క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత

క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత

1ప్రభువుకు సేవ చేయుటకై నేను వేటాడు ప్రయాణమును రద్దు చేసికొంటిని. కావున ఇది… ఇక్కడ కూడి యుండుటకు మనము ఆనందించుచున్నాము. దీనికి ము౦దు నేను ఇక్కడ మీకు చెప్పినానని నేను నమ్ముచున్నాను, ప్రతీ సారి మేము ఇక్కడకు వచ్చునప్పుడు ఎవరో ఒకరిని కోల్పోవుచున్నాము. మరియు, ప్రభువు రాకడ ఆలస్యమైన యెడల, రాబోవు సంవత్సరము మేము మరల వచ్చిన యెడల, మరొకరిని కోల్పోవుదుము.

నాకు అంతరంగముగా, ప్రాణపదమైన చాలా చాలా సన్నిహితమైన ఒకతను నుండెను అతడు సోదరుడు లైల్ సోదరుడు జాక్స్, ఆ నలుగురు పాడుటను గూర్చి చెప్పుటను అక్కడికి లోపలికి వచ్చి నిలుచుకొని వినుటకు నాకు ఎల్లప్పుడు స్వాగతముండును. "వారు ఈ రాత్రి మహిమలో పాడుచున్నారు." సరి, ఆ స్వరములలో ఒక స్వరము ఇప్పుడు అక్కడ నుండి తక్కిన ముగ్గురి కొరకు వేచియున్నది. ఈ భూమిపైన దానిని (ఆ పాడుటను) మరల నేను వినెదనని నేను ఉహించుట లేదు. సోదరుడు మరియు సోదరి మూర్ మరియు మీరు ఆ రాజ్యములో, అక్కడ ఎల్లప్పుడు వెలుగు౦డును.

2సోదరుడు పామెర్ క్రీస్తు యొక్క గొప్ప సేవకుడు. సోదరుడు జాక్ అతని యొక్క దేవునికి సమర్పించుకొన్న జీవితమును గూర్చి చెప్పుట నేను గుర్తించుకొనియున్నాను. వారివురు వడ్రంగులు మరియు అతను తన మధ్యాహ్న భోజనమును తినుచు, సాండ్విచ్ని (మాంసము మధ్య పెట్టిన రొట్టె ముక్కలు) తన చేతులలో పెట్టుకొని, సాండ్విచ్ తినుచు మరియు తన బైబిలు చదువుచుండును అని చెప్పెను. చూశారా, అతడు కొన్ని గొప్ప కార్యములను చేసెను, సోదరుడు పామెర్ వాటిని చేసెను. అతడు ఒక మంచి వడ్రంగి, తన బిడ్డలకు ఒక మంచి తండ్రి, ప్రేమతో నిండిన ఒక గృహము. ప్రభువును సేవించుటకు గాను వారినందరిని పెంచెను. నాకు తెలిసినంత వరుకు వారందరు రక్షింపబడి మరియు పరిశుద్దాత్మతో నింపబడియున్నారు. ఈ రోజులలో అది ఏ వ్యక్తికైనను అదొక గొప్ప బహుమతిగా ఉన్నది. బాలురు మరియు బాలికలు. వారు చేసిన ఎటువంటి కార్యమైనను వారు దేవుని సేవించువరుకు ఆ కార్యములన్నియు లెక్కకు రావు. అతడు దేవునికి సేవ చేసినగాని, మరియు ఈ రాత్రి ఈ భూమిలో అతడు ఏమి చేసెనో, అతని మంచి కార్యములు, అతడు తన యొక్క ప్రతి ఫలము కొరకు వాటితో ఉండుటకు వెళ్ళియున్నాడు. మన సహోదరుని ఆత్మను దేవుడు విశ్రాంతిలో ఉంచును.

3నాకు తెలిసి ఇది మందిరముగా ఇక్కడ వున్నంత వరకు, మరియు మీరు ఆ విధముగా అని నాకు తెలుసు - అతని స్వరము ఇంకనూ ఇక్కడ ఉండును. మీరు దానిని వినవచ్చును. (పామెర్ స్వరమును).

సోదరి అన్నా, జెన్ని మరియు ఆమె సోదరి ఆర్గన్, పియోనా వాయించునప్పుడు, వారు వేచి యుండనక్కర లేదు. సోదరుడు పామెర్ ఇక్కడ నిలుచుకొని పాటను ఎత్తి పాడుచుండగా వారు (ఆ సోదరీలు) అందుకొనెదరు (వాయించెదరు). మరియు నేను ఎప్పుడు కూడా అతడు పాటలు నడుపుచుండగా అతనిని వినవలయునని నేను ఎదురు చూచుచుండెదను. అతని పిల్లలకు, అతని భార్యకు, మరియు సోదరుడు జాక్ అతని ప్రాణ స్నేహితుడు, వారు అనేక సంవత్సరములుగా స్నేహితులుగా ఉండిరి. మరియు సోదరుడు బ్రౌన్, సోదరి బ్రౌన్, మందిరములో ఉన్న మీరందరు దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. నేను అతనిని పోగొట్టుకొని యున్నాను. మనము తిరిగి అతనిని సంధించు వరకు దేవుడు అద్భుతమైన అతని ఆత్మను సమాధానముతో విశ్రమింప చేయును. మనము మన తలలు వంచెదము.

4కృపగల పరలోకపు తండ్రి, ఈ యొక్క గొప్ప సేవకుని గూర్చి మాట్లాడు ఈ తరుణములో, అతనిని ఈ రాత్రి పోగొట్టుకొన్నాను. ఆ ద్వారము యొద్ద మేము నడచునప్పుడు అతడు ఎల్లప్పుడు చమత్కారముతో కూడిన ఆ చిరు నవ్వుతో, నాతో కరచాలనము చేసి, "దేవుడు నిన్ను ఆశీర్వదించును, సోదరుడు బ్రెన్హాం," అని చెప్పును. అతడు ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి యున్నాడని నేను ఎరిగి యున్నాను. కావున అతని ఫలములను ఫలింఫజేసి అతని వెన్నంటి గొప్ప కార్యములను అతని బిడ్డలు మరియు అతని భార్య కొనసాగించవలయునని నేను ప్రార్థించుచున్నాను. ప్రియ తండ్రి , ప్రభువా ఆమెను ఆశీర్వదించమని మేము ప్రార్థించుచున్నాము. విధవరాండ్రకు నీవే భర్తగా ఉందునని నీవు చెప్పి యున్నావు. సహోదరినూ, పామెర్ కొరకు మరియు పిల్లలందరి కొరకు ఇప్పుడు ప్రార్ధి౦చుచున్నాను. నేను ఎలా వారిరువురిపై సానుభూతి కలిగి యుండవలెయునో తెలియును, ఒక సహచరుని పోగొట్టుకొన్నాను, మరియు నా తండ్రిని కూడా పోగొట్టుకున్నాను.

5కావున తండ్రీ, ఈ రాత్రి మేమిక్కడ ఉన్నప్పుడు, ఆ యొక్క సమయము కొరకు మా హృదయమును సిద్దపరచమని మేము ప్రార్థించుచున్నాము. మాకు తెలియదు. అతనికి జరిగిన విధముగా ఆ కార్యము (మరణము) ఆకస్మికముగా రావచ్చును, అది ఎప్పుడు వచ్చునో మాకు తెలియదు అయితే అది రావలయునని మాకు తెలియును. కావున దేవా, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి హృదయమును మీరు పరిశోధించ వలయునని మేము ప్రార్థించుచున్నాము. దేవా, నన్ను కూడా వదలకుము. నన్ను కూడా వెదికి మరియు పరీక్షించుము ప్రభువా, మాలో ఏమైనా చెడుతనము ఉన్న యెడల, దానిని తీసివేయుము; మీకు సేవ చేయవలెనని మేము కోరుచున్నాము. మా యొక్క పూర్ణ ఉద్దేశ్యము మీకు సేవ చేయుటయే.

6ఈ రాత్రి మరియు ఈ వారమంతయు మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించుము.

జీవము గల గూడారపు నామముతో ఈ గూడారమును ఆశీర్వదించుము. ఈ గూడారము ఆ నామములోని పరిపూర్ణ ఆశీర్వాదములను గైకొనును గాక, తప్పిపోయిన ప్రతి ఆత్మను ఈ వారము రక్షించుటకు దేవుని జీవముతో నింపబడి ప్రతి విశ్వాసిని పరిశుద్దాత్మతో నింపి, మాలో ఉన్న నమ్మకమును మరల పునరుద్దరింపజేయుము ప్రభువా.

మా మధ్యలో వచ్చి బాధపడుచున్న వారిని, వ్యాధి గ్రస్తులను మీరు స్వస్థపరచమని మేము ప్రార్థించుచున్నాము. మీ యొక్క గొప్ప పరిశుద్దాత్మ ఇక్కడ ఉండనీ, ప్రతి ఒక్కరిని స్వస్థ పరచి, ప్రతి ఒక్కరు విశ్వసించులాగున అభిషేకించనీ. తండ్రీ, ఈ కార్యములను అనుగ్రహించుము.

దేవా, ఇప్పుడు నాకు సహాయపడుము, అది పడిన యెడల - వర్తమానమును తీసుకొనువచ్చు వంతు నాపై పడినది. దేవా, మనుష్యభాగమును ఒక ప్రక్కకు పెట్టి, పరిశుద్దాత్మ మా మధ్యలో వచ్చి కదలాడవలయునని నేను ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా ! మాకు తెలియును మేము చాలా అసమర్ధులమని, మేము చేయలేము, మాలో ఉండు ఎవ్వరు దానిని చేయలేరు. దానిని మేము చేయగలమని మేము హక్కు పొందుట లేదు. అయితే ప్రభువా, మాకు తెలియును. మీరే ఆ ఒక్కరని తెలియును. కావున ప్రభువా, నీ వైపు మేము చూచుచున్నాము. దేవుని ఆత్మ కదలాడి మరియు మాపై తాజాగా కుమ్మరించుము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

7ఇక్కడ నుండి జతపర్చబడిన (లైన్ల ద్వారా కలుపబడిన) పలు విధములైన రాజ్యములకు (దేశములకు) నేను ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేయు చున్నాను. టెలిఫోను ద్వారా మనము కలుపబడి యున్నాము. ఈ యొక్క చిన్న చక్కడి పద్దతి బ్యూమాంలో, టెక్సాస్ నుండి వచ్చు సోదరుడు పెరీ గ్రీన్ వలన మనకు సాధ్యపడినది. అమెరికా దేశములోని అనేక సంఘములు ఈ రాత్రి ఈ విధముగా టెలిఫోనుల ద్వారా కలుపబడి ఈ వర్తమానమును పొందుచున్నారు.

మేము శుభాకాంక్షలు పంపుచున్నాము, పశ్చిమ తీర ప్రాంతములోని వారికి, వాంక్యునర్ నుండి టిజువానా వరకు, మెక్సికో, శాన్జోన్, లాస్ ఏంజల్స్ అక్కడున్న అన్ని తెగలకు చెందిన వారికి, శ్రీవెపోర్ట్ నుండి మేము శుభాకాంక్షలు చెప్పుచున్నాము, అరిజోనా, ప్రెస్కాట్ వరుకు ప్రభువు కొరకు వేచి యుండు ఆ గుంపు ప్రజలకు మీకు మేము శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మరియు టూసాన్, సీరా విస్టా, న్యూయార్క్ వరుకు దేశములోని పలు చోట్లకు, ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును, ప్రతి ఒక్కొక్కరిని. ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండియుండవలసినదని కోరుచున్నాను. ఈ అందమైన పాత ప్రదేశమైన లూసియానా ఇది నా యొక్క రెండవ గృహము మాదిరి.

8నేను మీకు తెలియునా, న్యూయార్క్ లో ఉన్న మీరు మీకు తెలియును. మీరు మాట్లాడు విధము నాకు నవ్వు వచ్చులాగుండును. ఈ రాత్రి నా స్వస్థలములో (సొంత గృహములో) ఉన్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు "హలో ప్రియమైన సోదరుడా బ్రెన్హాం. మీరు సహోదరి బ్రెన్హాం మరియు చిన్న బిడ్డలనందరిని తీసికొని మా యొద్దకు మమ్ములను చూచుటకు తీసికొని రండి." ఓ, మై, అది ఏ విధముగా నన్ను ఆనందింపజేయుచున్నది. అది నిజమైన ఆంగ్ల భాష నాకు. తూర్పులోను, ఉత్తరములోను మరియు ఇతర చోట్లనున్న మిమ్ములను అలక్ష్యము చేయుట కాదు, అయితే మీకు తెలియును నేను ఒక "రెబ్" జన్మించితిని మరియు ఆ విధముగానే ఉండవలయును. నేను మెచ్చుకొనుచున్నాను అది నిజమైన ఇంగ్లీషు.

నేను వ్యాపారుల యొక్క భోజన సమయములలో వారితో కూడా భుజించునప్పుడు, కొద్దికాలము క్రిందట, "మనము ఇప్పుడు లేచి నిలువబడి దేశ గీతమును పాడెదము" అని చెప్పిరి.

మరియు నేను లేచి నిలిచి చెప్పితిని, "నా యొక్క పాత కెంటకీ గృహమునకు దూరముగా ఉన్నాను. అది నాకు దేశ గీతముగా ఉన్నది, అదే నాకు తెలిసినదంతయు. కావున మీకు మేము శుభాకాంక్షలు పంపుచున్నాము.

మరియు ఇప్పుడు ……

9వారు భోజన సమయమున కూడా ప్రచారము చేయుటకు ప్రయత్నించుచున్నారని నేను నమ్ముచున్నాను. శనివారము ఉదయపు వ్యాపారుల భోజన సమయము. సోదరుడు గ్రీన్ మీకు చెప్పును. అతడు మైక్రోఫోన్ల పనిలో అక్కడ ఉన్నందు వలన, ఏ సమయములో ఆ కార్యక్రమమును (మీ రేడియోలలో) పెట్టుకొని వినవలయునని అతడు చెప్పును. దయతో మీకు మా కృతజ్ఞతలు మరియు మా కొరకు ప్రార్థించుడి.

10ఇప్పుడు ఇక్కడున్న స్థానిక సంఘమునకు మరియు సోదరుడు జాక్స్ గుడారమును నేను ఈ రాత్రి ఒక కార్యము అనుగ్రహించ వలసినదిగా కోరుచున్నాను. ఈ దేశ మంతటను, స్థానిక సంఘములకు అందుకు గాను నేను కృతజ్ఞతా వర్తమానమును ఇవ్వబోవుచున్నాను. వర్త మానమునకు పిదప, నేను చాలా సేపు నా ప్రసంగమును పొడిగింప బోవుచున్నాను. మరియు నేను కొన్ని సిద్దాంతమును ప్రసంగిచబోవుచున్నాను. కావున… దానితో మీరు ఏకీభవించని యెడల, ఏ విధముగాను నేను చెర్రీ-పై తినుటను చెప్పినట్లు; ఆ విత్తనమును పారవేసి, కేవలము గుజ్జును మాత్రమే తినెదను. కావున ఈ రాత్రి దేనిని గూర్చైన నేను చెప్పిన యెడల. నేను సరి నేను. అందువలననే ఈ రాత్రి ఈ ఆహ్వానమును అందుకొని ఈ ప్రాంతమంతయును నా కృతజ్ఞత వర్తమానమును అందించుటకు ఇక్కడున్నాను, సహోదరుడు జాక్ ఎల్లప్పుడు తన ద్వారములను ఉచితముగా తెరచి "నీ హృదయములో ఉన్న దానిని ప్రసంగించుము" అని చెప్పెను. కావున నేను సొంత గృహములో ఉన్న విధముగా భావించుచున్నాను. కావున ఇక్కడను, సోదరుడు జాక్ తో ఉన్న స్థానిక సంఘమును, కొంత మంది సువార్త పరిచారకులు మరియు కొద్ది ప్రజలు సిద్దాంతముతో అంగీకరించక పోవచ్చును. సాధారణముగా నేను నన్ను తనకు బదులుగా మాటలాడుటకు ప్రసంగ పీఠమునకు పిలిచినప్పుడు, అప్పుడు అక్కడ సిద్దాంతమును ప్రసంగించకూడదన్న మర్యాద కలవాడను. కనుక ఈ రాత్రి పిదప, నేను వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించెదను. పద్దతి ప్రకారముగా ఆరాధన జరుపుతునే, అయితే ముందుగానే మీకు తెలియవలెనని నేను తలంచుచున్నాను. నేను చెప్పినదేమైనను మీరు అంగీకరించని యెడల అది నా యొక్క అజ్ఞానమని మీరు అనుకొని వదిలేయండి, నాకు అంతకంటె బాగుగా తెలియదని ఊహించుచున్నాను, మరియు నా కొరకు ప్రార్ధించండి.

11కావున ఇప్పుడు, వాక్యములోని ఒక అధ్యాయమును త్రిప్పెదము. ఈ రాత్రి అనేక కార్యములను చూపించాలని ఆశిస్తున్నాను, ఎందుకనగా నా యొద్ద అనేక వాక్యములును, మరియు వాటిని వ్రాసుకొన్న నోట్స్ ఇక్కడున్న నా పుస్తకములో ఉన్నది.

ఇరవై సంవత్సరములకు ముందు లైఫ్ గూడారములోని వేదికను మొట్ట మొదటగా ఎక్కుట జ్ఞాపకమున్నది. అప్పుడు నేను వాక్యములను, పురాణములను వ్రాయించుకొనక్కర్లేదు. అప్పుడు ఇప్పటి కంటె ఇరవై సంవత్సరములు తక్కువ వయస్సులో ఉన్నాను. ఇప్పుడు ఇంకొక ఇరవై-ఐదు సంవత్సరములు దాటియున్నాను, కావున నేను రెండవసారి, కావున (రెండు పాతిక సంవత్సరములు దాటినాడు. అనగా 50 సంవత్సరముల వయస్సు చెందుట), కాబట్టి నేను ముందు జ్ఞాపకముంచుకొనుచున్న విధముగా ఇప్పుడు ఉంచుకొనలేను. నేను వాక్యములను వ్రాసియుంచుకొనవలెను. మరియు కొన్ని సమయములలో దానిని క్లుప్తపరచి, లేక ఇంకొక విధముగా నేను గుర్తించుటకు అనుకూలముగా. మరియు ఇప్పుడు, మనము దేవుని వాక్యము నుండి రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము చదువుచుండగా, ప్రభువు మనలను ఆశీర్వాదించును.

ఆదివారపు పాఠశాల పాఠము వలె ఇప్పుడు నేను బోధించాలను కుంటున్నాను.

12సంఘములో జనులు ఎప్పటి వలె నిలుచుకొని యున్నారని, జెఫర్సన్విల్లో, అందరిని ఈ రాత్రి అభినందించుచున్నాము. మీరు మీ - మీ సంఘములకు ప్రసారము (ఫోన్) ద్వారా జతపరచబడి యున్నారని నాకు తెలియును. మరియు మీరు ఎక్కడున్నను ఈ రాత్రి ఈ సంఘము లోపలయున్నారని, గోడల ప్రక్కన జనులతో కిక్కిరిసి ఇక్కడ ఉన్నట్లు ఏదో కనిపించుచున్నది. ఇప్పుడు దేశములోని ఆ ప్రాంతములలో వర్తమానము కొరకు వచ్చు ప్రజలకు మీరు అదే విధముగా ఉందురని నేను తలంచుచున్నాను.

13ఇప్పుడు దీనిని ఆదివారపు-బడి పాఠమువలె ఉపయోగించబోవుచున్నాము. మరియు ఇది (వర్తమానము) దేనిపైనగాని, ఎటువంటి జనులపై లేక వేరొక దానిపై గురి పెట్టబడలేదు గాని, సంఘమునకు మాత్రము, క్రీస్తు శరీరమునకు , యేసు ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్నదని నమ్ముచు లోతైన తలంపులకు, లోతైన ఉద్దేశ్యములకు మేము నడిపింపవలయునని ప్రయత్నించుచున్నాము. దాని కంటెను అధికముగా మేము నమ్ముచున్నాము. శ్రీవెపోర్ట్ కు నేను మొదటి సారిగా వచ్చిన దానికంటెను అది ఇరవై సంవత్సరములు చేరువలో ఉన్నది. ఓ, అప్పటి నుండి చాలా కార్యములు సంభవించినవి. ఇప్పుడు ప్రభువు, ఈ సంతతిలో వచ్చునని మనము ఎదురుచూచుచున్నాము. నేను మన సంతతిలో పునరుద్దరణ కొరకు ఎదురు చూచుట లేదు. మన సంతతిలో ప్రభువు రాకడ కొరకు నేను ఎదురు చూచుచున్నాను.

ROM 7:1-6

 

14ఇప్పుడు, దేశములోని ప్రతిచోట పలుదిక్కులలో మీరు బైబిలును తెరచి ఉంచుకొన్నారని నమ్మి, మేము రోమీయులకు 7వ అధ్యాయములో చాలా జాగ్రత్తగా చదువవలెనని యున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి వర్తమానము, వివాహము మరియు పరిత్యాగము అను కార్యముపై ఉండేలా కనిపించును. అది నిజముగా అది కాదు. నాకు ఇది ఈ కడపటి దినములలో సంఘముల కొరకైన ప్రవచన. మనము చదివెదము

సహోదరులారా, మనషి బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నాదని మీకు తెలియదా? ధర్మ శాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను.

భర్త గల స్త్రీ, భర్త బ్రతికియున్నంత వరకే ధర్మ శాస్త్రము వలన అతనికి బద్దురాలుగాని, భర్త చనిపోయిన యెడల భర్త వియుషమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును.

కాబట్టి భర్త బ్రతికి యుండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారియనబడును గాని, భర్త చనిపోయిన యెడల ఆమె గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారి కాకపోవును. శాస్త్రము నుండి విడుదల పొందెను,

కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించు నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.

ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మ శాస్త్రము వలనైన పాపేచ్చలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.

ఇప్పుడైతే దేనిచేత నిర్బధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై, ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మాను సారమైన నవీన స్థితిగల వారమై సేవ చేయుచున్నాము.

MATT 4:4•

MATT 5:18•

LUKE 4:4•

REV 22:18,19

 

15మరియు ఇప్పుడు, మనము ప్రార్ధి౦చెదము. ప్రియమైన దేవుడా, దేవుని వాక్యము పవిత్రమైనదని మేము నమ్మి ఇప్పుడు మేము చదివియున్నాము. మరియు దానినే మేము నమ్ముచున్నాము. దీనిలో నుండి అన్నియు నెరవేరు వరకు ఒక పొల్లయినను సున్నయైనను తప్పిపోదు, మురియు ప్రకటన 22వ అధ్యాయములో మన ప్రభువు చెప్పినది మనము నమ్ముచున్నాము. ఎవరైనను వాక్యము నుండి ఒక పదమును తీసివేసిన యెడల, లేక ఏదైన ఒక వాక్యమును కలిపిన యెడల అతని పాలు జీవగ్రంధము నుండి తీసి వేయబడును.

మరియు ఈ వాక్యము తప్పుగా బోధింపబడిన, దానిని మనము చూసి యున్నాము. సాతాను హవ్వకు దానిని తప్పుగా బోధించినందు వలన ఒక్క వాక్యమును ఆమె సందేహపడేలా చేసి, దాని వలన సమస్త మానవ జాతిని గందరగోళములోనికి పడవేసినది. ఒక్క పదము మాత్రమే. అప్పుడు గ్రంధమునకు మధ్యలో మన ప్రభువును మరియు రక్షకుడును వచ్చుటను మనము చూచియున్నాము. మరియు ఆయన మనకు ఈ ఉదాహరణను ఎత్తి, దానిని గూర్చి చెప్పెను. "మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడుగాని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును." అప్పుడు యేసుక్రీస్తు ప్రకటన గ్రంధము చివరగా పవిత్రమైన (భక్తితో కూడిన స్థిరమైన) హెచ్చరిక. "ఎవరైనను ఒక పదము కలిపినను లేక ఒక వాక్యము తీసివేసినను, అతని పాలు జీవగ్రంధము నుండి తీసివేయబడును."

PROV 1:7

 

16ఓ దేవా, మేము ఎంతటి బలహీనులమని తెలిసికొని మరియు చూచుచున్నాము. దుర్బలమైన నశించెడు ఈ జీవితపు త్రాలపై నడుచుచున్నామని తెలిసి కూడా, ఉన్నతముల యందు మీకు బదులిచ్చుటకు ఎప్పుడు మేము పిలువబడుదుమోనని తెలియని ఈ స్థితిలో, ఓ ప్రభువా, మేము మా హృదయములలో ఉన్న ప్రతి వాటిని ప్రక్కకు పెట్టి, మా తలంపులలో ఉన్న వాటిని, ఈ రాత్రి, మీ వాక్యమును మేము తిన్నగా చూడనీ మరియు మీరు వచ్చి జీవ-వాక్యములతో వివరించుము. దీనిని అనుగ్రహించుము.

మీ యొక్క ఆత్మ మాపై కుమ్మరించి, మా హృదయములకు ఆ వాక్యములను అభిషేకించి అనుగ్రహించుము. ఈ సాయంకాలము ఇక్కడ నుండి పోవునప్పుడు ఇప్పటికంటె మెరుగైన జనులుగా పోనిమ్ము యేసుక్రీస్తును ఇంకొంచెము సమీపముగా చూచు అంతర్దృష్టి మాకిమ్ము. దీనిని అనుగ్రహించుము ప్రభువా, మేము జీవించు ఈ దినమును అర్ధము చేసుకొనని, ఈ యొక్క సమయము కొరకు దేవుడు తన జనులను ఏ విధముగా సిద్దపరచుచున్నాడని, మేము జీవించుచున్న ఈ అతి భయంకరమైన చీకటి సమయమును గ్రహించనిమ్ము.

దేవా, మమ్మల్ని అభిషేకించు, ప్రసంగికుడిని మాత్రమే గాక, వినేవారిని కూడా, మరియు మేమందరము మా హృదయములను మీ వాక్యమునకు స్పందింపచేయుము, ఏలయనగా "దేవుని యందలి భయుము సకల జ్ఞానమునకు ఆరంభము." ఈ కార్యములను అనుగ్రహించుము తండ్రీ, యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.

17ఇక్కడ నేను తీసుకొను విశేషమైన కార్యములకు మరియు కొన్ని వాక్యములకు నేను పేరు ఇయ్యవలెనని వెంబడించవలయునని ఇష్టపడుచున్నాను. (వాక్యములను క్షుణ్ణముగా పరిశీలించుట) మరియు ప్రభువు చిత్తమైతే, కృతజ్ఞతలర్పించు వర్తమానమునకు అదృశ్యమైన… "క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత (కలయిక), క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత."

ఇది కృతజ్ఞతలర్పించు వర్తమానము వలె ధ్వనించుట లేదు. ఏ వాక్యము ద్వారానైనను. వీటన్నిటికి మనము కృతజ్ఞలుగా ఉన్నాము. ప్రంచ చరిత్ర ముగించబడు దృశ్యములు కనబడుచున్న ఈ సమయములో నేను జీవించుచున్నందులకుగాను నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నాకు తెలియదు, నాకొక వేళ చెప్పుటకు తరుణము ఉన్నట్లయితే, కనుక ప్రపంచమునకు పునాదులు వేయబడక మునుపు దేవుడు సమస్త కార్యక్రమములను నా ముందు పెట్టి మరి నాతో ఈ విధముగా చెప్పియుండిన, "నీవు ప్రసంగించవలయునని నేను కోరుచున్నాను. మరియు ఇప్పుడు ఏ కాలములో నీవు భూమిపైకి వెళ్ళి ప్రసంగించవలయునని కోరుచున్నాము." నేను ఈ కాలమునే ఎన్నుకొనియుందును, ఎందుకనగా ఇది స్వర్ణకాలము (స్వర్ణ యుగము) అని నేను తలంచుచున్నాను.

ఆయన భూమిని సందర్శించినప్పుడు, ఆ సమయుములో నేను నిశ్చయముగా ఇక్కడ (భూమిపై) ఉండుటకు ఇష్టపడుచున్నాను, అయినప్పటికిని, ఇప్పుడు ఇది ఒక గొప్ప సమయము, ఏలయనగా ఈ సమయములలోనే ఆయన వచ్చి తాను విమోచించిన ప్రజలను తీసికొని పోవుటకు వచ్చుచున్నాడు, పునరుత్దానము సమీపించుచున్నది, మరియు విమోచింపబడిన వారందరు వచ్చెదరు. ఎటువంటి మహత్తరమైన అవకాశము మనము మరణిస్తున్న జనులకు ప్రసంగించవలసిన వారమై యున్నాము. గొప్ప సమయము!

అయితే మనము దీనిని గూర్చి ఉత్సాహముతో ఉన్నాము.

18చరిత్ర ముగించబడపోవుచున్నదని మనకు తెలియును. ప్రపంచ చరిత్ర అతి శీఘ్రముగా ముగించబడబోవుచున్నది. అప్పుడు మనము ఒక నూతన దినములలో అడుగిడెదము, గొప్ప వెయ్యేండ్ల పరిపాలనలో, ఒక విశ్వాసిగా, వెయ్యేండ్ల పరిపాలనను నేను నమ్ముచున్నాను. క్రీస్తు పరిపాలించు ఒక వెయ్యేండ్ల కాలము, భూమిపై ఒక వెయ్యి సంవత్సరములు, యేసు ప్రభువు శరీరకముగా తిరిగి వచ్చి తన రక్తముతో మహిమపరచబడిన శారీరక జనులను తీసికొని పోవును.

ROM 7:3

 

19ఇక్కడ పౌలు లేఖనములయందు గల ధర్మశాస్త్రము మరియు కృప (పాత నిబంధన, కొత్త నిబంధన)లను గురించి వివరించుచున్నాడు. దానిని వివాహము మరియు విడాకులు విధముగా విశధపరచుచున్నాడు. ఈ పాఠ్య భాగము అరుదుగా ప్రసంగించబడుచున్నది, ఎందుకనగా ఇది ఇంచుమించు వివాహము మరియు విడాకులకు సంబంధించినది. అయితే ఇది ఎక్కువ బాగం వివాహము మరియు విడాకులకు సంబంధించినది. ఇక్కడ అతడు ఏ విధముగా క్రమములో పెట్టుటకు ప్రయత్తించుచున్నాడో, మునము ఒక సంఘముగా ప్రపంచమునకు, క్రీస్తుకు ఒకే సమయములో వివాహము కాలేము మరియు దానిని చట్ట ప్రకారము సరి అని చెప్పలేము. అది ఎట్లున్నదనగా, ఒక స్త్రీ జీవించు భర్త ఉన్నప్పుడు ఇంకొక భర్తతో జీవించేలా వున్నది.

దానిపై నాకు నా సొంత అభిప్రాయము వున్నది, మరియు బైబిలు ఏమి చెప్పుచున్నదో అది సత్యమని నమ్ముచున్నాము. ఇప్పుడైతే నేను నమ్ముచున్నాను… గొప్ప మర్మమైన ప్రవచనములను అది బహిరంగపరచుచున్నది. మరియు ఈ రాత్రి దీనిని దేశములో పలుదిశల వేచియున్న ప్రజలకు దీనిని అందజేయుచుండగా ప్రభువు మనకు సహాయపడునని నేను నమ్ముచున్నాను.

EPH 2:8

 

20ఒకసారి చెప్పబడెను… దీనికి నేను పాఠ్యాంశమును వ్రాయుచుండగా నేను దానిని చదివితిని. ఏ పుస్తకములో అని నేను సరిగ్గా జ్ఞాపకముంచు కొనలేదు. అయితే ఇది సరి అని, నాకు తెలుసు. మూడీపై వ్రాసిన ఒకానొక పుస్తకము, చికాగోలో డ్వైత్ మూడీ (చికాగోలో కూడా ఈ రాత్రి గొప్పగా వినుచున్న సంఘము మనకున్నది.) రోమా 7 చదివిన పిదప మూడీ వీధిలో పరిగెత్తుకొనిపోయి, మరియు మొదలు సంధించిన ఆ మనుష్యునితో చెప్పెను, "నీకు కృపను గూర్చి తెలియునా?"

మరియు ఆ వ్యక్తి బదులిచ్చెను, "కృప ఎవరు?"

మూడీ చెప్పెను, "దేవుని యొక్క కృప."

కావున, కృప ఏ విధముగా ధర్మ శాస్త్రము నుండి మనలను వేరు పరచినదో, అది అతనిని పలకరించినది. మరియు ఏ విధముగా ఏదైనా చేయవలయు ననిన.. ఎల్లప్పుడు జనులతో చెప్పుచుందును, ఈ జీవితము వదలి ఆవలి గట్టుకు చేరిన పిదప నేను లేచి నిలువబడి మరియు పాడెదను; "అద్భుతమైన కృప! ఎంతో మధురమైన స్వరము, నాలాటి దౌర్భాగ్యుని రక్షించెను!" కృప, అమూల్యమైన కృప, తెలిసికొనవలసిన అధికమైన కృప, ఏలయనగా కృప వలన మనము రక్షింపబడితిమి. మనము ఏదో చేయబోవుట వలన కాదు, మనము ఏమి… మనము ఏమి చేసినను మనకు లెక్కలోనికి రాదు; కృప మాత్రమే మనలను రక్షించును. "విశ్వాసము ద్వారా కృప వలన మనము రక్షించబడితిమి;"

2JN 1:1

 

21మరియు నేను ఈ స్త్రీకి కృపను, చేర్చుచున్నాను, బైబిలులో ఉన్న ఆమెను కూడా ఎన్నుకొనబడిన గౌరవనీయురాలైన స్త్రీని మిస్ (కుమారి) కృపని చెప్పుచున్నాను. నేను మాటలాడబోవుచున్నాను. మీకు తెలియునా బైబిలు చెప్పుచున్నది, "ఎన్నుకొనబడిన స్త్రీ" మీరు గమనించిన యెడల, "ఎన్నుకొనుట" అనుట "ఎన్నుకొనబడిన మర్యాద గల స్త్రీ" అను పదము నుండి వచ్చినది. తక్కిన అందరు గౌరవింపతగిన స్త్రీలలో నుండి ఒకే ఒక స్త్రీ ఎన్నుకొనబడినది. ఎట్లనగా కన్యక దేవుని యొక్క శరీరమును భూమిపై తెచ్చిన విధముగా, ఆమె ఎన్నుకొనబడిన స్త్రీ, దేవుడు మరియను ఎన్నుకొనెను. మరియు అట్లే దేవుడు స్త్రీని ఎన్నుకొనెను. అదే ఆయన వధువు. ఆమె ఎన్నుకొనబడినది. ఈ దేశము నలుదిశలను మనము దానిలో (ఎన్నుకొనబడిన వధువులో) సభ్యులమని నేను నమ్ముచున్నాను.

22ఇక్కడ వివరించబడిన విధము వధువుకు క్రీస్తుతో గల సంబంధము చూపించుచున్నది. ఎన్నుకొనబడిన స్త్రీ, మరియు ఆమె ఏ విధముగా ఆయన యొద్ద తీసికొనిరాబడును, ఆమె ఎక్కడ నుండి వచ్చును, మరియు ఏల ఆమె ఆయన యొద్దకు తీసికొనిరాబడును. ఇక్కడ కానవచ్చుచున్న సంఘము ఏ విధముగా వివరించబడుచున్నదనగా ఒక స్త్రీతో ఉదాహరించబడియున్నది. ఒక స్త్రీ ఎల్లప్పుడు సంఘమునకు మాదిరిగా ఉన్నది, ఎందుకనగా సంఘము వధువుగా ఎంచబడినది, ఒక వధువుగా ఆమె దేవకుమారుడు ప్రభువైన యేసు యొక్క వధువు.

23ఎల్లప్పుడు, మీరు గమనించిన, స్త్రీల యొక్క నడతను, పరిస్థితులను గమనించుడి, మరియు మీ సంఘము ఎట్లున్నదో చూడగలరు. ఇప్పుడు, ఇది. ఈ యొక్క వ్యాఖ్యలు మీలో కొంత మందికి ఆశ్చర్యకరముగా అగుపించవచ్చును, అయితే ప్రభువు యొద్ద నుండి నేను పొందిన దానిని జనులకు చెప్పుటకు నేను ప్రయత్నించుచుండగా ఇది సహాయకరముగా ఉన్నది. చూశారా, సహజముగా అన్ని కార్యములు ఏ విధముగా జరుగుచున్నవో మీరు గమనించండి — ప్రకృతి — మరియు దానిని గమనించండి. అది ఆత్మీయ కార్యములతో సత్యముగా నడచును.

ఇప్పుడు, ఈ రోజు ప్రపంచములోని స్త్రీల యొక్క నడతను మీరు చూచిన యెడల, ప్రపంచపు సంఘముల యొక్క నడతను ఈ రోజు గమనించండి. ఊరకే గమనించండి. ఆత్మీయ వధువు యొక్క నడత కూడా ఇక్కడ యున్నది, సంఘము, చూశారా. దానిని కూడా గమనించండి, ఎందుకనగా సహజముగా, పిలువబడుచున్న వారు, వధువని చెపుకొనుచున్నారు.

24ఇప్పుడు, దయచేసి స్థానిక సంఘమునకు మరల నేను చెప్పుచున్నాను: ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు. నేను మాట్లాడుచున్నది దేశములోని పలు వసూలలో ఉన్న నేను అనుకొనుచున్న ఎన్నుకొనబడిన స్త్రీకి. ఇక్కడ సువార్త సేవకులు వున్నయెడల, అంగీకరించకపోయిన, మంచిది, మీరు కొద్దిసేపు ఊరకుండుడి.

కొంచెం ఆలకించండి. ఈ యొక్క స్వభావమును గమనించండి. మీరు స్త్రీలు తమ ఇష్టమొచ్చిన విధముగా, వారు అనుకొనినదానినంతటిని చేయుటను మీరు చూచిన యెడల, గమనించండి, సంఘము అదే విధముగా చేయును. గమనించండి. అయితే గమనించిన, ఆత్మీయ వధువు ఒక పునరుద్ధరణతో, మొదలుపెట్టి మరల తిరిగి వచ్చి దేవుని వాక్యముతో నిలిచిన యెడల, మరల గమనించండి, మీరు చూశారా, ఏ విధముగా ఆ లేఖనములు, ఆ సమయములో వధువును పట్టుకొనుటకు ఒక వర్తమానము వేగముగా తీసికొని రాబడును. ఎన్నుకొనబడిన ఆ స్త్రీని పట్టుకొనుటకు, అయితే ప్రపంచములో… మోసగాడైన సాతాను, ఆ సాతాను ఆయన వాక్యమును నమ్మకుండా ఉండేలా చేసి మొదటి వధువును వంచించి దేవునికి విరోధముగా ఇప్పుడు పాపము చేయలాగున చేసేలా చేశాడు.

25మరియు ఇప్పుడు, ఈ రోజు మనము చూచుచున్నాము, సంఘము సహజమైన మీ యొక్క జ్ఞానముతో నిండిన సువార్తతో, వాక్యమునకు ఇంకనూ దూరముగా పోవుచున్నారు, "సాంఘికమైన సువార్త"లో ప్రపంచములో స్త్రీలను వీధులలో ఉంచుటను మనము కనుగొనేలా, సభ్యులు అదే విధమైన వాతావరణములో కొనిపోబడుచున్నారు. వారికి మీరు ఏమియు చెప్పలేరు. వారు సాధారణ మర్యాదను పోగొట్టుకొని యున్నారు, ప్రజలు కోల్పోయారు. మరియు సంఘము అదే మార్గములో ఉన్నది. మురియు ఆ సంఘములన్నియు ప్రపంచములో ఏదైనను ఎంత నిశ్చయుముగా జరుగునో అదే విధముగా తిన్నగా ప్రపంచ సభకు వెళ్ళి (ఎకనామికల్ కౌన్సిల్), మరియు తిన్నగా ఎంత తీవ్రముగా పోవలయునో అంత వేగముగా రోమ్ కు పోవుచున్నది, చూచారా. ఎందుకనగా ఇది ప్రవచింపబడెను, మరియు ఆమె అక్కడ వున్నది. అది ఆమె యొక్క నడత.

26అయితే మరల ఆత్మీయ సంఘములను గమనించండి, ఏ విధముగా ఆ "పిలువబడిన" జనుల గుంపు, ప్రతి ఒక్కొక్క రివైవల్ ద్వారా ఎన్నుకొనబడిన జనులు. మార్టిన్ లూథర్, సంఘ సంస్కారణములో అదే విధముగా జరిగినది. జాన్ వెస్లీ కాలములో అదే విధముగా జరిగినది. పెంతెకోస్తు మొదలు ఆరంభమైనప్పుడు అదే విధముగా జరిగినది. స్త్రీలను వాక్య ప్రకారము ఉండేలాగ వారు చేసిరి, మరియు అటు పిదప వారు దాని నుండి తొలగిపోయిరి. అక్కడ ఆమె మరలా గందరగోళములోనికి పోయిరి. అయితే జనులు మళ్ళీ సరిదిద్దు కొనుటకు సిద్దపడుచున్నారు, ఒక వర్తమానము వచ్చుచున్నది, మరియు వారు దానితో క్రమపడుదురు.

27ఒక రోజు నీతిమంతుడుగా తీర్చబడును లూథర్ వర్తమానికుడు మరియు సంఘము దానితో నిలిచెను, వారిలో కొందరు మాత్రమే, తక్కిన వారు యధాప్రకారమే కొనసాగిరి, పరిశుద్ద పరచబడుటతో, వెస్లీ వచ్చెను. సంఘము దానితో నిలిచెను, వరములను తిరిగి పొందులాగున పెంతెకోస్తు వచ్చెను, సంఘము దానితో నిలిచెను, ఆ రోజు ఎన్నుకొనబడిన వారు, అటు పిదప కానరాక పోయిరి, వారు సంఘ శాఖలకు మరలి పోయి తక్కిన వారివెంట వెళ్ళి ఆ విధముగా నిలిచిరి.

28ఇప్పుడు, అయితే మీరు గమనించిన యెడల జనులు వాక్యముతో నిలుచుటకు ఆరంభించినప్పుడు దేవుని వాక్యము నుండి, తాజా వర్తమానము నేరుగా జనులకు వచ్చి ప్రతిసారి వర్తమానము సరిగా (జనులను) నిలబెట్టుచున్నది, ఇది దేవునిలో యున్నది. మనకు అది యున్నది.

మనకు కుటుంబములు ఉన్నవి. ఇక్కడున్న ప్రతి కుటుంబము దానికి అలవాటై యున్నది. కొన్ని సమయములలో అన్నియును సంవత్సరము కొలది చక్కగా మీకు ఉండును. అయితే ఉన్నట్టుండి మీరు ఒక సమయము మీకు వచ్చును, దక్షిణ ప్రాంతములో మేము అనేక పర్యాయములు దీనిని చెప్పెదము, "వర్షము వచ్చునప్పుడు అది కుమ్మరింపబడును" మరియు అన్నియును తప్పిదముగా జరుగును. మీరు రాత్రి సమయములో నడచుచున్నారు. తిరిగి పగలు వచ్చును; మరల రాత్రి సమయము. ప్రతి ఒకటి కొనసాగింపుగా జరుగుచునే యున్నది.

ROM 7:2,3

 

29ప్రవక్తయైన పౌలు చెప్పుచున్నాడు, స్త్రీ తన భర్త చనిపోవు వరుకు తిరిగి వివాహము చేసికొన కూడదు. ఆమె యొక్క మొదటి భర్త జీవించు కాలము వరుకు ఆమె తిరిగి వివాహము చేసికొనకూడదు. ఆమె ఎటువంటి పరిస్థితులలోనైనను, ఆమె ఒంటరిగా ఉండవలసినదే. ఆమె భర్త జీవించు వరకు. మరియు ఆమె అటువంటి పాపము చేసిన యెడల ఆమె వ్యభిచారిణి అని పిలువబడును. నేను సహజముగా జీవితములో జరుగు కార్యములను ఇప్పుడు ఆత్మీయ కార్యములతో పోల్చుచున్నాను. మరియు ఈ స్త్రీ ఇటువంటి పాపము చేసిన యెడల అప్పుడు ఆమె వ్యభిచారిణిగా గుర్తింపబడును, అట్లయిన యెడల జీవించుచున్న ఇద్దరు భర్తలు ఆమెకు ఒకే సమయములో ఉందురు. అందువలన ఆమె దేవుని యొద్ద తనకు గల హక్కును పోగొట్టుకొనెను, అట్లు చేయుట వలన పరలోకమునకు కూడా తనకు గల హక్కును పోగొట్టుకొనెను. నిశ్చయముగా ఆమె పోగొట్టుకొనెను. ఇప్పుడు నేను చదివిన వాక్యము ప్రకారము ఆమె దేవుని యొక్క కార్యక్రమము నుండి త్రోసి వేయబడినది.

30అదే విధముగా సంఘము ఉన్నది, ఆమె సంఘ శాఖలను, తెగలను దేవుని వాక్యముతో కలిసినపుడు ఆమె సంఘ శాఖకు వివాహము కాబడి అదే సమయములో క్రీస్తుకు వధువుగా ఉండజాలదు. ఆమె ఏదైనా ఒకదానికి చనిపోవలసినదే. ధర్మశాస్త్రము ఇక్కడ ఈ విధముగా చెప్పుచున్నది. దేవుని వాక్యములో అనేక చట్టములు ఉన్నవి, మరియు అదే ఆయన చట్టము. పౌలు అదే కార్యములను ఇక్కడ మాటలాడుచున్నాడు. ప్రపంచ శాఖలకు చెందిన సంఘమును ఆమె వివాహము చేసికొని ఆమె క్రీస్తుకు వధువుగా ఉండజాలదు, ఏలయనగా ఆమె… ఒకదానికొకటి విరుద్దముగా ఉన్నది.

ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, మీరు చెప్పెదరు, "సరి, మేము దీనిని నమ్మెదము, కాని దానిని మేము నమ్మము."

JOHN 1:1,14

 

31మీరు గనుక క్రీస్తుకు వివాహముకాబడియున్నయెడల, క్రీస్తు దేవుని యొక్క వాక్యమై యున్నాడు, పరిశు. యోహాను ఒకటవ అధ్యాయుము చెప్పుచున్నది, "ఆది యుందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను." మరియు అదే వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. క్రీస్తు జీవించు వాక్యముగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు వాక్యమై యున్నాడు, ఆయన ఇంకను వాక్యమై యున్నాడు, ఆయన ఎల్లపుడు వాక్యముగా ఉండును.

ఆయన దేవుని యొక్క స్వభావము లేక గుణముల ప్రత్యక్షతై యున్నాడు, ఏలయనగా అతడు దేవ కుమారుడు, మరియు ఏ కుమారుడైనను తన తండ్రి యొక్క స్వభావముగా ఉన్నాడు. మరియు ఏ విధముగా మీరు మీ తండ్రి యొక్క జన్యువులో ఉన్నారో. మీ తండ్రి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మీరు అతనిలో ఉన్నారు. మీరు ఆయన లోపల ఉన్నారు, అయినను ఆయన మీతో సహవాసము చేయలేడు, ఎందుకనగా అతడు మిమ్ములను ఎరుగడు. అయితే మీ తల్లి యొక్క గర్భము అనే నేల వలన మీరు భూమిలోనికి తేబడి మరియు మీ తండ్రి యొక్క ప్రతిబింబమై ఉన్నారు, అప్పుడు అతడు మీతో సహవాసము చేయగలడు. మరియు అందువలన, మీరు దేవుని కుమారులును, మరియు దేవుని కుమార్తెలు (ఎప్పటి నుండి అనిన) చంద్రుడు, నక్షత్రములు లేక చిన్న చిన్న అణువుల కంటె మునుపే మీరు దేవుని కుమారులును, కుమార్తెలై యుండిరి. ఆదిలో దేవునిలో ఉండిన గుణాలక్షణముల శరీర ప్రత్యక్షతయే మీరై యున్నారు. నిత్య జీవము యొక్క రూపము ఒక్కటే ఒక్కటి, మరియు మీరే అదే అయి యున్నారు. మునుపు నుండి మీకు దాని గురించి ఏమియు తెలియదు; మీ తండ్రి శరీరములో ఉన్నప్పుడు కూడా మీకు దానిని గురించి తెలియదు. అయితే ఆయన రూపములో మీరు ప్రత్యక్షపరచబడిరి. దేవుని స్వరూపమ౦దు మీరు నిర్మించబడినారు, మరియు దేవుని మహిమ కొరకు ఆయన సహవాసము కొరకే మీరు ప్రత్యక్షపరచబడి.

మరియు ఏ విధముగా మీ శరీరక జన్యువులు మీ సహజ జన్మకు ముందు మీ తండ్రిలో ఉన్నవో, మీ ఆత్మీయ జన్యువులు దేవునిలో ఉండియుండవలయును, ఏలయనగా మీరు ప్రపంచమునకు పునాది వేయబడక ముందు ఆయన యొక్క తలంపులలో ఉన్న గుణాతిశయములు లేక స్వభావముల యొక్క బయల్పాటే. వేరే ఏ మార్గము లేదు. అది సరియే.

GEN 3:4•

MATT 15:6•

MARK 7:13

 

32ఇప్పుడు, మీరు గమనించిన: అప్పుడు ఆ జీవము మీలో ఉన్నందున, ప్రపంచమునకు లేక భూమికి పునాదులు వేసినప్పటి నుండి దేవుని యొక్క జీవము మీలో ఉన్నందున… ఇప్పుడు మీరు సంఘశాఖలను, తెగలను వాక్యముతో చేర్చలేరు, ఎందుకనగా ఆ సంఘశాఖలే ఒకదానికొకటి వేరుపడియున్నవి. సరిగ్గా తన లోక జ్ఞానముతో హవ్వ యెడల తన తెలివిని ఉపయోగించెను. అతడు చెప్పెను… అతడు, దేవుడు దానిని చెప్పినాడని ఒప్పుకొనెను, అయితే "నిశ్చయముగా మీరు చావనే చావరు," అని చెప్పెను. చూచారా, మరియు వారు దానిని నమ్మిరి, మరియు అటువంటి కార్యమునే సంఘశాఖలు ఈ రాత్రి చేసినవి. సంఘశాఖ, జనులను దేవుని వాక్యము నుండి వేరు పరిచినది. యేసు చెప్పలేదా ఆయన వచ్చినపుడు, "మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు." మరియు మున సంఘశాఖల వలన మన సంతతిలో అల్లబడిన దేవుని వాక్యమును అభిషేకించు పరిశుద్దాత్మ యొక్క సహవాసమునకు దూరముగా పోవుచున్నాము. దానిని చూచుటకు వీలుకాకుండ జనులను సంఘశాఖల ద్వారా వేరు పరచియున్నాడు. ఇప్పుడు దేవుడు — ఆయన ప్రతి ఒక్కొక్క సంతతిలోను ఆయన పుస్తకములో, ఒక నూతన భాగము ఆయనకు కలదు. నా శరీరము నిర్మించబడినపుడు అన్నియు ఒక్కటిగా కూడివచ్చును. వెన్నెముకతో మొదలిడెనని నాకు చెప్పబడియున్నది. అయితే అదంతయు వెన్నెముక కాదు. అక్కడ నుండి అది పక్క ఎముకకు పోవును, మరియు ఊపిరి తిత్తుల నుండి, మరియు చేతులకు, కాళ్ళకు ఆ విధముగా అన్నియు జతపరచబడి నేను ఇప్పుడున్న విధముగా (పరిపూర్ణ శరీరముగా) వచ్చును.

33మరియు దేవుడు కూడా ఆ విధముగానే ఆదిలో బయలుపరచబడెను మరియు చివరగా ఆయన యొహోవాగా కనబడెను. తండ్రియెన దేవుడు అటు పిమ్మట దేవుడు కుమారుడుగా యేసు క్రీస్తులో కనబడెను. ఇప్పుడు దేవుడు పరిశుద్దాత్మగా కనబడెను, అదే దేవుడు అన్ని కాలములలోను మారని దేవుడు, ఒకే దేవుని మూడు ప్రత్యక్షతలు.

ఇప్పుడు మనము ఇక్కడ చూచుచున్నాము ప్రతి ఒక్కొక్క సంతతిలో దేవుడు ఆది నుండి తన వాక్యమును ఒక్కొక్క సంతతికి భాగించుచు వచ్చెను, సృష్టి అంతయు విస్తరించిన విధముగా, ఆ విధముగా… దేవుడు సృష్టించిన మొదటి కార్యము ఏదనగా… మనము ఈ విధముగా చెప్పెదెము. అతడు మొదట వృక్ష జాతిని సృష్టించెను, పిదప జంతు జీవములను సృష్టించెను, అటు పిమ్మట మనుష్య జీవమును సృష్టించెను. ఒక విధమైన విస్తరింపజేయుట, పైకి విస్తరించుచుపోవుట.

కావున ఆ విధముగానే దేవునిలో ఆయన సంఘములోను; లూథర్ క్రింద నీతిమంతులుగా తీర్చబడులు, (ఇప్పుడు ఆ కార్యము ఆయన వధువును బయటరీకి లాగుట, ఆయన తన వధువును సృష్టించుచున్నాడు), లూధరు క్రింద నీతిమత్వము, వెస్లీ క్రింద పరిశుద్దపరచబడుట, మరియు ఆ విధముగా, చూశారా. ఆయన… ఆత్మ అధికధికముగా విస్తరింప చేయబడుచున్నది, ఎందుకనగా శరీరము కట్టబడుచున్నది, శిరస్సు దగ్గరకు వచ్చే సరికి, అదే క్రీస్తు. క్రీస్తు యొక్క శరీరము.

ROM 3:4•

ROM 7:3

 

34ఇప్పుడు, ఆమె ఒక స్త్రీగా, ఆమె వాక్యమైన క్రీస్తుకు వివాహము చేయబడి యున్న అదే సమయములో ఆమె సంఘశాఖలకు వివాహము చేయబడ లేదు, ఏలయనగా ఆమె దీనికి బద్ధురాలై యున్నది. వీరిరువురు ఒకరికొకరు విరుద్దముగా యున్నారు. ఒకటేమో దేవుడు పంపియున్నాడు; మరొకటి మనుష్యుడు తయారు చేసినది. కావున వారు విరుద్దముగా వున్నారు. అతడు చెప్పెను, "ప్రతి మనుష్యుని మాట అబద్దము, కాని నా యొక్క మాటలు సత్యము." దేవుడు దానిని చెప్పెను. ధర్మశాస్త్రము, కృపకు ఏ విధముగా ఉన్నదో, ఆ విధముగా ఒకరికొకరు విరుద్దముగా ఉన్నారని ఇక్కడ పౌలు చెప్పుచున్నాడు.

వేరొకటి కావలయుననిన ఒకదానికి మరణించవలసినదై యున్నది. మరియు ఆమె కనుక వాటిని కలుపుటకు ప్రయత్నించిన యెడల ఆమె వ్యభిచారిణి అని పిలువబడును. ఓ దీనిని తలంచి చూడుడి, న్యూయార్కు, ఆరిజానో, దేశము నలుమూలల దీనిని తలంచి చూడుడి! దేవుడు చెప్పెను, ఆమె ఒకే సమయములో ఇరువురిని వివాహము చేసికొనుటకు ప్రయత్నించిన యెడల ఆమె వ్యభిచారిణి అని పిలువబడును. ఏ వ్యభిచారిణి పరలోకమునకు ప్రవేశింపగలదు? దేవుడు ఒక వ్యభిచరించు దానిని వివాహమాడునా? నిశ్చయముగా కాదు. అతడు మనలను ఆ కార్యము చేయవద్దని చెప్పాడు. ఆమె ఒక వ్యభిచరించు స్త్రీగా పిలువబడును.

2TIM 3:5•

REV 3:16

 

35మరియు ఆమె బిడ్డలు, ఆమె వ్యభిచారిణియైన ఎడల, ఆమె బిడ్డలు అక్రమ సంతానము. అక్రమము. దేనికి అక్రమము? సంఘమునకు కాదు గాని, దేవుని వాక్యమునకు. ఆమె అక్రమమైనది.

ప్రకటన 3వ అధ్యాయము లవొదికయ సంఘ కాలము ఈ కడపటి కాలములో ఏ విధముగా చిత్రీకరింపబడియున్నది. ఎటువంటిదీ విరుద్దమైన ఒక గుంపు. ఎటువంటిదీ సంఘ శాఖల కలయిక, గోరు వెచ్చగా ఉండుచు, దానినే కొనసాగించుచు, క్రైస్తవులని పిలుచుకొనుచు మరియు దేవుని వాక్యమును నిరాకరించుచున్నారు. "పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు," వారు ఆ విధముగా ఉందురని ప్రవక్త చెప్పెను.

36వివాహము ప్రపంచములో పురాతనమైన ఒక నియమింపబడిన కార్యము. వివాహము మొట్టమొదట ఏదెను తోటలో జరిగించబడి అక్కడే ఏర్పచబడెను.

ఒక స్త్రీకి కొన్ని గుణాలక్షణములు అప్పగింపబపడెను. ఆమె అపవిత్ర పరచుకొన కూడదు. ఆ కార్యమునకు ఒక స్త్రీ నమ్మబడెను. భూమిపై ఒక స్త్రీవలె ఏ సృష్టి లేదు. ఒక ఆడ కుక్క, స్త్రీకి అప్పగింపబడిన విధముగా గుణా లక్షణములు ఏ ఆడ జాతికి అప్పగింపబడ లేదు. ఒక స్త్రీ సృష్టి యొక్క ప్రారంభములో లేనేలేదు, ఎందుకనగా దేవునికి తెలుసును ఆమె పడిపోవునని. ఇతర ఆడ జాతి వ్యభిచారము చేయలేరు. ఆమె ఒక్కటే వ్యభిచారము చేయ గలదు. ఆమె మొట్టమొదటగా ఉత్పత్తి చేయబడి యుండిన యెడల, దేవుని యొక్క జ్ఞానము మెచ్చుకొన తగినదిగా ఉండెడిది కాదు. చూశారా, ఒక నరుని నుండి చేయబడిన ఉపసృష్టి ఆమె ఆ ప్రక్కగా త్రోసివేయబడినందు వలన, విమోచింపబడుట కొరకు దేవుని యొద్ద నుండి ఆమెకు ఒక పవిత్రమైన బాద్యత ఇవ్వబడెను. ఆమె అపవిత్ర పరచుకొనకుండా ఉండుటకు ఆమె కొన్ని గుణాలక్షణములు కలిగి యున్నది. ఆమె వాటిని మీరిన యెడల జీవితాంతము ఆమె అపవిత్రురాలుగా ఉండును. ఆమె ఎంతగా క్షమింపబడినప్పటికిని ఆమె నీతిమంతురాలుగా తీర్చబడదు. దానిని కొంచెము విశదీకరించెదను. ఇంకా కొద్ది నిమిషములలో దానిపై వాక్యములు నా యొద్ద ఉన్నవి. ఆమె అపవిత్రురాలైనందులకు ఆమె మన్నింపబడ వచ్చును. అయితే ఆమె ఈ జీవితములో నీతి మంతురాలుగా కానేరదు. అదెల్లప్పుడు ఆమెతో ఉండును. ఇప్పుడు గమనించండి, ఆమెకు ఇది ఇవ్వబడెను. ఆమె మన్నింపబడ వచ్చును, అయితే నీతి మంతురాలుగా తీర్చబడదు.

37దేవుని యొద్ద నుండి ఆమె శరీరమునకు పవిత్రమైన బాద్యత ఇయ్యబడెను. ఆడ కుక్కలు కాదు, పక్షికి కాదు, ఏ జంతువుకు కాదు, ఏ ఇతర సృష్టికి లేదు, ఆ విధముగా లేదు. ఆమె ఒక్కతే, ఆ కారణము వలననే, పవిత్రముగా ఉండవలయునన్న బాధ్యత ఉన్నందు వలననే భూమిపై జీవమునిచ్చు పని ఆమెదే. ఆమె శరీరము జీవము నిచ్చు భూమి వలె యున్నది. అందువలననే ఆమెకే అటువంటి పవిత్రమైన బాధ్యత ఇయ్యబడెను.

ఇక్కడ మీరు, అనేక వేదాంతులు అంగీకరించక పోవచ్చును. ఆదిలో జరిగిన వ్యభిచారమే మానవ జాతినంతటిని అపవిత్రపరచెను. ఆమె గర్భమనే భూమి చెడగొట్టబడెను. ఆమె కవల పిల్లలను కనెను. కయీను, హేబెలు. ఒకే క్రియ, ఇద్దరు బిడ్డలు. లేఖనములను వెదకుడి.

38ఇక్కడ గమనించిన, ఆమె శరీరము ఒక భూమి అనే పాన్పుగా ఉన్నదని మనము చూచాము. మరియు అందువలననే దానిని అపవిత్రపరచకూడదనే పవిత్రమైన బాధ్యత ఉన్నది.

ఇప్పుడు, నేను మాటలాడుచున్నాను, సంఘము ఏ స్థానములో ఉన్నదని ఉదాహరణములతో మీకు తీసికొనివచ్చుచున్నాను. నేను మిమ్మల్ని స్త్రీలను గురించి మాటలాడుట లేదు, మీరు ఎట్లున్నను అది మీకు, దేవునికి మధ్య లేక మీకు పురుషులారా, అయితే నేను క్రీస్తును గురించియు, సంఘమును గురించియు మాటలాడుచున్నాను.

ఇప్పుడు, దేవుడు అనుగ్రహించు జీవమును బయటికి తెచ్చుటయే ఆమెకు ఇయ్యబడెను. ఆమె భర్త భీజమును కలిగి యుండవచ్చును, అయితే దేవుడే ఆ జీవమును ఉత్పత్తి చేయవలెను. అది సరియే, అది రావలసి యున్నది… సమస్త జీవము దేవుని యొద్ద నుండి రావలసి యున్నది. ఏ ప్రాణమైనను దేవుని యొద్ద నుండి రావలసి యున్నది. అది తారుమారు చేయబడెను, మరియు అదే పాపమాయెను, అయితే జీవము అనునది దేవుని యొద్ద నుండి రావలసియున్నది. అతడే జీవమునకు కర్త.

ఇప్పుడు, ఆమెకు ఒక పవిత్రమైన… ఒకటి.

MATT 1:19,20

 

39ఆమె తొలగిపోకుండా నుండు మూడు కార్యములను, నేను చెప్పాలనుకుంటున్నాను, సహజమైన స్త్రీకి మాటలాడుచుండగా, సంఘమును గుర్తుంచుకొనుడి, పౌలు ఇక్కడ రోమా 7వ అధ్యాయములో చెప్పినట్లు. ప్రభువు వలన ఆమె కియ్యబడిన పవిత్రమైన సద్గుణము ఆమె విశ్వాసముగా ఉండవలసి యున్నది — ఒక స్థిరమైన సద్గుణము. వేరే ఎవ్వరు దానిని కాపాడలేరు. అయితే స్త్రీ కాపాడును. అది సరియే. దేవుని వలన అది ఆమెకు అప్పగంపబడినది. ఆమె ఆ సద్గుణమును అపవిత్ర పరచకొనకూడదు. ఒక వేళ ఆమె ఏదైనా తప్పు చేసిన యెడల ఆమె తన భర్త ఆమెను చేర్చుకొను లోపల ఆ తప్పును ఒప్పుకొనవలయును. మరియు దానిని సరి చేసుకొనవలయును. అది ఎట్లనిన ధర్మశాస్త్రమునకు వివాహము చేయబడిన సంఘము రెండవ వివాహమునకు మునుపు క్రీస్తుకు ముందు వచ్చి ఆమె దానిని ఒప్పుకొనవలసి యున్నది. ఒక వేళ ఆమె అట్లు చేయక తన భర్తతో 10 సంవత్సరములు జీవించి మరల అప్పుడు దానిని ఒప్పుకొనిన, ఆ స్త్రీకి విడాకులు ఇచ్చి మరల ఇంకొక స్త్రీని వివాహమాడుటకు అతనికి అధికారము కలదు. అదే వాక్యము. జారత్వము లేక వ్యభిచారము అసహ్యమైన కార్యము.

"యోసేపూ, నీ భార్యయైన మరియను చేరుకొనుటకు భయపడకుము: ఆమె గర్భమున ధరించినది పరిశుద్దాత్మ వలన కలిగినది." ఆమెతో ప్రధానము చేయబడిన తరువాత, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. నీవు ఆమెకు ఒక ప్రధానము చేయబడిన యెడల, దేవునికి సంబంధించినంత వరకు, నీవు ఆమెకు వివాహము కాబడియున్నావు.

40గమనించండి. దేవుడు, ఆమె కియ్యబడిన ఒక పవిత్రమైన కాపాడుకొనవలసిన సద్గుణము ఆమెకు కలదు, దేవుడు ఆ శీలమును ఆమెకు ఇచ్చియున్నాడు. ఏదేను తోటలో జరిగిన విధముగా ఆమె "ఔను" లేక "కాదు" అని చెప్పవచ్చును. ఆమె కాపాడుకొనవలసిన ఒక పవిత్రమైన స్త్రీత్వము ఆమెకు అప్పగింపబడియున్నది. దానిని ఆమె భంగపరచకూడదు. స్త్రీత్వమని ఇక్కడ నేను చెప్పునది, ఆమె యొక్క నడత, పురుషుల యెడల ఆమె యొక్క గుణము. ప్రతీ పురుషుని అనుమతించక………

41వెండి తెరపై సినిమా తారలు ముద్దు పెట్టుకొనుచు, హత్తుకొనుచు, ఒయ్యారముగా వుండెలా, మరియు ఇటువంటి సినిమా స్త్రీల చుట్టూ వుందురు. ఒక స్త్రీ అట్లు చేసిన ఆమె చెడు గుణము గల స్త్రీ. తన హృదయములో, ఆమె శీలవతిగా ఉండవచ్చును. ఆ గ్రంధులు, పెదవులలో కామ గ్రంధులు కలవు. ఒక పురుషుడు ఒక ముద్దాడినప్పుడు, అతడు నిజముగా (శారీరకముగా కలియకున్నను) అతడు వ్యభిచారమును చేసియున్నాడు.

ఉద్రేక (కామ) గ్రంధులు స్త్రీల పెదవులలోను మరియు పురుషుల పెదవులలోను ఉన్నవి. అతడు ఆమెను చేతిపై ముద్దాడవచ్చును. అది ఆ గ్రంధులను కలుపవు, అయితే కామ గ్రంధులు పెదవులలో ఉన్నవి. కావున చూడండి ఈ వెట్టి పనులు, ఈ రోజులలో హాలివుడ్ (సినిమా) ఒలకబోయుట, స్త్రీల చుట్టూ తిరుగుట మరియు ఆలాంటి కార్యములు, పడుచువారు వీటన్నింటటిని చూచుచున్నారు. మన యొక్క నీతి క్రుళ్ళిపోయి, క్షీణించి మరియు అసహ్యముగా ఉందనుటలో ఆశ్చర్యము లేదు. ఎందుకనగా అవి (ఆ కార్యములు) బిడ్డల ముందు పెట్టబడినవి. అది కడపటి దినములలో ఆ విధముగానే ఉండును.

42ఇప్పుడు, సంఘమును తలంచి చూడండి. ఆమె (సంఘము) వాక్యము తప్ప మిగతా వాటి చుట్టూ ఉన్న కార్యములను ముద్దు పెట్టుకొనుచు, మరియు ఒయ్యూరము ఒలకబోస్తు అన్నిటితో కలిసిపోవుచున్నది. సాతానును అనుమతించుచు మరియు విద్యను మరియు విజ్ఞాన పరిశోధనలను మరియు ఆ విధముగా. మరియు విజ్ఞాన విద్యయు, అన్ని కార్యములను పూర్తిగా దేవునికి విరుద్దమైన కార్యములు.

ఇప్పుడు మనకు ఉన్న నవ నాగరికత విధానములన్నియు పూర్తిగా క్రీస్తుకు విరోధమైనది, చదువు యొక్క విధానము క్రీస్తువిరోధి, నాగరికత క్రీస్తువిరోధి, దేవునికి అది విరోధమైనది. మీరు నాగరికతకు విరోధముగా చెప్పుచున్నారా, ఒకానొక రోజులలో దేవునికి ఒక నాగరికత వుండును, దానికి మరణముతో సంబంధ ముండదు.

ఈ నవీన నాగరికత సాతాను వలన కలిగినది. బైబిలు నుండి ప్రభువు చిత్తమైతే ఈ రాత్రి నేను దానిని మీకు నిరూపించెదను. ఈ కార్యములన్నియు సాతానువి. మన క్రొత్త నాగరికతలో ఈ కార్యములన్నియు ఉండవు.

ఆమెకు ఈ పవిత్రమైన స్త్రీత్వము కలదు.

MATT 5:28

 

43స్త్రీలు ఆ విధముగా చేయుటవలన పురుషులు స్త్రీలతో ఆ విధముగా మెలగుట ఆశ్చర్యపడే కార్యము కాదు. ఎందువలననగా పరుషులు ఆ విధముగా చేయుటవలన స్త్రీలు పురుషులతో ఆ విధముగా మెలగుచున్నారు. ఆమె చర్మమునకు అంటుకొనిన, ఒక జత పొట్టి దుస్తులతో తన గుణమును బయట చూపించుకొనుచున్నది మరియు పురుషుల యొక్క దుస్తులు మరియు ఇతర కార్యములను వీధులలో ప్రదర్శించుకొని, వక్రముగా తిరుగుచున్నారు. ఆమె ఏమి చెప్పినను అది లెక్కలోనికి రాదు. ఆమె భర్తకు ఆమె శీలవతిగా ఉండవచ్చును. అయితే దేవుని దృష్టిలో ఆమె ఒక వ్యభిచారిణి. "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును," మరియు ఆమె ఆ విధముగా తన్ను కనుపరచుకొనెను. మరియు సరిగ్గా అదే విధముగా సంఘము ఈ ప్రపంచముతో చేసెను.

44గమనించుము, అవి అప్పగింపబడినవి ఆమెకు పవిత్రమైన శీలము, పవిత్రమైన స్త్రీత్వము, మరియు పవిత్రమైన మాతృత్వము… తన భర్తను గౌరవించుట.

ఈ రోజులలో చూడుడి. కొన్ని నగరములలో, అనేక నగరములలో పెద్ద సాంఘిక వినోద విందులు జరుపుదురు — సంఘస్తులు కూడా అక్కడ కూడెదరు — వారి టోపీలను నేలపై పెట్టెదరు, మరియు వారు బాగుగా త్రాగి, వారి తాళపు చెవులను ఆ టోపీలలో అతికించెదరు; (దానితో జత పరచి పెట్టెదరు), ఒక్కొక్క స్త్రీ పోయి ఆ టోపీలలో ఉండు తాళపు చెవిలను ఎంచుకొనును. ఆ టోపీ ఏ మనుష్యునిదో అతనితో ఆ వారమంతయు గడుపును. ఆ విధమైన అనేక విందులు, వినోదములు, అనేకమైన ఆ విధమైన కార్యములను నేను చెప్పుటకు సమయము లేదు. అటువంటి అసహ్యమైన!

మరియు సంఘము అదే పదముగా చెడియున్నది. అది సరియే. ఆమెకు మిగతా కార్యములకు పోవలసిన పని లేదు. సమస్త కార్యములతో వ్యభిచారము చేయుచున్నది. ఆమె వాక్యముతో నిలిచి యుండవలసినదిగా ఉన్నది.

45గొప్ప కట్టడములు సరియే, వైద్యశాలలు సరియే, అన్ని ఇతర కార్యములు సరియే. చదువును గురించిన కార్యక్రమములు అవన్నియు సరియే. మనము ఇక్కడ జీవించవలసినదిగా ఉన్నది. మునము చదువవలెను, వ్రాయవలెను, అది కార్యాంశములో ఒక భాగము.

అది ఎట్లనగా, ఆదిలో మనము దుస్తులను ధరించవలసిన పనేలేదు. (ప్రభువు చిత్తమైతే ఈ వారము చివరలో దానిపై నేను ప్రసంగించెదెను.) అయితే మనము దుస్తులను ధరించుకొనవలయును, ఎందుకనగా దేవుడు మనకు దుస్తులను ఇచ్చెను; అయితే ఆదిలో మనకు దుస్తులు అక్కర లేకుండెను — మనము ముసుగు వేయబడి యున్నాము. ఇప్పుడు ఆమె తన పాపములకు ముసుగు వేయబడి యున్నది. ఆమె పాపము చేయుచున్నదని ఆమెకు తెలియను కూడా తెలియదు. అప్పుడు ఆమె ద్వారా…… ఇప్పుడు దయ్యము ద్వారా మూయబడి యున్నది; అప్పుడు దేవుని ద్వారా కప్పబడి (ముసుగు వేయబడి) యుండెను — దానిలో వ్యత్యాసము అదే.

46ఇప్పుడు, మనము చూచిన ఆమెకు ఈ పవిత్రమైన కార్యము అప్పగింపబడెనని స్త్రీత్వమును భంగపరచకూడదు. ఇట్లు చేయవలెను. తన గుణమును కాపాడుకొనవలయును, బిడ్డలను పెంచవలయును, భర్తను గౌరవించవలయును. ప్రపంచములోని మిగతా కార్యముల కంటె ఈ రోజులలో దానిపై కొద్దిగా శ్రద్ద చూపి గమనించుచున్నారు.

మీరు నా కార్యాలయములోనికి ఎప్పుడైనా వచ్చి చూడవలయును. మరియు పురుషులు వారి భార్యలనులోనికి తీసికొని వచ్చెదరు, అక్కడ ఆ స్త్రీలు వివాహము జరిగినప్పటి నుండి ఎంతమ౦ది పురుషులతో జీవించారో మరియు అన్ని కార్యములను ఒప్పుకొని దేవునితో సరిచేసికొనుటను ప్రయత్నించుదురు. ఓ, మీరు చెప్పవచ్చు, "అది కాదు, పెంతెకోస్తు వారు." మిగతా వారు ఆ విధముగా రారని. నేను మాట్లాడుచున్నాది… అది ఎలా వెళ్ళగలదు! మీరు ఈ ప్రపంచములో కలుపబడి, మరియు సంఘశాఖలతో, మనకున్న ఈ లోకవైఖిరి మరియు ఆ కార్యములతో ఉన్నయెడల, వాటి నుండి మీరు ఏ విధముగా బయటికి రాగలరు. పగలు ఏ విధముగా రాత్రికి వ్యత్యాసముగా ఉన్నదో, మనము నిజమైన పెంతెకోస్తు వారి వలె లేము. మనము అంధకారమైన గందరగోళములో కొట్టుకొనిపోబడుచు, మరియు తప్పిపోయి యున్నాము.

MARK 16:15

 

47ఎటువంటి ఒక పవిత్రమైన నమ్మకము! ఒక స్త్రీకి ఎటువంటి భాధ్యత. ఇప్పుడు, ఎందులకు ఆమె సంఘమునకు మాదిరిగా ఉన్నది, సంఘమునకు అదే విధమైన బాధ్యత, ఒక స్త్రీకి తన మాతృత్వమునకు గల పవిత్రమైన బాధ్యత, ఆమె శీలములకు, ఆమె భర్తకు. అదే విధముగా సంఘమునకు ప్రార్థించుట పవిత్రమైన బాధ్యత, మరియు వాక్యము, క్రీస్తు కొరకు; ఏ విధముగా స్త్రీకి కలదో, అదే విధముగా. మరియు ఒక స్త్రీ ఏ విధముగా ఇంకొక వ్యక్తితో పోవునో, అదే విధముగా మరియు సంఘము, స్థాపన కార్యక్రమములలో మరియు కట్టడములు కట్టు కార్యములలో, పాఠశాలలు మరియు అదే విధముగా. నేను వాటికి వ్యతిరేకిని కాను. అవన్నియు సరియే. అవి వాటి వాటి ఉద్దేశ్యమును నెరవేర్చుచున్నవి. అయితే అవి…. యేసు ఎన్నడూ చెప్పలేదు, "పోయి పాఠశాలలు కట్టమని." ఆయన చెప్పెను, "వాక్యమును ప్రకటించుము!"

48అక్కడే వారు దానిని అశ్రద్ద చేసిరి.

స్థాపనములు వైద్యశాలలు ఏర్పరచుట కాదు, మరియు ఆ విధముగా అవన్నియు సరియే. అయితే అది సంఘము యొక్క కర్తవ్యము కాదు. వారి పని సువార్తను ప్రకటించుటయే. అయతే మనము దానిని తప్ప తక్కినవన్నియు చేసియున్నాము, మరియు సాతాను తొలగిన విధముగా తొలగిపోయినాము. సువార్తతో కొన్ని కార్యములు కలుపుట, వేరే కార్యమును, వేరే కార్యమును చేర్చుట, చివరకు అన్ని కార్యములు కలిపి అది ఏమిలేని కలగలుపుగా అయిపోయినది! చెడిపోయినది.

మన ప్రపంచమంతయు… ప్రపంచమంతయు… ప్రపంచము యొక్క పోకడను గమనించండి.

MARK 16:15,17•

HEB 13:8

 

49రీడర్స్ డైజెస్ట్ అను పత్రికలో చాలా కాలము క్రిందట చదివితిని. యవ్వన స్త్రీలకు రుతుక్రమము ఆగిపోవుట, మరియు పురుషులు, జీవిత దశ మారుట, 20 మరియు 25 సంవత్సరములుకు మధ్య — వారు మధ్య-వయస్సులోకి వెళ్ళుచున్నారు. చెడిపోయినది! ఎందులకు? ఏలయనగా సహజమైన ఆహరమునకు బదులు, మన శరీరములోనికి విజ్ఞాన పరిశోధన ద్వారా చేయబడిన ఆహారము మొదలగునవి పంపుట (తినుట) ద్వారా. మనము చెడిపోయి మరణించు గుంపు తప్ప వేరొకటి కాదు.

ఇప్పుడు, ఆ విధముగా సంఘము ఉన్నది. అదే స్థితిలో ఉన్నది. ఆమె ఒక మాదిరి. ఆమెకు ఆత్మ ద్వారా ఇయ్యబడిన ఒక అమూల్యమైన సుగుణములు ఇయ్యబడినవి, ఆమె దాని ద్వారా ఆత్మను కాచుకొని, మరియు వాక్యమును మరియు ఎప్పుడు ఈ లోక కార్యములతో వేరే ఏ కార్యములతో వ్యభిచరించకుండ ఒక స్త్రీ తన భర్తకు ఏ విధముగా శీలవతిగా ఉండునో, అట్టే వాక్యమునకు కన్యకగా జీవించవలయును. అది ఒక పవిత్రమైన బాధ్యత. మనుష్యుడు చేసిన తెగలు, జ్ఞానము, సంఘశాఖలన్నిటికి పైన ఆమె తన ప్రభువు యొక్క వాక్యమును గౌరవించుటకు, సంఘము ఆ విధమైన బాధ్యత పొందినది. వారు చెప్పెదరు సరి, "నా సంఘము…" మీ సంఘము శాఖ ఏమి నమ్ముచున్నదో నేను లెక్క చేయను. అది దేవుని వాక్యమునకు విరుద్దముగా ఉన్నయెడల దానికి దూరముగా ఉండుడి. "యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు" అని బైబిలు చెప్పుచున్నది. మార్కు 16 చెప్పుచున్నది, "నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును." ఒకవేళ సంఘము దానికి విరుద్దముగా ప్రసంగించిన వద్దు… మీరు ఆ కార్యమునకు మీరు చనిపోవలయును. దేవుని వాక్యములోనికి తిరిగి జన్మించుడి. "మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి." అదే విధముగా అది పోవలసియున్నది. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, నమ్మిన వారివలన, నమ్మిన ప్రతి సృష్టి మరియు సర్వలోకము." మనము ఏ విధముగా దానినుండి తొలగిపోయినామో చూడుడి? నిజముగా, అయితే ఆమె దానికి జవాబుధారియై యున్నది.

50అయితే ఇప్పుడు, ఏ విధముగా హాలివుడ్ (సినిమా), సద్గుణములను మన స్త్రీల నుండి తీసివేసినదో చూడుడి. నేను ఇక్కడి నుండి ప్రియమైన వృద్ధురాలైన సోదరి ప్ర్కోడరను గమనించుచున్నాను. ఇక్కడున్న అనేకమైన స్త్రీలలో, మరియు సోదరి మోర్, ఇతర వృద్ధురాలైన స్త్రీలు, కొన్ని సంత్సరములకు మునుపు, మీకు గుర్తున్నది అనుకొనుచున్నాను. వారి తల్లులో లేక వారే, ఈ కాలపు సంఘమునకు వెళ్ళే స్త్రీల వలె వీధులలో నడిచిపోయిన యెడల, ఆ స్త్రీని పిచ్చి పట్టిన వారని గదిలో వేసి తాళము వేయుదురు. ఆమె తన లంగాను ధరించుట మరచి పోయినది.

సరి, అప్పుడు అది మతి చెడిన కార్యమనిన, ఇప్పుడు కూడా అది మతి చెడిన కార్యమే. సరి చూడుడి, ఇది పిచ్చి పట్టినదని సర్వ ప్రపంచము నిరూపించుచున్నది. ప్రపంచములో జరుగుచున్న హత్యలు మరి ఇతర కార్యములను గమనించుడి — పిచ్చి! ఈ కార్యములన్నియు ప్రకటనను నెరవేర్చుచున్నవి. ఈ వారములో ఆ యొక్క మరుగు చేయబడిన కార్యములను మనము ధ్యానించెదము. అతి సహజమైన కార్యములు కావు; అతి ఆత్మీయ కార్యములు అవి జనులను రాళ్ళను, మరికొండలను అన్నిటిని వారిపై పడవలయునని అరచులాగున చేయుయున్నవి.

1TIM 2:14

 

51ఈ ప్రపంచము పరిపూర్ణముగా పిచ్చి పట్టిన స్త్రీతిలో పోవుచున్నది. ఇప్పుడే అటువంటి స్థితి (మతి చెడిన స్థితి) అక్కడున్నది. ఎందువలననగా దాని యొక్క అడుగుజాడలు మీరు చూడవచ్చును. అక్కడే ఇది ఉన్నది. వీధులపై అది నడుచుచున్నది, సంఘము యొక్క కుర్చీల లోనికి. పరిపూర్ణమైన పిచ్చి. మానవుడు చేయకూడని కార్యములను చేయుచు మరి అదే సమయములో నాగరికులుగా ఉందురు.

హాలివుడ్ స్త్రీకి ఏమి చేసినదో గమనించుడి. ఏ విధముగా అది చూడండి - స్త్రీ యొక్క పవిత్రమైన గుణములను అది దోచుకొన్నది. ఆ విధముగా అనేక కార్యములను మనము మాట్లాడ వచ్చును. ఆమె కోల్పోయినది, చూడండి. ఆమె ఏ విధముగా అది చేసినది? ఎందుకనగా ఏదెను తోటలో నడిచివచ్చిన విధముగా, సంఘములోనికి నడిచివచ్చి మరియు ఆమెను అందులోనికి నడిపించినది. ఆమె దానిని తప్పు అని అనుకొనుట లేదు. హవ్వ తప్పు చేయుచున్నదని అనుకొనలేదు. అది స్వయ ఇచ్చ కాదు. అయితే ఆమె… బైబిలు చెప్పుచున్నది, I తిమోతి 3, "ఆమె వంచింపబడినది." మరి మీరు తెలిసి చేయునది వంచన కాదు, అయితే అది అ కార్యము చేయులాగున అందులోనికి వంచింపబడుటయే.

1TIM 5:6

 

52మరి ఈ రోజూ జరిగినది ఖచ్చితముగా అదే ఆమె టెలివిజన్ ద్వారా, పత్రికల ద్వారా, ఈ జనుల ద్వారా, ఈ అన్ని వీధులలో పోవు ప్రతి ఒక్క చక్కటి కార్యముల ద్వారా వంచింపబడెను. నవీన యవ్వన స్త్రీలు పత్రికలు చూచుచున్నారు, మరి ఆ చిత్రములను చూచుచున్నారు, వీధులలో చూచుచున్నారు. అంగళ్ళలో దుస్తులను చూచుచున్నారు. సాతాను ఏ విధముగా, ఆ గొప్ప నరకము యొక్క సాధనము జనుల మధ్య వచ్చి వారిని ఈ కార్యములలో మోసగించినది. మరియు స్త్రీ తలంచుచున్నది ఆమె సరిగ్గానే యున్నదని, ఆమె చనిపోయినదని ఆమెకు తెలియకున్నది. ఆమె దేవునికి దూరముగా ఉన్నది. ఆమె సమస్తమును ఏ విధముగా పోగొట్టుకొనినదో మరియు ఏ విధమైన యుక్తిగల కర్యమో చూడు?

LUKE 23:27-31

 

53ఈ రోజు మీరు గమనించవలయునని కోరుచున్నాను. యేసు దానిని గురించి మాటలాడెను. మరియు మీరు దానిని చదువవలయునని ఇష్టపడిన యేసు ఈ విధమైన కార్యము సంభవించునని, తన చివరి ఘడియలలో శిలువ మరణమునకు ముందుగా చెప్పెను. మీకు అది తెలియునా? దానిని మనము చదివెదము. పరి. లూకా 23 వ అధ్యాయము, ఆదివారపు పాఠశాల పాఠము విధముగా, 27వ వచనము మొదట, నేను దానిని ఇక్కడ గుర్తు౦చుకొని యున్నానని నమ్ముచున్నాను. యేసు కల్వరికి పోవుచుండెను. నేను చదువుచుండగా వినండి. అది సరి. పరి. లూకా 23:27, దానినే అని నేను నమ్ముచున్నాను. నా నోట్స్ ఆ విధముగానే ఉన్నది. సరి ఇది ఇక్కడ.

గొప్ప జనసమూహమును, ఆయనను గూర్చి రొమ్ముకొట్టుకొనుచు దుఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.

యేసు వారివైపు తిరిగి యెరుషలేము కూమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

ఇదిగో - గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి.

అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్ప సాగుదురు.

వారు పచ్చి మ్రానుకే యిలాగు చేసినయెడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను.

LUKE 13:30

 

54స్త్రీలు బిడ్డలే వద్దని చెప్పు దినమును గురించి మాటలాడుచున్నాను. వారికి ఒక కుక్క లేక ఒక పిల్లి లేక ఆ విధమైన ఏమైన ఉన్న చాలును, అయితే ఆమెకు ఇకమీదట బిడ్డలు అక్కర లేదు. ఎందువలన? ఆమె తల్లి అయిన వెంటనే వృద్ధురాలైన తల్లి హబర్ట్ వయస్సు ముదిరిన విధముగా అగుపించును. చూశారా? ఆమెకు అక్కర లేదు… అదే హాలివుడ్ విశేషము. హాలీవుడ్ కు తన స్త్రీలు, వయస్సు చెందిన తల్లి హబర్ట్ గా ఉండుట ఇష్టము లేదు. కావున ఆమె — అతను బిడ్డలను కనకుండా ఉంచుకొనుటకు శస్త్రచికిత్స చేసికొందురు, లేక ఆమె, అది వారిని పిడ్డలను కనకుండా చేయును. వారికి బిడ్డలు అక్కరలేదు.

యేసు దానిని గురించి మాటలాడెను. మరి ఆయనేమి చెప్పెను? "ఆ సమయములో మా మీద పడుడని పర్వతములతోను, రాళ్ళతోను జనులు కేక కేకలేయుదురు.''

ఆమె గర్భనిరోధకము చేసికొనుట వలన ఆమె పార్టీలకు పోవచ్చును. ఆమె ఆ విధముగా తనను పోషించమని తొందర పెట్టు శిశివు ఆమెకు ఉండదు. అది ఆమెను అసహ్యముగా చేయును. ఆమె గర్భమును ధరించిన యెడల అది ఆమెను అసహ్యముగా చేయును. ఆమె (గర్భము ధరించిన పిదప) ఉన్న విధముగా ఉండదు. ఆమెను ఆ విధముగా అనుమతించుటకు ఆమె భర్త ఏ కార్యములను ఎరుగని వానివలె ఉండును. ఆమె అతనికి బిడ్డను ఇయ్యదు.

యేసు దానిని గురించి మాటలాడెను. మరి ఆయన చెప్పెను, వారు దీనిని చేయుచున్న అటువంటి ఘడియలలో "వారు మా మీద పడుడని రాళ్లతో కేకలు వేయుదురు?" అది ప్రభువు రాకడ సమయము. వారు కుక్కల కొరకు, పిల్లుల కొరకు అధికమైన ధనమును చెల్లించుదురు. ఆమెను తల్లి చేయుటకు. అది సరి. ఆమె దేనికో ఒక దానికి తల్లిగా ఉండవలయును, ఎందుకనగా దేవుడు అది ఆమెకిచ్చిన స్వభావము.

55నేను గమనించియున్నాను… నేను పెద్ద వేట ఆడుదును. ఆకురాలు కాలములో ఒక ఎలుగబంటి మగ ఎలుగ బంటితో కూడినప్పుడు అప్పుడు పుట్టిన కూనలు ఆమెకు కలుగుదురు. ఆ ఎలుగుబంటి కూనలు నూరు పౌండ్లు బరువు కలిగి చక్కగా మంచి శరీర కొలతతో ఉన్నవి. ఆ ఆడ ఎలుగు బంటి కూనలను చలికి ఒదిగి యుండులాగున పండబెట్టును, ఎందువలననగా ఆమె ఇంకా అనేక కూనలను ఈనవలసినదిగా యున్నది. అవి ఫిబ్రవరిలో పుట్టినవి. ఎలుగుబంటికి దీనిని గూర్చి ఏమి తెలియదు. ఒక చిన్న గోనె సంచిలో అవి పుట్టును. ఏ విధముగా ఆ చిన్నగోనె సంచిలను విప్పుకొని బయటికి వచ్చునో, దేవుడు వాటికి ఆ విధముగా చేయలాగున చేసియున్నాడు. ఆ కూనలకు దారి తెలిసికొని వచ్చును. వాటి తల్లి దీర్ఘ నిద్రలో ఉండును. ఆ తల్లి ఆ నెల ఫిభ్రవరి నెల కావున అక్టోబరు నుండి ఏమియు తినదు. అని దానిచుట్టు వచ్చి మే నెల సగము వరకు దానిని పోషించుదురు. అప్పుడు అమె తన కూనలను చూచినప్పుడు అవి చక్కగా మంచి శరీర కొలతతో చిన్న పిల్లలుగా ఉందురు. 10 లేక 15 పౌండ్లు తలా బరువు కలిగియుండును. వారు ఆమెను పోషించుదురు. ఆమెకు ఏ విధముగా పాలు వచ్చునో అది దేవుని కార్యము. ఆమె తన కొరకు జీవించుచునే తన పిల్లలకు పాలు ఉత్పత్తి చేయును. మరి ఆమెకు బిడ్డలు కలుగ కుండా ఉండిన, ఆమెకు ఏ చిన్న ఎలుగబంటి కూనలు లేకుండిన, పోయిన సంవత్సరము కూనలను వేటాడి ఎండాకాలమంతయు తల్లిగా పోషించును, ఎందుకనగా దేవుడు అది అమె కిచ్చిన సహజ బుద్ది. ఆమె తల్లిగా ఎవ్వరికో ఉ౦డవలయును.

56మరి ఒక స్త్రీ తన భర్త మూలముగా బిడ్డలేని యెడల, ఆమె ఒక కుక్కనో, లేక పిల్లినో లేక దేనినో తెచ్చుకొనును. ఆమె దేనికో తల్లిగా ఉండవలయును. అది వారి స్వభావము. అయితే ఇప్పుడు తన భర్తకు ఒక బిడ్డను కని, ఆ బిడ్డను దేవుని సేవకొరకు పెంచుట ఆమె కార్యక్రమములో లేనేలేదు, అది పూర్తిగా ఆమెకు చెందనిది. ఆమె అన్నియు చేసిన, పాపమును ప్రేమించు సమాజము అయిన ఈ 1965లో ఉన్న స్త్రీలు అది ఆమెకు అవమానకరము, ఆ విధముగా అసహ్యమందురు. (బిడ్డలు కని పెంచుట)

ఈ రోజులలో నవీన సంఘముల యొక్క నిజమైన స్థితి. ఈ నవీన సంఘములు కేకలు వేయుట, అరచుట, అన్యభాషలు మాట్లాడుట కోరుటలేదు. అపో. కార్య. 2:38 చిన్న బిడ్డలు ఆమె చుట్టూ వద్దు. ఆమెకు అది ఏమియు అక్కరలేదు. అరచుట, ఏడ్పులు మరి కేకలు వేయుట, "ఆమేన్! హల్లెలూయా!" ఆ ఎందుకు, అటువంటి బిడ్డ తన సంఘశాఖ నుండి వెంటనే వెళ్ళగొట్టబడును. ఆ విధముగా వారి సంఘములో ఉన్నయెడల వెంటనే బయటికి నెట్టివేయుదురు. "ఎందులకు మీరు ఈ విధమైన కార్యములను జరిగించుచున్నారు?"

57కావున ఆమె దేని వలననో గర్భము ధరించుచున్నదో మీరు చూశారా, ఏలయనగా ఆమె ఎల్లప్పుడు సభ్యులను తెచ్చుచునే యున్నది. అయితే ఆమె ఎవ్వరు అరచుటను, వదరుటను, కోరుట లేదు. అపో, కార్య: 2:38, వారు దౌర్భాగ్యమైన సృష్టి అని ఆమె అనుకొనుచున్నది. అది నిశ్చయముగా ఆమెను కలవర పెట్టుచున్నది. అది ఆమెను పాడుచేయును, ఆమెకు చెందునటు వంటి విద్యయు, నీతియు కల, నైతికమైన, విజ్ఞాన, సాంఘికము సంఘమును పాడు చేయును. తదుపరి జరుగు ఆలోచన సభలో వారు ఆమెను త్రోసివేయుదురు. ఆమె దానిని పొంది యుండలేదు, కావున ఆమె వాక్యము ద్వారా గర్భము ధరించుటకు ఇష్టపడుట లేదు, ఎందుకనగా దాని ద్వారానే వాక్యమును తిరిగి బయటికి ఫలింపజేయును.

దేవుని ఆత్మ దార్వా జన్మించి, దేవుని ఆత్మ దానిలో ఉండును. మనుష్య తెలివి, సంఘములో చేర్చబడుట, సంఘ తెగలకు పోవుట, వెంట్రుకలు కత్తిరించుకొని యుండుట, ముఖమునకు రంగులు పూసుకొనుట ఇటువంటి కార్యములన్నియు. మీరు దేవుని వాక్యములో కనుగొనలేరు. పాతకాల పద్దతైన, పరిశుద్ద పరచబడిన, పరిశుద్దాత్మతో నింపబడిన బిడ్డ, దేవుని ఆత్మతో జన్మించబడి అరచుచు, గంతులేయుచు, కేకలేయుచు దేవుని స్తోత్రించుచు ఉండును.

58అయితే అటువంటి కార్యములు ఆమెకు అందలేని స్థితిలో ఉండును. ఆమెకు అది అక్కరలేదు. ఓ, అది కాదయ్యా. వాస్తవముగా కాదు.

అట్లయిన ఆమె అప్పుడు ఏమి చేయును? ఆమె ఒక జత, ముఖమునకు రంగు పూసుకొని, పొట్టి దుస్తులతో, యొజెబెలు మార్గస్తులను, విరుద్దమైన "పిల్లులను" ఆ విధముగా వారిని పిలిచెదరు. అది అదే అని నేను అనుకొనుచున్నాను. వారు వాటిని పిల్లులని పిలిచెదరని నేను తలంచుచున్నాను. "ఆ పిల్లి అక్కడికి పోవుచున్నది" లేక ఆ విధముగా ఏదో పోవుచున్నదని వారు చెప్పెదరు, మీకు తెలియును. ఆమె తన మొదటి భర్తతో జన్మించెను, లేక వివాహము చేయబడెను, లేక సంబంధము కలదు, మొదట నీ ఆదాము, వ్యభిచారి అయిన హవ్వతో ఆమె ఆదాము యొక్క మొదటి భార్య. మీరు చెప్పవచ్చు, "వ్యభిచారి?" ఆమె నిజముగానే అట్లే, అయితే ఆమె ఈ ఆదాము - మొదటి ఆదాము చనిపోయెను. "ఓ, నిజముగా అతడు చాలా కాలము క్రితము చనిపోయెను. నేను మరల జన్మించితిని" అని ఆమె చెప్పును. "మరి నేను నిజముగా రెండవ ఆదాము, క్రీస్తు, వాక్యమునకు వివాహము కాబడి యున్నాను."

DEUT 22:5•

1COR 11:5

 

59ఇప్పుడు, గమనించుడి ఆమె ఏమి ప్రేమించుచున్నదో, ఆమె ప్రేమికుని గమనించుడి. ఆమెకు ఎవ్వరిపై ప్రేమగలదో మీరు చూడవలయునని యున్నారా, వాక్యము ఇట్లు చెప్పుచున్నది, అయితే ఆమె చెప్పుచున్నది, "నా సంఘము దీనిని చెప్పుచున్నది." అట్లయిన ఆమెకు ఎవరిపై ప్రేమ కలదు? ఆమె భర్త ఎవరు? ఆమె ఎవరు అని ఆమె ఫలములు నిరూపించును. అది ఖచ్చితముగా సరియే. ఆమె ఎవరని చూపించుచున్నది.

గమనించుడి, ఆమె మొదట ఆదాముకు జన్మించెను, ఏలయనగా అది ఆమె సహజమైన జన్మ, చూశారా, మరి ఆమె దానిని వదలలేదు. అది ప్రపంచమును ప్రేమించుచున్నది. ఆమె క్రీస్తుకు రెండవమారు జన్మించినానని వాదించుచున్నది. అయితే ఆమె యొక్క ప్రియుడు ఇంకనూ ఆదామే, ఎందుకనగా ఆమె ప్రపంచమును ప్రేమించుచున్నది.

మరియు ఇంకొక కార్యము, గమనించుడి ఆమె ఏ రకమైన బిడ్డలను కనును. అది చెప్పును వారి తండ్రి ఎవరు అని; వారు మొదటి ఆదాము బిడ్డలా లేక రెండవ ఆదాము బిడ్డలా అని. ఒకవేళ సంఘము రెండవ ఆదాము యొక్క బిడ్డలను కనిన యెడల పెంతెకోస్తు దినమున రెండవ ఆదాము యొక్క మార్గము వలె వారు నడుచుకొందురు. వారే నిజమైన రెండవ ఆదాము బిడ్డలు. అది సరియే. వారి స్వభావము వారి వలె ఉండును. సరి అయ్యా, ఆమె బిడ్డలు ముఖమునకు రంగులు పూసుకొని, వెంట్రుకలు కత్తిరించుకొని, పురుష దుస్తులు ధరించుకొని, నిక్కర్లు వేసుకొనియుందురు. ఆ కార్యములు చేయకూడదని ఆమెకు బైబిలు చెప్పుచున్నది. ఆమె తన వెంట్రుకలను కత్తిరించుకొనును. అది ఆమెకు అవమానకరము. "వాటిని చెప్పినది చాలు, ఇంక వద్దు," అని మీరు చెప్పవచ్చును. మరి వాక్యము దానిని చెప్పుచున్నది. నేను స్వభావమును మాత్రము ఎత్తి చూపుచున్నాను. అదే ఆమె చేయుచున్నది.

GEN 4:16,17,22

 

60ఆమె పుత్రులు, ఆమెకు జన్మించిన వారు, విద్యపైన, పాఠశాలలపై, బైబిలు పాఠశాలలపై, చాలా కాలము నుండి ప్రసిద్ధి చెందిన కళాశాలపై, గ్రుడ్డు పొదుగుటకు ఉన్న పరికరమైన (ఇన్కుబేటర్) మరి ఆలాటి వాటి నుండి పొదుగుచున్నారు; సంఘశాఖలు వెతుకుదురు, కయీను వంటి మతముతో, కయీను ఏ విధముగా వాక్యమునకు విరుద్దముగా ఉన్నదో, ఆ విధముగా ఉన్నారు. అది సరి, కయీను వలె అక్రమముగా ఉన్నారు. నిశ్చయముగా, సంఘశాఖలను వెతుకుచుందురు. అదేమి అని మీరు చూశారా?

దేవుడు ఒక సంఘశాఖను ఎప్పుడును స్థాపించలేదు. ఆయన దానికి ఎల్లప్పుడు వ్యతిరేకి, మరి వాక్యమును దానికి వ్యతిరేకముగా ఉన్నది. అయితే వారు దానినే పట్టుకొని యున్నారు. కావున వారేమి ఫలించుచున్నారో చూడుడి. ఆ కార్యము చూపుచున్నది. వారి తండ్రి ఎవరని, తల్లి ఎవరని. అది సరియే. ఖచ్చితముగా అదియే. కయీను వలె విరుద్దమైన వారు. హవ్వ నుండి అటువంటి బిడ్డను బయటికి తెచ్చినది. వాక్యము నుండి దూరముగా వారు పోయిరి, మరి ఆమె ఏమి తెచ్చినది? అదే కార్యమును ఖచ్చితముగా సంఘము తెచ్చినది. వాక్యము ద్వారా మీకు నిరూపించగలను. అక్కడ నుండియే కయీను మూలముగా విధ్య, మరియు నాగరికత పుట్టుకొచ్చింది. అది ఖచ్చితముగా సరియే. అయితే వారు దేవుని పుత్రులని వాదించుచున్నారు. అయితే వారు సంఘ శాఖల ద్వారా పుట్టి, సంఘ శాఖల ద్వారా పండితులై మరి అటువంటి కార్యములలో ఉన్నవారు. అది ఖచ్చితముగా సరియే. కయీను వలె యుక్తితో, విజ్ఞానముతో కూడిన ప్రసంగికులవలె. ఖచ్చితముగా అదే కార్యము. "బ్రెన్హాం సోదరుడా, అది సరియా?" అని మీరు చెప్పవచ్చు.

61ఆదికాండము 4:16కు త్రిప్పి కనుగొనుడి, ఒక నిమిషము త్రిప్పిన యెడల మరి ఏ విధముగా జరిగినదో అని మీరు కనుగొనగలరు.

అప్పుడు కయీనూ యెహోవా సన్నిధిలో నుండి బయలు దేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను.

కయీను తన భార్యను కూడినప్పుడు, ఆమె గర్భవతియై, హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి, ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను.

GEN 4:25

 

62తూబల్కయీను వరకు పోయి చూచినయెడల వారు పనిముట్లలన్నిటిని చేయుచుండిరి, సంగీతము మరి మొదలైనవి. కయీను ద్వారా నాగరికత మొదలిడెను! అది సరియే. సర్ప సంతానమైన కయీను ద్వారా గొప్ప పట్టణములు కట్టబడుట, పనిముట్లు, విజ్ఞాన వేత్తలు వచ్చిరి.

మరి 25వ వచనమును గమనించుడి. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు. ఇప్పుడు, అతడు ఆమెను ఒకమారు కూడెను, అప్పుడు ఆమెకు ఇద్దరు బిడ్డలు కలిగిరి. లేఖనములను పరిశోధించుడి. అమె కయీను, హేబెలును కనెను. ఒకే క్రియ మరి ఇద్దరు బిడ్డలు మీరు చెప్పుదురు.

ఇంతకు మునుపు వారు నాకు చెప్పారు, ఆ విధముగా జరిగి యుండదని. హలివుడ్ లో జరిగిన ఒక వ్యాజ్యము మనము చూచియున్నాము… హాలివుడ్… టుసాన్లో ఒక కోర్టులో జరుగుచున్న కేసు (వ్యాజ్యము) మనము చూచుచున్నాము. ఒక స్త్రీ నలుపు రంగు బిడ్డను మరియు తెలుపు బిడ్డను ఒకే సారి ప్రసవించినది. వారు చెప్పారు, ఆమె ఆ విధముగా ప్రసవించలేదని. ఆమె రెండు సంతతిని (రెండు ఫలవంతమైన గర్బ విత్తనములు) కలిగియుండెను. ఇప్పుడు కోర్టులో అది వ్యాజ్యమాడబడుచున్నది. కుక్కలు ఆ విధముగా చేయునని నాకు తెలియును. జంతువులు దానిని చేయును. మరి ఆమె ఆ విధముగా కలిగియున్నది… తెల్ల వ్యక్తి చెప్పెను, "నేను నా సొంత బిడ్డను మాత్రము పోషించెదను, అయితే ఇంకొకనిని కాదు." మరి ఆ స్త్రీ (తప్పును) ఒప్పుకొనెను. ఆమె ఆ ఉదయము తన భర్తతో కూడెను మరి ఆ నలుపు వ్యక్తి (నీగ్రో)తో మధ్యాహ్నము కూడెను. మరియు అది వైద్యుడు చెప్పెను, 24 గంటలలో మరొకమారు కూడినపుడు రెండు గర్భములు ఉత్పత్తి కాగలదు. (ఆ బిడ్డలు ఒకే గర్భములో ఒకే రోజు ఇరువరితో కూడినందువలన) మరి అక్కడ (ఏదేను తోటలో జరిగిన విధముగా.)

GEN 4:25,26•

1JN 3:12

 

63ఇక్కడ ఖచ్చితముగా అదే జరిగినది. కయీనూ.. సాతానుడు ఆ రోజు ఉదయము, సర్పము (రూపములో), మరియు ఆదాము ఆ రోజు మధ్యాహ్నము మరియు ఆమెకు ఇద్దరు బిడ్డలు.

ఇప్పుడు, "ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు, రెండవ మారు; ఆమె కుమారుని కనెను." గుర్తుంచుకొనుడి, కయీనూ, ఆదాము యొక్క కుమారుడు అని బైబిలులో ఎక్కడను చెప్పుబడలేదు. "అతడు దుష్టుని యొక్క కుమారుడు." ఆదాము కుమారుడు కాడు, సైతాను కొడుకు అని చెప్పబడియున్నది.

"రెండవ మారు కూడెను, మరి ఒక కుమారుని కనెను. అతనికి సేతు అని పేరు పెట్టెను. దేవుడు కయీను చంపిన హేబెలునకు ప్రతిగా నాకు మరియొక సంతానమును నియమించెనను కొనెను. (అది నిజమైన సంతతి కాదు), ఆదాముకు బదులుగా ఇంకొక విత్తనమును నియమించెను. మరియు సేతు ఒక కుమారుని కనెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను: అప్పుడు జనులు యెహోవా నామమున ప్రార్ధన చేయుట ఆరంభమైనది." కయీను వంశము, వంశావళి నుండి కాదు, అయితే సేతు వంశావళి నుండి. కావున కయీను దుష్టుడు. అక్కడి నుండియే సర్పము వచ్చినది.

64ఇప్పుడు గమనించుడి, బైబిలు చెప్పుచున్నది, ఆమె యొక్క మొదటి భర్త చనిపోవలసి యున్నది, త్రోసి పుచ్చుట కాదు అతడు చనిపోయి ఉండవలయును. సమీపములో నేను వివాహము, విడాకులు అన్న అంశముపై ప్రసంగించితిని, అది అందరికి తెలియును. ఈ సంఘమునకు ఇప్పుడు నేను మాటలాడుట లేదు, అయితే దేశములోని పలు దిక్కులకు మాట్లాడుచున్నాను. అది సరియే. వివాహము మరియు విడాకులులో ఏమి జరిగినదని మీరు చూచితిరా? ఏడు ముద్రలు తెరువబడినప్పుడు, దాని నుండి నిజమైన సత్యము వెలుపలికి వచ్చెను.

65రెండవ ఆదాముకు వివాహము కాబడవలయునన్న క్రీస్తుకు, వాక్యమునకు, మీ యొక్క మొదటి భర్త అయిన సంఘశాఖలకు చనిపోయి, దాని నుండి వేరు పరచబడవలయును. ఎందుకనగా దేవుని వాక్యము నంతయు వారిలో ఏ ఒక్కరు అంగీకరించలేరు. నాకు చూపించండి, ఆ ఒక్కరు ఎక్కడున్నాడని, "ఓ," మీరు చెప్పెదరు "నాది." ఇంకొకతను కూడా చెప్పనునాడని. వారిరువురిని ఒక్కటిగా పెట్టిన యెడల, మరియు మీరు కనుగొనగలరు, వారివురు తప్పని — మీరు ఒక శాఖగా మారుట వలన. ప్రకటన 17వ అధ్యాయము చదువుడీ.

కావున మీరు చూచారా, ఆ కార్యమునకు మీరు చనిపోవలసినదిగా ఉన్నది. (ఇప్పుడు, నేను ఈ స్థానిక సంఘముతో మాట్లాడులు లేదు, దేశములోని నలుప్రక్కల ఉన్నవారికి నేను మాట్లాడుచున్నాను.) మీ యొక్క మొదటి భర్తకు మీరు చనిపోవలయును. ఒక వేళ మీరు క్రీస్తులో ఐక్యమై, మరియు ఇంకా సంఘశాఖతో వివాహము కాబడినయెడల, మీరు వ్యభిచారిణి యగుదురు! మీరు ఒక లవొదికయి.

MATT 6:24•

LUKE 16:13•

JOHN 1:1,14•

1JN 2:15

 

66దేశము అన్ని ప్రక్కల ఒక సంఘము, వాక్యమైన యేసుక్రీస్తును మేము వెంబడించుచున్నాము. వధువులో మీరు ఉండవలయునన్న క్రీస్తు అనబడు దేవుని వాక్యమునకు మీరు తిరిగి వివాహము కాబడవలయును.

"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను." మీరు సంఘశాఖల పారంపర్యములో ఉన్నంత వరకూ, దేవుని వాక్యములో మీరు వ్యభిచారులని పిలువబడుదురు. మీరు సంఘశాఖలు తెగలను వెదకు వారుగా ఉన్నంతవరకు, సంఘశాఖకు చెందిన వారైయుండి వాక్యమును కాదనిన మీరు ఒక వ్యభిచారి. బైబిలు దానినే చెప్పుచున్నది. యేసు చెప్పెను, "మీరు రెండు దేవుళ్ళను ఒకే సమయములో సేవించలేరు. మీరు దేవునినైనా లేక ప్రపంచమునైనా సేవించవలయును." "ఈ లోకమునైనను లేక లోకములో ఉన్నవాటినైనను ఎవరైనను ప్రేమించిన యెడల, దేవుని ప్రేమ వానిలో ఉండదు." దేవుని పైన ప్రేమ, లోకముపైన ప్రేమ, రెండును ఒకనిలో ఒకేసారి ఉన్నయెడల అతనిలో దేవుని విత్తనము అతనిలో ఉండదు. దేవుని యొక్క విత్తనము మీలో క్రియ చేయుచున్నయెడల, అది దేవుని వాక్యమై యున్నది. అదే సమయములో అతనిలో లోకము పై ప్రేమ ఉండదు. ఇప్పుడు ఎక్కడున్నది పొట్టి వెంట్రుకలు, మరియు పొట్టి దుస్తులు, మరియు రంగు పూసిన ముఖములు? ఇప్పుడు అవి ఎక్కడున్నవి?

GEN 4:3

 

67మీరు దేవుని వాక్యమైన క్రీస్తుకు సద్గుణవతిగా ఉండి మురియు అదే సమయములో మనుష్యుడు చేసిన సంఘశాఖకు సేవ చేయలేవు. వాక్యమునకు అది విరుద్దమైనది. ఇక్కడ పౌలు చెప్పెను, దాని గురించి? రోమా 7.

మీరు దేవుని పుత్రులుగా ఆయన వాక్యమును ఈ యొక్క విరుద్దమైన సంఘ శాఖలకు కొనిపోలేవు. మీరు దానిని చేయలేరు. మీ యొక్క ఇన్క్యుబేటర్ లో (గ్రుడ్డు పొదుగు యంత్రము) దేవుని యొక్క కుమారుని వాక్యమును తీసికొనిరాలేవు. నేను సంఘముతో మాట్లాడుచున్నాను. అయినను మీరు చాలా భక్తిపరులని చెప్పుకొనుచున్నారు. వ్యభిచారి అయిన హవ్వ కుమారుడైన కయీను అదే విధముగా చాలా భక్తిపరుడు, బలిపీఠములు కట్టెను, బలులర్పించెను, తన దశమ భాగములు చెల్లించెను, ఏ ఇతర దైవభక్తుడు చేయు విధముగా అన్ని కార్యములు చేసెను. అయితే ఆ వాక్యప్రకారము చేయుట తప్పిపోయెను, అతడు బయలుపాటును పొందుట తప్పిపోయెను!

MATT 16:18•

HEB 11:4

 

68మరి ప్రత్యక్షత ఒకే ఒక ప్రత్యక్షపరచే కార్యము, వాక్యము యొక్క ప్రత్యక్షత.

బయల్పాటు అనగా ఏమిటి? యేసు చెప్పెను, "ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు." విశ్వాసము ఒక బయలుపాటు, ఏలయనగా విశ్వాసము మీకు బయలపరచబడెను. విశ్వాసమును బట్టి హేబెలు ప్రత్యక్షత ద్వారా కయీనూ కంటె శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను.

వారు ఆపిల్ పండ్లు తినినారని కయీనూ తలంచెను. వారు ఇంకను అటు వంటి అభిప్రాయము కలిగియున్నారు, అయితే అది కాదు. అది ఒక వ్యభిచారము. సర్పము యొక్క సంతానము. మరి అక్కడ ఏడు ముద్రలు తెరువబడినప్పుడు, అది దాని బహిరంగపరచి మరియు నిరూపించినది. (దానిపై వ్రాయబడిన నా పుస్తకము ఇప్పుడే బయటకి (అచ్చయి) వచ్చియున్నది, ఇప్పుడు వెయ్యి పుస్తకములు మా యొద్ద ఉన్నవని నేను అనుకొనుచున్నాను.) గమనించుడి, అది వాక్యప్రకారము ఆదికాండము నుండి ప్రకటన వరకు.

MATT 6:24•

LUKE 16:13

 

69కడపటి కాలములో రెండు వృక్షములును విత్తనము యొద్దకు వచ్చి వాటిని నిరూపించుచున్నవి.

ఇప్పుడు మనము ఈ రోజు లవొదికయలో ఉన్నాము మరి వధువు వాక్యములో ఉన్న విధముగా చక్కగా, నిర్మలమైన (ఆ వధువు) మీ ముందే యున్నది. మీరు దేవుని, లోకమును సేవించలేరు. మీరు బైబిలును నమ్ము సద్గుణములతో నిండిన విశ్వాసిగా ఉండుచు, సంఘశాఖల యొక్క కార్యములతో కలువలేరు. ఒకే సమయములో ఈ రెండింటిని చేయలేరు. ఒకటి జీవించుటకు ఇంకొకటి మరణించ వలసియున్నది.

మీరు (లోకమును ప్రేమించుచునే) దేవుని వాక్యమును మోయు కుమారులుగా ఉండలేరు. సంఘము ఆ విధముగా బయలు పరచలేదు. మీరు అరచు బిడ్డలుగా, గంతులేయుచు మరి అన్యభాషలలో మాట్లాడుచు మరియు, ఆ కార్యములన్నియు చేయుచు ఆ ఒక్కరుగా ఉండకూడదు. మీరు సంఘశాఖలలో దీనిని చేయ కూడదు. వారు మిమ్ములను ఉంచుకొనరు. వారు వారిని అ విధముగా పె౦చరు. వారు వారిని తీసికొని మరియు కరచలనము చేసి చెప్పుదురు, "నీవు నమ్మినయెడల, నీవు దానిని పొందియున్నావు. పుస్తకములో నీ పేరు ఉన్నంతవరకు దానినే నీవు చేయవలసినది." చూశారా, వాక్యమునకు విరుద్దమైన బిడ్డలు వారు. భక్తిగలవారమని వాదించుదురు.

EXOD 20:19

 

70సంఘము సైతాను యొక్క జ్ఞానముతోను, వివేకముతోను గర్భము ధరించియున్నది. "ఆమేన్" అని సరిగా చెప్పుటకు వారు వారిని నేర్చుకొనుటకు పాఠశాలలకు పంపించుదురు. వారు ఇవన్నియు ఎట్లు చెప్పవలెయునో నేర్చుకొని జ్ఞానవంతులుగా ఉండుదురు. ఇది ఏమిటి? అది సాతాను యొక్క గర్భము.

హవ్వను, సాతాను దేనితో గర్భవతిగా చేసెను? తెలివికి, జ్ఞానమునకు, వాక్యమును అవిశ్వసించి, సర్వ సృష్టిని అది నాశనము చేసెను. సంఘమను ఆమె ఈ రోజు వాక్యమును ఖచ్చితముగా ఆ విధముగా చేసెను. ఆమె బైబిలు పాఠశాలలతో మరి కళశాలలతో, అటువంటి కార్యములతో గర్భవతి ఆయెను. చదువుట, వ్రాయుట మరి లెక్కలు, ఈజిప్టు యోధుని గూర్చి హనాన్ నాన్ (అఫ్రికాలో ఒక జాతి)కు ఏ విధముగా తెలియదో అదే విధముగా వీరికి దేవుని గూర్చి తెలియదు. వారికి వారి సంఘ తెగలన్నియు, ప్రార్ధన పుస్తకములు మరియు మిగత కార్యములన్నియు తెలియును. అయితే దేవుని గూర్చి తెలియదు. వాక్యము నిరూపించబడినపుడు వారికి తెలియును, మరి దేవుడు తిరిగి అక్కడ మాట్లాడి ఒక్కొక్క సంతతికి భాగించబడిన తన వాక్యమును పలుకును.

నోవహు ఇక్కడ వచ్చి, ఆ సంతితిలో ప్రసంగించెను. ఇప్పుడు, ఒకవేళ మోషే వచ్చి "మనము ఒక పడవను కట్టెదము" అనిన ఏలాగుండును? అది ఆ సమయమునకు చెందినదిగా ఉండదు, అయినను అతడు ఒక ప్రవక్త. దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి ఉండెను. దేవుడు అది సత్యమని నిరూపించెను, అతడు ఇశ్రాయేలు జనులను బయటికి తెచ్చెను, మరియు అగ్నిస్తంభమును వారికి ముందు చూపించెను మరియు ప్రవక్తని నిరూపించెను, ఆయన ఏమి చేయునో దానినే ఖచ్చితముగా చెప్పెను; మరియు ఆయన దానిని చేసెను. వారు చెప్పిరి, "దేవుడు మాతో మాట్లాడక; మోషే (మాతో) మాట్లాడనీ అట్లు కానియెడల మేము చనిపోవుదుము."

ఆయన చెప్పెను, "నేను వారితో ఆ విధముగా ఇక నుండి పలుకను, అయితే నేను వారికి ప్రవక్తులను లేపెదను మరియు వారు మాటలాడెదరు."

ISA 7:14•

ISA 9:6,7

 

71యెషయా అక్కడ నిలుచుకొని చెప్పెను, "ఒక కన్యక గర్భము ధరించును!" ఆ రోజు అతనిలాటి ఒక వ్యక్తి అప్పుడు… ఏ విధముగా ఒక కన్యక గర్భము ధరించును? "మనకు ఒక కుమారుడు పుట్టును, శిశువు పుట్టును, ఒక కుమారుడు అనుగ్రహింపబడును. అతని పేరు ఈ విధముగా పిలువబడును. ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి తన తండ్రియైన దావీదు సింహసనమును అతడు ఏలును, మరియు అతని రాజ్యమునకు అంతులేదు."

అది ఏ విధముగా జరుగును? అతనికి తెలియదు. అతడు దేవుడు చెప్పిన దానిని పలికెను. అది మనుష్య తెలివికి, అలోచనకు మించినది. విజ్ఞాన పరిశోధనలకు మించినది, అది అది దేవుని యొక్క వాక్యము.

ACTS 1:15

 

72ఇప్పుడు మనము మనుష్యుడు చేసిన వేదాంత శాస్త్రమును తెలుసుకొనుటకై మన బైబిలు పాఠశాల విద్యార్డులను, బైబిలు వేదాంతములో తర్ఫీదు ఇచ్చుచున్నాము. దేవుడు చెప్పినట్లు ఖచ్చితముగా లవొదికయ వలె, దానిలో ఒక గుంపుగా సంఘమున్నది.

ఓ, మై! దానిని నేను చూచుచుండగా, నాకు వణకు పుట్టించుచున్నది. ఇహలోక జ్ఞానముతో గర్భము ధరించుట. మీరు చేరకమునుపు ఉన్నత విద్య నభ్యసించి యుండవలయును. మీరు (సేవకులుగా) నిర్ణయింపబడక ముందు మీరు మనోగతి శాస్త్రజ్ఞాని ముందు నిలువవలయును. మీరు పేతురు, యాకోబు మరియు యోహను ఒక మానసిక వైద్యుడి యొద్దకు పోవుటను యోచించగలరా? గుర్తుంచుకొనుడి, అక్కడున్న ఆ నూట-ఇరవై మంది వారి చేవ్రాలు కూడా వేయను తెలియనివారు. మానసిక వైద్యుని ముందు నిలుచుకొని వారి యొక్క ఆత్మీయ క్రియలన్నియు సరి అని పరీక్షించుకొనుట మరియు ఆలాటి కార్యములు. వారికి (అపోస్తులులకు) ఒక అత్మీయ క్రియ ఒకటుండెను, అయితే అది తెలివితో కూడిన కార్యము లేక విజ్ఞాన పరిశోధన కాదు. అయితే దేవుని యొక్క శక్తి నుండి వచ్చుచున్నదై యున్నది. అది వారిని తాకినప్పుడు, పరిశుద్దాత్మ ఏమి చేయవలెయునని చెప్పునో, దానినే వారు చేయుదురు. వారు వారి తెలివికి సంఘము చెప్పుదానికి, మత గురువు చెప్పుదానికి, మరియు ఇదేమి చెప్పెను అదేమి చెప్పెను అన్నవాటికి ఎటువంటి శ్రద్దనియ్యక, ఆత్మ ద్వారా నడిపింపబడిరి, భయములేని వారుగా.

JOHN 5:38•

ACTS 2:38•

1JN 2:15

 

73I యోహాను 2:15, అతడు చెప్పెను, "మీరు లోకమును లేక లోకములో ఉన్న వాటినైనను ప్రేమించినయెడల తండ్రి ప్రేమ మీలో ఉండదు." భక్తి లేక మతము పేరుతో అన్ని కార్యములను మీరు కొనసాగించుచుండగా మీరు ఏ విధముగా దేవుని వాక్యముతో గర్భము ధరించుదురు, ఆ వాక్యము లోకమును ఖడించుచున్నది, హలివుడ్ ను ఖండించుచున్నది, ఈ లోక వైఖరిని ఖండించుచున్నది, అన్ని వినోద వింధులను వేడుకలను ఖండించుచున్నది. వీటిన్నిటిని ఆ వాక్యము ఖండించుచున్నది. వాక్యము ఏ విధముగా ఒక వ్యక్తిని గర్భము ధరింపజేయును?

ఏ విధముగా కత్తిరించిన పొట్టి వెంట్రుకలతో, రంగులు పూసిన ముఖముతో, పొట్టి దుస్తులతో…? ఏ విధముగా ఒక ప్రసంగికుడు వేద పాఠశాలకు పోయి, అపొ. కార్య. 2:38 ని చూచి, బిరుదులతో ఎవ్వరు బాప్తిస్మము పొందినట్టు బైబిలు లేదని తెలిసి, ఇంకను దేవుని వాక్యముతో గర్భము ధరించినానని చెప్పును? అతడు ఒక అబద్దమును చెప్పుచున్నాడు. అతడు తన జ్యేష్ఠపుత్ర భాగమును అమ్ముకొనెను. అతడు విడాకులు ఇచ్చితిని అని చెప్పు అదే కార్యముతో అతడు వ్యభిచరించుచున్నాడు.

దేవుడు ఒక సద్గుణవతైన ఒక సంఘమును పొందబోవుచున్నాడు. అట్లే ఖచ్చితముగా, ఒక వధువును! బైబిలు చెప్పుచున్నది, "నీలో వాక్యము లేదు," కావున ఏ రకమైన పుత్రులను నీవు కలిగియున్నావు? సంఘశాఖలను గర్భమున ధరించినది. నీ మొదటి ప్రియుని నుండి నీవు విడదీయబడుటకు మరణము సంభవించలేదు.

74"నేను ఏడ్చిన యెడల మరియు అన్యభాషలలో మాట్లాడిన జోన్స్ఎస్ ఏమి అనుకొందురు? నేను మరల బాప్తిస్మము పొందినయెడల వారేమి అనుకొందురు?" ఎటువంటి వెర్రితనము! మీరు జోన్స్ఎస్ వివాహము కాబడ్డారా, సంఘమునకు వివాహము కాబడ్డారా, లేక మీరు క్రీస్తును వాక్యమునకు వివాహము కాబడ్డారా? ఇప్పుడు, అందువలనే ఆమె ఇంకనూ అతనికి బిడ్డలు కలిగియున్నది.

ఆమె ఎటువంటి బిడ్డలను కలిగియున్నది? ఇక్కడ ఈ రోజు వారు పిలువబడు పేర్లు కొన్ని ఇచ్చట: కాట్స్, బీటల్స్, మోన్స్టర్స్, రిక్కిస్, రిక్కల్దాస్. కాట్స్, బీటిల్స్. వారు సంఘ సభ్యులు, నిజముగా వారందరు కయీను పుత్రులు, యుక్తిగల జంతువు యొక్క సంతానము, వారు చాలా నెమ్మదిగా (మంచిగా) అగుపడుదురు.

75ఇప్పుడు, మీ యొక్క ఆత్మలలో ఒక్క క్షణము మీ యొక్క సొంత ఆత్మీయ దృష్టితో సరిచూచుకొనుడి. చుట్టు చూచుకొనుడి. ఇప్పుడు నేను దేశమంతటా మాట్లాడుచున్నాను. కొద్ది నిముషములు చూచుకొనుడి, బ్రెన్హాం గుడారములో ఉన్న మీరు, పశ్చిమ తీరమున గుడారములో ఉన్న మీరు, మరి అరిజోనా మరియు ఎక్కడెక్కడ ఉన్న మీరు కొన్ని నిముషములు మీలో మీరు చూచుకొనుడి. మీరు చెప్పుదరు, "బ్రెన్హాం సోదరుడా, మీరు ప్రసంగించుచున్న వర్తమానము తప్పు." కొద్దిగా మీరు మీలో చూచుకొనుడి. మరియు పరిశుద్దాత్మ వాక్యముతో మీ భావమును (తలంపులను) పరిశోధించనీ? మీరు వర్తమానముతో అంగీకరించెదరు. మరియు క్రీస్తు, అభిషేకించబడిన వాక్యము, మీ యొక్క మనస్సాక్షిని పరిశోధించని. ఆయన మీలో ప్రవేశించని, అది సరియా, కాదా అని చూడనీ, అనేక వందలకొలది కార్యములు ఉండగా నేను ఒకటి - రెండు కార్యములను మాత్రము చెప్పుచున్నాను.

DEUT 22:5•

DAN 5:12•

ACTS 2:38•

1COR 11:5

 

76స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకొనుటను బైబిలు సమ్మతించుచున్నాదా? తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మలను మూడు బాప్తిస్మములు సమ్మతించుచున్నాదా? అటు వంటి కార్యము లేదు. పురుషుల దుస్తులను స్త్రీలు ధరించుట బైబిల్ సమ్మతించుచున్నదా? మూడు కార్యములను మాత్రము తీసుకొనుడి, ఆ విధముగా నూటికి పైగా అనేకమలున్నవి. దేవుని యొక్క వాక్యమనే వెలుగులో దానిని వెదకుడి.

మీరు చెప్పెదరు, "నేను ఒక సంఘసభ్యుని అని." కయీను అట్లే చెప్పెను; హవ్వ అ విధముగానే చెప్పును. కడపటి దినములలో లవొదికయ సంఘము అట్లే ఉండునని బైబిలు తెలియజేయుచున్నది.

77మరి పరిశుద్దాత్మ మీ మనసాక్షిని పరిశోధించని, అప్పుడు మీరు దానియేలు 5:12తో అంగీకరించుదురు, అప్పుడు రాణి, బెల్షజరు ముందుకు వచ్చి చెప్పెను, ఆమె కనుగొనెను దానియేలు అను ప్రవక్త వారి మధ్యన ఉన్నాడని, అతడు సందేహములను తీర్చునటువంటి వ్యక్తి అని.

మీరు పరిశుద్దాత్మను అనుమతించుడి, ఈ రోజు ఆయనే ప్రవక్తయై యున్నాడు. ఇప్పుడే ఆయన మీ హృదయములోనికి అనుమతింపబడిన మరి మీరు దేవుని వాక్యముతో పరిశోధించిన వర్తమానమును గురించిన అన్ని సందేహములు తొలగిపోవును. మీ యొక్క సమస్త సందేహములు అయన తీర్చును. మీరు కనుగొనెదరు, ఈ రోజు కొరకైన ఖచ్చితముగా వాక్యముపై ఉన్న వర్తమానము.

మీరు లూధరు వర్తమానము ఈ రోజు ప్రసంగించలేరు. అది అందులో పోయినది, అయితే అది పాదము. వెస్లీని ప్రసంగించ లేరు, పెంతెకోస్తు ప్రసంగించ లేరు. మనము వాటినన్నిటిని దాటియున్నాము. వారు స్థాపింపబడి మరియు మరణించిరి. వారు కాడగా ఉన్నారు. సంఘము యొక్క మొదటి దశలో ఎట్లనగా, కాడ ఆకు వరకు వచ్చినట్టు. మొదలుగా భూమిలోనికి పోయిన గోధుమ గింజ (విత్తనము) వలె అది అగుపించదు.

రెండవదిగా వచ్చునది పుప్పొడి, అది కూడా గింజ (విత్తనము) వలె అగుపించదు. కొద్దికొద్దిగా ఆ విధముగా ఉండును. నిజమైన విత్తనము యొక్క ఛాయలో అది వచ్చును. అయితే నిశ్చయముగా ఆకులు భూమిలో పోయిన విత్తనము వలె ఉండదు. అది విత్తనములో ఉన్న జీవమును మోసుకొనిపోవును. అయితే అది ఏమి చేసెను? అది కూడా ఇతర స్వభావముల వలె ఒక శాఖగా అయిపోయెను. అది మరణించెను.

MATT 24:24•

MARK 13:22

 

78తిరిగి ఏమిటి? తెరలుగా వ్రేలాడులాటిది చిన్న చెట్టులో వరకు పోవు జీవమును గమనించుడి, దానికి గుండ్లు గుండ్లుగా వ్రేలాడు విత్తనము వలె అగుపించునవి వాటిపై ఉండును. అది చూచుటకు నిజమైన విత్తనము వలె కనబడును, అయితే అది కూడా (విత్తనము) కాదు. అటు పిదప అది తొక్కలో దిగును మరియు అది ఏమి తెచ్చును? విత్తనముపై తొక్క.

ఇప్పుడు మీరొక గోధుమ గింజను తీసుకొనుడి. మొదట గోధుమ (పైరుకు లేక కోతకు) ముందు వచ్చునపుడు, యేసు చెప్పినట్లు, "ఒక గోధుమ విత్తనము," మీరు దానిని తీసుకోని తెరచి చూచిన యెడల, కాడ నుండి దానిని లాగి చూచిన యెడల, దానిని చూచి "మనము గోధుమ గింజను పొందియున్నాము" అని చెప్పిన, జాగ్రత్తగా ఉండుడి. అది చూడను ఇంచుమించు గింజవలె ఉండును, అయితే దానిలో గింజ ఉండదు. అది తొక్క. పెంతెకోస్తులు అక్కడే యున్నారు. మత్తయి 24:24 చెప్పుచున్నది, "ఈ కడపటి దినములలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చును." అయితే ఒక్కొక్క ఆకుగా లాగి చూడుడి. మీరు గింజను పొందలేరు. ఆ గింజ దాని వెనుక భాగములో ఉండును, చూశారా.

79మరియు జీవము సంఘశాఖల నుండి బయటికి వచ్చి, విత్తనము లోనికి పోవును.

అప్పుడు ఏమి జరుగును? మరియు గింజ పెరుగుటకు ఆరంభించినపుడు అది పెద్దదై, అది కప్పును, మరియు సంఘశాఖ దానినుండి తొలగిపోవును.

మనము ఎందువలన దీని నుండి సంఘశాఖను పొందలేము? అవి కాలేవు. అది విత్తనము. అది ఇంకనూ ముందుకు పోలేదు. మనము కడపటి కాలములో ఉన్నాము.

ఇప్పుడు అది ఏమి చేయబడవలెను? సూర్యుని ముందు పరిపక్వమునకై ఉంచుడి. అది ఖచ్చితముగా సరి. మనము దేనిని గురించి మాట్లాడుచున్నమో, ఆ వాక్యము మన హృదయములో పడి జీవమును బయటికి తేవలయును. అవునండి. దానియేలు గురించి ఆ రాణి చెప్పినట్లు, ఆ పరిశుద్దాత్మను మీకు బయలు పరచుటకు అనుమతించిన యెడల, అప్పుడు మీకు ఏ విధమైన సందేహములు ఉండవు.

80మీరు చెప్పవచ్చును, "కృతజ్ఞతా దినముతో వీటికేమి కలదు? బ్రెన్హాం సోదరుడా, మీరు దేనిని గురించి మాటలాడుచున్నారు? ఇప్పుడు పావు-తక్కువ-తొమ్మిది అగుచున్నది. మీరు కృతజ్ఞతా (థాంక్స్ గివింగ్) దినము గురించి ఏమియు చెప్పలేదు." ఈ సమయమునకై ఎటువంటి వర్తమానము నాకు. వాస్తవముగా, అది సరి.

ఆ౦గ్లేయుల సంఘశాఖల నుండి మరియు ఈ శాఖల నుండి వేరుపరచబడి క్రొత్తగా కనుగొనబడిన జీవమార్గమునకై యాత్రిక పితురులు కృతజ్ఞలుగా నున్నారు. వారి కాలమున క్రొత్తగా అభిషేకించబడిన వాక్యమునకు వారు వివాహము చేసికొన వచ్చును.

కావున యాత్రికులైన అబ్రాహామువలె మనము కృతజ్జలమై యున్నాము. ఈ లోక కార్యముల నుండి, తక్కిన సహవాసముల నుండి మనలను వేరుపరచుకొని, అబ్రాహాము ఒక యాత్రికుడు. దేవుడు మనలను మృతి చెందిన సమస్త మతముల నుండి వేరుపరచియున్నాడు. ఇప్పుడు, నేను దేశములోని పలు దిక్కులకు మాట్లాడుచున్నాను, సమస్త మృత ఆచారాలు. మరి దేనిలోనికి? మనలను వేరుపరచి, మరియు మనకొక నూతన రాజ్యమును, ఒక నూతన వర్తమానమును ఈ రోజుకై ఆయన తెరచియున్నాడు

పెంతెకోస్తు ఎండిపోయి మరి మరణించెను. లూధర్ వలె, వెస్లీ వలె, మరియు ఇతరుల వలె, అది సంఘముల యొక్క కూడికగా ఉన్నది. అయినను దానిలో మంచి జనులు ఉన్నారు, దానిలో నుండి వారు బయటికి రావలసియున్నది.

81ఆయనేమి చేసెను? కడపటి వర్తమానమైన ఏడు ముద్రలను తెరచెను. దానిని మీరు గమనించారా? ఏడు ముద్రలు, ఏడు సంఘకాలముల యొక్క మర్మములన్నియు ఏడు ముద్రలలో ముద్రింపబడినవి. సంస్కర్తలకు వారి యొక్క దినములలో దానిని చేయుటకు సమయములేదు. వారు అంతవరకు జీవించలేదు. ఆయితే ఈ కడపటి దినములలో అరిజోనా నుండి బయలు వెళ్ళిన ప్రవచనము ద్వారా ఆశీర్వదించబడిన ఏడు ముద్రల ప్రత్యకత మనకు తెరువబడినది.

ఆ రోజు మరియు నేను దేవునిని ఎట్లు అడిగితిని, "ఈ యొక్క ఎడారిలో నాతో మీరు ఏమి చేయుచున్నారు?" మీకు తెలియునా, మోషే క్రొత్త నిబంధన, లేక పాత నిబంధనను వ్రాసెనని? అతడు నిశ్చయముగా వ్రాసెను. మొదటి నాలుగు పుస్తకములు న్యాయప్రమాణమును మరి అన్ని కార్యములను ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, మరి ద్వితీయోపదేశకాండము. అతడు పాత నిబంధనను వ్రాసెను. దానిని చేయుటకు అతడు తన సహచారులనందరిని మరియు ప్రియులను వదిలి ఎడారికి పోయెను.

82పౌలు క్రొత్త నిబంధన వ్రాసెను. అది సరి. ఆతడు రోమీయులకు మరి తక్కిన పత్రికలన్నియు, హెబ్రియులు మరియు తిమోతియు మరి ఆ విధముగా, మరి దానిని చేయుటకు అతడు తనను వేరుపరచుకొని దేవుని యొక్క బయలుపాటును పొందుటకు అరేబియా ఎడారికి పోయి మూడేండ్లు గడిపెను. ఓ, మీరు చెప్పవచ్చు, "మరైతే మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను మాట ఏమిటి? వారు యేసు చేసిన వ్రాసిన వారు. పౌలు అన్నిటిని వేరుపరచి మరియు ఒక్కటిగా చేర్చాడు. అది సరి.

అట్లయిన సరి దానిని చేయుటకు, తన ప్రియులందరిని వదలి దూరముగా అతడు ఎడారికి పోవలసియుండెను… మీరు గుర్తుంచుకొనుడి, "అయ్యలారా ఇదే సమయుము?" ఎందరు వినియున్నారు? "ఆమెన్" చెప్పండి. అది ఖచ్చితముగా సరియా? అట్లయిన ఈ కడపటి దినములలో తన వధువును ఐక్యపరచుటకు ప్రభువైన దేవుని యొక్క వర్తమానము యొక్క బయల్పాటును మనము కలిగియున్నాము. ఈ కాలము కొరకు అది వాగ్దానము చేయబడి యున్నది.

మలాకీ 4, లూకా 17:30, పరి. యోహాను 14:12, యోవేలు 2:38. లేఖనములలో బాప్తిస్మమిచ్చు యోహాను ఏ విధముగా తన స్థానమును ఎరిగెనో, ఈ వాగ్దానములన్నియు ఖచ్చితముగా ఆలాటివే.

83యేసు తన్నుతాను గుర్తింపచేసుకొనెను. వారేమి చెప్పిరి? "అటువంటి వ్యక్తితో మనకేమి. యోహాను ఒక అడవి మనిషి." సంఘము దానిని గ్రహించుటకు సిద్దముగా లేకుండెను. అదియే మాదిరి. ఈ రోజులలో కూడా సంఘము దానిని అంగీకరించదు.

84అయితే ఎన్నుకొనబడినవారికి, దేవుడు పిలచుచున్నాడు. ఎన్నుకొనబడినవారికి అది తెలియును. సద్గుణవతియైన వధువు, వాక్యము, ఈ కడపటి దినపు సంఘము, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎన్నుకొనబడిన యోగ్యమైన స్త్రీ, వాక్యము. మరి యేసు వాక్యమైన ఎడల… ఎందరు దానిని నమ్మెదరు? అది సరి, వధువు ఎల్లప్పుడు పెండ్లి కుమారుని యొక్క భాగమై యొన్నది. కావున వధువు ఎప్పుడును సంఘశాఖగా మారదు; వాక్యము ప్రత్యేకపరచబడి క్రీస్తు యొక్క వధువుగా ఉండును. ఆయన దానిని చేయునని వాగ్దానము చేసియున్నాడు. దానిని ఆయన ఏ విధముగా చేయునని ఆయన చెప్పియున్నాడు.

ఆయన ఎప్పుడును తన మాదిరిని వదలడు. ఆయన ఎల్లప్పుడు తన మాదిరి ప్రకారము చేయును. ప్రతియొక్క సారి ఆయన తన మాదిరి ప్రకారము చేయును. ఆయన మరల చేయును. ఈ కడపటి దినములలో ఆయన తన సద్గుణవతియైన (శీలవతి) వధువును పిలచును, తన ఇస్సాకు కొరకు వేచియుండు సుందరమైన రిబ్కా వలె. ఎటువంటి రమ్యమైన కాలము!

ఏడు సంఘకాలముల పుస్తకమును చదువుచుండగా మీకు మర్మముగా ఉండు రెండు పుస్తకములను ఇక్కడ మీకు తేటపరచుచున్నాను. రెండు పుస్తకములు. జీవగ్రంధము, ఒకరు చెప్పుచున్నారు, మీ పేరు దానిలో మీరు వ్రాయవచ్చు మరి అవి దానిలో నుండి తీసివేయబడవు; మరి ఇంకొకరు చెప్పుచున్నారు, మీరు జీవ పుస్తకము నుండి అతని పేరు తీయవచ్చును. ఇది ఇక్కడ సరిగ్గా ప్రత్యక్షపరచబడుచున్నది. మనము ముగించుటకు ముందు దీనిని గైకొనుటకు నేను వ్రాసియుంచుకొనిన నోట్స్ దగ్గర కొన్ని నిమిషములు నిలిచెదెను.

85జీవిమనునది దేవునికి ఒక పవిత్రమైనది, మరియు అది ఒక పుస్తకములో వ్రాయబడియున్నది. దేవుడు జీవమునకు కర్తయై యున్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా? ఇక్కడ మనము జీవించు ఈ సహజ జీవితము తారుమారైన అక్రమ జీవితము. అది సరియైన జీవితముతో ఆరంభించి యుండవలయును, కాని అది సహజ పుట్టుక వలన అది తప్పిపోయినది.

మొదటి జీవితము, లేక మీ మొదటి కలయిక, సృష్టి ద్వారా మీరు పుట్టకలో కలుపబడియున్నారు. ఒక సహజ క్రియ, ఒక సహజమైన మనుష్యుడు సహకరించుట, పురుషుడు మరియు స్త్రీ ఒక్కటిగా వారు కలియుట వలన మీ యొక్క మొదటి జీవితము ఇక్కడ కొనిరాబడినది. మరి అది పాపముతో మరియు మరణముతో కలుపబడియున్నది!

మీరు సర్పము యొక్క విత్తనమును చూచుట ఎలా తప్పిపోగలరు?

86మీరు ఉప-ఉత్పత్తి అయిన స్త్రీని చూచినప్పుడు, ఆమె వంటి ఇంకొక స్త్రీ కాదు, అదే రీతిలో ఆమె చేయబడెను, ఆమె వంచింపబడుటకుగాను చేయబడెను. దేవుడు ఎరుగును… ఆయనకు ఆది నుండి అంతము వరకు తెలియని ఎడల మరి ఆయన దేవుడు కాడు. ఆయన ఒక వేళ అంతము లేని వానిగా కాకున్నయెడల… ఆయన సర్వ వ్యాప్తి సర్వజ్ఞడుగా కాకుండా అంతము లేని వానిగా ఉండలేడు, ఆయనకు అన్ని కార్యములు తెలియును, ఆయన నిత్యుడు, కావున ఆయనకు అన్ని కార్యములు తెలియును. మరియు ఆయన ఆ స్త్రీని చేయవలసినదిగా ఉ౦డెను. ఆ పురుష్యునికి భార్య లేకుండెను. భార్యను, ఆ పురుష్యుడును ఏకమై యున్నారు. అతనికి పురుష మరి స్త్రీ యొక్క స్వభావములు గల ఆత్మ ఆయనలో ఉండెను. ఆయన వేరుచేయవలసినదిగా ఉండెను. సమస్తమును సృష్టించిన తరువాత ఒక ఉప-ఉత్పత్తిని తీసుకొనెను. ఆదిలో దేవుని ద్వారా సృష్టించబడిన ఏ ఆడ జీవి అలంటి కార్యము చేయలేదు. ఆ విధముగా చేయుటకు (మోసపోవుటకు) ఆమె చేయబడెను. ఆమె దానిని చేయునని ఆయనకు తెలియును. అది ఆయనకు తెలియని యెడల ఆయన దేవుడు కాడు.

ఆయితే చూడుడి, దేవునిలో ఉన్న గుణములు ప్రదర్శించబడవలయును. ఆయన రక్షకుడిగా ఉండి యుండవలయును. మరి అన్ని కార్యములను పరిపూర్ణముగా చేయుటకు, ఆయన చేసిన ప్రకారము, అన్ని ఉన్న ఎడల, మరి ఏదియును తప్పిపోదు. ఓ చిన్న బిడ్డలవలె ఉండకుడి; పురుషుల వలె, స్త్రీల వలె ఉండుడి. మనము మార్గము చివరన ఉన్నాము.

87ఇప్పుడు గమనించుడి, సృష్టి మరణముతో కలసియున్నది. మీ పై అధికారము చేసిన మీ మొదటి భర్త సహజమైన పుట్టక ద్వారా మీ యొక్క సృష్టి లోకమును మీరు సహజముగానే ప్రేమించుచున్నారు, ఎందుకనగా మీరు లోకమైయున్నారు మరియు లోకములో భాగస్తులైయున్నారు. అది సరియా? మీరు లోకములో భాగస్తులుగా ఉండుటవలన స్వబావముగానే లోకమును ప్రేమించుట మీ యొక్క కోరిక అయినది. మీరు సృష్టిలో భాగమైయున్నారు. దానిని మీరు నమ్ముచున్నారా? మరి అది మీ యొక్క సహజమైన కార్యము. అందువలననే మీరు తిరిగి జన్మించవలసిన వారై యున్నారు. మీరు వేరుపడవలయును. మీ యొక్క మొదటి భర్తకు మీరు మరణించవలసిన వారైయున్నారు. మీరు దానిలో జీవించలేరు. మీరు ఏదో ఊరకే ఇట్లు చెప్పలేరు, "సరి, నేను అతనికి విడాకులిచ్చి అతనిని ఆ సమయము వరకు వ్రేలాడదీయుదును." అది కాదయ్యూ. విడాకులు వ్రాయుట కాదు. అతడు చనిపోయిన! లోకము యొక్క స్వభావము మరణించ వలసియున్నది! అతని యొక్క ప్రతి యొక్క మచ్చ లేక మరక చనిపోవలసియున్నది. మీరు ఇంకొక స్వభావముతో మరల కలియవలసియున్నది.

DAN 7:9,10

 

88మీ యొక్క మొదటి స్వభావము యొక్క పేరు జన్మించి మరియు జీవగ్రంధములో పెట్టబడియున్నది, మరియు మీ యొక్క సమస్త కార్యములన్నియు కూడా అందులో వ్రాయబడియున్నవి. ఆ స్వభావముతో మీరు చేసినదంతయు జీవగ్రంధము అను గ్రంధములో పెట్టబడియున్నది.

దానియేలును మీరు గమనించిన, అతడు మహావృద్దుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన తల వెంట్రుకలు గొర్రే బొచ్చువలె తెల్లగా ఉండెను, వేలకొలది ఆయనకు పరిచారము చేయుటకై ఆయనతో వచ్చిరి — వధువు. అటు తర్వాత గ్రంధములు తెరువబడెను, మరియు మరియొక గ్రంధము తెరువబడెను, అదే జీవగ్రంధము. ఇదివరకే పరిశుద్దులు అక్కడ ఉండిరి, సంఘము, వధువు. మరి యొక పుస్తకము తెరువబడును, అదే జీవగ్రంధము.

89ఇప్పుడు, చూడండి. మీరు ఆత్మీయ మరణము దార్వా మీరు ఆ ఐక్యత నుండి వేరు చేయబడినప్పుడు… మీ యొక్క వెంట్రుకలు కత్తిరించుకొనవలయునన్న మీ సహజ కోరిక. పొట్టి దుస్తులు వేసికొను మరియు ముఖానికి రంగు పుసుకొనుట అను మీ సహజ కోరిక. సూక్ష్మబుద్ధిగల వ్యక్తిగా, జ్ఞానముగలవానిగా, ఇతరుల కంటె మేలైన కార్యములు తెలిసినవారిగా ఉండవలెను అను కోరిక. అదే హవ్వ కోరినది. అటువంటి కార్యములనే ఆమె కోరినది.

సరి, మీరు ఇట్లు చెప్పిన, "పొట్టియైన మీ, రెండుకు నాలుగు (కొలత) గల ప్రసంగీకులారా, మీరు లేచి నిలువబడి మరియు నాకు పి.హెచ్.డి., ఎల్.ఎల్., ఉన్నవని నాతో చెప్పినయెడల," ఈ ఒక్కొక్క బిరుదులు మీతో చేరునప్పుడెల్ల, మీరు దేవునికి మరికొంత దూరముగా వెళ్ళుచున్నారు. అది సరియే. నిజము. చూశారా.

90దానినే హవ్వ తీసికొనినది అదే. ఆమె అటువంటి దానితో గర్భవతియైనది. ఈ రోజు సంఘములు, బైబిలు పాఠశాలలతోను, మరి తెలివితోను, ఒక దానితో ఒకటి అంగీకరించకుండా ఉన్నవి. సరిగ్గా బైబిల్ చెప్పిన విధముగా ఒక భయంకరమైన గందరగోళముగా ఉన్నది — బాబిలోను!

తాను ఎక్కడ నిలచియున్నానని వధువుకు తెలియును. ఆమె చాలా కొద్దిమంది మాత్రమే. అనేకులు రక్షింపబడరు. చాలా, చాలా, చాలా కొద్దిమంది. "సరి, వారు వేలకొలది అని చెప్పినారు" అని మీరు చెప్పవచ్చు. అవును, అయితే ఈ రెండు వేల సంవత్సరములలో ఒకొక్క కాలములో నుండి బయటికి వచ్చినవారు. ప్రతియొక… లూధర్ కాలము మరియు ఆ గుంపు, మరియు వారు చనిపోయిరి, మరి వారు వెళ్ళి ఒక శాఖగా మారిరి. మరియు వెస్లీ, మరల పెంతెకోస్తు వచ్చినది, మరి ఆ విధముగా చిన్న కొమ్మలు బాప్తిస్తులు, ప్రెస్బిటేరియన్లు, మెతడిస్టు, నాజరిన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ మరియు ఆ విధముగా అనేకులు, చూశారా. ఒక ఆకు వలె అక్కడి నుండి వారు చీలిపోయినారు.

91అయితే మీరు గుర్తుంచుకొనుడి, మరి అది క్రిందికి వెళ్ళినపుడు మరియు ఆ గింజ పండుటకు మొదలిడినప్పుడు వారు, అది పండుటకు మీరు కనుగొనిన ఆ కాడలో ఉన్నదంతయు మరణించవలసినదై యున్నది. హల్లెలూయా, ఇప్పుడు మనము ఎక్కడ నిలుచుకొనియున్నామో మీరు చూచుట లేదా? జీవము మరల ధాన్యము (విత్తనము)లో ఉన్నది. అది ఏమిటి? ఖచ్చితముగా భూమిలోనికి పోయిన అదే ధాన్యము, అదే యేసు వధువు రూపములో, అదే సంఘము, అదే కార్యము, అదే వాక్యము.

అదే వాక్యము వీటి ద్వారా పీల్చబడి, ఇక్కడ బయటికి వచ్చి, ఒక తలగా ఇక్కడికి వచ్చియున్నది. మరి అక్కడి నుండి వచ్చిన ఆ జీవమంతయు, తన జనులను ప్రోగుచేసికొని, ఎత్తబడుటకు ఒక తలగా రూపుదాల్చి యున్నది. రేపు రాతైన లేక దాని తరువాత రాతైన ఆ కార్యము పై ప్రభువు చిత్తమైతే ప్రసంగించెదెను. మీరు ఆత్మీయ మరణము ద్వారా మీ మొదటి కలయిక నుండి వేరుపరచబడియున్నారు. ఇప్పుడు మీరు తిరిగి జన్మించియున్నారు, లేక తిరిగి వివాహము కాబడియున్నారు, క్రొత్త ఆత్మీయ కలయికతో, లోకములోని కార్యములతో కూడిన సహజ జీవితము కాదు, అయితే నిత్యజీవము. ఆదిలో నీలో ఉన్న భీజము నిన్ను కనుగొనెను.

ROM 5:1

 

92ఇప్పుడు, నీ పాత కలయికతో ఉన్న నీ యొక్క పాత పుస్తకము వెళ్ళిపోయెను. ఇప్పుడు, పాతదానిలోని నీ యొక్క పేరు మార్చబడెను. ఇప్పుడు మీరు చెప్పవచ్చు, "మీరేమి చెప్పుచున్నారు, నా యొక్క పాత గ్రంధము?" మరుపు అను సముద్రములో దేవుడు దానిని వేసెను. మీరు దేవుని ముందు దోష-రహితముగా ఉన్నారు.

ఇప్పుడు, మీ పేరు ఇప్పుడు క్రొత్త గ్రంధము నందున్నది. జీవ గ్రంధములో కాదు, అయితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధములో, గొర్రెపిల్ల దేనినైతే విమోచించినదో అది. మీ సహజ కలయిక అయిన మీ పాత పుస్తకమును కాదు, అయితే మీరు నూతన "వధువు." హల్లెలూయా! గొర్రెపిల్ల జీవగ్రంధములో మీ యొక్క నూతన జీవితము ఉన్నది, మీ యొక్క వివాహ ప్రమాణ పత్రిక, హల్లెలూయా! అక్కడే మీ యొక్క నిజమైన ఆది నుండి ఉన్న భీజము మిమ్ములను పట్టుకొనును.

ఇప్పుడు మీరు మన్నించబడుటయే కాక, మీరు నీతిమంతులుగా తీర్చబడిరి. మహిమ! నీతిమంతులుగా తీర్చబడుట. రోమియులు 5:1 చెప్పుచున్నది. సరి, రోమా 5:1 చెప్పుచున్నది, "కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడియున్నాము.

93వాక్యమును చూడుడి. మన్నించబడుట అను అర్ధము కాదు. ఆ వాక్యము అర్థము నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు మన్నించబడినారని అర్ధము కాదు. ఉదాహరణముగా మీరు నేను త్రాగి యున్నానని, చెడు కార్యములు, మరియు అన్ని చేయుచున్నానని విని మరి నా యొద్దకు వచ్చి చెప్పెదరు. మీరు కనుగొనెదరు నేను ఆ కార్యములు చేయలేదని, మరేమో మీరు వచ్చి, "బ్రెన్హాం సోదరుడా, నేను నిన్ను మన్నించియున్నాను" అని చెప్పినయెడల. నన్ను మన్నించుటనా? నేను మొదటిగా దానిని చేయనే చేయలేదు, చూశారా.

ఇప్పుడు, నేను దానిని చేసియున్నయెడల నేను అపరాదిని. అయితే నన్ను మన్నించినయెడల మరి నేను అపరాదిని కాను, అయితే నేను ఇంకను ఆ నీతిమంతుడుగా కాలేదు, ఏలయనగా నేను నిజముగా దానిని చేసియున్నాను. అయితే "నీతిమంతుడుగా తీర్చబడుట" అను పదము ఏ విధముగా అర్థమిచ్చునదనగా, "మీరు ఆ కార్యమును ఎన్నడూ చేయనే చేయలేదు." అది పరిగణము లోనికి కూడా రాదు. అది ఏ విధముగా చేయబడెను? దేవుని యొక్క మరపు అను సముద్రము అనే పుస్తకములో, మీ పాత పుస్తకము మరియు వివాహము రద్దుకాబడి, మరణించబడి దేవుని యొక్క తలంపులలో కూడా లేదు. ఆమేన్. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. "అందువలన నీతిమంతులుగా ఉన్నందువలన" దానిపై నేరము మోపబడినది, మీరు నేరము మోపబడినారు; మొదటిగా మీరు ఎన్నడూ దానిని చేయనేలేదు! పాత కలయిక దేవుని యొక్క మరపు అను సముద్రములో ఉన్నది. మీరు మొదలు దానికి వివాహము కాబడలేదు. ఆయన, పెండ్లి కుమారుడు, మీ యొక్క అవమానమును ఆయనే మోసెను; నీ కొరకు, నీ స్థానములో. జగత్తు పునాది వేయబడక మునుపు, ఆయన వధువుగా మీరు ముందుగా నిర్ణయింపబడినందున, నీ స్థానమును ఆయన ఎత్తికొనెను. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. మీరు ముందుగా నిర్ణయించబడిన విత్తనము.

94మీరు ఏ విధముగా ఈ స్థితికి వచ్చిరి? మీ యొక్క వ్యభిచారి తల్లియిన హవ్వతో మీకు జరిగిన మొదటి వివాహమువలన దానిలోనికి మీరు మోసగించబడిరి, అది మీ యొక్క తప్పు కాదు. మీ యొక్క సహజ పుట్టుక వలన వ్యభిచారము చేసిన హవ్వ వలె మీరును అదే దారిలో వచ్చినారు. ఆ కారణము వలననే మీరు వ్యభిచారులుగా జన్మించితిరి. మీరు, ప్రారంభములో పాపులు. అది సరి. మీరు దానిలోనికి మోసగించబడితిరి. అది నీ యొక్క తప్పు కాదు. జగత్తుకు పునాది వేయబడక మునుపు నీలో ఉన్న ఆ చిన్న భీజము మీరుగా ఉన్నందువలన, మీరు దానిని చేయలేదు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధములో దేవుడు నీ పేరును ఉంచాడు.

95మీరందరు వినినటువంటి నా యొక్క చిన్న పక్షిరాజు పిల్ల కధ. ఒక కోడి… ఒక వృద్దుడైన వ్యవసాయదారుడు, ఒక కోడిని పొదుగు కొరకు పెట్టెను. కోడి క్రింద పెట్టుటకు అతని యొద్ద సరిపడ్డంతగా గ్రుడ్లు లేనందువలన, మరి అతడు ఒక పక్షిరాజు యొక్క గ్రుడ్డును దాని క్రింద పెట్టెను. ఆ పక్షిరాజు పుట్టినపుడు, తక్కిన కోడి పిల్లలకు అది వింతైన కోడి పిల్లగా కనబడెను. ఆ పక్షిరాజు పిల్ల వారితో పోవుచుండగా, ఆ కోడి పోవుచున్నప్పుడు, "క్లక్ క్లక్క్లక్" అని శబ్దము చేయుచూ ఆ చిన్న పక్షిరాజు చెప్పుకొనెను, "అది ఏ విధముగా అరచుచున్నాదో నాకు తెలియదు, అయినను దానిని నేను వెంబడించుచున్నాను."

మరియు అతడు (కోడి) ఆ ధాన్యపు కొట్టు యొద్దకు పోయి, ఆ పెంట కుప్పను గెలుకుచుండును, మరి అది "క్లక్ క్లక్,క్లక్" అను శబ్దము చేయుచు పోయెను. ఇది మంచిది. ఇది మంచిది. నీవు మాతో కలువుము. మరి ఈ… ఆ చిన్న పక్షిరాజు పిల్ల ఆ ఆహరమును (పెంట కుప్పలోనిది) తినలేదు. అయితే దానికి తెలియదు కనుక ఆ కోడిపిల్లలతో పోయెను. దానికి ఏమి చేయవలెనో తెలియలేదు. మరియు ఆ కోడి బయటికి వెళ్ళి అది ఇది తెచ్చి ఇచ్చినపుడు, ఆ చిన్న పక్షిరాజు పిల్ల తన కడుపును నింపుకొనవలసియున్నది. అతనికి ఎట్లు చేయవలెనో తెలియలేదు, అయితే ఆ కోడి పిల్లలు చేయునదంతయూ చూచియున్నది. అయితే అక్కడ ఒక వ్యత్యాసమైన కార్యమున్నది. దానికి అది నచ్చలేదు.

96కావున ఒక రోజు ఆ తల్లి పక్షిరాజుకి తెలియును, ఆమె రెండు గ్రుడ్లను పెట్టెనని. కావున, ఆ ఇంకొక గ్రుడ్డు కొరకు వెతక నారంభించెను. చుట్టు ఎగురుచు, గొప్ప పరిశుద్దాత్మ వెతుకులాగున. ఒక రోజు అది ఆ ధ్యానపు కొట్టపై ఎగురుచుండెను, ఆ సంఘశాఖపై ఆమె క్రిందికి వంగి చూచినప్పుడు, ఆమె తన యొక్క పిల్లను చూచెను. ఆమె అరచెను. అతనిలో (ఆ పక్షిరాజు పిల్ల) లోపలి నుండి (అంతరాత్మ నుండి) ప్రతిధ్వనించు ధ్వనివలె ఆ అరుపు ఉండెను.

"ఓ ఆది సరిగా యుండెను!"

ఓ, దేవుని ద్వారా ముందుగా ఎన్నుకొనబడిన ఒక ముందుగా నిర్ణయింపబడి పుట్టిన భీజము, దేవుని వాక్యమును వినినప్పుడు, అది అతనికి ఒక సంగీతము వలె ఉండును. అతనికి తెలియును, అది సత్యమని. అతడు సంపశాఖల కార్యములతో అలసిపోయి ఉన్నాడు. "మాతో చేరుము. రమ్ము, మాతో రమ్ము. మాకొక సాంఘిక విందు కలదు. మాకు ఇది కలదు, మాకు అది కలదు…" ఆ చిన్న పక్షిరాజుకు ఇదంతయు సరిగా అని అనిపించలేదు.

ఆమె చెప్పెను, "కుమారుడా, నీవు ఆ గుంపుకు చెందినవాడవు కావు. నీవు నాకు చెందినవాడవు; నీవు నా వాడవు."

అతడు (బదులుగా) చెప్పెను, "అమ్మా, అది నిజము అని అనిపించుచున్నది. అయితే దానినుండి (ఈ కోడిపిల్లల గుంపు) నేనెలా బయటికి రాగలను?"

"ఒక దూకు దూకుము. నేను నిన్ను పట్టుకొనెదను." అదే నీవు చేయవలసిన పని.

JOHN 1:1•

JOHN 10:4,5

 

97ఈ యొక్క సమయము కొరకు ముందుగా నిర్ణయించబడిన భీజముతో దేవుని యొక్క కుమారునిగా జన్మించిన ఏ మనష్యుని ముందైనను, అభిషేకించబడిన వాక్యము నిరూపింపబడిన యెడల దేవుడు పరలోకమందు ఉండుట ఎంత వాస్తవమో అదే విధముగా ఆ వ్యక్తి దేవుని యొక్క వర్తమానమును చూచును (గుర్తించును). మార్టిన్ లూధర్ దానిని తనవారి కొరకు చూచెను. వెస్లీ తనవారి కొరకు దానిని చూచెను. పెంతెకోస్తు తనవారి కొరకు దానిని చూచెను. ఇప్పుడు, నీ సంగతి ఏమి? వారు సంఘశాఖలలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ వాక్యము దానిని ఖండించుచున్నది, మలాకీ 4లో ఖచ్చితముగా మనము ఈ రోజు దేనిని పొందవలయునని, మరి ఈ ఘడియకై అన్ని ఇతర వాగ్దానములు మనకు చెప్పుచున్నది. మీరేమి చూచుచున్నారు? మీరు దేనిని చూచుచున్నారు? ఆమేన్.

ఇక్కడే మనము ఉన్నాము. వాస్తవమైన, నిజమైన పక్షిరాజు యొక్క (స్వరము) వినుట. "నా గొర్రెలు నా స్వరము వినును; ఒక అన్యుని అవి వెంబడించవు." ఎందువలన? అది ముందుగానే నిర్ణయించబడినందువలన. మీరు దేవుని కుమారునిగా ముందుగానే నిర్ణయింపబడియున్నారు. జగత్తుకు పునాది వేయబడక మునుపే మీరు దేవునిలో ఉన్నారు. ఆయన ఘనత కొరకు, మరి మహిమ కొరకు మాత్రమే మీరు ఈ రోజు శరీరములో ప్రత్యక్షపరచబడియున్నారు. దేవుని యొక్క ప్రతియొక వాక్యముతో నిలువకుండా, ఆయన వాక్యమును గౌరవించకుండా మరి దానిని ఎలా చేయుదురు? అవునండి, ముందుగా నిర్ణయించబడుట వలన అ వాక్యములో మీరు భాగమైయున్నారు, ఎందుకనగా, చూడుడి, దేవుడు వాక్యమై యున్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా?

సరి, మరి ఆయన ఎల్లప్పుడును వాక్యమై యుండిన — "ఆదిలో వాక్యముండెను." - మరి దేవుడు వాక్యమైన యెడల, అప్పుడు మీరు దేవునిలో ఉండిరి. ఆ వాక్యము, మీరు వహించవలసిన ఆ పాత్ర (ఆ భాగము) ప్రపంచమునకు పునాది వేయబడక మునుపు దేవునిలో ఉండెను. అతడు మిమ్ములను చూచెను. అతడు మిమ్ములను ఎరుగును. దానికొరకే మిమ్ములను ముందుగా నిర్ణయించెను.

98మరి నేను మీకు చెప్పుచున్నాను, ఆ పక్షిరాజు ఏ విధముగా ఆ స్వరమును గుర్తించెనో, అదే విధముగా ఒక నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు వాక్యము ద్వారా మాట్లాడు దేవుని స్వరమును, అది అభిషేకింపబడి మరియు నిరూపింపబడినప్పుడు దానిని చూచి గుర్తించును.

చూడుడి, అతడు పైకి చూచెను. "క్లక్, క్లక్ అని చుట్టు తిరుగు, మాతో కలువుము, ఇక్కడికి రమ్ము, అక్కడికి పొమ్ము అది చేయుము, ఇది చేయుము అని చెప్పు ఆ వృద్ద కోడిని అతడు చూడలేదు." అతడు కోరిన విధముగా అతడెట్లు ఉండవలెనని అనుకున్నాడో, ఆ పైన ఎగురుచు, స్వేఛగా అరచుచు, ఉన్నతములలో భూమిలోని కార్యములకు పైగా, రాబందులకు పైగా ఉండవలయునని ఆ ప్రక్షిరాజు పిల్ల అనుకొనెను. హల్లెలూయా! అతనిలో ఆ విధమైన కార్యము ఉన్నందువలన అతడు ఆ విధముగా ఉండవలయునని తలచెను

99మరియు దేవుని వలన జన్మించిన ఒక వ్యక్తి; ఒక దేవుని యొక్క కుమారునికి, దేవుని యొక్క స్వభావము ఉండవలయును. అతడు దేవుని వలె ఉండవలయును. అతడు దేవుని ఘనపరచును. అతడు దేవుని వాక్యము యొక్క భాగమై యున్నాడు.

అతను ఆదిలో ఉన్న విధముగా, ఈ చివరి దినములలో రూపొందుచున్న ఈ వధువు, ఖచ్చితముగా అదే శక్తితో ఉండును. అతడు ఈ సంఘశాఖల నుండి బయటికి వచ్చి, వధువుగా ఉండుటకు వెలుపలికి వచ్చును. అతడు వధువుగా కాకుండా వేరే విధముగా ఉండలేడు.

JOHN 5:39•

JOHN 6:31,49•

JOHN 10:37,38

 

100వారియొక్క దినములలో ఆ యూదులు దానిని చూచియుండవలయును, ఆయన చెప్పినట్లు ఆయన ప్రవక్తగా వారి ముందు ప్రత్యక్షమయినపుడు ఆయనను (యేసును) చూడలేకపోయారు. ఆయన చెప్పెను, "లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అదే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." "నేను నా తండ్రి క్రియలు చేయని యెడల, నన్ను నమ్మకుడి." అయితే మీరు నన్ను నమ్మని యెడల, నేను చేసిన క్రియలను నమ్ముడి."

వారు చెప్పిరి, "నలభై సంవత్సరములు మా పితురులు అరణ్యములో మన్నాను తినిరి. మేమక్కడ ఉన్నామని మాకు తెలియును."

ఆయన చెప్పెను, "మరి వారిలో ప్రతియొక్కరు మరణించిరి." నిత్యముగా వేరు పరచబడిరి. ప్రతియొక్కరు చనిపోయిరి. అక్కడ ముగ్గురే యున్నారు. ఇద్దరు, రెండు మిలియన్ల నుండి బయటికి వచ్చిరి. అది ఒక మిలియనుకు (పది లక్షలకు) ఒకరు.

101ఎందువలన, లోపలికి పోవునపుడు, పురుషుని నుండి వచ్చు ఆ శుక్ర కణము, మరి సాధారణంగా ఫలవంతమైన ఒక గ్రుడ్డు స్త్రీలో ఉండును. ఒక గ్రుడ్డు, ఫలవంతమైన ఒక భీజము. పశువులను కలుపుట (హైబ్రిడింగ్) మిశ్రమము చేయుట మీరు ఎప్పుడైనా చూచినట్లయితే.

గమనించుడి, అక్కడ పదిలక్షల బీజములు ఉండును. ఇక్కడ పదిలక్షల భీజములుండును. ఆ గర్భములో ఒకటిగా కలియుటకు వదలబడినపుడు, అవి సంధించును. వాటిలో ఒకటి గ్రుడ్డు, పదిలక్షల గ్రుడ్డు, పదిలక్షల భీజములు. అందులో ఒకే ఒక గ్రుడ్డు ఫలించును. ఒకే ఒక భీజమే ఫలించును. అవన్నియు జీవము కలిగియుండును. చిన్న దూడలను అక్కడ తిరుగు లాడుటను (ఈదుటను) మీరు గమనించవచ్చును, ఆ కణమును అగ్గి పుల్లపై మీరు పెట్టవచ్చును. మరియు డిమోస్ (వ్యక్తి పేరు) వారందరు ఈ రాత్రి ఇక్కడ వినుచున్నారు, మరి అతనికి జ్ఞాపకముండ వచ్చును, మేము తీసికొని… అతను నన్ను తీసికొనిపోయి అది ఏ విధముగా క్రియ చేయునని. టెస్ట్ ట్యూబ్. ఒక అగ్గి పెట్టెలోని పుల్లపై తీసికొని దానిపై పెట్టవచ్చును. వేలకొలది దూడలు మరియు ఎద్దులు యొక్క చిన్న కణములు, అయితే వాటిలో ఒక్కటే జీవించును. వాటిలో ఒకే ఒక్కటి, పెద్ద బంతివలె ఉండు అండము లోనికి ఒకే ఒక్క భీజము ప్రాకుచు దానిని సంధి౦చును. ఆ గుంపు కణముల నుండి ఒకే ఒక కణము బయటకి వచ్చును, అ రెండు సంధించును, మరి తక్కినవి చనిపోవును. అవి జీవించుచున్నప్పటికిని, అవి చనిపోవును!

102ఎందుకనగా అక్కడేదో కార్యమున్నది, ఎవరో దానిని ఫలించులాగున చేసి దానిని నియమించిరి. అది ముందుగా నిర్ణయింపబడుట, నా సహోదరుడా. అవునండి.

దేవుడు నిర్ణయించవలయును, అది బాలుడా లేక బాలికా అని, ఎర్రని తల, నల్ల తల లేక ఏదైనను, అది దేవుని వలన నిర్ణయింపబడును. కన్యక యొక్క గర్భములో నుండి పుట్టట కంటెను ఇది గొప్ప మర్మముగా ఉన్నది. అయితే గమనించుడి, మిగిలినవన్నియు (కణములు) మరణించును.

ఇరవై లక్షలమంది జనులు అక్కడ బయటికి వచ్చి, పాటలు పాడి, అరచి, అన్ని కార్యములు చేసి, మాట్లాడి… భాషలలో మాట్లాడలేదు, అయితే వారు గంతులేసిరి. మరియు దేవునికి మహిమగా నిలిచిరి. సముద్రము దగ్గర పైకి క్రిందికి దూకిరి మరి అన్ని కార్యములు చేసిరి. మిగత అందరు చేసిన విధముగా. అయితే వాగ్దానపు భూమిలో ఇద్దరు మత్రమే పోగలిగారు. కాలేబు మరియు యెహోఘవ ఇద్దరు మాత్రమే. అది పది లక్షలలో ఒకరు. సహజ పుట్టకలో పదిలక్షలలో ఒకటి మాత్రము. అందరికి అదే ఆశీర్వాదముండెను. ఓ పెంతెకోస్తు లైన మీరు, తొందరగా మేల్కొన వలయును. పదిలక్షలలో ఒకరు.

ఈ రోజు ప్రపంచములో క్రైస్తవులని పిలువబడు వారు ఐదువందల మిలియన్లు (యాభై కోట్లు) ఉండవలయును. (పైన చెప్పబడిన) ఆ లెక్కలు సరైన యెడల, ఒక వేళ యేసు వచ్చిన యెడల, ఐదువందల మంది మాత్రము అప్పుడు ఆయనతో కొనిపోబడుదురు. ఎందువలన, ప్రపంచములో ఆ సంఖ్యకంటె అధికముగా ప్రతిరోజు తప్పిపోవుచుందురు. అయితే వారికి దానిని గూర్చి ఏమియు తెలియదు. (ఎత్తబడుటలో వధువు పోయిన యెడల ప్రపంచములో మిగతవారికి ఏమియు తెలియదు)

MATT 17:10,12

 

103"నేను అనుకొనుచున్నాను, శాస్తులు చెప్పిరి… మీకు తెలియునా అది… వారు యేసుతో చెప్పిరి, "ఈలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు?"

ఆయన చెప్పెను, "ఏలియా ఇదివరకే వచ్చెను, మరియు దానిని మీరెరుగక యున్నారు." అతనికి ఏమి చేయబడవలెనని లేఖనములు చెప్పి యున్నవో, దానినే అతడు ఖచ్చితముగా చేసెను. ఆ విధముగానే మనుష్యకుమారుడు శ్రమపడవలయును…

వారు ఆయనను గుర్తించలేదు. అయినప్పటికిని వారందరు సంఘస్తులే, అందరు జీవించుచున్నామని అనుకొనిరి. మరి మీరు చెప్పుచున్నారు, మరల జన్మించిన ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన దేవుని సేవకుడు, దేవుని యొక్క వాక్యమును విని, ప్రతి యొక సంఘశాఖల నుండి బయటికి వచ్చి ఆ సారమైన భూమిలోనికి, వాక్యమును ఫలించు భూమిలోనికి వచ్చును. అతడు ఏమి చెప్పకుండా అది చేయును. నాకు తెలియదు అతడెట్లు దానిని చేయునని. దేవుడు ఆ విధముగా చేయుటను నిర్ణయించెను.

104మీ యొక్క మొదటి వివాహములో ఆరంభములో మీరు మోసగింపబడితిరి. ఇప్పుడు మీకు తెలియును ఏది నిజమని. చిన్న పక్షిరాజు గురించి నేను చెప్పినట్లు అతడు పెండ్లి కుమారుని స్వరము వినిన వెంటనే దాని కొరకు అతడు పోయెను, అభిషేగించబడిన, ఈ కడపటి దినములకైన నిరూపింపబడిన దేవుని వాక్యము.

అతని దినములలో నోవహు నిరూపింపబడిన వాక్యము. మీరు దానిని నమ్ముచున్నారా? సరి, అతని వర్తమానము ఈ రోజుకు పనిచేయదు.

యేసు… యోహాను నిరూపించబడిన వాక్యము. మీరు దానిని నమ్ముచున్నారా? యేసు దినములలో అది చెల్లదు. నిశ్చయముగా అది పని చేయదు. అయ్యా, కాదు. ధర్మశాస్త్రమును, ప్రవక్తలును యోహాను వరకే; మరి అప్పటి నుండి పరలోక రాజ్యము.

105అపొస్తలులు, బైబిలును క్రమపరచిన వారు. సరిచేయు కాలములో లూధరు బయటికి వచ్చెను. అతని మాటలు… అతని సంఘము ఈ రోజు పనిచేయదు. వెస్లీది పని చేయదు. పెంతెకోస్తులది పనిచేయదు. వారి దినములలో అది క్రియ చేసినది. అయితే ఇప్పుడు వేరొక దినము. ఇది ఏడు ముద్రలు తెరవబడుటయై యున్నది. నాకు తెలుసు, ఇది మీకు వింతగా ధ్వనించవచ్చు, అయితే దేవుడు చాలా పరిపూర్ణముగా దానిని నిరూపించెను, దానిలో ఏ ప్రశ్న లేదు, పరిపూర్ణముగా.

ఇక్కడ స్థానిక సంఘమునకు మాత్రమే నేను చెప్పుట లేదు. నేను దేశమంతటయును గల జనులతో మాట్లాడుచున్నాను, చూచారా. మీరు అనుకున్నది (తోచినది) చేయుడి.

106ఇప్పుడు గమనించుడి, ఆయన దినములలో అభిషేకించబడిన వాక్యములో మీరు ముందుగా నిర్ణయింపబడిన భాగముగా ఉన్నారు. మీరు వెంటనే… ఎరిగిన మాదిరి, మీరు దానిని వినినప్పుడు, మీరు వెంటనే తెలుసుకొన్నారు, మీరు పక్షిరాజు అని. మీరు ఆరంభము నుండి సంఘశాఖల కోడి కాదు అని కూడా తెలుసుకొన్నారు. అక్కడేదో తప్పు ఉన్నదని మీకు తెలిసెను. ఏదో తప్పైన కార్యమున్నది. అది సరియే. ఆరంభములో దానిలోనికి (సంఘ శాఖలోనికి) మీరు చిక్కుబడ్డారు.

EPH 5:26

 

107ఆయన, పెండ్లి కుమారుడు మీ యొక్క అవమానమును తీసివేసి మరి జీవమైన రక్తముతో, వాక్యమనే నీటిలో కడిగి మరి దానిని మరపు అను సముద్రములో దానిని వేసెను. బైబిలు దానినే చెప్పుచున్నది.

మీరు మొదటి వివాహము కాబడిన మీ మొదటి భర్త అయిన లోకము మరియు నిన్ను ముందుగా నిర్ణయించిన అభిషేకించబడిన పెండ్లి కుమారుడు సంఘము నీటి ద్వారా నిన్ను శుద్దపరచినాడా? అది సరిగా ఉన్నట్లనిపించలేదు. అది సరియేనా? మీరు దానిని పంచాంగములో మీరు కనుగొనగలరు. అయితే దేవుని యొక్క బైబిలులో మీరు కనుగొనగలరు. మరి వాక్యముతో, నీటి సువార్తచే కడుగబడుట ద్వారా, చూశారా? మీరు నీతిమంతులుగా నిలువబడియున్నారు, ఎట్లనగా మీరు ఆదిలోనే పాపము చేయకుండ ఉండులాగున నీతిమంతులుగా తీర్చబడ్డారు.

సంఘమునకు నేను ఇప్పుడు ఇచ్చు వర్తమానము ఇదే ఇంకొక నిమిషములో మనము బయటకు వెళ్ళిపోవుచున్నాము. మీరు నిలుచుకొనియున్నారు. మీరు దేవుని వాక్యముపై నిలిచి యున్న యెడల, దేవుని వాక్యముతో మరియు, ప్రతి యొక్క ఆమేన్, ఏ కొంచెము అయినను వాక్యములో ఒక చుక్క అయినను (వదలక) ఎక్కడ మీరు నిలుచుకొనియున్నారు? ఆ పొట్టును అంతయు వదిలించుకొని గోధుమ వలె మారి ఆ సూర్యుని (వేడి) లో పరి పక్వము చెందవలయునని నేను మీకు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. ఆ రెండు కలిసి వచ్చుటను నేను వినుచున్నాను. మీరు మొదటి నుండి పాపము చేయని వారివలె పరిపూర్ణముగా నీతిమంతులుగా తీర్చబడియున్నారు. హల్లెలూయా, కృతజ్ఞతలు గురించి మాట్లాడుచున్నాము. నేను చాలా బాగుగా ఆనందించుచున్నాను. నేను దానికి చాలా కృతజ్ఞతతో స్తోత్రములు చెల్లించుచున్నాను, మిగతా నాకు తెలిసిన అన్ని కార్యముల కంటెను. మీరు పరిశుద్దమైన, గుణవతియైన, పాపమే లేని జీవించు దేవుని యొక్క వధువు. దేవుని ఆత్మతో జన్మించిన ప్రతి యొక్క పురుషుడును మరి స్త్రీయును యేసుక్రీస్తు రక్తముతో కడుగబడి ఏమి చేయని వారివలె నిలుచుచున్నారు. మీరు సంపూర్ణమైన వారు.

యేసుక్రీస్తు రక్తము… ఏ విధముగా మీరు… ఒక వ్యక్తి…

108నేను ఒక వేళ ఉదయము చనిపోవలసి యుండిన మరి ఒక వ్యక్తి నా స్థానమును తీసికొనిన, నేను ఆ పాపము కొరకు చనిపోలేను. ఎవ్వరో నా స్థానమును తీసికొనిరి. మరి యేసు వాక్యమై నా స్థానమును తీసికొనెను. నేను ఆయన వలె వాక్యము వలె ఉండుటకు, ఆయన నా వలె, ఒక పాపిగా మారెను. ఆమేన్. దానిని నేను నిజముగా ఉండ వలయును, సంఘమునకు కాదు, వాక్యమునకు. ఆమేన్.

ఓ, ఆయన సంఘములో ఇప్పుడు క్రీస్తుతో ఆత్మీయ కలయిక, శరీరము వాక్యముగా మారుచున్నది, మరియు వాక్యము శరీరమగుచున్నది. ఈ రోజు ఏమి జరుగునోయని బైబిలు చెప్పియున్నదో, ఆ ప్రత్యకత నిరూపించబడుట ఒక్కొక్క రోజు జరుగుచునే యున్నది. ఆ ఎడారిలో చాలా శీఘ్రముగా ప్రోగుచేయబడుచున్నది మరి కార్యములు జరుగుచున్నవి మరియు వాటితో నేను పోలేకపోయాను. ఆయన సంఘముతో కలియుటకు వచ్చుచు౦డగా మనము యేసుకు చాలా చేరువలో ఉన్నాము, అక్కడ వాక్యము, వాక్యముగా మారును. పరిశుద్దాత్మ యొక్క పిలుపు హృదయములను వెదుకుచున్నది.

EPH 5:26

 

109మీరు పరిపూర్ణముగా నిలిచియున్నారు. మొదటిగా మీరు పాపమును చేయనేలేదు. దేవునికి దానిని తెలియను కూడా తెలియదు… అది మరుపనే సముద్రములో ఉన్నది. మీరు దానిని చేయలేదు. నిందించువాని వలన మీరు దానికై నింద మోపబడితిరి. అయితే ఆది నుండి మీరు దేవుని యొక్క కుమారునిగా లేక కుమార్తెగా ముందు నిర్ణయించబడియున్నారు. మీరు అక్కడ కడుగబడి నిలిచియున్నారు, మరియు మీ యొక్క ఆ పాత విడాకుల పుస్తకము నెట్టబడి చనిపోయియున్నది, దేవుని యొక్క తలంపులతో కూడా అది లేదు. మీరు యేసుక్రీస్తు రక్తముతో కడుగబడిన సద్గుణవతియైన క్రీస్తు యొక్క వధువు. అమూల్యమైన, సద్గుణముగల, పాపము లేని, దేవకుమారుడు పరిశుభ్రమైన, కలుషితములేని తన సొంత రక్తము అనే నీటితో కడుగబడిన వాక్య వధువుతో నిలుచుకొనుచున్నాడు, ఆ వధువు, శరీరములో ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంగీకరించి ఆమెను గైకొనును, వారు ఆయన ఏ విధముగా ఉన్నారో ఆది నుండి తండ్రి యొక్క రొమ్మునందు వారు ముందే నిర్ణయించబడియున్నారు.

ఆయన ప్రేమ అని పిలువబడు దేవుని యొక్క లక్షణముగా ఉన్నాడు.

110మీరు ఏ విధముగా ఉన్నను మీరు దేవుని యొక్క సేవకులు — దేవుడు మిమ్ములను ఏమి చేయ వలయునని కోరినను, మీ స్థానమెక్కడ. దేవుడు సంఘములో కొందరిని అపోస్తలులనుగాను, ప్రవక్తలనుగాను, ఉపదేశకులనుగాను, కాపరులనుగాను నియమించెను. తన యొక్క అనాది సంకల్పము చొప్పున ఆయన ముందు ఏర్పాటుగా వారిని ఏర్పచెను. ఇక మీరు మొదటి నుండిన వారై (ముందుగా నిర్ణయించబడిన వారై ) యున్నారు. మీ యొక్క మొదటి వివాహము రద్దు చేయబడెను. మొదటగా మీరు దానిని చేయలేదు, ఎందుకనగా దానిని ఒకే ఒక కార్యము చేయగలదు (మీరు పాపము చేయనట్టు అగు పడవలయుననిన) అది దేవుడు ఆయనే దిగి వచ్చి దేవ కుమారునిగా యేసుక్రీస్తు నీ యొక్క స్థానమును ఆయన తీసికొని, మరియు నీటితో నిన్ను కడిగి… వాక్యము అనే నీటితో కడిగెను. మరియు వాక్యము, సంఘశాఖ కాదు, వాక్యము నిన్ను కడిగెను. అయితే మీరు వాక్యమనే నీటిలో నిలువలేకున్నయెడల, మీరు ఏ విధముగా కడుగబడెదరు? మీరు హవ్వవలె ఇంకను మచ్చతో యున్నారు.

"ఓ, ప్రియమైన చనిపోవుచున్న గొర్రెపిల్ల, ఇకెన్నడును పాపము చేయకుండ దేవుని యొక్క సంఘమంతయు విడిపింపబడు వరుకు మీ యొక్క అమూల్యమైన రక్తవు దాని యొక్క శక్తిని కోల్పోదు.

EPH 5:26

 

111పాపమనగా ఏమిటి? అవిశ్వాసమే పాపము, దేనిపై అవిశ్వాసము? వాక్యము. దేవుని యందు అవిశ్వాసము, అదే వాక్యమై యున్నది.

పరిశుద్దమైన కలుషితము లేని. ఓ హల్లెలూయా! ఆకాశములోనికి తర్వలో పోబోవుచున్నాము. ఆమేన్. సిద్దముగా నిలుచుకొనియున్నాము. తలంచి చూడుడి. రక్తము కారుచున్న వాక్యమనే నీటితో మీ వస్త్రములు కడుగబడియున్నవి. వాక్యము రక్తముగా అయినది. వాక్యము నీ కొరకు రక్తమును చిందించెను, మరియు మీరు రక్తము కారుచున్న వాక్యముతో కడుగబడినారు. వాక్యము రక్తమును కార్చుచున్నది, దేవుని జీవము ఆ వాక్యములో ఉన్నది, మరియు వాక్యము నీ కొరకు రక్తము చిందించెను, మీరు వ్యభిచారులైన మురికి నుండి కడుగబడి మరియు నిర్మలమై, పరిశుభ్రపరచబడి, వాక్యమును నీటితో కడుగబడుట వలన, మీ యొక్క తలంపులు యావత్తు దేవునిపైనను మరియు ఆయన వాక్యముపై యుండును.

2COR 6:17

 

112ఇప్పుడు, అది సత్యమని మీరెలా తెలుసుకొనగలరు? దేవుడు క్రిందికి దిగివచ్చినప్పుడు దానిని రుజువుపరచి మరియు నిరూపించును.

మీరు చెప్పువచ్చును, "ఆ విధముగా నేను నమ్మలేను." యేసు యొక్క మార్గమును వారు నమ్మలేదు. అయితే దానిని దేవుడు నిరూపించెను. నోవహు యొక్క మార్గమును వారు నమ్మలేదు. మోషే మార్గమును వారు నమ్మలేదు. బిలాము యొక్క వాక్యములను దానికి బదులుగా తీసికొనుటకు సిద్దముగా ఉన్నారు.

"మన మంతయు ఒక్కటే, కావున మనమందరము ఐక్యమగుదుము."

"మిమ్ములను వేరుపరచుకొనుడి," అని బైబిలు చెప్పుచున్నది, "అవిశ్వాసము నుండి."

113హల్లేలూయా!

ఇప్పుడు గమనించుడి. మీరు అది మాత్రము కాదు, మీరు ఆకాశములో జరుగు వివాహమునకు పోవుచున్నారు, ముందు ఏర్పాటు అను వివాహ బంధమును లేక గుర్తును మీరు ధరించియున్నారు. మీ యొక్క సొంత యోగ్యత వలన కాదు గాని కృప అను వివాహ గుర్తు మీరు పొందియున్నారు దేవుడు, ఆయనే దానిని చేసెను. అతడు మిమ్ములను జగత్తుకు పునాది వేయబడక మునుపే ఎరిగినందువలన ఆ వివాహ బంధమును మీకు అక్కడ ధరింపజేసెను; గ్రంధములో మీ పేరు పెట్టెను. ఎటువంటి కృతజ్ఞత తెలుపు కార్యము. హల్లెలూయా! మన దేవుని స్తోత్రము!

114ముగించుచుండగా, ఇప్పుడు దీనిని నేను చెప్పవచ్చును. మన కందరికి తెలియును నవీన పెంతుకోస్తు సంఘము, అది ఇప్పుడున్న స్త్రీతిలో, అన్ని సంఘశాఖలు ఒక్కటిగా… వారందరిని ఒకే కట్టుగా నేను త్రోయుచున్నాను, ఏలయనగా వారు. మీకు గుర్తున్నది, కలుపు మొక్కలను ఆయన మొదలు కట్టుగా కట్టి వాటిని కాల్చును. ఆయన అన్ని గోధుమ కాడలను తీసి అన్నిటిని మొదలు కాల్చును, పిదప ఆయన వచ్చి తన గోధుమను తీసికొని గృహమునకు కొనిపోవును. వారందరు కట్టలుగా కూర్చబడియున్నారు. మెతడిస్టు కట్టు, బాప్టిస్తు, పెంతెకోస్తులు మరివారందరు సంఘ శాఖల ఐక్య సభకు పోవుచున్నారు. అది సరియే. వారందరు కాలిపోయియున్నారు, చూశారా.

115మనకందరికి తెలియును. ఈ నవీన సంఘము ఇప్పుడున్న దశలో, స్థితిలో, ఈ రోజు దేవుడు సంఘమునకిచ్చిన ఆ గొప్ప పనిని ముగించు స్థితిలో లేదు. ఎంతమంది పెంతెకోస్తులు దానికి "ఆమేన్" అని చెప్పగలరు? అది సరి.

మనము ఏకత్వము, ధ్వంధత్వము, త్రిత్వము, ఇది, అది, ఇంకొకటి రచ్చ చేయుచు, కొట్టుకొనుచు (వేర్వేరు అభిప్రాయములు కలవారై) ఒకప్పుడు ఇది, మరియు అక్కడ మరి వారందరు పరీక్ష కొరకై వాక్యమును సంధించుటకు భయపడుచున్నారు. వారికి తెలియును… దానిని గూర్చి మీరు వారికి చెప్పిన యెడల మరి వారు చెప్పెదరు, "నేను ఏమి చేయలేను, నేను దానిని నమ్మలేను, ఆయన ఏమి చేసినను నేను లెక్క చేయను."

మీరు ఎటువంటి తండ్రిని, తల్లిని కలిగియున్నారని ఇది చూపుచున్నది. మీరు ఒక రోజు దేశపు సంఘ నాయకునికిగా కావచ్చును. మీరు అది, ఇది లేక మరొకటి; మీరు దేవుని కుమారునిగా ఉండుట మేలైనది.

116ఇప్పుడు, మీకు తెలియును సంఘమునకు వీలుకాదు. ఇప్పుడున్న స్థితిలో పెంతెకోస్తు సంఘము కడపటి దిన వర్తమానమును నిశ్చయముగా ఏ విధముగా కూడా కోనిపోజాలదు. అది చేయనా? ఎందుకు? బైబిలులో ఉన్న ఒకటి రెండు వాక్యములను కూడా అది అంగీకరించుటలేదు. మీరేల దానిని చేయగలుగుదురు? అది దానిని చేయలేదు. కావున మీరు చూచిన యెడల సంఘ శాఖల పని అయిపోయినది. అది సరి. ఎన్నుకొనబడిన జనులు మాత్రమే, దానికొరకు ఎన్నుకొనబడిర వారే. ఇప్పుడు గర్తుపెట్టుకొనుడి.

మరి మనలో ప్రతి యొక్కరికి తెలియును సంఘశాఖ వరుసలలో ఉన్నవారందరు, పెంతెకోస్తు, మరి అన్నియు చనిపోయి ఉన్నవి — వర్తమానములో ఉన్న తిరిగి జన్మంచిన క్రైస్తవులకే అది. మీ యొక్క మొదటి భర్త చనిపోయి ఉన్నాడు. అతడు మరణించినాడని మీకు తెలియును. దేవుడు అది చనిపోవునట్లు అనుమతించెను. అది ముగిసినది. దానియొక్క, విజ్ఞాన తెలివి, విధ్య, విజ్ఞాన రీతిలో నడుపు బైబిలు పాఠశాలలు అని పిలువబడు మరియు ఆ కార్యములన్నియు నశించిపోయినవి. అదేమి చేసెను? వేరు పడెను. ఏకత్వము ఇక్కడ మరియు త్రిత్వము ఇక్కడ, ద్వందత్వము అక్కడ మరియు ఆ విధమైన అన్ని తారుమారైన కార్యములు చేయుచు, "పెంతెకోస్తులు" అని వారిని పిలుచుకొని చెప్పుచున్నారు.

117ఎందులకు, ఒక యౌవ్వనస్తుని యొద్దకు నేను పోయాను. (ఇప్పుడు ఇక్కడ అతను నినుచున్నాడు) మరియు ఒక యౌవ్వన స్త్రీ, ఆమె ఒక రకమైన సంఘమునకు చెందినది మరి ఆమె చెప్పెను, వారు వేరుపడిరి. "ఏమి జరిగినదని" నేను అడిగితిని.

"మేము పలువిధములైన విశ్వాసమునకు చెందినవారము" చెప్పెను.

నేను అడిగితిని, "ఓ నన్ను మన్నించుము నీవు కేతలిక్కువా?"

"కాదు" అని ఆమె చెప్పెను. ఆమె ఒక సంఘశాఖకు — పెంతెకోస్తుకు చెందినదని చెప్పెను.

"నీవు ఏమని?" నేను అడిగితిని. అతడు (ఆమె భర్త) కూడా పెంతెకోస్తు అయితే ఇంకొక శాఖకు (పెంతెకోస్తులో ఇంకొక శాఖకు ) చెందిన అతను.

ఓ! మీకు తెలియునా రోమన్ కాథలిక్ సంఘము పెంతెకోస్తులుగా ఆరంభించిరి. అది నిజమని ఎంత మందికి తెలియును? ఇప్పుడు అది ఉన్న స్థితికి వచ్చుటకు దాని (రోమన్ కాధలిక్కులకు) రెండువేల సంవత్సరములు పట్టెను. లేఖనముల నుండి దేనిని తీసివేయకుడి, ఏది తీయకుడి. ఎందులకు, ఇప్పుడు ఉన్న అదే స్థితిలో వారు కొనసాగించిన, ఇప్పుటి నుండి ఇరవై సంవత్సరములకు ఇప్పటికంటె చాలా హీనమైన స్థితిలో పెంతెకోస్తులు ఉందురు. ఎందువలన, నిజముగా, చూశారా? అది ఏమిటి? అది ఏమిటి? వారి యొక్క తల్లి, తండ్రి ఎవరు అని చూడుడి. వారి యొక్క స్త్రీల వెంట్రుకలు కత్తిరించుటను అనుమతించుచున్నారు. వారికి తోచిన ఏదైనను వారు చేయవచ్చును, వారు ఆ సంఘ శాఖకు చెందినంత వరకు చేయవచ్చును. అదే వారికి కావలిసినది.

1TIM 5:6•

1JN 3:17

 

118ఓ, ఆశ్చర్యపడనక్కర లేదు, దేవుని యొక్క శాపము పెరిగిపోయినదనుటలో ఆశ్చర్యపడనక్కరలేదు. దేవుడు మీ కళ్ళ ముందు దానిని పెట్టెను. మరి మీరు కళ్ళు మూసుకొని దానిని చూడలేకున్నారు. మీ యొక్క కనికరము అను గర్భమును మూసికొనుచున్నారు, ఏడు ముద్రలలో గల నిజమైన దేవుని వాక్యము నిరూపింపబడి, దేశములలో ఆకాశముపై అది సాక్యమిచ్చినపుడు, మరియు అంతటను గొప్ప సూచనలతోను, అద్భుతములతోను ఆయన చేయుదునని చెప్పిన వాగ్దానములు నెరవేరినప్పుడు. అప్పుడు మీరు నోరు మూసుకొని చెప్పెదరు, "నాకు తెలియదు, నేను దానికేమి చేయలేను, నేను…"

ఓ, మై, చనిపోయున్నారు మరియు దానిని తెలుసుకొనలేకున్నారు! పాపములోను, అతిక్రమములలోను మీరు మరణించియున్నారు. ఓ, మై!

LUKE 17:28,30

 

119మనకందరికి తెలియును సంఘము పైన చెప్పిన స్థితిలో ఈ కడపటి దినములో ముగించజాలదు. ఏ విధముగా మలాకీ 4ను లోనికి తెచ్చును. దానిని ఏ విధముగా చేయును? అటువంటి కార్యమును వారు నమ్మను కూడా నమ్మరు. ఏ విధముగా అది నమ్మును మరియు లూకా 17:30 ఈ కడపటి దినములకై వాగ్దానము చేయబడిన లేఖనమునన్నిటిని అది ఏ విధముగా గైకొనును? అది చేయజాలదు, ఎందుకనగా దానిని కాదనుచున్నారు. "లోతు దినముల వలె మనష్యకుమారుని రాకడ దినములందు ఉండును."

ఆ రోజులలో సొదొమ ఉన్న పరిస్థితిని చూడుడి. ఈ రోజు సంఘ స్థితిని గమనించుడి. ఎన్నుకొనబడినవాడైన అబ్రాహామునకు ఏమి జరిగినదో చూడుడి. లోతుకు మరి సొదొమలో ఉన్నవారందరికి ఏమి జరిగినదో చూడుడి. సంఘ శాఖలలో ఉన్న వారందరిని, బిల్లి గ్రహమ్, మరియు ఓరల్ రాబర్ట్ ను చూడుడి. ఎన్నుకొనబడిన బయటికి వచ్చిన అబ్రహాము యొక్క సంఘమును చూడుడి.

GEN 18:22•

LUKE 17:30•

JOHN 5:39

 

120గమనించుడి, యేసునకు తానే ఒక విధమైన సూచనను, దేవుని యొక్క అవతారము, మానవ శరీరములో అక్కడ నిలుచుకొని…

"అది ఒక దూత" మీరు చెప్పవచ్చును. అది దేవుడని బైబిలు చెప్పుచున్నది. ప్రభువైన దేవుడు ఎలోహిమ్ అక్కడ మానవ శరీరములో నిలుచుకొనియున్నాడు, కడపటి దినములలో తన సంఘమును అదే విధముగా అభిషేకింతునని చూపించుచున్నాడు, మరల మానవ శరీరములో దేవుడు క్రియ చేయును. "లోతు దినముల వలె మనుష్యకుమారుని రాకడయందు ఉందును."

అదే విధమైన కార్యము. లేఖనములలో అక్కడ మీరు చూడవచ్చును. "చదువుడి… లేఖనములను పరిశోధి౦చుడి; మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాకమిచ్చుచున్నవి."

121కావున మనకు తెలియును వారు చనిపోయినారని. దాని యొక్క స్వార్దములో విజ్ఞానముతో, గొప్ప విద్య మొదలగు కార్యములు వీటిన్నిటితో దేవుడు అది చనిపోయేలా అనుముతించినారు. పెంతెకోస్తులు అందరును సాధారణముగా అలవాటుగా…. మీరు బిడ్డలను బైబిలు పాఠశాలకు పంపించుటను గురించి మాట్లాడెదరు, పాతకాల సోదరుడు లైల్ మరి వారందరు, ఆ విధముగా పంపించిన సంఘము నుండి వెలివేయుదురు. అయితే ఓ ఇప్పుడది గొప్ప కార్యము. "నా కుమారుడు దూరములో బైబిలు పాఠశాలలో చదువుచున్నాడు." అతడు తన సమాధిని త్రవ్వకొనుచున్నాడు.

ఇప్పుడు, మీరు అనుకొనుచున్నారా, ఈ రోజు వారు గైకొందురా? మీరు అనుకొనుచున్నారా, నేను ఎరుగని వాటిని బలపరతునని? నేను చేయను. ఈ యొక్క మనుష్యజ్ఞానము లేక తెలివి గల కాలములో వారికి, ఈ కాలములో జీవించు మనకు చాలా తేడా ఉన్నది, ఈ కాలములో సంఘములు విజ్ఞానము మరియు ఇతర అనేక నవీన యుగకార్యములలో గర్భము ధరించి యున్నది. మీరు దేవునిని అంచనా వేయలేరు. ఎందుకు, ఆ యూజకులు దేవునిని పరిపూర్ణముగా భావించిరి. వారు మెస్సీయా ఏ విధముగా రాబోవునని తెలిసికొని యుండిరి. అయితే వారు భావించిన దానికి వ్యత్యాసముగా ఆయన వచ్చెను. అది విజ్ఞాన పూర్వకముగా లేదు. "ఏ విధముగా ఈ వ్యక్తి, విరుద్దముగా పుట్టిన బిడ్డ… ఈయనెక్కడ చదువుకొనటకు పాఠశాలకు పోయెను? ఆయన యొక్క విద్య ఎక్కడి నుండి వచ్చెను? ఆయన ఎక్కడ నుండి నేర్చుకొనెను. ఇదంతయు? ఎందులకు, నీవు మాకు బోధించుచున్నావా? నీవు జారత్వములో పుట్టియున్నావు." ఓ ఏది ఏమైనను దేవుని కొరకు.

MATT 5:18•

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33•

REV 10:7

 

122అదే కార్యము మరల జరుగుటను చూడుడి? అది తిరిగి జరుగుటను చూడుడి. అన్నియు వారి యొక్క మత విజ్ఞానములో, మత విజ్ఞానములో, వారి బైబిలు విద్యాశాలలు చెప్పుచున్నట్లు. ఆ విధముగా వారు దానిని కోరుచున్నారు. అదే విధముగా అది ఉండవలయును లేకున్న అది కాదు. ప్రతిసారి దేవుడు వారిని మూఢులుగా చేయుచున్నాడు. ఆ కార్యము ఎల్లపుడు భిన్నముగా వచ్చును. నోవహు కాలములో ఆ విధముగా వచ్చెను. మో మోషే కాలములో ఆ విధముగా వచ్చెను. క్రీస్తు సమయములో ఆ విధముగా ఉండెను. యోహాను కాలములో చేయబడెను; శిష్యుల కాలములో ఆ విధముగా చేయబడెను; వెస్లీ కాలములో చేయబడెను; లూథర్ కాలములో చేయబడెను; పెంతెకోస్తు కాలములో అది ఆ విధముగా చేయబడెను; మరియు మళ్ళి అదే విధముగా చేయబడుచున్నది. అది దాని యొక్క మార్గము నుండి ఇంకను మారలేదు; ఎల్లప్పుడును అదే కార్యములలో వచ్చుచున్నది. ఏడు-ఆరు కాలములుగా సరిదిద్దువారు, వారి ద్వారా ప్రకటన 10లో ఏడవవాని వరకు చెప్పబడును, ఈ సమయములో అది మార్చబడునని, మరి ఆ విధముగా జరిగెను.

123ఇప్పుడు దీనిని చెప్పుచు మనము ముగించెదము. (దేవుడు అప్పగించిన) కార్యమును ముగించుట దానిని ఎట్లు చేయుదురు? మనకు తెలియును వారు చనిపోయినారని. ఈ నవీన విజ్ఞానకాలములో అది చనిపోవుటకు దేవుడు అనుమతించెను. కావున ఆయన ఏమి చేయును? సంఘశాఖలకు చెందని వధువుకు ఏడు ముద్రల మర్మమును తెరచును. ఆ ఏడుముద్రలు వారికి వ్యతిరేకముగా ఉన్నందున ఏ విధముగా సంఘశాఖ దానిని అంగీకరించును? సర్పము యొక్క సంతానము మరియు ఆ ఇతర కార్యములన్నియు, ఏడు ముద్రల రహస్యములన్నియు వారు బోదింపబడిన విధానమునకు వ్యతిరేకముగా ఉన్నది. ఏలయనగా వారు బైబిలు పాఠశాల నుండి. పాత పాఠశాలను తీసికొన్నారు. మరియు దేవుని యొక్క ఆ ఏడు ముద్రలు ఆ పర్వతము పైన తెరువబడినప్పుడు… అది సత్యము కాని యెడల ఈ ప్రసంగ పీఠములోనే దేవుడు నన్ను చనిపోవులాగున చేయనీ, అది సంభవించుటకు ఒకటిన్నర సంవత్సరములకు మునుపే నేను మీకు దానిని గురంచి చెప్పియున్నాను, ఆయన నన్ను అరిజోనా పొమ్మని చెప్పుటయు, అక్కడ ఆ అరణ్యములో ఏమి జరుగునని చెప్పెనో, నేను ఆ కార్యమును గురించి ఆ వ్యక్తులు ఈ రాత్రి ఇక్కడ అనేకులు ఉన్నారు, ఆ ఏడు దూతలు క్రిందకు వచ్చిన కార్యమును, ఆ పత్రికల యందు "లైఫ్" అను పత్రికలో ఆ ఏడు దూతలు ప్రత్యక్షము కాబడిన కార్యమును ప్రకటించిరి. వారి యొక్క పరిశోధనశాల యందు అది యున్నది అయితే అది ఏమని వారికి తెలియదు. మరియు అన్ని కార్యములు చెప్పబడెను, కాలిఫోర్నియా నశించుటయు, అది ఏ విధముగా జరుగును ఎన్ని దినములు ఆ కార్యము ఉండును అని నేను వారికి విశదపరిచితిని. అది ఏ విధముగా జరుగును, అలాస్కాలో ఎట్లు భూకంపము ఏర్పడును. మరియు ముగింపు కాలముల యొక్క సూచన మరి ఏమి జరుగనైయున్నదన్న కార్యములు కలవు. మరియు ప్రతి ఒక్కొక్క వాక్యముపై వాక్యము అది ఏమి చెప్పెను, అది ఒక్క సారి కూడా తప్పిపోలేదు. అది తప్పిపోవుటను మీరు ఇంతవరకూ చూడలేదు. ఎందువలననగా అది దేవుని వాక్యము మరి అది తప్పిపోదు, మరి భూమియు, ఆకాశమును గతించును గాని, అయితే వాక్యము తప్పిపోదు.

124దేవుడు ఆ ఏడు ముద్రలను తెరువవలయును, సంఘశాఖలో కాదు. నేను దానికి ఎల్లపుడు వ్యతిరేకిని. అయితే సంఘశాఖకు వెలుపల ఆయన ఒక వధువును ఎన్నుకొనును, ఒక శాఖ యొక్క వధువు కాదు. ఆయన దానిని చేయలేదు. ఆయన వాక్యమునకు అది వ్యతిరేకముగా ఉన్నది. అక్కడ ఆయన ఆ ఏడు మర్మములను బయలుపరచెను, మరియు అది దేవుని యొక్క పుత్రులకు ఈ కడపటి దినములలో బయలుపడవలసినందువలన, జగత్తుకు పునాది వేయబడినప్పటి నుండి ఉన్న అన్ని కార్యములను అది బాహాటముగా చూపించుచున్నది. జనులు దానిని చూచు విధముగా అని బయటికి తేబడినవి. అక్కడే మీరు ఇప్పుడు… ఈ యొక్క సంఘశాఖ-కాని వధువు.

ఓ, మై అక్కడే మీ యొక్క రెండు పుస్తకములు. వాటిలో ఒకటి గొర్రేపిల్ల యొక్క జీవగ్రంథము. దానిలో ఉన్న మీ పేరు దానిలో ముందుగానే నిర్ణయింపబడియున్నది. దానిలో ఉండి మీ పేరు తీసివేయబడజాలదు, ఎందువలననగా అక్కడ ఉండుటకు ముందుగానే నిర్ణయించబడినది. అయితే సాధారణమైన జీవగ్రంధము దానిలో నుండి మీరు ఏ సమయమునైను ఎత్తబడవచ్చును. మీరు పశ్చాత్తాపము పొందని యెడల, మీ పేరు కొట్టి వేయబడును, ఎందుకనగా మీరు న్యాయతీర్పులో నిలువబడవలయును. వధువు న్యాయతీర్సులో నిలువబడదు. ఎత్తబడుటలో కొనిపోబడును.

125ముగించునపుడు నేను దీనిని చెప్పుచుండగా, ఇప్పుడు 9:30 గం.ల దగ్గరవుచున్నది, ప్రభువు చిత్తమైనయెడల 9:30 లోపలమనము బయలుదేరెదము. ఇప్పుడు భయభక్తులతో ఉండుడి. వినుడి. ఒకప్పుడు… ఇది చెప్పుచుండగా, ఇది దేశమ౦తటను ప్రసరింపబడుచున్నది, ఇప్పుడు న్యూయార్కులో సమయము 11:25 ఫిలిడల్ఫియాలోను, దాని చుట్టు ప్రక్కలను ఆ యొక్క ప్రియమైన పరిశుద్దులు అక్కడి నుండి వినుచున్నారు, చుట్టు ప్రక్కల నుండు సంఘములందు కూడ వినుచున్నారు. మెక్సికో, కెనాడా నుండి కూడా. రెండు వందల మైళ్ళలో ఎక్కడున్నను ఉత్తర అమెరికా ఖండము లోపల ఉన్న జనులందరు, వేలకు వేలమంది పైగా దీనిని వినుచున్నారు. సంఘమా! అది మీకు నా యొక్క వర్తమానము, మీరు వాక్యము ద్వారా ఆత్మీయ ఐక్యతలో ఉన్నారు, మీ యొక్క పాత భర్తలకు మీరు చనిపోయివున్నారు. మీరు నూతనముగా జన్మించియున్నారు. మరల అతనిని త్రవ్వి బయటికి తీసికొని వచ్చుటకు ప్రయత్మింపకుడి. అతను మరణించియున్నాడు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైన యెడల, మీలో ముందుగా ఉంచబడిన ఆ భీజము, అది వాక్యము కావున, వాక్యము పై, వాక్యముపై వాక్యము వచ్చి క్రీస్తు యొక్క సరిపూర్ణ స్వరుపము వచ్చు వరకు వాక్యముతో కలియును.

ఇప్పుడు, మనమొక కార్యమునకు సిద్దముగా ఉన్నాము. అది ప్రభువు యొక్క రాకడ.

JOHN 8:44•

JOHN 10:37

 

126అక్కడే జీవగ్రంధములో మీ పేరు వ్రాయబడియున్నది.

జీవగ్రంధమనగా దేవుని యొక్క వాక్యమే, ఎందుకనగా వాక్యమే దేవుడైయున్నాడు, మరియు జీవము అను ఒకే కార్యము దేవుడే. కావున బైబిలు వాక్యముగా మారుటకు ముందు మీ పేరు బైబిలులో చెప్పబడియున్నది. మరి మీరు దానిని చేయుటకు ఇక్కడున్న యెడల, మరియు అది ఆ వాక్యమును నిరూపించదా? సంఘము దానికదే నిరూపించదా? అది ఏమని, మలాకీ 4 మరియు తక్కిన ఇతర కార్యములు ఖచ్చితముగా, పరిపూర్ణముగా దానిని నిరూపించలేదా?

యేసు వచ్చినపుడు ఆయన చెప్పియున్నాడు, "నేను ఏ కార్యములైతే చేయవలెనని చెప్పబడియున్నదో, మరియు ఆ క్రియలను నేను చేయని యెడల నన్ను నమ్మకుడి."

"ఆయన ఏ గుంపుతో చేరెను? ఆయన చెప్పెను, "మీరందరు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మరియు అతని కార్యములు మీరు చేయుదురు." చాశారా? సంఘమూ మనము కడపటి దినములో ఉన్నాము. అదే మీకు నా యొక్క కృతజ్ఞతార్పణ వర్తమానము.

127ఇప్పుడు ముగించుటకు ముందు, నేను ఒకప్పుడు గ్లేసియర్ నేషనల్ పార్క్ లో ఉన్నాను. ఆ రోజు రాత్రి "మంచుగడ్డ అగ్ని" పడబోవుచున్నదని ఆ రోజంతయూ మేము వినియున్నాము. కావున జనులందరు దాని కొరకు సిద్దపడుచుండిరి, ఏలయనగా ఆ అగ్ని ఆ రోజు కుమ్మరించబడును. వారు ఒక ద్రవమును ఉంచిరి… అగ్ని గొప్ప మంచుగడ్డ వలె పడును, ఆ అగ్ని నుండి వర్ష ధనస్సు వలె కనబడి ఆ మంచుగడ్డ నుండి పడును. నేను, నా భార్య, బిడ్డలు రోజంతయు ఆ పార్కులో చుట్టు తిరిగి చూచుచుంటిమి. ఆ అగ్ని ప్రదర్శనమును చూచుటకు మేము అక్కడే వుండి చూడవలయునని అనుకొన్నాము, మేము దానిని చూడబోవునట్లు మాకు తెలుపబడినది. దానిని మరల చూడపోవుచున్నాము. వారు చెప్పిరి, ఎండాకాలములో అది జరుగును. నేను చెప్పాను, "సరి దానిని మేము చూడగలమా?"

వారు చెప్పిరి, "ఈ రోజు రాత్రి మేము మాట ఇచ్చియున్నాము." మేము మాట ఇచ్చియున్నాము. "ఇప్పుడు వారు అక్కడ దాని కొరకు సిద్దపడుచున్నారు" అని చెప్పెను.

128ఆ యొక్క సంభవము కొరకు నేను సిద్దముగా ఉన్నప్పుడు… ఇప్పుడు అదే కార్యము జరుగుచున్నది. ఆ యొక్క సంభవము కొరకు అన్నియు సిద్దముగా ఉన్నవి. ఆయన నామము నిమిత్తము ఒక సంఘము బయటికి లాగబడియున్నది, ఈ లోకము నుండి, సంఘశాఖల నుండి, ప్రపంచమునుండి, ఈ లోక కార్యముల నుండి, మురికి నుండి ఆయన వధువును వెలుపలికి తీయుచున్నాడు.

మరియు ప్రతి యొక్కరు… ఆ సంభవము సిద్దముగా ఉన్నది. ప్రతి ఒక్కరు అక్కడ నిలుచుకొని మరి చెప్పుచున్నారు. "ఆ కొండపైన జరుగబోవు దానిని ఇప్పుడు గమనించుడి."

ఆ విధముగానే అది ఎలప్పుడును జరుగును. ఆ విధముగానే ఈ సారి కూడా జరుగబోవుచున్నది. ఆ విధముగానే ఎల్లపుడు వచ్చును సంఘశాఖల నుండి రాదు. దేవుడు ఎప్పుడు సంఘశాఖను ఉపయోగించలేదు. లేదు. చక్కదిద్దు వ్యక్తి పోవుచున్నాడు. ఆయన ప్రభువు యొక్క వాక్యమును పొందును, మరి అతను చనిపోయిన పిదప వారు ఒక సంఘశాఖగా మారి దానినే పెంతెకొస్తులు మరియు ఇతరులు చేసిరి. మరియు క్రొత్త సంగతులు అన్నియు… ఆ విధముగానే అన్ని కార్యములు బయలుపడెను. ఒక నూతన వాక్యము కలుపబడును, దానిలో నుండి ఒక సంఘమును కట్టెదరు, సంఘ శాఖగా మారి, వారు వేరుపడుదరు. అది ఆ విధముగానే ఉండవలయును. అది మీరు సహజ ప్రకృతిని మార్చలేరు. ప్రకృతి సరిగ్గా ఆయా కాలములో పండును: కాడ, ఆకు, తలగడ, మరి ఆ విధముగా పొట్టు, మరియు అటు పిదప గోధుమ (గింజ).

JOEL 2:23,28,29•

MAL 4:5,6•

ACTS 2:17

 

129ఇప్పుడు గమనించుడి, అన్నియు సిద్దముగా ఉన్నవి. సమస్తమును ర౦గులు పెట్టబడి సిద్దముగా ఉన్నవి. మరియు ప్రతి యొక్కరు బయట నిలుచుకొని యున్నారు. నేను నా తల ఎత్తి పైకి చూచుచున్నాను, నా భార్య చుట్టు నా చేతులేసి మేము చూచుచున్నాము, బిడ్డలందరు అక్కడ నిలుచుకొని యున్నారు, అందరును ఆ విధముగా పైకి చూచుచున్నారు. మై, అదేదో కార్యమైయున్నది, ఎందుకనగా దానిని మేము ఎదురు చూచుచున్నాము. అది మనకు వాగ్దానము చేయబడినది. ఆమేన్.

వాక్యము దీనిని వాగ్దానము చేసియున్నది. "యెహోవా నియమించిన భయకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయుగు ఏలియాను మీ యొద్దకు పంపుదును, అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును.

"మరియు కడపటి దినములలో ఇవన్నియు జరుగును, పైనుండి నా ఆత్మను కుమ్మరించెదెను. కడపటి దినములలో మొదటి మరియు కడపటి వర్షము కురియను."

మరియు ఈ వాగ్దానములన్నియు లేఖనముల ద్వారా ఇవ్వబడెను. మనము పైకి చూచుచున్నాము, ఈ సమయములో దేశమంతటను గల వధువు పైకి చూచుటను (ఎత్తబడుట కొరకు) గమనించుచున్నాము

సంఘమా, ఆయన ఈ రోజులలో ఒకానొక రోజు వచ్చుచున్నాడు. ఆయన మొదటి సారి వచ్చినది ఎంత నిజమో, ఆయన మరల వచ్చును. సిద్దముగా ఉండుడి. పొట్టు నుండి వేరుపడుడి. సూర్యుని ముందు పడియుండుడి. తల పైకెత్తి పైకి చూడండి. కనిపెట్టుకొని ఉండండి.

130ఉన్నట్లుండి ఆ కొండపై నుండి మేము దేనినో వినియున్నాము, లౌడ్ స్పీకర్ ద్వారా ఒక స్వరము చెప్పుచున్నది," అన్నియు సిద్దముగా ఉన్నవి."

అప్పుడు నా ప్రక్కన ఉన్న ఆ వ్యక్తి చెప్పుచున్నాడు, "అగ్నిపడనీ."

ఆ కొండనుండి కుమ్మరించబడుచున్నది, మంచుగడ్డ, అగ్ని నాలుక వంటి అగ్ని మంటలు, అది చూడవలసిన దృశ్యము.

సహోదరుడా, ఒకానొక ఈ రోజులలో అగ్ని కుమ్మరింపబడును, అన్ని కార్యములతో సిద్దముగా ఉండెదము. మనము పైకి పోవుచున్నాము. అగ్నిపడు ఆ వేళ కొరకు మనము సిద్దపడెదము.

మనము, కడపటి దినములలో ఉన్నాము, మనకందరికి అది తెలియును. ప్రభువు యొక్క రాకడకు మనము సిద్దముగా ఉన్నాము. అన్ని పాపముల నుండి వేరు పడుటయే మీరు చేయవలసిన కార్యము. లోకమునకు సంబంధించిన దేనినుండైనను వేరుపడుడి. లొకమును, లోకకార్యములను ప్రేమింపకుడి. ఏ ఒక్క వ్యక్తియు, తన తెగల ద్వారా నిన్ను వంచింపకుండ ఉండనీ. దేవుని యొక్క వాక్యములోను, దేవుని వాగ్దానములోను సరిగా, తిన్నగా నిలిచియుండుడి; మరియు ఆ వాక్యము ఈ రోజు కొరకైన వాక్యమైన యెడల దేవుడే దానిని ఆ విధముగా నిరూపించును. ఆయన చేయని యెడల, ఈ రోజుకైన వాక్యము కాదు. పెంతెకోస్తు దినమున పడిన ఆ వాక్యము ఈ రోజు పని చేయదు. లేదండి. అది పెంతెకోస్తుకై యున్నది; ఇది వధువుకు మాత్రమే, వధువు ఇంటికి పోవుచున్నది. మనమొక వ్యత్యాసమైన దానిని కలిగియున్నాము. దానిని పెంతెకోస్తులు మరల కలిగియుండిరి. మనము వధువు యొక్క కాలములో ఉన్నాము. నోవహు యొక్క వాక్యము, మోషే దినములలో పని చేయని విధముగా, మోషే యొక్క ధర్మశాస్త్రము, పౌలు యొక్క కాలములో పని చేయని విధముగా, వారికి చెప్పుటకు ఆయన ప్రయత్నించెను. "మీరు దానికి చనిపోయి ఉన్నారు! దానిని మీరు కలిగియుండలేరు?"

1COR 15:52,53•

1THS 4:15

 

131దేశము యొక్క నలుమూలల నేను ఈ రాత్రి మాట్లాడుచున్న సంఘమా, మీరు సంఘ శాఖల నుండి వేరు పరచబడియున్నయెడల, ఈ లోక మురికి నుండి వేరు పరచబడియున్న యెడల, మనుష్యులు తయారు చేసిన తెగలలో మిమ్ములను పెట్టు కార్యము నుండి, ఆ క్రమము నుండి, అటువంటి కార్యముల నుండి మీరు మిమ్ములను వేరుపరచుకొని తలలెత్తి పైకి చూడుడి! సిద్దపడుడి! ఈ రోజులలో ఒకానొక రోజు ఆ అగ్ని పడబోవుచున్నది. దేవుడు మన దృష్టి నిలుపులాగున ఆయన వచ్చులాగున చేయబోవుచున్నాడు. ఆయన వచ్చునపుడు మీరు సిద్దముగా ఉన్నారా? సహజాతితమైన వధువు రహస్యముగా ఎత్తబడుట. ఆమె మర్త్యము నుండి అమర్త్యమునకు మార్చబడును, కనురెప్పపాటులో ఒక్క కణములో మార్చబడును. సజీవులమై యుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

132యుద్దము నిలిపి వేయబడిన ఆ రోజు నేను టూసాన్లో నిలుచుకొని యున్నాను. నా యొక్క చిన్న కొడుకు ఆ సైనికులు నడచి పోవుటను చూడవలయునని ఉండెను. నేను ఆ వేళలో వాక్యమును ధ్యానించుచుంటిని, మరియు వ్యాధి గ్రస్తులు నాకు ఫోను చేయుటయు ఆ అనేక కార్యములతో నాకు సమయుము లేకుండెను. అతడు నాతో చెప్పెను, "డాడీ?" వారు నన్ను తీసికొనిపోరు?. "నన్ను తీసికొనిపోవు?" అని అతడు అడిగెను.

"సరి," అని నేను చెప్పితిని.

సోదరుడు సిమ్సన్ (అతనిక్కడున్నాడని నేను అనుకొనుచున్నాను) మరియు అతని కొడుకు పోవలయునని ఉండిరి. నేను వారిని నా కారులో తీసికొని వెళ్ళితిని.

నేను ఒక మూల నిలుచుకొని మరి గమనించుచుంటిని. మరి కొద్దిసేపటిలో కొంత దూరములో "బోమ్స్," "బోమ్స్" అని ధ్వనించుచు వచ్చుచుండును, మేళతాళము లతో కొలుచు, నేను అక్కడ నిలువబడి, ఈ చిన్న బాలురు సేనలను గూర్చి వాని పుస్తకములలో చదువుచుందురు. వారు దానిని ఇష్టపడెదరు. మొదటి ప్రపంచ యుద్దపు టాంకులు వచ్చుటను నేను గమనింతిని. అక్కడే వారు చిన్న చిన్న సేన దళములలోని దండు నడుచుచు వచ్చిరి. అటు పిదప వచ్చినది. పెద్ద క్రొత్త రెండవ ప్రపంచ యుద్దములో ఉపయోగించబడిన టాంకు, ఆ టాంకు పెద్దది షర్మాన్ టాంకు మజల్ (ఫిరంగి) బ్రేకు గలది. అటు పిదప, తరువాత, (బంగారు పతకము) గోల్డ్ స్టార్ తల్లులు (యుద్దములో మరణించి బహుమతి పొందినవారి తల్లులు) అటు పిమ్మట మొదటి ప్రపంచ యుద్దములో మిగిలిన (యుద్ద వీరులు) అరిజోనాలో ఉన్న ఆ పన్నెండుగురు నడుచుచు వచ్చిరి. అటు పిదప ఒక తెల్లని శిలువతో గుర్తుపట్టలేని సైనికుడు తేలిపోవుచు వచ్చెను. అక్కడ ఒక నావికుడు, ఒక సైనికుడు కాపలా కాయుచు నిలిచియుండిరి. ఆ తేలుచు వచ్చు దానిలో ఒక తెర దానిలో ఒక ప్రక్క నెరసిన తలవెంట్రుకలతో వృద్ధురాలైన తల్లి, బంగారు పతకములో దానిని గుచ్చుకొని ఉన్నది; ఒక లేతవయస్సులో ఉన్న భార్య, చనిపోయిన భర్త కొరకు ఏడ్చుచున్నది, ఒక చిన్న బాలుడు సరైన దుస్తులు లేక తన తల త్రిప్పుకొని, అతని తండ్రి యుద్దములో చంపబడెను, మరియు ఆ విధముగా అనేకములైనవి దాని వెనుక వచ్చుచుచుండెను అటుపిదప క్రొత్త సేన దళము.

నేను అక్కడ నిలుచుకొనియున్నాను. ఎటువంటి దృశ్యము అది చూచుటకు; అయితే ఎంత విచారము.

1THS 4:15,16

 

133నేను తలంచితిని, "ఓ దేవుడా, ఒకానొక రోజు, నేను ఇంకొక దృశ్యమును చూడబోవుచున్నాను.

ఒక పునరుత్తాన దినము వచ్చును, మొదటి వారు కడపటి వారగుదురు. మరి కడపటివారు మొదటి వారగుదురు. ఆ పాత ప్రవక్తలు మొదట బయటికి వచ్చెదరు, గాలిలో ఊరేగింపు అడుగు వేయుచు పోవుటను చూచెదరు, సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటె ముందుగా ఆయన సన్నిధిని చేరము, దేవుని బూర శబ్దము చేయునపుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము నారితో కూడ లోనికి కొనిపోబడుదుము. హల్లేలూయా, ప్రతి యొక్క కాలమునందుండి లూథర్, వెస్లీ, మెతడిస్టు, ప్రెస్బిటేరియన్ మరియు కడపటికాలము వరకు, ఎవరెవరు వాక్యమును అంగీకరించిరో వారందరు.

దేవుడు మిమ్ములను ఆశీద్వరించును, అన్ని కార్యములతో సిద్దముగా ఉండుడి, మరి అగ్ని పడబోవుచున్నది.

134ఒక్క క్షణము మన తలలు వంచెదము. 9.30 వరకు మిమ్ములను నిలిపిన ఈ వేళలో ఈ రాత్రి ఇక్కడ కనబడుచున్న మీలో, ఒకరైనను, ఒక డజను మందైనను, ఎంతమంది చెప్పగలరు, "సోదరుడా బ్రెన్హాం, నేను జీవించుచున్న మార్గము గురించి నేను నన్ను గురించి సిగ్గుపడుచున్నాను, ఆ విధముగా చెప్పగలుగుదురా అని ఆశ్చర్యపడుచున్నాను. నేను అధికముగా మనుష్యల యొక్క సంఘశాఖలకు అమరియున్నాను. నాకు తెలియును నేను దేవుని వాక్యములో లేను. బ్రెన్హాం సహోదరుడా, నా కొరకు ప్రార్ధించ వలయునని మిమ్ములను కోరుచున్నాను," అని కోరువారు మీ చేతులు పైకెత్తుడి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. బాల్కనిలో చుట్టు ప్రక్కల ఉన్నవారు ఊరకే చూడుడి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. "నాకు తెలియును…" ఇప్పుడు సిగ్గుపడకుడి. ఇప్పుడు వద్దు…

MATT 7:14•

REV 3:16,17

 

135దేశములో మరి దూరముగా ఉన్న జనులు న్యూయార్కు నుండి కాలిఫోర్నియా వరకు, కెనడా నుండి మెక్సికో, అక్కడ సంఘములలో కూడుకొనియున్న జనులందరు, తమ హృదయపూర్వకముగా ఈ వర్తమానమును నమ్ము చిన్న చిన్న విశ్వాస గుంపులు. వారు బయటికి వచ్చియున్నారు; గొప్ప ఉపద్రవముల నుండి బయటికి వచ్చియున్నారు, సంఘశాఖలనుండి బయటికి వచ్చియున్నారు. వారు జీవ భీజములు- ఆ చిన్న పక్షిరాజు పిల్ల వలె, మీరు వినిన స్వరము కంటెను భిన్నమైన స్వరము ఈ రోజు వినినప్పుడు ఈ రాత్రి దానికొరకై మీలో ఏదైన ప్రేరణ కలదా? అయినను మీ హృదయములో మీకు తెలియును అది సత్యమని.

అక్కడ మీరు. అక్కడెక్కడో ఒక సంఘకాపరి నిలుచుకొని యున్నాడు, మీ చేతిని పైకెత్తి యున్నారు, మీ కొరకు నేను ప్రార్ధించ బోవుచున్నాను. స్నేహితులారా, ఈ కార్యములన్నియు ఏదో ఒక మూలలో జరుగలేదు. గుర్తుంచు కొనుడి, "జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే ?" ఆ గుంపులో పోకుడి దూరముగా పోవుచున్న ఆ లవొదికయ సంఘ కాలములో పోవు జనులతో స్నేహితులారా పోవద్దు. ఆకర్షించు సంగీతముల దార్వా అది పైకి క్రిందికి గంతు లేయుచు, డాన్స్ చేయుచున్నది. నులివెచ్చని స్తితి. ఇప్పుడు చల్లగా అని చెప్పవద్దు. నులి వెచ్చని అని చెప్పబడియున్నది. అది పెంతెకోస్తు, మరియు దౌర్భాగ్యుడవని, దిక్కుమాలినవాడని, మరి గ్రుడ్డివాడని తెలియకున్నది. దేనికి గ్రుడ్డితనము? వాక్యమునకు, వాక్య బయల్పాటునకు, ఎందుకనగా అది సంఘ శాఖల నుండి రాలేదు. వారు దానిని అంగీకరించలేకున్నారు.

136రాత్రి టూసాన్లో ఉండు పరిచారకులారా దాని కొరకు మిమ్ములను జవాబుదారిలుగా నేను బాధ్యత తీసుకొనులేదు. దేవుడు తీసుకొనును. నేను అక్కడ మూడేండ్లు ఉన్నాను. నేను సంఘమును ఏర్పరచనని మీతో చెప్పియున్నాను. నేను చేయలేదు. సోదరుడు పెర్రీ గ్రీన్ దానిని ప్రారంభించెను. మరియు నేను అక్కడ మూడేండ్లు ఉన్నాను, అయితే ఒక్కసారి కూడా నన్ను మీ ప్రసంగ పీఠమునకు ఆహ్వనించ లేదు. నేను టూసాన్లో మూడేండ్లున్నాను.

ఈ అరణ్యవాసము నుండి దేవుడు ఒక రోజు నన్ను తీసివేయును. ఈ వర్తమానము జీవించవలసియున్నది. మరి నా శాయశక్తుల మీ మద్యలో వచ్చుటకు ప్రయత్నించితిని. మీరు అది చేయుటకు కారణము నాకు తెలియును. అట్లు మీరు చేయుటకు గల ఒకే కారణమును వినదలచుకున్నారా? మీ సంఘశాఖ మిమ్ములను నెట్టివేయును.

మీలో అనేకులకు నేను ఫర్స్ భోజనశాలలో మాట్లాడినది మీకు తెలియును. మరియు అది సత్యమని మీకు తెలియును. మీరు సిగ్గుపడవలయును. దానిలో నుండి బయటికి రండి. దానిలో నుండి బయటికి రమ్ము సోదరుడా, నేను చెప్పిన పక్షిరాజు పిల్ల వలె మీలో ఏదైన జీవమున్న యెడల మీరు దేవుని వాక్యమును వినెదరు.

గుర్తుంచుకొనుడి, ఈ రోజులలో ఒకానొక దినమున మీరు చివరిసారిగా దీనిని వినెదెరు, మనము ఇప్పుడు చాలా సమీపములో ఉన్నాము. ఈ రాత్రికి మీరు వచ్చెదరా?

MATT 15:14•

JOHN 1:32,34•

HEB 11:10

 

137ప్రియమైన దేవా, ఇప్పుడు మేము పవిత్రముగా కూడి యున్నాము, నిజముగా ఒక కృతజ్ఞతార్పణ దినము ప్రభువా, ఈ దినము జీవించుటకు నేను కృతజ్ఞడుగా ఉన్నాను. ఇది గొప్ప దినము. అపొస్తలుడైన పౌలు ఈ దినమును చూచుటకు ఆశపడెను. పాత కాలములో గొప్ప వ్యక్తులు దీనిని చూచుటకు ఆశపడిరి. ప్రవక్తలు దీనిని చూచుటకు ఆశించిరి. వారు ఈ దినమునకై ఎదురు చూచుచుండిరి.

ఈ రోజు కొరకు, దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. ఈ రాత్రి మనపైన అది ఉన్నది. పరలోకము నుండి దేవుని ఆత్మదిగి వచ్చుటను యోహాను చూసెను. మరియు ఇప్పుడు యోచించుడి, ఆయన తన వధువును ఎన్నుకొనుచున్నాడు.

ప్రియమైన దేవుడా, ఈ యొక్క ప్రదేశములో నలుమూలల ప్రతిచోట వారి హృదయములలో మాట్లాడుము. మీరు ఒక్కరే వారి హృదయములను మార్చ గలరు. ఆది నుండి అక్కడ పెట్టబడిన విత్తనముగా కాకుంటే, వారు దానిని చూడలేరు ప్రభువా. వారు… గ్రుడ్డివారు గ్రుడ్డివారిని నడిపించుచున్నారు, వారు తక్కిన వారి వలెనే గుంటలో పడి పోవుదురు, ఏలయనగా మీ యొక్క వాక్యము చెప్పుచున్నది వారు ఆ విధముగా నశించుదురని.

138ఇప్పుడు, తండ్రీ దేశము నలుమూలల మునము చూచుచున్నాము, ఆఫ్రికాలోను, దక్షిణ ఆఫ్రికాలోను డజన్లు, డజన్లుగా, మోజమ్బిక్, ఈ ప్రాంతములన్నిటను చిన్న చిన్న సంఘములు ఈ టేపులను తీసికొని, మరియు ఈ టేపు ఇరవై కంటె ఎక్కువ దేశములకు పోవుచున్నది. మరియు వారు దానిని చూచుటకు ఆరంభించి వందలకు, వందలుగా, బయటికి లాగబడుచున్నారు. ప్రభువా, అధిక జనులను అది లాగదు. మరియు ఆ చిట్టచివరి సభ్యుడు క్రీస్తు శరీరములోనికి తీసికొనబడినప్పుడు, క్రీస్తు వచ్చును.

ప్రభువైన దేవుడా, ఈ రాత్రి వధువును నేను అడుగుచున్నాను, బయటికి లాగబడి, మరియు వేచియున్నవారిని; వారు లోకములోని ప్రతి కార్యము నుండి వేరుపడనీ. వారు దేవ కుమారుని యొక్క వెచ్చని సూర్యకాంతిలో, ప్రేమలో ఆయన వాక్యములో మునిగి ఆయన సన్నిధిలో ఉండవలయును. ప్రియమైన దేవుడా, అనుగ్రహించుము.

REV 3:17

 

139ఇక్కడ కనిపించుచున్న ఈ ప్రజలు, వారి హస్తములను పైకెత్తిన వారు, డజన్ల కొలది ఈ గుడారము నందున్న జనులు, వారిలో క్రొత్త జీవము ప్రవేశించ వలయునని నేను ప్రార్ధి౦చుచున్నాను, దేవా, ప్రపంచములో చుట్టు ఉన్నవారు, ఈ దేశము యొక్క నలుమూలల ఉన్నవారు, టేపులు ఎక్కడెక్కడ వేయబడి యున్నదో వారందరు, వారికియ్యబడు జాడల ద్వారా, ఆ కార్యముల ద్వారా, ఈ కృతజ్ఞతార్పణ వర్తమానము గుర్తించి, దానిని అంగీకరించి మేమేమి చేయవలెనని అనుకొనవలయునని నేను ప్రార్ధి౦చుచున్నాను, తండ్రీ. దానిని అనుగ్రహించుము.

వారిని ఆశీర్వదించుము. వారు నీ వారు. ఇప్పుడు ఇది అలవాటు చొప్పున తండ్రి, మేము జనులను బలిపీఠం నొద్దకు ఆహ్వనించుచున్నాము మరి ప్రియమైన దేవుడా నేను ప్రార్ధి౦చుచున్నాను ప్రతి యొక్క సంస్థలోను, చుట్టు ప్రక్కల నున్న వారు, మరియు ప్రపంచములో నలుమూలల నుండి, వారు బలిపీఠం యొద్దకు వచ్చెదరు గాక, నలుపు, తెలుపు, పసుపు, గోధుమ ఎవరైనను సరే. ధనవంతులు, బీదవారు, భిన్నమైనవారు, బిక్షగాళ్లు, వారెవరైనను, సంఘశాఖలు, వారికి వారే నీతిమంతులు.

ఓ దేవా, దిగంబరులు, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, గ్రుడ్డివారు మరియు దానిని తెలియని స్త్రీతిలో ఉన్నవారు. మీరు చెప్పారు అది ఆ విధముగా ఉండునని, ఈ విధముగా ఉండునని. కావున తండ్రీ ఈ రాత్రి ప్రతీ విత్తనమును మీరు పిలుతురని నేను ప్రార్ధి౦చుచున్నాను. మరియు ఇది ఎక్కడెక్కడ పడునో, మరియు ప్రపంచములో పలుచోట్ల, ఆ చిన్న పక్షిరాజు పిల్లను అది పట్టుకొననీ, తన ప్రభువు యొక్క స్వరమును ఎరిగిన వారిని అది పట్టుకొననీ, దానిని అనుగ్రహించుము ప్రభువా, యేసు నామములో నేను వారిని మీకు అప్పగించుచున్నాను. ఆమేన్.

140ఇప్పుడు, ఇక్కడ కనబడు జనులలో మీ తలలు వంచియుండగా, మీలో ఇదివరకు రక్షింపబడనివారు, దేవునికి హృదయములను కూడా సమర్పించని వారు… యేసు మీకు చేసిన కార్యమునకు మీరు కృతజ్ఞలుగా నుండుట సరి అని మీరు తలంచలేదా? మీరొక పాపి అని, దేవుని నుండి తొలగి అన్యులుగా ఉండిరని, అయినను ఏదో ఒకటి మీ హృదయములను తట్టుచున్నదని మీరు తలంచుడి. మీరు చిన్న పక్షిరాజు పిల్లలలో ఒకదానివని మీకెట్లు తెలియును… మీరు దౌర్భాగ్యులు మరియు దానికి సమర్పించబడు వరకు మీరు దౌర్భాగ్యులు. ఎందువలన మీరు చెల్లించిన కృతజ్ఞతలన్నిటిలో ఇది ఒక గొప్ప కృతజ్ఞతార్పణగాను ఎన్నటికిని యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించునప్పుడు ఉండకూడదు?

మీరు ఇక్కడికి పైకివచ్చి బలిపీఠం దగ్గర నిలువగలరా? మీరు వచ్చిన యెడల మీతో కూడా నేను ప్రార్ధి౦చుదును. ఎటువంటి పాపియైనను, పురుషుడో లేక స్త్రీయో, బాలుడు లేక బాలిక, సంఘసభ్యుడు లేక సంఘసభ్యుడు కాకున్నను. ఇప్పుడు ఆ సంఘ సభ్యత్వము మిమ్ములను క్రైస్తవులుగా చేయదు. బలిపీఠం తెరువబడి అందరిని ఆహ్వనించిచున్నది. మీరు వచ్చెదరా? ఇక్కడకు రాదలచిన ఎటువంటి పాపియైనను యేసు క్రీస్తును అంగీకరించుడి. నిజముగానే వదలుటకు ఇష్టపడు… కోళ్ళ యొక్క ఆహరమును భుజించు సంఘశాఖలలో ఉన్న మీలో కొందరు, వాటిని వదలి వేయుటకు ఇష్టపడుచున్నారా? నేను ఫలానా వారికి, లేక దానికి చెందినానని చెప్పుట ఆపండి మరియు అది సరియే. నిజమైన పరిశుద్దాత్మయొక్క బాప్తిస్మము ఏమని మీరు తెలిసికొనవలయునని ఉన్నారా? వచ్చి కనుగొనుడి.

141బలిపీఠం తెరువబడియున్నది. మనము సిద్దముగా ఉన్నాము. మీరు కూర్చున్న స్థలములలో నుండి రండి, ఇక్కడున్న బలిపీఠం ముందు సాగిలపడుడి. ఇప్పుడే వచ్చిన ఈ సహోదరుడు. కృతజ్ఞతార్పణ.

ఓ దేవుడా, మీకు నేను చాలా కృతజ్ఞుడుగా ఉన్నాను. నా జీవితమంతయు, ప్రభువా, నాకు తెలియును ఏదో కార్యమున్నదని. నేను ఎన్నడు తృప్తిచెందలేదు. రాబోవు సంవత్సరము నేను దానిని చేయుదునని నేను తలంచి నేను ప్రయత్నించినాను. వచ్చేవారము నేను దానిని చేయుదును; వేదిక పిలుపు వినినపుడు ఈసారి చేయవలెనని అనుకొందును, నేను నిశ్చయముగా ఒక రోజు దానిని నేను త్రోసుకుంటూ మరియు త్రోసిపుచ్చుచూ ఉన్నాను. అయితే ప్రభువా, నాలో ఏదో తప్పిదము ఉన్నదని నాకు తెలియును. నేను ఎల్లప్పుడు నమ్ముచున్నాను, ఏదో ఒక వ్యత్యాసమైన కార్యమున్నదని, మరియు ఇప్పుడు, ప్రభువా ఈ రాత్రి దేవకుమారుడు చేయు సకల విధములైన సన్నాహములకు నేను కృతజ్ఞుడుగా ఉన్నాను, నా యొక్క అవిశ్వాసమైన పాపము నా యొద్ద నుండి కడుగబడనీ.

ఈ రాత్రి, నేను మరి మోకాళ్ళని ఆయన కల్వరిలో నా కొరకు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు నా కొరకు చేసిన ఆ గొప్ప కృతజ్ఞతార్పణ వర్తమానమును అంగీకరించుటకు వచ్చుచున్నాను."

142మీరు వచ్చెదరా? ఇక్కడ అనేక జనులు బలిపీఠం చుట్టు మోకాళ్ళూని యున్నారు. మీరేమి లేచి రాకూడదా? మీరు దానిని చేయవలెనని యున్నారు. మీరు దానిని ప్రయత్నించియున్నారు.

మన సోదరుడు లైల్ పామెర్ను గురించి ఆలోచించుడి, మన యొక్క అమూల్యమైన సహోదరుడు. అతడు తన ఇంటి ముందు ఆవరణలో కూర్చొని తన చిన్న బాలిక బంతి ఆడుకొనుటను లేక ఆ విధమైన దేనినో చూచుచుండగా, ఆతను కూర్చొని ఉన్న కుర్చీలోనే ఒక్క అడుగు కూడా కదలక అట్లే చనిపోయెను.

మీకు తెలియదు ఏ ఘడియలో ఇక్కడనుండి మీరు వదలి వెళ్ళవలయునని. మీరు ఉన్న పాటున ఏ సమయమున పోవుదురని మీకు తెలియదు. ఒక వేళ ఈ రోజు రాత్రి కావచ్చును. కావున ఇప్పుడే వచ్చి ఎందులకు పరిష్కరించు కొనకూడదు? జనులలారా రండి. ఏదో మిమ్ములను ఈడ్చుచున్నట్టు అనుభూతిలేదా? ఇక్కడ ఈ బలిపీఠము ముందు ఉన్న ఆరు లేక ఏడుగురు మాత్రమే కాదు, ఇక్కడున్న అనేక జనులు నిశ్చయించుకొనుచున్నారు.

ఇప్పుడు, మీరు నన్ను నమ్మినయెడల ఈ వేదికపై జరుగుచున్న కార్యములను గమనించిన యెడల; ఇప్పుడు మీరు నన్ను నమ్ముడి. ఒక రోజు నా స్వరము నిశ్శబ్దముగా ఉండును, మరియు మీరు దానిని ఎన్నడును ఇక వినరు. మీరు రావలయునని మీరు కోరుకొనవచ్చును. మీరు చెప్పవచ్చు, "అయితే బ్రెన్హాం సోదరుడా, నేను ఒక సంఘ సభ్యుని…" నీవు ఏమైయున్నావనునది, ఏ విధమైన బేధము చేయదు. అట్లే నికొదేము ఒక సంఘ సభ్యుడు. ఆ విధముగానే యోహాను, యాకోబు, పౌలు తక్కిన వారందరును సంఘ సభ్యులు. ఒక రాత్రి లేక ఒక రోజు ఎదో కార్యము జరుగు వరకు.

143పౌలు ఒక సంఘ సభ్యుడు మరియు ఆయన వచ్చెను. అతను సంఘ సభ్యుని నుండి దేవుని కుమారునిగా మార్చబడెను.

మీరు రారా? ఓ అతను ఆరితేరినతను. అతను మంచి తెలివిగలవాడు, అతను ఆ ప్రాంతములోనే మంచి ఉన్నతమైన ఉపాధ్యాయుడైన గమలీయేలు దగ్గర గొప్ప శిక్షణ ఇచ్చు వేద పాఠశాలలో తర్ఫీదు పొందెను, అతనికి తెలుసు అతను ఆరితేరినవాడని, అయినను అతనికి ఏదో కార్యము కావలసియున్నదని అతనికి తెలియును.

మీరు రారా? ఇంకొక సారి నేను మిమ్ములను అడుగుచున్నాను లోపలికి… ఇక్కడైనను, దేశములో ఎక్కడున్నను, నేను అడుగుచున్నాను మీరు ఎక్కడున్నను, ఈ కృతజ్ఞతార్పణ సమయములో ఏ సభలో మీరున్నను… గుర్తుంచుకొనుడి ఇక్కడ నా మాటలు టేప్ చేయబడుచున్నవి, (ఇక్కడ మాత్రమే కాదు, పరలోకములో).

మీకు తెలియునా మీరు వేయు ప్రతి ఒక్కొక్క అడుగు రికార్డు చేయబడుచున్నదని విజ్ఞాన పూర్వకముగా నిరూపించబడినది. వారు దానిని నిరూపించిరి. జ్ఞాపక వుంచుకొనుడి: టెలివిజన్ దానిని నిరూపించెను. టెలివిజన్ బొమ్మలను లేక ప్రతిమలను తయారు చేయలేదు. మీరు ప్రతిమగా ఉన్నారు. మీరు చేయుచున్న కార్యములను ఇంకొక మార్గమునకు (చానల్) ప౦పుచున్నది ఎట్లయినను మీరు అక్కడ ఉన్నారు. చూడుడి. మీరు మీ యొక్క వ్రేలిని ఆడించిన ప్రపంచమంతయును ఆ కార్యము పోవును. మీరు దుస్తులు ధరించు ప్రతి యొక సమయమును మీరు ప్రపంచమంతట ఆ దుస్తులతో (టెలివిజన్) ద్వారా ప్రదర్శింపబడుదురు. అది రికార్డు చేయబడియున్నది.

మీ యొక్క మెదడులో వచ్చు ప్రతి యొక తలంపు రికార్డు చేయబడుచున్నది, మరి ఒకరోజు ఆ రికార్డు నిలిపివేయబడి, ఆల్బములో పెట్టబడును,

MARK 8:38•

LUKE 9:26

 

144పిదప న్యాయ తీర్పులో అది తిరిగి వచ్చును. అక్కడ క్రైస్తవులని చెప్పుకొనుచున్న మీరు కత్తిరించిన వెంట్రుకలతో నిలిచెదరు. అక్కడ వాక్యమునకు వ్యతిరేకమైన మీ యొక్క తలంపులతో నిలిచెదరు మరియు ఆ తలంపులు మీ చింతలో ఉన్నవి. మీరు దానిని దాచలేరు. టెలివిజన్ను మీరు జ్ఞాపకపరచుకొనుడి, అది నిజమని విజ్ఞానమునకు తెలియును.

మీరు ఇప్పుడు నిలుచుకొని యున్నారు, ఇక్కడ మీరుందురని మీకు తెలియును. గుర్తుంచుకొనుడి, న్యాయతీర్పు దినములో ఇది రికార్డు చేయబడి నపుడు, ఇప్పుడు మీకున్న ఇదే తలంపులు, అక్కడ మరల మీ మెదడు ద్వారా వచ్చును అది రికార్డు చేయబడును; ప్రపంచమంతయు అది ప్రదర్శించునపుడు దానిని దర్శించును. ప్రపంచము ఏల… న్యాయ తీర్పు దినములో మిమ్ములను చూచుచు. అక్కడున్న సమస్త దూతలను, ఇక్కడ నన్ను గూర్చి మీరు సిగ్గుపడిన యెడల, న్యాయతీర్పు దినములో మీ యొక్క పటము అక్కడ చూపబడినప్పుడు నేను మిమ్ములను గురించి సిగ్గుపడెదను. ఈ లోకములో యేసుక్రీస్తు నిమిత్తము మీరు సిగ్గుపడిన యెడల, న్యాయతీర్పు దినములో ఆయన మిమ్ములను గురించి సిగ్గుపడును; ఏలయనగా నేను నా వాక్యమును అభిషేకించి యున్నాను. నీ కొరకు దానిని పంపియున్నాను: దానిని మీరు నమ్మలేరు మీరు ఏదో ఒక దాని క్రింద దాగుకొనవలసిన వారై యున్నారు.

"ఓ అది మంచిగానే ధన్వించుచున్నది. నేను దీనిని చేసియున్నాను. నేను ఆత్మలో గంతులు వేశాను. భాషలలో నేను మాట్లాడినాను." విగ్రహారాధకులు కూడా ఆ విధముగానే చేయుదురు. "నేను అరచితిని" విగ్రహారాధకులు అదే విధముగా చేయుదురు. అప్పుడు వాక్యము తట్టు ఏవిధముగా మీరు వీపు చూపుదురు?

ఎందువలన? ఆయన యొద్దకు ఇప్పుడు ఎందువలన రాలేరు?

ఎందువలన కాదు, ఎందువలన కాదు? ఆయన యొద్దకు ఇప్పుడు ఎందు వలన రాలేదు.

ప్రియ సోదరుడా ఎందుకొరకు వేచియున్నావు.

ఓ అంతవరకు ఎందులకు కాచుకొనియున్నావు?

యేసు నీ కిచ్చుటకు వేచియున్నాడు.

ఆయన యొక్క పరిశుద్దపరచబడిన గృహములో నీకొక స్థానము.

(అయితే ఆయన శరీరములో మీరొక భాగమై యున్నారు)

ఎందువలన కూడదు? (ఓ చిన్న పకీరాజు పిల్లా, రమ్ము)

ఎందువలన రాకూడదు…

145ప్రభువా, నేను కృతజ్ఞునుని. నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. మీకే కృతజ్ఞతార్పణలు ప్రభువా, ఈ సహజమైన ఆహరమునకు కాదు, అయినను దానికి కూడా, అయితే ప్రభువా, కడపటి కాలము ఇక్కడున్నది, ఈ యొక్క ఆత్మీయ ఆహరమునకు స్తోత్రములు ప్రభువా, ఏడు ముద్రలు వాగ్దానము చేసి బయలుపరచియున్న ఆత్మీయ ఆహరమునకు స్తోత్రములు. "మీరు చెప్పవచ్చు అదేదో బేదముగా ఉన్నదని." కాదు, కానేకాదు. మీరు ఒక్క పదమైనను చేర్చకూడదు లేక తీసివేయకూడదు… అది దానిలోనే యున్నది. అది మరుగు చేయబడియున్నది. అది ముద్రించబడియున్నది. ఎందరు దానిని అర్ధము చేసుకొన్నారు, "ఆమేన్" అని చెప్పుడి.

చూడుడి, "సరి అదొక మర్మము మరల అదే బయటికి వచ్చును" అని మీరు చెప్పవచ్చును. కాదు, కాదు అది ఇంతకు మునుపే వ్రాయబడియున్నది. మీరు దానితో ఏమియు చేర్చవద్దు లేక తీసివేయవద్దు. ప్రత్యేకపరచబడవలసి మునుపే అక్కడున్నది. ఈ కడపటి దినములలో అది ప్రత్యేకపరచబడవలసి యున్నది. ఆ కార్యములు మరుగై యుండెను కడపటి దినములలో బయలుపడెను.

146మీరు రారా? ఇప్పుడే రండి స్నేహితులారా, మీకు అర్ధము కాని యెడల వచ్చి మోకాళ్ళూని ఆయనతో దానిని గురించి మాట్లాడుడి. నేను మీకు సరిగా చెప్పలేక పోయిన యెడల, ఆయన చేయగలడు; ఏలయనగా, ఆయన అన్ని సందేహములను తీర్చును.

… ఆయన యొక్క పరిశుద్దమైన సింహసనములో.

ఓ ఎందులకు రారు? (మీరు రాకూడదా?)

ఎందులకు రారు?

గుర్తుంచుకొనుడి, దీనిని రికార్డు చేయుచున్నారు, ఈ టేపు పైననే కాదు, దేవుని యొక్క గొప్ప రికార్డులో, మీలో ప్రతి యొక్కరి, మీ తలలు వంచినపుడు మీ యొక్క ప్రతి అడుగును, మీ హృదయము వంచి యుండగా, మీ మెదడులో ఏ తలంపులు పోవుచున్నవి అని కూడా గుర్తుంచుకొనుడి రికార్డు చేయబడుచున్నవి. ఇప్పుడే మహిమలో, ఇక్కడ మిమ్ములను, మీ తలంపులను రికార్డు చేసిన కార్యములన్నియు న్యాయ తీర్పు దినములో వేసి చూపబడును. మీ యొక్క నిశ్చయము ఎక్కడ? ఓ ఏ విధముగా ఆ రోజు మీరు దానిని మార్చగలరు!

JOHN 6:37,44

 

147నేను ఇప్పుడు బలిపీఠము చుట్టు అనేకులు ఉండుట వలన కాచుకొని యున్నాను. నేను ఆ విధముగా వేచియుండిన యెడల వారిలో ఒకరు, లేక అక్కడి వారిలో ఒకరు. బహుశా న్యూయార్కులో ఉన్నవారు, ఎక్కడో ఫిలిడేల్ఫియాలో ఉన్నవారు, కాలిఫోర్నియా, లేక అరిజోనాలో ఉండువారు ఇంకొకరు రావచ్చును. ఇప్పుడు సంఘకాపరీ, మీరు ఎక్కడున్నను బలిపీఠపు పిలుపును త్రోసివేయకుము. మనము ఇంకొక కృతజ్ఞతార్పణ చూడలేము. ఇదే చివరి అవకాశము, ఈ రాత్రికి చివరగా రికార్డు చేయబడుచున్నది. టేపులు ఈ ఒకానొక రోజులో అయిపోవును. దేవుని ఆల్బమ్ (ఫోటోలు పెట్టు పుస్తకము) లో రికార్డు కత్తిరించబడి పెట్టబడును. ఇప్పుడు మీలో ఉన్న తలంపులు తిరిగి వేయబడును. మీకు బేధము తెలియదని చెప్పకుము. మీకు తెలియును. "నా తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నా యొద్దకు రాలేడు. మరి తండ్రి నాకు అనుగ్రహించిన వారందురును నా యొద్దకు వత్తురు."

148నేను నమ్ముచున్నాను, నేను ఒకవేళ అక్కడ ఈ రాత్రి కూర్చొని ఉన్నత్లయితే, ఒకవేళ నేను అనుకోనినా, నేను కచ్చితముగా చేయుదును.

ఎందులకు కాదు? ఎందులకు రాకూడదు.

(మీరు అలసట చెందియున్నారా. ఇప్పుడు ఆయన ఆత్మను మీరు దుఃఖపరచుట లేదని మీరు నిశ్చయతతో ఉన్నారా?)

అట్లయిన మన తలలు వంచెదము. ఆయన ఆత్మను మీరు దుఃఖపరచుట లేదని మీరు నిశ్చయముగా ఉన్నారు. ఆయన ఏమిచేయవలెనని మీకు చెప్పినాడో దానిని ఖచ్చితముగా చేసినారని మీరు అనుకొనుచున్నారా? ఇప్పుడు మీరు వాస్తవముగా ఉన్నారా? గుర్తుంచుకొనుడి, మీకు ఇలాంటి అవకాశము రాకుండ పోవచ్చును. ఈ రాత్రికి రికార్డు ముగించబడవచ్చును. ఇది దీనితో చివరది ఉండవచ్చు. ఇది మీకు ఆఖరి లేపేగా ఉండవచ్చును. ఇప్పుడు మీరు సిద్దముగా ఉన్నారని మీరు స్తిర నిశ్చయతతో ఉన్నారా? అట్లయిన యేసుక్రీస్తు నామములో దీనిని మీ చేతులందు ఉంచుచున్నాను.

149ఇప్పుడు సున్నితముగా గాయక సమూహము పాడుచుండగా, ఇక్కడున్న వారి కొరకు నేను ప్రార్ధి౦చబోవుచున్నాను. నేను ఒక విధమైన వినోదమైన క్రైస్తవున్ని దేవుడు రక్షణ చేయవలెనని నేను నమ్ముచున్నాను. "ప్రభువైన, నేను," బైబిలులో యెషయా చెప్పుచున్నది, "యొహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.

ఈ బలిపీఠము చుట్టు మిమ్ములను నేను ఆహ్వనించులోపల, ఈ జనులను, నేనే స్వయముగా వారి కొరకు ప్రార్ధించవలయునని యున్నాను. ఇప్పుడు మన తలలు వంచెదము.

ISA 27:3

 

150ప్రియమైన యేసు, మీ యొక్క వాక్యమును మీ ప్రవక్త చెప్పినది నేను ఇప్పుడు వారికి ఎత్తి చెప్పియున్నాను, మరి ప్రవక్తల వాక్యములు సత్యములని నాకు తెలియును. మరియు మీరు చెప్పియున్నారు, "ప్రభువైన నేను దానిని నాటితిని. ఎందులకు నిశ్చయముగా, జగత్తుకు పునాది వేయబడక మునుపు మీరు దానిని గొర్రె పిల్ల జీవ గ్రంధములో పెట్టి యున్నారు. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివా రాత్రము దాని కాపాడుచున్నాను. బహుశ వీరు ప్రభువా, వేదిక పిలుపును విని యున్నారు, అయితే ప్రభువా మీరు ఇంకనూ దానికి నీళ్ళు పోయుచున్నారు.

ఈ రాత్రి వారిక్కడ ఉన్నారు, ఈ రాత్రికి వారు లోక కార్యములనుండి విడువబడనీ, వారి హృదయములలో ఉన్నవారి పాపముల నుండి బాధలనుండి విడువబడి, ధైర్యముతో, భయభక్తులతో వారి హృదయముల నుండి, నీ యొక్క వాక్యము వైపుకు ఇప్పుడే తిరిగి మరి చెప్పెదరు "ప్రభువైన యేసూ, నా హృదయ లోతులో నుండి ఇంకనూ ఏదో కార్యమును నేను పొందలేదని నేను ఎల్లప్పుడు నమ్ముచున్నాను. కోడిని వెంబడించవలయునన్న భావనను నేను తెలుపుటకు ప్రయత్నించినను అయితే నాలో ఏదో ఉన్నది, అది వింతైన కార్యముగా ఉన్నది. అది సరిగా అనిపించుట లేదు. మరి ఈ రాత్రి జీవించు వాక్యము యొక్క హస్తములకు చేరువగా వచ్చుచున్నానని అనుకొనుచున్నాను. నేను నా తలంపులలో చాలా భయభక్తులతో ఇప్పుడు వచ్చుచున్నాను. ఈ బలిపీఠము దగ్గర నేను స్థిరపడియున్నాను. ప్రభువా ఎలాగైనను నాకు రక్షణ కావలయును. నేను చాలా ఆకలితో యున్నాను. నేను మిమ్ములను కోరుచున్నాను, ప్రభువా ఈ రాత్రి నీ యొక్క చేతులలో నన్ను ఉంచుకొనుము. ఏదో ఉద్రేకమువలన కాదు అయితే ప్రేమగల ఆత్మ వలెనే. నన్ను నీ చేతులలో తీసికొనుము ప్రియమైన దేవుడా, నేను నీ యొక్క బిడ్డను. వారు మాట్లాడుకొనుచున్న పక్షిరాజు పిల్లను నేనే అని అనుకొనుచున్నాను. నేను ఎగురుచున్నాను నన్ను గైకొనుము. నా యొక్క కుర్చీ నుండి లేచి మరి ఇక్కడ మోకాళ్ళూని యున్నాను. నేను ఎగురుచున్నాను నన్ను పట్టుకొనుము. ప్రభువా, ఈ లోక కార్యములనుండి మీ రెక్కలపై కొనిపోమ్ము ఈ లోకపు మురికి నుండి అసహ్యము నుండి, నా యొక్క చెడ్డ తలంపులనుండి నా యొక్క సంఘ శాఖల పారంపర్యము నుండి నేను ఎగిరిపోనీ, మీ యొద్దకు మాత్రమే నేను వచ్చి ప్రియమైన దేవుడా, నా యొక్క సందేహములన్నిటిని మన్నించి మీ యొక్క పరిశుద్దాత్మ నాలో పోయబడిని. ఈ రాత్రి నేను మీ యొక్క బిడ్డగా, తాజగా, జన్మించి మరి నూతన సృష్టిగా ఉండనిమ్ము. నన్ను పట్టుకొని కోడి యొక్క అరుపులకు దూరముగా తీసికొని పొమ్ము, పక్షిరాజు యొక్క గూడు యొద్దకు నన్ను తీసికొని పొమ్ము అక్కడ నేను ఎగురువరకు, నేను దేవుని వాక్యము ద్వారా పోషింబడనిమ్ము.

అనుగ్రహించుము ప్రియమైన దేవుడా, వారిని గైకొనుము వారు మీ వారు, ఇది నా యొక్క నిష్కపటమైన ప్రార్ధన, మరణించు జనుల కొరకు ప్రార్ధి౦చుచున్నాను. తండ్రీ దానిని అనుగ్రహించుము. వారి తరఫున ఈ ప్రార్ధనను అర్పించుచున్నాను. దేవుని యొక్క మహిమ కొరకు దీనిని నేను అడుగుచుచున్నాను.

ఇప్పుడు మన తలలు వంచి యుండగా.

151ఇప్పుడు బలిపీఠము చుట్టు మీరు ఇక్కడ మోకాళ్ళూని యున్నారు. క్రైస్తవులని చెప్పుకొనుచున్న మీలో అనేకులు. మీరు పొందని ఏదో కార్యమును మీరు కావలయునని కోరుచున్నారు. కార్యము కావలయునని అనుభూతి చెందుచున్నారు. మీరు మత సంబంధమైన అన్ని కార్యములు చేసి యుండవచ్చును. మీరు ఆత్మలో నాట్యమాడి ఉండవచ్చును. మీరు భాషలలో మాట్లాడి యుండవచ్చును, దానికి వ్యతిరేకముగా ఎవరు ఏమి చెప్పలేరు. అది సత్యము. అవన్నియు. మంచిదే. అయితే మీరు చూశారా, ఆత్మ లేకుండ ఆత్మ యొక్క వరములు అవన్నియు. ఒకవేళ ఆత్మ లేని యెడల, ఆ అనుభూతని మీరు చేయు కార్యములను ఖండించి ఉండదు. మీరు నిజముగా, నిష్కపటముగా ఇక్కడ ఈ వేదికలో ఇప్పుడే మిమ్ములను అన్ని కార్యముల నుండి వదిలించుకొని, ఏదో ఉద్రేకము కాదు, ఇప్పుడు, అయితే మిమ్ములను అంగీకరించి, ఆయన వాక్యములో మిమ్ములను పోషించి మీరు పక్షి రాజులుగా మారి పైకి ఎగురు వరకు? ఈ విధముగా దేవుడు చేయునని మీరు నమ్ముచున్నారా?

మీరు చేసిన, ఆ విధముగా దేవుడు చేయవలెనని మీరు కోరిన యెడల, బలిపీఠము చుట్టు ఉన్న మీరు మీ చేతులను పైకెత్తుడి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. ప్రతి ఒక్కొక్కరి చేతులు పైకెత్త బడియున్నవి.

152ఇప్పుడు నెమ్మదిగా దేవుని గూర్చి తెలిసిన పవిత్రమైన పురుషులను, స్త్రీలను నేను అడగబోవుచున్నాను… వారిలో అనేకులు, అది చాలా వింతగా ఉన్నది. ఆ విధముగానే ఉండులాగున అగుపించుచున్నది. నేను చేయు వేదిక పిలుపులు అనేకులు పురుషులున్నారు, అయితే సాధారణముగా ఆ విధముగా స్త్రీలు ఉందురు; అయితే ఇక్కడ అందరు పురుషులు ఒకరో లేక ఇద్దరు ఈ రాత్రి బలిపీఠము దగ్గర ఉన్నారని నేను అనుకొనుచున్నాను. సాదారణముగా స్త్రీలు అయితే నేను స్త్రీలను గురించి వారికి విరోధముగా మాటలాడెదనని తలంచెదెరు. సోదరిలారా నేను చేయను (ఎవ్వరో ముగ్గురు అని చెప్పుచున్నారు. వారు చూడగలుగుచున్నారు. ఇక్కడ వేదిక పై నేను చూడ వీలుగా ఉన్నది). అది సరి. సమర్పించుకొన్న క్రైస్తవులారా, ఇక్కడికి వచ్చి ప్రార్ధనకు నాతో కూడా ఒక్క క్షణము నిలువుడి. బలిపీఠముపై మీరు ఎక్కడున్నను, వేదికపై, దేవుని నిజముగా ఎరిగిన వారు, వారిలో కొద్ది నిమిషములు ప్రార్ధనకు నిలుచుటకు తెలిసిన వారు ఇక్కడికి వచ్చి ప్రార్ధనకు నిలిచిన యెడల, మరియు మనము శ్రోతలను పంపించి వేయుదుము. ఆరాధనను ముగించెదము. ఇప్పుడు ప్రతి యొక్కరు భయభక్తులతో ఉండుడి.

ఎవ్వరు వదలిపోకుడి, మనము ఎత్తబడు కాలములోనికి వెళ్ళుచున్నామని, ఇంకొక కాలమునకు వెళ్ళుచున్నామని మీలో నిజముగా విశ్వసించు జనులు ఇక్కడికి వచ్చి నిలువుడి. మీకు తెలియునా, సంఘము అది ఉన్న స్టితిలో పోజాలదు, అది మేలైన స్థితికి మారలేదు; అది ఇంకను అధ్వానమైన స్థితికి మారును. మరియు ఈ విధముగా అది పోలేదు. చూశారా, అదేదో ఒక కార్యమైయున్నది, మరియు ఇప్పుడే అది కదలాడుచున్నది. స్నేహితులారా. ఇది వధువుకు ఒక కదలింపుగా ఉన్నది. అది సత్యము. అది ప్రభువు సెలవిచ్చునది. ఇప్పుడు పైకి కదలుడి. నమ్మకమైన క్రైస్తవులైన మీరు మీ రికార్డు. నిజముగా మనఃపూర్వకముగా ఇక్కడన్న సహోదర, సహోదరిలతో మీరు ప్రార్ధించవలయునని ఉన్నయెడల బలి పీఠము చుట్టూ రండి. ప్రార్ధనకు నాతో కూడా ఒక్క క్షణము ఇక్కడ నిలబడెదము.

ఎవరైనను రావలయునని కోరుకొనుచున్నారా? ఇక్కడ నిలువుడి; వారితో మోకాళ్ళూనుడి, పురుషులారా, ఆ పురుషుల యొద్దకు నడువుడి, స్త్రీలారా నెమ్మదిగా అణుకవగా వారి కొరకు ప్రార్డించుడి.

ప్రియమైన దేవా, వీరికి సహాయపడుడి.

153నా సమస్తమును సమర్పించుచున్నాను. నా సంఘశాఖను అప్పగించుచున్నాను. నా యొక్క మొదటి వివాహమును సమర్పించుచున్నాను. నా యొక్క మొదటి భర్తను సమర్పించుచున్నాను. నా సమస్తమును సమర్పించుచున్నాను, ప్రభువా.

సమస్తమును సమర్పించుచున్నాను సమస్తమును మీకే.

నా ఆశీర్వదింపబడిన రక్షకుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను

నేను సమస్తమును సమర్పించుచున్నాను,

నేను సమర్పించుచున్నాను. (మీ యొక్క సొంత ఆలోచనలను సమర్పించుదురా? దేవుని యొక్క వాక్యమునకు మీ యొక్క సొంత ఆలోచనలను సమర్పించుదురా?)

సమస్తమును మీకే నా ఆశీద్వరింపబడిన రక్షకుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

154విశ్వసి౦చు అందరును పాడుడి, ఇప్పుడు మీరు లేచి నిలువబడి, అందరు,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

నేను సమర్పించెదను.

మీరు అన్నిటిని సమర్పించుడి, ఇప్పుడు దీనిని పాడుడి,

నేను …

మీకే నా ఆశర్వదింపబడిన రక్షుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

ఇప్పుడు ఇక్కడున్న మీరు, నేను సమస్తమును సమర్పించు, నేను సంఘశాఖను సమర్పించుచున్నాను. నేను సంఘశాఖను సమర్పించుచున్నాను. నేను సంఘమును నామకార్ద సంఘమును. సమర్పించుచున్నాను. నాలో ఉన్న నేను అన్ని కార్యములను సమర్పించెదెను. నా ఆలోచనలను సమర్పించెదను. అన్నియు మీకే నా ఆశీద్వరించబడిన రక్షకుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

సమస్తమును మీకే నా ఆశీర్వదింపబడిన రక్షకుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

మీరు దానిని నిజముగా చేయుదురా?

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

[టేపులో ఖాళీ భాగము]

155బలిపీఠము దగ్గర ప్రార్ధి౦చిన మీరు, సంఘము మీ కొరకు ప్రార్ధించియున్నది, మీ కొరకు మీరు ప్రార్ధించియున్నారు. ఇప్పుడు, ఒకే ఒక మార్గమున్నది మీరు రక్షింపబడుటకు. కృప ద్వారా, విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడియున్నారు. దేవుని యొక్క కృప మీతో మాట్లాడి, వేదిక యొద్దకు మిమ్ములను తీసికొని వచ్చియున్నది. మీరు దేవుని ఆశీర్వాదములు కోరుచున్నారు. ఆయన వాక్యమును కోరుచున్నారు, పరిశుద్దాత్మను మీరు కోరుచున్నారు, మీరు దేవుని దయను కోరుచున్నారు; మీరు నిజముగా ఆ విధముగా కోరిన యెడల, మీరు హృదయ పూర్వకముగా సమర్పించుకొనుడి. ఇప్పుడు ఏదో ఉద్రేకము కొరకు ఎదురుచూడకుడి. సత్యము కొరకు చూడుడి, విశ్వాసము ద్వారా హృదయములో నుండి సత్యమును కోరుడి. ప్రభువా, మీ యొక్క వాక్యము ఏమేమి చేయవలెనని ఆజ్ఞాపించు చున్నాదో నేను ఏమైనను చేయుటకు సిద్దమే. నాలో ఉన్న సమస్తమును నేను సమర్పించుచున్నాను. మీ హృదయమంతటితో దానిని మీరు నమ్మిన యెడల, మీరు లేచి నిలువబడి, ఈ సంఘము వైపు తిరిగి, శ్రోతల వైపు తిరిగి, మీ చేతులను పైకెత్తి మరియు మనము వారితో చేరి పాడెదము. "నాలో ఉన్న సమస్తమును నేను సమర్పించుచున్నాను దేవా, మరియు నాకు తెలిసినంత వరుకు నాలో ఉన్న సమస్తమును నేను సమర్పించుదును."

బలిపీఠము దగ్గరున్న మీరు ఈ వేదికపైకెక్కుడి. సహోదరులారా, ఇక్కడ ఈ వేదిక పైకెక్కుడి. సహోదరులారా, సహోదరిలారా మీరందరు ఇక్కడే సంఘమా ఇక్కడ గమనించండి

[ఒక సహోదరి సాక్యమిచ్చెను.]

MATT 5:6

 

156ఆయన వాక్యమునకు ఆయనకు ప్రతియొక చిన్న కార్యము కూడా మీరు సమర్పించుకున్నారా? ఒక సంఘ శాఖనుండి వచ్చిన ఒక సహోదరి, ఆమె చెప్పెను, "నేను ఒక సంఘ శాఖకు చెందినదానను." దానిని మనము పిలువనవసరము లేదు. ఆమె అక్కడ పని చేయుచున్నది, అయితే "సోదరుడా బ్రెన్హాం, నేను సత్యమునకు పోవలయునని యున్నాను. నాకేదో కావలయును [స్పష్టత లేని మాటలు]." ఆయన వాక్యమును నేను చెప్పనియ్యుడి. "నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తి పరచబడుదురు." ఇప్పుడు ఇక్కడ వేదికపై వచ్చిన మీరు, మీలో ఉన్న ప్రతీ కార్యమును మీరు సమర్పించుటకు సిద్దముగా ఉన్నారా, దేవుని వాక్యమునకు అన్నిటిలో విధేయత. ఈ వారములో మీరు ఏమి చేయవలెనని మేము చెప్పియున్నాము. ఇప్పుడు, మీరు ఇప్పుడే ఆయనకు సమర్పించుటకు సిద్దముగా ఉన్న యెడల శ్రోతలకు ఈ విధముగా మీ చేతులను పైకెత్తుడి. ఇప్పుడు వేదికపై మనమందరము చేరి పాడెదము. "నేను సమస్తమును సమర్పించుచున్నాను" అందరును ఒక్కటిగా.

నేను సమస్తమును సమర్పించుచున్నాను,

నేను సమస్తమును సమర్పించుచున్నాను,

నా ఆశీర్వదింపబడిన రక్షకుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

157మీరు నిజముగా దానిని పాడుచున్నారా? "ఆమేన్" అని చెప్పుడి, "ఆమేన్" అని చెప్పుడి. ఇంకొకసారి చెప్పుడి, ప్రభువా నన్ను పరిశోధించుము. నన్ను పరిశోధించి ఒక అవకాశమియ్యుము. ఈ రాత్రి నన్ను నేను మీకు సమర్పించుకొనుటయే నేను చేయగలిగిన కార్యము. మీకు తెలియును, నా హృదయము యొక్క ఆకలి. నా యొక్క వాంఛ మీకు తెలియును. ఆ కోరికను తీర్చుతానన్నదే మీ యొక్క వాగ్దానము. ఇప్పుడు దానిని నేను ఎదురుచూచి, మరి నేను మీకు సమర్పించుచున్నాను.

మన మందరము ఐక్యముగా.

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

అవన్నీయును మీకే నా ఆశీర్వదింపబడిన రక్షకుడా,

నేను సమస్తమును సమర్పించుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...