నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళును
VGR PARA COUNT-123 స్నేహితులారా, శుభ సాయింత్రం. ఇక్కడున్నందుకు చాలా సంతోషము. (టేపులో ఖాళీ ఉన్నది-సంపా) ఇక్కడకు వచ్చుట మరియు తిరిగి వెనుకకు వెళ్ళుట, కనుక నేను-నేను అనుకున్నాను, మంచిదే, అక్కడ ఆ గది కొద్దిగా చిన్నది అయినప్పటికి, అయితే మనము సంతోషముగానే ఉన్నాము.... ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురో అక్కడ ఆయన ఉండును, మనకున్న కొన్ని అత్యంత ఆత్మీయ కూడికలు కలిగి ఉన్నాము అని మీకు తెలియును. కేవలము మనము ఒక చిన్న గుంపుగా ఉండి, ఒక విధమైన ఒక చిన్న కుటీర ప్రార్ధనా కూడికగా ఉన్న అలా౦టి సమయానికి ఏదో విధముగా దాదాపుగా క్రైస్తవులందరు తిరిగి సంబంధము కలిగి యుందురని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. మనం అతి చిన్న సమావేశాలు కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నిజముగా మన మధ్యకు వచ్చి మరియు మనలను ఆశీర్వదించే నాకున్న కొన్ని అత్యంత ఆశీర్వాద సమయాలు, అది ఆలాటి చోటులోనే ఉండును. “ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామము పేరట కూడియుందురో వారి మధ్యలో నేనుంటాను” అని ఆయన తన చిన్న మందగా ఉన్న సంఘానికి వాగ్ధానము చేశాడు.
2
ఈ రాత్రి లేఖనమునుండి కొంతభాగము చదువుదాము, తరువాత మనము ప్రార్ధించుదాము, మరియు ప్రజల కొరకు ప్రార్ధించుదాము. ఎందుకనగా వారు మనవలె చిన్న గుంపు ప్రజలు దేవుని యొక్క స్వస్థత కృప మరియు శక్తియొక్క రాజ్యములోనికి వచ్చి మరియు బాగవుదురు-ఇది చేయుదునని ఆయన వాగ్ధానము చేసియున్నాడు. ఆయన యొక్క చిత్తము మరియు ఆయన యొక్క దయ మనకు బయలు పరచుటకు అక్కడ కష్టమైన ఏదైననూ చేయకుండ విడిచి పెట్టలేదు. కనుక ఆయనయందు మనము విశ్వాసము కలిగి ఉందాము. అది మంచిది కదా?
ఈ రాత్రి లేఖనము నుండి కొంతభాగము చదవాలని ఆశపడుచున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయము, 20వ వచనము నుండి ప్రారంభము ఇది ఎల్లప్పుడు నాకు ఎంతో ఇష్టమైన భాగము (అంశము) అనెను...
ఇదిగో త్రోవలో నిన్నుకాపాడి, నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినైయుందును.
ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళును......
ఇప్పుడు, కొన్ని నిముషాలు కొరకు నేను ఆఖరి భాగమును తీసుకోవాలి అనుకుంటున్నాను లేదా ఆఖరివచనములో పద సముదాయము నుండి మొదటి భాగము “నా యొక్క దూత నీకు ముందుగా వెళ్ళును.”
3
దేవుడు అన్ని కాలములలో భూమిమీద తనకొరకు ఒకరిని కలిగి ఉంటాడు. ఆయన భూమిని కలిగి ఉన్నప్పటినుండి, ఆయన మొదలు పెట్టెను. ఆయనకు సమయము అనునది లేదు. కానీ ఆయన ఏమైయున్నాడు. తన చేతులను ఉంచి పంపుటకు ఒకరిని కలిగి ఉంటాడు.
మరియు మనము మాట్లాడుచున్న ఈ సమయములో నేను చదివిన లేఖనము నందు ఇశ్రాయేలు పిల్లలను విమోచించుటకు ఆయన మోషేను పంపియున్నాడు. ఇప్పుడు పంపబడినవాడు మోషేకాదు. మోషే ఒక సాధనము లాంటివాడు.
ఇప్పుడు, దేవుడు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండునని నా హృదయమునందు విశ్వసించుచున్నాను. అన్ని కాలముల గుండా ప్రతికాలములోను, ఆయన ఆదియందు ఏమైయున్నాడో అదే విధముగా ఉండెను. ఆయన పితృత్వరూపములో బయలు పరచబడెను ఆయన కుమారుని రూపములో బయలుపరచబడెను; ఇప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ రూపములో బయలు పరచబడెను.
ఇప్పుడు, మనము క్రైస్తవ సిద్ధాంతము ద్వారా కాదు గానీ, పరిశుద్ధాత్మ శాసనము ద్వారా జీవించుచున్నాము. అది సంఘములోని పరిశుద్ధాత్మయొక్క కార్యములైయున్నవి. వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమైయున్నది అనుదానికి ఆ సంఘము యొక్క ప్రతిస్పందనలైయున్నవి. మనము జీవించుచున్న ఈ దినము మరపురానిది, అన్ని కాలముల కన్నా గొప్ప సమయము మనము ప్రపంచ కార్యముల యొక్క ముగింపు దశనందు జీవించుచున్నాము. కాలముగుండా హెబ్రీ ప్రవక్తలు పలికినట్లుగా—, ఎంతోకాలము నుండి మనమ ఎదురుచూచుచున్న ఆ గొప్ప యుగములోనికి ప్రవేశించి స్థిరపడుదము.
4
దేవుడు ఎల్లప్పుడు తన చేతులను ఉంచుటకు ఒకరిని కలిగి ఉంటాడు.
ఇప్పుడు, మోషే ఒక యోగ్యమైన బాలునిగా పుట్టెను. అతడు తన నాయకత్వములో ఇశ్రాయేలీయులను బయటకు తీసుకురావలెనని దేవుడు నియమించి ఉండెను. మరియు అతడు ఐగుప్తునకు వెళ్ళకముందు అతడు పిలువబడిన తరువాత, అతడు ఉదయవేళ ఎడారిలో మామగారైన యిత్రో యొక్క గొర్రెలు కాయుచుండగా, అతడు మండుచున్న పొదను చూచెను.
ఇప్పుడు, అది ప్రభువు యొక్క దూత మొదటిసారి కనుపరచుకొనుట అని నేను నమ్ముచున్నాను. ఆయన మండుచున్న పొదలో ఉన్నాడు. మరియు తరువాత దేవుడు మోషేకు ఆజ్ఞాపించి, మరియు అతడు ఏమి చేయవలెను అనునది అతనికి చెప్పి, ఆయన అతనికి ముందుగా, ఐగుప్తునకు వెళ్ళెను. మరియు వారు బయటికి వచ్చినప్పుడు, ఆయన మరలా అగ్ని రూపములో ఒక అగ్ని స్థంభముగా ఉండెను.
మరియు ఈ అగ్నిస్థంభము ఇశ్రాయేలు పిల్లలను నడిపించెను, మండుచున్న పొదలో ఉన్న అదే దూత అది మండుచున్న పొదలో ఉన్న అదే అగ్ని స్థంభమైయుండెను.
5
మరియు ఆ అగ్ని స్థంభము లేదా దూత అది నిబంధన దూత, బోధకులు అందరు దీనితో ఏకీభవించుదురు అని నేను నమ్ముచున్నాను. అది నిబంధన దూత. అది నిబంధన దూత అయినట్లయితే అప్పుడు ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ.
ఐగుప్తు ధనముకంటే దేవుని గూర్చిన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకొనెను. చూశారా? క్రీస్తు ..ఆ క్రీస్తు లోగోస్ అయి ఉండెను. ఆ నిబంధన దూత ఇశ్రాయేలు పిల్లలను ఐగుప్తు బయటకు తెచ్చి వాగ్ధానభూమికి నడిపించినది. అది ఒక ఛాయ మాత్రమే. ప్రకృతి సంబంధంగా ఆయన చేసినది. తరువాత ఈ రోజు ఆయన ఆత్మీయముగా చేయుచున్నాడు.
ఇప్పుడు, వారి యొక్క అవసరాలు అన్నీ తీర్చుదునని ఆయన వాగ్ధానము చేసియున్నాడు. వారికి నీళ్ళు అవసరము అయినప్పుడు వారు బండనుండి పొందారు. వారికి ఆహారము అవసరము అయినప్పుడు దేవుడు ఆకాశమునుండి క్రిందకు కురిపించెను. అది గాలిచేత విసరగొట్టబడెను. మరియు నీళ్ళు చేదుగా ఉన్నప్పుడు, అవి తియ్యగా మార్చెను. మరియు వారి అవసరాలకు దేవుడు సమస్తము సిద్ధపరచెను.
6
శిబిరములోనికి వ్యాధి ప్రవేశించినప్పుడు, ఆయన ప్రాయశ్చిత్తము ఏర్పాటు చేసెను. ఇబ్బందికర సమయములో సహాయము చేయుట ద్వారా దేవుడును అయి ఉందునని, ఆయన వాగ్ధానము చేసెను.
మరియు ఇప్పుడు, ఆయన అప్పుడు ఉన్నట్లుగానే .......ఆయన ఈ దినమున ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నడిపించిన అదే దేవుని ఆత్మ ఈ దినమున సంఘమును నడిపించుచున్నది. అరణ్యము నుండి వాగ్ధాన భూమికి దానిద్వారా మనలను తీసికొని వచ్చును.
మనకు వాగ్ధాన భూమి ఉన్నది. మీరు దానిని నమ్ముచున్నారా? “నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును. మరియు మరలా నేను వచ్చుదును. మరియు నేను మిమ్మును స్వీకరించుదును.” మనము మన మార్గమందు ఉన్నాము. దేవుడు మనకు వాగ్ధానము చేసిన ఆ మహిమకరమైన వాగ్ధానభూమికి వెళ్ళుచున్నాము.
7
ఇప్పుడు, ఈ ప్రయాణములో మన సమస్త అవసరములను తీర్చుదునని ఆయన వాగ్ధానము చేసెను. “నా నామము పేరట మీరు తండ్రిని ఏమి అడిగిననూ నేను చేతును.” ఏమైననూ (మార్కు 11:24) నీయొక్క కోరిక ఏదైనప్పటికి నీవు ప్రార్ధించినప్పుడు విశ్వసించినట్లయితే దానిని పొందుదువు. అది నీకు అనుగ్రహించబడును. ఇప్పుడు, ఆయన మనకు ప్రపంచములోకెల్లా అత్యంత శక్తివంతమైన ఆయుధమును ఇచ్చెను. అదియే ప్రార్ధన. ప్రార్ధన స్థితిగతులను మార్చును. సర్వశక్తిమంతుడైన దేవుని యెదుట యేసుక్రీస్తు నామము పేరట మోకరించినప్పుడు, అతని మోకాళ్ళ ప్రార్ధన ఎంత శక్తివంతమైనదో క్రైస్తవుడు గుర్తించలేకపోవుచున్నాడు. అది “ఎంత శక్తి వంతమైనదో దానిని గుర్తించలేకపోవుచున్నాడు. మనకు ఇవ్వబడిన హక్కు ఏమిటి అనేది ప్రజలు గుర్తించగలిగినట్లయితే, నీవు చాలినంత విశ్వాసముతో విశ్వసించినట్లయితే నీవు ఏది అడిగినప్పటికి అది నీకు అనుగ్రహింపబడును. ఏలయనగా దేవుని యొక్క వాక్యము సత్యమైయున్నది.
8
మరియు ఇప్పుడు, దేవుని వాక్యము ఏ సమయములోనైనా, ఎక్కడైనా ఏ స్థలములోనైనా సాతానుని జయించును. ఇప్పుడు, యేసు ఇక్కడ భూమిమీద ఉన్నప్పుడు, ఆయన ఇమ్మానుయేలు అయి ఉండెనని నేను నమ్ముచున్నాను. దేవుడు క్రీస్తులో ఉండి తనంత తాను లోకమును సమాధానపరచుచుండెను. ఆయన భూమిమీద ఉన్నప్పుడు తండ్రి యొక్క గొప్ప గుణలక్షణములన్నియు కుమారుడైన యేసు క్రీస్తులో ఉండెను. తండ్రి ఏమైయుండెనో ఆయన అదే అయిఉండెను. మరియు దేవుని యొక్క గొప్ప వరములు అన్నియు క్రీస్తులో ఉండెను.
కానీ ఆయన సాతానుని కలుసుకొనినప్పుడు ఆయన ఎన్నడూ ఎలాటి వరములను ఉపయోగించలేదు. ఆయన మీకు మాదిరై ఉన్నాడు. అతిబలహీన కైస్త్రవుల వద్దకు ఆయన తెచ్చెను. ఆయన చెప్పెను. ఇప్పుడు, ఆయన -ఆయన అప్పుడు సాతానుని ఓడించి, తన వద్దనుండి తరిమివేసే శక్తిని కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఏమి చేసెను? ఆయన ఎన్నడు తనకున్న శక్తిని ఉపయోగించలేదు. సాతాను చెప్పెను, నీవు దేవుని కుమారుడవు అయినట్లయితే, అక్కడ ఎల్లప్పుడు దేవుని వాక్యమును ఒక ప్రశ్నతో సాతానుడు అడ్డుపడును. కాబట్టి అతడు అన్నాడు, “నీవు దేవుని కుమారుడవు అయినట్లయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు.
“ఇప్పుడు, యేసు చెప్పెను, ”మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గానీ దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలన అని వ్రాయబడియున్నది.“
ఎతైన ప్రదేశమునకు (దేవాలయ శిఖరమునకు) అతడు ఆయనను తోడుకొనిపోయి మరియు చెప్పెను, వంగి నమస్కరి౦చుము.
యేసు చెప్పెను, లేఖనము వద్దకు తిరిగి వచ్చెను. తరువాత ఎతైన పర్వతమునకు తోడుకొనిపోయి లోకరాజ్యములు అన్నింటిని చూపించి మరియు చెప్పెను “నీవు క్రిందకు వంగి నన్ను ఆరాధించినట్లయితే వీటిని నీకు ఇచ్చెదను.
“యేసు చెప్పెను, ”అది ఈలాగున వ్రాయబడియున్నది...“ చూశారా, నిరంతరముగా, ”అది ఇలా వ్రాయబడియున్నది; “అది ఇలా వ్రాయబడియున్నది.”
9
మరియు నీవు వాక్యముతో సాతానుని ఎదిరించినప్పుడు, అతడు ఎంత “బలహీనుడుగా ఉండగలడో అంతగా అవుతాడు. చూశారా? మంచిది ఏదైనా, అది ఏమైనప్పుటికి నేను లెక్కచేయను.
అది నాలో లేదు. మీ సంఘకాపరిలో లేదు ప్రార్ధించుటకు.... మీతో కలసి ప్రార్ధించుటకు మన అందరికొరకు, కానీ స్వస్థత కొరకు నీవు తప్పక నీయొక్క సొంత వ్యక్తిగత విశ్వాసము కలిగి ఉండాలి.
ఇప్పుడు, యేసు మొదట తండ్రి తనకు దానిగురించి చూపించితేనేగానీ, ఎన్నడూ ఎవరిని స్వస్థపరచలేదు. ఇప్పుడు, గతరాత్రి యోహాను 5:19 మనము కలిగి ఉన్నట్లుగానే ఆయన చెప్పెను. నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గానీ తనంతట తాను ఏదియు చేయనేరడు.”
ఒకరోజున వీధిలో ఇద్దరు గ్రుడ్డివారు ఆయనను వెంబడించుట గమనించు. వారు గ్రుడ్డివారు “మమ్మును కరుణించు, మమ్మును కరుణించు” అని వారు అరచుచున్నారు. ఆయన అలాగే నడచుచున్నాడు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, వారు గుడ్దివానిని ఆయన యొద్దకు తెచ్చిరి. మరియు ఆ గ్రుడ్డివారు “మమ్మును కరుణించు” అని ఆయనను అడిగిరి.
“నీవు నమ్ముచున్నావా”? అని ఆయన అడిగెను.
“అవును” అనెను.
అతడు ఆయన వారి కన్నులను ముట్టి “మీ నమ్మిక చొప్పున ..” అని చెప్పెను. అది నిజము కాదా? “మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక” చూసారా? మరియు వారు విశ్వాసము కలిగి ఉండిరి.
ఆయన వస్త్రపు చెంగును ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆయన చెప్పెను, “నీ విశ్వాసము, (నా శక్తి కాదు) నిన్ను సంపూర్ణురాలిగా చేయును. చూశారా, చూశారా? ”నీ విశ్వాసము,“ చూసారా?
కానీ, ఆయన వెళ్ళి తండ్రి ఏది చూపించెనో అదే ఆయన చేసియుండెను.
10
ఇప్పుడు, ఈ దినమున ఆయన ఆత్మ మనతో ఉన్నది. తండ్రి ఏది చూపించునో అది బయలుపరచబడును. అది జరిగిపోయినది. నీ ప్రార్ధనా విజ్ఞాపన కొరకు, అక్కడ ప్రార్ధిస్తూ ఉండు, నీవు ఆ విధముగా కూర్చుని ప్రార్ధిస్తూ ఉండినప్పుడు, మరియు తండ్రి ఏమి నిర్ణయించునో, మరియు నీ యొక్క విశ్వాసము ఒక ఆధారము పైకి కదలి వచ్చి మరియు ఇలాగనును, అవును నేను ఇప్పుడు ఇది సరిగా నమ్ముచున్నాను. నేను ఇప్పుడు దీనిని సరిగా అంగీకరించుచున్నాను. నేను ఇప్పుడు దీనిని సరిగా నమ్ముచున్నాను. అవును, నేను ఇప్పుడు నమ్ముచున్నాను. నేను ఇప్పుడు సరిగా దానిని అంగీకరించుచున్నాను. నేను ఇప్పుడు దీనిని సరిగా నమ్ముచున్నాను.“
ఇప్పుడు, తండ్రి నావైపు తిరిగి మరియు ఇలా చెప్పుట నేను వినియున్నాను. “అతనికి ఒక ఖచ్చితమైన విషయము ఉన్నది. మరియు అది పోయినది. అని అతనికి చెప్పుము.” చూశారా? కానీ దానిని నాయంతట నేను చేయలేను. అది అయిపోయినది అని మాత్రమే నేను చెప్పగలను. అది అయిపోయినది అని ఆయన నాకు చెప్పినట్లయితే అది జరిగినదని మాత్రమే నేను చెప్పియుందును. చూశారా? నా భావము ఏమైయున్నదో చూశారా?
ఇప్పుడు, ఆయన నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడని చూపించుచున్నది... నేను మీ కొరకు ప్రార్ధించగలను మరియు మీ నమ్మిక చొప్పున అది మీకు కలుగును. కానీ ఆయన మీకు ఏదైనా చెప్పమని నాకు చెప్పిన యెడల, దైవిక వరము ద్వారా ఆ వర్తమానమును తీసుకువచ్చి, ఆయన ఏమి చెప్పెనో దానిని మీకు చెప్పెదను.
ప్రత్యేకమైన ప్రజల వలే, మీరు సాక్ష్యములు వినియున్నారు. సాక్ష్యముల కొరకు నేను ప్రయత్నించుటలేదు. బాక్స్‌టర్ కొన్ని సమయాలలో వాటిని కలిగి ఉన్నాడు. నేను కూడ వాటిని కలిగి ఉన్నాను. చాలామంది వేలకొలది సాక్ష్యములు ప్రపంచ మంతటా ఆయన ఏమి చేసాడో వినియున్నారు. గొప్ప మనుష్యులు, కాంగ్రెస్ సభ్యుడు అప్‌షా మరియు వారు మరియు ప్రత్యేకముగా, ఫ్లారెన్స్ నైటింగేల్‌వారు స్వస్థత పొందియున్నారు.
ఆ తరువాత వారు స్వస్థపడినప్పుడు (మీరు చూసారా?) ఆయన మాట్లాడును. మరియు ఖచ్చితముగా చెప్పును మరియు నేను.. అది ఏమైనప్పటికి ప్రతిసారి దాని మార్గము ఆ విధముగా ఉంటుంది. ఇప్పుడు, మీరు కోరిన ఎక్కడికైనా, ఏ మనుష్యుని ఏ సమయములోనైనా వారు ఎప్పుడైనా వినులాగున “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” లేదా ప్రభువు యొక్క నామములో ఒక ఖచ్చితమైన విషయము సంభవించును అని చెప్పుము. అది ఆ విధముగా ఉండును చూశారా? లేదా దేశముల గుండా నా యొక్క అడుగులు (పాదముద్రలు) మీరు వెనుకకు తిరిగి చూడగలరు. మరియు ఎన్నడైనా ఒకసారి, “యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని” నేను మాట్లాడినది చూచినట్లయితే మరియు ఒక విషయము చెప్పినప్పుడు ఇది ఎన్నడు విఫలము కాలేదు.
11
కేవలము నేను ఒక చిన్నబిడ్డగా ఉండగా, అది మొదటిగా సంభవించెను. అది లోనికి ప్రవేశించునప్పుడు, నేను కేవలము మూడు నిముషాల వయస్సులో ఉన్నాను. అయితే జీవితమంతటిలోను ప్రతి సమయములోను నేను మార్పు చెందుటకు ముందు కూడ ....వరములు పిలుపులు మారుమనస్సు లేకుండానే వచ్చును. మీకది తెలియును. అనేకులను గూర్చి నేను తలంచినది అక్కడే....
మరియు చూడండి నేను పెంతెకోస్తు సంఘములో క్రొత్తవాడను. నేను బాప్టిస్టు సంఘమునుండి వచ్చాను. ఆ విధముగా అక్కడ ఒక దైవిక వరమున్నదని అప్పుడు బాప్టిస్టు ప్రజలు చూడలేకపోయారు. ఆ పెంతెకోస్తు ప్రజలు దానిని నమ్మారు. కనుక ' దేవుడు నన్ను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపారు. అక్కడే నేను ఇంటివలె భావించాను. నేను మీలో ఒకని అయి ఉన్నాను. (చూశారా?), ఎందుకనగా నేను పరిశుద్ధాత్మను పొందాను, మరియు అప్పుడు దేవుడు నాకు ఆ కార్యమును ప్రత్యక్షపరిచాడు; నేను బయలుదేరాను. అయితే అప్పటి నుండియే ...... ఆ భాగము దానికదే, ఒక బిడ్డనై ఉన్నప్పటినుండి ఉన్నది. వరములు పిలుపులు మారుమనస్సు లేకుండానే వచ్చును. మీరు దానిని నమ్ముచున్నారా? మీరు లేఖనమును నమ్మిన యెడల....
యేసుక్రీస్తు దేవుని కుమారునిగా ముందుగా నిర్ణయించబడెను. ఏదేను
తోటనుండి సర్పము యొక్క తలను చిదుగ గొట్టుటకు ఆయన స్త్రీ యొక్క సంతానమైయుండెను. మీరు దానిని నమ్ముచున్నారా?
మోషే వలె ఉండుటకు మోషే ఏ సహాయము చేసికొనియుండలేదు. అతడు యోగ్యుడైన బిడ్డగా పుట్టియుండెను. అతడు అలా ఉండుట వారు చూశారు. మరియు అతడు అలా ఉండెనని ఎరిగియున్నారు. మరియు దేవుడు వానిని సరిగా ఫరో యొక్క ముక్కు క్రిందనే (అనగా ఫరో ఇంటిలోనే) పెంచాడు, అతడు అలా పెరగలేదా? అది సరియే గదా? అతడు దానికి ఏ సహాయము చేసికొని యుండలేదు.
బాప్తిస్మము ఇచ్చు యోహాను, ఏడువందల పన్నెండు సంవత్సరములకు ముందే పుట్టియుండెను, అతడు అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమై యుండెను. అది యధార్థమే గదా?
12
ప్రవక్త అయిన, యిర్మియాను గూర్చి, దేవుడిలా చెప్పెను, “నీ తల్లి యొక్క గర్భములో నీవు రూపింపబడకముందే, నేను నిన్ను ఎరుగుదును, మరియు జనముల మీద ప్రవక్తగా నియమించాను” అది సరియే గదా? అతడు అతని యొక్క తల్లి గర్భములో రూపింపబడకముందే .... చూడండి, వరములు పిలుపులు మారుమనస్సు లేకుండానే వచ్చును. చూశారా? దేవుడు వాటిని ఇచ్చును.
నీవు నీలి రంగు కన్నులు కలిగియున్న కారణానికి నీకు నీవు సహాయము చేసికొనలేవు. “మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసికొనగలడు? కాబట్టి ఈనాడు ఆ కార్యము ఒక (ఇజము) సొంత వాదముల యొక్క గుంపుగా లోకములోనికి బయలు వెళ్ళినది, మీరు చూడండి, మరియు అది సంపూర్ణముగా, అది ఏమియు కాదు గానీ, దేవుని యొక్క నిజకార్యము నుండి దానిని దూరముగా తీసికొనిపోవుటకు ప్రయత్నించుచున్న సాతానుడు చేయుచున్న ఒక క్రియ. మరియు అది ఏమైయుండెననగా పెంతెకోస్తు ప్రజలైన మీరు మరియు బాప్టిస్టులు మొదలైన ప్రజలందరు యుగాలనుండియు ఇప్పటి వరకు కలిగియున్నారు, అలా వారు ఏమియు ఎరుగనిదాని గూర్చిన ఏదో సంగతిని గూర్చి అనుకరించుటకు ప్రయత్నించుచున్న ఎవరో వ్యక్తి అయి ఉందురు. అది ఊరక నిలచి ఉండుటయే శ్రేష్టమైనదిగా ఉండును” “ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరెడు ఎక్కువ చేసికొనగలడు?”.
ఒక ప్రత్యేకమైన కార్యము చేయుటకు దేవుడు నిన్ను కోరినయెడల, ఆయన ఈ భూమిమీద అలాగే ఉండుటకు ఆయన నిన్ను తీసికొనివచ్చును. చూశారా? ఆయన ఒక కార్యమును చేయుటకు నిన్ను పిలచిన యెడల, ఒక మనిషి చెప్పిన విధముగా, “సరేగానీ, నేను బోధకునిగా ఉండిన యెడల నేను ఇంకా ఎక్కువ ధనమును కలిగియుండగలనని నమ్ముచున్నాను. నీవు ఎన్నటికి ఒక బోధకునిగా తయారు చేసికొనలేవు. ఒక బోధకునిగా ఉండుటకు దేవుడే నిన్ను పిలువవలసి యున్నది. ప్రభువు వానిని పంపని యెడల, ఒక బోధకుడు ఎట్లు బోధించగలడు. అది సరియైనదే గదా? అదంతా దేవునిలో ఉన్నది. సమస్తము తిరిగి సరిగా ఆయన యొద్దకే వచ్చును, అది సరియే గదా? ఆయన ఆ కార్యక్రమమును చక్క బెట్టును. మనం కేవలము అలాగే వరుసలో ఉ౦డవలెను, మీరు చూశారా? మరియు అదే సరియైనదిగా మోసికొనిపోవును.
13
ఇప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితము, సూర్యుని వెలుగుకాకుండ అక్కడ ఏ ఇతరమైన వెలుగు లేదని ఏ ప్రజల ద్వారానైనను అది ధృఢముగా నమ్మియుండలేదు. విమర్శకులు మరియు విజ్ఞానశాస్త్ర ప్రపంచము ఒకప్పుడు నవ్వారు, మరియు ఇలా అన్నారు, ఆయన బైబిలు వ్రాసినప్పుడు దేవుడు పలుకబడిన దేవుని మాట నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళును. భయంకరమైన పొరపాటు చేయలేదా?“ అనెను, ”ఆయన సూర్యుని సృష్టించక ముందే ఆయన ఆకాశవిశాలమును చేసెను,“ అదే ఉద్దేశ్యము. ఆయన సూర్యుని చేయకముందు అలా ఆయన ఆకాశవిశాలమును చేసెను, అక్కడ సూర్యుని వెలుగు కాకుండ అలాటి మరే కార్యము లేదు. ”మరియు మీ దేహము పూర్తిగా మొత్తమంతా వెలుగుతో ఉండెనని ఆ విధముగా అపోస్తలుడు చెప్పెను.
సరేగానీ, విజ్ఞాన శాస్త్రము లక్ష్యముంచి మరియు సాత్వీకమైన ఆత్మతో లోతుగా చూచి మరియు దానిని త్రవ్విన యెడల దేవుడు చెప్పినదే సరియైనదని ఋజువు చేయబడెను.
ఇప్పుడు అక్కడ సూర్యుని వెలుగు కాకుండ సమృద్ధియైన వెలుగుండెను. ఉదాహరణముగా ఎక్స్-రే. అలాకాదు అది పనిచేయుటకు సూర్యునితో పనిలేదు. అయితే నీ యొక్క మొత్తము శరీరము ప్రతి చిన్న కణము, చిన్న అణువు ఒక వెలుగైయున్నది. మీరు పూర్తిగా వెలుగుతో నింపబడి తయారు చేయబడ్డారు. వారు ఆ విధముగా మీరు పూర్తి వెలుగుతో నింపబడి తయారు చేయబడ్డారనియు, ఆ విధముగా బైబిలు చెప్పినదే సరియైనదనియు వారు కనుగొన్నారు, ఎందుకనగా విజ్ఞానశాస్త్రజ్ఞులు దానివైపు ఒక సహజసంబంధమైన ప్రమాణ పరిధిలో చూచుట లేదు, మీరు దానిని అవగాహన చేసికొనలేరు. ఆత్మీయ సంగతులు ఆత్మీయ వివేచన ద్వారానే అవగాహన కలుగజేయును. కనుక ఆ విధముగా ఆ బైబిలే సరియైనదిగా ఉండెనని వారు ఋజువు చేసారు.
14
కొంతకాలము క్రితము, అక్కడ అలా నిజముగా నమ్మిన ఒక మనిషి ఉండెను. అక్కడ ఆ విధముగా విద్యుత్ను ఉత్పత్తి చేయుటకు నిరంతరము శ్రమపడుచుండెను, అతడు ఒక గాలి పటము అతడు కలిగియుండెను. మరియు అతడు దానితోక యొక్క చివర ఒక తాళముతో ముగింపచేసెను, అయితే తుదకు అతడు ఏమి ఆలోచించాడో అది పట్టుకొన్నాడు, అతడు ఏమి నమ్మాడో అది యధార్ధము, ఎందుకనగా..... ప్రజలు అతనివైపు చూచి నవ్వారు, అయితే అతడు, అతని హృదయములో అలా అది సరియైనదని అక్కడ ఏదో ఒకటి అక్కడే అతనితో చెప్పెను. కాబట్టి అతడు సరిగా దానితోనే నిలబడెను.
కొంచెము కాలము తరువాత, దీపములో మనకు విద్యుత్ను ఇచ్చిన మనిషి థామస్ ఎడిసన్, దానిని అతడు నమ్మాడు. ఆ విధముగా విద్యుత్ను విద్యుత్ ద్విశ్లేష.. . ఒక తీగ ద్వార తీసికొని వెళ్ళవచ్చును. పదివేల తీగెలు, అతడు ఉపయోగించెనని నేను ఊహించుచున్నాను. అతడు ఈ రకమైన ఒక లోహమును ఉపయోగించెను. అది పనిచేయలేదు. అక్కడ రాత్రి సమయములో, ఒక కప్పు కాఫీని అక్కడ ఉంచుకొనెను. మరియు అల్పాహార రొట్టెను మరియు అలసిపోకుండ అతడు ఉండుటకు అలా చేసెను, అయితే ఇంకా అతని హృదయములో అలా ఏదో ఒకటి అతనితో చెప్పెను, ఆ విధముగా వెలుగును పుట్టించగల విద్యుత్ యొక్క మంటను అతడు పుట్టించగలననుకొనెను. ఇపుడు సరే గానీ, అతడు ప్రారంభములోని ఆ చిన్నదైన తీగతో ఆగలేదు. కేవలము అతడు దానిని ఒక ప్రక్కకు పెట్టెను మరియు మరొక దానికై ప్రయత్నించెను.
15
అయితే, మనం, మనం కాదు... దేవుని యొక్క ఆత్మసంబంధమైన పరిధిలో సంబంధము కలిగియున్న మనము, మనము...“ సరేగానీ, నేను దాని కొరకు ప్రార్ధించాను మరియు నాకు స్వస్థతకలుగలేదు. కనుక దానికి అక్కడ ఏమియు లేదని నేను ఊహించుచున్నాను.”
“ఓహ్, దేవుని కొరకు ఏలాటి ఒక అల్పమైన దిష్టిబొమ్మను తయారు చేశావు. చూశారా?
చూడండి, లేదండి. ఎవరు ఆగరో అలాటి ఎవరో వ్యక్తిని దేవుడు కోరును. జయించువాడు ఎన్నడు ఆగడు మరియు చాలా తేలికగా మానివేసే సందేహించే వ్యక్తి ఎన్నడు జయించడు. నీవు నిలబడి మరియు దానిని పిలువవలెను, సాతాను ఎదుటకు సరిగా ఆ సంగతులను పిలువవలెను. “అది ఈ విధముగా ఉన్నది. ”యెహెూవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు...“ అని వానితో చెప్పుము. ప్రభువు అలా చెప్పెను. ”మరియు అది....“ ”ఈలాగు వ్రాయబడియున్నది.....“ ”అది ఈలాగు వ్రాయబడియున్నది.....“ ”అది ఈలాగు వ్రాయబడియున్నది.....“ అతడు ఏమి చెప్పినను ఏమియు కాదు, ”అది వ్రాయబడియున్నది,“ అని సరిగా అక్కడే ఉన్నది అని వానితో చెప్పుము.
“సరే గానీ, బ్రాన్హాం సోదరుడు నన్ను ఎన్నడు ముట్టలేదు.”
“అది ఇలా వ్రాయబడియున్నది.....” బ్రాన్హాం సోదరుడు ఎన్నడు స్వస్థపరచలేదు. దేవుడే నీకు స్వస్థత ఇచ్చెను. అది ఇది వరకే జరిగియుండెను. “అది ఈలాగు వ్రాయబడియుండెను.....” నేను ఏమి అడిగియున్నను మరియు దేవునియందు విశ్వసించునప్పుడు, నేను అది పొందగలను. అది నాదైయున్నది. నాయొక్క వ్యక్తిగత సంపద అయి ఉన్నది.
16
ఆ తరువాత ఎడిసన్, ఘడియ వెంబడి ఘడియ, అతని హృదయములో ఏదో ఒకటి ఉంది.... వారికి ఎన్నడూ అంతకుముందు విద్యుత్ లేదు, అయితే... ఒక దీపమును వెలిగించుటకు, అయితే ఎడిసన్ అది ఆ విధముగా జరుగునని నమ్మెను. మరియు తుదకు అతడు దానిని జయించెను, ఎందుకనగా అతని హృదయములో ఏదో ఒకటి అది ఆ విధముగా జరుగగలదని చెప్పెను.
మరియు ఇక్కడ లోపల ఆ విధముగా అది జరుగునని అక్కడ ఏదో చెప్పుచున్నంత కాలము, దానికి అలా స్పందించుటకు అక్కడ బయట ఏదో ఒకటి అక్కడ ఉండవలెను. అది యధార్ధము.
అతడు తన పొరుగువానితో ఒక టి.వి ని గూర్చి, ఒక తరంగము ఆ విధముగా గాలి ద్వారా కంపించుచు ఒక చిత్రమును కూడ చూపించునని మాట్లాడునప్పుడు నీ ముత్తాత (తాత....) ఏమి చెప్పియుండును. ఎందుకనగా, “అతనికి మతిపోయినది.” అని అతడు చెప్పియుండును, అయితే అక్కడ గాలి తరంగము అక్కడ ఉండెనని ఎవరో ఒక వ్యక్తి నమ్మాడు. మరియు దానిని విశదీకరించలేకపోయెను. దేవుడు దానిని ఇక్కడ ఉంచెను. ఇప్పుడు అతడు గాలిలో ఉన్న తరంగమును అతడు ఏలాగు ఆలోచించెను? మనం అది కలిగియున్నాము; మనకు టి.వి ఉన్నది, మనకు లేదా నిశ్చయముగా మనము కలిగియున్నాము. రేడియో మరియు మొదలైనవి. అది ఏలా జరిగెను? ఎందుకనగా మానవ హృదయములో అడుగున ఏదో ఒకటి అలా చెప్పెను, “అది అక్కడే ఉన్నది” అంతలో అది ప్రదేశములోనికి ప్రవేశించెను. మరియు అది దానిని పట్టుకొనెను, మరియు దానిని ఇక్కడ బయటకు తీసికొని వచ్చెను. మరియు దానిని ప్రపంచమునకు ఇచ్చెను.
17
ఇప్పుడు, సహెూదరీ, సహోదరుడా, నీవు కోరిన యెడల నీవు నన్ను మూఢునిగా పిలువగలవు, కానీ అలా అక్కడ దేవుని యొక్క ఒక శక్తి ఉన్నదని నేనెరుగుదును. మొదటి విషయము, ఎందుకనగా దేవుడు చెప్పెను. రెండవ విషయము ఎందుకనగా ప్రతి అనారోగ్యమును స్వస్థపరచుటకు అక్కడ దేవుని యొక్క ఒక శక్తి కలదని అక్కడ లోపల నా హృదయములో అక్కడ ఏదో ఒకటి ఉండి అలా చెప్పుచున్నది. నేను అది నమ్ముచున్నాను. మరియు నేను దానిని నమ్ముచున్నంత కాలము, నేను నా జీవితమును జీవించగలను (చూశారా?) అలా అది సత్యముగా ఉన్నదని నేనెరుగుదును. మొదటగా అది దేవుని వాక్యము, మరియుూ అది అక్కడే ఉన్నదని అక్కడ నా హృదయములో ఏదో ఒకటి ఉండి నాతో, చెప్పుచుండెను.
నేను ప్రతిచోటను ప్రతి తీగను పరిశోధించుచున్నాను. ఆ విధముగా దానిని సంఘములోనికి మనం పొందగలుగునట్లు ఒక స్థానమును కనుగొనుటకు ప్రయత్నించుచున్నాను. మూఢభక్తిగలవారు లేచి మరియు వెళ్ళెదరు, అయితే, దేవుడు...... నీవు ఆ దినమును చూడగలవు. ఈనాడు దానిగూర్చి వారు మనవైపు చూచి నవ్వుచున్న ఆ గొప్పశక్తితో యేసుక్రీస్తు సంఘము దాని పాదముపైనే నిలబడగలదు. అది విద్యుత్‌శక్తి తీసుకురాబడిన విధముగానే ఉండును, కారణము ఏమనగా అది అక్కదే ఉన్నది అని అక్కడే మానవుని హృదయములో అడుగు భాగములో ఏదో ఒకటి చెప్పును. చూశారా? అది ఎవరనగా దేవుని యొక్క అదే దూత!
18
ఇప్పుడు చూడండి. దావీదు చెప్పెను, “అల అలను పిలచినప్పుడు ...”అక్కడ ఒక అల అలను పిలచుచున్న యెడల, ఆ పిలుపునకు స్పందించుటకు అక్కడ ఒక అల ఉండవలసియున్నది.
ఇక్కడ నేను తరచుగా ఆ దృష్టాంతమును ఉపయోగించుచున్న విధముగా, ఒక చేప వీపు మీద పొలుసు ఉండటానికి ముందు, ఆ లోపల ఈదుటకు దానికొరకు మొదటగా అక్కడ నీరు ఉండవలెను. లేదా దానికి పొలుసు ఉండియుండదు. అది సరియేనా? భూమిమీద ఒక పుష్పము వికసించుటకు అక్కడ ఒక చెట్టు ఉండుటకు ముందు, అక్కడ మొదట దానికొరకు భూమి... ఆ పుష్పము వికసించుటకు భూమి ఉండవలెను, లేదా అక్కడ పుష్పమే ఉండదు. అది సరియేనా?
ఇప్పుడు, ఇక్కడ కొంతకాలము క్రితము, నేను ఎక్కడో ఒక చిన్న బిడ్డ కలిగియున్న దానిగూర్చి చదివాను...... బాక్స్‌టర్ సహోదరుడు మరో దినమున ఒకనిగూర్చి నాతో చెప్పుచుండెను, ఆవిధముగా ఒక చిన్న బిడ్ద ఉప్పు, ఉప్పు, ఉప్పు అని తృష్ణ కలిగియుండెను. అంతలో వారు ఆ బిడ్డనుండి ఉప్పును తీసి పారేశారు, దానిని అతడు కలిగియుండకుండ చేశారు. ఆ బిడ్డ చనిపోయెను. వారు పోస్ట్ మార్టమ్ జరిగించారు. మరియు అలా ఉప్పు కలిగియుండుటకు ఆ బిడ్ణయొక్క దేహములో అక్కడ ఏదో ఒకటి ఉన్నట్లు కనుగొనిరి. అంతలో వారు అక్కడ దానిని (ఉప్పును) లోపల ఉంచారు. మరియు అది కేవలము అది కరిగిపోయింది. చూశారా? వారు ఆ బిడ్డకు ఉప్పును ఇచ్చియుండిన యెడల, ఇచ్చియుండిన యెడల...
ఇక్కడే, ఒక చోట పెన్సిళ్ళు యొక్క రబ్బరులు ఆ చిన్న బిడ్ద తినియున్నాడని నేను చదివాను. మరియు అతడు ఒక సైకిలు యొక్క పెడలు భాగమును తిన్నాడు, సరే వారు ఆశ్చర్యపడ్డారు.....వారు ఆ చిన్న బాలుని పరీక్షించారు, మరియు వాని చిన్న దేహమునకు సల్ఫరు అవసరమైయున్నదని కనుగొన్నారు. అక్కడ రబ్బరులో సల్ఫరు ఉన్నది. చూశారా? అక్కడ సల్ఫరు ఉన్నది, ఇక్కడ లోపల భాగములో దానికొరకు ఏదో ఒకటి పిలచుచుండెను. అతడు ఎక్కడో ఒకచోట కనుగొనునంత వరకు అతడు ఆసక్తి చూపుచుండెను. మరియు ఇక్కడ సల్ఫరు కొరకు లోపల భాగములో అక్కడ ఏదో ఒకటి ఉండి పిలచుచుండెనని అది తెలియజేయుచున్నది. ఆ పిలుపునకు స్పందించుటకు అక్కడ ఒక సల్ఫరు ఉండవలసియున్నది. నా ఉద్ధేశ్యమేమిటో మీకు తెలియునా? “అల అల కొరకు.”
19
ఇప్పుడు, అక్కడ మన హృదయాలలో లోపల భాగములో ఏదో ఒకటి ఉన్నంతకాలము ...ఇక్కడ దైవిక న్వన్ధతయందు విశ్వసించినవారు ఎందరున్నారు? అంతా బాగుంది. అప్పుడు అంత నిశ్చయముగా... చూడుము... ఉండినయెడల ... అక్కడ లోపల క్రిందభాగములో అక్కడ ఒక పిలుపు ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా, దైవిక స్వస్థత ద్వారా దేవునియొక్క స్వస్థత పొ౦దుటకు ఒక కోరిక ఉండినయెడల, ఎక్కడో ఒకచోట అక్కడ ఒక ఊట తెరువబడి ఉండవలసియున్నది. చూశారా?...ఆ సృష్టి అక్కడ ఉండుటకు ముందే, ఆ సృష్టి ఆ విధముగా నీకు కోరిక కలుగజేయుటకు, ఆ సృష్టిని సృష్టించుటకు అక్కడ ఒక సృష్టికర్త ఉండవలసియున్నది. అది సరియైనదేనా? సరేగానీ, ఆ విధముగా నీ హృదయములో కోరిక కలిగి ఉండుటకు అలా ఆ కోరికను ఉంచుచూ అప్పుడు ఎక్కడో ఒకచోట దేవుడు అక్కడ ఉండవలసియున్నది. మరియు ఆయన ఆ కోరికను అక్కడ పెట్టినచో, అలా నీవు పొందిన ఆ కోరికను నెరవేర్చుటకు అపుడు అక్కడ బయట అక్కడ ఏదో ఒకటి ఉండవలసియున్నది. మీరు గ్రహించారా? “అల అలను పిలచుచున్నది.”
మరియు ఇక్కడే బయట ఎక్కడో ఒకచోట ఏదో రోజున నీవు కనుగొనగలవు, మరియు మనమందరము దానిని చూడబోవుచున్నాము. సహోదరుడా ఆ విధముగా సుదూరమున దేవుడు ఒక సంఘమును కలిగి ఉండబోవుచున్నాడు. మరియు అలా ఒక వైపునకు త్రోసివేయబడిన ఒకప్పుడు దేవుని సజీవ సంఘానికి చెందిన ఆ మరపురానీ సంగతులన్నియు, ఏదో ఒక రోజున దాని పాదముపై నిలబడబోవుచున్నది. మరియు ఆకాశము గుండా పైకి ప్రయాణము చేయబోవుచున్నది. ఓహ్, నా సహోదరుడా, సహోదరీ, అది కొన్ని సంవత్సరములనుండి నేను చూచియున్నాను.
మరియు ఈ రాత్రి, ఇశ్రాయేలు పిల్లలను అలా సడిపించుచున్న అదే పరిశుద్ధాత్మ, ఎక్కడో ఒకచోట, సుదూరమునకు, ఆ జలములలోనుండి మనలను పైకి లేపి నడిపించుచున్నదని నేను నమ్ముచున్నాను. ప్రజలు దానిని అవగాహన చేసికొనలేకపోయారు. అయితే అది అక్కడే ఉన్నది. ఒక మానవ హృదయము దానికొరకు పిలచుచున్నంతకాలము, అక్కడ దానికి స్పందించుటకు అక్కడ ఏదో ఒకటి ఉండవలసియున్నది. “అల అలను పిలచుచున్నది.” “ఆ మార్గములో నిన్ను నడిపించుటకు నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను.”
20
సమస్య ఎదనగా, మనము దూత కంటే ముందుగా వెళ్ళుటకు ప్రయత్నించుట. దూత మార్గమును నడిపించనీయండి. మరియు ఆయన మనలను జీవజల ఊట యొద్దకు నడిపించును, మరియు అది మనకు ఉచితముగా ఇవ్వబడును, నీవు దానిని నమ్ముచున్నావా.
మనము మన తలలు వంచుదామా.
ప్రభువైన యేసు ఈ రాత్రి ఇక్కడ .... ఈ చిన్ని సంఘము కొరకై మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆ కాపరి కొరకై, ఆ భోదకుల కొరకై మరియు ఆ ప్రజల కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మనము ప్రతి పరిచారకుని కొరకై, మనము అతని సమాజము కొరకై దానిలో భాగస్తులు నేటి రాత్రి ఇక్కడ కూర్చొనియున్నారు, వారి కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము. కాని వీటన్నింటికి పైగా, మమ్మల్ని ఒక్కటిగా ఆయన కృపచేత, ఆయన యోగ్యత చేత ఆకర్షించిన యేసు ప్రభువు కొరకై మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. తండ్రీ నిజమైన యదార్ధ హృదయంతో మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము.
ఇప్పుడు ఈ రాత్రి నీవు మాతో ఉండాలని ప్రార్ధించుచున్నాను. మాకు సహాయము చేయుము. మమ్మును దీవించుము, మరియు ఇక్కడ నా హృదయము మరియు ఇతర హృదయములు ఒకదానికొకటి కలసి కరడు పిలచుచున్నది—-కరడు. ఇక్కడ కూర్చొనియున్న పురుషులు మరియు స్త్రీలు ఐన నీ పిల్లలు శత్రువు చేత పట్టబడియుండెను. మా సహోదరుడు బాక్సటర్, నీ భోదకుడు కొంత సేపటి క్రితము ఇక్కడ మెట్ల మీద నిల్చొని అతడు చెప్పేది వింటూ, వినుచూ మాట్లడుచూ దురాత్మలను వెళ్లగొట్టెను. ఈ విధంగా మేము మీకు కృతజ్ఞతలు చెల్లించగలము, ప్రభువా, నీ వాక్యము భోదించుచున్నది ఏమనగా, “నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. రోగులపైన చేతులుంచిన వారు స్వస్థపరచబడుదురు.” దేవా, నీవు అది వాగ్ధానం చేసియున్నావు.
ఇప్పుడు, తండ్రీ నేటి రాత్రి నీవు ఆ తెరలను తొలగించాలని మేము ప్రార్ధించుచున్నాము. గొప్ప పరిశుద్దాత్మ ప్రతి హృదయమును నేటి రాత్రి విశ్వాసముతో నింపి మరియు మేము నేటి రాత్రి ఈ భవనంలో నుండి మా మధ్య బలహీనమైన వారు కూడా లేకుండా వెళ్ళునట్లుగా వారి వలయములను మరియు పరిమాణములను తెరువుము. ఆనందముతోను, సంతోషముతో, స్వస్థతతో నిండిన ఆత్మతో, మేము వెళ్ళుదుము గాక. మరియు ఈ పట్టణములో పాత ఉజ్జీవము ఇక్కడ ప్రారంభమవునుగాక. ప్రభువా, అది పట్టణమంతటిని రగిలించునుగాక. మరియు అనేకులు రక్షించబడునట్లు అనుగ్రహించుము. తండ్రీ, క్రీస్తు నామమున దానిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
21
మీరు చూడండి, అది ఒక రకమైన కష్టమైన సంగతి. ఆ రోగులకు ఏలాగు ప్రార్ధించాలి అనునది మనకొరకు నిర్ణయించుటకు కష్టమైనది. బాక్సటర్ సహోదరుడా, అది ఏలాగు ఒక క్రమమైన వరుసలో ఉంచుటకు క్రమపద్ధతిలో మనము వారికి ప్రార్ధనా కార్డులు ఇచ్చుటను గూర్చి నీవు విశదపరచావని నేను అనుకుంటున్నాను. మనము ఇలా చెప్పుటకు ప్రయత్నించెదము, “సరే ఇప్పుడు, అనేకులుగా ఉన్న వీరందరు ఇక్కడకు రండి, లేదా అలా వెనుకకు వెళ్ళండి మరియు అలా అక్కడ అనేకులను ఉంచెదము.
“మీరంటారు, ”హు-హు, మీరక్కడే ఉన్నారు. మీరు ఒక విధమైన గౌరవము పొందారు.“
కనుక, కేవలము మనం ప్రతి వ్యక్తికి ప్రార్ధనా కార్డులు ఇచ్చెదము. మరియు వారిని బయటకు పిలిచెదము.
ఇప్పుడు, ఏ సంఖ్యలో 50 నుండి 100వరకు నీవు కార్డులిచ్చావని నీవు చెప్పావని నేను నమ్ముచున్నాను. 1 నుండి 100వరకు “హెచ్” అను సంఖ్యలో సరే, ప్రారంభించెదము, 50, 60 తీసికొందాము.... 10వరకు, ఇక్కడ ఎంత మందిని మనము వరుసలో ఉంచాము.? అయ్యా? అంతా బాగుంది. అప్పుడు 15 వరకు ప్రయత్నించెదము. అంతా బాగుంది మనము 8,10, 11, 12, 13, 14, ఇంకా ముందుకు, 50, 55, 60, 65, మొదటి 15 మంది వరకు. మనం హెచ్-50 నుండి ప్రారంభించెదము. హెచ్-50 ఎవరి దగ్గర ఉన్నది, ప్రార్ధనా కార్డు హెచ్- 50? 51? 52? 53? 54? అది సరియైనదిగా ఉంది. సరిగా ఇక్కడే వరుసలో ఉంచుము. మీ కిష్టమైన యెడల ఈ వైపుగా సరిగా క్రిందకు నడచి రండి మరియు వరుసలో ఉండండి. మరియు మనం వారందరి దగ్గరకు వెళ్ళలేకపోవచ్చును. మనము చేయగలిగినంత శ్రేష్టమైన పద్ధతిలో చేయగలము.
22
ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరు లోతుగాను మరియు నిజాయితీగాను ప్రార్ధనలో ఉండవలెనని కోరుచున్నాను. మీరు అలా చేయగలరా? అంతా బాగుంది. వారు వచ్చుచుండగా నేను ఒక సంగతిని చూస్తున్నాను. -ఒక యవ్వన మనిషి ఇక్కడే నా ముందు కుర్చుని యుండుట చూస్తున్నాను. అతడు చాలా ఎక్కువగా బాధలో ఉన్నాడు. దేవుడు ఆ మనిషిని స్వస్థపరచుననియు లేదా ఏదో ప్రత్యక్షత, ఏదో మనకు ఇచ్చునని కోరుచున్నాము. నేను ఇక్కడ ఉండగా నేను చూడగోరుచున్నాను... నేను అలా మన ప్రభువు చేసినదానికంటే, చాలా చెడ్డదైనది నేను చూశాను.
ఇప్పుడు, ఆ బాలుడు బహుశ చాలాసార్లు ప్రార్ధించబడెను. అది నాకు తెలియదు. అయితే దేవుడు పలికి మరియు వానికి చెప్పమని నాకు ఏదో ఒకటి చెప్పిన యెడల, అలా ఆయన నీకు చెప్పగలడని నీవు ప్రార్ధించెదవా? నేను గతరాత్రి ఆ బాలుని చూశాను, మరియు నా హృదయములో అతని కొరకు తలంపు వెళ్ళినది. మరియు నేను... ఇప్పుడు ఆ విధముగా అది ఏ ఉద్దేశ్యము కొరకో, ఏ కారణము కొరకో, దానికి కారణము ఏమిటో అది జరుగుటకు ఏమై యున్నదో ఆయన నాకు చెప్పి యుండవచ్చును. నాకు తెలియదు. చూశారా? అది దేవునికి సంబంధించినది. నేను చేయమని ఆయన నాకు చెప్పిన విధముగా కేవలము నేను ఆలాగు చేయవలెను. ఆయన వానికి చెప్పవచ్చును. అతడు బాగుపడును. ఆయన చెప్పిన యెడల, ఆ విధముగా-అది దానిని స్థిరపరచును. అతడు ఎన్నడూ బాగుపడకయుండునని ఆయన నాకు చెప్పినయెడల, అది-అది ఎన్నడూ అలా జరుగదు. కేవలము ఆయన చెప్పినట్టే అది అలాగే జరుగును. చూశారా.
నేను చేయలేను.... అయితే నాకు తెలియదు, నేను కేవలము ఆ బాలుని గమనించుచున్నాను, నా కన్ను వానిపై ఉంచాను. మరియు నేను ప్రతిదానిని అలా చేయుదును.
23
ఇప్పుడు, ప్రభువు యొక్క దూత ...
ఆ చిత్రమును ఎన్నడైనా ఎంతమంది చూశారు? మీ చేతులను చూపండి. ఇంకా ముందుకు వెళ్ళినచో ....ఆ చిత్రములో అలా ఉన్న ఆ హేలో (కాంతి పుంజము) యొక్క వెలుగు అక్కడ దిగువన తీసికొన్నవారు? మీలో అనేకులు తీసారు. వారిలో కొందరు మనలను విడచి వెళ్ళారని నేను నమ్ముచున్నాను.
(సహోదరుడు బ్రాన్హాం ఎవరో ఒకనితో మాట్లాడుచున్నారు. - సంపా)
అంతా సరియైనదిగా ఉన్నది. 50 నుండి 65,. స్నేహితుడా మీ ప్రార్ధనా కార్డులను త్రిప్పి, దానియొక్క వెనుకవైపు చూడండి. మీరు అక్కడ ఒక సంగతి కనుగొనగలరు...?...50 నుండి 65. మీరు కనుగొనిన యెడల, అక్కడున్నవి అలా లేవు-అవి అన్నియు 50 నుండి 65 వరకు వరుసలో లేవు. మీరు ఇక్కడ వరుసగా ఉంచగలిగినచో మనం ఏమి చేయగలమో మనం అత్యంత ఉత్తమ పద్ధతిలో ప్రయత్నించగలము. 50 నుండి 65 వరకు, అది హెచ్ అక్షరమే గదా? అది హెచ్- 50 అయిఉండెను గదా? అంతా బాగుంది. అంతా బాగుంది.
ఇప్పుడు, మీలో మిగిలినవారు, మీ కార్డును పట్టుకొని ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ సంఖ్య నుండి పిలిచినచో, మనము మరియొక సంఖ్యను పిలువవచ్చును, మరియు ఆ విధముగా వాటిలో ఉన్న సంఖ్యలను కొంచెము ముందుకు వెళ్ళి తీయగలము. కేవలము ఈ చుట్టూ, మనం ప్రార్ధించుచుండగా అలా ప్రతి వ్యక్తి కొరకు ప్రార్ధించగలుగునట్లు ఆ స్థలములో ఉన్న ప్రతి వ్యక్తి అలా ఉండునట్లు చూచుటకు మనం ఎల్లప్పుడు ప్రయత్నించుదము.
ఇప్పుడు, అయితే మనము.. మీ కార్డువైపు చూడండి. (ఇప్పుడు మీరు వాటిని లెక్కించండి. బాక్స్టర్ సహోదరుడు, నీవు చూచినయెడల) అక్కడ ఒక సంగతి- మరియు అక్కడ అలా చెవిటివానిగా లేదా ఏదో విధముగా ఎవరైనా ఉండి ఉండవచ్చును. మరియు, సరేగానీ, రాలేరు, అలా కూర్చుని ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి కార్డుమీద ఆ చూట్టూ చూడండి.. మరియు అది-అది కేవలము నీ తరువాతే కూర్చుని ఉండును. లేదా ఏదో ఒకటి అయి ఉండును.
మరియు ఇపుడు, ఇక్కడకు పైకి వచ్చుచున్న ఆ ప్రజలకు నిశ్చయత లేదు. (అవును.)
24
మంచిది, అలా స్వస్థపరచబడుటకు ఇక్కడకు పైకి వచ్చుచున్న ఈప్రజలకు ఏ నిశ్చయతయు లేదు, ఏదియూ లేదు. కేవలము వారు ఇక్కడే నిలబడే ఉన్నారు. అయితే అక్కడున్న ఒకే ఒక నిశ్చయత దేవుని యందు నీవు ఎంత ఎక్కువైన విశ్వాసము కలిగియున్నావు అనునదే. దానిని చేసినది నీ యొక్క విశ్వాసము అయి ఉన్నది.
ఇప్పుడు, ఈ రాత్రి ఈ వసారాలో క్రిందకూర్చున్న మీలో ప్రతి ఒకరిని, ప్రశాంతంగా ఉండి, మరియు ప్రార్ధించవలెనని నేను కోరుచున్నాను. మరియు నేను మిమ్మును కోరునది -లోతైన నిజాయితీగా ప్రార్ధించవలెనని కోరుచున్నాను. మీరు ఎక్కడ కూర్చున్నను లేదా నిలబడియున్నా, లేదా ఇక్కడ వెనుక ఉన్ననూ, మీరు ఎక్కడ ఉన్ననూ ఆ విధముగా దేవుడు బయలు పరచి మరియు మిమ్మును స్వస్థపరచగలడని నమ్ముచూ, నేను మిమ్మును ప్రార్ధించవలెనని కోరుచున్నాను. కేవలము నమ్మండి. మీరు చేయవలెనని నేను మిమ్మును అడిగినదంతయూ అదే. కేవలము దేవునియందు విశ్వాసముంచండి.
25
ఇప్పుడు, నేను నేను మీ యొక్క సహోదరుడను, మరియు నేను ఇక్కడ ఒక ప్రయోజనము (ఉద్ధేశ్యము) కొరకు ఉన్నాను, మరియు-మరియు అది ఏమనగా మీకు సహాయము చేయుటకే. నేను మీకు సహాయము చేయగల ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు మీ కొరకు ఇదివరకే ఏమి చేసెనో మీరు చూచునట్టు చేయుటయే.
ఇప్పుడు, మనం ప్రార్ధించుటకు ముందుగా, ప్రతిచోటను, ఇక్కడే వెనుక ఉన్న శ్రోతలకు చెప్పనివ్వండి. నా సహోదరీ మరియు సహోదరులారా ఈ పట్టణములో అలా ఇక్కడే ఉన్న ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు ఇదివరకే స్వస్థపరచెను. ఈ రాత్రి ఇక్కడే అలా రోగియైయున్న ప్రతి వ్యక్తి నీవు ఇదివరకే స్వస్థత పొందావు. మరియు అలా ఈ భవనములో ఉన్న ప్రతీ పాపియు, మీరు ఇక్కడే ఉండినయెడల, మీ యొక్క పాపములు ఇదివరకే మీకు క్షమింపబడినవి. మీరు చేయవలసిన ఒకే ఒక కార్యము, ఏమి చేయబడినదో అంగీకరించుటయే. నీవు అంగీకరించినప్పుడు, నీ యొక్క రక్షకునిగా నీవు ఆయననూ అంగీకరించుటయే.
అయితే మీ కొరకు మరల చనిపోవుటకు ఆయన క్రిందకు వచ్చియుండలేదు; కేవలము ఆయన- ఆయన ఏమి చేసెనో నీవు అంగీకరించుటయే, మరియు దానిద్వారా నీవు రక్షించబడ్డావు. అది సరియైనదే గదా? మరియు స్వస్థపడే కార్యములోనూ అదే సంగతి. బాక్స్టర్ సహెూదరుడా, అది సరియైనదని నేను నమ్ముచున్నాను. మరియు-మరియు సహోదరులారా అది సత్యమైయున్నది, అది కాదా? అవును, అది ఇదివరకే, జరిగించబడిన కార్యము. యేసుక్రీస్తు ఆ పని సమాప్తము చేసెను. మరియు ఆయన కల్వరి యొద్ద చనిపోయినప్పుడే సంపూర్ణ విమోచన యొక్క వెల చెల్లించెను. ఇప్పుడు మనం అక్కడ పైకి చూచి మరియు దానిని నమ్ముటయే. నీవు ఏది అడిగినను, అది పొందితినని నీవు నమ్ము; అది దానికి సరిపోతుంది. ఇప్పుడు, విశ్వాసము కలిగి ఉండుము.
26
అలా అది ఒకే ఒక కార్యము... ఇప్పుడు, ఇక్కడే నావెనుక ఉన్న ఇక్కడే ఉన్న ఈ సేవకులు మరియు ఇక్కడున్న నా సొంత మేనేజరు, సహెూదరుడు బాక్స్టర్. బహుశ ఇప్పుడు, నేను కూడ తాకలేనంతగా వారు ఆ వాక్యము విశదపరచి ఉండగలరు. వారు అలాగే యున్నారు. దేవుడు దానికొరకే వారిని పిలిచాడు. చూశారా? మరియు వారు మీకు ఏమి చెప్పుచున్నారో మీరు అదే నమ్మినచో, అదియే దానిని జరిగించును. నేను ఖచ్చితముగా అలాగే చేయగలను; అది దేవుని వాక్యము అయి ఉన్నది. ఇప్పుడు, ఆ తరువాత సంఘములోనికి దేవుని ప్రేమ వరములను పంపెను. ఇప్పుడు మరియు ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా తెలియని భాషలలో మాట్లాడును, మరియు అక్కడ బయట మరొకడు దానిని అనువదించును. మరియు వారు ఏమైయున్నారో అదియు ... కేవలము వారికున్న బాధలు ఏమైయున్నవో, కేవలము ఏమిచేయవలెనో ఇతరులైన ఎవరో వ్యక్తిని గూర్చియూ లేదా ఇక్కడే ఉన్న ఈ వ్యక్తికిని ఖచ్చితముగా జరిగినది చెప్పును..., మీరు ఆ విధముగా నమ్ముచున్నారా? సరేగానీ, అలా సంఘములో అది ఒక దైవిక వరమైయున్నది.
ఇప్పుడు, అయితే ఆయన ఆ విధముగా చెప్పినయెడల, అది పరిశుద్దాత్మ అయినయెడల, కేవలము అది ఖచ్చితముగా ఆ విధముగానే ఉండును. ఆయన దానిని చెప్పిన విధముగానే కేవలము అది ఖచ్చితముగా ఆ విధముగానే ఉండును. అది ఒక వరమైయున్నది.
27
అప్పుడు, ఆయన పంపెను, మొదట ఆయన ప్రవక్తలను ఉపదేశకులను, సువార్తికులను పంపెను, మరియు... అది సరియేగదా? భాషలయొక్క వరములు, అనువాదము, అది అంతయూ సంఘముయొక్క క్షేమాభివృద్ధి కొరకు. అది సరియేగదా? అంతయూ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, దేవుడు వాటిని సంఘములోనికి పంపెను. ఎవరు కలిగియుండెను? ఎవరో వ్యక్తి నీ మీద చేతులుంచుటచేత కాదు అయితే దేవుడు కలిగియుండుటచేతనే, మనిషి కలిగియుండలేదు. దేవుడు సంఘములో ఉంచెను. ఆయన ఇచ్చును...
మంచిది, ఆ స్త్రీని తీసికొని రండి. ఇప్పుడు, వచ్చుచున్న ఈ ప్రజలు పూర్తిగా క్రొత్తవారు. మరియు ఇపుడు, ఈ రాత్రి ప్రతి ఒక్కరూ నా కొరకు ఇది చేయవలెనని నేను మిమ్మును కోరుచున్నాను, కారణం నాకు ఉన్నది...
నేను ఆఫ్రికాకు పిలిచే ఒక పిలుపు కొరకు కనిపెట్టుచున్నాను, మరియు అది ఏ సమయములోనైనా కావచ్చును. ఎన్నిరాత్రులో నాకు తెలియదు, మై.. మేము ఏ స్థలములోనైనా నిలిచి ఉండగలము, దానికి కారణం ..... ఆయనే కావచ్చును...నా జీవితమును ఆయనకు ఇచ్చాను. ఇప్పటినుండి పది నిముషాలలో ఆయన నన్ను పిలిచి ఉండవచ్చును, మరియు ఆస్ట్రేలియాకు నన్నుపంపును. కేవలము అది ఎక్కడైనప్పటికిని నేను వెళ్ళిపోవుదును. చూశారా.
28
మనం ఇక్కడ ఉండగా, మీలోనుండి ఆ సమస్త మూఢభక్తినంతను దూరంగా పారద్రోలవలెనని నేను మిమ్మును కోరుచున్నాను, ప్రతీదియు క్రిందపడేయండి. మరియు పరిశుద్ధాత్మకు మీయంత మీరే అప్పగించుకొనుడి. ఆ విధముగా దేవుడు మీలోనుండి కదలగలడు, మరియు మీరు మీ కొరకు దేవుని ఆశీర్వాదముల ప్రయోజనము పొందగలరు. నేను మీ దగ్గరకు వచ్చినది అందుకే. నేను ఈ విధముగా కదిలించబడి మరియు ఇలా చెప్పుచున్నాను, “ఇపుడు, దేవా, నీవు నాకు సహాయము చేయుము. ఆ ప్రజలందరు నమ్మునట్లు అనుమతించండి. మరియు ఆ విధముగా నేను వారికి పరిచర్య జరిగించగలను. నేను ఈ పట్టణమును విడిచి వెళ్ళినప్పుడు, దేవుని మహిమ ప్రతి స్థలములో ఉండును, మరియు మేము ఎవరినైతే అత్యంత ప్రేమతో ప్రేమించుచూ మరియు ఆయన ద్రాక్షతోట కొరకు పని-చేయుచున్న ఆ ప్రజలు మా ప్రియమైన ప్రభువైన యేసును స్తుతిచేయుచు ఉండగలరు.
ఇప్పుడు, దైవిక ఆత్మలో—చూచుట మరియు భవిష్య జ్ఞానము అను వరము, మరియు ఏమి జరుగుతున్నదో మరియు ఏమి జరుగబోవుచున్నదో, అది దేవుని దూరదృష్టి. స్వస్థపడుటకు అది ఏమియు చేయదు. అది కేవలం యేసుక్రీస్తును సవరించి, “నేను చేసిన కార్యములు మీరు కూడా చేయుదురు,” —-తండ్రి ఏమి చూపించునో, అని చెప్పే అతని వాక్యము తిరిగి తెచ్చుట.
29
ఇప్పుడు, ఈ స్త్రీ ఇక్కడ నిలబడియుందని నేను నమ్ముచున్నాను. నేను-నేను నిన్ను ఎరుగను. స్త్రీ నేను ఎరుగుదునా? నేను ఎరిగినంత మట్టుకు నేను ఎన్నడూ చూడలేదు. మనం పరిపూర్ణముగా ఒకరికొకరము ఎరుగనివారము, నా జీవితములో నిన్ను ఎన్నడూ చూడలేదు. ఆ తరువాత, సరే, నేను నిన్ను ఎరుగని యెడల మరియు బహుశ నీవు ఇక్కడే దిగువన వందల, వందల మైళ్ళదూరములో పెంచబడ్డావు. బహుశా అప్పుడు అది.. మరియు అప్పుడు, ఇక్కడ దిగువకు-నీతో మాట్లాడుటకు వచ్చినప్పుడు—-మంచిది నేను ఇండియానాలో పెరిగాను, బహుశా నీవు ఫ్లోరిడా దిగువన పెరిగావు. మంచిది. మనం ఒకరికొకరము మాట్లాడుటకు కలసినప్పుడు, మనం మైళ్ళు దూరములో ఉన్నాము. అయితే దేవుడు నీవు పుట్టకమునుపే నిన్ను ఎరిగియుండెను. నేను పుట్టకమునుపే ఆయన నన్నుఎరిగెను.
ఇప్పుడు, నేను-నీవు ఒక క్రైస్తవుడవని నమ్ముచున్నాను. నేను-నేను- ఎందుకనగా నీ ఆత్మ ఆహ్వానించుచున్నట్టుగా కనబడుచున్నది. (నీవు చూశావా?) కేవలము అది ఎప్పుడనగా.. ఒకక్రైస్తవుడు వచ్చునప్పుడు కేవలము అక్కడ ఆహ్వానము చెప్పుచున్న ఏదో ఒకటి అయి ఉన్నది. నీవు చూశావా? మరియు నేను-నేను అది సరియైన రీతిలో పొందాను. అది పరిశుద్ధాత్మ.
అయితే ఇప్పుడు, నేను నిన్ను గూర్చి ఏమియు ఎరుగని యెడల, మరియు మన జీవితమంతటిలో మైళ్ళు దూరములో ఉండగా, పరిశుద్ధాత్మ చేయవలసి ఉండును. అలా ఇక్కడే ఆయన సన్నిధియొక్క ఉనికిలో ఆ విధముగా ఏదో ఒక సంగతి నీవు ఎరుగునట్లు చేయును, అప్పుడు అలా నేను సత్యమునే చెప్పితినని మరింత ఎక్కువ విశ్వాసము నీవు కలిగి ఉండునట్లు చేయును.
30
నేను నీతో సన్నిహితముగా ఉండగోరుచున్నాను. కేవలము నేను,... కనుక ఇప్పుడు నేను ఏమి చేయుచున్నానో నీకు తెలియును; నేను నీ ఆత్మతో సంధించుచున్నాను. చూశారా? అయితే-నేను-నేను.. నీతో మాట్లాడుచున్నప్పుడు నీవు ఇది నమ్మవలెనని నేను కోరుచున్నాను (చూశారా?)ఆ సమస్త సంగతులు దేవునికి తెలియును మరియు అది ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నదనగా, నిన్ను స్వస్థపరచువాడు ఆయనే అని గ్రహించునట్లు అలాటి పరిస్థితిలో నిన్ను ఉంచుటకు (చూశారా? చూశారా? )ఆ విధముగా నీలో ఉన్న ఆవిశ్వాసమును ఉత్తేజపరచు ఏదో ఒకటి అయి ఉన్నది. ఏలయనగా, ఒక క్రైస్తవునిగా ఉన్నకారణముచేత అది అక్కడే ఉన్నది అయితే అది కాళ్ళు తుడుచుకొనే తివాచీగా అయి ఉండవచ్చును. చూశారా, మరియు ఇపుడు, కేవలము దయగలిగి కొన్ని నిముషాలు నీతో మాట్లాడుట కొరకు ..మొదటిగా వచ్చిన వ్యాధిగ్రస్తునిగా ఎల్లప్పుడు కేవలము అది ఒక...మొదటగా నేను ఆ వ్యాధిగలవానితో మాట్లాడునట్లు ఆసమయము తీసికొనుటకు ఇష్టపడుదును. అక్కడ ఆయన సన్నిధి ఉన్నదని తెలిసికొనునంత వరకు, కేవలము అపుడు నేను ప్రజలకొరకు ప్రార్ధించెదను. ఎందుకనగా వారు-వారు సగమార్గములో నమ్మగలిగినను, వారు ఆశీర్వాదము పొందగలరు. (మీరు చూశారా?) వారు-కేవలము వారు దానిని నమ్మగలిగినయెడల.
అయితే, ప్రభువుదూతను గూర్చి ఈ రాత్రి సహెూదరుడు బాక్స్టర్ చెప్పినట్లుగా, ఇపుడు, ఆయన సన్నిధిలో, ఆయన ఇక్కడ సమీపమున నిలబడియుండగా అపుడు ఆయన, ఆయన నిన్ను ఎరుగును. మరియు ఆయన నన్ను ఎరుగును. అపుడు అక్కడ నీలో ఏదైనా పొరపాటు ఉన్నయెడల, ఏదో ఆలాటి అనారోగ్యము అపుడు అది సంపూర్ణముగా -నీవు మధ్యాహ్న వేళలో జరిగిన పరిచర్యలలో మరియు మొదలైన వానిలో విన్నావు. అది ఒక దయ్యము. సమస్త అనారోగ్యము దయ్యమైయున్నది. అది నీవు దేవునిమీద పెట్టి గాయము చేయలేవు (గుచ్చలేవు, చూశారా?) అది దయ్యమైయున్నది.
31
మంచిదే, అప్పుడు అలా అయిన యెడల అది ఒక ఆత్మగా ఉండినయెడల ...ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఇద్దరము ఆత్మలు అయి ఉన్నాము, మన సహజ స్వభావముగలవారమైనట్లే, మనం సహజాతీత స్వభావము గలవారము. అప్పుడు నీవు ఒక క్రైస్తవ స్త్రీవైన యెడల మరియు నేను ఒక క్రైస్తవ మనిషిని, మరియు అప్పుడు నీలో ఏదో ఒకటి ఉన్నది. ఒక-అనారోగ్యముతో ఉన్న ఆత్మ.......
మరియు అప్పుడు దేవుడు నీ సహోదరునిగా నన్ను పంపాడు. చూశారా? మరియు నేను నీతో మాట్లాడుటకు మరియు వెళ్ళి ప్రజలకొరకు ప్రార్ధించమని ఆయన నాతో చెప్పెనని అలా నేను నీకు చెప్పాను. ఇప్పుడు అంతా అదే. అనెను, “నీవు ప్రజలను నమ్మునట్లు చేయగలిగిన యెడల, నీవు ప్రార్ధించినప్పుడు నిజాయితీగా ఉండుము. ఆ ప్రార్ధన ఎదుట ఏదియు నిలబడలేదు.” ఇప్పుడు, అదే సంగతి: నేను ప్రార్ధించినప్పుడు నిజాయితీగా ఉందును, మరియు ఆ ప్రజలను నమ్మునట్లు చేయుదును.
సరేగానీ, నేను నిరక్ష్యరాస్యతను గూర్చి ప్రశ్నించబడ్డాను, నేను ఇలా ఉన్నాను-గ్రామరును కలిగి బోధించే పాఠశాల విద్యను కలిగి ఉన్నాను. కేవలము ఏడవ శ్రేణికి పరిమితమయినవాడను, నేనెలా ఆ ప్రజలు నమ్మునట్లు చేయగలను? ఆయన అన్నాడు, మోషేకు ఋజువుగా రెండు సూచనలు ఇవ్వబడినట్లుగా, “మరియు మాట్లాడుటకు ప్రారంభించాను.. ఆ కధ మీకు తెలియునని నమ్ముచున్నాను.
ఇప్పుడు అది అలా సత్యమైయున్నదని నీవు నమ్ముచున్నావా? ఇపుడు, నీలో ఏ పొరపాటు ఉన్నదో ఆయన నాకు బయలు పరచిన యెడల లేదా నీ జీవితమును గూర్చి ఏదైనా మరొక సంగతిని గూర్చియు, ఆ విధముగా దానిని గూర్చి నాకేమి తెలియదని నీవు తెలిసికొందువనియు, ఆ విధముగా నీ కొరకు ప్రార్ధించుటకు దేవుడు నన్ను ఇక్కడకు పంపెనని అది ఒక నిజ సూచన అని అప్పుడు నీవు నమ్మగలవు. అది సరియైనదే గదా?
32
అంతా బాగుంది; నేను నిన్ను చూడవలెనని కోరుచున్నాను- చూడుము, నా వైపే చూస్తూ మరియు నమ్ముచుండుము.
క్రైస్తవ స్నేహితులారా, నేను మీకు చెప్పుచున్నాను అది ఒక ఖచ్చితముగా అది ఒక సమస్య చూడండి. నీ చూట్టూ అంతట ఆత్మను పొందావు. నా యొక్క-నా యొక్క ఆడిటోరియమ్ సమావేశాలలో ఎన్నడూ ఏ ఒక్కడు నా వెనుకభాగములో లేడు, చూశారా. ఆ విధముగా ఆ చుట్టూ ఏ ఒక్కడు లేడు, లేదా ఎక్కడా లేడు, అయితే, బయట ఈ పద్ధతిలోనే కనుక ఆ రోగిని తిన్నగా చూచునట్లు నేను నా వెనుకభాగమును ఈ విధముగా ఉంచగలను. అయితే, చూడండి అక్కడ రోగులైన ప్రజలు అక్కడ వెనుక లోపలకూర్చుని ఉన్నారు. చూడండి మరియు వెంటనే నేను ..ఈ స్త్రీ అది లోపలకు వచ్చుటకు ప్రారంభించిన వెంటనే, అది ప్రతీ చోటనుండి కదులుచున్నది. (మీరు చూశారా?) మరియు నీవు గమనించుము లేదా చిక్కు స్థితిలో ఉంటావు. అయితే, అది విచ్చిన్నమై, తెలిసికొనుటకు ఒక దర్శనముగా క్రిందకు రావలసియున్నది.
మరియు చూడండి, అక్కడ ప్రజలు రోగముతో అక్కడ కూర్చున్నవారు, ఇక్కడే రోగులై ఉన్నవారు, ఇక్కడ, ఇక్కడే, ఇక్కడే ఆ చుట్టూ వెనుక భాగములో, మరియు ఆ చుట్టూ అంతటా ఉన్న అందరూ నా ముందు నిలబడ్డారు. అయితే ఆ విధముగా దేవుడు దయచూపగలడని నేను ప్రార్ధించుచున్నాను.
33
నీవు - నీవు ఏమైయున్నావనగా... అవును నీవు ఏదో ఒకదానితో బాధపడుచున్నావు. —-అక్కడ ఏదో ఒక పొరపాటు ఉన్నది. అది ఒక -అది- అది అది క్యాన్సరు అయి ఉన్నది. అది సరియే గాదా? అది నిజము కాదా? కేవలము నీవు దానిగూర్చి పరీక్ష చేయించుకున్నావు. మరియు అది రొమ్ము మీద కాదా? అది సరియైనదే గదా? ఇప్పుడు, నేను సరియైనదే చేసిన యెడల చూడుము అది ఎడమ రొమ్ముమీద ఉండి యుండలేదా? అది సరియే గదా ? ఆ విషయము నీ మీద చుట్టూ ఉన్నప్పుడు ఒక విధమైన ఒకపొడవైన వ్యక్తి క్రిందకు చూస్తు కదలుచున్న ఆ వైద్యుని నేను చూశాను. అది సరియేగదా?
చెప్పు, నీవు రాలేదు.. నీవు ఫ్లోరిడానుండి రాలేదు. నీవు న్యూయార్కు నుండి వచ్చావు. అది సరియే గదా? అది సత్యమే కదా? అంతా బాగుంది. అక్కడ పైన ఒక స్థలములో, ఆ చుట్టూ ఒక సరస్సు లేదా ఏదో మరొకటి నేను చూశాను. అది సత్యమే కదా. నేను ఆ దేశమును ఎరుగుదును. ఒక్క క్షణము ఇక్కడకు రమ్ము ఆ విధముగా బాగుపడుటకు నీ కొరకు నన్ను దేవుడు పంపెననియు అలా అది సత్యమని నీవు నమ్ముచున్నావా?
ఓ దేవా నన్ను కరుణించుము; నీవు ఈ దీనురాలైన ఈ చిన్న స్త్రీకి దయచూపి మరియు ఆమెను స్వస్థపరచగలవనియు మరియు ఆమెను బాగుచేయమనియు నేను ప్రార్ధించుచున్నాను. మరియు ఇప్పుడు, నీ సేవకునిగా, నీవు ఆమెను ముట్టినయెడల, అలా ఆమెను గూర్చి ఎరిగియుండిన యెడల, ఏ విధముగా అయిననూ, ఆమె ప్రభువా భూమీ మీద ఒక ఎక్కువ కాలము నిలబడలేదు. ప్రభువా, మాకు ఆమె అవసరము. మాకు ఆమె కాలసియున్నది. ఆమె ఇక్కడ ఉండవలెను. మరియు ఆమె మా యొక్క సహోదరీ.
మరియు ఆ విధముగానే నేను ధృడముగా చెప్పిన సమస్త అభిప్రాయముల కంటే, సమస్త అనారోగ్యముకంటే పైగా, ఉన్నతముగా ఇప్పుడు అలా ఆమె విశ్వాసము తగిన స్థానములో ఉండవలెనని నేను నిజాయితీగా ప్రార్ధించుచున్నాను...?...దేవునికి మహిమ మరియు ఈ ఘడియనుండే, క్షేమముగా ఉండునట్లు బాగుపడుటకు ప్రారంభించునుగాక! నేనీలాగు చెప్పుచున్నాను; “ఆ కేన్సరు శపించబడును గాక. ”యేసుక్రీస్తు నామములో అది ఆమె శరీరమును విడుచును గాక, మరియు ఆమె క్షేమముగా ఉన్న ఒక స్త్రీగా గృహమునకు వెళ్ళి, దేవుని సేవించును గాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్.
సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. నీవు క్షేమముగా ఉండవలెనని కోరుచున్నావా? నీ జీవితకాలమంతయూ ఆయనను నమ్ముము. ఓహ్, దేవుడు నిన్ను దీవించును...?...లెమ్ము...? “నేను నా స్వస్థతను అంగీకరించుచున్నాను.”
34
అంతా బాగుంది. అమ్మా మీరు ఎలావున్నారు? రండి ఆ బిడ్డ ఎలా ఉన్నది.. నీ యొక్క చిన్నబిడ్డ ? మంచిదే, అతడు కొంచెం బాగానే ఉన్నాడు..అతని ముఖము మీద అతనికి పగుళ్ళు ఏర్పడి ఉండుట నేను చూస్తున్నాను. హు హు ఓహ్, అది చాలా చెడ్డదైయున్నది. ఇప్పుడు, వద్దు.. ఇప్పుడు అది నన్ను కొంచెము కూడ బాధపరచుటలేదు. చూడండి, అది అంతా బాగానే ఉంది ...?...అతని ముఖము మీద ఒక విధమైన ఎగ్జిమా (చర్మవ్యాధి) ఉందని నేను ఊహించుచున్నాను. అది సరియేగదా? సత్యముగా ఉన్న దేనిని నీవు వింటివో దానిని నీవు నమ్ముచున్నావా? నీవు అలా చేయుము.
నీ బిడ్డకు మరొకటి ఏదో కూడ ఉన్నది. అతనికి లేదా? ఒక విధమైన ఆస్మా వ్యాధితో ఉన్న స్థితి. అది సరియేగదా? చెప్పు, నీవు కూడ బాధపడుచున్నావు. నీవు ఏదో రకమైన ఊపిరి తిరకుండ చేయు ఒక ఆత్మను కలిగి ఉన్నావు. నేను ఆ విధముగా నిన్ను ఊపిరి తిరగకుండచేయు ఆత్మకు కారణమైన ఏదో ఒకటి లేదా లోపల భాగములో అది ఒక కణితి అని నేను నమ్ముచున్నాను. అది సరియే గదా? మరొక సంగతి చెప్పుము. నీయొక్క రక్షకునిగా నీకు యేసుక్రీస్తు అవసరము. అది యధార్దము కాదా? నీవు ఒక క్రైస్తవునిగా లేవు. ఇప్పుడు నీవు ఒక క్రైస్తవునిగా ఉండగోరుచున్నావా? మీ యొక్క చేయి పైకెత్తి మరియు అలా నీవు ఒక క్రైస్తవునిగా ఉండగోరుచున్నానని సూచించుము. సర్వశక్తుడవైన దేవా, ఆమె ఇక్కడ బిడ్డను ఎత్తికొని ఈ దీనురాలైన యవ్వన తల్లి నిలబడియుంది. మరియు ఈ సమస్త సంగతులు మంచి కొరకు కలసి పనిచేయుచున్నవని మేము బోధించబడ్డాము, దేవా, ఆమెను స్వస్థపరచుము, ఆమె గొంతులోనుండి ఆ కణితిని దూరముగా తీసి పారవేయుము. ప్రభువా, దానిని పోగొట్టండి. మరియు ఈ ప్రియమైన చిన్న బిడ్డను స్వస్థపరచండి. ఒక పాప జీవితము నుండి ఆమె ప్రాణమును (ఆత్మను) రక్షించండి. ఆమె ఈరాత్రి సంతోషించుచూ, ఆనందముతో గృహమునకు వెళ్ళునుగాక, మరియు వారిద్దరూ బాగుపడి, మరియు ఈశ్రోతలు యెదుట, ఇప్పుడే నిన్ను అంగీకరించుచూ వారి జీవిత దినములన్నియూ మీకు సేవచేయుదురు గాక. మీరిలా అన్నారు, “మనుష్యుల యెదుట మీరు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చినయెడల, నేను తండ్రి ఎదుట మిమ్మును గూర్చి ప్రకటన చేయగలను, ప్రభువా, మేము మీకు వందనములు చెల్లించుచున్నాము. ఆవిధముగా నీవు ఆమెను తీసికొని మరియు ఆమెను రక్షించి మరియు ఆమెను స్వస్థపరచియున్నారనియు, యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము. ఆమెన్.
సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు నీవు నాకు సహోదరివై యున్నావు. నీయొక్క పాపములు నీకు క్షమించబడ్డాయి. నీకు స్వస్థత కలిగినది. ఆ బిడ్డ అంతా బాగుగా అవ్వగోరుచున్నది. సమాధానము కలిగి వెళ్ళుము. మరియు దేవుడు నీకు తోడై యున్నాడు.
35
అంతా బాగుంది. రమ్ము. నీవు నమ్ముచున్నావా? ఎందుచేత స్వస్థత లేకుండా వున్నావు? ఏది వచ్చియున్ననూ, ఏది పోయినప్పటికీ, ఏమియూ కాదు. ఇప్పుడు దేవుడే ఆయనంత ఆయనే ఋజువు చేసికొన్నాడు. ఆయనే ఇక్కడ వున్నాడు. ఈ ప్రజలు ఎవరు? అక్కడ ఇద్దరు లేక ముగ్గురు ప్రక్కనుండి వచ్చారు. నేనెన్నడూ నా జీవితములో వారిని చూడలేదు. నేను వారిని గూర్చి ఏమియూ ఎరుగను, వారిని గూర్చి ఎన్నడూ వినలేదు లేదా నా జీవితములో వారిని చూడలేదు. నీవు ఇక్కడ ఏదో వున్నదని నీవు ఒప్పుకొనవలెను. నీవు అది సహజాతీతమైన పరిధిలో వున్నదని నీవు ఒప్పుకొనవలెను .
ఇప్పుడు, నమ్ముము. కొన్ని గాడిదలు ఎక్కడ కట్టబడియున్నవో అలా ఎరిగియున్న ఏకరీతిగాయున్న, అది యేసుక్రీస్తు ఆత్మఅయివున్నది, అతడు నతానియేలు దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్పుతో చెప్పిన అదే ఆత్మ. ఆయన అన్నాడు, “ఇదిగో ఇతడు కపటము లేని ఇశ్రాయేలీయుడు.”
అతడన్నాడు, “ఏలాగు నీవు నన్ను ఎరుగుదువు?”
ఆయన అన్నాడు, “ఫిలిప్పు నిన్ను పిలువకముందే, నీవు ఆ చెట్టు క్రింద వున్నప్పుడే.
“ఎందుకనగా, ”ఇప్పుడే...“ అని ఆయన చెప్పుటకు ఆయన ఎన్నడూ ప్రయత్నము చేయలేదు. యూదులు అన్నారు, ”ఓహ్ మంచి జాతకాలు చెప్పే, బయల్జెబూబు.“
అయితే ఫిలిప్పు అన్నాడు, “నీవు ఇశ్రాయేలు రాజువైయున్న, దేవుని కుమారుడవై యున్నావు”
“దేవుడతనికి తోడైయుంటే గాని ఏ మనుష్యుడూ ఈ కార్యములు చేయలేడని మేము ఎరుగుదుము.”
36
సరేగాని ఇప్పుడు, నీవు ఇక్కడే లోపల వున్నయెడల మరియు సంపూర్ణ సువార్త ప్రజలుగా లేనివారు మరియు మీరు కొద్దిగా మూఢభక్తి మీ మార్గములోనుండి దానిని బయటకు పారెయ్యండి. ఈ ప్రజలు పిచ్చివారు కాదు, వారు, వారి మీదుగా దేవుని ఆత్మను పొందియున్నారు. వారు ప్రపంచానికి వెర్రివారు, అయితే సరిగా వారిలోనికి కదిలి వెళ్ళుచున్న దేవుని ఆత్మ అది.
నేను ఒకప్పుడు మీరున్న పరిస్థితిలో వున్నాను. అయితే ఎవరు నమ్ముదురో అలాటి ప్రజలతో ఉండుటకు దేవుడు నన్ను కదిలించాడు. ఇప్పుడు, మీ హృదయమందున్న ఆ సందేహించే మరియు ఆ సంగతుల నుండి దూరముగా పొమ్ము. మరియు విశ్వసించుము. మరియు నీవు కూడ గ్రహించగలవు. మరియు మహిమగా ఉందువు.... దేవుని యొక్క మహిమ కలిగియుందువు.
ఇక్కడే ఒక స్త్రీ నా దగ్గర నిలబడియున్నది. ఉన్నది ఇక్కడే ఆ ఆత్మ ఉన్నది. నేను ఆ స్త్రీని ఎరుగను. నేను నా జీవితములో ఆమెను ఎన్నడూ చూడలేదు. అయితే నీవు ఒక క్రైస్తవరాలవైయున్నావు. (అది యధార్ధము కాదా?) పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, అది జరిగిన ఆ సమయములో నిజముగా ప్రేరేపించబడియున్నది. అది సరియేనా? మరియు నీవు ఇప్పుడు ఒక టి.బి పరిస్థితితో బాధపడుచున్నావు. మరియు అది ప్రేవులలో అయి ఉన్నది. అది సరియే గదా? అది ఆ విధముగా అయి ఉండుట అది క్రీస్తు వలననే గదా?...ఇప్పుడు, అమ్మా ప్రభువైన యేసు నిన్నుస్వస్థపరచాడు, మరియు నీవు బాగుగా ఉందువు. వెళ్ళి మరియు బాగుండుము....క్రీస్తు. ఆమేన్.
37
రండి, ఇప్పుడు,...? దేవునియందు విశ్వాసముంచండి. ఆయననే నమ్మండి మరియు ఆయన దానిని జరిగించగలడు.
రండి...?..నీవు దానిని నమ్ముచున్నావా? నీవు కలిగియుండు ఒకే కార్యము విశ్వాసము కలిగియుండుటయే. దేవునియందు విశ్వాసముంచండి. మరియు దేవుడే దానిని జరిగించును.
ఎవరో వ్యక్తి ప్రార్ధించుచున్నారు. ఓహ్, పరిశుద్దాత్ముడు ఏమి చేయును ఈ నిమిషములోనే (చూడండి?) ప్రజలు ఆయన వచ్చుటకు అనుమతించినయెడల ఆయన ఏమిచేయును.
అక్కడే సరిగా నీవు స్వస్థపడుటకు ప్రయత్నించుచున్నావు. నీవు నా వైపే చూచుచు స్వస్థపడునట్లు ప్రార్ధించుటకు శ్రేష్టమైన పద్ధతిలో నీవు ప్రయత్నించుచున్నావు. నా సహోదరుడా, నేను-నేను నిన్నుస్వస్థపరచలేను, అయితే నీవు నావైపు చూడుము. మరియు నీలో ఉన్న పొరపాటు ఏమిటో నీకు చెప్పగలను. నాకు క్రొత్తవాడవై అక్కడ కూర్చున్న నిన్ను నేను నిన్ను ఇలా అడుగగలను. నీలో ఉన్న పొరపాటు ఏమిటో దేవుడు నాకు బయలుపరచిన యెడల, నీవు నీ యొక్క స్వస్థతను అంగీకరించగలవా? నీవు అంగీకరించెదవా? నీవు ఒక పగులును కలిగియున్నావు. అది నిజమే గదా? అంతా బాగుంది. లేచి నిలబడుము. మరియు అప్పుడు నీయొక్క స్వస్థతను అంగీకరించుము. మరియు బాగుపడుము. దేవుడు నిన్ను దీవించును.
అంతా బాగుంది. అంతా బాగుంది. సహెూదరుడా, నీవు నన్ను ఆయన సేవకునిగా అంగీకరించుదువా? నేను-ఆ విధముగా విశ్వసించుచున్నావని నేను నిన్ను నమ్ముచున్నాను. అవునండి. మరియు-మరియు దేవుడు మాత్రమే, దేవుడు ఒక్కడు మాత్రమే. నేను నా జీవితములో నిన్నుఎన్నడూ చూడలేదు. అయితే అక్కడ ఒకటున్నది...... ఇక్కడే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వున్నాడు (చూశారా?), ఆయన ఎవరు, అది ఏమైయున్నది నేను ఎరుగుదును—-ఆయన ఎవరైయున్నది నేనెరుగుదును—-నేను ఎవనియందు విశ్వాసముంచానో నేను ఎరుగుదును. అలా ఆయన నాకు చెప్పాడని నేనెరుగుదును. అలా చెప్పబడిన ప్రతీ మాటను నేను నమ్ముచున్నాను.
చెప్పు, ప్రయాణ మార్గములో నేను నీకు మరియు నాకు మధ్యలో ఒక బలిపీఠము వుండుట నేను చూడకలుగుచున్నాను. నీవు ఒక సువార్త సేవకుడవై యున్నావు. అది సరియే గదా? మరియు నీయొక్క గొంతుకలో ఏదో ఒక బాధ (పొరపాటు) నీవు కలిగియుండలేదా? అది సరియేనా—-అది సరియైనదికాదా?నీ చేయి పైకెత్తుము. అంతా బాగుంది.
సర్వశక్తుడవైన దేవా, ఈ యొక్క నీ సేవకుని స్వస్థపరచుము, మరియు ఇది నిన్ను విడిచిపెట్టును గాక మరియు ఈ రాత్రే వాని నుండి తొలగిపొమ్ము. తండ్రీ, ఇప్పుడే అతను సంపూర్ణముగా బాగుపడును గాక. అది యేసునామములో వెళ్ళి పోవును గాక. అతని జీవితములో అంతకు ముందు చేసిన దానికంటే అత్యంత గొప్పగా సువార్త అతడు బోధించును గాక. యేసు నామములో ఆమేన్. దేవుడు నిన్ను దీవించును... దేవుడు నిన్ను దీవించును.
38
నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? దేవుని యందు విశ్వాసముంచుము. సందేహపడవద్దు, కేవలము నమ్ముము. అక్కడ వరుసలో వున్న నీవు, కేవలం నీవు నమ్మిన యెడల ఆ వరుసలోనికి నీవు రానవసరంలేదు. అక్కడ బయట వున్న నీవు, నీవు నమ్మిన యెడల నీవు వరుసలోనికి రానవసరము లేదు. విశ్వాసము కలిగియుండుము.
నేను ఒకటి చూశాను.... నేనిప్పుడే ప్రార్ధించిన ఆ మనిషి ఎక్కడకు వెళ్ళాడు. అక్కడ వెనుక భాగములో, కొన్ని నిముషాల క్రితం ఇక్కడే లోపల ఒక వేదిక వుంచబడియుండుట చూశాను, అయితే అక్కడ ఒక స్త్రీ దానివెనుక భాగములో, నిలబడియుండెను. అక్కడ వున్న నీవు ఒక స్త్రీ సేవకురాలవు. నీ ఊపిరితిత్తులలో ఏదో ఒకపొరపాటు కలిగియున్నావు. సహోదరీ, నీవు ఆ విధముగా లేవా? అక్కడ ఊపిరితిత్తి బాధ లేదా లేక ఆ ఊపిరితిత్తులతోపాటు, దానిలో ఏదో ఒకటి. అది నిజమే కదా? నీవు పూర్ణహృదయముతో నమ్ముచున్నావా దేవుడు నిన్నుబాగుచేయగలడు? అంతా సరియే. లేచి నిలబడుము మరియు ప్రభువైన యేసు క్రీస్తు నామములో, అప్పుడు నీయొక్క స్వస్థతను అంగీకరించుము.
39
అంతా బాగుంది, రండి అమ్మా, నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? నేను దేవుని సేవకునినైన యెడల, అప్పుడు దేవుడు ఇక్కడే వున్నాడు. అది సరియేనా? నేను సత్యమును చెప్పకుండినయెడల, దేవుడు ఒక కార్యమును గూర్చి ఎన్నడూ సాక్ష్యమియ్యకయుండును. అది సరియైనదే గదా? దేవుడు మాత్రమే ఆయన వరమును గూర్చి సాక్ష్య మిచ్చును. నేను అలా ప్రకటించినప్పుడు మరియు అది పొరపాటుగా నుండినయెడల, అప్పుడు దేవుడు నన్ను ఎన్నడూ పంపలేదు. అది సత్యమైయున్నదని నేను చెప్పినయెడల, నన్ను గూర్చి సందేహించుటకు నీకు హక్కు గలదు, అయితే దేవునికి కాదు. అంతలో అది ఇప్పుడు దేవుడై యుండెను. ఇప్పుడు అది ఇక నేను కాదు, నేను కొంచెం సేపటి క్రితం నేను సాక్ష్యమిచ్చియున్నాను. అయితే ఇప్పుడు ఆయన సాక్ష్యమిచ్చుచుండెను. నీవు ఆ కిడ్నీరాళ్ళు పోగొట్టుగొనగోరుచున్నావా? నీవు అలా చేయుదువా? అంతా బాగుంది, అప్పుడు వెళ్ళుము, మరియు ఆ ప్రభువైన యేసు నిన్ను బాగుగ చేయును మరియు యేసుక్రీస్తు నామములో అది నీకు ఆ విధముగా జరుగును గాక.
మనం ఇలా చెప్పెదము, “దేవునికి స్తుతి కలుగును.” అంతా బాగుంది.
నీవు నమ్ముచున్నావా? నేను... మరలా సరిగా ఆ గుండె కొట్టుకొనుటను చూచుటకు ఇష్టపడుచున్నాను... నీవును ఇష్టపడుచున్నావా? నీ చేయి పైకెత్తుము మరియు అది దానిని జరిగించును.
ప్రభువైన యేసు నామములో ఆమె వెళ్ళును గాక. మరియు యేసు నామములో స్వస్థత నొందుము. ఆమేన్.
దేవుని మంచితనమును మరియు దయను గూర్చి కృతజ్ఞత చెల్లించుచూ నమ్ముచూ వెళ్ళుము, నమ్ముచూ వెళ్ళుము.
40
అంతా బాగుంది, ఆ స్త్రీని తీసికొని రండి.
అమ్మా, రండి నీవు ఒక గుండె బాధను అధిగమించవలెనని నీవు ఇష్టపడుచున్నావు. సహోదరీ, నీవు అలా లేవా? నీవు నీ చేయి పైకెత్తి ఇలా చెప్పు, “నేను ఇప్పుడే దానిని అంగీకరించుచున్నాను, ప్రభువైన యేసునామములో” ఆమేన్..
అంతా బాగుంది, రండి. నీవు ఒక స్త్రీ కున్న సమస్యను మరియు ఒక గుండె బాధను కూడా సంభవించుటను గలిగియున్నావు. అది యధార్దము కాదా? నీ చేయి పైకెత్తి ఇలా చెప్పు, “నా యొక్క స్వస్థత కొరకు నేను దేవునికి వందనాలు చెల్లించుచున్నాను” ముందుకు కొనసాగుము వెళ్ళుము. నమ్ముచూ విశ్వాసము కలిగియుండుము.
అమ్మా, రండి నీవు నమ్ముచున్నావా?
అమ్మా, చెప్పు, సరిగా ఆ వైపు కూర్చున్న నీవు, ఆ చివరలో కూర్చొని ఉన్న నీవు ఆ అధిక రక్తపోటును అధిగమించవలెనని నీవు కోరుచున్నావు గదా? నీవు అలా కోరినయెడల, లేచి నిలబడుము. కేవలం అప్పుడే అది నన్ను విడిచిపెట్టినది. అమ్మా, అప్పుడే, కేవలం నీవు విశ్వాసమును కాపాడుకొనిన యెడల నీవు ఎల్లప్పుడూ దానిని అధిగమించి ఉండగలవు. దేవుడు నిన్ను దీవించును. విశ్వాసముంచుము.
సహెూదరీ, అంతా బాగుంది, దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? నీకు-నాకు మధ్యలో ఒక టేబిలువున్నది. దాని నుండి నీవు వెనుక వైపునకు కదలుచున్నావు, ఆ టేబిలు యొద్ద నుండి, ఎందుకనగా నీవు కడుపులో ఒక బాధను కలిగియున్నావు. ఆ కడుపులో అది జీర్ణరసమును స్రవింప జేయకుండ చేయు ఒక పుండు. నిజమే గదా? అంతా బాగుంది.
ప్రభువైన యేసు, నీవు ఆమెను స్వస్థపరచగలవని నేను ప్రార్ధించుచున్నాను, మరియు యేసుక్రీస్తు నామములో, ఆమె బాగుపడి, మరియు ఈరాత్రే ఆమె ఇక్కడనుండి వెళ్ళును గాక. ఆమేన్.
వెళ్ళుము. ఇప్పుడే ఆయనయందు విశ్వసించుమని ఆయన అలా చెప్పెను, దేవుని స్తుతించుచూ వుండుము.
41
కేవలం, మీరు నమ్మిన యెడల, మీలో ప్రతి ఒక్కరు స్వస్థపడగలరు. ప్రభువు యొక్క సన్నిధి సమీపముగా వున్నది. నిన్ను స్వస్థపరచుటకు ఇక్కడే ప్రభువు యొక్క సన్నిదియున్నది.
అమ్మా, నీవు నమ్ముచున్నావా? నీవు కలిగియున్న ఆస్మా పరిస్థితి నుండి నీవు అధిగమించగోరుచున్నావా? ఇలా చెప్పుము, “నన్ను స్వస్థ పరచినందుకు దేవునికి స్తోత్రము” నీ పూర్ణహృదయముతో అది నమ్ముచూ..., వెళ్ళుము మరియు దేవుడు దానిని నెరవేర్చగలడు. విశ్వాసము కలిగియుండుము.
అమ్మా, నీవు నమ్ముచున్నావా? ఆ కీళ్ళ నొప్పులను అధిగమించుటకు ఇష్టపడుచున్నావా? నీ చేయి పైకెత్తి ఇలా చెప్పు, “ప్రభువా, నేను స్వతంత్రుడనయ్యాను, ”దేవునికి వందనములు“ అని చెప్పుచూ, ఆనందముతో ఈ వేదిక మీద నుండి వెళ్ళుచుండగా, నీవు ఈ సహాయపడు చేతి కర్రలను క్రింద పెట్టుము. (టేపులో ఖాళీ ఉన్నది-సంపా.)
42
నీవు మానసిక భాధలు, దుఖమును కలిగి వున్నావు. సూర్యుడు అస్తమించుటకు ప్రారంభమైనప్పుడు ఒక సాయంకాలములో వాస్తవముగా నరాల బలహీనతకు గురి అయ్యావు. అది యధార్ధము కాదా? నీవు పూర్తిగా చీల్చివేయబడ్డావు. నీవు ఋతుస్రావములో వున్నావు, అది ఏలాగనగా, అలా నీవు పదార్థాలు తినలేక యుండునట్టు కడుపు అలాటి ఒక స్థితిలో వుండుటకు నీకు కారణమై యున్నది. ద్రావకముగా మారును. అది సరియే గదా? నీ చేయి పైకెత్తి ఇలా చెప్పుము, “ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను” వెళ్ళు....-ఇప్పుడు ఆనందించుచూ, ఇలా చెప్పుము “దేవునికి స్తోత్రము” .
అంతా బాగుంది. ఇలా చెప్పెదము, “ప్రభువునకు స్తోత్రము” ప్రభువైన యేసునామములో, నీవు వెళ్లి, యేసు నామములో స్వస్థతపొందుము. ఆమేన్“ దేవునికి వందనములు అని చెప్పుము. అంతా బాగుంది. అమ్మా, నీవు నమ్ముచున్నావా? ప్రభువైన యేసు నామములో నీవు వెళ్ళి, స్వస్థ పడుము మరియు యేసుక్రీస్తు నామములో పూర్తిగా బాగుపడుము. ఆమేన్.
ఇలా చెప్పెదము, “దేవునికి స్తోత్రము”
ఇక్కడ స్వస్థపరచుటకు ఇప్పుడే ప్రభువు యొక్క సన్నిధి వుండిన సమయం అయి వున్నది. నీళ్ళు కదిలించబడినవి. అడుగు పెట్టుటకిదే సమయము, ఇది సత్యమైయున్నది. దేవుడు సత్యమును ఋజువు చేయుచున్నాడు. నీవు ఈ సమయాన్ని ఎందుకు కలిగియుండకుండా వున్నావు?
ఇలా చూడుము. నీవు చేయనవసరం లేదు —-నీవు చేయవలసిన కార్యము విశ్వాసము కలిగియుండుటయే. నీవు ప్రత్యేకంగా భావించబడుచున్నావు. నీవు ఆ విధంగా లేవా? అది యధార్దము.
43
అమ్మా, అక్కడ ఒక కుర్చీలో కూర్చున్న నీవు, చూడుము. లేదా నీవు ఇక్కడకు రానవసరము లేదు. నీవు నమ్ముచున్నావా? నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? అంతలో అది ఆ విధముగా ఉండినయెడల, ఎందుకు, నీవు ఇక్కడ నిలబడి ఉండనవసరము లేదు. అక్కడే కూర్చుని ఉండమని నేను నీకు చెప్పియుందును. అది సరియే గదా? నీవు స్త్రీలకున్న ఋతుస్రావ బాధను కలిగియున్నావు. అది సరియైనది కాదా?అండాశయం పుండు, మీలో ఎవరికైనా ఉన్నట్లైతే ఎవరైనా స్త్రీలకున్న సమస్య కలిగి వుండినచో, మీచేయి పైకెత్తండి. అదిసరియే గదా. ఇప్పుడు వెనుకకు తిరిగి మరియు ఆ వరుస వెనుకకు వెళ్ళి మరియు బాగుపడుము.
ఇలా చెప్పెదము, “దేవునికి స్తోత్రము”.
నీవు అంగీకరించినయెడల, సరిగా ఇప్పుడే ఆయన నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముట లేదా? లేచి నిలబడెదము మరియు...?...అప్పుడు, ప్రతిచోట ఉన్నవారు. ఇప్పుడు మన చేతులు పైకెత్తెదము. మనం అలా...?...దేవుడే.
ప్రియమైన యేసు, మేము నీకు వందనములు చెల్లించుచున్నాము...?... నా హృదయమందు ఉండుము. ఆత్మ కుమ్మరించబడును గాక. వారిలో ప్రతీ ఒక్కరిని నీవు స్వస్థపరచుదువు గాక! వారు ఈ రాత్రి ఈ భవనము విడిచి వెళ్ళుచుండగా సంతోషించుచూ మరియు ఆనందముతో వెళ్ళుదురు గాక...