ఈ దుష్ట యుగపు దేవత

ఈ దుష్ట యుగపు దేవత

1సహోదరుడు నెవిల్ మాట్లాడుచున్నాడు. - ఎడిటర్.

LUKE 24:32

 

2సమస్తము సాధ్యము, కేవలము నమ్ముము;

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలము…

మనము తలలు వంచుదం. ప్రియ పరమ తండ్రీ, మేము నమ్మగలుగుచున్నందులకై ఈ ఉదయకాలమున ఎంతో కృతజ్ఞులము. నీ కుమారుడగు యేసు చిందించిన రక్తము ద్వారా మేము ఆయున కృపలో భాగస్థులమైనాము. సిలువలో ఆయన మరణమునకు విధేయుడైనందున దేవుని కుమారులు, కుమార్తెలుగా మేము రూపొంది యున్నాము. ఆయనను, ఆయన పునరుత్థానమును నమ్ముటను బట్టి నీతిమంతులుగా తీర్చబడియున్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ మా హృదయములలో నివాసము చేయుచున్నాది.

మా ఆలోచనలు, మా గౌరవములు, మా భావములను పాటలు, సాక్ష్యములు, కీర్తనలు చదువుట వాక్యము చదువుట ద్వారా ఈ ఉదయమున పంచుకొనుటకై ఇక్కడకు వచ్చాము. ఈ తరుణము కొరకై కృతజ్ఞులము. ఈ ఘడియకు నిర్ణయించబడిన వర్తమానమును పరిశుద్ధాత్ముడు మాకందించుటకై నిర్మలముగా మేము కనిపెట్టుకొని యున్నాము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఈ రోజు ఇక్కడుండుట ద్వారా మేలుపొందుదుము గాక. ఈ భవనమును విడిచిపెట్టునపుడు మేము అ ఎమ్మాయి గ్రామస్తులవలె, "ఈ ఉదయమున ఆయనమనతో మాట్లాడినపుడు మనలోపల హృదయములు మండుచుండలేదా?" అని చెప్పుదుము గాక. నిత్య దేవా, వీనిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనండి.

స్నేహితులారా, శుభోదయం. ఈ భవనంలో నున్న, ఈ దేశంలో నున్న నా స్నేహితులను తూర్పు, పశ్చిమ తీరములందున్న, ఉత్తర దక్షిణ టెలిఫోను సంబంధములు ఏర్పరచుకొన్న వారందరిని అభినందించుచున్నారు.

ఇండియానాలో ఈ దినం చాలా చక్కగా ఉన్నది. కొద్దిగా మబ్బుగా, చల్లగా చక్కగా ఉన్నది. ఆవరణ, గోడలు, ఆలయం నిండి క్రిక్కిరిసియున్నవి. ఈ రోజున ప్రభువు మనలను దర్శించవలెనను గొప్ప ఆశతో యున్నాం. మీరెక్కడున్నా గాని దేవుడు మంచి రోజును మీకిచ్చును గాక అని ఆశించుచున్నాను. ఇది దేవుడిచ్చిన మంచి దినము. వాతావరణము ఎట్లున్నాగాని, ఇది మంచి రోజు. యేసుక్రీస్తు లోనున్న మన విశ్వాసమును లోకమునకు వ్యక్తము చేయు అవకాశమునకు ఎంతయో సంతోషించుచున్నాము. ఆయన ప్రేమ, ఆయన మన పట్ల చేసిన దానిని మనము వ్యక్తపరచుటకు ప్రతి తరుణమును ఉపయోగించుకోవలెను.

3కొద్ది క్షణముల క్రితం ఒక ప్రకటనను చేయమని చెప్పారు. కొన్ని సంగతులు నేను చెప్పగోరుచున్నాను. ఒక రాత్రి జరిగిన అధికారుల సమావేశమును గూర్చి ప్రకటించమని చెప్పారు. ఆరిజోనాలో ఉంటున్న మన ఘన సోదరుడు, సహోదరుడు కాలిన్స్ సంఘము తరుపున డీకన్ గా నున్నాడు. ఆయన దూరంగా వెళ్ళిపోయినపుడు బోర్డు వారు సహోదరుడు చార్లీ కోక్స్ ను, అతని స్థానంలో నియమించారు. సహోదరుడు కాలిన్ లేని సమయంలో అతనికి బదులుగా కార్యము నిర్వహించుటకు సహోదరుడు చార్లి కోక్స్ ను సంఘము యొక్క ట్రస్టీ బోర్డు అధికారయుతంగా నియమించినది.

ACTS 6:3

 

4మరల అందరికి నేను వందనములు చెల్లించచున్నాను, ఎందుకనగా మీలో కొందరు ఈ రాత్రి స్వస్థతా కూటము ముగించకముందే ఇంటికి వెళ్ళిపోవుదురుగదా? చక్కని చిన్న బహుమతులు, గురుతులు కొరకు వందనములు. మేమిక్కడున్నప్పటి నుండి ఎంతో ఆహారము మాకు తేబడినది. నేను, నా భార్య కుటుంబమంతా అభినందించుచున్నాము. కొన్నిసార్లు నేను వాటిని గూర్చి చెప్పుట మరచిపోవుచుందును. చాలా తీరికలేని పనులు, మీకు తెలుసు. ఎపుడూ నా మనస్సు సుడిగాలిలా ఉంటుంది. ఈ సంపుము వారే కాదు గాని ప్రపంచమంతటానున్న వారిని గూర్చి ఆలోచించాలి. ఇదే నన్ను ఎల్లపుడూ సుడి త్రిప్పినట్లుగా చేయును.

ఏవరోగాని చిన్న పిల్లల ప్రతిష్ఠ , బాప్తిస్మ కార్యక్రమము మొదలగు వాని గూర్చి చెప్పారు. అది చాలా మంచిది. నాకు కూడా ఆ పని చేయాలని ఉంది గాని సమయం లేదు. నా మనస్సును వర్తమానము మీదనే ఉంచవలసియున్నాను. బైబిలులో అపొస్తలులు ఏం చెప్పారు? మీరు వెళ్ళి, జనుల మధ్య మంచి సమాచారసును యధార్దతను సంపాదించుకొని, పరిశుద్ధాత్మతో నింపబడండి. అపుడు జనులు మీ గూర్చి శ్రద్ధ వహించదురు." బిల్లీకి నేను చెప్పాను…

"ఈ సమయంలో నీవు బిడ్డనును ప్రతిష్ఠ చేయుదువా డాడీ?" అని బిల్లీ అడిగాడు.

నేనున్నాను, "ఓ, మై!" చూచారా? చాల మంది పిల్లలను తెచ్చి ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ పిల్లల ప్రతిష్ఠ కొరకై ఒక ప్రత్యేక దినమును నిర్ణయించుదును. అప్పుడా పని చేయుదును."

ఇప్పుడు…

5నేను, నా భార్య, కుటుంబము హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి వందనములు చెప్పుచున్నాము. జనులు శుభ్రపరచిన వస్తువులు తాజా వెన్న, చిక్కుళ్ళు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు తెచ్చారు. వారేదో మొత్తం మీద ఆలోచించి తెచ్చారు.

ఒక పెద్ద టర్కీని ఒక రోజున ఒక సోదరీ మరియు సోదరుడు తెచ్చారు. దానినింకా తీంటూనే యున్నాను. నేను వెళ్ళేముందుగా దానిని శుభ్రము చేయాలని తలంచాను. నేనా పని చేయనిచో, ఆమే మాతో దానిని తెచ్చును. వీటన్నిటిని గూర్చి నిశ్చయంగా నేను మిమ్మును ప్రశంసించుచున్నాను, చాలా మంది జనులను నేనెరుగుదును. కొందరిని నేనెరుగను. మేము లోనికి వచ్చినపుడు, వారు వసారాలో యున్నారు. దానిని నిశ్చయంగా నేను అభినందించుచున్నాను. నేను చూచినవారు చాలామంది యున్నారు. అందరినీ నేను ఎరిగి తెలుసుకోవాలని ఉన్నది, కాని నేను ఒక్కడినే. మీకు అర్థమగును కదా? అందరిని నేను కలువలేను. నాకు తెలిసినంతవరకు ఎట్లు చేయాలో చేస్తూనే యున్నాను.

6దేవుడు మీకు తోడైయుండు గాక. మీలో నుండు ఒకాయన గూర్చి నాకు తెలుసు. అయన యేసుక్రీస్తు, ఆయన ఉండగలడు. ఆయన మాత్రమే సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు కూడాను; కాబట్టి ఆయన ప్రతి అక్కరను తీర్చును. అయన సర్వజ్ఞాని కూడా, నీకేమి అవసరమో ఆయన ఎరుగును.

ఈ ఉదయం ఇక్కడున్నప్పటి నుండి నాకు సాధ్యమైనంత త్వరగా వెళ్ళుచున్నాను. నాకు సాధ్యమైనంత వరకు అందరినీ కలసికొనుచున్నాను. నేను తప్పిపోయిన దానిని సర్వశక్తుడగు దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును.

నేను దానినంత బాగా చదువలేను. ఇదేదో రకమగు ప్రత్యేక ప్రకటన. బిల్లీ పాల్ తప్పక దానిని వ్రాసియుండును అనుకొనుచున్నాను, అతడు నావంటివాడు. నా స్వంత వ్రాతను నేను చదువలేను. అందుకే నా స్వంత షార్టు హేండ్ నాకున్నది. నేను వ్రాసిన కొన్ని వచనములు మీరెన్నడైనా అర్ధము చేసికొనగలరా? వంతెనను దాటుచున్న చుక్కవంటిది నాకున్నది. [సహోదరుడు బ్రెన్హాం ఒక ప్రకటనను చదువుచున్నారు.] సరే.

7ఈ రాత్రి మరో ప్రకటన చేయగోరుచున్నాను. ఈ రాత్రికి రోగులకు ప్రార్ధన చేయుదును. మీరిక్కడుందురని నేను నమ్ముతున్నాను.

ఈ ఉదయాన దేవుడు మిమ్ముని ఆశీర్వదించునట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున భూమిపై నున్న వారందరిని అభినందించుచున్నాను. కొందరు మీలో మధ్యాహ్నకాలంలో ఉండియుందురు. న్యూయార్కులో ఇప్పుడు మధ్యాహ్నము ఆరిజోనా, పశ్చిమ తీరములలో 7 గంటలే అగును. మనం ఇక్కడ మధ్యకాలంలో ఉన్నాము. వినుచుండగా దేవుడు మిమ్ము దీవించు గాక!

ఇప్పుడు, ఇది… దానిని నేను నా హృదయముపై తిసుకున్నాను.

8ఇక్కడుండగా అది నా హృదయంలోనికి తీసికొన్నాను. ఆడిటోరియంకు చివరకు మనకు అనుమతి ఇచ్చారు; ఒక ఆరాధన మనం జరిపించుకోవచ్చు, కాని ఏ రోగికి మనం ప్రార్ధించరాదు. అదే నా సేవ. పరిశుద్ధాత్మ ఏది నన్ను చేయమని చెప్పుతో దానిని నేను చేయవలయును. దానిని నేను అందుకే నిరాకరించాను, ఎందుకనగా పరిశుద్ధాత్మ చెప్పేదానిని చేయు స్వేచ్చ నాకుండాలి. కనుక ఆలయంలోనే ఏలాగో మరో రోజు గడుపవలేనని అనుకొన్నాం. ఈ ఉదయాన ఇక్కడ చల్లగా ఉంది. ప్రభువు మనకు చక్కని దినం ఇచ్చాడు గనుక ఆయనకు వందనములు.

ACTS 20:27

 

9చివరి పాత్రలు, చివరి ఏడు బూరలు, చివరి ఏడు ఉరుములు గూర్చి ప్రకటనలో నుండి బోధించాలనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చాను. ఏడు ముద్రలు, ఏడు సంఘ కాలములను నేడు మనం జీవించుచున్న ఈ ఘడియలోనే విప్పవలెను. వాటన్నింటిని ముడివేయవలెను. కాని అవన్నీ చేయుటకు మనకు వసతి లేదు; అయితే త్వరలోనే అది సాధ్యపడునని నమ్ముచున్నాను, దానికి తగిన చోటు ఇక్కడగాని, లూయిస్-విల్ లో గాని, న్యూ-ఆల్బనీలో గాని, లేదా ఒక గుడారము గాని ఏర్పాటు చేసికొని, మనలను చేయుటకు ప్రభువు నడిపించినంత కాలము నిలిచియుందము.

కాని ఇప్పుడు దేవునిలో నాకున్న నమ్మకము, విశ్వాసమును జనుల వ్యక్తము చేయుటకు ఈ తరుణమును ఉపయోగించుచున్నాను. అపుడు మిమ్మును, మనము జీవించుచున్న ఘడియలోనికి తీసికొని వచ్చెదను. దీనిద్వారా ఏ వ్యక్తికి, ఏ సంస్థకు మరి దేనికి ప్రత్యేకముగా నొప్పి కలుగవలెనని గాని కాదు; అది దేవుని వాక్యముగా నేను చూస్తున్నాను. వాక్యముపై పరిశుద్ధాత్మ కుమ్మరింపును గత ఆదివారం చాలా చక్కగా చూచాం. చాలా సేపు ఉన్నాము, నాకది ఇష్టం లేదు; కాని మనం చివరిసారిగా ఏ సమయంలో కలసికొందుమోమనకు తెలియదు, పౌలు చెప్పినట్లుగా, "దేపుని ఆలోచననంతయూ మీకు ప్రకటించుటకు నేను వెనుకాడుట లేదు." యేసు తన శిష్యులకు చెప్పకుండా ఏదియు దాయలేదు. కాబట్టి పరిశుద్ధాత్మాభిషేకము క్రిందనుండిన నేను ఈ ఘడియకు చెందిన వర్తమానమును తీరిక లేకుంతో అందించగోరుచున్నాను. కొన్నిసార్లు నేను బయటకు వెళ్ళి దేవుని దాసునిగా, క్రీస్తు సేవకునిగా, నా బాధ్యతలను నేను నిర్వహించలేకపోవుచున్నాను. కాని ఇది చేయుటకు నాకు అనేకులు సహాయపడుతున్నారు, నా సేవక సోదరులందరికి నేను కృతజ్ఞుడను.

10జనులను ఎక్కువ సేపు ఉంచవలెనని నా కోరిక కాదు. మీరు బయటకు వెళ్ళి, వర్తమానము అందించబడుచున్న స్థలములు అనగా ఈ ఉదయాన సంఘము చుట్టుప్రక్కల రేడియోలలోను, బస్సులలో, ట్రయిలర్సులో, మోటారు శకటములలో ఇంకా తదితర స్థలములలో చూచినచో సమస్య అర్ధమగును. ప్రతి ఆరాధనకు చాలామంది కారు నడుపుకొంటూ, మరియు ఫోన్ చేస్తూ వచ్చెదరు, కాని చుట్టూ చేరలేకపోవుచున్నారు. కాబట్టి ప్రజలు కూర్చొని, హాయిగా వినేందుకు ఎక్కువ చోటు మనకు కావాలి. వర్తమానమును తీసుకొనివచ్చుట అన్నిటికంటే మిన్నయైనది - మన పెన్సిళ్లు, పేపరు, నోట్సు, బైబిలు తీసుకొని వ్రాసుకొనుటకు వీలుగా, చక్కగా కూర్చొనుటకు స్థలం కావాలి. అయితే నేనీ సమయంలో వెనక్కి వెళ్ళి మీరు ఎదుర్కొనే కొన్నింటిని చెప్పవలెనని యున్నాను. అవి మీకు అవసరము.

11ఈ రోజున నేను, లేదా ఏ రోజు అయినా, లేక ఏ సేవకుడయినాగాని, మరణించుచున్న మనకు వర్తమాన అందించ యత్నించవచ్చును; సమయము చాలా దగ్గరగా ఉన్నది, దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన దానిని మీకు సంతోషము కలిగించుటకు ఏదైనా నేను చెప్ప ప్రయత్నించినచో వేషదారినవుదును, లేక జనాన్ని కూడగట్టుకొనుటకు ఆ పని నేను చేయవచ్చు. నేను క్రీస్తు దాసునిగా ఇక్కడుండ తగను. ఏదో నలుగురికీ కనబడేందుకు కాదు గాని, మీకు చాలా ముఖ్యమైన దానిని నేను ఇవ్వగోరుచున్నాను, నేను ఈ రోజు చనిపోయినాగాని, రేపు మీ హృదయములలో దేవుని సేవించుటకు మరియు కొనసాగిపోవుటకు అది లంగరువేయబడును.

12ఏదో జరుగుటకు సిద్దంగా యున్నదని నేను చెప్పగోరుచున్నాను. నాకది తెలుసు. ఆరిజోనా వైవుకు వెళ్ళుటకు కొద్ది ముందు సమయములో సహోదరుడు జూనియర్ జాక్సన్ వచ్చి తన స్వప్నమును చెప్పిన సంగతి మీలో చాలా మందికి జ్ఞాపకముండును. ఒక క్రొత్త విషయం. ఎందరికది జ్ఞాపకమున్నది? ప్రభువు మనకు అనువాదము ఇచ్చెను, అక్షరాలా అది నేరవేరింది. అతనికిపుడు మరో కల వచ్చినది.

వింత సంగతి. ఒక రోజున ఒరేగాన్ నుండి వచ్చిన ఒకాయన ఇచ్చట ఉండెను. నిన్ను సరిగా ఏరుగడు. జూనియరు జాక్సన్ కు వచ్చిన కలయే అతనికి వచ్చినది మరియు వచ్చి చెప్పెను. నాకు అనువాదము తెలియదు; ప్రభువు కొరకు నేను కనిపెట్టుచున్నాను. కాని అదేదో దేవుని నుండి వచ్చినదని తెలుసు. దానిని గుర్తుతెచ్చుకొనండి - "అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." అది దేవుని నుండి వచ్చినది. అదేమిటో నాకు తెలియదు, అది చాలా అద్భుతమైనది. సూటిగా చెప్పాలంటే, వారికి వచ్చిన కలల ప్రకారము… వారిలో ఒకరు… అతడు ఒక బాప్టిస్టు, లేక ప్రెస్బిటేరియను కావచ్చును; ఈ ఉదయాన అయనిక్కడే ఉన్నాడేమో నాకు తెలియదు. ఒక రోజున ఇక్కడున్నాడు; అతడిని నేనెరుగను.

అతడి కన్నులు కన్నీటితో నిండియుండగా ఆ కల చెప్పెను. అతనిని అది కదిలించినది. దానిని చెప్పుటకై ఒరేగాన్ నుండి ప్రయాణమై వచ్చాడు. ఈ ఉదయాన సహోదరుడు జాక్సన్ కూడా అలాగే వచ్చాడు. ఒకరు ఒకరిని ఎరుగరు. ఇద్దరికీ మధ్య దూరం వేయి మైళ్ళున్నది, కాని రెండు స్వప్నములూ ఒకటే. పరిశుద్ధాత్మ ఆ అనువాదమును నాకింకా తెలియబరచలేదు. అతడికి ఏమి చెప్పాలో నేనెరుగను. కాని దేవుడు ఏదో చేయనైయున్నాడని ఎరుగుదును. అది మన కన్నులకు మహిమకరమైనదిగా నుండును.

13ఈ ఉదయము వర్తమానము కొరకు గలతీ పత్రిక నుండి చదువగోరుచున్నాను. అదొక ఆదివారపు బడి పాఠము, గోడల చుట్టూ నిలబడియున్న స్త్రీ మరియు పురుషులను ఎవరైనా కొంతసేపు కూర్చుండనిచ్చినచో నాకేమీ అభ్యంతరము లేదు; గౌరవముగా నుండండి. పిల్లలు ఏడ్చినచో, తల్లులు వారిని చిన్న పిల్లల గదులలోనికి తీసికొని వెళ్ళుటకు ఎవరైనా సాయపడండి.

మనము చదువుకొను కొన్ని వాక్య భాగములు వ్రాసికొనుటకు పెన్సిలు, బైబిలు సిద్దపరచకొనండి. మీరు కట్టేసినట్టుగా ఉండకండి. కూర్చొని చదువుకొనుటకు స్వేచ్చగా కూర్చొనండి. మీరు కొన్నింటిని అంగీకరించకపోవచ్చు, కాని ఈ ఉదయాన దేశమంతటితో నేను మాట్లాడుచున్నాను, కావున ఈ ఘడియకు యేసుక్రీస్తు నాకు వర్తమానమిచ్చెనని నమ్మినవారు ఏమి జరుగుతున్నదో వాక్యములో గుర్తించగలరని నమ్ముచున్నాను.

MATT 24:24•

MARK 13:22

 

14అభిషిక్తులు అను ప్రసంగమును గత ఆదివారం మనం విన్నాము. టేపులు వినేవారు తప్పక ఆ టేపును సంపాదించుకొనండి, మేము టేపులు అమ్మము; అది ఉద్దేశ్యము కాదు. వర్తమానమును బయటకు పంపించుటయే మా ఉద్దేశ్యము, చూచారా. టేపు యంత్రము మీకున్నచో కొందరు కలసి జాగ్రత్తగా దానిని వినండి.

అభిషిక్తులు. జనులు లేచి, "ఓ, చివరి దినములలో అబద్ద ప్రవక్తలు లేచి సూచనలు చూపించుదురని బైబిలు చెప్పుచున్నది," అనుట మీరు వినియుందురు. (అది ఖచ్చితముగా లేఖనము.) అదెక్కడ వర్తించును? సరిగా దానిని అన్వయించవలెను. దేవుడు తన స్వంత వాక్యములలో బయలుపడెనను అంశముపై ప్రభుని చిత్తమయితే, ఈ రాత్రి మాట్లాడుదును, చెవి ఉంచవలసిన చోట కన్నును ఉంచలేము, చూచారా. ముద్రించబడిన మొత్తం బైబిలులో యేసుక్రీస్తు పటము మనము చూడగలము. కావున ఈ రాత్రికి దేవుని చిత్తమయితే, దాని గూర్చి మాట్లాడుదును, లేనిచో మరొక దినాన చూద్దాము.

GAL 1:1-5

 

15ఇప్పుడు, గలతీయులు మరియు II కొరింథీ 4:1-6 మరియు గలతీయులు 1:1-4లో నుండి కొన్ని లేఖనములను చదువగోరుచున్నాను.

మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైను కాక, యేసుక్రీస్తువలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, [అపొస్తలుడు అనగా "పంపబడిన, లేక ఒక మిషనరీ."]

నాతో కూడానున్న సహోదరులందరును, గలతీయులలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది:

తండ్రియైన దేవుని నుండియు, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను.

దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.

2COR 4:1-6

 

16ఇప్పుడు, II కొరింథీ 4:1-6 చదువుదము.

కాబట్టి ఈ పరిచర్య పోందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.

అయితే కుయుక్తిగా నడచకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతిమనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము.

మా సువార్త మరుగుచేయబడిన యెడల, నశించుచున్నవారి [ఇంగ్లీషులో "నశించినవారి" అని వ్రాయబడియున్నది.] విషయములోనే మరుగుచేయబడియున్నది: [ఒకవేళ అది ముందు ఏర్పాటును తీసుకొనిరానియెడల, మరి ఏమి తీసుకొనివచ్చునో నాకు తెలియదు.]

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

GEN 1:3•

ISA 7:14•

JOEL 2:28•

2PET 1:20

 

17[ఆమేన్! వాక్యము ఆలాగు చెప్పుచున్నది.]

ఈ ఉదయాన నా అంశము: ఈ దుష్ట యుగపు దేవత. వాక్యములో మనము ఈ యుగ సంబంధమగు దేవత అని చదివాము. ఈ వర్తమానము ఈనాటి దుష్ట యుగపు దుష్టత్వములను వివరించును, మరియు ఈనాటి చెడ్డ యుగపు ప్రవచననమునకు ఇది చక్కగా సరిపోవుచున్నది. బైబిలులో ప్రతి యుగమునకు సంబధించిన సమాధానమును ఆ యుగపు విశ్వసి కొరకు వ్రాయబడియున్నది అని నేను నమ్ముచున్నాను, మనకు అవసరమైన ప్రతిదియు అక్కడ వాయబడినది; పరిశుద్ధాత్మచే అది అనువదింపబడవలసియున్నది. భూమిపై ఏ వ్యక్తికి వాక్యమును గూర్చి తన స్వంత అనువాదము ఇచ్చు హక్కు లేదని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యమునకు అనువాదము ఇచ్చుటకు దేవునికి ఎవ్వరు అవసరము లేదు. ఆయనే తన స్వంత అనువాదకుడు. ఆయన అది చేయుదునని చెప్పెను, మరియు ఆయన దానిని చేయును.

చాలా సార్లు నేనిది చెప్తుంటానుగదా? కన్యక గర్భవతియై కుమారుని కనునని ఆయన చెప్పెను. ప్రవక్త పెదవుల ద్వారా ఆయన ఆ మాట పలికెను. ఆమె నేరవేర్చెను. దానినెవరునూ అనువాదము చేయనవసరములేదు. ఆదిలో ఆయన వెలుగుకమ్మని పలికెను. అక్కడకు వెలుగు వచ్చెను. దానికెవరూ అనువాదము చెప్పనవసరము లేదు. అంత్యదినములలో సర్వశరీరులపై ఆయన తన ఆత్మను క్రుమ్మరించుదునని పలికెను, ఆయన ఆలాగే చేసెను. ఏ అనువాదము అవసరము లేదు. ఇప్పుడు మనము చూస్తున్న ఈ సంగతులు ఇక్కడ చివరి దినములలో జరుగును అని చెప్పెను. దానికేమీ అనువాదము అవసరము లేదు. అది ముందే అనువదించబడినది, చూచారా.

ACTS 15:14

 

18మనము వాక్యము ధ్యానించుచుండగా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు మనము జీవించుచున్న నేటి యుగపు దుష్ట దేవత. అది వింతగా కనపడవచ్చును. కృపా యుగములో చాలా వింతగా కనపడవచ్చును. ఈ దుష్ట యుగములో, నిజంగా దుష్ట యుగమని పిలువబడవలసిన ఈ యుగంలో దేవుడు తన నామము నిమిత్తమై ఒక జనాంగమును తన జనముగా నుండుటకు వధుపుగా నుండుటకు తీసికొనుచున్నాడు, కృప ద్వారా దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఈ చెడ్డ యుగముగా పిలువబడుతున్న ఈ కాలములోనే పిలుచుచున్నాడు. ఆయన పలికిన యుగము ఇదేనని బైబిలు ద్యారా ఇప్పుడు మనము రుజువు చేయుదుము.

దానిని గూర్చి ఆలోచించుట చాల వింత సంగతే, ఇటువంటి దుష్ట యుగము దేవుడు తన వధువును పిలచును. మీరు గమనించారా? ఒక జనము అని చెప్పెను గాని ఒక సంఘము అనలేదు. ఎందుకని? అది సంఘమని పిలువబడినప్పటికి ఆయన దానిని ఒక జనమగును. వివిధ రకాల మేకప్ లు గల అనేక జనుల కూటమియే సంఘము. కాని దేవుడిచ్చట ఒకటి పిలవచన్నాడు. నేను మెతడిస్టును, బాప్టిస్టును, పెంతెకోస్తును పిలుచుదునని దేవుడు అనలేదు, చూచారా. ఆయన ఒక జనమును పిలుచుదుననెను. ఎందుకొరకు? ఆయన నామము కొరకు, చూచారా. ఒక జనము, ఒకరు మెతడిస్టు నుండి, ఒకరు బాప్టిస్టు నుండి, ఒకరు లూథరన్ నుండి, ఒకరు కాతలిక్కు నుండి, చూచారా. కాని ఆయన ఒక సంఘ గుంపును పిలుచుట లేదు గాని, ఆయన నామమును చేర్చుకొనును, ఆయన నామములలోప్రధానము చేయబడిన, ఆయనతో వివాహముకాబడుటకు, ముందు నిర్ణయము ద్వారా ఆయనతో ఒక భాగముగా నుండు ఒక జనమును తన నామము కొరకు పిలచుచున్నాడు. ఒక మనుషుడు తన జీవితములో, తన శరీరములో ఒక భాగముగా నుండుటకు ఒక భార్యను ఎన్నుకొని అభిషేకించును. క్రీస్తు వధువు కూడా అంతే, దేవుని శరీరములో ఒక భాగముగా నుండుటకు ఆది నుండి నేటివరకు ప్రతిష్ఠ జరుగుచునే యున్నది. ఓ, లేఖనములు బహు ఐశ్వర్యవంతమైనది, తేనెతో నిండియున్నది.

MATT 24:24•

MARK 13:22

 

19గమనించండి. ఎవరో చెప్పుట కాదు, ఎవరో పిలచట కాదు, కాని దేవుడు జగత్తు పునాది వేయబడకముందే ఈ చివరి దినములోని ఈ జనులను పిలచెను. ఈ జనులను పిలచెను. ఒక సంస్థ కాదు, ఆయన నామము కొరకు ఒక జనాంగము. ఆయనది చేయుచున్న ఈ యుగము, మోసపు యుగము, దుష్ట యుగము.

గతవారం, మత్తయి 24లో అన్ని యుగములలో కంటెను ఇది మిక్కిలి మోసకరమైనయుగమని చెప్పుకొన్నాం. ఏదేను తోటలోని మోసము జరిగించిన యుగము నుండి, ఇప్పటి వరకును ఈ యుగమంత మోసకరమైన యుగము మరోకటి లేదు. అబద్ద ప్రవక్తలు లేచి సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు చేయుచూ - సాధ్యమయితే, ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును, చూచారా. ఇప్పుడు చల్లని ఆచారబద్దమగు, బిగిసిపోయిన సంఘములు మానవ-నిర్మిత వేదాంతములో నున్నవి. ఏర్పరచబడినవారు వాటి వైపు చూడరు. కాని అది నిజమైనదానివలెనే కనిపించను. నీవు చేయవలసినదంతా ఒక్క మాట విడిచి పెట్టుటయే. గొప్ప సమయమని ఈ యుగమును గూర్చి వాగ్దానము చేయబడెను. క్రైస్తవులందరూ నేడు మనం జీవించుచున్న ఘడియలను గూర్చి జాగ్రత్తగానుండవలెను. వ్రాసుకొని, చదివి, మరియు జాగ్రత్తగా వినండి.

MAL 4:6

 

20ఆయన నామము కొరకు దేవుడు ఈ దుష్ట యుగములో ఒక జనమును ఏల పిలచును? కారణమేమనగా, ఆయన తన వధువును పరిశోధించుటకు ఆమె బయలుపరచబడినపుడు, శోధించబడిన తరువాత, రుజువుకాబడినపుడు, ఆదిలో నుండినట్లుగానే అంతములోనూ ఉండును.

భూమిలో పడిన గింజ అంచెలవారిగా జీవమును తీసికొనివచ్చును. కానీ అది ఆదిలో నుండిన రీతిగానే భూమిలోనే అంతమగును. అదే ప్రకారము ఏదేను నేలలో మోసపు గింజ పడెను. చివరి దినములలో అదే రీతిగా అది ముగియును. రోమ్ లోని నైసియా శాఖ వద్ద సువార్త పడినది. అది గొప్ప సంస్థతోనే అంతమగును. ఆ దినములలో సంఘపు గింజ సూచన క్రియలు మరియు అద్భుతములులో పడెను. వారిమధ్య సజీవుడగు క్రీస్తు జీవించెను. చివరి దినములలో మలాకీ 4 మరియు సేవ ద్వారా ఒకసారి ఇవ్వబడిన అసలు విశ్వాసము పునరుద్ధరించబడును.

21ఆమె - హావ్వ వలె లేదు, మరియు ఆమె అటువంటి స్త్రీ కాదు, అని సాతానుకి రుజువు చేయుటకు ఈ దుష్ట యుగము ఉన్నది అని మనము కనుగొనగలము. ఆయన వాక్యము ద్వారా ఆమె శోధించబడును, ఆదాము వధువువలె ఈ వధువు వాక్యముచే శోధించబడును. వాక్యమంతటినీ ఆదాము వధువు నమ్మెను, కాని శత్రువు ముఖాముఖిగా వచ్ఛి శోధించినందున ఒక్క వాగ్దానముతో తప్పిపోయినది. ఒక్క వాగ్దానములో తప్పిపోయెను, ఆయన నామము కోరకు పిలువబడిన జనమే ఆయన వధువు. మరలా అదే విషయము ద్వారా ఆమె సంబంధమేర్పరచుకొనవలెను, శాఖా సత్యము లేదా మరేదో కాదు, కాని ప్రతి మాట వలన.

ఏలయనగా బైబిలు ప్రారంభములో జీవించుటకు మానవునికి దేవుని వాక్యము ఇయ్యబడెను. సర్పమని పిలువబడిన ఒక జంతువులో సాతాను అను వ్యక్తి ద్వారా ఒక్క మాటకు తప్పుడు అనువాదము ఇవ్వబడినది. ఈ వ్యక్తిలో సాతాను మాట్లాడకలిగి ఆమెకు తప్పుగా అనువాదము చెప్పినది, ఆమె నశించినది, చూచారా. ప్రతి మాటయు ఆసుసరించవలసియున్నది.

MATT 4:4•

LUKE 4:4•

REV 22:18,19

 

22బైబిలు మధ్యలో యేసు వచ్చి, "మసుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, ప్రతి మాటనలనను జీవించునని చెప్పెను," ఆయనపుడు సాతానుచే శోధించబడెను. ఇప్పుడు, చివరి దినములలో ఈ యుగ దేవత లేచునని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరైనా ఒక్క మాటను చేర్చినా, లేక ఒక్క మాటను తీసివేసినా - అట్టివాని పేరు జీవగ్రంథములో నుండి కొట్టివేయబడును. దేవుడు మనకు కృప చూపించు గాక. మనకు అంతా తెలుసునని మెడవంచక, గుండెలు విరుచుకొని, ఇస్త్రీ చొక్కావలె నడువకూడదు, ఎందుకనగా ఒకపుడు మనమును అవిధేయులమే. కృప, కరుణతో, దేవుని పట్ల వాంఛగల హృదయముతో, వినయముగా కృపా సింహాసనము నొద్దకు మమ్మును నడిపించెను.

కొత్తగా నున్నది. ఇప్పుడు, పందొమ్మిది వందల సంవత్సరాల సువార్త బోధానంతరము, ఇప్పుడు ఆమె, అనగా లోక క్రమము, ఆయన ఇక్కడ ఉన్నప్పటి కంటేను బహు చెడ్డగా నున్నది. లోక క్రమము చాలా దుష్టత్వముగా యున్నది. గొప్ప అనిశ్చిత స్థితి వైపుకు లోకము పరుగిడుచున్నది. నీకు అది తెలుసు. ప్రతిచోట కూడా ప్రభువు ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు.

23నా భార్యతో నిన్న నేను వచ్చాను, శ్రీమతి. వుడ్, సహోదరుడు రాయ్ రాబెర్సన్ ఇక్కడే ఎక్కడో ఉండియుందురు. సహోదరుడు ఉడ్, మేము ఈ చిన్న యంగ్స్-టౌన్ షాపింగ్ సెంటర్ లో సోదరి ఉడ్ కలిగియున్నటువంటి పాకెట్ ఒకటి కొనలని నిలిచాము. మేమక్కడ నిలబడియుండగా ఒక యువకుడు వచ్చి తన్నుతాను పరిచయం చేసికొన్నాడు, నాకతడు క్రొత్తవాడు. మరో యువకుడు వచ్చాడు, వారు అలబామా లేదా జార్జియా నుండి వచ్చారనుకొంటాను, ఎందుకనగా సహోదరుడు వెల్స్-ఎవన్స్ తెలుసా అని అడిగాను. మేము కొద్ది నిమిషాలు ముచ్చటించాం. నేను విడిచి పోవుచుండగా ఆ యువకుడు నా వైపు చూచాడు. మరో యువకుడు మరియు అతని చిన్న కుర్రాడు వెళ్ళిపోతుండగా, ఈ యువకుడు నా వైపు చూచి, "ఒక్క విషయం చెప్పగోరుచున్నానని," అన్నాడు.

"నీవు విశ్వాసివా? నీవు క్రైస్తవుడవా?" అని అడిగాను.

"కాదండీ!" అన్నాడు.

24అతడు చెప్పిన మాటనే సరిగ్గా నేను చెప్పలేకపోవచ్చును, కాని బహుశా అతడు ఒక మాదిరిగా కనిపించాడు. ప్రభువు దూత ప్రత్యక్షమగుటను గూర్చి నేను అడిగాను. దానిగూర్చి తాను విన్నట్లుగా చెప్పాడు, కాని ముందెన్నడూ ఈ సంఘమునకు వెళ్ళలేదని అతడన్నాడు. "నీవు దానిని నమ్ముతున్నావా?" అని అడిగాను.

"అవునండీ! నేను దానిని గమనించుచునేయున్నాను. రాబోవు వాటిని, జరుగనైయున్న సంగతులను చెప్పుటను గూర్చి విన్నాను. కాలిఫోర్నియా ఆ విధంగా బ్రద్దలగునని ముందు చెప్పినదాని గూర్చిన టేపు విన్నాను. నేను దానిని వార్తాపత్రికలో చూచి నమ్మాను. నేను మొదటిసారిగా ఈ రోజో రేపో వస్తాను," అని చెప్పాడు.

"కుమారుడా, ప్రభువు నిన్ను దీవించును గాక," అని చెప్పాను. కరచాలనం చేయ సాగాను.

"అయ్యా, కాని మీకో విషయం చెప్పగోరుచున్నాను. నేను పూర్తిగా నశించిపోయాను, ఇసుక కుప్పలో కప్పబడిన నాణెములా తప్పిపోయాను," అన్నాడు.

"కాని నీవు రీతిగా నుండవలసిన పనిలేదు. నిన్ను ఈ క్షణములోనే కనుగొనుటకు ఇప్పుడే ఒకాయన సిద్ధముగానున్నాడు," అని నేను చెప్పాను.

"నేను సిద్ధంగా ఉన్నానని," అతడు చెప్పెను.

"నీ తలను వంచుదువా?" అని నేను చెప్పాను.

"నేను సిగ్గుపడను," అని అతడు చెప్పెను. అంతేకాదు, అతడు మోకాళ్ళూనాడు, ఆ కార్లు పెట్టు స్థలములో జనులందరి యెదుట మోకరించాడు. దేవుడతని హృదయంలో శాంతి నిచ్చేవరకు కలసి అక్కడే ప్రార్ధించాం. వీధిలో జనమంతా విరగబడి చూచారు. అతడు పాపిగా వచ్చి, దేవుని బిడ్డగా వెళ్ళాడు. చచ్చినవానిగా ఆ కారు ప్రక్కకు వెళ్ళి మోకరించిన ఆ వ్యక్తి, సజీవుడుగా తిరిగి వెళ్ళాడు.

నేను చెప్పాను, "రేపు నీరు తెరువబడును."

రక్తముతో నిండిన ఊట ఒకటున్నది.

ఇమ్మానుయేలు నరకములలో నుండి ప్రవహించిన ఆ రక్తము;

క్రింద మునిగిన పాపులు

వారియొక్క పాపపు మచ్చలన్నింటిని పోగొట్టుకొందురు;

"లేచి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది, ప్రభువు నామమును పిలువుము. దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను నింపుము, గొప్పవాటిని నీ కిచ్చును, దానిని నీవు చూడగలవు," అని చెప్పాను.

REV 18:1-5

 

25ఏమిటది? లోకము అంతము వైపుకు కదిలిపోవుచున్నది. ఎందువలన? చట్టములేని ఆత్మ, నైతిక పతనము, శాస్త్రీయ మతము, బైబిలు చెప్పినట్లుగా అసహ్యమగు పక్షుల యొక్క పంజరములలోనికి దానిని నడిపించుకొని పోపుచున్నది. దానిని చదువుదం, ప్రకటన 18:1-5. దీనిని సరిగా గుర్తుపెట్టుకున్నాను అని నేను అనుకొనుచున్నాను.

అటు తరువాత మహాధికారముగల వేరోక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.

అతడు గొప్ప స్వరముతో అర్భటించి ఇట్లనెను, మహా బబులోను కూలిపోయెను కూలిపోయేను. అది దయ్యయులకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.

ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగములవలన ధనవంతులయిరి.

మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఎదియు మీకు ప్రాప్తించకుండునట్లును దానిని విడిచి రండి.

దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.

REV 3:17

 

26ఎట్టి హెచ్చరిక! ప్రకటన 3:14లో నున్న లవొదకయ సంఘ స్థితినే అది చూపించుచున్నది, చాలా నిజమైన భక్తిలా కనపడును గాని చట్టము లేనితనము, "నీవు ధనవృద్ది చేసికొని, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు గాని నీవు దిగంబరివనియు, దిక్కుమాలినవాడవనియు, గ్రుడ్డివాడవనియు ఎరుగకున్నావు." చక్కగా ఈ యుగమునకు వాక్యము, దానియేలు యుగపు వాక్యము కాదు, నోవహు యుగపు వాక్యము కాదు - ఈ చివరి దుష్ట యుగము కొరకు.

ఇక్కడ గమనించండి. నీవు దిగంబరివి! లోతుగా దాని వెళ్ళనిమ్ము. ఈ ఆలోచనలో నాతో చాలామంది సమ్మతించకపోవచ్చు, కాని అది ఏ స్థానమునకు వచ్చినది అనగా, ఒక క్రైస్తవుడు తన గృహములో నుండి బయటకు నడువలేని మరియు చాలి చాలని దుస్తులు ధరించిన స్త్రీల మధ్యకు ఈ దుష్ట యుగపు సన్నిధికి తీసుకొని రాబడడు.

MATT 5:28

 

27స్త్రీలారా, నేను చెప్పునది వినండి, స్త్రీ మరియు పురుషులారా, మీరు దానితో అంగీకరించకపోవచ్చు, కాని అది చెప్పవలెనను ప్రేరణ ఉన్నది. బట్టలు ధరించని స్త్రీ, మతిపోగొట్టుకొన్నదని మీకు తెలుసా? ఆమె అనుకొన్నా అనుకోపోయినా గాని వేశ్యయే. ఆమె ఒక రోజున దేవుని యెదుట నిలబడి, నేను నా భర్తను తప్ప మరెవరిని తాకలేదని చేతితో ప్రమాణము చేసి చెప్పవచ్చును. అది నిజమే కావచ్చు, కాని ఆమె వేశ్యయే. "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగునని," యేసు చెప్పెను.

ఆమె దిగంబరి కాని యెరుగకున్నదని బైబిలు చెప్పెను. ఆమెను ఆ విధమగు పనులు చేయుటకు అభిషేకించిన ఆత్మ చెడ్డది. వేశ్యాత్మ ఆమె పైన, శారీరకంగా పవిత్రముగా నుండవచ్చును. ఆమె ఏ వ్యభిచారము చేయకపోవచ్చును. దేవునితో ప్రమాణము చేయవచ్చును. అది సత్యమే కావచ్చు… కాని ఆమె ఆత్మ వేశ్యాత్మ. ఈ లోకపోకడ అను దేవతతో అంతగా గ్రుడ్డిది కాబడినది; ఆమె అసభ్యకరముగా దుస్తులు ధరించి అక్కడకు వచ్చినది.

28ఒక రోజున సహోదరుడు వుడ్ నేను నదిలో మా పడవను వదలుచున్నాం. నదిలోనికి వెళ్ళుటకై నేను ఇంటికి కొద్ది నిమిషాలు దూరం కావలసివచ్చెను. ఎక్కడ కెళ్ళినా గాని స్త్రీలు చుట్టూ చిన్నది "కినిస్" అనువాటిని చుట్టుకొనుట కనిపించును. అదెంతో అవమానకరము. మతి సరిగానున్న ఏ స్త్రీ ఆ విధమైన బట్టలు ధరించదు. ఆమె వేశ్యాత్మతో ఆవరించబడినది. ఇప్పుడు, దానిని దేవునితో సరి చేసుకో, స్త్రీ; అది సత్యము అని ఒకానొక రోజు నీవు తెలుసుకుందువు.

స్త్రీ శరీరము ఎంత పవిత్రమైనది! దానిని బయటకు చూపించి, శరీరాశ, పాపమునకు గురిచేయుచున్నారు. ఈనాడు వీధుల్లో నడచుచున్న దేయ్యములు అవే. దేవుని కుమారులు ఇంకా దేవుని కుమారులుగా నున్నచో, నీ భర్త దేవుని కుమారుడైనచో, నిన్ను సరిగా బట్టలు వేసికొనునట్లు చేయును, లేదా నిన్ను విడిచిపెట్టును. దేవుని కుమారుడగు యువకుడు ఎన్నడూ అట్టిదానిని పెండ్లాడడు, చూచారా. మీరు అనవచ్చు, "మీరు దానిని సృష్టించి చెప్పు…" లేదు, నేను మీకు సత్యమును చెప్పుచున్నాను, ఒక రోజున నీవు దానినెదుర్కొందువు. దిగంబరి, వ్యభిచారి అని యెరుగకున్నది.

"ఓ, నేను ఎన్నడూ నా భర్తతో చేసిన ప్రమాణములను మీరి పాపము చేయలేదు." నీవది చేసినచో నీ భర్త నీకు తీర్పు తీర్చును, కాని నీలో ఎట్టి విధమగ ఆత్మ ఉన్నదో దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చును. నీ శరీరమును బట్టి కాదు గాని, నీ ఆత్మ, అంతరంగ పురుషుని బట్టియే తీర్పు చేయును.

MATT 4:4•

LUKE 4:4•

1JN 2:15

 

29బాహ్య పురుషుడు అనగా భౌతిక జీవి ఆరు ఇంద్రియముల ద్వారా నియంత్రించబడును. అంతరంగ పురుషుడు ఆత్మయై యుండి అయిదు ఇంద్రియముల ద్వారా నియంత్రించబడును: మనస్సాక్షి, ప్రేమ, మొదలగునవి. బాహ్య పురుషుడు: చూచుట, రుచి, తాకిడి, వాసన, వినికిడి. కాని లోపలి ప్రాణము ఆత్మయై యుండి ఒక దానిచే నియంత్రించబడును: అదే నీ స్వేచ్ఛా చిత్తము. నీవు దెయ్యము లేదా దేవుడు చెప్పే దేనినైనా స్వీకరించవచ్చు. నీలో ఏ ఆత్మ యున్నదో అదే నిర్ణయించును. అది దేవుని ఆత్మ అయినచో, దేవుని విషయములచే పోషింపబడును, మరియు ఏ లోక విషయమునలనను పోషించబడదు. యేసు చెప్పెను, "లోకమును గాని, లోకములో ఉన్నవానిని గాని మీరు ప్రేమించినచో, దేవుని ప్రేమ మీలో ఉండదు, ఎందుకనగా అనగా దేవుని ప్రేమ ఎన్నడు అతని అంతరంగములోనికి ప్రవేశించలేదన్నమాట." సాతాను నిన్ను మోసము చేసెను. మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించను.

గమనించండి. ఆమె దిగంబరిగా, అసభ్యకరమైనదిగా, మరియు నగ్నముగా ఉన్నది అని మనము కనుగొనగలము.

30లోకము ఎన్నడూ లేని దుష్టయుగములో నున్నది అది… ఏ యుగములోను స్త్రీ ఆ విధంగా ప్రవర్తించలేదు, కాని లోకము జలప్రళయముచే నాశనము కాబడుముందు అలాగే యుండిరి. యేసు దానిని గూర్చి చెప్పెను. తరువాత దానిని చూచాం.

దేవుడు నియంత్రణ పోగొట్టుకొన్నాడా, లేదా ఆయన లోబరుచుకొనుటకు ఇంకెవరికైనా ఆయన అనుమతి ఇచ్చాడా? నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఈ ప్రశ్నకు నిజమైన జవాబు: ఈనాడు లోకములో రెండు విరుద్ధ ఆత్మలు పనిచేయుచున్నవి అన్నది నా అభిప్రాయము. రెండు శిరస్సుల కన్న ఎక్కువ లేవు. ఒకటి పరిశుద్ధాత్మ పని; మరొకటి దయ్యపు ఆత్మ, చివరి దినములలో, మోసము. ఇప్పుడు, తక్కిన వర్తమానమును ఇక్కడే కేంద్రీకరించుదును.

31రెండు ఆత్మలు: ఒకటి దేవుని పరిశుద్ధాత్మ; రెండవది మోసము చేయు దయ్యపు ఆత్మ. ఇప్పుడు భూలోకవాసులు వారి ఎన్నికను చేసికొనుచున్నారు, పరిశుద్ధాత్మ ఇక్కడ క్రీస్తు కొరకు వధువును పిలచుచున్నది. ఈనాటి యుగమునకు చెందిన ఆమె వాక్య వాగ్దానమును ఆయన బయలుపరచుచున్నాడు, అది క్రీస్తేనని చూపించుకున్నాడు. ఈ యుగములో వేళ్ళు కదలవలసియున్నచో, వేళ్ళే కదులును. ఈ యుగములో పాదము కదలవలసియున్నచో, పాదమే కదలును. ఈ యుగములో కన్ను చూడవలసియున్నచో, కన్నే చూచును. దేవుని ఆత్మ, దేవుని యుక్క పరిపూర్ణ వ్యక్తిత్వములోనికి ఎదుగుచున్నది. నేడు మనము జీవించుచున్న ఈ యుగములో ఈ ఘడియ వర్తమానమును పరిశుద్ధాత్మ బయలుపరచుచున్నది. ఈ నాశనము నుండి దేవుని నమ్మినవారు పిలువబడునట్లుగా పరిశుద్ధాత్మ దీనిని చేయుచున్నది. ఆదిలో వాడు చేసిన విధముగా - దేవుని వాక్యమును వక్రీకరించుట ద్వారా దయ్యము యొక్క అపవిత్రాత్మ భ్రమపరచుట ద్వారా తన సంఘమును పిలచుచున్నది. చూడండి, అది నేరుగా మరల విత్తన కాలముకు వస్తున్నది? ఏదేను నుండి తిరిగి ఇక్కడకు.

2THS 2:11,12•

1JN 4:6

 

32ఇతర యుగములలో నీవు శాఖలకు చెందియున్నావు; నీవు దీనికి, దానికి, మరి దేనికో చెందియున్నావు. శాఖ అనబడు ఖాండమునాకు ఏం జరిగింది? అది ఎండిపోయినది. ఆత్మ దానిని విడిచి వెళ్ళిపోయినది. అది గింజలో కేంద్రీకృతమైనది.

ఆ రెండు శోధనలను నీవు చూడు, ఆదిలో నున్న విధముగా తిరిగి వచ్చుచున్నవి. మరువక గమనించండి. I యోహాను 4:5 మరియు 6లో చెప్పినట్లుగా - మీరు వ్రాసుకోవాలని కోరినయెడల, ఈలాగు చెప్పుచున్నది, "భ్రమపరచు ఆత్మ." హవ్వ ఎన్నడూ ఇష్టపూర్వకంగా, "నేను దేవుని నమ్మను!" అని చెప్పలేదు, ఆమె ఒక తప్పును నమ్మినది.

సాతాను ఎన్నడూ బయటకు వచ్చి, "ఓ, అది దేవుని మాట కాదు!" అని చెప్పలేదు. అది దేవుని వాక్యమని ఒప్పుకొన్నది, అయితే దానికి వాడి స్వంత అనువాదమును జతచేసినది, అది చేయవద్దని దేవుడు స్పష్టంగా చెప్పెను. ఇదేమి చేయును? జనులు బలమగు మోసము ద్వారా అబద్దమును నమ్మి, దానిచే నశించిపోవుచున్నారు. దానిని II థెస్సలోనీయులు 2:11లో చదువగలరు, అన్నీ మనము చదువలేము. ఒక్కొక్కటి అపుడపుడు ఇచ్చుదును…

అది వింతగా కనిపించవచ్చును, దానిని మీరు ప్రశ్నించవచ్చు, మీ మేలు కొరకు దానిని మేము చదివెదము.

EPH 2:1,2•

2THS 2:3,4,11,12

 

33మోసము చేయు శక్తి అని బైబిలు చెప్పుచున్నది. (II థెస్సలోనీయులు), ఈ పాపపురుషుడు ఎట్లు బయటపడి దేవుని ఆలయములో కూర్చొని తానే దేవుడనని ఎట్లు చూపించుకొని జనులను బలమగు మోసము ద్వారా అబద్ధమునునమ్మునట్లు చేయునో, దాని ద్వారా వారినెట్లు నశింపచేయునో వ్రాయబడినది. హవ్వకు కూడా అదే చేసెను. వాక్యము తప్పు అని ఎన్నడూ పలుకలేదు, కాని అబద్దమును నమ్ము గొప్ప మోసమును ఇచ్చెను.

మోసము చేయు ఆత్మ దయ్యమునకు చెందినది, అవిధేయులగు పిల్లలలో ఇప్పుడు దయ్యము కార్యము చేయుచున్నది. దేనిపట్ల అవిధేయత? ఈ కాలపు పిల్లలు దేని పట్ల అవిధేయత చూపుచున్నారు. ఆదిలో హవ్వ వలెనే, దేవుని నిజ వాక్యమునకు. నిజము. ఇప్పుడు, దానిని మీరు చూడవలెనని కోరినచో, ఎఫెసీ 2:1-2 చదవండి.

మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బదికించెను:

మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించ శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడచుకొంటిరి.

EPH 2:2•

HEB 7:4,5

 

34[అవిధేయ పిల్లలు!]

అవిధేయ పిల్లలతో క్రీస్తువిరోధి ఆరంభమయినచో, క్రీస్తువిరోధి వ్యక్తిగా తయారయినవుడు ఎట్లుండును? అదెంత మోసకరముగా నుండును. చిన్న బడ్డ కంటే పెద్ద వ్యక్తి లోకమునకు ఎంత శక్తివంతమైన మోసము ఇచ్చునో గదా? "అవిధేయులగు పిల్లలతో మోసపరచు అత్మ పనిచేయుచున్నదని చెప్పెను," వాక్యమునకు అవిధేయత.

గమనించండి. ఇప్పుడు, అవిధేయ పిల్లల గూర్చి కొద్దిగా మాట్లాడుదును, ఏ వ్యక్తి యొక్క ఆదియైనాగాని ఆ వ్యక్తి యొక్క ముత్తాతలో జీవించియుండును. మీకిది తెలుసా? నీవు నీ తాత నుండి తండ్రికి, తండ్రి నుండి నీవు వచ్చావు, మెల్కీసెదెకు గూర్చి హెబ్రీ 1 అని నమ్ముచున్నాను. రోజులను సంహరించి అబ్రాహాము వచ్చుచుండగా కొల్లగొట్టబడిన వాటన్నిటిలో నుండి మెల్కీసెదెకు దశమభాగము చెల్లించెను. పౌలు ఇప్పుడు చెప్పుచున్నాడు - దశమ భాగములు పొందిన ఆ లేవి - అని, హాము యొక్క గర్భములో నిలిచెను. అబ్రాహాము లేవీకి పితరుడు. అబ్రాహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు పితరులను కనెను. లేవీ ఇక్కడ ముందు నిర్ణయములో కనబడుచున్నాడు. మెల్కీసెదెకునకు అబ్రాహాము గర్భములోనున్న లేవీ కూడా అబ్రాహాము పదియవవంతు చెల్లించినపుడు చెల్లించెనని వ్రాయబడెను.

35ఇప్పుడు, ఈ వర్తమానములలో ఈ భువి పైకి రానున్న సంగతులను ఈ సాయంకాల వెలుగు వర్తమానములో అను దానిలో నుండి దేవుడు చెప్పినవాటిని మరల నొక్కి చెప్పెవలెను అని కోరుచున్నాను.

గమనించండి, జగత్తు పునాది వేయబడక మునుపే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో పేర్లు లేనివారందరును భూమిపైకి రానున్న మృగము, లేదా క్రీస్తువిరోధి వలన మోసపుచ్చబడుదురు.

దేవుని యొక్క స్వాలోచనలో… దేవుడు, గొప్ప ఆత్మ, ఆదిలో - ఆది అనునది లేక మునుపే ఆయన దేవుడై యుండెను. నీవాయనలో అపుడే ఉన్నావని ఎరుగుదువా? నీవు ఇప్పుడు క్రైస్తవుడవయినచో అపుడే ఆయనలో నున్నావు. అట్లయితే దైవత్వమంతయూ యేసుక్రీస్తు అను వ్యక్తిలో శరీరము ధరించినది. కాబట్టి యేసు సిలువనొద్ద చనిపోయినపుడు, నేను మరణించాను, ఎందుకనగా అపుడే నేనాయనతోనున్నాను; ఎందుకనగా ఆయనే బయలుపరచబడిన వాక్యము యొక్క పరిపూర్ణత. తరువాత మనము బయలుపరచబడుదుమని ఎరుగుదుము. ఆయనతో కల్వరి యొద్ద మనమున్నాము, ఆయనతో పాటు మనము సమాధిలోనికి వెళ్ళాము. ఆయన పునరుత్థానముతో మనము ఆయనతో పాటుగా లేపబడి ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా క్రీస్తు యేసులోని ఉన్నత స్థలములందు కూర్చుండబెట్టబడుటకు కృపా సింహాసనము మీదకు ఎత్తబడితిమి.

36ఈ స్వాభావిక జీవము తండ్రి నుండి తండ్రికి, తండ్రి నుండి తండ్రికి ఎట్లు సంక్రమించునో క్రీస్తు జీవము కూడా అంతే. ఆ కారణమును బట్టియే ఏలియా ఆత్మను దేవుడు అయిదుసార్లు వాడుకొనెను. ఏమిటది? చేతులు మారుట, నీ తండ్రి యొక్క స్వాభావిక జీవము నుండి నీకేట్లు జీవము కలుగునన్నదో, ఆ ప్రకారమే దేవుని ఆత్మ కూడా భూమి పునాదికి ముందే నిర్ణయించబడినది.

దేవుని వాక్యము పూర్తిగా సమకూడి యేసుక్రీస్తు అను శరీరమును ధరించినప్పు అక్కడ ఆయనలో నీ పాపములను దేవుడు ఆయనచే చెల్లింప చేసేను. అక్కడ ఆయన తన పునరుత్థానముతో నన్ను లేపెను. ఇప్పుడు మనము ప్రతి దయ్యము మీదను అధికారముతో మరియు శక్తితో ఆయనతో కూర్చుండ పెట్టబడితిమి. ఓ, దేవుడు మీకిచ్చిన దానిని మీరు నమ్మితే చాలును! నీవు అక్కడ కూర్చుండక పోయినచో నీకేమీ లేదు. నీ వక్కడ కూర్చొనియూ అవిశ్వాసముతో, భయముతో, కళలకున్నచో ఎన్నడూ ఉపయోగించుకొనలేవు! కాని నీవక్కడ కూర్చొనియున్నచో, నీవు దానిని ఉపయోగించుకొనుదువు, ఎందుకనగా నీవు ఏం చేయాలో దాని కొరకు ప్రతిష్ఠించబడితివి.

ఫరో, మరియొక ప్రక్కన, ఈ పని కొరకు ఫరోగా యుండుటకు లేపబడియుండెను, జైబిల్ చెప్పెను. ఇస్కరియోతు యూదా నాశన పుత్రుడుగా నుండుటకు లేపబడెను.

ఇప్పుడు, మనము సమీపించుచున్న ఈ గొప్ప సత్యములను గమనించండి.

MATT 27:17,21•

2THS 2:11,12

 

37వాక్యము తమ్మును ఏలుటను వారు తిరస్కరించి దానికి బదులుగా బరబ్బను ఆ సంఘము కోరుకొనెను. దానిని గూర్చిన వాక్యమును మత్తయి 27:15 నుండి 23 చూడగలరు. ఇదేమీ చేసేను? ఇదే స్థానమును ఇచ్చెను? దానిగూర్చి ఆలోచించుము. సంఘము లోకము దానియొక్క సంస్థా వెలుగు నీతిలో పరశుద్దులుగా తమ్మును ఎంచుకొని, జనుల దృష్టిలో కూడా ఆలాగే కనపడినవారు యేసును సిలువవేసి "మనలను ఏలుటకు ఈ మనుష్యునికి అధికారములేదు," అని చెప్పిరి. యేసు దేవుని వాక్యము యొక్క సర్వ పరిపూర్ణత; దానిని I యోహాను 1 వ్యక్తము చేసెను. "దేవుని వాక్యము మమ్మునేలరాదని," వారన్నారు. అయినను ఆయన వాక్యమే, కాని ఆయన ఏమైయున్నాడు అను దానిని చూడకుండా వారి కండ్లు మూయబడినవి. ఆయన ప్రతి ప్రవచన ప్రత్యక్ష జవాబు ఆయనలో జరుగనైయున్న వాగ్దానములన్నియూ నెరవేరినవని నమ్ముదుం, ఎందుకనగా జరిగినవాటిని మనం తిరిగి చూచాం. కాని నేటి ప్రస్తుత దుష్టయుగము ఆనాడు ఉండినచొ, వారిపుడేమి చేయుచున్నారో అదే చేసియుండెడివారు, ఎందుకనగా ఈనాడు అదే వాక్యము బయలుపరచబడుచుచున్నది. వారు దానిని చేయుదురు. వారింకేమీ చేయజాలరు. వారు అవిధేయ పిల్లలు, అబద్దమును నమ్మి దానిచే నశించబడు బలమగు మోసము వారికి ఇవ్వబడినది.

JOHN 5:39,46

 

38గమనించండి. సంఘ జగత్తు యేసును అంగీకరించనపుడు, అ దినమున బయలుపరచబడిన వాక్యము, ఎందుకు? వారింకో విధంగా వాక్యమునకు అనువాదము చెప్పిరి. ఆ వాక్యమని వారేరుగవలసియుండెను, ఎందుకనగా ఆయనేమి చేయునని దేవుడు చెప్పెనో, దానిని ఆయన చేసెను. ఆయన వారితో, "ఈ ఘడియ లేఖనములను పరిశోధించుడి. నేనేమి చేయుదునని వ్రాయబడిన ఆ అర్హతలు నాలో లేనిచో నన్ను నమ్మకుడి," అని చెప్పెను.

"మేము మోషేను నమ్ముచున్నాం," అని వారన్నారు.

అందుకాయన, "మీరు మోషేను నమ్మినచో నన్నును నమ్మియుండెడివారు, ఎందుకనగా మోషే నన్ను గూర్చి పలికెను," అనెను. అయినా వారింకా దానిని చూడలేదు. పరలోక దేవుడే సిలువపై మరణించుచున్ననూ వ్రవక్త ఆయన ఏ మాటలు పలుకునని చెప్పెనో, ఆ మాటలే పలుకుచున్ననూ, వారు చూడలేకపోయిరి. వారాయనవంటి వారు కారు. వారు వాక్యము కారు - వాక్యము కాదు - అయినను వారు చాలా మత భక్తిగలవారు. కాని వారు వాక్యము కారు, ఎందుకనగా ఆ ఘడియకు దాని స్థానమును వారు గుర్తించియుండేవారు.

39ప్రతి యుగముతోను వాక్యములు ఎంత చక్కగా ముడివేయబడుచున్నవో చూడండి. ఇప్పుడు గమనించండి, సంఘ లోకము దేవుని వాక్యము తమ్మునేలుటకు అంగీకరించక, బరబ్బ అను హంతకుని స్వీకరించిరి: ఇదేమి చేసేను? సాతానును అది హెచ్చించెను, "ఈ దుష్ట యుగపు దేవత, ఎపుడూ తాను కోరుకొను స్థలమునకు అది హెచ్చింపబడినది - ఇప్పుడు వినండి - ఈ యుగమునకు తప్ప మరే యుగమునకును సాతాను దేవతగా చెప్పబడలేదు. నోవహు యుగము మరి దేనికిని అని దేవతగా చెప్పబడలేదు, కాని ఈ యుగమునకే… ఓ, దానిని తప్పిపోకండి! అది ఈ యుగపు దేవత. మిలియనుల, బిలియనల కొలది ఈ దుష్ట యుగపు దేవతనును జనులు తెలియకుండనే దాని ఆరాధించుచున్నారు.

ఈ ఉదయాన వాక్యము దానిని బయలుపరచనీయండి, మనం చూచి తెలిసికొందాం, వివేచనా కూటములలో వలె పరిశుద్ధాత్మ వాక్యము మధ్యకు వచ్చి ఒకరిని పిలచి, "నీవు మరో స్త్రీతో జీవించనవసరం లేదు. నీవు పది ఏండ్ల క్రితం ఆ వ్యక్తి భార్యతో నీవు వెళ్ళిపోయి ఏం చేశావు?" అని చెప్పును. అలాగే వాక్యమును పలుకనీయండి. ఆయనను వెలకి తెచ్చెను, మరో స్త్రీతో జీవించుచున్న పురుషుని లేదా మరో పురుషునితో జీవించుచున్న స్త్రీని, లేదా స్త్రీ పురుషులను బంధించుచున్న సాతానును, వారు చేసిన పాపములను బహిర్గతము చేయును. అది ఏమి చేయును? వాడిని బహిర్గతము చేయును.

1JN 2:19

 

40వైద్యులు ఏమి పొరపాటు ఉన్నదో తెలుసుకొనుటకు వైద్య సాధనములతో పనిచేయుదురు. వారు అది చేయలేరు. మనము చెప్పలేము. కాని అపుడు పరిశుద్ధాత్మ బయటకు వచ్చి, అతడేమిటో బయలుపరచను, మరియు వాడిని బహిర్గతము చేయును. అదే దేవుని వాక్యము. అది చీకటిలో ప్రకాశించు వెలుగు. నీవు గదిలో శబ్దము చేసినచో, అది అంతు చిక్కదు. ఏదో పనిచేయును గానీ అది ఏమిటో నీవు ఎరుగవు, దీపమును వెలిగించు. వెంటనే బొద్దింకలు, చిన్న పురుగులు పారిపోయి దాగును, అవి చీకటి పిల్లలు. వెలుగు ఉదయించినపుడు, అవి చెదరిపోవును. "వారు మనకు చెందినవారు కారు గనుక మనకు దూరమగుదురు," బైబిల్ ఆ విధముగా చెప్పెను. అవి లోకపు వెలుగులో నిలువ జాలవు, ఎందుకనగా ఈ చివరి దినములలో ఆయన తన బిడ్డల మార్గములను వెలిగింప చేయుటకు పరమందున్న దేవుడు ఆయన వెలుగును పంపించుచున్నాడు. వారు చీకటిలో నడిచి తొట్రిల్లకుండా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్న యేసుక్రీస్తు వెలుగులో నడచునట్లు చేయుచున్నాడు. ఆమేన్!

ISA 14:12,13

 

41గమనించండి, సాతాను ఈ యుగమునకు మాత్రమే దేవతగా పిలువబడినది. ఆదినుండి కూడా దేవునివలె నుండవలెనను ఆకాంక్ష దానికున్నది. దానిని మనము చదువుదము. మనము సమయమును తిసుకొందుము. మనము చూద్దాము; దానిని నేను వ్రాసుకొనియున్నాను. సౌతాను ఏమి చేసినది. యెషయా 14:12 మరియు 14 వరకు చదువుదం. గమనించండి.

తేజోనక్షత్రమా! వేకువ చుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి?

నేను ఆకాశమునకెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తరదిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీదికెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా?

దేవునివలే ఆరాధింపబడవలెనను కోరిక సాతానుకున్నది. వాడు ఆకాశమందలి మూడింట రెండువంతుల నక్షత్రములను తీసికొనెను. ఆ నక్షత్రములకు పైగా ఎక్కిపోయెను, వాటికి బోధించి మోసగించెను. అది వాడి అభిలాష, వాడిపుడు తన యొక్క జాగ్రత్తతో, ఎన్నుకోబడిన, విద్య కలిగిన పెండ్లి కుమార్తెతో సిద్దముగానున్నాడు (చూచారా), ఇదంతా వాడి స్వజ్ఞానము ద్వారానే. పెద్ద భవనములలో మోసపు రంగులు పూసియున్నాడు. పెద్ద శాఖలు జ్ఞానపు యుక్తులు, వేదాంతము మరియు చురుకుతనము, తెలివి, విద్యలతో సర్వలోకమును మోసము చేసి దేవుడైనాడు (వాడు చేసినది అదే!), అంతా కూడా క్రీస్తువిరోధి వ్యక్తిలోనికి సమకూడుచున్నది. దేవుని కిరీటమును తన లోక ప్రేమ, శాస్త్రీయ వధువు, తెలివి, మత విద్య ద్వారా ధరించుకొని సిద్దముగియున్నది. వాడి కుమారుడగు కయీనువలే, హవ్వకు చేసిన తప్పుడు అనువాదమునే ఆ పెండ్లి కుమార్తె కూడా పైకి భక్తిగా కనబడుచున్నది.

ఇప్పుడు, నీవు చెప్పావు, "సాతానుని కుమారుడు?"

GEN 4:3•

ISA 14:12,13•

1JN 3:12

 

42కయీను ఆదాము కుమారుడని చెప్పే ఏ ఒక్క వాక్యభాగమైనా చూపించు. వాడు సాతాను కుమారుడు, సర్పసంతానము, దుష్టుని కుమారుడని బైబిలు చెప్పెను. సోదరుడా! ఆ ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగించబడినది. ప్రకటనలో చూపించబడినరీతిగా పిరమిడ్ తెరువబడినది.

వాడి అలోచన, ఏం చేయగలడో గమనించండి. లోక సౌందర్యములో దేవుడు నివసించెని వాడనుకొనెను, పరమందు అదే చేసెను. మోసము ఏదేను తోటలో ప్రారంభము కాలేదు. అది పరమందు లూసీఫరు, వేకువచక్క సౌందర్యములో తన్నుతాను హెచ్చించుకొని మిఖాయేలు కంటే గొప్ప అందమగు రాజ్యమును కావలెనని కోరినపుడు ఆరంభమాయెను. దేవుడు సౌందర్యములో గుప్తమైయున్నాడని వాడు తలంచెను.

కయీనును గమనించండి. రక్త అర్పణం అక్కరలేదనుకొనెను. అతడు వచ్చి బలిపీఠముపై పొలములోని అందమగు పండ్లు అర్పించెను. చాలా శక్తితో హేబెలు చేసినట్లే చేసెను. దేవుని ఎదుట మోకాళ్ళూని అర్పణ అర్పించెను. అన్ని విధములా విధేయుడాయెను. కాని వాక్యప్రత్యక్షత లేదు. ఆదినుండియు వాక్యము దేవుని సంకల్పము. కాని దేవుడు ప్రత్యక్షత ద్వారా సరియైన దానిని బయలుపరచి విరమించెను. మతము కాదు, బలిపీఠము కాదు, సంఘమునకు చెందుట, బలి అర్పించుట, యదార్ధముగా నుండుట కాదు గాని, దేవుని వాక్య ప్రత్యక్షమవలననే. పాము ఇచ్చిన పండును తన తల్లి తీసికొనలేదు గాని సాతానుతో వ్యక్తిగత లైంగిక సంబంధము ద్వారానే జరిగినదని దేవుడు బయలుపరచెను. జంతువు ఆకారములో నున్నది కాని ప్రాకేటట్లుగా లేదు. భూమిపై బహు తేలివి, యుకి గలది. మనుష్య ఆహారము గలది. దాని బీజము మాత్రమే కలియగలదు, విజ్ఞాన శాస్త్రము దానిని కనుగొన యత్నించుచున్నది. వారెన్నడూ కనుగొనలేరు, ఎందుకనగా దాని శరీరములోని ప్రతి ఎముక మారిపోయినది. కాని బైబిలు అది ఆ రీతిగానున్నట్లు చెప్పుచున్నది.

2THS 2:3,4•

REV 13:4,11,12

 

43ఇప్పుడు వాడేమి చేయునో గమనించండి. వీడు చేవుని ఆలయములో, అనగా సంఘములో కూర్చొని తానే దేవుడనని చెప్పుకొనును. II థెలోనీకయులు 2:3 మరియు 4 మరియు ప్రకటన 13:4, 11, 12లలో ఇద్దరు ప్రవక్తలూ, పౌలు, యోహానులు వాడు చివరి దినములలో ఎట్లుండునో పలికిరి. మీరు దానిని చదవండి, సమయము చాలదు.

నేడు మనం జీవించుచున్న ఈ దినములు మానవ దినములని బైబిలులో పిలువబడినవి. ఇది దేవుని దినము కాదు. దేవుడు ఈ భూమికి దేవుడు కాడు; ఆయన కాడు అని బైబిలు చెప్పుచున్నది; ఆయన పరలోకపు దేవుడు. కాని ఇది దేవుని దినము కాదు; ఇది ఎన్నుకొను దినము. ఈనాడు జీవించుటకు లేదా మరణించుటకు ఎన్నుకొనుట అవకాశమున్నది; దేవుని ఎన్నుకొని జీవించు; వాక్యమే దేవుడు. వాక్యము అనగా ఘడియ మరియు దినము కొరకు ప్రత్యక్షపరచబడినదే వాక్యము.

1COR 4:3

 

44మనుష్యుని దినమును గమనించండి. మానవుని దినములో మానవునిచే తీర్పు పొందుటను గూర్చి పౌలు I కొరింథీ 4:1-5 వచనములలో వ్రాసెను.

ఇది మనసుని దినమని నీవెందుకు పిలచుచున్నావని అడుగవచ్చును. మానవుని జ్ఞానము ద్వారా క్రియలు మహిమపరచబడుచున్న దినమిది. కమ్యూనిస్టులను చూడండి. చంద్రుని వద్దకు వెళ్ళ యత్నించుచున్నారు. దేవుడు మానవులను పరలోమునకు తీసుకు వెళ్ళవలెనని ప్రయత్నము చేయుచున్నాడు, కాని వారు మిలియనులు, బిలియనులు, ట్రిలియను డాలర్లను వ్యర్థ ప్రయత్నములకు ఎట్లు ఖర్చు పెట్టుచున్నారో చూడండి. వారక్కడికి వెళ్ళినా గాని ఏమియు కనుగొనలేరు. వారి సంగతి ఏమిటి? చంద్రుని గూర్చి నాకక్కర్లేదు. నేను చంద్రుని చూడనంత వేగంగా పైకి వెళ్ళగోరుచున్నాను. పాలపుంతను దాటి పైకి పోయెదను. అవును!

MATT 15:6•

MARK 7:13

 

45ఈసాటి లోకము సాతాను ద్వారా వచ్చిన జ్ఞానమునకు తన్ను తాను అంకితము చేసికొనుచున్నది; మానవుని దినము మహిమపరచబడుచున్నది, దేవుని వాక్యము వలన కాదు గాని, తనకున్న జ్ఞానిమును బట్టియే. ఇప్పుడు ఆలోచించండి, బాగా లోనికి వెళ్ళనీయండి. మీరు టేపును ఈ విషయము కొరకు వెనక్కి తిరిగి విన్నపుడు, ఆగి ఆలోచించండి. వాడి క్రియలు దేవుని వాక్యముకన్న హెచ్చయినవి మరియు దేవుని ప్రత్యక్ష కార్యములకన్న హెచ్చింపబడినవి. ఆదిలో హవ్వకు సాతాను తన జ్ఞానమునిచ్చినది. తప్పిపోక వినండీ! ఘడియకు చెందిన బయలుపరచబడిన దేవుని వాక్యముకంటె ఎక్కువగా సాతాను యొక్క జ్ఞానము హెచ్చింపబడి పూజింపబడుచున్నది మానవులోనే. మన సంఘములు దానిని తమ సెమినరీలు, అధ్యయన కళాశాలల ద్వారా దానిని రుజువు చేయుచున్నవి. దేవుని వాక్యముకంటె ఎక్కువగా తాము తెలుసుకొన్నామని, నేర్చుకొన్నామని వారనుకొందురు. వారు తమ పేర్లకు ముందు డాక్టర్, టీచర్, ప్రొఫెసర్ తగిలించుకొని తమ స్వంత జ్ఞానమును హెచ్చించుకొని, నామకార్దులుగా పిలువబడుచున్నారు. వారే ముందు బయలుపరచబడిన దేవుని వాగ్దాన సత్యముకన్న, సాతాను నుండి వచ్చిన దానినే ఎక్కువగా చూస్తున్నారు. మానవులు దానికొరకు పడిపోవుమన్నాడు, చూచారా.

వాడి శాస్త్రీయ పరిశోధనలు దేవుని వాక్యము తప్పు అని రుజువు చేయ యత్నించుచున్నది. దాని గూర్చి ఆలోచించు, వాడు వాటి యొక్క, అనగా మానవ వేదాంతము జనులకు దేవుని వాక్యమును వివరించి, దానిని ప్రభావము లేనిదిగా చేయ యుత్నించుచున్నాడు. యేసు ఈ భూమిపై ప్రత్యక్షమయినప్పుడు శాఖాయుగము నందు కూడా ఆలాగే జరిగినది. యేసు ఇట్లనెను, "పేషధారులారా, మీరు మీ పారంపర్యాచారముల వలన (అది వారి అనువాదము) దేవుని వాక్యమును తీసికొని జనులలో ప్రభావములేనిదానిగా చేయుచున్నారు. ఈనాడు వారు మరల అదే చేశారు. దానికి ప్రభావము లేదనుచున్నారు.

2THS 2:4

 

46గమనించండి. వారు, ఆ జనులు, దేవుడు అను పిలువబడు దానంతటి పైగా హెచ్చించియున్నారు. II థెస్సలొనీకయులు, వారది చేయుదురని చెప్పలేదా? శాఖా సంఘము యొక్క అధికారమును, వాక్యమైయున్న దేవునికంటే శాఖను ఎక్కువగా నమ్ము ప్రజలు, శాఖా విశ్వాసములే వాక్యముకంటే హెచ్చయినదని నమ్మువారు, దేవుడని పిలువబడిన దానికంటే వాటిని హెచ్చించిరి. ఒకే ఒక్క దేవుడున్నాడు, అదే వాక్యము. కాబట్టి వాడు దేవునిగా దేవుని ఆలయములోని కూర్చుని, తానే దేవుడని రుజువు చేయుచూ ప్రజలు తనను ఆరాధించినట్లుగా చేసికొనుచున్నాడు. వాక్యమే దేవుడు. దేవుడని పిలువబడు దానంతటికంటేపైగా వాడు, హెచ్చించుకొనుచున్నాడు. వాక్యమైయున్న దేవుడు ఒక్కడే. నిజమయిన బయలుపరచబడిన వాక్యము కంటే పైగా, ఈ యుగ దేవత హెచ్చించుకొనియుండి, దేవునిగా ఆయన ఆలయములో మరో అధికారముతో కూర్చొనియుంది (పరిశుద్ధ యోహాను 1, చూచారా); దాని కొరకు పొగడబడుచున్నది. ఓ, జనులు, దేవుడు, ఆ మోసమును చూచెదరు గాక. వాడు పూజింపబడుచున్నాడు మరియు దానిని ఈ దుష్ట యుగవు జనులు నమ్ముచున్నారు. ఇప్పుడు, ఈ దుష్ట యుగపు దేవత మరియు దాని దాసులను ఇప్పుడు నీవు చూచావా?

47ఇప్పుడు, దాని బయలుపాటను గమనించుదము. ఎన్నడు తప్పిపోని దేవుని వాక్యమునకు వేరుగా వాడు వేరొక లోకమును వాని జ్ఞానము ద్వారా నిర్మించుచున్నాను అని వారికి చెప్పుచున్నాడు. కాని వాడి శాఖల ఉమ్మడి రాక, సిద్ధాంతములు, తెలివి, శాస్త్రీయము ద్వారా మనుష్యులు జీవించుటకు మంచి లోకమును తయారుచేసి, వేయేండ్ల కాలములోని లోకము మాత్రమే జీవించుటకు అర్హమైన దేవుని వాగ్దానమును అలక్ష్యము చేయునట్లుగా జనులను మభ్యపెట్టుచున్నాడు. జీవించుటకు బదులుగా పాపము చేయుటకు మంచి లోకమును వాడు తయారు చేయుచున్నాడనునది నా అభిప్రాయము.

గమనించండి. దానిని వాడు చేసెనా? వాడు పాపమును చట్టబద్ధం చేసెను. వాడు విస్కీ, త్రాగుడు, సిగరెట్టు త్రాగుటను చట్టబద్ధం చేశాడు. జుట్టు కత్తిరించుకొను స్త్రీలు సంఘములో సభ్యులుగా నుండవచ్చను శాసనమును సంఘములు ఏర్పాటు చేసినవి. ఇప్పుడు, మీరు ఒక క్షణం ఆగవచ్చు.

48స్త్రీ - షార్టులు ధరించవచ్చు, రంగులు పూసికొనవచ్చు, అయినా గాని మత గుంపులో సభ్యురాలుగా నుండవచ్చు. దేవుని వాక్యమునకు పూర్తిగా విరుద్దమది. అది పరవాలేదని వాడనును. వాడి తెలివిని చూచారా? "స్త్రీ సంగతి నీకెందుకు?" అంటున్నాడు. నిషిద్దమైన ఫలమును తినవచ్చు లేదా తినకపోవచ్చు; దేవుడు వద్దని చెప్పినా, వాడు దానిని చేసెను.

స్త్రీ, వాడిని నమ్మును, మరియు దానికై వాడినామె పేమించును. ఆమె దేవుని ద్వేషించును. ఆమె స్వంత పనులే దానిని రుజువు చేసినవి. ఆయనను ప్రేమించుచున్నానని ఆమె చెప్పినా గాని సాతానునే ప్రేమించునది. ఫ్యాషన్ దేవతను ఆమె ఆరాధించుచున్నది, ఈ లోక దేవత, హాలీవుడ్ దేవత. ఆమె దానిని ప్రేమించుచున్నది, దేవుని యొక్క నిజ వాక్యమును ఆమే ద్వేషించుచున్నది, నిజమైన దేవుని. చట్టం అనుమతి ఇచ్చినది: "సంఘములలో ఏమి హాని లేదు. మా స్త్రీలు అది, ఇది మరియు ఏదైనా చేయవచ్చు." కాని దేవుని యొక్క సజీవ సన్నిదిలో ఆమె పశ్చాత్తాప పడితేనేగాని వచ్చుటకు కూడా అనుమతించబడదు.

చూడండి, వాడు ఈ లోకపు సౌందర్య దేవుడు; అవును. ఆమె అందముగా కనబడగోరుచున్నది, మరియు ఆది నుండియూ వాడు సౌందర్య దేవతయే. ఈ ఆధునిక యుగము కొరకు, లేదా ఈ దుష్ట యుగములో అందము కొరకు విజ్ఞాన శాస్త్రములో తనకు గల జ్ఞానము ద్వారా వాడు వస్తువులను తయారు చేయుచున్నాడు. వాడు అందమును తయారుచేసెను.

49చుడండి. గమనించతగిన విషయమిది: ఆదిలో షేతు అతని పిల్లలు ఎన్నడూ శాస్త్రీయ మార్గములో వెళ్ళలేదు. కొన్ని నిమిషాలు సైన్సు గూర్చి మాట్లాడుదం. దీనిని చెప్పుటలో నేను చేయు తప్పులు క్షమించండి. అజ్ఞానులు దేవుని వాక్యమును నిరాకరించనున్నారు. నిశ్చయంగా! అది గమనించతగినదిది. షేతు పిల్లలెన్నడూ సెన్సు త్రోవలో వెళ్ళలేదు. వారు దీనులగు కాపరులు, వ్యవసాయదారులు. కాని కయీను పిల్లలు వెళ్ళారు. ఎందువలన? వారి తండ్రియగు అపవాదివలన వారు ప్రేరేపించబడిరి. కయీను తన తండ్రియగు అపవాది ద్వారా ప్రేరేపణ పొందెను. ఆ వంశము ఆ పేరణతోనే వస్తున్నది.

ప్రతి యుగములోను ఆ బీజము వచ్చుటను గమనించుము. ఈనాడు అదెక్కడ కేంద్రీకృతమైనదో చూడండి. నిజమైన క్రైస్తవులు ఈ సైన్సు పరిశోధనలు, వీటిలో లేరు. ఒక్క నిముషంలో అది చూద్దాం. కయీను తన తండ్రియగు అపవాది యొక్క పూర్తి లోకజ్ఞానము, అందము, సైన్సు మొదలగువాని ద్వారా నడచి వెళ్ళెను. కయీను పిల్లలు సైన్సు నేరిగినవారు. వారు విద్యగలవారు, వారు సంగీత వాయిద్యములను వాయించువారు (ఈ అధునిక ఎల్విస్ ప్రెస్లీ మొదలగువారి ద్వారా ప్రతి శనివారము రాత్రి వినబడుచున్నది), పట్టణములను నిర్మించువారు, వ్యక్తిగత వాంఛతో స్త్రీలను అలంకరించుట, దయ్యము - స్త్రీకి రంగు వేసి, షార్టులు ధరించి, జుట్టు కత్తిరించుకొని ఏవేవో చేస్తున్నారు. అదంతా వాడి చెడ్డ ఆశ కొరకే. అది చాలా కఠినముగా నుండవచ్చును గాని చెప్పక తప్పదు.

50ఇప్పుడు, సాతాను యొక్క సువార్త సైన్సు, అభివృద్ధి సువార్త అని మనకు తెలుసు. దానిని వాడు ఏదేనులో బోధించెను. దేవుడు కాదు, సాతాను, అభివృద్ధి శాస్త్రము. సైన్సు, అభివృద్ధి సాతాను సువార్త, దానితో వాడీనాడు మనలను ఎక్కడికి నడిపించాడో చూడండి.

ఏదెనులో వాడెవరికి బోధించెనో గమనించండి. అదాము పెండ్లి కుమార్తెకు, ఆమె దానికి పడిపోయినది. ఒక్క దేవుని మాటను ప్రశ్నించునట్లుగా ఆమెను మోసపుచ్చెను. వాడేమి చెప్పెనో చూద్దాం. "ఈ పరిశుద్ధ సంఘములో చనిపోవుట శాస్త్రీయము కాదు," అని వాడు చెప్పియుండును లేదా "మరణము అనునటువంటి హేతుబద్ధం కానిదానిని నమ్మకుండా నీవు బడిలో చదువవలసియున్నావని చెప్పియుండును, దేవుని వాక్యము దానిని చెప్పినా గాని హేతుబద్ధం కాని దానిని నేను నమ్మనని వాడు చెప్పి యుండును."

51ఓ, ఈనాడు వాడిని చూడు. "దేవుడు మంచి దేవుడు. నీవాయన పరిశుద్ధ సంఘములో ఉన్నావు. ఎందుకు, నీవు చావవు!" కానీ దేవుడు నీవు చచ్చెదవని చెప్పెను, మరియు అది దానిని స్థిరపరచును! వాడిని చూచారా? "నీవు సంఘానికి చెందియుండి ఏమి చేసినా పరవాలేదని వాడు చెప్పుచున్నాడు. సంఘానికి వచ్చి మంచి సభ్యునిగా ఉండు. నీ జుట్టు కత్తిరించుకో అందులో ఏముంది? షార్టులు వేసుకో, రగులు పూసుకో, డాన్సులకు వెళ్ళు, అప్పుడప్పుడు కొద్దిగా బీరు సేవించు, అందులో నీవు మునిగిపోనంత కాలము ఏమీ పరవాలేదు. నిజంగా నీ పిల్లలు దానిని తిసుకొందురని తలంచుచున్నాను, కావున అందునుబట్టి వారు దానిని ఇష్టపడుతారో లేదో తెలుసుకొనవచ్చు." అక్కడే వాడున్నాడు: ఈ యుగపు దేవత, ఈ దుష్ట యుగపు దేవత.

"దేవుడు మంచి దేవుడు." నేనది విని ఇక జబ్బు పడినట్లయ్యాను. దేవుడు న్యాయము తీర్చు దేవుడు. ఆయన తన మనుమలను పాపరహితులుగా చేయు తాత వంటివాడు కాడు. ఆయన న్యాయము, పరిశుద్ధతలు గలవాడు. దానిని దానిని ఏదెను తోటలో తన మొదటి పిల్లల ద్వారా రుజువు చేసెను. నీవు ఆయన యొక్క ఒక్క మాటను దాటినచో, చనిపోయినట్లే. అదే ఈనాడు కూడా అన్వయించును.

GAL 1:8

 

52హవ్వకు అంత శాస్త్రీయ, సాంఘిక, విద్యా, వృద్దిలో నిండిన సువార్తను బోధించెను. ఆదాము వధువు దానిని సమ్మెను. అవే వాదములతో క్రీస్తు వధువుగా నుండవలసిన సంఘమును రెండవ ఆదామును కూడా నింపుటలో సఫలుడాయెను. అది నిజము.

"ఓ, అది దేవునికి అనవసరం. అంత మంచి దేవుడు ఆ పని చేయడు. నీవు సంఘానికి వెళ్ళినంత కాలం పరవాలేదు… నమ్మితే చాలును…" దయ్యము చక్కగా నమ్మును, నటన విశ్వాసము కాదు, కాని నిజంగానే నమ్మును! వాడు రక్షించబడలేదు. "నమ్ముట నీవలనైతే…"

మొదటి ఆదాము భార్యకు చెప్పినట్లుగానే రెండవ ఆదాము. వధువునకు కూడా చెప్పుచున్నాడు. "దైవిక స్వస్థత అనేది ఇప్పుడు లేదు. దానిని మేము రుజువు చేయగలము. ఒక కేసు కూడా ఎన్నడూ రుజువవలేదు. యేసు నామములో బాప్తీస్మము సంగతి ఎందుకు? సంఘాధికారిని నేనే," అని వాడు చెప్పుచున్నాడు. నైసియా, రోమ్ బయటకు వెళ్ళినపుడు, అబద్ధ ప్రవక్తలు మొదలగునవి లేచిన సమయమది. "దైవ త్రిత్వము ఉన్నదని మేము నమ్ముతున్నాం." ఓ, అది మంచి కొరకే. అది అన్యత్వము. నీవెన్నడూ అట్టిదానిని తెచ్చి దేవుని సన్నిధిలో నిలబడజాలవు.

"ఓ, నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల బిరుదులలో జాప్తీస్మము పొందిన యెడల, ఏ వ్యత్యాసము లేదు. దాని వలన ఏ వ్యత్యాసమును ఉన్నది?"

ZECH 14:7•

ACTS 19:5,6•

HEB 13:8

 

53అది ఎంతో భేదమును తీసుకొని వచ్చినది, ఒక బాప్తిస్టు గుంపును మరల పౌలు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందమని చెప్పెను, భేదం కనపడినది. వారి పైకి పరిశుద్ధాత్మ దిగెను, ఆ అపొస్తలుడు కేక వేసి ఇట్లనెను, "పరలోకము నుండి దూత దిగి వేరు సువార్త ప్రకటించినా గాని శాపగ్రస్తుడవును." నిశ్చయంగా ఒక భేదమున్నది. ఓ, మై!

"ఈ దినములలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. ఆది అపోస్తలులకు మాత్రమే. అది గతించినది. ప్రవక్తలను వారున్నారా? అసలది తెలియదు. అద్భుతముల గూర్చి ఎన్నడూ తెలియదు, వారిక శాస్త్రీయు జ్ఞానము లేదు. మలాకీ 4? అది మరో యుగానిది. యోహాను 14:12? ఓ, యేసు ఆ భావముతో చెప్పలేదు. లూకా 17:30? అదొక కట్టు కధ." చూచారా? "అది తప్పు అనువాదము చెప్పబడెను. అది అసలు కాదు." అది బుద్ధిహీనత, ఎందుకనగా దేవుడు మన మధ్యకు వచ్చి దానిని రుజువు చేయుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఆయన చెప్పిన దానిని రుజువు చేయుచున్నాడు. అది కాదు అని ఎవరన్నా నాకు లేక్క లేదు; దేవుడే తన స్వంత వాక్యమునకు అనువాదకుడు. అంత్యదినములలో ఈ కార్యములు చేయునని దేపుడు చెప్పెను: "సాయంకాలమున వెలుగు కలుగును." మరియు దేవుని కుమారుని ప్రత్యక్షపరచుటకు వెలుగు వచ్చియున్నది.

ZECH 14:7•

REV 1:8

 

54తూర్పు ఉదయించిన సూర్యుడే పడమర అస్తమించుచున్నాడు. "పగలు రాత్రి కాని దినమొకటి యుండునని," ప్రవక్త చెప్పెను. అదొక మబ్బుగా వుండే కాలము; సూర్యునిపై మేఘములుండును. సాయంకాల సమయమున వేలుగుండునని ఆయన చెప్పెను. అదే కుమారుడు, ఆయనే ఆల్ఫా మరియు ఓమేగా. దినము గతించుటకు ముందుగా చివరి దినములలో తూర్పున ఉదయించిన కుమారుడే తిరిగి పశ్చిమాన ఉదయించునని ముందుగా చెప్పబడినది. దానినేట్లు అనువాదము చేశారో నాకు తెలియదు; దేవుడు తన స్వంత వాక్యమును ఆయనే అనువాదము చేయును. దానిని ఆయన రుజువు చేయును. ఇది సాయంకాలము.

అది విచారకరము, గాని నిశ్చయంగా ఆ దానికై ఆశించి పతనమాయెను. క్రీస్తు వధువు దానికి పడిపోయినది మరియు ఏదో సెమినరీ బోధకుని యొక్క జ్ఞానమును తీసుకొని, బయలుపరచబడిన దేవుని కల్తీలేని వాక్యమునకు బదులుగా నమ్మినది.

55ఇప్పుడు, ఈ దేశములో నున్న సేవకులు ఈ విషయమును అంగీకరించరు. నేను మిమ్మును బాధపరచుటలేదు. నేను నా స్వంత గుంపులో మాట్లాడచున్నాను. మీరు కూర్చొని విన్నచో, నాకు సంతోషము. కానీ దేవుడు వారికి చూపించిన దానిని, వారు చూచిన దానిని నిజమని రుజువయిన దానిని నేను చెప్పుచున్నాను. ఇదే ఘడియ. దానికెవరూ అనువాదము చేయనవసరం లేదు. నీ లోక జ్ఞానముతో పనిలేదు. నీకు బి.ఏ., డి.డి., ఏ.డి., లేక ఏదయినా ఉండవచ్చు; దాని వలన లాభం లేదు. దేవుడు తన స్వంత వాక్యమును ఆయనే అనువాదము చేసుకొనును. ఆయన వాగ్దానము చేసెను, అది ఇక్కడ ఉన్నది.

సెమినరీ జ్ఞానము ద్వారా, సంఘ శాఖ బోధ ద్వారా, లోకమంతయూ మృగము వెనుక వెళ్ళుట జరిగినది. చావు దెబ్బ తినిన ఆ మృగము అన్యుల నుండి పోపుగా మారి స్వస్థత నొందినది. అదిపుడెచ్చటకు వెళ్ళుచున్నదో చూచారా? ఆమె దానిని నమ్ముచున్నది. వాడు చెప్పు జ్ఞానమును ఆమె నమ్ముచున్నది.

56ఇప్పుడు గమనించండి! దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన సాతాను జ్ఞానమును ప్రధానము చేయబడిన ఇద్దరు వధువులు నమ్మిరి. ఆదాము వధువు దేవుని వాక్య విరుద్దమగు సాతాను జ్ఞానమును నమ్మెను.. ఈ తెలివిగల దుష్ట యుగములో క్రీస్తు వధువు కూడా వాక్య విరోధమైన సాతాను జ్ఞానమును నమ్మెను. గమనించండి, ప్రకృతి సంబంధియగు హవ్వ దానిని నమ్మి మానవజాతి యావతును మరణములో ముంచినది. భూవాసియగు స్వాభావిక మనిషి, తనయొక్క వధువును భార్యగా స్వీకరించు ముందే సర్వ మానవజాతి మరణములో మునిగిపోయినది. అది శాస్త్రీయమైనా, కాకపోయినా అందరం ఒకేలా చనిపోదుము, ఎందుకనగా దేవుడా విధంగా చెప్పెను. నీవు పరిశుద్ధ ఏదేను, లేదా పవిత్ర సంఘము లేదా పరిశుద్ధ శాఖ లేక ఎందులోనున్నా గానీ బయలుపరచబడి రుజువుకాబడిన వాక్యములోని ఏ ఒక్క సత్యమును నమ్మకపోయినా ఆ దినమున నీవు చనిపోదుమ, ఆ దినముననే నీవు దేవుని నుండి వేరగుదువు. వాక్యమంతా కాదు గాని ఒక్క మాట. ఒకటి తీసినా ఒకటి చేర్చినా, ఆ దినమున నీవు చచ్చెదవు.

MATT 24:37•

LUKE 17:26•

1PET 3:20

 

57గమనిచండి. మానవాళికి స్వాభావిక మరణమునకు కారణము ఆదాము యొక్క వధువు. క్రీస్తుకు ప్రధానము చేయబడిన ఈ ఆదాము వధువు సంఘము మొత్తమును శాఖా మరణములో ముంచెను. శాస్త్రీయమగు, జ్ఞానమగు, ఈ పెద్ద శాఖలు మృగము ముద్రను తీసికొనునట్లు చేసినవి "మేము బాపిస్టులము, మేము ప్రెస్బిటేరియనులము, మేము పెంతెకొస్తు వాళ్ళము," ఆ విధముగా. "మాకది ఉంది. మా కెక్కువ సంపద ఉన్నది." మేము ప్రభుత్వము ద్వారా పేరు పొందాము. మేము లోకమంతటా ఉన్నాం. ఈ పట్టణ మేయరు మా వద్దకు వచ్చును. మాస్ ఆచరించుటకు అధ్యక్షుడు మా వద్దకు వచ్చును" ఇది, అది. ఇంకేదో చెప్పెదరు. లోకమంతయూ ఒక ఆత్మీయ, శాఖా మరణములో మునిగి యున్నది. సంఘమంతయూ! చనిపోయినది!

"నీవు చాలా భాగం కప్పుచున్నావని" మీరనవచ్చు.

ఎనిమిది ఆత్మలు రక్షించబడిన నోవహు దినములువలే మనుష్యకుమారునీ రాకడయందును ఉండునని యేసు చెప్పెను. లోతు దినములలో సొదొమ నుండి ముగ్గురు బయటకువచ్చిరి. అపుడే ఒక గుంపు బయటకు వెళ్ళ సిద్దముగానున్నది. మనుష్యకుమారుని ప్రత్యక్షతయందును ఆలాగు జరుగునని చెప్పబడినది జ్ఞాపకముంచుకొనండి. అది ఏమి… ఎక్కడ మనం జీవించుచున్నామో చూడండి!

58విద్యా కార్యక్రమము ద్వారా లోకమంతయు శాస్త్రీయ నాయకత్వమును అంగీకరించునట్లు అది చేయుచున్నది. సంఘ పేరు క్రింద సాతాను దానిని ఇచ్చెను. విద్యా, శాస్త్రీయ కార్యక్రమము కింద; ఆ నాయకత్వము క్రిందవే. ఈ లోక దేవతను మీముందుంచచున్నాను. హవ్వ తన చేతిలో వోక్యమును నింపుకొన్నది. దేవుని మాటను అమె తీసికొనవలసినది, కాని దానిలో ఆమె ఏమిచేసెను? పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు నిలచియుండుటకు బదులుగా. పరిశుద్ధాత్మ శిష్యులకేనని చెప్తున్నారు. సైన్సును దానిని రుజువు చేయమనండి. దైవిక స్వస్థతను కొనసాగించుటకు బదులుగా, మృతులను లేపి గొప్ప ఆశ్చర్య కార్యములు చేయుటకు బదులుగా సాతానుకు నాయకత్వము ఇస్తున్నది. భక్తిగల వ్యక్తి దేవుని వాక్యమును తీసుకొని అది మరో యుగానికి అని చెప్తున్నాడు. దానిని ఆమె నమ్మినది.

MARK 16:15,17•

JOHN 14:12•

2TIM 3:5

 

59నేను చేయు క్రియలు మీరును చేయుదురని బైబిలులో చెప్పబడెను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడని యేసు చెప్పెను. మనమింకా పురుగులవంటి వారమే. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, దానిలోని ప్రతిదానిని ఆమె తిరస్కరించుచున్నది.

ప్రకృతికి అతీతమైన ప్రతిదానిని ఆమె తిరస్కరించుచున్నది. బైబిలును తన తెలివితేటలలో అర్ధము చేసికొనచున్నది. యాజకులు, పరిశుద్ధ తండ్రులు, నామకార్ధులు, బిషప్పులు, ఆర్చి బిషప్పులు, జిల్లా ప్రేస్బిటర్, జనరల్ ఓవర్సీర్లు, దానికి తమ స్వంత అనువాదమును చెప్పుచున్నారు. 12 గంటలవలె చచ్చి కూర్చున్నారు. దేవుడే ఆలాగు చేసెను. చివరి దినములలో మిగిలినది చిన్న పెంతెకోస్తు గుంపు, నాడు బహు గట్టిగా వాయిద్యములు కొట్టుదురు. నేల పై క్రింద పైన పడి నడచుచుందురు. భాషలలో మాట్లాడుదురు. చప్పట్లు కొట్టుదురు. ఒక రకముగా పైకి భక్తిగా కనిపించుచూ దాని వాక్యమును నిరాకరించుదురు. యేసుక్రీస్తు నామంతో బాప్తిస్మం పొందమని వారికి చెప్పు. నీ ముఖం మీదే సవ్వదురు. కాని దేవుడు తన వాక్యమును రుజువు చేయుచునే కొనసాగిపోవుచున్నాడు.

1COR 5:6•

GAL 5:9

 

60గమనించండి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములో హవ్వ పాలిభాగము పొందునట్లుగా సాతాను చేసెను. అది కలగూర వృక్షము. నేడు మనం జీవించచున్న దినము చూడండి. ఆయన, వధువును బయటకు పిలుచునవుడు, వాక్యమును నిరాకరించుచూ చెడ్డగానున్న సంఘము కుడా మంచి చేయుచున్నట్లుగా చెప్పుకొనును. కలగూర చెట్టు, వారికి గొప్ప సమూలములున్నవని చెప్పవచ్చు. వారేదో సహాయం చేయుచున్నారని చెప్పవచ్చు దానిని రెడ్ క్రాస్ అంగీకరించి యుండవచ్చు. పాఠశాలలన్నీ అనుమతించి యుండవచ్చు. ఇక్కడ చూడండి. వాక్యము నిరాకరించుచున్నారు. చనిపోవుటకు నీవు చేయవలసినదంతా అదే, ఎంత మేధావి, ఎంత మంచిగా నున్ననూ సరే, పులిసిన కొంచెము ముద్దంతయు పులియ చేయునని యేసు చెప్పెను. ఒక్క పులిసిన చోటు ముద్దను పాడు చేయును, సరిగా ఉంచబడునని ఒక్క వాక్యము మొత్తం పథకమును పాడుచేయును. నా పాదము ఉండవలసిన చోట నా చేయి ఉండినచో ఏమగును? నా చేయి ఉండవలసినచోట చెవి ఉన్నచో ఎట్లుండును? పులిసిన కొంచెము మొత్తము ముద్దను పులియబెట్టును.

"అది నిజమని నీకెట్లు తెలియునని" నీవనవచ్చు. దానిని నిజమని దేవుడు రుజువు చేయును. దానిని ఆయన బయలుపరచను. ఆయనిక్కడ వాక్యములో దానిని పలికెను, అపుడు దాని రుజువు చేయును. దానినిబట్టి అది తప్పో, ఒప్పో మనకు తెలియును. ఒక్క మాట త్రోసివేసినచో మరణము కలుగును. ఈ దుష్ట యుగములో ఆత్మీయ మరణము అను ఫలితమును తీసకొని వచ్చెను. ఆ రోజున మానవ జాతి మొత్తమునకు శారీరక మరణము సంభవించినట్లే.

PROV 3:5•

ROM 3:4

 

61నోవహు యొక్క శాస్త్రీయ యుగములో సాతాను ఎట్లువారిని తమ స్వబుద్దిని అదారము చేసికొనునట్లు చేసెనో గమనించిండి, బైబిలు సామెతలు ఇట్లు చెప్పెను. "స్వబుద్ధిని ఆధారము చేసికొనక." ప్రతిమనుష్యుని మాట అబద్ధమే కాని దేవుని మాట నిజము. కాని సాతాను తన జ్ఞానము ద్వారా ఆదినుండియు, ఏదేను తోటవద్దనే జనులు తమ స్వబుద్దిని ఆధారముగాచేసికొనునట్లు చేసినది. వాడు ఆ గొప్ప మాక్సు ఫాక్ట్ ర్ కనుల ద్వారా గతంలో స్త్రీలను సౌందర్యవంతులుగా చేసి, దేవుని కుమారులు పాపములో పడి వారిని పెండ్లి చేసికొనునట్లుగా చేసెను. స్త్రీలు చక్కనివారని చూచిరి.

ఈనాడు ఒక సామాన్య స్త్రీని వీధిలో చూడు. చాలామంది కధ చదివి యుందురు. జరిగింది కనుక చాలామంది వినియుండక పోవచ్చు. పెర్ల్, బ్రయిన్ గూర్చి ఎందరు విన్నారు? ఆమె ప్రపంచ సుందరిగా పిలువబడినది. కానీ ఈనాడు బడికి వెళ్చచున్న చిన్న పిల్ల ఆమెకన్న రెండు రెట్లు అందంగా నున్నది. ఎందువలన? చివరి దినములలో స్త్రీ సౌందర్యము ఆలాగుండును. వారు తమ జుట్టుక త్తిరించుకొనిరి. చిన్న బాలికలు దుస్తులు వారు ధరించారు. షార్టులు, బికినీలు, ఇంకేవో వారు ధరించారు. వారు లేనిదానినేదో పొందుటకుగాను రంగులు, మరేవో వేసికొనుచున్నారు. శాస్త్రీయ జ్ఞానము ద్వారా దీనిని వారు సాధించకలిగిరి. ఈ అమెరికాలో సౌందర్య పోషక వస్తువులకు ఖర్చు పెట్టు ద్రవ్యము, జీవించుటకు ఆహారము కొరకు ఖర్చుపెట్టు దానికన్న మూడు రెట్లు ఎక్కువ (అది నిజం), అలంకరణ సామగ్రి కొరకు.

GEN 6:2•

MATT 24:37•

LUKE 17:26

 

62గమనించండి దేవుడు కుమార్తెలు నరుల కుమార్తెలను చక్కనివారని చూచిరి - దేవుని కుమార్తెలను కాదు; నరుల కుమార్తెలను చక్కనివారని. ఈ కారణముననే దేవుని కుమారులు అంత మోసములో పడిరి. వారికి నచ్చిన స్త్రీలను తీసికొని పెండ్లాడిరి. అదొక వ్యభిచార యుగముగా మారెను, ఈనాటివలేనే, సొదొమలో నున్నట్లే, ఈనాడు ఉన్నట్లే ప్రవచింపబడెను, ఎప్పుడైతే ఈనాటి పురుషులు వారిక్కడ భార్య నచ్చకపోతే రేనో, నెవెడాలకు వెళ్ళి పెండ్లి చేసుకొని, దానికి విడాకులిచ్చి, మరో పదిహేను నిమిషములలో మరల పెండ్లి చేసికొని వస్తున్నారు. వారు జయించ లేనంతగా స్త్రీ సౌందర్యము పెరిగింది. ఏమిటది? దయ్యము! చూచారా, సాతాను ఇంకా అందంగానే ఉన్నాది!

గమనించండి, గమనించండి. ఆ పాపము వారికెన్నడూ క్షమించబడదు. ఆ అందమైన శాస్త్రీయ యుగము చాలా దుష్టయుగము. దేవుడు భూమీ మీద నుండకుండా వారిని నాశనము చేసెను. ఆ గొప్ప శాస్త్రీయ యుగము! మనుష్యకుమారుని రాకకు ముందు మరల ఆలాగే యుండునని యేసు చెప్పెను. నిజమే?

నోవహు దినములలో ఎట్లుండెనో మనుష్యకుమారుని రాకకు ముందును ఆలాగే యుండునని యేసు చెప్పెను. ఇప్పుడు గమనించండి. దేవుని కుమారులు అందమయిన నరుల కుమార్తెలను పెండ్లాడుటకు ప్రయత్నము చేసినప్పుడు దానినిబట్టి వారినెన్నడూ దేవుడు క్షమించలేదు.

MATT 24:24•

MARK 13:22

 

63బిలాము జోధ కూడా అదే… అందమైన, తెలివిగల శాస్త్రీయమగు మోయాబు స్త్రీలు తమ చెడ్డ కన్నులతో, రంగులు, పౌడరులతో, చక్కని సువాసనలతో, దేవుని కుమారులను వశము చేసికొనిరి. వారి స్వంత స్త్రీలకు ఆ రంగులు, వేషములు లేవు, మనందరం ఒకటే గనుక పెండ్లి చేసికొందము రండని వారు ఒకని నొకరు ఆకర్షించుకొనిరి. అది ఒక అబద్దము! అదొక అబద్దం. దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెండ్లి చేసికొనునట్లు చేయుటకు అదొక మార్గము. బిలాములో దయ్యము చెప్పిన ఒక అబద్ధము. ఆ అబద్ద ప్రవక్త మోషేకు వ్యతిరేకంగా జనాన్ని ఏకము చేయుటకు ప్రవచింప యత్నించెను. మనందరము ఒకే దేవుని నమ్ముతున్నాం. ఒకే విధంగా అర్పణలు ఇస్తున్నాం. మన బలులు ఒకటే. అంతా ఒకలాగే మనం చేస్తున్నాం అన్నాడు. సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును, ఆ జనుల నుండి వచ్చి వేయుము. వారితో నీకు ఏమీ పొత్తు లేదు.

REV 16:21•

REV 18:4

 

64కయీను యొక్క చెడ్డ తరమునకు దేవుడు తన వాక్యమునకు ఆ విధంగా అనువాదము చెప్పడు. వారికి దేవుడు తన వాక్య అనువాదము తెలియచేయడు. [టేపుపై ఖాలీ.] లోకమును సృజించిన జ్ఞానముగల దేవుడు అందమైన, శాస్త్రీయమున పాపపు లోకమును నాశనము చేయడా? దేవుడు ఆ విధంగా లోకమును అందంగా చేయునా? ఇటు చూడు! తన కుమార్తెలను దేవుడు మరింత చక్కగా చేయుచున్నాడు. ఆయన కుమారులు శరీరేచ్చకు లోనై వ్యభిచరించు రీతిగా ఆ స్త్రీలను అలంకరింపచేయునా? దేవుడటువంటి పని చేయునా? ఈ దిగంబరియైన లవొదకయ మొండి గుంపు వారి శాస్త్రములు, చదువు, ప్రతిభ, అందము ద్వారా ఈ యుగ దేవతను ఆరాధించుచున్నారు. "దానిలోనుండి బయటకు రండి!" బైబిలు చెప్పుచున్నది, "దాని పాపము, తెగుళ్ళలో పొలివారు కావద్దు." ఒక రోజున దేవుడు ఒక్కొక్కటి నూరు పౌనుల బరువు గల వడగండ్లను ఆకాశము నుండి కురిపింప చేసి, దానిని నాశనము చేయును. అయన వాక్యము ఎప్పుడూ చెప్పినట్లుగా ఆయన ధర్మశాస్త్రము పలికినరీతిగా ఆమెను రాళ్ళతో చంపును. అట్టి వారికి దేవుడు తన వాక్యము బయలుపరచి, తన ఉదేశ్యము కొరకు తానే ఓడిపోనున్నాడు. దేవుడు బుద్దిహీనుడు కాడు; సర్వజ్ఞానమునకు ఆధారము ఆయనే. కాబట్టి ఇదంతా ఎక్కడనుంచి వచ్చెను? అది సాతాను నుండియే వచ్చినది, ఇంకా వస్తున్నది. దానిని సంఘము నమ్మినది.

65స్త్రీలారా, ఇప్పుడు చూడండి, దేవుని వాక్యమును శాయశక్తులా మీకు చూపించ యత్నించుచున్నాను. స్త్రీ జుట్టు కత్తిరించుకొనుట ఆమెకు అవమానమనియు, తన భర్తను అగౌరపరచుచున్నదనియు బైబిలు చెప్పుచున్నది. ఆమె భర్త దేవునితో శిరస్సు. కాబట్టి ఆమే దేవుని తన భర్తను అగౌరపరచుచున్నది.

ఈ లోక సంఘ క్రమమునకు శిరస్సు ఎవరో అది సూచించుచున్నది. సహజాతీత వ్యక్తి రూపములో నున్న సాతాను మహా జ్ఞానముతో యున్నది. వారందరి కన్న దానికి ఎక్కువ తెలియును. వాక్యము ఏమి చెప్పినా లెక్క చేయక, తన స్వంత అనువాదమును చెప్పును (చూచారా), ఈ దుష్టయుగమునకు తగిన అనువాదమునిచ్చును.

66గొప్ప శాఖా సంఘము, ప్రపంచ సంఘముల సమితిని కట్టుటకు వాడి పధకములను కనిపెట్టి చూడు. క్రైస్తవ ఐక్యత అను పేరు క్రింద మృగమునకు ప్రపంచమంతా ఆరాధించునట్లు చేయును. అది నీవు చదువగోరినచో ప్రకటన 13:6 మరియు 8 చూడు. అది ఆధునిక బాబేలు గోపురము.

వేషధారియగు నిమ్రోదు ఈ గొప్ప గోపురమును ఎట్లు నిర్మించెనో గుర్తు చేసికో, దానికి ఆ తక్కిన చిన్న పట్టణములన్నియూ కప్పములు చెల్లించునట్లు చేసెను. బాబ్లె, బాబేలు రెండూ ఒక్కటే. అది పేరు మారి ఆలాగయినది. ఇప్పుడు బబులోను, రోమ్, ప్రపంచమంతా బబులోను యొద్దకు తేబడును. అది ప్రపంచ సంఘ సమితి ద్వారా తేబడును. అది ప్రతి ఒక్కరూ దానికి సాగిలపడునట్లు చేయును. నీవు ఏం చేయుచున్నావో తెలియకుండానే [స్పష్టత లేని మాటలు]. అయితే ఏర్పరచబడినవారు వాక్యము విని దానినుండి బయటకు వత్తురు.

67ఈ శాఖ దేవుని వాక్యమునకు ఎంత వేరుగానున్నది! ఆయనెన్నడూ ఒక్క శాఖతో కూడా మాట్లాడలేదు. సంఘంలో నుండి ఏ ప్రవక్తయినాగాని ఎన్నడై నా వచ్చాడేమో ఏ చరిత్రకారునైనా చూపించమనండి. సంస్థ అయిన తరువాత ఏ సంఘమునైనా దేవుడు ఎప్పుడైనా దీవించాడేమో చూపించండి. అది గూటిలోనికి పోయి దయ్యము జ్ఞానము, వాక్యమును నిరాకరించినవారి నాయకుల ద్వారా వచ్చినది. క్రీస్తు యొక్క పరిపూర్ణ రూపములోనికి దేవుని వాక్యమే ఎదిగించును. ఇపుడది శిరస్సు వద్ద నున్నది. సాయంకాల వెలుగు బిడ్డలారా! ఆ హవ్వ యొక్క అవిశ్వాసము నుండి వేరవండి.

సాతాను ఈ యుగ దేవత, తన జ్ఞానము ద్వారా మంచి చెడ్డల కలగూర చెట్టు నుండి తినుటకు జనులకిచ్చినది. సాతాను తన యుక్తి ద్వారా ఈ దుష్ట యుగము వారికి మంచి చెడ్డల మిశ్రమమును తినుటకు ఇస్తున్నది. తన మంచి, చెడుల జ్ఞానము ద్వారా గొప్ప క్రైస్తవ నాగరికతను నిర్ణయించుదుదని పలుకుమన్నది. కాని క్రీస్తు యొక్క చిన్న కన్యక, వాక్యము, మంద, వధువు, దాని జ్ఞానమును లెక్క చేయుటలేదు. దానినుండి ఆమె స్వేచ్ఛను పొందినది.

ఆమె గూర్చి ఒక నిమిషం మాట్లాడుదం. ఆమె తన, ప్రభువు కొరకు ఆయన వెయ్యేండ్ల పాలనలోని విడిది కొరకు ఎదురుచూస్తున్నది (అది నిజము) వాక్యము పెండ్లి కుమారుడు వాక్య వధువుతో ఏకమగును.

68జ్ఞానము, నాగరికతలలో, నిజ క్రైస్తవ్యమునకు ఏమి పొందిక లేదు, నాగరికత, నిజ క్రైస్తవ్యము ఏ విషయంలోనూ పోలికను కలిగిలేవు. నాగరిక జ్ఞానము ద్వారా వచ్చను. మనకందరకు తెలుసు. ఏదేను నుండి జ్ఞానము వచ్చెను. వాడు ఏదెనులో బోధించిన దాని ద్వారా అది రుజువు చేసెను. జ్ఞానము మరణమునకు కారణము. అవునా? ఏదేను తోటలో మరణమునకు ఏది కారణము? జ్ఞానమే. అది దేవునిది కాదు. దయ్యమునకు చెందినది. అది మంచిదా? జ్ఞానము, సైన్సు విద్య దేవునికి గొప్ప అడ్డు బండలు. అవి దయ్యానివి. ఇప్పుడు వాటిపై కొన్ని ఉత్తరములు నాకు వచ్చునని తెలుసు. నేను వాటికొరకు ఎదురుచూస్తున్నాను.

ఇప్పుడు మనము ఏ సంస్కృతిలోనికి వచ్చామో చూడండి, అదేం చేసెనో చూడండి. మనం ఎక్కడున్నాం? మన సైన్సు ద్వారా స్వబుద్దిని ఆధారము చేసుకొని ఆయా సంగతులపై మనం ఆనుకొనియున్నాము, దేవుడు అజ్ఞాని అని నీవనుకొనుచున్నావా అని మీరు ప్రశ్నించవచ్చు. ఓ, కాదు! దేవుడు ఈ భూమిని తీసికొనినపుడు తన స్వంత సంస్కృతిని భూమి పై ప్రవేశపెట్టును. ఇది సాతాను ప్రపంచము. ఈ లోక సైన్సు జ్ఞానమునకు వాడే ఇప్పుడు దేవుడు. కాని దేవుడు తన స్వంత నాగరికతను నెలకొల్పును. అది ఇటువంటి నాగరికత కాదు. నీవు జ్ఞాపకం చేసికో! ఈనాడు మనకున్న నాగరికత వంటిది కాదు, కాదు! అది ఆయన వాక్యానుసారముగాను, ఉద్దేశ్యానుసారమైనది గాను ఉండును. ఎందుకనగా ఈ ప్రస్తుత దుష్ట యుగము వాడి రాజ్యముతో పాటుగా నాశనము చేయబడును.

PROV 3:5•

2TIM 3:5

 

69ఈ ఆధునిక జ్ఞానమును ప్రేమించు యుగము సాతానును అందరికన్న గొప్ప నాయకునిగా ఎన్నుకొన్నది. ఆదిలో ఏదేను తోటలో వాక్యమును ఏక్రీకరించినట్లుగానే ఇప్పుడును చేయుచున్నాడు. కాని మత వ్యక్తి తన స్వబుద్ధి పై ఆధారపడును. ముందే నేను సామెతలు 3:5 లో చెప్పాను, మన స్వబుద్ధి పై ఆధారపడరాదు, వారికొక దేవుడుండును. వారు మానవులు. అయిననువారు కోరినట్లుగానే ఆయన చేయుచున్నాడు. అందరం మానవులమే ఇండియా వారు విగ్రహములను, సూర్యుని అన్నింటినీ ఆరాధించుదురు. మానవునికి తప్పక ఒక దేవుడుండాలి కాబట్టి ఈ గొప్ప తెలివి యుగమునకు గూడా ఒక దేవుడుండాలి. కాబట్టి ఈ లోక దేవత, జ్ఞానము, శాఖ, సైన్సు, పైభక్తిగల వారివలే యుండియు దాని శక్తిని ఆశ్రయించకపోవుట.

70గమనించండి. వారి దేవుడు వారిని వారిష్టానుసారంగా తయారు చేయును. వారు శరీరాశ గలవారు.

వారికదే వాడిచ్చును. "వారు బికినీలు వేసికొన గోరుచున్నారు, వారిని వేసికోనీయండి. వారేమి చేయాలన్నా చేయనీయండి. అందులో ఏమీ హానిలేదు; వారు గుడికి వెళ్ళుదురు. వారి తల్లి మొతడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు, ప్రెస్బిటేరియను; వారిని ఆలాగే ఉండనీయండి." అదే ఈ దుష్ట యుగవు దేవత. తెలివి, చురుకుతనము, సెన్సు, దానికి విశ్వాసము అవసరం లేదు. దానికేమి రుజువు అవసరంలేదు. అది వారి జ్ఞానము ద్వారా ముందే నిరూపించచడనది. మేము ఈ పట్టణంలో పెద్ద సంఘం కలిగియున్నాం." "మా పాస్టరుగారు డి.డి., పి.హెచ్.డి. పట్టా కలిగినవారు." చూచారా, విశ్వాసము అవసరం లేదు; జ్ఞానము పై అధారము. వారి శాఖ, సిద్ధాంతములకు కట్టుబడినంత కాలము ఏలాగున్నా పరవాలేదనుకొంటారు. ఒక పెద్ద నల్ల కన్ను అక్కడున్నది. చూడు! దేవుని వాక్యము చూచి నవ్వుదురు. వాక్యము విరుద్ద సంగతులు చెప్పి, తమ జ్ఞానమును శాస్త్రీయంగా రుజువు చేయ ప్రయత్నించుచూ, వాక్యము నిజము కాదందురు. ఓ, ఎలాంటి యుగంలో మనం జీవించుచున్నాం. ఈ యుగ దేవతను చూచారా?

71గమనించండి. అయితే ఈ ఆధునిక అమోరీయుల పాపము పరిపూర్తి అగువరకు దేవుడు వేచి చూస్తున్నాడు. చింతించవద్దు, ఆయన అ సమయమునకు మోషేను సిద్దముగా యుంచును. వాగ్దాన భూమికి ఒక రోజున నిర్గమము ఉండును. తండ్రుల విశ్వాసమును పిల్లల వైపునకు త్రిప్పి పునరుద్ధరణ చేయు పిలువబడిన ఒక మోషే మార్గమున వచ్చును. అదేదో ఈ దినములోనే జరుగును. మేమెలా అభివృద్ధి చెందుచున్నామో చూడమని నీవనవచ్చు. నిశ్చయంగా, ఆమోరీయుల పాపము ఇంకా పరిపూర్తి కాలేదు. ఈ దినములోనే వచ్చును, వారిని వారే నాశనము చేసుకోనీయండి.

నాగరికత, జ్ఞానము దేవుని వాక్యమును తమ రుచికి అనుగుణముగా త్రిప్పును. ప్రతి సంఘ శాఖయూ అదే పని చేయును. సాతాను తన స్వంత సంఘములో జ్ఞానము అను తన స్వంత నువార్తను బోధించుచున్నది.

EPH 2:2•

1JN 3:10

 

72దేవుని పిల్లలు, దయ్యము పిల్లలు అను రెండు, తరగతుల జనులు మాత్రమే క్రొత్త నిబంధనలో యున్నారు. అది నీకు తెలుసా? దానికి ఒక లేఖనము పెట్టవలెనని కోరుదువా? I యోహాను 3:10 చదవండి. మంచిది.

ఎఫెసీ 2:2లో వారు అవిధేయ పిల్లలని పిలువబడిరి, హవ్వ వలెనే దేవుని వాక్యమునకు అవిధేయులు. విధేయ, అవిధేయ పిల్లలకు ఏ విషయములోను సారూప్యము లేదు. ఒకరు విధేయులు మరొకరు అవిధేయులు, కాగా క్రీస్తు పెండ్లికుమారై ఒక శాఖలో ఎట్లు సహవసించగలదు? ఒకరు వాక్యము, మరొకరు తిప్పబడిన వాక్యము. వేశ్యయు, పవిత్ర స్త్రీయు సమ్మతించి ఎలా నడువగలరు? వారట్లు చేయలేరు. వారికసలు సహవాసమే లేదు. వారిమధ్యనుండి బయటకు రమ్ము. అది దయ్యమునకు సంబంధించినది; అది మృగము యొక్క ముద్ర, అదిపుడు ఒక్కచోటకు కూడుచున్నది. అన్ని శాఖలూ అందులోనున్నవి. అదెవరైనా గాని నేను లక్ష్యపెట్టను. దేవుడు మాట్లాడుచున్నాడు, ఒక శాఖతో కాదు గాని తన నామము కొరకు ఒక జనము నిమిత్తము. ఒక శాఖ ఈ సత్యములను చేర్చుకొనలేదు. ఒక వ్యక్తిగా మాత్రమే దేవుని చూచుట సాధ్యపడును, ఆయన వాక్యమును చూచును. దానిని నమ్మును. ఏ సంస్థకు చెందదు, కాని దేవుని కొరకు జీవించును, తన సంస్థ కొరకు కాదు లేదా వారికి నేర్పించిన ఒక బిషప్పు యొక్క మానవ జ్ఞానము లేదా మరేదో పైన ఆధారపడడు. అది నిజము.

2TIM 3:5,6

 

73విదేయ, అవిధేయ పిల్లలకు ఎందులోనూ పోలిక లేదు. ఒకరు దినపు వెలుగునకు, మరొకరు చీకటి, అంధకారము, దుష్ట యుగమునకు చెందిన వారు. ఇది అంధకార దుష్టయుగము. రాత్రి క్లబ్బులు, డాన్సులు, సంఘానికి చెందినవారు ఒక్కరే. వారి దేవునికది మంచిదే. దాని గూర్చి గద్దింపు లేదు; వారేది పట్టించుకోరు. "నా జుట్టు కత్తిరించుకొన్ననూ నాకేమీ శిక్షలేదే?" అని ఒకామె అన్నది. నా మనస్సాక్షికి బాధ లేదు." పాముకు కాళ్ళు లేనటే ఆమెకు అసలు మనస్సాక్షి లేదు. నిశ్చయముగా లేదు. అసలు మనస్సాక్షి అంటే ఏమిటో ఆమెకు తెలియదు. అదేమిటో తెలియనంత కఠినంగా ఆమెకు వాత వేయబడినది. అది నిజం.

దేవుని వాక్యముచుట్టూ నడచివస్తూ, "అది ఒక పాత పద్దతి. అక్కడికి వెళ్ళవద్దు; అదొక అల్లరి గుంపు," అందురు. ఒక ఐగుప్తు రాత్రిని గూర్చి హాటెన్ టాట్ ఎట్లు ఎరుగదో వీరును దేవుని గూర్చి ఎరుగరు. అది నిజము. పైకి భక్తిగలవారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారు. అట్టివారికి దూరము కమ్ము. అట్టివారు ఇంటింటికీ తిరుగుచూ, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుచుందురు. "నీవిది చేయాలి. అక్కడ నీత బోధకుని గూర్చి ఆలోచించు. నీవు ఈ బట్టల్లో ఎబ్బెట్టుగా కనపడెదవు. నీవు అదీ, ఇదీ, మరేదో చేయుము. చిన్న సిగరెట్టు వలన ఏమీ హాని లేదులే. నేను సంఘానికి చెందినవాడినే. మా శాఖ అందరికన్నా మంచిదని నీకు తెలుసు గదా?" అని అందురు. ఆ రంగు పూసికొనిన ముసలి అబద్ధికుని నమ్మకు, అది నీతో అబద్దమాడుచున్నది. అది నిజం. అవునండీ!

MATT 16:23•

MARK 8:33

 

74వారి దేవునికది మంచిదే. ఓ, అది అద్భుతమని వాడనుకొనును. దాని కోరకే వారతని ప్రేమించుదురు. వారు నీతో వాదించుదురు. వారు లేచి నిన్ను దానిగూర్చి హేళన చేయుదురు. వాక్యమైయున్న యేసుక్రీస్తు ముఖము ఎదుట సాతాను నిలబడి "ఈలాగు వ్రాయబడియున్నదని" చెప్ప ప్రముత్నించెను. అక్కడ ఆయన బయలుపరచబడిన దేవుని వాక్యము. ఆయన, "సాతానా! నా వెనుకకు పోమ్ము!" వెళ్ళి మరియు అదే చేస్తున్నది.

ఒకసారి ఒకతను నాతో చెప్పెను, "నీవు పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందావని నమ్మినచో, అందులో నీకు నమ్మకమున్నచో, నన్ను గుడ్డివానిగా చేయుము. ఎందుకనగా పౌలు ఒకని ఒక రోజున గుడ్డివాని కమ్మనగా గ్రుడ్డి వాడాయెను," అని చెప్పెను.

"అయ్యా! నీవు ఇప్పుడు గ్రుడ్డివాడవే. ఇంక నిన్ను ఎట్లు గ్రుడ్డివానిగా చేయగలను?" అని నేను చెప్పాను. నీవు ఇదివరకే చచ్చియున్నప్పుడు ఇంకెట్లు చంపగలను?"

"నా కళ్ళ నిక్షేపంగా ఉన్నాయ, కదా?" అని అతడు అన్నాడు.

"అది నీ భౌతిక భాగము, కాని నీవిపుడు గుడ్డి వాడివే," అని నేను అన్నాను.

"అది అసాధ్యము! బైబిలు అనువాదము చెప్పదు. బైబిలు మాట్లాడిన చోట మేము మాట్లాడుదుము, అది మౌనియగు చోట మేము మౌని యగుదుము."

2KGS 6:14-19

 

75ఏలియా దోతానులో నుండగా, చుట్టూ సిరియా సైన్యము ముట్టడివేసినది, ఆ దాసుడు పరుగేత్తికొని వెళ్ళి, "ఓ నా తండ్రీ! సిరియనుల దండు మనలను చుట్టుముట్టినది," అని చెప్పెను. ఏలియా కండ్లు నులుముకొని లేచి, 'వారితో నున్నవారికంటే మనతో నున్నవారు ఎక్కువమంది,' అని చెప్పెను. నా కేమీకనబడుటలేదని దాసుడనెను. దేవా వీని కండ్లు తెరువుమనెను. అతడు గ్రుడ్డివాడు. వృద్ద ప్రవక్తవైవు చూచెను. పర్వతములు దేవదూతలతో నిండిపోయెను. అగ్ని రధములు ఉండెను. అతడచ్చటికి నడచి వెళ్ళి వారిని అంధత్వముతో మొత్తెనని వ్రాయబడెను. అతని విషయంలో వారు గ్రుడ్డివారయిరి, మీరు ఏలియా కోసమేనా వెదకుచున్నారు? అని ప్రశ్నించి అతడెక్కడున్నాడో చూపించేదనని చెప్పి వారిని తోడుకొని వచ్చెను. వారు గ్రుడ్డివారు. ఇదంతా ఎందుకు నీకు చెప్తున్నానో తెలుసా?" అని ఆ వ్యక్తిని నేను అడిగాను. నీ తండ్రియగు అపవాదికి "వెనుకకు వెళ్ళమని" నా ప్రభువు చెప్పెను కదా? నీకు ఆలాగే చెప్తున్నాను అని అతనితో అన్నాను.

REV 22:18,19

 

76గమనించండి. విధేయ, అవిధేయ పిల్లలు ఒకేలా లేరు. అవిధేయులు తమ దేవుని ఆరాధించుదురు. "మేము బైబిలు నమ్ముదుము," అని చెప్పుదురు. అయిననూ అది మిశ్రిత వృక్షమే (చూచారా?); వారు దానికి లోకము, జ్ఞానమును కలుపుదురు, సాతాను చెట్టు కలగూర చెట్టు. మంచి చెడులను ఆమే సాతాను నుండి తీసికొన్నది. "మనము నిశ్చయంగా వాక్యమును నమ్ముతాం గాని అంతా కాదు." హవ్వ కూడా వాక్యము నమ్మినది. సాతాను తన చెట్టును తీసి కొని దానిని కొద్దిగా వంకరచేసినది. దానికి ఒకమాట చేర్చినా, అందులో నుండి ఒకటి తీసివేసినాగాని అన్న మాట అందుకొరకే. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు.

గమనించండి! మంచిది.

JOHN 6:49

 

77ఈ దుష్ట యుగము చీకటికి చెందియుండియూ సంఘములో చేరినది. వారిని ఇష్టానుసారంగా చేయనిచ్చున్న తమ దేవతను వారు ప్రేమించుదురు. వారికి శిక్ష లేదు. ఏదియు వారిని బాధించదు. సంఘ సభ్యులుగా ఉంటే చాలును. బిలాము సంఘమునకు అదే నేర్పించెను. "మనం కలిసి ఉందాం; మనము అంతా ఒక్కటే." అది చివరి ఎత్తుగడ. అట్టి అబద్ధమును నమ్మినందుకు దేవుడెన్నడూ వారిని క్షమించలేదు.

గుర్తుంచుకొనండి, బైబిలులో క్షమింపబడని పాపము మూడుసార్లున్నది. దేవుని వాక్యమునకు అది సత్యమని నిరూపించబడిన తరువాత దానికి స్వంత అనువాదము ఒకటి చేర్చినా గాని క్షమించబడదు. ఏదెను తోటలో ఒక్క మాట చేర్చినందున మరణము సంభవించెను బిలాము కూడా ఆ విధంగానే ఒక్క మాట కలిపెను. దానికై ఎన్నడూ ఇశ్రాయేలును దేవుడు క్షమించలేదు. అందరూ అరణ్యములో నశించిపోయిరి. ముగ్గురు మాత్రము దేవునిచే బయటకు రాగలిగిరి. "ప్రతివారు చచ్చిరి," అని యేసు చెప్పెను. వారు నిత్య ఎడబాటు పొందిరి. అందరూ పోయిరి, ఎన్నడూ క్షమించబడలేదు. అది క్షమించబడని పాపము, వారెన్నడూ క్షమించబడరు. సాయంకాల వెలుగు పిల్లలారా! దాని నుండి పారిపొండి.

78ఈ ఆధునిక మత దుష్ట యుగమునకు నాయకుడెవరు? మంచిచెడ్డల వృక్ష మును అక్కడుంచినది దయ్యమే. తన అందమైన సంఘ వధువును వివాహమునకై ఐక్య సమితికి తీసికొనివస్తున్నది. తన చక్కని శాస్త్రీయ సంఘమును సంపాదించగలిగిన డిగ్రీలన్నింటితో తీసికొనివస్తున్నది. క్రీస్తు సంఘపు పి.హెచ్.డిలు బాప్తిస్టులు, పెస్బిటేరియను, పెంతెకోస్తు, ఇంకా తక్కిన అలంకారములు, పెద్ద సంఘములు ఇవన్నియూ మనం ఒక్కటే అంటున్నాయి. అది వారి కెన్నడూ క్షమించబడదు. ఒక శాఖ గుర్తును ధరించుట మృగపు ముద్రయే. పిల్లలారా? పారిపొండి! అందమగు ఐక్య సంఘ… వాడి ముద్ర, షార్టులు (నిజము), లోక బట్టలు, రంగులు, వేసికొనిన నిజ సాతాను శిష్యులు. దేవుని కుమారులను పట్టుకొనుటకు వస్తున్నారు నిండుగా జన్మించిన పిల్లలను, ఆ భ్రష్ట ముసలిది పెండ్లి చేసుకోవాలనుకొనుచున్నది. అది నిజము.

GEN 6:2•

MATT 24:37•

LUKE 17:26•

1COR 11:15

 

79"తల వెంట్రుకలు కత్తిరించుకొంటే ఏమిటి?" అని వాడు అడుగుచున్నాడు. సహోదరుడా, ఒక్క నిమిషం ఆగుదం. ఎవరో అన్నారు ఆ మాట. ఎక్కడో వైరులో అన్నారు. వినండి! ఒక స్త్రీకి వెండ్రుకలు నాజీరు ప్రమాణము. సమ్సోనుకు వెండ్రుకలు నాజీరు ప్రమాణము. నాజీరు ప్రమాణమును," ఆమె తిరస్కరించుచున్నది. ఆ ఒక్కదానివలన ఆమె పూర్తిగా చెడిగొట్టినది. నిశ్చయముగా. నాజీరు అనగా "ఒక ఉద్దేశ్యము కొరకు ప్రతిష్ఠించబడినది అని అర్ధము." అవునా? సమ్సోను ఒక యుగము, ఒక ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించబడెను. కాబట్టి అతనికి పొడవాటి జుట్టు ఉండెను.

దేవుని బిడ్డయగు స్త్రీ, దేవుని ప్రతి మాటకు కట్టుబడి యున్నానని చూపించుటకు జుట్టును పెంచును. ఆమె దానిని కత్తిరించినప్పుడు ఆమె ఎంతగా గంతులు వేసి, పాటలు పాడి, భాషల్లో మాట్లాడినా, క్రిందికి పైకి ఎగిరినా, ఎట్టి సహాయ సంస్థలున్నా గాని చచ్చినదే. అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," దేవుని వాక్యము. (I కొరింథీ 14). ఆమె తన నాజీరు ప్రమాణమును నిరాకరించినది. ఈ ఆధునిక యుగ దేవతకు అమ్ముడుపోయినది, స్త్రీలారా! మీకు సిగ్గు.

దేవుని కుమారులు పట్టుకొనబడుమన్నారు. మనుష్యకుమారుడు తిరిగి వచ్చునపుడు నోవహు దినములలో నుండినట్లే ఉండునని యేసు చెప్పెను గదా? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి, పెండ్లి చేసికొనిరి. వారి దేవత అది గొప్పగా ఎంచును, అందమని, శాస్త్రీయమని భావించును.

జ్ఞానము, హాలీవుడ్ పోకడలు, తన స్వంత షావులోనే తయారగుచున్నవి, ఇలాంటి సరుకు, మీకు తెలుసా.

MATT 6:27•

LUKE 12:25

 

80ఆమె, వాడి సంఘము, దానిని ప్రేమించును. ఓ, మై! "నేను మెతడిస్టుని, నేను ప్రెస్బిటేరియనుని, నన్ను అర్థంచేయనీ. మా పాస్టరు అంతకన్న గొప్ప సంగతులు చెప్పును," అని వారంటారు. అయితే దేవుడు చెప్పే సంగతులు చెప్పే జ్ఞానం వానికి లేదు.

ఆమె, అనగా సంఘము దానిని ఆరాధించుచున్నది; ఆమె దానిని ప్రేమించును. అదే ఆమె కోరిక. దేనితోను ఆమె కలియదు, ఈ ఆధునిక యెజెబెలులకు భిన్నంగా ప్రవర్తించుటకు ఆమె ఇష్టపడదు. సోదరుడా! ఆమె స్వభావమది. ఎవడు తన ఎత్తుకు మూరెడు ఎక్కువ కలుపగలడు? నీవు అయిదడుగుల ఎత్తులో నుండుటకు పుట్టినచో, నీవు ఆరు అడగులు కాజాలవు. బూత్ క్లిబ్బను సాగే యంత్రమువలె…

81మీరు ఎలుకల గుంపులు, మీరు మానవులకు పుడితే మానవులవలె ప్రవర్తించుము. మీ ముఖముల మీదకు వెండ్రుకలు పడి చుట్టుకొనుచున్నవి. దెయ్యములవలె కనబడుచున్నారు, మీరు సర్పమువలే వక్రసంతానమునకు చెందిన వారు. నా దేవుడు ఈ దేశమును ఒక రోజుసు అగ్నితో తీర్పు చేయును, సముద్రము క్రింద దీనిని ఆయన ముంచును. ఆయన తీర్పు ఘడియ వచ్చియున్నది. లోకమంతయూ పోవును.

భక్తిలో వంకర, మానవునిలో వంకర; స్త్రీ - పురుషులు తాము ఏ లింగమునకు చెందియున్నారో అసలు తెలియుటలేదు. పురుషుని బట్టలు వేసికొని, షార్టలు ధరించుకొని, శరీరం కప్పుకోకుండా నిలబడి క్రైస్తవులని పిలిపించుకొనుచున్నారు. క్రైస్తవురాలు కాదు సరి కదా అసలు స్త్రీయే కాదు. ఆమె సాతానుచే వాడుకొనబడుచున్న వీధి వేశ్యలా ఉన్నది. దేవుని కుమారులను నరకమునకు పంపుటకు సాతాను ప్రేరేపణ పొందినవారు. యేసు ఆ విధంగా జరుగునని చెప్పిన మాట నెరవేరుచున్నది. నేను చెప్పాలనుకొనుట లేదు గాని ఆయనే ఆ విధంగా చెప్పుచున్నాడు. ఈ భక్తి ఆత్మ ఎచ్చట నుండి వచ్చినది? మిశ్రమ చెట్టునుండి.

DEUT 22:5•

1COR 11:5,13,15•

COL 2:8

 

82ఆ ప్యాంటు ధరించుకొంటే ఏం తప్పు! అంటున్నారు. దాన్ని ఏదోగా వారు పిలుస్తున్నారు. పురుషుని వస్త్రము ధరించన ఏ స్త్రీ అయినను దేవునికి అసహ్యురాలు అని బైబిలు చెప్తున్నది. బైబిలు ఆలాగు సెలవిచ్చుచున్నది. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీ తన శిరస్సును అవమానపరచకొన్నది. పొట్టి జుట్టులో స్త్రీ ప్రార్ధించుట పాపము, బైబిలు ఆ విధంగా చెప్పెను. బహిరంగముగా తల కప్పుకొనకుండా ప్రార్దించరాదు.

నేను టోపీ ధరించానని నీవు అనవచ్చు, నీవు వేషధారివి, మానవుడు చేసిన టోపీ కాదు గాని, ఆమెకు ముసుగుగా ఇయ్యబడిన జుట్టును గూర్చి బైబిలు బోంధిచుచున్నది. స్త్రీలకు అట్టివి నేర్పించుచున్నారు. నేను బాధ్యుడను కాను; సత్యము చెప్పే బాధ్యత నాపై యున్నది. ఏదో గుంపును సంతృప్తిపరచే, లేదా ఎవరి కోరిక కనుగుణంగానో బోధించే విధంగా దేవుని వాక్యమును ఉపయోగించరాదు. అది యదార్ధహీనత అని బైబిలు చెప్తున్నది.

83దుష్ట అను పదము ఇక్కడ యున్నది; దుష్ట పదమునకు బదులుగా ఎల్విస్ అను పదము వ్రాశాను. అవి రెండూ ఒక్కటే. ఎల్విస్ అనగా పీల్లి అనియు, రికీ అనగా ఎలుక అనియు అర్ధము. చిన్న రిక్కీ అని నీవు పిలుస్తున్నావంటే చిన్న ఎలుకా అని పిలుచుచున్నావన్నమాట. వాడు ఎలుకయై యున్నాడు. నీ పిల్లవానికి పెట్టిన ఆ పేరును సువార్త నిమిత్తము వెంటనే మార్చి వేయును. ఏ యుగములోనూ, బైబిలులోగాని ఆ పేర్లు పెట్టబడలేదు, ఈ యుగపు నామమది. పిల్లులు, ఎలుకలుగా వారు ఇప్పుడే మార్చబడిరి.

ఈ చిన్న పిల్లలు తమ చెవుల్లో చిన్న రేడియోలు పెట్టుకొని, ఏవో పాటలు వింటూ బడికి వెళ్తున్నారు. జేబులో చిన్న రేడియోలు పెట్టుకోకుండా ఎవ్వరూ బడికి వెళ్ళుటలేదు. ఆ ఇండ్లు ఆలాగు తయారయినవి, వారు నా ఇంటికి కూడా ఆలాగే రంగులు వేద్దామని వచ్చారు. ఆ రేడియోలు అక్కడ నుండి తీసేయండి అని మేము చెప్పాము. మీరది లేకుండా పని చేయలేకపోతే పొండి అన్నాను. నేను అక్కడ నిలబడలేనంత ఉద్రిక్తుడనైపోయాను. మేమీ స్థలమును దేవునికి ప్రతిష్ఠించాం. ఈ అంత్యకాలపు ఆ అసహ్య సంగీతము ఇచ్చటవద్దు అన్నాను. అది మూసేయండి లేదా పని నుండి పొండి అన్నాను.

గమనించండి. భక్తి ఉన్నది, సంఘానికి వెళ్తారు కాని ఆ బూగీ వూగి వింటారు.

84మరియు గమనించండి. క్రీస్తువిరోధి వెళ్ళుచున్న వైపునే క్రీస్తు వధువు కూడా వెళ్ళుచుండుటను గమనించండి. అక్కడది ప్రారంభమై ప్రపంచ సంఘ సమితి ఆ గొప్ప శిరస్సుగా తయారగును, వచ్చుచున్న చిన్న సంఘము, క్రీస్తు వాక్య వధువు కూడా అనాది కాలము నుండి ఒక శిరస్సుకు చేరుచున్నది. అది తన జతవానితో ఏకమగును. ఎప్పుడూ సంఘమువలెనే మరియు ప్రతిదియు ఏకమగును. గోధుమ, ఏదయినా గాని చివరకు అది ఆదిలో నున్న గింజవలె తయారగును, కయీను, హేబెలుల వలెనే, వాక్య పధుపు ఈ దుష్టయుగములో బయలుపరచబడుచున్న దేవుని వాక్యమను వ్యక్తిగా సమకూడును. అదెక్కడకు వెళ్ళుచున్నది?

EPH 5:27

 

85సాతాను వెంటనే తన జ్ఞాన వధువును తీసుకొని క్రీస్తువిరోధిగా హెచ్చించను. ఆ వారసుని ఒక సింహాసనముపై కూర్చుండబెట్టును, లోకమంతా వాని వెనుకపడును. ఆపుడు క్రీస్తు వచ్చును. ఒకే సమయంలో ఆ రెండూ కలసి ఉండవు. వాడి రాజ్యము తీసికొనబడును. వాడు నాశనమగును. స్త్రీ, పురుషుని శరీరములో భాగము. వారు ఇద్దరు కారు; వారు ఏకమైయున్నారు. వధువు, అనగా వాక్య సంఘము, ఆయన నామము నిమిత్తము ఆయా చోటనుండి పిలువబడినవారు యేసుక్రీస్తు శరీరములో ఐక్యమగుదురు. క్రీస్తువిరోధి, రాజ్యము తీసుకొనబడి నాశనము చేయబడును. క్రీస్తు దావీదు సింహాససమును అధిష్టించి, వెయ్యేండ్లు రాజ్యపాలన చేయును. అపుడు సంఘమును మచ్చ, ముడత లేనిదానిగా ఆయన దేవుని కప్పగించును. అవును.

86ఇప్పుడు. వాక్యమునకు ప్రమాణము చేసిన ఆమె నాజీరు జుట్టును చూడు. ఇప్పుడు క్రీస్తు వధువును నేను వర్ణించుచున్నాను. భక్తి, సైన్సులలో నున్న క్రీస్తువిరోధిని మనము చూచాం. ఇప్పుడు వాక్యమును నమ్మిన దీనురాలగు క్రీస్తు వధువును చూద్దాం. ఆమె ఎవరైనా కావచ్చు. అది వ్యక్తిగతము. చాలామంది కూర్చొని వినుచున్నారనుకొనుచున్నాను. నేను, మీరందరూ కూడా ఆ వధువులో భాగమైయున్నాం. దానికి ఉద్దేశించబడిన వారందరూ ఆలాగే యుందురు. అది వారి స్వభావము. వాక్యము మాత్రమే వాక్యమును గుర్తించగలదు. అది ఒక శాఖను గానీ, వంకరను గానీ గుర్తించదు. అది బాగుగా నెరుగును. ఆది ఒక వాక్యము. మరి దేనిని అది గుర్తించదు, గోధుమ గింజ గోధుమ గింజ గాక మరేమీ కాదు. అది గోధుమగా ప్రారంభమై, గోధుమ గింజగా సమకూడును. పిచ్చి మొక్క ఎన్నడూ గోధుమ గింజ కానేరదు. అదే నీటి అభిషేకము దానికున్నాగాని అది గోధుమ కాదు, చాలా కొమ్మలున్న చెట్టును గూర్చి ఒక రోజున నేను మీకు చెప్పాను గదా!

JOHN 10:5,27•

HEB 13:8

 

87ఆమె పొడవాటి జుట్టు, ఆమె నాజీరు ప్రమాణము దేవునికి ప్రమాణము చేసినదని చూపించును. ఆమె తన కాలమునకు చెందిన అయన వద్దన వాక్యమను గౌనుసు మట్టుకొని ఆయనలో ఆమె గుర్తించబడును. హెబ్రీ 13:8 వలే అమె ఉండును. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆమె వాక్య పెండ్లి కుమారునిలో భాగము. అన్నింటిలోను అయనకు యధార్ధముగా నుండును.

ఇప్పుడు గమనించండి. ఒక స్త్రీ ఒక వురుషుని పెండ్లి చేసుకొని మరొక పురుషునిలో ప్రేమ కలాపములు కొనసాగించి, తన భర్తనద్దకు వచ్చినపుడు, అతడామెను, తన్నును, అవునా? ఆమె అతనితో ప్రమాణము చేసెను గనుక నమ్మకముగా నుండవలెను. క్రీస్తు వధువు క్రీస్తుతో ప్రమాణము చేసియున్నది, అయన వాక్యము; మరోప్రక్క అసలు చూడదు. స్త్రీ ఇంకో పురుషుని కన్నెతి చూడరాదు. ఏ సైగను, ఏ సంజ్ఞలు చేయకూడదు, ఎందుకనగా ఆమె పూర్తిగా ఒక పెండ్లికుమారునికి వధువు. మాకు నీ కలగూర చెట్టులోనిది ఏదీ అక్కర్లేదు. మీ శాఖలు వద్దు. క్రీస్తు పట్ల నమ్మకముగా ఉండు. ఆయనే వాక్యము. అది సత్యము అని దానిని రుజువు చేయును.

కాదండీ! వేరే పురుషుని ప్రేమించే ఏ కదలిక అయినాగాని చేయరాదు, వాడి పదవుల్లో చేరరాదు. వాడి చేతులు జాగ్రత్తలోనికి వెళ్ళకూడదు. ఏ విధంగానూ మాట్లాడరాదు, ఒకే ఒక స్వరమును వినవలెను. నా గొర్రెలు నా స్వరమును వినును. క్రొత్తవాని స్వరము అవి వినవు. ఆయన స్వరమేమిటి? ఆయన వాక్యమే, ఏ వ్యక్తికైనా ఆయన స్వరము, అదే బైబిలు. దానికొక్క మాట కలుపరాదు లేదా తీసివేయరాదు, ఆ స్వరములో నిలచి యుండుము, ఒక శాఖను, అనగా క్రొత్తవాని స్వరమును అవి వెంబడించవు.

88ఆమే పెండ్లి కుమారునిలో భాగము. అన్ని విషయములలో యధార్థంగా ఉంచాను. పెండ్లికొరకు ఎదురు చూచును. ఏకమగును, ప్రపంచ సంఘ సమితిలో కాదు, కాని మధ్యాకాశములో పెండ్లి విందు జరిగినపుడు, ఇది స్వంత సంఘము కొరకు ఆమెకు బైబిలులోని ఏడు ముద్రల మర్మములు బయలు పరచబడినవి. సత్యమునకు బహు దగ్గరగానున్న మోసగానిని ఆమె చూచును. ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయును, ఆమె దానిని చూచును.

ఈ దుష్టయుగములో రెండు వ్యతిరేక ఆత్మలు పనిచేయుట చూడండి. నీవు దానిని చూడగలవా? కయీను, హేబెలువలే వారిద్దరూ భక్తిగా కనపడెదరు, ఆత్మలు తిరిగి శిరస్సులను చేరుచున్నవి. అవి ప్రారంభంలో నున్న పై ఉన్నవి. ఒకటి అందము, జ్ఞానము, చదువు, సైన్సు, పురాణముల ద్వారా ఆరాధించబడుచున్నది మరొకటి దేవుని వాక్య ప్రత్యక్షతయందలి విశ్వాసమును బట్టి. ఆ రెండూ ఈ ఉదయన ఈ ఆలయంలో నిలబడియున్నవి.

REV 17:5

 

89ఆయన వాక్యమునందు విశ్వాసము లేదా ప్రత్యక్షత ఏ జ్ఞానము వలన రాదు. నీకు డాక్టరు డిగ్రీ ఉన్నదా? అని వారడుగుదురు. నిజ క్రైస్తవుడు, నేనాయన వాక్యము నమ్ముచున్నానని చెప్పును, చదుపున్నదని చెప్పుకొనడు. ఏ శాఖకు, ఏ పక్షముసకు, ఏ తెగకు చెందడు. క్రీస్తుకు చెందియుండును. ఆయన భార్యగా నుండును, సంఘ భార్య కాదు; అది వేశ్య. అది వేశ్య, వేశ్యలకు తల్లి అని బైబిలు చెప్తున్నది. వారంతా కలసి ఆ వేశ్యనే చేయుదురు. అట్టి స్త్రీ భర్త ఎడల నమ్మకముగా లేని స్త్రీ. క్రీస్తుకు భార్యనని చెప్పుకొంటూ శాఖకు చెందియున్నది. అది బుద్ధిహీనత. నీవు క్రీస్తుకు చెందియున్నావు.

GEN 4:8

 

90ఈ చిన్న విశ్వాసముగల స్త్రీ విధేయురాలై విశ్వాసము ద్వారా జీవించును, వధువు, ఇక్కడ ఉన్న వ్యక్తి, ఎక్కడన్నా, ఏ సంఘం, ఏ శాఖలో నున్నా గాని దేవుని వాక్యమును విధేయతతో నమ్మును. ఆ యుగమునకు వాగ్దానము చేయబడిన వాక్యము స్థిరపరచబడు వరకు ప్రేమతో కాచుకొనియుండును. ఆమె దానిని గమనించును. ఆమె ఆ వాక్యములో భాగము. ఆ వాక్యము తన జీవితములో బయలుపరచబడవలెనని ఆమె చూచును. సహోదరులారా, దానిని మీరు చూడలేరా? అది మీ పై నుండి వెళ్ళిపోలేదు అని నేను అనుకొనుచున్నాను. శరీరము ఎదురుచూచుచున్నది (అది వాక్యము) జీవము కొరకు ఎదురుచూచుచున్నది, అది ఆత్మ, రుజువు చేయుటకు లేక జీవింపచేయుటకు. దానికొరకే ఆమె ఎదురుచూచుచున్నది. ఆమెలో వేరొక జీవము పనిచేయదు. మరే విధముగాను ఆమె జీవములోనికి రాలేదు, అయినను ఆమె అక్కడ దానిని అనుభూతి చెందుచున్నది, మరియు అది జరుగబోవుచున్నది అని ఆమె ఎరిగియున్నది; అప్పుడు అది ఇక్కడ జరుగును, ఆమె మేల్కొనును. దేవుడు చెప్పెను, "కలుగును గాక," మరియు మొదటిది వచ్చినట్లు ఆమె ముందుకు వచ్చెను.

ECCL 11:1•

GAL 6:7

 

91అవిధేయ పిల్లలు అనగా తిరుగుబాటు చేయువారు అని భావము. నిఘంటువులో నేను చూచాను. దేనిపై తిరుగబడుట? బయలుపరచబడిన దేవుని వాక్యముపై. అది నీతి యని దేవుని ద్వారా బయలుపరచబడిన హేబేలు ప్రత్యక్షతపై కయీను తిరుగబడెను. కయీను దానిపై తిరుగుబాటు చేసి తన సోదరుని చంపెను. దేవుని వాక్యమును గూర్చిన తమ శాఖా జ్ఞానముచే ఆ పరిసయ్యులు, ఎన్నుకొనబడినవారు, ఆ దినమునకు బయలుపరచబడిన దేవుని వాక్యముపై తిరుగుబాటు చేసిరి. అవునా? దేవుని వాక్యముపై అవిధేయ పిల్లలు తీరగుబాటు చేయుదురు. ఇప్పుడు వారెక్కడున్నారో చూడండి! "ఓ, అద్భుతాలు జరిగే రోజులు గతించాయి. యేసుక్రీస్తు ఏకరీతిగా లేడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. అదంతా బూటకం అంటున్నారు." చూచారా? తిరుగుబాటు! వారు రెండు సంగతులు చెప్పకూడదు, ఒక్కటే చెప్పాలి. నీకు కండ్లు లేవు, చెవులు లేవు అని వారనలేరు. నీవు పూర్తి శరీరము పూర్తి వాక్యమును తీసికొనపలెను.

దానిలో నుండి బయటకు రమ్మని పరిశుద్ధాత్మ పిలచుచున్నది. దాని శాఖా సిద్దాంతములలో పాలిభాగస్థులు కావద్దు. ఈనాటి వాక్యమును చూచి, నవ్వులు, హేళనలు చూడండి. దేవుడు వెక్కిరించబడడు, దానిని అది పొందునని మరువద్దు, బాధపడవద్దు. అది దానిని పొందును. దానిని మీరు వ్రాసుకోవలెననిన, ఎఫెసీ 4:30లో, "దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడేమి విత్తునో ఆ పంటనే కోయునని వ్రాయబడినది." వారు హేళన, వెక్కిరింపు, ఈ విషయములను విమర్శ చేయలేరు. నీటిపై ఆహారమువలె అది తిరిగి వచ్చును.

92ఆ దయ్యపు వధువు మతమును చుట్టుకొన్నది. ఈ ప్రస్తుత యుగములో పాపమును ప్రేమించు జ్ఞానము నిన్ను మోసము చేయును. శాస్త్రీయ జ్ఞానము ఆధునిక నాగరికతల ద్వారా శాఖల యొక్క మోసపుచ్చు ఆత్మలు పనిచేయుచున్నని, (కొద్ది నిమిషములలో ముగించుకొందుము. నేను ఆపవలెను, ఎందుకనగా నేను ముగించలేను, చూచారా.) నీవు జీవించుటకు గొప్ప లోకమును నిర్మించుదునని అది ప్రకటించుచున్నది. అది తన నాగరికతలో చక్కని సంఘములు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రులు, గంథాలయములు, మానవునికి తాత్కాలిక సహాయము అందించుచున్నది. కాని దేవుని వాక్యము లేదు అది చేయగలనని నిరూపించుకొన్నది. ప్రజలు దానివలన పడిరి. పాఠశాలలు, శాఖలు, సంస్కృతి, చక్కని బట్టలు ధరించినవారు చక్కగా తిన్నగా ఉన్నారు. మూడు పూటలు కోడి వేపుడు తిని అట్టి వేశ్యకు చెందియుండుటకంటె, కొద్దిపాటి రొట్టె ముక్కతో దేవునితో సరిగా నుండుటయే నాకు ఇష్టము.

1THS 5:2•

2PET 3:10•

REV 18:1,4

 

93ముద్ర వచ్చు ఘడియ సమీపంలో యున్నది. మరువవద్దు. నీవు దానిలో లేదా దాని వెలుపలగానీ ఉండవలసి యున్నావు. రాత్రి దొంగ వచ్చినట్లుగా అది వచ్చును. అక్కడే అది నిన్ను పట్టుకొనును. అప్పుడిక వెలుపలకు వచ్చు దారి ఉండదు. నీవొకసారి తీసికొన్నచో అంతే. బయటకురా! ఒక గొప్ప ప్రకాశమానమగు ముఖముతో పరలోకము నుండి దిగివచ్చిన దేవదూత, భూమిని కంపించునట్లు బిగ్గరగా ఇట్లనెను. "బబులోను నుండి బయటకు రండి, అది పతనమయినది. నా జనులారా!" దాని తెగుళ్ళలో పాలిభాగస్థులు కొవద్దు. దానిలో నుండి బయటకు రండి, కొద్దిసేపటి క్రిందటనే దానిని గూర్చి మనం చదివాము కదా? దేవదూత అనగా "ఒక వర్తమానికుడు," చూచారా క్రిందికి వచ్చుచున్నాడు. గమనించండి. పరిశుద్ధాత్మ, "దానిలో పాలి భాగస్థులు కాకుండా బయటకు రండి!"

94అదే వీటన్నింటిని నిర్మించినది. అది గొప్ప సంఘములను కట్టినది, అది కళలు , స్కూళ్ళు, అట్టి జనులను తీసుకొని వారికి విద్యనిచ్చి, గొప్ప నాగరికత అని పిలువబడుచున్నది. ఒక ఆధునిక నాగరికత ద్వారా వారికి విద్య చెప్పి, జ్ఞాసము ద్వారా మరణ గుంటలోనికి తీసుకొని వచ్చెను. దేవునికి, దేవుని వాక్యమునకు చూరము చేసినది. ఆ ప్రణాళికనంతయూ మీరు చూడలేడా? ఆ సంఘమును నీవు చూచావా? గాలిలో, నీ స్వంత జనసమూహములో దానిని చూచి ఆమేన్ అని చెప్పుము. తక్కిన వారందరూ నీవెక్కడ నిలబడియున్నావో చూడగలరు. దానిని అది చేసినది. అది ఈ భూలోక దేవత, అది కళాశాలలు కట్టినది. విశ్వవిద్యాలయములను అది నిర్మించినది, వైద్యశాలలు కట్టినది. గ్రంధాలయములు నిర్మించినది. మానవుని తాత్కాలిక సహాయము కొరకు వీటన్నింటిని అది నిర్మించినది. వాక్యము నుండి వారిని తప్పించుటకు జరిగిన మోసమిది. వారినెక్కడికి నడిపించుచున్నది? మొత్తం సంఘ లోకమంతయూ మరణములోనికి మునిగినది. నిత్యాగ్నిలో వేశ్యను దాని పిల్లలను కాల్చి వేయుదునని దేవుడు చెప్పెను. జనులారా! దానిలోనుండి బయటకు రండి! మీరందులో చిక్కుకోవద్దు. మీకు సాధ్యమైనంత వెంటనే దానిలోనుండి దూరము కండి! వాని శాస్త్రీయ జ్ఞానము ద్వారా, దేవుని వాక్యము లేకుండా దీనిని అది చేయకలుగుచున్నది.

1COR 2:1,4•

1THS 1:5

 

95దేవుడు మనలను విద్యాలయములు స్థాపించుటకు అభిషేకించలేదు. అయనెన్నడూ ఆ పనిచేయడు. వైద్యశాలలు కట్టుమని ఆయనెన్నడూ మనకు చెప్పలేదు. అవి మంచివే. ఆయనెన్నడూ గ్రంధాలయములు నిర్మించమని చెప్పడు, సువార్త బోధించుడని ఆయన చెప్పెను. పరిశుద్ధాత్మ శక్తిని బయలుపరచుననుదియే. సువార్త మాటల ద్వారా కాక, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత, శక్తి మూలముగా మాకు సువార్త వచ్చియున్నదని పౌలు పలికెను. డాక్టరు డిగ్రీ, లేదా గొప్ప జ్ఞానపు మాటలతో మీ దగ్గరకు నేనెన్నడూ రాలేదుని పౌలు చెప్పెను. కాని పరిశుద్ధాత్మ శక్తి, ప్రత్యక్షలతో వచ్చినట్లు చెప్పెను. ఈ లోక మానవుని యొక్క జ్ఞానము తెలివితో మీ విశ్వాసము నిండియుండరాదు, కాని యేసుక్రీస్తు యొక్క పునురుత్థాన శక్తితో నిండియుండవలెను, ఎందుకనగా ఆయన జీవించియున్నాడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." దానిని నమ్ముటకు దేవుడు సహాయము చేయు గాక! ఆయన చేయుచున్న దానిని దేవుడు మనకు బయలు పరచు గాక.

MATT 10:25

 

96వాడు తన పాఠశాలలు. గ్రంధాలయములు, సాహిత్యము, వైద్య శాలలు మొదలగువాని ద్వారా ఈనాడు బయలుపరచబడి ప్రత్యక్షమగుచున్న దేవుని వాక్యము యొక్క నిజ విశ్వాస ప్రత్యక్షతలను చూడకుండా చేయుచున్నాడు. దాని నుండి వాడు తొలగించుచున్నాడు. ఫరోకు వివరించినట్లే ఆయనిపుడు అనువదించుచున్నాడు. బయలుపరచబడి, రుజువు కాబడి ఈ సాయంకాల వెలుగులో నున్న ఈ యుగమునకు వాగ్దానము చేయబడిన ఆయన వాక్యము, బయలుపరచబడినదాని భావమును చూడనీయకుండా వాడు అడ్డగించుచున్నాడు. వాడు తన జ్ఞానము, పాటశాలలు, బాగా చదువుకొన్నవారు. శాస్త్రములు, మొదలగువాని ద్వారా దానిని చూడనీయకుండా నిన్ను దూరపరచుచున్నాడు. ఆయన యేసుక్రీస్తు అని నిన్ను చూడనీయకుండా చేయిచున్నాడు. అది యేసుక్రీస్తు అని నీ వెట్లు చూడగలవు? ఆయనే వాక్యము, ఈ యుగము వాక్యము ఆయనే. ఈ యుగములో ఏవి జరుగునని చెప్పబడెనో, అదిక్కడ జరుగుచున్నది. దానిని చూడనీయకుండా వాడు శాయశక్తులా ప్రయత్నించుచున్నాడు. దానిని వాడు ఏదో చెడ్డ పేరు పెట్టి పిలుచుచున్నాడు. పరిశుద్ధ బండలు అని హేళనగా పిలుస్తున్నాడు. యేసును బయల్జెబూబు అని పిలిచాడు. ఇంటి యజమానిని వారు బయల్జెబూబు అని పిలచినచో అయన శిష్యులను మరెంత ఘోరంగా పిలుచుదురో కదా? చూచారా, చూచారా?

MATT 24:24•

MARK 13:22•

LUKE 17:28-30

 

97వాక్యము యొక్క నిజ అర్ధమును చూడనీయకుండా నిన్ను చేయుటకు ప్రయత్నించుచున్నాడు. దాని భాపము ఈలాగు అని తన స్వంత అనువాదమును చెప్పుచున్నాడు. మలాకీ 4ను చివరి దినములలో నేను పంపుదునని దేవుడు చెప్పెను. దానికి అనువాదము చెప్పనవసరములేదు; ఆయనది చేసెను. లోతు దినములలో నుండినట్లుగా లోకము సొదొమ స్థితి నుండును. ఆ సమయములో సరిగ్గా నేను మనుష్యకుమారుని బయలుపరచుదునని ఆయన చెప్పెను. దానికి చాలా అనుకరణలు వచ్చినవి. కాని నిజమైనది కూడా మనకు వచ్చినది. దానిని చేయుదునని ఆయన చెప్పెను. క్రీస్తువిరోధి లేచి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయునని ఆయన చెప్పెను. వారినాలాగే ముందుకు పోయండి. వారి పాపమే వారిని పట్టుకొనునని ఆయన చెప్పెను. ఎందువలన? వాక్య పరీక్ష దానిని రుజువు చేయును. నీవా వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు, నేను అది నమ్మును, ఇది నమ్మను, సర్పసంతానము నేను నమ్మను అన్నావంటే వాక్యము నీ కెన్నడూ బయలుపరచలేదన్నమాట! ఎన్నడూ లేదు.

ఓ, సోదరుడా, ఇటు చూడు! పన్నెండు గంటలయింది, ముగించుకొందాం.

98గమనించండి, అనువాదము చెప్పబన ఈ సాయంకాల వెలుగు యుగము యొక్క వాక్య భావమును నిన్ను చూడనీయకుండా చేయుటకు ప్రయత్నించుచున్నది. దాని భావమేమి? దగ్గరలోనే నిర్గమనం ఉన్నది. ఆమె కొరకు దేవుడు వచ్చుచున్నాడు. అది ఖచ్చితం!

ఒక్క ప్రశ్న అడుగుచున్నాను, ఈ యుగము యొక్క దేవుడిని మీరు చూచారా? దానిని నీవు నమ్ముచున్నావా? అది ఒక సంఘము. జ్ఞానము, సైన్సు, లోకమంతా శాఖలకు చెందియున్నది. నీవు క్రైస్తవుడనని చెప్పుకోవచ్చు. కాని ఏ శాఖకు చెందియున్నావు? నేనొక శాఖకు చెందియున్నచో నేను క్రైస్తవుడనని చెప్పుకొనను. అది పెద్ద మాటగాని నిజమే. జ్ఞానము, సైన్సు, క్రైస్తవ్యమునకు ఎట్టి సహవాసమూ లేదని నేను చెప్పుచునే యున్నాను గదా! ఒకటి దయ్యానిది, మరొకటి దేవునిది. దేవుని సాక్ష్యమును తిరస్కరించి, దానికి దూరమగునది ఏదైనా దయ్యానికి చెందినదే.

లేదయ్యా. ఆ మంచి చెడ్డల వృక్షము, వేశ్యనుండి బయటకు రమ్మని ఈ చివర దినపు క్రైస్తవులను బైబిలు కోరుచున్నది.

99నిశ్చయంగా దానిలో మేలున్నది. ఒక వైద్యశాల మంచిది కాదని ఎవరై నా అందురా? గ్రంధాలయము మంచిది కాదందురా? చదువు మంచిది కాదందురా? అనరు! కానీ వాటిని వారు వాక్యము లేకుండా ఇచ్చుచున్నారు. అదెంత మోసమో చూడండి! వెళ్ళుటకు వారికొక సంఘము, ఆరాధించుటకొక ఆరాధన, ఒక పింహాసనముపై కూర్చొను దేవుడు, వీటిని గూర్చి దేవుడు బైబిలులో ముందే చెప్పెను.

నీవా సంస్థలలో దేనికీ చెందియుండరాదు. ఎల్లప్పుడూ భూమిపై రెండు యుండును. ఒకటి యేసు వచ్చునపుడు నాశనము చేయబడును. నీవా రెంటిలో ఏదో ఒక దానికి చెందియుందువు. ఒక దానిలో నీవు చేరెదవు. మరో దానిలో నీవు జన్మించుదువు. ఒకదానిలో జన్మించినందున నీవు భాగమైయుందువు. దానిలో నీవు భాగము కావలసియున్నావు. నొకు చేయలేదని నేననగలనా? ఆలాగే దేవుని వాక్యమును నేను కాదనలేను. నేను దేవునిలో, విలియం బ్రెన్హాంలో, భాగమైయున్నచో నాలోని భాగములన్నీ వావేయగును. నా ఆత్మకు ప్రతి దేవుని మాట సరిపోవును. నా జీవనమునకు అవి తగియుండును. నా ఉద్దేశ్యములకది సరిపోవును. నా భావములు దానికి వేరుగా నున్నదో నాలో దేవుని ఆత్మ నివసించుటలేదు. అది నిజం. దానిలోని ఒక్క మాటను కూడా నేను కాదనలేను.

100నీవేదో ఒకదానికి చెందియుందువు. వాక్యమైయున్న దేవుని శరీరమైనది కావాలి, లేదా సంఘము ద్వారా సాతాను శరీరమైనా కావాలి. లోకమంతా ఎదో సంఘానికి చెంది, ఏదో దేవుని ఆరాధించుచున్నది. తెలివి దేవతనయినా నీవు ఆరాధించాలి, విశ్వాసమునుబట్టి దేవుని వాక్యమునై నా ఆరాధించాలి. జ్ఞానము ద్వారా నీవు విన్న దానిపై నీవు అధారపడుదువు, లేదా ఆయన బయలుపరచుదాని కొరకు కనిపెట్టుదువు. నిజ దేవుని సంఘము ఈలాగున్నది:

ఆ సంతోషకరమగు వెయ్యేండ్ల దినపు రాక కొరకు ఎదురుచూస్తూ,

ధన్యుడగు మన ప్రభువు వచ్చునపుడు తన వధువును ఎత్తికొని పోవును.

ఓ, నా హృదయము అత్యానందముతో నిండియుండగా

నేను శ్రమించి, కనిపెట్టి ప్రార్థించుచున్నాను.

మన ప్రభువు తిరిగి భూమి మీదకు వచ్చుచున్నాడు.

ఓ, మన ప్రభువు తిరిగి భూమి మీదకు వచ్చుచున్నాడు.

సాతాను వెయ్యేండ్లు బంధించబడును.

అపుడు మనకిక కోపముండదు.

ఆ తరువాత యేసు మరల భువికి తిరిగి వచ్చును.

2THS 2:4

 

101ఓ, ఈ అమెరికా దేశ ప్రజలు ఇవుడీ వార్తమానము ఎక్కడికి వెళ్ళుచున్నదో వారు, ఈ జ్ఞానము, శాస్త్రీయ యుగము నుండి త్వరగా పారిపొండి. దేవుని వాక్యము నొద్దకు పరుగిడి రండి! నేను, నీవు, ఎవరూ దానినెరుగరు. దానినెవరూ రుజువు చేయరు, దేవుడు స్వంతంగా రుజువు చేయును. దానిని అనువదించు హక్కు ఎవరికీ లేదు. నాకు లేదా ఏ వ్యక్తికి అర్హతలేదు. దేవుడే తన స్వంత అనువాదమునిచ్చును. ఆయన వాగ్దానము చేసెను. చివరి దినములలో ఇది చేయుదునని ఆయన పలికెను. ఈ అంత్యదినములలో జనులనింకనూ మంచీ చెడ్డల మీశ్రమ వృక్షములో, తన తెలివితేటలతో ఈ దుష్ట యుగము గ్రుడ్డివారిని చేయును. సాతాను అను అతీత వ్యక్తిలోనికి అంధకార యుగమునకు ముందునుండియూ ఇది వచ్చుచూ ఇప్పటికొక శిరస్సు దగ్గరకు వచ్చియున్నది. దేవుని కుమారులకు పైగా నన్ను నేను హెచ్చించుకొందును. వారు నా మాట విందురు అని సాతాను చెప్పెను. దేవుని ఆలయములో వాడిక దేవునిగా కూర్చొనును. దానికి దేవుని కుమారులు కూడా పడిపోవుదురు.

GEN 1:27•

GEN 6:2•

MATT 24:37•

LUKE 17:26•

JOHN 1:46

 

102దేవుని కుమారుడు నా భార్య మంచిడని చెప్పును. సరే! ఆలాగే ముందుకు పొండి. ఆయన దేవుని కుమారుడని చెప్పెను. పురుషుడు దేవుని మహిమ కొరకు దేపుని రూపములో చేయబడెను. స్త్రీ, దేవుని నుండి కాక, పురుషుని నుండి వచ్చిన ఉప ఉత్పత్తి. అది నిజం! దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారిని వివాహము చేసికొనిరి. నోవహు దినములలో ఎట్లుండెనో మనుష్యకుమారుని రాకకు ముందును ఆలాగుండును, సంఘము ఏ దశలో నున్నవో నీవు తెలిసికొనగోరినచో, స్త్రీ ఏ దశలో నున్నదో గమనించుము, ఎందుకనగా స్త్రీయే సంఘము ఆమేమి చేయుచున్నదో గమనించు, ఇది దుష్ట వేశ్యా యుగము…

చూడండి. నజరేతు కంటే చిన్నది, చెడ్డది, తక్కువది, వేశ్యా గమనముగల పట్టణము మరొకటి లేదు. ఈ ప్రపంచంలో అందులో నుండిన ఒక కన్యకను దేవుడెన్నుకొనెను. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? ఈ చెడ్డ యుగములో, ఈ యుగ దేవత జనుల కండ్లను వారి శాఖలు సిద్దాంతములు ద్వారా బంధించిన ఈ దుష్ట యుగములో దేవుడు తన నామము కొరకు ఒక జనాంగమును ఎన్నుకొనెను.

ఇక్కడ నిర్లక్ష్యము చేయబడి, నిందించబడినప్పటికిని,

ఒక రోజున ప్రభువు తానేర్పరచుకొన్న వారిని గవిని నుండి తెచ్చును,

అది అన్నిటికంటే యోగ్యమైనది,

అపుడు మనము పాడుదుము, చప్పట్లు కొట్టుదుము, నాట్యము చేయుదుము.

గొర్రెపిల్ల కన్నీటిని ఎండిపో చేయును.

ఆ మొదటి పదివేల సంవత్సరములు, మనకు ఇంటికి తిరిగి వచ్చిన ఆనందకర వారముగా నుండును.

ఆయన నామము కొరకు అద్భుత జనము

వారాయన వధువుగా పిలువబడుదురు (అవునా?)

అలక్ష్యము చేయబడి, నిందించన గాని,

ఒక రోజున ప్రభువు తెచ్చును

ఆ ఏర్పరచుకొన్న వారిని గుమ్మములోనికి

(నిర్గమనంలో.)

నాకన్నిటికన్న అది యోగ్యమైనది.

PHIL 3:10

 

103నేను ముసలివాడనగుచున్నాను. నా దినములు గతించిపోవుచున్నవి; నా కనుదృష్టి మందగిలుచున్నది. నా చిన్న జీవితమంట ఆరిపోవుచున్నది. ఆ చీకటికి నేను భయపడను. పౌలుతో పాటు నేను ఆ విధంగా పలుకుదును. "ఆయనను పునరుత్థాన శక్తితో నేనెరుగుదును. వారు నన్నెక్కడ పాతి పెట్టినాగాని పర్వాలేదు. నేను సముద్రములో మునిగిపోయినా, కొలిమిలో కాలిపోయినా సింహముచే తినివేయబడినా, నా పేరును ఆయన పిలుచును, మరియు నేను పలుకుదును. ఆమేన్! ప్రార్ధించుదము.

ఇక్కడగానీ, వైరుల ద్వారా గాని. మీ చిన్న సంఘములు, గుంపులు, హాలులు ఎక్కడయినాగానీ కూర్చొని వర్తమానము వినుచున్నవారికి నేను చెప్పునదేమనగా, ఈ దుష్ట యుగపు ఉగ్రత నుండి తప్పించుకొనుడి. సువార్త సేవకునిగా యేసుక్రీస్తు నామములో మిమ్ము బ్రతిమాలుకున్నాను. ఈ దుష్ట యుగపు దేవతకు ఆరాధించకండి. అది మంచిది. చక్కగా ఉన్నది అని మీరనవచ్చు. అదొక మిశ్రిత చెట్టు. నీవు దేవుని వాక్యములో జ్ఞానమును మిశ్రమం చేయలేను. తెలివి గాక విశ్వాసముతో నమ్మవలసిన మాట అది. నీవు అర్థం చెసికోవద్దు. దానినంగీకరించము. అది నిజమని చెప్పినచో దానివలన నీవు జీవుంచుదువు. ఆయన నిన్ను చేయమని కోరునదంతా అదియే. ఆయనను ఎరుగని వారు, వేదిక పిలుపుకు ఇంకా లోబడనివారు ఇక్కడున్నచో. వినండి !

104ఓ, స్త్రీలారా! ఈ ఉదయాన మీకు చీవాట్లు పెట్టాను. నేను కాదు పెట్టినది. దేవుని వాక్యము మీ ముందుంచాను. పొట్టి జుట్టు, చిన్న బట్టలు ధరించుట. కామ వికారము కలిగించు బట్టలు ధరించుట; ఆ ఆత్మను మీరు గ్రహించలేదా? నీవు పవిత్రురాలవు కావచ్చు! ప్రియ సోదరీ! నీ శరీరములో నున్న దానిని బట్టి నీ ఆత్మలో నున్నది కనపడును, నీవు దేవుని కుమారులను వ్యభిచార పాపమునకు కారకులుగా చేయుచున్నాను. దేవుడది చేయచున్నాడా? మీరిరువురు ఆ దినాన తీర్పులో నిలుచుచురు. సోదరీ? ఆయనది చేయునా? ఆ ప్రశ్న నీవే వేసికో! దేవుడు ఎక్కడో పది మిలియనుల మైళ్ళ దూరంలో నున్నట్లుగా ఊహించకు.

సోదరుడా! నీవు ఈ లోకపు ఆత్మవలన అది తప్పని గ్రహించలేకపోపుచున్నను. వాడు నీ నేత్రములను సంఘ పురాణములు శాఖ సిద్ధాంతములతో గ్రుడ్డిపరచియున్నాడు. బయలుపరచుచున్న వాక్యమును నీవు అందుకే చూడబోవుచున్నావు? నీ ఉద్యోగము, నీ అధికారి, నీ భార్య, నీ పిల్లలు, నీ సంఘము, లేదా ఏదయినా దేవుని వాక్యము నుండి నన్ను వేరుచేయుచున్నదా? అదే జీవాధారము సుమా? నా సోదరుడా! పారిపోమ్ము! దైవ ప్రేమలో నిన్ను నేను ప్రేమించుచున్నాను. మీ కంటె ఎక్కువగా నా సోదరులను కూడా గౌరవించను. ఆలాగు చేసినచో నేను వ్యక్తులను లక్ష్యపెట్టిన వాడనగుదును. మీకు కోపము తెప్పించుటకు ఈ సంగతులు చెప్పుటలేదు. అవి దేవుని వాక్యములో నున్నవి గనుక నేను చెప్పుచున్నాను. దైవ దాసునిగా హృదయంతో దైవ ప్రేమతో మీరు చూచి అర్థం చేసుకోవాలని ఆ సంగతులు చెప్పాను. నేను చెప్పకపోతే మీకు తెలియదేమో, ఈ రోజే దానినుండే పారిపోదువా? దేశంలోనున్నవారంతా తలలు వంచండి.

JOHN 6:37,44

 

105ప్రియ దేవా, నా ఎదుట చేతిగుడ్డలు పడియున్నవి, రోగులున్నారు. వారిపై నా చేతులుంచుచున్నాను. నీవు వారిని భాగుచేయుము. ఈ రాత్రి గొప్ప ఆరాధన జరుగునట్లుగా ప్రభువా నేను నమ్ముచున్నాను. దేవుని శక్తి ఇక్కడుండును గాక.

ఈ రెండు రోజుల కూటములలో గొప్ప సూచక క్రియలు, అద్భుతములు మేము వినియున్నాము. ఎన్నో ఫలితములు చూచాం. ఎంత చక్కగా నున్నవి! ఏం జరిగిందో చూచాం. ఈ రాత్రికి రెండింతల ఆత్మనిమ్మని, ప్రభువా, నేను ప్రార్ధించునున్నాను. నీ మీద, నీ వాక్యము మీద, ఈ ప్రజల మీద నాకున్న ప్రేమను బట్టి ప్రభువా! యదార్ధ హృదయముతో నేను ప్రార్ధించుచున్నాను. ప్రియ దేవా, అనుగ్రహించుము.

దేశమంతటనూ, ఇచ్చటనూ, ఉన్న రోగులు. బాధపడుచున్నవారు, ఇక్కడుండకుండా వెళ్ళిపోయినవారు, ఎక్కడవారు కూడుకొన్నను వారిని బాగుచేయమని నేను ప్రార్ధించుచున్నాను. వారి భౌతిక దేహమునకు కాన్సరు, క్షయ, న్యుమోనియూ, మొదలగు గొప్ప రోగముల నుండి బాగుపరచము. వారి శరీరము పాపము, శాపము క్రింద ఇంకా ఉన్నది గనుక నిస్సందేహంగా మరలా రోగులవుదురు. వారు ఎంత ఎక్కువ కాలము జీవించితే, అంతగా రోగులవుదురు. కానీ నిజమగు దైవిక స్వస్థతను వారిని పొందనిమ్ము. నూతన సృష్టిగా చేయు ఆత్మ స్వస్థతనిమ్ము. మరణము నుండి జీవములోనికి దాటనిమ్ము. ఈ ముసలి గుడారములోనున్న ఆత్మ విడిపించబడిన తరువాత శరీరమునకు విమోచన కలుగును. ప్రభువా, అనుగ్రహించుము.

శాఖలు, సిద్ధాంతముల నుండి వారు పొరిపోవుదురు గాక! దేవా, ఆ శాఖలు సిద్ధాంతములలో చక్కని సోదరులను కొందరిని నేను కలిసికొన్నాను. వారు వాక్యము చూడునట్లుగా దేవా చేయుము. నీవు చెప్పావుగాని అది నన్ను బాధించుచున్నది. "ఎంత మంచివాడయినా, దీనుడయినా, సాధువైనా, తండ్రి పిలవనిచో రాలేడని నీవు సెలవిచ్చియున్నావు. తండ్రి అనుగ్రహించిన వారందరూ నీ యొద్దకు వచ్చెదరు" అన్నావు. ప్రభువా! పూర్తి సత్యమును చెప్పు బాధ్యత నాపై యున్నది. పౌలు చెప్పినట్లుగా దేవుని వాక్యమును మోసము, శాఖా సిద్ధాంతము, మంచి చెడ్డల, మీ శ్రమ, జ్ఞానము చేర్చక, తెరువబడి నీ హృదయములో, పరిశుద్ధాత్మతో ప్రయోగించవలెను. దేవా, అందరినీ రక్షించము.

LUKE 23:34

 

106మన తలలు వంచి, కండ్లు మూసియున్నాము. మీరు చేసినా చేయకపోయినా నాకేమీ పట్టదు అను మాటను నేననలేను. మీ పట్ల నాకు ఆసక్తియున్నది. నేను మిమ్ము ప్రేమించుచున్నాను. నేను కఠినంగా మాట్లాడానని మీరేమీ అనుకోరని నా ఆశ. మీతో ఉండాలను కొన్నాను గాని నా ధృక్పధమును మార్చుకొన్నానని పౌలు చెప్పినట్లే నేనూ చెప్పగలను. వారిని ఇష్టపడనందున ఆయనట్లు మాట్లాడలేదు. వారిని ప్రేమించాడు. యేసు వారిని గద్దించి వారికొరకు మృతి పొందెను. "తండ్రీ! వీరిని క్షమించము, ఎందుకనగా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు." సరిగా నుండవలెనని ప్రయత్నించు మానవుడు, దయ్యమును చూచి (నేను దానికి వ్యతిరేకిని) ఈ ప్రజల నేత్రములకు అది గ్రుడ్డితనము కలుగచేసినది.

107దేవుని మహిమతో ఈ దేశము మండిపోయి యుండవలసినది. ఈ చివరి దినమున దీనికేమి జరిగినదో చూడండి. ఆ పురాతన దేశములను ఈ ఉజ్జీవములు తాకలేదు. ఇక్కడికిది పశ్చిమ తీరము. కాని ఇంకా అవతలగా ఎంతో పశ్చిమం ఉన్నది. పాపము భూమిని పేల్చుచున్నది. భూమి మునిగిపోవుమన్నది.

లాస్-ఏంజలస్, హాలీవుడ్, తదితర స్థలములు గంటకు కొన్ని అంగుళముల చొప్పున మునిగిపోవుచున్నవి. అపే మార్గం లేదు. మనం ఇక్కడున్నాం. ఏ సమయంలోనైనా మనము హెచ్చరికలు వినవచ్చును. నీవైపే చూచుకో! నీ హృదయం పూర్తిగా తెలిసికో. నిన్నే అడుగుచున్నాను. దేవుడు నాకు తెలియచేస్తేనేగాని నీ హృదయమును నేనేరుగలేను. అయితే దేవునితో మరియు ఆయన విశ్వాసముతో ఆయన వాక్యములో నీవు ఎక్కడ ఉండాలో అక్కడ నీవు లేవు అని నీవు చూడగలిగినట్లయితే, ఆయనకు చెప్పండి ఓ, దేవా! ఈ క్రిక్కిరిసిన సంఘం, గోడలు, లోపల ఎక్కడ చూచినా గానీ అక్షరాలా వందలకొలది చేతులు, బహుశా రెండొందలు కావచ్చు, పైకి లేపబడినవి. మీ యదార్థత కొరకు వందనములు!

MAL 4:2

 

108ప్రియ యేసూ, ఏ ఒక్కరిని నశింపనీయకుడు. నీ దాసునిగా సజీవులు, మృతులు మధ్య నిలబడి, దేవుని వాక్యమును వేలుపెట్టిన వారికి చూపించచున్నాను. ప్రభువా, వారిని నేను రక్షించలేను గాని, వారు రక్షింపబడగోరుచున్నారు. తండ్రీ, అనేకసార్లు నేను చెప్పిన రీతిగా, ఉదయాన సూర్యుడు ఉదయించి, భూమి పైకి వచ్చి, గింజను పక్వపరచటకు దేవునిచే పంపబడును. మామూలు జీవితము కొరకైన మామూలు ఆహారమది. కాని, ఓ దేవా, నీవు చెప్పావు, "ఆయన నామమునకు భయపడువారికి, నీతి సూర్యుడు ఉదయించును, తన రెక్కలలో స్వస్థపరచును." నీతి కుమారుడు, దేవుని వాక్యము, జనుల హృదయములలో లేచు గాక! విశ్వాసపు స్వస్థతా కిరణములు ఆ వాక్యములో అవిధేయులైన ప్రతివారిని బాగుచేయు గాక. వారిని పూర్తిగా దేవుని కుమార, కుమార్తెల స్వరూపములోనికి తెచ్చు గాక! ప్రభువా! వారు నీవారు. యేసుక్రీస్తు నామములో ఇక్కడ, గాలిలో నున్నారని, తమ చేతులెత్తిన వారిని వారి ఆత్మల రక్షణార్ధము నీకు నమర్పించుచున్నాను. ఆమెన్!

…………………

అక్కడ ఎత్తబడిన నా హృదయము కనుగొనును,

(ఎక్కడ? బలిపీఠము వద్ద.)

అవతలి (విశ్రాంతి విశ్వాసము ద్వారా

నేను వెళ్ళుచున్న స్థలమును చూస్తున్నాను.)

సిలువ నొద్ద, (అక్కడే వాక్యము వ్రేలాడును.)

సిలువలో, నాకు నిత్య మహిమ ఉన్నది;

ఆనందకరమగు నా హృదయము,

నది ఆవల విశ్రాంతి కనుగొనువరకు.

యేనూ, నన్ను దాయము, (ఆయనలో సిలువ వేయబడుట. లోకము వద్దు; నన్ను సిలువ వేయుము!)

అక్కడొక ప్రశస్త కాలువ యున్నది.

అందరికీ అది ఉచితము - స్వస్థపరచు కాలువ.

కల్వరి ధార నుండి అది ప్రవహించుచున్నది.

సిలువలో, సిలువలో,

నా మహిమ ఉన్నది (చేతులను ఎత్తుదం.) నిత్యము;

ఆనందకరమగు నా హృదయము

నది ఆవల విశ్రాంతి కనుగొను వరకు.

109ప్రక్కకు వెళ్ళి మరియు ఎవరి చేతినయనా పట్టుకొని, "క్రైస్తవుడా, నిన్ను దేవుడు దీవించు గాక!" అని చెప్పుము. ఆయన సన్నిధి మీరు అనుభవించుచున్నారా? ఆ ఫోను తరంగములకు అవతలనున్నవారు ఒకరినొకరు కరచాలనముతో అభినందించుకొనుచూ, "క్రైస్తవుడా, దేవుడు నిన్ను దీవించు గాక," అని చెప్పండి.

110వెనక నీటి మడుగున్నదని మీకు తెలుసు గదా? ఆయన నామము ధరించుకొనువారిని అయన తీసికొనును. పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందనిచో అక్కడ నీరు, వస్త్రములు, మనుష్యులు సిద్ధముగా నిలబడియున్నారు. అది సత్యమని నమ్మి, నిజంగా యేసును నీవు రక్షకునిగా అంగీకరించినచో నిన్ను ఆహ్వానించుచున్నాము.

కాతలిక్కు సంస్థ ఏర్పడకముందు బైబిలులో ప్రతి వ్యక్తియు యేసుక్రీస్తు నామముతోనే బాప్తిస్మము పొందిరి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల బిరుదులతో, ఆ దేవుని సజీవ సంఘము వారు బాప్తిస్మము పొందినట్లు వాక్యములో గాని, చరిత్రలో గాని ఎక్కడా కనిపించదు. అది కాతలిక్కు సిద్దాంతము, బైబిలు బోధ కాదు.

MATT 16:19•

JOHN 1:1•

ACTS 10:47•

ROM 3:4

 

111ఒక యాజకుని నేనది అడిగాను. అతడిట్లనెను, "అది సత్యమే, కాని మేము సంఘము. మా ఇష్టానుసారంగా ఏదైనా మేము మార్చుకోవచ్చు. సంఘములోనే సర్వాధికారమున్నది. దేవుడు తన సంఘములోనే ఉన్నాడు."

నేనన్నాను, "దేవుడు తన వాక్యములో నున్నాడు. దేవుడు వాక్యమే. సంఘముము గాని వాక్యమునకు విరోధంగా ఉంటే, అప్పుడు నేను సంఘమును నమ్మను." మానవుని మాట అబద్ధము. దేవుని మాట సత్యము. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందనివారికి తిరిగి పౌలు బాప్తిస్మము పొందమని చెప్పెను.

కొందరు పరిశుద్ధాత్మను పొందిన తరువాత, పేతురు ఇట్లనెను, "వీరు పరిశుద్ధాత్మను పొందుటకు మనము నీళ్ళను నిషేధించుదమా?" (అపోస్తలుల కార్యములు 10:47) మనవలే వీరును పరిశుద్ధాత్మను పొందుట చూచాం. మీరు పరిశుద్ధాత్మను పొందిరి. ఈ స్థలము విడిచి వెళ్ళకముందు వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడని వారికి ఆజ్ఞాపించెను, ఎందుకనగా పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇయ్యబడినవి, "భూమి మీద మీరు వేటిని బందించుదురో, పరలోక మందును అవి బంధించబడును," అని చెప్పెను. తాళవుచెవి చేయు పని ఏమిటి? అది ఒక మర్మమును విప్పును.

MATT 28:19•

JOHN 5:43

 

112తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి బాపిస్మమియ్యుడని యేసు చెప్పెను. అవిశ్వాసికి గుడ్డితనమున్నది. గమనించండి! పేతురు ఆ మాటను ఉన్నదున్నట్లుగా ఎందుకు మోసుకొనిపోలేదు? మోసుకొని వెళ్ళాలి కదా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను బిరుదులలో ఒక వ్యక్తి బాప్తిస్మము పొందినచో, అసలు బాప్తిస్మము పొందలేనట్లే, ఎందుకనగా అతనికి పేరు లేదు. తండ్రి ఒక పేరు కాదు; కుమారుడు ఒక పేరు కాదు; పరిశుద్ధాత్మ ఒక పేరు కాదు. పరిశుద్ధాత్మ అనగా నేను మానవుని అన్నటుగా యున్నది. అది పరిశుద్ధాత్మ. తండ్రి ఒక బిరుదు; నేను ఒక తండ్రిని. కుమారుడు ఒక బిరుదు; నేను ఒక కుమారుడ్ని. మానవుడు అనేది ఒక బిరుదు; నేను అదే గదా? కాని నా పేరు విలియం బెన్హాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము యేసుక్రీస్తు. యేసు చెప్పెను, "నేను నా తండ్రి నామములో వచ్చియున్నాను." తండ్రి పేరేమిటి? ఏ కుమారుడైనా గాని తండ్రి పేరులోనే వచ్చును. తండ్రి పేరు యేసుక్రీస్తు, చూచారా. నా భావము ఏమిటో చూచారా?

ACTS 2:38•

ACTS 4:12•

COL 2:9

 

113ఈ పట్టణ మేయరు పేరు మీద ఏదయినా ఆ షాపులో తేమ్మని పంపించాననుకోండి. ఆ పట్టణ మేయరు పేరు ఎందరికి తెలియును? నా మంచి స్నేహితుడు రిచ్ విస్సింగ్, నీవు వెళ్ళి పట్టణ మేయరు పేరు చెప్పాలి. "రిచర్డు విస్సింగ్ నామమున," అని చెప్పాలి. జెఫర్సన్-విల్ లో నున్న జనులు అతనిని ఎరుగుదురు. ఆ కారణమును బట్టియే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పెను. ఆయనలో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా జీవించుచున్నది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమీయ్యుడని ఆయన చెప్పెను.

పేతురు ప్రత్యక్షతలో నిలబడి యుండెను (దాని పైనే ఆయన సంఘమును నిర్మించెను) ఆయనెవరైయుండెనో దాని పైన "ప్రతివాడును మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామమున బాపిస్మము పొందుడని," చెప్పెను. భూమి, పరలోకము రెండింటిలోను తాళపుచెవులు తిరిగినవి. "ఆకాశము క్రింద మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు, యేను నామము వలననే."

JOHN 20:23

 

114యేసుక్రీస్తు నామములో మీరెందుకు బాప్తిస్మము పొందుచున్నారు. పాపక్షమాపణ కోరకు. "ఎవరి పాపములు మీరు క్షమింతురో అవి క్షమించబడును," చూచారా. బాప్తిస్మము పొందుటకు అయోగ్యుడని తలంచిన వ్యక్తికి నీవు బాప్తిస్మమీయవు, కాని నీవు ఇచ్చినపుడు అది జరుగును. నా భావము ఏమిటో మీకు అర్ధమయిందా?

నా రక్షకుని పిలుపును విందును. (వాక్యము!)

(సమాధి నొద్దకు పిలచును.)

నేను రక్షకుని పిలుపు విందును.

(నాతో లేచుటకై నాతో మరణించవా?)

నా రక్షకుని పిలుపును విందును,

(లోకము ఏమి చెప్పును?)

నీ పిలువ నెత్తికొని నన్ను వెంబడించుము.

(ఆయనే వాక్యము!) (అక్కడ నీరున్నది!)

ఆయన నన్ను నడిపించు చోటికి వెళ్ళుదును,

ఆయన నన్ను నడిపించు చోటికి వెళ్ళుదును,

నేనాయనతో పోదును,

మార్గమంతయూ ఆయనతో వెళ్ళుదును.

తలలు వంచుదం!

HEB 13:5

 

115ప్రియ దేవా! నీరు సిద్దముగా నున్నది. ఇప్పుడు హృదయములతో మాట్లాడుము, ప్రభువా. వాక్యమైయున్న క్రీస్తు వారిని పిలచుట విందురు గాక! మార్గమంతయూ ఆయనతో వెళ్ళుదురు గాక! తోటగుండా ఆయనతో వెళ్ళుదును. నీటి యొద్దకు ఆయనతో వెళ్ళుదును, ఆయన నామమును ధరించుదును. ఆయన నామము కొరకు పిలిచిన జనులలో నేనొకనిగా నుందును. ఆయన వాక్యము నమ్ముదును. నేను వెంబడింతును, లోకములో ఎన్నడూ నేను తిరుగను. నేను నిజమైన ప్రధానము చేయబడిన వధువుగా నుందును. ఆయన వాక్యములోని ఒక్క పొల్లును కూడా నేను వదలను. ప్రతి మనవి, నేను నిజ వధువుగా నుండును. ఆయన నన్ను చేయమని కోరిన ప్రతిదానిని చేయుదును. రానున్న నా భర్త నా జుట్టును పొడవుగా ఎదుగ నిమ్మన్నచో, ఆలాగే చేతును. ఆయన నన్నీ మేకప్ లు అన్ని తీసివేయమని కోరినచో తీసివేతును. ఈ చెడు ఆత్మ ద్వారా దుష్ట బట్టలు ధరించుటను ఆయన వద్దని కోరినచో తీసివేతును. ఎవరేమన్ని గాని లెక్క చేయక తీసివేతును. అవిశ్వాసుల గుంపులో నుండి ఆయన రమ్మన్నచో నేను వచ్చెదను. నా రొట్టెను నేను తయారు చేసుకోవలసి వచ్చినాగాని వచ్చెదను. నిన్ను విడువను, ఎడబాయనని ఆయన వాగ్దానము చేసెను, మార్గమంతా ఆయనతో వెళ్ళుదును. ఆయన నామములో నన్ను బాప్తిస్మము పొందమని కోరినచో, నేను చేయుదును." ప్రభువా, నీ వాక్యములో నీవేమి కోరుచున్నావో వాగ్దానము చేశావు, ప్రభువా, ప్రతి వ్యక్తియూ దానిని చూచి, మాధుర్యముగా, వినయముగా దానికి వందనము చేయుదురు గాక! యేసు నామమున ప్రార్ధించుచున్నాను. ఆమేన్.

116మీరు దేవునికి చెందిరి. నా విరిగిన మాటలను దేవుడు మీకు నిజంగా అర్దము చేయాలనే నా ప్రార్ధన. నీరు సిద్దముగానున్నది. రాగోరువారందరికి కొద్ది సేపటికి సేవకుడు ప్రకటించును, మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందగోరు వారందరూ ముందుకు రావచ్చు. అన్నీ సిద్దపరచబడినవి. మీరు దేవునితో జీవించుటకు చేతనైన సహాయము మీకు చేతుము. అందుకే ఇచ్చటున్నాం. దేవుడు దీవించు గాక.

ఇప్పుడు, మనం నిలబడుదుము. అందరం నిలచి, "నేనాయనను ప్రేమించుచున్నాను, ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను," అను చిన్న పాట పాడుదము.

నేనాయన్ను ప్రేమించుచున్నాను, (పాడుచుండగా

అందరం చేతులేత్తుదం) ప్రేమించుచున్నాను.

ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,

నా రక్షణను కొనెను, కల్వరి మ్రాను పైన.

మన తలలు, హృదయములు ఇప్పుడు వంచి ఆయనకు ఈ పాట పాడుదం. [సహోదరుడు బ్రెన్హాం పాడుచుచున్నారు.] ఆయనను ప్రేమించు…

ఓ, తండ్రియగు దేవా! ఈ పేద జీవులను కరుణించుము. ప్రభువా, మా ముందున్న పని నిమిత్తము మమ్ము బలబరచండి. ఓ దేవా, నాకు సహాయము చేయుము. సహాయము చేయుము! తండ్రి, ఇక్కడే ఏదో పడియున్నట్లు నాకు తోచుచున్నది. తండ్రీ, సత్యము తెలిసికొనుటకు నాకు సహాయము చేయుము. ఈ జనులను దీవించుము ప్రియ దేవా! వారిని నడిపించుమని యేసు నామమున ప్రార్ధించుచున్నాను.

ఇప్పుడు, మనము తలలు వంచియుండగా, ఈ సంఘ కాపరియగు సహోదరుడు నెవిల్ ను, అనగా మన ప్రశస్త సోదరుని ఇక్కడకు వచ్చి ఇంకా బాప్తిస్మము గూర్చి ఏదైనా చెప్పదలచినచో చెప్పుమని అడుగుచున్నాను. నేను దానిని ప్రకటించవచ్చు… నీరు సిద్ధముగా యున్నదని తలంచుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...