట్లాడుట అసలైన రుజువు ఎట్లగును? అదిట్లు సాధ్యము? మీకు శాపము అక్కరలేదు. కదాండీ? అయితే ఇక్కడ అది వ్రాయబడియున్నది, కాబట్టి అది ఆలాగుననే జరుగును. అది మృగము యొక్క ముద్ర. సాధ్యమైతే ఏర్పరచబడినవారిని అది మోసము చేయుటకు చాలా దగ్గరగాయున్నది.

70ప్రతి సూచన, ప్రతి అద్భుతము, అభిషిక్తులు, ప్రవచనము ఇంకా రకరకముల సంగతులు బయలు వెళ్ళుచున్నవి; అన్ని రకముల సూచనలు, అన్ని రకముల అద్భుతములు బయలు వెళ్ళుచున్నవి, అయితే భేదమును మీరెట్లు చెప్పగలరు? ఈ ఘడియకు సంబంధించిన వాక్యమును గమనించుము. దాని ద్వారానే మీరు తీసుకొనవచ్చు.

మోషేను చూడండి, బిలాముతో అతడేలాగు చెప్పియుండును; మీకాయాను గమనించండి, అతను సరియైనది చెప్పుచున్నాడని మనకు ఏలాగు తెలియును? అంతకు ముందే ఆహాబు గూర్చి వాక్యము ప్రవచించెను. మనముందున్న వాక్యము ఈ దినమున్న సంస్థల గూర్చి ప్రవచించెను. ఇది వారిపైనున్న శాపము, ఆయన యొక్క అభిషేకము పొందిన నిజ సంఘము — మనము వాక్యమును కలిగి, వాక్య వధువుగా నుండును. ఇక్కడే మనమున్నాము. అప్పుడుండినట్లే, ఇప్పుడును అది యిక్కడ యున్నది.

2COR 13:1

 

71"ఇద్దరి లేదా ముగ్గురి నోట వెలువడిన మాట స్థిరమగునని" బైబిలు చెప్పుచున్నది. నేను బిలాము గూర్చి మోషే గూర్చి మాట్లాడాను. నేను ఇప్పుడు మీకాయా మరియు సిద్కియాల గూర్చి మాట్లాడాను. ఇప్పుడు మరో ఉదాహరణ ఇచ్చెదను. వందలమంది యున్నారు గాని ముగ్గురు సాక్షులు చాలును. నేను చాలా మందిని గూర్చి వ్రాశాను గాని, సమయము చాలదు.

యిర్మియా దేవుని యొక్క నిరూపించబడిన ప్రవక్త, అతడు వెళ్ళగొట్టబడెను. వారతనిని ద్వేషించిరి. వారతని మీద అతిగా పండిన పండ్లను విసిరిరి, మరియు ప్రతిది చేసిరి. అతడు వారిని శపించెను. ఇశ్రాయేలు చేయుచున్నది తప్పు అని సూచించుటకు ప్రక్కలకు పడుకోని మరియు అతడు ఎన్నో రీతులుగా ప్రవర్తించెను. లోకములో లేచిన ప్రతి నిజ ప్రవక్తయు సంఘము యొక్క మతశాఖల సంస్థలను శపించెను. మారని దేవుడు దీనినెట్లు మార్చగలడు?

పరిశుద్దాత్మ ఈ ఘడియకు ప్రవక్త. ఆయన తన వాక్యమును రుజువుపరచుచూ దానిని నిరూపించుచున్నాడు. మోషే యొక్క ఘడియకు పరిశుద్దాత్మయే ప్రవక్త. ప్రవక్త మీకాయా యొక్క ఘడియకు పరిశుద్ధాత్మయే ప్రవక్త. వాక్యమును వ్రాసిన పరిశుద్దాత్మ వచ్చి వాక్యమును ధృవపరచును.

1KGS 22:38•

MATT 15:14•

LUKE 6:39•

GAL 6:7

 

72ఇప్పుడు, మీకాయా కాలములో ఏమి జరిగెను? ఆహాబు చంపబడెను, మరియు దేవుని వాక్య ప్రకారము కుక్కలు అతని రక్తమును నాకెను. "ఓ, అబద్ధ బోధకులందరూ తాము విత్తినదాని పంట కోయుదురని దేవుడు చెప్పుచున్నాడు. గ్రుడ్డివారిని గ్రుడ్డి నాయకులు నడిపించుచున్నారు!" నాకు కోపము లేదు; నేను మీకు ఒక సత్యమును మాత్రమే చెప్పుచున్నాను. "ఈ విధముగా చెప్పమని" పరిశుద్దాత్మ నాకు ఆ గదిలో చెప్పనియెడల, ఈలాగు నేను చెప్పియుండెడి వాడిని కాను. ఏనాడైన నేను మీకు ఏదైన తప్పు చెప్పానా? అయితే నేను చెప్పిన దానిని ఎన్నడయినా దేవుడు నిజమని రుజువు చేయక మానెనా? ఆలస్యము కాకముందే నా సోదరులారా మేలుకోనండి!

JOHN 6:37

 

73అయితే నేనిది చెప్పనీయండి: ఒక ముల్లు, ముండ్ల చెట్లుగా ఉండి మరియు ఆ విధముగా ఉండుటకు ముందు నిర్ణయించబడినప్పుడు, అది ఏ విధముగా మారగలదు? ఏర్పరచబడినవారు దానిని చూడకుండా ఎట్లు౦దురు? ఎందుకనగా వారు దానిని చూచుటకే ఎన్నుకోబడిరి. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వారిని నాకిచ్చెను. వారి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడెను," అని యేసు చెప్పెను. సంఘ పుస్తకములో కాదు గాని, గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడెను.

JER 27:2

 

74గమనించండి! యిర్మియా లేచి జనులయెదుట రుజువు పరచబడెను, అయిననూ వారతనిని ద్వేషించిరి.

కాబట్టి అతడు ఒక కాడిని తన మెడ మీద మోసుకొని జనుల ముందర నడిచెను. వారీలాగు చెప్పుకొనిరి, "ఓ! మేము గొప్ప దేవుని ప్రజలము. మేము ఇశ్రాయేలీయులము. మా సమాజ మందిరములలో ఎంతో యధార్థముగా ఉన్నాము. ప్రతి ఆదివారము మేము హాజరగుచున్నాము. బలులు అర్పించుచున్నాము. మరియు మా డబ్బు ఇచ్చుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణములు నెబుకద్నెజరు ఎలాగు పట్టుకొనగలడు?" మీ పాపము వలనే అది ఆలాగు జరిగెను.

"మీరు నా ఆజ్ఞలు గైకొనినయెడల, మీకిది నేను చేయను; కాని మీరు ఆలాగు చేయనియెడల, అది మీ యొద్దకు వచ్చుచున్నది." అది వాస్తవమైన సత్యము. ఇప్పుడునూ ఆలాగే యున్నది. ఆయనాజ్ఞలను గైకొనుము. ఈ ఘడియ కొరకు తన వాక్యమును ఎదైతే ఆయన వాగ్దానము చేసెనో, దానిని గైకొనుము.

JER 29:10

 

75ఇప్పుడు చూడండి. దేవుని చిత్తమును బట్టి ఇప్పుడు యిర్మియా నిరూపించబడిన ప్రవక్త అయినను ద్వేషించబడెను. వారి-వారి దినములలో వారందరూ ద్వేషించబడిరి, ఎందుకనగా వారు ఆ మతశాఖలకు అంతుబట్టని వింత క్రియలు చేసిరి. రాజులు మొదలుకొని అందరూ ద్వేషించిరి. కాబట్టి అతడు మెడ మీద కాడి మోయుచూ, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పెను. మీరు డెబ్బది ఏండ్లు అక్కడ ఉండెదరు," ఎందుకనగా అతడు దేవుని వాక్యము వలన ఒక గ్రహింపును కలిగి యుండెను — డెబ్బది ఏండ్లు.

JER 28:10,11

 

76అంతట హనన్యా అను ప్రవక్త ప్రజల మధ్యలో నుండి వచ్చి యిర్మియా మెడపైనున్న కాడిని తీసి విరచెను. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నప్పుడు, ప్రజల మధ్యలో ఒక గొప్పవ్యక్తిగా యుండెను. "రెండు సంవత్సరములలో వారు వెనుకకు వచ్చుదురని ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని అతను చెప్పెను. ఇద్దరు అభిషేకించబడిన ప్రవక్తలు. వారిలో వ్యత్యాసము ఎలాగున్నది? ఒకరు పలుకబడిన వాక్యమును కలిగియుండెను మరియు మరొకరు కలిగిలేరు.

యిర్మియా, "ఆమెన్!" అనెను.

77పెద్దలు, సమాజము, మరియు ఇశ్రాయేలీయులందరి యెదుట.

చూచారా, అతడు యిర్మియా అంత గొప్పవాడినని చూపించుకొనగోరెను. "నీకు తెలియునా, వారేలాగు నిన్ను ఇష్టపడరు. కాబట్టి నేను కూడా ప్రవక్తనే. నేను నీకంటె గొప్ప ప్రవక్తను, ఎందుకనగా నీవు అబద్ధమును ప్రవచించుచున్నావు. నీవు నాకు చెప్పుము, దేవుని ప్రజలు పలానీ - పలానీ కార్యము క్రింద ను౦డేధరా?" నేడు వారును ఆలాగే చెప్పుచున్నారు, కాని మీరును అదే విధముగా ఒక సంఘముగా అక్కడ ఉండెదరు. మీరు శాపము వలన శాపగ్రస్తులైరి. దేవుని వాక్యమునకు బదులుగా మనుష్యుల పార౦పర్యాచారములు పట్టుకొన్నియున్న మతశాఖలు, మరియు సంఘములన్నియు దేవుని చేత శపించబడెను!

JER 28:10,11

 

78ఇప్పుడు గమనించండి, హనన్యా వచ్చి దేవుడిచ్చిన గురుతును అతని మెడమీద నుండి విరిచివేసెను. "రెండు సంవత్సరములలో తిరిగి వచ్చుదురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు" అనెను. తన గొప్పతనమును చూపించుకొనుటకు ఆలాగు చెప్పెను. "నేను పలానా - పలానా" కారణము అతను అక్కడ నిలబడెను. అతడు సంస్థ యొక్క ప్రవక్త.

యిర్మియా ఒక అరణ్యములో తనుకు తానుగా జీవించిన వ్యక్తి. వారందరూ చెడిపోయిరి, గనుక అతడు వారి మీదికి ఎల్లప్పుడు కీడును ప్రకటించెను. "మీరు ఇశ్రాయేలీయులుగా ఉన్నంత వరకు, మీరు దానికి చెందినంత వరుకు మీరు బాగానే ఉన్నారు, అది మాత్రమే కావలెను; (చూచారా) దేవుడు అది ఏమియు చేయడు. ఏదో చిన్న పొరపాటు ఇక్కడ జరిగినదని నాకు తెలియును, కాని దానిగూర్చి కలవరపడవద్దు, భయపడవద్దు" అనెను. ఓ! సోదరుడా, వారింకా నేడునూ జీవించియున్నారు. "భయము వద్దు, అంతా సరియగును. అంతా మన ఆధీనములోనే యున్నది. మేమే సంఘము" అని చెప్పుచున్నారు. ఆ విధముగా ఆలోచించడము లేదా. అవును.

79"అంతా సరియగును. వారు రెండేళ్ళలో వెనక్కు వచ్చెదరు. జరిగినది ఒక చిన్న సంగతి, అది అసాధారణమేమీ కాదు; మనలో జరుగుచున్నదే. నెబుకద్నెజరు కేవలము దండెత్తెను గాని మన దేవుడు ఇదంతయూ చూచుకొనును" అనెను. కాని ఆ తరము గతించిపోయి మరో తరము వచ్చువరకు డెబ్బది సంవత్సరములు వారు అక్కడే యుందురని దేవుని వాక్యము చెప్పెను… ఒక తరమనగా నలుబది ఏండ్లు.

"ఇది దాదాపు రెండు తరములు మీరక్కడ ఉండబోవుచున్నారు," మరియు దేవుని యొక్క వాక్యప్రకారము యిర్మీయా దీనిని చెప్పెను. హనన్యా దానిని విరిచెను! "సరే, ఆమేన్. కాని, హనన్యా, దీనిని మనము గుర్తు౦చుకొందము, మన ఇద్దరమూ ప్రవక్తలమే; మన ఇద్దరమూ సేవకులమే" అని యిర్మియా చెప్పెను. నా సోదరులారా, మీకు ఇది చెప్పుచున్నాను. మనముందు ప్రవక్తలుండిరని మనము గుర్తుచేసికొందము. మరియు వారు రాజ్యములకు, ఇంకా ఆయా సంగతులకు వ్యతిరేకముగా వారు ప్రవచించిరి. కాని ప్రవక్త ఏది చెప్పినా, అతను వాక్యానుసారముగా ప్రవచించవలెను. మీకాయా, మోషే మొదలగువారట్లే యుండిరి. వాక్యప్రకారము అది యుండవలెను. ఆలాగు కానియెడల ఏమి జరుగునో గుర్తు౦చుకొనండి."

JER 28:3,4,13,16,17

 

80హనన్యా స్వనీతి కోపముతో ఇట్లనెను, "నేను హనన్యాను (సందేహమే లేదు), ప్రభువు యొక్క ప్రవక్తను, మరియు నేను రెండేళ్ళు" అని చెప్పుచున్నాను. మరొక మాటలలో అయితే "వాక్యము చెప్పేది నాకక్కరలేదు" అతని అభిషేకము. "నేను చెప్పుచున్నాను, వారు రెండేళ్ళలో తిరిగి వచ్చెదరు."

యిర్మియా అతని యెదుటనుండి బయటకు వెళ్ళి ఇట్లనెను, "ప్రభువా, అతను ఏమన్ననూ నేను లెక్క చేయను. వాక్యము ఆలాగే చెప్చుచున్నదని నాకు తెలియును మరియు నేను ఇంకా విశ్వాసించుచున్నాను. నీ పట్ల నేను నమ్మకముగా యు౦దును. వానివలన నేను మోసపడను."

దేవుడిట్లనెను, "ఇనుముతో మరియొక కాడిని నేను చేయుదునని హనన్యాతో చెప్పుము." మరియు అతను అది చేసినందుకు గాను, అదే సంవత్సరమున హనన్యా భూమిమీద లేకుండా తీసికొనబడెను. ఆ ఇద్దరు ప్రవక్తలు మనకు ఉదాహరణలు. చాలామందిని గూర్చి చెప్పగలము గాని సమయము లేదు.

MATT 24:24•

MARK 13:22•

HEB 13:8

 

81అయితే గమనించండి. ఈ అంత్యకాలములో మరల ఆ రెండు ఆత్మలు ఒకేలాగుండునని యేసు చెప్పెను. అది నిజమేనా? ఇప్పుడు గమనించండి. అప్పుడు కంటె ఇప్పుడు మరింత మోసకరముగానుండును. ఇది చివరి కాలము. ఓ! పిల్లలారా! దేవుడు మనపై తన కృప చూపు గాక! "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును." ఇప్పుడు, ఆనాడు వారెట్లు దానిని చెప్పకలిగిరి? ఈనాడు మనమేలాగు చెప్పగలము? అదే విధంగా వాక్యముతో నిలచియుండుడి: "యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఇప్పుడు, ఈ వర్తమానమున౦తటిని మోసుకు వెళ్ళండి. మరియు మీరు ఈ టేపును వినునప్పుడు — బహుశా నేను వెళ్లిపోవుదును, ఈ భూమిపై నాతో ప్రభువు ఆయన కార్యమును ముగించినట్లయితే — మీరు దీనిని మరలా తిరిగి చూచెదురు. నేను ఏమి చెప్పుచున్ననో, నా స్వరమును వినండి. ఆయన రాకడకు ముందే నన్ను ఆయన తీసికొనినట్లయితే; నేను ప్రభువు నామములో, ప్రభువు యొక్క వాక్యము ద్వారా మీతో మాట్లాడియున్నానని గుర్తుంచుకొనండి.

MATT 24:24•

MARK 13:22

 

82గమనించండి, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసము చేయునంత చాలా దగ్గరగా యుండును, అవే సూచక క్రియలు, అవే అద్భుతములు, అదే ఆత్మ ద్వారా చేయుదురు. అది నిజమేనా? ప్రవక్తల గూర్చి ఇప్పుడే మనము మాట్లాడుకున్న రీతిగా యుండును.

ఇప్పుడు, యిది కూడ వ్రాయబడెను… మీరు కోరినట్లయితే: మనము II తిమోతీ 3 చూద్దాం. దీనిని విడువకూడదు. మరియు నేను కోరడము లేదు… నేను అక్కడనున్న గడియారము వైపు చూచాను. మరియు చాలా వరకు విడిచిపెట్టగోరాను, మరియు అది చేయకూడదని ఇప్పుడు నేను అనుకొనుచున్నాను, చూచారా.

గమనించ౦డి, కేవలము… నేను ఇక్కడ నిలబడి ఎంతగానో చెమటలు కార్చుచున్నాను. అయితే నేను సంతోషముగా యున్నాను. మరియు ఇది సత్యమని నాకు తెలియును.

II తిమోతీ 3:8.

GAL 1:8•

2TIM 3:1,2

 

83"నేను చెప్పినది కాక మరొక దానిని పరలోకమునుండి దూత దిగి వచ్చి చెప్పినను శాపగ్రస్తుడవును" అని పౌలు చెప్పెను. ఇప్పుడు ఒక దూత దిగి వచ్చినను, అది II థెస్సలోనికలో. ఓ! నన్ను మన్నించండి.

II తిమోతీ 3:8లోనిది గమనించండి. ఇప్పుడు పౌలు మాట్లాడుట చూడండి. వచనము మొదటి భాగమును జాగ్రత్తగా గమనించండి. బైబిలున్నవారు, నాతో పాటు చదవండి; బైబిలు లేనివారు, జాగ్రత్తగా వినండి.

అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. (చివరి దినములు అన్న మాటకు క్రింద గీత గీయండి. అది అప్పుడే జరుగబోవు చున్నది. మనము అందులో యున్నాము.)

ఏలాగనగా మనుష్యులు స్వార్దప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారలు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు.

84నేడు ఈ చెడిపోయిన గుంపును చూడండి. బయట వీధులలో యువకులు తమ కళ్ళమీద పడునట్లు జట్టు పెంచుకొనుచూ, స్త్రీవలె గాజులు ధరించుచున్నారు. వంకరతనము — సోదొమియులు!

ఈ సంవత్సరము యొక్క ఈ నెల రీడర్స్ డైజస్ట్ చదివారా? "అమెరికా జనులు ఇరవై, ఇరవై-అయిదేండ్లలలోనే నడివయస్కులగుచున్నారు. వారి పని అయిపోయినది! వారు చెడిపోయిరి! ఇరవై ఏండ్లు రాకుండానే పురుషుడు మరియు స్త్రీలు నడివయస్కుల స్థితికి వచ్చుచున్నారని విజ్ఞాన శాస్త్రము చెప్పుచున్నది. వారి శరీరము అంతగా చెడిపోయినది మరియు అపవిత్రతకు అప్పగించిరి.

DEUT 22:5•

2TIM 3:2-6

 

85ఓ! అమెరికా! దేవుడు ఎన్నిసార్లు నిన్ను తన క్రిందకు తీసికొనగోరెను, కాని ఇప్పుడు నీ ఘడియ వచ్చియున్నది! ప్రపంచమును అపవిత్రత వైపు నడిపించువారు మీరే.

దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు,

అనురాగరహితులు, (స్త్రీ పట్ల పురుషునికి, పురుషుని పట్ల స్త్రీకి నిజ ప్రేమ లేదు. అనురాగరహితులు. శరీరేచ్ఛతో నిండిపోయిరి.) అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు మరియు సజ్జన ద్వేషులు,

మరో మాటలలో, "మీరు పరిశుద్ధ గుండ్రాలైన గుంపుగా యున్నారు." ఒక దినమందు ఇక్కడ సంఘమునకు వచ్చుట గూర్చి ఎవరో నన్నడిగిరి. "అక్కడికి వెళ్ళకండి. వారంతా బాగా గోల చేయువారని?" ఎవరో అన్నారని నాతో చెప్పెను. సజ్జన ద్వేషులు.

ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు;

"బ్రెన్హాం సోదరుడా, అది కమ్యూనిస్తులు" అని నీవనవచ్చు. తరువాత వచనమేమి చెప్పుచున్నది?

పైకి భక్తి గలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు.

వాక్యమైయున్న యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నారు. ఈ దిన వాగ్దానమును బయలుపరచెను. హనాన్యా, సిద్కియా, బిలాము మొదలగు అబద్ధ ప్రవక్తలవలె యున్నారు.

పైకి భక్తిగలవారివలె ఉండియు (అభిషేకించబడిరి. పైన అభిషేకమున్నది. అభిషిక్త సేవకులు.) "పైకి భక్తిగలవారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారు.. (ఆయన నిన్న, నేడు, ఏకరీతిగా… ఆయన వాక్యమును త్రోసివేయువారు!)

ఆనాడు వారు యేసును ఎట్లు త్రోసివేసిరి? యేసును త్రోసివేసినప్పుడు వారెవరిని త్రోసివేసిరి? వాక్యమును. వారికి మతభక్తియున్నది. వారు తమ బైబిలు నుండి బోధించెదరు గాని ప్రస్తుత దినపు వాక్యమును తిరస్కరించెదరు. నేడు వారెవరు? అదే రీతిగా అభిషేకించబడి, పెంతెకోస్తు సువార్తను బోధించుచున్నారు, కాని ప్రసుత్త కాలములో వాగ్దానము చేయబడి బయలుపరచబడుచున్న వాక్యమును నిరాకరించుచున్నారు: యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది మీరు చూచుచున్నారా?

పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొనిపోవు వారు వీరిలో చేరిన వారు.

"మన కుట్టు కార్యక్రమములు మొదలగునవి ఇవియే." ఎవరో ఒకరు వచ్చి వాక్యమునకు తప్పుగా అర్ధము చెప్పుటకు ప్రయత్నించెదరు, మరియు యీలాగు అనెదరు, "జుట్టు కత్తిరించుకొనినా అది పరవాలేదు, సోదరీ. దానిగూర్చి ఎవరేమి చెప్పినా వినవద్దు లేక నీవు యిది ధరించుకొనినా, ఇందులో ఏమీ లేదు, "హృదయములో నుండి వచ్చునదే మనిషిని అపవిత్రపరచును." "చూచారా? నీవు చెడ్డ, దురాశ, అపవిత్రాత్మతో అభిషేకించబడితివని గ్రహించావా? నీవు జుట్టు కత్తిరించుకొని, గాన బృందములో పాడుచుండవచ్చును, కాని నీకు దురాత్మయున్నది. అది వాక్యమునకు విరోధము. అది నిజము. బైబిలు ఆలాగు చెప్పుచున్నది. "నేను పొట్టి బట్టలు ధరించుచున్నాను. అది నన్ను ఖండించుట లేదు" అని నీవందువు. ఒక స్త్రీ పురుషునికి చెందిన వస్త్రమును ధరించినట్లయితే, అది దేవుని దృష్టిలో హేయము. అది ఎవరైన కావచ్చు మారని దేవుడు దానిని చెప్పెను.

86ఓ! చాలా సంగతులున్నవి, వాటినన్నింటిని ఏలాగు చెప్పుకోగలము, మన సమయము అయిపోవును. అయితే ఏది నిజమో మరియు ఏది తప్పిదమో తెలిసికొనుట చాలని మీకు తెలియును. వాటిని నేను ఏలాగు చేయమందును? నేనేలాగు చెప్పుకుందును? "మంచిది, నీవెందుకు గోల చేయుచున్నావు?" అని అనవచ్చు. నేను మీకు వ్యతిరేక సాక్షిని! ఒక రోజున తీర్పు దినమున, దాగుకొనుటకు నీకు చోటు యుండదు.

2TIM 3:6

 

87మీకాయా దానిని ఎట్లు చెప్పకుండా ఉండగలడు? మోషే ఎలాగు కేకలు వేసి దానిని ఆప ప్రయత్నించగలడు? మరియు యొహోషువా మరియు వారును జనుల మధ్యకు పరుగెత్తిపోయెను. లేవీ కూడ ఖడ్గము దూసి ఏలాగు వారిని చంపెను? అయినా గాని వారు ఎప్పటివలెనె సాగిపోయిరి. వారు ఆలాగు చేయుదురని ముందే అది చెప్పబడెను. మరియు వారు దానిని చేయుదురు, ఎందుకనగా "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" గనుక వారు దానిని చేయుదురు. ఆ మతశాఖలు ఎన్నడైనా గాని వాక్యము నొద్దకు తిరిగి వచ్చునని మీరు తలంచుచున్నారా? "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." వారు రారు! వారు క్రీస్తు విరోధిలోనికి పోవుదురా? నిశ్చయంగా! అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు." వారు వెళ్ళెదరు! కాబట్టి దాని గూర్చి నీవేమి చెప్పుచున్నావు? నేను ఒక సాక్షిగా యున్నాను మరియు మీరునూ, విశ్వాసులందరూ ఆలాగే యున్నారు.

గమనించండి! "నానా విధములైన దురాశలు గల అవివేక స్త్రీలు."

2TIM 3:7,8

 

88"మంచిది, ఆ మిగతా స్త్రీలంతా చేయును." అబద్ధ ప్రవక్తలు! ఇప్పుడు వినండి. నేను మాట్లాడుచున్నది అబద్ధ ప్రవక్తల గూర్చి ఇప్పుడు వారు అంత్యదినమున ఏమి చేయుదురు? నానావిధములైన దురాశలు గల అవివేక స్త్రీలను చెరపట్టుకొనిపోవుదురు.

"మంచిది, ఆ మిగతా స్త్రీలందరి గూర్చి నాకు తెలియును." సరే, ముందుకు కొనసాగుము.

ఈ కాలిఫోర్నియోలో పెద్ద సంఘటన జరుగక మునుపు నేనేమి చెప్పుదును? "లాస్ ఏంజలస్లో ప్రజలైన మీ యొద్దకు నేను ప్రతి సంవత్సరము వచ్చుచున్నాను. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలు, స్త్రీలవలెయున్న పురుషులు అంతకంతకు ఎక్కువగుట కనబడుచున్నది. ఎక్కువ మంది బోధకులు సంస్థలలోనికి పోవుచున్నారు. మీకు సాకు దొరకదు! మీలో జరిగిన గొప్ప కార్యములు సొదొమ గొమొర్రాలలో జరిగియుండినయెడల, నేడు అవి నిలచియుండెడివి! ఓ! కపెర్నహోమా, నిన్నునీవు దేవదూతల పేరుతో పిలుచుకొనుచున్నావు, లాస్ఏంజలస్." ఏమి జరుగుచున్నదో చూడు? సముద్రపు అడుగునకు ఆమె పోవుచున్నది. ఎప్పుడు? అది ఎప్పుడు పోవుచున్నదో నాకు తెలియదు, కాని అది పోవుచున్నది. యౌవ్వన ప్రజలైన మీరు, నేను నా దినమున దానిని చూడనట్లయితే, మీరు గమనించండి; ఆమె పని అయిపోయినది.

ఎల్లప్పుడు నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవజ్ఞానము పొందలేకపోవుచున్నారు.

ఇక్కడ వినండి, ఇక్కడ సంచలనము కలిగించు మాట యున్నది.

యన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. (అది పరిశుద్దులకు ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము.) విశ్వాస విషయములో.

"మరియు ఆయన పిల్లల విశ్వాసమును తండ్రుల విశ్వాసము వైపు త్రిప్పును."

89విశ్వాస విషయములో భ్రష్టులు. హూ! భ్రష్టత్వమనగా ఏమిటో మీరెరుగుదురా? స్కోఫీల్డు బైబిలు మీ యొద్ద ఉన్నట్లయితే, అక్కడ "హెచ్" అని యున్నది. అక్కడ చూచినచో "విశ్వాసమును విడుచుట" అని యున్నది. అది అదే అయి యున్నది.

LUKE 18:1-8•

2TIM 3:8

 

90ఇప్పుడు, ఒక్క నిమిషము ఆగండి. ఇక్కడ నేను ఏదో విషయము చూడగోరుచున్నాను. దీనిని వ్రాశానని నేను తలంచుచున్నాను. ఖచ్చితంగా తెలియదు గాని చెప్పే ముందుగా దీనిని చూడవలెనని కోరుచున్నాను. ఇప్పుడు, ఒక్క నిమిషమాగండి. విశ్వాస విషయములో భ్రష్టులు, సత్యము విషయములో భ్రష్టులు, విశ్వాసము. ఒక విశ్వాసము మాత్రమే యున్నది, అది నిజము. విశ్వాస విషయములో భ్రష్టులు.

ఇప్పుడు, లూకా 18 చదువగోరుచున్నాను. ఒక్క నిమిషము. దీనిని మీరు వ్రాసికోనక్కరలేదు; దానిని మీరు చదువనక్కరలేదు.

వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను,

దేవునికి భయపడకయు, మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములోయుండెను.

ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరుచుగా వచ్చి నా ప్రతివాదికిని, నాకును న్యాయము తీర్పుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను.

తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు, మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాననుకొనెను.

మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మోర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?

ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమేగదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?

MAL 4:6•

LUKE 18:8•

REV 10:7

 

91ఇప్పుడు, అదియే ప్రశ్న. ఇక్కడ నేను వెళ్ళగోరుచున్నాను. ప్రకటన 10లో — కొద్ది నిమిషములలో వెళ్ళుదము మరియు మరో వాక్యభాగమున్నది. "ఏడవ దూత పలుకు దినములలో, దేవుని యొక్క మర్మమంతయు సమాప్తమగును" అని ఆయన చెప్పెను. ఇక్కడ ప్రశ్న యున్నది, ఈ ఘడియలో ఆ వరుస చొప్పున మీరు వెళ్లినట్లయితే: అది సమాప్తమగునా? "నేను విశ్వాసము కనుగొందునా?" మలాకీ 4 ఈ కాలములో నెరవేరునా? పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల యొక్క విశ్వాసము తట్టు, మూల వాక్యమునకు పునరుద్ధరించుట? చూచారా?

2TIM 3:5,8

 

92"యన్నే యంబ్రేలు, భ్రష్టులై ఎదిరించిరి." ఇప్పుడు కూడ వినండి. II తిమోతీ 38:8: "మోషేను ఎదిరించినట్లుగా, అంత్యదినములలో అట్టి భ్రష్టులే వచ్చెదరు." (ఇప్పుడు చూడండి, అక్కడ ఆ విధముగా చెప్పుచున్నది.) పైకి భక్తిగలవారివలె యుందురు, అభిషేకము పొందినవారే.

మీరు ఇంటికివెళ్ళి దానిని చదవండి. వీలయితే ఈ ఉదయమే దీనిని నేను ముగించెదను.

భ్రష్టులు, విషయములో… జీవించుటలో భ్రష్టులు కారు; వారు చాలా సంస్కారవంతులే, చక్కనివారు.

93ఇప్పుడు గమనించండి, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అను వర్తమానముతో మోషే ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు, అతను నిరూపించబడెను. ఒక ప్రజగానున్న ఇశ్రాయేలును పిలచెను, ఒక సంఘముగా కాదు… ఇశ్రాయేలీయులు జనులుగా ఉన్నారు; గాని సంఘముగా ఎన్నడూ లేరు, ఎందుకనగా సంఘము అను మాటకు "బయటకు పిలువబడినవారని" అర్ధము. వారు దేవుని యొక్క ప్రజలు. వారు వాక్యము ద్వారా అభిషేకించబడి బయటకు పిలువబడినప్పుడు, వారు దేవుని యొక్క సంఘమయిరి, మరియు తరువాత వారు వెనుకకు జారిరి, ఎందుకనగా వారు దేవుని వాక్యమును నమ్మలేదు; మరియు ఒక అబద్ద ప్రవక్త మాట వినిరి. మీకది అర్థమగుచున్నదని నేను అనుకొనుచున్నాను. దేవుని జనులుగా నుండిన ఇశ్రాయేలీయులు దైవహస్తము క్రింద బయటకు వచ్చిరి. దేవుని యొక్క వాక్యముతో, శక్తితో అభిషేకము పొందిరి. దేవుని యొక్క అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చూచిరి; మరియు అప్పుడు దేవుడు వారితో కదిలి వచ్చుచుండగా మధ్యలో ఒక అబద్ధ ప్రవక్తవచ్చెను, అభిషిక్తుడే, వారు వినిన దేవుని మూల వాక్యమునకు విరుద్ధమైన దానిని అతడు బోధించెను. ముగ్గురు తప్ప అందరూ అరణ్యములో నశించిరి. ఇప్పుడు దానిని పట్టుకొనండి!

MATT 24:35-37•

MARK 13:31•

LUKE 17:26-30•

LUKE 21:33•

1PET 3:20

 

94"నోవహు దినములలో నీటి ద్వారా ఎనిమిదిమంది రక్షించబడిరి, మనుష్యకుమారుని రాకడలోను ఆలాగే జరుగును. లోతు దినములలో సౌదోమ నుండి ముగ్గురు బయటకు వచ్చిరి. మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలోను ఆలాగే జరుగును." నేను ప్రభువు యొక్క వాక్యమును, లేఖనములను ఎత్తి చూపుచున్నాను. భూమ్యాకాశములు గతించినను… అల్ప సంఖ్యలో మాత్రమే యుందురు!

EXOD 4:3,4,11,16

 

95ఇక్కడ గమనించండి, మోషే అహరోను యొద్దకు వెళ్ళెను. మోషే దేవునిగా ఉండవలెను! దేవునిగా ఉండమని దేవుడే అతనితో చెప్పెను! "నీవు దేవునిగా ఉండుము, మరియు నీ సోదరుడగు అహరోను నీకు ప్రవక్తగా నుండును. నీవు సరిగ్గా మాట్లాడలేవు గనుక నీ మాటలు అతని నోటిలో యుంచుము." చెప్పెను, "అయితే ఒకని మూగవానిగా చేసినది ఎవరు? ఒకని మాట్లాడువానిగా చేసినది ఎవరు?" ప్రభువే చేసెను. మరియు అతడచ్చటికి వెళ్ళెను. అతను ఏమి చేసెను? దేవుడాతనికి చేయమని చెప్పిన ఒక నిజమగు అద్భుతమును జరిగించెను. "నీ కర్రను పడవేయుము" అని దేవుడు అతనికి చెప్పెను. దానిని పట్టుకొనగా, అది ఒక సర్పమాయెను. దానిని పట్టుకొనగా, మరల కర్రగా మారెను. "దీనిని ఫరో ఎదుట చేయుము మరియు 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని'" చెప్పమనెను.

మరియు ఫరో దీనిని చూచినప్పుడు, ఈలాగు అనెను, "ఎంత చవకబారు మాంత్రిక విద్య." "దానిలో ఏమియు లేదు; అది మానసిక శాస్త్రము లేక మరేదో అని మీకు తెలియునా?" "మా సంఘ సంస్థలో కూడా ఆలాగు చేయువారు చాలామంది యున్నారు. ఫలానా బిషప్పు, యిక్కడకు రండి, మరియు నీవు, నీవు యిక్కడకు రా? అదే కార్యమును చేయగలవారు మా యొద్ద ఉన్నారు." అది ఫరో ద్వారా సాతాను మాట్లాడుచుండెను.

అది మోషే ద్వారా దేవుడు మాట్లాడుచుండెను.

MATT 24:24•

MARK 13:22

 

96అయితే ఇతడు బయటకు వచ్చుట గమనించండి. యన్నె, యాంబ్రెలు మోషే ఎదుటకు నడుచుకుంటూ బయటకు వచ్చిరి. మరియు బహిరంగముగా జనుల యెదుట చేసిన ప్రతి అద్భుతమును జరిగించిరి. "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చుదురు." అది నిజమా? చేసినవే చేసిరి. అర్థమైనదా? ఇప్పుడు గుర్తు౦చుకొనండి, ఇది మరల చివరి దినములలో జరుగునని "ప్రభువు వాక్యము సెలవిచ్చుచున్నది." మోషే మరియు యంబ్రెల మధ్య తేడా ఏమిటి? "నీరు రక్తముగా మారును గాక!" అని మోషే పలికెను.

మరియు ఈ అబద్ద ప్రవక్తలు అనిరి, "నిశ్చయంగా, నీరును రక్తముగా మేము కూడ మార్చెదము." మరియు అది జరిగినది.

కాబట్టి "పేలు వచ్చు గాక!" అని మోషే పలికెను. ఎక్కడ నుండి యితనికి వచ్చుచున్నవి? నేరుగా దేవునియొద్ద నుండి, చూచారా. వారు కూడా పేలు తెప్పించిరి. మోషే చేయకలిగిన ఏ అద్భుతమునయినా గాని వీరు చేయగలరు. గుర్తు౦చుకొనండి, దీనిని మనస్సులో యుంచుకొనండి, కొద్దిసేపటి తరువాత దీనియొద్దకు మనము వచ్చెదము. మిగతావారు చేసినట్లుగా వారు ఏదయినా చేయగలరు గాని, వారు వాక్యముతో నిలచియుండలేరు. వారు వాక్యముతో నిలచియుండలేరు.

97ఇప్పుడు గమనించండి. వారు అదే చేసిరి. అయితే మోషే దేవుని యొద్ద నుండి పంపబడిన నిజమగు ప్రవక్త, దేవుని వలన ఆజ్ఞాపించబడెను. వారితో అతడు ఏమీ వాదించలేదు. "ఇక్కడ నీవు అది చేయకూడదు! నీవు చేయవద్దు!" అని చెప్పలేదు. వారి జోలికి అతను పోలేదు. వారిని ఆ విధముగా పోనిచ్చెను. వారు సంఘ సంస్థల ప్రవక్తలు, కాని వారిని పోనిచ్చెను. మోషే దేవుని మాట మాత్రమే వినుచూ ముందుకు సాగెను. దేవుడు ఏదైతే చెప్పెనో, "ఇప్పుడు నీవది చేయుము," మోషే వెళ్ళి దానిని చేసెను. అతడు ఒక క్రొత్త కార్యము చేసెను. వారిలో ప్రతియొక్కరికి ఒక అనుభూతి లేక మరేదో చేసినట్లయితే; యిక్కడ వారును వచ్చారు. మోషే చేసినట్టే, అదే విధముగా వారును దానిని చేసిరి.

JER 23:36

 

98ఇప్పుడు గమనించండి. ఈ వ్యక్తులు ప్రత్యక్షమైరి… ఓ, జనులైన మీరు, దీనిని మరువవద్దు! మొదట నిజమైనవాడు పంపబడిన తరువాత అనుకరణ చేయువారు వచ్చిరి. వారు అనుకరించుటకు వచ్చిరి. చూచారా, వారు అనుకరించవలసినదే. దయ్యము దేనిని సృష్టించలేదు; అసలు దానిని వంకరచేయుటే వాడి పని. పాపమనగా ఏమిటి? అది నీతిని వక్రీకరించుటయే. వ్యభిచారమనగా ఏమిటి? సరయిన కార్యమును వంకరగా చేయుటయే. అబద్దమనగా ఏమిటి? సత్యమును తప్పుగా చెప్పుటయే. ఒక వక్రీకరణ! హనన్యా వైపు చూడండి, అసలు వాక్యమును త్రిప్పివేసెను. బిలామును చూడండి, అసలు వాక్యమును త్రిప్పివేసెను. సిద్కియాను చూడండి, అసలు వాక్యమును త్రిప్పివేసెను. మరియు అసలైన వాక్యము నిరూపించబడిన తరువాత మరియు సత్యమని రుజువు చేయబడిన తరువాత ఈ వ్యక్తులు వచ్చి వక్రీకరించెదరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.

2TIM 4:3-5

 

99"సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులుగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక, కల్పనా కధల వైపుకు తిరుగు కాలము వచ్చును అని ఇంకా ముందు వ్రాయబడినది. వారు ఇష్టాను సారముగా జీవించెదరు. "మాకు అద్భుతములు, సూచక క్రియలు జరుగుచున్నవి గనుక చాలును అందురు." "సత్యము నుండి తొలగి పోయెదరు మరియు కల్పనా కథలు వైపు తిరుగెదరు" — సిద్ధాంతాలు.

MATT 24:24•

MARK 13:22

 

100ఓ, పరిశుద్దాత్మ ఉనికిని మనయెదుట ఎంతో తేటగా, వాస్తవముగా అది కనిపించుచున్నది. అయ్యో! దానికి లోబడని వారికి శ్రమ! ఈ మూలరాయిని త్రవ్వి అక్కడుంచబడిన కాగితపు ముక్కను చూడండి. అది ముప్పది-మూడు సంవత్సరముల క్రితము వేయబడెను. ఆ మూలరాయిని వేసిన ఉదయమున ఏడవ వీధిలో ఆయన చెప్పిన దానిని చూడండి. ఇప్పుడు, దానిని గమనించండి. ఈ నది యొద్ద అగ్నిస్తంభ రూపములో ప్రభుని దూత వచ్చుట గమనించండి. ఆ నదియొడ్డున, వందలకొలది సంఘ సభ్యులు నిలబడియుండిరి, ఆయనేమి చెప్పెను; ఆయన చెప్పినది నెరవేరినదా చూడండి. ఏమి జరిగినదో చూడండి. అది చాలా కఠినముగా యున్నది. సోదరులారా, అది చాలా కఠినంగా అక్కడ కనబడునని నాకు తెలియును, కాని బైబిలు చెప్పెను… మరియు యేసే స్వయంగా పలికెను, "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును." దానికి మరో దారి లేదు, దానిని వారెన్నడూ చూడలేరు. సాధ్యమైతే, ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయును.

101గమనించండి, దేవుని చేత నిజముగా అభిషేకము పొందినవాడు పంపబడిన తరువాత వీరు వచ్చెదరు. దేవుడు నిజ ప్రవక్తయగు మోషేను పంపెను. మోషే ఏదైనా చేసినప్పుడు, దానిని వారు అనుకరించిరి.

102ఇప్పుడు సోదరీ - సోదరులారా, ఇది నా స్వంత సంఘము. దేవుని వాక్యమును దాటిపోనంతవరకు నాకిష్టమైనది నేను బోధించు హక్కు నాకున్నది. నేను జనులైన మిమ్మును ఖండించుట లేదు, కాని మనము ఏ సమయములో, ఏ ఘడియలో జీవించుచున్నామో వెదకుదము.

సహో, రద్దెల్, జూనియర్ జాక్సన్ ఇంకా ఆయా సహోదర సంఘముల నుండి వచ్చిన వారికి వందనములు చెల్లించుచున్నాను. కొద్దిసేపటి క్రితము చెప్పవలసినది గాని మరచిపోయాను. సంఘములో చోటు లేనందున వారు టెలిఫోను ద్వారా వినుచున్నారని నేను తలంచుచున్నాను.

GEN 2:17•

GEN 3:4•

2TIM 3:8

 

103కేవలము ఒక్క నిమిషము ఇప్పుడు, దీని గూర్చి ఆలోచించండి. మోషే చేసిన అద్భుతములనే వారును చేసిరి. మోషే ఈగలను తెప్పించెను. వారును అనుకరించి ఈగలను తెప్పించిరి. చూచారా?

"దానిని తిను దినమున మీరు చచ్చెదరని" దేవుడు చెప్పెను. సాతాను వచ్చి ఇట్లనెను, "నిశ్చయముగా మీరు చావనే చావరు. మీరు తెలివిగలవారగుదురు. ఇంకా మంచి సంఘ సంస్థగా మీరు మారుదురు. ఇంకా మంచి వెలుగు పొందెదరు. ప్రతిది కూడ బాగుండునని మీకు తెలియునా" చూడండి, ఇది ఒక వంకరతనము. మరియు II తిమోతీ 3:18 ప్రకారము "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని" గుర్తు౦చుకొనండి. అదే "అంత్యదినములలో భూమి మీద యన్నే - యంబ్రేలు ఉండెదరు." ఇప్పుడు, ఇద్దరు అనుకరణ కర్తలున్నారని మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను, చూసారా.

ఇప్పుడు, కొంతసేపటి తరువాత సొదొమ యొద్దకు తిరిగి వెళ్ళుదము, ఆ ముగ్గురును గూర్చి చూద్దాం. దిగి వచ్చిన ముగ్గురు దేవదూతలను కనుగొని మరియు అనుకరణలను మరియు మొదలగువాటిని చూద్దాం. చూచారా, ఏది నిజమో, అబద్దమో చూద్దాం!

104గమనించండి. వారును అవే అద్భుతములు చేసిరి. అయితే ఆ నిజమైన వ్యక్తి ద్వారా అభిషేకించబడిన సత్య వాక్యమును దేవుడు పంపిన తరువాత వారు అనుకరించారని గమనించండి.

మనము ఒక్క నిమిషము ఆలోచించగలమా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. దాదాపు ఇరవై సంవత్సరముల క్రితము ప్రజల చేయి పట్టుకొని ఒక గురుతు చూపించాను. అబ్బాయీ, అన్ని విషయముల గూర్చి అంతకంటే ఎక్కువ సూచనలు వచ్చాయి… మరియు ప్రతియొక్కరు… ఒక్కరికి తన కుడి చేతికి వచ్చెనని చూపించారు; మరియొకరికి తన ఎడమచేతికి అది వచ్చెనని చూపించారు; మరియొకరు దానిని వాసన చూచారు, చూడండి. అన్ని రకముల… మరియు నేను ఆశ్చర్యపడుచున్నాను… ఏది నిజముగా సత్యమో ఇప్పుడు దేవుడు నన్ను ఈ సమయమున చెప్పనీయుట లేదు, గాని ఒక దినమున మీరది కనుగొందురు. అది కేవలము వారి బుద్ధిహీనత ప్రత్యక్షపరచబడుటకు. దాని ప్రారంభమే సరికాదు. ప్రభువు అనుమతించినట్లయితే, ఒక దినమున నేను చెప్పెదను.

105గమనించండి. అవే అద్భుతములు చేసిరి, కాని వారు చేయలేదు — గమనించండి — మొదట అసలయిన వాక్యము బయలు వెళ్ళిన తరువాత వరకు వారు దానిని చేయలేదు. ఏదెను తోటలో సాతానుడు అదే విధముగా చేసెను. ప్రతిసారి వాడాలాగే చేయును. మొదట ఎవరు ప్రవచించిరి? మోషే. రంగము మీదికి ఎవరు మొదట వచ్చిరి, మోషే నా లేక బిలామా? మోషే. మొదట రంగము మీదికి యిర్మియా వచ్చెనా లేక హనన్యా వచ్చెనా? నా భావమును గ్రహించారా?

గమనించండి. వారు కాపీ కొట్టిరి. శరీరసంబంధమగు అనుకరణ కర్తలు, యదార్థపరులు, "దేవునికి సేవ చేయుచున్నాముని" వారనుకొనుచుండిరి. దావీదు చేసినట్లుగా యున్నది. (గతవారం) దావీదు గూర్చి విన్నాము, కాని అది భౌతిక అనుకరణ. నేను ఒక్క నిమిషము ఆగుచున్నాను. వీటిని మీరు ఆలోచించవలెనని కోరుచున్నాను. నేను దానిని చెప్పునట్లయితే ముఖ్యంగా ఏర్పరచబడినవారికి పరిశుద్ధాత్మ వీటిని బయలుపరచును.

106ఫరో యొక్క మతశాఖ ఇట్లనును, "అదే క్రియలు చేయగలవారు మాకును ఉన్నారు." మరియు ఆలాగే వారు చేసిరి, చూచారా. ఫరో దీనిని ఎందుకు చేసెను? దేవుడెందుకు దీనిని అనుమతించెను? ఫరో ఎదుటికి ఒక సూచన చేయుటకు దేవుడు ఒక నిజమైన, అభిషేకము పొందిన ప్రవక్తను ఎందుకు పంపెను? ఆ తరువాత ఒక మతశాఖ వారు దానిని కాపీ కొట్టినట్లు ఎందుకాయన అనుమతించెను? ఎందుకు ఆ అనుకరణ చేయు వానిని లేవనిచ్చెను? నిజమైన దేవుని ఆత్మ చేసినవే వారెందుకు చేయకలిగిరి? చూడండి, వాక్యము తప్పక నెరవేరవలసియున్నది.

1KGS 22:20•

2CH 18:19•

REV 3:17,18

 

107ఫరో మరియు ఐగుప్తీయుల యొక్క హృదయమును కఠినమును చేయుటకు ఆయన ఇది జరుగనిచ్చెనని గుర్తుంచుకొనండి. ఆ వాక్యము కలిగియున్నది మోషే ఒక్కడే కాడని నిరూపించెను. మోషే చేయకలిగిన ప్రతిదియు వారును ఆలాగే చేయకలిగిరి. మరియు దేవుడు అంత్యదినములలో ఎందుకు ఈ కార్యమును జరుగనిచ్చును? సిద్కియాతో అబద్దమాడు ఆత్మ చెప్పినట్లే ఇది యున్నది. "ఈ సంగతులు జరుగునట్లు ఆహాబును ఎట్లు మనము పురికొల్పుదుము?" ఆయన ముందుగా చెప్పిన దాని ప్రకారము, ఈ ప్రజలు వారియొక్క సంఘములను నమ్ముచున్నారు, ఏలాగు ఈ కార్యము నెరవేరునట్లు వారిని ఆయన పురికొల్పును? ఈ లవొదికయ సంఘకాలములో యున్నవారు "నేను ధనవృద్ధి చేసికొనియున్నాను మరియు నాకేమీయు కొదువలేదు. నేనొక రాణిగా కూర్చున్నాను," అని నీవు చెప్పిన కారణమును బట్టి, నీకు ఏమియూ లేదు!

నీవు దిక్కుమాలిన దానవు, దరిద్రురాలవు, గ్రుడ్డిదానవని ఎరుగకయున్నావు? మరియు నా యొద్దకు వచ్చికొనమని నేను చెప్పుచున్నాను. "నూనె మరియు బంగారమును" కొనమనుచున్నాడు. ఎందుకాయన ఆలాగు చేసెను? దేవుని యొక్క నిజ వాక్యము వలన ఈ కార్యములు జరుగుచుండగా, ఈ చివరి దినములలో అనుకరణ చేయువారిని ఎందుకాయన లేపుచున్నాడు? మరియు అనుకరణ చేయువారు లేచి అవే క్రియలు చేసి, దేవుని నిజ వాక్యమును తిరస్కరించెదరా? మోషేకు ఆయన అదే చేసెను. మరియు ఫరో మోషేకు విరోధముగా ఆలాగు చేసెను. యన్నే యంబ్రేలు మోషేకు విరోధముగా ఆలాగు చేసిరి. మరియు చివరి దినములలో అది మరల జరుగునని బైబిలు చెప్పెను. ఇది మనము చూచుచున్నాము. యిక్కడే మనమున్నాము. ఇప్పుడు ఆ లేఖనము నెరవేర్పు జరుగనట్లయితే, అది ఎక్కడ నెరవేర్పు జరుగుచున్నది?

2TIM 3:9

 

108మోషే వారితో వాదించి "యిక్కడ యిక్కడ! మీరది చేయవద్దు, నేను మాత్రమే అది చేయుటకు అభిషేకించబడితిని. ఇదిగో! యిప్పుడే మీరు దానిని ఆపండి" అని చెప్పెనా? వారిని ఆలాగే అతను పోనిచ్చెను, వారిని పోనీయండి. బైబిలు చెప్పినది మరువకండి, "వారి మోసము బయట పడినట్లే, ఈ చివరి దినములో కూడ బయటపడును," అప్పుడు వధువు ఎత్తబడి ఆకాశమునకు కొనిపోబడును.

గమనించండి.

109మోషే, నిజమైన, బయలుపరచబడిన వాక్యము, ఎన్నడూ ఏమియూ అనలేదు, కేవలము దానిని ముందుకు సాగిపోనిచ్చెను. అయితే ఫరో హృదయము కఠినమగుటకు, ఫరో మోసపుచ్చబడుటకు ఆయన ఆలాగు చేసెను. ఆయన ఆహాబును మోసపుచ్చుటకే అదే కార్యమును ఆయన జరిగించెను. మరియు ఆ చిన్న మికాయూ వారి మధ్య స్వయముగా నిలబడి "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని" చిన్న మికాయా వారికి చెప్పుచుండెను. యిక్కడ మరొకరు నిలవబడి అభిషేకించబడి, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పెను. మరియు ఒకరికి మరొకరు వ్యతిరేకముగా యుండిరి.

MAL 4:5,6

 

110చివరి దినములలో యేసుక్రీస్తు నామములోనే నీటి బాప్తిస్మమై యుండవలెనని "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" మనము ఈనాడు నిలబడియున్నాము. మరియు మరొకడు లేచి అద్భుతములు జరిగించుచున్నాడు. మరియు అతడు ఒక త్రిత్వమును బోధించువాడు. బైబిలులో త్రిత్యము అను మాటను నాకు చూపించండి. ముగ్గురు దేవుళ్ళు ఎక్కడున్నారో నాకు చూపించండి. అట్టిది ఏదైనా ఉంటే నాకు చూపించండి. అది దేవుని వాక్యములో లేదు. "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము అను బిరుదులను ఉపయోగించి ఎవరునూ ఎన్నడునూ బాప్తిస్మము పొందినట్లు అలాంటి ఒక కార్యము కూడ లేనేలేదు. "సోదరీలారా, మీరు జుట్టు కత్తిరించుకొన్నా, మరేమి చేసినా పరవాలేదని వారనుచున్నారు. ఆ పాత బోధ వద్దనుచున్నారు." అయితే బైబిలు చెప్పెను! మరియు ఆయన వాగ్దానము చేసెను. "చివరి దినములలో ఆయన ఏలియా ఆత్మను పంపును. అతడు దేవుని పిల్లలను ఆదియందున్న వాక్యము వైపుకు, మూల విశ్వాసము వైపునకు త్రిప్పును." ఆ వాక్యమే స్థిరము. మనుష్యకుమారుడు అంత్యదినములలో సొదోమలోవలె ప్రత్యక్షమగును. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. అది చేయుదునని ఆయన వాగ్దానము చేసెను. అది దేవుని యొక్క వాగ్దానము; "అది ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

MATT 24:24•

MARK 13:22

 

111దేవునికి అది సరిపోయినంత వరకు మోషే చేసినట్లే వారునూ అదే కార్యమును చేసిరని గమనించండి. అది ఈ చివరి దినములో జరుగునని, అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని" ఇప్పుడు గుర్తు౦చుకొనండి. ప్రపంచమును అంతా ఇప్పుడు వెదకండి; ప్రతి బోధను తీసుకొనండి, ప్రతి ఆరాధన పద్ధతిని తీసుకొనండి. అదే కార్యమును ఆయన జరిగించెను. ప్రతి సంఘమును తీసుకొని గమనించండి! బోధకులారా, క్రీస్తు నామములో ఈ పని చేయుమని మీకు చెప్పుచున్నాను. వార్తాపత్రికలు చదవమని మీకు చెప్పుచున్నాను లేక నీవు కోరుకున్న చోటు ఎక్కడకైన వెళ్ళి విచారణ చేయమని నేను మీకు చెప్పుచున్నాను. మరియు ఇప్పుడు అది భూమిమీద యున్నదో లేదో చూడండి. అయితే మత్తయి 24:24 సరిగ్గా నిజమైయున్నది. "అబద్ధ అభిషేకించబడిన వారు ఈ దినములందు లేచెదరు. మరియు వారు అభద్ద ప్రవక్తలుగా యు౦దురు మరియు అనేకులను మోసపుచ్చెదరు." ఇప్పుడు అది సాదృశ్యములలో యుండుట గమనించండి, అది ఇప్పుడు వచ్చియున్నది, చూచారా. అనేకులను మోసపుచ్చెదరు. ప్రవక్తలు (బహువచనము); క్రీస్తులు, అభిషిక్తులు (బహువచనము). అనేక వివిధ వ్యక్తులు: మెథడిస్టు అని మీకు తెలియును, బాప్టిస్తు మరియు పెంతెకోస్తు మరియు మొదలగువారు.

అయితే ఒక నిజమగు క్రీస్తు ఆత్మయున్నది. అది చేయుదునని ఆయన వాగ్దానము చేసిన ప్రకారము ఆ వాక్యమే శరీరధారి అయ్యెను.

ఇప్పుడు ఇంకా కొన్ని లేఖనముల కొరకు ఇంకొంచెము ముందుకు వెళ్ళుదము.

దేవునికి అది చాలినంత వరకు జరుగును, అప్పుడు అది ముగించబడును. వారి మోసము బయలుపరచబడును.

112గమనించండి. పొట్టు కూడా సరిగ్గా గోధుమ గింజవలె కనిపించునని గుర్తు౦చుకొనండి, చూచారా. ఇప్పుడు, ఆ వెనుక లూథర్ కాలములో "కాండమే గోధుమయి యున్నది" అని మీరు చెప్పలేరు. అయినను దానిలో జీవమును కలిగియున్నది. కాండము సరియే. ఆ కాండములో జీవముండుట సరియే, కాని మరువవద్దు, ఆ జీవము ముందుకు పోవలెను. ఏలీషా నుండి ఏలియా వరకు వెళ్ళవలెను. జీవము ఆగక ముందుకు పోవును. అది మరొక్క దశలో యున్నదని. అయితే మరవకండి, అది ఆ దశలోనే ఉండజాలదు. మనము మరో కాలములోని క్రుళ్ళిన దానిని తినలేము. మనము పెంతెకోస్తు, లేదా మెథడిస్టు, లేదా బాప్టిస్తు క్రుళ్ళిన దానిని తినలేము. చూడండి, అది ఒక క్రుళ్ళినదిగా మారినది. మనకు తాజా ఆహారమున్నది. అది ఈ ఘడియ యొక్క వాక్యము, మొదలగునది.

MATT 24:24•

MARK 13:22

 

113గుర్తుంచుకొనండి, పొట్టు నిజంగా గోధుమ గింజను పోలియుండును. అది ఆకులో యుండినప్పుడు ఆలాగు కనపడదు, కాని కాడలో యుండినప్పుడు ఆలాగు కనబడదు, కాని అది నిశ్చయముగా పొట్టులో యున్నప్పుడు కనబడును. యేసుక్రీస్తు ఏకరీతిగా యున్నాడు. లూథర్లో ఆలాగు కనబడదు, అది వెస్లీలో ఆలాగు కనబడదు, కాని అది నిశ్చయముగా పెంతెకోస్తులో కనబడును. "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చును." అక్కడ మీ కాలములుయున్నవి.

114అయితే గుర్తు౦చుకొనండి, చివరి దినములలోని పెంతెకోస్తు సంఘము లవొదికయై యున్నది, మరియు క్రీస్తును బయటకు త్రోసివేయబడెను, మూలము, స్వయముగా గోధుమ గింజ. ఆయన ప్రయత్నించినప్పుడు… ఆయన తన్నుతాను సంఘములో బయలుపరచుకొనవలెనని ప్రయత్నించినప్పుడు, ఆయనను బయటకు త్రోసివేసిరి. ఇంకా అభిషేకించబడిన ఒక సంఘమనే చెప్పుకొనుచున్నారు. అయితే ఇక్కడ వాక్యమున్నది, స్వయముగా క్రీస్తే; వధువు అయిన ఆయన మిగతా శరీరము కొరకు రావలసిన అదే అభిషేకించబడిన వాక్యము. మనము దానిగూర్చి మాట్లాడుకున్నట్లు, అదే నీరు అభిషేకించబడిన గోధుమలను తడిపినది, అభిషేకించబడిన గురుగులను కూడ తడిపినది. కేవలము ఎన్నుకోబడిన వారు లేక ముందుగా నిర్ణయించబడినవారు వారిమధ్యనున్న తేడాను కనుగోగలరు. ఎఫెసీ 5:1 అదెట్లు౦డునో ఇప్పుడు మీకు చెప్పుచున్నది.

MATT 24:24•

MARK 13:22

 

115వారు అభిషేకించబడినవారు. ప్రతియొక్కరూ అనెదరు, "దేవునికి మహిమ! ఇక్కడ మాకు స్వాతంత్ర్యము దొరికినది. హల్లెలూయా, ఓ! హల్లెలూయా! మేము భాషలలో మాట్లాడుచున్నాము మరియు ఎగురుచున్నాము. మాకు స్త్రీ స్వేచ్చ లభించినది. ఇలాంటి రకమైన కార్యములన్నిటి క్రింద వారిని పెట్టుటకు జనులైన మీరు ప్రయత్నించెదరు." చూచారా? ఆలాగే కానీయుడి. మీరు చేయవలసినది ఏమియూ లేదు. "మంచిది, మేము భాషలలో మాట్లాడుచున్నాను. మేము కేకలు వేయుచున్నాము. మేము ఆత్మలో నాట్యమాడుచున్నాము. మేము వాక్యమును బోధించుచున్నాము" అని చెప్పెదరు. నిశ్చయముగా, దానికి వ్యతిరేకముగా ఒక విషయము అనలేము. వెనుక ఆ బైబిలులోని వారు ఆలాగే యుండిరి. "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసము చేయునని," యేసు చెప్పెను.

MATT 19:30•

MATT 20:16•

LUKE 13:30

 

116ఇప్పుడు గమనించండి. అసలైన గింజ యొక్క పొట్టు, గింజ, భూమిలోనికి వెళ్ళెను, అది సంస్థ కాదు. అది స్వయముగా ఒక గింజ. అయితే అది బయటకు వచ్చినప్పుడు, అది ఒక గింజ కాదు; అది ఒక సంస్థ (చూచారా), ఆకులు, ధాన్యము. అటు తరువాత అది మరో దశలోనికి వెళ్ళెను, అదే కాండము. అయినా అది ఆదిలో నున్నట్లు లేదు. అది ఒక సంస్థ. అది పొట్టుగా మారినది, చాలా ఆకులు తొడిగినది, పెంతెకోస్తు, దాదాపు అసలు విత్తనమువలె కనిపించెను. దానిని చూడుడి; అక్కడ మీరు చిన్న పైపొట్టును చూచినప్పుడు, ఒక గోధుమ గింజవలె సరిగ్గా అదే విధముగా కనబడునట్లు అది ఎల్లవేళల రూపుదిద్దుకొనుచున్నది. కాని చివరకు అది కనిపించెను మరియు సంస్థ వలె లేదు. దానిని మోసికొనిపోవునవి యిక లేవు. సంస్థ కేవలము ఒక మోసికొనిపోవునది. యిక మోసికొనిపోవునవి లేవు, కాండము చనిపోవలసినదే; పొట్టు చనిపోవలసినదే; మిగతా ప్రతిదియు చనిపోవలసినదే. కాని గోధుమ బ్రతికి యుండును. అదే పునరుత్థాన శరీరము, క్రిందకు వచ్చి మరియు వారిని పైకి ఎత్తును. కడపటి వారు మొదటి వారగుదురు మరియు మొదటి వారు కడపటివారగుదురు, చూచారా. పునరుత్థానమందు వారు లేపబడుదురు. దీనిని మీరు గమనించుచున్నారా? సరే.

గమనించండి, గింజ…

117పొట్టు సరిగ్గా నిజమైన గింజవలె కనిపించును. ఒక వ్యక్తి గోధుమ పంటను లేక ఇంకో మరేదైన పంటను పండించువాడు దానిని చూచి, "దేవునికి స్తోత్రము, నాకు గోధుమ పంట పండినది" అని చెప్పినప్పుడు, అసలు అతనికి ఒక్క గోధుమ గింజ కూడ రాలేదు. అది నిజమైన గోధుమవలె సరిగ్గా కనిపించును గాని, అది పొట్టు అయియున్నది.

118స్నేహితులారా, ఇప్పుడు నాతో కూడా వెనుకకు వెళ్ళండి. క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క వధువు, గోధుమ గింజ భూమిలో పడిన దినముల పిమ్మట (మరణించినప్పుడు) మొదటి ఉజ్జీవము ఎక్కడ వచ్చెను? క్రీస్తు తన వధువు సంఘమును సంస్థగా చేసెనా? అది నిజమేనా? ఎన్నడూ ఆయన దానిని సంస్థగా చేయలేదు. ఆయన అపోస్తలులను, ప్రవక్తలను మరియు మొదలగువారిని సంఘమును పవిత్రముగా ఉంచుటకు నియమించెను. కాని రోమ్లోని నైసియా వద్ద, మూడు వందల-ఆరు సంవత్సరముల తరువాత వారు ఒక సంస్థగా దానిని చేసిరి. మరియు అందులోనుండి ఒక సంఘ శాఖను తయారుచేసిరి. అది నిజమే గదా? మరియు అది మరణించెను. ఆ సంఘముతో సమ్మతించని ప్రతిదానికి మరణము విధించెను. మరియు ఆలాగున అది వందలాది ఏండ్లు నేలలో యుండెను, అయితే కొంతకాలము తరువాత లూథర్ వచ్చెను. మొదటి చిన్న విత్తనము మొలకెత్తెను. రెండవ దశలో అది వికసించెను. వారింకా మందుకు వెళ్ళిరి, జ్వింగ్లీ ఇంకా తదితరులు వచ్చిరి. ఇతర సంస్థలు మొదలగునవి వచ్చినవి. తరువాత కొంత కాలమునకు ఆంగ్లికనులు వచ్చిరి. మరియు అప్పుడు ఏమి జరిగినది? ఇక్కడ ఒక క్రొత్త ఉజ్జీవముతో వెస్లీ వచ్చెను, కాండము, అది యింక ఎక్కువ విత్తనమువలె కనిపించెను. పిమ్మట దానికి ఏమి జరిగెను? అది సంస్థగా మారి ఎండిపోయి మరియు చనిపోయినది. అయితే జీవము పొట్టులోనికి నేరుగా వెళ్ళెను. మరియు ఆ పొట్టు దాదాపు పరిపూర్ణముగా విత్తనము మాదిరిగా మారినది. కాని చివరిగా దాని మోసము గత యెనిమిది లేక పది సంవత్సరములలో బయలుపరచబడెను, ప్రత్యేకముగా చివరి మూడు సంవత్సరములలో బయలుపరచబడెను. ఇప్పుడిది ఏమాయెను? గోధుమ నుండి వేరాయెను.

MATT 24:24•

MARK 13:22

 

119ఇప్పుడు ఈ గొప్ప ఉజ్జీవము వచ్చిన ఈ ఇరవై సంవత్సరములలో ఇందులో నుండి ఒక సంస్థ ఎందుకు తయారవ్వలేదు? అభిషేకించబడిన బోధకులు, అభిషేకించబడిన ప్రవక్తలు మొదలగువారున్నారు, కాని ఎందుకు అక్కడ తయారవ్వలేదు? గింజను మించినది ఏదీ లేదు, చూచారా. అది సంస్థ లేకుండానే తిరిగి వచ్చెను. ఓ, మై, ఒక గ్రుడ్డివాడు కూడా దానిని చూడగలడు. అది సంస్థ కాలేదు. దానికది పూర్తి వ్యతిరేకి. అదే స్వయముగా గోధుమ గింజ. మనుష్యకుమారుడు ప్రత్యక్షమగును. చివరి దినములలో గోధుమ గింజ, మనుష్యకుమారుడు మరల ప్రత్యక్షమగును. "చివరి దినములలో అబద్ధికులు, దానిని అనుకరణ చేయువారు వచ్చి, సాధ్యమైతే, ఏర్పరచబడినవారిని కూడా మోసపుచ్పుదురు." ఇప్పుడు, ఆ సంస్థల పొట్టు ఊడిపోవుట చూడండి.

EPH 1:4,5

 

120అది ఏర్పరచబడిన వారికి మాత్రమే గోధుమ గింజ తెలియును, వారు దానిలో భాగము.

ఇక్కడ ఎంత చక్కగా అది తేబడెనో చూడండి. గమనించండి.. అభిషిక్తులు మాత్రమే… దానిని చూచుటకు సామర్థ్యము కలిగినవారు. నిజముగా ముందు నిర్ణయించబడి, ఏర్పరచుకొనబడినవారు. (ఎఫెసీ 5:1 లేక 1:5లో) ముందుగా అభిషేకించబడినవారు, ఏర్పరచ బడినవారు — వారు మాత్రమే మోసపుచ్చబడరు. గమనించండి, అభిషేకము పొందిన ప్రవక్తలు అబద్ధికులై యుందురు మరియు వారి మధ్యనే నిజ అభిషిక్తులు కూడ యందురు. నీవెట్లు దానిని కనుగొందువు? వాక్యము ద్వారానే. మనము దానిని ఛాయలో కలిగియున్నాము. దానిని మీరు చూచుచున్నారా? "ఆమేన్!" చెప్పండి. చూచారా?

MATT 24:24•

MARK 13:22

 

121గమనించండి. అభిషిక్తులను, సూచనలు కాదు గాని, వాక్యము మాత్రమే వారిని వేరుచేయును. ఓ, లేదు! వారునూ అవే సూచనలు చేయుదురు. అయితే వాక్యము వారిని వేరుచేయునది. నిశ్చయంగా! వారందరూ ప్రవచించిరి; వారందరూ ఇది, అది మరియు ఇతరవన్నీ చేసెను, నిశ్చయంగా, కేవలము అదే విధముగా చేసెను. వారు అదే కార్యము చేయుదురని యేసు చెప్పెను. అయితే గమనించండి, సూచక క్రియలు కాదు గాని, వాక్యము వారిని వేరు చేసెను.

మీరు గమనించారా, యేసు యిక్కడ మత్తయి 24లో చెప్పెను… "అబద్ద యేసులు అంత్యదినములలో లేచెదరని" ఆయన చెప్పలేదు. ఓ, లేదు, వారు ఆ పని చేయలేరు. లేదు! నిజమగు పెంతెకోస్తు తనకు తాను, అతను "యేసు" అని చెప్పుకొనునా? చూచారా? ఒక అబద్ద మెతడిస్టు, లేక ఒక బాప్టిస్టు, లేక ఆలాగు యొవరో ఒకరు లేక సంఘశాఖలలో ఒకటి "మేము యేసులము" అని చెప్పుకొనునా? వారికి అంతకంటె బాగా తెలియును, వారది చేయరు. అయితే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, వారు అబద్ధ క్రీస్తులుగా ఉండెదరు, యేసులుగా కాదు, గాని, అబద్ధ క్రీస్తులుగా.

"నేను యేసును" అని వారనలేరు. ఓ లేదు!

122అయితే వారు అబద్ధ క్రీస్తులు మరియు దానిని ఎరుగరు, కారణము వారు వాక్యమునకు వ్యతిరేకులు. మరియు దేవుడు దానినే రుజువు చేయును. ఇప్పుడు దీనిని మీకు చూపించుటకు తీసికొని వచ్చుచున్నాను, ఎందుకనగా నిజమైనవారు చేసినవే వారును చేయుట మీరు చూచిరి. మరియు యేసు ఆ ప్రకారమే చెప్పెను.

ఇప్పుడు, టెలిఫోను ద్వారా వినుచున్న జనులైన మిమ్మును నేను ఖండించుట లేదు, కాని ఇది నా సంఘము, మరియు పరిశుద్దాత్మ నా గుంపుపైన నన్ను కావలివానిగా నియమించెను. మరియు నేను వారికి సత్యము చెప్పవలసియున్నాను. సమయము గతించుచున్నది.

123ఇప్పుడు, వారు ఆలాగు నిలచియుండలేరు, కాని అబద్ధ క్రీస్తులు, అబద్ద అభిషిక్తులు, దాదాపు ప్రతి సూచక క్రియను మరియు వాక్యము యొక్క ప్రతి అక్షరముతో చేయుదురు. "వారు పరిశుద్దాత్మ బాప్తిస్మము నమ్ముదురా?" నిశ్చయంగా, "ఇవన్నిటిని నమ్ముదురా?" అవును! "భాషలు మాట్లాడుట వారు నమ్ముదురా?" అవును! "అద్భుతములు, సూచక క్రియలు వారిని వెంబడించునని నమ్ముదురా?" అవును! వారు బాప్టిస్తులు కారు. వారు మెతడిస్తులు కారు. లేదు, లేదు! వారు పెంతికోస్తువారు. ఇవి చివరి దినములు. ఇప్పుడు, మొదటి సంఘకాలము దానిని ఎన్నడూ గమనించనే లేదు. మెథడిస్తు సంఘకాలము ఎన్నడూ దానిని గమనించలేదు. బాప్టిస్తు సంఘకాలము ఎన్నడూ దానిని గమనించలేదు. ప్రెస్బిటేరియను సంఘకాలము ఎన్నడూ దానిని గమనించలేదు, కాని పెంతెకోస్తవారు — అసలయిన దానికి చాలా దగ్గరగా కనిపించిరి! అక్కడే పొట్టు దాదాపు గోధుమ వలే కనిపించును. వారు దానినెన్నడూ గమనించరు, చూచారా. వారు చూడలేరు. కాని ఇవి చివరి దినములు, ఈ దినము. అవునండీ!

MATT 24:24•

MARK 13:22

 

124గమనించండి. ఆదియందున్నట్లుగానే, అంతమందును ఉండును. ఒక్క మాటకు సాతాను తప్పు అర్ధము చెప్పగా, హవ్వ దానిని నమ్మినది. ఆమె, అతను కాదు. సంఘము, ఆయన కాదు, చూచారా. అబద్ధ వాక్యమును పొందినది సంఘమే, చూచారా. ఆదాము కాదు, హవ్వ. క్రీస్తు కాదు, గాని సంఘము, వధువు, అభిషేకించబడి వధువుగా ఉండవలసియున్నది. వధువు అని తనకుతాను చెప్పుకొన్నది. ఆమె అబద్ద వాక్యము పొందెను. దానిని మీరు చూడలేరా? ఎందుకు, అది చక్కగా కట్టబడిన బూటు త్రాడువలె యున్నది. కను రెప్పలవలె చక్కని అమరికలో యున్నది. అదే కార్యము నమ్మినది హవ్వ మాత్రమే, ఆదాము కాదు. నేడు వధువుగా చెప్పుకొనుచున్న సంఘము దానిని నమ్మెను, క్రీస్తు కాదు. వధువు అన్ని రకములను కలిగియున్నది, వధువుగా పిలచుకొనును, అదే సూచక క్రియలు, అదే అద్భుతములు అన్నియూ ఒకేలాగున్నవి, కాని అవి నిజము కావు. "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని మోసము చేయును."

ఇప్పుడు త్వరగా, మనము పదిహేను నిమిషములలో ముగించినయెడల సమయానికి ముగించినట్లే. ఇప్పుడు చాలా జాగ్రత్తలు గమనించండి… దీనిని మీరు అపార్థము చేసికోలేరు.

MATT 24:24•

MARK 13:22

 

125ఇప్పుడు, లేదు, వారు "అబద్ద యేసులు" గా పిలువబడుటకు నిలబడరు. "యేసుగా" వారు పిలువబడుటకు నిలవబడరు; నిశ్చయముగా కాదు. అది అంత తేటగా యున్నది. ఎవరయినా దానిని తెలిసికోగలరు. వారు యేసు కారని ఎవరికైనా తెలియును. వారి వీపు మీదనుండి నూనె కారినా, చేతుల నుండి, క్రింద మరియు పైన వారియొక్క కండ్ల నుండి రక్తము కారినా వారికింకా తెలియును. అది ఏ మాత్రము జ్ఞానముగల వ్యక్తి అయినా, అది యేసు కాదని గుర్తించగలడు, చూచారా. దానికి వారు తాళలేరు. కాని వారు అభిషిక్తులమని చెప్పుకొందురు మరియు దాదాపుగా ఏర్పరచబడిన వారిని మోసము చేయుటకు, వారు సూచక క్రియలు మరియు అద్భుతములు చేయుదురు. అయితే అబద్ద క్రీస్తులు, అభిషిక్తులు లేచి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయుదురు.

126ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి; ఈ మాట వినుటకు యోగ్యమైనది గనుక తప్పిపోవద్దు. (ఈ మైక్రోఫోను పైకి ఎగురకుండా అతడు టేపు పెట్టుచున్నాడు. నా చెమట బిందువులు దాని మీద పడుచున్నవి. మీరు చూచారా.)

ఆ ఇద్దరూ ఒకే విధంగా కనిపించెదరని బైబిలు చెప్పెను. చూచారా?

MATT 24:24•

MARK 13:22

 

127గమనించండి, అబద్ధ యేసులు కాదు, అబద్ధ క్రీస్తులు. వారు అభిషేకము పొందినట్లు నమ్మిక కలిగియుందురు, అయితే వారు యేసు కారని వారికి తెలియును, చూడండి. అది బహు తేటగా యున్నది. ఈ రోజున ఎవరైనా గాని జనులతో, "నా చేతులలో గాయములు చూడండి; నా నుదురు చూడండి; నేను యేసునే," అని చెప్పినచో, సరే, ఇప్పుడు అది తప్పు అని మనందరికీ తెలియును. మరియు గుర్తుంచుకొనండి, అట్టివారు లేచెదరని యేసు ఎన్నడూ చెప్పలేదు. అబద్ధ క్రీస్తులు వచ్చెదరని ఆయన చెప్పెను. క్రీస్తులు (బహువచనము), మతశాఖలు మరియు మొదలగునవి, అభిషిక్తులు — మతశాఖల యొక్క ఆత్మలో అభిషేకము కలిగియుందురు, మరియు వాక్యముతో కాదు. మీరు దానిని గ్రహించుచున్నారా? అబద్ద యేసు కాదు; అబద్ధ క్రీస్తులు, అబద్ధ అభిషిక్తులు, చూచారా. ఓ, ఎంతో తేటగాయున్నది! నిశ్చయంగా ఇది మీరు గ్రహించెదరు!

128ఇప్పుడు గుర్తుంచుకొనండి, మూడు తరగతుల జనులున్నారని మీకు ఎప్పుడూ నేను చెప్పుచుందును. మూడు తెగల ప్రజలున్నారు. హాము, షేము, యాపెతు — మూడు తెగలు. మూడు తరగతులు మరియు నేను చెప్పాను, అది విశ్వాసి, నటన-విశ్వాసి మరియు అవిశ్వాసి. ఎప్పుడూ వారుండుట జరుగును. ఎప్పుడూ వారుండెదరు, చూచారా. మోషే యుండెను, విశ్వాసి; యన్నె, యంబ్రెలుయుండెను, అవిశ్వాసులు, చూచారా. బిలాముయుండెను; మోషే. ఆ మూడు రకముల ప్రజలు ఎల్లప్పుడూ యుందురు. మూడు తరగతులు: విశ్వాసి, నటన-విశ్వాసి మరియు అవిశ్వాసి.

ఇప్పుడు, గుర్తు౦చుకొనండి, అవిశ్వాసి — మతశాఖకు చెందినవాడు — ఏ సూచక క్రియలు అసలు నమ్మడు; చల్లగా, అలవాటు ప్రకారముగా, నిర్జీవముగా నుండిన లోకములోనున్న సంఘమే ఈ మతశాఖ. కాని నటన-విశ్వాసి ఆ పొట్టును పోలియున్నాడు. ఆ వ్యక్తియే విశ్వాసిగా నటించును. మరియు నిజముగా నమ్మిన ఒక విశ్వాసియూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషము వారు ముందుకు వెళ్ళుచుండగా, యిప్పుడు గమనించండి.

MATT 4:6•

LUKE 4:9,10

 

129మరియు ఈ అవిశ్వాసులు.. లేక నటించు విశ్వాసులు ఎంత ధైర్యముగానున్నారో గమనించండి. మై! వారు ధైర్యవంతులు! చూడండి, నిజవాక్యమైయున్న దేవుని సన్నిధిలోనే సాతాను నిలబడి "ఈలాగు వ్రాయబడియున్నది" అని పలికెను. అది నిజమేనా? ఎందుకు సాతాను ఆలాగు చేసెను? కారణమేమనగా వాడికి వాక్యము తెలియదు ఆ ఘడియ కొరకు వాక్యమును వాడు ఎరుగును, కాని ఆ వాక్యమైయున్న ఈ దీన మనుష్యుని వాడు సందేహపడెను. "నీవు దేవుని కుమారునివైతే. దేవుని కుమారుడు వచ్చుచున్నాడని నాకు తెలియును, ఎందుకనగా ఆయన దానిని చేయుదునని అది చెప్పెను. మరియు "దేవదూతలు ఆయనను ఎత్తిపట్టుకొనునని" అది వ్రాయబడెను. చూచారా? అయితే దానిని నాకు నిరూపించుము! ఒక అద్భుతము చేయుము! నీవు చేయుచుండగా నన్ను చూడనీ" అని చెప్పెను. చూచారా, చూచారా? అవిశ్వాసిని చూడండి, నటన-విశ్వాసి, అనుకరణ చేయువాడు. వారి మధ్యనేనున్న యూదా వైపు అదే సమయములో యుండుట చూడండి — నటన-విశ్వాసి, చూచారా. నిజవాక్యము అచ్చట ఉండుటయూ గమనించండి.

JUDE 1:9

 

130వారెంత ధైర్యవంతులు! "అసలు ఆ వెర్రిదాని వైపు మీ ఏకాగ్రతను పెట్టకండి; దానిలో ఏమీ లేదు. అక్కడికి వెళ్ళవద్దు; అది గోల తప్ప మరేమీ కాదు. దానికి ఏమియూ లేదు; అదంతా ఒక కట్టు కథ; అది మీ మనస్సులోనేయున్నది." చూచారా, నా భావము గ్రహించారా? వాక్య సన్నిధిలోనే నిలబడియుండి మరియు దానిని చెప్పిరి.

సాతానులోనికి వెళ్ళినది… బైబిలులోని యూదా పత్రికలో ఇక్కడ చెప్పిన ప్రకారముగా "ప్రధాన దూత సాతానుతో వాదించుచున్నప్పుడు, "ప్రభువు నిన్ను గద్దించు గాక," అని పలికెను. వాక్యమునకే విరోధి. మరియు ఆ దినమునకు నిజమగు వాక్యముగా యున్న యేసు క్రీస్తునకు ఇక్కడ క్రీస్తువిరోధి, అభిషిక్తుడు, విరోధముగా నిలువబడి, "అది వ్రాయబడియున్నది" అని పలికెను.

1KGS 22:25-28•

2CH 18:24,26,27•

MATT 24:24•

MARK 13:22

 

131చివరి దినములు వైపు చూడండి, "సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుటకు అది చాలా దగ్గరగా యుండును." ఓ, మై! ఏర్పరచబడినవారు మోసపోరు, ఎందుకో మీకు తెలియునా? వారే వాక్యమైయున్నారు గనుక, చూచారా? అది పేరులో జీవమున్నదానివలె నున్నది (నేను కొద్దిసేపటి క్రితం చెప్పాను), అది తనకు తాను తిరస్కరించు కొనజాలదు, చూచారా. అది వాక్యము మరియు అది వాక్యము యొక్క కాలములో యున్నది. అది నిజము.

యిర్మియా వలె నున్నది, అతను ఎరుగును. హనన్యా ఏమి చెప్పినా గాని, అతడు తను ఎక్కడ యున్నాడో యెరిగియుండెను. మరియు సరిగ్గా మోషే ఆలాగే చేసెను మరియు మిగతావారందరూ ఆలాగే చేసిరి. అబద్ధ ప్రవక్తలు ఏమి చెప్పినా గాని, అతడు ఎరిగియుండెను. దేవుని వాక్యము అచ్చటుండెను. అది వ్రాయబడి యుండెను. "మంచిది, మీరందరూ వేచి చూడండి" అని ఆ కారణమునుబట్టి మీకాయా చెప్పగలిగెను.

ఆహాబు ఇట్లనెను, "నా ప్రవక్తలను నేను నమ్ముచున్నాను. నా సంఘ సంస్థయే సరియైనది. నేను సమాధానముగా తిరిగి వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని చెరసాలలో వేయుడి. వాని పని నేను చూతును! అతనికి దుఃఖవేు భోజనముగా ఇయ్యుడి. బయటకు త్రోసివేయండి; అతనితో ఎన్నడూ ఏ సహవాసము చేయవద్దు. నేను సమాధానముగా తిరిగి వచ్చిన తరువాత, వాని సంగతి చూచెదను."

"నీవు తిరిగి వచ్చినయెడల ప్రభువు నాతో మాట్లాడనట్టే" అని మీకాయా పలికెను. తాను "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడును" కలిగియున్నానని తెలియును. మరియు అతని దర్శనము సరిగ్గా "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో" సరిపోయినది; మరేదో కాలమునకు కాదు, గాని ఆ కాలమునకే చెందెను. ఆమేన్! హల్లెలూయా! ఆ కాలమునకే చెందినది.

ధైర్యముగా నిలబడి ఒక ప్రధాన దూతతో తర్కించెను! "దేవదూతలు వెళ్ళుటకు జంకు చోటికి బుద్ధిహీనులు వెళ్ళుటకు త్వరపడుదురని" అది చెప్పబడినది. అది నిజము.

HEB 13:5

 

132ఏర్పరచబడినవారు మోసపుచ్చబడరని యేసు చెప్పుటకు కారణము, వారే ఆ వాక్యమై యున్నారు. వారు ఇంకొకటి కాలేరు. వారు ఇంకేదో వినలేరు. వారికి మరేదీ తెలియదు. అది నిజము. గుర్తు౦చుకొనండి, మోషే వారి అనుకరణలు చూచి మోసపోలేదు. అతను మోసపోయునా? మోషే ఇట్లనెను, "ఫరో, ఇప్పుడు ఒక్క నిమిషము ఆగు! నీకు తెలియునా? ప్రభువు దీనిని నాకు చేయమని చెప్పెను, కాని నీ మాంత్రికులు అదే చేయుట నేను చూచుచున్నాను. దేవునికి మహిమ! కావున, నేను ఏమి చేయుదునో నీకు చెప్పెదను; నీతో నేను చేరెదను?" హు! ఆలాగన్నచో అతడు ఒక దేవుని యొక్క ప్రవక్త కాదు. లేదు, నిశ్చయంగా! అతడు తాను నిలబడికలిగినంత దృఢముగా నిలబడెను. పూర్తిగా అతడెరుగును, దానిని సమస్తమూ దేవుడే ఏదో ఒక విధముగా చూసుకొనునని ఎరుగును, ఎందుకనగా ఆయన "నేను నీకు తోడైయుందును. నేను నిన్ను విడువను, ఎడబాయను" అని వాగ్దానము చేసెను.

133అతడు ఎరుగును. కావున అతడు వారితో చేరలేదు, ఓ లేదు, వారియొద్దనే ఉండెను. వారి మతశాఖలలో చేరలేదు. అతడు దేవునితోనే నిలచియుండెను. వారు చేయకలిగిన ఆ సమస్త క్రియలను చూచి అతడు మోసపోలేదు. వారు ఎప్పుడైతే ఒక కార్యమును చేసారో ,అతడు పేలు రప్పించెను, వారునూ రప్పించిరి. అతడు రక్తమును రప్పించెను; వారునూ రక్తము రప్పించిరి. అతడు ప్రతిదియూ రప్పించెను; వారు అతనితో పాటే అన్ని విధములుగా అతనిని అనుకరించిరి. అయినా అతడు నెమ్మదిగా నిలబడెను. దేవుడు పనిచేయుచున్నాడని అక్షరాలా అతడెరుగును. ఇప్పుడు మీకు అర్థమైనదా? రెండు - రెండు, నాలుగు అగునని మీరెరుగుదురు? దానికి మీరేమీ కష్టపడనక్కర లేదు. కాబట్టి మీరు గ్రహించారు, చూచారా

ఎందువలన? వారు దానిచేత మోసపుచ్చబడరు, నిజమైన విశ్వాసి; వారు ముందుగా నిర్ణయించబడిన విత్తనము, ఆ దినములో నిలబడవలెను.

MATT 7:22,23

 

134యేసు కూడ ఇట్లు చెప్పెను, "ఆ దినమందు అనేకులు నా యొద్దకు వచ్చి "ప్రభువా, నీ నామములో మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా?" యేసు చెప్పెను, "అంత్యదినముల యందు, సమయము సమాప్తమైన తరువాత, గొప్ప పునరుత్థానము వచ్చును. అనేకులు వచ్చి ఆ రాజ్యములో కూర్చుందురు." దేవుని రాజ్యము మీలోనే యున్నది. అనేకలు! గురుగులు వచ్చి గోధుమల యొద్ద కూర్చొనును, "ప్రభువా! ఒక్క నిమిషము ఆగు; నేను భాషలతో మాట్లాడాను. నేను అరిచాను. నేను ఆత్మలో నాట్యమాడాను. నేను దయ్యములను వెళ్ళగొట్టాను. నేను భాషలతో మాట్లాడాను. ఆ పనులన్నీ నేను చేశాను" అని పలుకును.

ఆయనేమి చెప్పును? గమనించండి. "అక్రమము చేయువారలారా, నేను ఎన్నడూ మిమ్మును ఎరుగును."

MATT 7:23

 

135అక్రమము అనగా ఏమిటి? ఎవరినైనా అడగండి. "అది నీకు చేయవలెనని తెలిసియూ దానిని నీవు చేయకుండుట." వారికి ఆ వాక్యము తెలియును, దానిని వారు విందురు! మీరు ఈ టేపు వినుచున్నారు, ఈ వర్తమానము మీరు వినుచున్నారు. ప్రభువగు దేవుడు ఆలాగు చెప్పుట మీరు చూచుచున్నారు; ఆయన దానిని స్థిరపరచి నిజమని చెప్పుట మీరు చూచుచున్నారు. మరియు బయట సూర్యుడు ప్రకాశించుచున్నంత తేటగా ఇది మీకు తెలియుచున్నది. అయితే ఇంకా మీరు ఆ మతశాఖను పట్టుకొని ఆ అబద్ధ సంగతులు పట్టుకొని వ్రేలాడుచున్నారు, అక్రమము చేయువారలారా!

"ఓ అవును. నేను గొప్ప కూటములు జరిగించాను. నేను ఇది చేశాను. నేను అది చేశాను?"

"అక్రమము చేయువారలారా, ఎన్నడూ మిమ్మును నేను ఎరుగను. నా యొద్ద నుండి తొలగిపోవుడి" అనును.

"సరే, నా మీద పరిశుద్దాత్మ పడినది" అందువు. ఆ విషయంలో ఏమీ నాకు సందేహము లేదు. "నేను భాషలలో మాట్లాడాను. నేను ఆత్మలో పాడాను." ఏమీ అందులో నాకు సందేహము లేదు. ప్రశ్నించవలసినదే లేదు. ఓ సోదరీ, సోదరుడా? నీది ఎటువంటి స్థితి! ఇది వణుకు పుట్టించు సమయము. మనం ఎక్కడున్నాము? ఈ వాక్యము ఇప్పుడు జీవము నొద్దకు వచ్చుచున్నది. గమనించండి.

MATT 7:21-23

 

136అవును, వారాలాగు చేయుదురని ఆయన చెప్పెను. గమనించండి. "అక్రమము చేయువారలారా…" ఇక్కడ ఒక వాక్యము నేను వ్రాసియుంచాను. అదెక్కడున్నదో నాకు తెలియదు. నేను చాలా సమయము తీసికొన్నాను. ఒక్క నిమిషము అది ఎక్కడున్నదో వెదకి మరియు అది ఏమిటో చూచెదను. నా యొద్ద మత్తయి 7:21 యున్నది. అది ఎక్కడ యున్నదో నాకు తెలియదు… ఈలాగు బోధించుచున్నప్పుడు కొన్నిసార్లు నేను మరచిపోవుచుందును. మత్తయి 7:21.

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించెను.

ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా?

ప్రవక్తలు, అభిషిక్తులు. అది నిజమేనా? "మేము ప్రవక్తలము కామా? మేము అభిషేకించబడలేదా? నీ నామములో నేను ప్రవచించలేదా? నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా? వాటిని నీవు చేసి మరియు యేసు నామములో బాప్తిస్మము పొందుకొనుటకు ఏలా నిరాకరించెదవు? ఓ, మై! ఎంత మోసకరమో చూచారా? చివర వరకు వచ్చి మానివేసిరి. వారు వాక్యము యొద్ద వరకు వచ్చి తరువాత వెనుదిరిగెదరు. దీనిని ఇప్పుడు గమనించండి. ఒక్క నిమిషము దీనిని చూద్దాం.

ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? (మేము ప్రవక్తలము కామా? అవును, మత్తయి 24:24లో దానిని గూర్చి మీకు చెప్పాను.) నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేక కార్యములు చేయలేదా?

అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను: అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పోండని వారితో చెప్పుదును.

"అది మీ కండ్ల ఎదుటనే పెట్టబడియున్నది, మరియు దానిని మీరు చూచారు. అది కదలుట చూచారు. మరియు అది వాక్యమేనని చూచారు; అయితే మీ మతశాఖల కొరకు మీరు దానికి అంటిపెట్టుకొని యున్నారు. నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. మీరెన్ని దయ్యములను వెళ్ళగొట్టినా, మీరు ఇది, అది, ఏదేదో చేసినను నేను లెక్క చేయను; మిమ్మును గూర్చి నేనేమియు యెరుగను."

బిలాము ఇట్లు చెప్పెను, "నేను నీ నామములోనే ప్రవచించాను. అది నెరవేరెను."

"అది అక్షరాలా నిజము; కాని వాక్యము వద్దకు వచ్చినప్పుడు, నీవు దానిని తిరస్కరించావు. "ఓ! సోదరుడా, మోసపుచ్చు భాగమును చూచారా? నిశ్చయంగా ప్రవక్త కాదు, అయితే వాక్యము ద్వారా, నిజ వాక్యము ద్వారా, రుజువు చేయబడిన వాక్యము ప్రత్యక్షమాయెను. "అక్రమము చేయువారలారా."

137నిజ వాక్యమును అనుకరించుటకు అన్ని కాలములలోను సాతానుడు ప్రయత్నించాడు. అది మనకు తెలియును. మనకు తెలియదా?

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33•

HEB 6:4-8

 

138గమనించండి, సరిహద్దు వరకు వచ్చి ఆగిపోయిరి. ఇక్కడే చూడండి, హెబ్రి 6వ అధ్యాయములోనిది, ఇప్పుడు, ఇంతకు ముందు చదివాము. వచ్చే కొద్ది నిమిషములు మరల చూద్దామని నేను మీకు చెప్పాను. ఆయన చెప్పెను, "ముండ్లపొదలు, పిచ్చి చెట్లు చివరకు అగ్నితో కాల్చబడును. (వారే సరిహద్దు వరకు వచ్చియున్నారు!) పరలోక సంబంధమగు వరమును రుచి చూచియు . [రుచి చూచారు: ఇంకొక మాటలలో, నీవు దానిని చూచావు! కేవలము నీ నోటితో రుచి చూచుటయే కాదు, అయితే దానిని నీవు చూచావు. మరియు అది సత్యమని నీకు తెలియును. అది సత్యమని నీవు యెరిగియున్నావు.] "పరలోక సంబంధమగు వరమును రుచి చూచిరి." మరియు పరిశుద్దాత్మలో పాలిభాగస్తులయిరి. అది మీ మీద దిగినట్లుగానే, దేవునియొక్క మంచి వాక్యము రుచి చూచారు . [రుచి చూచిరి: అది నిజమని నీవు చూచావు; "పరిశుద్దాత్మ నీ మీద పడుచున్నది," పొలములోని గచ్చ పొదలు.] అయినను వారు తిరస్కరించిరి. "నిన్ను పిలచి, శుద్దీకరించి మరియు నీ మీద అభిషేకము పెట్టిన ఆ క్రీస్తునే విసర్జించెదవు;" వారి పాపమునకు ఇక బలి యుండదు; అది క్షమించబడదు! సత్యవిషయమైన జ్ఞానములోనికి వారు ఎన్నడైనను వచ్చుట అసాధ్యము. "వారు పరిశుద్దాత్మలో భాగస్వాములయిరి గాని అంగీకరించలేదు. వారిని నూతన పరచుట అసాధ్యము. [ముండ్లు పొదల మీద పడెను, "యేసులో, యేసుతో ప్రారంభించితివి, మరియు, "ప్రభువా, నేను నీలో వెళ్ళుచున్నాను" అని చెప్పెదవు, కాని నీవు వాక్యమునకు తగిలినప్పుడు, నీవు వెనుదిరిగితివి.] "పరిశుద్దాత్మలో పాలిభాగస్తులయిరి; మరియు రుచి కూడ చూచిరి, లేక వాక్యము స్వయముగా నిరూపించబడుట చూచితివి," మరియు పిమ్మట దానినుండి తిరిగిపోతివి; "వారు దానియొద్దకు వచ్చుట లేదా దానిని ఎన్నడైననూ చూచుట పూర్తిగా అసాధ్యం" అది "వాక్యము ఈలాగు సెలవిచ్చుచున్నది." ఇప్పుడు "భూమ్యాకాశములు గతించును గాని ఆయన మాటలు గతించవు." దానిని మీరు చూచారా? పూర్తిగా అసాధ్యము. బైబిలు ఆ విధముగా చెప్పెను. మరియు ఆత్మ దానికి సాక్షిగా వున్నది.

139గమనించండి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చెదను. మోషే ప్రవచనము విని తమ సంస్థల నుండి, తామున్న స్థితి నుండి బయటకు వచ్చిన ఆ జనులను చూడండి. ఆ ప్రవచనము క్రిందవారు గొప్ప క్రియలు, అద్భుతములు ఇంకా చాలా చూచిరి, లోనికి వెళ్ళుటకు సరిహద్దు వరకు వచ్చిరి. ఇప్పుడు, లీ, అక్కడే గ్రంథమందు మీ పేరు వచ్చును, చూచారా. నీవు దానిని నిర్ణయించుకోవలెను. ఇక్కడున్న మీరు కాదు గాని ఫోను ద్వారా దూరాన వినుచున్నవారికి. ఇక్కడ డాక్టర్. లీ వైల్, కూర్చొనియున్నాడు, అతడు ఏడు సంఘ కాలముల పుస్తకమును వ్యాకరణ రీత్యా ఆయన సరి చేయుచున్నాడు. గొర్రెపిల్ల జీవగ్రంథములో నుండి మీ పేరు తీసివేయబడును అన్న చోట సమస్య వచ్చినది లేక ప్రశ్న వచ్చినది. చూడండి, అది చాలా మంది సేవకులను కలవరపరచెను; అయితే ఆ పుస్తకము వచ్చు వరకు మీరు ఆగండి, మీలో ఏమైనా వెలుగున్నచో దానిని గ్రహించెదరు.

గమనించండి. ఇప్పుడు దానిని మీరు చూచుటకు ఇష్టము లేనిచో, కనీసము మీ తల ఎత్తి కూడా దానిని చూడరు. "నీకు ఒక దుంపలో నుండి రక్తము రానే రాదు, ఎందుకనగా అందులో అసలు రక్తమే లేదు" అను మాట, మా తల్లి చెప్పెడిది.

NUM 13:27

 

140గమనించండి, వెలుగు రావలసియున్నది; అది చీకటిలో లేదు. వెలుగు చీకటి యొద్దకు వచ్చుచున్నది గాని చీకటి దానిని గ్రహించుట లేదు. ఈ దినమున అభిషిక్తులను మీరు ఇప్పుడు గమనించండి. ఇశ్రాయేలీయులను మోషే బయటకు తెచ్చెను, మరియు ఆ గొప్ప దేశమును గూర్చి వారు విని వారందరు అయోమయముతో నిండిపోయిరి… ఇప్పుడు, ఇశ్రాయేలు శాఖల మిశ్రమమైయున్నది. దానికి భూమి లేదు, ఇల్లు లేదు; అది ఒక ఇంటికి వెళ్ళుచున్నది. మనకు ఒక సంఘము లేదు. మనము ఒక సంఘమునకు వెళ్ళబోవుచున్నాము, జ్యేష్టుల సంఘమునకు, మహిమయ౦దున్న సంఘమునకు వెళ్ళబోవుచున్నాము. మానవుని ద్వారా భూమిమీద ఏర్పాటు చేయబడిన సంఘము కాదు. మహిమలోయున్న సంఘము, బయటకు పిలువబడినవారు, నిత్యజీవమునకు ముందుగా నిర్ణయించబడిన వారు, చూచారా.

వారి గృహమునకు వెళ్ళుచున్నారు. వారు దాటి వెళ్ళవలసిన చోటికి వచ్చినప్పుడు వాక్యము గూర్చి సందేహించిరి. మరియు వెనక్కు మళ్ళిరి, యెహోషువా, కాలేబులు మరియు వారు అక్కడకు వెళ్ళి, ఒక ద్రాక్షగెలను వెనుకకు తెచ్చిరి. "అది ఒక మంచి దేశము, పాలు - తేనెలు ప్రవహించు దేశము" అని దేవునియొక్క వాక్య వాగ్దానమును, అక్కడ ఆ దేశము యున్నదని వారికి రుజువు చేయగోరిరి. మరియు దానిని వారికి రుజువు చేయుటకు దానిని ఇటువైపునకు, వెనుకకు తీసుకొని వచ్చిరి. మరియు దానిని వారు రుచి చూచిరి, "ఓ, ఓ, అయిననూ మనము స్వాధీనపరచుకోలేము" అనిరి. ఏమి జరిగెను? వారు అరణ్యములోనే నశించిరి. వారు అక్కడే నిలచియుండి సంస్థగా మారి ఒక్కడును మిగలకుండా అందరూ చనిపోయిరి, కాని వెళ్ళి వెనకకు మంచి వార్తను యెహోషువా, కాలేబులు తీసికొని వచ్చిరి; మోషే రూపాంతరము చెందెను. సంఘము నిమిత్తము ఎదురు చూచుచున్నవారికి ఒక మాదిరి; పాత నిబంధన కాలములోని వారికి, క్రొత్త నిబంధన కాలములోని వారికి పునరుత్థానపు సూచన; మరియు ఎత్తబడిన శరీరము. అక్కడ మూడును చూచారా? వారిని వరుసగా మూడుగా పెట్టవలసియున్నది (చూచారా) కావున, విశ్వాసిలోను మరియు అవిశ్వాసిలోను.

141అది పూర్తిగా… ఎట్లో గమనించండి. దేవుడు ఎన్నడూ ఆ పాపమును క్షమించడని గుర్తించండి. ఇప్పుడు, వారెట్లు లోనికి రాగలరు? అది ప్రారంభముతోనే ముండ్లయితే, అది అంతమందును ముండ్లు గానే యుండును. ముందు నిర్ణయించబడిన వారు మాత్రమే దానిని చూచెదరు.

142ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంధకార యుగములయ౦దు పరిశుద్ధ మార్టిన్ దినములలో వలె యున్నది, ఒక దైవికమైన చిన్న వ్యక్తి… పరిశుద్ధ మార్టిన్ వ్రాతలను ఎందరు చదివారు? మీలో చాలామంది చదివారు. పరిశుద్ధ మార్టిన్ వ్రాతలు సేకరించుటకు మేము వెళ్ళాము, యాజకుడు చెప్పెను, "అయితే అతడు ఒక భక్తుడిగా ప్రకటించబడలేదు." నిశ్చయముగా, అతను ప్రకటించబడలేదు. వారివలన కాదు, కాని దేవుని వలన అతడు భక్తుడని ప్రకటింపబడెను. మూడవ సంఘ కాలములో అతనిని ఉంచమని పరిశుద్దాత్మ మాకు చెప్పెను.

143అతడెంత భక్తికలిగినవాడో చూడండి: పిలువబడెను, ముందుగా నిర్ణయించబడెను. అతని తల్లిదండ్రులు అన్యులు, అతని తండ్రి ఒక సైనికుడు. ఒక సైనికుడిగా యుండుటకు అతడు తన తండ్రి వరుసని వెంబడించవలెను. అతను ఆలాగు చేసినప్పుడు మరియు ఎక్కడో ఒక దేవుడున్నాడని ఎల్లప్పుడు నమ్మెడివాడు, అడవులలో సంచరించెను, మరియు దేవునిని చూడకలిగెను. ఒకనాడు అతడు ఒక పట్టణము గుండా వెళ్ళుచుండును, మరియు ఒక ముసలివాడు చలితో ఆ వీధిలో చనిపోవుచుండుట చూచెను. "ఈ రాత్రి నేను చనిపోదును; నాకు కప్పుకొనుటకు ఏదయినా ఇయ్యుము" అని అతడు అడిగెను.

144ఎవ్వరూ ఆదరించుట లేదు. మార్టిన్ ఒక ప్రక్క నిలబడి కొద్దిసేపు అతనిని గమనించెను. ఎవ్వరూ సహాయపడుట లేదు. ఇతనికి ఒక్క కోటు మాత్రమే యున్నది. తన విధి నిర్వహణకు వెళ్ళుచున్నాడు. ఇది ఇచ్చివేసినచో చలికి గడ్డకట్టి అతడు చనిపోవును. కాబట్టి అతడు అనుకొనెను, "అతనితో పాటు దీనిని సగముగా పంచుకున్నట్లయితే మేమిద్దరమూ బ్రతుకుటకు ఒక అవకాశము యున్నది." అందుకు ఇద్దరూ కప్పుకొని బ్రదుక కలుగునట్లు దానిని రెండుగా చింపి ఒక భాగముతో ఆ ముసలివానిని కప్పెను. మిగిలిన భాగమును తాను కప్పుకొనెను.

అందరు, "చూడండి ఎంత వింతగా కనబడు కాపలాదారుడు; చూడండి ఎంత వింతగా కనబడు సైనికుడు, సగము కోటు అతడు చుట్టుకొని యున్నాడు," అనిరి.

MATT 25:40

 

145ఆ మరుసటి రాత్రి అతడు విధి నిర్వర్తించి మరియు ఇంటికి వచ్చి పరుండెను. మేల్కొని తరువాత అతని గదిలో ఆ పాత పీలికను చుట్టుకొని యేసుక్రీస్తు నిలబడి యుండుట చూచెను. "మిక్కిలి అల్పులగు వీరిలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్లే" అని ఆయన చెప్పిన మాట వెంటనే గుర్తుకు వచ్చెను. అతను ఒక గొప్ప దైవదాసుడు. సంఘము అతనిని ఎగతాళి చేసెను, అతనిని హింసించెను, అతనిని బయటకు తన్నెను, మరియు సమస్తము చేసెను గాని, అతడు ఒక దేవుని ప్రవక్తయై యుండెను. అతడు చెప్పినది జరిగెను. ఆ కాలములో చాలామంది అతని మాట నమ్మిరి.

146సాతానుడు ఎంత మోసగాడో మీకు నేను చూపించగోరుచున్నాను. ఒకరోజు అతడు తన అధ్యయనము నిమిత్తము కూర్చోనెను. ఒక బలమగు దేవదూత తలమీద కిరీటము, బంగారు జోళ్ళు, బంగారు వస్త్రములు ధరించుకొని వచ్చి మరియు అతనిని ఇట్లు ప్రశ్నించెను. "మార్టిన్, నీవు నన్నెరుగుదువా? నేను నీ ప్రభువును మరియు రక్షకుడును. నేనే నిన్ను రక్షించినవాడను. నన్ను ఆరాధించు మార్టిన్." అయితే ఆ ప్రవక్తకు ఇది కొంత వింతగా తోచి, వాడిని అతను బాగుగా చూచుచుండెను. "మార్టిన్, నేను నీ రక్షకుడగు యేసుక్రీస్తును, నన్ను ఆరాధించు! నన్నెరుగవా మార్టిన్?" అని వాడన్నాడు.

మార్టిన్ వాడినే ఇంకా చూచుచునేయుండెను, వాక్యము అతని మనస్సులో మొదలు చుండెను. "సాతానా! నా యొద్ద నుండి పొమ్ము! నీ తల మీద ఒక కిరీటమున్నది. మరియు కాలము యొక్క చివరిలో ఆయన పరిశుద్దులు ఆయనకు కిరీటము ధరింపచేయుదురని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది" అని అతడనెను. అది పెంతెకోస్తు ఎర కాదా? సోదరుడా! ఆ మాట గమనించుము. అది అక్కడే దాని వెల చెల్లించెను?

147ఒక రోజున మరలా ఆ మఠములో ఒక ముసలి పరిశుద్ధ వ్యక్తి అక్కడ యుండెను. చాలామంది యువకులును ఉండిరి. అందులో ఒకడు చాలా కొపిష్టిగా నున్నాడు. దీనిని జాగ్రత్తగా గమనించండి. —ఇక్కడ నేను మనకిది మ౦చి ఒక ఉపమానము. అతడు వారందరికంటె కొంత హెచ్చుగా ఉండగోరెను. తన అధికారమును, పెద్దరికమును,పెత్తనమును వారి మీద చూపగోరెను. అతడు పెద్దవానిగా, గొప్ప వ్యక్తిగా యుండగోరెను. అందరి సోదరులకంటె వేరుగా ఉండగోరెను. అతను వ్యత్యాసముగా యుండవలెనని మీకు తెలియును, చూచారా. అతను, అది ఏమైన కావచ్చు అతను చాలా పొగరుగా ఉండెను. తనను మించిన వారెవరూ లేరన్నట్లుండెను. అతనికి సమానులు ఎవరూ లేరను కొనుచుండెను. ఇప్పుడు ఏమి జరిగినది చూడండి. అతడు ఏదో పెద్దది కలిగియుండగోరెను. మీకు అర్థమగుచున్నదా? చూచారా? కాబట్టి తనకు తానే ప్రవచించుకొనెను; "ప్రభువు నన్ను కూడ ప్రవక్తగా చేసెను. నేను ఒక ప్రవక్తను" అని చెప్పెను. ఇప్పుడు, ఆనాడు దేశములో పరిశుద్ధ మార్టిన్ మాత్రమే ప్రవక్తగా గుర్తింబడెను. అతడు ఒక ప్రవక్తగా జన్మించెను.

148అయితే ఈ పాతికేళ్ళ యువకుడు చెప్పెను, "ప్రభువు తనను ఒక ప్రవక్తగా చేసెను, మరియు దానిని నేను మీకు రుజువు చేయుదునని" చెప్పుచుండెను. "ఈ రాత్రి ప్రభువునన్ను ఒక తెల్లని చక్కని పైవస్త్రమును ధరించి మీ మధ్య కూర్చుండబెట్టును" అని చెప్పెను. "అప్పుడు మీరందరూ నా యొద్దకు రండి, (చూచారా) మరియు నా యొద్ద నుండి ఆజ్ఞలను పొందుకుందురు" అని చెప్పెను.

ఇప్పుడు దానిని నేటితో పోల్చిచూడండి, చూచారా. "నేను ఈ సంస్థకు అధిపతి నగుదును. మీ అందరి బాధ్యత నేను వహించెదను" అని పలుకుదురు. మరియు నిశ్చయంగా, ఆ రాత్రి నిజంగానే ఆ భవనములోనికి, మీదికి ఒక వెలుగు వచ్చెను. పరిశుద్ధ మార్టిన్ యొక్క వ్రాతలు దీనిని చెప్పుచుండెను. దానిని చదవండి! మరియు అది విశ్వసనీయమైనది; అది చరిత్ర. వెలుగు రాగా, అందరూ దానిని చూచిరి. అతడు ఒక తెల్లని పైవస్త్రమును ధరించి వారిమధ్య నిలబడియుండెను. "నేను మీకు చెప్పినది చూచారా?" అని అతడు వారిని ప్రశ్నించెను. అయితే అది వాక్యమునకు విరుద్ధము.

149అతడు ఆ మఠములోని పెద్ద వయస్సుగలవాని యొద్దకు వెళ్ళెను. అతను క్రిందికి పైకి కొద్దిగా నడిచెను, "కుమారుడా, అది సరియైనదిగా అనుపించుటలేదు" అని చెప్పెను. "ఒకే ఒక్క మార్గమున్నది (అది యిక్కడే యున్నది!) అది ఆతీతమైనదిగానే కనిపించుచున్నది, దానిని తెలిసికొనుటకు కేవలము ఒకే మార్గమున్నది" అని అతను పలికెను. అబ్బాయి పెంతెకోస్తు దానిని త్వరగా పట్టుకొనవచ్చును, దాని వేరును, వరసను, కొక్కెమును మరియు ప్రతిదియు పట్టుకొనవచ్చును! అతను చెప్పెను, "అద్భుతము సరిగానే కనబడవచ్చును, అయితే అది వాక్యమునకు సరిపోవుచున్నట్లు కనబడుటలేదు." ఇప్పుడు, మార్టిన్ అను పేరుగల ఒకాయన మనకున్నాడు. అతను అభిషేకించబడిన ప్రవక్త రమ్ము అతని యెదుటకు వెళ్ళుదము."

"లేదు, లేదు. మార్టిన్ కు దీనితో ఏమీ సంబంధము లేదు" అని ఆ యువకుడనెను.

"ఏమెనా గాని, నీవు వెళ్ళుచున్నావు" అని వారు చెప్పిరి. మరియు వారు అతని చేయి పట్టుకొని మార్టిన్ యొద్దకు కొనిపోయిరి. మార్టిన్ యొద్దకు రాగానే ఆ పైవస్త్రము వెడలిపోయెను.

MATT 4:4•

LUKE 4:4•

JOHN 10:5,27

 

150చూడండి, "సాధ్యమైతే ఏర్పరచబడినవారిని కూడా మోసము చేయును," చూచారా. వారికి తెలుసు.

"నా గొర్రెలు నా మాట వినును" అని యేసు చెప్పెను. "ఓ "నీవు చెప్పవచ్చు, "నా స్వరము వినును." అది ఆయన వాక్యము. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని ప్రతి మాటవలన బ్రదుకును," చూచారా. ముందు నిర్ణయించబడినవారు దీనిని ఎరుగుదురు. "ఒక క్రొత్త స్వరమును, లేక క్రొత్త మాటను వారు వెంబడించరు." అక్కడ ఆ వెనుకయున్నవారు ఆ విధముగానే యుండేవారు, వారు వెంబడించలేదు… మార్టిన్ అక్కడున్నాడని వారికి తెలియును, ఆ కాలపు ఒక ప్రవక్త వాక్యము ద్వారా దేవునిచే గుర్తింపబడెను. వాక్యమును ఎరుగును. అతని యెదుట ఆవ్యక్తి నిలువలేకపోయెను.

MATT 24:28•

LUKE 17:37

 

151"ఎక్కడైతే తాజా మాంసము యుండునో (లేక వాక్యము), అక్కడ, ఆ కాలములో పక్షిరాజులు పోగవును" అని కూడ ఆయన చెప్పెను. మీరు దానిని వ్రాసుకొనగోరుచున్నారా, అది మత్తయి 24:28లో యున్నది. దానికంటె కొంచెము ముందు యున్నది, మత్తయి 24:24; నాలుగు వచనముల క్రింద యున్నది అది, (చూచారా), మీకు అది కావాలి అనినచో. "ఎక్కడైతే తాజా మాంసము యుండునో, (మన్నా యుండునో, వాక్యము యుండునో), పక్షిరాజులు అక్కడ పోగవును."

152ఇప్పుడు, నేను త్వరగా ముగించవలెను. నేను పైకి అక్కడ చూచాను మరియు పన్నెండు దాటి ఏడు నిమిషములు లేదా యెనిమిది నిమిషములు అయినట్లుగా నేను గడియారము చూచి గమనించాను. నేను చాలా త్వరగా ముగించెదను, లేనిచో దానిని రాత్రికి ముగించెదను: ఇప్పుడా లేక ఈ రాత్రికా. కూటానాంతరము ఎందరు ఇంటికి వెళ్ళవలెనో చేతులు ఎత్తి చూపండి. ఓ మై! అయితే సాగిపోవుట మంచిది. బయట ఫోనుల ముందు చాలా మందిని ఆలాగు ఉంచినందులకు నేను విచారించుచున్నాను, అయితే నేను త్వరపడెదను. ఇది మీ డబ్బుకంటె విలువైనది. నా మట్టుకు నేను ఆలాగు నమ్ముచున్నాను, చూచారా. మీ డబ్బు నశించును. ఇది నశింపదు; ఇది వాక్యము, చూచారా.

MATT 24:28•

LUKE 17:37

 

153"తాజా మాంసము ఎక్కడుండునో అక్కడ పక్షిరాజులు పోగవును. ఎక్కడైతే తాజా మాంసము యుండునో — ఎక్కడైతే తాజా ఆహారము యుండునో, పక్షిరాజులు అక్కడ పోగవును. తాజా మాంసము ఎక్కడ యుండునో, రుతువునకు సరిపడు ఆహారము, పక్షిరాజులు అక్కడ పోగవును." అయితే అది కుళ్ళిన తరువాత అప్పుడు రాబందులు దానిని తినుటకు పోగవును. నా భావమేమిటో చూచారా? ఎప్పుడైతే ఒకటి చంపబడగానే అక్కడ వెంటనే పక్షిరాజులు వచ్చును; అయితే దానిని అక్కడ విడిచిన తరువాత మరియు కుళ్ళిన తరువాత, అప్పుడు అక్కడ వెంటనే రాబందులు వచ్చును. పక్షిరాజుకు దానితో ఏమీ సంబంధము లేదు, చూచారా. యేసు చెప్పెను, "తాజా మాంసము ఎక్కడ యుండునో, మన్నా ఎక్కడ పడునో, రాత్రిలో మన్నా తాజాగా పడును, దానికొరకు పక్షిరాజులు అక్కడ పోగవును." అది ఆ దినపు మన్నా, చూచారా. గమనించండి.

MATT 23:37•

LUKE 13:34

 

154అయితే అది కుళ్ళిపోయిన పిమ్మట, పురుగులు దానికి పట్టినప్పుడు, అప్పుడు రాబందులు పోగవును. అది కుళ్ళిపోనంత వరకు అవి దాని వాసనను చూడలేవు. యేసు అక్కడ పైన నిలువబడి మరియు యిలాగు చెప్పుటలో ఆశ్చర్యములేదు. "యెరుషలేమా, నీవు ప్రతి ప్రవక్తను రాళ్ళతో కొట్టిన దానవు!" వ్యక్తిగత సర్వనామమును అక్కడ గమనించండి, చూచారా, "యెరుషలేమా, యెరుషలేమా, ఎంతవరకు నేను. ("అతను ఎవరైయుండెను?") కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొనినట్లు, నేనెంతవరకు నిన్ను నేను చేర్చుకొందును. నీ యొద్దకు నేను పంపిన ప్రతి ప్రవక్తను నీవు రాళ్ళతో కొట్టి, చంపితివి."

ఆ గొప్ప యెరూషలేము సంఘము.

JOHN 14:2

 

155ఈ భూమిమీదనున్న యెరూషలేము కాదు గాని, మునము పైనున్న యెరూషలేమునకు సంబంధించినవారము, ఎక్కడనుండైతే వాక్యము వచ్చెను. ఆ ముందు నిర్ణయము నుండి, (చూచారా); ఆ పాత యెరూషలేము నశించును, గాని క్రొత్త యెరూషలేము నశించదు; మానవుని చేత నిర్మించబడిన పాత యెరూషలేము కాదు గాని, దేవుని చేత నిర్మించబడిన క్రొత్త యెరూషలేము (చూచారా); ఆ పైనున్న వాక్యము ఇప్పుడు బయలుపరచబడియున్నది. "నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచెదను." ఆ సృష్టికర్త బంగారపు వీధులను మరియు మొదలగు వాటిని తయారు చేయుచున్నాడు. అది మాత్రమే నశింపనిది.

MATT 23:37•

MATT 24:28•

LUKE 13:34•

LUKE 17:37

 

156"యెరుషలేమా, యెరుషలేమా, నేనెంత వరకు, (ప్రారంభ సమయము నుండి; మూడవ వ్యక్తి కాదు, ఇంకెవరో కాదు, కాని) "కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొనినట్లు, నేను చేర్చుకొనినాను, కాని నీవు వినలేదు. అయితే ఇప్పుడు నీ గడియ వచ్చినది," చూచారా. "తాజా మాంసము ఎక్కడ యుండునో, పక్షిరాజులు అక్కడ పోగవును." అయితే కళేబరము కుళ్ళిన పిమ్మట అప్పుడు రాబందులు పోగవును, చూచారా.

GEN 15:13,14

 

157గమనించండి. మోషే, దేవునియొక్క పిల్లలకు అతను ఎన్నడు యివ్వలేదు . మోషే ఒక పక్షిరాజు, మరియు నోవహు కాలములో మిగిలిపోయిన ముక్కలను దేవుని పిల్లలకు ఎన్నడూ అతడు ఇవ్వలేదు. దేవుని యొక్క తాజా ఆహారము అతని యొద్ద ఉండెను. "ప్రభువగు దేవుడు అరణ్యములో నన్ను కలుసుకొనెను, మరియు ఆయన వాక్యము స్థిరపరచెను మరియు మిమ్మును బయటకు పిలుచుటకు నన్ను ఇక్కడకు పంపెను." అంతట అక్కడ దానిని అనుకరించువారు అనేకులు వచ్చి దానిని అనుకరించిరి, చూచారా. అయితే ఆ ఘడియ యొక్క వాక్యము అతని యొద్దనే ఉండెను. కారణము, వాగ్దానము కలిగియున్న అబ్రహాముతో దేవుడు పలికెను. "నీ సంతానము ఒక అన్యదేశములో నాలుగు వందల సంవత్సరములు యాత్ర చేయును, అయితే నేను వారిని దర్శించి బలమగు చేతి క్రింద బయటకు తెచ్చెదను."

JOHN 1:1

 

158"ఇప్పుడు, ప్రభువగు దేవుడు నాతో మాట్లాడి, నాకు చూపించెను, మరియు ఏమి చేయవలెనో నాకు చెప్పెను, మరియు దానిని మీకు చెప్పెదను. "ఉన్నవాడను అనువాడు," నన్ను పంపెను" అని మోషే చెప్పెను. "ఉన్నవాడను!" "ఉంటిని లేక ఉందును" అనలేదు. "ఉన్నవాడను," వర్తమాన కాలము. ఇప్పుడున్న వాక్యము. ఇది వరకు యున్న వాక్యము కాదు, లేక రాబోవుచున్న వాక్యము కాదు; ఇప్పుడున్న వాక్యము, చూచారా. మీరు గ్రహించారా? "ఉన్నవాడను…" "ఉన్నవాడను" అనునది వాక్యము. "ఆదియందు వాక్యముండెను. మరియు వాక్యము దేవునియొద్ద ఉండెను." అది నిజమేనా? "ఉన్నవాడను" ఇది నిజమని రుజువుపరుచుటకు దేవుడు తన ప్రవక్తగా నన్ను పంపించెను. కావున, ఆయన ఎప్పుడైతే యిక్కడకు క్రిందికి వచ్చిమరియు ఇది చేయునో ఈ వాక్యమునకు నేను జవాబును."

అతడు ఆ విధముగా చేసినప్పుడు, ఫరో ఇట్లనెను, "మంచిది, మా గుంపులోను ఆలాగు చేయకలిగినవారు చాలామంది ఉన్నారు." వారు అనుకరించువారు. "ఇప్పుడు అది మరల ఈ చివరి దినములలో జరుగనైయున్నదని" యేసు చెప్పెను. చూడండి, అదే కార్యమును చెప్పకుందురు. మొదట ఎవరు వచ్చిరో గమనించండి. వాక్యముతో ఎవరు నిలిచియుండిరో గమనించండి. అదే ఆ కార్యము. ఆలాగే దానిని మీరు తెలిసికొందురు.

కాబట్టి మీరు చూడండి.

MATT 24:28•

LUKE 17:37•

JOHN 5:46

 

159"ఇప్పుడు మనము ఓడ నిర్మించుదము" అనునది నోవహు కాలములోని వాక్యము. మోషే దానిని జనులకు ఇవ్వలేదు. ఒక రోజున నోవహు ఓడ నిర్మించెను. ఏ రాబందులు దానిని తినుటకు రాలేదు. లేదు, లేదు! ఇది ఒక వాగ్దాన వాక్యము.

గమనించండి, అతని వర్తమానము దేవునియొద్ద నుండియే వచ్చెను. ఆ ఘడియకు అతని యొద్ద ముందుగా నిర్ణయించబడిన అసలయిన దేవుని వాక్యముండెను. మోషే విడిచిపెట్టిన వాటిని యేసు అందించలేదు. మోషే తన ఘడియకు చెందిన వాక్యమును కలిగియుండెను, కాని మోషే ఒక ప్రవక్త. ఇక్కడ స్వయముగా దేవుడే, చూచారా. మోషే కాలములో మిగిలిపోయిన వానిని ఆయన ఎన్నడూ పంచలేదు.

అయితే ఆ సంస్థలోనున్న రాబందులను చూడండి. ఇంకా వాటినే తినుచున్నది. "మాకు తెలియును! మాకు మోషే ఉన్నాడు! నీవు మాకు అక్కరలేదు" అనుచున్నారు.

"మీరు మోషేను ఎరిగియున్నయెడల నన్నును ఎరిగియుందురు, ఎందుకనగా మోషే నన్ను గూర్చి చెప్పెను" అని ఆయననెను. ఓ, మై! చూచారా? "తాజా మాంసము ఉన్న చోట పక్షిరాజులు పోగవును" — పక్షిరాజులు! తాజా వాక్యము తినును. అప్పుడే బయటకు వచ్చి, బలిసియున్న వాక్యమును తినును. ప్రత్యక్షపరచబడి పిల్లల ఆహారముగా ఇయ్యబడును, వందల సంవత్సరముల వరకు అక్కడ పడియున్న ఆ పాత కళేబరము నుండి కాదు; అది అక్కడే యు౦డును. ఇప్పుడును అంతే! లూథరు మారుమనస్సు వర్తమానము కలిగియుండెను, కాని లూథరు రాబందులైన మీరు. బాప్టిస్తు వారికి ఒక వర్తమానముండెను, కాని బాప్టిస్తు రాబందులైన మీరు, చూచారా. పెంతకోస్తుకు ఒక వర్తమానముండెను (ఇప్పుడు యింటికి వచ్చుచున్నది), పెంతెకోస్తు రాబందులారా. అయితే "తాజా మాంసము ఎక్కడుండునో, అక్కడ పక్షిరాజులు పోగవును."

MAL 4:5,6•

JOHN 6:37

 

160గుర్తుంచుకొనండి, ఆ దినములలో లూథరను వారికి కాథలిక్కు ఆహారము తినిపించలేకపోయిరి. (ఇప్పుడు నీవు తినిపించవచ్చు). లేదండీ. వారికి తాజా ఆహారముండెను. అది ఆ సంఘ కాలము. మెథడిస్తు వారికి లూథరను వర్తమానము నీవు తినిపించజాలవు. ఓ, లేదు. ఆ కుళ్ళినది వారికి ఇష్టము లేదు. అది కుళ్ళిపోయినది. చూచారా, అందులో నుండి జీవము వెడలిపోయినది. మరియు అది మరొక దానిలోనికి వెళ్ళిపోయినది. ఆ పాత జీవము. అక్కడ అది చచ్చినది. జీవము ముందుకు సాగి వెళ్ళుచున్నది. యేసుక్రీస్తు యొక్క వధువును పెంతెకోస్తు ఆహారముతో నీవు పోషించజాలవు. నిశ్చయంగా లేదు! కుళ్ళిపోయిన సంస్థలు, చేయవలసినది ఏమిలేదు. లేదు, లేదు! వాగ్దానము ఇట్లున్నది, "భయంకరమగు ఆ మహా దినము రాక మునుపు, ప్రవక్తయుగు ఏలియాను మీ యొద్దకు పంపించెదను. అతడు పిల్లల యొక్క హృదయములను తండ్రుల యొక్క విశ్వాసము వైపునకు మరల త్రిప్పును." "ఈ వాగ్దానములన్నియు బైబిలులో ఉన్నవి. నేను వాటిని చేయుదును మరియు అక్కడ పక్షిరాజులు కూడికొనును." "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు," చూచారా.

DEUT 18:15,19•

PS 22:16

 

161యేసు ఆలాగు చేయుటకు ఎన్నడూ ప్రయత్నించలేదు. అయితే యేసు వచ్చినప్పుడు, ఆయన రాబందుల గుంపులను కనుగొనెను. "మాకు మోషే ఉన్నాడు. మరియు ధర్మశాస్త్రమున్నది" అన్నారు. చూచారా. మంచిది, దానిని చంపి గతంలో వారికిచ్చినప్పుడు చక్కగా వారు తినిరి. చూడండి, అప్పటికి అది మంచిదే, కాని ఇది మోషే ముందుగా స్వయముగా చెప్పినది, అతడు ఆ బలిని వధించి ఇట్లనెను, "ప్రభువైన మీ దేవుడు మీ మధ్య మీ స్వంత సోదరులలో నుండి ఒక ప్రవక్తను పుట్టించును. ఆ ప్రవక్త మాట వినని ప్రతివాడును జనుల మధ్యనుండి కొట్టివేయబడును." మరియు ఆలాగే జరిగెను.

యేసుక్రీస్తును గూర్చి పాత నిబంధనలో దాదాపు ఆరువందల వివిధ ప్రవచనములు ఏలాగు నెరవేరెనో చూడండి. "వారు నా చేతులను, పాదములను గాయపరచిరి." ఆయన జీవితపు చివరి ఏడెనిమిది గంటలలో ఆ ప్రవక్తలందరు చెప్పినది పరిపూర్ణముగా ఎన్ని నెరవెరెనో నేను మరచిపోయాను.

MATT 24:35•

MARK 13:31•

LUKE 4:18•

LUKE 21:33

 

162ఇంకొక సంవత్సరమునకు పలానిది జరుగును అని గాని నేను ప్రవచించిన యెడల అది జరుగుటకు ఇరవై శాతం మాత్రమే అవకాశమున్నది. అది తప్పో ఒప్సో అప్పుడు తెలియును. అది జరుగును గాని ఎప్పుడో నేను చెప్పలేను, అంటే కొద్ది శాతం అవకాశము మాత్రమే యున్నది. అదెప్పుడు జరుగునో నేను చెప్పినచో నాకు చిన్న అవకాశముండును. అది జరుగుచోటు ముందుగా నేను చెప్పినచో మరికొంత నా అవకాశము మెరుగవును. దానిలో ఎవరుందురో నేను చెప్పినచో, మరికొంత నా అవకాశము మెరుగవును. అది సత్యము కానిచో, ఎన్నడూ జరుగదు (హల్లెలూయా!) మెస్సీయాను గూర్చి వ్రాసిన ప్రతి మాట అక్షరాలా నెరవేరెను. ఒక రోజున ఆయన లేఖనములను చదువుచూ మధ్యలో ఆగెను. "సువార్త ప్రకటించుటకు దేవుని ఆత్మ నా మీద ఉన్నది." ఆ మాట మధ్యలో ఆయన ఆగెను, ఎందుకనగా అ తదుపరి మాట ఆయన రెండవ రాకడకు చెందినది. ఆమేన్! "భూమ్యాకాశములు గతించును గాని నా మాటలే మాత్రమును గతించవు," చూచారా.

163అప్పుడాయన వాక్యము, అప్పుడు వారిని ఆయన పోషించుచుండెను. మోషే వారికి సత్యము చెప్పెను. అయితే మీరు చూడండి, వారు ఎల్లప్పుడూ అందులో నుండి ఒక మతశాఖను తయారు చేసిరి, రాబందులు పక్షిరాజులు తిని ఎగిరిపోయిన పిదప కొంత అచ్చట మిగిలెను. అంతట వారు మరొకటి కొరకు చూచుచుండిరి. "ఇక్కడికి వాక్యము రానున్నది. నిన్న మేము ఒకటి తిన్నాము. రేపు మేము గొర్రె తిందుము" అనుకొనిరి. నా భావము ఏమిటో చూచారా? "అక్కడ ఆ పాత జింక కళేబరము ఆశతో చూచుచున్నది, కాని ఈ రోజు మాకు గొర్రె వచ్చుచున్నది. అది ఎక్కడ యున్నది?" నా భావమేమిటో చూచారా? వారు దేవదూతల ఆహారము తినిరి. ప్రజలు ఒకరోజు మన్నాను తినిన పిమ్మట, మరుసటి రోజు కొరకు వారు దానిని దాచుటకు ప్రయత్నించినయెడల, అది పురుగులు పట్టును. ఈ ఉదాహరణలు ఎంత చక్కగానున్నవో మీరు చూడుట లేదా? ఇప్పుడును అంతే!

JOHN 11:49,51

 

164గమనించండి, యేసు దినములలోని రాబందులు కూడ దయ్యములను వెళ్ళగొట్టుచుండెను; పాత కళేబరము మీదనున్న అభిషిక్తులు. అది నిజమేనా? వారు దయ్యములను వెళ్ళగొట్టుచుండిరి. యేసు ఆలాగు చెప్పెను. మరియు గుర్తు౦చుకొనండి, ఆ దినములలో వారికి ప్రవక్తలుండిరి. ప్రధాన యాజకుడగు కయప ప్రవచించెను. ఎందరికి ఇది తెలియును? కయప ప్రవచించెను. పొలములోని గురుగు స్థానమును గమనించండి; అది కూడా ఒకే అభిషేకము చేత నీరు పెట్టబడెను. అతడు ప్రవచించెనని ఎందుకు బైబిలు చెప్పెను? "కారణము ఆ సంవత్సరమున అతడే ప్రధాన యాజకుడు." కుళ్ళిపోయిన కాకికి, ఒక ముండ్లపొద, మరియు ఒక గచ్చపొద. గోధుమల మధ్య కూర్చొండెను, కాని దేవుని ఆత్మ అతని మీది ఉండెను, నిజమగు దేవుని పరిశుద్ధాత్మయే అది. ప్రవచించుటకు, బోధించుటకు, రాబోవు సంగతులు చెప్పుటకు దేవుని పరిశుద్ధాత్మ అతని మీద యుండెను, మరియు ఆ ఘడియకు బయలుపరచబడిన వాక్యమునే అతడు నిరాకరించి సిలువవేసెను. ఓ, కృప, సోదరుడా! ఎంతోసేపు ఈ సంగతులు మనము చెప్పుకోగలము. ఎన్నో విషయములను ఈ వాక్యము ద్వారా కనుగోగలము?

నేను త్వరపడవలెను. ఇక్కడ దాదాపు పది పేజీల వచనములు వ్రాసియుంచాను. ఇవన్నీ ఎంతగా నిరూపించబడినవి.

నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఒకే సూర్యుడు పడుచున్నాడు.

MATT 12:27•

MATT 24:24•

MARK 13:22•

LUKE 11:19

 

165దీనిని రుజవు చేయుటకు యేసు ఇట్లు చెప్పెను, "నేను దేవుని వ్రేలిద్వారా దయ్యములను వెళ్ళగొట్టుచున్నయెడల మీ పిల్లలు దేనిద్వారా వెళ్ళగొట్టుచున్నారు?" ఇప్పుడు వారును దయ్యములను వెళ్ళగొట్టుచుండిరి. వారు ప్రవచించుచుండిరి. అది నిజమేనా? అయితే ఆయనను ఆ ఘడియ యొక్క వాక్యముగా వారు గుర్తించలేదు. ఎందువలన? కారణము ఆయన వారితో సహవాసము చేయలేదు. ఇప్పుడు మత్తయి 24.24 చూద్దాం: "అబద్ధ క్రీస్తులు, అభిషిక్తులు మరియు అబద్ధ ప్రవక్తలు లేచి దానిని ప్రవచించెదరు (చూడండి), సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుదురు." మీరిప్పుడు గ్రహించారా?

MATT 12:27•

LUKE 11:19•

REV 13:8•

REV 17:8

 

166పిల్లలను గమనించండి. "నేను దేవుని వాక్యము ద్వారా దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. మీ మతశాఖల పిల్లలు దేని ద్వారా వెళ్ళగొట్టుచున్నారు?" ఆయనే దేవుని వాక్యము. దేవుడు మాత్రమే దయ్యములను వెళ్ళగొట్టగలడని మన మెరుగుదుము. దేవుడు మాత్రమే చేయగలడు. ఇంటిలోనున్నవానికంటె బయటనున్నవాడు బలవంతునిగా నున్నప్పుడే వానిని వెళ్ళగొట్టు శక్తి కలిగియుండును. మీకు తెలియును, అక్కడ ప్రకటనలో, చెప్పబడెను, వాడు… ఆ క్రీస్తువిరోధి ఈ అంత్యదినములయందు లేచి "అద్భుతములు, సూచక క్రియలు చేసి భూమిమీద నున్నవారిని మోసము చేయునని మరియు వారిలో ప్రతియొక్కరిని మోసము చేయును, క్రైస్తవులను మరియు అందరిని మోసము చేయును, ఎవరి పేరు జగత్తు పునాది వేయబడినప్పటినుండియు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడలేదో వారందరిని మోసము చేయును." (మత్తయి24:24నకు జవాబు) "ఎవరి పేరు జగత్తు పునాది వేయబడినప్పటి నుండియు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడలేదో?" అసలయిన నారింజ చెట్టు యొక్క వేరులోనున్న ఆ జీవము అన్ని పులుపు కొమ్మలలోనికి వెళ్ళి మరియు ప్రతిదానికి వెళ్ళి మరియు ముందు కొనసాగి మరియు చెట్టు యొక్క పై భాగమున ఫలమును ఉంచెను. మతశాఖ సంబంధమగు తీగెలు మరియు అంటుకట్టబడిన ప్రతిదానికి పైన ఉంచబడెను. మీరు గ్రహించారా? నేను త్వరపడవలెను.

బలవంతుడు…

167ఇప్పుడు దావీదును గుర్తుచేసికొనండి, అతడు యధార్థవంతుడు మరియు నమ్మకస్తుడు, ఒక పనిచేయుటకు అభిషేకించ బడకుండానే దేవునికి ఒక పనిచేయుటకు ప్రయత్నించెను. వారు, అభిషికులు… కాని యేసు చెప్పెను, "వారు మానవుని యొక్క (లేఖనములను గూర్చిన) అనువాదమును బోధించుచుండిరి," (చూచారా), దేవుని వాక్యము కాదు, ఆయన నిరూపించిన వాక్యమును కాదు. చారిత్రాత్మకముగు క్రీసును బోధించుచున్నారు (చూచారా), ఎప్పుడోయుండిన వానినే చెప్పుచున్నారు. ఆయన "ఉండినవాడు" లేదా "ఉండబోవువాడు" కాదు గాని, "ఉన్నవాడు" అని బైబిలు చెప్పుచున్నది. "ఇప్పుడు ఉన్నవాడును." ఇక్కడ ఆ వాక్యమే జీవించుచున్నది. అదిలో ఆయన… ఆయన ఆకులలో ఉండెను; ఆయన కాడలో ఉండెను; ఆయన పొట్టులో ఉండెను; అయితే ఇప్పుడు ఆయన విత్తనములో ఉన్నాడు.

HEB 6:4,8

 

168ఇప్పుడు, మీరు వెనక్కు వెళ్ళి మరియు మరల ఆలాగు జీవించుటకు ప్రయత్నించెదరా? ఆ జీవము వెనుకకు వెళ్ళి, ఆ పాత పొట్టు ఎండిపోయిన పిమ్మట, ఎన్నడైన ఆ జీవము వెనుకకు వెళ్ళి మరియు అందులో మరలా జీవించునని మీరు తలంచుచున్నారా? అది ఎన్నడూ జరుగదు. "ఒకసారి వెలిగించబడి, పడిపోయినవారిని నూతనపరచుట అసాధ్యము." మరియు బయలువెళ్ళుచున్న వాక్యముతో కూడా నడువరు." వారు చచ్చిరి. "మరియు ముండ్లు, గచ్చపొదలు కాల్చబడుటకే తగును…" అది నిజమేనా? ఇప్పుడు వీలయినంత త్వరగా ముగించెదను.

MATT 9:16,17

 

169ఇప్పుడు వాక్యమును గమనించండి. ఒక చారిత్రాత్మక దేవునిని బోధించుచున్నారు, (చూడండి) వారు గతంలో జీవించగోరుచున్నారు. "మంచిది, వెస్లీ పలాన-పలానిది చెప్పెను, లేక ఎవరో ఏదో చెప్పెను" అనుచున్నారు. ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యమును నీవు నిరాకరించుచున్నావు. ఈ దినము యొక్క మన్నాగా స్పష్టముగా గుర్తించబడినది. వారు మన క్రొత్త సీసాలలో తమ పాత లూథరను, బాప్టిస్టు, పెంతెకోస్తు ద్రాక్షారసమును పోయుటకు ప్రయత్నించుచున్నారు. అది పనిచేయదు. మన క్రొత్త ద్రాక్షారసము వారి పాత సీసాలలో పనిచేయదు. ఈ క్రొత్త ద్రాక్షారసమును వారు తమ మతశాఖలో పోయ ప్రయత్నించినచో వారి తప్పిదము బయటపడును. వారాలాగు చేయలేరు. అది వారిని బ్రద్దలు చేయును. "ఇప్పుడు, సోదరుడా, నేను దేవునియొక్క వాక్యమును ఖచ్చితముగా వాక్యము ద్వారా చూచాను."

"ఇప్పుడు, ఇక్కడ చూడుము, డాక్టర్… అది మనకు అక్కరలేదు." నెడ్, నీవు అది ఎప్పుడో కలిగియున్నావు. "ఇక్కడ దానిని మనము ఉంచలేము; అది లేకపోయినా మనకు పరవాలేదు.." అసలు సంగతి, అది వారికి పనిచేయదు. అది పగిలిపోవును. క్రొత్త బట్టకు పాత బట్ట మాసికవేయజాలవు. దానివలన అంతయూ చినుగును, చూచారా. యేసు అది చెప్పలేదా? పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయలేరు; అవి బ్రద్దలగును. క్రొత్త ద్రాక్షారసములో జీవమున్నది. మంచిది.

REV 16:13,14

 

170మన సంభాషణను ఇప్పుడు నిజముగా త్వరగా ముగించుకొనుచుండగా ఇక్కడ ఒకదానిని గమనించండి. మీరు వ్రాసికొనగోరుచున్నట్లయితే, ప్రకటన 16:13-14 వరకు గమనించుదము. నాకది చదువు సమయము బహుశా నాకు లేదు. మీరు తప్పక దానిని చూడవలెనని నేను కోరుచున్నాను.

ఇప్పుడు గమనించండి, ఇది ఆరు మరియు ఏడవ పాత్రకు మధ్య వినబడుచున్నదని ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనము ఒక నిమిషములో ముగించెదము. ఇంకొద్ది నిమిషములు మీరు ఓపిక పట్టండి. త్వరగా ముగించెదను.

ప్రకటన 16:13-14 గమనించండి. ఆరు మరియు ఏడవ పాత్రకు మధ్య జరిగినది. "కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు" (మీరు దానిని గమనించారా?) "ఒకని నోటనుండి బయలు వెళ్ళెను." ఇప్పుడు త్వరగా చూడండి, మీరు సిద్ధంగా యున్నారా? "ఆమేన్!" చెప్పండి. ఆత్మల యొక్క త్రిత్వము.

171మతశాఖకు చెందిన సోదరుడా! ఒక్క నిమిషము నెమ్మదిగా కూర్చొనుము. టెలిఫోనులు, రేడియోలు ద్వారా వినుచున్నవారు లేచి వెళ్ళిపోవద్దు. మీ టేపు రికార్డులు ఆపు చేయొద్దు. ఒక్క నిమిషము కూర్చొని మరియు వినండి. మీరు దేవునివలన పుట్టినవారైతే, మీరు వినెదరు.

REV 10:7

 

172కప్పల యొక్క ఒక త్రిత్వము! కప్ప ఎల్లప్పుడూ వెనుకకు చూచు జంతువు. తాను వెళ్ళుచున్నవైపు ఎన్నడును చూడదు; ఎక్కడ నుండి వచ్చుచున్నదో అటు వైపే చూచును, చూచారా. మీరు గమనించారా? త్రిత్వము ఎక్కడ పుట్టినది? గుర్తుంచుకొనండి, "మూడు అపవిత్రాత్మలు" వేర్వేరు ఆత్మలు. మీరిది గ్రహించారా?

గమనించండి. త్రిత్వ సిద్దాంతము ఎక్కడ పుట్టినదో, ఆ సీసియా సభ వైపున వెనుకకు వారు చూచెదరు — వారు పరిశుద్ధ గ్రంథములో చూడరు, అలాంటిది ఏదియు లేదు. త్రిత్వము ఎక్కడ పుట్టినదో, ఆ రోములోని, నైసియా వద్ద నైసియా సభవైపు, వెనుకకు వారు చూచెదరు. వారెక్కడ నుండి వచ్చారో గమనించండి. గమనించండి, కప్పల త్రిత్వము ఆ పాత త్రిత్వము నుండి బయటకు వచ్చి ఒక క్రొత్త త్రిత్వమునకు జన్మ ఇచ్చినవి. అది వారి తల్లి, అది ఎందులో నుండి వచ్చెను? త్రిత్వము, "మృగము," (చూచారా) "ఘట సర్పము," మరియు "అబద్ధ ప్రవక్త" ఒక క్రొత్త త్రిత్వము. ఆ కప్పలు ఎందులో నుండి వచ్చినవి? అవి ఎప్పుడు వచ్చినవి? అవి ఎప్పుడూ అక్కడనే యున్నవని గమనించండి. అయితే ముద్రలు తెరువబడి దానిని బయలుపరుచుటకు ముందు, అవి ఆరవ మరియు ఏడవ పాత్రకు మధ్యలో ప్రత్యక్షపరచబడినవి. "ఏడవ దూత వర్తమానము అందించు దినములలో దేవుని మర్మములన్నియూ తెలియును." ఈ త్రిత్వము యొక్క సంగతులు, అబద్ధ బాప్తిస్మములు, మొదలగువన్నియూ మరియు సమస్త కార్యములు బయలుపడును. సత్యమును చూచుటకు దేవుడు మనకు సహాయము చేయును. గాక!

మరియు ఎవరో ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నారనుకోవద్దు…

REV 12:4

 

173ఆత్మ దీనిని పలుకుచున్నదని నాకు తోచుచున్నది, మీరు చూచారా, సోదరుడా, నా అంతట నేను దీనిని పలుకుట లేదు. పాళెములోనున్న యెహోవా దూతను గూర్చి మాట్లాడుచున్నాను. అది సరిగ్గా నిజము.

త్రిత్వమును గమనించండి! "ఘట సర్పము." ఘట సర్పము అనగా ఏమిటో ఎంతమందికి తెలియును? అది రోమ్. ఆ స్త్రీ బిడ్డను ప్రసవించిన వెంటనే మింగివేయుటకు ఘట సర్పము దానియెదుట నిలబడియుండెను." అది నిజమా? బైబిలులో మృగమునకు అర్థమేమిటి? "శక్తి." మంచిది.

అబద్ధ ప్రవక్త, ఒక అబద్ధ ప్రవక్త, ఒక అబద్ధ అభిషిక్తుడే, చూచారా.

1KGS 22:22•

2CH 18:21•

REV 16:13

 

174ఎక్కడ ప్రారంభమైనది? ఇది "అబద్ధ ప్రవక్త" (ఏకవచనము), "అబద్ధ ప్రవక్త" మొదటి పోపు అయి యున్నాడు. మరియు అక్కడ నుండి "మహావేశ్య మరియు వేశ్యలకు తల్లి వచ్చినది." సమస్త కార్యము అక్కడ నుండి చచ్చినది. ఒక అబద్ద త్రిత్వము లేచుచున్నది; ప్రారంభ దినములలో కాదు, ప్రారంభ దినములలో అది ప్రత్యక్షపరచబడదు, అది ఎప్పుడూ బయలు వెళ్ళుచునేయున్నది. ఏడు ముద్రలు వచ్చి ఆ మర్మములను విప్పి మరియు వాటిని బయలుపరచినప్పుడు; అది అప్పుడు "కప్పలు, కప్పలవలె నున్న మూడు అపవిత్రాత్మలు వచ్చి తమ్మును తాము బయలుపరచుకొనినవి." సత్యమునకు విరోధముగా ఒక త్రిత్వ సిద్ధాంతము బయటపడినది. అదెక్కడ నుండి వచ్చినదో చూచారా? అదెక్కడికి తిరిగి వెళ్ళుచున్నదో చూచారా? ప్రపంచ సంఘసమితి యొద్దకు ఏదియేమైన వారందరూ ఒకే ఆత్మగల సోదరులు. ఒకే కార్యమును కలిగిన సోదరులు. మరియు గమనించండి. అద్భుతములు జరిగించుచూ ఎంతగానో మోసము చేయుచున్నది! ఇవి భూమియందంతటకు బయలువెళ్ళి అద్భుతములు చేయుచూ అంత్యదినములలో జనులను మోసపుచ్చుచున్న దయ్యములు ఇవి. అందులో అవి జయము పొందుచున్నవి. ఆ దురాత్మను గూర్చి దేవుడు ఏమి చెప్పెను? "ఆ ప్రవక్తల యొద్దకు వెళ్ళి వారి నోటిలో అబద్ధముంచి దానిని వారు ప్రవచించునట్లు చేయుదునని చెప్పెను. అప్పుడు ఆహాబు అక్కడ బయటకు వచ్చి నాశనమగుటకు కారణమగును" అని చెప్పెను.

1KGS 22:22•

2CH 18:21

 

175అందుకు దేవుడు "వెళ్ళుము, నీవు జయించెదవు. వారిని నీవు నమ్మునట్లు చేయుదువు. అసలు వారు దానిని ప్రారంభించుటకు ముందే ఎప్పుడూ ఆ వాక్యము మీద లేరు," చూచారా. "వెళ్ళుము, నీవు అతనిని ఒప్పించెదవు. ఆ అబద్ధ ప్రవక్తలలోనికి నీవు వెళ్ళినప్పుడు, నీవు మాత్రమే ఆ విధంగా చేయగలవు, ఎందుకనగా అతడు వారిమీద ఆనుకొనియున్నాడు. మరియు వాక్యము గూర్చి అతనికి ఏమియూ తెలియదు లేక దానిని నేర్చుకోవలెనని అతను ప్రయత్నించడుకూడ. దానిని అతడు చేయలేడు, ఎందుకనగా అతని పుట్టుకయే ఒక ముండ్లపొదగా యుండెను," చూచారా. కాబట్టి "నీవు జయమొందెదవు" అని దేవుడు చెప్పెను.

176ఈ అబద్ధ కప్పల వైపు చూడండి, అవి వెనక్కు చూస్తూ, "ఎందువలన, ఆ నైసీయా యొద్ద వారు ఏమి చెప్పెనో మీకు తెలియునా?" అని చెప్పుచున్నవి. ఆ నైసీయా యొద్ద వారు ఏమి చెప్పినది నాకు అక్కరలేదు. ఇక్కడ దేవుని సింహాసనము యొద్ద వారు చెప్పిన దానినే నేను చెప్పుచున్నాను. జరిగిపోయినది కాదు; జరుగబోవునది, ఎందుకనగా ఆయన "నేను ఉన్నవాడను" అని చెప్పెను, చూచారా.

అబద్ధికులు. దానిని చూడండి. వారెక్కడినుండి వచ్చిరో గమనించండి.

JOHN 8:24•

JOHN 10:30

 

177ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏడుముద్రలు విప్పబడిన తరువాత ఆ మర్మము బయలుపరుచబడునని మనము తేటగా చూచుచున్నాము. ఆ త్రిత్వము ఏమిటి? అసలు త్రిత్వమును పదము ఎక్కడ పుట్టినది? బైబిలులో త్రిత్వమును పదము అసలు ఎక్కడున్నది? ఎక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు? మనము ముగ్గురు దేవుళ్ళను ఆరాధించువారమైతే మనము అన్యులము కామా? "నేనును మరియు నా తండ్రియు ఏకమైయున్నాము" అని ఆయన చెప్పినప్పుడు, వారెట్లు వేరుగా నుందురు? "నేనే ఆయనను అని మీరు నమ్మనియెడల, మీరు మీ పాపములోనే, మీ అవిశ్వాసములోనే చనిపోయెదరు" అని చెప్పెను. అవిశ్వాసమే పాపము. "మీ అవిశ్వాసములోనే మీరు నశించెదరు."

ఓ నేను ఎవరినని మీరు చెప్పుకొనుచున్నారు?

నేను ఎక్కడనుండి వచ్చానని మీరనుచున్నారు?

ఓ, మీకు నా తండ్రి తెలియునా, లేక

ఆయన నామమును గాని మీరు చెప్పగలరా?

నేనే షారోను పూవును, ప్రకాశించు వేకువ చుక్కను.

ఆయన ఎవరో మీరు నాకు చెప్పగలరా?

మండుచున్న పొదలో మోషేతో మాట్లాడినది నేనే.

నేనే అబ్రాహాము దేవుడను,

ప్రకాశించు వేకువ చుక్కను.

నేనే షారోను పూవును,

ఓ, నేనెక్కడ నుండి వచ్చితినని మీరందురు;

ఓ, మీరు నా తండ్రిని ఎరుగుదురా?

లేక ఆయన పేరు చెప్పగలరా? (ఆమేన్!)

నేనే ఆల్బాయు, ఓమేగాను,

ఆదియు అంతమునైయున్నాను.

నేనే సర్వసృష్టిని,

మరియు ఆయన పేరు యేసు.

REV 17:5

 

178అది సత్యము. త్రిత్వము లేదు! లేదండీ. అది అబద్ధము. ఏడు ముద్రలు ఆ మర్మములను విప్పినప్పుడు "అవి సమాప్తములగును." ముద్ర విప్పబడెను. ఇన్ని సంవత్సరములు ఈ సంఘములు, మరియు మతశాఖల కాలములలో ముద్రలు దాచియుంచిన, మరుగు పరచబడిన మర్మములను, దాగిన సత్యములను ముద్రలు విప్పబడినప్పుడు ముద్రలు తేటగా చూపించుచున్నవి. ప్రకటన యొక్క మహా వేశ్య. ఆమె ఎవరు? అది వేశ్యలకు తల్లి, చూచారా.

MATT 24:24•

MARK 13:22•

HEB 13:8

 

179"నీవు వాటిని "రాబందులని పిలచుచున్నావా, బ్రెన్హాం సోదరుడా" అని మీరనవచ్చు. అది నిజము. అయితే గుర్తుంచుకొనండి, రాబందు ఒక పక్షి అది కూడ ఎగురుటకే అభిషేకించబడెను. "ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయునంత దగ్గరగా ఆ రెండు ఆత్మలు ఉండును." రాబందు కూడా పక్షిరాజంత పెద్దగా నుండును. పక్షిరాజువలె అది ఎగురును; (గమనించండి) పక్షిరాజవలె అది కూడ ఎగురుటకు, లేక బోధించుటకు, లేక ప్రవచించుటకు అభిషేకి౦చబడినది, కాని అది పక్షిరాజు ఎగిరినంత పైకి ఎగురలేదు. లేదు, లేదు. పక్షిరాజును వెంబడించ ప్రయత్నించినచో, దాని బలహీనతలు బయటపడును. అవునండీ! అది పక్షిరాజును వెంబడించలేదు. "యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నాను. తండ్రియగు దేవునిని, సర్వశక్తిని, భూమ్యాకాశముల సృష్టికర్తను నమ్ముచున్నాను, ఆయన కుమారుడగు యేసుక్రీస్తును నమ్ముచున్నాను" అని అది చెప్పవచ్చును. ఓ! నిశ్చయంగా వారాలాగు చేయగలరు. అయితే ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు అను సంగతి ఏమిటి? చూచారా?

180పక్షిరాజు ఒక ప్రత్యేక నిర్మాణముగల పక్షి భూమిమీద దానివంటిది మరేదీ లేదు, చూచారా. ఏ ఇతర పక్షిఅయినా గాని దానిని వెంబడించ ప్రయత్నించినచో అది మాయమగును. పక్షిరాజును ఒక డేగ కాని, ఏ ఇతర పక్షి వెంబడించుటకు ప్రయత్నించిన ఎడల, అది భాగములుగా విడిపోవును. దాని బలహీనతలు నిశ్చయముగా బయటపడును. పాత సీసాలో కొత్త మద్యము పోసినయెడల, అది పిగిలిపోవును, చూచారా. ఆ తిత్తులు పగులును. అది భాగములుగా విడిపోవును. దాని శరీర నిర్మాణము అంత పైన నిలుచుటకు అనువైనది కాదు. అది ఆ పైన గొప్ప ఎత్తైన ప్రదేశములోనికి వెళ్ళినప్పుడు, అది గనుక పక్షిరాజుగా జన్మించక, తయారు చేయబడక, అభిషేకించబడక, ముందు నిర్ణయించబడకుండ ఉంటే, అది ముక్కలుగా పగిలిపోవును, చూచారా. రెక్కల నుండి ఈకెలు ఊడిపోవును, మరియు అది నేలమీద పడిపోవును. నిశ్చయంగా! ఆ ఎత్తులో పక్షిరాజును అది వెంబడించలేదు. అది ఎగురుటకు ప్రయత్నించినచో దాని బలహీనత బయటపడును. అది నిజము. నీవు చేయలేవు.

181ఎందువలన? అది పక్షిరాజువలె చూడలేదు. నీవు నిజముగా ఎత్తైనదిగా దూకుటకు ప్రయత్నించినచో, నీవు ఆ ఎత్తులో యున్నప్పుడు, నీవెక్కడ ఉన్నావో చూడలేనప్పుడు, అది నీకు ఏ ప్రయోజనము చేయును? మరియు అది ప్రయత్నించిన యెడల, ఆ ఎత్తులలో ఈ పక్షిరాజును అనుకరించుటకు ప్రయత్నించినచో, అది ఎంత గ్రుడ్డిదిగా అవుచున్నదంటే, అది ఎక్కడ వరకు వెళ్ళినదో దానికే తెలియదు. అది నిజము. అది కేకలు వేయుచున్నది, అరచుచున్నది మరియు ఆలాగు సమస్తము చేయుచున్నది; అయితే కేవలము దానితో వాక్యము మాట్లాడుము, అబ్బాయీ, అక్కడ వాని బలహీనత తెలియజేయబడును.

యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము గూర్చి అతనితో మీరు మాట్లాడండి. లేక ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడని మరియు ఆలాగు అన్నీ చెప్పండి. "ఎందువలన, ఓ, ఇప్పుడు ఒక నిమిషము ఆగండీ!" అని వారందురు, చూచారా. దాని రెక్కలు ఊడిపోవుచున్నవి. చూచారా, అతను పైకి ఎగురును, ప్రవచించును, భాషలతో మాట్లాడును, దయ్యములను వెళ్ళగొట్టును, చప్పట్లు కొట్టును, నేల మీద గంతులు వేయును. కాని అక్కడ పైకి వెంబడించుటకు ప్రయత్నించకు; ఎందువలన, అతను నిశ్చయముగా తెలియజేయబడును. అయినను అతను అభిషేకించబడెను. ముందుగా నిర్ణయించబడెను. అతను ఎగురగలదు. కొంత దూరము ఎగిరి నిలద్రోక్కుకోగలదు. చూడండి, అతను ఒక క్రుళ్ళిన దానిని తినగలడు, అయితే సింహాసనము నుండి వచ్చిన తాజా మాంసము అతను తినలేడు. అతను గ్రుడ్డివాడు. అతను ఆ పనిచేయును, కాని దేనిగూర్చి పనిచేయుచున్నదో అతనికే తెలియదు. చూచారా, ఒక గోధుమ గింజగా దానిని తయారు చేయుటకు దానిమీద వర్షము పడినట్లుగానే, అదే ఆత్మ అతని మీద పడినది; అతని పుట్టుకయే ఒక గోధుమ గింజగా లేదు. అతను పగిలిపోవును. "ఓ, నేను ఏదో దానికొరకు వెళ్ళలేను… ఓ, లేదండీ! డాక్టర్. జోన్స్ చెప్పినది నాకు తెలియును అని అతను చెప్పును. మంచిది, ఆలాగే ముందుకు వెళ్ళుము; నీవు వెళ్ళగోరినయెడల, ముందుకు వెళ్ళుము.

182గమనించండి, అటువంటి రకమైన ఒక పక్షిగా యుండుటకు, అతను జన్మించలేదు లేక ముందుగా నిర్ణయించబడలేదు. అతను ఒక నారింజ చెట్టు మీద పెరుగుచున్న నిమ్మకాయ కావచ్చును, కాని అతనెన్నడూ వేరు నుండి వచ్చినవాడు కాడు. అతను దానికేదో కలుపబడినవాడు. వారు తమ మతశాఖలో చాలా పైకిపోయినప్పుడు, వారు నిరూపించబడిన ముందు నిర్ణయించబడిన దేవుని వాక్యమును చూడలేకపోవుచున్నారు, అందుకే వారి పొరపాటు తెలిసిపోయినది. "ఓ, ఆ కార్యమా, తలపైన వెలుగు మరియు ఆ సమస్తమూ… ఓ, అది బుద్ధిహీనత," అని వెళ్ళిపోవుచున్నారు. చూచారా. వారి సంగతి తెలిసినది!

183అంత దూరము చూడకలుగునట్లు అతను నిర్మించబడలేదు. తన మతశాఖ యొక్క కండ్లద్దములు తనను ఎంత దూరము చూడనిచ్చునో అంతవరకే అతను చూచును. అయితే అటు తరువాత, అతను గబ్బిలమంత గ్రుడ్డివాడగును. అది అప్పుడు దాని పొరపాటు తెలిసిపోవును. నిజమగు పక్షిరాజు ఆహారము తినుటకు కూర్చుండు చోటు అక్కడే. అవునండీ. నిజముగా ఏర్పరచబడిన పక్షిరాజులు అవి ఏమైయున్నవో అక్కడే చూచుకొనును. అతను ఆ వాక్యమును తీసుకొనలేకపోవుచున్నప్పుడు, అతనొక మతశాఖ రాబందువని అప్పుడు వెంటనే వాటికి తెలియును.

ఎందువలన? ఎందువలన అది ఎగురలేదు? కారణము, అది ఏమి తినుచున్నదో చూడండి. మతశాఖలో కుళ్ళిపోయిన దానిని అది తినుచున్నది. అది దాని శరీరమునకు ఆత్మీయ జీవము నియ్యదు. ఆత్మీయముగా సరిపడియుండుటకు అది ఇయ్యదు, మరో మాటలలో మతశాఖ భేదములను దాటి దానిని పైకి ఎగురవేయదు, చూచారా. చూడండి, అది కుళ్ళిన ఆహారమును తినుచు బ్రతుకుచున్నది; దాని శరీరము అందులో నుండే తయారయినది. ఆ పక్షిరాజు తాజా ఆహారమును తీసుకు వెళ్ళు ఆ పై చోటుకు, అక్కడికి అది వెళ్ళలేదు. అది దానిని మాత్రము చేయలేదు, చూచారా.

184మత్తయి 24:24ను అది నెరవేర్చుచున్నది. అది ఎగురుచున్నది, గాలిలో ఎగురుచున్నది, రెక్కలను కొట్టుకొనుచున్నది గాని కావలసినంత పైకి మాత్రము అది ఎగురలేక పోవుచున్నది, చూచారా. అది నిజము. చూచారా, అది వెళ్ళలేదు, ఆ తాజా మన్నాను పొందుకొనుటకు కావలసినంత ఎత్తునకు, అది చేరలేకపోవుచున్నది. అది ఇక్కడ నేల మీద యున్న పాత మన్నాను తినగలదు. ఎప్పుడో నలుబది సంవత్సరాల క్రితం, ఒక నెలక్రితం, ఒక వారం క్రితం చచ్చిన కుందేలును అనగా, కుళ్ళిన ఆహారమును అది నేల మీద పొడుచుకొని తినును. అది దానిని తినగలదు మరియు దానిని ఆనందముగా, కేకలు వేయుచూ, మరొక పక్షిరాజు వలె రెక్కలాడించుచూ తినగలదు. మరొక పక్షివలె అది అభిషేకించబడినది. రాబందు కూడా పక్షిరాజు మాదిరిగానే యున్నది. మనకు అది తెలియును. నిశ్చయంగా ఆలాగే యున్నది. అయితే అది అసలయిన పక్షిరాజును వెంబడించజాలదు, చూచారా. అది దానివలె ఎగురలేదు. లేదండీ! దాని శరీరము ఆలాగు నిర్మితము కాలేదు. అది వేరే ఆహారమును తినుచున్నది, చూచారా. అది తాజా మాంసము, తాజా మన్నా కాదు. అది లూథర్ చెప్పినదో, వెస్లీ చెప్పినదో లేక మరెవరో డాక్టర్ చెప్పినది కావచ్చు. ఈ ఘడియకు యేసు చెప్పినది కాదు.

MATT 24:24•

MARK 13:22

 

185ఇప్పుడు ముందుకు వెళ్ళెదము, దగ్గరగా చూద్దాం. చివరి దినములలో అభిషిక్తులు, క్రీస్తులు, లేచెదరు, కాని అబద్ధ బోధకులు అబద్ద ప్రవక్తలవలె. ఎంత నిజమో గమనించండి! ఇప్పుడు, దీనిని మీరు పోల్చి చూడవలెనని నేను కోరుచున్నాను. మత్తయి 24:24ను రెండవ తిమోతీ 3:8తో పోల్చి చదువుకొనండి. దానిని చదువుటకు మనకు సమయము లేదు. మత్తయి 24:24 చెప్పెను, అంత్యదినములలో (చూచారా), అబద్ధ క్రీస్తులు వచ్చెదరు, అబద్ద అభిషిక్తులు, అబద్ధ ప్రవక్తలు మరియు సూచక క్రియులు, మహత్కార్యములు చూపెదరు, సరిగ్గా నిజమైనవానివలె నిజమైనవానివలె, మరియు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని దాదాపు మోసము చేయును.

అది యేసు మాట్లాడుచున్నాడని ఇప్పుడు గమనించండి.

MATT 24:24•

MARK 13:22•

EPH 4:5•

2TIM 3:5,6,8

 

186ఆయన వెనుకనే ఇక్కడ సౌలు వచ్చెను. మరియు చెప్పెను, "ఇప్పుడు, అంత్యదినములందు, మత సంబంధమైన జనులు వచ్చెదరు, (చూచారా) పైకి భక్తిగలవారై యుందురు. మరియు అవివేక స్త్రీలను అన్ని రకముల లోకపు దురాశలవైపు మళ్ళించెదరు." మరియు వారు ఆశ్చర్యపడి, "నీవు స్త్రీలనెందుకు ఎత్తి చూపుచున్నావు?" అనెదరు. ఓ, దానిని వారు కేవలము చూడలేకయున్నారు. "అవివేక స్త్రీలను నానా విధములగు దురాశలతో మరులుగొలుపుచున్నారు." చూచారా, "మరియు యన్నె, యంబ్రెలు వలె. (మత్తయి 24:24, అబద్ధ క్రీస్తులు, అబద్ద ప్రవక్తలు వచ్చి అద్బుతములు సూచక క్రియలు చేసి ఏర్పరచబడిన వారిని మోసము చేయుదురు.) "యన్నె, యంబ్రేలు మోషేను ఎదిరించినట్లే వీరును భ్రష్ట మనస్సుతో విశ్వాస విషయములో ఎదిరించుదురు." "ఒక విశ్వాసము" కాదు. "విశ్వాసము!" "విశ్వాసము ఒక్కటే, ప్రభువు ఒక్కడే. బాప్తిస్మము ఒక్కటే. "ఒక్క ప్రభువును" నమ్మకుండా "ఒక విశ్వాసము" నీకు రాదు. నీకు రెండు బాప్తిస్మములుండవు. తండ్రి, కుమార పరిశుద్దాత్మ అనునది బాప్తిస్మము కాదు. అది అబద్ధ బాప్తిస్మము. యేసుక్రీస్తు నామమందే బాప్తిస్మము. "బాప్తిస్మము ఒక్కటే." అది నిజము.

2TIM 3:8,9•

REV 10:1-7

 

187గమనించండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, దీనిని పోల్చి చూడుడి. మత్తయి 24:24 లో యేసు చెప్పినది గమనించండి. రెండవ తిమోతీ 3:8లో పౌలు చెప్పినది గమనించండి. మరియు ఇప్పుడు దానితో పోల్చి చూడుడి.

మరియు మరొక లేఖనమును వ్రాసుకొనండి, లూకా 17:30, మలాకీ 4. యన్నే యంబ్రేలు మోషేను ఎదిరించినట్లుగా; ఆ ఘడియకు అభిషేకించబడిన వాక్యమును, ఈ వ్యక్తులు కూడ ఎదిరించుదురు; వ్యక్తి కాదు — వ్యక్తులు; అభిషిక్తులు — సత్యమును ఎదిరించుదురు.

"మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలో" (ప్రకటన 10:1-7 వరకు ఇంటికి వెళ్ళినప్పుడు దానిని చదవండి), "ఏడవ దూత వర్తమానము ముద్రలను విప్పును." ఏమిటిది? దూత మనుష్యకుమారుడు కాదు; కాని వర్తమానికుడు మనుష్యకుమారుని బయలుపరచుచున్నాడు. మీరు దానిని ఇప్పుడు వేరుచేయగలరా? అక్కడే మీకు కష్టమనిపించును, మీరు చూచారా. తనకు తాను మనుష్యకుమారుడు కాడు, కాని ఏడవ దూత — ఏడవ వర్తమానికుడు — మనుష్యకుమారుని జనులకు బయలుపరచుచున్నాడు, ఎందుకనగా అది పొట్టును విడిచిపెట్టినది. దానిని మీరు సంస్థగా చేయలేరు; అది స్వయముగా మరలా గింజ అయి యున్నది. "మరియు ఆ దినమున యన్నే యంబ్రేలు ఎదిరించిరి. (అభిషిక్తులు వేషధారులు, మరియు అవిశ్వాసులు. నామకార్థ సంఘస్తులు, మరియు పెంతెకోస్తు వారు) నిజమగు గింజ మీద తిరుగుబాటు చేయుచున్నారు. అయితే వారిని ఒంటరిగా వదిలివేయుము; వారి పొరపాటు ఇదివరకు బయటపడినట్లుగా, వారి సంగతి బయటపడును." ఇప్పుడు మీకు అర్ధమైనదా?

REV 10:7

 

188ప్రకటన 10, చెప్పెను, "ఏడవ దూత పలుకు దినములలో…" ఇప్పుడు గుర్తు౦చుకొనండి, ఏడవది లవోదికయ సంఘకాలము, ఆ దూత పలుకు దినములలో, ఆ సంఘ కాలమును మతశాఖగా మారి, మరియు ఒక సంఘకాలముగా మారెను, ఎప్పుడైతే దానియొక్క పెంతెకోస్తు సంస్థలో అది జరిగినప్పుడు, దాని వర్తమానికుడు… ప్రతి వర్తమానికుడు ఏమిటి? మార్టిన్ లూథర్ ఏమిటి? కాథలిక్కులకు ఒక గద్దింపు. వెస్లీ ఏమిటి? లూథరనులకు ఒక గద్దింపు. పెంతెకోస్తు ఏమిటి? ఇతరులకు ఒక గద్దింపు. ఇప్పుడు జీవము ఎక్కడికి పోయెను? సంస్థ నుండి దూరంగా పొయెను. ఇక పొట్టు లేదు; ఇది గింజ. ఇదేమిటి? ఘడియ యొక్క లేఖనము నెరవేర్చుటకు (చూచారా), పెంతెకోస్తుకు ఒక గద్దింపు, చూచారా.

189గమనించండి. ఆ దినముననే ఈ వర్తమానికుడు. అతను ప్రారంభించినప్పుడు కాదు గాని, అతను తన వర్తమానమును ప్రకటించుచున్నప్పుడు, చూచారా. మొదటి ఈడ్పు, స్వస్థత; రెండవ ఈడ్పు, ప్రవచించుట; మూడవ ఈడ్పు, వాక్యము తెరుచుట, మర్మములు బయలుపరచబడుట. ప్రవక్తలకంటె వాక్యమును ఎన్నడూ ఎక్కువగా బయలుపరచువారు మరెవరూ ఉండరు. అయితే వాక్యము ద్వారా మాత్రమే ప్రవక్త బయలుపరచబడును. మరియు గుర్తు౦చుకొనండి, మూడవ ఈడ్పు ఏడు ముద్రలు విప్పబడుట అయియున్నది. వాక్యములో ముద్రించబడి దాగియున్న సత్యములను బయలుపరచబడుట అయియున్నది. ఇది జరుగునప్పుడు, ఆ దినమున యన్నే యంబ్రేలు, అనుకరణ చేయువారు మరల ప్రత్యక్షమగుదురు. మోషే అసలైన వాక్యముతో, దానిని చెప్పుటకు ప్రత్యక్షమైనప్పుడు, వారునూ ఆలాగే చేశారు; దానిని అనుకరించుటకువారు ప్రత్యక్షమైరి. సరిగ్గా నిజము. ఇప్పుడు మత్తయి 24:24 ఏమిటి అనునది మీరు చూచారా? చూడండి, అభిషిక్తులు.

190ఇప్పుడు ముగించు ముందుగా, మూడు సంగతులు చెప్పెదను. అదే ఇది. మనము ముగించుకొనే ముందు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినవలెనని నేను కోరుచున్నాను. మూడు సంగతులు, గుర్తు౦చుకొనండి, మూడు సంగతులు నెరవేరినవి. ఇప్పుడు మీ ముందు మూడు సంగతులున్నవి.

మొదటిది: ప్రపంచము సొదొమ స్థితిలో యున్నది. ఆలాగుండునని యేసు చెప్పెను. అక్రమము చూడండి; మన స్త్రీలు పురుషులవలె ప్రవర్తించుటకు ప్రయత్నించుచున్నారు; మన పురుషులు స్త్రీలు ప్రవర్తించుటకు ప్రయత్నించుచున్నారు; కుళ్ళు, మురికి, నీచత్వము, దయ్యపు చేష్టలు, కాని అది వారికి తెలియదు. ఆలాగు జరుగునని బైబిలు చెప్పెను. మరియు అది అక్కడే యున్నది.

రెండవది: ఇక్కడున్న వాక్యప్రకారముగా, ఈ ఘడియలోనే యన్నే యంబ్రేలు ప్రత్యక్షమవుదురు. రెండవదిగా.

మూడవది: అదే ఘడియలోనే మనుష్యకుమారుడు బయలుపరచబడును.

191అక్కడ మీ విశ్వాసి, మీ నటించు-విశ్వాసి, మరియు మీ అవిశ్వాసి యున్నారు. అక్కడ నిరూపించబడిన ఒక అసలయిన వాక్యము నిలవబడియున్నది; అక్కడనే దానిని అనుకరించుటకు నటించు-విశ్వాసి యున్నాడు; మరియు అక్కడనే ఆ పూర్తి కార్యమును నిరాకరించు అవిశ్వాసి యున్నాడు.

అయితే సాయంకాలమందు వెలుగు కలుగును;

మహిమ మార్గమును నిశయముగా మీరు కనుగొందురు.

(అది నిజమేనా?)

మన బైబిలే మనకు ముందుగా చెప్పిన సూచనలు జరుగుచున్నవి.

దేశములు ముక్కలగుచున్నవి.

ఇశ్రాయేలు లేచుచున్నది.

అన్యుల రోజులు లెక్కించబడినవి (సొదొమ!) తిరస్కరించబడిన వాడా!

నీ స్వజనుల యొద్దకు రమ్ము

విమోచనా దినము సమీపమాయెను.

మానవుల హృదయములు ఈ భీతితో బ్రద్దలగుచున్నవి.

దేవుని ఆత్మతో నింపబడుడి

మీ దివిటీలు శుభ్రపరచుడి

(అప్పుడు మీరు ఆ ఘడియ వాక్యము చూడగలరు)

పైకి చూడండి! మీ విడుదల సమీపమాయెను

అబద్ధ ప్రవక్తలు అబద్దమాడుచున్నారు.

(వారు యిక్కడ యుందురని చెప్పబడెను — అభిషిక్తులు)

దేవుని సత్యము వారు నిరాకరించుచున్నారు.

(యేసు క్రీస్తే మన దేవుడు, దానిని వారు నమ్మరు.

ఈలాగు జరుగునని బైబిలు చెప్పెను. ఇక్కడ అది జరుగుచున్నది!)

అయితే మనము అపొస్తలులు వెళ్ళిన చోటకి వెళ్ళుదము,

(అదే వెలుగు! తండ్రుల విశ్వాసము వైపు పిల్లలను త్రిప్పును.)

విమోచనా దినము సమీపమున యున్నది.

(బహు సమీపముగా యున్నది.)

మానవుల హృదయములు భీతితో బ్రద్దలగుచున్నవి.

(భూమి కంపించుచున్నది)

ఓ! దేవుని ఆత్మతో నింపబడుడి,

మీ దివిటీలు శుభ్రపరచి వెలుగనీయుడి.

పైకి చూడుడి, మీ విడుదల సమీపమునేయున్నది.

మీరు అది నమ్ముచున్నారా? అలాగైతే మన తలలు వంచుదము.

JOHN 6:37

 

192బయట దేశమంతటా వర్తమానము వినబడుచున్నది. తూర్పు తీరము, పశ్చిమ తీరము, కాలిఫోర్నియా నుండి న్యూయార్కు, ఉత్తరము, దక్షిణము, ఇంకా మిషనులలోనికి వెళ్ళుచున్నది. ఈ ఆలయములో అది వినబడుచున్నది. మనము పేదవారము. మనకు గొప్ప టెలివిజను ప్రసారములు మొదలగునవి లేవు. మనము మనకు వీలయినది చేయ ప్రయత్నించుచున్నాము. "అయితే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు."

193ఇప్పుడు, మీరు దీనిని నిశ్చయముగా తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను. మరియు ఈ టేపు వినుచున్న మీరు కూడ. ఈ వర్తమానమును నేనే అందించుచున్నానని నా గూర్చి నేను చెప్పుకొనినట్లు ఈ రోజు మీరు తలంచవచ్చును. నేను కేవలము ఒక స్వరమును మాత్రమే. అంతకంటె మరేమియూ కాను. నా స్వరమే నా తీర్పులో నిలబడును. నేను ఒకటి పట్టుకొనగోరుచున్నాను. అయితే దీనిని నేను ప్రకటించుట నా తండ్రి యొక్క చిత్తము, దానిని చేయుటకు నిశ్చయించుకొన్నాను. ఆ నదియొద్ద ప్రత్యక్షమైనవాడను నేను కాను; ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను అక్కడ నిలబడినవాడను మాత్రమే. ఈ క్రియలు జరిగించునది గాని, ముందు జరుగు సంగతులు ఖచ్చితముగా చెప్పునది గాని నేను కాను. ఆయన చేయుచుండగా నేను ఆ దగ్గర నిలబడియున్న వానిని మాత్రమే. నేను ఆయన వాడుకొనుచున్న స్వరమును మాత్రమే. నాకు తెలిసినది నేను చెప్పుట కాదు. ఆయనకు నన్ను సమర్పించుకొనియున్నాను. నా ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు. అది నేను కాను. అది ఏడవ దూత కాదు; ఓ, కాదు; అది మనుష్యకుమారుని యొక్క ప్రత్యక్షత. అది దూత కాదు, ఆయన వర్తమానము; అది దేవుడు బయలుపరచిన మర్మము. అది మానవుడు కాదు గాని, దేవుడే. దూత మనుష్యకుమారుడు కాదు; అతను మనుష్యకుమారుని యొద్ద నుండి వచ్చిన వర్తమానికుడు మాత్రమే. క్రీస్తే మనుష్యకుమారుడు. ఆయనను మీరు భుజించుచున్నారు. మీరు ఒక మానవుని వలన పోషించబడుట లేదు. ఒక మానవుని మాటలు తప్పిపోవును, కాని మీరు తప్పిపోని మనుష్య కుమారుని యొక్క శరీర-వాక్యమును తినుచున్నారు.

నీవు ప్రతి వాక్యముతో పూర్తిగా భుజించబడినట్లయితే, అది నీకు ఈ లోక కార్యముల నుండి మరియు ఈ మత శాఖలన్నిటికంటే పైకి ఎగురుటకు శక్తినిస్తుంది. మనము ప్రార్ధి౦చుచుండగా, ఈ సమయమునందు అది చేయుటకు నీవు ఒప్పుకుందువా?

194ప్రియమైన తండ్రీ, ఇది కఠినమగు సంగతి. ఒక మర్త్యుడు దీనిని చేయుట సుళువు కాదు. నీవు అన్నియు ఎరుగుదువు. మరియు నేను నీకు ప్రార్ధి౦చుచున్నాను. ప్రియదేవా, దీనిని అపార్థము చేసికొనకుండునట్లు నీకు ప్రార్థించుచున్నాను, అయితే నీ వాక్య వెలుగులో జనులు నడచుదురు గాక!

మరియు తండ్రియగు దేవా, ఏర్పరచబడిన వారెవరో నాకు తెలియదు; నీవెరుగుదువు. నీ రాక ఎప్పుడో నాకు తెలియదు, అయితే ఇది ఎప్పుడు జరుగునో ఈ అబద్ధ అభిషిక్తులు వచ్చెదరని మాత్రము నాకు తెలియును; వారు ప్రారంభించినప్పుడు సరియైనది కాదు. మోషే వారి జోలికి పోలేదు, ఎందుకనగా వారిని ఏమీ చేయగోరలేదు. నీవు చెప్పినది మాత్రమే అతడు చెప్పగలడు. నీవు ఈగలను రప్పించమని చెప్పావు, వారు ఆలాగే చేసిరి; నీవు నీటిని రక్తముగా మార్చమని చెప్పావు, వారును ఆలాగే చేసిరి. మోషే నీవు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చెను. అయితే వారి తప్పును బయలుపరచినవాడవు నీవే.

195ఇప్పుడు, తండ్రీ, ఇంకనూ నీవు దేవుడివి. చివరి దినములలో ఇది జరుగునని ఆ వాక్యమే చెప్పెను. చాలామంది యధార్థపరులు. గత ఆదివారము మేము చెప్పుకున్న ప్రకారము, ఆ మందసమును లేవీయుల యొక్క భుజముల మీద కాకుండా, క్రొత్తబండిలో పెట్టుటకు చేతులు చాపిరి. వారు తమ సొంత మనస్సాక్షికి వ్యతిరేకముగా వాదించిరి. అందుకే వారు "అతిక్రమములోను పాపములోను" చచ్చిరి.

చాలామంది సేవకులు, వారి వాక్య ధ్యానములో కూర్చుండినప్పుడు, ఆ వాక్యమును చదివెదరు మరియు వెంటనే పేజీని త్రిప్పెదరు. వారు పేలిపోకుండ ఉండుటకు ఆలాగు చేయుదురు. అయితే తమ స్వంత గుర్తింపును, సంఘము యొక్క మతశాఖ యొక్క, జనుల యొక్క గుర్తింపును పోగొట్టుకొందుమేమోనని ముందుకు వచ్చుట లేదు. దేవా, ఎన్నడూ ఆలాగు చేయకుండా ఉండుటకు మాకు సహాయము చేయుము!

ISA 6:5

 

196ప్రభువా, సమస్త లోక అపవిత్రత నుండి మా హృదయమును కడుగుము. ప్రభువా, నేను కడుగుగొనుటకు సిద్దముగా నిలబడియున్నాను. ఈ సంఘముతోను, ఈ వినువారితోను, ఇంకా ఈ టేపు వినుచున్నవారితోను నేను సిద్ధపడి నిలబడియున్నాను. ప్రభువా, నేను నిలబడి కడుగమని అడుగుచున్నాను. ప్రభువా, నన్ను కుమ్మరివాని సారి యొద్దకు తీసికొని వెళ్ళి విరువుము. నీవు కోరుకొను సేవకునిగా మలచుము. కారణము, ప్రభువైన యేసూ, "నేను అపవిత్ర పెదవులు గలవాడను" అని యెషయా కేకలు వేసినట్లుగా, "అపవిత్ర పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను." యెషయా దేవదూతలను మందిరములో చూచినట్లుగా, "అయ్యో! నాకు శ్రమ! ఎందుకనగా దేవునియొక్క ప్రత్యక్షత బయలుపడుట నేను చూచాను." ప్రభువా, నేను అంత్యకాలము చూచుచున్నాను. నాకు, నా కుటుంబమునకు, నా జనులకు శ్రమ! ఓ నిత్యుడగు దేవా, మా మీద దయ చూపుము. నా నిమిత్తమును, నా జనుల నిమిత్తమును, వేడుకొనుచున్నాను. నమ్మని వారితో మేము నశించుట కాదు గాని విశ్వాసులతో మేము జీవించుదుము గాక!

197ప్రతి మతశాఖను, ప్రభువు, ప్రతి పురుషుడు లేక స్త్రీని… ఒక మతశాఖను దీవించుమని నిన్ను అడగలేను, ఎందుకనగా దానికి నీవు వ్యతిరేకివి అని నాకు తెలియును. అయితే ప్రభువా, నీ గొర్రెలు ఏవయినా వారి మధ్యలో యున్నచో ఈ టేపును వారు విందురు గాక, అని మాత్రమే నేను చెప్పగలను. ప్రభువా, దానిని వారు విని, నీవిచ్చు బుద్ధితో గ్రహించునట్లును, నీ యొద్దకు వచ్చి నిన్ను అంగీకరించునట్లును సహాయము చేయుము. ఈ దినము యొక్క గ్రుడ్డితనము మరియు ఆచారముతో మోసపోకుందురు గాక. వారు మరియొక దినము నాటి కళేబరమును తినుటకు ప్రయత్నించకుందురు గాక. వాక్యమునే వారు తినెదరు గాక! ప్రభువా, ఆ విధముగానే పరిసయ్యులు నిన్ను సిలువవేసిరి. వారు మోషే నాటి కళేబరమును తీసికొని దానిని తినగోరిరి. నీవయితే వారికి అరణ్యములో ప్రతి రాత్రి తాజా మన్నా ఇచ్చావు. ప్రతి తరమునకు నీవిచ్చు వాక్యమునకు అది సాదృశ్యము. అక్కడే వారు తప్పిపోయిరి. అది వారిని విషపూరితము చేసెను. ఆ చెడిన ఆహారము తినినందున అది వారిని చంపినది. మరియు నేడును ఆత్మీయంగా అదియే జరుగును; ఒక మతశాఖ ఆత్మీయంగా, వారిని చంపును. ప్రియదేవా, మాకు సహాయము చేయుము. ఇప్పుడు అంతా నీ చేతులలో యున్నది. యేసుక్రీస్తు నామములో

198మనము తలలు వంచియుండగా, మనము పాట పాడబోవుచుండగా, మీరు మీ తీర్మానము చేసికొనండి. అంతము వరకు నడిచెదరా?

నా రక్షకుని పిలుపు నేను వినుచున్నాను. (ఆయనే వాక్యము).

నేను వినగలను ("ఓ! ఎంతో కాలము నేను త్రోవ తప్పి తిరిగాను.

అయితే ఇప్పుడు నిజంగా చీకటిలో తడవులాడుచున్నవారిని ఆయన తన యొద్దకు రమ్మనుట వినుచున్నాను.")

నేను వినగలను ("వచ్చి సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించమనుచున్నాడు.

మరణాంధకారపు లోయలో నేను నడచినను ఏ అపాయమునకు నేను భయపడను.

ఆయన నన్ను పచ్చని బీడులందు, విశ్రాంతినిచ్చు జలముల యొద్దకు నడిపించును.)

ఆయన నడిపించు చోటికే వెళ్ళెదను. (ప్రభువా, త్రిత్వ మోసమును నేను చూచుచున్నాను.

ప్రపంచమంతా అందులో వ్రేళ్ళూనినది.

ప్రతిచోట గురుగులు పెరుగుచున్నవి. అయితే ప్రభువా,

ఇప్పుడు నీవు ఎచ్చటికి నడిపించెదవో అక్కడికే వచ్చెదను.

నేను అపొ.కా. 19 లోనున్నవారివలె యు౦దును.

"వారిది విని యేసు క్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందిరి.")

…వెంబడియు, (ప్రభువా, నీకెంతో దూరమయ్యాను. నిన్ను చేర్చుకొన్నచో నాకు చాలును.)

ఇప్పుడు అంతము వరకు ఆయనతో నడిచెదను.

[ఆయన నన్ను నడిపించు చోటికి అను పాట సహో, బ్రెన్హాం ఆలపించుచున్నారు.]

LUKE 14:31

 

199ప్రియదేవా, అది నా హృదయము నుండి వచ్చినదని నేను నమ్ముచున్నాను. ఈ సమయములో దీనిని పాడుచున్న ప్రతివారి హృదయములో నుండియు ఇది వచ్చుచున్నదని నేను నమ్ముచున్నాను. ఇక్కడ లేనివారు చాలామంది దీనిని వినుచున్నారు. ఈ టేపును విందురు. ప్రభువా, వెలను లెక్క చేయక మేము ఇష్టపడెదము గాక. "మరో సైన్యముతో యుద్ధమునకు పోపు రాజా, సైన్యాధిపతి మొదటగా కూర్చొని తన సామర్థ్యమును లెక్కించుకొనును, లోక విషయములు మరచిపోవును. మీరును దేవునియొక్క వాక్య సైన్యములో చేరుటకు, ఆయన సైనికులవలె ముందుకు పోవుటకు, ఆయన పక్షిరాజులతో ఎగురుటకు సమస్తమూ త్యజించెదరా?" యేసు నామములో, ప్రభువా, ఇది దయచేయుము.

200మీరు నమ్ముదురా? ఆయనను అంగీకరించెదరా? మంచిది. ప్రభుని చిత్తమయితే ఈ రాత్రికి మిమ్మును మరల ఇక్కడ చూచెదము. అది సత్యమని మీరు నమ్ముచున్నారా? ఇది కావలసినంత తేటగా యున్నదా? అయితే…

యేసు నామము నీతో కొనిపొమ్ము

దుఃఖము, శ్రమలతో నిండిన బిడ్డ?

అది నీకు ఆనందము ఆదరణ ఇచ్చును దానిని తీసికొనుము,

ఇప్పుడు మీ దగ్గరున్న వారితో కరచాలనము చేయుడి.

ప్రశస్త నామము ఓ! ఎంత మాధుర్యము!

భూలోక నిరీక్షణ, పరలోకానందము,

ప్రశస్త నామము ఓ! ఎంత మాధుర్యము

భూలోక నిరీక్షణ, పరలోకానందము,

యేసు నామము నొద్ద వంగి

ఆయన పాదముల యొుద్ద సాగిలపడి,

రాజులకు రాజుగా ఆయనకు కిరీటము ధరింపచేతుము,

(అప్పుడు ఆయన దేవుడు)

మన యాత్ర ముగియును,

ప్రశస్త నామము, ప్రశస్త నామము,

ఓ! ఎంత మధురము, ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోకానందము,

ప్రశస్త నామము ఓ! ఎంత మధురము!

భూలోక నిరీక్షణ పరలోక ఆనందము.

ACTS 20:27•

1COR 9:16

 

201ఈ ఉదయమున అందరు సేవకులను గుర్తించుట జరిగినదనుకొనుచున్నాను. వారమంతా ప్రార్ధించి వాక్యమంతటినీ చూచి, ఆశ్చర్యపడి మీ ఎదుట నిలబడితిని. "సువార్తను ప్రకటించనియెడల, అయ్యో నాకు శ్రమ" అని పౌలు పలికెను. మార్గాంత మందు ఇంకా అతడిట్లనెను, "దేవునియొక్క ఆలోచనంతయు నాకియ్యబడిన ప్రకారము మీకు ప్రకటించుటకు నేను వెనుకాడలేదు."

202కొన్నిసార్లు నేను సంగతులను గుర్తుపట్టలేను, పిల్లలను ప్రతిష్టించవలసిన పని కూడా మరచిపోవుదును. "నా బిడ్డను ప్రతిష్టించుటకు ఇక్కడికి రెండు సంవత్సరముల నుండి వచ్చుచున్నానని," ఒకతను చెప్పినట్లు బిల్లీ నాతో అనెను.

అప్పుడు బిల్లీ ఇట్లనెను, "దానిగూర్చి చింతించవద్దు. నాకు కూడ సంవత్సరము వయస్సున్న బిడ్డ ఉన్నది, ఇంకా ప్రతిష్టించలేదు. ఆ బిడ్డ తనకుతాను ఇక్కడికి నడచి వచ్చి అడుగు వరకు వేచియుండుట మంచిదనుకొనుచున్నాను."

కావున సోదరుడా, సోదరీ మనము కనుగొన్నాము, అది ఒక విషయము, మన పిల్లలను మనము ప్రతిష్టించవలెను. ప్రతివారికి మనము బాప్తిస్మమియ్యవలెను. అక్కడ కొలనులో నీరున్నది. ఇంకా మీరు పొందనియెడల ఆటంకమేమిటి? ఇక్కడ నీరున్నది. వెంటనే ఇప్పుడు రండి! రాత్రి వరకు వేచియుండవద్దు. వెంటనే ఇప్పుడు రండి. పశ్చాత్తాపపడి ఒప్పుకొనిన ఎవరికయినా గాని బాప్తిస్మమిచ్చుటకు ఇక్కడ ఒకాయన నిలబడియున్నాడు. నీవు డజను సార్లు బాప్తిస్మము పొందియుండవచ్చును, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము వారు నీకు యిచ్చును, చూచారా.

అది మనకున్నది…

203అయితే చూడండి, నా హృదయములో వర్తమానమున్నది. దానిని నేను బయటకు పంపవలెను. నా భార్య పిల్లలు, సంఘకాపరి మొదలగువారు ఏమి చెప్పినాగాని నా ఉద్దేశ్యము మాత్రము అదే. అది నా ప్రభుని నుండి కలిగినది. దానిని తప్పక నేను బయటకు పంపవలెను. అదే నా ఏకైక వాంఛ.

204మరియు ఇప్పుడు, చాలాసార్లు సేవకులను గుర్తించుటలో మరచుదును. సహో, నెవిల్ ఒక ప్రశస్త్ర సోదరుడు. ఇక్కడ ఈ ఇతర సహోదరులు, మీరు మాతో యుండుట మేము సంతోషించుచున్నాము.

మీతో వేరుగా నుండవలెనని, మేము మీతో సమ్మతించక పోవడము కాదు. సోదరులారా! మీలో ఇక్కడ చాలామంది త్రిత్వ బోధకులుగా యుండవచ్చు. మీ మీద కోపపడుట మాకిష్టము లేదు. మిమ్ములను ప్రేమించుచున్నాము. ఆలాగు లేనియెడల ఈ ఆలయములోనే మోకాళ్ళూని, "దేవా, నన్ను సరిచేయుము అని అడుగు వరకు కదలను. దానిని మేము విశ్వాసించుచున్నాము. అంత క్రూరముగా నేనుండగోరుట లేదు. నాలో ఆ స్వార్ధపు ఆత్మ కలిసిలేదు. నా ఆత్మను పవిత్రముగా, పరిశుద్ధముగా ఉంచగోరుచున్నాను. సహోదర ప్రేమతోను, పరిశుద్దాత్మతోను పరిశుద్ధముగా ఉండగోరుచున్నాను. ఎవరైనా నా పట్ల తప్పుగా ప్రవర్తించినా అది మ౦చిదే." వారిని దూషించు హక్కు నాకున్నాగాని నా జీవితములో అది నేను చేయగోరుట లేదు. నేను ప్రేమించగోరుచున్నాను. ప్రేమతో సరిచేయబడగోరుచున్నాను. ఆ ప్రేమ సంపూర్ణముగా అన్నిటిని మించినది.

205నేను వేరుగా ఉండవలెనని ఉద్దేశ్యము కాదు. మీరు మెథడిస్తు, బాప్టిస్టు, కాథలిక్కు, ప్రెస్బిటేరియను మరెవరయినా కావచ్చును. మీతో వేరుగా నుండుటకు, మీతో కోపించుటకు ఈ సంగతులు నేను చెప్పుటలేదు, అలాగయితే నేను వేషధారినే, ఇక్కడే వేదిక మీద పడి దేవునికి నేను ప్రార్ధి౦చవలెను. అయితే ప్రేమనుబట్టి దీనిని నేను చెప్పుచున్నాను. మీరెట్లు వెళ్ళుచున్నారో నాకు తెలియును. నాకు నేను ఇది ఊహించి చెప్పుట లేదు; మీకు "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ఇచ్చుచున్నాను. అది సత్యము. ఆ విషయములలో మిమ్ము ప్రేమించుచున్నాను. దేవుడు మిమ్ము దీవించును.

206ఇప్పుడు మనము వెళ్ళిపోవు ముందుగా ఈ పాటలో మరో వచనము పాడుదము. సాధ్యమైతే ఈ రాత్రికి మీరు మాతో ఉండండి. లేనియెడల తిరిగి మనము కలిసికొనువరకు దేవుడు మీకు తోడైయుండును గాక! దేవుడు మిమ్ము దీవించి, ఆయన దేశములోని అతి శ్రేష్టమైన దానిని మీకియ్యవలెనని ప్రార్ధి౦చుచున్నాను.

యేసు నామమును తీసికొని వెళ్ళుడి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...