క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను

క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను

1మన తలను వంచుదాము. ప్రభువైన యేసూ, గొప్ప మంద యొక్క గొర్రెల కాపరి, మేము నీకు ఎంతో అచ్చియున్నాము, ప్రభువా, మా హృదయములలో నీవు కుమ్మరించిన ప్రేమకు, మేము ఎన్నడూ తిరిగి చెల్లించలేము. మేము తలలు వంచి నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా, మేమే ఎంతో అయోగ్యులముగా భావిస్తున్నాము. పాపము నుండి మరియు పొరపాట్లన్నిటి నుండి మమ్మును కడుగుమని నిన్ను అడుగుచున్నాము. ఈ రోజు మా శరీరములను బలపరచమని మేము ప్రార్థిస్తాము. అనేక మంది రోగులుగా, మరియు వ్యాధితో పీడించబడుచున్నారు. అది ఇక్కడ చూపుచున్నట్లుగా, చేతి రుమాళ్ళు మరియు ప్రార్థనా మనవులు ప్రతి స్థలము నుండి ఫోను ద్వారా వస్తున్నాయి.

ప్రపంచ చరిత్రను మేము ముగించుచున్నామని, ఇప్పుడు మేము నమ్ముతాము, మరియు త్వరలో సమయము నిత్యత్వముతో అదృశ్యమవుతుంది, మరియు ఆ ఘడియకు మేము సిద్దపడ గోరుచున్నాము. ఆ సమయము కొరకు సిద్దపడుట కొరకు, ఆ కారణమును బట్టియే మేము ఈ ఉదయమున ఇక్కడ కూడుకొనియున్నాము. ఈ ఉదయమున అనేక మంది తీరము నుండి తీరము వరకు టెలిఫోన్ ద్వారా ముడి వేయబడియున్నారని నాకు చెప్పబడింది. మా స్వరములు ఎక్కడకు వెళ్ళినను, ఆ చిన్నగుంపు దీవించబడును గాక, మా మధ్యయున్న రోగులను స్వస్థపర్చుము, ప్రతి చెడు నుండి వారి ఆత్మలను నీవు కడుగుమని నేను ప్రార్థిస్తాను. ఆ గొప్ప ఆధిక్యతను ఈ ఉదయమున ఆలయములో, మేమును అనుభవించు లాగున మాకు సహాయము చేయండి.

2ఈ రోజున నీ వ్రాయబడిన మాట ద్వారా, మాతో మాట్లాడమని మేము అడుగుచున్నాము, మరియు దేశమంతటా మేము కూడియుండగా, ఆత్మ మాకు అవసరమైన వాటిని బయలుపర్చును గాక, మేము చిన్న ప్రజలమని భావించుచున్నాము, కాని విమోచించబడిన వారి మధ్యలో మాకు ఒక స్థానమున్నది, కారణము మేము యేసుక్రీస్తు నందు విశ్వాసముంచియున్నాము.

ప్రభువా, వీటిని మాకు దయచేయుము. మేము ఈ కూటమును ముగించి, దేశములోని మా గృహములకు వెళ్ళుచుండగా, ఎమ్మాయి గ్రామము నుండి వచ్చిన వారు చెప్పినట్లుగా మేమును చెప్పుదుము గాక, "ఆయన దారిలో మనతో మాట్లాడుచుండగా, మన హృదయములు మండలేదా?"

తండ్రీ, ఇప్పుడు, ఈ దేశములోని చక్కని క్రైస్తవులందరూ వినుటకు సిద్ధపడి యుండగా, నేను ఏమి చెప్పినప్పటికి అది చాలినంతగా యుండదు, నిశ్చయముగా అది చాలదు. నేను ఏది చెప్పినను అది వారికి ఏ మంచి చేయదు, ఏలయనగా మేమందరము అదే జాబితాలో యున్నాము. మనుషులమైన మేము, మర్త్యులము, కాని ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు మాట్లాడును గాక; ఆయన వాక్యమును తీసుకొని తన్నుతాను బయలు పర్చుకొనును గాక. యేసు నామములో మేము ఆయన కొరకు కనిపెట్టుచున్నాము. ఆమేన్. మీరు కూర్చోవచ్చును.

3ఒక విధముగా… నాకై నాకు ఆశ్చర్యముగా యున్నది. నా భార్యతో చెప్పాను, ఆమె టుసాన్లో వింటున్నటైతే, నేను ఇక్కడకు తిరిగి వచ్చినప్పుడు, ఏ విధమైన కూటము యుంటుందని నేను అనుకొనలేదు; నేను కనీసము బట్టలు కూడా తేలేదు. నేను నా కోడలుతో చెప్పాను, ఆమె నా కోటును ఇస్త్రీ చేసింది. నేనన్నాను, "నేను ప్యాంటు ఒక రకమైనది, కోటు మరొక రకమైన దానితో వేదిక వెనుక నిలబడుచున్నాను. అవి నేను ఇంటి దగ్గర వేసుకొనేవి." కాని, మెడా, నా షర్టును ఇస్త్రీ చేసింది, చింత పడవద్దు. అంతా బాగుంది.

4ఇప్పుడు, మనము ఒక ప్రార్థనా మనవిని కలిగియున్నాము, అక్కడ ఒక ప్రియమైన సోదరుడు యున్నాడు… అది ప్రెస్కాట్ అనుకొంటాను, వారు ఈ ఉదయమున అరిజోనాలోని ప్రెస్కాట్లో మనతో అనుసంధానమైయున్నారు. సహోదరి మెర్సీయర్ యొక్క తండ్రి, కూటమునకు వస్తూయుండగా రోడ్డు మీద, గుండెపోటును బట్టి హాస్పిటల్ కు ఆయనను తీసుకెళ్ళారు, ఆయన సోదరుడు కాగిన్స్. సహోదరుడు జూనియర్ జాక్సన్ కూడా, ప్రక్కన రేడియోలో లేక ఫోన్లో, కార్న్ విల్స్ లోగాని న్యూ-ఆల్బనీలోగాని యున్నాడని నేననుకొంటాను, ఆయన తండ్రి హాస్పిటల్లో, కాలేయములో యున్న కాన్సర్ ఆపరేషన్ కొరకు తీవ్రమైన స్థితిలో యున్నాడు. కాబట్టి నిశ్చయముగా వారిని మన ప్రార్థనలో జ్ఞాపకము చేసికొందాము. ఇప్పుడు ఇతరులు కూడా ఇక్కడ యున్నారు, కాని మనము సమయమును తీసుకొనుట లేదు. వారిని గూర్చి దేవునికి అంతా తెలుసు, కాబట్టి ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేద్దాము.

5ప్రియమైన దేవా, ఆ ప్రియమైన ముడుతలు పడిన చేతులు కలిగిన వృద్ధుడు, బ్రదర్ కాగిన్స్, పొలములోని ఒక వృద్ధ సైనికుడు, ఎక్కడో హాస్పిటల్లో గుండె పోటుతో బాధపడుతూ పడియున్నాడు. దేవా, ఆ దీనమైన వృద్ధ హృదయము ఎన్నో యిబ్బందుల గుండా వెళ్ళి యున్నది. దేవా, ఆయనకు సహాయము చేయమని ప్రార్ధిస్తున్నాను. దానిని దయచేయుము. మేమందరము ప్రేమించినట్లే, అతడును జీవమును ప్రేమిస్తాడు, అతడు జీవించగోరుచున్నాడు. ప్రభువైన దేవా, దానిని దయచేయుము. నీవు ఆయనను స్వస్థ పరచి బయటకు తేవాలని, యేసు నామములో దేశమంతటి గుండా మేము ప్రార్ధిస్తున్నాము. నీవు దానిని చేస్తావని మేము నమ్ముతాము, అతడు తిన్నగా కూటమునకు వచ్చును గాక.

6సోదరుడు జాక్సన్ కొరకు ప్రార్థిస్తాము, ఆయన ప్రశస్తమైన తండ్రి మరణపు వరుసలో పడియున్నాడు, మరియు జూనియర్ వంటి చక్కని బాలుని లోకములోనికి తెచ్చియున్నాడు. ప్రియమైన దేవా, నీవు ఆయనకు స్వస్థపర్చుమని నేను ప్రార్థిస్తాను, అది అసాధ్యముగా కనపడుతుందని నాకు తెలుసు. మందులు, వైద్యులు, "ఇలాటి వ్యాధితో ఏమి చేయాలో వారికి అర్థమగుటలేదు. కానీ సోదరుడు హాల్ ను మేము జ్ఞాపకము చేసికొంటాము, ఇంకా లూయిస్ విల్ లోని శ్రేష్టమైన వైద్యులను జ్ఞాపకము చేసికొంటాము. కాలేయములోని కాన్సర్ వ్యాధితో అతడు, "కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాడని," వారన్నారు. మరియు ఈ రోజున అతడు జీవించుచున్నాడు, అది ఇరవై-ఐదు సంవత్సరముల క్రితము, కారణము అది నీ కృపను బట్టి. కాబట్టి ఈ రోజు సోదరుడు జాక్సన్ను నీవు స్వస్థపర్చుమని నేను ప్రార్థిస్తాను, ప్రభువా, నీ కృప మరియు నీ దయ ఆయనతో యుండును గాక.

ఈ గొప్ప చేతి గుడ్డల కుప్ప, బట్టలు, ఇవన్నీ ప్రార్థనా మనవి కొరకు ఇక్కడ యుంచబడ్డాయి; తండ్రి, వారందరూ నీకు తెలుసు. అందరికీ స్వస్థతను దయచేయుమని నేను ప్రార్థిస్తాను. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.

7ఇప్పుడు, ఈ ఉదయారంభము, మొదటి స్థానములో, గత ఆదివారము నేను ఇక్కడకు వస్తానను కోలేదు. అప్పుడు మరలా, దానిని మనము ప్రకటించాము, నేను వచ్చాను. సోదరుడు నెవిల్ నన్ను మాట్లాడుమని అడిగాడు! తరువాత ఈ రోజు మనము ఇక్కడ యుంటామని ప్రకటించాము, అది దేశమంతా ప్రజలు తెలుసుకొని యుండలేదు. ఈ టెలిఫోను అనుసంధానమును మనము కలిగియున్నాము, అది చాలా, చాలా బాగుంది. ప్రజలు వారి గృహములలో తిన్నగా కూర్చొని, వారి స్థలములలో, వారి సంఘములలో కూడుకొని కూటమును వింటారు. నేను దానిని మెచ్చుకొంటాను.

ROM 13:8

 

8ఇప్పుడు, గతాదివారము నేను వర్తమానములో చెప్పియున్నట్లుగా, గత వారము ఎన్నో ప్రార్థనా మనవులు ఇక్కడ యుంచబడి యున్నవి. నేను దానికి ఏమి పేరు పెట్టానో మర్చిపోయాను. కానీ మీ అప్పులను తీర్చుటను గూర్చి నేను ఏదో చెప్పాను. నీకు తెలుసా, నీవు ఏమి చెప్పినను లెక్క కాదు, అది అనేకుల ద్వారా అర్థము చేసికొనబడినది. అపార్ధము చేసికొనుట వారికి ఇష్టము లేదు, కానీ నీవే దానిని అపార్ధము చేసుకున్నావు. ఇప్పుడు, ఎవరో అన్నారు, "మీరు కారును తప్పక కొనాలా?" లేక "నేను తప్పక ఏమి చేయాలి…" ఇప్పుడు, అక్కడ బైబిలులో అదే యేసు చెప్పియున్నాడు, "ఏ మనిషికి ఏదీ అచ్చియుండ వద్దు," అవి నీవు చెల్లించగలిగే, వ్రేలాడుచున్న అప్పులు, వాటిని చెల్లించుము. ఏ మనిషికి ఏదియు అచ్చియుండవద్దు. దాని భావము… నీ ఇంటి అద్దె, నీ టెలిఫోను బిల్లు అవి కాదు, ఇంకేమైనా. వాటిని మనము అచ్చియున్నాము, వాటిని మనము చెల్లిస్తాము. కాని ఒక నీవు చెల్లించవలసిన, వ్రేలాడుచున్న ఒక పాత బాకీ, దానిని చెల్లించివేయుము, చూడండి. ఇప్పుడు, అలాంటిది నీ మీద వ్రేలాడుచుండగా, వాటితో ముందుకు వెళ్ళవద్దు.

9ఒకప్పుడు నేను బాలుడుగా యున్నప్పుడు, నాకు గుర్తున్నది, నేను జబ్బు పడ్డాను. రెండు వేల డాలర్ల బాకీతో నేను హాస్పిటల్ నుండి బయటకొచ్చాను. అక్కడొక మందుల కొట్టు ఉండేది. ఆయన పేరు శ్రీ. స్వానిగర్, నేను రెండు లేక మూడు వందల డాలర్ల మందుల బిల్లు బాకీ యున్నాను. కనీసము నేను ఆయనకు తెలియదు. నేను ఆయన దగ్గరకు వెళ్ళాను. అతడు నాకు తెలియదు. ఎలాగైనా, అతడు దానిని అక్కడకు పంపాడు, దానిని పంపుటకు నిరాకరించలేదు. నేనన్నాను, నేను నీకు బాకీ యున్నాను," నేను నమ్ముతాను, స్వానిగర్… అది అక్కడ కోర్టు ఎవెన్యూ స్ప్రింగ్ దగ్గర యున్న శ్రీ. మేసన్. నేనన్నాను, "నేను నీకు అప్పున్నాను, నేను ఇంకా ఎంతో బలహీనముగా యున్నాను, కానీ నేను పనికి వెళ్ళుటకు ప్రయత్నము చేయుచున్నాను. ఇప్పుడు, నేను నీకు చెల్లించలేను…" నేను ఇప్పుడు ఒక క్రైస్తవుడనయ్యాను. నేనన్నాను, "మొదటి సంగతి, శ్రీ. మేసన్, దేవునికి నా విధిగా, నా దశమ భాగములను నేను అచ్చియున్నాను, మొదటిగా, నేను నా యొక్క దశమ భాగములను ఆయనకు చెల్లించగోరుచున్నాను." నేనన్నాను, "తరువాత నా విధి, నా అప్పులను చెల్లించుట." నేనన్నాను, నా తండ్రి కూడా రోగిగా యున్నాడు, మా కుటుంబములో మేము పది మంది యున్నాము," అయితే "నేను, నా జీతము చెల్లించబడిన ప్రతిసారి నేను దానిమీద ఇరవై-ఐదు సెంట్లు కంటే ఎక్కువ చెల్లించలేను. నేను కనీసము ఇరవై-ఐదు సెంట్లు చెల్లించలేనప్పుడు, నేను నీ దగ్గరకు వచ్చి, దానిని గూర్చి చెబుతాను. నేను నీకు చెపుతాను. 'ఈ సారి నేను అది చేయలేను' ఇప్పుడు, దేవుని యొక్క సహాయము ద్వారా, నే సమస్తము చెల్లించాను, చూడండి. నా భావము అదియే, చూడండి.

ఎవరో ఏదో చెప్పనీయవద్దు…

10ఓ, ఒకసారి ఎవరో క్రైస్తవుడు బయటకు వెళ్తూ, తన కారు పనిని చేయించు కొన్నాడు, అతడన్నాను, "నేను నీకు శనివారము ఆ డబ్బు చెల్లిస్తానన్నాడు." అతడు ఎన్నడూ ఆ డబ్బు అతనికి చెల్లించలేదు. వారములు గడచిపోయినవి, అతడు ఎన్నడూ చెల్లించలేదు, ఒక్క మాట దానిని గూర్చి ఎన్నడూ చెప్పలేదు. ఆ మనిషి నా దగ్గరకు వచ్చి అడిగాడు… చూడు, అది సంఘమునకు వ్యతిరేకముగా ప్రతిబింబిస్తుంది. అది క్రీస్తుకు వ్యతిరేకముగా ప్రతిబింబిస్తుంది. నీవు చెల్లించలేనప్పుడు, వెళ్ళు అతనికి చెప్పుము, "నేను నీకు బాకీ వున్నాను, నేను నీకు చెల్లించబోవు చున్నాను. నేను ఒక క్రైస్తవుడను. నేను ఇప్పుడు దానిని చేయలేను… నేను బాకీ యున్నాను." గుర్తుంచుకో, నీవు చేసింది, నీకు తెలుసా, అది దేవుని యొక్క గ్రంథముల మీద కూడా యున్నది; నా కొరకు నేను ప్రయత్నము చేస్తాను, మనమందరము కలసి ఏకముగా, సిద్దముగా యుందాము, ఏలయనగా మనము దేనినో సమీపించుచున్నాము, ఏదో సంభవించుటకు ఎంతో దగ్గరగా యున్నది. కాబట్టి మనము సిద్దముగా యుండాలి. ప్రభువు యొక్క రాకడ ఎంతో సమీపించుచుండగా ఇప్పుడు, ఆ గొప్ప ఘడియ కొరకు మనము సిద్ధపడాలి.

11ఇప్పుడు, దేవుని యొక్క సహాయమును బట్టి, ఈ ఉదయము కొరకు నేను ఎన్నుకొన్న ఒక చిన్న అంశమును మాట్లాడుటకు మనము సిద్ధపడదాము. మాట్లాడగలిగినంత క్లుప్తముగా మాట్లాడుదాము, ఏలయనగా ప్రజలతో మనము అనుసంధానమైయున్నాము. ఇక్కడ మేము ఇండియానాలో కలిగియున్నట్లుగా దేశమంతటి గుండా, చక్కని ఉదయమును కలిగియున్నారు. వర్షము పడినప్పటి నుండి, మనము చక్కని, చల్లని, మంచి వాతావరణమును కలిగియున్నాము. అది చాలా బాగుంది.

JOHN 1:1•

HEB 1:1-3

 

12ఇప్పుడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మరియు పరిశుద్ధ యోహాను సువార్త 1వ అధ్యాయము. హెబ్రీ 1:1 నుండి 3 వచనములు, మరియు పరిశుద్ధ యోహాను 1:1, ఒక అంశము కొరకు. ఈ ఉదయ కాలమున నా అంశము, లేఖనములలో చదువుదాము. ఇప్పుడు, హెబ్రీ 1:1 మనము చదువుదాము:

పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు,

ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను.

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచూ, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను;

ఎలాటి చక్కని పఠనము! ఇప్పుడు పరిశుద్ధ యోహాను 1:1:

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను.

13ఇప్పుడు, ఈ ఉదయము నా అంశము: క్రీస్తు తన సొంత వాక్యమందు బయలు పర్చబడెను. ఇప్పుడు, నేను దీని మీద మాటలాడుటకు ముగింపుకు వచ్చినప్పుడు, కారణమేమనగా ఒక క్రమము లేకుండా మనము కూడుకొన్నందున, ఏదో మనము దేనిమీదో చెప్పకూడదు, కానీ మనము చెప్పేది ఏదైనా ప్రజలను స్థిరపర్చుటకు సహాయపడాలి, ఏలయనగా మనము అపాయకరమైన, నాశనకరమైన జలముల గుండా ప్రయాణము చేయుచున్నాము. కొన్నిసార్లు అది మీతో యున్నట్లుగా నాతోనూ యుంటుంది. దానిలో అది ఎంతో అలా కనబడుతుంది, అది ఎంతో భీతిగా వుంటుంది…

14నేను ఇప్పుడే ఒక యవ్వన సేవకునితో అతని భార్యతో, గదిలో కొన్ని క్షణముల క్రితము మాట్లాడుచున్నాను. భూమి మీద యున్న ఇతర మనుషులవలె, వారిద్దరూ ఎంతో వత్తిడిలో వున్నారు. నేనన్నాను, "గుర్తుంచుకోండి, సాతాను మీ మీదికి ప్రయోగించుటకు పిడికిలి బిగించి వచ్చుచున్నాడు." నీవు ఎవరివైనను లెక్క కాదు, ఆ పిడికిలితో కొట్టుటకు వాడు హక్కును కలిగియున్నాడు. ఆ గుద్దు, ఒక గ్రుడ్డితనము కావచ్చు, కుర్చీలో కూర్చొనే ఒక నరముల వ్యాధి కావచ్చు. ఆ తెరవబడియున్న స్థలమునకు, వాడు హక్కు కలిగియున్నాడు. ఇప్పుడు, ఆ స్థలమునే నీవు ఎల్లప్పుడూ, తప్పక కప్పియుంచాలి.

ఈ నరముల ఉద్రిక్తతతోయున్న యుగమును మనము చూస్తున్నప్పుడు…

15పోయిన వారము టేపులు, నేననుకొంటాను, ఈ దినములలో ఒక దినము మనము సమృద్ధియైన స్థలమునకు వచ్చినప్పుడు, ఈ భీతి గొలుపు అంశముల మీద నేను మాట్లాడగోరుచున్నాను, భూమి మీద కుమ్మరించబడబోయే ఆ కడవరి తెగుళ్ళు. అదే కడవరి తెగుళ్ళు కుమ్మరించబడుట, ఏడు ఉరుములు, భూమి మీదకు రానైయున్న భయోత్పాతము కలిగించు దృశ్యములు…

ఇప్పుడు ప్రపంచ మంతయూ, ప్రజలందరూ ఎలాటి నరముల ఉద్రిక్తతలో యున్నారో!

16గత నెల రీడర్స్ డైజస్ట్ మీరు చదివితే, అక్కడయున్న అంశమును మీరు గమనిస్తారు; అది గొప్ప సువార్తికుడైన బిల్లీ గ్రాహం మీద. అతడు ఎంత అలసిపోయాడంటే, చివరకు ఆయన కూటములను జరిగించ లేక పోయాడు. అతడు భౌతిక పరీక్ష కొరకు మాయో బ్రదర్స్ దగ్గరకు వెళ్ళాడు. అతడితో ఏ చిక్కు లేదు కాని, అతడు కేవలము తగినంత పని చేయుట లేదు. భౌతిక వ్యాయామము కొరకు వారు అతడిని పరుగెత్తమన్నారు; ప్రతి రోజు అతడు ఒక మైలు పరుగెత్తుతాడు. ఆ వ్యాయామము ఇంకా ఏమి చెప్పిందంటే, యవ్వన బాలురు మరియు బాలికలు, "ఇరవై యేళ్ళ వయస్సుకే తమ మధ్య-వయస్సునకు చేరు కొనుచున్నారని," సైన్సు ఋజువు చేసింది. ఇరవై-ఐదు సంవత్సరములకే, అనేక సార్లు, అనేక సందర్భాలలో బాలికలలో ఇరవై-ఐదు యేళ్ళకే ఋతుస్రావము ఆగిపోవుచున్నది.

మీకు తెలుసో లేక తెలియదో, అది నాకు తెలియదు గాని, కొన్ని రాత్రుల క్రితము పరిశుద్దాత్ముడు ఇక్కడ కూటములో మాట్లాడుచుండెను, అక్కడొక చిన్న బాలిక కూర్చొంది, ఆ బిడ్డను పిలిచినప్పుడు, ఆ బాలిక అదే ఇబ్బందిలో యున్నది. నేను రెండవసారి ఆమె వైపు చూశాను. మరలా చూశాను, ఆ ఇబ్బంది ఏమిటో నేను చూసియున్నాను. నేననుకొన్నాను, "అది అలా యుండకూడదు, ఆ బిడ్డ ఎంతో యవ్వనస్తురాలు." కాని అది ఋతుస్రావము ఆగిపోవుటయై యున్నది, ఇరవై లేక ఇరవై-మూడు సంవత్సరములకే ఆ విధముగా, చూడండి.

17నా తల్లి మరియు నీ తల్లి దరిదాపు నలభై-ఐదు లేక యాభై సంవత్సరములకు దానిని తాకారు. నా భార్య ముప్పయి-ఐదు సంవత్సరములకే దానిని తాకియున్నది. ఇప్పుడు ఇరవై సంవత్సరములకే ఋతుస్రావము ఆగిపోతుంది. మానవాళి అంతయూ క్రుళ్ళి పోతుంది. బాగుంది, సంకరము చేయబడిన ఆహారములు, ఉద్రిక్తతలు ద్వారా అది మన భౌతిక దేహములనే, చీల్చి వేసి క్రుళ్ళిపోయినట్లు చేస్తున్నట్లైతే, అది మన మెదడు కణములను క్రుళ్ళిపోయినట్లు చేయదా? అప్పుడు స్త్రీలు ఎలా వీధులలో దిగంబరులుగా సంచరించుచున్నారో మనము చూస్తాము. వీధుల గుండా నూట-యిరవై మైళ్ళ వేగముతో గంటకు, ఎలా ప్రయాణం చేస్తున్నారో, ఇవన్నీ చూడండి. మన దేశమంతా, ప్రపంచమంతా, ఏ స్ధానమునకు వచ్చింది. ఈ దేశమే కాదు, ప్రతిచోట, వారు మానసికముగా పాడైపోయారు.

18ప్రభువు చిత్తమైతే, ఆ ఏడు తెగుళ్ళను మనము తెరచినపుడు, ఆ భయోత్పాతము కలిగించు సంగతులను అది చూపుతుంది. కొద్ది కాలము తరువాత ఎంత పిచ్చివారుగా యుంటారంటే, చివరకు ఆ చీమలను ఒక పర్వతమంత పరిమాణములో ఉహించుకొని చూస్తారు. అవి స్త్రీలను భాదిస్తాయి, పొడవైన వెంట్రుకలతో మిడతలు భూమిపైకి వచ్చి, జుట్టు కత్తిరించుకొన్న స్త్రీలను బాధిస్తాయి; అవి స్త్రీల వంటి, వెంట్రుకలతో వ్రేలాడుచూ, సింహము వంటి పొడవైన పండ్లు కలిగి, తోకలలో తేళ్ళు వంటి కుట్టే ముళ్ళను కలిగి, భూమి మీద మనుషులను బాధిస్తాయి. అయితే అప్పుడు ఏదైనా చేయటానికి అది చాలా ఆలస్యమై పోతుంది. మీకు బాగా అర్థమైనదా. చూడండి. బాధించుచున్న…

19గత ఆదివారము, మనము ఆ చక్రములలోనికి వెళ్ళినప్పుడు, ఆ బయట పంచేంద్రియములతో అది ఎలా యున్నదో… అదే శరీరమునకు, ద్వారమై యున్నది. అక్కడ శరీరములోనికి నీవు వెళ్ళు ఒకే ద్వారమున్నది. అదే ఐదు పంచేద్రియములు; చూచుట, వాసన చూచుట, స్పర్శించుట, వినుట, రుచి చూచుట. అక్కడ శరీరము తాకుటకు మరొక మార్గము లేదు.

మనస్సుగా పిలువబడు లోపల మనిషి, అతడు ఐదు జ్ఞానేంద్రియములను కలిగియున్నాడు; ఆలోచించుట… తలంచుట, ప్రేమ మరియు మనస్సాక్షి మొదలగునవి, మంచిది.

ఇప్పుడు, నీవు నీ శరీరముతో ఆలోచించలేవు. నీవు నీ యొక్క మనస్సుతో తలస్తావు. అక్కడే అనేక మంది క్రైస్తవులు ఆగిపోతారు. పొలములోని మొక్కజొన్న వలె, కలుపు మొక్కవలె వారు చేయగలరు. నిజమైన విశ్వాసి అభిషేకించబడియున్న అదే పరిశుద్ధాత్మతో వారు అభిషేకించబడవచ్చు. కానీ లోపట అంతరంగములో, తరువాత పరిధిలో మూడవ పరిధిలో, అక్కడ ఆత్మ యున్నది; అది దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడింది. అక్కడే నిజమైన విత్తనపు అంకురము ఉంచబడింది.

గుర్తుంచుకోండి, ఒక గురుగు గింజను తీసుకొని దానిని కోసి తెరచి దాని గర్భములో ఒక గోధుమ గింజను అంటుకట్టి, దానిని నేలలో పూడ్చి వేయండి. అది గురుగులో నుండి గోధుమను బయటకు తెస్తుంది; బయట ఏమి యున్నదో లెక్క కాదు, ఏ ఉద్రేకములు లెక్క కాదు.

JOHN 6:37,44•

HEB 7:1,2,9

 

20ఈ రోజున, పరిశుద్ధాత్మ యొక్క ఋజువును గూర్చి వారు ఎంతో గందరగోళములో యున్నారు. సాతానుడు దేవుడు కలిగియున్న ఏ వరమునైనా అనుకరణ చేయగలడు, కాని వాక్యమును తేలేడు, వాక్యము వెంబడి వాక్యము. అక్కడే వాడు ఏదెను తోటలో తప్పిపోయాడు; వాడు అక్కడే వాడు ఎల్లప్పుడు తప్పిపోతాడు. అక్కడే, "అభిషేకించబడిన చివరికాల అభిషిక్తులు," అను టేపు యున్నది. వారు ఆత్మతో అభిషేకించబడగలరు, భాషలతో మాట్లాడగలరు, నాట్యమాడగలరు, కేకలు వేయగలరు, సువార్తను బోధించగలరు, మరియు ఇంకనూ ఒక దయ్యముగా యుంటారు. అది లోపట భాగమైయున్నది! ఇప్పుడు గుర్తుంచుకో, యేసు అన్నాడు, "తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. మొదట నా తండ్రి ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాడు."

ఇప్పుడు, భౌతికముగా మాట్లాడుచున్నట్లైతే, దానిని చూపించటానికి… నీవు నీ యొక్క తాత, ముత్తాతలో ఎల్లప్పుడు, వెనుక నుండి యుండినావు. తరువాత, నీవు భౌతికముగా ఒక సహజమైన మనిషివయ్యావు. కొన్ని సార్లు ఒక బిడ్డ ఒక కుటుంబములో, ఎర్రని తలతో పుడతాడు. అది తండ్రిని ఆశ్చర్య పర్చుతుంది; ఏలయనగా ఆయన ప్రజలలో ఆయన ఎరిగిన వారు, తల్లి వైపు నుండి గాని, అలాటి ఎవరిని ఆయన ఎరుగడు. కానీ నీవు ఎన్నో తరములు వెనుకకు వెళ్ళినట్లయితే, నీవు తెలుసుకొంటావు, అక్కడ ఎవరో ఎర్రని తల గలవారున్నారు. ఆ విత్తనము క్రిందికి వస్తూయున్నది, మరియు నీవు వారిలో ఒక స్వభావము ప్రకారము నీవు వచ్చావు. హెబ్రీ 7వ అధ్యాయములో చెప్పినట్లుగా, "అబ్రాహాము రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచుండగా, మెల్కీసెదెకుకు దశమ-భాగములను చెల్లించాడు. మరియు లేవి, దశమ-భాగములను స్వీకరించి, మరలా దశమ భాగములను చెల్లించాడు." ఏలయనగా అతడు మెల్కీసెదెకు నడుములోయున్నాడు. లేక, "అబ్రాహాము యొక్క నడుములో," యున్నాడు. అతడు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు.

21ఇప్పుడు, అది అదే కార్యమైయున్నది: నీవు ఒక దేవుని కుమారుడవైతే, మరియు నేను ఒక దేవుని కుమారుడనైతే, లేక దేవుని కుమార్తెవైతే, నీవు ఆదిలోనే దేవునిలో యున్నావు. యేసు దేవుని యొక్క వాక్య సంపూర్ణతగా మారినప్పుడు, మనము ఆయనలో ఒక విత్తన రూపములో యున్నాము. ఆయన సిలువ వేయబడినప్పుడు, మనమును ఆయన శరీరములో సిలువ వేయబడ్డాము. ఆయన మృతులలో నుండి తిరిగి లేచినప్పుడు, మనము ఆయతో తిరిగి లేచాము. ఇప్పుడు మనము దానిని గుర్తించినందున, "ఇప్పుడు క్రీస్తు యేసులో పరలోకపు స్థలములలో కూర్చొండియున్నాము," చూడండి. మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై యున్నట్లైతే, మనము దేవుని యొక్క పిల్లలమై యున్నాము; అప్పుడు మనము దేవుని యొక్క గుణలక్షణములైయున్నాము. అప్పుడు మనము నిత్యజీవమును కలిగియున్నాము. మరియు దేవుడు మాత్రమే నిత్యజీవమైయున్నాడు. అప్పుడు ఆదినుండియే మనము ఆయనలో యున్నాము. యేసు సంపూర్ణ వాక్యముగా మారినప్పుడు, అప్పుడు మనము ఆయనలో ఒక భాగమైయున్నాము. ఆమేన్! అక్కడే నీవున్నావు. అది అక్కడ యున్నది. అక్కడే దయ్యము, ఏ శక్తులు, ఏదియూ ఎన్నడూ దానిని కదిలించలేదు. అది ఆత్మ యొక్క కట్టు కొయ్యయై (tie post) యున్నది.

నీవు మనస్సులో బయట ఇక్కడ అభిషేకించబడవచ్చును, ఆశించవచ్చును, మరియు ఈ కార్యములన్నీ చేయవచ్చును. అయితే అది వాక్యము నొద్ద కట్టు కొయ్యకు వచ్చినప్పుడు, నీవు అక్కడ నుండి ఎన్నడూ కదలవు. ఒకవేళ దాని బయట నీవు ఉన్నట్లయితే, నీవు ఏమి చేసినను లెక్క కాదు, నీవు ఇంకనూ తప్పిపోయినవాడివే.

MATT 7:22•

JOHN 1:1,14

 

22అది లవొదకయ సంఘకాలము — దిగంబరిది, గ్రుడ్డిది, దిక్కుమాలినది, దానిని ఎరుగదు. చూడండి, అది అభిషేకించబడింది. నిజమైన ఆత్మతో అభిషేకించబడింది. చూడు, పరిశుద్దాత్ముడు ఒక మనిషి మీద, అతని మనస్సులో దిగవచ్చును, కాని అతని ఆత్మ అంకురమైయున్నది. ఆ అంకురము వాక్యమై యున్నది, చూడండి. నీవు ఎంత బోధించినప్పటికి నేను లెక్క చెయ్యను, నీవు దీనిని ఎంత బాగా చేసినా, నీవు ఎంత బాగా ప్రేమించినా; నేను లెక్క చెయ్యను. అది ద్వారములలో ఒకటి. నీవు ప్రేమించవచ్చు, దేవునిని సహితము నీవు ప్రేమించవచ్చు, ఇంకనూ నీవు సరికాదు. నీవు దయ్యములను వెళ్ళగొట్ట వచ్చు, బోధించవచ్చు, మరియు ఈ కార్యములను చేయవచ్చు, ఇంకనూ నీవు సరికాదు. యేసు ఆ రీతిగా చెప్పాడు; ఆ దినము అనేకులు వస్తారు. ఆ వాక్యమే దానిని పరిష్కరిస్తుంది.

ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, వాక్యము దేవుడైయుండెను.

మరియు వాక్యము శరీరధారియై, మన మధ్య నివసి౦చెను,…

23గమనించండి, బైబిలు లోని ఈ అంశము మీద నేను మాట్లాడబోవుచున్నాను. క్రీస్తు తన సొంత వాక్యమందు బయలు పర్చబడనెను. నా గదిలో నేను దీని యొక్క ముగింపునకు వచ్చాను. ఇక్కడెవరో ఒక ప్రియమైన వ్యక్తి కూర్చొండి యుండవచ్చు… ధన్యతలతో వ్రాయబడిన, హాఫ్ మెన్ యొక్క క్రీస్తు శిరస్సు యొక్క చిత్రమును నా పఠన గదిలో వ్రేలాడుతుంది. నీకు వెంట్రుకలలో ఒక భాగము అవసరమైనట్లుగా, అక్కడే నీవు ఒక స్థానమునకు వస్తావు, నీవు ఆ భాగమును దాటి పోతుండగా, అక్కడే వారు పెన్నుతో దాని మీద అదిమియున్నారు. అక్కడే, ఆయన అక్కడే యున్నాడు, ఆయన వాక్యములో కూర్చొండి యున్నాడు, తిన్నగా బయటకు చూస్తున్నాడు; ధన్యతలలోని క్రీస్తు. ఎవరో, అది ఎవరో ఎన్నడూ నాకు తెలియదు, దానిని బట్టి నీకు వందనములు. ఏలీయా అగ్ని రథములపై పైకి వెళ్ళుచున్న చిత్రమును, తెచ్చి నా పఠన గదిలో యుంచారు. మేము వాటిని మెచ్చు కొంటాము. అనేక సార్లు, గొప్ప జనసమూహములు, ఈ విషయములు చెప్పుటకు నాకు అవకాశము దొరకదు. కాని సోదరుడా, సోదరీ నేను దానిని చూస్తాను. నాకు అది తెలుసు, దేవునికి అది తెలుసు.

ఇప్పుడు నేను ఈ అంశము మీద మాట్లాడబోవుచున్నాను; "క్రీస్తు తన సొంత వాక్యమందు బయలు పర్చబడెను" — ఎలా, ధన్యతలలో, అక్కడ క్రీస్తు యొక్క చిత్రము నిలబడింది, అలా బయటకు నిలబడి యుంది. ఈ అంశమును గూర్చి నేను అక్కడే తలంచాను.

ఇప్పుడు, క్రీస్తు మరియు వాక్యము ఒక్కటే, చూడండి.

24వారందురు, "ఎలా బైబిలు..?" ప్రజలంటారు… నేను ఈ మధ్యనే ఒకరితో ప్రయాణము చేయుచున్నాను. అతడన్నాడు, "దానిని ఆలోచించండి, మనము యున్నట్లుగా ఇక్కడ భూమి మీద యున్నాము, యూదులు కట్టు-కథగా చెప్పబడు బైబిలు ద్వారా మనము రక్షణ పొందియున్నామని మాత్రమే చెప్పగలము."

నేనన్నాను, "అయ్యా, నీవు దానిని ఎలా చెప్పుతావో నాకు అర్థం కావటం లేదు, అది యూదుల కట్టు-కథ అని నేను నమ్మను."

అతడన్నాడు, "సరే, నీవు ప్రార్దించినప్పుడు… నీవు దేనికొరకు ప్రార్థిస్తావు? నేను పలానా-పలానా వాటికి, కొన్ని కార్యములకు అడుగుతాను; నాకు అర్ధము కాలేదు."

ROM 8:28

 

25నేనన్నాను, "నీవు తప్పుగా ప్రార్థిస్తున్నావు. దేవుని మనస్సు మారాలని తప్పక ఎన్నడూ మనము ప్రార్థన చేయరాదు; మన మనస్సు మారాలని మనము తప్పక ప్రార్థించాలి. దేవుని మనస్సుకు ఏ మార్పు అవసరము లేదు. చూడండి? అది సరియే. "నేనన్నాను, "నీవు ప్రార్థన చేసిన దాని కొరకు కాదు…"

ఒక సారి ఒక యవ్వన కాథలిక్ కుర్రవాడు నాకు తెలుసు, ప్రార్థనలు వల్లించే ఒక ప్రార్థనా పుస్తకమును అతడు కలిగియున్నాడు, తన తల్లి బ్రతుకు కొరకు ప్రార్థించాడు. ఆమె చనిపోయింది, ఆ ప్రార్థనా పుస్తకమును అతడు అగ్నిలో వేశాడు. మంచిది, చూడండి, నేను ప్రార్థనా పుస్తకము కొరకు వెళ్ళను; కాని, ఎలాగైనా, నీవు తప్పు అభిప్రాయమును తీసుకొన్నావు. దేవుడు ఏమి చేయాలో నీవు ఆయనకు చెప్పుటకు ప్రయత్నించుచున్నావు. ప్రార్థన తప్పక ఎలా యుండాలంటే, "ప్రభువా, నీ వాక్యమునకు సరిపోవునట్లు నన్ను మార్చుము." "మారుట," కాదు, "నీ మనస్సు మారుట కాదు, నీవు నా మనస్సు మార్చుము." (చూడండి?) "నీ చిత్తమునకు నా మనస్సును మార్చుము. నీ చిత్తము ఇక్కడ గ్రంథములో వ్రాయబడింది. ప్రభువా, ఆ మనస్సు నీ మనస్సువలెయుండు వరకు, నన్ను వెళ్ళనియ్య వద్దు. తరువాత నా మనస్సు నీ మనస్సు వలె మారినప్పుడు, అప్పుడు నీవు వ్రాసిన ప్రతి మాటను నేను నమ్ముతాను. నీవు అక్కడ చెప్పావు, నిన్ను ప్రేమించు వారికి సమస్తమును నీవు సమకూడునట్లు చేస్తావు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను. అది అంతయూ మేలు కొరకే జరుగుతుంది."

26నా యొక్క ప్రియమైన స్నేహితుడైన కొందరితో నేను ఈ ప్రాంతములో యున్నాను. మేము భోజనము చేయుచుండగా నిన్నటి దినమున, బల్లయొద్ద నేను కొందరిని అడిగాను, మేము ఎల్లప్పుడు ఆ విధముగా కూర్చొని, చిన్న బైబిలు పఠనమును చేస్తాము. ప్రేమను గూర్చి మాట్లాడుచున్నాము. ఒక అతడు అక్కడ నాతో, "నీవు ఒక క్రీస్తు విరోధివని నేను నమ్ముతాను," అన్నాడు.

నేనన్నాను, "అది నా ప్రభువును సంతోషపపరచినట్లైతే, నేను ఆ రీతిగానే యుండగోరుచున్నాను. నేను ఎలాగు యుండాలని ఆయన కోరతాడో, నేను అలాగునే యుండగోరుదును. నేను ఆయనను ప్రేమిస్తాను. ఆయన నన్ను నరకములో వేసినను, ఇంకనూ నేను ఆయనను ప్రేమిస్తాను, ఇప్పుడు కలిగియున్న అదే ఆత్మతో నేను వెళతాను." అతడు నా వైపు వింతగా చూశాడు. అక్కడ నలుగురు లేక అయిదుగురు యవ్వనస్తులను, వారి భార్యలను, నేను చూశాను, చక్కని స్త్రీలు. ఆ కుర్రవాళ్ళు వారి భార్యలను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు, నేను వారితో అన్నాను, "ఇక్కడ పరీక్షించుటకు ఒక మార్గమున్నది. నీ భార్య వివాహము కాక మునుపు… నీవు వెనుకకు వెళితే… ఈ వివాహ జీవితమును గూర్చి నీకు వివాహమైనట్లు నీవు కలగనుచున్నావు; నీకు నిజముగా వివాహము కాలేదు, కాని వివాహమైనట్లు నీవు కలగనుచున్నావు. నీవు మేల్కొన్నావు, నీవు వెళ్ళి నీ బాల్య స్నేహితురాలితో మాట్లాడావు, అన్నావు 'నీకు తెలుసా, మనకు పెళ్ళియైనట్లు నాకు కల వచ్చింది, మనకు పిల్లలు పుట్టారు. మనము సంతోషముగా జీవిస్తున్నాము, మరియు ప్రభువు రాక కొరకు కనిపెడుతున్నాము, సమస్తమూ.' అప్పుడు ఆ బాలిక నీతో అంటుంది, 'నీకు తెలుసా, నేను నిన్ను ప్రేమించిన దాని కంటే ఎక్కువగా, నేను మరొక మనిషిని ప్రేమిస్తున్నాను. నేను ఆ మనిషితో ఎంతో సంతోషముగా యుండగలను.' అప్పుడు నీవు తగినంత ప్రేమతో, "ప్రియమైన దానా, నీవు అతనితోనే వెళ్ళుము, 'దేవుని దీవెనలు నీపై నిలుచును గాక, అని నీ హృదయము నుండి చెప్పగలవా?'" ఇప్పుడు, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ దానిని పరీక్షించండి. చూడండి? మంచిది నీ ప్రేమ సరైనదైతే, నీవు దానిని చేస్తావు, ఏలయనగా నీవు ఆమె సంక్షేమము నందు ఆసక్తి కలిగియున్నావు. నీవు ఆమెను కలిగి, నీవు ఆమెతో జీవించవచ్చు, ఏమిటి… ఆమె నీ భార్య… ఆమె నీ భార్యగా యుంటుంది. ఆమె నిన్ను పెళ్ళి చేసుకొంటుంది, కాని ఆమె సంతోషముగా యుండదు. ఆమె ఎంతో సంతోషముగా యుంటుంది… అలాగైతే, నీవు ఆమెను ప్రేమించినట్లైతే, అప్పుడు నీవు ఆమెను సంతోషముగా యుండనిస్తావు. అందుచేత, దేవుని యొక్క చిత్తము ఏమైయున్నప్పటికి, నేను దానితో సంతోషముగా యున్నా, లేకపోయినా, దేవుని చిత్తమును జరుగనిమ్ము. కాబట్టి నేను చేసే దానితో ఆయన సంతోషపడునట్లు, నేను జీవించగోరుతాను. అందుచేత, నీ యొక్క ఉద్దేశ్యములను మరియు లక్ష్యములను పరీక్షించుకో, నీవు దేవుని ప్రేమిస్తున్నావో లేదో నీవు తెలుసుకొంటావు."

"నీవు నన్ను సేవించినను, నేను నిన్ను దూరముగా పడవేస్తానని ఆయన అంటే?"

"ఎలాగైనా, నేను నిన్ను ప్రేమిస్తాను."

27అందుచేత, సంఘములు ఆ విధానములో దానిని నమ్మి, దానిని చూడగలిగినట్లైతే, అది ఒక వ్యక్తి పుడ్ బాల్ ను మరొక వ్యక్తి నుండి లాగివేసి, దానితో పరుగెత్తుచున్నట్లుగా ఉంది. అతడు దానిని కాపాడుచున్నాడు, చూడండి. నిజమైన ఉద్దేశ్యము మరియు లక్ష్యమేమనగా, "హే, నాకు ఇది దొరికింది, ఇది నాది, ఇది" అనుట కాదు. చూడండి, దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకొనలేడు. దానిని అలాటి అనుకరణ అక్కడ వెంబడించదు. అది సాతానై యున్నది. ప్రజలు దానిని గ్రహించలేరు. అది ఎవరికో ఇవ్వబడిన బంతిని లాగుకొనునట్లుగా యున్నది. దేవుడు ఒక నిర్ణీతమైన పరిచర్యను లేవనెత్తనివ్వండి, దానితో ఎంత మంది వెళతారో గమనించండి, చూడండి, చూడండి.

28ఇప్పుడు, దేవుని కొరకైన నిజమైన ప్రేమ, "నేను ఏ భాగమైనను లెక్క కాదు, ప్రభువా, నేను దాని కొరకు ఒక మాటను చెప్పినట్లైతే, దానిని అది కాపాడుతుంది, నన్ను దానిని చెయ్యనివ్వు," చూడండి. అది నీ భార్య విషయములో కూడా అలాగే యుంటుంది. చూడు, నీవు నిజముగా ఆమెను ప్రేమించినట్లైతే, అది శరీర ప్రేమ కాదు; అది దైవిక ప్రేమ, నిజమైన ప్రేమ. ఆమె ఇంకెవరితోనో ఇంకా సంతోషముగా జీవించవచ్చు, ఇప్పుడు నీకు వివాహము కాలేదు, నిజానికి, నీవు వివాహము చేసుకోలేవు…

29ఆ విధముగానే, ప్రజలు ఈ టేపును వినుచున్నారు. కొందరు, ఎంతో మంది, "ఎందుచేత, వివాహము మరియు పరిత్యాగములో, నీవు అది ఇది చెప్పావు అంటున్నారు." నేను దానిని ఎన్నోసార్లు చెప్పాను; సోదరుడా, నేను నా సంఘముతోనే మాట్లాడుచున్నాను. వారికే ఈ టేపులు వెళతాయి. కాపరిగా యుండుటకు దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, నేను దానికి భాధ్యుడను కాను; ఈ ప్రజలకు ఏ రకమైన ఆహారమును నేను మేపుచున్నాను దానికి నేను బాధ్యుడను. ఇది ఈ సంఘమునకు మాత్రమే, చూడండి. ప్రజలు టేపులను వినగోరినట్లైతే, అది వారి ఇష్టము. దేవుడు నాకిచ్చిన వారితో నేను మాట్లాడతాను. అది వారి పాపములు రద్దు చేయబడినాయి. ఎవరో నాకు ఇలా వ్రాశారు, "సరే, నేను ఇది చేశాను, నేను అది చేశాను, మా పాపము అని నీవన్నావు…" నేను అలా చెప్పలేదు.

నేనన్నాను, "దీనిని చూడండి, ఇది ఇక్కడయున్న ఆలయములోని ప్రజలకు మాత్రమే, నా సొంత మందకు," ఇప్పుడు, ప్రజలకు సంకరము చేయబడిన ఆహారము మరియు సరుకు కావలసినట్లైతే, మీరు దేవుని నుండి ప్రత్యక్షతను పొంది, దేవుడు ఏమి చేయమంటాడో అది చేయండి. నేనునూ అదే చేస్తాను, కాని ఈ వర్తమానము, ఈ సంఘమునకై యున్నది.

30ఇప్పుడు గమనించండి, మనము వెనుకకు వచ్చి, మనము దేనినో పట్టుకొని యుండునట్లుగా మనము ఒకటి కలిగి యుండవలసి యున్నది. మరొక మాటలో, ఒక తీర్మానము, ఒక కట్టు కొయ్య యుండవలసి యున్నది. ప్రతి ఒక్కరూ ఒక తీర్మానమును, ఒక మూలమైన దానిని కలిగి యుండవలసియున్నది. ఎన్నో సంవత్సరములు క్రితము నేను దాని మీద బోధించియున్నాను. ఒక ముగింపు, ఒక స్థానములో ఒక ముగింపు మాట. ఒక బంతి ఆటలో యుండు ఎంపైర్, అది దానిని కొట్టిందంటే, అది అతడు ఖచ్చితముగా చెప్పింది అంతే. ఒకటి కట్టు కొయ్యగా యుండవలసియున్నది. మరొక మాటలో అది ఒక పరిపూర్ణతయై యున్నది. నీవు ఎంత దానిని చూసినప్పటికి లెక్క కాదు. ఎంపైర్ అది కొట్టింది అని చెప్పాడు.

"నీవు అది కొట్టలేదు అంటావు.. నేను చూశాను…" అంటావు. అది ఏమైనను లెక్క కాదు. ఆయన అది "కొట్టింది," అని చెప్పినప్పుడు, అది అంతే, అదే పరిష్కారము. అతడే తీర్మానము చేయువాడు.

మరియు ట్రాఫిక్ లైటు తీర్మానమైయున్నది, అది "వెళ్ళండి," అన్నట్లైతే, అంతే "సరే, నేను తొందరలో యున్నాను, అంటే లేదు, లేదు. "ఇతరులు వెళ్ళే వరకు మీరు నిలిచియుండాలి," అని చెపితే. చూడు, అది తీర్మానమైయున్నది.

31ఇప్పుడు, నీవు చేసే ప్రతిదానికి అక్కడొక తీర్మానము ఉండవలసి యున్నది. నీవు నీ భార్యను ఎన్నిక చేసికొన్నప్పుడు, ఒక తీర్మానము యుండవలసి యున్నది. అక్కడ నీవు ఎన్నుకొను ఒక స్త్రీ యుండవలసి యున్నది.

ఇప్పుడు, నీవు ఒక కారును కొనబోవుచున్నప్పుడు, ఆ సమయములో అక్కడ నీ నిర్ణయమునకు ఒక తీర్మానము యుండవలసి యున్నది. అది ఫోర్డ్, చెవీ, ఫ్లెమవుత్, విదేశీ కారా, ఏదైనప్పటికి, నీవు తప్పకొక తీర్మానము కలిగియుండవలసియున్నావు. అలాగునే క్రైస్తవ జీవితముతో కూడా యున్నది. అక్కడొక తీర్మానము యుండవలసి యున్నది.

32ఇప్పుడు, ఒక మనిషి, మరొకరి దగ్గరకు వెళ్ళినప్పుడు, "నీవు తప్పక బాప్తిస్మము పొందాలి," అని విన్నాడు. ఈ వ్యక్తికి ఎన్నడూ… బహుశ వారు బాప్తిస్మము ఇవ్వరు; వారు చిలకరిస్తారు, నేననుకొంటాను, ఉదాహరణకు, మెథడిస్టు వారు, అడిగినట్లైతే బాప్తిస్మము ఇస్తారని నేను గ్రహిస్తాను. లేక, బహుశ ఒక కాథలిక్, వారు చిలకరింపు మాత్రమే ఇస్తారు. కాబట్టి అప్పుడు ఒక వ్యక్తి "ముంచే బాప్తిస్మము," గూర్చి విన్నప్పుడు, అది అతనికి అర్ధము కాదు; అతడు ఒక కాథలిక్కుగా పెంచబడ్డాడు. కాబట్టి అతడు యాజకుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, "తండ్రీ, మనము ముంచుట బాప్తిస్మము ద్వారా బాప్తిస్మము పొందాలని నేను గ్రహిస్తాను. మన సంఘము దానిని గూర్చి ఏమి చెపుతుంది?"

"ఏమిటి, మనము చిలకరించబడాలి అని అది చెప్పుతుంది." ఆ సంఘమే అతని తీర్మానమైతే, అది దానిని పరిష్కరిస్తుంది. వివాదమంతా ముగిసింది. సంఘము ఆ రీతిగా చెప్పింది, అది అంతే.

33ఒక బాప్టిస్టు సోదరుడు మనము "ముంచుట ద్వారా, బాప్తిస్మము పొందాలని విని నమ్మియుంటే ఏమిటి? అతడంటాడు, "నేను అది నమ్ముతాను," — యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు, ఈ సంఘసభ్యుడు అతని కాపరి యొద్దకు వెళ్ళి అంటాడు, కాపరీ, ఒక వ్యక్తి నాతో మనము ముంచుట ద్వారా బాప్తిస్మమును పొందాలి, మంచిదే, కాని, "యేసుక్రీస్తు నామములో, అన్నాడు."

"సరే," అతడంటాడు, "ఇప్పుడు మనము చూద్దాము. ఎందుకంటే, 'తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను' ఉపయోగిస్తూ మనము బాప్తిస్మము పొందాలి అని గ్రంథము చెపుతుంది." ఆ సంఘమే అతని తీర్మానమైతే, అది దానిని పరిష్కరిస్తుంది. ఏది ఏమి చెప్పినను అతడు లెక్క చెయ్యడు; అది అతని తీర్మానమైయున్నది.

34మంచిది, ప్రతి సంఘశాఖ వారి యొక్క విశ్వాసులకు తీర్మానమైయున్నది. అయితే, నాకు, మరియు నేను నిరీక్షిస్తున్న క్రీస్తు యొద్దకు నడిపించుచున్న వారికి, క్రీస్తు ద్వారా మరియు పరిశుద్ధ గ్రంథమే మన తీర్మానమైయున్నది. ప్రతి మనిషి యొక్క మాట అబద్దము అయితే నా మాట మాత్రమే సత్యము" అని దేవుడు చెప్పటంలో ఏ ఆశ్చర్యము లేదు… మరియు నేను నమ్ముచున్నదేమనగా - బైబిలుయే దేవుని యొక్క తీర్మానమైయున్నది. ఎవరు ఏమి చెప్పినా కాదు గాని, పరిశుద్ధ గ్రంథమే తీర్మానమైయున్నది.

బైబిలు ఒక పద్ధతుల గ్రంథము కాదు. లేదండి! అది ఒక పద్ధతుల గ్రంథము కాదు, లేక ఒక నీతి శాస్త్రపు పట్టిక కాదు. బైబిలు ఒక పద్ధతుల గ్రంథము కాదు. లేదండి! అది ఒక నీతి శాస్త్రపు గ్రంథము కాదు. లేదండి, అది కాదు. మొత్తానికి ఒక చరిత్ర గ్రంథమూ కాదు, లేకొక వేదాంత గ్రంథమూ కాదు, ఏలయనగా అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయై యున్నది. ఇప్పుడు మీరు దానిని చదువ గోరినట్లైతే — పేపర్లు కలిగిన వారు దానిని గుర్తుపెట్టుకోండి — అది ప్రకటన 1:1 నుండి 3, బైబిలు, "యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతగా యున్నది.

REV 1:1-3

 

35మనకు సమయ ముండగానే దానిని చదువుదాము. ఇక్కడ మాట్లాడుటకు నాకు ఎక్కువ నోట్సు లేదని నమ్ముతాను. ప్రభువు ఆలస్యము చేస్తే, ఎందుకంటే, మనము దాని నుండి పొందుతాము…

యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి, తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను:

అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్షమిచ్చెను.

సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

HEB 1:1,2

 

36కాబట్టి, బైబిలు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షమయై యున్నది. అది ప్రవక్తల ద్వారా వ్రాయబడియున్నది. హెబ్రీ 1:1 లో.. "పూర్వకాల మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను, యేసుక్రీస్తు." ఏకముగా కలిపి, వారందరూ ప్రవక్తలైయున్నారు. యేసు మలాకీయైయున్నాడు; యేసు యిర్మీయా, యెషయా, ఏలీయా ఆయి యున్నాడు. వారందరూ ఆయనలో యున్నారు. నీవు కలిగి యున్నదంతా, నేను కలిగియున్నదంతా, ఆయనలో యున్నది; వాక్యములు వాక్యమునకు సాక్ష్యములు. కాబట్టి ఈ గ్రంధము ఒక పద్ధతుల గ్రంధము, లేక ఒక నీతి శాస్త్రపు పట్టిక కాదు, లేక చరిత్ర గ్రంధము, ఒక వేదాంత గ్రంధము కాదు. అది కాదు. కాని ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయై యున్నది. దేవుడే స్వయముగా బయలుపర్చబడ్డాడు, వాక్యము నుండి శరీరమునకు. అది అదేయై యున్నది. బైబిలు వాక్యమైయున్నది. దేవుడు వాక్యమైయున్నాడు, మరియు యేసు శరీరమైయున్నాడు. అది ప్రత్యక్షతయై యున్నది. దేవుడు ఎలా (వాక్యము) మానవ శరీరములో ప్రత్యక్షపర్చబడినాడో, మనకు బయలు పర్చబడినాడు. అందుచేతనే ఆయన దేవుని యొక్క కుమారుడైనాడు; ఆయన దేవునిలో భాగమైయున్నాడు. మీకు అర్థమైనదా?

ఇప్పుడు, శరీరము దేవునిలో భాగమైయున్నది, ఎంత వరకనగా అది ఒక కుమారుడైయున్నాడు.

JOHN 1:14•

JOHN 5:39

 

37ఒక కుమారుడు, కాథలిక్కులు మరియు మిగిలిన సంఘములన్నియూ "నిత్యమైన కుమారుడని," దానిని ఉంచారు; ఆ మాటకు కనీసము అర్థమే లేదు, చూశారా. అది కుమారుడుగా యుండి, అప్పుడు ఒక నిత్యమైనదిగా యుండదు, కారణము కుమారుడనగా "జన్మించినవాడు." నిత్యుడను మాట, ఆయన నిత్యుడుగా యుండలేడు. ఆయన కుమారుడిగా యుండగలడు, కాని నిత్యమైన కుమారుడిగా యుండలేడు. లేదండి, అది నిత్యమైన కుమారుడిగా యుండజాలదు.

అయితే ఆయన కుమారుడైయున్నాడు, ఎంత మట్టుకనగా, యిర్మీయాలో యున్న వాక్యమంతయూ, మోషేలో యున్నదంతయూ, ఈ వాక్యములన్నియు, ఆయన చెప్పినట్లుగా, "అవి నన్ను గూర్చి మాట్లాడుచున్నాయి." దైవిక వాక్యము యొక్క నిజమైన ప్రత్యక్షత అంతయూ, ఒక మానవ శరీరములో చుట్టబడింది, దేవుడు దాని చుట్టూ శరీరము నుంచాడు. ఆ కారణమును బట్టియే, "కుమారుడని," ఆయన పిలవబడ్డాడు, కారణము ఆయన "తండ్రిని," సూచించాడు. ఎందుకు అది ఎంతో సూక్షముగా యుంది, కేవలము నీ మనస్సులో దేవుడు దానిని యుంచినట్లైతే, చూడండి. దేవుడు మాంస శరీరములో బయలు పర్చబడ్డాడు, ఆయన వాక్యము నుండి శరీరములో బయలు పర్చబడ్డాడు. అది పరిశుద్ద యోహాను 1:14, "వాక్యము శరీరధారియై మనమధ్య నివసి౦చెను."

38ఇప్పుడు, బైబిలును గమనించండి. "ఓ, సరే, ఇది అది చేసింది, అది ఇది చేసింది." కాని మీకు కొంత చెప్పనివ్వండి… ఒక్క నిమిషము మనము బైబిలు చరిత్రలోనికి వెళదాము, అది ఎక్కడ నుండి వచ్చిందో చూద్దాము. అది నలబై మంది వేర్వేరు గ్రంధకర్తల ద్వారా వ్రాయబడింది. పదహారు వందల సంవత్సరముల పరిధిలో, నలుబది మంది మనుషులు విడివిడిగా వ్రాశారు. మరియు వేరు వేరు కాలములలో, ఎన్నడైనా సంభవించని అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలను, మానవ చరిత్రలో అవి సంభవించుటకు వందల సంవత్సరములకు ముందే చెప్పియున్నారు. మరియు పూర్తి అరువది ఆరు గ్రంథములలో ఒక్క పొరపాటు లేదు. ఓ, మై, ఏ గ్రంధకర్త కాదు, కాని దేవుడే స్వయముగా, అంత ఖచ్చితముగా యుండగలడు. ఒక్క మాట కూడా మరొక మాటతో విభేదించదు. గుర్తుంచుకోండి, పదహారు వందల సంవత్సరములు వేర్వేరుగా వ్రాయబడింది, మోషే నుండి, పత్మాసు ద్వీపములో యోహాను మరణము వరకు. పదహారు వందల సంవత్సరములు, నలుబది మంది వేర్వేరు గ్రంధకర్తలు; కనీసము ఒకరు మరొకరిని ఎరుగరు, వారు దానిని ఎన్నడూ "వాక్యముగా," కలిగి యుండలేదు. వారిలో కొందరు కనీసము "వాక్యమును," చూడలేదు. కాని వారు దానిని వ్రాసినప్పుడు, అప్పుడు, వారు ప్రవక్తలైయున్నారని అర్థమైంది, వారు వారి యొక్క ప్రవచనములను ఏకము చేసినప్పుడు, వాటిలో ప్రతీ ఒక్కటి, ఒక దానితో ఒకటి పొందికగా వుంది.

ACTS 2:38•

ACTS 9:4

 

39పేతురు వైపు చూడండి, ఆయన పెంతెకొస్తును ప్రకటించాడు, "ప్రతివాడు మారు మనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి." పౌలు ఎన్నడూ దానిని గూర్చి వినలేదు. ఆ మార్గములో అతనితో మాట్లాడిన, ఆ అగ్నిస్తంభము, "సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు?" అన్నది ఎవరో తెలుసుకొనుటకు, అతడు పాత నిబంధన చదువుటకు, మూడు సంవత్సరములు అరేబియాలోనికి వెళ్ళాడు. అతడు ఎలా తప్పు అవుతాడు? అతడు కనీసము ఎన్నడూ సంఘమును ఏ మాత్రము సంప్రదించలేదు. పదునాలుగు సంవత్సరముల తరువాత, అతడు పేతురును కలుసుకొన్నప్పుడు, వారు ఒకే దానిని, వాక్యము వెంబడి వాక్యమును బోధించుచుండిరి. అది మన బైబిలుయై యున్నది. ఇతర మనిషి మాటలు తప్పిపోతాయి. దీనికి ఏ మనిషి ఏదియు కలుపకూడదు. నీవు బైబిలుకు ఏదియు కలుప కూడదు. లేదండి. ఇది సంపూర్ణమైన ప్రత్యక్షతయై యున్నది. అంతే.

40ఏడు ముద్రల వలె యున్నది. "ఏడు ముద్రలు," నాతో ఎవరో మాట్లాడుతూనే యున్నారు, "బ్రెనాం సోదరుడా, ఇప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు, ఈ ముద్రలు బయలు పర్చబడిన తరువాత దానిని ఎలా చేయాలో, దేవునికి ఎలా దగ్గరగా రావాలో మాకు చెప్పండి."

నేనన్నాను, "లేదండి, అది అలా యుండరాదు, ఏలయనగా బైబిలులో — ఏడు ముద్రల మీద ఏడు మర్మములు దాచబడ్డాయి. అది ఇది వరకే వ్రాయబడింది, కాని అది ఏమైయున్నదో వారికి అర్థము కాలేదు." గమనించండి, వారు ఎలా "యేసు," నామములో బాప్తిస్మమిస్తూ త్రవ్వుకొంటూ వచ్చారో, చూడండి. అది అది కాదు. "ప్రభువైన యేసు క్రీస్తు!" నామము, చూడండి! ఆ కార్యములన్నీ, అది ఎలా యున్నదో… ఏలయనగా అక్కడ ఎందరో యేసులున్నారు, "యేసు," అని పిలువబడు సేవక స్నేహితులు నాకు భూమి మీద ఎందరో యున్నారు. అది అది కాదు, అది మన "ప్రభువైన యేసు క్రీస్తు." ఏ గ్రంధకర్త కాదు, కాని దేవుడే అంత ఖచ్చితముగా యుండగలడు.

ఇప్పుడు, ఈ బైబిలు ఎలా వ్రాయబడిందో చూద్దాము..

41ఇప్పుడు ఉదాహరణకు… ఇప్పుడు దేహముతో పనిచేయు అరవై-ఆరు ఔషధ గ్రంధములను మనము తీసుకొని, నలుబది మంది ఔషద పాఠశాలల ద్వారా, పదహారు వందల సంవత్సరములలో వేరు వేరు వ్యక్తుల ద్వారా వ్రాయబడిన వాటిని మనము తీసుకొంటే? ఏ రకమైన ఎడతెరిపి లేని దానితో మనము పైకి వస్తామో అని నేను ఆశ్చర్యపోతాను?

మన అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్, రెండు వందల సంవత్సరముల క్రితము, ఊపిరితిత్తుల వ్యాధిని బట్టి పన్నెండు ఔన్సుల రక్తము కారునట్లుగా, వారు ఆయన బొటన వేలి గోరును లాగివేసియున్నారు… మనము ఇంకొంచెము ముందుకు, ఈ రోజున మనము ఎంతో ఆకర్షించబడి యున్న సైన్సులో, కొన్ని వాటి లోనికి వెళదాము.

నలుబది వివిధమైన శాస్త్రముల నుండి… పదహారు వందల సంవత్సరములు విడిగా తీసుకొంటే, మనము దేనితో పైకి వస్తామో చూద్దాము? మూడు వందల సంవత్సరముల క్రితము, ఒక ప్రెంఛి శాస్త్రవేత్త, ఒక బంతిని ముప్పయి మైళ్ళ వేగముతో విసిరివేసినట్లైతే, గంటకు ముప్పయి మైళ్ళ వేగముతో, అది భూమి మీద నుండి పైకి లేచి, మరలా తిరిగి భూమి మీద పడుతుందని ఋజువు చేశాడు. సైన్సు ఎన్నడైనా వెనుకకు తిరిగి దానిని సూచించుటను మీరు తలంచారా? ఒక గంటకు వందలేక నూట-ఏబది మైళ్ళ వేగముతో, వారు వీధిలో కారును నడుపుతున్నప్పుడు, దానితో ఇప్పుడు ఏమైనా ఎడతెగనిది యున్నదా? చూడండి? కాని అతడు దానిని శాస్త్రీయముగా ఋజువు చేశాడు. అదేమనగా, బంతి భూమి మీద గిరగిర తిరిగే వత్తిడిని బట్టి, గంటకు ముప్పయి మైళ్ళ వేగములో, ఏ వస్తువైనను భూమి మీద నుండి పైకి ఎగిరిపోతుంది, అది అంతరిక్షములో పడిపోతుంది.

లేదు, దానికి ఎడతెగనిది అక్కడ లేదు;

42కాని బైబిలులో ఒక్క మాట, ఇతర మాటతో విభేదించదు. ఒక ప్రవక్త, మరొక ప్రవక్తతో ఎన్నడూ విభేదించలేదు. వారిలో, ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైయున్నారు. ఒకరు వచ్చి ప్రవచించినప్పుడు, నిజమైన ప్రవక్త లేచి అతడు మునుపు చెప్పిన దానిని పిలుస్తాడు, అప్పుడే అది ప్రత్యక్ష పర్చబడుతుంది. చూడండి, చూడండి. కాబట్టి విశ్వాసులందరికి బైబిలు దేవుని వాక్యమై యున్నది.

43ఇప్పుడు, వైద్యులు సమ్మతించే దానిపై, నీకు ఏ ఖచ్చితత్వము రాదు. వారి నుండి ఇప్పుడు ఏ ఖచ్చితత్వము రాదు. సైన్సు నుండి నీకు ఏ ఖచ్చితమైనది రాదు.

కొద్ది కాలము క్రితము, మీకు తెలుసా వారు దానిని చెప్పినప్పుడు, "నలుగురు దూతలు భూమి యొక్క నాలుగు దిక్కులు పై నిలబడియున్నారని" బైబిలు చెప్పింది. అది ఆలాగున యుండదు; భూమి గుండ్రముగా యుందన్నారు. కాని బైబిలు చెప్పింది, "నాలుగు దిక్కులు," సరే, మీరు చూడండి, రెండు లేక మూడు వారముల క్రితము, ఇప్పటివరకు వార్తాపత్రికలు ఆ వాక్యమును కలిగియున్నాయి. భూమి చతురస్రాకారముగా యున్నదని వారు కనుగొన్నారు. మీలో ఎంతమంది దానిని చూశారు? ఎందుచేత, నిశ్చయముగా, చూడండి? నేను దానినంతా కాపీలు తీసుకొన్నాను. ఎవరైనను ఏదైనా చెప్పుటకు కనిపెట్టుచున్నాను.

44ఒక దినము వారు దానిని కనుగొంటారు, అదేమంటే, అంతరిక్షములోని నూట-యేబై మిలియన్ల వెలుగు సంవత్సరములు వారు చూచుట లేదు; వారు తిన్నగా ఒక వలయము చుట్టూ వెళ్తున్నారు. అది ఖచ్ఛితముగా. ఈ దినములో ఒక దినము నీవు పరలోకము వెళ్ళినప్పుడు, నీవు దానిని కనుగొనబోవుచున్నావు, నీవు ఎక్కడకో ఎగిరిపోవు. నీవు ఇంకనూ ఇక్కడే యుంటావు కూడా, అది దీనికంటే వేగమైన మరొక పరిధిలో యున్నది.

తిన్నగా ఈ గది గుండా రంగు వచ్చుచున్నది. ప్రతి రంగు, షర్టు, డ్రస్, నీవు ఏది కలిగియున్నా - అది నిత్యమైనదైయున్నది, తిన్నగా రికార్డులలో యుంచబడింది, అది ప్రపంచము చుట్టూ చుట్టూ తిరుగుతుంది. నీవు రెప్ప వేసిన ప్రతిసారి, అది తిన్నగా రికార్డు మీద యున్నది. గమనించండి, టెలివిజన్ దానిని ఋజువు చేస్తుంది.

45నీవు జన్మించినప్పుడు, దేవుడు రికార్డును ఆన్ చేస్తాడు… ఒక రికార్డును ప్రారంభిస్తాడు, అది కొద్ది కాలము వరకు ఎక్కువ శబ్దమును చేయదు, నీకు తెలుసా, అది చిన్న బిడ్డ, అది లెక్కించు వయస్సు వచ్చు వరకు; తరువాత శబ్దము ఆరంభమవుతుంది. అతడు చెప్పేవి, మరియు చేసే పనులకు అతడు లెక్క చెప్పాలి. తరువాత ఆ జీవితము ముగించబడినప్పుడు, ఆ రికార్డు టేపు తీయబడి, దేవుని యొక్క గొప్ప గ్రందాలయములో యుంచబడుతుంది. తీర్పు పీఠము నొద్దకు నీవు ఎలా చేరుకోగలవు? అది తిన్నగా నీ ముందే ఆడించబడుతుంది, నీ ప్రతి కదలిక, నీ మనస్సు గుండా వెళ్ళిన ప్రతి ఆలోచన. నీవు దానిని చూడగలవా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో నీవు చూడగలవా…?

46మొన్నటి రాత్రి, ఇక్కడ నిలబడియుండగా, ఒక మనిషి అక్కడ వేదిక మీద యున్నాడు, ఎత్తుగా, బట్టతల, నిజముగా దేహదారుఢ్యముగల వ్యక్తి, బలముగా యున్నాడు. ఇతడు వెళ్ళాడు… అతని కుటుంబము గూర్చి, అతడు తప్పక ఏమి చేయాలో, ఎంతో అతని గూర్చి ప్రభువు చెప్పియున్నాడు. అతడు బయటకు వెళ్ళి కూర్చొన్నాడు. కొన్ని నిమిషములలో, అతని వంటి మరొక మనిషి నా ముందుకొచ్చాడు, అతడు తలవంచుకొన్నాడు. నేను గుర్తుపట్టలేక పోయాను, మరలా నేను ఆ మనిషి వైపు చూశాను… అతను కాదు, ఏలయనగా అది మరొకటై యున్నది. ఈ మనిషిని నేను కనుగొనలేదు. చుట్టూ చూశాను, నా వెనుక ఎవరూ లేరు, నేనన్నాను, "ఆ మనిషి లోపల తెరల క్రింద కూర్చొన్నాడు." అతడు ఇక్కడ సంఘమునకు వచ్చే సోదరుడు, ఎత్తుగా, బట్టతల, బలమైన వాడు, అక్కడ కూర్చొన్నాడు. అతడు తన తలను దించియున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏలయనగా అతడు కడుపు జబ్బుతో చనిపోవుటకు సిద్దముగా యున్నాడు. అతడు ఒక జత బూటులను పొందబోవుచుండెను. అతని భార్య అతని కొరకు ఒక జత బూటులను తెగోరెను. అతడన్నాడు, "వద్దు, అవి తేనవసరము లేదు, నేను వాటిని ధరించుటకు జీవించబోవుట లేదు." అతడు చనిపోవుచుండెను. అక్కడ కూర్చొనియున్నాడు, మీరు చూడండి, ఆ పరిమాణములో… హల్లెలూయ! దేవుడు సరిగ్గా అక్కడ కదిలి అన్నాడు, "అతడు అక్కడ కూర్చొనియున్నాడు," సరిగ్గా అతడు యున్న స్థానములో… నా భావము చూడండి?

HEB 4:12

 

47ఇప్పుడు గమనించండి, అక్కడ లేఖనములలో ఏ పొరపాటు లేదు; యేసు, దేవుని వాక్యము, హృదయములో యున్న ఆలోచనను గ్రహించియున్నాడు. "దేవుని వాక్యము బలమైనది, వాడియైనది." హెబ్రీ 4:12 "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది," చూడండి — అది మనస్సులోనికి వెళ్ళి, బయటకు లాగుతుంది, వివేచిస్తుంది. వివేచన అనగా ఏమిటి? "తెలియపర్చుట, బయలు పర్చుట." అదే దేవుని యొక్క వాక్యము చేస్తుంది… ఈ రోజు మనమంటాము, "కాథలిక్ సంఘము దేవుని వాక్యమైయున్నది — బాప్టిస్టు, మెథడిస్టు , పెంతెకొస్తు, గుడారము అంటాము." అది తప్పు. వాక్యమే ప్రత్యక్షతయైయున్నది; దేవుడు, వాక్యము ద్వారా బయలు పర్చబడ్డాడు!

48లేదు, ఏ విధమైన ఎడతెగని దానిని, వైద్యులు, శాస్త్ర వేత్తలు భిన్నమైన వారి మధ్య మనము పొందలేము. ఐన్ స్టీన్, వెలుగుల గూర్చి, దానికి సంబంధించిన వాటిని గూర్చి, చదువుచుండగా, భౌతికముగా అన్వయించుటను, అతడు ఆత్మ సంబంధమైన అన్వయముగా కూడి దానిని కలిగి యుంటే, అతడు ఇంకా ఏదో మనకు చెప్పియుండేవాడు. ఆకాశములలో ఎక్కడో యున్న, ఆ గొప్ప కేంద్రమును గూర్చి, నేను అతని వర్తమానమును విన్నాను, అదేమనగా, "ఎన్నడైనా ఆ కేంద్రముతో సంబంధమును కలిగియుంటే, నీవు భూములను సృజించగలవు, ఏదైనా చేయగలవు, మరియు ఆ శక్తి అపరిమితముగా ఉంటుంది," చూడండి. అతడు దానిని చూశాడు.

49గాలిగుండా ఎగురుతున్న పొట్లములను మీరు చూడండి, వారు దానిని, "ఎగిరే పళ్ళెములు," అని పిలుస్తారు. కాబట్టి… దానిని మనము ఒంటరిగా విడిచి పెట్టుట మంచిది. నీవంటావు, "ఈ ప్రజలందరూ పైకి వస్తూ తప్పిపోవుటను వింటాము?" వారి నుండి మనము ఏమియు వినము; వారు అక్కడ నిలబడియున్నారు, కాని వారక్కడ లేరు. ఆ విధములోనే ఎత్తబడుట ఉండబోవుచున్నది. వారిలో ఒకరు తిన్నగా క్రిందికి పడిపోతారు. మరియు ఈ భూసంబంధమైన శరీరము, పరలోకపు శరీరమును ధరిస్తుంది. ఈ చర్మము, వెంట్రుకలు, ఎముకలు వీడిపోయినవి; అది ఒక క్షణములో, అంతరిక్షములో నుండి తిన్నగా దిగివచ్చి, దానిని గృహమునకు తీసుకువెళుతుంది. ఇదంతయూ ఇప్పుడు సంభవించుటను మనము చూస్తాము, మరియు ఆకాశములోని సమస్తమూ ఈ మర్మయుక్తమైన వెలుగులు, వెలుగులను, పెంటగాన్ చూసి ఆశ్చర్యపోతుంది. "ఒక మర్మయుక్తమైన వెలుగు," అని ఈ వారము, జఫర్సన్ విల్ వార్తాపత్రికలో, వారు అటువంటి ఒక దానిని కలిగియున్నారని మీరు చూశారు. కాబట్టి, అది ఏమిటో వారికి తెలియదు. కాని వినండి, చిన్న పిల్లలారా, ఈ దినములో ఒక దినమున అది నిన్ను పైకి తీసుకొంటుంది. చూడండి, చూడండి; కలవరపడవద్దు.

గుర్తుంచుకోండి, యేసు చెప్పెను, "సొదొమ దినములలో జరిగినట్లుగా."

50సరిగా సొదొమ ముందు ఏమి జరిగింది? దేవుడు కొందరు దూతలతో దిగి వచ్చాడు, వారు తీర్పు పరిశోధనను కలిగియున్నారు. "అది ఎంతో పాపభూయిష్టమైనదై, ఎంతో గొప్పగా యున్నదన్న మొర్రను మేము విని, అది అంతా నిజమో కాదో కనుగొనుటకు, మేము దిగి వచ్చాము." అది నిజమా? అబ్రాహాముతో నిలిచియున్న ఆ ముఖ్యమైన వ్యక్తిని గమనించండి, ఆయన వెనుక యున్న, శారా హృదయములోని తలంపులను వివేచించాడు. ఇప్పుడు, మీరు చుట్టూ చూసి, కొంచెము గమనించండి, చూడండి, అది ఏమి చేయుచున్నదో గమనించండి, ఈ రోజున అదే సంగతి. అది ఒక పరిశోధించు తీర్పుయై యున్నది. ఎందుచేత, కొద్ది సమయము తరువాత, సంఘము, అది దాని యొక్క స్థానములో నిలిచినప్పుడు, ప్రతి విత్తనము దాని స్థానమునకు తేబడుతుంది, వారు వెళ్ళిపోతారు. వారికి ఏమి సంభవించిందో వారికి తెలియదు. ఒకరు ఒకదారి గుండా వెళతారు, (చూడండి), ఒకరు సంఘకాపరి ఇంటికి వెళతారు, ఒకరు ఇటు, ఒకరు ఆ దిగువకు వెళతారు, మొదటి సంగతి మీకు తెలుసా, వారు అక్కడ లేరు. ఏలయనగా హనోకు ఒక మాదిరియైయున్నాడు, "దేవుడు అతనిని కొనిపోయెను, అతడు కనబడలేదు." పరిశోధించడానికి క్రిందికి వచ్చారు.

ఎడతెరిపి లేకుండా, హనోకు ఎలా కొనిపోబడ్డాడో, ఓడలోనికి మోసికొనబడిన ఇశ్రాయేలుకు మాదిరి.

51ఎంతో పరిపూర్ణముగా… దేవుని వాక్యము, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనకు ఎంతో పరిపూర్ణమైనది, ఒకే మొత్తములో, అది రెండు భాగములైయున్నది. అది సత్యము, పాత నిబంధన దానిలో ఒక సగము, మరియు క్రొత్త నిబంధన మరొక సగము; దానిని ఏకము చేసినప్పుడు, నీవు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను పొందుతావు. అక్కడ ప్రవక్తలు మాట్లాడుచున్నారు. మరియు ఇక్కడ ఆయన వ్యక్తిగతముగా యున్నాడు, చూడండి, ఒకే మొత్తములో రెండు భాగములు.

ఇప్పుడు, ఎక్కువ సమయము మేము తీసుకొనగోరుట లేదు.

52గుర్తుంచుకోండి, క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధన సంపూర్ణము కాదు. మరియు పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన సంపూర్ణము కాదు, ఆ కారణము చేతనే ఒకే మొత్తములో, అది రెండు భాగములు అని నేను చెప్పాను. ఏలయనగా ప్రవక్తలు అన్నారు, "ఆయన ఇక్కడ యుంటాడు; ఆయన ఇక్కడ యుంటాడు; ఆయన ఇక్కడ యుంటాడు. వారు దీనిని ఆయనకు చేస్తారు; వారు ఆయనకు దీనిని చేస్తారు." మరియు ఆయన ఇక్కడున్నాడు. "ఆయన ఇక్కడ ఉండెను; ఆయన ఇక్కడ ఉండెను. ఆయన… మరియు వారు దీనిని ఆయనకు చేశారు, వారు దీనిని ఆయనకు చేశారు." కొన్ని రాత్రుల క్రితమే నేను దానిని బోధించాను.

2TIM 2:15

 

53ఇప్పుడు, లేఖనము చదువుటకు గాను — పౌలు తిమోతీలో అన్నాడు, "దానిని చదువుము, దేవుని వాక్యమును సరిగ్గా విభజించుము, అదే సత్యమై యున్నది." అక్కడ లేఖనములో మూడు తప్పక పాటించవలసినవి ఉన్నాయి. దేవుని వాక్యమును ఉపయోగించేటప్పుడు, అక్కడ మూడు విషయములు నీవు తప్పక చేయరాదు. రాబోవు పది నిమిషములలో మనము దానిని చదువుదాము: మూడు విషయములు, నీవు తప్పక చేయరాదు. దేశమంతటా, మీరు ఎక్కడ యున్నను, దేశమంతటా ఈవైపు నుండి ఆ వైపు వరకు, మీకు పెన్సిల్ లేకపోయినట్లైతే, నిశ్చయముగా మీ మనస్సులో దానిని యుంచుకోండి. నీవు తప్పక వీటిని చేయరాదు. ఎప్పుడూ మీరు తప్పక ఏమి చేయాలో మేము చెప్పేవారము, ఇప్పుడు మీరు తప్పకేమి చేయకూడదో మీకు చెప్పబోవుచున్నాను.

ఇప్పుడు, దేవుని వాక్యమునకు తప్పు అనువాదమును నీవు తప్పక చేయరాదు. నీవంటావు, "సరే, దీని భావము అది అని నేను నమ్ముతాను." దాని భావము అది ఏమి చెప్పుతుందో అదే. దానికి అనువాదకుడు అవసరము లేదు. నీవు తప్పక దేవుని వాక్యమును దాని స్థానము నుండి తొలగించరాదు. నీవు తప్పక దేవుని వాక్యమును దాని అసలైన స్థితి నుండి కదపకూడదు. వీటిలో నీవు ఏది చేసినా, అది బైబిలును ఒక గందరగోళముగా, అస్తవ్యస్తమైన స్థితిలోనికి దానిని త్రోసి వేస్తుంది.

54గమనించండి. యేసును తప్పుగా అనువదించినట్లైతే, మనిషిలో యున్న దేవుని రూపము, నీవు ముగ్గురిలో ఆయనను ఒకడిగా చేస్తావు. దేవుని వాక్యమైయున్న యేసుక్రీస్తును, తపగా అనువదిస్తే, నీవు ఆయనను ముగ్గిరిలో ఒక దేవునిగా చేస్తావు. లేక ఆయనను దైవత్వములో రెండవ వ్యక్తిగా చేస్తావు. అలా చేయుట, నీవు పూర్తి లేఖనమును కలగలుపు చేస్తావు. నీవు ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేవు. కాబట్టి అది తప్పక తప్పుగా అనువాదము చేయరాదు.

ఒక విషయాన్ని నీవు చెప్పి, దానిపై నీ తర్జుమాను ఉంచినట్లైతే, నీవు దానిని మరొక కాలానికి అన్వయించినట్లైతే, లేక దానిని మరొక కాలానికి అన్వయించినట్లైతే, నీవు సరైన అనువాదము కూడా చేయుటలేదు.

EXOD 20:3

 

55ఎవరైనను బైబిలులోని యేసుక్రీస్తును, ఆయన స్వయముగా దేవుడు కాడని, ఆయన రెండవ వ్యక్తి అని, ముగ్గిరిలో ఒకడని అనువదించినట్లైతే, అది బైబిలులో ప్రతి మాటను తలక్రిందులు చేస్తుంది. అది మొదటి ఆజ్ఞను విచ్చిన్నము చేస్తుంది. "నేను తప్ప వేరొక దేవుడు నీకు యుండరాదు." మంచిది. అది మొత్తము క్రైస్తవ లోకాన్ని, భిన్నమైన ముగ్గురు దేవుళ్ళను ఆరాధించు, అన్య ఆరాధకులుగా వారిని చేస్తుంది. చూడు, ఎలాంటి బైబిలును నీవు కలిగియున్నావు? అప్పుడు యూదులు మనమేమైయున్నామని వారు చెప్పుచున్నారో, అదే మనలను చేస్తుంది. వారన్నారు, "వారిలో నీ దేవుడు ఎవరు?" చూచారా, కాబట్టి చూడు, నీవు బైబిలును తప్పుడు అనువాదము చేయరాదు, ఏలయనగా ఆయన శరీరములోని భాగమును, ఆ యుగములో ఆయన ప్రత్యక్షపర్చుచున్నప్పుడు, అప్పుడు యేసే స్వయముగా బైబిలును అనువదించుచున్నాడు. అది ఒక చేతి యుగమై యున్నట్లైతే, అది తప్పక చేయిగా యుండాలి; అది ఒక తల యుగముగా యుండదు. అది ఒక స్వరము యుగమైయున్నట్లైతే, సరే అప్పుడు, అది ఒక కాలియుగముగా యుండదు, చూడండి. ఇప్పుడు మనము కంటి యుగములో యున్నాము. ఇప్పుడు తరువాత, ఆయనే స్వయముగా రావలసియున్నది. చూచుట — ప్రవచనాత్మకమైనది.

56చూడండి, యుగముల గుండా క్రిందకు, మొదటి యుగము నుండి, మనము పునాదితో ప్రారంభించియున్నాము, విత్తనము భూమిలోనికి వెళ్ళినప్పుడు, సంపూర్ణమైన విత్తనము. తరువాత అది లూధర్ ద్వారా, పాదములు గుండా బయట కొచ్చింది; తరువాత తిరిగి వెస్లీ గుండా బయటకు వచ్చింది, తరువాత పెంతెకొస్తు లోనికి వెళ్ళింది, అదే భాషలు, పెదవులు, చూడండి, ఇప్పుడు అది కన్నులలో యున్నది, మాలాకీ 4 యొక్క ప్రవచనాత్మక మైనది. ఇప్పుడు వచ్చుటకు ఏదియు మిగిలియుండలేదు, ఆయనే స్వయముగా దానిలో అడుగు పెట్టుట తప్ప, కారణము అక్కడయున్న చివరిది అదియే. తరువాతది జ్ఞానము, మన సొంత జ్ఞానము మనకు ఏమీ లేదు. అది ఆయనది. మన సొంత దృష్టి మనకు లేదు. ఒక మనిషి, ముందుగా అలాంటి కార్యములను ఎలా చూడగలడు? అతడు దానిని చేయలేడు. అది స్వయముగా దేవుడే. చూడండి, అది ఒక్కొ స్థానమునకు వచ్చుచున్నది. అప్పుడు పూర్తి క్రీస్తు శరీరము, ఆయన ప్రక్క నుండి తీయబడీన, ఒక వధువుగా ప్రత్యక్షపర్చబడుతుంది. ఆదిలో ఆదామునకు చేసినట్లుగా… ఆరంభములో యున్న ఆదామువలె.

HEB 13:8

 

57అవును, మొదటి ఆజ్ఞను విచ్చిన్నము చేయుట, "దేవుడు," భిన్న అక్షరాలలో, అది పూర్తి బైబిలును గందర గోళములో యుంచుతుంది. ముగ్గురు దేవుళ్ళను అన్యత్వము నుండి, దేవుళ్ళలో ఒకరు అన్నట్టు. అది పూర్తి బైబిలు చిత్రాన్ని నాశనము చేస్తుంది. కాబట్టి నీవు తప్పక బైబిలును తప్పుగా అనువదించ రాదు. ఇప్పుడు, అది ఒకటి.

బైబిలులో ప్రతి లేఖనము ఒకే అన్వయాన్ని కలిగియున్నప్పుడు, నీవు తప్పక దానిని దాని స్థానములో యుంచాలి. దానిని తప్పు స్థానములో యుంచుట, ఒక యుగములో నీవు ఆయనను దేవునిగా చేస్తావు. మరొక యుగములో ఆయనను ఒక చరిత్రగా చేస్తావు. కాబట్టి నీవు తప్పక లేఖనమును, తప్పు స్థానములో యుంచరాదు. ఆయన ఎల్లవేళలా దేవుడైయున్నాడు. ఈ రోజు నీవు ఆయనను చరిత్రలో దేవునిగా చేస్తే, అదిగో ఆ వెనుక యున్నవాడు, ఈ రోజున నొకటే కాదా, హెబ్రీ 13:8తో నీవు ఏమి చేయబోవుచున్నావు? చూడండి, "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నాడు."

ఇప్పుడు, ఇది ఏమి చేస్తుంది, అది ఏమి చేసియున్నది. లేఖనములను తప్పించినప్పుడు, అది ఇది వరకే ఆయన వాక్యమును నిరాకరించినట్లు చేసింది.

58లేఖనములను తప్పు స్థానములో యుంచినప్పుడు, నీవు ఏకముగా ఆయన శరీరమును తప్పుగా ఉంచావు, తల ఒక చోట, కాళ్ళు ఒక చోట యుంచావు. సరిగ్గా ఆలాగుననే. మరొక మాటలో, మోషే వర్తమానమును యేసు బోధిస్తే, లేక లూధర్ యుగములో, వెస్లీ బోధిస్తే. మన యుగములో మనము కలిగి యున్నట్లుగా, పెంతెకొస్తు వర్తమానమును, పెంతెకొస్తు వారికి బోధిస్తే. నీవు చూడు, అది ఎలాటి గందర గోళముగా యుంటుంది? పెంతెకొస్తు ఇది వరకే దాని రంగులను చూపించింది. లూధర్ అతని రంగులను చూపించాడు. అది ఒక శాఖలోనికి వెళ్ళిపోయింది. అది తిన్నగా అక్కడే చనిపోయింది. ఆ యుగము నెట్టి వేయబడింది; అది అక్కడికే వెళ్ళింది.

గమనించండి, అది సంస్థగా మారిన వెంటనే, అది చనిపోయింది. ఇప్పుడు, అది సత్యమో కాదో చూడండి. చరిత్ర పుటల గుండా వెనుకకు చూడండి. అది సంస్థగా మారిన ప్రతిసారి, అది తిన్నగా అక్కడే చనిపోయింది; అక్కడింకేమి దానికి లేదు. అది ఈ లోక దేవతను ఆరాధించే దానిగా మారింది; సంస్థలుగా, శాఖలుగా, అనుకరణలుగా మారింది. ఒక ఎలుకల గుంపు దానిలోనికి ప్రవేశించి, దానిలోనికి దాని సొంత తలంపులను ఎక్కించింది. దానికి ఏమి సంభవించింది? అది ఒక గందరగోళముగా మారింది. ఈ లోక దేవతలోనికి రూపు దిద్దుకొంటుంది. అక్కడ సాతానుడే స్వయముగా సింహాసనాసీనుడవుతాడు. ఒక గొప్ప ప్రపంచ నాయకుడు వారికి సమాధానము తెస్తాడని వారు తలస్తారు.

59మొన్నటి దినాన నేను చెప్పాను — మరలా దానిని చెప్పుతాను — ఈ దినమున నాగరికత సహితము, దేవునికి పరిపూర్ణముగా విరుద్ధముగా యున్నది. నాగరికత దేవునికి వ్యతిరేకమైనది. ఆయనకు విద్య పది లక్షల మైళ్ళు దూరములోగా యున్నది. సైన్సు పది లక్షల మైళ్ళు దూరముగా యున్నది. సైన్సు మరియు విద్య, దేవుడు లేడని నిరూపిస్తున్నాయి, (చూశారా) వేదాంత పాఠశాలలు, కళాశాలలు, సైన్సు గదులు కూడా మరియు మొదలగునవి. వారు వారి కుదుపును కలిగియున్నారు. మొన్నటి దినమున దర్శనమును గూర్చి ఏమిటి, అలా వారు దానిని కుమ్మరిస్తున్నప్పుడు. అతడు శాస్త్రవేత్తలను చూసి కేకలు వేశాడు? వారు తిరిగి పైకి చూసి, వెళ్ళి పోయారు. అక్కడ మరొక స్వారీ యున్నది.

60గమనించండి. ఓ, ఈ మూడు తప్పక యుండాలి. యేసు నోవహు వర్తమానమును భోధిస్తూ రాలేదు. ఆయన మోషే వర్తమానమును బోధిస్తూ రాలేదు, మోషే మరొక వర్తమానమును బోధిస్తూ రాలేదు… చూడండి, లేఖనములను వాటి స్థానము నుండి తప్పించవద్దు. అది కాలము ప్రకారము తప్పక యుండాలి. ఇప్పుడు నీవు దానిని అన్వయించలేవు… ఆ గొప్ప మనిషి, జాన్ వెస్లీ బయటకు వచ్చినప్పుడు, లేక ఆ గొప్ప మనిషి, లూధర్ తన వర్తమానముతో బయటకు వచ్చినప్పుడు. లూధర్ ఒక గొప్ప మనిషి, అతడు సంఘమును చీకటిలో నుండి పిలిచి, విశ్వాసము ద్వారా నీతికరణమును ఏర్పరచాడు. అతడు దానిని చేసినప్పుడు, వారు దాని చుట్టూ పైకి ఒక సంస్థను నిర్మించారు; అది చనిపోయింది. గోధుమ పొట్టులోని జీవము వలె, జీవము ప్రయాణించి, తిన్నగా బయటకు వెస్లీ యుగములోనికి వెళ్ళింది. అదే పిప్పొడి కుచ్చు. లూధర్ నుండి ఇతర ఆకులు బయటకు వచ్చాయి. అది దానితో చనిపోయింది. ఆ గొప్ప పునరుద్దరణ నుండి బయటకు వచ్చిన వారు వీరే, జ్వంగ్లీ, కాల్విన్, మిగిలిన వారందరూ.

61తరువాత దాని వెంబడి వెస్లీ వచ్చాడు. మరొక యుగము పిప్పొడిగా మొగ్గ తొడిగింది. వెస్లీ మరియు అస్బురి, వారందరూ యోహాను అతని సోదరుడు, వారందరు ఒక గొప్ప వర్తమానముతో గొప్ప దేవుని మనుషులైయున్నారు. అది దేశమును ఊడ్చి వేసింది. వారు దానిని సంస్థగా మార్చారు. అది చనిపోయింది. తరువాత అది బయటకు వచ్చినప్పుడు చూడగా, అది ఖచ్చితముగా అది గోధుమ గింజను తెచ్చినట్లుగా యుంది, కాని దానిని చూసినపుడు - అది ఒక తొక్క, అదే పెంతెకొస్తు. కాని దానంతటి వెనుక, తిరిగి ఒక మొగ్గ వచ్చింది. మీరు గమనిస్తే సాధారణముగా, మూడు లేక నాలుగు సంవత్సరములు వెస్లీ పొలములో యుండగానే, లూధరన్ సంఘము సంస్థగా మారింది. వెస్లీ తరువాత కొద్ది కాలానికి, అతడు పొలములో యుండగానే అది సంస్థగా మారింది.

62టుసాన్లో, వెస్లీ సంఘము, అనగా మెథడిస్టు సంఘము ఎలా ఉనికి లోనికి వచ్చిందో, మేము ఒక కార్యక్రమమును చూశాము. వారు ఇక్కడ అమెరికాకు వచ్చినప్పుడు ఇంగ్లండు నుండి వారు అనేకులు వచ్చి, ఎలా నియమ నిబంధనలు ఎలా ఏర్పరిచారో, అది చిత్రీకరించబడింది. తిన్నగా అప్పుడే ఏమి సంభవించిందో నేను చూశాను. అక్కడే అది చనిపోయింది.

దాని నుండి పెంతెకొస్తువారు, ఎన్నో దినముల క్రితము ఆ పాత కేకలు వేయు వారు వచ్చారు. భాషలతో మాట్లాడు వరమును కలిగి, భాషలతో దానిని మాట్లాడుట ప్రారంభించారు. తరువాత దానికి "పరిశుద్ధాత్మ యొక్క ఋజువు," అని పేరు పెట్టారు. తరువాత వారు సంస్థగా మారారు. ఒకరు నేను దీనిని చేయబోవుచున్నాను అన్నారు, మరొకరు అది అన్నారు, వారు ఎన్నో ఎన్నో సమస్యలు కలిగియున్నారు. అది ఏమి చేసింది? పుప్పొడి మరియు కుచ్చును చేసినట్లుగానే, ఆ ఆకులు విచ్చుకు పోయినవి. వారు ఏకత్వమును, ద్విత్వమును, త్రిత్వమును, చర్చ్-ఆఫ్-గాడ్, ఈ మిగిలినవన్నీ వారు కలిగియున్నారు. అవి కేవలము విచ్చుకు పోయినవి, విచ్చుకు పోయినవి, విచ్చుకు పోయినవి. కాని ఇప్పుడు, ప్రకృతి ప్రకారము, అది ఒక పరిపూర్ణమైన సమాధికి, నీవు ఎన్నడూ దానికి విద్యగా బోధించలేవు.

63ఒక కుటుంబము, కెంటకీలో యున్న నా స్నేహితులు, మొన్నటి దినమున ఒక చిన్న బిడ్డ వారి కుటుంబములో పుట్టింది. మాకు వారు భోజనము వండుచుండగా, తల్లి అక్కడ యున్నది. అక్కడ వేటాడుచున్న మాకు వారు భోజనము సిద్దపర్చుచుండగా, ఆమె మరొక సహోదరికి సహాయము చేస్తోంది. నేను మాట్లాడుచుండగా, చిన్న బిడ్డ ఏడ్వటం ప్రారంభించాడు. ఆ తల్లి కొంచెము ఇబ్బంది పడిందని నేను అనుకొన్నాను, కాబట్టి ఆమె పరుగెత్తి వెళ్ళి బిడ్డను తీసుకొని, పాలివ్వటం ప్రారంభించింది. నేనన్నాను, "మీకు తెలుసా, అది సరిగ్గా ప్రకృతి," చూడండి. ఆ చిన్న బిడ్డ తనకు కావలసిన వాటి కొరకు ఏడ్వటం తప్ప, వారు మరొక మంచి మార్గమును ఎన్నడూ కనుగొనలేదు. నీవు ఒక నీతి శాస్త్రము నిచ్చి, కూర్చొని ఇట్లా చెపితే, "కుమారుడా, నేను నీకు వేదాంతమును నేర్పుతాను. నీవు ఇతర పిల్లల వలె గుక్కలు పెట్టి ఏడవద్దు; నీవు భిన్నమైనవాడవు. నీకు ఆకలి యైనప్పుడు, ఇక్కడయున్న గంట మ్రోగించు." అది పనిచేయదు. లేదు, అది పనిచేయదు.

64కాబట్టి, మీరు ప్రకృతిని గమనించినప్పుడు…

ఇప్పుడు, ప్రతి యుగములో మనము చూస్తాము, అది తిన్నగా రూపకల్పన చేయబడింది, అదే మనము చివరి యుగములో యున్నాము. తొక్కలాగి వేయబడింది. మనము పదిహేను సంవత్సరములు, దరిదాపుగా ఈ వర్తమానములో ఇప్పుడు ఇరవై సంవత్సరములను, అది దేశము నుండి దేశమును ఊడ్చి వేయుచున్నది. మరియు ఈ ఉదయము దేశమంతా అనుసంధానము కలిగియున్నాము. (చూడండి) — ఏ సంస్థయూ లేదు. అది సంస్థగా చేయబడదు. అక్కడ ఎన్నడైనా అలాటిది లేదు, లేక ఇక తరువాత ఉండదు, చూడండీ. ఈ దినమున ఈ వర్తమానముతో యున్న విషయమేమనగా, దీనిని వారి హృదయములలో పొందినవారు, పరిపక్వమగుటకు గాను, తప్పక కుమారుని యొక్క సన్నిధిలో ఉంచబడవలసియున్నారు. నీవు వర్తమానమును ఏరుకొన్నప్పుడు, అప్పుడు కుమారుడు మిమ్మును పరిపక్వమైన క్రైస్తవులుగా మిమ్మును తయారు చేయుటకు మీలోని పచ్చితనమునంతా వేయించనిమ్ము. నా భావమును మీరు చూశారా? తన సంఘమును స్వీకరించుటకు దేవుడు వచ్చుచున్నాడు, ఆయన చేత స్వీకరించబడుటకు మనము తప్పక ఆ రకమైన క్రైస్తవులను కలిగియుండాలి. గోధుమలు పరిపక్వము కావలసియున్నవి. మంచిది.

65ఈ మూడు తప్పని సరిగా యుండాలి. తప్పు అనువాదమును తప్పక చేయరాదు, లేక దానిని తప్పుగా ఉపయోగించరాదు, తప్పుగా అనువాదము చేయరాదు, లేక దానిని దాని స్థానము నుండి తప్పించరాదు. అది తప్పక ఖచ్చితముగా దేవుడు చెప్పినట్లుగా ఉంచబడాలి. లోకమునకు, ఇది ఒక మర్మమైన గ్రంథము. అది ఒక మర్మయుక్తమైన గ్రంథమని ప్రజలు నమ్ముతారు.

ఒకసారి ఇక్కడ పట్టణములో నేను ఒక ప్రసిద్ధిగాంచిన మనిషితో మాట్లాడుచుంటిని, క్రైస్తవ్యమునకు ఒక గొప్ప నిర్ణయమును కలిగియున్న వ్యక్తి, అతడన్నాడు, "ఒక రాత్రి ప్రకటన గ్రంథము నేను చదువుటకు ప్రయత్నించాను." "యోహాను తప్పక ఘాటైన మసాలా మాంసమును తిని, ఒక పీడకలను తప్పక కనియుండవచ్చు." చూడండి, అది ఒక మర్మమైన గ్రంథము, కాని…

MARK 4:14•

JOHN 6:63•

HEB 1:1

 

66నిజమైన విశ్వాసికి, అది మనము జీవించుచున్న యుగములా దేవుని ప్రత్యక్షత బయలు పర్చబడింది.

ఆయన అన్నాడు, "నా మాటలు ఆత్మయు మరియు జీవమునైయున్నవి." యేసు దానిని చెప్పాడు. మరలా, "వాక్యము విత్తువాడు విత్తిన ఒక విత్తనమై యున్నది." అది సత్యమని మనకు తెలుసు. అది వాక్యరూపములో యున్న దేవుడైయున్నాడు, మరియు ఆయన ద్వారా మాత్రమే అది అనువదించబడగలదు. మానవ మనస్సునకు దేవుని మనస్సును అనువదించే సామర్థ్యం లేదు. పరిమితిగల మన మనస్సు, అపరిమితమైన మనస్సును ఎలా అనువదించగలదు. మనము కనీసము ఒకరి మనస్సును ఒకరము అనువదించలేనపుడు.

మీరు గమనించండి, ఆయన ఒక్కడు మాత్రమే దానిని అనువదించగలడు, ఆయనకిష్టమైన దానిని ఆయన దానిని అనువదిస్తాడు. "పూర్వకాలము నానా సమయములలోను నానా విధములుగా, ఆ పాత కాలపు మర్త్యులు భూమి మీద పెద్ద అడుగులు వేశారని," అది చెప్పలేదు, "దేవుడు, పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తలకు తన్నుతాను బయలు పర్చుకొన్నాడు," చూశారా.

JOHN 1:10,11

 

67గమనించండి. ఆయనెవరికి దానిని బయలు పరచునో… మరియు ఆయనెలా దానిని రూపకల్పన చేశాడంటే, ఇక్కడ యున్న చురుకైన వేదాంత పండితులను తన్నుతాను లేఖనములో దాచుకొనుచున్నాడు. ఓ, మె! ఆయన తిన్నగా అక్కడ లేఖనములో యుండి, ఆయన తన్నుతాను దాచుకొంటాడు; నీవు రోజంతా చూసినను, నీవు దానిని ఎన్నడూ చూడలేదు; నీ జీవిత కాలమంతా చూసినా, నీవు ఎన్నడూ దానిని చూడలేవు. ఆయన అక్కడే యుండి, తన్నుతాను దాచుకొంటాడు.

ఇప్పుడు, దయచేసి ప్రతిచోట, అది లోపల నాన నివ్వండి. అదే, దేవుడు, వాక్యములో యుండి, తన్నుతాను వాక్యములో దాచుకొంటాడు. ఈ ప్రపంచములో యున్న ఏ వేదాంత పండితుడు లేక ఏ పాఠశాల, ఎన్నడూ ఆయనను కనుగొనలేదు. ఇంకనూ తిన్నగా ఆయన అక్కడ కూర్చొనియున్నాడు. నీవంటావు, "అది నిజమేనా బ్రెనాం సోదరుడా?" పరిసయ్యులు మరియు సదూకయ్యుల సంగతి ఏమిటి? ప్రతి యుగములో ఎలా యుంది? నిశ్చయముగా, ఆయన దానిని చేశాడు. ప్రతి యుగములో ఆయన అలాగే చేశాడు. ఇప్పుడు మనము దానిని పరీక్షించవచ్చు. నోవహు దినములను గూర్చి మనము ఆలోచిద్దాము; చురుకైనవారు, తెలివైన యుగము, ఎలా ఆయన వాగ్దానము చేయబడిన వాక్యములో తన్నుతాను దాచుకొన్నాడో. మోషే దినములలో, ఆయననెలా తన్నుతాను దాచుకొన్నాడో, ఏలీయా దినములలో ఎలా ఆయన తన్నుతాను దాచుకున్నాడో. యేసు దినములలో ఎలా ఆయన తన్నుతాను దాచుకొన్నాడో. "ఆయన లోకములో యుండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, మరియు లోకము ఆయనను గ్రహించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు." చూశారా.

MATT 11:25•

LUKE 10:21

 

68ఈ భూమి మీద యున్న తెలివైన, చురుకైన మనిషి నుండి ఆయన తన్నుతాను దాచుకొంటాడు.

నీవంటావు, "సరే, ఈయన డాక్టర్ హోలీ ఫాదర్, పలానా-పలానా." అతడెవడైనను నేను లెక్క చెయ్యను, దేవుడు అతని నుండి తన్నుతాను దాచుకొంటాడు; మరియు నేర్చుకొనే పసి బాలురకు తన్నుతాను బయలు పర్చుకొంటాడు, (చూడండి), దేవుని పసి బాలురు, ముందుగా నిర్ణయించబడిన విత్తనము.

ఆలోచించండి. బలవంతుడైన దేవుడు, ఆయన సొంత మాటలలో కూర్చొన్నాడు, ఈ యుగములోని చురుకైన తెలివైన ప్రజలను గ్రుడ్డివారిగా చేస్తున్నాడు. వారు దానిని చూడరు. వారు అది ఒక వెర్రితనము అంటారు. పెంతెకొస్తు వారికి, బాప్టిస్టులకు, మెథడిస్టులకు, ప్రెస్బిటేరియన్ వారికి, అక్కడ మరుగుపర్చుకొని, నిలబడియుండగా ఆయనవైపు చూడండి. తిన్నగా బహిరంగముగా తన్నుతాను బయలు పర్చుకొంటూ, అన్ని రకములైన కార్యములను చూపుచున్నాడు, వార్తా పత్రికలలో సహితము, ఆ కార్యములు ప్రచురించబడ్డాయి, ఇంకనూ వారు దానిని చూడరు. ఓ, మన దేవుడు, ఎంత గొప్పవాడు, ఆయన కిష్టమైన వారికి తన్నుతాను బయలు పర్చుకొనుచున్నాడు.

"ఓ," నీవంటావు, "సోదరుడు జోన్స్, లేక పలానా-పలానా సోదరుడు, అతడు చాలా గొప్పవాడు, అతడు దానిని చూస్తాడు." ఓ, లేదు. ఆయనకిష్టమైన వారికి అది ఆయన బయలు పర్చుకొంటాడు. "నా భార్య దానిని చూచుట లేదు, ఆమె ఒక క్రైస్తవురాలు," అంటావు. ఆయన తనకిష్టమైన వారికి తన్నుతాను బయలు పర్చుకొంటాడు, చూచారా. "మంచిది, నా కాపరి ఒక గొప్ప వ్యక్తి." అది నిజమే, కాని ఆయనకిష్టమైన వారికి తన్నుతాను బయలు పర్చుకొంటాడు. ఇప్పుడు, ఏమి బయలు పర్చబడిందో పరీక్షించు, అప్పుడు ఏమి సంభవించుచున్నదో, నీవు బాగా అర్థము చేసికొంటావు.

69అలాగైతే ఇప్పుడు మనము గమనించవచ్చు, అది ఒక మనిషి గ్రంథము కాదు, అది ఒక దేవుని గ్రంథమైయున్నది. అది మనిషిదైయుంటే… ఇప్పుడు అది ఎలా దానికై అది వ్యక్తపర్చబడిందో చూద్దాము. అది వ్రాసియున్న, మనుష్యుల యొక్క పాపమును అది ఎలా బహిర్గతము చేయుచున్నదో చూడండి. గమనించండి, దాని దినమున జీవించిన మనుష్యులు. ఉదాహరణకు - అబ్రాహాము "విశ్వాసమునకు తండ్రిగా" పిలువబడ్డాడు, గమనించండి… అబ్రాహామే స్వయముగా ఈ గ్రంథమును ఆయన మీద, మరియు ఆయన యొక్క సొంత పిరికితనము మీద వ్రాయవలసి వస్తే, మీరు ఆలోచించండి? ఆ ఉదయమున అతడు రాజుతో, ఆమె అతని భార్యయైయుండగా, ఆమె అతని చెల్లెలని అబద్దమాడాడని, అతడు వ్రాసియుండేవాడంటారా, మీరు ఊహించండి? అతడు చేసిన పిరికి పనులను గూర్చి వ్రాసేవాడంటారా? నిశ్చయముగా, అతడు వ్రాసేవాడు కాదు.

తన మోసములో యాకోబు సంగతి ఏమిటి? యాకోబు ఒక చిన్న మోసగాడు. ఒక మనిషి, ఒక హెబ్రీయుడు, తన హెబ్రీ సోదరుని గూర్చి వ్రాస్తూ, ఆయనలో ఇశ్రాయేలీయులందరూ పిలువబడ్డారు, ఆ మొత్తము దేశానికి తండ్రియైన వాని మోసమును గూర్చి వ్రాయుటకు ధైర్యము చేసేవాడంటారా? యాకోబు నుండి, పితరులందరూ వచ్చారు; పితరుల నుండి గోత్రములు వచ్చాయి. దాని అంతటి యొక్క పునాది రాయిని, ఒక మోసగాడిగా బహిర్గతము చేస్తుంది. అది నిజమేనా? మనుష్యులు దానిని వ్రాస్తారని నీవు అనుకొంటావా? లేదండి!

70ఈ భూమి మీద వారు ఎన్నడైనా కలిగియున్న అతి గొప్ప రాజు, ఒక కిరీటధారి; దావీదు, వ్యభిచారము చేయుటను గూర్చి ఒక మనిషి వ్రాయవలసి వస్తే ఏమిటి? ఆ యూదులు అత్యంత ఘనుడైన వారి రాజు ఒక వ్యభిచారి అని వ్రాసియుండేవారా? ఓ, "జార్జ్ వాషింగ్టన్ ఎన్నడూ ఒక అబద్దము చెప్పలేదు," అని మనము చరిత్రను కలిగియున్నాము, మరియు అలాటి విషయాలు. అది చరిత్ర అని మనము పిలుస్తాము. కాని ఇతను ఒక మనిషి బైబిలు దావీదును ఒక, "వ్యభిచారి," అని పిలుస్తుంది. అతడు అదే. ఇశ్రాయేలు రాజు, ఒక వ్యభిచారి… యేసు, దావీదు యొక్క కుమారుడుగా యుండవలసియున్నాడు. తల రాయియే; శరీరప్రకారము ఆయన తండ్రి ఒక వ్యభిచారి. యూదులు అలాటి గ్రంథమును ఎన్నడూ వ్రాయరు. ఒక మనిషి తన్ను గూర్చి దానిని వ్రాస్తాడా? నిశ్చయముగా వ్రాయడు.

HEB 1:1

 

71గర్విష్టి దేశమైననా ఇశ్రాయేలు ఎలా దానిని చేస్తుంది? (వారు ఎంత గర్విష్ణులో నీకు తెలుసా?) గర్విష్టి దేశమైన ఇశ్రాయేలు, వెళ్ళి వారి వారి యొక్క విగ్రహారాధన గూర్చి దేవుని పట్ల వారి తిరుగుబాటును గూర్చి, వారు చేసిన మురికి కార్యములను గూర్చి, వారికి వ్యతిరేకమైన మురికిని గూర్చి ఒక గ్రంథము వ్రాయుటయా? వారు నిశ్చయముగా దానిని దాచేవారు. వారు మంచి కార్యములను చూపియుండేవారు. కానీ ఈ బైబిలు ఏది మంచో ఏది చెడో చెపుతుంది. యూదులు అలాటి ఒక గ్రంథమును, వారి మురికిని గూర్చి, వారి విగ్రహారాధనను గూర్చి, వారి అపజయములను గూర్చి, ఎన్నడూ వ్రాసియుండే వారు కాదు. వారు ఎన్నడూ దానిని వ్రాయలేదు. ఓ, లేదు.. అలాగైతే ఎవరు దానిని వ్రాశారు? హెబ్రీ 1:1లో బైబిలు చెప్పింది, "పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు." అప్పుడు అది ప్రవక్తలు కాదు, అది మర్త్యమైనది కాదు. "దేవుడు!" "నానా సమయముల లోని ప్రవక్తలు" కాదు. కాని "నానా సమయములలోని దేవుడు, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు." నేను ఒక లేఖనమును ఇక్కడ వ్రాసుకొనియున్నాను. అది ఏమిటో నాకు తెలియదు; నేను దానిని సూచించలేను. సాధారణముగా, నేను వీటిని సూచిస్తున్నప్పుడు, నేను లేఖనము వైపు చూస్తాను, మీరు నన్ను మన్నించినట్లైతే ఒక్క నిమిషము, నేను దానిని చూసాను. అది రెండవ తిమోతి 3:16. నేను దానిని గుర్తుంచుకొంటాననుకొన్నాను, కాని నన్ను మన్నించండి. అది ఏమైయున్నదో తెలుసుకొనుటకు నేను ఒక్క నిమిషము ఆగుతాను.

2TIM 3:16,17•

HEB 1:1

 

72"పూర్వకాలమందు నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు." ఇప్పుడు, II తిమోతి 3:16. అది ఏమి చెపుతుందో చూద్దాం 3:16

ప్రతి లేఖనము [అవును!] దైవావేశము వలన ఇవ్వబడినది [ప్రవక్తలు? కాదు! దేని యొక్క దైవావేశము?] దేవుడు, మరియు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజన కరమైయున్నది:

దైవజనుడు సన్నద్ధుడై, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు.

మంచిది, అలాగైతే లేఖనమంతయూ ప్రేరేపణ ద్వారా వ్రాయబడింది. యేసు భూమి మీద యుండగా అన్నాడు, భూమ్యాకాశము గతించును గాని ఆయన మాటలెన్నడూ గతించవు. లేఖనములన్నియూ నెరవేరవలసియున్నదని ఆయన చెప్పాడు. కాబట్టి, అప్పుడు ఈ గ్రంథము మనిషి వ్రాతలతో కూడినది కాదు; అది దేవుని యొక్క వ్రాతలతో వ్రాయబడిన గ్రంథములైయున్నవి.

73ఇప్పుడు, ముందు నిర్ణయము ద్వారా దేవుడు ఆయన సంఘమును ఎన్నుకొంటాడని మనకు తెలుసు, ఆయన స్థలము, ఆయన ప్రవక్తలు, దానిని గూర్చి అంతా. తన ముందు జ్ఞానము ద్వారా, ఆయన తన ప్రవక్తను ముందుగా నిర్ణయిస్తాడు. ఆ యుగము వచ్చినప్పుడు, అదే సమయములో ఆయన ప్రవక్త వచ్చుటను ఆయన కలిగియుంటాడు. అతని ద్వారా ఆయన బైబిలు వ్రాసినప్పుడు, అతనిని ప్రేరేపించియున్నాడు. ఇప్పుడు, ప్రవక్తను వాడుకొనుట ద్వారా మాత్రమే దేవుడు బైబిలును వ్రాశాడు, కారణము దానిని చేయుటలో అది ఆయన విధానమైయున్నది… కాబట్టి, చూడండి, అది దేవుని యొక్క మాటయై యున్నది, మనిషి మాట కాదు.

DAN 5:5,27

 

74దేవుడు ఒక వ్యక్తియైయున్నాడు. దేవుడు మాట్లాడగలడు. దేవుడు ఉచ్చరించగలడు. ఆ విధానములో ఆయన చేయవలసిన పనిలేదు. కాని అలా చేయుటకు ఆయన ఎన్నుకొన్నాడు. ఆ విధానములో ఆయన చేయవలసిన పనిలేదు, కాని ఆ విధానములో దానిని చేయుటకు ఆయన ఎన్నుకొన్నాడు. ఇప్పుడు నీవంటావు, "దేవుడు తన వ్రేలితో వ్రాశాడా, తన మహనీయమైన వ్రేలితో పది ఆజ్ఞలు వ్రాశాడా. కాబట్టి దేవుడు వ్రాస్తాడు, స్వయముగా, ఆయన కోరినట్లైతే," చూడండి. కాని ఆయన ప్రవక్తల ద్వారా దానిని వ్రాయుటకు ఎన్నుకొన్నాడు, (చూడండి), ఏలయనగా అది ఆయన గుణలక్షణములై యున్నవి, ఆయన వాక్యము; వారందరూ ఒక భాగముగా, లేక ఆయనలో ఒక భాగముగా, వారి ద్వారా ఆయన దానిని వ్యక్తపరిచాడు, చూడండి. ఆయన తన వ్రేలితో వ్రాశాడు. ఆయన తన వ్రేలుతో బబులోను గోడల మీద వ్రాశాడు, "నీవు త్రాసులో తూయగా, తక్కువుగా కనపడ్డావు." ఆయన తన సొంత వ్రేలితో వ్రాశాడు.

EXOD 3:4•

MATT 3:17•

MARK 1:11•

LUKE 3:22•

JOHN 12:29

 

75దేవుడు మాట్లాడగలడు. దేవుడు మాట్లాడగలడని నీవు నమ్ముతావా? మండే పొదలో ఆయన పర్వతము మీద మోషేతో మాట్లాడాడు. మీరు దానిని నమ్ముతారా? అవునండి. పావురము ఆకారములో - ఆయన యోహానుతో మాట్లాడాడు. మీరు దానిని నమ్ముతారా? అదే, "ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నివసి౦చుటకు నేను ఇష్టపడుచున్నాను," ఆయన అతనితో మాట్లాడాడు. పేతురు, యాకోబు, యోహాను ముందు, రూపాంతరపు కొండపై ఆయన యేసుతో మాట్లాడారు. ఒక గొప్ప జనసమూహము ముందు ఆయన యేసుతో మాట్లాడాడు; అప్పుడు, ప్రజలు అది ఉరిమినదని చెప్పారు. కాని అది దేవుడు, యేసుతో మాట్లాడుటయైయున్నది. మత్తయి, మార్కు, లూకా, యోహాను అంతటిలో యేసు మాట్లాడుచున్నాడు. ఆయన దేవుడైయున్నాడు. కాబట్టి, దేవుడు మాట్లాడగలడు.

MATT 5:18•

JOHN 10:35•

HEB 1:1

 

76ఒక దినమున, ఆయన తన సొంత వ్రేళ్ళతో ఇసుక మీద వ్రాశాడు. ఆయన మాట్లాడాడు, ఆయన బోధించాడు. తన సొంత పెదవులతో ప్రవచించాడు, ఆయన శరీరధారియై భూమి మీద నివసి౦చినప్పుడు, దేవుడు చేశాడు. "దేవుడు శరీరములో ప్రత్యక్షపర్చబడ్డాడు." ఆయన వ్రాయగలిగినట్లైతే, మాట్లాడగలిగినట్లైతే, ఇతరులు ఏమి చేయాలో కూడా ఆయన చెప్పుతాడు? నిశ్చయముగా చేయగలడు. మానవ స్వరముతో ఆయన మాట్లాడగలడు. ఆయన వ్రాయగలడు మరియు వారు ఏమి చేయాలో చూపగలడు. ఆయన దానిని చేశాడు. కాబట్టి, "నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు." ఈ వ్రాతల మీద ఆయనేమన్నాడంటే, "అది నెరవేరు వరకు ఒక పొల్లు గాని, చిన్న మాట గాని ఎన్నడూ గతించదు," అప్పుడు అది ప్రత్యక్షపర్చబడుతుంది. అప్పుడు అది నెరవేరుతుంది, ఏలయనగా అది ప్రత్యక్షపర్చబడింది. జాట్ అనగా భావము, "చిన్న మాట." టైటిల్ అనగా భావము, "చిన్న పొల్లు." కనీసము ఒక పొల్లు గాని, ఒక చిన్న మాట గాని, దేవుని వాక్యములో ఎన్నడూ తప్పిపోదు. అది తప్పిపోదు, కారణము అది దేవుడైయున్నాడు, దేవుడు మానవ రూపములో ప్రత్యక్షపర్చబడ్డాడు. కారణము, అది వాక్యరూపములోయున్న దేవుడే స్వయముగా, ప్రవక్త రూపము, శరీరములో ప్రత్యక్షపర్చబడ్డాడు. ఇప్పుడు, ఆ కారణమును బట్టియే యేసు అన్నాడు, "దేవుని వాక్యము ద్వారా, మీతో మాట్లాడిన వారిని మీరు 'దైవములు,' అని పిలిచారు," వారు "దైవములైయున్నారు." ఆ ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడినప్పుడు, వారు ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యమును తెచ్చియున్నారు. అప్పుడు వారు దైవములైయున్నారు. అది దేవుని యొక్క వాక్యము వారి ద్వారా మాట్లాడుచుండెను.

2PET 1:20,21

 

77గ్రంథకర్త అనువాదము చేయుటకు అనుమతించినంత వరకే వారు దానిని అనువాదము చేశారు. ఇప్పుడు, మీరు దానిని కనుగొనగోరినట్లైతే, అది II పేతురు 1 మరియు 20 మరియు 21 వచనము. మంచిది, ఏలయనగా, దేవుడే తన సొంత అనువాదమును చేస్తాడు; వేరే అనువాదము లేదు. దేవుడు మాట్లాడును మరియు తనకుతానే దానిని అనువదించును, తరువాత ఆయనకిష్టమైనవారికి ఆయన దానిని బయలుపర్చుతాడు, ఇతరులకు దానిని దాచియుంచును. ఆయన కిష్టమైతే తప్ప, ఆయనెవరికీ దానిని బయలుపర్చనవసరము లేదు. ఆయన సమస్తమును లేఖనములో వ్యక్తపర్చాడు; అందుచేత సమస్తము ఇది వరకే తెలియపర్చబడింది; అది సరిగ్గా అక్కడ యుండి, అది సంభవించుటకు ఆయన కనిపెట్టుచున్నాడు, అది తిరిగి దాని రూపమునకు వచ్చుటకు, తిరిగి తన వధువుగా తయారు చేయబడుటను చూస్తున్నాడు. మంచిది.

HEB 4:12

 

78అబ్రాహాము వలె అవి యున్నవి లేవన్నట్లుగానే వ్యతిరేకముగా పిలిచి యున్నట్లుగా, విశ్వాసులు వాటిని నమ్ముతారు.

ఇంకా ఈ వాక్యము — హృదయ రహస్యములను వివేచిస్తుంది, హెబ్రీ 4:12. అది హృదయ రహస్యములను వివేచిస్తుంది.

HEB 1:1

 

79ప్రవక్తలు ఎల్లప్పుడు, వారు ఏమి వ్రాయుచున్నారో, వారు ఏమి మాట్లాడుచున్నారో వారు గ్రహించలేదు, వారికి అది అర్థమైయుంటే, వారు దానిని చెప్పేవారు కాదు, చూడండి. కాని బైబిలు చెప్పింది, "వారు పరిశుద్ధాత్మ ద్వారా కదిలించబడారు." కదిలించబడుట! పరిశుద్దాత్ముడు నిన్ను కదిలించినప్పుడు, నీవు కదులుతావు, "పరిశుద్ధాత్మ ద్వారా కదిలించబడిన ప్రవక్తల ద్వారా, దేవుడు పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడియున్నాడు." ఆ కారణము చేతనే, యుగములన్నిటి గుండా, కాలములను గూర్చి ఏమి సంభవిస్తుందో, ఆత్మ సంబంధముగా వారు ప్రవక్తలను సంప్రదించియున్నారు. ప్రవక్త ఎల్లప్పుడు గ్రంథకర్తతో తప్పక సహవాసమును కలిగియుండాలి, చూడండి. ఈ గ్రంథము ఎలా యుండబోవుచున్నదో తెలుసుకొనుటకు గాను, అతడు ఎడతెగకుండా గ్రంథకర్త యొక్క సముఖములో జీవించాలి, చూడండి. లేఖకుడైన ప్రవక్త, కలమును ఏ సమయములో నైనా కలమును సిద్దము చేసికొని యుంటాడు, దేవుడైయున్న గ్రంథకర్తతో ఎడతెగని సహవాసము కలిగియుంటాడు, ఎందుకంటే ఆయన ఏమి చెప్పుతాడో దానిని వ్రాయుటకు, చూడండి. తన సహోదరులందరి యొద్ద నుండి వేరుచేయబడిన జీవితమును జీవిస్తాడు… అది ఎలాటి జీవితమును అతడు తప్పక జీవించాలో అది చూపుతుంది.

80ఇప్పుడు, ఆ కారణము చేతనే ప్రవక్త, ఎడతెగకుండా దేవుడు చెప్పిన దానిపై తన మనస్సును యుంచుతాడు; మనిషి తలంచినది కాదు, యుగము తలంచినది కాదు, రాజ్యము తలంచినది కాదు. కాని దేవుడు తలంచిన దైయున్నది! దేవుని యొక్క తలంపులను కేవలము, మాటగా వ్యక్తపర్చుతాడు, ఏలయనగా ఒక మాట అది వ్యక్త పర్చబడినప్పుడు ఒక తలంపైయున్నది. ఇప్పుడు, మీకు అర్థమైనదా? మాట ఒక వ్యక్త పర్చబడిన తలంపై యున్నది, కాబట్టి దేవుని తలంపుల కొరకు ప్రవక్త కనిపెట్టుచుండెను. దేవుడు ఆయన తలంపులను అతనికి వ్యక్తపర్చినప్పుడు, అతడు దానిని వాక్యములో వక్తపర్చుతాడు: "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." చూడండి — "ప్రవక్త ఈలాగు చెప్పుచున్నాడు," కాదు — "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!" చూడండి. మంచిది.

ఆ కారణము చేతనే వారు రాజ్యములను జయించారు మరియు సంఘ యుగములను జయించారు. వారి దినములలో ఆలాగు చేయుట, ఒక మరణ దండనైయున్నది. నీవు రాజు యొక్క సముఖమునకు నడిచి వెళ్ళి, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, పలానా-పలానా కార్యము సంభవించబోవుచున్నది" అని చెప్పుట, నీ తల నరికి వేయబడుతుంది. తిన్నగా దానిని చేయుటను బట్టి, సంఘము నిన్ను మరణమునకు అప్పగిస్తుంది. కాని ఈ ప్రవక్తలు ముక్కు-సూటిగా వున్నారు. ఎందుచేత? వారు పరిశుద్దాత్మ చేత కదిలించబడ్డారు, (చూడండి), అందుకే వారు ముక్కు-సూటిగా యున్నారు. వారు తప్పిపోని దేవుని వాక్యమును వ్రాసియున్నారు.

81అనేకమంది ప్రవక్తలను అనుకరించాలనుకొన్నారు. యాజకులవలె, వారు ఏమి చేశారు? కలగలుపయ్యారు, అంతే, వారు దానిని చేయలేకపోయారు, ఏలయనగా, దేవుడు ఆ యుగము కొరకు మనిషిని ఎన్నుకొన్నాడు, వర్తమానమును ఎన్నుకొన్నాడు, మరియు ఆ యుగములో ఆ మనిషి యొక్క స్వభావమును సహితము, అతని మీద ఆయన యుంచే దానిని ఆయన ఎన్నుకొన్నాడు. ఆ నిర్ణీతమైన మనిషిలో యున్న స్వభావమును బట్టి, ఆయన ఇతరుల యొక్క నేత్రములను గ్రుడ్డివిగా చేస్తాడు. ఆ మనిషి చెప్పే మాటలు, అతడు ప్రవర్తించే తత్వం ఇతరుల నేత్రములను గ్రుడ్డివిగా చేసి, కొందరి నేత్రములను తెరుస్తాడు, చూడండి. అతడు ఎలాటి వస్త్రములతో యుండాలో, ఆలాగున ఆయనా మనిషికి బట్టలు కప్పుతాడు. అతని స్వభావము, అతని లక్ష్యము, అతడు యుండవలసిన విధానములో సమస్తమూ, సరిగ్గా అతడు యుండవలసినట్లుగా యుంటుంది. ఆ నిర్ణీతమైన యుగములో, ఆ ఎన్నుకొనబడిన నిర్ణీతమైన ప్రజలకు సరిగ్గా పరిపూర్ణముగా యుంటుంది. ఇతరులు నిలబడి అతని వైపు చూస్తుండగా, వారంటారు, "నేను దానిని చూడలేను…" మీరు చూచారా, వారు గ్రుడ్డి వారుగా చేయబడ్డారు.

82యేసు కూడా అదే విధముగా వస్త్రము ధరించినవాడై వచ్చాడు. అమర్త్యుడైన దేవుడు మానవ శరీరములో వస్త్రములు ధరించాడు, ఏలయనగా పూర్తిగా పేడతో యున్న, పశువుల పాకలో, ఒక పశువుల తొట్టిలో ఆయన జన్మించియున్నాడు, ఆయనకు తలవాల్చుటకు స్థలము లేదు; ఒక అక్రమముగా పుట్టినవాడనే పేరును తగిలించుకొని, ఆయన జన్మించాడు, చూడండి. వీటన్నిటితో ఆయనెలా పైకి వచ్చాడో చూడండి, ఒక వడ్రంగివాని కుమారుడుగా, ఆయన ఏ విద్యను అభ్యసించలేదు. దరిదాపుగా, ఈ ప్రపంచములో, ఈ లోకజ్ఞానముతో, ఆయన చేయునది ఏమియు లేదు; ఈ లోకజ్ఞానము, విద్య, లేక మరేదైనను ఏమియు కాదు, దానితో ఆయన చేయునది ఒక్కటి లేదు, ఎందుకనగా ఆయన దేవుడైయున్నాడు. అది ఘర్షణ పడుతుంది. ఈ లోక సంబంధమైన సంఘములు చేసినట్లుగా, ఆయన ఎక్కడో ఒక వేదాంత పాఠశాలకు వెళ్ళి, ఏదో నేర్చుకొనుటకు ప్రయత్నిస్తే, అది ఆయన గ్రహింపుతో ఏ మాత్రము పొసగదు, ఏలయనగా ఆయన దేవుడైయున్నాడు. కాబట్టి, విద్య, పాఠశాల, వేదాంత పాఠశాలలు, మరియు ఇవన్నీ పరిపూర్ణముగా దేవుని చిత్తమునకు వ్యతిరేకమైయున్నవి. మొత్తము విద్యా ప్రణాళిక అంతయూ దేవునికి వ్యతిరేకమైనది. సమస్తమూ అది ఎల్లప్పుడూ, దేవునికి దూరముగా భోధిస్తుంది. ఒక మనిషి నేను డాక్టర్., పిహెచ్.డి, ఎల్.ఎల్ క్యూ, అన్నప్పుడు, నాకు అది అంతెక్కువ దూరముగా దేవుని నుండి యుంటుంది, చూడండి. అతడు పిలువబడిన దాని కంటే అంత ఎక్కువ దూరముగా అతడు విద్యను అభ్యసించాడు. అది నిజము.

ఇప్పుడు వారు పరిశుద్దాత్మ ద్వారా ఎలా నడిపింపబడ్డారో గమనించండి.

1COR 2:1,4,5

 

83ఇప్పుడు, చదువుకొన్న వారు లోపలికి రారని నా భావము కాదు. పౌలు వైపు చూడండి. పౌలు కంటే చురుకైనవాడు అతని దినమున అక్కడ ఎవరూ లేరని నేను ఊహిస్తాను, అతడే తార్సువాడైన సౌలు. అతడు గమలీయేలు క్రింద, విద్యను అభ్యసించినవాడు, అతని దినమున యున్న అతి గొప్ప పండితులలో ఒకడు; ఒక గొప్ప, కఠినమైన హెబ్రీయుడు, ఒక పరిసయ్యుల సంస్థకు చెందినవాడు — పౌలు అతని క్రింద పెంచబడ్డాడు. అతడు యూదా మతమంతా ఎరిగినవాడు; కాని అతడు సంఘము నొద్దకు వచ్చినప్పుడు, అతడన్నాడు, "నేను మానవుని విద్యతో మీ యొద్దకు ఎన్నడూ రాలేదు, కారణము నేను వచ్చియున్నట్లయితే - అప్పుడు మీరు దానియందు నమ్మక ముంచేవారు. కాని మీ విశ్వాసము దేవునిలో యుండాలని, దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతతో నేను మీ యొద్దకు వచ్చాను." అక్కడే నీవున్నావు. అది సత్యము.

MATT 24:24•

MARK 13:22

 

84అనేక మంది ఈ ప్రజలను అనుకరణ చేయటానికి ప్రయత్నించారు, కాని వారు ఈ రోజు చేసినట్లుగా, అన్నీ కలగలుపు చేశారు.

యేసు కాలమునకు ముందు ఒకడు అక్కడ లేచాడు, నాలుగు వందల మందిని తప్పుదారి పట్టించాడు. ఆ సమయము రాకముందు దానిని చేయుటకు ప్రయత్నించుటను గూర్చి లేఖనములు దానిని ఎలా చెప్పుచున్నావో, మీకు తెలుసా, వారిలో కొందరు ఆయనను అనుకరణ చేయుటకు ప్రయత్నించారు. అందరూ ఇది, అది లేక మరొకటి అన్నారు. "చివరి దినములలో ఎలా అబద్దపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు అద్భుతములు మరియు సూచక క్రియలను ఎలా జరిగిస్తారో," ఆయన చెప్పాడు. అదంతా మనము కలిగియున్నాము, చూడండి. కాని అది నిజమైన దానిని తీసి వేయలేదు. అది కేవలము ఇంకా దానిని ప్రకాశించునట్లు చేస్తుంది, ఏలయనగా మనము నిజమైన క్రీస్తును కలిగియున్నాము, ఒక అబద్దికుడు కాదు.

EXOD 4:10-12•

JER 1:9

 

85ఇప్పుడు, దేవుడు తన ప్రవక్తలను పంపాడని మనము గ్రహిస్తాము. తన యొక్క ప్రవక్తల పెదవుల ద్వారా, ఆ మార్గములోనే ఆయన ప్రజలకు ఆయన వాక్యమును తెచ్చుచున్నాడు. గమనించండి, మీకు తెలుసా, మోషే అన్నాడు, మీరు దానిని చదువగోరితే నిర్గమ కాండము 4వ అధ్యాయము 10 మరియు 12 వచనములు. దేవుడు అతనితో మాట్లాడాడని మోషే అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడాడు, పెదవి నుండి చెవికి. మోషే అన్నాడు, "నేను నోటి మాంధ్యముగల వాడను," "నేను సరిపోయిన వాడను కాదు, నేను వెళ్ళలేను."

ఆయన అన్నాడు, "మనిషికి మాట ఇచ్చింది లేక మూగవానిగా చేసింది ఎవరు? అతనికి దృష్టి నిచ్చింది లేక అతనికి వినికిడి నిచ్చింది ఎవరు? యెహోవా నైన నేనే గదా?" "నేను నీ నోటికి తోడుగా యుంటాను," చూడండి. కావున…

యిర్మీయా అన్నాడు — మీరు దానిని చదువగోరినట్లైతే, యిర్మీయా 1:6 — "దేవుడు నా నోట మాటలు ఉంచియున్నాడు," అని యిర్మీయా అన్నాడు, చూడండి. ఆయన పెదవి నుండి చెవికి, ఒక ప్రవక్తతో మాట్లాడాడు, మరొక ప్రవక్త ద్వారా మాట్లాడాడు, ఆయనకు నియంత్రణ లేదు, తన పెదవుల గుండా మాట్లాడాడు.

EXOD 19:19•

EXOD 24:4•

JER 1:6,7

 

86ఆయన వాక్యమును బయటకు పంపుటకు ఆయన మార్గములను కలిగియున్నాడు, మీకు తెలుసా, అవునండి.

కాబట్టి మీరు చూడండి, బైబిలు దేవుని వాక్యమైయున్నది, మనిషి మాట కాదు. మోషే అన్నాడు, "దేవుడు స్వరముతో నాతో మాట్లాడాడు, నేను ఆయన మాట విన్నాను. ఆయనేమి చెప్పాడో నేను వ్రాశాను."

యిర్మీయా అన్నాడు, "నేను ఏ మాత్రము మాటలాడలేను, మొదటి విషయము మీకు తెలుసా, నా పెదవులు మాట్లాడుచున్నాయి, మరియు నేను వ్రాయుచున్నాను." దేవుడు అతని పెదవుల గుండా మాట్లాడాడు, అది నెరవేరింది. దానియేలు, యెషయా, ఆ ప్రవక్తలందరూ అలాగే యున్నారు.

87మీకు తెలుసా, పాత నిబంధన ఒక్క దానిలోనే, రెండువేల సార్లు కంటే ఎక్కువగా ప్రవక్తలు, "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పారు. ఇప్పుడు ఒక మనిషి "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పినట్లైతే, అది ఆ మనిషి మాట్లాడుట కాదు. అతడు దానిని చెప్పినట్లైతే, అతడు ప్రవక్త కాదు, అతడు ఒక వేషధారి, (చూడండి); ఏలయనగా అది ఎన్నడూ నెరవేరలేదు. పదివందల-వేలసార్లలో (చూడండి) వారు ఊహించే ఒక్క అవకాశము కలదు. కాని అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," యైనట్లైతే ప్రభువైన దేవుడు దానిని చెప్పియున్నాడు. "ఆర్మెన్ నెవిల్ ఈలాగు చెప్పుచున్నాడు…" అంటే, నా సోదరుడు, "శ్రీ. మాన్ ఈలాగు చెప్పుచున్నాడు," అంటే, "సోదరుడు వేల్ ఈలాగు చెప్పుచున్నాడు," అంటే, ఈ సోదరులలో కొందరు, మీలో ఎవరైనా; నీవు ఏమి చెప్పావో నేను దానిని మాట్లాడుచున్నాను. నేను యధార్థముగా యున్నట్లైతే, నీవు సరిగ్గా ఏమి చెప్పావో దానినే నేను చెప్పుచున్నాను. మరియు ఈ మనుష్యులు, ప్రవక్తలుగా ఉండి, చెప్పిరి, "ఇది నేను కాదు. దీనితో నేను చెయ్యాల్సింది ఏమియూ లేదు, అయితే ఇది 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా'" ఉన్నది. కావున బైబిలు అనేది ప్రవక్తల ద్వారా వచ్చిన "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా" ఉన్నది.

ISA 53:5•

ACTS 8:34

 

88గమనించండి. వారు క్రీస్తు ఆత్మను వారిపైకి తీసుకొన్నారు. మరియు సంభవించబోవు సంఘటనలను ముందుగా చెప్పియున్నారు. ముందుగా సంభవించబోవు సంఘటనలను గురించి — వారు కూర్చొని, నిలబడి, పండుకొని, వారి మీద క్రీస్తు ఆత్మను కలిగి నడుచుచుండగా, యుగము క్రింద వరకు ఏమి సంభవిస్తుందో వారు చెప్పారు. ఎంత మట్టుకనగా వారు క్రీస్తు వలె ప్రవర్తించియున్నారు. పాఠకులందరూ దానిని చదివినప్పుడు, ప్రవక్తలు అది వారి గురించి చెప్పుకొనుచున్నారని తలంచారు. మీకు గుర్తున్నదా, నపుంసకుడు యెషయా 53:1, చదువుచుండగా, అది ఎలా, "ఆయన మన అత్రిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొందియున్నాము? నపుంసకుడు ఫిలిప్పుతో అన్నాడు, "ప్రవక్త మాట్లాడుచున్నది తన్ను గూర్చియా మరొకరి గూర్చియా?" చూడండి, అది ప్రవక్త తానేయై యున్నట్లుగా మాట్లాడాడు.

PS 16:10•

PS 22:1,16,17

 

89ఆత్మలో విలపించుచున్న దావీదును చూడండి, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి? నా ఎముకలు, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు," [దావీదు]. "వారు నా చేతులను పాదములను పొడిచియున్నారు," [దావీదు]. "వారు నా చేతులను పాదములను పొడిచియున్నారు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు," దావీదు తన్ను గూర్చి పరిశుద్ధునిగా మాట్లాడుచున్నాడు. అది దావీదు కుమారుడైయున్నాడు, అది అంకురము కలిగియున్నది, ఆత్మ సంబంధమైన విత్తనము క్రిందకి వచ్చుచున్నది. దావీదు తనకై తాను ఒక గురుగు గింజల్లెయున్నను, కాని లోపల అక్కడ గోధుమ గింజ యున్నది. మీకు అర్థమైనదా? కాబట్టి, బైబిలు అంతా ఒక మనిషి మాట కాదు, లేక అది మనిషి ద్వారా వ్రాయబడలేదు, మనిషి ద్వారా తేబడలేదు, లేఖ మనిషి ద్వారా అది బయలుపర్చబడలేదు. అది దేవుని మాటయై, స్వయముగా దేవుని ద్వారా బయలుపర్చబడియున్నది, ఆయనే తన సొంత అనువాదకుడు, క్రీస్తు తన సొంత వాక్యమందు బయలుపర్చబడ్డాడు.

EXOD 3:5,10,12•

EXOD 4:20•

PS 22:1,8,12,16,17•

MATT 27:43,46•

MARK 15:34

 

90ఆ వెనుక దావీదులో నిలబడియున్న క్రీస్తును చూడండి. దావీదు కనీసము దానిని ఆలోచించలేడు. ఆయన మనస్సు గతించి పోయినట్లు యున్నది. ఇక్కడి ప్రతిమ వలె మీరు చూస్తున్నట్లుగా, ఆయన సిలువ మీద వ్రేలాడుచున్నాడు; సిలువ మీద వ్రేలాడుచూ ఆయన మొరప్రెట్టుచున్నాడు, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడనాడితివి? నా ఎముకలన్నియూ నేను లెక్కింపగలను, వారు నా పాదములను, నా చేతులను పొడిచియున్నారు. వారు నా ప్రక్కను పొడిచియున్నారు," చూడండి. "నీవు నాకు ఎందుకు దూరముగాయున్నావు? బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. వారు వారి తలలను ఆడించుచున్నారు, 'అతడు దేవుని యందు విశ్వాసముంచాడు, అతనిని విడిపించునని; ఇప్పుడు ఆయన వచ్చి విడిపిస్తాడేమో చూద్దాము,'" అదే మాటలను వారు మాటలాడుచున్నారు. కాబట్టి మీరు చూడండి, దేవుడు భూమి మీద ప్రత్యక్షపర్చబడినప్పుడు, దావీదు చెప్పిన మాటలనే ఆయన చెప్పాడు. మీకు అర్థమైనదా? మీరు చూడండి, అది మనిషి యొక్క మాట కాదు; అది దేవుని యొక్క మాటయైయున్నది. అక్కడ దావీదులో దేవుడున్నాడు; అది దావీదు కాదు. అతడు ఏమి చెప్పుచున్నాడో అతనికి తెలియదు; అతడు ఎంతో ఆత్మతో యున్నాడు. ఆ విధముగానే మోషే యున్నాడు. అతడు ఎంతగా ఆత్మలో యున్నాడంటే, అతడు జీవించుచున్న కోణమును దాటినవాడై, మండుచున్న పొద దగ్గర, ముఖాముఖిగా దేవుని ముందు, దేవుని ముందు నిలిచి, దేవునితో స్వయముగా మాట్లాడుచున్నాడు. "నీవు నిలబడియున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువుము," అని ఆయన అన్నాడు.

మోషే ఆ స్థలమును విడిచినప్పుడు, నేననుకొంటాను, "ఏమి సంభవించింది? ఏమి జరిగింది? అది ఏమిటి?"

"ఐగుప్తుకు వెళ్ళు; నేను నీతో వస్తాను" అన్నాడు.

అతడన్నాడు, "అది నాకు ఎంతో యధార్థముగా యుంది, నేను తప్పక వెళ్ళాలి," అతడు తన భార్యను, తన బిడ్డను, మరియు తన కర్రను తీసుకొని, ప్రజలను విడిపించుటకు ఐగుప్తుకు వెళ్ళాడు, చూడండీ.

ISA 53:1,5

 

91దేవుడు, స్వయముగా ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు.

చూడండి, అది ప్రవక్తలు కాదు, అది పరిపూర్ణముగా దేవుడైయున్నాడు; ఏలయనగా ప్రవక్త, వారికై వారు ఆ సంగతులు చెప్పలేరు. "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?" అని యెషయా మాట్లాడుచున్నాడు, మీరు చూడండి. "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలు పరచబడెను? అతడు మనముందు పాకలోని దూడవలె పెరిగెను." అది ఎలా… "ఇంకనూ, మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపర్చబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; ఆయన పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత పొందియున్నాము." మనము స్వస్థత నొందియున్నాము, ఈ యుగములో యున్న మనము; యెషయా, క్రీస్తుకు ముందు, అదిగో ఎనిమిది వందల సంవత్సరముల క్రితము చెప్పాడు, చూడండి. "ఆయన పొందిన దెబ్బల చేత, (జరిగిపోయిన కాలము) ఇదివరకే స్వస్థపడియున్నాము." ఓ, మై, దేవుని యొక్క వాక్యము ఎంతో పరిపూర్ణమైనది. ప్రజలారా, దానియందు నమ్మకముంచండి; అది మాత్రమే నిన్ను రక్షించగలదు.

GAL 1:8

 

92మిగిలిన మాటలన్నీ — అవి ఎంత చక్కగా యుంచబడినప్పటికి, అవి ఎవరి దగ్గర నుండి వచ్చినప్పటికీ, ఏ సంఘ శాఖ నుండి వచ్చినప్పటికి, లేక మనిషి ఎంత చురుకైనవాడైనప్పటికి, నేను లెక్క చెయ్యను, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా యున్న ఏదైనా అది పరిపూర్ణముగా మరవబడుతుంది. మీరు లేఖనాన్ని వ్రాసుకోవాలను కొనుచున్నారా, అది గలతీ 1:8, చూడండి. పౌలు చెప్పెను, "మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చినొక దూతయైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక." మరొక మాటలో, ఒక దేవదూత, ప్రకాశమానమైన వెలుగుతో ప్రకాశించుచున్న దూత, పరలోకము నుండి దిగివచ్చినను, నిలబడి, (అబ్బాయి, అది ఈ రోజున ఎరగా యున్నది, అది కాదా?) ఒక ప్రకాశమానమైన వెలుగుతో నిలబడి, వాక్యమునకు విరోధముగా ఏదైనా చెప్పినట్లైతే, నీవు చెప్పు, "సాతానా, నా నుండి దూరముగా వెళ్ళీపొమ్ము." నిజము. అతడు బిషప్పువాడైనా, అతడు ఎవరైయున్ననూ, ఇతడు ఖచ్చితముగా బైబిలు ప్రకారము వాక్యము వెంబడి వాక్యమును మాట్లాడకపోతే, అతనిని నమ్మవద్దు. అతనిని గమనించుము, బైబిలుతో నిన్ను అతడు కొనిపోతాడు. ఇతడు ఒక నిర్ణీతమైన స్థలానికి నిన్ను అతడు కొనిపోతాడు, మరియు అప్పుడు తిన్నగా అక్కడ దానిని బిగిస్తాడు. బైబిలు ఒక దానిని చెపుతూయుండగా, అతడు దానిని దాటి వేసినప్పుడు, అక్కడే అతనిని గమనించుము. చూడండి, ఆ మార్గములోనే వాడు హవ్వకు చేశాడు. వాడు తిన్నగా వచ్చి సమస్తమూ ఖచ్చితముగా చెప్పాడు, "మంచిది, దేవుడు దీనిని చెప్పాడు. హవ్వ, అది నిజమే. ఆమేన్, మనము దానిని కలసి నమ్ముచున్నాము."

"మంచిది, దేవుడు ఇది చెప్పాడు."

"ఆమేన్, మనము దానిని కలసి నమ్ముచున్నాము."

"దేవుడు ఇది చెప్పాడు."

"నిశ్చయముగా, మేము దానిని నమ్ముతాము."

"మంచిది, అయితే మేము చనిపోతామని దేవుడన్నాడు."

"మంచిది, ఇప్పుడు, నీకు తెలుసా, ఆయన మంచి దేవుడు." దానిని ఆయన చేస్తానని చెప్పలేదు, నీకు తెలుసా, "కాని నిశ్చయముగా…" ఓ, నేనా! అక్కడే వాడున్నాడు. వాడు ఆ విధముగా మోసకారియై యున్నట్లైతే, బైబిలు చెప్పింది. "చివరి దినములలో సాధ్యమైతే ఏర్పర్చబడ్డ వారిని సహితము వాడు మోసగిస్తాడు, స్నేహితులారా, మనము ఎక్కడ ఉండవలసినవరమైయున్నాము? ఇప్పుడు, ఈ చిన్న సండే స్కూలు పాఠములు, తప్పక మన హృదయములలో అనుసరించాలి, మీకు తెలుసా, చూడండి… అది తప్పకెంత మోసకరమైనదో మనము జాగ్రత్తగా వినాలి.

PROV 14:12•

PROV 16:25•

2COR 10:5

 

93గమనించండి, తప్పక మనము ఏ మనిషి మాటను వినకూడదు. ఎంత చురుకైనవాడైనా, ఎంత చదువుకొన్నవారైనా మనము లెక్క చెయ్యము. బైబిలు సామెతలలో చెపుతుంది, "మన తర్కములన్నిటిని తప్పక పడద్రోయాలి," చూడండి. ఇప్పుడు, ఇక్కడ రెండవ పరిధిలో… మొదటి పరిధి నీ జ్ఞానేంద్రియములున్నాయి, చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన చూచుట, వినుట, అది నీ భాహ్య శరీరములో యున్నది. లోపల శరీరములో, మనస్సులో, తర్కములు మరియు తలంపు యున్నది. మనము తప్పక దానిని పడద్రోయాలి. మనము తర్కించరాదు. "ఇప్పుడు ఆగండి, ఆయన మంచి దేవుడైనట్లైతే…" ఆయన మంచి దేవుడని ఎంతో మనకు చెప్పబడింది. "ఆయన మంచి దేవుడైతే, అప్పుడు నేను యధార్థముగా యున్నట్లైతే, బైబిలు యధార్థమై యున్నదని నేను చూడలేక పోయినను, నేను యధార్ధముగా యున్నట్లైతే, నేను రక్షించబడతాను." కాదు, నీవు తప్పిపోతావు.

"నేను సంఘమునకు వెళ్ళి, నేను సరియని నమ్మిన కార్యములను చేసినట్లైతే, నేను ఆలోచించేది సరియని పట్టుకొనుటకు ప్రయత్నిస్తే, మంచిది, నేను…" నీవు ఇంకనూ తప్పిపోయావు. "ఒకని యెదుట సరైనదిగా కనబడు మార్గముకలదు, కాని తుదకు అది మరణమునకు నడిపించును," చూడండి. నీవు రక్షించబడవు; నీవు తప్పిపోతావు, చూచారా. అది తప్పక లోపట నియంత్రణ చేయు మనిషై యున్నాడు.

94"మంచిది, బ్రెనాం సోదరుడా, నేను భాషలతో మాట్లాడాను. మంచిది, బ్రెనాం సోదరుడా, నీవు భాషలతో మాట్లాడుటను నమ్మవా?" నిశ్చయముగా. "మంచిది, నేను కేకలు వేశాను, నీవు దానిని నమ్మవా?" అవునండి. "నేను మంచి క్రైస్తవ జీవితమును కలిగియున్నాను, నీవు దానిని నమ్మవా?" అవునండి! కానీ ఇంకనూ అది నీవు రక్షించబడ్డావని అర్థము కాదు. నీవు ఒక మంచి వ్యక్తివి, శుభ్రమైన, నైతికముగా, పరిశుద్ధమైన, మంచి వ్యక్తివి. కాబట్టి, ఆయాజకులు ఎంతో మత నిష్టగలవారైయున్నారు. ఎంత భక్తిగల వారనగా - చివరకు ఒక్క మాటకు తప్పుగా అర్థము చెప్పినా, వారు రాళ్ళతో కొట్టి చంపబడతారు. దేవుని యొక్క వాక్యముతో ఆటలాడుట, వారికి మరణ శిక్షయైయున్నది.

95ఈ దినమున మన దేశముతో వచ్చిన చిక్కు ఏమిటి. దానికి కారణము ఏమనగా ఈ దినమున భూమి మీద, వదులు ఆకుల వంటి కార్యములను కలిగియున్నాము. శిక్షలు తగినంత బలముగా లేవు. ఒక పురుషుడు తన పొరుగువాని భార్యతో పరుగెత్తుతున్నట్లైతే, వారిద్దరిని ప్రజల ముందు నిలబెట్టి, తిన్నగా ప్రజల ముందే వారిని క్యాస్ట్రేట్ చేసి (బీజ గ్రంథులను తొలగించి), వారిని వదిలి పెట్టాలి. అది సత్యము. ఒక మనిషి రోడ్డు మీద వేగముగా వెళుతూ తప్పు చేసినట్లయితే, పది సంవత్సరములకు తగ్గకుండా అతనికి శిక్ష విధించాలి. అది ముందుగా ప్రణాళిక వేసిన హత్య, చూడండి. నీవు వారి మీద అలాటి జరిమానాలు వేసినట్లైతే, వారిని నీవు క్రిందకు అణిచి పెడతావు. అయితే, ఎవరో ఒక వంకర రాజకీయ నాయకుడు దానిలోకి ప్రవేశించి, దానిని అనుమతిస్తాడు. అతడంటాడు, "సరే, అతడు కొంచెము త్రాగియున్నాడు, అది చేయుట అతని భావము కాదు." అతడు ఆ మనిషిని, భార్యను, మొత్తము అమాయకులైన పిల్లలందరిని చంపేస్తాడు. ఆ రిక్కీని దానితో వెళ్ళనిస్తాడు. అదే రాజకీయం. అది లోకమైయున్నది; అది దయ్యము.

LEV 20:10

 

96ఒక స్త్రీ గాని లేక పురుషుడు గాని వ్యభిచారములో పట్టుబడినట్లైతే వారిని బయటకు తీసుకెళ్ళి రాళ్ళుతో కొట్టి చంపమన్నాడు. అది పరిష్కరించబడును, చూశారా. విశ్రాంతి దినముననొకడు ఒక పుల్ల బరువు ఎత్తుతూ పట్టుబడినా, "అతనిని తీసుకొని రాళ్ళతో కొట్టండి. అప్పుడు వారు దాని ద్వారా జీవించారు. ఇప్పుడు, చూడండి, అలాటి నియమములు మనకు ఈ రోజున లేవు, కానీ క్రైస్తవుడు, సంఘము గురించి ఈ ఉదయమున నేను మాట్లాడుచున్నాను, దేవుని యొక్క ధర్మశాస్త్రము నీ హృదయములో యున్నది, చూడండి. దానిని చేయాలను కోరిక నీలోపల లేదు. అదిక్కడ లోన ఉన్నది. దేవుని ధర్మశాస్త్రమును నీవు పరిపూర్ణముగా పాటించాలనుకొనుచున్నావు. అది ఏమైనను లెక్క కాదు, నీవు కేవలము కోరుదువు… ఒకవేళ ద్వారము నొద్ద కాళ్ళు దులుపుకొనే పట్టా దేవునికి అవసరమైనట్లైతే, నీవు ఆ పట్లాగా యుండాలని దేవుడు కోరినట్లైతే, నీవు అలాగు యుండుటకు ఎంతో సంతోషిస్తావు. అది ఏమైననూ, నీవు ఆ ద్వారపు పట్టాగా ఉండాలని కోరెదవు, చూడండి. నీవు దేనిని చేయమని దేవుడు కోరినా, నీవు దానినే చేయగోరతావు, ఏలయనగా అది దేవుడైయున్నాడు. ఇప్పుడు, నిజముగా అక్కడే నీవు నిజమైన, యధార్థమైన, అసలైన దేవుని ప్రేమను కనుగొంటావు.

REV 22:18,19

 

97ఇప్పుడు తరువాత మనము కనుగొనునది ఏమనగా, పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతయైనను… బైబిలులో ఇది వరకే చెప్పియున్న, దానికి మరేదైనా చెప్పితే, వాడు శపించబడును గాక. ఎవరూ దానిని చేయలేరు; అది ఖచ్చితముగా, అది చెప్పబడియున్నట్లుగా యుండాలి.

మరలా మనము ప్రకటన 22:18 మరియు 19లో చదువుతాము: "ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఏదైనను తీసివేసినయెడల, జీవగ్రంథములో నుండి అతని పేరును తీసివేయును." నిజం. అతడు ఒక సేవకుడైనను, మరి ఎవరైనను, దానికి ఏదైనా కలిపినను, దాని నుండి ఏదైనా తీసివేసినను, అతని పేరును జీవగ్రంథములో వ్రాయబడింది. దేవుడన్నాడు, "అతడు దానికి ఒకటి కలిపినా లేక దాని నుండి ఒకటి తీసివేసినా," "అతని పేరును తుడిచి వేస్తాను" (అది నిజము). ఆ విధముగానే తప్పిపోని దేవుడు, ఆయన వాక్యమును సిద్ధపర్చాడు, చూడండి. నీవు సంఘమునకు కలుపవచ్చు లేక సంఘము నుండి తీసివేయవచ్చు, కాని వాక్యమునకు ఏది కలపవద్దు, లేక దాని నుండి ఏదీ తీసివేయవద్దు, ఏలయనగా దేవుడు తిన్నగా జీవగ్రంథములో నుండి నీ పేరును తీసివేస్తాడు. మరియు అప్పుడు నీవు ముగించబడ్డావు, చూచారా. నీవు దానికి ఏదియు కలపరాదు, దాని నుండి ఏదియు తీసివేయరాదు. అది ఖచ్చితముగా ఏమైయున్నదో అదే…

2TIM 3:16•

HEB 13:8•

2PET 1:20

 

98దానికి అనువాదకుడు అవసరము లేదు, ఏలయనగా బైబిలుకు దేవుడే తన సొంత అనువాదకుడైయున్నాడు. "దానికి వ్యక్తిగతమైన అనువాదము లేదు," అని పేతురు చెప్పాడు. మంచిది.

లేఖనమంతయూ దైవికముగా ఇవ్వబడింది, దైవికముగా క్రమములో ఉంచబడింది; మరియు అది మొత్తము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. ఆయనిక్కడకు వచ్చినప్పుడు ఏమి చేస్తాడో, మరియు రాబోవు యుగములో ఏమి చేస్తాడో, పాత మరియు క్రొత్త నిబంధన అంతయూ, ఆయన రాకడను గూర్చి ముందుగా చెప్పింది. ఆ ప్రకారము అది ఆయనను, నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నవాడుగా చేస్తుంది, చూడండి. అక్కడ హెబ్రీ పత్రికలో వలె, పౌలు దానిని వ్రాశాడు: ఆయన దేవుడు, పాత నిబంధనలోని నిన్న అయి యున్న యేసుక్రీస్తు; ఆయన ఈ రోజు యేసుక్రీస్తు అయి యున్నాడు, శరీరములో ప్రత్యక్షపర్చబడ్డాడు; మరియు ఆయన ఎల్లప్పుడు ఆత్మలో యున్న యేసుక్రీస్తు, రాబోవువాడు (చూచారా, చూచారా), నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా యున్నాడు. ఆ యుగమునకు అది ఏమి చేస్తుందని అది చెప్పిందో, ఆయన మాటను జీవింపచేయుటకు ఆయన సదాకాలము జీవించుచున్నాడు. ఆయన సజీవముగా ఉన్నాడు.

99ఆయన పాత నిబంధనలో సజీవముగా, ప్రత్యక్షపర్చబడ్డాడు.

మీరు దానికి నిలబడగలిగినట్లైతే, ఇక్కడొక దానిని మీరు చూడాలని నేను కోరతాను. గమనించండి, మనము నమ్మియున్నట్లుగా, యేసు పాత నిబంధనలో ప్రత్యక్షపర్చబడ్డాడు. ఇప్పుడు, అక్కడ యున్న బోధకులైన మీరు, మీరు దానితో వాదించవచ్చు, మీరు ఏమి చేయాలనుకొంటారో అది చేయండి, కానీ నేను ఏమి తలంచానో దానిని తీసుకొంటాను, చూడండి.

పాత నిబంధనలో యేసు, తియోఫనిలో ప్రత్యక్షపర్చబడినప్పుడు, మెల్కీసెదెకు అను వ్యక్తిగా వచ్చాడు. యాజకత్వము కాదు, కానీ ఒక వ్యక్తి, మనిషి, చూడండి… కారణము, ఈ మనిషి ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, కాని ఆయన తియోఫనిలో యున్నాడు; కాబట్టి ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు. ఆయన స్వయంగా దేవుడే. ఆయన ఒక మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు, "షాలేము రాజు, అనగా సమాధానమునకు రాజు, నీతిరాజు," అని పిలువబడ్డాడు, చూడండి. ఆయన మెల్కీసెదెకైయున్నాడు. ఆయనకు తల్లి గాని తండ్రి గాని లేరు, దినముల ప్రారంభము కాని అంతము కాని లేదు, చూడండి. అది తియోఫనిలో యున్న యేసు అయి యున్నాడు, మానవ రూపములో యున్నాడు. మీకు అర్థమైనదా? మంచిది.

LUKE 17:28,30

 

100తరువాత ఆయన నిజముగా శరీరధారియై, కన్యక గర్భమున జన్మించిన, యేసుక్రీస్తు అను వ్యక్తిలో, మన మధ్య నివసి౦చాడు. ఆయన చనిపోవునట్లుగా, ఆ రూపములో వచ్చాడు. మరియు తిరిగి పరలోకము వెళ్ళాడు. ఇప్పుడు చివరి దినములలో, ఆయన శరీరములో, ఆత్మలో, తిరిగి స్వయముగా సంపూర్ణముగా ప్రత్యక్షపర్చుకొంటానని ఆయన వాగ్దానము చేశాడు, చూశారా. "సొదొమ దినములలో జరిగియున్నట్లుగా, మనుష్యకుమారుని రాకడలో జరుగును." ఇప్పుడు సొదొమ వైపు, అది ఎలా కూర్చొన్నదో, ఏమి సంభవించిందో చూడు. యేసుక్రీస్తు, ఆయన సంఘము యొక్క శరీరరూపములో, ఈ దినమున ప్రత్యక్షపర్చబడ్డాడు, (చూడండి), ఆయన ఎల్లవేళలా చేసిన అవే కార్యములను, అదే పనిని చేయుచున్నాడు, ఎన్నడూ మారనివాడు, నిత్యుడైనవాడు, చూడండి. ఈ దినమున భూమి మీద, మానవ శరీరములో తన్నుతాను ప్రత్యక్ష పర్చుకొనుచున్నాడు, పిలువబడిన మన శరీరములను, ఆయన భూమి మీద శరీరధారిగా యున్నప్పుడు, నానా సమయములలో ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నాడు. ఈ రోజున అదే కార్యము చేస్తున్నాడు, ఏలయనగా ప్రవక్తల ద్వారా నానా సమయములలో మాట్లాడిన దేవుడు, ఈ చివరి దినములలో ఆయన కుమారుని ద్వారా మాట్లాడియున్నాడు, యేసు క్రీస్తు, (చూశారా), చివరి దినములలో కుమారుడు బయలుపర్చబడ్డాడు, దేవుడు మానవ శరీరములో ప్రత్యక్షపర్చబడ్డాడు, సొదొమ నాశనమునకు ముందు, అన్యప్రపంచము అంతమునకు ముందు. మీరు దానిని చూస్తారా? అక్కడ మూడు ప్రత్యక్షతలున్నాయి.

101ఇప్పుడు, తరువాత సంభవించు కార్యమేమనగా, అదంతయూ ఆ ఒక్క వ్యక్తిలో, యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ నొద్ద, వధువు మరియు శరీరము ప్రోగుచేయబడుతుంది. ఆయన మూడు సార్లు, సిద్ధము చేస్తుంది. ఆయన భూమి మీదకి తేబడినప్పుడు, చంపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయనను ఆయన యొక్క శరీర రూపములో ప్రత్యక్షపర్చుచున్నది, అది ఆయన వధువైయున్నది, స్త్రీ. మీకు అర్థమైనదా? ఆమె ఆయన శరీరములో భాగమైయున్నది. స్త్రీ మరియు పురుషుడు, ఎంత దగ్గరగా కలిసియున్నారనగా, చివరకు వారు దరిదాపుగా… ఒక్కటైయున్నారు; ఎలాగైనా, వారు తప్పక అలా వుండాలి. అక్కడ వారున్నారు, చూడండి. వారు ఖచ్చితముగా ఒకే రీతిగా ప్రత్యక్షపర్చబడ్డారు. ఆమె అతనిలో భాగమైయున్నది, ఏలయనగా ఆమె అతనిలో నుండి తీయబడింది. ఈ దినమున వధువు, క్రీస్తు యొక్క శరీరము నుండి తీయబడింది. ఈ దినము కొరకు అది ఏమి చేస్తుందని ఆయన చెప్పాడో, ఖచ్చితముగా ఆలాగునే ఆమె చేయుచున్నది మరియు ప్రవర్తించుచున్నది — వధువు, రాణి, రాజు మరియు రాణి.

మంచిది. ఇప్పుడు మనకు ఆలస్యమగుచున్నది, కాబట్టి మనము త్వరపడి ముందుకు వెళ్ళాలి.

102మంచిది.

ప్రతి యుగమునకు తన్నుతాను తెలుపుకొనుచూ, బైబిలు అంతా యేసుక్రీస్తు యొక్క పూర్తి ప్రత్యక్షతయైయున్నది. లూధర్ కాలములో ఆయన తన్నుతాను తెలియపర్చుకొన్నాడు, ఒక పునాధిగా; సంఘము, పాదములు, కాళ్ళు. ఆయన రాజైన నెబుకద్నెజరుకు చేసినట్లుగా, అతడు ఎలా ఆ కలను కన్నాడో, తల నుండి ఎలా అది క్రింది వరకు వచ్చియున్నదో? చూడండి. ఇప్పుడు ఆయన పాదముల నుండి పైకి వచ్చుచున్నాడు, చూడండి. బబులోను రాజ్యములో ఆ పాత నిబంధన అంతా చూపాడు, ఆయన తల నుండి క్రిందికి వస్తున్నాడు, చివరగా దేవుడే స్వయముగా, నిచ్చెన పాదమునొద్ద శరీరధారిగా మారతాడు. ఇక్కడ కొత్త నిబంధనలో, తిన్నగా తన్నుతాను బంగారు శిరస్సు నొద్దకు కిరీటము ధరించుటకు, పైకి తెచ్చుకొన్నాడు. చూడండి, మీకు అర్దమైనదా? చూడండి, దేవుడు ఆరంభములో యున్నాడు, ఆయన క్రిందికి వస్తూనే యున్నాడు, ఇంకా క్రిందకు, చివరగా ఆయనే స్వయముగా మనలాంటి మనిషి అయ్యాడు, తిన్నగా క్రింద నిచ్చెన పాదము నొద్ద, ఒక బిడ్డ పశువుల తొట్టిలో పుట్టాడు; ద్వేషించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, ఒక చెడ్డ పేరును, సమస్తమూ ఆయనే యైయున్నాడు. తరువాత ఆయన పైకిలేచుట ప్రారంభించాడు, (చూడండి), పాదముల నుండి తన సంఘమును, వధువును నిర్మించుటకు, తిరిగి వస్తున్నాడు, మరియు ఇప్పుడు, బయటకు తలరాయి లోనికి వస్తున్నాడు, అక్కడ సమస్తము ఒక్కటిగా అతికించబడి, ఒక గొప్ప రూపాంతరము చెందిన యేసుక్రీస్తు శరీరముగా చేస్తుంది.

103ప్రతి యుగములో, ఆయన వాగ్దాన వాక్యము ద్వారా, ఆ యుగమునకు దేవుడు బయలు పర్చబడ్డాడు. ఇప్పుడు ఈ చివరి మాటలతో ముగించుచుండగా, ఈ దినము కొరకైన ఆయన వాగ్దానములలో కొన్నిటిని చూద్దాము.

ఇప్పుడు దేవుడు, సాయంకాలపు వెలుగు కాలములో, దేవుడు తన్నుతాను బయలుపర్చుకొనుచున్నాడు.

ఇక్కడ కొన్ని లేఖనములను నేను వ్రాసుకొన్నాను. ఈ పేజీని మీరు చూసినట్లైతే, ఇక్కడ ఎన్ని లేఖనములు వ్రాయబడియున్నవో, కానీ, ఇప్పుడు సమయము పదిహేను నిమిషములు తక్కువగా పన్నెండు అయింది. నేను బయటకు వెళ్ళాలి, ఈ ఉదయము మాట్లాడుట వలన నా గొంతు బొంగురు పోలేదు. కొన్నిసార్లు ఈ ఎయిర్ కండిషన్ నిజముగా నా గొంతు బొంగురు పోవునట్లు చేస్తాయి. కాబట్టి సోదరుడు నెవిల్, ఈ రాత్రికి నీ దగ్గరేమీ లేకపోయినట్లేతే? [సోదరుడు నెవిల్ "లేదు," అన్నాడు.] మంచిది, అది పరవాలేదంటే, నేను ఒకటి కలిగియున్నాను. నిన్నటి దినమున అడవులలో పడియున్న ఒక సిగరెట్ పెట్టెను నేను కనుగొన్నాను, మరియు ప్రభువు చిత్తమైనయెడల, ఈ రాత్రికి ఆ సిగరెట్ పెట్టి నుండి, నేను ఒక వర్తమానమును కలిగియున్నాను, చూడండి. కాబట్టి, ఇక్కడ నేను లేఖనములను కలిగియున్నాను. ఎక్కువ సమయము తీసుకొనుట నాకిష్టము లేదు, కాబట్టి మీరు తిరిగి రాగలరు.

104ఒక సిగరెట్టు పెట్టి మాట్లాడుచున్నది. మంచిది.

నేను అడవులలో నుండి బయటకు వచ్చుట ఆరంభించాను, అక్కడ ఒక సిగరెట్ పెట్టే పడియున్నది; నేను ముందుకు నడిచి దూరముగా వెళ్ళాను. నేననుకొన్నాను, "మంచిది, ఎవరో నా ముందున్నారు."

ఏదో మాట్లాడింది, "వెనుకకు తిరిగి దానిని పైకి తీసుకో."

నేను భావించాను, "ఆ సిగరెట్లు పెట్టెని పట్టుకోవాలా? నేను కాదు."

ఏదో మాట్లాడింది, "వెనుకకు తిరిగి మరియు ఆ సిగరెట్టు పెట్టెని తీసుకో." నేను క్రిందికి వెళ్ళాను, అక్కడొక పాత పెట్టేయున్నది, నేను దాని మీదొకటి చూశాను. ప్రభువు చిత్తమైనయెడల, ఈ రాత్రి దానిని గూర్చి చెపుతాను. మంచిది.

ZECH 14:7

 

105కొన్ని క్షణములలో సాయంకాలపు వెలుగులను గూర్చి మనము మాట్లాడబోవుచున్నాము. తిన్నగా ముగింపు కాలములో, సూర్యుడు బయటకు వస్తాడని, అక్కడొక సాయంకాలపు వెలుగు యుంటుందని, అలాటి ఒక సమయము వస్తుందని బైబిలు ముందుగానే చెప్పింది. మనందరకు అది తెలుసు. మనకు తెలియదా? ప్రభువైన యేసు నుండి వచ్చిన ఈ దినము యొక్క మన వర్తమానముతో, పరిచయమును కలిగిన మనము, అక్కడొక సాయంకాలపు వెలుగు ఉండబోవుచున్నదని మనము నమ్ముతాము. ఈ సాయంకాలపు వెలుగు… నిజానికి ఈ గొప్ప వెలుగు వస్తుంది. యేసే స్వయముగా ఈ భూమి మీద ప్రత్యక్షమవుతాడు, లేక ఆకాశములలో, ఆయన వధువును తీసుకొని వెళతాడు, తరువాత వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది.

106అయితే ఎన్నడైనా మానవాళి ముందుంచబడిన, ఒక అత్యంత భయంకరమైన కాలముల గుండా తప్పక మనము వెళ్ళవలసియున్నాము. నేను ఆ ఘడియ కొరకు ఎదురుచూస్తున్నాను, అప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశము లభించి, మీరు మీ పని నుండి తిరిగి వచ్చి, కొన్ని దినములు మనము ఎక్కడో కూర్చొందాము. అప్పుడు ఈ చివరి దినములలో పడబోయే ఆ తెగుళ్ళు, వాటన్నిటిని గూర్చి నేను మాట్లాడగలను; రెండు లేక మూడు వారములు ఏకముగా, దానిని ఒక్కటిగా చేస్తాను, దానిని చేయుటకు ప్రభువు నన్ను జీవించనిచ్చినట్లైతే, ఆలాగు చేయుటకు నన్ను ప్రేరేపించినట్లైతే చేస్తాను. చూడండి, ఏలాగు అవి లోపల పడతాయో, ఆ ఉరుములు, అప్పుడు మనుష్యులు ఏమి కలగనుచున్నారో, ఇవన్నియూ నెరవేరతాయి, చూడండి. అవి బయలు పర్చబడుట, ఆ గొప్ప ఉరుములు ఆకాశములో నుండి ముందుకు వచ్చుట, మీరు గమనిస్తారు. ఇప్పుడు, నిజానికి మీ గుంపందరికి, దాని భావము ఏమిటో తెలుసు, మీరు చూడండి. అయితే ఆ సమయము వచ్చు వరకు మనము కనిపెడదాము, (మీరు చూడండి) దాని కొరకు. ఇప్పుడు… అది ఎక్కువ ఋతువైయున్నది.

107కాబట్టి కొన్ని లేఖనములను ఇక్కడ మనము చదువబోవుచున్నాము. ఇప్పుడు, సాయంకాలపు వెలుగులు వచ్చియున్నవి, ఉదయమున ఉండిన అదే వెలుగుగా అది యుండవలసియున్నదని మనము గ్రహిస్తాము, కారణము ఉదయమునొక సూర్యుడు మరియు మధ్యాహ్నము మరొక సూర్యుడు అక్కడ లేడు. అది ఒకే సూర్యుడైయున్నాడు. మధ్యాహ్నమున యున్న అదే సూర్యుడు ఉదయమున ఉన్నాడు, ఉదయమున మరియు మధ్యాహ్నమున అదే సూర్యుడు. ఇప్పుడు అది చెప్పింది, ఆ దినము దానికదే — ఆ దినము మధ్యసమయములో యున్నది — అది ఒక విధముగా… ఓ, ఒక చీకటిగా, ఒక మబ్బుగా యున్న దినము. అది పగలు కాదు రాత్రి కాదు, దాని మధ్యలో యున్నది.

108చూడండి, అది పాదముల నుండి పైకి వస్తూ, శరీరము రూపుదిద్దుకొనుచున్నది.

ఆయన భూమి మీద యుండగా, ఆయన కుమారుడైయుండెను, వెలుగిచ్చువాడు, తరువాత ఆయన చంపబడ్డాడు. సంఘము ఆయన స్థానమును తీసుకొన్నది. తరువాత హత సాక్షులు, చీకటియుగముల గుండా వెళ్ళింది, మరియు పునాదిని నిర్మిస్తూ బయటకు వచ్చుట ఆరంభమైంది. అప్పుడు దృష్టి ఎక్కడ నుండి వస్తుంది? శిరస్సు పై నుండి. ఆ దర్శనము చూడండి, నెబుకద్నెజరు? అన్యుల యొక్క కాలము ప్రారంభము నుండి, వారి కొరకు రక్తము చిందించబడి, ప్రాయశ్చిత్తము చేయబడు వరకు, అతడు క్రిందికి వెళ్ళుటను చూడండి. అన్యమతస్తులైనవారు లోనికి తేబడ్డారు. కాని గమనించండి, అది తిన్నగా క్రిందకి వెళ్ళింది, తిన్నగా క్రిందికి, ఒక గురుతుగా అడుగుకు వెళ్ళి పోయింది, చూడండి, అది క్రిందికి తేబడింది. తరువాత తిన్నగా తిరిగి అది ప్రారంభమైంది. వెనుకకు వచ్చుచున్నది, సంఘము పాదముల నుండి వెనుకకు వస్తూ, పైకి వెళ్ళుచున్నది. ఇప్పుడు ఇది శిరస్సు యొక్క కాలము — శిరస్సు కాలము.

ఇప్పుడు వెలుగును గమనించండి…

109నీవు నీ చేతులతో చూడలేవు, అయినను అది దేహములో భాగమైయున్నది. నీవు నీ చెవులతో చూడ లేవు, ఇంకనూ అది వినగలదు. నీవు నీ ముక్కుతో చూడలేవు, ఇంకనూ అది వాసన చూస్తుంది. నీ పెదవులతో నీవు చూడలేవు, ఇంకనూ అది మాట్లాడుతుంది, చూడండి. అది పెంతెకొస్తు యుగమై యున్నది. కాని ఇప్పుడు, అది కన్ను కాలములో యున్నది. చూచుట, చూడండి. ఇప్పుడు కంటికి పైగా కదులు శక్తి ఏదీ లేదు. అది నిజమేనా? తరువాతది జ్ఞానమై యున్నది, అది దానికై అది క్రీస్తే, అదే శరీరమును నియంత్రణ చేస్తుంది. దానికి పైగా కదిలేది లేదు, కదలిక లేదు, చూశారా. సమస్తమూ కదిలింది, చూడండీ. నీ పాదములు కదులుతాయి, నీ పాదములలో కండరములు కదులుతాయి, సమస్తమూ కదులుతుంది. నీ చెవులు, నీ పెదవులు, ముక్కు కదలగలవు; కానీ కన్నులు తరువాత ఏదీ కదలదు. ఆ కారణమును బట్టియే పురుషులు త్వరగా బట్టతలగా మారతారు, కారణమేమనగా, (చూడండి), అక్కడ ఆ నెత్తిమీద వెంట్రుకల ఉండు స్థలములో కండరములను వృద్ధి చేయుటకు ఏ విధమైన వ్యాయామము లేదు, చూశారా. అక్కడ ఆ సౌలభ్యము లేనందున, అక్కడకు వారు రక్తమును తీసుకొని వెళ్ళలేరు. అక్కడ రక్తము ప్రవహించదు. పైకి వెళ్ళి రక్తముతో అలంకరించబడదు. కారణము, వెంట్రుకల వ్రేళ్ళు రక్తము ద్వారా జీవిస్తాయి. ఇప్పుడు మనము కనుగొనునది ఏమనగా, ఆ భాగము (మీరు చూడండి)… కంటికి పైగా ఏమియూ లేదు.

ZECH 14:7•

MAL 4:5,6•

LUKE 17:28,30

 

110ఇప్పుడు మనము కనుగొందాము, "అది వెలుగు కలుగును, (దరిదాపు రోజు మధ్యలోనా?), అస్తమయకాలమున!" వెలుగు ఎందుకొరకు పంపబడింది? అట్లు నీవెక్కడయున్నావో చూడగలవు… ఎలా సంచరించాలో. నీవెక్కడ యున్నావో చూడుము. "అస్తమయకాలమున వెలుతురు కలుగును."

ఇప్పుడు, మనము దానిని తీసుకొని మలాకీ 4తో పోల్చుదాము. అస్తమయకాలమున అక్కడ వెలుగు కలుగుతుందని ఆయన వాగ్దానము చేశాడు. చూడండి, "నేను వచ్చి భూమిని శపించకుండునట్లు, నేను ప్రవక్తయైన ఏలీయాను మీ యొద్దకు పంపుతాను, అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టును, తండ్రుల హృదయము పిల్లల తట్టును త్రిప్పును," (అది నిజమేనా?) "నేను వచ్చి దేశమును శపించకుండునట్లు."

ఇప్పుడు మనము యోహాను లేక లూకా 17:30 తీసుకొందాము, అక్కడ యేసు ప్రవచించి చెప్పిన దానిని గమనించండి, "సొదొమ దినములలో యున్నట్లుగా అది అలాగే యుంటుంది…" ఇప్పుడు గుర్తుంచుకోండి, గమనించండి, ఈ సమయములోనే మనుష్యకుమారుడు బయలుపర్చబడతాడు; మనుష్యకుమారుడు బయలుపర్చబడుట. సొదొమ కాల్చివేయబడక మునుపు, అక్కడ సరిగ్గా కొన్ని క్షణములు, మనుష్యకుమారుడు సమూలముగా బయలుపర్చబడ్డాడు. ఇప్పుడు, ఆ మనిషి, ఎలోహిం అయి యున్నాడు. అది దేవుడైయున్నాడు, మరియు యేసు దేవుడైయున్నాడు. పరిశోధనా తీర్పులో, కొన్ని క్షణములు పాటు, దేవుడు సమూలముగా బయలుపర్చబడి అబ్రాహాముతో మాట్లాడాడు. కొంచెము సమయము, మనుష్యకుమారుడు బయలుపర్చబడ్డాడు, మనుష్యకుమారుడు: ఎలోహీం. సంఘమా, నీవు దానిని చూస్తావా? ఎలోహీం, మనుష్యకుమారుడు, కొన్ని నిమిషములు అక్కడ బయలు పర్చబడియున్నాడు. ఆ మరునాడు ఉదయమే ఆమె కాలిపోయింది, ఎప్పుడు? సూర్యుడు తిరిగి రాక మనుపు. కాబట్టి అక్కడే సంస్థ మిగిలి యుండదు, లేక ఇప్పుడు వెళ్ళుచున్నట్లుగా ఏ పురోగతి యుండదు, కారణము ఆ దినము తిరిగి మరలా ఉదయించక ముందు ఆమె కాల్చి వేయబడుతుంది. దేశమంతటా ఉజ్జీవము సమాప్తమైంది. అక్కడేంత మాత్రము ఇక ఉజ్జీవములుండవు, పెద్ద ఊడ్చివేయు ఉజ్జీవములు; ఈ దేశము ఎన్నడూ దానిని స్వీకరించలేదు. నీవు తెలివిగల గుంపును కలిగియుండవచ్చు, కానీ నా భావము, ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవము, మనము అదంతా చూశాము. నీవు దానిని పట్టుకొంటున్నావని నేను నమ్ముతాను. నేను ఎలాంటి విధానములో చెపుచున్నాననగా, నీవు దానిని అర్థం చేసుకొంటావని నేను నమ్ముతాను, చూడండి. అది సమాప్తమైంది.

కొన్ని క్షణముల క్రితము, ఒక సేవకుడు అన్నాడు, "బ్రెనాం సోదరుడా, నేను ప్రభువు యొక్క ఆనందమును నా హృదయములో కలిగియుంటే చాలు!"

నేనన్నాను, "కుమారుడా, ఉజ్జీవము సమాప్తమైంది," చూడండి.

111ఇప్పుడు ఓడ మీద స్టెబిలైజర్లు ఉంచబడ్డాయి. గొప్ప భయోత్పాతము కలిగించు అలలు మన ముందున్నాయి; కానీ మనకు తెలుసు, అదిగో ఆ అలలకు ఆవల, మనము ఒడ్డును సమీపించబోవుచున్నాము, చూడండి. మనము ఒడ్డును సమీపించబోవుచున్నాము. కేవలము స్థిరముగా నిలిచియుండండి. సరిగ్గా వాక్యములో నిలిచియుండండి. దేవునిలో నిలిచియుండండి. నీవు ఎలా భావించినప్పటికి లెక్క కాదు, ఏది ఏమైనను లెక్క కాదు; తిన్నగా వాక్యముతో నిలిచియుండుము. దానిని స్థిరముగా నిలిచియుండనిమ్ము. ఈ గొప్ప పాత మేఘములన్నీ మన చుట్టూ చూస్తున్నప్పుడు, వారు మాట్లాడుచున్న సమస్తమూ, కాని మన స్టెబిలైజర్ తిన్నగా సరిగ్గా వాక్యములో యున్నది. అది అక్కడ యుంటుందని దేవుడు చెప్పాడు, అవును, వాటిలో ప్రతి అలను మనము తాకుతాము. అవును, తిన్నగా వాటి పై గుండా మనము వెళతాము. నిజానికి, అవును! అవి మనలను ముంచలేవు. వారు మనలను సమాధిలో యుంచినా, మనము తిరిగి పైకి వస్తాము. దానిని యున్నదంతా అదియే. దానిని అక్కడ క్రింద యుంచేది, లోకములో ఏది లేదు. వాటిలో ప్రతి అలను తాకుతూ ముందుకు వెళదాము, కారణము అవతల ఒడ్డున మన ఓడ నావికుడు పిలుస్తున్నాడు.

మనము క్రీస్తులో లంగరు వేయబడ్డాము,

జీవిత తుఫానులను నేను ధైర్యముగా ఎదుర్కొంటా;

నేను యేసులో లంగరు వేయబడ్డాను,

నేను ఏ గాలికి లేక అలకు భయపడను;

112అది ఏమైయున్నప్పటికీ, అది రానివ్వకండి. ఏమి వచ్చినా, ఏమి జరిగినా, ఏ భేదమును చేయదు. క్రీస్తు యేసులో అక్కడ మనము తిన్నగా లంగరు వేయబడియున్నాము. నేను జీవించినట్లైతే, నేను దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తాను. అప్పుడు నేను ఆయన మహిమ కొరకు చనిపోగలను. అదంతయూ దేవుని యొక్క మహిమ కొరకే. అదే నేను చేయగోరుచున్నాను. అదంతయూ అప్పుడు సమాప్తమైనపడు, ఇంకెంత మాత్రము దీర్ఘముగా నేను నిలచియుండగోరను. ఆయన నా కొరకు కొనిన బహుమానము కొరకు నేను వెళతాను; నేను సంపాదించినది కాదు కాని, ఆయన నా కొరకు కొన్నది, అదే ఆయన కృప ద్వారా నాకు ఇవ్వగోరేది.

113కాబట్టి సాయంకాలపు వెలుగు ఇక్కడ యుండుట మనము చూస్తాము. వెలుగును కలిగియున్నప్పుడు, అది ఏమి చేస్తుంది. దాని చుట్టూ ఎలా వెళ్ళాలో నీకు ఏమీ కన్నులు లేనప్పుడు? సాయంకాలపు వెలుగు అనగా ఏమిటి? దేనినైనా బయలుపర్చుటకు వెలుగు ముందుకు వస్తుంది. అది నిజమేనా? ఇక్కడ చీకటిలో ఏదైనా యున్నట్లైతే, అది ఏమిటో నీవు స్పర్శించి గ్రహించలేనపుడు, అప్పుడు వెలుగును ప్రసరింప చేయండి. అది బయలుపరచబడును. మలాకీ 4, ఏమి చేస్తుంది? ఆ కార్యమునే చేస్తుంది. ఏడు ముద్రలు విప్పబడుటేమి చేస్తుంది. అక్కడే సంఘశాఖలన్నియూ దాని చుట్టూ సందేహములో వున్నాయి [స్పష్టతలేని మాటలు]? అది బయలుపర్చుటకు, బయటకు తెచ్చుటకై యున్నది. అక్కడ మొదటగా దానిని చూచుటకు నేత్రములుండాలి, అది నిజమేనా? మలాకీ 4ను బయలుపర్చుటకు, లూకా 17:30ను బయలుపర్చుటకు, ఇంకా యోహాను 14:12, యోహాను 15:24, 16:13, ఇంకా ప్రకటన 10:1 నుండి 7 బయలుపర్చుటకు, ఏడు ముద్రలు విప్పుటకు, మరియు ఏడవ దూత యొక్క వర్తమానము; సాయంకాలపు వెలుగు వచ్చినప్పుడు, దానిని తెరుచుటకు, బయలుపర్చుటకు.

ఇప్పుడు, ఒకవేళ ఒక మనిషి…

MATT 15:14•

LUKE 6:39•

2TIM 3:3-5•

REV 3:17

 

114లవొదికయ యుగములో ప్రజలు (ఏమిటి?) దిగంబరులుగా యున్నారు. వారు దిగంబరులుగా యున్నారా? గ్రుడ్డివారు. ఒక గ్రుడ్డి వాడికి వెలుగు ఏ మంచి చేస్తుంది? గ్రుడ్డివాడు, గ్రుడ్డివాడికి దారి చూపినట్లైతే, వారిద్దరూ గుంటలో పడతారు. "దిగంబరులు, గ్రుడ్డివారు, అది వారికి తెలియదు." వారు ఆత్మసంబంధమైన గ్రహింపును, వారి మానసిక వివేచనలను సహితము వారు కోల్పోయారు, చూడండి. "బింకములాడువారు, అహంకారులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువుగా ప్రేమించువారు, ద్రోహులు, మూర్తులు, గర్వాంధులు, సజ్జనద్వేషులు; పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు (ప్రత్యక్ష యొక్క శక్తి). దానిని వారు కనీసము నమ్మరు, చూడండి. ప్రవక్తలు అను కార్యములు వారు నమ్మరు. వారు దానియందు విశ్వాసముంచరు. మలాకీ 4ను వారు ఒక సంస్థ అని, ఒక నిర్ణీతమైన సంఘమని అనుకొంటారు. ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు, ఆయనొక మనిషై యుండెను. ఆయన రెండవసారి వచ్చినప్పుడు, రెండు పాళ్ళతో, ఆయనొక మనిషై యుండెను. ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను రూపములో వచ్చినప్పుడు, ఆయన ఒక మనిషై యుండెను. చివరి దినములలో, సాయంకాలపు వెలుగులు ప్రకాశించుట ఆరంభమైనపుడు, కళ్ళు తెరవబడతాయి, మరియు నీవు ఎటు వెళతావో చూస్తావు. అప్పుడు పాదము మీద నిలబడినదై, శరీరము ఇది వరకే రూపించబడినదై, కదులుచూ, పరిశుద్దాత్మ ద్వారా నడుస్తుంది. ఏమిటి? ప్రవక్తల మీద కదిలిన ఆయనే, బైబిలును వ్రాసియున్నాడు, అదే పరిశుద్దాత్ముడు, పరిశుద్ధాత్మతో నింపబడిన శరీరములో కదులుచున్నాడు, ప్రతి సంస్థ నుండి ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజల నుండి పరిశుద్ధాత్మతో బయటకు కదులుచున్నాడు.

115ఇక్కడయున్న ఒక చిన్న స్త్రీ, ఆమె ఇక్కడ సమాజమునకు చెందినది కాదు. ఆమె ఎక్కడి నుండో వస్తుంది. ఈ ఉదయము ఆమె వచ్చినప్పుడు, ఒక చిత్రము కలిగి యుంది. ఆమె దానిని నా కుమారునికి ఇచ్చింది, అతడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. దీనిని గూర్చి ఆమెకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు తెలియదు. ఏడు ముద్రలు విప్పబడినప్పుడు, ఏడు సంఘకాలములపై ఆమె ప్రభువు దూత యొక్క చిత్రమును కలిగియున్నది. ఆమె అన్నది, ఒక కలలో అది ఆకాశములో నిలబడియుండుటను నేను చూశాను. ఆమె వెనుక నుండి అక్కడ చూడగా, ఒకరు తెల్లని వస్త్రములతో ముందుకు కవాతుతో వెళ్ళుచున్నారు, దాని వెనుక.. "బ్రెనాం సోదరుడా, అది నీవే." ఆమె అన్నది, "అక్కడ కవాతుగా వెళ్ళుచున్న." "నీ వెనుక, రంగురంగుల ప్రజలు, జెండాలు పట్టుకొనియున్నారు — జార్జియా, అలబామా, రకరకాల స్థలాల వారు, ముందుకు కవాతు తొక్కుతూ, ధర్శనములో బయలు పర్చబడిన క్రీస్తు, శిరస్సు నొద్దకు వస్తున్నారు." ఓ, హల్లెలూయ!

116మనము చివరి దినములలో, చివరి దినములలోని ఘడియలలో జీవించుచున్నాము.

ఆయన వాక్యములో మీరు ఆయనను చూస్తారా, మరియు ఆయన వాక్యమంతయూ తిన్నగా మనముందు ప్రత్యక్షపర్చబడుట చూస్తారా? ఓ, సజీవుడైన దేవుని సంఘమా, మీ పాదములపై మోకరించి, నీలోయున్న దానినంతటితో ఆయనను నమ్ముము. ఆ చక్రము మధ్యలో యున్న చిన్న చక్రమును పట్టుకొనుము, నీ ప్రతి కదలికను, నీ ప్రతి అడుగును అది నియంత్రించనిమ్ము. నీవు ఆలోచించు ప్రతి ఆలోచనను, నీ అంతరములోయున్న ఈ శిఖరమును నియంత్రణ చేయనిమ్ము, ఏలయనగా దేవుడు ఈ ఘడియ యొక్క ఆయన వాక్యములో తిన్నగా కూర్చొనియున్నాడు, సాయంకాలపు వెలుగులో, వెలుగును చూపుచున్నాడు.

117గబ్బిలము యొక్క గ్రుడ్డితనము… మీరు వెలుగును ప్రసరింపచేసినా, గబ్బిలము ఎంత గ్రుడ్డిగా యుంటుందంటే, అది ఎగురలేదు. ఒక గుడ్లగూబ, రాత్రి వేళ ఎరకొరకు సంచరించుచూ ఈ పక్షులన్నీ, బొద్దింకలు, అవన్నీ పగటి వేళ చూడలేవు. అదంతా ఏమిటో వాటికి తెలియదు. అవి చూడలేవు. సాయంకాలపు వెలుగులు మీదికి వచ్చియున్నవి. మనము వెళ్ళే ప్రతి ఉపమానము, ప్రకృతి, బైబిలునకు, దానియేలు చూసిన ప్రతిమకు, ఆ దినమున చూసిన రాజు, వారందరూ చూసింది; ఈ కార్యములన్నియూ, ప్రతి ఒక్కరూ, ప్రతి రూపము, ప్రతి కదలిక, శరీరములోని ప్రతి స్థలము, మనము జీవించుచున్న ఈ ఘడియలు దాని స్థానమునకు చూపుతుంది. దానికి పైగా మరొక కదలిక రాదు. అక్కడే చేతి యొక్క కదలికయున్నది, ప్రేమ, వెస్లీ. అక్కడ పునాది యొక్క కదలిక యున్నది, లూధర్, ప్రేమ, దాని కంటే ఎన్నడూ అతి గొప్పది లేదు; అదే వెస్లీ ఉద్యమము. వారు ప్రపంచమంతటా మిషనరీలను పంపారు. దాని ముందు యుగములో అది అతి గొప్ప ఉద్యమములలో ఒకటి. దాని తరువాత పెంతెకొస్తు యుగము వచ్చింది. తరువాత రకరకముల వ్రేళ్ళు వచ్చాయి, పెంతెకొస్తు యుగములో భాషలు, ముక్కు, అవన్నీ వచ్చాయి. ఇప్పుడు, అది నేత్రములలో యున్నది. అక్కడ చూడటానికి కన్ను లేకపోతే, వెలుగు వలన ఉపయోగమేమిటి? మొదట, చూడటానికి కన్నులుండాలి. అది వచ్చినప్పుడు, ఆయన నేడు ముద్రలు తెరచి, సాయంకాలపు వెలుగును బయలు పరిచాడు. ఈ సంఘ యుగములన్నిటి గుండా దాచబడియున్న మర్మములన్నిటిని తీసికొని, ఇప్పుడు ప్రకటన 10:17లో ఆయన చేస్తానని వాగ్దానము చేసినట్లుగా వాటిని బయలుపర్చియున్నాడు. ఇక్కడీ దినమున మనము వాక్యము మధ్యలో, యేసుక్రీస్తు ద్వారా వాక్యము బయలుపర్చబడియుండగా, కూర్చొని యున్నాము. అప్పుడు, ఇది దేవుని యొక్క వాక్యమైయున్నది.

ACTS 9:6

 

118ఆయన ఆదినములో మనము ఉండుటకు, దానిని గ్రహించుటకు, మనము తప్పక గ్రంథకర్తకు దగ్గరగా నడవాలి. అది మనకు బయలుపర్చబడుటకు, "ఓ దేవా, నీవు నన్ను ఏమి చేయమంటావు? నేను తప్పక పొలములలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాలా లేక నేను తప్పకింటియొద్ద యుండాలా? అది ఏమైనను లెక్క కాదు, నేను తప్పకొక మంచి గృహిణిగా వుండాలా, నేను తప్పకొక మంచి తల్లిగా యుండాలా, నేను తప్పక ఇది, అది, మరొకటి చెయ్యాలా? అది ఏమైనప్పటికి, నేను తప్పకొక వ్యవసాయదారుడిగా యుండాలా… అది ఏమైనప్పటికి ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు?"

అక్కడ సౌలు మొర్రపెట్టియుండలేదా, "ప్రభువా, నన్ను ఏమి చెయ్యమంటావు?" క్రైస్తవులందరిని జైలులో పెట్టుటకు, అతడు ఆ మార్గము గుండా వెళ్ళుచున్నాడు, కాని అప్పుడతడు మొర్రపెట్టాడు, "నీవు నన్ను ఏమి చేయమంటావు?" ఆ వెలుగు ప్రకాశిస్తూ, ఒక పెద్ద అగ్నిస్తంభము వలె అతనిపై వ్రేలాడుచున్నది. "నీవు నన్ను ఏమి చేయమంటావు?"

ముగించుటకు అది ఒక మంచి మాటయైయున్నదని నేను తలస్తాను, చెప్పు, "ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు? ఎంతో పరిపూర్ణముగా ఇప్పుడు లేఖనము బయలుపర్చబడుటను నేను చూస్తాను, ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు? లేఖనము బయలుపర్చబడుట నేను చూస్తాను, ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు?"

మన తలలు వంచుదాము.

119ఇక్కడ ప్రతి ఒక్కరిని మీ హృదయములను పరిశోధించుకొని, ఆ ప్రశ్నను అడగాలని, నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను, "ప్రభువా, నీవు నన్ను ఏమి చేయమంటావు?" ప్రజలారా, మీరు ఇంకనూ దేశమంతటా టెలిఫోను వైరుల మీద యున్నట్లైతే, మీరు మీ తలను వంచి అడగండి, "ప్రభువా, నీవు నన్నేమి చేయమంటావు? మనము చివరి దినములలో చివరి ఘడియలో యున్నామని మనము చూస్తున్నాము, ఎంతో పరిపూర్ణముగా అది మనముందున్నది, ఎంతో తేటగా అది బయలుపర్చబడింది, నీవు నన్ను ఏమి చేయమంటావు?"

120ప్రియమైన దేవా, వారు ఆ ప్రశ్న నిన్ను అడుగుచుండగా; నన్ను నేను, నిన్ను అడుగుతాను, ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు, ప్రతి రోజు లెక్కించబడవలెనని నేను గ్రహించియుండగా, ప్రభువా, ప్రతి దినము ఎంతో లెక్కిస్తూ నీ మహిమ కొరకు నీ గౌరవము కొరకు, నేను జీవించునట్లుగా నాకు సహాయము చేయుము. నీవు ప్రతి ఒక్కరికి దేశమంతటా సహాయము చేయుమని నేను ప్రార్థిస్తాను, ఈ ఆలయములో హాజరైన వారందరూ, మా హృదయములను పరిశోధించుకొంటూ అడుగుతాము, "ప్రభువా, నన్ను నీవు ఏమి చేయమంటావు? ప్రభువా, నీ రాజ్యవ్యాప్తి కొరకు, మరియు నీ కొరకు, నేను ఏమి చేయాలి?" దేవా, దయ చేయుము. మమ్ములను, మా హృదయములను శోధించుము — మమ్మును పరీక్షించుము; మాలో ఏదైనా అతిక్రమము యున్నట్లైతే, ప్రభువా, ఏదైనా స్వార్ధము, ఏదైనా తప్పు లక్ష్యములు లేక ఉద్దేశ్యములున్నట్లైతే, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో మమ్ములను కడుగుము, మేము దీనముగా ఆయన యొక్క మరణము యొక్క ప్రాయశ్చిత్తమును మరియు ఆయన పునరుత్థానమును అంగీకరిస్తాము. నీవు మాకిచ్చిన రక్షణ ప్రణాళికను మేము సంతోషముగా అంగీకరిస్తాము. తండ్రి, ఈ దినము యొక్క వర్తమానము కొరకు నీకు వందనములు, దానినే మేము నమ్మియున్నాము, దానిని పట్టుకొనియున్నాము, అది నీ వాక్యమైయున్నదని మరియు నీ వర్తమానమైయున్నదని ఎరిగి నమ్ముచున్నాము — ఇతర ప్రజల నుండి భిన్నముగా యుండుటకు కాదు — కాని మా మాదిరియైన యేసు వలె ఎక్కువుగా యుండుటకు మేము ప్రయత్నిస్తాము.

121ప్రియమైన దేవా, ఇక్కడ చేతి రుమాళ్ళు ఉంచబడ్డాయి. రోగులైన ప్రజలు ప్రతి చోట యున్నారు. ప్రభువా, నాకుగా నేను, ఈ ఉదయమున అలసిపోయి, హరించిపోయి యున్నాను. ప్రియమైన దేవా, నీవు మాకు సహాయము చేయమని నేను ప్రార్థిస్తాను. మేము బలము కొరకు నీ వైపు చూస్తున్నాము. నీవు మా బలమైయున్నావు. ప్రియమైన దేవా, నీవు అనేకులకు సహాయము చేశావు.

మొన్నటి దినమున, బ్యాంక్స్ ఉడ్స్ తో నడుస్తూ, అడవులలో ఆలోచిస్తూ యుండగా, అతని గుండె ఎంత బలహీనముగా యున్నదనగా, అతడు కనీసము నడవలేక పోయాడు, వైద్యులు… అప్పుడు దానిని ఆలోచిస్తూ, కొంచెము ఆ పైన ఎరిగినవాడనై, ఆ దర్శనము తరువాత ఆ పర్వతముల మీద నడుస్తున్నాను, "నేను తప్పక సింహమును పట్టుకోవాలి. ఆ సింహము చంపబడునట్లు నేను తప్పక చూడాలి." తరువాత క్రిందికి దిగి వచ్చినప్పుడు, టుసాన్ లోని ఫర్స్ కేఫ్టీరియాలో కూర్చొనియున్నాను, అతని బట్టలన్నియూ సంచులవలె క్రిందికి వ్రేలాడుచున్నాయి, అతని కన్నులు మూతబడియున్నాయి. నేనన్నాను, "దేవా, ఆ సింహము ఎక్కడ యున్నదో నీవు దర్శనము చూపగలిగినప్పుడు, నిశ్చయముగా సోదరుడు ఉడ్స్ గురించి నీవు చూపగలవు."

అప్పుడు అది వచ్చింది, "అతని మీద చేతుల నుంచుము." ఈ రోజు తిరిగి అతడు ఇక్కడున్నాడు, మన సోదరుడు బాంక్స్ మరలా బలముగా, ఆ పర్వతముల మీద పైకి క్రిందకి పరుగెత్తుచున్నాడు. ప్రియమైన దేవా, మేము ఎలా నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నామో. సోదరుడు ఉడ్స్ కి నీవు ఎలా యున్నావో, మా అందరికీ నీవు అదే దేవుడవైయున్నావు. నీవు అతనిని ప్రేమించుచున్నావని నాకు తెలుసు, ఏలయనగా అతడు నీ సేవకుడు, నమ్మకమైనవాడు, యధార్థవంతుడు.

122ప్రియమైన దేవా, మాలో ప్రతి ఒక్కరితో మీరు కార్యము చేసి, మా పాపముల క్షమించండి, మా దేహములోని రోగములను బాగుచేయండి. యేసుక్రీస్తు యొక్క ఆ సంపూర్ణమైన స్వరూపములోనికి మేము వచ్చు వరకు, ప్రభువా, రోజు రోజూ మమ్ములను ఎక్కువగా మీ వలె చేయండి. ఇప్పుడు, ప్రతి హృదయమును నీవు పరిశోధించావని నేను నమ్ముతాను, మరియు ఏమి చేయాలో మాకు తెలుసు. ఇప్పుడు మమ్ములను దీవించమని యేసు నామములో నిన్ను అడుగుచున్నాము.

123మనము మన తలలను వంచియుండగా, ఇక్కడ హాజరైన వారెవరైనా లేక దేశమంతటా టెలిఫోనులో యున్నవారు, మీరు ప్రార్థించుచుండగా, మీ తలవంచి, మీ చేతిని ఇప్పుడు దేవునికి ఎత్తండి. మీరు చేయగలిగినదంతా అంతమట్టుకే, ఈ ఉదయమునిక్కడ అంతా గుమికూడియున్నారు. మీ చేతిని దేవునికి ఎత్తి చెప్పండి, "దేవా, యేసులా నన్ను ఎక్కువగా చేయుము. నేను ఎక్కువగా యేసువలె యుండగోరుతాను." దేవుడు మిమ్ములను దీవించును గాక. దేశమంతటా, ప్రతి చోట బలమైన సమూహముగా చేతులు ఎత్తబడ్డాయి. నా చేయి కూడా ఎత్తబడింది. "నేను ఎక్కువుగా ఆయన వలె యుండగోరతాను, ప్రభువా, నన్ను పరిశోధించు, నాలో ఏదైనా చెడు యున్నట్లైతే, దానిని బయటకు తీసివేయుము. నాకు కావాలి…" మనము ఎంతో సేపటి నుండి ఇక్కడున్నాము. ఇంకనూ, మనము ధనవంతులమైనా, పేదవారమైనా, ఎంత యవ్వనప్రాయమైనా, ఎంత వృద్ధులైనా నీవు ఏమైనప్పటికి లెక్క కాదు, మనము ఈ స్థలమును విడిచి వెళ్ళబోవుచున్నాము.

124నిన్న ఆ పర్వతమునొద్ద, ఆ చిన్న సెలయేటి నొద్ద నిలబడియుండగా, ఒక చిన్న పేద గుంపు అక్కడ యున్నది. అక్కడొక చిన్న కుటుంబము యున్నది, ఒక మనిషి దేవుని గూర్చి ఎంతో సేపు మాట్లాడుచున్నాడు. అతని భార్య అక్కడకు వచ్చింది. ఏడు లేక ఎనిమిది మంది పిల్లలున్నారు; ఒక రోజుకు కొన్ని డాలర్ల కొరకు ఆ ఇనుప కుదురుతో అతడు పనిచేయుటకు ప్రయత్నించుచున్నాడు. ఒక చిన్న పాకలో జీవించుచున్నాడు. అతని భార్య ఆ పైన ఒక పెద్ద వెడల్పైన గొడ్డలితో కట్టెలను నరుకుతుంది. మరొక బిడ్డను కనుటకు సిద్దముగా యున్నది, వాటిని క్రిందకి లాగుతుంది; తొడ మీద ఒక బిడ్డను ఎత్తుకొని, మరొక వైపు కట్టెలు లాగుచున్నది; కట్టెలు నరుకుటకు క్రిందకి వచ్చింది, చలికాలము గుండా ఆకలి నుండి కాపాడుకొనుటకు కొన్ని ఈత పండ్లను డబ్బాలో వేసుకొనుచున్నది. మై, మేము ఎలా ఆమె పట్ల కనికర పడ్డామో! సహోదరుడు ఉడ్స్ మరియు నేను ట్రక్కును తీసుకొని వెళ్ళి, కట్టెలు నరికి, వాటిని లోపలికి తెచ్చాము. ఆమె అక్కడ నిలబడి, ఎంతో కృతజ్ఞతతో యున్నది. నేను ఆమె పట్ల జాలిపడ్డాను. మేము వారి కొరకు ప్రార్థన చేయుచునే యున్నాము.

ISA 27:3

 

125ఆమె చిన్న బిడ్డకు మూర్చ వ్యాధి వచ్చింది. మేము వెళ్ళి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థించాము. దేవుడు ఆ బిడ్డను స్వస్థపర్చాడు. మొన్నటి దినమున, ఆమె భర్త హెర్నియా వ్యాధిని కలిగియున్నాడు, లోనికి వెళ్ళాము… నేను అతనితో మాట్లాడుచున్నాను. అతడు పొగత్రాగుతాడు, వారిద్దరూ పొగత్రాగుతారు. ఆమెకు పొగాకు అలవాటున్నది. అతడు కూడా, వారు ఒక రకముగా పర్వత ప్రజలు. అప్పుడు నేను దానిని గూర్చి వారితో మాట్లాడుచునేయున్నాను. నిన్న ఉదయమున, పగటి వెలుగులోనే నేను లోపలకు వెళ్ళాను, అతడు చేతులు కట్టుకొని నడుచుకొంటూ బయటకు వచ్చాడు, అన్నాడు, "బిల్లీ సోదరుడా, నేను మార్పుచెందిన మనిషిని." అతడన్నాడు, "నేను నా చివరి సిగరెట్టును త్రాగియున్నాను, ఇప్పుడు నేను ప్రభువు పక్షమునకు వచ్చాను."

ఆమె అన్నది, "నేనును నా చివరి సిగరెట్టును త్రాగియున్నాను." ఓ, విత్తనమును నాటండి! "ప్రభువునైన నేను నీరు కట్టాను… నా చేతులలో నుండి ఎవడును దానిని లాగుకొనకుండా, దివారాత్రులు నేను దానిని నీరు కట్టుచున్నాను."

126ఓ దేవా, ఇప్పుడు కనికరము చూపుమని, మా హృదయ వాంఛను దయచేయుమని నేను ప్రార్థిస్తాను, ఏలయనగా మా హృదయములలో మేము నిన్ను సేవించగోరుచున్నాము. ఇప్పుడు, తండ్రి, ప్రతి చోట వారు నీ చేతులలో యున్నారు. వారు నీ పిల్లలై యున్నారు. ప్రభువా కనికరముతో వారితో పని చేయుము; తీర్పులో కాదు, కాని కనికరములో యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

127మీరు ఆయనను ప్రేమిస్తారా? మీ హృదయ మంతటితో! చేతి రుమాళ్ళను మీరు, వాటిని తెండి. ఇప్పుడు, మన కూటములు, కొంచెము పెందలకడ ప్రారంభమవుతాయని నేననుకొంటాను, 7 గంటలకు లేక ఆ ప్రాంతములో, సోదరుడు నెవిల్ దానిని ఎప్పుడు ప్రారంభిస్తారో, ఒక్క నిమిషములో ప్రకటిస్తాడు. ఈ ఉదయ కాలము బాప్తిస్మము యున్నదా? నీరు సిద్ధముగా యున్నది. ఇక్కడెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇంకనూ బాప్తిస్మము పొందకపోయినట్లైతే, ఎందుకు, నిశ్చయముగా… బాప్తిస్మపు పరిచర్యకు నీరు సిద్దముగా యున్నది.

128సేవక సోదరులందరిని మేము మెచ్చుకొంటాము. నేను సోదరుడు… పార్నెల్ ను చూస్తాను. మీ కూటము బాగా జరిగియున్నదా? సోదరుడు మార్టిన్, ఓ, అనేక మంది వారిలో ఇక్కడున్నారు, సోదరుడు లీవెల్, ఓ, ఆ స్థలమంతా అక్కడ సేవకులున్నారు. దేవుని వాక్యముతో సహవాసము చేస్తూ, మీరిక్కడ ఉండుటను బట్టి, మేము నిశ్చయముగా మిమ్ములను మెచ్చుకొంటాము.

MATT 4:4•

LUKE 4:4•

JOHN 10:27

 

129బహుశా ఖచ్చితముగా దీని మీద మీరు సమ్మతించక పోవచ్చును; మిమ్ములను అడుగను, మీరు చూడండి. ఒకే విషయము, మీరు దీనిని లెక్కలోనికి తీసుకోండి. మీరు ఏమి చెపుతారో నేను వింటాను. ఒక సేవకుడు టేపును తీసుకొని, "మంచిది, నేను దానితో సమ్మతించను," అంటే, అది పరవాలేదు, నా సోదరుడా. నీవు కొన్ని గొర్రెలకు కాపరివి కావచ్చు. నీవు కోరినవాటితో వారిని మేపుము. నేను దేవుని యొక్క వాక్యముతో సరిగ్గా శ్రేష్ఠముగా నిలిచియుండాలని ప్రయత్నము చేస్తాను, ఏలయనగా నిజానికి, గొర్రెలకు గొర్రెల ఆహారము కావాలి. "నా గొర్రెలు నా స్వరము వింటాయి." దాని ద్వారానే మనము జీవించేది, బయలు వెళ్ళు ప్రతిమాట… ఆలాగైతే, ఇక్కడొక అక్కడొక మాట కాదు; కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట, దాని ద్వారానే పరిశుద్ధులు జీవిస్తారు.

మనము మన పాదములపై నిలబడదాము. మన తలలను వంచియుండగా… నెవిల్ సోదరుడా, నీవు వారికి ఏదైనా చెప్పుటకు కలిగియున్నావా? మాన్ సోదరుడా? మంచిది.

ప్రతి ఒక్కరూ మంచి అనుభూతిని కలిగియున్నారా? "ఆమేన్," చెప్పండి. [సంఘము "ఆమేన్," చెప్పారు]. మంచిది. ఇప్పుడు మన తలలను వంచుదాము. సోదరుడు లీవెల్ ను ఈ పైకి రావాలి నేను అడుగబోవుచున్నాను. అతడు రాగలిగితే. సోదరుడు వేల్, నీవు ఈ పైకి రాగలిగినట్లైతే, రాగలిగితే…

సోదరుడు వేల్ మన సోదరుడైయున్నాడు, అతడు పుస్తకములు వ్రాయువాడు. ఇప్పుడు అతడు పుస్తకములను సిద్ధము చేయుచున్నాడు. ఏడు సంఘ కాలములు, మరియు ఏడు ముద్రలతో పనిచేయుచున్నాడు. అతి త్వరలో మేము వాటిని బయటకు తెస్తామని నిరీక్షిస్తాము. మంచిది. లీవెల్ సోదరుడా. దేవుడు మిమ్ములను దీవించును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...