రూపాంతరపరచు శక్తి
1మీ అ౦దరికిని తెలిసియున్న ప్రకారము దేవుని యొక్క వాక్యమును మీ మధ్య ఈ ఉదయమున పరిచర్య చేయుటకు నేనెంతటి భాగ్యవంతుడననే దానిని ప్రశంసించుటకు వేరెవరికైనను అటువంటి కృతజ్ఞతా భావమును వ్యక్తపరచుటమనేది చాలా కఠినమైన కార్యమైయున్నది.
మరియు ఈ యొక్క గొప్ప అవకాశము కొరకు సహోదరుడు లియో మరియు సహోదరుడు జీన్లకు నేను కృతజ్ఞతలు తెలుపగోరుచున్నాను. మరియు నేను పాట ఆరంభము మొదలుకొని చివరి వరకు వినుచుండగా పాటలు పాడుటను గురించి ఏదో కార్యమున్నది, మీరు దానిని తిరిగి ఆ విధమైన పాటల ఆరాధనను కనుగొనలేరు. మరి మీరు ఆ విధముగా చక్కని మంచి పాటలు పాడుచుండగా నేను ఒక సంవత్సరమునకు ఒక మారు లేక రెండు మారులు వచ్చుచున్నప్పటికిని మీరు ఆ విధమైన మధురమైన పాటలు పాడుటలో నిండియుండుట నేను చూచుట నాకు గొప్ప భాగ్యము. మరియు ఈ ఉదయమున వారు తూర్పునుండియు మరి పడమటి నుండి వచ్చుచున్నారు అను పాటను పాడబోవుచున్నట్లు సహోదరుడు లియో చాటించుచుండగా, నేను బయలుదేరి నా యొక్క భార్యను, మరి - మరియు బిల్లీని మరి రిబ్కాను వదలివచ్చుచుండగా నా భార్య ఆ పాటను పాడుట నేను తలంచుచున్నాను, ఈ యొక్క గొప్ప పునరుద్ధరణ కూటములు ఆరంభించుటకును, దేశములను కదలించివేయుటకును ఆ పాట ముందడుగు వేయుచు పోవునట్టున్నది.
2మరియు నేను చక్కని, చూచుటకింపైన మర్యాదగల స్త్రీల సమూహమును చూచినప్పుడు అప్పుడు వారిలో ఒకరిగానున్న మీడాను నేను గుర్తుంచుకొనియున్నాను. ఆమె నల్లని తల వెంట్రుకలు గల చిన్న యౌవ్వనస్తురాలుగా ఉండుటను నేను తలంచుచున్నాను. మరిప్పుడు ఆమె నా వలె వయస్సు చెందినదై మరి తలవెంట్రుకలు నెరసి మరి మా దినములు గతించిపోవుచున్నవి. అయినప్పటికిని కాలముగాని, వృద్ధాప్యముగాని మరేదియును మనలను అడ్డుపరచని మనలను అభ్యంతపరచని ఒక చోటు ఆయనలో మనమందరమును మరల ఒక్కటిగా కూడుకొనెదమన్న గొప్ప నమ్మికతో మనమున్నాము.
1COR 13:8
3ఇక్కడున్న ఈ యొక్క జనులలో ప్రేమతో నిండిన క్రైస్తవులవలె నేను వేరే ఏ స్థలములోను చూడలేదని నేను నమ్ముచున్నాను. మీలో ఉన్న ఈ యొక్క ప్రేమను చంపివేయవద్దు. దానిని ఎల్లప్పుడును గుర్తుంచుకొనుడి.
జనుల మధ్య ఈ విధముగా నన్ను గురించి మాటలాడుచుండెడి వారు. నా యొక్క మొదటి భార్య పేరు హోప్; బిల్లీ యొక్క తల్లి. మేము అప్పుడు ముగ్గురము ఉండేడి వారము. వారు ఆ విధముగా… ఆమె హోప్, మరియు నేను, మరి బిల్లీ వారు మమ్ములను, "నమ్మిక, విశ్వాసము, మరియు ప్రేమ," అని పిలిచెడి వారు. ఈ యొక్క వాక్యము సత్యమైనదని నమ్ముటకు నాకు గాఢమైన విశ్వాసముండెడిది; మరియు దేవుడు దేనినైతే వాగ్ధానము చేసియున్నాడో, దానిని చేయునని నాకు విశ్వాసముండెడిది. మరి అయినను మీరు చూడుడి, వీటిలో గొప్పది ప్రేమ. సహోదరుడు లియో ఈ ఉదయమున చెప్పినట్లు. ప్రేమ! భాషలైనను నిలిచిపోవును. ప్రవచనములైనను నిరర్ధకములగును, ప్రేమ శాశ్వతకాలముండును," చూశారా.
ప్రేమగల చనిపోవు గొర్రెపిల్లా,
నీ యొక్క అమూల్యమైన వాక్యము
దానియొక్క శక్తిని కోల్పోవద్దు.
క్రయమిచ్చి పాపము నుండి విడిపింపబడిన దేవుని యొక్క సంఘము
మరల పాపము చేయకుండునట్లు ఉండులాగున
నేను విశ్వాసము ద్వారా చూచినప్పటి నుండి
నీ యొక్క గాయముల నుండి కారుచున్న ప్రవాహములను
విమోచించిన ప్రేమ నా యొక్క ధ్యేయముగా నున్నది,
మరియు నేను చనిపోవువరకు ఆ భావము అట్లే యుండును.
4ప్రేమ కంటెను గొప్పది మరేదియును లేదని నేను అనుకొనుచున్నాను. మరియు ప్రేమ, దానిని మనము బయలుపరచని యెడల… ఇప్పుడు మనము మనకు ప్రేమగలదని చెప్పినయెడల, మనము దానిని ఊరకనే చెప్పుచున్నాము. అయితే మనకు ప్రేమకలదని మనము చెప్పిన దానిని మనము నిజముగా దానిని బయలుపరచిన యెడల, అప్పుడు మనము ప్రేమను కలిగియున్నామని మనము చూపించువారమై యున్నాము. ఇప్పుడు మనము పరిపూర్ణమైన వారము కాము. మనము తప్పిదములను చేయుచున్నాము. తప్పైన కార్యములను మనము చేయుచున్నాము. అయితే చూడుడి ప్రేమ వాటినన్నిటిని కప్పును. మనము మన తప్పిదములను చూచునప్పుడు మరల వచ్చి ఒకరి ఎడల ఒకరు మన్నింపు అడుగుటకు సిద్ధముగానున్నావు. అవును, అదే యుద్ధ వీరులు. అదియే, నిజమైన పురుషులు మరి స్త్రీల యొక్క సాహసమైన గుణము. ఎవరైనను యుద్ధభూమికి పోవచ్చును, అయితే అతను కొట్టబడి క్రింద పడిపోయినప్పుడు మరల లేచి పోరాడుటకు ప్రయత్నించువాడే నిజమైన శూరుడు, చూడుడి…
సంఘములో ఒక యౌవ్వన పురుషుడును మరి యౌవ్వన స్త్రీయును పాట ఒకటి పాడెడివారు:
"నేను పడిపోయినను లేక నేను ఓడి పోయినను… (చూశారా.)
నేను పడిపోయినను లేక నేను… (ఆ పాటను నేను మరచిపోయున్నాను.)
నేను క్రింద నుండి లేచి మరల ప్రయత్నించెదను;
ప్రభువా, నన్ను మన్నించుము, మరి నన్ను ఇంకొక మారు శోధించుము.
ఒకవేళ నేను పడిపోయినను, లేక నేను పాపము చేసినను,
ప్రభువా, నన్ను మన్నించుము,
నేను లేచి మరి తిరిగి ప్రయత్నించనిమ్ము.
EPH 2:6
5మరియు ఇంచుమించు నూట-ఇరవై మంది ఇక్కడ మీరు కూడుకొనియుండగా, శత్రువు మీలో తప్పులు కనుగొని మీ మధ్యలో దూరి మరి మీ తలంపుల ద్వారా మీరు చేసినది అది తప్పు, ఇది తప్పు అని చెప్పిన యెడల మీరు దానిని పట్టించుకొనవద్దు అటువంటి తలంపులను నిలిపివేయుడి. వెనుకకు తిరిగి ఈ ఉదయమును గురించి తలంచుకొనుడి, యేసుక్రీస్తుతో కూడా పరలోకములో ఉన్నత స్థలముయందు మీరు కూర్చుండియున్న సమయములను గుర్తుంచుకొనుడి. మీలో కొందరు నీటి కొళాయిల పనిచేయవారును, మరియు వడ్రంగిలును మరి అది ఇది పలురకములైన పని చేయువారున్నారు, మీరు బయట మీ యొక్క పనుల నిమిత్తమై ప్రపంచముతో అనుదినము మీ యొక్క భుజములు రాసుకొన వలసియున్నది. అయితే గొప్ప శోధనలకు మీరులోనై ప్రపంచ కార్యములయందు చిక్కుకొన్నప్పుడు ఈ యొక్క పవిత్రమైన స్థలమునందు మీరు ఏ స్థానమందు కూర్చొనియున్నారో, నిత్యముగా నిలుచు ఆ ఒక్క కార్యమును తలంచి చూచుకొని గుర్తుంచుకొనుడి. మీ యొక్క ఉద్యోగమును ఒకానొక ఈ దినములలో మీరు కోల్పోవచ్చును. మీ యొక్క ఆరోగ్యము క్షీణించవచ్చును, ఈ లోకములో మీ యొక్క జీవితమును కూడా మీరు పోగొట్టుకొవచ్చును, అయినప్పటికిని అది అపజయమును పొందదు. మరియు సమస్త కార్యములకు ఆయన కేంద్రమైయున్న యెడల మనయొక్క ధ్యాస ధ్యానములకు కేంద్రముగా యున్న ఈ స్తంభముయందు పెట్టెదము. అదియే మనలను దీని వైపుకు త్రిప్పును.
HEB 11:10
6ఆహా, చక్కని, పరిశుభ్రతతో కనిపించెడి జనుల సమూహము ఇది! మీ యొక్క చక్కని వస్త్రములను బట్టి నేను ఆ భావముతో దీనిని చెప్పుట లేదు. మీ యొక్క వస్త్రములు శుభ్రముగా నున్నవి, ఎటువంటి పైమెరుగులు లేక మీ ముఖములు కూడా పరిశుభ్రముగానున్నవి. ఇక్కడున్న ఈ స్త్రీలు కూడా వారెవరును పెదవులపై రంగు వేసికొనకయున్నారు. వారందరును యౌవ్వనులు మరియు వృద్ధులు, మరి మధ్య వయస్సులోనున్న వారు ప్రతి యొక్కక్కరును పొడవైన వెంట్రుకలతో గలరు. అవును, చూశారా. సరి, ఈ యొక్క చిన్న ఆలయ ఆరాధనలో ఎటువంటి ఐశ్వర్యము మీరు కలిగియున్నారో మీరు గ్రహించలేకున్నారు.
సహోదరుడు మరియు సహోదరి శంట్జ్ లకు కూడా మరియు వారి గృహములో ఇప్పుడు నేనుండు ఈ విశేషాధిక్యతకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపగోరుచున్నాను. మరియు ఇప్పుడు ఇదియే వారి యొక్క గృహముగానున్నది, కెనడాలోనున్న వారి యొక్క ఆస్థిని అమ్మి, మనతో నుండుటకు వారిక్కడికి వచ్చి యున్నారని నేను తలంచుచున్నాను. మనకు ఈ భూమికి చెందిన ఆస్థిపాస్తులు లేవు. దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై యున్నాడో, ఆ రాబోవు ఆ పట్టణము కొరకు మనము ఎదురు చూచుచున్నాము.
7సహోదరుడు లియో మరియు జీన్లను మేము మొట్టమొదటిసారి సంధించినపుడు వారికియ్యబడిన దర్శనమునకు వారు ఇప్పటివరకు సత్యముగా నున్నందువలన నేను వారికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. దానినతడు అనేక మార్లు మీకు చెప్పియున్నాడనుటలో సందేహము లేదు.
అది వింతగానున్నది — దానిని నేను ఈ విధముగా చూడలేదు. ఏదో ఒకటి ముందు రానున్నదని నేను తెలుసుకొన్నాను, ఆ యౌవ్వనస్తుడు పిరమిడ్, దానిపై అతను నిలుచుకొని యుండులాగున స్వప్నమునుకని నా యొద్దకు వచ్చెను. నేనున్న స్థలమునకు అతను పైకి ఎక్కి వచ్చెను, మరి ఒక మూకుడు లేక ఒక పళ్ళేము లేక ఒక వెలుగువలె నుండు ఏదో ఒకటి దానిపై నేను నిలుచుకొని యుండులాగున అతడు చూచెను. అతను అడిగెను, "సహోదరుడా బ్రెన్హాం, నీవెట్లు అక్కడికి పైకి వెళ్ళితివి?"
మరి నేను చెప్పితిని, "సహోదరుడు లియో, దేవుడు ఒక వ్యక్తిని ఇక్కడ ఈ యొక్క స్థానమందే వుంచునని" నేను చెప్పితిని, "ఇప్పుడు నీవు దీనిని చూచావు కాబట్టి వెనుదిరిగి ప్రజల యొద్దకు వెళ్ళి ఇది దేవుని యొక్క కార్యమైయున్నందు వలన దీనిని నీవు నమ్ముచున్నావని వారికి తెలుపుము."
8మరియు నాకు ఒక స్థానమున్నదని అప్పుడు నాకు కొద్దిగా కూడా తెలియదు. నేను బాలురను ప్రేమించుచున్నాను, మరియు నేను వారితో కూడ ఉండులాగున మరి ఆస్థానములో వారిని ఉంచదలచితిని, మరి వారు టేపు చేయతోడగిరి.
అయితే మీరు చూశారా, నాకు తెలిసినంత మట్టుకు వారు ఇంకను టేపు రికార్డు పరికరము ద్వారా టేపు చేయుచుండిరి. అయితే టేపు చేయుటకంటెను ఎటువంటి ఒక గొప్ప కార్యమును దేవుడు వారికి చేసియున్నాడో చూడుడి. తెలివియున్న ఎవరైనను టేపు రికార్డులను ఉపయోగించి టేపులను తీయవచ్చును లేక టేపు చేసి వాటిని అమ్మ వచ్చును. అయితే వారింకను వర్తమానముతో పెనవేయబడి, మరి వారిని ఏక అభిప్రాయముతో మరి ఐక్యతతో ఉండులాగున చేసి, ఈ ఉదయమున ఆ చిన్న గుంపును ఈ విధముగా నడిపించుట ఆ పరిశుద్ధాత్మ వలననే వీలగును. దేవా, మీరు… ఈ ప్రజలకు భూమిపై దీర్ఘాయుస్సును, సంతోషమును మరి ఆనందమును ఇచ్చి మరి అటు పిదప జీవితము ముగించిన పిదప ప్రభువు యొక్క సంతోషములో పాలుపొందులాగున, మీరు వారికి అనుగ్రహింపుము.
PS 42:7
9మేమిప్పుడు యుద్ధమునకు సిద్ధముగానున్నాము, బూర ధ్వనించబోవుచున్నది. పాటలు పాడి ముగించబడినది, ఇప్పుడు వాక్యము రాబోవుచున్నది. నేనిక్కడ నిలుచుకొనియుండగా, మీకు తెలియును, అవును, మీకు కూడా తెలియును. అయితే ఈ యొక్క యౌవ్వన సైనికుల యొక్క వ్యాఖ్యానములను వినుచున్నప్పుడు! మరియు నేను వృద్ధుడగుచున్నాను, మీ యొక్క విశ్వాసమును మరియు నమ్మకమును మరియు దేవుని వలన నాకనుగ్రహింపబడిన ఈ యొక్క వర్తమానమును మీరు విశ్వసించుటకుగాను మిమ్ములను ఏ స్థానములో ఉంచుకొని యున్నారోయని నేను చుట్టును వినుచున్నాను. ఇప్పుడు, ఇది మీకందరికి కానియెడల, వర్తమానము ఏ మంచియును చేయదు. చూడుడి, దానిని ఎవరైనను నమ్మునట్లుండవలయును. మరియు అది దేవుని నుండి వచ్చిన యెడల, దానిని నమ్ముటకు ఎవరైనను ఉండెదరు, మీరు చూడుడి. దేవుడు ఒక మార్గమును ఏర్పరచియున్నాడు. ఆయన, తన మహత్తరమైన మార్గమును ఈ విధముగా తీర్మానించియున్నాడు, ఆయన దేనినైనను పంపించినపుడు దానిని సంధించుటకు లేక దానిని అంగీకరించుటకు ఏదో ఒక దానిని ఆయన కలిగియున్నాడు. కరడు కరడును పిలుచుచున్నది. అది ఆ విధముగానే యుండవలయును.
ISA 59:19•
JOHN 13:35
10సహోదరుడు జీన్ ఈ ఉదయకాలమున ప్రార్థనలో ఉపయోగించిన వాక్యములు, "ఆయన యొక్క ఘనమైన ప్రాకారములలో," నేనిష్టపడుచున్నాను నేను ఆ యొక్క వంతెనను దాటి దేవుడు ఎక్కడ భయభక్తులతో గౌరవింపబడునో అక్కడికి వచ్చునప్పుడు నేను ఆ విధముగానే అనుభూతి చెందెదను. మరియు ఆ అనుభూతిని ఎల్లప్పుడును కాచుకొనియుండెదను. శత్రువు ఏమి చేసినను పరవాలేదు… ఇప్పుడు గుర్తుంచుకొనుడి, దీనిని మరచిపోకుడి, సహోదరుడు లియో మరియు జీన్ ప్రత్యేకముగా మీరు. ఇప్పుడు, సాతానుడు ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఈ విధముగా మనము కొనసాగిపోవుటకు మనలను అనుమతించునని మీరు అనుకొనుచున్నారా? ఓ, కాదు. అతడు ఆ విధముగా అనుమతింపడు. ఈ దినములలో ఒక రోజు ఒక సుడిగాలి వలె అతడు వీయవచ్చును. అయితే శత్రువు వరదవలె మన పైకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ధ్వజమువలె దానికెదురుగా లేచును. దేవునికి మునుపు మీరు ప్రార్థించుట ద్వారా మిమ్ములను మీరు ఉన్నత స్థలములలోనికి ఉంచుకొనుడి. ఒకరినొకరు పట్టుకొనియుండుడి. దేవునిని పట్టుకొని యుండుడి. ఏలయనగా, మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల, అది మీరు దేవుని ప్రేమించుచున్నారని చూపించుచున్నది. "మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు."
11కొద్ది క్షణములకు మునుపు నేను, "ఎంత చక్కగా పాడుచున్నారు! ఎంత మంచి స్వరములు! పురుషులు మరియు స్త్రీలు, భర్తలు మరియు భార్యలు; యౌవ్వనస్తులు, వృద్ధులు మరియు మధ్యవయస్సులో నున్నవారు ఇక్కడ కూర్చొని యున్నవారు ఎంత చక్కటి ఒక గుంపు, " అని తలంచితిని. నేను, "సరి, వీరందరును ప్రెస్కాట్ రేడియో స్టేషన్లో పాడవలసియుండవలసినవారు అని తలంచితిని. అప్పుడు, మీరు చూడుడి, ఈ యొక్క యౌవ్వనస్తులను ఆ విధముగా పాడుటకు దేవుడు పిలువ లేదు. చూశారా? చూశారా? వధువు బయటికి రమ్మని పిలువబడియున్నది, చూడుడి బయటకి రమ్మని, ఇప్పుడు నా యొక్క పని ఇక్కడ మిమ్ములను బయటికి రమ్మని పిలుచుటయే.
మరియు అటు పిదప ఈ విధమైన కార్యములు, మీరు మీ నివాసములను ఏర్పరచుకొని అందులో ఒక్కటిగా జీవించి, మీలో ప్రతి యొక్కరును ఒక్కొక్క రోజు పక్షిరాజు తన పిల్లలను గమనించుచున్నట్లు అటు వంటి దృష్టితో మీ బిడ్డలను గమనించుచు, మీ యొక్క బిడ్డలను పెంచుటకు కోరుకొందురు, కావున మీరు… మీరు ఏదైనను తప్పు కనుగొనిన ఎడల, మీరు అప్పుడు ఆ వ్యక్తిని ప్రక్కకు పిలచి మరి ఆ కార్యముపై ప్రార్థించుట మరియు ఆ విధముగా చేయుదురు. పరిశుద్ధాత్మ వచ్చి దర్శించులాగున ఆ స్థలమును నిర్మలముగా, పరిశుభ్రముగా నుంచుడి.
PS 133:1,2
12దేవుడు ఆరాధింపబడుటకు ఇష్టపడును. మరియు మీరు ఆయనను ఆరాధించునప్పుడు మనము ఎల్లప్పుడును పాడులాగున ఒక పాట పాడుట కాదుగాని, అయితే ఆత్మతో ఆరాధించుచు పాడుటయే, మీరు చూడుడి, అప్పుడు పరిశుద్ధాత్మ మరల వచ్చుట మీరు స్పృశించగలరు.
ఇక్కడున్న యౌవ్వనస్తులను నేను చూచునప్పుడు, ఆ దినములలో యౌవ్వనస్తులు -ఈ విధముగా కూర్చొనియుండుటయును, ఇక్కడున్న యౌన్వనస్తులు తమ భార్యలతో కూర్చొనియున్న ప్రకారము ఆ దినములలో వారు కూర్చొనియుండి, ఆ పెద్ద, దృఢమైన వ్యక్తులు చిన్న బిడ్డలవలె ఏడ్చుటను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఈ దినములలో చూచిన యెడల వారు వీథులలో తిరుగుచు వ్యభిచారములోను మరి ప్రపంచపు మురికిలో మరి అటువంటి కార్యములలో జీవించుచున్నారు. "సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు ఎంత మనోహరము," అని కీర్తనలు పాడినవాడు పాడినట్లు వేరువేరుగా వచ్చి మరి ఈ విధముగా ఒక్కటిగా కూడుటను తలంచి చూచునప్పుడు, అది తలమీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును.
ఆ అభిషేక తైలము… ఆ అభిషేక తైలము ఏమి చేసినదని మీకు తెలియునా, అది దేవుని యొక్క సముఖమునకు వెళ్లుటకు అతనిని సిద్ధపరచెను. చూశారా, దేవుని యొక్క సముఖమునకు పోవుటకు మునుపు అతను ఆ యొక్క తైలముతో అభిషేకింపబడి యుండ వలయును. మరి సహోదరులు ఐక్యతతో నివసించుట, ఆ యొక్క పరిమళ తైలమునకు పోల్చబడి యున్నది. అప్పుడు మనము సహోదరులు ఐక్యతతో నివసించుట అను అభిషేకముతో దేవుని యొక్క సముఖమునకు వెళ్ళేదము. తైలము పరిశుద్ధాత్మకు గుర్తుగా యున్నది."
13ఇప్పుడు మనము వాక్యమును చదువుటకు మునుపు ప్రార్థించుకొనెదెమా. పరలోకపు తండ్రీ, ప్రభువు యొక్క ఘనమైన ప్రాకారములలోనికి పోవులాగున అని మా సహోదరుడు ఈ ఉదయకాలమున వ్యక్తపరచినట్లు! ఇప్పుడు, తండ్రీ, ఇక్కడున్న ఈ యొక్క ప్రజలైన మేము దానిని గుర్తెరుగుచున్నాము, మరిప్పుడు నేను వీరికేమి చెప్పుచున్నానో న్యాయతీర్పు దినమున దానికి నేను బాధ్యుడను దానికి బదులు చెప్పవలయును. మరి వీరు మీ యొక్క బిడ్డలు. తండ్రి విడువక ఎల్లప్పుడును వీరిని ఆశీర్వదించుము. సహోదరుడు లియోను మరియు సహోదరుడు జీన్ ను కూడా ఆశీర్వదించుము. వేుము సూర్యాస్తమయమునకు మా యొక్క యాత్రను కొనసాగించుచుండగా, ఈ యొక్క జనులను నడపుటకు, మీ యొక్క పరిశుద్ధాత్మ వారిని నడిపించును గాక, మరియు, ఓ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కూమారుని యొద్దకు మమ్ములను నడిపించుము. దానిని అనుగ్రహించుము, ప్రభువా, వాక్యము ద్వారా మాకు జీవపు రొట్టెను పంచి పెట్టుము.
మరియు మేము… ఇప్పుడు మేము యుద్దములోనున్నామని ఎరిగియున్నాము. ఈ యొక్క సైనికులపై మిగిలియున్న వారి జీవిత కాలములో వారు పోరాడులాగున మేము సర్వాంగ కవచములను వారిపై ధరింప జేయుచున్నాము. మరియు ఆ సర్వాంగ కవచము ఎక్కడెక్కడ ఏ భాగమునకు సరిపోవునో మరి మీరు వాటిని వారికి సరిగా ధరింపజేయుడి, మరి ఎప్పుడెప్పుడైతే శత్రువు వారికి ఎదురుగా వచ్చునో అప్పుడు వారు వీటిద్వారా కేడెము ద్వారా కాచుకొననిమ్ము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.
1COR 2:4
14ఇప్పుడు, నేను చాలా మెల్లగా మాటలాడుచున్నాను, ఏలయనగా నేను ఒక శిక్షణ పొందిన వాక్య పరిచారకుని కాదు. ఇక్కడ తెలివైన, జ్ఞానముగల వివేకులు గలరని నాకు తెలియును, మరియు వారు వాటినన్నిటిని ఆ ప్రక్కకునెట్టి, ఇప్పుడు వారు తమను తాము ఏమిలేనివారమని అనుకొనుచు తగ్గించుకొనియున్నారు. అపొస్తలుడైన గొప్ప పౌలు, "మనుష్యులు ఉపయోగించు జ్ఞానయుక్తమైన తియ్యని మాటలద్వారా నేను మీ యొద్దకు రాలేదు ఏలయనగా మీరు దానిపై మీ విశ్వాసము నుంచెదరు, అయితే, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మీ యొద్దకు వచ్చితిని," చూడుడి. అతను నేర్చుకొనిన అతనికి తెలిసిన గొప్ప కార్యములను అతను ప్రక్కకు నెట్టివేసెను.
మరియు ఇక్కడున్న అతనివలె, సువార్త సేవలో బోధకుడుగానున్న సహోదరుడు హుగ్లీ మరియు సహోదరీల వలె మరియు నిజముగానే తెలివియును మరియు జ్ఞానముగలిగిన వారు మీలో అనేకులు ఉన్నారు; మరి మీకు ముందు చదువులేని నేను నిలుచుకొనియుండుట నాకు చాలా సిగ్గుగా యున్నది. అయితే నేను… ఆ విధముగానున్న మీరు మీలోనున్న గొప్పతనమంతటిని ప్రక్కకు నెట్టి వేసి మొదటి అక్షరములు కూడా సరిగా తెలియని ఒకని ముందు కూర్చొని వినుట నిజముగానే మీలోని గొప్పతనమును చూపించుచున్నది. భుజములను విరచుకొని మరి నడచువాడు కాదుగాని మరి… తనను తాను తగ్గించుకొనువాడే. మంచి గుణములు ఒకని యొక్క తన చేతి కండరముల వలన కాదు గాని లేక కఠిన్యమైన చర్మము కలిగిన చేతులవలన కొలువబడదు గాని, అయితే విడువక ప్రార్థించుటవలన అతని యొక్క పాంటు మోకాళ్ళయొద్ద చినిగిపోవుటవలన కనుగొన వచ్చునని నేను అనుకొనుచున్నాను. అదియే ఒకనిని మంచి మనుష్యునిగా చేయునని నేను తలంచుచున్నాను.
15ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథము నుండి కొన్నిటిని చదువవలయునని కోరుచున్నాను. మరియు నేను వాక్యమును ఇష్టపడెదను, మీకిష్టము లేదా? ఇప్పుడు మనము ప్రభువును ఆరాధించియున్నాము, మరియు ఆయనను ఆరాధించుచునే యుండెదము. మనము ఏ స్థితిలో యున్నామో తెలిసికొనుటకు మనమధ్య కోయుచు పోవుచునుండెడి వాడిగల అంచుకలిగిన ఒక ఖడ్గముగా ఇప్పుడు మనము ఆయనను ఆరాధించెదము. మరియు నేను వీటన్నిటిని ఎందులకు చెప్పుచున్నాననగా ఈ యొక్క స్థలములో మాత్రమే నేను వీటిని బోధింపగలనన్న భావముతో ఈ ఉదయమున నేను దీనిని చెప్పదలచియున్నాను.
మరియు ఎట్లైనను సహోదరుడు లియో మరియు జీన్ మరి వారు ఈ ఉదయమున అతని యొక్క వర్తమానములో చెప్పబడినట్టు మేము నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పిన కార్యములన్నింటిని విడమరచి మీకు బోధించెదరు. దానిని అతను గ్రహించును. అయితే మీరు దానిని ఈ విధముగానో లేక టేపుల ద్వారానో చెప్పలేరు, అయితే, చూడుడి, మీరు నెమ్మదిగా నుండి వాటిని ధ్యానించుడి.
అది అర్థము చేసికొనుటకు చాలా కఠినముగానున్నందున వాటిని మరల, మరల వాటిని చదువుడి. కావున అనేకులు దానిని అపార్థము చేసికొనెదరు. మరియు మీకు తెలియునా చిన్నమందా, మనుష్యుల మధ్య అది - అది ఎల్లప్పుడును ఆ విధముగానే యుండును? ఎల్లప్పుడును ఆ విధముగానే కొందరు గ్రహించెదరు, అనేకులు గ్రహింపరు.
JOHN 6:53
16మన ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తును వారు అర్థము చేసికొనలేకున్న యెడల (ఆయన యొక్క శిష్యులు కూడ, చూశారా) మరి ఈ రోజులో మనము దానిని అర్థము చేసికొనగలమని ఎట్లు ఎదురు చూడగలము. ఆయన చెప్పెను, ఆయన కార్యములను చెప్పునప్పుడు తిన్నగా వాటిని వివరింపక సూటిగా చెప్పును. ఆయన వాటిని అట్లే చెప్పి వేయును. ఉదాహరణముగా "నా శరీరమును భుజించి నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు". "ఆ విధముగా దానిని వివరింపక చెప్పెను."
ఇప్పుడు ఒకవేళ ఒక వైద్యుడు లేక ఒక నర్సు లేక వేరేవరైనను ఆ దినమున ఆ సంఘమున ఆయన దానిని చెప్పునపుడు నిలుచుకొనియున్న యెడల ఏమనుకొనియుందురు? సరి, "ఈ యొక్క మనుష్యుడు నరుల రక్తమును త్రాగే భూతము అని వారు చెప్పిరి. చూశారా, ఆయన రక్తమును త్రాగవలెనని కోరుచున్నాడు." చూడుడి, దానిని ఆయన వివరింపలేదు. దానిని చెప్పెను అంతే. అయితే పౌలు వచ్చి మరి దానిని వివరించెను, మరది ఏవిధముగా ప్రభుసంస్కారమని, మీకు తెలియునా, "ఆయన యొక్క శరీరమును భుజించి మరి ఆయన రక్తమును త్రాగుట." మరి కావున ఆయన వాటిని ఆ విధముగా చెప్పెను.
JOHN 21:22,23
17మరియు చివరగా అపొస్తలులు ఆయన పునరుత్దానమునకు పిదప, ఆయన భుజమునకు ఆనుకొనియున్న ఒకడు, యోహానును ఆయన ప్రేమించెను. అతనొక యౌవ్వనుడు. మరియు ఆయన యోహానును గురించి చెప్పెను, "నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? కాబట్టి యేసు తిరిగి వచ్చు వరకు యోహాను మరణించడను మాట వారిలో ప్రచారమాయెను. యేసు ఆ విధముగా చెప్పియుండలేదు. ఆయన చెప్పెను, "అతడుండుట నాకిష్టమైతే అది మీకేమి?"
మరియు అటుపిమ్మట మీరు వాక్యములలో దానిని చదవియుండెదరు ఏ విధముగా దేవుడు అప్పుడు… ఆ మాట ఒక ఉద్దేశముతో చెప్పబడినది. ఈ కార్యములన్నియును ఒక ఉద్దేశముకొరకైనవి. దేవుడు ఆ యొక్క యౌవ్వనస్తుని ఆత్మలో పైకెత్తి మరి అతడు రాబోవు కాలమును ఆయన రాకడను చూచెను. చూశారా, చెప్పెను, "అతనుండుట వలన మీకేమి? ఆయన అతనిని శరీరములో ఆయన వచ్చువరకు ఉండులాగున చేయలేదు; అయితే అతని ద్వారా ఆయన పలికిన వాక్యము, మనము ఇప్పుడున్న ఈ కాలమునకు మనలను తీసికొనివచ్చెను, మీరు చూడుడి. కావున, సకల కార్యములను మంచి కొరకే జరుగును.
ROM 12:1,2•
PHIL 2:5
18అందరు ఎరిగిన రోమీయులకు వ్రాసిన పత్రిక, దీనిలో నేను కొన్ని వాక్యములను తీసికొన వలయునని యున్నాను (మరి మొదటి రెండు లేక మూడు వచనములను, రెండు వచనములను అని నేననుకొనుచున్నాను), మరి చదవెదము. మరియు నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ యొక్క సహాయము వలన నేను దానిని వివరించుటకు ప్రయత్నించెదను. రోమా 12వ అధ్యాయము.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
ఈ ఉదయకాలమున మీరు చేయుచున్న కార్యములకు ఈ పాఠ్యభాగము చాలా బాగుండునని నేను అనుకొన్నాను.
ఇప్పుడు, ["మరియు," అనగా నేనర్థము చేసికొననట్లు కలుపునట్టి పదము.] మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనసు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
"ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మన మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతర పరచబడుటయే, మనమందరమును చేయవలయునని కోరు కార్యము ఇదియే. ఇప్పుడు మనము ఉన్నపాటున రక్షింపబడియున్నాము; మనము కలిగియున్నట్లు మనము పరిశుద్ధాత్మతో నింపబడి యున్నాము; ఇప్పుడు మనము ఆయన వాక్యముద్వారా, దేవుని ఆత్మ ద్వారా రూపాంతరము నొంది, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయుటకు కొనిరాబడునట్లు, ఈ లోక కార్యముల నుండి రూపాంతరపరచబడునట్లు, క్రీస్తులోనున్న మనస్సు మనలో నుండ వలయునని కోరుకొనుచున్నాము. ఇప్పుడు నా యొక్క పాఠ్యాంశము: "రూపాంతరపరచు శక్తి."
GAL 6:17
19ఇక్కడ నా బైబిలును పెట్టుచున్నాను. కొన్ని సంవత్సరములకు మునుపు ఈ యొక్క వ్యక్తులవలె నేను యౌవ్వనస్తునిగా యున్నప్పుడు నేను, నా యొక్క లేఖనములను నేను చదువు చున్నప్పుడు గుర్తుపెట్టుకొనక యుండెడివాడిని. అయితే, ఇప్పుడు నేను వయస్సు ముదురుచుండుట వలన నేను ఒక చిన్న పుస్తకమును తీసికొని వెళ్ళుచుండెడి వాడిని. మరియు నేనేదైనను పొందినప్పుడు నేను దానిని గుర్తుంచుకొనుచు మరియు దానికి తగిన లేఖనములను గుర్తుంచుకొనుచుండెడివాడిని. మరియు దానికి మునుపు అన్ని లేఖనములను నా యొక్క మనస్సులో గుర్తుంచుకొనెడి వానిని, సరిగా అన్నియును జ్ఞాపకమునకు వచ్చును.
అయితే, ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయమున నేను మీవలె యౌవ్వనస్తున్ని కాదు. అయితే నేను వృద్దాప్యుడ్ని, మరియు నేను అనేక కఠినమైన పోరాటములను ఎదుర్కొని యున్నాను, చూశారా; మరియు ఆ యొక్క కఠినమైన జీవిత యుద్ధములో పోరాడి వచ్చినందువలన ఈ ఉదయము అది నన్ను మీ యొద్దకు తీసికొని వచ్చియున్నది. చూశారా? కావున, దానిని మీరు సరిగా గ్రహించియుందురని నేను అనుకొనుచున్నాను. అప్పుడు మీరందరును ఆ యొక్క కఠినమైన మార్గములో పోవులాగున దేవుడు దానిలోనన్నుంచి దాని ద్వారా నన్ను నడిపించి "ఇది ఫలనా కార్యము, చూడుడి," అని చెప్పగలుగులాగున నా యొక్క జీవితము ఒక మార్గమును తెరచియున్నది. అయితే, నేను ప్రయణించులాగున ఇంతకుమునుపే ఎవరో నాకొరకు మార్గమును తెరచియున్నారు, చూశారా. మరియు ఆ మార్గమును ఒకరికొకరు తెరచుచున్నాము. మరియు కొన్ని సమయములలో వృద్ధుడైన యుద్ధ వీరుడు తన ఒంటిపై గాయములతో నుండుట మీరు చూచునప్పుడు, మరి ఆ విధముగానే పౌలు ఒక మారు చెప్పెను, "నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను," మీరు చూశారా. దానిని పౌలు తిమోతికి ఇచ్చుచున్నప్పుడు, భయభక్తులతో తిమోతి ఆ యొక్క ముద్రలను గమనించి యున్నాడని నేను ఊహించుచున్నాను.
20ఇప్పుడు, "రూపాంతరపరచబడుట…" నేను జాతీయ సేవా కంపెనీలో పనిచేయుచున్నప్పుడు, అక్కడ విధ్యుఛ్ఛక్తిని సరైన రీతిలో మార్చి సరఫరా చేయునటువంటి పరికరము ట్రాన్స్-ఫార్మ్లు నుండెను. ఇప్పుడు ఆ పదము యొక్క అర్థము దానిలోనే యున్నది… రూపాంతర పరచుట, అనగా "ఒక స్థితి నుండి మరియొక స్థితికి మార్చబడుట." మరి రానున్న నలుబది-ఐదు నిమిషములు రూపాంతర పరచబడుటను గురించి మాటలాడగోరుచున్నాను, నేను ఈ అంశమును ఉపయోగింపదలచుచున్నాను. ఇక్కడ కొన్ని వింతగా తోచు కార్యములను నేను చెప్పవచ్చును. మరియు సహోదరుడు లియో ఇప్పుడు చెప్పినట్లు, "దానిని తీసికొని మరి కొద్ది సేపు చదువుడి, చూశారా. దానిని గురించి కొద్దిసేపు ఆలోచించుడి.
ROM 12:2
21రూపాంతరపరచబడుట అనగా "మార్చబడి మరియు ఏదో వేరే రూపమునకు మార్చబడుట." ఒక కప్ప పిల్ల, అది పిల్లగా నుండి మరి కప్పగా రూపు మార్చబడును, చూడుడి. అది ఒకప్పుడు వాలుగ చేపగా అగుపించును, అది ఈత కొట్టును, దానికి తల యుండును మరి దాని తోక మరిన్నియును ఒక వాలుగ చేపవలె కనిపించును. మరటు పిమ్మట కొద్ది దినములైన పిదప అది తన తోకను పోగొట్టుకొనును, తోకను వదిలివేయును, మరియు అతను ఒక జాతి నుండి ఇంకొక జాతికి మారుచున్నాడు.
"నూతనమగుటవలన రూపాంతరము పొందుడి, " అని పౌలు చెప్పినప్పుడు దీనినే అతను తన మనస్సులో నుంచుకొని చెప్పి యుండును. మనము దానిని చూచెదము, దానిని నేను సరిగా చెప్పెదను. "మరియు అనుసరింపక, [మీకు తెలియునా, అనుసరింపక అనగా ఏమిటని?] ఈ లోక మర్యాదను అనుసరింపక, అయితే మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి, …"మీ మనస్సులను నూతనపరచుట." ఒకప్పుడు మీరు అమూల్యములని తలచిన కార్యములను ప్రక్కకు నెట్టి మరి వేరొక దానికి రూపాంతరపరచబడుట; మీరు ఏ విధముగ నున్నారో, ఆ స్థానము నుండి ఇప్పుడున్న స్థితికి మార్చబడుట, చూశారా, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన.
ఓ, దానిని ఏ విధముగా చేయవలయుననుటయే మనము తెలుసుకొనగోరుచున్నాము, చూశారా. మనమిక్కడనున్నాము, ఆయనను మనము ప్రేమించుచున్నాము, ఆయన మనలను రక్షించెను, ఇప్పుడు మనమేమి చేయవలెనో తెలుసుకొనగోరుచున్నాము. ఇంకొద్దిగా మన క్రైస్తవ జీవితములో మనము ఎదుగుటకు ఈ యొక్క ఉదయమున మనము కొద్దిగా ముందడుగు వేయుటకు ప్రయత్నించుచున్నాము. కొన్ని సమయములలో మనము కార్యములను కొట్టవలసినదిగా యున్నది… మీరు ఆ విధముగా కొట్టుట వలన ఏమి వెలుపలికి రానైయున్నదో యని మనము చూచువరకు మీరు కాచుకొనియుండుడి.
GEN 1:2,3
22ఇప్పుడు, ఆదికాండము మొదటి అధ్యాయము, "దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను." మనము ఎరిగియున్నాము జలములు… మరియు బైబిలు చెప్పుచున్నది, ఆదియందు అక్కడ వెనుకట, ఈ యొక్క భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏమియును క్రమముగా లేక చీకటినిండిన అవ్యక్త స్థితిలో నుండెను. మరియు ఎటువంటి ఘోరమైన ఏ విభజనలేని స్థితిలోనుండి యుండెనో, చీకటి తప్ప వేరేమియును లేకుండెను, వెలుగు లేకుండెను మరేదియును లేకుండెను, మరియు నీటి అలల శబ్దము లేకుండెను, మరియు ఆ నక్షత్రము గమ్యము తెలియక గ్రహ మార్గమును చుట్టూ తిరుగుచూ వచ్చుచుండెను. అది దారి తప్పినట్టున్నట్లు వంటి స్థితిలో తన మార్గమును కనుగొనలేని స్థితిలో ఒక భయంకరమైన అయోమయ స్థితిలో నుండెను. మనము కూడా దేవుని యొద్ద నుండి దూరముగా తొలగిపోయినపుడు ఆ విధముగానే దిక్కు తెలియక సంచరించు నక్షత్రములవలె, నమ్మకములేక, దేవుడు లేని వారివలె నుండెదము; దేవుడు లేక, చుట్టూ తిరిగి వచ్చుచు, మనము ఎక్కడికి పోవుచున్నామో తెలియక చీకటిలో సంచరించు చుండెదము.
మరియు దేవుడు ఆ చీకటియొక్క అవ్యక్తస్థితిని తీసివేసి మరి ఆయన వాక్యము ద్వారా దానిని ఏదేను తోటగా మార్చివేసెను. ఆ విధముగానే మనము దేవుని యొక్క వాక్యము ద్వారా రూపాంతరపరచబడి యున్నాము. 'వెలుగు కమ్మని' దేవుడు పలుకగా మరి సృష్టి రాశి అంతయును సూర్యుని చుట్టు వచ్చి మరి సూర్యుని చుట్టూ తిరగనారంభించెను మరి అది ఏదెను తోటగా మారెను, ఏలయనగా అది దేవుని యొక్క వాక్యమునకు లోబడెను. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చేసెను, ఏలయనగా ఒక గందరగోళపు స్థితి నుండి దేవుని యొక్క వాక్యము ద్వారా ఏదేను తోటగా మారెను.
23ఇప్పుడు, దానికొరకే మనమిక్కడనున్నాము. అదియే నా యొక్క వర్తమానము, ఇంతవరకు నేను బోధించుచువచ్చుచున్నది దేవుని యొక్క వాక్యమే. ఇతర ఏ కార్యములు సంభవించినను దానిని మనము విడువక పట్టుకొనవలయును. ఎల్లప్పుడును ఆ వాక్యములోనే నిలచియుండుడి. మీ యొక్క ఉద్దేశములు మరి అభిప్రాయములు దేవుని యొక్క వాక్యప్రకారమున్నదో లేదో యని ఎల్లప్పుడును మీరు సరిచూచుకొనుడి. అట్లు లేని యెడల, వాటిని వదలివేయుడి, చూశారా. అయితే అది దేవుని యొక్క వాక్యానుసారమైనదైయుండి దేవుని యొక్క వాక్యముతో సరిగానున్న యెడల పిమ్మట దానిని వదలక పట్టుకొనుడి.
ఈ ఉదయమున చిన్న గుంపుగా మీరు ఇక్కడున్నట్లు — దేవుడు కొన్ని సమయములలో వెంటనే ఒకే రాత్రిలో ఆయన ఏ కార్యమును చేయడు. ఆయన నెమ్మదిగా చేయును, ఎందుకనగా దేవుడై యున్నాడు… మనము ఎల్లప్పుడును తొందరపడెదము. దేవుడు తొందరపడడు. ఆయన చెప్పిన యెడల అది ఆ విధముగానే జరుగును; ఏలయనగా ఆయన ఏదైనను చెప్పిన యెడల అది అట్లే సంభవింపవలయును. అది ఆ విధముగానే జరుగును ! ఆయన, అది జరుగుటకు దాని సమయమును అది తీసికొను విధముగా అయన దానిని అనుమతించును. ఆయన అనుమతించును.
DAN 3:17,18
24లేఖనములలోని ప్రఖ్యాతిగాంచిన గుణాలక్షణములు కలిగిని దేవుని యొక్క వాక్యము సత్యమని దానికొరకై నిలిచియున్న యూదుల బాలురు, ఇట్లు పలికిరి, "మా దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్ములను రక్షింపక పోయినను మేము ఈ ప్రతిమకు నమస్కరింపము, చూశారా, ఏలయనగా అది వాక్యమునకు విరుద్దమైనది, చూడుడి. ఆయన ఒక వేళ మమ్మును చంపినను, ఆయన మరల మమ్ములను లేపును, మీరు చూశారా." చూడుడి, మరి వారు… ఆయన వారిని ఆ గొప్ప మండుచున్న అగ్ని గుండము అంచువరకు నడిపించెను మరి వారిని అందులో వేయుటకు కూడా అనుమతించెను అది ఎట్లుండెననగా, ఆయనకు వారిపై అక్కర లేకుండునట్లును ఆయన వారిని గమనింపకుండునట్లును అది అగుపించెను. అయితే ఎల్లప్పుడును ఆయన గమనించుచుండును. ఈ కార్యమునకై ఆయన వారిని గమనించుచుండెను.
GEN 1:3,21,25,27•
2PET 3:8
25ఇప్పుడు దేవుడు "వెలుగు కమ్మని" పలికెను. మరియు ఈ యొక్క ఏదేను ఉద్భవించుటకు ఆరు వేల సంవత్సరములు పట్టెను, మరియు దేవునికి మన యొక్క వెయ్యేండ్లు ఒక దినమని మనము లేఖనములో చదవియున్నాము. భూమిపై ఒక వెయ్యి సంవత్సరములు దేవునికి ఒక దినము. కావున ఈ యొక్క భూమిని చేయుటకును, మరియు దానిని ఏదేనుగా తయారుచేయుటకును ఆరువేల సంవత్సరములు పట్టెను. అయితే, మీరు చూడుడి, అది దేవుడు, సమస్త జ్ఞానమునకు మూలధారకుడు, మరియు ఆయన - తాను ఏమి చేయ బోవనైయున్నాడనేది ఆయన తలంపులో నుండెను. ఈ యొక్క లాగుకొనిపోవు బండిని మానవుడు చేసినప్పుడు, మానవుడు ఆ యొక్క… ఈ యొక్క ఉద్యానవనమును సహోదరులైన మీరు దానికి నమూనా వేసి, మరి దానిని మీరు ఆ విధముగా చేసినప్పుడు, అది మీ యొక్క తలంపులలో నుండెను, ఆ యొక్క దర్శనమును మీరు క్రియా రూపములో వుంచి దానిని చేసియున్నారు. ఆ విధముగానే దేవుడు ప్రపంచమును చేసియున్నాడు. ఆయన పని చేసెను… అది ఆయన యొక్క మనస్సులో నుండెను.
మరియు మీరు గమనించిన యెడల ఒకదాని నుండి మరియొకటి వచ్చినట్లును, ఇంకను అధికముగా నేర్చుకొనుచునుండు విధముగా, వేరేదో గొప్ప - గొప్ప కార్యముల తలంపులతో కనుపించును. అయితే, చూడుడి, ఆయన వాటన్నిటి కంటేను ఉన్నత స్థానమందుడి మరియు ఆయన మెట్టు-మెట్టుగా వచ్చులాగున వాటిని అనుమతించెను, మీరు చూశారా. సమస్తమును ఆయన భూమిపై సృష్టించెను, వృక్ష జీవము నుండి, మరియు చేపలను మరి ఆ విధముగానున్న వాటిని, పిదప పక్షులను, మరియు జంతువులను మరటు పిదప ఆయన యొక్క పోలికలతో — ఒక మానవుని — సృష్టించి మరక్కడ నిలిపివేసికొనెను, చూశారా, ఏలయనగా అది ఆయన కోరుకొనినట్లు ఆయన యొక్క పరిపూర్ణతలో నుండెను.
ROM 12:2
26మీరు కూడా ఆ విధముగానే ప్రారింభించియున్నారు ఉదాహరణకు ఈ యొక్క లాగు-బండి వలె. మీరు చట్టమును అక్కడ పెట్టి మరి మీరు అడిగెదరు, "మీరేమి చేయుచున్నారు? మీరు ఉద్యాన వనము కొరకు ఇక్కడ ఈ మూలనున్న రాళ్లను మొదలు తీసివేయులాగున, "మీరేమి చేయుచున్నారు?" అని అడిగనట్టు. చూశారా? ఆరంభములో అది ఇప్పుడున్నట్లు అగుపించలేదు అది చిన్న ఏదేను వలె కనిపించుచున్నది, ఏలయనగా అది మీ యొక్క తలంపులలో ఏమి చేయ వలయునని యున్నదో మరి దానిపై మీరు క్రియ చేసియున్నారు.
ఇప్పుడు, మనము మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరపరచ బడవలయునని కోరుచున్నాము, చూశారా. ఈ భూమిపై మనము ఏమి పొందియున్నామని కాదు, ఈ భూమిపై మనము ఏమి ఎదురు చూచుచున్నామని కాదు; అయితే రానున్న లోకములో మనము ఏమై యుండబోవుదుమో అదియే కార్యమైయున్నది. మనయొక్క మనస్సు నూతనమగుటవలన రూపాంతరపరచబడెదము!
GEN 1:3,31
27ఇప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు దీనిని సృష్టించుటకు ఆరువేల సంవత్సరములు తీసికొనెను. మరిప్పుడు ఆయన దానిని నెరవేర్చవలయునన్న ఒక ఉద్దేశమును కలిగియున్నాడని దేవుడు కలిగియుండెనని దీనిలో మనము చూచుచున్నాము. మరియు అనేకులు ఆదికాండమును ప్రసంగించునప్పుడు 1వ అధ్యాయము, మరియు 2వ అధ్యాయము, ప్రత్యేకముగా 3వ అధ్యాయములో దేవుడు మరల మరల దానిని చెప్పుచున్నట్లు అగుపించును. ఓ, ఆయన చెప్పుచున్నాడు, ఆయన చేసిన కార్యములన్నిటిని ఆయన మొదట చెప్పియున్నాడు. ఓ, ఆయన ఎట్లు… "వెలుగు కమ్మని పలుకగా, మరియు అది కమ్మని మరియు ఆలాగుననే కమ్మని పలుకగా, ఆయన పలుకునప్పుడు అవేమియును వాటిలో ఒక్కటైనను అంత వరకుండలేదు." ఏమియును లేకుండెను. అప్పటివరకు వెలుగులేకుండెను. ఆ యొక్క పాత ప్రపంచము ఇంకను చీకటిలో తేలుకుంటు జలముల ద్వారా కప్పబడియుండెను. అయితే, చూడుడి, ఆయన ఆయన యొక్క వాక్యమును పలికెను, మరటు పిమ్మట ఆయన పలుకునప్పుడు అవన్నియును జరిగెను.
GEN 1:3,27•
GEN 2:7•
EPH 5:27
28ఇప్పుడు, మనము ఆదికాండము 1లో గమనించుచున్నాము, ఆయన చెప్పెను, "మరి ఆయన తన స్వరూపమందు నరుని సృజించెను, ఆయనవలె దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను." చూశారా, ఆయన నరుని తయారు చేయుచున్నాడు, ఆయన మాట మాత్రము పలికెను. అటుపిమ్మట మనము చూచుచున్నాము, అనేక దినములు గతించిపోయెను, ఒకవేళ వందల కొలది వందలకొలది సంవత్సరములు గడచిపోయెను, అయినను ఇప్పటికి నేలను సేద్యపరచుటకు నరుడులేకుండెను. నేలను సేద్యపరచుటకు ఎవరును లేకుండిరి, కావున అప్పుడు దేవుడు నేలమట్టితో నరుని నిర్మించెను. ఆయన వాక్యమును పలికి యుండెను, మరటు పిమ్మట వాక్యము నెరవేరెను. ఇప్పుడు, ఆయన "వెలుగు కమ్మని" పలుకగా, వెలుగు కలుగుటకు ఒక వేళ వందలకొలది సంవత్సరములు, ఒకవేళ ఎనిమిది వందల సంవత్సరములు పట్టి యుండవచ్చును, అయితే దేవుడు పలికినందు వలన అది నెరవేరవలసి యుండెను.
మరియు దేవుడు ఒక సంఘమును కలిగియుండబోవుచున్నాడు, మనము ఎన్ని అంధకార యుగములలోకి పోయినప్పటికిని లేక ఏమైనను పరవాలేదు నేను లెక్క చేయను. మనము అందులో భాగస్తులముగానున్నను లేకున్నను ఆయన కళంకమైనను, ముడతయైనను లేని ఒక సంఘమును కలిగి యుండబోవుచున్నాడు, ఏలయనగా ఆయన అది సంభవింపనైయున్నదని దానిని ఇదివరకే చెప్పియున్నాడు. అది అక్కడ ఉండబోవుచున్నది.
29మరియు ఆయన వృక్ష జీవమును మరియు ఇతర జీవములను ఉండునట్లు ఆజ్ఞాపించెను. ఆయన ఈ విధముగా చెప్పెను, ఉదాహరణకు, "తాటి చెట్టు కలుగును గాక. మరియు సింధూర వృక్షము కలుగును గాక. దేవదారు వృక్షము కలుగును గాక." మనము నివసించు ఎడారి ప్రదేశమైన టూసాన్ ను చూడుడి. అక్కడ ముండ్ల చెట్టు కలదు, ఎగురు ముండ్ల చెట్టు, అన్ని రకములైన ముండ్ల చెట్లు కలవు. ఇక్కడ నుండి ముప్పది మైళ్ల దూరములో కొండపైన షర్మన్ పైన్ సూది ఆకులు గల చెట్లుండును. ఇప్పుడు ఈ యొక్క ముండ్ల చెట్లు అక్కడ పైన పెరగవు, మరి ఆ షర్మన్ పైన్ క్రింద ఇక్కడ పెరగవు. ఇప్పుడు ఆ యొక్క విత్తనములను పూడ్చిన జ్ఞానమెక్కడిది? చూశారా? అది ఎక్కడినుండియో వచ్చియుండవలయును. అదియే దేవుని యొక్క వాక్యము, "కలుగును గాక," మరి అవన్నియును కలిగెను.
GEN 1:11,20•
GEN 2:15
30ఇప్పుడు, ఆయన వాటినన్నిటిని చేసిన పిదప అవి వాటి వాటి జాతుల చొప్పున రూపాంతరపరచబడి మరి వాటి జీవమును పొందుటను మరియు అవన్నియును దేవుని యొక్క వాక్యము ద్వారా అక్కడ ఉంచబడుటను మనము కనుగొనియున్నాము. అవన్నియును ఏదేను తోట అని పిలువబడు ప్రధాన స్థలములో నుండుటను మనము కనుగొనియున్నాము. మరియు దేవుడు ఆయన యొక్క కుమారుని, మరియు ఆయన కుమారుని యొక్క వధువును వాటిని పాలించుటకు వాటాన్నిటిపైన అధికారమిచ్చెను, చూశారా.
ఈ యొక్క గొప్ప సృష్టిని చూచిన యెడల, దానిని సృష్టించుటలో ఆయనకు ఒక కారణము కలదు. ఆయన సమస్తమును చాలా అందముగా సృష్టించెను! ఆయన పుష్పములను, మరియు జీవమును, మరియు పక్షులను; సృష్టించెను అక్కడ మరణము లేదు, పాపము లేదు, దిగులు లేదు, వ్యాధి లేదు. మరియు ఇవన్నియును ఒక గొప్ప ప్రధాన స్థలమైన ఏదేను తోటలో సమకూడియుండెను. మరక్కడ ఆయన తన కుమారుడైన ఆదామును మరియు ఆదాము యొక్క వధువు భార్యను ఉంచెను.
ఇప్పుడు, మీరు చెప్పవచ్చును, "అది ఆమె యొక్క భార్య" ఆమె అతని యొక్క భార్య యగుటకు నిర్ణయింపబడినప్పటికిని, ఆమె ఇంకను అతని యొక్క భార్య కాలేదు.
MATT 1:20
31లేఖనములలో మనము చూచునట్లు, అక్కడ ఇట్లు చెప్పబడియున్నది, "దావీదు కుమారుడవైన యోసేపూ నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భమున ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది," చూశారా. ఇప్పుడు, ఆమెను వివాహమాడెదనని లేక గైకొనెదనని అతను వాగ్ధానము ఇచ్చిన పిదప ఆమె అతని యొక్క భార్య; అయినను ఇంకను ఆమె అతని భార్య కాలేదు, ఏలయనగా అతను ఆమెను భార్యగా ఎరుగకుండెను. ఆ కారణము వలననే వారు ఏదేను తోటలో ఆ విధముగా నుండిరని నేను చెప్పియున్నాను, "దేవుని యొక్క కుమారుడు మరియు అతని యొక్క వధువు." ఆదాముకి తన యొక్క భార్యగా ఆమెను అతడు నిర్ణయించినప్పటికిని ఇంకను ఆదాము తన భార్యను, భార్యగా హత్తుకొనకుండెను. ఇప్పుడు క్రీస్తు మరి సంఘము వున్న విధముగా అది యుండెను.
MATT 3:9•
LUKE 3:8
32దేవుడు పలికిన మంచి వాక్యపు విత్తనములు తమ తమ జాతులను ఫలింప జేసెను, కావున అప్పుడు సమస్తమును నియమించిన ప్రకారము జరిగెను. భూమి ఉద్భవించెను, అక్కడ వెలుగు ఉండెను. ఆయన సూర్యుని వెలుగునిమ్మని పలుకగా అక్కడ సూర్యుడు ప్రకాశించెను. ఇప్పుడు ఆయన ఎందులకు సూర్యుడు ప్రకాశించులాగున జేసెను? ఆయన యొక్క చింతలో ఈ విధముగా నుండెను, చూడుడి, సూర్యుడు ప్రకాశింపకుండినయెడల ఆయన పలికి సృష్టించిన పుష్పములు ఎదుగవు. ఆయన ఏమి సృష్టించినను దానికొక ఉద్దేశముండెను. ఉదాహరణమునకు ఒక వృక్షము అది సింధూర వృక్షము యొక్క కాయను కాయును, లేక అది ఒక ఆపిల్ను కాయును. ఆయన తోటలో ఫలములను మరి ఆలాటి వాటిని సృష్టించుచున్నాడు. ఇదంతయును ఆయన యొక్క ఉద్దేశముకొరకైయున్నవి. మరి సమస్తమును నెరవేరవలసియున్నది, ఏలయనగా ఆయన పలికి యున్నాడు.
ఇప్పుడు ఆయన దానిని పలికిన పిదప చేయవలసిన ఒకే కార్యము, ఆయన… దానిని పలికిన పిదప ఆయన విశ్రాంతి నొందవలయును, ఏలయనగా దానిని ఆయన పలికియున్నాడు, ఆయన పలికియున్నాడు గనుక సమస్తమును నెరవేరవలసి యున్నది. అది నెరవేరుటకు మునుపు అది ఎన్నెన్ని ఘట్టములలో అది పోవలసియున్నదో, మరి ఎందరు దానిని నిరాకరించెదరో మరియు ఆ విధమైన కార్యములు నాకు తెలియవు. అయితే అది నెరవేరవలయును ఏలయనగా ఆయన అది నెరవేరునని చెప్పియున్నాడు. దానిని ఆయన పలికియున్నాడు.
కడపటి దినములలో ఇక్కడొక సంఘము ఉదయించుట కూడా అటువంటి కార్యమునకు తగినదైయున్నది. ఆయన ఒక వధువును పొందబోవుచున్నాడు. "ఆయన ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడు." మనము గనుక ఆయనను వెంబడింపకున్న యెడల, ఆయనను వెంబండించు ఇంకొకరిని ఆయన పొందగలడు, చూశారా. ఆయన దానిని పొందును, ఏలయనగా ఆయన ఇది వరకే దానిని పలికి యున్నాడు. ఆయన ఏమి పలికినను అది ఆ విధము గానే జరుగవలసినదిగా యున్నది. అది మారదు. అది ఆ విధముగానే బయలుపడవలసినదిగా యున్నది, ఏలయనగా అది ఆ విధముగా జరుగునని ఆయన చెప్పియున్నాడు.
33ఆయన దానిని పలికిన పిమ్మట మరి ఈ యొక్క గొప్ప కార్యములన్నియును నెరవేరబోవుచున్నదని ఆయనకు తెలియును. ఆయన విశ్రాంతి తీసికొనవచ్చును. సమస్తమును ఆయన ఆధీనములో నుండెను! ఆయన యొక్క విత్తనము ఆయన వాక్యముగానున్నది, మరియు ఆయన యొక్క వాక్యము ఒక విత్తనము. యేసు ఆ విధముగానే చెప్పియున్నాడు. మరియు సమస్తమును క్రమముగా నుండవలయును, ఏలయనగా ప్రతియొక్కటియు తమ - తమ జాతి ప్రకారము ఫలించి, దాని జాతినే రూపాంతరపరచునని ఆయన చెప్పియున్నాడు. చూడుడి, ఆయన వాక్యము కూడ దాని జాతినే మొలిపింపవలయును. ఆయన ఒక 'తాటి చెట్టు' అని పిలికినయెడల, ఆయన తాటిచెట్టు మరియు సింధూర వృక్షము ఒక్కటిగా కలిపి చెప్పియుండలేదు. ఆయన ఇక్కడ ఒక తాటిచెట్టును, మరి అక్కడొక సిందూర వృక్షమును అని చెప్పియున్నాడు, సమస్తమును వాటి వాటి స్థానములలో ఉండవలయునన్న ఉద్దేశముతో చెప్పియున్నాడు. ఓ, మనము దానిని తెలిసికొనిన యెడల, మనము వాక్యములో ఏ భాగముగా నున్నామని, ఏమి జరిగినను మనము మన స్థానమును గైకొనవలయును.
34కొన్ని సమయములలో చక్రపు కుర్చీలో కూర్చొని యుండు ఈ యొక్క చిన్న సహోదరిని నేను తలంచుకొను చుండెదను, ఆ సహోదరి కొరకు ఎన్నో విశ్వాస ప్రార్థనలు ప్రార్ధింపబడియున్నవి. అయినను అది మనకు అర్ధము కాకున్నది, కావున దానిని మనము దేవుని యొద్దకు అప్పగించి యున్నాము. ఆమె తనయొక్క ఇంపైన మరి ఇతర మంచి స్వభావముతో మీ మధ్య ఒక పుష్పమువలెనున్నది. చూడుడి. మనము లేచి చుట్టూ నడువగలము, ఆమె కూడ ఆ విధముగా మనవలెనే తిరుగుచుండవలయునని ఆమె వాంఛించుచు నుండవచ్చును, అయినప్పటికిని ఆమె కూర్చొని యుండుటలో చాలా ఉల్లాసముగా నున్నది. నేనెల్లప్పుడును ఆమెను చూచుటకు ప్రేరేపింపబడెదను, చూశారా, ఏలయనగా ఆమె… మనమందరమును స్వస్థతనొందుట నమ్ముచున్నాము. దేవుడు వాటి కన్నిటి కంటేను మించిన అధ్బుతములను చేసియుండుటను మనము చూచియున్నాము, చూశారా. మరియు ఆమెకు అది కూడ తెలియును, చూశారా. అయినను ఆమె స్వస్థతనొందకున్నను తన యొక్క స్థానములో నుండుటకు ఇష్టపడుచున్నది.
PS 84:10•
ROM 12:2
35చూశారా, ఏది ఏమైనను పరవాలేదు. అదియే మనకు కావలసినది.
మరియు దావీదు దీనిని చెప్పియున్నాడని అనుకొనుచున్నాను, "భక్తిహీనుల గుడారములో నివసించుట కంటె, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము," మీరు చూశారా. ఏమి జరిగినను, "నా యొక్క స్థానమును తీసికొనుటయే." కొన్ని సమయములలో దేవుడు మిమ్ములను పిలిచిన మీ స్థానమును తీసికొనుటకు, ఈ ప్రపంచములో మీకిష్టమైన ప్రతియొక్క కార్యమునుండి మీరు వేరుపరచబడవలయును. నేను చెప్పు దానిని మీరు గ్రహించగలరని నేను నమ్ముచున్నాను, చూశారా. కొన్ని సమయములలో ఈ లోకములో మీకు ప్రియమైన వ్యక్తి నుండి మీరు కరచాలనము చేసి, దేవుడు ఏ స్థానములో ఉండవలయునని మిమ్ములను పిలిచియున్నాడో, ఆ స్థానములో మీరుండుటకు మీరతనినుండి వేరు పడవలసియున్నది, చూశారా.
అయితే దేవుడు ఏమి చేయుచున్నాడు? మీరు ఏ విధముగా నుండిరో దానినుండి మిమ్ములను మార్చుచున్నాడు. మీరు ఒకవేళ మంచి కుటుంబములో ఒక కుమార్తెగానో లేక ఒక కుమారునిగానో ఉండియుండవచ్చును, అయితే ఆయన మిమ్ములను ఇంకొక స్థానములో పెట్టును, ఏలయనగా దానిని ఆయన చేయునటువంటి మార్గముగా అది నున్నది, చూడుడి, క్రయము ఎంతైనను దేవుని యొక్క వాక్యమునకు విధేయులగునట్టు మీ మనస్సులను నూతనపరచుచున్నాడు, చూశారా. ఈ యొక్క కార్యములు వాటంతట అవి రావు… అది పిలువ లేదు…
ACTS 22:3
36మన యొక్క విమోచన చవుకయైనది కాదు. దేవుని యొక్క కుమారుడు మన కొరకు చనిపోవలసియుండెను, చూశారా. అది రాలేదు… గొప్ప క్రయము చెల్లించుటవలన విలువైన కార్యములు పొందగలము.
ఈ యొక్క వర్తమానమును తీసికొనివచ్చుట సులభమైన కార్యము కాదు, చూశారా. సులభము కానే కాదు. ప్రతి యొక్కరిని, నా యొక్క సొంత ప్రజలను, నాకు ఇష్టమైన సమస్తమును నేను విడువ వలసినదిగా యున్నది. మీరు చూచినయెడల దానియొక్క మహత్తరమైన కార్యము దేవుని యొక్క చిత్తమును చేయుటయే. మరియు దానిని చేయుటకు నాకు అడ్డంకులు ఏర్పడినవి, నాలో ఏదో కార్యమున్నదని వారు ఎరిగియుండియు, నన్ను వెలివేయుటకును మరియు నాకు మతి భ్రమించినదని అనుకొనుటకు కూడ ప్రారింభించిరి. "యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, సంఘమునకు విరుద్దముగానున్నది. ఈ కార్యములన్నియును!"అని చెప్పుచున్నారు, "అతను వెర్రివాడు."
అయితే, మీరు చూడుడి వారేమి చెప్పినను చెయ్యవలసిన కార్యము కలదు. మరియు దేవుడు ఒక వ్యక్తిని తీసికొని, ఆయన చేతిలో అతనిని భద్రపరచి, మరి "దీనిని చేయుము," అని చెప్పిన యెడల మరి మీరు దానిని చేయుదురు.
ఆ దినములలో గొప్ప బోధకుడైన గమలీయేలునొద్ద బోధింపబడిన పరిశుద్ధ పౌలుకు అది ఎటువంటి ఒక గొప్ప మహత్తరమైన విలువగల కార్యముగా నుండవలయును. మరియు వారు వచ్చిరి… ఏ కార్యములనైతే అతను వారి మతపారంపర్యాచారములకు భిన్నముగానున్నవని ఎంచెనో, సంఘమునకు ఏర్పడిన చెడ్డ కార్యములని వేటిని అతను తలంచెనో, అతను వాటిని అంగీకరించి దానిలో భాగస్తుడాయెను. ఒక వింతైన కార్యము! "మరియు దేవుడు, ఏ విధముగా అద్భుతమైన మార్గములలో, వింతగా, అసాధారణమైన మార్గములలో క్రియ చేయును, ఆయన అద్భుతములు నెరవేర్చుటకు ఇవియే మార్గము."
37దేవుడు దానిని పలికినప్పుడు, ఆయన యొక్క వాక్యము ఒక విత్తనమని ఆయనకు తెలియును. మరియు అది తన జాతిని మొలిపించుననియు తెలియును. ఇప్పుడు దానియొక్క జాతిని మాత్రము మొలిపింపవలయునని దానికి ఆజ్ఞాపింపబడి యుండెను, దాని జోలికి అనావశ్యకముగా పోనంతవరకు అది ఆ విధముగానే మొలిపించుచుండును. కావున, మరి వేదాంతులు ఆ యొక్క వాక్యములో వేరేదైనను చేర్చకుండునంతవరకు, దానిని వేరే ఎక్కడైనను పెట్టకుండునంతవరకు, దానితో అనావశ్యకముగా పోయి చిన్నాభిన్నము చేయనంత వరకు, ఇవన్నియును చేయనంత వరకు దేవుని యొక్క సంఘము మరియు సమస్తమును ఆదిలోనున్నట్టు దానియొక్క జాతినే అది మొలిపించును. ఆది సంఘమువలె మరిప్పుడును సంఘములు అట్టే యుండును. దేవుడు దానిని పలికియున్నాడు. మరి వారు దానిని ఎంత అపవిత్రము చేసినను మరి దానిని ఎంతగా చెడిపినను మరి ఆలాగు చేసినను, దాని జాతిని అది మొలిపించును. దానిని నిలుపుటకు ఏ అడ్డును లేదు. (నేను మాటలాడునది మీతో కేకలు వేయునట్లు ధ్వనించుట లేదని అనుకొనుచున్నాను. అది అధిక శబ్దముగానున్నదా?)
GEN 1:11,26•
ISA 64:4•
1COR 2:9
38మరియు చూడుడి, ఇప్పుడు సమస్తమును క్రమముగానున్నట్లు మనము చూచియున్నాము. దేవుడు దానిని పలికియున్నాడు, మరియు ఆయన చెప్పెను, "అది కలుగును గాక, కలుగును గాక. మరియు ఏదేను కలుగును గాక. చక్కటి పుష్పములు కలుగును గాక. నా యొక్క స్వరూపమందు నున్న నా యొక్క కుమారుడు అక్కడ ఏదేను తోటలో నిలువబడియుండును గాక, మరియు అతని యొక్క వధువు అతని ప్రక్కను నుండును గాక." ఓ, అది ఎంత చక్కగా నున్నది. మరియు తండ్రి, ఆయన తండ్రిగా యుండెను, మీరు చూడుడి అక్కడ ఆయన యొక్క స్వకీయ బిడ్డలు అగుపించుచున్నారు. మరియు ఆయన వారికి ఒక పరదైసును సృష్టించెను. దేవుడు ఆయన యొక్క బిడ్డలకు కార్యములను చేయుటకు ఇష్టపడుచున్నాడు. మీకు గుర్తున్నదా, తల్లులైన మీరు మీ యొక్క పిల్లలకు అతను కోరు ఒక జత చెప్పులు కావలసియున్న యెడల, మీ యొక్క భోజన ఖర్చులను సహితము తగ్గించుకొని మరి వాటిని మీరు కొనిచ్చెదరు, చూశారా. మీ యొక్క బిడ్డలకు చేయు ఏ కార్యములైనను మీరు చేసెదరు. తండ్రులు, మీ యొక్క బిడ్డలకు ఏదో కావలయునని మీరు ఇంకొద్దిగా కష్టపడి పనిచేసెదరు, చూశారా. సరి, మనము ఒక తల్లి తండ్రులముగా ఇక్కడ నున్నామని అది చూపించుచున్నది. ఆయన మిక్కిలి ఉన్నతమైన తల్లి తండ్రియైయున్నాడు, చూశారా.
మరి ఆయన ఎంత అధికముగా ప్రేమ చూపించునో! ఆ అపొస్తలుడు ఈ విధముగా చెప్పుటలో ఆశ్చర్యము లేదు, "దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు." మనము మన మనస్సులో దానిని ఊహించుకొనలేము, మనము, ఆయనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో వాటిని సరైన విధముగా తలంచుటకు మన యొక్క మనస్సులు అర్హత నొందియుండలేదు, మనస్సులు గ్రహింపజాలవు. చూడుడి, మనము, నేను అది ఎట్లుండునని నేను ఊహించుకొనగలను, అది ఏ విధముగా నుండునని నేను తలంచగలను, అయితే, నేను… అది ఎటువంటి గొప్ప కార్యమని తలంచు శక్తి నా యొక్క మనస్సుకు లేదు నా ఊహకు అది అందనిది. దేవుడు మనకొరకు ఎటువంటి మహతరమైన కార్యములను సిద్ధపరచెననేది మన మనస్సుకు, ఊహకు అందని కార్యమది. మనమందరమును యౌవ్వనస్తులుగా, మరియు పాపము లేనివారమై అక్కడ పరలోకములోనున్నప్పుడు, మీరు ఊహించగలరా, పరలోకము ఏలాగుండునని? మరియు కాదు… ఓ, అది ఎంతటి చక్కని ప్రదేశము! అయితే, చూడుడి, అది మనము ఊహించుటకంటేను ఇంకా చాలా బాగుండును. చూడుడి, దేవుడు వారి కొరకు ఏమి సిద్ధపరచియున్నాడో అవి మానవుని యొక్క హృదయములో కూడ జొరబడజాలవు. ఆయన దానిని పలికి యున్నాడు, మరి అది ఆ విధముగానే జరుగబోవుచున్నది.
39ఇప్పుడు ఈ యొక్క అమర్చిన విధమును అక్కడ ఆయన సృష్టించిన పిదప… దానిని ఆ యొక్క పదముతో చెప్పుటకు నాకిష్టము లేదు, అయితే ఆ విధముగా… బిడ్డ పుట్టుటకు మునుపు తల్లి దానిని శిశువు తాలూకు సజ్ఞ అని చెప్పుట సహజమే కదూ? ప్రేమ యొక్క ఒక చిన్న భాగముగా దేవుడు వారికి అనుగ్రహించు బిడ్డ , మరియు దానియొక్క పుట్టుకను ఎదురుచూచుచున్నారు. చిన్న కాలిజోడులను మరి బిడ్డకు కావలసిన ఇతర కార్యములను సిద్ధపరచుకొనెదరు. ఆదాముకు హవ్వకును దేవుడు చేసినది అదియే. ఈ యొక్క ఏదేను తోటను ఆయన సృష్టించెను.
దానిని ఆయన పలికెను. అది ఆయన యొక్క తలంపులలో ఉండెను. మరప్పుడు దానిని ఆయన పలికినప్పుడు, అది నెరవేరెను. ఇప్పుడు దానిని మనస్సులో ఉంచుకొనుడి. ఆయన ఏమి చెప్పినను అది నెరవేరవలయును! చూడుడి, ఆయన నిలుపజాలడు… ఏదియును దానిని నెరవేర్చకుండా నిలిపియుంచలేదు , అది నెరవేరుటకు ఏదియును అడ్డుయుండదు. అది నెరవేరుటను ఏదియును ఆటంకపరచలేదు. దేవుడు దానిని పలికియున్నాడు దాని సంగతి అంతే ముగిసి యున్నది! దేవుడు దానిని చెప్పియున్నాడు: అది నెరవేరును.
40ఇప్పుడు, ఆయన వీటన్నిటిని తన చింతలో నుంచుకొని యుండెను, మరి ఆయన చెప్పెను, "కలుగును గాక…" [ఇప్పుడు, అది ఆదికాండము 1 చూశారా.] "ఇది ఇక్కడ కలుగును గాక. అక్కడ అది కలుగును గాక. కలుగును గాక." ఆయన విత్తనములను విత్తుచున్నాడు. "ఇక్కడది కలుగును గాక. ఇక్కడది కలుగును గాక. ఇది ఇక్కడ కలుగును గాక." మరి అది ఆ విధముగా విత్తబడి ఫలించునని ఆయన ఎరిగియున్నాడు, ఏలయనగా ఆయన పలికినది మారదు. ఇప్పుడు మనకు అది విశ్వాసమునిచ్చును. మరియు ఆయనిక్కడ చెప్పినది, అది అట్లే జరుగును.
కావున ఆ యొక్క విత్తనము మన హృదయములో పడనిమ్ము, మన హృదయమనే విత్తు (సారవంతమైన) భూమిగా మనయొక్క హృదయములు అది విత్తబడు నేలగా ఉండనిమ్ము. ఈ యొక్క కడపటి దినములలో ఆయన మనలను ఏ స్థానములో ఉంచియున్నాడో, ఆ స్థానములో మనము నడచుకొనెదము. చూశారా, విత్తనము మా యొక్క హృదయములో పడనిమ్ము, ప్రభువా. మీ యొక్క వాక్యము నా యొక్క హృదయములో పడనిమ్ము. ఏ విధమైన అవిశ్వాసమును ఉండనీయకుము! అబ్రాహాము వృద్ధుడుగానున్నప్పుడు, అది అసాధ్యముగా అగుపించెను. "వారు దానిని ఏ విధముగా చేయబోవుచున్నారు? అతనెట్లు ఆస్థితికి మారగలడు? దానిని గురించి అతను ఆలోచింపలేదు. అతను దేవుని యొక్క వాక్యమును గైకొని మరి దానిని నమ్మెను, మరియు దేవుడు అది నెరవేర్చెను. ఇప్పుడు దేవుడు ఈ యొక్క కార్యములన్నిటిని చెప్పియున్నాడు, కావున ఆయనకు తెలియును అవి ఆ విధముగానే నెరవేరునని. అది ఆ విధముగానే జరిగినది, ఆయన వాటి - వాటి జాతిని మొలిపింపజేసెను.
41ఆయన ఆ యొక్క విత్తనములన్నిటిని, ఆయన తలంచినట్టు జీవముగల సృష్టిగా చేసెను. ఆయన పలికినట్లే అవి బహిర్గతమైనవి. ఆయన "కలుగును గాక," అని చెప్పెను. ఒకవేళ ఆయన పలికిన పిదప వందల కొలది సంవత్సరములు గడచిపోయుండ వచ్చును, అయినను ఇక్కడ మనము ఒక అందమైన ఏదేను తోటను చూచుచున్నాము, మరక్కడ పెద్ద పక్షులు ఎగురుచున్నవి. ఆ యొక్క పక్షులు చావ నక్కర లేదు. మరియు తోడేలును, గొర్రె పిల్లయును ఒక్కటిగా మేత మేయుచుండెను, మరియు సింహమును, చిరుత పులియును మరియు ఎద్దును ఒక్కటిగా భుజించుచుండెను. మరియు అక్కడ చంపుకొనుట లేదు, మరణము లేదు, దుఃఖము లేదు. మరియు ఆదాము, హవ్వయును ఏదేను తోటలో నడచుచుండిరి. ప్రతి యొక విత్తనమును వాటి - వాటి జాతిని ఫలింపజేయుచుండెను, అవి వేరే ఏమియును చేయుట లేదు. అది వేరే ఏమియును చేయజాలదు, ఏలయనగా దేవుడు చెప్పి యున్నాడు, ''ఆ విధముగానే కలుగును గాక." అది ఆ విధముగానే యుండవలయును. ఓ, ఇక్కడ ఒక నిమిషము నిలిపి, ఆ వాక్యము యొక్క పూర్తి నెరవేర్పును మనము సంధింపనైయున్నామని చెప్పుటకు నేనెంతగానో కోరుకొనుచున్నాను.
42ఇప్పుడు, దేవుడు పలికెను, "కలుగును గాక." మరిక్కడ మొదలు అది వచ్చెను, పరిపూర్ణముగా, పలికిన విధముగానే ఖచ్చితముగా బయలు పడెను. ఇప్పుడు ఈ యొక్క వృక్షము దాని జాతినే మొలిపించును. ఈయొక్క వృక్షము ఈ వృక్షమును మాత్రమే మొలిపించును. మరియు దేవునియొక్క కుమారుడైన ఆదాము ఒక దేవుని కుమారుని మాత్రమే జన్మింప చేయగలడు, 'చూశారా? నేను ఏమి చెప్పుచున్నానో మీరు గ్రహించుచున్నారా? సమస్తమును వాటి వాటి జాతి ప్రకారము, మరి దేవుడు చెప్పగలడు, ''సరి, నేనిప్పుడు విశ్రాంతి తీసికొనెదను.''
మరటు పిదప దేవుడు వాస్తవముగా చాలా కొద్ది మాటలనే పలికి యుండుటను మీరు గమనించి యున్నారా? మానవుడు పాపములో పడిపోయిన పిదప ఇప్పుడు వాక్యమును తీసికొని వచ్చు కార్యమును ఆయన తన ప్రవక్తలకు అప్పగించి యున్నాడు, మీరు చూశారా. దేవుడు విశ్రాంతి నొందియున్నాడు. ఆయన చేయవలసిన కార్యము వేరేదియును లేదు. వారు ఆ ప్రవక్తలు దేవునియందు ఆ ప్రధాన స్థలముయొద్దకు వెళ్ళి మరి తలుపులు తట్టి అడిగెదరు, "ఇదేమిటి, తండ్రి?" మరి ఆయన వారి ద్వారా వాక్యమును పంపును, చూడుడి.
ఆయనకు ఒక పద్ధతి కలదు, మరి ఆ కార్యములను చేయుటకు అదియే ఆయన యొక్క మార్గమైయున్నది.
43"ఇది ఈ విధముగానే కలుగును గాక…" మరి సమస్తమును వాటి విత్తనములును వాటి జాతుల ప్రకారము ఫలించుచుండును మరదియే మార్గము.
ఇప్పుడు, సమస్తమును చాలా అందముగా, దేవుడు ఏమి చెప్పెనో మరి ఆ విధముగానే జరుగుచుండగా, మరిక్కడ ఆ యొక్క అసహ్యమైన మాలిన్యముతో నిండిన వంచకుడు వచ్చెను. ఇప్పుడు దానిని గురించి మీకు హెచ్చరించుటకే నేను ప్రయత్నించుచున్నాను దేవుని యొక్క వాక్యము నాటబడి మరి పెరుగుటకు ఆరంభించునప్పుడు, అతడు నేర్పుగా మృదువుగాలోనికి వచ్చి దేవుని యొక్క ఆ వాక్యములను వారు అంగీకరింపకుండునట్లు లేఖనములను గుర్తించి చెప్పుచుండుటను గమనించుడి, చూశారా. అతనిని గమనించుడి, ఏలయనగా అతను ఒక వంచకుడు. అతనిని అనుసరించువాడని పిలుచుటకు బదులుగా, అతనొక చెడుపు వాడు, అనుసరింపబడు కార్యములను చెడగొట్టువాడు. అతను ఒక చెడగొట్టువాడు, మరియు అతను ఒక చెడ్డవాడు, లేక తారుమారు చేయువాడు లేక భ్రష్టుడు, మూల విత్తనమును లేక ఆది నిజమైన విత్తనమును చెడుపువాడు మరియు ఆది ప్రణాళికను చెడుపువాడు.
ఇప్పుడు, చూడుడి, ఈ ఉదయమున ఇక్కడున్న మీ యొక్క గుంపుకు ఒక ప్రణాళిక ఉండవచ్చును, మీకు ఒక దర్శనము ఉండవచ్చును. ఇప్పుడు ఆ యొక్క కపటమైన మరియు నేర్పరియైన అతనిని మీరు చూడుడి. అయితే మీ యొక్క దర్శనమును కాచుకొనుడి, అబ్బాయి, చూశారా. దానికే హత్తుకొని యుండుడి.
ROM 12:2
44ఇప్పుడు, మనము కనుగొనియున్నాము అతను లోనికి వచ్చినప్పుడు ఆ యొక్క విత్తనమును నాశనము చేసెను. మరియు హవ్వ అను ఫలించు భూమిలో అతను జొరబడి ఆ విత్తనమును నాశనము చేసియున్నాడు. ఆమెలోనికి ఆ విత్తనము జొరబడుటకు మునుపు అతడు కలుషితమైన విత్తనముద్వారా దానిని చెడిపి , ఆ కారణము వలన అందమైన ఏదేను తోట చెడగొట్టబడెను. ఎక్కడ పరలోకములో, తిరిగి పరలోకమునకు పోవుటయే జరుగవలసిన ఒకే ఒక కార్యము. మనమిప్పుడు ఎక్కడనున్నాము, దేవుని యొక్క ఆది సృష్టికి తిరుగుచున్నావు, పాపములేని భర్తతో మరి భార్య అను అనుబంధములోనికి, నిత్యముగా జీవించుటకు మరల ఏదేను తోటకు పోబోవుచున్నాము; అయితే రూపాంతర పరచ…
45ఇప్పుడు, ఇప్పుడు మన మనస్సులను ఆయున రూపాంతరపరచబడ వలయునని కోరుచున్నాడు, నూతనమగుటవలన లేక మార్చబడుటవలన, మన మనస్సులను నూతనపరచబడుటవలన రూపాంతరపరచబడ వలయునని మనలను ఆయన కోరుచున్నాడు.
ఇప్పుడు, సాతానుడు వాక్యములో లేని కార్యమును వాక్యములో ఉన్నదని చెప్పుచు వాక్యమును చెడుపుచున్నాడు. ఇప్పుడు ఆదిలో అతను చేసిన కార్యము అదియే. మరిప్పుడు గమనించుడి, నేను మీకు తీసికొనిరావలయునన్న తలంపులను మీ ముందు ఉంచుటకు మునుపు, నేను కాచుకొనియుండి నా యొక్క కొన్ని తలంపులను ఇక్కడ మీకు చెప్పని యెడల ఈ ఉదయమున నేను చెప్పు కార్యములు మీకు భయంకరముగాను, వింతగాను అనిపింపవచ్చును. లోనికి ప్రవేశించిన ఆ యొక్క దుష్టుడు నాశనము చేయువాడు వీడేనా అని అనిపించవచ్చును; మరియు దేవుడు ఆదియందు పలికిన వాక్యము, ఆ యొక్క ప్రతి వాక్యమును వాటి వాటి జాతుల ప్రకారము ఫలించునట్టు చేయుటకు దేవుడు ఆరువేల సంవత్సరములు తీసికొనెను. మరియు ఆయన చేసినవన్నియును దేవునియొక్క స్వకీయ వాక్యమైయుండి వాటి వాటి జాతుల ప్రకారము ఫలించెను. ఇప్పుడు మరి చెడగొట్టువాడు ఆ యొక్క దేవుని వాక్యమును చెడగొట్టుటకు తారుమారు చేయుటకు ఆరు వేల సంవత్సరములు తీసికొనెను. మరియు అతనేమి చేసెను? అతను తన కొరకు ఒక క్రొత్త విధమైన ఏదెనును తీసికొని వచ్చెను — సాతాను యొక్క ఏదెను. ఈ రోజు మనము దానిలో జీవించుచున్నాము.
46దానిని అతడెట్లు చేసెను? అది ఎట్లు సంభవించెను? అతడు దాని ఎట్లు చేసెననేదే ఇప్పుడు ముఖ్యమైన భాగముగానున్నది. దానిని మీముందుంచుటకే నేనిక్కడ యున్నాను. అప్పుడు రాబోవు వారములలో మీరు మీ యొక్క సహోదరులతో కూడి దానిని పరిశోధించి అతడు దానినెట్లు చేసినాడని చూడగలరు. మరియు అతడు ఎంతటి కపటమైన వాడనియు, ఎటువంటి నేర్పరియనియు గమనించుడి.
ఇప్పుడు, అతడు ఈ యొక్క విత్తనములను నాశనము చేసియున్నాడు. ఇప్పుడు అతను వాటిని చెడగొట్టగలడే కాని వాటిని నిర్మూలము చేయలేడు. మనమిప్పుడు ఎరిగి యున్నాము పాపమనునది నీతియైన కార్యమును తారుమారు చేయబడుటయే. అది అబద్ధమును ఒక సత్యమైన కార్యముగా తప్పుడుగా చూపింపబడుటయే. దేనినైనను చూడుడి. వ్యభిచారము అనగా, దేవుడు నిర్ణయించిన సరైన కార్యమును వదలి తప్పుగా దానిని చేయుటయే. మరణము దానిని తీసికొని… చూశారా, జీవమును చెడగొట్టుటయే.
47దానినతడు తన విషమును చల్లి చెడుపుటకు అతనికి ఆరు నేల సంవత్సరములు పట్టెను. మరియు దానిని అతడెట్లు చేసెను? ఇప్పుడు ఇదియే ముఖ్యమైన భాగము. మరిప్పుడు జాగ్రత్తగా వినుడి. అతడు దానిని నాగరికతతో చేసెను. ఇప్పుడుది వింతగా తోచవచ్చును, అయితే అదియే కార్యము… నేను చెప్పు కొన్నికార్యములు మిమ్ములను కొద్ది నిమిషములకు ఊహించులాగున చేయును; నేను ఆ విధముగా మిమ్ములనది చేయదని అనుకొనుచున్నాను. అయితే దీనిని మీరు గుర్తించగలుగుచున్నారా? ఇప్పుడు నేను చదువులేని పామరతనము లేక జ్ఞాన శూన్యతను సమర్థించుటకు ప్రయత్నించుట లేదు. అయితే మీకు తెలియునా, విజ్ఞానము, సైన్సు, చదువులతో కూడిన నాగరికత మరియు మనము ఈ దినమున వర్ధిల్లుచున్నామనుకొని ఆనందించు అనేక కార్యములు సాతానుడి యొక్క సాధనములని, అంతేకాకుండా అభివృద్ధి చెందుచున్న నాగరికత కూడా ఆ సాతానుడిదే. నాగరికత దేవుని వలన వచ్చినది కాదు. నాగరికత సాతాను వలన వచ్చిన కార్యము. ఇంకొద్ది నిమిషములలో దానిని మీకు వాక్యముతో నిరూపించెదను.
నాగరికత దేవుని వలన వచ్చినది కాదు, ఏలయనగా నేను మీకు దానిని చూపింపనిమ్ము; ఈ యొక్క నాగరికతలో, విజ్ఞానము ద్వారా మనము అనేక కార్యములను చేసి, అధికముగా మనము నాగరికులమని చెప్పుకొనుచుండగా, దాని ద్వారా మనలను మనమే అధికముగా చంపుకొనుచున్నాము. విజ్ఞానము ద్వారా మనలను మనమే ఈ దినములలో చంపుకొనుచున్నాము, చూశారా. ఇప్పుడు నాగరికత విపరీతముగా గోపుర శిఖరము వలె పెరిగి పోయున్నది, మరియు ఈ యొక్క నాగరికతలో మనకు మరణమున్నది, ఈ యొక్క నాగరికతలో పాపమున్నది, ఈ యొక్క నాగరికతలో వ్యాధులున్నవి. ఇవన్నియును దేవునియొద్ద నుండి వచ్చినవి కావు.
48కావున, దేవుడు… రానున్న ఆయన యొక్క గొప్ప రాజ్యములో, మనమొక నాగరికతను కలిగియుండబోవుచున్నాము, అయితే అక్కడ ఈ లోకములో నున్నట్లు ఈ నాగరికత నుండదు. అది విజ్ఞానము ద్వారా వచ్చు నాగరికత కాదు. అది వాక్యము ద్వారా వచ్చు విశ్వాస నాగరికత. చూశారా? మనము కలిగియున్న ఈ యొక్క విజ్ఞాన నాగరికత ఖచ్చితముగా సరిగా సాతాను యొక్క వల, మరి దాని ద్వారానే అతడు ప్రజలను చంపియున్నాడు. దాని ద్వారానే ప్రతి దినమును అతడు మనలను చంపుచున్నాడు. మరి ఆ విధముగానే, ప్రతిదినమును, మనము ప్రతి దినమును తినుచునుండగా, జీవించుటకు బదులుగా మనము చనిపోవుచున్నాము. వారు సమస్తమును తారు మారు చేసియున్నారు, వారు దీనిని తీసి మరి దానితో కలిసి మరి దీనితో మిశ్రితము చేసి మరది మరణింపచేయు వరకు ఒకదానితో యొకటి కలుపుచున్నారు. ఇప్పుడు అది చనిపోవు సంతతిగా యున్నది. మరి మీరేమి చేయుటకు ప్రయత్నించినను, మీరు చనిపోవుచునే యున్నారు.
ఆ యొక్క ఆఫ్రికనుల పటమును మీరు గత రాత్రి చూచి యున్నారు. మీకు తెలియునా ఎందులకు… వారు పెన్సిలిన్ను ఉపయోగించుట లేదు. వారు మనము జీవించుట కంటెను అధిక దినములు జీవించుచున్నారు. వారికి ఈ యొక్క మందును గురించియే తెలియదు వారు… క్రిమి వారిని తొందరపెట్టవు, చూశారా. ఏలయనగా ఒక విష క్రిమి తన యొక్క చేతులను పైకెత్తి వారికి ఏ హానియు చేయక వారికి లొంగిపోవును. చూశారా? ఏలయనగా అతను చూడుడి అతనికి తెలియదు, అతను… వారికి ఆ మందులు తెలియవు. ఏల? వారు ఇంతవరకు ఆ మందులను వారిపై ప్రయోగించి యుండలేదు… చూడుడి, అయితే విజ్ఞానము పెన్సిలిన్ లేక ఆ విధమైన మందులను వారు జబ్బులను పోగొట్టుటకు మనపై ప్రయోగించుటవలన అది ఒక వ్యాధిని పోగొట్టి మరి ఇంకొక వ్యాధి వచ్చుటకు క్రిములనుత్పత్తి చేయు భూమిగా మార్చుచున్నది. చూశారా. ఇప్పుడు, ఆ యొక్క ఆఫ్రికన్ దానిని చేయుట లేదు, చూశారా.
49ఇప్పుడు, మీలో అనేకులు వ్యవసాయములో అనుభవముండి దానినుండి వచ్చియున్నారు. ఒక ఆరోగ్యకరమైన పంటకు మందులు చల్లనక్కరలేదని మీలో ఎవరికైనను తెలియును. దానికి వాటిపైననే జీవము గలదు క్రిములను వెళ్ళగొట్టు శక్తి వాటికి గలదు, ఒక నిజమైన ఆరోగ్యమైన మొక్క యొద్దకు క్రిమిరాదు, దాని దగ్గరకు కూడ రాదు. అయితే రసాయన మందులు వేసి పెంచు మిశ్రమ మొక్కలను బిడ్డలవలె పెంచవలసియున్నది!
ఉదాహరణకు మీలో కొందరు పశ్చిమ ప్రాంతము నుండి వచ్చియున్నారు. పాతకాలపు పొడుగైన కొమ్ములు గల ఆవును గుర్తుకు తెచ్చుకొని తలంచి చూడుడి. ఈ రోజు హెరీఫోర్డ్ రకములైన ఆవులకు అధికముగా కండ (మాంసము) ఉండునని మీరు చెప్పుచున్నారు. ఆ విధముగా మీరు చెప్పుట లేదా? ఆ విధముగా కానే కాదు. పాత కాలపు పొడుగైన కొమ్ములు కలిగిన ఆవు, దాని కొరకు మాటలాడుచున్నానని అనుకొనవద్దు, ఆ ఆవు జింకవలె చలి కాలములో బయటికి వెళ్లి చలిని అణచుకొనును. ఓ, అది సన్నగా నుండును, అయితే అది రెండింతలు…
50అయితే ఈ యొక్క హెరీఫోర్డ్ రకపు ఆవుకు గడ్డి ఇచ్చుచున్నారు, దాని యొక్క కడుపు వరకు ఫోటో తీసి, వెనుక నున్న కాళ్ళ వరకున్న కండను చూపించుచున్నారు అదేమిటి? ఆ ఆవు చాలా బలిష్టి అయినదిగా చూపింపబడుచున్నది. అయితే చలికాలములో దానిని కట్టియున్న స్థలమునుండి కట్టు విప్పి బయటికి వదిలి చూడుడి, అది చనిపోవును. అది చలికాలములో చలికి తట్టుకొన లేదు. మీరు దానికి పోషింపవలయును మరి దానిపై అక్కర తీసికొని, చిన్న బిడ్డవలె పరామర్శింపవలయును. అది ఒక మిశ్రీతమైన ఆవు. చూశారా? అయితే ఒక నిజమైన, స్వచ్ఛమైన పాత పొడుగైన కొమ్ములు గల ఆవును చలికి వదలి చూడుడి, దానికి ఏమియును సంభవింపదు అది చలికి తట్టుకొనును.
ఈ రోజులలో మన క్రైస్తవులు కూడ ఆ విధముగానే యున్నారు. మనయొద్ద అనేకులు యున్నారు, మనము వారిని ముఖస్తుతి చేసి, వారిని బ్రతిమలాడుకొని , సంఘములో వారిని ఒక డీకన్ గా చేసి, వారిని భుజములపై తట్టి, సంఘములో ఒక పెద్ద స్థానమును వారికియ్య వలెను. ఇవన్నియును చేయని యెడల, వారది చేయుటకును, ఇది చేయుటకును మీరు అనుమతింపని యెడల - అతను సంఘమునకు రాడు. ఇటువంటి కార్యములన్నియును వారిని చిన్న బిడ్డల వలె ముద్దాడుటలాగున్నది.
నిజమైన క్రైస్తవులు ఈ విధముగా నుండురని మీరు ఊహించుకొనుచున్నారా? ఎత్తు పల్లములుగల కరుకైన వారు. వారు మోటైన వారు. పరిశుద్ధ పౌలు, పరిశుద్ధ పేతురు ఆ విధమైన క్రైస్తవులని మీరు తలంచుచున్నారా. "ఇప్పుడు పై విచారణ చేయు అధికారిగా నన్ను నియమింపని యెడల నాకు తెలియదు, నేను ఫలానా - మరి - ఫలానా వారి యొద్దకు పోయి చేరి పోయెదనని వారు చెప్పియుందురని మీరు అనుకొనుచున్నారా? వారు మెరక పల్లములుగల కరకైన వారు. వారు విశ్వాసముతో నిండియున్న వ్యక్తులు. వారు దేవునితో జీవించుచుండిరి. వారు దేవునితో నడచుచుండిరి. వారు అధికముగా మాటలాడు వారు కారు. వారు విడువక నిత్యమును రాత్రింబగళ్ళు దేవునిని సేవించుచుండిరి. మీరు వారిని చిన బిడ్డల వలె బ్రతిమాలుడుకొనుటయును, వారికి దీనిని మరి దానిని లేక ఇంకొక దానిని మరటువంటిపై స్థానములను ఇవ్వనక్కరలేదు, వారిని చెట్టుకు చల్లు రసాయన మందువలె చల్లనక్కర లేదు. వారు మొరక పల్లములు గల కరకైన వారు.
వారు నిజమైన స్వచ్చమైన విత్తనములు, సంఘ శాఖలలోనున్న సంకరమైనవారు కారు.
2COR 5:17•
2TIM 2:12
51"ఒకవేళ మెథడిస్ట్ లు నన్ను సరిగా గౌరవింపని యెడల నేను బాప్టిస్తుల యొద్దకుపోయెదను. బాప్టిస్టులు సరిగా నన్ను గౌరవింపని యెడల నేను పెంతెకోస్తు వారి యొద్దకుపోయెదను. ఒక వేళ వారు సరిగా గౌరవింపనియెడల నేను మరల కాతోలిక్కుల యొద్దకు లేక వేరేక్కడైనను పోయెదను," చూడుడి, వారు మిశ్రితమైన వారు ఒకే రకమునకు చెందిన వారు కారు కలుపబడినవారు, వారెప్పుడును చెట్లకు వలె చల్లుతుండవలసిన వారు, "అవును, డాక్టర్, పూజ్యుడైన సహోదరుడు ఫలానా మరియు ఫలానా వారిని పొగడనవసరము లేదు. అది క్రైస్తవత్వము కాదు. క్రైస్తవత్వము ఏ యొక్క భిరుదులను కోరదు, ఏ యొక్క పదవులను కోరదు. అది దేవుని మాత్రము తెలిసికొని యుండును. అది ఆది విత్తనము. అది దేవుని ప్రేమించును, మరియు ఒకరినొకరిని ప్రేమించును.
వారిని బుజ్జగింపనక్కరలేదు మరియు బ్రతిమాలుకొననక్కరలేదు, మరి వారిని సమర్థించుచు మరి సరి, "ఈ యొక్క సహోదరి, ఆమె వెంట్రుకలు కత్తిరించుకొని పొట్టి వెంట్రుకలతోనున్న యెడల పరవాలేదని చెప్పనక్కరలేదు నిజమైన క్రైస్తవులతో.." మరి నిజమైన క్రైస్తవులలో అటువంటి కార్యములు లేవు, వాటితో వారిని సమర్థించుచు మెచ్చుకొననక్కరలేదు. అది కరకైనది, అది సువార్త! దానిని అక్కడ పెట్టుడి, అది ఎక్కడ పడవలయునో అక్కడ పడును. క్రైస్తవులు దానిని ప్రేమించెదరు.
ఇతరులు ఆ బహుమతిని పొందుటకు పోరాడుచు మరియు రక్తపు సముద్రము ద్వారా ప్రయాణము చేయుచుండగా సౌఖ్యముతో పుష్పములు నిండిన పానుపుపై నేను పరలోకపు గృహమునకు తీసికొనపోబడవలయునా? నేను నా వీపుపై తట్టించుకొనుచు మరి ఇది, అది మరియు అదనియును బిడ్డవలె బ్రతిమాలించు కొనవలయునా? కరకైన వారితో కూడ నేను ఆవలి గట్టున నా స్థానమును ఉండవలయునని కోరుచున్నాను. జయ చిహ్నమను మరకలతో నేను అక్కడికి పైకి పోవలయునని ఎదురుచూచుట లేదు. నేను పాలించవలయుననిన నేను పోరాడవలయును. నా యొక్క ధైర్యమును వృద్ధిచేయుము, ప్రభువా!" చూడుడి, నేను ఒక సంకర జాతి లేక మిశ్రత జాతి మొక్క వలె నుండకుండా, బిడ్డలవలె బుజ్జగించుకొనుచును బ్రతిమాలించుకొనుచును యుండి మరి దేనిలోనికో కొనిపోబడకుండా నన్ను ఒక క్రైస్తవునివలె నిలువబడనిమ్ము. మీరు క్రైస్తవత్వములోనికి బలవంతముగా తీసికొని రాబడలేదు, మీరు దానిలోనికి జన్మించియున్నారు. మీరు నూతన సృష్టిగాయున్నారు, మరియు భూమిపైకి వచ్చియున్న దేవుని యొక్క విత్తనముగా మీరున్నారు.
52ఇప్పుడు, అతను చల్లినది విషపు జల్లుయని మనము కనుగొనియున్నాము, మరియు ఆ చల్లినది మనము అధికముగా వాటిని గురించి సంతోషించుచున్న నవీన తెలివి, చదువు, విజ్ఞానము మరియు నాగరికత. మనము జీవించుచున్న ఈ యొక్క జీవితములో దేశములన్నిటి మధ్య గొప్ప శత్రువుగా నున్నది కమ్యూనిజమ్, అని మనము ఎప్పుడైనను ఆలోచించియున్నామా? కమ్యూనిజమ్, కమ్యూనిజమ్ యొక్క దేవుడు ఎవరు? నాగరికత మరియు చదువు, విజ్ఞానము. అది సరి అవును కదూ? వారు జీవించునది వాటిపైననే, వారి యొక్క పోషణయే విజ్ఞానముపై ఆధారపడియున్నది, ఇప్పుడు మీరు గనుక కొద్దిగా… ఈ యొక్క నవీన నాగరికత, విజ్ఞానము, మరియు చదువు అను విషపు జల్లును గురించి ఆలోచించినయెడల ఆ విజ్ఞానమే వారికి దైవముగా యున్నది.
53ఇప్పుడు విద్యాభ్యాసము మరియు నాగరికతయు దయ్యుము యొద్ద నుండి వచ్చిన కార్యములని నేను మీకు నిరూపింపబోవుచున్నాను.
ఇప్పుడు మనము మరల మీరు కోరిన యెడల వెనుక త్రిప్పి ఆదికాండము 4వ అధ్యాయములో మరి చూచెదము. ఇక్కడ పదునాలుగవి లేక ఆదికాండము 4, నన్ను మన్నించుడి. ఇప్పుడు సాతానును గమనించుడి. మన సహోదరులతో ఈ యొక్క టేపులను విను మీరు, నేను సర్పము యొక్క సంతానము ప్రసంగించుటను వినియున్నారు. అది కాదనుటకు వీలు లేదు. అది మరుగుచేయబడియుండెను. ఆ యొక్క ఏడు ముద్రలలో అది తెరువబడెను.
54తల్లితండ్రులు ఏ విధముగానున్నారో, అధే విధమైన బోధనలలో బిడ్డలు పెంచబడునప్పుడు, వారు వారి యొక్క తల్లి తండ్రుల, వారి యొక్క సంఘ శాఖల స్వభావమును చేపట్టు అవలంభించుచున్నారు. వారు దానిని విశ్వాసింపవలసిన వారైయున్నారు. చూశారా వారు ఆ యొక్క తల్లి తండ్రులకు జన్మించి నందువలన వారు వారి యొక్క శరీరపు బోధనలను నమ్ముచున్నారు. అయితే ఈ దినమున మనము ఆ యొక్క తల్లి తండ్రులకు జన్మించలేదు; మన యొక్క తల్లి తండ్రి వాక్యమై యున్నది. మరియు వాక్యము…
సరి, చెప్పును, "నేను కూడా దేవుని యొద్ద నుండి జన్మించితిని." ఆ యొక్క కాలములో, అయితే ఇది ముమ్మరమైన కాలము, ఆ యొక్క సంఘ శాఖలకు కంటేను ఔన్నత్యమైన కాలమైయున్నది. ఒకటి బయలుపడవలసినదిగా యున్నది; దేవుడు దానిని నిర్ణయించి యున్నాడు అది బయలుపడవలసినదిగా యున్నది, ఏడు ముద్రలు తెరువబడి దానిలోనున్న రహస్యములు బయలుపడ వలయునని దేవుడు ముందుగానే నిర్ణయించియున్నాడు. అది లవొదికయ కాలములో జరిగి యుండవలసినది. మరియు నేను తలంచుచున్నాను, దానిలో కొద్దిగైనను సందేహము లేకుండ… మనము డంబములు చెప్పుకొనుట కాదు, మనము యేసు క్రీస్తును తప్పనిచ్చి మనలో మనల నెవరిని డంబములు చెప్పుకొనుటలేదు. యేసుక్రీస్తును గురించియే గొప్పలు చెప్పుకొనుచున్నాము.
అయితే మనము దీనికి కృతజ్ఞులమై యున్నాము… ఈ కడపటి కాలములో దేవుడు మనలను ఎన్నుకొని ఎటువంటి సందేహములకు చోటియ్యక దానిని పైన ఆకాశములోను మరియు భూమిలోను సూచనల ద్వారా నిరూపించి దానిని గురించి తెలుసుకొనులాగున మనకిచ్చిన భాగ్యము కొరకు మనము కృతజ్ఞులమైయున్నాము. వారిలో ప్రతియొక్కరును వాక్యమునొద్దకు నేరుగా వచ్చి మనము జీవించుకాలము ఎటువంటి కాలమని, వర్తమానము ఎటువంటిదని గుర్తెరిగి తృప్తిపడియున్నారు. మనము ఒక ప్రత్యేక మత సిద్ధాంతమును కలిగియున్న తెగకు చెందిన వారము కాము. మనము మూఢభక్తిగల ఒక గుంపు ప్రజలము కాము. మనము పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన దేవుని యొక్క సేవకులము. మీకు సకల విధమైన పేర్లు ఇతరుల ద్వారా పెట్టబడును, అయితే మనము వారు మనలను పిలుచు ఆ పేర్ల ప్రకారమైన వారము కాము.
GEN 3:1
55ఇప్పుడు గుర్తుంచుకొనండి, సాతాను యొక్క కుమారుడు కయీను. ఇప్పుడు మీరు టేపులన్నిటిని వినియుండెదరని నేను అనుకొనుచున్నాను, టేపులతో నిండిన పుస్తకములు, టేపు శాలలను నేను చూచియున్నాను. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, హవ్వ సాతాను వలన గర్భవతి ఆయెను మరియు అదే రోజున… ఇప్పుడు ఆ విధముగా టూసాన్లో ఒక కేసు జరిగెను, ఒక స్త్రీ ఇరువు పురుషులతో జీవించి మరి ఆమె ఇద్దరు వేర్వేరు రకముల బిడ్డలను కనెను. అది మనకు తెలియును. కుక్కలు మరి ఇతరమైన వాటిలో అవి కనునప్పుడు నేను దానిని చూచియున్నాను.
కావున, సాతాను ఈ రోజు ఉదయము ఈ యొక్క సర్పమగు ఈ యొక్క దుష్టుని సంధించి యుండవచ్చు; సర్పమప్పుడు ప్రాకెడు జంతువు కాదు, అయితే ఒక భూజంతువుగా యుండెను; భూజంతువులన్నింటిలో అది యుక్తిగలదిగాను, తంత్రము గలదిగాను, తెలివిగలదిగాను ఉండెను అయితే మానవునికి క్రిందగా నుండెను. మరియు మానవుడు కూడ ఒక మృగమువలె యుండెను, మరి మనము - మనము సమస్త జంతుజాతి, వేడి రక్తముగల జంతువులము. మరియు సాతాన ఇక్కడ తదుపరి (లింక్) సంబంధముగా నున్నాడు, ఈ యొక్క సర్పము మానవునికి తరువాత, చింపాంజి — మానవునికిని చింపాంజికిని మధ్యనున్న ఒక జంతువు. ఇప్పుడు, విజ్ఞానము కోల్పోయిన ఆ కోక్కెము కొరకు వెతకుచున్నది. ఆ సర్పము ప్రాకెడు ప్రాణిగా మారినందువలన, మన్నుపై ప్రాకుట వలన దానిలో ఒక ఎముక కూడ మనుష్య ఎముకవలె కనిపించదు, అది పూర్తిగా ప్రాకెడు పాముగా మారినది.
GEN 3:6
56మనమిప్పుడు కనుగొనియున్నాము, ఇతను పాపమే ఎరుగని, ఆమె దిగంబరిగా నున్నదని కూడ ఎరుగని హవ్వను వాడు ఏదేను తోటలో కనుగొనెను. మరియు అతనికి తెలియును. అతను తెలివైనవాడు, యుక్తిగలవాడు, బుద్ధిమంతుడు. మరి అతను ఆమెతో చెప్పెను, "ఆ విత్తనము - చూచుటకు రమ్యముగాను మరి భుజింపవలయునన్న కోరికను పుట్టించు ఫలము అని" ఆమెతో చెప్పి, ఆ రోజు ఉదయము అతడు ఆమెతో గడిపెను. మరటు పిమ్మట ఆ రోజు మధ్యాహ్నము హవ్వ ఆదాముకు ఆ యొక్క ఫలమును తినుట ఎంత భాగుండునని చెప్పి అదే కార్యమును అతను చేయులాగున అతనిని సమ్మతింప చేసెను. మరటు పిమ్మట దానిని చేయకూడదని ఆదాము ఎరిగియుండి కూడ అతను తన యొక్క భార్యతో బయటికి వెళ్లి మరి ఈ యొక్క కార్యమును తప్పని తెలిసియే చేసెను. ఎట్లైనను, కడపటికి అతను దీనిని చేసియుండును. అయితే మీరు చూడుడి, దేవుని యొక్క జ్ఞానము అది ఆ విధముగా జరుగవలయునని యున్నది. ఏలయనగా ఈ విధముగా చేయుట వలన ఆయనలో యున్న రక్షకుడు, తండ్రి, స్వస్థపరచువాడు అనే స్వభావములు బయలుపరచబడెను. నేను దానిపై ప్రసంగించుటను మీరు వినియున్నారు, చూడుడి.
ఇప్పుడు అది ఆ విధముగా జరుగకున్న యెడల…
GEN 4:1
57వారి యొక్క స్వయ ఆలోచన ప్రకారము వారు నడచుకొనుటకు ఆయన వారిని అను మతించెను. ఆ కార్యమును వారు చేయకుండా ఉండులాగున చేసి మరింకను ఆయన నీతిమంతుడుగా నుండలేడు. అయితే ఆయన వారిని తనతో సమానముగా ఉంచి మరియు వారిష్ట ప్రకారము వారు చేయులాగున అనుమతించి, మరి వారికి వారే దానిని చేయలాగున చేసెను. మరియు దానిని వారు చేయుదురని అయన ఎరిగి యుండెను. కావున మరి అప్పుడు ఆదాము ఆమెతో కూడినప్పుడు ఆమె కవలలను కనెను. మరియు ఆ బిడ్డలలో ఒకడు సాతానుడి కుమారుడు; మరియు ఇంకొకడు దేవుని వలన పొందిన ఆదాము కుమారుడు — కయీను మరియు హేబెలు.
మరి ఆ విధముగాను జరుగును. ఇప్పుడా టూసాన్లో ఒక కేసు ఆ విధముగా వాదాడబడుచున్నది. ఒక తెల్లని స్త్రీ ఒక ఉదయమున తన భర్తతో కూడెను మరి ఆ మధ్యాహ్నము ఆమె ఒక నీగ్రో (నలుపు వ్యక్తి)తో కూడెను. మరియు ఆ ఇరువురు చిన్న బిడ్డలలో ఒకడు… ఇద్దరు బిడ్డలు ఆమెకు పుట్టిరి. ఆ బిడ్డలలో ఒకడు తారుమారుగా రింగులవలె చుట్టుబడి యున్న వెంట్రుకలతో పుట్టిన నీగ్రో బిడ్డ మరియు ఇంకొకడు సొగసైన తెల్లని ముఖ తేజస్సుగల మంచి వెంట్రుకలు గల చక్కని బిడ్డ. మరియు ఆమె తెల్లని తండ్రి ఆ ఇరువురి బిడ్డలను అక్కరతీసికొను పెంచవలయునని కోరుకొనుచున్నది. మరి అతను చెప్పుచున్నాడు, "నేను నా యొక్క బిడ్డను మాత్రము పెంచెదను, అయితే ఇంకొకతని బిడ్డను పెంచను. ఆ నీగ్రో వ్యక్తి తనయొక్క బిడ్డను పెంచుకొననిమ్ము." కావున, మీరు చూడుడి, అది సత్యము.
MATT 24:24•
MARK 13:22
58కవలలు ఎప్పుడునే యుందురు. మరియు ఆ కారణము వలననే (చిన్న మందా, దీనిని మరచిపోకుడి!) కడపటి దినములలో సంఘము ఆ విధముగానే యుండును కవలలుగా యుండును. సాధ్యమైతే, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చులాగున చాలా దగ్గరగా యుండును… మత్తయి 24:24, చూడుడి. సంఘము ఆ విధముగానే యుండును… అది పెంతెకోస్తు యొక్క కదలిక. అది నిజమైన కార్యముగా అగుపించును, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చులాగున నుండును. మరి కొద్ది సేపైన పిదప నాకు అవకాశమున్న యెడల, ఎన్నుకొనబడుట అనగా ఏమనియు అదెట్లు జరుగుననియును నేను వివరింపదలచుచున్నాను, చూశారా. అది నిజమైన కార్యమువలె కనిపించుటవలన అది వారిని మోసగించును, చూడుడి — ఇరువురు తండ్రులు, అది అంతే. అదే తల్లి, అదే సంఘము, అదే కదలిక, అదే కార్యము. వాక్యము పడు భూమి కూడ అదే. అయితే వాటిలో ఒకటి తారుమారు చేయబడినది. మీరు దానిని గ్రహించియున్నారా? మీరు దానిని చూడ గలిగిన యెడల "ఆమేన్" అని చెప్పుడి.
చూడుడి, వాటిలో ఒకడు తారుమారుగా పుట్టియున్నాడు, ఏలయనగా వాడి తండ్రి ఒక దుష్టుడు. సంఘ శాఖ మృగము యొక్క ముద్రయని దేవుడు నన్ను గనుక అనుమతించిన యెడల నేనొక రోజు దానిని నిరూపించెదను, చూడుడి. అతను తప్పైన తండ్రి. వాక్యమునకు బదులుగా సంఘ శాఖలకు ప్రజలను అతను త్రిప్పివేయుచున్నాడు, చూశారా. వాడు తప్పైన తండ్రి. అది కయీను యొక్క కదలింపు.
GEN 2:17•
GEN 3:4
59ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సర్పము యొక్క అడుగుజాడలు అను అంశముపై నేను ప్రసంగింపనై యున్నాను. ఆదియందు ఆ యొక్క మృగము మరియు అంత్యమందు ఆ యొక్క మృగము కలదు; బైబిల్ అతని యొక్క అడుగులను వాసనను అతని తంత్రములను మనము చూడవచ్చును మరియు అతని యొక్క ముగింపు ఎట్లుండునని కూడ చూపింపబోవుచున్నాను, చూశారా. దేవుడు గనుక దానిని నేను చెప్పుటకు అంగీకరించిన యెడల మీరు దానిని టెలిఫోనులో కూడా వినవచ్చును.
మరిప్పుడు అతను ఎటువంటి జిత్తుల మారియని గమనించుడి, సరిగా ఏ విధముగాయనగా అక్కడ యూదా మరియు యేసు వలెను, వారి యొక్క జాతిలో సహోదరులుగా నున్న ఏశావు మరి యాకోబు వలెను ఉండిరి. మరియు కాకి, పావురము అదే కొయ్యపై నుండులాగున, మనమున్న ఈ యొక్క యుద్ధ భూమిలో సమస్తమును కవలలుగా యున్నది.
GEN 3:4
60హవ్వ దగ్గర ప్రయోగించినట్టు శత్రువు వంచనను ప్రయోగించుచున్నాడు, "ఓ, దేవుడు చెప్పి యున్నాడా? నిజముగా, అయితే వాస్తవముగా…" చూశారా, "వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు!" అని దేవుడు మొదటిగా చెప్పిన దానికి ఆ విధముగా చావరని దేవుడు చెప్పిన దానికి పైగా కారణములు చూపుటకు ప్రయత్నించుట, చూశారా.
అతను చెప్పెను, "అవును, దేవుడు దానిని చెప్పెను, అయితే నిశ్చయముగా…" దానిపైన సాతానుడు చల్లుటను చూశారా? అయితే దేవుడు ఏమి చెప్పినను దేవుడు దానిని కాచుకొనును, సాతాను యొద్ద నుండి దేవునికి సహాయము అక్కరలేదు. ఆయన దానిని కాచుకొనును, కావున దాని ద్వారా వంచింపబడకుడి. ఇప్పుడు మనము అక్కడ గమనించియున్నాము, అది తనయొక్క జాతిని మొలిపింపచేసినది.
ఈ యొక్క విషమనే జ్ఞానమును చల్లిన పిదప ఆదికాండములో వాటి జాతి ఫలములను మొలిపించుట మనము చూచియున్నాము. ఇప్పుడు విజ్ఞానము అనగా లోక జ్ఞానము అని అర్ధము. మరియు మనము వినుచున్న కార్యములన్నియును విజ్ఞానశాస్త్రము, విజ్ఞానము, విజ్ఞానము, పాఠశాలలలో గొప్ప పాఠము విజ్ఞానము, విజ్ఞానము! ఈ రోజులలో ఒక మంచి మోటారు వాహనము, ఈ యొక్క మేలైన వస్తువు, ఒక మంచి గృహము, ఒక మంచి ఇల్లు, ఒక మేలైన ఇది, ఒక మేలైన అది. మనమేమి చేయుచున్నాము? నీటితో మనము దినదినమునకు చనిపోవుచునే యున్నాము.
ఒక మోటారు వాహనమును తయారు చేసియున్నాము, మనము నడచుటను వదలివేసియున్నాము; నడచుట వదిలివేసినందువలన మనము ఒక పెద్ద చాపలో కొవ్వు వుండునట్టుగా మనలో కొవ్వు పదార్ధము అధికమవుచున్నది. మనయొద్ద పురుషుని యొక్క స్వభావములు లేక జెల్లి చేప వలె అటు ఇటు కాని ఒక స్థితిలో నున్నాము. అది సరియే.
61మరియు స్త్రీలు మురికి గుడ్డలనంతయును మెషిన్లో వేసి మరి ఒక బటున్ను నొక్కిన చాలును, అక్కడే కార్యమున్నది. అయితే ముందు కాలములో మీ యొక్క తల్లులు నీటి గుంటల యొద్దకు పోయి, మరి నీటిని మోసుకొనివచ్చి, కట్టెలను నరికి అక్కడ నీటిని బానలలో వేడి చేసి మరి మురికి గుడ్డలను వాటిలో వేసి గుడ్డలు మురికి పోవులాగున బాగుగా ఉతికెదరు. మరిప్పుడు మనము చాలా సౌమ్యమముగా పెరుగుచున్నాము, ఇప్పుడు గనుక ఆ విధముగా ఉతికిన యెడల మనము చనిపోయెదము మనకు బలము లేదు. అయితే ఈ కార్యములకు మనము ఏమి చేయలేము, మనము జీవించుచున్న కాలమటువంటిది.
ఇప్పుడు విజ్ఞానము కూడ చెప్పుచున్నది, "నెలకొకసారి కలుగునట్టి అంటు లేక ఋతుస్రావము చిన్న బాలికలలో కూడా నిలిచిపోవుచున్నది, యౌవ్వన స్త్రీలు ఇరువది మరి ఇరువది-ఐదు సంవత్సరముల వయస్సు గల వారికి కూడ నిలిచిపోవుచున్నది." మరియు యౌవ్వనస్తులైన పురుషులు ఇరువది మరి ఇరువది ఐదు వయసుకే మధ్య వయస్సుగల వారి వలెయగుచున్నారు. " నా యొక్క తల్లి… నా యొక్క భార్యకు ముపై-ఐదు నుండి నలభై వయస్సుకే ఆ విధముగా నిలచిపోయినది. నా యొక్క తల్లికి నలభై-ఐదు నుండి యాభై ఏండ్లకే నిలచిపోయినది, చూశారా. ఈ యొక్క కడపటి దినములో, వారెట్టు క్షీణించి పోవుచున్నారు. ఎందువలన? మనము విజ్ఞాన కార్యములపై అధికముగా ఆధారపడి దానిపై కృషి చేయుచున్నాము.
GEN 4:16
62నూట-యాభై సంవత్సరములకు మునుపు మనుష్యుడు ప్రయణించుటకు గల ఒకే ఒక మార్గము గుఱ్ఱము లేక కాలి నడక ద్వారా మాత్రమే. మరిప్పుడు ఒక విమానము ద్వారాను, తలంపు వేగములో మానవుడు పయణించుచున్నాడు. చూశారా, విజ్ఞానము దానిని సాధించియున్నది మరది సాతాను యొక్క కార్యము. ఇప్పుడు మీరు "అది సరియా, సహోదరుడా బ్రెన్హాం?" అని అడుగవచ్చును. అవునయ్యా!
ఇప్పుడు ఆది కాండము 4వ అధ్యాయము తీసెదము:
అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలు దేరి వెళ్లి.
ఇప్పుడు, అతడు చేసిన మొదటి కార్యమును గమనించుడి. (మాకు ఇంత వరకు మీరు చెప్పినది చాలునని మీరు నాతో చెప్పిన యెడల నేను నిలిపివేసెదను, చూశారా.) "కయీను దేవుని యొక్క సన్నిధి నుండి బయటకు వెళ్లేను. అతను అక్కడే తప్పు చేసియున్నాడు; మరియు మీరును నేనును కూడా అక్కడనే తప్పు చేయుచున్నాము — ఆ నిమిషముననే మనము దేవుని సన్నిధి నుండి బయటకు వెళ్ళెదము.
కయీను యెహోవా సన్నిధి నుండి బయలు దేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను.
GEN 4:17-24
63చూశారా అది ఎటువంటి మత మార్గమునకు సంబంధించిన కార్యముగా నున్నది? తూర్పు దిక్కునకు వెళ్ళెను, తూర్పు దిక్కునకు.
మరియు కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరుకట్టించి [నాగరికతను చూడుడి.] ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను.
హనోకుకు ఈరాదు పుట్టెను: ఈరాదు… మరియు ఈరాదు… [టేపులో ఖాళీ స్థలము.]
…ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను: వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా.
ఆదాయా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు.
అతని సహోదరుని వేరు వేరు యూబాలు. ఇతడు సీతారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూల పురుషుడు [చూడుడి, సంగీతము, విజ్ఞానములోనికి వచ్చుటను గమనించుడి.]
మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతను పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు [ఇంకొక విధముగా చెప్పవలయుననిన లోహములను ఒక్కటిగా చేసి కలిపి అచ్చు వేయుట.] మరియు తూబల్కయీను సహోదరి పేరు నయమా.
లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓసిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువానిని చంపితిని.
ఏడంతలు ప్రతి దండన కయీను కోసరము వచ్చిన యెడల లెమెకు కోసరము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
GEN 4:16,21,22
64ఇప్పుడు గమనించుడి, వారు దేవుని యొక్క సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళిన వెంటనే, వారు నగరములను కట్టుటకును, పరికరములను సంగీత వాయిధ్యములను చేయుటకును ఆరంభించిరి; వారు విజ్ఞానము ద్వారా వారి జ్ఞానమును అవలంభింప నారంభించి, ఇత్తడి మరి ఇనుము మరియు వాయిద్యములను మరి ఆలాటి అనేకమైన కార్యములను చేయుటకు మొదలిడిరి. చూశారా? ఇప్పుడు అవన్నియును ఎక్కడి నుండి వచ్చియున్నవి? ఎవరు బయటికి వెళ్లి యున్నారు? సర్ప సంతానమైన కయీను. దానిని మీరు అర్థము చేసికొనియున్నారా? కయీను బయటికి వెళ్ళెను. మరియు గమనించుడి, అతను దేవుని యొక్క సన్నిధి నుండి బయలుదేరి వెళ్లి మరి విజ్ఞానముతో పనిచేయుట కారంభించెను.
ఇప్పుడు, అతను ఇంకను ఎక్కడ తన క్రియ చేయుచున్నాడు, చూడుడి. విజ్ఞానము, విధ్య, నగరములు కట్టుట, సంస్కృతి నాగరికతలో — ఇవి అన్నియును దయ్యము యొక్క కార్యములు. దానిని ఎవరు ఆరంభించి యున్నారు? దయ్యము. ఈ రోజు కూడ అవంతయును ఎవరి వలన నడిపింపబడుచున్నవి? దయ్యము ద్వారా, మనలను నాశనము చేయు అణు గుండులు మరి అటువంటి కార్యములన్నియును సాతాను కార్యములు. వీటిలో మనము జీవించుచున్నాము. మనమిక్కడ జీవించపవలసియున్నది. మనము జీవముగల మానవులమైనందున మనమిక్కడ జీవింపవలసియున్నది. అయితే దేవుని యొక్క గొప్ప నాగరికతలో ఇటువంటి కార్యములు ఏమియును ఉండవు, చూశారా. మరి విజ్ఞానము సహజముగా దేవుడు సృష్టించిన కార్యములచే తీసికొని మరి వాటి కొరకై ఉద్దేశింపబడని కార్యములను సృష్టిని తారుమారు చేసి తయారు చేయుచున్నది.
MATT 28:20•
MARK 16:15-18•
HEB 13:8
65కావున మరి ఆ విధముగానే విజ్ఞానరీతిగా యున్న మతము కూడ అట్టే యున్నది. దేవుని యొక్క వాక్యము చెప్పు కార్యములను ఉన్నదున్నట్లుగా చేయుటకు బదులుగా విజ్ఞాన మతము దేవుని యొక్క వాక్యమును తీసికొని మరి దాని నుండి ఒక సంఘ శాఖను ఉత్పత్తి చేయుచున్నది. "అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అని వారు చెప్పెదరు." బైబిలు చెప్పుచున్నది, "యేసు క్రీస్తు నిన్న, నేడు, యుగయుగములకును ఏక రీతిగా యున్నాడు."
"దైవిక స్వస్థతయను కార్యము లేనే లేదని అనెదరు."
మీరు సర్వ లోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; నా నామమున దయ్యములను వెళ్ల గొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు; పాములను ఎత్తి పట్టుకొందురు; మరణకరమైనదేది త్రాగినను, అది వారికి హాని చేయదు; రోగులమీద చేతులుంచినపుడు, వారు స్వస్థత నొందుదురు. ఏమిటి? అప్పుడది ఎవరికి, సమస్త దేశములకును, ప్రతి యొక్కరికిని, ప్రతి సృష్టికిని ! "ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదా కాలము మీతో కూడ ఉన్నాను, ప్రపంచము యొక్క క్రమము లోకపోకడలు ముగియు పర్యంతము, సమస్త కార్యములు సమాప్తియగు వరకు నేను మీతో కూడ యున్నాను." ఆయన అక్కడ పరమ నిశ్చయముగా నున్నాడు.
MATT 24:24•
MARK 13:22
66మరిప్పుడు వారు విజ్ఞానముపై ఆధారపడి మరిట్లు చెప్పుచున్నారు, "ఓ, సరి, మనము ఒక్కటిగా కూడి సంఘములో చేరి మరి దానియొక్క లేక దీనియొక్క సభ్యత్వము కలిగియున్న చాలునని అనుకొనుచున్నారు. మేము మా యొక్క చందా చెల్లించుచున్నాము…" చూడుడి, దేవుడు అనునటువంటి కార్యము లేదని వారు చెప్పుట లేదు. కడపటి దినములలో అబద్దపు క్రీస్తులు అను అంశముపై పలికిన నా టేపు మీరు వినియుందురు. చూడుడి, అబద్ధపు యేసు కాదు. సాతానుకు దానికి మించి బాగుగా తెలియును, చూశారా — అయితే అది అబద్ధపు క్రీస్తులు.
క్రీస్తు అనగా "అభిషేకింపబడిన వాడని అర్థము." మరియు వారు నిజముగానే అభిషేకింపబడి యున్నారు, దేనితో అభికింపబడియున్నారు? సూచనలు మరి అద్భుతములు చేయుటకు పరిశుద్ధాత్మతో అభికింపబడియున్నారు. మరి వారు దానిని చేయుచున్నారు. అయితే, చూడుడి, ఇప్పుడు మనము నివసించుచున్న కాలములో చూచిన యెడల మనము చివరి కాలమున యున్నాము, వెనుకనున్న పెంతెకోస్టు కాలములో లేము. మనమిప్పుడు చివరి కాలములో నున్నాము. మరియు మొదటి కాలము వాక్యముతో ఆరంభించి యున్నది, అది మరదే విధముగా చివరి కాలము కూడ క్రీస్తుయను వాక్యముతో ముగించవలసినదిగా యున్నది. మరియు ఈ యొక్క ఉముక పొట్టు మరి అలాంటి కార్యములన్నియును నేను మీకు వివరించినట్టు మొదటి విత్తనము లేక ధాన్యము ఏ విధముగా నుండెనో మరి ఆ విధముగా పరిపూర్ణ ఎదుగుదల నెరవేరబడు ఉద్దేశము కొరకు వాక్యమును మోసికొను పోవునట్లువంటి పరికరములుగా ఈ పొట్టు నున్నవి.
GEN 4:25,26
67ఇప్పుడు 25వ వచనము:
ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనకి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
ఆ సర్పము యొక్క విత్తనము ఏ విధముగా విజ్ఞానములోను, చదువులోను, నగరములు కట్టుటలోను, మరియు సంగీతము, మరియు గొప్ప కార్యములు మరియు చదువు, మరి విజ్ఞానము మరి ఆలాటి కార్యములలో జొరబడియున్నదో చూడుడి.
MATT 24:24•
MARK 13:22
68అయితే నీతియైన విత్తనమును చూడుడి, అదెవరు… చూశారా, హవ్వకు విత్తనము లేదు. మీకది తెలియును. స్త్రీకి విత్తనము లేదు. ఆమెకు గ్రుడ్డు ఉన్నది, అయితే విత్తనము లేదు. ఆమె దేవుని ఏర్పాట్లు వలన విత్తనమును గైకొన్నది. మరియు దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప విత్తనము స్త్రీ నుండి వచ్చినది చూశారా, కయీను చంపిన హేబేలుకు బదులుగా దేవుడు ఆమెకు ఒక విత్తనమును ఇచ్చి యున్నాడు. శత్రువు, మరణము, అక్కడ తారుమారుయైనందు వలన సర్పము యొక్క సంతానము దేవుని యొక్క సంతానమును చంపెను, మీరు గమనించుడి. స్త్రీ మూలముగా మరల ఆ ఆది విత్తనమును తీసికొని వచ్చుటకు దేవుడు క్రీస్తు అను విత్తనమును స్త్రీ ద్వారా ఏర్పరచెను.
దానిని మీరు చూచి యున్నారా? మరియు సమస్తమును తలక్రిందులైనందున మనము ఈ రోజులలో హర్షించుచున్న విద్య మరియు జ్ఞానము ఇవన్నియును మరణమును తీసికొని వచ్చియున్నదని మీరు గమనించుడి. విజ్ఞానము మరియు మత మార్గములు; మరి అలాంటి కార్యములన్నియును మరణమును తీసికొనివచ్చియున్నవి. అయితే ఆమె ఒక విత్తనమును ఆయన ఏర్పరచెను. మరటు పిమ్మట అప్పటి నుండి యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది, మరల వాక్యమునకు తిరిగి వచ్చుటకు ఆరంభింపబడినది, చూశారా.
సర్పమును గురించియును దాని అడుగు జాడలను గురించి మనము రానున్న వారములో చూడాబోవుచుండగా ఆ విత్తనమును వెన్నంటు వుండుటను గుర్తుంచుకొనుడి. అది లేఖన ములంతటను కనుగొనవచ్చును. దానిని గమనించుడి. నేను ప్రసంగించిన 'ద్రాక్షా వల్లి' యను వర్తమానమును మీరు వినియున్నారు, ఆ యొక్క రెండు తీగేలును ఒక్కటిగా పెరుగుచున్నవి. అవి రెండును ఇంచుమించు ఒకేలాగున పెరుగుచున్నవి, వీలైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకైనట్లు, అది తల భాగమునకు (తీగె చివరి దశకు) వచ్చినపుడు ఈ కడపటి దినములో రెండును ఒకేలాగున యుండును. అది ఒక ధాన్యమును లేక విత్తనమును మొలిపించును అది గోధుమవలె నుండును; అయితే అది గోధుమ కాదు, చూశారా. అది గోధుమ కాదు. అది ఇంకను ఉముక పొట్టుగా నుండును.
69ఇప్పుడు, వారి యొక్క నాగరికతను విద్యను చూడుడి. నేను ఇంకను పది లేఖన వాక్యములను వ్రాసియుంచుకొనియున్నానని అనుకొనుచున్నాను, అయితే వాటిని ఇప్పుడు చూడలేనని అనుకొనుచున్నాను. అయితే విద్య, విజ్ఞానము, మరియు నాగరికత అన్నియును సాతానుడి కార్యములని దీని ద్వారా మనము గ్రహించియున్నాను. అది సరియే. అది దేవుని వలన వచ్చినది కాదు. అది దయ్యము యొక్క కార్యము.
ఇప్పుడు, అది మీరు కలిగియుండకూడదని నేను చెప్పట లేదు. లేదు, నిశ్చయముగా లేదు. కొద్దిసేపైన పిదప దానిని నేను నిరూపించెదను; దేవుడు… స్త్రీలైన మీరును, పురుషులైన మనమును ఇప్పుడు వస్త్రములు ధరించుకొని యుండులాగున, ఆదిలో మనము వస్త్రములు ధరించుకొనియుండనక్కరలేదు. అయితే, చూడుడి, మనము ఈ యొక్క కాలములో జీవించుటవలన మనము వస్త్రములను ధరించుకొనవలసియున్నది, చూశారా. ఆ విధముగా చేయవలయునని మనకు నియమింపబడియున్నది. మనము వాటిని ధరించుకొనవలయును. అయితే ఆదిలో మనము వస్త్రములను ధరించుకొని యుండనక్కరలేదు, చూశారా, ఏలయనగా మనము పాపమును ఎరుగనివారము. అయితే ఇప్పుడు మనము ధరించుకొనవలయును.
70ఇప్పుడు మనకు మోటారు వాహనములు అవసరమైయున్నవి. విజ్ఞానము మరి అలాంటి వాటి ద్వారా తయారు చేయబడిన మోటారు వాహనములు వలన మనము అనేక చోట్లకు వెళ్ళవలసియున్నది మరియు అనేకులను దర్శించవలసి యున్నది, అయితే అది దేవుని యొద్ద నుండి వచ్చిన కార్యము కాదు. అది దేవుని కార్యము కాదు. విద్యలు, అయితే అవి… దేవుని యొక్క విద్యభ్యాసము, నాగరికత, విజ్ఞానము మరివన్నియును ఆది (ప్రారంభ దశలో) దశలో నున్నవి, చూశారా. మనము చేయుచున్న ఈ యొక్క కార్యములకంటెను మిగుల హెచ్చైన స్థానములో నున్నవి.
ఇప్పుడు గమనించుడి. వారు కొన్నింటిని తీసి మరి వాటితో మరి దేనినైను కలిసి ఒక రసాయనమును తయారు చేయుదురు, అది నాశనము చేయును. ఇప్పుడు, వాటిని వాటి యొక్క నిజమైన స్థానములో ఉంచియున్న యెడల అవి సరిగా యుండి యుండును; వాటినన్నిటిని వాటి స్థానముల నుండి తొలగించి అన్నిటిని కలిపినయెడల అని చెడిపోయి నాశనమునకు దారి తీయును. చూశారా? అది మరణమును తీసికొనివచ్చును.
71మరియు మీరు గనుక దేవుని యొక్క వాక్యమును తీసికొని మరి దానిని ఈ యొక్క మత మార్గములలో దూర్చిన యెడల, మీకు మీరే మరణమును తెచ్చు కొనెదరు. అది దానినే చంపి వేయును. నేనేమి చెప్పుచున్నానో మీరు గ్రహించుచున్నారా? అది ఆ మనుష్యుని చంపివేయును. మీరు చెప్పెదరు, "సరి, ఇప్పుడు చూడుము, మీరు దేవుని నమ్ముచున్నారు. ఓ, ఇప్పుడు దానిని ఆ విధముగా నమ్మనక్కరలేదు, మీరు గనుక మీరు… మా యొక్క సంఘము చెప్పునది." ఆ అక్కడే ఆ యొక్క ఫిరంగి ఆ యొక్క మనుష్యుని చంపుచున్నది. మీరు సకలమును సమస్తమును ప్రక్కకు నెట్టి మరి వాక్యమును మాత్రము తీసికొనవలసినదిగా యున్నది. ఆ యొక్క వాక్యముతో నిలచియుండుడి. దానిని వదలకుడి. దేవుడు చెప్పిన యెడల అది అంతే దానిని చేయుడి.
విద్య దేనిని నిరూపించినను నాకు అక్కరలేదు.
72నోవహు దినములో ఆకాశముపైన నీళ్లు లేవని వారు నిరూపించి యుండ గలరు. అయితే దేవుడు చెప్పి యున్నాడు వర్షము కురిపించబోవుచున్నాననెను మరి వర్షము కురిసెను. అది సరియే. క్రింద భూమి మీద పడుటకు పైన అగ్ని లేదని; వారు చెప్పుచున్నారు. అయితే ఒక రోజు ఆ అగ్ని పడుటను చూడుడి. "మనము దీనిని ఎట్లు చేయగలము, మరి దానిని ఎట్లు చేయగలము?" కాని దేవుడు దానిని చేయుటను చూడుడి. ఆయన దానిని చేయును. దానిని చేయుదనని ఆయన చెప్పి యున్నాడు. మరియు ఆ విత్తనము దేనినైనను పట్టుకొనును. దేవునికి మహిమ!
ఈ రోజు అది ఎదురుచూచు ఒకే కార్యము, విత్తనము పడి ఫలించుటకు కావలసిన ఒక ఫలించు భూమి. అది ఒకరిలో ఆరంభించును, మరి వారు దానిని తారుమారు చేయుదురు, మరి సాతాను హవ్వకు చేసినట్టు దానిపై తప్పైన కార్యములను చల్లెదరు. దేవుని యొక్క కుమారులను బయటికి తీసుకొని వచ్చు విధముగా వారిని కనులాగున హవ్వతో అది ఆరంభించినది, సాతాను యొక్క కుమారులను కనుటకు కాదు. ఆమె ఫలించు ఒక భూమిగా నుండెను మరది తప్పైన స్థలములో పడెను. ఆ విధముగానే వాక్యము ఒక అవిశ్వాసిలో పడినపుడు, లేక ఒక సందేహించువానిలో పడునప్పుడు, వారిలో నుండి ఒక సంఘ శాఖ సభ్యుని అది తయారు చేయును, అయితే దేవుని యొక్క కుమారుని లేక కుమార్తెను అది తీసికొని రాదు.
మీరు వారిని వెంట్రుకలు పొడుగుగా పెంచుకొనమని చెప్పిన యెడల వారు మీ ముఖముపైననే నవ్వేదరు. మీరు వారిని ఇది లేక అది చేయుడియని చెప్పిన యెడల లేక ఆ వ్యక్తిని దానిని చేయమని చెప్పిన యెడల వారు మీ ముఖము పైననే నవ్వెదరు. వారు దేవుని యొక్క కుమారులు కాదు. అది విత్తనము పడిన తప్పైన భూమి, అయినను వారు విత్తనమును కలిగియున్నారు. తప్పైన అభిషేకము పొందినవారిని చూచి యున్నారా? వారు అభిషేకము పొందియున్నారు, అవును, పరిశుద్ధాత్మతో, క్రొత్త భాషలతో మాటలాడెదరు, మరియు అద్భుతములును సూచనలును చేయుదురు; అయితే అవన్నియును సాతాను కార్యములై యున్నవి.
PS 6:8•
PS 66:18•
MATT 7:22,23
73యేసు చెప్పెను, "ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు "నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొండి" అని ఆయన చెప్పెను. అక్రమము అనగా ఏమిటి? దావీదు చెప్పెను, "నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల, ప్రభువు, నా మనవి వినకపోవును," చూశారా. మీరు చేయవలయునని బాగుగా తెలిసియుండియు దానిని చేయు కుండుటయే అక్రమము అనబడును. దానిని గురించి మీకు బాగుగా తెలియును, అయినను దానిని చేయరు. అదియే అక్రమము అగును, చూశారా.
మీకు తెలియునా, వారు వాక్యముతో నిలచియుండవలయును, అయితే సంఘము కొరకు లేక వేరెవరో ఒకరికొరకు, మీరు దేవుని వాక్యము నుండి దూరముగా తొలగిపోయి మరియు సంఘ శాఖ ఏమి చెప్పునో దానినే చేసెదరు. "సరి, నాకు తెలియదు. దీనినిట్లు చేయ వలయునని నా యొక్క సంఘము చెప్పుచున్నది, మరి నేను దీనిని ఈ విధముగా నమ్ముచున్నాను, చూడుడి." మరి మీ ముందున్న దానిని మీరు చేయకూడదని మీకు బాగుగా తెలియును, అయినను మీరు చేయుదురు. అదియే అక్రమము. "అక్రమము చేయు వారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి."
DEUT 8:3•
MATT 4:4•
LUKE 4:4•
1COR 13:1,2
74గొప్ప అపొస్తలుడైన పౌలు, 1 కొరింథీయులు 13లో చెప్పుటను చూడుడి, అతను చెప్పియున్నాడు, "మనుష్యుల భాషలతోను దేవ దూతల భాషలతోను నేను మాటలాడినను…" ఇప్పుడు మీరైనను, లేక వేరెవరైనను దానిని పట్టుకొని అదియే పరిశుద్ధాత్మను పొందియున్నాననుటకు నిదర్శనమని చెప్పగలరా? పౌలు చెప్పియున్నాడు, "మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే? (ఇక్కడున్న మీరందరును పొందియుండులాగున,) నేను వ్యర్థుడను." చూశారా, మీరు భాషలలో మాటలాడవచ్చును, అవును, ఏలయనగా అది వాక్యమైయున్నది. ఒక ప్రసంగి ఈ యొక్క వాక్యమును తీసికొని మరి పోయి దానిని ప్రసంగింపవచ్చును, మరి ఆ వాక్యమును వివరించినపుడు మరి ఆ వాక్యము ఎదుగును. అయితే ప్రసంగి తాను ఒక కపటమైనవాడుగా నుండును. అది వాక్యమైయున్నది, చూశారా.
అయితే నిజమైన దేవుని యొక్క జీవసృష్టి వాక్యములోని సకల ఉద్దేశములను గైకొనును. "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును…" మరి మీరు దానికి వేరేదైనను చేర్చిన యెడల మీరు ఒక తారుమారైన చెట్టును కలిగియున్నారు.
75నేను గనుక ఒక గోధుమతో ఆరంభించి మరి ఒక గురుగు అను మొక్కను దానితో కలిపి పుప్పొడి ద్వారా వాటిని మిశ్రమ జాతులవలె కలిపిన యెడల నేను ఒక గోధుమను, గురుగును పొందెదను, చూశారా. అది గురుగు మొక్కైనను గోధుమలవలె కనిపించును. దానిలో స్వచ్ఛమైన జీవము లేదు, అది మరల ఉత్పత్తి చేయలేదు, చూశారా. అది మిశ్రమము చేసిన తరువాత ఒక కలుపు (సంకర జాతి) మొక్కగా వచ్చినను మరల అది తననుతాను ఉత్పత్తి చేసుకొన లేదు. ఒక ఆడ గుఱ్ఱముతో ఒక మగ గాడిదను కలిపి (సంకరము) మిశ్రమము చేసిన యెడల, మరది కంచర గాడిదను బయటికి తీసికొనివచ్చును, అయితే కంచర గాడిద మరల ఒక కంచర గాడిదను ఉత్పత్తి చేయలేదు. అది ఒక మిశ్రమ జాతి.
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
76"ప్రతి యొక వాక్యమును దాని జాతిని మొలిపించును గాక, చూడుడి.
అది ఒక సారే పుట్టించును. మరియు సంఘము కూడ ఒకసారే సంఘ శాఖగా వచ్చును అయితే అది తనకు తానుగా మరల పుట్టింపదు; అది ఇంకొక సంఘ శాఖను తీసికొనివచ్చును. లూథరనులు తిరిగి లూథరనులను పుట్టింపలేరు; అది ఒక మెథడిస్తునే తీసికొనివచ్చును. మరియు ఒక మెతడిస్తు ఒక పెంతెకోస్తునే తీసికొనివచ్చును. చూశారా? అది తిరిగి దేనిని కలుగజేయదు, ఏలయనగా అది చనిపోయున్నది. అది మరల అభివృద్ధి చెందదు.
ఎక్కడైనను దేవుడు ఎప్పుడైనను సంఘ శాఖలో ఉద్ధరించుటను కలుగ జేసియున్నాడా? మీ యొక్క చరిత్రలో చూడుడి. ఆయన ఎప్పుడును చేసియుండలేదు. ఒక ఉద్ధరణకు పిదప దాని వెనుక తయారగునది ఒక సంఘ శాఖయే దేవుని యొక్క మనుష్యుడైన లూథర్ నీతిమత్వము నొందుట వర్తమానముతో వచ్చెను. అతను చనిపోయిన పిదప అతని వెనుక లూథరన్ సంఘము వచ్చెను. దానికిపై వారు దానిని ఆ సంఘమును కట్టలేకపోయిరి. అటు పిమ్మట దేవుడు జాన్ వెస్లీ అను మనుష్యుని పంపెను, అతని వెనుక ఒక ఉద్ధరణ జరిగెను. వారేమి చేసిరి? ఆయన చనిపోయిన పిదప వారు దానిని ఒక శాఖగా మార్చిరి, అది మరల వృద్ధి చెందలేదు, చూశారా. అది ఫలింపలేదు. హల్లెలూయా! అయితే దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడునూ నిలిచియుండును! అది సరియే. దానియొక్క జాతిని అది ఫలించును.
77అటు తరువాత పెంతెకోస్టు వచ్చెను, అది కూడ ఫలింపలేదు, అదేమి చేసినది చూడుడి. అది మరల తన్నుతాను ఉత్పత్తి చేసికొనలేదు. వారు దేశమంతటను ఓరల్ రాబర్ట్స్ లాంటి అనేకులను కలిగియుండవచ్చును, అయినను వారు దానిని వృద్ధి పొందించలేరు. అది ఆ కంచర గాడిదవలె ఉత్పత్తి చేయబడినది. దానివలన వీలు కాదు. అది ఉత్పత్తి చేయలేదు!
దానికి ఎన్ని సూదులు పొడచినను (ఎన్ని మందులు ఉపయోగించినను,) అది అట్లేయుండును; దానికి ఎన్ని ఆత్మీయ కార్యములను గురించి చెప్పినను వాటిని గైకొనియున్నను అవి అంతే. మీరు ఎదిగియున్న పెద్దవారు నేనేమి మాటలాడుచున్నానో మీకు తెలియును. దానికి ఎందరు భర్తలు మరియు భార్యలు ఉన్నను మరేమి ఉన్నను, మరి ఎందరు చిన్న సహోదరిలను, గుంపులను సమకూర్చినను మరియు ఎన్ని చిన్న సంఘములను మరియు సంఘ శాఖలను సమకూర్చినను అది ఒక ఉద్ధరణను తీసికొనిరాదు. ఉద్ధరణను కలిగించదు. దాని కార్యము అంతటితో సమాప్తమైపోయినది. అది ప్రపంచ కార్యముల వైపు తిరిగి మరియు దేవుని యొక్క వాక్యమును వదలి వెళ్ళిపోయినది. మరి అది తనను తాను మరల ఉత్పత్తి చేసుకోలేదు. దేవుడు మరియు ఇంకొక దానిని లేపును మరి దాని ద్వారా ఆయన యొక్క వాక్యమును సంధింపజేయును. మరి అదియును ఒక శాఖగా మారిన యెడల, అదియును చనిపోవును. అది సరియే. అది ఒక సంకరముగానున్నందువలన అది తిరిగి ఉత్పత్తి చేయలేదు. అది నిజము.
78ఈ రోజు సంకరజాతి మొక్కజొన్న చూడుడి, వారు చెప్పెదరు, "అది మంచి ధాన్యమని." అది చంపివేయు గుణములను కలిగియున్నది. అదియే మిమ్ములను చంపుచున్నది. మీ యొక్క జీవితములు వాటికొరకు చేయబడి యుండలేదు… వాటి కొరకు మీ యొక్క శరీరములు చేయబడి యుండలేదు. మీ యొక్క శరీరములు నిజమైన అసలైన ధాన్యము కొరకు చేయబడి యున్నవి. ఆ కారణము వలననే మీ యొక్క తండ్రులు మరియు తల్లులు ఇతరులు అధిక కాలము జీవించియున్నారు. అందువలననే వారు దృఢ-శరీరములను కలిగియుండిరి. డెబ్బది, ఎనుబది వయస్సు గలవారు కూడ ఆరోగ్యముగాను, దృఢమైన శరీరము కలిగిన వారుగాను యుండిరి. చూశారా? వారు సహజమైన ప్రకృతి కార్యములపై జీవించిరి. పాతకాలపు కొండ ప్రాంతములలోనున్న వారిని గమనించిన యెడల, వారు జింకలను భుజించుచు మరియు అసలైన మిశ్రమము లేని ధాన్యములను తినుచుండిరి. నగరములోని ఒక వ్యక్తి ముప్బై-ఐదు, నలుబది సంవత్సరములకే మురికి గుంట నీళ్ళవలె మారిపోవుచున్నాడు. ఆ విధముగా మృదువుగా నున్నాడా? నిశ్చయముగా.
సరి, నేను ఆ అంశమును వదిలి వెళ్లిపోవుచున్నాను, సరియేనా?
79గమనించుడి, మనము సంస్కృతియని పిలుచు ఆ నాగరికతను గురించి మీకు చెప్పవలయు నని నేను ప్రయత్నించుచున్నాను. సంస్కృతి, దానిని గురించి అధికముగా మీరు వినియున్నారు. ఇప్పుడు మీరు సంస్కృతియనగా, నా అంచనా ఏమని మీరెప్పుడునను వినియున్నారా? ఒక కుందేలును చంపుటకు ధైర్యము చాలని ఒక వ్యక్తి, అయితే ఇంకొకడు దానిని చంపి యిచ్చిన యెడల, దానిని కడుపు నిండుగా అతడు తినగలడు, కావున నేను దానినే సంస్కృతియని తలంచుచున్నాను, మీరు చూశారా. అది సరియే.
మనము ఆ విధముగా చేయకూడదు… దేవుడు సంస్కృతివలన రాడు… సంస్కృతి ఒక మనుష్యుని దేవుని యొద్దకు నడిపింపదు. మీరు ఒకనిని నాగరికత ద్వారా దేవుని యొద్దకు నడిపించలేరు. అతను దేవుని యొక్క విత్తనముగా పుట్టియున్నాడు, దేవుని యొద్ద నుండి జన్మించియున్నాడు, ఎల్లప్పుడును దేవునిదై యుండును. అతడు దేవుని పోలిక తప్ప మరేదిగా ఉండలేడు. మీరు దాని యొద్దకు నాగరికత ద్వారా పోలేరు.
GEN 4:3
80ఇప్పుడు, అతను ఏదేను తోట కలిగియుండెను, అది ఒక చెడిపోయిన విత్తనము ద్వారా కలిగెను. ఇప్పుడు, సాతాను తన యొక్క మహత్తరమైన ఏదేనును ఏర్పరచుకొనెను. అదేమిటి? సంస్కృతి, విజ్ఞానము, అందమైన సంఘములు, ఎతైన గోపురములు, చక్కటి నేర్పుగల ప్రసంగికులు, విద్యభ్యాసము: డీఏ., డి., పిహెచ్.డి., ఎల్ఎల్.డి, పాండిత్యములో డాక్టరేట్, డాక్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్లు! ప్రతిసారి మీరు వారిని ఈ యొక్క డిగ్రీలతో పిలుచుచున్నప్పుడు అది వారిని దేవుని యొద్దనుండి ఇంకొద్దిగా దూరముగా తీసుకొనిపోవుచు, దూరముగా త్రోసి వేయుచున్నది. మరియు విద్యభ్యాసములేని, సరిగా ఉచ్చరింపలేని వారు ప్రసంగ వేదిక నుండి మాట్లాడినయెడల వారిని ఇష్టపడుట లేదు, వారికి ఆ ప్రసంగము అక్కర లేదు. వారికి చక్కనైన కార్యములు కావలసియున్నది.
ఆదిలో వారియొక్క తండ్రియైన కయీనుకు కూడ ఇటువంటి అందమైన కార్యములను మనస్సులోనుంచుకొని అతను పుష్పములను మరియు భూమి నుండి మొలచిన ఫలములను దేవునికి బలిగా అర్చించెను. దేవుని యొక్క బయలుపాటుతో మానవుడు బలిని అర్పింపవలయునని దేవుడు కోరగా, కయీను ఈ విధముగా బలినర్పించెను. దేవుడు బలిగా కోరినది రక్తము; ఒక బేరి పండునో, లేక ఒక దొండపండు వంటి యొక్క ఎర్రని పండునో, లేక ఎండిన ద్రాక్షపండునో, లేక వేరేదైనను, లేక వారిప్పుడు చెప్పునటువంటి ఒక జల్దరు పండుకాదు. ఏదేను తోట నుండి మనలను బయటికి తీసికొనివచ్చిన రక్తము, ఒక నీచమైన స్థానముకు మనలను త్రోసిన రక్తము, ఒక స్త్రీ తప్పైన మనుష్యుని విత్తనమును తన గర్భములో విత్తబడుటకు అనుమతించి మరి దానిని ఆరంభించెను.
81నేనిప్పుడు మీతో పంచుకొనుచున్న వర్తమానము సరైన సమయములో ఇవ్వబడుచున్న వర్తమానమని నిరూపించి చూపవలయునని కోరుచున్నాను. ఇంకొద్ది విశేషమైన వాటిని పొందుటకు ఈ దినములలో అన్నిటిని మిశ్రితము చేయుచున్నారు, మిశ్రమమును గమనించుడి. వృక్ష జీవములను చూడుడి. (అది వేసవి కాలము.) నా గృహములో ఒక పుష్పించే చిన్న అడవి పుష్పమును ఈ వేసవి కాలమందు పెంచుచున్నాను,( నా యొక్క తోటలో ఆ చిన్న అడవి పుష్పమును ఉంచితిని. ఇప్పుడు నాకు అది జ్ఞాపకము వచ్చినది) అది జీవముతో ఉండవలెననిన ప్రతిరోజు దానికి రెండు సార్లు నీళ్ళు పోయవలయును. ఎందుకనగా అది సంకర జాతి పుష్పము.
ఒక చిన్న పసుపు వర్ణపు పుష్పముతో ఈ పుష్పమును సంకరము (మిశ్రమము) చేయుట వలన అది తయారు చేయబడినది. మరియు ఈ యొక్క చిన్న పసుపు వర్ణపు అసలైన పుష్పమునకు పది అడుగుల లోతున నీళ్ళు లేకపోయినను అది అట్లే జీవముతో నిలువగలదు, గమనించారా? అది మట్టి ద్వారా జీవించుచున్నది, మరియు అది చాలా చక్కగా నున్నది మరి దానికి దినము నీరు పోయనక్కర లేదు. అది నిజమైన అసలైన పుష్పము. అది మిశ్రితమైనది కాదు. దానితో ఏదియును కలుపలేదు, అది అసలైన నిజమైన పుప్పము.
మరి ఇది ఇంకొక దానితో మిశ్రితమైన పుష్పము దానికి రోజును నీరు పోయవలెను బిడ్డవలె దానిని పోషింపవలయును, చూశారా. దీనికి అసలైన దానికి మీరు ఆ విధముగా చేయనక్కర లేదు; దానిపై ఏ పురుగులును రావు. అయితే మిశ్రీతమైన కలుపు మొక్కలకు అవి ప్రాణముతో నుండు లాగున ఈగలు మరి ఆలాటివి వాటిపై వ్రాలకుండ మీరు ఎరువులు చల్లవలయును. మీరు ఆ విధముగా చేయని యెడల ఆ పురుగులు, ఈగలు ఆ పుష్పములను చంపివేయును. అయితే అసలైన నిజమైన మొక్కల యొద్దకు ఏ యొక్క పురుగును రాదు!
82ఓ, అది నిజమైన, స్వచ్ఛమైన, మరల జన్మించిన క్రైస్తవుడు. మీరు అతనిని దేనితోనైనను శోధింపవచ్చును, అయినప్పటికిని అతను క్రైస్తవుడుగా యుండును. ఒక నిజమైన క్రైస్తవురాలిని మీకు తోచిన విధముగా శోధించుడి, అయినప్పటికిని ఆమె క్రైస్తవురాలిగా నుండును.
ఆ రోజు ఇక్కడున్న సంఘము నుండి ఒక చిన్న బాలిక యొద్దనుండి నాకు ఒక ఉత్తరము వచ్చినది. ఇక్కడున్న సహోదరుడి యొక్క పండ్రెండు వయస్సు గల కుమార్తె వ్రాసిన ఉత్తరము అది. ఆమె తన యొక్క ఉత్తరములో, "సహోదరుడా బ్రెన్హాం, నా యొక్క తండ్రి నన్ను బేస్ బాల్ లేక బాస్కట్ బాల్ ఆట ఆడకూడదని చెప్పుచున్నాడు. మేము నమ్ముచున్నాము…" ఆమె చెప్పెను, మరియు ఆమె అడిగెను, "సహోదరుడా బ్రెన్హాం, మీ యొద్ద దేవుని యొక్క వాక్యముగలదని మేము నమ్ముచున్నాము, ఇప్పుడు నేనేమి చేయవలెనో చెప్పుము. "నా తండ్రి తప్పుగా చెప్పుచున్నాడని నేను అనుకొనుచున్నాను." అయితే, చెప్పెను, "మీరేమి చెప్పినను నేను నమ్మెదను." ఇప్పుడు, ఈ విధముగా ఆ చిన్న బాలిక అడిగెను, చూశారా.
కావున నేను ఆలోచించి ఈ విధముగా బదులిచ్చియున్నాను. "మంచిది, ప్రియమైనదానా, నీవు గనుక క్రైస్తవురాలిగానున్న యెడల ఎక్కడున్నను నీవు క్రైస్తవురాలివే. నీవు ఎక్కడున్నను క్రైస్తవురాలివే. అయితే, నేను చెప్పాను, "నీవు చూడుము, ఆ బాస్కేట్ బాల్ ఆట ఆడునపుడు వారు అసహ్యమైన మాటలాడుకొనుచు మరియు అసభ్యముగా ప్రవర్తించుచుండెదరు, మరి నీ తండ్రి దానిని గురించియే చెప్పుచున్నారు. నీవింకను మంచి క్రైస్తవురాలివని నేను నమ్ముచున్నాను. అంతే కాదు నీ తండ్రి నీ కన్నను వయస్సులో పెద్దవాడు. చూశారా?" చాలా లోకజ్ఞానము కలవాడు. నీవు చెప్పి యున్నావు,
నీవు పన్నెండు సంవత్సరములు వయస్సు గలదానిననియును, మరియు నీకు నాలుగు సంవత్సరములు వయస్సుగల ఒక సహోదరి కలదని చెప్పియున్నావు. "ఆ చిన్న పిల్ల గనుక నిన్ను కాగితమును చింపి బొమ్మలు చేసివ్వమని అడిగిన యెడల, నీవు ఆ విధముగా చేయుటకు సమయము లేదని చెప్చెదవు, చూశారా, "నీవు నీ యొక్క సహోదరి కంటెను ఎదిగి యున్నావు."
ఇప్పుడు, సంఘము ఆ విధముగానే ఈ రోజు దేవుని యొక్క వాక్యములో ఇంకొద్ది పైకి ఎదిగి యుండవలయును. మెథడిస్తులుగా కాదు, బాప్టిస్తులుగా కాదు, పెంతెకోస్తులుగా కాదు, ప్రెస్బిటేరియన్లుగా కాదు; అయితే దేవుని యొక్క కుమారులుగాను మరియు కుమార్తెలుగాను ఉండులాగున దేవుని యొక్క వాక్యములో బాగుగా ఎదిగియుండవలయును. హు! అది సరి. అది సరి.
సరైన కాలములో వచ్చిన వర్తమానము దీనిని నిరూపించుచున్నది.
1PET 3:1-4
83విజ్ఞానము ద్వారాను, సాతాను యొక్క విజ్ఞానము ద్వారాను మరియు పరిశోధనల ద్వారాను, వారు సమస్తమును తారుమారు చేసి మూల సృష్టిని మార్చివేసి అందముగా కనుపించులాగున ఒక వేరైన దానిని చేసి ఒక బేధమైన విత్తనమును తయారు చేయుచున్నారు.
మన యొక్క సహోదరిలను చూడుడి. వారెంత చక్కగానున్నారోయని నేను కొద్దిసేపుకు మునుపు చెప్పియున్నాను. ప్రపంచ అందగత్తెల పోటీని యొకటి పెట్టి ఇక్కడ కాలిఫోర్నియాలోనున్న గ్లోరియా స్వాన్సన్ లేక ఈ యొక్క అర్థనగ్నముతో నున్న అందగత్తెలతో మన యొక్క సహోదరిలను నిలబెట్టిన యెడల, మన యొక్క సహోదరిలు ఆ పోటీలో నెగ్గుటకు అవకాశమేలేక మరి వారు దానికి ఒక పది లక్షల మైళ్ళ దూరములో నుందురు. అయితే వారి పేరు పేరు ప్రఖ్యాతులు గలవారితో నుండవు; మరయితే జీవగ్రంధములో నుండును, చూచారా.
తన్ను తాను తగ్గించుకొని విధేయతతో నున్న ఒక ఆత్మ దేవుని యొక్క దృష్టిలో గొప్ప బొక్కసము. మృదువైనట్టియునైన గుణమును, అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీ అలంకారముగా నుండవలెను, స్త్రీలు తము స్వపురుషులకు లోబడి యుండవలయును — అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది, చూశారా. అది సరియే.
84స్త్రీలు ఉపయోగించు చక్కనైన సాధనములు వారిని బయట కనపడు లాగున అంధముగా చేయును. ఆ విధమైనటువంటి కార్యములు మనయొద్ద లేవు. అయినను వారు దానిని చేయుచున్నారు, అదంతయును సాతానుడి వలన వచ్చిన కార్యములు. ఆ కార్యములన్నియును దయ్యము యొక్క కార్యములు. మీకది తెలియునా? నిశ్చయముగా. అవన్నియును దయ్యము యొక్క కార్యములు.
నాకు జ్ఞాపకమున్నది నా యొక్క భార్య చిన్న వయస్సులో అందముగా నుండెడిది, ఆ సమయములో ఆమె ఎటువంటి అలంకరణ సాధనములు ధరించి యుండలేదు. లేదు, ఆమె మోకాళ్లు వరకున్న వస్త్రములను ధరించికొని నా యొద్దకు వచ్చినప్పుడు, నేనామెకు యేసు నామములో బాప్తిస్మమిచ్చియున్నాను, చూశారా.
అయితే ఇప్పుడామె వృద్ధురాలగుచున్నది, "నాకు ముఖమంతయును ముడతలు పడుచున్నవి" అని ఆమె చెప్పెను,
నేను ఆమెతో చెప్పియున్నాను, "నీవు వృద్దురాలుగునట్టుగా, నా యొక్క కనుదృష్టియును తగ్గిపోవుచున్నది. నీవు ఏ విధముగానున్నావనియును నాకు గుర్తున్నది, మరియు నీవు ఏ విధముగా నుండబోవుచున్నాననియును నా హృదయములో నేనెరిగి యున్నాను, చూశారా. ఇప్పుడు నీవు పొందియున్న మృదువైన మరియు చక్కటి ఆత్మవలన దేవుడు మనలను గట్టుకు ఆవలి తీరమున మరల కలుపును. అదంతే. అటు పిమ్మట అక్కడ మన శరీరములలో ఎటువంటి మార్పు నొందదు," అని నా భార్యతో నేను చెప్పియున్నాను.
కావున ఏల…
GEN 6:2
85అయితే మీరు చూడుడి, నోవహు దినములలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి, చూశారా. దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలను చూచిరి, ఏలయనగా వారు అర్థనగ్న దుస్తులను వేసికొని మరియు ఆ విధముగా అసభ్యమైన దుస్తులను ధరించుకొనియుండిరి. వారు ఆ యొక్క స్త్రీలను మోహించిరి, మరియు వారి కొరకు వారి వెంట పోయిరి, చూశారా.
ఆ స్త్రీల యొక్క అలంకరణలను మీరు చూచి మోహింపక వాటికన్నింటికంటే ఉన్నతమునందు నుండుటకై మీరు దేవకుమారులుగా యున్నందులకు నేను మీకు కృతజ్ఞునిగా యున్నాను. అయితే ఇదేమిటి? అదంతయును అందముగా నున్నది. అది మిశ్రితమైనది. ముఖమునకు రంగులు పూసికొనిన కొందరిని పిలచి మరి వారి ముఖములను మీరు కడిగిన యెడల వారు ఎంతటి వికారముగాన రోతగా నుండి ఇతర పురుషులతో తిరిగెదరు.
86నా యొక్క భార్యయైనను నేను లెక్కచేయను, నేను ఏ స్త్రీలో నైనను విశ్వాసమును నమ్మదగిన స్వభావమును నేను గౌరవించెదను. నేను చిన్నపిల్ల వానిగానున్నప్పుడు, నేను ఈ విధముగా ఎల్లప్పుడును చెప్పెడి వాడిని, "ఒక నీగ్రో స్త్రీ గనుక నమ్మకముగా విశ్వాసముగా నుండగోరిన యెడల నేను నా యొక్క చివరి రక్తపు చుక్కను వారు ఆ విధముగా నుండుటకుగాను చిందించెదను" చూశారా. నేను ఏది సరైనదో దానిని నేను గౌరవించెదను. నా జీవిత కాలమంతయును ఆ విధముగా జీవించుటకు ప్రయత్నించుచుంటిని. అప్పుడు నేను యౌవ్వనునిగానున్నాను, అయితే ఇప్పుడు నేను వృద్దున్ని, అయినను నా యొక్క అభిప్రాయములను కొంచెము కూడ మార్చుకొనలేదు.
చూశారా,
ISA 14:12-14
87సాతానుడు విజ్ఞానమును ఉపయోగించి హవ్వకు చేసిన విధముగా, అతడు సంఘమును కూడ తారుమారు చేసియున్నాడు. ఈ రోజు మనకుగల అతనియొక్క నవీన ఏదేనులో తనయొక్క సంకరమైన సంఘము ద్వారా ఈ దినమున వాడు తనయొక్క యుక్తులను నెరవేర్చుకొనెను. మనము వైజ్ఞానిక ఏదేనులో, సాతానుని ఏదేనులో, ఒక వైజ్ఞానిక ఏదేనులో జీవించుచున్నాము.
మీరు త్రిప్పదలచిన యెడల యెషయా 14:12కు త్రిప్పుడి, మీరు కోరిన ఎడల దానిని చదివి వినిపించెదను, 12 మరియు 14. సాతాను తనలో తాను ఇట్లనుకొనెను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును. దేవుని యొక్క కుమారులు కూడ అతనిని ఆరాధించు విధముగా అతని యొక్క రాజ్యము ఉండును. మరి ఖచ్చితముగా దానినే అతను చేసియున్నాడు. ఆదిలో, ప్రారంభములో అతను చేసినట్లు సంఘము ద్వారాను మరియు మత మార్గము ద్వారా దానిని అతడు చేసియున్నాడు. దానిని అతను చేసియున్నాడు.
88మరియు, ప్రవక్తైన పౌలు II థెస్సలోనీకయులకు 2వ అధ్యాయములో దానిని చూచి యున్నాడు — ఈ యొక్క విజ్ఞానము, చదువు మరియు నాగరికత నిండియున్న గొప్ప విజ్ఞాన ఏదేనును చూచియున్నాడు. మరియు అతడు తనను తాను హెచ్చించుకొని సర్వ క్రైస్తవ సంఘములను ఐక్యపరచి అవన్నియును అతనికి వంగి నమస్కరించులాగున దానికి అతడే నాయకుడాయెను. మరి అదేమిటని చూడుడి? అది జనులమధ్య క్రియ చేస్తూ వంచించు ఆత్మయై యున్నది; అతను హవ్వకు చేసిన విధముగా, దేవుని యొక్క స్వరూపములో సృజింపబడిన దేవుని యొక్క కుమారులను, మానవుని యొక్క స్వరూపములో సృజింపబడిన మానవుని యొక్క కుమార్తెలను నీచమైన కార్యముల వైపు నడిపించెను. విజ్ఞానము, మరియు చదువు మరియు సంస్కృతియను తన మాయయైన కపటోపాయముల ద్వారా తనదైన ఒక నవీన, విజ్ఞాన, మృత్యువును ఏదేనును ఏర్పరచుకొనెను. దేవుడు తనయొక్క వాక్యము ద్వారా పలికినపుడు మరణములేని ఏదేనును సృష్టించెను; దానిలో ఈ దినము మనకున్న విధముగా చదువులేదు, లేక నాగరికత లేదు.
2THS 2:4•
REV 13:8
89మీరు దానినప్పుడు చూచుచున్నారా? దానిని గ్రహించుచున్నారా? చూడుడి?
ఇప్పుడు, అతడు తన యొక్క ఏదేనును కలిగియున్నాడు. చూడుడి. సంఘములన్నియును అతడిని ఆరాధించుచున్నవి. దానినే పౌలు థెస్సలోనీకయులలో ఇక్కడ చెప్పియున్నాడు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును మరియు భూనివాసులందరును, అనగా, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూశారా? అది ఒక నవీన ఏదెను.
ఇప్పుడు అతను ఏమి చేయుచున్నాడు? అతడు తనయొక్క గొప్ప చివరి భోజనశాలయైన రోము నగరముననున్న ఏదెనుకు పోవుచునున్నాడు. ఆ దినమున ఒక రోజు పోపు ఇక్కడకి వచ్చినపుడు మీరు చూచియున్నారా? అప్పుడు జరిగిన సమస్త కార్యములు పదుమూడుగా నుండుటను మీరు గమనించి యున్నారా? అతను పదుమూడు మాటలు పలికెను, పదుమూడుగురు రాత్రి భోజనమును తీసికొనిరి, పదుముడు సంఖ్య కలిగిన యాంకీ మైదానములో మాటలాడెను. సమస్తమును పదుమూడు సంఖ్యగానే యుండెను. మన యొక్క దేశపు సంఖ్య పదుమూడు — అది ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములోనున్నది, పదుమూడు చారలు, పదుమూడు నక్షత్రములు, పదుమూడు గీతలు, నాణేములపై పదుమూడు సంఖ్యలు, నాణేములపై పదుమూడు నక్షత్రములు, సమస్తమును పదుమూడు — మరియు ఒక స్త్రీ, చూశారా.
90మరిక్కడ నాయకుడైన పోపు స్త్రీ యొద్దకు వచ్చుచున్నాడు: విజ్ఞానపు అబద్దపు వధువుకు, అబద్ధపు క్రీస్తు విరోధి. మన యొక్క ఈశాన్యపు అమెరికనులు ప్రపంచము లేక పశ్చిమ ప్రపంచము అమెరికనులు ప్రపంచమును విజ్ఞానములో నడిపించిరి. అతని యొక్క విజ్ఞానపు సంఘములో, అతను ఆమె యొద్దకు వచ్చెను, మరిప్పుడు సమస్త ప్రొటెస్టెంట్లందరును అతనికి వంగి నమస్కారము చేయుదురు, పదుమూడు అధ్యాయములో. దానిని మీరు చూచి యున్నారా?
సమస్తమును పదుమూడు. మన యొక్క దేశమంతయును, సమస్తమును పదుమూడు — ఒక స్త్రీ యొక్క ప్రపంచము. చూడుడి, ఇక్కడ మనము దానిని గ్రహించియున్నాము. ఏదేను తోటలో అది దానిని స్త్రీ యొక్క ప్రపంచముగా మార్చినది, అయితే ఒకానొక రోజు అది దేవుని యొక్క ప్రపంచముగా మారును.
ఇప్పుడు గమనించుడి. ఇప్పుడు, కూడ ఈ యొక్క ప్రవక్తలును మరియు ఇతరులును జరుగబోవు దీనిని ముందుగానే చెప్పియున్నారు.
91మరిప్పుడు, దేవుడు భూమిపై సృష్టికి మునుపు అల్లాడుచున్న విధముగా, ఇది ఒక ఆత్మీయమైన ఒక అవ్యక్తస్థితిలో నున్నది. నిజముగా అది ఆ విధముగానే మారియున్నది.
ఇక్కడ గమనించుడి, రెండవ ఏదేను, మొదటి ఏదేనులో ఎన్నుకొనబడిన వారిని వంచించినట్లే మరటువంటి స్థితిలో నున్నది. ఇప్పుడు గమనించుడి, కొన్ని నిమిషములకు నేను పోల్చి చెప్పబోవుచున్నాను. (ఇప్పుడు, నేను నిలుపవలయునని యున్నాను, ఏలయనగా అప్పుడు పదునొకండు గంటలైయున్నది.) కావున వినుడి, ఈ యొక్క రెండు ఏదేను తోటలు, సాతానుడు ఆరంభములో నిజమైన ఏదేనులో హవ్వను వంచించిన విధముగా ఈ యొక్క రెండవ ఏదేనులో అదే మాదిరిగా పోల్చబడియున్నది. ఇప్పుడు అవి రెండును ఒకే విధముగా యుండుటను గమనించుడి. చూడుడి, దానిని మనము గ్రహించియున్నాము, ఇప్పుడు మనము జీవించుచున్న ఒక విజ్ఞానపు ఏదేనును ప్రతి యొక్కరును సృష్టముగా అర్థము చేసికొనియున్నారు, చూశారా. ఇప్పుడు ఇది దేవుని యొక్క ఏదేను కాదు. దేవుని యొక్క ఏదేను విజ్ఞానము ద్వారాను, విద్య ద్వారాను, మరియు సంస్కృతి ద్వారాను ఏర్పడలేదు. అది లేని కార్యములను ఉన్నలాగున పిలుచు దేవుని వాక్యము ద్వారా సృష్టింపబడును, చూడుడి. మరియు గమనించుడి, ఏదేను తోటలో, వాటిని మనము కొద్దిగా పోల్చెదము.
ఇప్పుడు గమనించుడి,
GEN 2:25•
REV 3:17
92మానవుడు మరియు ఆ మానవుని యొక్క భార్యయు దిగంబరులుగా వుండినను వారు దానిని ఎరుగని వారైయుండిరి, ఆ దేవుని యొక్క ఏదేనులో జతగా దిగంబరులై వారు ఉండినను మరియు దానిని వారు ఎరుగకయుండిరి. వారు మరల ఇప్పుడు (ఈనాడు) కూడా దిగంబరులుగానే నున్నారు మరి దానిని ఎరుగక యున్నారు, ప్రకటన 3, లవొదికయ సంఘకాలమైయున్నది. "ఏలయనగా నీవు దిగంబరుడవును, దౌర్భాగ్యుడవును, దరిద్రుడవును, దిక్కుమాలిన వాడవును, గ్రుడ్డి వాడవునై యున్నావని ఎరుగకయున్నావు." దేవుని యొక్క ఏదేనులో వారు దిగంబరులుగా నుండిరి మరి వారు దానిని ఎరుగక నుండిరి; మరిప్పుడు విజ్ఞానము ద్వారాను మరి విద్య ద్వారాను నింపబడియున్న ఈ యొక్క సాతాను ఏదేనులో వారు మరల దిగంబరులుగా నున్నారు, మరి దానిని ఎరుగకయున్నారు.
ఎటువంటి ఒక తారుమారైన కార్యముగా ఇది యున్నది! ఈ రోజును గమనించుడి. తన భార్య యొక్క లోపలి వస్త్రములను అతడు ధరించుటకు ప్రయత్నించుచున్నాడు; మరియు ఆమె, అతని యొక్క దుస్తులను ధరించుటకు ప్రయత్నించుచున్నది. ఆమెవలె అతను తన యొక్క వెంట్రుకలను పెంచుకొనగోరుచున్నాడు; మరి ఆమె కూడా అతనివలె తన వెంట్రుకలను కత్తిరించుకొనుచున్నది. ఓ, మై! పురుషుడు స్త్రీ వలె మారుటకు ప్రయత్నించుచున్నాడు; స్త్రీ పురుషునివలె మారుటకు ప్రయత్నించుచున్నది. అపసవ్యము! లవొదికయు సంఘము కూడ అదే కార్యమును చేయుచున్నది.
93గమనించుడి, ప్రారంభములో ఏదేను తోటలో వారు దిగంబరులుగానున్నను ఎరుగకుండిన కారణము వారు పరిశుద్ధాత్మలను ముసుగుతో నుండిరి. వారు దానిని ఎరుగక యుండిరి. పరిశుద్ధాత్మ వారి నేత్రముల యందున్నందువలన, వారు ఒకరినొకరిని సహోదరులుగాను మరియు సహోదరిలుగాను మాత్రమే చూచుచుండిరి, చూశారా. నియమములు… వారు దిగంబరులని వారు ఎరుగకయుండిరి — పరిశుద్ధాత్మ వలన! ఇప్పుడు అపవిత్రమైన ఆత్మయును, అపవిత్రమైన ఆత్మతో, మరియు కామేచ్చ వారిని కప్పియున్నది; విద్య, విజ్ఞానము, "పొట్టి దుస్తులు ధరించియున్నారు, ఎందువలయుననిన చల్లగా నుండునని, ఎందుకనగా అది విజ్ఞానమైయున్నది. ఇండియనులు మీకు దీనికంటెను చక్కగా బోధించెదరు. వారు చల్లగా నుండవలయునని దుప్పటిని చుట్టుకొనెదరు, చూశారా. వారు దానిని ధరించుకొనుచున్నారు…
వారిని సంస్కృతికి మరియు నాగరికతకు తీసికొనివచ్చినదని వారనుకొనుచున్న అదే విద్యాభ్యాసము మరల వారిని జ్ఞానశూన్యతలోనికి తీసికొని వచ్చుచున్నది — మునుపున్నట్లు వంటి స్థానముకంటేను హీనమైన స్థితికి వారిని తీసుకొని వచ్చుచున్నది.
94పాఠశాలలో చదువు… మరియు పాఠశాలలను చూడుడి. ఈ రాత్రి సర్వ కళాశాలలను చూడుడి, అక్కడున్న విద్యార్థులను! అక్కడ చదువుకొనుచున్న విద్యార్థిణీలకు ఈ యొక్క విద్యార్థుల ద్వారా అక్రమముగా ఎందరు బిడ్డలు పుట్టుచున్నారో చూడుడి! మీరు ఆలోచించుడి! "ఇది వీధిలో నుండెడి చెత్తయని." మీరు చేప్పెదరు, ఇరవై-యొక్క రత్నములని పిలువబడు ఆ బాలురు పెదవులపై రంగు పూసుకొని, తల వెంట్రుకలను వ్రేలాడదీసికొనియుందురని వారు వారిని చెప్పుచుండెదరు. దానిని వారు చెప్పెదరు. మరియు మురికి మెడ కలిగిన అసహ్యులు! మీరు చెప్పెదరు, "సరి అది వీధిలో నుండు చెత్తయని." అదట్లైనా? వారు సర్వకళాశాల యొక్క విద్యార్థులు.
ఒక రోజు రాత్రి వారు ఎక్కువగా త్రాగుట వలన ఆ మత్తులో వారు ఏమి చేయుచున్నారో తెలియక కొట్టు కొనుచుండిరి, మరియు త్రాగుడు మద్యపానము ఇవేవియును వారికి సంతృప్తినివ్వ లేదు. వారు సీసాలను విరుగ గొట్టి మరియు స్త్రీల గది యొద్దకు వెళ్లి వారి తలుపులను తట్టి, ఆ స్త్రీలు బయటికి వచ్చిన పిదప వారి ముఖములపై గుద్ది మరియు ఒక స్త్రీ యొక్క కంటిని పూర్తిగా కోసేసి మరియు అనేకుల ఇతరుల యొక్క ముఖములపై గాట్లు వేసినట్లు కోసి వారి రూపములు మార్చివేసిరి. ఈ కార్యములను వారు బయట చెప్పెదరను కొనుచున్నారా? లేదు చెప్పరు.
వారిలో ఇద్దరు బాలురు వీధిలో పైకి క్రిందికి తిరుగుచు మరి మెట్లపై కూర్చొనియున్న వివాహితులైన ఇద్దరు యౌవ్వన స్త్రీలను అవమానపరచిరి. పోలీసులు వారిని బంధించి జైలులో వేసిరి. ఆ సర్వకళాశాల అధిపతి ప్రధాని అక్కడికి వచ్చెను. మరియు కళాశాలలో ఈ విధముగా జరుగుచునే యున్నవి, ఈ యొక్క కార్యము మాత్రమే వారికి యున్నది. "వారు మా యొద్ద చదువుచున్న ఏమి ఎరుగని పిల్లలు, వారిని వదలి వేయుము అని అడిగెను." పోలీసు వారు వారిని వదలివేసిరి. అక్కడ మీరు గమనించియున్నారా; నాగరికత, విద్యాభ్యాసము, మరణమునకును, మరి అవ్యక్తస్థితికి, నరకమునకు దారి తీసియున్నది. ఆ విధమైన కార్యములకు చెవి యొగ్గకుడి.
ఇప్పుడు, గమనించుడి.
1JN 2:15
95హవ్వ ప్రపంచము ఏ విధముగానున్నదని తెలుసుకొనుటకు తొంగిచూచెను. మీకు తెలియునా మనము కూడ అనేకసార్లు దీనిని చేస్తే ఏమిటంట అని అనుకొనెదము, లేక కొద్దిగా తొంగిచూచిన యెడల ఏమి జరుగును అని అనుకొనెదము, లోకమును కొద్దిగా చూచిన పరవాలేదని అనుకొనెదము.
ఇప్పుడు సరి. యోహాను లేక I యోహాను 2:15, దేవుడు చెప్పియున్నాడు, "ఈ లోకమునైనను లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు." లోకములోనున్న కార్యములన్నియును మరణమైన కార్యములు, జీవములేనివి. వాటినుండి మీరు నరుకబడి సున్నతి చేయబడియున్నారు. మీరు లోక కార్యములకు మృతులైనందువలన మీరు వాటిని కోరుట లేదు. లోక కార్యములన్నియును మృతతుల్యమైన కార్యములుగానున్నవి. నిర్జీవమైనది. ఏదియును మీకు అక్కరలేదు. అవి కుళ్ళిపోయున్నవి. అవి కంపుకొట్టు చున్నవి. జీవించుచున్న ఏ ఒకటైనను ఆ విధముగా అసహ్యమైన వాటిని ఎట్లు కోరుకొనును? చూశారా? మీరు క్రీస్తు నందు జీవించియున్నారు. వాక్యము మిమ్ములను జీవింపచేయుచున్నది.
96విద్యాజ్ఞానముతో నిండియున్నదని మనమను కొనుచున్న ఈ యొక్క లోకములో దీనిని తలంచుకొని చూడుడి! ఎక్కువ చదువు, డాక్టరేట్ డిగ్రీలు మీకు లేని యెడల మీరు ప్రసంగవేదికలు ఎక్కి ప్రసంగింపకూడదనే లాంటి కార్యములు ఇప్పుడునున్నవి. ఒకప్పుడు సైనిక దళములోనున్న ఒక క్రైస్తవ గురువు నాతో చెప్పినది నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అతను చెప్పెను, "సహోదరుడా బ్రెన్హాం…" ఇది మొదటి ప్రపంచ యుద్దమునకు పిదప సంభవించి యున్నది. ఆ గురువు ఇట్లు చెప్పెను, అతనితో సేనలోని హవల్దారు వచ్చి మరి చెప్పెను, "అర్గోనేలోనున్న యుద్ధ భూమికి నాతో కూడ వచ్చెదరా?" ఆ స్థలము ఫ్రాన్స్ కు చెందిన లోరైన్ అను చోటునున్న, లాసెల్లే వద్ద నున్నదని మీకు తెలియును.
మరియు అతనితో కూడ అర్గోన్ లో అడవికి వెళ్ళితిని. మరియు "యుద్ధములో నాశనము చేయబడిన టాంకులను అతను లెక్క వేసికొనుచుండెనని," అతను చెప్పెను. మరియు అతను చెప్పెను, "అది ఈస్టర్ ఉదయము." నేను ఒక నర్స్ తో కూడ నడచుచుంటిని, మరియు ఆ నర్స్ గాయపడిన యుద్ధ వీరులకు అమెరికా రోజా పువ్వులను ఇచ్చుచుండెను, మీకు తెలియును అమెరికనులకు వాడుకైన రోజా పుష్పము. ఆ యొక్క రోజా పుష్పములను చేతిలోనికి తీసుకొని మరి కేకలేయుచు, ఏడ్చుటకారంభించిరి, ఏలయనగా ఆ యొక్క పుష్పము వారి యొక్క దేశమునుండి వచ్చియున్నదని వారికి తెలియును." చూశారా, అది వారి యొక్క దేశము నుండి వచ్చినది.
మరియు ఆ విధముగానే వాక్యమును కూడ మనము కైవశపరచుకొనెదమని నేను తలంచుచున్నాను. "ఓ, దేవా! అది స్వగృహము నుండి వచ్చియున్నది." చూశారా.
97"కావున నా యొక్క హృదయములో మంచి ఉన్నతమైన అనుభూతి చెందుచున్నాను," అని అతను చెప్పెను. "నేను బయటికి వెళ్లి," మరి చెప్పెను, "మరియు కెప్టెన్ ఎన్ని టాంకులు ధ్వంసము చేయబడినవని మరియు ఆ విధముగా నాశనము చేయబడిన దానిని లెక్క చూచుటకు వెళ్ళెను" అని చెప్పెను. చెప్పెను "అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పెను, ఆ యొక్క చిన్న రాతి నొద్దకు పొమ్ము!" మరియు అతను చుట్టు చూచెను. చెప్పెను, "వారు మస్టర్డ్ మరియు క్లోరిన్ అను విష-వాయువులను ప్రయోగించినందు వలన ఆ విష-వాయువులు చెట్టులోని ఆకులనన్నిటిని కాల్చివేసెను. అక్కడ జీవముతోనున్న ఏదియును విడువబడలేదు మరి ఇక్కడ ఈస్టర్!" అప్పుడతను చెప్పసాగెను, "ఎటు వంటి ఈస్టర్! ఎటు వంటి ఈస్టర్, భూమిపైన పచ్చ గడ్డి కూడ లేకుండ సమస్తమును తుడుచుకొనిపోయెను!" మరియు చెప్పెను, ఏదో అతనిని ఒక బండనొద్దకు పోవులాగున ఆకర్షించెను. అతను ఆ బండను లాగి చూసినపుడు, "అక్కడొక చిన్న ఈస్టర్ పుష్పము దాని క్రింద నుండెను, విష-వాయువులు ఎన్ని ప్రయోగింపబడినను ఆ యొక్క చిన్న పుష్పము ఆ బండ క్రింద జాగ్రత్తగా నుండెను." మరియు అతను చెప్పెను, "నేనప్పుడు అనుకొంటిని, ఓ, దేవా, ఈ యొక్క విషమంతయును పోవువరకు సదాకాలములుగానున్న ఆ బండ క్రింద నన్ను దాచుము, మరియు దూరముగా నున్న ఆవలి గట్టునున్న ఆ భూమిలో నన్ను వికసింపనిమ్ము."
98మీరు కోరిన యెడల నేను దీనితో నిలుపుకొనెదను, ఏలయనగా నేను అధికముగా వ్రాసుకొని వచ్చియున్నాను, దానిని ప్రసింగింపలేను, సమయము లేనందువలన దానిని ముగించలేను. కావున మరియొక సారి మీ యొద్దకు వచ్చి దానిని ప్రసంగించెదను. ఆ దినమున నేను "ఆలోచనాపరుని వడపోత సాధనము," అను అంశమును ప్రసంగించియున్నాను, దానిని మీరందరును చదివియున్నారు, చూశారా… పరిశుద్ధ మనుష్యుని యొక్క రుచిని ఉత్పత్తి చేయుచున్నది. ఆలోచించుడి, సహోదరులారా. మీరేమి చేసినను, ఆలోచించుడి!
ఎఫెసీయులు 5:26 అక్కడ చెప్పబడియున్నది. మనము ముందు నిర్ణయింపబడుటను గురించి మనము ప్రసంగించి యున్నాము. మీరు చూడుడి, అది అనేకులను తడబడేలా చేసినది. అది దేవుని యొక్క వాక్యము. ఆయన, "మనము దేవుని వాక్యము ద్వారా ముందుగా నిర్ణయింపబడియున్నామని," ఆ మాటను ఆయన, ఉపయోగించి యున్నాడు. మరియు దానిలో, దానిలో మనము… మీరు ముందుగా నిర్ణయింపబడియున్న యెడల, ఎందుకని అది నిశ్చయముగా జరిగి తీరవలయును, ఏలయనగా అది ముందే నిర్ణయింపబడియున్నది. దేవుడు మిమ్ములను ఎన్నుకొనియున్నాడు, ఏలయనగా మీరు ఆది నుండి ఏమేమి చేయబోవుచున్నారని ఆయన ఎరిగియున్నాడు.
99మరి చదువును, విషమును మరియు ఆలాటి కార్యములను దయ్యము మీ పై చల్లి, మీరు నవీన పద్ధతులో నవీనముగా నుండవలయును. మీరు ఈ విధముగా నుండవలయును అని చెప్ప నియ్యకుము. మీరు దేవుని యొక్క కుమారులును మరియు కుమార్తెలుగా నుండుట తప్పనిచ్చి వేరే ఏ విధముగాను నుండుటకు చోటియ్యకుడి. మీరు దేవుని వాక్యము ద్వారా జన్మించియుండిన యెడల, ఆ విధముగానే యుందురు.
సాతాను చల్లుటను గమనించుడి. మీరు గనుక ఒక మంచి విత్తనమును తీసికొని మరి దానికి కృత్రిమమైన వాటిని చల్లిన యెడల, ఆ విత్తనమును ఆ మందులు చంపివేయును. మరి ఆ విధముగానే వారు ఈ యొక్క సంఘ శాఖల యొక్క కార్యములను మీపై చల్లిన యెడల అది మీలోనున్న ఆది నిజమైన వాక్యము యొక్క ప్రభావమును నశింపజేయును. "దీనిని చేయవలెను… "ఇతర అమ్మాయిలు దానిని చేయుచున్నారు. ఇతర పురుషులు దానిని చేయుచున్నారు," అని వారు చెప్పిన యొడల, వారు మిమ్ములను ప్రోధ్బవించిన యెడల మీరు వినకుడి. దానిని నమ్మకుడి. అది మీపైనున్న దేవుని వాక్యము యొక్క ప్రభావమును నాశనము చేయును. అది మీకు తెలియును.
PS 14:1
100మన యొక్క పాఠము చెప్పుచున్నది, "మీరు లోక మర్యాదను అనుసరింపకుడి, లోక కార్యములు మీపై చల్లబడుటకు అనుమతింపకుడి, అయితే మీలోనున్న వాక్యమును విత్తనము ద్వారా నూతన పరచబడుడి."
దేవుడనేవాడు ఒకడున్నాడనే దానిని ప్రజలు ఈనాడు విశ్వసింపని వారివలె ప్రవర్తించుచున్నారు. అది మీకు తెలియునా? వారు ఆ విధముగా ప్రవర్తించుచున్నారు. ఇప్పుడు నేను వారిని వెర్రివారని పిలుచుటకు ఇష్టపడుట లేదు, అయితే వారు ఆ విధముగా నటించుచున్నారు. ఏలయనగా కీర్తనలు 14:1 చెప్పుచున్నది, "దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు." ఒక మనుష్యుని బుద్ధిహీనుడని మనము పిలువకూడదు. అయితే వారు నిశ్చయముగా ఆ విధముగా నటించుచున్నారు. ఏలయనగా వారికి తెలియదు… దేవుడు లేడనునట్లు వారు ప్రవర్తించుచున్నారు. ఈ యొక్క వాక్యమును వారు తెలియనట్టు దాటిపోవుచున్నారు.
101అక్కడ దూరదర్శిణి (టెలివిజన్)లో కార్యక్రమము జరుగుచుండగా దానిని చూచుటకు బిల్లీపాల్ అనుకుంటున్నాను, ఆ దినమున వారు నన్ను ఆ గదిలోనికి తీసుకు వెళ్ళిరి. మాకు దూరదర్శిణి లేదు. మా ఇంటిలో ఎన్నడును టెలివిజన్ లేదు ఇంకెన్నడును ఉండబోదు. అయితే మీరు గనుక వాటిని ఉంచుకొనదలచిన యెడల అది మీ ఇష్టము. అయితే దేవుడు దానిని ఉంచుకొనవద్దని చెప్పెను. మరి నేనిక్కడికి వచ్చినప్పుడు, ఈ యొక్క చక్కటి వృద్ధురాలైన సహోదరి యొక్క గృహమును అద్దెకు తీసికొన్నాను, వారు టెలివిజన్ను కలిగియుండిరి, ఏలయనగా అద్దెకు వచ్చువారికి ఇంటిలో టెలివిజన్ కలిగియుండ వలయును. అందువలన ఆ సహోదరి దానిని ఇంటిలో ఉంచుకొనెను. మరి నేను, పిల్లలను భక్తిని గురించిన క్రైస్తవ కార్యక్రమములను చూచుటకు అనుమతించితిని, కావున వారు అది చూచునప్పుడు నన్ను ఒక దేవుని సువార్తను గురించిన పాటలు పాడుటను చూచుటకు పిలచిరి.
సువార్త పాటలు పాడుచున్నామని తమ్మును తాము పిలుచుకొను వారు రిక్కీస్ అను గుంపు వారివలె నడచుకొనుచున్నారు. నవీన గాయకుల వలె, సువార్త పాటలు పాడు గాయకులు! వారు శరీరమునంతయును కదిలించుకొనుచు, రిక్కీ వెంట్రుకలు కత్తిరించుకొనుటయును మరి ఈ విధముగా చేయు అసభ్యమైన కార్యములన్నియును యేసుక్రీస్తుకు అపకీర్తి తెచ్చుచున్నవి, మీకు తెలియునా. ఆ కార్యక్రమమును చూచునపుడు అది సువార్తను పరిహాసము చేయలాగుననున్నది!
GEN 4:7
102కయీను ఆ విధముగానే యుండెను. మతపరమైనవాడు, నిశ్చయముగా. అయితే అతనిలో తప్పైన విత్తనము ఉండెను, చూశారా. అందువలననే అది సర్పము యొక్క సంతానమును బయటికి తీసికొనివచ్చెను. సాతానుడు ఏదేను యొక్క విత్తనముపై బుస కొట్టెను, మరి అట్లు చేయబడినందువలన ఒక కయీనును బయలుపరచెను. దానిపై అతడు తన విషమును పూనెను. అతను, కయీను దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును ఎరిగియుండెను. అతను దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును ఎరిగియుండెను. ఎందులకు? అయితే అతడు సర్పము యొక్క సంతానమని నిరూపింపబడుటకుగాను దేవుని యొక్క చిత్తమును చేయుటకు అతడు నిరాకరించెను. అతడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చూచినప్పుడు దానిని చేయుటకు నిరాకరించెను. హేబెలు యొక్క వర్తమానము దేవుడు సత్యమని నిరూపించుటను చూచెను. హేబెలు యొక్క కార్యము దేవుని చిత్తమని కయీను ఎరిగియుండెను, చూశారా. హేబెలు వర్తమానమును దేవుడు సత్యమని నిరూపించుటను అతడు చూచెను. మరి దేవుడతనికి ఏమి చెప్పెను? మరి ఆయన చెప్పెను, "నీవును ఆ కార్యమునే చేయుము, నీ యొక్క తమ్మునివలె ఆరాధించుము, మరి నీవును ఆశీర్వదింపబడెదవు." అయితే అతడు దానిని చేసియున్నాడా, అతను దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చూసియున్నాడు, అయినను అతను దానిని కోరలేదు, చూడుడి. దానితో కూడ వేరేదైనను అతడు కలపవలయునని కోరెను.
103మరి ఆవిధముగానే ఈ యొక్క వేదపండితులు ఈ పరిశుద్ధ గ్రంథమును చూచుచున్నారు, వారు దానిని చదువుచున్నారు, అయితే వారు పరిశుద్ధ గ్రంథము ప్రకారము చేయవలెనని కోరుట లేదు, చూశారా. అది సర్పము యొక్క సంతానమును చూపించుచున్నది. వాక్యము జనుల మధ్య సామాన్యతయందు నిరూపింపబడుటను వారు చూచియున్నారు.
అయినను దేవుని యొక్క వాక్యమునకు ప్రజలు లోబడవలయుననిన అది వారికి చాలా కఠినముగానున్నట్లు కనిపించుచున్నది. స్త్రీలైన మీ యొద్ద ఇతర స్త్రీలు, పొడవైన వెంట్రుకలను గురించి అడుగుచున్నప్పుడు, "మీరేల పొడుగైన వెంట్రుకలను పెంచుకొని యున్నారు? [చూశారా?] మీరేల మోకాళ్ళకు క్రింద వరకు పొడుగైన దుస్తులను ధరించుచున్నారు?" వాటికి మీరు బదులిచ్చునపుడు వారు భుజములు కదిలించుచు ఆ జవాబును లెక్క చేయనట్టుండెదరు. అది సరియే కదూ? చూడుడి, వారిలో ఎవరైనను మంచి నిజమైన గౌరవింపదగ్గ స్త్రీ యున్నయెడల అది సరియని వారికి తెలియును, చూశారా. అది సరియని వారికి తెలియును; అయితే, మీరు చూడుడి, ఆ కార్యములకు వారు లోబడక తమ్మును తాము తగ్గించుకొన లేకున్నారు, చూశారా. అదియే వారిలో నున్న కార్యమైయున్నది. కయీను ఏమి చేసెనో చూడండి? నిరూపింపబడిన దేవుని యొక్క వాక్యమునకు అతను లోబడకపోయెను. అతను విధేయుడుగా నుండలేకపోయెను.
104ఓ, పెంతెకోస్టు వారు కూడ, "దేవునికి మహిమ! హల్లెలుయా! నేను నా వెంట్రుకలు కత్తిరించుకొనుచున్నాను, మరియు అన్య భాషలలో మాటలాడుచున్నాను!" అని చెప్పుకొనుచున్నారు. హు! వారు చేయుచున్న క్రియలే వారిలో అక్కడేదో తప్పిదమున్నదని చూపించుచున్నది, చూడుడి. విత్తనము వ్యత్యాసమైన దానిని బయటికి తెచ్చుచున్నది. ఒక మంచి విత్తనము ఆ విధముగా చేయదు. దేవుని యొక్క సంతానము తల వెంట్రుకలు కత్తిరించుకొనిన ఒక స్త్రీ బహిర్గతపరచదు. అది ఆ విధముగా దానిని చేయదు. పరిశుద్ధ గ్రంథము నిజమైన దేవుని సంతానము ఆ విధముగా చేయరని చెప్పుచున్నది, చూశారా. దానిని అది చేయదు. లేదయ్యా. దేవుని యొక్క వాక్యమునకు లోబడుట చాలా కఠినమైన కార్యముగానున్నట్లు అగుపించుచున్నది.
GEN 4:7
105గమనించుడి, అది ఆదికాండము 4:6 మరియు 7లో నున్నది, వ్రాసి యుంచుకొని యున్న కొన్ని లేఖనములను చదివెదము. "హేబెలు చేసినట్టు చేయుము." ఆయన చెప్పెను, "నీవు గనుక - నీ సహోదరుడు చేసినది చూడుము…" చెప్పెను, "పోయి హేబెలు ఏమి చేసెనో నీవును దానిని చేయుము, అతను ఏ విధముగా ఆరాధించెనో అదే ఆరాధనను నీవును చేయుము, మరి నేను నిన్ను ఆశీర్వదించెదను. నీవు సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి యుండును." ఇప్పుడు పాపము అనగా "అవిశ్వాసము." "నీవు హేబెలు చేసినట్టు చేయని యెడల! అతడు ఆరాధించిన ఆరాధరా విధానమే సరియైనదని నేను నిరూపించి యుండుటను నీవు చూచియున్నావు. ఇప్పుడు, నీవు గనుక దానిని చేయని యెడల, అప్పుడు అది పాపముగా పరిగణించబడును, అవిశ్వాసము నీ వాకిట పొంచియున్నది." చూశారా?
మరి ఈ దినమున దేవుడు ఏది సరియని నిరూపించుచున్నాడో వారు చూచుచున్నారు. దేవుడు ఏమి చేయుచున్నాడో వారు చూచుచున్నారు. ఇవన్నియును నెరవేరుట వారు చూచుచున్నారు. దానిని గురించి వారికి తెలియును. దేవుడు తన యొక్క సూచనలను పైన ఆకాశములోను, క్రింద భూమిపైనను, మరియు ఆ విధమైన కార్యములన్నిటిని చూపించుచున్నాడు, మరియు ఏమి సంభవించుచున్నదనే దానిని వారు చూచుచున్నారు. అయినను వారు వాటిని అంగీకరింపక దానిని చేయకున్నారు, చూశారా. సాతాను, సర్పము యొక్క సంతానము — తెలివిగల వారు, బైబిలు పాఠశాలలో బాగుగా చదువుకొనియున్న వారు, సమస్త లోకజ్ఞానముతో నిండుకొనియున్న వారు, ప్రసంగవేదికలపై ఏ విధముగా నిలబడి ప్రసంగింపవలయునని ఎరిగియున్నవారు, ఒక్కొక్క వాక్యమును ఏ విధముగా వ్యాకరణముతో ప్రసంగింపవలయునని చదువుకొనియున్నవారు. చూశారా? నిశ్చయముగా, వారు తమ్మునుతాము తగ్గించుకొనలేరు, ఆ విధముగా చూడుడి, వారు దానిని చేయలేరు. వారు చేయరు. ఆ విధముగా చేయుట అనునది వారికి సాధ్యమవ్వని కార్యమైయున్నది.
HEB 10:26,27
106ఇప్పుడు, ఆ విధముగా లేకున్న, పాపము వాకిట పొంచియుండును; అప్పుడు అతడు మూర్ఖత్వముతో అవిధేయుడై యున్నాడు. మరియు "మీరు గనుక మంచి చేయుటకు ఎరిగి యుండియు, మరి దానిని చేయకున్న యెడల, అది మీకు పాపము, చూశారా. వాక్యము సరియని నిరూపింపబడిన తరువాత, ఇది తప్పని తెలిసికూడా ఒక వ్యక్తి మూర్ఖత్వముతో వాక్యమునకు అవిధేయుడుగానున్న యెడల, అప్పుడు అతను వేరుపరచు గీతను దాటియున్నాడు, అతను ఆ విధముగా ఆ గీతను దాటియున్నప్పుడు, అతను ఏదేను నుండి వెళ్ళగొట్టబడియున్నాడు. మీరు ముందుకు సాగిపోగలగునంత సరిహద్దు గీత కలదు, మరి దానిని వదలి ప్రక్కకు తొలగిన యెడల, మీరు బయటికి వెళ్ళియున్నారు, మీరంతే. మీకది తెలియును, మీకు తెలియును కదూ?
ఒక సరిహద్దు కలదు. మీరు దానిని నమ్మని యెడల మీరు హెబ్రీయులకు 10:26 చదువుడి. ఆ లేఖన ములనే నేను గుర్తించి చూపుచున్నాను, చూశారా. మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానమును పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపముచేసినయెడల పాపములకు బలియికను ఉండదు. అది క్రొత్త నిబంధన. అది సరియేనా? "మనము మీకు ప్రసంగింపబడిన, చదివి వినిపింపబడిన, మీకు నిరూపింపబడిన అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల; సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొందిన తరువాత, మరి మీరు మీ మార్గముననే పోయి మరి బుద్ధి పూర్వకముగానే అవిశ్వాసించిన యెడల — పాపములకు యిక బలి ఉండదు," అయితే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును. అది సరియేనా? చూడుడి, మీరు ఆ హద్దు గీతను దాటు వచ్చును.
అరణ్యమార్గమున వారి యొక్క యాత్రలో ఇశ్రాయేలీయులు చేసిన విధముగా, ఇశ్రాయేలు దానినే చేసెను. మరి వారు మోషే యొక్క వర్తమానమును వినిన పిదప మరి అది నిరూపింపబడుటను చూచిన తరువాత; "ఓ, ఇప్పుడిట్లు చూడుడి, ఇశ్రాయేలు పుత్రులారా, మనమంతయును ఒక్కరమే, మనలో ఒకరినొకరము వివాహము చేసికొనవచ్చును, మరి మనము దీనిని చేయవచ్చును," అను అబద్ధపు ప్రవక్త యొక్క మాటలను వినిరి, మరి మోషే వారికి వేరే విధముగా చెప్సియుండెను దేవుడు దానిని నిరూపించి యుండుటను వారు చూచియున్నారు. వారెందుకు ఆ విధముగా చేసినారనగా బిలాము మోషేకంటెను చాలా నేర్చుగా ఉపదేశించెను, చూడుడి. బిలాము మోయాబు దేశమునకు చెందినవాడు, మోయాబు దేశము ఒక గొప్ప దేశము, అక్కడ గొప్ప జనులుండిరి, వారందరును ఒక ఐక్య-సంఘశాఖగా కూడి యుండిరి. గొప్ప సైన్యముతో యుండేను వురియు ఇతరులు మోయాబీయులను చూచి భయపడు నటువంటి గొప్ప కార్యములతో వారుండిరి.
మరిక్కడ ఒక ప్రవక్త వచ్చుచున్నాడు. ఒక ప్రవక్త, అభిషేకింపబడినతను, తప్పైన అభిషేకము పొందియున్నతను, చూశారా, నిజముగా అభిషేకము పొందిన ప్రవక్త యొద్దకు వచ్చుచున్నాడు. ఎంత చేరువగా నున్నదో గమనించుడి. మరి జనులకు బోధించెను, మరి వినిన వారిలో అనేకులు ఆసత్య బోధనల వెంట వెళ్ళిరి. దానిని మరచిపోకుడి. చూచారా? నిరూపింపబడిన వాక్యము కాదు, బోధింపబడినది వాక్యము కాదు, మరి ఆ తప్పుడు బోధనల వెంట వారు వెళ్లిరి.
EXOD 8:6,24•
EXOD 14:21•
JOHN 6:31,49
107మరియు వేరేవరో ఇచ్చటికి వచ్చి మరి వేరే తప్పైన కార్యములను మీకు చెప్పుటకు అనుమతింపకుడి. దేవుడు ఏది సరియని నిరూపించుచున్నాడో మరి ఋజువు పరచుచున్నాడో దానిని గమనించుడి.
ఇప్పుడు, ప్రజలు వెనుక జరిగిన కార్యములను చూచి మరి చెప్పెదరు, "మోషే… దేవుడు ఆకాశములో ప్రత్యక్షమాయెను, మరియు ఆ మనుష్యుడు పురుగులను, ఈగల గుంపును, కప్పలను, సృష్టించెను, పుండ్లను మరియు వ్యాధులను రప్పించెను. ఎర్ర సముద్రమును తెరచెను, మరియు మనము వచ్చియున్నాము; మరియు పరలోకమునుండి వచ్చిన మన్నాతో మనలను పోషించి యున్నాడు. ఓ, ఆయన మన యొక్క ప్రవక్త!"
అయితే ఇక్కడ ఇంకొక ప్రవక్త వచ్చియున్నాడు, "దేవునికి మహిమ! నేను కూడ ప్రవక్తను." ఇప్పుడు నేను మీకందరికి ఒకటి చెప్పెదను, మీరు దానిని గ్రహించుడి, నేను మోషేకంటె మెరుగైన వ్యాకరణమును వాడగలను. మరియు "నేను ఇటువంటి వాడను మరి అటువంటి వాడను, చూశారా, మరియు ఆలాటి కార్యములను చెప్పసాగెను. మరియు మొదటిగా జరిగిన కార్యమేదనగా, వారు అతనియొక్క మాటలకు మోసపోయారు. మరి వారిలో ప్రతియొక్కరును అరణ్యములో నశించిరి. వారిలో ఒక్కరు కూడ బ్రతుకలేదు. వారు జీవించలేదు. వారిలో ఏ ఒక్కరును పరలోకములో నుండరు. యేసు చెప్పియున్నాడు… వారు చెప్పారు, "మా యొక్క పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి!" చూశారా. పెంతెకోస్టులు సరియే కదూ, వారు సమస్తములైన అనుభవములను పొందియున్నారు. "మరియు మా పితరులు అరణ్యములో మన్నాను భుజించియున్నారు!"
ఆయన చెప్పియున్నాడు, "మరి వారిలో ప్రతి యొక్కరును చనిపోయిరి." మరణమనగా "నిత్యముగా వేరు పరచబడుట." వారు అన్ని విధములైన అనుభవములలో నుండి వచ్చియున్నప్పటికిని వారు మరల లేవరు. వాస్తవముగా చెప్పవలయుననిన, వారు అన్యభాషలలో పలికిరి, మరియు ఆత్మలో నాట్యమాడిరి, మరియు అన్ని కార్యములను చేసిరి.
108అయితే వాక్యము మధ్యలో ఇరువురు ప్రవక్తలకు, వారిలో ఒకరు వాక్యము యందును, మరింకొకరు వాక్యమును వదలి వేరొక మార్గమున ఉన్నపుడు వారిరువురికి ఎవరు సరియని ఒక బలపరీక్ష వచ్చినప్పుడు — ఇరువురు ప్రవక్తలే… మీరు దానిని గ్రహించియున్నారా? "ఆమేన్" చెప్పండి. ఒకరు వాక్యముయందు నిలుచుకొనియున్నారు, మరియు ఇంకొకడు వాక్యమును వదిలి వాక్యమునకు దూరముగానున్నాడు; ఇరువురు ప్రవక్తలే, నిరూపింపబడియున్నారు. అయితే ఒకరు వాక్యముతోనున్నాడు, చూచారా; చివరి దినములలో తప్పైన అభిషేకము పొందినవారు, చూడుడి. ఒక ప్రవక్త — ఇరువురు ప్రవక్తలే — ఒకరు వాక్యముతో నిలిచియున్నాడు, మరియు వాక్యము ద్వారా నిరూపింపబడియున్నాడు, మరి ఇంకొకడు వాక్యము ద్వారా నిరూపింపబడలేదు. మరల కయీను, హేబెలు. ఇరువురిని చూడుడి, అబద్దము - తప్పిదమైనది మరియు నిజమైనది? అది సరి.
109అయితే వారిలో ప్రతియొక్కరును అరణ్యములో కుళ్ళిపొయిరి, మరియు నశించిపోయిరి. వారి ఆత్మలు చనిపోయి అదృశ్యమై పోయినవి. మరి వారు నారి యొక్క బాధ్యతలో క్రమముగానుండిరి, సంఘమునకు పోవుచునుండిరి, దేవుడు వారికి ఆజ్ఞాపించిన కార్యములను వారు చేసిరి, అయితే అతడు సరియని వాక్యము ద్వారా నిరూపింపబడని ఒక అబద్దపు బోధకుని వారు అంగీకరించిరి. అయినను అతను దైవత్వమును గురించిన చదువులో డాక్టరేట్ డిగ్రీని పొందియున్నాడు; ఒక నిజమైన ప్రవక్తను ఏ విధముగా పిలువవలయునో, ఆ విధముగా అన్ని రకములుగా పిలువబడుచున్నాడు, అయితే ఆత్మీయముగా వాక్యము ద్వారాను మరి దేవుని యొక్క సూచనల ద్వారాను అతను నిజమైన ప్రవక్తయని నిరూపింపబడలేదు. మరియు వారందరును అరణ్యములో నశించిపోయిరి. నీతిమంతులు, గౌరవనీయులు, భక్తిగల జనులు చనిపోయిరి, మరి వారు మరెన్నటికిని పరలోకములో నుండరు.
GEN 7:4•
JOHN 10:37
110మనము ఎక్కడ నడువవలయునని మీరు చూచుచున్నారా? అర్థము చేసి కొనియున్నారా? దీనిని వదలకుడి.
నోవహు దినములలో భూమినుండి ఆకాశముపైకి ఒక తేలుచు నుండు రూపాంతరపరచు నటువంటి వాక్యమనే విత్తనమును నిర్మించినట్టు. నోవహు కలిగియుండిన ఒక తెగ వంటి ప్రత్యేకమైన విధానము ఇతర ప్రజలకు వెర్రితనముగా తోచెను. మరియు అతను "ప్రభువు నెలవిచ్చుచున్నాడు" అని వారితో చెప్పి, వర్షము రాబోవుచున్నదని దేవుడు పలికియున్నాడు."
ఆ దినములలోనున్న విజ్ఞానము, విద్య, మరి మత మార్గములన్నియును చెప్పెను, "ఆ యొక్క బూటకపు వ్యక్తిని చూడుడి. అతను వృద్దుడగుటచే, అతనియొక్క మతి చలించుచున్నది," చూచారా. అయితే అతను సరిగాయున్నాడు, ఏలయనగా అతను ఒక నిరూపింపబడిన ప్రవక్త, మరియు అప్పుడు ఆ యొక్క చివరికాలములో అతని వర్తమానము సరియనియు మరియు సత్య మనియు నిరూపింపబడెను. అతను ఏమి చేసెను? అతను ప్రసంగించుచున్న వాక్యము ద్వారా చేయబడిన ఓడ ద్వారా భూమినుండి మహిమకు రూపాంతరపరచబడెను. అది రూపాంతరపరచబడెను. విజ్ఞానమును చల్లబడిన మిగిలినవారందరును క్రుళ్ళిపోయిరి. వరదగానున్న నున్న న్యాయతీర్పుయను నీటిపై తక్కిన వారందరును క్రుళ్ళిపోయిరి.
ఈ దినమున విద్య అనే గొప్ప విజ్ఞానపు యుగములో జనులు ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నారు? ఈ యొక్క ఏదేను సంఘము వాక్యము వైపును తిరిగి నిజమైన ఏదేను స్థితిని పొందుటకు బదులుగా, అది విజ్ఞానపు తెలివిని పొందుచున్నది. మీరు దేవుని వాక్యమును ఉన్నత స్థితిలోనుంచుచున్నారా? ప్రజలు దేవుని యొక్క వాక్యమును హెచ్చించుటకు ప్రయత్నించుచున్నారా లేక వారిని వారే హెచ్చించుకొనుచున్నారా? సంఘము ఈ రెండింటిలో దేనిని చేయుచున్నదని ఆశ్చర్యముగానున్నదా?
111అతని వలన చెడగొట్టబడిన విత్తనము, మానవ జ్ఞానమునకు సంభందించిన కార్యక్రమములు, ఇవన్నియును సమస్త మానవ జాతిని విజ్ఞానములో ముంచి వేసి, ఆ విజ్ఞానము వారిని దేవుని యొక్క వాక్యము వారికి మరుగుపరచబడులాగున వారిని దేవుని వాక్యమునకు శూన్యులుగా చేసియున్నది. విజ్ఞానము వలన దేవుని యొక్క వాక్యమును ఎరుగకుండనుండుట! అదొక పెద్ద కబళించెడి కార్యముగా నున్నది, అది సరియే కదూ? అయితే, వారు "అది ఆ విధముగా నుండదు అని" చెప్పుచున్నారా? యేసు వచ్చినపుడు ఆ వేళలో, యేసు వచ్చిన దినమున వారు వ్రాయబడిన వాక్యమువలన ఆ యొక్క దేవుని వాక్యమును ఎరిగియుండిరి. వారు ఆ విధముగానే యున్నారు కదూ? నిశ్చయముగా. అయితే, ఆయన ఖచ్చితముగా ఏమి చేసెదనని చెప్పియున్నాడో దానిని ఆయన చేసినపుడు, ఆయన పావురపు లెక్కలపై వచ్చును వారు చూచినపుడు, ఆయన ఎవరనునది వారు ఎరుగక యుండరి, మరియు వాక్యము ఆయన ఏమి చేయునని చెప్పబడి యున్నదో దానినే ఆయన చేసెను, 'నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి. అయితే వాక్యము ఆయన ఏమి చేయునని చెప్పబడియున్నదో, దానినే ఆయన చేసియున్నాడు. మరియు ఆ దినములలో విజ్ఞానికులు యుండిరి, అయితే విజ్ఞాపూర్వకముగా వారు ఆయనను ఎరుగక నుండిరి.
REV 3:18
112బుద్ధిపూర్వకముగా పాపము చేసిరి, ఇచ్చ వారిని గ్రుడ్డివారిగా చేసినది. ఆమె యొక్క దిగంబరత్వమును ఆమెకు చూపించుటకు వారికి దేవుని యొక్క వాక్యము అవసరమైయుండెను. ప్రకటన 3లో చెప్పబడియున్నది, "నీకు దృష్టి కలుగునట్లును, నీ యొక్క దిగంబరత్వమును చూచులాగున నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను."
కాటుక అనునది దేవుని యొక్క వాక్యము, అది ప్రపంచపు యొక్క కార్యముల నుండి మిమ్ములను దూరముగానుంచులాగున మీ కన్నులకు స్వస్థత నిచ్చి, మరి దేవుని యొక్క శక్తివలన మిమ్ములను ఆయన యొక్క సముఖములో నిలుపును. అప్పుడు మీరు చూడగలరు! మీరు చెప్పెదరు, "నేను ఒకప్పుడు తప్పిపోయియుంటిని, మరిప్పుడు కనుగొనబడియున్నాను. నేను గ్రుడ్డివానిగా యున్నాను, అయితే ఇప్పుడు నేను చూడగలుగుచున్నాను."
అది వ్యత్యాస మైనదిగా నుండును. ఈ రోజు సంఘమునకు ఇవ్వబడు పిలుపు అదియే, "నీవు నా యొక్క కాటుకతో అభిషేక్షింపబడులాగున, మరటు పిదప నీవు చూడగలుగులాగున, నీకు దృష్టికలుగునట్లు, నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనునుని నీకు బుద్ది చెప్పుచున్నాను."
MATT 5:45•
MATT 7:20•
MATT 16:24
113మీలో ప్రతి యొక్కక్కరిలో మీరు నిజముగానే పొందుకోవాలనుకొనే ఏ వ్యక్తిపైనైనను పరిశుద్ధాత్మ వచ్చును గాక! ఒక స్వస్థతలో నుండి వచ్చును. మరి మీలోనున్న ఆత్మ ద్వారా ఆ స్వస్థత వచ్చును గాక. ఒక స్వచ్చమైన ఆత్మ స్వచ్ఛమైన విత్తనమును అభిషేకించిన యెడల, అది దేవుని యొక్క కుమారుని లేక కుమార్తెలను తప్పనిచ్చి మరి దేనిని ఫలింపదు.
అయితే స్వచ్చమైన ఆత్మ ఒక గురుగు అను మొక్క యొక్క విత్తనముపై కూడ పడును, వర్షము గురుగు అనుమొక్కపైనను వర్ణించినపుడు మరది ఒక గోధుమవలె ఆ వర్షము వలన జీవించును. "అయితే వాటి ఫలముల వలన మీరు వాటిని కనిపెట్టెదరు," చూశారా. మరియు మనము ఆయన యొక్క వాక్యమును ధరించుకొని దేవుని యొక్క ఫలములను యిచ్చు వృక్షమువలెనున్నాము. యేసు చెప్పెను, "ఎవడైనను నన్ను వెంబండింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన యొక్క విద్యను ఉపేక్షించుకొనవలయును, తన యొక్క జ్ఞానమును, తనయొక్క డిగ్రీలను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను."
114ప్రజలు సర్వ సాధారణమైన మానాభిమానములను కూడ అటువంటి తలంపులను కూడ వదలి వేయుచున్నారు. (ఇక్కడ వ్రాసియుంచు కొనియున్న కొన్ని చిన్న లేఖనములను వదలివేయుచున్నాను, ఇంకొక ఐదు లేక పది నిమిషములు దానిపై మాటలాడవలయునని యున్నాను, చూడుడి.) జనులు ఒకరి యెడల ఒకరికి కలిగియున్న మర్యాదలను వదలివేసియున్నారు. వారు మునుపు ఉన్నట్లు ఇప్పుడు లేరు. ఇక్కడున్న వృద్దులును, సహోదరులును మరియు నేను, మరియు స్త్రీలును దానినెరిగి యున్నావు. ప్రజలు మునుపు ప్రవర్తించిన విధముగా ఇప్పుడు ప్రవర్తింపకున్నారు. వారు మంచి చెడు ఏదని కూడ తెలియని తమయొక్క సామాన్య గ్రహింపును కూడ పోగొట్టుకొనియున్నారు. మనము జీవించుచున్న ఈ యొక్క నవీన విజ్ఞాన దినములలో ప్రజలు వారి మతిస్థిమితము లేకుండ సహజమైన వారి గ్రహింపును కూడ పోగొట్టుకొనుచున్నారు, విజ్ఞానము వారిని ఆ విధముగా చేయుచున్నది.
వారు ఒక స్త్రీని ఒక సహోదరిగా లేక పురుషుని ఒక సహోదరునిగా గౌరవించలేక లేక చూడలేకయున్నారు. అది కామేచ్చగా యున్నది. మరి వారు వెంటనే…
115స్త్రీలు జనుల మధ్యకు రావలయుననిన చాలా అసభ్యమైన దుస్తులను ధరించుకొని వచ్చుచున్నారు. మరియు వారు, "నేను ఒక మంచి స్త్రీ" యని చెప్పుచున్నారు. సరి ఆలాగైన యెడల ఆ విధమైన దుస్తులను ఆమె ఎట్లు ధరించుకొని వెలుపలికి వెళ్ళగలదు? ఆమె గ్రుడ్డి దానిగా చేయబడి యున్నది.
సరి, ఇప్పుడు దుస్తులు అసభ్యముగా ధరించుకొను స్త్రీల వలె మీ యొక్క తల్లియో, నా యొక్క తల్లియో, మీలో ఇక్కడున్న స్త్రీలెవరైనను అటువంటి దుస్తులను ధరించుకొని, ఆ కాలములో వీథులలో నడిచి వెళ్ళిన యెడల, వారికి మతి సరిగా లేదని వారిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించెడి వారు. సరి, మరి అప్పుడు అది పిచ్చితనమైన యెడల, ఇప్పుడు కూడ అది పిచ్చితనమే. ఇప్పటికి కూడ అదే విధమైన స్త్రీలు ఉన్నారు, చూశారా. అయితే వారు వారి యొక్క యోగ్యతను, మర్యాదను వారియొక్క బుద్దినంతయును పోగొట్టుకొనియున్నారు. వారి యొక్క సమస్తమును పోగొట్టుకొనియున్నారు. వారు నవీన జ్ఞానముతో, సంస్కృతితో మరియు విద్యాభ్యాసముతో నిండుకొనిన వారై, "ఇట్లుండుటవలన ముందుకంటెను ఆరోగ్యము నిచ్చును," అని చెప్పుకొనుచున్నారు. అది పాపకరమైనది మరియు మరణమైనది!
గమనించుడి. వారు మునుపున్న విధముగా ఇప్పుడుండుట లేదు. అప్పుడు…
AMOS 3:7•
HEB 1:1
116మరియు సంఘ జీవితమును గమనించుడి. చాలా కాలము క్రిందట ప్రవక్త ప్రభువు సెలవిచ్చుచున్నాడు యని ఏదైన కార్యమును చెప్పిన యెడల వారి యొక్క ఆత్మీయ సంఘ జీవితములో అది జనులను కదలించుచుండెను. వారు దానితో నిలచియుండెడివారు. వారు కదలింపబడి యుండెడి వారు.
అయితే ఇప్పుడు, "ఆ విధముగా కదలింపబడిన వ్యక్తి నాకిష్టము లేదు. అతనిని గెంటివేయుడి." చూశారా, వారికి ఇక నుండి దేవుని కార్యములను గ్రహించు శక్తి లేదు. దేవుని యొక్క ఆత్మ ద్వారా వారికమీదట కదలింపబడరు.
దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క ఆత్మయైయున్నది మరియు ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క ప్రవక్త యొద్దకు వచ్చును. మరియు వాక్యము లోక కార్యముల నుండి మిమ్ములను వేరుపరచి ఇప్పుడున్న స్థితి నుండి మిమ్ములను దేవుని యొక్క పోలికలతో దేవ కుమారులుగాను మరియు కుమార్తెలుగాను రూపాంతరపరచును. మరియు వారు పలుకుచుండగా ఆ యొక్క ప్రవక్తల నుండియే వాక్యము వచ్చును. మరియు అది నిజమైన దేవుని వాక్యమో కాదోయని వాక్యముతో దానిని పోల్చి చూడవలయును. అప్పుడు గనుక మీరు వాక్యమును అంగీకరించినట్లైన అది మిమ్ములను రూపాంతరపరచును; దేవుని యొక్క కుమారుని నుండి లేక కుమార్తె నుండి, లేక ఈ లోకపు కుమారుని నుండి, ఈ లోకపు కుమార్తె నుండి దేవుని యొక్క కుమారుడుగాను మరియు దేవుని కుమార్తెగాను అది మార్చును.
117ఇక్కడున్న మిమ్మును తీసికొని చూడుడి. అటువంటి అనుభవము ఎందరు కలిగియున్నారు? మనలో నున్న ప్రతియొక్కరును, ఆ అనుభవమును పొందియున్నాము, ఏలయనగా అది పలుకబడెను, అది విశ్వసింపబడెను, మరియు వాక్యము బయలు వెడలి మరి హృదయమును పాన్పుపై పడి మరియు అక్కడ నుండి అది మొలచి బయటికి వచ్చెను, చూశారా — మిమ్ములను మీరు రూపాంతరపరచుకొనుట.
ఆయన యొక్క పరిశుద్ధాత్మ వాక్యమను విత్తనమును దాని ఛాయలో రూపాంతరపరచుట. అదెట్లనగా ఒక బేరి పండు చెట్టు ఒక బేరి పండును మొలిపించుట, ఒక ఆపిల్ చెట్టు ఒక ఆపిల్ పండును మొలిపించునటువంటి కార్యములాగానే; ఆయన యొక్క వాక్యము దేవుని యొక్క కుమారులను మరియు కుమార్తెలను బయలుపరచును. ఆ వాక్యము చేయు కార్యము అదియే.
ISA 7:14•
ISA 9:6
118ఒకప్పుడు ప్రపంచము మరల అంధకారములోను మరియు అవ్యక్తస్థితిలో నున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ ముందు నిర్ణయింపబడిన విత్తనముపై అల్లాడెను. ముందుగానే నిర్ణయింపబడిన ఒక విత్తనము, ముందుగానే నిర్ణయింపబడి అది రూపొతరపరచబడెను. అది యెషయా 9:6లో నెరవేరినది. ఇప్పుడు ఆ యొక్క ప్రవక్త అక్కడ నిలుచునియున్నాడు, ఆయన ఎటువంటి వ్యక్తియనగా అతను దేశమును మరియు జనులను వశపరచుకొనియుండెను. వారిని ఆకర్షించెను. అతని కాలములోనున్న భక్తిగల జనులు అతనిని నమ్మిరి; వారిలో అందరు కాదు, అందరును నమ్మలేదు. అయితే, ఈ యొక్క ప్రవక్త పలుకు కార్యములు సరైనవని వారు చూచిరి. ఆయన చెప్పునదంతయును సరిగా యుండెను మరియు అది నెరవేరెను. మరిక్కడ, ఈ యొక్క వ్యక్తి తనయొక్క జనులు ముందు నిలువబడి మరి చెప్పవలసియుండెను, "ఒక కన్యక గర్భము ధరించును." ఓ, అది నమ్మదగిన కార్యముగా లేదు. అయితే మీరు చూడుడి, దేవుడు ఆయనే దానిని పలుక లేదు; మరి ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా పలికెను.
ఇప్పుడు దానిని గురించి అక్కడ బైబిలులో ఏమియును వ్రాసియుండలేదు, అయితే ఈ యొక్క ప్రవక్త లేచి నిలువబడి, చెప్పెను, "ఒక కన్యక…." యెషయా 9:6: "ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముమీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరుపెట్టబడును." ఇప్పుడు "ఒక కన్యక గర్భము ధరించిన యెడల," ఆ యొక్క వాక్యము పలుకబడెను, అదొక బీజముగానున్నది, ఏదో ఒక రోజు దానిని గైకొను పాన్పు, బీజము పడతగిన భూమి అక్కడ నుండవలయును. అతను అన్ని దేశములలోను చూచెను. అక్కడ ఏమియు కనబడలేదు. అతను అన్ని దేశములలోను వెదకెను అటువంటి భూమియున్నదా యని, ఎక్కడను ఏమియు లేదు.
GEN 1:3,11•
ISA 7:14•
MATT 1:23•
MATT 12:21
119మరియు ఎనిమిది వందల సంవత్సరములకు పిదప, ఆ యొక్క ముందుగా నిర్ణయింపబడిన విత్తనము ఒక ఫలించు భూమిని కనుకొనెను, మరది మొలచుటకు ఆరంభించెను.
ఆదిలో దేవుడు చేసిన విధముగా: "వెలుగు కమ్మని" పలకగా, మరి ఒక వేళ ఎనిమిది వందల సంవత్సరములకు పిదప వెలుగు కలిగియుండవచ్చును. "చెట్టు మొలచును గాక," మరి అది కూడ ఆ విధముగానే మొలచెను, ఆయన పలికినవి అన్నియును ఆ విధముగానే కలిగెను.
ఇదిగో ఇక్కడొక ముందుగా నిర్ణయింపబడిన విత్తనము ఇమ్మానుయేలును పుట్టించెను, "దేవుడు మనతో కూడయున్నాడు." అతని యొద్దకు అన్యజనులు విచారణ చేయుదురు, మరియు యేసు అయిన ఆయననే ఈ రోజ మనము వెదకుచున్నాము. మీరు చూశారా, ముందుగా నిర్ణయింపబడిన విత్తనము.
120హవ్వకు చేసిన విధముగా సాతాను విషమును చల్లుటకు ప్రయత్నించెను. దానికి చల్లుటకు అతడు ప్రయత్నించెను, అయితే అతను ఓడిపోయెను. ఇక్కడ అతనికి త్రిప్పికొట్టగలగునటువంటి కార్యము ఆయనయందు యుండుటవలన, ఆయన ముందుగానే నిర్ణయింపబడిన ఒక విత్తనమై యుండెను. వారు ఆయనను ఒక పరిసయ్యునిగాను లేక ఒక సదూకయ్యనిగాను చేయుటకుగాను తమలో చేర్చుకొనలేకపోయిరి. ఆయనను ఏ యొక్క సంఘశాఖలోను చేర్చలేకపోయిరి. ఆయన దేవుని యొక్క పలుకబడిన ముందు నిర్ణయింపబడిన వాక్యమైయుండెను. సాతాను, వాడి యొక్క అవిశ్వాసమును ఆయన ముందు వేయలేకపోయెను; ఆయన వాటినన్నిటిని త్రిప్పిగొట్టుటకు ఒక శక్తిని కలిగియుండెను. దేవుడు మనకు కూడ సాతాను యొక్క సకల కుయుక్తులను త్రిప్పుగొట్టునట్లు వంటి శక్తినియ్యవలెనేదే నా ప్రార్ధనైయున్నది. అది సరైనది.
అటు పిదప, ఈ దినమున వెలుగును తీసికొని వచ్చుటకును, మరియు ఈ రోజున సంఘములో నున్న ముందుగా నిర్ణయింపబడిన సకల సంతానమంతటికిని వెలుగు నిచ్చుటకును, దేవుని యొక్క కుమారులను మరియు కుమార్తెలను రూపాంతర పరచి ఆయన యొక్క సముఖములో నుంచుటకును, ఆత్మ ఆయనపై కదలాడి ఆయనను కల్వరిలో సిలువపైకి పంపించెను.
EPH 1:5
121"ముందుగా నిర్ణయింపబడుట," మరి ఆ యొక్క వాక్యమును గురించి తొట్రిల్ల వద్దు. నేను దానిని చదవియున్నాను, మీరు చూశారా. నేను మీకు చూపింప దలచియున్నాను, ఎఫెసీయులకు 1:5, గమనించుడి. ఆ రోజు రాత్రి నేను మీకు చెప్పినట్లు, మీరు ఆరంభములో మీరు పుట్టక మునుపు మీ యొక్క తండ్రి లోపలనున్నట్లు. మీరు గనుక ఆయనలో లేనియెడల ఇక్కడ ఈ లోకములో మీరు వచ్చియుండెడివారు కారు. అయితే, మీరు చూడుడి, మిమ్ములను ఫలింపజేయు ఈ లోకములో మీరు పుట్టులాగున ఒక భూమి కావలసియుండెను. మరిప్పుడు మీరు ఆయన యొక్క కుమారుడివై యున్నావు, మీరు ఆయన యొక్క కుమార్తెవైయున్నావు, చూడుడి, అది ఒక విత్తనము. మరటు పిదప మీరు గనుక… మీరు గనుక ఇప్పుడు ఒక క్రైస్తవునిగా నుండిన — ఒక స్వచ్చమైన ముందు నిర్ణయింపబడిన విత్తనముగానున్న యెడల — ఏమి లేక శూన్యముగానున్నప్పుడే మీరు దేవునిలో యుండిరి… మీరెల్లప్పుడునే దేవునిలో నుండిరి: మీ యొక్క జీవభీజము, అది దేవునియొక్క గుణముగా నున్నది, అది ఆయన యొక్క తలంపైయుండెను.
122ఉదాహరణకు, ఇక్కడున్న ఈ యొక్క అందమైన చిన్న స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది, చూడుడి. దేవుడు చెప్పెను, "ఈ రోజు ఇక్కడొక అమ్మాయి ఉండును, ఆమె యొక్క పేరు ఫలానా - మరి - ఫలానా, ఆమె మరి ఈ విధముగా, ఆ విధముగాను మరి ఇట్లుండును," మరియు ఈ సమయమున ఒక ఎర్రని రంగు వస్త్రములను ధరించి ఇక్కడ కూర్చొని వర్తమానమును వినబోవు చున్నదన్న కార్యము కూడా ఆయనకు తెలియును, చూశారా. అది ఆయన యొక్క తలంపు. నీ యొక్క భర్త ఎవరనేది, ఏమైనదియును మీరిరువురును జతపరచబడి ఇక్కడ కూర్చొని యుందురనియును ఆయనకు తెలియును. ఆ విధముగా నెరవేరక మునుపే జరుగబోవునది ఆయనకు తెలియును.
మరి ఆ కార్యములు మీరు నెరవేర్చక యుండుటకు వేరే మార్గమే లేదు, చూశారా, ఏలయనగా మీరు ఎదుగుచున్నారు. మరి మీరు లోపల నుండి ఎదుగుచున్న విత్తనముగా నుండు వరకు, మీరేమి చేయుదురని విత్తనము చెప్పియున్నదో దానిని మీరు ఖచ్చితముగా చేసి నెరవేర్చెదరు. అది ఖచ్చితముగా సరియే. అది ఆయనయొక్క వాక్యము. ఆయన తన యొక్క వాక్యమును కాచుకొనును ఆ వాక్యము నెరవేరులాగున చేయును. దానిని ఆయన గమనించుచుండును.
123మీరు మీ యొక్క తండ్రిలోపల ఒక బీజముగా నుండి మరి ఒక కుమార్తెగా బయటికి వచ్చి యున్నారు; మీరు, మీరు, మీలో ప్రతియొక్కక్కరును, సహోదర, సహోదరిలారా, మీరు ఆ విధముగానే ఈ లోకములో జన్మించియున్నారు. మీరు గనుక మీ యొక్క తండ్రి లోపల లేకున్న యెడల, మీరిప్పుడిక్కడ ఉండి యుండరు. మరియు మీరు గనుక దేవునిలో లేకున్న యెడల…
మీరు గనుక పరిశుద్ధ గ్రంథము యొక్క వర్తమానమును నమ్మినయెడల, ఈ రోజు యొక్క వర్తమానమును నమ్మిన యెడల, మీరిక్కడ కూర్చొని యుండుట వలన మీరు నమ్మినట్టు ఋజువు పరచబడి యున్నది, ఏలయనగా మీరిక్కడ నుందురని ముందుగానే నిర్ణయింపబడియున్నది. ఆ విధముగా మీరు గనుక ముందు నిర్ణయింపబడియుండని యెడల, మీరిక్కడ ఉండరు; మరి వీథులలో త్రాగుబోతులుగా మీలో కొందరు యుండి యుండెదరు; మరి మీలో కొందరు ఇంకొకరి యొక్క భార్యలతో తిరుగులాడుచు నుండెదరు; మరియు వివాహమైన స్త్రీలు మీలో కొందరు ఇంకొకరి భర్తలతో తిరుగుచునుండి యుండెడి వారు, లేక ఆ విధమైన కార్యములు చేయుచునుండెడి వారు, చూశారా. అయితే మీరు ఇక్కడుండెదరని ముందుగానే నిర్ణయింపబడి యున్నది, చూశారా. దానికి మీరేమియును చేయనక్కరలేదు. మీకొక తండ్రి కలడు, ఆయన దేవుడు మరియు మీరు ఆయన యొక్క సంతానము.
JOHN 1:14•
EPH 2:6
124మీరు ఆయన యొక్క తలంపులో నుండిరి, మరిప్పుడు ఆయన యొక్క తలంపు నుండి మరి సరైన కాలములో మీరు బయలుపడి, ఆయనతో సహవాసము చేయు ఒక వ్యక్తిగా ఇప్పుడున్నారు, చూశారా. మీరు ప్రారంభములో మీ యొక్క తండ్రి లోపలనున్నట్లుగా వుండి, అయితే ఇప్పుడు మీరు ఆయన యొక్క కుమారులుగాను మరియు కుమార్తెలుగాను నున్నారు, కావున మీరు మీ తండ్రితో సహవాసము కలిగియుండవచ్చును. ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలుగా యున్నాము, మనము మన తండ్రియైన దేవునితో సహవాసము చేయగలము. చూడుడి, అది ఎంత చక్కగా యున్నది! దానిని మీరు ఇష్టపడుట లేదా?
అప్పుడు మీరు ఆయనవలె మారెదరు. మరియు మనము ఆయనయొక్క కుమారులుగా నున్నందువలన, ఆయన యొక్క గుణాలక్షణములుగా మరియు ప్రారంభములో ఆయనవలెనున్నాము. మరియు గుర్తుంచుకొనుడి, మీరు గనుక ఆయనలో ఆదిలో నుండి ఉన్నయెడల, దేవుడైన యేసు, (వాక్యముగానున్న యేసు శరీరధారుడై మరి మన మధ్య నివసించెను) అప్పుడు మనము ఆయనలోనుంటిమి మరియు ఆయన పొందిన నిందలను మనమును పొందియున్నాము.
మీరు ఆయనతో కల్వరికి వెళ్ళిరి. మీరు ఆయనలో నుండి ఆయనతో మరణించియున్నారు. మీరు ఆయనలో నుండి ఆయనతో పాటు లేచియున్నారు. మరిప్పుడు మీరు ఆయనలోనున్నందున ఆయనతో పాటు పరలోకములో ఉన్నత స్థలములలో కూర్చొనియున్నారు, చూశారా.
125నేను గనుక అమెరికా దేశస్తుడైన యెడల, ఆమె యొక్క అవమానములో నాకును భాగము కలదు, ఆమె యొక్క మహిమలో నాకు భాగము కలదు. ఆమె ఏమియో నేను అట్లే యుండెదను. నేనొక అమెరికను పౌరుని. నేను… ఫ్లైమౌత్ బండపై వచ్చి దిగియున్నాను. అవునయ్యా అవును, నేను ఫ్లైమౌత్ బండపై దిగి యున్నాను. నేను సంతకము వేసియున్నాను… ఆ రోజు ఉదయము ఆ హాలులో వారు స్వతంత్రులమైనామని ప్రకటించి సంతకములు వేసినపుడు నేనును అక్కడ యుంటిని. వారితో నేను కూడ సంతకము వేసియున్నాను. ఆమె యొక్క ధన నిర్వాహకములో నేనొక భాగస్తుని. స్వతంత్రులమైనామని వారు ప్రకటించిన ఆ పత్రములలో నేను కూడ సంతకము వేసియున్నాను. అది సరియే.
వాషింగ్టన్ ఫోర్డ్ అను కొండ సందులలో అతను నదిని దాటునపుడు నేను అతనితో యుంటిని. ఆ ఉదయమున నేను అతనితో యుంటిని. అతనితో నేను కూడ ప్రార్ధించితిని. నీవును మరి నేనును ఒక అమెరికా దేశస్తులముగా అక్కడ యున్నాము. నీవు గనుక అమెరికనువైయున్న యెడల అమెరికనుల యొక్క ప్రతియొక్క కార్యములోను నీవు అక్కడ యుంటివి. నేను జెండాను పైకెత్తి ఎగరవేసియున్నాను - గ్వామ్ అను స్థలములో, వారు దానిని చేయుటకు నేను వారికి సహాయపడియున్నాను. ప్రతియొక్కక్క కోటను నేను వశపరచుకొని యున్నాను. ఒక విప్లవకారునిగా ఆమె యొక్క అవమానమును నేను భరించియున్నాను. ఆమె ఏ విధముగానుండెనో నేనును ఆ విధముగానే నున్నాను.
EPH 2:6
126క్రీస్తు ఏ విధముగానున్నాడో, నేనును ఆ విధముగానే యున్నాను. ఆయన ఇప్పుడెట్టున్నాడో, నేను ఆ విధముగానే యున్నాను. ఓ, దేవుడా! ఆయన మతపిచ్చిగలవానిగా ఎంచబడినయెడల, నేను కూడ ఆ విధముగా నుండెదను. ఆయన ఆత్మ యొక్క క్రియల మూలముగా ఆయన బయెల్జెబూ అని పిలువబడినయెడల నేను కూడ ఆ విధముగానే పిలువబడెదను. ఆయన ఎట్లుండెనో, నేనును అట్లే యుండెదను. ఆయన ఏమైయున్నాడో, మీరును ఆ విధముగానే యున్నారు. అమెరికా చిరకాలము నుండుటకును, ఆమె యొక్క స్వేచ్ఛకు లేక ఆమె యొక్క కీర్తికి, ఆమె యొక్క మహిమకు లేక ఆమె యొక్క అవమానమునకు మనము కారణకర్తలుగా నున్నాము. మనము ఆ విధముగా నుండవలయును. మనము సంఘముగా — యేసుక్రీస్తు యొక్క వధువుగా నుండవలయును.
భూమిపై ఆయన జీవించియున్నప్పుడు, ఆయనతో కూడ నేను జీవించియున్నాను; ఆయన చనిపోయినప్పుడు ఆయనతో నేను కూడ చనిపోతిని; ఆయన లేచినప్పుడు, ఆయనతో నేనును లేచియున్నాను; నేను ఆయనలో ఒక భాగముగా నున్నందన, నేను ఆయనతో కూడ పరలోకమందు ఉన్నత స్థలములో కూర్చొనియున్నాను. ఆయన ఎక్కడుండునో, నేనును అక్కడ యుండెదను. "నా యొక్క పరిచర్యకుడు ఎక్కడుండునో నేను అక్కడ యుండెదను."
127ఇప్పుడు, ఆయన మనతో సహవాసము నొందగలడు, మనలో ఐక్యపడగలడు, మరియు మనలో ఆయన యొక్క వాక్యమును ఉంచగలడు — మనము ఆయన యొక్క వాక్యములో ఒక భాగముగా నున్నాము.
మరియు ఆయన వాక్యముగా నున్నాడు, మరి మనము ఆయనలో ఒక భాగముగా నున్నాము, అట్లైన యెడల మనము వాక్యములో భాగముగా నున్నాము.
మరి నాకు చేతులున్నప్పుడు, లేదని ఎట్లు చెప్పగలను? ఒక బుద్ధిహీనుడు, (నన్ను మన్నించుడి)… విజ్ఞానము నాకు చేతులు లేవని ఎంత చెప్పినను, నాకు చేతులు కలవు. నాకు హస్తము కలదు! నాకు హస్తము కలదని నేను ఎరిగియున్నాను: దానిని నేను ఉపయోగించుచున్నాను. మరియు నాకు ఒక దేవుడు గలడని నేను ఎరిగియున్నాను. నాకు ఒక రక్షకుడు కలడు. నా యొక్క ఆత్మలో ఆయన యొక్క ప్రసన్నతను నేను అనుభవించుచున్నాను. నేను ఆయనలో ఒక భాగముగానున్నాను. ఈ యొక్క వాక్యము నేను ఆయనలో ఒక భాగమైయున్నానని చెప్పుచున్నది. దీనిలోని ఒక భాగమును నేను నిరాకరించిన యెడల, అట్లు నిరాకరించుట నాకు చేతులు, చెవులు, కన్ను లేవని నిరాకరించుటవలెనుండును. ఇవన్నియు నాకు లేవనుచు, నా యొక్క సరైన మతితో నేను ఒక మనుష్యునిగా జీవింపలేను. మరియు దేవుని యొక్క వాక్యములో కొన్నింటిని నిరాకరించుచు, దేవుని యొక్క సరైన ఆత్మతో జీవింపలేను. సంఘ శాఖలు ఏమి చెప్పుచున్నవని వాటిని నేను గైకొనవలయును; లేనియెడల దానిని గురించి దేవుడు ఏమి చెప్పుచున్నాడో, దానిని నేను అంగీకరించవలయును, చూశారా. దానిని మీరు చేయలేరు.
128ఇప్పుడు, రూపాంతర పరచబడుట. ఆయన యొక్క వాక్యము ద్వారా ఆయన మనలను రూపాంతరపరచి మనము విశ్రాంతిలోనుండులాగున చేయును, ఏలయనగా మనము వాక్యములో ఒక భాగమైయున్నాము.
మరిప్పుడు నా యొక్క పుట్టుకను గురించిన అనేక కార్యములు కలవు — నా యొక్క పుట్టుకను గురించిన కార్యములను బట్టి నేను పొగడుకొనలేను. నేను మీకు చెప్పుచున్నాను, నన్ను నేను పొగడుకొనుటకు నాలో అటువంటి కార్యములు ఏమియును లేవు. ప్రారంభము నుండి చెప్పవలయుననిన, నాయొక్క తల్లి ఒక పాపి. నా తండ్రి ఒక పాపి. వారి యొక్క పితరులను చూసిన యెడల, వారు ద్రోహులుగను మరియు తుపాకీతో కాల్చుకొనుచుండెడివారు గాను నుండిరి. మరి వారిలో అనేకులు ఒకరినొకరు కాల్చుకొని చనిపోయిరి. కెంటకీలో వారిలో అనేకులు త్రాగుబోతులుగాను, మరి దొంగతనముగా సారాయి కాచువారుగాను మరి ఇతర చెడు కార్యములో నిండియుండిరి. నా తల్లి, సగము ఇండియనుగా నుండెను… మరియు నేను గొప్పగా చెప్పుకొనదగిన కార్యమేదియును లేదు. నా యొక్క వంశవృక్షం గురించి నేనేమి పొగడుకొనలేను.
129అయితే, దేవునికి మహిమ, నేను డంభముగా చెప్పుకొను ఒక కార్యము కలదు, అది యేసుక్రీస్తు నుండి వచ్చిన నా యొక్క రెండవ పుట్టుక. మనము కలిగియున్న ఆ యొక్క తల్లి తండ్రిని గురించి నేను డంబములు పలికెదను, ఏలయనగా ఆయన నా యొక్క తండ్రి. ఆయన నా యొక్క రక్షకుడు. ఆయన నా యొక్క విమోచకుడు. నేనిప్పుడు ఆయన యొక్క కుమారునిగా యున్నందువలన, ఆయన నాకు చేసిన సమస్త కార్యములకు నేను ఆయనను పొగిడెదను. నేను ఇక మీదట చార్లిన్ బ్రెన్హాం యొక్క కుమారుని కాను, నేను యేసుక్రీస్తు యొక్క కుమారుడను. అది సరియే. ఇప్పుడు నా యొక్క పుట్టుకను గురించి నేను డంబములు పలుకగలను. నేను ఈ లోకములో జన్మించిన నా యొక్క మొదటి పుట్టుకను గురించి గొప్పగా చెప్పుకొనలేను, ఏలయనగా దానిలో ఏ విధమైన చెప్పుకొనదగిన కార్యము లేదు, నా యొక్క ఈ లోక జన్మను గురించి నేను సిగ్గుపడుచున్నాను. అయితే నా యొక్క మరల జన్మించిన రెండవ పుట్టుక గురించి నేను సిగ్గుపడుటలేదు. లేదు, లేదు — నేను మరల జన్మించిన దానిని గురించి సిగ్గుపడుట లేదు.
నేను మరల జన్మించులాగున ఆయన దానిని ఎట్లు చేసియున్నారు? వాక్యముతో ఉదకస్నానము చేత దానిని పవిత్ర పరచెను — అది సరియే.
130నిజమైన ముందుగా నిర్ణయింపబడియున్న విశ్వాసులు వాక్యముతో నిలచియుండెదరు మరి వారు దానిని తారుమారు చేయరు. వాక్యమును వారు మార్చలేరు. ఓ, దేవుని యొక్క కుమారులును మరియు కుమార్తెలారా, మనమేల ఈ యొక్క మహత్తరమైన ఐక్యతను సమస్త దేవకుమారులతోను మరియు దేవకుమర్తెలతోను ఏల కలిగియుండకూడదు? దానిని మనము కలిగియుండవలయును; అయితే వారు ఆ విధముగా ఐక్యత కలిగియుండరు, అదంతే. ఏలయనగా వారు నిజముగా దేవుని యొక్క కుమారులును మరియు కుమార్తెలును కారు ఆది నుండి…
చూడుడి, గడచిన రాత్రి నేను చెప్పిన విధముగా (నేను చెప్పబోవు… నేను నేనిక్కడ వ్రాసియుంచియున్నాను, అయితే నాకు దానిని చెప్పుటకు సమయము లేదు. దానిని అట్టే వదలివేయదలచియున్నాను,)
131మీలోనున్న ఆ లోపలి చిన్న భాగము — మీలో ఆరంభించునది అంతరాత్మ. దానినుండి వచ్చునది మరి అది ఆత్మ, మరప్పుడు మీరు జీవించువారిగా మారియున్నారు. ఇప్పుడు జీవించు ఆత్మకు స్పర్శించుటకు పంచ-ఇంద్రియములు కలవు. రెండవ దానికి ఐదు ఇంద్రియములు కలవు. అది శరీరమునకు వెలుపట కలదు, చూచుట, రుచించుట, తాకి ఎరుగుట, వాసన చూచుట మరియు వినుట. మరియు లోపలి శరీరములో ప్రేమ, మనస్సాక్షి మరియు ఆలాటి ఐదు ఇంద్రియములు కలవు. అయితే లోనున్న లోపలి భాగములో సమస్తమును స్వాధీనము గోపురమునందు అక్కడ ఉండి నడిపించునది ఒకటి దేవుడుగా నుండవలయును, లేనియెడల సాతానుగా నుండవలయును. మీరు తాకి, చూచి, ఎరుగు కార్యములలో వీటి భాహ్య ఇంద్రియములు ద్వారా మీరు ఒక క్రైస్తవుని వలె నటింపవచ్చును, లేక ఒక క్రైస్తవునివలె నటించుచు మీరు దయ్యములను కూడ వెళ్ళగొట్ట వచ్చును. అయితే లోపలి భాగములోనున్న లోపలి అంతరీంద్రియములు సమస్తమును స్వాధీనపు గోపురము — ఆరంభము, ఆది — అది దేవునిది కానియెడల, అది ఎన్నటికి దేవుని యొద్దకు తిరిగి పోదు. దానిని మీరు గ్రహించియున్నారా? యూదా దయ్యములను వెళ్లగొట్ట లేదా? ఆయనను ఖండించి మరి ఆయనను మరణమునకు అప్పగించిన కయప ప్రవచింపలేదా? అయితే అతను వాక్యముతో నిలచియుండలేకపోయెను. అది సరియే.
132సంఘశాఖలనుండియును మరియు ప్రపంచమునుండియును దేవుని యొక్క కుమారులుగాను మరియు కుమార్తెలుగాను రూపాంతరడరచబడుట!
(ఇప్పుడు ముగించుచుండగా దీనిని గమనించుడి.) ఒక చోటినుండి ఇంకొక చోటికి సంచరించుచున్న దేవుని యొక్క కుమారులు ఈ లోకములో ఈ యొక్క సంఘశాఖ నుండి ఇంకొక సంఘ శాఖకు సంచరించు నక్షత్రములవలె నిలుకడలేక ఏ విధముగా సంచరించుచున్నారో గమనించుడి. ఆకురాలు కాలములో రాలిన ఆకులు నీళ్లపై చలించుచున్నట్లుగా వారుండెదరు. లియో సహోదరుడును నేనును దీనిని అక్కడ తూర్పు ప్రక్కన చూచియున్నాము. గాలి వీచునప్పుడు నీటిపై నున్న ఆ ఆకులను ఆ గాలి కదిలించును. చిన్నగా గాలివీచే ప్రతిసారి ఆ ఆకులను ఇటు ప్రక్క నుండి అటు ప్రక్కకు కదిలాడించును. అయితే దేవుడు మనలను నిలుకడగానుండవలయునని కోరుచున్నాడు.
యేసు క్రీస్తులో లంగరు వేయబడి,
ఎందుకనగా జీవితము యొక్క తుఫానులను నేను ధైర్యముగా ఎదుర్కొనగలను.
యేసులో లంగరు వేయబడి,
నేను ఏ యొక్క గాలికిని మరి పెద్ద అలలకును అది ఎటువంటి తుఫానైనను భయపడను.
చూచారా? మీరు చిన్న బాలురు మరి బాలికలుగా మీ యొక్క పాఠశాలలోనున్నప్పుడు ఇన్కేప్ బెల్ (ఒక పద్యములోని కధ) గురించి మీకు జ్ఞాపకముండవచ్చును.
GEN 12:4
133వాగ్ధానము చేయబడిన వాక్యము నెరవేరుటకుగాను అబ్రాహాము మరియు శారాల యొక్క శరీరములు రూపాంతరపరచబడెను. వారు వృద్ధులు. అబ్రాహాము డెబ్బది-ఐదు మరియు శారా అరువది-ఐదు సంవత్సరముల వయసున్న మరియు శారాకు స్త్రీలకు నెలకొకసారి కలుగునట్టి బహిష్టుకు సంబంధించిన కార్యములు నిలచిపోయెను. ఆమె ఆయన తండ్రి యొక్క కుమార్తె, అమ్మాయిగా ఉన్నప్పటి నుండి ఆమెతో జీవించెను. మరియు ఆ యొక్క వాగ్ధానము నెరవేరుటకుగాను వారిరువురి యొక్క శరీరములు వృద్ధాప్యస్థితి నుండి యౌవ్వనునిగాను మరియు యౌవ్వనస్తురాలిగాను మారిపోయెను, ఆ దినపు వాగ్ధానము, వారు మారుట వలన నెరవేరెను.
దేవునికి మహిమ! అది నన్ను చాలా చక్కని అనుభూతినొందులాగున చేయుచున్నది, చూశారా. నేను ఏ విధముగా యున్నాననుట నాకు లెక్క లేదు, నేనెట్లు ఇక్కడికి వచ్చియున్నానని నేను లెక్క చేయను, మనమెట్లున్నను ఈ దినపు యొక్క వాగ్ధానమును నెరవేర్చుటకు మనము రూపాంతరపరచబడెదము అప్పుడు మనము పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యముతో ఒక సహోదర, సహోదరిలుగా సహోదర ఐక్యతతో ఒక్కటిగా కలిసియుండగలము.
GEN 5:24•
PS 16:10•
JOHN 19:34•
ACTS 2:27
134ఇప్పుడు జరుగబోవు రూపాంతరమునకు మాదిరిగా హనోకు యొక్క శరీరము యావత్తును దేవునిలో రూపాంతరపరచబడెను, మరియు అతడు మరణమును రుచి చూడక పరలోకమునకు కొనిపోబడెను, హనోకు ఆ విధముగా మారెను. ఏలీయాకు కూడ ఆ విధముగానే సంభవించెను. చనిపోయి, చల్లగానున్న, నలుగగొట్టబడిన యేసు యొక్క శరీరము, రూపాంతరపరచబడెను, చితుకగొట్టబడిన మరియు ఆయన ప్రక్కటెముకలు వెనుక శరీరముగుండా బయటికి కనబడెను. మరియు అంతటి వెడల్పుగల ఈటె ఆయన యొక్క గుండెలోనికి పొడుచుటచే అది చొచ్చుకొని పోయెను మరియు రక్తము, నీరును బయటికి వచ్చెను. ఆయన శరీరములోనున్న తడి ఎండిపోయెను, మరియు ఈటెతో పొడిచినందువలన రక్తము ఈటె ద్వారా కారి, కాళ్ళపై కారి మరి నేలపై బొట్లు బొట్లుగా కారెను. ఆయన చనిపోయెను, ఆయన యొక్క మరణమును చంద్రుడును మరియు నక్షత్రములును ప్రకటించెను, భూమి కూడా వణకుచు ఆయన మరణమును ప్రకటించెను. భూమినుండి బండలు కదల్చబడి బ్రద్ధలాయెను మరి సమస్తమును ఆ విధముగా ఆయన మరణమును ప్రకటించెను. దేవుడు కూడ ఆయన ముఖమును మరుగుపరచుకొనెను. ఆయన చనిపోయెను. అయితే ఆయన యొక్క శరీరము రూపాంతరపరచబడెను. ఎట్లు? ఏలయనగా దేవుడు చెప్పియున్నాడు, "ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్దుని కుళ్ళు పట్టనియ్యవు." అది నెరవేరకుండునట్లు దానిని ఏదియును ఆటంకపరచ జాలదు.
1THS 4:13-17
135ఒకానొక దినమున మనయొక్క శరీరములు పీనుగుపెట్టెలో నిటారుగా పరుండ బెట్టబడి యుండును. మనము వచ్చెదము … నేను పీనుగు పెట్టెలో పండుకొని యుండుటను మీరు చూచెదరు. నేను ఒక వేళ వచ్చి మిమ్ములను ఆ స్థితిలో చూడవచ్చును, కడపటి మాటలు కొన్ని చెప్పవచ్చును మరి ఆ విధముగా. అయితే మనలను సమాధిలో ఎవరును ఉంచలేరు. ఒక వేళ మీపై బండలను వేసి మూసి యుంచవచ్చును. వారు మిమ్ములను సముద్రములో పూడ్చవచ్చును. వారేమైనను వారికిష్టము వచ్చిన రీతిన చేయవచ్చును, అయితే దేవునియొక్క రూపాంతరపరచు శక్తి, II థెస్సలొనీకయులకు చెప్పబడి యున్నది, "నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. మేము ప్రభుని యొక్క ఆజ్ఞలను బట్టి మీకు చెప్పునదేమనగా, దేవుని యొక్క బూర ధ్వనించును, మరి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము. [ఈ ఉదయకాలమున పాడినట్లు] మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము."
JOHN 11:25,26•
1COR 15:51,52
136దేవుని యొక్క రూపాంతరపరచు శక్తి మనలను అవ్యక్తస్థితిలోనున్న విజ్ఞానము మరియు విద్య, మరియు ప్రపంచ కార్యముల నుండి, ఈ యొక్క నవీన రోజులలో నున్న ఈ లోక జ్ఞానపు తెలివి నుండి మనలను బయటికి తీసి ఇప్పుడు దేవుని యొక్క కుమారులుగాను మరియు కుమార్తెలుగాను మార్చి యున్నది. మరి మరణము కూడ మనలను సమాధిలోనుంచలేదు. "నిమిషములో, ఒక రెప్పపాటున, మనమందరమును మార్పునొందెదము." ''ఓ, మీరు ఆ విధముగా చెప్పుచున్నారా?" నేను అది సత్యమని అది అట్లేయని చెప్పుచున్నాను.
ఆ వాక్యమైన యేసు భూమిపై నిలుచుకొ యుండెను, ఆయన వాక్యమైయుండెను, ఆయన ప్రాణముతో తిరిగి లేచెను, మరియు లాజరును ప్రాణముతో లేపెను. ఆయన చెప్పెను, "పునరుత్తానమును, జీవమును, నేనే నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు."
దేవుని వాక్యమును నిలుపుటకు ఏ విధమైన శక్తికిని మరియు ఎవరికిని వీలుపడదు! దేవుడు పలికిన పిదప అతను తిరిగి ప్రాణముతో లేవవలసినదే.
ISA 7:14•
ISA 65:21,22•
JOHN 5:25-29
137మరియు మనము జీవించుచున్న ఈ యొక్క నవీన విజ్ఞాన ఏదేను నుండియు, సంస్కృతి మరియు విజ్ఞానము మరి విద్య, ఈ యొక్క నవీన కార్యముల నుండి మనము లేచెదము! ఏదో ఒక రోజు, 'మాంసమగు ఈ అంగీని మనము జారవిడచి, మరియు పునరుద్ధానులమై మరియు నిత్యమైన బహుమతిని పొందుకొనెదము. మనము ఆకాశమార్గమున పోయెదము మరియు ఈ యొక్క కార్యములన్నియును సమాప్తమగును.
దేవుని యొక్క వాక్యము మన తలంపులలో నున్న నవీన తలంపులన్నియు నిర్మూలమై మనయొక్క మనస్సులను రూపాంతరపరచి, మన యొక్క హృదయములను, మన యొక్క ఆత్మలను నూతనపరచి దేవుని యొద్దకు చేర్చి యున్నది. దానిని పలికిన అదే ఆత్మ, మనలను ఇంత దూరము రూపాంతర పరచియున్నది, మరియు అది ఇంకను మనలను ఒక మహిమగల శరీరముతో, ఆయన యొక్క సముఖమునకు, ఆయన యొక్క మహిమలోనికి తీసికొనిపోవును.
"జనులు గృహములు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. మన యొక్క విజ్ఞాన పరిశోధనలలో మనము ఒక తోటను నాటిన యెడల, మనయొక్క బిడ్డలు వచ్చి వాటి ఫలములను ననుభవించుచున్నారు, మరియు అటు పిదప అతని యొక్క కుమారులు దానిని గైకొనుచున్నారు. మరి వారు నాటి, మరి ఇంకొకరు తినుచున్నారు; మరియు వారు కట్టుచున్నారు, మరి ఇంకొకరు వాటిలో కాపురముండెదరు. "వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యయంతయగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలములను పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు."
ఏమిటి? "ఒక కన్యక గర్భము ధరించును," అను దేవుని యొక్క వాక్యమును పలికిన అదే ప్రవక్త మూలముగా దేవుడు దీనిని మనకు వాగ్ధానము చేసియున్నాడు!
138దానిని మనము ఏ విధముగా పొందగలము? మనమిప్పుడే సంభవింపదగిన ఆ కార్యములోనున్నాము, చూశారా. ఏలయనగా దేవుడు ఆ విధముగా చెప్పియున్నాడు, అది ఆ విధముగానే జరుగవలయును. అక్కడ లాజరును ఆయన లేపినప్పుడు చెప్పెను, "దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరు మనుష్యకుమారుని యొక్క శబ్దమును విని, కొందరు శిక్షింపబడుటకును మరి కొందరు జీవమునకును బయటికి వచ్చెదరు." ఇదేమిటి? రూపాంతరపరచబడుట, దేవుని యొక్క వాక్యము ద్వారా రూపాంతరపరచబడుట, మనలను దేవుని యొక్క కుమారులనుగాను మరి కుమార్తెలనుగాను మార్చి మరియు రానున్న ప్రపంచములో మనకు జీవమునిచ్చును. ఓ, ఎంత బాగున్నది! నేనింతకుమించి వేరేమి చెప్పగలను? ఇతర కార్యములకు చెవి యొగ్గకుడి.
అతి శీఘ్రముగా కుళ్ళిపోవు,
ఈ యొక్క లోకపు వ్యర్ధమైన ఐశ్వర్యములను ఆశింపవద్దు
నిత్యమైన కార్యములపై నీ యొక్క నమ్మకమును ఉంచుము.
అవి ఎన్నటినికి నశింపవు.
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!
(దానిని మనము పాడెదము.)
మారని దేవుని యొక్క హస్తమును పట్టు కొనుము!
(ఇదో అదిక్కడ ఉన్నది!)
నిత్యమైన కార్యములపై నీ యొక్క నమ్మకమును కట్టుము,
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!
మన యొక్క యాత్ర ముగించునప్పుడు,
మనము గనుక దేవునికి నమ్మకముగా నుండినయెడల,
మహిమలో మనయొక్క గృహము ప్రకాశముగాను
మరియు అందముగాను నుండును,
పరవశించిన మన ఆత్మ దానిని చూచును.
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుడి!
(రూపాంతరపరచ బడుడి!)
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుడి!
నిత్యమైన కార్యములపై మీ యొక్క నమ్మకమును కట్టుడి,
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుడి!
విజ్ఞానమును గమనింపకుడి, అది దేనిని నిరూపించినను, అది దేవుని వాక్యమునకు విరోధముగానున్న యెడల నమ్మకుడి, చూశారా. దేవుని వాక్యమునకు విరోధముగా సంఘము ఏమి చెప్పినను దానిని గమనింపకుడి.
ఏలయనగా మనము
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొని యున్నాము!
కాలములు మారును, విజ్ఞానమును మారును.
మారని ఆ యొక్క హస్తమును పట్టుకొనుము!
నిత్యమైన కార్యములపై మీ యొక్క నమ్మకమును కట్టుము,
మారని దేవుని యొక్క హస్తమును పట్టుకొనుము!
HEB 13:5
139తండ్రైన దేవుడా, ఈ రోజు ఉదయమున మీ యొక్క సన్నిధిలో మేము ఒక్కటిగా కూడిన ఈ సమయములో, నేను ఒక దీర్ఘమైన వర్తమానమును ప్రసంగించి యున్నాను, మరియు, ఓ, ప్రభువా వాక్యమును విత్తనములను ఈ యొక్క జనుల హృదయములలో మీరు నాటువలయునని ప్రార్థించుచున్నాము. ప్రభువా మరి గుర్తుంచుకొనుడి, మేము బలహీనులము మరియు మా శరీర నిర్మాణమును బలహీనమైనదని మేము ప్రార్థించుచున్నాము, మరియు మేము… అనేక సమయములలో దారి తెలియకనున్నాము. ప్రియమైన దేవుడా, మీరు మమ్ములను సరైన దారికి త్రిప్పి మరి మీ యొక్క గొప్ప ఆత్మద్వారా మమ్ములను నడిపించుము, ప్రభువా. మాకు సహాయపడుము, మమ్ములను ఎన్నడును ఒంటరిగా వదలకుము, తండ్రి. మీరు మమ్ములను వదలరని వాగ్ధానము చేసియున్నారు, "నేను నిన్ను వదలను మరియు యెడబాయను. నేను మీతో కూడా యున్నాను."
మరియు తండ్రియైన దేవుడా, మా సహోదరుడైన లియోను మరియు జీన్ను మీరు నడిపించుము. మీరు వాంఛించు విధముగా ఈ యొక్క జనులను వారెట్లు నడుపవలయునో మరియు వారిని మీరు ఆ విధముగా చేయుము; వారు వారియొక్క సొంత తలంపులను ఉపయోగింపక నుండునట్టు, ఏమి చేయవలెనను కార్యములోనికి గొప్ప పరిశుద్ధాత్మ వారిని నడిపింపనిమ్ము, ప్రభువా, చిన్నబిడ్డల వలెనున్న ఈ యొక్క పురుషులను మరియు స్త్రీలను, ఆశీర్వదించుము. మరియు మీరు వారికి దీర్ఘాయుషు నివ్వవలెనని నేను ప్రార్థించుచున్నాను.
ఒక వేళ సాధ్యమైనయెడల మేము ఆయన యొక్క రాకడను చూచువరకూ జీవింపనిమ్ము. మేము చూడగలమని మేము నమ్ముచున్నాము, ఏలయనగా ఇప్పుడు సమస్తమును చాలా సమీపముగా నున్నదనుటను మేము చూడగలుగుచున్నాము. అది చాలా సమీపముగానున్నది! తండ్రీ దానిని అనుగ్రహించుము. మీ కొరకు సేవ చేయుటకై మాతో కూడ చేరి, వీరిని కూడ మీ యొద్ద అప్పగించుచున్నాము, యేసు నామములో. ఆమేన్.
మిమ్ములను అధిక సమయము ఉంచినందులకు నేను చింతించుచున్నాను. సహోదరుడు లియో.