మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు?

మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు?

1ధన్యవాదములు, సహోదరుడా గ్రీన్. ఇది ఒక భాగ్యము. సహోదరుడు మరియు సహోదరి గ్రీన్కు శుభములు, మరియు ఈ ఉదయకాలమున ఇక్కడ ఉన్నదంతయూ అదే. మరియు ఆరాధించెడి స్థలమునకు వచ్చి, కొన్ని ప్రకటనలు చేయుటకు ఇది నాకు ఇవ్వబడినఒక భాగ్యమని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ సహో, గ్రీన్ యొక్క సమయమును నేను తీసుకోవాలని కోరుట లేదు, ఎందుచేతననగా చాలాసార్లు సహో, గ్రీన్ మాట్లాడుటను, నేను వినియున్నాను, మరియు ఖచ్చితముగా నేను ప్రభావితము చెందాను, మరియు అతడు ప్రభువు యొక్క వాక్యము మన యొద్దకు తెచ్చియుండగా, మరియు దాని కొరకు చాలా దీనత్వము కలిగియుండెను. నిన్నటి దినమున అతడు చెప్పెను, "ప్రత్యక్షత ద్వారా వచ్చినట్లుగా, అది పంపబడినట్లుగా, ప్రభువు యొద్ద నుండి వాక్యమును నేను పొందలేను, కానీ" "చెప్పబడిన దానియందు నొక్కి చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను," అని ఆయన చెప్పెను. బైబిల్ గ్రంధములో పౌలు ఏదైయితే వాసేనో, అతడు చెప్పిన దానిని నొక్కి చెప్పుటకు నేను ఇక్కడకు వచ్చియున్నాను. "ప్రభువు యొద్ద నుండి ఎదైయితే ఇంతకు ముందు చెప్పబడినదో కేవలము దానిని నొక్కి చెప్పుటయే తప్ప నాకు వేరొక వర్తమానము లేదు." ఆ విధముగా యండుట నిజముగా గుర్తించదగినదని నేను తలంచుకొనుచున్నాను మరియు ఒక యౌవ్వనస్తుడు, అతడు చెప్పిన దానిని వినుట ఆ విధమైన గుర్తింపును చేసియుండుట వలెయున్నది.

ఇప్పుడు, అందరము కలిసి ప్రార్థనచేయుదుము.

2ప్రియమైన దేవా, ఏ విధముగా ప్రారంభించాలన్నది నాకు తెలియదు, ఈ రోజు ఇక్కడ నీవున్నావని నేను అనుభూతి చెందియున్నాను. మరియు నీ యొక్క సన్నిధిలో ప్రతీసారి మేము అల్పులముగా ఎంచుకొనుచున్నాము. మరియు ఈ భాగ్యము కొరకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను. ఇప్పుడు, ప్రభువా, ఇది ఈ స్థలమును నీవు మాకు అనుగ్రహించియుండగా, మేము ఇక్కడ కూడికొనిన ప్రతి సారి నీవు మమ్మలను కలుసుకొందువని మేము ప్రార్థించుచున్నాము. మరియు ఈ పట్టణము పై నీ యొక్క గొప్ప ఆత్మ కదలాడును గాక. ఈ చివరి దినములలో మాకు ఇవ్వబడి మరియు మా చేతులలోపెట్టబడిన ఈ సువార్త వర్తమానమును మేము తీసుకొని వచ్చెదము గాక. ఇది నెరవేరును గాక, మరియు జీవము కొరకై నీవు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఆత్మను ట్యుసాన్ మరియు చుట్టు ప్రక్కల నుండి నీవు తెచ్చెదవు గాక, ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి, వీటిని అనుగ్రహించుము. ఆమేన్.

3ఈ ఉదయకాలమున ఒక చిన్న లేఖన భాగమును చదువుటకు నేను ఇష్టపడుచున్నానని నేను అనుకొనుచున్నాను, నేను చెప్పుటకు ఇష్టపడుచున్న ఈ మాటలు చెప్పుటకు ముందు, అపోస్తులుల కార్యముల గ్రంధములోని 7వ అధ్యాయములో ఇది కనుగొనబడినది. మరియు మీరు దానిని త్రిప్పుచుండగా మనము 44వ వచనము వద్ద ప్రారంభించెదము. ఇప్పుడు, ఈ వారములో మేము శ్రీవ్పోర్ట్ వెళ్ళనై యున్నాము, రాబోవు వారము, ఒక కూడికల యొక్క వరుసకు, మరియు దేవుని చిత్తమైతే, ఇప్పుడు మేము ప్రయత్నించబోవుచున్నాము. సహోదరుడు మూర్, సహోదరుడు జాక్ మూర్, నాకు మరియు సహోదరుడు పెర్రీకి ఒక చాలా మంచి స్నేహితుడు, మరియు మేము సహోదరుడు జాక్ను ప్రేమించెదము. నేను అనుకొనుచున్నాను వర్తమానము కొంత వరకూ అతడిని సందిగ్ధములో పడవేసినది. ప్రత్యేకముగా ఏడు ముద్రలు విప్పబడుట ద్వారా మన యొద్దకు వచ్చియున్న కొన్ని విషయములను మనము హత్తుకొని మరియు నమ్ముచున్నాము, సర్ప సంతానము, మరియు విశ్వాసుల యొక్క నిత్య భద్రత, అనునవి మనము నమ్మినట్లుగానే, మరియు అలాంటి, కొన్ని వర్తమానములు. అది, బహుశా ఇతరులకు ఇది కష్టమని మనము అనుకొనుటలేదు, కానీ ఇది మీరు సత్యమునకు మీ హృదయమును తెరువవలెను.

మనము అంత్య దినములలో ఉన్నామని మనము నమ్ముచున్నాము. అది మనము కేవలము రోడ్డు చివరన ఉన్నాము అనుదానికి, అది కేవలము మనకు చాలా నిజముగా ఉన్నది.

4మరియు ఎవరో ఇతర మనుష్యుని యొక్క సంఘములో మాట్లాడుట, మంచిది, మీరు ఆ వ్యక్తి యొక్క ఆతిధ్యమును గౌరవించవలసియున్నది. ఎందుకనగా అతడి యొక్క సంఘములోనికి వచ్చుటకు నీకు ఇవ్వబడిన అవకాశమును బట్టి, మరియు నేను, నిశ్చయముగా దానిలో వారికి నమ్మిక లేదని ఎరిగియుండి, మరియు చాలినంతగా వారిని నేను గౌరవించెదను. తిసుకోనువచ్చుటకు దాని కంటే నేను మాటలాడుటకు అక్కడ చాలా ఎక్కువయున్నది, చూడండి. దానిని కొంచెము ముందుకు నేట్టవలసియున్నది, ఇది కేవలము పరిశుద్ధాత్మ వలననే జరుగవలెను. అప్పుడు ఆయన చెప్పినట్లుగానే నేను నిశ్చయముగా చెప్పెదను, మరియు దానిని చేయుట కంటే మరే ఇతరమైనది నాకు తెలియదు. ఆయన చెప్పినది చెప్పినట్లు చేయుటకంటే మంచిది, నేను నేర్చుకొనని ఆశించుచున్నాను.

ACTS 7:44-50

 

5ఇప్పుడు, మనము అపోస్తలుల కార్యముల గ్రంధములోని 7వ అధ్యాయము నుండి ఒకటి లేదా రెండు వచనములు చదివెదము, 44వ వచనముతోప్రారంభించెదము.

అతడు చూచిన మాదిరి చొప్పున దానిని చేయవలెనని మోషేతో చెప్పినవాడు, ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను.మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువాతో కూడ ఈ దేశములోనికి దానిని తీసికొని వచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను;అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను.అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను.అయినను - ఆకాశము నా సింహసనము భూమి నా పాద పీఠము మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు?నా విశాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

6దాని మీద, ఈ లేఖనము చదువుటయందు, సహో.పెర్రీ ఉదయకాల వర్తమానము తెచ్చుటకు ముందు నేను చెప్పదలచిన కొన్ని వాక్యములను చెప్పగోరుచున్నాను. ఇది నా యొక్క ట్యుసాన్ను దర్శించుటలో గొప్ప ఘడియలై యున్నవి. నేను ఇక్కడకి వచ్చాను ఎందుకనగా ఇక్కడకు వచ్చుటకు నడిపించబడియున్నాను. నేను ఇక్కడకు వచ్చాను ఎందుకనగా పరిశుద్ధాత్మ ఒక దర్శనము ద్వారా, ఇక్కడకు నన్ను పంపించెను. అది బహుశా చాలా వింతగా ఉండునని నేను ఎరుగుదును, కానీ ఆయన…. నాకు తెలిసినంత వరకూ, దేవుని గూర్చి నాకు ఏదైనా తెలిసి ఉంటే, నేను ఒక దర్శనము ద్వారా ట్యుసాన్కు పంపబడ్డాను. నేను ఎలా ఈ ఎడారి ప్రాంతానికి పంపబడ్డాను అని నేను ఆశ్చర్యము చెందాను. మరియు ఇక్కడ అప్పుడు ఎక్కడైతే, ఆత్మీయముగా మాట్లాడినచో, నగరము గుండా…

ట్యుసాన్ పట్టణము కంటే ఎక్కువగా ఆత్మీయముగా చనిపోయిన వారు వేరే ఏదైనా ప్రదేశములో ఉంటారని నాకు తెలియదు. సంఘముల మధ్య గొడవలు ఉన్నవి. సమాజముల మధ్య గడబిడలున్నవి, ఏకత్వము లేదు, మరియు ప్రతీ ఒక్కరూ లాగుచున్నారు, మరియు పట్టుకొనుచున్నారు, మరియు పిండుచున్నారు (లేదా త్రోక్కుచున్నారు) మరియు దీనిని పొందుటకు వారు ప్రయత్నించుచున్నారు, మరియు మత మార్పిడిలు చేయుచున్నారు. ఆత్మీయముగా మాట్లాడిననూ, ఇది ఒక ఎడారి.

7కానీ నేనప్పుడు పరిశుద్ధ గ్రంధములో చదివాను, అది తన ప్రేమించిన వారి నుండి మరియు అతడి యెడల ప్రియమైనవారందరి నుండి దేవుడు మోషేను బయటకు పిలిచెను. మరియు అతడిని ఎడారిలోనికి పంపివేసెను. పరిశుద్ధ గ్రంధము యొక్క ధర్మశాస్త్రమును వ్రాయుటకు. అది పాత నిబంధన, మొదటి నాలుగు గ్రంధములు, ఆదికాండము, లేవీకాండము, మరియు ద్వితియోపదేశకాండము, నిర్గమకాండము. చూడండి. నేను వాటిని క్రమములో చెప్పలేదు, కానీ ఆ నాలుగు గ్రంధములు. నిజముగా పాతనిబంధన అదే, ఎందుకనగా మిగిలినదంతా కూడా ప్రవక్తలు చెప్పినది, దావీదు కీర్తనలలో మరియు అలాంటివి, కానీ రాజులు యొక్క వృత్తాంతములు. కానీ ఇది పాత నిబంధన యొక్క మూలాధారములు. మోషే తన స్వదేశము నుండి పిలువబడిన తరువాత వాటిని వ్రాసెనా, ఎక్కడైతే అతడు తన జనులు మధ్య పుట్టి మరియు పెరిగెనో మరియు అక్కడ నుండి పాత నిబంధనా గ్రంధమును వ్రాయుటకు ఎడారిలోనికి పంపబడెను.

8దానిని నేను క్రొత్త నిబంధన గ్రంధములో కనుగొనినప్పుడు, పౌలు దానికి గ్రంధకర్త అయినప్పటికిని లేక కానప్పటికినీ అతడు క్రొత్త నింబంధన యొక్క రచయిత. అతడు కూడా తన యొక్క జనుల మధ్య నుండి ఆత్మ ద్వారా, అరేబియాలోనికి నడిపించబడెను, ప్రేరేపణ కొరకు అతడు అక్కడ మూడున్నర సంవత్సరములు ఉండెను. మరియు పౌలే క్రొత్త నిబంధనకు ముఖ్య రచయిత.

ఇప్పుడు, మత్తయి, మార్కు, లూకా, మరియు యోహను ఉన్నారు, కానీ వారు యేసును వెంబడించిన దానినంతటిని బట్టి వ్రాసిన లేఖకులై యున్నారు. మరియు. కానీ మీరు తిమోతి, రోమా, మరియు హెబీయులు, మరియు అలాంటివి తీసుకొన్నప్పుడు, క్రొత్త నిబంధనను వ్రాయుటకు పౌలు ప్రేరేపణను పొందెను; పాత నిబంధన అ౦తటిని ఛాయగా తీసుకొని మరియు దానిని క్రమములో ఉంచుట కొరకు. మరియు దేవుడు దానిని గౌరవించి, దానిని క్రొత్త నిబంధనగా చేసెను.

9మరియు ఇప్పుడు, ఒకవేళ పాత నిబంధన గనుక నడిపించబడినట్లయితే… రచయిత తన యొక్క జనుల మధ్యనుండి, పాత నిబంధనను వ్రాయుటకు కొరకు ప్రేరేపణ పొందుటకు, అరణ్యమునకు నడిపించబడవలెను. మరియు క్రొత్త నిబంధనలో, రచయిత గ్రంధకర్త ద్వారా, క్రొత్త నిబంధననూ వ్రాయుట కొరకు ప్రేరేపణ పొందుటకు, ఒక ఎడారిలోనికి నడిపించబడెను. మరియు గ్రంధములు ఏడు ముద్రలతో ముద్రించబడియున్నవి; ఈ రోజులలో ఏడు ముద్రలను విప్పుట కొరకై దానికి కూడా అదియే కావలసియున్నదని, నేను నమ్ముచున్నాను. నీవు దేనినైతే ప్రియముగా కలిగి ఉన్నావో, దేని కొరకైతే నీవు ఆనందించుచున్నావో, మరియు జనుల ద్వారా నాకివ్వబడిన ఒక చిన్న గృహమును, మరియు నా యొక్క జనులందరు మరియు స్నేహితుల మధ్య నుండి, మరియు అభివృద్ధి చెందుచున్న ఒక సంఘము, మరియు ఏమియూ కొదువ లేకుండా; మరియు దానినంతటినీ విడిచి, దాని నుండి తీసివేయబడి, మరియు దూరముగా వెళ్ళి, ఏ ఒక్కరూ తెలియని ఒక ఎడారిలోనికి వెళ్ళి, మరియు ప్రతీదీ నీకు వ్యతిరేకముగా ఉన్నదానిని విడచి వెళ్ళవలసియున్నది.

కానీ దేవుని గురించి ఏదో ఒకటి ఉన్నది, అది తన యొక్క సొంత తలంపులన్నింటికి మించి కొన్ని సంగతులను చేయుటకు ఒక వ్యక్తిని దేవుడు నడిపించును, కనుక అది దేవునికి మహిమ మరియు ఘనత కొరకైయున్నది. మరియు నేను అనుకొనుచున్నాను, అది వ్యక్తిగత గౌరవము కాదు, కానీ తనకు ప్రియమైన వాటన్నిటిని విడుచుట ఒక భాగ్యమని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ ఈ అరణ్యములోనికి తీసుకొని వచ్చి మరియు నా యొక్క జీవితములో ఎన్నడూ భరించనటువంటి కష్టమును భరిస్తూ, ఇక్కడ ఈ అరణ్యములో లేక ఈ ఎడారిలో ఉండుట. కానీ నేను నమ్ముచున్నాను, దానిని చేస్తూ మరియు దేవుడు ఏమి చేయమని ఆజ్ఞాపించెనో దానికి లోబడుతూ ఉండుట వలన, దేవుడు ఈ చివరి దినము కొరకైన మర్మములను మన కొరకు తెరిచెను. మరియు ఇదిగో ఇక్కడ ఈ వర్తమానముతో మనము ఉండియున్నాము.

10ఇప్పుడు, నన్ను వెంబడించిన చాలామంది ఉన్నారు, మరియు అది అసాధారణము కాదు. సాధారణముగా ఒక వ్యక్తి. జనులు ఒకరినొకరు ప్రేమించుకొనెదరు మరియు ప్రేమ, నీవు చేస్తావని అనుకొనని సంగతులను కూడా అది నీవు చేయునట్లుగా చేయును. మరియు మీలో చాలా మంది జనులు మి యొక్క గృహములను వదిలియున్నారు, కేవలము ఈ ఎడారిలోనికి వచ్చుట కొరకు సమస్తమును వదిలియున్నారు. చాలా మంది నాకు ఫోన్ చేసియున్నారు, చాలా మంది నన్ను అడిగియున్నారు, "మేము ఆరిజోనాకు రావచ్చునా? మాకు అది ఒక మంచి స్థలముగా ఉండునా?" మంచిది, మోషే మరియు వారందరి కొరకు చెప్పబడిన రీతిగా, ఇది ఫలములు కలిగియుండు స్థలము కాదు, దానిమ్మ పండ్లు ఉండు స్థలము కాదు. ఇక్కడ చేయుటకు పెద్దగా పనిలేదు, మరియు జీవనము చాలా హెచ్చగా ఉన్నది, మరియు జీవించుట కొరకు అవసరములు చాలా హెచ్చగా ఉన్నవి. ట్యుసాన్లో ఉన్న ఆరిజోనా, నివసించుట కొరకు నిజముగా ఒక కఠినమైన ప్రదేశము. వేతనములు చాలా తక్కువ, మరియు ఆహారపు ఖర్చు మరియు ఇంటి అద్దె చాలా ఎక్కువ… ఆ విధముగా నివసించుటకు అది ఒక భరించలేని స్థలము. కానీ అది ఆరోగ్యకరమైన మరియు పొడిగా యుండు స్థలము. మరియు మనము కొన్నిసార్లు. మనము ఈ భూసంబంధమైన విషయములపై మన మనస్సులను కేంద్రీకరి౦చకూడదు.

ACTS 7:44,47,48

 

11మనము పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు చూడవలెను.

కానీ ఇక్కడకు వచ్చి ప్రజలకు చెప్పుటకు నన్ను ఒకటి ఇబ్బంది పెట్టినది. మంచిది, "నీవు రాకూడదు," లేదా "నీవు రావలెను," అనేది నేను వారి వ్యక్తిగత నిర్ణయమునకు విడిచిపెట్టెదను. ఒక వ్యక్తి ఏ విధముగా చేయవలెనో దేవుడే నడిపించును. ఏమి చేయవలెనని ఆత్మ ద్వారా నడిపించబడుటకు మనందరము ఆ విధముగా చేయాలని నేను అనుకొనుచున్నాను. మరియు ఇక్కడనున్న మీలో చాలామంది జెఫర్సన్ విల్ మరియు ఆ చుట్టుప్రక్కల వారు, మరియు అక్కడనున్న ఆ సముహము మరియు మీరు ఇక్కడకు వచ్చియున్నారు.

ఇప్పుడు, నన్ను తొందరచేయు ఒక సంగతి ఏదనగా, ఆరాధనా స్థలము. మరియు నేను గుర్తెరిగియున్నాను, నేను ఇక్కడ లేఖనములో చదివినట్లుగా, సైఫెను తన మరణమునకు కొంచెము ముందు ఇచ్చిన వర్తమానము; దాని తరువాత అతని వర్తమానమును గూర్చి అతడిని వెంటనే వారు రాళ్ళతో కొట్టిరి. అతడు మాట్లాడుచుండగా, అతడు చెప్పెను, "మన పితరులు," (మొదటి దినములలో ఉన్న హెబ్రీయులను గూర్చి మాట్లాడుచూ, వారు ఆరాధన చేయుటకు ఒక స్థలమును నిర్మించుటకు కొరకు, ఏ విధముగా దేవుని ముందు కరుణ పొందుటకు ప్రయత్నించిరని.) అతడు చెప్పెను, "సొలోమోను అతడికి ఒక ఆలయమును కట్టెను, లేదా ఒక భవనము." మనము ఆ కథను బాగుగా ఎరుగుదుము.

HEB 10:5

 

12కానీ నేను అతడి తరువాత మాటలను ఇష్టపడెదను, "సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు."

మరియు యోషయాలో మరియొకచోట, అతడు చెప్పెను, "నాకొక శరీరమును సిద్ధపరచితివి." బలియు మరియు అర్పణము మరియు భవనములు, మరియు అలాంటివి కాదు, కానీ "నాకొక శరీరము సిద్ధపరచితివి." అతడు ఆ శరీరమైన క్రీస్తులోని దేవుని గుడారము గూర్చి మాట్లాడుచున్నాడు అని మనము గ్రహిస్తున్నాము. కానీ, నేడు నేను నమ్ముచున్నాను, అది ఆ ప్రేరేపణ సహోదరుడు గ్రీన్కి వచ్చియున్నది, మరియు సహోదరి గ్రీన్కు, ఇక్కడకు రావాలని, తూర్పున వారి యొక్క స్థలమును వదిలి, టెక్సాస్లో కూడా, ఏమి లేని దానితో ప్రారంభించుటకు ఇక్కడకు వచ్చెను. కేవలము ఒక సామాన్యమైన ప్రేరేపణ ద్వారా దానిని వారు చెయ్యాలనే తలంపుతో వచ్చియున్నారు.

క్రీస్తు యొక్క నాయకత్వము ద్వారా నడిపించబడుచున్న జనులను నేను అభినందించుచున్నాను, దాని కొరకు అది ఎంత వెల అయిననూ సంబంధము లేకుండా.

MARK 1:38

 

13లోకమంతయూ కూడా, బహుశా మీ యొక్క చాలా దగ్గర స్నేహితులు, మీరు తప్పు అని అనుకొన్నచో. కానీ అది నీకు తప్పు కాదు, దాని వెనుక ఏదో ఉన్నదని నీవు అనుకొన్నంత కాలము అది దేవుడు నిన్ను కదిలించుటయై యున్నది. అది ఎన్నటికినీ తప్పుకాదు. మరియు అది ప్రతీసారీ సరిగానే యుండును. ఈ యౌవ్వన దంపతులను చూడండి, ఒక సామర్థ్యముగల యౌవ్వనస్తుడు. అతడు ఇక్కడ కూర్చొనియున్నాడని నేను దీనిని చెప్పటలేదు. మరియు తన పిల్లలతో ఉన్న ఈ యౌవ్వన స్త్రీ, తన పోషించవలసిన తన కుటుంబముతో, మరియు అతడు ఇక్కడకు వచ్చుటకై తన ఉద్యోగమును మరియు అన్నీటిని వదలి వేసెను.

చాలా సంవత్సరముల క్రితము నేను పరిచర్యలోనికి పిలువబడ్డానని నేను గుర్తెరిగియున్నాను. నేను ఎన్నడూ ఒక విజయవంతమైన సంఘకాపరిగా ఉండలేకపోయాను, ఎందుకనగా నేను ఒక సంచరించెడి, అక్కడకు ఇక్కడకు తిరుగులాడేడి ఆత్మను కలిగియున్నాను. నేను ఎక్కడా కూడా తృప్తపరచబడలేదు, కేవలము ఆత్మ ఎక్కడికైతే కదులునో, నేను అక్కడికి దానితో పాటు కదలి వెళ్ళాను, ఎందుకనగా నాకు ఒక వర్తమానమున్నది. "నేను ఈ మరియొక పట్టణములో కూడా ప్రసంగించవలెను," అని యేసు చెప్పెను.

14కానీ మందను కనిపెట్టుకొనుచున్న సంఘ కాపరులనబడెడి వారు కొందరున్నారు. సహోదరుడు పెర్రీ పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును అనుసరించినందుకు నేనెంతో కృతజ్ఞడను, మరియు ఈ రోజు మనము ఒక గుడారమును కలిగియున్నాము. ఇది చాలా చిన్నది, అది ప్రారంభించుటకు ఒక మంచిదిగా ఉండును, పరిశుద్ధాత్మ ఏమి చేయునో చూచుటకు, ఏమి తెలియకుండా… కేవలము అడుగులో అడుగువేయుచూ కదిలెదము.

ఇప్పుడు, దేవుడు సహోదరుడు మరియు సహోదరి గ్రీన్తో మాట్లాడెను అని నేను నమ్ముచున్నాను, ఇక్కడకు వచ్చి మరియు మన యొక్క పిల్లలు ఆదివారపు బడికి వెళ్ళుటకు బదులు వారి యొక్క సైకిళ్ళను త్రోక్కుచు మరియు వీధులలో అటు ఇటు తిరుగుచూ ఉ౦డుటకు బదులుగా, వారు ఆరాధించుటకు వచ్చుటకు ఒక స్థలము కలిగియు౦డుటకు. మనము చుట్టూ కూర్చొని మరియు ఏదో వినుటకు అది మనము రేడియోలో విను దానికి బదులుగా, అది సరైనది.

15కానీ మనము, ఈ జనుల యొక్క సమూహముగా, మనకు ఈ దినమున ఒక వర్తమానమున్నది. దేవుడు మనకొక వర్తమానము ఇచ్చెనని మనము నమ్ముచున్నాము.

మరియు సహోదరుడు గ్రీన్, (అతడిని నా యొక్క సహయకునిగా, నేను పిలువదలుచుకొనుట లేదు, ఎందుకనగా మేము బందువులము) నా సహయకుడు కూడా. మేము ఇరువురము కలిసి ఈ వర్తమానములో ఉన్నాము. నేను నమ్ముచున్న అదే సంగతి మరియు వర్తమానమును సహోదరుడు గ్రీన్ ప్రసంగించుచున్నాడు. అతడు తన గృహమును విడిచెను, తన జనులను విడిచెను, తన యొక్క సంఘమును విడిచెను. అతడు ఒక, నేను నమ్ముచున్నాము, అతడు జిల్లా అధికారి లేదా ఏదో, సంస్థలలో ఏదో ఒక కార్యము, మరియు దీనిని వినినప్పుడు అతడు అన్ని సంగతులను విడిచెను. అతడు అన్నీటిని విడిచెను, అతనికి ప్రియమైనవన్నీ ఎడారికి వచ్చుట కొరకు, కేవలము దేవుడు మనకు ఇప్పుడు ఏదైతే ఇచ్చుచున్నాడో దానిని సహకరి౦చుట కొరకు.

16నేను చెప్పుచున్నాను, నేను నమ్ముచున్నాను ఇది కేవలము మన హృదయములో నుండుట మాత్రమే కాదు, అతడి వెన్నంటి ఉండుట మన యొక్క బాధ్యత అయివున్నది. మనము చేయగలిగిన ప్రతీది, కూడికలకు హజరగుటకు, ఇక్కడకు వచ్చి ఆరాధించుటకు, మరియు ఈ స్థలమును ఆయన మన కొరకు ఏదైతే బయలుపరచనై యున్నాడో అవన్నీ దేవుడు మన కొరకు బయలుపరచులాగున చేయును. మరియు ఆయన వాక్యము చెప్పినట్లుగా, "ప్రేరేపణ ఇచ్చు దాని నుండి నాకు వర్తమానము రాలేదు గానీ," అది మనలో కొందరికి ఏదో చేసినది, కానీ ఆయన చెప్పెను, "దేవుడు ఇచ్చిన దానికి వెన్నంటి ఉండుటకు నేను ఇక్కడ ఉన్నాను."

ఎటువంటి ప్రకటన అది! మరియు నేను నమ్ముచున్నాను, ఒకవేళ మనము గనుక ఒకరికి ఒకరు సహయము చేసికొన్నచో, మన హృదయములు దాని కొరకై పెట్టుదుము.

17నాకు తెలుసు మీలో ప్రతీ ఒక్కరూ, నేను పొందినట్లుగా మీరు అనుభూతి పొందినచో… దేవుని యొక్క ఆత్మ కదులుచుండుటను చూచుట కొరకు నేను చాలా ఆకలిగా ఉన్నాను, దాని కొరకు నేను నిలబడలేక యున్నాను. పర్వతములలో నేను కలిగియున్న కొన్ని అనుభవములు, మరియొకసారి దాని అనుభూతి పొందుటకు. అది ఏదో ఒక సంగతి, నేను మొదటిసారి రక్షించబడినప్పుడు నా హృదయమునకు చాలా దివ్యమైనది.

మరియు మనము ఒక స్థలములోనికి వచ్చి, మనము కూర్చొని మరియు మన మధ్యలో దానిని చూచెదము, అది మనము ఎండిపోవుచున్నాము. మనము ఇక్కడ ఎడారిలో కూర్చొనియుండగా, నేను నా సహోదరుల మధ్యకు వెళ్ళి, వారు నాతో మాట్లాడెను మరియు నేను వారితో మాట్లాడాను; ప్రతీసారీ, గమనించుచున్న ఆ చిన్న మార్గములో, ఆత్మ ద్వారా అనుభూతిని పొందుచూ, అలాగున, ఆ యొక్క సహోదరుని యొక్క స్థితిని చూచుటకు, తప్పిదము ఏమైనా ఉన్నదని చూచుటకు, అదంతయూ దిగజారిపోతుందని నేను అనుకొనుట ప్రారంభించాను, ఆత్మనుండి దొరమై వెళ్ళిపోవుట. ఒక సంగతి మనకు చాలా సహజముగా అయిపోయినది. మనము ఆత్మలో ఆరాధించవలెను. ఎక్కడైతే దేవుని ఆత్మ… కేవలము మన యొక్క వర్తమానము ఘడియకైన జ్వాల కాదు గానీ, అది మనయొక్క హృదయములో జ్వాలై ఉండవలెను. చూడండి. అది మన యొక్క హృదయములలో ఉండవలసియున్నది, లేదా దానిని మనము జనులకు సరిగా ప్రకటించలేము. ఆత్మయే వర్తమానమును దానికదే ముద్రించవలసి యున్నది. మరియు మీలో ప్రతీ ఒక్కరు నిజమైన క్రైస్తవునిగా ఉందురని, నేను నమ్ముచున్నాను మరియు విశ్వసించుచున్నాను.

18ఇప్పుడు, వారికి ఆదివారపు బడి ఉపదేశకులు కావలసియున్నారు. వారికి ఉద్యోగులు కావలసియున్నారు. మరియు నేను దీనిని చెప్పాలనుకుంటున్నాను, ఎందుకనగా మీరు పూర్తిగా అర్ధము చేసుకొనెదరు. ఇది నా సంఘము. నేను మూడు సంవత్సరముల నుండి ఇక్కడ ఉన్నాను. మరియు నా కొరకు తెరువబడిన ద్వారమును నేను కలిగియున్నాను, అది సహోదరుడు మాకీ నన్ను ప్రసంగించుటకు పిలిచియున్నాడు. దేవుడు అతనిని దీవించును గాక. నేను మరే ఇతర జనుల ద్వారా ఆహ్వనించబడలేదు. వారికి వ్యతిరేకముగా ఏమియూ లేదు, వారు సరిగానే ఉన్నారు. సహోదరుడు బ్రోక్, నా యొక్క మంచి స్నేహితుడు, సహోదరుడు గిల్మోర్, ఇక్కడనున్న చాలా మంది పెంతుకొస్తు సహోదరులు, వారు నాకు చాలా చాలా గాఢమైన మంచి స్నేహితులు. నేను వారిని ప్రేమించెదను. వారికి వ్యతిరేకముగా ఏమి లేదు. నేను వారి యొక్క స్థితిని అర్ధము చేసుకొన్నాను. వారు నన్ను అక్కడికి ఆహ్వనించలేరు, మరియు వారు వారి యొక్క సంస్థలోనే మిగిలిపోవుదురు. చూడండి, వారు దానిని చేయలేరు. ఎందుకనగా ఒకవేళ వారు చేసినచో, వారు గెంటి వేయబడుదురు. కనుక మీరు వారి స్థితిని చూడండి.

నేను అటువంటిదానినే ఎదుర్కొనవలసియున్నది. కానీ అది ఎల్లపుడును ఇలా ఉండును గాక, మొదట దేవుని యొక్క రాజ్యమును వెదకుడి, దేవుని యొక్క చిత్తము.

MATT 18:20•

HEB 10:25

 

19మరియు ఇప్పుడు సహోదరుడు గ్రీన్, దేవుడు అతడిని ఇక్కడకు పంపియుండెను మరియు మనము నమ్ముచున్న ప్రత్యేకమైన విశ్వాసము వంటి సంఘమును మనకు తెరిచెను. మనము దేవునికి చాలా కృతజ్ఞులమై ఉండవలెను. మరియు ప్రతీ కూడికకు హజరు కావలెను, మనము తీసుకొనగలిగిన ప్రతీ స్థానమును తీసుకొనవలయును. మరియు ఒకవేళ మనము పిలువబడిననూ మరియు అడగబడిననూ, ప్రార్థించుటకు, అడుగుటకు, చేయుటకు, అక్కడే సైనికుల వలె ఉందుము గాక. కేవలము దానిని చేయుట కొరకు ఆత్రుత కలిగియుందుము, చూడండి.

వర్తమానమును గౌరవప్రదమైన దానిగా ఉంచుము. సరియైన జీవితమును జీవించుము. దాని మీద ఎటువంటి మచ్చ రానీయకుము. మనము చాలా ఆలస్యమైన సమయములో జీవించుచున్నాము. కాబట్టి ఆఘడియలో మనము చాలా ఆలస్యముగా నున్నాము. శుభ్రమైన జీవితమును జీవించెదము గాక. నా జీవితములో, నీ జీవితములో, మన అందరి జీవితాలు దేవుని ఎదుట పట్టబడవలసిన అవసరమైయున్నవి. మన యొక్క యౌవ్వన జనులు ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు, ఒక ప్రదర్శన నుండి వేరొక ప్రదర్శనకు, అటు ఇటు తిరుగుచూ, మరియు దేవుని నుండి మరింతగా మరియు మరింతగా దూరము జరిగిపోవుచున్నారు. అది సరే. ఇప్పుడు, అది సత్యము. నేను నా పిల్లలలో దానిని చూస్తున్నాను. మరియు నన్ను నేనుగా వెళ్ళకూడనటువంటి ఒక ప్రదేశమునకు వెళ్ళుట చూచుకుంటున్నాను…

నీవు దేవుని ఆరాధించుట కొరకు మీకు మీరుగా కూడుకొనవలెను. బైబిల్ అలాగు చెప్పుచున్నది, మనము ఆ దినము రావడం చూచినప్పుడు మరింతగా దగ్గరకు రావలసియున్నది. ఒకవేళ ఇక్కడ ఇద్దరే జనులు ఉండినట్లయితే, వారిలో మీరు ఒకరిగా ఉండుము. ఇప్పుడు అది… మరియు ఒకవేళ మనందరము కూడి వచ్చి మరియు కలిసి ఆరాధించినచో, అప్పుడు మనము, దాని గూర్చి వేరొకటేదో ఉన్నది… "ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి యందురో, నేను వారి మధ్యన ఉందును," అని యేసు చెప్పెను.

20ఇప్పుడు, నేను ఇంతకముందు చెప్పినట్లుగా, సహోదరుడు గ్రీన్ నాకు చెప్పియున్నాడు, మరియు అతడు దానిని చెప్పెను (నా భార్య వచ్చినది, నేను దూరముగా వెళ్ళినప్పుడు అతడు ఏమి చెప్పెనో నాకు చెప్పెను), అది… మరియు ఈ ఉదయమున అతడు చెప్పెను, అది, "ఏ సమయమందైననూ మాట్లాడుటకు బలిపీఠము తెరువబడే యుండును." ఇప్పుడు సాధారణముగా, అది నేను మాట్లడుట కొరకు తెరువబడేయుండును.

ఇప్పుడు, సాధారణముగా, జనులకు ఇచ్చుటకు, దేవుడు నాకు ఇచ్చిన వర్తమానమును ఇచ్చుటకు, నేను ఇండియానాలోని, జెఫర్సన్విల్ వరకూ నడుపుకొని రావలసియుండును. ఇండియానాలోని జెఫర్సన్విల్ వరకూ వెళ్ళవలసియుండును. మరియు మీలో ప్రతీ ఒక్కరూ దేశ నలుమూలల నుండి కలుపబడియున్నారు. (ఫోన్లో) మరియు వైర్లు మరియు అలాంటి వాటితో తగిలించబడియున్నారు ( hooking up the wires) వర్తమానమును పొందుకొనుట కొరకు, ఎందుకనగా దాని మీదనే మనము జీవించుచున్నాము, చూడండి. దాని కొరకు మాత్రమే మనము ఇక్కడ ఉన్నాము. మంచిది, మనమింక ఎంతమాత్రమును దానిని చేయనవసరము లేదు.

ACTS 7:48,49•

HEB 10:5

 

21దేవుడు నాకొక వర్తమానమును ఇచ్చెను. నేను తిన్నగా ఇక్కడ బలిపీఠము యొద్దకు నడిచి వచ్చి దానిని ప్రసంగించగలను, మరియు దానిని చేయుటకు స్వేచ్చను కలిగియున్నాను.

మరియు నేను నమ్ముచున్నాను, దాని ద్వారా, ఇప్పుడు ఒక వేళ మీరు ఈ సంఘముతో నిలబడినచో, ఈ జన సమూహముతో, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించును. అది మాత్రమే కాదు, కానీ బయటకు వెళ్ళి మరియు ఒకవేళ ఇతరులను లోపలికి రానీయకుండా చేయుదుమో, చూడండి. ప్రతీచోట ఇతరులతో మనము మాట్లాడెదము. మన యొక్క సంఘము గూర్చి మరియు అది ఏమిటని వారితో మాట్లాడుము. మన సంఘము ఏమిటి… మన మిక్కడ ఉన్నాము. మీరు రావలెనని మేము ఆశించుచున్నాము, క్రొత్త వారిని తీసుకొనిరండి, మరియు అది మనందరి కొరకు చాలా మంచిదని నేను ఖచ్చితముగా చెప్పగలను.

చూడండి, మనము ఒక భవనమును కలిగియున్నాము, దాని కొరకు కృతజ్ఞతలు. అందరము కలిసి కూడుకొనుట కొరకు ఈ స్థలమునకై మనము కృతజ్ఞలము. కానీ, "సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు," చూడండి. "ఆకాశము నా సింహసనము, మరియు భూమి నా పాదపీఠము, మరియు నా విశ్రాంతి స్థలమేది? కానీ నాకొక శరీరము సిద్ధపరచియున్నావు." మరియు మనము క్రీస్తు యొక్క శరీరమైయున్నాము.

కావున, మనము ఒక భవనములో నుండి ఇంకొక భవనములోనికి మారునట్లుగా, నేను నమ్ముచున్నాను, మన వర్తమానములు తెచ్చుటలో, మరియు మేము క్రిందకు వచ్చి స్వస్థత కూడికలను కలిగియుందుము. మరియు ప్రభువు దేనినైనా చేయవలెనని మనకు బయలుపరచినచో, తిన్నగా మనము దానిని సంఘములోనే కలిగియుందుము, అది పొంగి చాలా పెద్దదై మరెక్కడో దానిని తీసుకొనునంత వరకూ మరియు మరెక్కడో, యేసు వచ్చునంత వరకు. దేవుడు మిమ్మలను దీవించును.

22[సహోదరుడు పెర్రీ గ్రీన్ సమాజముతో మాట్లాడుచున్నారు. మరియు తనని అభిషేకించమని అప్పుడు సహోదరుడు బ్రన్హంను అడుగుచున్నారు.] మన తలలు వంచుదము. ప్రియమైన దేవా, మేము ఈ వేదికపై నిలబడియుండగా, సరిగ్గా ఇక్కడ ఈ బలిపీఠము పైన, దేనికైతే ప్రాతినిథ్యము వహిస్తుందో, మేము గుర్తెరిగి యున్నాము, ఈ భూమికి సంబంధించిన వరకూ మనము మర్త్య జాతి ప్రజలము, ఈ భూమికి సంబంధించినంత వరకు. మనము అలా వీధులలో చూచియుండగా మరియు పాపము ప్రతీచోటా వ్రాయబడియుండట చూస్తున్నాము, మరియు ప్రభువు యొక్క మహిమ వేగముగా తిరిగి వెళ్ళిపోవుచున్నది. మరియు మనకు తెలుసు, ప్రభువు యొక్క మహిమ పైకి పోవునప్పుడు, అలానే సంఘము కూడా దానితోనే పోవును. దేవా, మేము అక్కడ ఉండాలని కోరుచున్నాము.

కొన్ని దినముల క్రితము, ఇక్కడ వీధి మూలలో నిలబడియుండగా, వీధికి అడ్డముగా, వీధిగుండా ఆ సైనిక కవాతు వెళ్ళుచుండగా చూచియున్నాము, మరియు ఆ పాత్ర మొదటి ప్రపంచయుద్ధ ట్యాంకులు మార్గముముందు సాగుట చూస్తుండగా. అప్పుడు పెద్ద బరువైన షెర్మాన్ ట్యాంకు వచ్చినది, దాని వెనుక అలా, అలా మరియు అలా అన్నీ సాగిపోచున్నవి; అప్పుడు ఆ బంగారు నక్షత్రపు తల్లులు; (సైన్యములో కుటుంబములో ఎవరైనా చనిపోతే వారి పోరాటమునకు గుర్తింపుగా బంగారు నక్షత్రమును తల్లులకు ప్రదానము చేస్తారు) చిన్న ముక్కలైన కుటుంబము, ఏడ్చుచున్న భార్య మరియు ఒక చిన్న బట్టలు చిరిగిన బాలుడు తన తండ్రిని కోల్పోయి; తన కుమారుని కొల్పోయిన ఒక ముసలి తల్లితో. ఓ, వీధి మూల నిలబడి మరియు అలాంటిది సాగిపోవుట చూచుట ఎంత విచారము!

అప్పుడు గమనించినప్పుడు, ఈ భవనమును వారు దాటియున్నప్పుడు, ఆ సంగీతము, "ముందుకు, క్రైస్తవ సైనికులారా" నకు ఆలపించబడినది. ఈ స్థానమును వారు దాటుచున్నప్పుడు; వెనుక వారి సైనికుల వరుస వాయించుచున్నది.

1THS 4:15,16

 

23ప్రియమైన దేవా, మరియొక గొప్ప సమయము వచ్చుటను నేను ఆలోచించుచున్నాను, మరియు అది పునరుత్థానము, అప్పుడు పాత-తరము వారు ముందుగా వచ్చెదరు, పరిశుద్ధులు, పితరులు. "సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారి కంటెముందుగా ఆయన సన్నిధి చేరము, మరియు నిద్రించిన వారిని మనము అడ్డుకోము లేక ఆపము. దేవుని బూర మ్రోగినప్పుడు, క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు." అప్పుడు మనము, ఆ గొప్ప జనుల వరుస చూచినప్పుడు, సరిగ్గా ఆజనులు వెళ్ళుచూ, ఆకాశముల గుండా నడుచుచుండగా మరియు మనము నిలబడి, మన యొక్క మార్పు కోసం ఎదురుచూస్తూ, మనము వరుసలో పడెదమని కూడా తెలుసు. దేవా, మమ్మలను విశ్వాస సైనికులుగా చేయుము.

కేవలము ఎవరైతే నిజముగా యుద్ధమునకు సంబంధించి మరియు అందులో ఉంటారో వారికి మాత్రమే అది నిజముగా ఏమిటి అనేది తెలియును, ఆ ట్యాంకులు అలా కదులుచూ వెళ్ళుట చూడండి. మరియు, దేవా, ఎవరైతే జీవితమనే యుద్ధ రంగములో ఉంటారో వారు మాత్రమే దానిని తెలుసుకునియందురు అని మేము అనుకొనుచున్నాము. ఎత్తబడుటకు, పునరుత్థానములో, మన యొక్క తరుణము కొరకు మరియు మన యొక్క స్థానమునకై ఎదురుచూచుచున్నాము.

24మరియు ఇది, నా యౌవ్వన సహోదరుడు ఇక్కడ నిలబడియున్నాడు, బాగా తర్ఫీదు పొంది, సిద్ధముగా ఉన్న వస్రములు ధరించుకొని, ఒక ముసలివాడు తన మీద చేతులుంచాలని ఎదురుచూచుచున్నడు, ఎవరైతే ముందు వరుసలో పోరాడిన ముసలి యోధుడు, అతడు కూడా యుద్ధ రంగమున ప్రవేశించాలని యెరిగినవాడు.

ప్రియమైన దేవా, నీకు ప్రతినిధిగా, ఈ విలువ లేని చేతులను నేను నా సహోదరునిపై ఉంచుచున్నాను. సహోదరుడు గ్రీన్ను దీవించుము. ప్రియమైన దేవా, యేసు నామములో నేను అతడిని దీవించుచున్నాను. ప్రభువా, అతడు ఈ వర్తమానమును, ఈ నగరము లోనికి మరియు నీవు అతడిని ఎక్కడికైతే పిలిచెదవో అక్కడికి అతడు మోసుకు వెళ్ళును గాక, అతడు విశ్వాసముతో, ఆత్మతో నింపబడి, నిందారహితమైన జీవితమును జీవించును గాక, దేవా, అతడు జనుల యొక్క హృదయములను కలిగియుండును గాక, అది అతడు వారికి బోధించును మరియు నడిపించును మరియు మనమందరము నడుచుటకు కోరుకొనుచున్న మార్గమును వారికి నిర్దేశించును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము.

అతడి యొక్క విశ్వాసపాత్రురాలైన భార్యను, అతడి యొక్క పిల్లలను దీవించుము. ఇక్కడ మా యొక్క ప్రయత్నములను కలిపి దీవించుము, ఈ భూమిపై ఇక్కడ క్రైస్తవ సహోదరులుగా, అది ఈ సువార్తను భూదిగంతముల వరకూ మేము తీసుకొని వెళ్ళవలసియున్నది, అతడిపై నీ ఆత్మను పంపించుము, దేవా. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థించుచు మేము అతడిని నీకు సమర్పించుచున్నాము. ఆమెన్. సహోదరుడు పెర్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుని యొక్క వాక్యమును మోయుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...