నేను వింటిని గాని ఇప్పుడు చూచుచున్నాను
1మీరు కూర్చొనండి. ఈ రాత్రి మరల వచ్చుట మంచిది. ప్రభువును సేవించు అవకాశము మరల మనకు కలిగినందుకు వందనములు చెల్లించవలెను. గత రాత్రి చాలా సేపు మిమ్మును ఉంచాను, ఈ రాత్రి కూడా అంతసేపు ఉ౦చుట భావ్యము కాదు అని తలంచుచున్నాను.
ఆ వెనుక కూర్చొని మన సహోదరులలో ఒకరు మాట్లాడగా వినుచున్నాను, ప్రభువునందు అతడు మన సోదరుడు, ఇండియానా నుండి వచ్చెను, ఒక వింత కల ద్వారా మేల్కొలపబడెను. అతడు ముందెన్నడూ ష్రీవ్ పోర్టులో ఉండలేదు, కాని ఒక రాత్రి తాను షీవ్ పోర్టులో యున్నట్లుగా కలకనెను, కారులో రాలేదు. నేను మాట్లాడుచున్న ఒక స్థలమునకు వచ్చెను. నేను బోధించి, జనులకు స్వస్థత ప్రార్థన చేసిన తరువాత "ఆ మరుసటి జరుగనైయున్న దానిని గూర్చి చెప్పానట." ఆ భవనము ఎట్లు కనబడెనో అతడు చెప్పెను. ఆ వీధిలో ఒక పౌర ఆడిటోరియం ఉన్నది, కాని వారెన్నడూ ఆడిటోరియం లోనికి వెళ్ళలేదట. అది ఇటు వైపుగా యుండెను, అది రాతికట్టడము, దానికి ఒక విభాగమున్నది. ఆ భవనము ఎట్లున్నదో చెప్పెను. అతడు కలలు కనువాడు. అతని కల నిజమని నేను చూచాను.
EXOD 20:19
2అతడింకా ఇట్లు చెప్పెను, చివరి రాత్రి నేను బోధించి రోగులకు ప్రార్థించాను, "ఏదో జరుగనైయున్నదని" చెప్పాను. అది ఒక ఉరుము ధ్వని వలె వినిపించినది. ఆ స్వరము పలుకుచుండగా అక్కడున్న కిటికీలు గుండా దేవుని యొక్క మహిమ అగ్ని స్తంభపు రూపములో కదలుట వారు చూచిరి. దానిని ఎన్నడూ అతడు చూడలేదు, కాని అటువంటి దాని గూర్చి మేము చెప్పుకొనుటకు వారు వినిరి. కాని ఇతడెన్నడూ అట్టి దానిని చూడలేదు. అది ఆ విధముగా కిటికీల గుండా రాసాగినది. మీరు ఆ పటములో చూచుచున్న వెలుగు వలెయున్నది. అది ఆ జనసమూహము పైనయున్నది. అది ఉరిమినట్లుగా వినబడుచున్నది. అది "యెహోవా దేవుడని" నేను నిలబడి చెప్పుచున్నానని అతడు పలికెను.
ఐగుప్తులోని జనులను మోషే బయటకు తెచ్చినట్లుగా అదియున్నదని చెప్పెను. "దేవుడు మాతో మాట్లాడినచో, మేము చనిపోదుము గనుక మోషే మాతో మాట్లాడితే చాలునని వారనిరి."
అందరునూ నేల మీద పడియుండి చేతులు చూపుచూ కేకలు వేయుచుండిరని అతడు చెప్పెను. అతడు కూడా ప్రభువగు దేవునికి కేకవేయుచుండెను, "దేవా, నిన్ను ప్రేమించుచున్నాను! ప్రేమించుచున్నానని అతడనుచుండెను!" అప్పుడతని భార్య అతనిని లేపెనని చెప్పెను.
3ఇప్పుడా బల్లల మధ్య వెళ్ళుచున్న సహోదరుడు జాక్సన్‌ను చూడండి, అతడు ఒకప్పుడు మెతడిస్టు బోధకుడు. అతడెంతో కలవరముతో యుండెను, చివరకు అతడు వచ్చెను. అతడు వచ్చి ఎంతో ఆశ్చర్యము చెందెను, అతడు కలలో చూచినట్లుగానే యుండెను. దాని యొక్క అర్థము నాకు తెలియదు. ప్రభువు నాకు దానిని దూరముగా యుంచెను. కాని ఏదయినా గాని జరుగగలదు, దానిని సహోదరుడు జాన్‌సన్ చూచెను. అతడు చాలా యధార్థత మరియు వేషధారణ లేని దేవుని దాసుడు.
అతడు కలలు కనునని నాకు తెలియును, నా యొద్దకు వచ్చుచుండును. ప్రభువు దాని భావము నాకు తెలియ చేయును, అది పరిపూర్ణముగా ఆ విధంగానే యున్నది. ఒకసారి నేను ఆరాజోనాకు వెళ్ళుట గూర్చి కూడా అతనికి కల వచ్చెను.
అతడు ఎంతో కలవరము చెందెను. అతడు తనభార్యను తీసికొని వచ్చెను. ఆమె ప్రసవ సమయములోయున్నది, ఆమె విమానములో మాత్రమే రాగలదు. అతని యొద్ద వచ్చుటకు ఒక పైసా కూడా లేదు, ఎవరయినా డబ్బు ఇవ్వవలెను. అయితే ఒక ఆశ్చర్య కార్యము జరిగెను, కావున ఏదయినా జరుగగలదు. ఆలాగు మనము నిరీక్షించుచున్నాము. ప్రభువు మన కొరకు ఏర్పరచిన దానిని మనము ఎరుగము.
4నేడు మనము జీవించుచున్న ఈ దినమున జీవించుచున్నందులకు ఎంతో కృతజ్ఞత చెల్లించవలసి యున్నాము. యేసు రాకడ ముందుగా జీవించుచున్నాము. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా, చరిత్రలో ఇంతకన్న గొప్పది మరేదీ లేదు. ఈ భూమి మీద మరేకాలము కంటెను ఈ కాలములోనే జీవించుటకు నేనిష్టపడుచున్నాను.
ఈ రాత్రి మరల నా ఎదురుగా నా మంచి స్నేహితుడు కనిపించుచున్నాడు, అతడు సహోదరుడు డాచ్. ఈ ఉదయకాలమున ఆడిటోరియంలో అతనిని గూర్చి నేను చెప్పాను. ఈ రోజు సహో డాచ్‌కు తొంబది-మూడు సంవత్సరములు, ఎంత ధన్యుత అది! అతడు తన యొక్క దీర్ఘజీవితమును దేవుని మహిమ కొరకు, స్తుతి కొరకు సమర్పించుకొనెను. ఈ రోజుకు తొంబది-మూడేండ్లు. నా సోదరుడా, నీకు "జన్మదిన శుభాకాంక్షలు." ఈ రాత్రి పలు ప్రాంతముల వారు దీనిని వినుచున్నారని నేనెరుగుదును. వారందరును నాతో కూడా సహోదరుడు బిల్ డాచ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నారు. అతడు ఓరల్ రాబర్ట్‌కు వ్యక్తిగత స్నేహితుడు. చాలా మంది అతని సువార్త ద్వారా సహాయమును పొందిరి. మనందరికి అతడు గొప్ప స్నేహితుడు.
5సహోదరుడు మాన్‌ను ఇక్కడ చూచుటకు సంతోషించుచున్నాను. అతడు మరియొక మెతడిస్టు బోధకుడు. రక్షింపబడి యేసుక్రీస్తు నామములోను, పరిశుద్ధాత్మలోను బాప్తిస్మము పొందెను. ఇక్కడతడు కూర్చొనియున్నాడు, అతడు కూడా మా సహచరులలో ఒకడు, ఇండియానా నుండి వచ్చెను. అతని ప్రక్కనే సహోదరుడు హికర్‌సన్ కూర్చొనియున్నాడు. ఇండియానాలోని జెఫర్‌సన్విల్ నుండి వచ్చిన మా సహచరులలో ఒకరు (వారంతా ఈ రాత్రి ఇది వినుచున్నారు), మరియొక పెద్దయగు సహోదరుడు వీలర్ ఇక్కడ కూర్చొనియున్నారు, ఇంకా అతని చోటు నాకు కనబడలేదు. కొందరు వ్రేలితో అతనిని నాకు చూపించుచున్నారు, కనుక కనుగొందును. ఆ కుడి ప్రక్కన కూర్చొని యున్నాడు.
సహోదరుడు బాంక్స్ ఉడ్ ఈ రాత్రి వినుచున్నాడు, అతని సోదరుడు గతరాత్రి ఇచ్చటే యున్నాడు. నేను వెళ్ళిపోవుచుండగా సహోదరుడు లైల్‌ను చూచాను. యెహోవా సాక్షికి చెందెను. ఆ గుంపంతయూ మార్పుపొందిరి. ప్రభువు యొక్క దర్శనము బట్టి వైల్ రక్షించబడెను.
6ఆ దినము లైల్ పడవలో కూర్చొని యుండెను, ఆ ముందు రోజున అతనికి ఏదో ఒక పునరుత్థానము లేదా తిరిగి బ్రదుకుట జరుగునని చెప్పబడెను. అతడు నిజమగు యెహోవా సాక్షి గుంపుకు చెందెను. ఆ ఉదయమున అక్కడతడు చేపలు వేటాడుచుండెను. పెద్ద చేపనొక దానిని అతడు పట్టుకొనెను. (ఆ కెంటాకీ మాట తీరు మీరెరుగుదురు)… "ఒక పెద్ద గాలమునకు చిన్న చేపను ఎరగా ఉంచెను." దాని మొప్పలు, దవుడలు ఆ నీటిపైన తేలియాడుచున్నవి. (అది ఒక చిన్న ఎర చేప) ఆ చిన్న చేపను నీటిమీద పడవేయగా అది ఆ నీటి వాలుకు, గాలి తాకిడికి ఆ నాచు మధ్యకు పోవుచుండెను.
7ఆ ముందు రోజు నేను కూర్చొని ఇట్లు చెప్పాను, "ఒక చిన్న జీవి తిరిగి బ్రదుకునని పరిశుద్ధాత్మ నాతో చెప్పుచున్నది. బహుశా అది నా ఇంటిలోని పిల్లి పిల్ల కావచ్చునేమో."
అతడప్పుడు చేపల కొరకు ఎరను త్రవ్వుచుండెను, నేను, సహోదరుడు ఉడ్, నా చిన్న బాలిక అక్కడనే యున్నాము. ఇప్పుడామె పెద్దదై పోయినది. ఈ గొప్ప యోధునికి ప్రధానము చేయబడినది. (అతనిని నేను చూచాను), ఆమె వచ్చి నన్ను పిలచినది. అందరూ ఏవేవో పెంపుడు జంతువులను పెంచుకొనుచుందురు గాని పిల్లి నాకు గిట్టదు. ఆమె వచ్చి ఒక "దిక్కులేని ముసలి పిల్లి దొరికెనని చెప్పినది, ఎవరో విషము పెట్టగా అది తినినది, విషమునంతా మ్రింగినది. అది చనిపోవు స్థితిలోయున్నది. దానిని చిన్న పెట్టెలో పెట్టి కొన్ని రోజులు దాచవలెనని ఆమె తలంచినది."
8"ఆ పిల్లిని నేను చూడగోరాను." వారు ఆ పిల్లిని నా యొద్దకు తీసికొని వచ్చిరి. ఏమి జరుగనై యున్నదో నేను చూచాను గనుక ఒక పెట్టెను ఇచ్చాను. ఆ మరుసటి ఉదయానికి అక్కడ ఏడు లేక ఏనిమిది పిల్లిపిల్లలుండెను. నా చిన్న కుమారుడు జో ఒక పిల్లను తీసికొని దానిని నలిపి క్రింద పడవేసెను; అది గిల గిల తన్నుకొని మరణించెను.
సహోదరుడు లైల్‌కు, అతని సోదరునికి నేను అదే చెప్పాను, "ఆ చనిపోయిన చిన్న పిల్లి తిరిగి బ్రదుక వచ్చునేమో అన్నాను. ప్రభువు అట్టి కార్యములు ఎన్నో చేయుట నేను చూచాను."
సహోదరుడు లైల్ ఆ సంగతులను క్రొత్తగా ఎరిగినవాడు. అతడు వివాహము చేసికొనుట గూర్చియు, అతడు చేసిన క్రియల గూర్చియు, అతడు జరిగించిన హేయ కార్యముల గూర్చియు పరిశుద్ధాత్మ చెప్పెను. సహోదరుడు బాంక్స్ ఆ సంగతులన్నియూ నాతో చెప్పెనని అతడనుకొనెను, కాని అసలు సంగతిని అతడు తెలిసికొనెను. ఆ ముందు రాత్రి జరిగిన దానిని గూర్చి తెలియ చేశాను. అది అతని జ్ఞానమునకు అందనంతగా యుండెను.
9ఆ రాత్రంతా మేము చేపలు వేటాడాము. ఆ మరుసటి ఉదయాన ఆ చిన్న చేపను ఎరగా ఉపయోగించి కొన్ని చేపలు పట్టగోరాము. ఆ చచ్చిన చిన్న చేపను నీటి మీద విసరెను. ఆ తరువాత అరగంటకు మేము అచ్చట కూర్చొనియున్నాము. నేను చెప్పాను, "లైల్ సాహోదరుడా, ఆ గాలమును చిన్న చేప మ్రింగినదని," అది దాని కడుపులోనికి పోయినది, చూచారా?" నేను చెప్పాను, "దానిని అది తాకిన వెంటనే అది దానిని గ్రుచ్చుకొనినది." ఆ విధముగానే చేపలను పట్టుకొనుట జరుగును."
అతడు అనెను "ఆ విధంగా ఎన్నో చేపలు పట్టుకొనెను, ఆ రకంగానే మేము చేపలను వేటాడుచుందుము, అని చెప్పెను."
10సరిగ్గా అదే సమయములో ఆ కొండ మీద నుండి ఏదో దిగి వచ్చుట నేను చూచాను, అది గొప్ప సుడిగాలి, అది సుడుల తిరుగుచుండెను. అది మా యొద్దకు దిగి వచ్చెను. దేవుని యొద్ద ఆత్మ ఆ దోనెమీదికి వచ్చెను. "లేచి నిలబడి ఆ చచ్చిన చేపతో మాట్లాడినచో, అది తిరిగి బ్రదుకునని," నాతో చెప్పెను.
ఆ చిన్న చేప అరగంట నుండి చచ్చి ఆ నీటిపైన తేలియాడుచున్నది. దాని మొప్పలు, దవుడలు బయటకు వచ్చినవి. నేనిట్లు పలికాను, "చిన్న చేపా, యేసుక్రీస్తు నీకు మరల జీవము ఇచ్చుచున్నాడు; యేసుక్రీస్తు నామములో బ్రదుకుము," అన్నాను. అది కిలకిల మంటూ ఆ నీటి మీద పరుగిడిపోయినది.
11లైల్ సాహోదరుడా, నీవెక్కడున్నావు? గత రాత్రి నిన్ను చూచాను. అతడు లోపల యున్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా గాని చేతినెత్తమని కోరుచున్నాను. [ఆ "బాల్కనీలో" యున్నాడు.] ఏమిటనుచున్నారు? ఆ కిటికీల వెనుక యున్నాడు, యెహోవా సాక్షి.
అతడు సంభ్రమాశ్చర్యములతో నిండిపోయెను. "బ్రన్హం సోదరుడా," ఇక్కడుండుట మంచిది కదా? దీని వలన నా జీవితంలో మలుపు వచ్చినది అని అతడనెను. "ఆ చిన్న చేప చచ్చిపోయి చాలా సమయమయినది, కాని ఆలాగు పలుకగా అది తిరిగి జీవించెను."
"అది కేవలము ఒక రుజువు మాత్రమేనని," నేనన్నాను. అతడు దానిగూర్చి ఎంతో ఆశ్చర్యపడెను.
MARK 11:14,21
12మనము ప్రయాణించుచుండగా ఈ జరుగుచున్న కార్యములను చూచుచున్నాము. అది దేనిని చూపించుచున్నదో గ్రహించారా? నా ప్రార్థనా జాబితాలో ఎందరో వ్యాధిగ్రస్తులగు పిల్లలున్నారు. వారి కొరకు ప్రార్థించుచున్నాను, కాని ఆ దర్శనములో చేపను చూచాను. అది దాదాపు రెండు లేదా మూడు అంగుళమలు ఉండును. ఆ చేప కంటే గాలమే పెద్దదిగా కనిపించినది, కాని దీని భావమేమిటి? దేవుడు చిన్న వాటిని కూడా ధృష్టించుచున్నాడు.
ఒకప్పుడు ఆ దేశములో ఎందరో కుష్ఠురోగులుండిరి, వారందరూ స్వస్థతా శక్తి కొరకు చూచుచుండిరి. అయినా ఆయన తన శక్తిని ఒక చెట్టును ఎండిపో చేయుటకు ఉపయోగించెను. ఆ చెట్టు ఎండి పోసాగెను, కాని మీరు చూడండి. ఆయన సమస్తము మీదను తాను దేవుడనని నిరూపించుకొనెను. అది చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు. ఆయన సృష్టి అంతటి మీదను దేవుడైయున్నాడు, అందుకే ఆయనను మనము ప్రేమించుచున్నాము, అది మనకు గ్రహింపు కలుగజేయచున్నది. అక్కడ చచ్చిపడి యున్న ఒక చిన్న అనామక చేపను ఆయన తన మాటతో జీవింపచేసెను, అరగంట సేపు అది నీటిపై తేలియాడినది. నిశ్చయముగా ఆయన ఒక దినమున తన పిల్లలలో జీవమును ఊదును. నీ శరీరము ఒక చెంచాడు ధూళిగా మారిపోయినా, ఆయన మాటపలుకగా అది తిరిగి సజీవమగును. ఆయన అన్నింటినీ శ్రద్ధగా చూచుకొను దేవుడు. మనము చేయునదంతయూ, మనము చెప్పున దంతయూ ఆయన పట్టించుకొనును. ప్రతి దానిని ఆయన చూచును.
ఇప్పుడు మనము మన తలలు వంచుదము, ప్రతిచోట:
13ప్రార్థించు ముందుగా ఈ మాట వినండి, ఈ రాత్రి ఆయన యందు ఆసక్తి గలవారెవరయినా గాని ఆయన యొద్దకు రావచ్చును. అవతలి దేశమునకు వెళ్ళుటకు ఇంకా నీవు సిద్ధ పడకుండా యుండవచ్చును. ఆ దేశములో ఆయనను మనము చూచెదము. సిద్ధపడకుండా అందులో నీవు ప్రవేశించలేవు. ఇంకా నీవు సిద్ధపడలేదు, కాని ఇప్పుడు నీవు ప్రార్థనలో జ్ఞాపకము చేసికోబడవలెనని కోరుచున్నావు. ఈ రాత్రి నీకును దేవునికిని మధ్య అడ్డముగానున్న దానిని సరిచేసికొనుము. ఆలాగయినచో నీ చేయిని చూపించుము. "ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుమని" అడుగుము. నీ చేతిని ఆయనకు కనుపరచుము. దానిని దేవుడు దయచేయును.
JOEL 2:28•
ACTS 2:17
14పరమతండ్రీ, ఈ దినము మేము మృతులకును, సజీవులకును మధ్య నిలచియున్నాము. ఈ దినములలో జరుగుచున్న ఈ సంగతులు మర్మముగా యున్నవి. నిజంగానే అవి మర్మముగా యున్నవి, కాని దేవా, అవి నిజమో, కావో నీవెరుగుదువు. నీవు భూమ్యాకాశ ములకు తీర్పరివి. ప్రభువా, జనులను ప్రోత్సాహపరచుటకు మేము ఈ సంగతులు చెప్పుచున్నాము. నిన్ను ప్రేమించుటకు, నిన్ను నమ్ముటకు, నిన్ను సేవించుటకు వారు ప్రోత్సాహించబడునట్లుగా ఇవి చెప్పుచున్నాను. ప్రతి చిన్న దానిని, ప్రతి చిన్న కదలికను, అది చెడ్డదయినా, మంచిదయినా, దానిని నీవు చూచుచున్నావని ఎరుగుదుము. ప్రియదేవా, ఈ రాత్రి ఎత్తబడిన ప్రతి హస్తమును ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాను. వారి ప్రాణాత్మలు ఏకీభవించుట చేతనే వారు తమ చేతులు ఎత్తి యున్నారు. నదికి ఆవలయున్న ఆ దేశములో ప్రవేశించుటకు వారు సిద్ధపడునట్లుగా నీవు దయ చూపుమని ప్రార్థించుచున్నాను. దానిని దయచేయుము.
ప్రభువా, శ్రమపడుచున్న వారిని, రోగులను బాగు చేయుము. ఇక్కడున్న వారిని, దేశములోని పలు ప్రాంతములో ఉన్న వారిని బాగు చేయుము. ఫోనుల ద్వారా ఆ సమాచారము వచ్చుచున్నది. రక్షింపబడని వారిని దీవించుము. కాలిఫోర్నియా నుండి న్యూయార్కు వరకును, కెనడా నుండి మెక్సికో వరకును ఉన్న వారిని దీవించుము. ఈ రాత్రి మా స్వరము వినుచున్న ప్రతి వ్యక్తియూ పాపము నుండి రక్షింపబడునట్లును, రోగము నుండి స్వస్థత పొందునట్లును చేయుము. ఎందుకనగా దైవ సన్నిధి ఇచ్చట యున్నది.
మా సోదరుడు జాక్సన్ వెయ్యి మైళ్ళ దూరములో నుండి ఇక్కడికి విమానములో ప్రయాణము చేసి వచ్చి యున్నాడు. అతని హృదయమును వింతగా ఏదో ప్రేరేపించినందున ఇక్కడికి రాగోరియున్నాడు. "వారు కలలుకందురు, దర్శనములు చూచెదరు," అని నీవు చెప్పియున్నావు. ప్రియదేవా, దీనిని నీవు నాకు మరుగుగా ఉంచియున్నావు. దీని భావము నేనెరు గను. నాకు తెలియదు, కాని ప్రభువా, నీవు మమ్మును దర్శించినయెడల ఆ దర్శనమును గ్రహించగల హృదయమును మాకు దయచేయుము. మేము గొప్ప కార్యముల కొరకు ఎదురు చూచుచున్నాము. నీవేమి చేయుదువో ఎరుగము. ఈ కల ద్వారా నీవు మమ్మును దర్శించుదునని నీవు వాగ్ధానము చేసితివేమో మాకు తెలియదు. మాకు అర్థమయిన వాటినే మేము చెప్పుకొనుచున్నాము. నీవు నీ జనులను దర్శించుదునని వాగ్ధానము చేసియున్నావు. ఇక్కడున్న మాకు నిన్ను నీవు నిజముగా బయలుపరచుకొనుమని ప్రార్థించుచున్నాము. దీనిని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
15గతరాత్రి మరియు ఈ ఉదయము చాలా సేపు మిమ్ము నిలిపియుంచాను. ఈ రాత్రి నా గొంతు బొంగురు పోయినది. నా తల మీదకు చిన్న ముసుగు వంటిదున్నది, నా బట్టతల పైన దానిని కప్పుకొని నేను బోధించెదను, అయితే ఈసారి దానిని తెచ్చుకొనుట మరిచిపోయాను. ఈ కిటికీల గుండా గాలి దూసికొని వచ్చుచున్నది, దాని వలన నా గొంతు బొంగురు పోయినది. నేను కూటములు ముగించవలెననుకొన్నాను, కాని అది మరల సంపాదించగలిగినందున ఇక నాకు ఏ ఆటంకము లేదు. నేను కొనసాగించెదను. దానిని నేను మరచిపోయాను, దానిని నేను ఇప్పుడు సంపాదించాను. మీ ప్రార్థనలను అభినందించుచున్నాను. దినమునకు రెండు ఆరాధలున్నవి. చాలా మైళ్ళు ప్రయాణము చేసి వచ్చుచున్నారని నాకు తెలియును, దానిని మీరే చెప్పుచున్నారు.
16కాలిఫోర్నియాలోనున్న జనులకు, ఆరిజోనాలోయున్న జనులకు, దేశమంతటాయున్న జనులకు వందనములు చెల్లించుచున్నాను. ప్రెస్కాట్ యొద్ద సహోదరుడు లియో మరియు అతని గుంపు ప్రభువు కొరకు ఎదురుచూచుచున్నారు. ఫీనిక్సు చుట్టు పట్లనున్న జనులనందరినీ ఇప్పుడు ఆహ్వానించుచున్నాము. ఈ రాత్రి తరువాత మరియొక వారమునకు యుమా యొద్ద విందులో మేము ఉందుము. అక్కడ వారు టిక్కెట్లన్నియును అమ్మివేసిరి. పెద్ద ఆడిటోరియంను సంపాదించిరి, అందరికీ వారు దారి చూపలేరు. కావున పెందలకడనే రండి, అందరూ లోపలకు రండి, ఆ తరువాత వచ్చే ఆదివారము రాత్రికి అచ్చట నుండి మేము లాస్ఏంజలస్‌కు వెళ్ళుదము. కావున మీ అందరినీ అచ్చట చూడగోరుచున్నాము. మీ అందరి మీదను దేవుని యొక్క సర్వ ఆశ్వీరచనములు నిలచి యుండును గాక!
17న్యూయార్కులోని ఉన్నవారికిని, ఓహియో, ఇంకా చుట్టుపట్ల ఉన్న వారికిని తెలియచేయుచున్నాను. సర్పముయొక్క జాడ అను వర్తమానమును బోధించగోరుచున్నాను. (ఆదియందున్న మృగము, అంతములో యుండు మృగము) ఆలయములో ప్రసంగించుదును. బిల్లీ మీకు దానిని తెలియపరచును, దాని మీద మాట్లాడుదును. అది దాదాపు నాలుగు గంటలు లేదా ఇంకా ఎక్కువ యుండును గనుక ఆలయములో ప్రసంగించెదను.
మీరిక్కడ ఉండగలరని ఆశించుచున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నాగాని, యోబు గ్రంథము తీయండి. చాలా వింత గ్రంథములో నుండి ఎత్తి చూపుచున్నాను. ఇక్కడ కొన్ని విషయములు చెప్పెదను,
రేపు ఉదయము ఈ ఆలయములో ఆదివారపుబడి ఆరాధన యుండును. ఏ సమయములో ప్రారంభించెదము? 9.30. రేపు మరల ఇచ్చట మాట్లాడు భాగ్యము నాకు దొరికెను. ప్రభుని చిత్తమయితే ఒక అంశము మీద మాట్లాడుదును. దానిని గూర్చి ఈ మధ్యాహ్నం నేను చదివాను. దేవుడు ఒక ఆరాధికునిని కలిసికొను చోటు ఒకే ఒకటున్నది. ఆ స్థలమేమిటో చెప్పెదను. ఆ స్థలము పేరు చెప్పెదను, దేవుడు ఆరాధికునిని అచ్చటే కలిసికొనెను.
18ఆ తరువాత రేపు రాత్రికి మీరు నాతో సహకరించుడి, స్వస్థత ఆరాధన యుండును. పాతకాలపు స్వస్థతా కూటము కొరకు నేనాశించుచున్నాను. ప్రభుని చిత్తమయితే ఒక అంశము మీద మాట్లాడుదును. అది ఈ రోజు నన్ను ఆశ్చర్యపరచినది. సహోదరుడు మూర్ మరియు ఇంకా చాలామంది ప్రశస్త సోదరులు నాతో కలిసి లేఖనములను ముచ్చటించుకొనుట జరిగినది. ఆ పాతకాలపు సోదరులతో గడుపుట ఎంతో బాగున్నది. ఒకరు నాతో ఇట్లనిరి, "బ్రెన్‌హాం సోదరుడా, ఈ ష్రీవ్ పోర్టులో నీవు బోధించిన వర్తమానములన్నింటిలోను గొర్రెపిల్ల మరియు పావురము చాలా బాగున్నది. ఈ ష్రీవ్ పోర్టులో నీవందించిన వర్తమానములన్నింటిలో అది సాటి లేనిది." "ఈనాడు నీవు ఎంత ప్రయాసపడినా గాని అటువంటి వర్తమానమును ఎన్నడూ అందించలేవు."
దానిని నేను పొగొట్టుకొనినప్పుడు నా వర్తమానమును పొగొట్టుకొందును.
చనిపోవుచున్న ప్రియ గొర్రెపిల్లయే, ఆ ప్రశస్త రక్తము,
ఎన్నడూ దాని శక్తిని పొగొట్టుకొనదు,
దేవుని యొక్క సంఘమంతయూ కొనబడిన పిదప,
అందరూ రక్షింపబడి, పాపము ఇక లేనప్పుడు
విశ్వాసము ద్వారా దానిని నేను చూతును
ఆ ప్రవాహమును నేను చూచాను.
నీ స్రవించు గాయములు ఇచ్చినవి
విమోచించు ప్రేమయే నా అంశము,
నేను చనిపోవు వరకును అదే గానము.
19ప్రభుని చిత్తమయితే రేపు రాత్రికి నేను బోధించు అంశము: "హిమము వలె తెల్లగా నున్న పావురపు రెక్కల మీద." రేపు రాత్రికి, పావురపు రెక్కల మీద ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభుని చిత్తమయితే, నా గొంతు సరిగా యున్నచో అది జరుగును… మా కొరకు ప్రార్థించుడి.
ఆదియందు మనకుండిన పాతకాలపు ప్రార్థనా కూటము ఏర్పాటు చేయగోరుచున్నాను. వివేచన ఉండదు, ప్రార్థన కోరువారందరికీ ఒక కార్డు పంచి ఇచ్చెదము. మీరు తప్పక కార్డు కలిగి యుండవలెను, కాబట్టి తొందరగా వచ్చి వరుసలో నిలబడండి. మీకు బిల్లీ కార్డు ఇచ్చును. మీరాలాగు చేయని యెడల జనులు వచ్చుచునే యుందురు, ఇంక దానికి ముగింపు ఉండదు, ఎవరయినా సరే కార్డును కలిగి యుండవచ్చును. ప్రార్థన వరుసలో నా ప్రక్కన సహోదరుడు జాక్ నిలబడవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందు బిల్లీ పాల్ స్థానములో సహోదరుడు బ్రవున్ నిలబడి యుండి జనులను నా యొద్దకు తెచ్చెడి వాడు. పాతకాలపు ప్రార్థన వరుస నాకు కావలెను, అనేక సంవత్సరాల క్రితం ఎట్లు ప్రార్థించెడివారమో ఆలాగే ప్రార్థించుదము.
20మరియొక సహవాస సోదరుడు ఈ రాత్రి మనతోయున్నందుకు సంతోషించుచున్నాను. చుట్టూకలియ చూచినప్పుడు అతనిని గుర్తించుట జరిగినది, కొద్ది నిమిషాల క్రితమే సహోదరుడు గోర్డన్ లిండ్సేను గుర్తుపట్టాను, పాతకాలపు వారిలో ఆయన ఒకరు, చాలా సంవత్సరాల క్రితం మనతో యుండెను. గొప్ప పనిని చేయుచున్నాడు. "ఏడు సంఘకాలములు" అను నా పుస్తకమును ముద్రించుచున్నాడు. దానిని సిద్ధపరచుదమని ఆశించుచున్నాము. "ఏడు ముద్రలు." [ఈ రెండు పుస్తకములును విలియం బ్రెన్‌హాం సువార్తిక సమాఖ్య ద్వారా పంచుట జరిగెను-సంపా॥] దానిని ముద్రించుటకు ముందే అతడు దానిని చదువుట జరిగినయెడల మాకు వేదాంత చర్చ జరిగి యుండును. అది వచ్చుచున్నదని నేను తలంచుచున్నాను, కాని నేను వేదాంత పండితుని కానని అతడెరుగును. మేము రేపు రాత్రి కొరకు ఎదురు చూచుచున్నాము. లిండ్సే సోదరుడా, రేపు రాత్రికి ఇచ్చటికి రమ్ము. పాతకాలపు ప్రార్థన కూటము కొరకు రేపు ఈ వేదిక మీదికి వచ్చి మాతో చేరుము.
ఆ పాతకాలపువారిని ఎందరు చూడగోరుచున్నారు? జనులను చూడండి. చాలా మంచిది. బాధపడుచున్న వారిని, రోగులను రేపురాత్రికి తీసికొని రండి, ఆ ఉద్ధేశ్యముతోనే రావలెను.
JOB 42:1-6
21ఇప్పుడు, మీరు యోబు గ్రంథము 42వ అధ్యాయము తీయండి. యోబు గ్రంథము 42వ అధ్యాయములోని మొదటి ఆరు వచనములు చూడండి. చాలా వింతగా నుండును. ఫోనిక్సులో సహోదరుడు టెడ్ డడ్లీ వినుచుండును. ఒకసారి అతడు నేను దీనిని గూర్చి చర్చించుకొన్నాము. ఒకటి లేదా రెండు వారములు అగును. "ఒక రోజున అది నా అంశమగునని" నీకు చెప్పిన సంగతి గుర్తున్నదా? ఈ రాత్రి దానిని నేను ఉపయోగించుకొనగోరుచున్నాను.
అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను. [దీనిని చదువుచుండగా జాగ్రత్తగా వినండి.]
నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్ధేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? ఆలాగున వివేచనలేని వాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.
నేను మాటలాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను. దానిని నాకు తెలియచెప్పుము.
వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను.
ఇప్పుడు 5వ వచనము నుండి నేను అంశము తీసికొనుచున్నాను. "వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను."
దేవుడు తన వాక్యమును దీవించును గాక!
HEB 12:6,8
22యోబు యొక్క జీవితమును కొద్దిగా చూచుదము. యోబు ఒక ప్రవక్త. బైబిలు వ్రాయబడక ముందే అతడు జీవించి యుండెను. బైబిలులోని గ్రంథములన్నింటిలో యోబు గ్రంథమే పురాతనమైనదని చెప్పుదురు, ఎందుకనగా ఆదికాండము వ్రాయబడక ముందే అది వ్రాయబడెను. ఈ యోబు గొప్ప యోధుడు మరియు ప్రవక్త. అతని దినములలో మహాపరాక్రమశాలి. అతడు దేవునిని తన జీవిత కాలమంతయూ అనుసరించెనని నిస్సందేహముగా చెప్పగలము. అతడు జీవించిన ఆ మహోన్నత జీవితమునుబట్టి జనులు అతని గౌరవించుచుండిరి,
కాని అతడు ప్రభువు చేత శోధింపబడు స్థానమునకు వచ్చెను. ప్రభువు చేత పరీక్షింపబడు చోటునకు వచ్చెను. దేవుని యొద్దకు నిజముగా వచ్చు ప్రతి కుమారుడును మొదట పరీక్షించబడును, పరిశోధించబడును, బిడ్డలవలె శిక్షింపబడును. ఆ పరీక్ష కఠినముగా ఉన్న యెడల అది మనము తట్టుకొనలేమనుకొందుము. (మాట వినము) అప్పుడు మనము మాట వినని పిల్లలమగుదుము. దేవుని బిడ్డలము కాము. ఎందుకనగా దేవుని ద్వారా నిజముగా తిరిగి జన్మించిన బిడ్డను ఏదియూ కదిలించజాలదు. తన తండ్రిలో నుండి వేరు చేయజాలదు, ఎందుకనగా అతడాయనలో ఒక భాగమై యున్నాడు. దానిని నీవు ఏ మాత్రమూ కాదనలేవు. నిన్నునీవు ధిక్కరించుకొనలేనట్లే అదియున్నది. చూడు, నీకు అనుభవమున్నది. నీకు శిక్షణ నిచ్చి నిన్ను ఆయన పరీక్షించెను.
JAS 5:11
23ఇతడు ప్రవక్త అయియున్నందున అతడు దేవుని కృపకు పాత్రుడు కాని యోబుకు చదువుటకు బైబిలు లేదు. అప్పటికి బైబిలు వ్రాయబడలేదు, కాని ప్రత్యక్షతద్వారా, దర్శనము ద్వారా దేవునిని అతడు సమీపించకలిగి యుండెను. అది బైబిలు వ్రాయబడక ముందున్న పరిస్థితి.
ఇప్పుడాతని జీవితమును కొంత చూద్దాం. దేవుడతనిని దీవించి గొప్ప వానిగా చేసెను. అందరూ అతనిని గౌరవించిరి, అతని జ్ఞానము చాలా గొప్పది. దేవుని నుండి అతడు ప్రేరేపణ పొంది దేవుని దాసునిగా బయలుపరచబడెను, బహు తేటగా కనబడెను, అతని మాట వినుటకు జనులు పలు ప్రాంతముల నుండి వచ్చిరి. అతనిని సాతాను తప్పు పట్టుటకు ప్రయత్నించినది. దేవుని చేత ఆవేశము పొందిన ప్రతి దాసుని విషయములోను సాతాను ఆ విధంగానే చేయును, వాడు ఎల్లప్పుడూ నేరారోపణ చేయుచుండును.
అతని జీవితమును, అతని శోధనలను, అతని గొప్ప విశ్వాసమును మనము ఎరుగుదుము. యేసు కూడా ఈ భూమి మీద ఉండినప్పుడు యోబు యొక్క సహనమును గూర్చి ప్రస్తావించెను. "యోబు యొక్క సహనమును గూర్చి మీరు చదువలేదా?" అనెను. వాగ్ధానము చేయబడిన వాక్యము నెరవేరు వరకు విశ్వాసము సహనముతో ఎదురుచూచును.
JOB 1:21•
JOB 2:8-10
24ఇక్కడ మనము యోబును గమనించుదము, అతడు ఎన్నో బాధలను, శ్రమలను సహించెను.
అతనికి చక్కని కుటంబముండెను — వారందరూ అతనియొద్ద నుండి తొలగింపబడిరి. అతనికి మంచి ఆరోగ్యముండెను, అది అతని యొద్ద నుండి తొలగింపబడెను. అతని జీవితములోని సమస్తమును అతడు పొగొట్టుకొనెను. అతడు బూడిదె మీద కూర్చొని ఒక చిల్ల పెంకు పట్టుకొని తన కురుపులను గోక్కొనుచుండెను. అతని భార్యయే అతనికి విరోధముగా మాట్లాడినది, "దేవుని శపించి నీవు చచ్చిపో అన్నది."
"నీవు బుద్ధిహీనురాలవలె మాట్లాడుచున్నావు, యెహోవా ఇచ్చెను. యెహోవా తీసికొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగును గాక!" అనెను.
JOB 1:8-11•
JOB 2:3
25ఇప్పుడు సాతాను దేవుని యెదుటికి వచ్చినది, వాడు దేవుని ముందుకు వచ్చి క్రైస్తవులకు (విశ్వాసులకు) విరోధముగా ఎల్లవేళలా నేరారోపణ చేయుచుండును. కావున యోబు మీద ఎన్నో ఆరోపణలు చేసెను. యోబుకు అంతా బాగా జరుగుచున్నది గనుకనే దేవునిని ప్రేమించుచున్నాడ పలికెను. "అతనిని నా చేతులకు అప్పగించిన యెడల నిన్ను దూషించునట్లు చేయుదునని సాతాను పలికినది."
ఒక విశ్వాసియందు దేవుడెంత నమ్మకమును కలిగి యుండునో చూడండి. మీరది గమనించారా? భూమి మీద యోబు అంతటి వాడు ఎవడునూ లేడు గనుక యోబును "ఆలాగున నీవు చేయలేవని" దేవుడనెను. అతడు నీతిమంతుడు. (నీతిమంతునిగా తీర్చబడెను) అతడు మంచివాడు. ఓ! ఎంతటి వాడు! దేవుడు తన శత్రువుతో ఇట్లు చెప్పగలిగెను, "నా దాసుడు ఎంతో పరిపూర్ణుడు," భూమి మీద అతనివంటి వాడెవడునూ లేడు. మనము ఆలాగుండిన ఎంత మేలు! దేవుడు మన మీద అట్టి నమ్మకమును పెట్టుకోగలడు. ఆయన వాక్యము నుండి గాని, ఆయన వ్యక్తిత్వమునుండియు గాని దారి తొలగము — ఆలాగే నిలచి యుందుము, ఆయన మనయందు విశ్వాసముంచగలడు.
JOB 1:11•
JOB 2:5,6•
ROM 8:35,39
26దేవుని యొక్క ఆజ్ఞలను అక్షరాలా పాటించిన మనుష్యుడు యోబు. అది సాతానుకు తెలియును, "అతనిని నాకప్పగించినయెడల నిన్ను శపించునట్లు చేయుదును అని దేవునితో" సాతాననెను.
కాబట్టి దేవుడు ఇట్లనెను, "అతడు నీ వశములోయున్నాడు, కాని అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు." ఆలాగున సాతాను తాను చేయగలిగినదంతయూ చేసెను. ప్రతి స్నేహితుని తీసికొనెను, అతనికున్న సమస్తమును తీసికొనెను, దాదాపు అతని ప్రాణమునే తీసికొనెను; కాని పూర్తిగా ప్రాణమును తీసికొనలేదు. అయినా గాని యోబు దేవుని విడిచిపెట్ట లేదు. వెనుకకు తిరుగలేదు.
చూడండి, ఒక మనిషి దేవునితో నిజముగా సంబంధమును ఏర్పరచుకొనినప్పుడు, దేవుడున్నాడని నిజముగా విశ్వసించినప్పుడు, ఆ మనిషిని దేవుని నుండి వేరుచేయునది ఏదియూ ఉండదు. ఎన్నడునూ, ఎచ్చటనూ ఆలాగు జరిగియుండలేదు. "పోరాటము గాని, ఆకలి గాని, అపాయము గాని, మరణము గాని, ఎడబాపునా?" అని పౌలు ప్రశ్నించెను. మీరు ఆయనలో లంగరు వేయబడి క్షేమముగా యున్నారు, ఎందుకనగా మీరు ఆ జీవమునకు నిర్ణయింపబడియున్నారు.
HEB 11:6
27కాని అతనిని కొద్దిగా వంచగలను లేదా నరుకగలను అని సాతాను తలంచినది. కాని చూడండి, యోబు పరిపూర్ణ దైవ ప్రత్యక్షత కలిగి యుండెను. దేవుడెవరో ఎరిగి యుండెను. దేవుడతనిని ఎట్లు ప్రేమించెనో ఎరిగియుండెను. అతడు కనిపెట్టి యుండెను. పరిస్థితులు ఎట్లున్నా లెక్క చేయలేదు. తన విశ్వాసము స్థిరపరచుబడునట్లు ఎదురు చూచెను, ఎందుకనగా అతడు దేవునిని పట్టుకొనెను. ఒక ప్రత్యక్షత కలిగి యుండెను. (గత రాత్రి దానిని గూర్చి మాట్లాడాను)
భవనములో రోగులున్నారు, కుంటి వారున్నారు, దేవుడు అవసరమైన వారున్నారు, మీరు ఆ విధముగా ప్రత్యక్షతను పొందియుండుడి. "నీతిమంతులుగా తీర్చబడుడి," మీరు ఏ విషయమునడుగుచున్నారో ఆ విషయములో "నీతిమంతులుగా తీర్చబడెను." ఆయనను నిజముగా వెదకు వారికి ఆయన బహుమానము దయచేయువాడని నమ్మవలెను. నీలో లంగరు వేయబడిన విశ్వాసమును నీలో నుండి వేరు చేయునది ఏదియూ లేదు. చూచారా? కాని మొదట నీకు అది బయలుపరచబడవలెను.
28కొంతకాలము క్రిందట ఒకరు వచ్చిరి, ఒక గుంపుకు చెందిన మనిషి, ఈ రాత్రి వినుచూ ఉన్నాడు. "కెంటాకీ వెళ్ళు, అక్కడ నూనెయున్నది," అని అతనికి నేను పదే పదే చెప్పాను, ఎందుకనగా నేను దర్శనంలో చూచాను. నాకది తెలియును.
మంచిది, సహోదరుడు డిమాస్ నేను తదితరులు చాలా కాలము అచ్చటికి వెళ్ళలేదు. ఆ తరువాత వారు వెళ్ళిరి — టెక్సాస్కు వారు కదిలి వెళ్ళి — తరువాత దానిని చూచి, "ఇప్పుడు మేము వెళ్ళుచున్నాము."
నేను చెప్పాను, "మీరు ఎప్పుడో వెళ్ళవలసియుండెను. అయితే వారు వెళ్ళలేదు.
"బ్రెన్‌హాం సోదరుడా, నీవు చెప్పినట్లు చేయకపోవుట గొప్ప తప్పు," అని ఆ తరువాత డిమాస్ చెప్పెను.
"వారప్పుడు వెళ్ళి యుండినచో, అదంతయూ వారికే చెందెడిది."
మంచిది, వారు నా మాట వినలేదు. ఆ రాత్రి మేము వెళ్ళక ముందే పరిశుద్ధాత్మ నాకు భూమిలో పెద్ద పగులును చూపించెను. ఆ స్థలములో మేము భోజనమునకు కూర్చొన్నాము, ఆ బీటలో నుండి ఎంతో చమురు కనబడుచుండెను. కెంటాకీలో చమురు పొంగి పొర్లుచుండెను, భూమి అడుగున అదియున్నది. వారు చమురును పైకి తీయుచుండిరి, ఇది ప్రధాన ప్రవాహము నుండి వచ్చుచుండెను. "డిమాస్‌తో నేను చెప్పినది అదే."
వారు దానిని అన్వేషించుచూ వెళ్ళిరి. "ఆ చమురు బావి ఎక్కడున్నదో చెప్పమని వారడిగిరి."
నేను చెప్పాను, "ఓ, లేదు! లేదు, లేదు."
29చూడండి, మనము దేవుని వరమును వ్యాపారమునకు ఉపయోగించరాదు. తగదు. ఆయన దానిని నాకు చెప్పగలడు, కాని దానిని తెలిసికొనవలసిన అవసరము నాకు లేదు. ఆయనను అడుగుటకు సరిపోవు విశ్వాసము కూడా నాకు లేదు. చూచారా? అది నాకు అవసరమై యున్నచో, ఆయనయందు నేను విశ్వాసముంచి అడిగినచో, ఆయన నాకు చెప్పును. మొదట మీరు చూడండి, మీ యొక్క ఉద్ధేశ్యములు మరియు తలంపులు సరియైనవిగా ఉండవలెను, దానికి కారణము ఉండవలెను. నీవు అడిగినంత మాత్రమున దేవుడు దానిని నీకు ఇయ్యడు. నీకు సరయిన వైఖరి లేకుండా విశ్వాసముతో దానిని అడగలేవు. అది దేవుని చిత్తములో యుండవలెను, నీవు బాగుపడవలెననుకొందువు, కాని ఎందుకొరకు నీవు బాగుపడవలెననుకొనుచున్నావు. నీవు స్వస్థత పొందగోరుచున్నయెడల ఎందుకు స్వస్థత కావలెను? దేవునికి నీవు ఏమి చెప్పుచున్నావు? నీవు బాగయిన తరువాత నీ జీవితములో ఏమి చేయుదువు? చూడు. నీకు ఒక ఉద్ధేశ్యము మరియు ధృక్ఫధము ఉండవలెను. దేవుని చిత్త ప్రకారము అవి సరయినవిగా యుండవలెను. విశ్వాసము నీకు బయలుపరచబడినప్పుడు ఆ పని జరిగినట్లే. దేవుడు తన సార్వభౌమ కృప ద్వారా ఆ విశ్వాసమును నీలోయుంచును. చూచారా? ఇప్పుడు గమనించారా?
30ఆ మాటను నిజము చేయుటకు ఆ సోదరులు అచ్చటికి వెళ్ళవలసి యుండిరి. ఒకరు వెళ్ళి కొంత భూమిని కొని మరొకరికి అద్దెకు ఇచ్చి ఒక విధముగా మోసము చేసెను. "చూడండి, అది పని చేయదు." నేను చెప్పాను. ఆ ప్రవచనము ఖచ్చితము, వారు త్రవ్వుచున్నచోటు వందగజముల దూరములో ఒకడు త్రవ్వగా పెద్ద ప్రవాహము వచ్చెను. అర దినములో పదకొండు వందల బేరల్స్ చమురు తీసెను. ఆ ప్రధాన ప్రవాహము నుండి ఇంకా వారు త్రవ్వుచునే యున్నారు, కాని ప్రవచనమును చూడండి. అది అక్కడున్నదని వాక్కు చెప్పెను; ఆలాగే అక్కడున్నది, మిగిలిన వన్నియూ దాదాపుగా ఎండిపోయినవి. కెంటాకీలోని మిగిలినవన్నియూ ఎండిపోయెను, చిన్న ప్రవాహములలో నుండి వారు కొంతకాలము త్రవ్విరి. ఆ తరువాత వెళ్ళిపోయిరి. దీని నుండి వచ్చిన ప్రవాహమే, అది, చూచారా?
1JN 3:21
31కాని వారి మధ్యకు స్వార్థము చొచ్చుకొని పోయినది, ఆ ఉద్ధేశ్యములు తప్పు, వారు ఏవేవో వాగ్ధానములు చేసిరి. దేవుని రాజ్యము కొరకు దానిని వాడుకొనుటకు బదులుగా తమ కొరకే దానిని వాడుకొనిరి. చూచారా?
అది పని చేయదు. ఏ స్వార్థపు క్రియయు పనిచేయదు. "నీ యొక్క ఉద్ధేశ్యములు మరియు ధృక్పథములు సరియైనవై యుండవలెను, అవి పరిపూర్ణముగా ఖచ్చితమై యున్నప్పుడే నీకు విశ్వాసము వచ్చును. "మన హృదయము మనలను ఖండించని యెడల మనలో అవిశ్వాసముండును." చూచారా? మనకు ఆ నమ్మకముండవలెను. "దేవుని యొక్క ఘనత మరియు మహిమ కొరకు" మనము దీనిని చేయవలెను. విశ్వాసము ఒక మార్గము గుండా సంచరించును. ఆలాగు జరుగని యెడల నీకు మానసిక, శారీరక విశ్వాసమున్నదని అర్థము. దేవుని నుండి వచ్చిన అసలయిన విశ్వాసము నీకు లేదు. ఆ మానసిక విశ్వాసము ఎక్కడికీ నిన్ను తీసికొని వెళ్ళదు. నీవు ఉద్రేకముతో నింపబడవచ్చును, కాని నీవు ఎదురు చూచుచున్న స్వస్థతను అది నీకు ఇయ్యదు.
2KGS 20:1,5•
ISA 38:1,5
32కాబట్టి యోబు తన్నుతాను దేవుని యొక్క అసలైన విశ్వాసముతో పరీక్షించుకొనుచున్నాడు, అతడు నీతిమంతుడు. దేవుని కొరకు చేయవలసినవన్నియూ అతడు చేసెను. మనము మన రోగముల కొరకు ప్రార్థన చేయించుకొనునప్పుడు దేవుని యొక్క షరతులన్నిటినీ నెరవేర్చవలెను. అన్ని విషయములను సరి చేసికొనవలెను. ప్రతి వాక్య భాగమును మనము వెంబడించవలెను. మన హృదయములను, మన జీవితములను ఆయన సేవ కొరకు నిజంగా సమర్పించామా? ఎందుకొరకు నీవు స్వస్థత పొందవలెననుకొనుచున్నావు? అందువలననే నీకు కావలసినంత విశ్వాసము దొరుకుట లేదు. చూడు! నీవు బహుశా నీ హృదయము పూర్తిగా ఈ పని చేయుట లేదమో. హిజ్కియావలె దేవునికి కారణమును ఇవ్వగలవా? అతడు తన రాజ్యమును క్రమములో పెట్టగోరెను. దేవుడు తన ప్రవక్తను మరల పంపి అతనిని స్వస్థపరచెను. చూచారా? కాని మొదట నీవు ఆ విషయములను సరిచేసికొనవలెను,
నీవు ఈ విషయములను గ్రహించు స్థితికి రావలెను. దేవుని వాక్యము ద్వారా అది నీకు బయలుపరచబడినట్లు నీవెరిగి యుండవలెను, ప్రత్యక్షత కావలెను, దేవుని వాక్యపు షరతులన్నియూ నీవు నెరవేర్చవలెను, అప్పుడు నీకు విశ్వాసము దొరకును, అది అసలయిన విశ్వాసముగా ఉండును.
GEN 17:1
33అబ్రాహాము కూడా తొంబది-తొమ్మిది సంవత్సరముల వయస్సులో దేవుని నమ్మెను. (ఆదికాండము 17) దేవుడతనికి ప్రత్యక్షమాయెను. అతడు తొంబది-తొమ్మిదేండ్ల ముసలివాడు, ఇన్ని సంవత్సరములు అతడు వాగ్ధానము కొరకు కనిపెట్టుకొని యుండెను, అతనికి దాదాపు వంద సంవత్సరములు. "ఎల్ షద్ధాయి" అను పేరు మీద ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, ఆయన బలవంతుడు, అదెంత ప్రోత్సాహకరము! అయినా ఆ వాగ్ధానమింకా నెరవేరలేదు, కాని "అబ్రహామా! నేను సర్వశక్తిగల దేవుడను, ఎల్ షద్ధాయిని, బలము నిచ్చువాడను, కేడెమునై యున్నాను" అని చెప్పెను.
34ఇంతకు ముందు నేను చెప్పియున్నాను, చిన్న పిల్ల అనారోగ్యముతో యుండినప్పుడు తన తల్లి ఒడిలో పరుండును, తన తల్లి నుండి బలమును పొందును, ఎందుకనగా ఆలాగున ఆపిల్ల తృప్తి పొందును. ఎందుకనగా ఆ బిడ్డకు తెలిసిన ఏకైక ఆస్పదము తన తల్లియే, తన తల్లి రొమ్ము తప్ప మరే ఇతర మందు ఆ బిడ్డకు తెలియదు. నీవు మందు ఇచ్చిన యెడల ఆ బిడ్డ దానిని కక్కివేయును. చేతికి సూది మందును, బలవంతముగా ఎక్కించెదరు, కాని ఆ బిడ్డను సంతప్తిపరచునది తల్లి రొమ్ము మాత్రమే.
35"అబ్రహామా! నీవు ముసలివాడవు. నీ బలము అయిపోయినది, నీ చేతులు ఎండిపోయినవి, నీ పురుషత్వము దిగిపోయినది, కాని నేను నీ తల్లిని. నా వాగ్ధానమును గట్టిగా పట్టుకొనుము, నీవు ఎదురుచూచుచూ సంతప్తిపొందుము. విశ్రాంతి పొందుము!" అని ఆయన చెప్పెను.
ఇప్పుడు, ప్రతి విశ్వాసియూ ఆలాగే యుండవలెను, కాన్సరు ఎంత నిన్ను తినివేసినా పరవాలేదు, ఎంత కాలము నుండి నీవు చక్రాల కుర్చీలో కూర్చొనియున్నా పరవాలేదు. ఏది ఎట్లున్నా సరే, నీవు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుము, అప్పుడు సంతృప్తిని పొందెదవు. అది జరుగునని తెలిసికొందువు, ఎందుకనగా విశ్వాసము ఎంతో సహనముతో వాగ్ధానము కొరకు ఎదురుచూచును. చూచారా?
36యోబుకు తన స్థితి తెలియును. దానిని లేఖనములలో మనము చూడగలము. వీరు అతని యొద్దకు వచ్చిరి, అతని సంఘ సభ్యులు, ఒకప్పుడు తనకు ఎంతో ప్రియముగా కనబడిన ప్రతిదియు ఇప్పుడతనికి విరోధి అయ్యెను. అతడు రహస్య పాపియని వారు నేరారోపణ చేసిరి, ఎందుకనగా ఇవన్నియూ అందుకే జరిగినవనిరి. ఈనాడు కూడా జనులు ఆలాగే చెప్పుటను మీరు వినుచున్నారు. "మనుష్యులు ఇతరుల మీద నేరారోపణ చేయుచున్నారు." కాని అది సత్యము కాదు. కొన్నిసార్లు దేవుడు జనులను పరీక్షించును. ఇక్కడ చూచినచో దేవుడు యోబును పరీక్షించుచున్నాడు. ఆ సమయములో యోబుకంటె ఉత్తముడు భూమి మీద లేడు, అతనిని దేవుడు పట్టుకొనియుండెను, యోబు ఒక ప్రవక్త; దేవుని నుండి దర్శనము పొందెను, దేవుడు చేయమని చెప్పిన ప్రతి దానిని అతడు నిశ్చయముగా చేసెను, కాబట్టి దేవుడు తన వాగ్ధానమును అతనిపట్ల చేయబద్ధుడై యున్నాడు.
JOHN 6:40•
REV 22:14
37ఓ! క్రైస్తవులందరూ ఆ విధముగా ఉండవలసి యున్నారు. మన జీవితములో చివరి పోరాటము వచ్చినప్పుడు, మన గొంతులో మరణము దొర్లుచున్నప్పుడు, మనము నిలకడగా యుండి దేవుడు చెప్పిన దానిని గుర్తుకు తెచ్చుకొనవలెను. "అంత్యదినమున నేను నిన్ను లేపుదను చూచారా?" దానిని మనము పట్టుకొనవలెను. మన సాక్షము. క్రీస్తులోని మన స్థానము, మన చోటు మనమేమైయున్నామో దానిని పోగొట్టుకొనరాదు. ఆయన యొక్క ప్రతి ఆజ్ఞను మనము గైకొనవలెను. ప్రతి మాటను ఎరిగి దాని ప్రకారము చేయవలెను. "ఆయనాజ్ఞల ననుసరించువారు ధన్యులు. వారే ఆయన రాజ్యములో ప్రవేశించు హక్కు కలిగి యుందురు." చూచారా? మనము స్వయముగా దానిని ఎరిగి యున్నప్పుడు ఎవరేమి చెప్పినా వినము. బైబిలులో మనము చూచుచున్న ప్రతి ఆజ్ఞను వెంబడించెదము. దేవుడు మనలను చేయమని చెప్పిన ప్రతి దానిని చేయుదుము. గౌరవముతో, ప్రేమతో, బైబిలును వ్రాసిన సృష్టికర్త పట్ల మర్యాదతో దానిని చేయుదుము.
"దానిని మానవులు వ్రాసిరి" అని మనమందుము.
"ఆనాటి మనుష్యులు పరిశుద్ధాత్మ చేత కదిలింపబడి దానిని వ్రాసిరి." చూచారా? దేవుడు మానవుల ద్వారా దానిని వ్రాసెను. ప్రవక్త తన మాటపలికినట్లే అదియున్నది, అది ప్రవక్త యొక్క మాట కాదు, అది దేవుని యొక్క మాట, చూడండి, ప్రవక్త ద్వారా మాట్లాడెను. ఆ కారణము చేతనే అది నెరవేరవలసియున్నది, అది సత్యమయితే ఆలాగే జరుగును.
38ఈ గొప్ప వానిని మనము చూచుచున్నాము. గుర్తుంచుకొనండి, ఆ దినమున చదువుకొనుటకు యోబుకు బైబిలు లేదు. కేవలము ఆత్మ ప్రేరణ ద్వారానే అతడు ముందుకు వెళ్ళెను. అతడు ప్రవక్త, యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చును. అతడు మాత్రమే ప్రేరపణను పొందును, ఎందుకనగా అతడు దేవుని ప్రవక్త. తన స్థానమును అతడు ఎరుగును, ఆత్మ ప్రేరేపణ అతనిని తాకినచో చాలును. తాను చెప్పినది జరుగునని అతనికి తెలియును, ఎందుకనగా దానిని ఆత్మ ప్రేరేపణతో పలుకును.
అదే సంఘమై యున్నది. అది క్రమములో యుండవలెను. (దానిని క్రమపరచవలెను) దాని యొక్క యంత్రములు సిద్ధముగా యున్నవి, అప్పుడే దాని శక్తి బయలుపరబడును. ఈ రాత్రి మన యంత్రములను సిద్ధపరచుకొనవలెను, మన హృదయములను సరిచేసికొనవలెను. మనము చేయకలిగిన కార్యములు చేయవలెను. ప్రతి మాటను వెంబడించవలెను. బాప్తిస్మములో ఆయనను వెంబడించవలెను, ఆయన మనలను చేయమని చెప్పిన ప్రతి క్రమమును నెరవేర్చవలెను. ప్రతి యంత్రమును సిద్ధపరచవలెను, అక్కడ నిలబడవలెను, అప్పుడు మనలో ఆ శక్తి వెల్లడియగును. దేవుడు మాత్రమే దానిని చేయగలడు; ఆ విశ్వాసము నీ హృదయము లోనికి జారవలెను, ఇప్పుడు నేను స్వస్థత పొందియున్నానని చెప్పగలవు, పరిస్థితులు ఏలాగున్నాగాని నీవు తడబడవు, "నీవు స్వస్థత పొందియున్నావు," ఎందుకనగా, విశ్వాసముచేతనే నీవు స్వస్థత పొంది యున్నావు.
39అతడు దేవునితో సంభాషించు మార్గమును కలిగి యుండెను, దాని నతడు ఆత్మావేశము ద్వారా పొందెను. అతడు తన్నుతాను బయటకు కదిలించుకొనెను, దేవునిని రానిచ్చెను. అతడు నీతిమంతునిగా తీర్చబడెనని ఎరుగును. అది ఒక వరము. అది జనులకియ్యబడిన వరము. యోబుకు మాత్రమే కాదు గాని, జనులందరికిని ఇయ్యబడినది. అవి దైవ సంబంధ ములగు వరములు, వానితో దేవుని ప్రజలకు సేవచేయవలెను. అందరూ ప్రవక్తలుగా యుండరు. అందరూ రోగుల కొరకు ప్రార్థించలేరు. అందరు సంఘకాపరులు కారు, కాని దేవుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్గము తెరచును. ఈ ఉదయ కాలపు పాఠములో దానిని చూచియున్నాము, ఒక వ్యక్తి ఎంత ఆత్మ ప్రేరణ పొందినా గాని మరియొకరి స్థానమును ఆక్రమించుటకు ప్రయత్నించరాదు. అది ఎంత బాగా కనబడినా గాని, ఆలాగు చేయరాదు. ఈ ఉదయకాల కూటములో ఎందరున్నారు? మీ చేతులు చూపించండి. చూచారా? మీరు ఆలాగు చేయజాలరు.
AMOS 3:7
40దావీదు ఉన్నాడు, ఎంతో ఆత్మ ప్రేరణను అతడు పొందెను, ప్రజలందరూ కేకలు వేయుచూ దేవుని మహిమపరచుచుండిరి, వారికది వాక్యానుసారముగానే కనిపించినది, కాని అదితప్పు. ఆ ఆత్మావేశము నాతానుకు రావలెను గాని, దావీదునకు కాదు, చూడండి. అతడెన్నడూ అసలు నాతానును సంప్రదించనే లేదు. ఏమి జరిగినదో మీరు చూచారా? తన దాసులగు ప్రవక్తలకు మొదట బయలుపరచకుండా దేవుడు ఏమియూ చేయడు.
యోబు ఈ దినమునకు ప్రవక్తయై యుండెను. దేవుడు యోబునకు మాత్రమే దానిని ఇచ్చెను: అందువలన అతనికి జ్ఞానము ఇచ్చెను, ఆయన వాక్యము మరియు ఆత్మావేశము అతనికి వచ్చెను. మరియొక విధమగు ప్రేరేపణ అతనికి లేదు. అతని యొక్క యంత్రములు సంగతి అతనికి బాగుగా తెలియును. (అతడు దహనబలిని అర్పించెను. తనకు తెలిసిన ప్రతి దానిని అతడు చేసెను), అయినా గాని దేవుని యొద్ద నుండి ఒక్క మాటయూ పొందలేదు, కాని అపవాది అతనిని కదపలేక పోయినది.
నీ కొరకు ప్రార్థించినప్పుడు, నీవును ఆలాగే యుందువు. నీవు ఒక వరుస గుండా పరుగెత్తనక్కర లేదు. నీ కొరకు మరొకరు ప్రార్థించనవసరము లేదు. దేవుడు నీతో చెప్పిన దానిని నీవు ఖచ్చితంగా చేసినచో చాలును. (చూచారా?) అప్పుడు ఆత్మావేశ మార్గము నీకు తెరువబడును, అప్పుడు "నీవు స్వస్థతను పొందెదవు." అది అక్కడ పడగానే అంతయూ ముగియును, నీకు ఏ ప్రార్థనా వరుసా అవసరము లేదు, మరేమి అక్కరలేదు, అంతా ముగియును! అది నీకు బయలుపరచబడియున్నది, చూచారా?
LUKE 2:26,29,30
41ప్రభువైన యేసు వచ్చిన సమయములో ఆ ముసలి ప్రవక్తను చూడండి. అది అతనికి బయలుపరచబడెను, అతడు ఒక ముసలి ప్రవక్త. "ప్రభువైన క్రీస్తును చూచువరకు మరణించడు." దానిని అతడు నమ్మెను, అందుకొరకు అతడు ఎదురు చూచెను, అతనికి పిచ్చి పట్టినదని జనులు తలంచిరి, ముసలివానికి మతిపోయినదనుకొనిరి. అయినా గాని ఇంకా అతడు నమ్ముచుండెను! దానిలో నుండి అతనిని ఏదియూ కదిలించలేక పోయెను, దానిని దేవుడే అతనికి బయలుపరచెనని ఎరుగును. "పరిశుద్ధాత్మ ద్వారా అది అతనికి బయలుపరచ బడెనని," బైబిలు చెప్పుచున్నది.
ఆ నిమిషములో సిమియోను ఆలయములోనికి వచ్చుచుండెను, అతడు లోపలకు వచ్చి దేవునిని స్తుతించెను. "నీ దాసుని సమాధానముగా పోనిమ్ము," అనెను. "అతడు ఆ బిడ్డను ఎత్తికొని, నీ రక్షణను కన్నులారా చూచితిని," అని చెప్పెను. చూచారా, దానిని చూచెదనని అతడు ఎరిగి యుండెను. అతడు ప్రతి దినము ఎందరో పిల్లలను చూచుచుండెను, కాని తన మరణమునకు ముందు క్రీస్తును చూచెదనని అతనికి తెలియును. దానిని సిమియోను నమ్మెను.
నీకది బయలుపరచబడినప్పుడు, నీవే దేవుని వాగ్ధానమును చేర్చుకొందువు, అదే ఆత్మా వేశము. క్రైస్తవులగు మీకు అది కావలెను, మీకు ప్రార్థన సిద్ధపరచబడవలెను, దైవావేశము లోనికి రానీయుడి, అప్పుడు నీ మనస్సును ఏదియూ మార్చజాలదు; దానిని మీరు పొందవలసియున్నారు. అది లేకుండా మీకు ఏ ప్రయోజనమును లేదు.
42ఇప్పుడు గమనించండి, యోబునకు ఒక దైవావేశపు మార్గము అవసరమయ్యెను, దానినతడు తెరువవలసి యుండెను. దేవునితో సంభాషించు ఒక మార్గము అతనికి అవసరమయ్యెను, అది అతని ఆత్మావేశము. అతడు తన్నుతాను వేరుపరచుకొనెను, దేవుని వాక్యమును లోనికి రానిచ్చెను. వారతనితో ఆలోచన చేయుటకు తూర్పు నుండియు, పడమరనుండియు ఎట్లు వచ్చిరో గమనించండి. జనులతని కొరకు ఎదురు చూచుచుండిరి, ఎందుకనగా యోబు చెప్పినది సత్యమని వారికి తెలియును. అతడు సత్యమే చెప్పునని వారికి తెలిసెను, ఎందుకనగా అతడు ప్రవచించినదే నెరవేరేను గనుక జనులు తూర్పు నుండియు పడమరనుండియు వచ్చుచుండిరి.
అతడు సంత వీధులలోనికి వెళ్ళినప్పుడు తూర్పు నుండి వచ్చిన యువరాజులు అతనికి సాష్టాంగ నమస్కారము చేయుచుండిరి. అతని యొద్ద నుండి బయలువచ్చు ఒక్క ఆదరణ మాటకొరకు ఎదురు చూచుచుండిరి. అతని యొక్క జ్ఞానము గొప్పది మరియు బలము గలది, అతడు యధార్థవర్తునుడని వారికి తెలియును. అతడు తనను గూర్చి గొప్పలు చెప్పుకొనలేదు, ఎవరినీ చిన్నపరచలేదు, ఎవరినీ విమర్శించలేదు. అతడు యధార్థపరుడగు దేవుని ప్రవక్త, అతని యందు నమ్మకమున్నది, అతనితో ఒక్క క్షణము మాట్లాడుట కొరకు జనులు తూర్పు నుండియు పడమర నుండియు వచ్చుచుండిరి. బైబిలులో ఆలాగని అతని గూర్చి చెప్పబడెను, కాని ఇప్పుడతనికి ఇది ఎందుకు సంభవించునో చెప్పగల ఆవేశము లేకపోయెను. దేవుడు దానిని అతనికి సంభవింపచేసెను, ఎందుకో అతనికి చెప్పలేదు.
AMOS 3:7
43అయితే ఒకనాడు జరిగిన దానిని చూడండి, అందరును అతనికి విరోధముగా మాట్లాడిరి. వారతనితో సమ్మతించలేదు, కాని తనది సరియని అతనికి తెలియును. అతని విశ్వాసపు నాడి కొట్టుకొనుచున్నది, దేవుడతనితో మాట్లాడుటను వినెను. అది సత్యమని అతనికే తెలియును. దేవుని యొక్క స్వరము అతనికి తెలియును, ఆ విషయములో ఎవరునూ అతనిని మోసము చేయజాలరు, ఎందుకనగా అది అతనికి తెలియును. నీకు అది బయలుపరచబడియున్నది. అది జనులు తలంచిన దానికి విరోధము కావచ్చును. నేను ప్రవక్తలగూర్చి మాట్లాడుచున్నాను. ఒకసారి దేవుడు ఒక విషయమును నీకు బయలుపరచినప్పుడు దానిని సెమినరీ వారు అంగీకరించరు, గుంపుల వారు సమ్మతించరు, అది దేవుని రహస్యము గనుక దానిని నీకు దేవుడు బయలుపరచి ప్రజలకు తెలియచేయమనును. భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో అది జరిగెను, ఒకే వ్యక్తికి, ప్రవక్తకు అది వచ్చును. ఆమోసు 3:7, "తన దాసులగు ప్రవక్తలకు మొదట బయలుపరచకుండా దేవుడు దేనినీ చేయడు."
JOB 1:11•
JOB 2:5
44యోబునకు అంతా కీడే జరిగెను, కాని అదేమిటో తెలిసికొను దైవావేశమతనికి దొరకలేదు, అది అతనిని బాధించుచుండెను. నీవు అటువంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు, శత్రువు ప్రతి స్నేహితుని నీకు దూరము చేయును, వారు నిన్ను దోషిగా ఎంచుదురు. నీ స్నేహితులు నీ మీద నేరారోపణ చేయుట కంటె బాధకరమైనది నీకు మరేదియూ ఉండదు. సాతాను ఆలాగున నీ శత్రువులుగా మారిన వారితో చేతులు కలుపును, సాతాను ఆలాగు లోపటకు వచ్చును. "నీవు దేవుని దూషించునట్లుగా చేయవలెనని అది ప్రయత్నించును, నీ వర్తమానమును వారు నిరాకరించెదరు, నిన్ను శపించెదరు, నిన్ను దోషిగా ఎంచి వెనుకకు తరుమగోరుదురు." అన్ని విధములగాను అతనిని దిగజార్చుటకు సాతాను ప్రయత్నించెను. అతని యొక్క స్నేహితులు, బందువులు అందరూ అతనిని ద్వేషించిరి, కాని యోబు ఏమి చలించలేదు, ఎందుకనగా అతడు దేవుని స్వరమును వినెను.
ఓ దేవా, రేపు రాత్రికి సహాయము చేయుము, పావురపు రెక్కల పైన అను ప్రసంగము చేయుదును. దేవుని స్వరము మాట్లాడుటను నేను విన్నాను. అది ఆ విధముగా జరుగవలసియున్నది! ఈ ఇతర సంగతులు జరిగినట్లుగానే ఇదియు జరుగనై యున్నది!
JOB 19:25-27•
JOB 32:2
45ఎప్పుడు, ఇది జరుగనని యోబునకు తెలియును. దేవుడతనికి చెప్పినట్లు అతడెరుగును, అతడు "నీతిమంతుడు," వారతనిని పాపిగా చేసిరి, కావున అతడు దైవావేశము కొరకు ఎదురు చూచెను. సాతాను ఆ జనులందరిని అతనికి విరోధముగా రేపెను, వారతనిని ఓదార్చుటకు వచ్చెననిరి, కాని అది అబద్ధము. అతని మీద నేరారోపణ చేసిరి, అయినా ఏ మాత్రమును అతడు చలించలేదు. దేవుని యొక్క వాక్యము అతనికి బయలుపరచబడెను. అతడు వినికిడి చేత దేవుని వాక్కును వినెను, కాని అతడు మిక్కిలి శోచనీయమగు స్థితికి దిగజారెను. అందరూ అతని మీద నేరారోపణ చేయుచుండిరి, అతని భార్య కూడా అతనిని దోషిగా ఎంచెను, అతడు తన కురుపులు గోకుచుండెను. ఎలీహు వచ్చి అతనిని స్వార్థపరుడని గద్దించెను, దేవునిపై నేరారోపణ చేయరాదని దూషించెను.
అదే సమయములో దైవావేశము అతనిని తాకినది, మెరుపు మెరయసాగెను, ఉరుములు గర్జించసాగెను, అప్పుడు ప్రవక్తను దైవావేశము తాకినది. అతడు లేచి ఇట్లనెను, "నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. అంత్యదినమున అతడు భూమి మీద నిలచును. ఈ శరీరమును చర్మపు పురుగులు తినివేసినా గాని, నా దేహముతోనే నా దేవునిని చూచెదను. నా యంతట నేనే చూచెదను."
JOB 14:13-15
46వారు చెట్లు గురించి మాట్లాడుకొనుచుండిరి, అది వృక్షజీవము. అదెట్లు మరణించి తిరిగి బ్రదుకునో వారు చెప్పిరి; నీటి వాసనవలన అది సజీవమగును, భూమిలో ఉండిన విత్తనము మీద నీరు పడినప్పుడు, నీటి వాసన దానికి తగిలినప్పుడు ఫలితమేమిటో మనకు తెలియును. "కాని ఒక నరుడు తన ఆత్మను విడిచి పాతి పెట్టబడును. అతని కుమారులు వచ్చి అతనిని ఘనపరచెదరు గాని అది అతనికి తెలియదు. నీవు నన్ను సమాధిలో దాచియుంచెదవని అతడు చెప్పెను. [యోబు 14] ఆయన ఉగ్రత దాటిపోవు వరకు అది జరుగును." "ఒక నరుడు చనిపోయిన పిదప మరల బ్రదుకునా? నా జీవిత కాలములో నిర్ణయించిన కాలములు వచ్చు వరకు ఎదురు చూచును. నీవు నన్ను పిలువగా నేను ఉత్తరమిచ్చెదను. నేను గతించిపోనియక హద్దులు నీవు నాకు నియమించితివని," అతడు పలికెను. అతనికి ఇవన్నియూ తెలియును. అతడు తిరిగి బ్రదికిన చెట్టును చూచెను, కాని నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగును? అతడు మరల లేవడు. కాబట్టి విమోచకుని అతడు దేవుని వలన చూచెను.
JOB 19:25
47అతని కొరకు మధ్యవర్తిత్వము జరుపు వారెవరైనా యున్నారేమోనని చూచెను. అతడు ఎందరో జనులకొరకు విజ్ఞాపన చేసెను, కాని ఇప్పుడు అతని కొరకు ఎవరైనా విజ్ఞాపన చేయుదురా? యోబు పక్షముగా ఎవరు నిలబడుదురు? వారందరూ అతనిని పాపిగా ఎంచుకొనుచున్నారు. పాపియగు వానికిని, పరిశుద్ధుడగు దేవునికిని మధ్య వారధి ఎవరు నిర్మించెదరు. దేవుని ఇంటికి వెళ్ళి ఆయన తలుపును ఎవరు కొట్టెదరు? ఆయన తలుపు తెరచి కొంతసేపు అతనితో మాట్లాడును?
దైవావేశము అతని హదయములోనికి జారినది, అతడు దేవునిని చూడగలిగెను. మెరుపులు మెరిసెను, ఉరుములు ఉరిమెను, ఆ విధముగా జరిగినప్పుడు అతడు లేచి నిలబడి ఇట్లనెను, "నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. నా విమోచకుడు అంత్యదినమున భూమి మీద లేచి నిలబడును." చూడండి, అతని విశ్వాసమునకు దేవుడు ప్రతిస్పందించుటను చూడనారంభించెను.
JOB 42:5
48ఇప్పుడు, దేవుని చూడగలమా, లేమా అని మనము సందేహపడుచుందుము. ఆయనను చూచుటకు మనకేదయినా మార్గమున్నదా? దేవునికి ఒకే ఒక మార్గమున్నది, యోబుకు దానినే ఆయన తెరచును. "నిన్ను గూర్చి నేను వింటిని, చెవితో దానిని వింటిని, కాని ఇప్పుడు నిన్ను చూచుచున్నాను. నా నేత్రములతోనే నిన్ను నేను చూచుచున్నాను." అధృశ్య దర్శనము తేటతెల్లము చేయబడినది. మేఘమలు బిగ్గరగా గర్జించుటను అతడు వినెను, మెరుపులు మెరిసెను, వాటిని అతడు చూచెను. ఉరుములు గర్జించుటను అతడు వినెను, చక్కని దినమున మేఘములలో అతడు దేవుని చూచెను. తన స్వాభావిక నేత్రముతో అతడు దేవునిని చూడగలిగెను, చూచారా, ఎందుకనగా అదృశ్యుడు దృస్యునిగా కనబడెను. ఇతరుల యొక్క దృశ్య దర్శనము అప్పుడు బయలుపరచబడినది. స్వాభావిక నేత్రమునకు తేటగా బయలుపరచబడినది.
49క్రియలతో కూడిన విశ్వాసమునకు ఇది పోల్చబడును, గత రాత్రి దాని మీద మనము మాట్లాడుకొన్నాము. అబ్రాహాముకు చదువుకొనుటకు ఏ బైబిలు లేదు, కాని అతడు ప్రవక్త, అతనికి దర్శనము, విశ్వాసము ఉన్నది. అతడు ఆలోచించిన తీరు ఇతరులకు తప్పుగా కనబడవచ్చును. వారికి ఒక శిశువు జన్మించునని చెప్పు దర్శనమును పొందెను. "దానిని గురించియే అతడు మాట్లాడుచూయుండెను. దానిని పొందుదునని అతడు చెప్పెను," అయితే అతడు దానిని దర్శనములో చూచెను. మిగిలిన వారయితే ఆ శిశువు జన్మించిన పిదప శారీరక నేత్రములతో చూచిరి. నీ హృదయములో నమ్మియున్న దానికి అనుగుణముగా నీవు క్రియ నారంభించినప్పుడు జనులకు దేవుడు అర్థమగును. నీకు జరుగుచున్న దానిని వారు చూడగలరు, నీవు ప్రవర్తించుచున్న విధానము వారికి తెలియును, ఆలాగున నీవు నీ కంటితో దేవునిని చూడగలవు. అతడు మేలయిన దానినే చేసెను, ఇతరుల కొరకు శ్రమపడెను, అయినా అతని కొరకు కొందరు విజ్ఞాపన చేయవలసి వచ్చినది. ఇస్సాకు పుట్టుట జరిగినది, అతని దర్శనమునకు అది నెరవేర్పు అయియున్నది, ఆ దర్శనము దైవావేశము వలన కలిగినది. అతడు చూచిన దర్శనము నిజమేనని ఆ తరువాత జనులు తెలిసికొనిరి.
JOB 2:7
50కొన్నిసార్లు ఈ విశ్వాసపు ప్రత్యక్షతలు క్లిష్ట సమయములలోనే వచ్చును. నిజానికి క్లిష్ట పరిస్థితియే దీనిలోనికి మనలను నడిపించును, అటువంటి పరిస్థితియే యోబును ఇందులోనికి త్రోసెను. అది అతని యొక్క జీవిత ముగింపు. అతని పిల్లలు చనిపోయిరి, అతని ఒంటెలు చనిపోయినవి, అతని యొక్క వస్తువులన్నియూ నాశనమయినవి. అతని స్వంత ప్రాణమే విలవిల లాడినది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లతో నిండిపోయెను. అది ఒక క్లిష్ట పరిస్థితి, అతడు తన్నుతాను అణచుకొనెను. అప్పుడే ఆ దైవావేశము అతనిని తాకినది.
51ఓ స్త్రీ, పురుషులారా, ప్రభువు యొక్క రాకడకు ఎంత సమీపముగా యున్నామో ఈ రాత్రి గమనించండి. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును విడిచి పెట్టిరి. మీరు ఏదో ఒక ఉద్రేకమును నమ్ముచున్నారు, సాతాను యొక్క అనుకరణ మీద మీరు ఆధారపడి యున్నారు. దేవుని యొక్క వాగ్ధానముల నన్నింటినీ స్వతంత్రించుకొను నిజమగు ఆత్మ మీలో లేదు. పరిశుద్ధాత్మను పొందియున్నానని చెప్పుకొను మనిషి ఈ బైబిలులోని మాటను ఎట్లు నిరాకరించుట జరుగును? అది సరి కాదని నీవు ఏ మాత్రమూ అనలేవు.
నీవెంత భక్తిగానయినా యుండవచ్చును, ఎన్నో సంఘములలో నీవు సభ్యునివి కావచ్చును, ఎన్నో పుస్తకములలో నీపేరుండ వచ్చును, కాని ఆ నిజమగు పరిశుద్ధాత్మ నీలో యున్నప్పుడే నీవు ఈ ఘడియ యొక్క వర్తమానమును చూడగలవు. (ఈ వాక్యము బయలుపరచబడి యున్నది), ఎందుకనగా పరిశుద్ధాత్మయే దానిని చేయుచున్నది. అయితే దానిని నీవు స్వీకరించవలెనన్న యెడల నీకు దైవా వేశము కావలెను. భూమిలో విత్తనమును పాతిపెట్టకుండా నీవు ఎన్ని నీళ్ళు పోసినా గాని మొక్క రాదు కదా? అసలు గింజ లేనప్పుడు మొక్క ఎట్లు వచ్చును? అక్కడ విత్తనమే లేదు. దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే దానిని చూడగలరు.
MATT 11:25•
LUKE 10:21
52దేవుని చేత ఏర్పరబడిన వారు నోవహు కాలములో చూచిరి, మోషే కాలములో చూచిరి, యేసు కాలములో చూచిరి, అపోస్తలుల కాలములో చూచిరి, లూథరు కాలములో చూచిరి, వెస్లీ కాలములో చూచిరి, పెంతెకోస్తు కాలములో చూచిరి, ఎందుకనగా ఈ దైవావేశము కుమ్మరించబడినప్పుడు ఆ విత్తనము నేలలో యున్నది. దైవావేశము కుమ్మరించబడుచున్నది, వధువును అది పోగుచేయును, ఏర్పరచబడినవారు మాత్రమే దానిని చూచెదరు. యేసు ఇట్లనెను, "జ్ఞానులకును, వివేకము గలవారికిని నీవు ఈ సంగతులను మరుగు చేసి, నేర్చుకొను పసిపిల్లలకు బయలుపరచి యున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాను తండ్రీ." ఇప్పుడు దైవావేశము దానిని తాకినది.
GEN 1:3•
ISA 7:14•
LUKE 17:28-30
53దైవావేశము అతనిని తాకినప్పుడు అది చూచుట జరిగెను. దానినప్పుడు అతడుకలిగి యుండెను! ఒత్తిడి ఎక్కువయిన సమయములలో, సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడిన సమయములలో అది వచ్చుటను మనము చూడగలము. ఈనాడు చూడండి, ఎటువంటి పరిస్థితు లలో జీవించుచున్నామో చూడండి. ఆధునిక సొదొమ మరియు గొమొర్రాలలో మనము జీవించుట లేదా? ప్రపంచము తిరిగి రాలేదా? అప్పుడు అన్య లోకము అగ్ని ద్వారా నాశనము చేయబడినది. లూకా 17వ అధ్యాయము 28, 29, 30 వచనములలో యేసు చెప్పలేదా? "సొదొమ దినములలో యుండినట్లుగానే మనుష్యకుమారుని రాకడ దినములలోను యుండును." మనుష్యకుమారుడు బయలుపరచబడును. బయలుపరచబడుట అనగా ఏమిటి? ఒక రహస్యము బయలుపరచబడినది, అదియే ప్రత్యక్షత; ఒక రహస్యము బయలుపరచబడినది లేదా తెలియచేయబడినది.
ఇప్పుడు, సంఘ కాలములన్నింటిలోను మరుగు చేయబడిన ఈ విషయములన్నియూ బయలుపరచబడినవి, తెలియచేయబడినవి. దానిని మనము చెప్పగలము, దానిని దేవుడు ఋజువు చేయని యెడల అది తప్పు. చూడండి, దేవుని వాక్యమును అనువదించుటకు ఎవరూ దేవునికి అవసరము లేదు, ఆయనే స్వంత అనువాదకుడు. "ఒక కన్యక గర్భవతి యగునని," ఆయన చెప్పగా ఆలాగు జరిగెను. ఆయన "వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను." మనము లూథరు కాలములో గాని, వెస్లీ కాలములో గాని, పెంతెకోస్తు కాలములోగాని జీవించుట లేదు. పెంతెకోస్తు కాలములో వరముల పునరుద్ధరణ సంఘములోనికి వచ్చినది, అయితే మనము సాయంకాల సమయములో జీవించుచున్నాము, వధువును బయటకు పిలచుచున్న కాలములో మనము జీవించుచున్నాము.
REV 3:17
54లూథరును చూచుట కాతలిక్కులకు కష్టమాయెను, వెస్లీని చూచుట లూథరనులకు కష్టమాయెను, వెస్లీ వారికి పెంతెకోస్తును చూచుట కష్టమాయెను, ఆ విధముగానే ఈ కాలమును చూచుట పెంతెకోస్తు వారికి కష్టమగును. ఎల్లప్పుడును అది ఆ విధముగానే యుండెను, ఎందుకనగా అది ఏర్పరచబడిన సంతానము మీద కుమ్మరించబడెను. అది మాత్రమే బైబిలు బోధించుచున్నది. వారు దానిని చూడజాలరు, వారి కొరకు యేసు కూడా ప్రార్థించెను, "వారు గ్రుడ్డివారై యుండి దానిని ఎరుగరు." ప్రకటన గ్రంథములో లవొదికయ సంఘ కాలము దానిని గూర్చి చెప్పుచున్నది. ఆయనను సంఘమునకు బయట ఉంచిరి, "వారు దిగంబరులు, దరిద్రులు, దిక్కుమాలిన వారు, గ్రుడ్డివారు కాని దానిని ఎరుగరు." అది మరల పునరావృతమగుచున్నది, దానిని వారు చూడలేరు, దానిని వారు గ్రహించలేరు. వారు అంతగా ఆచారములలో చుట్టుకు పోయిరి.
GEN 1:3•
JOHN 1:10,12•
JOHN 5:28
55కాని యేసుక్రీస్తు నోటి ద్వారా పలుకబడిన దేవుని వాగ్ధాన వాక్యమును గుర్తుంచుకొనండి. ఆ దేవుడే పలుకగా సృష్టి ఉనికి లోనికి వచ్చెను. జగత్తు పునాదికి ముందుగా ఉన్నవాడు ఆయనే. "ఆయన కలుగమనగా సమస్తమును కలిగెను." "ఆయన లోకములో యుండెను, లోకమాయన వలన కలిగెను, కాని లోకమాయనను ఎరుగకుండెను. అయితే ఎందరయితే ఆయనను ఎరిగిరో వారందరికీ దేవుని కుమారులగునట్లుగా ఆయన శక్తిననుగ్రహించెను." ఆయన సృష్టికర్త. సృష్టికర్తయగు ఆయనే లాజరును మృతులలో నుండి లేపెను. "ఇది వింత కాదని ఆయన చెప్పెను, ఎందుకనగా సమాధిలో యున్న వారందరూ మనుష్య కుమారుని స్వరము విను ఘడియ వచ్చుచున్నది." వారందరునూ బయటకు వచ్చెదరు. "వెలుగు కలుగు గాక," అని పలికని ఆ దేవుడే, సమాధిలో యున్న వానిని లేపెను, "అది మనుష్య కుమారుని స్వరము." అది దాని కాలములో జరుగవలసియ్నుది. "స్త్రీని గాను, పురుషునిగాను ఆయన వారిని సృజించెను." వందలాది సంవత్సరములకు ముందే ఇది జరిగి యున్నది.
ISA 7:14•
ISA 9:6•
DAN 3:23
56ప్రవక్తయగు యెషయాను దైవావేశము తాకి యున్నది. అతడిట్లు పలికెను, "ఏలయనగా మనకు ఒక కుమారుడు పుట్టెను. ఒక శిశువు అనుగ్రహించబడెను. ఆయనకు ఆలోచన కర్త, సమాధానాపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి," అని పేరు పెట్టబడును. దినములు, వారములు, నెలలు, సంవత్సరములు గతించిపోయినవి. ఎనిమిది వందల సంవత్సరముల తరువాత ఒక కన్య ద్వారా ఇమ్మానుయేలు జన్మించెను. ఎందువలన? అది దేవుని అభిషేకము పొందిన ప్రవక్త పెదవుల ద్వారా పలుకబడినది గనుకనే. విత్తనము చల్లబడినది. చూచారా? అది గొప్ప ఘడియ, ఆయన నుండి వారు ఒక దర్శనము లేదా సూచన చూడగోరిరి.
"నేను వారికి ఒక సూచన ఇచ్చెదను, అది ఒక నిత్యమగు సూచన, 'ఒక కన్యక గర్భవతి యగును,' అది ఒక నిత్య సూచన," అని ఆయన చెప్పెను.
నిజమగు కష్టకాలములోనే అది బయలుపడును, అటువంటి సమయములలోనే దేవుని ఆత్మ కదలాడుచుండును. ఆ హెబ్రీయులను ఆయన అగ్నిగుండము లోనికి పోనిచ్చెను. ఆ తరువాత ఆయన తన చేతిని కదిపెను. ఆయన కదులుటకు ఒక సమయము కలదు.
MATT 24:37,38•
LUKE 17:26-30
57ఇప్పుడు, లూకా సువార్త 17వ అధ్యాయము 30వ వచనములో ఇప్పుడు మనము గమనించగలము. "చివరి దినములలో మనుష్య కుమారుడు తన్ను తాను బయలుపరచుకొనును. సొదొమ గొమొర్రాలకు ముందు ఆయన ఆలాగే బయలుపరచుకొనెను, అవే పరిస్థితులు ఇప్పుడు యున్నవి." ఆయన మోషే గూర్చి చెప్పెను, క్షమించండి, మోషే గూర్చి కాదు, నోవహు గూర్చి చెప్పెను. ఆ దినములలో జనులు "తినుచూ, త్రాగుచూ, పెండ్లి చేసికొనుచూ, పెండ్లికిచ్చుచూ ఉండిరి." అప్పుడే ఆయన వచ్చెను. "లోతు దినములలో ఉండినట్లుగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలోను ఉండును." ఇప్పుడు చూడండి, ఒక మానవునిగాను, ఒక ప్రవక్త గాను, మానవ శరీరము గలవానిగాను మనుష్యకుమారుడు అబ్రాహాము యొక్క గుంపునకు ప్రత్యక్షమాయెను. ఒక సామాన్య మానవునిగాను ఉండెను. ఆయన దుస్తుల మీద ధూళి యుండెను; అబ్రాహాము అతనిని "ఎలోహిం" అని పిలచెను.
58ఇప్పుడు, చివరి దినములలో మనుష్యకుమారుడు మరల అదే మాదిరి గుంపుగా బయలుపడునని వాగ్ధానము చేసెను, వారే అబ్రాహాము యొక్క రాజ సంతానము, అగ్ని కురియుటకు ముందు అది జరిగెను. గుర్తుంచుకొనండి, సంఘము మరే ఇతర సాక్షిని ఇక పొందదు, అబ్రాహాము తదితరులు ఆ వాగ్ధానము చేయబడిన కుమారుని కొరకు ఎదురు చూచుచుండిరి, వారు ఎదురు చూచినది, ఆ తరువాత కనబడినది. సంఘము వాగ్ధాన కుమారుని కొరకు ఎదురు చూచుచున్నది, ఈ సేవా దినములు అయిపోయిన తరువాత ఆయన వచ్చును. ఆయన పరలోకము నుండి ప్రత్యక్షమగును, దానిని మనము చాలా తేటగా చూచుచున్నాము, అది ఆ విధముగా ఉండవలసియున్నది. ఆ స్పందన మాత్రమే అక్కడ ఉండవలసి యున్నది, మానవునిలోనికి రావలసియున్నది, దేవుడు దానిని బయలుపరచి అతనికి చెప్పును; అదే జరుగువలసియున్న సంగతియని చూపించును.
GEN 15:13
59మోషే చేసినట్లుగాను యుండును…
అతడు ఆ జనులను విమోచించగోరలేదు, అయితే దేవుడు మండుచున్న పొదలో నుండి అతనితో మాట్లాడెను. అతడు వెళ్ళుటకు ఇష్టపడలేదు, అయినా గాని అతడు వెళ్ళవలసి యుండెను. ఆయనే గొప్ప యెహోవా అని మోషే వినెను, కాని అప్పుడాయనను చూడగలిగెను. ఆయన అగ్నిస్తంభము రూపములో యుండెను. "నేను నిన్ను గూర్చి వింటిని గాని, ఇప్పుడు నిన్ను చూచియున్నాను." దేని ద్వారా అతడు చూచెను? బయలుపరచబడిన ఆయన వాక్కు ద్వారానే.
ఆ ప్రజలు నాలుగు వందల సంవత్సరముల పాటు ఒక క్రొత్త దేశములో యాత్ర చేయుదురని దేవుడు అబ్రాహాముతో చెప్పెను, కాని వారిని ఆయన ఒక బలమగు చేతితో తీసికొని వచ్చును.
ఇప్పుడు గమనించండి, ఏమి జరుగునని అబ్రాహాము చెప్పెనో దానికి ఈ మండుచున్న పొద ఒక ప్రత్యక్షతగా యుండెను. "దానిని గూర్చి వింటిని గాని ఇప్పుడు చూచుచున్నాను!" అని మోషే చెప్పెను.
JOB 42:5
60మనుష్యకుమారుడు చివరి దినములలో తన జనుల మధ్యకు వచ్చి ఆ కాలములో వారికి బయలుపరచుకొనిన విధముగానే మరల బయలుపరచుకొనును, సొదొమ నాశనమునకు ముందు ఇది జరిగెను. మనుష్యకుమారుడు ఏమి చేసెను? శారా హృదయములో నున్న రహస్యములను ఎరిగి యుండెను. అబ్రాహామునకు వాగ్ధానమును కూడా ఇచ్చెను. అబ్రాహాము దేవుని స్వరమును వినెను, ఆయనను అనేక రీతులుగా అతడు చూచియుండును. (అతడెట్లు మాట్లాడెనో నాకు తెలియదు. కలల ద్వారానో లేదా ప్రవచనముల ద్వారానో కావచ్చు), కాని ఈ సారి ఆయనను చూచెను. "నీ గూర్చి వింటిని గాని ఇప్పుడు నిన్ను చూచుచున్నాను."
సంఘము దేవుని గూర్చి విన్నది, వారాయనను గురించి చదివిరి, ఆయన చేసిన వాటిని, ఆయన వాగ్ధానములను వినిరి, కాని ఇప్పుడు మనము మన నేత్రములతో ఆయనను చూచుచున్నాము. యోబు వలెనె, "నీ గూర్చి వింటిని గాని ఇప్పుడు నిన్ను చూచుచున్నాను." మై! ఎంత వ్యత్యాసము.
EXOD 14:11-13
61క్లిష్టపరిస్థితిలో మోషే మొరపెట్టెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13 నుండి 16వ వచనములు. ఆ గొప్ప శ్రమలో ఇశ్రాయేలీయులతో కూడా మోషేయుండెను, దైవావేశము అతనిని తాకియున్నది, అతడు తనకు తెలియకుండానే ఒక మాటను చెప్పెను. "ఊరక యుండి దేవుని యొక్క రక్షణను చూడుడని," చెప్పెను. దేవుడతనితో ఇంకా మాట్లాడలేదు. చూడండి, దైవావేశము అతనిని తాకినది.
వారిట్లు ప్రశ్నించిరి, "నీవు మమ్మును ఐగుప్తు దేశము నుండి ఎందుకు తీసికొని వచ్చితివి? మేము ఐగుప్తులోనే చావలవలసినది. అక్కడ సమాధులు లేవని ఇచ్చటికి తీసికొని వచ్చితివా? ఇక్కడికి తీసికొని వచ్చి మమ్మును చంపుచున్నావు. అక్కడ మేము దాసులముగాయున్నా గాని క్షేమంగా, చనిపోయే వరకు జీవించేవారము, కాని ఇక్కడికి మమ్మును తీసికొని వచ్చి చంపుచున్నావు."
మోషే ఒక ప్రవక్త, దేవునితో అతనికి సంబంధము కలదు, అతడు దైవావేశమువలన ఇట్లు చెప్పెను, "ఊరక నిలచి యుండుడి, మీరు దేవుని రక్షణను చూచెదరు; ఏలయనగా నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను రేపు ఇక చూడరు." అది జరుగునని అతనికి ఎట్లు తెలియును? అతనికేలాగు తెలియును? తనకు తెలియకుండానే ఆ మాటను అతడు పలికెను.
EXOD 14:15,16
62అయితే అతడు మధ్యవర్తిగా పని చేయుచుండెను, అందుకే అతడు మాట్లాడెను. దానినెట్లు చేయవలెనో దేవుడతనికి తెలిపెను, "మోషే, నాకు నీవు మొర పెట్టవద్దు. నీ చేతిలో యున్న కర్రను సముద్రము మీదికి చాపుము. ఇశ్రాయేలీయులను సాగిపొమ్మని చెప్పుము." ఆమేన్!
దైవావేశము! నీవు రోగిగా యున్న యెడల నీకు కూడా అదే కావలెను. నీవు శ్రమలో యున్నప్పుడు ఆ విధముగానే అది నిన్ను తాకును. నీకు ఒకటి బయలుపరచబడియున్నది, అది బయలుపరచబడినదని నీకు తెలియును. "నేను బాగుపడి యున్నానని నీవు చెప్పుము."
అపుడు దేవుడు నీకేమి చేయవలెనో చెప్పును, "లేచి నడువనారంభించుము." ఆమేన్! అంతా అయిపోవును, ఆ విధముగా నీవు చేయగలవు. దేవుడు ఆ విధముగానే చేయును. అప్పుడు దేవుడు నీ ద్వారా ప్రత్యక్షమగును.
దానిని చేయమని దేవుడే చెప్పెను. అక్కడుండిన ఇశ్రాయేలీయులందరూ మోషే యొక్క దైవావేశమును చూచిరి. వారు తమ స్వంత నేత్రములతో చూచిరి, వారు ఆ నీటిని ఒక వైపునుండి మరియొక వైపునకు దేవుడు వేరుచేయుట చూచిరి. ఆ అగ్ని స్తంభము వారిని సముద్రములో నుండి నడిపించెను. అతడు ముందు దేవుని స్వరమును వినెను, ఆ తరువాత దేవునిని చూచెను.
JOSH 10:12,13
63యెహోషువా ఒక సంకట ఘడియలో ఉండెను, శత్రువులు చుట్టుముట్టుకొని యుండెను, సూర్యుడు అస్తమించుచుండెను. యెహోషువా ఒక ప్రవక్త, మరియు ఆ సైన్యములన్నియూ కూడుకొని వారి మీద పడినచో చాలామంది చనిపోవుట జరుగునని అతనికి తెలియును. కాబట్టి ఆ సంకట ఘడియలో ఏదో ఒక దానిని చేయవలసి యుండెను, ఒకే ఒకటి చేయవలెను. అదేమనగా, వారిని తరుమగలిగినచో వారిని వెనుకపడి చంపవచ్చును. ప్రతి ఒక్కరిని చంప వచ్చును, కాని అందుకు కావలసినంత వెలుగు లేదు, కాబట్టి యెహోషువా నిలబడి తన చేతులెత్తి "సూర్యుడా! నిలువుము, చంద్రుడా! నీవు అయ్యాలోను లోయలో యుద్ధము ఆగిపోవు వరకు నిలబడియుండుము." ఆలాగే సూర్యుడు ఆగిపోయెను. యెహోషువా మాట్లాడుటను వారు వినిరి, ఆ తరువాత దేవుడు క్రియ చేయుటను వారు చూచిరి, (తమ స్వనేత్రములతో చూచిరి). నిజము!
JOSH 10:12,13•
MARK 11:23
64చూడండి, అది బహుశా అసాధ్యముగా కనబడిన ఒక క్రియ. అయినా గాని అది సత్యము. "సూర్యుడు నిలచిపోయెనని" బైబిలు చెప్పుచున్నది. మీరేమనుకొనుచున్నారో నాకు తెలియదు. ప్రపంచము గుండ్రముగా యున్నదని మీరనుకొనుచున్నారు, ఏది ఏమైనా గాని "సూర్యుడు నిలచి పోయెను." బహుశా ఆలాగు జరుగట ఎట్లు సాధ్యమో యెహోషువాకు ఎన్నడూ తెలిసి యుండదు. దానిని దేవుడెట్లు చేయునో అతనికి తెలియదు, కాని అతడు సూర్యుని నిలువుమని దేవుడే దానిని పలికించెను, ఆయనే క్రియ జరిగించెను.
మార్కు 11:23 లోను అదే జరిగెను, "ఈ కొండను కదిలి పొమ్మని చెప్పి నీ హృదయములో సందేహించక, నీవు చెప్పినది జరుగునని నమ్మినయెడల ఆలాగే జరుగును. నీవు నీ మనస్సులో సందేహపడరాదు." నీవు దైవావేశము ద్వారా దానిని పలుకగలవు. ఆమేన్.
65నా మాటను మన్నించండి, అయితే ఆ దినమున అరణ్యములో కూర్చొని యున్నాను. (దేవుడే నా తీర్పరి, ఇది నిజము కానిచో ఈ వేదిక మీదనే పడిచచ్చెదను), నా జీవితమంతటికీ లేఖనమే నాంది. ఒక ఉదయమున అరణ్యములో కూర్చొని యున్నాను, దానిని గూర్చి ఆలోచించుచున్నాను. ఆ స్వరము నాతో ఇట్లు పలికినది, "ఆ వాక్య భాగము అన్ని వాక్యముల వంటిదే — అది సత్యము."
"అదెట్లు జరుగును?" అని నేననుకొన్నాను.
"నీవు పలుకుము, అది ఆ విధముగా జరుగును. దాని విషయములో సందేహ పడవద్దు," అని ఆయన చెప్పెను.
ఆ అరణ్యములో ఎక్కడో కూర్చొని — ఒకరితో నేను మాట్లాడుచున్నాను, ఉడుతలు దొరకలేదు, మూడు దినముల నుండియు అచ్చటనే యున్నాము. అక్కడ ఏ ఉడుతలు లేవు. నేను ఒక అంజూరపు పొద మధ్య కూర్చొనియున్నాను. అక్కడికి ఉడుతలు రావు… ఆ పొదల మధ్య ఎన్నడునూ అవి యుండవని ఉడుతలు వేటాడు, ఎవరికయినా గాని తెలియును. నేను అక్కడే కూర్చొనియున్నాను, గాలి చాలా బలముగా వీచుచున్నది, ఉదయము దాదాపు పది గంటలయినది, నేను మరల ఆలోచించుచున్నాను.
ఆ స్వరము ఇట్లనెను, "నీవు వేటాడుచున్నావు, అబ్రాహామునకు పొట్టేలు అవసరమయినట్లే నీకు ఉడుతలు కావలెను."
"ఆ స్వరము ఎల్లప్పుడును నాతో సత్యమే పలుకును, అయితే ఈసారి మాత్రము ఏదో వింతగా వినబడుచున్నదే" అనుకొన్నాను. నేను కూర్చొనియున్నచోటు నుండి లేచాను, చుట్టూ చూచాను, "నాతో మాట్లాడుచున్న వ్యక్తి ఎక్కడా? అని చూచాను," ఏమి కనబడలేదు; గాలి చాలా బలంగా వీచుచున్నది. "నేను నిద్రపోయిగాని కలగన్నాననా?" అనుకొన్నాను. లేదు, నేను నిద్రపోలేదు. నేను ఆ చెట్టునకు ఆనుకొని యున్నాను, కనిపెట్టి చూచుచున్నాను. ఆ వెనుకనయున్న సహోదరులు వుడ్ మరియు సాద్‌మన్‌లను ఎలాగు తీసికొనిరావలెనా అని ఆలోచించు చున్నాను. అప్పుడు ఉదయము దాదాపు పది గంటలయినది, అక్కడ వ్యవసాయదారులందరును పనిచేయుచున్నారు, పంటను కూర్చుకొనుచున్నారు.
66అది మరల ఈలాగు చెప్పుట విన్నాను, "నీవు వేటాడుచున్నావు, నీకు వేట కావలెను గదా? నీకు ఎన్ని జంతువులు కావలెను?"
నేనిట్లు తలంచాను, "నేను ఈ అవకాశమును జారవిడచుకొనరాదు, నేను మూడు ఉడుతల కొరకు అడిగెదను. నాకు యౌవ్వనములో ఉన్న ఎర్రని మూడు ఉడుతలు కావలెను."
"అయితే వాటిని గూర్చి పలుకుము," అని ఆయన చెప్పెను.
"నాకు మూడు యౌవ్వనములో ఉన్న ఎర్రని ఉడుతలు పొందబోవుచున్నాను," అన్నాను.
"అవి ఎటు వైపు నుండి వచ్చును?" అని నన్నడిగెను.
"నేనిటు వైపు వెళ్ళాను, నాతో ఎవరో మాట్లాడుచున్నారు" అనుకొన్నాను. నేను మీతో మాట్లాడుటను మీరెట్లు వినుచున్నారో, ఆలాగునే యున్నది. ఇది నిజమని తెలియును. నేను ఒక విచిత్రమగు స్థలమును ఎన్నుకొన్నాను. అక్కడ ఒక ఎండిపోయిన కొమ్మ వ్రేలాడుచూయున్నది. దాదాపు ఏబది గజముల దూరములో యున్నది, నా తుపాకీని అక్కడికి గురి చూపగలను.
"మొదటిది సరిగ్గా అక్కడేయుండవలెను అనుకొన్నాను," అది నిజముగానే ఆలాగే యున్నది.
నా కన్నులు నులుముకొని వెనక్కి చూచాను, నా తలను త్రిప్పాను, "దర్శనములో చూచుచున్న దానిని నేను కొట్టలేను గదా," అనుకొన్నాను. కాబట్టి నేను మరల చూచాను, అక్కడ ఉడుత కూర్చొని యున్నది. నేను తుపాకీలో గుండునుంచాను, గురి చూచాను, దాని నల్లని కన్ను నాకు కనబడెను, యౌవ్వనములో ఉన్న ఎర్రని ఉడుత. "నేను నిద్రలో కలగనుచున్నానేమో అనుకొన్నాను, కొన్ని నిమిషములు మేల్కొందుననుకొన్నాను. దీని గూర్చి నేను కలగనుచున్నానేమో అనుకొన్నాను." మంచిది, నేను తుపాకీని సరిచేసికొన్నాను, ఉడుతను గురి చూచి కొట్టాను, అది ఆ కొమ్మను విరచినది. "నాకేమీ తెలియదు." "నేను అక్కడికి వెళ్ళి అది పడెనేమో చూడవలెననుకొన్నాను." అక్కడికి నడిచి వెళ్ళాను, అది అక్కడ పడియున్నది, దానిని నేను పైకి లేపాను, దానిలో నుండి రక్తము కారుచున్నది. దర్శనములోనిదయితే రక్తమును కారదు, దానిని నేను పైకి లేపాను, మరియు అది ఒక ఉడుత. నా శరీరమంతయూ చల్లబడిపోయినట్లనిపించినది.
67నేను చుట్టూ చూచాను, "దేవా, దీనిని నీవే చేసితివి. నీకు వందనములు. ఇప్పుడు నేను వెళ్ళెదను," అని చెప్పాను.
ఆయన నన్ను ఇట్లు ప్రశ్నించెను, "నీవే గదా పలికితివి! నీవు చెప్పినక దానిని గూర్చి నీవు సందేహపడితివా? మూడు దొరుకునని నీవు చెప్పావు గదా? ఇప్పుడు రెండవది ఎక్కడ నుండి వచ్చును?"
"నేను కల కనుచున్నయెడల ఆ కలను కొనసాగించవలెను," అని అనుకొన్నాను.
అక్కడున్న ఒక పాత కొమ్మను ఎన్నుకొన్నాను, అది విషపు ఆకులతో పూర్తిగా నిండి యున్నది. అందులో నీకెన్నడును ఉడుత దొరకదు. "ఆ విషపూరిత స్థలము నుండి రెండవది వచ్చునని నేనన్నాను." అక్కడే ఆ యౌవ్వనములో ఉన్న ఎర్రని ఉడుత నా వైపు చూస్తు కూర్చొనియున్నది. నా తుపాకీని నేను క్రిందికి దించాను, నా కన్నులు రుద్దుకొన్నాను. మరల తేరి చూచాను, అది తన తలను మరో ప్రక్కకు త్రిప్పి చూస్తున్నది. నేనా ఉడుతను కొట్టాను, ఆ తరువాత నేను ఇంటికి పోనారంభించాను.
"కాని నీవు మూడు అని చెప్పావు గదా? నీవు చెప్పిన దాని పట్ల నీకే సందేహమున్నదా? "అని ఆయన అడిగెను.
"లేదు ప్రభువా, నేను చెప్పిన దానిని గూర్చి సందేహపడుట లేదు, ఎందుకనగా దానిని నీవు స్థిరపరచుచున్నావు," అని చెప్పాను. ఈ ఒక్క లేఖనము విషయములో నేను పొరబడ్డాను: "నేను చెప్పిన ప్రకారము కాదు గాని నీవు చెప్పిన ప్రకారమే," అనెను. దానిని గూర్చి యేసు చెప్పుట కాదు, నీ యంతట నీవే దానిని చెప్పవలెను.
68"ఏదో విధంగా ఆ అడ్డంకిని నేను విరుగగొట్టాను, ఆయన ఇక్కడున్నాడని నాకు తెలియును, ఎందుకనగా అది నా స్వశక్తి వలన జరిగినది కాదు." అయితే "ఈసారి నేను ఖచ్చితంగా చిక్కు ప్రశ్న వలె వేయగోరాను." "ఒక ఎర్రని ఉడుత ఆ కొండ మీద నుండి దిగి వచ్చినది. మరియొకటి ఇటు వైపు నుండి వచ్చినది. నా ప్రక్కనే ఈ సారి అది యుండి ఆ రైతు వైపు చూచునట్లుగా చేయమని అడిగాను." అది ఆ కొండ మీద నుండి దిగివచ్చి నా ప్రక్కనే కూర్చొని ఆ రైతు వైపు ముఖము పెట్టినది. దానిని నేను గురి చూచికొట్టాను.
"నీకు తెలియదా? ఈ అడవి నిండా అటువంటి ఉడుతలు ఎన్నో యున్నవి," అని సాతాను నాతో చెప్పినది. నేను పన్నెండు గంటలవరకు అచ్చట కూర్చొనియున్నాను, మరల ఒక్క దానిని కూడా చూడలేదు. భూమ్యాకాశములను సృజించిన సృష్టికర్త ఆయనే అని ఇది నిరూపించెను.
69ఇప్పుడు జెఫర్‌సన్ విల్‌లోని వారు వినుచున్నారు, రైట్ అను పేరుగల ఒక కుటుంబమున్నది. సహోదరుడు ఉడ్‌తో కలిసి నేను వారిని చూచుటకు వెళ్ళాను. వారు సంఘముల కొరకు ప్రభురాత్రి భోజనపు ద్రాక్షారసమును తయారు చేయుదురు. చిన్న ఎడిత్ ఆ గదిలో కూర్చొని యుండెను, ఆమె కుంటి పిల్ల, జీవితమంతా రోగియై యుండెను, ఆమె స్వస్థత కొరకు ఎల్లప్పుడూ ప్రభువు వైపే చూచాము. ఆమె సోదరి ఒక విధవరాలు, ఆమె భర్త చనిపోయెను; ఆమె పేరు హట్టీ, చాలా దీనురాలు. ఆమె కొరకు ఒక కుందేలును తీసికొని రావలెనని నేను సహోదరుడు బాంక్స్ కలిసి వెళ్ళాము, వారు చక్కని భోజనము మా కొరకు తయారు చేసి తినమని అడిగారు.
మేమందరము భోజనపు బల్ల చుట్టూ కూర్చొని యున్నాము, దీనిని గూర్చి ముచ్చటించు కొనుచున్నాము, ఇది కొద్ది దినముల క్రితమే జరిగినది. నేను భోజనపు బల్ల యొద్ద కూర్చొని దీనిని గూర్చి మాట్లాడుచుండగా అనుకోకుండా ఇట్లన్నాను, "ఏమి జరిగియుండును?" "రైట్ సోదరుడా, నీవు ముసలివాడవు, నీ జీవితమంతా ఉడుతలు వేటాడావు. షేల్బీ సోదరుడా, నీవు ఉడుతల వేటలో నేర్పరివి, ఉడ్ సోదరుడా, నీవు కూడా అంతే గదా? నేను కూడా బాల్యము నుండియూ వాటిని వేటాడుచున్నాను. మీరెన్నడయినా గాని అంజూరపు లేదా మీడి పొదల్లో ఉడుతలను చూచారా?"
"లేదండీ"
"అవి ఆ పొదల్లో యుండవు," కాని "దేవుడే వాటిని అచ్చటికి రప్పించెనని నాకు తెలియును. అబ్రాహామునకు ఒక పొట్టేలు అవసరమయినప్పుడు, ఆయన యెహోవా ఈరేగా ఉండెను, ఆయనే చూచుకొనును. "ఇది కూడా అంతేనని నమ్ముచున్నట్లుగా చెప్పాను."
70చిన్న హట్టీ అక్కడ కూర్చొని యుండెను, "బ్రన్హం సోదరుడా, అది సత్యము తప్ప మరొకటి కాదు!" అన్నది.
ఆమె సరయిన సంగతిని చెప్పెను! ఆ విధముగా ఆమె చెప్పినప్పుడు మరల అదే రీతిగా పరిశుద్ధాత్మ రాసాగినది, ప్రతి ఒక్కరూ దానిని చూడగలిగిరి. నేను లేచి ఇట్లు చెప్పాను, "హట్టీ సోదరీ, యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ఆ సురోఫెనికయ స్త్రీ చెప్పినట్లుగానే నీవును చెప్పితివి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుచున్నది, నీ హృదయ వాంఛను ఇవ్వమని, నాతో చెప్పుచున్నది." "నేను దేవుని దాసుడనయితే ఆలాగు జరుగును, లేనియెడల నేను దైవదాసుడను కాను, అప్పుడు నేను అబద్ధికుడను, అది జరుగని యెడల నేను మోసగాడిని." "ఇప్పుడు ప్రయత్నించి చూడుము. అది దేవుని ఆత్మయో కాదో పరీక్షించుము.
ఆమె చెప్పెను, "బ్రన్హం సోదరుడా," (అందరూ ఏడ్వసాగిరి) చెప్పెను, "నేనేమి అడుగుదును?"
"నీకు ఒక కుంటి చెల్లి అక్కడ కూర్చొని యున్నది గదా?" అన్నాను.
71నాయొద్ద ఇరవై డాలర్లున్నవి, వాటిని ఆమె నాకు కానుకగా ఇచ్చెను. ఆమె సంవత్సరానికి రెండువందల డాలర్ల కంటె ఎక్కువ సంపాదించలేదు. ఆమె పేదరాలు, తన ఇద్దరు కుమారులతో వ్యవసాయము చేసికొనుచున్నది. ఆమె పిల్లలు ఇంకా బడిలో చదువుకొనుచున్నారు. ఇంకా తమ తల్లి మీదనే ఆధారపడుచున్నారు; పదిహేను లేదా పదహారు సంవత్సరముల వయస్సుండును. నేను చెప్పుచున్న మాటలను వింటూ వారు నవ్వుచున్నారు.
నేనిట్లు చెప్పాను, "నీకు ముసలివారగు తల్లిదండ్రులున్నారు. నీకు డబ్బు లేదు. డబ్బు కొరకు అడుగుము, అది నీ యొద్దకు వచ్చును. నీ చెల్లి గురించి అడుగుము, ఆమె లేచి నడుచునో లేదో చూడుము." "నాకు తెలియును, నేనిచ్చట పదిమంది జనుల ఎదుట నిలబడి యున్నాను. ఇది జరుగనిచో, నేను అబద్ధ ప్రవక్తనగుదును." యోబు వలె నాకును తెలియును, ఒక దానిని నీవు తాకినప్పుడు నీకది తెలియును.
"నేనేమి అడుగుదును?" అన్నది.
"నీ నిర్ణయమును నీవు తీసికొనవలెను. నీ తీర్మానమును నేను తీసికొనలేను," అని చెప్పాను.
ఆమె అటు ఇటు చూచినది, దీనురాలు అకస్మాత్తుగా ఆమె ఇట్లన్నది, "బ్రన్హం సోదరుడా, నా ఇద్దరు పిల్లలు రక్షింపబడవలెననియే నా హృదయము యొక్క గొప్ప కోరిక."
"యేసుక్రీస్తు నామములో నీ బాలుర రక్షణను నీకిచ్చుచున్నాను," అని చెప్పాను. ఆ బాలురు నా వైపు చూచి నవ్వుచున్నారు, హాస్యము చేయుచూ ఆ బాలురు, అకస్మాత్తుగా తమ తల్లి ఒడిలో పడిపోయిరి. వారు తమ జీవితములను దేవునికి సమర్పించిరి, అక్కడే వారు పరిశుద్ధాత్మచే నింపబడిరి, వెంటనే పొందిరి!
ఎందువలన? అది సత్యము! నన్ను చంపుటకు దేవునికి అధికారమున్నది, ఈ జనుల ఎదుటనే నన్ను ఆయన చంపగలడు. మీలో ఇక్కడ చాలా మంది జెఫర్‌సన్‌విల్‌లో యున్నారు, టాబేర్నికల్ వారు దీనిని వినుచున్నారు. "ఆమేన్!" ఎందుకనగా వారందరూ కూర్చొనియున్నారు. చూడండి, ఎందుకనగా ఇది సత్యము. ఏమిటది? దేవుడు తన సార్వభౌమ కృప ద్వారా దీనిని జరిగించెను, దానికి వెలుపటగా అది జరుగదు.
72ఆ సంక్లిష్ట సమయములో… నాకు పరిచయమయిన జనుల గురించి ఆలోచించసాగాను. దేవుడు అన్ని ఉత్సవములను దాటిపోవుచున్నాడు, దీనురాలగు ఆ పేద స్త్రీకి సమస్తమునూ ఇయ్యగలడు, ఆమె సంతకము కూడా చేయరాదు… ఆమె తానడిగిన దానిని ఎరుగును. అదియే గొప్ప సంగతి, ఎందుకనగా ఇప్పుడామె చెల్లి చనిపోయినది, ఆమె యొక్క తల్లి దండ్రులును చనిపోయెదరు, డబ్బు నశించిపోవును, కాని వారి ఆత్మలు నిత్యమునూ జీవించును. వారు దానిని పట్టుకొనవలసిన సమయము అదే. "యేసుక్రీస్తు నామములో ఆ కుమారులకు దేవుని రక్షణను ఇచ్చుచున్నానని," నేను చెప్పిన వెంటనే వారు తమ తల్లి ఒడిలో పడిపోయిరి. ఇక్కడున్న వారిలో ఎందరికి అది తెలియును? చూడండి. అది జరిగియున్నది. ఎందువలన? దైవావేశము!
ఇప్పుడు: "నీవు ఉడుతలను సృజించగలవని; నీ గూర్చి నేను విన్నాను, నీవు ఒక పొట్టేలును సృజించగలవని నేను విన్నాను; కాని ఇప్పుడు నేను కన్నులతోనే నిన్ను చూచుచున్నాను," అని చెప్పాను. ప్రత్యక్షత, అదృశ్యమగునది దృశ్యముగా చూపబడినది. దేవుడు దేనినయినా వాగ్ధానము చేసినచో, దానిని ఆయన చేయును.
73గమనించండి, నీకు ఒక అవసరమున్నప్పుడు యెహోషువా వలెనె చేయుము. అతనికి ఒక అవసరమున్నది, అతడెన్నడూ పరిస్థితులను గూర్చి ఆలోచించలేదు, దానిని పలుకగా దేవుడు దానిని చేసెను. సూర్యుడు నిశ్శబ్ధముగా నిలుచునని మీరూహించగలరా? నేను నమ్మజాలను, అదెట్లు జరిగినది? అది సాధ్యమా అని ఆలోచించవద్దు, అది ఆలాగు జరిగెను. యెహోషువా దానిని చేసెను, అతడు తన చేతులను ఎత్తెను, ఆ సంక్లిష్ట సమయములో అతడు దేవునికి చేరువయ్యెను, అదే జరిగినది. అది సమయోచితముగా జరిగినది. సజీవ దేవుని యొక్క ఆత్మ దాని యొక్క అవసరతను చూచెను. దానిని చేయుటకు యెహోషువా త్రోసెను. ఆ దేవుడే అబ్రాహాము యొక్క అవసరతను చూచెను. ఆ దేవుడే ఈ లేఖనమును స్థిరపరచు అవసరమును గుర్తించెను. ఈ లేఖనము కూడా నిజమే అయియున్నది. ముందుగా నిర్ణయించబడిన ఆ బాలుర యొక్క అవసరమును ఆ దేవుడే చూచెను. ఆ క్షణములోనే దానిని ఆయన నిరూపించి ఆయన తన వాక్యమును స్థిరపరచెను.
MATT 24:24•
MARK 13:22•
LUKE 7:38,44•
JOHN 8:7
74మార్కు సువార్త 14లో ఆయనయందు విశ్వాసముంచిన ఒక స్త్రీని మనము చూతుము. ఆమెకు ఒక అవసరమున్నది, ఆయన పాదములు కడుగబడవలెనను అవసరమును ఆమె చూచియున్నది. ఆమె కార్యరూపమును ధరించవలెనను దైవావేశమును పొందెను. ముగించు ముందుగా మీరు వినండి. ఆమె కార్యమును చేయవలెనను దైవ ప్రేరణను పొందినది, ఎందుకనగా ముందే ఆమె ఆయనను గురించి వినినది. ఆయన ఒక పాపాత్మురాలగు వేశ్య యొక్క పాపములను క్షమించెనని ఆమె వినినది. "మీలో ఏ పాపము లేని వారు మొదటగా ఆమె మీదరాయి వేయుడని," ఆయన వారితో చెప్పగా వినినది. ఆమె ఆయనను గురించి వినినది, కాని ఇప్పుడు ఆయనను చూచినది. ఆయనను సేవింపవలెనను దైవావేశమును ఆమె పొందినది. నీవు అది మాత్రమే చేయవలెను.
నీవు పాపివని పరిశుద్ధాత్మ నీతో చెప్పవలెను! నీవు తప్పు చేయుచున్నావని పరిశుద్ధాత్మ నీకు చెప్పవలెను! నీవు వాక్యానుసారముగా తప్పు చేయుచున్నావని పరిశుద్ధాత్మయే నీకు రుజువు చేయవలెను… ఎందుకనగా దేవుని యొక్క ప్రతి లేఖనమును అది కదిలించి తద్వారా పనిచేయును, అది దేనినీ అతిక్రమించదు. ఆలాగు నీవు చేసినయెడల దాని వలన నీకు ఎన్నడునూ మేలు జరుగదు, ఎందుకనగా పరిశుద్ధాత్మ దానిని నీలో కదిలించును, కాని ఆత్మ దేవునిపట్ల సరిగా లేనియెడల ఏమాత్రమును మేలు జరుగదని ఈ వారంలో మనము చూచాము. గుర్తుంచుకొనండి, అంత్యదినములలో అబద్ధ అభిషిక్తులు లేచెదరు — అబద్ధ యేసులు కారు, అబద్ధ క్రీస్తులు, అభిషేకము పొందిన వార౦దురు — సాధ్యమయితే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుదురు.
75గమనించండి, ఆయన కొరకు ఆమె చేయవలసిన పని ఒకటున్నది. ఆమె ఆయనను గూర్చి విన్నది, ఇప్పుడాయనను తన కన్నులతో ఆమె చూచినది. ఆమెకు చేయవలసిన ఒక పనియున్నది, దానిని చేయకుండా ఆమె ఉండజాలదు. ఏమయినా సరే ఆమెముందుకు వెళ్ళ గోరినది. ఆయనకు సేవ చేయగోరినది — దేవుడు ఆమెకు నీటిని, తువ్వాలును అనుగ్రహించెను. ఆయన పాదములను ఆమె తుడిచినది. ఆమె సజీవుడగు దేవునిని గురించి వినినది. జీవితములో చాలాసేపు వినినది, కాని ఇప్పుడాయనను తమ స్వనేత్రములతో చూచినది. అది ఆయనే అని ఆమెకు తెలిసెను. దైవావేశము ఆమెను తాకినది, "ఈయనే వర్తమానికుడని" ఆమె చెప్పెను. ఆయనకు ఒక సేవ అవసరమయినది. ఆయనకు సేవ చేయుటకు ఆమె యొద్ద ఏమియూ లేదు, ఆయన పాదములు ధూళితో నిండియున్నవి; ఆయనకు సేవ చేయవలెనని ఆమె ముందుకు వెళ్ళినది, ఎందుకనగా దానిని చేయుటకు ఆమె దైవావేశము పొందియున్నది.
76ఓ వెనుకకు జారిన సంఘ సభ్యుడా, శాఖకు సంబంధించిన స్త్రీ, పురుషుడా, ఈ రాత్రి యేసు యొక్క అవసరతను నీవు చూడలేవా? నీకు దైవావేశము కలిగినట్లయితే దానిని చేయవలసిన ఘడియ ఇదే. ఆమె తన నేత్రములతో దానిని చూచెను. ఇతరులయితే ఆమెను ఎగతాళి చేయుచుండిరి. ఆయన యొక్క వర్తమానమును వారు వినలేదు. ఆయనను అపహసించుటకే ఆ సీమోను అక్కడికి ఆయనను తీసికొని వచ్చెను. ఆయన ప్రవక్త అని వారు నమ్మలేదు.
అపవాది పనిచేసినట్లుగా అది కనిపించెను, "ఈయన ప్రవక్త అయినచో ఇతని పాదముల యొద్ద యుండిన స్త్రీ ఎట్టిదో ఇతనికి తెలిసియుండెడిది గదా, అనుకొన్నాడు. ఇతడు ప్రవక్త కాడేమో అని తలంచెను!" ఆయనెవరోయను ప్రత్యక్షత కూడా అతనికి తెలియలేదు. అతనిని ఏదైవావేశమూ తాకలేదు, ఎందుకనగా అందుకు అవకాశము అక్కడ లేదు. కాని ఆమెను ఆ దైవావేశము తాకినది.
ISA 53:5•
LUKE 17:30
77అతనికి విమర్శకు ఆవలి వైపునకు ఆమె కన్నులు చూచినవి. ఆయనను ఆమె ప్రవక్తయనియు, వాక్యమనియు విశ్వసించినది. ప్రవక్తల వచనములన్నియూ ఆయనలో నెరవేరినట్లు ఆమె చూచినది. ఆయన భూమిమీద ఉండెనని ఆమె వినినది, కాని ఇప్పుడు ఆమె ఆయనను చూచినది. ఆమె ఏమి చేసినదో గమనించండి. ఆమె శరీరధారియైన వాక్యమును చూచినది, ఆయనే మెస్సీయా లేదా ఇమ్మానుయేలు. ఆమె విశ్వాసపు నాడి కొట్టుకోసాగినది. ఆయనెవరై యున్నాడో అను ప్రత్యక్షతను పొందినది. తాను జీవించుచున్న కాలమును ఆమె గుర్తించినది. తనవంటి పాపులకు ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చెనని తెలిసికొనినది, తన సేవను ఆయనకు చేయుటకు తెలియకుండానే ఆమె బయలు వెళ్ళినది.
అసలయిన స్వస్థత ఆ విధంగానే వచ్చును — నీ పాపముల కొరకు ఆయన నలుగగొట్టబడెననియు, నీ అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడెననియు నీవు గ్రహించినప్పుడే, స్వస్థత నీకు వచ్చును. ఆయన పొందిన దెబ్బల వలన నీవు స్వస్థత పొందియున్నావు, ఆయన సన్నిధి ఇచ్చటున్నదని నీవు దైవావేశము వలన గుర్తింపవలెను. మార్కు 11… లేదా లూకా 17:30, ఆయన చివరి దినములలో తన్నుతాను బయలుపరచుకొనును, తన జనుల మధ్య శరీరధారిగా, సొదొమ ఎదుట ఆలాగే ఆయన బయలుపరచుకొనెను, దానిని నీవు చూచినప్పుడు ఏదో నిన్ను తాకును!
"కాన్సరు ఇంకా అక్కడున్నదని వైద్యుడు నీతో చెప్పవచ్చును."
రోగి కూడా "తన నడక ఎట్లు వచ్చునో తెలియకున్నదని చెప్పవచ్చును, ఏమయినా గాని నడచెదవు." అదెట్లు జరుగునో మనకు తెలియదు.
LUKE 7:38
78ఆయనను సేవించుటకు ఆమె ముందుకు వెళ్ళినది, ఎందుకనగా దైవావేశముఆమెను తాకినది, అదే ఘడియ, ఆయనే వర్తమానికుడు, స్వస్థపరచు మెస్సీయా ఆయనేమ, దానిని ఆమె నమ్మినది. ఆయనకు పరిచర్య చేయుట అవసరమయ్యెను, దానినెట్లు చేయుదునో అని ఆలోచించకుండానే ఆమె ముందుకు వెళ్ళి పోయినది. ఆమె తన దైవావేశమును బట్టి వెళ్ళిపోయినది. గమనించండి! ఆమె కన్నులలోని కన్నీటి ప్రవాహమును, ఆ గ్రంధులను దేవుడు తెరచెను. ఆయనను గూర్చి ఆమె వినినది, ఆ కన్నులు దానిని చూచెను. సంతోషముతో కేకలు వేసినది. దేవుడామెకిచ్చిన పొడవైన వెంట్రుకలతో ఆ కన్నీటిని తుడిచినది, దేవుడామెకు ఆ తువాలును ఇచ్చెను. ఆమె వెండ్రుకలు, కన్నీటితో కడిగినది, ఆమె ఆయన యొక్క అవసరతను గుర్తించినది, ఆయన సజీవుడగు దేవుడు. దానిని గూర్చి ఆమె వినినది, కాని ఇప్పుడామె చూచినది, ఆయన కొరకు ఒక సేవ చేయగలిగినది.
ఓ పాపీ! ఇప్పుడు అవసరతలను చూచుచున్న నీవు ఎందుకాలాగున చేయవు? నీవు ఆయనకు కావలెను, నీ సేవ ఆయనకు అవసరము. ఒకప్పుడు నీవు బైబిలులో ఎవరిని గూర్చి విన్నావో, ఆయననే ఇప్పుడు చూచుచున్నావు. ఆయన గత రాత్రి ఇక్కడికి వచ్చి ఏమి చేసెనో మనము చూశాము. ప్రతి కూటములోను ఆయనను మనము చూచుచున్నాము, కొన్నిసార్లు మనము విమర్శించుచున్నాము, దానిని పట్టించుకొనుట లేదు. "లేఖనములలో ఏమియున్నదో మనకు తెలియును, ఆ కార్యములు జరుగుట చూచుచున్నాము," చూచారా? మనకు ఆసక్తి లేదు, సరిగా అది మనలను తాకుట లేదు
ఆలాగు కనబడుట లేదు… ఏదియూ నీలో నుండి ప్రవహించుట లేదు.
HEB 13:8
79గంధకము లేని అగ్గిపుల్ల నుండి అగ్నిని మనము పుట్టించలేము. దాని వలన ఉపయోగము లేదు, ఆ గంధకమును ఒక రసాయనము చంపివేసినది. కాబట్టి అది పని చేయదు, దాని నుండి వెలుగు రాదు, కాని ఆ గంధకము సరిగా అక్కడున్నచో వెలుగు బయటకు వచ్చును.
లేఖనముల యొక్క నిజమగు, అసలయిన ప్రత్యక్షత ఈ చివరి దినపు వర్తమానములో నుండి వచ్చుచున్నది. యేసుక్రీస్తు సన్నిధిని నీవు చూచుచున్నావు. ఆయన తన జీవితములో ఏమి చేసెనో నీవు విన్నావు. ఆయన నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా యున్నాడని లేఖన ములో చెప్పబడిన మాటను మీరు విన్నారు. సొదొమ యొక్క పరిస్థితి ఇప్పుడున్నది. దేవుని ఉగ్రత అగ్ని రూపములో కుమ్మరింపబడుచున్నది. యేసు జనులమధ్యకు శరీరకారములో వచ్చుటను చూచుచున్నాము, అవే కార్యములను ఆయన చేయుచున్నాడు. మన ఆత్మలను అది మహిమలోనికి కొనిపోవలెను! అది మనకు ఒక కార్యము చెయ్యవలెను. ఎందువలన? అది దాని మీద పడుచున్నది.
MATT 9:20,22•
MARK 5:27,34•
LUKE 8:44,48•
COL 2:9
80ఆయనచేసిన దానిని గూర్చి నీవు బైబిలులో విన్నావు. ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ఎట్లు తాకెనో నీవు విన్నావు. ఆయన వెనుకకు తిరిగి ఆమె యొక్క వ్యాధిని గూర్చి చెప్పెను. ఆమె విశ్వాసము ఆమెను శుద్ధురాలునుగా చేసెను. ప్రపంచము సొదొమ పరిస్థితిలో యున్నప్పుడు, అగ్నితో ఈ లోకము దహించబడుటకు ముందు, దానిని మరల చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను. క్రొత్త నిబంధన, ప్రవక్త, దేవుని ప్రవక్త, ప్రవక్తలకు ప్రవక్త, ప్రవక్తలందరికి దేవుడు. శరీరమందు ప్రత్యక్షమాయెను. ఆయనే సృష్టికర్త, ఆదికాండములోయుండిన వాడు. హల్లెలూయా! అది ఆయన వాక్యము! అది జరుగునని ఆయన చెప్పెను. సొదొమ స్థితిని మనము చూచుచున్నాము, ప్రపంచము ఆ స్థితిలో యుండుట మనకు కనబడుచున్నది. ఇప్పుడాయన దిగివచ్చి ఖచ్చితంగా తాను చేయుదునని చెప్పిన దానిని చేయుట చూచుచున్నాము. "ఆయనను గూర్చి విన్నాము, ఇప్పుడాయనను చూచుచున్నాము." "నిన్ను గూర్చి నా చెవులతో వింటిని, గాని ఇప్పుడు నా కన్నులతో చూచుచున్నాను." ఆమేన్! "నా కన్నులతో నేనాయనను చూచుచున్నాను." అదెటువంటి ఘడియ! అదెటువంటి కాలము! ఆయన వాక్కు స్థిరమగుచున్నది. వాక్యము స్థిరపరచబడు ప్రతిసారియు, దేవుడు తన వాక్కుతో మాట్లాడు ప్రతి పర్యాయమును, ఆయనను దృశ్యునిగా మీరు చూడగలరు.
GEN 3:15•
MATT 26:13•
MARK 14:9•
LUKE 7:37,38
81ఇప్పుడు, ఈ వేశ్యగా పిలువబడిన స్త్రీ బలిపీఠము ఎదుటపడినది (యేసు యెదుట) మరియు తన కన్నీటితో ఆయన యొక్క పాదములను ఆమె కడిగినది. తన తలవెండ్రుకలతో ఆయన పాద ములను తుడిచినది. దేవుడామెను గౌరవించెను, "సువార్త భోధింపబడు ప్రతి చోటయు ఇది జ్ఞాపకార్థముగా ఆమెకొరకు వినిపింపచేయబడునని," ఆయన చెప్పెను. ఎందువలన? ఆమె ఎంతో పాపాత్మురాలయినా గాని దైవావేశము ఆమెను తాకినది. ఏదెను తోటలో నుండి వచ్చిన వాగ్ధాన వచనమును ఆమె చూచినది. "స్త్రీ యొక్క సంతానము సర్పము యొక్క తలను చిదుకగొట్టును." కన్యకకు జన్మించిన మెస్సీయాను ఆమె చూచినది.
ఆయన కన్యకకు జన్మించునని ఆమె వినినది. ఆయన భూమి మీద ఉన్నట్లుగా ఆమె వినినది. యువకుడగు రబ్బీ, ప్రవక్త, రోగులను బాగుచేసినవాడు అక్కడుండెనని వినినది. దానిని ఆమె నమ్మినది. ఇప్పుడామె వీధిలో నడచుకొంటూ ఆయన యొద్దకు వచ్చుచున్నది, అటు వైపు ఆమె చూచినది, గొప్ప విందు జరుగుట ఆమె చూచినది. ఆమె కంచెమీద నుండి అవతలకు వెళ్ళినది, ఆయనను చూచినది. అక్కడాయన ఉన్నాడు, "ఆయనే!" అని ఎదో చెప్పినది. అంతే దైవావేశము ఆమెలో పుట్టినది. ఏమి జరిగినదో చూడండి? "శరీరధారియైన వాక్యమును" ఆమె చూచినది. ఆమె తన చెవితో విన్నది, ఇప్పుడు తన కన్నులతోనే చూచెను.
82చివరి దినమున సంఘము ఎటువంటి పరిస్థితిలో యుండునో అను విషయము మనకందరికిని తెలియును. సంఘము యొక్క ప్రస్తుత పరిస్థితిని చూడండి, దేవుని ఆజ్ఞలను ఎన్నడునూ నెరవేర్చజాలదు. గొప్ప ఆజ్ఞ ఇయ్యబడినది, వధువును ఎన్నడూ బయటకు పిలచుట జరుగదు. ఎవరు దానిని చేయగలరు? పెంతెకోస్తు వారా? కాదని నేను చెప్పుదును. మరెవరునూ చేయజాలరు. అది గోధుమ గింజ మీదనున్న పొట్టువలె యున్నది. అది బయటకు వచ్చినప్పుడు అక్షరాలా గోధుమ గింజవలెనె కనబడెను, కాని అదిగింజలేని పొట్టు. దానిని బ్రద్దలు చేసిచూడగా అందులో గింజ ఏమియూ కనబడలేదు. వారు సంస్థగా మారిరి, వారందుకే చనిపోయిరి. వారు పొట్టువలె యున్నారు. కాని దానిలో నుండి గోధుమ గింజ వచ్చినది. ఇప్పుడది వధువు ఆకారమును పొందుచున్నది. అంధకార యుగములలో నేలలో పడిన గోధుమ గింజ, అది చావవలసి యున్నది.
JOHN 12:24
83"ఎర్రసముద్రము పాయలుగా చేసిన ఆ కృప గల దేవుడు నిస్సహాయులగు క్రైస్తవుల సింహముల చేత, అగ్ని చేత చంపబడుటకు ఎందుకు అనుమతించెనని ఒక విమర్శకుడు అడిగెను. కూర్చొన ఆ మాట పలికి అతడు నవ్వుచుండెను." ఎంత అమాయకుడు! "గోధుమ గింజ భూమిలో పడి చావవలెనని అతనికి తెలియదు." అంధకార యుగములలో అది చావవలసి యున్నది. ఏ గోధుమ గింజ అయినా గాని భూమిలో పడిచావని యెడల అది ఒంటిగానే యుండును. నేలలో పాతిపెట్టబడిన ఆ గోధుమ గింజ, లూథర్ సంస్కరణ కాలములో దళములను విప్పుకొని బయటకు వచ్చినది. ఆ కాండు వెస్లీయనుల కాలములో ఎదిగినది, ఆ తరువాత కుచ్చు, పుప్పొడి కనబడినది, అదే ఆ గొప్ప మిషనెరీల యుగము. పెంతెకోస్తు కాలము తిరిగి వచ్చెను, వరములు మరల ప్రత్యక్షమాయెను, దాదాపుగా ఏర్పరచబడిన వారిని అది మోసము చేసెను. (అది గోధుమ గింజవలె కనిపించినది); దానిని తెరచి చూడగా అందులో గింజ కనబడలేదు, అది కాండము మాత్రమే. కాని ఆ జనులు ఏకత్వమును, త్రిత్వమును స్థాపింప నారంభించిరి. ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము అను సంస్థలు బయలుదేరినవి. దేవుని సంఘమును సంస్థ వెలసినది, అందరూ సంస్థలుగా మారిరి, అక్షరాలా మరణము సంభవించినది! ఇప్పుడు ఏమయినది? అది గోధుమ గింజకు ఆశ్రయమైనది, అన్ని కాలముల లోను అది ఎదుగనారంభించినది.
ఇప్పుడది రాలిపోవుచున్నది, గోధుమ గింజ కనబడుచున్నది. ఇది పెంతెకోస్తు యుగము కాదు, ఇది కడవరి దినము, ఇది వధువు కాలము, ఇది సాయంకాలపు వెలుగు మలాకీ 4 నెరవేరు సమయమిదే. దేవుని పోలికను వెంబడించవలెను. ఇది లూకా 17:30 నెరవేరు కాలము. ఇది యిర్మియా గ్రంథము, ఇంకా ఇతర గ్రంథములు. యోవేలు ప్రవచనము నెరవేరవలసిన సమయము. ఇదే ఆ దినము! "నేను వింటిని, ప్రభువా, అది వచ్చుచున్నది, కాని ఇప్పుడు నా స్వంత నేత్రములతో చూచుచున్నాను."
MATT 24:24•
MARK 13:22
84ఎందరో అబద్ధ అనుకరణ కర్తలు లేచిరి, యన్నే, యంబ్రే అనువారు లేచి అన్ని విధములుగాను మోషే చేసినట్లుగానే తమ మంత్రములచే చేసిరి. ఎన్నడునూ మోషే, అహరోనులు బెదరలేదు. యోబువలె వారికిని దైవావేశమున్నది. "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" మాకున్నదని వారు చెప్పిరి. ఇదే బైబిలు వారిని గూర్చి చెప్పుచున్నది, చివరి దినములలో వారు వచ్చుదురు అని చెప్పెను — అనుకరణలు చేయువారు. ఆ మతపరమైన సంస్థలు, ఎట్లు ప్రారంభమయినవి? మోషే ద్వారానా? మోషేనా లేక వారా? ఒకవేళ వారు మొదట ప్రరంబించినట్లయితే మోషే అనుకరణ చేయువాడగును.
ఇప్పుడు మనకు అన్ని విధములగు అనుకరణలు యున్నవి, దేవుని యొక్క అసలు విషయము నుండి నిన్ను పెడత్రోవ పట్టించుటకే ఇవన్నియూ బయలుదేరియున్నవి. దేవుడు తన లేఖనముల ద్వారా సత్యమని నిరూపించిన దానిని వారు చూడలేరు. "మేము మా చెవులతో దానిని వింటిమి, ఇప్పుడు కన్నులారా చూచుచున్నాము." ఆమేన్! దానిని మీరు నమ్ముచున్నారా? మీ నిండు హృదయములతో నమ్ముచున్నారా? దైవావేశము! మనుష్య కుమారుడు ఆ దినములలో ప్రత్యక్షమగును. యేసుక్రీస్తు తన జనుల మధ్య బయలుపరచబడును.
GEN 18:9-13
85అబ్రాహాము మరియు అతని గుంపు ఎదుట ఒక మనిషి నడచి వెళ్ళెను, అతడు సామాన్య మనిషి వలె కనిపించెను, అతని వస్త్రములపై ధూళియుండెను. అతడు తన వీపును గుడారము తట్టు త్రిప్పెను, "నీ భార్యయగు శారా ఎచ్చటని ప్రశ్నించెను?" శారయి కాదు, శారా. అబ్రాము కాదు గాని, అబ్రాహాము. ఆమె పేరు పిలచి ఎక్కడని అడిగెను.
"ఆమె నీ వెనుక గుడారములో యున్నదనెను."
"నిన్ను నిర్ణయ కాలమున దర్శించెను," అని ఆయన పలికెను. ఆమె కొంగు చాటున నవ్వుకొనెను. "ఆమె ఎందుకు నవ్వినదని ప్రశ్నించెను."ఇప్పుడు, ఆయన వాగ్ధానము చేసెను… వారు ఆ వాగ్ధాన కుమారుని కొరకు ఎదురు చూచుచుండిరి.
ఈ శాఖలలోని జనులు ఏలాగు ప్రవర్తించుచున్నారనునది కాదు. "క్రీస్తు కొరకు చూచుచున్నామని" చెప్పెదరు, కాని వారు ఎదురుచూచుటలేదని వారి క్రియలే నిరూపించుచున్నవి. ఇది నిజము! నీ మాటల కంటె నీ క్రియలే బిగ్గరగా మాట్లాడును. వారు ఎల్లప్పుడూ సంఘ లేదా శాఖల సభ్యుల కొరకు ఆలోచించుచుందురు, కాని చెదురుమదురుగా కొందరు జనులున్నారు, వారు ప్రభుని రాకడ కొరకు ఎదురుచూచుచున్నారు. వారు కనిపెట్టుచున్నారు, వారికే ఆయన తన్ను బయలుపరచుకొనును. వారు మాత్రమే గ్రహించెదరు.
LUKE 2:26
86ఆయనను ఏర్పరచబడిన వారు మాత్రమే గ్రహించెదరు. ఆలోచించండి, భూమి మీద మూడు మిలియనుల మంది జనులున్నారు. కాని ఆయన భూమి మీద ఉండినట్లుగా కనీసం అందులోని మూడోవంతు జనులకు కూడా తెలియదు, ఆయన వచ్చి వెళ్ళిపోయినా వారికి తెలియలేదు. అయితే ఎదురుచూచుచున్న వారికి ఆయన తన్ను బయలుపరచు కొనెను: బాప్తిస్మమిచ్చు యోహాను - యోహాను ద్వారా పిలువబడిన అపోస్తలులు యున్నారు, మొదలగు వారు. దేవాలయములో గ్రుడ్డిదగు హన్నా యున్నది, యాజకుడగు సిమియోను ఉన్నాడు. క్రీస్తును చూతునని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయబడి యున్నది. వారితో కూడా ఉండిన గొప్ప మత నాయకులకు, వేదాంత పండితులకు అది తెలియలేదు, వారు ఎంత గ్రుడ్డివారో చూడండి.
వర్షము వలన గింజ మొలకెత్తును, అక్కడ ముందు విత్తనముండవలెను. నీవు నీ తండ్రిలో ఒక జన్యువుగా యుంటివి, నిన్ను అతడు ఎరుగడు — అయినా గాని నీవు నీ తండ్రిలో యుంటివి, కాని నీ తల్లి గర్భము ఒక పొలము వలెయున్నది, నీవతని పోలికలో నిర్మింపబడితివి, అప్పుడతడు నీతో మాట్లాడగలిగెను — దేవుడు, మహా దేవుడు నీకు నిత్యజీవమును అనుగ్రహించెను. నిత్యజీవము యొక్క జన్యువు ఆదియందు దేవునిలో యుండెను, నీవచ్చట యుంటివి. ఆయన యొక్క ఆలోచనలో నీవుంటివి, నీ నామము అక్కడున్నది. ఆయన తన ముందు జ్ఞానము ద్వారా నీవు దీనిని చూచునట్లు చేసెను. నిర్ణయింపబడని వారు దీనిని చూడరు. గుర్తుంచుకొనండి, ప్రభువైన యేసు నామములో "ఆ ఘడియ ఇచ్చటున్నది!" ఆయనను మీరు నమ్మరా? మీ జీవితములను ఆయనకు సమర్పించుడి.
నేను ఆపవలెను, తొమ్మిది దాటిపోయినది. మన శిరములు వంచుదము: "ప్రభువా, నిన్ను గూర్చి వింటిని, ఇప్పుడు నిన్ను చూచుచున్నాను." ప్రభువగు యేసూ, ఈ కనిపెట్టుచున్న జనులను దీవింపుము.
87ఇప్పుడు నేను మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. పరిశుద్ధాత్మ మీ మనస్సులను పరిశోధించవలెను. (ఆయన చేయునని నేను నమ్ముచున్నాను) మిమ్మును శోధించును. మీ ఆత్మను పరిశోధించును, మీరు నిజముగా నమ్ముచున్నారో లేదో చూచును. మీలో చిన్న సందేహమున్నయెడల చేతిని ఎత్తండి! ఈలాగు చెప్పండి, "ప్రభువైన యేసు, నిన్ను చూడనిమ్ము. నీ గూర్చి నేను వింటిని, కాని నిజంగా నిన్ను నేను ఇంకా చూడలేదు. నిన్ను చూడనిమ్ము, నేను నమ్ముదును." అది సరి. అది మంచిది.
ఆయనను రక్షకునిగా ఎరుగని వారు ఇంకా ఎవరయిన యున్నారా? మీ చేతుల ఎత్తండి, వాక్యము మీతో మాట్లాడియున్నది, గనుక ప్రభువైన యేసు, "నేను పాపినని ఒప్పుకొనండి. ఆయన మీకు తన్ను బయలుపరచుకొనును. వారు చెప్పిన మాట మీకు కనబడును. యోబు ఆలాగే ఆయనను చూచెను, అబ్రాహాము ఆలాగే ఆయనను చూచెను, మరియు మిగిలిన వారందరూ ఆ విధముగానే ఆయనను చూచిరి, ఎందుకనగా ఆయన యొక్క వాగ్ధాన వచనము బయలు పరచబడినది. ఎన్నో అనుకరణలు, మాంత్రిక విద్యలు మనము చూచాము, కాని ఇప్పుడు దేశములో చివరి దినపు వర్తమానము వినబడుచున్నది. 1933వ సంవత్సరములో ఆ నదియొద్ద దేవదూత దానిని పలికినది. స్వస్థతాకూటములను గూర్చి నేను విన్నాను, అదెప్పుడు జరుగునో నాకు తెలియును, అది ఆ పాత శాఖల ఒరవడిలో యుండదు." అందుకొరకు అది పంపబడలేదు, అది అక్కడ లేదు. [టేపు పై ఖాలి.]
JOHN 4:19
88మోషేవచ్చి నోవహువలె "ఓడను కట్టి ఐగుప్తు నదిలో వదిలినచో బాగుండునని" అనుకొనలేదు. చూచారా? అది కాదు. దేవుని యొద్ద నుండి అతనికి ఒక వర్తమానము వచ్చెను. అతడే ఆ ప్రత్యక్షత. ఆ ప్రవక్త తెరమీదకు వచ్చెను. ఇశ్రాయేలుకు నిరూపించెను. (వారికి నాలుగు వందల సంవత్సరముల నుండి ప్రవక్త లేడు. ఇప్పుడు ఒక ప్రవక్త రంగము మీదికి వచ్చెను) ఏదో జరుగబోవుచున్నదని వారు తెలిసికొనియుండవలసినది.
ఇశ్రాయేలునకు మరల నాలుగు వందల సంవత్సరములు ఒక ప్రవక్త లేడు. ఇప్పుడు యేసు రంగము మీదికి వచ్చెను. ఆ బావి యొద్ద నున్న స్త్రీ ఇట్లన్నది, "అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మాకు నాలుగు వందల సంవత్సరముల నుండి ప్రవక్త లేడు," ఎందుకనగా ఆమె హృదయములో ఉన్న దానిని ఆయన ఎరిగి యుండెను. చూచారా?
MAL 4:6•
REV 10:7
89ఇప్పుడు, సంస్కరణకర్తల ద్వారా మనకు ఒక సంఘకాలము వాగ్ధానము చేయబడినది, అవి మనకున్నవి. కాని మలాకీ 4లో ఆయన వాగ్ధానము చేసెను. ఆయన తన విధానమును చివరి దినమున చూపించును. ఏమి జరుగునో చూడండి, "పిల్లల హృదయములను అపోస్తలుల తండ్రుల యొక్క విశ్వాసము వైపునకు త్రిప్పుదునని," ఆయన చెప్పెను — అదే అసలు ఉద్ధేశ్యము! సంఘము శాఖలుగా, వాదములుగా విచ్చిన్నమయినది, చిదిగిపోయి, మృతమైనవి; అది ఒక వాహకముగా యుండినది. ఆ తరువాత ఆయన ఒక వాగ్ధానము చేసెను. ఏడవ దూత వర్తమానమందించు దినములలో ఏడు ముద్రలు బయలుపరచబడును. ఏడవ దూత వర్తమానమందించు సమయములో దేవుని యొక్క మర్మములన్నియు బయలుపడును. (ప్రకటన 10) కేవలము స్వస్థతా కూటము కాదు, స్వస్థతా కూటము వెంబడి వర్తమానము వచ్చును.
JOHN 10:30
90రోగులను స్వస్థపరచినంత కాలము యేసును "గొప్పవానిగా" అందరూ చెప్పుకొనిరి. కాని ఆయన లేచి, "నేను నా తండ్రి ఏకమైయున్నామని" చెప్పెను.
"ఉహ్-ఉహ్! అది తప్పు!"
యోబును అందరూ గొప్పవానిగా ఎంచిరి. చూచారా? ఎల్లప్పుడునూ ఆలాగే యుండును.
విశ్వసించండి. ఇప్పుడు మీరాయనను అంగీకరించెదరా? "నేనాయనయందు విశ్వాసముంచి, ఆయనను అంగీకరించగోరుచున్నానని చేతులెత్తి చెప్పండి." దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. మంచిది. ఇప్పుడు బహు నెమ్మదిగా కూర్చొని ఒక్క క్షణము ప్రార్థన చేయండి.
1THS 4:16
91ప్రియదేవా, ఈ ప్రశాంత క్షణములో మేమున్నాము, ఇటువంటి సమయములోనే ఒక దినమున ఉరుము ధ్వని వినబడును. దేవునికుమారుడు పరలోకమునుండి బూర ధ్వనితోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని ఆర్భాటముతోను దిగివచ్చును, క్రీస్తునందు మృతులు లేచెదరు. ఈ రాత్రి మనకందరికిని తెలియును. తండ్రి, మేము పలికిన ప్రతి మాటకు మేము జవాబు ఇయ్యవలయును, మేము పలుకు ప్రతి మాటకు జవాబు చెప్పవలయును. మా హృదయములోయున్న ప్రతి ఆలోచనకు మేము సమాధానము చెప్పవలెను. దేవా, ఇక్కడున్న ప్రతి హృదయమును నీవు పవిత్రపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము. నా హృదయమును శుద్ది చేయుము. ఈ జనుల హృదయములను శుద్ధి చేయుము. ప్రభువా, మమ్మును సిద్ధపరచుము. సర్వశక్తుడగు దేవుని యొక్క మహిమను చూచునట్లుగా, మా ఆత్మీయ నేత్రములను తెరువుము. మేమాయన గూర్చి విన్నాము. ఓ, తండ్రియగు దేవా, ఆయనను మేము చూడగలుగునట్లు చేయుము. తండ్రీ, దయ చూపుము. ఈ ఆశీర్వచ నములనను గ్రహించుము. యేసుక్రీస్తు నామము ద్వారా ప్రార్థించుచున్నాను. ఆమేన్.
DAN 7:9•
REV 1:14
92గుర్తుంచుకొనండి: మీరు కూర్చొన్న చోటనే మీ హృదయములను చిన్న బలిపీఠములుగా తయారు చేసికొనుడి. "ప్రభువైన యేసూ, ఇప్పుడు నా హృదయములోనికి రమ్ము. నేను దానిని పట్టుకొనునట్లు చేయుము. నీవు ఇచ్చటనే యున్నావను గ్రహింపును నేను దైవావేశముతో పొందునట్లు చేయుము."
జనులు ఆ మాట పలుకుట ఎంతో మేలు! ఆ పనిని చేయవలెను. ప్రభువగు దేవునిని నేను అడుగగోరుచున్నాను.
ఎందరు తీసికొన్నారు? "అయ్యలారా, ఎంత వేళయైనదను వర్తమానమును విన్నారా?" అది జరుగుటకు ఒక సంవత్సరమునకు ముందే ఆ విషయములను గూర్చి చెప్పుట జరిగినది. ఆ పత్రికలను చూచారు. దానిని గూర్చి సైన్సు ఆశ్చర్యపడినది. ప్రభువైన యేసు కిరీటమును ధరించుకొని యున్నాడు. తెల్లని విగ్గు ధరించుకొనెను. ఆలాగే బైబిలులో మీరు చూడగలరు. ప్రకటన 1, దానియేలులోను చూడగలరు. భూమ్యాకాశములకు మహోన్నత న్యాయాధిపతి సైన్సు దానిని గ్రహించలేకపోయెను. ఆరిజోనా విశ్వవిద్యాలయములోని పరిశోధనాగారములో చూచిరి, మెక్సికో వరకు వెళ్ళిరి. గత రెండు సంవత్సరముల నుండి అన్వేషించుచున్నారు, ఇది జరుగునని ముందే మీకు చెప్పబడినది.
93అలాస్కా భూకంపము మాట ఏమిటి? హాలీవుడ్ సముద్రములో కూలును. అది జరుగునో లేదో కనిపెట్టి చూడండి. ఆయన నాకు తప్పు ఎన్నడునూ చెప్పలేదు. అది జరుగును. చూచారా? చరిత్ర యొక్క ముగింపు ఘడియలలో మనము జీవించుచున్నామో లేదో చూడండి. ఆయన ఏ ఘడియలో వచ్చునో ఎవరికిని తెలియదు. కాని ఒక సంగతి నాకు తెలియును: ప్రస్తుత నా పరిస్థితిని బట్టి నమ్ముచున్నాను, నేను సరయిన మానసిక స్థితిలో యున్నాను. నేను క్రైస్తవునిగా లేకపోయినయెడల నిజమగు బైబిలు క్రైస్తవునిగా ఉండగోరుచున్నాను, శాఖకు చెందిన వానిగా యుండను. నీవు చప్పట్లు కొట్టినందున సంబరపడవద్దు. ఈ ఉదయ కాలమున మనము విన్నాము, దేవుని వాక్యము ద్వారా నిరూపించాము; దేవుని చిత్తము కాని దానిని ఎన్నడూ చేయము, ఎందుకనగా అందువలన మరణము ప్రాప్తించును. కాండముగా ఉండవద్దు, జీవములోనే యుండండి. దేవునియందు విశ్వాసముంచండి.
94ఈ వాగ్ధానమును చేసిన దేవుడు, ఆదికాండము గ్రంథములో అబ్రాహామునకు తన్నుతాను బయలుపరచుకొనెనని మీరు నమ్ముచున్నారా? అక్కడ అద్భుతమును చేసెను. ఆ దేవుడే శరీరధారి అయ్యెను, మానవ శరీరమును ధరించెను, కన్యకకు జన్మించెను. అది ఒక మహిమాన్విత శరీరము, ఆయన మానవ శరీరములోనే వచ్చెను. అవే కార్యములను జరిగించెను. (మలాకీ 4 ప్రకారము దానిని చేయుదునని ఆయన వాగ్ధానము చేసెను) దేవుడు ఒక మానవునిని సాధనముగా తీసికొని మాట్లాడునని మీరు నమ్ముచున్నారా? ఆయన తాను చేయుదుననిన క్రియలనే చేయును. దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన చేయునని నేను నమ్ముచున్నాను.
ఆయన వస్త్రమును తాకగల విశ్వాసము నీకున్నదని నీవు విశ్వసించుచున్నావా? ఆయన విశ్వాసము ద్వారానే ఆయన వస్త్రమును తాకగలవు. ఆయన వస్త్రమును తాకగల విశ్వాసము నీలో కలిగి యున్నావని నీ హృదయములోనే ఏదో చెప్పుట నీవు గ్రహించుచున్నావా? దానిని చేయగలవని నీవు నమ్ముచున్నావా? ఉద్రేకముతో కాదు గాని, విశ్వాసముతో నీవాయనను అందుకొనుము. కల్తీలేని, పవిత్ర విశ్వాసముతో నీవాయనను తాకుము. ప్రభువా, "నేను నమ్ముచున్నాను, నా పూర్ణ హృదయముతో నిన్ను నమ్ముచున్నాను. నీవు నన్ను తాకుము. నీవాలాగున చేసినట్లు నేను విన్నాను. ఇప్పుడు నా స్వనేత్రములతో దానిని చూడగోరుచున్నాను." చూచారా? ఆలాగు చెప్పండి.
నేను మిమ్మును తాకలేను, దేవుడే మిమ్మును తాకవలెను. ఆయన తాకునని మీరు నమ్ముచున్నారా?
95నేను ఈ ఎడమవైపుకు చూచుచున్నాను. ఒక దారి కనిపించుచున్నది, నేను దానిని గూర్చి మాట్లాడాను, దానిని పట్టుకొనండి. అటువైపుకే మిమ్మును నేను నడిపించాను, ఇప్పుడది ఆశ్చర్యముగా వచ్చుచున్నది. ఇక్కడ ఒక స్త్రీ తన భర్తతో కూడా కూర్చొని యున్నది. ఆమె ఇక్కడి వ్యక్తి కాదు. ఆమె టెక్సాస్‌లోని డల్లాస్ నుండి వచ్చినది. ఆమె బాధపడుచున్నది. ఆమె భర్త కూడా బాధపడుచున్నాడు. ఆమె ఒక వ్యాధితో బాధపడుచున్నది. ఆపరేషను కూడా జరిగినది. అది నిజము. ఆమె భర్త వీపు నొప్పితో బాధపడుచున్నారు. కార్బెట్ దంపతులు. టెక్సాస్‌లోని డల్లాస్ నుండి వచ్చిరి. అది నిజమయినచో, మీ చేతులు ఎత్తండి. నేను మిమ్మును ఎరుగను. అది నిజమేనా? దీనిని నేను ఏ విధముగా తెలిసికొనజాలను. ఏమిటది? "నీ గూర్చి నా వినికిడి ద్వారా నేను వింటిని, ఇప్పుడు నిన్ను చూచుచున్నాను." నా భావమును గ్రహించారా? ఇప్పుడు ఆ దంపతులను అడగండి. నా జీవితంలో ఎన్నడూ వారిని చూడలేదు. "నా వినికిడి చేత వింటిని గాని, ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను."
మీరు నమ్మినయెడల దేవుడు మీ అవసరమును తీర్చును.
MARK 9:23
96గడ్డము క్రింద చెయ్యి పట్టుకొని ఒకాయన కూర్చొనియున్నాడు. అధిక రక్తపోటుతో శ్రమపడుచున్నాడు. దేవుడు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావా? నమ్ముదువా? దేవుడు నిన్ను ఆ అధిక రక్తపుపోటు నుండి బాగుచేయునని నీవు నమ్ముచున్నయెడల, ఈలాగు నీ చేతిని ఎత్తుము. దానిని నీవు నమ్మినయెడల చేతిని ఎత్తుము. మంచిది, ఆయన చేయును. ఎన్నడూ నా జీవితములో అతనిని చూడలేదు. అతని గూర్చి నాకేమియూ తెలియదు. కాని బైబిలులో యేసు చెప్పిన మాటను నీవు విన్నావు. ఆయన ఈ సంగతులను చేయునని విన్నావు గాని, ఇప్పుడు చూచుచున్నావు. నా భావమును గ్రహించావా? "నమ్ముట నీవలనయితే నీకు సమస్తమునూ సాధ్యమే." నమ్మిక యుంచిన చాలును. అందుకు నిజమగు, వాస్తవమగు విశ్వాసమగు విశ్వాసము కావలెను. దీనిని నీవు విశ్వాసించినయెడల దేవుడు అనుగ్రహించును.
JOHN 1:42
97ఆ వెనుక ఒక స్త్రీ కూర్చొనియున్నది, నా వైపు చూచుచున్నది, ఆమె గొంతులో ఒక వ్యాధి యున్నది.
ఆమె ప్రక్కన మరో స్త్రీ కూర్చొనియున్నది, ఆమె గ్రహించును. అధిక రక్తపోటుతో బాధపడుచున్నది. అది నిజము.
ఆమె ప్రక్కన ఒకామె కూర్చొని యున్నది, ఆమెకు కూడా ఒక వ్యాధి యున్నది. ఆమె ఇక్కడ నుండి రాలేదు, ఆమె ఆర్కన్‌సాస్ నుండి వచ్చినది. వారు దానిని పొగోట్టుకొనిరి. కుమారి ఫిలిప్స్. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. స్వస్థత పొందుము! నీవాయనను విశ్వసించుచున్నావా? నీ పూర్ణహృదయముతో నమ్ముము. దానిని అంగీకరించుచున్నావా? అయితే అది నీదే.
"అది కష్టతరముగా ఉన్నది" అనవద్దు.
"నీ పేరు సీమోను, నీవు యోనా కుమారునివి," అని యేసు చెప్పెను.
"నా వినికిడిచేత నిన్ను గూర్చి వింటిని, కాని ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను." ఏమి జరిగినదో మీరు చూడలేదా? ఎవరో అక్కడ కూర్చొని యుండిరి. ఇటు చూచుచున్నారు. నమ్ముచున్నారు, విశ్వసించుచున్నారు, అకస్మాత్తుగా అది జరుగుచున్నది. చూచారా?
LUKE 17:30
98కుమారుడా, గత రాత్రి కంటె ఈ రాత్రి నీకు మెరుగైనదా? కూర్చొనియున్నవాడు? ఇప్పుడు బాగయినది, నీవు సరియగుదువు. గతరాత్రి ఇక్కడ కూర్చొని తన తలను గోకుకొనుచుండెను; కాని ఈ రాత్రి పెద్ద మనిషివలె కనిపించుచున్నాడు. చూచారా? అతడు ఆయావిషయముల గురించి కొద్దిగా గందరగోళపడెను, కాని ఇప్పుడన్నియూ సరి అయినవి. చూచారా? అంతా సరియగును. చూడండి? "ఆ దినమున మనుష్యకుమారుడు ప్రత్యక్ష పరచబడును. సొదొమ దహింపబడుటకు ముందుగా ఇది జరుగును."
"వినికిడి చేత నిన్ను గూర్చి నేను వింటిని, ఇప్పుడు నా కన్నులారా చూచుచున్నాను." యేసుక్రీస్తు యొక్క వాగ్ధానమును నేను విన్నాను. ఇప్పుడా వాగ్ధానము సజీవమగుట నేను చూచుచున్నాను. "నా చెవులతో నిన్ను గూర్చి విన్నాను, ఇప్పుడు నా కన్నులతో చూచుచున్నాను." చూచారా? అది ఆయనే అని ఎందరు నమ్ముచున్నారు? ఓ దేవా!
MARK 16:17,18
99ఆలస్యమగుచున్నది. రేపు రాత్రి మనకు గొప్ప స్వస్థతా కూటము ఉండును. సహోదరుడు మూర్ వచ్చునని ఎదురు చూచుచున్నాము. మేమిరువురము ఇచ్చట నిలబడి, వరుసలో వచ్చు ప్రతి వ్యక్తికి ప్రార్థన చేయుదుము. ఈ రాత్రి నేను మాట్లాడుచూ వేదిక పిలుపును ఇవ్వనాశించాను. కాని ఆ తరువాత వద్దనుకొన్నాను. "నీ గూర్చి నేను వింటిని గాని, ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను." ఇప్పుడాయన ఇచ్చటనేయున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా?
ఇప్పుడు మనము ఒకరి మీద ఒకరము చేతులుంచెదము. ఇప్పుడు గుర్తుంచుకొనండి, వాగ్ధానము చేసిన వాడే ఈ క్రియలను చేయును. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును." ఆయనే దానిని చెప్పెనా? నీవు విశ్వాసివా? "ఆమేన్" చెప్పుము. ఈ వాగ్ధానము చేసిన దేవుడే ఇప్పుడు క్రియ చేయుటను నీవు చూడగలవు. ఈ జనులను అడుగుము. వారిని ఎన్నడూ చూడలేదు, వారిని గురించి ఏమియూ ఎరుగను. ఇప్పుడు వారిని ఏమి గుర్తుంచుకోలేను. నాకది అసాధ్యము, కాని ఆ లేఖనము నెరవేరవలసియున్నది. అది నెరవేరినట్లయినచో మనము అంత్యకాలములో యున్నామని తెలియును. మనుష్యకుమారుడు రాబోవుచున్నాడని మనమెరుగుదుము, ఎందుకనగా మానవశరీరములో ఆయన తన్నుతాను బయలుపరచుకొనుచున్నాడు. అది నిజమేనా?
అయితే అది నిజమని మనకు తెలియును. నీవు ఆయన యందు విశ్వాసముంచుచున్నావని చెప్పుచున్నావు. "కావున నీ చేతులను మరియొకరి మీద వేయుము. మీరు ఒకరిమీద ఒకరు చేతులుంచుకొనినప్పుడు, ఆ దేవుని కుమారుడే మీ కన్నులకు కనబడును." ఆ కుమారుడే ఇచ్చటున్నాడు, "వారు స్వస్టతనొందురు!" అదే దేవుని కుమారుడు. ఆయన చెప్పిన దానిని నేను విన్నాను. "విశ్వాసులు చేతులుంచినప్పుడు వారు బాగవుదురు." నా చెవులతో దీనిని నేను విన్నాను. ఇప్పుడు నా కన్నులతో చూచెదను. దానిని చేసెదనని ఆయన వాగ్ధానము ఇచ్చెను.
ఇప్పుడు నేను ప్రార్థించుచుండగా: మీరును ప్రార్థించుడి.
100ప్రభువైన యేసూ, పరలోకమందున్న ప్రభువైన దేవుని నామములో, నీ ఆత్మ ఈ జనుల హృదయములలో పడునట్లు చేయుము. ఆ దేవుని యొక్క నిజవిశ్వాసము ఈ వాగ్ధానమును వారిపట్ల స్థిరపరచును. పరలోకమందున్న దేవుడు ప్రతి ఒక్కరిని బాగుచేయును గాక! వారు ఒకరి మీద ఒకరు చేతులుంచి నీ ఆజ్ఞకు లోబడియున్నారు. ప్రభువా, ఆ ప్రకారము జరుగును గాక! యేసుక్రీస్తు నామమునందు నీ మహిమార్థము దానిని జరుగనిమ్ము.
JOB 42:5•
MARK 16:18•
ROM 10:17
101మీరు అడిగిన దానిని పొందియున్నామని మీరు నమ్ముచున్నారా? మీ హృదయములో ఏదో పలుకుచున్నదా? ఆ చిన్న రవ్వవలె దైవావేశము చెప్పుచున్నదా? "అది అయిపోయినది! అది జరగిపోయినది."
మనము మన చెవితో వినగలమని దేవుని యొక్క ఆజ్ఞ చెప్పుచున్నది. ఇప్పుడు దానిని మనము మన కన్నులతో చూచుచున్నాము. యోబు చెప్పెను, "నా వినికిడి చేత నీ గూర్చి నేను వింటిని, ఇప్పుడు నాకన్నులారా నిన్ను చూచుచున్నాను."
ఇప్పుడు మీరు వాక్యము ద్వారా విన్నారు, వాక్యమును విని యున్నారు. "వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినునది దేవుని వాక్యమై యుండవలెను." ఇప్పుడది పనిచేయుటను మీరు కన్నులారా చూచి యున్నారు. ఆ దేవుడే ఈ కార్యములు జరుగునని చెప్పెను. విశ్వాసులు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు బాగవుదురు. మీరిప్పుడు బాగయిరి, అది మీ హదయములలో జారి పడినది. ఆలాగు జరిగినయెడల మీ చేతుల ఎత్తండి. ఆమేన్! అది నిజమగు అపోస్తలుల స్వస్థత, మీకది అర్థమయినదా? మీ పూర్ణహదయముతో మీరు దానిని నమ్ముచున్నారా? హల్లెలూయా! అదే మనకు అవసరము. మనము లేచి నిలబడి ఆయనను స్తుతించుదము.
ప్రభువైన యేసూ, నీకు వందనములు. ప్రభువు యొక్క నామము స్తుతింపబడును గాక!
నేనాయనను స్తుతింతును! నేనాయనను స్తుతింతును!
పాపుల కొరకు వధింపబడిన గొర్రెపిల్లను స్తుతించుము;
జనులందరూ ఆయనను మహిమపరచుడి,
ఆయన రక్తము ప్రతి డాగును తుడిచి వేసెను.
102ఇప్పుడు, మీరాయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు, అందరము కలిసి ఆయనను మహిమపరచుదము, జనులందరూ కలవండి, అది దేవుని ద్వారా బయలుపరచబడినదో కాదో చూడండి, దాని ద్వారానే మీరు రక్షింపబడియున్నారు. మీరు రక్షింపబడితిరనే అదే మీతో చెప్పెను. అదే మార్గము గుండా దేవుడు సంచరించెను. యోబు ఇంకా ఇతర ప్రవక్తలు ఆలాగే కదలిరి. ఆయన నీ ద్వారాను ఆలాగే కదిలినందున నీవు క్రైస్తవునిగా మారితివి. ఆయన దైవిక ప్రత్యక్షత ద్వారా మీరు స్వస్థత పొందితిరి. అది జరుగకుండా మిమ్ము ఆటంకపరచునది ఏదియూ లేదు.
కావున జనులందరూ ఆయనను స్తుతించుడి,
ఆయన రక్తమే సమస్తమును శుద్ధి చేసెను..
(ప్రతి సందేహమును, ప్రతి సంశయమును అది తుడిచి వేసెను).
నేనాయనను స్తుతించెదను! నేనాయనను స్తుతించెదను!
పాపుల కొరకు వధింపబడిన గొర్రెపిల్లను స్తుతింపుము!
జనులందరూ ఆయనను స్తుతించుడి,
ఆయన రక్తము ప్రతి మరకను శుద్ధి చేసెను.
JOB 42:5•
LUKE 17:28,30•
ROM 10:17
103మీరాయనను ప్రేమించరా? ఆహా, ఎంత అద్భుతము! ప్రభువా, "నా వినికిడి చేత నిన్ను గూర్చి వింటిని, వినుట ద్వారా విశ్వాసము వచ్చును; కాని ఇప్పుడు నిన్ను చూచుచున్నాను." దేవుడు తన్నుతాను జనులకు బయలుపరచుకొనుచున్నాడు, అబ్రాహామునకు ఆలాగే ఆయన చేసెను. ప్రపంచము సొదొమ పరిస్థితిలోనికి జారి పోవునప్పుడు మనుష్యకుమారుడు తన్నుతాను బయలుపరచుకొనునని వాగ్ధానము చేయబడినది.
ముగ్గురు వర్తమానికులు బయలువెళ్ళిరి, పరలోకము నుండి దిగివచ్చిరి.
సొదొమలో ఒక శాఖా గుంపున్నది. బిల్లీ గ్రాహం మరియు ఓరల్ రాబర్ట్‌లు అక్కడికి వెళ్ళిరి. నేను మీకు చెప్పిన దానిని ఎన్నడూ మరువవద్దు. విశ్వవ్యాప్తముగా ఒక సంఘమునకు ఒక వర్తమానికుడు తన పేరు ఆరు అక్షరములతో పంపబడుట చరిత్రలో ఎన్నడునూ జరుగలేదు. అతని పేరు అబ్రాహాము వలె యుండుట జరుగలేదు. (ఆరు అది మానవ సంఖ్యా). గ్రాహం ( G-R-A-H-A-M), అతడు ప్రపంచమునకు పంపించబడెను.
కాని అబ్రాహాము నామములో ఏడూ అక్షరములు, దేవుని యొక్క సంపూర్ణ వర్తమానికుడు. చూచారా?
అక్కడికి వెళ్ళిన వర్తమానికుడు ఏమి చేసెనో చూడండి: వాక్యమును బోధించెను, వారిని బయటకు రప్పించెను, మారుమనస్సు పొందమని చెప్పెను.
LUKE 17:28,30•
JOHN 1:1,14
104అయితే అబ్రాహాముతో నిలచియుండిన మరొకతడు ఏమి చేసెనో చూడండి. తన వెనుక ఉండిన గుడారములో శారా ఏమి చేయుచున్నదో చెప్పి అబ్రాహాము పట్ల ఒక అద్భుతమును జరిగించెను. ఈ వ్యక్తితోయుండిన యేసు ఇట్లు చెప్పెను, "ప్రపంచము సొదొమ స్థితిలోనికి వచ్చినప్పుడు అప్పుడు జరిగినట్లుగానే, మనుష్య కుమారుడు మరల ప్రత్యక్షమగును." అది నిజమేనని వాక్యము నిర్థారించుచున్నది. "ఆది యందు [సంఘము "వాక్యము!" అని చెప్పిరి.] మరియు ఆ వాక్యము ["దేవునియొద్ద!"] యుండెను. వాక్యము ["దేవుడై"] యుండెను. ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివాసము చేసెను." అది నిజమేనా? అదే వాగ్ధాన వచనమును మనము చూచుచున్నాము. లూకా మరియు మలాకీ ఇంకా ఇతర వాగ్ధానములన్నియూ నేడు మన మధ్య శరీరరూపము ధరించుచున్నవి. మన మధ్య నివాసము చేయుచున్నవి, మన చెవులతో మనము విన్నాము; ఇప్పుడాయనను మనము కన్నులారా చూచుచున్నాము. (మన నేత్రములతో) ఆయన తన స్వంత వాక్యమును అనువదించుచున్నాడు. మానవుల యొక్క అనువాదము మనకు అక్కర లేదు. ఓ సజీవ దేవుని సంఘమా! జనులందరూ ఫోను ద్వారా వినుచున్నారు. జనులందరూ మేల్కొనవలెను. ఆలస్యము కాకముందే లెండి! దేవుడు మిమ్మును దీవించును.
నేనాయనను ప్రేమించెదను, ఆయనను ప్రేమించెదను
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
కల్వరి మ్రానుపైన.
105సజీవమగు దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడుటను, సంఘమా, నీవు నీ స్వంత కన్నులతో చూచుచున్నావా? ఈ ఘడియ యొక్క వాగ్ధానము. చివరి దినములలో జరుగును, సజీవ వాక్యము స్వాభావిక రూపములో అనువదింపబడుటను మీరు మీ స్వనేత్రములతో చూచుచున్నారు, దేవుడు మనమధ్య ఉన్నాడు. "నా స్వనేత్రములతో ఆయనను నేను చూచుచున్నాను. దానిని చేయునని నేనెరుగుదును." గత కాలములోని ప్రవక్తలందరూ ఈ దినము కొరకు ఎదురుచూచిరి. మనము దాని ప్రత్యక్షతను మన స్వనేత్రములతో చూచుచున్నాము. ఆ పాతకాలపు మెతడిస్టులు, బాప్టిస్టులు, నిజమయిన, అసలయిన పెంతెకోస్తు వారు దీనిని చూడవలెనని ఎంతో నిరీక్షించిరి. ఇది జరుగునని వారిలో చాలామందికి తెలియును, కాని ఈ రాత్రి మనము నిలబడి అది జరుగుటను చూచుచున్నాము. ఓ! మీరాయనను ప్రేమించరా?
JOHN 13:35
106ఇప్పుడు, "మీరు ఒకనినొకడు ప్రేమించుట వలన నా శిష్యులని జనులందరూ తెలిసికొందురని," యేసు చెప్పెను. ఆయనను మనము ప్రేమించుచుండగా ఒకరితో ఒకరు కరచాలనము చేయుచూ నేనాయనను స్తుతించెదను. నేనాయనను స్తుతించెదను అను పాట పాడుదము!మంచిది.
నేనాయనను స్తుతించెదను! నేనాయనను స్తుతించెదను!
పాపుల కొరకు వధింపబడిన గొర్రెపిల్లను స్తుతించుడి!
జనులారా! ఆయనను మహిమపరచుడి! (ఎట్లు?)
ఆయన రక్తము ప్రతి పాపపు డాగును తుడిచివేయును.
DAN 5:12•
JOHN 3:18
107ఆ రాత్రి బెల్తెషాజరు యొక్క రాణి, రాజు ఎదుట ఏమి పలికినది? "నీ సందేహములన్నింటినీ తీర్చగల ఒక మనుష్యుడు నీ రాజ్యములో యున్నాడు." ఈ రాత్రి పరిశుద్ధాత్మయే సందేహములను కుదుర్చువాడు! దానిని మీరు నమ్ముచున్నారా? సందేహములను కుదుర్చాడు. క్రీస్తు రక్తము ప్రతి డాగును తుడిచివేయును, సందేహపు డాగులు పోవును. ప్రపంచములోని గొప్ప పాపము అవిశ్వాసమే, "విశ్వసింపనివాడు ముందే ఖండించబడి యున్నాడు." అది నిజమేనా? నమ్మని వానికి శిక్ష విధించబడును. ఒకే ఒక పాపమున్నది, అదే అవిశ్వాసము. పొగ పీల్చుట పాపము కాదు, శపించుట పాపము కాదు, వ్యభిచరించుట పాపము కాదు, అబద్ధమాడుట పాపము కాదు. అవి పాపము కాదు, అవన్నియూ అవిశ్వాసము యొక్క ఫలితములే. అవిశ్వాసము — మీరు నమ్మనందువలననే అవి చేయుచున్నారు. మీరు విశ్వసించినయెడల ఆ క్రియలను చేయరు.
108ఓ! అద్భుతము! గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రతి సందేహమును శుద్ధి చేయును. ఆయన మాటను మనము సందేము లేకుండా నమ్ముచున్నాము. వాక్యము శరీరధారియైనదని మనము నమ్ముచున్నాము. ఇప్పుడు ఆయన వాక్యమును స్థిరపరచుట ద్వారా, ఆయన సన్నిధి యొక్క ప్రత్యక్షత ద్వారా వాక్యము శరీరధారియైనదని మనము నమ్ముచున్నాము. దానిని మీరు నమ్ముచున్నారా? దేవుడు మిమ్ము దీవించును.
ప్రభువు నందు గొప్ప సమయము ననుభవించుట కొరకు ఉదయ కాలమున ఇక్కడ మిమ్మును చూచెదమని ఆశించుచున్నాము. ఇప్పుడు మీ శిరములు వంచండి. ఆరాధనను సహోదరుడు లిండ్సేకు అప్పగించుచున్నాను.