ఆ పర్వతము మీది ఆకర్షణ ఏమిటి?
1ఇప్పుడు మనము తలలు వంచుదము. తండ్రియగు దేవా, ఈ రాత్రి మా యథార్థ ప్రార్థన అదే, ఈ దినమున ప్రజలకు నీవు చేయుచున్న సమస్తమును చూస్తున్నాము. అందుకే ప్రభువా నిన్ను మేము అడుగుచున్నాము, నమ్మిక మాత్రముంచునట్లును, అది సత్యమని, కేవలము విశ్వసించునట్లును, వ్రాయబడిన వాక్యమును మా కొరకు ప్రత్యక్షపరచుముచబడెను. వీటిని దయచేయుము తండ్రి.
ఇప్పుడు ఈ రాత్రి, ఈ ఉదయమున లేఖనముల మీద నీవు ప్రసరింపచేసిన వెలుగును బట్టి మేము నీకు వందనములు చెల్లించగోరుచున్నాము. మరియు ప్రభువా, ఈ రాత్రి ప్రార్థనా వరుసలో నీ వాక్యము సత్యమని రుజువు చేయమని ప్రార్థించుచున్నాము
ప్రభువా, దేశమంతటను, పశ్చిమ తీరము వెంబడి, ఆరిజోనాలోని పర్వతము మీదను, టెక్సాస్ లోని మైదానములలోను, తూర్పు తీరప్రాంతములోను, దేశ వ్యాప్తముగా ఆ చిన్న మైక్రోఫోనుల చుట్టూ కూడు కొనిన సంఘములన్నింటి కొరకును, గుంపులన్నింటి కొరకును మేము ప్రార్థన చేయుచున్నాము. కాలమును బట్టి చూచినచో, ఎంతో భేదములో మేమున్నాము, ఎన్నో గంటల తేడా మా మధ్య ఉన్నది, కాని, ప్రభువా, ఈ రాత్రి మేము ఒకే ఐక్యగుంపుగా, విశ్వాసులముగా, కూడికొని, మెస్సీయా యొక్క రాకడ కొరకు కనిపెట్టుచున్నాము. నీ సంఘము నిమిత్తము ఆయనను త్వరగా పంపించుమని, పరమ తండ్రీ, మేము ప్రార్థించుచున్నాము. దీనిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
2మీరు కూర్చోవచ్చును.
ఈ రాత్రి ఇక్కడున్న వారందరికీ క్రైస్తవ వందనములు, మనకు ఊపిరి సలపనంతగా మనందరము క్రిక్కిరిసిపోయి, కట్టకట్టుకొని పోయినట్లున్నందులకు విచారించుచున్నాను. గాలిని అదుపుచేయు యంత్రములున్నవి, వాతావరణమును అనుకూలముగానే చేసియున్నారు. అయినను జనులు చాలా మందియున్నందున వాటి ప్రభావము కనిపించుట లేదు. మామూలుగా ఒక సంఘము నిండా వచ్చిన జనులకయితే, ఆ ఎయిర్ కండిషనర్ లు గడ్డ కట్టుకొని పోవునట్లు చేయును. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ విసనకఱ్ఱను కలిగియున్నారు, గాలి వీసరుకొనుచున్నారు, ఆ ఎయిర్ కండిషనర్ లు శాయశక్తులా గాలిని ఊదుచున్నవి.
వినుచున్న క్రీస్తునందలి మా స్నేహితులందరికీ, తూర్పు తీరము నుండి పశ్చిమ తీరాన ఉన్నవారందరికీ మేము అభివందనములు పంపించుచున్నాము. సాన్-జోస్ లో నున్న వారికి మేము అభినందనలు పంపుచున్నాము. అక్కడ సహోదరుడు బోర్డర్స్ గుంపు ఉన్నది. ఆరిజోనా లోని, ప్రెస్కాట్ వద్ద పర్వతములలో నున్నవారికి మేము అభివందనములు పంపుచున్నాము. అక్కడ సహోదరుడు లీయో మెర్సియర్, ఆయన గుంపు ప్రభువు యొక్క రాకడ కొరకు కనిపెట్టి చూచుచున్నారు. ఈ రాత్రి టుసాన్ లో కూడుకొని, ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురుచూచుచున్న వారికి మేము వందనములు తెలుపుచున్నాము. టెక్సాస్ లోని, హాస్టన్ లో నున్న వారికి, అక్కడ ప్రభువు యొక్క రాకడ కొరకు కనిపెట్టిచూస్తున్న వారికి; షికాగోలో ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురుచూచుచున్న వారికి; తూర్పు తీరాన, స్యూ-యార్కు మరియు కనెక్ట్ కట్, అక్కడున్న గొప్ప గుంపులు, ప్రభుని రాక కొరకు ఎదురు చూస్తున్నవారందరికి, వారిని కూర్చోబెట్టుటకు ఇచ్చట కావలసిన స్థలము లేదు. కాబట్టి టెలిఫోను సాధనము ద్వారా వాక్యమును మనము వారికి పంపించవలసియున్నాము. క్లార్క్స-విల్ లోనున్న సహోదరుడు జూనియర్ జాక్సన్ మరియు ఆయన గుంపునకు ఈ రాత్రి అభివందనములు పంపుచున్నాము. 62లో నున్న సహోదరుడు రడెల్ మరియు ఆయన గుంపు ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుచున్నారు. ఈ రాత్రి స్థానిక సంఘమునకు చెందిన మనము ఈ ఆలయములో కూడికొని, ప్రభుని రాకకై కనిపెట్టుచున్నాము.
DAN 12:10
3మరియు ఇప్పుడు, ఉదయకాలమున జరిగిన ఆరాధనలలో మిలో చాలామంది లేరని అనుకొంటున్నాను. కాని లేనివారందరూ ఆ ["అంత్యకాలమందు అభిషిక్తులు."] టేపును పొందగలరని నేను నమ్ముచున్నాను. "అయ్యలారా, ఇది ఏ సమయం?" [ 62‑1230E] అను వర్తమానము తరువాత సుఘమునకు అతి సూటిగా ఇయ్యబడిన వర్తమానము ఇదేనని ["అంత్యకాలమందు అభిషిక్తులు."] నేను నమ్ముచున్నాను. ఆత్మ యొక్క అభిషేకమును నేను తాకాను, చేప్పినది ఆత్మ నడిపింపును బట్టి పలికినదే. అది సుదీర్ఘమైనది, కాని ఆలాగు ప్రసంగించుటకు నడిపించబడితిని. ప్రభువు తన వాక్యము ద్వారా మనము ఏ ఘడియలో జీవించుచున్నామో చూపించెనని నేను నమ్ముచున్నాను. జరుగుచున్న ఈ మర్మయుక్తమగు సంగతులు అర్థము చేసికొనునట్లు గట్టి నిశ్చయత కలిగియుండుడి. "బుద్ధిమంతులు గ్రహించుదురు," అని బైబిలు చెప్పిన మాట మీరెరుగుదురు.
కాని రాజ్యములు మరియు ప్రజలు బలహీనులుగాను, బుద్ధిమంతులుగాను ఎదుగుదురు. కొద్దిగా ఆలోచించండి, ఇప్పుడు నడివయసులో నున్న సగటు అమెరికను యొక్క వయస్సు ఇరవై సంవత్సరాలు, బలహీనమే కాని జ్ఞానమున్నది. ఆ దినములలో జెట్ విమానములు గాని అణు క్షిపణులు గాని లేవు, కాని వారు ఎంతో ఎక్కువ కాలము జీవించారు. మనము బలహీనులము గాను, బుద్ధిమంతులముగాను అగుచున్నాము. మన స్వంత జ్ఞానమే మనలను నాశనము చేయనైయన్నది, మనలను మనమే నాశనము చేసికొందుము. దేవుడు మనలను నాశనము చేయడు. ఎప్పుడునూ అలాగే జరుగుచున్నది, మరల అదే జరుగనైయున్నది.
4ఇప్పుడు, ప్రభుని చిత్తమైతే, వచ్చే ఆదివారపు ఉదయాన, దేని మీద నేను మాట్లాడుదునో ఇప్పుడు ఎరుగను, గాని ప్రభువును నమ్ముచున్నాను, ఆయన మనలను జీవించనిచ్చినచో, అదే ఆయన చిత్తమైనచో, మరియొక వర్తమానమును వచ్చే ఆదివార ఉదయాన మాట్లాడుటకు గురి కలిగియున్నాము. మరుసటి ఆదివారపు రాత్రి రోగుల కొరకు ప్రార్థించెదము. అప్పుడు నేను పిల్లలను బడిలో చేర్చునట్లుగా కటుంబమును అరిజోనాలోని ఇంటికి తీసికొని వెళ్ళు వంతు నాకు వచ్చును. అప్పుడు మీరు… మీకు తెలియచేయుదుము, మా వీలును బట్టి చెప్పెదము, జరుగనున్న కూటములు, రాబోవు కాలములో చేయువాని గూర్చి… స్థలముల గూర్చి మీకు చెప్పెదము. దేవుడు మిమ్మునందరిని దీవించును గాక.
ఇప్పుడు ఈ రాత్రి ఎరిగియున్నదాని బట్టి… ఆదిలోనే నేను పదిహేను నిమిషములు ఆలస్యము చేశాను. జెఫెర్సన్-విల్ లో ఇప్పుడు పావు-తక్కువ-ఎనిమిది అయినది; ఆ తూర్పు తీరమున పావు-తక్కువ-తొమ్మిది అగును; పశ్చిమ తీరాన సుమారు అయిదు గంటలు అగును, కాబట్టి ఇక్కడ మనము సూర్యాస్తమయ సమయములో ఉన్నాము. ఆత్మ యొక్క అభిషేకమును పొంద ప్రయత్నించుటకు కేవలము కొద్దిపాటి ఆరాధనను నిర్వహించి, మీతో మాట్లాడగోరుచున్నాను, ఆ తదుపరి ప్రార్ధనా వరుసను పిలచుదును.
5ఇక్కడున్న సంఘములోని వారిని అలాగే ఇతర స్థలములలో కూడియున్న సంఘములవారికిని నేను చెప్పగోరునది ఏమనగా, ఆత్మ యొక్క అభిషేకము కలిగియున్న ఒక వ్యక్తిని, ఒక సోదరుని కనుగొనండి. మేము రోగులకు ప్రార్థన చేయనారంభించినప్పుడు, మీ సంఘములో నున్న వారిమీద వెళ్ళి చేతులుంచండి. మరియు గుర్తుంచుకోండి, దేవుడు సర్వాంతర్యామిగా ఆయన ప్రతిచోటను ఉన్నాడు. కాబట్టి టెక్సాస్ లోను, కాలిఫోర్నియాలోను, ఆరిజోనాలోను, ఎక్కడ మీరున్నప్పటికిని, మేము రోగులకు ప్రార్థించనారంభించినప్పుడు, వ్యాధిగ్రస్తులపై చేతులుంచండి. దేవుడు ప్రార్థనను విని జవాబును అనుగ్రహించునని నేను నిశ్చయముగా చెప్పగలను.
వింత సంగతి, గత ఆదివారము రాత్రి అభిషేకము కొనసాగుచున్నది, మరియు పరిశుద్ధాత్మ… అది చాలా గొప్ప సంగతి. ఒకసారి ఇక్కడ నేను ఉన్నప్పుడు తప్ప, నెలల తరబడి వివేచనా పథంలో నేను లేను. ఒక వాగ్ధానము బట్టి నేను అక్కడికి నడిచిపోతున్నాను… ఆయన చేయునని మీరెరుగరు. ఆయన జరిగించునని నీవు చెప్పలేవు. నీవు అక్కడికి నడిచి వెళ్ళి కనిపెట్టవలెను, ఆయన సార్వభౌముడు; అయన తాను చేయగోరునది చేయును. కాని అక్కడ నిలబడి ఆయనేమి చేయునోకనిపెట్టి చూచుట, ఆ తరువాత అది నీ పైన అలాగు విరుచుకుపడుటను అనుభవించుట ఎంతో కష్టమగు సంగతి.
6మరియు కూటాంతమున అది ఎవరో తెలియకుండానే ఆ వరుసలో ఓక పొడుగైన వ్యక్తి బట్టతల కలిగి బహు వ్యాధిగ్రస్తుడుగా నుండుటను చూచాను.
అప్పుడు అక్కడే చివరకు ఇక్కడి వేదిక మీద ఒక మనిషి కనిపించాడు. తల క్రిందికి వంచియున్నాడు, బాదపడుచున్నట్లుగా కనిపించాడు, కడుపుచుట్టూ పట్టుకొనివున్నాడు. అతడే మొదటి వ్యక్తి లేదా రెండో వ్యక్తి, లేదా ఇతనికి ఎప్పుడో ప్రార్థన చేశాను అని తలంచాను. ఎందుకనగా అతడు బట్టతల కలిగియుండి, తల కిందికి వేలాడవేసి యున్నాడు; పెద్దమనిషి, వంగిపోయాడు. కాని నేను చుట్టూ కలియచూచి, అక్కడ కూర్చునియున్న, పెద్ద మనిషిని చూచాను, కాని అతడు సంతోషించుచున్నాడు, "అది ఎక్కడ?" అని నేననుకొన్నాను. అదేక్కడున్నదో నేనింకా తీర్మానించుకోలేకపోయాను. దానిని నేను అనుభవపూర్వకముగా ఎరిగియున్నాను. నా యెదుట అతన్ని చూచుచున్నాను. అది ఈ వైపుకు లాక్కొనిపోతున్నట్లుగా తోచింది. అది వెనుక నుండి వస్తున్నట్లున్నది. నేను సహోదరుడు నెవిల్ మరియు ఇక్కడ కూర్చొని యున్న ఈ ఇద్దరివైపు చూచాను; కాని వారు కారు. "ఆ వ్యక్తి ఆ వెనుకనున్న బాప్తిస్మపు తొట్టె ఉండే గది లోపల ఉన్నాడు," అనుకొన్నాను, అది ఎవరో మీరెరుగుదురా? సహోదరుడు షెఫర్డ్, అతనిని గుర్తించలేకపోవుటకు కారణము ఏమనగా, అతడు తల క్రిందకు దించి ఆ వెనుక కూర్చొని ప్రార్థించుచున్నాడు.
తాను చనిపోవనైయున్నానని అతడు తలంచెను, ఆ విధంగా గత కొద్దివారముల నుండి అనుకొంటున్నాడు. అతని భార్య క్రొత్త మేజోళ్ళు కొనుక్కోమని చెప్పగా, "అవి నాకవసరము లేదు; అంతకాలము నేను ఇక్కడ ఉండను," అని చెప్పాడు.
7ఒక రోజున అతడు నన్ను… సహోదరుడు ఉడ్స్ ఆవరణలో కలిసికొన్నప్పుడు గట్టిగా అరచుచూ దేవుని స్తుతించాడు. ఇట్లన్నాడు, "నేను బేకన్, గ్రుడ్లు, టమాటాలు, కోరిన ప్రతిది తింటున్నాను."
వినయముగా తన సీటును విడిచిపెట్టి మార్గమునకు ఆవల వెనుకకు వెళ్ళిపోయి ప్రార్థించుచున్నాడు. చూడండి, మీకు ప్రార్థన కార్డు అవసరము లేదు. విశ్వాసము మాత్రమే నీకు కావలెను, చూశారా. మీరు స్వస్థపడియున్నారో లేదో ఇప్పుడు నాకు తెలియదు, నేను కేవలము ఇట్లు చెప్పాను, "ఒక వ్యక్తి ప్రార్థించుచున్నాడు. ఏదో అస్వస్థత కలిగియున్నాడు.'' అదేమిటో నేను ఈలాగు చెప్పాననుకొంటాను, "కడుపు వ్యాధి, మరియు ఇక్కడే వెనుక నుండి ప్రార్ధించుచున్నాడు. ప్రభువైన యేసు నిన్ను బాగుచేయును." ఇపుడు నేను చెప్పకలిగినదంతా అదే. అతడు ప్రార్ధన చేయుచున్నాడని మాత్రమే నేను చెప్పగలను. అతడు ప్రార్ధన చేయుచున్నాడు అనునదియే ఈడ్పు. దానిని నేను చూడగలను, కాని ఏమి జరుగునో నాకు తెలియదు, చూచారా.
కాని అది తిరిగి వచ్చుటను నీవు చూచినప్పుడు, అందరూ తెలిసికొందురు, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పబడినప్పుడు, అది మాట్లాడునది ఇక ఎంత మాత్రము నేను కాదు; అది ఆయనే.
ISA 53:5
8యేసుక్రీస్తు నిన్ను బాగు చేసియున్నాడు," అని మాత్రము నేను ఎల్లప్పుడు చెప్పుచుందును. అది అక్షరాలా నిజం. "మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దేబ్బల వలన మనకు స్వస్థత కలిగియున్నది," చూడండి, చూచారా.
కాని అది వచ్చినప్పుడు, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," మరియు ఏమి చేయవలేనో, ఏమి జరుగనైయున్నదో నీకు చెప్పును. దానిని గమనించినప్పుడు అది అలాగే జరుగుచుండును.
కాని నేను, "యేసుక్రీస్తు నిన్ను బాగుచేసి శుద్ధిపరచును," అని చెప్పినప్పుడు దానిని నీవు నమ్ముము, ఎందుకనగా ఎప్పుడో ఆయన దానిని చెప్పెను. ఆయన చెప్పిన దానిని నేను కేవలము తిరిగి చెప్పుచున్నాను.
దర్శనమనునది ఆయన చూపించిన దానిని తిరిగి చెప్పుటయే. మీకు అర్థమైనదా?
9ఇప్పుడు మనము త్వరపడి తిన్నగా వాక్యములోనికి వెళ్ళుదము, ఎందుకనగా ఇక్కడ ఉన్న మిలో అనేకమంది ఈ రాత్రికి ఎన్నో మైళ్ళు తిరిగి ప్రయాణము చేయవలసియుందురు, మార్గములలో దేవుడు మిమ్మును దీవించి సహాయము చేసి, భద్రపరచును గాక అని నా ప్రార్థన. ఈ రాత్రి నేను పరిశుద్ధ మత్తయి 21 అధ్యాయము 1 నుండి 11 వచనములు చూడవలెనని కోరుచున్నాను. ఇప్పుడు, మీ యొద్ద బైబిలు లేనిచో, లేదా వాక్యములను వ్రాసికో గోరినచో, మంచిది.
10ఈ ఉదయాపు వర్తమానమును విననివారు, మీ యొద్ద టేవు రికార్డులున్నచో, టేపులు లభించును. కాని ఎన్నడూ మేము వాటిని గాని, మరి వేటిని అమ్మము. కొన్నిసార్లు పెద్ద కూటములలో వెనుక కొన్ని పుస్తకములు ఉన్నాయని ప్రకటన చేయుచుందురు; వాటి నుండి మేము ఏమియు పొందుట లేదు; సహోదరుడు వైల్ వాటి గ్రంథకర్త. ఆ టేపులు… ఆ టేపు వ్యవహారమును చూచు వ్యక్తి మీకు వాటి గూర్చి చెప్పను. మేము టేపుల వలన ఎట్టి డబ్బు సంపాదించగోరుట లేదు. అవి "టేపులు" అని మేము అనుకొనుట లేదు; అది వర్తమానము. ఒక వ్యక్తి మనసులోనికి డబ్బు అను తలంపు చొరబడినప్పుడు, ఇక మీదట ఏ టేపులు తయారు చేయజాలడు. అది నిజము. దాని గూర్చి నేను అడుగుచున్నాను; మా టేపులు అయిదు డాలర్లకంటే తక్కువకు, లేదా మూడు నుండి అయిదు లేక ఆ షుమారుగా అమ్మబడుచున్నవని తలంచుచున్నాను. ఏమిటి చెప్పండి? ఆ పెద్ద, పొడవైన టేపులు మూడు. నాలుగా?
ఒక ఫలనా సేవకుని… అతని టేపుల్లో ఒకదాని గూర్చి అడిగాను, మరియు సుమారు ఇరవై లేక ముప్పది నిమిషాల వర్తమానమున్నది, తొమ్మిది డాలర్లు అని చెప్పెను.
11వారు బయటకు అమ్మివేయుచున్న ఆ టేపులు దాని వలన ఆ వెనుకనున్న సహోదరుడు సాద్మన్ ధనికుడు ఆగుటలేదు. చూడండి, వారు దాన్ని నడిపించకలిగినంతకే విక్రయించుచున్నారు. అసలు ఏదీ లేకుండా చేయమని వారిని మనము అడుగలేము, ఎందుకనగా వారు టేపులు తదితరములు కొనాలి, యంత్ర సామాగ్రి ఎంతో ఖరీదైనది. ప్రారంభములో ఆ టేపుల నిర్వహణ కొరకు పదివేల డాలర్లు ఖర్చు చేయుట జరిగెను.
ఇప్పుడు, నాకు వెంటనే అర్థమయినది…. వారింకా దానిని ప్రకటన చేయలేదు, అయితే తిరిగి టేపును వినుట ఒకటున్నది. ప్రతిసారి నేను… ట్రస్టీలు, దానితో నాకే సంబంధములేదు. నాకు అసలు… ఏ ఒక్క కూటములోను ఎన్నడూ లేను. అనుకూల లేక ప్రతికూలములు ఏమీ లేవు వారు తమ వంతుల చొప్పున పని చేతురు; తరువాత టేపు ఎవరు చేయవలెనో ట్రస్టీలు తీర్మానించుదురు. అతనికి వారు ఒక ఉత్తరము పంపించెదరు. దాని గూర్చి నాకు తెలిసిందంతా అదే. వారు దానిని గూర్చి శ్రద్ధ వహింతురు, ఎందుకనగా నేను కనీసము పిల్లలను ప్రతిష్ఠ కూడా చేయలేక పోవుచున్నాను, టేపుల గూర్చి శ్రద్ద టేపులే వహించనిమ్ము, కావున… లేక బాప్తిస్మము.
MATT 21:1-11
12కనుక నేను నా మనస్సును వర్తమానము పైనే ఉంచాను. అది మూడవ ఈడ్పు, దానికే నేను లోబడి గౌరవము చూపవలసియున్నాను.
మత్తయి 21:1 నుండి 11. వాక్యమును తీసికొనుటకు వీలుగా… లేదా చూచుటకు వీలుగా దానిని మీకు నేను చెప్పియున్నాను:
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి; వెళ్ళగానే కట్టబడియున్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి.
ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల, అవి ప్రభువుకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను.
ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా
ఇదిగో నీ రాజ సాత్వికుడై, గాడిదను, భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి, నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
శిష్యులు వెళ్ళి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి,
ఆ గాడిద, దాని పిల్లను తోలుకొని వచ్చి, వాటిమీద తమ బట్టలు వేయగా, ఆయన బట్టల మీద కూర్చుండెను.
జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్ల కొమ్మలు నరికి దారిపొడగున పరచిరి.
జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును - దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి.
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను.
జనసమూహము - ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
ఇప్పుడు, ప్రార్థన పరుస ప్రారంభమగు ముందుగా, షుమారు ముప్పది నిమిషముల పాటు మాట్లాడుట కొరకు ఒక అంశమును నేను తీసికొందును. ఇట్టి ఒక అంశమును నేను తీసికొనగోరుచున్నాను: "ఆ పర్వతము మీది ఆకర్షణ ఏమిటి?"
13అది చాలా అలసటతో, ఉద్రిక్తతతో కూడిన దినము. అది ఒక అసాధారణ దినము. ఇక్కడ యేసు పస్కా పండుగకు హజరగుటకు సిద్ధపడి యెరూషలేమునకు వచ్చుటను మనము కనుగొందుము. పస్కా అనగా పస్కా బలి గొర్రెపిల్లను వధించు దినము. జనుల యొక్క పాపపరిహారార్ధమై రక్తము కరుణా పీఠము మిద చల్లబడును. ఆయన బేత్పగే నుండి రావలసియుండెను. ఒలీవ కొండ పై భాగమునకు వచ్చెను. అక్కడ నుండి క్రిందికి చూచినప్పుడు, మరియొక చిన్న కొండ మీద కట్టబడిన యెరూషలేము కనబడును. ఆయన చూచుచుండగా, ఇదే ఆయన చివరి సందర్శనము అని ఆయన ఎరుగును.
పాపుల చేతులకు ఆయన అప్పగింపబడు సమయము ఇదే, వారు ఆయనను చంపెదరు. ఒక మానవ మాత్రుడు ఇంతకు ముందెన్నడూ చనిపోని ఒక భయంకరమగు మరణమునకు ఆయన గురికావలసి యుండెను, తదుపరి సమాధి చేయబడవలయును. ఆయన తన స్వకీయుల వల్లనే, ఆయనతో పాటు నిలబడియున్న కొందరి వలననే అప్పగింపబడవలసియుండెను. ఆయన దేవుడైయుండి, వారి హృదయములలో నున్న దానిని ఎరిగియుండెను. ఎవరు ఆయనను అప్పగించుదురో, ఆది నుండియు ఆయన ఎరిగియుండెను, తన ప్రక్కన కూర్చొని డబ్బులెక్క పెట్టుచూ, ఇంకా ఏవేవో పనులు చేయుచూ, తనతో నుండిన వ్యక్తియే తనను అప్పగించునని ఆయన ఎరిగియుండెను. ఆ బయట క్రూరమగు రోమా సిలువ. తన కొరకు ఎదురు చూస్తున్నదని ఆయన ఎరిగియుండెను. తన శరీరములోని నీరు మరియు రక్తము వేరగునని ఆయన ఎరిగియుండెను. తన నుదుటి నుండి చెమట వలె రక్తము పెద్ద బిందువులు కారునని ఆయనకు తెలుసు. ఆయనకు తన ముందున్నదంతయూ తెలియును. ఆయన యెరూషలేము వైపు చూస్తూ, ఆ కొండ మీద నిలబడియుండెను.
JOHN 1:11
14ఆ నాటి జనులు — ఆ దినమును వారేమని పిలిచారు, ఒక మంచి మత వర్గపు జనులు — ఆయనను అసహ్యించుకొనిరి. ఆనాటి సంఘములు ఆయనను అసహ్యించుకొన్నవి, నిందించినవి, ఆయన బోధ విన్నవారందరిని వెలివేసినవి. వారు ఆయన కూటములకు గాని వెళ్ళి హాజరయినచో, సంఘము యొక్క సహవాసము నుండి వెంటనే వారిని బహిష్కరించెడివారు. అందుకే వాక్యము ఈలాగు చెప్పుటలో ఆశ్చర్యములేదు, "ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని, ఆయన స్వకీయులే ఆయనను చేర్చుకొనలేదు." ఆయనను ప్రేమించవలసినవారు, ఆయన పక్షమున నిలబడవలసిన వారు, ఆయనకు బద్ద శత్రువులు, విరోధులైరి.
MATT 10:3•
ACTS 4:13
15ఆయన తన చిన్న గుంపును పేదవారు, జాలరులు, సుంకపు గుత్త దారులు, విద్యలేని వారిలో నుండి తయారు చేసెను. అందులో కొందరు ఏమీ తెలియని వారు, పామరులు అని కూడా బైబిలు చెప్పుచున్నది. కొందరు తను సంతకమును కూడా చేయుట రాని వారు. ఆయన తన గుంపును తయారు చేసికొనుటకు ఎన్నడూ సంఘములలోనికి వెళ్ళలేదు.
ఏ సంఘ నాయకులతోను ఆయన ఎన్నడూ సమ్మతించలేదు. అంతే కాకుండా ఆయన ఒక ప్రవక్త యొక్క ధోరణిని అవలంబించెను. ఆయనకు ముందుండిన వారివలెనే, వారు చేయుచున్న ప్రతిదానిని ఆయన ఖండించేను; ఎందుకనగా వారు వాక్యములో ఒక భాగమైయున్నారు. ఆయన వాక్యము యొక్క సంపూర్ణత అయి యుండెను.
LUKE 10:40-42
16కాని దాని అంతటి మధ్యను, మునుపుండిన లేక ఉండబోవు ప్రతి యుగము మరియు ప్రతీ ప్రవక్త ద్వారా ప్రత్యేకించబడిన కొందరు జనులు ఆ వర్తమానమును వినుటకు ముందుగా నిర్ణయించబడుదురు. వారు దానిని వెంబడించుదురు. వారు జనులను అలక్ష్యము చేయుదురు. వారైతే ఆవిశ్వాసి యొక్క విమర్శను అలక్ష్యము చేయుదురు. వారు వారికి వారితో ఎట్టి వివాదము లేదు. వారికి చేయుటకు ఒక్క పని యున్నది. అదేమనగా, దానిలోని ప్రతి చిన్న దానిని విశ్వసించి, పొంది, యేసు పాదముల యొద్ద కూర్చొనిన మరియవలే అందులో మునిగిపోయి యుండుటయే వారి పని.
మార్త ఆయననకు భోజనము సిద్ధపరచుచుండెను. యేసు ఆమెతో ఇట్లు చేప్పెను, "మార్తా, నీవు ఈ జీవన సంబంధమగు సంగతుల గూర్చి ఎంతో చింత కలిగియునావు, కాని మరియ ఉత్తమమైనవాటిని వెదకినది." నిత్యజీవ సంగతులను చూడండి.
17ఇప్పుడు, మనము చాలామంది ప్రజలు అర్థము చేసికొనుటను కనుగొనుచున్నాము… నేడు మనకున్నంత సాహిత్యము ఆనాటి వారికి లేదు, ఆ దినములలో టెలివిజను కాని, టెలిఫోనులు కాని మరేమి వారికిలేవు, అయితే ఆయన పస్కాకు వచ్చుచున్నాడని ఏలాగో ప్రాంతమంతా వార్త వ్యాపించినది. చాలామంది ప్రజలు ఆత్మసంబంధమగు మనస్సు గలవారై యుండి, ఆ పస్కా గొర్రెపిల్ల ఆయనే అని ఎరిగియుండిరి, ఎందుకనగా ఆయన అప్పటికే సంభవించనైయున్న సంగతులను గూర్చి చెప్పియుండెను.
18ఆయన అక్కడుండునని ఎరిగియుండి, వారు తమ పద్దతిలో ఆయనను ప్రేమించి, ఆయన కొరకు ఎదురు చూచుచుండిరి. జనులు త్రోసుకొంటూ, ఒకరినొకరు ఆ మార్గ ప్రవేశమందు నిలబడ ఆరాటపడుతూ, అన్ని త్రోవలలో కనిపెట్టి చూస్తున్నారు, ఎందుకనగా ఏదో ఒక గంటలో ఆయన కనపడవచ్చునని వారికి తెలియును. వారు ఎదురు చూచుచుండిరి.
ద్వారము నుండి ద్వారమునకు పరుగెత్తుచున్న ఈ మనష్యులను చూచి, తక్కిన వారు, ఈ ప్రజల సంగతి ఏమిటి, "అకర్షణ ఏమిటి?'' అని ఆశ్చర్యపోవుచుండిరి.
దానిని కనుగొనుటకు వారు ఇటువైపు అటువైపు చూచుచున్నారు. వారు దేనికొరకో చూచుచున్నట్లు కనబడిరి. ఏదో జరుగనైయున్నదన్న ఆతృతతో ఉన్నారు.
నేను కొద్ది నిమిషములు నా అంశమును మార్చి, ఓ, ఈనాడు సంగతి ఏమిటి? అను దానిగూర్చి చెప్పుటకు ఎంతో ఇష్టపడుచున్నాను. ఆయన వచ్చునని ఎదురుచూచునున్న ప్రజలు గొప్ప ఆతృత మరియు ఆశతో ఉన్నారు. ఆ వత్తిడిని మనము తాకి చూడగలము. వారు వెదకుచూ ప్రతి కదలికను కినిపెట్టుచూ, ప్రతి సూచనను గమనించుచూ వానిని లేఖనములతో పోల్చిచూస్తున్నారు.
19ఆయనను గూర్చి ప్రవచింపబడిన సంగతులన్నియూ చివరి వరకు జరుగుట చూచి అంతము సమీపములోని యున్నదని వారు ఎరిగియున్నారు. వారు అక్కడ ఉండగోరుచున్నారు, అందుకే కనిపెట్టి చూస్తున్నారు. జన సందోహములో అల్ప సంఖ్యాక భాగము ఆయనకు చెందినవారు. కొందరు ఆయనకు వ్యతిరేకులు. వారిలో చాలామంది, నూటికి-తొంబై-మంది ఆయనకు విరోధముగా యుండిరి.
ఈనాడు మత గుంపులలో కూడా పరిస్థితి దాదాపు అలాగే యున్నది. నిజంగా వాక్యము మరియు క్రీస్తును వచ్చినప్పుడు దానిని నమ్మువారు షుమారుగా నూటికి-ఒకవంతు-మంది మాత్రమే ఉందురు. తక్కిన భాగము వారు దానికి ఎట్టి స్పందన చూపించరు. ఏమి జరిగినా గాని, వారికి లెక్క లేదు; వారు దానిగూర్చి ఒక విధమగు హాస్యోక్తియో లేక చలోక్తి యో చెప్పి దాటిపోదురు. అదే విధముగా ఉన్నది. కాలమును సంగతులు ఎక్కువగా మారవు; చరిత్ర దానంతట అది తిరిగి పునరావృతమగుచుండును.
20అది ఒక ఉద్రిక్తమగు ఒత్తిడి కలుగచేసినదని మనము కనుగొనుచున్నాము. అది అలాగే ఉండవలసియున్నది; తప్పక అది ఆలాగు చేయును. ఆయన అక్కడికి వచ్చినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారు ఆశ్చర్యపడచూ కనిపెట్టి చూస్తున్నారు. ఆయన చేయునది ఏదైనా గాని, దానిని పొందుటకు వారు అక్కడ ఉండగోరుచున్నారు, దానిని వారు కోరుచున్నారు. దానిని వారు చూడగోరుచున్నారు. వారాయనను విశ్వసించిరి. తక్కిన వారయితే ఆయన అక్కడకు వచ్చుచున్నారని విని, ఆయనను అపహాస్యము చేయుటకు అక్కడికి వెళ్ళారు. అలాగున ఆ ఉద్రిక్త ఆతృత అంతటి తరువాత, ఒక అసాధారణ దినము, చాలా అసాధారణ సమయము, సంఘములు నిద్రపోతున్నవి, ప్రజల నాడి ఉద్వేగపు అంచున ఉన్నది, ఆక్కడ చాలా మంది ప్రజలున్నారు, మరియు అప్పుడు అది జరిగినది.
MATT 21:8,9•
MARK 11:7-9•
JOHN 12:13-15
21ఒలీవ పర్వత శిఖరము పైనుండి తెల్లని గాడిద వచ్చుచున్నది. కొండ దిగువగా నడిచి వస్తున్నది, జనుల గుంపు ఒకటి పిచ్చిగా కేకలు వేయుచున్నారు, చెట్ల నుండి ఖర్జూర ఆకులు పీకివేయుచున్నారు. తన వస్త్రములను రోడ్డు మీదికి విసిరి వేయుచున్నారు, "ప్రభువు పేరట వచ్చుచున్న దావీదు కుమారునికి హోసన్నా," అని కేకలు వేయుచున్నారు. ఈ చిన్న గాడిద పిల్లమీద స్వారీచేయుచున్నవాడు ఆ ఘడియకు దేవునిచే అభిషేకించబడిన మెస్సీయా తప్ప మరెవరూ కాదు.
దేవుడు అప్పుడు ఏమి చేయుచుండెను? ఆ కొండమీది ఆకర్షణ ఏమిటి? దేవుడు చరిత్ర సృష్టించుచున్నాడు, ప్రవచనమును దేవుడు నెరవేర్చుచున్నాడు. అది ఎల్లప్పుడూ ఒక ఆకర్షణకు కారణము అగును. విమర్శకులందరిని అది రేపును, ఆ రాబందులు (ఈ ఉదయపు వర్తమానము యొక్క) పక్షిరాజులు కూడా ఉన్నవి, చూచారా. ఏమి జరుగుచున్నదో పరికించుటకు వారు కూడి వచ్చుచున్నారు. కొందరు వింతను చూడగోరు ఆసక్తితో వచ్చుచున్నారు. కొందరు తప్పులు పట్టుకొనుటకు వచ్చుచున్నారు. కొందరు విమర్శించుటకు వచ్చుచున్నారు. అన్ని రకముల వారు అక్కడకు కూడి వచ్చారు. ఈ ఉదయాన మనము చెప్పిన రీతిగానే: విశ్వాసులు, నటించు-విశ్వాసులు, మరియు అవిశ్వాసులు. ఆ కొండ పైన ఏమున్నది? ప్రవచనము నెరవేరుచూ యున్నది, ఏమీ జరుగనైయున్నదో ఇప్పుడు మనందరము చూతుము.
ZECH 9:9•
MATT 15:6•
MARK 7:13
22ఇపుడు, జెకర్యా గ్రంధము 9 అధ్యాయము 9 వచనము. ఆత్మావేశుడైన ప్రవక్తలలో ఒకడగు జెకర్యా ఈలాగు పలికెను:
ఓ, సీయోను కుమార్తెలారా సంతోషించుడి; యెరూషలేము కుమార్తెలారా ఉల్లసించుడి; ఇదిగో, నీ రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు: ఆయన నీతిమంతుడు, రక్షణ కలుగచేయువాడు; దీనుడై గాడిద మీదను, గాడిద పిల్లమీదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.
ఇప్పుడు, ఆ శాస్త్రుల సంగతి ఏమిటి? ఆ యాజకుల సంగతి ఏమిటి? ఆ మత నిష్టగల జనుల సంగతి ఏమిటి? ఒక రుజువు చేయబడిన ప్రవక్త ద్వారా అది జరుగుటకు నాలుగు-వందల-ఎనభై-ఏడు సంవత్సరములకు ముందే ఇది వ్రాయబడినది. ఎప్పుడో వ్రాతలో పెట్టబడి పాత నిబంధన చుట్టలలో ఉండి బైబిలులో ఇమడ్చబడినది. ఆ ప్రవచనము నెరవేరుటను ఎందుకు వారు చూడలేకపోయిరి? ఈనాడు వారు దానిని చూడకపోవుటకు కూడా అదే కారణము. వారు దేవుని వాక్యమును తీసికొని ప్రజలలో దానిని నిరర్థకము చేసిరి. హితబోధకు బోధలకు బదులుగా మానవ ఆచారములు బోధించిరి.
శాస్త్రులు, బోధకులు, యాజకులు, ఆత్మీయ సంబంధులు (ఆలాగు పిలువబడినవారు) అభిషక్తులు, కేవలము బైబిలు చదివి యుండినచో జరుగుచున్న దానిని చూచి వారు ఆశ్చర్యపడియుండెడివారు కారు, అదేమిటో వారెరుగుదురు: దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు.
MATT 23:37•
LUKE 13:34
23చరిత్ర నెలకొల్పబడినది; ప్రవచనము నెరవేరుచున్నది. లోకమునకు రక్షణ వచ్చుచున్నది. ప్రవచనములన్నియు ఎదురుచూచిన మహాదినము! సమాధులలో ఉన్నవారందరూ ఆ దినము కొరకు (అది నిజము, దాని గూర్చి ఆలోచించండి!) కనిపెట్టి చూచుచున్నారు. చనిపోయినవారందరూ, హతసాక్షుల రక్తము యొక్క నీతిమంతులందరూ, మరియు ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నారు.
అప్పుడే ఆయన ఈలాగు కేకవేసెను, "యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదాన, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి! అయితే ఇప్పుడు నీ ఘడియ వచ్చియున్నది."
GEN 3:15
24సమాధిలో నున్న ప్రతి వారు — అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలందరూ ఈ ఘడియ కొరకు ఎదురు చూస్తున్నారు.
కాని, సంఘము దానిని చూచుటలో గ్రుడ్డిదయినది. "ఇంత అల్లరికి కారణమగు వీడెవడు? వడ్రంగి వాని కుమారుడని ఒకసారి ఎవని గూర్చి చెప్పారో, వాడు ఇక్కడకు వచ్చాడా? మేమతనిని ఎరుగుదుము? ఈ పాండిత్యము ఎక్కడ నుండి ఇతనికి వచ్చినది? మా పాఠశాలల్లో దేనిలోను ఇతనికి సంబంధమున్నట్లు మేము కనుగోలేదే? ఏ గ్రంథమును చదివి నేర్చుకొన్నట్లుగా మాకు తెలియదే? ఎవడితడు?"
ప్రవక్త యొక్క ప్రవచనమునకు ఇతడు జవాబు. ఇక్కడ ఆయన ఒక గాడిద పిల్ల ఎక్కి వచ్చుచున్నాడు. ఎట్టి ఆకర్షణ! దేవుడు తన వాగ్దాన వాక్యమును నెరవేర్చుచున్నాడు. నాలుగు వేల సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్న ఘడియ అది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ముందుగానే దీనిని చెప్పెను, "స్త్రీ యొక్క సంతానము సర్పము యొక్క తలను చితుక ద్రొక్కును, కాని అతని తల అయన మడిమను కరచును," బైబిలులోని ఆ ప్రవచనము ఈయన రాకనే ముందుగా చెప్పినది.
ZECH 9:9
25ఇక్కడ ఆ మధ్యనే ఒక ప్రవక్త లేచి వారి మధ్య నిలచెను, అతడు రుజువు చేయబడిన ప్రవక్త, జెకర్యా, అతడిట్లు చెప్పెను, "యెరూషలేము కుమార్తెలారా, సీయోను కుమార్తెలారా, సంతోషించి, ఉల్లసించి, ఉత్సహించుడి, ఏలయనగా మీ రాజు దీనుడై సాత్వికుడై అణకువగలవాడై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు."
ప్రతి రోజు లేఖనము చదువుచున్న ఆ ప్రజలు ఇక్కడ ఆయన స్వారీ చేయుచూ వచ్చుట చూచి, "ఈయనెవరు?" అని కేకలు వేసిరి. చూచారా, అది ఏమైయుండెనో తెలిసికొనవలెనని దేవుడు ప్రజలకు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు గాని, దానిని వారు ఎరుగరు.
దేవుడు తన వాక్యమును నెరవేర్చునప్పుడు, ఎల్లపుడూ అది ఒక అకర్షణకు కారణమగును, ఎప్పుడూ అంతే. ఒక ఆకర్షణకు హేతువగును, ఎందుకనగా అది అసాధారణము. ఆధునిక దినపు పోకడకు ఆయన తన వాక్యమును నెరవేర్చినప్పుడు, ఎంతో అసాధారణముగా గోచరించును, ఎందుకనగా ఆధునిక దినపు ధోరణి దానిని విశ్వసించలేదు. వారికి తమ స్వంత మార్గమున్నది.
MATT 21:9•
MATT 24:35•
MARK 11:9•
MARK 13:31•
LUKE 21:33•
JOHN 12:13
26ఇప్పుడు, మనము చూతుము… వాక్యములోనికి తిరిగి వెళ్ళి కొన్ని అసాధారణ సంభవములను తీసికొని కొద్ది నిమిషములపాటు దేవుడు తన ప్రవచనమును నెరవేర్చుటను చూద్దాం. దేవుడు ఏదైనా చెప్పినచో దానిని ఆయన చేయును. భూమ్యాకాశములు నశించిపోవును గాని ఆ వాక్యము ఎన్నడూ గతించదు. కనుక అది సాధారణముగా ఒక రంగమును, ఒక అసామాన్య రంగమును సృష్టించును.
దేవుని వాక్యమును నమ్మవలసియున్న జనులకే అది ఎంత అవహేళనగా ఉన్నదో గమనించండి. వారికి అది ఎంత అసాధారణముగా ఉన్నది. అంటే వారు, "ఏమిటిది?" అని అడిగే స్థితికి వచ్చిరి. దానిని నీవు ఎక్కడ సంపాదించావు? ఈతడెవరు?" ప్రభువు నామము పేరట వచ్చువానికి హూసన్నా," అని వారు కేకలు వేయుచుండిరి. అయితే అక్కడ ఒక చిన్న గుంపు మాత్రమే దానిని చేయుచున్నారు, కేవలము చిన్న గుంపు. నాలుగువేల సంవత్సరముల యొక్క ప్రవచనము, ఆ దేశములో ఎన్నడూ జరుగనంతటి గొప్ప సంగతి, ఎందుకనగా మృతుల యొక్క నిరీక్షణ అంతయూ, భవిష్యత్ అంతయూ అందులో దాగియున్నది. దానిని నమ్ముచున్నామని చెప్పుకొనుచున్న మతనిష్ఠ కల జనులందరూ "ఏమిటది? ఏమిటి ఈ ఆకర్షణ?" అని కేకలు వేయుచున్నారు. ఏదో అసామాన్యమైనది! అది అంతే, అది ఏమీ మారదు, ఇప్పుడును అసామాన్యము.
27నేనిప్పుడు చెప్పినట్లుగా కొన్నిఅసాధారణ సంగతులను మనము చూద్దాం. తీర్పు లోకమును తాకి, నీటి ద్వారా అది నాశనము కాబడకముందు ఆకర్షణ ఏమిటి? ఒక ముసలివాడు, షుమారు నూట-ఇరవై సంవత్సరాల వృద్దుడు, తేలచేయుటకు నీరు అనేది లేనప్పుడు, ఒక ఓడను నిర్మించుచున్నాడు. కొన్ని సంవత్సరములు అక్కడ నిలబడి, ద్వారము దగ్గర ఉండి, లోపలి భాగమును నిర్మించుచూ బయట వేలుపట దానికి కీలు పూయుచూ, "లోకము నీటి ద్వారా ముంచివేయబడునని," ఆ గొప్ప శాస్త్రీయ యుగములో చెప్పుచున్నాడు.
"ఆ కొండమీది ధ్వని ఏమిటి?" "నోవహు అను పేరుగల వాడు అక్కడ పైన ఉన్నాడు. ఒక ముసలి ఛాందసుడు. ఆ ముసలివాడుఎప్పటి నుండియో ఎండలో నిలబడి యున్నందున, వడదెబ్బ కొట్టినది. ఆతనికి మతి పోయింది. "ఓడ" అను పిలువబడే దానిని ఒకదానిని నిర్మించుచున్నాడు. నీరు అనేది లేని చోటనుండి నిరు పడునని చెప్పుచున్నాడు. మనుష్యులందరిని అది ముంచివేయుననియు, అతని వర్తమానమును విననివారందరిని మరియు ఆ ఓడలోనికి రానివారందరిని అది ముంచివేయుననియు చెప్పుచున్నాడు. అట్టిసంగతి నీవు ఎప్పుడైనా విన్నావా?" అది ఒక అసాధారణ ఆకర్షణ.
28నేను ఉహించుచున్నాను, ప్రజలు బాగా నవ్వవలెనని అనుకొన్నప్పుడు, వెళ్ళి ఓడ తలుపు దగ్గర కూర్చొని నవ్వుచుండిరి. "వర్షము పడునని నీవు చెప్పి వందసంవత్సరాలు గడిచిపోయాయే? వర్షము వచ్చునని నీవు చెప్పుట మా తాత విన్నాడట గదా? ఇంకా నీవు ఆ కర్ర ముక్కను పట్టుకొని చేక్కుచునే యున్నావు. నీ ప్రక్క నున్నదానిని నీవెందుకు పొంద కూడదు?"
కాని అది, దేవుడు ఒక వాగ్దానమును స్థిరపరచుటకు, తన ప్రవక్త చెప్పిన ప్రవచనమును నెరవేర్చుటకు సిద్ధపడుతున్న కాలము. చాలా అసాధారణము! ఇతరులు నవ్వుచుండగా, దేవుడు నోవహుకు తన వాగ్దానమును నెరవేర్చుచున్నాడు. ఇతరులకు చూపించుటకు ఆయన తన మాటకు కట్టుబడి యుండునని నేటివరకు కూడా చూపించుటకు ఒక చరిత్రను సృష్టించుటలో సిద్దపడుచున్నాడు. అదెంత అవాస్తవముగా కనిపించినా గాని, ఎంత అకారణముగా కనిపించినా గాని, ఆయన తన మాటను నెరవేర్చును. ఈ రాత్రి ఈ అమెరికాలోనున్న జనులకు, ప్రపంచమంతటనున్న ప్రజలకు ఒక ఉదాహరణ చూపించుటకు ఆయన ఆ ముసలివాని చెక్కడము ద్వారా ఓడ నిర్మించెను, సైన్సు ఏమి చెప్పునో మనకు అక్కర్లేదు. వారేమి చెప్పినా గాని ఇది, అది, లేదా మరేదో ఆయన తన మాటను నెరవేర్చును. ఆయన చరిత్ర సృష్టించుచున్నాడు.
GEN 15:13•
EXOD 3:3,4
29ఒక రోజున ఆకర్షణ ఏమిటి… ఒక అసాధారణమగునది ఆ వెనుక ఆరణ్యములో సంభవించెను, ఒక పొద మండుచున్నది. ఒక పారిపోవుచున్న ప్రవక్త అరణ్యములో నిలబడియున్నాడు. అతడు ఎన్నడూ ఏ స్వరమును వినలేదు. ఎన్నడూ అతడు ఏ శబ్దమును వినలేదు, కాని అతడు ఆ కొండ పై భాగాన ఒక అసామాన్యమగు విషయమును చూచెను. అతని యొక్క దృష్టిని దేవుడు ఆకర్షించే ప్రయత్నించుచున్నాడు. ఈనాడును ఆలాగే యున్నది!
తన ప్రవక్తయగు అబ్రహాము ద్వారా దేవుడు తన వాక్యమును నేరవేర్చుటకు సిద్ధపడుతున్నాడు: "నీ సంతానము ఒక క్రొత్త దేశములో నాలుగు వందల సంవత్సరములు యాత్ర చేయును. బలిష్టమగు హస్తము ద్వారా నేను వారిని బయటకు రప్పించుదును."
విశ్వసించు వారందరికొరకు ఓడను ఒక సురక్షిత స్థలముగా ఆయన సిద్దపాటు చేసినట్లుగానే పనికొరకు ఆయన ఒక మానవుని సిద్దపాటు చేయుచుండెను. దేవుడు ఈ పొదను మండునట్లు చేసెను. ఈ గొర్రెలు మేపు మోషే ఇట్లు అనుకొనెను, "ఈ వింత ఏమిటో చూడ వెళ్ళెదను." ఆయన మోషేను పొద దగ్గరకు రప్పించి అతనితో మాట్లాడెను.
EXOD 7:10•
EXOD 14:21,22
30ఆ తరువాత ఈ గొర్రెలు మేపువాడు పిలాతు భవనములో కర్రను విసరగా, అది సర్పముగా మారినప్పుడు, అకర్షణ ఎట్టి రీతీగా ఉండెను? మోషేకు దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుచుండెను. ఆకాశముల నుండి ఒక బలమగు గాలి వీచి, ఎర్ర సముద్రమును కుడి ఎడమలుగా విడదీసినప్పుడు వారు చూచి, ఫరో గుర్రములు ఆశ్చర్యము చెందినప్పుడు, ఆ ఎర్ర సముద్రము వద్ద కలిగిన ఆకర్షణ ఏమిటి? ఒక పేద గుంపు అయిన ఆ బానిసలు దేవుని యొక్క వీధిలో నడుచుచున్నారు. ఆ ఎండిన భూమి మీద వారు నడిచారు. ఏమిటది? దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు. చచ్చిన స్థితి పోయినది, సజీవమగు జనులు అడ్డంగా నడిచి వెళ్ళారు; ఆత్మీయంగా మరణించిన ఆ ప్రజలు దానిని అనుకరించగోరిరి, మునిగిపోయిరి. దేవుడు ప్రవచనమును నెరవేర్చుచూ చరిత్రను నెలకొల్పుచున్నాడు. మృత సముద్రము నొద్ద ఆకర్షణ అదే.
EXOD 3:8
31దాని తరువాత రెండవ రోజున సీనాయి కొండనొద్ద ఆకర్షణ ఏమిటి? భార్యలకు దూరముగా ఉండవలెనని ప్రజలందరికి ఆజ్ఞాపించబడెను. వారు తమ బట్టలు ఉదుకుకొనవలెను. తమ్మును తాము పవిత్రపరచుకొనవలెను. పర్వతము చుట్టూ కూడుకొనవలెను. అక్కడ మోషే అను పేరుగల ఒక వ్యక్తి అగ్నిస్తంభములో దేవుని కలిసికొనునని చెప్పబడెను. దేవుడు మోషేతో ఇట్లు పలికెను, "నేను జనుల మధ్యకు దిగిరాబోవుచున్నాను. నేను ఎవరు అనేది మరియు నేను నీకు చెప్పిన దానిని రుజువు చేయబోవుచున్నాను; నేను ఆ దేవుడను అని వారికి నేను చూపించబోవుచున్నాను." అది ఆకర్షణ అయి యున్నది: దేవుడు తన వాక్యమును నెరవేర్చుచుండెను.
1KGS 17:1
32చరిత్రలో కనుపించు ఒక రోజున జరిగిన ఆకర్షణ ఏమిటి? ఒక దేశము దేవుని మరచినది. ప్రజలు లాంఛనప్రాయులుగా తయారయిరి. భేదముతో నిండిపోయిరి, యాజకులు అందరూ ఆధునిక ధోరణిలో మునిగిపోయిరి. యాజకుల అభిమతము చొప్పున ప్రవక్తలు ప్రవచించిరి. ఆ దినమున యధావిధిగా వారు ఛాందసుడని తలంచిన ఒక వ్యక్తి అక్కడుండెను. అతడు స్త్రీ రంగు వేసికొనుటను గూర్చి మాట్లాడెను. అట్టివాటన్నింటిని చూపించెను. ఆతడు ఏదో కొరుకుపడని మనిషిగా ఉండెను, ఈ ముసలివాడు వచ్చి రాజూతో ఇట్లనెను, "నేను మరల ప్రార్థించు వరకు మంచయినను పడదు."
1KGS 18:23,24,36
33ఆ తరువాత అతడు వెళ్ళి, అక్కడ నుండి పారిపోయి ఒక గుహలో దాగుకొనినట్లు మనము చూతుము. ఎక్కడో అరణ్యములో అతడు దాగొనెను. బహుశా అతడు ఆకలి బాధతో చచ్చి ఉంటాడు లేక నశించిపోయి ఉండును అని వారంతా తలంచారు, కాని ఆతడు ఎంతో చక్కగా పోషించబడెను. నీళ్ళు కూడా అనుగ్రహించబడెను. ఇక్కడ అతడు వచ్చి ఇట్లు పలికెను, నేను, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," ను కలిగియున్నానని నీవు గ్రహించావా? ఇంకా నీవు ఒప్పించబడనిచో, ఆ పర్వతము మీదికి వెళ్ళి దేవుడెవరో రుజువు చేసికొందము," ఎందుకనగా అతడు ప్రభువు నుండి మరియొక దర్శనమును పొందెను.
ఆతడిట్లు చెప్పెను, "మీరొక బలిపీఠము ఏర్పరచుకొని, దానిని తయారు చేసికొనండి. ఎద్దులను ఏర్పరచుకొని వధించుడి. నేను యెహోవాకు ఒక బలిపీఠము కట్టుదును. నేను కూడా నా యెద్దులను దాని మీద ఉంచెదను. మన ఇరువురము బలిని అర్పించుదము. ఏ దేవుడు, దేవుడో జవాబు ద్వారా తెలిసికొందము." యెహోవా అతనికి చెప్పియుండనిచో ఆలాగున అతడు ఏ విధముగాను చేసియుండెడివాడు కాడు. ఆ తరువాత ఇట్లు చెప్పెను, "యెహోవా నీ ఆజ్ఞ ప్రకారము ఇవన్నియూ చేశాను."
1KGS 17:1
34అయితే అక్కడున్న ఆకర్షణను గమనించుము. నాలుగు వందలమంది యాజకులు కొండ పైన నిలబడియుండిరి. రాజు అక్కడ తన రధములో ఉండెను. చుట్టూ ఆతని ఆయుధములు, రక్షక భటులు నిలచి యుండిరి. ఈ ముసలి, ఒడిలిన, ముడుతల ముఖంతో కనబడుచున్న వ్యక్తి, బట్టతలతో, పొడవాటి గడ్డంతో, గొర్రె చర్మము చుట్టుకొని, శరీరమంతా రోమము కలిగి, ఒక చేతిలో కర్రతోను, మరొక చేతిలో నూనె బుడ్డితోను నిలబడి యుండెను. అప్పటికి మూడున్నర సంవత్సరముల ముందే, "నేను మురల ప్రార్థించు వరకు మంచు కూడా పడదని," చెప్పెను. (ఛాయలు, నీడలు మొదలగునవన్నియు వారు మాట్లాడి దేవుని స్థానమును ఆక్రమించుచున్నారు!) ఇక్కడ ఆ ముసలి ఛాందసుడు ఆ కొండ మీద నిలబడి ఆ జనులందరినీ పోగు చేయుచుండెను. ఆ ఆకర్షణ ఏమిటి? తన ప్రవక్త చెప్పినది నిజమని దేవుడు రుజువుపరచుట. అది దేవుడే ప్రవచనమును నెరవేర్చుట. వాక్యమును నెరవేర్చుచూ దేవుడు కూడా చరిత్రను తయారు చేయుచున్నాడు.
35ఆ తరువాత కొన్ని వందల సంవత్సరములకు అదే ఆత్మలో అభిషేకించబడిన మరియొక మనుష్యుడుండెను. అతడు అరణ్యములో నుండి వచ్చెను. ఏ సంస్థతోను అతనికి సంబంధము లేదు, అతని తండ్రి ఒక సంస్థకు చెందిన వ్యక్తి అయినప్పటికిని, అతడు చేరలేదు. తండ్రి ఒక యాజక క్రమములో ఉండెను. కాని ఇతడు అరణ్యములో నుండి వచ్చెను, గొర్రె చర్మము చుట్టుకొని యుండెను, ముఖము నిండా రోమములు, బూడిద రంగులో ఉండుటకు బదులుగా అది నల్లగా ఉండెను. యెరూషలేము యూదయ వారినందరిని ఆకర్షించిన, ఈ మనుష్యుని యొక్క ఆకర్షణ ఏమిటి? వారిలో కొందరు బయటకు వెళ్ళి, ఇట్లు చెప్పుచుండిరి, "అక్కడ ఒక అడవి మనిషి ఉన్నాడు; అతడు జనులను నీటిలో ముంచి చంపుటకు ప్రయత్నించుచున్నాడు. అటువంటి సంగతి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా?"
MATT 3:11•
MARK 1:7•
LUKE 3:16•
JOHN 1:27
36ఇతరులు కుతూహలముతో అనుచుండిరి, "ఈయనే తప్పక మెస్సీయా అయి యుండును." వారిలో ఒకడు ఇట్లనెను, "ప్రవక్తలలో ఒకడు అయి ఉండును." ఏమి ఆలోచించాలో వారికి తెలియలేదు. కాని అది ఏమిటి? అది దేవుడు యెషయా 40ని నెరవేర్చుట, అక్కడ ఇట్లు చెప్పెను, "ఇదిగో….." చివరి దినములలో ఆయన ఏమి చేయునో, తన దాసుని ఎట్లు పంపునో, మరియు ఆయన ఏమి చేయును అనునది.
ఆ తరువాత కొన్ని వారములకు ఆ వ్యక్తి తన వర్తమానము విషయములో ఎంతో అనుకూల నిశ్చయత కలిగి ఇట్లు చెప్పుట మనము కనుగొందుము. "మీ మధ్య ఒకాయన నిలబడి యున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను తగను. నేను మీకు నీటితో బాప్తిస్మము ఇచ్చిన రీతిగానే ఆయన పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తిస్మము ఇచ్చును."
ISA 40:3•
MAL 3:1
37ఒక రోజున ఒక సాధారణ యువకుడు షుమారు ముప్పయి సంవత్సరముల వయస్సువాడు వచ్చి బాప్తిస్మము పొందెను. ఈ మనుష్యుడు వచ్చినప్పుడు ఆ ప్రవక్త ద్వారా ఎంత ఆకర్షణ కలిగినదంటే, ఆ ప్రవక్తయే ఆ దినమున వింతగా ప్రవర్తించెను. ఆ నదికి ఆవల యాజకులతో అతడు వాదించినప్పుడు, ఆ ప్రవక్త యొక్క ప్రవర్తనను చూస్తున్న జనసమూహములు నిస్సహాయులై నిలబడిరి తప్ప మరేమీ చేయలేదు.
వారిట్లు అనిరి, "దేవుడు ఈ బలిపీఠము నిర్మించెను. దీనిని చేయమని దేవుడు మాకు చెప్పెను. మోషే ప్రవక్త. మేము మోషేను నమ్ముచున్నాము. బలి ఎన్నడునూ వ్యర్థము కాదు.
యోహాను తిరిగి ఈలాగు చెప్పట నేను వినగలను, "ప్రవక్త యగు దానియేలు పలికిన మాటలు మీరు వాక్యములో చదువలేదా? 'అనుదిన బలి నిరర్ధకమగును.' ఆ ఘడియ వచ్చియున్నది. యెషయా 40 అధ్యాయములో చెప్పినది మీరు చదువలేదా? 'ప్రభువు మార్గము సరాళము చేయుడి, అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము.' నా గూర్చి రెండు ప్రవచనములున్నవి. మరో సంగతి ఏమనగా, మన ప్రవక్తయగు మలాకీ నాలుగు వందల సంవత్సరముల క్రితము ఈలాగున 3వ అధ్యాయములో చెప్పుట మీరు గుర్తించలేదా? "ఇదిగో మార్గము సిద్ధపరచుటకు నాకు ముందుగా నేను నా దూతను పంపుదును. ఇది ప్రవచనమును నెరవేర్చునని మీరు నమ్ముటలేదా?" ప్రవచనము నెరవేరుతూ వుండెను.
MATT 3:13-15•
JOHN 1:29
38షుమారు అదే సమయములో ప్రవక్త అటు తిరిగి ఇట్లు చెప్పెను, "ఇదిగో, లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల వచ్చుచున్నది." ఇప్పుడు, ఆకర్షణ ఏమిటి? అది ప్రవక్త నుండి ఆతని యొక్క ప్రవచనమునకు మారినది.
ఇప్పుడు గమనించండి! ఏది జరుగనున్నదో! ఇక్కడ ఒక మామూలు మనిషి వచ్చుచున్నాడు. ఎవరికీ తెలియనివాడు, ఒక వడ్రంగివాని కుమారుడు, తిన్నగా నీటిలోనికి నడిచి వచ్చాడు. అప్పుడు గొప్ప ప్రవక్త యగు యోహాను ఇట్లు చెప్పెను, "నేను నీ చేత బాప్తిస్మము పొందవలసియుండగా, నీవు నా యొద్దకు ఏల వచ్చుచున్నావు?"
ఆయనిట్లు పలికెను, "ఇప్పటికి ఈలాగు కానిమ్ము, కాని ప్రవక్తగా, వాక్యముగా నీతి యావత్తు ఈలాగు నేరవేర్చుట మనకు తగియున్నది."
అర్పించబడు ముందుగా బలిపశువు కడుగబడవలెనని అతడు అర్ధముచేసికొనెను గనుక ఆయనకు అతడు బాప్తిస్మము ఇచ్చెను.
MATT 3:17•
MARK 1:10,11•
LUKE 3:22
39ఇప్పుడు, అక్కడ ఆయన నీటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మరియొక ఆకర్షణ జరిగినది. ఈ ప్రవక్త తన వయస్సు మరియు కాలమును ప్రకటించుటలో విధేయుడైయుండగా, ఆకాశములు తెరువబడుటయు, మరియు పావురమువలె దేవుని ఆత్మ ఆయన మీదికి దిగి వచ్చుటయు కనబడెను, మరియు ఒక స్వరము ఇట్లు పలికెను, "ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను." దేవుడు ఒక ప్రవక్త యొక్క వర్తమానమును రుజువు చేయుచుండెను. అది యోర్దాను నొద్ద దృష్టిని ఆకర్షించెను."
PS 22:1,16,17•
MATT 27:46•
MARK 15:34
40ఆ సోదరుడు కొద్ది సేపటి క్రితం పాడెను… లేక ఆతడు పాడ వలసియున్నాడు. "ఎక్కడో దూరపు కొండల మీద ఒక పాత కరకు సిలువ నిలబడియున్నది." కల్వరి కొండ మీద ఆకర్షణ ఏమిటి? మత ప్రపంచము ఆయనను విసర్జించినప్పుడు, రోమా ప్రభుత్వము ఆయనను మరణమునకు అప్పగించెనని మనము చూతుము. ఇక్కడ ఆయన ఇద్దరు బందిపోటు దొంగల మధ్య వ్రేలాడుచుండెను. దాహముతో అల్లాడుచుండెను. ఆయన శరీరము నుండి రక్తము కారుచుండెను. అక్కడ ఆయన వ్రేలాడుచూ, "నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి?" అని కేక వేసెను. దానిని చూస్తూ మత ప్రజలు అక్కడ నిలబడియుండిరి. ఆ సమయములో అక్కడ కల్వరి యొద్ద పాత నిబంధన ప్రవచనము నెరవేరుచున్నదని వారికి బొత్తిగా తెలియదు.
దావీదు తానే వ్రాసెను… అందరి ప్రవక్తలవలె అతడును, ఆత్మపూరితుడాయెను. అది తానే అన్నట్లుగా అతడు నటించెను. దావీదు 22వ కీర్తనలో ఇట్లు మొర్ర పెట్టెను, "నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి? నా ఎముకలు అదరుచున్నవి. వారు నా చేతులు, పాదములు గాయపరచిరి." దావీదు అది తనకే జరిగినట్లుగా మాట్లాడుచుండెను. అది దావీదు కాదు; దావీదులో నున్న క్రీస్తు.
ఇక్కడ ఆయా ప్రవక్తల యొద్ద నుండి బయలు వెళ్ళిన ప్రవచనములన్నియ కల్వరి సిలువ యొద్ద నెరవేరెను. కల్వరి కొండమీద ఆకర్షణ ఏమిటి? దేవుడు తన వాక్యమును నేరవేర్చుచున్నాడు.
ACTS 2:12-17
41ఒక కొండ మీద మరో ఆకర్షణ ఉండెను. అది పెంతెకోస్తు దినమున వారందరూ ఒక మత పండుగలో అక్కడ కూడి యుండగా జరిగెను, ఆ ఛాందసులందరినీ వదిలించుకొన్నామని వారు తలంచిరి. పది రోజుల నుండి వారి గూర్చి ఏమియూ వారు వినలేదు, అకస్మాత్తుగా, తేనెపట్టు బెదరినట్లుగా, ఆ భవనము పైభాగాన పెల్లుబికి వీధులలోనికి కేకలు మొదలగునవి వినబడెను.
"ఏమిటిది? దీని భావము ఏమి? వీరందరూ మధ్యముతో మత్తులయిరా?"
గమనించండి! వారిమధ్య ఒక ప్రవక్త నిలబడియుండెను. అది ప్రవక్తయొక్క క్రమము కూడా ఆయి యున్నది. "ఇశ్రాయేలీయులారా, యూదయ మరియు యెరూషలేములందు నివసించువారలారా, ఇది తెలిసికొనుడి. నా మాటలు ఆలకించుడి. మీరనుకొనుచున్నట్లుగా వీరు మధ్యముతో మత్తులుకారు, ప్రవక్తయగు యోవేలు ద్వారా ప్రభువు పలికినది ఇదే. "అంత్యదినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను" అని చెప్పబడెను. అదే ఆకర్షణ అయి యుండెను.
MATT 24:28•
LUKE 17:37
42మత ప్రజలు, జీవాధిపతిని సిలువ వేసిన తరువాత, అంతా జరిగించిన తరువాత ఇంత జరుగుచున్ననూ ఇంకా పరిశుద్ధాత్మ రాక యొక్క వాగ్దానమును వారు చూడలేదు. "ఎవరిది? దీని అర్థము ఏమిటి? వీరికి ఏమి జరిగినది?" అన్నదే ఆ ఆకర్షణ.
ఓ, మై! ఈ నాడునూ అంతే. దానిని ఈ ఘడియకు తీసికొని వచ్చుటకు దీనిలోని చాలా భాగమును దాటి పోదుము. ఈనాడును ఆలాగే యున్నది. అదే జరుగుచున్నది, అవే ప్రశ్నలు అడుగబడినవి. "ఆ రాకెట్ ఏమిటి?" వీధిలో పైకి క్రిందికి చూడు. మిషిగాన్ నుండి ఫ్లోరిడా వరకు, మేయిన్ నుండి కాలిఫోర్నియా వరకు కార్లు. ఈ ఉదయాన నేను బయటకు కారు నడుపుకొని వచ్చుచుండగా లేక మధ్యాహ్నమందు వీధిలోనికి వెళ్ళుచుండగా, కార్లు మీద ఉన్న లైసెన్సులను నేను నా భార్య చూస్తున్నాము, అక్కడే నాకీ ఆలోచనతో అంశము వచ్చినది.
"దీని భావము ఏమిటి?''
అక్కడ చెప్పబడినట్లుగానే, "పీనుగు ఎక్కడుండునో, అక్కడ గద్దలు పోగవును"!
43నా భార్యతో అన్నాను, "హానీ, గత రాత్రి నేను, నాకు ఈ భూమీ మీద ప్రియమగు ప్రతిదానికి వీడ్కోలు చెప్పవలసి వచ్చెను, మరియు దేవుడు చేయమని చెప్పినది ప్రారంభించుటకు బయటి పొలములోనికి వెళ్ళవలసియున్నాను. నీకది గుర్తున్నదా?" నీవు ఆ పాట పాడావు:
ఓ, వారు తూర్పు నుండియు పడమర నుండియు వచ్చెదరు,
వారు దూరదేశముల నుండి వచ్చెదరు,
మన రాజుతో విందు చేయుటకు,
ఆయన అతిధులుగా భోజనము చేయుటకు;
ఈ యాత్రికులు ఎంత ధన్యులు!
ఆయన ఘనమైన ముఖమును చూచుచూ,
దైవ ప్రేమతో ప్రకాశించును;
ఆయన కృపయందు ధన్యకరమగు భాగస్వాములు,
ఆయన కిరీటములో మణులవలె మెరయుదురు.
ZECH 9:9
44అదే ఆకర్షణ అయియున్నది. దేవుని యొక్క ముందు నిర్ణయము వలననైన సంతానము దానిని వెంబడించుట తప్ప మరేమీ చేయలేరు. మనకది జీవితము కన్న అర్థవంతమైనది. మన జీవితములు తీసికొనని, కాని దానిని తీసికోవద్దు. ఆకర్షణ ఏమిటి? దేవుడు యధాప్రకారము ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు. ప్రవక్తయగు జెకర్యా యొక్క మాటను తిరిగి ఆయన నెరవేర్చుచున్నాడు.
కొద్ది సేపటి క్రితం యేసు దేవాలయములో ప్రవేశించుట లేక… యెరూషలేములో గాడిదపిల్ల మీద ఎక్కి ప్రవేశించుట నేను 9వ వచనములో చదివాను. ఇక్కడ జెకర్యా యొక్క ప్రవచనము నెరవేరుచున్నది. "సీయోను కుమార్తెలారా, బహుగా ఆనందించుడి. ఇదిగో, రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా ఉల్లసించుడి. ఆయన నీతిపరుడు, మరియు రక్షణ అనుగ్రహించువాడు; దీనుడై ఆయన గాడిద నెక్కి భారవాహక పశువగు గాడిద పిల్ల నెక్కి ఆయన వచ్చుచున్నాడు." ఆ మత ప్రధాన కార్యాలయము అగు యెరూషలేము యొద్ద ఆకర్షణ అదే.
ZECH 14:4,5
45ఇప్పుడు మనము ఒక చివరి దినపు సంభవమును చూచుచున్నాము! మనము కొద్ది పేజీలు ముందుకు త్రిప్పి చూద్దాం. జెకర్యా గ్రంథములోనే, దాని గూర్చి అతడు ఏమి చెప్పెనో చూద్దాం. అప్పుడు దానిని చివరి దినముల కొరకు మనము త్రిప్పుదాం. అది మధ్య యుగము; ఇప్పుడు మనము చివరి దినముల వైపు చూద్దాం, జెకర్యా 14వ అధ్యాయము 4వ వచన ప్రారంభము నుండి చూద్దాం. వినండి! 4 నుండి 9 వరకు గల వాక్య భాగమును మనము చదువుదాం. షుమారు తొమ్మిది వచనములు మనము చదువబోవుచున్నాము. జాగ్రత్తగా వినండి. ఆయన రాకడను గూర్చి చివరి దినముల గూర్చి అది ప్రవచించబడెను. కనుక జాగ్రతగా ఇప్పుడు వినండి, ఇది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." ఇది వాక్యము, జెకర్యా 14. జెకర్యా 9 ఏమి చెప్పెనో గుర్తుంచుకొనండి? దానిని వారు గుర్తించలేదు. ఇప్పుడు, నేటి సంగతి ఏమిటి? జెకర్యా 14, ఆయన రాకను గూర్చి మాట్లాడుచున్నది.
ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున నున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును, సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి ఏర్పడును.
కొండల మధ్య కనబడు లోయ ఆ జీలువరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతో కూడా పరిశుద్దులందరును వచ్చెదరు…..
ISA 29:6•
ZECH 14:5-7•
REV 16:18
46మరియొక భూకంపము వచ్చి భూమిని బ్రద్దలు చేసి తెరవ చేయును! మీరు ఇక్కడ ఒక వాక్యమును వెంబడించగోరినచో 5వ వచనములో గమనించండి. ఒలీవ కొండ ఒక భూకంపము ద్వారా బ్రద్దలగునని దీనిని అన్వయించ వచ్చును. ఇది యెషయా 29:6 మరియు ప్రకటన 16:9 ద్వారా స్థిరపరచబడినది. నిశ్చయంగా! ఏమిటది? ఆయన మొదటి రాకను గూర్చి చెప్పిన అదే ప్రవక్త, ఆయన రెండవ రాకడను కూడా చూచెను! గమనించండి, "ఆ భూకంప దినములలో వలెనే…" ఆ భూకంపములు ఏమి చేయుచున్నవో చూడండి, వాటియొక్క ప్రవచనములు చూడండి?
…అప్పుడు నీతో కూడా పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
ఆ దినము ప్రత్యేకమైనదిగా నుండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు. (హల్లెలూయా!)
కాని అది ఒక దినము, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు రాత్రి కాదు; అస్తమయ కాలమున వెలుతురు కలుగును. (ఓ దేవా!)
ZECH 14:8,9
47"సాయంకాల సమయములో వెలుతురు కలుగును," అదే ప్రవక్త. ప్రజలు గ్రుడ్డి వారయిరి, ఏమిటి ఆకర్షణ? ఇంకో రెండు వచనములు చదువుదాము.
ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును, సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగే జరుగును. (సువార్త యూదులకు, అన్యులకు బయలు వెళ్ళుచున్నది.)
యెహోవా సర్వలోకమునకు రాజైయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.
సాయంకాలమున వెలుతురు కలుగును,
(నిజము!)
మహిమకు మార్గము నీవు తప్పక కనుగొందువు:
నీటి మార్గమున, ఈనాడు వెలుగున్నది,
ప్రశస్తమగు యేసు నామములో పాతి పెట్టబడుట.
యవ్వనులు, వృద్ధులు, పాపమంతటి నుండి పశ్చాత్తాప పడుడి, పరిశుద్ధాత్మ నిశ్చయముగా ప్రవేశించును;
సాయంకాలపు వెలుతురు వచ్చినది,
దేవుడు క్రీస్తు ఒక్కటే అనునది ఒక వాస్తవము.
మనమెక్కడున్నామో చూడండి?
దేశములు ముక్కలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,
మన ప్రవక్తలు ముందు చెప్పిన సూచనలు;
(చివరి దినమునకు అన్యులకు ఆ భూకంపము)
అన్యుల దినములు లెక్కించబడినవి,
భీతులు పెచ్చు పెరిగినవి.
ఓ చెదరగొట్టబడిన వారాలారా, మీ స్వంతవాని యొద్దకు తిరిగి రండి.
బయటకు తన్నివేయబడిన వారలారా, ''ఈ మందసములను క్రొత్తబండ్ల మీద తీసికొనిపోబడుచున్నవి. మరణము నిన్ను మొత్తక ముందే అచ్చట నుండి తప్పుకొనుము, దేవుడు దానిని స్థిరపరచెను. ఇది ఆలాగు ఉండును.
MAL 4:1-4
48ఇప్పుడు మనము పాత నిబంధనలోని మరియొక వాక్యము వైపు తిరుగుదము. మలాకీ 4వ అధ్యాయము. ఆ చిన్న అధ్యాయము చదుపుదము:
…ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును! గర్విష్టులందరును, దుర్మార్గులందరును కొయ్య కొలువలే ఉందురు…
ఇప్పుడు, ఇది…. మలాకీ 3 మొదటి రాకడ ఇప్పుడిచ్చట తరువాత రాకడ. ఇక్కడ డాక్టర్ స్కోఫీల్డు సహితము తన గమనికల పట్టికలో ఇక్కడి ఈ విషయములను సరిగానే వ్రాసెను. ఆయన యొక్క వాతలన్నింటిని నేను నిశ్చయంగా అంగీకరించను. యోహాను యొక్క పనిని మలాకీ 3 గాను; మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ, మరియు ముందుగా ఏలియా;
…గర్విష్టులందరును దుర్మార్గులందరును, ఒకనికిని వేరైనను, చిగురైనను లేకుండా రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. (అయితే "నీత్య" నరకము ఎక్కడ ఉన్నది?)
అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును… గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
"నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను వీధులను జ్ఞాపకము చేసికొనుడి.
MAL 3:1•
MAL 4:5,6
49ఇక్కడ ఏలీయా యొక్క రాకడ:
నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపెదను…..
పాత నిబంధన యొక్క చివరి ముగింపు వచనము:
…యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.
ఇప్పుడు, అది యోహానుగా ఉండజాలడు కాదు. లేదు. చూడండి, లోకము కాల్చివేయబడలేదు మరియు దుష్టులమీద నీతిమంతులు నడువలేదు, చూచారా. కాదు, కాదు.
… యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దీనము రాకమునుపు:
నేను వచ్చి దేశమును శపించకుండునట్లు, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.
పరివద్ధాత్మ యొక్క ఖచ్చితత్వమును గమనించండి. అది ఏలియా యొక్క రెండు రాకడలను కలగలుపు చేయలేదు. మలాకీ 3 చెప్పెను, "ఇదిగో, నాకంటే ముందుగా నేను నా వర్తమానికుని పంపుచున్నాను." యోహాను గూర్చి యేసు ప్రశ్నించబడెను, ఆయనిట్లు చెప్పెను, "నాకు ముందుగా నేను నా దూతను పంపుదునని ప్రవక్తల ద్వారా చెప్పబడినవాడితడే, మీరు తెలిసికొనుడి ఇది రానున్న ఏలీయా." మలాకీ 3.
ISA 61:1,2•
LUKE 4:18,19
50గమనించండి, వాక్యము ఎంత సరిగ్గా దానిని ఇచ్చుచున్నదో, ఇది ఏమిటో గమనించండి…. విశ్వసించగోరు వారికి, చూడగోరు వారికి చూపించుటకు. గుర్తుంచుకొనండి, యేసు వాక్యము మధ్యలో ఆపెను, ఎందుకనగా అప్పటికి అందులోని భాగము నెరవేరెను, తక్కినది ఆయన యొక్క రెండవ రాకడ కొరకు? "ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించుటకు, విరిగిన హృదయముగలవారిని కట్టుటకు," అని ఆగెను; "అన్యులకు తీర్పు తెచ్చుటకు కాదు." ఆయన రెండవ రాకడ వరకు.
MAL 4:6
51దానిని సమానాంతరముగా చేయు ఇక్కడి ఈ వాక్యమును గమనించండి. "ఏలియా తండ్రుల యొక్క హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పును." ఇప్పుడు మలాకీ 4 గూర్చి మాట్లాడుచున్నాను, దానిని కలగలుపు చేయవద్దు… లేక మలాకీ 3. క్రీస్తు మొదటి రాకడకు ముందుగా నున్న దిననములలో వచ్చిన ఏలియా, యోహానులు ఆ ముసలి పితరులగు తండ్రుల హృదయములను పిల్లల యొక్క వర్తమానము తట్టు త్రిప్పిరి, క్రొత్త వర్తమానము.
ఇప్పుడు గమనించండి! "పిల్లల యొక్క హృదయములను తండ్రుల తట్టునకు." ఆయన రెండవ రాకడలో, చివరి దినములలో ఆయన తిరిగి అపోస్తలుల విశ్వాసము వైపునకు త్రిప్పును. చూడండి ఎంత పరిపూర్ణముగా వాక్యము విజ్జోడు అగుచున్నదో?
అది పాత నిబంధన యొక్క అంతము, పాత నిబంధన. ఇప్పుడు మనము సాయంకాల సమయమున వెలుతురు ఉండునని చూచుచున్నాము. ఏమిటది? అది శిఖరము, పర్వతము యొక్క శిఖరము.
ZECH 14:7
52ఈ ఉదయమున నేను చెప్పినట్లుగా, మనము శాఖల గుండా వచ్చియున్నాము, (ఒక నారింజ చెట్టు కాదు, నేను ఈ ఉదయమున చెప్పినట్లుగా)… కాని దబ్బపండు, నిమ్మ, ఇంకా ఎన్నో ఇతర రకములు మనము కలిగియున్నాము, అవి ప్రారంభమున ఉన్న దానివలె లేవు. కాని తరువాత (దానిని పోగొట్టుకొనవద్దు; అది ఇక్కడకు వచ్చుచున్నది!) శాఖలన్నియూ ఆట ముగించిన పిదప ప్రారంభించుటకు వారికి ఏ వెలుతురు లేదు. పగలు, రాత్రిగా పిలవబడని దినము వచ్చునని చెప్పబడెను.
వారేమి చేయుచున్నారు? వారు ఏమి చేయుచున్నారు? ఒక నారింజ చెట్టుమీద, నిమ్మ పండు ఏమి చేయును? నారింజ యొక్క అసలు జీవము పైకివచ్చి, దానిని నిమ్మగా వక్రీకరించినది. దేవుని వాక్యమునకు శాఖలు చేసినది అదే. తమ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును ప్రభావము లేనిదిగా చేసియున్నారు. అది "ప్రభువు యొక్క ఆత్మ ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" వారు నిమ్మలను, దబ్బ పండ్లను ఫలించిరి గాని, నారింజలు కాదు.
ZECH 9:9
53కాని ప్రవక్త ఏమి చెప్పెను? ఈ రాత్రి మన అంశము కొరకు, "ఓ యెరూషలేము కుమార్తెలారా సంతోషించుడి; సీయోను కుమార్తెలారా ఉల్లసించుడి. మీ రాజు దీనుడై, సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు," అని చెప్పిన ఆ ప్రవక్తయే ఏమి చెప్పెనో గమనించండి, "పరిపక్వమగు కాలము వచ్చుచున్నది." ఫలమును పండించుటకు సూర్యుడు భూమీ మీదికి పంపించబడుచున్నాడు. మరి ఎందుకది పండదు? అక్కడ పండుటకు పంటే లేదు. కాని జీవము ఇంకా పయనించుచునే యున్నది.
54దబ్బ పండు, నారింజ పండుగా ఉండవలసి వచ్చెను. అది సంస్థగా మారినట్లు కనుగొనబడినది. అది ఒక దబ్బ పండు! అది మరల వెళ్ళినది. ఆ సమయమున అది ఒక నిమ్మగా వచ్చినది. అది మరి దేనిగా రూపొందినది. చివరగా చెట్టు పై భాగాన అది బత్తాయి పండుగా మారినది, అనగా అది సగము నారింజ మరియు సగము నిమ్మ; ఒక మిశ్రిత జాతి, వంకర చేయబడినది; వక్రీకరణమునకు వచ్చినది. అదే చెట్టు జీవమును పొందలేకపోయినది; పొట్టు, దాదాపు ఏర్పరచబడిన వారిని మోసపుచ్చెను. నారింజవలె కనిపించెను, కాని అది నారింజ కాదు.
"కాని వెలుగు కలుగును" ఆమె సంస్థకు అతీతముగా ఎదిగినది. ఆమె సంస్థను కాలదన్ని బయటకు వచ్చినప్పుడు మరల తిరిగి పుష్పించును, అది భూమిలోనికి వెళ్ళినప్పుడు ఎట్లున్నదో, ఆలాగే నారింజలను అది తిరిగి ఉత్పత్తి చేయును. అప్పుడు అక్కడ వెలుతురు ఉండును.
ఈ ఆకర్షణ ఏమిటి, ఏమిటి సంభవించుచున్నది? దేవుని వాక్యము నెరవేరుచున్నది! పాతనిబంధనలో ఇద్దరు సాక్షులు, ఇది జరుగునప్పుడు ఉందురు.
LUKE 17:28-30•
JOHN 14:12•
JOHN 15:2•
HEB 13:8
55క్రొత్త నిబంధనలోని యోహాను 14:12లో యేసు చెప్పినది తీసికొందుము, "నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును.
లూకా 17:22 నుండి 30లో కూడా ఆయనిట్లు చెప్పెను: "లోతు దీనములలో జరిగినట్లుగానే, సొదొమ దహించబడక ముందు; మనుష్యకుమారుని రాకడలోను అలాగే జరుగును, ఆ దినమున మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడును.
ఓ, కేవలము వాక్యముల వైపు చూడండి! "మనుష్యకుమారుడు," యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. శాఖలను దాటిపోయి ఆయన ఎదిగియున్నాడు. చెట్లు చివరకు ఆయన ఎదిగియున్నాడు, యోహాను 14 లేక 15లో ఆయన ఏమి చెప్పెను? "నాలో ఫలించని ప్రతీ కొమ్మను నరికి పారవేతును. అగ్నిలో వేయబడి అది దహించబడును. కాని ఫలించు ప్రతి కొమ్మయు కూడా కత్తిరించబడును."
56ఓ, చివరి దినములలో అక్కడ నిజ తొలకరి మరియు కడవరి వాన కురుయును, ఆయనతో కూడా ఆ చిన్న గాడిద పిల్లపై వచ్చుచున్న చిన్న గుంపు మీద కురియును. దీనుడై, సాత్వికుడై ఆయన వచ్చును. నిరుత్సాహపరుచు సంఘ శాఖ లేదు, "ప్రభువు పేరట వచ్చుచున్న రాజుకు హోసన్నా," అని కేకలు వేయుచుండిరి. ఈనాడు సంగతి ఏమిటి? ఆ కొండమీద ఆకర్షణ ఏమిటి?
57కొద్ది కాలము క్రిందట, ఈ వేదిక మీదనే నిలబడియుండగా, పరిశుద్ధాత్మ ద్వారా ఇట్లు చెప్పబడెను, "నీ యింటిముందు ఒక కొయ్యను, దిగగొట్టు దినము ఒకటి రాబోవుచున్నది. వారు నీ ద్వారమును కదిలించుదురు. కాబట్టి నీవు దానిని దాటిపోదువు మరియు కోపపడవద్దు." నా ద్వారము పడవేయబడి ఆ కొండ ప్రక్కను పడవేయబడుట నేను చూచాను. నా ముందు నున్న కొండ అంతయూ త్రవ్వివేయబడి, చెక్కలు, ఏవేవో అక్కడ పడవేయబడినవి. చిందర వందర చేయబడెను. ఆయన చెప్పెను… నేను చూచాను. అక్కడ ఒక అల్లరి కుర్రాడు ఆ ద్వారమును పీకివేసి ఈలాగు చేసెను, "నీవెందుకు నాకు చెప్పలేదు?" అనడిగాను. అతడు నాతో దురుసుగా మాట్లాడినందున, నేనతని కొట్టవలసివచ్చెను. ఆలాగు చేసినప్పుడు, నేను అన్నాను, "నేను రింగులో ఉన్నప్పడు తప్ప ఇప్పటివరకు దీనిని నేను చేయలేదు, కాని నీకు తెలియవలెనని కోరుచున్నాను," నేను అతన్ని ఒక దెబ్బ కొట్టాను. నేను అతన్ని క్రిందకు పడద్రోసినప్పుడు, మరల లేవదీసి తిరిగి కొట్టాను. నేను, మూడు నాలుగు సార్లు ఆలాగు లేవనెత్తి, తన్ని కొండ పైకి విసిరేశాను. అప్పుడు మరల నేను అక్కడికి వెళ్ళి, "అది సరియైనది కాదు," అని చెప్పాను. నేనతనిని పైకి లేవనెత్తి, చేతులు కలిపి, అన్నాను, "నీ పట్ల నాకు కోపము లేదు, కాని నీవు నాతో ఆలాగు మాట్లాడరాదని తెలియచేయుటకే ఇట్లు చేశాను." అప్పుడు నేను తిరిగి వెనక్కి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఆ గుమ్మము నొద్ద నిలబడియుండి ఇట్లనెను, "ఇప్పుడు నీవు దీనిని దాటి వెళ్ళుము. ఆ పాతబడిన కొయ్య వద్ద, పశ్చిమ దిశగా తిరుగుము."
నాకు కావలసిన దంతయూ ఈ గ్రంథమే,
ఈ గ్రంథము ఒక మంచి మార్గదర్శి,
(నా బాధలన్నింటిలో ఎటు వెళ్ళవలెనో చూపించు మార్గము)
ఆమెన్. మరియు ఆ గ్రంథము వాక్యము, ఆ వాక్యము దేవుడు. నీ బాధలను దాటిపోవును; ఏమి చేయవలెనో అది చెప్పును.
58మూడు సంవత్సరముల క్రితము పట్టణ సర్వేయరుగా నున్న నా స్నేహితుడు ఒకాయన నేను నివసించే రహదారికి దిగువన ఉంటూ, ఒక కర్రను పాతెను. నేను అచ్చటికి వెళ్ళి, అడిగాను, "మడ్, ఏమిటి సంగతి?'' అని అడిగాను. అతను శ్రీ. కింగ్స్ కుమారుడు. వ్యక్తిగత స్నేహితుడు.
అతను, "బిల్లీ, వారు ఈ రోడ్డును వెడల్పు చేయనైయున్నారు," అన్నాడు.
మీరంతా జ్ఞాపకముంచుకొనండి. నేను అన్నాను, "అది వంతెన కావచ్చు," సహోదరుడు ఉడ్ కి చెప్పాను, "నీ ఆస్తిని నిలిపియుంచుకో. బహుశా ఆ వంతెన ఇటుగుండా రావచ్చును, మరేదో రావచ్చును." ఆ రహదారి పీకివేయబడినది, ఇటుకలు, రాళ్ళు అంతటా విసిరి వేయబడినవి. నేను చెప్పాను, "నీ ఆస్తి నిలిపి ఉంచుకో."
అది జరుగనై యున్నదని శ్రీ. కింగ్ చెప్పినప్పుడు, నేను వెళ్ళి నా భార్యకు కూర్చునియుండగా చెప్పాను, "హానీ, దాని గూర్చి ఏదో వ్రాయబడినది. అది, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అన్నది అది ఎక్కడో వున్నది," అన్నాను.
59నేను వెళ్ళి, నా పుస్తకము తీసికొన్నాను. దానిలోనికి చూచాను, అందులో, "అది జరుగును…" అని ఉన్నది. ఎనిమిది సంవత్సరాల తరువాత అది జరిగినది!
అప్పుడు నేను దానివైపు చూచినప్పుడు, అన్నాను. "ఇది సమయము హాని; మనము తప్పక పశ్చిమానికి తిరుగవలెను."
దాని తరువాత రెండు రోజులకు, ఒక ఉదయాన పది గంటల ప్రాంతంలో గదిలో నిలబడియుండగా, దేవుని ఆత్మలోనికి వెళ్లితిని, అప్పుడు ఒక చిన్న పావురముల గుంపు ఎగురుట చూచాను, ఆ చిన్న పక్షుల వైపు చూచాను. దానిని మీరు గుర్తుచేసికొనండి. నేను చూచినది, ఏడు దేవ దూతలను ఒక పిరమిడ్ ఆకారములో నా వైపు దూసుకొనివచ్చి, ఇట్లనెను, "పశ్చిమానికి తిరుగుము, టుసాన్ కు వెళ్ళుము, నలుబది మైళ్ళు ఈశాన్యము వైపు. నీవు నీ బట్టల నుండి ఒక ముండ్లుగల గురుగు విత్తనమును తీసి పారవేతువు." (దాన్ని వారు ఇక్కడ బుల్ హెడర్ అందురు).''
60సహోదరుడు ఫ్రెడ్ సాద్మన్ అక్కడ కూర్చొనియున్నాడు. ఇప్పుడు నా వైపు చూస్తున్నాడు, ఆ ఉదయాన ఆయన అక్కడుండెను, "దాని గూర్చి నేను మర్చిపోయాను."
నేను చెప్పాను, "ఒక భూకంపము వంటి పేలుడు కలిగి, దానివలన ఆ దేశములోని సమస్తమూ దాదాపు కదిలిపోయినట్లు కనిపించినది. దానిని ఒక మానవుడు ఎట్లు తాళుకోగలడో నాకు అర్థము కాదు." నేను భయపడ్డాను. నేను ఫీనిక్సు నొద్ద నిలబడ్డాను; ఈ రాత్రి - వినుచున్న మీరందరూ నాకు సాక్షులు. "అయ్యలారా, ఇది ఏ సమయం? [62‑1230E] అను ప్రసంగములో బోధించాను. "ఎక్కడున్నాము మనం?" నేను పశ్ఛిమంగా వెళ్ళాను. ఇక్కడ చాలా మంది ఆ టేపును కలిగియున్నారు; అది జరుగుటకు ఒక సంవత్సరము లేదా ఇంకా ముందే దాన్ని చెప్పుట మీరు విన్నారు.
61నేను పశ్చిమంగా వెళ్ళాను, ఏమి జరుగునో అని ఆశ్చర్యపడ్డాను. ఒక రోజున ప్రభువు నుండి ఒక పిలుపు విన్నాను. నా భార్యతో ఇట్లన్నాను, "హానీ, బహుశా నా పని అయిపోయిందను కొంటాను." నాకు తెలియదు. నేను చెప్పాను, "ఇప్పుడు ఇక బహుశా దేవుడు నాతో పని ముగించుకొన్నాడు. నేను ఇంటికి వెళ్ళబోవుచున్నాను. నీవు బిల్లీతో వెళ్ళు, పిల్లలను తీసికొనుము; ఏదో విధంగా దేవుడు నీ కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేయును. వెళ్ళి దేవునికి సత్యముగా జీవించు. పిల్లలు బడికి వెళ్ళునట్లు చూడు, దేవుని యొక్క భయ భక్తులలో వారిని పెంచుము."
ఆమె అన్నది, "బిల్, నీకు తెలియదు అది నిజమని నీవేరుగవు."
నేనన్నాను, "కాదు. అయితే ఒక మానవుడు దాని నుండి బ్రతికి బయటపడలేడు."
ఒక ఉదయాన ప్రభువు న్ను మేల్కొలిపి, ఇట్లు చెప్పెను, "సాబినో కాన్యన్ వద్దకు లేచి వెళ్ళుము." నేను ఒక కాగితపు ముక్కను మరియు నా బైబిలును తీసికొన్నాను. "ఎక్కడి వెళ్తున్నారు?" అని భార్య అడిగినది.
"నాకు తెలియదు. తిరిగి వచ్చినప్పుడు చెప్పెదను," అని నేను అన్నాను.
62నేను కాన్యన్ వద్దకు ఎక్కి వెళ్ళాను, పక్షిరాజులు ఎగురుచూ ఉన్న ఆ స్థలానికి ఎక్కిపోయాను. అక్కడ కొన్ని దుప్పులు నిలబడియుండుట చూచాను. నేను ప్రార్థించుటకు మోకరించాను, మరియు నా చేతులు పైకెత్తాను, మరియు నా చేతిని ఒక ఖడ్గము తాకినది. నేను చుట్టూ చూశాను, "అది ఏమిటి? నా నియంత్రణలో నేను లేను. ఇక్కడేమో నా చేతిలో ఖడ్గమున్నది. అది ప్రకాశమానంగా, కాంతివంతంగా, సూర్యుని వెలుగులో మెరయుచున్నది." నేను ఇట్లనుకొన్నాను, "ఈ కాన్యన్ లో ఎక్కడా మనుష్యులు లేరు, ప్రజలకు చాలా మైళ్ళ దూరంలో నేనున్నాను. అది ఎక్కడ నుండి వచ్చి యుంటుంది?"
ఒక స్వరము నాతో ఇట్లు చెప్పుట విన్నాను, "అది రాజు యొక్క ఖడ్గము."
నేను అన్నాను, "ఒక రాజు ఖడ్గముతోనే ఒక మనుష్యుని యోధునిగా నియమించును." .
అతని స్వరము మరల వచ్చి ఇట్లనెను, "ఒక రాజు ఖడ్గము కాదు గాని, 'ఆ మహా రాజ ఖడ్గము' ప్రభుని యొక్క వాక్యము." ఇట్లు చెప్పెను, "భయపడవద్దు, ఇది కేవలము మూడవ ఈడ్పు. నీ సేవ యొక్క రుజువు.''
63ఒక స్నేహితునితో నేను వేటకు వెళ్ళుచున్నాను, ఏమి జరుగనై యున్నదో ఎరుగను, ప్రభువు యొక్క దేవదూతను గూర్చిన పటమును తీసిన వ్యక్తి, దాని గురించి నన్ను విమర్శించిన వ్యక్తి నన్ను పిలిచాడు. అతని కుమారుని గూర్చి నేను హూస్టన్ కు వెళ్ళవలసియున్నాను, ఎందుకనగా అతడు చనిపోవు వారి వరుసలో ఉన్నాడు. కొద్ది దినములలో అతడు చనిపోవుటకు సిద్దముగా ఉన్నాడు. అతడు నన్ను అక్కడ కలిసికొని, నా చుట్టూ చేతులుంచి ఇట్లనెను, "ఆలోచించండి, నేను ఎవరినయితే విమర్శించానో, ఆ వ్యక్తియే నా ఒక్కగానొక్క కుమారుని రక్షించుటకు వచ్చెను!" ఒక జీవితమును రక్షించినందులకు మానవత్వ సమాజము వారు, ఆస్కార్ అను (దానిని ఏమైనా పిలవండి,) పిలువబడు దానిని నాకిచ్చారు.
64అపుడు మేము తిరిగి వెళ్ళాము; వేటాడుటకు నేను కొండకు వెళ్ళాను. అక్కడ సహోదరుడు ఫ్రెడ్ మరియు నేను ఉన్నాము. ఒక ఉదయాన నేను బయటకు నడకకు వెళ్ళితిని — అప్పటికే నేను చిన్నపాటి హవలీన అనబడు అడవిపందిని పట్టుకొనియున్నాను — అతడు వెళ్ళిన స్థలమును నేను చూచాను. నేనన్నాను, "సహోదరుడా ఫ్రెడ్, ఉదయానా, వేకువనే ఆ కొండ మీదికి వెళ్ళుము, నేను మరియొక దానిమీదికి వెళ్ళుదును. నేను పందిని గురిచూచి కొట్టను, దానిని చంపను. కాని అవి ఇటువైపుగా వచ్చుటకు ఆరంభించినట్లయితే, ఆ మందను వెనుకకు మళ్ళించుటకు వాటిముందు పేల్చుదును."
65సహోదరుడు ఫ్రెడ్ అక్కడికి వెళ్ళెను గాని అక్కడ ఏమి పందులు లేవు. నాకు చేతులు ఊపి చెప్పగా, నేను చూశాను. నేను కాన్యన్ లోనికి వెళ్ళాను, కాని పెద్ద బీటలు అక్కడున్నవి; అప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు. కొండ యొక్క మరో ప్రక్కకు తిరిగి వచ్చాను. ఆ ప్రవచనము గురించి అసలు ఆలోచనయే నాలో లేదు. కూర్చొని, కనిపెట్టుచూ విశ్రాంతి తీసికొనుచున్నాను, "ఆ పందులకు ఏమి సంభవించింది?" అని అనుకొన్నాను.
నేను నా… ఇండియన్సువలె కూర్చున్నాను. మఠం వేసికొని కూర్చున్నాను. నా ప్యాంటు కాలు మీద చూడగా, ఒక ముండ్లుగల గురుగు విత్తనమును వంటిది అంటుకొనియున్నది, నేను దానిని పైకి తీసేశాను. నేనిట్లు తలంచాను, "ఇది చాలా వింతగా ఉన్నదే! ఇక్కడ నేను దాదాపు టుసాన్ కు వాయవ్యంగా నలభై మైళ్ళ దూరంలో ఉన్నాను. అక్కడ నా చిన్న జోసెఫ్, నా కోసం కూర్చొని ఎదురు చూస్తుండును." నేను చూడనారంభించగా, నా నుండి ఒక వేయి గజాల దూరంలో పర్వతము మీద పందుల మంద వచ్చుట కనబడినది; నేను ఆ ముండ్లుగల గురుగును క్రిందికి విసిరేశాను. నేనిట్లు అనుకొన్నాను, "నేను వాటిని తోలుకొచ్చెదను. నేను వెళ్ళి, సహోదరుడు ఫ్రెడ్ ని తీసికొచ్చెదను, ఇక్కడున్న ఈ పరివృత్తం మీదుగా ఎటు వెళ్ళాలో తెలిసికొనునట్లుగా నేను ఒక కాగితపు ముక్కను వ్రేలాడదీసెదను, మరియు వెళ్ళి సహూదరుడు ఫ్రెడ్ ని తీసికొచ్చెదను."
నేను కొండ మీద మరియొక ప్రక్కకు వెళ్ళుటకు శాయశక్తులా పరుగెత్తనారంభించాను. అకస్మాత్తుగా ఎవరో నన్ను పేల్చినట్లు అనిపించినది. అంత పేలుడు నేను ఎన్నడూ వినలేదు; అది ఆ దేశమంతటిని కుదిపివేసినది. ఆలాగు జరిగినప్పుడు, ఏడుగురు దేవదూతలు ఒక సమూహముగా నా ఎదుట నిలబడియున్నారు.
66కొద్ది సేపటి తరువాత సహోదరుడు ఫ్రెడ్ తదితరులను చూచాను. "ఏమిటది?" అని అడిగారు.
"అది అదే," అన్నాను.
"నీ వేమి చేయబోతున్నావు?"
"ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాను. ఎందుకనగా 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' ఈ సంవత్సరములన్నింటిలోనూ, ఈ శాఖలు మొదలగువాటికి మరుగై, బైబిల్ లో దాగియుండిన ఏడు మర్మములను దేవుడు మనకు ఏడు ముద్రలలో విప్పనైయున్నాడు," అన్నాను.
పొగమంచు ఏర్పడిన రీతిగా ఆ వృత్తము భూమిలో నుండి పైకి వచ్చుచున్నది. అది ఆలాగు జరిగినప్పుడు, అది పర్వతములోనికి వెళ్ళి, అది వచ్చిన మార్గము నుండి పశ్చిమ దిశకు గుండ్రముగా వెళ్ళనారంభించినది. ఆ తరువాత కొంత సమయమునకు సైన్సు దానిని కనుగొన్నది, ముప్పది మైళ్ళ ఎత్తు, ఇరవై-ఐదు మైళ్ళ వెడల్పు, సరిగ్గా పిరమిడ్ వృత్తములోనే యున్నది.
67మరియొక రోజున అక్కడ నిలబడియుండగా, పటమును కుడి ప్రక్కగా త్రిప్పగా, ఏడు సంఘ కాలములో యున్నట్లుగానే యేసు తెల్లని జుట్టుతోను, మహోన్నత దైవత్వమును చూపించుచూ అక్కడుండెను. ఆయన అల్ఫా మరియు ఓమెగా; ఆయన ఆది మరియు అంతము; సమస్త నిత్యత్వమునకు ఆయన మహెన్నత న్యాయాధికారిగా అక్కడ నిలబడియుండి, ఈ ఘడియ యొక్క వర్తమానమును స్థిరపరచుచుండెను. సాయంకాల సమయమున వెలుతురు కలుగును! అదంతా దేని గురించి? అది ఏమైయుండెను?
68నేను పశ్చిమ దిశగా వెళ్ళాను. అదే కొండమీద బాంక్స్ ఉడ్ తో వెళ్ళుచుండగా, ఇట్లు చెప్పెను, "ఒక రాతిని విసరుము. దేవుని యొక్క మహిమను నీవు చూతువని 'యెహోవా సెలవిచ్చుచున్నాడని,' శ్రీ. ఉడ్ కు చెప్పుము."
ఆ మరుసటి రోజునే, అక్కడే నిలబడియుండగా, ఒక సుడిగాలి వచ్చి కొండలను పేల్చివేసినది మరియు చెట్ల యొక్క చివరలను రాళ్ళు నరికివేపినవి, నా తలకు పైగా దాదాపు మూడు నాలుగు అడుగుల ఎత్తులో ఇది జరిగెను. మూడు, పెద్ద పేలుళ్ళు జరిగినవి. సోదరులు పరుగు పరుగున వచ్చారు. అక్కడ దాదాపుగా పదిహేను మంది మనుష్యులు బోధకులు మొదలగువారు అక్కడ ఉండిరి. "ఏమిటది?" "ఏంటది?" అని అతడు అడిగెను.
"పశ్చిమ తీరాన్ని దేవుని తీర్పు తాకుచున్నది," అన్నాను.
69ఆ తరువాత దాదాపు రెండు రోజులకు భూకంపము దరిదాపుగా అలాస్కాను ముంచివేసినది. అరిజోనాలోని, కొరెనాడో అడవిలోని, సన్-సెట్ కొండమీది ఈ వెలుగు ఏమిటి? అక్కడ సంభవించిన ఈ వింత సంగతి ఏమిటి? ప్రజలు పశ్చిమము నుండి తూర్పునకు వెళ్ళిపోతున్నారు. అది జరిగినచోట చెల్లా చెదురుగా పడియున్న రాళ్ళను ఏరుకొని పోవుచున్నారు. బ్రద్దలైన ప్రతి రాయి, ప్రతి రాయికి మూడు మూలలున్నవి, అది ఆలాగు బ్రద్దలయినది. (ముగ్గురూ ఒక్కటే.) అవి బల్లల మీద, పేపరుపై బరువు పెట్టుటకు, ఆ దేశమంతా తీసికొనిపోబడినవి. కొరెనాడో అడవిలోని సన్-సెట్ కొండ మీది ఈ వింత ఏమిటి?
70జూనియర్ జాక్సన్ వినుచున్నాడు, "సూర్యుడు అస్తమించు దిశగా వెళ్ళుట," గూర్చి అతనికి కలిగిన స్వప్నమును నేను వివరించి భావము చెప్పుటను గుర్తున్నదా? ఇది, "సన్-సెట్" కొండ మీద జరిగినది! అది సాయంకాల సమయము. సూర్యాస్తమయవేళ చరిత్ర ముగింపులో, ప్రవచన ముగింపులో లేక, ప్రవచన నెరవేర్పువేళలో సూర్యాస్తమయ వర్తమానము వెలువడినది. టుసాన్ కు ఉత్తరంగా, నలుబది మైళ్ళ దూరాన, కోరెనాడో అడవిలో, సన్-సెట్ కొండ మీద సాయంకాల సమయమున వెలుతురు కలుగును. అక్కడ సన్-సెట్ శిఖరము ఉన్నదో లేదో పటము తీసి చూడండి. సరిగ్గా అక్కడే అది జరిగెను. ఆ రోజు వరకు దానిని నేను ఎన్నడూ ఎరుగను.
COL 2:9
71ప్రతీదియు… అది ఎన్నడూ చావదు; అది ఎడతెగకుండా - దానంతట అది విప్పబడుచున్నది. ఆ జరిగిన దాని దగ్గర నుండి, యేసు నిలబడి మనవైపు చూస్తున్నట్లున్న ఆ పటము వరకు మరియు ఇప్పుడు ఆ సన్-సెట్ కొండ మరియు సరిగ్గా ఆ సూర్యాస్తమయ వెలుగు. సూర్యాస్తమయ వెలుగు వచ్చియున్నది, దేవుడు తన్నుతాను రుజువుపరచుకొనుచున్నాడు. ఏమిటది? దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే అనునది వాస్తవము. ఆ తెలుపు… దానిని ఎందరు చూచిరి? ఆయన పైనున్న తెల్లని విగ్గు, ప్రకటన 1లో మనము మాట్లాడుకొన్నట్లుగానే. చూడండి, ఆ మహోన్నత దైవమును, మహోన్నత అధికారము! ఏ ఇతర స్వరము లేదు, ఏ ఇతర దేవుడు లేడు, ఏ ఇతరమైనదియు లేదు. "దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది." దేవదూతలే ఆయన యొక్క విగ్గు. ఆమేన్.
MATT 24:24•
MARK 13:22•
LUKE 17:30•
REV 10:7
72సన్-సెట్ కొండ పై ఏమి జరిగెను? దేవుడు తన మాటను స్థిరపరచుచున్నాడు. ఈ శబ్దమంతయూ దానిని గూర్చియే. గమనించండి. అది దేవుడు మరల తన వాగ్దాన వాక్యమును నెరవేర్చుటయే, ప్రకటన 10:1 నుండి 7 వరకు గల: "ఏడవ దూత బూర ఊదు కాలములో దేవుని మర్మమంతయూ సమాప్తమగును." ప్రకటన 10:1 నుండి 7 వరకు గల దాగియున్న మర్మము చివరి సంఘ కాలమునకు, చివరి వర్తమానము. "మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములలో," అను లూకా 17:30లోని మాట ఈ కాలములో సరిగ్గా నెరవేరుచున్నది.
"మరియు అబద్ద ప్రవక్తలు, అబద్ద క్రీస్తులు లేచి, గొప్ప సూచక క్రియలు, అద్భుతములు చేయుదురు. సాధ్యమయితే, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చెదరు." ప్రజలు ఇంకా సందేహములోనే యున్నారు. మరియు యధావిధిగానే సంఘము ఆశ్చర్యములో ఉన్నది.
73టుసాన్ అంతటిలోను ఉన్న సైన్సు వారు వ్యాసములు వ్రాసి పత్రికలో ప్రచురించుచున్నారు. ఆ వెనుక ఎక్కడో ఉన్న లేమ్మన్ కొండ పైన మనము నిలబడియున్న చోట నుండి ఎక్కడ నుండి అది లేచినదో, ఆ పెద్ద కెమెరాలు చూడలేకపోయినవి; పశ్చిమంగా సాగిపోతూ వెళ్ళుచున్నవి, సమయము గతించినదని చూపించుచున్నది. అక్కడున్న ఆ చిన్న భాగము తప్ప మరేదీ వెళ్ళజాలదు; అది పశ్చిమ తీరాన ఉన్నది. అది వెళ్ళిన మార్గంలోనే తీర్పు తాకినది. ఫీనిక్సు నుండి అడ్డంగా ప్రేస్కాట్ మరియు పశ్చిమతీర కొండల వైపుగా అది వెళ్ళినది… వారెక్కడికి వెళ్ళుచున్నారు? నేరుగా అలాస్కాలోనికి వెళ్తున్నది, అది ఉరుముతూ, ఆ వైపుగానే కదిలిపోతున్నది.
NUM 24:17•
MATT 2:2
74ఆ టుసాన్ లో నున్న పరిశోధనా సంస్థలు ఇంకా మున్నగునవి ఇప్పటికి అడుగుచునే యున్నవి. అది ఏమిటో సైన్సు పరిశోధన కనుగోన ప్రయత్నించుచున్నది. అంత ఎత్తున పొగమంచు గాని, హిమబిందువులు గాని, అట్టిది మరేది ఉండజాలదు. "ఏమిటది? అదెక్కడున్నది?" "యూదుల రాజుగా, వుట్టిన వాడెక్కడ?" అని అడుగుతూ, నక్షత్రమును వెంబడించి వచ్చిన జ్ఞానులు చూచిన వెలుగు వలెనే, అక్కడ ఆకాశములో ఆ సహజాతీతమగు వెలుగు వ్రేలాడుట చూచి వారు ఆశ్చర్యపడుచున్నారు. ఏమిటది? దేవుడు తన మాటను నెరవేర్చుచున్నాడు: "యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయించును."
75సాయంకాల సమయమున, సాయంకాలపు వెలుగు ఉండునని పరలోకమందున్న దేవుడు వాగ్దానము చేసెను. మూడు సంవత్సరము క్రితము ఈ మర్మము ఒక ప్రవచనమైయుండెను, "అయ్యా, ఇది ఏ సమయం?" అయితే ఇప్పుడు ఇది ఒక చరిత్ర. అది జరిగిపోయెను. వాగ్దానము నెరవేరినది. "అయ్యా, ఇది ఏ సమయం?" మరియు ఈ ఆకర్షణ ఏమిటి?" దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు! ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు.
మనము ప్రార్థించుదము:
GEN 18:2,13•
MAL 4:5,6
76ప్రియ దేవా, నేను జనులను అనుకొన్నంతటికంటే ఎక్కువసేపు నిలిపియుయుంచాను. ప్రజలు ఎక్కడున్ననూ అర్థము చేసికోగలుగునట్లుగా నేను చెప్పిన లేదా చేసిన దానిని చేయుమని, దేవా ప్రార్థించుచున్నాను. చూచుట మరియు అర్థము చేసికొనుట ద్వారా వారు నీవు క్రీస్తువనియు, స్థిరపరచబడిన వాక్యములు తగిన రుతువులో పరిపూర్ణముగా నేరవేర్చబడిన ఆయన వాక్కు యొక్క నిశ్చయత అనియు వారు విశ్వసించునట్లు కృప చూపుము.
ఇప్పుడు, ప్రభువైన యేసూ, లోకము సొదొమ స్థితిలో ఉండునని నీవు చెప్పితివి. దానిని మనము చూడగలమని మనకు తెలుసును. "సొదొమ దినములలో జరిగినట్లుగానే," అని నీవు ఆ రోజున చెప్పితివి, అన్యుల మరియు హెబ్రీయుల లోకమునకు నీవు అక్కడకు ముగ్గురు వర్తమానికులను పంపితివి, అందులో ఒకరు దేవుడే, మనుష్యకుమారుడు ఒక మానవ రూపములో బయలుపడి ఒక అద్భుతమును జరిగించెను. తన వెనుక నున్న గుడారములో శారా ఏమి చేయుచున్నదో అబ్రహాముకు చెప్పెను.
అన్యుల ప్రపంచమంతయూ సొదొమ స్థితిలోనుండినప్పుడు అది మరల పునరావృతమగునని నీవు చెప్పియున్నావు. ప్రభువా, మేము ఇచ్చటున్నాము. అదే విషయమును ఇతర ప్రవచనములును స్థిరపరచుచున్నవి. చివరి దినమున ఏలియాను పంపుటయు, భూమిమీద - ఏలియా ఆత్మ ఉండుటయు, తండ్రుల హృదయములను లేక "పిల్లల హృదయములను తండ్రుల తట్టు త్రిప్పుటకు వచ్చుననియు," చెప్పబడెను. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావను నీ మాటను ఈ ఘడియలో స్థిరపరచుమని, దేవా, నేను ప్రార్థించుచున్నాను. తండ్రి, అది అనుగ్రహించుము. వీరందరు నీవారు, ఈ దీవెనలు దయచేయుమని నేను ప్రార్థించుచున్నాను. చెప్పిన దానిని స్థిరపరచుము, దేవుని యొక్క మహిమ కొరకే చేయును. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
77మాట చెప్పుట మానవుని పని. మాటను స్థిరపరచుట దేవుని పని, ఏదో చెప్పుట ఒక పని; దేవుడు దానిని చేయుట మరొక పని. దేవునికి ఎట్టి అనువాదకుడు అవసరములేదు; ఆయన అనువాదమును ఆయనే చేసికొనును.
ఇప్పుడు మనము ప్రార్ధన వరుసను ఏర్పాటు చేయుటకు సిద్దపడుచున్నాము. దేవుని చిత్తమయితే రోగులకు ప్రార్థించుదుము. నిన్ను స్వస్థపరచకలిగిన పురుషుడుగాని, స్త్రీగాని, మానవుడు గాని, దేవదూత గాని లేదు, ఏదీ లేదు — ఎందుకనగా దేవుడు దానిని ఎప్పుడో చేసెను. ఆయన సిద్దము చేసెను; నీవు చేయవలసిన ఒకే ఒక్క కార్యము, దానిని స్వీకరించటయే.
78ఏ మనుష్యుడూ, ఏ దేవదూత, ఎవ్వరూ, దేవుడు సహితము నీ పాపములను క్షమించజాలడు, ఎందుకనగా అది ఎప్పుడో జరిగిపోయినది. యేసు సిలువ నొద్ద దానిని చేసెను. కాని దానిని నీవు అంగీకరించువరకు నీను ఏ విధముగాను లాభము చేకుర్చదు… లేదా లాభము పొందవు, చూచారా.
చేయబడవలసినది ఒక్కటే యున్నది, దేవుని ద్వారా ఆజ్ఞలు ఇయ్యబడినవి. విశ్వాసులు రోగుల మీద చేతులుంచవలెను. ఎన్నో ఉజ్జీవములలో, ఆయా యుగములు నుండి ఆలాగు జరుగుతూ వచ్చినది. దానిని వారు దేవుడు అని పిలిచిరి.
79అబ్రహాము చాల గురుతులను చూచెను. కాని అబ్రహాము తాను చివరి సూచన చూచు కాలము ఒకటి వచ్చెను, అది సొదొమ దహించబడుటకు ముందుగా, దేవుడు తన్ను తాను ఒక మానవ రూపములో ప్రత్యక్షపరచుకొనెను. దానిని నీవు నమ్ముదువా? అది తిరిగి పునరావృతమగునని యేసు చెప్పెనా?
80ఇప్పుడు, ఎందరిక్కడ… బయట రేడియోలోను… లేక దేశములో టెలిఫోనులలోను వినుచున్న మీరందరునూ ఇప్పుడు ప్రార్థనకు సిద్దపడండి, ఇక్కడ చేతిరుమాళ్ళు ఉంచబడిన వారికొరకును ప్రార్థించబడును. ఏమి చేయవలెనో నేను దేవునికి చెప్పలేను. చెప్పలేను. ఆ విధంగా ప్రయత్నము చేయుట కూడా నాకు దూరమగును గాక. ఆయన సార్వభౌముడు, ఆయన తనకిష్టమైనది చేయును. నేను కేవలము ఆయనకు లోబడి ఆయన చెప్పినది మాత్రమే చెప్పగలను.
81ఇప్పుడు, జనులు గోడల చుట్టూ నిలబడియున్నారు; వారు క్రిక్కిరిసియున్నారు. "అంతా ఉక్కిరి బిక్కిరిగా యున్నది. మనము దేవునిని, "ఈ ఆకర్షణ ఏమిటి?" అను మాటలపై అడుగుదము. దేవుడు మరల మనమధ్య సంచరించునట్లుగా (ఇక్కడ క్రొత్తవారు ఊండి యుండవచ్చును), మనమధ్య ఆయన తన ధన్యకరమగు ముఖము చూపించునట్లుగాను, ఇక్కడ ఆయన ఆత్మను కనుపరచునట్లుగాను — ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చూపించునట్లుగాను, ఆలాగున దానిని మనము నమ్మకలుగునట్లుగాను, మనలో ప్రతి ఒక్కరు దానిని నమ్మవలెను. (ఈ రెండు బలమైన వర్తమానముల) పిదప ఆలాగు మిరు చేయగలరా? మంచిది.
82అయితే వేడిగా, క్రిక్కిరిసి గోడల ప్రక్కల నిలబడియున్న ఈ సమయములో ప్రార్థనా వరుసను పిలచుటకు బదులుగా… నా ప్రార్థన వరుసను పిలచుటకు నేను ఇటు వైపుగా చూచెదను; అక్కడ నిలబడియుండి మీరది చేయజాలరు. ఈ మార్గము నుండి నేను పిలువ వచ్చునా? రోగులు, మంచములు అన్ని చోట్ల పడియున్నవి, మీరది చేయలేరు. కనుక ఉన్న చోటనే, కూర్చోండి, మరియు దేవుని విశ్వసించండి. మీకు ప్రార్థన కార్డు ఉన్నచో, దానిని పట్టుకొని యుండండి; అది మంచిది. వరుసగుండా మీరు రాగోరినచో మేము మీ యొద్దకు వత్తుము. అయితే ప్రార్ధన వరుస గుండా మీరు రానవసరములేదు.
83ఆ షెపర్డు అను ఆయన గత ఆదివారము రాత్రి ఏ వరుస గుండా రాలేదు. అతనికి ప్రార్థన కార్డు ఉందని కూడా నేను అనుకోను. ఈ రాత్రి శ్రీ. షేపర్డు ఇచ్చటున్నాడా? ఎక్కడాయన? ఇక్కడున్నాడా? ఆయన వెనుకన ఉన్నాడు. షెపర్డు గారూ, మీరు ప్రార్థన కార్డును కలిగి ఉన్నారా? మీకు లేదు? ఆయనకు లేదు, ఈ రాత్రి తిరిగి ఆయన అక్కడే కూర్చొని యున్నాడు. ఉండుటకు అదే మంచి స్థలము, సహోదరుడా షెపర్డు.
HEB 4:15
84అక్కడ మీరు ఉండుట మాత్రమే కాదు గాని విశ్వాసము కలిగియుండాలి. ఎందుకనగా గుర్తుంచుకొనండి, ఒక దీన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినది. ఆయన దానిని ఎరిగెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలోని హెబ్రీ పత్రిక చెప్పినదేమనగా, ఆయన ఒక ప్రధానయాజకుడు. ఈ రాత్రి నీ యొక్క బలహీనతల యొక్క తాకిడి ద్వారా ఆయనను తాకవచ్చు." దానిని నీవు నమ్ముదువా? అయితే విశ్వాసము కలిగియుండు! దానిని సందేహించవద్దు! దానిని నమ్ముము. అది నెరవేరును. నీవు అడిగిన దానినే నీవు పొందుదువు, నీవు నమ్మినచో జరుగును. కాని నీవు దానిని నమ్మవలెను. ఆలాగు నీవు చేయుదువా? దానిని మీరందరూ నమ్ముదురా? ఇప్పుడే ఎందరు నమ్మెదరు? దేవుడు మిమ్మును దీవించును గాక!
మీరు ఎవరు ఎవరో నాకు తెలియదు; మీలో ఎవరిని నేనెరుగను. మీలో ఎవరినీ ఎరుగుట నా పని కాదు; వీటన్నింటినీ ఎరుగుట దేవుని పని. కాని నీవు దానిని నమ్మినచో ఆయన దానిని చేయును. ఇప్పుడే దానిని నీవు నమ్మెదవా?
85ఇప్పుడు, ప్రియదేవా, నిశ్చయంగా మేము ఒక సంకరపు క్రైస్తవుల గుంపుము కాము. గారాబముతో, అల్లారు ముద్దుగా పెంచబడవలసిన వారము మేము కాము. అట్టివారిని ప్రభువా, నీవు కలిగియుండవు. నీకు కరకైన విశ్వాసులున్నారు. దేవుని సన్నిధియే ఒక మనుష్యుని ఆత్మను మండించును. అబ్రహామువలె, అతడు దేవుని నమ్మెను. నిన్ను నీవు అతనికి తెలియచేసికొనియున్నావు; ఆ తరువాత నీవు అతనికి ప్రత్యక్షమై ఒక సూచనను జరిగించియున్నావు, మరియు అతడు నిన్ను నమ్మెను. నీవు అతని శరీరమును తిరిగి యవనత్వమునకు మార్చితివి. అతని భార్యను కూడాను, అతని భార్య అతని స్వంత శరీరములో భాగము. అపుడు కొత్త బిడ్డ, వాగ్దాన పుత్రుడు జన్మించెను.
86దేవా, ఈ దినమున కూడా అదే జరుగునని నీవు వాగ్దానము చేసితివి. ఈ వాక్యమును నీవు స్థిరపరచుదువని నిన్ను ప్రార్థించుచున్నాను. అక్కడున్న ఆ ఒక్క వాగ్దానము మీదనే మేము పని చేయుదుము. అది సొదొమలో ఉండినట్లుగానే ఉన్నది. సొదొమ దహించబడుటకు ముందుగా, సొదొమను తీర్పు తాకుముందుగా ఆ అన్యప్రపంచమునకు తీర్పు తీర్చబడు ముందుగా ఉన్నట్లే ఉన్నది. కనుక తీర్పు అన్యుల ప్రపంచమునకు రానైయున్నది. యూదులకు శ్రమల కాలము మూడున్నర సంవత్సరములున్నది. యాకోబు శ్రమ, దానియేలు యొక్క డెబ్బది వారముల కొనసాగింపు. కాని అన్యులు లెక్కించబడిరి; అది వెళ్ళిపోవలసిన సమయము. నీవు ఆ గురుతును ఇమ్ము, మరియు అది మరల జరుగునని నీవు చెప్పితివి. దేవా, దానిని అనుగ్రహించుము. మేము నీ చేతులలో ఉన్నాము; నీవెట్లు తగుదుమని చూతువో అట్లే మాతో పనిచేయుము. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
MARK 9:23
87ఇప్పుడు, ఉద్రిక్తతగా ఉండకండి. నేను ఉద్రిక్తతగా నుండినచో ఎట్లుండును? ఇప్పుడు నేను ఇక్కడ దేవుని సార్వభౌమత్వముపై ఆధారపడి యుండు ఒక పనిని చేయుచున్నాను. కాని ఎందుకు నేను దీనిని చేయుచున్నాను? ఆలాగుండునని ఆయన చెప్పెను. అదే దానిని స్థిరపరచును. మీ యెదుట ఆలాగున ఆయన దానిని స్థిరపరచినచో మీరు ఆయనను నమ్మరా? నిశ్చయంగా, ఇప్పుడు మీరు కేవలము విశ్వాసము కలిగియుండి నమ్మండి. నన్ను చుట్టూ చూడనీయండి. పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపించునో, ఆయన ఏమి చేయునో చూడనీయండి. ఆయన ఏమి చేయునో నాకు తెలియదు; అది ఆయన పని. కాని మీరు కేవలము విశ్వాసము కలిగియుండినచో, కేవలము నమ్మినచో, "నమ్మువానికి సమస్తము సాధ్యమే." దానిని నమ్మువారలందరూ చేతులు పైకెత్తి, "నేను దానిని నమ్ముచున్నాను," అని చెప్పండి. [జనసమూహము, "దానిని నేను నమ్ముచున్నాను," అని చెప్పిరి.] నా పూర్ణహృదయముతో నేను దానిని నమ్ముచున్నాను.
LUKE 17:30•
JOHN 4:7•
HEB 13:8
88ఇప్పుడు, మూడు అనునది ఒక స్థిరత్వమునకు సూచన. ఆయన మూడుసార్లు నేరుగా చేసినప్పుడు అది సరియని రుజువు చేయుచున్నాడు. నీవు ఎక్కడున్నను, ఎవరివైననూ, నాకు అక్కరలేదు. కేవలము నీవు విశ్వాసము కలిగియుండి నమ్ముము. ఇపుడు, అస్థిరత్వముతో ఊగిసలాడవద్దు.
ప్రార్ధించుచున్న ఆ స్త్రీని నేను ఎరుగను. నీవు ఉన్నచోటనే కూర్చొనియుండు. నీవు రానవసరము లేదు. నిన్ను నేను ఎరుగను కాని నీవు నీ చేతిలో ఒక చిన్న పిల్లను పట్టుకొనియున్నావు… లేక నీ ఒడిలో ఉన్నది. నేను పూర్తిగా నీకు కొత్త వ్యక్తివి. ఆ చిన్న పిల్ల మామూలుగానే, బాగానే కనబడుచున్నది. ఆ పిల్ల చక్కగా అందముగా ఉన్నది. కొద్దిగా ఎర్రని జుట్టు గల పిల్ల. ఇక్కడ నేను ఆమె వైపు చూస్తున్నాను. ఆమె అంగవైకల్యము లేక మరేదో కలిగియున్నట్లుగా నాకు కనబడుట లేదు. ఆమె యొక్క వ్యాధి ఏమిటో నాకు తెలియదు. బహుశా ఆ బిడ్డ కొరకు నీవు రాలేదు గాని, నీ కొరకే వచ్చియుందువు. కాని నీవు అక్కడ బిడ్డను పట్టుకొని కూర్చొని ప్రార్థించుట నేను చూచాను. నీ ఆత్మను పట్టుకొనుటకు నేను ఒక్క నిమిషము నీతో మాట్లాడవలసియున్నాను. యేసు ఆ స్త్రీతో మాట్లాడి, "నాకు దాహమునకిమ్ము," అని అడిగినట్లుగానే, చూచారా, ఒక్క మనిషిని గుర్తించుటకు సహోదరుడు బ్రయంట్ తదితరులు ఇక్కడ కూర్చొనియున్నారు, ఇక్కడ కూర్చొనియున్న వీరిని నేను ఎరుగుదును. వారు కూడా అవసరతలో యుందురు, అయితే నీవు ఒక క్రొత్త వ్యక్తివి.
నన్ను దేవుని ప్రవక్తగా నీవు నమ్ముచున్నావా? ఈ రాత్రి నీవు వినిన సంగతులు సత్యమని నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు దేవుడు నీవు చేసిన కొన్ని సంగతులు లేదా చేయకుండవలసిన సంగతులు, లేదా నీ వ్యాధిని, నీ కోరికను బయలు పరచినచో, అది నిజమో కాదో నీవు ఎరుగుదువు, అవునా? ఆయన ఆలాగు చేసినచో, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండి, తన మాటను స్థిరపరచుచున్నాడనియు, లూకా 17:30 ప్రత్యక్షపరచబడుచున్నదనియు మీరు గ్రహించరా? దానిని మీరు నమ్ముదురా?
89ఇప్పుడు, ఆ స్త్రీ మేము క్రొత్తవారమని చేతినెత్తి చూపెను. నిన్ను నేను ఎరుగను, కాని ఆమె ఆత్మను ఒక వ్యక్తిని సంధించుటకు నేను ప్రయత్నించుచున్నాను. మీలో చాలామంది లాగుచున్నారు. ఇప్పుడు, మీరు దీనిని పూర్ణహృదయముతో నమ్మండి. ఇప్పుడు అది చిన్న బిడ్డ కొరకు. నీ కొరకు కాదు. నీవు ఉద్రిక్తతతో ఉన్నావు గాని నిన్ను భాధించునది ఆ నరముల ఒత్తిడి కాదు. నీ హృదయములో నున్న గొప్ప విషయము, ఆ చిన్న పిల్ల. అదేమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముదువా? దానిని నీవు నమ్మెదవా? అది నీకు సహాయపడునా? అప్పుడు నీవు నమ్మెదవా? అది ఒక మెదడు గాయము. నిజమేనా? నీ చేతిని ఇప్పుడు ఆ చిన్న బిడ్డ తల మీద ఉంచుము.
MARK 9:23•
MARK 16:17,18
90ప్రియదేవా, నీ విట్లు చెప్పితివి, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు బాగవుదురు." ఈ స్త్రీ ఒక విశ్వాసి. ఆమె చేతులు బిడ్డ మీద ఉన్నవి. ఆ పిల్ల బాగవును గాక! యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అర్పించుచున్నాను. ఆమేన్.
ఇప్పుడు మీరందరును నమ్ముచున్నారా? నమ్ముట నీవలనైతే, సమస్తమును సాధ్యమే. నిశ్చయంగా!
ఆమె ప్రక్కన కూర్చొనియున్న స్త్రీని నేనెరుగుదును. కాని ఆమె బహు యధార్థముగా అటువైపు చూస్తున్నది. ఆమె పేరు నాకు తెలియదు, కాని నేను… ఒక్క నిమిషము నేను ఆమెవైపు చూచినచో, నాకు తెలియును. కాని చూపులను బట్టి నేనా స్త్రీని ఎరుగుదును, ఆమె బాధను నేను ఎరుగను. నీ బాధ ఏమిటో దేవుడు నాకు తెలియచేయునని నీవు నమ్ముచున్నావా? నీవు… అది నీకు సహాయపడునా? షుగర్ డయాబిటిస్. ఇప్పుడు, అది నిజమైనచో, నీ చేతిని పైకెత్తుము. నిశ్చయంగా!
నీ ప్రక్కన కూర్చొనియున్న స్త్రీ కూడా అదే కలిగియున్నట్లుగా ఉన్నది. ఆమె ఒక క్రొత్త వ్యక్తి, మరియొక స్త్రీ ఎవరి కొరకో, ఒక కుంటి పిల్ల కొరకు ప్రార్థించుచున్నది. దేవుడు దానిని అనుగ్రహించునని నీవు నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా?
91ఇక్కడ వెనకన ఎవరో ఉన్నారు. అక్కడ కూర్చొనియున్న ఆయన సిగరెట్లు త్రాగుట నుండి విడుదల పొందవలెనని ప్రయత్నించుచున్నాడు. దేవుడు వాటి నుండి నిన్ను దూరపరచుసని నమ్ముచున్నావా? సరే, మంచిది. నీవు నమ్ముదువా? దానిని నీవు పొందగలవు? ఆ వ్యక్తిని నా జీవితములో ఎన్నడూ నేను చూడలేదు.
ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఒక మంచముపై ఉన్న దానిలో లేక ఒక కుర్చీలో పడియున్న ఒక వ్యక్తి పై ఇక్కడ ఆ నల్లని చీకటి ఛాయ వ్రేలాడుచుండుట చూస్తున్నాను. అతడు మరణించుచున్నాడు. అతడు చీకటితో కమ్మబడియున్నాడు. అతనికి కాన్సరు వ్యాధి. ఎన్నడూ ఆతనిని నేను ఎరుగను, చూడలేదు. నీ గూర్చి దేవునికి సమస్తమూ తెలియును. అది నిజమండీ! నీ గూర్చి దేవుడు ఏదైనా చెప్పునని నీవు నమ్ముచున్నావా? నీ స్వస్థతను పొందుటకు అది నీకు దోహదపడునా? నీవు ఒక స్నేహితుని ద్వారా ఇక్కడకు తీసికొని రాబడితివి. నీవు ఇక్కడ నుండి రాలేదు గాని మరోచోట నుండి అనగా, ఎక్కువ నీరుండి, ప్రజలు చేపలు వేటాడు స్థలము నుండి వచ్చావు. అవును, ఆల్బనీ, కెంటకీ. అది నిజము. నీవు నమ్ముదువా! దానిని తప్పక నీవు నమ్మవలెను. అది నీ కొరకు జరిగినదని నమ్ముము. నీవు నమ్మేదవా?
92టెన్నిస్సి నుండి వచ్చిన నీవు ఉబ్బసముతో ఉన్న ఒక అబ్బాయిని కలిగియున్నావు. అబ్బాయి ఇక్కడ లేడు, అతడు బాగవునని నీవు నమ్మెదవా? అయితే నీవు నీ చేతిరుమాలును నీ చేతితో అతని యొద్దకు తీసికొని పొమ్ము, దానిని నీవు నమ్మినచో అతడు బాగవును.
అక్కడ డాక్టర్ వైల్ కు దగ్గర్లో కూర్చొనియున్న స్త్రీ ఏడ్చుచున్నది. ఆమె పైన కూడా ఒక నల్లని ఛాయ కమ్మినది, నా జీవితములో ఎన్నడూ నేను ఆ స్త్రీని చూడలేదు, కాని ఆమెకు కాన్సరు ఉన్నది. ఆమెకు ఏదో చేయనిచో ఆమె చనిపోవును. ఓ స్త్రీ, ఆయన నిన్ను బాగు చేయునని నీవు నమ్ముచున్నావా? నమ్మగలవా? నీవు కేవలము నమ్మినచో, నీవు నీ స్వస్థతను పొందుకోగలవు.
అక్కడ ఒక చిన్న స్త్రీ కూర్చొనియున్నది. ఆమె వెనుకన ఒకామె నోటి మిద చేతిరుమాలు ఉంచుకొనియున్నది. ఆమె కూడా కడుపులో పుండు కలిగి వ్యాధిగ్రస్తురాలయినది. నీకు వాంతులు వచ్చి, కళ్ళు చీకటయి పోయి పడిపోవుచున్నావు, ఎవరో నిన్ను ఇక్కడకు తీసికొని వచ్చారు. నీకు స్త్రీ వ్యాధి యున్నది. నీవు విశ్వసించినచో, బాగుపడి ఇంటికి వెళ్ళగలవు.
HEB 13:8
93యువకుడవగు నీవు ఒక కొత్త వ్యక్తివి. నా ముందు ఇక్కడే కూర్చొనియున్నావు. నావైపు చూస్తున్నావు, ఏమిటి నీపు, ప్యూర్టో రికనా లేక మరేదయినానా? [స్పష్టతలేని మాటలు.] నేను నీకు క్రొత్త వ్యక్తిని, నీకది తెలియును; నీవు మా దేశస్థుడవు కూడా కాదు. కాని నీ హృదయ వాంఛను దేవుడు తీర్చునని నీవు నమ్ముచున్నావా? నీ కోరిక ఏమిటో నేను చెప్పినచో దానిని నీవు పొందెదవా? నీవు పరిశుద్ధాత్మ బొప్తిస్మమును వెదకుచున్నావు, అది నిజము. నా సోదరుడా, పరిశుద్ధాత్మను పొందుము.
ఇక్కడే ఆ వెనుకన ఒక నల్లరంగు సోదరుడు కూర్చొనియున్నాడు. తన హృదయములో ఒక భారము కలిగియున్నాడు. అది తన భార్య నిమిత్తము. ఆమే ఇక్కడ లేదు. ఆమెకు తన కాలిలో ఏదో బాధయున్నది. ఆయన ఆమెను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా? నీవు ఇక్కడ ఒక క్రొత్త వ్యక్తివి. నీవు ఆ సముద్రము ఆవలి నుండి వచ్చావు. నీవు జమైకా నుండి వచ్చావు. నీవెవరవో దేవుడు నాకు చెప్పునని నమ్ముచున్నావా? శ్రీ. బ్రాడెన్. నీవు నమ్ముదువా? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా యున్నాడు
94అక్కడున్న శ్రీమతి. రైట్ ప్రక్కన ఈ చివరన కూర్చొని యున్న ఆ స్త్రీ తన హృదయములో ఒక భారము కలిగియున్నది. ఆమె తన కుమార్తె కొరకు ప్రార్థించుచున్నది. ఆమె ఒక శస్త్ర చికిత్సకు గురియగుచున్నది, ఆమె కొరకు నీ పూర్ణహృదయముతో నీవు నమ్మెదవా? నీవు ఆమెను నమ్మునట్లు చేసినచో ఆమెకు శస్త్ర చికిత్స అవసరముండదు. నేను బాగు చేయలేను.
ఆ వెనుక ఏక్కడో ఉన్న నర్సరీలో ప్రభువు యొక్క ఆత్మను లేక దేవదూత, ఒక వెలుగు కదలుట చూచుచున్నాను. అది ఒక యవ్వన స్త్రీ మీద ఆమెకు ఒక ఆత్మీయ సమస్య ఉండి వ్యధ చెందుచున్నది. ఏదో రీతిగా ఆమెను నేను తెలిసికోవలసి యున్నాను. ఒక యువతి, ఆమె కూడా ఒక స్త్రీ క్రమమును తప్పిపోయినది. అవును. ఆమె పేరు శ్రీమతి. వెస్ట్, అలబామా నుండి వచ్చెను. శ్రీమతి. డేవిడ్ వెస్ట్. నమ్ముము, మరియు దేవుడు నీకు దానిని అనుగ్రహించును.
MARK 9:23
95"మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున వెలుగు కలుగును." ఆ యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా యుండనిచో దాని గూర్చి అసలు నాకేదీ తెలియదు. దానిని నీవు నమ్ముచున్నావా? నమ్మువానికి సమస్తమూ సాధ్యమే.
ఇప్పుడు దేశములోను ఈ ఆలయములోను ఉన్న మైక్రో ఫోనుల మీద వినుచున్న వారిలో ఎందరు తమ చేతులెత్తి, "నేను విశ్వాసిని," అని చెప్పగలరు? ఇప్పుడు బయట ప్రదేశములో ఉన్నవారు; ఇక్కడున్న వారందరూ తమ చేతులెత్తారు. ఎక్కడో దేశపు మారుమూలలున్న మీరు కూడా చేతులేత్తారని నిస్సందేహాముగా నమ్ముచున్నాము. ఇప్పుడు మీరు మీ కండ్లు మూసికొనండి. మీ దగ్గర్లోనే యున్న ఒకరిపై మీ చేతులను ఉంచండి. వారి చేతిని మీరు పట్టుకొనండి. దానిని వారి భుజము మీద ఉంచండి. నేను నా చేతులను చేతిరుమాళ్ళు మీద ఉంచుచున్నాను. ఈనాడు జరిగినది చూడండి! ఇప్పుడు జరుగుచున్నది చూడండి:
ఆయన ఘనమగు ముఖమును చూచుచూ
దైవిక పేమతో ప్రకాశించుచున్నది;
ఆయన కృపలో ధన్యకరమగు పాలిభాగస్థులుగా,
ఆయన కిరీటములో మణులుగా వెలుగొందుదుము.
ఇప్పుడు ప్రార్థింతము. అన్నిచోట్లనూ, ప్రార్థించుదము.
JOHN 1:42•
JOHN 4:16-18,25,26
96ప్రియ దేవా, ఘడియ సమీపించినది. దీని భావమేమిటి? దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు! ప్రభువా, ఆకర్షణ ఏమిటి? అది దేవుడు తన వాక్యమును నెరవేర్చుటయే. దేశమంతటనూ టెలిఫోను పరికరము ద్వారా, వందలాది మంది జనులు ఒక తీరము నుండి మరొక తీరము వరకు, ఉత్తరము నుండి దక్షిణము వరకు, తూర్పు నుండి పడమర వరకు చేతులు ఒకరిపై ఒకరుంచుకొనుట ఏమిటి? ఇక్కడ విదేశముల నుండి ప్రజలు వచ్చి కూర్చొన్నారు. అనేక దేశములు, మెక్సికో, కెనడా నుండి వచ్చారు. మేము ఒకరిపై ఒకరము మా చేతులుంచుకొన్నాము. దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు!
ఆయన సీమోను పేతురును చూచి, "నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడవు," అని చెప్పినట్లుగా ఇక్కడ ఒక మనిషి నిలబడి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పుట ఎట్లు జరుగుచున్నది?
"వెళ్ళి నీ భర్తను తీసికొని ఇక్కడికి రమ్ము."
"నాకు పెనిమిటి లేడు."
"నిజమే, నీకు అయిదుగురున్నారు."
"మెస్సీయా వచ్చి ఈలాగు చేయునని నేనెరుగుదును, కాని నీవెవరవు?" అని ఆమె అడిగినది.
"నేనే ఆయనను," అన్నాడాయన.
ZECH 14:7•
MAL 4:5,6•
MARK 16:17•
JOHN 14:12•
HEB 13:8
97నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. వీవు వాగ్దానము చేసితివి, "నేను చేయక్రియలు మీరును చేయుదురు. వీటికంటే గొప్పవియు చేయుదురు, ఎందుకనగా నేను, నా తండ్రి యొద్దకు వెళ్ళిపోవుచున్నాను. ఇదిగో, చివరి దినములలో ప్రవక్తయగు ఏలియాను నేను పంపుదును. అతడు ప్రజల యొక్క ఆలోచనలను మళ్ళించును, పిల్లలు యొక్క హృదయములను బైబిలు యొక్క అపోస్తలుల బోధవైపుకు తిరిగి త్రిప్పును. సంధ్యా కాలమున వెలుతురు కలుగును."
గొప్ప పరలోకపు తండ్రీ, ఇదిగో మేము ఇక్కడున్నాము. ఆ ఘడియ ఇక్కడున్నది! ప్రజల మీద చేతులున్నవి.
సాతానా, నీవు ఓడిపోతివి. నీవు ఒక అబద్దికునివి. దేవుని సేవకునిగా, దైవదాసులముగా, నీవు దేవుని మాటకు లోబడి జనులలో నుండి వెడలిపో అని మేము యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాము, ఎందుకనగా "నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు," అని వ్రాయబడియున్నది.
ప్రజలందరూ విడుదల పొందవచ్చును. ప్రియదేవా, దానిని అనుగ్రహించుము. దయ్యము యొక్క సమస్త క్రియలను, వ్యాధులను, రోగములను ఆ రోజున కల్వరి కొండ మీది ఆకర్షణతో ఓడగొట్టిన పరలోకపు తండ్రివి నీవు. నీవు దేవునివి! నీవు పొందిన దెబ్బల వలన జనులు స్వస్థత పొందియున్నారు. వారు స్వతంత్రులు. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
98దేవా, దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉండగా, యేసుక్రీస్తు యొక్క అభిషేకము జనుల పైన ఉండగా, ఆయన వాగ్దానము చేసిన గొప్ప సూచక క్రియలు నెరవేరుచుండగా, భూమి కంపించుచుండగా, భూకంపములు సంభవించుచుండగా, ఆయన చెప్పిన గొప్ప గురుతులు, లేఖనములు నెరవేరుచుండగా, సాయంకాలపు వేలుగు ప్రకాశించుచుండగా ఇక్కడ ఈ చేతిరుమాళ్ళు ఉంచబడియున్నవి. తూర్పు, పడమర, ఉత్తరము, ధక్షిణముల నుండి వచ్చిన విశ్వాసుల యావత్తు శరీరమునకు ప్రాతినిధ్యము వహించుచున్న ఈ చేతి రుమాళ్ళపై నేను నా శరీరమును ఉంచియున్నాను. దయ్యముతో ఈలాగు చెప్పుచున్నాను, "యేసుక్రీస్తు నామములో ఇవి ఏ రోగిపై ఉంచబడునో, ఆ రోగిలో నుండి బయటకు వెళ్ళిపొమ్ము!" దేవుని యొక్క వాక్యమునకు ఘనత మహిమ కలుగును. దేవుని యొక్క వాక్యము యొక్క నామములోను, నజరేయుడగు యేసుక్రీస్తులోను అడుగుచున్నాము.
99ఇప్పుడు, నెమ్మదిగా, ప్రశాంతంగా, మెళకువగా, మీ యొక్క సరియైన మనస్సుతో విశ్వాసులుగా, యేసుక్రీస్తు నామము పేరట సర్వశక్తుడగు దేవుని నుండి మీ స్వస్థతను ఇప్పుడు మీరు నమ్మి అంగీకరించుచున్నారా? ఆలాగయినచో మీ హస్తమును పైకి ఎత్తండి, ఏ స్థలములో ఉన్నా సరే, అక్కడే మీ చేతులు పైకి ఎత్తండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తి నేను చూడకలిగినంత మేరకు తమ చేతులు ఎత్తియున్నారు; బయట, లోపల, కిటికీల ప్రక్కన, ద్వారములందు, నర్సరీలోను, అన్నిచోట్లనూ. ప్రజలు తమ చేతులు ఎత్తియున్నారు. దానిని వారు అంగీకరించి యున్నారు, సాతాను ఓడిపోయినది! యేసుక్రీస్తు యొక్క దెబ్బలు మిమ్మును స్వస్థపరచినవి. ఆయన నేడు సజీవునిగా ఉన్నాడన్న వాస్తవమును యేసుక్రీస్తు సాన్నిధ్యము రుజువు పరచుచున్నది. ఆయన చేసిన ప్రతి వాగ్దానమును ఎన్నడును ఆయన నెరవేర్చక మానడు. ఆమేన్! నేనాయనను నమ్ముచున్నాను. మీరు నమ్మరా?
100ఇప్పుడు మనము లేచి నిలబడుదము. ప్రభువైన యేసు నామములో చేసిన లేదా చెప్పిన ప్రతి దానిని అంగీకరించుము. మన హృదయమంతటితో మనమాయనను ప్రేమించుదము. మనలో ఉన్న సమస్తముతో ఆయనను గౌరవించుదము. ఈ రాత్రి ఇప్పుడు మీరు మీ వివిధ గృహములకు వెళ్ళనైయుండగా, దేవుడు మీతో వచ్చును గాక! మీరింకా పరిశుద్ధాత్మను కలిగియుండనిచో, దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చును గాక!
MATT 6:34
101ప్రతి స్త్రీ, పురుషుడు, బాలుడు, లేక బాలిక, ఇక్కడున్న ప్రతివారిలోను ఇంకా ఎవరైననూ యేసుక్రీస్తు నామములో ఇంకా బాప్తిస్మము పొందనిచో ఇక్కడ దుస్తులు, నీరు సిద్దముగా ఉన్నవి. నేడు చేయకలిగిన దానిని రేపటికి వాయిదా వేయవద్దు. "ఏనాటి కీడు ఆ నాటికి చాలును." అక్కడ సేవకులు నిలబడి ఎదురు చూస్తున్నారు. దుస్తులు ఎదురు చూస్తున్నవి. ఎట్టి సాకులు చెప్ప వీలులేదు. నీవు కనిపెట్టుచున్నావా? నీవాలాగున్నచో, నీవు నమ్మినచో… నీవొక వేళ చిలకరింపు, కుమ్మరింపు బాప్తిస్మము పొందినను అది లేక్కకు రాదు. అది తప్పు, వెలుగు వచ్చియున్నది. రా, నమ్ముము, బాప్తిస్మము పొందుము.
పరిశుద్ధాత్మ లేని ప్రతీవారు పరిశుద్ధాత్మను పొందుదురు గాక! మిలో ప్రతి ఒక్కరు పూర్ణ దైవశక్తితో, ఆయన నీకు వాగ్దానము చేసిన ప్రేమతో, ఆయనలో నూతన సృష్టిగా రూపొందుదురు గాక. దేవుడు మిమ్ము ఆశీర్వదించును గాక.
102ఇప్పుడు, మళ్ళీ వచ్చే ఆదివారము ఉదయము తొమ్మిదిన్నర వరకు అనేక సంవత్సరాల క్రితం మనం పాడుచుండిన ఈ చిన్న పాటను మనము పాడుకొందము:
కుటుంబ ప్రార్థనను మరువకుము,
యేసు నిన్ను అక్కడ కలిసికొనగోరును;
ఆయన నీ ప్రతి అక్కరను తీసివేయును,
కుటుంబ ప్రార్థనను మరువకుము,
ఇప్పుడు మనము దానిని కలిసి పాడుదము:
కుటుంబ ప్రార్థనను మరువకుము,
యేసు నిన్ను అక్కడ కలిసికొనగోరును,
ఆయన నీ ప్రతీ అక్కరను తీసివేయును;
ఓ, కుటుంబ ప్రార్థనను మరువకుము.
ఇప్పుడు, దానిని మనము తిరిగి పాడుచుండగా, నీ ప్రక్కనున్న యాత్రికునితో కరచాలనము చేయుము. చూడండి, దానిని మనము పొడుచుండగా:
కుటుంబ ప్రార్థనను మరువకుము,
యేసు నిన్ను అక్కడ కలిసికోగోరును;
ఆయన నీ ప్రతి అక్కరను తీసివేయును,
ఓ, కుటుంబ ప్రార్థనను మరువకుము.
103నీవాయనను ప్రేమించవా? నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును, ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను, కల్వరి కొండమీద నా రక్షణను కొనెను (అదే ఆకర్షణ). అదే ఆ సన్-సెట్ కొండ మీద, నెబో కొండ మీద, సీనాయి కొండ మీద, వివిధ శిఖరాగ్ర అనుభవములు - ఏడు. సరే, మంచిది, దానిని ఇప్పుడు పాడెదము:
నేనాయనను ప్రేమింతును, ఆయనను ప్రేమింతును
ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి మ్రాను మీద.
ఆయనను ప్రేమించువారందరూ, "ఆమేన్" చెప్పండి. ఇప్పుడు, ఆయన నీ కొరకు చేసిన దానిని కేవలము ఆలోచించుము, ఈ రాత్రి నీవు మద్య శాలలో ఉండి యుండినచో, ఎట్లుందువో తలంచుకొనుము. నావలె నీవును దేవుని కృపకు బయట ఉండి సమాధిలో బహుశా ఉండియుందువు. ఆయన నీ కొరకు ఏమి చేసెను? ఓ, ఆయనను ప్రేమించకుండా ఎట్లుండగలము? ఎవరు ఏమి చెప్పినా ఏమీ వ్యత్యాసము చేయదు, ఆయనే ప్రధమము!
104ఇప్పుడు మనము కండ్లు మూసికొని తలలు వంచుకొని ఆయనకు ఈ పాట పాడుదము. అయనకు పాటలు అంటే ఇష్టము, సంగీతములు పాడునప్పుడు వినుట ఇష్టము. ఇప్పుడు ఆయనకు దానిని మనము పాడుదము:
నేనాయనను ప్రేమింతును, ఆయనను ప్రేమింతును
ఎందుకనగా మొదట ఆయనే నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి మ్రాను మీద.
ఆయన సన్నిధిలో మన శిరములు, హృదయములు వంచి, మన కన్నులు చూచిన దాని బట్టి, మన చెవులు విన్న దాని బట్టి, దేవుని వాక్యములో నమోదయిన దానిబట్టి నేడు మనకు ఆయన వాగ్దానమును ఇచ్చుటను బట్టి కృతజ్ఞత కలిగియుందము. దేవుడు మిమ్మును దీవించును.
105ఈ రాత్రి మనతో ఒక అతిథి సోదరుడున్నాడు నెడ్ ఐవర్సన్. మొదట ఒక పెస్బిటేరియను సేవకుడు. ఆయన తండ్రి, అతడి సోదరులు ప్రేస్బిటేరియను పరిచారకులే. ఆయన నేడు యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందినాడని గ్రహించాను. ఆయన ఒక బోధకుడు, అందులోనివాడు. మీరు మీ ఇండ్లకు వెళ్ళుచుండగా, ఈ జనసమూహముపై ఆశీర్వచనములుండునట్లుగా, ఆయన దైవజనుడని నమ్మియున్నాను గనుక ఇప్పుడు ఆయనను ప్రార్థించుమని అడుగుచున్నాను.
సహోదరుడా ఐవర్సన్, ముందుకు రమ్ము, మనము ప్రార్థనకు తలలు వంచుదము. నా సోదరుడా, దేవుడు నిన్ను దీవించును.