ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు
1ఇప్పుడు ప్రార్థన కొరకు మనము తలలు వంచుదము. మా ప్రభువగు దేవా, భూమ్యాకాశముల మహా సృష్టికర్తా మృతులలో నుండి యేసుని తిరిగి లేపినవాడ, ఈ రెండువేల సంవత్సరముల నుండి మాతో సజీవునిగా ఉన్నవాడా, ఆయన వాక్యమును స్థిరపరచి ప్రతి తరమునకు అది సత్యమని చూపించుటకు సదా జీవించి యున్నావు. ఇప్పుడు ఆయన యొక్క దైవ సాన్నిధ్యము నిమిత్తము మేమెంతో కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఈ జీవితము అయిపోయిన పిదప, రానున్న లోకములో నిత్యజీవము మాకున్నదన్న ఈ గొప్ప నిశ్చయతను ఎరిగియున్నాము. ప్రభువా, దీనిని బట్టి, నీకు వందనములు. తుఫాను సమయములో నిశ్చలతకు, ధృడత్వమునకు అదియే ఆత్మకు నిరీక్షణా లంగరు. తుఫానులు చెలరేగినప్పుడు, మహా అలలు గర్జించునప్పుడు ఆయన యందలి విశ్వాసము ద్వారా మేము ప్రతి అలను దాటగలమను నిశ్చయతను కలిగియున్నాము.
దేవా, రోగులు మరియు అక్కరలో నున్నవారికి సేవచేయుటకు వచ్చియుండగా, ఈ రాత్రి మాకు సహాయము చేయుము. ఈ రాత్రి ఇక్కడనుండి మేము వెళ్ళునప్పుడు, మా మధ్య ఏ రోగియు లేకుండునట్లుగా, దేవా, ప్రార్ధించుచున్నాము. ఇక్కడ మరియు దేశమంతటను టెలిఫోను ద్వారా వినుచున్నవారు ప్రతిఒక్కరు నీ దైవికశక్తి ద్వారా స్వస్థత పొందెదరు గాక. ఈ రాత్రి ఈ భవనములో నుండియు, కూడిన ప్రతి స్థలములో నుండియూ, ఏ ఒక్క బలహీనుడును ఆలాగు తిరిగి వెళ్ళకుండును గాక! నీ ఆత్మ వారిని బాగుచేయును గాక. ఆ గొప్ప నీతి సూర్యుడు, తన రెక్కలయందు స్వస్థత కలిగి, వాక్యమును వినుచుండగా ప్రతి హృదయము లోనికి విశ్వాస కిరణములు పంపి, ఆయన ఇంకనూ జీవించియున్నాడని నిరూపించు పరిశుద్దాత్మ యొక్క ప్రత్యక్షతలు చూచెదరు గాక, తండ్రీ, ఈ దీవెనలు దయచేయుమని యేసు నామములో ప్రార్ధించుచున్నాము. ఆమేన్. (మీరు కూర్చొనవచ్చును)
2ప్రజలతో మాట్లాడుటకు, రోగులకు ప్రార్ధించుటకు ఈ రాత్రి ఇక్కడ ఉండుట మేము నిశ్చయముగా గొప్ప భాగ్యమని తలంచుచున్నాము. ఈ రాత్రి ఈ గుడారములో బయటి ప్రదేశముల నుండియు, దేశమంతటను టెలిఫోను ద్వారా అనుసంధానము చేయబడిన ప్రతివారిని మేము అభినందించగోరుచున్నాము. మీ ప్రతిఒక్కరిని దీవించవలెనని దేవుని ప్రార్ధించుచున్నాము. క్రీస్తును అంగీకరించిన ప్రతివారు ఈ ఉదయమున పరిశుద్దాత్మతో నింపబడి, ఈ మర్త్య జీవితము ఈ భూమి మీద ముగియు వరకు సదా ఆయన పట్ల నమ్మకముగాను, యధార్థముగాను జీవించుదురు గాక. ఆ విధముగా వారు చేయుట వలన నిత్యజీవము పొందెదరు. మనము ఎదురు చూచుచున్న ఆ గొప్ప యుగము, రానున్ను ఆ మహా యుగములో వారెన్నడునూ చనిపోరు.
3ఆటంకపరచుటకు కాదు గాని, ఆ విధముగా తలంచునప్పుడు ఈలాగు చెప్పగోరుదుము. సహో వెయిల్ ఇచ్చటున్నాడు. నేనాయనను తిరిగి చూడలేక పోవచ్చును. నేను టూసాన్కు తిరిగి వెళ్ళిన తరువాత ఆ వ్రాతప్రతిని మీకు పంపవచ్చునా? నేను దానిని మరల చూస్తున్నాను. అంతయూ ఇంకా చదువలేదు. నేను టూసాన్కు వెళ్ళిన వెంటనే దానిని మీకు పంపించెదను.
ఇప్పుడు నేను ఒక ప్రకటన చేయగోరుచున్నాను. ఇది ముఖ్యముగా ప్రతి చోటను ఉన్న సంఘములకు, ప్రత్యేకముగా పశ్చిమాన ఉన్న సంఘములకు, లేదా రాగోరుచున్న ప్రతి సంఘమునకును, ఇవ్వబడుచున్నది. మన గౌరవనీయ సహోదరుడైన, సహో. పెర్రీగ్రీన్… ఇక్కడున్న టెలిఫోను అనుసంధానమునకు మూలకారకుడు అతడే. మన సహో. పెర్రీగ్రీన్ టూసాన్కు వచ్చి మనలను దర్శించవలెననియు, టూసాన్లో ఉజ్జీవ సభలు ఆరంభించవలెననియు ప్రభువు అతని హృదయములో భారముంచెను. అది నిజంగా మనకు అవసరమైయున్నది. సహో. పెర్రీ టూసాన్లో యుండును. మీరాయనతో మాట్లాడగోరినచో అక్కడున్న మా ఆఫీసును సంప్రదించుడి. ఆగష్టు 10, 11, 12, 13 తేదీలలో అది యుండును. దానిని అతడు తన హృదయములో చాలా కాలము నుండి కలిగియున్నాడు. "దానిని నీ హృదయములో నుండి తీసివేయవలెనన్నచో ఒక్కటే మార్గము, అది నీవు వెళ్ళి జరిగించుటయే," అని అతనితో నేను పలికాను. అతడు ఒక క్రైస్తవ సోదరుడు, నిజమగు ఒక దైవదాసుడు. అతడు అక్కడ పరిచర్య చేయుట ద్వారా టూసాన్లోనున్న మీరు దీవించబడుదురని నాకు తెలియును. బహుశా రమాడా-ఇన్ లో గాని లేదా ప్రభువు ఎక్కడ స్థలము ఏర్పాటు చేయునో అక్కడ కూటములు జరుగును. అతనికి కూటమును జరిపించడానికి ఇంకా స్థలము దొరకలేదు. మనకు దేవుని వాక్యమును సహో. పెర్రీగ్రీన్ వివరించుచుండగా, వినుచున్న మనము ఆయన రాకద్వారా దీవించబడుదుమని నాకు తెలియును. బహుశా రోగులకు ప్రార్ధించును, లేదా దేవుడు దేనికొరకు అభిషేకించునో ఆ ప్రతిదానిని జరిగించును, విధి నిర్వహణలో యుండును.
4ఈ అద్భుతమగు సహవాస సమయము నిమిత్తము సహో. ఆర్మన్ నెవిల్ మరియు సహో. మాన్లకు వందనములు తెలుపగోరుచున్నాము. సహో. నెవిల్, సహో. మాన్, ఇంకా ఇక్కడ చేరియున్న ఇటువంటి సేవకులతో కలిసియుండుట మహా భాగ్యముగా ఎంచుచున్నాను. వారు గుర్తించబడిరని నేను ఊహించుచున్నాను. మన బోర్డు లేదా ఇక్కడున్న మన సంఘముతో మీరు గుర్తించబడనిచో, ఇక్కడ మీరు ఆయన దాసులుగా దేవుడు గుర్తించునని నేను తప్పక చెప్పెదను. ప్రభువు ఎల్లప్పుడు మిమ్ము దీవించును గాక.
5ఇప్పుడు, ఒక కార్యమును ప్రకటించడానికి, ఒక చిన్న కాగితము నాకు వ్రాసి ఇయ్యబడినది. ఇక్కడ ఒక రాత్రియందు ట్రస్టీల సమావేశము జరిగినది. ట్రస్టీ బోర్డు మరియు పెద్దల కూటము, సంఘము ఎదుట ఈ ఉదయమున కూటములో తీసుకొనబడిన నిర్ణయములు చదువబడినవనుకొందును. ఆలాగు చేయుట మన వాడుక. ట్రస్టీ బోర్డు, మరియు ఇక్కడున్న సంఘ పెద్దల ద్వారా తీసికొనబడిన తీర్మానములు బహుశా అందరినీ ఆనందింపచేయకపోవచ్చును. ఆలాగు మనము చేయజాలము. ట్రస్టీ బోర్డు లేక పెద్దల బోర్డులో నాకు అసలు ఏలాంటి సంబంధము లేదు. సమ ఓటు అనే పరిస్థితి ఏర్పడితేనే గాని నాకు అసలు ఓటు వేసే హక్కు కూడా లేదు. ఆ విధముగా జరిగే పక్షములో నేను ఇక్కడకు వచ్చి ఓటు వేయవలెను. సహో ఆర్మన్ నెవిల్ రెండో ఓటును తీసుకొనును. అప్పుడు మేము ఇక్కడ సంతకము చేయుదుము, ఎందుకనగా మేము సంఘములో భాగము. అయితే ఆ ట్రస్టీ బోర్డు, లేక ఆ బోర్డువారు చేసిన నిర్ణయములకు నూటికి నూరు శాతము మద్దతు ఇచ్చెదము, ఎందుకనగా ఇక్కడ వారు అందుకే యున్నారు. వారి నిర్ణయములు వారికిని దేవునికిని మధ్యగా ఉండును. నేను ఏ విధముగాను ఆ నిర్ణయములకు వ్యతిరేకముగా ఉండజాలను; ఉండలేను కూడా. దానికి సంబంధించి ఏ నిర్ణయము చేయరాదని అమెరికా ప్రభుత్వము నన్ను నిషేధించుట మరియొక సంగతి. కనుక వారి నిర్ణయములు సరిచేయమని దయచేసి నన్ను అడుగవదు. ఆ విధముగా నేను చెయ్యలేను. దానిని గురించి నేను ఏమి అడుగబోవుటలేదు. చూడండి? కావున వారి నిర్ణయములు సరిచేయమని నన్ను అడుగవద్దండి. మీరు బోర్డును చూడండి; నిర్ణయములు చేయునది వారే. సరే. మంచిది.
MATT 24:28•
LUKE 17:37
6దేవుని చిత్తమయినచో, సాధ్యమైనచో రాబోవు కూటముల గూర్చి చెప్పబోవుచున్నాను. దాదాపు నాలుగు, ఆరు వారములలో లేదా ఆ దరిదాపునే బహుశా ఇక్కడికి నేను తిరిగి వచ్చెదను. మరొక ఆదివారపు కూటమునకు రావచ్చును. దేవుడు ఆయన వాక్యములో ప్రత్యక్షమాయెనను అంశము మీద మాట్లాడుదునని ఈ ఉదయము నేను ప్రకటన చేశాను, కాని వాస్తవంగా ఈ రాత్రి సమయము లేదు. బహిరంగముగా చెప్పాలంటే, అది మాట్లాడుటకు తగిన గొంతుకూడా లేదు. లోపల వైపున ఎంతమంది జనులు క్రిక్కిరిసియున్నారో, అంతేమంది జనులు వెలుపలకూడా క్రిక్కిరిసియున్నారు. ఆ బస్సులు, ట్రక్కులు, మొదలగు వానిలో కూర్చున్న వారిని లెక్కించినచో, వెలుపల ఇంకా ఎక్కువ యందురు. ప్రసారము చేయబడు సాధనమును కొద్దిగా ఎక్కువగా త్రిప్పినందున అది మనకు వినబడుచున్నది. ఈ చిన్న ప్రసార తరంగము, ఆలయము నుండి వెలువడు చిన్న ప్రసార తరంగమును ఒక పట్టణ సరిహద్దు దూరము (city Block) నుండి పట్టుకొనవచ్చను. అయితే ఇక్కడకు వచ్చిన కొన్ని కారులు అనేక పట్టణ సరిహద్దులను దాటియున్నవి. ఈ రాత్రి ఆ కారుల వరుసలు వీధులలోను, ఎటు చూచిననూ కనబడుచున్నవి. మన గుడారము చుట్టూ కారుల మయము. ఈ రాత్రి గుడారము లోపలను, చుట్టూనూ, మనము చూచుచున్న ఇంత క్రిక్కిరిసిన జనమును ఇంతకు ముందెన్నడును మనము చూడలేదని నమ్ముచున్నాము. కావున మనము … అనేకులు చోటులేని కారణము చేత కార్లను నడుపుకొని వెళ్ళిపోయారు.
"తాజా ఆహారము ఎక్కడుండునో గద్దలు అక్కడ పోగవును" అని ఇది చూపించుచున్నది. అది అంతర్జాతీయ కూడిక అని ఈ రాత్రి చిన్న గుంపునకు నేను నిస్సందేహముగా చెప్పెధను. అమెరికా సంయుక్త రాష్ట్రములలోని మూడులోని రెండు భాగముల రాష్ట్రముల వారు అక్షరాలా ఇక్కడ ప్రాతినిధ్యము వహించిరి. అయిదు విదేశముల వారును ఉన్నారు. రష్యా సహితము ఉన్నది. దేశములోని పలు ప్రాంతముల వారు కూడిరి. వెనిజులా, జమైకా, ఇంకా దేశములోని వివిధ భాగముల వారు, ఇక్కడుండి దేవుని కొరకు ఆకలి దప్పులుగొనుచున్నారు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమగు సమయము!
7పరిశుద్ధ గ్రంథము చదువుచుండగా నా కొరకు మీరు ప్రార్ధించవలెనని కోరుచున్నాను. ప్రభుని చిత్తమయినచో దైవీక స్వస్థతను గూర్చిన చిన్న వర్తమానమును తీసికొని వచ్చుటకు నేను ప్రయత్నించబోవుచున్నాను. ఎందుకనగా ఈ ఉదయము రక్షణ మీద మాట్లాడుకున్నాము. ఈ రాత్రి కొద్ది నిమిషముల పాటు దైవీక స్వస్థత మీద మాట్లాడుకొని ప్రార్ధన వరుసను పిలిచి, జనులకు ప్రార్ధించుదుము. ఇది మేము చేయుచుండగా, టెలిఫోను సంబంధము కలిగియున్నవారు, బస్సులలో, కారులలో ఆలయమునకు కొద్దిగా దూరములో నున్నవారు, మీరెక్కడున్ననూ సరే, మీరు ప్రార్ధించి అక్కడ ఒకరిపైన ఒకరు చేతులుంచు కొనండి, ఎందుకనగా రోగులకు ప్రార్ధించునప్పుడు మీరు భవనము లోనికి రాలేరు. అన్నిచోట్ల ద్వారపు త్రోవలు క్రిక్కిరిసియున్నవి, ఎక్కడను త్రోవలేదు. కనుక మీరు రాలేరని ఖచ్చితంగా చెప్పగలను. టెలిఫోను సంబంధము కలిగి ఈ రాత్రి వినుచున్న ప్రతి సేవకుడును స్వస్థత ప్రార్ధన కొనసాగునప్పుడు తమ సంఘము కొరకు ప్రార్ధించవలెను. దేవుడు సర్వాంతర్యామి, ప్రతిచోట ఉండును అని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మనము చదువుటకు ముందు…
LUKE 24:12-35
8మనము ప్రార్ధించు ముందుగా దేవుని వాక్యములోని కొంత భాగమును చదువగోరుచున్నాము. కొద్దిసేపటి క్రితమే నా వాక్య భాగమును నేను మార్చుకొన్నాను, ఎందుకనగా ముందు నేను అనుకొనిన రీతిగా ఈ రాత్రి కూటమును ఏర్పాటు చేయ దలచుకోలేదు, కావున నేను కొద్దిగా మార్చాను; కనుక నా వాక్యమును మార్చుకొనవలసి వచ్చెను, వాక్యము మార్చలేదు గాని మరియొక విధానములో దైవిక స్వస్థత గూర్చి చెప్పదలిచాను. ప్రజలు గ్రహించవలెననియే ఈలాగు చేశాను. పరిశుద్ద లూకా. 24వ అధ్యాయము తీయుదము. 24వ అధ్యాయము 12వ వచనారంభము నుండి 34వ వచనము వరకు చదువుము. అది ప్రభువైన యేసు పునరుత్థానము మీది అంశము.
అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తి కొనిపోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను.
ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు, ఇప్పుడు, పది ఫర్లాంగులు ఒక మైలు అగును. కనుక అది దాదాపు ఆరు మైళ్ళు.
జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితోనొకరు సంభాషించుచుండిరి.
వారు సంభాషించుచూ ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను.
అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను.
ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా, వారు దుఃఖముఖులై నిలిచిరి.
వారిలో క్లియొపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.
ఆయన - అవి ఏవని వారిని అడిగినప్పుడు?
9[ఇప్పుడు, గుర్తుంచుకొనండి, యేసే త్రిరిగి లేచి, స్వయంగా మాట్లాడుచున్నాడు.] వారు- నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను, ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తైయుండెను.
మన ప్రధాన యాజకులును, అధికారులును ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి, సిలువ వేయించిరో నీకు తెలియదా?
ఇశ్రాయేలును విమోచింప బోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటి మి; ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయును.
అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధియొద్దకు వెళ్ళి;
ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేసిరి.
మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.
10[ఇప్పుడు వినండి!]
[యేసు], అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా:
క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి.
మోషేయు, సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూర ము వెళ్ళునట్లు అగపడగా,
వారు - సాయంకాలము కావచ్చినది, ప్రాదు గ్రుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి, ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్ళెను.
ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పటుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
అప్పుడు వారు - ఆయన త్రోవలో మనతో మాటలాడుచూ లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా, పదునొకొండుగురు శిష్యులును వారితోకూడా ఉన్నవారును కూడి వచ్చి
ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి.
వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడేనో అదియు తెలియజేసిరి.
LUKE 24:32•
JOHN 17:17
11ఇప్పుడు మనము ప్రార్ధించుదము. ప్రియ కృపగల తండ్రీ, నీ వాక్యము కొరకు నీకు వందనములు, ఎందుకనగా నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవము. ఓ ప్రభువా నీవు, నీ వాక్యము ఒక్కటిగా నున్నారు. కనుక ప్రభువా, ఈ రాత్రి నీ యొక్క పునరుత్థాన శక్తితో, మా మధ్యకు వచ్చి ఆ ఎమ్మాయి వారికి చూపించినట్లుగానే మాకును చూపించుము. 'మన హృదయములు మండుచుండలేదా? అని మేమును చెప్పుచూ గృహములకు తిరిగి వెళ్ళెదము గాక. ప్రభువా, అది దయచేయుము; మరల సాయంకాలము అగుచున్నది. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
REV 1:1
12ఈ బైబిలుకు సంబంధించి నేను మాట్లాడగోరుచున్నాను. ఈ రాత్రి నా అంశము, ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు.
ఇప్పుడు, పవిత్ర గ్రంథములన్నింటిలోను బైబిలు ఒక ప్రత్యేక గ్రంథము. బైబిలు ఒక వేరైన గ్రంథము. అది ప్రవచనముల గ్రంథము. భవిష్యత్ సంఘటనలను ముందే చెప్పెను. అది యేసుక్రీస్తు యొక్క ప్రతక్షత కూడాను. ఆదికాండము నుండి ప్రకటన వరకు ఆయన ఏమైయుండెనో, ఏమైయున్నాడో, ఆయన యొక్క సంపూర్ణతను వెలికి తీసికొనవచ్చును. గ్రంథమంతయూ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని ప్రకటన 1:1-3లో చెప్పబడెను - అనగా దేవుని వాక్యము. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుని వాక్యమే.
13తక్కిన గ్రంథములన్నియూ, పవిత్ర గ్రంథములు కేవలము నైతిక సూత్రములు మాత్రమే. నీతులు, లేదా వేదాంతము మాత్రమే. అటువంటిదే… మహమ్మదీయుల మత గ్రంథమగు ఖురాను ఎంతమంది చదివారు? లేదా బౌద్దుల గ్రంథము. ఇంకా అలాంటివి? అవి కేవలము నీతిబద్ధముగా జీవించుట చూపును. ప్రజలు ఏలాగు జీవించవలెనో, ఎందుకొరకు జీవించవలెనో చెప్పునే గాని ప్రవచనము కాదు. ఈ విషయములు గూర్చి చెప్పవు. ఎవరికయినా ఏవైనా ప్రత్యేక వరములు ఈయబడినట్టు గాని, ఏదైనా జరుగనైయున్నట్లుగాని చెప్పవు. ఏదో ఒక వసతి గృహములోనో (lodge) మరిదేనిలోనో చేరినట్లుగా యుండును. కనుక కేవలము కలిసియుండుటకే ఏర్పడిన సంఘములు మా వసతి గృహమునకు రండి, చేరండి అని సంఘములు ఆ స్థానములోనికి వచ్చుచున్నవి. దేవుని వాక్యము నుండి పడిపోవుచున్నవి.
JOHN 14:20
14పరిశుద్ద గ్రంథము సజీవమైనదై, యేసుక్రీస్తును గూర్చి ముందుగా చెప్పిన సాక్షియునైయున్నది. భూమి దాని సంపూర్ణతలోనికి, ద్రాక్షాతీగెలు తమ సంపూర్ణత లోనికి, దినము దాని సంపూర్ణతలోనికి ఎదిగినట్టుగానే బైబిలు కూడా యేసుక్రీస్తు వ్యక్తిత్వము నందు సంపూర్ణతతో బయలుపరచబడినది. ఆయనే ప్రత్యక్తపరచబడిన దేవుని వాక్యము. బయలుపరచబడిన సంపూర్ణ గ్రంథమైయున్నారు. దానిని విశ్వాసించువారు దానిని చదివి, దానియొక్క ప్రతి మాటను నమ్మవలెనని ఆ గ్రంథకర్త ఆజ్ఞాపించుచున్నాడు. అందులో ఒక భాగము నమ్ముట కాదు. దానిలోని ఒక్క మాటను నమ్మకపోయిననూ దానిని పూర్తిగా నమ్మువరకూ ఆ గ్రంథమును విడిచిపెట్టరాదు. మీరు ప్రయత్నిస్తునే వుండవలెను. ప్రతి మాటయు సర్వశక్తుడగు దేవునియొక్క పరిపూర్ణ భాగమై యున్నది. దేవుడు ప్రత్యక్షమాయెను. తన వాక్యములో చుట్టుకొని తానెవరైయున్నాడో చూపించుచున్నాడు. దానియందలి ప్రతి మాటను నమ్మవలెనని విశ్వాసులుగా మనకు ఆజ్ఞాపించబడియున్నది. దానిని వ్రాసినవాడు స్వయంగా గ్రంథకర్త అయిన దేవుడే. దానికి ఎవరునూ ఏమియూ కలుపలేరు, మరేమియూ తీసివేయజాలరు. ఆలాగు మీరు చేసినచో అది దేవుని చిన్నాభిన్నమైన శరీరముగా నుండును. అప్పుడది ఆరు వ్రేళ్ళుగల హస్తముగాను, లేదా మూడు చేతులు గల వింత వ్యక్తి మాదిరిగా నుండును. దానినుండి ఒకటి తీసివేయుట, దానికి మరొకటి చేర్చుట ఒక చేయి, లేదా ఒక వ్రేలు తీసివేసినట్లుగానే యుండును. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ శరీరము. క్రీస్తు, పురుషుడై యుండి, పెండ్లి కుమారునిగా నున్నాడు. పెండ్లి కుమార్తె కూడా ఆయనలోనే యున్నది. వీరిద్దరు ఒక్కటే. "ఆ దినమందు నేను తండ్రియందును, నా తండ్రియు, నేను మీయందును, మీరు నా యందును యున్నామని మీరు తెలిసికొందురు." ఎంత సంపూర్ణ చిత్రము!
ఈ వాక్యమునందున్న నిజ విశ్వాసులు, దానిని ఉన్నట్లుగా అంగీకరించి, నమ్మువారు, దానియొక్క ప్రవచించబడిన వాగ్దానముల కొరకు సహనముతో కనిపెట్టు కొనువారు, దాని కాలములో ఆ ప్రతియొక్క వాగ్దానము నెరవేరుట చూతురు. ప్రతి విశ్వాసియు దానికొరకు కనిపెట్టవలెను. తన కొనవ్రేళ్ళమీద నిలబడి కనిపెట్టుచున్న ప్రతి విశ్వాసికి అది బయలుపరచబడును.
ISA 40:3•
MAL 3:1
15ప్రభువగు యేసు వచ్చుచున్న దినములలో చూడుడి, "ప్రభువునకు మార్గము సరాళము చేయుడి అను అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము" అని యెషయాలో బైబిలు స్పష్టముగా చెప్పిననూ ఎందువలన యోహానును ఆ జనులు గుర్తించలేదు? వారి చివరి ప్రవక్తయగు మలాకీ 3వ అధ్యాయములో ఈలాగు చెప్పెను. "ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను నా వర్తమానికుని పంపుదును." వారెందుకు దానిని చూడలేదు? ఎందుకనగా వారు జరిగిపోయిన మరి దేనినో చూచుచుండిరి. ఎప్పుడో బయలు వెళ్ళిన వర్తమానము మీదనే వారి తలంపులు ఉండెను. వారు జీవించుచున్న ఆ దినమున వచ్చిన దేవుని ప్రత్యక్షతను చూచుటలో విఫలమయిరి.
ప్రతి చోటను ఉన్న క్రైస్తవులారా, ప్రపంచము ఈ రాత్రి సరిగ్గా ఆ స్థితిలోనే నిలబడియున్నది. ఏ భేదము లేకుండా అది సత్యము! ప్రతి చోటను క్రైస్తవులు లూథరు లేక వెస్లీ, లేక సాంకీ, ఫిన్నీ, నాక్స్, కాల్విన్లు వ్రాసిన నీతి నియమావళినే తిరిగి చూచుటకు ప్రయత్నించుచున్నారు. వారిని గూర్చి నేనేమియూ చెడ్డ పలుకుట లేదు, కాని అది గతించిన విషయము.
MATT 23:29,31
16పరిసయ్యులు మోషే చెప్పిన దానిని చూచుటకు వెనుదిరిగిరి, "మాకు మోషే ఉన్నాడు, నీవెక్కడినుండి వచ్చావో మేమెరుగుదుము" అనిరి.
కాని మరువవద్దు, మోషే ఇక్కడుండినప్పుడు, అతడెక్కడనుండి వచ్చెనో వారికి తెలియలేదు, చూచారా. "మీరు ప్రవక్తల సమాధులను శృంగారించుదురు, గాని వారిని అందులో పెట్టింది మీరే" అని యేసు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. వారి సందేశము అయిపోయిన తరువాత నమ్ముచున్నారు! ఒక వర్తమానము బయలు వెళ్ళుచుండగా, ప్రజలు దానిని చూచి హేళన చేసిరి (లోకము ఆలాగే చేయును). ఆ వర్తమానము అయిపోయిన పిదప, వర్తమానము సమాప్తమైన తరువాత, ఆ వర్తమానము మీద వారు ఒక శాఖను నిర్మించుదురు. వారు అక్కడే చనిపోవుదురు, తిరగి జీవము ఎన్నడూ పొందరు.
17మీలో కొందరి జనులవైపు కొద్ది క్షణములు చూడండి. ముఖ్యంగా కాథలిక్కు వారితో నేను మాట్లాడుచున్నాను. మీరు అసలయిన చరిత్రను, రోమను కాథలిక్కు సంఘ చరిత్రను ఎన్నడైనా చదివారా? మీ హిప్పో నివాసియగు పరిశుద్ద, ఆగస్టీన్ కాలము మొదలుకొని ఎన్ని మిలియనుల అమాయక ప్రజలను ఆ సంఘము హతము చేసినదో మీ హతసాక్ష్యుల గ్రంథములో చూడండి, నాకు గుర్తులేదు. అసలు సంఖ్యను మరచిపోయాను, కాని అది మిలియనులలో ఉండును. రోమను కాథలిక్కు సంఘమును ఎదిరించు వారినెవరినయిననూ చంపుట సంపూర్తిగా దేవుని చిత్తమని ఆఫ్రికాలోని హిప్పో నివాసియగు పరి. ఆగస్టీన్ ఒక ప్రకటనను వెలువరించెను. పరి. పాట్రిక్ మరణించేంతవరకు రోమను కాథలిక్కుగా గుర్తించబడలేదని మీరు గ్రహించారా? అతడు పోపును, అతని క్రియలన్నింటినీ ఎదిరించెను. కాథలిక్కు సంఘము, వేల మిలియనుల కొలది తన పిల్లలను తానే చంపెను. పరిశుద్దురాలగు జోన్ ఆఫ్ ఆర్క్ ను మాంత్రికురాలని చెప్పి కొయ్యకు కట్టి కాల్చినది కాథలిక్కు సంఘమేనని మీరెరుగుదురా? ఆ తరువాత రెండు వందల సంత్సరములకు మత గురువుల యొక్క శల్యములను త్రవ్వి పవిత్ర భూమిలో పాతిపెట్టుట తప్పు అని భావించి, ప్రాయశ్చిత్తముగా వానిని సముద్రము లోనికి విసిరివేసిరి.
ఆ దినము మీ శిరస్సు మీదుగా గతించిపోవుచుండగా, బుద్ధిహీనులుగా ఉండవద్దు.
JOHN 5:39
18యేసును శిక్షించుటకు ఈ రాత్రి ఆ మతగురువులు ఎంతగా సిద్ధపడి వస్తారో వారి కాలమునకైన దీర్ఘదర్శనమును వారు చూడలేకపోవుటయే వారు చేసిన తప్పగును. యేసు చెప్పెను, "లేఖనములను పరిశోధించుడి, ఎందుకనగా వాటియందు జీవము కలదని మీరు చెప్పుకొనుచున్నారు. నేనెవరినో లేఖనములు తెలియచేయుచున్నవి?" ఆ కాలములో అతనెవరని.
గమనించండి, పరిశుద్ధ గ్రంథము విఫలము కాజాలదు. అది చేయలేనిది అదొక్కటే. దేవుని వాక్యమును తిప్పిపోవునట్టు చేయజాలదు — ఎందుకనగా ఆ గ్రంథకర్త చేయు దానిని చేయకముందే అది చెప్పును.
ISA 1:18
19ఇప్పుడు, ఒక మనిషి జరుగునని ముందు జోస్యము చెప్పిన వెయ్యింటిలో ఒకటి మాత్రమే జరుగు అవకాశము కలదు. అదెక్కడ జరుగునో చెప్పమన్నచో, ఆ వేయిలో ఒక్క అవకాశము కూడా జారిపోవును. పది వేలలో ఒక్క అవకాశము కూడా ఆలాగుండదు. ఏ దినమున జరుగునో చెప్పమన్నచో, ఒక మిలియనులో ఒక్క అవకాశము కూడా యుండదు. అదెవరికి జరుగునో చెప్పమన్నచో, బిలియనుల అవకాశములలో ఒక్కటియూ జరుగదు.
కాని ఈ పరిశుద్ధ గ్రంథము, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ మరియు దేనికి ఎదురు చూడవలెనో, ఖచ్చితంగా చెప్పును. ఒక్కసారి కూడా విఫలము కాలేదు. ఇక్కడున్న పవిత్ర హృదయ సంఘ బిషప్పుతో కొద్దికాలము క్రితము ఒక చిన్న చర్చ జరిగినది. అతడు ఈలాగనెను, "బ్రెన్హాం గారు, మీరు పరిశుద్ధ గ్రంథము గురించి వాదించగోరుచున్నారు. అది సంఘ చరిత్ర మాత్రమే."
నేను, "అది చరిత్ర కాదు; అది దేవుడే, ఆయన అచ్చు రూపములో నుండుట" అన్నాను.
అతనో, "దేవుడు తన సంఘములో యున్నాడు" అన్నాడు.
నేను, "దేవుడు తన వాక్యమందున్నాడు. దానికి వేరుగానున్నది ఏదయినా గాని అబద్దమే. ఎందుకనగా నా మాట ఒక్కటే సత్యము, ప్రతి మానవుని మాట అబద్ధమే అని దేవుడు చెప్పెను" అని జవాబిచ్చాను.
"మనము వాదించకూడదు" అన్నాడతడు.
"నిన్నెప్పుడూ వాదించమని నేను కోరలేదు, కాని బైబిలు "రండి, మన వివాదము తీర్చుకొందుము" అని పలుకుచున్నది, అని అన్నాను.
MATT 11:25•
LUKE 10:21
20ఆ గ్రంథకర్త చేయకముందే అతడు చేయు కార్యములను గూర్చి అది తెలుపును. ఆ విధముగా చెప్పుట వలన, ఏ సాకు చెప్పకుండా ప్రతి స్త్రీ మరియు పురుషుని, ఆ తీర్పునొద్ద జవాబుదారిగా నిలబెట్టును. దానిగూర్చి మెతడిస్తు ఏమి చెప్పుచున్నాడో, దానిగూర్చి బాప్టిస్తు ఏమి చెప్పునో, కాథలిక్కు ఏమి చెప్పునో, పెంతెకోస్తు ఏమి చెప్పునో, లేదా మరే సంఘమయినా ఏమి చెప్పునో దానిని నీవు తీసికొనినచో తీర్పు దినమున నిరాశకు గురయ్యెదవు. కాని ఏమి జరుగునని బైబిలు చెప్పనో దానిని నీవు గమనించి, అదెప్పుడు జరుగునని చెప్పునో గ్రహించినచో, అప్పుడు నీవు ఏమి జరుగునో గుర్తించెదవు.
ఇప్పుడు, జనులందరూ దానిని చూడగలరని తలంచుట సరి కాదు, ఎందుకనగా జ్ఞానులకు, తెలివిగలవారికి దానిని మరుగుపరచి నేర్చుకొను పసిబిడ్డలవంటి వారికి బయలుపరచినందుకు యేసు దేవునికి వందనములు చెల్లించెను. సర్వశక్తుడగు దేవుడు తన స్వంత వాక్యము మీద కూర్చునియుండి, ధనికులను, జ్ఞానులను, విద్యగల పండితులను, గ్రుడ్డివారినిగా చేసి, ఆయనను చూడకుండునట్లుగా వారి నేత్రములను బంధించు శక్తిని కలిగియున్నాడు. బీదల, విద్యలేని వారి నేత్రములను తెరచెను.
LUKE 24:15,16
21ఎమ్మాయి నుండి వచ్చిన వీరిని గమనించండి. ఆయనను గూర్చిన గ్రహింపు మూయబడెను అని ఆయన చెప్పెను. ఆ దినమంతయూ ఆయనెవరో తెలియకుండానే వారాయనతో మాట్లాడిరి. దేవుడు ఆలాగు చేయగలడు, ఎందుకనగా ఆయన దేవుడు.
ఆ యాజకులు, శాస్త్రులు, మొదలగు వారికి సరిగ్గా ఆయన అదే చేసెను. ఆయన అది చేయవలసియుండెనని వ్రాయబడెను. మనకు తరుణము దొరుకునట్లుగా దేవుడు వారి నేత్రములను మూసెను. గమనించండి, వారెంత పండితులయిననూ, ఎంత యాజకులయిననూ, వారేమి చేసిననూ దానిని వారు చూడలేకపోయిరి, ఎందుకనగా వారు అంధులు. శారీరకంగా వారి దృష్టి ఇరవై-ఇరవై యుండవచ్చును. కాని వారి ఆత్మీయ దృష్టి గ్రుడ్డిది!
REV 17:1,2,5
22ఈ ఉదయమున స్త్రీ యొక్క వ్యభిచారమును గూర్చి అదే నేను చెప్పవలెనని ప్రయత్నించుచున్నాను. ఇప్పుడు వారు ధరించుచున్న బట్టలు చూడండి. వారు వ్యభిచారులు. శరీరేచ్ఛను పురికొల్పు వస్త్రధారణ జరిగించు వీరు దేవుని గ్రంథములో ఎన్నడునూ వ్యభిచారులుగానే వ్రాయబడుదురు. వారి ఆత్మకు అది తెలియదు. ఆ స్త్రీలలో వేలాదిమంది నిర్దోషులనియు, వారే విధముగాను వ్యభిచరించలేదనియు నేను నమ్ముచున్నాను. ఆ దీన స్త్రీలు తమ్మును ఆ విధంగా బయటకు చూపించుకొనుట ద్వారా చూచువారిలో శరీరేచ్చ పుట్టించి వ్యభిచారులయిరి. బైబిలు ఇట్లు చెప్పెను, "విస్తారమగు జలముల మీద కూర్చునియున్న ఆ వేశ్యతో భూరాజులందరును, భూజనులందరును, సంఘములు మొదలగునవన్నియూ ఆత్మీయ జారత్వము చేసిరి. ఆమె వేశ్యలకు తల్లి" — అవే శాఖలు.
23మనము పరిశుద్ధ గ్రంథమును గమనించవలెను, ఏలయనగా దేవుడు మనలను చీకటిలో విడిచిపెట్టలేదు. సంఘటనలు జరుగకముందే, అవి జరుగు కాలమును, వాని స్వభావమును మనకు తెలియ చెప్పుటకు ఆయన మనకు పరిశుద్ధ గ్రంథమును పంపెను.
ఇప్పుడు, క్యాలెండర్ లో తేదీ ఏమిటో చూచినట్లుగానే అది యుండును. ఇది శనివారమో, ఆదివారమో ఏ వారమో తెలిసికొనుటకు ఏమి చేయుదురు? క్యాలెండరును చూడండి. ఏ రోజుయి యున్నదో క్యాలెండర్ చెప్పును. ప్రజలయొక్క క్రియలు చూచినప్పుడు, అనగా చర్చికి వెళ్ళుట చూచునప్పుడు, గంటలు మ్రోగుట వినునప్పుడు ఇది ఏమి రోజూ అని నీవు ఆశ్చర్యపడుదువు. క్యాలెండరును చూడండి. అది ఏ దినమో నీకు చెప్పగలదు.
JOHN 6:37,44
24సంఘము లోకసంబంధమైనదిగాను, సొదొమ దినములలో ఉండినట్లుగాను, 'ఈ దుష్టయుగపు దేవతను' సంఘ ప్రపంచము ఆరాధించుటను మీరు చూచుచున్నారు. మరో వైపున ఒక చిన్న అల్ప సంఖ్యాక గుంపు దైవావేశము క్రింద కూడుకొని, జరుగుటకు ఉద్దేశించబడిన లేఖనముల ద్వారా యేసుక్రీస్తు జీవమును తిరిగి ఉత్పత్తి చేయుట కనబడుచున్నది. మనము ఏ ఘడియలో జీవించుచున్నామో మీకు తెలియును.
మనము ఏ దినమందు జీవించుచున్నామో, ఏ సమయమందు బ్రదుకుచున్నమో, ఏ విధమగు సంఘటనలు జరుగుచున్నవో ప్రవచనము ద్వారా ఈ బైబిలు ముందే చెప్పుచున్నది. అది అక్షరము తప్పిపోకుండా సరిగ్గా చెప్పుచున్నది. ఏ ఒక్క కాలములోను కూడా అది తప్పిపోలేదు. ఏ ఒక్కసారి కూడా తప్పలేదు, మరి అది తప్పదు. దానిని చూచుటకు ముందుగా నిర్ణయించబడినవారు దానిని చూచెదరు. "నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రారు. తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వత్తురు" అని యేసు చెప్పెను. అది వాక్యముతో వాక్యము చేరుట. అది మరేదియూ చేయలేదు. మనము జీవించుచున్న దినమును ఎరుగుదుము.
ACTS 23:2,3
25కాని అన్ని కాలములలో ఉండినట్లుగానే, మానవుడు ఈ వాక్యమునకు స్వంత అనువాదమును సమకూర్చెను, మరియు జరుగుచున్న సంఘటనను చూడలేనంతగా వారిని గ్రుడ్డివారినిగా చేసెను. పరిసయ్యులకు, మరియు సద్ధుకయ్యలకు అది ఆ విధముగానే చేసినది. పౌలు అక్కడ నిలబడి వాక్యమును ప్రస్తావించి ప్రయత్నించిననూ విఫలమయ్యెను. ప్రధాన యాజకుని సున్నము కొట్టిన గోడా అన్నందుకు ఒకడు అతనిని ముఖము మీద కొట్టెను. అప్పుడు వారు ప్రవచించబడిన ఆయన వాక్యమును దేవుడు దృఢపరచుచుండగా వారు చూడకుండా తప్పిపోయిరి.
26చూడండి, పరిశుద్ధ గ్రంథము తనకు తాను విభేదించుకొనదు; పరిశుద్ధ గ్రంథమే దేవుడు. దేవునియందు ఏ విభేదములేదు; ఆయన పరిపూర్ణుడు.
కాని ప్రజలు తమ స్వంత అనువాదముతో యున్నారు! ఇప్పుడు గమనించండి, స్నేహితులారా, నన్ను చూపించనీయండి. దానియొక్క అనువాదము మీద సంఘములు తమలో తాము అంగీకరించజాలవు. మెథడిస్తు బాప్టిస్తుతో అంగీకరించదు. బాప్టిస్తు ప్రెస్బిటేరియనుతోను, పెస్బిటేరియను పెంతెకోసుతోను అంగీకరించవు. పెంతెకోస్తునందు దాదాపు నలుబది వివిధ సంస్థలున్నవి. అవి పరస్పరము ఒకదానితోనొకటి ఏకీభవించజాలవు. కనుక మీరు చూడండి, అది మరల బబులోను అగును, గందరగోళము.
కాని దేవుడు తన వాక్యమునకు తానే స్వంత అనువాదము చేయును. ఆయన ఒకదానిని వాగ్దానము చేసెను. దానిని ఆయనే చేయును. ఆయన (తానే) దానికి అనువాదము ఇచ్చును, ఎందుకనగా ఆయన ఆ ఘడియలో తన్నుతాను తెలియ చేసికొనును. క్రీస్తు శరీరము పాదము నుండి శిరస్సుకు ఎంతగా ఎదిగినదో చూడండి!
JOHN 5:39
27గమనించండి, ప్రజలు దానిని పొందలేకుండా తప్పిపోవుటకు అదే కారణము, ఎందుకనగా వారు దానిగూర్చి ఎవరో చెప్పినది విందురు. యేసు చెప్పినట్లుగా వాక్యమును చదువరు. "అవి ఆయన గూర్చి సాక్ష్యమిచ్చును. లేఖనములను పరిశోధించుడి, ఎందుకనగా వానిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, నన్ను గూర్చి అవి సాక్ష్యమిచ్చుచున్నవి." ఇంకో మాటలో, "వాక్యమును చదవండి మరియు మెస్సియా ఏమి చేయనైయున్నాడని చెప్పబడెనో చూడండి. ఏ సమయములో మెస్సీయా వచ్చునని చెప్పబడెనో చూడండి. మెస్సీయాకు ముందుగా ఎవరు వచ్చునో చూడండి. ఆ ఘడియ వైపు చూడండి. అరణ్యములో ఒక స్వరము కేకవేయనై యున్నది: అది యోహాను. మీరేమి చేతురని చెప్పబడెనో అదే మీరు అతనికి చేసిరి. నేను వచ్చినప్పుడు ఏమి చేయవలసియున్నానో చూడుడి. ఇప్పుడు మీరేమి చేసిరి? ఇది చేయకుండా నేను తప్పిపోయానా?" చూడండి, యేసు మాట్లాడుచున్నాడు, "ఇది చేయకుండా నేను తప్పిపోయానా?"
ISA 7:14•
ISA 9:6•
JOHN 5:39•
HEB 13:8
28గమనించండి, ఈ మధ్యాహ్నాము మనము ఈ వాక్యము ద్వారా వచ్చుచుండగా, ఆయన గూర్చి ప్రవచించబడినది. చెప్పబడిన విధంగా ఖచ్చితంగా సమస్తమూ ఎటు జరిగినదో మనము చూచాము. వారు ఈ సంఘటనను తెలిసికొనియుండవలసినది. "ఈ మత పిచ్చివాడు, ముప్పది ఏండ్లవాడు లేదా ముప్పది-మూడేండ్లవాడు. ఏదో వెలుగులు, పావురములు దిగి వచ్చుచున్నవని చెప్పుచున్నాడు. అదెంత అవమానకరము." "అతడు అక్రమ రీతిగా జన్మించి, కన్యక వలన పుట్టితినని చెప్పుకొనుచున్నాడు" అని వారనిరి.
యెషయా 9:6లో యెషయా పలికిన దానిని వారు తెలిసికొనియుండవలసినది గదా? "ఏలయనగా మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను." "కన్యక గర్భవతియగును" అని యెషయా ప్రవక్త పలికిన దానిని వారు తెలిసికొనియుండవలసినది. ఈ సంగతులు వారు ఎరిగియుండవలసినది. కాని, మీరు చూడండి, వారు దానిని ఇంకా ముందు ఎప్పుడో జరుగును అని తలంచుచుండిరి. ఇతడు వారియొక్క ప్రత్యేక గుర్తింపులకు సరిపోలేదు. కాని ఆయన ఇటు వారికి చెప్పెను, "లేఖనములను పరిశోధించుడి, అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు గదా. నా వర్తమానమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. అదే." ఏదో ఒక వేదాంత పండితుడు చెప్పినది కాదు. దేవుడు ఏది జరుగునని చెప్పెనో అది జరుగును! (ఆయన స్వంత వాక్యము) ఆమేన్!
ఇప్పుడును ఆలాగే యున్నది! లేఖనములను పరిశోధించుడి. మనము జీవించుచున్న ఘడియ గూర్చి చెప్పునది అదే. ఈ దినమున ఏమి జరుగునో ఖచ్చితంగా మనకు తెలియును. మీరు దాని మీదనే ఆనుకొనవలెను. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమును గూర్చి సాక్ష్యమిచ్చునది అదే. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు" అని బైబిలు చెప్పుచున్నది — ఎందుకనగా ఆయనే ఈ యుగములోని వాక్యము యొక్క ప్రత్యక్షత. అందులో తేడా ఉండదు.
MATT 15:14•
LUKE 6:39•
REV 3:17,19,20
29మానవుని యొక్క అనువాదము వినుట ద్వారా, దేవుని వాక్య నెరవేర్పు యొక్క దృఢత్వమును చూడవలెనని వారు కోరి దానిని చూచుటలో విఫలమయిరి. ఎందుకనగా అది ఎల్లవేళలా జరుగుచున్నది. వారు మానవ అనువాదమునకు చెవియొగ్గుట వలన "వారు అంధులగు మార్గదర్శకులు" అని యేసు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానిని నడిపినచో, వారికి ఏమగును? ఇప్పుడు మరువవద్దు, అతి మతావేశముతోనున్న ఈ లవొదికయ కాలము గ్రుడ్డిదని పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పెను. వారాయనను సంఘమునకు బయట ఉంచిరి. యేసు బయటనున్న సంఘ కాలము మరొకటి ఏదియూ లేదు. కాని లవొదికయ సంఘ కాలములో ఆయన బయట ఉండి, లోనికి వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను." ఆయన లోపల ఉండవలసినవాడు, కాని ఆయన ఇటు చెప్పెను, "నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసికొనియున్నాను. నాకేమియూ కొదువ లేదు అని చెప్పుకొనుచున్నావు. కాని నీవు గ్రుడ్డివాడవును, గ్రుడ్డివారికి మార్గదర్శకుడవునై యుండి, ఆత్మయందు దరిద్రుడవును, దిక్కుమాలినవాడవును, దిగంబరియునై యున్నావని ఎరుగుట లేదు." ఒకడు దిగంబరిగా వీధిలో యుండి, దిక్కుమాలిన వానిగాను, గ్రుడ్డివానిగాను యుండినచో, ఆ సంగతిని గ్రహించు స్థితిలోయున్నచో నీవు అతనికి దిగంబరివని చెప్పెదవు. అప్పుడు దానిగూర్చి అతడేదో చేయ ప్రయత్నించును. కాని అతడప్పుడు తల ఊపుచూ, "నేను వస్త్రము ధరించను. నీవెవరివి నాకు అది చేయుమని చెప్పుటకు? నేనేమి చేయుచున్నానో నాకు తెలియును? అన్నచో ఎట్లుండును? అది దీనమైన పరిస్థితి కాక మరేమిటి? ఇప్పుడున్న ఈ దుష్ట యుగములో, మనము జీవించుచున్న ఈ చివరి సంఘ కాలములో సంఘము ఆ స్థితిలోనే యుండునని ఈ పరిశుద్ధ గ్రంథములోని దేవుడు చెప్పెను.
గమనించండి, "నేనెందరిని ప్రేమించుచున్నానో, వారిని గద్దించుచున్నాను" అని జనులతో ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు, నీవు చేయుచున్న దానిని బట్టి ప్రభువు చేత నీవు గద్దింపబడుచున్నచో బయటకు రమ్ము దానినుండి దూరముగా రమ్ము. "నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచున్నాను."
JOHN 5:39
30దేవుని చూచుచూ పరిసయ్యులు ఈలాగు పలికియుండినచో ఎట్లుండును? "ఒక్క నిమిషము ఆగుము. ఆ మనిషి మనకు గొప్ప సవాలు విసిరియున్నాడు. లేఖనములను పరిశోధించుడి. వానిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని చెప్పుచున్నాడు. నేను వెనక్కు లేఖనములలోనికి వెళ్ళి ఆయన ఏమి చేయనైయున్నాడో, ఆయన ఎవరైయున్నారో, ఏది జరుగనైయున్నదో చూచుట మంచిది. వెనక్కి చూచి నేను కనుగొందును?" దానికి బదులుగా వారు యాజకుని యొద్దకు వెళ్ళి "దాని సంగతి ఏమిటి?" అని అడిగిరి. ఆ తేడా చూచారా? వారు వాక్యము చదివియుండవలసినది.
HEB 1:1
31హెబ్రీ1:1లో బైబిలు చెప్పెను, "దేవుడు, నానా సమయములందు" అనగా "పూర్వకాలములో, వివిధ విధములుగా ప్రవక్తల ద్వారా పరిశుద్ధ గ్రంథమును వ్రాయించెను." ఇప్పుడు గమనించండి, ఆయన పరిశుద్ధ గ్రంథమును తన స్వంత ఏర్పాటు చేసుకొనిన రీతిలో వ్రాయించెను. చూచారా? ఆయన ఆ విధముగా వ్రాయించియుండవలసిన పనిలేదు. ఆలాగే మానవుని రక్తము ద్వారా రక్షించవలసిన పనిలేదు. మానవుని ద్వారా సువార్తను బోధించనవసరములేదు. ఆయన సూర్యుడు, లేక చంద్రుడు లేక నక్షత్రముల ద్వారా సువార్తను బోధింపచేయగలడు; గాలి ద్వారా సువార్తను ఆయన వినిపింపచేయగలడు. కాని ఆయన మానవుని ఎన్నుకొనెను! ఆయన తన వాక్యమును రప్పించుటకు తన మార్గమును ఎన్నుకొనెను. అది తన ప్రవక్తల ద్వారా, వారు ముందుగా నిర్ణయించబడిరి. ఆ కాలమునకు ఆ తరమునకు ఆయన వాక్యము యొక్క ప్రత్యక్షతను వారు ప్రకటించిరి. "యెహోవా వాక్కు ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును." ఎన్నడూ అది ఒక వేదాంత పండితుని యొద్దకు రాదు. నాకు వాక్యములో చూపించండి. అది ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును. దేవుడు అబద్ధమాడలేడు. కనుక దేవుడు తాను ఏర్పాటు చేసికొనిన విధానములో పరిశుద్ధ గ్రంథమును వ్రాసెను. ఆయన స్వంతగా ఏర్పరచుకొనిన ప్రవక్తల ద్వారానే, మనుష్యులు ఏర్పరచుకొనిన ప్రవక్తల ద్వారా కాదు, కాని దేవుడేర్పాటు చేసికొనిన ప్రవక్తల ద్వారా.
32దానియందు విశ్వాసముంచువారు తమ ప్రవక్త చెప్పినది నెరవేరుట కొరకు ఎదురు చూచెదరు. వారు దేవుని ప్రవక్తలని అదియే గుర్తింపు. ఎందుకనగా వారు మొదట దైవావేశాపూరితులు. తరువాత ఆ ఘడియకు చెందిన వాక్యమునే చెప్పెదరు. అవియే వారి నియామక పత్రములు. చూడండి, గత ఆదివారము అది మనము చూచాము. అనేకమంది అబద్ధ ప్రవక్తలు లేచెదరు. బిలాము, మోషే ఇద్దరును ఒకే ఆత్మతో ఎట్లు అభిషేకించబడిరో మనము ఉదాహరణగా పేర్కొందుము. అందులో ఒకడు ఇట్లనెను, "మనందరమూ ఒక్కటే. రండి మనము కలిసిపోదుము. మన బాలికలనందరినీ ఒకచోట సమకూర్చండి. ఇక్కడ చాలా అందమగు యువతులున్నారు మరియు యువకులారా, ఇక్కడకు వచ్చి మీకొరకు చక్కని భార్యలను ఏరుకొనండి. అది మంచిదే. మనందరమూ ఒక్కటే ప్రజ, ఒకే జాతివారము." దానిని బట్టి దేవుడెన్నడూ వారిని క్షమించలేదు. వారు దానికి చెవియొగ్గిరి.
చూడండి, లోకము - జనులు ఏదో ఒక చిన్న త్రోవ కొరకు, ఏదో చిన్న మార్గము కొరకు, ఏదో చిన్న అడ్డదారి కొరకు చూచుచున్నారు, కాని దేవుని వాక్యమందు ఏ అడ్డదారులు లేవు. ఒకే మాదిరి యున్నది. నిన్ను నీవు కుదించుకొని ఆ మాదిరికి తగినట్లుగా మలచుకొనవలెను. ఆ మాదిరిని కుదించి నీకు తగినట్లుగా చేసికొనుటకు ప్రయత్నించవద్దు. ప్రతివారు తప్పక అది చేయవలెను. దానిని దేవుడు చేయుటకు మార్గము అది ఒక్కటే.
33ఇప్పుడు గమనించండి, ఆ వాక్యము ధృవీకరించబడుట కొరకు విశ్వాసులు ఎదురు చూచుచున్నారు. చూడండి, అది మానవుని ద్వారా వ్రాయబడలేదు, కాని ప్రభువగు దేవుని ద్వారా వ్రాయబడెను, కాబట్టి అది మానవ గ్రంథము కాదు.
ఎవరో ఈలాగనిరి, "అది ఒక పురాతన హెబ్రీ వ్రాతప్రతి. హెబ్రీయులు తమ్మునుతాము ఖండించుకొను ఉత్తరమును వ్రాసికొందురా ఏమిటి? యూదుల యొక్క ఆ చక్కని దేశము, ఆత్మ నిబ్బరత, మొరుగుదిద్దుకొనినవారు తమ స్వంత దోషములను, తమ్మునుతాము ఖండించుకొనుచూ వ్రాసికొందురా? నిశ్చయంగా వ్రాసికొనరు. తమ స్వంత పాపములు, తాము ఎటు విగ్రహారాధనలోనికి వెళ్ళిరో, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఎటు జారత్వము జరిగించిరో వ్రాసికొందురా? వ్రాసికొనరు. ఆ గర్వము గల రాజ్యస్ధులు, ఎన్నడునూ ఆ విధముగా చెప్పియుండరు.
అది మానవ గ్రంథము కాదు. అది దేవుని గ్రంథము. దర్శనములు చూచుచూ లేక దేవుని స్వరమును వినుచున్న మనిషి తనలో తాను దాని భావమును గ్రహించకపోవుట చాలా సందర్భములలో (చాలా సార్లు) జరుగును, చూచారా. మానవుడు పరిశుద్ధ గ్రంథము వ్రాయలేదు. దేవుడు పరిశుద్ధ గ్రంథమును వ్రాసెను. అది మానవ గ్రంథము కాదు; అది దేవుని గ్రంథము. మానవ పెదవుల ద్వారా దేవుని ఆలోచనలు వ్యక్తపరచబడినవి. ఆలాగే పరిశుద్ద గ్రంథము తయారయినది. వ్యక్తపరచబడిన ఆలోచనయే వాక్యము. ఆదియందు దేవుని ఆలోచన యుండెను. దానిని ఆయన తన ప్రవక్తల పెదవుల ద్వారా వ్యక్తపరచెను. తన దాసుల ద్వారా దానిని దృఢపరచెను, చూచారా. గమనించండి.
34దేవుడు ముందు నిర్ణయము ద్వారా తన స్వంత ఏర్పాటు చేయును. ప్రతి కాలమునకు ప్రవక్తలను ఎన్నుకొనెను. దానిని గమనించండి. ఆ కాలమునకు తగునట్లుగా ఆయన ఆ ప్రవక్త యొక్క స్వభావమును అమర్చును. చూడండి, అతని విధానమును, ఏది చేయునో ఆ ప్రతిదానిని ఆయన అమర్చును. అతడు విద్య కలిగియుండవలెనో లేదో ఆయన నిర్ణయించును. వరములను ఆయన ఇచ్చును. ఏ విధముగా బోధించునో, ఎట్టి వరములు కలిగియుండునో ఆయన ఏర్పరచును. ఆ ప్రత్యేక కాలమునకు వర్తమానము, ఒక ప్రత్యేకమైనది ఆ కాలములో జరుగుటను ఆయన నిర్ణయించును. దాని స్థానమును మరొకటి ఆక్రమించలేదు. ఎన్ని మానవ-నిర్మిత ప్రగతులు బయలు వెళ్ళినా గాని ఏదియూ దాని చోటును ఆక్రమించలేదు. ఒక తెలివిలేనివానిగా దేవుడు అతనిని ముందుగానే నిర్ణయించియుండవచ్చును. మరొక రీతి వ్యక్తిగా ఆయన అతనిని ముందే నిర్ణయించియుండవచ్చును. అతడేలాగున్ననూ, అతనికి తన పాఠము ఇచ్చును. అతని వరములు, అతని స్వభావము, అతని విధానము, అతడేమైయున్నాడో ఆ సమస్తమును, అతడేమిచేయునో అదంతయూ ఆయనే అనుగ్రహించును. ఆ ఘడియలోని మనుష్యులను పట్టుకొనుటకు ఆ ఘడియ మనిషిగా ఆయన తయారుచేయును. అది నిజము. అది ఆయన చేయును.
ప్రతి యుగాంతమున, సంఘము, లోకము మరియు పాపమువైపు తిరిగినప్పుడు, వాక్యమునకు మానవుడిచ్చిన అనువాదము మీద ఆధారపడినప్పుడు అది ఒక గందరగోళముగా తయారగును. తమ వేదాంత పండితులు మరియు యాజకుల ద్వారా అట్టి గందరగోళము ప్రతి యుగాంతమున తయారగుట పరిపాటి అయినది. ఎల్లప్పుడును వారి అనువాదము తప్పు. ఏదో ఒక్కసారి తప్పు అగుట కాదు గాని, ఎల్లవేళలా తప్పుగానే ఉండును. దేవుని వాక్యము తప్పిపోవుట ఏ ఒక్కసారియు జరుగదు. అదియే భేదము.
EXOD 4:11•
JER 1:9
35ఇప్పుడు మీరు చూడండి, దేవుడు తానే పరిశుద్ధ గ్రంథమును వ్రాసెను. దేవుడు మాట్లాడగలడు. ఆయన మాట్లాడెనని మోషే చెప్పెను, "ఆయన నా నోటిలో మాటలుంచెను" అని యిర్మియా చెప్పెను. దేవుడు వ్రాయగలడు, ఆయన తన స్వంత వ్రేలితో పది ఆజ్ఞలను వ్రాసెను. బబులోను గోడల మీద ఆయన వ్రాసెను. గుర్తుంచుకొనండి, ఒక్క పాత నిబంధనలోనే "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" అని ప్రవక్త రెండువేల సార్లు పలికెను. దేవుడు మాట్లాడగలడు, దేవుడు వ్రాయగలడు. నిశ్చయంగా. మత్తయి, మార్కు, లూకా మరియు యోహానునందలి దాదాపు నూటికి తొంబది మాటలు దేవుడు పలికిన మాటలే. యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడకలిగినప్పుడు, దేవుడు వ్రాయకలిగినప్పుడు, దేవుడు చదువకలిగినప్పుడు, ఆయన ఇతరులను కూడా ఆలాగు చేయలేడా? మోషెకు ఆయన ఈలాగు చెప్పలేదా? "మానవులను మూగవారినిగా చేయువాడెవడు? లేదా వారికి మాటలు ఇచ్చువాడెవడు?" ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథమును వ్రాసెను. అది ఆయన పనిచేయు విధానము.
MARK 16:20•
JOHN 1:11,12
36సంఘము కలగలుపయిన ప్రతి సమయమునందును (వారు ఆ విధముగా కలగలుపవ్వుతారు అని ఆయన ముందుగానే ఎరిగియుండెను. ఆయన అన్నిటిని ఎరిగినవాడైయుండెను), దేవుడు ఆ కాలమునకు తన ప్రత్యేక ప్రవక్తను సిద్ధపరచి, సూచనలు, మహత్కార్యముల ద్వారా తన వాక్యమును బయలుపరచి తాను ఏర్పరచుకొనినవారిని పిలచును. ఆయన వాక్యమును స్థిరపరచును, "జరుగుచు వచ్చిన సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరచుచుండెను." ఆయన వాగ్దానము అది. ప్రవక్త తన్ను బయలుపరచుకొనిన పిదప ఆయన తన నిజ అనువాదమును ఇచ్చును.
అతడు ఎవరియొద్దకు పంపబడెనో, ఆ ఏర్పరచబడినవారు తప్ప తక్కిన వారందరును అతనిని ద్వేషించుదురు. ప్రతి సందర్భమును ఇప్పుడు గమనించండి. అది సరియో, కాదో చూడండి. ఆయన ఎవరికొరకు అతనిని పంపెనో వారు మాత్రమే! "ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు. కాని ఎందరయితే ఆయనను చేర్చుకొనిరో వారందురునూ దేవుని కుమారులగునట్లుగా ఆయన అధికారము అనుగ్రహించెను." గమనించండి, ప్రతి సందర్భములోను వాక్యమును పరీక్షించినప్పుడు, ప్రతి యుగాంతమందును, లేదా చివరి దశయందును, లేదా కూడలియందును, నేను చాలాసార్లు బోధించినట్లుగానే జరుగుచుండును.
GEN 19:16,26
37నోవహు కాలమును చూడండి, తీర్పు ముందున్న ఆఖరి దశ. ఏమి జరిగినది? నోవహు, అతని కుటుంబము మాత్రమే ఆయనను నమ్మెను. తక్కిన వారందరూ అతనిని విమర్శించిరి. మరియు సర్వ ప్రపంచమూ నాశనమయినది.
అబ్రహాము దినములలో, అబ్రహాము గుంపు మాత్రమే నమ్మెను. దేవదూతలు వెళ్ళి సొదొమలో బోధించినప్పుడు లోతు, అతని భార్య ఇద్దరు కుమార్తెలు మాత్రమే బయటకు వచ్చిరి. ఆమె వెనుకకు చూచి ఉప్పు స్తంభమాయెను.
మోషే దినములలో ఇశ్రాయేలులో ఎన్నుకొనబడినవారు మాత్రమే బయటకు వచ్చిరి. ఫరో అతనిని ద్వేషించెను.
ఏలియా దినములలో (దాదాపుగా) అందరునూ, ఏడు వేలమంది తప్ప మొత్తము దేశమంతయూ అతనిని ద్వేషించెను.
యిర్మియా దినములలో, వారు ఎందుకు పండని ఫలములను అతని మీదికి విసిరిరి, మరియు అతనిని ఉన్మాది అని పలికిరి. ఎందుకనగా అతడు అనేక దినముల పాటు ఒక ప్రక్కన పరుండెను. కొన్ని పనులు చేసి సూచనలుగా చూపించెను. వారతనిని ద్వేషించిరి.
ప్రవక్తయగు యెషయా ఆ జాతిని ఎంతగానో ఖండించెను. చివరకు అతనిని వారు రంపముతో రెండు ముక్కలుగా కోసిరి. నిజము.
38బాప్తిస్మమిచ్చుచు యోహాను. "అతడు అడవి మనిషిగా అచ్చటుండెను. ఏదో కేకలువేయు జంతువుగా ఉండెను.'' యేసుక్రీస్తునకు సంఘముగా నిలబడిన ఆ శిష్యులు తప్ప మిగిలినవారందరూ ద్వేషించిరి! "ఆయన అక్కడ నిలబడియున్నాడు అని యోహాను ప్రజలను సిద్ధపరచెను. అతడెందరిని జయించెను? మీరు మీ రెండు చేతుల వ్రేళ్ళపైన లెక్కింప వచ్చును. యోహాను ఎంతమందికి యేసు వచ్చినప్పుడు ఆయనను చూపించకలిగెను? ఇప్పుడు, ఆయన రెండవ రాకడ మాట ఏమిటి? దానిగూర్చి ఆలోచించుము.
ఆ కాలము యొక్క వాక్యము అంత తేటగా బయలుపరచబడుట నిజము, విశ్వాసులు చూచినప్పుడు నమ్ముదురు. దానినుండి వారు దూరమగు మార్గము లేదు. దానిని నమ్ముదురు. తమ సాక్ష్యమును తమ రక్తముతో సహితము వారు ముద్రించుదురు. దానిని వారు నమ్ముదురు. అప్పుడది వారిదగును. ముందుగా నిర్ణయించబడినవారు, ఆ ప్రత్యేక కాలమునకు చెందినదానిని వారు చూచి నమ్మెదరు.
39ఇతరులు దానిని చూడలేరు; వారు గ్రుడ్డివారు. "వారు చూడలేరు" అని ఇప్పుడు నీవు చెప్పెదవు. బిలామువలెనె, బిలాము దానిని ఎందుకు చూడలేకపోయెను? అతడు అభిషేకించబడిన ప్రవక్త. ఫరో దానిని ఎందుకు చూడలేకపోయెను? దేవుని హస్తము దిగివచ్చి అద్భుత కార్యములు జరిగించుట చూచినప్పుడు అతని హృదయము కఠినపరచుకొనెను. అది నిజమేనా? యూదుడైయుండిన దాతాను ఎందుకు చూడలేకపోయెను? అతడు మృత సముద్రము గుండా వచ్చెను. ప్రతి రాత్రి తాజాగా కురిసిన మన్నాను భుజించెను. అయినా దానిని చుడలేకపోయెను. కోరహు దానిని ఎందుకు చూడలేదు. కయప ఎందుకని అది చుడలేకపోయెను. ఆ కాలములో అతడు ప్రపంచములోని అగ్ర మతమునకు అధిపతి. ఆయనే మెస్సీయా అని ఎందుకు చూడలేకపోయెను? యూదా ఎందుకు దానిని చూడలేకపోయెను? యూదా వారితోనే ఉండి, వారితోనే నడిచి, వారితోనే అద్భుత కార్యములు చేయుచుండెను. కాని వాక్యము నెరవేరవలసియున్నది. ఆ స్థానమును తీసికొనుటకే అతడు జన్నించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆ ఉద్దేశ్యము కొరకే వారు లేపబడిరి. అది నిజము. రోమా 8 ఆలాగు చెప్పుచున్నది.
1KGS 17:13•
1KGS 19:18
40ఇప్పుడు, తమ తరములో వాక్యము శరీరధారియగుటను దేవుడు మాట్లాడుచున్నప్పుడు విశ్వాసులు చూడగలరు. వారు నిజవిశ్వాసులు. ఆ ఏడువేల మంది లేక ఏలియా దినములలో ఉన్నవారు ఏడు వందలమందా? ఏడు వేలమందియే సరి. ఏలియా దినములలో దాదాపు రెండు మూడు మిలియనుల మందిలో ఏడు వేలమంది మాత్రమే అది నిజమని చూడకలిగిరి. వందో వంతుకూడా లేరు. కాని వారే అది నిజమని చూచిరి. దేవుడు ప్రత్యక్షపరచబడుట వారు చూచిరి. ఆ వృద్దురాలైన విధవరాలి యొద్దకు ఏలియా పంపబడెను. ఆమె కట్టెలు ఏరుకొని అప్పము చేసికొనుటకు బయలుదేరెను. ఒక్క అప్పము చేయుటకు మాత్రమే పిండి యుండెను. తనకు, తన కుమారునికి చేసికొని ఇక చనిపోదుమనుకొనెను. కాని ఏలియా చెప్పినది గమనించండి; "మొదటగా నాకు ఒకటి చేసికొని రమ్ము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 'భూమి మీదకు యెహోవా వర్షము పంపు వరకు బుడ్డిలో నూనె అయిపోదు, కుండలో పిండి తరిగిపోదు.'" ఏ ప్రశ్న లేదు. వెంటనే ఆమె వెళ్ళి అప్పము చేసి అతనికి ఇచ్చెను! "మొదట నాకు ఒకటి తయారుచేసి తెమ్ము, అప్పుడు వెళ్ళి నీ కొరకు, నీ కుమారుని కొరకు తయారు చేసికొనుము." ఆమె అతని మాట విని అతనివైపు చూచినది. ఎందుకనగా ఆమె ముందు నిర్ణయించబడిన విత్తనము.
1KGS 18:17
41చాలామంది ఈలాగనియుండవచ్చును, "అదిగో ఆ ముసలి పిచ్చివాడు మరల వచ్చుచున్నాడు. ఇతనిని బట్టియే దేవుడు మనలను శపించెను. ఏలియా, మరువవద్దు. ఇశ్రాయేలును శ్రమపరచువాడవు నీవే."
"ఇశ్రాయేలును శ్రమపెట్టువాడవు నీవే" అని పలికెను. దేవుడెవరో, ఎవరి వాక్యమును అతడు బయలుపరచుచున్నాడో చూడండి? ఆయన స్వంత వాక్యమునే.
వారు ఈ ఉద్దేశ్యము కొరకే లేపబడిరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, కాని ఎప్పుడైతే…. అవిశ్వాసి. కాని నిజమగు విశ్వాసి ఆ కాలము యొక్క వాక్యము శరీరధారియగుట, మానవ పెదవుల ద్వారా మాట్లాడుట, ఆయన చేయుదునని చెప్పిన క్రియలు చేయుట చూచినప్పుడు స్థిరచితుడగును, అది దానిని స్థిరపరచును.
1KGS 22:11•
2CH 18:10•
MATT 24:24•
MARK 13:22
42తక్కినదంతయూ గమనించండి. సూచక క్రియలను గమనించవద్దు. మీరు సూచక క్రియలను గమనించినచో, లోకము ఎంత ఖచ్చితముగా యున్నదో, అంతే ఖచ్చితముగా మోసపుచ్చబడుదురు. అబద్ద ప్రవక్తలు లేచి అద్భుతములు, సూచక క్రియలు చూపించి సాధ్యమైనచో ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చుదురు. వాక్యమును గమనించండి. ఈ యాజకులు, ఈ ప్రవక్తల వైపు చూడండి. హెబ్రీ ప్రవక్త అక్కడ నిలబడియున్నాడు. సిద్కియా రెండు పెద్ద కొమ్ములు పట్టుకొని "నేను దేవుని వలన అభిషేకము పొందిన ప్రవక్తను" అని చెప్పెను. అది నిజము. "నాతో పాటు ఇక్కడ మూడువందల తొంబది తొమ్మిదిమంది యున్నారు. మా మీద పరిశుద్దాత్మయున్నది. ఆ భూమి మనది అని చెప్పి ధృడపరచుచున్నది. మనము వెళ్ళి దానిని తీసికొందము. ఆహాబూ, ఈ కొమ్ముల ద్వారా శత్రువును మన భూభాగాము నుండి తరిమి వేయుదువు, ఏలయనగా దీనిని దేవుడు మనకు ఇచ్చెను."
1KGS 22:7,8,13-15,17•
2CH 18:6,7,12-14,16
43కాని భక్తిగల, సజ్జనుడగు ఆ యెహోషాపాతును గమనించండి, "ఇంకా ఒక్కరెవరైనా యున్నారా?" అని ప్రశ్నించెను.
"ఇంకొకరా? విభేదము లేని నాలుగు వందలమంది యున్నారు." "అవును. ఇక్కడ ఇంకొకడున్నాడు గాని, అతనంటే నాకు అసహ్యము." "అతడెప్పుడునూ మాకు విరోధముగా మాట్లాడి, మేము గొప్ప పాపులమనియు, ఇంకేదో చెప్పును." "అతనంటే నాకు అసహ్యము! అతడే ఇమర్గా కుమారుడగు మీకాయా" అని చెప్పెను.
"ఓ, రాజు ఆలాగు పలుకవద్దు. వెళ్ళి అతనిని తీసికొనిరండి. అతడేమి చెప్పునో విందాము" అనెను.
కనుక వారతనిని తీసికొనివచ్చిరి. "ఈ రాత్రి నాకు సెలవియ్యుడి దానిగూర్చి యెహోవా ఏమి చెప్పునో చూచెదను" అని పలికెను.
"నీవు సత్యము తప్ప మరేమియూ పలుకరాదని నీకు ఆనబెట్టి చెప్పుచున్నాను" అని ఆహాబు పలికెను.
ఒకడు వచ్చి ఇట్లనెను, "ఇప్పుడు, నీవు వూతో మంచి సహవాసము చేయగోరినచో, వారందరు చెప్పినట్లే చెప్పవలెను సుమా."
మరుసటి ఉదయము వారు వచ్చిరి. రాజులు తమ అంగీలు ధరించిరి. గుమ్మమునొద్ద కూర్చొనిరి. అంతా కోలాహలముగా యున్నది. ప్రవక్తలు అచ్చట నిలబడి యుండిరి. "వెర్రివాడా, దానిగూర్చి ఇప్పుడు, నీవేమి చెప్పెదవు?" అనడిగిరి.
"వారి మీదికి పోవుడి. కాని ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల మందవలె చెదరియుండుట నాకు కనబడుచున్నది" అనెను.
1KGS 22:24•
2CH 18:23
44అప్పుడు సిద్కియా తన పిడికిలితో మీకాయా యొక్క నోటిమీద గుద్దెను. ప్రవక్త ప్రవక్తను నోటి మీద కొట్టెను. వారిద్దరూ అభిషేకము పొందిన ప్రవక్తలే. అక్కడ నిలబడి ప్రవచించుచున్నారు. ఒకనికి విరోధముగా నాలుగు వందలమంది లేచిరి. చాలా బలముగా కనబడిరి. ఎక్కువమంది యొక్క ఆలోచనలో ఎల్లప్పుడూ క్షేమము ఉండదు. వారు దేనిగూర్చి ఆలోచన చేయుచున్నారో, వారి ఆలోచన ఏమిటో దానిమీద అది ఆధారపడియుండును. రాజుకు అక్కడ క్షేమము లేదు. ఆ ఎక్కువమంది యొక్క ఆలోచన సరియైనదని రాజు స్వీకరించెను. కాని అతడు ఆగి వెనక్కు వెళ్ళి ఆ వ్రాయబడిన చుట్టను తెరచి ఏలియా ఏమి చెప్పెనో చూచినచో ఎంత బాగుండెడిది.
1KGS 21:19•
1KGS 22:19-21•
2CH 18:18-20
45మీకాయా అప్పుడు, ఏమియూ చెప్పలేడు. అతనికేమియూ తెలియదు. దానినిబట్టి దేవుడతనిని క్షమించును గాక! కాని మొదట, ప్రవక్తగా ఉండిన అతడు దేవుడేమి చెప్పునో కనుగొనుటకు దేవుని యొద్దకు వెళ్ళెను. దేవుడు చెప్పిన దానిని అతడు కనుగొనెను. "దేవుడు తన సింహాసనము మీద కూర్చొనియుండుటయు, పరలోకపు ఆయన సభికులందరూ ఆయన చుట్టూ చేరియుండుటయు నాకు కనబడెను. ఆహాబును గూర్చి చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడునట్లుగా ఎవరిని మనము ఆహాబు యొద్దకు పంపుదము అని చెప్పుకొనుచుండిరి."
చూడండి, ఏలియా ఎప్పుడో ఆహాబు దగ్గర "కుక్కలు నీ రక్తము నాకును" అని ప్రవచనము చెప్పెను.
అప్పుడు మీకాయా ఇంకా చెప్పెను, "ఒక అబద్దము పలుకు ఆత్మ ఆయన ఎదుటనుండి పంపబడినది, ఆహాబు యొక్క ప్రవక్తల యొద్దకు వెళ్ళి వారు అబద్దమును ప్రవచించునట్లుగా చేతును అని అది చెప్పెను."
1KGS 22:22,27,28•
2CH 18:21,26,27•
JOHN 10:5,27
46ఇప్పుడు, మానవులు తమ వేదాంత పరిజ్ఞానముతో నిండిపోయి, గర్వముతో, తాము చెప్పునది ప్రతిది సరియేనని తలంచుచుండిరి అని దేవుడు తెలిసికొనియుండెను. ఆ ఘడియకు చెందిన వాక్యమును వారెన్నడూ గమనించలేదు. కనుక దేవుడీలాగు చెప్పెను, ఆ ఆత్మతో "నీవు జయము పొందెదవు - వెళ్ళమనెను." మీకాయా, దానిని ఎత్తి చెప్పగా, వారు అపవిత్రాత్మ వలన దీర్ఘదర్శనము ప్రవచించారు అని రుజువవ్వుచున్నది. టెలిఫోను సంబంధము త్రెంచినట్లే, రేడియోను ఆపినట్లే, వారు అతని మాట వినకుండా నడిచిపోయిరి, ఎందుకనగా అది వారికి విరోధముగా వచ్చుచున్నది. అయితే ఏమి జరిగినదో చూడండి. మీకాయా తాను పొందిన దర్శనమును వ్రాయబడిన వార్తతో సరిచూడవలసినదైనది, అందువలన అతడు నిజమును తెలుసుకొనెను.
"ఆతనిని చెరసాలలో వేయుడి. దుఃఖమునే అన్నపానములుగా ఇయ్యడి. నేను తిరిగి వచ్చునప్పుడు అతని సంగతి చూచెదను" అని ఆహాబు చెప్పెను.
"నీవు తిరిగి వచ్చినచో, దేవుడే నాతో మాట్లాడలేదని తెలిసికొనుము" అని అతడు పలికెను. అతని యొక్క దర్శనము ఆ ఘడియ యొక్క ప్రతి మాటతోను సరిగ్గా సరిపోయియుండెనని అతనికి తెలియును. అది ఆహాబు కాలముగా యున్నది.
సోదరీ, సోదరుడా, బబులోను నుండి బయటకు పిలచుచున్న ఘడియ మరియు కాలము ఇదే. సాయంత్రపు వెలుగులు ఇచ్చటున్నవి. వెలుగున్నప్పుడే వెలుగులో నడుచుటకు రమ్ము గమనించండి. వాక్యము బయలుపరచబడుటను విశ్వాసులు చూచిరి, దానిని నమ్మిరి. "నా గొర్రెలు నా స్వరము వినును, నా మాట వినును, కాలము యొక్క నా సూచనలు ఎరుగును, అబద్ధికుని అవి వెంబడించవు" అని యేసు చెప్పెను.
ISA 40:3•
MAL 3:1•
JOHN 1:19,20,23
47ఇప్పుడు మన అంశముయొద్దకు వెళ్ళుదము, ఎందుకనగా నేను దూరముగా వెళ్ళిపోవుచున్నానని గ్రహించాను. ఎక్కువగా ఆ ప్రార్ధన వరుసను గూర్చినొక్కి చెప్పగోరుచున్నాను. మనము ఆలోచన చేయుటకు ఎన్నుకొనిన ఆ అంశము యొద్దకు తిరిగి ఒక్క నిమిషము పాటు వెళ్ళుదము. ఎల్లప్పుడూ, మామూలుగా అది జరిగినట్లుగానే అది మరల జరుగును.
ఆయన వాక్యము చెప్పినట్లుగా, దేవుడు తన ప్రవక్తయగు యోహానును పంపెను. మలాకీ 3లో వాగ్దానము చేసెను, "ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను నా వర్తమానికుని పంపుదును." యోహాను అదే సంగతిని సాక్ష్యమిచ్చెను. యెషయా 40:3లో యెషయా ఈలాగు చెప్పుట మనము కనుగొందుము, "అరణ్యములో కేకవేయు ఒక ప్రవక్త స్వరము, యోహోవా మార్గము సరాళము చేయుడి అని వినబడుచున్నది." అవన్నియూ ప్రవచనములే! చూడండి, త్వరగా గమనించండి, వాక్యము ఆయనను గుర్తించినది.
"నీవెవరవు? నీవు మెస్సీయావా?" అని వారడిగిరి.
"నేను కాను" అని చెప్పెను.
"నేను వారిలో ఎవరిని కాదు గాని, యెషయా ద్వారా పలుకబడినట్లు అరణ్యములో కేకవేయు స్వరమునైయున్నాను" అని చెప్పెను.
అది వారు నమ్మిరని మీరు తలంచుచున్నారా? లేదండీ! ఎందువలన? ఆయన వారి సంఘము ద్వారా రాలేదు. ఆయన వారి వాడు కాదు… చూడండి, ఆయన తొమ్మిది సంవత్సరముల వయస్సులో అరణ్యములోనికి వెళ్ళెను. ముప్పది ఏండ్ల వయస్సులో బయటకు వచ్చెను. ఆయన వర్తమానము ఆ వేదాంత పాఠశాలలోనికి చొచ్చుకొనిపోలేనంత గొప్పగా యుండెను. మెస్సీయాను పరిచయము చేయువాడు ఆయనే. ప్రతివారును అటు ఇటు చెదరిపోవుచున్నారు. తన తండ్రియగు జెకర్యా మృతిపొందిన పిదప, దేవుడతనిని అరణ్యములోనికి పంపెను. అసలు ఆయన యాజకుడు, కాని ఎన్నడునూ తన తండ్రి క్రమమును ఆయన వెంబడించలేదు.
ఎందుకనగా ప్రవక్తలు అటువంటి వాని ద్వారా రారు. వారు కరకు స్థలములకు అరణ్యము నుండి వచ్చెదరు. వారెక్కడనుండి వచ్చిరో, రంగము మీదికి ఎటు ప్రవేశించిరో, లేదా వారి చరిత్ర ఏమిటో ఎవరునూ ఎన్నడూ ఎరుగరు. వారు హఠాత్తుగా వచ్చిన వాక్యమును బోధించిన పిదప దేవుడు వారిని తీసికొనును, వారు వెళ్ళిపోవుదురు; ఆ తరమును ఖండించుదురు, ఆయన వాక్యములోనికి కదిలి వెళ్ళి ఆ గొప్ప దినము కొరకు ఎదురు చూచెదరు.
1KGS 19:2•
ISA 40:3•
MAL 3:1•
MAL 4:5
48సంఘము అతనిని నమ్మదు, ఎందుకనగా అతడు వారికి తెలియడు. అతని అభిషేకము యొక్క రికార్డు వారి గ్రంథములలోలేదు, కనుక అతనిని వారు తిరస్కరించిరి. చూడండి, వారు దేవుడు తేటగా, అక్షరము వెంబడి అక్షరమువలె బయలుపరచిన దైవ వాక్యమును నమ్మరు. చూచారా? మలాకీ 3, ఆయనను బయలుపరచుటకు రెండు వాక్యములు. మలాకీ 3 మరియు యెషయా 40:3 చూడండి. ఆ రెండు వచనములను ఒకని రాకను గూర్చియు, ప్రభువు యొక్క త్రోవ సిద్ధపరచుటను గూర్చియు చెప్పినవి. ఆయన దానియొక్క ప్రతి సూచనను నెరవేర్చెను.
ఆయన ప్రవక్త ఉండవలసియున్నాడు. "నేను ఎలీషాను మీకు పంపించుదును." అతడచ్చట ఉండెను, చాలా కరుకు మార్గము. అతని స్వభావము ఏలియాతో ఎట్లు సరిపడినదో గమనించండి." ఏలియా అరణ్యపు మనిషి, ఆలాగే యోహాను బయట జీవించెను. అతడు సుతిమెత్తని మనిషి కాడు; అతడు మొరటు వ్యక్తి.
మరల గమనించండి, ఏలియా స్త్రీ ద్వేషకుడు; అతడు యెజెబెలు రంగులు పులుముకొనుటను ఎత్తి చూపి, ఎటు తప్పిపోయెనో చూపించెను. ఆలాగే యోహాను, యెజెబెలు ఏలియాను చంపుటకు ప్రయత్నించి, అతని తల నరికి వేయుదునని దేవతల పేరట ప్రమాణము చేసెను. ఆలాగే హేరోదియ చేసెను, చూచారా.
వారి వర్తమానమును ఎప్పుడూ గమనించండి, వారేమి చేసిరో చూడండి. ఆ జనులు వెనుకకు తిరిగి బైబిలు చెప్పినది చూచి, అతని స్వభావమును గమనించి, దేవుని వాక్యముతో ఎంత సమయోచితముగా అతడు సరిపోయెనో పరీక్షించినచో అతనిని వారు తెలిసికొనియుండేవారు. సుమారు అరడజను మంది మాత్రమే అది ఎరిగియుండిరి. అది నిజము. అరడజను కంటే ఎక్కువ మంది అది ఎరుగలేదు. వారతని మాటలు వినుటకు వెళ్ళిరి, కాని వారు దానిని నమ్మలేదు, చూచారా. ఎందుకని? వారి ఘడియలోనున్న ప్రవచనము యొక్క గుర్తింపును వారు నమ్మలేదు.
49గమనించండి, వారతని చూచి నవ్విరి. "కేకలువేయు, విద్యలేని ఒక అడవి మనిషి మాటలాడు తీరు తెలియదు" అని వారతనిని పిలిచిరి. యధావిధిగానే వారు అతని యొక్క విద్య ద్వారా అతనిని పరీక్షించిరి. అతని యొక్క వ్యాకరణము ద్వారా అతనిని తీర్పు చేసిరి. అతని వస్త్రధారణ మూలముగా అతనిని తీర్పుచేసిరి. అతడు ఒక గొర్రె చర్మము చుట్టుకొనెను. ఒక ఒంటె చర్మపుదట్టీ ధరించెను. రోమములతో నిండి యుండెను. నీళ్ళలో నడచుచుండెను; సంఘము లేదు, బల్లల వరుసలు లేవు, సహకారము లేదు. వారది అంగీకరించలేకపోయిరి. వారు లోక దేవతను పూజించుచుండిరి, చూచారా.
యన్నె మరియు యంబ్రెలవలె బయలుదేరిన అబద్ధ ప్రవక్తలు ఉండరని నేను చెప్పుట లేదు. కాని నీవు వాక్యము ద్వారా వర్తమానమును పరీక్షించి తెలిసికొనుటయే మార్గము. అది ఏ కాలమో, ఆ కాలమునకు ప్రవచనము ఏమిటో తెలిసికొనవలెను.
MATT 3:11,12•
LUKE 3:16,17
50దేవుని యొక్క స్వంత క్రమములోనే యోహాను యొక్క ప్రవచనము బయలుపరచబడెను. ఎంత ఖచ్చితముగా నున్నదో గమనించండి. పరిశుద్ధ గ్రంథము ఈలాగు చెప్పెను, "యెహోవా యొక్క వాక్కు ప్రవక్తల యొద్దకు వచ్చును." యేసే వాక్యము. రాబోవుచున్న వాక్యము యొక్క నెరవేర్పుకొరకు యోహాను ప్రవచించుచుండెను. వాక్యమగు యేసు నీటిలోనున్న ప్రవక్త యొద్దకు వచ్చెను. ఓ! ఎంత రమ్యము! ఎంత చక్కగానున్నదో చూడండి. ఆ దినమున వాక్యము వచ్చుట అరుదు. ఇక్కడ ప్రవక్త వచ్చి, "నేనే వాక్యము యొక్క స్వరమును" అని చెప్పుచున్నాడు.
"అయితే మేమేమి చేయవలెను?" అని వారనిరి.
"నేనాయన చెప్పులవారు విప్పుటకైనా యోగ్యుడను కాను. కాని ఎక్కడో ఒకాయన మీ మధ్యనే నిలబడియున్నాడు. మీకు పరిశుద్దాత్మతోను, అగ్నితోను బాప్తిస్మమిచ్చువాడు ఆయనే. ఆయన చేట ఆయన చేతిలో యున్నది. ఆయన కళ్ళమును బాగుగా తూర్పారపట్టించి పొట్టును ఆరని అగ్నిలో వేయును. గింజలను కొట్లలోనికి కొనిపోవును" అని చెప్పెను. ఓ! ఎటువంటి ప్రవక్త ఆ దినము వరకు అంత గొప్పవాడు స్త్రీలు కనినవారిలో లేడు అని యేసు చెప్పెను. ఓ, ఎంత గంభీరము! తానెక్కడ నిలబడియున్నాడో ఎంతగా అతనికి తెలియును! ఖచ్చితంగా అతడెరుగును. అతడు దేవుని మాట వినెను. అది వాక్యముతో సరిగ్గా సరిపోయెను, కనుక ప్రజలు ఏమి చెప్పినా లెక్క చేయలేదు. ఏమయినా గాని అతడు దానిని బోధించెను, మరియు ప్రవచించెను. గమనించండి, ఒక సత్యము కొరకు మనిషి నిలబడినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి సత్యము బయలుపరచుటకు దేవుడు బాధ్యతతో ముందుకు వచ్చెను.
EXOD 3:2,3,14•
EXOD 8:24•
EXOD 10:22
51మోషే ఐగుప్తులోనికి వచ్చి ఈలాగు చెప్పెను, "నేను ఆవల అరణ్యములో యున్నాను. ఒక చెట్టు మీద అగ్నిని చూచాను, అయితే అది కాలిపోలేదు. నేను ఆ చెట్టు యొద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక అగ్నిస్తంభము వ్రేలాడుట కనబడినది. 'ఉన్నవాడను అనువాడను నేనే' అని ఒక స్వరము పలికినది. ఆ కర్రను తీసికొని ఇక్కడికి వచ్చి అద్భుతములు జరిగించమనియు, దేవుడు వాక్యమును బయలుపరచుననియు ఆయన చెప్పెను." అతను తన కర్రను చాచగా అక్కడికి ఈగలు, కందిరీగలు, చీకటి మొదలగునవి వచ్చెను. ప్రవక్తకు దానిని బయలుపరచుటకు, ఆ విశ్వాసులను ఆయన కొండ మీదికి తీసికొనివచ్చెను. అదే కొండ మీదికి, అదే అగ్ని స్తంభములో దేవుడు దిగి వచ్చెను. మరియు అది నిజమని రుజువుపరచెను.
ఈ దినమున ఆయన ఏమి చేసెనో ఇప్పుడు చూడండి. ఆలాగే చేసెను.
52వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చి, అతడు నిజవ్యక్తియని బయలుపరచును. వాక్యములో చెప్పబడినవాడితడే అని ఖచ్చితంగా బయలుపరచును. ఇప్పుడు త్వరగా చూద్దాం. ప్రవచనమునకు వారి మానవ కల్పిత అనువాదమునకు వేరుగా యేసు వచ్చెను. అదెట్లుండునో మానవుడు అనువాదము చేసి చెప్పెను. నిశ్చయంగా, అది తామే అయియుందుమని ప్రెస్బిటేరియనులు తలంచిరి. గమనించండి. దేవుడు ఒకటి చేయుచున్నప్పుడు ప్రతి సంస్థయు లేచి ఒకటి చేయుచుండును. అవును, అవును. ఎల్లప్పుడూ ఆలాగే జరుగుచుండును. ప్రతిచోటను యన్నె యంబ్రేలుందురు. గమనించండి. వారు వాక్యములో భాగము మాత్రమే చెప్పిరి. కాని, ప్రతి అక్షరము ప్రవక్త యొక్క వాక్య ప్రకారమే ఉండును.
ISA 9:6•
MATT 23:9•
REV 3:17
53ఎప్పటివలెనె వారు దానిని తప్పిపోయిరి, జాతకములు (సోదె) చెప్పువాడు, ఒక దయ్యము, బయల్జెబూబు, తన్నుతానే దేవునిగా చేసికొనుచున్నాడు అని పలు రీతులుగా పలికిరి. ఆయన దేవుడని వారియొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారానే వారు తెలిసికొనియుండవలసినది. గమనించండి, ఆయన గూర్చి యొషయా ప్రవచించెను. యెషయా 9:6. "బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి" అని ఆయనకు పేరు పెట్టబడును. దాని తరువాత ఇక ఏ తండ్రులు ఉండరు, ఎందుకనగా ఆదియందు మొదటి తండ్రి ఆయనే. ఆయన మాత్రమే తండ్రి. "ఈ భూమి మీద ఎవరినీ తండ్రి అని పిలువ వద్దు" అనెను. ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆలోచన కర్త, సామాధానాధిపతి. నిశ్చయంగా!
ఇప్పుడు, వారేమి చేయుదురని ప్రవక్తలందరూ వ్రాసిరో అదే వారాయనకు చేసిరి. ఈ లవొదికయ సంఘములో వారు చేయుచున్నట్లుగానే ఆయనను సంఘము బయట ఉంచిరి. "గ్రుడ్డివారు, దిగంబరులు, కాని ఎరుగరు." ప్రవక్త చెప్పినది, బైబిలు ప్రవక్త పలికినది అదే. మానవ సాంప్రదాయముల ద్వారా అంధులయిరి. ఆయనను వెలుపట ఉంచిరి. వారి సంఘముల బయటకు వాక్యమును త్రోసివేసిరి, వారినిగూర్చి ప్రవచించబడినట్లుగానే యథావిధిగా వారు చేసిరి.
JOHN 10:35•
2PET 1:21
54ఇప్పుడు, త్వరగా గమనించండి. దీనిని మీరిప్పుడు తప్పిపోవద్దు. ఇక్కడ అంశమున్నది. తానే వారి మెస్సీయానని ఈ ఇద్దరు శిష్యులకు యేసు తన్నుతాను తెలియపరచుకొనెను చుడండి! ఇప్పుడు అందరి కండ్లు ఇటు చూడవలెను. బయట నున్నవారును దీనిని తప్పిపోవద్దు. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమనియు, దేవుడు తానే వ్రాసెననియు, మానవుని యొక్క పెదవులు, సాధనముల ద్వారా వ్రాసెననియు మేము చెప్పుటకు ప్రయత్నించాము. దేవుడు తానే వ్రాయగలడు. తనంత తాను దేవుడు మాట్లాడగలడు. తాను కోరినది దేవుడు చేయగలడు, కాని దానిని చేయుటకు ఆయన మనుష్యుని ఎన్నుకొనెను, ఎందుకనగా ఆ వ్రాసిన మనిషి దేవునిలో ఒక భాగమే. కనుక బైబిలును దేవుడే వ్రాసెను. వ్రాసిన వ్యక్తులు తమ మానవ ఆలోచనలో తాము వ్రాయుచున్నది ఏమిటో ఎరుగనే ఎరుగరు. వారు దానితో సమ్మతించకపోవచ్చును, కాని అది వ్రాసిరి. వ్రాయకుండా ఉండలేరు. బైబిలు ఈలాగు చెప్పెను, "ఆదిలోని (ఆ కాలపు) మానవులు పరిశుద్దాత్మచే కదిలించబడి వ్రాసిరి." దేవుడు వారి చేతులను కదిలించెను. దర్శనములలో వారి కండ్లను కదిలించెను. తాము చూచుచున్నది తప్ప మరేమియూ వారు చెప్పలేకపోయిరి. వారేమియూ పలుకలేకపోయిరి, ఎందుకనగా వారి నాలుక, వ్రేలు, ప్రతి శరీర భాగము మీదను ఆయన సంపూర్ణ నియంత్రణ కలిగయుండినందున — ఆ విధముగానే వారు కదిలిరి. వారు దేవుళ్ళని బైబిలు చెప్పుటలో ఆశ్చర్యము లేదు; వారు దేవునిలో ఒక భాగము. ఆయన దేవుని యొక్క సంపూర్ణత.
LUKE 24:18,19,25
55వాక్యమగు యేసు ఈ గుండెపగిలిన ఇద్దరు శిష్యులకు తానే వారి మెస్సీయానని, వాగ్దానము చేయబడిన వాక్యము మరియు మెస్సీయానని ఎట్లు తెలియపరచెనో గమనించండి. ఆయన చేసినది చూడండి: "అవివేకులారా, ప్రవక్తలు వ్రాసినవన్నియు నమ్మలేని మందమతులారా," అనెను. "దానిగూర్చి సంఘము ఏమి చెప్పుచున్నది?" అని ఆయన ఎన్నడూ అడుగలేదు.
వారాయనకు వృత్తాంతము చెప్పిరి. జరిగిన సంఘటనలన్నియూ వారెరుగుదురు. వారు దుఃఖముతో నిండియుండిరి. "నీవిక్కడికి క్రొత్తవాడవా, లేదా యెరూషలేములో జరిగిన సంగతులు నీవు ఎరుగవా?" అని వారు ఆయనను ప్రశ్నించనారంభించిరి.
"ఏ సంగతులు?" అని ఆయన తనకు తెలియనట్లుగా అడిగెను. చూడండి, మీరు దానిని గూర్చి ఏమి చేయుదురో చూచుటకు ఆయన కొన్నిసార్లు అటువంటి పనులు చేయుచుండెను. చూచారా? ఆయనీలాగు అడిగెను, "ఏ సంగతులు? ఎవరది? ఏమి జరిగినది?"
"నీవు క్రొత్త వ్యక్తివా?" మూడన్నర సంవత్సరముల పాటు వారితో జీవించిన ఆయనతోనే వారు మాట్లాడుచుండిరి గాని, ఆయనను ఎరుగకుండిరి.
"ఏ సంగతులు? ఏమి జరిగెను?"
"నజరేయుడగు యేసు అను ప్రవక్తను గూర్చిన సంగతులే వాక్యములోను, క్రియలోను ఆయన జనులందరి ఎదుట శక్తి కలిగియుండెననుటలో మాకు ఏ సందేహము మనస్సులో లేదు. ఈ కాలమునకు దేవుని యొక్క ప్రవక్తగా గుర్తింపబడు కార్యములు ఆయన చేయుట మేము చూచాము. అది మేమెరుగుదుము. ఆయనే విమోచకునిగా ఉండుననియు, ఇశ్రాయేలును విడిపించుననియు మేము విశ్వాసించాము" అనిరి.
అప్పుడాయన వారివైపు తిరిగి ఇట్లనెను, "అవివేకులారా ఆయనను గూర్చి జరుగునని ప్రవక్త చెప్పిన మాటలన్నియు నమ్మని మందమతులారా?" ఆయనను గమనించండి. ఇప్పుడు తిరిగి ప్రవచనము యొద్దకు వెళ్ళండి. ఆయనను నమ్మితిమని చెప్పుకొనుచున్న విశ్వాసులకు ఎంత గద్దింపు.
JOHN 5:39,46
56అంశమును ఆయన ఎట్లు సమీపించెనో చూడండి. ఆయన వచ్చిన వెంటనే, "నేనే మెస్సీయాను" అనలేదు. ఆలాగు ఆయన చెప్పగలడు, ఎందుకనగా ఆయనే ఆమెస్సీయా. కాని గమనించండి, ఆయన వాక్యములో తన్నుతాను గుర్తింపచేసికొనెను. అప్పుడే వారెరుగుదురు. ఆయన దానిని సూటిగా చెప్పినచో, అది మరొక రీతిగా పరిణమించియుండెడిది. కాని ఆయన తన్ను గూర్చి ప్రవక్తలందరూ చెప్పిన దానిని వారికి తెలుపనారంభించినప్పుడు వారు చూచిరి. తాము దేవుని పిల్లలమో కాదో అప్పుడు వారు చెప్పుకోగలిగిరి. కాని ప్రవక్తలు ముందుగా చెప్పినదాని వైపునకు ఆయన వారి దృష్టిని మళ్ళించెను. మెస్సియా యొక్క కాలము బయలుపరచబడుటను గమనించమని చెప్పెను. ఆయన యోహానువలె తన వర్తమానమును వాక్యముతో గుర్తించనారంభించెను. ఏ నిజ ప్రవక్త అయినా గాని ఆలాగే చేయును. అవును. "నేనే ఆయనను. నేనే…" అని ఆయన బయటకు వచ్చి చెప్పలేదు. అది నిజమగు దేవుని ప్రవక్త పద్ధతి కాదు, చూచారా. "తిరిగి లేఖనములలోనికి వెళ్ళుడి" అని ఆయన చెప్పెను, చూడండి. దానిని చేయుటలో తన మార్గమును ఎన్నడునూ ఆయన తప్పడు, చూచారా.
"మేము మోషేను ఎరుగుదుము" అని వారు చెప్పిరి.
"మీరు మోషేను ఎరిగియుండినచో, నన్నును ఎరిగియుందురు." "మోషే నన్ను గూర్చి వ్రాసెను." లేఖనములను పరిశోధించుడి; అందులో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు గదా, వాక్యము నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. వెళ్ళి లేఖనములో పరిశీలించి చూడుడి" అని ఆయన చెప్పెను.
ISA 40:3•
LUKE 24:25•
JOHN 5:39
57ఇక్కడ దానిని చేయుటలో తన మార్గమును ఎన్నడునూ, ఆయన ఇక్కడ తప్పడు. ఎన్నడూ తప్పిపోడు. ఆయన ఎన్నడునూ మారలేడు, ఎందుకనగా ఆయన మారని దేవుడు, చూచారా. గమనించండి, ఎమ్మాయి మార్గములో వెళ్ళుచున్న క్లియొపా మరియు అతని స్నేహితుడు యొద్దకు ఆయన తిన్నగా వెళ్ళి, వారికి లేఖనములను చూపించెను. "మెస్సీయా గూర్చి నెరవేరబడవలసియున్న ప్రవక్తలు వ్రాసిన ప్రతి మాటను నమ్మలేని అవివేకులుగా మీరెందుకున్నారని?" ఆయనడిగెను, ఓ! ఎట్టి రోజది!
యోహాను అదే చేసెను. "లేఖనములు పరిశోధించుడి, వెనక్కు చూడండి, అరణ్యములో ఒకని స్వరము కేకవేయును అని చెప్పబడెను. నేను ఎక్కడనుండి వచ్చాను?" అది వారికి అంతా విశదము చేసియుండవలసినది. నిజము!
ఈనాడును ఆలాగే విశదము చేయవలెను. మనము చూచుచున్న కార్యము పరిశుద్దాత్మ వలన జరుగుచున్నది. "లేఖనములను పరిశోధించుడి" అని ఆయన ఒకసారి చెప్పెను. నేడును మనము అదే చేయవలెనని ఆయన మనలను కోరుచున్నాడు.
DEUT 18:15•
LUKE 24:27
58గమనించండి, "మోషే మొదలుకొని ప్రవక్తలందరూ" వ్రాసిన వేద వాక్యములన్నిటిలోను తను గురించి చెప్పినవాటిని వారికి వివరించి చూపించాడు అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయన మోషే ప్రవచనముతో మొదలుపెట్టెను. మోషే, "మీ ప్రభువగు దేవుడు మీ మధ్య ఒక ప్రవక్తను పుట్టించును. ప్రభువగు దేవుడు ఒక ప్రవక్తను లేపును."
ఇప్పుడాయన ఈలాగు చెప్పియుండును, "క్లియొపా మరియు ఇక్కడున్న అతని మిత్రుడా, ప్రభువగు దేవుడు ఈ దినములలో మీ కొరకు ఒక ప్రవక్తను లేపనని మోషే చెప్పలేదా? వారు సిలువ వేసిన ఈయన ఆ అర్హతలన్నింటినీ కలిగిలేడా? మోషే ఇప్పుడు, దీనిని ప్రవచించెను. మీకు ఎన్నో వందల సంవత్సరముల నుండి ప్రవక్త లేడు. ఇక్కడ ఆయన లేచియున్నాడు. ఈయనకు ముందగా ప్రకటన చేసినవాని సంగతి ఏమిటి? అతడు చెప్పినది గ్రహించారా? ఆ ప్రవక్తలందరూ ఆయనను గూర్చి ఆయన కాలము గూర్చి చెప్పిరి. ఆయన వారితో మాట్లాడెను. ఆయన మాటలు వినుట నిశ్చయముగా ఆసక్తి పుట్టించును. ఆయన మాటలు వినుటకు మీరు ఇష్టపడలేదా? నేను అతని మాటలు వినుటకు ఇష్టపడుదును. తనను గూర్చిన ప్రవక్తలు ఏమి చెప్పిరో అదే ఆయన చెప్పెను గాని, ఆయనను నేనే అని ఆయన ఎన్నడునూ చెప్పలేదు. ఆయన వారికి ఒక ప్రవచనము మాత్రమే చూపించెను. "ఇది జరుగునని ప్రవక్తలు చెప్పిరి" అని మాత్రమే ఆయన చెప్పెను, చూచారా.
59కొద్ది నిమిషములు మనము ఇప్పుడు వెనుకకు వెళ్ళి ఆయన చెప్పిన మాటలు విందాం. ఇక్కడ గమనించండి, వాక్యమే వాక్యమును చూపించుచున్నది. వాక్యమే తన యొక్క వాక్యమును ఎత్తి చూపించుచున్నది. అది నేనే అని వారికి చెప్పుట కాదు గాని, వాక్యమే జవాబు ఇవ్వవలెను. అప్పుడు వారు ఆయనెవరో తెలిసికొందురు. వాక్యములోని అక్షరమే వాక్యమును ఎత్తి చూపించుచున్నది … శరీరములోనున్న వాక్యము, తనతో సంపూర్తిగా గుర్తింపును పొందిన అక్షరము యొక్క వాక్యమును ఎత్తి చూపించుచున్నది. ఇటు చూడండి, ఆయన ఎత్తి చెప్పినది వినుదము. అప్పుడే జరిగిన సంఘటనలను వారు క్లుప్తముగా విశదీకరించిరని మనము తెలిసికొన్నాము, అనగా సిలువ వేయబడుట, పునరుత్థానపు గాధ, సమాధి గూర్చి ఇప్పుడు మనము చదువుకొన్నాము. ఆయన తన్ను గూర్చిన ప్రవచనము నిమిత్తము తిన్నగా తిరిగి వాక్యములోనికి వెళ్ళుచున్నాడు. ఆయన దీనిని చెప్పెనని కేవలము మనము అనుకొందము; ఇంతకంటె ఆయన మరెక్కువగా చెప్పెను, కాని గమనించండి.
GEN 22:6•
PS 16:10•
PS 22:1,16,18•
PS 35:11•
PS 41:9•
ISA 50:6•
ISA 53:7,9•
ZECH 11:12•
ZECH 13:7•
MAL 3:1
60ఆయన ఈలాగు చెప్పెననుకొందుము, "జెకర్యా 11:12 తీయండి. ప్రవక్త చెప్పిన రీతిగా మెస్సీయా ముప్పది వెండి నాణములకు అమ్మబడును గదా? ఇప్పుడే మీరు అతనిని ముప్పది వెండి నాణేములకు అమ్మిరని చెప్పిరి గదా, తీసి చూడండి. మీరు ఆ లేఖనములు చూచారా? జెకర్యా 11:12. అంతట ఆయన ఇట్లనెను, "కీర్తనలలో దావీదు చెప్పినది మీరు గమనించారా? కీర్తనలు 41:9. ఆయన తన స్నేహితుల ద్వారా అప్పగించబడును. మరల జెకర్యా 13:7. ఆయన తన శిష్యుల ద్వారా విడిచిపెట్టబడెను. కీర్తనలు 35:11. అబద్ధ సాక్ష్యము మోపబడెను. ఇప్పుడే ఆ మాట మీరు చెప్పిరిగదా, యెషయా 53.7. అబద్ధసాక్ష్యుల యెదుట ఆయన మౌనముగా నుండెను. యెషయా 50:6. వారాయనను కొరడాలతో కొట్టిరి అని ప్రవక్త చెప్పెను. కీర్తనలు 22. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని? అని ఆయన సిలువ మీద కేకవేయును. మొన్న మధ్యాహ్నము ఆయన ఆలాగు పలుకలేదా? మరల కీర్తనలు 22:18, వారాయన వస్త్రములు పంచుకొనిరి. వారాలాగు చేయలేదా? కీర్తనలు 22: 7-8. తన శత్రువులు, సంఘము ద్వారా వెక్కిరించబడెను. మరల కీర్తనలు 22. ఆయన శరీరములో ఒక్క ఎముకయు విరువబడదు. కాని 'ఆయన కాళ్ళు, చేతులందు మేకులు కొట్టిరి.' "ఆయన తన చేతులు వెనుకకు పెట్టుకొని నిలబడెను. ఆ సమయములో నిస్సందేహముగ ఆలాగు జరిగెను." యెషయా 53:12. ఆయన దొంగల మధ్య మరణించునని పలికెను. ఆయన ధనికులతో పాతిపెట్టబడునని యెషయా 53:9 చెప్పెను. కీర్తనలు 16:10. 'ఆయన ఆత్మను పాతాళములో పెడిచిపెట్టవు. నా పరిశుద్దుని కుళ్ళుపట్టనీయవు' అని చెప్పెను. ఈయనకు ముందు మార్గము సరాళము చేయటను గూర్చి మలాకీ 3 చెప్పలేదా? ఓ, ఆయన వీటిని ఎత్తి చూపించుచున్నప్పుడు నేను అక్కడ వినుటకు ఉండినచో ఎంత బాగుండును. ప్రవచనముల వైపు చూడండి! గమనించండి, ఆయన అప్పుడు అన్ని మాదిరుల గుండా ఆయన వెళ్ళియుండును. ఆదికాండము 22లో ఇస్సాకు గూర్చి దేవుడు ముందు ఛాయగా ఇస్సాకును ఎట్లు౦చెనో చెప్పియుండును. తండ్రియగు అబ్రహాము
తన స్వంత కుమారుని తీసికొని, కట్టెలు పటుకొని, కొండమీదికి కొనిపోయి, తన కుమారుని ఎట్లు అర్పించెనో చెప్పెను.
PS 16:10•
ACTS 2:27
61అది వారిలో పనిచేయనారంభించెను. ఆ దినము కొరకు నిర్దేశించబడిన ప్రవచనములు చూడని అవివేకులని ఆయన వారిని పిలచెను. ఇప్పుడది వారిలో పని చేయసాగెను. గడచిన రెండు మూడు సంవత్సరములలోను, గత కొద్ది దినములలోను సంభవించిన ఇదంతయూ నెరవేర్పు అని వారు చూడనారంభించిరి. ఆ కాలము యొక్క బయలుపరచబడిన ప్రవచనము. ఈ యొక్క ప్రతి మాటను తమ సిలువవేయబడిన స్నేహితుడగు యేసు నెరవేర్చెనని అప్పుడు వారు తెలిసికొనిరి. ఓ, ఆయన నిజంగా మెస్సీయా అని అప్పుడు వారు తెలిసికొనిరి. ఆయన మృతులలో నుండి లేవవలెను. సమాధి ఆయనను బంధించియుంచజాలదు. "నా పరిశుద్దుని కుళ్ళుపట్టనీయను." ప్రవచనములో ఒక్కమాట కూడా ఎన్నడూ విఫలము కాదు. ఆయన లేచెను.
LUKE 24:32
62"అయితే ఈ ఉదయమున ఆ సమాధియెద్దకు వెళ్ళి సందేశము తీసుకువచ్చిన వర్తమానికులు నిజమైనవారే. ఆయన మృతులలో నుండి లేచెను. ఆయన సజీవుడై యున్నాడు. ఆయనే ఆ మెస్సీయా.' ఎందుకని? ఏమీ తప్పలేదు. ఆయన క్రియలు, ఆయన సేవ, ఆయన చేసిన సమస్తమూ, ఈనాడు ఏమి జరుగునని ప్రవక్త చెప్పెనో సరిగ్గా దానికి సరిపోయియుండెను. అదే జరిగినది. అది ఆయనే అని అప్పుడు వారు తెలిసికొనిరి. దానిని చేసినది తమ సిలువవేయబడిన స్నేహితుడగు యేసేనని గ్రహించిరి. ఆయన వారితో మాట్లాడుచుండగా, వారి హృదయములు మండుచుండుటలో ఆశ్చర్యము లేదు. ఇప్పుడు వారు ఆరు మైళ్ళు నడిచారు. అది తక్కువ సమయమువలె వారికి తోచెను.
63ఇక్కడ వారు చేసిన మరియొక పనియున్నది. మీకు తెలియునా, ప్రవచనము బయలుపరచబడినది అను దానిమీద ఆరు గంటల ప్రసంగమును వారు వినిరి. మార్గములో ఆయన వారితో మాట్లాడినది అదే. వారు మార్గములో ప్రవేశించగానే ఆయన వారితో వచ్చి కలుసుకొనెను. ఆయనప్పుడు యెరూషలేములో యుండెను. ఎమ్మాయి యెరుషలేము నుంచి ఇంచుమించు అరవై ఫర్లాంగుల దూరములో నున్నది. ఎమ్మాయినకు చేరడానికి ఆరు మైళ్ళ దూరము వారు ప్రయాణము చేయవలసి యుండిరి. ఆయన బోధించెను, ఆరు గంటల పాటు ప్రవచనమును బోధపరచెను. గనుక నా మూడు గంటల ప్రసంగమునకై మీరు నన్ను నిందించవద్దు. చూచారా? కాని గమనించండి. ఆయన వారికి బోధించెను. ప్రవచనము స్థిరపరచబడుట, బయలుపరచబడుట మీద వారు ఆరు గంటల ప్రసంగమును వినిరి.
LUKE 24:25•
HEB 13:8
64ఇప్పుడు సాయంకాలము కావచ్చుచున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని మీరెరుగుదురు. హెబ్రీ 13:8లోని ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడను సంగతి తెలిసికొనుటకు అప్పుడాయన వారి కన్నులు తెరచెను. సాయంకాల సమయమందు, ప్రవచనము ద్వారా సంఘటనలు తేటపరచబడును. ఈ ఘడియకు చెందిన ప్రవచనమును మీరు కేవలము నమ్మినచో, ఆధునిక ఘడియలో ఏమి సంభవించుచున్నదో సులభముగా మీరు గుర్తించగలరు.
"అవును, అవివేకులు, నెమ్మదిగా అర్ధము చేసుకొనేవారు, నెమ్మదిగా నమ్మువారు (దానిని పదే పదే ఆలోచించండి), మెస్సీయాను గూర్చి ప్రవక్తలందరు చెప్పినది ఆలస్యముగా నమ్మువారు. అది జరుగవలసి లేదా?" ఈ విషయములన్నియూ ఆయన వెనుకకు వెళ్ళి పరీక్షించి ఏమి జరుగునని ప్రవక్త చెప్పెనో చూపించెను. అప్పుడు వారు గ్రహించసాగిరి, ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోవుచున్నట్లుగా నటించెను. ఇతకంటే వారికి ఇష్టత ఏర్పడెను. వారు ఈలాగు పలికిరి, "నీవు మాకు ఇది ఇచ్చావు. మేమెన్నడూ ఆలాగు తలంచలేదు. ఆయన ఎక్కడో సజీవముగానే యున్నాడు." వారు ఆయనతోనే మాట్లాడుచున్నారు, గాని ఆయనెవరని ఎరుగరు. ఆయన వారివైపు విచారముగా చూచెనని నిస్సందేహముగా చెప్పగలను. ఆయనింకా ముందుకు నడిచిపోసాగెను. వారాయనను ఆహ్వానించుదురో లేదో కనిపెట్టుచుండెను. ఈ రాత్రి ఆయన దానికొరకే ఎదురుచూచుచున్నాడు, నీవు ఆయనను ఆహ్వానించవలెను.
65గమనించండి, ఆ శిష్యులు ఆయనను తమతో భోజనము చేయుటకు సహవాసపు బల్ల యొద్దకు ఆహ్వానించునప్పుడు, సిలువ వేయబడుటకు ముందు ఆయన చేసినట్లుగానే వారి నేత్రములు తెరచెను. ఆయన విధానము, ఆయన పద్ధతి వారు తెలిసికొనిరి. ఆయన ఏమి చేసెనో వారు తెలిసికొనిరి. ఇంతకు ముందు ఆయన చేసినట్లుగానే ఇప్పుడును చేసెను. "అదిగో, ఆయనే" అని వారనిరి. వెంటనే వారు కేకలు వేయుటకు లేవసాగిరి. ఆయన అదృశ్యుడాయెను. ఈ ప్రసంగము వినుటకు వారికి ఆరు గంటలు పట్టియుండవచ్చును గాని, "ఆయన నిశ్చయముగా లేచెను. ఆయన నిజంగా బ్రదికియున్నాడు" అని తక్కిన శిష్యులతో చెప్పుటకు ఇరవై నిమిషములే వారికి పట్టియుండవచ్చును, వారి పాదములు అంత తేలికగా పరుగిడినవి.
66స్నేహితులారా, మలాకీ 4, పరి. లూకా 17 పరి. యోహాను 15, ఓ, ఇంకా చాలా యున్నవి. ప్రకటన 10, చాలా ప్రవచనములు సరిగ్గా ఈ దినమునకు సరిపోవును. ఇది వాటికి నెరవేర్పు మార్కు, మత్తయి గ్రంథములలో కూడా ఆకాశమందు గొప్ప సూచనలు, మహత్కార్యములు కనబడును అని చెప్పబడెను. ప్రజలు వాటిని ఎగిరే పళ్ళెములు అని పిలుచుదురు. తలంపు ఎంత వేగముగా వెళ్ళగలదో అంతే వేగముతో, శక్తితో, అవి మాయమవ్వగలవు. ఆయన వ్రాయగలడు, ఆయన మాట్లాడగలడు, తనకిష్టమైనది ఆయన చేయును. గొప్ప అగ్నిస్తంభము, "నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." భూమి మీద దృశ్యములు కనబడుచున్నవి. పిరమిడ్లు, గాలిలోనికి లేచు పొగ, తేమ ఉండజాలని ముప్పది మైళ్ళ ఎత్తులో ఉంటున్నవి. అది జరుగుటకు సంవత్సరమున్నరకు ముందే చెప్పబడెను. అది ఆలాగుండునని చెప్పబడెను. ఆ పటము త్రిప్పి క్రిందికి ఎవరు చూచుచున్నారో చూడండి. చెప్పినదానిలో ఒక్కమాట కూడా ఎన్నడూ తప్పిపోలేదు. అది సత్యమని ధృవీకరించుటకు వ్రాయబడిన దేవుని వాక్యము ఇచ్చట ఉన్నది. మరల సాయంకాలమయినది. కృప చూపి ఆయన ఈ రాత్రి తిరిగి వచ్చి అప్పుడు చేసినట్లుగానే ఏదైనా చేయునేమోనని నేను ఆశించుచున్నాను. ఇప్పుడు మనము ప్రార్ధించి ఆయనను అడుగుదము. బయలుపరచబడిన ప్రవచనము ద్వారా సంఘటనలు తేటపరచబడినవి.
67సర్వశక్తుడగు దేవా, మాకు సహాయము చేయుము. అర్ధము చేసికొనుటకు ప్రియదేవా, మాకు సహాయము చేయుము. మేము తెలిసికొనవలసిన సంగతులు గ్రహించునట్లు నీ వాక్యము అర్ధము చేసికొనునట్లు సహాయము చేయుము. ప్రభువా, రెండువేల సంవత్సరములనుండి మేము ప్రసంగములు వినుచున్నాము. గ్రంథములు వ్రాయబడినవి. ఈ చివరి దినములలో అది మరల వెనుకకు జారిపోయినది. ఇప్పుడు సాయంకాల సమయమైనది. మెథడిస్తులు, బాప్టిస్తులు, ప్రెస్బిటేరియనులు ఇంకా చాలామంది ఆ కాలములో నీతో మాట్లాడిరి, కాని పగలు రాత్రి కాని ఆ గొప్ప దినము ప్రవక్త చెప్పినట్లుగా మార్గములో ఇదే కావచ్చును. అయితే సాయంకాల సమయమున వెలుగుండును. యేసు సమాధిలో నుండి లేచి, సీమోనుకు, ఆ స్త్రీకి ప్రత్యక్షమయి తాను సజీవముగా నున్నానని కనుపరచుకొనెను. అది ఉదయకాలవు. సాయంకాలమున ఆయన మరల తిరిగి వచ్చును. పగలంతయూ ఆయన వారితో నడిచెను. వారి గ్రుడ్డితనమును బట్టి వారిని గద్దించెను, కాని సాయంకాల సమయమున ఆయన తన్నుతాను వారికి తెలియపరచుకొనెను.
JOHN 6:37•
HEB 13:8
68దేవా, మా చుట్టూ వాక్యము కలిగియుండునట్లుగా ఈ రాత్రి మా సహవాసములోనికి రమ్ము. దేవా, ఈనాడు ప్రజల మధ్య విశ్వాసము అరుదుగా యున్నది, కాని నీవు పిలచి నిత్యజీవమునకు అభిషేకించినవారు కొందరున్నందుకు నేను వందనములు చెల్లించుచున్నాను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు" అని నీవు చెప్పావు. ఇప్పుడు సాయంకాల దీపములు ప్రకాశించుచుండగా, నీవు అనుమతించి యుండగా, ప్రభువా, ఎన్నడునూ ఏ ఒక్క (బయలువెళ్ళిన వందల ప్రవచనములలో) ప్రవచనము తప్పిపోలేదు. దానిని నిజముగా గుర్తించవలెనన్నచో అది నీవే అయియుండవలేను, ఎందుకనగా ఏ వ్యక్తియు అంత పరిపూర్ణ ఖచ్చితముగా ఉండలేడు. బైబిలువలెను, ఏ మనిషియు దానిని వ్రాయలేడు. నలుబదిమంది రచయితల ద్వారా పదహారు వందల సంవత్సరముల వ్యవధిలో వ్రాయబడియూ, అందులో ఒక్క తప్పు కూడా లేదు. "ప్రియదేవా, ఈ రాత్రి నిన్ను నీవు బయలుపరచుకొనుమని ప్రార్ధించుచున్నాను. హెబ్రీ 13:8లోని నీవు - నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని బయలుపరచుకొనుము. అప్పుడు నీవు చేసిన క్రియలు నేడును చేయుము. దానిని నీవు వాగ్దానము చేసియున్నావు. "ఈ చివరి దినములలో, ప్రపంచము సొదొమ మరియు గొమొర్రావలె, అక్రమములో కూర్చునియుండును." ఈ బాలురు బాలికలవలె బట్టలు ధరించుట, బాలికలు బాలురవలె నటించుటకు ప్రయత్నించుట చూస్తున్నాము. ఈ వంకర కాలములో స్త్రీ పురుషులు ఎట్లున్నారో చూస్తున్నాము, శరీరేచ్ఛకు పురికొల్పుచున్నారు - అది ఒక విగ్రహారాధనగా మారినది. సువార్త ఒక ప్రక్కకు త్రోయబడినది. లవొదికయ సంఘ కాలములో దిగంబరత్వము. ఓ దేవా, ఎట్టి ఘడియ! ప్రభువైన యేసూ రమ్ము! నిన్నునీవు మాకు తెలియపరచుకొనుము. యేసు నామమున ఇది అడుగుచున్నాము.
MATT 9:22•
MARK 5:34•
LUKE 8:48
69మీరు తలలు వంచి, కండ్లు మూసియుండగానే, ఒక్క సంగతి మిమ్మును అడుగగోరుచున్నాను. ఇక్కడ దేవుడున్నాడని మీరు నమ్ముచున్నారా? నేడు జరుగుచున్న సంగతులు ప్రవచనము నెరవేరుట అని మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని మీరు నమ్ముచున్నారా? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆనాటి కొరకు శరీరములో బయలుపరచిన క్రియలు ఈ దినమున మరల పునరావృతమగునని మీరు నమ్ముచున్నారా? ప్రవక్త ఆలాగు పలికెను. బైబిలు ఆలాగు చెప్పెను. వాక్యమంతయూ నెరవేరవలెను, అది తప్పిపోజాలదు. ఆయన తన్నుతాను ఎటు గుర్తింపచేసికొనును? మోషే ద్వారా పలుకబడిన ఆ ప్రవక్తగా ఉండియే. జనుల హృదయ రహస్యములను ఎరిగియుండెను. ఆయన వస్త్రమును తాకిన స్త్రీ వైపు ఆయన తిరిగి ఇట్లనెను, "నీ విశ్వాసము నిన్ను రక్షించెను." సీమోను పేతురు ఆయన యొద్దకు వచ్చినప్పుడు అతని పేరును ఆయన ఎరిగియుండెను. అతడెవరో, అతని తండ్రి ఎవరో చెప్పెను. మారని ప్రియమైన యేసు చనిపోలేదు గాని, సదా జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక! ఇప్పుడీ సాయంకాల సమయములో మనలను తిరిగి సమకూర్చియున్నాడని నేను నమ్ముచున్నాను.
MATT 16:16•
HEB 13:8
70ఓ ప్రభువైన యేసూ, మా మధ్యకు రమ్ము. మమ్మును దాటిపోకుము. వచ్చి ఈ రాత్రి ముగియు వరకు మాతో యుండుము. రేపు ఉదయమున మేము మీతో పాటు వచ్చి, అప్పుడు మేము నీ పునరుత్థాన శక్తితో నిన్ను ఎరుగునట్లును, నీ యొక్క ప్రేమ, కృప మరియు కరుణ మాతో ఉండునట్లును అప్పుడు మేము రేపు నీతో వచ్చెదము. ఓ నిత్యుడగు దేవా, వీటిని దయచేయుము. దేవుడు మాత్రమే వాటిని దయచేయునని మేము ఎరుగుదుము.
ఈ గంభీర ఘడియలో మేము ఈలాగు చెప్పెదము: దేవా, మా తండ్రీ, మా శరీరము నీకు ఒక పేద ఆలయము. కాని, ప్రభువా, నీ పవిత్రపరచు కృప, నీ పరిశుద్దాత్మ ఇప్పుడు రానిమ్ము. మాలో నుండు ప్రతి అనుమానము, ప్రతి సందేహము, ప్రతి నైరాశ్యము తొలగునట్లు కడిగి, ఒక్క సందేహము లేకుండా స్వేచ్చగా యుందుము గాక; బయటకు వచ్చి పేతురువలె, "నీవు క్రీస్తువు, నిన్న నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నావాడవు" అని ధైర్యముగా ఒప్పుకొందుము గాక.
GEN 17:5,15•
GEN 18:1,9,22•
MATT 5:5•
LUKE 17:28
71ప్రభువా, నీ వాక్యమే సత్యమని మేము నమ్ముచున్నాము. ప్రభువా, ఈ ప్రార్ధన వరుస ప్రారంభించక ముందు అది మమ్ము చూడనిమ్ము, నిన్నునీవు మాకు తెలియపరచుకొనుము. నీవు చెప్పినట్లుగా, "లోతు దినములవలెనే ఉన్నవి." బయటకు పిలువబడిన అబ్రహాము గుంపు ఒక వాగ్దాన పుత్రుని కొరకు ఎదురు చూచుచున్నది. లోతు అయితే అక్కడ ఒక ఆధునిక బిల్లీగ్రాహం, ఒక ఒరల్ రాబర్టును వినుచున్నాడు. శాఖా వ్యవస్థ అక్కడున్నది. ఒక దేశముగా యున్నది. కాని అబ్రహాము అయితే ఏ సంస్థయు లేకుండా ఒక పరదేశిగా ఉండెను. అతడు వారసుడుగా ఉండనైయున్న ఆ దేశమునకే ఈ చిన్న గుంపు పయనించుచున్నది. "సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు." ఒక రోజున, ఆ నీడగల చెట్లు క్రింద వారు కూర్చొని విశ్రాంతి తీసికొనుచుండగా, దేవుడు ఒక మానవ రూపములో దిగి వచ్చెను. ఇద్దరు దేవదూతలు సొదొమలోనికి దిగి వెళ్ళిరి. దేవుడు, మానవ శరీరములో తానున్న వాడినని రుజువు చేసెను. "అబ్రహమూ, నీ భార్యయగు శారాయి ఎక్కడ?' అనడిగెను. అంతకు కొద్ది రోజుల ముందు, అతడు అబ్రాము. ఆమె శారాయి; శారా కాదు. "రాజకుమారి." నీవామెను రాజకుమారి నామముతో పిలిచావు. రాజు యొక్క కుమార్తె, అబ్రామును నీవు అబ్రహాము, అనగా జనములకు తండ్రి అని పిలిచావు. "నిన్ను నేను దర్శించుదును" అని నీవు చెప్పావు.
GEN 18:9,13,14•
LUKE 17:28
72దేవా, ఆ ప్రవక్త యొక్క హృదయము ఎటు గంతులు వేసియుండునో ఆ వెంటనే నీవెరివో అతడు తెలిసికొనెను. నీ పాదములను కడిగి, తనకున్న ఆహారమంతయు తెచ్చి శ్రేష్టమైనది నీకు పెట్టుటలో ఆశ్చర్యము లేదు. అక్కడున్నది దేవుడేనని అతడు ఎరిగియుండెను. అప్పుడాయన "శారా ఎక్కడ?" అని తెలియనట్లు అడిగెను.
అబ్రాహాము ఆయనతో, "ఆమె నీ వెనుక గుడారములో యున్నది" అని చెప్పెను.
ఏమి జరుగనైయున్నదో నీవు చెప్పావు. ఆమె తన హృదయమందు సందేహించెను. 'ఈ సంగతులు ఎట్లు జరుగును'? అని చెప్పి శారా తన హృదయములో ఎందుకు సందేహించినది? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అని నీవు అబ్రహామునడిగితివి.
ఓ దేవా! యేసూ, వాక్యము యొక్క బయలుపరచబడిన దేవునివి. "సొదొమ దినములలో వలెనె ఉండును" అని నీవు చెప్పితివి. అన్యుల యుగము, అన్యుల లోకము నాశనమునకు ముందుగా లోకము అదే స్థితిలో యుండునని చెప్పావు. ఇక్కడ మనమున్నాము, పూర్తిగా సొదిమీయుల స్థితి. ఎప్పుడునూ "ప్రవక్తగా" చెప్పబడిన మనుష్యుకుమారుడు ఆ ఘడియలో ప్రత్యక్షపరచబడునని నీవు చెప్పావు. ఓ దేవా, నీ మాటలు నెరవేర్చుము. మేము నిన్ను నమ్ము పిల్లలము. ప్రభువా, నీవు విశ్వాసము ఇచ్చుదువని యదార్ధ హృదయములతో ఎదురుచూచుచున్నాము. ప్రార్ధన వరుస మేము ఏర్పరచునప్పుడు ప్రజలు నమ్ముదురు గాక. తండ్రీ, ఇది సాయంకాలము. దేవుని కుమారుని యొక్క సాయంకాలపు దీపములు ఆయన చెప్పిన ప్రవచనముల ద్వారా ఆయనను బయలుపరచును గాక. (భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండేవాడు ఆయనే) యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
73ఇప్పుడు నేను రోగులకు ప్రార్ధించుటకు సిద్ధముగా యున్నాను. దేవుడు ఇంకనూ దేవునిగానే యున్నాడని నేను ఇక్కడ నిలబడి సవాలు చేయుట ఎంతో వింతగా యున్నది. ఈ బహిరంగ సవాలును దేశమంతటా టెలిఫోను సంబంధము గలవారు వినుచున్నారు. ఆయన తప్పిపోజాలడు. వాగ్దానము చేసిన దానిని ఆయన నెరవేర్చును. దానిని చేయుటలో ఎన్నడునూ ఆయన తప్పిపోడు. దానిని చేయుటకు ఆయన వాగ్దానము చేసెను. కాబట్టి ఆయన చెప్పిన దానిలో పూర్ణ విశ్వాసము నేను కలిగియున్నాను. అందుకే ఆయన రాకకొరకు నేను చూచుచున్నాను. ఏ సమయములోనయినా ఆయన ప్రత్యక్షమగునని, నేను ఎదురుచూచుచున్నాను, ఎందుకనగా, "మీరనుకొనని ఘడియలో, లోకము తలంచని ఘడియలో" ఆయన వచ్చును అని ఆయన చెప్పియుండెను.
నాకు తెలిసినంతవరకు, ఇక్కడ నేను నా ఆలయములో యున్నాను. ఇక్కడ కొందరు జనులు కూర్చొనియున్నారని నాకు తెలియును. సహో. రైట్, ఇంకొందరు ఇక్కడ కూర్చొనియున్నవారిని నేనెరుగుదును, నాకు తెలియదు. కాని నాకు తెలియనివారే మీలో ఎక్కువమంది యున్నారు. దీనిని దేవుడు ఈ రాత్రి చేయునని చెప్పుటకు నాకు ఏ మార్గము లేదు. గత అనేక సంవత్సరముల నుండి ఆయన చేయుట మనము చూస్తున్నాము, కాని ఈ రాత్రి ఆయన చేయకపోవచ్చును. నాకు తెలియదు. అది ఆయనకే తెలియును; ఆయన సార్వభౌముడు. ఆయన తన కిష్టమైన దానిని చేయును. ఏమి చేయవలెనో ఆయనకు ఎవరూ చెప్పనక్కరలేదు. ఆయన చిత్తము మరియు ఆయన విధానములలో ఆయన ఒంటరిగానే నిలచి యుండును. కాని ఆయన వాగ్దానము చేసినందున, దానిని చేయమని ఆయనను అడుగుచున్నాను. మనకోసరము అది అవసరము కాకపోవచ్చును గాని, కొందరు క్రొత్తవారి కొరకు అది కావలెను. ఇప్పుడు పరిశుద్దాత్మ మన మీద అభిషేకము జరిగించుచున్నది. నన్ను ఆయన ఎంతగా అభిషేకించినా గాని, మిమ్మును కూడా నిశ్చయంగా ఆయన అభిషేకించవలెనని నేను నమ్ముచున్నాను.
74ఇప్పుడు నేను ప్రార్ధన వరుసను ఏర్పరచగోరుచున్నాను. నాకు సాధ్యమైనంతవరకు నేను రోగుల కొరకు ప్రార్ధించెదను. ఇప్పుడు, మనము ఒక వరుసను ఏర్పరచి, ప్రజలను పిలచి, రోగులకు, ప్రతివారికి ప్రార్థించెదము. మాతో కూడా నా సేవక సోదరులును ఇక్కడికి వచ్చి, మీ మీద చేతులుంచవలెనని తలంచుచున్నాను. అది తప్పక మనము చేయగలము. లేక మీ కొరకై ఏమైనా చేయకలిగిన మన తండ్రిని మనము అడుగవలెను, నా చేతులు మీవంటి మానవ చేతులే. కాని అసలు సంగతి ఏమనగా, దానిని చేయునది మానవ చేతులు కాదు గాని, దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమందలి విశ్వాసమే అది చేయును. దానికి ఏ విజ్ఞాన శాస్త్రము అక్కరలేదు. ఇది పూర్తిగా అశాస్త్రీయము. (విజ్ఞాన శాస్త్రమునకు సంబంధించినది కాదు).
క్రైస్తవుని యొక్క యుద్దాలంకారములలో లేనిది ఒకటున్నది అదియే విజ్ఞాన శాస్త్రము. అది మీరెరుగుదురా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము, సహనము, విశ్వాసము, పరిశుద్దాత్మ సమస్తమును విజ్ఞానమునకు కనబడనిదే. నిజమైనది మరియు చిరకాలము నిలచునది అది మాత్రమే. నీవు చూచు ప్రతిదియు భూమిలో నుండి వచ్చినదే. తిరిగి అది భూమిలోనికి పోవునదే. కాని నీవు నీ కంటితో చూడజాలనిది, నిత్యత్వపు లోకమునకు చెందినది, దానికది బయలుపరచుకొనుచున్నది.
75దేవుడు తన్నుతాను బయలుపరచుకొని ఇక్కడ ఆయన సజీవముగా ఉన్నాడని రుజువుచేసి, ఆదియందు ఆయన చేసిన కార్యములే ఈ వర్తమానము తరువాత చేసి చూపించినయెడల నీవు నమ్మి నీ స్వస్థతను అంగీకరించుదువా? దానిని దేవుడు దయచేయును గాక, మీరెవరైనా గాని, ఎక్కడ నుండి వచ్చినవారైనా గాని గృహములో యున్నవారిని అడుగుచున్నాను. ఈ వర్తమానము సత్యమని పూర్తిగా నమ్ముమని మిమ్మును అడుగుచున్నాను. యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడున్నారనియు, సజీవునిగా ఉన్నారను సందేశమే ఈ ఘడియకు పరిశుద్ధ గ్రంథములో దేవుడుంచిన వర్తమానము. ఇప్పుడు సమీపముగా …
మీ ప్రజలందరు నన్ను ఎరుగుదురు. నేను పెరిగిన పట్టణములోనే ఇప్పుడు నేనున్నాను. నాకు వ్యాకరణ పాఠశాల విద్యకూడా లేదు. అది పూర్తిగా సత్యము. మీరు నన్ను చాలా కాలము నుండి ఎరుగుదురు. నేను యధార్థముగాను, నిజముగాను ఉన్నానని చూపించుటకే మీ యెదుట నేను జీవించానని నమ్ముచున్నాను. నేను వేషధారిని కాను. నా విమర్శకులు కూడా నా గూర్చి ఆ మాట చెప్పలేరు. "నీవు వేషధారివి కాదు గాని నీవు తప్పు చెప్పుచున్నావనియే వారందురు. నీవు తెలియక తప్పు చెప్పుచున్నావు గాని ఉద్దేశపూర్వకముగా గాదు" అని వారందురు. కాని నేను తెలియక తప్పు చేయుచున్నానని అనుకొనను, ఎందుకనగా నా వర్తమానమునకు దేవుని వాక్యమే సాక్షి. అది ఎవరో వాక్యమే చెప్పవలెను. అది నాది కాదు అని నేను తేటతెల్లముగా చెప్పుట మీరు విన్నారు. కనుక అది ఆయనే అయియుండవలెను. అది నిజమేనా? అయితే దేవుని యందు విశ్వాసముంచుడి. ఇటువైపు చూచి, దేవుని నమ్ముడి. దేవుని మీరు నమ్మకలిగినచో, దేవుడు మీకు అనుగ్రహించును. ఆయన మునుపు చేసినట్లుగా దానిని చేయకలిగినచో, ఆయన ఇంకా దేవుడుగానే ఉన్నాడు. అది మీరు నమ్ముదురా?
76అది మీరు నమ్ముదురా? ఒకామె ఇక్కడ కూర్చొనియుండి, నావైపు చూస్తున్నది. నిజముగా ఆమె కండ్లలో నీరున్నది. ఆమె ఎవరో నాకు తెలియదు. ఎన్నడూ ఆమెను చూడలేదు. నీకు నేను క్రొత్తవానిని. దేవునికి నీ హృదయ రహస్యములు, నీ కోరికలు, నీ పాపము, లేక ఏది ఏమైనాగాని తెలియునని అనుకొనుచున్నావా? ఆయనెరుగునని తలంచుచున్నావా? నీ పాపము ఏమిటో నీవు ఏమి చేశావో నీవేమి చేయకుండా ఉండవలసినదో, లేక నీ కోరిక, మరి ఏదైనా సరే ఏమిటో ఆయన నాకు బయలుపరచునని నీవు తలంచుచున్నావా? ఆయన ఆలాగు చేసినచో అందువలన నీవు దేవుని నమ్మెదవా, అది ఆయన వలనే జరుగును అని విశ్వసించెదవా? అది ఆయన వలనే జరిగినదని అంగీకరించెదవా? నిన్ను బాధపెట్టుచున్నది నీ పాపము కాదు; దానిని నీవు ఒప్పుకొన్నావు. కాని నీవు ఆయన ఆత్మ బాప్తిస్మమును పొందగోరుచున్నావు. దానిని నీవు పొందెదవు. అది ఆమె మీదికి కదిలివచ్చుట నేను చూచుచున్నాను.
నేను ఆ స్త్రీ వైపు, ఆ స్త్రీ నా వైపు చూచుచున్నట్లు మీరు తెలిసికొనవలెను. నేను మీకు పరిశుద్దాత్మను చూపించగోరుచున్నాను. ఇటు చూడండి, ఇక్కడ నా కాళ్ళకు సమీపముగా ఈ స్త్రీ కూర్చొనియున్నది. నేను చెప్పాను కదా, అదే ఆమెకు కావలసినది, పరిశుద్దాత్మ బాప్తిస్మమే. సోదరీ, నీవు దానిని పొందుదువని నమ్ముచున్నావా? అయితే నీ చేతిని ఎత్తుము. అయితే, నాకు తెలిసినంతవరకు ఆమెను ఎన్నడూ నా జీవితములో చూడలేదు.
77తలక్రిందికి వంచి కూర్చొనియున్న ఈయనను చూడండి. సరిగ్గా అక్కడే కూర్చొనియున్నాడు. అతని మెడ సరిగ్గా అమరలేకనో, మరేదోగానో యున్నాడు. నీవు మూత్రాశయ వ్యాధితో బాధపడుచున్నావు. దేవుడు నిన్ను బాగు చేయునని నమ్ముచున్నావా? దానిని నీవు అంగీకరించినచో నీ చేతిని ఎత్తుము. మంచిది, దేవుడు నీ మనవిని ఆలకించి ఇచ్చును.
ఇక్కడ కూర్చొనియున్న ఈ యువకుడు పరిశుద్దాత్మ బాప్తిస్మమును కోరుచున్నాడు. గీతలు వేసిన తెల్లని టై నీ వెనుకవైపు వ్రేలాడుచున్నది, నీవు, అది దేవుడు అనుగ్రహించునని నమ్ముచున్నావా? దానిని దేవుడు అనుగ్రహించును.
ఈయన తన భార్య కొరకు ప్రార్ధించుచున్నాడు. ఆమె ఒక వైద్యశాలలో యున్నది. దేవుడామెను స్వస్థపరచి, ఆమెకు బాగుచేయునని నీవు నమ్ముదువా? నీవు విశ్వసించెదవా? అయితే అది నీవు పొందగలవు.
నీ గొంతు మీద చేతిని పెట్టికొనియున్న నీవు, నిన్ను బాధించుచున్న ఆ గుండె జబ్బును దేవుడు స్వస్థపరచగలడని నీవు నమ్ముదువా? నీకున్న కడుపు జబ్బును దేవుడు బాగుచేయునని నమ్ముదువా? ఇప్పుడు నీవు బాధతోనే కూర్చొనియున్నావు. అవును కదూ? ఆయన నిన్ను బాగు చేయునని నమ్ముదువా? అయితే అది నీవు పొందగలవు. ఆమేన్.
78మీరు చూడండి, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. వారిని నేను ఎరుగుదునేమో ఆ జనులను అడగండి. నాకు తెలియదు కాని, ఆయనెరుగును. ఆమేన్. ఆవలి గోడ ప్రక్కనున్న వెలుగును చూడండి. అక్కడ కూర్చొనియున్న ఒకాయన మీద అది వ్రేలాడుచున్నది. అతడు వెన్నెముక వ్యాధితో బాధపడుచున్నాడు. అతడు ఇక్కడివాడు కాడు. అతడు జార్జియా నుండి వచ్చేను. శ్రీ డంకన్, నీ వెన్నెముక జబ్బును దేవుడు స్వస్థపరచునని నీ పూర్ణ హృదయముతో నమ్మెదవా? దేవుడు నిన్ను దీవించును.
వీపు నొప్పితో, ఆ వెనుక ఒకాయన కూర్చొనియుండి నా వైపు చూచుచున్నాడు. నేను ఆయనను ఎరుగను గాని ఆయన శ్రీ ధాంప్సన్. నీవు నమ్ముదువా? ఆ వెనుక నున్న మీరు లేవండి. నేను నీకు అపరిచిత వ్యక్తిని. అది నిజము. కాని అక్కడ నీవు ప్రార్ధించుచూ కూర్చొనియున్నావు. ఇప్పుడు నీ వీపు నొప్పి నయమైనది. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.
ZECH 14:7
79"సాయంకాల సమయమున వెలుగుండును." ఆయన ఈ రాత్రి ఇక్కడుండుట మీరు చూడలేదా? ఆయనే ఆ మహా నేనున్నవాడనని పలుకువాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది నీవు నమ్ముదువా? యేసుక్రీస్తు తన్నుతాను తెలియబరచుకొని, ప్రవచనమందు తన్నుతాను గుర్తింపచేసికొనుచున్నాడని మీరు ఒప్పించబడి సంతృప్తి పొందుచున్నారా?
కంటిని గూర్చి బాధపడవదు; దేవుడు రోగులను, బాధపడుచున్నవారిని బాగు చేయును.
ఇక్కడున్న వారిలో ఎందరు జనులు రోగులుగా ఉన్నారు? మీ చేతులు చూడనీయండి. అది అటువంటి ఈడ్పు మరియు బాధవలె కనిపించుచున్నది. మీలో ఎవరికైననూ ప్రార్ధనా కార్డులున్నవా? మిమ్మును ఇక్కడికి ఎట్లు తీసికొనిరావలెనో నాకు తెలియుట లేదు. మీ కొరకు నేను ప్రార్ధించగోరుచున్నాను. దానిని ఏలాగు చేయవలెనో నాకు తెలియదు. ఆ గోడవైపు మీరు చూడండి. అక్కడికి వారిని నేనెట్లు తీసికొనిరాగలను? ఒక్క మార్గము జనులతో మూయబడినచో, వెంటనే ఆ తక్కినవన్నియూ మూయబడును. అందరూ ఇంక ఆగిపోవలసినదే.
MARK 16:18
80వినండి, నా మాట ఆలకించండి. ప్రభువు నామములో నేను మీకు చెప్పినది ఎన్నడైనా నెరవేరకుండా పోయినదా? అది నిజమా? ప్రతిసారి అది నిజముగానే యుండెను. నా జీవితములో నేను ఒక్క పైసా కూడా మిమ్మును ఎన్నడూ అడుగలేదు. అడిగానా? ఒక్కసారి కూడా అడుగలేదు. నా జీవితములో ఎన్నడును చందా తీసుకొనలేదు. డబ్బు కొరకు ఇక్కడ నేను లేను. మిమ్మును మోసపరచుటకు నేను ఇక్కడ లేను. ఈ ఘడియ యొక్క దేవుని వాక్యమును బయలుపరచుటకు ఇక్కడ నేనున్నాను. నేను మీకు సత్యము చెప్పాను. అది సత్యమని దేవుడు దానికి సాక్ష్యమిచ్చెను. ఇప్పుడు నేను మీకు చెప్పునది, లేఖనములు ఈలాగు సెలవిచ్చుచున్నవి అని, అదేమనగా విశ్వాసి రోగుల మీద చేతులుంచినప్పుడు "బాగవుదురు" అని యేసు చెప్పెను. అది మీరు నమ్ముదురా? అయితే దేవుని సన్నిధిలో, ఇప్పుడే ఆయన అది చేయునని మీరు నమ్ముదురా?
81ఇప్పుడు మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచుకొని, ఆలాగే ఒక నిమిషము నిలిచి యుండుడి. ఇప్పుడు ప్రార్ధించవద్దు. కేవలము ఒకరిమీద ఒకరు చేతులేసియుంచండి. బయట ఏ ప్రాంతములోనున్నవారైనాగాని ఆలాగు చేయండి. నేను కూడా నా చేతులను ఈ చేతిగుడ్డల మీద ఉంచుచున్నాను. మీరిప్పుడు ఒక నిమిషము పాటు నావైపు చూడవలెనని కోరుచున్నాను. దేవుడు చేయకుండా విడిచిపెట్టినది ఏమిటి? ఆయనేమైయున్నాడో చూడండి. మనము చదివిన వాక్యమేమిటి, చెప్పుకొనిన ప్రవచనము లేమిటో చూడండి. యేసు ప్రవచనముల ద్వారా తన్నుతాను గుర్తింపచేసికొనెను అనునదే. ఈ ఘడియ వైపు చూడండి. ఈ గడిచిన మూడు వారములలో మనము ఏ ఘడియలో జీవించుచున్నామో చూశాము. మనము చదివినది చూడండి. అబద్ద ప్రవక్తలు, సూచక క్రియలు దాదాపు ఏర్పరచబడిన వారినికూడా ఎట్లు మోసపుచ్చునో చూశాను. వాక్యము ఎట్లు బయలుపరచబడెనో, ఈ యుగపు దేవత వారి నేత్రములకు గ్రుడ్డితనము ఎట్లు కలుగచేసెనో, జనుల హృదయములనెట్లు బంధించెనో చూశాము. లవొదికయ సంఘ కాలములో ఈ సంగతులు జరుగునని దేవుడు తానే ప్రవచనముల ద్వారా చెప్పుట చూశాము. ఏదియూ చేయకండా విడిచిపెట్టలేదు. ఎమ్మాయి వారితో మాట్లాడి, తన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ద్వారా తన్నుతాను గుర్తింపచేసికొనిన ఆ దేవుడే ఆ రాత్రి ఇక్కడుండి ఈ కాలము గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ద్వారా తన్నుతాను గుర్తింపచేసికొనుచున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అది మీరు నమ్మగలరా? అయితే మీరు ఒకరిమీద ఒకరు చేతులుంచుకొనండి. మీ కొరకు మీరు ప్రార్ధించుకొనవద్దు, కాని మీరు మీ స్వంత పద్ధతిలో మీరెవరి మీద చేతులేసిరో వారికొరకు ప్రార్దించండి, ఎందుకనగా వారు మీ కొరకు ప్రార్ధించుచున్నారు. ఇప్పుడు చూడండి. సందేహించ వద్దండి.
82ఇప్పుడు, మీరు నేను చూచుచున్న దానిని చూడకలిగినచో మంచిది! ఇక్కడ నిలబడి నేను మీకు అబద్ధము చెప్పనని మీకు తెలియును. మీరు చూడకలిగినచో, ఆవల గాలిలో పయనించగా ఆ విజ్ఞానము, పటములు తీసిన ఆ గొప్ప పరిశుద్దాత్మ వైపునకు నీ విశ్వాసము ఆకర్షించబడినచో, అదే పరిశుద్దాత్మ ఈ భవనములో సంచరించుచూ దిగుటకు ఒక స్థలము కొరకు వెదకుట, ఒక లంగరువేయు స్థలము కొరకు వెదక ప్రయత్నించుట మీరు చూడగలరు. నా సోదరుడా, దానిని కేవలము నమ్ముము. లేఖనము మరియు ఇంకా తదితరముల ద్వారా ఆయన గుర్తింపబడి యున్నాడు. అది నిజము. మీరు ఎవరిమీద చేతులుంచారో ఆ వ్యక్తి కొరకు యధార్ధముతో ప్రార్ధించండి, వారు నీ కొరకు ప్రార్ధించుచున్నారు.
MARK 16:17,18
83ప్రియ నజరేయుడగు యేసూ, నీవు ఇచ్చటున్నావని, ప్రభువా, వాక్యము ద్వారా మేము ఎరిగియున్నాము. వాగ్దానము ద్వారా ఇక్కడ నీవున్నావని ఎరుగుదుము. "ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడియుందురో, వారి మధ్యన నేనుందును. నమ్మువారివలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగులపై చేతులుంచగా బాగయ్యెదరు." ఆ టెలిఫోను తరంగములు ఎక్కడెక్కడకు వెళ్ళుచున్నవో అక్కడకు, ప్రతి సమాజములోనికి ఆ గొప్ప పరిశుద్దాత్మ వెళ్ళును గాక. సంఘములో ఇక్కడ ఇప్పుడు మేము చూచుచున్న అదే పవిత్ర వెలుగు ప్రతివారి మీదను పడి ఈ సమయములో వారు బాగవుదురు గాక. క్రీస్తు యొక్క సన్నిధానములో అపవాదిని, శత్రువును మేము గద్దించుచున్నాము. సిలువ మరణము ద్వారాను, ప్రభువైన యేసు శ్రమల ద్వారాను, మూడవ దినమున విజయ పునరుత్థానము ద్వారాను శత్రువు ఓడింపబడియున్నాడని వాడికి చెప్పుచున్నాము. పందొమ్మిది వందల సంవత్సరముల తరువాత, సజీవముగా ఆయన ఇక్కడ ఈ రాత్రి మనమధ్య ఉన్నాడని రుజువయినది. సూచనగా కనబడినది. సజీవ దేవుని యొక్క ఆత్మ ప్రతి ఆత్మను విశ్వాసము మరియు శక్తి, మరియు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము నుండి వచ్చు స్వస్థతా ప్రభావములతో నింపును గాక. ఆయన సన్నిధిలో, సంఘమునంతటినీ ఈ గొప్ప వెలుగు చుట్టుకొనుట ద్వారా ఇప్పుడు ఆయన గుర్తించబడెను. యేసుక్రీస్తు నామమున, దేవుని యొక్క మహిమార్ధము దానిని అనుగ్రహించుము.
ఈ చేతిరుమాళ్ళ కొరకు మేము ప్రార్ధించాము. అవి ఎవరికొరకు ఉద్దేశించ బడినవో ఆ రోగులు మరియు బాధపడుచున్న వారియొద్దకు వెళ్ళును గాక! ఇప్పుడు ఇక్కడుండి తన్నుతాను గుర్తింపచేసికొనిన అదే పరిశుద్దాత్మ ఇవి ఎవరి మీద పెట్టబడునో, ఆ ప్రతి రోగి మీదను గుర్తింపబడును గాక. వారి శరీరములోనున్న రుగ్మత పటాపంచలగునట్లుగా దేవుని యొక్క సన్నిధి వారి ఆత్మలను విశ్వాసముతో నింపును గాక. దీనిని మేము దేవుని యొక్క మహిమ కొరకు యేసుక్రీస్తు సన్నిధిలోను, యేసుక్రీస్తు నామములోను యేసుక్రీస్తు దాసులముగా మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
84మీ వ్యాధి ఏదయిననూ నాకు లెక్కలేదు. మీ విన్నపమునకు జవాబును దేవుని యొక్క వాక్యము అనుగ్రహించినదని మీ పూర్ణ హృదయములతో విశ్వాసించుచున్నారా? చాలును. నాకు కనబడుచున్నంత వరకు ప్రతి హస్తము పైకి లేచినదని నమ్ముచున్నాను. మీరది నమ్మతే చాలును, ఇప్పుడు గుర్తుంచుకొనండి, అది సమాప్తమయినది!
ఈ టెలిఫోను వైరుల ద్వారా వినుచున్న మీరు, మీ పూర్ణ హృదయములతో నమ్మిన యెడల, మీ మీద సేవకుల చేతులు వేసియుండగా, మిమ్మును ప్రేమించుచున్నవారు మీ మీద చేతులు వేసియుండగా, అది సమాప్తమాయెనని మీరు మీ పూర్త హృదయములతో నమ్మినచో, అది పరిసమాప్తమయినట్లే. ఆ గొప్ప పరిశుద్దాత్మ ఈ రాత్రి ఈ ఆలయములో నున్నది. ఆయన జనులకు పైగా సంచిరించుట నాకు కనబడుచున్నది. ఆయన తన్నుతాను కనుబరుచుకొనుచూ, ఈ ప్రక్కనున్న గోడమీద నుండి ఒక వ్యక్తి మీదికి దిగివచ్చెను. ఈ భవనములో సంచారము చేయుచున్నాడు. హృదయ రహస్యములను తెలియచేయుచున్నాడు. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా నున్నాడని చూపించుటకు ఆయనయొక్క సన్నిధిని గుర్తింప చేసికొనుచున్నాడు. ఆయన మనమధ్య ఉన్నాడు! ఆయన దేవుడు, ఎన్నడునూ తప్పిపోని దేవుడు.
EXOD 3:2
85సదాకాలము మహిమ మరియు స్తుతి అర్పించబడును. పునరుత్థానుడగు యేసుక్రీస్తు సన్నిధిలో ఇప్పుడు మనమున్నామని తెలిసికొన్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా, ఇప్పుడును మండుట లేదా? సర్వశక్తుడగు యెహోవా యొక్క వ్యక్తపరచబడిన రూపము ఆయనే. ప్రవక్త యొక్క దృష్టిని ఆకర్షించుటకు ఒక మండుచున్న పొదలో ఒక అగ్నిస్తంభము యొక్క రూపములో పయనించినది ఆయనే. పర్వతము మీదికి దిగివచ్చినవాడు ఆయనే. యెహోషువా, మోషేలు తప్ప ఆ కొండను తాకిన వారెవరయిననూ బ్రదుకరు. ఇశ్రాయేలీయులను వారి యాత్రలో అరణ్యము గుండా ఎట్లు నడిపించెనో చూడండి. ఈనాడు బయటకు పిలువబడిన జనులకు అది మాదిరి. శాస్త్రీయ పరిశోధన ద్వారా కూడా ఆయన ఇక్కడున్నాడని విజ్ఞాన శాస్త్రమునకు రుజువాయెను. విజ్ఞానముకంటె ముందుగానే ఆయన తన్నుతాను గుర్తింపచేసికొనెను. ఆయన యొక్క క్రియల ద్వారాను, ఆయన యొక్క ప్రవచనముల ద్వారాను, ఈ దినమున ఆయన చేయునని చెప్పిన కార్యముల ద్వారాను, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని రుజువగుచున్నది. పరిపూర్ణముగా బయలు పరచబడినవి. మన హృదయములు మనలో మండటకు అది చాలదా? దేవుడు మిమ్ము దీవించును.
86ఇప్పుడు మనము ఏకమనుస్సుతో నిలబడి, యేసుక్రీస్తును రక్షకునిగాను, బాగుచేయువానిగాను అంగీకరించుచున్నానని చెప్పుదము. [జనులు సాహో బ్రెన్హాం చెప్పినది ఆయన వెంబడి చెప్పుచున్నారు.] ఆయన కృపను బట్టి, ఈ ఘడియు మొదలుకొని, ఓ దేవా, ఏ అవిశ్వాసము, ఎన్నడూ నా హృదయములో ప్రవేశించదు, ఎందుకనగా, ఈనాటి ప్రవచనము నెరవేరుట నేను చూచాను. యేసుక్రీస్తు సజీవుడనియు ఇప్పుడిక్కడుండి, ఈ ఘడియ యొక్క ఆయన వాక్యమును ధృవీకరించుచున్నాడనియు, నమ్ముచున్నాను. ఆయన గూర్చి వ్రాయబడిన ప్రవచనములు మనమధ్య ఇప్పుడు నెరవేరియున్నవి. ఆయన నా రక్షకుడు, నా దేవుడు, నా రాజు, నా సర్వములో సర్వము.
87ప్రియదేవా, మా సాక్ష్యము వినుము, అనుదినము మాకు జీవాహారము యిమ్ము. ఓ దేవా, మా హృదయాంతరంగముల నుండి, మేము నీకు స్తుతి చెల్లించుచున్నాము. సర్వశక్తుడగు వాడా, ప్రవక్తల యొక్క దేవుడా, నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
ఓ ఎట్టి క్షణము, ఎట్టి సమయము!
…….. నమ్మిక మాత్రముంచుము;
నమ్మికమాత్రముంచుము, కేవలము నమ్మికయుంచుము,
సమస్తమూ సాధ్యమే, నమ్మిక మాత్రముంచుము.
ఈలాగు మనము పాడుదము:
ఇప్పుడు నేను నమ్మచున్నాను, ఓ, ఇప్పుడు నేను నమ్మచున్నాను,
సమస్తమూ సాధ్యమే, ఇప్పుడు నేను నమ్మచున్నాను;
ఇప్పుడు నేను నమ్మచున్నాను, ఓ, ఇప్పుడు నేను నమ్మచున్నాను,
సమస్తమూ సాధ్యమే, ఇప్పుడు నేను నమ్మచున్నాను.
అది మీ సాక్ష్యమా?
ఇప్పుడు మనము తలలు వంచి పాడుదము:
మనము కలిసికొను వరకూ, మనము కలిసికొను వరకూ!
యేసు పాదముల యొద్ద మనము కలిసికొను వరకూ;
మనము కలిసికొను వరకూ, మనము కలిసికొను వరకూ!
మనము కలిసికొను వరకూ దేవుడు మీతో నుండును గాక!
[మనము కలిసికొను వరకూ, అను పాటను సహో బ్రెన్హాం ఆలపించనారంభించుచున్నారు.]
…….యేసు పాదముల యొద్ద;
మనము కలిసికొను వరకు, మనము కలిసికొను వరకూ!
మనము కలిసికొను వరకు, దేవుడు మీతో నుండును గాక!
88మనము తలలు వంచియుండగా, సహో వైల్ ప్రార్థనతో కూటమును ముగించడానికి ఇక్కడ నిలబడియున్నాడు. సహో లీ వైల్, ఇక్కడున్న ఆలయమునకు, సాహిత్యము, పుస్తకములు మొదలగువానికి ఆయనే లేఖికుడు. చాలా ప్రశస్త సోదరుడు. చాలా కూటములలో ఆయన నాతో యున్నాడు. ప్రతి సేవకుడు ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడు అవకాశమున్నచో బాగుండునని తలంచుచున్నాను. మీరు అర్ధము చేసికొందురని నిశ్చయముగా నమ్ముచున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి సేవకుని బట్టి మేము సంతోషించుచున్నాము. సంఘ పనిలో లేని వారందరూ, వివిధ సంఘముల ప్రజలు, ఇంకా వారందరినీ ఇక్కడ చూచుట సంతోషము. మరల మనము ఇచ్చట కలిసికొను వరకూ మీ అందరితో దేవుడు ఉండవలెనని మీ ఒక్కొక్కరి కొరకు నిజముగా మేము ప్రార్ధించుచున్నాము. మనము తలలు వంచియుండగా, మన చేతులు ఎత్తియుండగా, నిజ మాధుర్యముతో దేవునికి మరల దానిని పాడెదము.
తిరిగి మనము కలిసికొను వరకూ! తిరిగి మనము కలిసికొను వరకూ!
యేసు పాదముల యొద్ద తిరిగి మనము కలిసికొను వరకూ!
తిరిగి మనము కలిసికొను వరకూ తిరిగి మనము కలిసికొను వరకూ
మనము కలిసికొను వరకూ దేవుడు మీతో నుండును గాక!