ఆలోచనాపరుని వడపోత సాధనము
1మనము ప్రార్థించుదము. ఓ, దేవా, కేవలము నమ్మికముంచవలెననుదియే ఈ రాత్రి నిజంగా మా హృదయ వాంఛయైయున్నది. ఈ రాత్రి ఈ ఆలయములో మేము కూడియుండగా, సూర్యుడు పశ్చిమానికి అస్తమించుచున్నాడు. ఆలాగే సమయము మీదను సూర్యుడు అస్తమించుచుండగా, సమయము ఎంత సమీపముగా యున్నదో మేము గ్రహించగలుగునట్లు చేయుమని, ప్రియదేవా, మేము ప్రార్థించుచున్నాము; సమయము గతించుచున్నది. పగలు చాలా గడిచి పోయినది. పగలు చాలా గడిచిన ఒక సమయమును మేము జ్ఞాపకము చేసికొనుచున్నాము. అపుడు ఇద్దరు యాత్రికులు నిన్ను ఉండమని బలవంతము చేసిరి. అపుడు నీవు నీ వాక్యము వారికి వివరించుట ద్వారా, నిన్నునీవు తెలియపరచుకొంటివి. మొదటగా క్రీస్తు శ్రమపడి వీటన్నింటినీ నెరవేర్చవలసి యున్నాడని, నీవు వారు చూడకలుగునట్లు చేసితివి.
దేవా, పగలు చాలా గడిచియుండగా, నీవు మా ఇండ్లకు వచ్చి, మాతో ఉండి వాక్యమును వివరించమని, మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, మేమెంతో ధారాళముగా, నీ నుండి, నీ నిధిని పొంది, మా హృదయ మందు ఒక కానుకగా ఉంచుకొనియున్నాము. దానిని మేమెన్నడునూ అతిక్రమించకుండా చేయుము. మా హృదయమంతటితో దానిని ఎల్లపుడూ మేము గౌరవించునట్లు చేయుము.
ఈ ఉదయమున ఆ వైద్యశాలలోని వారికి నీవు చేసిన దానినిబట్టి నీకు మేము వందనములు చెల్లించుచున్నాము. దాదాపు మరణావస్థలోయున్న సహో. కాప్స్ యొక్క చిన్న బాలునికి, నీవు చేసిన దానికొరకు వందనములు. ఇపుడీ రాత్రి, అతడు జనములో యున్నాడు. తండ్రీ, వీటన్నింటికి మేము నిన్ను ఎంతగా స్తుతించవలెను!
నిన్నెట్లు స్తుతించవలెనో మేము ఎరుగునట్లుగా, ప్రభువా నీ కృప దయచేయుము. నిన్ను ఏలాగు స్తుతించవలెనో ఎరుగుట మా అవగాహనకు అందనిది. కాని ప్రభువా, మా హృదయములను కతజ్ఞతా కానుకలుగా స్వీకరించుము. మేము నిన్ను ప్రేమించుచున్నాము. మేము సరియైనది చేయగోరుచుండగా, ఏమి చేయవలెనో మాకు చూపించుము. యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొవచ్చును.
2ఈ రాత్రి గొప్పగా క్రిక్కిరిసి యుండిన ఈ సంఘమునకు, దేశమంతటనూ టెలిఫోనుల ద్వారా వినుచున్న వారికిని, శుభ సాయంకాలము. ఈ రాత్రి మరల వారు వినుటకు ఏర్పాట్లు చేసిరని చెప్పిరి.
నా భార్య వినుచున్నదని నేను ఆశించుచున్నాను. నేనామెతో మాట్లాడలేక పోయాను గనుక ఈ ఆరాధన తరువాత ఆమెను నేను పిలువనైయున్నాను.
మరియు ఇక్కడ ఒక చిన్నవార్త వ్రాసి పెట్టబడినది, అదేమనగా, సహో. జాక్‌సన్ తండ్రి ఈ ఉదయము అటువంటి స్థితిలో ఉండియు, ఆ తదుపరి అంతటి మెరుగుదల కనిపించి రేపు ఇంటికి వెళ్ళిపోవుటకు సిద్ధముగా ఉన్నాడు.
సహో. కాప్స్, చిన్న బాలుడు బహు జబ్బుతో ఉన్నందున, ఆ రాత్రి నన్ను పిలచారు. (సహో. కాప్స్ జన సమూహములో యున్నాడో లేదో నాకు తెలియదు) జోసఫ్ మరియు నేను వేటాడు స్థలము వద్ద నా చిన్న 22 రైఫిల్ సిద్ధపరచుచుండగా అది జరిగినది. గతవారము అదంతటి గూర్చి నేను మీకు చెప్పాను. అతడు నిజంగా గొప్పవాడుగా ఉండబోవుచున్నాడు గనుక, అతడు నన్ను నిశ్చయత కలిగియుండి, అతడు చేసినది లారీ గారీలతో చెప్పమన్నాడు.
తిరిగి వచ్చుచుండగా, నేను అతనితో, "నీవు ఆగి, దాని గూర్చి సహో. జిని నార్మన్‌కు చెప్పవలసియున్నావు," అన్నాను.
"ఆగి, మొదట బిల్లీకి (అతని సోదరుడు) చెప్పు," అని అతడనెను. ఎంత మంచి ప్రేలుళ్ళు పేల్చెనో అతనికి చూపించిన తరువాత, "ఇపుడు నా దగ్గర నేర్చుకోనవసరము లేదు," అని అతడనెను. చూచారా.
3మేము సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఫోను మ్రోగినది మరియు బిల్లీ అడుగుటకు పరుగిడెను. నేను ఇట్లన్నాను, "బహుశా ఎవరో రోగి కొరకు పిలచియుందురు." మేము అప్పుడే లోనికి వెళ్ళాము, అది సహో. కాప్స్ వద్ద నుండి వచ్చెను. చిన్న బాలునికి పెరిటోనిటైటిస్ వ్యాధి. బ్రతుకుటకు ఆశ, దాదాపు అంతరించినది. అయితే ప్రభువు వానిని స్వస్థపరచెను. ఆ రాత్రి అతడు ఒక విధమగు నొప్పితో బాధపడుచుండెనని, శ్రీమతి. వుడ్ నాకు చెప్పెను. మేము వెళ్ళిపోవు తొందరలో యున్నాము. "శ్రీమతి. వుడ్, ఇప్పటికే చాలా ఆలస్యమైనది, 10:00 గంటలు. ఆ వైద్యశాలలోనికి నన్ను వెళ్ళనిచ్చుదురో లేదో సందేహించుచున్నాను," అని చెప్పాను. "నేను ఇంటికి వెళ్ళి తలుపు మూసికొందును," అని చెప్పాను. నేను పైకి వెళ్ళి ప్రార్థించాను, మరియు ఆ చిన్న బాలుడు ఈ రాత్రి జనములో యున్నాడని వారు చెప్పిరి. కనుక దానిని బట్టి మేము ఎంతో వందనములు చెల్లించుచున్నాము. మనము కతజ్ఞులము.
ఇప్పుడు, మనము వేచియున్నాము, ఇంకా వారిగురించి వినలేదు. సహో. లియో మెర్సియర్ మరియు సోదరి మెర్సియర్ వినుచున్నారేమో, నీ తండ్రి నుండి ఇంకా మేము ఏమీ వినలేదు. అతడు ఎట్లున్నాడో కొద్ది సమయములో మేము విందుమని ఆశించుచున్నాము. కాని అతడు బాగున్నాడని దాదాపు నిశ్చయముగా నేను చెప్పగలను. సర్వశక్తిగల దేవుని బట్టి, నమ్మకముతో చెప్పుచున్నాము. ఆ ప్రియమగు, వృద్ధ పరిశుద్ధుని, సువార్త యొక్క వృద్ధ యోధుడగు సేవకుని గూర్చి దేవుడు శ్రద్ధవహించును.
4ఓ! చేయవలసిన కార్యములు ఎన్నో యున్నవి. దానిని చేయుటకు కొద్ది సమయమే ఉన్నది, కనుక ప్రభువు కొరకు మనము చేయకలిగిన దానిని చేయుటకు ఇపుడు మన ప్రయత్నములన్నింటినీ చేయవలెను.
నేను కొద్దిగా ముందు వచ్చాను. నేను అంత బాగా లేను. నేను అలసిపోయాను, నిజంగా అలసిపోయాను. ఈ మధ్యాహ్నము పరుంటిని. ఇంకా భోజనమే చేయలేదు. నేను లోనికి వెళ్ళి, మధ్యాహ్నమంతా పరుండియున్నాను. నాకు బాగాలేదు. కనుక అక్కడ పరుంటిని, మరియు నేను ప్రార్థించుచుంటిని; మరియు నేను కొద్దిగా బాగుగా అనిపించెను, లేచి బట్టలు వేసికొని సంఘానికి వచ్చాను.
ఈ రాత్రి మన అందరి ప్రయత్నములను ఆయన దీవించునట్లుగా, ప్రభువైన యేసునందు ఇపుడు నమ్మికయుంచుచున్నాము. దేశమంతటిలోనున్న ఈ క్రీస్తు శరీరము యొక్క భాగమును చేరుటకు ప్రయత్నించుచున్నాము. ఆయన గొర్రెలను సరియైన దానితో మేపు హక్కు నాకు ఈయబడినది. నాకు తెలిసినంత వరకును, గొర్రెలకు సరియగు ఆహారమును ఇయ్యుటకే శాయశక్తులా పని చేయుదును. మనందరము ఒక్కచోట సమావేశమై, ఆ ఏడు తెగుళ్ళు, ఏడు పాత్రలు, బూరెలు మొదలగువాని గూర్చి బోధించుకొను సమయము కొరకు ఆసక్తితో ఎదురుచూచుచున్నాను. అవన్నియూ ఒక వరుసలో సంభవించును. మనకు వీలయినచో దాదాపు ఒక వారము, పది రోజుల కూటములలో ఒక్కసారే తీసికొని బోధించవలెనని తలంచుటకు కారణము అదే. ఆలాగయితే బాగుగా సరిపడునని తలంచుచున్నాను.
5నేనిక్కడకు చూచినపుడు, మీలో చాలామంది దూరము నుండి ప్రయాణించి వచ్చుట గమనించాను. కొద్దిసేపటి క్రితము టూసాన్ నుండి వచ్చిన వారిని గమనించాను. శ్రీమతి. సాద్‌మన్, సహో. ఫ్రెడ్, ఇప్పటికే చేరుకొనుట చూచాను. ఈ ఉదయాన జనుల గుంపులో అతనిని చూచాను. ఆ వెనుక ఆయన ప్రక్కన సహో. డాన్ రడ్డెల్, కూర్చొనియుండుట, ఈ రాత్రి నాకు కనబడుచున్నది. సహో. డాన్ వచ్చుట చూచి సంతోషము కలిగినది. జూనియర్ ఇచ్చటున్నాడా? సంఘము యొద్ద ఉన్నాడా? ఈ రాత్రి వారు సంఘము యొద్ద నుండి టెలిఫోను ద్వారా వినుచున్నారని అనుకొనుచున్నాను. సోదరులందరూ, ఈ రాత్రి ఇక్కడ మాతో యున్నందుకు; మేము చాలా సంతోషించుచున్నాము. ఒక దినమున మనము ఈ జీవిత దినమును ముగించి, మన మర్త్య జీవితపు చిన్న దీపములు కాంతి తగ్గి ఆరిపోవునపుడు, మనము ఏ కీడునకు భయపడమని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను.
6ప్రెస్‌కాట్ నుండి వచ్చిన వార్తను మీకు ఇపుడు నేను తెలుపగోరుచున్నాను. సహో. కాగిన్స్ వైద్యశాల నుండి పంపించి వేయబడెను. కావున దానిని బట్టి ఎంతో వందనములు చెల్లించుచున్నాము. మంచిది. అది మంచిది. కనుక దానిని బట్టి చాలా కతజ్ఞులము. మెర్సియర్ సోదరీ, ఇపుడు మీ తండ్రి బాగవుచున్నాడు. మనము ప్రార్థించిన తరువాత అతడు బాగవునని నాకు తలంపు కలిగినది. వారు ఈ మాటలు వినుటకు సిద్ధపడియున్నారని ఆశించుచున్నాను. వారు వినుచున్నారని తలంచుచున్నాను. కనుక దానిని బట్టి, అనగా మన సోదరుడు బాగుపడి ఇపుడు చక్కగా ఉన్నందుకు వందనములు చెల్లించుచున్నాము.
కనుక వీటిన్నింటిని బట్టి ప్రభువునకు వందనములు చెల్లించుచున్నాము.
ఇక్కడున్న ఒక ప్రియ సోదరుడు గత రాత్రి ఒక విన్నపము తెలియచేసెను. ఈ రోజు అతడు మనతో లేడనుకొంటాను. కెంటాకీ నుండి వచ్చిన ఒక సోదరుడు తన బాలిక చక్కని కుటంబము గూర్చి నాకు తెలిపెను. ఆ బాలికకు ఆపరేషను జరుగనైయున్నది. ఆ యువతల్లి వీపు వెనుక కాన్సరుతో యున్నది. ఈ యువతిని దేవుడు విడిపించునట్లుగా మనము ప్రార్థించుచున్నాము. ఆయన విడిపించునని నమ్ముచున్నాను. మనమంతయూ, సంఘ మంతయూ కలిసి ఈ కుటుంబము కొరకు ప్రార్థించవలెను. ఒక ఐక్యతగా తప్పక అది మనము చేయవలెను.
7దినములు మరింత దగ్గర, దగ్గర పడుచుండగా, మార్గము మరి ఇరుకుగా కనబడుచుండగా ఇంకా సన్నిహితముగా మనము ఎదుగగోరుచున్నాము. తప్పక మనందరము ఒకే శరీరముగా ఉండవలసియున్నాము. ఒకరి పాపములు ఒకరు మరిచిపోయి, మన విభేదములు మరిచి మనందరము కలిసి నడువవలెను. ఆ దినము సమీపించుట మనము చూచుచుండగా, మనము మరింత సన్నిహితముగా హత్తుకొనవలెను. సహజముగా కూడుకొనవలెను. ఒకే హృదయము, ఒకే మనస్సుతో కూడి యుండవలెను. ఒక వేళ ఏ సోదరుడైనా, సోదరి అయినా ఏదో విధముగా మార్గము తప్పిపోయినచో ఏమియు చేయవద్దు గాని, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి, ఎల్లపుడూ ప్రేమతో ఒకనినొకడు ఎంచుకొనుడి. మీలో ఎవరినీ పొగొట్టుకొనుటకు తావు ఈయవద్దు. కలిసియుండుడి. ఎల్లపుడూ ఇంకా మీకు సాధ్యమయితే దానికి మరెక్కువ కలుపుతూ సాగిపోవుడి.
8నెవిల్ సోదరుడా, సహో. రైట్, అనగా ఇక్కడ కూర్చొనియున్న జార్జి రైట్ సోదరుని గూర్చిన నీ విన్నపము ఇక్కడ యున్నది. రైట్ సోదరి, రైట్ సోదరుడు, ఇక్కడున్నందులకు మేము సంతోషించుచున్నాము. ఒక రోజు ఇక్కడికి మేము వచ్చినపుడు, చిన్న జ్ఞాపకార్థ కూటము జరిగినది. ఎడిత్ తిరిగి వెళ్ళినపుడు నేను రాలేదు; కాని రైట్ సోదరీ, దాదాపు రెండు సంవత్సరముల క్రితము ఆమెకు వచ్చిన కల నీకు గుర్తుండియుండును. చిన్న ఎడిత్ ఎక్కువ కాలము మనతో యుండదని అపుడు నీకు చెప్పాను, ఎందుకనగా ప్రభువు అప్పటికే ఆమెకు వచ్చిన కల ద్వారా ఆ సంగతిని తెలియచేసెను. ఆమె దేవుని కలిసికొననైయున్నదని దానికి భావము చెప్పబడెను. తరువాత సుమారు రెండు సంవత్సరములకు ఆమె ప్రభువును కలిసికొనుటకు వెళ్ళినది. ఇపుడు ఆమె తన తల్లి, తండ్రి, ఆ మర్త్య, అమర్త్యతలకు మధ్య గల గీతను దాటు సమయము కొరకు ఎదురు చూచుచున్నది. దేవుడు మిమ్ము దీవించును! నాకు వీలయితే, ఇది అయిన వెంటనే మిమ్మును చూచుటకు ప్రయత్నించెదను. దేవుడు మీకు తోడైయుండును గాక.
ఈ ఉదయము షెల్బీని చూచానని నేను తలంచుచున్నాను; ఖచ్చితంగా చెప్పలేను. ఇక్కడి నుండి అంత తేటగా చూడలేరు. ఈ సీలుంగు వలన వెలుగు ఒక రకంగా కండ్లలో పడున. చోటులు చూడవచ్చును గాని ప్రజలను అంత తేలికగా మీరు చూడలేరు.
9ఇపుడు తిన్నగా వర్తమానములోనికి వెళ్ళుదము. సంఖ్యా కాండము 19:9 మరియు ఎఫెసీ 5:26 నుండి ఈ వర్తమానము చదువగోరుచున్నాను. ఈ వాక్యాంశములు మొదలగునవి వ్రాసికొనగోరు వారు వ్రాసికోవచ్చును.
ఇపుడు గుర్తుంచుకొనండి, ఇది టేపు అవుచున్నదో లేదా నాకు తెలియదు. (నాకు తెలియదు; ఎవరూ నాకు కనబడుట లేదు. ఆ ఇపుడు రికార్డింగు గదిలో టెర్రీ నాకు కనబడుచున్నాడు.).. ఇది గాని టేపు అవుచున్నచో, ఇది ఏ సమయములోను, ఏ స్థలములోను, ఏ సేవకుని కించపరచుటకు చెప్పుట లేదని గ్రహించండి. మీ గుంపును ఉద్ధేశించియూ ఇది చెప్పబడలేదు. ఈ వర్తమానము మరియు నేను మాట్లాడిన తక్కిన వర్తమానములన్నియూ, నా సంఘమునకు మాత్రమే ఉద్దేశించి చెప్పబడినవి. ఇది మీ సంఘమునకు కాదు. అయితే వారు అంగీకరించినచో అంగీకరించవచ్చును, కాని ఇది ఈ జనులకు ఉద్దేశించబడినది.
ప్రజలు ఈ టేపులను కొందురు. ప్రపంచములోని పలు ప్రాంతపు జనులు వాటినికొని వినెదరు. చాలాసార్లు వారు వ్రాయుచుందురు, వారు ఏదైనా సంఘ సభ్యులైనచో "మీ పాస్టరును సంప్రదించండి," అని తిరిగి వ్రాయుచుందును.
10సంఘకాపరులారా, ఇపుడు ఇది, అనగా నేను చెప్పు సంగతులు నా జనులకు మాత్రమేనని మీరు తెలిసికోవలెనని కోరుచున్నాను. ఆలాగు చేయుటకు నాకు ఒక హక్కున్నది, ఎందుకనగా మందపై కావలివానిగా యుండుటకు పరిశుద్ధాత్మ నన్ను నియమించెను. నేను సత్యము అని తలంచునది, ఎక్కడి నుండి అది వచ్చునని నాకు తెలియునో అక్కడిది, నేను వారికి చెప్పనిచో నాకు శ్రమ కలుగును. కాని ఇది ప్రపంచమంతటికీ లేదా ఇతర సంఘముల కొరకు కాదు. దేవుడు ఏమి చేయమని మీకు చెప్పునో అది చేయండి. నేను మీ కొరకు జవాబు ఇవ్వలేను; లేదా మీరు నా కొరకు జవాబు ఇవ్వలేరు; కాని మన సేవ కొరకు దేవుని ఎదుట మనము జవాబు చెప్పవలెను. కాబట్టి, నా సేవ కొరకు నేను జవాబు ఈయగోరినచో, నేను నాకు కనబడిన విధముగా, నాకు బయలుపరచబడిన విధముగా నేను తప్పక బోధించవలెను. కనుక ఇది వారిని ఇపుడు తెలిసికోనీయుడి.
NUM 19:9•
EPH 5:22-26
11ఇపుడు సంఖ్యాకాండము 19:9. మనము ఈ వాక్య భాగము చదువుదము:
మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా [ఇపుడు గమనించండి!] ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను: అది పాపపరిహారార్థ బలి.
గమనించండి, అందరికీ కాదు, ఇశ్రాయేలీయుల సమాజపు వారికి మాత్రమే ఈ పాపపరిహార జలము. ఇపుడు ఎఫెసీ 5వ అధ్యాయము, 22వ వచన ఆరంభము నుండి.
స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.
క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున, పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు; క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి,
[ఇదే నేను చెప్పవలెనని కోరుచున్నాను.] అది కళంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదయినను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్ధోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అర్పించుకొనెను.
12ఇప్పుడు, ఇది ఈ రాత్రికి చిన్న అంశము. ఇక్కడున్న ప్రజలు, మరియు టెలిఫోను ద్వారా వినుచున్న వారును దీనిని నీచముగా లేదా అపవిత్రకరమగు మాటగా ఎంచరని నమ్ముచున్నాను. అయితే ఈలాంటి పేరు ఒక రకముగా అపవిత్ర పదజాలము వలె కనిపించును. ఈ రాత్రి నేను ఉపయోగించుకొను అంశము, "ఆలోచనాపరుని వడపోత సాధనము." పొగత్రాగుటను గట్టిగా వ్యతిరేకించు ఒక సేవకుడు అట్టి అంశమును తీసికొనుట బహు వింతగా వినబడవచ్చును. ఆలోచనాపరుని వడపోత సాధనము అను ఒక అంశము.
ఒక ఉదయమున ఉడుతల వేటకు నేను వెళ్ళినపుడు అది జరిగినది. రేడియో, ఆకాశతరంగములు, టెలిఫోనుల ముందు కూర్చొని వినుచున్న జనుల ముఖము మీద నేను నా అంశమును చెప్పగానే ఏదో వింత అనుభూతి కలిగినదనుకొనుచున్నాను. దానిని గూర్చి మీరు నవ్వియుందురు: ఆలోచనాపరుని వడపోత సాధనము.
13ఒక ఉదయమున ప్రభుని దూత నాకు ప్రత్యక్షమై, లేని ఉడుతలను ఉండునట్లు చేసినపుడు, ఇది జరిగినది. అదెపుడు జరిగెనో మీ అందరకు గుర్తున్నది. ఏడు సంఘకాలముల గూర్చి బోధించబోవు కొద్ది ముందుగా, నేను ఒక కొండ శిఖరాన నిలబడియున్నాను. పగలు కాకముందే ఒక ఉదయాన వేటకు వెళ్ళాను. సూర్యుడు ఉదయించుచున్నాడని అనుకొన్నాను, దాదాపు ఉదయము 4:00 గంటలయినది. అసాధారణముగా నేను వెలుగును చూచాను, నేను చుట్టూ కలియ చూశాను. అక్కడ ఏడు దీప స్తంభములు నిలిచియున్నది, ఆ కొండ శిఖరము పైన, వర్షధనస్సు వచ్చుచున్నట్లుగా, ఒక పంపులో నుండి బయటకు వచ్చుచున్నట్లుగా కనిపించెను.
అది అయిన వెంటనే, ప్రభువైన యేసు మాకు ప్రత్యక్షమాయెను. ఆ వెంటనే ఒక స్వరము ఈలాగు చెప్పుట విన్నాను, "పాత నిబంధనలోని యెహోవా, క్రొత్త నిబంధనలోని యేసే." అక్కడ ఆయన కొంత సేపటికి, అనగా, ఆ ఏడు దీప స్తంభములు కనబడిన తరువాత ఆయన ప్రత్యక్షమాయెను. అపుడు దానిని గమనించండి. ఆ అంశము ఎందరికి గుర్తున్నది? దానిని నేను నా తుపాకీ గుండ్లున్న పాకెట్టు వెనుక వ్రాశాను. "పాత నిబంధనలోని యెహోవా, క్రొత్త నిబంధనలోని యేసే." అది సత్యమని పరలోకమందలి దేవుడు ఎరుగును.
REV 1:14
14ఉడుతలు బయలుపడి ఆయన నాకు కనబడిన ప్రదేశమును నేను దాటి వెళ్ళినప్పుడు…
ఏడు సంఘకాలముల గూర్చి, ప్రకటన 1వ అధ్యాయము గూర్చి నేను బోధించుటకు ఆరంభించినపుడు, కొన్ని నెలల తరువాత, నా మంచి మిత్రుడగు జాక్‌మూర్‌ను పిలిచాను. మరియు ఆయన అక్కడ నిలబడియున్నాడు, అక్కడ అంతా తెల్లగా కనబడెను; ఆయన జుట్టు ఉన్నివలె తెల్లగా యుండెను. ఇంకా ముప్పయి మూడు సంవత్సరములు నిండని ఆయనకు జుట్టు మొత్తము ఎందుకు తెల్లబడినది? సహో. మూర్ చాలా చక్కని, విద్యగల క్రైస్తవ పెద్దమనిషి. నాకు తెలిసిన వారిలో అత్యుత్తమ పండితులలో ఒకడు. "బ్రన్హం సోదరుడా, యేసు మహిమ పొందిన తరువాత స్థితి అది. ఆయన ఆలాగే కనిపించును," అని అతడు చెప్పెను.
కాని అది నాకు సరిపడలేదు. నేను ప్రార్థించసాగాను. ఏడు సంఘకాలముల గూర్చి బోధించుటకు ఒక రోజు ముందు ఆ మొదటి అధ్యాయము ఇంకా నాకు సరిగా అర్థము కాలేదు. ముప్పది మూడు సంవత్సరముల వయస్సు వాడు … అదే శరీరమందు పునరుత్థానుడాయెను… అపోస్తలులు ఆయనను గుర్తించిరి, ఆయనే అని ఎరిగిరి… అటువంటి ఆయన ఎనభై, తొంభై సంవత్సరముల వ్యక్తివలె ముఖము, గడ్డము, జుట్టు అంత తెల్లగా ఉండి ఎట్లు కనిపించగలడు? మంచువలె తెల్లగా యున్నది.
DAN 7:9
15దినముల యొక్క ప్రాచీనత్వము యొద్దకు ఆయన వచ్చుటను గూర్చి నేను దానియేలు గ్రంథములో చదివాను. ఆయన తలవెండ్రుకలు ఉన్నివలె తెల్లగా అయినవి. ఆయనే ఆ పురాతన దినముల వాడు; నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావాడు. అది ఒక చిహ్నము అని నేను చూచాను. అయితే తెల్లని ఉన్నివంటిది ఎందులకు? అపుడు పరిశుద్ధాత్మ నాకు పురాతన దినములలోని ఒక న్యాయాధిపతిని ఒకసారి నేను పటములో చూచిన దానిని జ్ఞాపకమునకు తెచ్చి చూపించెను. అపుడు నేను చరిత్రలోనికి వెళ్ళాను. అదంతయూ కనుగొనుటకు నేను మరల వెనుకటి బైబిలు చరిత్రలోనికి వెళ్ళాను. ఆ ప్రాచీన న్యాయాధిపతులు ఇశ్రాయేలులోని ప్రధాన యాజకుని వంటివాడు. అతడు ఆ తెల్లని ఉన్నిని పోలిన జుట్టు మరియు గడ్డము కలిగియుండవలెను, ఎందుకనగా అతని మీద ఉన్న ఆ తెల్లదనము ఇశ్రాయేలులోని న్యాయాధిపతులందరి మీద తనకున్న సర్వాధికారమును సూచించుచున్నది. కొద్ది వందల సంవత్సరముల క్రితము వరకు, బహుశా రెండు వందల సంవత్సరము కావచ్చు లేదా కాకపోవచ్చు — ఇంగ్లీషు న్యాయాధిపతులందరూ వారెంత వృద్ధులయినా, యువకులయినా, తీర్పు తీర్చుటకు వెళ్ళునపుడు వారు తెల్లని విగ్గు ధరించెడివారు. అది వారికి రాజ్యములోను, తమ మాటలోను గల అధికారమును మించినది మరేదీ లేదని సూచించును. వారి మాటయే రాజ్యములో చివరిది. వారు చెప్పినదే ఇక తుది తీర్పు.
అపుడు, నేను అక్కడ ఆయన ఆలాగు నిలచియుండుట చూచాను. అయిననూ ఆయన యువకుడే. కాని తెల్లని విగ్గు ధరించెను. ఆయన పరిపూర్ణ మహోన్నత అధికారి; ఆయనే వాక్యమై యుండెను. ఆయన తెల్లని విగ్గు ధరించి యుండెను.
JOHN 1:1,3,14•
COL 2:9
16ఆ తరువాత ఆ ప్రసంగము చేసి పశ్చిమానికి వెళ్ళినపుడు, ఏడు ముద్రల కొరకు అక్కడ ప్రభువు యొక్క దూతలు ప్రత్యక్షమాయెను, అది గాలిలోనికి ఎక్కిపోయెను (దాని పటమ ఇక్కడ మరియు దేశమంతటనూ యున్నది), అక్కడ కూడా ఆయన విగ్గుతోనే నిలబడియుండెను, ఆ మహోన్నతాధికారముతోనే యుండెను. ఆయనే సంఘమునకు శిరస్సు. శరీరమునకు ఆయనే తల. ఆయన వంటి వారు ఎవరును ఎక్కడునూ లేరు. సమస్తమును ఆయన తనంతట తానే చేసెను; సమస్తమూ ఆయన తన కొరకే చేసెను; కలిగియున్నదేదియూ ఆయన లేకుండా కలుగలేదు. భూమ్యాకాశములలో ఆయన సంపూర్ణాధికారము కలిగియుండెను, మరియు సమస్తమూ ఆయనకే చెందును. దేవత్వము యొక్క సంపూర్ణత శరీరరీత్యా ఆయనలో నివసించుచుండెను. దేవుడైయున్న వాక్యము శరీరధారియై మనమధ్యనుండెను. ప్రవక్తలందరికిని, జ్ఞానులందరికిని పూర్తి రక్షణ పథకము యొక్క సంపూర్ణ రహస్యమును ఆయనే బయలుపరచెను. ఆ విగ్గు ధరించిన వాడు ఆయన మాత్రమే, ఆయనే మహోన్నత అధికారి.
17ఇప్పుడు, ఒక ఉదయమును నేను కొండ మీద ఆగియున్నాను; అక్కడ కొన్ని ఉడుతలున్నట్లుగా కనిపించినది. నేను కూర్చొని చూడనారంభించాను. అక్కడ ఒక్క క్షణము నేనున్నాను, నా ప్రక్కనున్న పొదలు కదిలినవి. ఆ పొదలో నుండి ఒక పెద్ద వ్యక్తి రెండు గొట్టముల తుపాకీ వంటిది పట్టుకొని నడచి వచ్చుచున్నట్లు కనిపించెను. పగటి వెలుగులో నన్ను భయపెట్టినట్లుగా అయినది. నేనింకా ముందుకు వెళ్ళి, వంగి చూచాను. ఇక ముందుకు వెళ్ళుటకు భయపడ్డాను, ఎందుకనగా అతడు నన్ను కాల్చునేమోననిపించినది. పొదలు కదలుచున్నవి, గనుక నేను బహు నెమ్మదిగా యున్నాను.
ఒక ఉడుత కొండమీద రాసాగినది, అతడు రెండు గొట్టములు ప్రేల్చెను. గాని అది తప్పిపోయెను. కనుక ఆ ఉడుత కొండ మీదికి ఎక్కిపోయినది. "ఇప్పుడు, నేను దూరంగా పోవుదును," ఆ ధ్వని ఇంకా ప్రతిధ్వనించుచునే యున్నది, అని నేను అనుకున్నాను. అతని తుపాకీ ఖాళీ అయినది." నేను కొండ దిగనారంభించాను, నా ముందే అతడు తుపాకీ పేల్చెను. అది నన్ను ఇటు వైపునకు త్రిప్పినది. నేను మరోవైపు వెళ్ళుటకు ప్రారంభించాను .22 రైఫిల్ పేలసాగెను. గుండ్లు నాకు పైగా ఎగిరి వెళ్ళుచున్నవి; "నేను చాలా భయంకర స్థలములో యున్నాను," అనుకొన్నాను.
18నేను చుట్టూ తిరిగి, నది ద్వారా దిగి పోదలిచాను. "నేను ఇక్కడికి వెళ్ళి వారి తూటాలన్నీ పేలిపోవు వరకు దాగుకొందును, ఆ తరువాత బయటకు పోదును," అనుకొన్నాను. నా దృష్టి నా కుడి ప్రక్కనున్న దాని వైపునకు లాగినది. నేను చూడగా, అక్కడ పొదలలో ఉడుతలను తరుముచూ వెళ్ళిన ఒకరు పడవేసిన ఖాళీ సిగరెట్టు పెట్టె కనబడినది.
నేను ఆ ఏదో పేరున్న సిగరెట్టు పెట్టెను పైకి తీసి చూశాను.. క్షమించండి — దానిని పైకి తీయలేదు; నేను దానివైపు క్రిందకు చూచాను. నేను దానిని పైకి తీయలేదు, ఎందుకనగా దాని వాసనే అసలు నాకు పడదు. నేను ఆ క్రిందికి చూచినపుడు నేను ఆ పేరు చెప్పకూడదు గాని, ఆ కంపెనీ పేరు మీరెరుగుదురు. ఒక పొగాకు కంపెనీ, అది ఈలాగు వ్రాసెను; "ఆలోచనాపరుని వడపోత సాధనము, పొగపీల్చువాని రుచి." నేను దాని వైపు చూచి ఈలాగు అనుకొన్నాను, "ఆలోచనాపరుని వడపోత సాధనము! అసలు ఆ మనిషి ఆలోచించకలిగిన వాడయినచో, పొగ త్రాగనే త్రాగడు. ఆలోచనాపరుడు అసలు పొగపీల్చడు." అంతే.
19"అయితే అదెంత మోసకరము!" అనుకొన్నాను నేను. ఆ పొగాకు కంపెనీ అమెరికాదే అయి యుండును. ఓ! నిజంగా మనము మన విధానములను అనుసరించి నడిచినచో ఒకరినొకరు సహాయపడు విధముగా పనిచేయుదుము. ఒకరిపట్ల ఒకరికి చింత కలిగిలేము. ఎంత వేఫధారణ అది… ఆ కంపెనీ పేరు నేను చెప్పక పోవుటకు కారణము, ఆ కంపెనీ వారి కొన్ని చెడ్డ పనులు నేను చెప్పవలసియున్నాను. డబ్బు పోగు చేసికొనుటకు ఎవరైనా ఎంత వేషధారణగా యుండగలరో చూడండి?
ఆలోచనగలవాడు అసలు పొగత్రాగడు, కాని అమెరికా ప్రజలు దానికెట్లు పడిపోవుచున్నారో చూడండి. అది చాలా అమోఘము అని వారు తలంచుచున్నారు.
ఇపుడు చూడండి, కావలసినచో ఎవరినైనా గాని, శాస్త్రజ్ఞులనయినా గాని అడగండి — తారు లేకుండా పొగ అనునది మీకు రాదు. ఒక్క చిన్న పొగ వచ్చినా గాని దానికి మూలము తారు మాత్రమే. నీకు పొగ ఏదీ రానిచో, తారు లేదన్న మాట; నీకు ఏ హానిలేదు. నీవు ఒక బలమగు కర్రను పీల్చుచున్నావన్నమాట. కాని నీవు పొగను పీల్చుచున్నంత వరకు కాన్సరును తెచ్చుకొనుచున్నట్లే — నికొటైన్.
20మీరు గత సంవత్సరము… లేక అంతకు ముందు సంవత్సరము గాని నాతో ఆ ప్రపంచ సంతలో ఉన్నట్లయితే, యూల్ బ్రిన్నర్, ఇంకా తదితరులు అక్కడ విడమరచి చూపించుట చూచి యుందురు. వారు ఒక సిగరెట్టును తీసికొని దాని మీద ఏదో వేసి ఒక చలువరాయి మీద పోసిరి. ఒక వైద్యుడు దానిలో నుండి నికోటైన్ అను విషమును తీసెను. దానిని ఒక తెల్ల ఎలుక మీద వేసి ఒక బోనులో యుంచెను. ప్రతి ఏడు రోజులకు ఒకసారి దానిని వారు బయటకు తీసిరి. ఆ ఎలుక కాన్సరుతో నిండిపోయినది. ఆ ఒక్క సిగరెట్టులో నుండి వచ్చిన నికోటైను వలన నడువలేకపోయినది.
అపుడతడు ఈలాగు చెప్పెను, "వడపోత సాధనము ద్వారా మీరు దానిని పొందరని వారు చెప్పుచున్నారు, కాని నికోటైన్ను వడకట్టునది ఏదియూ లేదు. నికోటైన్ పోయినచో పొగరాదు, ఎందుకనగా తారు వలనే పొగ ఏర్పడును, కాన్సరు కలుగచేయునది ఆ తారే."
అంతట అతడు వెళ్ళి నీటిగుండా దానిని లాగి ఇట్లు చెప్పెను, "కొన్ని సార్లు మీరు దానిని వడకట్ట వచ్చునని తలంచుదురు. దానిని నేను లోనికి పీల్చుట లేదని అందురు. వారు దానిని నోటిలో పెట్టుకొని బయటకు ఉమ్ముదురు. అపుడతడు దానిని తీసికొని చుట్టి అక్కడున్న ఒకదాని క్రింద ఉంచి ఇంకా అందులో కాన్సరు ఉన్నట్లుగా చెప్పెను. నీ గొంతు ద్వారా వెంటనే నీవు దానిని మ్రింగుచున్నావు. చూచారా? నీవెట్లు ఉపయోగించినా గాని, అది మరణమే. చూచారా.
21ఒక కంపెనీ కావలసినంతగా ఒక మనిషిని మోసము చేయుచున్నదని ఆలోచించినపుడు, బాధ కలుగును. తమ స్వంత ప్రజలను మోసము చేయ ప్రయత్నించుచున్నది. అది రాబందు తన స్వజాతిని తినునట్లే యున్నది. డబ్బు కొరకు దేశమునకు మరణమును అమ్ముచున్నారు. యువకులు ఆ యుద్ధ రంగమునకు వెళ్ళి దాని కొరకు మృతిపొందుచున్నారు. ఒక తప్పు నటన క్రింద అటువంటి వాటిని వారు అమ్ముచున్నారు — "ఆలోచనాపరుని వడపోత సాధనము, పొగత్రాగువానికి రుచి." నీకు రుచి కావలెనన్నచో పొగత్రాగవలెను, అని చెప్పుచున్నారు.
అయినా గాని జనులు దానికొరకు ఎంతగా బానిసలవుతున్నారో చూడండి. వారది కోరుచున్నారు. నిన్ను ఎక్కువగా మోసపుచ్చుటకే అది. చూడండి, అది అపవాది సంబంధి. నీ జీవితము వారికి లెక్క లేదు. నీ గూర్చి వారికేమీ చింత కూడా లేదు. వారికి కావలసినది డబ్బు. అది వారు నీకు అమ్మి, నీవు చచ్చిపోతూంటే చూస్తూ ఉందురు.
22రాజకీయము, యుద్ధము అట్టిదే. యుద్ధము నందు నాకు విశ్వాసము లేదు. మనము ఒక యుద్ధమును కలిగియుందుమును నమ్మకము నాకు లేదు. దేవుడు తీసికొని వచ్చుచున్న ఆ గొప్ప రాజ్యములో నాకు నమ్మకమున్నది. ఆయన యొక్క స్వంత గొప్ప ఆధిపత్యము క్రింద ఆ గొప్ప నాగరికత తీసికొని రాబడును. మరియొక యుద్ధము ఎన్నడూ యుండదు. దేశము మరియొక దేశము మీదికి ఈటెలు విసరదు. అంతా సమాధానమే, నిత్య సమాధానముండును.
ఇటువంటి నాగరికతయే యుద్ధమును తెచ్చును. దీనిక్రింద మనము ఎంతగా నాగరికత సంతరించుకొందుమో, అంత ఎక్కువగా యుద్దము వైపు వెళ్ళుదుము. ఒకరు మరొకరి కంటె ఎక్కువ నాగరికతలో ఉండవలెనని ప్రయత్నించుచున్నారు, ఎక్కువ నాగరికత, ఎక్కువ యుద్ధమునకు దోహదమగును. చూచారా.
ఈ నాగరికత క్రింద ఒక వ్యక్తి ఎటువంటి దాని క్రింద ఉంచబడుచున్నాడో చూడండి. నీవు ఎక్కువ సిగరెట్లు కొనునట్లు, నిన్ను మోసపుచ్చుటయే అది చేయుపని. ఒక వ్యక్తి సిగరెట్లు త్రాగుచున్నచో, అది అపవాది నుండి కలిగినదని నేను నమ్ముదును. స్త్రీలో గాని, పురుషులోగాని అది నికోటైన్ దయ్యము. ఆ నికోటైన్ దయ్యమునకు ఒక్క సిగరెట్టు సంతప్తి ఇచ్చినచో అది నిన్ను మరొక రీతిగా వెంటాడును. నీవు ఒక ఫిల్టరు సిగరెట్లు తీసికొనునట్లు చేయును. అందులో ఒక వంతు మాత్రమే నికోటైన్ ఉండును. కనుక నీవు అపుడు ఫిల్టరు లేచి ఒక్క దానికి బదులుగా ఫిల్టరు గల మూడు సిగరెట్లు త్రాగెదవు.
చూడండి, అది కేవలము ఒక మోసపుచ్చు పథకము. సిగరెట్లు ఎక్కువ అమ్ము పన్నాగము. ఒకడు పొగాకును ప్రత్యక్షముగా గాని లేదా పైపులోగాని ఉంచి త్రాగిన దానికన్నా ఇపుడు మరెక్కువ సిగరెట్లు కొందురు. ఇప్పుడు, చూడండి, అది అపవాది సంబంధమైనది.
23దానివైపు నేను నిలబడి చూచుచుండగా, అదెంత మోసకరమో ఆలోచించుచుండగా, ఒక ప్రశ్న నాలో వచ్చి వెనక్కు వంగి మరలా ఆ పెట్టె వైపు చూచాను. ఏదో నాతో ఈలాగు చెప్పినట్లు అనిపించినది, "కాని నినాదము సరియే: 'ఆలోచనాపరుని వడపోత సాధనము, పొగత్రాగు వాని రుచి.'" అక్కడున్న పొగాకులో, అనగా సహజ సంబంధముగాయున్న మోసము, నేడు సంఘముల యొక్క క్రమములోను యున్నదను ఆలోచన వచ్చినది (చూడండి?) ఒక మోసము.
నిజంగా సత్యమగు దానికి, అసలు అయిన దానికి ప్రపంచము మొత్తము దూరమై, ఒక గొప్ప మోసమును తమదిగా చేసికొను పరిస్థితి ఏర్పడినది. చూడండి. రాజకీయములోను, సాంఘిక వ్యవహారములోను, పాఠశాల, ఇంకా అన్ని చోట్లను ఒక మోసమే పనిచేయుచున్నది.
24ఒక యువకుడు ఒక రోజున సైనిక స్థావరము యొద్దకు వెళ్ళి, ఒక టాంకు క్రిందపడి మరణావస్థలోనున్న సైనికుని చూచెనని నాతో చెప్పెను; అతని ఊపిరితిత్తులు, కడుపు, అన్నియూ నలిగిపోయినవి. వారు వైద్యశాలకు కొనిపోయిరి, అక్కడ ముగ్గురు నలుగురు వైద్యులు వరుసలో నిలబడియుండిరి. ఆలాగే అందరును వరుసలో నిలబడియుండిరి. ఇద్దరు ముగ్గురు సైనికులు అతనిని పట్టుకొనిరి. అతడు అతి కష్టముగా ఊపిరి పీల్చుచుండెను. అతడు ఊపిరి పీల్చుచున్నపుడెల్లనూ ప్రక్కటెముక ఊపితిత్తులకు నొక్కు కొనుచుండెను. అందువలన అంతర్భాగములో రక్తస్రావము జరుగుచుండెను. ఆ వరుసలో ఆ యువకుని నిలువబెట్టిరి. ఆ వరుసలో బాగా వెనుకన అతడుండెను. అయితే ఆ ముందున్న వారు చెవి నొప్పిలేదా మరేదో మామూలు బలహీనత కలిగిన వారు మాత్రమే, వారికి అంతకన్న మరేమీ లేదు.
అతడు అక్కడికి చేరిన సమయమున ఒక సైనికాధికారి తన చిన్న బిడ్డను తీసికొని వచ్చెను. ఆ పిల్ల లేదా పిల్లవాని చేతి మీద ఏదో దద్దురు వంటిది వచ్చెను. ఆ సైనికాధికారి బిడ్డను లోనికి తీసికొని వెళ్ళుటకు లైను ఆపిరి. ఆ కుర్రవాడేమో చనిపోవుచుండెను. అక్కడే మీరున్నారు.
ఓ, ఆ సైనికాధికారి ఆ వరుసలో ఉండిన తన సోదరుని పట్ల చింత కలిగియున్నచో ఈలాగు చెప్పియుండును, "ఈ బిడ్డ ఆగ గలడు; అతనిని త్వరగా తీసికెళ్ళి; అతనికోరకు ఏదయినా చేయండి."
25కాని ప్రతి మనిషి తన అధికారమును చూపించగోరుచున్నాడు. అందరూ ఆలాగుండరు. లేదు, అందరూ ఆ విధంగా ప్రవర్తించరు. కాని చాలామంది ఆలాగున్నారు; అనేకమంది ఆ విధంగా ప్రవర్తించుచున్నారు. కాని ఆ వ్యక్తి తన బిడ్డ చేతి మీద యున్న దద్దురు గురించే ఆలోచించుచున్నాడు గాని, ఆ టాంకు క్రింద నలిగిపోయిన ఆ దీన బాలుని గూర్చి ఏమీ పట్టించుకొనుట లేదు. బహుశా ఒక దినమున యుద్ధరంగములో ఆ సైనికాధికారి జీవితమును ఆ బాలుడే కాపాడవచ్చును. చూడండి, వారది ఆలోచించుటకు ఆగుట లేదు, తమ గురించే ఆలోచన. "ఆలోచనాపరుని వడపోత సాధనము."
నేనది చూచి ఈలాగు తలంచాను, "అది ఈనాటి శాఖల వలెయున్నది, మన సంఘముల మాదిరి ఆలాగే యున్నది." ప్రతి ఒక్కరికి తమ స్వంత ఆలోచనా వడపోత సాధనమున్నది; వారికి వారి స్వంత రకపు వడపోత సాధనమున్నది. ఏది వచ్చినా, రాకపోయినా వారు తాము కోరునది చేయగోరుదురు. వారు తమ స్వంత వడపోత సాధనముతో లోనికి బయటకు వడకట్టుదురు. అక్కడున్న అవిశ్వాసులను సంతప్తిపరచుటకు లోకము చాలా మట్టుకు లోనికి పోనిచ్చుదురు. డబ్బు వచ్చినచో వారు ఏదయినా గాని పట్టించుకోకుండా చేసెదరు. వారు పేరు పొందితే చాలు, ఏదయినా చేయుటకు వెనుకాడరు. కాని ఒక్క సంగతి దానికున్నది: దేవుని సంఘములో అటువంటిది నీవు చొప్పించజాలవు — ఇపుడున్న సంఘశాఖ కాదు — నిజమగు దేవుని సంఘము గూర్చి నేను మాట్లాడుచున్నాను.
26ఈనాటి పొగాకు కంపెనీల వలెనె ఒక రుచి కొరకు ఆ చెప్పబడిన సంఘముల లేదా శాఖలలోనికి వచ్చుచున్నారు. ఆ రుచి ఏమనగా లోకపు ఔన్నత్యమే. మరియు ప్రతి శాఖకు తమ స్వంత వడపోత సాధనమున్నది. "ఆమేన్!" చెప్పువారు, అనగా బోధించునపుడు ఏకీభవించు నిజక్రైస్తవులందరినీ వారు వడకట్టి పారవేయుచున్నారు. దేశములోని జుట్టు కత్తిరించుకొను, ముఖమునకు రంగులు పూసికొను, యెజెబెలులను వారు తెచ్చుచున్నారు. వారికి పేరు వచ్చినచో చాలును: "ఒక చలన చిత్ర నటి, ఒక గొప్ప వ్యక్తి, "పలాని-పలాని వారు మా యొద్దకు వచ్చెదరు." వారు ఆలాంటి విధమగు వడపోత సాధనమును ఉపయోగించుచున్నారు. "మా శాఖ… పలాని-పలాని, వారు మాకు ప్రెసిడెంటు లేక ఒక సైనికాధికారి, లేక ఆ మరొకరు మా శాఖకు చెందినవారు." చూడండి, వారు ఎట్టి విధమగు వడపోత సాధనమును వాడుచున్నారో? అయితే ఆ వడపోత సాధనము లోకమునకు చెందినది, లోకస్తులకు చెందినది.
ప్రజలు, తమకు కావలసినది ఏదో ఎరుగుదురు. వారు తమకు కావలసినది పొందగోరినచో వారు ఒక ప్రత్యేక విధమగు వడపోత సాధనమును కలిగి యుండవలసియున్నారు. వారి లోకపు రుచిని సంతప్తిపరచుటకు లోకపు మాటలు వారికి చాలును. "ఆలోచనాపరుని వడపోత సాధనము, లోకస్తుని రుచి."
27వారు మత ఛాందసులుగా ఉండగోరుదురు. తాము భక్తిగా ఉండవలెనని తలంచుదురు, ఎందుకనగా వారిలో ఒక ఆత్మ యున్నది.
మనము మొదటగా ఈ దేశమునకు వచ్చినపుడు, ఇండియనులు సూర్యుని ఇంకా సృష్టిలోని వాటిని ఆరాధించుట కనుగొన్నాము. ఎందువలన? మానవులు కాబట్టి, మనము ఆఫ్రికాలోని కీకారణ్యములలోనికి వెళ్ళిననూ, ఆ స్థానికులు దేనినో ఒక దానిని ఆరాధించుట చూతుము. ఎందువలన? వారు మానవ మాత్రులు, కనుక ఆరాధించుట అవసరము.
కనుక మానవుడు, ఎంత పతనమైనా గాని, ఎక్కడో ఏదో యున్నదని ఎరుగును, కాని అతడు లోకము కొరకు అట్టి రుచి కలిగియున్నందున సరయిన వడపోత సాధనమును తీసికొనలేక పోవుచున్నాడు. అతడు తాను స్వంతగా తయారు చేసికొనిన వడపోత సాధనమును కలిగియుండ వలసియున్నాడు. ప్రతివారు తమ స్వంత విధానమున వడపోత సాధనము తయారు చేసికొనుచున్నారు.
ప్రతి సిగరెట్టు కంపెనీ తాము చేయకలిగిన దానిని గూర్చి గొప్ప చెప్పుకొనుచున్నారు: "నిజమగు వడపోత సాధనము ఇదే; ఇది అత్యుత్తమ వడపోత సాధనము, లేదా అన్నింటి కన్న అగ్రగామి," ఆలాగు చెప్పుకొందురు.. ఆ రుచి లేక మరేదో దీనిని మించినది లేదు అందురు. ఓ! ఎంత మోసము! "అగ్రగామి." అసలు దీనంతటికీ వెనుక ఉన్నదేమిటి? ఒక ఆలోచనా పరుడు గాని, ఆలోచనా పరురాలు గాని లేరన్న మాట ఖచ్చితము. కాని వారు ఆలాగే చెప్పెదరు, కేవలము జనులను మోసపుచ్చుట.
28ప్రజలు ఒక రుచిని కలిగియున్నారని మనము మన దినములలో కనుగొనుచున్నాము. ఒక మనిషి ఎందుకు సిగరెట్టు త్రాగును? తన రుచిని సంతప్తి పరచుకొనుటకే. ఒక స్త్రీ ఎందుకు సిగరెట్లు త్రాగును? ఒక రుచిని సంతప్తి పరచుకొనుటకే.
ఒక సంఘము ఒక మత గుంపును కనుగొనినపుడు, అందులోనికి జనులను రప్పించ వలెననుకొనినపుడు, వారు ఆ జనులకు ఇష్టమయిన రుచిని ఇవ్వగల వడపోత సాధనమును ప్రత్యేకముగా కలిగి యుండవలసియున్నారు. వారు తమకు కావలసిన రుచిని పొందనిచో, ఆ సిగరెట్టు వారికి అక్కరలేదు. మతములో తమకిష్టమగు రుచిని పొందనిచో, వారు ఆ మతమును తీసికొనరు. అది అందరికీ తెలిసిన సంగతే.
షర్టులు ధరించిన స్త్రీలు, జుట్టు కత్తిరించుకొనిన వారు, ముఖమునకు రంగులు పూసికొన్నవారు, దురాశను రెచ్చగొట్టు దుస్తులు ధరించువారు వారికి కావలెను; దానిని వారు ప్రేమించెదరు.
గత ఆదివారము నేను చక్రము మధ్యలో యున్న చక్రము లేదా ఆత్మలో యున్న ఆ చిన్న అంతరాత్మ గూర్చి చెప్పాను. ప్రాణమునకు మరియు శరీరమునకు మధ్యనున్న ఆ ఆత్మ బయట, పరిశుద్ధాత్మతో సంపూర్తిగా అభిషేకించబడగలదు. అది మీ అందరికీ అర్థమయినదా?
EZEK 18:4
29వర్తమానము యొక్క కొనసాగింపుతో దానిని మీరు అర్థము చేసికొనుటకు, ఈ లోకము యొక్క దేవుడు, చివరి దినములలో అభిషిక్తులు, ఆ బయటిది… ఆ మధ్య వృత్తము… మొదటి భాగము, మానవ జ్ఞానేంద్రియములు. రెండవ భాగము, ఆత్మీయ జ్ఞానేంద్రియములు: చిత్తము — స్వచిత్తము, ఆశ, మొదలగునవి. కాని అంతరంగ మందు ఆత్మ యున్నది. అంతరాత్మ ముందుగా నిర్ణయించబడినది. ఆత్మకు ఆ బయటి శరీరము వశమగునట్టుగా వారు ఆ ఆత్మను అభిషేకించగలరు. "కాని ఏ ఆత్మ పాపము చేయునో, ఆ ఆత్మయే మరణించును." అవిశ్వాసమును బట్టి తిరస్కరించు ఆత్మ, దేవుని వాక్యములో భాగమై యుండక, నిత్య నాశనములోనికి పోవును.
నిత్య పరలోకమును ఎట్లు నేను నమ్ముచున్నానో, ఆలాగే నిత్య మరణ మందును నేను విశ్వసించుచున్నాను, కాని నిత్య నరకమునందు కాదు. నిత్య నరకము అనునట్టిది లేదు. జనులకు నిత్య మరణమున్నది. ఈనాడు లోకము ఉన్న చాలామంది భక్తిగల వారమని చెప్పుకొని మరణించియే యున్నారు.
తన కత్తింరించుకొను జుట్టుతో, రంగులు పూసికొనిన ముఖముతో భోగముగా జీవించు స్త్రీ, బ్రదికి యుండగానే చనిపోయినది! బైబిలు ఆలాగు చెప్పెను. చూచారా? చూడండి. ఆమె భక్తిగలదై యుండును, కాని ఆమె ఎన్నడూ రక్షించబడలేదు. ఆమె బయటి ఉద్రేకమును మాత్రమే కలిగియున్నది. ఆమె సంగీత బందములో పాడవచ్చును, లేదా ఆత్మతో నాట్యమాడ వచ్చును; ఆమె భాషలలో మాట్లాడవచ్చును. ఆత్మ యొక్క ప్రత్యక్షతలన్నియూ ఆమె కలిగియుండ వచ్చును; కాని ఆమె లోపల ఉన్న ఆత్మ, దేవుని కుమార్తె అయితేనే గాని (చూచారా), ఆమె ఏమి చేసినా గాని నశించినట్లే.
30ఇశ్రాయేలీయులందరూ బాహ్యముగా ఆత్మీయముగా ఉండిరి, అందరూ దేవునిమంచి తనముతో నిండియుండిరి, దేవునిని ఇంకా ఏవేవో ఎట్లు పొందిరో తెలియున, కాని అది పని చేయలేదు. వారి అంతరంగములో నున్నది వాక్యమును గుర్తించలేదు.
కాని నీవు దేవుని ఆత్మ మూలముగా జన్మించినపుడు, అపుడు నీవు దేవుని కుమారుడవగుదువు. నీవు ఎల్లపుడూ దేవుని కుమారునివే. ఇక ముందునూ నీవు ఎప్పుడూ దేవుని కుమారుని గానే యుందువు. దానిని వేరు చేయు మార్గమేదీ లేదు, ఎందుకనగా నీవు నిత్యజీవము కలిగియున్నావు. నిత్యత్వమను దానికి అది ఎన్నడూ యుండదు; ఆలాగే దానికి అంతమును ఉ౦డదు.
EPH 5:22,32,33
31ఓ, ఆ గొప్ప మర్మములు తెలిసికొనుటకు దేవుడు తన కృపను ఇచ్చును గాక! ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు ఇంకా ముందుకు వెళ్ళి భార్య భర్తల గూర్చి మాట్లాడుచున్నాడు. "ఇది మర్మము," అని చెప్పెను. భార్య ఎట్లు భర్తను గౌరవించవలెనో చెప్పెను. రెండవ స్థానము అది, అని నేను నమ్ముచున్నాను. గౌరవము అను పదము బైబిలు అంతటిలో రెండవ సారిగా భార్య, భర్తను గౌరవించుట అని చెప్పినపుడే వాడబడినదని నమ్ముచున్నాను. తనను దేవుని కుమారునిగా భార్య గౌరవించకలగు జీవితమును, ఆ భర్త జీవించవలెను. అట్టి విధమగు జీవితము అతడు జీవించనిచో, ఆమె అతనిని గౌరవించదు. ఎందుకనగా అతని కట్టుబాటు ఆమె ఎరుగును. అయితే పురుషుడు తన భార్యపట్ల పవిత్రముగా, మర్యాదగా జీవించిన యెడల, తన కుటుంబము ఎదుట ఒక నిజమగు దైవదాసునిగా ఉన్న యెడల భార్య, పిల్లలు, అందరూ ఆ దైవదాసుని గౌరవముతో మర్యాద చూపవలెను.
32ఇపుడు స్త్రీలను గమనించండి, వారు జుట్టు కత్తిరించుకొని ఉండగోరుచున్నారు. వారు షర్టులు ధరించి, రంగులు పూసికొని, ముస్తాబవ గోరుచున్నారు. ఈ చిన్న బికినీలు, మొదలగునవి ఈ దినములలో ధరించుచున్నారు, ఆలాగు వారు చేయగోరుదురు; అయినా గాని వారు ఆలయమునకు వెళ్ళెదరు. ఆ అభిషేకము శరీరము మీదనే గాని, ఆత్మ మీద లేదని మీరు గ్రహించండి.
క్రైస్తవులుగా ఉండగోరుదురు, ఈ పనులు కూడా చేయుదురు. అది పరవాలేదని పాస్టరు చెప్పును. అది బాధ లేదని అతడు చెప్పినప్పుడు ("నీవు ఒక సభ్యురాలుగా ఉండవచ్చును; ఇక్కడున్న సంఘ పుస్తకములో నీ పేరుండును; అది పరవాలేదు."), ఒక లోకస్తురాలి రుచికి సరిపడిన తన శాఖా వడపోత సాధనమును అతడు ఆమెకు ఇచ్చుచున్నాడు. ఆమె లోకమును ప్రేమించెను; దాని యొక్క రుచి ఆమెకు ఇంపు. కనుక అతడు ఆలాంటి వడపోత సాధనమును ఆమె కొరకు కలిగియున్నాడు, కాని ఆమె ఆలోచించు స్త్రీగా కనుచూపు మేరలో కూడా లేదు. కాని అది స్థితి! అక్కడే నేను ఈ అంశమును కనుగొన్నాను.
ఆమె అసలు ఆలోచనాపరురాలు కాదు. ఆమె యోచించినచో, తన సంఘము అంత్యదినమున తీర్పు చేయదని ఎరిగి యుండెడిది. సంఘము ఇప్పుడు ఆమెను ఆమె సభ్యత్వము ద్వారాను, ఆమె చెందియుండిన సమాజములు, సంఘములకు ఎంత విధేయత చూపుచున్నదో దాని బట్టియు తీర్పు చేయుచున్నది. ఇపుడు దాని ద్వారానే ఆమెకు వారు తీర్పు తీర్చుచున్నారు. కాని అంత్యదినమున దేవుడు ఆమెకు తీర్పు తీర్చనైయున్నాడు. అయితే ఆమె ఆలోచించుట లేదు.
33పొగ త్రాగుచున్న వ్యక్తి ఆలాగే యున్నాడు. అతడు సిగరెట్టును ప్రేమించుట గాఢమైనది. ఆ నికోటైన్‌తో అతని ఆలోచనా శక్తి మొద్దుబారినది. ఆ స్త్రీ యొక్క ఆలోచనా శక్తియూ మొద్దుబారిపోయి, ప్రభువు దష్టియందు చెడ్డవగు ఈ క్రియలను చేయుచూ, ఆలాంటి ఆశలు కలిగియున్నది, ఎందుకనగా అది ఆమె చేయగోరును; ఒక లోకస్తురాలి రుచిని అది తప్తి పరచును. కనుక ఆమె లోకపు సంఘ వడపోత సాధనమును తీసికొనుచున్నది; దానితో ఆమె నిస్సంకోచముగా వెళ్ళుచున్నది, ఏ తొందర లేదు.
అది సత్యమని మనము ఇపుడు అక్కడ చూచుచున్నాము. "అది మంచిదే. స్త్రీలు ఆలాగు చేసినా మేము గద్దించము. పరవాలేదు; అందులో పెద్ద పాపము లేదు," అని పాస్టరు చెప్పును. అది అతని యొక్క వడపోత సాధనము వలన చెప్పెను, ఒక తత్వ జ్ఞాన వడపోత సాధనము ద్వారా వారు వెళ్ళిరని అది చూపించుచున్నది; వారికి ఒక తత్వజ్ఞాన రుచి యున్నది. కాని అది దేవుని వడపోత సాధనము గుండా వెళ్ళలేదు అనునది నిశ్చయము. లేదండీ!
34ఇపుడు, తత్వజ్ఞానిగా యోచించు వానికి తత్వజ్ఞానపు వడపోత సాధనము, సంఘ ధోరణిలో ఆలోచించువానికి సంఘపు వడపోత సాధనము, సిగరెట్టు గూర్చి ఆలోచించు వానికి సిగరెట్టు వడపోత సాధనము యున్నపుడు, నిజముగా యోచించు వానికి ఒక నిజమగు వడపోత సాధనము కూడా ఉండవలసి యున్నది. దేవుని యొద్ద ఒక వడపోత సాధనమున్నది, అది ఆయన యొక్క వాక్యమే. అది వేర్పాటు చేయునది, ఎందుకనగా అది పాపము నుండి వేరు చేయు జలము. ఇప్పుడు, అదియే ఆలోచనాపరుని, పరిశుద్ధుని రుచి.
ఒక వ్యక్తి లోకము యొక్క ఇటువంటి వడపోత సాధనము గుండా వెళ్ళినచో, అతనికి లోకపు రుచి దొరకును. పొగాకు కంపెనీ వలె, అతడు ఈ వడపోత సాధనము గుండా వారిని త్రోయుట వలన ఎక్కువ మంది సభ్యులను అతడు పొందును. "పురుషుల కంటె స్త్రీలే ఎక్కువగా ఆలయమునకు వెళ్ళుచున్నారు," అని మీరనవచ్చును. అది నిజము కావచ్చు. ఆమె వెళ్ళనూ గలదు. తనకిష్టమైన మరి ఏ పని అయినా చేయగలదు. అది నిజము! ఆమె ఎట్టి దానితో నయినా కలిసి పోగలదు, ఏదయినా చేయగలదు. ఆమె ఆ సంఘ వడపోత సాధనము ద్వారా వెళ్ళినది. ఆమె దేవుని యొక్క వడపోత సాధనము ద్వారా వెళ్ళినచో ఆమె ఇంకొక రకముగా ఉండి యుండును. చూచారా? ఆమె దేవుని యొక్క వడపోత సాధనము ద్వారా వెళ్ళజాలదు. ఆలాగు వెళ్ళి జుట్టు కత్తిరించుకోజాలదు. అది ఆమె చేయలేదు.
1COR 11:6,15
35ఇపుడిది కొందరికి కొంత చేదుగా వినబడవచ్చును. ఆమె దేవుని వడపోత సాధనము గుండా వెళ్ళుట ప్రారంభించినయెడల ఆమె జుట్టు కత్తిరించుకొనరాదని వారు చెప్పినపుడు, ఏమీ చేయును? ఆ ప్రక్కనే యుండును. ఆలాగు చేయుట పాపము మరియు అవమానము అని చెప్పబడెను, "ఆమె కోరినచో జుట్టు కత్తిరించుకొనవచ్చును'' అయితే "క్షౌరము చేయించుకొనుట స్త్రీకి అవమానము." "ఆమె ముసుగు వేసికొనవలెను." ఆమె జుట్టు ఒక ముసుగు, టోపి కాదు, స్త్రీలారా! ఆమె జుట్టు ఒక ముసుగుగా ఇయ్యబడినదని, బైబిలు చెప్పుచున్నది. ప్రభువునకు ఆమె నాజీరు చేయబడినదని చూపించుచున్నది. స్త్రీకి పొడవగు వెంట్రుకలు ఆమె ప్రభువునకు నాజీరు చేయుటను సూచించును.
అది నిజమని ఇపుడు మనము కనుగొనుచున్నాము. అయితే ఆలోచనా పరుడుగా పిలువబడుచూ, ఈ లోకములో పొగత్రాగుచూ రుచి పొందుచున్న వ్యక్తి, తాను పీల్చు పొగాకు నుండి తారు గ్రహించుచున్నానన్న వివేకమును కలిగియుండవలెను. అయితే జరుగుచున్నదేమనగా అతడు ఎక్కువ సిగరెట్లు కొనునట్లు చేయుటయే.
PS 139:23,24
36సంఘపు వడపోత సాధనము సభ్యత్వము మొదలగు వాని ద్వారా ఎక్కువ సభ్యులను పొందుచున్నారు. వారు ఏలాగు జీవించిననూ సంఘమునకు చెందెదరు, అని చెప్పి అనుమతించుచున్నారు. ఈ రాత్రి మనము సంఘములలోనికి వెళ్ళి, నిజముగా వాక్య మూలమున జన్మించిన క్రైస్తవులను తప్ప తక్కిన వారందరిని వడకట్టినచో ఎట్లుండును! ఈ రాత్రి అనేకులు గోడకు చేరబడి నిర్జీవ ప్రసంగమును వినుచున్నారు. నిజము! ఎందుకనగా అది వారి వడపోత సాధనము ద్వారా వెళ్ళుట బట్టి జరిగినది.
నా హృదయములో ఏదయినా కోరిక ఉన్నదంటే, అది ఒక్కటే, నా మాట వినుచున్న వారందరూ అదే కలిగియుండవలెనని ఆశించుచున్నాను. "దేవా, నీ వడపోత సాధనము గుండా నన్ను తీసికొని వెళ్ళుము!" దావీదు చెప్పినట్లుగా, "నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైనది నాలో యున్నచో తీసి వేయుము, ప్రభువా." చూచారా? నాకు దేవుని వడకట్టు సాధనము కావలెను. లోకము ఏమీ చేసినా అక్కర్లలేదు, సంఘమునకున్నది నాకు వద్దు. నేను ఆలోచనాపరునిగా ఉండగోరుచున్నాను, ఈ దినములలో ఒక దినమున తీర్పు కొరకు ఎవరి యొద్ద నేను నిలబడియుందునో అని ఆలోచించసాగుదును.
37గమనించండి, ఎక్కువ సిగరెట్లు అమ్ముకొనుటకు పొగాకు కంపెనీ ఆలాగు చేయుచున్నది. ఎక్కువ మంది సభ్యులను సంపాదించుటకు సంఘము ఆలాగు చేయుచున్నది. జుట్టు కత్తిరించుకొని, పొట్టి దుస్తులు ధరించియున్న స్త్రీ, దేవుని యొక్క వడపోత సాధనములో చిక్కుకొనును. పొట్టి జుట్టుతో ఆమె అందులో నుండి క్రిందికి దిగజాలదు, ఎందుకనగా అది చేయరాదని బైబిలు చెప్పుచున్నది. ఆ విధముగా ఆమె చేసినపుడు, తన శిరస్సును అవమాన పరచును. దానిని మనము తెలిసికొనవలెను. కాని ఆమె సంఘము ద్వారా ఏ ఇబ్బంది లేకుండానే దిగిపోవును, తక్కిన వారందరూ ఆలాగే పోయెదరు.
కొన్ని సార్లు నేను ఎవరినీ లెక్క చేయకుండా నిలబడుదును. ఎవరిని గూర్చి ఎన్నడూ నేను వ్యక్తిగతముగా మాట్లాడను, కాని సంఘములో పాపము గూర్చి మాట్లాడుచున్నాను. దాని గూర్చి మీరు నాతో పాటు సాక్షమిచ్చెదరు. "పలాని ఆమె పలాని రీతిగా యున్నది, లేదా రెవరెండు పలాని ఆయన పలాని విధంగా యున్నాడు," అని నేను చెప్పను. కాదండీ! పాపమును నేను పాపమని చెప్పుదును. అది నా కుటుంబములో యున్నా, నాలో ఉన్నా, ఎవరిలో ఉన్నా పాపము పాపమే. ఏదో వ్యక్తిని నేను ఎత్తి చూపించుచున్నానని తలంచవద్దు. నేను పాపమునకు వ్యతిరేకముగా మాట్లాడుదును. అది నాలో ఉన్నా, ఎవరిలో ఉన్నా, దేవుని వడకట్టు సాధనము గుండా వెళ్ళినచో, ఏ పాపమయినా గాని అక్కడికక్కడ ఆగిపోవును.
1JN 2:15
38గమనించండి. పొట్టి జుట్టు మరియు పొట్టి దుస్తులు ధరించి లేదా రంగులు పూసికొనుట మరేదయినా గాని చేయగోరు స్త్రీ, మంచి నీళ్ళు త్రాగినంత తేలికగా ఒక పెంతెకోస్తు వడపోత సాధనము గుండా వెళ్ళుచున్నది. అది ఏమీ వింత కాదు. తిన్నగా మరణములోనికే వెళ్తున్నది. "అందులో ఏమీ కీడు లేదు," అని ఆమె తేలిగ్గా చెప్పును. "లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని మీరు ప్రేమించుచున్నచో, దేవుని యొక్క ప్రేమ అసలు మీలో లేదనియే అర్థము."
ఈ బాహ్య ప్రాణము నుండి ఆమె ఆత్మ యొద్దకు ఈ దేవునికి, దేవుని వాక్యమునకు చెందని కార్యములను స్వీకరించుచున్నది, ఎందుకనగా అది ఆమె యొక్క ఆత్మ రుచి యున్నది. అది ఆ రుచి నుండి రాగలదు, చూడండి. హేతువును బట్టి ఆలోచించుట ద్వారా అది, అనగా రుచి కలుగుచున్నది: "అందులో ఏమీ కీడు లేదు. నాకు రుచి ఉన్నది; నాకు అనుభూతులు కలుగుచున్నవి. ఇది పరవాలేదని నాకు భావన కలుగుచున్నది." ఆమె యొక్క ఆ భావన ఆమె ఆత్మలోనికే చొచ్చుకొని పోవుచున్నది. ఆమె యొక్క ఆత్మ ఆ విధముగా ఉండుటయే దానికి కారణము. ఆమె దేవుని యొక్క వడపోత సాధనము గుండా వెళ్ళుట లేదని అది సూచించుచున్నది. కాని ఆమె దానిగుండా వెళ్ళిన యెడల ఆ కత్తిరింపు జుట్టు, ముస్తాబు, షర్టులు, పాంట్లు, పురుషునివలె కనబడుట, ఆ క్రియలు, సంగతులు లోకము కొరకు జీవించుట, వారు ఏదేదోగా పేరుపెట్టి పిలచునదంతయూ పోవును, ఆమె అదంతయూ ఆపును; ఆమె ఆలాగు నడువజాలదు. లేదండీ! ఆదిలోనే ఆమెను అది ఆపును.
39గమనించండి, ఆమె చక్కని ఎర్రని పెదవులను, రంగుల ముఖమును, షర్టును బికినీలను, ఆమెకున్న సమస్తమునూ ఒక పురుషుడు చూచును. నిజముగా ఆలోచించు వ్యక్తి ఆమె వైపు చూడడు. ఇప్పుడు, ఒక సంఘ సభ్యుడగు వ్యక్తి ఆమెను చూచి, మెచ్చుకొనును. ఆమె కంటికి ఎంత అందముగా కనపడినా గాని, ఆలోచనా పరుడు లెక్క చేయక తన ముఖమును త్రిప్పుకొనును. ఎందువలన? అతడు దేవుని వడపోత సాధనము గుండా వెళ్ళియున్నాడు. ఆమెను చూచుట వ్యభిచారముతో సమానమని అతడు తన హృదయములో ఎరుగును. ఆమె అందముగా ఉన్నదని అతడు తలంచడు. "ఆమె అందముగా ఉన్నది కదా?" అని ఎవరైనా అంటే, నాకు ఆలాగు లేదని అతడు పలుకును. ఆలోచనాపరునికి ఆమె అపవిత్రముగా కనబడి, నీచమగు, దరిద్రురాలగు యెజెబెలుగా ఉండును. ఆమె చెందిన కుటుంబమునకు అతడు చెందినా గాని, దేవుని కుమారుడు ఆమెను అవమానముతో చూచును. అది నిజము! "ఆలాగు ప్రవర్తించుచున్న ఆమె, నా సోదరిగా ఏలాగు తగును?" చూచారా?
ఆమె వచ్చిన వడపోత సాధనము వేరు, అతడు వచ్చిన వడపోత సాధనము వేరు. ఆమె అందముగా ఉన్నదని, అతడు ఏ మాత్రమును ఆలోచించడు. నిజమగు దైవజనునికి అది అందము కాదు.
GEN 6:2
40గుర్తుచేసికొనండి, ఒక కాలములో, అనగా యేసుక్రీస్తు రక్తము వడపోత సాధనము కాకముందే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిని పెండ్లి చేసికొనిరి. (కొద్ది నిమిషములు అందులోనికి మనము వెళ్ళుదము.) దేవుడు ఎన్నడూ దానిని క్షమించలేదు. ఇశ్రాయేలు వారు సాగిపోవుచున్నపుడు ఇది జరిగెను, మరియు దానిని దేవుడెన్నడూ క్షమించలేదు; వారందరూ నశించిపోయిరి. "ఆలోచనాపరుని వడపోత సాధనము."
ఇక్కడున్నపుడు ఒక కూటము నుండి బయటకు వచ్చాను; ఒక రాత్రి ఆ చర్చి వెనుక ఒక చిన్న యువకుడు నిలబడియుండి, సుమారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఈలాగు చెప్పెను, "నీవు ఆలాగు చెప్పుటకు కారణము, నీవు ముసలివాడవగుటయే." "వారు అందముగా కనబడుచున్నారని నేననుకొనుచున్నాను," అని చెప్పెను.
"అది నేను ఉహించగలను," అని అన్నాను. అతనిని చూస్తే, అతడేలాగు కనబడుచున్నాడో మీరు చెప్పగలరు. "అయితే ఒక్క మాట విను. నీ వయస్సెంత?" అనడిగాను.
"దాదాపు ముప్పయి సంవత్సరాలు," అన్నాడు.
"నీ కంటె పదిహేను సంవత్సరాల యువకునిగా నేనున్నపుడు, నేను ఆలాగే తలంచాను," అని చెప్పాను. నిజమే! అది అపవిత్రతే! "ఆలోచనాపరుని వడపోత సాధనము."
PROV 7:22,27•
MATT 5:28
41ఇప్పుడు గమనించండి, అతని మనస్సు దేవుని ఒక్క వడపోత సాధనమగు దేవుని వాక్యము గుండా వెళ్ళి యుండినచో, ఆమె వైపు అతడు చూచి యుండేవాడు కాడు. ఆమె అందముగా యున్నదని అతడు తలంచడు; ఆమె యెజెబెలు అని అతడు తలంచును. ఆ ఎర్రని పెదవుల వెనుక, అతనిని కరచు విష కోరలున్నవని అతడు తలంచును. బైబిలు ఈ విధముగా చెప్పెను, "ఆమె గవునులు పాతాళపు గవునుల వంటివి; అందులోనికి నడిచి వెళ్ళు వ్యక్తి, వధించబడుటకు వెళ్ళుచున్న ఎద్దువలె ఉన్నాడు." అక్కడ ఆలోచనాపరుని వడపోత సాధన మున్నది.
నీవేమి ఆశించుచున్నావు? ఆ విధంగా దుస్తులు ధరించి, వీధిలో నడిచి వచ్చుచున్న స్త్రీ వైపు పురుషులగు మీరు, తల త్రిప్పి ఆలాగు చూచుచున్నయెడల, నీవు ఆలోచనాపరుని వడపోత సాధనమును ఉపయోగించుట లేదు. ఎందుకనగా ఆలాగు నీవు చూచినపుడు వ్యభిచరించుచున్నట్లే. "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, ఆమెతో అప్పుడే వ్యభిచరించిన వాడగును" అని వడపోత సాధనము చెప్పుచున్నది. ఆలోచనాపరుడా! నీ తల త్రిప్పుము. ఆమె నుండి తప్పించుకొనుము. ఆమె అందకత్తె కాదు; ఆమె ఒక సర్పము. అది నిజము. ఆలాగే త్రిప్పుకొని, ప్రవర్తించుచున్నది, ఆలాగే కరచుచున్నది. ఆమె నుండి దూరంగా పొండి.
42ఓ, అవును, దేవుని యొక్క వాక్యము ఆలోచనాపరుని యొక్క వడపోత సాధనము. ఎవరయినా అది ఎరుగుదురు; నీ ఆత్మ ఆ దేవుని వాక్యము ద్వారానే వడకట్టబడుచున్నది. ఒక ఆలోచనా పరుడు, దేవుని యొక్క వడపోత సాధనము గుండా వచ్చినచో, అది అతనికి పరిశుద్ధుని రుచిని ఇచ్చును. అది నిజము. నీవు దేవుని వడపోత సాధనము ద్వారా వచ్చినపుడు, నీ రుచి పరిశుద్ధుని రుచిగా ఉండును. అది ఒక నీతిమంతుని రుచిని కలుగచేయును. ఆ నినాదము నిశ్చయంగా నిజమే.
ఇది ఇశ్రాయేలు సమాజములో ఏలాగు మాదిరిగా చేయబడినదో ఇపుడు మనము కనుగొందుము. ఆ కారణము చేతనే, ఇపుడు దీనిని చెప్పుచున్నాను; చెప్పబడిన దేని గూర్చి యైననూ సేవకులు సమ్మతించనిచో, ప్రభువు నాకు బోధించమని అప్పగించిన ఈ సమూహమునకు మాత్రమే ఇది చెప్పుచున్నానని గ్రహించవలెను.
43గమనించండి, నిర్గమ కాండము 19 (మీరు ఇంటికి వెళ్ళి ఎక్కువ సమయమున్నపుడు దానిని చదువమని కోరుచున్నాను) గమనించండి, ఇశ్రాయేలు వారు పాపము చేసినపుడు, మొదటగా వారు ఒక ఎర్రని దూడను తీసికొనెడి వారు; అది ఎన్నడునూ తన మెడ పైన కాడి మోయరాదు. అనగా అది ఎన్నడునూ, ఏ బరువును మోయరాదని అర్థము. అది ఎర్రగా ఉండవలెను. ఎర్రని రంగు ఒక పరిహారపు రంగు.
నీవు ఎర్రనిది తీసికొని మరియొక ఎర్రని దానిలో నుండి చూచినచో అది తెల్లగా కనబడునని సైన్సు చెప్పుట మీరు ఎరుగుదురా? ఎర్రని దానిని ఎర్రని దాని గుండా చూచినపుడు: తెలుపు కనబడును. ప్రభువైన యేసు యొక్క ఎర్రని రక్తము గుండా ఆయన మనలను చూడగా, మన పాపములు హిమమంత తెల్లగా కనబడును — ఎర్రని దానిగుండా ఎర్రనిది చూచుట. ఇశ్రాయేలు యొక్క సర్వసమాజము ద్వారా ఆ దూడ వధించబడవలెను. ఆ సర్వసమాజము ప్రవేశించు ద్వారము మీద దాని యొక్క రక్తముతో ఏడు చారలు గీయవలెను: రక్తము ద్వారా వచ్చిన ఏడు సంఘ కాలములకు అది మాదిరి.
NUM 19:9
44అపుడు దాని శరీరమును తీసికొని దహించుదురు. డెక్క, చర్మము, ప్రేవులు, మలముతో సహా దానిని దహించవలెను. అంతయూ కలిపి దహించవలెను, అపుడు దానిని ఒక పవిత్ర వ్యక్తి ఎత్తికొని, సమాజము వెలుపట పవిత్ర స్థలములో ఉంచవలెను. ఇశ్రాయేలు కేవలము ఒక మాదిరినే చూచెను, ఈ దేవుని వాక్యము అవిశ్వాసముగు అపవిత్ర చేతులతో తాకబడరాదు. అతడు పవిత్రుడుగా ఉండవలెను; అతడు పవిత్రుడయినచో, అతడు దేవుని యొక్క వడపోత సాధనము ద్వారా రావలెను. ఒక పవిత్ర మనిషి, పవిత్ర చేతులు! అది పవిత్ర స్థలములో ఉంచబడవలెను. యెజెబెలులు, అల్లరి యువకులు, మొదలగు వారందరూ కలిసి సంస్కారము తీసికొనుచోటు కాదు. వారు ఇతరుల భర్తలతో, భార్యలతో తిరుగుచూ, సమస్త అపవిత్ర కార్యములు చేయుచూ, డాన్సులకు, విందులకు వెళ్ళుచూ, జుట్టులు కత్తిరించుకొని, షర్టులు ధరించుకొని తమ్మునుతాము క్రైస్తవులుగా పిలచుకొనుచున్నారు. దానిని పవిత్ర స్థలములో పెట్టవలెను మరియు పవిత్ర చేతులతో తాకవలెను.
ఇశ్రాయేలు పాపము చేసి, వారు తప్పు చేసినట్లు గ్రహించినపుడు, ఈ దహన బూడిద వారి మీద ప్రోక్షింపవలెను. అదియే వేరు చేయు జలము, పాపమునకు ఒక పరిహారము.
ROM 10:17
45గమనించండి, ఇది చూడవలెను! ఇశ్రాయేలీయులను ఆరాధన ద్వారా సహవాసములోనికి రాకముందు, ఈ వేరుపరచు జలము దాటి వెళ్ళవలెను — నీతికరణ ద్వారా… వినుట వలన విశ్వాసము కలుగును; వాక్యము వినుటవలన. అపుడు వారు రక్తము యొక్క ఆ ఏడు చారల క్రింద నుండి సమాజములో ప్రవేశించవలెను. తమ పాపము కొరకు ఒకటి చనిపోయి, తమకంటె ముందు వెళ్ళినదని వారు చూపించుచున్నారు. వాక్యము వినుట ద్వారా వారు వేరు చేయబడి, వేరుపరచు జలము. ఆ తరువాత సహవాసములో ప్రవేశించిరి.
దేవుడు ఒక మనిషిని కలిసికొనుటకు అదొక్కటే స్థలము, ఆ క్రమము వెనుక. మరెక్కడను అతడు దేవుని కలిసికొనలేడు. ఆ క్రమము వెనుకనుండియే అతడు రావలెను. దేవుడు ఇశ్రాయేలును ఒకే స్థలములో కలిసికొనెను. ఈనాడును దేవుడు నిన్ను ఒకే స్థలములో కలిసికొనును; అది యేసు క్రీస్తునందే. ఆయన వాక్యమై యున్నాడు, వేరుపరచు జలము. ఆయన రక్తము ఏడు సంఘముల కాలములకును చిందించబడినది. అపుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా సహవాసములోనికి ప్రవేశించుచున్నాము, అది కేవలము సంఘమునకు మాత్రమే ఇయ్యబడినది. ఓ! ఆయన ఎంత గొప్పవాడు!
EPH 5:26
46ఇపుడు మనము, ఎఫెసీ 5:26 కూడా చూద్దాం, వాక్యముతో ఉదకస్నానము చేయుట అని వ్రాయబడినది. వేరుపరచు జలము. అది ఏమీ చేయును? వాక్యమే దేవుని యొక్క వడపోత సాధనమై యున్నది. పరిశుద్ధ జలము — పరిశుద్ధ జలము అను వాక్యముతో కడుగుట, దేవుని వడపోత సాధనము.
సంఘ వడపోత సాధనము ద్వారా నీవు క్రీస్తులోనికి రాజాలవు. ఒక శాఖా లేదా సిద్ధాంతపు వడపోత సాధనము ద్వారా రాలేవు; ఆ పరిశుద్ధ వాక్యమును జలము ద్వారా కడుగబడుట వల్లనే. దేవుని వాక్యమే ఆలోచనాపరుని యొక్క వడపోత సాధనము.
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4
47నీవు ఒక మంచి సభ్యునిగా ఉన్నావో, లేదో అని ఇక్కడ సంఘము నిన్ను తీర్పు చేయును. వారు నీకు మంచి సమాధి, లేక నీవు చనిపోయినపుడు పతాకము సగము అవనతు చేసి గొప్ప పూలదండలు పంపుట, ఇంకా ఏవేవో చేసెదరు; కాని నీ ఆత్మ దేవునిని కలిసికొనవచ్చినపుడు, దానికి నిత్యజీవము ఉండవలెను! నిత్యజీవమనగా దేవుని వాక్యములో భాగమే. …నా స్వంత చేయి నా చేయిని తిరస్కరించదు… నా స్వంత కండ్లు నా చేతిని కాదనవు, ఆలాగే నా పాదమును, బొటన వ్రేలును, నాలోని మరే భాగమును తిరస్కరించుట జరుగదు. వాటిని అది కాదనదు. ఆలాగే దేవుని యొక్క వాక్యములో భాగమైయున్న పురుషుడయినా, స్త్రీ అయినా, దేవుని వాక్యములోని ఒక్క భాగమును కూడా తిరస్కరించరు. స్త్రీలారా, మీరు జుట్టు కత్తిరించుకొనియు దేవుని సన్నిధిలోనికి రాగలమనుకొనుచున్నారు, మీరు తప్పు చేయుచున్నారు! అది మీరు చూచారా? మీరు చేయునది తప్పు! వాక్యము యొక్క జలము ద్వారా మీరు కడుగబడితే గాని, దేవుని యొక్క వడపోత సాధనము గుండా రాలేరు. అపుడే మీరు సహవాసములో ప్రవేశించెదరు. మీరు ప్రవేశించామని అనుకొనుచున్నారు గాని, మీరు వాక్యము ద్వారా వస్తేనే గాని, అక్కడికి వచ్చుట దుర్లభము. ప్రతి చిన్న పొల్లు ప్రతి చిన్న దేవుని వాక్యము… "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని, ప్రతి మాట వలన జీవించును." ఆ వడపోత సాధనము గుండా అది రావలసియున్నది. అది ఒక నీతిమంతుని రుచిని ఇచ్చును, ఎందుకనగా అతడు దానికొరకే ఎదురుచూచుచున్నాడు, తనను పవిత్రపరచు ఒక దానికొరకు చూచుచున్నాడు.
48దేవుని వాక్యము ఆలోచనా పరునియొక్క వడపోత సాధనమైయున్నది, అది నీతిమంతుని రుచిని కలుగజేయును. అది నిజమని మనకు తెలియును. అవిశ్వాస పాపమునంతటినీ బయటకు వడకట్టి వేయును. ఆ వడపోత సాధనము గుండా నీవు వచ్చినపుడు, ఏ అవిశ్వాసము ఇక ఉండదు, ఎందుకనగా అది నిజవిశ్వాసి యొక్క రుచి.
నిజవిశ్వాసి ఏమైనా గాని సరిగి ఉండగోరును. "మంచిది, నేను సామాజిక ఔన్నత్యమునకు చెందియున్నాను. నేను సంఘమునకు చెందియున్నాను. పట్టణములోని పెద్ద చర్చికి చెందాను," అని చెప్పుకొనగోరడు. అది మూలలో ఉన్న మిషను అయినా, ఎక్కడో యున్న మరో స్థలము అయినా నాకు లెక్కలేదు. ఒక ఆలోచనాపరుడు తాను దేవునిని కలిసికొననైయున్నానని ఎరుగును. సంఘము చెప్పినా లేదా మరెవరు ఏది చెప్పినా, అతడు దేవుని షరతులను అంగీకరించి వచ్చును. దేవుని వాక్యమే దేవుని యొక్క షరతు.
"మంచిది, దేవుని వాక్యము!" అని వారందురు. నిశ్చయంగానే వారందరూ అది దేవుని వాక్యమని వారందరూ నమ్ముదురు, కాని దానిగుండా వెళ్ళి నీవు వడకట్టబడగోరుదువా? జుట్ట కత్తిరించుకొనిన స్త్రీని, నీవు ఏలాగు దానిగుండా రానీయగలవు? అది నీవేలాగు చేయగలవు? ఈ బోధను ఆపవలెనని కోరుచున్న వ్యక్తిని, నీవు దీనిగుండా ఏలాగు రప్పించగలవు? చూచారా? అది ఆలోచనాపరుని రుచికాదు. కాదు! అటువంటి దానిలోనికి దూకు ముందుగా ఆలోచనాపరుడు రెండు సార్లు ఆలోచించును.
JOHN 6:37•
JOHN 10:5,27
49గమనించండి, వాక్యము — వాక్యమును తిరస్కరించదు. అది తృప్తి నిచ్చును — కోరిక కలిగి యుండును. అది దేని గూర్చిన ఆశ? మొదటగా దానివలన నీకు కలుగకోరిన ఏమిటి? నీ ఆత్మ యందు ముందుగా నిర్ణయించబడిన ఒక విత్తనమున్నది, అది నిత్యజీవము; అదెల్లపుడునూ అక్కడే యున్నది. "తండ్రి నా కనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. వారిలో ఎవరునూ నశింపరు."
"ఆలోచనాపరుని రుచి." ఆలోచనాపరుడు దేవుని వాక్యము వినినపుడు నా గొర్రెలు, నా స్వరము వినును. క్రొత్తవాని స్వరము అవి వెంబడించవు," అన్నట్లుండును. ఎందుకనగా అక్కడ జీవమున్నది, మరియు జీవము జీవముతో ముడిపడును. పాపము పాపముతో అక్కడ ముడిపడున, మరియు పాపము ఎంతో వేషధారణగా ఉండును; రక్షించపబడక పోయిననూ, రక్షించబడితిననునట్లుగా చేయును. అది వేషధారణ యొక్క అగాధములో యున్నది.
తమ స్వంత కోరిక కలిగియుండియూ, భక్తి వర్గము వారిగా పిలువబడునట్లుగా సంఘ సభ్యులు ఒక శాఖా వడపోత సాధనమును కోరుకొనుచున్నారు. "ఓ, ఆయన చాలా భక్తిగలవాడు," అని చెప్పుట మీరు విందురు.
1JN 2:15
50ఆఫ్రికాలో ఒక రోజున, నేను బయటకు వెళ్ళాను. అక్కడున్న కొందరు బాలురు ఈ ఎల్విస్ ప్రిస్లే, పాట్ బూన్, నికీ విల్సన్ ఇంకా తదితర రాక్-ఎన్-రోల్ నాయకుల గూర్చి ముచ్చటించు కొనుచున్నారు. "వారు ఒక అల్లరి ముఠా," అని నేనన్నాను.
"ఆ అతడు చాలా భక్తిగలవాడు కాదా?" అని ఒక చిన్న బాలిక అన్నది.
నేను అన్నాను,"యూదా కూడా ఆలాగే. యూదాకు కేవలమ ముప్పది వెండి నాణెములే దొరికెను; ఎల్విస్ ప్రిస్లేకు అనేక మిలియనుల డాలర్లు దొరికెను." "వారిద్దరూ జన్మ హక్కులను అమ్ముకొన్న వారే,'' చుడండి. "దేశమునకు ఉన్న అతి నీచులలో, వారు ఒకరు," అని నేను చెప్పాను. [తేపు పై ఖాలీ.] సిగరెట్టు ఫిల్టరు వలె ఇంకా మోసముచేయుచున్నారు. ఈ శాఖలు, ఆ సభ్యులను లోనికి రానిచ్చుచున్నారు. వారు భక్తి పాటలు పాడరాదను ఒక చట్టము ఉండవలెను. ఆలాగు పాడుట చట్ట విరుద్ధమని వారికి తెలియవలెను. అయితే అంతయూ, ఒక పెద్ద వేషధారణ యొక్క కుప్ప అయిపోయినది, ఈనాడు వారు అక్కడే యున్నారు. ఆత్మకు నిజమగు వడపోత సాధనము ఈలాగు చెప్పుచున్నది, "మీరు లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించిన యెడల, దేవుని ప్రేమ మీలో యుండదు!"
1JN 2:15
51చూడండి, రాక్-ఎన్-రోల్ లోకముదో, దేవునిదో మీరు చెప్పలేరా? రాక్-ఎన్-రోల్ లోకపరమైనది. ఈ డాన్సులు, అసహ్య అపవిత్ర కార్యములు, లోక-సంబంధమైనవే. అదంతయూ లోక-సంబంధమైనదే. స్త్రీకి దేవుడు జుట్టు కత్తిరించుకొనుమని చెప్పెనని మీరు అనలేరు. కాదని బైబిలు చెప్పుచున్నది, కావున అది లోకము యొక్క అపవిత్రత. మీరు లోకములోని ఒక్క చిన్న కణమును ప్రేమించినా, దేవుని ప్రేమ మీలో యుండదు.
ఏమీ సమీపమగుచున్నదో చూడండి. అంతరంగమందు ఏదో లాగుచున్నది. బాహ్యము ద్వారా ఆత్మ తనకు కావలసిన ఆధారమును లాగుచున్నది. ప్రాణము ద్వారా ఆత్మలోనికి లాగుచున్నది. ఆత్మగాని లోకమును ప్రేమించినచో, అది చనిపోయినట్లే. ఇక్కడి బయట అది ఎంతగా అభిషేకించబడినా గాని, ఆ అంతరంగ మందు అది చచ్చినట్లే, మరియు అదెంత నీతిగా బయట కనబడినా; నాకక్కర లేదు, చచ్చినదే. "ఏలయనగా లోకమును గాని, లోకములో ఉన్న వానిని గాని ప్రేమించిన వానిలో దేవుని ప్రేమ ఉండదు!" అదెంత భక్తిగా కనబడినాగాని అంతే!
ఆ నిజమగు వడపోత సాధనము, అది అన్ని సంగతులన్నియూ జల్లాడ పట్టి, మరియు కేవలము దేవుని యొక్క నిజత్వమును, మరియు వాక్యమును, తప్ప మరి దేనినీ నిజమగు వాస్తవపు ఆత్మలోనికి తీసుకోని రాదు.
52వారు ఏశావు వలె యున్నారు, పైకి బాగున్నారు. ఏశావు బయటకు భక్తిగానే యుండెను. మత రీత్యా చూచినచో, యాకోబు కన్న అతడే ఎక్కువ భక్తిగా కనబడెను. యాకోబు కన్న మంచివానిగా కనబడెను, కాని అతని అంతరంగము ఏమిటో చూడండి. బయటకు అతడు భక్తిపరుడు, కాని అతని ఆలోచన వడకట్టబడలేదు. జన్మహక్కు గూర్చి అతడు సరిగా ఆలోచించలేదు. దేవుడు చెప్పినంత పెద్ద విశేషము ఈ జన్మహక్కులో లేదనుకొనెను. "నేను ఆకలిగా ఉన్నాను, ఆ జన్మ హక్కు వలన నాకేమి లాభము? నీకు కావాలన్నచో తీసికొనుము," అన్నాడు! ఓ, చూడండి, "నేను చర్చికి వెళ్ళెదను; నేను నీ వలె మంచివాడినే! నా శాఖ ప్రపంచమంతటిలోనూ పెద్దది. నా తల్లి దానికి చెందినది; నా తండ్రి దానికి చెందెను, ఇది, అదీ చెప్పెదరు. నా పాస్టరు విద్యాధికుడు; ఆయనకు పలాని-పలానివి ఉన్నవి." ఎంత ఎక్కువగా అవి యున్నచో అంతగా దేవునికి దూరంగా ఉన్నాడన్న మాట. అది ఆలోచనాపరుని వడపోత సాధనము కాదు. అదే నిజమయితే, పేరు కూడా వ్రాసికొనుట రాని పేతురు మాట ఏమిటి? కాని అతడు ఆలోచనాపరుని వడపోత సాధనమును సంపాదించెను.
గమనించండి. ఓ, మై!
53దేవుడు చెప్పినంతగా ఈ జన్మహక్కు లేదులే, అని ఏశావు తలంచెను. జీవము, మరణములకు మధ్య అది వారధిగానున్నదన్న తలంపు పొగొట్టుకొనెను. ఆలాగే హవ్వ మరియు యూదా తమ జన్మహక్కులు అమ్ముకొనిరి. నాగరికత యొక్క జ్ఞానమును కలియుండవలెనను రుచి కొరకు, తృప్తి కొరకు అమ్ముడు పోయిరి. హవ్వ సరిగ్గా అందుకే తన జన్మహక్కును అమ్ముకొనెను. విజ్ఞానశాస్త్రము యొక్క రుచి చిన్నగా చూచుట కొరకు, లోక జ్ఞానము యొక్క రుచి చిన్నగా చూచుట కొరకు, కొద్దిగా మంచి సంఘము కొరకు, కొద్దిగా మంచి వర్గపు ప్రజల కొరకు, అని ఈనాడు జనులు చెప్పుచున్నారే; దాని కొరకే ఆమె దానిని అమ్ముకొనెను. చూచారా? ముప్పది వెండి నాణెముల కొరకు, ఇంకొన్ని డాలర్ల కొరకు యూదా, తన జన్మహక్కును అమ్ముకొనెను. "ఇక్కడున్న నా సంఘము నాకు ఎక్కువగా జీతమిచ్చును. అందుకోసము ఇక్కడే బోధించెను." చూచారా? "కనుక నేను బోధకుడినయితే, మంచిది…."
54"బ్రన్హం సోదరుడా, ఆ వర్తమానము సత్యమని మేము నమ్ముదుము గాని, దానిని మేము అంగీకరించ జాలము. దానిని మేము అంగీకరించినా గాని, ఎక్కడ దానిని బోధించగలము?" అని వారనుచున్నారు. సోదరుడా, ప్రపంచము; అదే నీ సంఘము. నిశ్చయంగా. "అవును సోదరులెవరూ నాకు మద్ధతు ఇవ్వరు." ఎవరయినా సోదరులు నాకు మద్ధతు ఇవ్వవలెనని కూడా నేను చూచుట లేదు. యేసుక్రీస్తు నన్ను బలపరచవలెనని నేను చూచుచున్నాను, ఎందుకనగా ఆయన దానికి కట్టబడియున్నాడు. దానిని చెప్పినవాడు ఆయనే.
నిజమగు జన్మహక్కు అగు రక్తము, వాక్యముల ద్వారా వడపోయబడినపుడు; సమస్త పాపము, లోకము, సంఘము, శాఖలు, మరియు వర్గములు బయటకు పోవును. విద్య, నాగరికత, సంఘము, శాఖ, క్రమము, అన్ని రకముల పాపము, ఒక ఆలోచనాపరుడు దేవుని అంచనాలోయున్న ఆలోచనాపరుని వడపోత సాధనము తీసికొనినపుడు బయటకు పోవును.
దేవుని యొక్క వడపోత సాధనము ద్వారా ఒకడు తన జీవితమును వడకట్టుకొన్నపుడు అవేమియూ మిగలవు. గమనించండి. ఇక్కడ నీ జీవితము పాపముతో మిళితమైయున్నది, ఎందుకనగా నీవు పాపములో పుట్టితివి, అతిక్రమములో రూపించబడితివి, అబద్ధములాడుచూ లోకములోనికి వచ్చితివి. సహో. మెకల్లీ సాధారణముగా చెప్పెడి మాట, నేను చెప్పబోవుచున్నాను. జాగ్రత్తగా వినండి!
PS 51:5•
PS 58:3
55ఈ లోకములోనికి నీవు పాపములో పుట్టి వచ్చియున్నావు. ఒక పోరాడు తరుణము కూడా నీకు ఉండలేదు. నీవు పాపములో జన్మింతివి, అతిక్రమములో రూపుదిద్దుకొంటివి, అబద్ధములాడుచూ లోకములోనికి వచ్చితివి, నీ ఆత్మలోనే పాపపు కోరికయున్నది, పాపమును ప్రేమించుదువు; ఎందుకనగా నీవు పాపములో జన్మించావు. నీకు అసలు అవకాశమే లేదు. కాని నీ అంతరంగమందు లోపల ఎక్కడో ఏదోయుండి నిన్ను లాగుచున్నది (అందుకే నీవు వచ్చావు!) ఎక్కడో మొత్తం మీద దేవుడున్నాడని నీతో చెప్పుట నీవు ఎరిగి, ఆయన వాక్యము చదివావు. అపుడు నీవు సంఘమందు ప్రవేశించావు. నీకు ఇంకా చక్కగా చెప్పినపుడు వారి ఉద్ధేశములను గ్రహించావు. ఇక నీవు నీ ఆలోచనా వడపోత సాధనమును ఎన్నడూ వాడలేదు. కాని నీవు ఆలోచనాపరుని వడపోత సాధనమగు దేవుని వడకట్టు సాధనమును వాడవలెను. "తక్కిన వడపోత సాధనములన్నియూ నశించును, కాని నాది నశించదు," అని ఆయన చెప్పెను. నీవు దేవుని వడపోత సాధనము తీసికొని, నీ జీవితమును వడకట్టినపుడు, నీ కోరికలు ఉండవు. దేవుని వడపోత సాధనము ద్వారా, ఆలోచనాపరుని వడపోత సాధనము ద్వారా నీవు వడకట్టినపుడు, పరిశుద్ధాత్మ తప్ప మరేదియూ నీలో ఉండదు.
ఇపుడు, నీవు పరిశుద్ధాత్మకు రుజువును కోరినచో, అక్కడ అది ఉండును. నీ ఆత్మ అన్ని విధములుగా దేవుని యొక్క వాక్యపు వరుసలోనికి వచ్చినపుడు, నీవు నీ జీవితమును ఆలోచనాపరుని వడపోత సాధనము —దేవుని వడపోత సాధనము గుండా వడకట్టినట్లు లెక్కగును.
JOHN 6:37•
EPH 5:26
56గమనించండి, అది దేవుని వడపోత సాధనమేనా? తాను వాక్యము ద్వారా కడుగబడినట్లు అతడు చెప్పెను. దేవుడు ఏదెను తోటలో ఆదామవ్వలకు ఒక వడపోత సాధనము ఇచ్చెను, "అందులోనికి మరేదియు చేర్చవద్దు, అని చెప్పెను. కాని సాతాను దానికి చిన్న రంధ్రము పెట్టి "ఓ, కొద్దిగా తీసికొన్నచో పరవాలేదులే అన్నది."
ఒక్క బిందువయినాగాని దానివలన మానవజాతి యావత్తు మరణమగునట్లు చేసెను. అంతే జరుగును, నికోటైన్‌ను ఒక్కసారి రుచి చూచినచో, వారి పని అయిపోవును.
పరిశుద్ధాత్మ తప్ప అక్కడ మరేమియూ మిగలదు.
నీ అంతరంగములోనున్న ముందు నిర్ణయించబడిన విత్తనము, దేవుని పట్ల నీకు ఆకలి కలిగించుచున్నదని అది చూపించును. "తండ్రి నాకను గ్రహించిన వారందరును నా యొద్దకు వత్తురు, నేను వారిని విడిపించెదను — వారు కల్వరిలో నాతో పాటు చనిపోయిరి; నాతో పాటుగా పునరుత్థానమందు వారు తిరిగి లేచిరి — నాకు అనుగ్రహించబడిన వారందరునూ, నా యొద్దకు వత్తురు. వారు శరీరమందు కలుపబడుదురు. (కాలు, చేయి, ముక్కు , నోరు మరేద యినాగాని) వార౦దరు తమ కాలములో నా యొద్దకు వచ్చెదరు.
ఓ, మై!
PS 119:11•
HEB 13:8
57అక్కడే ఆ నిజమగు వడపోత యున్నది. లోకములోని పాప మంతయు, లోకము మీద ప్రేమంతయూ పోవును. ఈ ఆత్మ ఒకే ఒక దానిని గ్రహించును… అదిక్కడున్నది, దానిని మరచిపోవద్దు! టెలిఫోనులలో వినుచున్న మీరందరునూ, మీ మనస్సులలో దీనిని ముద్రించుకొనండి. ఒక ఆలోచనాపరుడు తాను ఎవరి ఎదుట నిలబడనైయున్నాడో ఆలోచించ నారంభించినపుడు, దేవుని వాక్యమేమిటో ఆలోచించినపుడు, ఆ ఆలోచన అతనిలో కలిగినపుడు, అతనిలోనికి పరిశుద్ధాత్మ తప్ప మరేమియూ రాదు. ఏమిటది? అది ఒక జీవకణము. ఆది నుండి యున్న వాక్యబీజము. నీవు ఆదియందే దేవునిలో యున్నావు. ఇక్కడ నిలబడి జీవబీజమును నీవు గ్రహించుచున్నావు. ముందు అభిషేకము ద్వారా విత్తనము నీ హృదయములో యున్నది! హల్లెలూయా! దేవుని యొక్క ముందు జ్ఞానము చొప్పున ఎప్పుడో ఆ విత్తనము అక్కడున్నది, ముందుగా నిర్ణయించబడినది. అది వడపోయబడినపుడు, వాక్యమునే లోనికి పోనిచ్చునుగాని మరి దేనిని లోనికి పోనీయదు! అపుడది ఆలోచనాపరుని, నీతిమంతుని, పరిశుద్ధుని రుచియగును. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని బైబిలులో చూచువాని రుచియగును. అందులోనికి వచ్చునది వాక్యమే గాని మరేదియూ రాదు. హృదయములో అది ఉండును, "నీకు విరోధముగా పాపము చేయకుండునట్లుగా, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని యున్నాను?" వాక్యము ద్వారా వడపోత పోసినపుడు లోనికి దిగునది ఏది? ఒకే ఒక్కటి యున్నది; అది పరిశుద్ధాత్మ. వాక్యముతో వడపోసినపుడు క్రిందికి దిగునది పరిశుద్ధాత్మ ఒక్కటే. ఆలోచనాపరుని వడపోత సాధనము పరిశుద్ధుని రుచిని ఇచ్చును.
HEB 13:8
58అతడు పరలోక సంగతులను రుచి చూచును. అతడు తన హృదయములో దేవుని వాక్యమును కలిగియున్నాడు. అది తన ఎదుట బయలుపరచబడుటను అతడు చూచును. అతని ఆత్మ యావత్తు దానిలోనికి చుట్టబడి యుండును. లోకము, దాని సంగతులన్నియూ అతని చుట్టూ చచ్చిపడి యుండును.
ఇపుడు నేను మతమును వడపోయుటను గూర్చి ఆలోచించుచున్నాను. ఆలోచనా పరుని వడపోత సాధనము పరిశుద్ధుని రుచిని ఇచ్చినపుడు (చూడండి), అది అతనిని సంతప్తిపరచును. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని అతడు చూచును. అవును! ఆయన గతంలో చేసిన క్రియలే మన యొదుట చేయుట చూతుము. అది పరిశుద్ధుని రుచిని, ఆలోచనను సంతృప్తిపరచును.
మరణము నుండి జీవములోనికి దాటియున్నానన్న సంగతిని అతడు ఎరుగును. వాక్యము దృడపరచబడి బయలుపరచబడుటకు అతడెంతో ఇష్టపడును. ప్రతి కాలములోను దాని కొరకు అతడు ఎదురుచూచును. ఎందుకనగా అతడు పరిశుద్ధుడు, దేవుని చూడ వలెనను కోరిక కలిగియుండును. తక్కిన వారు కేవలము సంఘములో చేరితే చాలునను కొందురు. ఇతడయితే దేవుని చూడ గోరును. మత సిద్ధాంతముల గుంపులో అతడు ఆయనను చూడడు. చక్కని పెద్ద పైపు ఆర్గనులు, ఆలయములు, పెద్ద సిలువలు, లేదా మెరుగులు దిద్దుకొనిన వేదాంత పండితులు, కాలర్లు త్రిప్పుకొన్న వారున్నచోట ఆయన అతనికి కనబడడు. ఒక తత్వవేత్తలో అతడు ఆయనను చూడడు; ఆయన వాక్యము యొక్క స్థిరతలోనే ఆయనను అతడు చూచును.
అగ్ని కణములలో ఆయనను నేను చూచాను,
ప్రభువు రాకడ యొక్క మహిమను,
నా కన్నులు చూచినవి;
ఉగ్రతా ద్రాక్షలు నిలువచేయబడిన తొట్టిని
ఆయన త్రొక్కుచున్నాడు;
నమ్మకమగు మెరుపును ఆయన
తన భీకరమగు వాడి ఖడ్గముతో పంపించెను;
ఆయన సత్యము ముందుకు సాగిపోవుచున్నది.
(అంతము వరకు అది సాగిపోవును! అవునండీ!)
GEN 2:17•
EPH 5:26
59నేను చెప్పినది గ్రహించారా? ఆలోచనాపరుని వడపోత సాధనము. దేవుని సన్నిధిలో నిలువబడగోరు వ్యక్తి, దేవుని వడపోత సాధనము ఏమిటని ప్రశ్నించుకొనును. ఆయన వాక్యమే. "దానిని తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు." ఇక్కడ జరుగుచున్నది లెక్క కాదు. ఆ వాక్యమును నీవు మీరిపోవద్దు. వాక్య జలముతో కడగబడుటయే — ఆలోచనాపరుని వడపోత సాధనము. ఒక శాఖ కాదు, ఒక మత విశ్వాసము కాదు, ఒక చర్చి కాదు, ఒక ఆలయము కాదు గాని; ఆలోచనా పరుని వడపోత సాధనము! ఏలయనగా మీరు వాక్యము ద్వారా తీర్పు తీర్చబడనైయున్నారు. ఒక ఆలోచనాపరుడు దానిని ఆలోచించును. బుద్ధి హీనుడు లోకపు రుచిని తీసికొనును. ఏ రుచియైననూ దానికి ప్రత్యామ్నాయము కాదు. అక్కడ నిజమైనది ఉండగా ప్రత్యామ్నాయము ఎందుకు?
60ఆలోచించుము! ఒక్క నిమిషము దాని గూర్చి ఆలోచించుము. జుట్టు కత్తిరించుకొని, పెదవులకు రంగు పూసికొని, ఒక స్త్రీ భాషలతో మాట్లాడుచుండగా, సంఘము ఆమె మాట్లాడుచున్నది పరిశుద్ధాత్మకు రుజువు అని ఇంకా చెప్పుచున్నది.
ఒక సెమినరీ నుండి వచ్చిన బోధకుడు, లేదా ఏదో బైబిలు స్కూలు త్రిత్వ బాప్తిస్మమును చెప్పుట, లేదా వాక్యమును ఏదో మత విశ్వాసము లేదా శాఖతో పోల్చి రాజీపడుట. అది ఆలోచనా పరుని వడపోత సాధనమా? సోదరుడా! అది కాదని నాకు కనబడుచున్నది. దానిగుండా బుద్ధిహీనుడు దిగిపోవుచున్నాడు. అది నిజము! దానిని నీవు ఊహించగలవా? తన ఆత్మ కొరకు వడపోత సాధనముగా దేవుని వాక్యమును వాడుటకు బదులుగా, ఆ పాత మత నమ్మకమును, శాఖను తన పైన ఆలాగు పేర్చుకొనుచున్నాడు. దేవుని వాక్యమును ఒక వడపోత సాధనముగా తీసికొనవలసి యున్నాడు. అందుకే అతడు పూర్తిగా కలుషితమైపోయెను, మానవ సిద్ధాంతములు మొదలగునవి అతనికి అంటుకొనియున్నవి. ఏర్పరచబడిన వారిని కూడా దాదాపుగా మోసపుచ్చుచున్నది. తన ఆత్మకు వాక్యమును చేదుకొనుటలో విఫలమగుచున్నాడు, వాక్యమును నిర్లక్షము చేయుచున్నాడు. చేదుకొనుటకు అసలు ఏదియూ లేదు. కాని ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము (దీనిని తప్పిపోవద్దు)… ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము అక్కడ లేనిచో అది అక్కడకు చేదుకొనుట జరుగదు, ఎందుకనగా అతడు తన స్వకోరిక చొప్పునే చేదుకొనును.
61పొగత్రాగు వానికి పొగత్రాగు వాని రుచియే కావలెను. ఒక కర్రను, లేదా, "నీ వ్రేలును చీకుము," అని నేను చెప్పినచో, అతడు తన వ్రేలును చీకి, "ఇది పిచ్చితనము," అని పలుకును. ఎందువలన? అతని రుచి ఆ నికోటైన్‌లో యున్నది. అతడు ఆలోచనాపరుడు కాడు. చూచారా.
"మంచిది, నేను లోకమును రుచి చూడగోరుచున్నాను; నేను పొగాకు రుచి చూడగోరుచున్నాను. మిగతావి నాకేమీ రుచించవు," అని నీవనవచ్చును. "అతనికి ఒక బట్టల పిన్ను ఇచ్చి చీకమనండి. నిశ్చయంగా! దానిని అతడు చీకునట్లు చేయండి.
"నాకేమీ రుచించుట లేదు," అని అతడు చెప్పును. అయితే నీవెందుకు అది చీకినట్లు? నీకు నికోటైన్ రుచి చూచు కోరిక యున్నది. మీరు సంఘ సిద్ధాంతమును చీకుచూ, జుట్టు కత్తిరించుకొని, ముఖమునకు రంగులు పూసికొని, అసభ్యమగు బట్టలు ధరించి, తిరుగుచున్నారు. మగవారైతే వారిని చూచుకొంటూ తమతమ క్రియలలో కొనసాగుచున్నారు. అది ఏమిటి? అక్కడేమున్నది? ఇంకా లోకము అక్కడే యున్నది. నీకు ఒక రుచియున్నది; ఒక రుచి కోసము నీవు దానిని కొనసాగించుచున్నావు.
62"నేను ఈ చర్చికి వెళ్ళగలను; వారయితే ఎన్నడూ దాని గూర్చి ఏమీ అనరు. దీని గూర్చి వారు ఏమీయూ చెప్పరు, దాని గూర్చి ఏమీ అనరు. ఈ సంగతులేమీ ఎత్తనే ఎత్తరు. మా బోధకుడు అంతకంటె విశాల మనస్సు గలవాడు. మేము అటువంటి మాటలు చెప్పము! ఏమిటది? నీవు దేనికొరకు వెర్రిగా పరుగిడుచున్నావో ఆ లోకపు రుచిని పొందియున్నావు. అది నిజము.
కాని ఒక ఆలోచనగల స్త్రీ, ఆలాంటి దానిని తీసికొనలేదు. తాను పరిశుద్ధముగా ఉండవలసి యున్నానని ఆమె ఎరుగును! దేవుని వాక్యము ద్వారా నీవు చేదుకొన కలిగినది ఆత్మ మాత్రమే, మేల్కొలుపు శక్తి, నీవు జీవించుచున్న కాలములో యేసుక్రీస్తును ప్రత్యక్షపరచుటకు నీలోనున్న ఆత్మయే, ఆ మేల్కొలుపు శక్తినిచ్చును! హల్లెలూయా! సోదరుడా, అది సత్యము కానిచో, మరి సత్యము ఇక ఏదో నాకు తెలియదు. అది సత్యము కానిచో నేను మతి పోగొట్టుకొన్న వాడనగుదును.
నీ హృదయములో ఉన్న వాక్యము, అక్కడ ముందుగా నిర్ణయించబడినది, అదే లాగుచున్నది. అది లోకమును ఉమ్మివేయును; దానికది ఇష్టముండదు. ఈ వాక్యమును అది చూచి దానివైపునకు ఆకర్షించబడుటకు ప్రారంభించును. వాక్యము ద్వారా అది ఆకర్షించబడినపుడు, ఆ వాక్యమును మేల్కొలుపునది, పరిశుద్ధాత్మ తప్ప మరేదియూ అయియుండదు.
63ఆలోచనాపరుని, భక్తిపరుని వడపోత సాధనము వాక్యమే. అతని హృదయములో ఉన్న పరిశుద్ధ రుచిని అది తప్తిపరచును. "ఆలోచనాపరుని వడపోత సాధనము, పరిశుద్ధుని రుచి." ఓ! మనము ఎట్టి దానిలోనికి వచ్చి యున్నాము.
తన ఆత్మకు దేవుని యొక్క వడపోత సాధనమును వాడుటకు బదులుగా, ఏదో శాఖ, లేక మత విశ్వాసముల ద్వారా సాతాను మోసపుచ్చుటకు చోటిచ్చుచున్నాడు. సిగరెట్లు త్రాగు మిమ్మును పొగాకు కంపెనీలు మోసము చేయచున్నట్లుగానే యున్నది. మీరు ఎక్కువ మంది సభ్యులను సంపాదించెదరు. అంతే!
ఓ! ఇది కొద్ది నిమిషములలో ఇది చెప్పి, నన్ను ముగించనీయండి.
MATT 23:26•
REV 22:18,19
64గ్రుడ్డి లవొదికయ! ఎంత గ్రుడ్డిగా మనమున్నామో చూడండి. గ్రుడ్డి లవొదికయ, అబద్ధ నటన క్రింద, అబద్ధ నమ్మకముల క్రింద, అబద్ధ సిద్ధాంతముల క్రింద, అబద్ధ శాఖల క్రింద, అబద్ధ మత సూత్ర గ్రంథముల క్రింద, ఈ యుగపు గ్రుడ్డివారిని నడిపించుచున్నది. ఓ! గ్రుడ్డి లవొదికయ, గ్రుడ్డివారికి త్రోవ చూపుచూ, మీరందరూ ఆ గుంటలో పడుటకు పరుగిడుచున్నారు.
బోధకుడా, ఈ రాత్రి నీ వడపోత సాధనమును మార్చుము. నీ క్రమము లోనికి ఆ శాఖా నికొటయినును, సిద్ధాంతముల, నమ్మకముల విషమును పీల్చుకోవద్దు. యేసు చెప్పెను, "ఒకడు వాక్యమునకు ఏదీ చేర్చరాదు, ఏదీ అందులో నుండి తీసివేయరాదు." నీవు నీ సమాజము వారికి ఆ స్త్రీలు ఆలాగు చేయుట, ఆ పురుషులు ఆ క్రియలు చేయుట పరవాలేదు. వారమే చేసినాగాని దీనికి నమ్మకముగా నిలచియండి, ఈ సిద్ధాంతములు, విశ్వాసములు అనుసరించునంత వరకూ పొరపాటు లేదు, అని చెప్పు నీవు సిగ్గుపడుట లేదా?
"గ్రుడ్డి పరిసయ్యులారా," అని యేసు చెప్పెను.
65"యేసుక్రీస్తు వారిని అంధులగు పరిసయ్యులారా," అని పిలచినట్లుగానే.
నా హృదయములో నున్న పరిశుద్ధాత్మ ఈ రాత్రి, గ్రుడ్డి లవొదికయ! దేవుడు ఎంత తరచుగా నీకు ఉజ్జీవములు దయచేసెను, కాని ఇపుడు నీ సమయము వచ్చినది. ఇక నీకు అవకాశము లేదు. దేవుడు నీ యొద్దకు పంపిన జనులను చూచి నీవు ఎగతాళి, పరిహాసము చేశావు. అయితే ఇపుడు నీ సమయము ఆసన్నమయినది. ఓ, అమెరికా దేశమా, "కోడి తన రెక్కల క్రింద పిల్లలను పొదిగినట్లుగా, దేవుడు నిన్ను ఎంతగా చేరదీసెను? కాని నీవు విననైతివి," ఇప్పుడు ఈ స్వరము తీరము నుండి తీరమునకు పోవుచున్నది, తూర్పు నుండి పడమరకు.
దేశములు బ్రద్ధలయి పోతున్నవి; లోకము పడిపోవుచున్నది. పదిహేను వందల మైళ్ళు దద్దరిల్లినది, మూడు నాలుగు వందల మైళ్ళు వైశాల్యములో మునిగిపోనున్నది, ఈ రాబోవు దినములలో ఒక దినమున ఆవలనున్న గొప్ప అగాథములో నలుబది మైళ్ళ క్రిందికి కూరుకు పోవచ్చును. కెంటకీ రాష్ట్రామును, అలలు కుప్ప కూల్చవచ్చును. అది జరిగినపుడు ప్రపంచము దద్దరిల్లి దాని మీద ఉన్నదంతయూ చిన్నాభిన్నమగును.
ఓ! యుగముల బండలో, నన్ను దాయుము. ప్రభువా, నా మీద ఊదుము. సజీవ దేవుని ఆత్మ, నా మీద ఊదుము. దేవుని వడపోత సాధనమును నన్ను తీసికొనిమ్ము, ప్రభువా. నా ఊపిరితిత్తుల లోనికి, నా ఆత్మలోనికి ప్రతి దినము పరిశుద్ధాత్మ యొక్క తాజా గాలిని ఊది, నీకు విరోధముగా పాపము చేయకుండునట్లు చేయుము, ఓ, ప్రభువా. నా పై పరిశుద్ధాత్మను ఊదుము. నా మీద ఊదుము.
66నా హృదయములో దేవుని వాక్యమును నాటుకొననిమ్ము. దాని నుండి కుడి వైపునకు గాని, ఎడమ వైపునకు గాని నేను తొలగకుండునట్లుగా ఉండనిమ్ము. నా జీవితకాలమంతయూ దానిపట్ల నేను యధార్థముగా జీవించుదును. ఓ, తండ్రియగు దేవా, యేసుక్రీస్తును నాముందున్న వారికి బయలుపరచున్నట్లుగా, ఆ మాటలను జీవింపచేయుటకు నా మీదకు పరిశుద్ధాత్మ జీవమును పంపించుము… అది జరుగవలెననియే వారు చూచుచున్నారు. అదియే నా ప్రార్థన.
ఓ! మై! ఆ సంఘములలో ఈనాడు వారెట్లు చేయుచున్నారో, గమనించండి. ఆ శాఖా వడపోత సాధనముల ద్వారా ప్రజలను ప్రపంచ సంఘసమితిలోనికి దించుచున్నారు. ఎందుకు? ఎందువలన? వారి హృదయవాంఛను అది వారికిచ్చును, సంస్థ. వారికి సంస్థ పట్ల రుచియున్నది. దానిని వారు చేయుదురు.
దేవుడు వారికొరకు ఉజ్జీవము పంపిన ప్రతిసారి, వారు చేయుచున్నదేమిటి? దానిని వారు సంస్థగా చేసిరి. అది నిజమేనా? కనుక వారికి ఆ రకమగు వడపోత సాధనమున్నది, ఎందుకనగా వారికి వారి కోరిక చొప్పున వారి రుచిని దేవుడు వారికిచ్చును. ఆయన వారికి ఇవ్వనైయున్నాడు… వారికి తిన్నగా ప్రపంచ సంఘ సమితిలోనికి దించుచున్నారు, వారికపుడు సంస్థ రుచి దొరకుచున్నది. అది వారికి దొరుకుచున్నది.
MATT 24:24•
MARK 13:22
67ఓ, లవొదికయ సంఘమా, వారి యొక్క మోసముల ద్వారా ఈ కాలములో మోసపోకుము. ఓ, పెంతెకోస్తూ, నీవు లవొదియలోనికి పోయియున్నావు. నీవు లవొదికయలో భాగమై పోయావు. మెతడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు సంఘములన్నియూ చనిపోయినవి, కేవలము ఒక సంప్రదాయ రూపము మిగిలినది… కాని పెంతెకోస్తు వారగు మీరు, అప్పుడప్పుడు ఆమేన్ ఇంకా చెప్పకలుగుచున్నారు. వేదిక పైకి చాలా సంగీతమును లాక్కొని వెళ్ళుచున్నారు. ఎక్కడ చూచినా జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలు, డాన్సు వేయుచున్నారు, అయినా గాని దైవిక స్వస్థతలో నమ్మికముంచియున్నారు. ఎన్నిసార్లు దేవుడు మిమ్మును తీసికొన్నాడు, కాని మీరు మరో వడపోత సాధనమును తీసికొన్నారు, ఒక శాఖా వడపోత సాధనమును తీసికొనిరి. ఎన్నోసార్లు దేవుడు మిమ్మును తీసికొనెను.
ఎంత మోసకరముగా అది ఉన్నది! మత్తయి 24:24, సాధ్యమైనచో ఏర్పరచబడిన వారిని కూడా అది మోసము చేయునని, యేసు చెప్పెను. మీరెంత సమీపములో యున్నారో చూడండి; హవ్వ తాను చేర్చుకొనజాలని రెండు మూడు చిన్న కార్యములను చేర్చుకొని దూరమైపోయెను. ఆలాగే మీరును సంస్థగా మారినందున దానిని పొందలేకపోవుచున్నారు. అదే కారణము. మీరు అంతా స్వీకరించి యుండవచ్చును, కాని చిన్న దానిలో అభ్యంతర పడినచో, మొత్తములోను దోషులయినట్లే. ఓ!
68పెంతెకోస్తు, పెంతెకొస్తు, దేవుని వడపోత సాధనము గుండా నీ ఆలోచనను జారనిమ్ము, నీ శాఖా స్వప్నము కాదు, మరియు అపుడు నీవు పరిశుద్ధుని రుచితో బయటకు వచ్చుదువు, పరిశుద్ధాత్మ యొక్క నిజ బాప్తిస్మము పొందుదువు.
ఒక వ్యక్తి తన భార్యను జుట్టు కత్తిరించుకొననిచ్చి, షర్టులు లేదా పొట్టి దుస్తులు ధరించనిచ్చి, తాను ఆలోచనాపరుని వడపోత సాధనము క్రింద వచ్చుచున్నానని; ఎట్లు చెప్పగలడని మీరను కొనుచున్నారు? అటువంటి పనులు చేయుచున్న వ్యక్తి ఆ మాట పలుకగలడా?
ఒక ప్రసంగీకుడు, వేదిక మీద నిలబడియున్నాడు, ఎందుకనగా మంచి జీతము అతనికి ఆ సంఘము ఇచ్చుచున్నది, "డాక్టర్, బ్రదర్, రెవరెండ్," అని అతని వీపు మీద నిమురుతూ కలిసి స్నానము చేయు స్థలములకు, ఆ సమస్త అల్లరి క్రియలు జరుగు సముద్ర తీరములకు, అన్ని విందులకూ అతనిని వారు తీసికొని వెళ్ళుచున్నారు. అతడు ఆలోచనాపరుని వడపోత సాధనము గుండా వచ్చెనన్నచో, మీరు నమ్మగలరా?
వేదికల మీద కనబడుచున్న స్త్రీలలో, చాలామంది, తమ మోకాళ్ళకు పైగానే దుస్తులు ధరించియునారు, శరీరమును అంటి పెట్టు బట్టలు ధరించారు, అన్ని రూపములను చూపించుచున్నారు. వారి ప్రతి కదలికను చూపించుచున్నారు. వారి లోపటి వస్త్రములు కనబడునట్లు చేయు బట్టలు ధరించుచున్నారు. పొట్టి దుస్తులు, బికినీలు ఇంకా ఏవేవో వేసికొన్నచో ఎంత తప్పొ, ఇది కూడా అంతే తప్పు! పెంతెకోస్తువారలారా, గ్రుడ్డి, లవొదికయ బోధకులారా, ఎంత కాలము దేవుడు మిమ్మును సహించును, నాకు తెలియదు. మీ గ్రుడ్డి నేత్రముల పట్ల దేవుడు కృప చూపించును గాక! మీరు చూచునట్లుగా మీ కండ్లు తెరచుటకు, ఈ రాత్రి ఆయన యొక్క కండ్లకు కావలసిన కాటుక యున్నది.
ZECH 14:7
69ఈ ఉదయమున నేను చెప్పినట్లుగా, మనము చూచు కాలములో యున్నాము, పైది తెలిసికొనుటకు బయట నీవు కదలునట్లుగా దానికన్న మిన్నయైన జ్ఞానేంద్రియము మరేదియూ లేదు. నీ ముక్కు ద్వారా రుచి చూతువు, నీ పెదవుల ద్వారా మాట్లాడుదువు, నీ చేతుల ద్వారా తాకుదువు మరియు అందుకొందువు, నీ పాదముల ద్వారా సంచరించుదువు, కాని నీ నేత్రముల చుచుదానికన్న ఎక్కువ దూరము నీవు నడువలేవు.
మలాకీ 4 వచ్చెను! అది నిజము. సాయంకాలమున వెలుగు కలుగును. ఓ, వెలుగులో నడువుడి!
మేము వెలుగులో నడుతుము, ఒక చక్కని వెలుగు,
కృపా హిమబిందువులు ప్రకాశమానముగా ఉన్నచోట నుండి అది వచ్చును;
దివా రాత్రులు నా చుట్టూ ప్రకాశించుము,
యేసే (వాక్యము) లోకమునకు వెలుగు.
(అవునండీ!)
ఓ సోదరుడా, దానిగుండా వెళ్ళుము. నీవు బయటకు పరిశుద్ధుని రుచితోను, పరిశుద్ధాత్మతోను వచ్చెదవు.
70ఓ స్త్రీ, నీ ఆధునిక దుస్తులను గూర్చిన ఆధునిక ఆలోచనను విడిచిపెట్టుము. నీ ఆధునిక యోచక విడువుము. పురుషుల యెదుటకు వీధిలోనికి వెళ్ళు ముందు, యవ్వన స్త్రీలారా, వృద్ద స్త్రీలారా, బిగుతు బట్టలు ధరించి ముందుకు వెనుకకు త్రోసుకొంటూ వీధిలోనికి వెళ్ళు ముందుగా… నేను విమర్శించుట కాదు గాని, సోదరునిగా చెప్పుచున్నాను. సజీవులు, మరియు మృతుల మధ్య నిలబడియుండి, నేను చెప్పుచున్నది గ్రహించి చెప్పుచున్నాను. మీరు బయటకు వెళ్ళు ముందుగా, మీ శరీరము ఒక పవిత్ర క్రమము, దేవుడు మీకిచ్చిన ఒక పవిత్ర వర్గమనియు తెలిసికొనుడి, ఆ విధమగు బట్టలు ధరించి; మీరు వీధిలోనికి వెళ్ళు ముందుగా, మీ మనస్సును ఒక ఆలోచనాపరురాలి వడపోత సాధనము గుండా వెళ్ళనీయుడి. గుర్తుంచుకొనండి. మీ వైపు దురాశతో చూచిన వారితో మీరు వ్యభిచరించినట్లే అగుదురు. సోదరీ, అది మరచిపోవద్దు.
సోదరుడా, నీవు ఆమెను చూచుటకు రెండవసారి తల త్రిప్పు ముందుగా, నీ మనస్సును ఒక ఆలోచనాపరుని వడపోత సాధనము గుండా వెళ్ళనీయుము; నీవు ఒక పరిశుద్ధుని రుచితో వచ్చి (చూచారా), ఏది సరియో అది చేసెదవు.
71గమనించండి, ఆలోచనాపరురాలి వడపోత సాధనము గుండా, మీరు మీ మనస్సును పోనిచ్చినచో, మీరు ఒక పరిశుద్ధ స్త్రీ దుస్తులతో బయటకు వచ్చెదరు. అది నిజము! సోదరుడా, నీవు ఒక పరిశుద్ధ వ్యక్తి యొక్క చూపుతో బయటకు వచ్చెదవు. ఇప్పుడు, అది ఒక ప్రత్యేక సంగతి. నీవు చేయు ప్రతిదానిని దేవుని వాక్యమను వడపోత సాధనము గుండా పోనిచ్చి అది తప్పో, ఒప్పో చూచుకొనుము.
నీవు పరిశుద్ధ స్త్రీ దుస్తులతో, పొడవైన జుట్టుతో, చక్కని వస్త్రధారణతో, నెమ్మది, అణకువగల ఆత్మతో బయటకు వచ్చెదవు, ముందుకు వెళ్లి అరచుట, పోట్లాడుట, మొదలగునవి పోవును. నెమ్మదియగు, స్వాతికపు ఆత్మతో వచ్చెదవు. అది దేవుని యొద్ద నుండి వచ్చు గొప్ప నిధి. బైబిలు ఆలాగు చెప్పెను.
ఇప్పుడు, బయట ప్రాంతములలో ఉన్నవారిని ఒక్క సంగతి అడుగుచున్నాను. కొద్ది నిమిషములలో మనము ముగించుకోనై యున్నాము.
72ఇప్పుడు, మనందరమూ ఈ రాత్రి మన కోరికలను పరీక్షించుకొందము, మరియు అపుడు నీవు ఏ విధమగు వడపోత సాధనము గుండా వచ్చుచున్నావో చూచుకోగలవు. ఇక్కడను మరియు దేశమం దంతటనూ కూడియున్న ప్రతి ఒక్కరము పరీక్షించుకొందము. మీరు నిజంగా జీవితములో ఏమీ కోరుచున్నారో, మీ కోరికల విషయములోను పరీక్షించుకొనండి. మీరు దేనికొరకు పోరాడుచున్నారో పరీక్షించుకొనుడి. ఇక్కడ మీరెందుకున్నారో పరీక్షించుడి. సంఘమునకు మీరెందు కొరకు వెళ్ళుచున్నారో పరీక్షించుకొనుడి… సంఘమునకు వెళ్ళుట మంచిదే, అయితే కేవలము చర్చికి వెళ్ళుటయే కాదు; అది మిమ్మును రక్షించదు. చూచారా? కొద్ది నిమిషముల పాటు పరీక్షించుకొనుడి. నేను ఎట్టివిధమగు వడపోత సాధనము గుండా వడపోయబడు చున్నాను? అని ప్రశ్నించుకొనండి. దేవుని వాక్యముతో మీరు ఏకీభవించనిచో, మీ ఆత్మ దానిని చేయనిచో ఏదో తప్పున్నది. అది నీవు ఏ విధమగు జీవితమును, రుచిని కలిగియున్నావో చూపించును. అది పరిశుద్ధము, విచక్షణ గలది, గౌరవము గలది అయినచో ఆ విధముగానే బయటకు వచ్చును. అది ఆలాగు కానిచో నీవు మరియొక రుచిని నీలో కలిగియుందువు. నీవు మరో దాని నుండి అది పొందుచున్నావు. అది ఖచ్చితంగా నిజము! ఆ రుచి దేవుని వాక్యము, దేవుని చిత్తము అయినచో, నీవు నీలో ఏమున్నదో తెలిసికొందువు. రుచిని ఏది అందించుచున్నదో తెలిసికొందువు. నీవు ఆ వాక్యములని భాగమైయున్నావని చూపించును. ఆ వాక్యము నీలో యుండి వాక్యము నుండి గ్రహించుచున్నది.
JOHN 6:37•
JOHN 12:32•
HEB 13:8
73అది దేనిని గ్రహించుచున్నది? అది వాక్యము గుండా వడపోయబడుచున్నది, ఎందుకనగా నీవు ఈ యుగము యొక్క యేసుక్రీస్తు శరీరములోని భాగమై యున్నావు. ఆ వాక్యము నీలో ఉన్న యెడల, అది వాక్యము నుండియే సంగ్రహించును. ఆ వాక్యమును జీవింపచేయు ఆత్మ, నీలో యున్నది. కేవలము వాక్యము ఒంటరిగా జీవించలేదు. అదియే కారణము, తండ్రి నా కనుగ్రహించిన వారందరునూ నా యొద్దకు వచ్చుదురు. నేను పైకెత్తబడినపుడు మనుష్యులందరిని నా వైపునకు ఆకర్షించుకొందును. చూచారా, చూచారా. ఆ తండ్రి…
క్రీస్తు యొక్క శరీరమందలి భాగము లోకములో ముందుగా నిర్ణయించబడియున్నది, హృదయములో పెట్టబడియున్నది… నిజమగు క్రైస్తవుడు ఎవరయినా గాని, ఈనాడు తిరిగి జన్మించినవాడు, చిన్న బాలునిగా లేదా చిన్న బాలికగా ఉన్నప్పటి నుండియూ, దేవుని కొరకు ఆకలిగొనుచున్నది, ఏదో తనలో ఉన్నట్లుగా గ్రహించును. నీవు అందుకే సంఘములలో చేరి ఏదేదో చేయుటకు ప్రయత్నించావు; అది పని చేయదు. అది ఏమిటి? అది ఆ వాక్యమే. నీవు ఒక వడపోత సాధనము కొరకు వెదుకుచున్నావు. ఒక దినమున అది నీ కండ్ల ఎదుట తారసపడినది. నీవు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు చూచావు. అది ఆ రుచిని సంతప్తిపరచినది. చూచారా? నీలో నున్న జీవితమే ఆకర్షించుచున్నది. నీలోనున్న జీవితము చేదుకొనుటను చూడుము. నీవు ఇక్కడ ఏ కోరిక కలిగియున్నావో దాని మీదనే అది ఆధారపడినది. నీవు, ఇది, అది మరేదో చేదుకొనలేవు; నీవు ఆ సరియగు వడపోత సాధన మును కనుగొనవలసియుందువు, ఎందుకనగా నీవు ఆలోచించు వ్యక్తివి. చూచారా.
నీవు ఒక ఆలోచించు వ్యక్తివయినచో, నీవు ముందుగా నిర్ణయించబడినవాడవు, లేదా జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడితివి.
74దీనిని ఒక శాఖకు చెందిన సేవకుడు వినుచున్నచో, అతడు ఆలోచనాపరుని వడపోత సాధనమును తీసికొనును. శాఖకు చెందిన సేవకుడు. నిశ్చయముగా నశించు ఆ శాఖకా పెట్టెను విసిరి పారవేయును, ఎందుకనగా అది మానవ మాట. అయితే ఎన్నడూ తప్పిపోని, ఎన్నడూ గతించని దేవుని యొక్క వడపోసిన వాక్యమును గ్రహించును. అది పరిశుద్ధుని రుచికి తగియుండును. యాకోబువలె, ప్రపంచమునంతటినీ త్యాగము చేసి, లోకములో యున్న ప్రతి శాఖయందలి ఆకాంక్షను లేదా గొప్ప పేరును త్యజించి, బిషప్పు, కార్డినలు, రాష్ట్ర ప్రెస్బెటరు, గొప్ప సంఘకాపరి పదవి మొదలగు వాటన్నింటినీ త్యజించి దేవుని యొద్దకు వచ్చెదవు; ఉన్న ప్రతిది త్యాగము చేసెదవు. లోకములో పాలు పొందుటకు ఏశావు చేసినట్లుగా కాదు గాని యాకోబు వలె, నీకున్న ప్రతిదియు నీవు జన్మహక్కును, ఆలోచనాపరుని వడపోత సాధనమును పొందుటకు ఇచ్చి వేసెదవు; ఎందుకనగా అది నీకు పరిశుద్ధుని రుచిని ఇచ్చును. అది సంతప్తికరముగా ఉండును. దేవుని యొక్క పవిత్ర మంచితనము యొక్క నిత్య రుచితో అది శుద్ధీకరించును.
75గుర్తుంచుకొనండి, హవ్వ యొక్క మనస్సు లేదా, ఆమె ఆలోచనకు సాతాను మొదటి రంధ్రము చేసినది. తన జ్ఞానము, తెలివి
చొచ్చుకొని పోవునట్లు చేసెను.
ఇపుడు, దీని గూర్చి ఆలోచించుము; నేను ముగించుచున్నాను. సాతాను మొదటి రంధ్రమును పొడిచెను, ఎందుకనగా అప్పటికి ఆమె వాక్యమును తప్ప మరిదేనిని గ్రహించని స్థితిలో యుండెను. "ఈ వడపోత సాధనము గుండా నీవు ఊపిరిపీల్చినంత కాలము, నీవెన్నడునూ చనిపోవు; కాని ఆ బయటనున్న దానిలోనిది గాని పీల్చినచో చనిపోదువు," అని చెప్పెను. చూడండి.
కాని సాతాను ఈలాగు చెప్పెను, "ఇక్కడ నీకు ఏదీ తెలియని స్థితిలో ఉన్నావు, కాని ఇక్కడున్న దీనిలో చిన్న రుచిని చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది; నీవు దేవుని వలె ఉందువు. చూచారా, ఆయనకు మంచి చెడు తెలియును గాని; నీకు తెలియదు. దీనిని చిన్నగా రుచి చూచినచో చాలును…" దానికి చిన్న రంధ్రము పొడుచుటకు తావిచ్చెను. కేవలము ఒక్క చిన్న రంధ్రమే.
"స్త్రీలకు వరములు మొదలగునవి పొందుట ఎట్లో, నీవు ఎందుకు చెప్పవు?" అని మీరనుచున్నారు కాబట్టి ఇది చెప్పుచున్నాను.
"వారు అ-ఆలు నేర్చుకోకుండా బీజ గణితము వారికెట్లు నేర్పించగలను?" అని నేనడిగాను. ఒక్క చిన్న రంధ్రమే అంతటికీ మూలమయినది. లోకపు జ్ఞానము వాడు తేగా వీరు స్వీకరించిరి. అది చేసినపుడు మొత్తము కుటుంబమునకు మరణము సంప్రాప్తించెను. జ్ఞానమును రుచి చూడగోరెను.
MATT 7:22,23•
2TIM 3:5
76ఇపుడు వడపోత సాధనము వైపు చూడండి, నిశ్చయంగా అది ఆమె రుచిని వ్యక్తము చేసెను. ఆమె రుచి లోకము పట్ల ఉన్నది; అదే ఆమె పొందెను. నేడును అదే జరుగుచున్నది; పైకి భక్తి కలిగియుండియు, దాని శక్తిని నిరాకరించుచూ వారు లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమించుదురు. చూచారా? సాతాను వారిని భాషలతో మాట్లాడించుచున్నది. వారిని కేకలు వేయనిచ్చుచున్నది. వారిని దైవిక స్వస్థతా ఆరాధనలను జరిపించనిచ్చుచున్నది. ఈ వివిధ కార్యములను చేయనిచ్చుచున్నది.
"ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? మేము చాలా కార్యములు చేయలేదా? ఇది చేయలేదా?" అని అందురు. అందుకాయన, "నేను మిమ్మును ఎరుగనే ఎరుగను, అక్రమము చేయువారలారా పొండి అనును," అని వ్రాయబడియున్నది. నీ ఎదుటనే వాక్యము ఉంచబడినపుడు కూడా ఇంకా నీవు ఆ పాత వడపోత సాధనమును పట్టుకొని లోకమును ఆస్వాదించుచున్నపుడు (చూచారా), అది నీవు హృదయంలో ఏ రుచిని కలిగియున్నావో చూపించుచున్నది.
77పావురములు పీనుగు మాంసమును తినలేవు. దానిని అవి తినజాలవు. వాటిలో చేదు లేదు. ఒక కాకి పావురము వలె గింజలను తిని, చెడు మాంసమును కూడా తినగలదు; ఎందుకనగా అది వేషధారి. కాని పావురము మరే ఇతర పక్షికి లేని నిర్మాణము కలిగియున్నది. అందుకే దేవుడు తన్ను తాను పావురము వలె పోల్చుకొని పరలోకము నుండి దిగి వచ్చుచున్నానని చెప్పెను. చూచారా? అది చచ్చిన పీనుగు యొక్క వాసనను భరించలేదు. అది డేగ కాదు. కారణమేమనగా: దానిలో చేదులేదు. దానిని జీర్ణింపచేసికోలేదు. అదిగాని తిన్నచో అది చచ్చును. పావురము ఎన్నడూ స్నానము చేయనవసరము లేదు. పావురము శరీరము లోపల నుండి ఒక నూనె బయటకు వచ్చి, బాహ్య శరీరమును శుభ్రముగా ఉంచును. అది పావురములో ఉన్న ఒక జీవము. ఈకెలను శుభ్రముగా ఉంచు నూనె అందులోనే ఉత్పత్తియగును. క్రైస్తవుడునూ ఆలాగే యున్నాడు; వారిని పవిత్రముగా ఉంచు ఒక జీవితము వారి అంతరంగములోనే యున్నది. అది వడపోయబడినది.
ఓ, గమనించండి! ఇపుడు ఆ వడపోత సాధనము వైపు చూడండి. ఈనాడు వారు చేయుచున్నది గమనించినచో, నిశ్చయంగా వారి రుచి ఏలాగున్నదో మీరు చూడగలరు.
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4•
HEB 13:8
78ఈ ఆధునిక సంఘము వైపు చూడండి. వారి వడపోత సాధనము వైపు చూడండి. వారు దేనిని ప్రేమించుచున్నారో మీరు చూడగలరు. వారేమి సంపాదించారో చూడండి. వారేమి ప్రేమించుదురు? కుమారి లవొదికయ దేవుని తీర్పు కొరకు పరుగిడుచున్నది… అది నిజము. ఈనాడు సంఘ ప్రేమ… లవొదికయ కోసమే, ఒక గొప్ప సంస్థ, ఒక గొప్ప ఏర్పాటు, ఒక గొప్ప ప్రసిద్ధ సంగతి, చక్కని దుస్తులు ధరించిన వారు, ఉన్నత సంస్కతి గలవారు, జ్ఞానముతో నిండిన వారు, పూర్తిగా అపవాదితో నిండిన వారు; మోసపూరితమగు క్రీస్తు సంఘము క్రింద ఉన్నవారు. అక్కడ మరొక్క మాట ఉంటే చాలును: "క్రీస్తు విరోధి," ఎందుకనగా క్రీస్తు నేర్పిన ప్రతిదియు వారు ఆచరణలో పెట్టక విరోధులగుచున్నారు. నిజము. వారు తమ్మును తాము ఆలాగు పిలచుకొన్నచో చాలునని తలంచుచున్నారు.
ఇక్కడ, మరియు బయట ఉన్నవారు, వర్తమానము ఎక్కడికి బయలు వెళ్ళుచున్నదో, అక్కడ ఉన్నవారు ఈ రాత్రి ఆలోచనాపరులయినచో; మీ వాంఛ బైబిలు రుచియే గాని, శాఖా రుచిగా ఉండదు; ఏలయనగా మీరు బైబిలు మూలముగానే తీర్పుతీర్చబడుదురు. వాక్యము మీ ఆత్మలను వడకట్టనిమ్మని మిమ్మును నేను అడుగుచున్నాను. దానిలోని ఒక్కమాటను తిరస్కరించుట, ఒక్క మాటను మీ ఆత్మలోనికి చొచ్చుకోనీయకుండా పోనిచ్చినచో, మీరు తిరస్కరించబడుదురు; ఎందుకనగా మనిషి కేవలము జీవించునది, గాలి పీల్చునది, రొట్టెవలన మాత్రమే కాదు గాని, దేవుని నోట నుడి వచ్చు ప్రతిమాట వలనను బ్రదుకును.
అది మీలోనికి, ముందు నిర్ణయించబడిన దానిని తీసికొని వచ్చును. ప్రభువు మీ మీద ఊదినపుడు ఆయన ఆత్మ ఆ వాక్యమును వాస్తవముగా జీవింపచేయును. అపుడు మీరు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నట్లు చూచెదరు. ఓ, మై!
79ప్రపంచము యొక్క శాఖా, మత పెట్టను విడిచిపెట్టండి. ఆ సిగరెట్టు పెట్టెను అడవులలో వారు పారేసినట్లు పారేయండి. దానిని చీకిపోయి నాశనమై పోనీయండి. (అది తప్పుడు వడపోత సాధనము) క్రీస్తు అను వాక్యమును తీసికొనండి. నిత్యజీవము తీసికొను వారందరికీ దానిని ఇచ్చి, అందించి, ఆ నిత్యజీవపు రుచిని భద్రపరచువాడు ఆయనే.
వాక్యమునకు నీవు ముందుగా నిర్ణయించబడినచో, దానిని నీవు చూచెదవు. నీలో నుండి దానిని దాయుటకు ఏ మార్గము లేదు. నీవు దానిని చూచి, "ఆఁ ఇది నా ముఖమునకు చాలా స్పష్టముగా కనబడుచున్నది. దానివైపు చూచెదను; అదే నాకు కావాలి. దాని వైపే నేను చూస్తున్నాను. దానిని నేను చూస్తున్నాను. అది ఇక్కడే యున్నది, వాక్యము, ప్రతి వాక్యము, మాట వెంబడి మాట; జీవించెదను," అందువు. అపుడు నీకు నీవు కోరు నిత్యజీవపు రుచి దొరకును. దేవుని వడపోత సాధనములో నుండి ఏది క్రిందికి దిగును? ఆత్మ తప్ప మరేదియూ కాదు, లోకము కానే కాదు. అవిశ్వాసము కానేకాదు. అది దేవుని వడపోత సాధనము. దానిగుండా నీవు పీల్చినపుడు, పరిశుద్ధాత్మ తప్ప మరేదియూ లోనికి వెళ్ళదు.
80ఇపుడు, మీరు పరిశుద్ధాత్మకు రుజువు పొందియున్నారు, చూచారా. ఒక పరిశుద్ధుని, లేదా పరిశుద్ధురాలి రుచి. వారు జీవించగోరుచున్నారు; వారు నిత్యజీవము పొందిరి. ఈ వాక్యము వారిని లేపినందున వారు బ్రదికిరి. ఆలోచనాపరుని వడపోత సాధనము మరియు పరిశుద్ధుని రుచి.
మోసము క్రింద ఆ సిగరెట్టు కంపెనీలు చేయుచున్న లోకమును తీసికొనవద్దు, కాని నిజమయిన ఆలోచనాపరుని వడపోత సాధనమును తీసికొనుము. నీవు పీల్చు ఊపిరి, నీవు తిను ఆహారము, ఆ వడపోత సాధనమై యుండవలెను. నీవేమై యున్నవో, ఆ సమస్తమూ దేవుని యొక్క వాక్యము ద్వారా పీల్చుము. నీవు పరిశుద్ధుని రుచిని కలిగియుందువు; ఎందుకనగా అది దానినే ఉత్పత్తి చేయును, ఏలయనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు.
మనము కావచ్చు లేదా కాకపోవచ్చు గాని, నాకు తెలియును — కావచ్చు అని నేను నమ్ముచున్నాను. అయితే మనము కానిచొ, ఈ దినము క్రీస్తు శరీరములో భాగమైయున్నవారు కొందరు ప్రపంచములో యున్నారు; నేడు అది దేవుని వాక్యము ద్వారా మాత్రమే జీవించును, ఈ కాలము కొరకు దేవుని నోట నుండి బయలు వెళ్ళిన ప్రతి మాట వలనను ఇపుడు మనము జీవించుచున్నాము.
81బైబిలులో అంత తేటగా పలానిది జరుగును, సంగతులు ఈలాగుండును అని వ్రాయబడియుండగా ఆ శాఖలు ఎందుకాలాగు ప్రవర్తించుచున్నవో నాకు తెలియుట లేదు. మనము ఇపుడు సరిగ్గా వాటి యెదుటనే జీవించుచున్నాము — ఇది తప్ప మరి ఏదియు అయియుండదని నాకు నిస్సందేహమగా కనబడుచున్నది.
సంఘమా, ఒక దినమున తీర్పునాడు మీతో నేను నిలువవలసియున్నానని నేను గ్రహించాను. పేరు కొరకు మీకు ఏదయినా తప్పు చెప్పుట నాకు దూరమగును గాక! నాకది ఇష్టము లేదు. నాకు కోరిక యున్నచో… నా మానవకోరిక ఏమనగా, నా రైఫిల్ తీసికొని అడవులకు వెళ్ళి ఒక చిన్న చెక్క గది తయారు చేసికొని, నా శేష జీవితమంతయూ గడుపవలెనన్నదియే. నేను వృద్దుడనగుచున్నాను, అలసిపోయాను, సోలిపోయాను, నలిగిపోయాను. కాని నేను ఇది విడిచిపెట్టలేను. నాలో ఏదో పిండి చేయుచున్నది. సత్యమును, సర్వ సత్యమును చెప్పనిచో, అయ్యో, నాకు శ్రమ! నా శరీరములో నుండి తుదిశ్వాస విడిచిపెట్టు వరకు ఇక్కడ నేను నిలబడనిచో, అయ్యో, నాకు శ్రమ! ఎవరు ఏమి అన్నాగాని నేను లెక్క చేయకుండా, తప్పక నిలబడవలసియున్నాను. దేవుని యెదుట నాకు లెక్క చెప్పవలసిన బాధ్యత యున్నది.
82మేము బోధించుచున్న సంగతులు సత్యమని అని నేను వాస్తవముగా నమ్ముచున్నాను. దానిని నేనుర బోధించుచున్నానని కాదు. కాదు, నా సోదరుడా! కాదండీ! దేవుడు నా హృదయమును ఎరుగును. నేను ఆలయములోని జనుల మధ్య కూర్చొని అభిషేకము పొందిన సేవకుడు బోధించుచుండగా వినగోరుదును. అది నాకు ఎంత తేలికగా యుండును! నిశ్చయంగా! వేదికపైనున్న వ్యక్తివలె నేనును నిత్యజీవము కలిగియుందును. అతని వలెనె నేనును భాగము కలిగియుందును. నేనును అదే పరలోకమునకు వెళ్ళెదను. అవే భాగ్యములను కలిగియుందును. ఈ దెబ్బలు, గాయములు, మాటలు పడకుండా అక్కడ కూర్చొని వినుట నాకు ఎంత సులభము! అదెంతో తేలికగా యుండును. ఇక్కడ రాత్రంతయూ నిద్రలేక ఉంటున్నాను. ముందుకొచ్చుచున్న సమస్యలు సంగతులతో రాత్రంతయూ పోరాటమే. గంటన్నర, రెండు గంటలే విశ్రాంతి. ఉదయానే నా తుపాకీ తీసికొని, చేపల గాలము తీసికొని వేటకు వెళ్ళుట, నాకు ఎంత హాయిగా ఉండును. అదెంత సులభము! కాని సోదరుడా, నా చీటి ఈలాగు పడినది. నా విధి నిర్వహణలో నేనెన్నడూ వెనక్కు పోకుండా దేవుడు సహాయము చేయును గాక! యధార్థముగా, విధేయునిగా నిలబడి మీకు ఒక ఆలోచనాపరుని వడపోత సాధనమును పరిశుద్ధమగు రుచి ఇచ్చునట్లుగా ఉత్పత్తి చేయుదును గాక!
ఆలోచనాపరుని యొక్క వడపోత సాధనము జలము… వేరుపరచు జలము. పాపము నుండి అది పవిత్రీకరించును, అదియే దేవుని వాక్యము. ఆలోచనాపరుడు తాను దేవుని యెదుట నిలవవలసియున్నానని ఎరుగును, బైబిలులోని ప్రతి మాటకు జవాబు ఇవ్వవలసియున్నానని యెరుగును; నీ హృదయములో ఉన్న రుచిని అది సంతప్తిపరచును. మనము తలలు వంచియుండగా దానిని మనము పొందుటకు దేవుడు సహాయము చేయును గాక!
83ప్రియదేవా, మరియొక గంట లేదా రెండు గంటలు గడిచిపోయినవి. ఇపుడు గడియారము కదిలిపోయినది. వర్తమానము ఇపుడు చరిత్రలోనికి పోయినది. పుస్తకములో అది నమోదు కాబడినది. దీనికి, మేము కదిలిన ప్రతి కదలికకు, చెప్పిన ప్రతి మాటకు, మా మనస్సు గుండా వెళ్ళిన ప్రతి తలంపుకు మేము అందరము జవాబు చెప్పవలసియున్నాము; రికార్డు ఇంకా పనిచేయుచున్నది. జీవితము అంతమగు వరకు అది పని చేయును, మరియు అపుడు మేము తీర్పు దినమున జవాబు చెప్పవలెను.
ఓ దేవా, భూమ్యాకాశముల గొప్ప సష్టికర్త, మేము నమ్ముచున్నవాడా, ఈనాటి జనుల కొరకు నేను ప్రార్థించుచున్నాను. వారితో పాటు నా కొరకును నేను ప్రార్థించుకొనుచున్నాను. ప్రభువైన యేసూ, నీవు వడపోత సాధనమును ఎత్తి పట్టుకొనుము. నేను అమర్యాదకరమైనది ఏదయినా చెప్పుచున్నచో, ప్రభువా, అది నా హృదయములో ఎరిగి చెప్పలేదు. నీ వాక్యమును తీసికొని ఆలాంటి రీతిగా నేను వాడినచో అది నాకు తప్పు అగును. దానిని నీవు క్షమించుము.
84కాని ప్రభువా, ఆ అడవులలో నీవు నాతో మాట్లాడియున్నావు. ఆ ఉదయమున సమయమును నీవెరుగుదువు. దానిని నేను నా మనస్సులో నుండి తీసివేయజాలను. నీ నుండి వచ్చుచుండగా దానిని నేను అంగీకరించాను. కనుక తండ్రియగు దేవా, ఇప్పటికే దానిని చెప్పియున్నాను. నేను అనుకొనిన రీతిగానే దానిని నీవు ఉండనిమ్మని, దేవా, నీకు ప్రార్థించుచున్నాను. ఆలోచనాపరుడు, అసలు ఆలోచన అనునది ఏమయినా యున్నచో, తాను దేవుని సన్నిధిలో నిలబడవలసియున్నానని అతడు ఎరుగును. దేవుని వాక్యమును చెరుపు చేయునది గాని లేక విరోధమైనది గాని అతడు తన ఆత్మలోనికి తీసికొనడు.
తండ్రీ, దానిని నేను ఈనాటి సంస్థలతో పోల్చి చూచినపుడు అది వేరు కాదని మేము గ్రహించియున్నాము. ప్రభువా, నా హృదయమంతటితోను ఒక దినమున నీవు తీర్పు తీర్చుదువని ఎరిగియున్నాను. అది వేరుగా ఉండవలసియున్నదని నీవు చూచెదవని ఎరిగి యధార్థముగా ఉండునట్లు సహాయము చేయుమని ప్రార్థించుచున్నాను. యధార్థముగా ఉండుటకు ప్రయత్నించుచున్నాను. ఇపుడు నా చేతిలో నీ రక్తము యొక్క సొత్తును నేను తీరము నుండి తీరమువరకు పట్టుకొని యున్నానని గ్రహించియున్నాను. అందులో చాలా మంది సమాచారమును నమ్మియున్నారు.
పరలోకమందున్న దేవా, వారిలో ఒక్కరునూ నశించిపోకుండునట్లు దయచూపుము. వారిలో ప్రతి ఒక్కరిని నేను విడిపించి పాపము నుండి వడపోసి ఆ వడపోత సాధనము ముందు, వేరుపరచు జలము ముందు, యేసు క్రీస్తు రక్తము ముందు, శరీరధారియైన వాక్యము ముందు, ఎత్తి పట్టుకొనుచున్నాను. ప్రభువా, అది గైకొనుము. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వాగ్ధానము మా ఆత్మలలో పోయబడును గాక! సంధ్యా వెలుగును చూచుచున్న, ఈ కాలము యొక్క నేత్రములలో యేసుక్రీస్తు వధువుగా మేము ప్రాతినిధ్యము వహించి జీవించుదుము గాక! దీనిని యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుచున్నాము. ఆమేన్.
JOHN 6:37
85మీరాయనను ప్రేమించుచున్నారా? అది మీరు నమ్ముదురా? ఆలోచనాపరుని వడపోత సాధనము అని చెప్పుట ద్వారా నేను ఏదయినా తప్పు చెప్పినచో, అంతకన్న ఎక్కువ మరేమియూ చెప్పజాలను. నాకు విద్యలేదు; నాకు వచ్చినదే నేను చెప్పవలసియున్నాను. అది అక్కడ పడి యుండుట నేను చూచి, "ఎంత వేషధారణ పంక్తి" అనుకొన్నాను. "సరిగ్గా సంఘము వలెనె," అని ఏదో నాకు చెప్పెను.
ఒక ఆలోచనాపరుని వడపోత సాధనము. ఓ, మై! దానికి అంతకన్న ఇంకా చేర్చి చెప్పవలెను. ఆలోచనాపరుడు దానిని అసలు వాడనే వాడడు. చూచారా? నిశ్చయంగా వాడడు. అతడు తన రుచిని సంతప్తిపరచుకొనగోరును గనుక ఆ కోరికకు పొగత్రాగువాని రుచి కావలెను. (అది నిజము). కాని నిజముగా ఆలోచించు వ్యక్తి తన ఆత్మ తీర్పునకు వెళ్ళుచున్నదని ఎరిగి తన రుచిని దేవుని వాక్యమను వడపోత సాధనము ద్వారా వడకట్టుకొనును. "తండ్రి నాకనుగ్రహించిన వారందరునూ నా యొద్దకు వత్తురు." దేవుని నోట నుండి బయటకు వచ్చు ప్రతిమాట వలననూ అతడు జీవించును. అదే పవిత్ర జలము, అది పాపము నుండి మనలను వేరు పరచును. వాక్యము ద్వారా అది వచ్చుచున్నపుడు దానిని నమ్మకుండుట పాపము అని మనము చూచాము. కనుక దానిని మనము నమ్మి ముందుకు పోవలెను. అది పాపము నుండి వేరుపరచును. ఆయనను మీరు ప్రేమించుచున్నారా?
నేను ఆయనను ప్రేమించుచున్నాను… (ఇపుడు
మనము ఆయన వైపు చేతులు ఎత్తుదము.)
ఎందుకనగా, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
మరియు నా రక్షణను కొనెను,
కల్వరి వృక్షము పైన.
86ఆయన ఏమి చెప్పెను? " మీరు ఒకని నొకరు ప్రేమించుకొనుటను బట్టి మీరు నా శిష్యులని మనుష్యులందరును తెలిసికొందురు." దీనిని మనము పాడుచుండగా ఎవరినో ఒకరిని కరచాలనము చేయుచూ ఈలాగు చెప్పెదము. "సోదరుడా, నిన్ను కూడా ప్రేమించుచున్నాను."
నేను ఆయనను ప్రేమించుచున్నాను… (ఇది మీరు తెలిసికొనునట్లుగా…)
ఎందుకనగా, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
మరియు నా రక్షణను కొనెను,
కల్వరి వృక్షము పైన.
MATT 5:44•
LUKE 6:28
87ఆలోచనాపరుని వడపోతా సాధనమును నీవెట్లు ఇష్టపడుచున్నావు? సోదరీ, సోదరుడా, రేపు నీవు చేతులు రుద్దుకొనుచూ వీధిలో నుండి లోకములో సాగిపోవునపుడు, ఆలోచనాపరుని వడపోత సాధనమును కలిగియుందువా? ఎవరో వచ్చి నిన్ను పరిశుద్ధ బండ అని హేళన చేసినపుడు నీవు ఆలోచనాపరుని వడపోత సాధనమును ఉపయోగించుకొందువా? ఎవరయినా నీ మీద చెడ్డగా మాటలు పలికినపుడు, నీవు ఆలోచనాపరుని వడపోత సాధనమును కలిగియుందువా? చూచారా? కీడుకు ప్రతిగా మేలు చేయుడి. నిన్ను నిర్నిమిత్తముగా నిందించి, హింసించు వారికొరకు ప్రార్థించుము, అపుడు నీవు ఆలోచనాపరుని వడపోత సాధనము గుండా ఊపిరి పీల్చుచున్నట్లే.
88నిన్ను ప్రేమించు వారినే నీవు ప్రేమించుట కాదు, ప్రభువునందు మిక్కిలి ప్రియులగు వారితో మనము కరచాలనము చేయుయున్నాము. అది మంచిది, కాని ప్రేమించని వారిని మీరు ప్రేమించగలరా? అదియే ఆలోచనాపరుని వడపోత సాధనము. అదే నీలో ఉన్న క్రీస్తు ఆత్మ: నిన్ను ప్రేమించని వారిని ప్రేమించుట; అపుడు నీకు దేవుని ప్రతిఫలము దొరకును. కాని దానిని నీవు ఇంకా ఒక విధి వలె చేయుచున్నచో, నీవు ఆ ఆలోచనాపరుని వడపోత సాధనమును పొందలేదు. నీవింకా రెండవ అంతస్థులోనే ఉన్నావు. కాని నీ హృదయమంతటితో నీవు నిజంగా ఆయనను ప్రేమించినచో, నీవు ఆలోచనాపరుని వడపోత సాధనము ద్వారా ఊపిరి పీల్చుచున్నట్లు అగును. అది పరిశుద్ధుని రుచిని సంతప్తిపరచును. ఏమి జరిగినా గాని, నీవు ప్రతివారిని, ప్రతి దానిని హృదయ పూర్వకముగా క్షమించెదవు. ఆయన అద్భుతమగు వాడు కాడా?
మొదటిగా నన్ను ప్రేమించెను,
మరియు నా రక్షణను కొనెను,
కల్వరి వృక్షము పైన.
మనము వెలుగులో నడచెదము; అది అద్భుతమైన వెలుగు;
అది ప్రకాశమైన కృప మంచు బిందువులు
పడుచోట నుండి వచ్చును;
రాత్రి పగలు మన చుట్టూ మెరియును,
లోకానికి వెలుగు, యేసు.
మనము ఆయన వెలుగులో నడిచెదము; అది అద్భుతమైన వెలుగు;
ఎక్కడి నుండి వచ్చును (వడపోత చేయబడి!) అది ప్రకాశమైన
కృప మంచు బిందువులు
పడుచోట నుండి వచ్చును;
రాత్రి పగలు మన చుట్టూ మెరియును,
లోకానికి వెలుగు, యేసు.
వెలుగు యొక్క పరిశుద్ధులు అందరు రండి.
లోకానికి వెలుగు, యేసు;
అప్పుడు పరలోకపు గంటలు మ్రోగును;
లోకానికి వెలుగు, యేసు;
ఓ, మనము వెలుగులో నడచెదము;
అది అద్భుతమైన వెలుగు;
అది ప్రకాశమైన కృప మంచు బిందువులు
పడుచోట నుండి వచ్చును;
రాత్రి పగలు మన చుట్టూ మెరియును,
లోకానికి వెలుగు, యేసు;
మీరది ప్రేమింతురా?
మనము వెలుగులో నడచెదము;
అది అద్భుతమైన వెలుగు;
అది ప్రకాశమైన కృప మంచు బిందువులు
పడుచోట నుండి వచ్చును;
రాత్రి పగలు మన చుట్టూ మెరియును,
లోకానికి వెలుగు, యేసు.
దానిని నేను ప్రేమింతును.
నా విశ్వాసము నీవైపు చూచును,
కల్వరి గొర్రెపిల్ల, రక్షక దైవమా!
ఇప్పుడు, నేను ప్రర్దించుచుండగా వినుము,
నా పాపములన్ని తీసివేయుము…
వాక్యముతో, నన్ను వాడపోయుము, ప్రభువా,)
ఈ రోజు నుండి నన్ను,
నీవాడినై ఉందును గాక!
దాని గురించి ఆలోచించుము! వాక్యము ద్వారా వడగట్టబడి, నీవాడినై ఉందును.
చీకటి మార్గములో నేను నడచినను,
విచారములు నన్ను చుట్టుముట్టినను,
నన్ను నడిపించువాని వాలే ఉండుము;
చీకటి వేలుగా చేసి,
విచారములు మరియు భయములు తుడిచివేయుము,
నీ మార్గము నుండి నన్ను తప్పిపోనియ్యక,
[సహోదరుడు బ్రన్హం పాడుచున్నారు]
సోలిపోవు నా హృదయమును,
ఆసక్తితో నింపుము;
చీకటిని వేలుగా చేసి, మరియు దుఃఖములను తుడిచి వేసి,
ఈ రోజు నుండి నన్ను,
పూర్తిగా నీవానిగా ఉండనిమ్ము!
89ప్రియదేవా, మేము నీకు పాడుటకు ఇష్టపడుచున్నాము, ఎందుకనగా అక్కడే మేము మా అనుభూతులను, మా ఆవేశములను, వ్యక్తపరచుదుము. ఈ సమాజమంతటి మీదను జీవవాక్యమును ఊదుము. అదే మా కోరిక. దేవుని వాక్యము ద్వారా వడపోయబడి వెలుగులో నడువగోరుదుము. అదే సువార్త వెలుగు, ప్రభువా మేమెంతో కతజ్ఞత కలిగియున్నాము. ఆ పాటలో, ప్రభువా, మమ్మును చేర్చుకొనుము.
మా యొక్క మార్గమును ప్రతి రోజు ప్రేమతో నింపుము.
మేము పరలోకపు పావురాముతో నడచుచుండగా,
మనము అందరమూ వెళ్ళెదము,
గానముతో మరియు సంతోషముతో వెళ్ళెదము;
మా యొక్క మార్గమును ప్రతి రోజు ప్రేమతో నింపుము.
ప్రభువా, అది దయచేయుము. ఇపుడు, మా అందరినీ ఆశీర్వదించుము. నీ కృప, కరుణ మాతో ఉండనిమ్ము. దేశములో ఉన్న ప్రతి రోగిని, బాధపడుచున్న వారిని స్వస్థపరచుము.
సహో. కాగిన్స్ బట్టి, ఈ రాత్రి నీకు మేము వందనములు చెల్లించుచున్నాము. అతనిని వైద్యశాల నుండి గృహము వెళ్ళునట్లు ఆయనను బాగుచేసియున్నావు. నీవు చేసిన ప్రతి కార్యమునకును, నీకు వందనములు. మాకు మేమును, ఇపుడు ఎంతో బలము పొందినట్లుగా అనుభూతి పొందుచున్నాము. పైకి లేపబడినాము.
MATT 15:26,27•
MARK 7:27,28
90ప్రభువా, ఈ రాత్రి చిన్నగా కుదించబడిన వర్తమానము కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము. నేను సరిగా చేసియుండక పోవచ్చును, కాని ప్రభువా, అది జనుల దష్టిలో సరిగా ఉండి, అది ఏ భావముతో చెప్పబడినదో ఆ భావమును చూచి ఎరుగునట్లుగా చేయుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, దాని ద్వారా మహిమ పొందుము. మాకు ఇది అవగాహన అగునట్లుగా చేయుము. దేవుడు తన బిడ్డల కొరకు మాత్రమే వడపోత పోసియుంచిన, దేవుని వాక్యమును రొట్టెవలన మాత్రమే మేము జీవించవలసియున్నాము. మరేదియూ లేదు. అది ఒక ప్రత్యేకించబడిన సమాజము. అది మరి ఎవరి పక్షమున ఉండదు. పవిత్ర జలము ఇశ్రాయేలు కొరకు మాత్రమే నిర్ధేశిచబడినట్లుగా, ఇది కూడా నీవు ఏర్పాటు చేసికొనిన వారికి మాత్రమే. కనుక తండ్రీ, ఈ ఆహారము గొర్రెలకు మాత్రమేనని ఎరుగుదుము. "నేను పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు," అని యేసు చెప్పెను. అందుకు ఆ స్త్రీ చెప్పినదేమనగా, "అవును, ప్రభువా, అది నిజమే, కాని నేను ముక్కలను ఏరుకొనగోరుచున్నాను." ప్రభువా, ఈ రాత్రి మేమును ఆలాగే భావించుచున్నాము. తండ్రీ, నీవు ఇవ్వకలిగిన సమస్తమూ మేము పొందవలెనని కోరుచున్నాము, ఎందుకనగా నీ కొరకు మరి యెక్కువగా మేము ఆకలిదప్పులు కలిగియున్నాము.
మా ఆకలి తీరునట్లును, మా కోరికలు సిద్ధించునట్లును దయచూపుము తండ్రీ, ఎందుకనగా మేము నీతిమంతుని కోరికను కలిగియుండ గోరుచున్నాము. యేసుక్రీస్తే ఆ నీతి మంతుడు. ఆయన కోరిక తండ్రి చిత్తమును చేయుటయే, అనగా వాక్యమే. తండ్రీ, అది మాకును దయచేయుము. దీనిని ఆయన నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
"యేసు నామమును నీతో కొనపోమ్ము," అను మన ముగింపు పాటను పాడుచుండగా; మనము లేచి నిలబడుదము.
2CH 7:14
91ఈ రాత్రి ఏ యే స్థలములకు ఈ వర్తమానము వెళ్ళుచున్నదో, అక్కడున్న వారందరికీ ప్రభువు తోడుగా ఉండి పంపించును గాక! ప్రార్థనతో ముగించనైయున్నాము. అక్కడున్న ప్రతివారును నేనందించిన వర్తమానమును విని, ఆనందించారని నమ్ముచున్నాను. దేవుడు దానిని మీ హృదయములో ఉంచి, దానికి సరయిన అనువాదమును ఇచ్చును గాక!
ఈ స్థలములో యున్న జనులు చేతిరుమాళ్ళను ఇక్కడుంచియున్నారు. నేను వాటిపై చేతులుంచాను. మీ ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచవలెనని నేను ప్రార్థించుచున్నాను. మన మధ్య ఒక్క రోగియు ఉండకుండును గాక! మన దేవుడు ప్రార్థనకు జవాబు ఎట్లు ఇచ్చునో చూడండి.
"నా పేరు పెట్టబడి, కూడికొని ప్రార్థించువారి మొరను నేను ఆకాశము నుండి విందును," అని మనము కూడియుండగా చెప్పబడెను, ఆలాగు ఆయన వాగ్ధానము చేసెను.
92కనుక మనము విభాగించబడలేదు; మనము ఒక్కరమే. క్రీస్తు యేసునందు మనమందరమూ ఒక్కటే. ప్రతి ఒక్కరు మరియొకరు కొరకు ప్రార్థించుడి. నేను మీ కొరకు ప్రార్థించుచుండగా, మీరు నా కొరకు ప్రార్థించుడి. మరల మిమ్మును తిరిగి చూచు వరకు, దేవుడు మిమ్మును దీవించును.
ఇక్కడికి సమీపముగా జీవించువారు ఆలయమునకు వచ్చి మన మంచి సంఘ కాపరియగు సహో. నెవిల్‌ను దర్శించగలరని నమ్ముచున్నాను. ఆయన మీకు మేలుచేయును. ఈ ఆలయములో సహో. మాన్ మరియు చక్కని ప్రజలు ఇక్కడున్నారు.
సహో. జూనియర్ జాక్‌సన్ లేదా ప్రాంతములో దగ్గరగా నున్న వారెవరికయినా గాని, సమీపములో యున్నచో; న్యూయార్కు మరియు తదితర స్థలములలోను, ఆరిజోనా మరియు కాలిఫోర్నియో చుట్టు ప్రక్కల జరుగు కూటములకు; మీరు అక్కడికి వెళ్ళుట జరిగినపుడు, సంఘములను దర్శించండి. మీరు తిరిగి రావలెననియు ప్రభువైన యేసు గూర్చి ఎక్కువగా సంఘకాపరి మీకు సహాయము చేయవలెననియు మేము ప్రార్థించుచున్నాము.
93"యేసు నామమును మీతో తీసుకువెళ్ళండి," అను పాటను, ఇపుడు మనము పాడుచుండగా; దేవుడు మిమ్మును దీవించును.
..యేసుని నామము మీతో…
బాధ మరియు దుఃఖముతోనున్న కుమారుడా;
అది నీకు ఆనందము మరియు ఆదరణ యిచ్చును,
(సహోదరుడా జాన్, ముందుకు రమ్ము.)
……………. ముందుకు వెళ్ళు.
ప్రశస్త నామము, (ప్రశస్త నామము,)
ఓ, ఎంతో మధురమైన! (ఓ, ఎంతో మధురమైన)
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
ప్రశస్త నామము, ఓ, ఎంతో మధురమైన!
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము.
94ఈ రాత్రి సమూహములోనికి నేను చూచినపుడు, సహో. ఎస్టెల్ బీలర్, సహో. పామర్, ఇంకా చాలామంది, సహో. జె.టి, ఇంకా చాలామంది సేవకులు ఇక్కడ కనబడుచున్నారు. వారందరి పేర్లు నాకు రావు. చాలా మంది సేవకులు నిలబడియున్నారు, మీరందరు ఇక్కడికి వచ్చి ఈ సమూహమును ఇంటికి పంపించు తుది ప్రార్థన గాని, మరేదయినా గాని చేయవలెనని నాకు కోరిక యున్నది. మీకు అర్థమయినది కదా? మేము ఎట్లున్నామో తెలిసికొనగల క్రైస్తవ హృదయము మీరు కలిగియున్నారని నాకు తెలియును. యేసుక్రీస్తు నందు మనమందరము కలిసి ఒకటై యున్నాము.
ఇప్పుడు, ఈ తరవాత వచనమును మనము గుర్తు చేసికొని దానిని మనము పాడుచుండగా, మన సహో. మార్టిన్, ప్రార్థనతో ముగించి పంపించును. ఈయన ఎర్ల్ మార్టిన్; ఆర్కన్ సాస్ లేక మిస్సోరి, అక్కడున్న ఆర్కన్‌సాస్ వరుస నుండి వచ్చియున్నాడని నమ్ముచున్నాను. అక్కడ వారికి ఒక చర్చియున్నది.
ఇక్కడున్న సోదరుడిని నేను గమనించాను. ఆయన పేరు నాకు తట్టుట లేదు - బ్రీవర్. ఈ ఉదయమున ఆయన ఇక్కడున్నాడు. ఈ రాత్రి కూడా ఆయన ఇక్కడే యున్నాడని తలంచుచున్నాను. ఆఁ అతడు అక్కడ నిలబడుట నాకు కనబడుచున్నది. సహో. బ్రీవర్, చాలా సార్లు నేను వచ్చి, వారి చర్చిలను ప్రతిష్ఠ చేయుదునని వాగ్ధానము చేశాను. సాధ్యమైనచో ప్రభుని సహాయము వలన ఒక దినము అచ్చటికి వెళ్ళుదును.
ఇపుడు, మనము తరువాత వచనము పాడుదము.
యేసుని నామములో గౌవరముగా వంగుతూ
ఆయన పాదములపై సాగిలపడి,
మన యాత్ర ముగుయునప్పుడు.
పరలోకమందు రాజుల రాజుకు, మనము కీరిటము పెట్టుదము.
ఇపుడు మరల పాడుదము.
యేసుని నామములో గౌవరముగా వంగుతూ
ఆయన పాదములపై సాగిలపడి,
మన యాత్ర ముగుయునప్పుడు.
పరలోకమందు రాజుల రాజుకు, మనము కీరిటము పెట్టుదము.
ప్రశస్త నామము, (ప్రశస్త నామము,)
ఓ, ఎంతో మధురమైన! (ఓ, ఎంతో మధురమైన)
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
ప్రశస్త నామము, ఓ, ఎంతో మధురమైన!
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
ఓ, యేసుని నామము మీతో తీసుకోని వెళ్ళండి,
ప్రతి యొక్క ఉచ్చునుంది రక్షణ; (ఇప్పుడు వినండి!)
లోక ఆశలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, (నీవు ఏమిచేయవలెను)
కేవలము పరిశుద్ధ నామమును ప్రార్ధనలో ఊదండి.
ప్రశస్త నామము, ఓ, ఎంతో మధురమైన!
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
ప్రశస్త నామము, ఓ, ఎంతో మధురమైన!
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
ఇపుడు మన తలలు వంచుదము:
ప్రశస్త నామము, ఓ, ఎంతో మధురమైన!
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
ప్రశస్త నామము, (దానిలో బాప్తిస్మము పొందుము
మరియు దానిలో ప్రార్ధన చేయుము!)
ఓ, ఎంతో మధురమైన!
భూమి యొక్క నీరీక్షణ, మరియు పరలోకము యొక్క ఆనందము;
సహో. మార్టిన్!