క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము
1ధన్యవాదములు, ఈ రాత్రి మరల ఇచ్చట ఉండుట బాగున్నది. నేను రోగులకు ప్రార్ధి౦చనైయున్నానని వారికెట్లు తెలియుచున్నదో నాకర్థమగుట లేదు. ప్రతివారు ప్రార్థన కొరకు వచ్చుచున్నారు. మీరు ఆత్మ నడిపింపును అనుసరించినంత వరకు, అది సరియేనని నేను నమ్ముచున్నాను. అది ఉత్తమమైనది. ఆ వర్తమానము ఎన్నడును తప్పిపోదు.
ఈ దినము నేను గదిలో కూర్చొనియుండగా, నా హృదయమునకు అతి ప్రియమైన సేవకులు (ముగ్గురు) వచ్చి వారు నాతో మధ్యాహ్న భోజనముకు వచ్చుచున్నట్లు చెప్పిరి, వారు నా నిజ స్నేహితులు. ఆ మాట విని చాలా బాగున్నదని తలంచాను.
2నేను కొద్దిగా అల్పాహారము తీసికొన్నాను, ఎందుకనగా నావెల వారు చెల్లించెదరని నిశ్చయంగా తెలియును, చూడండి. నేను మంచి నిండు భోజనము తిన్నాను. నేను 12:00 గంటలకు వచ్చాను, 1:00 గంటకు వచ్చాను, 2:00 గంటలకు వచ్చాను, అయినా ఇంకా ఎవరూ రాలేదు. ఆ ఆవరణలో పోలీసులు ఒక నేరస్తుని తరుముచున్నారు. అది చూచుటకు నేను వెళ్ళాను. సహో జాక్ ఇంత వరకు నేను చూడనే లేదు. హోటలు వ్యక్తి అతనికి తప్పు నంబరు ఇచ్చినట్లు తెలిసినది. అతడు మరో గదికి ఫోను చేసెను. ఎన్నిసార్లు చేసినా నన్ను కనుగొనలేదు. అసలు అక్కడ నేను లేను గదా? వారు నా బిల్లు చెల్లించారు. అతనిని, సహో ట్రాసీ, బ్రవున్ ను ఈ రాత్రి నేను చూచుటకు సంతోషించుచున్నాను. మేము మరల ఆరిజోనాకు వెళ్ళవలెననిపించుచున్నది.
3ఒక దినమున మేము ఎడారిలో వచ్చుట నాకు గుర్తున్నది. నా భార్యకు చెప్పాను, "సహో జాక్ తన చిన్న చెవర్లెట్ కారులో వెనుక కూర్చొనెను." అతడు, సహో. బ్రవున్ అసలు సృష్టి గూర్చి వాదించుకొనుచుండిరి. ఆరు దినములలో జరిగినదా లేక ఆరు మిలియను దినములలో జరిగినదా అని వారి వాదన. అది మంచి తర్కమే.
వారు చాలా గట్టిగా వాదించుకొనిరి, వారు లేచి చెరొక స్తంభము వెనుకకు వెళ్ళి రాళ్ళు తీసికొని గట్టిగా ఒకరి మీదకు ఒకరు విసురుకొనిరి. వారు ఆ సమస్యను ఆలాగు పరిష్కరించలేరు. వారు ఒకరిని ఒకరు మించి పోవలెనని రోడ్డుమీద తరుముకొనిరి. సహో, జాక్ చిన్న మనిషి, పొట్టిగానున్నందున ఎటు అయినా గాని త్వరగా తిరుగును; కాని సహో, యంగ్ పొడవైన కాళ్ళున్న మనిషి అని మీరెరుగుదురు. నా జీవితంలో అప్పుడు నవ్వినంతగా ముందెన్నడూ నవ్వలేదు!
సహో జాక్ తిరిగి తన కారులోనికి వచ్చి బూట్లు విప్పెను. సహో షారిట్ మాకు బస్తా నిండా నారింజలు ఇచ్చెను. మేము శ్రీవ్ పోర్ట్ కు రాక ముందే సగం అతడు ఖాళీ చేసెను.
4మీకు తెలుసా, అవి బంగారు దినాలు. అవునండి, నిజంగా అవి స్వర్ణ రోజులు. అది హాస్యాస్పదంగా, నవ్వుగా మీకు వినిపించవచ్చును గాని, ఇది సత్యము. మీరు ముసలివారగుచుండగా వాటిని మీరు మనస్సులో ఆలోచించ ప్రారంభించుడి. మరల అట్టి రోజులు జీవితంలో వస్తే, ఎంత బాగుండును అని మీరనుకొందురు. అవి మన యవ్వన దినాలు. మనము ఎదుగుచుండగా, అవి మన కండ్ల ముందు చిత్రములై నిలచును. ఆ దినములు పవిత్రంగా, పరిశుద్ధంగా, సహోదర సహవాసము, ప్రేమలలో గడిచినందుకు నాకెంతో ఆనందముగా యున్నది. మనము మరెన్నడూ ముసలివారము కాని ఒక దేశమునకు వెళ్ళుచున్నామని ఎరుగుదుము. ఆ గొప్ప దేశము ఆవల నున్నది. అక్కడ ఎన్నడూ మనము ముసలివారము కాము మరియు ఎన్నడూ చనిపోము.
5మనందరికి ప్రియుడగు మన ప్రశస్త సోదరులలో ఒకాయన ఈ మధ్యనే ఆ దేశమునకు వెళ్ళెను. ఈ వేదిక మీదికి నేను వచ్చిన ప్రతిసారి సహో, లైల్ గూర్చి తలంచుచుందును. గత రాత్రి నాకు కూర్చొనియున్న చిన్న జాడ కనిపించినది. నా హృదయం వేదనాభరితమయినది. ఆమె ఏలాగుండగలుగుచున్నదో గదా అనిపించినది. నా తండ్రి చనిపోయినప్పుడు నేనెట్లున్నానో, నాకు తెలియును. ఇతరులు ఎంతగా శ్రమపడుచున్నారో మనము తెలిసికోవలెనన్నచో, మనము ఆ శ్రమల పాఠశాల గుండా వెళ్ళవలెను.
6ఇక్కడ కూర్చొనియున్న మరో ముసలి సేవక స్నేహితునివైపు నేను చూచుచున్నాను. నేను పేరు చెప్పలేను. అవునా? చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ రోగులకు మీరు ప్రార్ధి౦చుచుండేవారు గదా? గెర్హోల్డర్. అది జర్మను పేరు, దానిని ఎన్నడూ నేను పలుక లేదు. సహో ట్రేసి ఆయనను కలిసికొనెను, దాదాపు పదేండ్ల నుండి అతనిని నేనెరుగుదును. "ఆ పది సంవత్సరాల్లోను మీరు ఆరు నెలలు పెద్దయినట్టు నాకు కనిపించ లేదని, నేనాయనతో పలికాను." ఒక దినమునకు కృశించు లోకములో మనము జీవించుచున్నాము.
7గత రాత్రి చాలా ఆలస్యమయినది. ఈ రాత్రి ఆలాగుంచకుండా ప్రయత్నించెదను. నా కథ ముగించెదను. ఈ రాత్రి నేను ఎత్తబడుట అను అంశము గూర్చి బోధించవలెనని తలంచుచున్నాను. సంఘము కొనిపోబడును. సంఘము ఎత్తబడు ముందు ఎట్టి పరిస్థితులుండునో, ఏలాగు జరుగునో నేను లేఖనములో చూచుచున్నాను. మనందరము ఎత్తబడుటను నమ్ముచున్నాము. లేదా? దానిని మనము నమ్ముచున్నాము. అయితే ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్ధి౦చండి అని ఆకస్మాత్తుగా చెప్పిరి. నేనక్కడ ఒక మెక్సికను సోదరునితో కలిసి భోజనము చేసితిని. వీధిలో అతనిని నేను కలిసికొంటిని. అతడు, అతని భార్య ఈ రాత్రి ఇచ్చటున్నారని ఊహించుచున్నాను.
అంతట ఎవరో వచ్చి సాక్ష్యము చెప్పిరి. దాదాపు ఒక సంవత్సరం క్రితం అతడు వివేచన చెప్పబడుచున్న వరుసలోనికి వచ్చెను. సహో జాక్, తదితరుల వలె ఆ పాతకాలపు ప్రార్ధనా వరుసనే ఈ రాత్రి కలిగియుండవలెనని నేను తలంచుచున్నాను.
8సహో, యంగ్ బ్రవున్ నా కొరకు ప్రార్థనా కార్డులను ఇచ్చుచుండెడివాడు. అతడు నిజమైన యధార్థపరుడని నాకు రుజవైనది, మరియు అతడు కార్డులు అమ్ముట గాని, మరే పొరపాటు చేయుట గాని ఎన్నడూ చేయలేదు. చాలా సూటి మనిషి ఆలాగు చేయ ప్రయత్నించిన వారిని మేము పట్టుకొనిన సంగతి మీరెరుగుదురు. కాబట్టి సహో, యంగ్ తన పనిని అన్ని వేళలా నమ్మకముగా చేయుచున్నాడు. అతడు నిలబడి కార్డులు స్వీకరించుట, కార్డులున్నవారిని వరుసలో పెట్టుట చేయుచుండెడివాడు. నాకు గుర్తున్నది. మేము వారి కొరకు ప్రార్ధి౦చుచుండెడివారము. ఆ విధంగా మేము కలిసి పని చేసెడివారము. వారిది కల్తిలేని విశ్వాసము. వారు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడే జనులు బాగవుచుండిరి. అప్పటిలో జరిగిన వాటిలో ఇరవైకి ఒకటి కూడా ఇప్పుడు జరుగుట లేదు.
9ఈ మధ్యాహ్నము ఒకాయన గూర్చి చెప్పుకొనుచున్నాము (ఇప్పుడు బహుశా అతడు ఇక్కడే ఉండియుండును). ఒక సంవత్సరం క్రితం అతడు ప్రార్ధనా వరుసలో యుండెను. అప్పుడు వివేచన జరుగుచున్నది. అతనికి గల వ్యాధిని గూర్చి వివేచనా సమయములో చెప్పుట జరిగినది. ఆ వ్యాధి వలన అతనికి ఎన్నడూ ఆడపిల్ల జన్మించదని వైద్యులు చెప్పిరి. అతనికయితే ఆడపిల్ల చాలా ఇష్టముగా ఉండెను. అతనికి మగపిల్ల వాడుండెను. "అయితే అతనికి ఆడపిల్ల జన్మించనైయున్నట్లు ప్రభువు నాకు దర్శనములో చూపించెనని చెప్పాను."
10ఈ రాత్రి ఆ చిన్న బాలిక ఇక్కడున్నదని అతడు నాతో చెప్పెను. ఈ జన సమూహములో ఎక్కడో నేను చెప్పుచున్న వ్యక్తి ఉండెను. బయట ఎవరో నాకు చెప్పిరి. అ బిడ్డను ఎత్తికొని ఇక్కడే ఎక్కడో అతడున్నాడు. అది చాలా చక్కని సంగతి. ఆ బిడ్డ నాకు కనబడుచున్నది. (చాలా చక్కగా యున్నది). ఇంకా సరిగ్గా నడవని చిన్న బిడ్డ చాలా ముద్దుగా యున్నది. ఆమె ఇక్కడికి వచ్చి సాక్ష్యమీయవలెనని నేను తలంచుచున్నాను. రేపు గాని లేదా మరోసారి గాని ఆమె ఆరాధనలో సాక్ష్యమిచ్చును.
రేపు ఉదయము వ్యాపారస్తుల అల్పాహారమున్నదా? దానిని మీరు ప్రకటించారా? అది మంచిది.
11దైవిక స్వస్థత మీద చిన్న పాఠము మనము నేర్చుకొందము. ఎందరు దానిని నమ్ముచున్నారు? అట్టి విశ్వాసము మీకున్నచో, ఈ రాత్రి గొప్ప కార్యములు చూతుము. నమ్ము జనుల ద్వారా అది జరుగును. విశ్వాసికి అది జరుగును.
నేను పెన్సిలు తీసికొని కొన్ని అంశములు వ్రాసితిని. అంతట బిల్లీ తలుపు తట్టి "నాన్నా," అని పిలచెను.
"ఒక్క నిమిషము ఆగు! ఇంకా నేను ముగించలేదు," అన్నాను.
"కాని, సహో జాక్ మీ కోసం ఎదురుచూచుచున్నాడు," అని అతడనెను. కాబట్టి నేను రావలసి వచ్చెను. నా యొద్ద పేపరు క్లిప్పు లేనందున ఆ పేపరును మిడా తలలోని పిన్నుకు తగిలించాను. ఇక్కడ దానిని "జానీ పిన్స్," లేదా ఒక రకమైన పిన్, "బాబీ పిన్" అంటారు. అది ఒక రకమగు పిన్. వాటి సంగతి ఎక్కువగా నాకు తెలియదు. అక్కడది పడియుండుట చూచి దానిని తగిలించాను, ఉదయము కొరకు కొంత నోట్సు వ్రాసియుంచాను; అవి కలిసిపోకుండా ఉండేందుకు వాటికి తగిలించాను.
12వాక్యములను నేను చాలా తేలికగా గుర్తుంచుకొనేవాడిని. కాని ఇప్పుడు చాలా కష్టముగా యున్నది. జాక్ సోదరుడా, నీకు ఈ బాధ ఇంకా ఏర్పడలేదా? అవును. "నేను పెద్దవాడినయిపోవుచున్నాను గనుక జ్ఞాపకశక్తి కోల్పోవుచున్నాను," అని నేను కొంతకాలం క్రితం జాక్ సోదరునితో చెప్పాను. "నేను ఏదయినా చెప్పాలని ప్రారంభించినా, కొంతసేపు ఆగవలసి వస్తుంది."
"అది నీవు ఉన్న మార్గములో కష్టముగా ఉన్నదా?" అని అతడడిగెను.
"అది అంత కష్టముగా లేదులే?" అన్నాను.
అతడు చెప్పెను, "లేదు." అతడు చెప్పెను, "నేను ఎవరికో ఫోను చేసి ఏమి కావాలి అని అడిగాను?" అప్పుడు నీవు తమాషాగా అన్నావు అనుకున్నాను సాహో జాక్. అది నిజమని ఇప్పుడు తెలిసింది.
అవునండి. మీరీలాగే మరచిపోవుచుందురు! మనందరము అన్ని పనులు సరిగ్గా చేయుదము, ఎందుకనగా అవన్నియూ ఒక గ్రంథములో వ్రాయబడుచున్నది. తీర్పు దినమున అవి మరల వినిపించబడును.
13ఇప్పుడు మనమంతా ఒక పెద్ద కుటుంబమువలె నున్నాము. గతరాత్రి నా వర్తమానమును వినుటకు టెలిఫోను సంబంధములు ఏర్పరచినట్లుగా, ఈ రాత్రి దేశమంతటా అట్టి ఏర్పాటు చేయబడలేదని తలంచుచున్నాను. ఇది ఈ స్థానిక సంఘమునకు మాత్రమేనని తలంచుచున్నాను. గత రాత్రి మీరు నిలబడి విన్నందుకు మిమ్మును అభినందించుచున్నాను. సహో జాక్ బట్టి నేను లాభము పొందుటకు ప్రయత్నించుట లేదు. "నా ఇష్టము వచ్చినది చెప్పమని అతడు ఎప్పుడూ నన్ను అడుగును." ఈ వేదిక మీదికి వచ్చి సిద్దాంతము చిన్నగా బోధించాను. అయితే… కావున.. కొందరు శాఖా సోదరులున్నారు…
14ఒక ఉదయమున నాకు కల వచ్చినది. నేను ఎక్కువగా కలలు కనను. నేను కలలను కను వానిని కాను. కాని ఆ కలలో ఒక వ్యక్తిని నేను చూచాను, అతడు యువకుడు, సంకెళ్ళలో నున్నాడు. అతడు బయటకు వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. "వారు చాలా భయంకరమగు జనులు. వారి జోలికి నీవు పోవద్దని ఎవరో నాతో చెప్పిరి."
ఈ యువకుడు తన సంకెళ్ళలో నుండి విడిపించుకొని బయటకు వచ్చుచుండగా నేను చూచాను, కాని అతని జోలికి పోలేదు. "అతడు ఏమి చేయునో చూద్దాం," అనుకొన్నాను. అతడు విడిపించుకొని బయటకు వచ్చెను. చాలా చక్కగా నున్నాడు. మిగలిన వారును బయటకు రా ప్రయత్నించుచున్నారు.
15ఇప్పుడు, ఇది ఒక కల మాత్రమే. ఒక వైపు నేను నడిచి వెళ్ళాను. నాకు రాయ్ బోర్డర్స్ సోదరుడు కనిపించెను. నాకు చాలా మంచి స్నేహితుడు. కాలిఫోర్నియోలో నివసించుచున్నాడు. అతనికి ఏదో జరిగినట్లు కనిపించినది. కండ్లు సగం మూతబడినవి, అతని కండ్లకు కాన్సరు వంటి జబ్బు సోకినట్లు కనబడినది. అతని యొద్ద నుండి నన్ను ఎవరో లాక్కొని పోవుచుండిరి. "బోర్డర్స్ సోదరుడా! ప్రభువైన యేసు నామమున దానిలో నుండి బయట పడుము," అని నేను అరిచాను.
అతడు మాట్లాడలేకపోవుచున్నాడు. "బ్రెన్హాం సోదరుడా, ఇంతకంటె గొప్పది జరుగవలెను. దీనిని నేను గ్రహించలేకపోవుచున్నాను," అని అతడు చెప్పెను.
"ఓ! బోర్డర్స్ సోదరుడా!" అని నేను అన్నాను. అతనిని నేను ప్రేమించుచున్నాను.
16ఎవరో నన్ను దూరంగా లాక్కొని పోవుచుండిరి.
నేను చూడగా ఆమె ఇక్కడ నిలబడియున్న ఒక స్త్రీయేనని గ్రహించాను. నేను బాలునిగా నున్నప్పుడు జనులకు మార్కెట్టు నుండి కాయగూరలు తెచ్చెడివాడిని. ఆ కొట్టు యజమాని పేరు శ్రీమతి ఫెన్టన్, ఇంకా ఆమె జెఫర్సన్ విల్లోనే ఉంటున్నది. నాకు, నా భార్యకు ఆమె వ్యక్తిగత స్నేహితురాలు.
ఆమె ఇట్లన్నది, "బ్రెన్హాం సోదరుడా! మమ్మును నీవు విడిపించుము. "ఇది నరక గృహము. నీవు అపార్థము చేసికొన్నావు. ఈ జనులను కూడా నీవు అపార్థము చేసికొన్నావు. వీరు చక్కని ప్రజలు." బ్రెన్హాం సోదరుడా! మమ్మును విడిపించుము, మేము ఆపదలో నున్నాము, మాకు సహాయము చేయుము." నేను ఆ వైపు చూచాను. అది పెద్ద గోడలతో ఒక సొరంగ గది (cellar) వలె నున్నది. దానిక్రింద ఒక పెద్ద గుహ యున్నది. ఎనిమిది లేదా పది అంగుళముల మందము గల గొప్ప ఇనుప చువ్వలు దానికి యుండినవి. మనస్సు స్థిమితము లేని మనుష్యులు అక్కడున్నారు. వారి చేతులు కాళ్ళు వంకరలు తిరిగియున్నవి. వారు తలలు బాదుకొనుచున్నారు. ఆమెను నేనెరుగుదును. ఆమె సహోదర సంఘము అను క్రైస్తవ సంఘమునకు చెందినది.
17నాకును సహాయము చేయవలెనని యున్నది అని చెప్పాను. వారిని చూచుకొంటూ ముందుకు నేను వెళ్ళిపోయాను. ఆ గొప్ప ఇనుప చువ్వల మధ్య చిక్కిన జనులు యున్నారు. వారి యొద్దకు వెళ్ళలేము, ఎందుకనగా ఆ ఇనుప చువ్వలు దగ్గర దగ్గరగా యున్నవి. వారు మతిపోయి తమ తలలు బాదుకొనుచుండిరి.
అక్కడ కొన్ని దీపములు మిణుకు మిణుకుమని వెలుగుట నాకు కనిపించినవి. నేను చూడగా ప్రభువైన యేసు చుట్టూర దీపములు వర్షధనస్సు వలె కమ్మియున్నవి. ఆయన నా వైపు సూటిగా చూచుచుండెను. "ఆ జనులను విడిపించుమని," ఆయన నాతో చెప్పి వెళ్ళిపోయెను.
"వారినెట్లు నేను విడిపించగలను? ఆ ఇనుప ఊచలను పగులగొట్ట కలిగినంత శక్తి నా చేతులలో లేదే?" అని అనుకొన్నాను.
"నరక గృహమా! యేసుక్రీస్తు నామమున నాశనము కమ్ము," అన్నాను.
శబ్దములు, కేకలు వినబడినవి, రాళ్ళు దొర్లిపోయినవి, ఇనుప ఊచలు ఊడిపోయినవి; "విమోచించబడితిమి," అని చెప్పుచూ జనులు పరుగిడుచుండిరి. వారు తమ గొంతెత్తి అరచుచుండిరి.
18"రాయ్ బోర్డర్స్ సోదరుడా! ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? దేవుడు తన జనులను విమోచించుచున్నాడు. బోర్డర్స్ సోదరుడా, ఎచ్చటున్నావ్?" అని చెప్పి నేను ఆశ్చర్యముతో కేకలు వేయుచున్నాను.
సహో, బోర్డర్స్ చాలా భయపడినాడు. మీలో చాలామందికి ఆ ప్రవచనము తెలియును, పశ్చిమ తీరము గూర్చి చెప్పబడిన టేపులు మొదలగునవి వినండి.
19అది జరిగినప్పుడు అక్కడుండిన ఒకాయన ఈ రాత్రి ఇచ్చట కూర్చొనియున్నాడు. (మేము వేట పర్యటనలో నిలబడియున్నాము), గత రాత్రి ఆ సేవకుడు వినుచునే యున్నాడు. గ్రుడ్డివానిగా అతడు వచ్చి తన్ను పరిచయము చేసికొనెను. కొండమీద నివసించు అతడు నల్ల కళ్ళద్దములు పెట్టుకొనియున్నాడు. "బ్రెన్హాం సోదరుడా, నా పేరు మొక్ హుజస్. కాలిఫోర్నియోలో మీరు ఒకసారి జరిపిన కూటములకు కొంత సహాయము నేను చేశాను? అని అతడు చెప్పెను
"సోదరుడా! మొక్ హుజస్ నిన్ను కలిసికొనుట చాలా సంతోషము," అని నేను చెప్పాను.
20కాబట్టి అక్కడ దాదాపు ఇరవైమంది మనుష్యులు నిలబడియుండిరి. మేము అడవి పందులను వేటాడుచున్నాము. సహో, బాంక్స్ ఉడ్ (మీరందరు ఎరుగుదురు, నాకు అతడు వ్యక్తిగత స్నేహితుడు), కొండమీదికి వెళ్ళు ఒకరోజు ముందే అతనితో నేను దేవుడు ఏదో చేయనై యున్నాడని చెప్పాను. ఇది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పాను." ఒక రాయిని తీసి గాలిలోనికి విసరగా, అది క్రిందికి పడినది.
"అదేమిటి బ్రెన్హాం సోదరుడా?" అని అతడడిగెను.
"నాకు తెలియదు, కాని ఇరవై నాలుగు గంటలలో నీవు దానిని చూచెదవు. ఎదో జరగనై యున్నది. అది గొప్ప గురుతు," అని చెప్పాను.
21అది ఒక సాయంకాల సమయము, మరుసటి రోజు దాదాపు పది గంటలకు మేము వెళ్ళిపోవలెనని ఉద్దేశించాము. మేమందరము వేట సాధనాలతో నిలబడియున్నాము. సహో, మెక్ అనెల్లీని మీరందరు ఎరుగుదురు. వారు అడవి పందులను వేటాడి పరిశుభ్ర పరచుచున్నారు. సహో, బోర్డర్స్, నేను, మాకు అతి ప్రియుడు, ప్రశస్త స్నేహితుడు, కుంటివాడు అగు సహో, రాయ్ రాబర్సన్ అక్కడే నిలబడియున్నాము. నేను పైకి చూస్తున్నాను. సహో, మొక్ హుజస్ నాతో ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా! ఇటువంటి వేట సమయములలో కూడా ప్రభువు యొక్క దూత మీకు ఎప్పుడైనా కనిపించునా?"
"మొక్ హుజస్ సోదరుడా! అవును, అది నిజము; కాని ఇక్కడికి నేను ఒక రకంగా విశ్రాంతి తీసికొనుటకు వచ్చాను," అని చెప్పాను.
"మంచిది. బ్రెన్హాం సోదరుడా! నిన్ను ఆయాసపరచదలచుకోలేదు," అని అతడనెను.
"నీవు నన్నేమీ ఆయాసపరచుట లేదు," అన్నాను.
22నేను తిరిగి చూచాను, ఒక వైద్యుడు అతని కన్నులోనికి చూచుట నాకు కనబడినది. అతనిని నేనెరుగను. అతడు నళ్ళ కళ్ళద్దములు పెట్టుకొనెను, ఆరిజోనాలో చాలా ఎండగా యున్నది. నేను చూడగా, డాక్టరు అతనితో ఇట్లు చెప్పుట కనబడెను, "అయ్యా, నేను దాదాపు రెండేండ్ల నుండి ఈతని కంటికి వైద్యము చేయుచున్నాను, నీ కంటిలోనున్న వ్యాధి వలన చూపు పోవును. అది కనుగ్రుడ్డును తినివేయుచున్నది, దానిని నేను ఆపు మార్గము కనబడుట లేదు."
అంతట అతనితో ఇట్లు చెప్పాను, "నీవు నన్ను నీ కన్ను గూర్చి అడుగుచున్నావు, నీ కన్ను బాగాలేనందున నీవు ఆ నల్ల కళ్ళద్దములు ధరించితివి."
ఆయన చెప్పెను, "అది నిజము."
"నీ కంటిలోని వ్యాధి వలన నీవు ఆ కన్ను పోగొట్టుకొందుపని కొద్దిరోజుల క్రితం నీ వైద్యుడు నీతో చెప్పెను [ఆ వైద్యుని వివరించాను] కొన్ని సంవత్సరాల నుండి అతడు నీకు వైద్యము చేయుచున్నా గాని దానిని ఆపజాలనని చెప్పెను," అని నేను చెప్పాను.
"బ్రెన్హాం సోదరుడా, అది సత్యము," అని అతడనెను.
23నేను చుట్టూర చూచాను, అతనికంటె ఎక్కువ వయస్సు గల ఒక స్త్రీ కనబడినది. ఆమె నల్లజాతి స్త్రీ వారు ఆర్కన్సాస్లోని వారే. ఆమె తన వస్త్రమును ఎత్తి తన జబ్బు అవయవము (కాలు)ను తీసి చూపి, "కుమారుడా! నీవు బ్రెన్హాం సోదరుని చూచినచో, నా కాలు గూర్చి ప్రార్ధి౦చమని చెప్పుము," అనెను. ఆమె పాదము మీద పెద్ద కంతులు వ్రేలాడుచున్నవి.
"మీ తల్లి నెరసిన వెంట్రుకలు గలది, ఆమె తన వస్త్రమును ఎత్తి మేజోడు తీసి పాదమును చూపించి, నన్ను ఎప్పుడైనా కలిసినచో తన కొరకు నన్ను ప్రార్ధి౦చమన్నది గదా?" అనడిగాను.
ఆయన అన్నాడు, "ఓ కృపా!"
అతడు కండ్ల అద్దములు లేకుండా చూచుట నాకు దర్శనములో కనబడినది. "దేవుడు నీ కంటిని, నీ తల్లిని కూడా స్వస్థపరచియున్నాడు. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు," అని చెప్పాను.
24ఆ సమయమున నేను తిరిగాను (ఆ రోజు అక్కడ నిలబడియున్న ఒక వ్యక్తి ఇప్పుడిచ్చటనే యున్నాడు). నేను సహో, రాయ్ రాబర్సన్ మీద నా చేతులు వేశాను. ఆయన ఒక్కప్పుడు యుద్ధ సైనికుడు. "రాయ్ సోదరుడా! త్వరలోనే ఏదో జరుగనై యున్నది" అన్నాను.
"బ్రెన్హాం సోదరుడా, నీ భావమేమి?" అని అతడడిగెను.
"మాట్లాడవద్దు! వెంటనే దేని క్రిందికైనా వెళ్ళుము!" అని చెప్పాను. నేను తిరిగి నా ప్రక్కనే యున్న ఒక పారను తీసికొని, వారియొద్ద నుండి నడిచి వెళ్ళిపోయాను, ఎందుకనగా అది నేనున్న చోటకే వచ్చునని నాకు తెలియును.
25ఈ ఇంటికంటె ఎనిమిది లేదా పదిరెట్లు పెద్దగానున్న ఒక పెద్ద ఎత్తైన కనుమ ప్రక్క నుండి అగ్నివంటిది సుడిగాలివలె ఆకాశము నుండి దిగి వచ్చెను. నేను నిలబడియున్న దానికి అది కొద్ది అడుగుల దూరమే యున్నది, ఆ కొండ మీది రాళ్ళను బ్రద్దలు చేసినది. ఆ తాకిడికి చెట్ల పై భాగములు నరుకబడెను, అవి వెళ్ళి వంద గజముల దూరములో పడెను. అందరూ పరుగెత్తసాగిరి, మరియు ట్రక్కుల క్రింద దాగుకోసాగిరి. అది ఒక గొప్ప ఉరుము వలె వినబడినది. మరల ఆకాశములోనికి వెళ్ళి తిరిగి క్రిందికి దిగి వచ్చెను. ఆ విధంగా మూడు సార్లు జరిగెను. అది ముగిసిన తరువాత అందరూ వచ్చి "దాని భావమేమిటని నన్నడుగసాగిరి?"
"అది తీర్పు సూచన అని మీతో చెప్పగోరుచున్నాను. కొద్దిరోజులలో ఒక గొప్ప భూకంపము పశ్చిమమును తాకనై యున్నది. అది ఆగదు. కాలిఫోర్నియో, లాస్ఏంజల్స్ మునిగిపోవును. అది అడుగుకు పోవుచున్నది. అది సముద్రములోనికి జారిపోవును." రెండు రోజుల తర్వాత అలాస్కా భూకంపము అలాస్కాను కుదిపివేసినది.
MATT 11:23
26కాలిఫోర్నియోలో నా చివరి కూటములో మాట్లాడుట ముగించి, వీధిలోనికి వచ్చి నాకు తెలియకుండానే ఇట్లన్నాను, "దేవదూతల పేరుతో పిలువబడుచున్న పట్టణమా, కపెర్నహోమా, కపెర్నహోమా, [అదే లాస్ఏంజల్స్] నీవు ఆకాశము మట్టుకు నిన్ను హెచ్చించుకొన్నావు, కాని నీవు పాతాళము మట్టుకు తగ్గించబడెదవు. నీలో జరిగించిన గొప్ప కార్యములు సొదొమలో జరిగించియుండినయెడల అది నేటికిని నిలచియుండెడిది."
27గత కొద్ది దినముల నుండి మహా రోదన వినబడుచున్నది. సైన్సు పేపరులో ఇట్లున్నది, "అది కరిగిపోయి అడుగునకు పోవుచున్నది." వారిప్పుడే అది తెలిసికొనిరి.
మీరు గమనించండి, నీరు వచ్చి సాల్టన్ సముద్రములోనికి దానిని తీసికొనిపోవును. లాస్ఏంజల్స్ తీర్పునకు గురియగును. అది జరుగకముందే మీతో నేను చెప్పుచున్నాను. అది జరిగినప్పుడు దానిని మీరెరుగుదురు. నా యంతట నేను ఇది ఎన్నడూ చెప్పలేదు. ఆయన నాతో చెప్పెను. అది ఎన్నడూ జరుగక తప్పలేదు. దానికి మీరు సాక్షులు. అది నిజము. ఎప్పుడు జరుగును? నాకు తెలియదు.
MATT 11:23
28నేను వెళ్ళిపోయాను, నేను చెప్పినదే వారు నాకు చెప్పిరి. నేను విన్నాను, వెళ్ళి లేఖనములను పరిశోధించాను. కపెర్నహోము గూర్చి యేసు దాదాపు అదే మాటలను పలికినట్లు మాకు తెలియును. ఆ సమయములో సౌదొమ గొమొర్రాలు, మృత సముద్ర అడుగ భాగమున ఉండియుండును. ఆ తరువాత దాదాపు వంద సంవత్సరములకు కపెర్నహోము సముద్రములోనికి జారిపోయెను. అదిప్పుడు సముద్రములో యున్నది. పాపములను బట్టి సొదోమను సముద్రములో పడవేసిన దేవుడు, పాపములను బట్టి కపెర్నహోమును సముద్రములో పడవేసిన దేవుడు, లాస్ఏంజల్స్ దాని పాపము బట్టి సముద్రములో పడవేయును, అది చెడ్డ పట్టణము.
సహో, రాయ్ మరణము గూర్చి భయపడుచున్నాడు. దాని భావము నాకు తెలియదు. నేనెరుగను.
ప్రార్ధి౦చుదము.
29ప్రభువా, నిజముగా వినువారికి సాక్ష్యము చెప్పుట. చాలా మంచిది. ప్రభువా, నిన్ను మేము నమ్ముచున్నాము. అపనమ్మకము లేకుండా సహయము చేయుము. ఇప్పుడు మేము ప్రపంచ అంతమునకు చేరుచున్నట్లు గ్రహించుచున్నాము. ఏ సమయములో అది జరుగునో మాకు తెలియదు. కాని వధువు రహస్యముగా కొనిపోబడును — ప్రభువా, ఈ దినములలోనే మేము ఎత్తబడుదుము. ఆయనతో కొనిపోబడుదుము. ఆ దినము కొరకు మేము ఎదురుచూచుచున్నాము. ప్రభువా, మా హృదయములు సిద్ధపరుచుము.
ఇక్కడ చాలామంది మంచముల మీద, పరుపుల మీద పరుండియున్నారు. ఈ స్త్రీ-పురుషులు శత్రువు ద్వారా బంధించబడియున్నారు. నీవు తాకనియెడల గుండెపోటుతో మరణించు రోగులు బహుశా ఇక్కడ ఉండియుందురు. బహుశా కొందరు కాన్సరుతో తినివేయబడియుందురు.
తండ్రీ, నీవు ప్రతి మానవుని హృదయమును ఎరుగుదువు. అది సత్యమో, అసత్యమో నీవే ఎరుగుదువు. నీవు చేసిన క్రియలను మేమెరుగుదుము గనుక వీటిని చెప్పుచున్నాము. నీ గొప్ప శక్తి ఎందరినో విడిపించెను. అందుకు మేము సాక్షులము, ఆ కార్యములు జరుగలేదని కొందరు చెప్ప ప్రయత్నించుచున్నారు. కాని ప్రభువా, నీవు చేసితివి. మేము సాక్షులము.
30ప్రభువా, ఈ ప్రజల హృదయములలో నీవు విశ్వాసము నిర్మించుము. ప్రతిఒక్కరు విమోచింపబడుదురు గాక; ఈ రోగులు, బాధపడుచున్నవారు విమోచింపబడుదురు గాక. ప్రభువా, మేము వాక్యము బోధించ ప్రయత్నించుచుండగా, అది సూక్ష్మముగా నుండునట్లు చేయుము. ప్రభువా, నా తప్పులను పరిశుద్దాత్మ తీసికొని సరిదిద్ది జనుల హృదయములో నుంచు గాక. దానిని వాస్తవముగా చేయుము. ఇక్కడున్న ప్రతి విశ్వాసి హృదయములోను ఆయన వాక్యము నాటబడును గాక. ప్రభువా, ఈ రాత్రిని ఆ ఉద్దేశ్యము కొరకు మేము ప్రత్యేకించుకొనియున్నాము. ఇంకా రక్షించబడని వారిప్పుడు సిద్ధపడుదురు గాక! కృప ద్వారములు ఇంకా తెరువబడియుండగా, వారు సిద్ధపడుదురు గాక. దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
31ఇప్పుడు వాక్యముతో ప్రారంభించుకొందము.
ఈ బల్లమీద ఎవరో కాగితము వ్రాసియుంచిరి. ఈ రాత్రి నా కొరకు వారు కానుక స్వీకరించినట్లు అందులో వ్రాసిరి. అది అవసరత కాదు. ఆలాగు చేయకండి. దానిని నేను తిరిగి తీసికొని వెళ్ళజాలను. ఒకసారి కెనడాలోని కాల్గారీలో ఆలాగే కానుక స్వీకరించిరి. సహూ, జాక్ నాతో ఏదో చెప్పగోరెను. నా భార్య ఆ వెనుక కూర్చొనియున్నది, ఇంతకు మేముండిన రెండు పాత గదులలో మా పిల్లలు ఉండుచున్నారు. ఆమె పిల్లలకు న్యుమోనియో రాకుండా తలుపుకు అడ్డంగా దుప్పటి కట్టెడిది. "బ్రెన్హాం సోదరుడా! ఆమె యెడల ఆలాగు ప్రవర్తించుట మంచిది కాదు," అని అతడు చెప్పెను. కాబట్టి సంగతిని గుర్తు౦చుకొనండి. ఎన్ని వేల డాలర్లో నేను మరచిపోయాను.
"సహో జాక్! తిరిగి తీసికొని వెళ్ళు," అని చెప్పాను.
మేము వెనక్కు తీసికొని వెళ్ళలేము అని అతడు చెప్పెను. కాబట్టి నేను అక్కడ స్థలము కొన్నాను. దేవుని మహిమ మరియు ఘనత కొరకు మాత్రమే. దానిని సంఘము నుండి జనులకు వచ్చిన ఒక కానుకగా, నా భార్య నేను కొన్ని సంవత్సరములు ఉంచి యున్నాము.
అది అంత బాగా నాకు తోచలేదు. ఈ లోకమునకు నేను ఏదీ తీసికొనిరాలేదు, నేను ఏదియూ నిశ్చయముగా తీసికొనిపోను. దానిని నేను ఆలయమునకు అప్పగించాను. రేపు అనునది యున్నచో, నేను గతించిన తరువాత మరో దైవజనుడు వచ్చి దానిని వాడుకొనును. చూచారా? స్నేహితులారా, మీ దయను బట్టి వందనములు. అందును బట్టి దేవుడు మిమ్ము దీవించును.
32ఇప్పుడు యాకోబు పత్రిక రెండవ అధ్యాయము చూద్దాం. మనము మొదటి నుండి 21 వచనము వరకు చదువుదము.
కొద్దిసేపు వాక్యోపదేశము చేసిన తరువాత, వీలయినంత త్వరగా రోగులకు ప్రార్ధన చేయుట ప్రారంభించుదము. ఈ ప్రార్ధన వరుసలో వచ్చు వారందరికి వీలయితే ప్రార్థించెదము. సహోదరి ఆనాజీన్ మరియు సహో డాన్, మొదలగు వారిని నేను మరచిపోదలచుకోలేదు. వారు థాయ్లాండులో ఉన్నారనుకొంటాను. కాదా? ఎక్కడ? బాంకాక్, మిషను పొలములు. ప్రజలకు చెప్పవలెనని పగటియందు ఎన్నో సంగతులు ఆలోచించెదను. ఇప్పుడు అవి గుర్తులేవు. ఆ పాఠము మీద మనము చదువుదుము.
JAS 2:21-23
33మరియు ఇప్పుడు యాకోబు 2వ అధ్యాయము. 21 వచనము నుండి ప్రారంభించుదము. 2వ అధ్యాయము 21 వచనము. మరియ దానిలోని భాగము చదవండి. రెండవ అధ్యాయము 21 వచనము.
మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు? అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?
విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?
మరియు లేఖనము నెరవేరబడినది, కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.
34ఇప్పుడు, ఈ రోజు నా అంశము… మీరిప్పుడు మీ బైబిలును పట్టుకొని యుండుడి, ఎందుకనగా ఈ రాత్రి చాలా లేఖనములు వ్రాసియుంచాను. మరీ సమయము ఎక్కవగా కాకుండా వానిలో కొన్ని ఎత్తి చూపెదను. ఈ రాత్రి నా అంశము: "క్రియల వలన వ్యక్తమయిన విశ్వాసము." ఇప్పుడు గుర్తు౦చుకొనండి: క్రియల వలన వ్యక్తమయిన విశ్వాసము. విశ్వాసమున్నట్లు క్రియలు రుజువు చేయును. చూచారా? అది మనకు అర్ధము చేయుటలో ఈ వాక్యము సహాయపడునని దీనిని నేను తీసికొన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దీనిని మనము ఆదివారపుబడి పాఠము వలె తీసికొందము.
ఇక్కడ యాకోబు ఆదికాండములోని 22:1-9, అబ్రాహామును తన బోధనా అంశముగా తీసికొనెను.
GEN 22:1-5
35మనమును వెనుకకు వెళ్ళుదము. ఇక్కడ కొన్ని రకముల వాక్యములు వ్రాసి యుంచాను. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 9 వచనములు:
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన — అబ్రాహామా అని పిలువగా: అతడు — చిత్తము ప్రభువా అనెను.
అప్పుడాయన — నీకు ఒక్కడైయున్న కుమారుని, అనగా, నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను. [ఆయన ఏ పర్వతమో చెప్పలేదు. దేవుడు మాట్లాడినప్పుడు నీవు ముందుకు పోవలసినదే. చూచారా?]
తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలికొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను.
మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి.
అబ్రాహాము తన పనివారితో — మీరు గాడిదతో ఇక్కడనే యుండుడి. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి (దేవునికి) మొక్కి మరల మీ యొద్దకు వచ్చెదమని చెప్పి, దహన బలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొనిపోయెను.
GEN 22:5-12
36ఇప్పుడు, దేవుడు తనతో చెప్పినట్లు తన కుమారుని చంపుదునను తలంపుతో అతడు వెళ్ళుచుండెను. కాని ఇక్కడ వాక్యము చూడండి:
నేను మరియు ఈ పిల్లవాడు అక్కడికి వెళ్ళి మరియు ఆరాదించి తిరిగి వచ్చెదము. [ఆయన మరియు పిల్లవాడు].
మరియు అబ్రాహాము కట్టెలు మరియు నిప్పులును ఆయన కుమారుడైన ఇస్సాకుపై ఉంచి; ఆయన చేతిలో అగ్ని తీసుకోని, మరియు కత్తి; మరియు వారు ఇద్దరు కలసి వేల్లుచు౦టిరి.
వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో — నా తండ్రీ, అని పిలచెను. అందుకతడు — ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు — నిప్పులును, కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా?
అబ్రాహాము — నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఆలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు.
అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను.
అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా.
యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా, అని అతనిని పిలచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
అప్పుడాయన — ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము. అతనినేమియు చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. [ఎంత గొప్ప క్రియ!]
అబ్రాహామును అతని క్రియల బట్టి యాకోబు ఇచ్చట నీతిమంతునిగా తీర్చు చున్నాడని కనుగొందుము.
ROM 4:1-4
37కాని ఇప్పుడు, రోమా పత్రికలో పౌలు చెప్పినది చూద్దాం. 4వ అధ్యాయము 1 నుండి 8 వచనములు… 4:1 నుండి 8, అంతా కాదు గాని, వాటిలో కొంత భాగము చదువుదము:
కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.
అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని; అది దేవుని యెదుట కలుగదు. [గత రాత్రి "నీతిమంతునిగా తీర్చబడుట" అను పదము చూచాము]
లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు.
అబ్రాహాములో దేవుడు చూచిన దానిని, పౌలు ఇక్కడ ఎత్తి చూపుచున్నాడు.
GEN 15:5,6
38ఇప్పుడు మనము, ఒకవేళ మరల మనము ఎక్కువ త్రిప్పుట లేదు, మనమను మరలా ఆదికొండము 15వ అధ్యాయం 6 వచనము చూద్దాం. వచనము; 15:6. అది సరియైనది అని నమ్ముచున్నాను. 5 నుండి ప్రారంభి౦చుదము:
మరియు ఆయన వెలుపలికి అతని తీసికొనివచ్చి — నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి — నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
GAL 2:16•
JAS 2:21
39విశ్వాసమును గూర్చి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుచున్నారు: అబ్రాహాములో దేవుడు చూచిన దానిబట్టి పౌలు నీతిమంతునిగా ఆతని తీర్చెను. దానిని అతడు నమ్మొను. అయితే అబ్రాహాములో మానవునికి కనబడిన దానిని బట్టి యాకోబు అతనిని నీతిమంతునిగా తీర్చెను.
చుడండి, ఇప్పుడు, "అతడు క్రియల వలన నీతిమంతునిగా తీర్చబడెను," అని యాకోబు చెప్పెను.
"అతడు విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడెను," అని పౌలు చెప్పెను.
కాని చూడండి, అబ్రాహాము దేవుని నమ్మెను. అతనిలో దేవుడు అదే చూచెను. దానిని క్రియగా చేయ వెళ్ళగా మనిషి చూచెను.
అతడు దానిని చేసినట్టే మనపట్లను ఆలాగే అది యున్నది, ఎందుకనగా మనకెంత విశ్వాసమున్నదో మన క్రియలే తెలియచేయును. మనము నమ్మినదానినిబట్టి మనము పనిచేయ భయపడినచో, మనము నమ్మనట్లే. చూడండి, మీరు దానిని నమ్మవలసియున్నారు.
GEN 17:17
40దేవుని వాగ్దానమందు తనకు గల విశ్వాసమును అబ్రాహాము యొక్క క్రియలు రుజువు చేసెను. గుర్తు౦చుకొనండి, అబ్రాహామునకు వంద సంవత్సరములు, శారాకు తొంబది సంవత్సరములు. వారిరువురూ బాగుగా వృద్దులు, పిల్లలను కను వయస్సును ఎప్పుడో దాటిపోయిరి. వారు యవ్వన కాలము నుండి భార్యాభర్తలుగా యుండిరి, అయినా పిల్లలు కలుగలేదు. అయితే అతడు డెబ్బది-ఐదేండ్ల వయస్సులోను, ఆమె అరవై-అయిదేండ్ల వయస్సులోను ఉండగా, "దేవుడు వారికి బిడ్డ కలుగునని చెప్పెను." అతడు దేవుని వాగ్దానమును నమ్మెను. ఇప్పుడు, చూడండి, ఈ బిడ్డకు కావలసిన సామాగ్రి సిద్ధము చేసికొనెను. చూచారా, దేవుడు అదే చూచెను. దేవుని అతడు నమ్మెను; అతడు నమ్మిన దానికి రుజువుగా క్రియను చేసినప్పుడు మానవులు చూచిరి. (ఈ రాత్రి మన విషయము ఆ రీతిగానే యున్నది) అది అతనికి బయలుపరచబడెను. అది అతనికి ప్రత్యక్తపరచబడెను గనుక ఆ ప్రకారము అతడు నమ్మెను. అది జరిగినట్లే అతడు తలంచి పనిచేసెను.
ఇప్పుడు ఒక్క నిమిషము మనము ఇచ్చట ఆగుదము. కొన్నిసార్లు దానిని మనము అపార్ధము చేసికొందుము. ప్రజలకు ఉద్రేకము వచ్చి దానికి అనుగుణముగా పనిచేయుదురు. కాని అది జరుగదు.
41ఇప్పుడు, నేనిక్కడున్న సహో, గెర్హోల్డర్ వలె ఉన్నాను. మేము వృద్దులము. చాలాకాలము నుండి ఈ ఒడుదుడుకులు ఎదుర్కొనుచున్నాము. ప్రపంచమంతా తిరిగి రోగులకు ప్రార్ధి౦చుచున్నాము. అన్నిచోట్లా ప్రజల యొక్క నిరాశను, హల్లెలూయాను చూచుచున్నాము. ఇదంతయూ మేము నేర్చుకొనుచున్నాము. బాలురముగా ఉన్నప్పటి నుండియే మేము బోధ ప్రారంభించాము. సహో, గెర్హోల్డర్ వలె ఈద నారంభించాను. మొదటి సంగతి మీరు తెలిసికొనినట్లుగా… సహో జాక్ మరియు నేను బయటకు వెళ్ళేవారము; ఇప్పుడు బ్రవున్ మరియు నేను వీధుల్లో ప్రతి రాత్రి నడచుటకు కలిగియున్నాను, నాకునేను సమయము గడుపుటకు ప్రయత్నించెడివాడిని, నేను చిన్నవాని వలె, నిలబడి నీళ్ళు చిమ్ముచూ దర్శనములు చూచెడి వాడిని, మీకు తెలుసా. సహో, బ్రవున్ వచ్చే వరకు అక్కడే నిలబడి…
42ఒక రాత్రి నాకు గుర్తున్నది, ఎన్నడూ దానిని మరువలేను, సాన్ జోస్ లేదా మరెక్కడో అనుకొంటాను. అతడు నన్ను లేపుటకు వచ్చెను. చాలా రోజుల నుండి నాకు నిద్ర లేదు. నాకు తెలియకుండానే నిద్రమత్తులో మాట్లాడాను. "నేను ఇంటికి వెళ్ళిపోదును," అని చెప్పి ఏడుపు ప్రారంభించాను. చూచారా?
"ఎందుకు," "అయితే ఒక కూటము ఉన్నది గనుక నీవు ఇంటికి వెళ్ళరాదని," అతడన్నాడు.
నేను అన్నాను, "అయితే, నేను కొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవుటకు సిద్దపడుదను." చూచారా, అప్పుడు నేను బాలుడిని. నాకు తెలియకుండానే ఆలాగు జరిగినది.
43నీవు నీటిలో ఈద నారంభించినప్పుడు. నీవు నీళ్ళు త్రోసుకొంటూ కొలనులో వెళ్ళెదవు, మరియు [సాహో బ్రన్హం వేగముగా ఉపిరి తీయుచుండెను.] నీవు ఈదుట నేర్చుకొనిన తరువాత అంతగా అలసట రాదు, ఎందుకనగా నీకు ఈదుట వచ్చినది; నీవు మెలికలు తిరుగుచూ సులభంగా పోయెదవు, చూచారా.
నడక రాని బాలుడు బల్లలు పట్టుకొని నడువ ప్రయత్నించును, డజనుల సార్లు పడిపోయి అక్కడకు చేరుకోక ముందే అలసిపోవును. అయితే నడక నేర్చిన ఒక వ్యక్తి అసలు తాను నడచుచున్నానన్న తలంపు లేకుండానే నడచిపోవును. అయితే ప్రారంభములో అందరూ నేర్చుకోవలసినదే; ఇప్పుడు ఆయన అదే అయి యున్నాడు.
44మంచిది, దైవిక స్వస్థత గూర్చి బోధించుట లేదా మరేదయినా గాని అంతే. నీవు ప్రారంభించినప్పుడే నేర్చుకొందువు. నీవు నేర్చుకొననియెడల, నీవు ఏదో పొరపాటులో నున్నావు, చూచారా. నీవు నేర్చుకొనవలెను. దేవుని అంగీకరించుట ఎట్లో, దాని నిజభావము ఏమిటో నీవు నేర్చుకోవలసియున్నావు.
కొన్నిసార్లు మనము, "వీనికి తగిన విశ్వాసము లేదు. వానికి విశ్వాసము లేదు అని చెప్పుచుందుము." దానికి ఒక కారణమున్నది. కొన్నిసార్లు ఒప్పకొనని పాపము వలన ఆలాగు జరుగును. నీవు ఒక వ్యక్తి మీద ఒక గాలను నూనె పోసి గొంతు పోయేటట్లు అరిచినా గాని, ఆ దెయ్యమును కదిలించజాలవు. దానిని ఒప్పుకొనవలెను. వివేచన దానినే చెప్పును. "వెళ్ళి దానిని సరిచేసికొనుము," అని చెప్పును. దానిని బయటకు తీసుకోని రమ్ము.
కాని దానిని నెమ్మదిగా చేయుట వలన, మీరు చూచారా. కొందరు అసహనమునకు గురియగుదురు. "నాకెన్నడూ ప్రార్ధి౦చలేదు," అని వారందురు. నిజమగు ప్రాధమిక దైవిక స్వస్థతకు మార్గమేమిటో మనము కనుగొనవలెను.
45ఇప్పుడు, గతరాత్రి నేను వరమును గూర్చి చెప్పాను, వరము ఒక అద్భుతమే; కాని నీ నిత్యత్వ గురిని వరముల మీద ఆధారపడునట్లు చేయరాదు. వరము అనునది చిన్నది, నీవు చిన్నదానిని ప్రధానమైనదిగా మార్చలేవు. దేవుడిచ్చిన ఏ వరమునయినా గాని, సాతాను అక్షరాలా అనుకరించ వచ్చును. కాబట్టి దానిని మనము గమనించవలెను.
కొన్నిసార్లు గట్టిగా నేను అరచుచుందును; దురాత్మలు అరచుట నేను చూచాను. దయ్యములు భాషలు మాట్లాడుట నేను చూచాను; నిశ్చయంగా అవి అనుకరించును. అది అసలయినది కాదు గాని, అనుకరణ మాత్రమే, మీరు చూచారా, నిజమగు దానివలె కనిపింపచేయును. ఆ తేడాను ఎరుగని జనులు కొన్నిసార్లు ఇదే నిజము అని ప్రకటించుదురు, కాని అది నిజము కాదు.
దైవిక స్వస్థత విషయములో కూడా ఆలాగే జరుగును. "కొందరు దానిని బూటకము అందురు." అది కాదు. అది సత్యమే, దేవునియందు కల్తిలేని విశ్వాసమే నిజము. అది లంగరు వేయును! అది లంగరు వేయబడినప్పుడు, దానిని ఎవరును కదపలేరు. అది అక్కడే ఉండి తీరును. మరియు అందువలన, ఈ మూలలను కత్తరించు…
46ఇప్పుడు, విశ్వాసమనగా దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షత. విశ్వాసమనునది ఒక బయలుపాటు. కొద్ది క్షణాలు అక్కడే నేనుండగోరుచున్నాను. అది బయలుపాటు. ఆయన కృపను బట్టి దానిని నీకు బయలుపరచును. అది నీవు చేసినది కాదు. నీ యంతట నీవు విశ్వాసమును తెచ్చుకోలేవు. నీవెన్నడూ విశ్వాసము కలిగియుండలేవు, అది దేవుని కృప వలన నీకియ్యబడినది. దేవుడు దానిని నీకు బయలుపరచును, కాబట్టి విశ్వాసమనగా ప్రత్యక్షత. మరియు దేవుని సంఘమంతయూ ప్రత్యక్షత మీదనే నిర్మించబడినది.
MATT 16:13-16,18•
MARK 8:27-29•
LUKE 9:18-20
47కొంతకాలము క్రిందట ఒక బాప్టిస్టు కాపరి నాతో ఇట్లనెను, "నేను ప్రత్యక్షతను అంగీకరించను."
అయితే "నీవు బైబిలును అంగీకరించలేవు, క్రీస్తును అంగీకరించలేవు, ఎందుకనగా ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత కదా?" అని నేనన్నాను. "ఆయన శరీరమందు ప్రత్యక్షమైన దేవుడు." కాబట్టి సంఘమంతయూ దైవ ప్రత్యక్షత మీద నిర్మించబడియున్నది.
"నేనెవరినని జనులు చెప్పుకొనుచున్నారు?" అని ఒకసారి యేసు అడిగెను; పేతురును అడిగెను అని నమ్ముచున్నాను. ఆయన తన శిష్యులతో మాట్లాడుచుండెను.
"కొందరు నీవు ఏలియావనియు, కొందరు మోషేవనియు, ప్రవక్తలలో ఒకడివనియు, యిర్మియావనియు చెప్పుకొనుచున్నారనెను."
"కాని నీవు నేనెవరినని చెప్పుచున్నావు?" అని ఆయనడిగెను.
"నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు," అని అతడు చెప్పెను.
MATT 16:17,18•
LUKE 9:20
48కాథలిక్కు చర్చి ఇట్లు చెప్పుచున్నది, అతడు పేతురుతో మాట్లాడుతూ, "నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును," అని చెప్పెను.
ఆయన తన మీదనే దానిని కట్టుచున్నాడని ప్రొటస్టెంటు వారందురు.
ఇప్పుడు, వారు సరికావచ్చును. కాని నాకయితే, వారిద్దరిదీ తప్పు. ఆయన ఎవరైయున్నారన్న ఆత్మీయ ప్రత్యక్షత కావలెను. "పేతురూ, రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు గాని, పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. ఈ బండ మీద. [ఆయనెవరైయున్నాడన్న ప్రత్యక్షత; ఆయనే వాక్యము అను ప్రత్యక్షత.] "దీని పై నేను నా సంఘమును కట్టుదును; పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువజాలవు." పాతాళలోక ద్వారములు దానికి వ్యతిరేకమగునని అది చూపించుచున్నది.
HEB 11:4
49"విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటె శ్రేష్ఠమైన అర్పణను దేవునికి అర్పించెను. [ఆ రోజులలో ఏ బైబిలులేదు]. అతడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యమిచ్చెను." ఏలాగు? విశ్వాసము బట్టి. ఏలాగు? ప్రత్యక్షతను బట్టి. ప్రత్యక్షత ద్వారా హేబెలు దేవునికి శ్రేష్ఠమైన బలిని అర్పించెను. పొలములోని పండు కాదు గాని, రక్తమే సరైన అర్పణ అని అతనికి బయలుపరచబడెను.
అందువల్లనే కొందరు విశ్వాసులు గాను; కొందరు అవిశ్వాసులుగాను; కొందరు వేషధారులు గాను ఉన్నారు.
50ప్రార్ధనా వరుసలోనికి వచ్చు సమూహములోని వారందురూ మంచివారేనని మనము చెప్పెదము. కొందరు దానిని నమ్ముటకు గట్టిగా ప్రయత్నించుచున్నారు. వారంతట వారే ఆ ప్రయత్నము చేయుచున్నారు; కొందరు ఆలాగు చేయలేకపోవుచున్నారు; కొందరికి, కేవలము కృప వలన అనుగ్రహించబడుచున్నది. ఇప్పుడు, అదియే తేడా. చూచారా? అదే చేయును. అదే నిజప్రత్యక్షత, ఎందుకనగా విశ్వాసము అనగా దేవుని నుండి వచ్చు ప్రత్యక్షత. మొదటగా అది బయలుపరచబడవలెను.
JOHN 6:44
51యేసు దీనిని స్పష్టముగా వెల్లడి చేసెను, "మొదటి తండ్రి ఆకర్షించితేనేగాని ఎవడును నా యొద్దకు రాలేడని," ఆయన చెప్పెను. [మొదట దానిని ఆయన బయలుపరచవలెను.] దానిని మీరు చదివి చూడండి. అది యోహాను 6:44 నుండి 46. ఆయనెవరో వారెరుగరు. ఆయన ఒక సామాన్యుడనివారు తలంచిరి. ఈనాటి ప్రజలు తలంచునట్లుగా ఆయన ఒక ప్రవక్త అనుకొనిరి. ఆయన ప్రవక్తయే. ఆయన ఒక సామాన్య నరుడే, కాని అంతకంటి ఆయన అధికుడు.
52"నేను రాత్రి రెండు జీవగ్రంథములు," అని చెప్పాను. దానికి మీరు కొంత తికమక పడవచ్చును. "గ్రంథము ఒక్కటే, కాని ఒకటి నీ స్వాభావిక జన్మ గూర్చి, మరొకటి నీ ఆత్మీయ జన్మ గూర్చి వ్రాయబడినది." ఒకటి మరొక దానికి దారిచూపును, గోధుమ గింజ వలె నున్నది. మీరు సజీవుడనగు నాతో మాట్లాడుచున్నారు, కాని నాలో నశించిపోవు భాగము ఒకటున్నది. ఆ గ్రంథములో పేరు పోవును. కాని నిత్యమగునది, ముందుగా నిర్ణయించబడునది, ఏర్పరచబడినది, ఒకటున్నది. దానిలో పేరు ఎల్లప్పుడును యుండును, అదెన్నడూ తీసివేయబడదు. దానిని మీరు గ్రంథములో గుర్తించెదరు, కాబట్టి మీరీ సంగతి గూర్చి తికమకపడవద్దు. ఆలాగు మీరు కనుగొందురు, దానిని సరైన వ్యాకరణములో పెట్టిన సహో, వైల్ దానిని ఈ రోజు నాకు గుర్తుచేసెను. "అది సరియే," అని నేనన్నాను.
53రెండు వేర్వేరు గ్రంథములున్నవని బాప్టిస్తులు నమ్ముదురు. ఒక విధంగా అవి రెండు వేర్వేరు గ్రంథములు, మరో విధంగా అవి వేర్వేరు గ్రంథములు కావు. నేను ఆత్మ, శరీరము, మరియు ప్రాణము అను మూడు వ్యక్తిత్వములను కలిగియున్నాను. అయితే నేను ఒక్క మానవుడినే.
వాస్తవానికి ఒకే జీవగ్రంథమున్నది. ఒక గోధుమ గింజయే దళముగాను, కాండము గాను, గింజగాను మారును — ఎన్నో దశలున్నవి. అది కట్టగా నున్నది గాని గింజయే, ఎందుకనగా దశలు వారీగా మారి చివరకు గింజగా వచ్చును. దానిని తీసికొని వచ్చిన కాండము, దళము, పొట్టు నశించిపోవును. గొర్రెపిల్ల జీవగ్రంథములో నుండి నీ పేరు కొట్టివేయబడునన్నట్లుగా ఒక చోట నీకు వినిపించవచ్చును, మరియు మరొకచోట ఆలాగు వినబడదు. అదే సంగతి అంతా ఆ గొప్ప ప్రత్యక్షతలోనే యున్నది. ఏడు ముద్రల కాలములో అది తెలియబడును. ఎందుకు…. ఎలాగు కొందరు జనులు దానిని నమ్మలేరు?
JOHN 6:37,44
54"మొదటగా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడని," యేసు చెప్పెను. "తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు." దేవుని యొక్క ప్రత్యక్షత వలన నీకు బయలుపరచబడితేనే గాని ఆయనెవరో, ఎట్లున్నాడో ఎవరికిని అర్ధము కాదు. దానియందు విశ్వాసమున్నయెడల ఆ ప్రకారముగా జరిగించెదవు. చూడండి? యేసునందు దేవుడు ప్రత్యక్షమాయెనని మనము తేటగా చూతుము. అది చూచుటకు ముందుగా ఎవరు నిర్ణయించబడిరో వారే చూచెదరు. ఈ వాక్యము నిశ్చయంగా చదవండి. యోహాను 6:44 నుండి 44. ఆ గడియారము కదిలిపోవుచున్నది గనుక నేను చదువుట ఆపితిని. సమయము లేదు.
మీరు గమనించండి, "మొదట తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వచ్చెదరు." దానిని వారు గుర్తించెదరు. నీవు ఎంతమంచి మనిషివైనా కావచ్చు, కాని అది నీకు ప్రత్యక్తపరచబడవలెను. అప్పుడు యేసుక్రీస్తు ఎవరో నీవు చూచెదవు.
LUKE 8:11
55ఇప్పుడు, ఇక్కడ, ముందు నిర్ణయించబడిన ప్రణాళిక తేటగా కనబడుచున్నది. వేరే దానివలే.
ఇతర విత్తనముల వలెనె దేవుని వాక్యము కూడా విత్తనమైయున్నది. నేల ముందుగా దున్నబడవలెను. నీవు విత్తనమును నేల మీద పారవేసినచో ఏమీ మేలు జరుగదు. పక్షులు దానిని ఎత్తుకొనిపోవును. ముండ్ల పొదలు మరియు గచ్చ తుప్పలు మధ్య అది పడినచో అణచబడును. యేసు ఆ ఉపమానములో చెప్పెను. కాబట్టి మొదటగా ఆ భూమి సిద్ధపరచబడవలెను. దేవుడు తన సంపూర్ణ కృప ద్వారా మొదట హృదయమును సిద్ధపరచును. ఈ కాలములో ఆయనను చేర్చుకొనుటకు జగత్తు పునాదికి ముందే నిన్ను సిద్ధపరచెను. ఆయన తన ముందు జ్ఞానము ద్వారా నిన్ను ముందే ఎరుగును. నిత్యజీవమునకు నిన్ను నిర్ణయించెను. నిన్ను ఆయన ఎరుగును గనుక సిద్ధపరచెను.
56అందువలననే నీవు ఈ విషయములతో తడబడుచున్నావు, నీవు ఎప్పుడు ఏమైయున్నవో దానిలోనికి నీవు తడబడియున్నావు. నీవు ఎక్కడుండవలెనని ముందు ఆయన నిర్ణయించెనో ఆ చోటికి దేవుడు నిన్ను నడిపించుచున్నాడు. ముందుగా ఈ నేల సిద్ధపరచబడనియెడల అది ఎదుగదు. విశ్వాస బీజమును నీవు ప్రసంగము ద్వారా చల్లవలెను, చూడండి ప్రభువు యొక్క వివేచనలను చూడవలెను, ఏమి జరుగునో చూడుము. బైబిలులోని వరములన్నియు పనిచేయుచున్నవి. "ఓ! హల్లెలూయా! దానిని నేను నమ్ముచున్నాను," అని జనులు తమ స్వశక్తి ద్వారా పలుకుచున్నారు, ఆ తరువాత నిరాశ చెందుచున్నారు. చూడండి, ముందుగా నేల సిద్ధపరచబడవలెను, అప్పుడది ఎదుగును.
ROM 10:17
57గత రాత్రి నా చిన్న పక్షిరాజు గూర్చి చెప్పాను. ఆ తల్లి పక్షిరాజు యొక్క స్వరమును అది ఎరుగును. ఆ కోడి పిల్లలకు దానికి మధ్య ఎంతో తేడా యున్నది, ఎందుకనగా గ్రుడ్డు లోనే అది పక్షిరాజు. మొదట్లోనే అది పక్షిరాజు, మధ్యలో తయారుకాలేదు. క్రైస్తవుడునూ ఆలాగే యున్నాడు. మీ మొదటి తల్లిదండ్రులగు ఆదామవ్వల వలన మీరు మోసములో పడి విడాకులు పుచ్చుకొనుచున్నారు. స్వభావము బట్టి మీరు పాపులు. మీ కోరిక బట్టి కాదు. ఇప్పుడు మీరు సువార్త విన్నారు. "వినుట వలన విశ్వాసము వచ్చును," వినుట వలన ప్రత్యక్షత వచ్చును. నీ అంతరంగమందు ఏదో చిన్నది ఒకటున్నది.
"అదంతా నేను నమ్మను. అది చెత్త, దానిలో ఏమీ లేదు. నేను నమ్మను," అని నీ ప్రక్కనే కూర్చొనియున్న ఒక వ్యక్తి చెప్పవచ్చును.
ACTS 2:13
58పెంతెకోస్తు నాడు వారాలాగే చేసిరి, వారు నవ్విరి. "వీరు క్రొత్త మద్యముతో నిండుకొనిరి, అని చెప్పిరి." గొప్ప సంఘటన జరుగుచున్నది. ఎందువలన? వ్యక్తిగతంగా దేవుడు తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. ఇతరులు నవ్వుచుండగా వీరు సంతోషించుచుండిరి. అది వ్యక్తిగత ప్రత్యక్షత, అదే విశ్వాసము; బయలుపరచబడిన విశ్వాసము. విశ్వాసము కానియెడల, అది అక్కడ ఉండనే యుండదు. అది విశ్వాసము.
ROM 8:29,30
59విత్తనములు చల్లు ముందు నేలను సిద్ధపరచవలెను. "కాబట్టి ఆయన తాను ముందుగా ఎరిగిన వారినందరినీ పిలచెను, ముందుగా వారిని నిర్ణయించెను." దానిని మీరు రోమా 8:28-34 మరియు ఎఫెసీ 1:1-5లో చదువగలరు, "ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలచెను. ఎవరిని పిలచెనో, వారిని నీతిమంతులనుగా తీర్చెను. నీతిమంతులుగా తీర్చినవారిని మహిమపరచెను." ఏదీ క్రమము తప్పలేదు. మనము అనుకొందుము గాని వాక్యమును చూడండి. దేవుని వాక్యము ఏలాగు జరుగునని చెప్పుచున్నదో ఆలాగే సరిగ్గా జరుగుచున్నది. నేడు వర్తమానమును తిరస్కరించుచున్నారు. వారాలాగు చేయుదురని వాక్యము చెప్పలేదా? నిశ్చయంగా ఇవ్వన్నియూ దేవునిచే ముందుగా నిర్ణయించబడినవి.
60ఓ! ఇది మిమ్మును ఆనందంగా నడచునట్లు చేయును. పాత క్రైస్తవుల కంటె మనము ఎంతో తేడగా యుండుటకు కారణము అదే. యేసుక్రీస్తు యొక్క నిజ ప్రత్యక్షత, ఇమ్మానుయేలు ఈ కరకు జనులలో, ఈ జనుల హృదయములలో నివాసము చేయుచున్నది. కాని నేడు శాఖలు మనలను ఈలాగనుచున్నవి, "ఓ! వారికి ప్రత్యక్షత లేదు. మీరిక్కడకు రండి." మీరు వారి ప్రత్యక్షత మీద ఆధారపడుచున్నారు. వారి ప్రత్యక్షత దేవుని వాక్య ప్రకారము లేనిచో అది తప్పు. అది నేను లేదా మరెవరయినా కావచ్చును. ఏది సరియోనదో, ఏదో తప్పో, దేవుడుని వాక్యమే చెప్పును!
MATT 13:7,8•
ROM 8:29
61విత్తనముకు నేలకావలెను. "ఏమి జరుగనైయున్నదో ముందే ఆయనకు తెలియును." విత్తనము గూర్చి యేసు మరల చెప్పినది గమనించండి, "కొన్ని రాతి నేలను పడెను, కొన్ని కలగలుపులున్న నేలలో పడెను, [ముండు, పొదలు ఉన్న చోట అది పెరుగదు, చుడండి. ఎక్కడైతే ముళ్ళు, పొదలు, మరియు ప్రతివిధమైనవి, అది పెరగలేదు.] కొన్ని మంచి నేలను పడినవి. [ఆ నేల ముందే సిద్ధపరచబడినది.]"
62కోడి పిల్లలవలె వారు ఏదో వెదుకుచూ యున్నారు… కాని పక్షిరాజులు కోడిపిల్లల మధ్యయున్నా గాని ఆకాశములో నుండి ఒక స్వరమును ఆకస్మాత్తుగా విన్నది. వెంటనే దానిని గుర్తించినది. "అది దేవుని మాట!" చూడండి, దాని హృదయములో ఒక ప్రత్యక్షతను పొందినది, దాని గురించి ఆయనకు బయలుపరచబడినది.
ISA 7:14
63గుర్తించండి, యెషయా ప్రవక్త ఇట్లనెను, "ఒక కన్యక గర్భవతి యగును." ఎంత వింత మాట! మతి సరిగ్గానున్న వ్యక్తి ఆలాగు పలుకగలడా? ఎన్నడూ కన్యక గర్భవతి కాజాలదు. "ఒక కన్యక గర్భవతి యగును." ఇప్పుడు, దానిని చెప్పుటకు వెనుదీయలేదు, దానిని అతడు పలికెను. ఏలాగు ఇది జరుగును? అది అతని పని కాదు. దేవుడు తాను ఏది చేయనైయున్నాడో దానిని అతడు పలికెను. దేవుడు అతనికి దానిని బయలుపరచెను. దర్శనములో చూపించెను, ప్రత్యక్షపరచెను, మరియు అది సత్యము.
64ఆడపిల్ల జన్మించునని అతనితో చెప్పమని ఆ దేవుడే నాకు తెలియచేసెను. "అది జరుగదని," వైద్యుడు చెప్పెను. నేను చెప్పినది అనేకులకు వింతగా వినపడవచ్చును.
కాని "అది జరుగునని," దేవుడు చెప్పెను. ఆ మాట మీద అది ఆధారపడియున్నది. గుర్తుంచుకొనండి, అక్కడ ప్రవక్త నిలబడియుండెను మరియు ఆయన వాక్యము బయలు వెళ్ళెను.
GEN 1:3,27•
GEN 2:5
65ఆదికాండము 1లో: "దేవుడు వెలుగు కలుగును గాక, పలానిది కలుగును గాక, అని చెప్పెను. మానవుని తన పోలిక చొప్పున నిర్మించెను. వారిని స్త్రీని గాను, పురుషుని గాను సృజించెను." ఇంకా భూమి మీద అప్పుడు ఏదియు లేదు. ఆయన నరుని తన రూపములో చేసెనని అదికాండము 2లో చదువగలము. సృష్టి జరిగిన పిదప నేల దున్నుటకు ఏ నరుడును లేడు. ఆయన తనమాట ద్వారా సమస్తము జరిగించెను. "ఆయన వెలుగు కలుగును గాక," అని పలికెను. అసలు వెలుగు అనునది ఆ ముందు గాని, ఆ తరువాత ఎనిమిది వందల సంవత్సరముల వరకు గాని లేకపోవచ్చును, కాని ఆయన పలికెను! ఆయన ఏ చెట్టు నిర్మించబడవలెనని పలికినా గాని ఆ నీటి క్రింద భూమిలో ఆ విత్తనము తయారగుచుండెను. అది నిజము. దాని దాని కాలములో అది మొలిచెను. దేవుటి మాట తప్పిపోదు. అది పలుకబడనిది గనుక విఫలము కాదు.
EXOD 20:19•
DEUT 18:16,18
66ఇప్పుడు, ఒక దినమున దేవుడు ముఖాముఖిగా నరునితో మాట్లాడెను. మోషే కాలములో అగ్నిపడుచుండగా వారు "మోషెను మాట్లాడమని కోరిరి, దేవుడు మాట్లాడితే నశించుదుమనిరి."
ఆ విధముగా ఇక మీదట "నేను వారితో మాట్లాడక, ఒక ప్రవక్తను లేపుదునని ఆయన చెప్పెను." దేవుని క్రమము ఎల్లప్పుడూ ఆలాగే యున్నది.
ఇప్పుడు, ఇక్కడ ఒక ప్రవక్త ఆత్మావేశముతో నిలబడియున్నాడు. అతడు తన మేధాశక్తి గూర్చి తలంచలేదు: "ఒక నిమిషము ఆగండి. ఆ విధంగా నేను మాట్లాడితే జనులు నన్ను పిచ్చివాడనుకొందురని ఆయన తలంచలేదు." చూడండి, అది ఆయన జ్ఞానము. హవ్వ సాతాను మాట విన్నట్లు, అతడు (వైద్యుడు) జ్ఞానము చెప్పునది వినెను.
ISA 7:14
67వైద్యుడు నీవు బ్రదుకవనియు, నీవు బాగవవనియు, నీవు ఏమీ చేయలేవనియు చెప్పును. ఆ మాట నీవు వినినంత కాలము ఆ విత్తనము మంచి నేలలో పడక సత్ఫలమునియ్యదు. కాని ఎప్పుడైతే దానినంతటినీ తిరస్కరించి మంచి నేలలో అది పడునో, అప్పుడు అది మంచి ఫలితము నిచ్చును.
అది జరుగుటకు ఎంత కాలము పట్టినా గాని అది జరుగును. ఇప్పుడు, కన్యక గర్భవతియగును అని ఆయన చెప్పెను. అది జరుగుటకు ఎనిమిది వందల సంవత్సరములు పట్టినది. ఆ స్త్రీ ఎవరో, ఆమె పేరు ఏమిటో, ఆ విత్తనము ఎక్కడ పడునో, దేవునికి ముందే తెలియును. దానిని నీవు నమ్ముదువా? నిశ్చయంగా, ఆయన చేయును. ఈ గొప్ప అద్భుతము అక్షరాలా ఒక స్త్రీ గర్భము ద్వారా నెరవేరినది. దాని గూర్చి దేవుడెరుగును. ఆయన తన మాటను నమ్మకముగా చెప్పు ప్రవక్తకు దీనిని బయలుపరచెను. అది ఏమిటో తనకు తెలియకుండానే చెప్పెను. దాని గూర్చి అతడు ఎన్నడూ వాదించలేదు.
68ఇక్కడ కూర్చొనియున్న స్త్రీ, పురుషులు ఎట్టి రీతిగాను తర్కించుకొనరాదు. ఇంతకాలము నుండి నేను కుంటిగా యున్నాను. నేను బాగపు అవకాశము ఏ మాత్రము లేదని వైద్యుడు చెప్పెను గదా, అని అనుకోవద్దు. అతనికి తెలిసినంత వరకు అది సత్యమే.
బోధకుని వలన గాని మరొకని వలన గాని కాదు. దేవుడే తన కృపను బట్టి ఆ కలుపు మొక్కలను పీకి వేయవలెను. నీవు బాగవుదువు అను ప్రత్యక్షతను దేవుడు నీ హృదయములో నుంచును. నిన్ను బాగవకుండా ఆపునది ఏదియూ లేదు. నీవు బాగయొదవు! అది జరుగు వరకు నీవు వైద్యుడు నీతో చెప్పిన పరిస్థితిలోనే కూర్చొని యుందువు. అది బయలుపరచబడవలెను. దానిని బయలుపరచునది దేవుని కృపయే.
ISA 7:14
69ఇప్పుడు, గమనంచండి, రానున్నదని దేవునికి తెలియును. యెషయాను గమనించండి. అతనికి ఏ ప్రశ్నలేదు. "ప్రభువా, ఒక్క నిమిషము ఆగు! నీవు నాతో ఏమి చెప్పావు? కన్యక గర్భవతి యగునా? ఓ! అదేమిటి? తండ్రీ, అటువంటిది ఎన్నడూ జరగలేదే?" అనలేదు.
అతడు ఏమీ సందేహించకుండా, "ఒక కన్యక గర్భవతి యగును!" అని చెప్పెను. నిజం.
LUKE 1:34,35,38
70మరియను గమనించండి: "ప్రభువా, ఒక్క నిమిషము ఆగు! నేను ఎన్నడూ పురుషుని ఎరుగని దానినని నీకు తెలియును. ఇది అసాధ్యము! ఇటువంటిది ఎన్నడూ జరుగలేదు! ఓ! ఇట్టిది ఎన్నడూ జరుగదు. నేనేలాగు కుమారుని కందును? నేను ఏ పురుషుని ఎరుగను గనుక ఇది జరుగదు. దేవదూతా! నీవు పొరబడుచున్నావు. నాకు ఏదో కన్ను చెదిరినది. ఈ రోజులు గతించాయి అని మా చర్చి చెప్పుచున్నది. మరియ ఎన్నడూ ఒక్క మాట కూడా ఆలాగు పలుకలేదు. మరియు అసలు ప్రశ్నించలేదు.
"పురుషుని ఎరుగని నాకు ఇదెట్లు జరుగును?" అని ప్రశ్నించెను.
"పరిశుద్దాత్మ కమ్ముకొనును. ఆ విధంగా అది జరుగును," అని ఆయన చెప్పెను.
"ఇదిగో యెహోవా దాసురాలు!" అన్నదామె. ఏమీ ప్రశ్నించలేదు. చూడండి.
71ఆలోచన ద్వారా వాక్యమును దేవుడు యెషయా యొక్క హృదయములో పుట్టించెను. అది మంచి నేలను పడెను. అతడు ఒక ప్రవక్త, ఆ ప్రవక్త ఏ మానవ జ్ఞానమును లెక్క చేయడు. ఏ మానవుని తెలివితేటలను అతడు లక్ష్యము చేయడు. ఏ వ్యక్తిత్వమును అతడు లెక్క చేయడు. అతడు దేవునికి ప్రతిష్టించబడిన సాధనము. దేవుడు పలుకగా అతడు పలికెను. అంతే! అది బాధపెట్టినా, పెట్టకపోయినా అంతే! అది పిచ్చివాని మాట వలె వినిపించినా, వినబడక పోయినా అంతే; అతనిలో ఏ మార్పు కలుగదు, అది దేవుని మాట గాని — మానవ మాట కాదు.
MATT 17:20•
MATT 21:21•
MARK 9:23•
MARK 11:23
72ఆ మాట బయలు వెళ్ళి, ఇప్పుడు విత్తనముగా మారెను. అది ఒకచోట పడవలసియున్నది. దేవుడు దానిని పలికెను గనుక అది ఒక స్త్రీ గర్భములో తప్పక పడును. "నమ్మువానికి సమస్తమూ సాధ్యమే. హృదయములో సందేహించక ఒక పర్వతమును కదిలిపొమ్మని ఆజ్ఞాపించినచో ఆలాగు జరుగును." చుడండి, అది ఎక్కడో ఉండవలసియున్నది, అది నిజము!
గమనించండి! యెషయా ఆలాగు పలికెనని మనము చూతుము.
73కన్య మరియ,… నేల దున్నబడినది. ఆమె కన్యయే. ఆమె ఏ తప్పు చేయనక్కర్లేదు. నేల ముందే సిద్ధపరచబడినది. దేవుని యొక్క ముందు జ్ఞానమువలన నిర్ణయించబడినది.
ఆమె కన్యక అని చెప్పబడెను. ఆమె పేరు ఏమిటో దేవునికి తెలియును. ఆమె పేరు పరలోకమందున్న జీవగ్రంథములో యున్నది.
అప్పుడు అది బయలుపరచబడినది. వారి క్రియలు వ్యక్తపరచుట బట్టి మానవులు దానిని చూచిరి, అది ముందే జరిగినది, "మనము గతమును చూచి అది జరిగెను," అని అందుము. మనము జరిగిన క్రియలనే చూతుము.
GEN 6:13-17
74నోవహు క్రియలు మానవునికి వెల్లడాయెను. ఆయన విశ్వాసము దేవుని వాగ్దానమందున్నది. దేవుడు నోవహును కలిసికొనెను, "నోవహు, వర్షము కురియును. నేను సర్వ భూమిని జలముతో నాశనము చేసెదను," అని చెప్పెను. అంతకు ముందెన్నడూ వాన కురియలేదు. అది ఒక అసాధ్యము. "దేవుడు నోవహుకు కొలతలు ఇచ్చి, ఆ ప్రకారము ఓడను చేయమనెను." అతడు వడ్రంగి వాడే గనుక తన పనిముట్లన్నిటితో పనిచేయ నారంభించెను. పిత్రీము కట్టను కోసెను. బల్లలు తయారు చేసెను. దేవుడు చెప్పినట్లు కీలు పూసెను. అతని గూర్చి మనుష్యులు ఏమనుకొనియుందురని మీరనుకొనుచున్నారు?
"నిజంగా ఈతనికి పిచ్చిపట్టినది, ఎందుకనగా ఇతడు ఆకాశము నుండి నీరు కురియనని చెప్పుచున్నాడు. పైన నీరు లేదు గదా? కాని చూడండి. నోవహు ఆలాగు తలంచలేదు. అతని విశ్వాసము ఏమిటో అతని క్రియల ద్వారా వ్యక్తమాయెను. దేవుడు చెప్పినది జరుగును.
ఆ కారణము చేతనే నిజమైన క్రైస్తవుడు సమస్తము నుండి వేరగును. దేవుని వాక్యమును హత్తుకొనును. ఎవరేమి అనుకొన్నా జనులు ఏమి తలంచినా పరవాలేదు. అతడు మాటలతో వేరయితినని చెప్పుట మాత్రమే కాదు, తన క్రియల ద్వారా దానిని తెలియచేయును. కొందరు అటుఇటు తిరిగి దేనికో చేరబడుదురు, కాని నిజమగు వ్యక్తి ఆ గొప్ప ఘడియ కొరకు సిద్ధపడును. దేవుని వాక్యము అతనిలో యున్నది గనుక తిరిగి దానినే పుట్టించును, చూడండి. నోవహు ఆలాగే చేసెను.
EXOD 3:10•
EXOD 4:17•
ROM 11:29
75మోషే చేతిలో కర్ర పట్టుకొని ఫరో యొద్ద నుండి జనులను విడిపించ వచ్చెను. ఐగుస్తీయుల జ్ఞానమంతయూ మోషే నేర్చుకొనెనని బైబిలు చెప్పుచున్నది. అతడు తెలివైన వాడు. వారి మేధావులవంటివాడు. తెలివిగల సంగతులు చెప్పగలడు. వారి జ్ఞానమంతయూ అతడు నేర్చుకొనెను. అంత చదువు కలిగిన వ్యక్తి ఎక్కడో అరణ్యములో యుండగా దేవుడు ప్రత్యక్షమాయెను. "మోషే, నీ చేతితో ఈ కర్రను పట్టుకొని ఐగుపు లోనికి వెళ్ళుము. నీ చేతిలోనున్న ఈ కర్ర ద్వారా వారిని బయటకు తీసికొని రమ్ము! అంతా ఈ కర్ర వలనే జరుగును," అని దేవుడు చెప్పెను.
ఇప్పుడు, మోషే ఈలాగు చెప్పినయెడల ఎట్లు౦డును? "నీవు ఉన్నవాడనని చెప్పుచున్నావు. నీవు చాలా జ్ఞానముగలవాడవు. ఈ చిన్న వంకర కర్ర పట్టుకొని వెళ్ళి, ఈటెలు గల మిలియను కంటె ఎక్కువ మంది ఉన్న సైన్యమును, యోధులను ఎట్లు జయించగలననుకొనుచున్నావు? నేను అసలు పోరాడుట ఎరుగను. నేనొక గొర్రెల కాపరిని. దీనిని ఏలాగు చేయగలను?"
ఆ విధంగా అతడు ప్రశ్నించలేదు. ఎందువలన? అతని హృదయంలో పునాది ఏర్పడినది. అతడు ముందుగా నిర్ణయించబడినవాడు. "వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండానే వచ్చును." దేవుడు తాను చేయు పనిని అబ్రాహామునకు తెలియచేసెను. అతనిలో ఒక పునాది ఏర్పడెను.
EXOD 5:1•
EXOD 10:3
76మోషే ఈ కర్రను తీసికొని అక్కడికి వెళ్ళి ఒక దేశములో నుండి మరో దేశమును బయటకు తెచ్చెను. తన చేతిలో కర్రను పట్టుకొని ఫరోతో "ఈ జనులను పోనిమ్ము!" అనెను. ఫరో మోషేలో క్రియలను చూచెను. మోషేకు తాను చేయు పనిలో, లేదా చేయ ప్రయత్నించు దానిలో నమ్మకమున్నది. వాగ్దానము చేసిన దేవునియందు అతనికి విశ్వాస ముండెను. అతడు దానిని జయించుటకు వెళ్ళెను. ఏ ఇతర వ్యక్తియు ఆలాగు చేసియుండెడి వాడు కాడు. దానిని చేయుటకు దేవుడాతని అభిషేకి౦చెను. దేవుడు ముందుగానే జరుగనైయున్న దానిని అబ్రాహామునకు తెలియచేసెను. వాగ్దానము సమీపించిన సమయములో చిన్న బాలుడు, చక్కనివాడు జన్మించెను. అతని తల్లిదండ్రులగు అమ్రాము, యొకెబెదులు రాజాజ్ఞకు భయపడలేదు. ఆ నేల ముందే సిద్ధపరచబడినది.
ఓ దేవా, ఈ రాత్రి సిద్ధపరచబడిన నేలతో నేను మాట్లాడుచున్నానని తలంచుచున్నాను. సరైన చోట విత్తనము పడినచో అది జరుగును. లేనియెడల అది జరుగదు.
ఇది మారదు, "బ్రెన్హాం సోదరుడా, ఆ విధమైనది మాకున్న దానిని కూడా తీసివేయును. మాలో నున్న క్రైస్తవ్యమును కూడా తొలగించును," అని వారనవచ్చును. నీవు దేనినయినా అనుకరించవచ్చును. కాని దేవుని వాక్యము సరైన స్థలములో పడినయెడల, అది తిరిగి తన జాతినే మొలిపించును. అది విత్తనము గనుక ఆలాగే జరుగవలెను.
EXOD 3:12•
EXOD 5:1•
EXOD 9:15•
EXOD 10:3
77మోషే యొక్క క్రియలు అతడు నమ్మిన దేవునియందు అతనికి గల విశ్వాసమును రుజువు చేసెను. మానవుడగు ఫరో దానిని చూడకలిగెను. మోషే ఏలాగు చేయగలిగెనో అతనికి తెలియలేదు. మోషే దేనిగూర్చి మాట్లాడెనో దానిని ఎరుగును. దానిని అతడు నమ్మెను, లేనియెడల ఆ స్థలములో అతడు నిలిచియుండెడివాడు కాడు. "ఈ కర్ర చేతనే నేను వారిని బయటకు రప్పించెదను," అని తన చేతిలోని కర్రను చూపించెను. ఎనుబది-సంవత్సరముల ముసలివాడు. ఏమీ అగ్రశ్రేణి క్రీడాకారుడు కాడు; ఒక ముసలివాడు. భుజములు వంగిపోయినవి, గడ్డము నెరసినది. జుట్టు పండిపోయినది. తన చేతిలో కర్రను పట్టుకొని ఇట్లనెను, "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా జనులను పోనిమ్ము లేనియెడల దేవుడు నీకు తీర్పు తీర్చును," అని చెప్పెను. ఆమేన్! అతడు భయపడెనా? అతనిని ఒక్క బాణముతో, ఒక్క ఈటెతో అంతము చేయవచ్చును. అతనికి భయము లేదు. తానెక్కడ నిలబడియున్నాడో, తనకు తెలియును. "ఫరో, దేవుడు నిన్ను మొత్తును," అని చెప్పెను. అవునండి.
"నీవు మరల ఈ కొండ యొద్దకు వచ్చెదవు," అని దేవుడాతనితో చెప్పెను. తానచ్చటికి వెళ్ళుచున్నానని ఎరుగును.
హల్లెలూయా! ఈ యాత్ర చివరలో మనము ఎచ్చటికి వెళ్ళుదుమో మనము కూడా ఎరుగుదుము. దేవుడు వాగ్దానము చేసెను! నదికి ఆవల ఒక దేశమున్నది. నీ సాక్ష్యము విషయములో నిర్భయముగా ఉండుము. ఆమేన్! అది నీకు బయలుపరచబడినయెడల నీవు భయపడవు. ప్రపంచమంతా ఏకమైనా నీవు భయపడవు. దేవుని యొద్ద నుండి ఈ సత్యము వచ్చినది అని నీవు చెప్పెదవు. అప్పుడు నీవు నిర్భయముగా ఉందువు. లేనియెడల, నీవు ఆలాగుండలేవు.
1SAM 17:8,26
78తన దేవునియందున్న విశ్వాసమును దావీదు ఒక గొల్లవాని వడిసెల ద్వారా ఇశ్రాయేలు సైన్యమంతటికినీ వెల్లడి చేసెను. మరోవైపును గోల్యాతు ఉండెను. వాడచ్చట నిలబడి తన గొప్పలు చెప్పుకొనుచుండెను. దావీదుకన్నా ఎన్నో రెట్లు పెద్దవాడు. అతని వ్రేళ్ళు పధ్నాలుగు అంగుళముల పొడవుండెను. అతడు ఒక గొప్ప ఫిలిస్తీయ రాక్షసుడు. మరి ఇక్కడ దావీదు, సైన్యములో చేర్చుకొనుటకు అతడు మరీ చిన్నవాడుగా నున్నాడు. వారతనిని ఉపయోగించుకొనుటకు పనికి రాడు, కావున అతని సోదరులు సైన్యములో యుండిరి. మరియు గొల్యాతు తన గొప్ప చెప్పుకొనుచుండెను.
కాని దావీదు (అతడికి బయలుపరచబడినదని గుర్తు౦చుకొనండి), "సజీవ దేవుని సైన్యములు ఇచ్చట నిలబడియున్నవి, తమ మాతృభూమి మీద నిలబడియున్నవి, సున్నతి లేని ఫిలిస్తీయుడు అక్కడ నిలబడియున్నాడు, అనుకునెను." మనము వాడిని ఈ రాత్రి, "కాన్సర్," "పక్షవాతము" అను పేరు పెట్టి పిలువవచ్చును.
ఎందుకు, దావీదు వాడికి అసలు ఏ విధంగాను సరిపోడు, ఏ ఆయుధము లేదు. అతడు తగడు. అతడి భుజములు బహుశా పది-పన్నెండు అడుగుల పొడవైనవి. అతని ఎత్తు దాదాపు పధ్నాలుగు లేదా పదిహేను అడుగులు. నేతగాని దోనె అంత పొడవైన ఈటె యున్నది. బహుశా ఇరవై అడుగుల పొడవున్నది. దాని వెడల్పు నాలుగడుగులు ఉండి యుండును.
1SAM 9:2•
1SAM 10:23•
1SAM 17:37
79చిన్న గొర్రె చర్మము చుట్టుకొని, చిన్న దావీదు అక్కడ నిలబడియుండెను. రెండు చర్మములతో దానిని ముడివేసికొనెను. కాని అతనికి ఒక ప్రత్యక్షత యున్నది! అతనికి ప్రత్యక్షత దొరికినది! ఆమేన్! అతడు ఇట్లనెను, "ఎలుగుబంటి కోరల నుండి, సింహపు కోరల నుండి నన్ను విడిపించిన దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని చేతిలో నుండి విడిపించలేడా?" అనెను.
అతని సోదరులు అంతకన్నా బలమైనవారు. సౌలు యొక్క శిరస్సు, భుజములు సైన్యములో అందరికన్నా ఉన్నతమైనవి. కాని, మీరు చూడండి, వారికి ప్రత్యక్షత లేదు. అది జరుగుననియు, దేవుడు దానిని చేయగలడనియు వారు నమ్మిరి, కాని వారికి ప్రత్యక్షత లేదు; దావీదు ప్రత్యక్షత కలిగియుండెను. అక్కడే బేధమున్నది. దేవుడు నిన్ను బాగుచేయునను ప్రత్యక్షతను నీవు పొందినయెడల దానిని నీవు పొందెదవు. [టేపుమీద ఖాళీ యున్నది] దానిని నీవు పొందెదవు. నీకు ఎట్టి వ్యాధియున్నా లెక్కలేదు. అది దావీదు, గొల్యాతుల కన్నా జటిల సమస్య అయి యుండవచ్చును. కాని నీకు ప్రత్యక్షతపరచబడినట్లయితే….
1SAM 17:46
80గమనించండి, ప్రత్యక్షత పొందినందున దావీదు భయము లేక యుండెను. "ఈ రోజు నీ తల నరికి వేయుదును!" అని అతడు చెప్పెను. ఆమేన్, మన దేవుడు తన కృప ద్వారా నిర్ణయము తీసికొనవలసిన ఆ సంక్లిష్ట సమయములో విశ్వాసము పుట్టించెను. ఆ చిన్నవాని హృదయములో విశ్వాస విత్తనమును జార విడిచెను. చక్రాల కుర్చీలో కూర్చొనియున్న ఈమెను ఆ దేవుడే విడుదల చేయగలడు. నీ వ్యాధి పోవును. [స్పష్టత లేని మాటలు] ఆ చిన్న గింజ వంటి విశ్వాసము నీకు ప్రత్యక్షము కావలెను. నీ వ్యాధి ఎంత ముదిరినా లెక్కలేదు.
1SAM 17:43,44•
ZECH 4:6
81ఇప్పుడు, అవతలి వైపునున్న రాక్షసుని గమనించండి, దానినతడు నమ్మలేదు. "నన్ను జయించుటకు నా పైకి ఒక కుర్రాడిని పంపారు. నేను కుక్కనా?" అని వాడడిగెను. "నా ఈటె చివరతో నిన్ను ఎత్తి అవతల పారవేసి, నీ మాంసమును పక్షులకు తినిపించెదను," అనెను. అంతా వాడి పక్షమునే యుండినట్లు కనిపించెను.
కాని చూడండి, అది దావీదును ఏ మాత్రము కదిలించలేదు. అతనికి ప్రత్యక్షత యున్నది. తాను చేయుచున్నదానిలో తనకు విశ్వాసమున్నది. దానిని చేయనైయున్నానని తానెరుగును. అది అతనికి బయలుపరచబడినది గనుక దానిని అతడు చేసెను. తానెక్కడ నిలబడియున్నాడో తానెరుగును.
ఈ రాత్రి దేవుడు నీ హృదయములో ఆలాగు చెప్పినయెడల చాలును, "నీవు పడక మీద ఉండవు. నీవు బాగయి ఆ కుర్చీలో కూర్చొందువు." నీ మనస్సును ఆ మాట నమ్మకుండా మరేదియూ మార్చజాలదు,
కాని అది నీకు జరుగు వరకు, ప్రపంచములోని ప్రతి బోధకుడు ప్రార్ధి౦చవచ్చును. దానివలన నీకు మేలు జరుగదని నేను చెప్పను; అది నిన్ను ధైర్యపరచును. ఆ స్వస్థపరచు శక్తి నీలోనే యున్నది. అది బోధకుని యొద్ద నుండి రాదు. విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా అది నీకు వచ్చును. "శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు." దీనిని ఆయన ఆత్మ కృప ద్వారా బయలు పరచును. ఏదియూ నిన్ను దూరపరచజాలదు. విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా అది వచ్చును. దావీదు తన క్రియల ద్వారా నిరూపించెను.
1SAM 17:28,33,34,37,44,46
82అతని సోదరుడు, మరికొందరు ఇట్లనియుందురు, "నీవు అల్లరి వాడవని నాకు తెలియును. నిన్ను గొర్రెలు కాయమంటే, నీవు యుద్ధము చూచుటకు వచ్చావా?"
"సైన్యాధిపతియగు సౌలుతో నన్ను మాట్లాడనీయుడి," అని అతడనెను.
సౌలు ఇట్లనెను, "కుమారుడా! నీ ధైర్యమును మెచ్చుకొనుచున్నాను. కాని, నీవు చూడు, నీవు కుర్రవాడివి. వాడు ఎప్పటి నుండియో పరాక్రమశాలి. నీవు వాడికి సరిపోవు." "నేను నా తండ్రి గొర్రేలను సంరక్షించుచున్నా"నని అతడు చెప్పెను. అతడు తన విశ్వాసమును ఒకదానిమీద ఆధారము చేసికొనెను. ఆమేన్! ఓ సోదరుడా! నీ ఆత్మను రక్షించిన దేవుడు నీ శరీరమును బాగుచేయలేడా? ఆయన నీకు రక్షకునిగా, స్వస్థపరచు వానిగా ప్రత్యక్షమవ్వవలెను. చూచారా? మొదటగా నీకు బయలుపరచబడవలెను. అప్పుడే తేడా చూచెదవు. నీ విశ్వాసమును ఒకదానిమీద ఆధారము చేసికొనవలెను.
"ఇది ఎన్నడూ ఇంతకు ముందు జరుగలేదే?" అన్నారు.
"సింహపు కోరల నుండి నన్ను విడిపించిన దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని చేతి నుండియు విడిపించగలడు," అని చెప్పెను.
"దావీదు నీకేలాగు తెలియును?"
"దానిని నేను నమ్ముచున్నాను."
"ఎందుకు?"
"అది నాకు బయలుపరచబడియున్నది."
తాను మాట్లాడుచున్న దానిని గూర్చి తనకు తెలియును. "నిన్ను గద్దలకు వేయుదును" అని ఆ రాక్షసుడు చెప్పినప్పుడు; దావీదు "నీ తలను నరికివేయుదునని," చెప్పెను. అక్కడే తేడా యున్నది. చూడండి. అతడు ఆ పని చేసెను.
JUDG 15:15
83ఒక రోజున సంసోనును పొలములో పట్టుకొనిరి. అతని మీద వేలాదిమంది ఫిలిష్తియులు పడిరి. అతడు నేల మీద చూచెను. ఎప్పుడో చచ్చిన ఒక గాడిద దవడ ఎముక ఎండిపోయి పడియున్నది. దానిని పట్టుకొని ఫిలిస్తీయులను చావగొట్టెను. పళ్ళు విరగనివాడు ఒక్కడును లేడని నేను చెప్పగలను. ఆ ఫిలిస్తీయులు దాదాపు ఒక అంగుళము మందమున్న శిరస్తాణమును ధరించిరి. (ఎందుకనగా ఆ దినములలో ఒకరినొకరు కర్రలతో కొట్టుకొనెడివారు) తలమీద దెబ్బ తగలకుండా వారు దానిని ధరించుచుండిరి. కాని అతడు గాడిద యొక్క దవడ ఎముకను తీసికొని ఒక వెయ్యిమంది ఫిలిస్తీయులను కొట్టెను. అయినా ఆ దవడ ఎముక విరుగలేదు. వచ్చిన వారందరిని అతడు కొట్టుచునే యుండెను. వారందరూ కొండల లోనికి పారిపోయిరి. ఎందువలన? అతడు దానిని నమ్మెను.
ఒక సమయమున… మరో సంగతి మీకు చెప్పగోరుచున్నాను. యెహోషువా, మగ్ధలేనే మరియ, మొదలగు వారందరూ ఆలాగే చేసిరి. నీకు ఒకటి ప్రత్యక్షమయినప్పుడు దానిని పట్టుకొనియుండుము. ఒక్క క్షణము కూడా దానిని విడువక, పట్టుకొనుము. ఆ సమయము యొక్క భాగమును.
JUDG 15:15
84అవును, అతనికి ప్రత్యక్షత్ర దొరికెను. అతడు ఆ వెయ్యిమంది ఫిలిస్తీయులను కలిసికొనుటకు వెళ్ళెను. "ఈ చిన్న రొయ్యి పీచువాడు వచ్చుచున్నాడు చూడండి. నాలుగున్నర అడుగుల ఎత్తు కలిగి ఇంకా తల్లి చాటు బిడ్డవలె ఉంగరాల జుట్టు కలిగియున్నాడు. చూడండి. ఒక గాడిద దవడ ఎముక పట్టుకొని వచ్చుచున్నాడు. మనము మహాసైన్యముగా నున్నాము. ఎంత హాస్యాస్పదము!" అని ఆ ఫిలిస్తీయులు పలికియుండవచ్చును. కాని అతడు ఏమి చేయుచున్నాడు? తనకు దేవుని ద్వారా ప్రత్యక్షమైన దానిని అతడు ఫిలిస్తీయులకు వెల్లడి చేయుచున్నాడు. అతడు గాడిద దవడ ఎముకను పట్టుకొనెను. అతడు తన చేతిలో ఉన్నదానిని నమ్మెను. దానిని అతడు చేయగలడు. ఆ విధముగా చేయుచూ, దేవుడు తనను చేయమని హృదయములో ఉంచిన దానిని ఫిలిస్తీయులకు బయలుపరచెను.
MARK 1:7,8•
LUKE 3:16•
JOHN 1:26,27,33
85బాప్తిస్మమిచ్చు యోహాను తన క్రియల ద్వారా విశ్వాసమును వెల్లడి చేసెను. "మీ మధ్య ఇప్పుడు ఒకాయన నిలబడియున్నాడు." దానిని గూర్చి ఆలోచించండి. పరిశుద్ధ యోహాను, నాకు వాక్యము దొరికెను. యోహాను 1:26. చూడండి. ఆయన చెప్పెను…
"మెస్సీయా వచ్చుచున్నాడని నీవనుచున్నావా?" అన్నారు. అతడు చెప్పెను, మీతో ఏమి సంగతి? "మేమాయన గురించి నాలుగు-వేల-సంవత్సరముల నుండి చూచుచున్నాము," అనెను.
"ఆయన మీ మధ్యనే ఇప్పుడు నిలబడియున్నాడు," అని అతడు చెప్పెను. హల్లెలూయా! ఈ రాత్రి ఆయన ఇచ్చటనే యున్నాడు.
తన ప్రత్యక్షత్ర ద్వారా అతడు దానిని బయలుపరచెను, ఎందుకనగా అది అతనికి తెలియచేయబడెను. మెస్సీయాకు బాప్తిస్మమిచ్చుదునని అతనికి తెలియును. ఆయన ముప్పది సంవత్సరముల నరుడు. ఆయన అక్కడే ఎక్కడో ఉండియుండునని అతనికి తెలియును. ఆయనెవరో అతనికి తెలియదు. ఆయన వారి మధ్యనే నిలబడియున్నాడు. "ఆయన మీ మధ్యనే నిలబడియున్నాడు, మీరాయనను ఎరుగరు; ఆయన చెప్పులవారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన ఇప్పుడు మీ మధ్యనే యున్నాడు," అని అతడు చెప్పెను. తన విశ్వాసము ద్వారా దానినతడు బయట పెట్టెను, ఎందుకనగా తన దినములలోనే మెస్సియాను చూచి బాప్తిస్మమిచ్చుదునని తనకు తెలియును. అతని మీదనున్న భావమును జనులు చూడగలిగిరి. అతడు బోధించుచున్న తీరు, ప్రవర్తన బట్టి, అతనికి దేవుని నుండి నిజప్రత్యక్షత యుండెనని అర్ధమయినది.
JOHN 1:26,29,33
86అది నిజమని రుజవు చేయుటకు, మెస్సీయా ఆ సమూహములో నుండి నడిచి వచ్చెను; ఒక సాధారణ యువకునిగా అతడు వచ్చెను, అందరివలెనె బట్టలు ధరించెను. "ఇదిగో లోక పాపమును మోసికొనిపోవుచున్న దేవుని గొర్రెపిల్ల," అని యోహాను చెప్పెను.
"నీవాయనను ఏలాగు ఎరుగుదువు?"
"ఎవరి మీద ఆత్మ దిగుట నీవు చూచెదవో, ఆయనే పరిశుద్దాత్మతో బాప్తిస్మమిచ్చువాడు," అని అరణ్యములో నాకు చెప్పెను.
ఆ సమయములో ఒక సూచన ఉండనై యున్నది గనుక ఆయనను అతడు ఎరిగియుండెను. (దీనిని మీరు గమనించుచున్నారా?) యోహాను ఆ ఘడియను గూర్చి ఎరిగెను, ఎందుకనగా అతడు ఒక ప్రవక్త, అతనికి ఒక ప్రత్యక్షత దొరికెను. ఆ కాలములోనే అది ఉండునని అతడెరుగును, అతడు ఒక సూచన చూచును. ఆ సూచనను అతడు చూచినప్పుడు ఇట్లనెను, "ఆయన మీ మధ్యనే నిలబడియున్నాడు." అతడు దానిని ఎరుగును.
ఓ! అంత్యకాలము ఇక్కడున్నదను సూచన ఇక్కడున్నది. లేఖనము చెప్పినట్లుగా, ఈ అంత్యకాల వర్తమానమునకు వాగ్దాము చేయబడిన సంగతులు నెరవేరుట (బయలుపడుచున్నవి) అక్షరాలా చూచుచున్నాను. సమయము సమీపించినదని నాకు తెలియును! నేను దీనిని నిస్సందేహముగా చెప్పెదను. అది సమీపముగానే యున్నదని నేను నమ్ముచున్నాను. ఆ సమయమునకు ముందు ఆయన జరుగునని చెప్పిన సూచనలు నేను చూచుచున్నాను. ఇప్పుడవి జరుగుటకు సిద్ధముగా నున్నవి.
87దేవుడు తనకు ప్రత్యక్తపరచు దానియందు యోహాను తన విశ్వాసమును వ్యక్తము చేసెను. కాబట్టి క్రియలు విశ్వాసమునకు సాక్ష్యము. నీవు స్వస్థత పొందినటు ప్రవర్తించుటను వారు చూచెదరు. నీవు స్వస్థత పొందినట్లు నమ్ము విశ్వాసము కలిగి యున్నావని వారు తెలిసికొందురు.
సాక్ష్యమేమి చెప్పెను? ఈలాగు చెప్పెను: "ఇప్పుడు అది నేను పొందియున్నాను, ఎందుకనగా దేవుని యొక్క వాగ్దానమును నేను పొందియున్నాను. ఇప్పుడు అది నాలో పనిచేయుచున్నది. అది జరుగుటకు నేను అన్నీ సిద్ధపరచుచున్నాను." చూడండి, నీ క్రియలు దానిని నిరూపించును. నిశ్చయంగా!
88కొన్ని సంవత్సరముల క్రితం, నేను ఆఫ్రికా సందర్శించాను. ఈ వసంత కాలములోను అక్కడకు నేను వెళ్ళాను. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇది జరిగినది. అక్కడ ఒక చిన్న పాపకు ఒక కాలు పొట్టిగా నున్నది. ఆ పాపకు వారెన్నడూ జోళ్ళు తొడగలేదు. ఓ, చాలా వికృతముగా ఇది ఉండెను. నేను ఆ రాత్రి బిడ్డ కొరకు ప్రార్ధి౦చాను. వారందరూ ఆ కార్యములు జరుగుట చూచిరి. వారును ఆ బిడ్డ కొరకు ప్రార్ధి౦చిరి. మరుసటి ఉదయాన, నేను ఒక చెప్పులు కొట్టు ప్రక్కనుండి వెళ్ళుట జరిగినది. అక్కడ ఒక వ్యక్తి తన చిన్న బిడ్డ కొరకు చెప్పులు కొనుచున్నాడు. దానిని అతడు నమ్మెను.
దేవుడు తనకు బిడ్డను ఇచ్చునని నమ్మిన, ఒకాయన ఇచ్చట ఉన్నాడు. అది జరుగునని నిశ్చయంగా అతడు నమ్మెను, దానికొరకు సిద్ధము చేసెను. అతడు సిద్ధముగా నుండెను. శరీర సంబంధమగు ఫలితములను ఇంకా చూడలేదు. దానిని అతడు నమ్మేను. అబ్రాహాము వలె, "అనబడిన ఏదైనా వ్యతిరేకముగా ఉన్నప్పటికిని అది ఆలాగు లేదు." అక్కడ.
MATT 24:24•
MARK 13:22
89కాబట్టి, నీ మనస్సు నీకు చెప్పినదే నమ్మట కాదు. నీ మేధాశక్తి దేవుని సత్యమును దేవుడు రోగ స్వస్థతనిచ్చు వాడనియు చెప్పినప్పుడు అందుకు నీ మనస్సు అవును సత్యమే అని సాక్ష్యమియ్యవలెను. అయితే దానిని బయలుపరచుటకు నీ హృదయములో మంచి నేల లేనియెడల (విశ్వాసము) అది జరుగదు. ఈ బయటి వ్యక్తి వాక్యమును గూర్చి నీతో వాదించవచ్చును, అయినా, నీవు దానిని నిజమని ఒప్పుకొనవలెను.
ఎంతమంది టేపులు వినుచున్నారు. కొద్దికాలము క్రితం "అంత్యదినము అభిషిక్తులు" అను ప్రసంగము బోధించాను. అది విన్నారా? దానిని మీరు నమ్ముచున్నారా? క్రీస్తువిరోధులు లేచెదరని వారు లేచి సాధ్యమైతే, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుదురని చెప్పబడెను. అయితే అది అసాధ్యము, ఎందుకనగా వారు ఎన్నుకోబడిరి. చూడండి? మంచిది.
"అభిషిక్తులు," అని ఆయన చెప్పెను. చూడండి. క్రీస్తు అనగా "అభిషిక్తుడు," కాని వీరు విరోధులు. వారు అభిషిక్తము చేయబడినారు, కాని వారు క్రీస్తుకు విరోధముగా బోధించుచున్నారు. వారును ఇతరులవలె ఏదయినా చేయగలరు.
90ఇప్పుడు గుర్తు౦చుకొనండి, మీరు మూడు-అను-చక్రములో నున్నారు, కాని మీరు ఒక్క మనిషిగానే యున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వలె. ముగ్గురి యొక్క చక్రము, కాని ఒకే వ్యక్తి. ఒకే దేవుని యొక్క మూడు గుణలక్షణములు: పితృత్వము — కుమారత్వము — మరియు పరిశుద్దాత్మ. నీవును ఆత్మ శరీరము, మరియు ప్రాణముగా నున్నావు.
ఇప్పుడు, నీ భూసంబంధ గృహమును నీతో జతచేయుటకు అయిదు ద్వారములు, నీ బయటి శరీరమునకున్నవి: దృష్టి, రుచి, తాకిడి, వాసన మరియు వినికిడి. లోపట ఆత్మ యున్నది. దానికి అయిదు స్పందనలున్నవి: మనస్సాక్షి, ప్రేమ, మొదలగునవి. అయితే దాని లోపట ఒకే అంతరాత్మ యున్నది. నీవు అక్కడే జీవించునది.
MATT 5:45
91ఆత్మ వచ్చి ఒక ప్రత్యేక పని చేయుటకు నిన్ను అభిషేకించును, దానిని నీవు చేయుదువు, కాని దాని అర్ధము నీవు రక్షించబడినట్లు కాదు. దాని గురించి ఆలోచించు. కయప ప్రవచించెను. యూదా దయ్యములను వెళ్ళగొట్టెను. చూడండి, ఆత్మాభిషేకము వారికున్నది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురియుచున్నది. గోధుమ గింజతో పాటుగా గురుగులును సంతోషించుచున్నవి, కాని ఆ అంతరంగమును పరీక్షించుడి. మేధావులు ఈలాగందురు, "ఓ! నిశ్చయంగా అది మంచిగా కనబడుచున్నది. దానిని నేను నమ్ముచున్నాను." అయినా గాని ఏ లాభము లేదు. లేదయ్యా. దానికి ఆత్మ సాక్ష్యము కూడా ఇయ్యగలదు, అయినా గాని అది లాభకరము కాదు. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి రానియెడల, అది ఎన్నో అనుకరణలు చేయునే గాని, అది వాస్తవము కానేరదు. నీవు స్వస్థత పొందినట్లు కనిపించవచ్చును గాని, అది ఒక నటనగానే యుండును, దానిని నీవు పొందినట్లే ప్రవర్తించెదవు. క్రైస్తవులు తాము క్రైస్తవులమే అన్నట్లు నటించెదరు గాని, దాని భావము వారు రక్షించబడినట్లు కాదు. ఇది అక్షరాలా నిజము. చూడండి, అసలైన, నిజమయిన ఆత్మ అచ్చట ఉండగలదు. పరిశుద్దాత్మ నిన్ను అభిషేకించును గాని, దాని భావము నీవు రక్షించబడినట్లు కాదు. ఆ లోపల ఉన్న ఆత్మ ఎన్నడూ చనిపోదు, అది నిత్యజీవము పొందినది. అది ఎల్లప్పుడూ నిత్యజీవమును కలిగియుండును. చూచారా? అది దేవుని యొద్ద నుండి వచ్చును, అది దేవుని యొద్దకు వెళ్ళును. అదియే ఆత్మ.
ACTS 23:3
92ఇప్పుడు, దానిని గమనించండి, అది ఆలాగు అయిదుగా ఉండవలసియున్నది. బయటది విశ్వాసము; ఆత్మ, యేసు; లోనిది నీవు. ( Five, f-a-i-t-h, outside; spirit, J-e-s-u-s; on the inside, y-o-u.) చూచారా? ఇక్కడ నిలబడియున్న నాకు మిమ్ములను ఒక్కరినీ ఎరుగను. మీ వైపు చూచుచున్నాను. ఆత్మ నన్ను అభిషేకించినా గాని, మీలో ఏ ఒక్కరినీ నేనెరుగను. కాని అంతరంగములోని అంతరంగము బ్రద్దలయినప్పుడు, అది దేవునికి నివాసమగును.
బయటది హేతువును వెదకును. ఒక్క మనిషి ఇట్లనును, "అవును, వ్యభిచారము చేయరాదని నేనెరుగుదును. కాని నీకు తెలుసా, నేను వ్యభిచారము చేయరాదని ఆత్మ చెప్పుచున్నది. అయినా గాని, ఆ లోపల అది ఇంకను ఉన్నది." చూడండి, అది ఒక రకముగా మిమ్మును మోసగించుచున్నది — దానిని మీరు గమనించుట మంచిది.
కాని అంతరంగము ద్వారా అది నడుపబడినయెడల, అంతా సవ్యముగా నుండును. అదియే నడుపు శక్తి, అంతరంగములో నున్న అంతరంగమే నియంత్రణా గోపురము. ఆత్మను అంతరాత్మ అదుపు చేయును, ఆత్మ శరీరమును అదుపు చేయును.
బయట సున్నము వేయుట వలన ఏమీ తేడా రాదు. ఆనాటి మత ప్రజలను పౌలు "సున్నము కొట్టిన గోడలని," పిలచెను. బయట వారు విశ్వాసుల వలె కనబడిరి. వారు ప్రవచించిరి మరియు అంతయు చేసిరి, అయితే అంతరంగములోని అంతరంగము మాత్రము అవిశ్వాసముతో నిండినది.
ఆ కారణము చేతనే, జనులు క్రిందికి పైకి ఎగురుచున్నారు, భాషలు మాట్లాడుచున్నారు, చప్పట్లు కొట్టుచున్నారు, రోగుల మీద చేతులుంచుచున్నారు, వ్యాధులను బాగుచేయుచున్నారు, విశ్వాసము ద్వారా ఈ గొప్ప పనులన్నియు ఆత్మ ద్వారా చేయుచున్నారు, అయినను వారు నశించుదురు. వారు అభిషేకము పొందిన వారే.
MARK 9:23
93యేసు చెప్పినది గమనించండి, "నమ్మిక మాత్రముంచుము, నమ్మువానికి సమస్తమూ సాధ్యమే." విశ్వాసము మరియు క్రియలు భార్యాభర్తల వంటివి. అవి కలిసి పనిచేయును. భర్త భార్యతోను, భార్య భర్తతోను పనిచేయును. వారు ఒకరినొకరు గుర్తింప చేసికొందురు.
ఒక వ్యక్తి తాను పెండ్లి చేసికొన్నాను అని చెప్పి తన భార్యను చూపించనప్పుడు, నీవు సందేహించెదవు. చూచారా? "నాకు పెండ్లి అయినది," అని చెప్పెను.
"నీ భార్య ఎక్కడ?"
"ఓ! దాని గూర్చి నాకు తెలియదు." చూచారా? చూడండి. అతనిని నమ్ముట చాలా కష్టము.
"నీ భార్య ఎక్కడ?" అందురు.
"నాకు తెలియదు," అంటే అతనిని నమ్మలేము.
కాబట్టి చూడండి, నీవు నాకున్నది అని ఒకదాని గూర్చి చెప్పినప్పుడు దానిని నీవు చూపించవలెను — "నాకు విశ్వాసమున్నది," అని నీవన్నచో, నీవు విశ్వాసమును ఏలాగు చూపించెదవు? నీ క్రీయ ద్వారా. చూచారా?
"నేను పెండ్లి చేసికొన్నాను."
"నీవు పెండ్లి చేసికొనినట్లు నాకేలాగు తెలియును?"
"ఈమె నా భార్య." చూడండి. అప్పుడు అర్థమగును.
"ఇది నా బర్త, నేను పెళ్ళైన దానను."
"నేను స్వస్థపడ్డాను."
"నీకెట్లు తెలియును?"
94"నా క్రియలు నా విశ్వాసమును చూపించును." చూచారా? ఇప్పుడు, నీవు ఎంతో చెప్పవచ్చును. దేవుడు నీలోనున్న విశ్వాసమును చూచును, ఇతరులు నీ క్రియలను చూచెదరు.
ఇక్కడ యాకోబు మరియు పౌలులు ఆ భేదమును అబ్రాహాము విషయములో వెల్లడించిరి. వారు వేరువేరుగా నుండరు. వారిరువురు ఒక్కటే చెప్పిరి — వివాహము వలె నున్నది.
క్రియలు లేని విశ్వాసమును ఎవరైనా చూచినప్పుడు, నీ సాక్ష్యము విషయములో సందేహించుట సహజమే. మనము ప్రార్ధన వరుస ప్రారంభించు ముందు దానిని మీరు వినండి. మీ క్రియలు విశ్వాసమును నిరూపించవలెను, లేనియెడల నీవు ఎవరినీ నమ్మించ జాలవు. "నాకు ప్రపంచములోని విశ్వాసమంతా యున్నది," అని నీవు చెప్పినా, అది నమ్మబడదు. ఎందుకనగా నీకు విశ్వాసమున్నట్లైతే, క్రియలు విశ్వాసమును వివాహము చేసికొనును. విశ్వాసము మరియు క్రియలు భార్యాభర్తలు, అవి ఒకదానినొకటి గుర్తించుకొనును.
GEN 17:5•
ROM 4:17,20
95కొద్ది నిమిషముల పాటు అబ్రాహామును గూర్చి ఆలోచించుదము. అబ్రాహాము సంపూర్తిగా పరిశుద్ధ ఐక్యతను పొందెను. అతడు సమస్తమును పూర్తిగా పొందెను. లేని వాటిని, నమ్మజాలని వాటిని అతడు నమ్మెను. అదే సూత్రము మీద పనిచేసెను. ఇరవై సంవత్సరములు గతించిన తరువాత ఎవరో వచ్చి అతనితో ఇట్లు చెప్పియుందురు, "జనములకు నీవు తండ్రివా? నీ పేరు "అబ్రాహాము," అని చెప్పుకొంటివి, దానికి అర్థము జనములకు తండ్రి. అయితే ఇప్పటికీ నీకు ఎందరు పిల్లలు పుట్టియున్నారు?" చూచారా?
కాని ఆ మాటకు అతడు తొట్రిల్లలేదు. "అవిశ్వాసము బట్టి దేవుని వాక్యము విషయములో అతడు సందేహించలేదని," బైబిలు చెప్పుచున్నది. అతడు పుట్టబోవు బిడ్డ కొరకు అన్నియూ సిద్ధపరచుచునే యుండును. అతడు బిడ్డను కననై యుండెనని నమ్మెను, అంతే
GEN 16:2
96శారా కూడా సందేహించి ఇట్లన్నది, "ఏమి జరుగనైయున్నదో నీకు తెలియునా? నీకు బిడ్డ పుట్టబోవుచున్నది. మనము చేయవలసిన విధానము నేను నీకు చెప్పెదను. హాగరు నా దాసురాలు. ఆమెను నేను నీకిచ్చెదను. [ఆ రోజులలో బహుభార్యత్వము చట్టబద్దము], మరియు ఆమె బిడ్డను కనును, ఆ బిడ్డను నేను స్వీకరించెదను." కాని అబ్రాహాము దానిని నమ్మలేదు. లేదు, ఆలాగు అతడు ఇష్టత చూపలేదు. కాని శారా ఆలాగు చేయుటకు ప్రేరణ నొందినది.
కాబట్టి దేవుడు అబ్రాహాముతో ఇట్లనెను, "ఆమె మాట వినుము." కాని ఆయన చెప్పెను, "నేను వాగ్దానము చేసినది అది కాదు. నేను ఆలాగు వాగ్దానము చేయలేదు."
ROM 4:13-15,17-20
97ఇప్పుడు గమనించండి, "అతని శరీరము మృతతుల్యమాయెను, మరియు శారా గర్భమును ఆలాగే యున్నది." అతడు వంద-సంవత్సరముల ముసలివాడు. శారాకు తొంబది-సంవత్సరములు. ఇప్పుడు గమనించండి! శారా గర్భము ఉడిగిపోవుట గాని, అతని శరీరము మృతతుల్యమగుట గాని అసలు లెక్కలోనికి రాలేదు.
ఈ మాట వినండి:
అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని, విశ్వాసము వలనైన నీతిమూలముగానే కలిగెను.
ధర్మశాస్త్ర సంబంధులు వారుసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును… వాగ్దానమును నిర్ధరకమగును:
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేకపోవును.
ఇప్పుడు దీనిని వినండి, "నిరీక్షణకు ఆధారము లేనప్పుడు… అతడు నిరీక్షణ కలిగి నమ్మెను." ఆశలన్నియూ గతించెను! ఈ రోమ 4వ అధ్యాయము చదివిన ప్రతిసారి నేను ఆశ్చర్చపడుదును.
(నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని) నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు నిరీక్షణకు ఆధారములేనప్పుడు, అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. [చూచారా? దేవుడాలాగు చెప్పెను.]
నిరిక్షణకు ఆధారము లేనప్పుడు, నిరిక్షంచి నమ్మెను, కావున ఆయన జనములకు తండ్రియగునట్లు; పలుకబడిన దానిని బట్టి, నీ సంతానము ఉండును.
ఇప్పుడు 19వ వచనము వినండి:
మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను:
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు; అయితే దృడముగా ఉండెను…. దేవుని మహిమపరచెను;
98వంద సంవత్సరవుల వయస్సులో? చూడండి, అతని శరీరము మృతప్రాయమయ్యెను (పురుషత్వము), శారా గర్భము ఉడిగిపోయెను. దానిని అతడు లెక్కచేయలేదు. అతనికి ప్రత్యక్షత యున్నది, గనుక, ఆ మృతమగునది కనబడలేదు. నీవు ఏ వ్యాధి కలిగియున్నా గాని, ఆలోచించవద్దు. చక్రాల కుర్చీలోయున్నా గాని ఏమీ తలంచవద్దు. నీ చిన్న బిడ్డ చచ్చుబడియుండ వచ్చును. (నాకు తెలియదు), దానిని నీవు చూడవద్దు. అసలు అది పట్టించుకోవద్దు.
"కానీ వైద్యుడు చెప్పాడు, 'ఆయన ఎప్పటికి అక్కడికి చేరుకోలేడు.' వైద్యుడు చెప్పాడు, "ఆమె ఎన్నటికి రాదు….' " ఆ మాట నీవు వినవద్దు.
"చూడు, నేను ముసలివాడనై పోయాను. నేను నడివయస్సులో ఉన్నాను." అని నేను ఎప్పటికి దానిని లెక్కచేయను.
ROM 4:19•
GAL 3:29
99మనము అబ్రాహాము సంతానము. ఇస్సాకు వలె కాదు గాని రాజ వంశముగా నున్నాము. హల్లెలూయా! అతనికి కలిగిన విశ్వాసము ద్వారా, (యేసుక్రీస్తు ద్వారా) చివరిదినములలో నక్షత్రము వలె ప్రకాశించుటకు అబ్రాహాము సంతానము వచ్చుచున్నది. అబ్రాహాము సంతానము! "అతని శరీరము మృతతుల్యమైనట్లు భావించలేదు." దేవుడు చేయగలడా, లేదా అని ప్రశ్నించలేదు; దానిని చేయుదునని దేవుడు చెప్పెను. ఎందువలన? అది అతనికి ప్రత్యక్షమాయెను. అది నిజమేనా?
నీవు అది జరుగునట్లు చేయలేవు గాని, అది నీకు ప్రత్యక్తపరచబడవలెను. అప్పుడు నీవు దేనినీ తలంచవు: అది ఎంత అసాధ్యముగా నున్నాగాని, వైద్యుడు ఏమి చెప్పినా గాని; నీ తల్లి, తండ్రి, సంఘకాపరి మొదలగు వారెవరు ఏమి చెప్పినా గాని. నీవు కేవలము దేవుని మాటనే విందువు.
ROM 4:19
100"అతడు తన శరీరము మృతతుల్యమైనట్లును, శారా గర్భము ఉడిగినట్లును భావించలేదు." అది అస్సలు అతనికి లెక్కలోనికి రాదు. అది నన్ను కదిలించుచున్నది. చచ్చినట్లున్న శరీరము గాని, ఉడిగిన శారా గర్భము గాని అసలు లెక్కలోనికి రాలేదు.
విశ్వాసము తన ఆధారమును కనుగొనినప్పుడు, ఏ పరిస్థితులు లెక్కలోనికి రావు. పురుషునిలోని జీవకణము, స్త్రీలోని అండము ఫలదీకరణము చెందినప్పుడు ఒకటి జరుగును. హల్లెలూయా! "నీకు పిల్లలు పుట్టరని వైద్యము చెప్పవచ్చును. నీ శరీరములోని జీవకణములు చచ్చినవి. నీ అండము ఎన్నడూ ఫలించదు అనవచ్చును." అయితే ఒక్కసారి ఆ అండము పరిపక్వత చెందినచో ఏమి జరుగును? చిన్న బాలిక లేదా చిన్న బాలుడు రంగము మీదికి వచ్చును. ఎందువలన? విశ్వాసమునకు ఆధారము దొరికినది. కణము మీద కణము ఏర్పడి చిన్న బిడ్డ పుట్టును. ఆమేన్. దేవా, మామీద దయచూపుము. ఓ దేవా! మమ్మును అట్టి కఠిన క్రైస్తవులనుగా ఉండునట్లు చేయుము! స్త్రీలు మరియు పురుషులైన మీరు దేవుని మాటను మీరు తీసికొన్నట్లయితే. నీకది బయలుపరచబడు వరకు నీవు ఏమియూ చేయజాలవు. (నేను త్వరగా చెప్పవలెను.)
ISA 7:14•
MARK 16:17
101గమనించండి, దేవుని యొక్క పవిత్ర విశ్వాసము తన ప్రవక్త యొక్క పవిత్ర క్రియలతో ఏకమాయెను. గుర్తు౦చుకొనండి, దేవుని యొక్క పవిత్ర విశ్వాసము అబ్రాహామునకు బయలుపరచబడెను. అతడు దానిని పొందెను, అందువలన అతని పరిశుద్ధ క్రియలు ప్రారంభమాయెను. అతడు నమ్మెను. వాగ్దాన బీజము ఎదుగుటకు ఒక స్థలము కావలెను. (అబ్రాహాము) ఈ విధముగా చెప్పలేదు. "శారా! దేవుడు ఈ వాగ్దానము చేసి ఇరవై-అయిదు సంవత్సరములయ్యెను." [స్పష్టత లేని మాట] ఎదో జరిగి యుండెడిది, చూచారా. కాని ఆలాగు జరుగలేదు. అది జరుగదని దేవునికి తెలియును.
కన్య మరియ ఇట్లు చెప్పలేదు, "కన్యక గర్భవతియగునా? అట్టి మాట నేను చెప్పినచో వారు నన్ను సంఘములో నుండి త్రోసివేయుదురు." ఆమె సిద్ధపరచబడిన నేలగా లేనియెడల అలాగే పలికి యుండెడిది
"కన్యక గర్భవతియగును" అని ఆ ప్రవక్త చెప్పినది చాలనుకొనెను. చూచారా?
"నమ్మువారివలన ఈ సూచక క్రియలు కనబడును." సిద్ధపరచబడిన నేల అచ్చటున్నయెడల వాక్యము అక్కడ పడినప్పుడు, బ్రదుకును. దానిని ఏదియూ ఆపజాలదు.
GEN 12:4
102ఇప్పుడు, త్వరగా, ముగించెదము. చూడండి, విత్తనము దాగుకొనుటకు ఒక చోటుకావలెను. దానిని దేవుడెరుగును, లేనిచో అబ్రాహామునకు ఆయనెన్నడూ వాగ్దానమిచ్చియుండెడి వాడు కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ వాగ్దానము ఎచ్చట ఉండవలసియున్నదో దేవునికి తెలియును. అబ్రాహామునకు డెబ్బది-అయిదేండ్లు వచ్చు వరకు ఆయన పిలువనే లేదు. అతడు మరియు శారా ఆది నుండియు దేవునిచే ముందుగా నిర్ణయించ బడిన దాసులు.
గమనించండి, గుర్తుంచుకొనండి, అతనికి ఏ బైబిలు చదువుటకు లేదు. ఆయన వాక్యమును చదువుట గాని, దానిని చదివిన వారి అనుభవములను గ్రహించుట గాని వారెరుగరు. నేడు అది చాలా సుళువుగా నున్నది. అతనికి ప్రత్యక్షత వల్లనే అది దొరికినది. అదే నిజమైనది. ఆదికాండములోని యోసేపు అంతే! బైబిలు అతడెరుగడు. గుర్తుంచుకొనండి, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము మరియు ద్వీతీయోపదేశకాండములను మోషే వ్రాసెను. మోషేకు ముందున్న వారెవరును బైబిలును చదువలేదు. నిజమే గదా? మన సందేహ పరిస్థితులలో మనలను బలపరచు ఈ బైబిలు వారికి లేదు. విద్యలేనివారికి దేవుడు సమస్తము బయలుపరచెను, వారు ఆలాగే నిలబడిరి. వారిని ఏదియు కదపలేదు. అట్టి నిండు విశ్వాసము మనమును కలిగియుండగలము అని నీవు అనుకోనుచున్నావా? అది నీకు బయలుపరచబడినట్లయితే!
103ముగించు ముందు ఈ మాటలు నేను చెప్పుచున్నందుకు క్షమించుడి. ఈ "జంట నగరము"లో సహో, బ్రవున్ నాతో కూడా ఉన్న రోజులవి. నేను బైబిలులోని యోసేపు జీవితమును అధ్యయనము చేయుచుంటిని. అతనికి విరోధముగా ఎవరునూ ఏదీ చెప్పలేరు. అబ్రాహాము. ఇస్సాకు, యాకోబు తదితరులందరికీ విరోధముగా ఏదో ఒకటి యున్నది గాని యోసేపునకు విరోధమైనదేదీ లేదు. పరిపూర్ణమగు మనిషి, క్రీస్తునకు మాదిరి.
అది నేను చదువుచుండగా, నా హోటలు గదిలో ఒక రోజన ఏడ్చాను. నా బట్టలు వేసిన చిన్న గదికి తలుపులు మూసి ఇట్లన్నాను, "దేవా, యోసేపును బట్టి నీకు వందనములు. నా వలె అతడును ఒక దినమున ఈ భూమి మీద శరీరముతో జీవించెను. నీ మాటను నమ్మి అంగీకరించెను." అతని సోదరులు అతనిని ద్వేషించిరి. అతడు ఆత్మ సంబంధిగా నుండెను. దర్శనము చూచెను. కలలకు భావము చెప్పెను. అందును బట్టి అతనిని వారందరు ద్వేషించిరి. అయితే అతడు ఆలాగుండకుండా జీవించలేకపోయెను. ఆయన అదైయున్నాడు.
GEN 37:19
104చూడండి, అందరూ ఆలాగుండలేరు. వారతనిని ప్రేమించియుండవలెను. అతడు కొన్నిసార్లు వారికి నచ్చని సంగతులు చెప్పెను. "ఓ! ఇదిగో కలలుకనువాడు వచ్చుచున్నాడు" అనిరి, చూడండి? కారణము లేకనే వారతనిని ద్వేషించిరి.
ఎందుకాలాగు చేసిరి? అని నేననుకొన్నాను. అయినా గాని అతడెన్నడూ చలించ లేదు. స్థిరముగా ఉండెను. చూచారా? "ప్రభువా! నీకు వందనములు! ఓ దేవా, అట్టి మనిషిని బట్టి నీకు వందనములు," అన్నాను.
అప్పుడు పరిశుద్దాత్మ నాకీలాగు బయలుపరచెను, "నీవు ఒక కుమారుని కందువు, అతనికి "యోసేపు" అని పేరు పెట్టుము." నేనచ్చట నుండి లేచి ప్రభువుకు వందనములు చెల్లించాను.
105ఆ వెనుక బెకీ కూర్చొనియున్నది, ఆమె అప్పుడే పుట్టెను… దాదాపు సంవత్సరము వయస్సు. ఆమె తల్లికి ఆపరేషను చేసి ఆమెను తీసిరి. నా భార్య కుటుంబమునకది మామూలే, ఎందుకనగా వారి ఎముకలు స్త్రీల ఎముకల వలె నుండక పురుషుల ఎముకల వలె గట్టిగా నుండును. కాబట్టి ఆమె కడుపు కోసి పిల్లను తీసిరి. వైద్యుడు నాతో ఇట్లనెను, "బ్రెన్హాం సోదరుడా, ఈమె ఇక పిల్లలను కనకూడదు. ఆమె గర్భము గాలి బుడగంత పలచగా నున్నది."
నేను "లేదు, నేను ఒప్పుకొను… దాని గురించి ఆలోచించ వద్దు," అన్నాను.
"ఆమె మరో బిడ్డను కనరాదు, ఆమె చనిపోవును," అని వైద్యుడు నాతో చెప్పి హెచ్చరించెను. చాలా భయంకర సమయములో నుండి ఆమె బయటపడినది.
అయితే దేవుడు నాకు మగబిడ్డ పుట్టుననియు, అతనికి యోసేపు అని పేరు పెట్టెదననియు చెప్పెను. దాని గూర్చి నేనెన్నడూ భయపడలేదు. మీలో చాలామందికి అది గుర్తు౦డును.
106నేను అందరికీ ఈలాగు చెప్పాను, "నేను ఒక కుమారుని కందును, అతనికి యోసేపు అని పేరు పెట్టెదను." ఎందరికిది గుర్తున్నది? దేశమంతటా, వెళ్ళిన ప్రతిచోటయు జనులకు ఈ యోసేపును గూర్చి ప్రకటించాను.
ఫిన్లాండులో చనిపోయిన బాలుడు లేచునని చెప్పినట్టే యుండెను. అది జరిగి నప్పుడు సహో జాక్ అక్కడుండెను. అది జరుగుటకు రెండు, మూడు సంవత్సరముల ముందే చెప్పాను. ఆ బాలుడు బట్టలు ఎలాగు ధరించెనో, ఏలాగు పరుండెనో చెప్పాను. దేవుని మాట అది!
"అదెట్లు జరుగును?"
"నాకు తెలియదు!" కాని అది జరుగనైయున్నదని ఆయన బయలుపరచెను."
107నాకది బయలుపరచెను. నేను ఆరిజోనాకు వెళ్ళుచున్నాను, అక్కడ నేను ఏడు దూతలను కలిసికొన్నాను. నేను బోధించవలసిన వర్తమానము గూర్చి నాకు చెప్పిరి. అది ఏడు ముద్రల వర్తమానము. అది జరిగినది! దానిని నేను చెప్పుట ఎందరికీ గుర్తున్నది? టేపులలో అది ఉన్నది. అది జరిగినది! దాని పటములు వార్తా పత్రికలలో యున్నవి. ఆ గాలిలో నున్న వెలుగును వారెవరూ ఇంకా అర్థము చేసికోలేదు.
సహో జాక్ నేను పిలచి దాని గూర్చి అడిగాను. క్రీస్తు అక్కడ నిలబడియుండెను. "అది ఆయన మహిమకర స్థితి," అని సహో, జాక్ పలికెను. చూచారా? నేను సహో, జాక్ ను ప్రేమించెదను. నాకు తెలిసిన శ్రేష్ఠమగు వేదాంత పండితులలో అతడు ఒకడు, కాని అది నాకు సరిగ్గా అర్థమవ్వలేదు.
నేను అక్కడ నిలబడి ఇట్లడిగాను, "ప్రభువా, ఇదెట్లు జరుగును? యువకునికి తెల్లని వెంట్రుకలు ఉండునా?"
"అది విగ్గు," అని ఆయన చెప్పెను. పుస్తకములో చూడండి, అది జరుగుటకు ముందుగా నేను చెప్పాను. మీరు "లైఫ్" పత్రిక చూడండి. దానిని ప్రక్కకు పెట్టి చూడండి. హాఫ్ మన్స్ క్రీస్తు శిరస్ళు అది. నేను నిలబడియున్న చోటనే అది కనబడెను. దానిని ఎందరు చూచిరి? మీరందరూ చూచారు. ఆ ప్రత్యక్షత్ర సరియేనని అది రుజవు చేసెను.
JOHN 5:22•
REV 1:8
108ఎందుకు విగ్గు ధరించెను? ఆంగ్ల న్యాయాధిపతులు, యూదా న్యాయాధిపతులు విగ్గు ధరించెడివారు. వారు ఇంగ్లాండులో ఇంకా ఆలాగు చేయుచున్నారు. మహోన్నత అధికారి విగ్గు ధరించును. దేవదూతల విగ్గును అతడు ధరించి నిలబడియుండుటను చూపించుచున్నది. అల్ఫాగా మరియు ఓమేగా ఆయనే. అక్కడ ఆయన ముప్పది సంవత్సరముల యువకునిగా, తెల్లని విగ్గు ధరించి నిలబడియున్నాడు, దేవుడు మహోన్నతుడని చూపించబడినది. సమస్త తీర్పును తండ్రి కుమారుని చేతులకు సమర్పించెను. హల్లెలూయా! ప్రత్యక్షత ఎన్నడూ తప్పు కాదు! దానిని ఏలాగయినా చెప్పండి. అదెట్లు వినిపించినా గాని వాక్యముతో సరిగానే వెళ్ళును, గుర్తుంచుకొనండి.
109ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆ తరువాత నాలుగు సంవత్సరములకు నా భార్య గర్భవతి అయినది. అందరూ "యోసేపు జన్మించుచున్నాడా?" అని అడిగిరి.
"నేను అనుకోనుచున్నాను, నాకు తెలియదు గాని; యోసేపు పుట్టును," అని చెప్పాను.
అప్పుడు శారా జన్మించినది. అప్పుడు ఒక వ్యక్తి నా ముఖము మీదే ఎగతాళి చేసెను. నీకు ఆడ యోసేపు పుట్టినది, అని ఎగతాళి చేసెను. ఆ వ్యక్తి చనిపోయెను.
అతనికి ఇట్లు చెప్పాను, "అయ్యా! దేవుడు నాకు కుమారుడు పుట్టబోవుచున్నాడు. నేను జోసెఫ్ అని, పేరు పెట్టుదును."
ఒక శాఖను విడిచిపెట్టిన ముగ్గురు మా సంఘమునకు వచ్చి నేను చెప్పుట వినిరి. శారా పుట్టినప్పుడు వారు చూచి, ఇతడు అబద్ధ ప్రవక్త అని చెప్పిరి.
నేనిట్లు చెప్పాను, "ఒక్క నిమిషము ఆగండి, నేను ఎప్పుడో చెప్పాను గదా? దేవుడు నాకు చెప్పలేదు. అబ్రాహామునకు ఇస్సాకు పుట్టునని దేవుడు చెప్పెను, కాని ఆ మధ్య కాలములో ఇష్మాయేలు జన్మించెను. అందువలన ఆ మాట నెరవేరెను. ఆలాగే దేవుడు నాకు యోసేపు పుట్టునని చెప్పెను."
110వైద్యుడు మరల నాతో పిల్లలు లేకుండా ఆమెకు నాళములకు ముడివేయుదునని చెప్పెను.
"ఆలాగు చేయవద్దు," అన్నాను.
"నీవు మరో పెండ్లి చేసికొని ఆ కుమారుని కనుము," అన్నాడు.
"ఈమె ద్వారానే పుట్టనని ఆయన చెప్పెను," అన్నాను. దానిని నేను బైబిలులో నుండి చదువలేదు గాని, అది నా హృదయము మీద విశ్వాసము మరియు ప్రత్యక్షతల ద్వారా వ్రాయబడియున్నది. దేవుడా విధముగా చెప్పెను. అ విశ్వాసమును బట్టి దేవుని వాగ్దాన విషయములో సందేహించలేదు.
"ఆడ జోసెఫ్" కాబోలునేమో అని కొందరనిరి.
"లేదు, యోసేపు" అన్నాను.
"ఆమె పిల్లలను కనరాదు," అని వైద్యుడనెను.
"ఆమె మరో బిడ్డను కనును," అని చెప్పాను.
నాలుగు సంవత్సరములు గతించినవి, మరల ఆమె గర్భవతి అయ్యెను.
111స్త్రీ ఈలాగు మాటలు వ్రాసి పంపినది, అది ఒక అబద్ద ప్రవచనము దేశమంతా ప్రచారమయినది, "ఈ సమయములో మిడా చనిపోనై యున్నది. నేను బిల్ నడిపించుటకు పంపబడితిని." మరియు చెప్పెను, "అతడు నా మాట వినడు, ఎందుకనగా నేను ఒక స్త్రీని కాబట్టి, మరియు దేవుడాతని భార్యను చంపును."
నేనిట్లు చెప్పాను, "నన్ను నడిపించుటకు దేవుడు యేసుక్రీస్తును పంపెను." చూచారా? "నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాను," అని చెప్పాను.
మీడా దీన స్థితిలో యున్నది. అక్కడి కూటములలో స్వస్థత పొందిన ఒక నర్సున్నది. ఆమె శ్రీమతి. మోర్గన్, మీరెరుగుదురు, మోయో నర్సులలో ఆమె ఒకరిగా నుండి క్లిష్టమగు కేసులను చూచును. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఆమెను కాన్సరుతో చనిపోయిన వారి జాబితాలో ఉంచిరి. లూయిస్విల్లోని ఒక హాస్పటల్లో ఆమె కాన్సరుతో చనిపోవుచున్నది. ఆమె ఇప్పుడు జెఫర్సన్ విల్లోని వైద్యశాలలో పనిచేయుచున్నది. ఆమె బ్రదుకునని దేవుడు చెప్పెను, ఇన్ని సంవత్సరములు ఆమె జీవించియున్నది.
మిడా ఆమెను ప్రేమించినందున, మిడా చెప్పెను, "ఆమె నాతో రావాలని కోరుచున్నాను, బిల్. నాకు వైధ్యశాలకు వెళ్ళాలని లేదు."
112"మర్గీని మనము ప్రేమించుచున్నాము గాని, మార్గీ మనకు దేవుడు కాడు. ఆమె మన సోదరి," అని నేనన్నాను. నేను గ్రీన్స్ మిల్ వద్దకు వెళ్ళాను. ఆమెను నేను ప్రేమించాను. అందువలన నా మనస్సు బాగోలేదు. గ్రీన్స్ మిల్ వద్దకు వెళ్ళాము.
"బిల్, నేను చనిపోదుననుకొనుచున్నావా?" అనడినది.
"నాకు తెలియదు, ఏమైనా గాని బిడ్డ జన్మించును. నీవు జోసెఫ్ను కనెదవు," అన్నాను
"ఈసారి అతడేనా?" అనడిగినది.
"నాకు తెలియదు ప్రియా, నేను చెప్పలేను గాని, మనకు జోసెఫ్ ఫుట్టునని దేవుడు చెప్పెను. ఎవరేమి చెప్పినా గాని నాకు అక్కర్లేదు. జోసెఫ్ మనకు పుట్టును. ఇన్ని ప్రత్యక్షతలు నాకు దయచేసిన దేవుడే దానిని చెప్పెను. ఎన్నడూ ఆయన చెప్పినది తప్పిపోలేదు. ఇప్పుడును తప్పదు," అన్నాను.
నేను ప్రార్ధి౦చుటకు మిల్ దగ్గరకు వెళ్ళాను. రెండు చెట్ల మధ్య ఆ వెలుగు వ్రేలాడుట చూచాను. ఒక స్వరమిట్లు చెప్పెను, "నీ పనికి వెళ్ళుము… నీ పుస్తకము చూడుము." నేను నా బైబిల్ వద్దకు వెళ్ళాను.
2SAM 7:8
113ఆ బైబిలు నా కారులో యున్నది.
నేను అలాగా ఉన్నప్పుడు, గాలి బలంగా విసిరినది. దావీదు యొద్దకు నాతాను వచ్చిన సందర్భము నొద్ద బైబిలు తెరచుకొన్నది. "నా దాసుడగు దావీదుతో చెప్పుము, నేను అతనిని గొర్రెలను మేపుచున్న స్థితి నుండి ఈ ఉన్నతమగు స్థితికి తీసికొనివచ్చితిని. దేవాలయమును అతడు కాదు గాని అతని కుమారుడు నిర్మించును," అనెను. (బిల్లీగ్రాహం వలె గొప్ప పేరు కాదు గాని, ఒక నామము ఇచ్చెను)
"జోసెఫ్ కదా?" అన్నాను నేను.
"అది నిజము."
నేనక్కడున్న ఇంటిలోనికి వెళ్ళాను. అక్కడ పెద్ద స్త్రీ యున్నది. అక్కడ నుండి నడవలేక నడుచుచున్నది. ఆమె వైపు నా చేతులు చాపాను, "ప్రియా! జోసెఫ్ వచ్చుచున్నాడు, జోసెఫ్ మార్గంలో యున్నాడు!" అన్నాను.
114కడుపు కోయబడిన వారెవరూ మరల సామాన్య ప్రసవము ఇయ్యలేరు. ఆ రాత్రి ఆమె [టేపు మీద ఖాళీ యున్నది.] అంతా నెరవేరినది.
మరుసటి ఉదయము, ఏడు గంటలకు మేము ఆస్పత్రికి వెళ్ళాము. డాక్టరు ఆశ్చర్యపోయెను.
నేనామెకు వీడ్కోలు చెప్పి, "జోసెఫ్ త్వరలోనే వచ్చును," అని చెప్పాను. మెట్ల పైకి వెళ్ళాను. ఆమె శస్త్రచికిత్స బల్లమీదికి ఎక్కినది.
కొద్ది నిమిషముల తరువాత నర్సు వచ్చి "రెవ. బ్రెన్హాం," అని పిలచినది.
"అవును మేడం," అన్నాను.
"నీకు ఒక చక్కని ఏడు పౌనుల, మూడు ఔన్సుల, కుమారుడు పుట్టెను," అన్నది.
"కుమారుడా! జోసెఫ్ స్వాగతం!" అన్నాను. అవునండీ! ఎందుకు? ఎందుకు? ఏమిటది? అది జరుగునని బైబిలులో వ్రాయబడలేదు గాని, బైబిలులోని అబ్రాహామునకు బయలుపరచిన ఆ దేవుడే, దీనిని చేసెను. ఆమె గర్భము యొక్క మృతతుల్యతను చూడలేదు. అది అసాధ్యమే గాని విశ్వాసము చేత వాగ్దానమును శంకించలేదు. దేవునికి స్తుతి చెల్లించెను. అది జరుగునని తెలియును. వైద్యుడు ఏది చెప్పినా, నాకు అక్కర్లేదు. ప్రతిదియూ చక్కగా జరుగును, కాని అపనమ్మకము అపవాది యొక్క అబద్ధము. అవునండీ! నిజము. క్రియలతో కూడిన విశ్వాసము వాగ్దానమును సృష్టించును. (మనము త్వరపడుదుము.)
JOSH 2:9-11•
ACTS 2:17•
JAS 2:25
115"వేశ్యయగు రాహాబు క్రియల వలన నీతిమంతురాలిగా తీర్చబడినది," అని యాకోబు వ్రాసెను. ఎందువలన? ఆమె విశ్వాసమును బట్టియే.
దేవుడు మీకు తోడుగా నున్నాడని నాకు తెలియునన్నది. యెహోషువా ఎట్టి బట్టలు ధరించుకొనెనో, ఏ విధముగా తలదువ్వుకొనెనో ఆమె చూడలేదు. దేవుడు మీకు తోడైయున్నాడని నాకు తెలియును అన్నది. అదే కావలెను.
నేడు నిజమగు దర్శనములు దేవుని నుండి రావలెను. (ఒక్క క్షణములో ముగించెదను) ఇది నేటి వాగ్దానము. బ్రెన్హాం సోదరునికి ఈ దర్శనములు ఎక్కడి నుండి వచ్చుచున్నవని జనులు అడుగుచున్నారు. ఆ విషయములో వారు తొట్రిల్లుచున్నారు. అపో.కా. 2:17 ఆలాగు చెప్పలేదా? "అంత్యదినములలో మీ యవ్వనులు దర్శనములు చూచెదరు. మీ వృద్దులు కలలు కనెదరు." అది నిజము కాదా? బైబిలు చెప్పెను.
LUKE 17:28,30
116మంచిది.
మలాకీ 4 అధ్యాయము కూడా చూడండి. ఈ దినమునకు అది వాగ్దానము. దానియందు మీకు విశ్వాసమెట్లుండును? బైబిలు ఆలాగున చెప్పెను.
ఇప్పుడు మీరు లూకా 17:30 చదవండి. "సొదొమ దినములలో జరిగినట్లే మనుష్యకుమారుని రాకడ యందును జరుగును," అని యేసు చెప్పెను. సోదొమ వలెనె ఉండును. నేటి ప్రపంచ స్థితిని చూడండి. సొదొమీయులు, ఇద్దరు సాక్షులున్నారు. వారు బిల్లీగ్రాహం, ఓరల్ రోబెర్ట్స్, వారు శాఖా సంబంధమగు సంఘములకు సాక్ష్యమిచ్చుచున్నారు. ఒకరు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియనులకు; మరియొకరు పెంతెకోస్తు వారికి సాక్ష్యమిచ్చుచున్నారు. వీరు, వారు, మరొకరు.
GEN 18:10•
REV 10:7
117కాని గుర్తు౦చుకొనండి, అబ్రాహాము సోదొమలో లేడు. అంతకు ముందే అతడు పిలువబడెను. ఒక వ్యక్తి అక్కడ నిలచియుండి అతనితో మాట్లాడెను. అతనితో యుండి మాట్లాడిన వ్యక్తి ఒక సూచనను అతనికి చూపించెను. అతడు వెనుకకు తిరిగియుండి శారాకు బిడ్డ జన్మించునని చెప్పెను. ఆమేన్. వెనుకకు అతడు నిలబడెను. "ఎలోహిం దేవుడు."
నేడును అది సంభవించుచున్నది, ఎందుకనగా మనకు విశ్వాసమున్నది. ఇది దేవుని సంబంధమైనదని నాకు తెలియును. ఎందుకనగా ఇది మరియు ఇతర లేఖనములు ఈ ఘడియను చూపించుచున్నవి. ప్రకటన 10 ఇట్లు చెప్పెను. 'ఏడవ దూత పలుకు దినములలో" అనగా అతడు వర్తమానమియ్యనారంభించును. ఒక స్వస్థతా కూటములో కాదు గాని స్వస్థతా కూటమును ఆ వర్తమానము వెంబడించును.
JOHN 6:53•
JOHN 10:30
118యేసు వెళ్ళి, బోధించెను. ఆయన సనస్త రోగులను బాగుచేసెను. "ఆ యువకుడగు రబ్బీ ఒక గొప్ప ప్రవక్త. ఆయనను వారి సంఘములలోనికి రమ్మనిరి."
కాని ఒకనాడు ఆయన నిలబడి నేను "నా తండ్రి ఏకమై యున్నామని," చెప్పెను. ఆ తరువాత వారాయనను కోరలేదు. "మనుష్యకుమారుని శరీరము తిని, రక్తము త్రాగితే తప్ప" అను దానిని ఆయన వివరించలేదు. "మనుష్యకుమారుని శరీరము తిని, రక్తము త్రాగని యొడలమీకు జీవము లేదు," అని ఆయన చెప్పెను.
ఆ వైద్యులు, నర్సులు ఇట్లు చెప్సియందురు, "ఇతడు రక్తపిపాసి, తన రక్తము మనము త్రాగవలెనని అడుగుచున్నాడు." చూడండి, దానిని వారు అర్ధము చేసికోలేదు. ఆయనకు అది తెలియును.
కాని ఆ శిష్యులు దానిని వివరించలేకపోవచ్చును, కాని వారచ్చట కూర్చొని నమ్మిరి. (ఆమేన్.) ఎందుకనగా అది వారికి బయలుపరచబడెను. అవును. దానిని వారెరుగుదురు. దానిని లేఖనములు ప్రకటించెను.
119ఎన్నో అబద్ధ అనుకరణలు వచ్చుచున్నవి గదా? ఈ దర్శనములను నీవెందుకు నమ్ముచున్నావని జనులు నన్ను అడుగవచ్చును.
ఒక్క నిమిషము పాటు ఇప్పుడు గట్టిగా నేను ఒక్క సంగతి మీకు చెప్పగోరుచున్నాను. నా సోదరులారా గుర్తు౦చుకొనండి, ఇదే సమయములో నిజమైనవి కూడా ఉండుననియే ఆ అబద్ధ అనుకరణలు తెలియచేయుచున్నవి. ఇది సరిగ్గా మోషే కాలములో నున్నట్టే నున్నది. జనుల యెదుట దేవుని క్రియలను జరిగించుటకు మోషె వెళ్ళెను. అక్కడ యన్నె, యంబ్రేలు నిలబడియుండిరి. కాని మొదట ఎవరు చేసిరి? దానిని వారు అనుకరించిరి, ఎందుకనగా అనుకరించుటకు మొదటగా అసలైనది ఉండవలెను. మనము నశించిపోలేదు, మనం ఎక్కడున్నామో మనకు తెలియును, చూచారా, వాక్యము మరియు ప్రత్యక్షత వల్లనే మనకు తెలియును. అందువలనే నీవు నిలవగలవు.
2TIM 3:8
120"మంచిది, ఇతడు దర్శనములు మొదలగునవి చూచుచున్నాడందురు. ఇతడు పలాని పని చేయుచున్నాడు అందురు. ఇతడు పలానిది నమ్ముచున్నాడు అందురు." అయినా ఏ మాత్రము సంశయించను. వారు అనుకరించలేనిది ఒక్కటున్నది. అది వాక్యము! వారు భాషలలో మాట్లాడవచ్చును, వారు చప్పట్లు కొట్టవచ్చు, ఆత్మలో నాట్యమాడవచ్చు; అయినా వారు దయ్యములే. అది నిజము. సత్యము. కాని ఈ వాక్యము వారిని లెక్కించును. చూచారా? అది అక్షరాలా నిజము. అది ఇక్కడికే వచ్చును. మోషే మరియు అనుకరణ చేయువారు గుర్తించబడిరి.
ఆయన చెప్పినది గుర్తు౦చుకొనండి, "ఆనాడు యన్నె, యంబ్రెలు మోషెను ఎదిరించినట్లుగానే చివరి దినములలో అనుకరణలు చేయువారు లేచెదరు." ఆయనాలాగున చెప్పలేదా? [జనులు "ఆమేన్" అనిరి] అయితే మనము వారిని కనిపెట్టాము.
JOHN 10:30,38
121కాని అది మోషెను ఆపలేదు. మోషే వచ్చి యెహోవా నామము పేరట ఒక అద్భుతము చేయగా, ఈ అనుకరణలు చేయువారును ఆలాగే జరిగించిరి. అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోవుట మంచిదని అతడు తలంచలేదు. అతడు అక్కడే యుండెను. ఎందుకొరకు? అతడు ప్రత్యక్షత పొందినది జరిపించుటకు. హల్లెలూయా! దేవుని వాక్యము బట్టి అతనికి అది తెలియును. చివరకు వాక్యమునకు వారు దొరికిపోవుదురని అతనికి తెలియును. వాక్యము బయలుపడు సమయము వచ్చుననియు, అప్పుడు వారిక ముందుకు సాగలేరనియు తెలియును.
నేనును ఇన్ని సంవత్సరముల నుండియూ దీనిని ఎరుగుదును. చూచారా? సమయము వచ్చును. అది నిజము. ఒక నిజమగు అద్భుతమును దేవుడు ఎప్పుడు పంపినా గాని మొత్తం విధానమే మారిపోవును. దేవుడు సంఘము లోనికి ఒకటి పంపినప్పడు, దానివలన పాత పద్ధతి మారనియెడల ఆయన పంపినది వ్యర్థమైనట్లే. ఒక వర్తమానము అద్భుతములు మరియు సూచనలతో బయలు వెళ్ళుచున్నది. దానికి వెనుక వర్తమానము వచ్చును. యేసు రోగులను స్వస్థపరుచుచూ వెళ్ళెను. ఆ తరువాత ఆయన వర్తమానము వచ్చెను. "నేనును నా తండ్రియు ఏకమై యున్నాము. నేనే ఆయనను." చూచారా? దానిని వారు నమ్మలేదు. వారాయన అద్భుతములను నమ్మిరి. "నన్ను మీరు నమ్మనియెడల, నా అద్భుతములను చూచి నమ్ముడి, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి." మొదట ఎవరు? మోషే తరువాత వారతనిని అనుకరించిరి. గొప్ప సత్యములు ఎల్లప్పుడును తప్పు ఒప్పులకు మధ్య ఏకరీతిగా నిలచియుండును. వారు ఆ వర్తమానమును అంగీకరించ లేకపోయిరి. దేవుని వాక్యము నుండి వచ్చిన కల్తిలేని వర్తమానమును వారు అంగీకరించలేదు.
122యూదా అన్ని రకముల సూచక క్రియలు అద్భుతములు చేసినా నేను లెక్కచేయను; కానీ పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ పొందవలసి వచ్చినప్పుడు, అసలు రంగు బయటపడినది. అపవాది వచ్చి అసలు దానిని అనుకరించినది, కాని వాక్యమునొద్దకు వచ్చినప్పుడు మాత్రము అసలు రూపము బయటపడును. వాక్యమంతయూ అది అంగీకరించదు. వాక్యమంతయూ హవ్వవలె అంగీకరించి, ఒక్క మాట మీరినా నాశనము తప్పదు. అపవాదియే ఆ విధముగా హవ్వకు చేసెను. అదంతయూ క్రీస్తు శరీరమే. యన్నే, యంబ్రేలు కూడా మోషే వర్తమానమంగీకరించలేదు. వారి అనుకరణ క్రియలు వెల్లడాయెను, ఎందుకనగా దేవుని యొక్క అభిషిక్త ప్రవక్త ద్వారా బయలుపరచబడిన దేవుని వాక్యమును వారు వెంబడించ లేకపోయిరి. చూచారా?
123వారు ఇశ్రాయేలీయులతో పాటు బయలుపరచబడలేకపోయిరి. ఎందువలన? వారు శాఖా సంబంధులు. ఐగుప్తు పిల్లలందరూ వాక్యమును వెంబడించలేరు. వారు అంగీకరించినయెడల, ఐగుప్తును విడిచిపెట్ట వలసియుండును. వారికి అంతయూ బాగుండెను గాని, వారు తెగించలేకపోయిరి. వారు వాక్యమును అనుకరించిరి, మోషే వలె చేసిరి, కాని విడిచిపెట్టవలసిన సమయము వచ్చినప్పుడు వారి పొరపాటు బయటపడెను. అంతట నిజంగానే దేవుడు వారిపై కుమ్మరించెను.
ఇప్పుడును ఆలాగే యున్నది! వారు అన్ని రకముల అబద్ధ అనుకరణలు, క్రియలు జరిగించవచ్చును, కాని మంచి పనిని ఏ మాత్రము చేయరు. నమ్ము ప్రతి బిడ్డకు సత్యము తెలియును. వారి తప్పిదమును, అనుకరణను మీరు చక్కగా చూడగలరు. మీరు చేయు క్రియ నిజ వాక్యప్రకారమై యుండినచో, మరియు దానిచే రుజుచేయబడి, నీ విశ్వాసము ద్వారా, దేవుని యొక్క వాగ్దానమును దాని యొక్క నిజమైన వ్రాయబడిన వాక్యములో ప్రత్యక్షపరచును.
DEUT 18:15•
JOHN 10:37
124యేసు చెప్పెను. (జాగ్రత్తగా వినండి) "నేను ఏమి చేయుదునని వాక్యము చెప్పెనో, ఆ క్రియలు నేను చేయనియెడల, మెస్సీయా కాలములో మెస్సీయా వచ్చి చేయవలసిన క్రియలు నేను చేయనియెడల నన్ను నమ్మకుడి." దేవుడు తాను చేయదునని చెప్పిన క్రియలు, నా ద్వారా చేయనియెడల, నా జీవితము ఆ వాక్యమును బయలుపరచనియెడల, (ఇది వినండి!) మెస్సీయా చేయవలసియున్నది చేయనియెడల నన్ను నమ్మకుడి వ్రాయబడిన వాక్యము నా ద్వారా బయలుపరచబడనియెడల నేనాయనను కాను. [ఆమేన్], ఆ దినమున నన్ను గూర్చి యోహాను చెప్పినది తప్పుయగును. నేను మెస్సీయాను కాని యెడల, మెస్సీయా చేయు క్రియలు నేను చేయనియెడల, నేనాయనను కాను. మీ ప్రభువగు దేవుడు, నా వంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును. వందల సంవత్సరముల నుండి మీకు ప్రవక్తలేడు. దేవుడు వాగ్దానము చేసిన క్రియలు నేను చేయనియెడల, నా ప్రస్తుత జీవితములో అవి ప్రత్యక్తపరచబడనియెడల నేనాయనను కాను. కాని ఈ కాలపు వాగ్దాన వాక్యము నాలో బయలుపరచబడినయెడల, నేనే ఆయనననియు, ఆ వాగ్దానము మీ యొద్దకు వచ్చినదనియు నమ్ముడి." (ఓ, మై, అదెంత విపులముగా యున్నదో చూడండి) "ఒకవేళ వాగ్ధానము …" ఓ!
JOHN 10:38
125యేసు ఇట్లనెను, "ఆ దినపు వాగ్దానము నా పరిచర్యలో బయలుపరచబడును." అప్పుడే "నేనే ఆయనను అని తెలిసికొనుడి. నేను ఎవరినో మీకు నమ్ముట కష్టముగా ఉన్నచో ఈ దినమునకు వాగ్దానము చేయబడిన క్రియలను చూడుడి. [ఆమేన్!] వాగ్దానము చేయబడిన క్రియలను చూడుడి. ఆ క్రియలన్నియూ నాలో నెరవేరనియెడల, నన్ను నమ్మకుడి. నేను చెప్పినది అబద్ధమగును. నన్ను మీరు నమ్మనియెడల ఈ దినమున ఏమి జరుగునని బైబిలు చెప్పెనో చూడండి. అది జరుగనియెడల, నేను చెప్పినది తప్పు. ఇక్కడ అబద్దపు క్రియలున్నవి, అయితే ఇవ్వనియూ జరుగవలసియున్నవి, ఇవి లేనియెడల నేను చెప్పినది తప్పుగా కనబడును. "నేనే ఆయనను," అని యేసు చెప్పెను. [ఆమేన్] "రానైయున్నవాడిని నేనే." ఆయన చేసిన క్రియలే ఆయనను మెస్సీయాగా నిరూపించినవి. మీరది నమ్ముదురా?
LUKE 17:30
126మంచిది ఇప్పుడు, లూకా 17వ అధ్యాయము 30 వచనమును చూడండి. సోదరులారా, యేసుక్రీస్తు రాకడకుముందు లోకము సోదొమ స్థితిలోనికి మారునని చెప్పబడినది, వర్తమానికులు బయలు వెళ్ళెదరు. ఈలాగే క్రియలుండును, ఆలాగు జరుగనియెడల నేను మీకు సత్యము చెప్పితినని నమ్మకుడి. ఆలాగు జరుగుచున్నయెడల, నేనే ఆయననని నమ్ముడి. "మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున." ఆమేన్! శరీరమందు మనుష్యకుమారుడు ప్రత్యక్షమగును, సంఘముగా నున్న మీరు బయటకు పిలువబడిన గుంపుగా నుందురు. దేవుని వాగ్దానమును నమ్ముదురు. మహిమ!
HEB 13:8
127ఈ దర్శనముల ద్వారా నేడు పరిశుద్ధాత్మ చేయుచున్న పనులు ఎన్నడూ తప్పిపోనివి, ఎన్నడు తప్పిపోని వాగ్దానములు, అపొస్తలత్వ గురుతులన్నియూ బైబిలులో వాగ్దానము చేయబడినవి. మలాకీ 4, ప్రకటన 10:7 కూడా నెరవేరినవి. శాస్త్రీయంగాను, అన్ని విధములుగాను అది రుజవు చేయబడినది. నేను మీతో సత్యము చెప్పనియెడల ఇవి జరిగియుండెడివి కావు. నేను మీతో సత్యము చెప్పితి నన్నందుకే అవియే సాక్ష్యము. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు." ఆయనాత్మ ప్రత్యక్షత ద్వారా వధువు ఎత్తబడును. "ఇదే ఆ ఘడియ!" అను ఆ విశ్వాసమును (ప్రత్యక్షత) మీ హృదయములో పడనీయుడి.
ఇప్పుడు మనము ప్రార్ధి౦చుదము.
MARK 16:17•
LUKE 12:32
128ప్రియదేవా, శరీరమందు యేసుక్రీస్తు అను వ్యక్తిగా నీవు ప్రత్యక్షమైనావు. లేఖనముల ప్రకారము మూడవ దినమున నీవు మృతులలో నుండి లేచియున్నావు. ఆరోహణమై యున్నావు. శిష్యులను ప్రపంచమంతా పంపియున్నావు. "నమ్మవారివలన ఈ సూచక క్రియలు కనబడును," అని చెప్పితివి.
దేవా, ఈ దినపు పెంతెకోస్తు సంఘమునకు వరములను తిరిగి ఇచ్చియున్నావు. వారిలో కొందరు ఇక్కడ కూర్చొనియుండి ఈ మాటలు వినుచుండవచ్చును. ప్రపంచము లోని చాలామంది టేపులు వినుచున్నారు. ఇది వధువును బయటకు పిలుచుటయే గాని, పెంతెకోస్తు వర్తమానము కాదని వారు గ్రహించుదురు గాక. సంఘమునకు తిరిగి వరములను సమకూర్చుటయే పెంతెకోస్తు వర్తమానము. కాని ఇది వధువును బయటకు పిలచుట. సొదొమ అగ్ని పాలగు ముందు రానైయున్న మరో వర్తమానము ఇది. ప్రియదేవా, వారికి అర్ధము చేయుము. విశ్వాసముతో దీనిని నమ్ముచున్నాను, ఎందుకనగా అది నీ ఆత్మ ద్వారాను, దేవుని వాక్యము ద్వారాను బయలుపరచబడియున్నది. సర్వలోకమునకు అది బయలుపరచబడి ప్రత్యక్షపరచబడినది. ప్రభువా, నిశ్చయంగా నీ గుంపు ఎల్లప్పుడు అల్పమైనదిగానే యుండును. కాని నీవు ఈలాగు చెప్పితివి, "చిన్నమందా భయపడకుడి, ఏలయనగా మీకు రాజ్యమనుగ్రహించుట మీ తండ్రి చిత్తము."
DAN 5:11,16•
HEB 10:38
129కావున దేవా, మనుష్యులు తమ తెలివితేటల ద్వారా చూడక, తాము సరియని తలంచుట బట్టి చూడక, వాక్యమును చూచునట్లు చేయుమని ప్రార్ధి౦చుచున్నాను. గత రాత్రి చెప్పాను, ఆ బబులోను నాశనమగునప్పుడు రాణి ప్రవర్తించిన రీతిగా ఇక్కడి జనులు ప్రవర్తించునట్లు చేయుము. ఆమె ఇట్లన్నది, "నీ తండ్రి రాజ్యమందు దానియేలు అను ఒక ప్రవక్త యున్నాడు. అతని రాజ్యములో పెంతెకోస్తు తండ్రి యుండెను. అతడు సమస్త సందేహమును తీర్చును."
ప్రభువా, ఇప్పుడు పెంతెకోస్తు రాజ్యములో పరిశుద్దాత్మ యున్నది. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, జాన్ స్మిత్, అలెగ్జాండర్ కాంపబెల్ ఇంకా ఈ కాలము వరకు ఎందరో ఆ రాజ్యములో యున్నారు. అతడు ఆలోచనలను, సందేహములను సరిచేయగలడు. లూథర్ దినములలోని వారు విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడిరి. మెథడిస్తు వారి సందేహములను అతడు తొలిగించెను, వారు పరిశుద్ధతను పొందిరి. పెంతెకోస్తు దినములలో వారు భాషలతో మాట్లాడిరి. దైవిక స్వస్థత ద్వారా ఆత్మ ప్రత్యక్షతలను వెల్లడి చేసిరి. అది పెంతెకోస్తు హృదయములోనున్న సందేహములను పోగొట్టెను. కాని ఓ, దేవా, వారు శాఖగా మారిరి. వారు మానవాభిప్రాయములను తిరిగి స్వీకరించిరి. నీవు ఈ వాక్యములో వాగ్దానము చేసిన ప్రకారము వధువును పిలచుచున్నావు. లోకము ఎదుట ప్రతి రాత్రి చదువుచున్నాను. మా స్వనేత్రములతో దానిని గమనించుచున్నాము. దేవా, అది జనుల హృదయములోని సందేహములన్నింటిని తీసివేయును గాక. వారు త్వరగా సూర్యుని యొద్ద పరిపక్వతపొందుటకు తీసుకురాబడి, మరియు కొట్టులోనికి చేర్చబడుదురు గాక; పొట్టుతో పాటుగా దహించబడకు౦దురు గాక; ఈ రాత్రి వారు కొట్టు లోనికి చేర్చబడుదురు గాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
మీరు శ్రద్ధగా విన్నందుకు వందనములు. దేవుడు మీ హృదయములతో మాట్లాడును గాక.
130ఇప్పుడు, మేము ప్రార్ధన కార్డులు ఇచ్చాము. ప్రార్ధన వరుసకు ఇప్పుడు దాదాపు ఇరవై నిమిషములు తీసికొందుము. మనము బహు త్వరగా వరుసలోనికి వచ్చి ప్రార్ధనకై వేదిక యొద్దకు చేరుదము. ఎన్ని కార్డులిచ్చిరో నాకు తెలియదు. బిల్లీని ఒక్క మాట కూడా అడుగలేదు. వెళ్ళి ప్రార్ధన కార్డులిమ్మని మాత్రమే చెప్పాను. అతడు వచ్చి కొద్దిసేపటి క్రితం నన్ను నా భార్యను తీసికొని వెళ్ళెను.
[ప్రార్ధన కార్డులు గూర్చి సహో, బ్రెన్హాం మాట్లాడుచున్నారు.]
131సరే. మనము ప్రార్థన కార్డు ఒకటి చూద్దాం. దయచేసి నేను చూచునట్లు నీ చేతిని ఎత్తుము. నీవు నిలబడలేనియెడల మేము వచ్చి నిన్ను లేపెదము. త్వరగా ప్రార్ధన కార్డు ఒకటి తేవవలెను. ఎవరియొద్ద ఉన్నది? ఏమందురు? ఒకటి. (క్షమించండి) ఈ స్త్రీ యొద్ద ఉన్నదా? అమ్మా! ఇక్కడికి రమ్ము రెండవ కార్డు ఎక్కడ? ఎవరియొద్ద ఉన్నది? త్వరగా చేతిని ఎత్తవలెను. ఆ స్త్రీ ఇటు రావలెను. మూడు. కార్డున్నదా? నీ వద్ద నున్నదా? ఇంకా కార్డులు ఎవరియొద్ద లేవు? కార్డులు అక్కర్లేదు. మూడు, నాలుగు, అయిదు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. మీరు వరుస కట్టండి.
132మీరు రాలేనియెడల చేతిని ఊపండి. మిమ్మును మోసికొని వచ్చెదరు. ఇక్కడ కార్డులు లేని వారికి నేను చెప్పాను. కార్డులు అక్కర్లేదు. మీరు పెందలకడనే రావలెనని చెప్పాను. నేను నేర్పించినట్టి విశ్వాసము మీకున్నయెడల కార్డు అక్కర్లేదు. మీకు ప్రత్యక్షత కావలెను. ప్రత్యక్షత లేకుండా మీరు డజను ప్రార్ధన వరుసల్లో నిలబడినా ఏమీ జరుగదు. అది మీరెరుగుదురా? దానిని మీరు నమ్ముచున్నారా? చూచారా? నేను ప్రార్ధి౦చవచ్చు. చేయకలిగినదంతా చేయవచ్చు. మోకాళ్ళూని మీ మీద చేతులు వేయవచ్చు. నూనె మీ మీద అభిషేకించవచ్చు. మీరు చెప్పిన రీతిగా ప్రార్ధి౦చవచ్చు, కాని దేవుడు తన కృప ద్వారా మీ హృదయములో అది జరిగినది. వ్యాధి పోయినది అని బయలుపరచు వరకు ఏమీ జరుగదు. మీరు ప్రార్ధన వరుసలోనే ఉండనక్కర్లేదు, ఎక్కడైనా ఉండండి, ఏలాగయినా అది జరుగును.
133సరే. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు, పదునాలుగు, పదిహేను. నేను పిలచిన వారిలో కార్డులుండియు నిలబడలేనివారెవరైనా యున్నారా? చేయి చూపించండి. కార్డు ఉండియు నిలబడలేనివారు. మంచిది.
…నమ్మిక మాత్రముంచుడి
ఆ ముసలి అన్నా జీన్ కూర్చొని రాత్రంతయూ దాదాపు ఆ పాటను వాయించుట నాకు తెలియును. ఇక్కడున్న వారంతా నిశ్శబ్దముగా, మర్యాదగా ఉండవలెను అని కోరుచున్నాను.
…నమ్మిక మాత్రముంచుము.
ఇప్పుడు ఒకటి నుండి పదిహేను వరకు ప్రార్ధన కార్డులున్నవారు రండి.
…..నమ్మిక మాత్రముంచుము.
ఇక్కడ కొద్దిగా ఇరుకుగా యున్నది గనుక ప్రారంభించెదము. మీరేమందురు?
……… సాధ్యమే.
134ఒకటి, 2,3,4,5,6,7,8,9…….
ఇప్పుడు మేము పిలచిన వారికంటె ఎక్కువమంది వచ్చారు. సరే. నెమ్మదిగా నిలబడియుండండి. ఉన్నచోటనే ఉండుడి. మీ నెంబరు పిలచు వరకు వేచియుండుడి. ఇక్కడ ఎక్కువమంది నిలబడవద్దు. ప్రభువు చేయు కార్యమును జనులు చూడకుండా మీరు మూయవద్దు. చూడండి. దేవుడు దీవించును.
ఇప్పుడు, వారు సిద్ధపడుచుండగా, ఈ చేతిరుమాళ్ళ కొరకు ప్రార్ధించుదా౦.
JAS 5:17•
JUDE 1:3
135ప్రియదేవా, రోగుల, బాధపడుచున్నవారియొద్ద నుండి చేతి రుమాళ్ళు ఇక్కడికి వచ్చియున్నవి. ప్రభువా, ఈ విశ్వాసము గూర్చి ఇంతక్రితమే చెప్పితిమి. బైబిలులోని యూదా పత్రికలో నీవీలాగు చెప్పుట మాకు గుర్తున్నది. "ఒక్కసారే పరిశుద్దులకు అప్పగించబడిన విశ్వాసము నిమిత్తము పోరాడుడి." పరిశుద్దుల శరీరముల నుండి అంగీల అంచులు చింపి రోగుల మీద ఉంచిరి, వారు ప్రత్యేకమైన జనులని కాదు, కాని వారు విశ్వసించినవారు. వారును మనవంటి స్వభావముగలవారే. ఏలియా వర్షి౦చకుండునట్లు ఆసక్తితో ప్రార్ధి౦చెనని చెప్పబడెను. ప్రజలు మారు మనస్సు పొందునట్లు అతడు ప్రార్ధి౦చెను. దేవా, నీ వాక్యమును నెరవేర్చుటకు ఆ విధముగా అతడు ప్రార్ధి౦చవలెనని నీవు అతనికి బయలుపరచితివి. ఆ ప్రవక్తకు నీవు దర్శనము చూపించితివని నిశ్చయముగా చెప్పగలను. దేవా, ఈ రాత్రి ఈ జనులు స్వస్థత పొందునట్లుగా నేను ప్రార్ధి౦చుచున్నాను. నేను ఏలియాను కాను. అతడు పరమునకు కొనిపోబడెను, కాని అతని జీవితము మరియు ఆత్మ ఇంకా జీవించుచునే యున్నది. కాబట్టి ప్రియదేవా, నీ జనుల ప్రార్థనను నీవు ఘనపరచుదువు. మేమంతా ఇప్పుడు ఈ చేతిగుడ్డల కొరకు ప్రార్ధి౦చుచుండగా, ఆ ప్రార్ధనాలకించుము. రోగుల మీద వాటి నుంచగా బాగవునట్లు చేయుము.
136తండ్రీ, ఈ తరము చనిపోవుచున్నదని మేము గ్రహించాము. మేము నిత్యత్వమును ఎదుర్కొనుచున్నాము. లోకము పిచ్చిదయినది. హత్యలు జరుగుచున్నవి. చిన్న బాలికలను చెరచి ముక్కలుగా నరకుచున్నారు. పురుషులు స్త్రీల వలె వెంట్రుకలు పెంచుచున్నారు, స్త్రీలు పురుషుల వలె, వారంతా వంకరయే. ఈ తరం చనిపోవుచున్నది. లోకము చనిపోవుచున్నది. ప్రతి ఒక్కటి చనిపోవుచున్నది. సంఘము చనిపోవుచున్నది.
ఓ దేవా, జీవము నిమ్ము. ఓ దేవా, జీవము నిమ్ము విశ్వాస జీవమిమ్ము. ప్రభువా, ఈ జనులకు బయలుపరచుము. నేను వారిమీద చేతులుంచి ప్రార్థన మాత్రమే చేయగలను. కాని వారిని నీవే స్వస్థపరచెదవు. నీవు మాత్రమే బాగుచేయగలవు. తండ్రీ, ప్రతిఒక్కరిని నీవు బాగుచేయుము. వారిమీద చేతులుంచి హృదయమంతటితో నేను అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామములో వీరిని స్వస్థపరచుము. ఆమేన్.
137ఇప్పుడు, ఈ మైకు పలుకుచున్నదా? సోదరుడా! మీరు సరిగ్గా వినకలుగుచున్నారా? అందరూ వినుచున్నారా? మీ చేతులెత్తండి. ఈ కుర్చీలలో, ఈ పడకల మీదనున్న కొందరికి కార్డులు లేవు. కాని సోదరులారా, వినండి. ప్రార్ధన కార్డులుంటే బాగవుదురని అర్ధము కాదు. వారు బాగవవచ్చు లేదా బాగవకపోవచ్చు. అది వారికి దేవునియందు గల విశ్వాసము మీదనే ఆధారపడియున్నది. అది నిజమని ఎందరికి తెలియును? దేవునియందు మీకు నమ్మకముండవలెను. అది సత్యమని ఎందరెరుగుదురు? నీవెంత మంచివాడనైనా, చెడ్డవాడవైనా, భక్తిగలవాడవైనా, దేవుని కృప నీ హృదయములోనికి జారనిచో నీవెన్నడూ బాగవవు. దేవుడు గొప్ప సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేసెనని ఎందరికి తెలియును? మీరు దేవునిచే ఎన్నుకోబడినందున ఈ రాత్రి ఈ ప్రార్ధన వరుసలో నిలబడలేదు, అది కాదు; మీకు కేవలము ప్రార్థన కార్డు కలిగియున్నారు. మీరు మీ యొక్క [టేపు మీద ఖాళీ యున్నది]
138నేను గౌరవించు సోదరుడు గేర్హోల్జేర్ చాలా సంవత్సరముల క్రితం ఇక్కడ పరిచర్య ప్రారంభించెను. [టేపు మీద ఖాళీ యున్నది] దేవుడు రోగులను విశ్వాసము ద్వారా బాగు చేయునని నమ్మెను. అది ఎన్నడూ మారదు. ఈ చివరి దినమున దేవుడు తాను వాగ్దానము చేసిన వరములను అదనంగా కలిపెను. దానిని ఆయన చేయవలసియున్నందున కాదు గాని, వాగ్దానము చేసినందునే. ఆయన వాగ్దానము చేసినచో దానిని నెరవేర్చవలసియుండును, ఎందుకనగా ఆయన తన మాట నిలబెట్టుకొనును.
మీరు నమ్మనియెడల ఆలాగే జరుగునని ఆయన వాగ్దానము చేసెను. మీరు నమ్మలేనియెడల అది జరుగదు. నేను మిమ్మును నమ్మించలేదు. మీకు మీరు నమ్మలేరు. దానిని దేవుడే మీకు ఇవ్వవలెను. నమ్మకమనునది దేవుని వరము. మీ విశ్వాసము కాదు గాని, దేవునిది. మీ మానసిక విశ్వాసము చక్కగా యుండవచ్చును, కాని దేవుని విశ్వాసము నీ హృదయములోనికి వచ్చు వరకు ఏదీ జరుగదు. చూడండి. నీ మేధస్సుకు చెందిన విశ్వాసము దానిని చేయుటకు అంగీకరించవచ్చును. దానిని దేవుడు నీకు బయలుపరచు వరకు నమ్ముచునే యుండుము. చూచారా? దేవుడు ప్రత్యక్షపరచు వరకు నమ్ముచుండవలెను.
ISA 38:1-3,5
139"బ్రెన్హాం సోదరుడా, నీవేమి చెప్పుచున్నావు?" అని నీవడుగవచ్చును.
అవును. దేవుడు హిజ్కియా యొద్దకు ఒక ప్రవక్తను పంపి ఇట్లు చెప్పెను, "నీవు పడక మీదనే చనిపోదువని, ప్రభువు సెలవిచ్చుచున్నాడు? నిజమేనా?
కాని ఆ రాజు గోడ తట్టు తన ముఖము త్రిప్పి, గట్టిగా రోదించుచూ, కన్నీరు కార్చి ఇట్లనెను, "ప్రభువా, నాకు పదిహేను సంవత్సరములు కావలెను. నా మొర వినుమని, ప్రభువా, నిన్ను బ్రతిమాలుచున్నాను." ఆ రాజు ప్రపంచ రాజకీయ నాయకులలో అతి గొప్పవాడు, కాని ప్రవక్త దేవుని దృష్టిలో నున్నాడు. అతడు దేవుని రాజు, కాని ఇతడు దేవుని ప్రవక్త. కావున దేవుడు, ప్రవక్తకు… [టేపు మీద ఖాళీ యున్నది] మీకు తెలిసినదా? అర్థమైనదా?
LUKE 17:28,30
140ఇప్పుడు, అది మీకు అర్థము కావలెను, ఎందుకనగా నేను వాక్యము బోధించాను.
"సొదొమ గోమోర్రలో నుండినట్టే మనుష్యకుమారుని రాకడలోను ఉండును." సంఘము బయలుపరచబడు దినములా? కాదు. "మనుష్యకుమారుడు బయలుపరచబడును." ప్రత్యక్షపరచబడుట అనగా ఏమిటి? "తెలియచేయబడుట." అవునా? బయలుపరచుట — మనుష్యకుమారుడు బయలుపరచబడు దినములు. అది సొదోమ గొమొర్రా దినము వలె నుండును. అది అవునా?
ఇప్పుడు, ఏమి జరిగినదో చూడండి. సౌదొమ గొమొర్రాలలో ఇద్దరు ప్రధాన వర్తమానికులుండిరి, ఎందుకనగా అక్కడ ఒక నులివెచ్చని క్రైస్తవుల గుంపు ఉన్నది. నిజమేనా? సౌదొమ గొమొర్రాలలో ఇద్దరు ప్రధాన వర్తమానికులు బోధించుచుండిరి. (ఇప్పుడు జాగ్రత్తగా వినండి). కాని అందులో ఒకరు అబ్రాహాము యొక్క గుంపుతో నిలచియుండెను. అది నిజమేనా?
141ఇప్పుడు చూడండి, సంఘ చరిత్రలో నేటి వరకు హాము అను పేరుతో వచ్చిన విశ్వవ్యాప్త వర్తమానికుడు ఎవరూ లేరు, ఇప్పుడు: G-R-A-H-A-M గ్రాహం అనగా ఆరు అక్షరములు. కాని అబ్రాహాము పేరు చూడండి. A-B-R-A-H-A-Mనకు ఏడక్షరములు. చూచారా? కాబట్టి విశ్వ సంఘమునకు ఆరు అక్షరములున్నవి. (అది మానవ సంఖ్య. మానవ సంస్థ) సాంకీ, మూడీ, పిన్నీ నాక్స్, కాల్విన్ మొదలగువారుండిరి గాని హాము అను చివర పేరున్న వారు లేరు. అవునా? అతడు వారి వర్తమానికుడు. దేవుని యొద్ద నుండి పంపబడినవాడు, మారుమనస్సు పొందుడి లేనిచో నశించెదరు అని అతడు వారిని గట్టిగా బయటకు పిలచుచున్నాడు.
కాని గుర్తు౦చుకొనండి, ఎన్నుకోబడిన, ముందుగా నిర్ణయించబడిన, ముందుగా అభిషేకము పొందిన నిబంధన గల అబ్రాహాము గుంపుకు ఒక వర్తమానికుడున్నాడు. అతడేమి చేసెనో గమనించండి. అగ్నిపడు సమయము సమీపించినదని అతడు వారికి ఒక సూచన ఇచ్చెను. మరల ఆ అగ్నియే ఇప్పుడు పడనై యున్నది. అణు అగ్ని పడనైయున్నది. దేవుని ఉగ్రత కురియును!
AMOS 3:7•
HEB 13:8
142ఆ వర్తమానికుడు ఒక పనిచేసెను. వెనుక వైపునకు తిరిగియున్న ఒక స్త్రీతో జరుగనైయున్న దానిని అతడు చెప్పెను. ఆమె సందేహపడుచున్నది. అవునా? ఆ దినమున అదే రీతిగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగునని ఆయన చెప్పలేదా? అది సత్యమని మీరు నమ్ముచున్నారా?
ఇక్కడ ఒక స్త్రీ నిలబడియున్నది.
అదృశ్యమగు సంఘములో క్రీస్తు యొక్క వధువు అయి యున్నది. ఇక్కడున్న వర్తమానికుడు యేసుక్రీస్తే, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.
ఆయన తన ప్రవక్తల ద్వారా మాట్లాడును. బైబిలు ఆలాగున చెప్పెను. "మొదట ఆయన తన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమియూ చేయడు." ఆమోసు 3:7. ఆయన ఎల్లప్పుడూ ఆలాగే చేయును. ఆయన తన విధానము మార్చుకొనడు. చూచారా? దేవుడు తనతో చెప్పిన దానిని మాత్రమే నిజ ప్రవక్త పలుకును. అది నిజమేనా? అవును.
143ఇప్పుడు, ఈమెను నేను చూడక ముందే ఈమె వ్యాధి ఏమిటో ఆయన నాకు చెప్పగలడని మీరు నమ్ముచున్నారా? అది మీరు నమ్ముదురా? ఆమె కాన్సరుతో బాధపడుచున్నది. అది నిజము. ఆమెకు రొమ్ము కాన్సరు. ఆమెకు ఒక కుమారుడున్నాడు, అతడు ఒక విధమగు మానసిక వ్యాధితో, నరముల బలహీనత, రుగ్మతలతో బాధపడుచున్నాడు. అతని గూర్చి ఆమె తలంచుచున్నది. ఇది నిజము. అది నీవు నమ్ముచున్నావా? అది సత్యము కాదా? నీ విశ్వాసము నిలకడగా యున్నది, నీవు కోరినది నీవు పొందెదవని నమ్ముము. ప్రభువైన యేసు నిన్ను బాగుచేయును. వెళ్ళము. చూచారా? మీరు నమ్ముచున్నారా? పూర్ణ హృదయముతో నమ్ముడి.
ఈ స్త్రీ వైపు చూడకుండానే ప్రభువైన యేసు ఆమె వ్యాధిని గూర్చి నాకు చెప్పనని మీరు నమ్ముచున్నారా? ఎందరిది నమ్ముచున్నారు? నేనామె వస్త్రము మాత్రమే చూచాను. ఆ వ్యక్తి స్త్రీయో, పురుషుడో కూడా నేను చూడలేదు. ఆమె నమ్మవలెనని నేను కోరుచున్నాను. అమ్మా! నీవు నమ్ముదువా? ఈ రోగి నమ్మునా? నమ్మినయోడల నీ చేతిని ఎత్తుము. నీవు నీ పూర్ణ హృదయముతో నమ్మినచో, నీ బిడ్డను గూర్చి నీవడిగినది పొందెదవు. చూచారా? నమ్మగలవా? దేవునియందు నీకు విశ్వాసమున్నదా? అందువలన నీ స్వస్థత గుర్తింపబడును. దేవుని సన్నిధి యొక్క విశ్వాసమును నీ క్రియలు గుర్తించును. ఆయన వాక్యము బయలుపడును.
144ఈమె ఇంకో గొప్ప దానిని కోరుచున్నది. బిడ్డను కాదు గాని, పరిశుద్దాత్మ బాప్తిస్మమును కోరుచున్నది. ఏమి చేయవలెనో నేను చెప్పెదను. నీవు ఆ సిగరెట్లు మానివేసినయెడల, దేవుడు నీకు పరిశుద్దాత్మ బాప్తిస్మమును ఇచ్చును. నమ్మి వెళ్ళుము. చూచారా. అది మీరు నమ్ముదురా? దేవునియందు విశ్వాసముంచుము?
ఇక్కడ నిలబడియున్న ఈతనిని నా జీవితంలో ఎన్నడును చూడలేదు. నేనతనిని ఎరుగను, కాని అతడు ఏదో గుండె వ్యాధితో బాధపడుచున్నాడు. కొంతకాలం క్రితం అతడు పడిపోయెను. ఇక్కడి వాడు కాడు, ఆర్కన్సాస్ నుండి వచ్చెను. ఇతడు బోధకుడు. ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించుము. ఈతని ముఖమును ఎన్నడూ నేను చూడలేదు.
MARK 9:23
145ఇక్కడ ఒక స్త్రీ నిలబడియున్నది. ఆమె నాకు తెలియదు, నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. దేవుడామెను ఎరుగును.
ఆమె వ్యాధిని గూర్చి ఆయన నాకు బయలుపరచినచో, మీరు నమ్ముదురా? మీరందరూ? ఈ రాత్రి నేను మీకు బోధించిన దానియందు విశ్వాసమున్నదని రుజువు చేయు క్రియ ఇది. దేవుడు దీనిని బయలుపరచెను, దానిని ఈ క్రియలు ఈ రాత్రి నిరూపించును. మీరు బాగవుటకు విశ్వాసము కావలెను.
ఇక్కడున్న స్త్రీ నాకు తెలియదు. కాని ఆమెను ఎరిగిన కొందరు నాకు తెలియును, ఎందుకనగా ఆ వ్యక్తి నాముందు నిలబడియున్నాడు. ఆమె తల నొప్పితో బాధపడుచున్నది. అది నిజమేనా? దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? పెర్రీ గ్రీన్ సోదరి. ఇది నిజము. ఆమెను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. పెర్రీ గ్రీన్ నా ముందు నిలబడి అటు కదలుట నాకు కనబడుచున్నది. ఇది సత్యము. పెర్రీ గ్రీన్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. నీవు నమ్ముచున్నావా? ఎంతవరకు నీవు నమ్ముచున్నావు? నీవు నమ్మినయెడల సమస్తమూ సాధ్యమే. నీవు నమ్మలేనియెడల ఏమీ జరుగదు.
MARK 9:23•
HEB 4:15
146తల నెరసిన ఒకామె ఇక్కడ కూర్చొనియున్నది. నీవు దేవునిని నమ్ముచున్నావా? నీవు అక్కడుండి దేనిని గూర్చి ఆలోచించుచున్నావో దానిని నాకు దేవుడు తెలియచేయునని నమ్ముచున్నావా? నీకు రొమ్ముపై కంతి ఉన్నది. దానిని దేవుడు తీసివేయునని నీవు నమ్ముచున్నావా? అది నిజము. నమ్మికమాత్రముంచుము. ఆమె దేనిని తాకినది?
ఆస్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టెనని బైబిలు చెప్పుచున్నది. మన బలహీనతలను ఆయన తాకు ప్రధాన యాజకుడు అని బైబిలు చెప్పుచున్నది. అది నిజము కాదా? ఆయన ప్రధాన యాజకుడు. ఇక్కడ నిలబడియున్నాడు. ఇప్పుడు జనులు ఆయనను తాకుచున్నారు.
ఇక్కడ కూర్చొనియున్న ఒక సన్నని స్త్రీ తన చేతిని ఎత్తియున్నది. ఆమెను నా జీవితములో ఎన్నడూ నేను చూడలేదు. ఆమె ఒక దానిని తాకినది. అది ఇదే. ఆమె దేవునికి ప్రార్ధి౦చినది. ఆమె గుండె వ్యాధితో యున్నది. ఆమెకు కడుపు జబ్బు కూడా యున్నది. నీవు దీనిని నమ్మినయెడల స్వస్థత కలిగినట్లే. నీవు తప్పక నమ్మవలెను. "నమ్మువానికి సమస్తమూ సాధ్యమే."
147ఆ వెనుక కూర్చొని, ఇటువైపు చూస్తున్న వ్యక్తి ఉబ్బసము వలన బాధపడుచున్నాడు. (రెండవ వరుసలో యున్నాడు) నిన్ను దేవుడు బాగుచేయునని నమ్ముచున్నావా? నీవు నమ్మినయెడల దేవుడు నిన్ను బాగుచేయును. నీవు విశ్వసించినయెడల నమ్మినది దొరకును.
ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని, నా వైపు చూస్తున్నది. నెరసిన వెంట్రుకలు గల స్త్రీ, నీవు నీ పూర్ణహృదయముతో దీనిని నమ్ముదువా? నీవు నమ్మినయెడల నీ పిత్తాశయపు వ్యాధి తొలగిపోవును.
148ఆ మంచము మీద పడియున్న నీకు ఏమనిపించుచున్నది? దేవుడు నిన్ను బాగుచేయగలడని నీవు నమ్ముచున్నావా? నీ వ్యాధి ఏమిటో దేవుడు నాకు తెలియపరచినయెడల నీవాయనను నమ్ముదువా? నీవు నమ్మినయోడల, నీ కాన్సరు వ్యాధి పోవును. నీవు బాగవుదువు. నీవు లేచి నీ పరుపెత్తికొని ఇంటికి వెళ్ళుము. నమ్ముచున్నావా? మీరందరూ నమ్ముచున్నారా? ఇప్పుడు ఏమి జరుగుచున్నది? దేవుడు ఆ విశ్వాసమును నీ హృదయములో ఉంచెనా? ఇక్కడున్నవారందరూ చేతులెత్తండి. దేవుడు ఆ విశ్వాసమును మీ హృదయాలలో జారవిడిచినయెడల, ఈ వరుసలలో ఉన్నవారందరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసికొనండి. త్వరగా చేయండి, పరిశుద్దాత్మ సంచారము చేయుచున్నది. ఆయన వరుస లోనికి పరుగెత్తి ఇతరులకు ప్రార్ధన చేయుచున్నాడు.
HEB 13:8
149మనము లేచి నిలబడి మరియు అందరము దేవుని స్తుతించెదము. ఇంకా ముందుకు పోనవసరము లేదు. యేసుక్రీస్తును గుర్తించండి. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మీ బాధలు ఏవైనా కావచ్చును, మీరాయనను నమ్మినయోడల, ఇప్పుడే విశ్వాసముతో లేచి నిలబడండి.
సర్వశక్తుడగు దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తన శక్తిని పంపి, ఇప్పుడే ఈ జనుల గుంపును స్వస్థపరచవలెననియేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక! దేవుడు మిమ్మును దీవించును.