మరియు దానిని యెరుగక
1నెవిల్ సోదరుడా, వందనములు! ప్రభువు నిన్ను దీవించును. నేను ఎందులోనికో వెళ్ళిపోయాను. కదా? సహో. కాప్స్ బాలుని పట్ల ప్రభువు చూపిన దానికి వందనములు చెల్లించుచున్నాను. ఈ కొద్ది సమయము ఇండియనా వచ్చుటకు ఆలాగు కుదిరినది. దీనిని వారు రికార్డు చేయుట లేదని తలంచుచున్నాను. అక్కడ నాకెవరూ కనబడుట లేదు. ఉడుతల వేటకు వెళ్ళుటకు నేను తిరిగి వచ్చాను. ఒకటి రెండు రోజులు వేటలో నెల్లీ మరియు చార్లీలు కెంటకీలో నాతో సహకరించుదురని తలంచుచున్నాను. నేను ఆగస్టు మధ్యలో ఇక్కడికి వచ్చి చార్లీ, బాంక్స్ ఇంకా తదితరులతో ఉడుతల వేటకు వెళ్ళుటకు మరే ఇతరమగు వినోదమయినా గాని విడిచిపెట్టుదును. అది నాకు ఒక రకమగు ఆచారమగు పని. కాబట్టి నేను జోను తీసికొని వెళ్ళాను…
2ఒకసారి ఇక్కడున్నప్పుడు అందరూ రోగులే. అంత వేడి వాతావరణము నుండి ఇంత చల్లని వాతావరణమునకు వచ్చినందున మార్పు అది. ఇది మీరు చల్లదనముగా ఎంచరని నాకు తెలియును, కాని మీరు ఒక్కసారి ఆరిజోనాకు రండి! ఒక ఉదయాన నేను బయలుదేరినప్పుడు నీడలో 109° ఉన్నది. రాత్రిలోను, అర్థరాత్రిలోను కొండల పై నుండి చల్లని గాలి వీచినా గాని 96° ఉన్నది. అర్ధరాత్రియందు చల్లని గాలి వీచినప్పటి వాతావరణము అది. చలికాలములో ఆ స్థలము బాగుండును, కాని ఆ ఎండా కాలము తేళ్ళు మరియు బల్లులకే గాని మానవులకు కాదు. జంతువులు కూడా ఆ కొండలకు పారిపోవును. దానిని అవి భరించలేవు.
3నేను నా చిన్న తుపాకీతో పేల్చుచున్నాను. నేను ఏలాగయినా చిన్న కాప్స్ బాలుని గూర్చి మీకు చెప్పగోరుచున్నాను. జో, నేను అతనికి రైఫిల్ ఇవ్వవలసియున్నాను, ఎందుకనగా అతడు నాకంటే బాగా పేల్చును. దానిని మేము పేల్చాము, నేను 50 గజాల దూరంలో యున్నాను. "డాడీ! నేను పేల్చగలను" అని జో చెప్పాడు. (ఆ చిన్నవానికి తలనొప్పి వచ్చినది. తీవ్ర జ్వరము. నేను ప్రార్ధి౦చుచున్నాను. అతడు నాతో కూడా బయటకు వచ్చెను…) ఇరవై-రెండు రైఫిల్లో పది మీద రెండు ఉన్నచో అది ఇరవై-అయిదు గజములు ఆ తరువాత ఏబది గజములు దూసికొనిపోవును, రెండు పైన పది వలెనె వెళ్ళును. నేను ఇరవై-అయిదు గజముల దూరములో దానిని పేల్చాను. ఇంకా నా యొద్ద ఉన్న రెండు గురులను అక్కడ పెట్టాను. ఆ రెంటిని జో కొట్టలేడు అని తలంచాను. ఇంక నా వద్ద గురిగా పెట్టుటకు ఏమీ లేవు. అక్కడ పడియున్న ఒక చిన్న మట్టి పావురమును పెట్టాను, ఇంతకుముందు వేటగాళ్ళు ఉపయోగించిన దాని ముక్కను అక్కడ పెట్టాను — అంగుళములో మూడో వంతున్నది — మరియు ఏబది గజములు దూరంలో పెట్టగా, దానిని అతడు రెండుగా చీల్చెను. అతనికన్నా కొద్ది సంవత్సరములు మాత్రమే పెద్దవాడనగు నేను దూరంగా చూడగల యంత్రము తగిలించుకొన్నాను. అతడు నాతో ఇట్లనెను, "నీకు తెలియునా? నేను వెళ్ళి బిల్లీతో, ఇకనుండి నన్ను దూరముగా ఉంచమని చెప్పవలసియున్నాను."
''మంచిది, నీకో విషయము చెప్పనా; వెళ్ళి, మరియు సహో నార్మన్ కు అది చూపిద్దాం" అని నేను అన్నాను.
4"జో, ప్రపంచ పందెములలో ఇముడును" అన్నాను (ఎవరైనా గాని నేను లెక్క చేయను) ఎవరైనా… (ఎప్పుడూ ప్రక్కకు గురిపోనీయడు. సూటిగా కొట్టును. అది అంగుళములో నాలుగవ వంతు అయినా, పదహారవ వంతు మందముగా ఉన్నా, నాలుగవ వంతు ఎత్తులో ఉన్నా - అతడు దానిని ఏబది గజముల దూరములో నుండి సరిగ్గా మధ్యకు చీల్చగలడు. అంతకన్నా బాగుగా పేల్చగలవారు ప్రపంచములో ఎవరూ ఉండరు. ఛాంపియన్లు కూడా అదే చేయకలుగుదురు, కాని మూడుసార్లు వరుసగా ఆలాగు పేల్చజాలరు. ఆ కొట్టబడినవి వంగవు. తిన్నగా రంధ్రము పడును. కాగితము మీద రంధ్రము పడినట్లే యుండును.) "అంతకన్న కొట్టువారు మరెవరూ యుండరు" అని చెప్పాను. అతని తలనొప్పి వెంటనే వెళ్ళిపోయింది అని నేను అనుకొంటాను.
"సరే, దీనిని సహో. నార్మన్ కు చూపించుటకు వెళ్ళుదము" అన్నాను. (పొలము మరియు ప్రవాహము నొద్ద పనిచేయును. అది సహో, టోనీ ఫ్రోమీ యొక్క ఆటవస్తువులమ్ము చోటు.)
"మొదట బిల్లీ యొద్దకు వెళ్ళుదము. నేను ఒక సంగతిని బబ్బీకి చెప్పవలయును" అని చెప్పెను. (నిజానికి అతని సోదరుడు ఫ్రాంక్లీ ఎన్నడూ అంత బాగా చేయలేదు.) "మొదటగా మనము అచ్చటకు వెళ్ళుదము," అని అతడు పలికెను.
5నేను తలుపు యొద్దకు వచ్చుసరికి, బిల్లీ ఇంకా పైజామాలోనే యుండెను. బాగా వేడి పెరుగుచుండును గనుక మేము చాలా పెందలకడనే వెళ్ళాము. అతడు ఒక విధంగా, నా వైపు చూచెను. "అది బహుశా రోగులు పిలిచిన ఫోను పిలుపు కాబోలు" అని ఫోను మ్రోగితే నేనన్నాను. అది సహో కాప్స్ తన బాలుని గూర్చి చేసెను. అతడు వ్యాధిగ్రస్తుడై శస్త్రచికిత్స కొరకు వైద్యశాలలో ఎదురుచూచుచుండెను. ఆ వెంటనే మరల ఆ బాలుడు చక్కగా అగుచున్నాడని, బాగున్నాడని చెప్పెను.
చూడండి, దేవుడేలాగు పనిచేసెనో, ఆ చిన్న బాలుడగు జో స్వరమును కూడా వినెను. సహో నార్మన్ యొద్దకు వెళ్ళుటకు బదులుగా సహో. కాప్స్, నేను కలిసికొన్నాము. మా ప్రార్ధనల వలనే ఆలాగు జరిగినదని చెప్పుట కాదు గాని, ఆ విధంగా మేము క్షేమము అడిగి తెలిసికొనుట మంచిదయ్యెను. నీవు చేయుచున్న దానిలో నీకు విశ్వాసముండవలెను. పిలచుటకు అతనికి నమ్మకము కుదిరెను. బిల్లీ తాను ద్రవ్యము ఇచ్చుచున్నట్లు చెప్పెను. "ఇది తప్పక చాలా దూరమై యుండును" అని చెప్పి మూడు నిమిషముల ఫోనులో మాటకు దాదాపుగా అయిదు డాలర్లు ఇచ్చెను.
అది న్యూయార్కు నుండి గాని ఏదో ఒక ద్వీపము నుండి గాని వచ్చుచున్నదని నేను తలంచాను, కాని అతడు లోయిస్ ను పిలచుటకు బదులుగా బిల్లీని వ్యక్తిగతంగా పిలచెను. చూడండి, అందుకే అంత డబ్బు కర్చు అయినది.
ఇప్పుడు అతని బాలుడు తేరుకొనుచున్నాడు. ఆ బాలుడు అందులోనుండి కోలుకొనుట చాలా కష్టమని వైద్యుడు చెప్పెనని సహో, కాప్స్ మాతో అనెను. చూడండి, శస్త్రచికిత్స నుండి తప్పించెను. ఈ ఉదయాన దేవునికి వందనములు చెల్లించుచున్నాము - ఆయన యందు చాలా ఆనందించుచున్నాము.
6ఈ ఉదయాన ప్రొద్దుపొడుచు వేళకే మేల్కొన్నాము. నేను సుమారు మూడు గంటలు నిద్రపోయాను. నేను చాలా అలసిపోయాను. ఆలయానికి రావలసిన సమయము కాగానే, అందరము వచ్చేశాము.
దేవుని చిత్తమైతే… ఇప్పుడు నేను చెప్పినట్లుగానే కెంటకీకి వెళ్ళవలసియున్నాము. ఇక్కడికి నేను తిరిగి వచ్చినప్పుడు, ఒక ఆదివారము మాట్లాడుదునని వాగ్దానము చేశాను. వచ్చే ఆదివారమే దానిని నెరవేర్చుట మంచిదనుకొనుచున్నాను, ఎందుకనగా ఆ తరువాత నేను వెనక్కు వెళ్ళవలసియున్నాను. తిరిగి నేను కెనడా వెళ్ళవలెను. కాబట్టి వచ్చే ఆదివారము, వచ్చే ఆదివారము ఉదయమే నేను చేయుదును.
సహో. నెవిల్ నాతో ఇట్లనెను, "మీరు బయటకు వెళ్ళి జనులను పలుకరించి కొద్ది నిమిషములు వారితో మాట్లాడుదురా?''
"నెవిల్ సోదరుడా, ఇంకా నేను బైబిలు తెరవనే లేదు" అని చెప్పాను.
"బయటకు వెళ్ళి, వారితో ఏదో మాట్లాడండి" అన్నాడు.
శ్రీమతి నెవిల్, మీరేలాగు ఇది చేయుదురో నేనెరుగను. అతడు చాలా ఒప్పించే మనిషి.
కాని అయితే…
7నాకు దీనిని చెప్పుటకు అవకాశము దొరకలేదు, ఎందుకనగా అంతా క్రిక్కిరిసి జనులు కూడియున్నారు, కాని సహో, ఆర్మన్ నెవిల్ వంటి సంఘ కాపరిని ఇచ్చినందుకు దేవునికి నేను ఎన్నో వందనములు చెల్లించుచున్నాను. అతడు నమ్మకస్తుడు, ఎంత నమ్మకముగా యుండవలెనో - అంతనమ్మకముగా యుండును. ఎన్నడూ అతడు సణుగుట నేను వినలేదు. సహో, మాన్ తో యుండగా, అతనితో చక్కగా అరగంట సేపు మాట్లాడాను. ఈ సంవత్సరము కొలరెడోకు మేము వెళ్ళినప్పుడు, దానిగూర్చి మరెక్కువగా అతనికి నేను చెప్పెదను.
అతని వర్తమానము మేము అనుభవించుచున్నాము. సహో. నెవిల్ తో మంచి సంభాషణ జరిగినది. "మా చక్కని సంఘకాపరి గూర్చి కనీసము జనులకు చెప్పుట కుదరలేదు." "నిన్ను జనులు చక్కగా చూచుచున్నారా?" అనడిగాను.
"అంతకంటె బాగా మరెవరూ చూడరు" అన్నాడు.
"ఆ మాట విన్నందుకు నేను సంతోషించుచున్నాను" అని చెప్పాను. ఒక సంఘ కాపరి సంతృప్తి చెందినప్పుడు, జనులు సంతృప్తి చెందినప్పుడు - అది నిజంగా మంచి సంఘమని చెప్పగలము. అప్పుడు దేవుడు సంతృప్తి చెందును. ముఖ్యంగా మనము మోసికొనిపోవుచున్న ఈ వర్తమానము విషయంలో వీరు సంతృప్తిచెందుట శుభసూచకము. ప్రజలు మరియు దేవునితో వర్తమానము ఎడతెగక సాగిపోవుటను అది చూపించుచున్నది.
8సహో, ఆర్మన్ నెవిల్ మరియు చక్కని అతని భార్య కుటుంబమునకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. దేవుడు అతనిని విధేయునిగా చేసికొనునట్లు ప్రార్ధి౦చుచున్నాను. ఆయన కిష్టమైనచో ప్రభువైన యేసు మనకొరకు వచ్చినప్పుడు, అందరము ఇక్కడ నిలబడి కొనిపోబడుదుము గాక! మేమిద్దరము ముసలివారము, సహో. నెవిల్, నేను ఒకరిపై ఒకరము చేయి వేసుకొని, ఇద్దరమూ, మా చేతి కర్రలు పట్టుకొని నిలబడుటకు ప్రయత్నించుచున్నాము.
అంతట ఒక్క క్షణములో, కనురెప్పపాటులో మార్పు చెందుదుము. ఈ పాత శరీరము అను పైవస్త్రము పడిపోవును. నిత్య బహుమానమును పట్టుకొనుటకు లేచెదము. మధ్యాకాశము గుండా వెళ్ళుచూ, కేకలు వేయుదుము. "వీడ్కోలు, వీడ్కోలు, మాధుర్య ప్రార్ధన ఘడియ"; అప్పుడు ముందుకు కొనసాగుదుము.
9ప్రభువు ద్వారా సహో. కూమీర్ స్వస్థత పొందుట గూర్చి విన్నాను. దానిని బట్టి ఎంతో వందనములు. చాలా కార్యములు జరిగినవి! ఈ ఉదయమున ఇక్కడ ఉండుట బట్టి వందనములు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడూ ఇక్కడికి నేనొక ప్రత్యేక అంశముతో వచ్చెదను. ఈ ఉదయాన వచ్చి ఇట్లన్నాను, "నెవిల్ సోదరుడా, నేను గడియారమును బహు తేలికగా పరిశీలించెదను. జనులను తొందరగా బయటకు విడిచిపెట్టుదును. అప్పుడు కొద్ది నిమిషములు నా హృదయములోని దానిని గూర్చి వారితో సంభాషించెదను. వారు ఈ సంగతులను దేనినీ టేపు చేయరనుకొనుచున్నాను, సంఘ జనులే ఇక్కడ కూడియుండగా, మీరు చూచారా, కేవలము మనమే సహవాసము చేయదము." కనుక మనము ప్రార్ధి౦చుకొందము.
10ప్రియ యేసూ, ఇక్కడ మేము కూడికొను భాగ్యము అనుగ్రహించినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. అర్ధరాత్రి గడచుచుండగా, ఉదయకాలమున ఈ ఆలయమును చూచి ఈ ఆలయములోని కొందరిని గూర్చి ఆలోచించాను. మీరెట్లు నిలబడిరో చూచాను. ఇక్కడుండిన పెద్ద చెరువు గూర్చి తలంచాను. నాచు మొక్కలు పెద్దవి లేచెడివి. సరిగ్గా అక్కడే ఈ వేదిక యున్నది. చిన్నవానిగా ఇక్కడ నేను నిలబడ్డాను. ఈ స్థలమును కొద్దిపాటి డబ్బుకు తీసికొమ్మని శ్రీ. ఇంగ్రమ్ చెప్పెను. వెంటనే డబ్బు చెల్లించినా, చెల్లించకపోయినా తీసికొనుటకు ప్రయత్నించమని చెప్పెను. దాని మొత్తము వెల 2000 డాలరుకు కొద్దిగా పైన యున్నది. దానిని ఇరవై సంవత్సరములకు చెల్లించవలెను.
ప్రభువా, దాని వైపు ఇప్పుడు చూడుము. ఇక్కడ ఉన్న నీటి రంధ్రము యొద్ద ఇంకా నీరు ఉబుకుచున్నది. నీవు వాక్యము ద్వారా ఎంతగా వాగ్దానము చేసితివి! "ప్రభువగు నేను దీనిని నాటితిని, ఎవరును నా చేతి నుండి దీనిని అపహరించకుండా - దివారాత్రులు దానికి నేను నీరు పోయుచున్నాను." అదే సమయములో జనులు, "ఆరు నెలలు తిరగక ముందే ఇది గ్యారేజిగా మారును" అనిరి.
11అయితే ఈ బలిపీఠము నొద్ద అక్షరాలా వేలకొలది ఆత్మలు క్రీస్తును కనుగొనెను. ప్రభువగు యేసు నామములో జనులు బాప్తిస్మము పొందిరి. ఆయన నామమున ప్రార్ధి౦చిరి. తమ పాపములు కడుగుకొనిరి. వందలాది కుంటివారు, బాధలోనున్నవారు, గ్రుడ్డివారు, అవిటివారు, అంగవికలురు, కాన్సరుతో తినివేయబడినవారు, చనిపోవుచున్న స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, ఈ బలిపీఠము యొద్దనుండి నూతన శరీరములతో, నూతన జీవములతో నడిచిపోయిరి. తమ చక్రాల కుర్చీలు, చంక కట్టలు మొదలగునవి విడిచిపెట్టిరి. ఓ, దేవా, ఇది ముప్పది సంవత్సరముల సేవ…
తండ్రీ, ఈ మూలరాయిని వేసిన ఉదయమును గుర్తుచేసికొనుచున్నాము. ఈ స్థలమును దర్శనములో చూపించావు. జనులు క్రిక్కిరిసియుండిరి. అందమగు మూలగా చూచాము; అది తప్పిపోదని నాకు తెలియును. కావున, ఈ సంగతులన్నింటి కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాను.
12వారిలో అనేకులు మంచి పోరాటము పోరాడిరి, పరుగు తుదముట్టించిరి, మరియు విశ్వాసము కాపాడుకొంటిరి. ఆవల యుండి ఇప్పుడు కనిపెట్టుచుండిరి. విశ్రాంతి తీసికొనుచుండిరి. తమ ప్రయాసనుండి విడుదల పొందిరి. వారి క్రియలు వారిని వెంబడించుచున్నవి. కడబూర మ్రోగు ఘడియ కొరకు కనిపెట్టుచున్నారు. నూతన శరీరముతో నూతన జీవములోనికి వచ్చెదరు. వారిలో చాలామంది ముసలివారయి వణకుచూ యున్నారు. కొందరు యువకులుగా నున్నారు. కొందరు నడివయస్సులో నున్నారు. కాని నీ నామము అంతటా స్తుతింపబడు గాక!
సజీవుల యెదుట, మృతుల ఎదుట మరల మేము నిలబడియున్నాము. ఈ ఉదయమున నీ మాటలను అభిషేకించుమని అడుగుచున్నాను. ఒక్క సంగతియు నాకు చెప్పుట రాదు. ప్రభువా, ఎల్లప్పుడూ నీవు చేయుచున్నట్టే, ఇప్పుడును చేయమని అడుగుచున్నాను. మా సంఘ కాపరియగు సహో. నెవిల్ ను దీవించుము. ఆతని భార్యను దీవించుము. ట్రస్టీలను, పెద్దలను, శరీరములోని ప్రతి విషయమును దీవించుము. ఈ జీవితములోను నిత్యజీవమును మేము పొందుదుము గాక!
వాక్యము, ఆత్మ నుండి దిద్దుబాటును స్వీకరించునటు, ఈ ఉదయమున మాకు సహాయము చేయుము. ఈ ఉదయమున తలుపులు దాటి మేము కదిలిపోవుచుండగా, మమ్మును మేము సిద్దపరచుకొనునట్లు, గతములో కంటె మరింత శ్రేష్టమగు జీవితము జీవించుటకు తీర్మానించుకొనునట్లు సహాయము చేయుము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
13ఇప్పుడే, నేనిక్కడ బైబిలు తెరచాను. అది కొద్ది నిమిషములకు ముందు జరిగినది. ప్రకటన 3లో యున్న లవొదికయ వర్తమానమును చదివాను.
నేను మీకు ఒక సంగతి కూడా ప్రకటించవలెను. (సహో. నెవిల్ ఇప్పుడే చెప్పుచున్నాడు) సహో. పార్నెల్ ను ఇప్పుడే ఇక్కడ కూర్చొనియుండుట చూచాను. మెంఫిస్ కు ఈ ప్రక్కన జరుగుచున్న ఉజ్జీవ సభలలో యున్నాడు. ఇంతకు ముందు వింపీ హాంబర్గర్ స్టాండు ఎక్కడున్నదో ఎరిగిన వారికి చెప్పుచున్నాను. సరిగ్గా అక్కడే అతడు తన గుడారము వేసియున్నాడు. ఆ బయట మార్గములో జీవమునకు నిర్ణయించబడిన వారు ఎవరైనయున్నయెడల, వారిని క్రీస్తు కొరకు సంపాదించవలెనని అతడు ప్రయత్నించుచున్నాడు. ఆలయములోనున్న ఆరాధనల కొరకు తన కూటమును ఆదివారము మూసివేసెను. చాలా విధేయతగల సోదరుడు. సోమవారము రాత్రి మరల కూటము తెరువబడి మరుసటి వారము వరకు జరుగునని మీకు తెలుపుచున్నాము. క్రీస్తు యొక్క ప్రేమ గూర్చి సహో. పార్నెల్ ఇచ్చు వర్తమానమును వినుటకు మీరందరూ సాదరముగా ఆహ్వానించబడుచున్నారు.
REV 3:14-19
14ఇప్పుడు, ప్రకటన 3వ అధ్యాయము నుండి చదువుదము. బైబిలులోని ఒక భాగము మాత్రమే చదువుదము, ఎందుకనగా నేను చెప్పునది తప్పిపోవచ్చును గాని, ఆయన చెప్పునది తప్పిపోదు. ఎక్కడ నుండి ప్రారంభించవలెనో, ఏమి చేయవలెనో, ఎక్కడికి వెళ్ళవలెనో నాకు తెలియదు గాని, లవొదికయ సంఘకాలము గూర్చిన 14-19 వచనములు చదువదము.
లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము; ఆమేన్ అనువాడును, సమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా -
నీ క్రియలను నేనెరుగుదును, … నీవు చల్లగానైనను లేదా వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను లేదా వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ సుద్దేశించుచున్నాను.
కాని నీవు దిక్కుమాలినవాడువును, దౌర్యాగ్యుడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును అయియున్నావని ఎరుగక యున్నావు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసికొనియున్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
గనుక నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.
REV 3:17
15ఒక నిమిషము నన్ను క్షమించండి. ఎక్కడో గాని చదివినట్టున్నాను. అది నాకు మంచిగా అనిపించినది. ఇప్పుడది ఎక్కడున్నదో నాకు తెలియదు. ఇక్కడున్నది: "నీవు దిక్కుమాలినవాడవును, దౌర్భాగ్యుడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును అయియున్నావని యొరుగక యున్నావు." ఓ మై! ఈనాటి సంఘము యొక్క చిత్రమది. సంఘ కాలముల పుస్తకము విడుదలయగుచున్నది. కాని మనము లవొదికయ సంఘ కాలములో ఉన్నాము. దానియొక్క స్థితిని గూర్చి చూద్దాం.
మరే ఇతర అంశము నేను తీసికోగోరుట లేదు, ఎందుకనగా మనము దీనిని గురించి ఆకస్మికముగా మాట్లాడుట లేదు. ప్రభువు నడిపించినదే మాట్లాడుదును. అది మనకు సహాయపడవలెను.
లవొదికయ సంఘ కాలమును, దాని స్థితిని గూర్చి ఆలోచించుదము. నాకు తెలిసినంతవరకు ప్రభువగు యేసు రాకడను ఆటంకపరుచునది ఏదియూ నాకు కనబడుట లేదు. ఆయన సంఘము సిద్ధముగా యుండవలెను. అది ప్రవచనములలో ఒకటి అని తలంచుచున్నాను.
MATT 22:21•
MARK 12:17
16ఇక్కడికి వచ్చుటకు టుసాన్ నుండి రెండు వేల మైళ్ళు, రెండు రోజులు నేను మరియు బిల్లీ నిన్న కారు నడుపుకొని వచ్చాము. వేగ చట్టములను అతిక్రమించకుండా వచ్చాము. అతడు నడుపుచుండగా, నేను చేరబడి తుపాకీవలె కూర్చున్నాను. అతడు వేగముగా పోతూంటే, "ఒక్క నిమిషము ఆగు బాబు. కైసరుది కైసరుకు చెల్లించాలి" అని హెచ్చరించాను.
గతరాత్రి ఇక్కడికి వచ్చాము. సుమారు మూడు సంవత్సరముల బాలిక రోడ్డు మీద పడియున్నది. ఇంకా చూడగా, ఆమె తల్లి గుంటలో మరణించి కనబడినది. ఆర్.ఒ.టి.సి నుండి వచ్చిన 18 ఏండ్ల కుర్రాడు గంటకు 120 మైళ్ళ వేగముతో పోతూ ప్రమాదమును తెచ్చెను. అతడు త్రాగియుండెను. అతడును రోడ్డుకు ఎడమ వైపు చచ్చి పడియున్నాడు. మీరిప్పుడు గ్రహించండి. "కైసరుది కైసరుకు చెల్లించుడి."
17అమాయకులగువారు చనిపోవుచున్నారు. ఒక చిన్న మూడు సంవత్సరాల బాలిక చనిపోయినది, ఎందుకనగా ఒక త్రాగుబోతు సైనికుడు గంటకు 120 మైళ్ళ వేగంతో రోడ్డులో తప్పు ప్రక్కన వచ్చుచుండుట వల్లనే. కొండ మీదినుండి క్రిందికి దిగుచూ వారిని చంపెను. వాడును చచ్చెను. మీరు చూడండి, అమాయకులను చంపెను.
ఆ కుర్రాడు రక్తము చిందించి హత్య చేసిన నేరస్తుడు. ఎవడయినా గాని త్రాగి నడుపుచున్నచో, వాడిని పట్టుకొని 10 సంవత్సరముల జైలు శిక్ష విధించవలెను, ఎందుకనగా ఉద్దేశించిన హత్యే, ఎవరైనా…
18రాజకీయములతో మనకేమీ పొత్తు లేదు. అది చెడిపోయినది. ఒక నీతిమంతుడగు రాజు ఏలవలెననునదియే దేవుని చిత్తము. కాని రాజకీయము కేవలం విస్తరించిపోయింది. ప్రతిదీ నీవు బయటకొనవచ్చును. "మీరెక్కడున్నారో చూడండి" అని నేను కొన్ని ఆదివారముల క్రితం చెప్పాను. అంతా కలుషితమే తప్ప మరేదియూ కనబడుటలేదు. కాని నీతిమంతుడగు రాజు తన స్వంత చట్టములను చేయగలడు. నీవు మనిషిని చంపినవాడవైనా రాజకీయములతో పేరొందుదువు. నీవు అందులో నుండి బయటకు రావచ్చును. ప్రజాస్వామ్యము మంచి ఉద్దేశ్యమే, కాని అది పనికిరాదు. కమ్యూనిజం వలె అది మంచిగా వినిపించవచ్చును. అందరూ పంచుకొనుట భాగానే యుండును, కాని పని జరుగదు. దావీదువలె ఒక రాజును కలిగియుండుటయే దేవుని ఇష్టము.. అది సరి. మరియు నీవు ఒకదానిపైన నీ మనస్సును ఉంచుదువు. ఒక బాతుల మంద మీద ఒక్క నాయకుడున్నట్లుగా నుండును. వాటిలో రెండు లేదా మూడిటిని నీవు తిసుకోలేవు. కావున నీవు అన్నిటిని కలిపివేస్తావు, నీవు ప్రతివిధమైన ఆలోచనతో వస్తావు. కాబట్టి నేటి పరిస్థితులు ప్రభుని రాకడకు సిద్ధముగానున్నట్లు మనము కనుగొనుచున్నాము.
19సహో. నెవిల్, నేను, ఇంకా ఈ సోదరులందరమూ కలిసి ఒక మందను కాయుటకు ప్రయత్నించుచున్నాము. ఇప్పుడు నా మనస్సులో ఒకటున్నది, దానిగూర్చి మనము మాట్లాడు కొనవచ్చునను కొంటాను. అదేమనగా, ఒక రోజున ఒక మంచి స్త్రీ నుండి ఒక ఉత్తరము వచ్చినది. నాకెన్నడూ రాలేదు; అది మరియొక వ్యక్తి ద్వారా వచ్చినది. ఆమె నన్ను చీల్చివేయుటకు ప్రయత్నించుచున్నది. "సహో, బ్రెన్హాంను ఆపుటకు క్రైస్తవ వ్యాపారులగు మీరు ఏదైనా చేయ ప్రయత్నించవచ్చు గదా?" అని ఆమె చెప్పినది. ఎందుకనగా "లవొదికయ సంఘకాలము" అను పుస్తకము ఇప్పుడే విడుదల చేసిరి. "అతడు పెంతెకోస్తు సిద్దాంతమును ముక్కలు చేయుచున్నాడు. భాషలు మాట్లాడుట ప్రధమ సూచన కాదని అతడు చెప్పుచున్నాడు. స్త్రీ బోధకులకు అతడు వ్యతిరేకి" అని ఆమె వ్రాసినది. (ఆమె స్త్రీ బోధకురాలు!)
ఆమె పిల్లలు నాకు గల ప్రపంచములోని అతి మంచి స్నేహితులలో ఒకరు. నేను కలిగియున్న మంచి స్నేహితులలో శ్రేష్టమైనవారు. మరియు ఆమె ఇప్పుడు చెప్పింది…
ROM 16:1•
1COR 14:34•
1TIM 2:12
20ఈ భార్యాభర్తలు (వారితో నేను అల్పాహారము తినుచున్నాను) ఇట్లనిరి, "బ్రెన్హాం సోదరుడా, ఇటు చూడు, దీని గురించి నీవు ఏమి అనుకుంటున్నావు" అని చెప్పి ఉత్తరము తీసిరి.
"సరే, సహోదరి, ఆమె అర్థము చేసికొనదు" అని నేను అన్నాను.
వారి తల్లి బోధకురాలని ఆ బాలురు చెప్పిరి, ఆమె వర్తమానము కొరకు వెళ్ళలేదు. ఇక్కడామె ఇట్లు చెప్పినది — "స్త్రీకి పురుషుని మీద అధికారము లేదు." అయితే బైబిలులో పౌలుకు సహాయకురాలిగా నుండిన ఫోబే మాట ఏమిటి?"
ఆమె సామానులను అమ్ముకొనునది అను సంగతి నిశ్చయమే. "స్త్రీ సంఘములో మౌనముగా నుండవలసినదే" అని చెప్పిన పౌలు మరల ఫీబే వైపు తిరిగి, "సువార్తలో నా సహాయకురాలవగు ఫోబే, కొన్ని రాత్రులు నీవు బోధించు" అని చెప్పునా? ఆలాగయితే అతని మాటలో తేడా వచ్చును, చూడండి.
"దానికి అంతటికి పైగా (బైబిలులోని ఒక న్యాయాధిపతి ఎస్తేరు అనుకొంటాను) బైబిలులో ఒక స్త్రీ న్యాయాధిపతిగా యుండుట అంతకన్నా గొప్ప సంగతి కాదా? అది ఒకవేళ పురుషులపై అధికారము కాదా…" అని ఆమె అడిగినది.
1COR 14:34
21స్వస్థత పొందిన ఈ వ్యాపారి ఇక్కడి ఆలయములోనే కొంతకాలము క్రిందట తన భార్యతో వచ్చి ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, అది నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే."
"సోదరీ, ఎందుకు నీకది ఆశ్చర్యము?" అనడిగాను.
"ఆమె స్త్రీ న్యాయాధిపతి గదా?" అన్నది.
అది రాజకీయమే గాని సంఘము కాదు అన్నాను. సంఘముతో దానికి ఎట్టి సంబంధము లేదు. "ధర్మశాస్త్రము క్రిందున్నట్లే లోబడియుండవలెను" అని పౌలు చెప్పెను. ధర్మశాస్త్రము ఒక స్త్రీని యాజకునిగా చేయదు; స్త్రీ ప్రధాన యాజకుని మీరెన్నడూ కనుగొనరు. బైబిలులో ఎక్కడునూ స్త్రీ యాజకురాలు లేదు. బైబిలులో ఎన్నడూ బోధకురాలు లేదు. నిశ్చయము. మిర్యాము మొదలగు వారు ప్రవక్తీనులు, ఎస్తేరు న్యాయాధిపతిగా ఇశ్రాయేలు మీద ఉండెను. కొన్నిసార్లు వారిమీద రాణులు మొదలగు వారు ఉండిరి. రాజు చనిపోయినప్పుడు మరో రాజుని ఎన్నుకొనువరకు రాణి అధికారములో యుండెడిది.
22ఆరిజోనాలోని టుసాన్ లో ఒక స్త్రీ న్యాయాధిపతి యున్నది. ఆ పట్టణము అందుకే అంత పాడయిపోయినది. స్త్రీకి రాజకీయములో ఎట్టి జోక్యము తగదు. సంఘములో ఆమెకు ఆధికారము చెలాయించు అవకాశము లేదు. ఆమె స్థానము ఇంటిలో పురుషునికి రాణిగా నుండుటయే. అంతకు మించి ఏమీ లేదు. అది సత్యమని మనకు తెలియును. అది పాత పద్ధతిగా మీకు కనబడును గాని, నేను బాధ్యతాయుతంగా చెప్పాను.
ఈ భూమి మీద నుండి నేను పోయిన తరువాత ఈ టేపులు, ఈ పుస్తకములు జీవించును అని నాకు తెలియును. ఇది పూర్తి సత్యము అని రాబోవు దినములలో మీ యౌవన పిల్లలు తెలిసికొందురు, ఎందుకనగా ప్రభువు నామమున దీనిని నేను పలుకుచున్నాను.
REV 3:17
23ఇప్పుడు, ఒక మంచి స్త్రీ, భర్తకు విధేయురాలు, చక్కని పిల్లలుగా తీర్చిదిద్దిన స్త్రీ, వర్తమానము విన్న వెంటనే 100% అమ్ముడు పోవుచున్నది. అది ముందు నిర్ణయము వలననే జరుగగలదు. అది రాగల మార్గము అదొక్కటే.
ఇప్పుడు, ప్రభువు నాకు ఈ ప్రశ్నను మరల తీసికొనివచ్చెను! "నీవు దిగంబరివనియు, దిక్కుమాలినదానివనియు, దరిద్రురాలివనియు, గ్రుడ్డిదానివనియు ఎరుగకయున్నావు."
24దానియొద్దకు నేను వచ్చు ముందుగా ఈ స్థలంలోనే కొన్ని రోజుల క్రితం 'ఈ ప్రపంచపు దేవుడు' అను వర్తమానములో చెప్పినది గుర్తుచేసెదను. మతారాధనలలో దయ్యమును వారు పూర్తిగా ఆరాధించునట్లు ప్రజల కన్నులు గ్రుడ్డితనము కలుగచేసెను. మీ అందరికి అది అర్ధమై౦దా - మీరందరు దానిని అర్ధము చేసికొనిరా?
అవినీతికరంగా, అసభ్యంగా బట్టలు ధరించిన స్త్రీ తీర్పు దినమున ఒక వేశ్యగా ఆయన నిరూపించునని, ఆ వర్తమానములోనే నేను చెప్పాను. అది చాలా వింతగా కనిపించును.
ఒక చిన్న చిత్రము, మీకు చూపించెదను.
25ఈ పట్టణములో ఒక యువ న్యాయాధికారి యున్నాడు. రాజకీయంగా అతడు మంచివాడు. రాజకీయాలలో సభ్యత కలిగియున్నాడని తలంచుచున్నాను. అతడు చాలా పేరొందిన ఒక బాలికతో స్నేహము చేయుచూ ప్రేమించి పెండ్లిచేసికొనిరి. వారు అన్ని గొప్ప గొప్ప విందులకు మున్నగు వానికి హాజరయి ఇద్దరు కలిసి త్రాగుచున్నారు. చివరకు ఆమెకు చక్కని గృహము ఏర్పడినది. ఆమె చక్కని పొరుగువారి యొద్ద జీవించుచున్నది. ప్రజల మధ్య మంచివానిగా అతడు ఎంచబడెను, ఇద్దరూ త్రాగుదురు; ఆమె పొట్టిబట్టలు ధరించును, జుట్టు కత్తిరించుకొనును, రంగులు పూసికొనును; ఆమె తన అందమును బయటకు చూపించును.
అసలు ఆమె ఎన్నడూ సంఘమునకు వెళ్ళదు, వారెవరూ వెళ్ళరు. వారి ఇంటి ప్రక్కనే బాప్టిస్టు లేదా మెథడిస్టు చర్చికి వెళ్ళు దంపతులున్నారు. (ఈ స్త్రీ మెథడిస్టు అనుకొందాము, ఎందుకనగా వారు బాప్టిస్టుల కంటె పరిశుద్ధులమని చెప్పుకొందురు — క్రొత్త నిబంధన బాప్టిస్టులు మాత్రమే పరిశుద్ధతను గూర్చి ఎక్కువ చెప్పెదరు. మామూలుగా బాప్టిస్తు వారు అసలు పరిశుద్ధత గూర్చి పట్టించుకొనరు. వారు దానిని నమ్మరు. కాబట్టి వీరిని మెథడిస్టువారని అనుకొందము, ఎందుకనగా వారే ఎక్కువగా పరిశుద్ధత గూర్చి చెప్పెదరు).
26ఈమె వీధిలోనికే, ఈమె ఇంటి ప్రక్కకే ఆ మెథడిస్టు స్త్రీ వచ్చెను. ఆమె భర్త ఒక అకౌంటెంటు లేదా ఏదో ఆఫీసులో పనిచేయుచున్నాడు. తన పేరు జాన్, ఈ లాయరు పట్టణములోనికి వెళ్ళిపోయిన వెంటనే, ఈ మెథడిస్టు స్త్రీ ఆమెను చూచును. నేను చెప్పేదంతయూ కల్పిత గాధ. పేరు కల్పితమే. ఆమె రాల్ఫ్ తో వెళ్ళుచుండెను. (మీరు గాధను అర్ధము చేసికొనుటకు కల్పిత నామములు చెప్పుచున్నాను.)
ఒక త్రాగుడు విందులో మొదటిసారి రాల్ఫ్ ఆమెను కౌగలించుకొనెను. ఆమె మండిపడినది, ఆమె మరల రాల్ఫ్ తో ప్రేమలో పడినట్లు తలంచుచున్నది. అప్పుడు కొంత సమయము తరువాత రాల్ఫ్ ఆమెను కలిసికొనెను. ఆమె చాలా తెలివైనది గనుక జాన్ ను పెండ్లిచేసికొనియు, రాల్ఫ్ తో మామూలుగా కొనసాగవచ్చునని తలంచినది.
చూడండి, స్త్రీకి సభ్యతగా ఉండుట కూడా అసలు రాదు. దానిగూర్చి అసలు ఆమె తలంచదు.
27కాని ఈ మెథడిస్ట్ స్త్రీ మరో రీతిగా ఎదిగినది. ఆమె కనీసము ఆలయానికి కూడా వెళ్ళదు; ఆమె చాలా భయంకర స్త్రీ అని ఈమె తలంచును. తన భర్త వచ్చునప్పుడు ఇట్లు చెప్పును, "అతడు అక్కడామెను కలిసికొనును. జాన్ తన వాదనకు ఫిలడెల్ఫియా లేదా మరెక్కడికో వెళ్ళినప్పుడు ఆమెను ఇతడు షికారుకు తీసికొని వెళ్చును. వారు సాగర తీరమున పరుందురు. వారు ఇంటికి వచ్చుట నేను చూచాను. కొన్నిసార్లు వారు తెరలు దించకుండానే ముద్దు పెట్టుకొందురు మరియు సరసము ఆడుదురు. ఓ! అది చాలా ఘోరము కాదా," అని ఆమె భర్తతో అనును. "ఆమె వీధి వేశ్యగాక మరేమిటి?"
అది సత్యము. ఆమె వీధి వేశ్యకన్నా నీచురాలు, ఎందుకనగా ఆమె వివాహిత, చూచారా. ఆమె ఎన్నడూ సంఘానికి వెళ్ళదు గనుక నీచురాలు అని ఈ మెథడిస్ట్ స్త్రీ తలంచును.
MATT 5:28•
REV 3:17
28ఇప్పుడు, ఈ మెథడిస్ట్ స్త్రీ అలాంటిది ఏది చెయ్యదు. లేదు, నిశ్చయంగా! ఆమె సభ్యత గలది. ఇంకో సంగతి ఏమనగా, ఆమె ఒక్క చుక్క విస్కీ ముట్టుకొనదు, ఎందుకనగా మెథడిస్ట్ చర్చి… 90% విస్కీకి విరోధముగా పనిచేసి నిషేధించును. వారికి ఆ నిషేధ కార్యక్రమమున్నది. మరియు ఆ మెథడిస్ట్ చర్చి వారు సంఘ ఉపదేశకుల కంటే ఎక్కువగా జీవించరు.
కాని ఈ మెథడిస్టు స్త్రీ సాయంకాలములందు పొట్టి బట్టలు ధరించి తన భర్తతో కూడా ఆదివారపు బడికి వెళ్ళును. ఆమె జుట్టు కత్తిరించుకొనును, పెదవులకు రంగు పూసికొనును, కొద్దిగా పొగ కూడా త్రాగును.
ఇప్పుడు, దేవుని వాక్యము బట్టి వారిద్దరూ వేశ్యలే. కాని ఇక్కడ ఒకరు దిగంబరిగా, నీచురాలిగా, దిక్కుమాలినదానిగా, గ్రుడ్డిదానిగా యుండియు ఎరుగకున్నది. ఇద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు. ఏలయనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, అప్పుడే ఆమెతో తన హృదయమందు వ్యభిచరించినవాడగును.
29ఈ స్త్రీ ఇలాగ అనవచ్చును, "ఒక్క నిమిషము ఆగు బ్రెన్హాం. నీకు అర్థము చెప్పెదను, నేను వేశ్యను కాను!" నా సోదరీ, నిన్ను బైబిలు ముందు ఉంచెదను. నీ భర్తపట్ల నీవు ఉండగలిగిన విధముగా యధార్ధముగానున్నట్లు దానిమీద చేతులు వేసి దేవుని సన్నిధిలో ప్రమాణము చేయవచ్చును. నీ శరీరము భర్తకే చెందియుండును, కాని నీ ఆత్మ దేవునికి చెందియున్నది. నిన్ను అభిషేకించుచున్న ఒక దురాత్మ యున్నది. ఆలాగు కానియెడల, నీవు పూర్తిగా వెర్రిదానివని నిరూపించెదను.
అట్టి పొట్టి దుస్తులు వేసికొని మీ అమ్మమ్మ వీధిలో నడిచిన ఎడల ఏమనియ౦దురు? ఆమె సరిగ్గా దుస్తులు ధరించకయున్నది గనుక వెంటనే ఆమెను పిచ్చాసుపత్రిలో వేయుదురు. ఆమె మతి సరిగ్గా లేదు. అప్పుడు ఆలాగుండినయెడల, ఇప్పుడునూ ఆలాగే యుండును.
కాబట్టి మొత్తం లోకమే పిచ్చిదయినది. అందరికీ మతి చెడినది. అది మెల్లగా ప్రాకీ, చివరకు జనులు దానిని గ్రహించని స్థితికి వచ్చిరి.
30ఇప్పుడు, ఆమె ఒక వేశ్యయేనా? ఆమె భర్తకు చేసిన ప్రమాణము శరీర విషయములో తప్పులేదు, కాని దేవుని ఎదుట ఆమె ఆత్మ చెడ్డది. అందుకే ఆలాగున ఆమె బట్టలు ధరించుచున్నది. ఆమె లవొదికయ సంఘ కాలములో యున్నది. దానిని ఆమె చేయుచున్నదని ఎరుగదు. తమ్మును ఒక వేశ్యగా దేవుడు తీర్పు తీర్చునని అమాయకులగు స్త్రీలకు తెలియదు. మీరు అక్కడే ఉన్నారు.
మీరు ఆమె దగ్గరకు తీసుకు వెళ్ళండి. ఆమెకు చెప్పలేరు. దానిని ఆమెకు అర్థము చేయు మార్గము లేదు. "వారు దిగంబరులు మరియు దానిని వారు ఎరుగరు" అని బైబిలు చెప్పెను.
ఆమెను నీవు వ్యక్తిగతంగా ఒక వేశ్య అని పిలచినయెడల, ఆమె నిన్ను అరెస్ట్ చేయి౦చును; ఆమె ఆలాగు చేయును. నేను వ్యక్తిగతముగా ఎవరిని గూర్చియు చెప్పుట లేదు. నేను పాపము గూర్చి మాట్లాడుచున్నాను. "ఈ ప్రత్యేక సంఘము ఇక్కడ పలాని వారు, రెవరెండు పలాని" అని నేను ఎప్పుడూ అనను. నేను వ్యక్తులను అనుట లేదు. అది వ్యక్తులను కాదు; వారున్న క్రమమును, అది లోక క్రమము.
31సహో, జార్జి రైట్ ఇక్కడ కూర్చొనియున్నాడు — ఆయన వయస్సు 75 లేదా 78 సంవత్సరములు అనుకొంటాను. శ్రీమతి రైట్ను చూచుటకు నీవొక రోజున వెళ్ళినప్పుడు, ఆమె పొట్టిబట్టలు ధరించి కనబడినచో, నీవు ఏమందువు? ఆమెను గదిలో పెట్టి తాళము వేయుదురు. ఆమెను ఆయనెన్నడూ పెండ్లిచేసికొనియుండక పోవును.
మంచిది, ఆ దినములలో ఏ యువకుడు ఆలాగు చేసినా గాని, అదే జరిగియుండును. అప్పుడు అది తప్పు మరియు పాపము అయినచో, ఇప్పుడును అంతే; అయితే జనులకు పిచ్చి ముదిరినది.
32అది నెరవేరు ముందుగా నన్ను ఒక ప్రవచనము చెప్పనీయుడి. ప్రపంచమంతయూ పిచ్చిలో తడవులాడుచున్నది, మరియు అదింకా ముదురును, మరియు ఇంకా పెచ్చు పెరుగును. నేను చెప్పునదేమనగా వెర్రివారు గుంపుగా తయారగుదురు; అది దాదాపు ఇప్పటికే ఆలాగయిరి.
రోడ్డుకు తప్పు వైపున ఒకడు లైట్లు లేకుండా కారు నడుపుట ఏమిటి? రిక్కీ, ఆ యౌవన బాలుడిని బడిలో నుండి వెళ్ళగొట్టియుండవలెను. ఆ విధముగా చేసినచో, వాడు ఇందరిని చంపియుండకపోవును.
తరువాత వాడును అదే చేయుచూ వాడి వెనుక వచ్చెను. యువకుడు తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుట ఏమిటి? మంచి వయస్సులో, అందంగా, మంచి శరీర సౌష్టవముతో, చక్కని రూపము, మంచి ముఖము, సౌందర్యము కలిగిన స్త్రీ ఆలాగు ప్రవర్తించుటను బట్టి మనము అంత్యకాలములో యున్నామని తెలియుచున్నది. ఆమె పూర్తిగా లోక భోగముల లోనికి పోయెను. పరిశుద్ధ సౌందర్యము, ఆత్మ మాధుర్యము ఆమెకు లేదు, అది లోక అందము. నేను స్త్రీలను చూచాను, వారి బయట చూచుటకు ఏమియూ లేదు, కాని వారితో కొద్ది నిమిషములు మాట్లాడండి; వారు నిజ రూపము తెలియును; వారినుండి దూరంగా పోజాలనిది ఏదో యున్నది. చూడండి, బయటనున్న సౌందర్యము దయ్యము వలన కలిగినది; అది లోకము వలన కలిగినది.
GEN 6:2•
NUM 25:1
33కయీను పిల్లల వైపు చూడండి, వారెట్లు అందులోనికి వెళ్ళిరో చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి, వారిని తమకు భార్యలుగా తీసికొనిరి. దేవుడు వారిని ఎన్నడూ క్షమించలేదు.
చూడండి, ఆ ఇశ్రాయేలీయుల స్త్రీలు జడలు అల్లుకొని, సున్నిత హస్తములతో నుండిరి; ఆ దేవుని కుమారులు మోయాబు దేశము గుండా వచ్చుచూ చక్కగా తలలు దువ్వుకొని, ముఖముల మీద చిత్రంగా దిద్దుకొని, వింతగా కనబడుచున్న స్త్రీలను కలిసికొనిరి. ఆ చక్కగా అందముగానున్న స్త్రీలను దేవుని కుమారులు కలిసికొనినప్పుడు, అబద్ధ ప్రవక్త ఇట్లనెను, "మనమంతా ఒక్కటే." వారిని పెండ్లిచేసికొనిరి, మరియు దేవుడు వారిని ఎన్నడూ క్షమించలేదు; వారు అరణ్యములో నశించిరి.
వారందరూ అక్కడే నశించిరి, నిరీక్షణ లేకుండా, దేవుడు లేకుండా, వారు నిత్య నాశనమయిరి. వారు దేవుని యొక్క మంచితనమును చూచినా గాని, ఎన్నడూ ఎండని ప్రవాహజలములు త్రాగినా గాని, వారు నశించిరి. వారు కొట్టబడిన బండలోని నీళ్ళు త్రాగిరి. ఇత్తడి సర్పము అద్భుతములు చేయుట వారు చూచిరి. వారు మోషే సముద్రములో ఇచ్చిన బాప్తిస్మము క్రింద నడిచి వచ్చిరి. వారు దేవుని హస్తము చూచిరి. వారు దేవదూతల ఆహారము తినిరి. ఎన్నో క్రియలు చూచిరి. కాని పెండ్లి చేసికొనిరి… వారి స్త్రీలను తెచ్చుకొని పెండ్లాడిరి. వ్యభిచారము చేయలేదు; వారిని పెండ్లిచేసికొనిరి. దానిని దేవుడెన్నడును క్షమించలేదు.
34ఆ విధముగా అది జరుగుట రెండవసారి. ఇప్పుడు జరుగుచున్నది మూడవసారి: మరింత మోసకరముగా ఉన్నది. అది కఠినమని నాకు తెలియును, చాలాసార్లు నేను ఆశ్చర్యపడితిని. అదెట్లు జరిగినది? నేను జనులతో అంత కఠినముగా ఎందుకు మాట్లాడాను? ఎందువలన ఆలాగు జరిగినది? అయినా నేను గమనించాను. అది దేవుని వలనే తప్ప, మరెవరి వలన కాదు; ఒక్క స్త్రీ కూడా కూర్చొని నా మాట వినదు. కాని వారు మరల వచ్చుచున్నారు! ఏమయినా గాని తమకు సత్యము అని తెలిసిన దానిని విత్తవలసిన వారు ఒకరున్నారు; అది నిజమేనని వారికి తెలియును.
ఇప్పుడు, ఏమి జరుగుచున్నదో గమనించండి. ఇది కఠినమని నాకు తెలియును.
REV 3:17
35వైద్యుడు మందు ఇచ్చినట్లే ఇది యున్నది మరియు దానిని నీవు తీసికొనట్లయితే, నీవు చనిపోయినచో - వైద్యుని నిందించలేవు. ఇది మందువలె యున్నది. స్త్రీ ద్వేషకుడనని నన్ను ఎప్పుడూ తిట్టచుండు ఈ జనుల మాట ఏమిటి? స్త్రీ ఎట్లు ప్రవర్తించుచున్నదో చూడండి. సంఘము ఎక్కడున్నదో దానిని బట్టి నేను చెప్పగలను. స్త్రీ యొక్క నైతిక విలువలు లవొదికయవలె యున్నవి. శారీరకంగా, లోక సంబంధముగా, దిగంబరులు, నీచులు, గ్రుడ్డివారు, అయితే అది యొరుగకున్నారు.
ప్రజలు, లోకపు స్త్రీలు… సంఘము ఒకే స్థితిలో యున్నారు. ప్రతిసారి స్వాభావిక రీతిని నీవు గమనించినయెడల, ఆత్మీయ రీతిని గమనించగలవు.
ఇప్పుడు, ఒక దినాన తీర్పు సమయాన…
36దానిని గొప్ప కొరకు చెప్పుట కాదు; దానిని చెప్పుటకు అభిషేకించబడనివారు చెప్పకుండా యుండుట మంచిది, ఎందుకనగా మీరు అనుకరణ చేయుచున్నారు; మీరు నిశ్చయంగా ఆపదలో పడుదురు.
ఇప్పుడు గమనించండి, ఒక స్త్రీకి నోరు తెరచి ఆ యా సమయములలో మందు పోసినట్లే యుండును; ఆమె నోటి మీద నేను చేతులుంచుదును, ఆమె ప్రతిసారి ఉమ్మివేయును. ఒక రోగికి వైద్యుడు ఆ విధంగానే చేయును. మందు మ్రి౦గనందున ఒక రోగి చనిపోయినచో అందులో వైద్యుని తప్పు ఏమిటి? జుట్టు కత్తిరించుకొనుట, పొట్టి బట్టలు ధరించుట, ఇవన్నియు తీర్పులోనికి వచ్చును.
37నేను కట్టువాడను మాత్రమే. ఏదో జరుగుట మీరు చూచు ఘడియ సమీపముగా యున్నది. ఆ జరుగబోవు దానికి ఇది సిద్ధపాటు మాత్రమే. మొత్తం దేశమును ఊపివేయు ఒక క్లుప్త, త్వరిత వర్తమానమును ఒక పునాది కొరకు అందించుచున్నాను.
ఎందుకు, నేను స్త్రీలనే ఎత్తి చూపుచున్నాను; అది అక్కడే యున్నది గనుక, నీవు తల బాదుకోవలసినది అక్కడ యున్నది. ఏది ఒప్పో వారికి చెప్పు ప్రయత్నించుచున్నాను. వారి నోటి యొద్ద నేను చేతిని ఈలాగు పట్టుకొనియున్నాను; వారు బయటకు ఉమ్ముచున్నారు. ఇప్పుడు వైద్యుని ఎవరు నిందించుదురు?
దీనికి విరోధముగా కేకలు పెట్టిన స్వరములు రికార్డు చేయబడి, తీర్పు దినమున మరల ప్రజల ముఖముల ఎదుటనే వినిపింప చేయబడును; తీర్పు దినాన నీవేమి చెప్పబోవుచున్నావు? దానినుండి వారేలాగు తప్పించుకోగలరు, చూచారా?
38మీ వ్రేళ్ళ మధ్యనుండి దానిని ఉమ్మివేయుడి. ఇంకా కొంత పోసి వారి తలను జాడించి వెనక్కు ఊపండి, వెనక్కు నడవండి, మరియు తిరిగి వెళ్ళండి — అది సరిపోదు. ఏమయినా గాని మీరు మరల వచ్చి దానిని పోయండి. ఇప్పుడు ఎవరిది తప్పు? వైద్యునిది కాదు, మందుది కాదు, కాని ఆ వ్యక్తి యొక్క వైఖరియే. ఖచ్చితముగా!
సర్వశక్తుడగు దేవుని యెదుట ఈ పాపపు వ్యభిచార తరము ఈ రోజులలో ఏదో ఒక రోజున నిలబడుట ఎంత భయంకరముగా నుండును.
39నా సంవత్సరములు దొర్లిపోవుట చూచుచున్నాను, నా భుజములు వాలిపోవుచున్నవి. ఈ వేదికమీద 30 సంవత్సరములు … అవును, బయట 33 సంవత్సరములు పనిచేశాను, అది ఒక దీర్ఘ జీవితము. 33 ఏళ్ళ సేవ. నాకు ఒకే విచారమున్నది; ఏమనగా నాకు 133 ఏళ్ళు సేవచేయు అవకాశము లేదు. మానవునిగా సువార్తను బోధించుట ఇక ఇదే నా చివరి తరుణము కావచ్చును. వాక్యము పట్ల యధార్థముగా ఉండకలుగునట్లు, దేవా, నాకు సహాయము చేయుము. ఆయన చెప్పినదే చెప్పెదను గాక!
ఆ మెథడిస్టు స్త్రీ ఎందుకలాగన్నది? ఏలాగు ఆమెకు అది మీరు చెప్పగలరు? ఆమె లవోదికయ సంఘ కాలములో ఉన్నది.
1SAM 4:21
40ఇప్పుడు, పెంతెకోస్తు స్త్రీని తీసికొందము. ఆమె పొట్టి దుస్తులు ధరించరాదు, రంగులు రాసుకోదు, లేదా జుట్టు కత్తిరించుకొనకూడదు, కాని ఆమె మెథడిస్టు స్త్రీని చిన్న చూపుతో చూచును: "చూడు, ఆ స్త్రీ పలానిది చేయుచున్నది." ఆమె పొట్టి దుస్తులు ధరించదు గాని, జుట్టు కత్తిరించుకొనినది. దేవునిలో నీవు ఎంతగా పైకి ఎదుగుదువో, ప్రతిది అంత పాపముగా నీకు కనిపించును.
మరియు కొన్నిసార్లు ప్రార్ధనలో, నీవు ఊహించవచ్చు, పరిశుద్ధాత్మ నిన్ను గోళము పైకి తీసుకొని వెళ్ళునప్పుడు, అంతయూ గందరగోళముగా నున్నట్లు నీకు కనిపించును. మరల నీవు తిరిగి వచ్చుసరికి నీవు జనులకు ఒక పనికిమాలిన వ్యక్తివిగా, ఒక పాతకాల వ్యంగ్యమైన మనుష్యునిగా… ఒక వెర్రివానిగా కనబడుదువు, ఎందుకనగా నీవు ఒక పాత పద్ధతిలో కనిపించెదవు మరియు ఎల్లప్పుడు ప్రజలను నిందించుచూ కనబడుదువు; కాని ఒక్కసారి నీవు ఆ ఎత్తైన అనుభవములోనికి వెళ్ళితే — ఉద్రేకము ద్వారా కాదు గాని, నిజమగు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినయెడల — అంతయూ "ఇకాబోదు" అని వ్రాయబడియున్నట్లుగా చూతువు. మొత్తం మత శాఖలలో నుండి ప్రభుని మహిమ తొలగిపోయినది. అది నిజము. అందులో సరియైనది ఏదీయు లేదు.
41ఒక చిన్న వృత్తమును మీకు గీసెదను. నల్ల బల్ల యున్నచో బాగుండును. ఇక్కడ గమనించండి. నేనొక వృత్తము గీయుచున్నాను. దానిలో మరో వృత్తము గీయుచున్నాను, అనగా రెండు గీసితిని. ఇప్పుడు ఆ లోపలనున్న వృత్తములో మరో వృత్తము గీయుచున్నాను; మూడు వలయములు, మూడు వృత్తములు అయినవి. ఇప్పుడు, అది మీరే. అది దేవుడే. త్రిత్వమందున్న దేవుడు ఒక్కడు. త్రిత్వము లేనిచో ఆయన దేవుడు కాడు. మరేవిధముగాను ప్రత్యక్షము కాలేడు. నీవు కూడా త్రిత్వ వ్యక్తివిగా లేకుండా ప్రత్యక్షము కాజాలవు. అదే ఆత్మ శరీరము, ప్రాణము, అందులో ఏది లేకపోయినా నీవు అసంపూర్ణుడవు, చూచారా. నీకు ఆత్మ లేనిచో నీవు శూన్యము. నీకు ప్రాణము లేనిచో నీవు శూన్యము. నీకు శరీరము లేనిచో, నీవు ఆత్మగా ఉందువు గాని - శరీరముగా ఉండవు. త్రియేకము యొక్క వ్యక్తిత్వములో దేవుడు సంపూర్ణుడై యున్నాడు. వ్యక్తుల యొక్క త్రియేకత కాదు. ఒకే వ్యక్తి త్రియేకముగా యున్నాడు. ఒకే నిజదేవుని ప్రత్యక్షతయే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
దేవుడు…
JOHN 1:18•
REV 3:14
42ఇక్కడ గమనించండి… కొద్దిగా ఆగండి. కొద్ది నిమిషముల క్రితం దీనిని నేను చదివానని నమ్ముచున్నాను. దీనిని వినండి: "…లవొదికయ సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా;" దేవుడు సృష్టికర్త మరియు ఆయనేలాగు సృష్టి చేసెను? ఇది దేవుని సృష్టికి ఆది. ఆత్మ స్వరూపియగు దేవుడు మానవ రూపములో సృజించబడెను. అదియే దేవుడు సృజించబడుట. సృష్టికర్తయగు దేవుడు తనకుతానే ఒక సృష్టి అయ్యెను. దేవుడు ధూళిని సృజించెను, దేవుడు కాల్షియమ్మ్ ను సృజించెను, పొటాషియంను దేవుడు సృజించెను, దేవుడు సూర్యకాంతిని సృజించెను, పెట్రోలియంను సృజించెను; ఇవన్నీ కలిపి ఆయన తన్ను సృజించుకొనెను. దేవుని సృష్టి యొక్క ఆదియందు — ఆమేన్, అదియే తుది. ఆమేన్, అనగా ఆలాగు జరుగును గాక! అని భావము. దేవుడు తన సృష్టిని ముగించుటయే ముగింపు.
ఇప్పుడు, అది ఎలాగు? ఏ మనుష్యుడును ఎన్నడును దేవుని చూడలేదు, అయితే తండ్రి యొక్క అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మీరు దానిని గ్రహించారా?
COL 1:9-16
43ఒక్క నిమిషము ఆగండి. మీరు తొందరలో లేరు గదా? కొలస్సీయుల పత్రిక చూద్దాం. నా మనస్సులోనికి ఆ లేఖనము వచ్చినది. కొలస్సీ 1వ అధ్యాయము చూద్దాం. ముందుగా దీనిని చూడలేదు గనుక దీనివైపు చూడవలెను. యువ బోధకునిగా ఉన్నప్పుడు, నాకు వెంటనే గుర్తుకు వచ్చెడివి. ఇప్పుడు ముసలి వానినగుచున్నాను. తొమ్మిదవ వచనము నుండి చూద్దాం.
[పౌలు కొలస్సీయులకు క్రీస్తును గూర్చి చెప్పుచున్నాడు. ఆయనెవరో చెప్పుచుండెను.] "అందుచేత ఈ సంగతి వినిన నాటినుండి మేమును మీ నిమిత్తము ప్రార్ధన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై,
ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధిపొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడచుకొనవలెననియు;
ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరచునట్లు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు;
తేజోవాసులైన పరిశుద్దల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించపలెననియు దేవుని బతిమాలుచున్నాను.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా? చేసెను. [ఇక్కడ మనము పొందుకొనబోవుచున్నాము, ఇప్పుడు గమనించండి.]
ఆ కుమారుని రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
ఆయన అదృశ్య దేవుని స్వరూపియై, సర్వసృష్టికి ఆదియై యున్నాడు." [గమనించారా? కొలస్సీ 1:15 వచనము.]
ఆమేన్! ఏమిటి? "సర్వసృష్టికి ఆదియైయున్నాడు." అది దేవదూత అయినా; మరెవరయినా గాని; ఆయనే సర్వసృష్టికి ఆదియునై యున్నాడు.
"ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన వలన సృజింపబడెను. ఆయన కొరకు సృజింపబడెను."
COL 1:17
44అది ఏమైనా కాని, వేరే ఏది జీవించునది లేదు. గమనించండి.
మరియు ఆయనే…..అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు, మరియు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ; లేక మరేదయినా గాని,
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు.
పరలోకమందును, భూమి మీదను, దృశ్యమగునది, అదృశ్యమగునది మరేదియూ లేకముందే ఈ దేవుని కుమారుడున్నాడు. నిజమేనా? సింహాసనములు, ఆధిపత్యములు మరేవియూ, అవి పరలోక సింహాసనములైనా, రాజ్యములైనా ఏదియూ ఆయన కంటె ముందు లేదు. నిత్యత్వముకు ఆవలనున్న దేవదూతలు, దేవుళ్ళు, మరే గొప్ప సహజాతీతమైనవియూ ఆయన తరువాతనే యున్నవి. "ఆయన అన్నిటికంటె ముందున్నవాడు." ఆమేన్! ఆయనను మీరు చూడలేరా? "ఆయన అన్నింటికన్న ముందున్నవాడు. సమస్తమును ఆయన సృజించెను."
ఇప్పుడు 17 పచనము:
ఆయన అన్నింటికన్న ముందున్నవాడు, మరియు సమస్తము ఆయన వలన కలిగెను.
COL 1:19,20
45ఆయన తప్ప ముందున్న వారెవరునూ లేరు. తండ్రియగు దేవుడు అయినా, పరిశుద్ధాత్మయగు దేవుడు అయినా; దేవదూతలు అయినా, అధికారులు, ఆధిపత్యములు, రాజ్యములు, మున్నగునవన్నియూ — ఆయన వలనే జరుగును. సమస్తమూ ఆయన వలన కలిగెను.
"సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియై యుండి [ఆదియందు ఉన్నవాడు!] మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను; [ఆయన విమోచించుటకు వచ్చి తిరిగి వచ్చెను] అన్ని విషయములలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము.
ప్రాముఖ్యము కలుగు నిమిత్తము — దీని భావము తెలియునా? అన్నింటికీ పై నుండుట. సృష్టింపబడిన ప్రతిదానికి ఆయన పైనున్నాడు: దేవదూతలు అయినా, అధికారులు, ఆధిపత్యములు, మున్నగునవన్నియూ — ఆయన అనింటికి పైనున్నవాడు. ఏ సృష్టి ఇది? ఎవరై యుందురు? అన్నింటి మీదను!
సమాధానపరచెను….
ఒక్క నిమిషము చూద్దాం.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు తండ్రి అభిష్టమాయెను;
సమస్తము యొక్క సంపూర్ణత, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, దేవదూతల యొక్క సర్వ సంపూర్ణత, సమయము యొక్క సంపూర్ణత, నిత్యత్వము యొక్క సంపూర్ణత, సమస్తమూ ఆయనలో నివసించెను. ఆయనే ఈయన.
ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవియైనను, పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రీ అభీష్టమాయెను.
అక్కడే ఆ మహా గొప్ప వ్యక్తిని, ఆది యందు దేవుని యొక్క సృష్టిని గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము.
1COR 12:13
46ఆయన యొక్క పూర్తి ఉద్దేశ్యమంతయూ సంఘమే. అయితే ఈ సంఘములోనికి ఎట్లు రాగలము? ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము: సంఘము, క్రీస్తు శరీరము. అది తప్పిపోదు. ఇక్కడ అదే జరిగినది. ఇక్కడున్న చిన్న అలంకార రూపమును గమనించండి.
ఇప్పుడు, ఈ బాహ్య పురుషుడు శరీరము. దానివైపు మనము చూచెదము. అదే మనము చూతుము. శరీరమునకు అయిదు ముఖ ద్వారములున్నవి. శరీరమును అదుపులో నుంచు అయిదు జ్ఞానేంద్రియముల గూర్చి ఏ చిన్న బడి పిల్లవానికైనా నావలెనె తెలియును; చూచుట, రుచి, తాకిడి, వాసన మరియు వినుట; అవి లేకుండా నీవు శరీరమును తాకలేవు. శరీరమును ఆలాగే నీవు తెలిసికొందువు — చూపు, రుచి, తాకిడి, వాసన, మరియు వినికిడి; దానిని చూచెదవు, దానిని రుచి చూచెదవు. దానిని తాకెదవు. ఇప్పుడు, బయటనున్నది చెడ్డది.
PS 51:5•
PS 58:3
47దానికి లోపల ఒక ఆత్మయున్నది. నీవు ఇక్కడ జన్మించినప్పుడు, జీవవాయువు నీలోనికి ఊదబడినది. ఆ ఆత్మ లోక స్వభావమును పొందును, ఎందుకనగా అది దేవుని వలన ఇయ్యబడలేదు కాని, దేవుని అనుమతి చేత ఇవ్వబడినది. ఇప్పుడు, మీరది గ్రహించారా?
లోకములో జన్మించుచున్న ప్రతి బిడ్డయు పాపిగానే రూపుదిద్దుకొనుచున్నాడు. అబద్ధములాడుచూ లోకములోనికి వచ్చుచున్నాడు. నిజమేనా?
ఆ లోపల నున్న వ్యక్తి ఆదినుండియే పాపి. కాని దానికి అయిదు లోపల ద్వారములున్నవి, (సరిగ్గా ఇప్పుడు చెప్పగలనో లేదో నాకు తెలియదు) ఆలోచన, అంతరాత్మ, ప్రేమ - ఎన్నిక, హేతుబుద్ధి - అవి ఆత్మయొక్క ద్వారములు. నీవు నీ శరీరముతో ఆలోచించలేవు. నీవు నీ ఆత్మతో ఆలోచించెదవు. నీ శరీరములో నీకు మనస్సాక్షి యుండదు. నీ శరీరమునకు మనస్సుకు సంబంధించిన జ్ఞానములు లేవు. కాబట్టి నీవు ఆత్మలో ఆలోచించవలెను. నీవు కారణముతో ప్రశ్నించుదువు. నీ శరీరము ద్వారా నీవు హేతువాదిగానుండలేవు, ఎందుకనగా హేతువు చూడదు, రుచి చూడదు, వాసన చూడదు, వినదు. హేతువు అనగా నీవు నీ మనస్సులో తీసికొను నిర్ణయము.
నీవు నిద్రపోవునప్పుడు లేక నీవు మరణించినప్పుడు; నీ శరీరము మృతప్రాయమైపడియుండును, అయితే నీ ఆత్మ ఇంకా హేతుబుద్ధితో ఆలోచించును. అయిదు జ్ఞానేంద్రియములు అంతరంగ పురుషుని అదుపులోనుంచును. మానవునికి చివరిది, ఆత్మ… దానిని అదుపులో చేయునది ఒక్కటియే, స్వేచ్చా చిత్తము, ఎన్నుకొనుటకు లేదా తిరస్కరించుటకు స్వతంత్రము ఉన్నది.
REV 22:18,19
48మరియు ఇప్పుడు, ఈ రోజు ప్రజలు — ఇప్పుడు, దీనిని మరచిపోవద్దు, ఇప్పుడు మీరు చూచెదరు… పరిశుద్ధాత్మకు ప్రధము సూచన ఏమిటి, చూచారా. ఇప్పుడు, ఈ ఆత్మలో ప్రజలు జీవించగలరు, మరియు వారు ఆత్మలో నాట్యమాడుదురు. వారు ఆత్మలో చప్పట్లు కొట్టుదురు. వారు ఆత్మలో గుడికి వెళ్ళుదురు, ఆ ఆత్మ మీద నిజమగు దేవుని ఆత్మను వారు సంపూర్తిగా పొంది అభిషేకము నొందగలరు, అయినా నశించిపోవచ్చు. దయ్యము ఆ ఆత్మను స్వాధీనము చేసికొన్నట్లే అది యుండును.
గమనించండి. ఆ కారణము చేతనే ఈ స్త్రీలకు వారు పొట్టి బట్టలు ధరించుట తప్పు అని చెప్పలేకపోవుచున్నాము. జుట్టు కత్తిరించుకొనుట తప్పు అని ఆమెకు చెప్పలేక పోవుచున్నాము. "మంచిది, మీ జుట్టుతో దానికి ఏమి సంబంధము ఉన్నది?" మంచిది, అది సమ్సోనుకు సంబంధము ఉన్నది, చూచారా. "ఈ వాక్యమునకు ఒక్కటి చేర్చినా, ఒక్కటి అందులో నుండి తీసివేసినా…" ఎక్కడో ఒక మహోన్నతమైనది యుండవలసియున్నది.
49ఉదాహరణకు నేను బాప్తిస్టుననుకొనండి, మరియు మీరు నా యొద్దకు వచ్చి, యేసు నామములో బాప్తిస్మము పొందవలెను: అది బైబిలులో యున్నది అని చెప్పిరి. "మంచిది, నేను నా సంఘ కాపరిని అడిగెదను" అని మొదటగా నేను జవాబిచ్చెదను.
నేను సంఘ కాపరి నొద్దకు వెళ్ళి చెప్పగా, ఆయనిట్లనును: "ఓ, అది ఎప్పుడో వెనుకటిది, చూడు. బాప్టిస్టులమైన మనము… మనము నమ్మునది ఇది: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను బిరుదులలో మనము ముంచుట ద్వారా బాప్తిస్మము పొందవలెను. సంఘములన్నియూ ఆలాగే చేసినవి. జాన్ స్మిత్ స్థాపించినప్పటినుండియు, ఈ విధంగానే జరుగుచున్నది."
మంచిది, అది మీ తుది నిర్ణయము. " [స్పష్టతలేని మాటలు] అతడు చెప్పునది!"
50మీరు మెథడిస్టులైనచో, చిలకరించుట మీ పద్ధతి. మీరు ముంచుట బాప్తిస్మము పొందుట తప్పినిసరి అని నేను చెప్పినయెడల, మీరు మరల మీ మెథడిస్ట్ పాస్టరు యొద్దకు వెళ్ళి, పలాని ఆయన ఈలాగు చెప్పెనని అందురు. అతడు ఈలాగనును, "కాని మన మెథడిస్ట్ సంఘము 300 లేక 400 సంవత్సరముల క్రితము ఇంగ్లాండులో జాన్ వెస్లీ ద్వారా స్థాపించబడినది. వైట్ ఫీల్డ్ ఇంకా ఎందరో అప్పుడున్నారు; మరియు ఆస్బరీ, మనము చిలకరింపును పొందవలెనని జాన్ వెస్లీ తరువాత దొరికిన పత్రములో కనుగొన్నాము. అది కేవలము బాహ్య పద్ధతి. చిలకరింపు కూడా ఆ ఏ పద్ధతికి తీసిపోదు."
ఒకవేళ నీవు నిజమైన… ఒకవేళ మెథడిస్ట్ చర్చి నీకు తుది అయినచో, నీవు అంతవరకే వెళ్ళగలవు.
మీరు కాథలిక్కు అయినచో… మరియు నేను మీకు చెప్పుదును, శుక్రవారము మాంసము తినరాదని మరియు ఇలాంటి విషయాలు - ఇంకేవేవో బైబిలులో ఎక్కడా లేవు. పరిశుద్ధ యూకారిస్తు, ఒక పల్చని రొట్టె కాదు, ఎందుకనగా అది ఒక ఆత్మ మరియు మొదలుగునది, మరియు నీవు నీ యాజకుని యొద్దకు వెళ్ళుదువు, యాజకుడు ఈలాగు చెప్పును, "మా పత్రము మీద ఈలాగు వ్రాయబడియున్నది." సంఘమే నీ అంతిమ గురియైనచో, ఎవరేమి చెప్పినా గాని నీవు వినవు. అదే నీ తుది గురియగును.
ఓ! దేవుడు దీనిని మీకు అర్థము చేయును గాక!
నాకైతే, అంతయూ తప్పుగానే యున్నది. దేవుని వాక్యము మాత్రమే తుది గురి! వాక్యము చెప్పిన ప్రతిదియు సరియే.
51నీవు ముందుగా నిర్ణయించబడినప్పుడు మాత్రమే ఈ చిన్న అంతరంగమందు దీనిని పొందగలవు, ఎందుకనగా నీవు దేవునితో యుంటివి; దేవునిలో నీవు ఒక భాగముగా నున్నావు.
నేను నా తండ్రిలో యున్నాను. నా తాతలో నేనున్నాను, నా తాత తండ్రిలో నేనున్నాను. బీజము ద్వారా నేను అందులో యున్నాను. నేను క్రీస్తునందున్నాను! లోకము పునాది వేయబడకముందే, మీరు క్రీస్తులో యున్నారు. ఆయన యందున్న తన పిల్లలను విమోచించుటకు ఆయన వచ్చెను. హల్లెలూయ! ఆయనలోయున్న ఆయన పిల్లలు.
అపవాది పిల్లలను విడిపించుటకు ఆయన రాలేదు. వారెన్నడూ దానిని ఎరుగరు. వారు తమ తెలివితేటలలో ఎంతగానో మునిగిపోయియుండిరి. వారు మరెవరితోను పోల్చలేవు. వారిని నీవు మాటలతో ఒప్పించలేవు. దానిని విశ్వాసము ద్వారా నీవు చూచెదవు.
52విజ్ఞాన శాస్త్రమునకు ఎట్టి విశ్వాసము అవసరము లేదు. విజ్ఞాన శాస్త్రము తాను చెప్పుచున్నదానిని రుజువు చేయును. దానికి ఎట్టి విశ్వాసము అవసరము లేదు.
కాథలిక్కు యాజకుడు నీకు ఈలాగు చెప్పును, "కాథలిక్కు సంఘము ఏలాగు ప్రజ్వరిల్లినదో చూడండి. అన్యులు పెట్టిన హింసలకు ఏలాగు తాళుకొన్నదో చూడండి." మెథడిస్ట్ సంఘము చెప్పును, "ఇక్కడ చూడండి. ఎంత ఎక్కువ కాలమో…"
PROV 3:5
53ఒక సంఘము వేషధారణ సూచన గూర్చి మాట్లాడుకొనుట నేను విన్నాను. నిన్న దారిలో వచ్చుచూ దానిని నేను చూచాను. "క్రీస్తు సంఘము క్రీ.శ., 33లో స్థాపించబడినది" అని చెప్పిరి. దానికి ఇంకా 100 సంవత్సరములు కూడా లేవు అనిరి, చూడండి - సంఘ శాఖ.
సమెతలు 3:5
ఓ మై! అపోస్తలుల యొక్క బోధ — అరుదుగా ఏదో పొందుకొనిరి. వారు ఈనాటి సద్దూకయ్యులు. ఆత్మ లేదు… వారికేమీ మీరు చెప్పజాలరు. వారితో మీరు వాదించజాలరు; ఎందుకనగా మనము హేతువును దాటిపోదుము. "మన స్వబుద్ధిని ఆధారము చేసికొనరాదు." విశ్వాసము అసలు కారణమును చూడదు. విశ్వాసము దానిని నమ్మును. "ఇప్పుడు, ఇటు చూడండి. ఆ వెనుక జరిగిన వాటిని మనము చేయగలమని నమ్ముచున్నారా? బుద్దిహినత" అని వారందురు. అయితే బైబిలు ఆలాగు చెప్పుచున్నది. అదెట్లు జరుగునో నేను వివరించజాలను గాని, అది జరుగును! దేవుడు ఆలాగు చెప్పెను. కావున నీవు దానిని కలిగిలేవు… దానిగూర్చి ఏమియూ నేను చెప్పలేను.
విశ్వాసము దానిని వివరించదు. అది నీవెరుగుదువా? విశ్వాసము కేవలము దానిని నమ్మును.
JOHN 3:2-4,12
54యేసు తాను జీవించిన నాటి సంఘ సమితి నుండి వచ్చి నికోదేముతో ఈలాగనెను; అతడు రాత్రివేళ వచ్చి ఇట్లడిగెను, "బోధకుడా, నీవు దేవునియొద్ద నుండి దిగివచ్చిన ధర్మశాస్త్రోపదేశకుడవని మాకు తెలియును, ఎందుకనగా దేవుడు ఒకనికి తోడైయుంటేనే గాని నీవు చేయు కార్యములు ఎవడును చేయజాలడు."
ఆయన ఈలాగు చెప్పెను, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడను కూడా చూడలేడు."
"నేను వృద్దుడను, తిరిగి నా తల్లి గర్భములో ఏలాగు జన్మించగలను?" అతనడిగెను.
యేసు ఇట్లనెను, "భూసంబంధమగు సంగతులనే నమ్మజాలని నీకు, పరలోక సంబంధమగు సంగతులు ఏలాగు చెప్పగలను?"
JOHN 6:37,53•
JOHN 10:27
55అంతట ఒక దినమున ఆయన ఈలాగు చెప్పెను, "మనుష్య కుమారుని శరీరము తిని మరియు ఆయన రక్తము త్రాగని యెడల మీకు జీవము కలుగదు." దానిని ఆయన వివరించలేదు.
ఆ అపోస్తలులు మరియు జీవమునకు ఆనాడు ముందు ఏర్పరచుకొనబడినవారు దానిని ఎరుగుదురు. ఆయనిట్లు చెప్పెను, "నా తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వచ్చెదరు. (అతడు నా స్వరమును ఎరిగియుంటే చాలును; దానిని వారు ఎరుగుదురు.) ఏలయనగా నా గొర్రెలు నా స్వరము వినును." వ్యక్తపరచబడిన మాటయే స్వరము… ఏమైనను వారు దానిని నమ్ముదురు. విజ్ఞాన శాస్త్రము ప్రకారము రుజువు చేయమని వారడగరు లేదా సద్దూకయ్యులు, పరిసయ్యులు మొదలగువారివలె వారేమియూ అడుగరు. "నేను చెప్పితిని; వారు దానిని నమ్ముదురు. ఏలయనగా నా గొర్రెలు నా స్వరము వినును." ఇది అక్షర రూపములోనున్న దేవుని స్వరము, ఎందుకనగా ఇది పూర్తిగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. పాత, క్రొత్త నిబంధనలు ఏకము చేయబడినవి. ఆమేన్! మీరక్కడే యున్నారు.
56ఎందువలన? మీరు ఈ జనులు మంచివారని చెప్పుచున్నారు. వారెందుకు ఆలాగయిరి? ఒక్కటే కారణము: వారు ఒక సంఘమునకు కట్టుబడియున్నారు.
మీకు గుర్తుందా, ఒక వారము క్రిందట ఆదివారము…? మీలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు మరియు 'అంత్యకాల అభిషిక్తులు' అను ప్రసంగమును విన్నారు? మీరందరూ ఉన్నారనుకొనుచున్నాను. చూడండి, వారు అభిషిక్తులు. ఈ రెండవ పరిధిలో వారి ఆత్మలు అభిషేకించబడినవి.
JOHN 3:11
57ఇప్పుడు, ఆ మొదటి స్త్రీ ఈలాగనుచున్నది, "లేదు." ఆమె సంఘము చెప్పిన దానిని వినదు, ఎవరు చెప్పినా వినదు. ఆమె చాలా తెలివిగలది. ఆమెకు కళాశాల విద్య యున్నది. ఆమె దానిని తన భర్త మీద పెట్టి తెలివిగా తప్పించుకోగలదు.
ఈ ఇతర స్త్రీ దిగంబరి, కాని అది ఎరుగదు. ఓ, అది విచారకరము, కాని బైబిలు చిత్రీకరించిన చిత్రము అదియే.
ఆమె సంఘమునకు వెళ్ళును. ఆమె చాలా మంచిదే కావచ్చును. ఆమె చాలా పవిత్రమగు జీవితము జీవించుచున్నది. అందులో ఏమీ వ్యతిరేకము లేదు. దానికి దేవుడే తీర్పరి. నాకు తెలియదు; నేను తీర్పరిని కాను. ఆయన నాకు చూపించు దానికి మాత్రమే నేను బాధ్యుడను.
అపోస్తలులు ఆలాగే చెప్పిరి: "మాకు తెలిసినది, మేము విన్నది, మేము చూచినదే చెప్పుచున్నాము." నేనును అందుకే బాధ్యుడను. మీరందరూ అందుకే బాధ్యులు.
58కాని మీరు చూడండి, ఒకవేళ మీరు అదే స్త్రీను తీసుకోన్నచో… ఆమె చివరకు ఎక్కడ ఉన్నది, చుడండి? ఆమె చుట్టూ తిరుగుచున్నది. ఆమె విన్నది; చాలాసార్లు రేడియో విన్నదని నిస్సందేహముగా చెప్పగలను. దేవుని యొక్క స్వరము చాలా సార్లు వినబడుచున్నది.
మంచిది, ఇప్పుడు చూడండి, ఆమె ఈ మతారాధన వ్యవస్థలోనికి వచ్చుచున్నది, సంఘములన్నియూ కేవలము సమూహములు, అన్నియు. అది పూర్తిగా నిజము. ప్రజలు సభ్యత్వము కొరకు ఒక దగ్గర చేరు లాడ్జిలు అవి. ఆమె ఇక్కడికి వచ్చుచున్నది; మంచిది, అది ఆమెకు సరిగ్గా సరిపోవును. అయితే ఆమె ఏమి చేయవలసియున్నదో, ఆమెకు నీవు చెప్పినయెడల, ఆమె వినదు. నీవు దానిని ఆమెకు బైబిల్లో చూపించు; ఆమె దానిని వినదు.
59ప్రియ సోదరీ సోదరుడా, ముగించు ముందు రెండు మూడు మాటలు చెప్పెదను - పదిహేను నిమిషములలో ముగించవలెను.
60ఇప్పుడు చూడండి, మిమ్మును ఒక సంగతి అడుగగోరుచున్నాను. ఎందుకు ఆ స్త్రీ దానిని చూడలేకపోవుచున్నది? ఆమె ఎందుకు దానిని చూడలేకపోయినది? ఎందువలన? శారీరకంగా ఆమె వ్యభిచారము చేయలేదు, ఆ నేరము ఆమె భర్త ఆమె మీద మోపడు; ఆమె ఒప్పుకోవలసినది ఏదియూ లేదు. ఆమె పుట్టినప్పుడు ఎంత పవిత్రముగా యున్నదో, ఇప్పుడును ఆలాగే యున్నది. ఏ పురుషుడు ఆమెను తాకలేదు. ఇప్పుడు నేను స్త్రీని సంఘముగా చెప్పి మాట్లాడుచున్నాను. ఆమె తాను పుట్టినప్పుడు ఎంత పవిత్రముగా యున్నదో, ఆలాగే యున్నది.
మంచిది, సంఘము కూడా సరిగ్గా ఆలాగే యున్నది. పుట్టినట్లే యున్నది, కాని ఆమె పాపములో పుట్టినది, పాపములోనే రూపుదిద్దుకొన్నది. నా భావము గ్రహించారా?
ఇప్పుడు, ఆమెకు జుట్టు కత్తిరించుకొనుట తప్పు అని చెప్పండి. బైబిలు ఆలాగు చెప్పెను! ఆ పొట్టి దుస్తులు ఆమె ధరించుట తప్పు. బైబిలు ఆలాగు చెప్పెను! ఆమె దానిని "బుద్ధిహీనత" అని పలుకును. ఎందువలన? ఆమె తుది గురి ఆ మూడవ మనిషియగు ఆత్మలో లేదు — ముందుగానే దేవునిచే నిర్ణయించబడి పంపబడినది ఆత్మ అది — కాని ఆమె తుది గురి అక్కడ ఉన్న సంస్థయందున్నది, అదే మనిషి దానికి బయట స్థాపించెను, చూచారా.
61కాని ఆ ఆత్మయందు దేవుని యొక్క వాక్యము ఉన్నచో, "దానిని నేను చూచుచున్నాను, ఆమేన్" అని చెప్పును. అది దానికి వరుసలో యుండును.
ఇప్పుడు ఇటు చూడండి. దేవుని ఆత్మమూలముగా పుట్టినవాడు… చూడండి, ఈ బయట శరీరమున్నది. ఇప్పుడు, నేను మిశ్రిత జనమునకు చెప్పుచున్నాను, కాని మీ పాస్టరుగా, మీ సోదరునిగా నేను చెప్పుచున్నాను. ఇక్కడ శరీరమున్నది; అది బలహీనముగా నున్నది. ఆలాగే యుండును. ఒక స్త్రీ వీధిలో నడిచిపోవుచూ యుండగా 17, 18, 20, 25, 30 సంవత్సరముల వయస్సులోనున్న ఒక యువకుడు ఆమెను చూచును. ఈ యువతి శరీరములోని ప్రతి అవయవమును త్రిప్పుకొనుచూ వచ్చును, ఎత్తు జోళ్ళు వేసికొని నడచుచున్నది; ఆమె మోకాళ్ళ పైకి పొట్టి బట్టలు ధరించుకొని, ముందు వెనుక బహిర్గతము చేయుచున్నది. ఆ విధంగా ప్రవర్తించవచ్చునని ఆమెకు బైబిలు చెప్పుచున్నదా? ఆమె ఆలాగు ప్రవర్తించినయొడల అపవిత్రురాలని బైబిలు చెప్పుచున్నది.
62ఈ నెల రీడర్స్ డ్రైజస్టు చదివారా? 20 లేదా 25 సంవత్సరముల బాలికల రుతుక్రమములో మార్పు వచ్చుచున్నదని వ్రాసిరి. విజ్ఞాన శాస్త్రము ప్రకారము 20 లేదా 25 సంవత్సరముల వయస్సులోనే మధ్య వయస్కులవలె అగుచున్నారు. నా కాలములో అయితే 30 లేదా 35 సంవత్సరముల వయస్సు వచ్చుసరికి ఆలాగయ్యెడివారు. నా తల్లి కాలములో అయితే స్త్రీలు 40 లేదా 45 సంవత్సరములకు మాత్రమే రుతుక్రమములో మార్పుకు గురయ్యెడివారు. ఏమిటది? విజ్ఞాన శాస్త్రము వలన, ఆహారము వలన, ఈ సంకరము వలన మానవ శరీరము మారిపోయి క్షయమగుచున్నది. భౌతిక శరీరము క్షయమయిన యెడల, మొదడు కూడా మారును కదా?
63దీనిని ఆత్మ వెంబడించుటయు గమనించండి. జనులు పూర్తిగా మతిచెడిన వారుగా అగు కాలము ఒకటి వచ్చునని ప్రభుని నామము పేరట చెప్పుచున్నాను. బైబిలు ఆలాగు చెప్పెను. వారు కేకలు వేసి గోలపెట్టుదురు; వారి ఊహ మనస్సులో గొప్ప చెడు క్రియలు బయలుదేరును. రేడియోలు, టెలివిజనులు మొదలగునవి వాటిని ఉత్పత్తి చేయుచున్నవి. 14 మీటరు ఎత్తుగల చీమలు భూమి మీద లేచును. నాలుగు లేక అయిదు మైళ్ళు పొడవుగల రెక్కలు గల పక్షులు భూమి మీద లేచి ఎగురును, జనులు వానిని చూచెదరు; వారు కృప కొరకు వేడుకొని కేకలు వేసి మొరపెట్టుదురు, కాని అది తెగులు. ఆ తెగుళ్ళు కుమ్మరించబడుట గూర్చి చెప్పు వరకు ఆగి చూడండి.
EXOD 8:16,17,24
64మోషే శారీరకముగానే ఏమి చేసెనో గమనించండి, ఆత్మ ద్వారా కాదు. దేవుడు మోషేకు ఇట్లు చెప్పెను, "చేతినిండా ధూళి తీసికొనుము; 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అని చెప్పి దానిని గాలిలోనికి విసరుము. భూమి మీదికి జోరీగలు వచ్చును." అక్కడ ఈగలు లేవు. మొదటగా వారు అవి ఆ తుప్పల మీద ప్రాకుట చూచిరి. వారు చూచిరి, అదేదో అనుకొనిరి. కొంతసేపటికి అవి విస్తారముగా పడినవి. వాటిని దాటి రాలేకపోయినవి. అవి ఎక్కడ నుండి వచ్చినవి? దేవుడే సృష్టికర్త! ఆయన తనకిష్టమైనది చేయును. భూమికి ఇరుప్రక్కల తాకు రెక్కలున్న పక్షిని ఆయన సృష్టించగలడు.
ఆయన ఇట్లనెను, "ఈగలు వచ్చి భూమి మీద వస్త్రము వలె పరచుకొనును గాక! అప్పుడు ఆ భూమి మీద ఈగ లేదు. ఒక ముసలి కందిరీగ అటు ఇటు తిరగ సాగుట మొదటగా చూచిరి. మొదట అక్కడ 8, 10, లేదా 12 ఉండెను. మొదటగా వారు వాటిని దాటి నడువలేకపోయిరి. సృష్టికర్తయగు దేవుడు తన మాటను నిలబెట్టుకొనును.
EXOD 8:6,14•
REV 9:3-5
65దేవుని ఆజ్ఞను బట్టి అతడు తన కర్రను చాపి ఇట్లనెను, "కప్పలు వచ్చి ఈ నేలను కప్పివేయును గాక." కుప్పల కొలది కప్పలు పోగయినవి - దుర్వాసన కొట్టెను - బహుశా 40 లేదా 45 అడుగుల ఎత్తు కప్పలు పోగయ్యెను. ఫరో యొక్క అరలో అవి యున్నవి. ఒక కాగితము ఎత్తగా దానిక్రింద 500 కప్పల వరకు ఉండెను. పరుపు క్రింద, దుప్పట్ల క్రింద ఎక్కడ చూచినా కప్పలు, కప్పలు, కప్పలు. అవి ఎక్కడ నుండి వచ్చినవి? సృష్టికర్తయగు దేవుడు సార్వభౌముడు! తాను చెప్పిన దానిని ఆయన చేయును.
భూమి మీద నీచమగు దృశ్యములు కనబడును అని ఆయన చెప్పెను. జుట్టును కత్తిరించుకొనిన స్త్రీలను వెంటాడుటకు పొడవైన జుట్టుగల మిడుతలు పుట్టును. సింహముల వలె పండు, తేళ్ళ ముళ్ళవంటి ముళ్ళు వాటికుండును. అవి నెలల తరబడి జనులను యాతన పెట్టును.
ఆ తెగుళ్ళు మరియు ముద్రలు, ఆ ఏడు ఉరుములు గూర్చి నేను విప్పు వరకు మీరు వేచియుండుడి. ఏమి జరుగునో వేచి చూడండి. ఓ! సోదరుడా, గోషెనుకు వెళ్ళు సమయముండగానే గోషెనుకు వెళ్ళుము. ఈ బయటి దానిపట్ల ఎక్కువ శ్రద్ధవహించవద్దు.
66ఇటు చూడండి, ఈ స్త్రీ వీధిలో విరుచుకొంటూ నడుస్తున్నది. ఇక్కడొక యౌవనుడు కూర్చొని ఆమెను చూస్తున్నాడు. అతడు పెంతెకోస్తు సంఘ సభ్యుడే; ఏదయినా కావచ్చు గాని — అయితే మొదటి విషయము మీకు తెలుసా, అక్కడ ఆతనికి ఆధారము లేదు.
ఆమె "హల్లో" అనును. అతనికి ఉంగరాల జుట్టున్నది, చక్కగా కనబడుచున్నది. భుజములు నిటారుగానున్న యువకుడు, సరిగ్గా జీవించవలెనని ప్రయత్నించుచున్నాడు - బహుశా బోధకుడయి కూడా యుండును. ఆమె ఆతని యొద్దకు వచ్చుటకు ఆరంభించినది. ఇది ఏమిటి? శరీరము. దీనికి కోరిక యున్నది. లోపట ఆత్మ అభిషేకి౦చబడినదే. అదీలాగు చెప్పుచున్నది, "ఆలాగు చేయవద్దు, అది చేయవద్దు." కాని అది ఏమి చేయును? అది అక్కడే తిరుగుచుండును, అక్కడ ఆగి… అది వెళ్ళిపోవును. మొదటి విషయము మీకు తెలుసా అతడు ఆమెతో గడుపుటకు ఒక తేదిని నిర్ణయించుటకు ప్రయత్నించును. ఆమెను అంటుకొన్నా అంటుకొనకపోయినా అతడు వ్యభిచారము చేసినవాడగును.
67కాని నిజముగా తిరిగి జన్మించిన దేవుని కుమారుడు ఆలాగుండడు. ఆమేన్!
నీయంతట నీవు ఆలాగు ఉండలేవు. వేడి రక్తముతో యున్న పురుషుడు అటువంటి స్త్రీ ముందు చెడ్డ తలంపు లేకుండా యుండుట అసాధ్యము. అయితే అంతరంగమున ఒకటి ఉన్నట్లయితే, అక్కడ ఎదో చిన్న తిరిగి-జన్మించిన… అతడు చప్పట్లు కొట్టుచుండవచ్చును, భాషలలో మాట్లాడుచూ యుండవచ్చును, గంతులు వెయవచ్చు, నాట్యమాడవచ్చు, మిగిలినవన్నియూ చేయుచూ; ఆత్మాభిషేకము కలిగియుండ వచ్చును; దేవుడక్కడ చెప్పిన సూచక క్రియలు మరియు అద్భుతములు అన్నియూ జరిగించుచూ యుండవచ్చును.
యేసు ఇట్లనెను, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, "ప్రభువా, నీ నామమున నేను ప్రవచించలేదా? నీ నామమున నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా?" అందురు. అందుకాయన, "అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి తొలగిపోవుడి" అనును. అక్రమమనగా ఏమిటి? నీకు చేయవలెనని తెలిసియుండియూ, దానిని చేయవు. "అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి తొలగిపోవుడి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను."
ఆ మనిషి లోపల ఒకటున్నది… అక్కడ నిలిచియుండుతకు చిన్న ఆధారము ఉన్నయెడల, జగత్తుపునాది వేయబడకముందే, ముందుగా నిర్ణయించబడిన దేవుని బీజము అక్కడున్నయెడల — ఏమి ఎదురైనా గాని నేను లెక్కచేయను — అది అతడిని పట్టుకొనును; నిలిచియుండుటకు అది అక్కడ ఉండును.
1COR 11:5,15
68అది లేనందువల్లనే ఆమె పొట్టి దుస్తులు ధరించుచున్నది. ఆమె వేశ్యా వృత్తిలోనున్న స్త్రీతో సమానముగా ఎంచబడును. ఆమె ఆత్మకు అదేమిటో తెలియదు. ఆమెకు తన తుది గురి ఏదో ఎట్లు తెలియును? తుది అనగా ఏమిటి? చివరి మాట. ఆమేన్ అనునదియే అంతము; సమస్త పోరాటమునకు అంతము — అదే నీ తుది.
పొడవుగా జుట్టు పెంచుకొనుట మతమౌఢ్యము అని నీ పెంతెకోస్తు సంఘము చెప్పవచ్చును. "ఆ జుట్టు మీద ఒక టైరు మోయవచ్చును" అని ఏవేవో వ్యంగ్య మాటలు అందురు — ఆ మన్యుషుడు దయ్యము పట్టినవాడు; ఎందుకనగా దేవుని వాక్యము ఇట్లు చెప్పుచున్నది, "స్త్రి తన జుట్టును కత్తిరించుకొనుట అవమానము. ఆమె తన తలను అగౌరవించుచున్నది." ఆమె తన భర్తను అగౌరవించుచున్నది, ఆమె భర్త సంఘమే, క్రీస్తే ఆ సంఘము, ఆమె గౌరవహీనమగు మత వేశ్య, దిగంబరి మరి దానిని ఎరుగదు. దిగంబరి. స్త్రీ తన తలను కప్పుకొనవలెనని బైబిలు చెప్పుట లేదా? వెంట్రుకలు ఆమె కప్పుకొనుటకు ఇయ్యబడలేదా?
69ఒక దినమున తీర్పు జరుగును. నేను మందును పోసి మరియు నా చేతులతో పట్టుకొని యున్నాను, కాని వ్రేళ్ళ మధ్య నుండి దానిని ఉమ్మివేసెను. వారిని దేవుడు ఒక దినమున తీర్పులో నిలబెట్టును. ఇది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" ఇది బుద్ధిహీనత కాదు లేక ఒక వెర్రివాని పని కాదు. అది ఆలాగు కాదు, ఎందుకనగా ఇది ప్రభువు యొక్క వాక్యము.
నిజమగు క్రైస్తవుడు ఆ అంతరంగ పురుషునితో సహకరించును. వాక్యమే ఆదియందు ఆత్మయైయుండెను. మీ అందరి యొక్క సంపూర్ణత ఆయనే. కల్వరి యొద్ద మీరందరూ ఆయనలో యుండిరి.
మీరిక్కడ యు౦దురని ఆయన ముందే ఎరుగును. జరుగనైయున్న దానిని ఆయన ప్రసారము చేయును. మీరాయనలో యున్నారు. మీరాయనతో చనిపోయిరి. మీ గర్వము విషయములో, మీ దురాశల విషయములో, లోకము విషయములో మీరు చనిపోయిరి! మీరు కల్వరిలో ఆయనతో కూడా చనిపోయి, మూడవ దినమున ఆయన తిరిగి లేచినప్పుడు - మీరును ఆయనతో కూడా తిరిగి లేచిరి; ఎందుకనగా మీరాయనను అంగీకరించిరి, ఇప్పుడు మీరు క్రీస్తు యేసులో పరలోక స్థలములందు కూర్చుండియున్నారు. హల్లెలూయా!
70అక్కడే మీరున్నారు. ఆది ఈ అంతరంగ మనిషి, అంతరంగము వాక్యమును అది బోధపరచును, ఏమయినా గాని వాక్యము పట్టుకొని వ్రేలాడుము. దానికి నీవేమీ చేయలేవు. చాలా సంవత్సరముల క్రితము దానిని నేను నేర్చుకొన్నాను.
నా చిన్న కుమార్తె అక్కడ చనిపోయి పడియున్నది; నా భార్య కూడా అక్కడ సిద్ధపరచబడి పాతిపెట్టబడినది. వారు నా యొద్దకు వచ్చి షారోను చనిపోవుచున్నదని చెప్పిరి. నా జీవితములో నేనెదుర్కొనిన కఠిన పరీక్ష అదే. నేను సుమారు 25 సంవత్సరముల వయస్సులో ఉంటిని. నేనక్కడికి వెళ్ళి చూడగా, బిల్లీ పాల్ మరణావస్థలో యుండెను.
డాక్టర్ శామ్ నా యొద్దకు వచ్చి, ఇట్లు చెప్పెను, "బిల్, మేము బిల్లీని రక్షించలేము. అతడు చాలా తీవ్ర స్థితిలో యున్నాడు. నీ గురించి నేను చాలా విచారించుచున్నాను" అని చెప్పి, నన్ను కొగలించుకొనెను.
"డాక్టర్, నాకు ఇక బలము లేదు," అని నేను చెప్పితిని. నా బిడ్డ షారోను కొరకు కొన్ని గంటలు ఏడ్చాను. ఆమె వాంతులు ఆగలేదు. వారు ఆమె వెన్నులో సూది గ్రుచ్చిరి; దానిని కోసిరి, అది ఊపిరితిత్తుల వాపు అని చెప్పిరి.
71నేను ఆస్పత్రి నుండి బయటకు వీడ్కోలు చెప్పి వచ్చాను; బయట ఆపిన నా పాత ట్రక్కు ఎక్కి గది దగ్గర ఆపి నడిచి వచ్చాను. శామ్ తన చేతిలో టోపీ పట్టుకొని వచ్చుచుండెను. "బిల్, వెనక్కు రా!" అని చెప్పి నన్ను చేతులతో చుట్టుకొనెను.
"ఏమిటి సంగతి" అని నేనడుగగా.
"బిల్, ఆమె చనిపోవుచున్నది గనుక నీవామెను చూడలేవు" అని చెప్పాడు.
"లేదు శామ్, నా బిడ్డ కాదు" అన్నాను.
"అవును. నీ బిడ్డ కొరకు ఇక ప్రార్ధి౦చవద్దు; ఆమె బ్రదికినా గాని బాధపడును." ఆమె ఎల్లకాలము బాధితురాలుగా ఉండును మరియు ఆమె జీవితకాలమంతయూ వ్యాధితోనే ఉండును. ఆమెకు వాపు వ్యాధి వచ్చెను. ఆమె దగ్గరకు వెళ్ళవద్దు. వెళ్ళినచో, నీవు బిల్లీని కూడా (ఆ వ్యాధి బిల్లికి కూడా సోకును) చంపినవాడవగుదువు" అన్నాడు.
"శామ్, ఆమెను నేను చూడాలి" అన్నాను.
"బిల్, నీవది చేయలేవు. నిన్ను వెళ్ళనియ్యను. నీ గూర్చి నేనెంతగా ఆలోచించానో తెలియునా? నీవు నాకు ప్రియనివి. నీ గూర్చి నేను తీవ్రంగా ఆలోచిస్తూ యున్నాను. నీ మీద నాకెంతో విశ్వాసమున్నది. బిల్ నీవామె ఆమె యొద్దకు వెళ్ళవద్దు. ఆమె వ్యాధి అంటుకొనును. ఇక కొద్ది నిమిషములలో ఆమె చనిపోవును. ఆమెను పాతిపెట్టుదుము. బిల్, నీ గూర్చి నేను చాలా విచారించుచున్నాను" అని అతడు చెప్పెను.
72అతడు నర్సును పిలచి నాకు ఏదో మందు ఇచ్చెను. "ఇతడెట్లు తట్టుకొనుచున్నాడో నాకు తెలియుట లేదు" అన్నాడు.
అక్కడ నేను కొద్దిసేపు నిలబడియున్నాను. అతడు లోపల నుండి మందు తెచ్చెను మరియు నేను హాలులో కూర్చొనియున్నాను. నర్సు నన్ను పిలచి, "బ్రెన్హాం సోదరుడా, నీవు దీనిని త్రాగవలెను" అని చెప్పెను.
"వందనములు, ఒక్క నిమిషము దానిని క్రింద పెట్టుము" అన్నాను.
ఆమె వెళ్ళిపోగా, నేను దానిని ఉమ్మివేయు పాత్రలో పారబోశాను. మరల గ్లాసును అక్కడ పెట్టాను. "ఓ! దేవా, నేను ఏమి చేశాను? నీవు మంచి దేవుడవు. నీవెందుకు ఆమెను చనిపోనిచ్చావు? నేనామె రెండు చేతులు ఆలాగు ఎందుకు పట్టుకోవలసివచ్చెను? ఆమె కొరకు నిన్ను బ్రతిమాలి అడిగాను. నీవెందుకామెను తీసికొన్నావు? అక్కడ బిల్లీ చనిపోవుచున్నాడు, ఇక్కడామె చనిపోవుచున్నది. నేనేమి చేశాను? నాకు చెప్పు! నేను వారితో పోతే బాగుండును!" అని చెప్పాను. నేను తలుపు తెరిచాను గాని అక్కడ నర్సు ఎవరూ లేరు. నేను క్రిందికి వెళ్ళాను. అది ఆస్పత్రికి ముందు నిర్మించబడినది. కిటికీల మీద తెరలు కూడా లేవు; ఆమె చిన్న కండ్ల మీద ఈగలు వాలినవి. ఆమె ముఖము మీద ఒక దోమ తెర గుడ్డ వేసిరి. నేను ఈగలను తోలాను. ఆమె చిన్న కండ్లు బాధతో ఎంతో సతమతమవుచున్నవి.
73సాతాను నా ప్రక్క మెదలినది. "ఆయన మంచి దేవుడని నీవు చెప్పుచున్నావు గదా?" అన్నది.
"అవును, ఆలాగే అన్నాను" అని జవాబిచ్చాను.
"ఆయన స్వస్థపరచువాడని నీవందువు గదా? నీ తండ్రి అక్కడ నీ చేతుల్లోనే చనిపోయెను. అతడు పాపి అని చెప్పి కూడా నీవు అతనికి ప్రార్థన చేశావు. నీ సోదరుని చేతిలో మరో సోదరుడు ఏలాగు చనిపోయెను? కొద్ది వారముల క్రితం నీవు వేదిక మీద నిలబడి బోధించుచున్నావు గదా? అయితే ఆయన నీకెందుకు జవాబు ఇయ్యలేదు? నిన్ను ఆయన ప్రేమించెనని చెప్పావే? నిన్ను ఆయన రక్షించెనని చెప్పావే?"
దేవుడు లేడని నీవు నాకు చెప్పజాలవు, ఎందుకనగా ఆయనను నేను చూచాను. కాని సాతాను నాతో ఆయన నా పట్ల శ్రద్ధ చూపుట లేదని చెప్పెను.
ఇంకా ఇట్లన్నది, "నీ భార్య అక్కడ చనిపోయియున్నది. నీ బిడ్డలు త్వరలోనే అక్కడుందురు. నీ తండ్రి సమాధి చేయబడెను. నీ సోదరుడు పాతిపెట్టబడెను. రేపు నీ భార్యను సమాధి చేయుదురు. నీ బిడ్డ త్వరలోనే చనిపోవును. ఆయన మంచి దేవుడు. నీవు చెప్పుదువు. ఆయన స్వస్థపరచువాడు అని నీవు చెప్పుదువు." నిన్ను నీవు ఎంతో బలహీనపరచుకున్నావు," అని అన్నాడు.
74అది ఏమి చేసినది? అది ఈ బయటి మనిషిని బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నది.
"చూడు, కొద్ది సంవత్సరముల క్రితం, అనగా రెండు మూడు సంవత్సరముల క్రితం, దీనిని నీవు అంగీకరించినప్పుడు, నీవు ప్రజల మధ్య ఎంతో గౌరవంగా ఉన్నావు. నీవు ఎంతో మంచి పవిత్రమైన జీవితము జీవించావు. పట్టణములోని ఏ బాలికయినా గాని నీతో వచ్చుటకు ఉవ్విళ్ళూరుచుండెడిది, ఎందుకనగా నీవు అంత పవిత్రంగా మరియు నీతిగా జీవించావు" అని అన్నాడు.
వారిలో ఎవరి ముందయినా గాని నేను నిలబడగలను. నేను అవమానపరచునది ఏది ఎన్నడూ పలుకలేదు. ఆమె తెలివిగా ప్రవర్తించినాగాని నేనామెను ఇంటికి తీసికొని వెళ్ళుదును.
"నిన్ను ప్రజలు ఎంతగానో ఇష్టపడుచున్నారు, కాని ఇప్పుడు నీవు ఏమిటి? ఒక మాత మూఢునిగా ఎంచుచున్నారు."
అది నిజము. నేను ఆలాగే యున్నాను. ఇవన్నియూ కలిసి వచ్చినవి చూడండి. బయటి హేతువాదము, అంతరంగపు సంగతులు కలిసికొనుచున్నవి. "సాతానా! అది సరియే."
"అప్పుడు, ఆయన ఒక స్వస్థపరచువాడని చెప్పెదవా?'
"అవును."
"నీవు మొరపెట్టి ప్రార్ధి౦చుచున్నావు మరియు ఆలాగు జరుగరాదని ప్రజలు చెప్పుచున్నారు. నీవు దారి త్రిప్పితివని చెప్పుచున్నారు. దీనిని బట్టి నీ స్వంతవారే నిన్ను వెలివేయుచున్నారు. అక్కడున్న నీ స్వంత బాప్టిస్తు సంఘమే ఈ కారణమును బట్టి నీకు తలుపులు మూసి వేసెను."
"అవును."
"నీ తండ్రి పాతిపెట్టబడెను; నీ సోదరుడు పాతిపెట్టబడెను. నీ భార్య అక్కడ సమాధి చేయబడుటకు పడియున్నది. మరో 15 నిమిషములలో నీ కుమార్తె చనిపోవును. ఆయన స్వస్థపరచువాడా? నీ స్వంత రక్తమాంసములు వారు. ఆయన ఒక్క మాట పలికితే ఆ బిడ్డ ప్రాణము దక్కును గదా! "ఆయన స్వస్థపరచువాడని" నీవు చెప్పుచున్నావు. నీవు ఏదో అయిపోయావని, నీవు మతిపోయినవాడవని జనులు, వారి బోధకులు చెప్పుటకు ప్రయత్నించుచున్నారు. నీవు ఒక మతమౌఢ్య వ్యక్తివైపోయావు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడనుచున్నావు. ఆయన నిన్ను ప్రేమించగలడా?
75"నీ తండ్రి కొరకు నీవెంతగానో ఏడ్చావు. ఎన్నో రాత్రులు నీవు ఉపవాసమున్నావు. పగలంతయూ పనిచేసి, ప్రార్ధన చేయుట కొనసాగించావు. ఒక పాపిగా అతడు నీ చేతులలో చనిపోవునట్లు ఆయన చేసెను. నీ భార్యను చూడు. ఆమె ఎంతో మంచిది. నీవామెను ఎంతో ప్రేమించావు." (బిల్లీ తల్లియగు హోప్ - మీయందరికి గుర్తుండును.) ఆమె ఎంత చక్కనిది! మీరెంతో సంతోషముగా యుండిరి. 7 లేక 8 డాలర్ల విలువైన ఇంటి సామాగ్రితో మీ చిన్న ఇల్లు బాగుండెడిది. వస్తువులు కాదు గాని ఆమెను ఎంతో ప్రేమించావు. ఒకరికొకరు అనురాగము కలిగియున్నారు. మీరు వెళ్ళి ఇతరుల కొరకు ప్రార్ధి౦చెడివారు. అది ఒక మానసికోద్రేకము. వారు బాగయిందని చెప్పి లేచి వెళ్ళిపోయెడి వారు. కాని ఈనాటికి నీ భార్య చనిపోయి రెండు దినాలయినది. స్కాట్ మరియు కొమ్బ్స్ శవవాటికలలో ఆమె పడియున్నది. ఆయన స్వస్థపరచువాడా? హూ? 18 నెలల నీ చిన్న బాలుడు బిల్లీ పాల్ చావు బతుకుల మధ్య యున్నాడు. 8 నెలల నీ చిన్న కుమార్తె భయంకర వ్యాధితో అక్కడ చనిపోయియున్నది. నీవు ప్రార్ధి౦చావు కాని దేవుడు తెరలాగి, "ఊరుకో! నీ మొర నేను వినను" అని నీకు తన వీపు త్రిప్పెను. ఆయన మంచి దేవుడా? ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు! నీ స్నేహితురాండ్రు, నీ స్నేహితులు, నీ మంచి స్నేహితులు నిన్ను మతమౌఢ్యుడని ఎంచి వెళ్ళిపోవుచున్నారు."
JOB 1:21•
JOB 13:15
76వాడు చెప్పిన ప్రతిదియూ సత్యమే. వాడు చెప్పినదంతయూ వరుసగా నిజమే. ఇక్కడ చూచారా? ఆయనాలాగు ప్రవర్తించెను గనుక ఇక నేను సేవచేయను" అని నేను చెప్పుటకు సిద్ధమయ్యాను. ఆ సమయంలో ఏదో నా యొద్దకు వచ్చినది. అంతరంగములో ఇట్లు చెప్పినది, "అసలు ఏది నీది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొనెను."
చూడండి, అది అంతరంగ మందున్నది. కారణము వెదుకనే వద్దు. నేను వెనక్కు తిరిగి ఇట్లు తలంచాను, "నేను భూమి మీదికి ఏలాగు వచ్చాను? నేను త్రాగుబోతుల గుంపు నుండి వచ్చాను. ఇక్కడికి ఏలాగు నేను వచ్చాను? నాకు జీవము ఎవరు ఇచ్చిరి? ఆ భార్యను నాకెవరు ఇచ్చిరి? ఆ బిడ్డను నాకు ఎవరిచ్చిరి? నా భార్య ఎక్కడ నుండి వచ్చినది? నా జీవము ఎక్కడనుండి వచ్చెను?"
"ఆయన నన్ను చంపినను, ఆయనను నేను నమ్ముదును. సాతానా నా యొద్దనుండి వెళ్ళిపో," అని చెప్పాను.
77నేను బిడ్డ మీద చేతులుంచాను. "అమ్మా షారోనూ, కొద్ది నిమిషములలో నిన్ను మీ తల్లి చేతులలో ఉంచెదను. దేవుని దూతలు వచ్చి నిన్ను మోసికొనిపోవును. కాని ఒక రోజు నాన్న నిన్ను చూచును. అదెప్పుడో నాకు తెలియదు. ఏలాగో నేను చెప్పలేను. ఆయన నాకు ముఖము మరుగుచేసెను. నీ కొరకు చేసిన ప్రార్థన వినలేదు. ఆయన నా భార్యను చావనిచ్చెను. నేను ఆమె చేతులు పట్టుకొని ఆమె కొరకు ఏడ్చాను. నా తండ్రి ఈ చేతిలోనే చేతులుంచి చనిపోయెను. ఊపిరి పీల్చుటకు ప్రయత్నించుచూ, నా వైపు చూచెను. నేను బహు తీవ్రముగా ప్రార్ధి౦చాను." నేను జనుల ముఖము మరల ఏలాగు చూడగలను? నేను దైవిక స్వస్థత గూర్చి బోధించాను. నా స్వంత తండ్రిని ఒక పాపిగా చావనిచ్చిన ఆయన మంచి దేవుడని నేనెట్లు చెప్పగలను? ఏలాగో నాకు తెలియదు గాని, ఆయన చేసినది సరియేనని తెలియును.
78దేవుని వాక్యము ఎన్నడూ తప్పిపోదు. ఏమి జరిగినా గాని అది జయించును. వీటన్నింటికి లోపల ఒకటున్నదని నాకు తెలియును. సమస్త ఉద్రేకములకు లోపట ఒక్కటున్నది. ప్రతిదియూ ఆలాగే యున్నది. ఆ ఘడియలో ఒక అంతరంగ మనిషి నన్ను పట్టుకొనెను. మరెవరూ ఆలాగు చేయజాలరు. ప్రతి హేతువు — వారు చూపించిన ప్రతిదియు, అది తప్పు అని నిరూపించిన సమస్తమును నేను తప్పు అని తెలిపెను; అయితే జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన దేవుని వాక్యము అంతరంగమందు పట్టుకొనెను.
భవనములోనికి ఒక చిన్న గాలి వీచినట్లు నాకు తోచెను. ఆమె ఆత్మ దేవుని కలిసి కొనుటకు వెళ్ళిపోయెను.
79సోదరుడా, సోదరీ, ఒక్కమాట మాత్రమే నేను చెప్పెదను. కారణమును చూడ ప్రయత్నించవద్దు. నేను చెప్పినందున మీరు జుట్టు పొడవుగా పెంచుకోవద్దు. మీరు శారీరిక సంబంధముగా ఇవన్నియూ చేయుటకు ప్రయత్నించవద్దు… కేవలము దానిని కలిగియుండుటకు చేయవద్దు, కాని నీ అంతరంగమందు ఒకటి జరుగు వరకు ప్రభుని సన్నిధిలో కనిపెట్టుము…
మీలో చాలామంది పొడవైన జుట్టు కలిగియున్నారు గనుక పరలోకమునకు వెళ్ళుదుమని తలంచుచున్నారు. దాని భావము అది కాదు. మీరు చాలా నీతిగానున్న స్త్రీలు గనుక వెళ్ళెదరని చాలామంది తలంచుచున్నారు… దాని భావము అది కాదు.
ISA 28:10,13•
MATT 5:18
80వారి ఆలయములు దీనికి చెందినవి, వారీ గొప్ప గుంపుకు, గొప్ప పట్టాలు పొందిన వారికి చెందియున్నారు గనుక వెళ్ళెదరని తలంచుచున్నారు. అది దాని భావము కాదు, చూచారా. తాము భాషలతో మాట్లాడుచున్నాము గనుక పరిశుద్ధాత్మ పొందితిమని చాలామంది తలంచుచున్నారు. దాని అర్ధము అది కాదు, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడును. అయితే నిజమగు, అసలగు పరిశుద్ధాత్మ ప్రతి వాక్యముతోను ఏకీభవించును.
ఆ పరిశుద్దాత్మ నిన్ను భాషలతో మాట్లాడనిచ్చుచున్నది.
కాని పూర్తి వాక్యమును ఒప్పుకొననీయుట లేదు, కాబట్టి అది తప్పు ఆత్మ. అది అంతరంగము నుండి రావలెను. అదియే ఆదినుండియున్న వాక్కు. ఆదియందు దేవుడు సృష్టిచేయనారంభించెను. నిన్ను ఉనికిలోనికి తెచ్చెను… మీరు చూడండి, మీరు ఒక విత్తనముగా అక్కడ బయలుదేరి యున్నారు. ఇప్పుడున్న రీతికి ఎదిగియున్నారు. మీరందరు అప్పుడు క్రీస్తులోయున్నారు. క్రీస్తు మిమ్ములనందరిని విమోచించుటకు చనిపోయెను. మీరు ఈ వాక్యములో భాగముగానున్నారు. "ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. సూత్రము వెంబడి సూత్రము, ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము." ఒక్క పాలు, చుక్క కూడా తప్పిపోదు. మీరు వాక్యములో ఒక భాగముగా యున్నచో, వాక్యములో దేనినయినా ఏలాగు ఒప్పుకొనకుండా ఉండగలరు? మీలోనున్న లోకము మాయమగును. ఏ వాక్యభాగమును కాదనరు.
81దేవుడు మిమ్మును దీవించును. నా సమయము మించినది. మిమ్మును ఎక్కువసేపు ఉంచగోరుటలేదు. ఆలాగు చేసినందుకు చింతించుచున్నాను; నేను చెప్పిన దానిగూర్చి చింతలేదు. స్నేహితులారా! మనము ఒకదాని అంతమునకు వచ్చియున్నాము.
ఇక్కడ యున్న మీరందరు సంఘసభ్యులని తలంచుచున్నాను. ఇక్కడ ఎందరు సభ్యులున్నారో చూచు సమయము నాకు లేదు. మీరందరు ఇక్కడకు ఎప్పుడూ వచ్చేవారనుకొనుచున్నాను.
జరిగిన ఒక సంగతి చెప్పెదను. దయచేసి ఆరు నిమిషములు ఓపిక పట్టుదురా?
82ఒక ఆదివారము నేనిక్కడ ఉన్నప్పుడు, ఓరెగాన్ నుండి ఇక్కడకు వచ్చిన రెవ. శ్రీ. ఒర్లాండ్ ఒకర్ గుర్తున్నాడా? ఎవరికైనా ఈ గొప్ప వింత సంగతి తెలియునా? నేనిక్కడకు వచ్చాను. చాలామంది జనులు నన్ను కలిసికొనుటకు ప్రోగయ్యారు — నాకు కుప్పులుగా ఇంటర్వ్యూలు ఉండెను — వారందరూ యోగ్యులే: వారి పిల్లలు వివాహితులు, త్రాగుబోతులు, అన్ని రకముల వారు వచ్చిరి, వారు తప్పక కలిసి కొనుటకు యోగ్యులే. కాని, నేనది చేయలేను. మిమ్మును దేవుని కప్పగించి నా చేతులు మీద వేసి ప్రార్థించాను.
ఓ దేవా! నేనది చేయలేను. ప్రభువా, నీవే స్వీకరించుము. ఏలాగు చేయవలెనో నీకు తెలియును. నేను ప్రతియొకరి కొరకు ప్రార్ధి౦చుచున్నాను.
83బిల్లీ నన్ను పిలిచాడు, అప్పుడే నేను సహో, బ్యాంక్స్ తో లోనికి వచ్చుచుంటిని. అతడు నన్ను పిలిచినప్పుడు నేను చూచాను. బయట జనులు వరుసలో ఉన్నారు, కొందరు వరుసలో యున్నారు, లోపల; మరియు నేను బయటకు చూచి చేయి ఊపగా వారందరూ దాదాపు తమ తలలు త్రిప్పిరి. మీరాలాగు చేయవలెనని కోరుట లేదు.
ఒక రోజున టుసాన్ లో నేనుండుట కొరకు వారు ఒక స్థలము కొనుచున్నారు. సహో, టోనీ అక్కడ వున్న ఒక స్థలమును నా కొరకు ఈ స్థలము కంటె మూడు లేదా నాలుగు రెట్లు ఎక్కువ ఖరీదుకు కొనగోరెను. తాను ఒక్కడే కొన్నివేల డాలర్లు సహితము ఈయగోరెను. అతడు అక్కడికి వచ్చుటకు ఒకే మార్గమున్నది. ఒక ద్వార-పాలకుడు అక్కడ నిలువబడియుండెను. ఎవరైనా గాని అక్కడ నివసింపవలెనన్నచో, ఒక వ్రాత అనుమతి కలిగియుండవలెను. లోనికి వచ్చుటకు ముందు ఈ ద్వార-పాలకుడు తనిఖీ చేయును.
"నన్ను నీవు గమనించావా? నన్ను చూచుటకు వచ్చి నాతో కరచాలనము చేయగోరువారు నాకు దేవుని దీవెనలు చెప్పెదరు. టోనీ అక్కడ నేను ఏలాగుండగలను?" అని చెప్పెను.
"మంచిది, నీవు …" అని అన్నాడు.
"టోనీ, సంఘము వారందరు ప్రజలను రావద్దని చెప్పుదురు" అని అన్నాను.
"ప్రజలు నన్ను వారికిష్టమైన ప్రతిది చేయుమని కోరుదురు. ప్రభువు మాకు చెప్పెను… హల్లెలూయా, నేనిక్కడే యు౦దును. దేవునికి మహిమ. మా గుంపులో ఇక్కడ నీవు కూటములు జరుపవలెనని ప్రభువు నాతో చెప్పెను. దేవునికి మహిమ. దేవుడే దానిని నాకు చెప్పెను. బ్రెన్హాం సోదరుడా! నీవు ఆలాగు చేయనియెడల నిశ్చయముగా వెనుకకు జారినవాడవే" అని వారందురు. అక్కడ నేను చదువుటకు ప్రయత్నించుచున్నాను, చూచారా. ఆ కారణముల వలన చాలామంది మంచి వ్యక్తులు కూడా రాలేకపోవుచున్నారు.
84ఒక పొలములో వేటకు వెళ్ళిన వ్యక్తివలెనే ఉన్నది. "మీరు వచ్చి వేటాడుకోవచ్చును" అని యజమానుడు చెప్పెను. మీరు వెళ్ళి ఆతని ఆవులలో ఒకదానిని తుపాకీతో కొట్టిరి. ఆవు క్రింద నుండి ఒక కుందేలు పరుగెత్తుకుపోతూ ఉంటే, కుందేలును గురి చూచి కొట్టారు. మీరు కంచె దాటి వెల్లారు, దానిని విరుగగొట్టారు. అప్పుడు అతడిట్లనును, "నేను ఆ స్థలమును మూయుదును." అతనిని నేను ఒక్క మాటయు అనను, కానీ ఇంకొకసారి మరెవరినీ లోనికి రానీయను అని చెప్పును. ఇక మీదట తరువాత వచ్చిన మంచి వేటగానికి కూడా అనుమతి దొరకదు. అది ఎల్లప్పుడు అలాగే యున్నది. ప్రాధాన్యత పొందుకోనుటలో చెడు ఎప్పుడు మంచివారిని దూరము చేస్తుంది. అది ఎల్లప్పుడూ.
85కాని ప్రజలు… నిజంగా అక్కరలోనున్నవారు మరియు మంచివారు, ప్రేమగలవారు, దేవుని కృప పొందినవారు వేలాదిమంది ఉన్నారు.
ఈ జనులు ఏలాగు వచ్చుచున్నారో చూడండి. మనకు అది అక్కర్లేదు కానీ ఒకడు వచ్చి ఇట్లనెను. శ్రీమతి వాల్టార్స్ కొందరు చనిపోవుచున్న వారిని ఇక్కడకు తెచ్చినది. వారిని వెంటనే చూడాలి. నేను పరుగిడి వెళ్ళాను. బిల్లీ నన్ను తొందర చేసాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరు లేరు. ఒక వ్యక్తి మాత్రమే ఆ ఇంటి ప్రక్క ఎప్పటివలెనే దిండు వేసుకొని నిద్రపోవుచుండెను. చెప్పెను, "అతనికి ప్రార్థన కావలెనట."
"సరే, ప్రార్ధి౦తును" అని చెప్పి లోనికి వచ్చెను. అక్కడ ఒక కాడిలాక్ కారు వంటిది ఒక పెద్ద కారు ఆగియున్నది. అందులోని వ్యక్తి "బాగున్నారా?" అని అడిగెను. అతడు నన్నెరుగడు. నేను లోనికి వెళ్ళగా, వృద్దురాలగు వాల్టార్స్ సోదరి కనబడినది. ఆమె సంగతి మీకు తెలియునా? ఆమెకు కేన్సరు జబ్బు. నేను ప్రార్ధన వరుసలోనికి ఒక గంటలో వెళ్ళుదుననగా, ఆమె చనిపోయినది. ఆమె వైద్యుడు వచ్చి నాకు చూపెను. 18 సంవత్సరాల క్రితము గుండెలో కేన్సరు వచ్చినది. నేడు ఆమె జీవించియున్నది. ఇప్పుడు ఆమె ఆర్కన్సాస్లో ఉంటున్నది. అప్పుడామె ఫీనిక్సులో ఉండేది. ఆమె నాతో ఈలాగన్నది, "విల్లీ సోదరుడా! ఈలాగు వచ్చుటకు నాకు ఇష్టము లేదు. "కానీ, నాకు ఎక్కడా నివాసము లేదు. నేను చనిపోవుదునని చెప్పిరి." నా చేతితో ఒక చిన్న కానుక నీకీయవలెనని యున్నది, విల్లీ సోదరుడా! నేనివ్వలేను, కాని నేను కొన్ని పండ్లతో గుజ్జు తయారు చేసాను" అని చెప్పెను.
86ఓ!
నేనక్కడకు వెళ్ళి మరియు ఆమె తయారు చేసిన పండ్ల గుజ్జు చిన్న సీసాలలో చూచాను. నేనది తినుటకు ఎంతో పవిత్రముగా ఎంచాను. ఆమె డెబ్బది యేండ్ల వృద్ధాప్యములోనున్న స్త్రీ, "హాట్టీ సోదరీ! వద్దని నేననలేను" అని చెప్పాను.
విధవరాలు మూడు నాణములు వేయుటను యేసు చూచెను. ఆమెను ఆయన ప్రత్యేకముగా ఎ౦చెను. అందుకు దేవుడు ప్రతిఫలమిచ్చును. ఆలాగే ప్రభువు ఈమెను స్వస్థపరచును. ఆమె వ్యాధి పూర్తిగా పోయినది. ఆమె సంఘకాపరి మనస్సులో ఏమి ఉన్నదో బయటపడినది. అతడు చేయబోవునది తెలియపరచెను. వారందరు అది విని చప్పట్లు కొట్టిరి.
87బిల్లీ పరుగెత్తుకొచ్చి, "డాడీ ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్లు చెప్పెను. నేను చేయలేను…"
"ఆ కారులో ఉన్నది ఎవరు?" అని అన్నాను.
"ఓ, అతడు ఓరెగాన్ నుండి వచ్చాడు. ఒక కల అతడు చూచెను." అయితే అతడికి నేను ఎట్టి భ్రమ కలిగించలేదు. ఇక్కడ 300 మంది ఇప్పుడు కనిపెట్టుచున్నారు. నీ కలను వ్రాసి ఇమ్ము అన్నాను. అంతకు ముందే పెద్ద కుప్పగా పొగై ఉన్నవాటికి ఇది అదనంగా వచ్చి చేరినది.
"అతనిని లోనికి రానీయండి. అయిదు నిమిషములు అతనికి ఇవ్వండి," అన్నాను.
వెంటనే అతడు లోనికి వచ్చెను — అయిదు నిమిషాలు! తాను రెవ. వాకర్ అనియు, ఓరెగాన్ నుండి వచ్చెననియు చెప్పెను. అతడు ప్రెస్బిటేరియన్, ఎపిస్కోపాలియన్ అను ఏదో ఒక శాఖకు చెందినవాడు.
"ఇరవై సంవత్సరాల క్రితము అతడు నన్ను కలసికొన్నట్లు ఒక స్థలములో నన్ను చూచినట్లు" చెప్పెను. ఆ స్థలము పేరు నాకు గుర్తులేదు. "ఆ ప్రాంతమంతా ప్రతి ఉదయము పేపరులో వార్తగా ప్రకటించిరి." కాబట్టి "ప్రతివారికి అది తెలియును." ఒక రోజు వీధిలో అతడు నన్ను చూచెను. నా యొద్దకు నడిచి వచ్చెను. అప్పుడు "నా చుట్టు నలుగురైదుగురు మనుష్యులున్నారు." అతడు నాతో కరచాలనము చేసెను. తన పేరు "వాకర్" అని చెప్పెను. కొద్దిగా మాట్లాడుకొన్నాము. తరువాత మూడు లేదా నాలుగు మంది మనుష్యులు పెద్దవారు వచ్చి, నన్ను త్రోసికొనిపోయారు." "నన్ను అతడు విమర్శించక అభినందించుచున్నట్లు" నాకు చెప్పెను. అయితే "నాకేమీ అర్ధము కాలేదు."
88ఆయన చెప్పెను, "కొన్ని సంవత్సరములు గడిచిపోయిన తదుపరి ఒక వ్యక్తి అతనికి కొన్ని టేపులు వినమని ఇచ్చెను. ఇది మూడు సంవత్సరాల క్రితము జరిగినది." "ఆ టేపులలో వినినప్పుడు నేను ఒక ప్రవక్తనని నమ్మకము కలిగినదట." నేను ఆ వ్యక్తికి చెప్పితిని, "ఆ విషయాలు నాకు తెలియవు — నాకు తెలిసినంతవరకు, బహుశా కావచ్చు."
"మరియొక్క వ్యక్తి వారి పట్టణములోనికి వచ్చి, కూటము పెట్టి ఈ దినమునకు నేనే దేవుని ప్రవక్తను" అని చెప్పగా, ఇతడు వినెను. తూర్పున ఉన్న విల్లియం బ్రెన్హాం ప్రవక్త అని టేపులలో విన్న సంగతి అతడు గుర్తుకు తెచ్చుకొనెను.
[ప్రవక్తనని చెప్పుకొనిన ఇతడి పేరు నేను బయటపెట్టను. బాగుండదు, మీరు చూచారా?] ఆ వ్యక్తి విల్లియం బ్రెన్హాం నాకు తెలియునని చెప్పెనట. అతని బోధ తప్పు. అతడు పెంతెకోస్తు కాదు. ప్రారంభ సూచనను నమ్మడు. ఇంకా చాలా నా గూర్చి చెప్పెనట. చిన్న ప్రవక్తలు లేరు మరియు పెద్ద ప్రవక్తలు లేరు — అలంటిది లేదు. "నీవు ప్రవక్తవు లేదా ప్రవక్తవే కాదు, అంతే," అని అన్నాడట.
89ఇతడు అతనితో వాదించగోరుటలేదని తెలియజేసెను. విల్లియం బ్రెన్హాం ప్రవక్త అవునో కాదో గానీ నేను మాత్రము ఈ యుగమునకు ప్రవక్తనని తెలిసికొనుము" అని చెప్పెనట.
"ఆలాగైతే ప్రభువు నిన్ను దీవించి, నీతో నుండును గాక" అని ఇతడు పలికెను.
ఆతడు వెళ్ళిపోయెను, అతని గూర్చి ఎన్నడు ఆలోచించలేదు. ఇతని సోదరుల మధ్య మూడు లేదా నాలుగు కూటములు ఏర్పాటు చేయసాగెను. అతడు తపాలా ఆఫీసుకు వెళ్ళిన "చిరునామా మార్చక తనకు వచ్చు ఉత్తరములన్నియు ఉంచమని చెప్పెను. నాలుగు, అయిదు రోజుల తర్వాత వచ్చుదునని" చెప్పెను. వారు సరేనని చెప్పి మార్చలేదు. అతడు వెళ్ళిపోయెను, తన కుమార్తెను చూచెను. వచ్చుచు దారిలో ఒక ఆలయము దగ్గర ఆగి, రాత్రి కూటములో కూర్చొనెను. ఆ మరుసటి ఉదయాన తపాలా ఆఫీసుకు వెళ్ళి చూడగా, తన కుమార్తె పంపిన ఉత్తరమును తీసికొనెను.
90దానినతడు తెరచి చూడగా, అది శ్రీ. హిల్డ్ బ్రాంట్ అను నా స్నేహితుడు వ్రాసెనని కనుగొనెను. అతడు టేపులు వినిపించుచున్నాడు. శ్రీ హిల్డ్ బ్రాంట్, రాయ్ బోర్డర్స్ నుండి నేను ఇక్కడ 28 నుండి 1 వరకు కూటములు ఏర్పాటు చేయుచున్నట్లు వార్త అందుకొనెను, (అతడు ఒక మేనేజరు మీకు తెలుసు) అతడు వచ్చి స్వయంగా చూచెను. అతనికున్న అపోహలన్నియు తొలగిపోయినట్లు చెప్పెను. అతడు తెచ్చిన ఉత్తరమును చెత్త బుట్టలో వేసెను.
అతడు వచ్చి ఆ రాత్రి కూటము జరిపెను. మరుసటి ఉదయాన తన గుండె పట్టుకొని గదిలో కేకలు వేయసాగెను.
91అతడిట్లనెను, "బ్రెన్హాం నేను దేవుని ఎదుట నిలువబడవలసియున్నదని గ్రహించాను." "నేను నిద్రపోయానో, ఏమయ్యానో నాకు తెలియదు." "నాకు కల వచ్చినది. నా కుమారుని చేయి ఒక సంచిలో ఇరుక్కుపోయినది." "ఆ సంచి నిండా ఆపిల్స్ ఉండెను. అవన్నీ క్రిందపోసి, చూడగా, అవి పచ్చగా కనపడినవి. అవి కొరకబడినవి. వాటిని నేను ఎత్తి మరల సంచిలో వేసాను," "కొన్ని దొర్లిపోవుచుండెను. గడ్డిమీద నుండి అందకొన ప్రయత్నించాను, కాని అవి కంచె క్రిందనుండి దొర్లిపోయినవి." ఆ ప్రక్కనే పెద్ద రహదారి యున్నది. "నేను తూర్పు వైపు చూడగా, ఒక గొలుసు ఒక పెద్ద రాయికి తగిలించియున్నది. నేనక్కడకు వెళ్ళాను, ఈ గొలుసును వేసి ఆ ఆపీల్సు లాగవలెనని తలంచాను. గొలుసు వేయబోగా."
92"ఒక స్వరము మొత్తము భూమిని కంపింపచేసినది. నా కాలి క్రిందనున్న భూమి కంపించినది."
"ఆ కంపనము ఆగిపోయిన తరువాత నేనొక స్వరము" విన్నాను. ఆ స్వరము బ్రెన్హాం సోదరుడా నీదే. నాకు తెలియును, "మరొకసారి ఈ దారిగుండా ప్రయాణింతునని ఎవరో నాతో చెప్పిరి." "నేను రాతివైపు చూడసాగాను. మబ్బులు కమ్ముకొన్నవి. తూర్పునుండి పశ్చిమానికి ఒక పిరమిడ్ ఆకారము ఏర్పడినది. ఆ తూర్పు వైపున నీవు ఒక గుర్రము మీద నిలువబడియున్నావు." అట్టి దానిని నా జీవితములో నేనెన్నడు చూడలేదు; గొప్ప తెల్ల గుర్రము. నీవు "ఒక ఇండియను ప్రధానులలో ఒకరివలె వస్త్రములు ధరించుకొంటివి. ఇండియనులు వాడు వస్తువులన్నియు ఉన్నవి." "చేతులకు గాజులు, శిరస్తాణము మొదలగునవి ఉన్నవి." నీ చేతులు పైకి ఉన్నవి. "ఆ గుర్రము ఒక సైనిక గుర్రము వలె నిలువబడినది." "నీవు పశ్చిమానికి దానిపై స్వారి చేయుచు వెళ్ళిపోయావు."
93అక్కడ నేను చూడగా, అనేకమంది శాస్త్రజ్ఞలున్నారు.
మరుసటి ఉదయము (అది శనివారము) నేను విజ్ఞాన శాస్త్రము గురించి బోధించాను, నీకు తెలుసా, అపవాది సంబంధులని.
"శాస్త్రజ్ఞలు నాళికల (tubes)లో ఏవో పోయుచు కలుపుచున్నారు." "నీవు గుర్రమును ఆపావు. నీవు చేతులెత్తి మరలా ఒకసారి ఈ దారిలో స్వారి చేయుదునని" కేకవేయగా "భూమి మొత్తము కంపించినది. ఆ జనులు వణికిపోయిరి." "ఒకరి వైపు ఒకరు చూచుకొనిరి, నీ వైపు చూచిరి, మరియు భుజములు కదుపుచు వారు తమ శాస్త్రీయ పరిశోధన కొనసాగించుటకు వెళ్ళిరి."
"నీవు పశ్చిమానికి వెళ్ళనారంభించావు. అప్పుడు నేను ప్రవక్తనని చెప్పకొన్న ఆ వ్యక్తిని చూచాను. అతడు నలుపు తెలుపు కలిసిన గుర్రమును ఎక్కి వచ్చెను. అతడు ఈ గొప్ప తెల్లని గుట్టము వెనుకనే ఉండెను. అది మేఘములకు పైగా ఎక్కిపోవుచు, మరియు ఆ మార్గము అంత విశాలముగా లేదు. ఆ గుర్రము గాలితో పాటుగా పరుగెత్తినది. నీవు ధరించిన ప్రతిదియు గాలికి, రెపరెపలాడుచుండెను. గుర్రపు తోక కూడా ఎగురుచుండెను. గొప్ప యజమాని, పెద్ద తెల్లని గుర్రము, ఒకే వరుసలో నడచుచుండిరి. "ఇతడు నీ వెనుకే పరుగెత్తుచు వచ్చెను. కెనడా వైపు నుండి వచ్చెను." [అతడు కెనడాలో నివసించుచుండెను.] ఆతడు "తన చిన్న గుర్రముతో నీ పెద్ద గుర్రమును పడగొట్టుటకు ప్రయత్నించుచున్నాడు." కానీ "పెద్ద గుర్రమును ఏమాత్రము కదిలించలేదు; పడకుండా నడచుచుండెను." అంతలో ఆకస్మాత్తుగా నీవు తిరిగి చూచావు. నీవు మాట్లాడుట అది మూడవసారి, కానీ రెండవసారి నీవు స్వారీ చేయుదునని చెప్పావు. కానీ అది మామూలుగా మాట్లాడినట్లు లేదు; ఆజ్ఞాపించినట్లున్నది. "నీవు వెనుదిరిగి ఆతనిని పేరు పెట్టి పిలిచి, పొమ్మని చెప్పావు. దేవుడు ఒకనిని అభిషేకించి వెళ్ళమని చెప్పనిచో, ఎవడును ఈ దారిలో స్వారీచేయలేడు. ఇక్కడ నుండి పో, అని చెప్పావు."
94"ఆ మనిషి వెనుదిరిగి, గుర్రము వీపు మీద నాకు ఉత్తరములు వ్రాసెను. [నల్లని, తెల్లని రంగుల గుర్రమది]… ఆ గుర్రము వీపు మీద వ్రాయబడిన అతని పేరు అతడు ఉత్తరము మీద పెట్టిన సంతకము వలెనే యున్నది. అతడు ఉత్తర దిశగా వెళ్ళెను.
అప్పుడు నీవు దిగి వచ్చేవు; ఆ పెద్ద గుర్రము వెనుదిరిగి పశ్చిమ దిశగా వెళ్ళినది. నీవు నిలబడి చేతులెత్తావు. అంతట అతడు ఏడవసాగెను. బ్రెన్హాం సోదరుడా, ఆ గుర్రము అక్కడ నిలువబడి ఉన్నది. యుద్ధ అలంకరణలతో అది మొరయుచున్నది. "నీవు నీ చేతులను కొద్దిసేపు పైకెత్తి దానివైపు మరల చాచావు. మరొకసారి ఈ దారిలో స్వారి చేయుదునని" నీవు చెప్పావు. అప్పుడు భూమి యావత్తు కంపించి పోయినది. నాలో ప్రాణం లేనట్లయినది. నేను ఆ బండ ప్రక్కన పడిపోయాను, మరియు మెళకువ వచ్చినది."
అతడు, "అయ్యా, దీని భావమేమి?" అని అడిగెను.
"నాకు తెలియదు," అని నేను అన్నాను.
95మరుసటి ఉదయము పిరమిడ్ గూర్చి జూనియర్ జాక్సన్ కలగనెను. నేను పశ్చిమా.నికి వెళ్ళాను. దానికి 1, 2 నెలల ముందు అతడు నన్ను పిలచుట మీకు గుర్తు౦డును. అతడు తనకు వచ్చిన ఒక కలను నాకు చెప్పవలసియుండెను. నేను బిల్లీతో… అక్కడ దాదాపు 20 మంది నిలబడియున్నట్లు" చెప్పాను. "జూనియర్ జాక్సన్ నాకు తన కలను చెప్పుచున్నట్లుగా వార్తను పంపెను"
"అయిదు నిమిషములలో అతనిని పంపు" అని నేను అన్నాను.
అతడు తన భార్యను "ఒక సాక్షిగా" తీసికొని వచ్చెను. "అతడు అతని భార్య పయనించుచుండగా, ఆ కలగనినట్లు చెప్పెను. అతడు తూర్పు వైపు చూడగా, ఎగురుచున్న పళ్ళెము వంటి ఒక వస్తువు కనబడెను."
96చూడండి, అదేమిటో ప్రపంచమునకు తెలియదు. మీరెరుగుదురు; అది ఏమిటో మనకు తెలియును. అది తీర్పుతీర్చు దేవదూతల అన్వేషణ అని మనకు తెలియును, మీరు చూచారా. పెంటాగాన్ ఇంకా గూఢచారి వ్యవస్థలు చాలా యున్నవి; అయినను అవి మెరుపువలె వెళ్ళుచున్నవి; అవి దేనినయినా ఛేదించుకొనిపోగలవు. చూడండి, అవి ఏమిటో వారికి తెలియుట లేదు. వారిని వారి ఇష్టము వచ్చినట్లు అనుకోనీయండి. వారు వాటిని ఎగిరే పళ్ళెములని లేక మరేదో అని చెప్పుచున్నారు; వారికి తెలియదు, చూచారా.
97"అది వచ్చుట నేను చూచాను, మరియు దానిని నేను గమనించాను. అది ఒక గుర్రముపై ఒక మనిషి. మెరుపు వేగముతో వచ్చుచుండెను. నేను నా ముందుకు వచ్చుచున్నట్లు చూచి కారును ఆపాను. బయటకు దూకాను. రహదారి మీద ఒక గొప్ప తెల్లని గుర్రము నిలబడియుండుట చూచాను. అది సైనిక గుర్రము వలె అలంకరించబడి యున్నది" అని అతడు చెప్పెను. అది వాక్యము అని మీకు తెలియును.
అతడింకా ఈలాగు చెప్పెను, "దానిమీద ఒక వ్యక్తి కూర్చొనియుండెను. అతడు పశ్చిమ దుస్తులు ధరించెను. పశుల కాపరి కాదు, కాని అతడు కార్మిక నాయకుని వలె కనిపించెను." [అతని ప్రధాన అధికారమంతయూ పశ్చిమము నుండియే వచ్చినది. ఇండియనుల మీద ఇండియనులు.] అతడు టోపీ క్రిందికి దించి ప్రక్కలకు చూచుచుండెను. బ్రెన్హాం సోదరుడా! ఆ తిరిగినది నీవే. నీవెన్నడూ ఆలాగు మాట్లాడలేదు. నీవు మూడుసార్లు "జూనియర్" అని పిలచితివి. "నీవేమి చేయవలెనో చెప్పెదను" అన్నావు. నీవు మరల గుర్రము మీదికి ఎక్కితివి. అది మూడుసార్లు ఎగిరి ఆకాశము మీదికి పోయినది. నీవు పశ్చిమానికి వెళ్ళిపోయావు!
98అతడింకా ఇట్లనెను, "నేను చూడగా మరియొక చిన్న గుర్రము వచ్చుచుండెను. అదే జాతికి చెందినది గాని చిన్నది. దీనిని అతడు నా కొరకు పంపియుండునని తలంచాను. నేను ఎక్కాను. [జూనియర్ కూడా కొద్దిగా స్వారీ చేసెను.] "బ్రెన్హాం సోదరుడా, ఆ జీను నీకు సరిగ్గా సరిపోయినది." "నాకును ఇది బాగానే సరిపోయినదని" నేననుకొన్నాను. "నేను కళ్ళెము లాగాను; ఆకాశమునకు ఎక్కిపోయినది." నేను కళ్ళెము లాగి దానిని ఆపుచేశాను, దానిని త్రిప్పి మరల వెనక్కు వచ్చాను. వెనక్కు వచ్చి గుర్రమును ఆపి, దిగిపోయి మరియు నా భార్యతో మాట్లాడాను. గుర్రము వెళ్ళిపోయినది."
99మొన్న, అనగా, మూడు దినముల క్రితం లియో మొర్సియర్ వచ్చెను. అతడును అదే కలను చెప్పెను. దీనిగూర్చి అతనికి ఏమీ తెలియదు. ఒక పెద్ద తెల్లని గుర్రమును ఒక నల్లని గుర్రముతో కలుపగోరిరి, కాని చేయలేకపోయిరి. అప్పుడు "నేను అతని యొద్దకు వెళ్ళి, "లియో" అని పిలచి నేను ఏమి చేశానో తెలిపాను." (దానిని ఇక్కడ నేను చెప్పగోరుట లేదు.) ఎడ్ డాల్టన్ కు అల్లుడున్నాడని నాకు తెలియదు. ఆ పేరుతోనే ఆ అల్లుడికి ఒక కుక్క ఉన్నది.
"లియో, నీ కలను నీవు తెలిసికొందువు, అయితే నీవు మేల్కోనినప్పుడు దానిని గుర్తుచేసికొనుము." "అట్టి ఆజ్ఞ నేనెన్నడూ వినలేదు" అని అతడు చెప్పెను.
100అదే సమయములో రాయ్ రాబర్సన్ లోనికి వచ్చెను. "బ్రెన్హాం సోదరుడా, మొదటిసారి నీవు ఆలయమును విడిచి వెళ్ళుట నీకు గుర్తున్నదా? నీవు పాలస్తీనాలో కూర్చొనియున్నట్లు నేను చూచాను. ప్రభువు బల్ల దగ్గర కూర్చొనియున్నట్లుగా ఉన్నది. నీవు ఏదో చెప్పావు గాని నీకే అది ఖచ్చితంగా తెలియనట్లున్నది. ఒక తెల్లని మేఘము వచ్చి నిన్ను కొనిపోయెను" అని చెప్పెను.
సహో, రాయ్ యొక్క కల ఎందరికి గుర్తున్నది? "ఒక తెల్లని మేఘము నిన్ను కొనిపోయెను. నీవు వెళ్ళిపోయావు. నేను వీధిలో కేకలువేయుచూ, ఏడ్చుచూ వెళ్ళుచున్నాను. నేనక్కడ నుండి వచ్చుట చూచి ఒక ముసలి వ్యక్తియు ఏడ్వనారంభించెను. నేను అతనిని ఇంతకు ముందు చూచి ఈ కల చెప్పలేదు.
MATT 24:24•
MARK 13:22
101నీవు వెళ్ళిపోయావు, కాబట్టి వీధులలో నీ కొరకు వెదుకుచూ యున్నాను; ఎక్కడ నీవు కనబడలేదు. నేను ఏడ్చుచున్నాను. "ఓ! బ్రెన్హాం సోదరుడా, వెళ్ళిపోవద్దు! ఒక తెల్లని మేఘము వచ్చి నిన్ను మా నుండి దూరంగా పశ్చిమంగా తీసికొనిపోయినది."
అది పిరమిడ్ మొదలగునవి కనబడకముందు జరిగినది. అతడు ఈలాగు చెప్పెను, "అది నిన్ను పశ్చిమంగా తీసికొనిపోయెను. నేను ఏడ్చుచూ వీధులలో వెదికాను. కొంతసేపు తరువాత వెళ్ళి బల్లయొద్ద కూర్చొన్నాను. నేను ఆ బల్ల పైకి చూడగా, నీవు హిమమంత తెల్లగా కనబడితివి. నీవు అక్కడ నిలబడి అధికారముతో మాట్లాడితివి. దానిలో ఏమీ ఊహలేదు. నీవు చెప్పిన దానిని ప్రతివారు అర్ధము చేసికొనిరి."
ఓ! నా సోదరీ, సోదరులారా; ఇప్పుడు మీరందరూ తెలిసికొనుడి. దాని భావము నాకు తెలియును, చూచారా. గమనించండి! క్రీస్తుకు దగ్గరగా జీవించండి. ఎట్టి వెర్రితనమును వెంబడించవద్దని సువార్త సేవకునిగా మిమ్మును హెచ్చరించుచున్నాను. దేనిని ఊహించవద్దు. మీ లోపలనున్న అంతరంగము వాక్యములో లంగరువేసి, క్రీస్తులో మీరు సరిగ్గా యుండు వరకు అక్కడే యుండుడి, ఎందుకనగా మనము ఎన్నడూ లేని మోసపు యుగములో యున్నాము. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చును, ఎందుకనగా వారు అభిషేకి౦చబడిరి. వారు ఇతరుల వలె ఏదయినా గాని చేయగలరు.
ROM 13:8
102మీ జీవితములను శుభ్రపరచుకొనండి, మీ బాకీలు తీర్చండి, ఎవనికిని అచ్చి యుండవద్దు. మీ ఇల్లు మొదలగు వాటిని గూర్చి నేను చెప్పుట లేదు. మీరు అద్దె ఇంట్లో యుండవచ్చును. మీరు అన్ని విషయములలో చేతులు కడుగుకొనండి. అన్నింటినీ సరిచేసికొనండి. సిద్ధపడండి. ఏదో ఒకటి జరుగనైయున్నదని ప్రభుని నామమున గుర్తుచేసికొనండి!
ఈ వారములో నేను కొండలకు పోవుచున్నాను, నిజంగా ఉడుతల వేటకు కాదు — వేటాడుదుననుకోండి — కాని నేను ఈ ఉద్దేశ్యముతో వెళ్ళుచున్నానని చెప్పుచున్నాను. "ఓ! దేవా, ఎటు కదలవలెనో నాకు తెలియదు. దీనిని నేను తప్పిపోగోరుట లేదు. నాకు సహాయము చేయుము."
మీరు నా కొరకు ప్రార్ధి౦చండి. ప్రార్థించెదరా? నేను మీ కొరకు ప్రార్ధి౦చెదను. దేవుని కృపను బట్టి మీ ప్రతి ఒక్కరిని నేను కలిసికొందునని ఆశించుచున్నాను. ఇక్కడున్న ఈ దేశముకంటె శ్రేష్టమైన దానిలో మనము కలిసికొందుము.
103ఎందుకొరకు మనము ఇక్కడికి వచ్చుచున్నాము? మనమేమి చేయుచున్నాము? ఇక్కడ మనము ఆట ఆడుటకు వచ్చుచున్నామా? ఒక్క లాడ్డిలో కలిసికొనుటకు వచ్చుచున్నట్లు వచ్చుచున్నామా? ఆ సంఘము సంపూర్తిగా సరియగువరకు క్రీస్తు రాలేడు. ఆయన మనకొరకు కనిపెట్టుచున్నాడు. మనము అంతమందున్నామని మనము నమ్ముచున్నాము.
కాలిఫోర్నియా వైపు చూడండి. ఆ అల్లరు చూడండి. జాతి భేదములలో 19 మంది చనిపోయిరి. మార్టిన్ లూథర్ కింగ్ తన జనులను త్వరలోనే మూకుమ్మడి హత్యకు నడిపించునని ఎప్పుడో మీకు నేను చెప్పలేదా? ఎంతమందికి అది గుర్తున్నది? ఆ వర్ణజాతి ప్రజలు కారు. ఆ నాయకులే వీరిని పురికొల్పుచున్నారు. అది వివక్షత కాదు, సంలీనము కాదు, దానిని మీరేమైనా అని పిలవండి. అది అపవాది! నిజము. తెల్లవారు, నల్లవారు అని కాదు; అది వారందరు. అది అపవాది!
104మనిషి యొక్క జ్ఞానము, హేతుబుద్ధి నాశనమైనది. ఇక నీరీక్షణ లేదు. అది నీరీక్షణకు దూరముగా ఉన్నది. అంతయూ భయంకరముగా చెడిపోయినది.
మానవుని మేధాశక్తి ఇక నిర్ణయములు తీసికొనలేని స్థితికి వచ్చినది. నేను రాజకీయవేత్తను కాను, డెమొక్రాట్ ను కాను, లేదా రిపబ్లికనును కాను; వారందరూ అపవిత్రులయిరి. నేను ఒక రాజ్యమునకు చెందినవాడను. అది యేసుక్రీస్తు రాజ్యము. అంతే! ఇప్పుడు మనకున్న కీలుబొమ్మలు మరెప్పుడైనా యున్నారా? మనము టెక్సాస్ గుంపువంటి వారిని కలిగియున్నాము. "ప్రజలు ఏది కోరితే అది చేయుదుము. వారు కమ్యూనిజం కోరినచో, కమ్యూనిజం ఇచ్చెదము. వారికి సంలీనము కావలసినచో అది ఇచ్చెదము. వేర్పాటు కావలసినచో అది ఇచ్చెదము. ఏమైనా ఇచ్చెదము," అని వారు చెప్పుచున్నారు. మానవుడిచ్చటున్నాడు?
ఓ దేవా, అది వేదిక వలె యున్నది. మనిషి ఎక్కడ — ఒక నియమమునకు నిలబడు మనిషి ఎక్కడ? ఒక నియమమునకు నిలబడు స్త్రీ ఎక్కడ? ఒక నియమమునకు నిలబడు సంఘమెక్కడ? అది ఇది చెప్పి రాజీపరచు ఆత్మను వ్యక్తము చేయుటకు నాకు అసలు సమయము లేదు!
స్త్రీని - స్త్రీగానే ఉండనీయండి. పురుషుని - పురుషునిగానే ఉండనీయుడి.
MATT 16:18•
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
105మన జాన్ క్విన్సీ ఆడామ్స్ ఎక్కడ? మన అబ్రహాం లింకన్ ఏరి? వారు నియమము గల జనులు. మన పాట్రిక్ హెన్రీ ఎక్కడ? "నాకు స్వాతంత్ర్యము ఇవ్వండి లేదా మరణమును ఇవ్వండి." సరియమైన దానికొరకు నిలబడు మనిషి ఎక్కడ? ప్రపంచమంతా తనకు శత్రువైనా గాని భయపడక సరియమైన దానిని బయటకు చెప్పి, దానికొరకు నిలబడి, మరణించగల వారెవరున్నారు?
ఈనాటి ప్రపంచములో మన ఆర్నాల్డ్ వాన్ వింకిల్ రీడ్ ఎక్కడ? యధార్థపరులు ఎక్కడ? ఆవేశము గల మనుష్యులేరి? వారెక్కడ నిలబడియున్నారో వారికే తెలియని బూటకపు మనుష్యులు మనకున్నారు. దేవా! సేవకునిగా నేను నియమముగల వ్యక్తిగా నిలబడుటకు కృప చూపుము. యేసుక్రీస్తు వాక్యము ఈలాగు చెప్పుచున్నది: "భూమ్యాకాశములు గతించును గాని, నా మాటలేమాత్రమును గతించవు. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువజాలవు." మనము లేచి నిలబడుదుము.
మనలను బంధించు బంధము దీవించబడును
మన హృదయములను క్రైస్తవ ప్రేమలో
ఒకే రకమగు మనస్సుగలవారి సహవాసముమైనున్న
దానికి సమానముగా ఉన్నది.
ఇప్పుడు, మీరు ఒకరితో ఒకరు చేతులు కలపండి.
మనము విడిపోయినయెడల
అది మనకు లోన బాధ కలిగించును;
అయినా ఇంకా మనము హృదయములో కలిసే యుందుము,
మరల కలిసికొను ఆశ కలిగియుందుము,
తిరిగి మనము కలిసికొనువరకు
తిరిగి మనము కలిసికొనువరకు,
యేసు పాదముల యొద్ద
తిరిగి మనము కలిసికొనువరకు;
తిరిగి మనము కలిసికొనువరకు;
తిరిగి మనము కలిసికొనువరకు,
దేవుడు మీకు తోడైయుండు గాక!
REV 22:18,19
106సహో. నెవిల్ మనలను ప్రార్థన చేసి పంపించు వరకు ఇప్పుడు మనము తలలు వంచుదము. ఈ రాత్రికి మరల తిరిగి రండి. ఇక్కడ ఈ ఆలయములో ఈ రాత్రి గొప్ప ఆరాధన జరుగునని ఆశించుచున్నాను. దేవుడు మిమ్ము దీవించును. నా కొరకు ప్రార్ధించండి. నేను మీ కొరకు ప్రార్ధి౦చుదును. స్నేహితులారా, నేను మతమౌఢ్యినని తలంచకుడి. నేను మీ మీద ఏదో నెట్టుచున్నానని అనుకోవద్దు. నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నాకు ఒక నియమమున్నది; అది బైబిలు. దానినుండి ఒక్క మాటయు తీసివేయబడదు! దానికి ఒక్క మాటయు చేర్చబడదు. దానిని నేను వ్రాయబడిన రీతిగానే నమ్ముదును.
ఇప్పుడు మనము తలలు వంచుదము. మన దీన, మంచి సంఘ కాపరి కూటమును ముగించును. నెవిల్ సోదరుడా! దేవుడు మిమ్ము దీవించును.