దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధనా స్థలము
1శుభోదయం! ఈ ఉదయం ఇచ్చట ఉండుట ఆనందము. ఈ పాతకాలపు విశ్వాస గీతములను వినుచూ ఈ గొప్ప సహవాసమును మేము ఆనందముగా అనుభవించుచున్నాము. అది మాకు ఇష్టము. మీకు కాదా? ఆమేన్ అను కోరస్. ఆయన అదే ఆమేన్ అయియున్నాడు. ఆయన చెప్పవలసియున్న చివరి మాట అదే.
పాటలు పాడుచుండగా నేను నా పాత స్నేహితుడగు సహో, బ్రవున్ తో అచ్చట కూర్చొని మాట్లాడాను. "బ్రెన్హాం సోదరుడా, నిన్నటి వరకు నీవు చెప్పే మాటను నేను చూడలేదు. "నీవు చెప్పుచున్న దానిని జనులు అర్ధము చేసికొన్నచో, ప్రతి అడ్డము తొలగిపోవును," అని అతడు చెప్పెను. అది అక్షరాలా నిజము. అది నిజము. అది అక్షరాలా నిజము. దానిని మీరు గ్రహించి పట్టుకోగలిగినచో బాగుండును. చూచారా?
2నా చిన్న స్నేహితుడగు ఎర్నీ ఫాండ్లర్ తో మాట్లాడుచున్నాను. టెలిఫోనుల ద్వారా వినుచున్న వారికి ఎర్నీ ఎట్లు మారెనో, ఎట్లు ప్రభువు యొద్దకు నడిపించబడెనో తెలియును. అతడు ఇంగ్లీషు మంచిగా మాట్లాడలేడు, అతడు వచ్చి ఒక్క మాట చెప్పితే బాగుండును. మరియు అన్ని అక్షరములను కలగలుపు చేయును. అతని నివాస స్థలమగు షవానో యొద్ద గడిపిన సమయము గుర్తున్నదా, అని నన్ను అతడడిగెను. అక్కడ కూటములో ఒకతను కూర్చొన్న చోటులోనే చనిపోయెను, అతడు లూథరను. అందరినీ నిశ్శబ్దంగా ఉంచాము. ప్రభువు యొక్క వాక్యము అతని మీద పలుకగా, అతను తిరిగి జీవము పొందెను. వారు మరల మమ్మును రమ్మని కోరిరి గాని మేము వెళ్ళలేకపోయాము.
3ఈ ఉదయమున ఫ్రాన్స్ లో రెండువేలకు మంది పైగా ఫ్రెంచ్ వారు తమ భాషలో తమ దేశమునకు వర్తమానము రావలెనని కోరుచూ చాలా దినముల ఉపవాస ప్రార్థనను ప్రకటించిరని నాకు తెలిసినది. ఫ్రాన్స్ లోని ప్రొటస్టెంటు భాగమంతా ప్రార్ధించుచున్నది, కనుకనే మేము…
ఇప్పుడే ఇది వికసించ నారంభించినది. గింజ బయటపడునట్లుగా పొట్టు రాలిపోవుచున్నది. చూచారా? కాబట్టి మర్యాదగా ఉండి ప్రార్ధి౦చండి. చూచారా? "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు."
నేను చాలా ముసలివాడినగుచున్నానని తలంచుచున్నాను, "మరో ఉజ్జీవ కాలమును నేను చూచెదనా?" పశ్చిమము నుండి ఒకడు తెల్ల గుర్రము ఎక్కి వచ్చును. ఈ త్రోవను మరల మనము వెళ్ళుదుము. అది నిజము. గుర్తుంచుకొనండి, అది వాగ్దానము, మీరు చూచారా.
4ఇప్పుడు, గత రాత్రి నేను సహో ఉడ్ గూర్చి మాట్లాడుచున్నాను, అతని సహోదరుడగు లియో ఇచ్చటున్నాడు. ఈ ఉదయమున సహోదరుడు లియో మరియు వారి చిన్న గుంపు టెలిఫోను ద్వారా వినుచున్నారు. మొర్సియన్ సోదరీ, నీ తండ్రి ఇచ్చటున్నాడు. గత రాత్రి ఆయనను నేను చూచాను. ఈ భవనంలోనే ఎక్కడో ఇప్పుడాయన ఉండియుండును, మరియు చాలా చక్కగా ఆరోగ్యంగా కనబడెను.
ఆలయములో అతడు స్వస్థత పొందిన ఉదయమున, కాన్సరుతో చనిపోవుచున్న ఇద్దరు స్వస్థత పొందిరి. గుండెపోటుతో వారి తండ్రి బాధపడుచుండగా దేవుని మహిమార్ధమై బాగుచేయబడెను. ఆయన ఈ కూటములో యున్నాడు. జనుల మధ్య అతడు నాకు కనబడలేదు గాని గత రాత్రి ఇక్కడే చూచాను.
5అన్ని ప్రాంతముల వారికి వందనములు చెల్లించుచున్నాను, ఇచ్చట ఈ అద్భుతమగు స్థలము అయిన ష్రీవ్-పోర్ట్ లోని ఈ లైఫ్ టెబర్నికల్ జనులతో క్రిక్కిరిసినది. ఆదివారపు-బడి కొరకు వచ్చిరి. ఈ ష్రీవ్-పోర్ట్ లో నేను జీవించినయెడల ఎవరితోను నాకు విరోధముండదని నేను చెప్పగలను, నేను ఈ లైఫ్ టెబర్నికల్ చర్చికే వచ్చెదను. ఇది ఒక శాఖ కాదు. ఈనాడు లైఫ్ టెబర్నికల్, ఒక అంతర్ సమాఖ్య స్థలము. వారు శాఖ నుండి బయటకు వచ్చిరి, ఎందుకనగా వారు నన్ను మరియు నేను ప్రసంగించుచున్న ఈ వర్తమానమును అంగీకరించిరి. నా సోదరుడు మరియు స్నేహితుడగు, జాక్ మూర్ తో సహవాసము చేసినందున సంస్థలో నుండి బహిష్కరించబడెను కనుక అతనిని అభినందించ తగును. అది నిజము. దేవుడతనిని దీవించును. ప్రార్థనలో మీరతని చేతులను పట్టుకొని అతనివలె విశ్వసించండి.
6మరియు సోదరి మూర్, నాకు ఎక్కడా కనబడుట లేదు. ఆమె… అవును, ఆ వెనుక ఉన్నది. చక్కగా దుస్తులు ధరించి ఆ వెనుక కూర్చొన్న ఆమె చిన్న బాలికవలె కనబడినది. ఆ క్రొత్త దుస్తులన్నియు కూడా ఈస్టరు దుస్తులువలె యున్నవి. సహో. జాక్ కు ఆమె ఇక్కడున్నదని తెలియదు, ఇప్పుడు … సోదరి మూర్.
అన్నా జీన్ మరియు డాన్ మొదలగు వారిని నిశ్చయంగా మనము తలంచుకొనుచున్నాము. సహో, నోలన్ ను కలిసికొనుటకు సంతోషించుచున్నాను. అతడు ఇక్కడి సహవాసులలో ఒకనిగా యున్నాడు.
7"ఆమేన్" పాటను పాడమని నిన్న నేను సోదరుడు ఎమ్మీని అడిగాను. రికార్డు మీద అది ఉన్నది, "ఆమేన్" పాటను అరిగిపోయేలాగా విన్నాను. దానిని పాడగల స్వరము అతనికున్నది; ఎవరినైనా మించి పాడగలడు. చిన్న జూడీని నేను గమనించాను. వారిద్దరూ సోదరీ సోదరుల వలె కనబడుదురు. కాదా? కాని వారిద్దరు భార్య-భర్తలు. వారిని చూడండి, నిజంగా చక్కని దంపతులు. ఈ మధ్యనే సహో. పామర్ బంగారు మెట్టు ఎక్కెను. ఆయనకు ఈమె కుమార్తె మరియు అల్లుడు. అతడు పిల్లలను క్రమశిక్షణలో పెంచుటకు ఈమె కూడా సహాయము చేసెను. తక్కినవారికిని పెండ్లి అయినది. వారు కూడా ఆయా స్థలములలో సువార్తకులుగా, సేవకులుగా పనిచేయుచున్నారు. కాపున అది చాలా గొప్ప సంగతి.
ECCL 12:13
8పామర్ సోదరీని నేను చూడలేదు. ఆమెను చూచానో లేదో నాకు నిజంగానే తెలియుట లేదు. ఆమె బహుశా ఈ కూటములోనే కూర్చొనియుండును. బాగా వెనుక ఉన్నది. పామర్ సోదరీ, దేవుడు నిన్ను దీవించును.
ఆ సంగతి గూర్చి ఆలోచించునప్పుడెల్లా, నా హృదయము వణకును. సహో. పామర్ చనిపోయెనని నాకు వర్తమానము అందినది. ఆ మాట నేను నమ్మలేకపోయాను. బిల్లీ నన్ను పిలచి చెప్పెను. మేము చాలా గొప్ప స్నేహితులము. అతడు చనిపోయెనని తెలుసుకొని నేను చలించిపోయాను. కానీ మనం ఎవరిమైనాగాని ఒకరి తరువాత ఒకరం అందరం వెళ్ళవలసియున్నాము. ఒక మాట వినండి, "చివరకు తేలిన ఫలితార్థము ఇదే. దేవునికి భయపడుటయు, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మానవుని విధి." ప్రసంగి 12.
9ఈ ఆదివారపు పాఠమునకు నాకు ఎంతో సమయము లేదు. నా గొంతు బోంగురు పోయినది.
సహో పెర్రీ గ్రీన్ గొప్ప కార్యము చేసెను. "నా తలను కప్పు చిన్న ముసుగు వంటిది" పోయినదని గత రాత్రి నేను చెప్పగా విని, దానిని తెచ్చుటకు ఎవరినో పంపెను. నేను చెప్పాను, "దానిని తెచ్చు లోపలే నా గొంతుబొంగురు పోయినది." దీని నివారణకు సంవత్సరాల తరబడి వెదకుచుంటిని, కాని చివరకు దీనివలన అది పోయినది. ఇప్పుడు దానిని మరచిపోయి వచ్చినందున గొంతు బోంగురు పోయినది. కాబట్టి నా మాట అర్థం కాకపోతే క్షమించండి.
10ఆదివారపు-బడి ఎందరికి ఇష్టము? ఓ! చాలా మంచిది. మీ పిల్లలను పంపించుట చాలా మంచిది. కాదు, సరిగ్గా చెప్పెదను, మీ పిల్లలను తీసికొని వచ్చుట మంచిది; మీరునూ రండి. ఈ ఆదివారపు-బడి మొదట ఎట్లు ప్రారంభమైనదో, ఎందరికి తెలియును? ఎక్కడ అది ప్రారంభమాయెను? ఇంగ్లాండు. మొదట దానిని ఏమని పిలిచిరి? "రాగ్డ్ స్కూల్" దానిని స్థాపించిన వాని పేరు మరచిపోయాను. అతని పేరు ఏమిటి? ["రాబర్ట్ రైక్స్" అని ఎవరో చెప్పిరి.] అది అక్షరాలా నిజము. వీధులలోని చిన్నపిల్లలను పోగుచేసెను — మురికి బట్టలతో ఇల్లు లేక తిరుగుచున్న పిల్లలు — అతడు వారిని పిలిచి బైబిలులోని పాఠములను నేర్పెను. ఈనాడు అది దాదాపు అన్ని సంఘముల యొక్క క్రమముగా మారిపోయినది, దాదాపుగా, అన్ని చోట్లా ఈ రోజు ఆదివారపు బడిదానికి వెళ్ళుట మంచిది. తప్పక మీరు, మీ పిల్లలు రండి. ఈ ఆలయంలో టీచర్లున్నారు, అన్ని వయస్సుల వారికి తగిన సౌకర్యములు గల గదులున్నవి. ఇప్పుడే క్రీస్తు నొద్దకు వచ్చిన కొత్తవారు వర్తమానమును వెంబడించవలెను. ఈ లైఫ్ టెబర్నికల్ వారు మీకు మేలు చేయుదురు.
11ఈ రాత్రికి మనము పాతకాలపు ప్రార్ధనా వరుసను ఏర్పరచుదుము. సహో. జాక్ మరియు సహో, బ్రవున్ మొదలగువారు మునుపు ప్రార్ధించిన రీతిగానే రోగులకు ప్రార్ధి౦చుట జరుగును.
సహో బ్రవున్ ప్రార్ధనా కార్డులు పంచుట నాకు గుర్తున్నది. ఆయనే ఒక సేవకుడు. ఆ దినములలో ఆ సంస్థ వారు ఆయన మీద ఒత్తిడి తెచ్చిరి. "నేను నీ సోదరుడను, నాకు ఒక ప్రార్ధన కార్డు ఇవ్వు," అని అడుగసాగిరి. ఓ! అది నిజంగా అతనికి కష్టకాలము, కాని అతడు యధార్థంగా ఉండెను. సహో, బ్రవున్ చక్కని వ్యక్తి. అతనిని ప్రేమించుచున్నాము.
2COR 5:1
12మరియు నేను మా అందరిని చూచుచున్నాను, మా ముగ్గురము వృద్ధాప్యములోనికి జారిపోవుచున్నాము. మాకు తెలిసిన సత్యములో మేము నిలచియుండనియెడల, అది బహు విషాదము. ఒక దినమున మేము వెళ్ళిపోదుము. మా పనిని యువకులకు అప్పగించుదుము. మా శరీరములు రూపాంతరము చెందును. ఆయన రూపములో తయారుకాబడి నిలబడుదుము. "భూమి మీది ఈ మన గుడారము శిధిలమైపోయినను, ఒకటి ఎదురు చూచుచున్నది."
13ప్రియ స్నేహితుడా, యేసుకు అందుకొరకు వందనములు చెల్లించవలెను… నన్ను నమ్మువారికి సత్యము చెప్పుచున్నాను, ప్రభువైవ ప్రియ యేసు ఒక ఉదయము ఎనిమిది గంటలకు, ఆ దేశమును నాకు చూపించెను. అది ఒక దర్శనము కాదు, దానిని నేను చెప్పగోరుట లేదు. ఇక్కడ మీతో మాట్లాడుచున్నంత వాస్తవముగా అది ఉన్నది. ఆ జనుల ముఖములను నేను చూచాను, మరియు వారిని గుర్తించలేకపోయాను, వారు మరల తిరిగి యవ్వనులయిపోయిరి. మరియు వారు చాలా వాస్తవముగా… నేను వారిని మరియు వారి చేతులు పట్టుకొన్నాను. చాలా వాస్తవముగా…
2COR 5:1
14అది నాకు సహాయము చేసెను, ఎందుకనగా అది నాకు ఒక అభిప్రాయముగా ఉండెడిది. ఒక వ్యక్తి చనిపోగానే ఆత్మ బయటకు వచ్చును. "ఈ భూమి మీది మన గుడారము శిథిలమైపోయినను, మరొకటి కాచుకొనియున్నది," అను మాట ఆయన నాకు గుర్తుకు తెచ్చెను. చూచారా? మరియు మనకు అన్ని రకముల సంపూర్ణత కొరకు మూడు ఉండవలసియున్నది. ఇక్కడ ఒక శరీరమున్నది, మరియు అక్కడ ఒకటున్నది, అది దైవిక శరీరము; మరియు పునరుద్ధానమందు మహిమ శరీరముండును. చూడండి, అది పరిపూర్ణత. ఇది కట్టు కథ కాదు, ఒక అభిప్రాయము కాదు, ఆత్మ కాదు. నీవు, నేను ఉన్నట్లే అక్కడ స్త్రీ మరియు పురుషులున్నారు.
15చాలా సంవత్సరాల క్రితం, నశించిన వారుండు స్థలమును చూచాను. స్నేహితుడా, ఒక వృద్దునిగా ఇది నీకు చెప్పుచున్నాను. ఈ ఉదయము దేశములోని వారందరికి చెప్పుచున్నాను, ఎన్నడూ దానిని చూడనాశించవద్దు. దానిని ఏ విధముగానైనను నేను వివరించలేను. నేను చిత్రకారుడనయినాగాని, దానిని కుంచెతో చిత్రీకరించలేను. సేవకునిగా నేను మీకది వివరించలేను. నరకము ఒక అగ్నిగుండము అని చెప్పుదుము, కాని అది అంతకన్న మిలియనుల రెట్లు భయంకరముగా యున్నది, దాని వెనుక వెళ్ళు నరకమంతా కూడా.
16మరియు పరలోకము — లేదా ఈ స్థలము, ఏమని మీరు పిలచుదురో నేనెరుగును. బలిపీఠము క్రిందనున్న ఆత్మలు? అని ఆయన పిలచెను. అదెంత గొప్పదో నేను చెప్పజాలను. నేను మానవుడను గనుక మాట చెప్పెదను, దానిని మీరు నమ్మవలెను. నేను చెప్పిన దర్శనములన్నియూ ఎట్లు నెరవేరుచూ నిజములుగా నిరూపింపబడుచున్నవో, ఆలాగే ఇదియు సత్యము. మీరు దేన్ని పోగొట్టుకొన్నాగాని దానిని పోగొట్టుకోవద్దు, (ఆరోగ్యము, బలము, దృష్టి మరేది పోయినా పరవాలేదు), దానికి సాటియైనది ఏదీ లేదు. దానిని వివరించగల పదము ఆంగ్ల భాషలో ఏదియూ లేదు. "పరిపూర్ణము," "అమోఘము," "అపూర్వము," అను పదములు దానికి చాలవు. నాకు తెలిసిన ఏ పదము దానిని వివరించజాలదు. దాని అంతము అదే కాదు. "ఇక్కడికి వచ్చినందుకు భయపడుచున్నానా?" అనుకొన్నాను.
"మీరు తినుచున్నారా?" అనడిగాను.
"ఇక్కడ మేము తినము. తిరిగి మేము భూమి మీదికి వెళ్ళినప్పుడు, తినగల శరీరములను ధరించుకొందుము," అన్నారు.
17వారిని నేను తాకగలిగాను. వారు ఆలాగు ఉన్నారు. చూచారా? నేను అన్నాను, "మంచిది, మీకు…" ఓ, వారికి ఒక శరీరమున్నది. అది ఒక కల్పనా కధ కాదు, శరీరమున్నది. ఒకరినొకరము తెలిసికొన్నాము. వారందరూ నన్ను ఎరుగుదురు, మీలియనుల మంది నన్ను కౌగలించుకొనిరి.
"నన్ను ఇక్కడికి తెచ్చిన ఆయనను చూడగోరుచున్నాను," అన్నాను.
"నీవిప్పుడు ఆయనను చూడలేవు, ఆగుము" అన్నారు.
"నన్నెందుకు ఇక్కడుంచారు?" అనడిగాను.
"నీవు జీవితములో నాయకుడవు," అన్నారు.
"వారంతా బ్రెన్హాంలు కదా?" అనడిగాను.
"కాదు. వారు నీ ద్వారా క్రీస్తు నొద్దకు నడిపించబడిరి," అనిరి. చూచారా?
18నేను చుట్టూ చూచాను, చీకటి రాత్రులు మరియు కష్టకాలము పోయినవి, వారి ముఖములు చూడగలిగాను. ఒక యువతి నన్ను కౌగలించుకొన్నది, ఆమె బహు అందముగా యున్నది, "ప్రశస్త్ర సోదరుడా" అని పిలచినది. ఆమె స్త్రీ, కాని అక్కడ పాపమే లేదు. మన గ్రంధులు మారిపోవును. అక్కడ పిల్లలను కనుట ఇక లేదు. చూచారా? అంతా ఒక్కటే.
తేడా అంతా ఉద్రేకములోనే యున్నది. ఆ కారణము చేతనే నేల మీద నాట్యము చేయుటలో నాకు నమ్మకము లేదు. నేను పవిత్రముగా జీవించితినని దేవుడు ఎదుట, బైబిలు ఎదుట నిలబడి చెప్పుచున్నాను. నేను బాలునిగా ఉన్నప్పుడు, యువకునిగా ఉన్నప్పుడు ఆ విధంగానే జీవించాను. నేను ఏ బాలికతోనూ తిరుగలేదు. ఆలాగు తిరిగిన యెడల, ఆ బాలికతో తీర్పులో నిలబడుదును. చూచారా? కాని ఏ పురుషుడైనను స్త్రీని కౌగలించుకొనినయెడల, అతడు నిజంగా ఆరోగ్యవంతుడైనచో, ఉద్రేకమునకు గురి కాకుంకా ఉండలేడు. ఎవరైన సరే అంతే! ఆ గ్రంథి లేనప్పుడు మాత్రమే అది సాధ్యము. పవిత్రమైన, కల్తిలేని, సోదర ప్రేమ, సోదరి ప్రేమ కలిగియుండుట కష్టము. నీ చిన్న కుమార్తెను హత్తుకొనినా కష్టమే. ఆమె ఒక స్త్రీ, మరియు నీవు ఒక పురుషుడవు. అది నీ సొంత కుమార్తె అయినా గాని. చూడండి, అది దేనినో చేయును. అయితే అక్కడ ఆలాగు జరుగదు, పాపము లేదు, అది అంతా ముగించబడినది. చూచారా? నిజమైన, పరిశుద్ధ ప్రేమ.
19మరియు నేను ఆ స్త్రీ వైపు చూచాను. మిలియనుల మంది నిలబడియున్నారు, మరియు వారందరూ పొడవైన జుట్టుతో నిండుగా తెల్లని దుస్తులు ధరించియున్నారు. నాతో మాట్లాడుచున్న ఆయన ఇట్లనెను, "ఆమెను నీవు గుర్తించలేదా?"
"లేదు," అన్నాను.
"నీవామెను క్రీస్తు నొద్దకు నడిపించినప్పుడు, ఆమెకు తొంబది సంవత్సరములు," అని చెప్పెను.
అద్భుతమైన కృప, ఎంత మధురమైన స్వరము! అది ఏమిటో వివరించి చెప్పుటకు ఎలాంటి మార్గము లేదు. మీరు నన్ను నమ్మినట్లయితే, కేవలము నా మాటను తీసుకొనండి. మీ వెనుకనున్న ఈ లోకము యొక్క ప్రతి వంతెనను కల్చుటకు కచ్చితముగా ఉండుడి.
20సంఘము వర్తమానమును విననారంభించినదని నేను నమ్ముచున్నాను, దానిని అర్థము చేసికొననారంభించుచున్నారు. కాని స్నేహితుడా విను! కుమారుని సన్నిధిలో మనము పడియుండవలెను, మనము పరిపక్వత చెందవలెను. మన విశ్వాసము పండలేదు. దేవుడు మనకిచ్చిన వర్తమానమును తెలివిగా వినుచున్నాము. మరియు ఆయన మనకు చూపించిన గురుతులను చూచుచున్నాము మరియు బైబిలు ద్వారా దానిని రుజువుచేయుచున్నాము. సంఘము ఆయన సన్నిధిలో పడియుండవలసిన అవసరత ఎంతో యున్నది. హృదయము మెత్తబడవలెను, ఆత్మయందు మాధుర్యము పొంది విశ్రమించును. కొన్నిసార్లు మీకు వర్తమానము కఠినముగా వినబడును, ఆలాగు విరుగగొట్టబడవలెను, ఎందుకనగా మేకును లోనికి దిగగొట్టవలెను. కాని ఒక్కసారి సంఘము దానిని వింటే చాలును, ఏర్పరచబడినవారు బయటకు పిలవబడుదురు, మరియు ప్రత్యేకించబడుదురు (దేవుని సన్నిధిలో కూర్చొందురు), మరియు నేననుకొనుచున్నాను ఎత్తబడినప్పుడు జనులు అచ్చట ఉండినట్లుగా అది యుండును.
21ఈ ఉదయము నేను "ఎత్తబడుట" గూర్చి మాట్లాడనైయున్నాను, కాని నాకు స్వరము బాగోలేదు, కాబట్టి కొద్దిసేపు నాతో సహకరించండి. నేను మాట్లాడగోరుచున్న అంశము: "దేవుడేర్పరచిన ఒకే ఆరాధనా స్థలము," అయి ఉన్నది అని.
ఇప్పుడు, ఇది చాలా గొప్ప అంశము. ఇప్పుడు మనము ప్రార్ధి౦చుదుము. ఈ ఉదయమున మీరెక్కడున్నాగాని, ఒక్క క్షణము తలలు వంచండి. ఇప్పుడు మర్యాదగా ఉండుడి. దేవుని వాక్యమును మనము సమీపించుచున్నాము, అది దేవుడు అక్షర రూపములో యున్నాడు.
22ఆ గ్రంథము యొక్క గొప్ప రచయిత దీనిని, "విత్తనము" అని మనకు బోధించెను, "విత్తు వాడు విత్తనము విత్తుటకు బయలు వెళ్ళెను," అని ఆ రచయిత చెప్పెను. సరయిన నేలలో పడినప్పుడు, ఆ విత్తనము ఎదుగునని మనకు తెలియును. తండ్రీ, ఈ ఉదయము మా హృదయములో నుండి ముండ్లు పొదలు, అవిశ్వాసము, హేతుబద్ధ ఆలోచనలు తీసివేయుము. అప్పుడు పరిశుద్ధాత్మ నీరు పోయగా, దేవుని వాక్యము హృదయములో స్వేచ్చగా ఎదుగును, అప్పుడు మేము దేవుని పిల్లలమగుదుము. తండ్రీ, దానిని మాకనుగ్రహించుము. అది మా హృదయము. దీనిని గుర్తించిన మాకు మాత్రమే ఇది కాదు గాని, దేశములో చాలా మందికి అవసరము. ప్రతివారి హృదయము ప్రేమ మరియు మెత్తదనముతో నిండియుండి మండుచున్నది. నశించిన సోదరుని, నశించిన సోదరిని సంపాదించు ప్రయత్నము చేయుచున్నాము. దేవా, దానిని దయచేయుము. మేము పూర్తిగా నీవైపే చూచుచున్నాము, ఎందుకనగా నీవే మా మార్గదర్శివి మరియు ప్రభువు. నేడు నీ మార్గములో మమ్ము నడిపించుమని, నీకు ప్రార్ధి౦చుచున్నాము, మరియు నీ దీవెనలు దయచేయుము. నీ కృప ద్వారా, నీ నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
23ఇప్పుడు, పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండములో నుండి వాక్యభాగమును నేను చదువగోరుచున్నాను. సహో, వైల్ తో అల్పాహారము భుజించిన తరువాత వచ్చి త్వరగా కొంత నోట్సు వ్రాశాను.
హోటల్ యొద్ద ఉన్నవానికి నేను ఎప్పుడు వందనములు చెప్పలేదు. ఒక రాత్రి ఆ రెస్టారెంటు వారు మాకు ఉచితముగా భోజనము పెట్టిరి. నా భార్య, నేను, నా కుమార్తె కలిసి పెళ్ళి భోజనము చేశాము. బిల్లు చెల్లించుటకు వెళ్ళగా, ఎవరో ముందే మా బిల్లు చెల్లించిరని తెలిసినది; వారెవరో గాని వారికి వందనములు చెల్లించుచున్నాను. "ఆ బెంచీ చివరన కూర్చొన్న వ్యక్తి" అని చెప్పిరి. అందులో చాలామంది నాకు తెలిసినవారున్నారు. ఆ రెస్టారెంటు పేరు కికాపూ అన్నట్లుండును. ఆలాగు చేసిన వారెవరో గాని, వారికి వందనములు. మీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును.
DEUT 16:1-6
24ఇప్పుడు, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము. అది పస్కా విధిని ఆచరించుట. మొదటి ఆరు వచనములు చదువుదము:
అబీబునెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరింపవలెను. [ఏప్రిలు నెల]… ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను.
యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను
పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా? నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితమంతటిలో జ్ఞాపకము చేసికొనునట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండకూడదు.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు.
నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కాపశువును వధించి -
చదువబడిన ఆయన వాక్యమును ప్రభువు దీవించును గాక.
25ఇప్పుడు మైక్రోఫోనులో శబ్దము మారినదా? గతరాత్రి ఆలాగు అవుట నేను విన్నాను. మీరు సరిగా వినగలుగుచున్నారా? మీరు వినలేకపోవుచున్నారు. ఇప్పుడు బాగున్నదా? ఈ విధంగా క్రిందికి మాట్లాడుట బాగున్నదా? నా గొంతు బోంగురుబోయినది, అందుకే ఈ ఉదయమున దానికి దగ్గరగా నిలబడితిని. సహో. పెర్రీ గ్రీన్ వినగలుగుచున్నాడని అనుకొనుచున్నాను. సరిగా ఇప్పుడు వినబడుచున్నదా? దానిని వారు బాగుచేసిరనుకొనుచున్నాను. మంచిది.
26ఇప్పుడు, ఆరాధికుడు దేవుడుని ఒకే ఒక చోట కలిసికొనుట అను దానిని గూర్చి ఈ ఉదయము నేను మాట్లాడగోరుచున్నాను. యుగముల నుండి చాలామంది ఈ దేవుని రహస్య చోటును గూర్చి వెదికిరి. యోబు కూడా ఆయన నివాస స్థలమును గూర్చి తెలిసికొనగోరెను, "ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టవలెనని కోరుచున్నాను." దేవుని నివాస స్థలమును కనుగొనవలెనని యోబు కోరెను, ఎందుకంటే అక్కడ దేవుడు ఆయన కుటుంబము కలిసి ఆరాధింపబడును.
యధార్థముగా ఆరాధించుచూ కూడా ఒకడు దేవుని వ్యర్ధముగా ఆరాధించు అవకాశము కలదని నిన్నటి ఉదయము వర్తమానములో కనుగొన్నాము. దేవుడు ఈ సంగతులన్నింటినీ మన కొరకు దాచియుంచెను, కానీ వాటిని వెదుకవలసిన పని మాత్రము మనదే. సమయమునకు, అసమయమునకు పరిశోధించమని పౌలు తిమోతితో చెప్పెను. అతనిలోనున్న నిరీక్షణా మాటను ఇచ్చుటకు సిద్ధపడియుండవలెను.
27ఆ సంగతులన్నీ ఇచ్చట యున్నవి. రెండు లేదా మూడు వారముల పాటు ష్రివ్-పోర్ట్ లో యుండి రాత్రి అరగంట సేపు చూడండి, కేవలము వాక్యములోనే నిలిచియుండుము, అను ఈ రహస్య వాక్యభాగములను గూర్చి బోధించుకొనిన బాగుండును. (చూచారా?) అందులోనికి ఎట్లు ప్రవేశించగలమో చూచెదము. దేవుని విధానమును గమనించి వెంబడించుడి, ప్రతి తలుపునకు ఒకే తాళముండును. అది సరియే. వేరొక తాళముండదు, దానికి దగ్గర పోలికలో కనపడినా గాని, అది పట్టదు. ఒక తాళపు చెవి. మరియు నీవు ఆ తాళపు చెవిని కలిగియుండవలెను, లేనిచో తలుపు రాదు. నీవెంత యధార్థముగా ఉన్నాగాని, ఆ తలుపును తెరువలేవు.
28నిన్నటి అల్పాహార విందులో ఎందరున్నారు? దాదాపు మీలో తొంబై శాతం మంది అక్కడున్నారు. నేను చెప్పబోవు దాని
వెనుక గాధను గుర్తుచేయుచున్నాను. దావీదు అభిషేకించబడిన రాజు, దేవునిచే, ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజు. ప్రభువైన యేసు మాత్రమే అంతకన్న గొప్ప అభిషేకము గలవాడు. (ఆయన దేవుడు) శరీర సంబంధమగు వంశావళిని బట్టి దావీదు కుమారుడు. దావీదు సింహాసనము మీద ఆయన కూర్చొనును. రాజు సింహాసనమును రాజకుమారుడు స్వాస్టముగా పొందును.
ఇప్పుడు చూడండి, దావీదు అభిషేకించబడెను అయినా గాని అతడు దేవుని చిత్తమును చేయలేదు. జనులందరూ వాక్యమును సరిగ్గా గ్రహించరు. ఈ ప్రత్యక్షతకు తాళపు చెవిని పొందరు. వారందరూ అభిషేకించబడిన వారే, సరిగ్గా తమ దృష్టికి కనబడిన దానిని గూర్చి వారందరూ దేవుడుని స్తుతించి, కేకలు వేసిరి. దేవుని వాక్యమును తిరిగి దేవుని ఇంటికి తేగోరిరి. కానీ దావీదు రాజు, ప్రవక్త కాడు. చూచారా? దానిని చేయుటకు ఆ దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు. వారు సరైన తాళపు చెవిని వాడనందున, దేవుడు వారి ఉద్యమమునంతటినీ త్రోసివేసెను. ఆ తలుపు తెరచుకొనలేదు. ఇప్పుడు దానిని మనము గుర్తుంచుకొనవలెను, మనస్సులో తలంచుకొనవలెను. దేవుని యొక్క ప్రతి కార్యము ఒక ప్రత్యేక విధానములోనే జరుగును, మరియు అదియే కార్యమును ముగించును. దేవునికి ఒక ప్రత్యేక సంఘమున్నది, అందులోనే ఆయన జనులను కలిసికొనును. ఆ సంఘములో తప్ప మరే సంఘములోను ఆయన నిన్ను చేర్చుకొనడు.
29నేను చాలాసార్లు అపార్థము చేసికొన్నాను గనుక దీనిని చెప్పుచున్నాను.
"నీవు క్రైస్తవునివా?" అనడిగాను.
"నేను బాప్టిస్ట్ ను"
"నీవు క్రైస్తవునివా?"
"నేను మెతడిస్తును."
"నీవు క్రైస్తవునివా?"
"నేను పెంతెకోస్తును."
ఇప్పుడు చూడండి, అది దేవునికి అవసరమే లేదు. నీవు తప్పు తాళపు చెవిని కలిగియున్నావు. కాని మంచి తాళపు చెవి యున్నది, మెతడిస్తు లేదా బాప్టిస్తు లేదా పెంతెకోస్తు లేదా మరేదో శాఖలో కలిసికొందునని దేవుడెన్నడూ నీతో వాగ్దానము చేయలేదు. శాఖలను ఆయన లెక్కచేయడు, అవి ఆయనకు వ్యతిరేకము.
త్వరలోనే దానిని ఆలయములోని దీర్ఘ ప్రసంగములో చెప్పెదను. అప్పుడు దానిని సహో జాక్ వినును, అది టేపు చేయబడును గనుక నీవేమి చేయగలవో చూచెదవు.
30తమ వేదాంత జ్ఞానమును బట్టి తమను దేవుడు కలిసికొన బద్దుడన్నట్లు జనులు ప్రవర్తించుచున్నారు. ఇప్పుడు, ఆలాగు ప్రజలు చేయుచున్నారు. వారు ఒకరితో ఒకరు సహవాసము చేయరు. త్రిత్వమువారు లేదా పెంతెకోస్తువారు, ఏకత్వము వారితో సహవాసము చేయరు. మెతడిస్తువారు బాప్టిస్తు వారితో కలియరు, ఎందుకనగా ఒకరు లీగలిస్తు, ఒకరు కాల్వినిస్తు, కనుక వారికి సహవాసమే లేదు. వారు ప్రజల మనస్సులను తమ దుష్ప్రచారముతో చెరచుచున్నారు.
31కొంతకాలం క్రిందట ఆస్పత్రి గదిలో ప్రార్ధి౦చుటకు వెళ్ళాను. అక్కడ ఒకామె చాలా జబ్బుతో యున్నది. శస్త్రచికిత్స చేయనైయుండిరి. ఆమె చనిపోవునని వారు తలంచిరి. నేను మరో స్త్రీని ప్రార్ధించుటకు పిలిచాను. ఆమెను ప్రార్ధించినచో అభ్యంతరమా? అని అడిగాను.
"ఆ తెర దించుము!" అన్నది.
"క్షమించు! నేను ప్రార్ధించబోవుటకు మాత్రమే అడుగుచున్నాను," అని చెప్పాను.
"ఆ తెర క్రిందికి లాగు!" అన్నది.
"అలాగే" అని చెప్పాను. ఆమె మరియు ఆమె కుమారుడు కూర్చొనియున్నారు, అల్లరి కుర్రవానివలె కనిపించాడు. "మంచిది, నీవు క్రైస్తవురాలవా?" అనడిగాను.
"మేము మెతడిస్తులము," అన్నది.
"అది నేనడుగుట లేదు. నీవు క్రైస్తవురాలవా?" అనడిగాను. చూచారా?
"తెర క్రిందికి దించు!" అన్నది.
చూడండి, మెతడిస్టును కాని నేను ఒక చనిపోవుచున్న రోగి కొరకు ప్రార్ధన చేయుట ఆమెకు ఇష్టము లేదు, ఆమె మెథడిస్టు అయియున్నది. ఆమె సంస్థలో మేము లేము, గనుక మా ప్రార్థన వినుటకు కూడా ఆమె ఇష్టపడుట లేదు. అటువంటి పరిసయ్యురాలను ఎన్నడూ నేను చూడలేదు.
32సర్పపు జాడ అను వర్తమానము వినువరకు మీరు వేచియుండండి. ఉహ్, అది సరే. ఇప్పుడు వారి శాఖ ఒక్కటే దేవునితో సంబంధము కలిగినదని వారు తలంచుదురు. "నీవు మెతడిస్తువు, లేదా బాప్టిస్తువు, లేదా త్రిత్వము, లేదా ఏకత్వమునకు చెందితేనే గాని దేవుడు నీ ప్రార్థన వినడు," అని వారందురు. అది తప్పు.
మరియు అది నా అవసరత అయి ఉన్నది. సరిగ్గా జీవించవలెనను కోరిక ఒక వ్యక్తి హృదయములోను, మనస్సులోను ఉండినట్టైతే… కానీ ఒక స్త్రీ దానిని చేసినదంటే నేను నమ్మను. ఇంకా ఎవరైనా, ఒక మెథడిస్తు లేచి ఆ మొథడిస్తు సంఘము కొరకు తీసుకొనబడలేడు, ఎందుకనగా అతనికి తెలుసు అది తప్పు అని. మానవుడు అది సరి అని తలంచును. త్రిత్వము వారు ఏకత్వము వారిని కండిస్తారు అని నేను నమ్మను, లేదా ఏకత్వము వారు త్రిత్వము మరియు పెంతకోస్తు వారిని, ఎందుకనగా వారు అతడు వ్యత్యాసముగా ఉండగోరుచున్నాడు. అతడు తనది సరి అని అనుకోనుచున్నాడు. మీరు వారి ఆలోచనలని గౌవరించవలెను. దుప్పటి రెండు ప్రక్కలను కప్పును. కాని గుర్తించుకొనండి, ఒక స్త్రీ లేదా పురుషుడు తన హృదయములో ఒకటి సరియైనదని అనుకొనుచున్నారు గనుక సరియైనది ఒకచోట ఉండి తీరును. నేను తరచుగా చెప్పుచుందును, "కరడు కరడును పిలచునప్పుడు, దానికి జవాబిచ్చు కరడు మరెచ్చటో ఉండును."
33మనకొక సంగతి చెప్పబడియున్నది తెలియునా? ఒక సీలు చేప ఒకనాడు సముద్ర తీరమున కాళ్ళతో నడచుచుండెను. కాని ఇప్పుడు దానికి కాళ్ళు లేవు, ఎందుకనగా ఇప్పుడది భూమి మీద నివసించక సముద్రములో నివసించుచున్నది గనుక దానికి కాళ్ళకు బదులు మరొకటి వచ్చినవి. ఇప్పుడది బాగుగా నీటిలో ఈదును, మునుపటి నడక కంటే.
ఒక గొప్ప వ్యక్తి దక్షిణ ధృవమునకు వెల్లెను. అతని పేరు? బిర్డ్. కొన్ని పశువులకు అతడు కోటు తయారు చేసెనట. పాల కొరకు ఆ పశువులను అతడు తీసికొని వెళ్ళెను. ఆ పశువులు చలికి గడ్డకట్టుకొని చనిపోకుండా ఉన్ని కోటులను అతడు తయారు చేసెను. కాని అతడు అక్కడికి వెళ్ళిన తరువాత, వాటి అవసరము రాలేదు, ఎందుకనగా ప్రకృతి వాటికి ఉన్నిని పుట్టించెను. చూచారా? ఎందువలన? చేపకు ముందు మొప్పలు అవసరము లేదు. నీరున్న తరువాతనే అందులో ఈదుటకు కావలసిన మొప్పలు ఎదిగెను. ముందు చెట్లుండ లేదు, ఆ చెట్లు ఎదుగుటకు భూమి ముందుండవలెను, నేల లేనిచో చెట్టు లేదు.
మానవ హృదయములో ఒక కేక పుట్టుటకు ముందే దానికి జవాబు ఎక్కడో ఉండవలసియున్నది. ఆ పిలుపును సంతృప్తిపరచునది ఎక్కడో ఉండవలెను.
34ఒక చనిపోయిన స్త్రీకి కొంతకాలం క్రిందట ఇక్కడ పరీక్ష చేసిరి. మరియు ఆమె చనిపోవుటకు కారణము, ఆమె ప్రతీసారి ఎక్కువగా ఉల్లిగడ్డలు తినుచుండెడిదని చెప్పారు. ఒకవేళ ఆమె ఉల్లిపాయలు తిననట్లైతే, ఆమె తల దురద వచ్చెడిది, దానిని వారు కనుగొనలేకపోయారు. కనుక ఆమెను పరీక్ష చేసిన తరువాత, ఆమెలో ఒక రకపు కణములు ఎదుగుచున్నవి అని కనుగొనిరి, దానికి ఒక పేరు పెట్టారు. ఆ పెరుగుచున్న కణముల ముద్దను తీసి ఉల్లిపాయలు ఉంచిన ఒక గిన్నెలో పెట్టారు మరియు ఒక్క రాత్రిలోనే ఆ ఉల్లిపాయలను అది కరిగించివేసినది. చూడండి? అది ఏమిటి? ఆ స్త్రీలో ఏదో ఉల్లిగడ్డల కొరకు పిలుచుచున్నది, ఒకవేళ ఉల్లిగడ్డలు లేనట్టైతే, ఎదుగుదల లేదు.
మరియొక మాటలో సృష్టి కంటె ముందుగా సృష్టికర్త యుండవలెను. చూచారా?
35మొథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, కాథలిక్కు మొదలగు వాటి కొరకు మానవ హృదయములో ఒక ఆకాంక్షయున్నది. "ఒక నిజమార్గమును" కనుగొనుటకు ప్రయత్నించుచున్నారు. "ఇది నిజమార్గము." కాథలిక్కు సంఘమునకు బయట ఉన్నచో, రక్షణ లేదు," అని వారు చెప్పుచున్నారు.
ప్రతి చర్చికి దాని స్వంత అభిప్రాయమున్నది. కొందరు ఒప్పుకొనరు గాని వారి క్రియల ద్వారా అది వ్యక్తమగును. నీ మాటకంటె నీ క్రియ పెద్దగా మాట్లాడును. వారు కాథలిక్కుల కంటె వేషధారులు. కాథలిక్కులు దానిని ఒప్పుకొందురు, "ఇది మాత్రమే అని నేను నమ్ముచున్నాను," అని వారందురు. వారు దానిని దాచిపెట్టినా వారి క్రియలు బిగ్గరగా పలుకును. వారి ఆలోచనలను వారి క్రియలే రుజవు చేయును. చూచారా?
36ఇప్పుడు, ఒకే ఒక స్థలముండవలసియున్నది, కానీ దానిని కనుగోవలెనను కోరిక మానవ హృదయములో యున్నది. మరియు మనయొక్క ప్రతి అవసరమునకు దేవుని వాక్యములో జవాబున్నది. కాబట్టి దేవుని యొద్ద జవాబున్నది, దానికొరకు ఇప్పుడు లేఖనములలో వెదకుదము. దేవుడు మానవుని కలిసికొను ఒకే స్థలమును, ఒకే చోటును ఒకే మార్గమును దేవుడు లేఖనముల ద్వారా మనకు చూపినయెడల దానిని మనము హత్తుకొనియుండవలెను, ఎందుకనగా అది మాత్రమే బైబిలు సత్యము.
37ఇప్పుడు, ద్వీతీయోపదేశకాండము అను మాటకు "రెండు చట్టములు," అని అర్థము. దేవునికి రెండు చట్టములున్నవి: వాక్యమునకు అవిధేయులై చనిపోవుట, అందులో ఒకటి. వాక్యమునకు విధేయులై జీవించుట, మరొకటి. అవే రెండు చట్టములు. ద్వితీయోపదేశకాండముముకు అదే అర్థము. ఆ రెండు మనకు వాక్యములో చూపబడినవి. ఒకటి మరణము, మరొకటి జీవము, జీవ మరణములు, దేవునికి జీవముతోనే సంబంధము. సాతానుకు మరణముతోనే సంబంధము. ప్రతివారి కండ్ల ఎదుట, లోకములోను ఇవి తేటగా, బహిరంగముగా కనబడుచున్నవి. అందులో సందేహము లేదు. ధర్మశాస్త్రమియ్యబడినప్పుడు సీనాయి కొండమీద అందులో ఒకటి వివరించబడినది. అది సర్వమానవ జాతికి శిక్ష విధించెను; మరొకటి కల్వరి కొండమీద చూపబడినది, అది మొత్తం మానవజాతిని బ్రదికించెను, యేసుక్రీస్తులో జరిమానా చెల్లించబడెను. ఈ రెండు గొప్ప సందర్భములలో ద్వితీయోపదేశకాండము యొక్క రెండు చట్టములు నెరవేర్చబడినవి.
GEN 3:3•
GEN 17:7
38మీరు మరల గమనించవలెనని కోరుచున్నాను, రెండు నిబంధనలు ఇయ్యబడినవి. ఒకటి ఆదాముకు షరతులపై ఇయ్యబడెను. అది ధర్మశాస్త్రమువలెయున్నది. "దీనిని అంటుకొననియెడల బ్రదుకుదువు; దీనిని తాకినయెడల చనిపోదువు." అది ఒక ధర్మశాస్త్రము. అబ్రహామునకు మరొక ధర్మశాస్త్రమియ్యబడెను. అది కృపతోను, షరతులు లేకనుయుండెను. "నిన్ను నీ సంతానమును నేను రక్షించితిని." ఆమేన్! అది కల్వరి మాదిరి. ఆదాము నిబంధన వంటిది కాదు. అది అబ్రాహామీయ నిబంధన.
ఆయన ఒకే ఒక స్థలములో ఆరాధనకు మానవుని కలిసికొనునని ఇప్పుడు చెప్పబడి యున్నది. నా అంశములోనే మీరు దానిని విన్నారు. కొద్ది నిమిషములలో దానిని మనము చూచెదము.
MATT 15:9•
MARK 7:7
39మానవుడిని దేవుడు కలిసికొను చోటు ఒకే ఒకటున్నయెడల, మనము జాగ్రత్తపడవలెను. మన ఆచారమును ఈ ఉదయమున ప్రక్కకు పెట్టెదము. ఆదివారపు-బడి పాఠములో ఆ ఒక్క చోటును తప్పక కనుగొందము. మరే ఇతర స్థలములోను ఆయన నిన్ను చేర్చుకొనడని ఇక్కడ దేవుడు చెప్పెను. ఏ ఇతర సంఘములోను ఆయన నిన్ను చేర్చుకొనడు, ఆయన సంఘములో మాత్రమే, ఆ స్థలములో మాత్రమే ఆయన నిన్ను చేర్చుకొనును.
"నేను యధార్థముగా ఉన్నచో, చాలదా బ్రెన్హాం సోదరుడా?" అని నీవందువు.
యేసు కొందరు యధార్థవంతులతో మాట్లాడెనని మరువవద్దు, ఆనాటి ఆరాధకులు వారు. వారితో ఇట్లనెను, "మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు." నిజమగు ఆరాధన హృదయములలో నుండి వచ్చును. "మీరు వ్యర్ధముగా నన్ను ఆరాధించుచున్నారు, బోధకు బదులుగా మానవాచారములను నేర్పుచున్నారు," అది వారి సంఘశాఖల యొక్క ఆచారము. వారు యధార్ధముగాను, భక్తితోను వారు ఉండవచ్చును. అది పరిసయ్యులకు క్రొత్త కాదు. కయీను, హేబెలులు మొదట ఆరాధన చేసిరి, ఈ భూమిమీద వారే ముందు పుట్టిరి, ఒకే వైఖరితో వచ్చిరి.
40కయీను కూడా హేబెలువలె భక్తిగలవాడు. వారిద్దరు బలిపీఠములను కట్టిరి. వారిద్దరూ దేవుని ప్రేమించిరి. వారిద్దరూ బలులర్పించిరి. వారిద్దరూ ఆరాధించిరి. వారిద్దరు దశమభాగము చెల్లించిరి. వారిద్దరూ అన్నీ ఒకేలా చేసిరి. కాని హేబెలు విశ్వాసము ద్వారా "ప్రత్యక్షత"ను పొందెను — దేవుని వాక్యము తేటగా బయలుపరచబడెను, చూపించబడెను, ప్రత్యక్తపరచబడెను. మహిమ! కయీను బలి అర్పించెను, కాని దానిని దేవుడు బయలుపరచలేదు. దేవునికి ఆరాధన కావలెను, కనుక కయీను అర్పణను చెల్లించెను, కాని దేవుడు దానిని బయలుపరచలేదు. కానీ ఒక నిజ మార్గములో…
"నా సంఘమునకు అది బయలుపరచబడినది," అందువు.
ఒక్క నిమిషము ఆగుము. దేవుడే తన స్వంత వాక్యమునకు అనువాదకుడు. తాను మాట్లాడిన షరతులను బట్టి దానిని అనువదించును. చూడండి, కయీను ఇట్లనుకొనెను, "నేను భక్తిగలవాడిని. నా సృష్టికర్తను ప్రేమించుచున్నాను. చక్కని బలిపీఠము కట్టాను. చక్కని బలి అర్పించాను. దేవునిని ప్రేమించుచున్నాను గనుకనే ఇవన్నియూ చేశాను." హేబెలు కూడా అదే చెప్పెను. ఇప్పుడు అదే బయలుపరచబడినది, రుజువైనది అదే. దేవుడు దిగి వచ్చిహేబెలు బలిని స్వీకరించెను, ఎందుకనగా ప్రత్యక్షత ద్వారా నిజమగు దేవుని మార్గమును అతడు కనుగొని దేవునిచే అంగీకారము పొందెను.
NUM 23:1
41ఇప్పుడు కయీను ఆత్మ వచ్చుచుండుట చూడండి, ఈ చివరి దినము వరకు వచ్చుచున్నది. ప్రాధమికమైనదా? కాదు గాని వాస్తవము పోలియున్నది.
ప్రవక్తలగు బిలామును, మోషేను చూడండి. ఇద్దరును యొహోవాకు ఏడు బలి పీఠములను కట్టిరి, రక్తము చిందించిరి; అంతే కాదు, ప్రతి దానిమీద గొర్రెపిల్లను వధించిరి. సంఖ్యాశాస్త్ర ప్రకారము, ఏడు అనగా "పరిపూర్ణము," ఏడు పొట్టేళ్ళను అర్పించిరి. రెండు బలిపీఠములు ప్రాధమికముగా ఒకేలాగున్నవి, ఇద్దరూ ఒకేలాగుండిరి. కాని దేవుడెవరికి బయలుపరచెను? చూచారా? ఆయన వాక్యములో ఉన్నవారికే. ప్రాధమికమైనది ఎక్కువగా వ్యత్యాసమును తీసుకోనిరాదు; అది దేవుని యొక్క ప్రత్యక్షత.
MATT 15:6,9•
MARK 7:7,13
42ఇప్పుడు ఆలోచించండి! (ఈ పరిసయ్యులు) ఎందుకు వారు ఆ స్థితిలో యుండిరి? యేసు చెప్పెను, "నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు." నిజంగానే తమ హృదయముల నుండియే వారాయనను ఆరాధించిరి. "మీరు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. మానవ పద్ధతులను దైవోపదేశములని మీరు బోధించుచున్నారు. దేవుని వాక్యమును ప్రజలకు శక్తి లేనిదానిగా చూపుచున్నారు."
మెథడిస్తు వర్తమానము మీకు నేను బోధించినయెడల, అది మీ మీద ఎట్టి ప్రభావము చూపించదు. ఇది వధువు కాలము. నోవహు వర్తమానము మోషే బోధించినచో, ఏమీ ఫలితముండదు. మోషే వర్తమానమును యేసు బోధించినచో, ఏమీ ఫలితముండదు. ఎందుకనగా ముందుగా నిర్ణయించబడిన విత్తనము అచ్చటయున్నది, దానికి కావలసిన నీరు తగిలినప్పుడే అది మొలకెత్తును. మరే ఇతర స్థితిలోను ఎదుగదు. దానికి కావలసిన ఆ పరిస్థితిలోనే ఎదుగును.
43నీవు కోడి గ్రుడ్డును ఒక పొదుగు యంత్రములో పొదిగించవచ్చును, వేడి కలిగించు దేనిక్రింద పెట్టినా అది పొదగబడును. వేడి పరిస్థితి వలన అది పొదుగబడును. నీవు మంచి గ్రుడ్డును తీసికొని చనిపోయిన కోడిపెట్ట క్రింద పెట్టినచో అది పొదుగబడదు. పరిస్థితి కావలెను.
నేడు మనము జీవించుచున్న కాలములోనూ ఆలాగే యున్నది. ఈ కాలమునకు దేవుని విధానము ఏమిటో నీవు కనుగోవలెను. మార్టిన్ లూథరు, జాన్ వెస్లీ, పెంతెకోస్తు మొదలగు వారు తమ-తమ కాలములలో అదే కనుగొనిరి. దేవుని కాలము మరియు తగిన సమయము దానిని చేయును.
44ఇప్పుడు, పెంతెకోస్తు వారు చూడండి. కన్నులేని ఒక నల్లజాతి సోదరుడు నిజమగు పెంతెకోస్తు వర్తమానమును కాలిఫోర్నియోలోని పాత అజుస వీధిలో ప్రారంభించెను. అతనిని చూచి నవ్విరి, అతడు నీగ్రో గనుక వారు నవ్విరి, కాని అతడు ఆ కాలపు వర్తమానమును తీసికొని వచ్చెను. చిన్న శరీరము గల వ్యక్తి, సంతకము చేయుట రాని వ్యక్తి, కాని ఇది వరముల పునరుద్ధరణ కాలము అని ప్రభువు అతనికి బయలుపరచెను. అందరూ ఆ వాతావరణమును, కాలమును చూచిరి, కాని దేవుడు ఈతని ద్వారా జనులకు దానిని బయలుపరచెను. కాని అతడు వెళ్ళి "ఇది మాత్రమే దానికి రుజువు" అనగానే, అది చచ్చినది. చూచారా? అంతటితో శాఖలు, విభజనలు ప్రారంభమాయెను. ఒకరు మేఘము మీద, ఒకరు పొద మీద వచ్చుచుండిరి. ఓ, మై, అది ఆలాగు వెళ్ళుచుండెను.
DEUT 16:2,6•
MATT 15:9•
MARK 7:7
45శాఖల వలన అదే జరిగెను. చూచారా? దేవుడు శాఖలకు కర్తకాడు, ఎందుకనగా శాఖ అనగా బబులోను, ఆయన అల్లరికి కర్త కాడు. దానిని అర్థము చేసికొనుటకు వివేకము అక్కరలేదు. అది బబులోను. ఆచారము. దాని గురించి ఆలోచించండి, యదార్ధమైన ప్రజలు. ఇప్పుడు, ఇంకను, ఎందుకనగా వారు దానిని నమ్ముచున్నారు, దేవుడు వారిని కలిసికొనుటకు యదార్ధమైన స్థలము ఒకటి ఉండవలసియున్నది.
ఇప్పుడు 2వ వచనము గమనించండి: "నేను ఏర్పరచుకొనిన స్థలములో ఆరాధించుడి." వారు ఆరాధించు చోట బలి అర్పించెదరు. "మీరు ఎన్నుకొను చోటు కాదు. నేను ఎన్నుకొనిన స్థలము. మానవుడేర్పాటు చేసికొన్న చోటు కాదు, కాని నేను ఏర్పాటు చేసుకొనిన స్థలములో ఆరాధించుడి." ఒకే ఒక చోట్నునది. మిగిలినవి వ్యర్ధములే. నీ ఎన్నిక చొప్పున కాదు, క్కని ఆయన ఎన్నిక అయి యుండవలెను.
"అయితే నేను సంఘమునకు వెళ్ళవలసిన పని లేదు," లేదా "నీవు చాలా సంకుచితమగు బుద్ధిగల మనిషివి. స్త్రీల జుట్టు గూర్చి, ఇంకా ఆయా స్థలముల గూర్చి బోధించుచున్నావు. నీది సంకుచితమగు ఆలోచన, అని మీరనవచ్చు."
అందుకు నీవు దేవుని మాట తీసికోనవసరం లేదు. దానిని వాక్యములో నీవు కనుగొందువు, "వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు." యేసు అదే విషయమును గురించి మాట్లాడేను. చూచారా?
SONG 2:15•
REV 22:14
46ప్రతి చిన్న పొల్లులోను నీవు నమ్మకత్వముగా ఉండవలెను. గుంటనక్కలు ద్రాక్షా వనములను పాడుచేయును. నీవు చేయు పెద్ద పనులు కాదు, నీవు చేయకుండా విడిచిపెట్టిన చిన్నవే. చిన్న లింకు సరిగ్గా లేనిచో, పెద్ద గొలుసు ఎందుకూ పనికి రాదు. "దేవుని ఆజ్ఞలన్నియూ గైకొనువారు ధన్యులు. వారు ప్రవేశించు హక్కు కలిగియుందురు." దేవుడు సెలవిచ్చినవన్నియు చేయుము.
స్త్రీ పొడవైన జుట్టు కలిగియుండవలెనని దేవుడు చెప్పెను. చాలాకాలం క్రితం ఒకడు నాతో ఇట్లనెను, "నేను బట్టల గూర్చిన మతమును బోధీ౦చుట లేదు."
"అయితే నీవు సువార్తనే బోధించుట లేదు," అన్నాను.
ఏమి చేయవలెనో దేవుడు చెప్పెను. దానిని చేయవలెనని నీకు సహజంగానే తెలియును. "చిన్నవాటిని గైకొనువారు ధన్యులు," అని యేసు చెప్పెను. స్త్రీ తన జుట్టును ఎదుగనీయవలెను. దానిని ఆమె చేయనక్కర లేదు. సహజ సిద్ధము.
"ఓ! మాకు గొప్పవాటిని నేర్పుము."
సామాన్యమగు వాటినే మీరు చేయనప్పుడు, గొప్ప వాటిని మీకెట్లు బోధించగలను? ఎందుకనగా మీ ఉద్దేశ్యము మరియు లక్ష్యము తప్పు.
DEUT 16:2,6
47దేవుని పట్ల నీకు ప్రేమ ఉండవలెను, "ప్రభువా! నీవు నన్ను ఏమి చేయమని కోరినా నేను చేయుదును, దానిని చేయుటకు ఇష్టపడుచున్నాను. అప్పుడు నీవు ఎదో ఒక చోటికి వెళ్ళుచున్నావు. "కాని నీవు ఆయన చెప్పిన విధంగా చేయనియెడల లాభముండదు.
అది ఆయన ఎన్నిక. "నేనేర్పచుకొనిన స్థలము." అక్కడ నీవు నీ బలిని అర్పించి ఆరాధించవలెను.
కయీను, హేబెలులు తమ అర్పణలు తెచ్చిరి. ఆయన ఎన్నుకొనిన స్థలములోనికి దానిని నీవు తీసికొని రావలెను. అప్పుడు దానిని ఆయన అంగీకరించును, లేనియెడల ఆయన దానిని అంగీకరించడు. బలి ఒక్కటే, కాని ఒకదానిని తిరస్కరించెను.
ఈ బలిని ఎచ్చటకు తేవలెనో మనము కనుగొందము. మనందరము పరలోకము వెళ్ళగోరుచున్నాము. కాదా? అందరము తప్పు చేశామని ఎరుగుదుము. యేసే బలి అని మనమందరము ఎరుగుదుము. ఆయన ఎచ్చట మనలను అంగీకరించునో మనము ఎరుగగోరుచున్నాము. చూచారా? ఆయనను ఎచ్చట కలిసికొన్నచో అంగీకరించబడుదుమో బైబిలు చెప్పుచున్నది; దాని బయట ఉన్నచో, అది అంగీకరింపబడదు.
DEUT 16:2,5,6
48బలిని ఉంచుటకు ఆయన ఎన్నుకొనిన చోటు ఏమిటో మనము గమనించుదము. ఈ పురములలో దేనిలోను నీవుంచలేవు, అయితే ఆయన ఒక చోటును ఎన్నుకొనెను, దానికి ఆయన తన పేరు పెట్టెను. ఇక్కడ అదే ఆయన చెప్పెను. తన పేరు పెట్టుటకు ఆయన దానిని ఎన్నుకొనెను. ఇప్పుడు ఆయన తన నామము ఉంచు ఆ చోటు కొరకు లేఖనములను పరిశోధించుదము.
అంశము నుండి ఇప్పుడు మనము చదువుదము. ఈ ఉదయము చిన్న చిటీ ఎవరో వ్రాసి పంపిరి. ఈ అధ్యాయములోని 2వ వచనము చూద్దాం. టెలిఫోనులో వినుచున్నవారిని బట్టి త్వరగా ముగించెదను. 16వ అధ్యాయము 2వ వచనము.
యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొనిన స్థలములోనికి నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె, మేకలతో గాని, గోవులతో గాని బలి అర్పింపవలెను.
49ఇప్పుడు, దీనిని నీవు తీసుకొనలేవు. నీ యధార్దాత, నీ ఒప్పుదలను మొతడిస్టు బలిపీఠము మీదికి గాని, బాప్టిస్తు బలిపీఠము మీదికి గాని, పెంతెకోస్తు బలిపీఠము మీదికి గాని నీవు తీసికొని వెళ్ళరాదు. అయితే ఆయన ఒక బలిపీఠమును ఎన్నుకొనును. దానికి ఆయన తన పేరును పెట్టును. ఆ స్థలములోనే ఆయన నిన్ను కలిసికొనును. మరియు ఇప్పుడు అంతయూ క్రమములో ఉంచబడి, తీగె సరిగ్గా లేనిచో ఆ దీపము వెలుగదు. ఎందుకంటే ఆ తీగ కత్తిరించబడి, వదిలివేయబడినది. మరియు దేవుని మాటలలో ఒకటి, దేవుని చోటులో ఒకటి నీవు తీసికొనవచ్చును, కానీ నీ స్వంత హృదయములో స్వార్ధ అభిప్రాయమున్నచో దేవుని శక్తికి ఆటంకము కలుగును. నీవు నీ తెలివి వలన దానిని చేయవచ్చును. ప్రత్యేకముగా కనిపించవలెనని చేయవచ్చును. అది తప్పు. నీ హృదయమంతటితో పూర్తిగా యధార్థముగా రావలెను. నీ ఉద్దేశ్యములు, అభిప్రాయములు దేవునిలో ఉంచుము, ఆయన చోటు కొరకు వెదకుము, ఆయన చెప్పిన చోటికి తీసికొని రమ్ము. చూచారా?
JOHN 11:23,25,27
50మరియ, మార్తలను చూడుము. సువార్త బోధించిన తరువాత యేసు వచ్చినప్పుడు (ఆయన మెస్సీయా అయి యుండెను, ఆ ఘడియ యొక్క వెలుగు), ఆయనను ద్వేషించిరి, విసర్జించిరి. ఓ, పరిసయ్యులు, సంఘములు ఆయనను ద్వేషించిరి. కానీ వారి సోదరుడును, యేసుకు మంచి స్నేహితుడును అగు లాజరు చనిపోయెను. వారతనిని అక్కడే ఉంచి, యేసు కొరకు కబురు పంపినా ఆయన రాలేదు.
మార్తయొక్క వైఖరిని చూడండి, "ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సోదరుడు చావక యుండును." [ఆమె ప్రభువా అని పిలచినది, యెహోవా — మహిమ!] జీవమరణములు ఒకేచోట కలిసియుండవు.
"పునరుద్ధానమును జీవమును నేనే. నీ సోదరుడు తిరిగి బ్రదుకును," అని ఆమెతో యేసు చెప్పెను.
"అవును ప్రభువా, నిశ్చయముగా అది నమ్ముచున్నాను. మృతుల పునరుద్ధానముండునని సామాన్యముగా యూదురాలునగు నేను నమ్ముచున్నాను. మరియు నా సోదరుడు విధేయతతో యధార్థముగా ఆరాధించెను. బైబిలులో చెప్పిన మెస్సీయావు నీవేనని నమ్ముచున్నాను, ఎందుకనగా దేవుడు నీలో బయలుపరచిన వాక్యమే నీవు ఈ ఘడియ యొక్క వర్తమానికుడవని రుజువు చేయుచున్నది. నీవే ఆ మెస్సీయావు. రాబోవు క్రీస్తువు నీవే అని నమ్ముచున్నాను, ఎందుకనగా నీ క్రియలు దేవుడు మెస్సీయాగా నీవుండుటకు పంపినట్లుగా సాక్ష్యమిచ్చుచున్నవి అన్నదామె. చూచారా?
51"నీవు వచ్చి నా సోదరుని ఎందుకు లేపలేదు? నీవెందుకతనిని స్వస్థపరచలేదు? నీవు ఇతరులను బాగు చేశావు. నీ అతి ముఖ్య స్నేహితునికి ఏమయిందో చూడు!" అని అడుగు హక్కు ఆమెకున్నది. అట్టి విధమైన వైఖరి ఎక్కడను పనిచేయదు.
"లేఖనములో నీవెవరివో గుర్తించబడిన రీతిగానే నీవున్నావు. మెస్సీయా రావలసిన దినము ఇదేనని నమ్ముచున్నాను. అందుకొరకే మేము చూచుచున్నాము. తక్కినవారు ఏమన్నా నేను లెక్కచేయను. నేను వినిన, చూచిన వాక్యముబట్టి నీవే మెస్సీయావని నేను పూర్ణ హృదయముతో నమ్ముచున్నాను, నీలో వాక్యము బయలుపరచబడినది." చూచారా, ఆమె అడుగవలసినది ఒకటున్నది గాని, సరైన రీతిలో అడుగవలెను.
52ఆమె పరుగిడి వెళ్ళి ఇట్లన్నచో ఎట్లు౦డును? "ఆ మెస్సీయావు నీవేనేమో చెప్పుము! మా విన్నపమును ఆలకించుటకు నీకు మనస్సు లేదు. నీవు మర్యాద గల ఆ పెద్ద మనిషివి కానే కాదు. నీకు ఇల్లు ఇచ్చాము, నీకు భోజనం పెట్టాము, నీ కోసం మా సంఘం విడిచిపెట్టాము, ఆ శాఖలలోనుండి బయటకు రమ్మని నీవు చెప్పావు. నీ కోసం ఎన్నో చేశాము, అన్నియూ విడిచిపెట్టి మేము వెలివేయబడిన వారివలె, ఆనాధులవలె యున్నాము. నీ కొరకు ఎంతో చేశాము, కనీసం నా పిలుపుకు జవాబు కూడా నీవు ఇవ్వలేని పెద్ద మనిషివి." నిజంగానే దానిని అనగల హక్కు ఆమెకున్నది.
"నేను అమెరికా పౌరురాలను, నేను జుట్లు కత్తిరించుకొందును, పొట్టిబట్టలు ధరించుదును, అది చట్ట సమ్మతము," అని నీవనవచ్చు. అది నీ హక్కు. నీవు గొర్రెపిల్లవయినచో, ఉన్నిని పుట్టించెదవు; కానీ ఒక మేక ఎప్పుడు దానిని పోగొట్టుకొనును. అది నీకు దేవుడిచ్చిన హక్కు, కానీ దానిని నీవు పోగొట్టుకొనెదవు.
JOHN 11:25-27,34
53"ఏ శాఖలోనయినా నేను చేరు హక్కు నాకున్నది," అని నీవనవచ్చు. అక్షరాలా నిజమే. చూచారా?
కానీ దానిని పోగొట్టుకొనెదవు, ఆమె తన హక్కులన్నిటినీ తాకట్టు పెట్టెను. ఆమె కళ్ళముందే దేవుని వాక్యము బయలుపరచబడినా గుర్తించలేదు.
ఆయనిట్లు చెప్పెను, "పునరుద్దానమును, జీవమును నేనే: నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరల బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు వాడెన్నడూ చనిపోడు. దీనిని నమ్ముచున్నావా?" ఆమె క్రమపరచుకొనని సంగతి ఒక్కటున్నది. చూచారా?
"అవును ప్రభువా! నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను." ఓ! సోదరుడా! అంతా ఆరిపోవుటకు సిద్ధముగా యున్నది. చూచారా?
"మీరతనిని ఎక్కడ ఉంచిరి?" చూచారా? ఏమి జరిగినదో మీరెరుగుదురు.
DEUT 16:2,3•
1COR 5:6
54నీవు సరయిన చోటుకు తెచ్చినప్పుడే నీ బలిని దేవుడు అంగీకరించును. చూచారా, అక్కడికి రావలసియున్నావు. గమనించుము:
… ఆ స్థలములో యెహోవా తన నామము నుంచుటకు ఎన్నుకొనెను.
అందులో నీవు పులిసినదేదియూ తినరాదు, మన్నా.
సమర్పణలో అది దేనికి మాదిరిగా యున్నది? ఏ ఆచారముతోను దానిని నీవు కలుపరాదు. వాక్యము మాత్రమే అయియుండవలెను. "పులిసిన రొట్టె తినరాదు." "పులిసినది కొంచెమయినాగాని ముద్దంతటినీ పులియ చేయును." అదేమిటో మీరెరుగుదురా? పూర్తి శరీరము. క్రీస్తులోనికి చిన్న శాఖను గాని ఆచారమును గాని కలుపరాదు. అందువలన క్రియ జరుగదు.
గత గురువారము రాత్రి వర్తమానము మీకు గుర్తున్నదా? నీ పాత భర్త చనిపోవలెను. వాక్యమే నీ నూతన భర్త.
… ఏడు రోజులు నీవు పులియని రొట్టెను తినవలెను, …
"ఏడు రోజులు," దేనికి మాదిరి? పూర్తిగా ఏడు సంఘ కాలములు, ఏడు దినములు. ఏడు దినములే వారెందుకు తినవలెను? బయటకు వెళ్ళు ముందు, ప్రతి సంఘ కాలములోను ఆదినుండి అంతము వరకు ఆ కాలము యొక్క వాక్యమునే తినవలెను. రోమను ఆచారము, మెతడిస్తు, బాప్టిసు, పెంతెకోస్తు ఆచారము అంతయూ చూపవలెను.
DEUT 16:3,4•
JOHN 12:24
55ఇప్పుడు చూడండి:
బాధల రొట్టె [లూథర్, వెస్లీ, పెంతెకోస్తు అందరూ దానికొరకు బాధనొందిరి. నీవునూ శ్రమపడవలెను] నీవు ఐగుప్తు దేశములో నుండి త్వరపడి బయటకు వచ్చితివి. ఐగుప్తు దేశములో నుండి నీవు బయటకు వచ్చిన దినమును నీ జీవితకాలమంతయూ నీవు గుర్తు౦చుకొనవలెను.
ఏడు దినముల పాటు నీ ప్రాంతమంతటిలో పులిసిన రొట్టె కనబడరాదు.
క్రీస్తు యొక్క అందమగు వధువు, రోమా సామ్రాజ్యము ద్వారా చీకటి యుగములలో చనిపోయినది. ఆమె చావవలసియున్నది. "గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే…." పెండ్లి కుమారుడు రావలసియున్నాడు, దేవుని యొక్క పరిపూర్ణ కళాఖండము. దాని మీద నా ప్రసంగమును మీరందరూ విన్నారు.
56ఒక రోజు నేను లాస్ఏ౦జల్స్ లోని ఫారెస్ట్ లాన్లో నిలబడియుండగా, నా హృదయము గంతు వేసినది. ఎంతమంది ఫారెస్టు లాన్ చూచారూ? మైక్లేంజిలో యొక్క మోషే విగ్రహమున్నది. ఆ విగ్రహమంతా పరిపూర్ణముగా యున్నది గాని, కుడి మోకాలులో కొద్ది తప్పునది. గైడు నాకు ఆ తప్పును చూపించెను. "మైకెలేంజ్లో తన జీవిత కాలమును దానికొరకు వెచ్చించెనని చెప్పెను. అతడు శిల్పకారుడు, మరియు మోషే స్వరూపమును చెక్కగోరెను. మోషే యొక్క రూపము తన మనస్సులో ఉండెను, తన హృదయములో మోషే స్వరూపమును చూచెను, సంవత్సరముల తరబడి దాని మీద పని చేసెను. చివరగా దానిని ముగించి, తన సుత్తి క్రింద పడవేసి, విగ్రహమును చూచెను — అది మోషే తన హృదయములో ఎట్లు ఊహించెనో — అంత పరిపూర్ణముగా ఉండెను, అతడు తన సుత్తెను పట్టుకొని, "మాట్లాడు" అని కొట్టెను. అది మైకెలేంజ్లో యొక్క మహోన్నత కళాఖాండమని పిలువబడెను. ఆ శిల్పకారునిలో ఏదో గొప్పది ఒకటుండెను. మోషే ఎట్లు౦డునో అను దర్శనమును అతడు కలిగియుండెను. గొప్ప తండ్రియగు దేవునికి అది ప్రతి రూపమే.
57ఆయన తండ్రి గనుక జగత్తు పునాదికి ముందే తన హృదయములో కుమారుని కలిగియుండెను. ఆయన వాక్యములో అది జన్యువు (genes)గా యుండెను. ఆయన మానవుని సృజించెను. స్వేచ్చాయుత జీవిగా ఉంచెను, కానీ ఆ మనిషి పడిపోయెను. కానీ మట్టితో మానవుని చేసిన ఆ గొప్ప శిల్పకారుడగు దేవుడు అంతటితో ఊరుకొనక మానవుని మరల చేయనారంభించెను. ఆయన ఒక నోవహును తయారు చేయగా, అతడు త్రాగి చనిపోయెను. ఆయన మోషేను తయారు చేయగా, అతడు దేవుని మాటనుల్లంఘించెను. ఆయన ప్రవక్తలను చేసెను, వారు ఆపద కాలములో పరుగిడిరి. ఆయన కట్టుచునే, మలచుచునే యుండెను. ఆయన స్వభావమును, ఆయన ప్రతిబింబించు ఒక మహోన్నత కళాఖండమును ఆయన రూపుదిద్దుచుండెను. కుమారుని యొక్క నమూనా ఆయన హృదయములో ఉండెను.
MATT 3:16,17•
MARK 1:10,11•
LUKE 3:22
58మహోన్నత కళాఖండము పూర్తి అయిన తరువాత ఒక రోజు యోర్గాను దగ్గరకు ఆయన వచ్చుచుండెను, పాపురపు రెక్కల మీద ఆయన వచ్చెను. "ఈయనే ఆయన," అని చెప్పెను. కల్వరిలో ఆయనను కొట్టునంత వరకూ, ఈ మహోన్నత కళాఖండమును చూచి ఆయన ఎంతో చలించిపోయెను. అ పరిపూర్ణముగా యున్న మనందరి కొరకు ఆయన చనిపోయెను. ఆయన చిందించిన రక్తము ద్వారా ఎన్నో మహోన్నత కళాఖండములు పుట్టునట్లు చేసెను, ఆయన వధువు. మహోన్నత కళాఖండమునకు గాయములయ్యెను, ఎందుకనగా అట్టి మహోన్నత కళాఖండమును చూచి దేవుడు ఉప్పొంగిపోయెను. మనందరి కొరకు ఆయన కొట్టబడెను. చూచారా? అ సంపూర్ణముగా యున్న మనలను సంపూర్ణులనుగా చేయుట కొరకు ఆయన చనిపోయెను. మహోన్నత కళాఖండము.
DEUT 16:3•
MATT 4:4•
LUKE 4:4
59ఇక్కడ ఆయన చెప్పినది చూడండి:
… ఏడు దినములు మీరు పులియని దానిని తినవలెను…
రొట్టె అనగా యేసుకు సాదృశ్యము, "మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, ప్రతి మాట వలన జీవించును." ఒక మాటను నమ్ము శాఖను నమ్ముట కాదు. కానీ దేవుని వాక్యమే పరిపూర్ణము! వాక్య రూపములోయున్న దేవుడే దానిని "విత్తనము" అని పిలచెను. ఆ వాక్యములో కల్థీలేని సరైన విశ్వాసముంచినట్లయితే, ఆ విత్తనము జీవమును పొందును.
రాత్రులందు ఆత్మల వివేచనలో మీరు దానినే గమనించగలరు, మరియు ఈ యొక్క అన్ని విషయాలు, ఎందుకంటే అది దేవుడు చేసిన వాగ్దానము. ఆయన నా ప్రక్కన నిలబడి ఇట్లు చెప్పెను, "నకిలీ వారు లేచెదరు, కాని నీవు నిలకడగా యుండుము." దానిని నేను నమ్ముచున్నాను. స్వార్థపూరిత ఉద్దేశ్యము ఏదియూ లేదు, ఎవరినీ గాయపరచవలెనని కాదు, కానీ దేవునికి గౌరవము చూపుచున్నాను. ఆయన నన్ను చేయమని అడిగిన పనిని చేయుచున్నాను. అందుకే ఈ సంగతులు చెప్పుచున్నాను. దానిని దేవుడు ధృవీకరించుచున్నాడు, దానిని సత్యమని బయలుపరచుట ద్వారా బలిని అర్పణను స్వీకరించుచున్నాడు. దానికి తిరుగు ప్రశ్నే లేదు! ఆ వాక్యమును ఇప్పుడు చూడండి!
60ఇక్కడ మనము "ఏడు దినములను" గమనించాము, ప్రతి సంఘ కాలమునకు అది చెందును. మనందరిని విమోచించుటకు తిరిగి లేచునట్లుగా ఆ మహోన్నత కళాఖండము చనిపోవలెను. ఆయన ఒక సంఘమును పెంతెకోస్తు దినమున ఏర్పరచెను. కాని ఆ సంఘము ఒక బలిని ఎదుర్కొని వెళ్ళవలసియుండెను; మరియు రోమా ప్రపంచము దానిని చంపి భూమిలో పాతిపెట్టెను.
ఒక గ్రంథ రచయిత నన్ను చాలా అపహాస్యము చేసి వ్రాసెను, "అన్ని దయ్యములు విలియం బ్రెన్హాంలోనే యున్నవి." చూడండి, దయ్యము ఆ విధంగా ఆలోచించుటకు ప్రయత్నించును. "దర్శనములు మరియు ఈ సంగతులన్నియూ అపవాదికి సంబంధించినవని చెప్పెను. ఒక రకమగు హిప్నటిజంతో, అతీత ఊహా జ్ఞానముతో నేను పనిచేయుచున్నానని వ్రాసెను." మేధావులు ఎప్పుడూ ఆ విధంగానే దానిని గూర్చి తలంచుచున్నారు.
MATT 21:23-25,27•
MARK 11:28-30,33•
MARK 12:34•
LUKE 20:2-4,7,8,40•
HEB 1:1
61యేసును వారాలాగే అన్నారు. "ఈ క్రియలు నీవెట్లు చేయుచున్నావు?" ఏది ఈ క్రియలను చేసెను?
"నేను ఒక ప్రశ్న అడుగుదును. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సేవ దేవుని నుండి వచ్చినదా? మానవుని నుండి వచ్చినదా?" అని ఆయన ప్రశ్నించెను.
"మేము చెప్పలేము," అన్నారు.
"నేను కూడా మీతో చెప్పను," అన్నాడు. ఆ తరువాత నుండి ఎవరూ ఆయనను ఏమియూ అడుగలేదు. చూచారా? వారిని కోసెను, దానిగూర్చి ఆయన వారితో ఏమీ చెప్పలేదు. ఆయనకు చేయవలసిన పని ఒకటున్నది మరియు దానిని ఆయన పూర్తి చేసెను.
అది చేయుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక దయ్యముల ప్రశ్నలకు మనము జవాబు చెప్పవలసిన పనిలేదు. నీవు సువార్తకు, బోధకు, బాధ్యత వహించవలసియున్నావు. అంతే! అదెట్లు వ్రాయబడినదనవద్దు, దానిని చెప్పవలసిన పని నీది.
నీవు సేవకునివైనచో, నీవు ప్రవక్తవైనచో, నీవు దేవునికి బాధ్యుడవు. దర్శనములు ఈ లేఖనములను వెలిగించి వాటిని మీకు చూపించును. బైబిలులో ఉన్న ప్రతి మాటకు నీవు బాధ్యత వహించవలెను, ఎందుకనగా అది నీలాటి వారివలెనె వ్రాయబడెను. "పురాతనమందు దేవుడు ప్రవక్తలను కదిలించి పరిశుద్ద బైబిలు వ్రాయించెను. "చూచారా? నిజమగు ఏ ప్రవక్తయు దేవుని ఒక్క మాటను కూడా నిరాకరించడు, కానీ ప్రతి మాటను నమ్మిదానిని బోధించును. అది వాగ్దానము చేయబడినరీతిగా నెరవేరునట్లు చేయు బాధ్యత దేవునిది. విత్తనము ఎదుగును.
62ఇప్పుడు తిరిగి గమనించండి, ఏడు దినములు వీరు ఆ రొట్టెను తినవలెను, ఆ ఏడు సంఘ కాలములు గుండా, ఇప్పుడు అది చనిపోయి భూమిలోనికి వెళ్ళవలెను.
నా గూర్చి విమర్శించిన వాడు ఇట్లనెను, "చీకటి యుగములలో తల్లులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు సింహములకు ఎరగా చేయబడిరి, స్త్రీలను దిగంబరముగా సిలువల మీద వ్రేలాడదీసిరి, కన్యకలను సింహములచే చీల్చునట్లు చేసిరి, వారు యధార్థపరులు, మరి మీరు ఆరాధించుచున్న దేవుడు వారినెందుకు ఆ విధంగా చంపించెను. పరలోకమందు సింహాసనము మీద కూర్చొనియున్నాడని మీరు చెప్పుచున్న దేవుడు దానిని చూచి ఆనందించెనా?" అని చెప్పెను.
చూడండి, అది అపవాది యొక్క తెలివిగల మాట. అతడు ఆత్మ సంబంధి అయియుండినచో, గోధుమ గింజ భూమిలో పడి చావవలసియున్నదని ఎరిగియుండెడివాడు. రోమను కెతెడ్రల్ లో అది పాతిపెట్టబడవలెను.
HAB 2:4•
ROM 1:17•
GAL 3:11•
HEB 10:38
63కానీ ఆ చిన్న జీవపు చిగురు మార్టిన్ లూథరు సంస్కరణలో వచ్చెను. "మత గురువు దీవించి ఇచ్చిన రొట్టె ముక్క వలన నీతిమంతుడు జీవించడు గాని, దేవుని వాక్యము వలన జీవించును." "నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రదుకును." గోధుమ గింజ ఎదుగనారంభించెను.
ఆ తరువాత జాన్వెస్లీ వచ్చి దానికి మరికొంత కలిపెను. (చాలామంది వచ్చారు… జ్వింగ్లీ తదితరులు వచ్చి కన్యక ద్వారా పుట్టుటను కాదనిరి, అది చనిపోయెను). ఆ తరువాత మెతడిస్తు వచ్చెను, కాండము, అది మిషనెరీ దినము. వారు శుద్దీకరణను బోధించిరి; కాండము పెరుగసాగెను.
ఆ తరువాత పొట్టు రూపములో పెంతెకోస్తు వచ్చెను, ఏర్పరచబడిన వారిని మోసము చేయ ప్రయత్నించినది. నిజమగు గోధుమ గింజవలె కనిపించెను. కాని తెరచి చూడగా, అందులో గింజ లేదు. కాని పొట్టు ద్వారా జీవము దాటిపోవుచున్నది.
64ఒక గొప్ప కూటము జరిగిన మూడు సంవత్సరములకు ఏమి అవునో మీరెరుగుదురా? ఒక శాఖ పుట్టును. ఇది వచ్చి ఇరవై సంవత్సరాలయినా శాఖ ఏర్పడలేదు. ప్రియ మరణించుచున్న గొర్రెపిల్లా, అదెన్నడూ జరుగనీయవద్దు. నేను ఈ తరములో గతించి పోయినా గాని, ఈ వర్తమానము కొరకు నిలబడిన జనులు ఒక శాఖగా దీనిని తయారు చేయకుందురు గాక! ఆలాగు చేసిన వెంటనే మీరు చనిపోయెదరు. అది గుర్తుంచుకొనండి! మీ మధ్య శాఖ గూర్చిన ఆలోచనే రాకూడదు. మీరెంత యధార్థముగా ఉన్నారన్నది నాకు వద్దు. ఈ వాక్యమును సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మకు బదులుగా మీరు ఒక మానవుని నాయకునిగా ఎన్నుకొన్న ఘడియలోనే మీరు చనిపోయెదరు! నిజమగు విత్తనము చావదు, ఎందుకనగా అది ముందుండిన గింజవలె యుండును. గోధుమ గింజను తిరిగి భూమిలో నుండి తీసికొని వచ్చుటకు వధువు భూమిలో పడెను.
DEUT 16:3
65గమనించండి:
ఏడు దినములు నీవు పులియని రొట్టెను తినవలెను…
వధువు కూడా అంతే…
మీకు కేకలు వేయు ఆ ముసలి మెతడిస్తు తల్లులు ఉండియుందురు. ఆమె భాషలతో మాట్లాడనియెడల పరలోకము వెళ్ళదని మీరనుకొనుచున్నారు. అది అబద్ధము! నీవు నేడు కలిగియున్న పరిశుద్ధాత్మనే వారు కలిగియున్నారు, కాని అది వారికి అసాధ్యము, వరముల పునరుద్దరణ వారికి లేదు. కానీ ఏడు దినముల పాటు పులియని రొట్టెను, అనగా వాక్యమును తినవలెను. ఆ వెనుక శాఖగా మారిన వారందరూ చనిపోయిరి, అవి పొట్టువలె కాల్చబడును. కాని జీవము ముందుకు పోవుచున్నది. ఏమయినది? దళము, కాండము, పొట్టుగుండా జీవము ముందుకు పోవుచున్నది, చివరకు గింజ ఏర్పడును. లూథరును, వెస్లీని, పెంతకోస్తును తీసికొని వచ్చిన ఒకే పరిశుద్ధాత్మ పునరుద్ధానమందు వధువుతో అంతమగును.
DEUT 16:3
66"ఏడు దినములు పులియని రొట్టెను తినవలెను." వధువు మధ్య ఏ పులిసినదియు కనబడరాదు, ఏ వాక్కును చేర్చరాదు. ఒక్కమాట కలుపుట వలన భూమి మీదికి మరణము వచ్చెనని మీరు మరచిపోవద్దు. హవ్వ వల్లనే ప్రతి అక్రమ సంతానము పుట్టెను. మొదటి సంఘము, ఆదాము యొక్క మొదటి పెండ్లికుమార్తె దేవుని వాక్యము సందేహించి శాఖను, తెలివిని, జ్ఞానమును అంగీకరించినది; ఎందుకనగా హేతుబద్ధంగా ఆలోచించినది. "నిశ్చయంగా దేవుడు మంచివాడు," అనుకొన్నది. దేవుడు మంచి దేవుడే గాని దేవుడు న్యాయవంతుడు కూడా. ఆయన మాటను మనము గైకొనవలెను. హవ్వ దానిని అంగీకరి౦చెను.
ఇక్కడే కొందరు సెమినరీ వారు తప్పిపోవుచున్నారు, వారి జీవితములో పిలుపున్నది నిజమే, కానీ మీరు ఒక బైబిలు స్కూలుకు వెళ్ళి దానిలో ఉన్నదానిని నేర్చుకొనుచున్నారు; అక్కడే మీరు చనిపోవుచున్నారు. దేవునితోను, ఆయన వాక్యముతోను నిలచియుండుడి! వారు మిమ్మును రానివ్వరు. మరియు వారి సంస్థకు మీరు చెందరు, వారి వేదికల పైకి మిమ్మును పిలువరు. కనుక వారిని వారిది చేసుకోనివ్వండి, మృతులు మృతులను పాతిపెట్టుకోనీయండి. వాక్యమైయున్న క్రీస్తును మనం వెంబడించుదాం.
DEUT 16:4
67ఇప్పుడు, ఏడు దినముల పాటు సంఘమను వధువులో ఏదీ చేర్చరాదు. సంఘము, ఏడు దినములు.
ఇప్పుడు గమనించండి:
నీ ప్రాంతమంతటిలో ఏడు దినముల పాటు పులిసినదేదియూ కనబడరాదు. [ఈ బలి ఒక మాదిరిగా యున్నది: క్రీస్తు అను బలిలో నుండి వధువు వచ్చుచున్నది]; మొదటి దినపు సాయంకాలము నీవు బలిగా అర్పించిన మాంసములో ఏదియూ మిగిలి యుండరాదు…
సంఘ కాలములగుండా ఎట్లు మనము వెళ్ళామో చూడండి. మరో సంఘకాలము చనిపోవుచున్న కాలములోనే సంఘ వర్తమానికుడు ఎల్లప్పుడూ వచ్చును.పెంతెకోస్తు యొక్క అవసాన కాలములో వధువు ఎత్తబడుట జరుగును. చూచారా? లూథరు అవసాన దశలో వెస్లీ వచ్చెను. చూచారా? వెస్లీ అవసాన దశలో పెంతెకోస్తు వచ్చెను. పెంతెకోస్తు అవసాన దశలో ఇప్పుడు వర్తమానము వచ్చెను. దీని మాదిరి యావత్తును మనము వాక్యములో చూడగలము. బైబిలులోని ప్రతి లేఖనము ఒకదానితో ఒకటి ముడిపడును. చూచారా? ఇవన్నీ మాదిరులు. నాకు చదువు లేదు, కాని పరిశుద్ధాత్మ యున్నది, అది నాకు — ప్రకృతి ద్వారా — వాక్యమును బోధించుచున్నది. వాక్యమే ఆయన వాగ్దానమును తీసికొని వచ్చును.
.. మొదటి దినపు సాయంకాలము అర్పించిన బలి మాంసము… ఆ రాత్రి మాత్రమే ఉండవలెను.
HAB 2:4•
ROM 1:17•
GAL 3:11•
HEB 10:38
68లూథరుకు ఒక సత్యమున్నది, "నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును." దానిని సంఘమునకు అతడు బోధించెను, అదే పూర్తి బోధ అనుకొని మొతడిస్ట్ కాలములో కూడా దానిని పట్టుకొని వ్రేలాడకూడదు. నీవేమి చేయవలెను? అగ్నితో దానిని దహించవలెను. దేనికది మాదిరి?వాక్యములో నుండి బయటకు వచ్చిన శాఖలు పొట్టుకు సాదృశ్యముగా ఉన్నవి. కాండము మరియు పొట్టు అగ్నితో దహించబడును. శాఖకు సంబంధించినదేదియూ అందులో మిగిలియుండుటకు వీలులేదు, అది చావవలెను. మరో కాలము వచ్చువరకు దానిని నిలిపియుంచవద్దు, దానిని కాల్చివేయుము! ప్రతి కాలములోను వచ్చుచున్న వధువుతో, కేవలము వధువుతో, ఇక్కడ ఆయన మాట్లాడుచున్నాడు.
ఎంత చక్కగా యున్నదో గమనించండి, "గొర్రెపిల్ల రక్తము." ఇది క్రీస్తు యొక్క శరీరము, బలి, గొర్రెపిల్ల రక్తము ద్వారముల మీద యున్నది. గుర్తుంచుకొనండి, వధింపబడిన గొర్రెపిల్ల క్రీస్తుకు మాదిరి.
చాలా సమయము మనము తీసుకొనవచ్చును, కానీ నాకు సమయము లేదు, కొద్ది నిమిషములే ఇక్కడుందుము. నేను కొద్ది నిమిషములు ముగించి అది మరల ప్రారంభించెదను, ఈ రాత్రికి చెప్పెదను, చాలా ఆలస్యమయినది. ఈ ఒక్క అంశము మీద ఇరవై పేజీలు వ్రాసి తెచ్చాను.
DEUT 8:3•
MATT 4:3,4•
LUKE 4:3,4
69ఇప్పుడు చూడండి, గొర్రెపిల్ల అనగా, అలంకార రూపము అయిన క్రీస్తు. నేను దానిని సరిగానే చెప్పానా? క్రీస్తే ఆ గొర్రెపిల్ల. మన గొర్రెపిల్ల కావలెను. మొదటిగా తల్లికి పుట్టినది కావలెను. మరియు అతను ముందు పరీక్షింపవలెను, ఎందుకనగా అతని మీద ఏదైనా మచ్చయున్నదో అని చూచుట కొరకు.
ఇప్పుడు, క్రీస్తు శోధింపబడెను — కన్యయగు మరియకు జన్మించిన మొదటి గొర్రెపిల్ల. దేనిద్వారా శోధింపబడెను? సాతాను వాక్యమునకు వ్యతిరేకముగా. అది హవ్వను కొట్టగా, పడిపోయెను; మోషేను కొట్టగా, పడిపోయెను; క్రీస్తుకు విరోధముగా ఆయన దగ్గరకు వచ్చి వాక్యములను తప్పుగా వివరించెను, కాని ఆయన మోషే కాదు. చూచారా? ఆయన శోధింపబడెను. వాడిట్లనెను, "నీవు దేవుని కుమారుడవైతే అద్భుతములు చేసి చూపించు. మెస్సీయా ఆలాగు చేయునని వారనుచున్నారు. నీవు ఆకలిగా ఉన్నావు, ఏదీ తినలేదు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి తినుము."
"మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును," అని ఆయన వ్రాయబడిన వాక్యమును చెప్పెను. వాక్యములో కొంత భాగమా? కాదు. "దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను." దాని ద్వారానే దేవుడు జీవించును. చూచారా? గొర్రెపిల్ల శోధించబడెను, చూడండి ఆయన ఎక్కడనూ పడిపోలేదు.
MATT 19:17•
MATT 22:16,18•
MARK 10:18•
LUKE 18:19•
LUKE 20:21
70"ఓ రబ్బీ! నీవు యువ ప్రవక్తవు. అద్భుతమైన వాడవు. నీవు మంచివాడవు," అని పరిసయ్యులు పలికారు.
"మీరు నన్నేల మంచివాడనుచున్నారు. మంచివాడు ఒక్కడే. ఆయన దేవుడు. దానిని మీరు నమ్ముచున్నారా?" అనడిగాడు.
"అవును. దేవుడే."
"నేనే ఆయనను". ఒక్కడే మంచివాడు. నన్ను దేవునిగా మీరు నమ్మట లేదు గదా? ఎందుకు ఆయనను "మంచివాడు" అనుచున్నారు? నన్నెందుకు మంచివాడని పిలచుచున్నారు? దేవుడొక్కడే మంచివాడని తెలిసికూడా మీరెందుకు నన్ను మంచివాడని పిలచుచున్నారు? "ఏది మిమ్మును ప్రేరేపించెను?" అని ఆయన పలికెను.
"మానవుల హోదాను గాని, వైద్యుల మాటను గాని నీవు లెక్కచేయుట లేదని మేమెరుగుదుము." ఆ వేషధారిని ఆయన ఎరుగును. చూచారా?
71ఆయన ఎక్కడ నిలబడియున్నాడో అని చూచుటకు ఆయన శోధించబడెను. మనవలెనె ఆయన కూడా అన్ని రీతులుగా శోధింపబడెను. కాని ఎక్కడా ఆయన పడలేదు. లేదండీ! ఆయన దేవుని కుమారుడు.
మరియు గొర్రెపిల్లను పరీక్షించి పధ్నాలుగు దినములు బయట ఉంచెదరు, అనగా రెండు సబ్బాతులు, లేదా రెండు కాలములు. ఒకటి యూదుల కాలము, వారు గొర్రెపిల్లను మాదిరిగా అర్పించిరి; ఒకటి అన్యులకాలము, నిజమగు గొర్రెపిల్ల అర్పించబడెను. ఈ గొర్రెపిల్ల వచ్చునని నమ్మినవారందరూ పరిపూర్ణులుగా చేయబడిరి. కానీ ఆయన పధ్నాలుగు రోజులు పరీక్షించబడెను. ఆయనే వాక్యము.
మీరు పాత నిబంధనను పరీక్షించవచ్చును, "అది క్రొత్త దానిని ఖండించును," అందురు. అది తప్పు! క్రొత్తదానికి సాక్షిగానే పాతది నిలచియున్నది.
కొంతకాలం క్రిందట ఒకడు నన్ను సవాలు చేసెను, "అతనిలో ఏమున్నది? ఇతడు పాత నిబంధనలో నుండి కూడా బోధించుచున్నాడు. పాత నిబంధన గతించి పోయినది." ఒక క్రైస్తవ బోధకుడు అన్న మాటలివి. పాత నిబంధన ఒక శిక్షకుడు. గోడ మీద వ్రాయబడిన దానిని అది చూపించును, చూడండి. సరే.
EXOD 12:22•
DEUT 12:23
72ఇప్పుడు, చూడండి, క్రీస్తు పధ్నాలుగు రోజులు పరీక్షింపబడెను. ఇప్పుడు, గమనించండి, సాయంకాలమున ఆయన చంపబడెను, గొర్రెపిల్ల ఆలాగే చంపబడవలెను. క్రీస్తు కూడా మధ్యాహ్నమున చనిపోయెను. గమనించండి, అతను కూడా…
ఆ రక్తము గుమ్మపు కమ్ముల మీద ఉండవలెను, అది జంతువు యొక్క ప్రాణము. "నీవు మాంసము తినవచ్చును గాని, దానియొక్క ప్రాణమగు రక్తమును పారబోయవలెను." చూచారా? ఆ రక్తమును ఇంటి యొక్క ద్వారబంధపు కమ్ముల మీద ప్రోక్షించవలెను. బలిని అక్కడ అంగీకరించును. మహిమ! ప్రాణమేమిటి? నామము. తలుపు యొద్దకు వెళ్ళి చూచినయెడల, ఆ యజమాని పేరు కనబడును. మరియు మనము ఇంటియొక్క గంట మ్రోగించక ముందే యజమాని పేరు చూచెదము. చూచారా? ద్వారబంధపు కమ్ముల మీద రక్తము చల్లవలెను, లోనున్న బలికి అది మాదిరి.
ఆరాధనా స్థలమును మనము కనుగొనబోవుచున్నాము, అక్కడ నుంచే, ఆ రక్తము గుండా రావలెను. గమనించండి, తలుపు మీద ఉన్న రక్తము లోపట ఉన్నవాని పేరును గూర్చి చెప్పచున్నది. వాక్యమైయున్న గొర్రెపిల్లయే మన ఆరాధనా స్థలము. అది మనకు తెలియును.
DEUT 16:4
73ఇప్పుడు, 4వ వచనము గమనించుము, "రొట్టె గాని, బలిలో ఏదీ గాని మిగిలియుండుటకు వీలులేదు." ఒక కాలము నుండి మరో కాలమునకు తీసికొని పోరాదు.
"మేము లూథరనులము," అని నీవందువు. నీవు వెస్లీ కాలములో జన్మింపవలెనన్నచో, లూథరను కాలమునకు నీవు చనిపోవలెను. పెంతెకోస్తు యుగములో జీవించవలెనన్నచో, వెస్లీ కాలమునకు నీవు చనిపోవలెను. మరియు పెంతెకోస్తు యుగమునకు నీవు చనిపోవలెను, ఏమియూ మిగల్చకుండా కాల్చివేయవలెను, పొట్టును కాల్చినట్లు కాల్చవలెను. కాండమువలె నున్న శాఖ, కాల్చబడవలెను. కాబట్టి క్రొత్త వర్తమానములోనికి నీ శాఖను తీసికొని రావద్దు. ఇది ఇప్పుడు వాక్యము. శాఖ అనగా విభజింపబడినది. అది వాహకముగా పని చేసిన మాట నిజమే, కాని దాని పని అయిపోయినది. వాక్యము ముందుకు పోవును. అవును, వాక్యము ఆగిపోక సాగును.
DEUT 16:5,6
745 మరియు 6వ వచనములు చూడండి.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు.
పురములలో కాదు. ఈ శాఖలను దేవుడు ఉండనిచ్చును, అవి "పురములు."
నీ దేవుడైన యెహోవా, తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకొను స్థలములోనే.
DEUT 16:6
75"ప్రతి ఉదయం నేను మెతడిస్తు పురములోనికి వెళ్ళుచున్నాను." "ప్రతి ఉదయము నేను కాథలిక్కు పురములోనికి వెళ్ళుచున్నాను," అని నీవు చెప్పవచ్చు. అది చర్చి. ఆ పురములలో ప్రవేశించి బయటకు వచ్చుటకు దేవుడనుమతించును. కాథలిక్కు చర్చిలో, మెథడిస్టు చర్చిలో, ప్రెస్బిటేరియను చర్చిలో పెంతెకోస్తు చర్చిలో దేవునికి జనులున్నారు, కాని ఆ పురములలో నీవు దేవుని ఆరాధించరాదు. చూచారా? దేవునికి ఒక ప్రత్యేక చోటున్నది. మహిమ! ఆయనకు ఒక పురమున్నది.
నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించవలెను.
GEN 24:63,64
76రిబ్కా ఎప్పుడు ఇస్సాకును కనుగొన్నది? ఎలియాజరు ఎప్పుడామెను పెండ్లి కుమార్తెగా పిలచెను? సాయంకాలము!
సాయంకాల మందు వెలుతురుండును,
మహిమ బాటను నిశ్చయంగా నీవు కనుగొందువు;
నీటి మార్గమే నేటి వెలుగు,
యేసు ప్రశస్త నామములో పాతిపెట్టబడుము;
వృద్దులు, యవ్వనులు అందరూ పాపములకు పాశ్చాత్తాప పడుడి,
పరిశుద్ధాత్మ నిశ్చయముగా ప్రవేశించును;
సాయంకాల దీపములు వచ్చినవి,
దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే సత్యము.
అది దానికి ప్రారంభము. ఆమె పెండ్లికుమార్తె వెలుగులోనే నిలచియున్నది. నా భావము గ్రహించారా?
77ఇక్కడ ఆపి, రాత్రికి ప్రారంభించుట మంచిది, ఎందుకనగా మీరు దీనిని కోల్పోవద్దు, మీరు చూచారా. లేదు, లేదు, ఇది రాత్రి భోజన సమయము. మంచిది, ఇక్కడ చాలా వ్రాసినది యున్నది. ఓ, మై! ఈ రాత్రికి బాగుండునా? నిశ్చయంగా? కొద్ది సేపు చెప్పుచుందురా? మంచిది, ఇంకొద్ది ముందుకు వెళ్ళి ముగించుదము. బాగున్నదా?
DEUT 16:5,6•
JOHN 10:7,9
78"ప్రభువు నీకిచ్చిన స్థలములోనికి తప్ప మరే చోటికి నీవు వెళ్ళరాదు, ప్రభువు తన నామమును దానికి పెట్టెను." ఆ పురములలోనికి వెళ్ళరాదు. కదా? దేవుడు తన నామమును ద్వారము వద్ద పెట్టబోవుచున్నాడు. ఆ చోటు మాత్రమే ఆరాధనకు పాత్రము. నీ బలిని మరే ఇతర పురములలోనికి తీసికొని వెళ్ళరాదు, కానీ ప్రభువగు దేవుడు తన నామము నుంచుటకై ఆ చోటును ఏర్పరచుకొనెను. చూచారా?
ఇప్పుడు, అతడు అది చేసెనా? ఆ గుమ్మము ఎచ్చటున్నది? యోహాను సువార్త 10లో ఆయనీలాగు చెప్పెను, "గుమ్మమును, ద్వారమును నేనే. దేవుని మందిరమునకు ద్వారమును నేనే." మేకలు పోవు ద్వారము కాదు, గొర్రెలు పోవు ద్వారమును. చూచారా? "గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఇందులో ప్రవేశించిన వాడు క్షేమముగా ఉండును."
79దానిగూర్చి ఇలా చెప్పుకోవచ్చును. కాని సమయము చాలదు, కానీ సమయము ఆదా చేసుకొనుటకు, గొర్రెలు పోవు ద్వారము ఆయనే. ఇక్కడ మనము గమనించవలెను. ఛాయలు మరియు మాదిరులు ఇక్కడ చూడండి, అది చెప్పవలెనన్న కొంత సమయము కావలెను.
సరే, చూడండి, యేసు క్రీస్తు పూర్తిగా మనకిందులో కనబడును. పాత నిబంధనంతయూ ఆయనకు మాదిరి. పండుగలు, బలులు అన్నీ ఆయనకే మాదిరి. వీటిని వివరించవలెనని లేఖనములను వ్రాసికొని తెచ్చాను, కాని చాలా సమయము పట్టును. పండుగలు, అర్పణలు క్రీస్తుకు సాదృశ్యములు. మనము కేవలము ఒకటి చూద్దాం.
80ప్రవక్తల పాఠశాల అనెడిది ఆ కాలములో ఒకటుండెను, చదువుకొన్న ప్రవక్తలకు వారందులో శిక్షణ ఇచ్చుచుండిరి. వారిని దర్శించుటకు ఒకసారి నిజమగు దేవునిచే పలుకబడిన ప్రవక్త వెళ్ళెను. ఆ వృద్ధ ప్రవక్తకు వారు గౌరవము చూపగోరిరి, అందులో ఒకడు వెళ్ళి కొన్ని కూరాకులను కోసికొని వచ్చెను, అవి మంచివే అనుకొనెను; కాని అవి పిచ్చి కూరాకులు, వాటిని వండి పెట్టగోరెను.
ఎంతో మంది సెమినరీవారు మనకున్నారు! చూడండి? వారేదో వండుచున్నారు. చూచారా? మెథడిస్తు, బాప్టిస్టు, పెంతెకోస్తవారున్నారు. వారు పిచ్చి కూరగాయలవంటి వారు. చూడండి, ప్రధాన ద్రాక్షా తీగెలో లేరు. పుల్లని చెట్టుకు సంబంధించిన వారే కావచ్చు గాని నారింజ కాయలకు బదులుగా నిమ్మకొయలు, దబ్బకాయలు కాయుచున్నారు.
2KGS 4:39-41
81మరల గమనించండి, ఏలియా వచ్చి వారిని చూచెను, మరియు ఆ విషపు కూర తిన్నచో అందరూ మరణించెదరు. వారందరూ "కుండలో విషమున్నది," అని కేకలు వేసిరి.
"కొంత గోధుమ పిండిని తీసికొని రండి," అని అతడు చెప్పగా, వారు తెచ్చిరి. దానిని ఆ కుండలో వేసి, "ఇప్పుడు తినుడని చెప్పగా, వారు తినిరి." మరణము జీవముగా మారినది.
ఆ పిండి క్రీస్తే, ఆయనే ఆ బలి. గోధుమలు పిండిగా చేయబడును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడని అది చూపించుచున్నది. నీ శాఖలో ఆయనను ఉంచినచో, అది బ్రదుకును. వాక్యము! క్రీస్తే ఆ వాక్యము! ఆలయము. మందసపు రొట్టె అన్నియూ ఆయనే. విరువబడిన రొట్టె విరుగగొట్టబడిన ఆయన శరీరమే. దానినే యూదులు వివరించలేకపోయిరి. చూచారా? అన్నియూ ఆయనకు మాదిరులు.
82ఇప్పుడాయనను మనము చూచుచున్నాము. శాఖలు, ఆచారములు విడిచి పెట్టబడినవి. ఆయనే దేవుని యొక్క పవిత్రమగు మారని వాక్యము, అదే పులియని రొట్టె. యోహాను 1. అది సరియే. ఆయన పులియని రొట్టె. నీవు పులిసిన దానిని దానికి కలుపరాదు.
ఇటు చూడండి. నేడు జాతిని చంపునది ఏది? వారు సంకరము చేయుచున్నారు. సంకరము చేసినచో అది చనిపోవును. ఓ! అది చాలా అందముగా కనబడును. నిశ్చయంగా! సంకర జాతి మొక్కజొన్న, పప్పులు చాలా బలంగా కనబడును. అసలు దానికంటె రెండు రెట్లు పెద్దగా నుండును. పెద్ద వెన్నులు కాయును. కాని అది మరణము! దానిని సైన్సు కూడా కనుగొనెను. సంకరము చేసినచో, మరణము వచ్చును.
83ఇక్కడ ఒకటి చూపించెదను. ఒక రోజున మా ఆవరణలోని మొక్కలకు నీరు పోయుచున్నాను. ఇంటి ప్రక్కనున్న ఒకామె కొన్ని సంకరజాతి పూలకుండీలు ఇచ్చినది. వారానికి కనీసము మూడుసార్లయినా వాటికి నీరు పోయవలెను. లేనిచో అవి చనిపోవును. అసలు మొక్క ఆ ఆవరణలోయున్నది. ఆరు నెలలు నుండి వర్షము లేదు. వర్షము పడినయెడల, పది నిమిషములలో దాని మీది ధూళిపోవును. నీరు పోసిన సంకర జాతి మొక్కల కంటె, నీరు పోయని ఆ అసలు జాతి మొక్కలే బలంగా, అందంగా నిలబడి కనిపించినవి. నీళ్ళు పోయనిచో, సంకర జాతి మొక్కలు చనిపోవును. కాని వీటికి నీరు ఎక్కడనుండి వచ్చుచున్నది? మరో సంగతి. ఆ సంకర జాతి మొక్కలకు ఎప్పుడూ మందు చల్లవలెను, లేనిచో పురుగులు పట్టును. అది చాలా మృదువుగా, మెత్తగా ఉండును గనుక చీడ తినివేయును. కాని అసలు మొక్క పైన ఒక్క చీడ పురుగు కూడా లేదు. దాని మీదికి ప్రాకి వెళ్ళినా గాని మరల వచ్చును. అది అసలు మొక్క! సంకరమువలన ఎన్ని అనర్ధములో చూడండి?
84సంఘము కూడా ఆలాగే యున్నది. వారు శాఖను, వాక్యమును మిశ్రమం చేయుచున్నారు. శాఖ చెప్పినట్లుగానే వాక్యము చెప్పుచున్నదని వారు అనుచున్నారు. పురుగు మందులు చల్లుచున్నారు, గారాబము చేయుచున్నారు, ఆదివారపుబడికి వచ్చుట కొరకు బంగారు నక్షత్రములు ఇచ్చుచున్నారు. అసలయిన తిరిగి జన్మించిన క్రైస్తవుడు, దేవుని వాక్యముతో పుట్టినవాడు కరకుగా యుండును, దేనినయినా తట్టుకొనును. లోకపు సంగతులు చీడ అతనిని అంటుకొనవు. అతడు పక్షిరాజు, విశాల ఆకాశములో విహరించును. చూచారా? ఇది నిజము.
85గమనించండి. ఇక్కడ ఒకటి మనము తప్పక గ్రహించవలెను. పులిసిన రొట్టెకు కలిపినట్లుగా పులియని రొట్టెకు శాఖను గాని, ఆచారములను గాని కలుపరాదు. మరియు బైబిలు ఇక్కడ ఛాయగా బలిని చూపించుచున్నది. ఆరాధనలోనికి వెళ్ళుచున్నాము, కనుక నీతో పులిసినదేదియూ తీసికొని వెళ్ళరాదు మరియు పులియని దానినే దేవుడు చేర్చుకొనును.
"నేను మెతడిస్తును," అని నీవందువు. అక్కడే నీవు చనిపోయావు! "నేను పెంతెకోస్తును." నీవు చనిపోయావు.
నేను క్రీస్తుకు చెందియున్నాను. అది సరే. నీవు ఒకదాని మీద నిలబడవలెను. నీవు దేనిమీదనో నిలబడియున్నావు.
చర్చిల్ ఒకసారి రెండు వ్రేళ్ళు పైకి చాపి, "మనం విజయం పొందాము," అన్నాడు. ఇంగ్లాండు చర్చిల్ను నమ్మి, అతని పక్షము వహించినది.
ఈ ఉదయము నీవు నమ్ము నమ్మకపో, నీవు ఒకదాని మీద నిలబడియున్నావు. నీవు నిలబడుటకు, జీవించుటకు ఒకే ఒకటున్నది. అది వాక్యమైయున్న క్రీస్తు. నిజము!
86చూడండి, బైబిలులో శాఖలకు మాదిరి బబులోను తప్ప మరేదియూ లేదు. బబులోనును నిమ్రోదు స్థాపించెను, మరియు నిమ్రోదు ఒక అల్లరివాడు. కొందరు స్త్రీలను తన రాణులునుగా అతడు ఎంచుకొనెను, వారిలో ప్రవక్తిని యుండెను. బిలాము అందులో నుండియే వచ్చెనని వారు చెప్పెదరు. వారెట్లు ఆరాధించిరో మీరెరుగుదురు, (హిస్లోప్ యొక్క రెండు బబులోనులు మీలో చాలామంది చదువుచుండవచ్చును. మరియు సంఘ చరిత్ర చదివియు౦దురు), స్త్రీ దేవతను వారు పూజించి జనులను బలవంతముగా అందుకు ప్రేరేపించిరి. నిమ్రోదు నాయకత్వము క్రింద బబులోనులోని గోపురము యొద్దకు బబులోను చుట్టూయున్న పట్టణముల వారందరూ బలవంతముగా తీసికొని రాబడిరి. చూడండి? అది సరే. అది ఒక బలవంత మతము. అక్కడే గందరగోళము పుట్టెను.
నేడు సంఘము ఆలాగేయున్నది. "నీవు ఆదివారపుబడికి రానియెడల, నీవు ఇది చేయనియెడల, అది చేయనియెడల నిన్ను అసలు ఇందులో ఉండనివ్వము, లేదా ఆ పలాన పని చేయవలసియుందువు," అనుచున్నారు.
87టుసాన్లోని వారు ఈ ఉదయము వినుచున్నారు. నేనెల్లప్పుడూ జనులకు ఈలాగు చెప్పుచుందును, "చర్చికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఫరవాలేదు." కాని కొందరు ఎచ్చటికీ వెళ్ళరు. "వారి సంగతి ఏమిటని" నేను అనుకొన్నాను.
నేను వారిలో కొందరి యొద్దకు వెళ్ళాను, "మొదటిసారి వారి యొద్దకు నీవు వెళ్ళగానే "వారు నిన్ను తమ సంఘములో చేరమని కోరుదురు," లేనియెడల వారు నిన్ను చేర్చుకొనరు." చూచారా? అది ఒక బలవంత కార్యము. నిన్ను బలవంతము చేయుదురు. చూడండి, అదే బబులోను. కాని క్రీస్తులోనికి, నీవు ఎన్నిక ద్వారా వచ్చెదవు, బలవంతముగా కాదు. నీ హృదయమే నిన్ను లాక్కొని వచ్చును.
"బబులోనులో దేవుడు తన నామమును నుంచడు," అని దేవుడు చెప్పాడు. శాఖల వారు ఆయన పేరును ఉంచిరి గాని ఆయన ఎన్నడూ వాటిలో యుండడు.
DEUT 16:2,6
88ఇప్పుడు మీరు నన్ను, "సహో, బ్రెన్హాం" కొంతసేపు ఆగమని చెప్పెదరు. ఎంతసేపు మీరు నన్ను చెప్పమన్నా గాని నేనిదే చెప్పెదను. వారే ఆయన నామమును అచ్చటుంచిరి గాని, ఆయన అక్కడ దానిని ఉంచలేదు.
"నిన్ను కలిసికొనుచోటు, నీ బలిని స్వీకరించుచోటు అదే. దానిని నేను నా నామము పెట్టుటకు ఎన్నుకొనియున్నాను. నీవు ఈ గుమ్మములోనికి రావలెను. నా నామమునుంచుటకు ఎన్నుకొనిన ఈ ద్వారము ద్వారా రావలెను," అని ఆయన చెప్పెను.
"ఇది క్రీస్తు సంఘము" అని వారందురు. ఆ మాటలో ఒక్క మాట వారు వదిలి వేసిరని నేను చెప్పెదను: "విరోధి." ఆయన చెప్పిన దానంతటినీ వారు వ్యతిరేకించెదరు. ఆధునిక పరిసయ్యులు.
JOHN 5:43
89ఆయన తన పేరును ఎక్కడ పెట్టెనో చూద్దాం, ఎందుకనగా అందులో మాత్రమే ఆయనేర్పరచుకొనిన ద్వారమున్నది. ఆమేన్! మహిమ! గమనించండి! ఆయన తన పేరును ఎచ్చటుంచెను? తన కుమారునిలో
"బ్రెన్హాం సోదరుడా అది కుమారుడు. తండ్రి కాదు గదా!" అని మీరందురు.
కుమారుడెల్లప్పుడూ తండ్రి నామమునే కలిగియుండును. ఈ భూమి మీదికి నేను బ్రెన్హాం నామములో వచ్చాను, ఎందుకనగా నా తండ్రి బ్రెన్హాం.
"నేను నా తండ్రి నామములో వచ్చియున్నాను, మీరు నన్ను చేర్చుకొనలేదు," అని యేసు చెప్పెను. ఆ లేఖనము కావలెనా? యోహాను 5:43. చూచారా? "నేను నా తండ్రి నామములో వచ్చాను, మీరు నన్ను చేర్చుకొనలేదు." తండ్రి తనయొక్క స్వంత నామమును కుమారునికి పెట్టెను. అది "యేసు" ఆయనే మార్గము, ఆయనే ద్వారము, ఆయనే ఇల్లు, అక్కడే దేవుడు తన నామము నుంచుటకు ఏర్పరచుకొనెను. దేవుడు నాలో తన పేరు నుంచలేదు, ఏ చర్చిలోను ఆయన తన పేరు నుంచలేదు, మెథడిస్టు, బాప్టిస్తు, కాథలిక్కు శాఖలలో తన పేరునుంచలేదు, కాని ఆయన అభిషిక్తుడగు ఇమ్మానుయేలగు క్రీస్తులో తన నామమునుంచెను.
MATT 16:17,18
90వాక్యములో నామమున్నది, ఎందుకనగా ఆయనే వాక్యము. ఆమెన్! అయితే ఆయన ఎవరు? అనువదింపబడిన వాక్యమే దేవుని యొక్క బయలుపరచబడిన నామము. "రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని, పరలోకమందున్న నా తండ్రి నేనెవరో నీకు బయలుపరచెను. మరియు ఈ బండ మీద నా ఆరాధనా స్థలమును నేను నిర్మించెదను, పాతాళలోక ద్వారములు దానిని కదల్చలేవు." ఆమెన్. ఓ, సజీవ దేవుని సంఘమా, యేసుక్రీస్తు అను గట్టి పునాది మీద మాత్రమే నిలబడుము. నీవు పాట పాడవచ్చును, కాని వాక్యమైయున్న క్రీస్తు మీద నీవు లేనియెడల నీవు కులిపోవుచున్న ఇసుక మీద ఉన్నట్లే. "కాని ఈ బండ మీద, క్రీస్తు, నా మాట."
91ఆయన లూథరాను వర్తమానమును నిర్మించెను మరియు వారు దానిని వారు శాఖగా మరచిరి. అది ఎదుగుచున్నది, పాద పీఠము. ఆ తరువాత ఆయన కాలు భాగముగా ఎదిగెను, అది మేతడిస్ట్. ఆయన తన వాక్యము మీదనే సంఘమును నిర్మి౦చెను. ఆయన పూర్తిగా కాలు కాదు, ఆయన శరీరము; ఇప్పుడు పైకప్పు వచ్చుచున్నది. మీరు పిరమిడ్ లో గమనించారా… పిరమిడ్ మతము నేను బోధించుట లేదు.
కాని మొదటగా ఆకాశములో బైబిల్ వ్రాయబడెను. [టేపు పై ఖాళి యున్నది.] దానిని మీరు గమనించారా? రాశి చక్రములో మొదటిది కన్య. చివరిది సింహముగా వచ్చును. దానికి ముందు కొన్ని కాలములున్నవి. మనకు సమయము ఉన్నచో దానిని మనము ఆలయములో చెప్పుకొందుము.
JOHN 10:9•
2PET 1:5-7
92మరియు పిరమిడ్ వాటికీ ఒక పునాదిగా యుండి, రాజ గదిలోనికి వెళ్ళును. ఏడవ గోడను నీవు తాకు ముందుగా, ఒక పరిచయ పలుకు వ్రాయబడిన అట్ట యున్నది. అక్కడికి ఒక వర్తమానికుడు వచ్చి నిన్ను రాజు దగ్గరకు తీసుకోని వెళ్ళును — రాజును పరిచయము చేసినవాడు పాప్తిస్మమిచ్చు యోహాను. కాని తలరాయిని విసర్జించిరి. అదెక్కడున్నదో ఎవరికీ తెలియదు, ఎందుకనగా అది విసర్జింపబడిన రాయి. కాని పిరమిడ్ ను సంపూర్తిగా చేయు రాయి అదే, అది ఏడు సంఘ కాలములను పూర్తిచేయును. క్రుపను, ఇంకా ఏడింటిని కలుపండి, చివరిగా క్రీస్తు౦డును. ప్రేమ, కృప, మొదలగు వాటన్ని౦టిని కలిపిన తరువాత తల రాయి యగు క్రీస్తు వచ్చును. "నేనే ద్వారము."
JOHN 5:43•
JOHN 14:19
93ఇప్పుడు, కుమారుడెల్లపుడూ తండ్రి నామములో వచ్చును. ఏ కుమారుడైనా గాని తండ్రి పేరులోనే వచ్చును. మరియు యేసు చెప్పెను, "నేను నా తండ్రి నామములో వచ్చియున్నాను." అయితే తండ్రి పేరు ఏమిటి? కుమారుని పేరు ఏమిటి? "కొంతకాలమైన పిదప ఈ లోకము నన్ను చూడదు గాని మీరు నన్ను చూతురు," అని ఆయన చెప్పెను. మరియు గుర్తు౦చుకొనండి, "మరియొకడు వచ్చును," అని కూడా ఆయన హెచ్చరించెను. అది ఒక శాఖ. ఒక ఆచారము. "వారు వారి నామములో రాగా మీరు చేర్చుకొనిరి, మీరు నన్ను చేర్చుకొనరు. వాక్యము మీ ఎదుట బయలుపరచబడి రుజువైనది."
JOHN 5:43
94మరియు గుర్తుంచుకొనండి, "మరియొకడు వచ్చును," అని కూడా ఆయన హెచ్చరించెను. అది ఒక శాఖ, ఒక ఆచారము. "వారు వారి నామములో రాగా, మీరు చేర్చుకొనిరి. మీరు నన్ను చేర్చుకొనరు, వాక్యము మీ ఎదుట బయలుపరచబడి రుజువైనది."
ఆయన ఆనాడున్నట్లే, ఈనాడును యున్నాడు. దేశములో ఉన్న జనులారా, దీనిని మరువవద్దు. "మరొకడు, మరొక సంఘము వచ్చును మరియు దానిని మీరు నమ్ముదురు, ఎందుకనగా మీరేమయినా చేయవచ్చును. దానిని నేను బయలుపరచను." ఇయ్యబడిన వర్తమానమునకు బయట ఆయన దేనినీ బయలుపరచడు, ఏ సమయములోనయినా అంతే. లూథరు యొక్క నీతీకరణము, వెస్లీ యొక్క శుద్దీకరణము; పెంతెకోస్తు యొక్క వరముల పునరుద్ధరణ, వారు దానిని శాఖగా చేయగానే చనిపోయిరి. లేఖనములను పరిశోధి౦చండి.
DEUT 16:2,6•
ISA 7:14•
MATT 1:23•
JOHN 1:1•
JOHN 5:43
95"నా నామము నుంచుకొనుటకు స్థలమును ఎన్నుకొందును," అని ఆయన చెప్పెను. ఆ నామము యేసు. వాక్యమే యేసు, యోహాను 1 కదా? వాక్యమైయున్న క్రీస్తులోనే ఆరాధనా స్థలమున్నది. "నేను నా తండ్రి నామములో వచ్చియున్నాను."
"ఆయన పేరు ఇమ్మానుయేలు," అని ప్రవక్త చెప్పెను. మత్తయి 1:23, మీరు వ్రాసికోవచ్చు. యేసు, యొహోవా, రక్షకుడు.
ఆయనే ద్వారమని 5వ వచనము చూపించుచున్నది. ఇంకా చాలా కనబడని రుజువులున్నవి. మానవుని దేవుడు కలిసికొను చోటు ఒకే ఒకటియున్నది, అది క్రీస్తులోనే. ఆ ద్వారము, నామము, చోటులోనే ఆరాధన చేయవలెను.
"ఆయన లోనికి ఎట్లు వెళ్ళగలము?" అనేది ఇప్పుడు ప్రశ్న. ఇది కొద్దిగా కష్టమే. రోగము లేనిచో మందును రోగికి వేయుట కష్టమే, కాని బాగుపడవలెనన్నచో, మందు అవసరము. చూచారా?
1COR 12:13
96ఇప్పుడు, లూథరన్లు ఒక మార్గమును చూపుచున్నారు, అది లూథరన్ సంఘములో చేరుట ద్వారా అందురు. చప్పట్లు కొట్టుట ద్వారా మెథడిస్తు వారు చేరుదురు. భాషలలో మాట్లాడుట ద్వారా పెంతెకోస్తు వారు చేరుదురు. అదేదీ కాదు! అవి వరములు, I కొరింధీ 12 చెప్పుచున్నది, "ఒకే ఆత్మ ద్వారా" అని దేవుని ఆత్మ వాక్యమును జీవింపజేయునది అదియే, విత్తనము, ఆ కాలమునకు ఆ విత్తనమే బ్రదికించును.
ఇక్కడ మెతడిస్టు కాల విత్తనము పడియున్నది, దానిని జీవింపజేయుటకు పరిశుద్దాత్మను తీసుకొనెను, శుద్దీకరణ ద్వారా సంఘమును పవిత్రపరచును. లూథరు దానిని బోధించలేదు, ఎందుకనగా అతడది ఎరుగడు. పెంతెకోస్తు వారు భాషలలో మాట్లాడగోరిరి. అందరూ మాది గొప్ప అంటే మాది గొప్ప అనుచున్నారు. చూచారా?
DEUT 16:2,6•
PROV 18:10•
1COR 12:13•
HEB 10:16
97"కాని ఒకే ఆత్మ ద్వారా మనందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొంది యున్నాము." మరియు ఆ శరీరము ఒక కుటుంబము, అది దేవుని కుటుంబము. అది దేవుని ఇల్లు, యేసుక్రీస్తు నామమే దేవుని ఇల్లు. "యెహోవా నామము బలమగు దుర్గము, నీతిమంతులు అందులోనికి పరుగెత్తి వెళ్ళి క్షేమముగా ఉందురు."
ఇప్పుడు, నీవు పేరుతో ఎలా వస్తావు? మీ యొక్క చెక్కును మీరు ఎలా పొందుకుంటారు, "ఒక రెవరెండు, డాక్టరు లేదా మినిస్టరు ద్వారా అని." చూడండి! మీరు ఒక రెవరెండు, డాక్టరు లేదా మినిష్టరు అయియుండవచ్చు. కానీ ప్రభువు యొక్క పేరు, "యేసు క్రీస్తు." చూచారా?
"నా ఆరాధనా స్థలము ద్వారము మీద నా పేరు నుంచవలెనని నేను నిశ్చయించుకొన్నాను. నా కుటుంబము రక్తము క్రింద అందులో సమకూడును. ఐగుప్తువలెనె, అందులో లేనివారు చనిపోయెదరు. మరియు పులిసిన రొట్టె ఉండరాదు. శాఖల మిశ్రమము అందులో ఉండరాదు. నా మందిరము! నా పిల్లలు! నా బీజమునకు పుట్టినవారు." ఆమేన్! దేవునికి మహిమ! "నా కణములు వారిలో ఉన్నవి. వారిలో నేను నా వాక్యమునుంచియున్నాను. వారి హృదయమను పలకల మీద దానిని వ్రాసియున్నాను. అది నా కుటుంబము, యేసుక్రీస్తు శరీరము యొక్క కుటుంబము. ఈ ద్వారముగుండానే నీవు రావలెను, మొతడిస్టు కాదు, బాప్తిస్టు కాదు, పెంతెకోస్తు కాదు. నా నామము నుంచిన ద్వారము లోనే." అది మొథడిస్ట్ కాదు. దేవుని పేరు మెథడిస్ట్ కాదు. దేవుని పేరు పెంతెకోస్తు కాదు. దేవుని పేరు బాప్తిస్టు కాదు. దేవుని పేరు కాథలిక్కు కాదు. ద్వారములకు వెలుపల యుండుడి. చూడండి?
DEUT 16:2,6•
ACTS 4:12•
PHIL 2:10
98"నా నామము నుంచుటకు ఒక చోటును ఏర్పరచుకొనియున్నాను." యేసు క్రీస్తులో మాత్రమే దేవుడు తన నామము నుంచెను. మరే ఇతర చోటు బైబిలులో లేదు. దేవుని పేరును తీసికొనిన దేవుడు కుమారుడు ఆయనే. ఆయనే దేవుని యొక్క మానవ పేరు. "ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ ఇతర నామము వలనను రక్షణ కలుగదు." మెతడిస్టు, బాప్తిస్టు, ప్రెస్బిటేరియను మరేదయినా లెక్కకు రాదు. యేసుక్రీస్తు నామము ద్వారానే ప్రతి మోకాలు వంగవలెను. ఆయనే ప్రభువని ప్రతి నాలుక ఒప్పుకొనవలెను. ఆ విధంగా నీవు రాగలవు.
నీవు నీటిలో బాప్తిస్మము పొందుట మంచిదే, కాని వాక్యమును తిరస్కరించినచో, అక్రమకారునివి; నీ పుట్టుక సరి కాదు. ఆయనను నమ్మితినని చెప్పుకొనుచున్నావు గాని ఆయనను విసర్జించుచున్నావు.
నా కుటుంబమును నేనెట్లు కాదందును? చార్లెస్ బ్రన్హాం నా తండ్రి కాదని ఎట్లందును? ద్వారము మీది రక్తపరీక్ష దానిని చూపించును.
1COR 12:3•
1JN 5:1,5
99నేను దేవుని బిడ్డనో, కానో నా క్రియలు మరియు నా జీవితములోని దేవుని వాక్యరుజువు చూపించును. దేవుని ఒకే స్థలము అచ్చటున్నది. దానిని చూచారా? నీ బలిని స్వీకరించు దేవుని ఒకే స్థలము క్రీస్తే, (నీవు ఎంత యధార్థవంతుడవైనా అవసరము లేదు.)
మరియు గుర్తించుకొనండి… "నీవు లోనికి ప్రవేశించినట్లు తలంచవచ్చును." మరియు గుర్తించుకొనండి, మీరు అనవచ్చు, బైబిలు చెప్పుచున్నది కదా… "యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొందురో, వారందరూ రక్షించబడుదురు గదా అని," బైబిలు ఆలాగు చెప్పుచున్నది.
కాని ఇంకా ఈలాగు వ్రాయబడిన దానిని గుర్తించుకో, "పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసుక్రీస్తును ఒప్పుకొనలేదు." ఆయన ఉన్నాడని నీవనవచ్చు, కాని పరిశుద్ధాత్మ వాక్యమునకు జీవమిచ్చి, నీవు దేవుని కుమారుడవని రుజవు చేయును. అది వాక్యము.
DEUT 16:2,5,6•
ISA 9:6,7
100"నా నామము నుంచుటకు ఏర్పాటు చేసికొన్న చోటు అదే. మరే పురములోను మీరు ఆరాధించరాదు, కానీ నా నామము౦చిన చోటులోనే ఆరాధించవలెను; అప్పుడు నేను మిమ్మును చేర్చుకొందును, మీరు నా కుటుంబము వారగుదురు."
ఇప్పుడు, దేవుని కుటుంబము తండ్రి యొక్క మాటకు లోబడును. "ఆయన సమాధానాధిపతి. బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి; ఆయన రాజ్యమునకు, అధికారమునకు అంతము లేదు. ఆయన భుజముల మీద రాజ్య భారముండును." ఆయనే గవర్నరు, రాజు, ఇమ్మానుయేలు, ఆది, అంతము, సమాధానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి; ఆయనాజ్ఞకు ప్రతి కుమారుడు లోబడును, ఎందుకనగా వారాయనలో భాగము.
EXOD 12:10•
DEUT 8:3•
DEUT 16:2,6•
MATT 4:4•
LUKE 4:4
101బ్రెన్హాంలు జీవించినట్టే, మేము మా గృహములో జీవించుదుము. మీ ఇంట్లో మీరు జోన్స్ వలె జీవించెదరు, జోన్స్ వలె,
దేవుని ఇంటిలో మనము దేవుని వాక్యము ద్వారా జీవించెదము. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట విందుము. ఇతర మోసపు మాటలను వినము. చూచారా? "పులియని రొట్టెను మీరు తినవలెను, ప్రతి సంఘ కాలమును నేను ఇచ్చుచున్నాను." దానిలోనికి మరి దేనిదీ చేర్చరాదు. "బలి ఇయ్యగా మిగిలిన ఎముకలు మొదలగు వాటిని కాల్చివేయవలెను." చనిపోయిన సంఘ కాలములో నిలిచియుండక ముందుకు పోవలెను. ఇప్పుడు మనము మరోకాలములో యున్నాము. ఆమేన్.
"నా నామము నుంచుటకు ఆ స్థలమును ఏర్పరచుకొనియున్నాను." 1 కొరి౦ధీ 12.
EPH 4:30
102ఎఫెసీ 4:30.
దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దాని ద్వారా మీరు ముద్రించబడియున్నారు. [వచ్చే ఉజ్జీవము?] …. మీ విమోచనా దినము వరకు.
గమనించండి, దానిని మన లేఖన పాఠమునకు అన్వయించుదము. జనులను అయాసపెట్టుచున్నాను. కదూ? జనులు లేచి వెళ్ళిపోవుచున్నారు, ఎందుకనగా వారు వెళ్ళి భోజనము వండుకొనవలెను. మరి కొందరు దినమంతా ఇచ్చట కూర్చొని వినుటకు రాలేదు. చూచారా? కానీ చూడండి, మీకు తెలుసు.
EPH 4:30
103బెన్, నీ పని చూడవలెను. దేవుడు దీవించును గాక! వందనములు, బెన్ సోదరుడా, నిన్ను ప్రేమించుచున్నాను. బెన్ సోదరుడా.
ఆ యుద్ధములో అతడు మనకొరకు ఎంత శ్రమపడెనో ఎరుగుదురా; అతడు తుపాకీ దెబ్బలు తిని ముక్కలుగా చీల్చబడెను. అతని జీవితము అస్తవ్యస్తమాయెను, కాని దేవుడతనిని దీవించెను. అతడు నీతి కొరకు నిలబడెను. అతని భార్య అతనిని వదిలివేసెను, పారిపోయెను, తిరిగి వెళ్ళి - పెళ్ళి చేసుకొనెను, అతని బిడ్డలను తీసుకొనెను. ఓ, మై, నేను అది ఊహించలేక యున్నాను.
కానీ బెన్, ఏలాగయినా దేవుడు నిన్ను దీవించును.
ఇప్పుడతడు నరముల వ్యాధితో కూర్చొనియున్నాడు. బెన్ యొక్క పూర్వగాధ మీరు తెలిసికోవలెను. దేవుడతనిని దీవించునుగాక! అవును.
… విమోచనా దినమువరకు మీరు దానిచే ముద్రించబడిరి.
EPH 4:30
104చూడండి! ఇది కొద్దిగా బాధ కలిగించినా, ఒక్క నిమిషము వినండి. నా గూర్చి విసుగుకోవద్దు, జ్ఞాపకము చేసుకొనుము.
ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు, రక్తము ప్రోక్షించబడిన ఆ ద్వారమును చూచారో. ఐగుప్తులో నుండి బయటకు వచ్చు వరకు ఇశ్రాయేలీయుల తలుపు కమ్ముల మీద రక్తము ప్రోక్షించబడెను. (రక్తమే ప్రాణము).
దేవుని యొక్క పరిశుద్దాత్మను దుఃఖపరచకుడి. విమోచనా దినము వరకు మీరు దాని వలన ముద్రించబడియున్నారు.
బైబిలు ఎల్లప్పుడూ నిజమే. అక్కడ ఆయన తన మాటల నుంచెను. విమోచన యొక్క మొత్తం చిత్రము అందులో యున్నది, చూచారా చూచారా?.
దేవుని యొక్క పరిశుద్దాత్మను దుఃఖపరచకుడి, విమోచనా దినము వరకు దానివలన మీరు ముద్రించబడియున్నారు. [మీరు విమోచించబడు వరకు]
COL 3:3
105మీరు ముద్రించబడితిరి, మీరు రక్తము క్రింద యున్నారు. మీరిక బయటకు పోనక్కర్లేదు. అయితే నీవెవరవు? దేవుని కుటుంబములోని దేవుని కుమారుడువు, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినావు. అపవాది నిన్ను అంటుకోజాలదు. ఎందుకనగా నీవు చనిపోయావు — నీ పాత భాగమగు, నీ పాత భర్త చనిపోయెను — నీవు పాతిపెట్టబడితివి, క్రీస్తు ద్వారా నీ జీవితము దేవునిలో దాచబడియున్నది, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితివి. వాడు నిన్నెట్లు పట్టుకోగలడు? నీవెట్లు బయటకు రాగలవు? నీవు అక్కడున్నావు! మహిమ! నేను మాట్లాడుచున్న దానిగూర్చి నీకు తెలియును.
GEN 37:28•
MATT 4:10•
LUKE 4:8
106ఒక సృష్టి జరుగునుగాని శాఖ ఏర్పడదు. నీవు వాక్యపు సృష్టివి. జగత్తు పునాదికి ముందే నీలో ఆ పునాది రాయి వేయబడియున్నది. దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉండుటకు ముందే నిర్ణయించబడితిరి.
మరియు ప్రతి కాలములోను రాయి మీద రాయి వచ్చుచున్నది, వచ్చుచున్న వాక్యమును బయలుపరచును. యేసు తన కాలములో చేసినట్లే అది యున్నది. అన్నింటికి తలరాయి ఆయనే. ప్రతికాలము ఆయనలోనే దాగియున్నది. యేసులో మోషే ఉండెను. యేసులో దావీదు ఉండెను. యేసులో ప్రవక్తలుండిరి. నిజమేనా? యోసేపును చూడండి, దాదాపు ముప్పది వెండి నాణములకు అమ్మబడెను. గోతిలోనికి త్రోయబడి, చనిపోయినట్లు ఎంచబడెను, బయటకు తీయబడెను, ఫరో కుడి చేతి యొద్దకు హెచ్చింపబడెను. యేసులో యోసేపుండెను.
మరియు ఆయన వచ్చినప్పుడు, రాజల యొక్క ప్రవక్తల యొక్క సంపూర్ణత ఆయనే. (హల్లేలూయా!) శరీరరీత్యా దైవత్వమంతా ఆయనలో నివసించెను. ఒక వధువును, ఒక మహోన్నత కళాఖండమును విమోచించుటకు ఆయన వచ్చెను. ఒక కళాఖండము సాతానుకు ఏమి చెప్పుచున్నదనగా…
"అద్భుతములు జరుగు దినములు గతించాయి. అటువంటివి ఏవీ లేవు" సాతాను చెప్పెను.
"సాతానా, నా వెనుకకు పొమ్ము." చూచారా? చూడండి, ఒక మహోన్నత కళాఖండము తోటలో నిలబడియున్నది.
DEUT 18:15•
MATT 15:14•
JOHN 5:46
107ఒక సమయమున ఆ మూలరాయి తిరిగి వచ్చును, అన్నింటికీ అదే శిరస్సు, మరియు వధువును ఆయన చేర్చుకొనును. స్త్రీ పురుషునిలో నుండి తీయబడినది, పురుషునిలోని భాగము. ప్రతీ పురుషుని జన్యువులు స్త్రీలో యున్నవి, వాటి ద్వారానే స్త్రీ తయారయ్యెను. ఆ విధంగానే సంఘములో దేవుని వాక్యమున్నది, ఆ వాక్యమే సంఘమును దేవుని వధువుగా మార్చును. శాఖ కాదు. శాఖ అపవాదికి చెందినది, ప్రతి శాఖ కూడాను. అందులో ఉన్న జనులను నేను ఆలాగు పిలువను. వారు మోసపుచ్చబడిన జనులు, యేసు చెప్పినట్లే యున్నది, "గ్రుడ్డివారు గ్రుడ్డివారికి త్రోవ చూపుచున్నారు." ఆయన వారిని బయటకు పిలువలేడు.
"నీవు జారత్వము వలన జన్మించావు! ఇక్కడికి నిన్ను ఎవరు రమ్మన్నారు? ఏ స్కూలు, ఏ సెమినరీ నిన్ను గుర్తించినది? మాకు మోషే ఉన్నాడు," అని వారనిరి.
"మీరు మోషేను ఎరిగియుండినయెడల నన్నును ఎరిగియుందురు," అని ఆయన చెప్పెను.
ఎందుకనగా మోషే తన నాలుగు గ్రంథములలో ఆయనను గూర్చి వ్రాసెను, "మీ దేవుడగు యొహోవా నా వంటి యొక ప్రవక్తను మీలో పుట్టించును, ఆయన మీకు వాక్యమిచ్చును. ఆ ప్రవక్త మాట విననివాడు మీలోనుండి కొట్టివేయబడును." మరియు అదంతయూ అంతే. ఆయనెవరు? వాక్యము. మరియు అది ఏమిటి? దానిలో పులిసినదేదియూ చేర్చరాదు. ఏ ఆచారమును గాని, శాఖను గాని దానికి చేర్చరాదు, ఆలాగు చేసినచో, అప్పుడే అది కలుషితమగును, నీ బలిని అంగీకరించడు.
ROM 8:1
108మీరు భోజనమునకు వెళ్ళునట్లు త్వరగా ముగించెదను.
చూడండి! నీవు దేవుని కుమారుడవు, దేవుని ఇంటిలో యున్నావు, దేవుని సంకల్పములోని భాగముగా ఉన్నావు. రోమా 8:1, "కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు." ఎందుకనగా వారు లోకమునకు చనిపోయియున్నారు, ఆయనయందు జీవించియున్నారు, ఈ ప్రస్తుత దినమున జీవించియున్నారు. వారికొరకు దేవుడు వాక్యమును ఉపయోగించెను, వారిని ముందుగా అభిషేకించెను, ఈ వధువు గ్రంథములో వారి పేరు వ్రాసెను. హృదయములో ఉన్న విత్తనము మీద నీరు పడినప్పుడు అది క్రీస్తు వధువుగా ఎదుగును. ఓ! మై! అది చాలా పరిపూర్ణముగాయున్నది. ప్రతి కాలములోను ఆలాగే యున్నది.
109నీతీకరణము క్రిందనున్న లూథరన్లు, కాళ్ళువలెయున్నారు; శుద్దీకరణ క్రింద వెస్లీవారుండిరి. పెంతెకోస్తు వారు చేతులవలెయున్నారు, క్రియలు, కార్యములు చూడండి. కాల్వినిస్తులు లేదా ఆర్మీనియనులు, లీగలిస్టులుగా యున్నారు. కానీ ఇప్పుడు శిరస్సు యొద్దకు వచ్చియున్నారు, తలరాయి. "కృప, కృప," అని తలరాయి అరచినది.
తలరాయి ఏమని కేకలు వేయుచున్నది? "కృప! కృప" మరణము మరియు ఆచారములను దాటి, జీవముగల దేవుని యొక్క జీవవాక్యములోనికి వచ్చియున్నాము. ఆయన కాలమునకు దేవుడేర్పాటు చేసిన ఒకే సంకల్పము ఏమిటి? వాక్య కాలములో యున్న ఆయన కుమారులు ఆత్మ ద్వారా బ్రదికింపబడి ఇప్పుడు పరలొక స్థలములందు కూర్చోపెట్టబడియున్నాము. (వర్తమానకాలము) ఎప్పుడో బ్రదికింపబడి వాక్యములోని ప్రతి వాగ్దానమునకు వారసులమైయున్నాము. మరప్పుడు నీవు ఏమయినావు? నీవు దేవుని జన్యువులో భాగమైయున్నావు, వాక్యములో భాగమైయున్నావు, దేవుని వాక్యములో భాగమైయున్న ఇతరులు కూడా కలిసి కూర్చొని, క్రీస్తు యొక్క పూర్తి శరీరమును బయలుపరచుచున్నారు, ఎందుకనగా మీ మధ్య పులిసినదేదియూ లేదు. (బ్రవున్ సోదరుడా, ఆయన దేని గూర్చి చెప్పుచున్నాడో చూడు?) మీ మధ్య పులిసినది ఏదీ ఉండరాదు, వాక్యము మాత్రమే ఉండవలెను, పరలోక స్థలములందు కూర్చొనియున్నాము, ఆ ద్వారమునకు ఆయన తన పేరు పెట్టెను: యేసు క్రీస్తు.
110మీ మధ్య పులిసినది ఉండరాదు, అది శరీరరీత్యా దేవత్వము యొక్క సంపూర్ణత మీలోనికి తెచ్చును. లూథరు కాలములో అది జరుగలేదు, వెస్లీ కాలములో అది జరుగలేదు, పెంతెకోస్తు కాలములో అది జరుగలేదు, కాని మనుష్యకుమారుడు ప్రత్యక్షపరచబడు ఈ కాలములో, సంఘమును తిరిగి తీసికొని వచ్చును. ఆయన జనుల మధ్య పూర్తి దైవత్వము బయలుపరచబడును, అవే దృశ్య సూచనలు చూపించును. ఆదియందు బయలుపరచుకొన్న రీతిగానే ఇప్పుడాయన బయలుపరచుకొనును. దేవ ప్రవక్తగా ఆయన భూమి మీద ప్రత్యక్తపరచబడును. మలాకీ 4, ఇంకా ఇతర లేఖనముల ద్వారా అది వాగ్దానము చేయబడినది. మీరెక్కడ ఆరాధించుచున్నారు? దేవుని ఇంటిలో, కూర్చొండపెట్టబడియున్నారు, వర్తమాన కాలములో.
111ఇప్పుడు, ప్రభుని చిత్తమయితే, పది నిమిషములలో త్వరగా ముగించెదము.
వారి కాలములో, ఈ దేవుని ఇంటిలోనికి తీసికొని రాబడిన కొందరిని చూద్దాం.
హనోకు! (పది నిముషములలో మనము వెళ్ళేదము) చూడండి!
హనోకు తనయొక్క కాలములో దేవుని యొక్క సజీవవాక్యమై యున్నాడు, అతను ప్రవక్త అయి యున్నాడు.
ప్రవక్త దేవుని ప్రతిబింబించును. ఎందరికి తెలియును? ప్రతిబింబించు వాడు తన దానిని ప్రతిబింబించడు. మరొక దానిని అతడు ప్రతిబింబించును. ప్రవక్త అనగా దేవుని చేత ఎన్నుకొనబడిన సాధనము, దేవునితో ప్రత్యక్ష సంబంధము కలిగియుండి వాక్యమైయున్న క్రీస్తు స్వరూపములోనే ప్రతిబింబించును. చూడండి, మరేదియూ అలా చేయలేదు. నీవే ప్రతిబింబించువాడవు, ఆ కారణము చేతనే ప్రవక్త గ్రంథమును తినుచున్నాడు. కనుకనే గ్రంథపు చుట్టను అతడు భుజించెను. ఆ కాలపు వాక్యమును అతడు ప్రతిబింబించవలెను. అర్ధమైనదా?
JOHN 1:14•
EPH 1:20•
EPH 3:14,15
112హనోకును గమనించండి, దేవుని పరిపూర్ణ ప్రతిబింబమునకు మాదిరి. దేవుడతనితో యుండెను, అతనిని రూపాంతరము చెందించి తీసికొనిపోయెను. అతడు మాటలచే దేవుని వెల్లడి చేసెను, కాని ఆ మాటలే ఆత్మశక్తిగా మారి అతనిని కొనిపోయినవి.
ఏలియా దినములలోను ఆలాగే జరిగెను, అతని శరీరము కూడా దేవుని ప్రతిబింబించెను. దేవుని వాక్యము ప్రతిబింబించువానిగా అతనిలో దేవుని వాక్యము బయలుపరచబడెను; ప్రవక్త యొక్క ఎముకలు ఒక శవమునకు తగలగా, బ్రదికెను. క్రీస్తు యొక్క వధువుగా ఉన్నంతకాలము మనము ఆయన మాంసములో మాంసము గాను, ఎముకలో ఎముక గాను ఉందుము. దానిని మీరు నమ్ముచున్నారా? అది సరే. ఆయన మనకొరకు చనిపోయెను, మనకు-మనము చనిపోయి ఆయన నామములో పాతిపెట్టబడియున్నాము. "ఇక లోకమునకు చెందినవారము కాదు గాని ఆయనలో యున్నాము." ఎఫెసీ 1:21, పరలోకములోయున్న కుటుంబము పేరేమిటి? యేసు. భూమి మీదనున్న కుటుంబము పేరేమిటి? రక్తము ఎక్కడున్నదో అక్కడ దేవుని ఇల్లున్నది. నిజమేనా? అదియే ద్వారము, అదియే పురము, ఆ చోటికి ఆయన తన పేరు పెట్టెను: "మరియు వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. నీవు జీవించుచున్న కాలములోని వాక్యమును అది ప్రతిబింబించుచున్నది. ఆయన ఆలాగే యుండెను. మోషే, యాకోబు, మొదలగువారెందరో దేవుని వాక్యమును ప్రతిబింబింప చేసిరి. దేవుడే కనుపరచుకొనుచున్నాడు. దేవునియొక్క పరిపూర్ణ స్వరూపములోనికి వచ్చుచున్నాము, యేసు క్రీస్తే దేవుని యొక్క మహోన్నత కళాఖండము; ఆయన కొట్టబడెను, ఆయనను ప్రతిబింబించుచున్నవారినందరినీ వధువుగా ఆయన స్వీకరించునట్లుగా కొట్టబడెను.
MATT 5:14,15•
MARK 4:21•
LUKE 8:16
113ఆయనలో మోషే ఉండెను. ఆయనలో యొహోషువా ఉండెను. మరియు జగత్తు పునాది వేయబడక ముందే నీవు ఆయనలో ఉన్నావు, దేవుని కుటుంబము. ఆయనతో నీవు శ్రమపొందితివి, ఆయనతో నీవు చనిపోయితివి, ఆయనతో నీవు సిలువ యొద్దకు వెళ్ళితివి, ఆయనతో నీవు లేపబడితివి; ఇప్పుడు నీవు ఆయనతో కూడా ఉన్నత స్థలములందు కూర్చొనియున్నావు, ఈ కాలపు వర్తమానమును లోకమునకు బయలుపరచుచున్నావు. లోకమునకు వెలుగుగా ఉన్నావు. "మీరు లోకమునకు వెలుగై యున్నారు," కాని దానిని శాఖ అను కుంచము క్రింద దాచిపెట్టినచో వారెట్లు దానిని చూతురు? మీ ఆచారములవలన ఆ వెలుగు కనబడకుండా పోయెను. శాఖలవారలారా! మీరు వెలుగును మీ సంఘమునకు దూరముగా ఉంచుటకు ప్రయత్నించుచున్నారు. మీరు ప్రవేశించరు, ప్రవేశించగోరు వారిని ప్రవేశింపనీయరు. ఆమేన్.
మనము ఆగుదము. చాలాయున్నది. ఓ, మై! అయిదు నిమిషములున్నవి.
EPH 4:5
114ఆ ద్వారము ఎవరో చూడగోరుదురా? దేవుడు తన నామమును ఎక్కడుంచెను? యేసునందు. ఆయన నామమును నీవెట్లు ధరించగలవు? అందులో నీవెట్లు ప్రవేశించగలవు? బాప్తిస్మము పొందుట ద్వారా, ఏలాగు? నీటి ద్వారా? ఆత్మ మూలముగా! "ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము." అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము.
నీటి బాప్తిస్మము నీకు ప్రజలతో సహవాసము నేర్పరచును. నీవు క్రీస్తును అంగీకరించితివను గుర్తింపు కలుగజేయును. అది సత్యము. కానీ అది ఆత్మ బాప్తిస్మము కావలెను. నేను యేసు నామములో నీకు బాప్తిస్మము ఇయ్యవచ్చును, అయితే అది ఏమి చేయదు.
అసలయిన వాక్యము నీలోనికి రావలెను — వాక్యము, యేసు — సోదరుడా! వర్తమానము నీకు రహస్యముగా ఉండదు. నీవిది తెలిసికొందువు, నీ ఎదుట అది పూర్తిగా కనబడును. హల్లేలూయా! దేవునికి స్తోత్రము! ఆమేన్!
నేనాయనను ప్రేమింతును, ప్రేమింతును
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను,
నా రక్షణను కొనెను! (ప్రియదేవా!
జనులను బాగుచేయుమని ప్రార్ధి౦చుచున్నాను,
ప్రభువా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము.
యేసు క్రీస్తునామములో, ఆమేన్!)
ఓ! ప్రేమించుడి!
విశ్వాసముతో ఆ ప్రవాహమును నేను చూచినప్పటి నుండియూ
నీ స్రవించు గాయములు అందించినవి.
(ఆ మహోన్నత కళాఖండమునుండి)
విమోచించు ప్రేమే నా మూలమై యున్నది.
DEUT 8:3•
PS 119:11•
MATT 4:4•
LUKE 4:4•
1JN 4:7
115దేవుడు ప్రేమాస్వరూపి. "ప్రేమ చూపువాడు దేవుని సంబంధి," దైవికమగు పవిత్ర ప్రేమ. మురికి ప్రేమ కాదు; పరిశుభ్రముగా, పవిత్రముగా, ఉండు ప్రేమ, వాక్యమైయున్న దేవుని ప్రేమించును. "నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ ధర్మశాస్త్రమును దాచుకొనియున్నాను," దావీదు ఆలాగు పలికెను. ఆయన ఆశ్చర్యకరుడు కాడా? మీరాతనను ప్రేమించరా?
ఇప్పుడు, దేవుడు కలిసికొను ఒక మార్గము, ఒక పరిశుద్ధ త్రోవ, ఒకే చోటున్నది. "దేవా, నేను ఒక మంచి మెథడిస్ట్ ను, నేను ఒక మంచి బాప్టిస్ట్ ను, నేను ఒక మంచి పెంతెకోస్తును," అని నీవు చెప్పినందువలన కాదు. నీవు వాక్యమైయున్న యేసులో ఉండుట బట్టియే. ఆ వాక్యభాగము నేడు బయలుపరచబడియున్నది, ఈనాటి వర్తమానము. లూథర్, వెస్లీ, పెంతెకోస్తుది కాదు, యేసును ప్రతిబింబించుట కావలెను. నీ పరిశుద్ధ రొట్టెకు పులసిన దానిని కలుప రాదు." "దాని కాలములో దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను మనుష్యుడు జీవించును."
PROV 26:11•
2PET 2:22
116ఓ! ప్రభువైన యేసూ, గొప్ప మూలరాయి, రమ్ము హతసాక్షులుగా చనిపోయిన లూథరన్ల ధూళిని ఆవల మేము చూచుచున్నాము. మెథడిస్ట్ వారిని చూడుము.
పెంతెకోస్తు మొదలగు వారు, ఇంకా ఇతరులు వచ్చుచున్నారు, బయటకు వచ్చివారికి ఎంత శ్రమ.
అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారు సంస్థగా మారిరి, ఎందులో నుండి దేవుడు మిమ్మును బయటకు తెచ్చెనో తిరిగి అందులోనికే వెళ్ళిరి, పంది బురద లోనికి పోయినట్లే.
ఏకత్వము వారు, యునైటెడ్ వారు, పెంతెకోస్తువారు, పెంతెకోస్తు అసెంబ్లీ వారు రంగును బట్టి చీలిపోయిరి. నల్లవారికి ఒకటి, తెల్లవారికి ఒకటి ఏర్పరచుకొనిరి, దానిని మీరు "ఐక్యత" అనుచున్నారు. సంస్థగా మారి తగవులాడుచున్నారు. "కుక్క తన వాంతికి తిరిగినట్లు" మొదటిసారి ఇమడ్చుకోలేక వాంతి చేసికొన్నది గదా? ఇప్పుడెట్లు ఇమడును? నీ శాఖను విడిచి వాక్యమును భుజించి క్రీస్తుతో జీవించుము, లేనియెడల నీకు అవమానము!
ఆవల నాకు ఒక తండ్రియున్నాడు,
ఆవల నాకు ఒక తండ్రియున్నాడు,
ఆవల నాకు ఒక తండ్రియున్నాడు,
ఆవలి ఒడ్డున.
ఒక ప్రకాశమగు దినమున వెళ్ళి ఆయనను చూతును,
ఒక ప్రకాశమగు దినమున వెళ్ళి ఆయనను చూతును,
ఒక ప్రకాశమగు దినమున వెళ్ళి ఆయనను చూతును,
ఆవలి ఒడ్డున.
ఓ! అది సంతోష కలయిక గదా?
(వాక్కు వాక్కు యొద్దకు వెళ్ళును)
………………. అది సంతోష కలయిక!
(వధువు పైకి వెళ్ళును, వాక్యము మీద వాక్యము)
………………. సంతోష కలయిక
ఆవలి ఒడ్డున.
ఓ! ఆ ప్రకాశమగు దినము రేపే రావచ్చు,
ఆ ప్రకాశమగు దినము రేపే రావచ్చు,
ఆ ప్రకాశమగు దినము రేపే రావచ్చు,
ఆవల ఒడ్డున.
"బ్రెన్హాం సోదరుడా, నిజమా?" అని మీరడుగవచ్చు.
JOHN 14:20
117అవును! ఆనాటి లూథరనులు, ఆనాటి వెస్లీ వారు, ఆనాటి పెంతెకోస్తు వారు, (నిజమగు వారు, శాఖలవారు కారు) చనిపోయిరి. వారు పులిసిన దానిని కలిపిరి, (శాఖ) కాని ఈ నిజవాక్యము కదిలి ముందుకు వచ్చుచున్నది. యేసు చెప్పినట్లే యున్నది, "ఆ దినమున నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నా యందు మీరును, మీయందు నేనును ఉన్నట్లు మీరు తెలిసికొందురు." అంతా వాక్యమే!
ఓ! అది సంతోషకరమగు కూటము కదా…
(ఆయన కుమారులు ఆయన గుమ్మములో కలిసికొందురు)
…………… సంతోష కలయిక
అది సంతోషమగు కూడిక కదా,
ఆవలి యొడ్డున.
118ఇప్పుడు సంఘమునకు బోధించుచున్నాను. గుర్తుంచుకొనండి, పొట్టును విడిచి మీరు గింజగా మారుటకు ఇప్పుడు కదిలి వెళ్ళవలెను, అయితే ఎండలో యుండండి. నేను చెప్పినదానికి ఏదీ కలుపవద్దు, అందులో నుండి ఏదీ తీసివేయవద్దు. ఎందుకనగా నాకు తెలిసినంత వరకు నిజమే చెప్పితిని, తండ్రి నాకిచ్చిన దానినే చెప్పాను. చూచారా? దానికి ఏమీ కలుపవద్దు, నేను చెప్పినదే చెప్పండి.
ప్రభువైన యేసును వెదక రండని జనులతో చెప్పుచున్నాను. మీరు ఆయన సన్నిధిలో పడియుండండి, ఆయనను ప్రేమించండి: "ఓ! ప్రభువైన యేసూ, దేవుని కుమారుడా, నిన్ను ప్రేమించుచున్నాను, ప్రభువా. నా హృదయమును మెత్తబరచుము. సమస్త మురికిని, లోకము మీద ఉన్న ప్రేమను తీసివేయుము. ఈ ప్రస్తుత లోకములో నీ యెదుట నన్ను పరిశుద్దునిగా జీవించనిమ్ము"
ప్రార్థనకు మన తలలు వంచుదము. ముగింపు ప్రార్థన చేయుటకు మీరెవరినైనా ఏర్పరచుకొన్నారా? లేనియెడల నేను చేసెదను. బహు మర్యాదగా ఉండండి.
REV 6:16
119ప్రియదేవా, మాకు ఆత్మీయాహారము ఇచ్చినందుకు నీకు వందనములు. వాక్య విటమిను దేవుని కుమారులను ఎదుగజేయును. ప్రభూవా! నీకు వందనములు! దేవుని కుమారులు మరియు కుమార్తెల మీద తప్ప మరెవరి మీదను అది పనిచేయదు — దానిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము — నీకు వందనములు చెల్లించుటయే గాక దాని వలన మేము లాభము పొందునట్లు కృప చూపుమని దేవా ప్రార్ధి౦చుచున్నాము. మా దేవునియందు జనులు విశ్వాసముంచునట్లు ప్రేమతో ఒప్పింపచేయు ప్రయత్నమునకు మా బలమును వాడుదుము గాక. దారి తప్పినవారు, పాపులు, స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు ఈ కాలములో విశ్వసించునట్లు కృప చూపుము.
ప్రభువా, జనులు మానసిక స్థితిలో, ఉద్రిక్త కాలములో జీవించుచున్నారు, వారి మనస్సు కుదురుగా లేదు; వాక్యము చెప్పినట్లే అక్షరాలా నెరవేరుచున్నది, భూమి మీదికి గొప్ప అపాయకరమగు కాలములు వచ్చును. జుట్టు కత్తిరించుకొనిన స్త్రీలను తరుము మిడుతలు వచ్చును. వాటికి స్త్రీలవలె పొడవాటి జుట్టు ఉండును. ఎన్నో భయంకర దృశ్యములు చూచెదరు. వారు మానసిక ఒత్తిడిలోను, ఎటూ తేల్చుకోలేని స్థితిలోను ఉన్నారు. బండలకు కొండలకు వారు మొరపెట్టెదరు. స్త్రీలు కుక్కలను, పిల్లులను పెంచుచున్నారే గాని, నిన్ను ఘనపరచుటకు పిల్లలను కనుట లేదు. నీవు వారికి పిల్లలను ఇచ్చినా వారిని వీధులలో విచ్చలవిడిగా విడిచిపెట్టుచున్నారు. ప్రభువా, నీవు సిలువ ఎక్కు ముందు చెప్పిన మాట ఆశ్చర్యము కలిగించదు. "రాళ్ళు, కొండలు తమ మీద పడవలెనని వారు కోరుకొందురు."
MATT 24:30•
MATT 25:31•
MARK 13:26•
LUKE 21:27•
1THS 4:17
120ఈ కాలమునకు అన్నియూ సమకూడి జరుగుచున్నవి. వాక్యము బయలుపరచబడి నిరూపించబడుట మనము చూచుచున్నాము. ప్రభువా! ఒక దినమున ఎత్తబడుట జరుగునని నీవు నీ నేత్రములతో చూచి బయలుపరచబడినది. ఆ వాక్య ప్రత్యక్షతను మేము చూతుము. "మనుష్య కుమారుడు మహిమ మేఘములలో తన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చును. మనము మధ్యాకాశములో ఆయనను కలిసికొనుటకు వెళ్ళిపోదుము." ఇప్పుడు దానిని గూర్చి వినుచున్నాము గాని మన కండ్లతోనే మనము దానిని చూచెదము.
ప్రభువా ఏర్పాటు చేయబడిన ఒకే స్థలములో మేము ఉందుము గాక ఆయనే బలి. యేసుక్రీస్తు నామము ద్వారాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారాను, దేవుని ఇంటిలోనికి యేసుక్రీస్తును తీసికొని వచ్చుదము, ఆయనను గూర్చియే మేము విన్నాము. అక్కడ మా బలి అంగీకరించబడి మేము కుటుంబములోనికి తీసికొని రాబడుదుము; ఎందుకనగా ఇంకా మనము లోకములో తిరుగుచున్నాగాని జగత్తు పునాది వేయబడకముందే దేవుని కుమారులు మరియు కుమార్తెలముగా అభిషేకించబడియున్నాము. తండ్రీ, దానిని బట్టి నీకు వందనములు. అటువంటి దానిని విడిచిపెట్టి మేమెట్లు తిరిగి పోగలము. (వారు సత్యమును కనుగొనిరి, లోకములో నుండి దేవుడు వారిని ఎన్నుకొనెను.) నేను రక్షించబడిన దినమున మిలియనుల మంది నశించిరి.
121ఓ చనిపోవుచున్న గొర్రెపిల్లా, ఎన్నటికినీ నిన్ను గూర్చి ఎట్లు ఆలోచించగలను? నీ ఎదుట నా హృదయము చాలినంత మర్యాదను ఎట్లు చూపగలదు? నమ్మకముగా జీవించుటకు ప్రియదేవా, నాకు సహాయము చేయుము. నా జనులు నమ్మకముగా జీవించుటకు సహాయము చేయుము. ప్రభువా, ఆ ప్రతి ఒక్కరికొరకు ప్రార్థించుచున్నాను. ఎట్లు అడుగవలెనో నాకు తెలియదు, ప్రభువా, దానిని సరయిన రీతిలో అడుగుట కూడా నాకు చేతకాకపోవచ్చును. ప్రభువా, నా ఆజ్ఞానమును క్షమించుము, ప్రభువా, నా హృదయమును చూడుము. వారిలో ఏ ఒక్కరును, ఒక్కరు కూడా నశించకుండవలెనని ప్రార్ధి౦చుచున్నాను. తండ్రీ, ప్రతి ఒక్కరిని నీ కొరకు సమర్పించుచున్నాను. యేసుక్రీస్తు నామములో, ఆమేన్.
నేనాయనను ప్రేమించుదును, నేను…
మీరాయనను ప్రేమించుచున్నయెడల మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఒకరితో ఒకరు కరచాలనము చేయండి.