సాతానుని ఏదెను

సాతానుని ఏదెను

1శిరములు వంచుదము… ప్రియదేవా, ఈ రాత్రి ఈ గొప్ప అవకాశము నిమిత్తము నీకు మేమెంతో కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మా శత్రువును, నీ శత్రువును ఆ యుద్ధ రంగములో ఎదుర్కొనుటకు, వాక్యముతో ఎదిరించుటకు, నీ జనుల మధ్యలో నుండి వానిని తరిమి వేయుటకు ప్రభువైన యేసు నామములో మరల కూడి వచ్చుచున్నాము. ప్రభువా, ఈ రాత్రి వారు సువార్త వెలుగును చూచెదరు గాక. సత్యమునకు మా కన్నులు తెరువబడునట్లుగా నీవు మా కన్నులకు కాటుక నియ్యమని ప్రార్థించుచున్నాను. ఈ చోటును విడిచి పెట్టి వెళ్ళునప్పుడు మేమిలాగు పలుకుదము గాక, "ఆయన దారిలో మనతో మాట్లాడుచుండినప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా?" రోగులను, బాధపడుచున్న వారిని బాగుచేయుము. నిరుత్సాహముగానున్న వారిని ప్రోత్సాహపరచుము. సడలిన చేతులను పైకి లేవనెత్తుము. ప్రభువైన యేసు రాకను మేము చూచెదము గాక. అది సమీపముగా ఉన్నదని నమ్ముచున్నాము. దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చొనండి.

2ఈ రాత్రి క్లుప్తముగా చెప్పవలెనని ప్రయత్నించుచున్నాను, ఎందుకనగా దేశములోని వివిధ ప్రాంతముల నుండి చాలామంది వచ్చిరి. వారు ఆరాధనకు వచ్చారని నాకు తెలియును; కొందరు ఇక్కడున్నారు, మరి కొందరు వెళ్ళి పోవలసియున్నారు, బహుశా చాలా దూరము వెళ్ళవలసియుందురు, మరియు మీకు వందనములు చెల్లించుచున్నాను. ఈ ఉదయము సహో. నెవిల్ మాట్లాడినచో, నేను వినవలెనని ఆశించాను. చాలా సార్లు నేనాయన ప్రసంగములను విన్నాను, కాని ఏ ఒక్కసారియు ఆయనను అభినందించకుండా ఉండలేకపోయాను. ఈ ఉదయమున సమయమునకు కావలసిన వర్తమానమును ఇచ్చెను. ఈ ఉదయమున దానిని వినుటకు నాకు ప్రభువు నడిపింపును ఇచ్చెనని నేనెరుగుదును. చాలా బాగున్నది. మీరు ఆయన వర్తమానమును వినుటకు ఎందుకు వచ్చుచున్నారో నాకు తెలియును. ఆయన మా మేలునే ఎల్లప్పుడూ కోరును, నిశ్చయంగా, మీరాయన వర్తమానము వినండి.

3ఈ దినము నేను కొన్ని ఇంటర్వ్యూలను ఇచ్చుటకు ప్రయత్నము చేసితిని — ఈ ఉదయము, మరియు మధ్యాహ్నము. ఇంకా నేను ఎంతో మందిని కలుసుకోవలసియున్నాను.

ఒకసారి మోషేతో ఇత్రో చెప్పిన మాట గుర్తుకు వచ్చుచున్నది, "ఇది నీ శక్తికి మించినది," అని పలికెను. మీ సమస్యలను వినుటకు కావలసినంత మంది సోదురులు ఇచటున్నారు. వారందరికి అట్టి అర్హత యున్నది. వారి విషయములలో చక్కగా శ్రద్ధ చూపగలరు. మన సంఘ కాపరి లేదా సొదరుడగు సహోదరుడు మాన్ ను ఇంకా ఇతరులను మీకు సిఫార్సు చేయుచున్నాను. విశ్వాసము కలిగిన ఇతర సేవకులునూ యున్నారు. వారి యొద్దకు మీరు వెళ్ళవచ్చును. వారు మీకు చేయవలసిన పనిని సూటిగా చెప్పెదరు. కొందరి పిల్లలు అవిశ్వాసులను పెండ్లి చేసికొనుచున్నారు; లేక అది తప్పు. అట్టి సమస్యలలో నున్న వారికి వారు సహాయము చేయగలరు, ఎందుకనగా వారు క్రీస్తు దాసులు. వారి యొద్దకు వెళ్ళండి. వారు తప్పకుండా మీకు అవసరమగు సహాయమును అందించగలరు. వారందరి యొద్దకు నేనయితే వెళ్ళజాలను. చాలా మంది యున్నారు. ఎక్కడికి వెళ్ళినా గాని అట్టి జనులే యున్నారు. సమస్యలు గల జనులు అంతకంతకు వృద్ధియగుచున్నారు, చూడండి; ప్రతివారి యొద్దకు వెళ్ళవలెననియే యుండును, కాని అది సాధ్యము కాదు. అయితే ఏదో విధంగా దేవుడు మీకు సహాయము చేయవలెననియే నేను నిరంతరము ప్రార్థించుచున్నాను.

GEN 3:1-7

 

4ఈ రాత్రి ఒక లేఖనమును చదువుదము. ఆదికాండము 3వ అధ్యాయము నుండి చదువుదము; గతించిన కాలములో కొన్ని విషయముల గూర్చి మాట్లాడియున్నాము. ప్రభువైన యేసు మరి కొద్ది ఎక్కువగా మనకు తెలిసికొనవలసిన వాటిని ఇచ్చునేమో చూద్దాం. ఆయన మనకు బయలుపరచవలెనని ప్రార్థించుచున్నాను.

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో - ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.

అందుకు స్త్రీ - ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును.

అయితే తోట మధ్య నున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు - మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.

అందుకు సర్పము - మీరు చావనే చావరు.

ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా.

స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను.

అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

5చదువబడిన ఆయన వాక్యమును ప్రభువు దీవించును గాక.

ఇప్పుడు, దాని నుండి నేను ఈ రాత్రి ఒక అంశమును తీసికొనగోరుచున్నాను, మరియు దానిని: సాతానుని ఏదెను అని పిలచును. సాతానుని ఏదెను అని చెప్పుట చాలా మొరటుగా వినబడుచుండును. ఒక ఆదివారము రాత్రి నేను మీతో చెప్పినదానికి ఇది సరిపోవును. ఆలోచనాపరుని వడపోత సాధనము మరియు పరిశుద్ధుని రుచి అని చెప్పాను. కొన్నిసార్లు ఈ చిన్న మొరటు పదజాలములే చాలా బాగుగా పనిచేయును. మనకు అధ్యయనమును చేకూరును మరియు వాక్యమును చదువుటకు మీకు దోహదపడును. ఈ నా జనులందరూ అదే చేయవలెనని నా కోరిక. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును." కాబట్టి ఆ వాక్యము చదవండి; దానిని ధ్యానించండి. దేవుని నేత్రములతో దానిని మీరు అధ్యయనము చేయండి, ఈ ప్రస్తుత దినములలో మనమెట్లు జీవించవలసియున్నామో, మీ వివేకమునకు ఒక గ్రహింపును ఇయ్యుడి.

6ఈ రాత్రి మీతో మాట్లాడవలెనని వచ్చియున్నాను. నేను ఏదో తలంపుతో ఏదేదో చేయవలెనని రావచ్చును. నేను జనులతో మాట్లాడగోరుదును. ఈ రాత్రి మీ ప్రతి ఒక్కరి ఇంటికి రావలెనని నాకు కోరిక యున్నది. అది సత్యమని దేవునికి తెలియును. మీ ప్రతి ఒక్కరి ఇంటికి ఈ రాత్రి నాకు రావలెనని యున్నది. ఉదయమున మీతో అల్పాహారము భుజించవలెనని యున్నది. రేపు మధ్యాహ్నము మీతో కలిసి ఉడుతల వేటకు వెళ్ళవలెనని యున్నది, చూడండి. నాకాలాగు చేయవలెనని యున్నది, కాని అది నా సాధ్యము కాదు. మీతో కూడా మీ ఇంటికి వచ్చి మీతో ముచ్చటించవలెనని యున్నది. కూటము అయిపోయిన తరువాత మీ వరండాలో కూర్చొని కొంతసేపు మీతో ముచ్చటించగోరుచున్నాను. మీ సంక్షేమమును గూర్చి అడిగి తెలిసికొందును. మీతో దేవుని సంగతులు చెప్పెదను. ఆలాగు చేయుట నాకు ఎంతో ఇష్టము. ఇక్కడ స్త్రీలు, పురుషులు యున్నారు; నాకాలాగు చేయవలెనని యున్నట్లు దేవునికి తెలియును, కానీ అది నాకు సాధ్యము కాదు, చూడండి. అటువంటి బాధ, వేదన నాకున్నది.

7ఉద్రికత్త గల ఈ దినములలో మనము జీవించుచున్నాము. నా మట్టుకు నేనే ఒక ఉద్రిక్తత గల వ్యక్తిని.

ఈ రోజు ఒక పని చేయవలెనని నేను నా మనస్సులో తలంచినచో, ఆ పనిని ఇప్పుడే చేయవలెను, లేనియెడల రేపు అది నాకు అందనే అందదు. ఏదో అటూ, ఇటూ త్రిప్పుచుండును. నీవు ఒక సమయమును కలిగియున్నావు. ఆ సమయములోనే నీవు కుదురుబాటు కలిగించుకొనవలెను.

8కాని సువార్తను ప్రకటించుటయే నా ప్రధాన అంశము, సంఘమునకు దానిని అందించవలెను. ఈ దినమున యేసుక్రీస్తు మహిమ కొరకు నేను చేయగలిగినదంతయూ చేయవలెను. ఇప్పుడు నేను భూమి మీద యున్నాను. నాకు భూమి మీద కొద్ది కాలమే మిగిలియున్నది.

మీకు సహాయపడు దానిని నేను చెప్పగోరుచున్నాను. ఆ ప్రయత్నమే నేను చేయుచున్నాను. ఈ ఉదయము నేను ఇంటికి వెళ్ళిన తరువాత అధ్యయనం చేశాను: "ప్రభువా, ఈ జనులకు సహాయపడు దానిని ఈ రాత్రి నేను చెప్పకలుగునట్లు సహాయపడుము" అనడిగాను. ఈ ఉదయమును బలమగు వర్తమానమును విన్నాము. సహోదరుడు నెవిల్ దానిని అందించెను. అతడు చెప్పినది చాలా ఆశ్చర్యముగా యున్నది. "ఒక వైద్యుడు కేసును నిర్థారించును, కాని పెనము నిండా సూదులను తీసికొని వచ్చిన వ్యక్తి ఇంజక్షను ఇచ్చును." అది నిజంగా చాలా ఆలోచించదగిన మాట. దానిని గూర్చి నేను ఆలోచించాను: ఒక కేసును గుర్తించిన తరువాత ఆ సీరమ్ ను (రక్తములోని పసుపు పచ్చని ద్రవము ) తీయుదురు. కాబట్టి అది చాలా మంచి సంగతి.

9మీతో ఒక సంగతి చెప్పగోరుచున్నాను. ఈ కాలమునకు దేవుడిచ్చిన వాగ్దానమును మీకు విశదపరచగోరుచున్నాను, చూచారా. ఎవరో, ఏదో ఒక దినమున చెప్పినది కాదు, అవన్నియూ సరియే; ఆ సంగతులనే మనందరము ఎత్తి చూపుచున్నాము. కాని ఇక్కడ వ్రాయబడియున్న ఈ లేఖనముల ద్వారా ఒక సంగతిని మీకు చెప్పవలెనని ప్రయత్నించుచున్నాను. మీకు అవి వెలుగునిచ్చును. మీకు తెలివి కలుగజేయును. ఇప్పుడు మీరు పందెపు రంగములో మంచిగా పోరాడు సైనికుని వలె అది చేయును. శత్రువు యొక్క పన్నాగములను తెలిసికొందురు. అది మీ మీదికి రాకముందే దానిని అడ్డగించునట్లుగా చేయగలరు, చూడండి. అదే ప్రధానమగు సంగతి; మీరు దానిని పిడిగుద్దులు గుద్దెదరు. మీరు శాయశక్తులా పోరాడుదురు.

10నేడు మనము మహా పాపభరితమైన దినములలో జీవించుచున్నాము. కొద్ది నిమిషముల పాటు దీనిని మనము చూచెదము. ఇటువంటి దినములు ముందు చరిత్రలో ఎప్పుడునూ లేవని నేను నమ్ముచున్నాను. నేను ఎక్కడా చరిత్రలో చదువలేదు. మహా హింస దినములుండినవి. దేవుని యొక్క పిల్లలను అన్ని విధములుగా హింసించి చంపిరి, కాని శత్రువు యొక్క మోసమును చూడండి. ఇప్పుడు మనము జీవించుచున్న ఈ దినము వంటిది ముందెన్నడూ ఉండలేదు. ఇది బహు మోసకరమగు, యుక్తికరమగు దినము. దానిని చూచుచున్నప్పుడు నాకు ఒక సంగతి గుర్తుకు వచ్చుచున్నది. ఏ కాలములోను లేనంత అప్రమత్తముగా క్రైస్తవుడు ఈ దినమున ఉండవలసియున్నాడు.

11గత దినములలో రోమ్ సంఘమును హింసించిన కాలములో, క్రైస్తవుని పందెపు రంగములో విడిచి పెట్టి సింహములను వారి మీదికి విడిచి పెట్టిరి. అతడు క్రైస్తవుడనని సాక్ష్యమిచ్చినందుకే ఆలాగు చేసెడివారు. కాని అతని ఆత్మ రక్షింపబడినది, ఎందుకనగా అతడు దేవునియందు సంపూర్ణ నమ్మకము కలిగియుండెను. అతడు కల్తి లేని పవిత్రుడు. సంతోషముగా అతడు తన సాక్ష్యమును రక్తముతో ముద్రించెను. రక్త నాళములు పగిలిపోయినా, శరీరములో రంధ్రములేర్పడినా, రక్తము స్రవించిపోయినా, అతడు నిజమగు విధేయత మరియు విశ్వాసముతో ఇట్లు కేకవేసెను, "ప్రభువైన యేసూ, నా ఆత్మను చేర్చుకొనుము."

MATT 24:24•

MARK 13:22

 

12కాని ఇప్పుడు, అపవాది యొక్క యుక్తి గమనించండి. క్రైస్తవులు కాని వారిని కూడా క్రైస్తవులే అన్నట్లుగా నమ్మించుచున్నది. ఇది అసలయిన మోసము. నీవు ముద్రించనక్కర లేదు… ఇది చాలా మోసకరమగు దినము. నీవు నీ సాక్ష్యముతో నీ జీవితమునకు ముద్రవేయవలెను. అపవాది చేయగల అనేకములగు మోసపూరిత ఉరులను ఏర్పాటు చేసి ఉంచినది… వాడు మోసగాడు.

మత్తయి 24లో మనకు యేసు చెప్పెను, నేడు మనము జీవించుచున్న ఈ దినము ఎట్లుండునో చెప్పెను: అన్నింటి కన్న బహు మోసకరమగు దినము; "సాధ్యమయితే దేవుని చేత ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుటకు ప్రయత్నించును."

2TIM 3:3,4

 

13ఈ దినము కొరకు బైబిలులో పలుకబడిన కొన్ని లేఖనములను లేదా కొన్ని ప్రవచనములను మనము పోల్చి చూడవలెనని కోరుచున్నాను. నేడు మనము జీవించుచున్న ఈ దినముతో పోల్చి చూచెదము. II తిమోతీ 3లో దీనిని మనము నేర్చుకొనియున్నాము: ప్రవక్తలు చెప్పిరి, మనుష్యులు గర్వాంధులుగాను, అతిశయించువారు గాను, దేవుని కంటి సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు గాను ఉందురు.

ఒక క్షణము పాటు దానిని పోల్చి చూద్దాం. దానిని క్లుప్తముగా చూద్దాం, ఎందుకనగా దానిని పూర్తిగా చూడగల సమయము మనకు లేదు, కాని దానిని సూటిగా మనము చూచి ముఖ్యాంశములను గమనించుదము. మీరు ఇంటికి వెళ్ళి దానిని అధ్యయనము చేయండి. "గర్వాంధులు, అహంకారులు, దేవుని కంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, నిబంధనను మీరు వారు, అబద్ధముగా నేరారోపణలు చేయువారు, సంతృప్తి లేనివారు, సజ్జన ద్వేషులు. ఇవి చివరి దినములలో యుండునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ దినముల గూర్చియే ప్రవచనము మాట్లాడుచున్నది.

REV 3:17

 

14ప్రకటన 3:14లో కూడా మవను చదువుదుము, (అది లవొదకయ సంఘ కాలము) చివరి కాలములో సంఘము ఎట్లుండునో మీరు గ్రహించగలరు. అది విధవరాలి వలె కూర్చొని యుండును. ఏమి కొదువలేదని చెప్పును. అది ధనవంతురాలు, ధనవృద్ధి చేసికొని యున్నది. కానీ అది దరిద్రురాలు, దౌర్భాగ్యురాలు, దిక్కుమాలినది, గ్రుడ్డిది, దిగంబరి అని ఎరుగదు.

గుర్తుంచుకొనండి, ఈ కాలపు సంఘముతో ఆయన మాట్లాడుచున్నాడు. "దౌర్భాగ్యురాలు, గ్రుడ్డిది, దిగంబరి, కాని ఎరుగదు." ఆ చివరి మాట ఎంత గమనించదగినదిగా యున్నదో చూడండి. వారు నిండుగా పరిశుద్ధాత్మను కలిగి యున్నామనుకొందురు. అంతా సిద్ధముగా యున్నదనుకొందురు. లవొదికయ సంఘ కాలమనగా పెంతెకోస్తు సంఘకాలము, ఎందుకనగా ఇది చివరి సంఘ కాలము.

లూథర్ ఒక వర్తమానమందించెను, వెస్లీ ఒక వర్తమానమందించెను, మరియు పెంతెకోస్తు ఒక వర్తమానమందించెను.

REV 3:16

 

15ఇంకా ఈలాగు చెప్పబడియున్నది, "నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా యున్నావు," — బయట ఉద్రేకమున్నది, సువార్తను మామూలు మనస్సుతో ఎరుగుదురు. "నీవు ఆ విధంగా ఉన్నావు గనుక నిన్ను నేను నా నోట నుండి ఉమ్మి వేయ నుద్దేశించుచున్నానని," ఆయన చెప్పుచున్నాడు. సంఘము ఆ స్థితిలో నుండుట ఆయన చూడగా ఆయనకు జబ్బు కలిగెను.

16గుర్తుంచుకొనండి, వారాయనను బయటకు ఉమ్మివేసిరి. ఆయన సంఘమునకు వెలుపట యున్నాడు, లోపలికి రావలెనని ప్రయత్నము చేయుచున్నాడు. లవొదికయ సంఘ కాలము అంత భయంకరమగు స్థితిలో యున్నది.

17నేటి ప్రపంచము యొక్క దైవము… ఈనాడు ప్రపంచము ఆరాధించుచున్న దైవము సాతానే. సాతానును ఆరాధించుచున్నామని జనులకు తెలియదు. కాని సంఘములో సాతాను అనుకరణ చేయుచున్నది, చూడండి — సంఘమువలెనే యున్నది. వారు సాతానును ఆరాధించుచున్నారు, కాని వారయితే సంఘము ద్వారా దేవునిచే ఆరాధించుచున్నామని తలంచుచున్నారు. కానీ సాతాను ఆ విధముగా దానిని తయారు చేసెను.

ఓ! "ఒక్క నిమిషము ఆగుము; మేము వాక్యము బోధించుచున్నాము" అని నీవు చెప్పవచ్చును. ఈ రాత్రి నా అంశమును మరోసారి చూడుము. మొదట హవ్వకు వాక్యమును సాతాను బోధించెను. దేవుడు చెప్పెను, చూచారా. ఆ దినమునకు వర్తించు వాక్యమును ఆ విధంగా అపవాది తప్పుగా చెప్పెను. కొంత భాగమును వక్రీకరించెను. యేసు చేసినదంతయూ పరిపూర్ణమేనని నీకు మొదట చెప్పును. మోషే చేసినదంతయూ పరిపూర్ణమేనని నీకు మొదట చెప్పును. కాని ఈ దినమునకు ఇయ్యబడిన వాగ్దానమును నీవు చూచునప్పుడు, అది మరో యుగమునకు చెందినది అని చెప్పును. వాడు ఆ విధముగానే చేయును, చూడండి, ఆ విధంగా దానిని జనులు నమ్మునట్లుగా చేయును. నీవు దానిలో నుండి ఒక మాట తీసివేయరాదు, దానికి ఒక మాట చేర్చరాదు, కాని వాడు చేయునది అదే.

2THS 2:1-4

 

18ప్రజలు తెలియకుండానే సాతానును ఆరాధించుచున్నారు. వారు దేవుని ఆరాధించుచున్నామని తలంచుచున్నారు. II థెస్సలొనీయుల పత్రికలో ప్రవచనము ద్వారా మనకు హెచ్చరిక ఇయ్యబడినది. II థెస్సలొనీయులు పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. ఒక క్షణము దానిని మనము చూద్దాం. దానిని నేను చదువగోరుచున్నాను. II థెస్సలొనీయులని నేననుకొనుచున్నాను. ఇక్కడ వాక్యమున్నది…

సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చి యున్నట్లుగా ఆత్మ వలననైనను, మాట వలన నైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పినయెడల,

ఇప్పుడు చూడండి. ప్రభువు యొక్క రాకడలో పరిశుద్ధులు సమకూర్చబడుదురు, చివరి దినములలో దేవుడు తన జనులను సమకూర్చును: ప్రభువు తన కొరకు తన జనులను సమకూర్చును గాని సంఘము కొరకు కాదు — ప్రభువు కొరకు; ఆయన తన కొరకు వారిని సమకూర్చుచున్నాడు.

మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము.

మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు. [పాప పురుషుడు అను వానిని ఇప్పుడు గమనించండి.] ధర్మ విరుద్ధ పురుషుడు, [అతడే యూదా, చూచారా.]

ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానీనంతటిని ఎదిరించుచూ దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

19అది నేటి సంఘము యొక్క మోసము. చూడండి, "నాశన పుత్రుడు" అనగా అపవాది. "నాశనపుత్రుడు" అతడే అపవాది. ఈనాడు జనులు సాతానును ఆరాధించుచూ తాము దేవునిచే ఆరాధించుచున్నామని తలంచుచున్నారు. కాని వారు ఆపవాదిని ఒక మానవాచారము ద్వారాను, మానవ-నిర్మిత శాఖల ద్వారాను, ఆచారముల ద్వారాను ఆరాధించుచున్నారు. అందువలన జనులు గొప్పగా మోసపుచ్చబడుచున్నారు. అంత గొప్ప మోసమును లోకము ఎన్నడూ ఎరుగదు. ఈ దినమునకు ఎంతో వాక్యము వాగ్దానము చేయబడినది. అది బోధింపబడుచున్నది, బయలుపరచబడుచున్నది, అయినా గాని దానిని వారు నమ్మరు. దానిని వారు అసలు నమ్మరు.

ఎందువలన? మనము ఆశ్చర్యపడుచున్నాము. ఎందుకు వారు దానిని నమ్మరు? దేవుడు తాను ఒక ప్రత్యేకమగు పనిని చేయుదునని చెప్పినప్పుడు, దానిని ఆయన చేయును; అయినా గానీ వారు దానికి తమ వీపులను త్రిప్పి వెళ్ళిపోవుచున్నారు. దేవుడేమి చెప్పెనో, దేవుడేమి చేయునో, హవ్వకు తెలియును; కానీ ఆమె దానికి తన వీపును త్రిప్పినది. అపవాది చెప్పిన మాటను వినినది. గుర్తుంచుకొనండి, ఇతర కాలములలోను కూడా ఆలాగే జరిగినది. ప్రతి కాలములోనూ అంతే! సాతాను వాక్యమును వక్రీకరించు ప్రయత్నమును చేయుచున్నది. మరో కాలము వైపు వారు చూచునట్లు చేయుచున్నది.

20చూడండి, యేసు వచ్చినప్పుడు (చూడండి), ఆ యూదా బోధకుల గుంపులో సాతాను చొరబడినది. రబ్బీలు, యాజకులు వారికి మోషే ధర్మ శాస్త్రమును అనుసరించమని చెప్పుచుండిరి. ఆ దినమున వాక్యమై యున్న మనుష్యకుమారుడు బయలుపరచబడెను (చూడండి), ఆయన తన్ను తాను బయలుపరచుకొనెను. వారు మతమును వెంబడించుటకు ప్రయత్నములు చేయుచుండిరి. మోషే ధర్మశాస్త్రమును వెంబడించుచుండిరి. అపవాది వారికేమి చెప్పు ప్రయత్నించుచుండెనో గమనించండి? వారికి ఈ విధముగా చెప్పు ప్రయత్నించుచుండెను. "వాక్యములో ఈ భాగము అక్షరాలు ఖచ్చితముగా నిజమే, కానీ ఈ వ్యక్తి, ఆ రాబోవువాడు కాడు," అని వారితో పలికెను. ఎంత మోసకారిగా వాడుండెనో చూచారా? అదియే నిజంగా మోసపూరితమగు దినము.

21అప్పటి నుండియూ ఇప్పటి వరకును ఆ విధంగానే కొనసాగుతున్నది. సాతాను భూమి మీద తన రాజ్యమును స్థాపించుచున్నది. ఖచ్చితంగా వాడు ఆ విధంగానే చేయుచున్నాడు. తన స్వంత రాజ్యమును అతడు స్థాపించగోరుచున్నాడు. క్రైస్తవుడు కాని ఒక వ్యాపారస్థుని మీరు చూడండి, అతడు ఎన్నో ప్రణాళికలను ఏర్పరచుకొని పనిచేయుచున్నాడు. నిన్ను తప్పు త్రోవ పట్టించుటకు అతడు ప్రయత్నములు చేయును, అందుకొరకు అతడు ఒక ఉద్దేశ్యము కలిగి యుండును. నీవాలాగు తప్పు చేసినయెడల అతనికి వ్యక్తిగత లాభము కలుగును. అందుకే అతడు నిన్ను తప్పు త్రోవలో నడిపించును. అతడు తన శాయశక్తులా నీకు దానిని చూపించును. నిన్ను ఏదో రకంగా సత్యము నుండి త్రోవ తప్పించును, ఎందుకనగా అతనికి వ్యక్తిగత లాభమే ముఖ్యము. అబద్దము, మోసము అతనికి ఏమి లెక్కకు రావు. వ్యక్తిగత సంపాదనయే ముఖ్యము.

GEN 3:1-3

 

22అందుకొరకే సాతాను ఈలాగున చేసినది. సేవ ద్వారా ఈ పనిని అపవాది నెరవేర్చెను. దేవుడు కూడా తన పని చేయుదునని వాగ్దానము చేసెను.

ఏదేనులో మత మోసము ద్వారా వాడు దీనిని జరిగించెను. అప్పటి నుండి దానిని కొనసాగించుచునే యున్నాడు. కొందరు కమ్యూనిస్టు గుంపును ఏర్పరచుట ద్వారా దీనిని చేయలేదు. కమ్యూనిస్టులకు దీనితో సంబంధము లేదు. సంఘమే ఇందులో పాలుపొందెను. దానినే మీరు గమనించవలెను, చూడండి. ఏర్పరచబడిన వారిని మోసము చేయువారు కమ్యూనిస్టులు కారు; సంఘమే ఏర్పరచబడిన వారిని మోసము చేయును, చూచారా. అది కమ్యూనిస్టు కారు. వారు దేవుని నిరాకరించుదురని మనమెరుగుదుము. వారు క్రీస్తు విరోధులు — నిశ్చయంగా వారి నియమావళి అట్టిది — కానీ వారు అంత్యక్రీస్తులు కారు. అంత్యక్రీస్తు మతభక్తి కలిగియుండును, చాలా మతభక్తి కలిగియుండును, మరియు వాక్యమును ఎత్తి చూపును. దానిని తేటగా, కనుపరచును. ఆదియందు సాతాను ఆ విధంగానే చేసెను. వాక్యమునంతటినీ ఎత్తి చూపెను. "ఈ చెట్టు ఫలములో దేనినయినా తినవద్దని దేవుడు చెప్పెనా" అని అడిగినది. చూడండి. వాక్యమునే చెప్పినది…"అవును. ఈ తోటలోని చెట్ల ఫలములలో అన్నింటినీ మేము తిన వచ్చును, కాని ఈ తోట మధ్యలో ఒక చెట్టున్నది, దాని ఫలమును తినవద్దని దేవుడు మాతో చెప్పెను. దానిని కనీసము అంటుకొనరాదు — ఆలాగు చేసిన దినమున మేము చనిపోదుము" అని ఆమె చెప్పెను.

GEN 3:4,5

 

23"ఓ, మీరు నిశ్చయంగా చావనే చావరు, కాని దీనిని దేవుడు ఎందుకు చెప్పెనో కారణమును మీతో చెప్పెదను వినండి. అది తిను దినమున మీ కన్నులు తెరువబడును. మంచి, చెడులను మీరు గ్రహించగలుగుదురు. అప్పుడు మీరు దేవునివలె యుందురు," అని సాతాను వారితో చెప్పెను. వాడు అలాగే చేయగోరుచున్నాడు. నేడు కూడా అదే రీతిగా వాడు చేయగోరుచున్నాడు. ఆదియందు ఏదేనులో ప్రారంభమైన ఆ మత మోసము నేటికినీ కొనసాగుచునే యున్నది.

ఆదాము కాలములో అది ఒక మోసము. నోవహు కాలములో అది ఒక మోసము. యేసు కాలములోనూ అంతే. ఇప్పుడును అదే విధముగా యున్నది: ఒక మతపరమగు మోసముగా యున్నది.

24ఇప్పుడు మనము గమనించుదము, భూమి, అది దేవుని ఆదీనములో ఉన్నప్పుడు… ఇప్పుడు, అది ఒకప్పుడు దేవుని ఆదీనములో ఉండెను. దేవుని వాక్యమును విసర్జించినందున సాతాను దానిని వశపరచుకొనినది. ఒక కాలములో భూమి దేవుని యొక్క ఆధీనములో యుండెను. దానిని ఆయన ఒక కక్ష్యలో నియమించెను. దానిని ఆయన పనిచేయునట్లుగా చేసెను. ఆయన సమస్తమును తన ఆధీనములో యుంచుకొనెను. సాతాను దానిని తన వశములోనికి తీసికొనెను. ఇప్పుడు వాటిని పోల్చి చూద్దాం.

25అందుకు దేవునికి ఆరువేల సంవత్సరములు పట్టెను. అంత కాలము ఆయనకు ఆక్కర లేదు గానీ అంత కాలమును ఆయన తీసికొనెను. ఆరువేల సంవత్సరములు, ఎందుకనగా మనము దానిని నేర్చుకొనియున్నాము, పరలోక మందు ఒక్క దినము భూమి మీద వెయ్యి దినములకు సమానము; ఆరువేల సంవత్సరములు లేదా ఆరు దినములలో దేవుడు భూమిని నిర్మించెను.

ఇప్పుడు, దానిని స్థిరపరచుటకు దేవునికి ఆరువేల సంవత్సరములు పట్టెను. మంచి విత్తనములను అందులో ఆయన నాటిను. ప్రతిదియూ దాని దాని జాతిని మొలిపించెను. దేవుడు ఆరువేల సంవత్సరములను తీసికొనెను.

26ఆయన భూమినంతటినీ తయారు చేసి, చివరగా తన ప్రధాన కార్యాలయమునకు చేరెను. భూమికి అది ప్రధాన కార్యాలయము. ఏదేనుకు తూర్పున అందమగు చోట అది యుండెను. దానినే ఏదేను తోట అని పిలచెను. ఐగుప్తులోని ఏదేను తోటలో దేవుడు తన ప్రపంచ ప్రధాన కార్యాలయమును ఏర్పరచెను; తోట యొక్క తూర్పు చివరన, ఆ ప్రధాన కార్యాలయముండెను.

27ఈ యావత్తు సృష్టి మిద దేవుడు తన కుమారుని మరియు ఆతని భార్యను నియమించెను. అది నిజము. దేవుడు ఆ విధంగా చేసెను.

వారికి పూర్తి ఆధిపత్యమును ఆయన ఇచ్చెను. వారు గాలితో మాట్లాడగలరు మరియు అది వీచుట ఆగును. వారు చెట్టుతో మాట్లాడగలరు మరియు అది అటు ఇటు సంచరించగలదు. సింహము మరియు తోడేలు కలిసి మేసినవి, మరియు వాటి ప్రక్కన గొర్రెపిల్ల పరుండెను. అక్కడ చెడు లేదు. అది పరిపూర్ణ సమాధానము, పరిపూర్ణ సఖ్యత, అంతయూ పరిపూర్ణముగానే అది యుండెను, అది దేవుని యొక్క ఆధీనములో యుండినప్పుడు. గమనించండి, అది ఆయన ప్రవంచము, దానిని ఆయన నిర్వహించుచుండెను. ఆయన మూలముగానే సమస్తమూ కలిగెను. అన్నియూ చక్కగా తినుచుండెను, ఏది చావలేదు, ఏది నాశనము కాలేదు. ఏది చెడిపోలేదు. అది చాలా పరిపూర్ణముగా యుండెను. దానంతటి మీద ఆయన తన ప్రియ పిల్లలను: ఆయన ప్రియ కుమారుని మరియు ఆయన కుమార్తెను, ఒక భార్యాను మరియు భర్తను నియమించి, వారి ఆధీనములో యుంచెను.

28దేవుడెంతో సంతృప్తి చెందెను, ఆయన తన కార్యమంతటి నుండియూ విశ్రమించెను. ఏడవ దినమున విశ్రమించేను. ఈ ఏడవ దినము ఆయనకు సబాతు దినము. ఆరువేల సంవత్సరముల పాటు దేవుడు దానిని మలచి, తయారు చేసి దానిని ఉనికి లోనికి తీసికొని వచ్చెను. దానినంతటినీ దేవుడు చూచెను. పర్వతములను పైకి తీసికొని వచ్చెను. అగ్ని పర్వతములు అడుగు నుండి కొండలను పైకి లేవనెత్తెను. అవి బ్రద్ధలగుట ద్వారా ఎన్నో మార్పులు వచ్చెను, భూమి ఎండి పోయెను మరియు ఆయన తలంచిన విధముగా భూమి తయారయ్యెను. అది ఒక సుందరమగు స్థలముగా యుండెను.

29దాని వంటిది ఏదియూ లేదు.

అది దేవుని యొక్క గొప్ప పరదైసు. దాని మీద గొప్ప డైనోసరులు ఇంకా ఏవేవో, దానిపై ప్రాకుచు, మరియు గొప్ప జంతువులుండెను — అవి ఎవరికీ హాని చేయలేదు. అవి చిన్న పిల్లి పిల్లలవలె సాధువుగా యుండెను. వాటికి ఏమియూ లేదు: వ్యాధి లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. భూమి మీద ఒక్క వ్యాధి క్రిమియు లేదు. ఓ, ఎట్టి స్థలమది: గొప్ప పక్షులు చెట్టు మీద నుండి చెట్టు మీదికి ఎగురుచుండెను, మరియు ఆదాము వాటికి పేరు పెట్టి పిలచెను, మరియు అతని భుజముల మీదికి ఎగిరి అవి కూయుచుండెను. ఓ, ఎంత అద్భుతమగు చోటును దేవుడు ఏర్పాటు చేసెను.

30అప్పుడు ఆయన తన స్వంత శరీరములో నుండి తన స్వరూపములో మానవుని సృజించెను. దేవుని శరీరములో ఎన్నో గుణలక్షణములున్నవి, నీవు నీ తండ్రి యొక్క రూపమైయున్న విధముగా. నీవు గమనించు, నీవు నీ తాత, తాత, తాతలోనే యున్నావు. నీవు నీ తండ్రిలోనే యున్నావు.

నీవు నీ తండ్రిలో యుండగా నీకేమి తెలియదు. జీవ కణము పురుషునిలో నుండియే వచ్చుచున్నది. మగవానిలో రక్త కణమున్నది; స్త్రీకి అండమున్నది. కాబట్టి రక్త కణములోనే జీవమున్నది. నీవు నీ తండ్రిలో యున్నప్పుడు నీకు అసలు ఏమియూ తెలియదు, అయినను, నీవు నీ తండ్రిలో యున్నావని విజ్ఞాన శాస్త్రము మరియు దేవుని వాక్యము కూడా రుజువు చేయుచున్నవి, కాని దాని గూర్చి నీకేమియూ తెలియదు.

నిన్ను ఎరుగవలెనని నీ తండ్రి ఆంక్షించెను. తల్లితో ఐక్యమగుట వలన నీవు నీ తండ్రికి తెలిసితివి. నీవు నీ తండ్రి యొక్క స్వరూపమై యున్నావు. నీవాయన వలె కనిపించితివి. నీ తండ్రి వలె కనిపించిన శరీర అంగములు నీవు కలిగియున్నావు. ఆదియందు దేవుడు ఆ విధంగానే యుండెను. దేవుని యొక్క ప్రతి కుమారుడు, దేవుని యొక్క ప్రతి కుమార్తె ఆదియందు దేవునిలోనే యుండిరి. ఇప్పుడు నీకది జ్ఞాపకముండదు గాని నీవు అక్కడుంటివి. ఆయన దానిని ఎరుగును, నిన్ను ఆయన ప్రేమించి నీతో మాట్లాడగలుగునట్లును, నీతో కరచాలనము చేయునట్లుగాను ఆయన నిన్ను ఈ విధంగా రూపొందించెను.

31నీ కుమారుడు ఇంటికి వచ్చి బల్ల యొద్ద కూర్చొనుట చూచినప్పుడు నీవు ఆనందించవా? అతడు యుద్ధరంగమ నుండియో లేక మరో అట్టి చోట నుండి భయముతో వచ్చినప్పుడు నీవెట్లు భోజనము సిద్ధపరచెదవు? క్రొవ్విన దూడను వధించెదవు. అతని కొరకు ప్రత్యేకమగు భోజనమును సిద్ధపరచెదవు, ఎందుకనగా అతడు నీ యొక్క శరీరము, నీ యొక్క రక్తమునైయున్నాడు. అతడు నీలో యుండెను. అప్పుడు నీవతనిని ఎరుగవు గాని అతడు అక్కడున్నాడని నీకు తెలియును.

32మనము ఇక్కడుందుమని ఆలాగే దేవునికిని తెలియును. ఆయన మనతో సంభాషించగలుగునట్లుగా మనకు శరీరమును ఏర్పరచెను. మనతో మాట్లాడుటకై ఆయన మనలో ఒకనివంటి వాడాయెను. ఆయన యేసుక్రీస్తుగా మారెను. ఆయనే దేవుని కుమారుడు. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆయనే.

ఆయన తన స్వరూపమును బయలుపరచెను, ఒక సహవాసమును ఏర్పరచెను, అది ఆయన ఉద్దేశ్యము. నేను నా తండ్రిలో యున్నప్పుడు నాకేమియూ తెలియదు, కాని నేను ఆతని కుమారునిగా మారినప్పుడు, అతనికి జన్మించిప్పుడు ఒక స్వరూపమునయితిని, నా తండ్రీలో ఒక భాగముగా ఉన్నాను; మీరు మీ తండ్రిలో భాగమైయున్నారు. దేవుని పిల్లలముగా మనము దేవుని యొక్క స్వరూపములో భాగమైయున్నాము. ఆయనలో యుంటిమి. ఆయన శరీరము ధరించినట్లు మనమును శరీరమును ధరించితిమి, కావున ఆ విధముగా మనము ఒకరితో ఒకరము సహవాసము చేయునట్లు, భూమి మీద దేవుని కుటుంబముగా. ఆదియందు అదే దేవుని యొక్క ఉద్దేశ్యము. అవును. ఆదియందు దేవుడు దానినే కోరెను. సమస్తమును ఆయన తన అదుపులో యుంచుకొనెను. ఏదెను తోటలో ఆయన మానవుని ఉంచెను. స్వేచ్ఛాజీవిగా ఆయన ఉంచెను. "కుమారుడా! ఇది నీదే అని చెప్పెను."

33ఎంత అందమగు స్థలము.

దేవుడు ఎంతో సంతృప్తి చెందెను. ఆయన సమస్త పని నుండి విశ్రమించెను. ముండ్లు గాని, పొదలు గాని అదివరకు భూమి మిద లేవు. చెడ్డ ఫలములు ఫలించు చెట్లు లేవు. అంతయూ పరిపూర్ణముగా యుండెను. విత్తనములన్నియూ పరిపూర్ణముగా యుండెను. ప్రతిదియు పరిపూర్ణ స్థితిలో యుండెను.

ఆయన చిన్న విశ్రాంతి తీసికొనుటకు వెళ్ళినప్పుడు, శత్రువు మోసముతో లోనికి చొరబడెను. దేవుని బిడ్డలకు ఆయన యొక్క కార్యక్రమమును తప్పుగా అనువాదము చేయుట ద్వారా దానిని ఆక్రమించెను. ఆయన తన స్వంత కుమారుని యందు నమ్మిక యుంచెను. నీ కుమార్తె రాత్రివేళలలో ఒక పురుషుడితో వెళ్ళినప్పుడు, ఆమె యందు నీవు నమ్మిక యుంచెదవు. నీ కుమారుడు త్రాగుబోతు పిల్లలతో బయటకు వెళ్ళునప్పుడు, నీ కుమారుని యందు నీవు నమ్మిక యుంచెదవు, చూడండి. దేవుడు తన కుమారుని యందు నమ్మిక యుంచెను. అతడు ఏ పొరపాటు చేయక తన మాటను అనుసరించునని ఆయన తలంచెను, కాని శత్రువు లోనికి చొరబడి వచ్చినది. ఒక జిడ్డు మోసాగాడు నీ కుమార్తెను మోసము చేయునట్లు, లేదా ఒక స్త్రీ నీ కుమారుని మోసపుచ్చునట్లు, మరియు అదే సంగతి, చూచారా. వాడు లోని చొరబడి… దేవుని యొక్క శత్రువు లోపలకు వచ్చి, హవ్వకు వాక్యమును తప్పుగా అనువాదము చేసెను.

34ఇప్పుడు, వాడు, ఈ పతనము ద్వారా ఏదేను తోటను ఆక్రమించి తన వశము చేసికొనెను. దానిని వాడు ఆక్రమించెను. వాని యొక్క మోసపూరితమగు పరిపాలన ఆరువేల సంవత్సరముల నుండి కొనసాగుతున్నది, జనులను (దేవుని బిడ్డలు) మోసము చేయుచున్నాడు, అప్పుడు వాడు ఆలాగునే మోసము చేసెను, ఎందుకనగా వారు స్వేచ్ఛాజీవులుగా యుండిరి. వారికిష్టమొచ్చినట్లు ప్రవర్తించగలరు. వారు సరిగా ప్రవర్తించుదురని నమ్మెను. వారు చెడ్డగా ప్రవర్తించరని నమ్మెను, కాని వారు తప్పు పని చేసిరి. తమ జన్మ హక్కులను అమ్మివేసుకొనిరి. లోకము కొరకు (ఏశావు చేసినట్లుగా) వారు చేసిరి; మరియు దానిని సాతాను జయించెను, దానిని వశపరచుకొనెను. వాడు తన ఏదేనును నిర్మించుటకు ఆరువేల సంవత్సరములను తీసికొనెను, దేవుడు తన ఏదేనును ఆరువేల సంవత్సరములలో నిర్మించినట్లుగా, మోసము ద్వారా; (వాక్యమును మోసము చేయుట ద్వారా, లేదా జనులను మోసము చేయుట ద్వారా) ఇప్పుడు, భూమి మీద పాపముతో తన స్వంత ఏదేనును స్థాపించెను.

ISA 14:12-14

 

35దేవుని యొక్క ఏదేను నీతితో స్థాపించబడెను. సాతాను యొక్క ఏదేను పాపములో స్థాపింపబడెను, ఎందుకనగా సాతాను పాపమైయున్నది. దేవుడు నీతియైయున్నాడు. దేవుని యొక్క రాజ్యము నీతి, సమాధానము మరియు జీవముతో స్థాపించబడినది; సాతాను యొక్క రాజ్యము పాపములోను, మతపరమైన పాపముతో స్థాపించబడియున్నది.

వాడెట్లు మోసము చేసెనో చూడండి. ఆ విధముగా మోసము చేయుదునని వాడు చెప్పెను. ఈ విధముగా వాడు వాగ్దానము చేసెను. దీనిని ఎందరు ఎరుగుదురు? యెషయా గ్రంధము మనము తీయుదము. మీరు కొన్ని లేఖనములను చూడండి. నేను చాలా చెప్పవలెను. యెషయా 14వ అధ్యాయము తీయుదము. ఒక క్షణము చూద్దాం. ఇక్కడ సాతాను ఏమి చెప్పెనో చూద్దాం. యెషయా 14లో మనము చదువుదము. వీడేమి చేసెనో గమనించుదము, యెషయా 14వ అధ్యాయము 12 వచనము నుండి చదువుదము.

తేజో నక్షత్రమా, వేకువ చుక్కా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి?

నేను ఆకాశమున కెక్కిపోయెదను. దేవుని నక్షత్రములకు పైగా [వారే కుమారులు] నా సింహాసనమును హెచ్చింతును: ఉత్తర దిక్కున నున్న సభా పర్వతము మీద కూర్చుందును.

మేఘమండలము మీది కెక్కుదును; మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?

2THS 2:4

 

36కొద్ది సేపటి క్రితం థెస్సలొనీయులలోని వాక్యమును మనము చదివియున్నాము. దానిని దీనితో ఇప్పుడు పోల్చి చూడండి. "ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచూ దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచూ, భూమి మీద ఒక దేవునిగా పూజింపబడుచున్నాడు."

గత ఆదివారము నేను ఈ లోక దేవుని గురించి మీకు బోధించియున్నాను. ఇప్పుడు వాడు మోసము చేయుచున్నాడు. మనము అట్టి భయంకర ఘడియలో, ఘోరమగు కాలములో జీవించుచున్నాము. ఇది అన్ని యుగములలోనికి అతి మహిమకరమగు కాలము, ఎందుకనగా మరల మనము గొప్ప వెయ్యేండ్ల పాలనను ఎదుర్కొనుచున్నాము. మరల ఏదేనును మనము ఎదుర్కొనుచున్నాము. కాని ఈ కాలములో వాడు తనకున్న మోసమునంతటినీ, తంత్రమునంతటినీ ఉపయోగించుచున్నాడు. దానితో మనలను మోసము చేయగోరుచున్నాడు. అందుకొరకు తన శాయశక్తులా ప్రయత్నము చేయుచున్నాడు. వాడు తన శక్తినంతటినీ అందుకొరకే కూడబెట్టుకొని పని చేయుచున్నాడు. దేవుని వలె క్రిందికి దిగి వచ్చెను. దేవుని స్థానములో తన్నుతాను అతడు నిలుపుకొనెను, మతపరమైనవానిగా ప్రవర్తించెను, వాక్యమును వాడు చెప్పగలడు, వాక్యమును వాడు నీకు చెప్పగలడు. ఏదెను తోటలో, సాతాను హవ్వను ఆ విధంగానే మోసపుచ్చెను. తన విషపూరితమగు బోధను అపవాది ఏదో ఒక చిన్న సందు గుండా ఎక్కించుటకు ప్రయత్నము చేయును. ఒక రాత్రి మనము "ఆలోచనాపరుని, వడపోత సాధనము" గూర్చి చెప్పుకొన్నట్లుగానే ఇది యున్నది.

ISA 14:13,14

 

37సర్వోన్నతుని కంటె పైగా వాడు తన్నుతాను హెచ్చించుకొందునని అనుకొనెను. మేఘముల మీదికి నక్షత్రముల మీదికి, వాడు ఎక్కిపోయి, దేవుని వలె కూర్చొనును. సర్వోన్నతుని కంటె పైగా హెచ్చించుకొనును. వాడు తన బెదరింపులను కొనసాగించుటలో విజయము సాధించెను. నిజంగా వాడు ఈ బెదరింపులు ద్వారా గొప్ప విజయమును పొందెను. ప్రజలకు, దానిని వాడు వివరించగల స్థితిలో యున్నాడు. ప్రతి కాలములోను దేవుని యొక్క విలువగల వాగ్దాన వాక్యము కూడా ఆ మాదిరిగానే బయలుపరచబడుచున్నది. ఆ విధముగానే వాడు అది చేసియున్నాడు. ప్రతికాలములోనూ వాడు అది వివరిచియున్నాడు.

GEN 6:17

 

38నోవహు దినములలో జరిగినది చూడండి. ఆకాశములో నుండి వర్షము కురియుట అసాధ్యమని అతడు వారికి వివరించెను. ఆ పైన ఆకాశములో నీరు లేదు, అని చెప్పెను. ఏదేను తోటలో వాడు తన గొప్ప శాస్త్రీయ సువార్తను బోధించెను. వాడు తన పరికరములను చంద్రుని మీదికి విసిరి, ఆ పైన తేమ కూడా లేదని రుజువు చేయగలడు. కాని వర్షము వచ్చునని దేవుడు చెప్పెను, కాని సాతాను విజయమును పొందెను మరియు ప్రజల యొక్క మనస్సులను శాస్త్రీయ పరిశోధనల ద్వారా అది జరగదు అని వాడు విషపూరితము చేసెను. దేవుడు చెప్పినది జరుగుట అసాధ్యమని వారికి చెప్పెను, కాని దేవుడు చెప్పినదే జరిగినది. ఆ ప్రకారము జరుగునని దేవుడు చెప్పెను గనుక ఆలాగు జరిగినది. ఆయన దానిని చేసెను.

MATT 4:3,4•

LUKE 4:3,4

 

39ఇప్పుడు, యేసు దినములలోను వాడు ఆ ప్రకారమే చేసెను. వారి మనస్సులను మోసము ద్వారాను, వాక్యమును తప్పుగా అనువాదము చేయుట ద్వారాను విషపూరితము చేసెను. "నీవు దేవుని కుమారునివైనచో, ఫలానా, ఫలానా పని చేయుము నేను చూచెదను," అనెను. యేసు వాని ముందు హాస్యగాని వలె ఆడలేదు. ఎన్నడూ ఆయన ఆలాగు చేయలేదు. దేవుడు హాస్యగాడు కాడు. సాతాను అడిగిన ప్రతిదానికి ఆయన జవాబు చెప్పనవసరము లేదు. యేసు కేవలము ఈలాగు మాత్రమే పలికెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడియున్నది." ఆయన ఏ మాత్రమూ వాని మాటలకు చలించలేదు. ఆయన రొట్టెను తయారు చేయనవసరము లేదు. ఆయన అది చేయగలడు, కాని ఆయన అపవాది యొక్క మాట విన్నట్లుగా హవ్వును, కాబట్టి ఆయన వాడి మాటలు వినే అవసరము లేదు.

MATT 7:22

 

40మరల అది మతపరమైన పాపముగానే యున్నది, ఆదియందు ఉన్నట్లుగా అది చాలా మోసపూరితముగా యుండెను. ఇప్పుడు దానిని గమనించండి. అది ప్రతి రోజు జరిగించు పాత పాపము కాదు: వ్యభిచారము, త్రాగుడు, దేవుని నామమును వ్యర్థముగా ఉపయోగించుట కాదు. అది కాదు. కాదు.

చాలా సంవత్సరముల క్రిందటి సంగతి మీకు గుర్తుండును, ఇక్కడ చాలామంది పాత-కాలపు వారున్నారు. నేను బోధించిన ఆ ప్రసంగమును గుర్తుచేసికొనండి. తీర్పునందు నిరుత్సాహాములు అను ప్రసంగమది. వేశ్య అక్కడ నిరాశకు లోను కాదు, ఎందుకనగా ఆమెకు తన గమ్యము ఎరుగును. త్రాగుబోతు అక్కడ నిరుత్సాహము చెందడు. జూదగాడు, తిరుగుబోతు, అబద్దికుడు, దొంగ — అతడు నిరుత్సాహపడడు. కానీ తాను సరిగాయున్నానని తలంచువాడే — అక్కడే నిరుత్సాహము ఉన్నది. అతడే, వచ్చి, "ప్రభువా, నేను సువార్తను ప్రకటించలేదా? నీ నామములో నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా?" అనును.

MATT 7:23

 

41"అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. నేను మిమ్మును ఎన్నడును ఎరుగను," అని యేసు చెప్పెను.

అక్కడే నిరుత్సాహము, చూచారా — మోసము బయటపడును. నేను నిరంతరమూ ఇదే చెప్పుచున్నాను. ఇక్కడే నన్ను చాలా అపార్థము చేసికొనుచున్నారు. నేను వేరుగా ఉండవలెనని ఇది చెప్పుట లేదు, కాని నేను యధార్థముగా ఉండగోరుచున్నాను.

నాకు ఒక వర్తమానమున్నది, మరియు అది తప్పకుండా జనుల యొద్దకు వెళ్ళవలెను. దానిని జనుల మధ్య విశదపరచవలెను. నేను అందరికీ విరోధినని వారు తలంచుచున్నారు.. నేను అందరి పక్షముగా యున్నానని వారు తెలిసికొనిన చాలును. సత్యము నొద్దకు వారిని తీసికొని రావలెనని నేను శాయశక్తులా ప్రయత్నము చేయుచున్నాను. అది నా హృదయములో ఉంచబడియున్నది. ఇక్కడి బైబిలులో అది యున్నది. అది సత్యమని దేవుడు నిరూపించుచున్నాడు, కాబట్టి ఆ విషయములో మరేమియూ చేయజాలము. కాబట్టి వారు దానిని చూడవలెను, లేదా చూడకుండవలెను.

MATT 24:24•

MARK 13:22•

MARK 16:17

 

42చూడండి, దానిని వారు చూడగోరుట లేదు, ఎందుకనగా వారెప్పుడో అమ్మబడిరి. ఒక సంస్థకు వారు తమ జన్మహక్కులను అమ్మి వేసికొనిరి. ఒక శాఖకు వారు అమ్ముడు పోయిరి. తమ జన్మహక్కును అమ్ముకొనిరి. ఏదో ఒక సంస్థ యొక్క మత పునాది మీద నిలబడి పరలోకమునకు వెళ్ళవలెనని వారు ప్రయత్నించుచున్నారు. దానికి సాతాను శిరస్సుగా యున్నాడు.

దేవుడు ఎన్నడు ఒక మత సంస్థను ఏర్పాటు చేయడు. ఇంతకు ముందు ఎన్నడూ ఆలాగు చేయలేదు. వారు దానికి అమ్ముడుపోయిరి. కొందరు వ్యక్తులు గుంపుగా చేరి, వాక్యమును తప్పుగా అనువాదము చేయుచున్నారు, దాని అర్థము ఇది, దాని అర్థము అది అనుచున్నారు. దేవునికి ఎట్టి అనువాదకుడూ అవసరము లేదు. ఆయన తనకుతానే స్వంత అనువాదకుడు. దానినేట్లు చేయవలెనో ఎవరూ ఆయనకు చెప్పవలసిన అవసరము లేదు. ఆయన సార్వభౌముడు. దానినెట్లు చేయునో ఆయన ముందే చెప్పెను. ఆయన తన మాటను ఆ విధంగానే నిలబెట్టుకొనును. "నమ్మిన వారి వలన ఆ సూచక క్రియలు కనబడునని, ఆయన చెప్పెను. దానికి వేరే అర్థము లేదు.

ఆయన చెప్పిన ప్రతిది జరుగును. చివరి దినములలో ఇవి జరుగును అని ఆయన చెప్పెను. ఆయన జరుగునని చెప్పిన ప్రత్యేక సంగతులు జరుగును. ఇది ఆ క్రియలు చేయుటకు సమయమా, కాదా అని ఆయన ఎవరినీ అడుగనవసరము లేదు. సమయము ఎప్పుడో, ప్రణాళిక ఏమిటో ఆయనకు తెలియును.

43సాతాను మోసగాడని చెప్పబడెను, మత్తయి 24:24 లో చూడండి. బహు మోసముతో వాడు వచ్చును…

వాని జ్ఞానము యొక్క సువార్త కార్యక్రమములు ద్వారా — మంచి విద్య, ఉన్నత నైతిక సూత్రములు, నాగరికత మొదలగు వానితో నిండి యున్నవి — దేవునిని సేవించవలెనను జనులను బెదిరించుచున్నది అని మనము కనుగొంటిమి. తన అబద్ధమును నమ్మమని బోధించుచున్నది. హవ్వ దానిని చేయగోరలేదు, కాని అందులో ఎంత ఎక్కువ జ్ఞానమున్నదో వారికి చూపించగోరెను.

ఆమె దానిని ఎరుగదు. ఆమె తెలిసికొనగోరినది. ఆమెకు అది అర్థము కాలేదు, కాని ఆమె అర్థము చేసికొనగోరినది. మరియు అర్ధము చేసికొనుటకు ప్రయత్నించవద్దని ఆమెకు దేవుడు చెప్పెను. ఈ సంగతులను నేనెట్లు అర్థము చేసికొందును? వాటిని నేను ఆర్థము చేసికొనలేను. వాటిని నేను నమ్ముదును. వాటిని నేను అర్థము చేసికోనవసరము లేదు. దేవుడే విశ్వాసము, మరియు ఆర్థము చేసికొనుట కాదు. ఆయన చెప్పిన దానిని కేవలము నమ్ముదుము.

44ఇప్పుడు సాతాను యొక్క ఏదేనుతో దేవుని ఏదేనును పోల్చి చూడండి. దేవుని యొక్క నిజ వాగ్దాన వాక్యమును ఆరువేల సంవత్సరముల నుండి వక్రీకరించుచూ వచ్చుచున్నది. ప్రతి కాలములోను ఆలాగే చేయుచున్నది. ఇప్పుడు దానిని మనము పోల్చి చూద్దాం. ఎక్కడికి మనం వచ్చామో చూద్ధాం. యేసుక్రీస్తు కాలములో వాడు సంఘమునకు చేసిన ప్రకారమే ఇప్పుడును చేయుటకు ప్రయత్నించుచున్నాడు. దేవుని యొక్క విధేయులగు కుమారులు సత్యమును ఎరుగకుండా చేయుటకు ప్రయత్నములు చేయుచున్నాడు. దేవుడు తన కుమారులను ఇక్కడ ఉంచియున్నాడు, ఆయన గుణలక్షణములు, ఆయన మాట వినుట ద్వారా ఆయనతో సహవాసము చేయవలెనని ఆయన కోరుచున్నాడు.

45నీవు నీ తండ్రికి విధేయుడవగు కుమారునిగా యున్నచో నీ తండ్రి మాట విందువు. "కుమారుడా, ఆ నీటిలోనికి ఈతకు వెళ్ళవద్దు. అందులో ప్రమాదకరములగు మొసళ్ళున్నవి" అని నీతో చెప్పెననుకొందము. ఆ వెనుకనే మరియొకడు వచ్చి, "అది చాలా మంచి నీరు, అందులో ఏమి మొసళ్ళు లేవు," అని చెప్పును.

ఇప్పుడు, నీవు ఎవరి మాట విందువు? నీవు నిజమయిన కుమారునివయినచో, నీ తండ్రి మాటనే విందువు. నిజమయిన దేవుని కుమారుడు లేదా కుమార్తె మొదటగా దేవుని మాటనే తీసికొనును! ఎవరేమి చెప్పినా నేను లెక్క చేయను, వారు దేవుని వాక్యమునే మొదట తీసికొందురు. "ఆ గిన్నెలో విషమున్నది" అని చెపితే వారు నమ్ముదురు. ఆయన వాక్యమంతటి యందు వారు విశ్వాసముంచుదురు. ఆయన బీజముగా నున్న వారు పరిశుద్ధ ఏదేనును తీసికొని వచ్చెదరు. ప్రేమ మరియు నిత్యజీవములను కలిగియుందురు.

దేవుని ఏదెనులో నుండి పరిశుద్ధత వచ్చెను. ఆ ఏదేనులో పరిశుద్ధత, ప్రేమ, ఆవగాహన, పరిపూర్ణత, నిత్యజీవము ఉండెను. దేవుడు దానినే నాటుచున్నాడు. అది ఆయన వాక్యమను విత్తనము; అంతమందు ఆయన సంఘము ఆలాగుననే యుండును. ఇందులో ఏమియూ మార్పు లేదు.

GEN 1:11•

MARK 4:14•

LUKE 8:11

 

46చూడండి, ఇక్కడ ఒక ఆలోచన యున్నది. దానిని మరచిపోవద్దు. నేను మరియొకసారి లేదా మరియొక వర్తమానములో దానిని తీసికొని వచ్చెదను, కాని మీరు దేవుడు చెప్పిన దానిని తెలిసికొనుడి. "ప్రతి విత్తనము తన దాని జాతిని మొలిపించును." అది దేవుని ఆజ్ఞయే గదా? ఏ బోధకుడైనా లేదా మరే వ్యక్తి ఆయినా గాని ఆ వాక్యమును మరో రీతిగా చెప్పుటకు ప్రయత్నించితే ఏమగును, చూచారా? దేవుని యొక్క ప్రతి మాటయు విత్తనమే — యేసు ఆ విధంగా చెప్పెను — విత్తువాడు విత్తిన విత్తనమని ఆయన చెప్పెను. కావున మార్కు 16 దేవుని వాక్యము గనుక అది దాని జాతినే తిరిగి పుట్టించును. మలాకీ 4 దేవుని వాక్యమయినచో అది తిరిగి దాని జాతినే మొలిపించును. ప్రతి ఇతర వాగ్దానము కూడా తిరిగి దాని జాతినే పుట్టించును.

GEN 1:11•

DEUT 8:3•

MATT 4:4•

MARK 16:17,18•

LUKE 4:4

 

47మీరు చూచారా? ఇక్కడ సాతాను మారు వేషములో యున్నదా? "అది ఆలాగు కాదు" అని చెప్పుటకు ప్రయత్నమూ చేయుచున్నది. దానిని మీరు అర్థము చేసికోన్నారా? "ఓ, అది ఈ దినమునకు కాదు. అది మరియొక కాలమునకు చెందినది. దాని అర్థము ఇది కానే కాదు," అని సాతాను చెప్పును. "ప్రతి విత్తనము తన జాతిని తిరిగి పుట్టించును. దేవుడు తన ఏదేనును ఆ విధముగా స్థాపించెను. అది నిజమేనా?

దేవుడు తన సంఘమును ఆ విధముగా స్థాపించును: ప్రతి వాక్యము తిరిగి తన జాతినే పుట్టించును. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును," చూచారా. సాతాను, మరొక దానిని చెప్పును, కానీ దేవుడు ప్రతి విత్తనము తన జాతిని తిరిగి మొలిపించునని చెప్పెను. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడునని వాగ్దానము చెప్పెను. కాని సంఘము ఇట్లు చెప్పుచున్నది, "మా సంఘములో చేరండి, సూత్రమును వల్లించండి, మా పుస్తకమును తెలిసికొనండి." పూర్తి బైబిలులో ఎక్కడనూ అటువంటిది లేదు. కాని యేసు చెప్పెను, "నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, వారు సర్పములను ఎత్తి పట్టుకొందురు, వారు విషకరమైనది ఏదయినా త్రాగినా, వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచగా, వారు బాగవుదురు." దానిని కాదనగలవారు ఎవరున్నారు? చూచారా?

JOHN 10:5,27

 

48"ప్రతి విత్తనము తన జాతిని మొలిపించును. నీవు దేవుని బీజముగా యున్నచో, నీవు దేవుని స్వరూపముగా యుందువు, దేవుని కుమారునిగా యుందువు, నీలో దేవుని యొక్క విత్తనము చల్లబడి యుండును, చూచారా. అప్పుడు నీవు దేవుని వాక్యమును వినప్పుడు — "నా గొర్రెలు నా స్వరమును వినును; క్రొత్తవానిని అవి వెంబడించవు." మీరు దానిని గ్రహించారా? ప్రతి విత్తనము తన జాతిని మొలిపించును.

49ప్రతి విత్తనము తన జాతినే తిరిగి పుట్టించునని మనకు తెలియును. ఆ ఏదేనులో మరణము లేదు. కొత్త ఏదేనులోను మరణము ఉండదు, చూచారా. అక్కడ పరిశుద్ధత, పవిత్రత మరియు నిత్యజీవము తప్ప మరేమియూ లేవు.

దేవుని వాక్యమందు విశ్వాసముంచనందున సాతాను ఏదేనులోనికి అపవిత్రత అను విత్తనము తీసుకొని వచ్చెను. సాతాను అంత్యక్రీస్తుగా సింహాసనము అధిష్టించినది. అందులోనికి ఇప్పుడు మనము ప్రవేశించుచున్నాము. అది ఈ భూలోకపు ఏదెను. పాపపు ఏదెను — వక్రీకరించబడిన మతము. "నేను సాతానును. నేను గొప్ప దేవదూతను." అని ప్రారంభములో వాడు చెప్పుకొనలేదు. లేదు, ఆలాగు వాడు ప్రారంభించలేదు గాని వాక్యమును వక్రీకరించుట ద్వారా వాడు దానిని ప్రారంభించెను. ఆ విధముగా వాడు ప్రతి కాలములోను తన రాజ్యమును తీసికొని వచ్చుచున్నాడు. ఇది గొప్ప మోసకరమగు కాలము. వాడు తన జనుల ద్వారా తన సింహాసనమును అధిష్టించుటకు సిద్ధమగుచున్నాడు. వాడు తనకుతాను వివేకముగల, విద్యగల, శాస్త్రీయ ఏదేనును నిర్మించుకొనెను. నిజము. శాస్త్రీయ బోధకులు, శాస్త్రీయ సంఘములు, శాస్త్రీయ వేదాంతము — అంతా శాస్త్రీయమే. ప్రతిదియు జ్ఞానమును ఆధారము చేసికొనియే యున్నది. సంఘము యావత్తు జ్ఞానముపైనే నిర్మించబడుచున్నది. విశ్వాసము మిద అది నిర్మించబడుట లేదు.

50ఒకసారి నేను ఒకతని సంఘములో కూటము ఏర్పాటు చేయుటకు వెళ్ళాను. అది పశ్చిమాన ఉన్న ఒక గొప్ప ఆడిటోరియం. చాలా చక్కని వ్యక్తి అతడు. మనము మాట్లాడుకొనుచున్న సంగతులను అతడు నమ్మడు. అయినా గాని అతనంటే నాకు ఇష్టమే — అతడు వృద్ధుడు, చక్కని మనిషి. అతని సంఘస్థులు చాలామంది యుండిరి. ఆరువేల మంది కూర్చోగల స్థలమది (దాదాపు పదిహేను వందల మంది) అతని సంఘ సభ్యులు ఒక మధ్యాహ్న కూటమునకు వచ్చిరి. వారు చాలా చక్కని దుస్తులు ధరించిన గొప్ప మేధావులు. నేను అక్కడ కూర్చొని వారిని పరీక్షించాను. అతడు చాలా మంచి వర్తమానము బోధించెను. ఆ తరువాత అతడు ఎవరైనా క్రీస్తును అంగీకరించువారున్నారా? అని ప్రశ్నించెను. వారు చేతులు ఎత్తవలెనని అతడు కోరెను గాని ఎవరునూ చేతులు ఎత్తలేదు. చివరకు ఒక స్త్రీ తన చేతులను పైకి ఎత్తినది.

"మంచిది, ఇప్పుడు, నీవు ఒక క్రైస్తవురాలవు," అని అతడు ఆమెతో చెప్పి బాప్తిస్మమునకు నడిపించేను. ఆ తరువాత అతడు బయటకు వెళ్ళెను; ఒక శిశువుకు ప్రతిష్ఠ చేసెను (ఆ చిన్న శిశువును ముద్దు పెట్టుకొని) ప్రార్థించెను, మరియు ఆ తరువాత జనులను పంపివేసెను.

51అతని సంఘము వారు వెళ్ళిపోయిరి. వారు చాలా విద్యగలవారు, పండితులు — ఆ తరువాత నేను ఒక ప్రక్కగా నిలబడి అతనితో కరచాలనము చేసి, దేవుని దీవెనలు నిలచుగాకని చెప్పగోరాను. అప్పుడతడు వెళ్ళుచుండెను, ఆ తరువాత నా జనులు వచ్చుచుండిరి. అతని జనులు అక్కడున్నంత సేపు వీరిని రానియ్య లేదు. నా వారు ఇక్కడికి వచ్చుచున్నారు, వారు చక్రాల కుర్చీల లోను, మంచముల మీదను, వచ్చుచున్నారు, పిచ్చివారు, ప్రతివిధమైనవారు వచ్చుచుండిరి! మీరు తేడాను చూచారా? అంతే. నేను దానిని గూర్చియే చెప్పుచున్నాను, చూచారా. అందులోను భేదమున్నది.

MARK 16:17•

JOHN 3:18•

JOHN 5:24•

JOHN 6:37,44

 

52శాస్త్రీయ జ్ఞానము ద్వారా నీవు సువార్తను అర్థము చేయవచ్చును — "యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వానికి ఏ శిక్షా విధియు లేదు," చూడండి, "కాని నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును." చూచారా, అతడు దానిని అక్కడ పెట్టుట తప్పిపోయాడు, చూచారా. ఆమె యేసుక్రీస్తు నందు విశ్వాసముంచెను. ఒకవేళ విశ్వాసిని ఈ సూచనలన్నియూ వెంబడించినప్పుడు, ఆమె రక్షించబడెను. ఆయన వాక్యమును వినవలెను, దాని అర్థము కేవలము చెవులతో వినుట కాదు, కాని దానిని అర్థము చేసికొనవలెను. ఎవరయినా విందురు.

ఒక వేశ్య కూడా దానిని విని మరియు వేశ్యగానే మిగిలియుండును, చూచారా. దానిని ఒక త్రాగుబోతు వినును. ఒక అబద్ధికుడు వినును గాని ఆబద్ధికునిగానే మిగిలియుండును, కాని "ఆయన వాక్యమును గ్రహించి ఆయన యందు విశ్వాసముంచినవానికి నిత్యజీవము కలుగును." అక్కడే మీరున్నారు, చూచారా. దేవుడు ముందుగా ఒకనిని అభిషేకించితేనే గాని ఎవడును దానిని చేయలేడు.

యేసు చెప్పెను, "నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాజాలడు. నా తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." ఆమేన్! అది పూర్తిగా దేవుని యొక్క సార్వభౌమత్వము మరియు ముందస్తు జ్ఞానము. అతడు ఏకాంతముగా జీవించును, మరియు ఏమి చేయవలెనో అతనికి ఎవరూ చెప్పనవసరము లేదు.

53ఇప్పుడు, అవిశ్వాసము ద్వారా మరియు దేవుని వాక్యమును తీసుకొనుటవలన, అది అవిశ్వాస బీజమును, అపరిశుద్ధత, పాపము, ద్వేషము, నిత్య మరణము తీసుకొనివచ్చెను - ఈ పాపయుక్తమైన, వివేకముగల సంఘ కాలములో ఉన్నవి. మీరు ఇప్పుడు దానిని గ్రహించారా? ఈ దినమున, ప్రపంచమంతయూ మతపరమైన భావముతో నిండిపోయియున్నది… దానిని మీరు ఎరుగుదురా? మొత్తము ప్రపంచము భక్తిగా కనిపించుచున్నది. ఈ మత కాలములో ప్రతి మూలను పెద్ద సంఘములు వెలయుచున్నవి. మొత్తం మీద సాతాను బాగా ఆరాధించబడుచున్నది. అది ఈ బైబిలులోనే యున్నది. ఇది నిజము.

ఈ విజ్ఞానము గల, వేదాంతపు సెమినరీలను చూడండి. మేధావులను వారు తయారు చేయుచున్నారు. ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చేయ వలెనో, ఎట్లు కదలవలెనో వారికి నేర్పించుచున్నారు. మానసిక శాస్త్రమును వారు నేర్చుచున్నారు. మానవ మనస్సుతో ఎట్లు వ్యవహరించవలెనో అను శిక్షణను మూడు లేదా నాలుగు సంవత్సరముల పాటు ఇచ్చుచున్నారు. పాఠశాలలో చదువుట ద్వారా నీవు దేవుని యొక్క ఆత్మను పొందజాలవు. సర్వశక్తుడగు దేవుని ద్వారా, ఆయన హస్తము ద్వారా అది నీలోనికి రావలెను. అందుకు నీవు ముందుగా నిర్ణయింపబడవలెను. పాఠశాలలో చదువుట ద్వారాను, నేర్చుకొనుట ద్వారాను ఆ అనుభవములు నీలోనికి రావు; ముందుగా నీవు నిర్ణయింపబడవలెను. దేవుని హస్తము, దేవుని ముందస్తు జ్ఞానము నీలో పని చేయవలెను. ఇది నిజము.

54అందుమూలముగానే ఇప్పుడు వీరు జీవించుచున్న ఈ గొప్ప ఏదేను పుట్టియున్నది — ఒక సంఘ లోకపు ఏదెను. వారందరూ ఇప్పుడు ఆ గొప్ప విశ్వ సంఘసమితి యొద్ద సమకూడుచున్నారు. ప్రపంచ సంఘము ఏర్పడనైయున్నది. అందరూ ఒకే శిరస్సు క్రిందికి వచ్చుచున్నారు. సాతానుకు కిరీటము పెట్టబడును. ఇది ఖచ్చితము.

దానిలోనికి వెళ్ళక ముందే, వధువును పట్టుకొనుటకు చివరి పిలుపు వినబడుచున్నది.ఒక్కసారి గాని అందులోనికి వెళ్ళినచో, మృగము యొక్క ముద్ర ఆమె తీసుకొనును, శిక్షకు గురియగును. అందులో నుండి మరెన్నడూ బయటకు రాదు. ఆ కారణమును బట్టియే, "నా జనులారా, దానిలోనికి వెళ్లక ముందే, వారి మధ్య నుండి బయటకు రండి, చూచారా. వారి మధ్య నుండి బయటకు రండి, మరియు మీరు ప్రత్యేకించబడుడి," అని నేను చెప్పుదును.

1COR 2:4

 

55ఇప్పుడు, ఈ ఏదెనులో ద్వేషము, మరణము, దేవుని నుండి నిత్య ఎడబాటు యున్నది — దురాశ, మురికి, వంకరతనము ఉన్నది. ఏలాగు? — చెడ్డ విత్తనము చల్లుట ద్వారా ఇది జరిగియున్నది.

పెంతెకోస్తు వారిని కలిసికొనకు ముందే నేను ఒక దర్శనమును చూచాను. అది నాకు గుర్తుకు వచ్చుచున్నది. ఒక వ్యక్తి తెల్లని దుస్తులతో ప్రపంచమంతా తిరుగుచున్నాడు. దానిని నేను మీతో చాలాసార్లు చెప్పాను. వాని వెనుకనే మరియొకడు వచ్చి, చెడ్డ విత్తనములు చల్లుచుండెను. ఏదెను తోటలో హవ్వ శరీరాశకు లోనయినది. శరీరాశయే పాపముగా మారినది.

హవ్వ జ్ఞానము కొరకు ఆశించినది, అదియే పాపము. మనము జ్ఞానము కొరకు దురాశ చూపినప్పుడు, (పి.హెచ్.డి., ఎల్.ఎల్.డి కావాలని కోరుచున్నాము), ఆలాగు ఆశించుట పాపము. ఇది చాలా కఠినమగు మాట, కాని ఇది సత్యము. అదెంత కఠినముగా ఉన్నాగాని అది మాత్రము నిజము, చూచారా. జ్ఞానము కొరకు దురాశ, అర్థం చేసుకొనుట… ఈనాడు మనము జనుల హృదయములలో దేవుని వాక్యమును స్థాపించుటకు ప్రయత్నించుట లేదు. మనలను మనమే స్థాపించుకొనుటకు పూనుకొనుచున్నాము! సంఘములు వాటి సిద్ధాంతములను మనుష్యుల హృదయములలో నాటుటకు ప్రయాసపడుచున్నవి. దేవుని వాక్యమును స్థాపించవలెనని మనకు ఆజ్ఞాపించబడియున్నది. పౌలు చెప్పెను, "మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని."

అక్కడే మీరున్నారు.

PROV 14:12•

PROV 16:25

 

56మానవుడు తన్ను తాను స్థాపించుకొనుట కాదు. దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకొని అతని ద్వారా ఒక పనిని జరిగించుటకు బయటకు పంపినప్పుడు అతనిని అనేకులు అనుకరించుదురు. చూడండి, వారు తమ్మును తాము స్థాపించుకొనుటకు ప్రయత్నించుచున్నారు. ప్రతి వారు తమ గొప్పలు తాము చెప్పుకొనుచున్నారు. తమ శాఖల గూర్చి గొప్ప చెప్పుకొందురు. తమ్ము తాము హెచ్చించుకొందురు. మనము దేవుని రాజ్యము గూర్చి ప్రకటించుచున్నామా లేక మన గూర్చి మనము చాటించుకోనుచున్నామా? దేవుని వాక్యమును స్థాపించుము. అవిశ్వాసమును బయటకు తొలగించుము. మానవుల హృదయములో దేవుని రాజ్యమును స్థాపించుము. ఒక మనిషిని దేవుడు ఆ విధంగా చేయనంతవరకు ఒక మానవుని హృదయములో దేవుని రాజ్యము స్థాపించబడదు. గుర్తుంచుకొనండి, హృదయము మోసకరమైనది. మానవుడు అది సరియైనదనుకొనును. "ఒకని ఎదుట అతని మార్గము సరిగానే కనిపించును." వివేకముగల ప్రతి ఒక్కరికి అది సరియనిపించును.

GEN 3:5

 

57కొన్ని ఆదివారముల క్రిందట నేను మీతో చెప్పాను. నేను నా చనిపోవుచున్న శిశువు యొద్ద నిలబడియున్నాను. అక్కడ సాతాను నిలబడి ఇట్లన్నది, "ఒక రోజున నీ చేతులలోనే నీ తండ్రి చనిపోయెను. నీ భార్య ఆ శవపేటికలో చనిపోయి పడియున్నది; ఇక్కడ నీ శిశువు చనిపోవుచున్నది; మరియు ఆయను సమాధానము ఇవ్వమని అడుగుచున్నావు, మరియు ఆయన నీపై ఒక నీడను పరచియున్నాడు, అయినా గాని ఇంకా నీవు ఆయనను మంచి దేవుడని చెప్పుచున్నావు. ఆయన స్వస్థపరచునని ఇంకా చెప్పుచున్నావు. నీవు నిజమనుకొనుచున్నావు గాని ఇదంతయూ తప్పు."

ఓ, ప్రతి కారణము, ప్రతి మానసికమైన బుద్ది అది నిజము అని ఒప్పుకొనెను, మరియు వాడు చెప్పినది అంతవరకు నిజము.

హవ్వతో వాడు చెప్పినది నిజమని మనము అనగలమా? "మి కన్నులు తెరువబడును, మరియు మీరు మంచి చెడ్డలను ఎరుగుదురు. మీరు దేవునివలె యుందురు," (మంచి చెడ్డలను వివేచించగలరు) ఎందుకనగా దేవుడు వారిని ఇంకా ఆలాగు చూడనియ్యలేదు, వారు దిగంబరులని వారికి తెలియచేయలేదు. ఇప్పుడు వారికి మంచి, చెడులు తెలిసిపోయినవి. మరియు వాడు చెప్పినది నిజము. అయితే మీరు చూడండి, అది దేవుని వాక్యమునకు విరోధము.

58సెమినరీలలోని బోధకులును ఆలాగే చేయుచున్నారు. మానవ-కల్పిత వేదాంతమును నేర్పించుచున్నారు. అది సరిగా కనబడవచ్చును, అది చాలా అర్థవంతముగా అగుపించవచ్చును, కాని అది తప్పు! దానిని మనము అర్థము చేసికోనవరములేదు. దానిని మనము నమ్ముచున్నాము, ఎందుకనగా ఆ ప్రకారముగా దేవుడు చెప్పెను, మరియు అది నిత్యమూ స్థిరపరచబడును — దానిని మొత్తము మనము ఆ ప్రకారముగానే నమ్మవలసియున్నాము. పి.హెచ్.డి కొరకు హవ్వ ఎలా దురాశ చూపినదో చూడండి. ఆమె కలిగినదానికంటే ఎక్కువ తెలివితేటలు సంపాదించుకోవలెనని ఆశించినది.

59చూడండి, అది దేవుని ఏదెను. ఆ ఏదేనులో స్త్రీ పురుషులు దిగంబరులుగా యుండిరి. ఇప్పుడు నేను ముగించబోవుచున్నాను. కొద్ది నిమిషములు మాత్రమే నేను చెప్పెదనని అన్నాను. ఇప్పుడు ముగింపులో చూడండి. ఇప్పుడు దీనిని పోల్చి చూడండి. దేవుని యొక్క ఏదెనులో స్త్రీ, పురుషులిరువురూ దిగంబరులుగాయుండిరి. వారి శరీరము మీద నూలు పోగు కూడా లేదు, అయినా అది వారికి తెలియదు. ఎందువలన అది వారికి తెలియలేదు? వారు పరిశుద్ధాత్మ ద్వారా ఒక పరిశుద్ధ ముసుగును పొందిరి. వారి దిగంబరత్వము మీద దేవుని ముసుగు ఉండెను. వారిద్దరూ ఒకరినొకరు చూచుకొనుచునే యున్నారు గాని దిగంబరులమని ఎరుగలేదు. పరిశుద్ధత యొక్క ముసుగును పరిశుద్ధాత్మ వారి మీద కప్పెను. వారు ముసుగులో యుండిరి.

HEB 10:2

 

60నేటికిని దేవుని ముసుగు యున్నది, చూచినా గాని దురాశ కలుగదు. వారు తమ తలలు త్రిప్పుకొందురు. అది ఒక పరిశుద్ధ ముసుగు — పరిశుద్ధ ముసుగు. ఒకరు స్త్రీ మరియు ఒకరు పురుషుడు, అయినా గాని వారు దిగంబరులమన్న సంగతిని ఎరుగరు, ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధత వారి కన్నులను కప్పెను. చూడండి, దేవుడు వారి మనస్సాక్షిని పాపము నుండి దాచెను. పరిశుద్ధ ముసుగు ద్వారా అది కప్పబడెను. కొద్ది నిమిషముల పాటు దానిని మనము చెప్పుకొనిన బాగుండును.

ఇటు చూడండి, "సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత… (హెబ్రీ) వారి మనసాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు! పాపము అతనిలో నుండి దాటిపోయెను!"

61ఈ ఉదయము సహోదరుడు నెవిల్ చెప్పిన దానిని నేను విన్నాను. నేను పరిశుద్ధాత్మ మిద లేదా మరో దాని మీద ఎందుకు బోధించలేదని కొందరు అతనిని అడుగవచ్చును? దానికి కారణము కలదు. పరిశుద్ధాత్మ మీలోని క్రియ. అది ఒక జీవమే గాని ఒక ఉద్రేకము కాదు; ఏదో ఒక శరీర సంబంధమగు రుజువు కొదు, కాని అది ఒక వ్యక్తి, యేసు క్రీస్తు, ఈ కాలము యొక్క ప్రతి వాక్యము మాలో జీవింపజేయునట్లు దేవుని యొక్క వాక్యము మీ హృదయములో స్థాపించబడియున్నది. ఇది నిజము. క్రియా రూపములోయున్న పరిశుద్ధాత్మను గమనించండి, ప్రదర్శనలో ఎంతగానో కనబడదు, కాని క్రియలో చూడండి. అది వాక్యము ప్రకారమే పనిచేయును.

GEN 2:17

 

62ఇప్పుడు, దేవుని పరిశుద్ధ వాక్యము యొక్క పరిశుద్ధాత్మను గమనించండి. స్త్రీ, పురుషులు దిగంబరులుగా ఉండినా గాని అది వారికి తెలియలేదు. ఎంత అద్భుతము! వాక్యము యొక్క జీవము. వాక్యమే విత్తనమైయున్నది. దేవుడు వారితో ఇట్లు చెప్పెను, "ఈ తోట మధ్యన ఒక చెట్టున్నది, (స్త్రీ). ఈ చెట్టు తోట మధ్యలోనే యున్నది. దానిని తాకనైనా తాకరాదు, దానిని మీరు తిను దినమున నిశ్చయముగా చనిపోవుదురు." వారికి పరిశుద్ధ ముసుగు ఉండెను, దానిని గూర్చి వారికేమియూ తెలియదు. దానిని తాకు ధైర్యము కూడా వారికి లేదు.

వారికి పరిశుద్ధ ముసుగుండెను. దేవుని యొక్క స్థలములో వారు క్షేమముగా యుండిరి. వారు సజీవులుగా యుండిరి. వారి చుట్టూ ఎట్టి మరణమును లేదు. హల్లెలూయా! వారికి ఒకరి పట్ల ఒకరికి పరిపూర్ణ ప్రేమ యున్నది, అది నిత్యమూ ఉండెడి పరిపూర్ణ జీవితము. వారికి పరిపూర్ణ ప్రేమ యుండెను, దేవుని ప్రేమను గూర్చి వారికి పరిపూర్ణ అవగాహన యున్నది. వారికి దేవుని వాక్యమున్నది, మరియు దానిని వారు గైకొనిరి. వారు దేవుని యొక్క ఏదేనులో సజీవము గాను, సురక్షితముగాను ఉండిరి. వారియొద్ద మరణము అనునది లేనే లేదు.

63సాతాను హవ్వ యొద్దకు వచ్చినది. తన వేదాంత సువార్తను, జ్ఞాన సువార్తను, ఉన్నత విద్యను, ఉన్నత నీతి శాస్త్రమును, మంచి నాగరికతను, ఉన్నత చదువును, ఆమెకు వినిపించెను. ఆమె ఒక్క నిమిషము ఆగి, దాని మాటలు వినేను, (హేతువులకు చెవి యొగ్గెను. దానిని మనము వినరాదని ఆజ్ఞాపించబడినది) కాని అతడు ఆమె యొద్దకు వచ్చి దానిని వినిపింపచేసెను: ఇప్పుడు, ఇక్కడ చూడు. అది ఫలానా ఫలానా సంఘము. అది ఎప్పుడో స్థాపించబడినది. దేశములోని పురాతన సంఘములలో మాది ఒకటి. ఈ పట్టణ మేయరు మా యొద్దకు వచ్చును…" ఏది ఏమైనా గాని, దానిని నేను లెక్క చేయును. అది దేవుని యొక్క మాటకు విరోధమయినచో, ఎప్పటికినీ విరోధమే. అది నీ శత్రువు. వాక్యమునకు విరోధముగా ఉన్నది ఏదయినా గాని, అది నీకు శత్రువే. వాక్యము పక్షముగా ఉన్న వారెవరయినా గాని నీ సోదరులే. అతడు నీలో భాగమైయుండును.

64చూడండి, లైంగిక ఆకర్షణకు లోనై ఆమె ఆ పరిశుద్ధ ముసుగును లాగివేసినది (దానిని పోల్చి చూడండి), శరీరాశ వలన ఏమివచ్చునో చూడండి. ఆమె కన్నుల మీద నున్న ముసుగును లాగివేసినది. ఆమె కన్నుల మీద దేవుడు పరిశుద్ధమైన దానిని ఉంచెను. ఆమె జ్ఞానము కావలెననుకొనెను, అంతయూ తెలిసికొనవలెనని కోరుకొనెను. కాబట్టి దానినంతటినీ చూచుటకు ఆ తెరను తీసివేయవలసివచ్చెను. ఆమె అపవాది మాటను వినినది, ఆమె ఏ స్థానములోనికి దిగజారిపోయెనో గమనించండి.

ఆ తరువాత ప్రతి కాలములోను వారాలాగే చేయుచూ వచ్చుచుండిరి — ఎల్లప్పుడూ వివేకముగల వారి పక్షముగానే వెళ్ళుచున్నారు. ఇప్పుడు సాతాను యొక్క రాజ్యమును నిర్మించెను, అదియే జ్ఞానము (ఆ విత్తనమును వాడు చల్లెను) ప్రపంచము అందువలన మరణపు ఏదేనుగా మారిపోయెను.

GEN 3:7

 

65ఇప్పుడు గమనించండి. ప్రకటన 3 చూడండి, లవొదకయ సంఘ కాలము. దానినిగూర్చి మీ మనస్సు లో ఆలోచించండి. ఇప్పుడు గమనించండి. ఆమె, హవ్వ, సాతాను యొక్క రాణి. చూడండి, సర్పముగా నున్న సాతాను హవ్వ యొద్దకు ఆదాము కన్న ముందుగానే వచ్చినది, చూచారా. ఇది నిజము. ఆమెను మోసము చేసెను, చూడండి, కాబట్టి సర్పమగు సాతాను ఆదాము కంటే ముందుగానే హవ్వను ఎరిగియుండెను. ఆమెను మోసము చేసెను. ఆ విధముగా చేసెనని బైబిలు చెప్పుచున్నది, మరియు అప్పుడు ఆమె దిగంబరియని ఎరిగియుండెను, చూచారా.

66ఇప్పుడు లవొదకయ సంఘ కాలమును చూడండి. హవ్వ సాతాను యొక్క రాణి వలె కూర్చొన్నది. ఆమే లోక సంబంధమగు సంపదలో ధనవంతురాలు, గ్రుడిది, మరల దిగంబరియైనది, కాని ఆ సంగతి ఎరుగదు. దేవుని ఏదేనులో యున్నట్లుగానే ఇదియున్నది. ఆమె ముఖము మీద ఇప్పుడు పరిశుద్ధ ముసుగు లేదు గాని దురాశ ముసుగు యున్నది. దేవుని యొక్క పరిశుద్ధ ముసుగును ఆమె తీసివేసి జ్ఞానము అను ముసుగును, దురాశ అను ముసుగును ధరించినది. ఆమెకు దురాశ అను ముసుగున్నది. పాపము వలన ఆమె గుడ్డిది. ఆమె వీధిలో దిగంబరిగా యున్నది, కాని ఆ సంగతిని ఎరుగదు. ఆమె వీధిలో వేశ్యగా ఉన్నది. ఈ పొట్టిబట్టలు ధరించిన స్త్రీలు దేవుని దృష్టిలో వేశ్యలే, మరియు వారది ఎరుగరు.

67మన స్త్రీలను చూడండి. సంఘము ఏ స్థితిలో యున్నదో మీరు చూడవలెనన్నచో స్త్రీలు ఏ రీతిగా ప్రవర్తించుచున్నారో చూడండి. ఆమె ఎల్లప్పుడును సంఘమునకు సాదృశ్యము. సాతాను యొక్క ఏదేనులో పాపము, అవిశ్వాసము, వంకరతనము, మత సంబంధమగు వక్రము, అక్రమ రాజ్యము ఉన్నది. దేవుని వాక్యమును తీసికొనుటకు బదులుగా, వారు మానవుల యొక్క విజ్ఞాన పాండిత్యము స్వీకరించిరి. సంఘమును స్వీకరించుటకు బదులుగా, వారు సంస్థను స్వీకరించిరి, మరియు దానిని వారు ఒకే పెద్ద ఆధిపత్యము క్రిందికి తెచ్చిరి.

68ఇప్పుడు చూడండి, అమాయకత్వము నుండి మరలిరి… దీనిని జాగ్రత్తగా వినండి. సంఘము మీద ఈ దురాశ ముసుగు ఉన్నది, దాని వలన ఆమెకు ఏమి జరిగినదో చూడండి. అందువలన ఆమె అమాయాకత్వము నుండి తెలివికి మళ్ళినది, చూచారా. పరిశుద్ధ ముసుగు, ఆమె అమాయకురాలుగా ఉండెను; దురాశ ముసుగు వలన ఆమె జ్ఞానమును పొందెను. అది రమ్యముగా ఉన్నదని ఆమెకు తెలియును. అదేమి చేయునో కూడా ఆమెకు తెలియును, చూడండి. అది ఒక ఫలము… ఆపేక్షించదగిన చెట్టు అది, తెలివిని ఇచ్చును, చూచారా. ఆమె అమాయకత్వము నుండి జ్ఞానమువైపునకు వచ్చినది. పరిశుద్ధత నుండి అపవిత్రత, దురాశ వైపుకు వచ్చినది, మరియు జీవము నుండి మరణమునకు వచ్చినది.

ఈ రాజ్యము చావవలసియున్నది! ఈ రాజ్యము చనిపోవును! దీనిని భూమి మీద లేకుండా పరలోకమందున్న దేవుడు నాశనము చేయును!

69ఈ వంకరతనమును గమనించండి, స్త్రీ నుండి పురుషునికి, పురుషుని నుండి స్త్రీకి ఇది సంక్రమించినది, మరియు దానిని వారు ఎరుగరు. సాతాను ఏదెనులో నుండి వచ్చిన వారు వీరే. నేడు మీరు వీధులను చుడండి. మన ఆధునిక జనులను పరీక్షించండి.

70సాతాను హవ్వను ఉపయోగించుకొని ఆదాము ద్వారా పాపము చేయించెను. దురాశ అను శక్తిని ప్రయోగించెను. నేడు ఆ విధముగానే జరుగుచున్నది. గమనించండి, జుట్టు కత్తిరించుకొనుట, ముఖములకు రంగులు పూసికొనుట, కామ వికారము పుట్టించు దుస్తులు ధరించుట, చూడండి. అవన్నియూ దేవుని యొక్క వాక్యమునకు విరోధము. ఆమె జుట్టు కత్తిరించుకొని వేశ్యగా తయారగుచున్నది. అది ఆమెకు అవమానకరము. పొట్టి బట్టలు ధరించుట ఆమెకు సిగ్గుకరము. కామ వికారము కలిగించు బట్టలు ధరించుచున్నది, అందువలన ఆమె వేశ్యయగుచున్నది. అయినా ఆమెకు అది తెలియదు! దేవుని యొక్క పరిశుద్ధతను బట్టీ కాదు గాని సాతాను యొక్క దురాశ వలన ఇట్లు జరుగుచున్నది.

ఆమెను చూచి ఆదాములో దురాశ పుట్టుటకు అది కారణమాయెను.

DEUT 22:5

 

71ఆమెకు దేవుడు ధరింపచేసిన బట్టలు తొలగిపోయినవి. ఏదెను తోటలోని దుస్తులు లేవు, ఎందుకనగా ఆమె ఈ అరణ్యము గుండా ప్రయానించినది — ఆమె వాటిని తీసివేసినది. ఆమె దిగంబరిగా మారినది, దేవుడు చర్మముతో ఆమెను కప్పెను; ప్రతిసారి ఆమె కొద్ది కొద్దిగా వాటిని తీసివేయసాగినది. ఇపుడామె ఆదియందున్న స్థితికి వచ్చినది. ఇప్పుడు, ఆమె యొక్క ఆదామును ఆమె లోదుస్తులు దరించువిధముగా చేసినది.

పురుషులు ఏవో చిన్న చిన్న ఆడంగి బట్టలు ధరించుచున్నారు, బయటకు వెళ్ళుచున్నారు, మగవారిలో మగసిరి ఏమి కనబడుట లేదు. నాకు తెలిసినంతవరకు పురుషుడు ఆడంగివాడాయెను. చూచారా, ఆదామును వంకరగా ఒక స్త్రీ వలె ప్రవర్తించునట్లు ఆమె చేసినది, చూచారా — ఆమె యొక్క లోదుస్తులు అతడు దరించుట. ఆమె తన యొక్క బట్టలు విప్పినప్పుడు, ఆమె ఏమి చేయగలదో చూచినది, కాని ఆమె యొక్క లోదుస్తులు — అవే పొట్టి దుస్తులు (shorts); అవును, అవి స్త్రీ యొక్క లోదుస్తులు.

ఇప్పుడు వారి ఆదాము వాటిని ధరించుచున్నాడు, దేవుని యొక్క మూల వాక్యమును చూడండి, "స్త్రీ, పురుషుని బట్టలు ధరించుట, పురుషుడు స్త్రీకి చెందిన బట్టలు ధరించుట అవమానకరము, హేయము. ఇది మూల వాక్యము. దాని గురించి ఆలోచించండి.

72ఇప్పుడతడు వారివలె జుట్టును కూడా పెంచుకొనుచున్నాడు. జుట్టును ఉంగరాలవలె దువ్వి, పిన్నులు పెట్టుకొనుచున్నారు. నా జీవితంలో ఇంతకంటే అసహ్యమైన దానిని మరి దేనినీ చూడలేదు. ఈనాడు కొందరు మగవారు ఆ విధంగా దువ్వుకొనుచున్నారు. జట్టుకు వింత రంగులు వేయుచున్నారు. పెరాక్సయిడు లేదా బ్లీచు వేయుచున్నారు. ఉంగరాలు దువ్వుకోని, పిన్నులు పెట్టుచున్నారు. ఆడంగివారి వలే తయాగుచున్నారు. వేదిక మీద నుండి చెప్పరానంత భయంకర సంగతి ఇది, కానీ తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమగుచున్నది. వారు స్త్రీలో, పురుషులో కూడా తెలియుట లేదు. మన అమెరికా దేశపు సైన్యము ఇక మిగులు పొట్టి బట్టలతో ప్రత్యక్షమగునని నాకు తెలిసినది. ఇది నిజము. ఎంత వంకరతనమో చూడండి? అవి స్త్రీ యొక్క దుస్తులు — స్త్రీల వలె జుట్టును పెంచుకొనుచున్నారు.

73ఒక రోజున నేను హవర్ట్ జాన్సన్ యొద్ద ఉన్నాను (ఇక్కడున్నది కాదు గాని ఆ బయట రోడ్డు మీద అది ఉన్నది) నేను ఆశ్చర్యముతో చతికిలబడ్డాను. ఒక చిన్న బాలుడు నోరు తెరచుకొని వచ్చెను. అతనికి ఒక వైపు జుట్టు నల్లగా యున్నది, దానిని ఒక వింతగా దువ్వెను, అతని కన్నులు కనబడుటలేదు; కళ్ళ మీదికి దానిని దువ్వెను. అంతకన్న వంకరతనమును ఎన్నడూ నేను చూడనే లేదు!

చూడండి, అతడు నమ్మడు గాని — అతడు శరీరరీత్యా మగవాడు అని నిరూపించవచ్చు — కాని అతని ఆత్మలో మాత్రము అతడు స్త్రీయే. ఆతడు దేనికి చెందునో అతనికి తెలియదు. ఇది నిజము. ఎంత వంకరతనము! సాతాను ఆ విధంగా చేయును! దేశములను వాడు వంకరగా చేయును! సంఘమును వాడు వంకరగా చేయును! జనులను వాడు వంకరగా చేయును! వాడు మోసగాడు, వాడు మూల సత్యమును వంకరగా మారును. దేవుడు మగవానిని మగవానిగానే చేసెను. అందున స్త్రీని స్త్రీనిగానే చేసెను, వారికి వేర్వేరు దుస్తులు ధరింపచేసెను. వారు ఆ విధముగా ఉండవలెనని, ఆ విధముగా ప్రవర్తింపవలెనని ఆయన కోరెను. ఒకరు స్త్రీ, మరొకరు పురుషుడు. ఏదేను తోటలో ఆయన ఆదామును వేరు చేసెను; హవ్వను అతనిలో నుండి ప్రత్యేకించెను.

74ఇప్పుడు, మగవారు స్త్రీ వలె జుట్టును పెంచుకొనుచున్నారు; స్త్రీ అయితే పురుషునివలె జుట్టు కత్తిరించుకొనుచున్నది. స్త్రీల దుస్తులను పురుషుడు ధరించుటకు ప్రయత్నించుచున్నాడు. ఆమె పురుషుని దుస్తులు ధరించుచున్నది, మరియు అతడు స్త్రీ యొక్క లోదుస్తులు ధరించుచున్నాడు. ఇప్పుడు, అది భక్తిహీనము అనిపించవచ్చు, కాని నేను ఆ భావముతో చెప్పుట లేదు. ఇది సంపూర్ణ సువార్త సత్యము. మీరు దీనిని ఎరుగనియెడల, మిలో ఏదో పొరపాటున్నది. మీరు గ్రుడ్డివారయినా అయి యుండాలి లేదా ఎన్నడూ వీధులలోనికి వెళ్ళని వారయినా యుండాలి. అది సరియేనని ఆమె మరియు అతడు అనుకొనుచున్నారు. వారు ఎక్కడికో వెళ్ళిపోవుచున్నారు.

"చాలా వేడిగా యున్నది గనుక ఈ బట్టలు ధరించాను," అని స్త్రీ చెప్పుచున్నది. ఆ ప్రాచీన అపాచి ఇండియనులను చూచి మీరు సిగ్గు తెచ్చుకొనండి. వేడి ఎంత ఎక్కువగా ఉంటే, వారు అంత ఎక్కువగా బట్టలు ధరిస్తారు — సూర్యుడిని వారినుండి దూరముగా ఉంచుటకు. మీకు చెమట పట్టినయెడల మీరు నడచునప్పుడు ఎయిర్-కండిషన్ లో యున్నట్లుగా యుందురు. వారు నేరుగా సూర్యుని క్రింద నిలబడియుందురు.

REV 3:17

 

75మీరు దేనినీ తట్టుకొనజాలరు. మీరు కందిపోయి మరియు కాలిపోవుదురు. కాని చూడండి, మీరు దానిని ఉన్నత విద్య అని పిలచుచున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రము దీనిని ఉత్పత్తి చేసినది.

ఓ, మై, లవొదికయ దిగంబరిగా యున్నది గాని ఆ సంగతిని ఎరుగదు. ఆమె ఏదేనులో దిగంబరిగా యుండెను. రెండు రాజ్యములూ ఒకే రకంగాయుండుట మీరు చూచారా? ఒకటి మరణము మరియు పాపముతో నిండినది. మరొకటి జీవము మరియు నీతితో నిండినది. అందులో ఆమె పరిశుద్ధ ముసుగును కప్పుకొనెను. వారిద్దరూ దిగంబరులుగా యుండిరి. దానిని వారెరుగరు. దానిని గూర్చి వారికేమియూ తెలియదు, ఎందుకనగా వారు దేవుని యొక్క ఆత్మతో కప్పబడిరి.

ఇక్కడ వీరు దురాశతో కప్పబడియున్నారు, వారు ఒకరి వైపు ఒకరు చూచుకొనుచున్నారు. చూడండి, ఆదాము హవ్వ వైపు చూడగలడు, కాని ఆమె దిగంబరియని గ్రహించలేడు. కాని, ఇప్పుడు ఈ దురాశ అను ముసుగు యున్నది, ఆమె దిగంబరియని గ్రహించలేదు, కాని ఈ దురాశ అను ముసుగు వలన ఆమె పురుషుడు పాపము చేయుటకు కారణమగుచున్నది. ఆమె వైపు అతడు చూచుచున్నాడు. దాని కొరకే ఆమె ఆ విధంగా చేయుచున్నది. మీరు దానిని నమ్మరు, కాని ఏమైనను అది చేయుచున్నారు. మగవాడు చూచును. ఎంతో ఆకర్షణ నీలో యున్నట్లు అతడు తలంచును, చివరకు స్త్రీ దుస్తులనే అతడు ధరించుచున్నాడు.

76ఓ, ఎంత వంకరతనము. ఎట్టి కాలము. ఎట్టి మోసపూరిత యుగము! ఓ, ఇవన్నియూ సంగతులు మరియు వాటిని వారెరుగరు: మానవునిలో ఒక పరిపూర్ణమగు వంకర ఆత్మ యున్నది. సాతాను యొక్క దురాశ అను ముసుగును అతడు ధరించియున్నాడు, మరియు స్త్రీ కూడా ఆ విధంగానే యున్నది. ఈ గొప్ప సమాజము యొక్క సాతాను ఆత్మ అది, చూచారా.

వారికది తెలియదు, కాని వారు ఒక సంస్థగా ఉన్నారు. స్త్రీలు దుస్తులు లేకుండా తిరుగుచున్నారు. ఒక సంస్థకు వారు చెందియున్నారు. మగవారు ఆలాంటి దుస్తులు ధరించియున్నారు, వారు ఒక సంస్థకు చెందియున్నారు. దానిని వారు బి.ఎస్.ఎస్ అని పిలచుచున్నారు, అనగా బిగ్ సిస్టర్ సొసైటీ. కావున వారు దానికి చెందియున్నారు. వారు నిజంగా ఒక ఆడంగి సమాజమువలె యున్నారు, పాత పాంట్లు ధరించి, పెద్ధ ముడులు వేసికొని, మురికిగా కనబడుచున్నారు.

77మగవారలారా, మీరు ఈ విషయంలో నాతో ఏకీభవించకపోవచ్చును గాని ఇది సత్యము. మీరెంతో వంకరగా మారిపోయారు గానీ అది మీకు తెలియదు. మీరు ఎంత మాత్రము మగవారి వలె ప్రవర్తించుట లేదు, చూచారా. చాలా మెత్తబడిపోయారు, వారి విషయంలో అసలు పట్టించుకొనరు — పురుషులు మరియు స్త్రీలు కూడా ఒకేలాగున్నారు. వారు ఒక సమాజముగా యున్నారు. అది ఒక సంస్థ. ఎందువలన? "ప్రక్కనున్న జాన్ పొట్టి బట్టలు ధరించుచుండగా, నేను మాత్రం ఎందుకు ధరించరాదు? లుఎల్ల నన్ను వేసేకోమన్నది గనుక నేను కూడా జాన్ వలె దుస్తులు ధరించుదును, అని పలుకుచున్నారు. సుసీ జేన్ అలాంటి బట్టలు ధరించినది గనుక మార్తా జేన్ కూడా ధరించవచ్చుననుచున్నారు, లేక అది ఎవరి పేరైన కావచ్చు," చూచారా. చూడండి, ఇది ఒక సమాజముగా యున్నది. అది ఒక సంస్థ. ఆత్మీయంగా మీరు దానికి చెందియున్నారు గాని అది ఎరుగరు.

78మరియు ఒకవేళ అది అలాగైతే, మరియు మనము అలాగే చూచెదము, మీరు గ్రుడ్డివారయి యున్నారు! ఈ శాఖల విషయములో మీరు గ్రుడ్డివారయిరి, సాతాను మిమ్మును అందులోనికి త్రోసివేసినది! దేవుని యొక్క మూల వాక్యమును అది వక్రీకరించినది. ఆయన రాజ్యము వేరు. ఆయన పిల్లల పట్ల ఆయన పధకము వేరు. స్త్రీలను, పురుషులను సాతాను ఈ విధంగా వాటిలోనికి త్రోసివేసినది, మరియు దానిని వారెరుగరు, మరియు వంకరతనములో ఉన్నారు. ఇక ఎంత మాత్రము దేవుని కుమారునివి కావు — ముఖము మీద జుట్టు వ్రేలాడుచున్నది మరియు పొట్టి బట్టలు ధరించి వీధులలో అలాగే తిరుగుచున్నారు, ఒక దేవుని కుమారుడు? సంఘములో డీకన్, వేదిక మీది సంఘ కాపరి? లేదు. అది దేవుని కుమారుని లక్షణము కాదు!

దేవుని యొక్క ఆలోచనా సాధనములో నుండి అతడెన్నడును రాలేదు. స్త్రీల దుస్తులు ఆయన ధరింపడు. నిశ్చయంగా ఆయనాలాగు చేయడు; లేక ఆమెను మగవారి బట్టలు వేసికొనదు. అది దేవుని పిల్లలు కాదు; అది సాతాను కుమారులు, సాతాను యొక్క కుమార్తెలు (చెప్పుటకు ఇది చాలా కఠినమగు సంగతి).

79ఈ ప్రంచమును వంకరగా చేసి, దానిని స్వాధీనము చేసికొనుటలో సాతాను జయము పొందెను. దీనిని తన రాజ్యముగా చేసికొనెను. మానవుడు స్వేచ్ఛ జీవిగా ఉంచబడెను. వారు తమ ఇష్టమొచ్చిన జీవితమును ఎన్నుకొనుటకు స్వేచ్చను కలిగియున్నారు. నీ హృదయములో ఏమున్నదో నీ ఎన్నిక బట్టి అర్ధమగును, చూచారా.

నీ స్వరము… నీకు తెలుసా? నీ క్రియలు నీ మాటల కన్న పెద్దగా వినబడుచున్నవి, నీ స్వరమును నీ క్రియలు ముంచివేయుచున్నవి. నన్ను ఒక మనుష్యుని యొద్దకు వెళ్ళినప్పుడు, "ఓ, మనమంతా క్రైస్తవులము. మనమంతా సంఘమునకు చెందియున్నాము," అని అతడు చెప్పినయెడల. మరియు ఆ అర్ధనగ్న చిత్రములు అతడి ఆఫీసులో వేలాడుచున్నవి? అతడు నాకు ఏమి చెప్పినా, అది ఏ వ్యత్యాసమును తీసుకొని రాదు, నాకు అసలు సంగతి తెలుసు; అలాగే మీకు తెలుసు.

జుట్టు కత్తిరించుకొనిన ఒక స్త్రీ తాను క్రైస్తవురాలనని చెప్పుకోనియ్యండి. మీకు ఆ సంగతి బాగుగా తెలియును, చూచారా. అవునండీ. క్రైస్తవురాలనని చెప్పుకొనుచు ఒక స్త్రీ ముఖమునకు రంగులు పూసికొని, మరియు పొట్టి బట్టలు ధరించి, మరియు నేను క్రైస్తవురాలనని చెప్పునట్లయితే? మీకు బాగుగా తెలియును. దేవుని వాక్యము మీకు అంతకంటే బాగుగా దానిని బోధించును. ఆమె ఆ విధముగా చేయుచూ క్రైస్తవురాలుగా ఉండలేదని వాక్యము చెప్పుచున్నది. ఆమె అగౌరవమునకు, అవమానమునకు గురియగును. అగౌరవమగు దానిని దేవుడు తన పరలోక రాజ్యములో ఎట్లు ప్రవేశపరచగలడు? లేదండీ. ఏ మాత్రము కాదు. లేదండీ. వారికివారు… వారి కోరిక ఏమిటో అది కనుపరచుచున్నాది.

80నీవు పావురమును కాకితో పాటు తినునట్లుగా చేయలేవు — ఏ మాత్రము చేయలేవు. పావురమునకు చేదు లేదు. చచ్చిన దానిని అది తినజాలదు. కొద్దిగా దానిని తిన్నత్లయితే, అది చనిపోవును, మరియు ఆ సంగతి దానికి తెలియును; కాని కాకి దానిని తృప్తిగా తినును. దానికి సమృద్ధిగా చేదున్నది. కావున, నేటి లోకము సంగతి కూడా అలాగే యున్నదని మీరు తెలిసికొనుడి — అదే సంగతి. వారు దిగంబరులు, గ్రుడ్డివారు, మరియు దానిని ఎరుగరు.

81స్త్రీ జ్ఞానము కొరకు దురాశ - లైంగిక పరమైన వాంఛను కలిగియుండెను గనుక ఆమె యొక్క స్వంత ఎన్నిక చొప్పున సాతాను దానిని ఆమెకిచ్చినది.

ఇప్పుడు గమనించండి, ఆదామును తప్పులోనికి నడిపించినది హవ్వ. ఆదాము కంటే ముందుగా హవ్వయే తాను దిగంబరినని తెలుసుకొనెను, చూచారా. ఎల్లప్పుడూ స్త్రీయే కారణము. ఎల్లప్పుడునూ అంతే! ఇప్పుడు కూడా ఆ విధానము మారలేదు.

మానవులను తప్పుదారి పట్టించునది సంఘమే. అది సంఘము, చూచారా, దేవుని కుమారులుగా ఉండవలెనని కోరిన మానవుడిని సంఘమే నడిపించును; అది ఒక స్త్రీ, సంఘము. బైబిలు కాదు, దేవుడు; బైబిలు మానవుడైయున్నాడు. ఓ, అవును, వాక్యము శరీరధారి అయ్యెను, మరియు ఆయన ఒక నరుడు, చూచారా. బైబిలు ఒక మానవుడు; సంఘము ఒక స్త్రీ, చూచారా. మానవులను తప్పుత్రోవ పట్టించునది బైబిలు కాదు. సంఘము దిగంబరియైనది గాని బైబిలు కాదు. వాస్తవంగా కాదు. అతడు దిగంబరిగా ఉన్నాడు అని బైబిల్ చెప్పుచున్నది. అవునండి.

ఇప్పుడు, అది ఏమిటో ఎరుగుట కొరకు ఆమె లైంగిక కార్యము (లైంగిక వాంఛ) ద్వారా ఎలాగు జ్ఞానము కొరకు దురాశ చూపినదో గమనించండి, ఆ ఫలము మంచిదో కాదో తెలిసికొనగోరినది, మరియు ఆమె అది చేసినది.

82ఒక మానవుని ద్వారానే దేవుడు ఒక దినమున దానిని తిరిగి తీసికొనును. అది ఒక స్త్రీ ద్వారా చుట్టుముట్టబడినది, కాని ఒక మగవాని ద్వారా అది విమోచించబడినది: ఆయనే నరుడగు యేసుక్రీస్తు. ఆయనే వాక్యమైయున్నాడు. ఇది ఏమిటి…? (ముగింపులో గమనించండి) కొద్దికాలము క్రిందట ఇక్కడ, నేను ఈ మాట చెప్పాను. నాలుగు లేదా అయిదు పేజీల లేఖన భాగములు మరియు నేను ఎత్తి చూపగోరు ఇతర కార్యముల ఇక్కడున్నవి, కాని వినండి. ఇది చెప్పి మనము ముగించెదము.

83గుర్తుందా, కొద్ది కాలము క్రిందట ఇక్కడ నేను మీకు ఏడు బూరల గూర్చి చెప్పాను, బూరల పండుగ గూర్చి చెప్పాను, మరియు మొదలగునవి? "ఎనిమిది దినముల పండుగ ఉన్నదని చెప్పాను." కాబట్టి ఏడవ దినము చివరిది; అది వెయ్యేండ్లపాలన. కాని ఎనిమిదవ దినము యొక్క పండుగ ఒకటున్నది. ఏడు దినములు మాత్రమే యున్నవి గనుక ఏనిమిదవ దినమనగా మరల మొదటిది అని అర్థము — చుట్టూ తిరిగి మరల మొదటి దినమునకే వచ్చును. వెయ్యేండ్లు అయిపోయిన తరువాత, ఏదేను మరల స్థాపింపబడును. దేవుని యొక్క గొప్ప రాజ్యము తిరిగి దేవుని స్వాధీనమగును, ఎందుకనగా సాతానుతో యేసు గెత్సెమనే తోటలో పోరాడెను, ఏదేనును తిరిగి సంపాదించెను, తిరిగి వచ్చుటకు పరలోకములో సిద్ధపరచుటకు ఆయన వెళ్ళెను.

పరలోకములో, "మీ హృదయములు కలవరపడనీయకుడని" ఆయన చెప్పెను.

84ఆయన ఈ భూమి మీద ఉండగా, ఆయన ఇట్లు చెప్పెను, "యూదులైన మీరు, మీరు దేవుని యందు విశ్వాసముంచియున్నారు, (ఇప్పుడు, నాకు చెడ్డపేరున్నదని నాకు తెలియును. నేను ఫలాని అని మీరనుచున్నారు, అని ఆయన చెప్పెను.) అయితే మీరు దేవుని యందు విశ్వాసముంచియున్నారు, మీరు దేవుని యందు విశ్వాసముంచినట్లు, మీరు నా యందును విశ్వాసముంచుడి."

ఆయన దేవుడుగా బయలుపరచబడెను, చూచారా. నాయందును విశ్వాసముంచుడి…

JOHN 14:2•

REV 21:1,2

 

85"నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను." అదెంత పొడవుగాయున్నదో చూడండి: పదిహేను వందల చదరపు మైళ్ళు. "ఆదెక్కడున్నదో చెప్పండి?" దానిని సిద్ధపరచుటకు ఆయన వెళ్ళెను. ఆయన సృష్టికర్త. ఆయన పూర్తిగా బంగారముతో దానిని సృజించెను. వీధులు స్ఫటికము వలె మెరయుచున్నవి. ఆయన సృష్టికర్త. ఆయన ఒక స్థలము సిద్ధపరచుచున్నాడు.

ప్రకటన 21లో ఆయన ఇలాగు చెప్పెను, "యోహానను నేను, పరిశుద్ధ పట్టణమును చూచితిని, నూతన యెరూషలేము, దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నది." సముద్రము ఇకను లేదు. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించెను.

మన మొదటి ఆకాశములు ఏమిటి? వెయ్యేండ్ల పాలన. మొదటి భూమి ఏమిటి? — ఇదే. ఇది క్రొత్తదిగా చేయబడును. నోవహు బోధించిన దినములలో ఇది బాప్తిస్మము పొందినట్లుగానే యుండును; క్రీస్తు ద్వారా శుద్ధీకరింపబడెను, దాని మీద ఆయన తన రక్తమును ప్రోక్షించెను, దానిని క్రొత్తదిగా చేసెను (దాని మీది క్రిములన్నింటినీ మరియు దానిలోని అన్నిటిని ఆయన తీసివేసెను) అంతమందు అది అగ్ని బాప్తిస్మము పొందును. అది ప్రతి క్రిమి, ప్రతి బాధ, ప్రతి రోగమును, భూమి మీద నున్న సమస్త అపవిత్రతను చంపివేయును.

MATT 5:28•

LUKE 13:24

 

86అది క్రొత్త భూమిగా ఉద్భవించును. "నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించెను. సముద్రము ఇకను లేదు. యోహాను అను నేను పరిశుద్ధ పట్టణమును, క్రొత్త యెరూషలేమును చూచితిని. పరలోకము యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి అది దిగివచ్చెను."

అక్కడ దేవుడు తన నిజమగు జనులతో యుండును. ఆయన తన కుమారులు, కుమార్తెలతో సహవాసము చేయును. ఆయన పరిశుద్ధతలో వారితో సహవాసము చేయును. వారి కన్నులు పాపమును చూడవు. ఇకమిదట పాపము అక్కడ ఉండదు. మనము గట్టిగా పోరాడుదము. ఈ దినమున మీరు మోసపోవద్దు, మీరు గుమ్మములో ప్రవేశించుటకు పోరాడుడి; వేశ్యలు, జారులు విడిచి పెట్టబడుదురు. "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినవాడగునని," ఆయన చెప్పెను. అందరూ బయటకు చెడ్డ స్త్రీ లేదా చెడ్డ పురుషుడు అనబడకపోవచ్చును. విమోచింపబడిన వారి పేర్లు మాత్రమే గొర్రెపిల్ల జీవగ్రంధములో యుండును. వారే గుమ్మములో ప్రవేశించెదరు. కాబట్టి స్నేహితులారా, పోరాడుడి; ఈ చివరి దినమున మీరు మోసపోవద్దు.

87ఇది ఒక గొప్ప కాలము. అందరి యొద్ద డబ్బున్నది. అందరూ అదీ, ఇదీ చేయగల స్థితిలో యున్నారు. డబ్చు అన్ని విధములా ప్రవహించుచున్నది. పెద్ద కార్లు, సామాగ్రి యున్నవి; ఆ పట్టణము అటువంటిది కాదు. ఒక్క కారు గాని, విమానము గాని అక్కడ ఉండదు. లేదు, అది పూర్తిగా వేరయిన నాగరికత. జ్ఞానము మరియు విజ్ఞాన శాస్త్రము లేని నాగరికత అది — అమాయకత్వము మరియు దేవుని యందు విశ్వాసము ఉండును.

అందులోనికి ప్రవేశించుటకు మనము పోరాడుదము. ఒక దినమున ఆ పట్టణములోనికి ప్రవేశించవలెననునదియే నా ఉద్దేశ్యము. వెనక్కు చూడండి, నాతో కూడా రండి, మీరందరూ పాడుచూ ముందుకు కదలండి. "పరిశుద్ధులు ముందుకు సాగిపోవుచున్నారు. ముందుకు పోవు పరిశుద్ధుల గుంపులో నేనుండ గోరుచున్నాను." మనము ప్రార్ధించుదము.

REV 20:6

 

88ప్రియ పరమ తండ్రి, దినములు ముగియుచున్నవి, అది సమీపించుట మేము చూచుచున్నాము, వాగ్దానము సమీపించుచున్నది. ప్రియదేవా, దానిని మా హృదయములో ఉంచమని ప్రార్థించుచున్నాను, కావున మేము అప్పుడు ఏ తప్పిదము చేయము.

ప్రియదేవా, మా మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుము. ప్రభువా, మా హృదయములకు ముసుగు వేయుము. లోక సంగతుల నుండి, ప్రపంచపు వ్యర్థ క్రియల నుండి మాకు ముసుగు వేయుము. వ్యర్థమగు మహిమతో కొందరు గర్వించుచున్నారు, వారెంత గొప్పవారయినా కావచ్చును. రాజులు, అధిపతులు, చక్రవర్తులు మొదలగు వారందరూ నశించెదరు. వారు మొదటి పునరుద్ధానములో లేవరు; ఏలయనగా ఈలాగు వ్రాయబడియున్నది, "మొదటి పునరుద్ధానములో పాలు పొందినవాడు ధన్యుడు మరియు పరిశుద్ధుడు, అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు." ఓ, దేవా, రెండవ మరణము, అనగా ఆత్మ సంబంధమగు మరణము, వారి మీద దానికి అధికారము లేదు. అతడు విమోచింపబడియున్నాడు.

LUKE 17:34,36

 

89దేవా, ఈ ఘడియలో ఒకరిని ఒకరు దర్శించుకొందురు. ఒకరిని మరొకరు చూచుటకు వెళ్ళు కాలములోనే రాకడ వచ్చును. "ఇద్దరు మంచము మీద యుందురు, ఒకరు కొనిపోబడుదురు, మరొకరు విడిచి పెట్టబడుదురు. ఇద్దరు పొలములో ఉందురు, ఒకరు విడిచి పెట్టబడుదురు, ఒకరు కొనిపోబడుదురు."

ఓ దేవా, నీ దృష్టిలో మేము పరిశుద్ధులముగా యుండునట్లు సహాయము చేయుము. మనుష్యులు మనలను గూర్చి ఏమనుకొన్నా పరవాలేదు. ఇతరులు ఏమి చెప్పుకొనినా పరవాలేదు. ప్రభువా, మా ప్రవర్తనను పవిత్రముగా యుంచుము. దేవుని వాక్యముతో మా మాటలను మిశ్రితము చేయుదుము గాక! ప్రభువా, మాలో చేదు కనిపించకుండునట్లుగా చేయుము. ప్రభువా, మా స్వంత తప్పులను ఒప్పుకొనుచున్నాము. మాకును దేవునికి మధ్య యేసుక్రీస్తు యొక్క రక్తము నిలబడుచున్నది. యేసు రక్తము క్రింద నుండి ఆయన మనలను చూచును. మన స్వ-నీతిని ఆయన చూడడు, మనము ఎవరిమైయున్నామని ఆయన చూడడు, మనము ఏమి చేసియున్నాము అని ఆయన చూడడు, కాని కేవలము ఆయన యొక్క అర్హతను బట్టి మాత్రమే. దేవా, దయచేయుము.

90ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వర్తమానము వినిన ఏ ఒక్కరును నశింపకుండునట్లు సహాయము చేయుము. చిన్న బిడ్డ మొదలుకొని ముసలి వారి వరకు రక్షింపబడుదురు గాక! వారి యొక్క పరిశుద్ధ కోరిక దేవుని కొరకు, ఆయన పరిశుద్ధ వాక్యము కొరకు మాత్రమే యుండునట్లుగా చేయుము. ఆయన ఏ ఘడియలో ప్రత్యక్షమగునో మాకు తెలియదు. మనలను ఎప్పుడు ఆయన పిలచునో తెలియదు. తీర్పునందు మనము జవాబు చెప్పవలయును. ఆయన ఏ ఘడియలో వచ్చునో మనమెరుగము. "ఇది నీవు గృహమునకు రావలసిన కాలము. నీవు రావలసియున్నావు," అని ఆయన కబురు పంపించును. దేవా, మేము పరిశుద్ధముగా ఉండునట్లు సహాయము చేయుము. ప్రభువా, నీ దయ చూపుము.

సాధ్యమయినచో, ప్రభువు యొక్క రాకడ వరకు మేము జీవించెదము గాక! మా చేతనయిన సమస్తమును మేము చేయుదుము గాక! ప్రేమతోను, అవగాహనతోను మేము చేయునట్లు కృప చూపుము. దేవుడు ప్రపంచమును ఈనాడు పరిశోధించుచున్నాడని గ్రహించుచున్నాము. నశించిన ప్రతి గొర్రెను ఆయన వెదకుచున్నాడు. ప్రార్థనా పూర్వకముగాను, ప్రేమగాను, దేవుని వాక్యముతోను వారితో మేము మాట్లాడునట్లు సహాయము చేయుము. ప్రభువా, చివరి వానిని కూడా మేము కనుగొనునట్లు చేయుము కావున మేము గృహమునకు వెళ్ళగలము మరియు ఈ సాతాను యొక్క పాత ఏదేనులో నుండి బయటకు వెళ్ళుదుము.

91అది అంతయు దురాశ పై నిర్మించబడియున్నది, మరియు ఈ లోకములో అందమైన స్త్రీలుగా పిలువబడువారు, వారియొక్క ప్రకటనలతో: మేము ప్రకటనలను వేయుదుము, ముఖమునకు ఏదేదో పూసికొనిన బాలురు, మరియు అందమగు బాలికలు పొట్టి బట్టలు ధరించాలని కోరుచున్నాము.

మన రేడియోలు, టెలివిజనులు చూడండి. సమస్త మురికి, హాలీవుడ్; అన్ని విధములైన లైంగికమైనవి, మురికి, స్త్రీల యొక్క అసభ్యమైన వస్త్రములు. మగవారు స్త్రీల యొక్క బట్టలు ధరించుచున్నారు. స్త్రీల వలె తమ జుట్టు కత్తిరించుకొనుచున్నారు. స్త్రీలు మగవారి వలె జుట్టు కత్తిరించుకొనుచున్నారు.

ఓ, దేవా, ఎంత భయంకరమగు ఘడియలో మేము జీవించుచున్నాము. ఓ, ప్రభువైన యేసూ, రమ్ము. రక్తము ద్వారా మమ్మును శుద్ధీకరించుము. మాలోనుండి సమస్త అపవిత్రత, మురికి తీసివేయుము. ప్రభువా, మమ్మును బ్రదికించుము. రక్తము క్రింద ఎడతెగకుండా మమ్మును జీవింపచేయుము. అది మా హృదయ వాంఛ, మా యధార్థ విన్నపము.

92ప్రియదేవా, ఈ రాత్రి ఈ వేదిక మీద సువార్త ఉంచబడియున్నది. ప్రభువా, ఇక్కడ చేతిరుమాళ్ళున్నవి. రోగుల కొరకు, వాధిగ్రస్తుల కొరకు చిన్న పొట్లములు ఉంచబడినవి. ప్రభువా, విశ్వాస సహితమగు ప్రార్థన ఇప్పుడు మా హృదయములలో నుండి రానిమ్ము. నీ దృష్టిలో దానిని పడనిమ్ము. ప్రభువా, మాలో ఏదయినా ఒక అపవిత్ర కార్యమున్నచో, ఇప్పుడే మమ్మును తీర్పులోనికి కొనిపొమ్ము. మేము కృప కొరకు వేడుకొనుచున్నాము.

ప్రభువా, మా తప్పు ఇప్పుడు మాకు బయలుపరచుము, కావున మమ్మును రక్తము ద్వారా శుద్ధి చేయుమని మేము అడుగుదుము. ఈ రోగులను స్వస్థపరచుము, వారిని బాగుచేయుము, తండ్రీ, ఏమి జరగనైయున్ననూ; వారు ఎక్కడికి వెళ్ళిననూ. తండ్రీ, ఆలాగు జరుగును గాక.

93నిన్ను సేవించు అంకితభావము మాకు ఇమ్ము. నిన్ను మాత్రమే, ప్రభువా, మేము సేవించునట్లు చేయుము. ప్రభూ, ఇండ్లకు తిరిగి వెళ్ళు చుండగా, రోడ్ల మీద వీరికి క్షేమమును ఇమ్ము. జనులను నీవు స్వస్థపరచినందుకు నీకు వందనములు. సోదరి షేపర్డ్, మరియు సోదరుడు షెపర్డ్ యొక్క చిన్న కుర్రవాడు సైకిలు వలన గాయపడినాడు. అందువలన మరే కీడు రాకుండా సహాయము చేయుము. ఆ బాలుడు సైకిలు నడుపుచున్నాడు. అతడు బాగవునట్లు ప్రార్థించుచున్నాను. ఇంకా మేము ఇతరుల స్వస్థత కొరకు అడిగియున్నాము. వారిని బాగు చేసినందుకు వందనములు. మేము అడిగినవాటిని పొందుదుమని మాకు తెలియును, ఎందుకనగా వాగ్దానము చేసిన వానియందు మాకు నమ్మకమున్నది. ప్రభువా, నీ కృపను మాకు ఇమ్ము. మా పాపములను క్షమించుము, యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

HEB 11:6

 

94మీరాయనను ప్రేమించుచున్నారా? మీరాయనను నమ్ముచున్నారా? సాతాను రాజ్యము వలన మీరు రోగులై అలసిపోయారా? ఆయన యొక్క ఏదేను, ఆయన యొక్క వెయ్యేండ్ల పాలన వచ్చుచున్నదని మీరు నమ్ముచున్నారా? నేడు అది రూపొందినదని మీరు నమ్ముచున్నారా? చూడండి, ప్రతిదియు మేధావుల మీదనే ఆధారపడియున్నది. శాస్త్రీయంగా రుజువయితేనే గాని నమ్మమని వారందరూ పలుకుచున్నారు. దేవునిని మీరు శాస్త్రీయంగా రుజువు చేయజాలరు. విశ్వాసము ద్వారా మీరాయనను అంగీకరించవలసియున్నారు, "ఏలయనగా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను శ్రద్ధగా వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా?"

ఓ, దేవా, నేను యేసుక్రీస్తు రక్తమును తప్ప మరి దేనినీ తెలిసికొనగోరుట లేదు. అది నన్ను పాపము నుండి కడిగెను. యేసుక్రీస్తును తప్ప మరెవరినీ నేను ఎరుగను. ఆనాటి పౌలు చెప్పిన ప్రకారమే నేడు నేను చెప్పుచున్నాను, "సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మా మధ్య మరెవరినీ నేనెరుగను."

95అది మాత్రమే నాకు తెలియునని మీతో చెప్పుచున్నాను. ఈ బైబిలును నా హృదయపూర్తిగా నేను నమ్ముచున్నాను. ఇది పరిపూర్ణమగు కల్తి లేని దేవుని వాక్యమని నేను నమ్ముచున్నాను. దీని ద్వారా నేను జీవించుచున్నాను. దీని ద్వారా నేను నిలబడియున్నాను. నాకు పదివేల జీవితములున్నాగాని వాటన్నింటినీ ఈ వాక్యము కొరకే నేను ఇచ్చెదను, ఎందుకనగా ఇది యేసుక్రీస్తు యొక్క వాక్యము. దానిని కాదని రుజువు చేయుటకు వారెంతం ప్రయత్నించినా గాని నేను లెక్క చేయను. ఇది నమ్మ యోగ్యమైనది కాదని విజ్ఞాన శాస్త్రము ఎంత చెప్పినా నేను వినను. నాకయితే ప్రపంచములో ఇది మాత్రమే నమ్మదగినది. ఇది వాక్యము. ఇది నాది. ఆయనను నేను ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించరా?

96మీ హృదయములో పాపమున్నచో, మీ హృదయములో తప్పున్నచో, మీలో మరేదయినా ఉన్నచో ఇపుడే ప్రార్థించి, దేవునిని క్షమాపణ కోరండి. మీరు నా కొరకు ప్రార్ధించండి. నేను మీకొరకు ప్రార్థించెదను. దేవుడు మిమ్మును దీవించవలెననునదియే నా ప్రార్థన.

తిరిగి మనము కలియు వరకూ, తిరిగి మనము కలియు వరకు,

తిరిగి మనము కలియు వరకు, దేవుడు మీకు తోడై యుండు గాక!

మీరు ఒకరినొకరు ప్రేమించుచున్నారా? "చిన్నపిల్లలారా, ఒకనినొకడు ప్రేమించుకొనుడి" అని యోహాను చెప్పెను. "ఒకని నొకడు ప్రేమించుకొనుడి, ఏలయనగా ప్రేమ విస్తారమగు దోషములను కప్పును." ఇప్పుడు ఒకరితో ఒకరము కరచాలనము చేయుదము.

తిరిగి మనము కలియు వరకు దేవుడు మీతో ఉండుగాక.

తిరిగి మనము కలియు వరకు, తిరిగి మనము కలియు వరకు!

ఇప్పుడు, ఒకరి పట్ల ఒకరు దయ కలిగియుండుడి. అందరి పట్ల దయ కలిగియుండుడి. మీ పొరుగు వారిని సరిగా చూడండి. యేసు వచ్చువరకూ మీరు మచ్చలేని జీవితము జీవించండి.

తిరిగి మనము కలియు వరకు, తిరిగి మనము కలియు వరకు,

తిరిగి మనము కలియు వరకు దేవుడు మీతో నుండు గాక.

97మీరాయనను ప్రేమించుచున్నారా? అది నా ప్రార్థన. మీరు నా కొరకు ప్రార్థించండి; నేను మీ కొరకు ప్రార్థించెదను. ఇప్పుడు నేను తిరిగి టుసాన్ కు వెళ్ళవలసి యున్నాను. మీ అందరినీ ప్రభువు దీవించవలెనని నేను ప్రార్థించుచున్నాను. అక్కడ నుండి నేను కెనడాకు వెళ్ళుదును. తిరిగి కొలరడోకు వచ్చెదను. చాలా చాలా తిరుగవలసి యున్నాను. సహోదరుడు టోనీ అచ్చట ఉన్నాడు. ఒక గొప్ప సంగతి జరిగి యున్నది. రోమ్ లోని వాటికన్ లో ఉజ్జీవము కొరకు పిలుపు వినబడుచున్నది. అక్కడికి నన్ను వచ్చి ఉజ్జీవ కూటము పెట్టమనిరి. ఇప్పుడే అతడు తిరిగి వచ్చెను. జనులందరూ కూడుకొందురు. అక్కడ గొప్ప స్థలమున్నది. వేలాదిమంది కూర్చొను స్థలమున్నది. వారు నన్ను ఆ ఉజ్జీవ కూటమునకు రమ్మనుచుండిరి. ప్రభుని యొక్క మహిమను సేవలో వారు చూడగోరిరి. నాకు తెలియదు. దానిని గూర్చి నేను ప్రార్థించవలెను. ప్రభువు నాకు ఏమి చెప్పునో చూడవలెను. మనందరమూ జ్ఞాపకముంచుకొని ప్రార్థించవలెను, మనము కలిసి పనిచేయుచున్నాము…

మన ధన్యుడగు రక్షకుని రాక కొరకు,

మనము ఎదురు చూచుచున్నాము.

ఇదిగో! అంజూరపు ఆకులు పచ్చబడినవి.

ఆయన రాజ్య సువార్త,

ప్రతి దేశమునకు చేరినది,

మనము అంతనమునకు సమీపించినట్లు చూచుచున్నాము.

ఆయన యొక్క శుభప్రదమగు రాకడను

మనము సంతోషంగా ఇతరులకు చాటించుదుము.

ఆయన త్వరలో మహిమతో రానున్నాడని అందరకూ చెప్పుదము.

ప్రభుని పరిశుద్ధులారా, మేల్కొనండి,

అంతము సమీపించుచుండగా నిద్రపోకలేవండి,

ఆ తుది పిలుపు కొరకు మనము సిద్ధపడుదము.

98ఆమె పశ్చిమము నుండి వెనుదిరిగి ఈ రోజులలోనే ఒక రోజున పయనించును. కేవలము గుర్తుంచుకొనండి. నిశ్చయంగా ఆమె ఆ విధంగా చేయును. ఇది నిజము. అంత వరకు…

యేసు నామమును నీతో కొనిపొమ్ము,

దుఃఖము, శ్రమతో నిండిన బిడ్డా;

అది నీకు ఆనందము, ఆదరణ ఇచ్చును.

నీవు వెళ్ళు చోటికల్లా దానిని తీసికొని పొమ్ము.

ప్రశస్త నామము ఓ! ఎంత మధురము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకానందము;

ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము.

యేసు నామము యొద్ద వంగును,

ఆయన పాదముల యొద్ద సాగిలపడును.

పరమందు రాజాధిరాజుగా ఆయనకు

కిరీటము ధరింపచేతుము

మన యాత్ర ముగిసిన పిదప,

ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము,

ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, మరియు పరలోక ఆనందము!

99ఇప్పుడు చివరి వచనము. ఇప్పుడు మన హృదయములు వంచి దానిని పాడుదము. "యేసు నామమును నీతో కొనిపొమ్ము. ప్రతి బంధకము నుండి రక్షించును. శోధనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు (ఇవి సాతాను రాజ్యము యొక్క క్రియలు, చూడండి, ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుడి. ఆలాగు చేసి వెళ్ళుము. అది పనిచేయును. దానిని నేను చేసి చూచాను. ఇప్పుడు దానిని నమ్ముడి, ఎందుకనగా అది పని చేయును, కేవలము ఆయన పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.

యేసు నామమును నీతో కొనిపొమ్ము,

ప్రతిబంధకము నుండి రక్షించును;

శోధనలు నిన్ను చుట్టు ముట్టినప్పుడు,

(అప్పుడు నీవేమి చేయుదువు?)

ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము.

(నీ ముఖము మీదికి అప్పుడు ముసుగు వచ్చును.)

ప్రశస్త నామము, (ప్రశస్త నామము)

ఓ! ఎంత మధురము,

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము;

ప్రశస్త నామము, ఓ! ఎంత మధురము!

భూలోక నిరీక్షణ, పరలోక ఆనందము!

ఇప్పుడు మనము తలలు వంచుదము. సహో. బీలర్ ను ఆ వెనుక నుండి ఈ వేదిక మీదికి రమ్మని కోరుచున్నాను.

[యేసు నామమును నీతో కొనిపొమ్ము అను పాటను సహాదరుడు బ్రెన్హాం పాడుచున్నారు - సంపా.]

100మనము ఇప్పుడు శిరములను, హృదయములను వంచుదము. ఇక్కడి మన సహచరులలో ఒకరగు సహో బీలర్ యున్నారు. సహో. ఎస్టెల్ బీలర్, చక్కని క్రైస్తవ సోదరుడు. విధేయుడగు వ్యక్తి, ఈ రాత్రి ప్రార్థనతో ఈ జనులను పంపించమని ఆయనను నేను అడగుచున్నాను. బీలర్ సోదరుడా, దేవుడు నిన్ను దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...