దాహం

దాహం

1స్నేహితులారా, శుభ సాయంకాలం. ఈ రాత్రి ఇక్కడ ఉండుట గొప్ప ఆధిక్యత, సహోదరుడు లీవైల్ గారు, సహోదరుడు మాక్ గారు, మరియు చక్కని ప్రభుని సిబ్బంది మరియు అనేక సంఘముల నుండి వచ్చిన క్రైస్తవులతో కలసి ఈ గ్రాంట్వే అసెంబ్లీలో నేనుండటం ఇది రెండవసారి. మరియు ఇప్పుడే, నేను ఇక్కడ ఒక సోదరుని కలుసుకొన్నాను, ఆయన సహోదరుడు బోస్వర్త్ గారికి మిక్కిలి ప్రియమైన స్నేహితుడు; మరియు సహోదరుడు ఎఫ్.ఎఫ్. బోస్వర్త్ ప్రభువుతో వుండుటకు వెళ్ళిన సంగతి ఆయనకు తెలియదు, "ఏలియా చేతులపై నీళ్ళు పోసిన ఎలీషాను నేను కలుసుకొన్నట్లు నేను భావించుచున్నాను" అని నేను చెప్పాను, ఆయన దూరదేశములో వున్నప్పుడు బోస్వర్త్ గారు ఎనభై-నాలుగు సంవత్సరముల వయస్సులో చనిపోయి, ప్రభువుతో వెళ్ళారన్న సంగతి ఆయనకు తెలియదు.

2ఇప్పుడు, నా వాక్యము వినుటకు దేశమంతా టెలిఫోన్ సంధి కలిగియున్న ప్రజలను, కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు టెక్సాస్ మరియు మెయిన్ నుండి కాలిఫోర్నియా వరకు ప్రజలందరిని నేను అభినందించుచున్నాను. కావున వర్తమానములను టెలిఫోనులకు కలిపే ఒక పద్ధతి మనకున్నది. అది గొప్ప దీవెనగా యున్నది.

ఇప్పుడు ఒక చిన్న సాధనం ద్వారా టెలిఫోన్లోనే కాకుండా మీ టెలివిజన్లో కూడా చూపించబడుచున్నది. మరియు మన మంచి స్నేహితుడైన పెర్రీగ్రీన్ ద్వారా ఇప్పుడు నాకు ఇది అర్థమయింది, మరియు ఇప్పుడు వారు దాన్ని చూస్తున్నారు.

HEB 13:8

 

3మరియు, సహోదరి మాక్, ఈ రాత్రి ఆర్గాన్ వద్ద చక్కగా కూర్చొనివుండుటను చూచుటకు నేను సంతోషించుచున్నాను. మరియు ఇంకా చాలామంది స్నేహితులు ఇండియానా బయటవారు, సియెర్రా-విస్తా మరియు సహోదరుడు బోర్డర్స్, లేక సహోదరుడు రాబర్సన్, ఇంకా చాలా మందిని చూస్తున్నాను. నన్ను ఈ రాత్రికి జెఫర్సన్విల్ నందలి గుడారములోని జనులతో చెప్పవలెనని కోరుచున్నాను, వారిలో సగము మంది ఇక్కడే వున్నట్లున్నారు.

మరియు సహోదరుడు కూంజ్ గారు మీ బలహీనత గురించిన ప్రార్థన విన్నపమును గూర్చి నేను ప్రార్థన చేయుచున్నాను. విశ్వాసం కలిగివుండండి. ఆందోళన చెందకండి. అది బాగవును.

మరియు టెక్సాస్ నందలి సహోదరుడు బ్లెయిర్ గారు, ఒకవేళ ఈ రాత్రికి మీరు వినుచున్నట్లయిన, నా సోదరుడా, దీనిని గుర్తుంచుకొనుడి: ఈ మొదటిసారి ఇక్కడకు మిమ్ములను తెచ్చిన దేవుడు రెండవసారి కూడా మిమ్ములను ఇక్కడకు తెస్తారు. మరియు ప్రభువు మీకు దీనిని అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము. మరియు దేనిని గురించి అయిననూ సాతాను అబద్ధమును తీసుకోవద్దు. దేవుడు దేవుడేనని, మరియు అక్కడ… మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని మాత్రము మీరు గుర్తుంచుకొనుడి. మరియు మనము ఆయనను ప్రేమించుచున్నాము మరియు నమ్ముచున్నాము, మేము మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.

కాలిఫోర్నియాలోని మన స్నేహితులందరు, సహోదరుడు మెర్సియర్ గారు మరియు అరిజోనా, ఫోనిక్సు, జార్జియా మరియు అనేక ఇతర ప్రదేశములలో వున్నవారు, సహోదరుడు విలియమ్స్ గారు, మీరందరు ఇక్కడ ఈ రాత్రి హాజరయ్యారు, మేమెంతో మీకు కృతజ్ఞులం. మరియు జార్జియా దిగువన ….. మరియు ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరికి మా వందనములు. ప్రభువు మిమ్ములను దీవించును.

4నా మంచి స్నేహితుడు, సోదరుడు మాక్ గారితో ఈ గ్రాంట్వేలోని అసెంబ్లీ-ఆఫ్-గాడ్ సంఘములో ఈ రాత్రికి ఇక్కడ నాకు నిజమైన స్వాగతం వున్నట్లు అనిపిస్తుంది. దేవుడు సహోదరుడు మాక్ గారిని దీవించారు. ఒకసారి అతడు… నేను కెనడాలోని అడవులలో గుర్రపు బగ్గి వెనుక కూర్చొని స్వారీ చేయుచుండగా, దిగి సహోదరుడు మాక్ కొరకు నన్ను ప్రార్థన చెయ్యమని పరిశుద్దాత్మ చెప్పెను. ఆ సమయంలో అతడు అపాయకరమైన స్థితిలో వుండెను, మరియు ప్రభువు ఆయనను స్వస్థపరిచెను. మరియు కావున ఈ సమయంలో ఆయనతో కలిసి ఈ చక్కని సత్యముతో ప్రభువును ఆరాధించుటకు నేనెంతో కృతజ్ఞుడనై యున్నాను.

నా వెనుక వేదిక మీద కూర్చొనివున్న వ్యక్తి అన్నాడు, "నేను మీకు తెలుసు ఆలోచించవద్దు. బోస్టన్ లోనో, లేక డెట్రాయిట్లోనో మీరు ఎక్కడో ఒక చోట ఒకసారి నన్ను కారు ఎక్కించుకొని సహాయము చేశారు?"

మరియు నేను చెప్పాను, "మంచిది, నేను సాధారణముగా అవసరతలో ఉన్నవారికి చేయూత నిచ్చుటకు ప్రయత్నించుదును." మరియు కావున ఈ రాత్రి మనమందరము అవసరతలో వున్నాము. మరియు ఈ రాత్రికి ప్రభుని కృపా కనికరములతో దీవెనతో, తన చేయి చాపి మనకు సహాయము చేయునట్లు మనము ఈ రాత్రి ప్రార్థన చేయుదము.

5ఇప్పుడు, నాకు ఎక్కువ సేపు ప్రసంగము చేసే అలవాటున్నది, అయితే ఈ రాత్రికి అలా చెయ్యకుండుటకు ప్రయత్నించెదను, ఎందుకనగా ఓహియోలో జనులు సహోదరుడు మెక్ కిన్నే సహోదరుడు బ్రౌన్ శ్రీమతి డాచ్ గారిని పిలచియున్నారు, మరియు వారంతా ఓహియోలోనే ఆశతో వున్నారు. మేము మీకు అందరకు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. నేను అనుకొంటాను, ఇప్పుడు న్యూయార్క్ లో ఆలస్యమవుచున్నది, మరియు ఈ సమయమునకు పదకొండు లేక పన్నెండు గంటలు కావచ్చు మరియు ఆరాధన కొరకు సంఘములు వచ్చి ఇప్పటి వరకు ఎదురుచూచారు. ప్రతి స్థలములో వున్న ఆ మంచి స్నేహితులందరికి మనము కృతజ్ఞులము.

JOHN 3:16•

JOHN 5:24

 

6ఇప్పుడు, మనము వాక్యమును తెరువక మునుపు, మనము మన తలలు వంచియుండగా, గ్రంధకర్తతో ఒక క్షణం మాట్లాడుదాము.

మా ప్రియ పరలోకపు తండ్రి, మేము… మీ ప్రజలతో కలసి ఈ రాత్రి మేమంతా సజీవులముగా వున్నందుకు, మీరిచ్చిన ఆధిక్యతను ಬట్టి మా హృదయములు సంతోషముతో పొంగి పొర్లుచున్నవి. ఇప్పుడు మేము నిత్యజీవాన్ని కలిగియున్నాము, ఎందుకనగా "నీవు నీ అద్వితీయ కుమారుని మాకిచ్చావు, ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించావు." ఆయన భూమిమీద తన యాత్రలో ఆయన మాకు ఇలా నేర్పించెను, "నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు; అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని, మేము ఆ అద్వితీయ కుమారుని నమ్మియన్నాము." ఈ గొప్ప రక్షకుని బట్టి మీకు స్తోత్రములు మరియు ఈ రాత్రి మేము ఆయన వాక్యమును చదివి మరియు ధ్యానించబోవుచుండగా, ఆయన గొప్ప సన్నిధి మమ్మును దీవించాలని ప్రార్ధిస్తున్నాము. ప్రభువా, ఈ దేశములో ఎక్కడెక్కడైతే ప్రజలు గుంపులుగా కూడి యున్నారో వారి ఒక్కొక్కరి హృదయమునకు పరిశుద్దాత్మ వాక్యమును తీసికొని వెళ్ళునట్లు చెయ్యండి.

ప్రసంగ వేదికపైనున్న ఇతర సేవకులను దీవించండి. తండ్రీ, ఈ గ్రాంట్వే అసెంబ్లీని, సంఘ కాపరిని, ఆయన భార్యను, ఆయన పిల్లలను, పెద్దలను, కార్యదర్శకులను మరియు బోర్డు సభ్యులందరిని దీవించుమని మేము ప్రార్ధన చేయుచున్నాము. మరియు, తండ్రి, మేమందరము కలసి మా ముందు వెలుగు ప్రకాశించుచుండగానే, ఏ మనిషైనను మనిషి పనిచేయలేని రాత్రి రాకముందే, మేము దేవుని రాజ్యము కొరకు పనిచేయునట్లు చేయుడి. మరియు తండ్రి, మీరు మాకిచ్చిన ఆధిక్యతలో మేము మా సమయమును సద్వినియోగము చేసికొనెదము గాక, ప్రభువా దానిని మాకు అనుగ్రహించండి. ఈ దేశమంతటిలో వున్న రోగులను, పీడించబడుచున్న వారిని బాగుచేయుము. ఈ

రాత్రి దేవుని సన్నిధి దేశమంతటా, ప్రతి మూలలో వున్నవారిని తాకునట్లు చేయండి.

MATT 24:7,37•

MARK 13:8•

LUKE 17:26,28,30•

LUKE 21:25,26

 

7తీర్పు తాకబోవుచున్నదని మేము గ్రహించుచున్నాము. గొప్ప చెడుతనము పాపముతో, మరియు దేశము తల్లక్రిందులై, మరియు అనేక చోట్ల భూకంపములు కలుగుచున్నవి. గతంలో బైబిలులో సంభవించిన గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు సంఘటనలు మరలా ఈ దినాన మనముందు పునరావృతము కావడాన్ని మనము చూస్తున్నాము. ప్రవచనం ఇలా చెప్పుచున్నది, "నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడలో అలాగేయుండును. లోతు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుడు వచ్చు దినమున జరుగును." మరియు ఇవన్నీ ఇప్పుడు జరగడం మనము చూస్తున్నాము. మనుష్యుల హృదయాలు కలవరం చెందటం, కలవరపడు సమయము, దేశముల మధ్య ఉద్రిక్తత: దేవా, మేము అంత్యకాలములో వున్నామని మాకు తెలియును. ప్రభువా, ఈ వర్తమానము ప్రతి స్థలమునకు, మూలమూలలకు, నీవు నిత్యజీవమునకు నిర్దేశించిన ప్రతి బిడ్డకు అందునట్లు సహాయము చేయండి. ప్రభువా, దానిని దయచేయుము. యేసు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.

ఇప్పుడు వాక్యమును చదువుచుండగా ప్రభువా దీవించుము.

LUKE 20:42

 

8ఇప్పుడు, దైవదాసుడు బైబిలు చదువుచుండగా మీలో అనేకులు బైబిలు చూచుదురా, మరియు నా అంశమును తీసికొనుటకు, కీర్తనలు, కీర్తనలు 42 నుండి రెండు - మూడు వచనములను ఈ రాత్రి నేను చదవాలని ఆశించుచున్నాను. మరియు జరుగబోవు కొన్ని విషయములు నేను ఈ అంశము మీద మాట్లాడుచుండగా, మధ్యలో వాటికి సంబంధించిన వ్రాయబడిన కొన్ని వాక్యములు నా దగ్గర ఉన్నవి మధ్యలో వాటిని చెప్పెదను. దావీదు కీర్తన, కీర్తనల గ్రంథమును దావీదు వ్రాసియున్నాడు. ఇప్పుడు, మీరు వాక్యమును త్రిప్పుచుండగా, నేను దీనిని తప్పక చెప్పాలి. చాలా మంది, "మంచిది, కీర్తనలు ఆత్మావేశముతో వ్రాయబడినవా?" అంటారు. నిశ్చయముగా, అవి అలా వ్రాయబడినవి. అవి… అది చరిత్ర కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనప్పటికి, బైబిలులో వ్రాయబడిన ప్రతిది, అది ఆత్మావేశముతో వ్రాయబడినది. అది ప్రేరేపించబడినది. యేసు చెప్పెను, "కీర్తనల గ్రంథములో దావీదు వ్రాసినది మీరు చదువలేదా?" ఆ తరువాత నేను అనుకొంటాను, కీర్తనలు పాటలే. మరియు పాటలు దేవునిచే ప్రేరేపించబడినవయితే అవి ప్రవచనములే కూడా అని నేను నమ్ముచున్నాను. ఈ పాట నెరవేరునప్పుడు, ఆ రోజున నేనక్కడ వుంటానని ఆశించుచున్నాను.

మధ్యాకాశంలో సమావేశం ఉండబోవుచున్నది,

ఆ తియ్యని మధురమైనది కలుసుకొనబోవుచున్నాను,

మరియు నీకక్కడ స్వాగతం పలుకబోవుచున్నాను;

ఆకాశం పైనున్న ఆ గృహంలో అట్టి పాటలు ఎన్నడూ వినలేదు;

మర్త్యమైన చెవులతో ఎన్నడు వినలేదు,

అది మహిమకరమైనది, నేను తప్పక ప్రకటిస్తాను!

మధ్యాకాశములోని ఆ సమావేశములో

మరియు నడిపించే నాయకుడు దేవుని సొంత కుమారుడు

ఓ, నేను ఆ సమయంలో అక్కడ ఉండగోరుదును!

PS 42:1-3

 

9ఇప్పుడు కీర్తనలు 42.

"దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?

నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను.

దావీదు ఈ కీర్తన వ్రాయుచుండగా, గొప్ప వేదనలో ఉండి వుంటాడని నేను తలంచుదును. మరియు సామాన్యముగా మనిషిలో నుండి ఉత్తమమైన దానిని తీయాలంటే శ్రమల ద్వారానే అవుతుంది. అప్పుడే దేవుడు క్రిందికి… అనేకసార్లు మనము ఉపవాసము ఉంటాము, మనము క్రమములోనికి వచ్చు వరకు, మనకు-మనము మార్గములో నుండి తప్పుకోనుటకు. మరియు దావీదు ఈ స్థలములలో ఉన్నప్పుడు, ప్రభువును గూర్చి ఆయన కార్యములను ధ్యానించడం ప్రారంభించాడని నేను తలంచుచున్నాను.

చాలాసార్లు, మనము ఆయన వైపు పైకి చూచేటట్లు దేవుడు మనలను క్లిష్టమైన పరిస్థితులలోనికి నడిపిస్తాడు. కొన్నిసార్లు మనము ఆసుపత్రిలోనో, ఏ పడకమీదో మన వీపులను మోపి, దేవుని యొక్క గొప్ప దీవెనలు ఎక్కడ నుండి వచ్చునో అని మనము పైకి చూడవలసియుంటుంది.

PS 42:2

 

10ఇప్పుడు, ఈ రాత్రి నేను మాట్లాడే వాక్యము బైబిలులో నుండి, మరియు 2వ వచనంలో కనబడుచున్నది: "దాహం," "దాహం" అనే పదము. ఈ పదాన్ని నేను చూచినప్పుడు నిఘంటువులో నేను చూచుచుంటిని. ఒకసారి నేను ప్రసంగించిన "జీవము కొరకైన దాహం" అను ఒక ప్రసంగమును గురించి నేను ఆలోచించుచుంటిని, మరియు నేను దానిని కూడా కీర్తనల గ్రంథములో నుండే తీసుకొన్నాను, దావీదు, "నీ శాసనములు జీవముకంటే నాకు విలువైనవి" అని చెప్పెనని నేను నమ్ముచున్నాను. "దాహం" అనే పదమును గూర్చి వెదకుచు, ఆలోచించుచుంటిని, కావున దాని అర్థమేమిటని నేను నిఘంటువులో వెదకితిని. మరియు వెబ్స్టర్ నిఘంటువులో ఇలా వున్నది, "అది వేదనతో కూడిన ఒక ఆశ." ఒక వేదనతో కూడినది… నేవు దేనినైనా ఎక్కువగా కావలని కోరినచో, అది నీకు బాధను కలిగించును.

ఇప్పుడు, దాహం గొనటం అనునది ఒక అసహజమైన సంగతి కాదు. దాహం అనునది ఒక సహజమైన విషయము. అది కేవలము దేవుడు మనకు ఇచ్చిన… అది మనకు ఒక దానిని గురించిన ఆశను కలుగజేయును. కొన్నిసార్లు దేవుడు నీలో ఒక నియంత్రణ శిఖరమును ఇమిడ్చి యుంచడం ద్వారా అది వివిధములైన కోరికలను నియంత్రించును. మరియు ఈ దేహము, దేవుడు తనకిచ్చేవి, తనకు అవసరమైన కోరికలను గూర్చి హెచ్చరించుటకు మానవ హృదయములో ఈ నియంత్రణ శిఖరము ఉంచబడినది.

PS 42:2

 

11ఇప్పుడు, ఇక్కడ రెండు విధములైన దాహములున్నవి. భౌతికమైన దాహం ఒకటి, మరియు ఆత్మ సంబంధమైన ఒక దాహం కూడా వున్నది. దావీదు వ్రాసిన దానిని మరలా నేను చదువగోరుచున్నాను, "నా ప్రాణము దేవుని కొరకు, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది."

ఏదో ఒక చారిత్రాత్మకమైన దాని కొరకు కాదు, లేక ఏవో కొన్ని సంవత్సరముల క్రిందట జరిగిన సంగతుల కొరకు కాదు, లేక ఎవరో చెప్పిన కట్టుకథ కొరకు కాదు — కానీ "జీవముగల దేవుని కొరకు," నిత్యమూ నివసించు దేవుని కొరకు. ఏదో చారిత్రాత్మకమైన దానికొరకు కాదు గాని, ఆయన ఆత్మ దేవుని కొరకు తృష్ణగొనుచున్నది.

12నీకు అవసరమైన వస్తువులను నీకు ఇవ్వడానికి దేవుడు నీకు నియంత్రణ శిఖరాన్ని ఇచ్చుచున్నాడని మనము ఇప్పుడు కనుకొన్నాము. ఇప్పుడు, నీలోని నియంత్రణ శిఖరమే నిన్ను నడిపించును. మరియు అలాగే ఈ ఆత్మ దాహం, ఈ నియంత్రణ శిఖరం, నీకు ఆత్మీయముగా ఏమి అవసరమో తెలియజేస్తుంది. శరీరంలోని నియంత్రణ శిఖరంవలె ఆత్మలో కూడా నియంత్రణ శిఖరం వుంటుంది. శరీరంలోని నియంత్రణ శిఖరం నీ శరీరమునకు కావలసిన వాటిని గురించి చెప్చును, మరియు అది నీకు దాహంగా పరిణమిస్తుంది. అలాగే, నీ ఆత్మలో కూడా నియంత్రణ శిఖరం వున్నది, అది నీ ఆత్మీయ విషయముల యొక్క అవసరతను గూర్చి చెప్పును, నీ ఆత్మకు కావలసినవి ఏవో అవి, మరియు ఆ విధముగా ఏ విధమైన జీవము నిన్ను నడిపించుచున్నదో చెప్పవచ్చును. నీవు నీ యొక్క కోరికను బట్టి నీలో వున్నదేదో, నీ యొక్క కోరికను ఏది ఉత్పత్తి చేయుచున్నదో తెలిసికోవచ్చు. చూడండి, ఒక ప్రత్యేకమైన దానికొరకు నీకు దాహం కలిగినప్పుడు, మరియు అది ఆ దాహము యొక్క సహజ స్వభావమును బట్టి ఈ కోరిక ఏమైయున్నదో, నీ ఆత్మలో చెప్చును. మీరు దానిని అర్థము చేసికొంటారని ఆశిస్తున్నాను.

13ఆత్మకు ఒకటి మరియు శరీరము ఒకటి నియంత్రణ శిఖరాలుంటాయి, మరియు ఒక నియంత్రణ శిఖరము మరియొక దానియొక్క అవసరములను హెచ్చరించి పిలిచేదానిగా వుంటుంది. ప్రతి ఒకటి దాని అవసరమును పిలచినప్పుడు, పిలిచినదాని అవసరము కొరకు అది హెచ్చరిక తరంగమును బయటకు పంపును. ఉదాహరణకు, శరీరం తనలోని ఆశలను తృప్తిపరచుకొనటానికి తృష్ణగొంటుంది, అలాగే ఆత్మ ఆత్మీయ ఆకలిని తృప్తిపరచుకొనుటకు తృష్ణగొంటుంది, ఈ విధంగా కోరికను బట్టి ఆత్మ శరీరము ఒక దానితో ఒకటి విరుద్ధముగా పోరాడుతాయి.

ఈ రోజున వున్న మనము కనుగొనే గొప్ప ఇబ్బంది ఏమంటే, చాలామంది ప్రజలు ఈ రెండు కోరికల మధ్య జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఒకటి భూ-సంబంధమైనవాటిని అపేక్షించును, మరొకటి పరలోక-సంబంధమైనవాటిని అపేక్షి౦చును.

ROM 7:21

 

14పౌలు చెప్పినట్లు, రోమీయులు 7:21లో వివరించినట్లు, "మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను నియమము నాకు కనబడుచున్నది." "క్రైస్తవులారా, మీరు ప్రయత్నించినప్పుడు మీకు ఎప్పుడైనా ఆ అనుభవము కలిగినదా, మీరు ఒక మంచిదానిని చేయుటకు ప్రయత్నించినప్పుడు లేక ఒక మంచి కార్యమును చేయుటకు శ్రమ తీసుకొన్నప్పుడు, సాతాను అక్కడ హాజరవడం మీరు గమనిస్తారు, ప్రతిచోట నీవు చేసేదానిని తల్లక్రిందులు చేయుటకు సాతాను చూస్తుంది. మరియు అది ఒక గొప్ప విషయం, క్రైస్తవులందరూ దీనిని తెలుసుకోవాలని నేను చెప్పగోరుచున్నాను… నీవు ఏదైనా చేయాలని ప్రారంభిస్తున్నప్పుడు, ఎప్పుడూ ఏదో ఒకటి నీవు చేసే దానిని తల్లక్రిందులు చేయుట జరుగును, ఏమైనప్పటికి నీవు దానిని చేయుము. నీవు చేసే మంచిదాన్ని చేయకుండా అడ్డగించుటకు ప్రయత్నించునది ఆ సాతాను.

REV 22:17

 

15ఇప్పుడు, చాలాసార్లు, కొంత భయమునకు లొంగిపోయిన వారిని నేను కలుసుకొంటుంటాను. వారు ఏదైన చేయ తలపెట్టినప్పుడు, మరియు రెండు వైపులా అంతా మార్గం మూసివేయబడినప్పుడు, వారు, "అది ప్రభువు చిత్తము అయి వుండదు" అంటారు. చూచారా. ఇప్పుడు, సాతాన్ని ఆ విధంగా నీకు అబద్దం చెప్పనియ్యవద్దు. మొట్టమొదట విషయము, అది దేవుని చిత్తమో కాదో తెలుసుకొనుము. ఆ తరువాత ఒకవేళ అది దేవుని చిత్తమా అని తెలిసికొనుటకు బైబిలులో చూడుము. నిన్ను తిన్నగా నడిపే ఆ విషయం అక్కడే వున్నది, అది దేవుని వాక్యము, మరియు తరువాత నీవు చేయవలసినది ఏదో దానిని దేవుని వాక్యములో చూచి చేయుము, ఉదాహరణకు, పరిశుద్ధ బాప్తిస్మం కొరకు వెదకుట…

చాలాసార్లు నేను జన సమూహములోనికి వెళ్ళినప్పుడు వారు అంటారు, "మంచిది, నేను పరిశుద్దాత్మ కొరకు వెదికాను, కాని పొందలేకపోయాను. ఈ అనుభవం నాకు కాదని నేను నమ్ముచున్నాను. ప్రతిసారి నేను ప్రార్థనలో వున్నప్పుడు, నాకు అనారోగ్యం వస్తుంది. మరియు నేను ప్రార్థనలో ఉపవాసము ఉన్నప్పుడు, నాకు అనారోగ్యం వస్తుంది. మరియు ఒకవేళ నేను రాత్రంతా ప్రార్థనలో వుంటే, మెళుకువగా వుంటే నాకెంతో నిద్రమత్తుగా వుంటుంది. మరలా నా పాదాల మీద నేను నిలబడలేను?" అంటారు. గుర్తుంచుకోండి, అలా చేసేది సాతాను, ఎందుకనగా నీవు పరిశుద్ధాత్మను కలిగియుండవలెనని దేవుడు కోరుచున్నాడు. అయితే అది కోరుకొన్నవారికి మాత్రము అనుగ్రహించబడును.

చాలాసార్లు నీవు దైవిక స్వస్థత కొరకు ఒక కూటములో ప్రార్థన చేయించుకొన్నప్పుడు, ఆ రెండవరోజే నీ ఆరోగ్యం మొదటి రోజుకన్నా రెండింతలు చెడిపోవటం నీవు కనుగొంటావు, సందేహం లేదు, అది సాతాను యొక్క పనియే, చూచారా. గుర్తుంచుకొనండి, అది దేవుడు నీ కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదమును నీకు దక్కకుండా ప్రయత్నించడమే, చూచారా. వాడి మాటలను వినవద్దు! చూచారా. ఎల్లప్పుడు ముందుకు బలంగా సాగిపొండి.

ROM 7:21

 

16ఈ మధ్యనే నేను ఆఫ్రికా ప్రయాణములో వున్నప్పుడు నాకు అలాంటి అనుభవం కలిగింది. నేను ఆఖరుసారి ఆఫ్రికా వెళ్ళవలసి వచ్చినప్పుడే, ఇదివరకు ఎన్నడూ లేనంతగా సాతాను నన్ను తొందర చేశాడు. నా విదేశ సేవాపర్యటనలో జరిగిన కూటములలో అది ఒక బహు చక్కని కూటముగా వుండినది. నేను అక్కడ వున్న కొద్ది కాలంలో, నా వేట కార్యక్రమము గాక, నేను ఎన్నడూ చేయలేని గొప్ప సంగతులు నెరవేరడం జరిగిందని నేను నమ్ముచున్నాను.

అక్కడ వున్న సంఘములకు నేను అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదని తలస్తూ వుండేవాడిని. మరియు అలాగే ఒక రోజు ఒక వ్యక్తి నుండి ఒక ఉత్తరం రావడం జరిగింది, దానిలో, అక్కడ వున్న సంఘమంతటికి నేను రావడం ఇష్టము లేదని వుంది; నేను పరీక్షించినప్పుడు, అది ఒక సంస్థకు చె౦దిన వ్యక్తి తన చిరునామాను ముద్రించిన కాగితము మీద వ్రాసిన ఉత్తరం. అందులో, "మీరు మాకు అక్కర లేదు" అని చెప్పబడివుంది, (అలా వ్రాయుటలో) అతని అర్థము, నాకు, నా కుటుంబమునకు (మీరు ఇష్టము లేదు) అని. చూచారా, కావున తరువాత నేనక్కడికి వెళ్ళినప్పుడు నేను… చూచాను, "మాకు," అనగా అతనికి, అతని కుటుంబమునకు తప్ప, అక్కడ ప్రజలందరికి మేము రావటం ఇష్టమని గ్రహించాను. మరియు కావున ఇప్పుడు అక్కడ గొప్ప పొలము మనకొరకు (సేవకై) తెరువబడినది.

ROM 7:21

 

17మీరు చూడండి, పౌలు, "నేను మంచి చేయగోరినప్పుడు, నాకు చెడు ఎదురగుచున్నది," అని చెప్పెను.

ఈ దేశములో ఎక్కడనుండైనా గాని, లేక ఇక్కడ సంఘములో నుండి కాని, ఒక మారుమనస్సు పొందిన యౌవ్వనస్తుడు ఈ రాత్రి బలిపీఠము దగ్గరకు వచ్చినట్లయితే, మరియు గుర్తుంచుకోండి, రేపు తన తల్లి ఎప్పుడూ లేనంతగా అతని మీద ఎక్కువ కోపంగా వుంటుంది. తండ్రి అతని పట్ల చాలా ఇబ్బందిగా వుంటాడు, మరియు పాఠశాల పిల్లలంత అలాగే ప్రవరిస్తారు. మరియు ప్రతిది ప్రతికూలంగా నడుస్తుంది, ఎందుకనగా సాతాను అలా నిన్ను త్రిప్పివేయడానికి ప్రయత్నించుచున్నాడు. వాడు నీ మార్గంగుండా నిన్ను వెళ్ళనీయకుండా తరుముతాడు. "నేను మంచి చేయ గోరినప్పుడు నాకు చెడు ఎదురగుచున్నది."

18నిజంగా దాహం అనేది సహజమైన ఒక విషయమేనా, ఇప్పుడు మనము దాహం అనే పదము వైపు చూద్దాం. "ఓ, నాకెప్పుడు దాహం కాలేదు… క్రైస్తవులుగా ఉండగోరిన కొద్దిమందికి మాత్రమే ఆ దాహం వుంటుందని నేను నమ్ముచున్నాను," అని నాతో చాలామంది చెప్పుతారు. ఓ, కాదు. అది తప్చు. అది వాస్తవముగా ప్రతి మానవునితో జతపర్చబడియున్నదై యున్నది. అది నిశ్చయముగా సత్యము.

మొదటి రోజుల్లో మనము ఈ దేశమునకు వచ్చినప్పుడు, ఇక్కడ మనము ఇండియన్ జాతి వారిని కనుగొన్నాము. మరియు ఇండియన్ వారు ఆ సమయంలో అన్యులైనప్పటికి, వారు సూర్యునినో మరి దేనినో ఆరాధించువారు. వారు మనుష్యులుగా వున్నంతవరకు, వారిలో ఏదో ఉన్నది, ఒక సహజమైన దాహం, ఎక్కడోవున్న దేవుని పిలుస్తున్నది.

19ఇప్పుడు, ఈ మధ్య, అడవులలో, నాగరికతా ప్రపంచమునకు బయట నాలుగు-వందల-ఎనభై మైళ్ళ దూరముగా, మొజాంబిక్ లోని మూడువేల మంది నివసించే బైరా అను చిన్న తెగను మేము చూచాము. ఒక తెల్లని వ్యక్తిని ఎన్నడూ చూడని ఆ గ్రామస్తులను మేము కనుగొన్నాము. నేను అక్కడ నివసించే ఒక బాలికను చూచాను, ఆమెకు బట్టలు లేవు, (వారిలో ఎవరికి ఏ మాత్రము బట్టలు లేవు), మరియు ఆమె ఒక చెట్టు మీద కూర్చొనియున్నది. మరియు నేను సింహము యొక్క కాలిముద్రలను చూస్తున్నాను, అప్పుడక్కడ మనిషి అరుపువలె వినబడినది. అది నేను చూచిన బాలికయే, చంటిబిడ్డను పట్టుకొని, చెట్టుమీద కూర్చొని యున్నది. మరియు ఆమె దేనికి భయపడినది — మరియు అదే ఆమెకు భద్రత, సింహముగాని, చిరుతపులిగాని, మరేదైనా జంతువు కనబడినప్పుడు చెట్టు ఎక్కటమే ఆమెకు భద్రత. మరియు ఆమె నన్ను చూచినది, మరియు అది మనిషి అని గుర్తుపట్టినది. ఆమె ఒక తెల్లని వ్యక్తిని చూచినప్పుడు… ఆమె ఒక తెల్లని వ్యక్తిని తన జీవితములో ఎన్నడూ చూడలేదు, చూచారా. మరియు ఆమె మరణమగునంతగా భయపడింది, చూచారా.

అయితే మేము ఆ ప్రజలను కనుగొన్నప్పుడు బహు అనాగరికులుగా మొరటుగా వున్నారు, వారింక ఆరాధనలోనే యున్నారు, వారిలోని ఒక వరుసలోని వారిని మేము పిలువకముందు, ఒక తినే ఆహారమును వారు (అదే వారు తినే ఆహారం), ఒక ఆకు మీద పోసి చప్పట్లు కొడుతూ ఎక్కడిదో వారు ఎరుగని ఏదో ఒక గొప్ప ఆత్మను (కాథలిక్కునకు చనిపోయిన ఒక పరిశుద్దుడు, లేక మరొక దానివలె), తమ్మును కాపాడాలని పిలచారు. సింహం ఎర కొరకు సంచరించే సమయంలో దానివలన చంపబడకుండా కాపాడబడాలని అలా చేస్తారు.

20చూడండి, అది కొంత సహజమైనదే.

దేవుని కొరకు దాహంగొనటం అసహజమైన విషయమేమి కాదు. అది సహజమైన సంగతి. అది ఏదో ఒకటి నీవు తప్పక చేయవలసినది. దేవుడు నిన్ను ఆ విధముగా తయారు చేశాడు. మరియు ఇది మానవాతీతమైనది కాదు, ఇది నిజముగా సామాన్య మానవమాత్రునిదే. అది కొందరికొరకు ప్రత్యేకించబడినది కాదు. వారు, "మంచిది, ఒక జయజీవితం జీవించే కొంతమందిని నేను చూచాను, వారు ఎల్లప్పుడూ మేడ మీద ప్రార్ధనలో గడుపుతూ, దేవుని స్తుతిస్తూ వుంటారు. నాకు కూడా అలా అనుభవించాలని వుంది," అని చెబుతారు. మంచిది, నీకు ఆ విధంగా అనిపించడానికి కారణమేమంటే, అది నీలోని దాహం. మరియు అది ఒక సహజమైన విషయం. దేవుని కొరకు దాహం కలిగిన ప్రతి వ్యక్తికి అలాగే ఉంటుంది

PS 42:1,2

 

21ఇప్పుడు, మనము మొదటగా సహజమైన దాహముగొనుటను తీసుకొందాం. ఉదాహరణకు, నీటి కొరకు దాహంగొనటం. ఇక్కడ దావీదు చెప్పినట్లు, నీటి కొరకు దాహంగొనటం. నీటి కొరకు దాహంగొనుట, శరీరమునకు దాహం అవసరమై యున్నది. మరియు నీరు లేని చోట చిక్కుకొనియున్న తన ముక్కును పైకెత్తియున్న ఒక లేడి (పరిస్థితి)ని మీరు ఊహించగలరా? నీవు ఆ దాహాన్ని తీర్చలేకపోతే, నీవు చనిపోతావు. నీ శరీరంలో నీటి పరిమాణం తగ్గిను, మరియు నీవు బ్రతుకవు. నీ సహజ దేహము యొక్క దాహము తిర్చుటకు దాహమునకు నీకు నీరు దొరకకపోయినా, నీవు త్వరగా క్షీణించిపోదువు. నీవు ఎక్కువ కాలము బ్రతుకవు.

నీవు ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు, కాని నీరు లేకుండా మాత్రం ఎక్కువ కాలం జీవించలేవు. ఎందుకనగా, నీవు నలుబది దినములు ఉపవాసము ఉండవచ్చు (యేసు ఆహారము లేకుండా ఉండెను), కాని నీరు లేకుండా మాత్రం నీవు అన్ని రోజులు వుండలేవు అని నేను అనుకుంటున్నాను. నీవు మామూలుగా ఎండిపోయి చనిపోయెదవు. నీకు తప్పక నీరు కావాలి. మరియు నీలో కలిగే దాహం తెలియజేసేదేమంటే, నీవు బ్రతికి వుండడానికి శరీరమునకు నీరు అవసరమైయున్నది. నీలో ఎనభై-శాతం నీరు మరియు పెట్రోలియం వుంటుంది, ఎలాగైనా నీవు బ్రతికి వుండేటట్లు ఈ వనరులను నీవు లోనికి తీసికొనవలసియున్నావు. నేను చెప్పినట్లు, నీవు దానిని నిర్లక్ష్యము చేసినట్లయితే, నీవు క్షీణించిపోదువు.

ఈ దాహం ఒక అపాయమును తెలియజేయునటువంటిది (అలారం) కూడా. అది దాహం అవుతుందని చెప్పే హెచ్చరికను తెలియజేయు గడియారం, ఆత్మలో అపాయమును తెలియజేయు గడియారం అమర్చబడియున్నది, నీలోని ఒక చిన్ని సాధనం (టెలిఫోన్ శబ్దంవలె) మరణము నీకు దగ్గరగా పొంచియున్నదని, నీవు త్వరగా నీరు త్రాగనట్లయితే చనిపోవలసియుంటుంది అని నీకు చెప్పును. అది నిన్ను పిలచును, బిగ్గరగా పిలచును, చివరకు నీవు ఆ పిలుపును కట్టివేసినప్పుడు, నీవు చనిపోతావు. మరియు అది ఒక అపాయమును తెలియజేయు గడియారం వంటిది

PS 42:1

 

22ఇక్కడ దావీదు కీర్తనల గ్రంథములో వివరించినట్లు, "దుప్పి నీటి వాగులకొరకు ఆశపడునట్లు, ఓ, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది." దుప్పి నీటి వాగులకొరకు ఆశపడునట్లు… నేను తరచుగా దావీదును గూర్చి చదువుతూ, ఆలోచిస్తాను. దావీదు ఒక అడవులలోని మనిషి, ఒక వేటగాడు, మరియు దుప్పిని అతడు వేటాడి యుండవచ్చును. మరియు ఈ రోజున మనలో అనేకమందిమి వాటిని వేటాడుతాము. దుప్పి ಅಂటే లేడి.

మరియు మీరు ఎప్పుడైన కుక్కలను చూసినట్లయితే, అడవి కుక్కలు ఒక దుప్పిని లాక్కొని పోతాయని మనము కనుగొంటాము. మరియు సామాన్యంగా వాటికి అడవి తోడేలు దంతములవలె పదునుగల దంతాలు వుంటాయి. మరియు అది దుప్పిని చెవి ప్రక్కగా మెడ కంఠమును పట్టుకొని బలంగా ఒక్కసారిగా దాన్ని తన పైకి గుంజుకొంటుంది. అది అప్పుడు దుప్పి కంఠమును కొరికివేస్తుంది, మరియు ఇక దుప్పికి అవకాశం వుండదు.

అయితే కొన్నిసార్లు ఆఫ్రికాలోని అడవి కుక్కకు దుప్పి యొక్క జబ్బలు పట్టుకొనును. దుప్పి యొక్క గొంతు దొరకనప్పుడు మరలా అది రెండవసారి దాని యొక్క జబ్బను పట్టుకొనును. మరియు ఒక వేళ దుప్పి బలంగా వుండి చురుకైనదైతే, కుక్కను ఒక్కసారిగా విదిలించి వేస్తుంది.

23దుప్పి బహు వేగమైనది. అది చూడనప్పుడు కుక్కమెల్ల మెల్లగా నక్కుకుంటూ దానిని వెంబడి౦చును, మరియు అది మలుపు తిరిగినప్పుడు దానికి తెలియదు ఆ కుక్క దగ్గరగా వున్నదని.

ఆ తరువాత అడవి కుక్క దుప్పిని పట్టుకొంటుంది, అది మహా చురుకుగా వుంటే, కుక్కను విసిరి పడేస్తుంది, అయితే జబ్బనుండి దుప్పి మాంసం కుక్క నోటినిండా వస్తుంది. లేక, కొన్నిసార్లు అది మెడ పట్టుకొని పీకినప్పుడు, అది మెడలోని పెద్ద రక్తనాళము వరకు కొరుకును, మరియు అది తప్పిపోవును. ఆ తరువాత దుప్పి దానిని విదిలించినప్పుడు, అది మెడలోని పెద్ద మాంసపు కండను లాగివేయును, ఇక దుప్పి మెడలో నుండి రక్తం కారటం మొదలవుతుంది. ఆ తరువాత కారుచున్న రక్తపు ముద్రలను వెంబడిస్తూ కుక్క దుప్పి వెంట పడుతుంది. మరియు జీవమునకు మూలమైన రక్తము దుప్పినుండి కారిపోతుండగా, దాని ప్రాణం కృంగిపోయి, అది చివరకు బలహీనమైపోవును. అప్పుడు కుక్క, లేక తోడేలు కాని, దుప్పి వెంట పడతాయి.

ఇప్పుడు, ఆ దుప్పికి నీరు దొరకకపోయినట్లయితే… ఇప్పుడు, నీటికి ఏదో వున్నది, దుప్పి నీరు త్రాగినప్పుడు రక్తం కారటం ఆగిపోవును. కాని దుప్పికి తనకు సేదతీర్చుకొనుటకు నీరు దొరకనట్లయితే; అది పరిగెత్తుతూ వుండడం వలన దాని గుండె వేగంగా కొట్టుకొనుట వలన రక్తం ఎడతెగకుండా కారిపోతూ వుంటుంది. అయితే దానికి నీళ్ళు దొరికినట్లయితే, అది బ్రతుకును.

PS 42:1

 

24ఇప్పుడు, గొప్ప పాఠము అక్కడ మనకున్నది చూడండి, దావీదు ఇక్కడ చెప్పుచున్నాడు, "దుప్పు నీటివాగులకొరకు ఆశపడునట్లు, ఓ దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది." ఇప్పుడు ఆ దుప్పికి తెలుసు, దానికి నీరు దొరకనట్లయితే చనిపోవును, అది బ్రతకలేదు. వాటికి (తుపాకి) దెబ్బ తగిలినప్పుడు చాలాసార్లు నేను వాటిని వెంబడించాను. దానికి నీటివాగు తగిలినప్పుడు, అది దానిలోనికి వెళ్ళి మరియు నీరు త్రాగి కొండపైకి ఎక్కును తిరిగి క్రిందకు వచ్చి నీరు త్రాగి మరియు పైకి వెళ్ళును. అది ఆ నీటి వాగును వెంబడిస్తున్నంతవరకూ నీవు దానిని ఎన్నడూ పట్టుకొనలేవు. కాని అది ఒకసారి ఆ వాగును విడిచిపెట్టిన తరువాత దానికి మరొక వాగు ఎక్కడను దొరకనప్పుడు, నీవు దానిని అక్కడే పట్టుకోవచ్చు. మరియు ఇప్పుడు దుప్పికి ఆ సంగతి తెలుసు, అందువలన అది త్వరగా వెళ్లి నీళ్ళు త్రాగునట్లు ఆ నీటివాగుకు దగ్గరే వుంటుంది.

నీరు లేనిచోట చిక్కుకొనియున్న తన ముక్కును పైకెత్తి యున్న ఒక లేడి (పరిస్థితి)ని మీరు ఊహించగలరా?

25మరియు ఆయన చుప్పుచున్నాడు, "దుప్పి నీటివాగుల కొరకు దాహంగొనునట్లు లేక ఆశపడునట్లు [అది ఒక దాహం], ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు తృష్ణగొనుచున్నది. నిన్ను కనుగొంటేనే తప్ప, ప్రభువా, నేను నశించిపోతాను. నేను నిన్ను కనుగొనకుండా వెళ్ళలేను." మరియు ఒక స్త్రీ గాని లేక పురుషుడు గాని, ఒక బాలుడు గాని, లేక బాలికకు గాని ఆ విధముగా దేవుని గురించిన దాహం కలిగినప్పుడు, అతనికి తప్పకుండా ఏదో దొరకును, చూచారా.

కాని మనము ఏదో సగం దారివరకు మాత్రమే వచ్చి, "మంచిది, నేను మోకరించి ప్రభువు ఏమి చేయునో చూస్తాను…" చూచారా, ఇంకను నీవు నిజంగా దాహంగొనలేదన్నట్లే, ఆ దాహం జీవము మరియు మరణమునకు మధ్య వున్నట్లుగా వుండాలి. మరియు అప్పుడు ఏదో తప్పక జరిగి తీరును.

26దుప్పి, ఇక్కడ కూడ, అది… దానికి వాసన చూడగలిగే మరొక జ్ఞానేంద్రియం ఉన్నట్లు మనము కనుగొంటాము, అది వాసనను ಬట్టి శత్రువు దగ్గరలో వున్నాడని హెచ్చరింపబను. (దానికి అలారం మ్రోగుతుంది). ఈ చిన్న జంతువు, ఒక జ్ఞానేంద్రియాన్ని కలిగియుండుటను బట్టి తనను రక్షించుకొంటుంది. మరియు అది దానిలో ఏదో ఒక చిన్న హెచ్చరికను సూచించే శబ్దమును కలిగి యుంటుంది. అది దాని ముక్కును స్పర్శించటం ద్వారా శత్రువు దగ్గరలో వున్నాడని చెప్పును. నీవు శత్రుకానాలో నక్కినప్పటికి, అది నీవు అక్కడున్నావని గ్రహిస్తుంది, మరియు అది జారుకొంటుంది. కొన్నిసార్లు అర మైలు దూరము నుండి కూడా అది నిన్ను గాని, లేక తోడేలును గాని, లేక మరేదైనా అపాయమును గాని వాసన పట్టగలదు. అది ఆ విధముగా వాసన పట్టగలదు, ఎందుకనగా అది ఆ విధముగా చేయబడినది. అది స్వభావరీత్యా దుప్పి మరియు అది జీవించడానికి దేవుడు దానికి ఇచ్చిన జ్ఞానేంద్రియాలలో అది ఒకటి.

27దేవుని కొరకు దాహంగొంటున్న మానవునితో దుప్పిని పోల్చవచ్చునని నేను అనుకుంటున్నాను. ఆ తరువాత శత్రువు దగ్గరకై సమీపించక ముందు, అక్కడ దేవుని బిడ్డను గురించిన ఒక విషయమున్నది, ఒకసారి నీవు దేవుని ఆత్మ ద్వారా జన్మించి, పరిశుద్ధ బాప్తిస్మము పొందినప్పుడు శత్రువును పసికట్టే జ్ఞానము ఆ వ్యక్తిలో వుంటుంది. ఒకవేళ ఏవరైన ఒక వ్యక్తి లేఖనాన్ని తీసుకొని, దానిని చదువుతూ, ఆ లేఖనముతో ఏదైనా లేఖన విరుద్ధమైన దానిని చేర్చుటకు ప్రయత్నించినప్పుడు: ఒక పరిశుద్దాత్మతో నింపబడిన వ్యక్తి వెంటనే అక్కడే దానిని పసికట్టగలడు. అక్కడ ఏదో మార్గము తప్పుచున్నది. ఆ వ్యక్తి ఏ స్థలమునకైనా వెళ్ళినప్పుడు, మరియు తనకున్న ఆ చిన్న జ్ఞానమును బట్టి, అది అతని జీవితమును భద్రపరచును. ఖచ్చితంగా అది దేవుని వాక్యము అయితేనే తప్ప మరి దేనికీ అసలు నీవు వెళ్ళకూడదు. నీవు ఖచ్చితముగా ఆ వాక్యముతోనే నిలచియుండవలెను. మరియు ఇప్పుడు, మరియు పరిశుద్దాత్మలో మనము వున్నంతవరకు ఆ గ్రహింపుతో మనము సురక్షితముగా ఉంటాము.

MARK 16:17,18•

REV 22:18,19

 

28ఉదాహరణకు నీవు ఈ వాక్యమును చదువుతున్నావనుకో, మరియు ఎవరో ఒకరు, నేను మార్కు 16వ అధ్యాయమును చదువబోవుచున్నాను, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున వారు దయ్యములను పారద్రోలుదురు; వారు క్రొత్త భాషలతో మాట్లాడుదురు; లేక సర్పములను ఎత్తి పట్టుకొందురు; విషకరమైనవి త్రాగుదురు, అయినను అవి వారిని ఏమీ చేయవు; రోగులపై వారు చేతులుంచినప్పుడు, వారు బాగయ్యెదరు."

ఇప్పుడు, తరువాత, అక్కడ ఒక మనుష్యుడు లేచి, "ఇప్పుడు, అది అపొస్తలులకు మాత్రమే" అని చెప్పుటను మీరు కనుగొనుచున్నారు. అది ఇప్పుడు, సరిగా వెంటనే, నీవు పరిశుద్దాత్మను పొందినట్లయిన, నీవు ఆ ఇ౦ద్రియమును కలిగి యుంటావు — అది దానిని ఆపుచేయును, అక్కడ ఏదో తప్పుగా వున్నది, చూచారా. వారు దానిని వివరించుటకు ప్రయత్ని౦చెదరు. "అది మరొక దినము కొరకైనది. వాస్తవముగా, ఈ దినమునకు ఆ విషయాలు నీకు అవసరము లేదు.

అయితే యేసు, "నమ్మువారిని ఈ సూచక క్రియలు వెంబడించును" అని చెప్పెను, చూచారా. నీలోని ఆ చిన్న అలారం, ఆ చిన్న శబ్దము అది తప్పని మరియు అది మరణమునకు ద్వారమని నీకు తెలుపును.

EZEK 3:1,3•

JOHN 1:1,14•

JOHN 6:63•

HEB 13:8

 

29ఎందుకనగా యేసు చెప్పెను, "మనము ఒక మాటను దానికి కలిపినా లేక ఒక మాటను దానినుండి తీసివేసినా, జీవగ్రంధములో మన భాగం తీసివేయబడును," చూచారా. ఒక లేఖనభాగం కాదు — అది ఏ విధంగా వ్రాయబడినదో, ఆ విధముగానే మనము వాక్యమును తీసుకొనవలెను. మరియు దేవుడు తన వాక్యమును నెరవేర్చుటకు ఆయన జాగ్రత్త తిసుకోనును. మరియు ఇది సత్యమని మనకు తెలియును.

అందునుబట్టి, ఎవరెన్ని చెప్పినప్పటికి, సంఘములు ఎన్ని చెప్పినప్పటికి, నీవు దేవుని ఆత్మ ద్వారా పుట్టినట్లయితే, నీవు బైబిలులో ఒక భాగమగుచున్నావు. దేవుడు యెహెజ్కేలుతో చెప్పెను (ఆయన ఒక ప్రవక్త), ఆయన "పుస్తకపు చుట్టను తీసికొని తినుము" అని చెప్పెను. అప్పుడు ప్రవక్త మరియు పుస్తకపు చుట్ట ఒకదానితో ఒకటి భాగమయినాయి. మరియు అలాటి విశ్వాసి పరిశుద్దాత్మను పొందినప్పుడు; పరిశుద్దాత్మ బైబిలును వ్రాసియున్నది, మరియు దేవుని ఆత్మ దేవుని వాక్యమైయున్నది. "నా మాటలు ఆత్మయైయున్నవి. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద వుండెను. వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." హెబ్రీయులు 13:8: "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు." మరియు నీవు ఆ వాక్యములో భాగమై వున్నప్పుడు, ఓ, అప్పుడు ఏదైనా ఆ వాక్యమునకు విరుద్ధముగా రానివ్వండి, వెంటనే నీలోని ఆ శబ్దము చేయు పరికరము మ్రోగుతుంది, చూడండి. అది మరణము దారిలో వున్నదని తెలియజేయుట కొరకు. దానిని మనము ఎన్నడూ చేయరాదు.

ఈ దాహములు సహజమైనవి. అవి క్రైస్తవులకు సహజమైనవి. అవి మనిషికి సహజమైనవి.

30జయమును గూర్చి కూడా ఇక్కడ దాహమున్నది. ఈ రోజున అనేక మంది, ఎలా పిల్లలకు చదువు చెప్పించాలనే దాహం. విశ్వవిద్యాలయములకు వారిని పంపడం గమనిస్తాము. ఇంక మనము చూచినట్లయితే… ప్రజలు వేలకొలది డాలర్లు హెచ్చించి వారి పిల్లలను చదువుకొరకు పాఠశాలలకు, మరియు విశ్వవిద్యాలయాలకు, మరియు కళాశాలలకు, మరియు ఆ విధమైన వాటికి వారిని పంపుచున్నారు. అది వారికి జీవితంలో జయం పొందుటకు అని అంటారు.

అయితే… ఇప్పుడు, దానికి నేనేమి వ్యతిరేకిని కాదు. ఇప్పుడు అది మంచిదే, కాని నా మట్టుకైతే, నీవు ఈ లోకంలోని విద్యనంతా అభ్యసించవచ్చు, అయినను నీవు ఇంకను సరియైన జయమును సాధించలేదు. అది నిజము. ఎందుకనగా ఇవన్నీ ఈ లోకంలో తాత్కాలికమైనవే, ఇక్కడ నీ విషయములను కొంత సులభతరం చేస్తాయి, మరియు అక్కడ… అయితే నీవు చనిపోయినప్పుడు, వీటన్నిటిని నీవు వెనుక విడిచి వెళ్ళుదువు. మరియు మనము కలిగియున్న ఈ క్రమమంతయూ

31(ఫోనిక్సులో మొన్నటి దినమున నేను ఈ సంగతి చెప్పుచున్నాను, దానిని మరల నేను వివరించుదును), అది అధునాతన నాగరికత అంతా, విద్యావిధానమంతా, శాస్త్రీయ విధానమంతా, మొత్తము దేవుని వాక్యమునకు ఆయన చిత్తమునకు విరుద్దమైనది.

నాగరికత అంతా పూర్తిగా… ప్రపంచములో రాబోయే నాగరికత ఇప్పుడున్న దానివలె ఇక ఎన్నడూ ఉండబోదు. ఇది వక్రమైన నాగరికత. దేవుడు తన మొదటి నాగరికతను భూమిమీద కలిగియుండవలెను. ఆయన తన మాటలను పలికినప్పుడు, ప్రతి విత్తనము దాని జాతి ప్రకారము, ప్రతిది ఉనికిలోనికి వచ్చింది, ఆ నాగరికతలో మరణము, రోగము, బాధ లేదు. మరియు ఇప్పుడు ఈ శాస్త్రీయ లోకంలోని విషయములను తీసుకొని, ఇక్కడ వుంచి, వాటిని జతచేసి చూస్తే ఇది ఏదో వేరొక రకంగా వక్రమైపోవును, మరియు అది మరణమును తెలియును. ఒక అణుబాంబువలె, నీటి యొక్క సూత్రములు నాకు తెలియదు, కాని అది తప్పని నేను చెప్పుదును. వారు యురేనియంను తీసుకొని దానిని ఒక పరమాణువుగా విభజిస్తారు, ఈ పరమాణువు అణువుగా పగులుతుంది. తరువాత అది ఏమి చేయును? అది పూర్తిగా అంతమొందించబడును, పూర్తిగా నాశనం చేస్తుంది.

మనము చేసే ప్రతియొక్క…

32మనము మందును తీసుకొందాం, దీనిని బాగుచేయడానికి ఈ సూత్రమును మరొక సూత్రముతో కలిపి, మరియు మనలోనికి ఆ మందును ఎక్కిస్తారు. మరియు మనము చేసేదేమిటి? దేనినో మనము చించివేస్తున్నాము. ఇప్పుడు, మీరు గత నెల "రీడర్స్ డైజస్ట్" చదివారు అని నేను అనుకొంటాను. దానిలో ఇలా వుంది, "ఇప్పుడు మనము జీవించే యుగములో, యౌవన పురుషులు, మరియు స్త్రీలు ఇరవై నుండి ఇరవై-ఐదు మధ్యలోనే మధ్యవయస్సుకు చేరుకొంటున్నారు." దానిని ఆలోచించండి. చిన్న బాలికలలో ఇరవై, ఇరవై-రెండు, ఇరవై-మూడు మధ్య వయస్సుకే గర్భధారణ ఆగిపోవటం.

మీరు చూడండి, ఏమి సంకరజాతి ఆహారమును పదార్ధములను మనము భుజించుటవలననే, చూచారా. ఈ విధమైన ఆహారంతో మనము జీవించుచున్నాము. శాస్త్రవేత్తలు దీనిని మనకు తెచ్చారు, మరియు ఆ విధంగా చేయటం వలన వారు నిన్ను చంపుతున్నారు. నేను ఆఫ్రికాలో వున్నప్పుడు, వారి జీవితములో ఒక మందు బిళ్ళను కూడా వేసుకొనని బాలురను నేను చూచాను. వారు ఏలిక పురుగులు ఉండే మాంసమును తింటారు. ఆ కొలనులోని నీటిని ఎద్దు త్రాగితే అది చచ్చిపోవును అనిపించును. అలాటి కొలనులోని నీరు వారు త్రాగుతారు. మరియు నేను రెండు వందల గజముల దూరములో గురి చూచి తుపాకితో కొట్టబోవుచున్నాను. మరియు మూడు-వందల-యాభై శక్తి గలిగిన ఒక దూరదర్శినితో దానిని (ఆ గురిని) నేను చూడలేకపోయాను. మరియు అక్కడ నా వయస్సులో వున్న వ్యక్తి అక్కడ నిలబడివున్నాడు, అతను మామూలు కంటితో చూచి అది ఎక్కడ తగిలిందో చెప్పాడు. ఇప్పుడు, ఈ అధునాతన నాగరికత అంతా ఏదో చేసినట్లయితే అతని కళ్ళు, అతని కడుపు నాకున్నట్లయితే, నేను ఒక మంచి బలిష్టమైన మనిషిగా ఉండేవాడినని భావించాను. అవును, అయితే అక్కడే నీవున్నావు.

మీరు చూచారా, అదే విజ్ఞానశాస్త్రము విద్య, నాగరికత, వాటివలనే మనము నాశనము చేయబడియున్నాము. మనలను మనము నాశనము చేసికొన్నాము. అది ఏదెను తోటలో ప్రారంభమయినది మరియు ఈ రోజు వరకూ అలాగే పరిగెడుతూ వుంది. అయితే విజయం కొరకు ఆరాటం…

తరువాత, మనము సహవాసం కొరకు దాహం చెందుతాము. మనము వెళ్ళుదుము, మనకు సహవాసం కావాలి.

33ఒక యౌవ్వనుడు మరియు ఒక యౌవనురాలు వలె, ఇప్పుడు ఇది అనవసరమైన కాదు, లేక (నా ఉద్దేశ్యము) ఒక యౌవనురాలు మరియు ఒక యౌవనుడు ఒకరినొకరు ప్రేమించటం అసహజమైన విషయం కాదు. అది ప్రేమకొరకైన దాహం. అది వారి వయస్సు, మరియు వారు ఒకరినొకరు ప్రేమిస్తారు, మరియు అది అసహజమైనది కాదు. వారలాగు చేయటం వారికి సహజమైనదే.

ఇప్పుడు, ఈ సహజమైన దేహములో జీవిస్తున్నంతవరకూ, మన జీవితములో దాహంలోనే ఎన్నో విషయాలను మనము కనుగొంటాము. అది ఆ విధంగా మనలో ఏర్పాటు చేయబడింది. ఒక దానిని మనము చేయాలనుకొన్నాము. అది పూర్తిగా మనకు అవసరమని భావించాము, మరియు దానిని మనము చేయవలసిన అవసరమున్నది. ఈ దినాల్లో ఎందరో స్త్రీలు అందం కొరకు ఆరాటపడటం మనము చూస్తాము. ఇప్పుడు, అది ఆ స్త్రీతో ఏమీలేదు… సహజంగానే స్త్రీకి అందంగా ఉండాలనే దాహం తనలో వుంటుంది. అది దేవుడు అమెకిచ్చిన సహజ గుణం మరియు దేవుడు ఆమెకిచ్చిన అందం తన భర్త కొరకే. మరియు ఇప్పుడు, స్త్రీలు ఆ విధంగా ఉండుటను కోరుకొనడాన్ని మనము కనుగొంటాము. అది ఎందువలన? దేవుడు ఆమెకు ఏదో ఇచ్చినందువలన. మరియు స్త్రీలు అందంగా వుండటం తప్పు కాదు, వారు ఉండాలి.

34మరియు మీకు తెలియునా, మానవజాతిలో స్త్రీలు మాత్రమే మగవానికంటే సౌందర్యముగా వుంటుంది? ఇక ప్రతి ఇతర జంతువు — ఆవు నుండి దున్న వరకు, కుందేలు నుండి దుప్పి వరకు, పెట్ట నుండి పుంజు వరకు, తల్లి పక్షి నుండి, తండ్రి పక్షి వరకు — ఎప్పుడూ మగది పెద్దదిగాను అందంగాను వుంటుంది. కాని మానవ జాతిలోనే ఇది తారుమారు కావటం కనబడుచున్నది, ఇక్కడ అంతా తిరిగిపోయింది, మరియు స్త్రీ చాలా సౌందర్యముగా వుంటుంది, మరియు సౌందర్యముగా వారు వు౦డాలని ఆశపడెదరు.

ఈ రోజున మనము వీధులలో చూసే, కృత్రిమ సౌందర్యాన్ని కనపరిచే (స్త్రీలు) జీవులవలె కాదు; కాదు, కాదు! ఆ రకమైన సౌందర్యము కాదు, కాదు! అది నా జీవితంలో ఎన్నడూ చూడని భయంకరముగా కనపడే దృశ్యం. అవునండి! అది వక్రబుద్ధి. అది నిజమైన దాహమును త్రిప్పివేసిన ఒక వక్రబుద్ధి.

1TIM 2:9

 

35ఇప్పుడు, స్త్రీకి వుండవలసిన నిజమైన దాహం ఏమిటంటే, ఈ విధంగా వుండాలి, "స్త్రీలు తగుమాత్రపు వస్త్రములతో అలంకరించుకొని, క్రీస్తును పోలిన ఆత్మను కలిగియుండవలెను. I తిమోతి 2:9. ఇప్పుడు, స్త్రీ ఆ విధముగా ఉండుటకు దాహం కలిగియుండవలెను. ఇప్పుడు, నీవు సౌందర్యముగా వుండాలంటే, క్రీస్తును పోలిన ఆత్మను కలిగి, మరియు తగుమాత్రపు వస్త్రములతో అలంకరించబడినచో, చూచారా, అదే నిన్ను సౌందర్యముగా చేస్తుంది.

ఓ, మై, ఈనాడు వీధుల్లో తిరిగే కొంతమంది, నీవు స్త్రీ నుండి పురుషుని గుర్తుపట్టలేవు, మరియు నీవు చూస్తే, ఇదొక నాశనకరమగు సంగతి… నేను దానిని చూడలేను… ఇది మనుష్యులలో. ఇంత విపరీతము, నేను ఎన్నడును చూడలేదు. ఇది మానవులకు తగనిది. కళ్ళకు రంగులు వేసుకొని, మరియు, మీకు తెలుసు, బల్లి కళ్ళవలె విచిత్రముగా కనబడుతూ, అసభ్యకరమైన దుస్తులు వేసుకొంటున్నారు మరియు, ఎందుకు… వారి ఆకారమే మారిపోయింది, వారు కనీసం మనుష్యులవలె కనబడటం లేదు. మరియు కొందరు బాలురు తలలు దువ్వి వారి సహోదరీల యొక్క చుట్టలను ముందు పెడుతున్నారు, నీకు తెలుసా — ఎందుకు, ఇది పూర్తిగా వక్రబుద్ధి. అది సత్యము.

అది ఒక సాతాను, మరియు సాతాను వక్రము చేసేవాడు.

36ఏదెను వనములో దేవుడు సమస్తమును కలుగజేసినప్పుడు, అది ఎంతో అందముగా వుండెను. సాతానులోనికి ప్రవేశించి మరియు దానిని వక్రముగా త్రిప్పాడు. వాడు సృష్టించలేడు. ఒకే ఒక సృష్టికర్త: ఆయన దేవుడు. కాని సాతాను అసలైన సృష్టిని వక్రము చేయును. మరియు ఇప్పుడు వాడు దీనిలోనికి లోనికి దిగాడు, నేను ఈ రాత్రికి మాట్లాడుటకు నేను కోరే అంశం దీనిని గురించే: అసలైన సృష్టిలోని దాహమును తారుమారు చేయుట.

ఇప్పుడు, నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక స్త్రీ సౌందర్యముగా వుండాలని ఆశిస్తుంది. ఆమెలో ఏదో వున్నది, స్త్రీ గుణం ఆమెలో వున్నందువలన ఆమె ఆ విధంగా ఉండాలని ఆశపడుచున్నది. కాని ఈ రోజున వీధిలో వారు పురుషునివలె జుట్టు కత్తిరించుకొని, పురుషుని బట్టలను వేసికొంటున్నారు; మరలా పురుషుడు స్త్రీవలె, స్త్రీల దుస్తులు ధరించడం, స్త్రీ వలె జుట్టు కత్తిరించుకోవటం చేస్తున్నారు. చూడండి, ఇది మొత్తం అంతా వక్రము, నీ ఆహారం వక్రము, నీ జీవితం వక్రము, నీ దాహం వక్రమైపోయింది. నీ ఆశ వక్రమైపోయింది — ఇది ఒక వక్రమైన దినం.

37ఈ మధ్యనే నేను "సాతానుని ఏదెను" గూర్చి ఇక్కడ మాట్లాడుచుంటిని. దేవుడు ఆరు వేల సంవత్సరములు సృష్టిని పరిపూర్ణమైన ఏదెనును తయారు చేశాడు. సాతాను అక్కడకు వచ్చి విత్తనములను చల్లి మరియు వాటిని తారుమారు చేశాడు. ఇప్పుడు సాతానుకు ఆరు వేల సంవత్సరములున్నవి, మొదటినుండే నిజమును వక్రముగా చేయడం ద్వారా వాడు తన సొంత శాస్త్రీయ ఏదెనును కలిగియున్నాడు. మరియు ఇది సంకరం చేసే యుగం, సంకరం చేయటం. ఈ రోజున వారికి సంఘములును ఉన్నవి. అయినను వారింకను సంకరము చేయబడియున్నారు. అది నిజము.

వారు దీనిలోనికి చేరతారు, వారు కేవలము సంఘమునకు వెళ్ళుదురు. అది ఒక సంఘమువలె ఉండుటకు బదులుగా ఒక సత్రమువలె ఉంటున్నది. ప్రజలు ఆత్మతో మరియు సత్యముతో దేవుని ఆరాధించడానికి కూడుకొనే స్థలము ఒక సంఘమైయున్నది. మరియు ఈ రోజున ఇది ఒక సత్రము అయింది. మనము అక్కడకు వెళ్ళి మరియు కాసేపు చేతులు కలుపుతాము, కాస్త సహవాసం, తరువాత కొంచెం నల్లకాఫీ త్రాగటానికి భవనము వెనక్కు వెళ్ళుదుము. ఇక వచ్చే వారంవరకు ఇంటికి వెళ్ళిపోతాము. మనము మన మతవిధిని నిర్వర్తించాము. ఇప్పుడు, ఇది వక్రయుగము. మరియు దాహంగొనుటకు దేవుడు నీలో పెట్టిన దాహమును సాతాను వక్రము చేయుచున్నాడు. సాతాను వాటిని త్రిప్పివేయుచున్నాడు.

ఇప్పుడు, నీవు దాని నిజము తెలుసుకోవాలంటే, వక్రతనము.

PS 42:1•

1TIM 2:9

 

38స్త్రీలారా, మీరు సౌందర్యముగా వుండుటకు ఇష్టపడిన ఎడల, I తిమోతి 2:9 తీసుకోండి, అక్కడ "స్త్రీಲು తగుమాత్రపు వస్త్రములతో అలంకరించుకోవాలి తగుమాత్రపు వస్రాలు, క్రీస్తును పోలిన ఆత్మతో అణకువతో తమ భర్తలకు లోబడి యుండాలి." నీ జీవితమును నీవు ఆ రీతిగా అలంకరించుకొని జీవించవలెను. వాడు నిజమైన దేవుని స్వభావమును, మరియు శరీరము యొక్కయు, ఆత్మ యొక్కయు నిజ దాహమును పాపముకొరకైన ఇచ్చగా వక్రముగా త్రిప్పుచున్నాడు — పాపము, ఒక వక్రము.

ఇప్పుడు, వారు ఏ విధముగా ఆ వక్రమును తీసుకొన్నారో, ఇప్పుడు ఈ రోజు ఒక వ్యక్తిని చూద్దాం — దేవుని కొరకు దాహం, సౌందర్యముగా వుండాలనే దాహం, మరియు నీటి కొరకు దాహం — మరియు ఈ దాహములన్నీ వారు త్రిప్పివేసి త్రాగుడుతో తమ్మును తృప్తిపరచుకొంటున్నారు. సంతోషం కొరకు దాహం… ప్రతి ఒక్కరు సంతోషంగా వుండాలని ఆశిస్తారు. సహవాసం కొరకు దాహం, మనము ఆయన కొరకు దాహం కలిగియండాలని ఆ గొప్ప దాహములన్నింటిని దేవుడు మనలో ఉంచాడు. నీవు దేవుని కొరకైన దాహంగొనేటట్లు ఆయన నిన్ను చేశాడు. మరియు దానిని మనము వేరే విధమైన దాహంతో తృప్తిపరచాలని ప్రయత్నిస్తాము, నిజమైన దాహమునకు వక్రముగా వేరే దానితో, స్వాభావికముగా ఎలా ఉందో చూచారా? అది ఆత్మీయముగా ఎలాగువున్నదో చూచారా? ఏదో ఒక సంఘములో చేరినట్లయిన అది ఇక మనము చేయగలిగింది అదేనని అనుకొంటాము. మంచిది, అది పూర్తిగా తప్పు కాదు. ఆయన కొరకు నీవు దాహంగొనాలని దేవుడు కోరుచున్నాడు. "దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు ఓ దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది," చూడండి. చూచారా?

39ఇప్పుడు, ఆ దుప్పి నీటివాగుల కొరకు దాహంగొంటున్నట్లయిన, తన ప్రియమైన స్నేహితురాలైన (వేరొక దుప్పి దాని దగ్గరకొచ్చి) "నేను ఏమి చేస్తానో నీకు చెప్పెదను. అక్కడ ఒక చోట మురికిగుంట వుంది" అని అంటుంది. మంచిది, ఆ దుప్పికి ఆ గుంట పనికి రాదు. దానివలన దుప్పికి ఉపయోగము లేదు.

మరియు దేవుడు లోపలికి వచ్చేవరకు, మానవ హృదయములో వున్న దాహమును ఏదీ తృప్తిపరచలేదు. అతడు దానిని పొందాలి, లేనిచో చనిపోతాడు. మరియు ఆ పరిశుద్ధ దాహమును నొక్కివేయడానికి, లోకసంబంధమైన వస్తువులతో తృప్తిపరచుటకు గాని ఏ ఒక్కరికి అధికారం లేదు. లేదండి! ఆ విధంగా చెయ్యటం భక్తిహీనత, మరియు నీవు దేవుని కొరకు దాహంగొంటున్నట్లయితే, బోధకునితో కరచాలనం చేసి నీ పేరును పుస్తకములో వ్రాయించుకోవద్దు. నీవు దేవుని కొరకు దాహంగొంటున్నట్లయితే, దానిని తృప్తిపరచేది ఒక్కటే ఒక్కటి వున్నది: అది దేవుని కలుసుకోవటం. నీవు దేవుని కొరకు దాహంగొంటున్నట్లయితే, నీవు చేయవలసినదంతా దాహం తీర్చుకొనుటకు ఆయనను కలుసుకోవటమే.

40ఆ తరువాత ఆ సమయంలో నీవు ఏమి చేయుచున్నావని నీవు కనిపెట్టకపోయినట్లయితే గొప్ప అపాయము కూడ ఉన్నది. నీవు దేవుని కొరకు దాహం గొన్నట్లయితే, నీవు తప్పక దేవునినే కలుసుకొనవలసియున్నావు, చూచారా. నీ దాహం తృప్తిపరచబడినట్లు నిశ్చయత కలిగియుండుము.

కాని ఒకవేళ సాతాను నిన్ను శరీరసంబంధమైన దాహం వైపు నిన్ను త్రిప్పగలిగినట్లయితే మరియు — వాడు చెయ్యాలంటే చెయ్యగలడు — నీవు తృప్తిపరచబడేటట్లు వాడు ప్రయత్నం చేసాడు. ఒక మనిషి బయటకు వెళ్ళి… ఒక మనిషిని త్రాగేటట్లు ఏది చేస్తుంది, ఎందుకనగా ఆ మనిషి కలవరపడి మరియు నలిగిపోయాడు. అతనిలో ఏదో లోపము వున్నది.

41ఈ మధ్య నేను ఒకసారి మయో దగ్గర వుంటిని, మరియు అక్కడ నాకు ఒక ముఖాముఖి ఉన్నది. ఆ తరువాత త్రాగుడు అలవాటును గూర్చి దానిలో చెప్పబడింది, నేను వారికి నా తండ్రి త్రాగేవాడని చెప్పాను. ఆయన, "ఎందుకు త్రాగవలసి వచ్చింది?" అని అడిగారు. నేను చెప్పాను,

"అది నాకు తెలియదు."

ఆయన చెప్పాడు, "ఏదో ఆయనను తృప్తిపరచలేకపోతున్నది, కాబట్టి తన మనసులో నుండి దానిని ఎత్తివేయాలనుకొన్నాడు."

అప్పుడు నేను అక్కడే దానిని పట్టుకొన్నాను, చూచారా. ఒక్కటే ఆ దాహమును తీర్చును, అది నిజంగా దేవుడే. దేవుడు తాను మాత్రమే ఆ మానవ దాహమును తృప్తిపరచగలడు, అందుకు దేవుని అంగీకరించాలి.

PS 42:2

 

42ఇప్పుడు, నేను చెప్పినట్లు సాతాను వీటిని తీసుకొని, మరియు వాటిని వక్రము చేస్తుంది. అప్పుడు, నీవు నీ జీవితములో ఆ దాహమునకు సరైన దాహమును తీర్చకపోయినా లేక ఆ దాహమును ఆర్పివేసినా, అప్పుడు సాతాను నిన్ను లోకములోని వాడియొక్క పాడుపడిన మురికి గుంటలోనికి నిన్ను నడిపిస్తాడు.

నీవు దానిని తప్పక ఎక్కడైనా పొందవలసియున్నావు. నీకు ఆహారము దొరకనట్లయితే, చెత్త బుట్టలోనిది తింటావు, చూచారా. మరియు నీకు దొరకనట్లయితే, మరియు నీవు దాహానికి చనిపోతున్నప్పుడు, ఎలాటి గుంటలోని నీళ్ళయినా నీవు త్రాగుతావు, ఎందుకనగా నీవు నశించిపోతున్నావు. అయితే నీవు దేవుని కొరకు దాహంగొంటున్నప్పుడు నీవు అలా చేయవలసిన అగత్యం లేదు, ఎందుకనగా దేవుడు జీవముగల దేవుడు — అదేదో పురాతన వస్తువు కాదు. "జీవముగల దేవుని కొరకు నా ఆత్మ తృష్ణగొనుచున్నది," అది నీకు జీవ జలములను ఇచ్చేది, నిన్ను తృప్తిపరిచేది.

43అక్కడ మరొక స్వభావము, ఒక స్వాభావికమైన, ఆత్మలోని దాహం సహజమైనది. మీరు అనవచ్చు, "సహోదరుడా బ్రెన్హాం గారు, ఆత్మలోని ఆ దాహం సహజమైనదా?" అవును, ఆత్మ ఆ విధముగా దాహంగొనటం సహజమైనది. మరియు అది.

దేవుడు నిన్ను ఆ విధంగా చేశాడు కాబట్టి నీవు ఆయన కొరకు దాహం గొంటావు. నీవు ఆయన కొరకు దాహంగొనాలని ఆయన కోరుచున్నాడు. ఇప్పుడు, దేవుడు నిన్ను అలా చేశాడు. నిన్ను ఆయన ఆ విధముగా దాహంగొనేటట్లు చెయ్యవలసిన పనిలేదు, కాని అలా నిన్ను చేశాడు. మరియు దేవుడు ఆ విధముగా నీవు దాహంగొనేటట్లు నిన్ను చేసియుండకపోతే, "నాకు ఎన్నడూ దేవుని కొరకు దాహం కాలేదు? అని నీవు చెప్పినప్పుడు న్యాయతీర్పులో నీకు క్షమాపణ వుంటుంది. కాని నీకు దాహం వుంది కాబట్టి నీకు క్షమాపణ లేదు. నీవు దానిని ఎలాగైనా తీర్చుకోవాలి. నీవు దానిని నీ భార్య ద్వారా తీర్చుకోవచ్చు, నీవు దానిని నీ కారు ద్వారా తీర్చుకోవచ్చు, ఆలయానికి వెళ్ళడం ద్వారా గాని, మరి ఏ విధంగానైనను నీవు ప్రయత్నించి దానిని తృప్తిపరచవచ్చు. మరియు ఆలయానికి వెళ్ళుటకు నేనేమీ వ్యతిరేకిని కాదు, కాని అది తృప్తి కాదు. అది జీవముగల దేవుని, పరలోకపు దేవుని నీవు నీ ఆత్మలో కనుగొనటమే, అది ఇంతవరకూ నీవు ఎదురు చూస్తూవున్న దాహమును తృప్తిపరచును. ఇప్పుడు, ఆయన నిన్ను చేశాడు కాబట్టి నీవు ఆయన కొరకు, ఆయన సహవాసం కొరకు దాహంగొంటావు.

ఇప్పుడు, ఇక్కడ సహవాసం కొరకైన అసలైన దాహం వున్నది. ఇప్పుడు, మనము ఒకరితో ఒకరు కలుసుకొనుటకు ఇష్టపడతాము. ఈ రాత్రి దానిని మనము చేస్తున్నాము. ఒకరితో ఒకరం సహవాసం చేయటం మనకు ఇష్టము కాబట్టి ఈ రాత్రి మనమందరము ఇక్కడ కలుసుకొన్నాము. ఎందుకు మనము అలా చేస్తున్నాము? ఎందువలన అనగా మనలో ఏదో వుండి ఒకరితో ఒకరం కలుసుకొనునట్లు చేయుచున్నది. అది సహజమైనది. మరియు ఇప్పుడు, మనము ఇక్కడ ఒక స్థలములో కలుసుకొన్నాము, ఎందుకనగా మనమందరము దేవునిపట్ల దాహం కలిగియున్నాము, చూచారా.

ఆ తరువాత మనము క్రమముగా ఈ స్థలములో సహవాసం కొరకు కలుసుకొంటున్నాము. ఈ రాత్రి ఇక్కడ వివిధములైన ఉద్దేశములతో కూడిన సంఘ శాఖలు వుండవచ్చును. కాని అది దాహమునకు వచ్చేసరికి, మనమంతా ఒకే స్థలములో ఒక్కటిగా కూడుతాము: మనమంతా దాహంగొంటాము. కొందరు చిలకరింపును నమ్ముతారు, కొందరు కుమ్మరింపు అంటారు, కొందరు ముంచడం అంటారు. కాని దేవుని కొరకు దాహమునకు వచ్చేసరికి, మనమందరము కలిసి ఒక స్థలములోనికి వస్తాము. మరియు ఆయన మనలను ఆ విధంగా చేశాడు. ఆయన కొరకు మరియు ఆయన సహవాసం కొరకు దాహంగొంటాము.

నాకు ఏమీ తెలియదు…

44నేను చిన్న బాలునిగా వున్నప్పుడు నాకు గుర్తువుంది నేను నిజమైన ఒక పేద కుటుంబములో పెరిగాను. మరియు నేను చాలాసార్లు పిల్లలతో కలసి బయటకు వెళ్ళేవాడిని. మంచి స్థలానికి వెళ్ళటానికి నాకు సరైన బట్టలు వుండేవి కావు. కాని, నాకు తెలియదు, నాకిష్టమయినది వాళ్ళలో ఏదో వుండేది. మరియు నేను రక్షించబడిన తరువాత నాలో ఒక స్నేహితుని కొరకైన దాహం వుండేది, నేను నమ్మదగినవాడు, ముఖాముఖిగా నా బాధలు, నా సమస్యలు చెప్పుకొని నా బాధను పోగొట్టుకొనుటకు నాకు ఎవరైనా మంచి స్నేహితుడు వు౦డాలని వుండేది… కాని నేను నిజమైన తృప్తిని యేసుక్రీస్తును కనుగొన్నప్పుడు మాత్రమే పొందాను, నిజముగా దాహం తీర్చువాడు, అంతా తొలగించి దాహమునంతా తీర్చువాడు, మరియు అది ఆయన స్థానమును ఏదీ తీసుకొనలేదని నీకు అనిపించే దేనినో ఆయన నీకు ఇచ్చును.

45మరియు ఇప్పుడు ఆత్మయొక్క ఈ దాహము తీర్చబడకుండా ఎలా సాతాను వక్రము చేయునో, వాడు దానిని తృప్తిపరచడానికి నీకు ప్రతిదానిని ఇచ్చుటకు ప్రయత్నిస్తాడు. మరియు ఈ వక్రమ దినాలలో వాడు చాలా కుయుక్తిగా వున్నాడు. ఇది ఒక వక్ర ప్రపంచం. ఇది ఒక వక్రజాతి. ఇది ఒక వక్రజనము. ప్రతిది వక్రము చేయబడింది, ఇది క్రమేణా ఎంత వక్రమైపోయిందంటే, ఇంతవరకు భూమిమీద మనము ఏ మనిషి జీవించని భయంకరమైన మోసపు యుగమయింది. ఇది వరకెన్నడూ లేనంత మోసపు యుగము ఇది. ఇప్పుడు, ఎంత మోసకరమైన వ్యక్తులను, మన తోటి సహోదరులతో కూడ అమెరికా ప్రజలవంటి వ్యక్తులను ఈ దేశం కలిగియున్నదని మీరు ఊహించలేరు?

46నేను కొంతకాలం క్రితం మాట్లాడుచుంటిని… కొన్ని వారాల క్రితం నేను అడవులలో వున్నప్పుడు క్రిందపడియున్న ఒక సిగరెట్టు పెట్టిని చూచాను. మరియు దానిమీద ఇలా వ్రాసియుంది, "ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము." ఇంకా నేను కొంతదూరం అడవులలోనికి వెళ్ళి, మరియు నేను తిరిగి వచ్చాను — "ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము, ఒక పొగత్రాగే మనిషి యొక్క రుచి," అను దానిని నా మనస్సులో ఉంచుకొన్నాను. మంచిది, రెండు సంవత్సరాల క్రితము ఒక ప్రపంచ ప్రదర్శనలో వు౦టిని, అక్కడ యూల్ బైనర్ మరియు ఇంకా వారందరు సిగరెట్టు మీద ప్రదర్శనలు జరుపుతున్నారు. మరియు వారు ఒక సిగరెట్టు పొగ తీసుకొని గాజు గోలీకాయ మీద వేసి, తరువాత దానిమీద నుండి ఆ నికోటిన్ తీసి ఎలుక వీపు మీద వేశారు. ఏడు రోజులలోనే దానికి కేన్సర్ వచ్చి కాళ్ళ మీద నిలబడలేకపోయింది, చూచారా — ఒక సిగరెట్టు నుండి.

ఆ తరువాత అది ఏ విధంగా మానవుని ఊపిరితిత్తులలోనికి వెళ్ళునో చూపించారు… వారిలో కొంతమంది, "నేను లోనికి పీల్చనండి. నా నోటితో అలా పీల్చి వదులుతాను" అని చెప్పుదురు. ఆ పొగ నోటిలోని లాలాజలముతో కలసి అది గొంతులోనికి వెళ్ళిపోతుంది, చూచారా. ఆ తరువాత ఈ మనిషి అన్నాడు, "చూడండి, మీరు ఎక్కువ వడపోత సాధనం గురించి మాట్లాడుచున్నారు." ఆయన చెప్పాడు, "నీకు ఒక కోరిక వున్నట్లయితే [అక్కడ దాహం వుంటుంది. మీరు చూచారా], సిగరెట్టు త్రాగాలనే ఒక ఆశ, ఒక సహజమైన సిగరెట్టు నీ కోరికను ఏదో ఆ క్షణానికి మాత్రం తీర్చవచ్చును. వడపోత కలిగిన సిగరెట్టు అయినట్లయితే నిన్ను తృప్తిపరచటానికి నాలుగువ భాగము కావలసివస్తుంది, ఎందుకనగా నీకు పాతిక భాగం పొగ మాత్రమే వచ్చును."

47మరియు చెప్పెను, "ఒక పొగ త్రాగేవాని రుచి: చూడండి; తారు లేనిదే నీకు పొగరాదు. మరియు దానిలో తారు వున్నప్పుడు, నీకు కేన్సర్ వచ్చును." కావున మీరు అక్కడే వున్నారు, చూచారా?. అది ఒక ఆకర్షణ.

మరియు ఈ దేశంలోని ఒక పొగాకు కంపెనీ, మరియు అది ఈ దేశంవలన జీవిస్తున్నది, మరియు తరువాత ఈ విధమైన ఆకర్షణతో అమెరికా వాసులను పూర్తిగా మోసగి౦చుచున్నది — వారిన౦దరిని మోసగించడానికే. ఒక ఆలోచించే మనిషియొక్క వడపోత సాధనము? అధికంగా సిగరెట్లను అమ్మటానికి అది ఒక మోసకరమైన ఆకర్షణ మాత్రమే. నేను ఆ విషయమును గూర్చి ఆలోచించినప్పుడు, ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము. నేననుకొంటాను, "అది మంచి ఉద్దేశ్యం." కాబట్టి అక్కడ ఒక ఆలోచించే మనిషియొక్క వడపోత సాధనం వున్నది — అది ఈ బైబిలే. ఒక ఆలోచించే మనిషియొక్క వడపోత సాధనమును ఈ వడపోత సాధనం తీసుకొంటుంది. అది ఒక నీతిమంతుని యొక్క రుచిని ఉత్పత్తి చేయును, చూచారా.

ఇప్పుడు, ఈ బైబిలులోని పుటలలో నుండి పాపమును లాగలేవు. కుదరదు, అది దానిని ఆపివేయును. అది పాపమును బయటకు వడకట్టును. నీవు ఆలయానికి వెళ్ళవచ్చు ఏదైనా తీసుకోవచ్చు, కానీ పాపముతో మాత్రము నీవు బైబిలుగుండా రాలేవు. అది దానిని చెయ్యదు. అది పాపమునంతా వడకట్టి పరిశుద్ధ మానవునియొక్క రుచి నిచ్చును. ఎందుకనగా, ఒక మనిషి తాను పరిశుద్ధముగా వుండాలని ఆలోచించే వాడయితే, దేవునివలె వుండాలని, దేవుని కుమారుడుగా లేదా కుమార్తెగా కాని కావాలంటే, అప్పుడు అతనికి మంచి రకపు వడపోత సాధనము కావాలి. కాబట్టి అతడు బైబిలునకు ఈ వైపు పాపమునంతా ఆపి, బైబిలును వ్రాసిన పరిశుద్దాత్మను మాత్రమే బైబిలులో నుండి అతడు తీసుకొనును. ఈ ఆలోచనాపరుని వడపోత సాధనమును కలిగివుండుట, అది ఒక పరిశుద్ధ మానవుని రుచియైయున్నది.

MATT 24:24•

MARK 13:22

 

48ఇప్పుడు, ఈ రోజున అది ఎంత మోసకరముగా వున్నదో మనము చూస్తాము. మత్తయి 24:24లో యేసు చెప్పెను, ఈ కడవరి దినాలలో ఈ రెండు ఆత్మలు ఒకదానికి ఒకటి బహు దగ్గరగా వుండి, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపుచ్చును. ఎంత దగ్గరగా, ఎంత, ఈ రోజున మంచి చెడుల మధ్య ఎలాటి మోసమో మన ప్రభుత్వములో, మన రాజకీయాలలో, మనకు కనీసం తను తలంచినది సరియని, దానికొరకై పరిపూర్ణముగా నిలబడునటువంటి ఒక రాజకీయ నాయకునిగా నిలబెట్టడానికి తగిన మనిషి ఒక్కరు కూడా లేడు. ఈ రోజున మన పాట్రిక్ హెన్రీలు, జార్జి వాషింగ్టన్లు, మరియు అబ్రహాం లింకన్లు ఎక్కడున్నారు? అక్కడ మన రాష్ట్రపతి చెప్పినట్లు, వారికి కమ్యూనిజం కావలసినచో, వారు దానిని పొందవచ్చు, ప్రజలు వారికి ఏది కావాలనుకొంటే అది. ఒక మనిషి కూడా దానికి ఇష్టతను చూపకపోతే, ఆ మనిషి తన సిధా౦తమే సిద్దాంతమని, దాని మీద నిలబడతాడు… దాని మీద వచ్చే అసమ్మతిని ఏమాత్రం లెక్కచెయ్యకుండా తన సిద్దాంతము మీదే సాగిపోతాడు.

మరియు ఆ విధంగానే ఈ రోజున సంఘములో ప్రజలున్నారు. వారు వచ్చి సంఘములో చేరగోరెదరు, "ఓ, మంచిది అది… అది ఇంతే. నేను ఇప్పుడు సంఘములో చేరాను," అందురు. దేవుడు నీలో వంచిన ఆ గొప్ప పరిశుద్ధ దాహమును, నీలోని నియంత్రణ శిఖరం మంచిదానివైపు నిన్ను త్రిప్పుచున్నప్పుడు, నీవు సంఘములో చేరి, సంఘ విశ్వాసపు ప్రమాణములను వల్లించుట ద్వారా ఇంకా అలాటిదేదో చేయటం ద్వారా నిన్ను తృప్తిపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. దేవుడు తన సన్నిధిని మరియు తనను తానే నీ జీవితంలో నింపటం ద్వారా అది తృప్తిపరచబడును.

1TIM 2:5

 

49అతడు మత సిద్దాంతము ద్వారా తృప్తిపరచబడలేడు. నీవు బైబిలు నుండి ఒక సిద్దాంతమును లాగలేవు. కుదరదు, అపొస్తలుల సిద్ధాంతాలని పిలువబడునవి కూడ ఏమి లేవు, దానిలో ఏవీ రావు. "దేవునికి మానవునికి మధ్య ఒకే మధ్యవర్తి వున్నాడు, ఆయన క్రీస్తుయేసు అను నరుడు" అని బైబిలు చెప్పుచున్నప్పుడు, "నేను పరిశుద్ధ రోమన్ కాథలిక్ సంఘమును నమ్ముచున్నాను. పరిశుద్దుల ఆరాధనను నేను నమ్ముచున్నాను" అని బైబిలులోని అపొస్తలుల సిద్దాంతము ఎక్కడ ఉన్నది? నాకు చూపించండి. నీవు ఎన్నడూ బైబిల్ నుండి దానిని బయటకు లాగలేవు.

50ఈ నృత్యములు, పొట్టి బట్టలు, మరియు ఈ రోజున జనులు చేయుచున్నన్నిటిని, ఈ త్రిప్పడాలు మరియు ఈ వటూసి అనబడు నృత్యములు, మరియు వీటన్నిటిని నీవు దేవుని వాక్యము నుండి తీయలేవు. ఈ అధునాతన నాగరికతను నీవు బైబిలు నుండి తీయలేవు. ఇది దానికి విరుద్ధం, చూచారా.

మరియు ఆ దాహమును నీవు తృప్తిపరచాలని ప్రయత్నించుము, అయితే మీరు చూచారా, అది… నీతిమంతుడైన పురుషుని యొక్క లేక స్త్రీ యొక్క రుచిని బైబిలు మాత్రమే తృప్తిపరచగలదు. పరిశుద్దాత్మ అంటే వారు నవ్వుతూ, "నీకు పిచ్చి పట్టింది" అంటారు. అయితే అదే నీలోని దాహమును తీర్చును, దాని గురించి లోకమునకు ఏమీ తెలియదు.

నిజమైన పరిశుద్దాత్మ బాప్తిస్మము నుండి, దేవుని వాక్యము నుండి తమ్మును తాము దేనివైపుకు వక్రము చేసుకొన్నారు? మురికి గుంటలవైపు, సంఘము యొక్క మురికి గుంటలకు, సంఘ ఆచారములకు, సంఘ సిద్దాంతములకు, మరియు సంఘశాఖల భేదాలు, మొదలగు వాటివైపునకు, చెప్పుము, "నీవు ఒక క్రైస్తవుడవా?"

"నేను మెథడిస్తును."

"నేను బాప్టిస్తును."

"నేను ప్రెస్బిటేరియన్ను."

దానిలో ఒక్క విషయము కూడా దేవునికి సంబంధము లేదు, ఒక్క విషయము కూడా. దేవుని బైబిలులో నుండి అలాటి వాటిని నీవు బయటకు తీయలేవు. మరియు నీవు దేవుని కొరకు దాహం గొనుటకు గాను దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిశుద్ధ దాహమును తృప్తిపరచుటకు నీవు ప్రయత్నించుచున్నావు. అది నిజము కాదా?

PS 42:2•

JOHN 1:1,14

 

51ఇప్పుడు, ఇక్కడ దావీదు ఏమని చెప్పుచున్నాడో మీకు తెలియును, "జీవముగల దేవునికొరకు." ఇప్పుడు, "ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవునియొద్ద వుండెను, ఆ వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." అప్పుడు ఈ వాక్యము, అనగా, దేవుడు నీలో సజీవుడు కానంతవరకు, నీలో తృప్తి వుండదు. తరువాత చూడుము, దేవుడు తనకుతానే, బైబిలులోని తన వాగ్దానములను నీలో నెరవేర్చుచుండును.

52ఇప్పుడు, మన మధ్యలో బైబిలును వివిధములుగా అనువాదం చేసిన వారున్నారు. ఒక సంఘము ఈ విధముగా దానిని అనువాదం చేయుచున్నది; వేరొకరు ఆ విధముగా అనువాదము చేయుచున్నారు; కొందరు దానిలో కొంత మాత్రమే తీసుకొంటారు; కొందరు ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం తీసుకొంటారు. అయితే దేవుడు వాక్యమునకు సొంత అనువాదకుడు. ఆయన ఒక వాగ్దానమును నెరవేర్చినప్పుడు, అదే దానియొక్క అనువాదము. నేను ఈ రాత్రికి ఇక్కడ వుంటానని నీకు వాగ్దానము చేసి, మరియు నేను ఇక్కడ వున్నప్పుడు — అది నా వాగ్దానము యొక్క నెరవేర్పు. నేను నిన్ను రేపు ఉదయము కలుసుకొంటానని వాగ్దానము చేసి, మరియు నేను ఉదయము అక్కడ ఉందును — అది నా వాగ్దానము. అక్కడ ఏదో వేరే సాకులు చెప్పే అవసరం లేదు, నేను అక్కడ వుండవలసినదే. మరియు దేవుడు ఒక వాగ్దానము చేసినప్పుడు, మరియు ఆయన వచ్చి దానిని నెరవేర్చినప్పుడు — వాగ్దానమునకు ఆయన అనువాదం అదే. మరియు నేను ధైర్యంగా అంటాను, ఎవరైనా దేవుని ఆయన వాక్యముతో తీసుకొని బైబిలులోని ప్రతి మాట ఎలా సత్యం కాదో చూడండి. అది నిజము!

అక్కడ వున్న దాహము అదే మరి. నీవు అంటావు, "నేను యేసు దినములలో జీవించియున్నట్లయితే, నేను పలాని దాన్ని చేసియుండేవాడిని." ఎందుకు, నీవు ఆయన దినాల్లోనే జీవిస్తున్నావు. మనము దాని గురించి ఏమి చేస్తున్నాము? మనము ఏమి చేస్తున్నాము? నీవు అంటావు, "మంచిది? నీవు చేసింది ఏమిటి, పరిసయ్యులు ఏమి చేశారో అదే కాబోలు. వారు సంఘమునకు చెందియుండి మరియు యేసుక్రీస్తును తృణీకరించారు.

MATT 11:25•

MATT 24:40•

LUKE 10:21•

LUKE 17:34,36•

EPH 5:27•

HEB 11:4

 

53మనము రోజూ ఎప్పుడూ అంటుంటాము, జనులు చెప్పుటకు ప్రయత్నించునది, "మనము పోల్చాలి. లేఖనమును లేఖనముతోను బైబిలు పేజిని పేజితోను మనము పోల్చాలి." అది సత్యము కాదు. కాదు, అది సత్యము కాదు. గ్రీకు మాటకు అర్థము ఇది, మరియు దీని అర్థం అది." ఆలోచన సభలో గ్రీకువాళ్ళకే, ఇదివరకు వ్రాసినది వారే, వారికి కొన్ని భిన్నాభి ప్రాయాలున్నాయి. ఒకరు ఈ విధంగా నమ్మెను. ఈ గ్రీకు పండితుడు ఇలా నమ్మాడు, వేరే ఆయన ఇది ఆ విధంగా వుంటుంది అన్నాడు. మరియు దానిమీద వారు రచ్చలు చేసికొన్నారు. మనకు గ్రీకు పండితుల అనువాదము లేదా గ్రీకు మాటలు కాని అవసరము లేదు. ఆయనను ఎరుగుటయే జీవము, క్రీస్తు అను వ్యక్తిని, ఆయననే; పోల్చటం కాదు.

అది దేవుడు తన సంఘమును కట్టిన ఒక ప్రత్యక్షత. మనము అదే సంఘముమీద కట్టబడకపోయినచో… బైబిలు చెప్పుచున్నది, "హేబెలు విశ్వాసము ద్వారా…" మరియు విశ్వాసము ఒక దైవిక ప్రత్యక్షత, చూచారా. విశ్వాసము ఒక దైవిక ప్రత్యక్షత. సరి, విశ్వాసము ప్రత్యక్షత మీద కట్టబడియున్నది, అప్పుడు ఇది నీకు ప్రత్యక్షపరచబడితేనేగాని… యేసు చెప్పెను, "తండ్రి, నీవు ఈ విషయములను, ఈ లోకములోని జ్ఞానులకు మరుగుచేసి, నేర్చుకొనే పసిపిల్లలకు వీటిని బయలుపరచినందుకు నీకు స్తోత్రములు," చూచారా. ఇప్పుడు, అంతా అక్కడ కట్టబడియున్నది. ఆ వ్యక్తిని నీవు తెలుసుకోవలసి యున్నావు.

54మరియు నీవు సంఘములో చేరి ఆ దాహమును తీర్చుకోలేవు. నీవు ఆ వ్యక్తిని, మరియు వాక్యమైయున్న దేవుని, ఈ రోజుకు తాను చేయు అనువాదమును, ఈ రోజు తాను చేయు వాగ్దానములను కనుగొనవలసి యున్నావు. ఈ రోజున ఆయన స్వీకరించబోయే ప్రజలు, "ముడత, మచ్చలేని సంఘము," అంటే ఒక సంఘశాఖ కాదు. దాని అర్థము వ్యక్తులు, ముడత, మచ్చలేని వ్యక్తులు. "మంచము మీద ఇద్దరుంటారు, ఒకరిని నేను తీసుకొనెదను, ఒకరిని విడిచిపెట్టుదును, ఇద్దరు పొలములో వుండెదరు, నేను ఒకరిని తీసికొనెదను, మరియు ఒకరిని విడిచిపెట్టుదును."

అయితే ఆయనవలె వుండాలనే పరిశుద్ధ దాహం… అప్పుడు మీరు చూడండి ఆయన వాక్యము నీలో యున్నది, వాక్యము తనకు తానె నీవు దేవుని దాసుడవని నిర్ధారించును. దేవుడు ఏది చెప్పితే, నీవు దానికి అవునంటావు, అప్పుడు నీవు సరైన పద్ధతిలో నీలోని పరిశుద్ధ దాహమును తీర్చుకొనుటకు వచ్చుచున్నావు.

HEB 13:8•

2PET 1:21

 

55ఓ, ప్రజలు నిన్ను చూచి నవ్వవచ్చు, మరియు "నీకు మతిపోయినది. నీవు పిచ్చివాడవయిపోయావు" అనవచ్చు. కాని గుర్తుంచుకోండి, వారు దేనినుండి త్రాగుతున్నారు, చూచారా. వారు ఎక్కడ వున్నారో చూడండి. ఒక పెద్ద మంచి నీరు ఉబుకుతున్న బావివద్ద నీవు ఉండగా, మరొక ఆయన ఆ గుంట దగ్గర చచ్చిన కప్పలతో, నానావిధములైన చెత్త సిద్దాంతములతో వున్న ఆ మురికినీరు త్రాగుతూ, పైకి చూచి నిన్ను ఎగతాళి చేయుటను నీవు ఊహించగలవా? ఓ ఎందుకు అతనికి తెలియదు; నీవు నివసించుచున్న దాహమును తీర్చే ప్రవాహము ఏదో అతనికి తెలియదు. అది ఖచ్చితముగా నిజము.

మనకు ఒక జీవముగల దేవుడున్నాడు, పందొమ్మిది వందల సంవత్సరముల క్రితం చనిపోయిన మరియు సమాధిలో పెట్టబడిన ఆయన కాదు, అయితే మరణమును జయించి తిరిగి లేచినవాడు. హెబ్రియులు 18:8 చెప్పుచున్నది, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు. ఇప్పుడు ఇక్కడ వున్న పరిశుద్దాత్మయే పెంతెకోస్తు దినమున కుమ్మరింపబడిన పరిశుద్దాత్మ ఆయన మనలను తృప్తిపరచే స్వాస్త్యము, ఎందుకనగా ఆయన వాక్యమైయున్నాడు. అది నిజము. పరిశుద్దాత్మ వాక్యమును వ్రాసినాడు; ఆయనే వాక్యమును అనువదించుచున్నాడు. పరిశుద్దాత్మ బైబిలును వ్రాసియున్నదని II పేతురులో బైబిలు చెప్పుచున్నది, "పూర్వము మనుష్యులు, పరిశుద్దాత్మవలన ప్రేరేపించబడినవారై బైబిలును వ్రాసిరి." ఇప్పుడు, నీవు దానిని చేయలేవు, దేవుడు తానే పరిశుద్దాత్మగా నీలో నివసించుటకంటె తక్కువగా నీవేమి చేసినను ఆ పరిశుద్ధ దాహమును తీర్చలేవు. విద్య, నాగరికత, సంఘములలో చేరడం, విశ్వాస ప్రమాణాలను కంఠత చేయడం, ఒక సహవాసమునకు వెళ్ళడం; ఇవన్నీ చాలా మంచివి, కాని అవి ఏ మాత్రము ఈ పరిశుద్ధ దాహమును తీర్చలేవు — ఆ పరిశుద్ధ దాహము — ఆ పరిశుద్ధ దాహమును అణచలేవు.

56గతరాత్రి నేను ఒక గొప్ప సువార్తికుడైన బిల్లీ గ్రాహం గారి ప్రసంగమును వింటున్నాను. నేను మీకు చెప్పుచున్నాను, కొందరు దైవదాసుల మీద ఆయన విమర్శ చేయడం నేను చూచినప్పుడు, నేను ఎన్నడు లేనంతగా ఆయన కొరకు ఇప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన అన్నాడు, "కాలర్లు ఎగరేసుకొని ఆ సేవకులమూక రహదారి మీద వచ్చుచున్నారు." వెళ్ళవలసిన అవసరం లేకున్నను వారు అలా వెళ్ళుచున్నారు, చప్పట్లుల్లా కొడుతూ మరియు వారి పాదములను తట్టుచున్నారు. మంచిది, అవును వారు అపవిత్రమైన బండలుగా కనబడుచున్నారు. ఇప్పుడు మీరు చూడండి, అయితే వారు ఒక దానియందు విశ్వాసముంచాను. వారిలో ఏదో వున్నది, అది ఆత్మను ఉత్తేజపరుస్తున్నది. వారిలో ఏదో వుండి వారిని ఆనందోద్రేకులుగా చేస్తున్నది. ఎవరో ఒక స్త్రీ వెళ్ళి మరియు ఆమె తలను అక్కడున్న దేనికో కొట్టుకొన్నది, మరియు ఆమె ఒక హతసాక్షి అని వారు తలంచారు. మరియు చేయుటకు ఆమెకు ఏ పనియు లేదు…

ఇప్పుడు, ఈ మనుష్యులు చప్పట్లు కొట్టడానికి వారిలో ఏదో వున్నదని మనము కనుగొన్నాము. వారు ఆనందంలో వున్నారు. వారు దేనినో చేస్తున్నారు. మంచిది, నీవు మంచిదని ఒక మూల సిద్ధాంతము కొరకు నీవు అలా చేయవచ్చు; ఆ తరువాత నీవు సంఘములో నిలబడి దానిని ప్రకటించినప్పుడు, కొందరు అది మంచిదని చప్పట్లు కొట్టినప్పుడు, లేక వారి పాదమును తట్టినప్పుడు సంఘ పెద్దలు వారిని తలుపు బయటకు గెంటివేస్తారు… చూడండి, వారు యేసుక్రీస్తు పునరుత్ధాన ప్రభావముతో ప్రకటించబడిన దేవునిచే దీవించబడిన పరిశుద్ధ వాక్యముతో ప్రజలను పోషించుటకు బదులు, మురికి గుంటలకు సంఘ సిద్దాంతములు మరియు సంస్థల యొక్క మురికి గుంటలకు మళ్ళించారు.

ACTS 4:13

 

57చూడండి, వారు ప్రయత్నించేది… "నేను పలనా-పలానా వైద్యుడను" అని లేక, నేను పలానా సెమినరీ లేక పలానా పాఠశాల నుండి వచ్చాను అని చెప్పుకోవటం ద్వారా వారు తమ దాహమును తీర్చుకొనుచున్నారు. అయితే దానివలన రవ్వంత కూడా ప్రయోజనం లేదు. "ఇప్పుడు, నేను ఆయన కాపరిని కాబట్టి దేవుడు నన్ను గుర్తిస్తాడు. "నేను పలానా - పలానా పరిశుద్ధ తండ్రిని, లేక నేను పలానా - పలానా బిషప్పుని కాబట్టి దేవుడు నన్ను గుర్తిస్తాడు," అని లేక ఆ విధమైనవి చెప్పుకోవటం ద్వారా తమ్మునుతాము తృప్తిపరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కుదరని దానితో వారు తమ దాహమును తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. "నాకు పి.హెచ్.డి. ఎల్.ఎల్.డి. వుంది, నాకు బాచిలర్-అఫ్-ఆర్ట్ పట్టా వుంది, నాకు ఇది వుంది…" అది అంతా మంచిదే. అయితే, నాకు మాత్రం నీవు అంత దూరంగా దేవునికి వున్నావని అర్థమగుచున్నది. అది నిజము, ఎల్లప్పుడు దేవునికి అంతమట్టుకు దూరంగానే యున్నావు.

నీవు దేవుని ఒక అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకొనగలవు. నీవు విద్య ద్వారా పొందుకోలేవు; అది నీలో జన్మించవలెను. అది దేవుడు నీకు ఎదో ఇచ్చునదై యునది. దానితో విద్య చేసేది ఏమీ లేదు. పరిశుద్ధ పేతురు, బైబిలులోని ఒక గొప్ప మనిషి, తన పేరును కూడా వ్రాయలేనివాడు. అది ఖచ్చితముగా నిజము, మరియు ఆయన మరియు యోహాను, వారిద్దరూ అజ్ఞానులు మరియు విద్యలేని పామరులని బైబిలు చెప్పుచున్నది. కాని పేతురుకే పరలోక రాజ్యపు తాళపుచెవులను ఇవ్వడం యేసుకు ఇష్టమయింది, ఎందుకనగా అతడు దేవుని కొరకు దాహం కలిగియున్నాడు. ఆమేన్! దేవుని కొరకు దాహం కలిగియున్నాడు. ఆయన సహవాసము కొరకు. అవునండి! ఓ, మై.

ISA 6:1-3

 

58నేను యెషయా గూర్చి ఆలోచించాను, ఆ యౌవనుడు, ఓ, ఒక మంచి యౌవనస్థుడు. ఒక రోజు దేవాలయములో అతడు వున్నాడు. గొప్ప రాజు, అతడి పట్ల విశ్వాసమును వు౦చెను మరియు అతడు గొప్పవారిలో ఒకడని తలచాడు, ఆయన మంచి కుటుంబములో పెరిగాడు, మంచి తల్లిదండ్రులున్నారు, ఒక మంచి తల్లి మరియు తండ్రిని కలిగియున్నాడు. అయితే ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఆయన రాజకీయములు చక్కగా వున్నాయి, మరియు అతడు దేవునితో అన్ని విషయములలో యథార్థముగా వున్నాడు. యెషయా ఆయన వైపు చూచి ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి మాదిరిగా తీసుకోవచ్చు అని తలంచాడు. అయితే యేసుక్రీస్తు అను మనిషిని తప్ప మరి ఏ మనిషిని కూడ నీకు మాదిరిగా ఉంచుకొనవద్దు. మనుష్యులందరూ తప్పిపోవుదురు. కొంతసేపటికి ఆయన ఒక ప్రదేశమునకు వెళ్ళాడు… అతడు రాజు, కాని అతడు యాజకుని స్థానం తీసుకొని మరియు దేవాలయములోనికి వెళ్ళాడు. మరియు అతడు కుష్టురోగముతో మొత్తబడ్డాడు.

అప్పుడు యెషయా ఆందోళన చెందాడు. కావున అతడు దేవాలయములోనికి వెళ్ళి మరియు అతడు అందోళనతో ప్రార్ధన చేయడం ప్రారంభించాడు. ఆయన లోపలకు వెళ్ళి కొంతసేపు ప్రార్ధన చేయాలనుకొన్నాడు. మరియు ఇప్పుడు, చూడండి, ఆ మనుష్యుడు ఒక ప్రవక్త. అయితే ఒక యౌవనస్తుడుగా దేవాలయములో ఒక రోజు దేవునికి మొర్రపెడుతున్నాడు, మరియు ఆయనకు ఒక దర్శనం కలిగింది. మరియు ఆయన చూడగా, సెరాపులు, వారు రెండు రెక్కలతో తమ-తమ ముఖమును, రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని, రెంటితో ఎగురుచుండెను. మరియు వారు దేవాలయము గుండా ముందుకు మరియు వెనుకకు, పైకి-క్రిందికి ఎగురుచు, "సర్వశక్తుడగు యెహోవా పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు" అని అరచుచుండిరి.

ISA 6:5-7

 

59మరియు యెషయా, అతడు పాఠశాలలో చదివియుండవచ్చు, కాని ఆయనలో ఆ గొప్ప దాహము వున్నది. ఒకవేళ అతడు మంచి చదువు చదివి యుండవచ్చునేమో. ఆయనది ఒక విశేషమయిన పుట్టుక, అతడు యాజకుల బోధలు వినేవాడు. అతడు దేవాలయములోనే వుండేవాడు. ఒక విశ్వాసిగా వుండుటకు పెంచబడినవాడు. అయితే మీరు చూడండి, ఆయన ఇంతకు మునుపెన్నడూ ఇలా ముఖాముఖిగా దాని ఎదుటకు రాలేదు, చూచారా. అతనికి మంచి చేయాలనే కోరిక ఉండేది. మంచిగా వుండాలని కోరేవాడు, కాని విద్య వైపు మాత్రమే వుండెను. అతడు దాని వేదాంతం వైపును కలిగియుండెను.

కాని ఆయన ఆ రోజు ఆలయములోనికి వచ్చినప్పుడు, సెరాపులు రెక్కలు ముందుకు వెనుకకు అల్లాడించుచు ఎగురుచున్నవి, ఈ దూతలు దేవుని సముఖమందు పరిచర్య చేయునని గుర్తించాడు, మరియు ఈ దూతలకు పాపమంటే ఏమిటో, తెలియదు, అయినా అవి దేవుని సముఖములో నిలబడుటకు తమ పరిశుద్ధ ముఖములను కప్పుకొనవలెను, అప్పుడు ఆ ప్రవక్త బిగ్గరగా అరిచాడు, "అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. నా వేదాంతము మరియు నేను నేర్చుకొన్నదంతయు, నా విశేషమైన పుట్టుక ఏమీ కాదు, నేను ఇప్పుడు దానిని ముఖాముఖిగా చూస్తున్నాను." అతడు, "నేను అపవిత్రమైన పెదవులు కలవాడను మరియు నేను అపవత్రమైన పెదవుల జనుల మధ్య నివసించువాడను."

మరియు వారి ధర్మశాస్త్రపు బోధలన్ని ఇంకా వారు చేసే అనేకములు, ఇప్పుడు అతడు వచ్చి వున్న దేవుని సన్నిధికి ఎన్నడూ చేరలేవు, మరియు ఆయన తన స్వంత కళ్ళతో దేవుని చూచాడు. మరియు ఆయన అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడై పరలోకములలో దూతగణములతో వున్నాడు. మరియు అక్కడ ముఖా ముఖిగా యధార్థముగా దేవుని సన్నిధిలో ఆయన వున్నాడు. మరియు ఆయన అరిచాడు, "నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, మరియు అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడను."

60అప్పుడు ఆ సెరాపులలో ఒకడు, బలిపీఠము మీద నుండి, కారుతో తీసిన నిప్పును తన చేతపట్టుకొని ఎగిరివచ్చి అపవిత్రమైన పెదవులను తాకెను, ఒక బోధకుడు, చదువుకున్న వ్యక్తి, ఒక పిరికివాని నుండి, ఒక ప్రవక్తగా దేవుని వాక్కు తన ద్వారా మాట్లాడేవానిగా ఆయనను మార్చివేసెను. నిజము, ఆయన దేవుని సన్నిధిలో వుండగా, అది ఏదో వ్యత్యాసముగా వుంది. ఆయన దానితో నింపబడువరకు, ఆయనలోని దాహం ఆ స్థలానికి చేరుకొన్నది.

మరియు స్నేహితుడా, నన్ను చెప్పనివ్వుము, నీవెన్ని సంఘములలో చేరినా, నీవు ఎన్ని పేర్లు పెట్టుకొన్నా నీవు ఏ మార్గంలో వెళ్ళినా, నీవు చిలకరించబడినా, మంచబడినా, లేక నీవు మరేమయినాగాని; యేసుక్రీస్తు అనే వ్యక్తిని నీవు కలుసుకోనంతవరకు ఏమీ లాభము లేదు. అది ఒక్కటి మాత్రమే నిన్ను నిజముగా తృప్తిపరచును. ఉద్రేకం దానిని చేయలేదు; నీవు పైకి-క్రిందికి ఎగురుతూ నీ ఇష్టం వచ్చినంత సేపు అరవవచ్చు, లేక నీవు నేలమీద పైకి-క్రిందికి పరుగులు తీయవచ్చు, మరియు నీ ఇష్టము వచ్చినంతసేపు భాషలతో మాటలాడవచ్చు మరియు ఆ విషయములు పరిశుద్ధమైనవి మరియు మంచివి. నేను వాటి మీద ఏమీ వ్యతిరేకంగా చెప్పుటలేదు. కానీ నీవు ఆ వ్యక్తిని కలుసుకునేవరకు, ఆ తృప్తిపరిచే భాగమును, అది నీ దేహంలోని ప్రతి నరమును తాకును, ఉద్రేకం ద్వారా కాదు, కాని సంతృప్తి ద్వారా…

1COR 15:55,57

 

61నేను ఒక చిన్న సంకేతమును చూచేవాడిని, "నీకు దాహమయితే పార్ఫే అని చెప్పు" అని చెప్పబడియుండును. నేను చిన్నవానిగా వున్నప్పుడు, "పార్ ఫే" అని పిలువబడే ఒక చిన్న పానీయము వుండేది. నాకు గుర్తువుంది, ఓ, నేను చేపల వేట నుండి వచ్చేటప్పుడు నేను ఒక చిన్న నిలువవున్న పాత నీటిగుంట దగ్గరకు వెళ్లేవాడిని. మరియు నాకు మరణమయ్యేంత దాహం కలిగినప్పుడు,

మరియు నేను, "నీవు దాహముగా ఉంటే, పార్ఫే అని చెప్పు" అనే సంకేతమును చూచాను. మరియు నేను "పార్ఫే, పార్ఫే" అని చెప్పటం ప్రారంభించాను. ఇంకా నా దాహం ఉధ్రుతమయ్యేది. మరియు నేను… చూడండి, మరలా నేను ఉమ్మికూడా వెయ్యలేకపోయేవాడిని, నాకెంతో దాహం అయ్యేది.

మంచిది, మీరు చూడండి, దానివలన ప్రయోజనము లేదు. దానిని ఏది కూడా తృప్తిపరచలేదు. నీవు పానీయములు త్రాగినా, మరి నీకిష్టమయినది ఏది త్రాగినా, తీపి శర్బత్ నీళ్ళ త్రాగినా, ఒక మంచి చల్లని, చల్లని నీటివాగు తప్ప మరేదియు నీ దాహమును తీర్చలేదు. అది ఆ దాహమును తీర్చును. మిగతా ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయాలు.

62మరియు మానవ ఆత్మలో ప్రతి నరమును, తృష్ణను తృప్తిపరిచే నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము వున్నప్పుడు, అది నేరుగా మరణమునకు ముందు నిలబడగలిగినప్పుడు, ఎందుకు మనము ప్రత్యామ్నాయమును తీసుకోవాలి? గొప్ప అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, "ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరియు సమాధి, నీ విజయమెక్కడ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు." సోదరుడా, అదే ఆ అనుభవము. అదే నీలోని ఆ పరిశుద్ధ దాహమును తృప్తిపరచును. అది దానిని తృప్తిపరచును. ఇంకా నీవు దాని గురించి వేరే ఏమి చేయవలసిన పనిలేదు, అవును, అది నీ పెదవులను శుద్ధిచేయును.

మరియు కొందరైతే ఉద్రేకముపైన జీవిస్తారు, ఉదేక్రముపైన… కొందరు, "మంచిది, మా పెంతెకోస్తు ఉద్యమంలో అది మాకెంతో వున్నది" అంటారు. మరియు దానిలోనికి వారు వెళ్ళెదరు, (అది మంచిదే), వారి చేతులు తట్టెదరు, మరియు సంగీతమును వాయిస్తారు. సంగీతం ఆగిపోయినప్పుడు, ష్-వ్యూ, ఒక బక్కెట్ నీళ్ళు వెళ్ళిపోయినట్లే, చూచారా. ఇప్పుడు, మనము దానిని చేస్తాము. అలా చేయడం మనకు అలవాటయింది. ఇది కేవలము మన వాడుకలో ఒకటిగా మారినది.

PS 42:1,2•

1COR 13:1-3

 

63మీకు కొంత నన్ను చెప్పనివ్వండి. నీవు దేవుని ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తున్నప్పుడు, ఆ విధంగా చేయడం నీకు ఆచారమయినప్పుడు, ఎందుకనగా నీవు తప్పక దానిని చేయవలెనని తలస్తున్నప్పుడు, నీవు అరవకపోతే, లేక పైకి క్రిందికి ఎగరకపోతే, లేక సంగీతముతో పాటు నాట్యము చేయకపోతే, నీ పొరుగువాడు నీవు వెనుకకు జారిన వ్యక్తివని అనుకొంటాడు అని నీవు తలంచుచున్నావు — నీవు మురికి వాగులో నుండి త్రాగుతున్నావు. సత్యము. నీలో ప్రతి నరమును నింపువరకు, పరిశుద్ధాత్మ నీలో తానే పొంగుచుండు వరకు… వారు సంగీతము వినిపిస్తున్నప్పటికి, లేక "నా దేవా, నీ దగ్గరకు సమీపముగా" అను పాట వినిపిస్తున్నప్పటికి, లేక మరేదయినప్పటికి నేను లక్ష్యపెట్టను, పరిశుద్దాత్మ ఇంకా నీ హృదయములో మహిమ గంటలు మ్రోగించుచునే యున్నది. అదే తృప్తిపరచును. అది తృప్తినిచ్చే దేవుని భాగము. దానికి తక్కువగా మరేది నీవు చేయరాదు.

నీవు మనుష్యుల భాషలతోను, మరియు దేవదూతల భాషలతోను మాట్లాడవచ్చును; ప్రవచించు కృపావరములు కలిగి, మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, బీదల పోషణకు నీ ఆస్థి అంతయు ఇచ్చినను; ఇంకా నీవు వట్టివాడవే (I కొరింథీయులు 13). ఆ సంపూర్ణమైన తృప్తినిచ్చేది వచ్చువరకు, అది మాత్రమే నీయొక్క దాహమును తీర్చును… "దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, నా ఆత్మ జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నేను దానిని కనుగొననియెడల, నేను నశిస్తాను." అలాటి దాహం నీకున్నప్పుడు, అది, ఎదో తప్పక జరిగి తీరును. పరిశుద్దాత్మ నిన్ను దేవుని జీవజలపు బుగ్గల యొద్దకు నడిపి౦చును. అవునండి!

MATT 16:17,18•

JOHN 4:24

 

64ఇప్పుడు, దేవుని ఆత్మతో ఆరాధించడం ఒక గొప్ప సంగతి, అది నిజము. కాని కొన్నిసార్లు నీవు సత్యం లేకుండా ఆత్మను కలిగియుంటావు. పరి. యోహాను 4 చెప్పుచున్న "మనము దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను." మరియు యేసే సత్యమైయున్నాడు. అది ఖచ్చితంగా నిజం. మరియు ఆయన వాక్యమైయున్నాడు.

సహజముగా నీ దాహమును తీర్చుటకు దేవుడు పంపిన నీటివాగులను, వాటిలో ప్రతిదానిని సాతాను కలుషితం చేశాడు. వాడు ప్రవేశించగలిగిన ప్రతి దానిలో వాడు విషపు మందును కలిపాడు. అది నిజము.

వాడు సంఘము యొక్క గొప్ప ప్రవాహమును చెరపట్టాడు. అది, దేవుని మార్గమైయున్నది. యేసు చెప్పెను, "ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు." ఇప్పుడు, దానిమీద వేర్వేరు అభిప్రాయములున్నవి. రోమీయులు, అంటే కాథలిక్కులు ఆయన దానిని పేతురు మీద కట్టాడు అంటారు, చూడండి. మరియు అది అలాగయితే, ఆయన అవమానముతో వెనక్కు జారాడు. కాబట్టి అది అలా కాదు, అది పేతురు మీద కట్టబడియుండలేదు, ఇప్పుడు, పెట్రా, అంటే చిన్న బండ.

మరి ప్రొటస్టెంటులు అది ఆయన తనమీదే కట్టెను అంటారు. యేసుక్రీస్తు వ్యత్యాసముగా వుండాలని కాదు, అయితే నేను వారితో విభేదించుచున్నాను. ఆయన ఒక్కదానిలో ఏ ఒక్కదానిమీదను కట్టలేదు. ఆయన ఎవరైయున్నాడు అను ప్రత్యక్షత మీద ఆయన దానిని కట్టెను. ఆయన, "యోనా కుమారుడవైన సీమోను, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేగాని నరులు నీకు బయలుపరచలేదు" అని చెప్పెను. జ్ఞానము ద్వారా కాదు, నీవు దానిని పుస్తకముల ద్వారా నేర్చుకోలేదు. సంఘములో చేరడం వలన నీవు దానిని నేర్చుకోలేదు. నీవు దానిని దుకాణములలో నేర్చుకోలేదు. నీవు నేర్చుకోలేదు… కానీ పరిశుద్దాత్మ తానే, యేసుక్రీస్తు అనే వ్యక్తిని నీకు ప్రత్యక్షపరచును అప్పుడు, "ఈ బండమీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు." ఆ పరిశుద్ధ దాహం యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా తృప్తిపరచబడుచున్నది. అక్కడే నీవున్నావు. దాని కొరకే మనము ఎదురు చూడాలి, దానితోనే మన దాహమును తీర్చుకోవాలి. అంతా మంచిది.

మనము దానిని తప్పక…

JOHN 6:37,44,53•

JOHN 10:27

 

65జ్ఞానము? ఓ, మై జ్ఞానము ఒక గొప్ప విషయము. మనము దానిని నింపు కొనుచున్నాము, మరియు ఈ రోజు మనము పూర్తిగా దానితో నిండిపోయాము. కానీ మీరు చూడండి, జ్ఞానము జ్ఞానమనే అంశము గురించే నిన్నటి దినమున నేను మాట్లాడుచుంటిని, అక్కడ ఒక మనిషి బయట నిలబడివున్న నా స్నేహితుడైన ఒకాయనతో మాట్లాడుచుంటిని, "ఒక మనిషి విద్యను నమ్మనట్లయితే, ఎందుకు బైబిలును చదువుచున్నాడు?" అన్నాడు.

నేను అనుకొన్నాను, "మంచిది, వారు యేసుక్రీస్తు చెప్పినదానినే నమ్మనట్లయితే, నాలాటి వట్టివాని మాటలు వారు ఎలా తీసుకొంటారు?" ఆయన ఎంత యధార్థముగా మాట్లాడినను వారు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఒకరోజు అక్కడ చెప్పెను, "మీరు మనుష్యకుమారుని యొక్క శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగితేనేగాని మీరు జీవముగలవారు కారు." ఆయన దానిని వివరించలేదు. ఆయన నడుచుకొంటూ వెళ్ళాడు. అది సత్యము, చూచారా.

వారన్నారు, "ఈ మనిషి నరమాంస భక్షకుడు. అతడు తన మాంసమును తిని, తన రక్తమును త్రాగమంటున్నాడు. ఈయన ఒక రక్త పిశాచి, చూడండి. అతడు మమ్ములను కూడా రక్త పిశాచిగా మారమనుచున్నాడు." ఆ తెలివిగలవారిని చూచారా? కాని ఆయన అన్నాడు, "నా గొర్రెలు నా స్వరమును వినును. అది ఎన్నుకోబడినవారికి వర్తి౦చును, దేవుడు తన అనంత జ్ఞానము ద్వారా ముందుగానే వారిని ఎన్నుకొన్నాడు. నా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నాయొద్దకు రాడు. మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరు నా దగ్గరకు వచ్చెదరు. వారు దానిని గ్రహించుదురు." శిష్యులు దానిని అర్థం చేసుకోలేకపోయారు, కాని దానిని వారు నమ్మిరి, చూచారా. అది నిజము. నీవు దానిని నమ్మినట్లయితే… నాకు అనేక విషయములు అర్ధము కావు, అయినను నేను దానిని నమ్ముతాను, చూచారా. ఎందుకనగా దేవుడు అది ఆ విధముగా వుండునని చెప్పెను.

1COR 2:4,5

 

66జ్ఞానము — సాతాను యొక్క సువార్త జ్ఞానమే, మీకది తెలుసా? వాడు ఏదెను తోటలో హవ్వకు దానిని బోధించాడు, తద్వారా ఆమె సాతాను యొక్క జ్ఞానసువార్త ద్వారా మోసపుచ్చబడింది. ఇప్పుడు, వాడు సమస్త మానవాళిని దానితో కలుషితం చేసిపారేశాడు. అది ఖచ్చితముగా సత్యము. వారు విద్యా కార్యక్రమాలు తీసికొని, మరియు వాటిని సంఘములో ప్రవేశపెట్టారు. వారు అక్కడ బాగానే యున్నారు, కాని దేవుని వాక్యములో లేరు. లేరండి. నీవు విద్య ద్వారా దేవుని తెలుసు కోలేవు. లెక్కలు నేర్చుకోవటం వలనగాని, పెద్ద మాటలు ఉచ్ఛరించడం ద్వారా నీవు దేవుని తెలుసుకోలేవు.

పౌలు, అతడు ఒక మంచి చురుకైనవాడు. కాని ఆయన క్రీస్తులోనికి వచ్చి పరిశుద్దాత్మను పొందిన తరువాత ఆయన కొరింథీయుల యొద్దకు వెళ్ళి అన్నాడు "మనుష్య జ్ఞానముతో కూడిన చమత్కారమైన తియ్యని మాటలతో నేను మీయొద్దకు రాలేదుగాని [ఆయన దానిని చెయ్యగలడు.] మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక యుండవలెనని నేను దేవుని శక్తితోను పరిశుద్దాత్మ ప్రభావము కనపరస్తూ మీయొద్దకు వచ్చితిని."

ఇప్పుడు కొన్నిసార్లు వారు సంఘ కార్యక్రమాలను వేస్తారు. వారు వారి కాపరిని కూడ పిలుస్తారు. సంఘము, కాపరిగారి కొరకు ఓటు వేయును. వాళ్ళంటారు, "మంచిది, ఈ కాపరి గారికి రెండు కళాశాల పట్టాలున్నవి. ఆయన నాలుగు సంవత్సరములు వేదాంత విద్యను అభ్యసించాడు. ఆయన దీనిని, దానిని, మరొక దానిని తీసుకొన్నాడు." మరియు ఒక కాపరిని దేవునిచే ప్రేరేపించబడి మరియు దేవునిగా నమ్మి ప్రజలు ఏమనుకొంటారో అని లెక్కచేయకుండా దేవుని వాక్యమును బోధించే వానిని విడిచిపెట్టి. ఎందుకు? అలాటి మనిషికి ఓటు వేస్తారు.

EZEK 2:7

 

67మీకు తెలుసా, దేవుడు యెహెజ్మేలుతో, "వారు నమ్మినను, నమ్మక పోయినను బోధించుము. దానిని ఎలాగైనను బోధించాలి" అన్నాడు. చూచారా? సరే. వారు దానిని అంగీకరించినా, అంగీకరించకపోయినా సరే. వారు యేసును అంగీకరించలేదు. ఆయన బోధించుకొంటూ అదే మాదిరిగా వెళ్ళిపోయాడు. దేవునియందు విశ్వాసముంచి దేవుని వాక్యమును నిజముగా బోధించే కాపరికి బదులుగా వారు ఒక మంచి తెలివైన వ్యక్తిని, మంచి విద్య కలిగిన వానిని తెస్తున్నారు. ఆ వ్యక్తి ప్రసంగ వేదిక మీద ఎక్కి పదిహేను నిమిషముల కంటే ఎక్కువ తీసుకోడు, కాబట్టి వారు తొందరగా ఇంటికెళ్ళి ఏదైనా చేయవచ్చు. రిక్కీగారు ఆయన వేగముగా వెళ్ళే కారును తీసుకొని మరియు త్వరగా బయలుదేరి పార్టీలకు, విందులకు మరియు అన్నిటికి వెళతారు. మరియు ఇది, సంకరమైన కలుషితమైన విద్య తప్ప మరేది కాదు. అది నిజము. అది ఖచ్చితంగా ఏమైయున్నదో అదే. అది నిజము.

కాని ఏమిటది? అది వారి రుచిని తృప్తిపరుస్తున్నది, చూచారా. అది లోక సంబంధమైన సంఘము యొక్క రుచిని తృప్తిపరుస్తుంది. పరిశుద్దుని రుచిని అది తృప్తిపరచలేదు. అతడు ప్రతిసారి వాక్యమును తీసికొనును. కాని వారంటారు, "ఓ, మంచిది, ఇప్పుడు ఈ మనుష్యులకు ఎక్కడో వారి మనస్సు దెబ్బతింది, చూడండి. వారు దానిని అర్థం చేసుకోలేరు. వారు, వారు జరిగిపోయిన రోజులో జీవించాలని ప్రయత్నిస్తున్నారు."

68నేను పశ్చిమానికి వచ్చినప్పుడు, మరియు వారు జరిగిపోయిన దినములో జీవించాలని ప్రయత్నం చేయడం నేను కనుగొనడం వింతగా లేదా, వారికి పాతకాలపు పశువుల పిల్లవాడి రోజులు కావాలి, మరియు కెంటకీకి వెళ్ళి అక్కడ పాతకాలపు కొండరోజులు గడపాలి, వారు ఆ విధమైన కార్యక్రమాలతో అలా ప్రవర్తిస్తున్నారు. కాని పాతకాలపు విశ్వాసమును అంగీకరించవలసి వచ్చేటప్పటికి, అది వారికెంత మాత్రము ఇష్టం లేదు పాత వాడుక రోజులు? నేనిక్కడికి పశువులు కాసే పిల్లల నైపుణ్యమును ప్రదర్శించే ఆట సమయానికి వచ్చాను; వారి దగ్గర అక్కడ నేను ఒక స్త్రీని చూచాను, కళ్ళ క్రింద పచ్చని రంగు, మరియు పొట్టిగా కత్తిరించబడిన వెంట్రుకలతో, నోట్లో ఒక సిగరెట్టు వుంది. ఎందుకు, అలాటిది వారు పాత రోజుల్లో చూసియుంటే, వారు ఆమె శరీరంలో ఏదో పుండు వ్యాపించి వుందని తలచేవారు. వారు, ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవారు. ఏమిటి? నీ తల్లే ఆ విధంగా నీవలె దుస్తులు వేసుకొని బజారులో నడిస్తే మరియు ఈ రోజు నీ కుమార్తె అలా దుస్తులు వేసుకుంటే ఏమి జరుగును? వారు నీ కుమార్తెను పిచ్చి ఆస్పత్రిలో వేసియుండేవారు. నిజం, ఆమె లంగా ధరించకుండా బయటకు వచ్చెను.

మంచిది, గుర్తుంచుకోండి, ఈ రోజున జరిగేది అదే. మనుష్యులు వారి దేహములో క్రుళ్ళిపోవుచున్నారు. ఇరవై నుండి ఇరవై-ఐదు సంవత్సరముల మధ్యలో వారు మధ్యవయస్సుకు చేరుకొన్నట్లయితే, వారి మెదడులోని కణములు కూడా క్రుళ్ళిపోవుచున్నవి. ప్రజలకు తెలివి వున్నది, కాని వారికి తగినంత గ్రహింపు లేదు. సభ్యత అంటే అర్థమే వారికి తెలియదు. వారికి మంచి చెడులమధ్య వ్యత్యాసమే తెలియదు.

మరియు, ఓ, వారికి విద్యా కార్యక్రమాలు వున్నాగాని, వారు…

69నీకు తెలుసా, విద్య, విజ్ఞాన శాస్త్రము, నా అర్థం చదవటం మరియు వ్రాయటం మాత్రమే కాదు, కాని విద్యను వారు సంఘములో ప్రవేశపెట్టడం. కమ్యూనిజం దేనిపై వున్నదేమిటి? విజ్ఞాన శాస్త్రము విద్య అదే వారి దేవుడు, చూచారా. సాతాను వాడు హవ్వకు పరిచయం చేసినది అదే. ఇప్పుడు వారంతా దానిని పట్టుకొనియున్నారు. ఇప్పుడు, అది మన సంఘములలోనికి వచ్చింది. బాప్టిస్తులు, మెథడిస్తులు, మరియు ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తులలోకి, మరియు అన్నిటిలోనికి అది వచ్చేసింది. కొంత చదువు, విజ్ఞానము, కొంత ఇది - అది మరియు దానివంటిది, అది కేవలము వారిని దేవుని నుండి దూరంగా త్రోసివేసింది. అది తప్పు అవునండి.

ఇప్పుడు అది వారి కోరికను తృప్తిపరుస్తుందని మనము కనుగొంటాము. సంఘము ఒక విషయానికి ఓటు వేస్తుందంటే, సంఘ విశ్వాసుల మనస్సులలో ఏముందో, వారి కోరిక ఏమిటో, వారి దాహం దేనికొరకో మనకు చూపుతుంది. వాళ్ళు అంటారు, "మా కాపరి గారు విశాలమనస్సుగలవాడు. ఆయన మేము కలిసి స్నానం చేసినా ఏమనుకోరు, మరియు ఆయనే మాతో కూడా వస్తారు."

70మొన్నటి రోజున ఒక చిన్న బాలిక నా కుమార్తె శారాతో చెప్పింది, ఆమె పాస్టర్ ఆఫిక్రా వెళ్ళారు. మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆ రాత్రి ఆమె తన బట్టలన్నీ విప్పివేసి, ఒక జత బిగుతైన బట్టలు ధరించి, అతనిని మురిపించుటకు గాను, మరి అతని కొరకు ఉత్తేజభరిత నృత్యమును చేసింది, ఎందుకంటె వారి కాపరి ఆఫ్రికాకు వెళ్ళి వచ్చారు. మీకు తెలుసా, వటూసి అంటే అక్కడ ఒక జాతివారు. బాలుడా, నా సంఘములో ఒక బాలిక ఆ విధంగా ఉత్తేజ భరిత నాట్యము చేయుటకు ప్రయత్నిస్తే, దానిని చూచి నేను సహిస్తానా? చూడండి, అది చూపినది.

మరియు ఒక కాపరిగారు తన సంఘస్తులలో ఒకరి ముందు కూర్చొని మరియు తన సభికులలో ఒకరి వైపు చూచి, పదహారు లేక పద్దెనిమిది సంవత్సరముల వయస్సు కలిగిన ఒక బాలిక తన వస్త్రములను తీసివేసి ఆ విధంగా ఆమె నాట్యములు చేయడం, అది ఏమి చూపుతుందంటే ఆయన ఒక మురికిగుంట నుండి వచ్చినవాడని తెలుస్తుంది. ఒక దైవజనుడు అలాటి దానిని చేస్తాడా? నిశ్చయంగా. అది కఠినముగా వినిపిస్తున్నది, కాని నేను దేశమంతటికి కూడ బోధిస్తున్నాని గ్రహించాను. సహోదరి, సహోదరుడా, నీకు ఇది కూడా తెలియాలి, నన్ను మీకు చెప్పనివ్వండి, అదే సత్యము.

1JN 2:15

 

71ఒక రాబందుకు చచ్చినవి కావాలి. అది నిజము. మరియు అదే చనిపోయినది. అది ఖచ్చితంగా నిజము. తేటగా చూపేదేమంటే అది తేటగా చూపినది ఏమనగా, వారి తల ఏదో మరియు వారి నియంత్రణ శిఖరము ఏదో, అది వారికి ఇచ్చుచున్నదేమిటో, చూచారా, వారికి ఆత్మలో ఏమున్నదో అని. వారి ఆత్మ అలాటి విషయాల కొరకు ఎదురు చూస్తున్నది. వారి ఆత్మ గొప్ప తెవివైన సంఘము కొరకు ఎదురుచూస్తున్నది, అక్కడ ప్రజలు చక్కగా దుస్తులు ధరిస్తారు, మరియు కాపరిగారు పదిహేను లేక ఇరవై నిమిషములు తీసుకొంటాడు. మరియు కాపరిగారి ప్రసంగము ఆ సమయం దాటిందంటే, పెద్దల బోర్డు ముందు వారు ఆయనను వుంచుతారు. మరియు ఆయన పాపమును గురించి ఎట్టి పరిస్థితులలో మాట్లాడకూడదు. స్త్రీలు పొట్టి దుస్తులు వేసుకోవటం గురించి ఆయన ఏమీ మాట్లాడకూడదు, మరియు వారు అది, ఇది, మరేదో చేస్తున్నారని మాట్లాడకూడదు. ఆయన వాటి పేరు ఎత్తకూడదు. ఒకవేళ ఆయన అలా చేస్తే, పెద్దల బోర్డు ఆయనను పంపివేస్తారు. చూడండి ఏమిటది? అది వారియొక్క ఆలోచనాపరుని వడపోత సాధనము.

I యోహాను 2:15లో బైబిలు చెప్పుచున్నది, "నీవు ఈ లోకమును గాని లోకములో వున్నవాటిని గాని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ అసలు నీలో వుండదు."

72ఇప్పుడు, సంఘము యొక్క పేరుతో ఈ రోజు వారు కొనసాగించుచున్న సంగతి గురించి ఏమిటి? నాలుగు జంటలు చదరపు ఆకారములో ఒకరికెదురుగా ఒకరు నిలుచుకుని చేసే నృత్యము; సంఘములో అభ్యాసము చేయుట, మోసకరమైన తంత్రములతో కూడిన విద్య, అట్ట ముక్కలపై అంకెలు వేసి, కుదిలించివేసి, ఒక అంకెను యథేచ్ఛగా ఎన్నుకొని, గెలిచినవానికి ధనము ఇచ్చే ఆట, యౌవనస్తుల రాక్ అండ్ రోల్, కులికే నృత్యములు ఇవన్నీ ఎల్విస్ ప్రేస్లి వైపు చూడండి, బూట్ల వేసికొని నిలబడియున్న ఒక దయ్యము. పాట్ బూన్, రిక్కీ నెల్సన్, దేశమునకు ఎన్నడూ కలిగియుండనంత అతి పెద్ద అభివృద్ధి నిరోధకాలు. అది నిజము.

వారంటారు, "ఓ, వారు చాలా భక్తిపరులు. వారు క్రైస్తవ పాటಲು పాడారు." అది కూడదు… సంఘము అలాటి పనిని ఎన్నడూ అనుమతించరాదు. ఈ కుర్రవాళ్ళు కొందరు ఇక్కడ నుండి, మరియు ఈ రాత్రికి వారు ఒక రోడ్డు ప్రక్కన ఇంట్లో నాట్యములు చేసి, మరియు సంగీతం వాయించి అంతా చేసి, మరలా తరువాత రాత్రి ప్రసంగ వేదికపైన సంగీతం వాయిస్తారు. ఓ, కృపగలిగిన! ఏ విధంగా అయినను మురికి ఎంత దూరం, మురికి ఎంత దూరం వెళ్ళగలదు? అవునండి. ముందు ఒక వ్యక్తి తాను ఒక దైవజనుడుగా తన్ను తాను నిరూపణ చేసుకోవాలి, ఆయన ఒక పాత గిటారు వాయించగలడని మరి ఇంకేదైనా చేయగలడని కాదు.

నీ హృదయ సింహాసనము మీద ఎవరున్నారో, నీ యొక్క కోరిక ద్వారా చెప్పవచ్చు. నీకు ఏదంటే ప్రేమో, అది నీవు ఏమిటో చెబుతుంది. నీవంటావు, "మంచిది, ఇవన్నీ మంచివేనండి, సహోదరుడు బ్రెన్హాం గారు." మంచిది, ఇప్పుడు గుర్తుంచుకో, నీ హృదయములో ఏమున్నదో నీకు తెలుసు. అవునండి. నీ ఆత్మను ఏది పోషించుచున్నదో, నీ ఆత్మ దేనికొరకు దాహముగొనుచున్నదో, మరియు అది నిన్ను తృప్తిపరచటం నీవు చూడగలవు — అది ఈ వాక్యం కానిచో, ఎక్కడో తప్పు వున్నది. ఎందుకనగా పరిశుద్దాత్మ వాక్యము మీద మాత్రమే నివసించును, చూచారా.

73మనము ముగించక మునుపు, నేను మరొక గొప్ప అపాయమును చూడదలచాను, నేను వివరించిన విషయములలో ఏ విషయములోను నీవు తప్పిదస్తుడవు కాకపోతే, నీవు దాహమును నిర్లక్ష్యము చేస్తే వచ్చే గొప్ప ప్రమాదము అదే, చూచారా. నీవంటావు, "నాకు పరిశుద్ధ దాహం వుంది. అయితే సంఘములో చేరి ఇలాటివి చేయడం వలన, నేను తప్పిదస్తుడను కాను, సహోదరుడా బ్రెన్హాం గారు." కాని చూడుము, దాహమును నిర్లక్ష్యము చెయ్యడం. నీవు శరీరమునకు దాహమయిన నీటిని, ఆహారాన్ని ఇవ్వకపోతే నీవు మరణిస్తావు. మరియు అలాగే దేవుని కొరకు ఉన్న నీలోని దాహమును నిర్లక్ష్యము చేస్తే, నీవు ఆత్మీయముగా మరణిస్తావు.

ఉజ్జీవముల కొరకు మీరు పిలవండి. మీ సంఘము ఉజ్జీవము పొందుటకు మీరు వేచియుండుడి. మంచిది, అది మీకు ఉజ్జీవము కాదు. మీరు దేవుని కొరకు దాహంగొనడం ప్రారంభించినప్పుడు, ఉజ్జీవము సరిగా మిలోనే ప్రారంభించి తీరుతుంది. సంఘములోని మరొక సభ్యుడు ఆ ఉజ్జీవమును కోరుకొనకపోవచ్చును. అది మీలో విరిగిపోయినట్లయితే, అది వేరొక ప్రాంతములను విరచివేయును, చూచారా.

అయితే చూడండి, మీరు ఆ దాహమును నిర్లక్ష్యము చేయుదురు. ఆవుకు రొమ్ము నిండా పాలు ఉన్నప్పుడు, నీవు పాలు తీయకుండా ఆవును నిర్లక్ష్యము చేస్తే, మరియు నీవు ఆవును అలాగే ఉ౦చితే, అది ఎండిపోవును. అది ఖచ్చితముగా నిజం. నీవు నీరు త్రాగకుండా నిర్లక్ష్యం చేస్తే, "నేను నీళ్ళు ఇక త్రాగటం లేదు? అంటే నీవు చనిపోతావు. నీవు ఆహారం తినడం నిర్లక్ష్యం చేస్తే, నీవు మరణిస్తావు. నీవు పరిశుద్దాత్మకు దేవుని వాక్యమును ఇచ్చుటకు నిర్లక్ష్యము చేసినచో, నీవు మరణిస్తావు.

MATT 4:4•

LUKE 4:4

 

74క్రైస్తవులైన మీరు, బాప్టిస్తులారా, మెథడిస్తులారా, ప్రెస్బిటేరియనులారా, పెంతెకోస్తువారలారా, అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారలారా, ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము, మీరు ఎవరైనను సరే, చూచారా —నేను దానిని లెక్కచేయను — అది నాకు ఏమీ కాదు. దేవునికి కూడా అవసరమని నేను తలంచుట లేదు, చూడుము.

నీవొక వ్యక్తివి. నీవు ఒక్కడివి. నీవు ఒక సంఘముగా, ఒక సంస్థగా ఎన్నడూ పరలోకానికి చేరలేవు. నీవు పరలోకానికి ఒక వ్యక్తివిగా మాత్రమే వెళ్ళుదువు, అది నీకు దేవునికి సంబంధించినది. అది అంతే. నీవు ఏ సంఘానికి చెందియున్నను నాకు అనవసరం. మరియు బైబిలును నమ్మట మరియు బైబిలును చదువుట మరియు పరిశుద్దాత్మ దానిద్వారా నీ ఆత్మకు ఇచ్చుటను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే, నీవు చనిపోతావు. పరి. యోహాను 4:3లో యేసు చెప్పెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును," దానిలో కొంత భాగము వలన కాదు. మనము ఇక్కడ కొంచెము తీసుకొంటాము. నేను దానిని "బైబిలు ఒకచోటు నుండి వేరొకరి ధర్మంతో వారి వాహనములో ప్రయాణించువాడు," అంటాను. వారంటారు, "మంచిది, నేను దీనిని నమ్ముతాను, అయితే మనము ఇక్కడనుండి పైకి వెళ్ళుదము," చూచారా. నీవు దానిని మాట తరువాత మాటను తీసుకోవాలి.

యేసు చెప్పెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును." అది మీకు తెలుసా?

మరియు, మీకు తెలియును, మనము జీవించుచున్న… ఆ రోజును ఒక మతసంబంధమైన వక్రముగా చేశాము.

75ఈ మధ్య నా కుమార్తె లోపలకు పిలిచి, మరియు నాతో చెప్పింది, "నాన్నగారు …" (మా ఇంటి ప్రక్కన) ఇక్కడకు రండి, ఇక్కడ ఒక భక్తి ప్రదర్శన జరుగుచున్నది. ? అది పాటలు, కీర్తనలు పాడటం, మరియు అక్కడ ఒక చిన్న రిక్కీ అక్కడ దానిని చదువుతున్నది. మరియు నేను ఇదివరకెన్నడూ అంత దైవద్రోహమైన కదలికను చూచివుంటే, ఇది అదే. ఆ పిల్లలు, మరియు అక్కడ ప్రజలను చూస్తుంటే, అది మేడ ప్రదర్శన కంటే ఎక్కువగా కనపడుచున్నది. అది ఇండియన్ తెగవారు చేసినట్లు, వారు ఒకరిని ఒకరు మోసుకొంటూ, మరియు పైకి ఎగురుతూ, ఒకరిని ఒకరు గుద్దుకొంటున్నారు.

మనము దేవుని ఆత్మలో ఆనందిస్తూ వుండగా, మన చెంపలపై కన్నీరు కారుచుండగా మనము పాడే ఆ పాతకాలపు కీర్తనలు ఎక్కడ? మరియు మనలో తగినంత శ్వాస లేనంతవరకు, మన ముఖములు నీల వర్ణమునకు తిరిగేవరకు మనము ఒక తరహా గాయకుడు అని చూపించుకోవడాని కొరకు మన ఊపిరిని బిగబట్టడానికి ప్రయత్నిస్తాము. మనము హాలీవుడ్లో ఉన్నదానిని చూచి అలాగే చేయుచున్నాము, మరియు మనము చూచుచున్న ఈ ప్రదర్శనలన్నీ వాటి స్వరములను శిక్షణ చేసుకొని తెలివైన కీర్తనలు పాడటమే. మంచి పాటలు పాడుటను వినుట నాకు ఇష్టం. ఆ పాతకాలపు, హృదయములను స్పందింపజేసే, పెంతెకోస్తు గానమంటే నాకెంతో ఇష్టం. అయితే ఈనాడు పాడుట అని వారు చెప్పుచున్న ఆ కీచుమని అరచుటను నేను నిశ్చయంగా అసహ్యించుకొనెదను. అది ఒక వక్రము. అది నిజము.

76అతను పురుషుడైతే, నేను పురుషుని చూడాలనుకొంటాను. ఒకడు తన భార్య యొక్క లోపలి దుస్తులను బయట ధరించి, ప్రక్కకు మృదువుగా మరియు ముందు జుట్టుకు చుట్టను వ్రేలాడదీసి జుట్టును కత్తిరించి రెండు జుట్టు పాయలను కొప్పులుగా చుట్టుటను చూచుట నాకు అసహ్యం. దానిని, నేను పురుషుడని పిలువలేను. అతడు ఏ జాతికి చెందినవాడో అతనికే తెలియదు, చూచారా. అది నిజము. మీరు స్త్రీలను చూడండి, స్త్రీ - పురుషునివలె తన జుట్టును కత్తిరించుకొనుచున్నది. పురుషుడు తన జుట్టును స్త్రీ వలె కొప్పులు చుట్టుచున్నాడు. పురుషుడు ధరించే చొక్కాలు, లాగులను ధరిస్తున్నది, చూచారా. ఇది అంతా చూట్టూవున్న వక్రము.

మరియు ఇప్పుడు దేశముతో, ప్రజలతో, సంఘముతో వున్న చిక్కు అంతా అదే. ఓ, దేవా, వీటికి అంతము ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు రాకడయే దీనికి అంతము.

JOHN 8:44

 

77కాబట్టి నీవు దేవుని వాక్యమైన పరిశుద్దాత్మను పోషించుటకు నిర్లక్ష్యము చేస్తే. యేసు చెప్పెను, ప్రతి మాట పరిశుద్దాత్మతో కూడినది. మరియు ఇప్పుడు వినండి, నీవు తప్పైన దానిని నీ ఆత్మకు ఇచ్చుటకు ప్రయత్నించినచో, నీలో నిజమైన పరిశుద్దాత్మ వున్నట్లయితే, అది వెంటనే భేదమును గ్రహించును. ఇప్పుడు, గుర్తుంచుకొనండి పరిశుద్దాత్మతో పోషించబడునదే దేవుని వాక్యము. అది వీరావేశము మీద పోషింపబడదు. అది విద్య మీద పోషింపబడదు. అది ఆలయానికి వెళ్ళడంవలన పోషింపబడదు. అది వేదాంతములవలన పోషింపబడదు.

ప్రేరేపించబడిన వాక్యమునకు, వేదాంతమునకు మధ్య గొప్ప తేడా ఉన్నది. యేసు ప్రభువు కాలములోని వేదాంతులు వాక్యమునకు వాక్యము, పేజీకి పేజి పట్టుకొని, మెస్సీయా ఈ విధముగా రావలసియున్నాడని అన్నారు. అది నిజముగా ఆ విధముగానే ఉంది. మరియు వారిలో ప్రతిఒక్కరు దానిని పోగొట్టుకొన్నారు. మీకు తెలుసా, యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏమన్నాడు, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడి క్రియలే మీరు చేస్తారు" అన్నాడు. నిజమైన వాక్యము ఏమిటో వారికి ప్రత్యక్షపరచబడలేదు. చూడండి, ఈ రోజు అనేకులు దానిని పోగొట్టుకొన్నట్టు, వారు ఆ చిన్న మూలలను పోగొట్టుకొన్నారు.

"నీవు దీనికి చెందివున్నట్లయితే…"

మరియు "దీనికి చెందియుంటే, నీవు చక్కగా వుంటావు." మీరు దానిని నమ్మవద్దు. నీవు క్రీస్తుకు చెందవలసియున్నావు.

ISA 7:14•

JOHN 1:18•

EPH 2:6

 

78నీలో ఎదో క్రీస్తు కొరకు ఆకలి ఉనట్లయితే, గుర్తుంచుకొనుము, నీవు నీ తండ్రియొక్క నడుములలో ఉన్నప్పుడు, నీవు ఆయనతో అప్పుడే ఉన్నావు. అయితే నీ తండ్రికి నీవు తెలియదు, నీకు కూడా నీ తండ్రి తెలియదు. మరియు నీవు జన్మించవలసియున్నావు. దేవుడు నీ తల్లి ద్వారా ఒక మార్గమును ఏర్పాటు చేశాడు, ఆ విత్తనం తల్లి గర్భము ద్వారా పెరిగి అది బయటకు వచ్చును. ఆ తరువాత నీవు పురుషుడవో లేక స్త్రీవో అవుతావు, అది ఏదైనా కానివ్వండి, అప్పుడు నీవు నీ తండ్రిని గుర్తిస్తావు, మరియు నీ తండ్రి నీతో సహవాసము చేయగలడు.

ఇప్పుడు, గుర్తుంచుకొనుము, నీకు నిత్యజీవమున్నట్లయితే, నీ జీవము ఆదియందే దేవునిలో ఉన్నది. మరియు ఆ జీవము… దేవుడు వాక్యమైయున్నాడు. ఆ తరువాత ఆ వాక్యము యేసుక్రీస్తుగా శరీరము దాల్చినప్పుడు, దేవుడు తన సొంత శరీరంలో నివసించటానికి దిగివచ్చాడు, తననుతాను దేవుని కుమారునిగా చేసుకొన్నాడు, దేవుడు ఆ శరీరములో నివసించడానికి దిగివచ్చినప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు నీవు ఆయనలో ఉన్నావు. మరియు నీవు ఆయనతో సిలువ వేయబడియున్నావు, మరియు ఆయనతో కల్వరిలో చనిపోయినావు. ఆ కొండ మీద ఆయనతో పాటు సమాధి చేయబడినావు. మరియు నీవు మరలా ఆయనతో ఆయన పునరుత్దానమైన ఉదయాన తిరిగి లేచావు. మరియు ఇప్పుడు నీవు ఆయనతో పాటు ఆయనలో ఉన్నావు. మరియు నీవు ఆయనతో సిలువ వేయబడియున్నావు, మరియు ఆయనతో కల్వరిలో చనిపోయినావు. ఆ కొండ మీద ఆయనతో పాటు సమాధి చేయబడినావు. మరియు నీవు మరలా ఆయనతో ఆయన పునరుత్దానమైన ఉదయాన తిరిగి లేచావు. మరియు ఇప్పుడు నీవు ఆయనతో పాటు ఆయనలో పరలోక స్థలాలలో కూర్చొనియున్నావు, మరియు ఇప్పుడు ఆయనతో సహవాసము కలిగియున్నావు, చూచారా. దేవుడు తానే మనలో ఒకడు అయినాడు. "ఏ మనిషి తండ్రిని ఎన్నడూ చూడలేదు, కాని ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే — తండ్రిని బయలుపరచియున్నాడు." దేవుడు ఒక మానవుడయ్యాడు, తద్వారా ఆయన నీతో మానవునిలాగే సహవాసం చేశాడు, చూచారా. మరియు ఇప్పుడు, నీవు ఒక శరీరము, మరియు ఆయన ఒక శరీరము.

ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో దేవుడు మనమధ్య శరీరధారి అయ్యాడు. మరియు ఆయనలో దేవుడు ఉండెను. ఆయన దేవుడైయుండెను, దేవుని కన్నా ఏమీ తక్కువ కాదు. ఆయన దేవుడైయుండెను, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడ్డాడు, ప్రవక్త చెప్పినట్లు అందుకే ఆయన ఇమ్మానుయేలు అయ్యాడు.

REV 22:18,19

 

79ఇప్పుడు చూడండి, లోకము పుట్టకముందే, నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నది. ఆ తరువాత నీవు ఏమి తినగలవు? పరిశుద్ధాత్మ దేవుని వాక్యముపై నివసించును. మరియు ఇప్పుడు ప్రకటన 22:19లో బైబిలు చెప్పుచున్నది, "ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనను తీసివేసినయెడల, లేక ఒక వాక్యమును దీనికి చేర్చినయెడల, జీవగ్రంథములో అతని భాగము తీసివేయబడును." ఇది ఎంత లోతైనదో చూచారా?

పరిశుద్దాత్మ ఈ లోక విషయముల మీద జీవించదు — ఒక పావురము మరియు ఒక కాకివలె, ఒక కాకి ఒక పెద్ద వేషధారి. ఒక కాకి అది దినమంతా గోధుమలు తిని, మరలా వెళ్ళి చచ్చిన కళేబరము మీద వ్రాలి, మరియు దానిని కూడా తింటుంది. అది పొలములో పావురములతో కూర్చొని తినగలదు, మరలా వెళ్ళి చచ్చినవాటిని తింటుంది. కాని ఒక పావురము దినమంతా గోధుమలు తినగలదు, కాని అది చచ్చిన కళేబరమును ముట్టదు, ఎందుకనగా అది ఒక పావురము. మరియు ఒక పావురము పిచ్చును కలిగియుండదు. చచ్చిన కళేబరమును ఒక్కసారి కొరికితే, అది పావురాన్ని చంపివేయును, చూడండి. దానికి పిచ్చు లేదు. మరియు, చేదు ఉండని విధముగా అది వున్నది.

మరియు అదే మాదిరిగా ఒక నిజమైన క్రైస్తవుడుంటాడు. వారు లోకములోని వస్తువులను కోరుకొనరు. వారు వాక్యమును మాత్రమే భుజిస్తారు, మరియు దానిని మాత్రమే భుజిస్తారు, ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము ఎంత శుభ్రముగా వున్నది, చూచారా. వారు దాని ద్వారా వచ్చారు మరియు దాని ద్వారా మాత్రమే వచ్చారు. ఈ లోకములోని వస్తువులు వారికి దుర్గంధముగా ఉంటాయి. ఆ ప్రాచీన నాశనములోని, ఆ పాత కాకిని చూడండి, అది కళేబరము నుండి కళేబరము మీదికి ఎగురుచూ, ఆ చచ్చినవాటిని తింటూ, మరల ఓడలోనికి రాలేదు. కానీ పావురమునకు కాలు మోపుటకైనా వీలులేనప్పుడు, చూచారా. అది మరలా తనకు గింజలు దొరికే ఓడలోనికి తిరిగి వచ్చింది. మరియు మనము ఆ విధంగానే చేయుదుము. మనము దేవుని వాక్యమువలననే జీవించుదుము.

1CH 11:16,17•

PS 42:1,2

 

80కీర్తనలు 42లో… దావీదు శరణార్థిగా కొండలలో ఉన్నప్పుడు ఈ 42వ కీర్తనను వ్రాసియుండవచ్చును, "దుప్పి నీటి వాగులకొరకు ఆశపడునట్లు, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది" అని దావీదు చెప్పెను. చూడండి. అతడు మొర్రపెట్టెను… దావీదు ఒక దిక్కులేనివానిగా ఉన్నాడు. ఆయన మీద దేవుని అభిషేకము ఉన్నది. ఆయన రాజు కాబోతున్నాడని ఆయనకు తెలుసు. దేవుని ప్రవక్త ఆయనను రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు, గమనించండి. మరియు ఆయనతో పాటు అన్యులైన కొద్దిమంది సైనికులున్నారు, వారంతా కొండ పై భాగమున ఉన్నారు. అక్కడ ఆయన సొంత ప్రియమైన పట్టణము, వారి పాపమును బట్టి ఫిలిస్తీయుల సైన్యసమూహములతో పట్టణము చుట్టు ముట్టబడియున్నది. మరియు దావీదు ఆ ఎండ వేడి రోజున ఈ కీర్తన వ్రాసియుంటాడు, "దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు."

ఈ పరిస్థితిలో దావీదును గమనించండి. తన ప్రియమైన పట్టణమువైపు వంగి చూశాడు. మరియు ఆయనకు గుర్తున్నది, ఆయన చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఏదో ఒక వాగు దగ్గరకు తన గొర్రేలను నడిపించేవాడు. అది ఒక గొప్ప, గొప్ప నీటివాగులుగల దేశము, మరియు గొప్ప ఆహారముగల దేశము. నిజముగా, "బేత్లెహేం" అంటే "దేవుని రొట్టెల ఇల్లు" అని అర్ధము. మరియు ఆ తరువాత దావీదు తాను ఏ విధముగా అక్కడకు వెళ్ళి ఆ మంచి చల్లని నీరు త్రాగే వాడో, ఇప్పుడు ఇక్కడ ఎలా తన ప్రజలకు దూరముగా ఒక దిక్కులేనివానిగా పడివున్నాడో, ఆయన జ్ఞాపకం చేసికొంటున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళడానికి ఏ స్థలమును లేదు, మరియు ఆయన ప్రాణం ఆ చల్లని నీటి కొరకు తపించి ఉండవచ్చు.

1CH 11:17,18

 

81ఆయనకు కొంతమంది దాసులు ఉన్నారు. మై, ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇస్తే చాలును. మరియు వారు, వారిలో ముగ్గురు, ఆ ఫిలిస్తీయులతో పోరాడి వారిని ఏడు లేక పదిహేను మైళ్ళవరకు వారిని తరిమి; వారి మార్గమును అటకాయించి, మరియు ఆయనకు దాహమునకు నీళ్ళు తెచ్చారు.

కానీ ఆత్మ దాహము… ఆ ఎండ దినమున, ఆ కొండ పైభాగమున ఆయన బహుశా పాత మేక చర్మములోని వేడి నీళ్ళు త్రాగుతూ ఉండవచ్చు. "నేను క్రిందకు వెళ్ళి నాకున్న ఆ దాహమును తీర్చుకొంటే. నేను క్రిందకు బేత్లెహేము వెళ్ళి ఆ చల్లని నీటివాగు దగ్గర చేరి నీరు త్రాగితే" అని ఆయన తలస్తున్నాడు.

1CH 11:18,19•

JOHN 6:35

 

82మరియు వారు క్రిందకు వెళ్ళి మరియు నీళ్ళను తీసుకు వచ్చినప్పుడు, ఆయన ఆత్మ దాహం చాలా ఎక్కువయింది, బేత్లెహేము కాదు, గాని యెరూషలేము కొరకు. అప్పుడు ఆయన నీళ్ళను త్యాగము చేసి, అన్నాడు, "నేను ఈ నీటిని అసలు త్రాగను." ఆయన నీళ్ళను నేలపై పారబోశాడు. చూడండి, మంచి చల్లని నీటితో తన శరీర దాహమును తీర్చుకొనుట కంటే ఆయన ఆత్మ దేవునికొరకు ఇంకా ఎక్కువగా దాహంగొన్నది. ఆయన వాటిని నేలమీద కుమ్మరించాడు. చూడండి, దేవుని ఇంటిని, ఆత్మను చల్లపరిచే పైనున్న యెరూషలేము నీళ్ళు.

యేసు చెప్పాడు, యోహాను 6:38 లో, "జీవాహారమును నేనే. జీవాహారమును నేనే." బేత్లెహేము, దేవుని ఇల్లు, మన సంఘము, ఇక్కడ భూమిమీద ఉన్న దేవుని సంఘము. ఈ భూమిమీద ఉన్న సంఘమునకు వెళ్ళుటకు మనము ఇష్టపడతాము, కానీ యెరూషలేము గొప్పది, అది పైనున్నది, అదే దేవుడైయున్నది. పైనున్న యెరూషలేమే దేవుడైయున్నది. ఎక్కడో సంఘములో చేరి నిన్ను తృప్తిపరచుకోవడం కంటే ఆయనతో పైనవుండే ఆత్మదాహం చాలా గొప్పది. చూచారా, సంఘములో చేరడం ఆ దాహమును తృప్తిపరచదు. దావీదు ఇక్కడ దానిని నిరూపణ చేశాడు. దేవుని ఇంటినుండి వచ్చే నీళ్ళను, చూచారా. దేవుని దయ పొందుటకు, దేవునియొద్ద నుండి చల్లని నీరు పొందుటకు ఆయన వాటిని నేల మీద కుమ్మరించాడు. ఆ ఎండ రోజు నీలోని మామూలు దాహంకంటే దేవునికైన ఆత్మదాహం గొప్పది.

GAL 4:26

 

83యెరూషలేము అనే మాటను గమనించండి, ఆ పదము… పైనున్న యెరూషలేము, అది మనము… మనందరకు తల్లి అని బైబిలు చెప్పుచున్నది. మరియు క్రీస్తు మన తల్లి, మనము దానిని గ్రహించాము. మనము ఆయనలో నుండి పుట్టాము, కాబట్టి దేవుడే మన తల్లి. యెరూషలేము, షాలోము అను మాటలకు అర్థము, "సమాధానము" లేక షాలోం అనగా "సమాధానము," యెరు-షాలోం (చూచారా?) అనగా "సమధానము" అని అర్థం. నీవు ఒక సంఘమునకు చెందినవాడవని చెప్పడం కంటే ఏ ఆత్మలోనైనా జీవజలముల కొరకైన దాహం గొప్పగా ఉండాలి. ఆత్మయొక్క నిజమైన దాహం వేరే విధముగా తృప్తిపరచబడనేరదు. దానిని వక్రముగా చేయవచ్చు, నీవు సంఘములో చేరినప్పుడు నీవు బాగానే యున్నావని అనుకోవచ్చు, కాని అది కాదు. అది నిజమైన దేవుని కొరకైన దాహమును తీర్చలేదు. దానివల్ల కాదు. అది కేవలం అది దానిలో లేదు.

PS 42:7

 

84ఇప్పుడు, దావీదు ఇక్కడ కీర్తనలు 42:7లో, "నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది." ఆత్మ పిలుపు. చూడండి, నేను అప్పుడప్పుడు దీనిని ఒక ఉదాహరణగా ఉపయోగిస్తాను. చేప వీపు మీద రెక్క ఉన్నట్లయితే, అది ఈదుటకు అది అక్కడ ఉంచబడినది. దానితో చేపకు అవసరమున్నది. ఇప్పుడు, ఆ చేప, "నేను వింతైన చేపగా ఉంటాను. నేను చురుకైన, చదువుకొన్న చేపను. ఉహ్-హూ, నేను కేవలము నేను నిజమైన వేదాంతమును నమ్ముతాను. ఆ వీపు మీద రెక్క నాకు ఉండవలసిన పని ఇక లేదని నేను నమ్ముతాను" అని చెప్పినట్లయిన ఏమగును? అది నీళ్ళలో అలా అది ఎక్కువ దూరం వెళ్ళునా? మరియు అది ఖచ్చితముగా సత్యము.

ఒక చెట్టు "నాకు పెరగడానికి ముందు ఒక భూమి కావాలి. మరియు అది సత్యము. నేను ఇక్కడే పెరగవలసియున్నది, కాని నేను ఒక వింతైన చెట్టుగా ఉంటాను. కనుక వారు తీసుకొని వీధి మధ్య ఉంచితే, అప్పుడు నన్ను అందరూ గమనిస్తారు" అని చెప్పినట్లయిన ఏమగును? చూడండి, అది ఎక్కువ కాలం జీవించలేదు, చూచారా. అది నిజము. కరడు కరడును పిలుస్తున్నప్పుడు అది సంఘములో చేరడంకంటె ఎక్కువైనది. అది బోధకునితో చేతులు ఊపటంకంటె ఎక్కువైనది. మంచి, తిన్నని జీవితం జీవించడం కంటే అది ఎక్కువైనది. నీ లోపల ఆత్మను తృప్తిపరచుటకు, దేవుని సన్నిధినుండి ఏదో కొంత కుమ్మరించబడవలసియున్నది. నీ జలప్రవాహధారలు విని, ఓ ప్రభువా, కరడు కరడును పిలచుచున్నది. కరడు కరడును పిలచుచున్నది.

85ఈ రాత్రి కాలములో ఎలాటి దాహము మనలో ఉన్నదని మనము తలుస్తాము? మనం పెంతెకోస్తు అనుభవంగల ప్రజలముగా, మనము దేనిలోకి వెళ్ళుతున్నాం? మనలో ఎలాటి దాహమున్నది? నాలో ఎలాటి దాహమున్నది? నీలో ఎలాటి దాహమున్నది? దేవుని కొరకైన ఆ పరిశుద్ధ దాహమును అణచవద్దు.

కొన్ని సంవత్సరాల క్రితం, ఈ కొండలలో వారికి బంగారము దొరికేది. చాలా సంవత్సరాల క్రితము, నేను ఒక కథ చదివాను. అది నాలో ఎల్లప్పుడూ మొదులుతూనే ఉంటుంది. దానిలో, ఇలా చెప్పబడి వుంది, ఒక బంగారము కొరకు వెదికే వ్యక్తి బయట కొండలోనికి వెళ్ళి బంగారం కొరకు వెతుకుతున్నాడు, వెంటనే ఆయనకు ఒక గొప్ప నిధి తగిలింది. మరియు ఆయన వెనక్కు వచ్చి ఆలోచిస్తున్నాడు, నేను పట్టణములోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటానో, నా కష్టాలన్నీ తొలగిపోతాయి. మరియు అతడు ఇలా చెప్పబోయాడు, "నేను రేపు దానిలోనికి వెళతాను, మరియు నేను…" ఒక రోజు ప్రయాణము, అతడు పట్టణంలోకి వెళ్ళును, మరియు బంగారాన్ని తీసుకొనును. మరియు అతడు పెద్ద సంచులనిండా బంగారాన్ని నింపుకొనును.

86ఆయనతో ఒక కుక్క వున్నది. నేను పరిశుద్దాత్మను కుక్కతో పోల్చటం లేదు, గాని ఒక ఉదాహరణకు చెప్పుచున్నాను, కానీ ఈ కుక్క… ఈ వ్యక్తి తన పడక మీద పండుకొని, మరియు రాత్రి అంతా ఆలోచన ప్రారంభించాడు, "ఇప్పుడు, రేపు నేను నా బంగారాన్ని అంతా తీసుకొంటాను, మరియు నేను ఎప్పుడు ఏమి కావాలని అనుకొంటున్నానో అలా అయిపోతాను. నేను నేనెల్లప్పుడు ధనవంతుడను కావాలని కోరుకుంటాను. నేను మంచి వస్తువులను, మరియు వాటన్నింటిని కలిగివుంటాను." ఆ తరువాత ఈ కుక్క మొరగడం ప్రారంభించింది, మరియు ఎందుకనగా అక్కడ శత్రువు ఆయనను సమీపిస్తున్నాడు. మరియు అతడు బయటకు వెళ్ళి మరియు దానిని "ఊరుకో" అన్నాడు. మరియు అందువలన కుక్క మొరగటం ఆపివేసింది. మరియు మరలా అతను తన పడక మీదకు వెళ్ళి నిద్రపోతున్నాడు, కుక్క మరలా మొరగడం ప్రారంభించింది. గొలుసును లాక్కొంటూ ఎగురును. మరలా అతను తలుపు దగ్గరకు వెళ్ళి కుక్కను "ఊరుకో, రేపు నేను ధనవంతుడనని నీవు తెలుసుకోవాలి" అన్నాడు. చూచారా, మరియు అవి అతని గొప్ప కలలు.

కాని మరలా కుక్క మొరగడం ప్రారంభించింది.

87మరియు అతను ఆఖరుగా ఎంతో నిరుత్సాహముతో, అతడు వెళ్ళి తన తుపాకిని తెచ్చి, మరియు దానిని కాల్చి చంపివేశాడు. అతడన్నాడు, "ఎలాగైనను నీ వలన నాకు ఇక అవసరము లేదు. రేపు నేను ధనవంతుడను. రేపు నేను ధనవంతుడనైపోతాను." మరియు అతడు తన తుపాకిని ఒక మూలన పెట్టి, తలుపు దగ్గరకు వెళ్ళి నిద్రపోయాడు. మరియు ఒక మనిషి కొన్ని రోజులనుండి అతన్ని వెంబడిస్తూనే వున్నాడు, అతను లోపలకు దూకి, ఇతన్ని చంపివేశాడు. అతడు ధనవంతుడవలేకపోయాడు, చూచారా. తనకు ప్రాణాపాయమున్నదని తనను హెచ్చరించుచున్న శబ్దమును అతను ఆపివేశాడు.

PS 42:1,2

 

88మరియు సోదరుడా, సోదరీ, నీవెన్నడూ దానిని… ఒక సంఘములో చేరడం ద్వారానో, విశ్వాస ప్రమాణాన్ని వల్లించడంద్వారానో, లేక ఏదో ఒక సంస్థకు చెందియుండడం ద్వారానో నీ హృదయములోని ఆ పరిశుద్ధమైన పిలుపును అణుచుటకు ప్రయత్నించవద్దు. దానిని తృప్తిపరచగలిగినది ఒక్కటే వున్నది. అది యేసుక్రీస్తు అనే వ్యక్తి.

"దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు, ఓ, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవునికొరకు నా ఆత్మ దాహంగొనుచున్నది," చూచారా. నీలో ఏదో వున్నది, అది నీలో దేవుని కదలికను చూచుటకు ఆశిస్తున్నది. నీ ఆత్మ దానికొరకు దాహంగొంటుంది. నీవు ఏ విధంగాను దానిని ఆపవద్దు. "నీవు అతని చేతిని కరచాలనం చేసి, సంఘములో చేరి, లేక సంస్థకు చెంది యుండుము" అని ఏ కాపరిని నీతో చెప్పనియ్యవద్దు. నీవు ఆ పరిశుద్ధ పొంగును చంపవద్దు. అది నిన్ను హెచ్చరిస్తుంది. ఒకరోజు వచ్చును, నీవు రహదారి ఆఖరుకు చేరుకొంటావు.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4

 

89ఇదివరకు మేము వున్న పట్టణములో వున్న ఒక చిన్న స్త్రీ వలె, ఆమె చెప్పింది… ఒక చిన్న బాలిక అక్కడున్న సంఘమునకు వెళ్ళినది, మరియు ఒక మంచి ఉత్తమమైన చిన్న బాలిక, మరియు ఆమె వీధిగుండా నడచి వస్తున్నది. ఆ పాపకు పొడవైన తలవెంట్రుకలు వున్నవి. మీకు తెలుసా, మరియు ఆమె తన జుట్టును వెనుకకు లాగి, నున్నగా దువ్వి, ఒక తొక్కు తీసిన ఉల్లిపాయవలె కట్టుకొని చక్కగా వుండేది, ఆమె ముఖమునకు ఏ విధమైన సౌందర్య అలంకరణ లేదు. అయితే ఈమె ఈ బాలికను ఎగతాళి చేసేది. "అక్కడ మీ సంఘములో మీకున్న ఆ బోడితల బోధకుడు లేనట్లయిన," (నన్ను గురించి చెప్పుచున్నది), చెప్పెను, "ఈ పాటికి నీవు కూడా ఎంతో సుందరముగా వుండేదానవు. కానీ నీవిప్పుడు పురాతన కాలపు వస్తువులు అమ్మే దుకాణములోని పాతకాలపు సరుకులా వున్నావు." మరియు, ఓ, ఆ విధముగా ఈ స్త్రీ ఆ బాలికను చూచినప్పుడెల్లా నిప్పుల మీద పెట్టినట్లు ఆమెను అవమానపరిచేది. "మా కాపరిగారు విశాల హృదయముగలవాడు" అనేది. "వారు ఆయనకు తెలుసు అన్నది… మరి, నీవు ఎందుకు అలా చేస్తావు? నీవు ఎలా వస్త్రములు ధరించినా, ఆలోచించినా దానివలన ఏమీ పరవాలేదు? అంది. దానికి(అర్థం) ఉంది. దానికి అర్ధంవుందని దేవుని బైబిలు చెప్పుచున్నది. మనము ప్రతి మాట వలన జీవిస్తాము. కావున ఈ చిన్న పాప ఆమె మాటలను ఏమాత్రం లెక్కచెయ్యలేదు, అలాగే ఆమె దారిన వెళ్ళేది. ఆమె ఇప్పుడు ఒక మిషనరీ అయింది.

90కాబట్టి అప్పుడు ఈ… ఈ యౌవన స్త్రీకి ఒక సుఖవ్యాధి వచ్చి మరియు ఆమె చనిపోయింది. ఆమె చనిపోతూ వుండగా నా స్నేహితుడైన ఒక ఆయన దేహం కుళ్ళిపోకుండా ఒక సుగంధ ద్రవ్యములాటి మందును ఆమె శరీరములోకి ఎక్కించాడు. ఆయన నాతో చెప్పాడు, ఆమె చనిపోయిన తరువాత తరచూ ఆ సుంగధ ద్రవ్యపు వాసన వచ్చేటట్లు ఆ దేహాన్ని ఉంచాడు. ఆమె శరీరములో ప్రక్కన తినివేసిన ఒక రంధ్రం ఏర్పడింది — సుఖవ్యాధి. ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమెలో ఏ లోపమున్నదో తెలియదు. మరియు ఆమె చనిపోయింది. అయితే ఆమె చనిపోక ముందు ఆమె ఆదివారపుబడిని చెప్పేది. మరియు ఆ ఆదివారపుబడి పిల్లలంత లోపలికి వచ్చి, ఆమెను దేవదూతలు ఏ విధముగా పరలోకమునకు తీసుకుపోతారో చూడాలనుకొన్నారు. మరియు ఆమె కాపరిగారు బయట సిగరెట్టు త్రాగుతున్నాడు, ఆ ఆసుపత్రిలోని గదిలో అటు ఇటు నడుస్తూ. మరియు ఆమె చనిపోతూ వుండగా, పాట పాడుటకు వారు సిద్ధముగా వున్నారు, మీకు తెలియును. ఆమె చనిపోతుందని వారికి తెలిసిపోయింది. చనిపోతున్నదని వైద్యుడు చెప్పాడు, కావున వారంతా దేవ దూతలు వచ్చి ఆమెను కొనిపోతారని ఎదురు చూస్తున్నారు.

JOHN 14:6

 

91మరియు ఒక్కసారి హఠాత్తుగా, ఆమె నిజాన్ని ఎదుర్కొంది… ఇప్పుడు, ఆమె ఒక మంచి సంఘ సభ్యురాలు, ఒక ఆదివారపు బడికి ఉపాధ్యాయిని, మరియు ఒక నమ్మకమైన సంఘ సభ్యురాలు. అయితే ఒక పెద్ద సంఘ శాఖకు చెందినది. ఆమె కొట్టుకులాడుతూ వుండగా, మరణం ఆమెను తాకింది. ఆమె కళ్ళు ఉబ్బిపోయినవి, మరియు ఆమె అంది, "నేను తప్పిపోయాను." ఆమె అంది, "నేను తప్పిపోయాను, వెళ్ళి కాపరిగారిని తీసుకురండి."

ఆయన సిగరెట్టు బయట పడవేసి లోపల వచ్చి, అన్నాడు, "ఇక్కడ, నీకు హైపో ఇంజక్షన్ ఎక్కించుటకుగాను మేము వైద్యుని తీసుకువస్తాము."

(ఆమె) అంది, "నాకు హైపో అవసరం లేదు. నీవు మనుష్యులను మోసము చేయువాడవు. నేను చనిపోతున్నాను, మరియు నేను నరకానికి వెళ్ళుచున్నాను. మరియు నేను తప్పిపోయాను, ఎందుకనగా నీవు నాకు సత్యం చెప్పలేదు. పో, వెళ్ళు, ఆ మంచి బాలికను నా దగ్గరకు తీసుకురా, మరియు ఆమెను త్వరగా ఇక్కడకు తీసుకురా. ఆమెదే నిజం."

నీవు ఒకేసారి యధార్దాన్ని ఎదుర్కొనేవరకు వుండు. ఆ పరిశుద్ధమైన పొంగును ఆపుటకు ప్రయత్నించవద్దు. నీవు ఏదో అధునాతన, విద్యాసంబంధమైన, రెండు గొట్టముల తుపాకీతో దానిని పేల్చవద్దు. నీవు ఆ పరిశుద్దాత్మ హెచ్చరికను ఈ రాత్రి వినుము, అది నిన్ను హెచ్చరించుచున్నది, "నేనే మార్గము, సత్యము, జీవమును మరియు నాద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు." మరియు ఆయన వాక్యమైయున్నాడు.

ఒక్క క్షణం మన తలలు వంచుదము.

MATT 5:6

 

92మీరు దానిని గురించి ఆలోచించుచుండగా, ప్రభువైన మన దేవుడు చెప్పిన ఇంకొక మాటను నేను మీకు చెప్పవలెనను కొనుచున్నాను. మత్తయి 5లో యేసు చెప్పెను, "నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు." ఆ దాహం నీలో ఉండడం అది ఇంకా దీవెనకరమైన సంగతి.

మీ పూర్తి పద్ధతులన్నీ శాఖాసంబంధమైన వాటితో చిన్న మతాచారాలు, తెగలు మరియు అలాటివి కొన్ని సంఘక్రమాలు, సాంఘికమైన వసతి గృహములలో చేరటం; మరి ఇంకా అలాటివి సంఘమునుండి సంఘమునకు పూర్తిగా కలుషితమైపోయే స్థాయికి వచ్చారా? సాతాను చేసిన కలుషితమైన నీళ్ళలో, నీవు ఒక గుంటలో, అటు ఇటు పొర్లుచున్న పందివలె వున్నావా? నీవు ఆ నిజమైన దేవుని దాహమును తీర్చే దానిని అసలు తెలుసుకోలేనప్పుడు, పరిశుద్దాత్మ నీలో నివసించటం ద్వారా, నీలో ప్రత్యక్షపరచుకొనుట ద్వారా ఆయనను నీవు చూడడమే నిజత్వము.

ఈ రాత్రి నీవు ఆ విధముగా వున్నచో, నీవు దేవుని కొరకు ఇంకను దాహం గొనుచున్నట్లయితే, నన్ను చెప్పనివ్వు,

రక్తముతో నింపబడిన బుగ్గ వున్నది,

అది ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి తీసినది,

ప్రవాహము క్రింద పాపులు ము౦చబడుడురు

పాపభీతిని వారు పోగొట్టుకొందురు.

ఆ చనిపోయే దొంగ తన దినమున ఆ బుగ్గను చూసి ఉత్సహించాడు;

అక్కడ నేను కూడా అతని వంటి క్రూరుడనైనా,

నా పాపములన్నియు కడిగివేయబడును.

ప్రవహించుచున్న నీ గాయములు సరఫరా చేయుచున్న

రక్త ప్రవాహమును నేను విశ్వాసముతో చూసినప్పటినుంచి

నేను చనిపోవువరకు, విమోచనా ప్రేమయే నా అంశము

1PET 1:8

 

93దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయనకు ఇంకా సమీపముగా రావడానికి, ఈ రాత్రి ఆ దాహం నీకున్నట్లయితే, మనమందరము తలలు వంచుచుండగా, నీవు నీ చేతిని పైకెత్తి, "నా కొరకు ప్రార్థన చెయ్యమని" అడుగుము. ఓ దేవా, ఈ చేతులను మీరు చూడండి. ఈ దేశములో ఎక్కడైతే ఈ ప్రసారము వినబడుచున్నదో, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముల నుండి, గదులలో వున్నవారు మీ కోరిక ఏమిటో మరి ఏదైనను, మీ చేతులను మీ సంఘ కాపరుల ముందు ఎత్తండి, నీలో ఏదో దేవుని కొరకు దాహంగొనుచున్నది. ఆ పరిశుద్ధ దాహం, దానిని తృప్తిపరచలేదు

ఓ, "సహోదరుడా బ్రెన్హాం, నేను ఒకసారి బాగా కేకలు వేశాను. ఆత్మలో నాట్యం చేశాను," అని చెప్పవద్దు.

వద్దు, దానిని తీసికోవద్దు. ఆ తృప్తి నీకు వచ్చువరకు వేచియుండు, ఆ తృప్తిపరిచే భాగం, పరిశుద్దాత్మ పరిపూర్ణత నీలోనికి వచ్చినప్పుడు, అప్పుడు ఈ ఆనందపు గంటల కేకలు, భాషలతో మాట్లాడడం, ఆత్మలో నాట్యం చేయడం వస్తాయి. అంతే కాని నీవు ఏదో సంగీతంతో పాటు ఎరగడం కాదు. నీవు నీ కారులో రహదారి మీద వెళ్ళుచుండగా, దానిని నీవు చేస్తావు. నీవు నేలను చిమ్మేటప్పుడు దానిని చేస్తావు. నీవు వడ్రంగి పనిలో, గోడకు మేకులు కొడుతున్నప్పుడు, దానిని చేస్తావు. నీవు ఎక్కడ ఉన్నప్పటికి, చెప్పనశక్యముకాని మహిమాయుక్తమైన సంతోషం నీలో పొంగుతూ వుంటుంది… ఇప్పుడు, ప్రార్ధన చేసుకొందాము.

94ప్రియ పరలోకపు తండ్రీ, ఈ రాత్రి, ఈ చిన్న వర్తమానము ఎక్కువసేపు తీసికొనబడినది, దీనియొక్క నిజ అర్ధమును, నీ పరిశుద్దాత్మ ప్రతి ఒక్కరికి తెలియజేయును గాక. ఈ సంఘములోనే, ఈ రాత్రి ఎంతోమంది గదులలో వున్నవారు, ఇంకెక్కడెక్కడో వున్నవారు, తమ చేతులను ఎత్తియున్నారు. ప్రియదేవా, మేము వారికొరకు ప్రార్థన చేస్తున్నాము. ఓ, ఆ తృప్తిపరిచే దేవుని భాగం, మహిమ నిరీక్షణ, నీలోని జీవమునకు నిరీక్షణయైన క్రీస్తు ప్రతి ఒక్కరికి ఈ రాత్రి దొరుకును గాక. దేశమంతా, కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు, అక్కడ ఇప్పుడు వేకువ జాము, అక్కడ వారంతా వినుచున్నారు; న్యూ హేంప్పైర్లో, మరియు క్రింద బోస్టన్లో, మరియు టెక్సాస్, ఇండియానా, కాలిఫోర్నియా మరియు అంతట వినుచున్నారు.

ఓ దేవా, ఆ చేతులవైపు చూడుము. వాటి వెనుక ఏమున్నదో చూడుము, ప్రభువా — ఆకలితో మరియు దాహముతో ఉన్న హృదయములను చూడుము.

1JN 2:15•

REV 22:18,19

 

95ఈ వక్రమైన దినమున, సాతాను సంఘములో చేరునట్లు ప్రజల కళ్ళకు గ్రుడ్డితనమును కలుగజేసి, "మీరు చేయవలసినదంతా అంతే" అని చెప్పుచున్నది. మరియు వారంతా తమ స్వార్ధమునే చూసుకొంటూ మరియు తమ మార్గాల్లో నడుస్తూ, లోకాశలు కలిగి జీవిస్తున్నారు. "మనము లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినచో, తండ్రి ప్రేమ మనలో ఉండదు" అని బైబిలు చెప్పుచున్నది.

కేవలము ఆలోచించండి, తండ్రీ, నిజమైన దేవుని వాక్యమును సాతాను ఎంత వక్రము చేశాడు. "ఓ, మేము బైబిలును నమ్ముతాము, కాని దీనిని కాదు. మేము దీనిని నమ్మము. ఇది వేరే యుగమునకని మేము నమ్ముతాము. ఇది అదే అని మేము నమ్ముతాము" అని వారు ఎలా చెప్పగలరు.

ఎందుకనగా ఏదో సంఘ శాఖ వారి మనస్సులను మురికి గుంటలోనికి త్రిప్పినది. "ఎవడైనను ఒక మాట దీనికి కలిపినయెడల లేక ఒక మాట దీనినుండి తీసివేసినయెడల, అతని పాలు జీవగ్రంథములో నుండి తీసివేయబడును" అని యేసు చెప్పెను.

ప్రియదేవా, ప్రజలు మంచి, శుభ్రమైన, పరిశుద్ధ జీవితమును జీవించి, ఆలయానికి వెళ్ళుచూ, ఎంతో నమ్మకంగా ఉండి కూడా న్యాయతీర్పు రోజున నిరాశలను ఎదుర్కొని మరియు తప్పిపోవచ్చును.

EXOD 15:20•

NUM 13:31-33•

DEUT 9:23•

JOHN 8:44

 

96పరిసయ్యలను గూర్చి ఆలోచించండి, వారు చిన్నవయస్సు నుండి వాక్యములో తర్ఫీదు పొందారు, మంచి పాఠశాలలో చదివారు, పరిశుద్ధముగా వు౦డాలి, లేనిచో రాళ్ళతో కొట్టిబడి చంపబడతారు. మరియు యేసు వారితో అన్నాడు, "మీరు మీ తండ్రియొక్క అపవాది సంబంధులు."

ఇశ్రాయేలీయులు అక్కడకు ఎలా వెళ్ళారో (మరియు ప్రభువా, దేశములో వున్న పెంతెకోస్తు వారందరికి ఇది ఒక హెచ్చరికగా వుండనివ్వండి), దేవుని వాక్యమునకు నెరవేర్పుగా మోషే అను ప్రవక్త ఐగుప్తునకు వచ్చి సాయంకాలపు వెలుగును ఎలా తెచ్చాడు. వారు దేవుని గొప్ప అద్భుతాలను ఎలా చేశారో, వారు ఎలా ఆయనను వెంబడించి, ఎర్ర సముద్రమును దాటి, ఆయనను బట్టి బాప్తిస్మము పొంది, అరణ్యములో ప్రవేశించి మరియు పరలోకమునుండి పడే దేవదూతల ఆహారాన్ని తిన్నారు, మరియు పూర్తి వాక్యమును తీసికొనుటకు నిరాకరించారు, వారు కాదేషు-బర్నేయనుండి… కాదేషు-బర్నేయకు వచ్చినప్పుడు, అనగా వాగ్దాన భూమి నుండి వచ్చినప్పుడు, "వారు గొప్ప బలిష్టులు. మనము వారిని గెలువలేము" అన్నారు. అయితే దేవుడు, "ఆ భూమిని ఇదివరకే మీకు ఇచ్చియున్నాను" అని చెప్పెను.

సరిహద్దు గీత… యేసు చెప్పెను, "వారిలో ప్రతి ఒక్కరూ నశించారు." వీటన్నిటిని వారు చేసి కూడా, దేవుడు లేకుండా వారంతా చనిపోయారు, తప్పి పోయారు. వారు ఈ అద్భుతములను చూశారు. మిర్యాము తంబుర వాయించుచుండగా, వారు ఆమెతో కలిసి సముద్రతీరమున పైకి - క్రిందికి గంతులు వేశారు, ఆనందించారు. మరియు రెండు మిలియన్ల మందిలో ముగ్గురు మాత్రమే వాగ్దాన భూమిలోనికి వెళ్ళారు.

ACTS 2:38,39

 

97తండ్రి, మేమెరుగుదుము, ఆ వీర్యము, ఆ స్త్రీ - పురుష బీజములు కలుసుకొన్నప్పుడు, వాటిలో ఒక మిలియనుకు ఒకటి మాత్రమే అంగీకరించబడును. పురుషునిలోని ఒక పురుష బీజము మాత్రమే స్త్రీ యొక్క ఫలదీకరణము చెందే గ్రుడు లోనికి ప్రవేశిస్తుంది; మిగతా ఆ స్త్రీ యొక్క ఒక మిలియను బీజములు చనిపోతాయి. ఐగుప్తు నుండి ఒక మిలియను, రెండు మిలియనుల మంది బయటకు వచ్చారు; రెండు, యెహోషువ మరియు కాలేబు మాత్రమే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు.

తండ్రి, దానిగురించి ఆలోచించినప్పుడు, నాకు వణుకుపుట్టును. ఈ దినమున ప్రపంచమంతటిలో ఐదు-వందల-మిలియనుల క్రైస్తవులుండగా, ఈ రాత్రి మీరు రావలసియున్నచో, ఐదు వందల మంది మాత్రమే అంగీకరించబడతారు. ఓ, దేవా, మీ యొక్క ప్రతి మాట ఒక జ్ఞాపకచిహ్నముగా నిలచియుండునని మేము గుర్తుంచుకొననిమ్ము, మేము దానిని నమ్మవలసియున్నాము. దానికి మేము లోబడవలసియున్నాము. మరియు మీరు, "మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరమును పొందుదురు. ఏలయనగా ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తు లందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికి చెందును."

మరియు, దేవా, నీవు ఇంకా ఈ రాత్రి ప్రజలను పిలచుచునేయున్నావు, మరియు ఈ వాగ్దానము నీవు పిలచుచున్నంత వరకు వుండును. మరియు ఈ సేవకులు ప్రజల మనస్సులను తారుమారు చేసి, మరియు విద్య, వేదాంత సంబంధమైన, సంఘ శాఖల పాఠశాలలవైపు వారిని మళ్ళీంచి, "ఓ, ఇక మీరు దానిని కేవలము నమ్మండి" అని చెప్పుచున్నారు. దయ్యము కూడా నమ్ముచున్నది, కాని వాడు పరిశుద్దాత్మను పొందలేదు. యూదా ఇస్కరియోతు కూడా మిగిలిన శిష్యులవలె సువార్తను ప్రకటించాడు, మిగిలిన వాటన్నిటిని చేశాడు. కాని పరిశుద్దాత్మను పొందవలసిన సమయము వచ్చినప్పుడు, వాడు తన రంగులు చూపించాడు.

దేవా, ఈ రాత్రి ఈ దేశములోని ప్రజలు ఈ అనుభవము లేకుండా వారు తప్పిపోతారనే సంగతిని వారు గ్రహించునట్లు సహాయము చేయుము. దేవా, వారిని నీ చేతులకు అప్పగించుచుండగా, తృప్తినిచ్చే ఆత్మతో వారి ఆత్మలను సంతుష్టినొందునట్లు చేయుము. ప్రభువా, వారంతా నీ వారు. మేము నీ వాక్యమును ప్రకటించుటవరకే మా బాధ్యత. వారు హృదయమంతటితో నిన్ను నమ్మి మరియు నీ ఆత్మతో వారు నింపబడునట్లు నేను వారికొరకు ప్రార్థించుచున్నాను. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

నేనాయనను ప్రేమించుదును

నేనాయనను ప్రేమించుదును

ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను

కలువరి వృక్షముపైన.

98ఓ, నీ తృప్తిపరిచే భాగం ఆయనేనా? ఓ, మై నీ పూర్ణహృదయముతో ఆయనను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు, కొన్నిసార్లు పదములు కత్తిరించును, అయితే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరము, చూచారా? మన మందరము ఇప్పుడు ఆత్మలో పాడుదము. మీ ప్రక్కన కూర్చొనియున్న సహోదరుని, సహోదరిని కరచాలనం చేసి, మరియు, మనము దీనిని మరలా పాడుచుండగా "యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును" అని చెప్పండి.

నేనాయనను ప్రేమించుదును,

నేనాయనను ప్రేమించుదును ఎందుకనగా

ఆయనే మొదట నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను కల్వరి వృక్షముపైన.

ఇప్పుడు, మనము ఒకరినొకరము కరచాలనము చేసితిమి. ఇప్పుడు, మనము మన కళ్ళు మూసికొని, ఆయనకు మన చేతులను ఎత్తి మరియు ఆత్మలో పాడుదము.

నేనాయనను ప్రేమించుదును,

నేనాయనను ప్రేమించుదును,

ఎందుకనగా ఆయనే మొదట నన్ను

ప్రేమించెను మరియు నా రక్షణను కొనెను

కల్వరి వృక్షముపైన

ఓ, ఆయన అద్భుతకరుడు, అద్భుతకరుడు,

అద్భుతకరుడు, అద్భుతకరుడు,

యేసు నాకు, ఆలోచనకర్త సమాధానపు రాజు,

బలమైన దేవుడు ఆయనే;

ఓ, నన్ను రక్షించుచున్నాడు,

ప్రతి పాపము మరియు అవమానము నుండి

నన్ను దూరపరచుచున్నాడు,

నా విమోచకుడు అద్భుతకరుడు,

ఆయన నామమును స్తుతించుడి

ఓ, అద్భుతకరుడు, అద్భుతకరుడు,

యేసు నాకు, ఆలోచనకర్త సమాధానపు రాజు,

బలమైన దేవుడు,

ఆయనే నన్ను రక్షించుచున్నాడు,

ప్రతి పాపము మరియు అవమానము నుండి

నన్ను దూరపరచుచున్నాడు,

నా విమోచకుడు అద్భుతకరుడు,

ఆయన నామమును సుత్తించుడి!

99ఓ, క్రీస్తుతో నీ అనుభవమును గూర్చి ఉత్సుకతతో ఉన్నావా? ఆయన అద్భుతకరుడు కాడా? ఆయన తృప్తిపరచుట లేదా?

ఒకప్పుడు నేను తప్పిపోతిని,

ఇప్పుడు కనుగొనబడితిని,

శిక్షా విధినుండి విడుదల పొందితిని

యేసు స్వేచ్చను మరియు ఒక పూర్ణ రక్షణను ఇచ్చుచున్నాడు;

నన్ను రక్షించుచున్నాడు,

ప్రతి పాపము మరియు అవమానము నుండి

నన్ను దూరపరచుచున్నాడు,

నా విమోచకుడు అద్బుతకరుడు,

ఆయన నామమును స్తుతించుడి.

అద్భుతకరుడు, అద్భుతకరుడు,

యేసు నాకు ఆలోచనకర్త, సమాధానపు రాజు,

బలమైన దేవుడు ఆయనే.

ఓ, నన్ను రక్షించుచున్నాడు,

ప్రతి పాపము మరియు అవమానమునుండి

నన్ను దూరపరచుచున్నాడు,

నా విమోచకుడు అద్భుతకరుడు,

ఆయన నామమునే స్తుతించుడి!

PS 47:1•

PS 100:1

 

100అది వాక్యానుసారమైనదని మీరు నమ్ముచున్నారా? బైబిలు చెప్పెను, "మీ చేతులను తట్టుడి. ప్రభువుకు గంభీర జయధ్వని చేయుడి." మీకు తెలియునా, నేనెల్లప్పుడు సంగీతమును వాయించుటకు ఇష్టపడేవాడ్ని. నా కుమార్తె, రెబెకా పియానో తీసుకొనుచున్నది. నా చిన్న అబ్బాయి ట్రంపెట్ తీసికొనుచున్నాడు. అయితే నేను పది తీగలున్న వాయిద్యమును నేర్చుకొంటిని.

అద్బుతకరుడు, అద్బుతకరుడు,

యేసు నాకు, ఆలోచనకర్త సమాధానపు రాజు,

బలమైన దేవుడు

ఆయనే నన్ను రక్షించుచున్నాడు,

ప్రతి పాపము మరియు అవమానము నుండి నన్ను దూరపరచుచున్నాడు,

నీవు ఆయనను ప్రేమించుదువా?

మనము వెలుగులో నడచెదము,

సుందరమగు వెలుగు,

కృపామంచు బిందువులు మెరయుచున్న చోటికి వచ్చును,

పగలు మరియు రాత్రి మనచుట్టు ప్రకాశించును,

యేసు, లోకమునకు వెలుగు. మనము వెలుగులో నడచెదము,

సుందరమగు వెలుగు, కృపామంచు బిందువులు

మెరయుచున్న చోటికి వచ్చును,

పగలు మరియు రాత్రి మనచుట్టు ప్రకాశించును,

యేసు లోకమునకు వెలుగు.

101[సహోదరుడు బ్రెన్హాం, "యేసే లోకమునకు వెలుగు" తనలోతాను పాడుచుండిరి.] నీకున్న సమస్తముతో దేవుని ఆరాధించుము. [సహోదరుడు బ్రెన్హాం పాడుచుండిరి.]

పరిశుద్దులు లోనికి పోవుచుండగా

పరిశుద్ధులు ప్రయాణమైలోనికి పోవుచుండగా

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను.

పరిశుద్ధులు ప్రయాణమై లోనికి పోవుచుండగా

ఓ, అన్నింటికి ప్రభువైన ఆయనకు వారు కిరీటము పెట్టుచుండగా,

అన్నింటికి ప్రభువైన ఆయనకు వారు కిరీటము పెట్టుచుండగా,

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను

అన్నింటికి ప్రభువైన ఆయనకు వారు కిరీటము పెట్టుచుండగా,

ఓ, సూర్యుడు ప్రకాశించుటకు తిరస్కరించినప్పుడు,

సూర్యుడు ప్రకాశించుటకు తిరస్కరించినప్పుడు,

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను

సూర్యుడు ప్రకాశించుటకు తిరస్కరించినప్పుడు.

నీవు దానిని ప్రేమించుదువా? ఇప్పుడు, నీ పాదములు మారి, నీవు ఇకపై అక్కడ బయట లోకం కొరకు నాట్యము చేయనట్లయితే నేను ఆశ్చర్యపడుదును? చూచారా? మన పాదములను మన ప్రభువుకు—ప్రభువుకు తట్టుదము. నీ చేతులు మారినవా? ఇక మీదట నీవు దొంగిలించవు కదా? నీ పెదవులు మారినవి, ఇక మీదట నీవు అబద్దమాడవు కదా? కేవలము నీ తలలో మాత్రమే పొందవద్దు, నీ అంతటిలో దానిని పొందుము. అంతే. ఇది పూర్తి మానవుని తీసికొనును. అది నిజము. ఇప్పుడు, మన పాదములను తట్టుదము.

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగాలోనికి పోవుచుండగా,

పరిశుద్దులు ప్రయాణమై ఠీవిగాలోనికి పోవుచుండగా

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను.

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగాలోనికి పోవుచుండగా,

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగా లోనికి పోవుచుండగా,

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగా లోనికి పోవుచుండగా

ఓ, ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను.

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగాలోనికి పోవుచుండగా,

ఇప్పుడు, మన చేతులను పైకి ఎత్తుదము.

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగాలోనికి పోవుచుండగా,

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగాలోనికి పోవుచుండగా,

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను.

పరిశుద్ధులు ప్రయాణమై ఠీవిగా లోనికి పోవుచుండగా,

ఓ, అన్నింటికి ప్రభువైన ఆయనకు వారు కిరీటము పెట్టుచుండగా,

అన్నింటికి ప్రభువైన ఆయనకు వారు కిరీటము పెట్టుచుండగా,

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను

అన్నింటికి ప్రభువైన ఆయనకు వారు కిరీటము పెట్టుచుండగా,

ఓ, సూర్యుడు ప్రకాశించుటకు తిరస్కరించినప్పుడు,

సూర్యుడు ప్రకాశించుటకు తిరస్కరించినప్పుడు,

ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచున్నాను

సూర్యుడు ప్రకాశించుటకు తిరస్కరించినప్పుడు.

1COR 14:15

 

102నీవు ఆయనను ప్రేమించలేవా?

మనము వెలుగులో నడచెదము

(మీకు తెలియును, ఆయనే వెలుగు)

అది ఒక సుందరమైన వెలుగు,

కృపామంచు బిందువులు మెరయుచున్న చోటికి రమ్ము

పగలు మరియు రాత్రి మన చుట్టు ప్రకాశించును,

యేసు లోకమునకు వెలుగు

ఆయనే లోకమునకు వెలుగైయున్నాడని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? పౌలు చెప్పెను, "నేను పాడినప్పుడు, నేను ఆత్మలో పాడెదను. నేను ఆరాధించినట్లయిన, నేను ఆత్మలో ఆరాధించెదను." అది సత్యము. మరియు ఆత్మ వాక్యమును జీవమునకు తెచ్చును. అది సత్యమా? అది సత్యము. అవునండి.

వెలుగు సంబంధమైన పరిశుద్ధులైన మీరందరు చాటించుడి,

ఆయన నామములో దయ మరియు కరుణ,

యేసు, లోకమునకు వెలుగు.

అప్పుడు మనము ఏమి చేయుదుము?

మనము వెలుగులో నడచెదము, సుందరమగు వెలుగు,

కృపామంచు బిందువులు మెరయుచున్న చోటికి రమ్ము,

పగలు మరియు రాత్రి మనచుట్టు ప్రకాశించును,

యేసు, లోకమునకు వెలుగు.

GEN 1:3,6,14•

MATT 5:6

 

103వాయించుచున్న మిమ్ములను ఆ రీతిగా తికమక పెట్టినందుకు క్షమించండి, అయితే నేను అలా కొనిపోబడ్డాను. ఆరాధించుటకన్నా మేలైనది వేరొకటి నాకు తెలియదు. మీరు దానిని చేయు విధము అదే. అవునండి. సహోదరుడు మాక్, ఇక్కడకు వచ్చుటకు మరియు మీతో సహవాసము కలిగియుండుటకు, మరియు ఈ రాత్రి ఇక్కడున్న మీ సంఘముతో, ఈ మంచి జనులతో సహవాసము కలిగి యుండుటకు ఇచ్చిన అవకాశముకొరకై నేను వందనస్తుడను. మరియు పరిశుద్దాత్మ బాప్తిస్మము కొరకు కరములెత్తిన మీరు, ఇక్కడున్న కాపరి మాకు గానీ, లేక వారిలో కొందరిని కలిసి, మరియు తిరిగి ఇక్కడున్న గదిలోనికి వెళ్ళెదరని నేను నమ్ముచున్నాను. మరియు జ్ఞాపకముంచు కొనండి, ఆది యందు దేవుడు వాక్యమును మాట్లాడి, మరియు "కలుగును గాక" అని చెప్పినప్పుడు, అక్కడ కలిగి యుండవలెను. మరియు ఆయన, "నీతి కొరకు ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు" అని చెప్పెను. చూడండి, అది జరుగవలసియున్నది. వచ్చి ఇక్కడున్న మీ కాపరిని దర్శించండి, మరియు అతడు సువార్తను బోధించుచుండగా ఆయన ప్రక్కన మీరు ఉండండి.

JOHN 8:12•

1COR 12:8-10,13

 

104ఇప్పుడు, మనము మరలా "మనము వెలుగులో నడచెదము" అనే ఆ మంచి పాత పాటను పాడుదము. అది నాకు ఇష్టమైనది. యేసు చెప్పెను, "నేను వెలుగు," మరియు మీరు ఆయనలో ఉన్నారు, చూచారా. ఏ విధముగా మీరు ఆయనలోనికి వెళ్ళగలరు? ఆయనతో చేరగలరు? కాదు. కరచాలనము చేయుటవలనా? కాదు. నీటి బాప్తిస్మము వలనా? కాదు. "ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి." అదే క్రీస్తు శరీరము. మరియు ఆ శరీరములో తొమ్మిది ఆత్మీయ వరములు స్థానిక సంఘమైన స్థానిక శరీరము ద్వారా పనిచేయుచున్నవి. నాకు తెలిసినంతవరకు, అది అపొస్తలుల (సభ), అది సత్యము.

కావున మనము వెలుగులో ఉండెదము,

సుందరమైన వెలుగులో

కృపా మంచు బిందువులు

ప్రకాశించుచున్న చోటికి అది వచ్చును,

పగలు మరియు రాత్రి మనచుట్టు ప్రకాశించును,

యేసు లోకమునకు వెలుగైయున్నాడు.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...