దేవుని యొక్క చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నించుట
1సేవకులైన సోదరులారా, మరియు ఇక్కడ ఉన్న మిత్రులారా, ఈ ఉదయం ఇక్కడ ఉండుట గొప్ప ఆధిక్యత అని నేను చెప్తున్నాను. నన్ను ఇంత ఉన్నత స్థాయిలో పరిచయం చేసిన విధముగా ఎప్పుడు జీవిoచగలనో నాకు తెలియదు.
బ్రదర్ నోయల్ మరియు నేను కూర్చుని మాట్లాడుచున్నాము. ఆయన మాట్లాడుచున్న వ్యక్తిని నేను చూసి ఉంటానని అనుకోవటం లేదు… కానీ మనందరం వేర్వేరుగా ఒక్కడే దేవుని మూలముగా చేయబడ్డాము. బ్రదర్ జాక్ మూర్ మాదిరిగానే, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి సహోదరుడు నోయల్ నాతో చెప్తూ ఉన్నాడు, ఏవిధముగా ఆయన అల్లుడు ఆయనను ప్రేమిస్తూ ఆయన జ్ఞానాన్ని గౌరవిస్తున్నాడనే సంగతిని గూర్చి నాతో పంచుకున్నాడు. దానికి నేను ఆమెన్ చెప్పాను. ఇక్కడున్న నేను మరియు అతడు, మరియు సహోదరుడు బ్రౌన్, సహోదరుడు బూట్లేయర్ చాలాసార్లు మేము కలుసుకున్న చక్కని సమయాలను కలిగి ఉన్నాం. చక్కని దైవజనులు, వారిని నేను నిజముగా నా హృదయమంతటితో ప్రేమిస్తున్నాను.
ఆపై మనం ఎంత మాత్రము యవ్వనముగా మారలేమని నేను చూస్తున్నాను . మనం ఏ విధముగా 20 సoవత్సరాల నుండి మారుతూ వచ్చామో దానిని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. మేము ఆ విధముగా యవ్వనస్తులుగా ఉన్నప్పటి నుంచి కలసి ఎన్నో ఎడారులను దాటాము. అయితే ఎప్పటికీ వృద్ధాప్యం లేని స్థలం ఒకటి ఉన్నదని, మనం ఏదో ఒక రోజు అక్కడ కలుసుకుంటామని ఎరిగియున్నాము.
2గత రాత్రి నేను గుడారం నుండి బయలుదేరినప్పుడు, అక్కడ ఒక చిన్న మహిళ మంచం మీద పడుకొని ఉన్నది . ఆమె "బ్రదర్ బ్రన్హాం ……కొన్ని సంవత్సరాల క్రితం …" ఆమె పక్షవాతముతో పడి ఉన్నదని అనుకుoటున్నాను. ఆమె చెప్పినది "నాకు నీవు ఇలా చెప్పావు…"
ఆ మహిళ చెప్పిన మాట నాకు సరిగా గుర్తు లేదు కానీ , నేను దానిని తప్పుగా చెప్పడం లేదని తలస్తున్నాను. ఆమె "నేను కలిగియున్న ఈ శ్రమ ఒక ఉద్దేశ్యం కోసమే అయి ఉంటుందని, "లేదా ఒక బిడ్డ కలిగి ఉండబోతుందని చెప్పెను. అయితే ఆమె ఉన్న స్థితిలో అది ఎలా జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు.
అక్కడ అందమైన ఒక యవ్వనస్తుడు "నేనే ఆమె కలిగి ఉన్న బిడ్డను" అని అన్నాడు . "నేనే ఆమె కలిగి ఉన్న బిడ్డను".
మరియు, ఆ విధముగా యాత్రలో చాలా విషయాలు జరిగాయి. వాటి గురించి మాట్లాడటానికి మనకు ఇక్కడ సమయం లేదు. మనం అవతలి గట్టున మాట్లాడుకుందాము.
3మరియు ఈ వ్యాపార వేత్తల కూడిక. నేను ఏ సంస్థకు చెందినవాడను కాను. కేవలం ఈ ఒక్క గుంపుతోనే నేను సంబంధం కలిగియున్నాను అని మీ అందరికీ తెలుసు… అని ఊహిస్తున్నాను. వారు అనేక సంఘ శాఖలకు చెందినవారు. వారు కేవలం వ్యాపారవేత్తలు. వారు నాకు మరియు తండ్రి అయిన ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్యకు గొప్ప ఆస్తి. ఇది ఏదో వేరే సoస్థలను ఇష్టపడటం లేదని కాదు, ఇది కేవలము నాకు ఇవ్వబడిన పరిచర్య. మరియు నేను ఆ పిలుపుకు విధేయత చూపకపోతే, దేవునికి అవిధేయత చూపిన వ్యక్తినవుతాను.
4నేను ఆలోచిస్తున్నాను (టుక్సన్ నుండి బయలుదేరే ముందు మీలో చాలా మంది అక్కడ ఉండవచ్చు) ఒక రోజు నేను లాస్ ఏంజెల్స్ వ్యాపార వేత్తల మధ్య మాట్లాడుచున్నప్పుడు, మరియు అక్కడ ….నేను స oస్థల గురించి కొంచెం కఠిిినముగా మాట్లాడాను. నేను అలా ఉండాలని కాదు. నేను అలా మాట్లాడానని మీకు అనిపిస్తే, నేను వేషధారిని అయ్యేవాడిని. మీరు అలా చేయకూడదు, లేదండీ అది కేవలం ఒకరిపై విరుచుకు పడుట. కానీ నేను బ్రదర్ షరిత్ పెరడు లో చూసిన చెట్టు గురించి మాట్లాడాను . దానిపై ఐదు రకాల పండ్లు ఉన్నాయి. మరియు నేను " నా జీవితములో అలాంటి చెట్టును ఎప్పుడూ చూడలేదు" అని అన్నాను . అది ఒక….. దానికి ద్రాక్ష, నిమ్మ ,టాన్జేరిన్, టాoజేలో, నారింజ అన్నీ అదే చెట్టుకు పెరుగుతున్నాయి . "మంచిది", నేను అన్నాను, "నేను ఖచ్చితముగా అది ఏ చెట్టు అనేది చెప్పలేను. అది ఏ రకమైన చెట్టు అయి ఉన్నది"?
"ఇది ఒక నారింజ చెట్టు"
అయితే నేను, "సరే, అది ద్రాక్షపండా?" అని అన్నాను .
దానికి ఆయన "అవును" అన్నారు.
నేను, "అది ఎలా" అన్నాను.
దానికి ఆయన ఇది "అంటుకట్టుట" అన్నారు
అప్పుడు నేను, "అవునా అలాగా" అని అన్నాను.
"ఇవన్నీ నిమ్మ కుటుంబమునకు సoబంధించినవి మరియు నిమ్మజాతికి సంబందించిన ఏ చెట్టునయినా అoటు కట్టవచ్చు "అని చెప్పారు.
నేను, "నాకు అర్ధమైంది" అని అన్నాను. అప్పుడు నేను కొంచెం గట్టిగా అరవటం మొదలు పెట్టాను. ఎందుకంటే నేను భావోద్వేగానికి లోనయ్యాను.
దానికి ఆయన "ఏమిటి విషయం?" అని అన్నాడు .
5మరియు నేను, "మంచిది నేను ఏదో ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకొంటున్నాను" అని అన్నాను. ఇప్పుడు వచ్చే ఏడాది వసంత కాలము వచ్చినప్పుడు, ఇక నారిoజలు, టాంజలోస్, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయలు ఉండవు అన్నీ నారింజలే ఉంటాయి. అవునా? అని అడిగాను.
ఆయన, "లేదు, లేదు, లేదు ప్రతీ శాఖ దాని సొంత ఫలాన్ని ఇస్తుంది" అని అన్నాడు
నేను "అవునా అలాగా" అని అన్నాను.
కాబట్టి అది అయినను వినుటకు బాగుంది. ఎందుకంటే నేను కానీ మీకు తెలుసా నేను ……నాకు హార్ట్ ఫోర్డ్ మరియు ఈ ఇతర విశ్వవిద్యాలయాలనుండి డిగ్రీ పొంది ఉన్నాను. మీకు తెలుసు కాబట్టి, నేను… ప్రకృతిని గమనించేవాడిని. అది ఇప్పటి వరకు నేను కనుగొన్న ఉత్తమ విశ్వవిద్యాలయం -సృష్టికర్త విశ్వవిద్యాలయం, కాబట్టి నేను దానిని చూసినప్పుడు, ప్రకృతి కార్యకలాపాలను చూసే విధానము నుండి నా ప్రసంగాలను పొందుతాను.
మరియు నేను "మంచిది, అది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది" అని అన్నాను.
ఆయన "ఏమిటి విషయం" అని అన్నాడు.
"నేను ఏదో ఆలోచించాను" అని చెప్పాను.
JOHN 15:1,2
6కాబట్టి ఆ రోజు నేను దానిపై బోధించాను. "నేను ఇప్పుడు మీరు చూచినట్లయితే సంఘం మొదట ప్రారంభమైనప్పుడు, అది ……యేసు అన్నాడు (యోహాను 15వ వచనంను బోధిస్తున్నాను). ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు మరియు ఫలి oపని ప్రతీ తీగ కత్తిరించబడును మరియు కాల్చివేయబడును."
మరియు ఎవరో ఈ విషయం గురించి గట్టిగా అన్నారు, "మీరు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి రక్షించబడిన తరువాత దాని నుండి బయటపడలేరు అని అన్నారు."
"అది నిజం".
ఆయన, "మరి దాని గురించి ఏమిటి?" అని అన్నాడు.
నేను "ఇప్పుడు నీవు వేరే అంశము గురించి మాట్లాడుతున్నావు . ఆయన ఇక్కడ ఫలములు ఫలించడం గురించి మాట్లాడుతున్నాడు, తీగ గురించి కాదు. ఆయన ఫలాలు ఫలించడం గురించి మాట్లాడుతున్నాడు, జీవం గురించి కాదు". ఆయన, మంచిది "ఆ చెట్టును తిరిగి నరికివేస్తే, అప్పుడు తద్వారా అది పెరుగుతుంది, తిరిగి ఫలిస్తుంది" అని అన్నాడు .
ఆయన అన్నాడు …..
మరియు నేను, "ఇప్పుడు గమనించండి, ఈ చెట్టు, అది ప్రారంభమైనప్పుడు, అందరూ పరిశుద్ధ గ్రంథానుసారమైన కల్తీ లేని క్రైస్తవులు, దాని తరువాత లూథర్, బాప్టిస్ట్ , ప్రెస్బిటేరియన్ -నిమ్మకాయలు మరియు తక్కినవి వచ్చాయి అని అన్నాను. "మరియు నేను అన్నాను, "మీరు గమనిస్తే, ఇది క్రైస్తవ్యము అను పేరు మీద వర్ధిల్లుతోంది, కానీ అది ఆ చెట్టుకు వెలుపల జీవిస్తుంది, అయితే అది దాని సొంత శాఖ మాదిరిని కలిగి ఉంది. చూసారా? కానీ, ఒకవేళ నారింజ చెట్టు ఎప్పుడైనా మరొక కొమ్మను చిగురిస్తే అది ప్రారంభములో ఉన్నట్లుగా నారింజలను ఫలిస్తుంది."
HEB 10:25
7ఒకానొక సందర్భములో గొప్ప పెంతెకొస్తు సంఘముల యొక్క ప్రముఖులలో ఒకరు ఇక్కడ కూర్చోవటం జరిగింది. నేను ఆ సహోదరీ, సహోదరులకు వ్యతిరేకిని అన్నది నా ఉద్దేశ్యం కాదు అని మీకు అర్ధం అయ్యేలా ఎలా వివరించాలో నాకు తెలియడం లేదు. అది తప్పు. నన్ను చాలా తప్పుగా అర్ధం చేసుకొన్నారు. ఎందుకో నాకు తెలియదు. చూసారా? నేను సంఘానికి వెళ్ళేవారిని కూడా నమ్మను అని ప్రజలు అనుకుంటారు. నిజానికి అది సత్యమునకు మిలియన్ మైళ్ళ దూరములో ఉంది. "ఆ దినము సమీపిస్తుండగా మనము తప్పక ఈ విధంగా మరి ఎక్కువగా కూడుకోవాలి". మనం ఐక్యతతో కలసి రావాలి. మనము ఆలాగు చేయలేకపోవచ్చు ……
నేను ఒక నగరములో నివసిoచినట్లయితే వారికి అక్కడ ఏమీ లేదు కానీ ….మంచిది, ఏదో ఒక సంఘము (నేను ఏ పేర్లను పిలవాలని అనుకోను, కానీ ఏ సంఘమైన), వారు కేవలము యేసు దైవము మరియు మిగిలినవన్నీ తప్పు అన్న ఒక్క విషయం మాత్రమే విశ్వసిస్తే, నేను ఆ సంఘానికి వెళ్ళేవాడిని. ఒకవేళ నేను రొట్టె మొత్తం పొందలేకపోతే, నేను ఒక ముక్క తీసుకుంటాను చూసారా? నేను వెళ్లి వింటాను, ప్రభువును ఆరాధిస్తాను, మరియు నేను నా వంతు కృషి చేస్తున్నానని ఆయనకు చూపిస్తాను. నేను సజీవంగా ఉన్నానని ఆయన తెలుసుకోవాలని కోరుకుంటాను. నేను ఏ వైపు ఉన్నానో అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను క్రైస్తవులతో వారి ఆరాధనలో హాజరై ప్రభువును సేవిస్తాను.
8కానీ అది చాలా కష్టం, అది నన్ను చాలా బాధ పెట్టేది మరియు అప్పుడు మన ప్రభువు కూడా చాలా విషయాలలో తప్పుగా అర్థం చేసుకోబడ్డాడు అని నేను కనుగొన్నాను. ఆయన ఏదైనా చెప్పినప్పుడు, అది తప్పుగా అర్ధం చేసుకోబడింది. నా అంచనా ప్రకారం అది అలాగే ఉండాలి. కానీ జ్ఞానము గలవాడు దానిని అర్ధం చేసుకొంటాడు. బైబిల్ అలా చెప్పింది. దాన్ని వారు పట్టుకొంటారు.
కాబట్టి ఈ ఉదయం ఈ మాట చెప్పేటప్పుడు …మరియు నేను ఇలా అన్నాను "ఇప్పుడు, వారు క్రైస్తవ్యము అన్న పేరులో జీవిస్తున్నారు, అయితే తప్పిదమయిన ఫలమును ఫలించుచున్నారు. అది ఒక సంఘశాఖ ఫలాన్ని కలిగి ఉంది. వారు ఒక నియమాలను పెట్టుకుంటారు, వారు దాని నుండి సరిగ్గా జీవిస్తున్నారు. ఆ జీవానికి బయట జీవిస్తారు.
MATT 7:20•
LUKE 6:44
9అదే గత రాత్రి నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఆ ఆత్మ, ఆత్మ లోనికి బాప్తిస్మం పొందవచ్చు మరియు అప్పటికీ క్రైస్తవునివి కాదు. చూసారా? మీరు సరిగ్గా అదే జీవితాన్ని గడుపుతున్నారు కానీ మీరు ఫలించే ఫలములను బట్టి మీరు తెలుసుకొనబడుదురు. అది నిజం, చూచారా? వారు అన్నీ సూచక క్రియలు చేయగలరు, మరియు రోగుల కొరకు ప్రార్థించగలరు, రోగులను స్వస్థపరుస్తారు, మరియు గ్రుడ్డి వారి కన్నులు తెరవగలరు, దయ్యములను వెళ్లగొట్టగలరు మరియు ఈ పనులన్నీ చేయగలరు, అదే జీవముతో జీవిస్తున్నారు, కానీ ఇప్పటికీ అది నిమ్మకాయ. అది నిజం. "ఫలాలను బట్టి మీరు తెలియబడుదురు" అని యేసు అన్నాడు. కాబట్టి మనం తెలుసుకొంటాము ….
నేను వేదిక నుండి దిగినప్పుడు, ఈ గొప్ప నాయకుడు లేచి ఇలా అన్నాడు, "అది ఆయన ఉద్దేశ్యం కాదు మనమందరం అంటు కట్టబడ్డాము అని మాకు తెలుసు" అని అన్నాడు. మంచిది, అది నిజం. మనం అంటు కట్టబడ్డాము, మొదలులో అంటు కట్టబడ్డాము. అది నిజం, కానీ తీగలో అంటు కట్టబడలేదు. కాబట్టి ఆయన అన్నాడు ….నన్ను మందలిస్తూ వెనక్కి లాగే ప్రయత్నం చేసాడు.
10మరియు అక్కడ ఒక యవ్వనస్థుడు ఉన్నాడు, ఇది కొంతమంది సినిమా తారల ప్రజలు అనుకొంటున్నాను. అతని పేరు డానిహెన్రీ, మరియు అతను బాప్టిస్ట్ అబ్బాయి. మంచిది, అతను తన చేతులను నా చుట్టూ వేయుటకు వేదిక వద్దకు వచ్చి ఇలా అన్నాడు, "బ్రదర్ బ్రన్హాం నేను ఏదో హేళనగా చెప్పానని కాదు కానీ అది ప్రకటన గ్రంధం 23వ అధ్యాయము అయి ఉండేది అని నేను నమ్ముతున్నాను"
మరియు నేను "ధన్యవాదములు" అని అన్నాను.
అతను ఇంకేదో చెప్పటం ప్రారంభించగానే అతను భాషలలో మాట్లాడటం ప్రారంభించాడు - ఒక బాప్టిస్ట్ కుర్రాడు. మరియు అతడు అలా మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు లూసియానాకు చెందిన ఒక మహిళ ఇక్కడ ఉంది. ఆమె ఒక ఫ్రెంచ్ మహిళ, ఆమె కొంచెం లావుగా ఉంది. దానికి ఆమె అనువాదం వ్రాసింది.
అప్పుడు అక్కడ మరో ఫ్రెంచ్ యువకుడు కూర్చుని ఉన్నాడు, అతడుచెప్పిన దానిని ఈయన కూడా వ్రాసాడు. వారు వ్రాసిన రెండింటిని పోల్చి చూసారు, మరియు అవి ఒకే విధముగా ఉన్నాయి.
ఆపై ఒక అబ్బాయి……… క్లిప్టన్ కాఫెటేరియా వద్ద వెనుక వైపునిలబడి , ముందుకు నడుస్తూ వచ్చాడు. అతను అన్నాడు "ఆ వ్రాసిన అనువాదములను చూడనివ్వండి.
11నేను అవి ఏమిటో చూడాలని అనుకుంటున్నాను".
ఆ మూడింటిని సరి చూడగా తర్జుమా ఒకే విధముగా ఉన్నది. అతను ఐక్యరాజ్య సమితి (U.N.,) కొరకు అనువాదకుడు, ఫ్రెంచ్ అనువాదము చేయువాడు. మరియు అది ఇలా చెప్పుచున్నది "నీవు ఈ తిన్ననిదైన మరియు ఇరుకైన మార్గాన్ని, కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నందున, దీనిని (ఈ మార్గాన్ని) మీరు మీ సొంత ఎన్నికగా చేసుకున్నారు. కానీ మీరు ఎంతో మహిమకరమైన నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే అది నా మార్గము" చూశారా?
మరియు ఆయన కొంచెం ముందుకు వెళ్లి "దైవిక ప్రేమలో ఒక గొప్ప విజయాన్ని సాధించే కార్యం ఇదే" అని అన్నాడు.
చూసారా, ఎల్లప్పుడూ, చివరికి ఫ్రెంచ్ భాష అనువాదములో సహితము, క్రియా విశేషణమునకు ముందు క్రియ వస్తున్నది. కాబట్టి మోషే, ఆయన తన ఎంపిక చేసుకొన్నాడు అని నేను ఇలా చెప్పలేను … అతను తన ఎంపిక చేసుకోవాల్సి వచ్చెను. మరియు మనందరమూ మన ఎంపిక చేసుకోవాలి. మరియు మనకు సాధ్యమైనంత వరకు ఉత్తమమైన దానిని చేయాలి. మరియు దేవుడు …..దేవుని గురించి ఇచ్చిన ఏ వ్యక్తి వర్తమానమైనను నేను గౌరవిస్తాను. అది ఏమైననూ, దానిని హృదయపూర్వకముగా గౌరవిస్తాను .
12ఇప్పుడు, కొంతకాలం క్రితం ఒక యవ్వన సోదరుడు నా యొద్దకు వచ్చాడు. బ్రదర్ స్ట్రింగర్, లూసియానా లేదా మిసిసిపి నుండి వచ్చాడనుకొంటున్నాను…. అతను కొన్ని చిత్రాలు తీసుకొని వచ్చాడు…మేము వాటిని చూస్తున్నట్లుగా మీరు చూసారు. అది ప్రభువు యొక్క దూత, కనిపించినప్పుడు తీసిన చిత్రాలు . మీలో ఎంతమంది ఈ కథ విన్నారు ? మీలో ప్రతీ ఒక్కరు దీనిని విన్నారని నేను ఊహిస్తున్నాను . మీరు దానిని టేప్ లో మరియు ఇతరమైన వాటిలో కలిగి యున్నారు .
ఇప్పుడు, అది నాకు ఒక ఉదయం పది గంటలకు ఇండియానాలో నా గదిలో నిలబడి ఇలా చెప్పింది. నేను ఒక ఉదయాన టుక్సన్ వద్ద ఉండబోతున్నానని, నా కాలి ప్యాంటు కి అంటుకున్న పల్లేరు కాయను తీసుకొంటూ ఉండగా, మరియు, ఏడు దూతలు ఒక పెద్ద శబ్దముతో వస్తాయని ఆ శబ్దానికి భూమి పగిలి పర్వతము యొక్క రాళ్ళు దొర్లి పడతాయని నాకు చెప్పబడింది .
మరియు నేను, మంచిది …నేను నా భార్యతో చెప్పాను (ఆమె ఈ ఉదయం ఇక్కడ ఉన్నది) "నీవు ప్రతీది సిద్ధం చేసుకో ఎందుకంటే ఏ మనుష్యుడు దాని ముందు నిలువలేడు" అని చెప్పాను . నేను, "దాని నుండి బయటికి రా. నేను టుక్సన్ కి వెళుతున్నాను, నా పని ఈ భూమిపై ముగిసింది నేను ప్రభువైన యేసుతో ఉండడానికి ఇంటికి వెళ్తున్నాను" అని చెప్పాను .
"మంచిది, మీకు ఖచ్చితముగా తెలుసా" అని అడిగింది.
నేను "అవును ఎవరూ అక్కడ నిలువలేరు. దీనిని చేయుటకు ఏ విధముగానైన సాధ్యము కాదు" అని అన్నాను .
REV 1:14
13నేను ఏడు సంఘ కాలాలు ప్రసంగించాను. అక్కడే నేను మా ధైర్యము గల చిన్న సహోదరుడైన జాక్ మూర్ ను ప్రకటన 1 వ అధ్యాయము లోని తెల్లజుట్టు కలిగి యున్న యేసును గురించి మాట్లాడడానికి పిలిచాను
"ఆయన (యేసు) ఒక యవ్వనస్థుడు", అని నేను అన్నాను . ఆయన తెల్లని విగ్గుని కలిగియుండుట ఒక ప్రత్యక్షత . అది ఆయన అసలు జుట్టు కాదు. (అది నాకు అంతకు ముందు అర్ధము కాలేదు,) అయితే ఆయనే సర్వాధికారియైన దైవత్వము అయి ఉన్నాడు . ఇశ్రాయేలులోని పురాతన న్యాయాధిపతులు తలమీద విగ్గుని ధరించేవారు. తెలుపు స్వచ్ఛతకు సాదృశ్యము. మరియు ఆ oగ్లేయ న్యాయాధిపతులు ఈ దినము వరకూ కూడా ఇంగ్లాండులోని సర్వోన్నత న్యాయ స్థానాల్లో వారు న్యాయస్థానంలోకి వచ్చినప్ప్పుడు, తెల్లని విగ్గు ధరిస్తారు. ఎందుకంటే వారు చెప్పే చట్టానికి పైగా ఈ భూమ్మీద ఏ చట్టమూ లేదు. చూశారా? వారు సర్వోన్నత న్యాయాధిపతులు .
14మరియు నాకు గుర్తుంది నేను ఆరిజోనా వెళ్ళాను, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ….మరణానికి భయపడ్డాను. ఫోనిక్స్ కూడికకు వెళ్ళాను. మరియు అక్కడ "అయ్యలారా, ఇది ఏ సమయం" అన్న అంశం ప్రసంగించాను. అది మీకు గుర్తుందా?. నేను అది చూశానని చెప్పాను. నేను "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అది జరగడానికి ముందు ఏదో జరగబోతుంది" అని చెప్పాను . మీరు ఇప్పుడు మీ టేపు గ్రంథాలయములో ఆ టేపును కలిగిఉంటారు . అక్కడ నేను ఇలా అన్నాను "మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి, దర్శనం, అది ఎప్పటికీ విఫలం కాదు . గుర్తుంచుకోండి!! ఏదో జరగబోతుంది".
15మరియు కొన్ని రోజుల తరవాత నేను భావోద్వేగానికి లోనయ్యాను. మరియు నేను అనుకొన్నాను "ఏంటి… కేవలం…నేను చనిపోతానా? నేను త్వరగా దాన్ని ఆశిస్తున్నాను, కాబట్టి నేను దాన్ని అధిగమించగలుగుతున్నాను. ఆలస్యమవ్వటం నాకు ఇష్టం లేదు".
మరియు ఒక ఉదయం ప్రభువు "సబీనో కెన్యాన్ పైకి వెళ్ళుము" అని అన్నాడు.
మరియు నేను అక్కడ చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నా చేతికి ఏదో తాకినట్లు అనిపించింది. అది ఒక ఖడ్గం. ఇప్పుడు, అక్కడ మీరే నిలబడి చేతిలో ఒక కత్తి , అంత పొడవుగా ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఉహించుకోవచ్చు . నేను దానిని క్రిందికి లాగి చూసాను. అది కేవలం ఒక కత్తి, అందులో ఒకటి ……మరియు నాకు కత్తి అంటే ఎట్లైనను భయమే . మరియు అది ఒక లోహపు కత్తి. ఈ కత్తులలో ఒకదాని వలే, ఒక లోహం వలే తక్కువ వెడల్పు కలిగినది మరియు బహు పదునైనది. దాని చుట్టూ ఒక కోశం ఉన్నది ("కప్పు"), ఖడ్గముతో పోరాడినప్పుడు, గాయం తగలకుండా కాపాడి ఉంచే ఒర ఉన్నది. దానికి ముత్యముతో కూడిన చేతి పిడి ఉన్నది. సరిగ్గా నా చేతిలో ఖచ్చితంగా సరిపోతుంది. మంచిది, నేను నా ముఖాన్ని రుద్దుకొని తిరిగి చూసాను (అదే ప్రదేశములో, మరో రోజు, తెల్లని పావురం దిగి రావడాన్ని చూసాను. దాని గురించి మీకు తర్వాత చెబుతాను.)
16మరియు నేను దాన్ని నాచేతిలో పట్టుకొని అనుకున్నాను, "అది వింతగా ఉంది, ఇప్పుడు, ప్రభువా నా మతి కోల్పోతున్నానా? ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను ఎవ్వరి నుండైనా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాను. మరియు ఇక్కడ కత్తి ఉన్నది (నేను నా చేతిని పైకి లేపాను ) మరియు అది ఎక్కడ నుండి వచ్చింది?" మరియు నేను ఇలా అనుకున్నాను" అది వింతయిన కార్యము. మరియు ఇక్కడ చూస్తే, ఇది ఒక కత్తి; చూడండి, కొట్టి చూడండి, ఇది ఒక కత్తి". మరియు నేను, ఇక్కడ ఎవరూ లేరు. నేను ఈ రాళ్ల పై ఉన్నాను" అని అన్నాను. మరియు మీరు అక్కడ నుండి టుక్సన్ ను కూడా చూడలేరు, అది చాలా దూరంలో ఉన్నది.
17నేను అనుకొన్నాను "ఇప్పుడు ఇది ఒక వింత విషయం. ఇప్పుడు ఈ పరిసరాల్లో ఎవరో, ఎక్కడో ఈ కత్తిని చేసి నా చేతిలో పెట్టి ఉంటారు,". మరియు నేను అన్నాను, "ఇది అబ్రహాము కొరకు గొర్రెను సృష్టించిన దేవుడు మాత్రమే అయి ఉండవచ్చు". ఆయన ఉడుతలను సృష్టించగలడు మీరు ఇదివరకే విన్నారు. మరియు నేను "ఇక్కడ ఒక పదార్ధం ఉంది, దానిలో మూడు రకాల పదార్ధాలు ఉన్నాయి, మరియు నేను దానిని వాస్తవముగా నా చేతిలో వేరే దేనినైనను పట్టుకునే విధముగానే పట్టుకొని యున్నాను".
మరియు నేను ఒక స్వరము విన్నాను "అది రాజు యొక్క ఖడ్గము" అని చెప్పింది.
18మరియు నేను అనుకొన్నాను, "ఇప్పుడు, అది ఎక్కడ నుండి వచ్చింది అని"? అది నేరుగా ఎక్కడో రాళ్ళలో నుండి వచ్చింది అనుకుంటున్నాను. మరియు నేను నా చేతిని అలాగే పట్టుకొని యుంచాను . మరియు నేను "ఒక రాజు ఖడ్గము" అని అన్నాను, మరియు నేను తిరిగి చూసినప్పుడు, ఆ కత్తి పోయింది. మరియు నేను "ఒక రాజు ఖడ్గము" అని అన్నాను. అది ….ఆ కత్తితో వారు పోరాడుతారు, అది సత్యం అని అనుకుంటున్నాను. మీకు తెలుసా సైనికులు దానితో పోరాటం చేస్తారు. నేను "మంచిది, బహుశా అది దాని కొరకే అయి ఉండవచ్చు. దానికి అర్ధం బహుశా నేను సేవకులపై చేతులు ఉంచడం, లేదా వారిని సేవకులుగా చేయటం అలాంటిది ఏదైనా అయి ఉండవచ్చు "రాజు ఖడ్గము!" ఒక రాజు ఖడ్గము కాదు. "ఏకైక రాజు ఖడ్గము" అని మాట్లాడింది. చూసారా?.
నేను "ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను . నా మతి పోయినట్టుంది, లేదా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఎవరో నా దగ్గరలో నిలబడి ఉన్నారు". అని అనుకున్నాను.
19మరియు సహోదరులారా ఈ కార్యాలు నిజమే. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎప్పుడూ ఇలా జరగుతుండడం మీరు ఎల్లప్పుడూ చూసారు. మీరు చూసారా? చూసారా? మరియు అది….నాకు అర్ధం కాలేదు. అది ఒక వింత అయిన అనుభూతి.
అప్పుడే నేను ఇలా అనుకున్నాను, "ఇప్పుడు ఎవరైతే నా జీవితమంతా నాతో మాట్లాడారో, పసివాడిగా ఉన్నప్పటి నుండి, ఆయన ఇక్కడ నిలబడి ఉన్నారు. మరియు ఆయనను నేను ఎప్పటికీ చూడలేకున్నాను." నేను అన్నాను, "ఏకైక రాజు ఖడ్గమా? అది ….దేవుడే రాజు మరియు ఆ ఖడ్గం ఏమిటి? వాక్యం" అని అన్నాను .
"అది నీ చేతిలో ఉంచబడింది". "మరణానికి భయపడవద్దు, ఇది నీ పరిచర్య" అని చెప్పాడు.
20ఓహ్, మై! ఆ పర్వతము నుండి వెళ్తూ, ఏడుస్తూ, నా స్వరముకంటే ఎక్కువగా అరుస్తూ, రాళ్ళపై ఎగురుతూ కిందికి వెళ్ళాను . నా భార్యతో చెప్పాను, "నేను చనిపోను అది నా పరిచర్య." (నేను ఆమెతో బిల్లిపాల్ తో కలసి పిల్లలను తీసుకు రమ్మని చెప్పాను. నేను "ఇప్పుడు, నా దగ్గర ఏమీలేదు. కానీ మీరు ఎంతమాత్రమూ ఆకలి తో ఉండరని మరియు నేను సరిహద్దు మీదుగా కలుస్తానని, సంఘము దానిని చూస్తుంది" అని అన్నాను). మరియు నేను "లేదు, నేను చనిపోను. అది కేవలం నా పరిచర్య గురించి" అని అన్నాను.
21ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను ఒక కూడిక, నుండి బయటకు వస్తున్నాను . హూస్టన్ టెక్సాస్ నుండి ఒక మూడు పేజీల టెలిగ్రాం కలిగి ఉన్నాను. హూస్టన్ లో, ప్రభువు యొక్క దూత చిత్రాన్ని తీసినప్పుడు, ఆ రాత్రి నన్ను చెడ్డగా విమర్శించిన ఆ వ్యక్తి, నన్ను పిలిచి ఇలా అన్నాడు …బ్రదర్ బ్రన్హాం మీరు తీరిక లేకుండా ఉన్నారని నాకు తెలుసు . నా కుమారుడు, టెడ్ కిప్పర్ మాన్ యొక్క సహోదరి యొక్క కుమారుడు చనిపోయే స్థితిలో కుర్చీలో పడి ఉన్నాడు. ("ఒకవేళ అది బిల్లీ పాల్ అయితే ?"), అని టెలిగ్రామ్ లో ఆయన భార్య అన్నది. ఆయన " ఆ కుమారుడు మరియు చిన్న బాలిక చనిపోబోతున్నారు" అని అన్నారు. దీనిని మీరు వార్తా పత్రికలో చదివే ఉంటారు. మరియు ఆయన, "మాకున్న ఒకే ఒక నిరీక్షణ ఏమిటంటే మీరు వచ్చి ప్రజలను సమకూర్చి కూడికను జరిపించడం". అని అన్నారు
22మరియు రేమాండ్ హుక్ స్ట్రా అప్పటికే చాలా సార్లు వ్రాసారు. కానీ మీకు తెలుసు, ఆ సభ తర్వాత మెక్ నెల్లీ మరియు వారితో వేటకు వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నాను. "మంచిది, నా ప్రయత్నం ఏమీ లేకుండా నేను ఆ పిల్లలను చనిపోనిస్తే మరి ఎప్పుడూ వేటకు వెళ్ళలేక పోయేవాడిని".
కాబట్టి "సరే నేను వస్తానని" చెప్పాను. నేను హూస్టన్ కు వెళ్ళాను సభ జరిగించాను. మరియు వారు వారిని ఎప్పటికి చంపలేదు. వారు కేవలం ….వారు వారికి జీవితాన్ని ఇచ్చారు. అదే వారు చేయాలనీ వారు అనుకొన్నారు. కేవలం జీవితాన్ని ఇవ్వడమే. అది టెక్సాస్ లో ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జరిగింది.
23కాబట్టి అప్పుడు, తిరిగి వెళ్లుతున్నప్పుడు, నేను ఆ కొండ పైకి బ్రదర్ ఫ్రెడ్ సాత్ మెన్ తో కలసి వెళ్ళాను. ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారు. బ్రదర్ ఫ్రెడ్ మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే, సహోదరులు జీన్ నార్మన్, ఫ్రెడ్ సాత్ మన్. ఒకరోజున, అనగా కొండమీదున్నరెండవ రోజున మేమున్న శిబిరంలోనికి ప్రభువు యొక్క దూత దిగి వచ్చి, వారి పిల్లలు మరియు వారు చేసే పనుల గురించి చెప్తూ ఉన్నారు.
నేను బయలుదేరి కొండ పైకి తిరిగి వెళ్ళాను. నేను, అప్పటికే అడవి పందిని కనుగొన్నాను. నేను సహో ఫ్రెడ్ కోసం ఒకటి వేటాడడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఒక కొండ ప్రక్కన అవి తినే చోటు కనుగొన్నాను. మరియు నేను "మంచిది ఇప్పుడు సహో ఫ్రెడ్ నేను ఏమి చేయబోతున్నామో చెప్తాను" అని అన్నాను. "ఇప్పుడు మీరు ఉదయం ఆ స్థలానికి వెళ్ళండి" అని అన్నాను. మనం పగటి పూట అక్కడకు వెళ్లి, ఆ కొండ పైకి వెళ్దాము. "మరియు మీరు పగటి పూట వెళ్ళండి, నేను మరో వైపుకి వెళతాను. ఇప్పుడు నేను ఒకటి కూడా కాల్చను . . కానీ ఒకవేళ అవి ఇటువైపుకి పరుగెడితే, వాటి ఎదురుగా కాల్చి వాటిని వెనక్కి తిప్పుతాను. మరియు మీరు ఒక పెద్ద దాన్ని ఎన్నుకోండి"
"సరే", అని ఆయన అన్నాడు .
24కాబట్టి సహో. ఫ్రెడ్ అక్కడికి వెళ్లారు, మరియు సహో. జీన్ నార్మన్ (సహో. జీన్ వచ్చాడని నేను అనుకోవట్లేదు, ఆయన వచ్చాడా ?) ఆయన మరో వైపు ఉన్నాడు . మీలో చాలామందికి జీన్ నార్మన్ తెలుసు. చాలా మందికి మంచి స్నేహితుడు, మంచి సహోదరుడు. ఆయన ఇంకొంచెం క్రిందికి వెళ్ళాడు. అయితే, ఆ పందులు, ఆ ఉదయం అక్కడ లేవు. మరియు నేను సహో. ఫ్రెడ్ ని చూడగలిగాను మరియు ఆయనకు చేయి ఊపాను. ఆయన నా నుండి ఒక మైలు దూరంలో ఉన్నాడు. "అవి ఎక్కడికి వెళ్లి ఉండవచ్చు?" అని అనుకున్నాను. నేను గొప్ప లోయలోకి దిగి క్రిందికి వచ్చాను, అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టగలనేమో అని. మేము తిరిగి వెనక్కి బయలుదేరాము. అది పగటిపూట కొద్దిసేపటికే సూర్యుడు పైకి రావడం ప్రారంభించాడు.
25నేను పెద్ద అగాధము గుండా వెళ్ళాను, ఓహ్, మై, మరియు వందల అడుగులు, ఆ లోయలు పెద్ద గోడలు, గొప్ప రాళ్ళూ ఉన్నాయి. అది ఒక రకముగా…… సూర్యుడు పైకి వస్తున్నాడు. ఏడు గంటల సమయములో అని ఉహిస్తున్నాను. మరియు నేను అక్కడ కూర్చుని చూస్తున్నాను. నేను నా ప్యాంట్ కాలి మీద పల్లేరు కాయలు అంటుకోవడం చూసాను. మరియు నేను తెలుసా "అది చాలా వింతగా కనిపిస్తుoది" అన్నాను. మీకు తెలుసా ప్రభువు యొక్క దూత నాతో చెప్పింది, "టుసాన్ ఈశాన్య దిశలో నలభై మైళ్ళ దూరంలో ఉంటానని పల్లేరు కాయను నా ప్యాంట్ నుండి లాగుతానని" ప్రభువు దూత నాతో చెప్పింది. నేను దానిని చూశానని మీకు గుర్తుందా? మరియు నేను "అది వింతగా ఉంది" అన్నాను. దానిని నేను పట్టుకొనియున్నాను.
26మరియు నేను పైకి చూసినప్పుడు, ఐదువందల గజాల దూరంలో ఉన్న ఇరవై పందులను చూసాను. ……తినుటకు వచ్చి అలా పండుకున్నాయి. "ఇప్పుడు, ఒకవేళ సహో. ఫ్రెడ్ ని పిలిచి, మరియు ఆయనను ఆ స్థలానికి తీసుకు రాగలిగితే, ఆయన ఆ పందిని పొందుకొంటాడు" అని అనుకొన్నాను. కానీ ఆయన నా నుండి ఒకటి లేదా రెండు మైళ్ళ దూరంలో ఉన్నాడు. కాబట్టి నేను "ఒకవేళ అవి నన్ను చూడకుండా ఈ చిన్న శిబిరాన్ని దాటగలిగితే, అక్కడ ఉన్న చిన్న బదరీ వృక్షం ద్వారా, నేను ఈ వైపుకి వస్తే, ఈ వైపు ఒక జింక కాలిబాట వస్తుంది . నేను అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి బయటపడగలను. మరియు ఇక్కడ ఒక చిన్న కాగితపు ముక్కను వేలాడదీయగలను. ఈ లోయలో ఏ దారులలో నుంచి బయటకు వెళ్ళాలో, నేను సహో. ఫ్రెడ్ ని సమయానికి చేరుకోగలను".
27నేను ఈ చిన్న పల్లేరు కాయను కింద పడేసి, దాని గురించి మర్చిపోయాను . మరియు కొండ మీదుగా బయలుదేరాను. చాలా సులభముగా, మరియు వెనక్కి తిరిగి చూసినప్పుడు, అవి నన్ను చూడలేదు. మరియు ఆ జింకల కాలిబాటను ఎదుర్కొన్నాను. నేను పెద్ద నల్ల టోపీ ధరించియున్నాను. నేను ఈ లోతైన లోయ ద్వారా వేగంగా పరుగెత్తడం మొదలుపెట్టాను. మరియు అప్పుడు ఇది జరిగింది.
భూమి అంతా వణికింది. రాళ్లు కిందికి దొర్లాయి, దుమ్ము అలా పైకి ఎగురుతుంది. మరియు నేను చూసినప్పుడు, ఏడు దూతలు నాకెదురుగా నిలబడి ఉన్నారు . సరిగ్గా అదేవిధముగా నేను అలా భూమి మీధ నుండి గాలిలో ఉన్నట్టుగా అనిపించింది. మొదట నన్ను ఎవరో గన్నుతో కాల్చారు అని అనుకొన్నాను. నా నల్ల టోపిని చూసి పంది అనుకొని ఎవరైనా కాల్చారేమో అని, కానీ తెలుసా అవి చాలా నల్లగా ఉంటాయి మరియు నేను అది ఏమిటి అని చూసాను. మంచిది, వెంటనే …. నా యొక్క పరిచర్య, మరియు లేఖనము, మరియు ఏడు ముద్రలు, అయిన ఏడు మర్మాలను నేను పొందుకున్నాను. చూశారా?.
REV 22:18,19
28ఎవరో నాతో ఇలా అన్నారు, "ఇప్పుడు …ఓహ్, ఆయన "మంచిది, ఇప్పుడు ఏదో ఒక రోజు ప్రభువు బహుశా (మీరు దర్శనాలను చూస్తున్నారు, సహో బ్రన్హాం )ఈ విషయాలను మీకు ప్రత్యక్ష పరుస్తాడు, మనమ oదరమూ దేవునికి దగ్గరగా ఉండవచ్చు. మరియు భాషలలో మాట్లాడటం కంటే ఇంకా వేరే వాటికన్నా గొప్ప శక్తిని మనం కలిగియుంటాము." అని చెప్పాడు .
"అది ఆలాగు కాదు" అని అన్నాను.
ఎందుకంటే, చూడండి, వాక్యం నిజం అని నేను నమ్ముతున్నాను . మరియు వాక్యం ఇలా చెపుతుంది "ఎవరైనను ఈ గ్రంధమందు ఒక సున్నా అయినను ఒక పొల్లైనను తీసివేసిన లేదా కలిపిన యెడల….." అది వాక్యాను సారముగా ఉండాలి. చూసారా? ఇవి ప్రజలు పట్టించుకోని మర్మాలు . మంచిది, అందులోనే సర్ప సంతానము, మరియు విశ్వాసి యొక్క భద్రత యొక్క నిజ నమ్మకం అనే నా యొక్క వర్తమానం వస్తుంది.
29నేను అక్కడ ప్రెస్బిటేరియన్ మరియు కొంత మంది బాప్టిస్ట్ సోదరులను కించపరచడం లేదు, ఆ మార్గములో మీరూ భద్రత కలిగియున్నారు. నేను ఇది భిన్నంగా ఉండాలని చెప్పడం లేదు, కానీ దానిని వీరు సరైన విధముగా కలిగి లేరు. చూసారా? కానీ నేను కూడా తప్పుగానే కలిగియున్నాను . కానీ ఎప్పుడైతే పరలోకము నుండి దూత వచ్చి లేఖనములో అది సరైనది అని చెపుతుందో అది నిజం. చూసారా? అది నిజం. చూడండి, అది ఎప్పుడూ లేఖనములో ఖచ్చితముగా మాట్లాడుతుంది.
30ఆ వృత్తం పైకి వెళ్ళేవరకు నేను అక్కడ చూసాను, పైకి తుడుచుకు పోవటం మొదలు పెట్టి, మరియు అవి పొగ మంచు లాగా, ఒక మర్మమైన కాంతి లాగా మారాయి . ఖచ్చితముగా అదే విధముగా ….హూస్టన్ లో తీసిన చిత్రాన్ని ఎంతమంది చూసారు?, మంచిది, అది ఇదే విధముగా ఉంది. అది ఇదే విధముగా మారింది. అది మరింత ఎత్తుకు వెళ్తూ ఉంది.
నేను సహో. ఫ్రెడ్ ని మరియు వారిని కనుగొనడానికి పరుగెడుతున్నాను. ఒక అర గంట తరువాత నేను ఆయనను చూడగలిగాను, ఆయన మరియు సహో. జీన్ చేతులు ఊపుతూ వస్తున్నారు . ఏదో జరిగిందని వారికి తెలుసు. తరువాత నేను వారిని కనుగొన్నాను. సహో. ఫ్రెడ్ అక్కడే కూర్చున్నాడు .
31అది పైకి వెళ్ళిన తరువాత, అక్కడ మెక్సికోలో ప్రవేశించిన నక్షత్ర గణితశాలలు మొదలగునవి, ఆ చిత్రాన్ని తీస్తున్నాయని నాకు తెలియదు . లైఫ్ మ్యాగజిన్ అది పైకి వెళ్లిన రీతిగానే ఆ చిత్రాన్ని ముద్రించింది. మీలో చాలా మంది చూసే ఉంటారు . ఆ చిత్రాన్ని ఆ మ్యాగజిన్ ఇలా ముద్రించింది. ఒక మర్మమైన కార్యము అది ఎక్కడ నుండి వచ్చిందో తమకు తెలియదని ముద్రించారు. అది చాలా ఎత్తులో ఉంది, అన్నీ గోళాలు మరియు అన్నిటికి మించి, అది పొగ మంచుకు చాలా ఎత్తులో, ఎందుకంటే పైకి వెళ్ళిన తరువాత అది ముప్పై మైళ్ళు ఎత్తు మరియు ఇరవై ఏడు మైళ్ళు విస్తీర్ణములో ఉoది. మీరు చూసినట్లయితే, గాలిలోని తేమ లేక మరేది అక్కడ లేదు.
MATT 7:6
32మరియు వారు ఒక విమానం అనుకున్నారు, కాబట్టి వారు అన్ని ప్రదేశాలను తనిఖీ చేసారు. అక్కడ కిటికీలు మొదలగునవి కదిలిపోవడంవల్ల కూడా ఆరోజు విమానాలు లేవు . అదే విషయం పత్రికలో ఉంది. మరియు అదే విధముగా కొనసాగింది.
ఇక్కడ సైన్సు మ్యాగజిన్ లో అది ఏమిటి అనే విషయాన్ని అర్ధం చేసుకోలేకపోయారని ఉన్నది. అదేమిటో వారికి తెలియదు.
టుక్సన్ విశ్వవిద్యాలయములో ఉన్న నా స్నేహితుడు మరుసటి రోజు అక్కడికి వెళ్లి దీని గురించి వారితో మాట్లాడినప్పుడు, "అది ఏమిటో మాకు అర్ధం కాలేదు" అని చెప్పారు .
"ఏమీ చెప్పొద్దు, అది ఏ మంచి చేయదు. మీ ముత్యములను పందుల ముందు వేయవద్దు" అని అన్నాను. చూసారా? అది సంఘమునకు, మరియు ఏర్పరచబడిన వారి కొరకు, మరియు పిలువబడిన వారి కొరకే .
33ఆ పై ప్రతీ ఒక్కరు వచ్చి సహో. "బ్రన్హాం, మీ చిత్రాన్ని ఇక్కడ చూసాం ఇది చూసాం. నేను …." అది ఎలా ఉందో మీకు తెలుసు. ఈ సహోదరుడు కలిగియున్న ఆ …….అది ఏది …క్షమించండి (సహో బ్రన్హాం చిత్రాన్ని తీసుకొనివచ్చారు ). ఇక్కడ అది ఊడ్చుకుపోవటం ప్రారంభమైనది. వాస్తవానికి ఇది కుడి వైపున ఉంది మరియు ఇది జరగడానికి ముందే "నాతో మాట్లాడింది ఘనుడైన దేవదూత, ఆయన కుడివైపున ఉన్నారు," అని చెప్పడం మీకు గుర్తుందా.? ఆయన రెక్కలు వెనుకవైపుకి ఉన్నాయి. అది పైకి వెళ్తున్నప్పుడు ఖచ్చితముగా దేవదూత రెక్కలే చూసారా? కాబట్టి వారు చిత్రాలు తీయడం మొదలు పెట్టారు . ఎందుకంటే అది చాలా మర్మయుక్తముగా ఉంది. కానీ చివరి చిత్రం అది ఆకాశములోనికి ఏర్పడినప్పుడు, ఇది కనిపించిన విధముగా జత చేయబడి oది. వారు చూడటం ప్రారంభించినప్పుడు, అది ఎలా పైకి వెళ్లిందో చూడండి . చూసారా మరియు అది ఏర్పడినప్పుడు, నిజమైన ప్రధాన మరియు చివరి చిత్రం వస్తుంది .
MATT 24:7•
MARK 13:8•
LUKE 21:11
34అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎటువైపుకి వెళ్లిందో వారికి ఇప్పటికీ తెలియదు . విజ్ఞాన శాస్త్రం దాని గురించి పూర్తిగా స్తంభించిపోయింది. ఏం జరిగిందో తెలియక, కానీ మనకు తెలుసు "పరలోకములో ఇట్టి సూచనలు ఉండును". మరియు ఆయన ఈ కార్యముల గురించి వాగ్దానం చేసాడు . చూసారా ? మరియు దీనిని తీయడానికి అనుమతించబడిన ఏకైక విషయం ……
నాకు ఈ ఉదయ కాలం ఇక్కడ స్థానిక సహోదర సహోదరీలారా ఒకవేళ నాకే అన్నీ తెలిసినట్లు నేను మీతో మాట్లాడితే, నన్ను క్షమించండి . అలా ఉండాలని నా ఉద్దేశ్యం కాదు . ఈ ఉదయ కాలం తెలివైన వారి యెదుట పండితుల యెదుట నేను మాట్లాడుతున్నాను. నేను చదువు రాని నిరక్షరాస్యుడను. నేను నా లేఖనాలను కూడా సరిగ్గా ఉచ్చరిoపలేను. ఈ ఉదయం చదవడానికి ఒక అధ్యాయము కలిగి యున్నాను. ఇక్కడున్న సహోదరులలో ఒకరు నా కొరకు దానిని చదవమని కోరాను. ఎందుకనగా దానిలోని పేర్లను కూడా నేను ఉచ్చరిoపలేను. నా అంశము 1 వ దినవృత్తాoతములు 13 (సహో జాక్ మీరు కోరుకొంటే దానిని తీసి చదవవచ్చు .)
మరియు నేను చురుకైన వారితో మాట్లాడుతున్నానని తెలుసు. కానీ సహోదరులారా, నా నిరక్షరాస్యతను చూడకుండునట్లు ఉండడానికి ఈ కార్యాలు చేయబడ్డాయి, కానీ నేను నిజం చెప్పుతున్నాను అని నమ్మండి. దేవుడే మీకు నిజం చెప్పుతున్నాడు. అది నిజం. చూసారా ?
35ఇప్పుడు, మరియు ఎప్పుడైనా నేను సంఘశాఖల గురించి మాట్లాడినప్పుడు, మీ పట్ల అంత కఠినముగా ఉండటం నా ఉద్దేశ్యం కాదు. మరియు ….లేదు, మీరు సంఘానికి వెళ్లకూడదని నా ఉద్దేశ్యం కాదు. మీరు మీ సంఘానికి వెళ్ళండి. మీరు అలా చేయవలసినదే. కానీ వారితో వారి సంస్థలతో కలవవద్దు. ఎందుకంటే మీకు లేఖనముల ద్వారా నిరూపిస్తాను, అది మృగం యొక్క ముద్ర. మరియు మీరు కేవలం గుర్తుంచుకోండి, అది ముద్ర .
36నేను ప్రసంగిస్తున్నాను ….నేను బ్రదర్ జాక్ సంఘములో ప్రసంగించలేకపోవచ్చు. ఆయన , "ముందుకు సాగండి" అని చెపుతాడు. కానీ నేను గుడారానికి వెళ్తున్నాను. అది సుమారు నాలుగు గంటల వ్యవధి గల అంశం. మరియు నా అంశం ఏమిటంటే, ఆదిలో ఉన్న మృగము మరియు అంతములో ఉన్న మృగము, సర్పము యొక్క జాడ ద్వారా. చూసారా? సుమారు నాలుగు గంటలు పడుతుంది. నేను నా లేఖనాలన్నింటిని సిద్ధం చేసుకున్నాను. ప్రారంభములోనున్న మృగము అనగా ఏదేను తోటలో మృగముగా ఉన్నవాడే, అంతములోని మృగముకూడా. మరియు అతను ఒక మతపరమైన వ్యక్తి మరియు ఒక సంఘ శాఖ (సంఘ శాఖను చేసిన వాడు కూడా వాడే )అని చూపించగలను. మరియు అదే జాడతో వస్తాడు మరియు లేఖనముల ద్వారా ఇదే అని నిరూపించగలను. పరిశుద్ధాత్మ దానిని మరుసటి రోజు నాకిచ్చే వరకు నాకు తెలియదు .
37ఇప్పుడు, ఇందులో నేను ఒక రోజు దీనిని చూస్తున్నాను. మరి ఏదో నాతో చెప్పింది ….దాన్ని చూస్తూ, నేను అనుకున్నాను …..సహో. హికర్సన్ నా ట్రస్టీలలో ఒకరు …లేదా జెఫర్సన్ విల్ వద్ద ఉన్న సంఘ పెద్దలు …ఒకవేళ నేను సంఘానికి వెళ్లడాన్ని నమ్మకపోతే, నేను ఎందుకు సంఘాన్ని కలిగిఉన్నాను? మేము దేశమంతటా దానిని కలిగి యున్నాము ..గత రాత్రి ఫోన్ ద్వారా వర్తమానం వినియున్నారు, ప్రతీ రెండు వందల చదరపు మైళ్ళకు ఒకటి నా సంఘాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు, ఈ చిత్రం, నేను దాన్ని నిలబడి చూస్తున్నాను. మరియు ఏదో …నేను నా గదిలో నిలబడి యున్నాను. ఏదో నాతో "దానిని కుడి వైపుకి త్రిప్పు" అని చెప్పింది. నేను విన్నాను ….
మీలో కొందరికి మానసికముగా కలత చెంది మాట్లాడుతున్నట్లుగా, అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ చూడండి, నేను గత రాత్రి, మీతో చెప్పినట్లుగా ఈ గొప్ప విషయాలన్నీ పాండిత్యం కలవి. నేను వాటికి వ్యతిరేకిని కాను. గుర్తుంచుకోండి, మనం కలిగియుండాలి …మీ పిల్లలను పాఠశాలకు పంపండి. మరియు విద్యను ఇతరమైనవి పొందనీయండి, కానీ నేను ఇప్పుడే చెప్పుతున్నాను, రాబోయే ప్రపంచములో అది వారికీ ఏ మంచీ చేయదు, ఎందుకంటే ఇంతకు మించి మరో నాగరికత ఉంటుంది . ఆ నాగరికతకు ఏది ఉండదు ….దానిలో ఏ పాఠశాలలు ఉండవు, దానికి ఏ మరణం ఉండదు, అందులో ఏ పాపం ఉండదు, అయితే ఇందులో అవన్నీ ఉన్నాయి . మనము ఎంత నాగరికత పొందుకొంటే మరిన్ని మరణాలు జతచేయబడతాయి. చూసారా? అయితే అక్కడ ఉండే నాగరికతలో ఈ మరణాలు ఉండవు. కానీ ఇప్పుడు మనకు పాఠశాల ఉండాలి, బట్టలు ధరించాలి, మనం …
38ఈ ఉదయం నేను సాతాను యొక్క ఏదేను గురించి మాట్లాడబోతున్నాను . మీలో చాలా మందికి ఈ టేప్ దొరికింది, సాతాను యొక్క ఏదేను. అతను మరొక ఏదేను తోటను చేసుకొన్నాడు. మరియు అతను ఆరువేల సంవత్సరాలు తీసుకున్నాడు, దానిని తయారుచేయటానికి, ప్రారంభములో దేవుడు చేసిన విధంగానే. దేవుడు తన ఏదేను తోటను చేసాడు. సాతాను దాన్ని భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు సాతాను తన స్వంత ఏదేనును చేసుకున్నాడు. మరియు దేవుడు దానిని నాశనం చేయబోతున్నాడు. అది నిజం. మరియు తన సొంతదానిని అక్కడ పెట్టబోతున్నాడు.
నాతో ఏదో, "కుడి వైపుకి త్రిప్పుము", అని చెప్పింది.
"నేను దానిని సరిగానే చూస్తున్నాను", అని నేను అనుకున్నాను.
నాతో "కుడివైపుకి త్రిప్పుము", అని చెప్పింది. చూసారా?.
నేను, "ఆ స్వరము నాతో కుడివైపుకి త్రిప్పమని చెప్తుందేమో", అని అనుకున్నాను. మరియు నేను అలా చేసినప్పుడు, అది ఏమిటో చూసారా? హాఫ్ మాన్ గీసిన ముప్పై మూడు సంవత్సరాల వయస్సుగల క్రీస్తు యొక్క శిరస్సు. ఇక్కడ చూడండి అతని నల్లని గడ్డం, అతని ముఖం, కళ్లు, ముక్కు, మరియు మిగతావన్నీ. అతని జుట్టు లోని భాగాన్ని ఇక్కడ చూడండి. మరియు దేవుడు నిజమైన వాడు (నిజం ) అన్న వర్తమానాన్ని చూపించటానికి ఆయన ఆ తెల్లని దూత విగ్గుని తలకి ధరించుకున్నట్లుగా ఉంది. ఆయనే విశ్వం యొక్క ఉన్నత న్యాయాధికారి, భూమి మరియు పరలోకం యొక్క ఉన్నత న్యాయాధిపతి. ఆయన దేవుడు, మరేది కాదు కానీ దేవుడు. ఆయన దేవుని కుమారుడు అని పిలవబడే మానవ రూపములో వ్యక్తికరించబడిన దేవుడు. కుమారుడు ఒక మానవుడు అయి ఉన్నాడు. మరియు ఒకవేళ అది మన వర్తమానమును సరిగ్గా చూపించకపోతే లేఖనాల ద్వారా, సేవలో, మరియు ఆయన ఉనికిద్వారా, ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే అయ్యున్న రీతి ద్వారా గుర్తించబడింది. అందువల్ల ఆ ఏడు ముద్రలు నిజం, సహోదరులారా. మీరు వారితో అంగీకరించకపోవచ్చు కానీ ఒక సారి మీ హృదయాలు తెరచి కూర్చుని ధ్యానించండి, ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి…..
39నేను దీనిని ప్రసంగించే ముందు ఒక సమయములో సహో జాక్ ని పిలిచి మాట్లాడాను . "ఈ తెల్లని విగ్గు ఏమిటని"
ఆయన "సరే సహో. బ్రన్హాం, అది ఆయన పునరుత్ధానం తరువాత మహిమపరచబడిన శరీరం అని ప్రకటిస్తున్నాను" అని అన్నాడు. నేను సహో. జాక్ తో మాట్లాడుతున్నాను. తత్వ శాస్త్రం పై సహో. మూర్ మరియు వేయిల్ చేసే బోధనలపై ఆధారపడినంతగా ఈ ప్రపంచములో ఇంకా ఎవరిపైనా ఆధారపడినట్టు నాకు తెలియదు. నిజమైన తత్వవేత్తలు, వారు అన్ని రకాల పుస్తకాలను చదువుతారు. మరియు ప్రతిదానినీ విభిన్న కోణాలలో చదువుతారు . మంచిది, కానీ, దానితో కూడా నా తోటి స్నేహితుడు అయినప్పటికీ, కానీ దానిని స్వీకరించలేకపోతున్నాను. అక్కడ ఏదో ఉంది నేను వారు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోయాను.
HEB 13:8
40ఆపై దీని విషయానికి వస్తే, అది ఏమిటో, అని నేను చూస్తున్నాను. ఇక్కడ ఆయన నల్లని గడ్డం. మీరు దీనిని చూశారని నేను అనుకుంటున్నాను. చూశారా? మరియు ఆయన నల్లని గడ్డం మరియు నల్లని జుట్టు, ఆయన కళ్ళు, ముక్కు ప్రతీది, మరియు ఆయన జుట్టులోని భాగం ఇటు వైపుకి రావడం కూడా ఖచ్చితముగా ఉంది. ఆయన దేవుడు! ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరియు ఈ లైఫ్ మ్యాగజిన్ అనే పత్రిక, ఇది ఎప్పుడు జరిగిందో నేను మర్చిపోయాను. ఓహ్ ఎవరైనా పత్రిక కావాలనుకొంటే అది మే 17 వ తారీఖు 1963 లో బయటకు వచ్చింది. అది రాక్ ఫెల్లర్ మరియు అతని భార్య దాని వెనుక భాగములో ఉన్న అదే చిత్రం. మరియు ఇది న్యూసైన్సు మ్యాగజిన్". ఇది ఇప్పటికీ ఒక మర్మముగా ఉంది".
41నేను వీటిని దేనికోసం చెప్పాను? మేము చెప్పటానికి ప్రయత్నిస్తున్న విషయాల గురించి ఇది మీకు కొద్దిగా అవగాహన వస్తుందని, దేవుడు పరలోకములో మరియు భూమిమీద సరిగ్గా గుర్తించబడాలని. ఈ వివేచనలు, దర్శనాలు, ఇలాంటి అనుకరణలు చాలా మనకు ఉన్నాయి. ప్రతి సమయములోనూ కలిగియున్నాం. కానీ గుర్తుంచుకోండి, నకిలీ బూటకపు డాలర్ ఉండడానికి ముందు, మొదట నిజమైన డాలర్ ఉండాలి. మొదట నిజమైన డాలర్ ఉండాలి, ఆపై అవి దాని నుండి తయారవుతాయి. మనకు నిజమైన మోషే మరియు నిజమైన అహరోనులు ఉన్నట్లు, వారి తరువాత మనకు యన్నే మరియు యంబ్రేను కలిగియున్నాము. ఇవన్నీ ఎలా వస్తున్నాయో చూసారా ? వారు దానిని చూసి, నిజంగా అసలైనది ఉన్నప్పుడు వారు దాని ప్రతిరూపాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అది నిజం. వారికి హాని చేయడానికి లేదా దిగజార్చడానికో లేదా తప్పుగా ఉంచడానికో చెప్పడం లేదు, కానీ కేవలం నిజం తెలుసుకోవడానికే .
42నేను వృద్దుడిని అవుతున్నాను, మరియు నా సమయం ఇంకా ఎక్కువ లేదని నాకు తెలుసు . ఒకవేళ దేవుడు ఆలస్యం చేసినట్లయితే, నేను ఇంకొంత కాలం ఉండగలను, కానీ ఏదో ఒక రోజు ఈ హృదయం దాని చివరి చప్పుడు చేయబోతుందని, మరియు నేను మరణం అనే గొప్ప, చీకటి గదిలోనికి ప్రవేశిస్తానని నాకు తెలుసు. కానీ అది వచ్చినప్పుడు, వెనక్కి తిరిగి చూసేవి, పశ్చాతాపం చెందే కార్యాలు ఏవీ నాకు వద్దు. ఆ సమయం వచ్చినప్పుడు, దేవుని దయ వలన శుభ్రముగా మరియు స్వచ్ఛముగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆయన నీతి వస్త్రాలతో నన్ను చుట్టుకోవాలనుకుంటున్నాను. నేను అక్కడికి ప్రవేశించినప్పుడు, ఈ ఒక్క విషయం నా మనస్సులో ఉంది. ఆయన పునరుద్ధాన శక్తిలో నేను ఆయనను తెలుసుకున్నాను. మరియు ఆయన పిలిచినప్పుడు, నేను మృతులలో నుండి లేచి వస్తాను. మరియు ఆయనతో నిరంతరం జీవిస్తాను. మరియు ప్రతీ మనిషిని నడిపించటమే ఇక్కడ నా ఉద్దేశం. మీ వేదాంత శాస్త్రములు లేదా ఏది కూడా మార్చడానికి కాదు కానీ ఈ దినం యొక్క దేవుని వాగ్దానంపై మీ విశ్వాసాన్ని పెంచడానికే .
ఇప్పుడు మనం ప్రార్ధించుకుందాము.
43ప్రియమైన దేవా, ఈ ఉదయం మేము కృతజ్ఞత గల ప్రజలం, అయినప్పటికీ ప్రభువా, మేము ఒక చీకటి ప్రపంచములో జీవిస్తున్నాము ….ఈ ఉదయం మాలో ఒకరు కూడా లేరు, తండ్రీ, కానీ మాకు మీతో దగ్గరగా నడవటమే కావాలి అనిపిస్తుంది. మమ్మల్ని మృదువుగా చేయగల మరియు సరళంగా మార్చగల మీ స్పర్శను మా జీవితములో మేము కోరుకుంటున్నాము. తద్వారా మీరు ఎప్పుడైనా మమ్మల్ని మార్చవచ్చు, మమ్మల్ని దేవుని కుమారులు కుమార్తెలుగా మలచండి . అదే ఇక్కడ మా ఉద్దేశ్యం తండ్రీ. మీ ముందు జీవించడానికి ప్రయత్నించి, మరియు మీ వాక్యాన్ని పొంది మరియు దానిని స్త్రీ పురుషులతో మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం అయి ఉన్నది. వేరే వ్యక్తిగా ఉండడం కాదు కానీ నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయనను గౌరవించుట కొరకే . దానిని అనుమతించు ప్రభువా.
44ఈ ఉదయం దేశవ్యాప్తముగా ఫోన్ ద్వారా అనుసంధానం చేయబడి వింటున్నారు. మా స్వరం వినుచున్న ఏ వ్యక్తి కూడా మీ పునరుత్థాన శక్తిని తెలుసుకోకుండా ఆ గొప్ప గదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ దేశ వ్యాప్తముగా పాపులున్నట్లయితే లేదా ఈ భవనములో, ఈ గొప్ప సభా మందిరములో ఈ ఉదయం ఇక్కడ కూర్చుని ఉన్నట్లయితే, మీ గురించి తెలియని వారు ఉంటే, ఈ రోజు వారి మనస్సాక్షి కదిలి, మేల్కొని మరియు మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఏ నిమిషం పిలవబడతామో వారికీ తెలియదని వారు గ్రహిస్తారు. మరియు ఒకవేళ మన పేరు ఇంకా ఆ సంఘ శాఖల ( స్టాక్) పుస్తకములో ఉంటే, మనం సమాధి చేయబడినట్లే . కానీ ఒకవేళ మన పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంధములో ఉంటే అప్పుడు మనము రక్షించబడినవారము.
మరియు ప్రభువా, ఆ జీవం చిగురులోనుండి పుప్పొడి లోకి, దాని నుండి పొట్టులోనికి, దాని నుండి గింజలోనికి ప్రవహించినట్లుగా, ఈ ఉదయం మేము దాని గుండా వెళుతుండగా, ఒకవేళ ఏదైనా జీవితం ఆ కాండములోనే మిగిలిపోయినట్లయితే, బయటకు తీసుకు రండి. ప్రభువా అది గింజ యొక్క కదలికను అనుసరించాలని యేసు నామములో అడుగుచున్నాము. ఆమెన్
1CH 13:1-14
45ఎక్కువ సమయం తీసుకున్నoదుకు క్షమించండి. రేడియోలోనూ, ఫోన్ లోనూ ఈ కూడిక వెళ్తుందన్న సంగతి నేను మర్చిపోయాను.
ఇప్పుడు మన వాక్య పఠణము కొరకు త్రిప్పుదాం. సహో. జాక్ మీ బైబిల్ అక్కడ ఉందా ?. నా లేఖనాన్ని వెతుకుతుండగా, సహో. జాక్ ను ఈ లేఖనం చదవమని అడుగుతాను ఎందుకంటే నేను ఆ పేరులను ఉచ్చరించలేను . అయితే సరే 1 దినవృత్తాoతములు 13 లో.
దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను.
ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మనయొద్దకు తెచ్చుకొందాము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.
కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకు నుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.
కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును
యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.
వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.
దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు,
సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.
వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా
యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను.
యెహోవా ఉజ్జాను వినాశము చేయుటచూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ ఉజ్జా అని పేరు.
ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది-దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.
దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.
MARK 7:1-7
46సహో మూర్ నా కోసం ఈ లేఖనాన్ని చదివినందుకు ధన్యవాదములు. క్షమించండి, నేను దానిని స్వయముగా చదువలేకపోయాను. కానీ నేను దానిని చేయలేను.
ఇప్పుడు మీ గ్రంధాలను మార్కు 7:7 కు త్రిప్పమని కోరుకుంటున్నాను. మార్కు సువార్త ఏడవ అధ్యాయములోని మొదటి ఏడు వచనాలు చదువుకుందాం.
యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి
ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుటచూచిరి. పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు.
మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు, నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియు గాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు.
అప్పుడు పరిసయ్యులును, శాస్త్రులును,-నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి.
అందుకాయన వారితో ఈలాగు చెప్పెను- ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే.
ప్రార్ధించుకుoదాము.
47ప్రియమైన దేవా, ఇప్పుడు మీ వాక్యాన్ని ఘనపరచండి. అది ఉద్దేశించిన దానిని నెరవేర్చండి. దానిని మాట్లాడటానికి సాధనముగా మమ్మును వాడుకోండి. మరియు మా చెవులు మీ నుండి వినుటకును, మరియు మా హృదయాలను దానిని స్వీకరించడానికి ఉపయోగించండి. దేవుని మహిమ కొరకు యేసు నామములో అడుగుచున్నాము ఆమెన్.
48ఇప్పుడు, కొద్ది క్షణాలు నా అంశం ఇది ….
ఈ ఉదయం మనము టెలిఫోన్ ద్వారా దేశవ్యాప్తముగా అనుసంధానం చేయబడి ఉన్నాం. మరియు నా మంచి స్నేహితుడు రాయ్ బోర్డర్స్ వినుచున్నారని అర్ధం చేసుకున్నాను. గత రాత్రి గురించి నిరుత్సాహపడ్డాను. మనము రేడియోలో ఉన్నామని నేను మర్చిపోయాను …లేదా వింటున్నారని మర్చిపోయాను . రాయ్ నీవెక్కడున్నా ఒకవేళ సాన్ జోస్ లో ఉన్న సంఘములో ఉన్నట్లయితే, లేదా సహో. మెక్ హ్యూగ్స్ సంఘములో అయినను లేదా ఎక్కడున్ననూ భయపడకుము, నా సహోదరుడా, అంతా సరి అవుతుంది. ఊరక కూర్చో. ఆయన నాకు తెలియచేస్తాడు, విసుకవద్దు, కుమారుడా, దేవునిపై విశ్వాసము ఉంచుము.
49ఈ ఉదయం నా అంశము: "దేవుని చిత్తం లేకుండా దేవునికి సేవ చేయ ప్రయత్నించటం". ఇప్పుడు అది ఒక వింత వచనం మరియు దేవుడు మనకు బయలుపరుస్తాడని నేను నమ్ముచున్నాను. గుర్తుంచుకోండి. దేవుని చిత్తం లేకుండా దేవునికి సేవ చేయటానికి ప్రయత్నించుట. ఇప్పుడు, అది చాలా వింతగా అనిపిస్తుంది కానీ దానిలో దేవుడు మనకు సహాయం చేయగలడు .
50ఈ ఉదయం నేను మరొక విషయం చెప్పాలనుకుoటున్నాను. నా స్నేహితుడు చాలా ప్రియమైన స్నేహితుడు, ఒక యవ్వనస్థుడు, మన మధ్యలో ఉండటం చాలా సంతోషముగా ఉంది . ఇప్పుడు మీలో చాలామందికి ఎవరైతే రేడియో ద్వారా విoటున్నారో వారికి ఆయన ఎవరో తెలుసు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు, 93సoవత్సరాలు. 93 సoవత్సరాలుగల సహో. బిల్ డచ్ నా ముందు కూర్చుని యున్నారు.
చాలా సoవత్సరాల క్రితం "అతను జీవించలేడు" అని డాక్టర్ చెప్పారు. (ఆయన ఇక్కడ కూర్చోవటం ఇప్పుడే గమనించాను )ఆక్సిజన్ గుడారం క్రింద ఆయన యొక్క ప్రియమైన భార్య నన్ను పిలిచి, "సహో. బ్రన్హాం నీవు నీ స్నేహితుని సజీవముగా చూడాలనుకొంటే, మీరు ఒకసారి రావడం మంచిది" అని చెప్పింది.
51నా కారు చక్రాలలో ఒకదానికి ప్రక్కన చీలింది. మరొక చక్రం ఊడి పడింది. ఆయనను కలసుకొనే ప్రయత్నంలో నా కారు టైర్లు చీల్చబడ్డాయి . అతనిని కలవడానికి నేను పెట్రోల్ బంక్ నుండి విశ్రాంతి గది నుండి బయటికి నడుస్తూ వస్తుండగా నేను ఓహియోలో ఆగిన దగ్గరనే ఒక దర్శనం చూసాను. మరియు సహో డాచ్ అక్కడ నిలబడి యున్నాడు తన చేయి చాపి చర్చి దగ్గర నిలబడి యున్నాడు. ఇది మారిపోయింది మరియు మీరు రావడాన్ని చూసి నా చేతిని ఊపాను. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అని ఆయనతో వెళ్లి, చెప్పుము అని చెప్పబడింది.
అతను అప్పటికి తొంబై సoవత్సరాలు వయస్సు గలవాడు. గుండెలో అడ్డంకితో ఆయన గుండె పోటును కలిగియున్నాడు. పూర్తిగా ఆయన గుండె చెడిపోయింది చాలా తెలివైన వైద్యుడు ….ఆ మనుష్యుడు ఆయనకి ఇది అవసరం లేదు. వద్దు, నేను చెప్పను. ఆయన కోరిన ఏ వైద్యుడినైనను పొందగలిగే స్తోమత ఆయనకు ఉంది. అతను చక్కని యూదుడైన వైద్యున్ని కలిగియున్నాడు . ఆ వైద్యుడు నన్ను ప్రవేశ గదిలో కలసి "అతను జీవించుటకు ఏ మాత్రం అవకాశం లేదు" అని చెప్పాడు.
నేను లోపలికి వెళ్లి ఆక్సిజన్ పెడుతున్న గుడారములోకి నా చెయ్యి చాపి, నేను "బిల్, నా మాట వినిపిస్తుందా?" అని అడిగాను. ఆయన తలను ఊపాడు. నేను "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు ఇప్పుడు చనిపోరు" అని చెప్పాను.
52అప్పటి నుండి ఒక వారం తరువాత, నేను వర్తమానం ప్రసంగించడానికి బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు, సహో. డచ్ ఇక్కడకు భవనం గుండా నడుస్తూ వచ్చాడు. మరియు నేను ఫర్ రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు లూయిస్ విల్ వద్ద ఉన్న బ్లూ బోర్ దగ్గర, అతడు కారులో నుంచి దిగి వీధిలో తన చేయి చాపి -సరిగ్గా ప్రభువు సెలవిచ్చినట్లుగా నడుస్తూ వచ్చాడు మరియు అది మూడు నాలుగు సంవత్సరాల క్రితం ష్రీవ్ పోర్ట్ పట్టణములో మన మధ్యలో కూర్చుని యున్నాడు. (దేశాన్ని దాటి విమానంలో కాదు కారులో ) "డచ్ సహోదరుడా దేశవ్యాప్తముగా ప్రతీచోట నుండీ పుట్టినరోజు శుభాకాంక్షలు". దేవుడు నిన్ను దీవించును గాక!
53ఆయన త్రిత్వాన్ని వెంబడించిన తరువాత, …ఒకానొక మొదటి కూడికలో నేను ఆయనకు బాప్తిస్మం ఇచ్చాను. బ్రదర్ బాంక్స్ వుడ్ తన బట్టలు అతనికి వేసుకోవడానికి ఇచ్చాడు. ( మీరు చూస్తున్నట్లుగా ఆయన కొంచెం గంభీరమైన ఆకారము గల వ్యక్తి). మరియు అతడు బాప్తిస్మము తొట్టిలోకి వెళ్ళినప్పుడు, సుమారు ఆయనకి ఎనభై ఐదు లేదా తొంబై స oవత్సరాలు వయస్సులో నేను ఆయనకు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాను. ఏదో ఒక భద్రతను కనుగొనే వరకూ తను ఎప్పుడూ సరైన అనుభూతిని కలిగి లేడని చెప్పాడు. అప్పుడు అతడు ఎప్పటికీ వృద్ధుడుగా అవ్వని ఒక పుట్టినరోజుని పొందుకున్నాడు. అది నిజం, ఆ గొప్ప రాజ్యం. ఆయన ప్రభువు రాకడను కూడా చూడడానికి జీవించాలని ఆశిస్తున్నాడు . అది జరగవచ్చు కానీ ఒకవేళ ఆయన నిద్రపోతే, మరియు మేము ఆ సమయములో మేల్కొని ఉంటే, ఆయన మొదట వస్తాడు. సరే కాబట్టి సహో. డచ్ దానిని కోల్పోవుటకు ఇప్పుడు ఏ అవకాశం లేదు. సరిగ్గా ఆ వరుసలోనే నీవు ఉన్నావు. అక్కడే ఉండండి నా సహోదరుడా, దేవుడు మిమ్మును దీవించును గాక . అలాంటి మంచి సహోదరుడిని బట్టి, మరియు ఆయనకు ఇచ్చిన ఇన్ని సంవత్సరాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
54దినవృత్తాoతములు గ్రంధములో: ఆయన చిత్తము లేకుండా ఆయనకు సేవ చేయడానికి ప్రయత్నిoచుట. దేవుడు సార్వభౌముడు, మొదట, మనము దానిని అర్ధం చేసుకోవాలి. ఈ రోజు ప్రజలు మనం ఎందుకు ఉజ్జీవం కలిగి ఉండలేకపోతున్నాము అని ఆశ్చర్యపోతున్నారు. దేవుని సార్వభౌమత్వాన్ని మీరు నమ్మలేకపోతున్నారా? చూడండి, బైబిల్ ఈ విధముగా మాట్లాడుతుంది .
నేను నా మంచి సహోదరుల బృoదముతో చర్చిస్తున్నప్పుడు, చాలా కాలం క్రితం కాదు, మరియు ఆ బాప్టిస్ట్ సహోదరులైన వారు "సహో.బ్రన్హాం మనం వాక్యాన్ని, వాక్యం వెంబడి వాక్యం, పేజీ వెంబడి పేజీ, అక్షరం వెంబడి అక్షరముగా తీసుకున్నప్పుడు మాత్రమే ఉజ్జీవం కలిగియుంటాము" అని అన్నారు.
మరియు నేను "పేజీ వెంబడి పేజీ, నేను కూడా నమ్ముతాను" అని అన్నాను . "వారు కూడా కాలములగుండా ఈ విధముగా చేయటానికే ప్రయత్నిస్తున్నారు" అని అన్నాను .
ఆయన "కానీ గ్రీకు ఏమి చెపుతుందో, మనం వాక్యం యొక్క గ్రీకు వివరణ కనుగొనాలి" అని అన్నాడు.
"నేను ఎక్కువగా చదవలేదు కానీ, సంఘము యొక్క చరిత్ర, నైసియా సమావేశము, మరియు పూర్వపు నైసియా సమావేశము, మరియు నైసియా తండ్రుల చరిత్ర మొదలగునవి చదువుతున్నప్పుడు, వారు గ్రీకు గురించి వాదన కలిగియున్నారు. అది రెండువేల సoవత్సరాల క్రితం. ఒకరు ఇది దీని అర్థం అని, మరొకరు 'దీని అర్థం అది అని', ఈ గ్రీకు పదానికి అర్థం ఇది అని" అన్నారు.
MATT 11:25•
LUKE 10:21
55మన భాషలాగే, వాక్యము కూడా చూడండి. "సీ" అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, మీరు "నీరు ఉండే స్థలం", లాగ ఉద్దేశించి ఉండచ్చు "నేను అర్ధం చేస్కుంటాను" లేదా ఇలాంటివి అనేకములు. "బోర్డ్", "బోరు బావిని త్రవ్వుట", "నడచుట," లేదా "మీరు నాకు విసుకు పుట్టించారు," లేదా "మీరు నేను ఆడేదానికి వెల చెల్లించారు" లేదా ఈ పదాలకి అనేకమైన అర్ధాలు ఉండవచ్చు. మరియు ఆ చిన్న అచ్చులు మరియు మరెన్నో పూర్తి అర్ధాన్ని మారుస్తాయి. కాబట్టి మీరు ఎప్పటికీ అలా చేయరు. దేవుడు ఆ విధంగా వ్రాశాడు, ఎందుకంటే …
వాక్యమంతా ప్రేరేపించబడింది, మరియు ఆయన " తండ్రీ, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి నేర్చుకునే పసిబాలురకు బయలుపరచినందుకు నీకు కృతజ్ఞతలు," అని అన్నాడు. నిన్న సాయంత్రం నేను చెప్పినట్లు అది ఆయనకు వచ్చిన బయలుపాటు. "పసిబాలురకు బయలుపరుస్తాడు".
నేను ఇలా అన్నాను, "అయ్యా , అది పని చేయదు. దేవుడు అనగా సార్వభౌముడైన దేవుడు పంపిస్తేనే గాని ఉజ్జీవం రాదు. తన పేరును కుడా సంతకం చేయలేని ఒక వెర్రివాడిని తీసుకుని చేయగలడు- గ్రీకు గురించి పక్కనపెడితే ఆయన మంచి ఆంగ్లం కూడా మాట్లాడలేడు".
56పెంతెకొస్తు దినాన పేతురు బోధించిన సమయములో ఆయన అదే చేశాడు. అతను తన పేరును కుడా సంతకం చేయలేడు మీకు తెలుసా, అజ్ఞాని మరియు నేర్చుకోని వాడు. కానీ దేవుడు మన మేధః ఆలోచనకు వింతైన రీతిలో పనులు చేస్తాడు. అదే ఆయనను దేవుడుగా చేస్తుంది. ఒకవేళ ఆయన తత్వ బోధకులను మరియు ప్రముఖులను మరియూ మిగిలిన వారిని కలిగి ఉంటే, వారు, "ఆ చురుకైన కయపా! మీరు చూసారా, అతను దానిని సరిగ్గా కలిగి ఉన్నాడు". అని అనుండేవారు. కానీ దేవుడు, వారి పేర్లను కుడా సంతకం చేయలేని మత్స్యకారులను పొందాడు. ఆయన తీసుకున్నది అదే. అదే దేవుడు. ఆయన ఏమీ లేనిదాన్ని తీసుకుని మరియు దాని నుండి తన మహిమ కొరకు ఏదో ఒకటి చేస్తాడు. అతను గందరగోళం తీసుకొని ఏదేనును చేశాడు. అదియే దేవుడు.
57ఇప్పుడు, ఎవరైన ఉజ్జీవం కొరకు యాంత్రికమైన కార్యాలు కలిగి ఉన్నారు అంటే, అది మన గొప్ప సహోదరుడు బిల్లీ గ్రాహం. కాని యాంత్రికమైనది మంచిదే, కాని అది ఎంత మాత్రమూ కదల్చదు. దానిని కదిలించడానికి గతి శక్తి కావాలి. మీరు ఒక వాహనం నిర్మించవచ్చు, దానిలో చక్కటి సీట్లు పెట్టవచ్చు, చక్కటి చిమ్ని గొట్టములను తయారు చేయవచ్చు మరియు విజ్ఞాన శాస్త్రము ద్వారా అది ఏమి చేయగలదో నిరూపించవచ్చు; కానీ కదిలించే శక్తి లేకపోతే, అది ఒక మృతమైన వస్తువు మాత్రమే.
కాబట్టి, మా పెంతెకొస్తుకు ముందు మా చివరి ఉజ్జీవములలో ఒకటైన వెల్ష్ ఉజ్జీవములో, ఉజ్జీవం ఎవరు ప్రారంభించారో ఎవరికీ తెలియదు, కేవలం కొంతమంది ప్రజలు మాత్రమే ఉన్నారు.
ఇప్పుడు, మనం అందరినీ తీసుకువస్తే… మన స్నేహితుడు బిల్లీ గ్రాహం ప్రెస్బిటేరియన్లు, మరియు లూథరన్లు, మరియు పెంతెకొస్తులు, మరియు అంతటిని ఒకచోటికి తీసుకువచ్చి, నగరంలోకి వెళ్లి మరియు అక్కడ వారు వేలాది, మరియు ముప్పై వేల మందితో ఒక గొప్ప సమావేశాన్ని కలిగి ఉంటారు. (రెండు వారాల్లో) వచ్చి వారి హృదయాలను క్రీస్తుకు ఇస్తారు; మరో రెండు వారాలు వెనక్కి వెళతారు మరియు మీకు ఒకరు కూడా లభించరు. చూడండి, ఇదే నేను చెప్పిన యంత్రికమైనది. కానీ దేవుడు తన సార్వభౌమ కృపలో కొంతమంది వెర్రి వారితో మాట్లాడనివ్వండి, చెప్పాలంటే, ఏమీ కాని కొంతమంది, తన ఆత్మను పట్టణంలో కుమ్మరింప చేసినప్పుడు, మరియు పురుషులు పనికి వెళ్లలేరు, మహిళలు అంట్లు కడగలేరు, పని మనుషులు వారి పనులు చేయలేరు, అరుస్తూ మరియు ఏడుస్తూ వారి చేతులు పైకి ఎత్తినప్పుడు. అది ఉజ్జీవం అంటే. అది దేవుని చిత్తములో ఉన్నది.
58వెల్ష్ ఉజ్జీవము జరిగే సమయములో, సంఘములో కొంతమంది గొప్ప వ్యక్తులు వెల్ష్ వద్దకు వెళ్లి, ఉజ్జీవంలో ఉన్న ఆ యంత్రికమైనది ఏమిటో తెలుసుకోవడానికి వెళ్ళారని చెప్పబడింది. మరియు వారు తమ పొడవైన టోపీలు మరియు వారి గుండ్రని కాలర్లతో ఓడ నుండి దిగినప్పుడు, ఒక చిన్న పోలీసు, తన కర్రను అలా ఊపుతూ, ఈలలు వేస్తూ, వీధిలోకి రావడాన్ని చూశారు. వారు, "నా మంచి మనిషి, వెల్ష్ ఉజ్జీవం ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పగలరా? " అని అడిగారు.
అతను, "అవును, నా సహోదరులారా. మీరు దాని మధ్యలోనే నిలబడి ఉన్నారు! మీకు అర్ధం అవుతుందా, నేనే ఆ వెల్ష్ ఉజ్జీవం, ఎందుకంటే ఆ వెల్ష్ ఉజ్జీవం నాలోనే ఉంది", అని అతను చెప్పాడు.
EPH 1:4•
PHIL 2:12
59అదే సార్వభౌమత్వం! దేవుడు చేసేది అదే. మరియు ఆయనకు మాత్రమే ఉజ్జీవాన్ని పంపే అధికారం ఉంది. యంత్రికమైన కార్యాలు ఒకచోటుకు కలపడం కాదు; దానికి క్రియా రూపకమైన దాన్ని పంపమని దేవునికి ప్రార్ధించుట అయిఉన్నది.
అతను తన వాక్యాన్ని ముందుగా నిర్ణయించిన వారిలో మాత్రమే బయలుపరుస్తాడు. ఇప్పుడు, నేను ముందు నిర్ణయము అనే పదాన్ని ఉపయోగించినప్పుడు … ఇప్పుడు, బహిరంగంగా దాన్ని ఉపయోగించడానికి అది ఒక చెడ్డ వాక్యం, ముఖ్యంగా అర్మేనియన్లు మరియు కాల్వినిస్టుల మధ్య మనం జనసమూహం కలిగిఉన్నప్పుడు, నాకు అన్నీ తెలుసని మీరు అనుకోవద్దని నేను మిమ్మల్ని అడిగాను, కాని వారిద్దరూ కూడా లేఖనాల ప్రకారం తప్పే. కృపయే నా కోసం దేవుడు చేసింది, పనులు నేను ఆయన కోసం చేస్తున్నాను. చూశారా? అప్పుడు, మీరు దాన్ని పొందుకున్నట్టు. మీరు ఈ రెండు కొమ్మలలో ఒకదానిపైకి ఎక్కితే, మీరు ఖచ్చితంగా ఆ కొమ్మ చివరలో మిమ్మల్ని మీరు వెలుపలనే కనుగొంటారు మరియు తిరిగి రాలేరు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ఈ రెండింటిని కలిపి దగ్గరకు తీసుకువస్తుంది, అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు, కానీ వాక్యము, ముందుగా నిర్ణయింపబడుట అని నేను ఉపయోగించినప్పుడు, మీరు అనుకోవద్దు నేను… ఆ ఒక్క వాక్యం మాత్రమే నాకు తెలుసు దాన్ని ఎలా… ఇది దేవుని భవిష్యత్ జ్ఞానం, చూడండి, అది ముందే ఆయనకు తెలుసు. ఆయన చెప్పలేడు… అందరూ రక్షింపబడతారని ఆయన చనిపోయాడు, ఆయన చేసాడు, కాని ఆయన భవిష్యత్ జ్ఞానం ద్వారా ఎవరు మరియు ఎవరు కాదు అని ఆయనకు ముందే తెలుసు. చూశారా? అదే ఆయనకు తెలుసు. నాకు మరియు మీకు తెలియదు, కాబట్టి మనము భయముతోనూ మరియు వణుకుతోనూ మన స్వంత రక్షణ కొరకు కృషి చేస్తాము.
MATT 11:25•
MATT 28:20•
LUKE 10:21•
JOHN 14:19
60ఇప్పుడు, కానీ దేవుడు తన వాక్యాన్ని సరైన స్థితిలో అమర్చాడు, మరియు అన్ని యుగాలలోను కలిగి ఉన్నాడు. ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానము, ఆయనను చర్చిలోనూ, ప్రజలలోనూ, ఆయన మొదటి నుండి చేసిన కొన్ని పనులలోనూ సరైన స్థితిలో అమర్చేలా చేసింది. ఆపై ఆ యుగానికి బోధించబడుతున్న సువార్త కొంత మంది ప్రజలకు మాత్రమే బయలుపరచబడింది. మిగతా వారు దానిని చూడరు. చూశారా? "తండ్రీ, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి నేర్చుకునే పసిబాలురకు బయలుపరచినందుకు నీకు కృతజ్ఞతలు." అదే ముందు నిర్ణయము. "నేను నిన్ను ఎన్నుకుంటాను, నిన్ను ఎన్నుకోను" అని మీరు అంటునట్టు ఆయన దీన్ని చేశాడని కాదు. ఆయన భవిష్యత్ జ్ఞానం ద్వారా మీరు ఏమి చేస్తారో ఆయనకు తెలుసు.
ఆయన అనంతుడిగా ఉండుటవలన…. ఆయన అనంతుడని నీవు నమ్ముతున్నావా? ఆయన ఆలాగు కాకపోతే, దేవుడు కాలేడు. కాబట్టి మీరు ఆలోచించండి, అనంతుడు కాబట్టే భూమి పైనున్న ఏ ఈగ అయిననూ ఎన్నిసార్లు తన కనురెప్పలను వాల్చుతుందో, ప్రతీ ఈగలోను ఎంత క్రొవ్వు ఉన్నదో ఆయన ఎరుగును, ఎక్కడ ఉన్న గడ్డి పోచనైననూ ఆయన ఎరుగును. ఆయన అనంతుడు. మనము అంతము కలిగినవారము. మనము అంధకారములో తడబడతాము. మనము గొర్రెలుగా ఉండుట దేవునికి ఇష్టము, మరియు మనకు తప్పక ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మనుష్యుడు కాదు గానీ పరిశుద్ధాత్మే, క్రీస్తు ఆత్మ మన మధ్యలో ఉన్నది. "కొంతకాలం అయిన తరువాత లోకము నన్ను చూడదు". ఏ సింహాసనం వద్ద అయితే ఆత్మ ఉన్నదో ఆ దేవుని సింహాసనం వద్దకు ఆయన భౌతిక శరీరం కొనిపోబడెను. యేసుక్రీస్తు ఇప్పుడు ఆ సింహాసనం పైన ఉన్నాడు. "కొంతకాలము తరువాత లోకము నన్ను చూడదు గాని, మీరు నన్ను చూతురు. లోక అంతము వరకు నేను మీతోను మీలోనూ ఉందును". దేవుడు అనగా క్రీస్తు యొక్క సింహాసనం మీ హృదయములో వేయబడినది. దావీదు కుమారుడిగా తన కుమారుని ఆ సింహాసనం మీద కూర్చుండ బెట్టెదనని ఆయన మాట ఇచ్చిన ప్రకారముగా 1000 ఏళ్ల పాలనలో ఆయన తన యొక్క సింహాసనం మీద కూర్చొనును.
61ఇప్పుడు, ఆయన ఈ విషయాల కొరకు తాను నియమించిన వారికి తన ముందస్తు జ్ఞానం ద్వారా ఈ విషయాలను బయలుపరుస్తాడు; లేకపోతే వారు చూడలేరు. అక్కడే నిలబడి, దాన్ని సరిగ్గా చూస్తూ కూడా గ్రహించలేరు.
మళ్ళీ మళ్ళీ చూసే ఒక పొదలో ఆవు యొక్క చిత్రాన్ని ఎంతమంది చూశారు. మీరు ఎప్పుడైనా దాన్ని చూశారా? లేక క్రీస్తు చిత్రాన్ని ఒక పొదలో, లేదా ఆకాశంలో, లేదా మేఘాలలో చూశారా? చూడండి, ఆ చిత్రకారుడు మీరు దానిని ఒక నిర్దిష్ట మార్గములో చూడవలసినంతవరకు దానిని చిత్రీకరించాడు. మంచిది, మీరు ఒకసారి దానిని చూస్తే, మీరు దానిని తప్ప మరి దేనినీ చూడలేరు. మీరు చూసిన ప్రతిసారీ, అక్కడ అది ఉంటుంది. ఆ చిత్రాలను ఎంతమంది చూశారు? ఖచ్చితంగా మీరు చూసారు.
మంచిది, ఆ ప్రకారమే క్రీస్తు తనకు తానుగా వ్యక్తపరచుకున్న విధానమే సువార్త అయి ఉన్నది, అదియే వర్తమానం. మీరు ఒకసారి ఈ ఘడియ యొక్క వర్తమానాన్ని చూసినప్పుడు, మీరు దానిని తప్ప చూడగలిగేది మరొకటి ,లేదు. అంతే అదే. మిగతావన్నీ పోయాయి. మీరు ఒకసారి వర్తమానమును చూసినప్పుడు, మిగిలినవన్నీ కేవలం పూరించునవి మాత్రమే (చూడండి? చూడండి?)
62అది నోవహు కాలములో జరిగింది. నోవాహు మరియు అతని గుంపు చూసినప్పుడు … వారు వర్తమానమును చూసినప్పుడు, మరేదీ ముఖ్యమైనది కాలేదు. మోషే గుంపు అది చూసినప్పుడు, మరేదీ ముఖ్యమైనది కాలేదు. యోహాను యొక్క గుంపు దానిని చూసినప్పుడు, మరేదీ ముఖ్యమైనది కాలేదు. యేసు గుంపు అది చూసినప్పుడు, మరేదీ ముఖ్యమైనది కాలేదు. అపొస్తలుల గుంపు దానిని చూసినప్పుడు, మరేదీ ముఖ్యమైనది కాలేదు. లూథర్ గుంపు దానిని చూసినప్పుడు, వెస్లీ యొక్క గుంపు దానిని చూసింది, పెంతెకొస్తు గుంపు దానిని చూసింది, మరేదీ ముఖ్యమైనది కాలేదు, వారు అన్నింటికీ దూరంగా ఉన్నారు. ఎందుకు? తన భవిష్యత్ జ్ఞానం ద్వారా ఆయన ఈ విషయాలు జరగాలని ముందే నిర్ణయించాడు.
MAL 1:2,3•
ROM 9:13
63ఆయన తన భవిష్యత్ జ్ఞానంతో తన సొంత వ్యక్తిని ఎన్నుకుంటాడు. అతను ఇక్కడ రోమా 8లో చెప్పినట్లుగా, ఆ ఏశావు … దేవుని యొక్క ఎన్నిక ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ ఏశావు మరియు యాకోబు, కవలలు, ఇద్దరూ పరిశుద్ధులైన తల్లి దండ్రులకు పుట్టారు, ఆయన ఎన్నిక ఖచ్చితముగా మరియు వాస్తవముగా నిలబడుతుంది, ఏ బాలుడు పుట్టకముందే "నేను ఏశావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమిస్తున్నాను" అని చెప్పాడు. చూశారా? మనిషిలో ఏముందో ఆయనకు తెలుసు, ఇది ఏమైఉందో మొదటి నుండీ ఆయనకు తెలుసు, అందువల్ల అతను గడియార సమయానికి సరిగ్గా ప్రతీదీ పని చేసేలా చేయగలడు. మనము బావోద్వేకానికి లోనవుతాము మరియు ఆందోళన పొందుతాము; ఆయన ఆందోళన చెందడం మీరు ఎప్పుడూ చూడలేదు. వారు చూడరు, చూశారా . ప్రతీదీ సమయానుసారముగా (ఘడియకు తగినట్లుగా) ఖచ్చితంగా, సరిగ్గా పని చేస్తుంది.
జరగబోయే ఈ విషయాలు, చిన్న జుట్టు ఉన్న ఈ మహిళలందరూ, మరియు ఈ పురుషులు వారివలె ధరిస్తారు … వారి భార్యలలాగా జుట్టు పెంచుకుంటారు. నేను ఖచ్చితంగా వారి జుట్టులో ఈ రింగులు కలిగి ఉండడం చూసాను, దానిని ఇక్కడ ముందు రింగులుగా. ఎంత వక్రబుద్ధి! అది సాతానుని ఏదేను యొక్క ఫలితం. మరియు ఆమెను చూడండి, ఆమె తన భర్త లాగా జుట్టు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె భర్త తన జుట్టును తన భార్యలాగా పెరగనిస్తున్నాడు. మరియు ఆమె అతని దుస్తులను ధరిస్తుంది, మరియు అతను ఆమె లోదుస్తులు ధరిస్తున్నాడు. నీవు అక్కడే ఉన్నావు. ఆమె పురుషత్వం పొందుతోంది, మరియు అతను స్త్రీలింగత్వం పొందుతున్నాడు. చూడండి, ఇది సాతాను యొక్క ఏదేను, దేవుడు ప్రారంభములో చేసిన దానికి విరుద్ధమైనది. అది నిజం.
64నేను ప్రారంభించకపోతే, మనము ఎప్పటికీ దీనిలోనికి ప్రవేశించము. కానీ ఈ విషయాలు, మరియు ఆయన దానిని చేయటానికి మార్గం, మరియు అది ఎవరు చేస్తారు, అది ఆయన సొంతంగా ఎంచుకున్న మార్గం. ఆయన ఎన్నుకుంటాడు. ఆ విధంగా జరగాలని ఆయన కోరుకుంటున్నాడు.
గత రాత్రి టుక్సన్ వద్ద మా పాస్టర్ బ్రదర్ పెర్రీ గ్రీన్, దేవుడు ఆయన కార్యాన్ని ఒక విధంగానే చేస్తాడు అన్న దాని గురించి బోధిస్తుండగా వినినప్పుడు. ఆయన అంశం ఏమిటో నేను మరచిపోయాను, కాని అతను ఇలా అన్నాడు, "దేవుడు ఇష్టపడే విధానం అదే, దేవుడు చేసే మార్గం అదే." మంచిది, అది నిజం.
ఇప్పుడు, మనలో ఎవరు ఆయనకు ఆయన తప్పు అని చెప్పబోతున్నారు? ఎవరు దేవుని సముఖములో ధైర్యముగా నిలబడి, "ప్రభువా, మీరు తప్పు. నేను జరగాలనుకున్న విధంగా మీరు దీన్ని చేయాలి, ఆ డాక్టర్ ఫలానా ఫలానా ..చెప్పిన విధంగా చేయాలి"? అని ఎవరు చెప్పబోతున్నారు. అలాంటి ఒక విషయం చెప్పడానికి వారి మానసిక సామర్థ్యాలలో ఇంత దూరం ఎవరు వెళ్లారు? లేదు, మీరు బయటకు వచ్చి చెప్పలేరు, కానీ మీరు ఆలోచిస్తారు!
NUM 16:3,21,32•
MATT 24:24•
MARK 13:22
65క్రీస్తు విరోధి అను అంశముపై నేను ఇచ్చిన వర్తమానము లాగా.నా అంత్య క్రీస్తు వర్తమానము లాగా. "అబద్ధ క్రీస్తులు లేస్తారు." ఇప్పుడు, అతను అబద్ధ యేసులు అని చెప్పలేదు. చూడండి, ప్రభువు యొక్క స్థానములో యేసుగా పిలువబడుటకు ఏ మనుష్యుడూ నిలువబడలేడు, కానీ అబద్ధ క్రీస్తులు అనగా అభిషిక్తులుగా పిలువబడుదురు.
ఓహ్, ప్రతీ ఒక్కరూ తమకు అభిషేకం ఉందని అనుకుంటారు. "దేవునికి మహిమ, అతడు దీన్ని చేయగలడు మరియు దాన్ని చేయగలడు!" కానీ అతన్ని వాక్య పరీక్షలో ఉంచి, లేదా ఆ ఘడియ యొక్క వర్తమానం యొక్క పరీక్ష లో పెడితే అతను ఎక్కడ ఉన్నాడో అర్థమవుతుంది.
వారు యేసు కాలంలో అభిషేకం కలిగి ఉన్నారు, కానీ ఆయనపై కాదు.
ఆ సమయంలో వారికి అభిషేకం ఉంది … దాతానుకు కూడా మోషే కాలంలో అభిషేకం ఉంది. అతను ఇలా అన్నాడు, "ఇప్పుడు, మా మధ్యలో నీవు మాత్రమే పవిత్రుడవని అనుకుంటున్నావా; దేవుడు పుష్కలంగా కలిగిఉన్నాడు. మేము ఇక్కడ ఒక సంస్థను ప్రారంభిస్తాము, ఒక పురుషుల గుంపు".
దేవుడు మోషేతో, "అతని నుండి వేరుపడండి" అని చెప్పి, ఆయన భూమిని తెరచినప్పుడు, అది నెరవిడిచి వారిని మ్రింగేసినది. ఆయన తన అసలైన వాక్యాన్ని తన ప్రవక్త అయిన మోషేకు ఇచ్చాడు. ఆయన ఎప్పుడైనా చేసిన ఏకైక మార్గం అదే, మరియు ఆయన ఎప్పుడైనా చేసే ఏకైక మార్గం అదే. ఆయన తన ప్రణాళికను మార్చడు, చూడండి.
66కాబట్టి మన ఆలోచనలు తప్పు, ఎల్లప్పుడూ-ఆయన ఆలోచనలు సరైనవి. మరియు ఆయన తప్పు అని ఆయనకు చెప్పడానికి ప్రయత్నించవద్దు. వీరు ఉత్తమ అర్హత ఉన్న వారిని మనము ఎవరిని గూర్చి అనుకున్నా సరే, అది వారు ఉత్తమమైన అర్హత గల వారిని చెప్పవలసిన పని మనది కాదు. దానిని మీరు సంస్థలలో కనుగొంటారు.
ఆత్మతో నిండిన ఏదో ఒక చిన్న సోదరుడు ఒక నగరంలోకి వెళ్లి ఒక సంస్థను నిర్మిస్తాడు … ఒక మంచి వ్యక్తుల గుంపును నిర్మిస్తాడు. మరియు సమావేశంలో వారు కలుస్తారు, మరియు పరిశుద్ధ సోదరులందరూ కలిసి, మీకు తెలుసా, మరియు "మీకు తెలుసా? నేను ఇక్కడ చిన్న జోన్స్‌ను నమ్ముతున్నాను [అతను వారిలో ఎంపిక అయినవాడు], అతను ఆ మంచి పెద్ద గుడారాన్ని కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. అది సరైనదని మీరు అనుకోవట్లేదా? " లేదండి. ఆయన అక్కడకు వెళ్తాడు. ఆపై సమాజం చెల్లాచెదురుగా అవుతుంది. చూశారా? వీటిని వేరు చేయండి! దేవుడు వేరుచేస్తాడు, అది చేసేవాడు ఆయనే. కానీ వారందరూ, ప్రతీ ఒక్కరూ, ఒక వ్యక్తిని పైన ఆ స్థానంలో ఉండాలని కోరతారు ఇంకొకరిని కింద ఈ స్థానంలో ఉండాలని కోరతారు. అది మనిషి యొక్క ఆలోచన.
ACTS 9:16
67మనిషి దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, కాని దేవుడు వాస్తవానికి ఆ తాళపు చెవులను పట్టుకుని ఉన్నాడు. వారు పరిశుద్ధ సంఘమైన శిష్యులకు, తాళపు చెవులను ఇచ్చారు; మరియు యూదా అతిక్రమణతో పడిపోయినప్పుడు వారు మొదటిసారి వాటిని ఉపయోగించడం గమనించండి. వారు ఒకచోట చేరి చీట్లు వేసారు. మరియు పరిశుద్ధ సోదరులు … వారు పరిశుద్ధ సోదరులు కాదని ఎవరు చెప్పగలరు? వారు పరిశుద్ధముగా లేరని ఎవరు చెప్పగలరు? కానీ వారు చీట్లు వేసారు, అది మత్తయి మీద పడింది. మరియు అతను ఎప్పుడు… అతను ఎప్పుడైనా ఏమి చేశాడు? ఏమిలేదు! అయితే పౌలు ఎన్నుకోబడినవాడు. ఆమెన్. అది దేవుని ఎన్నిక. కొద్దిగా, గద్ద ముక్కుతో, వెటకారంగా, అత్యుద్రిక్తత గల యూదుడు. మత్తయి కాదు, డి.డి., మీకు తెలుసా, అతను … కానీ పౌలు, దేవుడు పౌలును ఎన్నుకున్నాడు; సంఘము మత్తయిను ఎన్నుకుంది. చూశారా? దేవుడు తప్పు అని చెప్పడానికి మీకు ఏ హక్కు లేదు. ఆయనకు ఏమి చేయాలో తెలుసు, మనిషి ఎలా తయారు చేయబడ్డాడో ఆయనకు తెలుసు.
ఎవరు ఎప్పుడైనా … ఆ సంఘము ఎప్పుడైనా పౌలును ఎన్నుకుందా? ఓహ్, ఎప్పటికీ కాదు. "ఆ వ్యక్తి మా అందరినీ జైలులో పెడుతున్నాడు" అని అన్నారు.
కానీ దేవుడు, "అతను నా కోసం ఎలా బాధను అనుభవిస్తాడో నేను అతనికి చూపిస్తాను" అని అన్నాడు. అతనికి ఏమి తెలుసు …
సరే, మనం ఎవరు సరైనవారు అనుకున్నా దానితో పనిలేదు, ఎవరు అర్హత కలిగి ఉన్నారో దేవునికి తెలుసు. ఎందుకంటే మనిషి హృదయం ఆయనకు తెలుసు. ఆయన ఎరిగియున్నాడు .
ISA 40:31•
MATT 17:12
68ఉజ్జీవం, లేదా జరుగుచున్న ఈ కార్యాలు మానవుడు జరగాలి అనుకునే సమయంలో జరగవు. మనం అనుకుంటాము, "ఇప్పుడే ఆ సమయం, ఇదే ఆ సమయం. దేవునికి మహిమ! ". నేను వ్యాపార వేత్తల కూడికలలో గమనించాను, "ఒక గొప్ప ఉజ్జీవం మన మధ్యలో జరుగుతున్నది, దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని పంపబోతున్నాడు, హల్లెలూయా!" అని వారంటారు.
మోసపోకండి. "ఆయన అప్పటికే వచ్చాడు, మరియు ఆ జాబితా ఏమిటో అది వారు ఆయనకు చేసారు". చూశారా? కానీ ఉజ్జీవం ఉందని వారు భావిస్తున్నారు. ఇది జరుగుతుందా? లేదు. ఇది పూర్తయింది, చనిపోయింది, ముగిసింది. గమనించండి, ఇది వెలిగి ఆరుతూ ఉన్నటువంటి దీపాన్ని కత్తిరించే సమయం. "యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు".
69ఇక్కడ మన వచనంలో గమనించండి, ఇశ్రాయేలు రాజు అయిన దావీదును గమనించండి, దేవుని మందసమును తిరిగి తన స్థానానికి తీసుకువచ్చే బయలుపాటు ఆయన పొందుకొని ఉన్నాడు, సౌలు వెనుకబడినందున వారు సౌలు కాలంలో దానిని ఎప్పుడూ సంప్రదించలేదు. సౌలు కాలంలో వారు మందసమును, నిబంధనను ఎప్పుడూ సంప్రదించలేదు, ఎందుకంటే సౌలు వెనకబడ్డాడు మరియు దేవుని నుండి దూరమయ్యాడు. కాబట్టి దావీదు, ప్రేరేపణతో, త్వరగా, … ఇప్పుడు దీనిని గమనించండి, మీకు సరిగ్గా తెలియకపోతే ఇది చాలా నమ్మకద్రోహ వచనం. మరియు పిల్లలకు బదులుగా పురుషులుగా ఉండవలసిన ఘడియ రాబోతుందని నేను భావిస్తున్నాను. మనకు పాలకు బదులుగా బలమైన మాంసం ఉండాలి.
70ఇశ్రాయేలు రాజు అయిన దావీదును గమనించండి, రాజు నూతనముగా రాజుగా అభిషేకం చేయబడ్డాడు; లేదా ఎన్నుకోబడిన రాజు. సౌలు … సమూయేలును దేవుని చిత్తముతోనే ఆయనకు అభిషేకం చేసాడు, మరియు అతను ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్న రాజు, దానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ అతను ఉన్నాడు, ప్రేరేపణ అతనిని తాకింది. ఇది దావీదుకు బయలుపడింది. అతను ప్రత్యక్షత పొందాడు. దీని గురించి మరెవరూ ఏమీ అనలేదు. "మనం వెళ్లి మందసమును తిరిగి పొందుకుందాము, ఎందుకంటే మన మందసము ఇక్కడ మన దగ్గర ఉండుట, ఈ మందసము ద్వారా దేవుణ్ణి సంప్రదించడమే దేవుని చిత్తము." చాలా, చాలా అద్భుతమైన విషయం. మీరు అలా అనుకోవట్లేదా? అయితే సరే.
AMOS 3:7
71గుర్తుంచుకొనండి, కాని అతడు రాజుగా ఉండి, ప్రత్యక్షతను పొందుకుని కూడా, అతను తన స్థానాన్ని అధిగమించాడు. ఆ దేశంలో నాతాను అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతను ప్రత్యక్షత పొందటానికి నియమించబడ్డాడు. దేవుడు ఏదైనా మాట్లాడాలి అంటే, "దేవుడు తన సేవకులైన ప్రవక్తకు బయలుపరచేవరకు ఏమీ చేయడు" అని అన్నాడు. కాని మీరు చూస్తే, దావీదు రాజుగా ఉండి, అతనిపై అభిషేకం ఉండి కూడా … ఇప్పుడు, అది లేఖనమేనా? అతనిపై అభిషేకం ఉండి కూడా, నిజమైన ప్రత్యక్షతను పొందుకుని కూడా, కానీ అది తప్పు. ఎందుకంటే నాతాను ఆ కాలానికి ప్రవక్త, మరియు ప్రత్యక్షత నాతానుకు ఎప్పటికీ రాలేదు; మరియు దావీదుకు బయలుపాటు వచ్చినప్పుడు, అతను దాని గురించి నాతానును సంప్రదించలేదు. అతను చేయాలనుకున్న దాని గురించి ముందుకు కొనసాగుతూ వెళ్ళాడు.
2KGS 20:1,4,5•
1CH 13:1
72అయితే, పదమూడవ అధ్యాయములో దావీదు ఇక్కడ ఎవరిని సంప్రదించాడో గమనించండి: "కాని అతను సమాజములోని సహస్రాధిపతులను మరియు శాతాధిపతులను సంప్రదించాడు. దావీదు "ఇప్పుడు, నేను ఇది చేయాలని మీరు అనుకోవట్లేదా …?" అని అడిగాడు. కానీ అది సరికాదు. ఇప్పుడు, అతను దేవునికి ఒక సేవ చేయటానికి ప్రయత్నిస్తున్నాడు, కాని అతను దానిని చేయటానికి నియమించబడలేదు, చూడండి, ఎందుకంటే దేవునికి ఒక మార్గం ఉంది.
దేవుడు ఆ రాజుకి తన జబ్బును గూర్చి, తన బాగవుటను గుర్చి నేరుగా మాట్లాడగలిగి ఉండేవాడే, కానీ ఆయన అలా చేయలేదు. అతను దానిని చేయటానికి ఒక నిర్దేశిత మార్గాన్ని కలిగి ఉన్నాడు, అదే అతని ప్రవక్త. కాబట్టి ఆయన ప్రవక్త యెషయాతో మాట్లాడాడు. తిరిగి వెళ్లి హిజ్కియాకు ఏమి జరుగబోతుందో చెప్పమని చెప్పాడు.
ఇప్పుడు, హిజ్కియా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మరియు దేవుడు హిజ్కియాతో మాట్లాడగలడు, కానీ అతను కొన్ని మార్గాలను చేశాడు! మీకు ఇది అర్థమైందా? దేవుడు పనులను చేయడానికి తన స్వంత మార్గాలను కలిగి ఉన్నాడు: ఉజ్జీవాలను పంపడం, మాట్లాడటం, అది ఏమైనా. ఆయనకు అది చేయడానికి తన స్వంత మార్గం ఉంది, మరియు దీన్ని ఎలా చేయాలో ఆయనకు చెప్పడానికి మనము ఏ పాటివారము. అది ఆయనకు ఇష్టమైన మార్గములోనే ఆయన చేయును.
1CH 13:4
73కాబట్టి, మీరు చూస్తే దావీదు ప్రేరేపణ కలిగియుండి కూడా… ఇప్పుడు, నేను అభిషేకం, తప్పుడు అభిషేకం గురించి చెప్పడం మీకు గుర్తుందా? గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వచ్చి అభిషేకించగలిగినప్పటికి కూడా, ఇంకా అది దేవుని చిత్తానికి దూరంగా ఉందా? ఇక్కడ, ఇది దీనిని ఇక్కడే రుజువు చేస్తుంది. మనం దేవుడు దానిని చేసే మార్గం ద్వారానే ముందుకెళ్లాలి. మన మార్గాలు కాదు, దేవుడు చేసే మార్గం. ఎందుకంటే దావీదు, రాజుగా ఉండి, అభిషిక్తుడై , దేవుని ఆత్మతో అభిషేకించబడినప్పటికీ (యేసు క్రీస్తు యొక్క మాదిరి), కానీ అది దేవుని మార్గం కాదు.
సమాజమంతా "అది అలా చేయుట వారికి ఇష్టమే" అని బైబిలు చెప్తుంది. గమనించండి. శాతాధిపతులు మరియు సహస్రాధిపతులు, యాజకులు మరియు వేదాంతపండితులు కూడా ఇది అద్భుతమైనదని భావించారు. అవే బైబిల్ పాఠశాలలు మరియు మిగతావన్నీ. ఇది అద్భుతమైనదని వారు భావించారు. ప్రజలందరూ కూడా అంగీకరించినప్పటికి, మరియు యాజకులు మరియు వారందరూ కూడా రాజు అభిషేకం సరైనదని వారందరూ అంగీకరించారు. గమనించండి! కానీ దేవుడు తన వాక్యాన్ని దాని కాలంలో వారికి బయలుపరుస్తానని వాగ్దానం చేయలేదు. దేవుడు తన వాక్యాన్ని బయలుపరచడానికి తన మార్గాన్ని కలిగి ఉన్నాడు, కానీ వారికి కాదు. గుర్తుంచుకొనండి, ఇది దేవునికి విరుద్ధం.
74ఇమ్లా కుమారుడైన మీకాయా కాలంలో ఉన్న మాదిరిగా. మీకు ఆ కథ గుర్తుందా? యూదా మరియు ఇశ్రాయేలు వేరు చేయబడ్డాయి, వారికి రెండు వేర్వేరు రాజ్యాలు ఉన్నాయి. అహాబు ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు, యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు, అది నేను నమ్ముతున్నాను; అహాబు ఇశ్రాయేలు, యెరూషలేముపై ఉన్నాడు.
గమనించండి. ఆపై ఇక్కడ అన్యులు సమూహముగా వచ్చి, దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ ఉన్న ఈ ఫిలిష్తీయులు, లేదా సిరియన్లు ఆ భూమిని పట్టుకొని ఇశ్రాయేలుకు చెందిన భూమి నుండి తమ స్వంత పిల్లలను పోషిస్తున్నారు. కాబట్టి వారికి తమ సొంత పిల్లలను మరియు వారి స్వంత కుటుంబాలను పోషించడానికి ఆ భూమి అవసరం అయి ఉంది. దేవుడు వారికి ఇచ్చాడు … అది వారికి దేవుడు ఇచ్చిన హక్కులు.
1KGS 22:3,4•
2CH 18:3•
AMOS 3:3
75కాబట్టి అహాబు యెహోషాపాతును పిలిచి, "దిగి రండి!" అని అన్నాడు. అతడు ఇలా అన్నాడు, "మన శత్రువు ఏమి చేస్తున్నాడో అక్కడ చూడండి. మనము, దేవుని పిల్లలమైన మనము, ఈ భూమిని కలిగిఉండడం సరైనదేనా …? అది మనకు చెందినది. దేవుడు తన ప్రవక్త అయిన యెహోషువా ద్వారా ఈ భూమిని విభజించాడు. ఇది మనదై ఉండాలి, అది మనకు, మన పిల్లలకు చెందినది. మరియు ఇక్కడ కమ్యూనిస్టులు దానిని స్వాధీనం చేసుకున్నారు, మరియు మనకు … మనం ఆకలితో ఉన్నాం, మరియు వారికి మన దేవుడు ఇచ్చిన హక్కులు లభించాయి. మనం అక్కడకు వెళ్లి, మన భూమిని తిరిగి పొందుకోవాలి అని మీరు అనుకోవట్లేదా? మీరు మీ దళాలలో చేరితే … మీరు మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, మరియు అందరూ, మరియు ప్రెస్బిటేరియన్లు, మరియు లూథరన్, ఇంకా అందరూ సర్వసాధారణ సమాఖ్యగా ఏర్పడితే , మనమందరం కలిసి కూర్చుని, ఆ విషయాన్ని స్వాధీన పరచుకుంటాం. [నేను ఇప్పుడు ఉపమాన రీతిగా చెప్తున్నాను మరియు మాట్లాడుతున్నాను.] మనం వెళ్లి దాన్ని పొందుదాము."
"ఎందుకు," అతను అన్నాడు, "ఖచ్చితంగా, మనమంతా ఒకటే."
ఇప్పుడు, బైబిలు ఇలా చెప్పింది, "ఇద్దరు సమ్మతింపకుండా ఎలా కలిసి నడుస్తారు?"
ఇక్కడే ఆ గొప్ప వ్యక్తి, ఆ గొప్ప పెంతెకొస్తు మనిషి యెహోషాపాతు, తప్పుడు జనులతో కలిసిపోయాడు. ఈ రోజు మన పెంతెకొస్తులకు కూడా అదే జరిగింది. అక్కడ కొంతమంది సరియైన పురుషులు ఉన్నారు, కానీ వారు ఆ సంఘ శాఖలలో కలిసిపోయారు. ఆ కార్యం నుండి బయటపడండి! ఇది ప్రభువు చేత శపించబడినది.
1KGS 22:5,7•
2CH 18:4,6
76ఇప్పుడు గమనించండి! అక్కడ అతను ఉన్నాడు, మరియు అతను "అవును, అది యుక్తముగానే అనిపిస్తుంది" అని చెప్పాడు. "మా సంఘం మీదే, మా ప్రజలు కూడా; మనం అందరం యూదులము. ఖచ్చితంగా, మేము మీతో వస్తాము. " కానీ యెహోషాపాతులో ఒక ఆచారం మిగిలి ఉంది, "మనం మొదట ప్రభువును సంప్రదించాలని మీరు అనుకోవట్లేదా? ఇది మంచి ఆలోచన అని నేను అనుకుంటున్నాను."
ఎందుకు, అహాబు, "ఖచ్చితంగా. నేను దాని గురించి ఆలోచించి ఉండాలి." అని అన్నాడు.
"సరే, దేవుని యొక్క మనిషి ఎక్కడైన ఉన్నారా? మీరు ప్రవక్తను కలిగి ఉన్నారా?"
"ఆహ్, వారిలో నాలుగు వందలు మందిని కలిగి ఉన్నాను. నేను మొత్తం సమాఖ్యను, మొత్తం సంఘ శాఖను ఇక్కడకు తెచ్చాను. వారు హెబ్రీ ప్రవక్తలు."
1KGS 22:11•
2CH 18:10
77ఇప్పుడు గుర్తుంచుకొనండి, వారు ప్రవక్తలు, హెబ్రీ ప్రవక్తలు అని బైబిల్ చెప్తుంది. అన్య ప్రవక్తలు కాదు, హెబ్రీ ప్రవక్తలు. వాటిలో ఒక పాఠశాల, ఒక వేదాంత శిక్షణ సంస్థ.
"మంచిది, వారిని తీసుకురండి!"
రాజులు రాజవస్త్రములు ధరించుకొని ప్రవక్తలను ఆకట్టుకోవడానికి వారి ముందుకు వచ్చి ఉన్నారు. మరియు అక్కడికి, అది సిద్కియా అని అనుకుంటున్నాను, అతను జిల్లా సమాఖ్యకి గొప్ప అధిపతి లేదా అతను ఏమైనప్పటికీ వారి మధ్యలోనికి వచ్చాడు. అతను, "రెండు పెద్ద యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి- నేను దేవుని నుండి విన్నాను, వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని" చెప్పెను.
" ఓ మహిమ!" ప్రతీ ఒక్కరూ అది అద్భుతముగా ఉందనీ, సరియైనదనీ తలంచారు.
78సరైనది మరియు తప్పిదముకు మధ్య వెంట్రుక వాసి అంత ఎడమే ఉంది చూడండి. మరియు గుర్తుంచుకోండి, ఇది ఏదోక వైపు పడిపోతుంది, మరియు ఇది సరైనది మరియు తప్పిదము యొక్క వ్యత్యాసాల మధ్య చదును చేయబడిన బ్లేడులాగా వస్తుంది. ఇది దేవుని యొక్క ప్రతీ వాక్యం అయిఉండాలి. దాదాపు ప్రతీ వాక్యం మాత్రము కాదు, ప్రతీ వాక్యము! మరియు అది ఈ రోజు లూథరనులకు కాదు, మెథడిస్టులకు కాదు, పెంతెకొస్తులకు కాదు, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసం చేసే ఆ ఖచ్చితమైన అంత్య క్రీస్తు యొక్క యుగమైన పరిశుద్ధాత్మ చేత చెక్కబడే యుగానికి వస్తుంది. స్వల్ప తేడాను వారు చూడకపోతే వారు తప్పు వైపు పడతారు. చూడండి! జాగ్రత్త! ఇప్పుడు పెంతెకొస్తు కాలములో మనం జీవించడం లేదు. మనం ఆ కాలాన్ని దాటిపోయాము, అది లూథరన్ను దాటిపోయినట్లే, మరియు… చూశారా?
1KGS 22:6-9,12•
2CH 18:5-8,11
79గమనించండి. ఇప్పుడు ప్రవచించిన నాలుగు వందల మంది ప్రవక్తలందరూ బాగా పోషించబడి, స్థిరపడిన హెబ్రీ ప్రవక్తలు, వారందరూ ఒకే తాటి పై, "యెహోవా ఇలా అన్నాడు, "పైకి వెళ్ళండి, ప్రభువు మీతో ఉన్నాడు," అని సాక్ష్యం ఇచ్చారు,
యెహోషాపాతు, "సరే, అది వినడానికి బాగుంది. కానీ, మీరు ఇంకొకరిని కలిగి ఉన్నారా?" అని అన్నాడు.
"మరొకరా? మేము ఇక్కడ మొత్తం సంఘ శాఖను తెచ్చాము, మొత్తం సమాఖ్య ఇక్కడ హాజరయింది. మనకు మరొకరు ఎందుకు? "
అతను, "ఆహ్,", "ఇంకొకరు ఉండవచ్చునని నేను అనుకున్నాను." అని అన్నాడు.
అతను, "ఓహ్, అవును, మరొకరు ఉన్నారు, కానీ అతను ఈ సమాఖ్యకు చెందినవాడు కాదు." అతను బహిష్కరించబడినవాడు. అతడు ఇమ్లా కుమారుడు మీకాయా, నేను అతడిని ద్వేషిస్తున్నాను." చూశారా? వారు అతన్ని సహవాసంలోకి స్వీకరించరు, మరియు అతను ప్రారంభించడానికి ఒక సాధారణ బహిష్కరణ. మరియు అతను ఎల్లప్పుడూ, అతను ప్రవచించే ప్రతీదీ, అతను నా వేదాంత శిక్షణ కేంద్రమును కొంచెం కూడా ప్రోత్సహించడు. మరియు అతను ఈ పనులన్నింటినీ చెడుగా చేస్తాడు, అతడు నా నుండి కేవలం వ్యత్యాసంగా ఉండుటకు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును".
"ఓహ్," అని యెహోషాపాతు ఇలా అన్నాడు, "రాజైన మీరు ఆలాగనవద్దు. కానీ ఈ మనిషి చెప్పేది నేను వినాలనుకుంటున్నాను."
1KGS 22:13•
2CH 18:12,13
80"సరే, మేము అతనిని కనుగొంటాము." కాబట్టి అరణ్యంలోనికి ఎక్కడికో వారిని పంపించారు.
మరియు వారు ఒక వ్యక్తిని పంపించి, అతనితో (మికాయాతో), "ఇప్పుడు, మీ రహదారిపై తిరిగి వెళ్తున్నప్పుడు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు మళ్ళీ సంఘ శాఖలోనికి తిరిగి రావాలనుకుంటున్నారా? మీరు వారందరితో మళ్ళీ సహవాసం చేయాలనుకుంటున్నారా? మీరు అలా చేస్తే, జిల్లా ప్రెస్‌బైటర్ చెప్పినదే చెప్పండి, బిషప్ చెప్పిన అదే మాట చెప్పండి. మరియు వారు మిమ్మల్ని తిరిగి తీసుకువస్తారు". అని చెప్పారు. ఇప్పుడు దీన్ని చేయాల్సిన సమయం వచ్చింది.
దేవుని అభిషిక్తుడైన, నిజమైన ప్రవక్త దేవుని ఒక్క వాక్యంతో అయినా రాజీ పడతాడని మీరు ఊహించగలరా? ఎప్పటికీ కాదు! అతను ఇలా అన్నాడు, "యెహోవా జీవము తోడు, దేవుడు చెప్పినది మాత్రమే చెబుతాను!" మాకు ఇమ్లా కుమారుడు లాంటి వారు కావాలి. " యెహోవా జీవము తోడు, దేవుడు చెప్పినది మాత్రమే చెబుతాను." ఆయన చెప్పేది నిజం".
1KGS 22:17,18•
2CH 18:16,17
81కాబట్టి వారు ప్రజల ముందు, ప్రవక్తలందరి ముందు అక్కడకు దిగినప్పుడు, "ఇప్పుడు, నీవు చెప్పు…" అని అన్నారు.
అతను, "వేచి ఉండండి, ఈ రాత్రి నాకు ఇవ్వండి, ప్రభువు ఏమి చెప్పబోతున్నాడో చూద్దాం." కాబట్టి ఆ రాత్రి ప్రభువు ఆయనకు దర్శనమిచ్చాడు మరియు ఏమి చెప్పాలో చెప్పాడు.
మరుసటి రోజు ఉదయం, "ఇమ్లా, నీవు ఏమి చెబుతావు?" వారందరూ నిలబడి ఉన్నప్పుడు … నా ఉద్దేశ్యం ఇమ్లా కుమారుడైన మీకాయా. "నీవు ఇప్పుడు ఏమి చెబుతావు? మేమందరం ఇక్కడ ఉన్నాము, యాజకులందరూ , ప్రవక్తలందరూ , రాజులందరూ, ఇక్కడ అంతా కలిసి కూర్చున్నాము. ఈ మహా సభకు నీవు ఇప్పుడు ఏమి చెబుతావు? " అని అన్నాడు.
"వెళ్లండి, కానీ ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెలవలే చెల్లాచెదురుగా ఉన్నట్లు నేను చూశాను" అని అన్నాడు.
మరియు అహాబు, "నేను మీకు ఏమి చెప్పాను! ఆ తిరుగుబాటు చేయువాడు నాపై చెడును మాత్రమే ప్రవచించగలడు!" అన్నాడు.
దేవుడు ఒక మాట చెబుతున్నప్పుడు అతను వేరేది ఎలా చెప్పగలడు? ఒక ప్రవక్త దేవుడు మాట్లాడే నోరు అయి ఉండాలి, తన సొంత ఆలోచన కాదు. అతను పూర్తిగా దేవునికి లొంగిపోయాడు, అతను ఏమీ బాధపెట్టకూడదనుకుంటున్నాడు, కాని దేవుడు చెప్పేది అతను చెప్పాలి, ఎందుకంటే అతనికి దానిపై నియంత్రణ లేదు. చూశారా?
1KGS 22:24•
2CH 18:23
82ఆయన, "ఇప్పుడు, నేను మీకు చెప్పలేదా?" అని అన్నాడు.
ఆపై కొమ్మును పట్టుకున్న పెద్ద మనిషి వచ్చి, నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను." మరో మాటలో చెప్పాలంటే, నేను దానిని కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను, "ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. , మీకాయా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను లేఖనాల్లో నైపుణ్యత గలవాడను అని నీవు గ్రహించావా? నాకు అభిషేకం ఉందని నీవు గ్రహించావా? [లేదా, మేము ఈ రోజు చెప్పే బాప్తిస్మము] నాకు అది ఉందని నీవు గ్రహించావా?"
ఇమ్లా, "నేను దానిని సందేహించడం లేదు", అని అన్నాడు.
అతను, "అయితే విను ! దేవుని ఆత్మ నాకు చెప్పింది, మరియు మనం సిరియన్లను భూమి నుండి బయటకు వెళ్ళగొట్టబోతున్నాం (ఇక్కడ నా 400 మందితో సాక్ష్యం ఇచ్చాను). మా గొప్ప రాజు చనిపోబోతున్నాడని చెప్పడానికి మీరు ఎవరు? " అతను చెప్పాడు, "దేవుని ఆత్మ నాకు చెప్పింది."
1KGS 22:19,20•
2CH 18:18,19
83మీరు దానిని అర్థం చేసుకోవడానికి కుదించి నేను దానిని చెప్తాను. మరియు మీకాయా ఇలా చెప్పి ఉండవచ్చు, "అయ్యా, గత రాత్రి దర్శనంలో, యెహోవా సింహాసనాసీనుడై యుండగా, పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని, వారు పరలోకంలో ఒక సమావేశాన్ని కలిగి ఉండడం నేను చూసాను. వారు, 'మనం అహాబును మోసగించడానికి ఎవరిని పంపించగలము? ఎందుకంటే ఇక్కడ సింహాసనం క్రింద ఒక ప్రవక్త, నిజమైన ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఏలియా. మరియు అతను నా వాక్యము ద్వారా ఆ దుష్ట అహాబు, అతను నాబోతును చంపినందున, కుక్కలు ఆ దుర్మార్గుడి రక్తాన్ని నాకుతాయని, ప్రవచించాడు, మరియు అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మరియు అది అప్పటికే ప్రవచించబడినందున అది నెరవేరాలని మేము కోరుకుంటున్నాము, అక్కడ అది జరగాలి. మరి మనం దీన్ని ఎలా చేయబోతున్నాం?" అని అన్నారు.
1KGS 22:21,22•
2CH 18:20,21
84"అప్పుడు నశించిన ఆత్మలుండు ప్రాంతాల నుండి, ఒక ఆత్మ పైకి కదులుతూ వచ్చింది. అతను, 'నేను మోసగాడిని. నేను మీకు సేవ చేయగలిగితే, నేను దిగి అతని ప్రవక్తలోనికి వెళ్తాను (ఎందుకంటే వారు చాలా క్రమమైనవారు వారు ఒక విషయం మాత్రమే అర్థం చేసుకుంటారు, మరియు అది కొంత ఉద్రేకం మాత్రమే), మరియు నేను వారిని అబద్ధం ప్రవచించేలా చేస్తాను. నేను అహాబును మీ నిజమైన ప్రవక్తకు బదులుగా ఆ ప్రముఖులను వినేలా చేస్తాను; ఎందుకంటే తను చేసేవన్నీ అతడు మీ వాక్యంతోనే పరిశీలిస్తాడు. అతను తన దర్శనాలను వాక్యము ద్వారా పరిశీలిస్తాడు, అతడు వాక్యము చేత చేసే ప్రతీదానినీ పరిశీలిస్తాడు, మరియు అది వాక్యముతో సరికాకపోతే అతడు దానిని వినడు. అయితే అది … నేను ఈ ఇతరులను కూడా మోసం చేయగలను, మరియు నేను చేస్తాను … వారి భద్రత కోసం ఆ గొప్ప ఐక్య సమూహముపై అహాబుకు చాలా నమ్మకం ఉంది, కాబట్టి వారు కలిసి తిరుగుతారు, మరియు వారు కలిసిపోతారు. నేను అక్కడకు వెళ్లి అహాబు వారి మాట వినేలా చేస్తాను. మరియు మేము దానిని ఈ విధంగా చేస్తాము."
దేవుడు ఇలా అన్నాడు, "నీవు దీన్ని చెయ్యగలవు , నీవు నిజమైన మోసగాడివి; నీవు క్రిందికి వెళ్ళు."
1KGS 22:24,25,27,28•
2CH 18:23,24,26,27
85ఆపై సిద్కియా అతనిని చెంపమీద కొట్టెను, "మీరు ఎక్కడ ఉన్నారు …?"
అతను ఇలా అన్నాడు, "దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియ వచ్చును."
సిద్కియా రాజుతో, "మీరు వెళ్ళండి! వెళ్లి శాంతితో తిరిగి రండి!" అని అన్నాడు.
అహాబు, "అతన్ని తీసుకొని జైలులో పెట్టండి. సంకెళ్ళలో ఉంచి, అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఈ ఉజ్జీవం ఖచ్చితంగా జరుగుతుందని నా ప్రవక్తలు నాకు చెప్పినట్టుగా, నేను అక్కడ నుండి నా విజయంతో తిరిగి వచ్చినప్పుడు, "నేను అతనికి మొగ్గు చూపుతాను!"
ఆ వ్యక్తికి మీకాయా చెప్పిన చివరి మాటలు వినండి: "రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు." ఆమెన్!
చూడండి, దేవుడు తన స్వంత మార్గాలను కలిగి ఉన్నాడు. ఈ మనుష్యులు దేవునికి సేవ చేస్తున్నారని అనుకున్నారు. జాగ్రత్త! ఉద్రేకం కాదు, ఉత్సాహం కాదు, ఊహలు కాదు, కానీ అది "ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అయి ఉండాలి. సరే, ఏదేమైనా… ఇవి పైన చెప్పబడిన రీతిగా ఈ కార్యాలు ఉన్నాయని మనం గమనిస్తున్నాం.
AMOS 3:7•
MAL 4:5
86ఇప్పుడు గమనించండి దావీదు ఈ గొప్ప ప్రకటన చేసాడు. మరియు ఇది మంచిదని, మంచి పని అని అనిపించింది, అప్పుడు మేము కనుగొన్నాము … (నేను మిమ్మల్ని అలసిపోయేట్టు చేస్తున్నానా? ఇంకొకటి తీసుకోడానికి నేను చాలా ఆలస్యం అవుతున్నానా …?) వారు ఈ గొప్ప ప్రకటన చేసారు, అతడు ప్రవక్తను సంప్రదించలేదు.
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడని అమోసు 3: 7 చెబుతోందని ఎవరికైనా తెలుసు. సంఘ కాలాలలో మనము సంఘ సంస్కర్తలను కలిగి ఉన్నాము; కాని నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు భూమిమీద ఒక ప్రవక్త ఉంటాడని మలాకీ 4 ద్వారా వాగ్దానం చేయబడింది (ఎందుకంటే అది ఆ నమూనాకు సరిపోతుంది, చూడండి).
MAL 3:1•
MATT 11:10•
REV 11:3
87యేసు రాకడకు ముందే, ఏలియా వస్తాడు, మలాకీ 3 లో చెప్పిన ఏలియా. మత్తయి 11 ఇలా చెబుతుంది. "మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది ఆ వ్యక్తి గురించి చెప్తుంది, ఇదిగో నేను నా దూతను నా ముందు పంపుతాను." ఇప్పుడు, ఆయన ప్రవచించాడు (వేదాంత పండితులు అందరూ నమ్ముతారు) భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ఏలియా యొక్క ఆత్మ కూడా రాబోతుంది. ఇది ఐదుసార్లు రావాలి. దేవుడు ఆ ఆత్మను ఉపయోగిస్తాడు: ఎలీషా, ఏలియా, బాప్తిస్మమిచ్చు యోహాను, అన్యజనుల సంఘం కోసం, ఆపై ప్రకటన పదకొండవ అధ్యాయం లోని యూదుల కోసం. అది దేవుని g-r-a-c-e (కృప), f-a-i-t-h (విశ్వాసము), J-e-s-u-s - యేసు, ఐదు అక్షరాలు. నాలుగు వద్ద దానిని ఆపలేము, అది ఐదుకి వెళ్ళాలి. చూడండి? గమనించండి!
LUKE 17:30
88ఇప్పుడు, ఆయన అది వాగ్దానం చేసాడు గనుక బైబిలు ఈ దినమునకు ఖచ్చితంగా సరిపోయే విధముగా ఉన్నది, అదే విధంగా సొదొమ, గొమొర్రా కూడా. మరియు అది ఏలియా కాదు, అది ఏలియాపై ఉన్న దేవుని ఆత్మ; ఏలియా కేవలం ఒక మనిషి. ఇప్పుడు, మనము ఏలియాను, ఏలియా వస్త్రములను, ఏలియా పైవస్త్రములను మరియు ఏలియావి ప్రతీదీ కలిగి ఉన్నాము. కానీ ఈ దినము యొక్క ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మత్తయి పదిహేడు ప్రకారం వస్తాడు … లూకా 17:30, మనుష్య కుమారుడు తన ప్రజలలో తనను తాను ప్రత్యక్షపర్చుకుంటాడు అని చెప్తున్నది. మనిషి కాదు, దేవుడు! కానీ అది ఒక ప్రవక్త ద్వారా వస్తుంది. ఇప్పుడు, ఆయన ఎప్పుడూ కూడా ఒకేసారి ఇద్దరు ప్రధాన ప్రవక్తలను కలిగియుండలేదు . ప్రపంచంలో ఎన్నడూ అలా జరగలేదు. చూడండి? ఇరువురు ఉన్నట్టుగా ఎంత కనిపించినప్పటికిని…రెండు శిరస్సులు ఉండజాలవు.. అది తప్పక ఒక్క శిరస్సు అయి ఉండవలెను. దేవుడు ఒక మనిషిని తన ఆధీనంలోనికి తీసుకురావాలి. చూడండి? దేవుడు ఒక్కడే. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఉన్నారు, కానీ అన్నింటికి పైగా దేవుడు ఒక్కడే. గమనించండి. ఆయన వారిని కేవలం కార్యలయములుగానే వాడుకున్నాడు. ఏలియాతోను అదే విధముగా ఉన్నది ఏలియా యొక్క ఆత్మను కూడా అదే విధంగా వాడుకున్నాడు. ఆయన అదే ఆత్మను ఉపయోగించి, కానీ అదే దేవుడు తన వాక్య నెరవేర్పు కొరకు అన్ని వేళలా వాటిని నియంత్రిస్తున్నాడు.
89ఇప్పుడు, ఈ విషయాన్ని గమనించండి, దావీదు తన దగ్గర ప్రతీదీ క్రమంలో ఉందని అనుకున్నాడు. మరియు అతను ప్రేరేపించబడ్డాడు. పరిశుద్ధాత్మ మనిషిని ఎలా అభిషేకించగలదో చూడండి? కానీ అది అభిషేకం యొక్క క్రమంలో ఉండాలి. బాహ్యపు ఆత్మ పరిశుద్ధాత్మతో అభిషేకించబడవచ్చు, కాని లోపల ఆత్మ చిమ్మ చీకటిగా ఉంటుంది. గోధుమలలో జీవాన్ని నింపే అదే నీటిపై గురుగు కూడా పెరుగుతుంది. గురుగులో జీవాన్ని నింపుతుంది, కానీ గురుగు యొక్క చివర అది గురుగు జీవం. ఇది ఆనందిస్తుంది, వికసిస్తుంది, మరియు జీవాన్ని కలిగి ఉంటుంది, మరియు గోధుమ చేసే ప్రతీ దాన్ని చేస్తుంది, కానీ దాని యొక్క ప్రాణము గురుగే . తప్పుడు బోధకులు పైకి లేచి, అన్ని రకాల త్రిత్వమును మరియు మిగతా వాటిని బోధించగలరు, పరిశుద్ధాత్మతో అభిషేకం చేయబడతారు, నిజమైన సువార్తికునివలే చాలా అద్భుతాలు ప్రదర్శిస్తారు, కానీ ఇక్కడ వాక్యం ద్వారా, అది దానిని చేస్తుంది. నా ఉదేశ్యం ఏంటో చూడండి? నేను ఈ ఉదయం ఇక్కడ హోటల్‌లో ఒక వేర్వేరు శాఖలకు చెందిన గుడారంలో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు, దీన్ని భోదించడం పర్వాలేదు అని అనుకుంటున్నాను.
90గమనించండి. మేము ఏమి చెబుతున్నామో చూడండి. ఇప్పుడు, వినండి. నిజమైన ఉజ్జీవం కలిగి ఉండే అన్ని ఉద్రేకాలను దావీదు కలిగి ఉన్నాడు. గమనించండి! వారు అరిచారు, వారు గట్టిగా అరిచారు, వారు నాట్యం చేసారు, వారు నిజంగా ఆ అభిషేకం నుండి ఏదో పొందారు. ఖచ్చితంగా పొందారు! నిజమైన ఉజ్జీవం కలిగిన వ్యక్తి లాగా, కానీ దేవుడు దానిలో లేడని మీరు గమనించవచ్చు. దేవుడు అందులో లేడు. వారు తెలుసుకోవలసిన ఒక ప్రవక్త అక్కడ దేశములో కూర్చున్నాడు. చూశారా? దావీదుకు అది తెలిసి ఉండాలి.
ఈ దినమున కూడా అదే విధముగా ఉన్నది. మన కాలంలోని గొప్ప సంఘ శాఖల వలే, గొప్ప కూడికలవలే అన్ని యాంత్రికమైన కార్యములను మనం పొందియున్నాము, కానీ దాని యొక్క చివరి పర్యవసానం ఆ దినమున ఉన్నట్టు గానే ఉన్నది; మన గొప్ప కూడికల యొక్క ఫలితాలు, మనం చూపించే కారణాలు, మన పెద్ద భవనాలు, మన పెద్ద … మన పెద్ద వేలాది భవనాలు, మనుషులను జతచేయుట మరియు ఇతర కార్యాలు, ఇవన్నీ అదే రీతిగా అవుతున్నాయి. అంతా అపజయము. నేను భిన్నంగా ఉండాలని చెప్పడం లేదు, ఎవరి పుస్తకం తో నేను ఈ ఉదయం నిలబడి ఉన్నానో, ఆ దేవుని ముందు నిజాయితీగా ఉండాలని చెప్తున్నాను. చూశారా? అన్నీ అపజయాలే , అదే ఫలితం.
91దేవుడు, ఆయన కాలములోను, యుగములోను, ఆయన ప్రవక్తలను పరిగణించనప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం; ఈ రోజు మాదిరిగానే తత్వ శాస్త్రం, యాజకులు, సంఘశాఖలపై ఆధారపడ్డారు. ఇప్పుడు, దగ్గరగా. ఇదంతా గందరగోళంలో పడిపోతుంది. అక్కడ దేవుని నిజమైన ఆత్మ ఉంటే, అది దానిని వాక్యం వైపుకి నడిపిస్తుంది. వాక్యంలోని ఒక స్థలం మాత్రమే కాదు, మొత్తం యుగంలోని మొత్తం వాక్యం వైపుకి. చూశారా?
పెంతెకొస్తు దినమందు, ఆత్మ దానిని యోవేలు 2:38 కు (2:28- తెలుగు అనువాదకుడు) నిర్దేశించింది. చూశారా? లూథర్ దినమందు, ఆత్మ దానిని ఆ వెస్లీ లోనికే నడిపించింది. వెస్లీ, ఈ చివరి పెంతెకొస్తు కదలికలో, కానీ ఇది మరొక యుగం. ఇది వధువును బయటకు పిలిచే సమయం. రెండువేల సంవత్సరాల క్రితం పెంతెకొస్తు వద్ద జరిగినది కాదు, లేదా పునరావృతం కాదు, తిరిగి రావడం కాదు. పెంతెకొస్తు …
92పరిశుద్ధాత్మ లూథర్‌లో ఉంది, పరిశుద్ధాత్మ వెస్లీలో ఉంది; అభిషేకించబడిన దేవుని వాక్యం ఇది . మరియు పరిశుద్ధాత్మ ఆ యుగంలోని ప్రజల దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మరియు వారు వరముల పునరుద్ధరణను కలిగి ఉండడం ప్రారంభమైనది. తమను తాము దేవునికి సమర్పించడం ద్వారా, పరిశుద్ధాత్మ వారి ద్వారా భాషలలో మాట్లాడడం వారు కనుగొన్నారు,. వారు జబ్బుపడిన వారిపై చేతులు ఉంచినప్పుడు, మరియు వారు స్వస్థపరచబడ్డారు. వారు ఆత్మలో నాట్యం చేసారు. చూశారా? అది సంస్కరణ యొక్క యుగం సంఘాన్ని తిరిగి క్రమంలోకి తీసుకువచ్చింది. మరియు సంఘం యొక్క చివరి క్రమం వరములను సంఘములో ఉంచడం. లూథర్ నీతీకరణను, వెస్లీ శుద్దీకరణను, పెంతెకొస్తు వరాలను సంఘంలో ఉంచిన రీతిగానే. కానీ వారు ఏమి చేశారు? అదే తప్పు. ప్రకృతి గోధుమ కొమ్మను నమూనాగా చేసినట్టుగా, వారు (ఇది దేవునికి వ్యతిరేఖమైనది, దేవునికి విరుద్ధమైనది) దానిని సంఘ శాఖగా మార్చారు.
93ఇప్పుడు, మనము అది ఏమిటి అని ఇప్పుడు కనుగొంటాము…ఈ కొమ్మ సేకరించి, కలిసి వచ్చినప్పుడు, వారు తమ సొంత ఆలోచనను ఏర్పరుస్తారు. మరియు… వారు పిలిచినట్లుగా, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ నుండీ "కొత్త సమస్య" తలెత్తినప్పుడు, వారు ఏమి చేశారు? వారు దానిని స్వీకరించలేకపోయారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇది ఎంత నిజం అయినా, వారు అప్పటికే సభా మండలిలో ఉన్నారు. మానవుడు దానిని స్వాధీనం చేసుకున్నాడు, ఆత్మ వారిని విడిచిపెట్టింది. అది నిజం! ఆపై ఇది ముందుకు వస్తుంది. నేను మీ ఉత్తమ నాయకులతో మాట్లాడాను; వారు, "సరే, మనం ఇప్పుడు ఏమి చేస్తాం?" వారు తమను తాము కలవరపరచుకున్నారు. అది నిజం అని వారికి తెలిసినప్పుడు; వారు అలా చేయకపోతే, వారు ఆధ్యాత్మికంగా అంధులు మరియు బైబిల్ విషయములో అజ్ఞానులు. ఇప్పుడు అది అసహ్యముగా కాక; మర్యాదకరంగా చెప్తున్నాను. "తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ" అనే బిరుదులను ఉపయోగించి ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నట్టు బైబిల్లో ఎక్కడా లేదు. మరియు క్రైస్తవ మండలి, రోమన్ కాథలిక్ సంఘం వరకు ఎప్పుడూ ఉపయోగించబడలేదు. వారి స్వంత సంఘ శాఖ గ్రంథాలు కూడా అదే విషయాన్ని సాక్ష్యమిస్తున్నాయి. ఇది కాథలిక్కుల యొక్క సిద్ధాంతం! బైబిల్ సిద్ధాంతం కాదు, కాథలిక్కుల యొక్క సిద్ధాంతం. మరియు మీరు మెథడిస్టులు మీ మత శాఖ గ్రంథాలు మరియు ప్రతీ దానిని వారు కలిగి ఉన్నట్లే తీసుకువచ్చారు, క్రమంగా దాని నుండి ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు పెంతెకొస్తుకు వచ్చినప్పుడు, మరియు మీరు ఇంకా పట్టుకున్న కొన్ని సిద్ధాంతాలను విస్తరించారు …
కానీ ఇప్పుడు వధువు పిలుపు, ఇప్పుడు ఏడు ముద్రలు తెరువబడ్డాయి, ఇప్పుడు సంఘ సంస్కర్తలు వదిలిపెట్టిన పూర్తి విషయాలు తెరవవలసి ఉంది; మరియు మలాకీ 4 మాత్రమే దీన్ని చేయగలదు, ఎందుకంటే ఆ ప్రత్యక్షత దేవుని నుండి నేరుగా ఒక వ్యక్తి దగ్గరకు వెళుతుంది. అది నిజం! ఇది ఒక గుంపుకి రాదు, ఎప్పుడూ రాలేదు. ఒకే వ్యక్తి ! దీనినే వధువు రాకడ యొక్క ఛాయలలో దేవుడు వాగ్దానం చేశాడు, ఒక ఎలియాజరును. గమనించారా?
94యాజకులు, సేవకులు మరియు వారిని గమనించండి, నిజంగా అభిషిక్తులు అయిఉండి కూడా, వారి స్వంత ప్రేరేపణ పొందుతారు. దావీదు అభిషేకం పొందాడు. బైబిల్ అలా చెప్తుంది. కానీ మీరు చూడండి, అతను తప్పు వనరు ద్వారా, తప్పు మార్గమునకు వెళ్ళాడు. "మార్గమైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" అనే దేవుని పరిశుద్ధ మార్గమును కనుగొనుటకు బదులుగా ఆయన యొక్క అభిషేకాన్ని తప్పిదమైన మార్గము వైపుగా మర్లించారు, మనుష్యులు వారి యొక్క ఆలోచనలకూ, నాయకులు వారి యొక్క ఆలోచనల వైపుకు. "దీనికి తగిన సమయము, తగిన కాలము ఇదేనా? ఇది దేవుని చిత్తమేనా? "
2SAM 7:2,3,12•
1CH 17:1,2,11
95ఒకవేళ అతను దేవుని నిజమైన ప్రవక్త అయితే, అతను మొదట దేవుని ముందుకు వెళ్తాడు; "తండ్రీ, అది ఏమిటి?" అని అడుగుతాడు. నాతాను దావీదు విషయంలో చేసినట్లు.
దావీదు, "నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు నివాసము చేయడం, దేవుని మందసము డేరాలో నిలిచియుండడం సరైనదేనా?" అని అన్నాడు.
మరియు నతనయేలును (నాతాను- తెలుగు అనువాదకుడు) చూసి, "దావీదూ, యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. నీవు దేవుని అభిషేకించబడిన పాత్రవు" అని అన్నాడు.
కానీ అతడు ఒక ప్రవక్త అయిఉండియు, మరియు అతడు తప్పు చేసి ఉన్ననూ , మరియు అతని ప్రవక్తకు కట్టుబడి ఉన్న దేవుని కర్తవ్యం, ఆ రాత్రి ఆయన అతడికి కనిపించి, "వెళ్లి నా సేవకుడైన దావీదుకు ఈలాగు చెప్పుము, నేను అతని ధైర్యాన్ని మెచ్చుకొనుచున్నాను. దీని కోసం నేను అతనిని ప్రేమిస్తున్నాను, ఎందుకంటే అతడు నా హృదయానుసారుడు, మరియు నా మందసము ఆ విధంగా ఏదో ఒకదాని కింద ఉంచడానికి ఇది సమయం అని నాకు తెలుసు, కానీ … ఇది జరగడానికి ఇది కాలం కాదు. నేను అతని కుమారుడిని చేయనిస్తాను, కానీ నేను అతన్ని చేయనివ్వను."
అప్పుడు ఇక్కడ నాతాను వచ్చి, "దావీదు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆయన కలిగిన గొప్ప బయలుపాటు దేవుని యొక్క మందసమును పైకి తీసుకు వచ్చునప్పుడు ఎంత తప్పుగా ఉన్నదో అంతే తప్పుగా ఉన్నది. మీరు దీన్ని చేయవద్దు. ప్రయత్నించవద్దు! కానీ దేవుడు మీ కుమారుడు దానిని చేస్తాడని చెప్పాడు." అక్కడ! చూశారా? అక్కడే మీరు ఉన్నారు.
96అబ్రహాము భూమిపై ఒక పట్టణాన్ని కోరినట్లే, దావీదు దానిని ముందుగా చూడగలిగాడు కాబట్టే దావీదు దానిని చెప్పుటకు అభిషేకించబడ్డాడు. మీకు తెలుసా, అతను ఏదో ఒక రోజు ఇక్కడ నివసించబోతున్నాడు కాబట్టి అతను దానిని చూస్తున్నాడు. అబ్రహాము ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు అయన దాని కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఆయన ఏ యొక్క స్థలంలో నిలిచి చూసాడో ఆ పట్టణం ఆయనకు పైగానే ఉన్నది, మరియు వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన తిరిగి వచ్చి ఆ నగరంలో నివసిస్తాడు. కానీ ఒక ప్రవక్తగా ఉండి, అతను నియమించబడ్డాడు మరియు ప్రేరేపణ పొందాడు, మరియు అతను దాని కోసం వెతుకుతున్నాడు, ఎందుకంటే ఎక్కడో ఒక నగరం ఉందని అతనికి తెలుసు. కానీ, మీరు చూస్తే, దాని యొక్క పూర్తి ప్రత్యక్షత అతని నుండి దాచబడింది, అది అతని కాలం కోసం కాదు. [టేప్‌లో ఖాళీ ఏర్పడింది] … యోహాను వరకు. ఇక్కడ దేవుని యొద్ద నుండి పరలోకం నుండి ఆ నగరం కిందికి దిగడాన్ని అతను చూశాడు. అదే ఆ పట్టణము.
97చూడండి, ప్రతీదీ దాని కాలంలో ఉండాలి. మీరు వసంత ఋతువులో లేదా, శరదృతువులో మీ గోధుమలను నాటండి … మరియు వచ్చే వేసవిలో కత్తిరించండి. చూశారా? ఇది కొమ్మ గుండా, పుప్పొడి కుచ్చు ద్వారా మరియు పొట్టు ద్వారా పైకి రావాలి, మరియు … దానిలోనుండి … ఇది దాని ఋతువులో ఉండాలి. ప్రకృతి అంతా నిరంతరంగా నడుస్తుంది. దేవుని ఆత్మ ప్రకృతిని చేసింది, మరియు దేవుడు మరియు ప్రకృతి కలిసి ఆగకుండా కొనసాగుతూ ఉంటారు . ఆలయములో ఉంచిన వస్తువులన్నీ ఆయన పరలోకములో చూసినదానికి ఒక నమూనాగా ఉంచబడ్డాయి.
REV 6:9,10
98జీవించడానికి ప్రయత్నిస్తున్న ఒక చెట్టు మీరు చూస్తే, అంటే చనిపోని చెట్టు ఒకటి ఉంది. ఒక వ్యక్తి జీవించడం కోసం కష్టపడుతున్నట్లు మీరు చూస్తే, అది చనిపోని ఒక గుడారం ఎక్కడో వేచి ఉందని చూపిస్తుంది. "ఈ భూసంబంధమైన గుడారం కరిగిపోతే మనకు ఇప్పటికే ఒకటి వేచి ఉంది." మంచి పరలోకపు తండ్రి ఒక రోజు ఆ తెర వెనుక నడిచి చూడటానికి నన్ను అనుమతించారు. కాలము అనే ఆ తెరను దాటి చూడటం, దాని కథను ఎంతమంది విన్నారు? అక్కడ నేను మీ అందరికీ బోధిస్తున్నట్లుగానే, అక్కడ వారు నిలబడ్డారు. బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు, "ఎంతకాలం ప్రభువా అని కేకవేస్తున్నాయి?" కేవలం కల్పించినది కాదు, అది మేధావులు చెప్పుచున్నారు: "ఎంతకాలం ప్రభువా అని కేకవేయుచున్నారు?" అది ఇప్పుడే మనము అనుభవిస్తున్నాము. ఇక్కడ కూర్చున్న తొంబై మూడు సంవత్సరములు వయస్సు గల బిల్ డచ్ వలె మనము కూడా వృద్ధులమయ్యే కొలదీ దానిని వాస్తవికముగా అనుభవిస్తున్నాము. మరల మనము యవ్వనస్తులముగా మారుటకు ఏదోకటి మనలని లాగుతున్నది. ఏదో ఒకటి ఉన్నది దానికోసం నీవు ఏదైనా ఇస్తావు. ఏ విధముగానైనను, సహోదరుడు జాక్, సహోదరుడు గేర్హోల్తేజెర్ మరియు మనం అందరమూ, యవ్వనత్వములోనికి వెళ్లడానికి ఆశపడుతున్నాం. దానిని దేనికోసం కోరుతున్నాము? మరలా యవ్వనస్తులమై తిరిగి లోకంలోనికి పరుగెత్తడానికా ? కాదండి! ఎందుకంటే మనం ప్రేమిస్తున్న దేవునికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి మహిమపరచడానికే దానిని కోరుతున్నాం.
99మరియు నా ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయం నేను ఈ వర్తమానం కలిగిఉన్నాను, నదికి అవతల తీరమున ఒక దేశము గలదు, వారు దానిని నిరంతరము మధురమైనదని పిలుస్తారు. అక్కడ మనం ఆయనను యుగాల వెంబడి, అన్ని యుగాలలోనూ మరియు నిత్యం మహిమపరుస్తాము. మనకు ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే కరడు కరడును పిలుస్తోంది. కరడు యొక్క పిలుపు ఉన్నంతవరకు, ఆ పిలుపుకు ప్రతిస్పందించడానికి కరడు ఉండాలి లేకపోతే పిలుపు ఉండదు. ఒక సృష్టి ఉండటానికి ముందు, సృష్టిని సృష్టించడానికి మొదట ఒక సృష్టికర్త ఉండాలి, లేదా ఏదీ లేదు … దేవుడు ఉన్నాడు అనడానికి అదే ఋజువు.
100గీత అవతల ఉన్న ఈ యాజకులను గమనించండి. అభిషేకాన్ని గమనించండి. సరే, అభిషేకంలో తప్పు లేదు. మీతో కూడా అదే పెంతెకొస్తు వారలారా, కానీ మీరు ఇప్పుడు ఏ మార్గములో కదులుతున్నారో చూడండి. పెంతెకొస్తు నుండి కాలం మారిపోయింది, ఇంకేదో జరుగుతోంది. దేశములో ప్రవక్త లేకుంటే, దావీదు సరియే అయిఉండేవాడు. అది నిజం. కానీ అక్కడ నాతాను, దేవుని చేత నియమించబడి, నిరూపించబడి, ప్రవక్త అని దేవుని చేత సాక్ష్యము పొందినవాడై అక్కడ నిలబడిఉన్నాడు.
.గమనించండి! బైబిల్లోని మందసము ఎల్లప్పుడూ మనకు వాక్యమునకు మాదిరి అయి ఉన్నది, ఎందుకంటే అది మందసములోని దేవుని వాక్యము. మరియు ఉంది … వారు తెచ్చిన మందసమును గమనించండి, వారు ఎలా చేశారో చూడండి. అది దేవుడు నియమించిన స్థితిలో ఉంచబడలేదు. ఇప్పుడు, దేవుడు ఇక్కడ చట్టాలలో ఇలా అన్నాడు … తప్పనిసరిగా అది ఎలా చేయాలి, ఈ మందసము ఎలా కదలాలి, మరియు అది ఎవరిచేత తరలించబడాలి. కానీ దావీదు, తన అభిషేకం కింద …
101నా సహోదరులారా, మీరు దీన్ని కోల్పోకండి. మరియు మహిళా బోధకులుగా ఉండాలనుకుంటున్న నా సోదరీమణులారా, మీరు దీన్ని కోల్పోకండి. మీ అభిషేకం ఎంత ఉన్నా, మీరు దేవుడు ఏర్పరచిన స్థానములోనికి రావాలి. దావీదు యొక్క అభిషేకం అంతా బాగానే ఉంది, కాని అది చేయడంలో అతను ఉత్సాహంగా సరిహద్దు రేఖ దాటి అడుగుపెట్టాడు. అతను ఏమి చేశాడు? అతను సరిహద్దు రేఖ దాటి అడుగుపెట్టాడు. మందసమును దాని అసలు స్థితిలో ఉంచడానికి బదులు, దానిని లేవీయుల హృదయాలపై కాకుండా కొత్త బండిపై ఎక్కించాడు. ఇది లేవీయుల గుండెకు పైన ఉన్న భుజంపై మోయవలసి ఉంది. వాక్యం మనస్సులో లేదు, అది హృదయంలో ఉంది! క్రొత్త బండిపై కాదు. అది ఏమిటి? క్రొత్తదాన్ని సూచించాడు, దావీదు అక్కడ అదే చేశాడు, అక్కడ ఉన్న ప్రతీ సంఘ శాఖతో మాట్లాడి చేశాడు. దేవుని వాక్యాన్ని మోయాల్సింది రాష్ట్ర ప్రెస్‌బిటర్లు లేదా బిషప్‌లు మరియు మొదలగు సంఘశాఖల వారు కాదు. ఇది మనుష్యుల హృదయములోని పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము, ఏదో సంఘ సమాఖ్య యొక్క కదలిక కాదు. పరిశుద్ధాత్మ ఆయనకు విధేయత చూపించడానికి స్త్రీ మరియు పురుషుల హృదయాలలో ఉంచబడిన నిధి. చూశారా?
102ఇది ఆయన పరిచారకుల భుజము మీద పెట్టబడాలి. ఆయన పరిచారకులే లేవీయులు. ఆ మందసము వారి ఎడమ భుజము మీద మోసుకు పోయేవారు ఎందుకంటే అది వారి హృదయం మీద ఉన్నది. వారి హృదయంలో వాక్య భారం ఉంది. ఆమెన్! ఇప్పుడు మీరు మీ హృదయముపై, మీ సంఘశాఖ యొక్క భారం, మరియు మీ సమాజం యొక్క భారం, మీరు దీన్ని కట్టాలి, లేదా దానిని కట్టాలి, లేదా మరేదైనా కట్టాలి అన్న భారం కలిగిఉన్నారు: మీరు ఇంకా ఎంతమందిని మీ సంఘశాఖ లోనికి చేర్చాలి అనే భారం కలిగి యున్నారు; ప్రజలు దేవుని వాక్యాన్ని తప్ప మరేదీ చూడకుండునట్లు ప్రభువు వాక్యం పట్ల భారం కలిగి యుండడానికి బదులుగా మీ సంఘ శాఖ భారాన్ని కలిగి యున్నారు. కానీ మీరు ఆ మందసమును ఒక క్రొత్త బండిలో ఎక్కించారు. చూశారా? వారు సంఘ సమాఖ్య అనే భుజముల పైకి ఎక్కించారు. నేను క్లిష్టమైనవాడిగా ఉండాలనుకోవట్లేదు, కానీ మీకు నిజం చెప్పాలని అనుకుంటున్నాను, దేవుడు నాకు సహాయం చేయును గాక.
2KGS 15:1,3,4•
2CH 26:16-18
103[103] ఇప్పుడు, మతాచారాలు మరియు క్రైస్తవ మండలిచే ప్రభావితమై, ఆ యుగం యొక్క కాలం యొక్క నిజమైన వాక్యం అయిన వాక్యం నిర్లక్ష్యం చేయబడింది, ఎందుకంటే వారికి చాలా ఉద్రేకం ఉంది. కానీ దావీదు, అభిషిక్తుడైన రాజు … అతడు రాజు, కాని ఆయన అభిషిక్తుడైన రాజు. "నేను సేవకుడను, అభిషిక్తుడిని" అని మీరు అంటున్నారు. అప్పుడు సేవకుడిగా ఉండండి, ప్రవక్తగా ఉండటానికి ప్రయత్నించవద్దు. చూశారా? మీరు సువార్తికుడు అయితే, సువార్తికుడుగా ఉండండి.
యవ్వన రాజు మరియు యవ్వన ప్రవక్త అయిన యెషయా కాలములో ఉజ్జియాను గుర్తుంచుకొనండి. ఉజ్జియా గొప్ప వ్యక్తి, అభిషిక్తుడు, దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఆయనను ఆశీర్వదించాడు [అస్పష్టమైన వాక్యం]. నేను మీకు ఇక్కడ ఒక సారి దాని గురించి ప్రసంగించాను. మరియు ఒక రోజు అతను ఒక యాజకుని కార్యాలయమును(బాధ్యత) తీసుకోవచ్చని భావించే వరకు అతను పైకి లేచాడు… చివరకు ప్రభువు ఎదుటకి వెళ్ళాడు, మరియు యాజకులు అతనితో, "ఉజ్జియా, అలా చేయవద్దు!" అని చెప్పారు. కానీ అతను హెచ్చించుకున్నాడు . ప్రవక్త అతనికి ఏమీ చెప్పలేకపోయాడు. యజకులకు వారి క్రమం తెలుసు, వారు తమ క్రమమును పాటిస్తున్నారు. అతడు, "అది మీ క్రమము కాదు, ఉజ్జియా. అలా చేయవద్దు! " అని చెప్పాడు .
2KGS 15:5•
2CH 26:19,21
104మంచిది, అతను వారి నోరు మూయించాడు. మరియు అతను యాజకుని పనిని తీసుకొని, అర్పణ చేయుటకు అగ్నితో వెళ్ళాడు. అతడు అభిషిక్తుడైన రాజు, యాజకుడు కాదు. మరియు ఆ యాజకులు అతనితో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, "మీరు అద్భుతమైన రాజు, మీరు అబిషేకించబడినవారు, దేవుడు మనలను ఆశీర్వదించాడు; కానీ మీరు రాజు, యాజకులు కాదు."
మరియు పాస్టర్లు అయిన మీరు ప్రవక్తకు ఏమి చేయాలో ఎప్పుడూ చెప్పకూడదు, లేదా సువార్తికులు అయిన మీరు ఒక పాస్టరుకు చెప్పకూడదు . చూశారా? ఇది ఖచ్చితంగా గుర్తించబడితే ప్రతీ ఒక్కరికి తన కార్యాలయం (పని భారం) ఉంటుంది.
అందువలన అతను అగ్నితో లోపలికి వెళ్లాడు, కుష్టు వ్యాధితో మొత్తబడ్డాడు మరియు మరణించాడు.
1CH 13:1,2
105ఇప్పుడు ఇక్కడ రాజైన దావీదు, దావీదు కూడా ఇక్కడ అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను దానిని తన మీదకు తీసుకున్నాడు. "సరే, అది మంచిది." ప్రజలను చూస్తూ, "అధిపతీ , మీరు ఏమి చెబుతారు? మీ దగ్గర పది వేలు మంది ఉన్నారు."
"దేవునికి మహిమ, దావీదు, నేను ఆత్మను అనుభవిస్తున్నాను." ఓహ్, అతను అనుభవించాడు! అతను దానిని అనుభవించాడు. "దావీదు గురించి మీరేమనుకుంటున్నారు? మీకు అనిపిస్తుందా?"
"దేవునికి మహిమ, ఇదంతా నాపై ఉంది! దాన్ని పరీక్ష చేసి, అది సరైనదా అని చూద్దాం, చూద్దాం. ఆ మందసము ఎక్కడ ఉంది? "
"మనతో! మన మధ్యలో ఉంది."
"మేము ఎవరిని సంప్రదించాలి?" ఖచ్చితంగా, మందసము, అదే విధముగా ఆ భూమి ఫిలిష్తీయులకు బదులుగా ఇశ్రాయేలుకు చెందినది. అది నిజం. "వారు మనకు చెందినవారు. మరియు … అభిషేకాన్ని నేను కూడా అనుభవిస్తున్నాను. "
శాతాధిపతులు, సమాజమంతా, "దేవునికి మహిమ!" వారు చప్పట్లు కొట్టారు, మరియు వారు అరిచారు, మరియు వారు నాట్యం చేసి, పైకి క్రిందికి దూకారు.
వారికి ఆత్మ ఉంది, కానీ తండ్రి ఏమి ఆలోచిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? "నేను నాతానును, ఆ ప్రవక్తను అక్కడకు పంపలేదా? ఏమి చేయాలో వారికి తెలుసు, దావీదుకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు మరియు తన సరిహద్దు రేఖ దాటి అడుగు పెట్టి, దీన్ని చేయటానికి వెళ్ళాడు."
1CH 15:15
106సరే, గమనించండి, "భుజాలపై మోయడం" అనేది దేవుని అసలు ప్రణాళిక. ఐదు ఖచ్చితంగా ఉండాలి. మీరు వీటిని రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీరు ఉంటే … మీరు వ్రాస్తున్నట్లు నేను చూస్తున్నాను. (మరియు ఇది ఇరవై నిమిషాలు పది తరువాత, కాబట్టి నేను పదకొండు గంటల లోపు చేరుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను వీలైనంత త్వరగా తొందరపడతాను.) దేవుని సేవ చేయడంలో మనిషి ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత అభిషేకం పొందినప్పటికీ, ఎంత ప్రెస్బిటేరియన్ అయినా, బాప్టిస్ట్ అయినా, పెంతెకొస్తు అయినా, మీరు బిషప్, డీకన్, మీరు ఏమైనా, పాస్టర్, సువార్తికుడు, ప్రవక్త, అది ఏమైనప్పటికీ, ఐదు ఉన్నాయి మొదట పరిగణించవలసిన ఖచ్చితమైనవి ఐదు. ఎంత అభిషేకం ఉన్నా, ఎంత మంచిగా కనిపించినా, ప్రజలు అలా అరవడం, ఏ ఆత్మ కార్యమైనను, వాటిని ఖచ్చితంగా కలిగి ఉండాలి.
1COR 13:1
107ఇప్పుడు, నా సహోదరులారా, మీరు మీ కాగితాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు, ఇప్పుడు అది ఎందుకు అని అర్థం చేసుకోగలరా? ఇప్పుడు గుర్తుంచుకోండి, మీరు అందరూ ఆలోచించారు మరియు మీ మధ్య బోధించబడింది, (చూడండి, నేను దేశమంతటా మాట్లాడుతున్నాను). నేను భాషలలో మాట్లాడటం నమ్మలేదని.. నేను భాషలలో మాట్లాడటం నమ్ముతున్నాను, కానీ మీరు పరిశుద్ధాత్మ లేకుండా ఇంకా భాషలలో మాట్లాడగలరు. 1 కొరింథీయులకు 13 వ అధ్యాయములో ఇలా ఉంది, "మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, నేను ఇంకా వ్యర్థుడను." చూశారా? అది పరిశుద్ధాత్మ అభిషేకం, దానికి మీలోని ఉన్న ఆత్మతో సంబంధం లేదు. మీరు భాషలలో మాట్లాడవచ్చు మరియు వాక్యాన్ని తిరస్కరించవచ్చు. నేను అలా జరగడం చూశాను, మీరు కూడా చూశారు. చూశారా? ఒక స్త్రీ సువార్తను ప్రకటించగలదు మరియు … చూశారా? వారి జుట్టు కత్తిరించవచ్చు, మరియు ఇంకా అరిచి, భాషలలో మరియు మిగతా వాటిలో మాట్లాడతారు, వారు అన్నీ చేయగలరు … ఖఛ్చితంగా నిజం. మీరు వాక్యం యొక్క సత్యానికి అనుగుణంగా ఉండాలి.
108గమనించండి! మనిషి ఎంత నిజాయితితో ఉన్నా, అతను దేవుని చేత ఎంత గొప్పగా వాడబడినా, అతను ఎవరు అయినప్పటికీ, అతడు ఇది అయి ఉన్నాడు; అది అయిఉన్నాడు … అతను మాట్లాడుతున్న విషయం బైబిల్ ద్వారా సమయానుకూలంగా ఉండాలి. ఎవరో, "సరే, అప్పుడు మోషే …" అని అన్నారు. మోషే ఏమి చేసాడో నాకు తెలుసు, కానీ ఈ రోజు దేవుడు అది చేయడం లేదు. "సరే, ముప్పై సంవత్సరాల క్రితం, లూథర్ ఇలా అన్నాడు …" అది బాగానే ఉండవచ్చు, కానీ ఈ రోజు ఆయన చేస్తున్నది అది కాదు. "సరే, నలభై సంవత్సరాల క్రితం, పెంతెకొస్తు పడిపోయింది." కానీ ఈ రోజు ఆయన చేస్తున్నది అది కాదు.. చూశారా? ఇది సకాలంలో ఉండాలి.
ఇది లేఖనం ప్రకారం ఉండాలి. రెండవదిగా, అది కాల పరిమితిలో ఉండాలి. మూడవదిగా, అది దేవుని వాక్యం మాట్లాడిన విధానానికి అనుగుణంగా ఉండాలి.
AMOS 3:7
109నేను, "దేవునికి మహిమ అని చెప్పగలను! పెంతెకొస్తు రోజున జరిగినట్లే పరిశుద్ధాత్మ నాపైకి వచ్చింది, హల్లెలూయా " అని చెప్పగలను. కానీ అది ఈ రోజు భిన్నంగా ఉండవచ్చు. ఇది దావీదు మీదకు కూడా వచ్చింది, కాదా? ఖచ్చితంగా, అది వచ్చింది. ఉజ్జియాపై పడింది, కానీ అది తప్పు! చూడండి, మీరు ఇప్పుడు దాని కంటే లోతుగా వెళ్లాలి. చూశారా? మీరు దాని కంటే లోతుగా వెళ్లాలి. ఇప్పుడు, బాధపడకండి, భక్తితో ఉండండి.
మరియు గమనించండి, మరియు అది దేవుడు ఎన్నిక చేసుకున్న మనిషి మీదకు రావాలి. ఒక సంఘశాఖ ఎన్నిక కాదు, ప్రజల ఎన్నిక కాదు, కానీ దేవుని ఎన్నిక ప్రకారమే . మరియు అది దేవుని నుండి వచ్చిన వర్తమానం అయితే, దేవుని నుండి గొప్ప ప్రత్యక్షత అయితే, అది ఆయన యొక్క ప్రవక్త వద్దకు రావాలి. ఇప్పుడు, మీకు దాని లేఖనం కావాలంటే, అది ఆమోసు 3: 7. చూశారా? ఇప్పుడు, అది తప్పక జరగాలి.
ఐదు విషయాలలో ఉండాలి. ఇది కాలపరిమితిలో ఉండాలి. దేవుడు చెప్పిన సమయంలోనే ఉండాలి. ఇది దేవుని వాక్యంలో వ్రాయబడాలి. ఇది దేవుని కాలపు పరిమితిలో ఉండాలి, చూడండి. మరియు అది దేవుని ఎన్నిక ద్వారా ఉండాలి.
GEN 6:14
110మరియు దేవుడు తన వాక్యాన్ని అనువదించడానికి మనలో ఎవరి అవసరం లేదు. దేవుడే తన సొంత అనువాదకుడు. ఆయనకు మన శిక్షణ సంస్థలు అవసరం లేదు. ఆయనకు మన జ్ఞానం అవసరం లేదు, అది అర్ధంలేనిది. చూశారా? హవ్వ దానిని పొందుకుంది మరియు ఆమె జ్ఞానం ద్వారా అనువాదాన్ని కోల్పోయింది.
"ఓహ్, ఆ వ్యక్తి చాలా తెలివైనవాడు" అని చెప్పవచ్చు. మంచిది, అది ఒక విషయమే కాదు. ఖచ్చితంగా. అహాబు తెలివైన వ్యక్తి. బెల్షస్సరు తెలివైన వ్యక్తి. సాతాను చాలా మోసకరముగా , క్రూరముగా, యుక్తిపరుడై ఉన్నాడు, ఎవరూ అతన్ని తట్టుకోలేరు, ఎవరూ లేరు.
ఇప్పుడు ఎవరి జ్ఞానం మీద ఆధారపడకండి, దేవునిపై మాత్రమే ఆధారపడండి. చూశారా? దేవుడు ఎలా ఉన్నాడు? ఆయనే వాక్యం. దేవుడు తన వాక్యాన్ని ఎలా అనువాదం చేసుకుంటాడు? ఇప్పుడే దగ్గరగా వినండి, ఈ విషయాలు తప్పిపోకండి. దేవుడు తన మాటను ఎలా అనువాదం చేసుకుంటాడు? అది నెరవేరడం ద్వారా, ఎక్కడో ఒకటి మాత్రమే కాదు, ఆ కాలముకు సంబంధించినవన్నీ .
"నోవహు బయటికి వెళ్లి బోధించుము, ప్రేరేపణ పొందుము" అని చెప్పలేదు; కానీ, "ఒక ఓడ నిర్మించు, దానిలో తలుపులు ఉంచు, దాన్ని ఈ విధంగా తయారు చేయి మరియు ఆ విధంగా చేయి అని చెప్పాడు. అతను దిగువకు బదులుగా పైన తలుపును ఉంచినట్లయితే ? అతను కిటికీని అడుగున, పైన తలుపు పెడితే? చూశారా? ఇది సమయం ప్రకారం ఆదేశించబడాలి, ఎందుకంటే దేవుడు దానిని ఖచ్చితంగా అలాగే ఉపయోగించబోతున్నాడు. అది ఆ విధంగా ఉండాలి, మరియు అది ప్రేరేపింపడం ద్వారా రావాలి.
111ఒక వ్యక్తి ఒక సారి ఇలా చెప్పడం నేను విన్నాను, అతడు "ఆయన జబ్బుపడినవారి కోసం ప్రార్థిస్తాడని నేను నమ్ముతున్నాను, అది మంచిది అని నేను నమ్ముతున్నాను. కానీ ఒక ప్రవక్తగా గాని చూసినట్లయితే, "అతను దేవుని ప్రవక్త అని నేను నమ్ముతున్నాను; కానీ భోదకుని విషయానికి వస్తే ఆయన 'యేసు మాత్రమే .' " అని అన్నాడు. ఏమి … మీరు అలాంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆ మనిషి ఏమి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడు.
ప్రవక్త అనే పదానికి "అతను దేవుని వాక్యాన్ని బయలుపరిచేవాడు" అని అర్ధం. అనువాదం అతని వద్దకు మాత్రమే వస్తుంది. అందుకే ఈ రోజు మనం ప్రవక్త అయిన ఏలియా రూపంలో మనకు పంపించబడాల్సిన ఆ గొప్ప వ్యక్తి యొక్క అవసరతలో ఉన్నాము. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన ఈ రోజు, మరియు ఘడియ మరియు ఈ యుగం ఇదే అని చూపించడానికి ఋజువుపరచబడిన దేవుని ప్రత్యక్షత. మరియు, గుర్తుంచుకోండి, అతనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎల్లప్పుడూ అలాగే ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. తిరస్కరించబడతాడు, పొట్టును తిరస్కరించినట్టుగా … మొదట అతను అంగీకరించబడతాడు, ఎందుకంటే పొట్టు గోధుమలను సూర్యుడి ముందుకు వచ్చు వరకు మాత్రమే పట్టుకుని ఉంటుంది. పెంతెకొస్తు అనేది వర్తమానమునకు ఆశ్రయం మాత్రమే ఇస్తుంది, చెల్లాచెదురుగా పడిపోవువరకు దానికి ద్వారం తెరుస్తుంది, ఆపై పొట్టు వేరుచేయబడుతుంది, మరియు గోధుమ పరిపక్వత లోనికి వచ్చువరకు సూర్యుని వెలుగు కింద ఉంటుంది, చూశారా .
112ఏ సంఘశాఖ ఉండదు, గుర్తుంచుకోండి. బ్రదర్ జాక్ మరియు మీలో చాలా మంది ఇక్కడ చరిత్రకారులు ఉన్నారు. ఉజ్జీవం ఎప్పుడూ లేదు, కానీ ఉజ్జీవం తరువాత మూడు సంవత్సరాల తరువాత వారు దానిని ఒక సంఘశాఖగా ప్రారంభించారు. అది సరియైనదేనా? దేవుని చివరి గొప్ప అద్భుతమైన కదలిక ఈ చివరి రోజుల్లో, ఇరవై సంవత్సరాలు గడిచింది, మరియు ఇది ఒక సంఘశాఖ నుండీ ఒక మిలియన్ మైళ్లు దూరంలో ఉంది, అన్ని సమయాలలో మరింత దూరం వెళుతూనే ఉంది; పొట్టు తిరస్కరిస్తుంది, దానితో సహకరించదు, దానితో ఇంక చేసేది ఏమీ లేదు. చూశారా? ఎల్లప్పుడూ దానిని తిరస్కరిస్తుంది. ఇక అది ఉండదు, ఇప్పుడు అది గోధుమ మాత్రమే. కానీ మనము చాలా ఆకుపచ్చగా ఉన్నాము. అది నిజం. పరిపక్వమగుటకు సూర్యుడి వెలుగు క్రింద ఉంచబడాలి, అంతే. చాలినంత ఆకుపచ్చదనం; మరియు సజీవ దేవుని యొక్క ఆత్మ ఆయన వాక్యంలో కదలాడుతూ, మన మధ్యలో గొప్ప కార్యాలు చూపించుటను ఎరగడానికి కావలసిన యధార్ధత, పవిత్రత మన మధ్యలో లేదు.
EXOD 7:11•
MATT 12:34•
MATT 23:33•
MATT 24:24•
MARK 13:22•
JOHN 6:53•
JOHN 8:29,44•
JOHN 10:37,38•
2TIM 3:8
113మనకు తప్పుడు అనుకరణదారులు పైకి లేచారు. ఏమి చేయడానికి? మోసగించడానికి. బైబిల్ వారు చేయగలరు అని చెప్తుంది. "యన్నే, యంబ్రే అనువారు మోషే తో పాటు ఉన్నట్లుగానే, చివరి రోజుల్లో కూడా ఇవి జరుగుతాయి." చూశారా? వారు అదే పని చేస్తారు, దానిని అనుకరిస్తూ వస్తారు. ఖచ్చితంగా అదే విధముగా. చూశారా? జాగ్రత్తగా ఉండండి! బైబిల్ సిద్ధాంతాన్ని చూడండి. వారి సూచనలు అనుసరించే వర్తమానాన్ని చూడండి. ఇప్పటికీ అదే పాత వర్తమాన పాఠశాలా ? మర్చిపోండి.
దేవుడు తన ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అద్భుతాలు మరియు సూచనలను పంపాడు. యేసు వచ్చినప్పుడు జబ్బుపడినవారిని స్వస్థపరిచాడు, ప్రవక్తలు కూడా అలానే చేసారు. వారు, "ఓహ్, గ్లోరి, అతను వస్తున్నాడు, అతను పరిసయ్యుడు అవుతాడు , అతను సద్దుకయ్యుడు అవుతాడు" అని వారు అనుకున్నారు.
కానీ ఆయన, "సర్పసంతానమా." "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు" అని అన్నారు. "మీరు మనుష్యకుమారుని మాంసాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప, మీలో జీవం ఉండదు" అని అన్నారు. ఆయన దానిని వివరించలేదు. అతను దానిని వివరించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా! అది మరొక యుగం కొరకు. ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్పాడు. "నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనదానినే చేస్తాను" మరియు అది ఆయన వాక్యాన్ని పాటించడమే. "నేను చేయకపోతే, నేను ఉండవలసిన నా జీవితం మరియు నా క్రియలు ఆయన వాక్యం తో పోలిక లేకుండా ఉంటాయి, అప్పుడు నన్ను నమ్మవద్దు, నేను ఆయనను కాదు; కానీ ఒకవేళ అలా ఉంటే, మీరు నన్ను నమ్మలేకపోతే నా క్రియలను నమ్మండి," అని ఆయన చెప్పాడు.
ఇప్పుడు తప్పక చేయవలసినవి ఖచ్చితముగా చేయవలెను.
114ఇప్పుడు, దేవుడు తాను ఏర్పరచిన మార్గం ద్వారా వారికి విషయం బయలుపరచలేదు. అతను దానిని ప్రేరేపణతో బయలుపరచాడు, కానీ అది తప్పు మార్గములో ఉంది. చూడండి, ప్రేరేపణ బాగానే ఉంటుంది, కానీ అది తప్పు మార్గం లో ఉంటే, అది తప్పుగానే తీసుకుని వెళ్తుంది. మీరు తూటా తీసుకొని నేరుగా లక్ష్యానికి పేల్చినట్లైతే . ఇది లక్ష్యానికి సరిగ్గా దారి తీసుకుంటుంది, కానీ చిన్న గాలి తగిలితే దాని గురి తప్పిపోతుంది. ఇప్పుడు, మీ వాహనములో మీరు గంటకు అరవై, డెబ్బై మైళ్ళు వేగంతో రోడ్డుపైకి వెల్లినట్లితే మరియు గాలి తగిలినప్పుడు, మీరు మీ చక్రాలను తిరిగి సరి చేసుకుని, దాన్ని మళ్లీ రహదారిపైకి తెచ్చుకోవచ్చును, కానీ మీరు తూటాతో అలా చేయలేరు. దాని చక్రాలను సరిగా ఉంచడానికి ఏమీ లేదు, అది లక్ష్యాన్ని తప్పుతుంది. చూడండి, ఇది దాని అసలైన మార్గంలోనే ప్రయాణించాలి.
115కాబట్టి అలాగే దేవుని వాక్యం దాని అసలైన మార్గంలోనే ప్రయాణించాలి. గాలి యొక్క చిన్న ఊపు కూడా దాన్ని చెదరగొట్టలేదు, ఏ చిన్న సంఘ శాఖ లేక మరేదీ దానిని చెదరగొట్టలేదు, ఏచిన్న హింస అయినా దానిని చెదరగొట్టలేదు, అది సూటిగా గురియొద్దకే కదులుతుంది! ఇది ఖచ్చితంగా లక్ష్యాన్ని కూడా చేరుకుంటుంది. మరియు అది ఆ దశకు ఆ లక్ష్యమును చేరుకున్నప్పుడు, దేవుడు దానిని ఋజువుపరుస్తాడు. ఆయన చెప్పినది ఖచ్చితంగా అది చేస్తుంది. ఇక్కడ ఇది లేఖనాల్లో ఉంది, ఇది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 'అది నెరవేరుతుంది!". చూశారా? అక్కడే ఉన్నారు మీరు.
116ఇప్పుడు, దేవుడు తాను ఏర్పరచిన మార్గములో దానిని బయలుపరచలేదు. కాబట్టి వారు ఆయన వాక్యానికి మరియు కాలానికి భిన్నంగా, ఇప్పుడు ఉన్నట్లుగానే చేయబోతున్నారు. జనులు ఎంత నీతిగా ఉన్నా, ఆయన అందించిన మార్గం వెలుపల ఆయనకు సేవ చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారు దానిని ఎల్లప్పుడూ గందరగోళానికి గురిచేస్తారు. బిలాము లాగా. తాను దేవునికి సేవ చేస్తున్నానని బిలాము అనుకున్నాడు.
దేవుడు అబద్ధాలు చెబుతాడా? దేవుడు ఎప్పుడైనా తన మనసు మార్చుకుంటాడా? సరే, ప్రజలు ఈ రోజు ఆయన మారినట్టే వ్యవహరిస్తున్నారు. స్త్రీల వెంట్రుకలను కత్తిరించవద్దని ఆయన చెప్పినప్పుడు, వారు ఇలా అంటారు, "మేము దానిని కత్తిరించవచ్చు, ఈ డాక్టర్ ఫలానా వ్యక్తి , ఆ డాక్టర్ ఫలానా వ్యక్తి అలా చెప్పారు- కాబట్టి మేము చేయగలమని చెప్తారు. ఈ సహోదరుడు లేదా ఆ సహోదరుడు మీరు చాలా సంకుచిత మనస్తత్వం గలవారని అన్నారు. " చూశారా?
"సరే, ఇది జరగగలదా? ఇది జరుగుతుందా? "
"అవును, వాళ్ళు వీళ్ళు అలా అన్నారు."
దేవుడు తన మనసు మార్చుకోడు.
NUM 22:6,8,10-15
117బిలాము ఒక ప్రవక్త అని మీరు నమ్ముతున్నారా? ఆయన ప్రవక్త అని బైబిలు చెబుతుంది. అతను ప్రవక్త అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు, గుర్తుంచుకోండి, బాలాకు అతని వద్దకు వచ్చి, "దిగి ఈ ప్రజలను శపించు, ఎందుకంటే వారు భూమి అంతట ఉన్నారు. వారు ఒక తెగ కాదు, ఒక దేశం కాదు, వారు కేవలం చెల్లాచెదురుగా ఉన్న గుంపు; మరియు మనము దేశము యొక్క ప్రముఖులము. ఇప్పుడు మీరు అక్కడకు వెళ్లి ప్రజలను శపించండి, నేను దాని కోసం వెలను చెల్లిస్తాను," అని అన్నాడు.
మరియు బిలాము ఒక ప్రవక్త ఏమి చేయాలో సరిగ్గా అదే చేసాడు. అతను, "నేను వెళ్ళను. మీరు రాత్రిపూట ఇక్కడ వేచి ఉండండి, దేవుడు ఏమి చేయమంటాడో చూద్దాం" అని అన్నాడు.
అందువల్ల అతను లోపలికి వెళ్లి, "ప్రభువా, నాతో ఇక్కడ కొంతమంది ఉన్నారు, నేను దిగి అక్కడ మరికొంత మందిని శపించాలని వారు కోరుకుంటున్నారు." "నేను దీని గురించి ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు?" అని అడిగాడు.
దేవుడు, "నీవు వెళ్లవద్దు, ఎందుకంటే వారు నా ప్రజలు!"
బిలాము బయటికి వెళ్లి, "మీ ఇంటికి తిరిగి వెళ్లుడి. నేను మీతో రాలేను, దీన్ని చేయవద్దని దేవుడు నాకు చెప్పాడు" అని చెప్పాడు. ఇప్పుడు, దేవుని అసలు వాక్యం ఉంది. "వెళ్లవద్దు!" అని.
మంచిది, అప్పుడు వారు తిరిగి వెళ్లి, "మీకు తెలుసా, మీ బిషప్ దానిని వినరు."
"సరే", రాజు ఇలా అన్నాడు." మనము చేయవలసినది మీకు చెప్తాను. అతనికి కొంచెం డబ్బు కావాలి, అది అతనిని ఒప్పించగలదని నేను నమ్ముతున్నాను. లేదా నేను అతన్ని రాష్ట్ర మత గురువుగా చేస్తాను, బహుశా నేను అతనికి కొంత గొప్ప పదవిని ఇస్తాను . నేను అతన్ని బిషప్పుగా చేయగలను, నేను ఏమి చేయగలనో మీరు చెప్పలేరు. నేను ఏమి చేస్తానో మీకు చెప్తాను. మీరు అతనిని ఒప్పించటానికి తగినంత విద్యను పొందలేదు.' హిజ్ ' మరియు ' హేఇంట్స్', మరియు ' టోట్ ' మరియు ' ఫెచ్ ' మరియు ' క్యారీ' మొదలగు మీరు వాడిన (ఆంగ్ల) పదములు సరిగా లేవు కాబట్టి అతడు మీ మాట వినడు. అతడు మీ మాట వినడు. మేము నిజమైన విద్యావంతులైన గుంపును ప్రముఖులను పంపుతాము. "
NUM 22:17•
PROV 26:11•
2PET 2:22
118వారు అక్కడకు వెళ్లి, "డాక్టర్ బిలాము, మీకు శుభాకాంక్షలు. నేను మీకు రాజు నుండి అభివందనములు తీసుకువచ్చాము."
"శుభోదయం, సోదరులారా." చూశారా?
"ఇప్పుడు, డాక్టర్ బిలాము …" మరియు, ఓహ్, పదజాలం, అది నిజంగా ఎలా కురిపించబడిందో. మరియు, "ఇప్పుడు, రాజు నిన్ను హెచ్చిస్తానని , అతడు మీకు గొప్ప గౌరవం కూడా ఇస్తానని చెప్పాడు. మరియు, మీకు తెలుసా, వారైతే ఈ ఆజ్ఞను తీసుకోవడానికి మీకు చాలా డబ్బు ఇచ్చారు, కానీ రాజు అయితే, మీరు దానిని తీసుకోవడానికి వస్తే దానిని మూడు రెట్లు, నాలుగు రెట్లు చేస్తానని చెప్పాడు. "అప్పుడు బిలాము దురద చేతులు గలవాడయ్యాడు. అతను మూర్ఖమైన ఆలోచనలతో తన మనస్సును కదిలించాడు. ఇప్పుడు, గుర్తుంచుకోండి, అతను దాని ద్వారా దేవుణ్ణి పిలిచాడు, అభిషేకించాడు, కాని అతను అసలు ప్రణాళిక నుండి వెంటనే దేవుణ్ణి కదిలించాడు. పెంతెకొస్తు చేసినది కూడా అదే! జనాదరణ పొందటానికి, ఏకత్వం వారు, త్రిత్వం వారు, ప్రజాదరణ కోసం మీరు భిన్నంగా ఉండాలని సూచించారు. మీరు ఒక శాఖగా మారి మరియు మీరు చనిపోయారు. మీరు మరలా తిరిగి లేవలేరు. కానీ, మీరు చూస్తే, మీరు దేవుని మూలంతోనే ఉండి ఉండాలి … మిమ్మల్ని ప్రజలుగా మార్చడానికి అతను మిమ్మల్ని ఆ గుంపు నుండి బయటకు తీశాడు, కాని మీరు శాఖగా మారి, అదే వాంతిలోకి తిరిగి వెళ్లారు … (నన్ను క్షమించండి) మీరు బయటకు వచ్చిన అదే దానిలోకి. "ఒక కుక్క దాని వాంతికి మరియు ఒక పంది దాని బురదలోనికి వెళ్లినట్లుగా." క్షమించండి, నేను అలా చెప్పాను, నన్ను క్షమించండి. ఇక్కడ వేదికకు అది సరైనది కాదు. చూశారా? నేను భౌతికంగా చెప్పాను. ఇప్పుడు గమనించండి. నా ఉద్దేశ్యం అదే, వాంతి చేయడం. నేను అలా చెప్పిఉండవలసినది. వాక్యం అంతా బాగానే ఉంది, కానీ దుర్వినియోగం చేయబడింది. చూశారా? ఇది సరిగ్గా ఉపయోగించబడింది, కానీ తప్పుగా పలుక బడింది. వాంతి, "కుక్క దాని వాంతికి తిరిగి వచ్చినట్లుగా."
119పెంతెకొస్తును మొదట శాఖగా మార్చిన అసెంబ్లీ ఆఫ్ గాడ్, జనరల్ కౌన్సిల్, ఈ ప్రత్యక్షతను అంగీకరించలేనట్టుగా మార్చారు అని మీరు అన్నట్లయితే, ఏకత్వం వారైన మీకు తెలియదా, మీరు అదే పని చేయలేదా? సర్ప సంతానం, నిత్య రక్షణ మరియు ఈ ఇతర విషయాల వర్తమానాన్ని మీరు ఎలా స్వీకరించగలరు? మీరు కూడా సంస్థాగతమైన శాఖగా మారారు కాబట్టే మీ ఇంటి తలుపు ద్వారం వరకు కూడా దానిని అనుమతించలేరు. బిలాము చేసిన పని అదే, కాని దేవుడు తన మనసు మార్చుకోడు.
120కాబట్టి బిలాము వెళ్లి, "ప్రభువా, ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు వేరేవారి వలే ఉండటానికి అవకాశం వచ్చింది. మీకు తెలుసు నేను ఎవరూ కాని వాని వలే ఉన్నాను, కాని నాకు వేరేవారి వలే ఉండటానికి అవకాశం వచ్చింది. ప్రభువా, దాని గురించి ఇప్పుడు మీరు ఏమి చెబుతారు?" ఇప్పుడు, అతను ఎప్పుడూ అలా చెప్పకుండా ఉండాల్సింది! దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో ఆయనకు తెలుసు !
కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ ఎవరైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్నారో, ఈ దినానికి ఉండాల్సిన బైబిల్ యొక్క ఈ ఇతర విషయాలను గురించి ఏమి చేయాలంటే - దానిని అంగీకరించండి! దేవుడు స్పష్టంగా నిరూపించడాన్ని మరియు అది నిజం అని మీరు చూసినప్పుడు, అది దేవుడు తన వాక్యమును తానే అనువదించడం. కానీ మీరు చేస్తారా? లేదు. దీన్ని చేయడానికి మీ సంస్థ మిమ్మల్ని అనుమతించదు.
NUM 22:12,19,20
121ఈ ఉదయం టుక్సన్ లో అక్కడ ఉన్న చాలా మంది సేవకులు వింటున్నారు. సహోదరుడా గిల్మోర్, నాకు మీపై వ్యతిరేఖత ఏమీ లేదు; బ్రదర్ బ్రాక్, మొదటి అసెంబ్లీ మరియు స్నేహపూర్వక సంఘం. నేను అన్నీ సమయాలలో ఉన్నాను, మీరు నన్ను కనీసం లోపలికి రానివ్వలేదు. ఖచ్చితంగా మీరు చేయలేరు. మీరు ఏమిటో అలా మీరు ఉండలేరు. మీరు ప్రత్యక్షతను అంగీకరించలేరు, ఎందుకంటే మీరు స్థాపించబడి ఉన్నారు. మరియు వినండి, ఉజ్జియా ఆ తప్పుడు ప్రేరేపణలో ఉన్నందున చంపబడినట్లే, చాలా మంది నిజమైన క్రైస్తవులు ఆ పాత చనిపోయిన శాఖలలో తమ అనుభవాన్ని తిరిగి కోల్పోతున్నారు, ఎందుకంటే వారు అలా చేయటానికి నియమించబడనప్పుడు వారు మందసము మీద చేయి వేస్తున్నారు. . ఇప్పుడు మీరు దీన్ని నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం. దేవుడే మీకు న్యాయాధికారి . దేవుడు తన వాక్యాన్ని తిరిగి తీసుకోలేదు. ఆయన మొదటిసారి ఏం చెప్పాడో, ఆయన ప్రతీసారీ అదే చెబుతాడు.
అతను బిలాముతో, "మీరు వెళ్లవద్దు!" అని చెప్పాడు.
ఆపై బిలాము తిరిగి వచ్చి, "అయితే ప్రభూ, నేను వెళ్ళగలనా?" అని అన్నాడు.
ఇప్పుడు చూడండి. దేవుడు, "వెళ్లు !" అన్నాడు. ఇప్పుడు, అతను వెళ్లడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. దేవుని అనుమతి పూర్వకమైన చిత్తం ఉంది, కానీ అది దేవుని పరిపూర్ణ చిత్తం కాదు. అతను ఏమి ఇబ్బందిలో పడ్డాడో మీరు చూశారా?
122మరియు దేవుని వాక్యానికి వెలుపల ఏదైనా, ఏదైనా సంస్థ లేదా మరేదైనా, దేనినైనా నిర్మించే ఏ వ్యక్తి అయినా, అది మునిగిపోయే ఇసుక మరియు అది పడిపోతుంది! అది ఖచ్చితంగా చనిపోతుంది, ఎందుకంటే దేవుని వాక్యం వధువు యొక్క ఎదుగుతున్న శరీరం. మీరు శరీరమంతా పాదాలు, అంతా చేతులు, అంతా తొడలు కలిగి ఉండలేరు. ఇవన్నీ వాటి కాలంలో వస్తాయి.
మరియు పెంతెకొస్తు, మీ శాఖ అంతా కూడా ఒకే విధముగా చేసి, తద్వారా మీరు క్రొత్త ప్రత్యక్షతను అంగీకరించలేరు. అందుకే మీరు ఉన్న చోటే ఉన్నారు మరియు చనిపోతున్నారు; అయితే దేవుని సంఘము కదిలి వెళ్ళింది. (సమయం ఎక్కువ తీసుకున్నాను, మిమ్మల్ని అలసటకు గురి చేయడం ఇష్టం లేదు.) కానీ దేవుడు తన మనసు మార్చుకోడు. ఆయన మొదటి నిర్ణయం ఖచ్చితంగా సరైనదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు తన మనసు మార్చుకోడు, మీ అనుమతి పూర్వకమైన చిత్తం లో కొనసాగడానికి అయన మిమ్మల్ని అనుమతిస్తాడు. ఓరల్ రాబర్ట్స్ చెప్పినట్లు "దేవుడు మంచి దేవుడు". ఆయన భయాన్ని కలిగించే దేవుడు కూడా!
JOHN 20:25,27,29
123చూడండి, మీరు అన్నట్టే "దేవునికి మహిమ, నేను భాషలలో మాట్లాడాలనుకుంటున్నాను!" ఆయన దాన్ని చేయటానికి మిమ్మల్ని అనుమతిస్తాడు, కానీ మీకు పరిశుద్ధాత్మ ఉంది అనటానికి అది సంకేతం కాదు.
తోమా చెప్పినది గుర్తుందా, పాత సందేహి? "నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను." ఇప్పుడు, మీరు అక్కడే ఉన్నారు, అదే విషయం.
యేసు, "తోమా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను" అని అన్నాడు . ఇప్పుడు, మీకు తోమా మార్గం కావాలంటే, ముందుకు సాగండి. కానీ ఆయన ఏమి చెప్పారు? " నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని."
124గమనించండి, మందసము మీద చేయి వేసి ఉండకూడదు కాని ఇలా చేయడం ద్వారా అతను నిజాయితిగల మనుష్యుల మరణానికి కారణమయ్యాడు. గొప్ప, నీతిగల మనిషి, ఆలోచించండి అభిషేకం మరియు ప్రతిదీ సరిగ్గా ఉన్నాయి, కానీ మందసము దాని తప్పుడు మార్గంలో కదులుతోంది. బైబిలు ఇలా చెప్తుంది లేవీయులు, తడబడలేదు కాని ఎద్దులు తడబడ్డాయి. ఎద్దులు తడబడ్డాయి. మరియు బండి తిరుగబడబోతున్నది; మరియు ఒక నిజాయితీ గల వ్యక్తి, ప్రేమతో నిండిన హృదయయముగాలవాడై, ఎడ్లకు కాలు జారినందున చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, ఆ మందసమును లేవీయుడు తప్ప మరెవరూ తాకకూడదు గనుక అతను చనిపోయాడు. దేవుడు తన వాక్యాన్ని ఎలా కాపాడుతున్నాడో, తన మార్గమును ఎలా కాపాడుతున్నాడో, అతని క్రమాన్ని ఎలా కాపాడుతున్నాడో చూశారా? ఉజ్జియా కుష్టు వ్యాధితో మొత్తబడ్డాడు. దావీదు, ఒక మనిషి మరణానికి కారణమయ్యాడు. మరియు అది ఒక తీవ్రమైన విపత్తు; వారిద్దరూ ఆత్మతో అభిషేకించబడ్డారు, కానీ దేవుని మార్గము వెలుపల. అది సరియైనదేనా? అతడు మరణించాడు. ఓహ్, ఇది దావీదుకు చచ్చేంత భయము పుట్టించింది. ఇదే ఆ స్థలమునకు పేరుగా పెట్టబడింది. చూసారా? ఆయన అక్కడ అతనిని గుర్తింపచేసాడు.
MATT 23:15
125నిజాయితీగల విశ్వాసులకు ఎన్నిసార్లయినా సంఘ శాఖలవారు అదే పని చేసారు. కాథలిక్, మెథడిస్ట్, బాప్టిస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, పెంతెకొస్తులు కూడా అదే విషయంతో చాలా మంది ఆధ్యాత్మిక మరణానికి కారణమయ్యారు. ఈ విషయాలతో వారు కనుగొన్నప్పుడు … మరియు వారు ఇంకేమీ ముందుకు వెళ్లలేరు, ఎందుకంటే వారి సంఘశాఖ అదే నమ్ముతుంది.
ఈ రోజు చూడండి. ఈ పెద్ద కూడికలు, అదే కార్యం. వారు ఏమీ చేయరు కానీ వారిని పాతాళానికి రెండింతలు పాత్రులుగా చేస్తున్నారు, వారు మొదటి స్థానంలో ఉన్న దానికంటే ఘోరమైన స్థితిలో ఉన్నారు. సత్యంలోనికి రావడానికి వారికి కష్టమయ్యేట్టుగా అది చేస్తుంది. ఈ పెద్ద ఉజ్జీవాలలో ఒకదానిని కలిగి ఉంటారు, మరియు అందరు లోపలికి వస్తారు, కొద్దిసమయం కొనసాగుతూ వెళ్తారు మరియు తిరిగి బయటకు వెళ్లి, వారు ఆ పాపాన్ని మళ్లీ ప్రారంభిస్తారు. మరొక ఉజ్జీవం గురించి వింటారు, "ఆహ్, నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి; నేను ప్రయత్నించాను, దానీలో ఏమీ లేదు." అని అనుకుంటారు చూశారా? వారికి మార్గం తెలియదు.
126మన గొప్ప సువార్తికుడు బిల్లీ గ్రాహం, ఒక ఉదయం ఈ విధమైన అల్పాహారం వద్ద కూర్చుని, "నేను … " కెంటకీలోని లూయిస్ విల్ అనే ప్రాంతములో, అతను బైబిల్ను ఉంచి, ఇలా అన్నాడు, ఇక్కడ "దేవుని యొక్క ఉదాహరణ ఒకటి ఉంది. " అని అనడం విన్నాను. మరియు అది నిజం, ఆ మనిషి నిజం చెప్పాడు. అతను ఇలా అన్నాడు, "మీరు వెళ్ళండి … పౌలు ఒక నగరంలోకి వెళ్లి ఒకరిని మార్చాడు, ఒక సంవత్సరం తర్వత, అక్కడ నుండి ముప్పై మంది మార్చబడ్డారు." "కానీ నేను ఒక నగరంలోకి వెళ్లి ముప్పై వేల మందిని మార్చాను, ఆరు నెలల్లో తిరిగి చూస్తే ముప్పై మందిని కూడా కనుగొనలేకపోయాను." అతను- "విషయం ఏమిటో మీకు తెలుసా?" "ఓ సోమరి బోధకులారా", " భోజనం తర్వాత విస్వాసులను సందర్శించి వారితో మాట్లాడటానికి బదులు, కాళ్ళని బెంచీ పైన చాపి కుర్చుని ఫోను ద్వారా వారితో సందర్శిస్తున్నారు" అని అన్నాడు.
ఓహ్, నా గుండె మండుతోంది. నేను అనుకున్నాను, "ఓ గొప్ప దేవుని యొక్క ప్రజలారా, ఇక్కడ మీతో విబేధించడానికి నేను ఇష్టపడను, కానీ పౌలు ఒకరిని మార్చినప్పుడు సోమరి బోధకులు ఎవరు? అతను ఏమి చేసాడు, అతడు అతనిని వాక్యము లోనికి తీసుకువెళ్లాడు, అతనిని వర్తమానములోనికి తీసుకువెళ్లాడు, దేవుణ్ణి కనుగొన్న చోటికి తీసుకువెళ్లాడు; అయన హృదయం మండించబడుతుంది, ఆయన దేశమును వెలిగించాడు! మరియు మీరు చేసే ఏకైక విషయం వారిని బాప్టిస్ట్ లేదా మెథడిస్ట్ సంఘం, లేదా ఏదైనా దానిలో ఉంచడం. మండడానికి అక్కడ ఏమీ లేదు." అవును అండి!
127వాక్యం ఈ రోజు కోసం వాగ్దానం చేసినదాన్ని చూడండి. ఇది మెథడిస్టా, బాప్టిస్టా, పెంతెకొస్తులు, లేదా ఈ రోజు కోసం ఎవరో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ లేఖనాలను చదవడానికి వెళ్లవచ్చు. నేను మీకు చెప్తున్న ఈ లేఖనాలను వ్రాసుకోండి. అలాగే ప్రకటన …
నాకు సమయం ఉంటే, నేను చదివేవాడిని, కానీ నాకు సమయం లేదు. నాకు పన్నెండు లేదా పద్నాలుగు నిమిషాలు ఉన్నాయి.నేను సరిగ్గా బయటకి వచ్చినట్లైతే, పదకొండు గంటల సమయానికి ముగించాలి.
REV 10:1,2,6,7
128మలాకీ 4, ప్రకటన 10, ఏడు ముద్రలను గమనించండి. బైబిల్ చెప్పలేదా … ఇప్పుడు చూడండి! అక్కడ ఒక పరలోకపు దూత, భూసంబంధమైన దూత ఉన్నారు. మరియు ప్రతీ దూత ఆ సంఘ కాలం కోసం ఉన్నారు. ఆయన ఇలా అన్నాడు, "ఒక దూత వర్తమానికుడు వచ్చాడు" (దేవదూత అనే పదానికి , ఆంగ్లంలో వర్తమానికుడు అని అర్ధం). "…ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి మరియు యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని-ఇక ఆలస్యముండదు గాని. " అది సరియైనదేనా? అతని తల చుట్టూ ఒక వర్షధనస్సు, మరియు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. ఆ దేవదూత క్రీస్తు. ఖచ్చితంగా. కానీ ఆయన ఏమి చెప్పారు? "కానీ ఏడవ దూత పలుకు దినములలో [ఏడవ సంఘ కాలం] దినములలో …"
129ప్రతీ సంఘ కాలానికి ముగింపులో , దేవుడు ఒక దూతను పంపే వరకు అక్కడ వారు ఒక మతసంబంధమైన, గందరగోళంలో మిళితమైపోయి ఉన్నారు, మరియు ఆ సంఘ కాలానికి అదే వర్తమానము. అప్పుడు వారు అతని వర్తమానాన్ని తీసుకుంటారు, ఎందుకంటే అతను కొంతకాలమే జీవిస్తాడు, అప్పుడు వారు అతని సందేశాన్ని తీసుకుంటారు, మిగిలిన వాటితో కొనసాగించే బదులు, వారు ఒక సంఘ శాఖగా మారుస్తారు. ఆపై మరొక వర్తమానికుడు మరొక దూతను తీసుకుని , మరొక సంఘ శాఖగా చేస్తారు.
మీరందరూ నా పుస్తకంలో చూశారు. ఏడు సంఘ కాలాలలో దీని గురించే చెప్పబడుతుంది, ఏదైతే నాకు చెప్పబడినదో, దీని నిమిత్తం తీర్పు దినమున తీర్పు తీర్చబడుటకై దేవుని ఎదుట సాక్షిగా నిలబడతాను. ఇది దేవుని నుండి వచ్చింది, నా ఆలోచన నుండి కాదు. ఇక్కడ గమనించండి. నేను అనుకున్నాను … ఒకవేళ నా స్వంత ఆలోచనను కలిగి ఉంటే, దానికి భిన్నంగా ఆలోచించి ఉండేవాడినేమో. సహోదరుడు జాక్ అక్కడ దేవదూత గురించి నాకు చెప్పినట్లుగా, "ఆ క్రీస్తు మహిమ శరీరములో ఉన్నాడు." కానీ అది కాదు, ఈ వర్తమానము యదార్ధమైనదని కనిపిస్తుంది, ఆయనే ఉన్నతమైన దైవత్వం, ఆయనే దేవుడు అని చూపిస్తుంది. చూశారా? వాక్యం నుండి దీనినే నేను బోధిస్తూ వచ్చాను. వాక్యం ఎల్లప్పుడూ వాక్యమును గూర్చి సాక్ష్యమిస్తుంది.
REV 3:16,20•
REV 10:7
130ఇప్పుడు, త్వరగా, ఇప్పుడు మేము కొన్ని క్షణాల్లో ముగించాలని అనుకుంటున్నాము.
ఇప్పుడు, "ఏడవ దూత పలుకు దినములలో, భూసంబంధమైన దూత , ఏడవ సంఘ కాలంలో ఈ ఇతర ఆరు సంఘ కాలాల ద్వారా తిరిగి పోగొట్టుకున్న ఈ మర్మములన్ని అప్పుడే బయలుపరచబడాలి" అని ఆయన అన్నారు. సరే , ఆ దూతలు చెప్పినది అదే. ఇక్కడ ఏడు ముద్రలు లేదా ఈ మర్మాలు తెరవడం ఉన్నాయి. మరియు మీరు ఆ ఈ సంఘ శాఖల కంటే ముందు దాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. వారు దానికి విరుద్ధంగా … సహోదరుడా, వారు ఒక నత్తగుల్లవలే మూసివేయబడతారు. కానీ వారు ఎల్లప్పుడూ అలాగే చేసారు! కానీ ఇది ఆ కాలం.
ఇది ఏడవ సంఘ కాలం అని ఎంతమందికి తెలుసు, "ఆమేన్" చెప్పండి. లవొదికయ సంఘ కాలం, నులివెచ్చనిది, దేవుడు తన నోటి నుండి బయటకు ఉమ్మి వేస్తాడు. మరియు వారు తమ నోటి నుండి దేవుణ్ణి ఉమ్మి వేస్తారు. అక్కడ యేసు బయట తలుపు తట్టి, తిరిగి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు బైబిల్లో వేరే ఏ కాలములోను లేదు,. వారు ఆయనను బయట పెట్టారు, సహకారం లేదు. యేసు ఎవరు? వాక్యం! ఆ వాక్యమును బయట పెట్టారు. పొట్టు గోధుమలను విసిరివేసింది! ఆయన ఇలా అన్నాడు, "నేను తలుపు వద్ద నిలబడి తలుపు తడుతున్నాను, ఆ సంకెళ్ళలో ఎవరైనా నా గొంతు వింటారా …" ఓ దేవా, దయ చూపండి.
131ఆ సమయంలోనే, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు, దావీదు అభిషేకంతో తాను చేసిన తప్పును చూశాడు. ఓ దావీదు, సేవకుడవైన నీవు పట్టుకున్న నీ చనిపోయిన మతాచారాలను మరియు సంఘ శాఖలను చూడలేదా? అది ఏమి చేస్తుందో మీరు చూడలేదా? ఇది ఉజ్జియాను చంపుతోంది. ఆధ్యాత్మికంగా చనిపోయారు, మరియు ఉజ్జీవం ఎందుకు లేదని మీరు ఆశ్చర్యపోతున్నారు: మీ స్త్రీలను వారి జుట్టును కత్తిరించడానికి, వారి ముఖాలకు రంగులు పూయడానికి, పొట్టి దుస్తులు ధరించడానికి అనుమతిస్తున్నారు; మీ అబ్బాయిలను రిక్కీ పాఠశాలలకు పంపిస్తున్నారు మరియు అలాంటి వారిలో సగం మంది స్వలింగ సంపర్కులుగా ఇంటికి తిరిగి వస్తారు.
ISA 27:3•
JOHN 10:28
132దావీదు లక్ష్యాన్ని గమనించండి: అతను మందసమును తన సొంత ఇంటికి తీసుకువస్తున్నాడు. అది రాజధాని లోని గొప్ప భవనము కాదు, దానిని ఉంచే స్థలం కాదు. ఇది యెరూషలేములో ఉండాల్సినది, కానీ దావీదు దానిని తన సొంత ఇంటికి తీసుకువస్తున్నాడు. ఉజ్జీవం తన సొంత సంస్థలో ఉండాలని అతను కోరుకున్నాడు. "ఓహ్, మీరు సమాజం అయితే, సరే." "మీరు ఏకత్వం వారు అయితే, సరే." "మీరు పెంతెకొస్తు వారు అయితే, సరే."
ఎవరో నాతో, "బ్రదర్ బ్రన్హాం, మీ మాట వినడానికి మీతో ఎప్పుడైనా ఎవరైనా ఎలా ఉన్నారు?" "నేను బిల్లీ గ్రాహంను చూస్తున్నాను, అతను దేశంలో ప్రతీ సంఘ శాఖను అతనితో కలిగి ఉన్నాడు. నేను ఓరల్ రాబర్ట్స్ ను చూస్తున్నాను, ప్రతీ పెంతెకొస్తు అతనిని అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ, "మీరు మొత్తం అంతటికీ వ్యతిరేకముగా ఉన్నారు, ప్రపంచములో మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఎలా పొందుతారు?" అని అన్నారు.
నేను, "అది దేవుడు!" అన్నాను.
"ప్రభువు అను నేను జగదుత్పత్తికి మునుపే దానిని కాపుచేయుచున్నాను ప్రతీ నిమిషమునా నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను." యెషయా గ్రంధములో. "నేను నాటాను. నేను జగదుత్పత్తికి మునుపే, ముందు నిర్ణయము ద్వారా వారి పేర్లను పుస్తకములో ఉంచాను. నీరు కట్టువాడను నేనే, నీవు కొనసాగుము. నీరును అమర్చువాడను నేనే, నీవు దాన్ని పిచికారీ (చల్లడము) చేయుము. " సరే. చూశారా? " ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను" ఇక్కడే మీరు ఉన్నారు.
133యెరూషలేముకు బదులుగా దావీదు పట్టణానికి రావాలని కోరుకున్నారు. ఆ సమయంలో దానికి ఏ స్థలం సిద్ధంగా లేదు, మరియు ఈ రోజు కూడా అలానే ఉంది. ఏడు ముద్రలలో విప్పబడిన ఈ గొప్ప మర్మాలకు, ఏ సంఘ శాఖలోనూ చోటు లేదు … దానిని తీసుకోవటానికి ఒక సంఘశాఖను విడిచిపెట్టాలి. లూథర్ నుండి పెంతెకొస్తు ఏకత్వం వరకు, దానిని స్వీకరించగల స్థలం లేదు. ఒక మనిషి దానిని స్వీకరించలేడు మరియు అతడి సంఘ శాఖలో ఉండలేడు. అతడు గోధుమలను అనుసరించాలి లేదా పొట్టు తో అయినా వెళ్ళాలి, ఆయనకు కావలసిన ఏదో ఒకదానితో కొనసాగాలి.
LUKE 23:34
134క్రీస్తే అనగా వాక్యమే మన మందసము. వారు తమ సంఘ శాఖను కోరుకుంటారు. ఆయన సంఘ శాఖల యొక్క కొత్త బండ్లపై వెళ్లలేడు, ఆయన వర్తమానం విసుగు చెంది ఒక ప్రవక్త యొక్క హృదయంలోనికి రావాలి తప్ప, కొత్త సంఘశాఖ యొక్క బండిపైన కొనసాగలేదు . అది కొనసాగలేదు. అది ఆ విదంగా ఉండాలని వాగ్దానం చేసాడు, అది అలానే ఉంటుంది, మరియు అది తప్పక అలాగే ఉండాలి. # 314 కాబట్టి సంఘ శాఖ ఎప్పటికీ దానిని పొందుకోలేదు, అందులోని వారు పొందుకోలేరు. యేసును సిలువకు వేలాడదీసినప్పుడు యూదులు ఉన్నట్లుగా వారు గ్రుడ్డివారుగా ఉన్నారు, యేసు, "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. " అని అన్నాడు. వారిని తృణీకరించవద్దు, కానీ, మీ కండ్లకు గ్రుడ్డితనము కలిగి, లేవ లేని మరియు ఏమి జరుగుతుందో చూడలేని అదే స్థితిలో మీరు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
PS 22:1,16,17•
REV 3:17
135అది వారి దేవుడే అని వారు చూడలేకపోయారు. ఆయన అక్కడ సిలువపై వేలాడుతున్నప్పుడు, వారు రెండు వందల గజాల దూరంలో ఉన్న ఆలయంలో ఇరవై రెండవ కీర్తనను పాడుతూ, "నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడనాడితివి? వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. "చూశారా?" నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నీవు నన్ను ఎందుకు విడనాడితివి? " మరియు అక్కడ, వారు ఏ దేవుడు గురించి అయితే పాడారో, ఆయనను సిలువకు అప్పగించే అంత గ్రుడ్డితనం కలిగి ఉన్నారు, మరియు అది వారికి తెలియదు.
ఇప్పుడు, లవొదికయ సంఘం, ఆమె "దౌర్భాగ్యురాలు, దిక్కుమాలినది, దరిద్రురాలు, గ్రుడ్డిది, దిగంబరి అయి ఉండి దానిని యెరుగక, తన సంఘ శాఖ సభ్యులచే చాలా గొప్పదని భావించి" ఉందని బైబిల్ చెప్పలేదా? "గ్రుడ్డితనం" అంటే ఏమిటి? లవొదికయ సంఘమునకు "గ్రుడ్డితనం" అంటే యూదుల సంఘం ముగింపు వలే ఉన్నది, వెలుపల నిలబడి తలుపు తడుతూ, లోపలికి వచ్చుటకు ప్రయత్నిస్తున్న క్రీస్తును గ్రహించలేని గుడ్డితనంలో ఉన్నారు: "దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక. " దేవా, వీరిపై దయ చూపండి!
136గోధుమ గింజ సూర్యుని ప్రకాశంలో ఉండి కూడా మనం జీవిస్తున్న ఘడియను ఎందుకు గ్రహించలేకున్నది? అవును, క్రీస్తే మన మందసము, కానీ అది చేయడమే ఆయన అసలు మార్గం. అప్పుడు ఇక్కడ ఆయన… సరే వారు ఆయన ఆత్మను కలిగి ఉన్నారు, అది మనకు తెలుసు. వారు ప్రభువు కొరకు వేచి ఉన్నారు, దాని కాలములో ఆయన అసలు వాక్యముపై ఆయన ప్రణాళిక నిరూపించబడటానికి వారు చూస్తున్నారు, అదే మనం ప్రస్తుతం చేస్తున్నది. అయన వాగ్దానము చేసిన ప్రణాళికను ఋజువు పరుస్తూ ఆయన తన వాక్యం ద్వారా వారి విశ్వాసాన్ని బయలుపరుస్తాడు, సంఘ శాఖల యొక్క మానవ పథకాలు కాదు, మన స్వకీయ మందసానికి మనుషులను సమకూర్చుకోవడం కాదు.
వారికి మెథడిస్ట్ మందసము, బాప్టిస్ట్ మందసము, ప్రెస్బిటేరియన్ మందసము లభించాయి, మహా శ్రమల కోసం ప్రతి ఒక్కరూ ఈ మందసములోకి వెళుతున్నారు; "దేవునికి మహిమ! నేను మెథడిస్ట్ మందసము, ప్రెస్బిటేరియన్, పెంతేకొస్తు మందసములో బాప్తిస్మం పొందాను." ఒకే ఒక మందసము ఉంది, అది యేసుక్రీస్తు, మరియు ఆయనే ఆ వాక్యం!
REV 10:9
137గమనించండి, పాత నిబంధనలో దేవుడు "గ్రంధమును భక్షించుము" అని ప్రవక్తతో చెప్పాడు. క్రొత్త నిబంధన యొక్క ప్రవక్తతో, "చిన్న పుస్తకం తినుము" అని చెప్పాడు. ఎందుకు? ప్రవక్త మరియు వాక్యం ఒకటి కాబట్టే! చూశారా? అది మందసము, దేవుని వాక్యం.
దేవుడు తన వాక్యాన్ని వాగ్దానం చేసాడు, అది ఎలా నెరవేరింది మరియు ఆయన తన వధువును ఎన్నుకున్నప్పుడు అది ఎలా నెరవేర్పులోనికి వస్తున్నది, అది ఎలా జరుగుతుంది. ఇది మీ ముందు, ప్రభువు పేరిట జరుగుతోంది, మరియు అది అసలు వాక్యం ద్వారా! సాయంకాల వర్తమానం ఇక్కడ ఉంది.
హేవుడ్ వ్రాసినప్పుడు ఎంతమందికి గుర్తుంది:
సాయంకాల సమయమున ఒక వెలుగు ఉంటుంది,
మహిమలోనికి మార్గం మీరు ఖచ్చితంగా కనుగొంటారు…
DEUT 4:2•
REV 22:18,19
138అవును, ప్రకటన 10, మలాకీ 4, లూకా 30 మరియు 10, ఏడు ముద్రల యొక్క సాయంకాల వాగ్దానం ద్వితీయోపదేశకాండము 4: 1 మరియు 4 చదవండి, తరువాత ఇరవై ఐదవ మరియు ఇరవై ఆరవ అధ్యాయం చదవండి మరియు ఈ చివరి దినాల గురించి ఆయన ఏమి చెప్పారో చూడండి. మోషే ఇశ్రాయేలీయులతో "ప్రతి వాక్యమును గైకొనుడి, ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు!" అని చెప్పాడు. ఆ ప్రవక్త అయిన మోషే అక్కడే ఉండి ఆ దేవుని వాక్యాన్ని చూశాడు. ఆయన చూచిన ఆ వాక్యము దేవుని స్వంత చేతి వ్రాత ద్వారా ఆయన కొరకు వ్రాసి ఋజువుపరిచాడు. అయన, "వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు" అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 4 లోని ఇరవై ఐదవ మరియు ఇరవై ఆరవ వచనములో మీరు చదివారు.
గమనించండి! మీరు దానికి కలపకూడదు, మీరు దాని నుండి తీసివేయకూడదు; ఎందుకంటే మీరు అలా చేస్తే, దేవుడు మీ బాగాన్ని జీవ గ్రంధం నుండి తీసివేస్తాడు. మరియు మీరు ఆయన సంతానం కాదని ఇది చూపిస్తుంది.
139గుర్తుంచుకొనండి! దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రతీదీ, దేవుడు మనతో మాట్లాడిన ప్రతీదీ, దేవుని నామములో మనకు చెప్పబడిన ప్రతీదీ, అది జరిగింది! దేవుడు ఎప్పుడూ ఒక్క వాగ్దానాన్ని కూడా శూన్యంగా చేయలేదు, కానీ ఆయన మనకు చెప్పిన ప్రతీ వాగ్దానాన్ని ఆయన నిలుపుకున్నాడు, ష్రీవ్ పోర్ట్, ఈ ఇరవై సంవత్సరాలుగా ఆ వాక్యం సత్యముగానే ఉన్నది, నేను దేవుని శక్తి ద్వారా మరియు మీ కాపరి యొక్క మర్యాద ద్వారా మీకు బోధించాను మరియు ఈ రోజు మిమ్మల్ని మునుపు చెప్పబడిన కార్యము యొద్ధకే తీసుకొచ్చాను. పిల్లలను కనే అవకాశం దాటిపోయిన స్త్రీలు, పురుషులు, పిల్లలు, బాధలు, స్వస్తతలు, ప్రవచనాలు, జరగబోయే కార్యములు, వాటిలో ఒక్కటి కూడా ఇంతవరకు ఎన్నడూ విఫలం కాలేదు! ఇప్పుడు, ఆ సంఘ శాఖల నుండి దూరంగా ఉండండి, వారు మిమ్మల్ని మరణానికి నడిపిస్తున్నారు.
140సమూయేలు ఒక రోజు నిలబడి, మరియు "మాకు రాజు కావాలి, మిగతా ప్రపంచం లాగా ఉండాలని కోరుకుంటున్నాము" అని వారు చెప్పారు.
సమూయేలు, "ఆ రాజును తీసుకోకండి. అతడు మీ కుమారులు, కుమార్తెలను తీసుకుంటాడు, అతడు ఇది అది చేస్తాడు" అని చెప్పాడు.
ఆయన, "అవును, మీరు చెప్పింది నిజమేనని నాకు తెలుసు" అని అన్నాడు.
అయితే సమూయేలు, "నా మాట వినండి. నేను మీ డబ్బును ఎప్పుడైనా తీసుకున్నానా? జీవనం కోసం నేను మిమ్మల్ని ఎప్పుడైనా వేడుకున్నానా? మీ కోసం ఒక కూడిక నిర్వహించడానికి మీరు నాకు ఇంత జీతం ఇవ్వవలసి ఉందని నేను ఎప్పుడైనా మీకు చెప్పానా? " ఇప్పుడు కూడా మీరే తీర్పు చెప్పండి! అతను, "ప్రభువు యొక్క నామములో నేను చెప్పిన ఏ కార్యమైన ఎప్పుడైన జరగకుండా పోయిందా ?" అని అన్నాడు. ఒక్కటి అయినను లేదు.
"ఓహ్, అవును, సమూయేలు, మీరు డబ్బు కోసం మమ్మల్ని ఎప్పుడూ వేడుకోలేదు, మీరు ఎప్పుడూ పెద్ద విషయాలు కోరుకోలేదు. సమూయేలూ , అది నిజం, మరియు మీరు ప్రభువు నామములో మాకు చెప్పినవన్నీ నెరవేరాయి. కానీ, సమూయేలూ, మా సంఘ శాఖను ఎలాగైనా కోరుకుంటున్నాము! "
"అప్పుడు వెళ్ళండి. మీకే వదిలేస్తున్నాం." అది నిజం.
141మీరు దేవునికి సేవ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, మరియు మీరు దేవుని మార్గము నుండి బయటికి వెళుతుంటే, మీరు దానిని గందరగోళానికి గురిచేస్తూనే ఉంటారు. సజీవ దేవుని సంఘమా! దయచేసి నా ఐరిష్ పద్ధతులను మరియు నా హాస్య భావనను క్షమించండి, కానీ నిజాయితీతో నా హృదయంలోని పవిత్రతతో, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అయిన మీరు, ఏకత్వం అయిన మీరు, ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్, మీరు ఎవరైనప్పటికీ, మీ జీవం కోసం పారిపోండి. గుర్తుంచుకోండి, అక్కడ నుండి బయటపడండి.
దేశాలు విడిపోతున్నాయి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,
(శేషించబడిన వారికోసం సిద్ధపడుతుంది)
ప్రవక్తలు చేత ముందుగ చెప్పబడిన సూచనలు;
సంఘ శాఖల యొక్క దినములు లెక్కించబడుతున్నవి,
భయానక సంఖ్యతో;
"చెదరగొట్టబడిన వారలారా, మీ స్వంత వారి యొద్దకు తిరిగి రండి."
విమోచనా దినము సమీపముగా ఉన్నది,
జనుల హృదయాలు భయము వలన పగిలిపోతున్నాయి;
ఆయన ఆత్మతో నింపబడి ఉండండి,
మీ దీపాలను సరిచేసుకుని తేటగా ఉంచుకొనుము,
మీ తలలను పైకి ఎత్తుకొనుము! మీ యొక్క విమోచనా దినము సమీపముగా ఉన్నది.
మీరు దానిని నమ్ముతున్నారా? మనము చివరి దినాలలో ఉన్నాము. మనం ఇక్కడ ఉన్నాము. ఆ చేవ్రాత గోడ మీద ఉంది, రెండవ రాకడ అతి సమీపములో ఉంది, వధువు ఎన్నుకోబడింది, నీరు పోయబడింది, మరియు బయటికి తీసుకురాబడింది.
HEB 13:8
142ఇప్పుడు, సంఘము నుండి తీసివేసినట్లు కాదు, సంఘ శాఖల నుండి బయటకు తీసుకురాబడింది. మీరు తప్పనిసరిగా సంఘానికి వెళ్ళాలి, కానీ ఏ సంస్థలోనూ చేరకండి. యేసు అన్ని సంస్థలతో వెళ్ళాడు, కానీ ఆయన వారిలో ఏ ఒకరితోను ఎప్పుడూ చేరలేదు. ఆయన వారిలో ఎవరితోనూ కలిసి ఉండలేదు, వాస్తవానికి, కానీ ఆయన వారిలో ఉన్నాడు. అక్కడే కాంతి వెదజల్లే చోటు ఉంది. మరియు మీరు ఉన్న చోటనే ఉండి, కాంతిని వెదజల్లుతున్నారు. చూశారా? దేవుడు మిమ్మల్ని దాని కొరకే ఉపయోగిస్తున్నాడు. ఆకలితో ఉన్న హృదయము కలిగిన ప్రజలకు, యేసుక్రీస్తు నిజమని వారికి తెలియజేయండి-ఆయన నిన్నటి మాదిరిగానే, ఆయన ఈ రోజు, మరియు నిరంతరం ఉంటాడు.
143ఒక పురుషుడు లేదా స్త్రీ పూర్తి నిజాయితితో, దేవునికి సేవ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ, దానిని తప్పుడు మార్గంలో కదిలించుట సాధ్యమవుతుంది . వారిపై పరిశుద్ధాత్మ యొక్క నిజమైన అభిషేకం కలిగి ఉండియు, ఆ కాలముయొక్క దేవుని ప్రణాళికకు విరుద్ధంగా కదిలించి, సమస్తమును గందరగోళ పరిచారు . ఇప్పుడు, ఇది నిజం అని మీరు నమ్మితే, "ఆమేన్" అని చెప్పండి. మనము దానిని ఇప్పుడే చదివాము. దానిని చేయుటకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం లో దానిని చేయుటకు రాకుండా సమస్తమును గందరగోళ పరిచారు.
ప్రార్థన చేద్దాం:
144ఓ సంఘమా, ఇక్కడ మరియు దేశమంతటా, ఈ ఉదయం మీ దీనమైన సేవకుడి మాట వినండి. వింటారా? ఇది మొదట ప్రారంభమైన కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఎక్కడ ఉన్నారో చూడండి; ఆ అనుకరణలు ఏ విధముగా దానిపైన ప్రాధాన్యత తీసుకున్నయో చూడండి , మరియు గొప్ప మిలియన్లు మరియు బిలియన్ల డాలర్లు సంస్థలలోకి వచ్చాయి. చూశారా? దేవుని వాక్యానికి ఇంకనూ దూరంగానే ఉన్నారు. భవనాలు మరియు సంస్థలు దేవుడు తన ఆత్మను కదిలించే మార్గం కాదు. ఆయన దానిని సజీవంగా ఉంచడానికి, దానిని తన వాక్యంలోకి కదిలించాడు. మరియు మీరు జగదుత్పత్తికి మునుపే ఆ వాక్యము కొరకు నియమించబడితే, ప్రతి వాక్యము వేరొక వాక్యము పైనకు సరిగా వచ్చి చేరుతుంది (దాని యొక్క వరుసలో వచ్చి చేరుతుంది). ఏ విధముగా అంటే ఒక మానవ కణం వలే, ఒక మానవుని కణం తరువాత కుక్క యొక్క కణం, తరువాతి పిల్లి యొక్క కణం గా ఉండదు; అది కేవలం మానవ కణాలు మాత్రమే. కానీ మొదట ప్రారంభించడానికి ఒక కణం ఉండాలి. అది సరియైనదేనా? "ఆమేన్" అని చెప్పండి. సరే, ఇది ప్రారంభించడానికి అది వాక్య కణం అయితే, ఇతర వాక్య కణాలు దానిని పూర్తి శరీరంగా మార్చడానికి నియమించబడతాయి.
పిల్లలుగా ఉండకండి (ప్రేమలో మాత్రమే), కానీ ఆత్మ మరియు తీర్పులో పురుషులుగా ఉండండి. నేను మీకు నిజం చెప్పానా లేదా అని పరీక్షించండి. ఇది దేవుని వాక్యమా కాదా అని పరీక్షించండి . ఇది మనం మాట్లాడుతున్న గడియ అవునా కాదా అని పరీక్షించండి. ఈ విషయాలు వాగ్దానం చేయబడినవేనా అని పరీక్షించండి. ఇప్పుడు, అవి నిరూపించబడ్డాయా? ప్రపంచంలో ఏ మానవుడు చేయలేని విషయాల ద్వారా ఇది నిరుపించబడింది. అది మనలను దాటుకుంటూ వెళ్ళిపోయే అవకాశం మనం ఇవ్వడం మనకు సర్వ సాధారణమైపోయింది. వేచి ఉండుము, సంఘమా, వేచి ఉండుము.
145ఈ ఉదయం ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు తెలియని వారుంటే, ఈ ఉదయం నీతీమంతులుగా నిలువనట్లైతే, మీరు ఎన్నడు పాపం చేయనట్లుగా మీ పాపాలు అన్నీ పోయి, మరియు మీరు అలా ఉండాలని కోరుకుంటే … ఎందుకంటే గుర్తుంచుకోండి, ఒక రోజు, బహుశా ఈ రోజు, తరువాతి ఐదు నిమిషాల్లో కావచ్చు, కానీ ఒక రోజు ఆ గుండె ఆగిపోబోతుంది. మరియు లోపల ఉన్న లోపల భాగం దేవుని సమక్షంలో నిలబడటానికి, ఈ ఉదయం మీరు ఈ వర్తమానంతో ఏమి చేస్తున్నారో, మీరు చూసే ఈ వర్తమానం ప్రకారం పరీక్షించబడటానికి వెళ్తుంది. ఇది నేను కాదు, నేను కేవలం ఈ నోటిబూరను (మాట పలుకువాడను) మాత్రమే. ఈ మైకు మాదిరిగా, నేను దానిలో మాట్లాడితేనే తప్ప అది ఏ విషయం చెప్పలేదు. దేవుడు దాని ద్వారా మాట్లాడితేనే తప్ప నేను ఏమీ చెప్పలేను, కాని దేవుడు దానిని నిజమని నిరూపించాడు. మీరు నిజమైన క్రైస్తవునిగా ఉండాలని కోరుకుంటారు.
ఇప్పుడు, మాకు వేదిక పిలుపును పిలువడానికి స్థలము లేదు, కానీ మీరు కూర్చున్న అదే బల్ల వద్దనే. ఈ స్థలం కిక్కిరిసి, ఇరికించబడి, నిండిపోయింది. నేను మిమ్మల్ని ఒక వేదిక వద్దకు పిలవలేను, మిమ్మల్ని పిలవడానికి ఇక్కడ వేదిక లేదు. కానీ వేదిక మీ హృదయములో ఉంది. "యేసుక్రీస్తు నిజమైనవాడు" అనే చిన్న ఒప్పుకోలును సమీపముగా రానిచ్చి, అయన శరీరంలోని మిగిలిన భాగాలను మీ యొద్దకు పిలువనివ్వరా, ఆయనను మీ హృదయంలో నివాసం చేయనివ్వండి. ఆయన లేకపోతే, "ప్రభువా, నన్ను నింపండి, నేను నీ ద్వారా జీవించటానికి మీ వాక్యముతోను, నీ ప్రసన్నతతోను నింపండి" అని చెప్పి, మీ చేయి పైకెత్తండి?
146ప్రతి ఒక్కరు తమ తలలను వంచి యుండగా, ప్రతి కన్ను మూసుకుని యుండగా, దేశమంతటా ఉన్నవారందరూ, ఇక్కడ కనపడుచున్న గుంపును మరియు బయట ఉన్న వారు కూడా మీ చేతులను పైకి ఎత్తండి; నేను మీ కోసం ప్రార్థన చేస్తాను. నేను చేయగలిగేది అంతే, నేను దానిని (అవసరతలను) నింపలేను. దేవుడు మిమ్మును దీవించును గాక. నేను దాన్ని నింపలేను. దేవుడు మిమ్మును, మరియు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నింపగలడు . దేవుడు నిన్ను దీవించును గాక. కనబడుచున్న గుంపులలో చేతులు పైకి ఎత్తబడుతున్నవి, ప్రతిచోటా ఎత్తబడుతున్నవి . "నింపుము. దేవా, నన్ను నింపండి. నన్ను నింపుము." ఇప్పుడు, నా తరువాత … ధన్యవాదాలు, సహోదరి. ధన్యవాదాలు, సహోదరుడా . దేవుడు నిన్ను దీవించును గాక. నేను తరువాత … ప్రియమైన సహోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తరువాత … యదార్ధముగా ఉన్నవారును, ఉండాలనుకుంటున్న వారిని నేను పట్టుకున్నానని అనుకుంటున్నాను, నేను మీతో నా చేతులు ఎత్తాలనుకుంటున్నాను.
ఓ ప్రభువా, నేను నిలిచిపోయే స్థానానికి ఎప్పుడూ నన్ను రానీయకుము. నిరంతరం, ప్రభువా , నన్ను దేనికొరకు కూడా నిలువనీయకుము. ప్రభువా, మీరు నాకు నియమించిన ప్రతిదాన్నీ నేను పూర్తి చేసేవరకు నన్ను కొనసాగి పోనిమ్ము. వెల ఎంత అయినప్పటికినీ , ఖర్చు ఎంత అయినప్పటికినీ, విమర్శ అయిననూ, ఆ సిలువ ఎంత భారము, మీరు భరించిన ఆ సిలువను నాకు గుర్తుచేసుకుంటున్నాను.
పరిశుద్ధపరచబడిన సిలువను నేను మోయుదును.
మరణము వరకు నన్ను స్వతంత్రునిగా చేయువరకు.
గృహమునకు వెళ్ళిన తరువాత, ధరించుటకు
ఒక కీరిటమున్నది నాకు ఒక కీరిట మున్నది.
యేసు ఒక్కడే సిలువను సహించెను,
సర్వలోకము స్వేచ్ఛగా పోవునట్లు?
ఆయన కుమారులైన ప్రతి ఒక్కరికీ ఒక సిలువున్నది,
నాకును ఒక సిలువ ఉన్నది.
JOHN 6:37•
JOHN 10:28
147ప్రియమైన దేవా, వాక్యము బయలు వెళ్ళింది. ఇది శూన్యంగా తిరిగి రాదు, అది ఎక్కడో దాని స్థానాన్ని కనుగొంటుంది. విత్తనం ఇప్పటికే నాటబడినట్లయితే, అది పెరిగే వరకు ఆ వాక్యం నీరు పోస్తుంది. మరియు మీ చేతిలో నుండి ఎవరూ దానిని తీయలేరు. "తండ్రి నాకు ఇచ్చిన వారందరును నా యొద్దకు వచ్చును, వాటిని ఎవరూ నా చేతిలో నుండి పెరికివేయలేరు. జగదుత్పత్తికి మునుపే నా తండ్రి వాటిని నాకు ఇచ్చియున్నారు"; ఆయన ఆ ప్రణాళికలు అన్నీ రూపొందించబడినప్పుడు, యేసుకు తన సంఘంమును, తన వధువును ఇవ్వబడింది.
ఈ సంఘ శాఖలకొరకు ఈ లోకం యొక్క నకిలీ వివాహము. మీరు వచ్చి ఈ లోకంలోనికి మరణించి యున్నావు, మీరు ఆమెను విమోచించారు. మీరు ఆమెను నీతికరించారు, ఆమె ఎప్పుడూ మొదటి స్థానంలో దానిని చేయలేదు. ఆమె గుడ్డిగ దానిలో చిక్కుకుంది. మరియు పాట పాడబడినట్లుగా:
ఒకప్పుడు నేను తప్పిపోయియుంటిని,
కాని ఇప్పుడు కనుగొనబడితిని,
ఒకప్పుడు నేను లవోదికియలో ఉన్నాను, గ్రుడ్డివాడనైయుంటిని,
కాని ఇప్పుడు చూచుచుంటిని.
కృపయే నా హృదయమునకు భయమును నేర్పినది,
కృపయే నా భయములన్నిటిని తొలగించెను;
ఎంత ప్రశస్తముగా ఆ కృప కనబడెను.
ఆ మొదటి ఘడియలో నేను నమ్మినప్పుడు!
(నేను ఎండిపోయి ఉండగా దేవుని జలము నా ప్రాణము మీద పడెను)
148దేవా, ఈ చిన్న వేదిక వద్ద ఇక్కడ మరియు దేశం అంతటా ఉన్న ప్రతి హృదయాన్ని, దేవుని యొక్క బలిపీఠం క్రింద నుండి ఆ యొక్క నీటిని ఈ ఉదయం మీ సంఘాలపైకి పొంగి ప్రవహింపనిమ్ము. ప్రభువా, నీరు కట్టుము, ఈ యొక్క కాలం గతించిపోయినది . సంఘము కుమారిని యొక్క సన్నిధిలో పరిపక్వమగుటకు, నీ యొక్క గొప్ప కొట్లలో కూర్చబడుటకు దానికి జీవమును, జీవ జలాలను ఇవ్వుము.
తండ్రీ, నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. కానీ ఆ కొమ్మ ఎండిపోవలెను, కాబట్టి నేను దాని కోసం ప్రార్థించలేను; అది చనిపోవాలి, కాబట్టి అది చనిపోయింది. కానీ నేను క్రీస్తు శరీరంలోకి ఏర్పడుతున్న గోధుమ కోసం ప్రార్థిస్తున్నాను. అనుగ్రహించండి, ప్రభువా, దేవుని యొక్క తాజా నీరు దాని యొక్క బుగ్గలను ఆనంద బాష్పాలతో తడిపి ఉంచుటకును మరియు దానిని గృహమునకు చేర్చే గ్రహింపునకు కలిసి వచ్చుటకును, ప్రభువా, అనుగ్రహించుము. యేసు నామంలో, ప్రభువా, దీనంతటిని నేను మీకు అప్పగిస్తున్నాను; ఫలితాలు మీకే చెందును గాక. ఆమెన్.
149[సమాజంలోని ఒక సహోదరి సందేశం ఇస్తుంది.] ఆమేన్.
తండ్రివైన దేవా, మీకు ధన్యవాదాలు. మరియు, తండ్రీ, మా చిన్న సహోదరి పనిమనిషి కోసం, ఆమె బలం కోసం ప్రార్థిస్తున్నాము. నేను ఆమె సమక్షంలో నడుస్తున్నప్పుడు, ఏ విధముగా ఆత్మ ఆమెపైకి వచ్చి, ఆ రోజు ప్రభువు యొక్క దేవదూత నదిపై ఇచ్చిన అదే వర్తమానాన్ని ఎలా ఇచ్చాడో అదే వర్తమానమును ఆమె ద్వారా ఇవ్వబడినది : "బాప్తిస్మము ఇచ్చిన యోహాను ప్రభువైన యేసు మొదటి రాకడకు ముందు పంపబడినట్లుగా, రెండవ రాకడకు ముందుగా నీవు పంపబడ్డావు. "
ఇది ఇప్పుడు గోధుమ భాగంలోకి రావడాన్ని చూసి, దేవా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. మాటలకు మించి మా హృదయాలు నిండి ఉన్నాయి. నేను బాగా నింపబడినట్లుగా భావిస్తున్నాను, ప్రభూ, ఇంకేమీ చెప్పాలో నాకు తెలియదు. అయితే, తండ్రీ, మీరు మా కోసం చేసిన ప్రతీదానికి ధన్యవాదాలు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను.
నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, … (ఆయన కొరకు మనం ఇప్పుడు ఈ పాట పాడుదాం; ఆయన ఇక్కడ ఉన్నాడు అని గుర్తుంచుకోండి)
ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను ఆ
కల్వరి వృక్షము పైనే.
150ఇప్పుడు మిమ్ములను తేలికగా చెసిందా? అంతా ఖాళీ చేయబడి, ఆత్మ చేత నింపబడడానికి సిద్ధముగా, చూడండి.
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
మార్పు చెందని ఆయన హస్తములను పట్టుకొనుము!
లోకము యొక్క వ్యర్థమైన సంపదలను ఆశించవద్దు,
అవి అతి త్వరగా కుళ్లిపోవును,
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
(ఇప్పుడు ఏ సంఘ శాఖలపైన కాదు)
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
151అలా చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? చేయి పైకెత్తండి. ఇప్పుడు ఆ యొక్క బల్లకు దగ్గరగా జరిగి, మీ చేతులను ఒకరి చేతుల్లో ఒకరు ఈ విధముగా ఉంచండి. అందరు కలిసి … మీరు కూర్చోవచ్చు, సరే, లేదా మీరు ఏది చేయాలనుకుంటే అది. జాగ్రతగా వినండి. ఇప్పుడు అందరం కలిసి పాడదాం. ఇది దేవుని ప్రేమ యొక్క విచ్ఛిన్నం కాని మన బంధాన్ని సూచిస్తుంది. మనం దేవుణ్ణి నమ్ముతున్నాం గనుక మనము ఒకరి చేతులు ఒకరము పట్టుకున్నాము. మనము సహోదరులు, సహోదరీలు గనుక మనము ఒకరినొకరు ఆనుకుంటున్నాం, కదలాడుతున్న అదే ఆత్మ, మన హృదయాలలో నివసిస్తున్న నిత్యమైన దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతున్నది.
నా యాత్ర పూర్తియైనప్పుడు,
నేనాయనకు నమ్మకముగా వున్నచో,
మహిమలో నా గృహము చక్కగా
ప్రకాశముగా నుండును,
గొప్ప ఆనందము పొందిన నా ఆత్మ చూచును!
కాబట్టి మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
( ప్రభువు యొక్క ఆత్మ) ఆయన హస్తమును పట్టుకొనుము……
(ఆయనపై మీ మనసును ఉంచండి, చూసారా.
భవిష్యత్తులో ఈ రకమైన కుడికలలో మనం కూర్చోవాలి.)
…….. మార్పు చెందని ఆయన హస్తము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
(కేవలం వాక్యం మాత్రమే నిత్యమైనది)
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
లోకము యొక్క వ్యర్థమైన సంపదలను ఆశించవద్దు…
(పేరు ప్రఖ్యాతులు , విద్య)
అవి అతి త్వరగా కుళ్ళిపోవును,
(ఈ దినాన అది ఏమీ చేసిందో గమనించుము)
ఆ పరలోకపు సంపదలను పొందుటకు వెదకుము,
అవి ఎన్నడూ గతించవు!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకొనుము!
నీ ఆశలన్నీ నిత్యమైన వాటి మీద నిర్మించుము,
మార్పు చెందని ఆయన హస్తమును పట్టుకొనుము!
152[ఒక సోదరి వేరొక భాషలో వర్తమానం ఇస్తుండగా , బ్రదర్ బ్రన్హాం ఒక పాటకు రాగం తీయుట ప్రారంభించారు. మరొక సోదరి దానికి వివరణను ఇస్తుంది.]
ప్రభువా, మేము మీకు ఎంతగా కృతజ్ఞతలు తెలుపగలము. మనము ఈ ఆసక్తికరమైన ఘడియలో కూర్చునియుండగా, దాదాపు అంత్యక్రియల మాదిరిగా, ఎందుకంటే మనం చనిపోతున్న, మృతమైన ప్రపంచమును, మరియు చనిపోతున్న, మృతమైన లోకము యొక్క అంత్య క్రియలు ఎదుర్కొంటున్నాము;
దేవా, తండ్రీ, త్వరగా మీ గోధుమలను సమకూర్చుకొనుము. ప్రభువైన యేసు, త్వరగా రండి.
తండ్రీ, నీ ప్రజలను ఆశీర్వదించండి. ప్రజల హృదయాలలో యధార్దాతను, లోతును తీసుకురండి. మేము పగిలిపోయే నీటి బుడగ వంటి నృత్యాలనుండి మమ్మల్ని తప్పించి, లోతైన వేలకలిగిన దేవుని యొక్క మాధుర్యతలో స్థిరపడుదుము గాక. ప్రభువా, దానిని ఇవ్వండి. ప్రేమ మరియు నిజాయితితో మా హృదయాలను స్థిరపరచండి.
తండ్రీ , ప్రతిచోటా నీ ప్రజలను ఆశీర్వదించండి. మేము ఈ స్థలం నుండీ బయలుదేరినప్పుడు, ప్రభువైన యేసు నామములో నిజాయితీ అయినది, సత్యం అయినది, సరైనది మాట్లాదుదుము గాక. ప్రభూ, తప్పు అయినది మేము విస్మరించుదుము గాక. ఒక మనిషి మాతో అబద్ధం చెప్పడం ప్రారంభించినప్పుడు, మేము త్వరగా వారికి వెన్ను చూపి, ప్రపంచంలోని అన్ని దరిద్రమైన, అసహ్యమైన చతురోక్తులకు మరియు ఇతర కార్యాల వైపు వెన్ను చూపి మరియు వెనక్కి తిరిగి నడిచిపోదుము గాక. ప్రియమైన దేవా, మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావముతో మేము ప్రవర్తించుటకు, దేవుని కుమారులు, కుమార్తెల ప్రతిరూపాలుగా ఉండుటకు, మమ్మల్ని మలచండి, తయారు చేయండి, విరువండి మరియు మార్చండి. యేసుక్రీస్తు పేరిట, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని , మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. ఆమెన్.
మనం నిలబడదాం. సహోదరుడు నోయెల్.