హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కల పైన
1మన శిరములు వ౦చుదము: ప్రియ ప్రభువా, ప్రభువైన యేసు రాకను గూర్చిన వాగ్దానము నిమిత్తము, ఈ రాత్రి నీకు వందనములు చెల్లించుచున్నాము, అప్పుడు మేము ఒక గొప్ప కూటములో కలిసికొందుము; ఆ సంతోషము, పాటలకు ఎన్నడూ అంతముండదు, రానైయున్న నిరంతరయుగములలో మేము స్తుతించెదము. ఈ రాత్రి కూటము మీద నీ ఆశీర్వచనముల కొరకు అడుగుచున్నాము. ఈ గుడారము మీద, ఈ కార్యకర్తల మీద, దీని సంఘ కాపరుల మీద, నీ సహ పనివారుల మీద, అందరి పై, నీ దీవెనలు అడుగుచున్నాము
ప్రభువా, ఈ కూటములో ఉండుటకు ఎన్నో మైళ్ళ దూరము నుండి వచ్చిన వారిని దీవించమని అడుగుచున్నాము. వారు తిరిగి తమ గృహములకు వెళ్ళనైయుండగా, నీ కృపా హస్తమును వారిపై యుంచుము, ప్రభువా, అది దయచేయుము. దేవుని గృహమని పిలువబడు ఈ స్థలములో అనేకసార్లు మేము అరాధించుటకుగాను ఒక్కటిగా కూడుకొనెదము గాక! ప్రభువా, ఈ రాత్రి టెలిఫోను ద్వారా వినుచున్న వారిని దీవించుము. రక్షించబడని ప్రతి వ్యక్తి, ఈ రాత్రి యేసుక్రీస్తును తమ రక్షకుని కనుగొనెదరు గాక! రోగులను, బాదపడుచున్న వారినందరిని స్వస్థపరచుము. తండ్రీ, యేసు నామములో ఆరాధన కొరకు నీ సేవకుడు నివేదించుచున్నాడు. ఆమేన్.
2ప్రభువు మీ ప్రతి ఒక్కరిని దీవించును. ఈ రాత్రి ఇక్కడున్నందుకు చాలా సంతోషము. పావురపు రెక్కలపైన అను తన పాటలోని చివరి భాగమును సహో. ఎర్ని పాడుచుండగా, నేను లోనికి వచ్చాను. నిశ్చయంగా అందమగు పద్యము. చాలా చక్కగా నున్నది. అది సమయోచితమని నేనెరుగుదును. కాబట్టి ఇప్పుడు మనము చాలా కృతజ్ఞులము.
దేశములోని వివిధ ప్రాంతములలోను కూర్చుని వినుటకు సిద్ధపడిన మీరందరూ ఇక్కడి జనులు ఆసక్తితో వేచి ఎట్లు కూర్చొనియున్నారో, మీరు చూచిన బాగుండునని నాకు కోరిక కలుగుచున్నది. వారి ముఖముల మీద ఆ భావము వ్యక్తమవుచున్నది. ఆ రాత్రి భవనము కిక్కిరిసి యున్నది. చాలా అద్భుతమగు సమయమిది.
సహో. జాక్ మూర్, సోదరి మూర్, సహో. నోయల్, సహో. బూట్లేయర్, సహో. బ్రవున్, ఇంకా ఇక్కడి ఆలయ సభ్యులు, కార్యకర్తలు, సహచరులు అందరికి, మమ్మును తిరిగి ఆహ్వానించినందుకు వందనములు చెల్లించ గోరుచున్నాము.
3ఈలాగు జరిగించినది కేవలము దేవుని హస్తమే గాని మరేమీ కాదు. దీనిని యధా సంఘటన అనజాలము. ఇది జరుగుటకు గూర్చి ఇక్కడ ఒక సోదరునికి కొంత కాలము క్రిందట ఒక కల వచ్చినది. ''ఇండియను తోలు బూట్లు ధరించి, తెల్లని ప్యాంటు వేసికొని నేను నిలబడియున్నట్లుగా'' చెప్పెను. ఇక్కడి కూటము కొరకు సహో. జాక్ ను పిలచినపుడు అక్షరాలా నేను అలాగే దుస్తులు ధరించియున్నాను, కొలరెడోలోని, కార్సన్‌లో — ఇండియను తోలు బూట్లు మరియు తెల్లని లెవి ప్యాంటు జత ధరించియున్నాను. సహో. లియో, నీవు వినుచున్నావనుకొంటాను. కొద్ది నిమిషముల క్రితం నిన్ను నేను కలిసికొన్నాను. ఈ కూటమునకు జన్మ స్థలము అదే.
4ఇప్పుడు, ఆదివారము రాత్రే, మీలో కొందరు తిరిగి గృహములు చేరుటకు రాత్రంతయూ కార్లు నడుపుకొని వెళ్ళవలయునని నాకు తెలియును. మరికొందరు ఉదయమున వెళ్ళెదరు. నాకు రెండు రోజుల ప్రయాణమున్నది కాబట్టి ఎక్కువ సేపు మిమ్మును ఉంచము. దీనిని ఒక పాతకాలపు రాత్రిగా నేను చేయుటకు ప్రయత్నించాను. సహో. బ్రవున్, సహో.జాక్, ఇంకా మేమందరము సంవత్సరాల క్రితం రోగులకు ప్రార్థించేవారము, అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు రోగుల కొరకు ప్రార్థించెదము.
ఆ వెనుక నున్న వారికి నా మాట వినబడుచున్నదా? నాకు బొంగురు పోయినది గనుక ఈ మైకులను క్రిందికి దించుచూయున్నాను.
5ఒక చిన్న సంఘటన జరిగినది, కొద్దిసేపటి క్రితం వారు ఒక సోదరుని గూర్చి నాకు చెప్పిరి. బహుశా, ఈ రాత్రి ఈ కూటములో ఉండియే యుండును. శాఖ నుండి ఈ మధ్యనే బయటకువచ్చెను, ష్రీవ్ పోర్టుకు వచ్చెను, వర్తమానము వినగోరుచున్నాడు. అతడు గలిబిలితో నిండియుండెను, అతని స్థితి అతనికే తెలియలేదు కాబట్టి అతడు పట్టణ శివారుకు వెళ్ళెను. జనులు ఒక చోట పోగవుట చూచి, ''బిల్లీ బ్రన్హాం బోధించు స్థలము ఇదేనా?'' అని ప్రశ్నించెను.
''కాదు, ఒక చలన చిత్రము ద్వారా బిల్లీ గాహ్రం బొధించనైయున్నాడు,'' అని జవాబు చెప్పెను.
''అయితే నేను తప్పు చోటుకు వచ్చాను,'' అని చెప్పెను.
''ప్రభువా, ఏలాగు నేను వెళ్ళగలను?'' అని తనలో తాను అనుకొనుచూ ఈ ప్రధాన వీధి గుండా నడువసాగెను. ఈ చివరన ఒక పెద్ద ఆలయము ఉండుట చూచెను. అదేమిటో అతనికి తెలియదు. టెక్సాస్ వీథి గుండా ఆలయము మీద ఒక తెల్లని సిలువయున్నది. ''ఇంకా ముందుకు నడువుము,'' అని ప్రభువతనితో చెప్పెను. ఒక చోటికి రాగా అక్కడ చాలా కార్లు నిలిపియుంచుట చూచెను. ''ఆలయములో నుండి ఒక పెండ్లి కుమార్తె, పెండ్లి కూమారుడు వచ్చుట'' చూచెను. గత రాత్రి పెండ్లి అయినదని మనందరికి తెలియును. ''ఇదే ఆ స్థలము. నీవు పెండ్లి కుమార్తెలో ప్రవేశించుటకు, పెండ్లి కుమారునితో వెళ్ళుటకు శాఖ నుండి బయటకు వచ్చియున్నావు,'' అని ప్రభువు చెప్పెను.
6వీథిలో నుండి వచ్చుచూ, ఆ సిలువ మీద చంద్రుడు, నక్షత్రములు ఏలాగు వ్రేలాడుచున్నవో నా భార్యకు చూపించాను. నేను అటువంటి చిన్న విషయముల వైపు చూచుదును. దేవుని యందు, నా సేవ యందు నాకు గల విశ్వాసమునకు అది ఒక అభినందన.
ఒక రాత్రి టుసాన్‌లో జరిగిన సంగతి నా ఆలోచనలలోనికి వచ్చినది. విక్టర్ లాడ్యూక్సు అను ఒక ఫ్రెంచి దేశస్థుడున్నాడు — అతడు అసలయిన ప్రెంఛివాడు. నిజమగు క్రైస్తవ్యము నుండి శాఖావాదమును ఎట్లు వేరు చేయవలెనో ఒకనాడు మీతో చెప్పినట్లుగా నాకు గుర్తున్నది. ఒక పేరు పొందిన పెంతెకోస్తు శాఖ చర్చి నుండి వచ్చిన ఒకాయన దాని గూర్చి నాకు క్లుప్త సంభాషణ ఇచ్చెను.
డానీ హెన్రీ ఒక బాప్టిస్టు వ్యక్తి, ఎవరో సినీ తారకు అతడు సమీప బంధువు, అతడు వేదిక మీదికి వచ్చి, నన్ను హత్తుకొని ఇట్లనెను, ''బ్రెన్హాం సోదరుడా, ఇది అవహేళన కాదు గాని, అది ప్రకటన 23వ అధ్యాయములో ఉండియుండును.'' ఇంకా ఏదో అతడు చెప్పబోవుచుండగా, అతడు భాషలతో మాట్లాడనారంభించెను.
అక్కడున్న ముగ్గురు ఫ్రెంచి జాతీయులు దానిని వ్రాసిరి. ఒక ఫ్రెంచి స్త్రీయున్నది (ఆమె లావుగా, నల్లని ఛాయ కలిగియున్నది, లూసియానా నుండి వచ్చెను. ఈ రాత్రి బహుశా ఇక్కడామె కూర్చొనియుండును.) అతడు పలికిన దానిని ఆమె ఒక కాగితము మీద వ్రాసెను.సేవకుడగు విక్టర్ డ్యూక్సు కూడా దానిని వ్రాసెను. వారు ఒకదానితో ఒకటి సరిపోల్చి చూచుకొనిరి. కొద్దిగా తల తేలికగాయున్న ఒకాయన బాగా వెనుక నిలబడియున్నాడు. (రాగి వెంట్రుకలు గల) ఆ వెనుక నుండి అతడు వచ్చి ఈ వ్రాసిన దానిని చూడగోరెను. అతడు ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచ్ అనువాదకుడు. ఆ మూడు నోట్సులు ఒకేలాగున్నవి.
అది ఈలాగున యున్నది: ఈ కఠిన మార్గమును నీవు ఎన్నుకొన్నావు… నీవు ఇష్టపూర్వకంగా దానిని ఎన్నుకొంటివి [మోషే తన ఎన్నికను చేసికొనెనని మనమెరుగుదుము] ఇట్ల చెప్పినది, "ఇది ఖచ్చితమగు, సరియైన మార్గము; ఎందుకనగా ఇది నా మార్గము, నీవెంత మహిమకరమగు నిర్ణయము తీసికొంటివి!" చెప్పెను, "దీనిని బట్టి పరలోకములో ఎక్కువ భాగము నీ కొరకు కాచుకొనియున్నది. దైవప్రేమయందు అద్భుతమగు విజయమును దానంతట అదియే తీసికొని వచ్చును."
ఆ ముగ్గురు వ్రాసినది ఒకేలాయున్నది. దాని యొక్క మూల ప్రతి ఈ రాత్రి నా బైబిలులో యున్నదని తలంచుచున్నాను. (చూచాను గాని కనబడలేదు)
7నావలె డానీ హెన్రీకి మంచి ఇంగ్లీషు తెలియదు… నా వలె, ఆయనకు చాల తక్కువ ఇంగ్లీషు తెలియను, ఫ్రెంచి మరి ఎట్లు వచ్చును. మీరు దానిని గమనించినట్లయిన, అది ఫ్రెంచి భాష వలెయున్నది. వారు క్రియా విశేషణము ముందు క్రియను పెట్టెదరు. ఆ ముగ్గురు అనువదించినది ఒకేలా యున్నది.
కొద్ది కాలము క్రితము డానీ హెన్రీ, అతను… ఈ రాత్రి దీనిని డానీ వింటూ యుండును. విక్టర్ లా డ్యూక్సు, బహుశా అతడు టుసాన్‌లో ఉండియుండును. టుసాన్‌లో యున్న ఆలయమునకు సహో. గ్రీన్ సంఘ కాపరి, సహో. విక్టర్ లా డ్యూక్స్ ఒక గుడార కూటములో యున్నట్లు నాకు తెలిసినది. పార్క్ అవెన్యూకు దిగువగా అది జరుగుచున్నది, హైవే 80 నుండి అది ఇటుగా వచ్చును. రేపు రాత్రి గాని, ఆ మరుసటి రాత్రి గాని మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు వెళ్ళి ఆయన బోధ ఆలకించుడి; డానీ బహుశా అతనితో ఉండియుండును. ఈ రాత్రి వారు ఆలయము నుండి వింటూ కూడా ఉండియుండవచ్చును, నాకు తెలియదు.
8ఆ తరువాత వెంటనే డానీ యెరుషలేమునకు వెళ్ళెను, యేసును ఉంచిన రాతి సమాధిలోనికి అతడు దిగెను. ఆయన పునరుద్దానమునకు ముందు ఒక శవముగా అందులో యుండెను. అతడు అక్కడున్న సమయములో అకస్మాత్తుగా అతనికి నేను జ్ఞాపకము వచ్చినట్లుగా చెప్పెను. అతడు కేకలు వేయుచు బయటకు పరుగెత్తుకొని వచ్చి నడువసాగెను. అతడు నడిపి౦పబడెను… రాళ్ళలో నుండి దేనినయినా తయారు చేయగలడు — రాళ్ళ వలన పడునట్లు చెయగలడు. సిలువను నడిపించిన చోటికి వెళ్ళినట్లు చెప్పెను, ఒక అంగుళము పొడవుగల చిన్న రాయిని అక్కడ తీసి దానిని తన జేబులో ఉంచుకొనెను. దానిని ఇంటికి తేవలెనన్న ప్రగాఢ వాంఛ అతనికి కలిగినది.
అతడు దానిని తెచ్చినపుడు అతనితో ఎవరో ఇట్లు చెప్పిరి, ''దాని ద్వారా సహో బ్రెన్హాంనకు రెండు చొక్కాయి యొక్క చేతిలో మణికట్టు దగ్గర మడచి కట్టిన అంచులను కలుపు బొత్తాముల వంటివి (కఫ్ లింక్స్) చేయుము.'' కాబట్టి అతడు దానిని ఆమ్లములో యుంచెను. అది మాములు సున్నపు రాయిగా కాక రూపము మారినది. రక్తవర్ణపు రాయిగా మారినది. అతడు కఫ్ లింకులను తయారు చేసెను.
వాటిని అతడు నాకు ఇచ్చెను, రెండు కఫ్ లింకుల మధ్య ఒక చార ఉన్నది. దానిని అతడు గమనించలేదు. సన్నని చారయున్నది. ఈ రాత్రి రోగులకు ప్రార్థించుటకు వాటిని ధరించియున్నాను. రక్తము కారుచున్నట్లుగా ఆ సన్నని చారయున్నది. ఆయన ప్రవచనములో ఉన్నట్లే అక్షరాలా యున్నది, ''తిన్నని, ఇరుకైన మార్గము.'' ప్రవచనము చూడండి. దానిని అతనికి చూపించాను.
డానీ, లేక లాడ్యూక్సు సోదరుడా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు దీనిని వింటూ యుండ వచ్చును. ఈ రాత్రి రోగుల కొరకు ఆ పాత కాలపు రాత్రివలెనె ప్రార్థించుదుము. ఈ తిన్నవి, ఇరుకు మార్గములో నడచుటకు నేను ఆనందించుచున్నాను. సువార్త మార్గము, వాక్య మార్గము, మన ప్రభువైన యేసుక్రీస్తుతో నడచుట.
9మీ అందరినీ దేవుడు దీవించును. ఇప్పుడు, మాట్లాడుట చాలా బాగుండును, నేను ఎక్కువ సేపు మాట్లాడిన యెడల మీరు ఎక్కువ సేపు ఉండవలసియుండును. ప్రార్థన కొరకు మూడు నాలుగు వందల మంది యున్నట్లు బిల్లీ చెప్పెను. కాబట్టి సాధ్యమైనంత త్వరగా నేను మన వర్తమానమును అందించవలెను, తరువాత రోగుల కొరకు ప్రార్థించుదుము.
ఇప్పుడు, ఆరిజోనాలో నున్న జనులకు చెప్పుచున్నాను, వచ్చే శనివారము రాత్రికి ఆరిజోనాలోని యుమాలో విందుకు పాల్గొందుము. (ఆ పట్టణము పేరు ఎన్నడూ గుర్తుకు రాదు) ఆదివారము ఉదయము కాలిఫోర్నియోలోని లాస్ ఎంజలస్‌కు వెళ్ళుదము. ఇంకా ముందు అనుకొన్న స్థలములకు వెళ్ళుదము.
ఈ రాత్రి లేఖనము నుండి ఒక భాగమును తీసికొనగోరుచున్నాను.
10మార్గ మధ్యమున, ఈ రోజున ఒక కాఫీ శాలలో కూర్చొనియున్నాను. మారిసన్స్ కాఫీ శాల, సహో. జాక్, అతని భార్య, నేను నా భార్య, మేము కొద్దిసేపు ముచ్చటించుటకు మారిసన్స్ కాఫీ శాలకు వెళ్ళాము. ఎందుకనగా నేను బయటకు వెళ్ళలేదు, స్త్రీలు ఒకరినొకరు కలిసికోలేదు. అక్కడ ఒక యువకుడు నా దగ్గరకు వచ్చెను, అతని పేరు గ్రీన్. అతడు సహో. పెర్రీ గ్రీన్‌కు తండ్రి. అతడు ఈలాగనెను, ''సహో. బ్రన్హాం, నీకు తెలియునా? ఒక రాత్రి నీవు 'జానీ పిన్' గూర్చి మాట్లాడితివి. ఏమిటది? బాబీ పిన్. అతడు చెప్పెను, "నీవు జానీ పిన్ గూర్చి మాట్లాడితివి. "నీకు నేను ఒక జానీ పిన్ తెచ్చాను,'' అనెను. అది నాకు ఇచ్చెను.
స్త్రీలారా, అది జానీ పిన్, జుట్టుకు అది పనిచేయదు. బైబిలులో పేజీలు గుచ్చి యుంచుటకు సంవత్సరాల తలబడి ఆ జానీపిన్‌ను వాడుచున్నట్లు అతడు చెప్పెను. "నీకు నేను అసలయిన జానీపిన్‌ను ఇచ్చెదను," అని అతడనెను. కాబట్టి గ్రీన్ సోదరుడా, నీవు ఇక్కడ ఎక్కడో యుండి వినుచున్నయెడల ఆ జానీపిన్ చాలా గట్టిగా పట్టి యుంచినదని గమనించుము.
11వెంటనే మనము వాక్యములోనికి వెళ్ళుదము. నాతో కూడ మీరు కీర్తనలు 55 మరియు మత్తయి 3 తీయవలెనని కోరుచున్నాను. ఈ రాత్రి నా అంశము సహో. ఎర్నీ యొక్క అంశము: హిమమువలె తెల్లగానున్న పావురపు రెక్కలపైన. నేను ఇక్కడ సిద్దపరచిన లేఖన భాగములన్నియూ చెప్పలేకపోవచ్చును. వాటిలో కొన్నింటినీ దాటిపోవుదును, ఎందుకనగా వర్తమానము గూర్చి నేను వాగ్దానము చేశాను.
ప్రభుని చిత్తమయితే మరుసటి శనివారము రాత్రి నేను బోధించు అంశము: "ఎత్తబడుటకు షరతులు," ప్రభుని చిత్తమయితే.
PS 55:1-7
1253వ కీర్తన… నన్ను క్షమించండి. 55వ కీర్తన:
చెవియొగ్గుము… [క్షమించండి? 55, అవునయ్యా]
దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము: శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతా క్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను.
వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు.
నా గుండె నాలో వేదనపడుచున్నది: మరణ భయము నాలో పుట్టుచున్నది.
దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహా భయము నన్ను ముంచి వేసెను.
ఆహా! గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే.
త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని. [సెలా అనగా ''ఆమేన్'' అని భావము]
PS 55:6•
MATT 17:4•
MARK 9:5•
LUKE 9:33
13దావీదు అరణ్యమును ప్రేమించువాడు. ప్రజలు అతనిని నమ్మలేనందున వేదనతో కృంగిపోయెను, శత్రువులు అతని మీదికి లేచిరి. అప్పుడు ఇట్లనుకొనెను, ''ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి అరణ్యములో నివసించియుందునే.'' ఎన్నోసార్లు నేను అలాగు తలంచాను: గోడకు తగిలించిన నా రైఫిల్ తీసికొని, నా క్యాంపు బ్యాగు తగిలించుకొని, అరణ్యములోకి వెళ్ళి మరెన్నడూ రాను. అటువంటి దినము చూడవలెనని నేను ఆశించి ప్రభువును అడిగాను… సమాధి కార్యక్రమము నాకెన్నడూ అక్కరలేదు. ఎక్కడో అరణ్యములోనికి వెళ్ళి చెట్టుకు, ఆ పాత ''బ్లాండీ'' ఆనుకొని కూర్చొనియుంటే ఎంత బాగుండును." అక్కడ నా భార్య కూర్చొనియున్నందున అలా చెప్పాను.
మీకు తెలియును గదా, ఇక్కడున్న ఒకసోదరుడు సంవత్సరాల క్రితం దానిని నాకిచ్చెను, ఒక్కసారి కూడా గురి తప్పకుండా దానితో ఏబది అయిదు సార్లు వేటను కొట్టాను. అందులో కొన్ని ఏడు లేదా ఎనిమిది వందల గజముల దూరములో యున్నవి. దానిని పాత తల మాసిన లేక వయస్సైన దానిని ''బ్లాండీ'' అని నేను పిలచుదును. ఏలయనగా నా భార్య నల్లని రంగు గల వెంట్రుకలు కలది. నేను నా భార్య కంటె రైఫిల్‌నే ఎక్కువ సార్లు తలంచుకొందునని అన్నది.
దానిని చెట్టుకు చేర్చి కూర్చొని ఇట్లందును, ''ప్రభువా, ఒక రోజున జోసెఫ్‌కు అది దొరకనిమ్ము.'' నేను గువ్వ రెక్కలు కట్టుకొని ఎగిరిపోవుదును.
ఒకసారి పర్వతముల మీద పక్షిరాజు ఎగురుటను నేను గమనించాను. (దాని గూర్చి నా గాధ మీకు తెలియును) ''ప్రభువా, ఇక్కడుండుట మంచిది. మూడు పర్ణశాలలు కట్టుదుము,'' అని పేతురు చెప్పినట్లే నేను చెప్పాను. కాని ఆ కొండ దిగువన రోగులు, శ్రమపడుచున్నవారు ఎదురుచూచున్నారు. వెలుతురుండగానే మనము చేయకలిగినది చేయుదుము. ఒక దినమున తెల్లని పక్షిరాజు రెక్కలు క్రిందికి దిగును. ఆయన మనలను మోసికొనిపోవును.
MATT 3:16,17
14ఇప్పుడు మత్తయి 3:16. 16, 17 వచనములు చదువుము:
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను: ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి, తన మీదికి వచ్చుట చూచెను.
మరియు - ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. [ఈయనలో నివసించుట నాకు ఇష్టము, అని మరో మాటలో చెప్పవచ్చును]
15ఈ పక్షి మీద ఇప్పుడు కొద్ది నిమిషములు మనము మాట్లాడుదము. పావురము ఎల్లపుడూ నాకిష్టమగు పక్షులలో ఒక్కటిగా యున్నది. గువ్వ మరియు పావురము ఒకే రకమైనవి. పావురము పెంపుడు పక్షి. ఆ రెండునూ ఒకే కుటుంబమునకు చెందినవి. నేను వాటిని గూర్చి చూడగా ఆ రెండూ ఒకే కుటుంబమునకు చెందినవని తెలిసినది. గువ్వ మరియు పావురము ఒకే జాతికి చెందినవి. ఈ రెండు పక్షుల యొక్క ఆహారపు అవాట్లు అసాధారణమైనవి.
కొన్ని సంవత్సరముల క్రితము ఇక్కడ ఒక గుడార కూటములో సహో. మూర్‌తో కలిసి గొర్రెపిల్ల మరియు పావురము గూర్చి ప్రసంగించాను. మీకందరికి అది గుర్తున్నదని అనుకొనుచున్నాను; పావురము అతి పరిశభ్రమగు పక్షి, మరియు గొర్రెపిల్ల అత్యంత దీనమగు జంతువు. అవి రెండును అర్పించే పక్షి మరియు జంతువు.
16అది ఎంత చక్కని మాదిరిగా యున్నది, యేసు గొర్రెపిల్లగాను దేవుడు పావురముగాను యున్నారు. పావురము ఒక తోడేలు మీద దిగియుండలేదు, అది దాని స్వభావము కాదు, అది ఒక కుక్క మీద నిలబడలేదు, అది దాని ప్వభావము కాదు. అది గొర్రెపిల్ల మీదనే వాలియుండ గలదు; ఆ రెండు స్వభావములు ఏకరీతిగా యుండవలసియున్నవి. మనమునూ అలాగే ఉండవలసియున్నాము. గర్జించు పాపి నుండి దీనమగు గొర్రెపిల్లకు మన స్వభావములు మారవలసియున్నవి.
పావురము గొర్రెపిల్లను నడిపించుట మీరు గమనించారా? గుర్తించుడి. గొర్రెపిల్ల తనకు గల సమస్తమును పావురమునకు అప్పగించినది. పావురము ఆయనను ఎక్కడికి నడిపించినదనో చూడండి. మనందరి పాపము నిమిత్తము సిలువవేయబడుటకు నడిపించెను.
దేవుడు తన కూమారుని పావురముగా సాదృశ్యపరచ గోరుచున్నాడు. భూమి మీద ఆయన అతి పవిత్ర మరియు అతి దీనమగు జంతువునకు సాదృశ్యముగా యున్నాడు. ఒక భూ-సంభంధమగు జీవి. ఆకాశమందుగల అతి దీన మరియు అతి పవిత్ర పక్షియగు పావురమునకు ఆకాశమందున్న ఆయన సాదృశ్యముగా యున్నా డు.
17పావురములలో చాలా రకములున్నవి. మామూలుగా మన గువ్వ బూడిద రంగులో కనబడును. ఏడ్పుల పావురము, సంద్యా పావురము అని కూడా యున్నది. అది చిన్నగా, బూడిద రంగులో యుండును. దాని రెక్కల మీద ఎర్రని చారలుండును మరియు చిన్నగా ఉండును. చాలా రకములగు పావురములున్నవి. రంగులలో తేడా యుండును. గువ్వలలో కూడా అంతే.
పావురము యొక్క నిర్మాణము చాలా వింతగాయుండును. అపరిశుద్ధమగు దేనిని అది తినజాలదు. అది దాని అలవాటు. అది తినజాలదు, ఎందుకనగా అలాగు అది నిర్మాణము కాలేదు.
18పావురము దేవునికిని, కాకి వేషధారికిని మాదిరిగా యున్నవని, ఎల్లపుడూ నేను మీతో చెప్పుచుందును. కాకి ఒక క్రుళ్ళిన శవము మీద వాలి దినమంతా తినుచుండును. మరల పొలములోనికి వెళ్ళి, పావురము వలె గోధమలను భుజించగలదు, కాని పావురము గోధమలను తినగలదు గాని చచ్చిన కళేబరమును తినజాలదు. చూచారా? అది అలాగు చేయజాలదు. దాని కడుపునకు అది సరిపడదు, అదెందుకు సహించలేదో నాకు ఆశ్చర్యము కలుగుచుండును; అవి రెండునూ పక్షులే, కాని ఎందువలన? వాటి నిర్మాణములోని తారతమ్యము అది.
నిజమగు క్రైస్తవుని స్థితి కూడా అలాగేయున్నది. ఒక శాఖకు చెందిన క్రైస్తవుడు దేనినయినా గాని స్వీకరించగలడు, కాని తిరిగి జన్మించిన అసలయిన క్రైస్తవుడు లోకపు సంగతులను స్వీకరించజాలడు. అతని నిర్మాణము వేరేగాయున్నది.
19పావురమునకు చేదు లేదని నేను కనుగొన్నాను, ఎందుకనగా దాని అవసరము దానికి లేదు.
క్రైస్తవుడు కూడా అలాగేయున్నాడు. అతనికి ఎట్టి చేదు అవసరము లేదు, చూడండి. ఎందుకనగా అతడు దేవుని ఆహారమును మాత్రమే తినగలడు. దానిని అరిగించుకొనుటకు చేదు దానికి అక్కరలేదు; ప్రేమను తీసికొనును, ఆహారమును అలాగు జీర్ణించుకొనును, ద్వేషము ఎల్లప్పుడు చెప్పును, ''ఓ! అలాగా…'' అని చెప్పి వారు తేడాను కనపరచుదురు. కాని ప్రేమ ఎల్లపుడూ దేవుని వాక్యమును చేర్చుకొనును.
ఇప్పుడు, దానిలో చేదు లేదు, ఏదయినా చెడ్డది తినుటకు దానికి విరోధము. అది తిన్నచో చనిపోవును, ఒకవేళ అపాయము లేకపోయినా గాని అది తినజాలదు, ఎందుకనగా అది తినవలెనను ఆకలి దానికి లేదు.
PS 32:2•
ROM 4:8
20నిజ క్రైస్తవుడు అలాగే యున్నాడు. నిజ క్రైస్తవునికి ఏ పాపము ఆపాదించుటకు కూడా వీలుండదని మీకు తెలియునా? ''యెహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు,'' అని దావీదు చెప్పెను. గొర్రెపిల్ల రక్తములో నిజముగా నీవు కడుగబడవలెను (వేషధారణ కాదు. నిజంగా దేవుని రక్తములో.) నీవు జరిగించిన దేనికి దేవుడు నీకు నేరారోపణ చేయడు, ఎందుకనగా నీవు రక్తము క్రింద ఉన్నావు. దానిని ఆయన చూడడు. అక్కడ ఒక్క బలి యాగమున్నది; గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు జగత్తు పునాది వేయబడక మునుపు ఎట్లున్నదో, ఆ రీతిగానే ఆయన నిన్ను చూచును. ఆయన చూడకలిగినదంతయూ అదే, ఎందుకనగా నీవు చేసిన ప్రతిదాని నుండి ఆయన నిన్ను విడిపించెను. నీవు గొర్రెపిల్ల రక్తములో కడుగబడితివి, కాబట్టి నీలో ఎట్టి చేదు లేదు. నీలో ఏ చెడ్డ అలవాటు లేదు. ఈలాగు నిన్ను చేసినది గొర్రెపిల్ల రక్తమే. నీ పాపము కొరకు పరిహారముగా బలి అర్పించబడినది, గనుక దేవుడు నీకు పాపమును ఆపాదించడు, అది నీ కొరకు కనిపెట్టి చూచుచున్నది.
''బ్రన్హం సోదరుడా, అయితే నాకు చాలా అవకాశమున్నది. ఇప్పుడు, నేను నాకిష్టము వచ్చినది చేయుదును,'' అని నీవందువు. నేనెల్లపుడూ చేయుదును, ఎల్లపుడూ అలాగే యుందును. ఒకడు యేసు తన కొరకు చేసిన దానిని నిజంగా చూచియూ, ఆయనకు వ్యతిరేకముగా ఏదయినా చేయుచున్నయెడల, అతడు క్రీస్తును పొందలేదని చూపించుచున్నది.
21నా భార్య ఆ వెనుక కూర్చొనియున్నది. ఆమె నాకంటె పది సంవత్సరములు చిన్నది, అయినా గాని నావలె తెల్ల వెండ్రుకలు వచ్చియున్నవి. దానికి కారణము ఆమె నాకును, బయటి ప్రపంచమునకును మధ్య నిలబడుటయే. నేను విదేశములకు వెళ్ళు ముందు నా కుటుంబమును పిలచి ఇట్లందును, ''శ్రీమతి బ్రన్హం, ఇటు చూడు, నీవు శ్రీమతి విలియం బ్రన్హంవు అని గ్రహించవలెనని కోరుచున్నాను. నేను వెళ్ళిన తరువాత నీకు మరి ఎవరూ భర్తగా యుండరాదు, ఏ పురుషుని వైపు చూడరాదు," ఇవన్ని విషయాలు? "నీవెవరితోను పరిహాసాలు ఆడరాదు. నీవాలాగు చేసిన యెడల, నేను తిరిగి వచ్చిన పిదప నీకు విడాకులిచ్చెదను."
అపుడామె నా వైపు తిరిగి ఇట్లనును, ''ఏమండీ, నేను మీకు ఒక సంగతి చెప్పవలెను. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తరువాత మరే స్త్రీతోను తిరుగరాదు. ఏదియూ చేయరాదు. మీరాలాగు చేసిన యెడల ఇంటికి తిరిగి వచ్చిన పిదప పరిత్యాగము ఇచ్చెదను.''
అది సంతోషకరమగు కుటుంబమేనా? చూచారా? కాదు! నేను తప్పు చేసినా గాని, పొరపాటు జారినా గాని, ఆమె నన్ను క్షమించునని నాకు నమ్మకముండవలెను, ఎందుకనగా ఆమె నన్ను ప్రేమించుచున్నది. ఆమె ఒకవేళ అలాగు చేసినా గాని ఆమెను నేను క్షమించుదునని నమ్ముచున్నాను; ఎందుకనగా ఆమెను నేను ప్రేమించుచున్నాను. ఆమెను నేను అలాగు ప్రేమించుచున్నంత కాలము, ఆమెకు ఏ చింతయూ ఉండదు. ఆమె నన్ను క్షమించినాగాని ఆమెకు నేను ఎట్టి విధముగా బాధ కలిగించను. నేను చేసిన తప్పును ఆమెకు చెప్పువరకు ప్రపంచములో నాకంటె దోషి మరెవరూ లేరన్న భావనను కలిగియుందును; ఎందుకనగా ఆమెను నేను ప్రేమించుచున్నాను. అటువంటి ఫిలియో ప్రేమతో నేను ఆమెను ప్రేమించుచున్న యెడల, యేసుక్రీస్తు పట్ల నాకు గల అగాపే ప్రేమ మరెంత ఎక్కువగా ఉండవలెను.
22నా జీవితంలో నేనెన్నడూ సిగరెట్టు త్రాగలేదు, ఎప్పుడూ లేదు, కాని ఒకవేళ త్రాగినాగాని, ఆయన నన్ను క్షమించును; ఆ నమ్మకము నాకున్నది. నా జీవితంలో ఎన్నడూ నేను త్రాగలేదు, ఒకవేళ త్రాగినాగాని, ఆయన నన్ను క్షమించును; ఆ నమ్మకము నాక్నుది. ఆయనను ఎంతో నేను ప్రేమించుచున్నాను. (దేవా, నాకు సహాయము చేయుము), అందువలన అట్టిది ఏదియూ నేను చేయను; చూడండి, ఎందుకనగా ఆయనను నేను ప్రేమించుచున్నాను. ఆ విధమగునది నాలో నుండి వెడలిపోయినది, ఎందుకనగా ఆయన నన్ను కాకి నుండి పావురమునకు మార్చెను, అందువలన నా ఆకలి మరి ఆ క్రియలు నన్ను విడిచి పెట్టినవి. ఆ పాపము నాకు ఆరోపించబడలేదు, ఎందుకనగా అది చేయవలెనను గురి నాకు లేదు, అది చేయవలెనను కోరిక నాలో లేదు.
23ఇప్పుడు ఈ పావురము విషయములో మరో గొప్ప సంగతియున్నది. అది ఒక వింత పక్షి. మీరు ఇతర పక్షులు ఎన్నడైనా చూచియున్నారా…
నాకు ఇష్టమగు పక్షులలో రాబిన్ ఒకటి. ఇప్పుడు, నా రాబిన్‌లను మీ పిల్లలు వేటాడవద్దు, చూడండి, మీరాలాగు చేయుట నాకు ఇష్టము లేదు. నా రాబిన్‌కు ఎర్రని ఉదర భాగముండుట గమనించారా? ఒక రోజున ఒకాయన సిలువ మీద చనిపోవుచుండెను, ఎవరూ ఆయనకు సహాయము చేయుట లేదు. ఆ మనుష్యుని దేవుడు చేయి విడిచెను, ఆయన చనిపోవుచుండెను. ఆయన చేతులలో మేకులు కొట్టబడెను, ఆయన పాదములు, ప్రక్కల నుండి రక్తము కారుచుండెను, ఆయన తలమీద ముండ్ల కిరీటము పెట్టబడినందున ముఖము రక్తముతో నిండిపోయెను. అటువైపుగా ఒక చిన్న గోధుమ రంగు పిట్ట ఎగిరి వెళ్ళుచుండెను. దానికి ఈ అతి హృదయవికారమగు దృశ్యము కనబడెను. తాను చిన్న పక్షినని ఎరిగి యున్నప్పటికిని, ఆయన చేతులలో కొట్టబడిన పెద్ద క్రూరమగు మేకులను రోమీయులు ఎట్లు గుచ్చిరో చూచెను. వాటిని లాగుటకు తన చిన్న ముక్కుతో ప్రయత్నించెను, అప్పుడు దాని రొమ్ము భాగమంతయూ అందువలన రక్తముతో నిండిపోయెను; అందువల్లనే దాని రొమ్ము భాగము అప్పటినుండియూ ఎర్రగా నున్నది. నా రొమ్ము భాగము కూడా ఆయన రక్తముతో పరిరక్షించబడవలెనని కోరుచున్నాను. ఆయనను కలిసికొనుటకు వెళ్ళినపుడు, అదియే నాకు కేడెముగానుండును. ఆ చిన్న రాబిన్ను నేను ప్రేమిస్తున్నాను.
24కాని మీరు చూడండి. ఆ చిన్న రాబిన్‌కు స్నానము అవసరము; కాని పావురమునకు అక్కరలేదు. దాని లోపల ఒక రకమగు నూనెయున్నది. ఆ నూనె దాని లోపటి నుండి బయట శుభ్రముగా ఉండునట్లు చేయును. అది మీకు తెలియునా? పావురమునకు అదియున్నది! పావురము తనలోనే ఆ నూనె కలిగియున్నది. ఒక పావురమును పట్టుకొని ఎప్పుడయినా దాని పైనున్న వాసనను గమనించారా? దాని లోపటి నుండియే ఆ నూనె ఉత్పత్తియగును. దాని శరీరములో నున్న నూనె గ్రంధి, ఎల్లపుడూ దాని బయటనున్న ఈకెలను పరిశుభ్రముగా ఉంచును, అందువలనే అది ఎల్లపుడూ లోపట-బయట పరిశుభ్రముగా యుండును. అది నిజము. అది నిజంగా ఒక అద్భుతమగు పక్షి.
మీరు వాటిని ఈ లూసియానాలో వేటాడగలరని నేననుకొనుచున్నాను. అలాగు చేయవద్దు! ఓ! నేను అది చేయలేను. నేను ఆకలిగా ఉన్నా పరవాలేదు, కాని దానిని చంపుటకు నా రైఫిల్‌ను ఉపయోగించను.
25మా కుటుంబములో పావురము ఒక గొప్పదగు ఆశ్చర్యకరమగు వింతపక్షి. మా నాయనమ్మ ఈ కెంటకీ నుండియే వచ్చినది, చెరోకీ అడవి ప్రాంతము నుండి వచ్చినది. ఆమె ఒక విధమగు… వారు దానిని మాంస గ్రంధులు వాయుట వలన లేక అదేదో వ్యాధితో చనిపోవుచున్నది. మా తాతగారు ఆమె పడక ప్రక్కన మోకరించెను, ఆమె పడకచుట్టూ తల్లి, బిర్టీ, హవులీ అంటీలు,చార్లీ అంకుల్, (చిన్న నాలుగు సంవత్సరముల బాలుడు, శిశువు) పండ్రెండు సంవత్సరముల వయస్సుగల మామా మోకరించిరి. పడక మీదయున్న ఆమెకు మా తల్లి తల దువ్వుచూ ఈలాగు పాడసాగినది, ''నా కొరకు చీల్చబడిన యుగముల బండా! నీలో నన్ను దాగుకోనిమ్ము.'' ఆమె జుట్టు నల్లగానేయున్నది. ఆమె మరణశయ్యపై యున్నది. అప్పటికి తాతగారు ఇంకా క్రైస్తవుడు కాలేదు. ఆయనకు ఎనుబది ఏడేండ్ల వయస్సు వచ్చినపుడు నేను యేసు క్రీస్తు నామములో, ప్రభువు దూత నాకు ప్రత్యక్షమైన నది యొద్ద బాప్తిస్మ మిచ్చాను.
ఆమె తన బలహీనపు చిన్న చేతులను గాలిలోనికి ఎత్తి ఈ పాట పాడుచుండగా ఒక పావురము తలుపుగుండా ఎగిరి వచ్చినది. అది పడక మీదికి వచ్చి, కూయసాగినది. దేవుడామె ఆత్మను తీసికొనెను.
26సహో. జాక్ మరియు గోర్డన్ లిండ్సేలతో కలిసి నేను ఇంగ్లాండులోని లండన్‌కు వెళ్ళాను. అక్కడ ఫ్లారెన్సు నైటింగేలు అను పేరుగల ఒకామెయున్నది. (దిగవంత ఫ్లారెన్సు నైటింగేలుకు ఆమె ముని మనుమరాలని చెప్పుకొనెను) ఆమె నాకు చాలా ఉత్తరములు వ్రాసినది. ఆమె దక్షిణాఫ్రికాలో కాన్సరుతో చనిపోవుచుండెను. ఆమె బొమ్మను మీరు పుస్తకములో చూచియున్నారు, అట్టి రూపమును నా జీవితములో ఎన్నడూ నేను చూడలేదు. ఆ రోజున నాతో సహో. జాక్ ఉన్నాడని నమ్ముచున్నాను, ఆమెను ఒక ఆలయములోనికి తీసికొని వచ్చిరి. ఆలయము వెనుక నున్న సంఘకాపరి ఇంటిలోనికి మేము వెళ్ళాము.
మా విమానము కిందకు దిగగానే, వారు మాకు పేజర్ ద్వారా వర్తమానము పంపారు. ఆమె అక్కడ ఒక అంబులెన్సులో యున్నది, మాకు తెలియపరచిరి దక్షిణాఫ్రికా నుండి ఆమె వచ్చినది. నేను ఇంగ్లాండునకు వచ్చుచున్నానని ఆమెకు తెలిసినది, ఆమెను విమానములో తీసికొని వచ్చిరి. అప్పుడు సంఘకాపరి, ఆమెను కాపరి గృహమునకు తీసికొనివెళ్ళెను, కావున మేము ఆమెకు ప్రార్ధించుటకు అచ్చటకి వెళ్ళాము.
27నేను ఎందరో రోగులను చూచాను, కాని ఆమె చేతులను, చూడలేకపోయాము, అస్థిపంజరమువలె యున్నది. ఆమెకు ఎముకలు తప్ప మరేమీలేవు, ఆమె చేతులు నేను పైకి ఎత్తలేకపోయాను. పైకి లేపుటకు కూడ ఆమెకు బలములేదు. ఆమెకు నడుములు లేవు రెండు అంగుళములు మాత్రము అక్కడుండెను. ఆమె ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నది, నాకు అర్థము కాలేదు. ఒక నర్సు ద్వారా చివరకు నేను ఈలాగు విన్నాను, ''బ్రెన్హాం సోదరుడా, దేవుడు నన్ను తీసికొనునట్లు ప్రార్థించు.'' ఆమెకు జీవించుటకు ఇష్టములేదు, ఆమె ఎముకల ముఖము నుండి కన్నీరు కారుట నేను గమనించాను. ఏడ్చుటకు కూడా కావలసిన తడి ఆమెలో లేదు. ఆమె నరములు చచ్చుబడినవి. ఆమె భయంకర స్ధితిలోయున్నది. నేను రోగులకు ప్రార్థించుటకు వచ్చాను గాని చనిపోవునట్లు ప్రార్థించుటకు రాలేదు. ఆమె ప్రాణము పోకుండ అలాగే నిలచియున్నది, వ్రేలాడుచున్నది.
గదిలో ప్రార్థించుటకు మీ సంఘకాపరితో నేను మోకరించాను. నేను ప్రార్థించుటకు మోకరించినపుడు కిటికీలోనుండి ఒక చిన్న పావురము ఎగిరి వచ్చినది, కూయ నారంభించినది. నేను ప్రార్థన ముగించిన పిదప అక్కడ పెంపుడు పావురమున్నదేమోనని చూచాను. పొగమంచు కమ్మియున్నది. ఇంగ్లాండు, బ్రిటీషు దీవులు ఏలాగుండునో మీరెరుగుదురు. ఈ చిన్న పావురము కూయుటకు ఆపినది, ఎగిరిపోయినది. నేను ఆమె యొద్దకు వెళ్ళి ఆమె మీద చేతులుంచి ప్రభువు పేరట ప్రార్థించాను. నేడు ఆ స్త్రీ ఒక బలమగు, ఆరోగ్యమగు స్త్రీగా పావురపు రెక్కల మీద యున్నది.
అది లోపట కూడా తన్నుతాను శుభ్రమగా ఉంచుకొనును. క్రైస్తవుడు కూడ అలాగే చేయును. అంతరంగమును శుద్ధిచేసికొనును. అది అసూయను దూరముగా నుంచును. దేనినయినా జీర్ణించు కొనుటకు దానికి చేదు అక్కరలేదు, ఎందుకనగా అది అలాటి వాటిని తినదు. చూచారా? అది లోపల, వెలుపల కూడా పరిశుభ్రముగా నున్నది.
GEN 15:1-9
28ఇప్పుడు, ఈ యొక్క పక్షిని మనము గమనించియున్నాము… ఇక్కడ నేను చాలా సంగతులు వ్రాసియుంచాను గాని గడియారము ఆగక పోవుచునేయున్నది. ఈ పక్షిని పాత నింబంధనలో బలికొరకు ఉపయోగించిరి. శుద్దీకరణకు ఇది ఒక ప్రాయశ్చిత్త బలి. ఈ సందర్భములో ఆదికాండము 15:9 వచనమును, ఒక్క క్షణము చూచెదము. దీనిని ఎట్లు చేయుదువు అని అబ్రాహాము దేవుని ప్రశ్నించెను. దేవుడు అబ్రాహామునకు తన వాక్కు మరల ప్రత్యక్షపరచెను. ఆయన దానిని వింత రీతిలో చెప్పెను. 1వ వచనము నుండి ఆరంభించుదము, ఇక్కడ నేను తొందరపడగోరుటలేదు.
ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి - [చూడండి, అబ్రాహాము ఒక ప్రవక్త, అతడు దర్శనములను చూచెను] అబ్రాహామూ, భయపడకుము: నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. [చూడండి. యెహోవా-నిస్సీ]
అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? [గమనించండి.'' ప్రభువైన యెహోవా.'' ఎలోహిం.] ప్రభువైన యెహోవా, [దర్శనమందు] నేను సంతానము లేనివాడనైపోవుచున్నానే? దమస్కు వాడైన ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా?
మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక: నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా.
యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు; [అతనికి ఒక వాగ్దానము ఇచ్చెను, అక్కడే అబ్రాహాము విఫలుడైయుండును గాని ఆ వాగ్దానము షరతులతో కూడినది కాదు. నిబంధనకు షరతులు లేవు] నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును. [ఇప్పుడతని వయస్సు వంద సంవత్సరములు] మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. [వంద సంవత్సరముల వాడై పిల్లలు లేని వ్యక్తి]
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది తీసికొని అతనికి నీతిగా ఎంచెను.
మరియు ఆయన, నీవు ఈదేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినపుడు.
అతడు, ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా?
ఇప్పుడు దీనిని వినండి:
ఆయన, మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, [ఇప్పుడు ఆ ''మూడు''ను గమనించండి. ''మూడేండ్ల వయస్సు''] మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. [రెండును అదే జనులు, రెండును అదే కార్యము.]
చూడుడి, అది యేసును చూపించులాగున బల్యర్పణలో వాడబడెను.
29నిబంధన చేయబడినది… వాటిని ఎట్లు ఖండించునో మీకు తెలియును.
అనాది కాలములో నిబంధన చేయునప్పుడు వారు ఒక ఒప్పందమునకు వచ్చి, మరియు వ్రాసికొనెడివారు. ఒక జంతువును చంపి, దాని మధ్య నిలబడి, నిబంధనను రెండుగా చీల్చి, ఒకరు ఒక భాగమును తీసికొనెడివారు.
చైనా చాకలివారు చేసినట్లే అది యున్నది. ఇక్కడున్న చైనా వారికి ఇంగ్లీషు వ్రాయుట రాదు, కాబట్టి అతడు ఒక కాగితము మీద వ్రాసి దానిని చింపి ఒక ముక్కను నీకు ఇచ్చును. చైనా చాకలివారు అలాగు చేయుట మీరెరుగుదురు. చింపబడిన ఆ రెండు కాగితపు ముక్కలు సరిపడినపుడే నీకు బట్టలు ఇచ్చెదరు, కాబట్టి వారిని నీవు మోసపరచలేవు; ఎందుకనగా వానియొద్ద మరొక ముక్కయున్నది. నీవు, నీ పేరును తిరిగి వ్రాయవచ్చును, కాని ఆ కాగితమును అలాగు నీవు చింప లేవు. చూచారా?ఆ చింపబడిన కాగితమునకు ప్రత్యామ్నాయము చేయలేవు.
తూర్పు దేశములలో వారు ఆనాడు చాలా కాలము క్రిందట అలాగే చేసెడివారు. వారు ఒక జంతువును చంపి, దాని మధ్యను నిలబడి దాని చర్మమును రెండుగా చింపి, చెరొకటి తీసికొనెడివారు. నిబంధన స్థిరపడినపుడు వారు ముక్కలను ఏకముగా కలుపుదురు.
30ఇప్పుడు, ఈ బలుల ద్వారా దేవుడు క్రీస్తును గూర్చి చూపించుచున్నాడు: యేసును కల్వరి యొద్దకు దేవుడు రప్పించి, ఆయనను ముక్కలుగా చీల్చెను, మరియు ఆయన శరీరమును పరమందు చేర్చుకొనెను. ఆత్మను మన మీదకి పంపెను, ఆయన మీద ఉండిన ఆత్మయే, నీ మీద ఉండవలెను. అప్పుడు ఆయన శరీరముతో అతుకబడి అంత్యకాల మందు పెండ్లికుమార్తెగా ఉండును. ఆయన వాక్యమై యుండినట్లు అది వాక్యమైయుండును. చూచారా?
అలాగే వాక్యము మరల వాక్యము యొద్దకు రావలెను, మానవునిలో కణము ఉన్నట్లుగానే; మీకు తెలియునా, నీ శరీరము నిర్మింపబడినప్పుడు ఒక మానవ కణముతోను, ఒక కుక్క కణముతోను, ఒక పంది కణముతోను నిర్మించబడుట లేదు. అలాగు కాదు. అంతయూ మానవ కణమే. అలాగే క్రీస్తుయొక్క శరీరము పూర్తిగా దేవుని వాక్యముతో నిర్మించబడియున్నది. ఒక భాగము వాక్యము, మరో భాగము ఆచారము కాదు. అది పూర్తిగా క్రీస్తు శరీరము.
గువ్వను, పావురమును కూడా వాడుట కనుగొందుము, ఎందుకనగా ఆ రెండునూ ఒకే జాతికి చెందినవి.
LEV 12:4-6•
LUKE 2:22,24
31కావున గమనించండి [కొన్ని లేఖనములను నేను చెప్పెదను] లేవీకాండము 12:6.స్త్రీ యొక్క క్రమము పవిత్రీకరించబడుట మనము ఇక్కడ కనుగొందుము. స్త్రీకి శిశువు జన్మించినపుడు ఆమె కనిపెట్టవలెను. మగబిడ్డ పుట్టినచో ఆమె ముప్పది మూడు దినములు ఆగి, పరిశుద్దత పొందుటకు పావురములతో ఆమె సమాజ మందిరములో ప్రవేశించవలెను. ఆమెకు ఆడశిశువు జన్మించిన యెడల ఆమె తొంబది ఆరు దినములు ఆగి సమాజ మందిరములో ప్రవేశించవలెను.
ఇప్పుడు 6వ వచనము గమనించుదము.
కుమారుని కొరకే గాని, కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్ధబలిగా ఒక పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసికొనిరావలెను.
చూడండి. ఆమె ఇంకా లోనికి రాలేదు, ఎందుకనగా ఆమె దినములు ఇంకా సంపూర్తి కాలేదు, కాని ఆమె తన అర్పణను ద్వారము నొద్ద యాజకునికి ఇవ్వవలెను. చూడండి. ఆమె గువ్వను లేదా పావురపు పిల్లను గాని తేవలెను. అవి రెండూ ఒకే జాతివి.
32పాప పరిహారమునకు పావురమును ఉపయోగించెడి వారు. కుష్టము కూడా పాపమునకు సాదృశ్యము. ఆ రోగియు రెండు పావురములను తీసికొనిరావలెను. ఒకదాని తలను చేధించవలెను, దానిని తలక్రిందులు చేసి దాని రక్తమును మరొక దాని మీద ఒలికించవలెను. అప్పుడు మరో పావురము స్వేచ్ఛగా వదలబడును, ఆ పావురము ఎగురుచుండగా దాని మీద నున్న తన సహ పావురపు రక్తము వలన భూమి తడియును. ఆ రక్తము దేవునికి ఈలాగు మొరపెట్టును: ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువగు యెహోవా పరిశుద్ధుడు!''
చనిపోవుచున్న ఆ ఇంకొక జత పక్షియైన యేసుక్రీస్తును నీవు చూచుట లేదా? ఆయన చంపబడెను. ఆ రక్తము మన మీద ప్రోక్షించబడెను, మనము స్వాతంత్య్రముగా వెళ్ళిపోగలము. ''పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!'' అని ప్రభువుకు మొరపెట్టుచు. ఎటువంటి సాదృశ్యము. నాకు పెద్ద గొంతున్నచో బాగుండును.
GEN 2:17•
GEN 6:8•
GEN 7:11,16
33ప్రకటన 3:16లో ఆ గొప్ప పరిశుద్దాత్మకు మాదిరిగా యున్న దానిని ఇప్పుడు మనము చదివితిమి. ఈ పావురమును ఒక సూచనగా దేవుడు వాడుకొనెను.
నోవహునకు ఒక సూచన ఇవ్వబడెను. దాని గూర్చి ఇప్పుడే సోదరుడు పాడెను. దేవుడు అయిష్టపడెను, ఆయన ఉగ్రత ఏదియూ తాళజాలదు. ఆయన ఇట్లనెను, ''దానిని తిను దినమున, నిశ్చయముగా నీవు చనిపోదువు.'' నోవహు దేవుని దృష్టిలో కృపను పొందెను. దేవుడు తనకిచ్చిన కొలతల ప్రకారము ఒక ఓడను నిర్మించెను. అతడు పైకి తేలెను.
ఆ రోజులలో వారేమనిరో నేనూహించగలను, ''ఆ కొండ మీదనున్న ముసలివాడు ఉన్నాడు. వృద్ధ మత మూఢుడు, వర్షము కురియునని చెప్పి ఒక ఓడ నిర్మించుచున్నాడు. వర్షము కురియునని చెప్పుచున్నాడు, అసలు ఎన్నడూ వర్షము కురియలేదు గదా?'' అయితే.
"ఏమయినాగాని వర్షము కురియును,'' అని నోవాహు చెప్పెను.
అతడు ఏ దినమున లోనికి వెళ్ళెనో నాకు గుర్తులేదు గాని, అది మే పదిహేడు అనుకొందును, నోవహు ఓడలోనికి ప్రవేశించెను. దేవుడు ఓడను మూసెను.
మబ్బులు కమ్ముకొన్నవి, వర్షము రాసాగెను, అగాధ జలములు విప్పబడెను, ఊటలన్నియూ పొంగిపొర్లినవి, చివరగా జనులు బండ్ల మీదకి ఎక్కిరి. ఆ పాత ఓడ ఎప్పటివలెనె నిలబడి యుండెను.
అది పైకి లేచుటకు కావలసినంత నీరు రాగానే, అది నెమ్మది నెమ్మదిగా పైకి పోసాగెను. ప్రజలు ఆ తలుపు కొట్టి అరవసాగిరి. అయినా ఫలితములేదు, నోవహు తలుపును తెరువ జాలకపోయెను. దేవుడు దానిని మూసెను గనుక, దానిని దేవుడు మాత్రమే తెరవగలడు.
మన ఓడయగు యేసుక్రీస్తు కూడ అలాగే యున్నాడు. దేవుడు కల్వరిలో మనకొరకు తలుపు తెరచెను, ఆయన దానిని తెరచినంత నిశ్చయముగానే మూసి వేయును.
GEN 7:17
34అది పైపైకి తేలిపోసాగినది, బహుశా ఈ భూమిపైన ఒక మైలు ఎత్తుగా ఉండునేమో. అది ఇంకా పైకి పోయి చెట్లు, పర్వతములు మునిగిపోసాగినవి. నలువది దివా రాత్రులు అలాగు కురిసెను.
గాలులు వీచుట మానెను…
దేవునియొక్క ఉగ్రత భయంకరము. ఆయన యొక్క ప్రేమ పవిత్రమైనది, దైవికమైనది. ఆయన ఉగ్రత కూడా ఆయన ప్రేమవలెనె దైవికమైనది, ఎందుకనగా ఆయన న్యాయవంతుడు గనుక న్యాయతీర్పులను పంపించి తీరవలెను. ఆయన శాసనమిచ్చువాడు, శిక్షలేని శాసనము శాసనమే కాదు. కాబట్టి శాసనమునకు ఒక శిక్ష వెంట ఉండును. నీవు దేవుని శాసనములను మీరినపుడు, దానికి జరిమానా చెల్లించవలెను.
GEN 8:6•
LUKE 9:62
35నోవాహు ఓడలో పైకి తేలినప్పుడు, అక్కడ కేకలు, గగ్గోలు ఉన్నదని నిస్సందేహముగా చెప్పవచ్చును. దేవుని యొక్క ఉగ్రత నురుగులు కక్కుచూ గర్జించుచున్నది. అయితే ఆ తరువాత నిమ్మళమాయెను, ఏమీ జరుగలేదు. దినములు గతించినవి, ఏమీ సంభవించలేదు. బహుశా ఆ జంతువుల ఆహారము తరిగిపోవుచుండెను. అయినాగాని ఏమీ మార్పులేదు, కావున అతను తలంచెను ''ఆశ్చర్యము… నేను బయటకు చూడ వీలులేదు.''
ఓడ ఆ విధంగా నిర్మించబడినది, అందులో మీరు ఉంటే, అందులో ఒకే కిటికీయున్నది, అది చాలా పైనయున్నది. నీవు ప్రక్కలకు చూడ వీలులేదు, పైకి తప్ప మరే వైపునకు నీవు చూడలేవు. యేసుక్రీస్తు అను ఓడ కూడా అలాగేయున్నది. తరువాత వ్యక్తి వైపు నీవు చూడలేవు. ఓడలో నున్నపుడు నీవు క్రీస్తును తప్ప మరెవరిని చూడలేవు, ఎందుకనగా ఒకే ద్వారమున్నది, ఆ ద్వారము ఆయనే. ఈ ఉదయము దాని గూర్చి మనము మాట్లడుకొనియున్నాము. మీరు పైకి చూడవలసియున్నది. ''నాగటి మీద చేయి వేసి వెనుకకు చూచువాడు యోగ్యుడు కాడు.''
GEN 7:7
36ఇప్పుడు, ఈ ఓడలో బహుశా అతడు సూర్యకాంతిని చూడగలడు, కాని అతడెక్కడున్నాడో అర్థము కాదు. ఇంకా ఆ ఓడ తేలిపోవుచూ యున్నది. ప్రక్కల నుండి కొట్టుచున్న అలల హోరు వినబడచున్నది. అయితే అప్పటికి చాలా దినములు అయినది గనుక నీరు వెనక్కు తగ్గుచున్నదని మాత్రము అతనికి తెలియును. అతడు వెళ్ళి నమ్ముటకు వీలులేని ఒక పక్షిని బయటకు విడిచెను, పరీక్షించెను. అది ఒక కాకి, బయటకు వెళ్ళి ఇక తిరిగి రాలేదు; ఎందుకనగా దేవుని యొక్క ఓడకు వెలుపట దానికి ఆనందము దొరికినది. అది ఒక మృత కళేబరము నుండి మరొక దాని మీదికి ఎగిరి వెళ్ళుచుండెను. ఆ నీటి మీద ఎన్నో పీనుగులు దానికి దొరికెను; అది పూర్తి సంతృప్తిని పొందినది.
GEN 7:8-11•
GEN 8:8,11
37చాలా దినముల తరువాత అతడు మరల పరీక్షించెను. దేవునియొక్క ఉగ్రతలో అతడు తన కాలు మోప ఇష్టపడలేదు, కనుక అతడు ఒక పావురమును బయటకు విడిచెను. ఈ పావురము స్వభావమే వేరు, అది రాబందు కాదు, కాకియూకాదు. అది పవిత్రమగు వాటిని మాత్రమే తినగలదు, దాని కాలు మోపుటకు ఎక్కడా చోటు కనబడనందున తిరిగి ఓడలోనికి వచ్చినది. ''ఇంకా ప్రళయము పోలేదు,'' అని నోవహు తలంచెను.
అపుడతడు చాలా దినములు కనిపెట్టెను, అతడు మరల దానిని బయటకు పంపెను. అతని ప్రార్థన ఇట్లున్నది, ''ఓ దేవా, నీ ఉగ్రత సమాప్తమైనదా? ప్రభువా, నీ ఉగ్రతచల్లారినదా? అంతా ముగిసినదా?'' ఈ సారి దానిని బయటకు పంపి చూతునని అతడు తలంచి ప్రార్థనా పూర్వకముగా దానిని పంపెను. అది దేవునిచే నడిపించబడి బయటకు వెళ్ళి చెట్టు మీద నుండి పరిశుద్ధమగు ఆకును పట్టుకొని వచ్చి మరల కిటికీ మీద కూర్చొనెను.
దేవుడు పావురమును ఒక సూచనగా వాడుకొనెను. ''జల ప్రళయము అయిపోయినది,'' అని అది వచ్చి చెప్పినది. అప్పుడు దేవుడు తలుపు తెరచెను, వారు బయటకు వచ్చిరి. అదియే ఆదికాండము 8:8.
MATT 3:16,17
38అప్పుడు దేవుని ఉగ్రత భూమిమీద ఉండగా మత్తయి 3:16లో కూడా అలాగే వాడబడెను. త్రోవ కనబడుట లేదు, చీకటి రాత్రి, అర్థ రాత్రి, సంఘములు బయటకు రాజాలని సంగతులలో చుట్టుకొని పోయినవి. అబద్ధ బోధకులు వచ్చిరి, అన్ని రకముల క్రియలు చోటుచేసికొన్నవి, అన్ని రకముల బోధలు బయలుదేరినవి, కాని దేవుడు మరల ఒక పావురమును ఉపయోగించుకొనెను. అది ఆయనకు ఇష్టమాయెను, ఆయన కుమారుడగు యేసు ఎంతగానో ఆయనను సంతోషపెట్టెను, అది ఆయనను గుర్తించెను.
పశువుల తొట్టిలో జన్మించినను ఆయనను వారు నమ్మలేకపోయిరి, ఆ తల్లిదండ్రులు ఇంకా వివాహములో జతపరచబడలేదు. అటువంటి కార్యమును దేవుడు ఉపయోగించుకొనుట వారి ఊహకు మించిన కార్యముగా ఉండెను, కాబట్టి ఆయన లోకమునకు గుర్తించబడవలెను. దేవునియొక్క కళాఖండముగా ఆయన తన్ను తాను నిరూపించుకొనుట విధేయుడై నీటి యొద్దకు నడిచి వచ్చెను, దానిగూర్చి ఈ ఉదయమున మాట్లాడాను…
MATT 11:11•
LUKE 7:28
39ఇప్పుడు మీరు గమనించినట్లయిన, అక్కడ ఒక గొప్ప పాఠమున్నది. ఆ సమయమున యోహాను భూమి మీద నున్నవారిలో అతి గొప్పవాడు. అప్పటి వరకు ''స్త్రీలు కనిన వారిలో ఇంతకన్న గొప్పవాడుమరెవరు లేరు,'' అని యేసు చెప్పెను. ఆయన ఒక ప్రవక్త, మీరది నమ్మెదరా? ఇప్పుడు గుర్తుంచుకొనండి. భూమి మీద ఎవరియొద్దకైనను దేవుని వాక్యము వచ్చినయెడల, అది ఒక ప్రవక్తగా యుండును. అది ఎల్లప్పుడూ దేవుని మార్గము. యేసు శరీరధారియైన వాక్యము అని మీరు నమ్ముచున్నారా? కాబట్టి పరిచయము కాబడుటకు ఆయన రావలసిన మార్గము ఒక్కటేయున్నది — యాజకుల ద్వారా కాదు.
''కయపా, నీవు నన్ను పరిచయము చేయుదువా?'' అని ఆయన వెళ్ళి అడుగలేదు. ఆయన అలాగు చేసియుండినయెడల మనము పాఠములో ఒక రోజున చెప్పుకొన్నట్లుగా దావీదు చేసిన పొరపాటునే చేసిన వాడగును; చూడండి, ''మీరు నన్ను పరిచయము చయుదురా?'' అని ఆయన సంఘమును వెళ్ళి అడుగలేదు.
AMOS 3:7•
MATT 3:11,17•
MARK 1:7•
LUKE 3:16,22•
JOHN 1:26,27,29•
HEB 7:26,27
40ఆయన జన్మించినపుడు జరిగినది గమనించండి, ఆయన సంఘముయొక్క ఛాయలో జన్మించెను. వారు బహుశా గంటలు మ్రోగించుచుండిరి, కాని ఆయనను గొర్రెల కాపరులు గుర్తించిరి మరియు జ్ఞానులు. చూచారా?
ఇక్కడ ఆయన సేవ కొరకు సిద్థమగుచున్నాడు. మరియు ఆయన గనుక వాక్యమైన యెడల… దేవునియొక్క గొప్ప పధకము ప్రకారము, వాక్యము మాత్రమే…''తన దాసులగు ప్రవక్తలకు మొదట బయలుపరచకుండా ప్రభువగు దేవుడు దేనినీ చేయడు,''
అది ఎల్లప్పుడు ఆయన మాదిరి, అలాగే జరుగవలసియున్నది. ముద్రలు విప్పబడినపుడు, మరేమి చేసినా ఆయన విధానము అదే. భూమి మీద ఎంత గొప్ప సంఘటన జరిగినా గాని దేవుడు దానిని తన ప్రవక్తలకు బయలుపరచును.
యోహాను ప్రవక్తగా ఉండెను. ''ఆయన వచ్చును,'' అని అతడు ప్రవచించుచుండెను.
ఒకనాడు ఆ కొండ ప్రక్కన కొందరు యాజకులు గుమిగూడి ఏదో చర్చించుచుండిరి. ''ఆ బురదలో నిలబడిన నీవు ప్రవక్తవని మాతో చెప్పుకొనుచున్నావా?'' [అతడు సంఘములో లేడు, వారతనినిరానియ్యరు] ''ఆ బురదలో నిలబడి ఆ ఘడియ వచ్చుచున్నదని మాకు చెప్పెదవా? ఆ గొప్ప యెహోవా ఈ బలులను నియమించెను, ఈ ఆలయమును, ఆ మహా యెహోవా నిర్మించెను, అగ్ని స్తంభములో ఆయన దిగి వచ్చెను. అనుదిన అర్పణ ఆగిపోవు దినము వచ్చునని నీవు మాతో చెప్పుదువా?''
అతడు ఇట్లనెను, ''ఒకాయన వచ్చుచున్నాడు, ఇప్పుడు మీమధ్యనే ఆయన ఉన్నాడు, అక్కడే ఎక్కడో ఆయన యున్నాడు, ఆయన పాపమును మోసికొనిపోవును.'' యాజకుడు అతని మాటలకు తికమకపడి విసుగుచెందెను.
JOHN 1:29
41యోహాను పైకి చూచెను. అతడు ఎవరు? ప్రవక్త! ఇక్కడ వాక్యమున్నది. వాక్యమే సూటిగా ఆ నీటిలోనున్న ప్రవక్తయొద్దకు వచ్చెను. యోహాను ఇట్లనెను, ''ఇదిగో, లోక పాపమును మోసికొనుపోవుచున్న దేవుని గొర్రెపిల్ల. అదిగో ఆయనే.'' యేసు ఎన్నడూ ఒక్క మాటయు పలుకలేదు. తిన్నగా నీటిలోనికి వచ్చెను. భూమి మీదకు వచ్చిన ఇద్దరు అతి గొప్ప వ్యక్తులను మనము అక్కడ నిలబడియుండగా చూడగలము (ఆ సంధర్బము ఉహించండి), వాక్యమగు దేవుడు మరియు ఆయన ప్రవక్త.
గమనించండి, ఈ కృపా యుగములో వాక్యము, నీటిలోనున్న ప్రవక్తయొద్దకు వచ్చెను. మీరు దానిని గ్రహించగలరనుకొనుచున్నాను. నీటిలో! వాక్యము యొక్క మొదటి ప్రత్యక్షత నీటిలోనే! పెండ్లికుమార్తె ఎక్కడ ఆరంభమాయెనో ఇప్పుడు మీరు చూడగలుగుచున్నారా? సంధ్యాకాల వర్తమానమా? నీటిలోనే! వాక్యము, సత్యవాక్యము, మత సిద్దాంతములతో మిశ్రమము కాదు గాని, నీటి ద్వారా నీటిలోనున్న ప్రవక్తయొద్దకే వచ్చును.
MATT 3:14,15
42గమనించండి! వాక్యముయొక్క కండ్లు మరియు ప్రవక్తయొక్క కండ్లు నీటిలో కలియుటను మీరు ఊహించగలరా? ఓ! అది నా ఊహకు అందదు. అక్కడ ప్రవక్త నిలబడెను, అక్కడ వాక్యము నిలబడెను, ఒకరి కళ్ళలోనికి ఒకరు చూచుకొనిరి. ''నేను నీ ద్వారా బాప్తిస్మము పొందవలసియుండగా నీవు నా యొద్దకు వచ్చుట ఏల?'' అని ప్రవక్త అడిగెను.
''అది నిజమే'' అని వాక్యము పలికెను. ఇక్కడ నన్ను ఒక నాటకము ఈయనీయండి:
''యోహాను, నీవు ఒక ప్రవక్తవు, నీవు వాక్యమును ఎరుగుదువు. చూచారా? ''నీవు నన్ను గుర్తించావు, నేనెవరినో నీవెరుగుదువు.''
''నేను నీతో బాప్తిస్మము పొందవలసిన అవసరమున్నది,'' అని యోహాను పలికెను.
యేసు ఈలాగనెను, ''ఇప్పటికీలాగు కానిమ్ము. అది ఖచ్చితముగా సరియే. నీవు నాచేత బాప్తిస్మము పొందవలసియున్నావు. కాని గుర్తుంచుకొనండి, యోహాను ప్రవక్తగా ఉండెను, నీతి యావత్తు ఈలాగు మనము నెరవేర్చవలసియున్నాము. [ఇపుడిచ్చట ప్రత్యక్షతయున్నది] ''యోహానూ, నేనెవరినో నీకు తెలియును, నేనే ఆ బలిని. దేవునియొక్క వాక్య ప్రకారము బలి అర్పించబడు ముందుగా కడుగబడవలెను.'' అది సరియేనా? "గొర్రెపిల్ల కడుగబడి బలికి అర్పించబడును, నేనే ఆ గొర్రెపిల్లను. లోకమునకు బలిగా అర్పించబడు ముందుగా నేను కడుగబడవలెను. యోహాను, ఇప్పటికీలాగు కానిమ్ము, వాక్యము మరియు ప్రవక్తగానున్న మనము కలిసి నీతియావత్తు ఈలాగు నెరవేర్చవలసియున్నాము.
DEUT 8:3•
MATT 3:17•
MATT 4:4•
MARK 1:11•
LUKE 2:14•
LUKE 3:22•
LUKE 4:4
43అందులో ఏమియూ పొరపాటు లేదు. ఇప్పుడు, ప్రతియొక కార్యములన్నియూ….
ఇప్పుడు, చూడండి, ఆ విధముగా ఆ పరిస్థితి యుండనిచో, యోహాను మనందరివంటివాడే అయి యుండేవాడు. ''ప్రభువా, నీవెవరో నాకు తెలియును,'' అని వారనిరి.
ఆయన ఇట్లనెను. ''ఒక్క నిమిషము ఆగండి. నేను వాక్యమైయున్నాను, 'మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవునియొక్క ప్రతి మాట వలన జీవించును.' హవ్వ ఒక్క మాటను విడిచిపెట్టెను, కాని మీరు ప్రతి మాటను తీసికొనవలెను. నేనే ఆ బలిని, అర్పించబడుటకు ముందుగా నేను కడుగబడవలెను. కాని, యోహానూ, నీవు చెప్పినది సత్యమే.''
ప్రవక్తగా నుండిన యోహానుకు వాక్యము నెరవేర్చబడవలసియున్నదని తెలియును. అలాగే అతడు ఆయనకు బాప్తిస్మము ఇచ్చెను. ఆయన నీటిలో నుండి పైకి రాగా, పావురపు రెక్కల మీద నుండి ఒక వర్తమానము ఆకాశము తెరువబడి వినబడెను. ''ఈయన నా ప్రియ కుమారుడు.'' కృపయొక్క విమోచనా సందేశమును ఆయన పావురపు రెక్కల మీద పంపెను. పరము నుండి అది ఎగిరి వచ్చినది. ''భూమి మీద ఆయనకిష్టులగు జనులందరికి సమాధానము.'' అప్పుడుబలి సిద్ధమైనది, ఆయన సేవ సిద్ధపరచబడినది. సర్వ ప్రపంచమును విమోచించు వాక్యమది. ''అది ముగిసినది!''
44సమాధానమునకు సూచనగా బైబిలులో పావురము వాడబడినది, అలాగే దేశములు కూడా శాంతి చిహ్నముగా పావురమును వాడినవి. మన దేశమునకు పక్షిరాజు చిహ్నము, ఇతర దేశములకు ఇతర పక్షులున్నవి. రోమ్‌నకు పక్షిరాజున్నది, వాటిలో చాలా వాటికి పెద్ద ఆకాశ పక్షులు చిహ్నములుగా ఉన్నవి. కాని వాటన్నింటిలో, పావురము ప్రతి దేశమునకు శాంతి చిహ్నముగా యున్నది. అది విశ్వవ్యాప్త గురుతు.
ఒక రాత్రి సహోదరుడు గ్రీన్ చెప్పినట్లు, పెర్రీ గ్రీన్ ఈలాగు చెప్పెను, ''లొంగిపోవుటకు చిహ్నము 'చేతిని ఎత్తుట.' ఏ దేశమైనా గాని చేతిని ఎత్తిన యెడల, అది లొంగిపోయినట్లే." మీరు పాట పాడుచుండగా చేతులెత్తినపుడు, మీరు పూర్తిగా ఆయనకు లొంగిపోయినట్లు సూచన.''
మరియు ప్రతి దేశమునకు పావురము శాంతి చిహ్నముగా ఉన్నది. ఎందువలన? దాని యొక్క సాత్వికము మరియు అమాయకత్వము బట్టియే. ఆ కారణము చేతనే అది శాంతి చిహ్నముగా యున్నది.
45పావురము గూర్చి మరో సంగతి, అది ఇంటిని ప్రేమించు పక్షి. దానికి ఇంటిలో యుండుట ఇష్టము.
మరో విషయము, అది తన జతదానికి ఎల్లపుడూ నమ్మకముగా యుండును. పావురము ఆడదయినా, మగదయినా, ఏదీ తన జతను విడిచిపెట్టదు. ఆడ పావురము తగిన కాలములో తన జతను సంపాదించుకొనును. చూడండి. అది దేవునియొక్క సృష్టికే ఆభరణము. ఆ కారణము చేతనే ఆయన హవ్వను ఒక ఉప ఉత్పత్తిగా తయారుచేసెను. చూచారా? ఆమె ఇతర స్త్రీ జీవులవలె చేయబడియుండిన ఆమె కూడా తన నిర్ణయ కాలములో తన జతను చేరియుండెడిది; కాని ఆమె ఎప్పుడయినా చేరగలదు. చూడండి? ఆ విషయములోనికి నేను వెళ్ళుట లేదు, ఎందుకనగా దానిని "వివాహము మరియు పరిత్యాగము" అను ప్రసంగములో వివరించాను. అయినాగాని ఆమె ఘనురాలు, సద్గుణమును తీసికొని వచ్చినది, దానిని గూర్చి ఆ రాత్రి ఏలాగు బోధించానో మీరెరుగుదురు. సరే, గమనించండి, ఆమె గొప్ప బాధ్యతను కలిగి యున్నది.
కాని పావురము ఎల్లపుడూ తన జతకు నమ్మకముగా యుండును. ఎల్లప్పుడూ! ఎన్నడూ విడిచిపెట్టదు.
LUKE 2:14
46ఇక్కడ ఒక్క నిమిషము ఆగి దీనిని చెప్పెదను: ఒక నిజమగు పెండ్లి కుమార్తె, ఆడ పావురము, ఎల్లప్పుడూ తన జతకు నమ్మకముగా యుండును. అది ఎట్టి మత సిద్దాంతమును గాని, శాఖా బోధను గాని, లోక సంబంధమగు దేనినీ లోనికి స్వీకరించదు. వాక్యము అను తన జతకు ఎల్లప్పుడూ విధేయత చూపును. ఎల్లప్పుడూ విధేయత.
ఇంటిని ప్రేమించు తన ప్రవర్తనను బట్టి అది సమాచారము మోయు పావురముగా విజయవంతముగా వాడబడినది. అది ఇంటిని ప్రేమించును గనుక దానిని ఎక్కడకు వదిలినా గాని అది తిరిగి ఇంటికి చేరును. తప్పక అది ఇంటికి వచ్చును.
కొద్దిసేపు దానిని నొక్కి చెప్పెదను, క్రైస్తవులగు మీరు నా భావమును గ్రహించెదరు. అది ఎల్లప్పుడు తన ఇంటి త్రొవను ఎరుగును, అందువలన అది సమాచారము మోయు పావురముగా వాడబడెను. యుద్ద సమయములలోదానిని వాడిరి, ఒక వర్తమానమును అందించుటకు ఇంకనూ దానిని ఉపయోగించుచున్నారు. పావురము సంగతి ఇప్పుడు మీరు గ్రహించిరి, మానవుల ద్వారా, దేవుని ద్వారా కూడా అది వర్తమానికురాలిగా వాడబడినది. పావురము సందేశమునందించును, అది నోవాహునకు సందేశమందించెను ''మరల శాంతి వచ్చెను,'' అని నోవహునకు చెప్పెను. ''ఈయన నా కుమారుడు,'' అని దేవుడు బయలుపరచుటకు దానిని వాడుకొనెను. ''భూమి మీదికి సమాధానము. ఆయన కిష్టులగు వారికి శాంతిని తీసికొని వచ్చు బలి ఆయనే,'' అను వర్తమానమును తెచ్చుటకు దానిని వాడుకొనెను.
47ఒకసారి నేను ఒక పుస్తకములో చదివిన చిన్న కథ నా మనస్సులో ఇప్పుడు గుర్తుకొస్తున్నది. ఇది నిశ్చయమైనదని నేను చెప్పజాలను. మొదట ప్రపంచ యుద్ధ చివరి దశలో అది జరిగియుండవచ్చును, దానికి ఇప్పుడు నేను అనుకూలంగాలేను; దానిని మీరు చూచుటలో తప్పిపోయినచో నేను చెప్పినది తప్పుగానే భావించవచ్చును. చాలా సంవత్సరాల క్రితం దానిని నేను ఒక పుస్తకంలో చదివాను… కాని అది మాత్రం చాలా నాటకీయంగా జరిగిన సంఘటన.
జర్మను వారి మర తుపాకుల అగ్ని వలన అమెరికా సైనికులు కూలిపోవుచుండిరి, మరియు వారు ఒక విధమగు గోతిలో ఉండిరి.సైనికులకు ఆ విషయములు అర్ధమగును, శత్రువులకు వారు చేరువుగా నుండిరి. వారికి ఇంకకొద్ది మందు సామాగ్రి మాత్రమే మిగిలియుండెను. జర్మను వారు గొప్ప సమైక్య శక్తిగా ప్రతి చోటికి దూసికొనిపోవుచుండిరి. వారికి ఏదో సహాయము అందనిచో త్వరలోనే అందరూ చనిపోవుదురని వారికి తెలిసిపోయెను. జర్మను వారు కొండ దిగి వారి మెడ మీదికి విరుచుకుపడుచున్నట్లు కనిపించినది.
48అందులో ఒకరికి తన యొద్దనున్న పావురము గుర్తుకు వచ్చినది. దీనిని విడిచిపెట్టినచో తమ ప్రధాన స్థావరము యొద్దకు వర్తమానమును అందించునని తలంపు పుట్టినది. కాబట్టి వారు కూర్చుని ఒక వార్త వ్రాసిరి, ''మేము పలాని చోట పలాని రీతిగా బందీలమై పోయితిమి. మా యొద్ద ఆయుధ సామాగ్రి అయిపోయినది. ఇక కొద్దిగంటలలో మేము వారికి లొంగిపోవలెను లేదా వారిచే చంపబడుట తప్పదు.'' వారు ఈ సందేశమును చిన్న పావురపు కాలికి కట్టి వదిలిరి.
అది ఇంటిని ప్రేమించు గుణము గలది, కావున అది ఏమి చేసినది? అది తన జతను గూర్చి చింతతో యున్నది. కాబట్టి తిరిగి అది గృహము చేరినది?
ISA 53:5
49అది పైకి ఎగిరి వెళ్ళుచుండగా జర్మనులు ఆ సందేశమును పంపు కార్యమును చూచిరి. వారు దానిని కాల్చి వేయుటకు తుపాకులు పేల్చిరి. అందులో ఒకడు మర తుపాకీ .30 గుండుతో దానిని కొట్టెను దాని కాలు విరిగినది. మరొకడు దాని వీపు మీద గురి చూచి కొట్టెను. దాని ఛాతీ మీద రక్తము ధారగా కారుచుండెను. దాని ఒక రెక్క కుంటిదయ్యెను, అది చివరకు నేలకు పడసాగెను, కాని అది అలాగే ఎక్కుటను కొనసాగించెను. నలుగగొట్టబడినా గాని, కొట్టబడినాగాని, గాయపరచబడినా గాని, చివరకు అది వచ్చి ఆ స్థావరములో పడెను. అది ఒక గొప్ప పావురము.
కాని ఓ సోదరుడా! యెషయా 53 ఈలాగు మనకు చెప్పుచున్నది, ఒకాయన ఇంటిని బాగున్న స్థితికి విడిచిపెట్టి క్రిందికి దిగివచ్చెను, తన క్షేమము పరిత్యజించెను:
ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను: మన సమాధానర్థమైన శిక్ష ఆయన మీద పడెను; ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందితిమి.
50వ్యాధి, మూఢత్వము, మరియు దయ్యములు మనలను అణచి వేసినవి. బయటకు వచ్చు త్రోవలేదు, సంఘము తప్పుదారిపట్టెను, వారు శాఖ సంబంధమగు కార్యములలోనికి పోయిరి (పరిసయ్యులు, సద్దూకయ్యులు గిన్నె కడుగుట, పాత్రలు శుద్ధిచేయుట అవలంబించిరి), దేవునియొక్క వాక్యమునకు ప్రభావము లేకుండాపోయెను. కాని ఈ చిన్న పావురము క్రిందికి దిగివచ్చెను, అక్కడ ఒక్క విషయము మాత్రమే జరుగవలెను: విమోచన కర్త రావలసియున్నాడు.
కాని గాయపరచబడి, విరుగగొట్టబడి, నలుగగొట్టబడి, చీల్చబడిన వాడు ఆయన తిరిగి తన ఇంటి త్రోవ పట్టెను, కల్వరి సిలువ మీద వారాయనను చీల్చిరి, తోడేళ్ళ మందవలె వారాయనపైనపడిరి, ఆయన కల్వరిలో దుస్థితిని పొందెను. ఆయన పరలోక ద్వారమునకు చేరుకొని ఇట్లనెను, ''సమాప్తమాయెను! సమాప్తమాయెను! వారు స్వతంత్రులు! ఇప్పుడు వ్యాధికి స్వస్థత యున్నది! పాపులు రక్షించబడిరి! బందీ, స్వేచ్ఛను పొందును!''
ఆయన నలుగగొట్టబడి, గాయపరచబడినా గాని, ఆ మహా యుద్ధమును ఆయన జయించెను… ఒక కవి ఈలాగు వ్రాసెను:
పగిలిన రాళ్ళ మధ్య, చీకటి మేఘముల మధ్య,
నా రక్షకుడు, తన తలను వంచి చనిపోయెను.
కాని చినిగిన తెర మార్గమును బయలుపరచెను
పరలోక ఆనందమునకు, అంతము లేని పగటికి.
51నా జీవితమంతా నేను ఒక నరాల ఒత్తిడితో ఉండేవాడిని. చిన్న బాలునిగా నున్నప్పుడు ఏదో నన్ను వెంటాడి భయపెట్టెను. ప్రతి ఏడు సంవత్సరములకు అది నాకు ఎదురయ్యేది. మొదట నేను ప్రారంభించినపుడు సహో. జాక్ ఎరుగును, ఒక సంవత్సరము పాటు నేను సేవ విడిచాను; అప్పుడే ఏదో జరిగినది.
జువానిటా హేంప్‌పిల్ నాకు గుర్తున్నది. ఇప్పుడామె పేరు జువానిటా కెల్లీ, ఆమె తన భర్త చనిపోయిన తరువాత సహో. కెల్లీని పెండ్లి చేసికొనెను. ఆమెది, అన్న జీన్, వారి ఫోటోలు నా యొద్ద ఉన్నవి, ఆ ఇద్దరు బాలికలు, సహోదరి. మోర్, గొప్ప త్రయముగా నుండేవారు. వారు పాడిన పాటను ఎన్నడూ నేను మరువను; సూర్యాస్తమయమునకు ఆవలివైపు చూడు. జాక్ సోదరుడా, నీకు గుర్తుండియుండును. ఫ్లారిడా నుండి వచ్చుచుండిరి, ఎంతో చక్కని బాలికలు.
52ఈ దేశపు ఉత్తర ప్రాంతము మిచిగాన్ నుండి వచ్చిన ఒక చిన్న పెంతుకోస్తు గుంపు వారితో గడిపిన ఆ ఉదయము గుర్తున్నది, ఆ బాలికలు సహో. హూపర్‌తో నిలబడిరి. అతనిని ఒక రాత్రి ఇక్కడ చూచాను, సహో. ఎడ్ హూపర్ ఇప్పుడిచ్చట లేడు కాబోలు. ఇక్కడున్నావా ఎడ్ హూపర్…? లేడనుకొంటాను. ఒకరాత్రి ఇచ్చట కూర్చొనియున్నాడు. మీలో చాలామందికి అతడు తెలియును, అతడు, నేను, సహో. హూలీ వెళ్ళిపోవుచున్నాము. దానిని పాడుచూ ఆ బాలికలు మూలన నిలబడియున్నారు, తమ తలలో నుండి తీసి మా ఒక్కొక్కరికి ఒక్కొక్క పసుపు గులాబీ ఇచ్చిరి. (అక్కడ ఆ పిచ్చివాడు స్వస్థతనొందెను, ఎన్నో గొప్ప కార్యములు జరిగినవి.)
నేను ఎంతో సంతోషముగా రహదారిలో వచ్చుచుండగా, అకస్మాత్తుగా అది మరల నన్ను తాకినది; ఒక సంవత్సరము తరువాత, మరల నేను సేవలో ప్రవేశించక ముందు అది నన్ను చంపెను.
53చిన్న బాలునిగా ఉన్నప్పటి నుండి నాకు దర్శనముగా ఏమిటో ఎన్నడూ తెలిసేది కాదు. ఎప్పుడూ మీకు చెప్పుచుందును, "అందులో నేను పడినప్పుడు, ఎప్పుడు కోలుకొందునా అని చూసేవాడిని."
నేను ఎప్పుడును మాయో వైద్యశాలకు వెళ్ళి, నా వ్యాధి ఏమిటో చూపించుకోవలెనని కోరెడివాడిని. అక్కడి వైద్యులు …
నా కడుపు నొప్పిగా యుండేది, ఓ! అది తలంచలేను, సహో. జాక్ నాకు ఇంట్లో సహాయము చేసెను. నేను ఇంట్లో కొట్టుకొనెడివాడిని. నా నోటిలో నుండి వేడిగానున్న నూనె వంటి ద్రవము కారుచుండెడిది, వేదిక యొద్దకు వెళ్ళి అంతకంటె రెండు రెట్లు వ్యాధిగానున్న వారికి ప్రార్థన చేసినపుడు స్వస్థత పొందెడివారు. ముఖము మీద కాన్సరు గల ఒక రోగిపై నేను చేతిని వేయగా, ముఖము మీద కాన్సరు పోయినది, అక్కడ నిలబడి; కాని ఎంతో రోగిగాయుండి నిలబడలేకపోయేవాడిని.
54నేనెంత బాధపడితినో మీరెరుగరు - మానసిక ఒత్తిడి. నా జీవితములో ప్రతి ఏడు సంవత్సరములకు ఒకసారి అది వచ్చుచుండెను, నా జీవితము అంతా. ఇప్పుడు నేను ఎనిమిదవ ఏడులోయున్నాను.
నేనెంతగానో వ్యధచెందాను. నేను ఏడ్చాను, నేను మొరపెట్టాను, నేను బ్రతిమాలాను.
చివరకు మాయో వైద్యశాలకు వెళ్ళి పరీక్ష చేయించుకోవలెనని తలంచాను నా యొద్ద కావలసినంత ద్రవ్యమున్నది. ''వారు నీ వ్యాధిని కనుగొందురు,'' అని నాకు చెప్పిరి. నేను, నా భార్య బెకీ, అప్పుడున్నాము. శారా చాలా చిన్నది, అప్పుడే నేను స్వస్థతా సేవలో ప్రవేశించాను, మేము మాయో వైద్యుల యొద్దకు వెళ్ళాము.
నేను వైద్యశాలలో తనిఖీ చేయబడ్డాను. మరుసటి ఉదయము నా తుది తనిఖీ జరుగును, నేను ఉదయాన లేచి పడకపై చుట్టూ చూస్తున్నాను. నా ముందు నావలెయున్న ఏడేండ్ల బాలుడు నిలబడి; నా వైపు చూచెను, మరియు అది నేనే. అతడు ఒక చెట్టు ప్రక్కన నిలబడియున్నాడు. మరియు ఆ చెట్టుపైన…
55ఉడుతలు వేటాడు వారికి ఇది తెలియును, చిన్న పుల్లలను విరిచి వాటిని చెట్టుకు రాస్తూ బెదిరించుచుందురు. ఆ విధముగా తొర్రలో దాగియున్న ఉడుతను బెదిరించి బయటకు తరుముదురు.
ఆ ఉడుత ఉన్న చోటువైపు నేను చూస్తున్నాను, ''ఇది ఏ రకమగు ఉడుత?'' అని తలంచుకొంటూ కళ్ళు రుద్దుకొన్నాను. నేను తేరిచూడగా, చిన్న కుర్రవాడు పోయి ముప్పది ఎనిమిది సంవత్సరాల వయస్సులో నేనే మరల అక్కడ నిలబడి కనిపించాను. నేను ఆ కొమ్మను నలుపగా, దాదాపు నల్లగానున్న పొడవాటి ఉడుత తొర్రలో నుండి బయటకు వచ్చెను; నేనెన్నడూ చూడని భీకర రూపములో అది కనిపించినది, దాని కండ్లు చిన్న పూసలవలె యున్నవి, అది ఉడుతవలె కాక అడవి పిల్లి ఆకారములో ఉన్నది.
56అది సూటిగా, నా వైపు చూచెను. ఏదో చెప్పవలెనని నా నోరు తెరచాను, "అయితే అది కనురెప్పపాటులో, నా నోటిలోనికి వచ్చి, నా కడుపులోనికి దూరిపోయెను. నన్ను ముక్కలుగా చీల్చెను. ఆ దర్శనము నుండి నేను మేల్కొనినపుడు, నేను చేతులు పైకెత్తి కేకలు వేయుచున్నాను. ''ఓ దేవా, నా మీద దయచూపుము! అది నన్ను చంపుచున్నది,'' అన్నాను.
గదిలో ఒక స్వరము: నాతో ఈలాగు చెప్పుట విన్నాను, ''గుర్తుంచుకో, అది ఆరు అ౦గుళముల పొడవు మాత్రమేయున్నది.''
ఎంతమంది ఈ గాధ ఎరుగుదురు? ఈ ఆలయములోనున్న వారికి చాలాసార్లు చెప్పాను.
మంచిది, అలాగే మరలా మరలా, ఎప్పటివలెనె బాధపడుచునే యున్నాను.
మరుసటి రోజు మాయో సోదరులు నన్ను పరీక్షించిరి. ''నీ తండ్రి ఒక ఐరీస్ సంతతివాడు, త్రాగుబోతు. నీ తల్లి అర్థ ఇండియను, అందువలన నీవు అర్థ సంతతికి చెందియున్నావు! నీవెన్నడూ కోలుకోలేని రుగ్మతలో యున్నావు,'' అని చెప్పిరి, ''నీవు ఆరోగ్యముగానే యున్నావు, కాని మానవుని ఆధీనములో లేని ఆత్మలో ఏదో కలిగియున్నావు,'' అని వారనిరి. చెప్పెను, ''ఒక మనుష్యుడు చనిపోయిన యెడల తనను తాను పరీక్షించుకొన జాలడు, ఏలయనగా అతని అంతరాత్మ వెళ్ళిపోయుండును.'' ఆయన చెప్పెను, ''దానినుండి నీవు ఎన్నడూ తప్పించుకొనలేవు.''
57ఆ వ్యక్తి నా పాత వైద్యునికి ఇట్లు చెప్పెను, ''నా తండ్రికి ఇది యున్నది, అతడు ఎనుబది అయిదు లేదా తొంబది సంవత్సరముల వాడై మృతిపొందెను." "అతడు రెండు, మూడు నెలలకు చనిపోవుననగా, నేను పరీక్షించాను. అతని జీవితమంతా ఆ విధముగా అప్పుడప్పుడు వచ్చెను.''
"కొందరు అమితమగు ఉద్వేగముతో యుండి, ఈ వ్యాధికి లోనవుదురు," అని కొందరు చెప్పిరి. చెప్పెను, ''అటువంటిదే నిన్ను చంపును." "మరో రకమైనది స్త్రీల రుతుక్రమము వంటిది. వారు కేకలు వేయుదురు. ఒక విధమగు అలసట అనుభూతి పొందెదరు." చెప్పెను, పాతతరములో చెప్పువారివలె, అందువలన నీ కడుపు నొప్పియగును. "అది నీకు వచ్చినప్పుడు, నీ కడుపు నొప్పియగును, అప్పుడు నీవు కలత చెందుతావు,'' అని చెప్పెను.
''కాని, అయ్యా, నేనేమి చేయను." "నేను ఆనందముగా యున్నాను,'' అన్నాను.
''అది సరయే. అది ఎల్లపుడూ మానవనైజమే, ఎప్పుడూ నీకు అది పోదు,'' అన్నాడు. ఓ! ఎంత నిరుత్సాహ విషయమది!
కాని ఆ మాటలు, ఆలోచించగా, ''గుర్తుంచుకో, అది కేవలము ఆరు అ౦గుళముల పొడవే యున్నది.'' అదింకా నన్ను వెంటాడుచునే యున్నది. ఆ వెనుక నున్న నా భార్య దానిని మీకు చెప్పగలదు. సంవత్సరములు తరువాతి సంవత్సరము గడిచినా ఇంకా నేను దాని గూర్చి ఆలోచించుచున్నాను.
58గతసారి విదేశములకు వెళ్ళు ముందు జరిగినది, నేను ఇంటికి తిరిగి వచ్చాను, నేను ఉడుతలు వేటాడు పర్యటనలో యున్నాను. సహో. బాంక్స్ పుడ్‌తో కారులోనుండి బయటకు దూకాను, ఈ రాత్రి ఆయన వినుచూ ఉన్నాడు. నేను కొండపైకి ఎక్కవలెనని పరుగిడనారంభించాను. నా గుండె నాలో నుండి బయటకు వచ్చినట్ల అనిపించినది.
''అది ఏమిటి?'' అని నేను డాక్టర్ శాం అడయార్‌ను అడిగాను.
''ఇంకోసారి నీకది వచ్చినపుడు కార్డియోగ్రాం తీయుము,'' అని చెప్పెను.
''మంచిది,'' అన్నాను.
ఆ మరుసటి సంవత్సరము మరల అది జరిగినది, వెళ్ళి కార్డియోగ్రాము తీసికొన్నాను. ''నీ గుండె బాగున్నది," కాని "నీవు కేవలము కలత చెందావు,'' అని చెప్పెను. అప్పుడు వచ్చుట ప్రారంభమాయెను.
59నాకు మంచి స్నేహితుడగు మరియొక వైద్యుడు; ఈలాగు నాతో చెప్పెను, ''అది నీ గుండెకు సంబంధించినది, గనుక నీవు చాలా జాగ్రత్తగా ఉ౦డాలి.'' ఆ సంవత్సరములోనే నేను సహో. మూర్‌ను పిలిచాను. నాకు బదులుగా మరొకరిని అతడు బోధించుటకు తీసికొని వచ్చెను, అప్పుడు నేను సహో. ఫ్రెడ్‌తో కలసి పొట్టేలు వేటకు వెళ్ళాను. పదహారేళ్ళ బాలునివలె నేను కొండలు ఎక్కాను, మైళ్ళ కొలది దూరం పరిగెత్తాను; ఏ మాత్రము నాకు తొందరకలుగలేదు. చూచారా?
నేను తిరిగి వచ్చి సామ్‌కు చెప్పాను. ''ఏదో తప్పుయున్నది, నీవు జాగ్రత్తగా ఉండుట మంచిది,'' అన్నాడు.
అప్పుడు, నేను ఒక దర్శనము చూచాను, అందులో ఒకముసలి వైద్యుడు నిలబడియుండుట చూచాను, అతని చేతిలో స్టెతస్కోపు వున్నది. ఒక రోజున అతడు నా ముందు నిలబడియుండి ఇట్లనెను, ''వారు నీ గుండెకు వ్యాధి అనుచున్నారు గాని, అది నీ కడుపుకు వ్యాధి.''
''నేను ఆ మాటను నమ్ముదును, ఎందుకనగా అది దర్శనము గదా,'' అని తలంచాను.
60నేను ఆఫ్రికాకు బయలుదేరాను… కొన్ని మందులు తీసికొవలెను, ఆఫ్రికాకు వెళ్ళుముందు చాలా ఇంజక్షనులు తీసికొనవలెను. అది చట్టము. నేను ఆ మందులు తీసికొనుచుండగా, అతడు నాతో ఇట్లనెను, ''నీలో ఏ వ్యాధియూ నాకు కనబడుటలేదు. నీ రక్తము తొంబది ఆరుకు తొంబది ఆరే ఉన్నది, నీ హిమోగ్లోబిన్ స్థితి బాగున్నది, నీవు పదహారేళ్ళ వయస్సులో ఉన్నాగాని ఈలాగే యుందువు. వంద సంవత్సరముల పాటు జీవించుటకు అది చాలును. ఊపిరితిత్తులు అన్నీ బాగున్నవి." చక్కెర వ్యాధి లేదు, ఏమీ లేదు, అన్నీ బాగున్నవి,'' అని చెప్పెను.
''మీకు వందనములు,'' అని చెప్పాను. నాకు వైద్య పరీక్ష జరిగినది, నా ఆరోగ్య ధృవ పత్రమును తీసికొని వెళ్ళాను.
''నీకు దాని గూర్చి ఏమైనా తెలియునా?'' అని నన్ను అడిగెను.
''నిరంతరము నా కడుపులో నొప్పి తప్ప దాని గూర్చి మరేమీ తెలియదు,'' అని చెప్పాను.
''సరే, నేను నీకు చెప్పెదను,'' అన్నాడు…
ఓ! నాకు వైద్య పరీక్షజరిగినది. నేను మాయో సోదరుల యొద్దకు ఇంకా ఎన్నో చోట్లకు వెళ్ళాను,'' అని చెప్పాను.
61అతడు చెప్పెను, ''కాని ఒక నిమిషము ఆగుము." "కొన్నిసార్లు చాలా అల్సరులు వచ్చును, వాటిని ఏ బేరియమ్ పరీక్ష బయట పెట్టలేదు; కొన్నిసార్లు అది చూపించలేనంత పెద్దదిగా ఉండును, ఎందుకనగా ఎక్స్‌రే కేవలము ఒక ఛాయ మాత్రమే. చిన్న అల్సరును నీవు చూడలేవు, అంత చిన్న దానిని అది వెల్లడి చేయలేదు, చిన్న చిన్న అల్సరుల గుంపు అలాగు చేయగలవు." అతడు చెప్పెను, "ఇక్కడ ఒక ముసలి వైద్యుని నేనెరుగుదును, అతని యొద్ద ఒక పరికరమున్నది, వారు నీకు సోడియం పెంటోతల్ ఇచ్చి; నిన్ను నిద్ర పుచ్చుదురు, నీ గొంతులో ఒక ట్యూబు పెట్టెదరు, వారు నీ కడుపులోనికి తొంగి చూచి అసలు ఏమున్నదో చూచెదరు." అతడు మీవంటి వాడే, అనగా ఒక క్రైస్తవుడు." "నీవెందుకు వెళ్ళి అతనిని చూడకూడదు?'' అని నాతో పలికెను.
62అతని పేరును నేను తీసికొన్నాను: డాక్టర్ వాన్ రావన్స్ వర్త్. నేను తిరిగి వచ్చి ఆ ముసలి వైద్యుని చూచుటకు వెళ్ళాను. ఓ! అతడు చక్కని వృద్ధుడు, డచ్ ఈస్ట్ ఇండియా నుండి వచ్చెను. మిషనరీలు సంతతి నుండి వచ్చెను. అతడు నన్ను గూర్చి వినెను, నా పుస్తకము చదివెను. అతడు ఎంతో అప్యాయముగా నాతో కరచాలనము చేసి ఇట్లనెను, ''ఓ! "బ్రన్హం సోదరుడా, నీ కొరకు ఆ పని నేను సంతోషముగా చేయగలను. నీవేమిచేయవలెనో చెప్పెదను." వచ్చె వారము ఇక్కడున్న వైద్యశాల యొద్దకు రమ్ము, నీవు వెళ్ళకముందు నన్ను పిలువుము." "నీకు కొద్దిగా పెంటథాల్ మందు ఇచ్చెదను. అప్పుడు నీవు అయిదు నిమిషములు నిద్ర పోయెదవు.''
నా చిన్నపిల్ల పన్నును ఊడదీయుటకు ఆ మందు ఈ మధ్యనే ఇచ్చిరి. సహో. నార్మన్ చిన్న బాలికకు కూడా ఇచ్చిరి. ''అయిదు నిమిషముల నిద్ర నన్ను ఏమీ బాధిచదులే,'' అను కొన్నాను. ఆ విధంగా చూపినచో అది సంతృప్తికరముగా చూడవీలగునేమో కదా.
63ఆ మరుసటి ఉదయము పడక మీద నుండి నేను లేచి చూట్టూ చూశాను, ఆ రెండు పరుపుల వైపు చూచాను; నా భార్య అక్కడున్నది, ఆమె ఇంకా మేల్కొనలేదు. నేను కిటికిలో నుండి ఆ గొప్ప కటాలినా పర్వతముల వైపు చూస్తున్నాను; అక్కడే నేను నివసించుచున్నాను, నా చేతిలో యెహోవా దూత అక్కడే ఖడ్గమును ఉంచెను, మీరు పటములో చూచుచున్న ఆ ఏడు దూతలు అక్కడే కనిపించినవి, గొప్ప సంగతులు జరిగినవి.
నేను చూచాను, మరల నేను ఆ ఉడుతయున్న ఆ చెట్టు యొద్దనే నిలబడుట నాకు కనబడినది. నేను అటువైపు చూచి ఇట్లు తలంచాను, ''ఆ ఉడుతల తొర్రె అదే." "ఇంకా అది అక్కడే యున్నదా?'' అని నేను ఆశ్చర్యపడసాగెను. (దర్శనములోనే.) నేను చెట్టును కదిపాను, అది బయటకు వచ్చినది. (అదినేనెన్నడూ చూడని వింతైన ఉడుత; ఈ గుర్తులను మరి కార్యములను గురించి తెలుసుకొనుటకు మీరు నా సేవను తెలిసికొనవలయును) కనురెప్ప పాటులో అది నా మీదికి ఎగురబోయి గురి తప్పినది. నా నోటిలోనికి అది దూరలేకపోయెను. నా గుండెను తాకి క్రిందికి పడిపోయెను.
అది అలాగు చేసిన వెంటనే నాతో ఎవరో ఈలాగు చెప్పిరి, ''కటాలినా పర్వతముల యొద్దకు పొమ్ము.''
64నేను వెనుదిరిగి, నా భార్యను లేపి ఇట్లన్నాను,''మిడా, నీవు లేచావా?'' నేను ఆమెను లేపాను.
''ఏమిటి సంగతి?'' అని ఆమె నన్ను అడిగినది. అప్పుడు సుమారు ఉదయము అయిదు గంటలవుచున్నది.
''నేను ఇటు నుండి బయటకు చూచాను, మరలా ఆ ఉడుత నాకు కనబడినది,'' అన్నాను.
''ఏ ఉడుత?'' అన్నది.
''ఆ మాయో వైద్యుల యొద్దకు వెళ్ళినపుడు చూచినదే చూచాను." అయితే "ఏమయిందో తెలియునా? ఈసారి అది నా నోటిలోనికి వెళ్ళలేకపోయినది. అది నా గుండె పైపడి వెళ్ళినది." "దేవునికి స్తోత్రము! నేను చూచాను… ఓ! చిన్న బాలునిగా ఉన్నప్పటినుండియే అది జరుగవలెనని ఎదురుచూచాను. దానిని నేను చూడగలిగినయెడల నేను బాగవుదును (ఆ దర్శనము నాకమునుపు కూడా) అది జరుగుట చూడకలిగినయెడల, అప్పుడు నేను బాగవుదును. అది ఏమి చెప్పునో అలాగే నేను అవుదును. నలుబది సంవత్సరముల నుండి దానికొరకు నేను చూస్తున్నాను. ఇప్పుడది సంభవించినది,'' అని చెప్పాను.
నేను మాయో వైద్యులయొద్దకు వెళ్ళక ముందు, వారు నాకు ఆ వార్త చెప్పినపుడు నేను ఆ దర్శనము చూచాను…
65నా ముసలి తల్లి ఇప్పుడు మహిమలోనికి వెళ్ళిపోయినది, చాలా గడ్డు స్త్రీ. ఆమె జీవితంలో దాదాపు మూడు నాలుగు స్వప్నములు వచ్చినవి, అవి ఎప్పుడూ సత్యములే. ఆమె నాకు చెప్పుట ప్రారంభించగానే ''అమ్మా! ఆపు, ఆ మిగతాది నేను చెప్పెదను,'' అనే వాడిని. చూచారా?
మీరు ఒక కల భావమును నన్ను వివరించమని ఆ కలను నాకు చెప్పెదరు, కాని ఎన్నడూ మీరు ఆ కలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేరు. దానిని నేను మరల చూచినపుడు, ఆ కలను నేను ఖచ్చితంగా చెప్పెదను, అప్పుడు ఆయన అదేమిటో దాని భావమును నాకు చెప్పును. చూచారా? ఆ కల ఏమిటో మీరు నాకు చెప్పనవసరములేదు, ఆయనే నాకు ఆ కలను చూపించును. చూచారా? ''మీరు నాకు ఇది చెప్పలేదు, అది చెప్పలేదు.'' చూచారా? కాబట్టి కలకు భావము చెప్పగలిగిన దేవుడు, ఆ కల ఏమిటో కూడా చెప్పగలడు. దానిని ఆయన నాకు చూపించును, దానికి భావమును చెప్పును.
DAN 2:2,5
66అటువంటిది బైబిలులో చెప్పబడలేదా? అది నాకే సంభవించినది. దానియేలు అట్టివాడు కాడా? కాదు, యోసేపు, అది యోసేపు. అది బైబిలులో యున్నది. నాకది జ్ఞాపకము వచ్చెను. ఓ! అది రాజగు నెబుకద్నెజరు పలికెను.
''ఆ కల మాకు చెప్పుము'' అని మాంత్రికులు అడిగిరి.
''అది నాకు గుర్తులేదు,'' అని అతడు చెప్పెను. దానిని నేను జ్ఞాపకము చేసికొని దాని గురించి ఆలోచించాను.
ఇప్పుడు గమనించండి. మా తల్లి ఇట్లన్నది, ''బిల్లీ, నా కుమారుడా, వచ్చి ఇక్కడ కూర్చొనుము, నాకు ఒకవింత కల వచ్చినది. ఆ కలలో నీవు చాలా జబ్బుగా ఉండి, చనిపోవుటకు సిద్ధమయినట్లు చూచాను, నీ కడుపు ఎప్పటివలెనె యున్నది." ఆమె నాకు ఎన్ని రకముల వంటలు చేసెనో ! "నీవు ఒక కొండ మీద ఇల్లు కట్టుచున్నావు. ఆకాశము నుండి ఆరు తెల్లని పావురములు వచ్చి, నీ గుండె మీద 'S' ఆకారములో కూర్చొని కూయుట చూచాను. నీవు చూచుచుండగా ఆ ముందు నున్న ఒకటి నీతో ఏదో చెప్పబోవుచున్నది. అవి ఎంతో తెల్లగా ఉన్నవి. అవి తమ చిన్న తలలను నీ బుగ్గ దగ్గర ఆనించి ''కూ, కూ, కూ'' అని అరవసాగినవి. అది నాకు అర్థము కాలేదు అవి అలాగే 'కూ, కూ, కూ,' అని అరచుచునేయున్నవి.''
నేను చెప్పాను, ''ఓ! అది నాకు కనబడుచున్నది, దేవునికి స్తోత్రము." అవి మరల ''S'' ఆకారములోనే ఆకాశములోనికి ఎగిరిపోతున్నవి, ఇంటికి వెళ్ళిపోవుచూ, 'కూ, కూ,కూ, కూ' అని అరచుచున్నవి."
నేను చూచిన ఆ చిన్న జీవి ఆరు అ౦గుళముల పొడవుగా నున్నది. మా తల్లి చూచిన పావురములు ఆరు. అది అసంపూర్ణ సంఖ్య. ఒక దినమున ఆ ఏడవ దానిని చూతునని నాకు తెలియును. ఆది మానవుడు, శ్రమ. అది అలా వెళ్ళినది.
67ఆ దర్శనము చూచిన తరువాత ఆ ఉదయము నేను లేచాను, ప్రభువుకు నేను లోబడ్డాను. నా చిన్న కుమారుడు జోసఫ్‌ను నేను స్కూలుకు తీసికొని వెళ్ళాను (ఇపుడతడు టుసాన్‌లో యుండి నా మాటలు వినుచున్నాడు). నేనతనిని స్కూలుకు తీసికొని వెళ్ళాను, నేనెపుడు తిరిగి వచ్చెదనో నాకు తెలియదని మిడాకు చెప్పాను.
నేను కటాలినా పర్వతశ్రేణుల యొద్దకు వెళ్ళాను, నా చేతిలో యెహోవా దూత ఖడ్గము నుంచిన చోటికి వెళ్ళాను. చాలా వేకువనే ఆ కొండ ఎక్కనారంభించాను.
నేను కొండను సూటిగాపైకి ఎక్కుచుండగా (ఆరిజోనా ఏలాగుండునో మీరెరుగుదురు. చాలా పాములు తేళ్ళు ఉండును) నా కుడివైపుకు తిరిగాను. ''నీ కుడివైపుకు తిరుగుము,'' అని ఎవరో చెప్పిరి. నేను పర్వత శిఖరము మీదికి చేరాను. ఆ పెద్ద బండలు చూట్టూ వెళ్ళాను, అవి ఒక్కొక్కటి ఈ ఆలయము కంటె ఎన్నోరెట్లు పెద్దవి. మనుష్యులు ఎవరూ వెళ్ళని శిఖరాగ్రమున అవి యున్నవి.
68సుమారు పదకొండు గంటల వేళలో, ఒక చిన్న గుహ వంటిచోటికి వెళ్ళాను, ఒక చిన్న జింక నడువగా ఏర్పడిన త్రోవ. నేను షర్టు తీసివేశాను, నా చేతిలో టోపీ పట్టుకొన్నాను, ఎందుకనగా నేను చెమటతో తడచిపోయాను. నేను ఆ చిన్న తొర్రవంటి చోటికి రాగా ప్రభువుయొక్క సన్నిధి ఉన్నట్లు అనిపించినది. నేను టోపి కదిలించి చూట్టూ చూచాను. ''ఆయన ఇక్కడెక్కడో ఉండియుండును. ఆయన ఇక్కడున్నాడని నాకు తెలియును,'' అనుకొంటూ ముందుకు కొన్ని అడుగులు వేశాను. ''ప్రభువా, ఇక్కడే ఒక చోట నీవున్నావు,'' అన్నాను.
ఆ త్రోవలో, ఆ చిన్న ఉడుత ఉండుట చూచాను; అది దేని మీదికో దూకబోయినది గాని తప్పిపోయినది, అది ఒక ముండ్లపొద మీద పడినది. ఆ ముండ్లు దాని తలకు, గుండెకు, కడుపునకు, గుచ్చుకొన్నందున, అది చచ్చినది. వింతగా కనబడిన ఆ చిన్న ఉడుత నోటిలో దూరబోయి ఆ పొదలో పడినది. ప్రభుని స్వరము ఇట్లనెను, ''నీ శత్రువు చనిపోయెను.'' నేను అక్కడ నిలబడి, మరియు నేను వణికాను.
69మామూలుగా అయితే కాకులు దానిని తినివేసియుండును. ఆ తరువాత కొన్ని రోజులకు ఒక పామును నేను చంపి అరగంటసేపు దారిలో యుంచాను. అక్కడ ఎల్లప్పుడూ పక్షిరాజులు, కాకులు ఎగురుచుండును, అవి వెంటనే దానిని ఎత్తికొనిపోవును. దానిని చూపించవలెనని కోరల్ పామును నేను చంపాను (మనకు కలిగిన అతి భయంకరమైన పాము) అది నా ప్రక్కనేయున్నది, కొన్ని రోజుల తరువాత దానిని చూపించవలెనని వచ్చుచుంటిని, దానిని కాకులు పీక్కొని తిన్నవి.
అంతకు రెండు రోజుల ముందే అది అక్కడునట్లు దర్శనము చూచాను. అది శనివారమని నేను నమ్ముచున్నాను, నేను అక్కడికి సోమవారము వెళ్ళాను. అది అక్కడ చనిపోయి పడియున్నది. దానిని నా పాదముతో త్రొక్కివేసితిని.
70నేను చుట్టూ తిరిగి వెళ్ళి మరల కూర్చొన్నాను; కొంతసేపు ఏడ్చి, ప్రార్థించాను. నాకు దిగువగా ఎన్నో మైళ్ళ దూరంలో క్రిందయున్న టుసాన్‌వైపు చూచాను.
నేను చూట్టూ తిరిగి వెనక్కు వచ్చినపుడు, అది అక్కడేయున్నది. ఆ గుహలో నేను ప్రవేశించినపుడు దేవునియొక్క ఆత్మ తిరిగి నా మీదికి వచ్చెను.
నేను చుట్టూ తిరిగి వెళ్ళి కొండను దిగి వచ్చాను. వెళ్ళి నా భార్యతో చెప్పాను, ''నాకు ఏలాగో తెలియదు గాని, దీనిని మాత్రము జయించుదును.''
డాక్టర్ రావన్స్ వర్త్ నాకు పరీక్ష చేసి ఈలాగనెను, ''నీవు బాగవుట పూర్తిగా అసాధ్యము.'' అయిదు నిమిషములు నిద్రపుచ్చు పెంటథాల్ నాకిచ్చినపుడు, నేను పది గంటలు నిద్రపోయాను. ఆస్పిరిన్ సహితము నాకు మత్తు కలుగచేయును. నా నోటిలో ఆ నాళిక పెట్టి చూచుటకు మందు ఇచ్చెను. మరుసటి ఉదయాన నేను వచ్చినపుడు, అతడు నాతో ఇట్లనెను, "రెవరెండ్, నీకిది చెప్పకూడదు, కాని నీ కడుపు గోడలు పూర్తిగా ఎండిపోయినవి. గట్టిగా నున్నవి.'' ఎన్నడ నేను దానిని చూడలేదు, దాని పేరు గాస్ట్రయిటిస్ అని అతడు చెప్పెను. నేను వెళ్ళి నిఘంటువు చూడగా, ''ఎండిపోయినది'' అని అర్థము కనిపించెను. ''దానిని నీవు జయించలేవు, ఎప్పుడూ అది నీకుండును,'' అని చెప్పెను. నాకు ప్రభుని దర్శనము రానియెడల నేను నిరాశతో నిండినవాడనయి యుందును.
71''తిరిగి ఆ పర్వతము యొద్దకు వెళ్ళుము,'' అని ఆ మరుసటి ఉదయాన ఎవరో చెప్పిరి.
ఆ రోజు నేను ఒక దారిని వెళ్ళుటకు బదులుగా మరో దారికి నడిపించబడ్డాను. అక్కడ నేను నిలబడియున్నాను; నా ముందుర ఆ ఏడవ చిన్న పావురము తెల్లటిది నిలబడి చూచుచుండెను. నా కళ్ళు నులుపుకొని ఇట్లు అనుకొన్నాను, ''నిశ్చయంగా ఇది ఒక దర్శనము, నిశ్చయంగా.'' ''చిన్న పావురమా, నీవు ఎక్కడి నుండి వచ్చావు?'' అనడిగాను. అది తెల్లగా చాలా అందముగా యున్నది, అది గువ్వ కావచ్చు. ఏమైనాగాని అది ఆ అరణ్యములో యున్నది.
సర్వశక్తుడగు దేవుడు, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినవాడు, ఆయనకు నేను దాసుడను, మరియు ఆయన వాక్కు ఇక్కడ నా ముందు తెరువబడియున్నది, నేను అబద్ధము కాక సత్యమే చెప్పుచున్నాను అని ఎరుగుము.
ఆ పావురము అక్కడ కూర్చొని నా వైపు చూస్తున్నది. ''నిశ్చయంగా ఇది దర్శనమే'' అనుకొన్నాను. నా తలను నేను త్రిప్పి, వెనక్కు చూచాను, అది అక్కడే కూర్చొనియున్నది. దాని చిన్న రెక్కలు హిమమంత తెల్లగా ఉన్నవి, దాని పాదములు పసుపుగా నున్నవి, నా వైపుగాచూస్తున్నది. అది సూటిగా పశ్చిమ దిశకు చూస్తున్నది. నేను దాని దగ్గరకు నడిచి వెళ్ళాను, నేను దానిని తాకలేదు. ఆ బాటలో నడుచుకొంటూ, నేను వెనక్కి చూచాను. అది అక్కడే నా వైపు గమనించుచున్నది.
సోదరుడా, నేను అబ్రాహాము కుమారుడిని గనుక, వైద్యులు చెప్పిన దానిని నమ్ముట లేదు. ఏమైనా గాని నేను బాగయ్యెదను!
72మూడవ దినమున నేను తిరిగి వెళ్ళాను, నేను పైకి ఎక్కుచుంటిని. పశ్చిమ దిశనున్న చిన్న గోడను ఇండియను ప్రధాని గుర్రముపై నెక్కుట యొక్క దర్శనము మీలో చాలా మందికి గుర్తుండియుండును. దాదాపు మధ్యాహ్నమగుచున్న ఆ సమయమున, ఒక పెద్ద బండవైపునకు ఏదో నన్ను ఆకర్షించినది. ''దాని మీద చేతులు వేసి ప్రార్థించుము,'' అని చెప్పెను. ఇది సత్యమని పరమందున్న దేవునికి తెలియును.
నేను ఆ బండ మీద చేతులుంచి, పరలోకము వైపు కన్నులెత్తి ప్రార్థించనారంభించగా, ఆ బండ శిఖరము నుండి ఒక స్వరము వచ్చుటను విన్నాను. ''నీ హృదయమును దేనికి ఆనించియున్నావు?'' నా భుజములను పైకి ఎత్తి చూశాను. వేడిగా నున్నందున షర్టు తీసియున్నాను. వెనక్కు చూచాను. ఆ బండ శిలా స్పటికము మీద ఈలాగు వ్రాయబడియున్నది, ''తెల్లని పక్షిరాజు.'' తరువాత వర్తమానము ఎట్లు వచ్చునని ఆ దర్శనము చెప్పెనో అక్షరాలా అలాగే జరిగెను.
నేను అపరిమితానందములో నిండిపోయాను, ఇంటికి పరుగిడి వెళ్ళాను, కెమెరా తీసికొని మరుసటి రోజు మరల వచ్చాను మరియు దానియొక్క ఫోటో తీశాను. అది ఇంకా ఆ బండలో వ్రాయబడియేయున్నది: ''తెల్లని పక్షిరాజు.'' పక్షి రాజును పావురము నడిపించుట.
73మొత్తం మీద నాకు తెలిసినది. అది జరుగక ముందే చెప్పెదను. వైద్యుడు మంచి వైద్యుడు, ఎట్టి సందేహము లేదు, అతడు చక్కని వ్యక్తి అని నాకు తెలియును, కాని దానిని నేను జయించుదునని నాకు తెలియును. అది జరిగినది! అది సమాప్తమైనది. నేను బాగవుదును.
కొన్ని క్షణములు క్రితం ఎర్నీ పాడిన ఆ పాట గూర్చి ఆలోచించుచున్నాను. ''పావురపు రెక్కల మీద.'' దాని తియ్యదనము ఎట్లున్నది. ఎర్నీ, నా కొరకు దానిని పాడుదువా?
హిమమువలె తెల్లగా నున్న పావురము.
(దానిని నాతో కలిసి పాడండి.)
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను.
అది పైనున్న దానికి గురుతు,
పావురపు రెక్కలమీద.
ఎర్నీ దానికి రెండు వచనములు కూర్చెనని అర్థమగుచున్నది. నేను మీకు మూడు వచనములు కూర్చుచున్నాను.
నోవాహు పయనించెను
చాలా రోజులు జలప్రళయము మీద,
అతడు నేల కొరకు వెదికెను
బహు రీతులుగా;
అతనికి కొన్ని శ్రమలు కలిగెను,
కాని పైనుండి కాదు.
ఏలయనగా దేవుడతనికి ఒక గురుతు ఇచ్చెను,
పావురపు రెక్కల మీద హిమమంత తెల్లగా నున్న,
పావురపు రెక్కల పైన దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను,
అదిపై నున్న దానికి గురుతు,
పావురపు రెక్కల మీద యేసు,
మన రక్షకుడు ఒక దినమున భూమి మీదికి వచ్చెను.
ఆయన ఒక పశుల తొట్టిలో జన్మించెను.
అది ఒక పశుల పాక.
ఇక్కడాయన విసర్జించబడిననూ పైన విసర్జించబడలేదు.
ఏలయనగా దేవుడు తన సూచనను ఇచ్చెను.
పావురము యొక్క రెక్కల పైన.
హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కలపైన
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను.
పావురపు రెక్కల పైన.
అనేక రీతులుగా,
నేను శ్రమపడినప్పటికిని,
దివా రాత్రులు స్వస్థత కొరకు,
నేను మొరపెట్టితిని.
కాని పైనున్న పరమతండ్రి ద్వారా,
విశ్వాసము మరువబడలేదు.
ఆయన నాకు తన సూచన ఇచ్చెను,
పావురపు రెక్కల మీద
హిమమువలె తెల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను.
ఓ! పై నుండి ఒక గురుతు.
పావురపు రెక్కల పైన.
హిమము వలె తెల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను,
ఓ! పై నుండి ఒక గురుతు,
పావురపు రెక్కల పైన.
ISA 53:5•
1PET 2:24
74ప్రియమైన దేవా, తండ్రీ, ఈ సంగతులను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. నీవు నోవాహుకు ఒక సూచన ఇచ్చావు. లోకమునకు ఒక సూచన నీవు ఇచ్చావు. నాకు ఒక సూచన నీవు ఇచ్చావు. ఓ దేవా, మరుసటి రోజు, ఆ పక్షిరాజు ఎగురుట చూస్తూ ఒక వర్తమానము రానున్నదని ఎరిగియున్నాను. దేవా, పావురము ఎగురుట చూస్తూ, ఒక వర్తమానము రానున్నదని ఎరిగియున్నాను. దేవా, పావురము నడిపించునట్లుగా చేయుమని ప్రార్థించుచున్నాను. ప్రభువా, అది దయచేయుము. నాకు ముందెన్నడూ లేని విశ్వాసమునకు అది నడిపించును. దేవా, అది బాగవునని నాకు తెలియును, కాబట్టి తండ్రీ, దానిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము.
ప్రభువా, వాక్యము అను పావురపు రెక్కల మీద, ఈ రాత్రి నీ వర్తమానమును పంపించుము. ప్రియమైన పరమతండ్రీ, అది దయచేయుము. ఈ రాత్రి ఈ వేదికగుండా వెళ్ళు ప్రతి వ్యక్తి, బయట ప్రాంతములలో కూడుకొనిన వారు, నీ గొప్ప పావురపు విశ్వాసమును హృదయములో కలిగియుండునట్లు వారికి వారి స్వస్థత కొరకు విశ్వాసము దయచేయుము. దేవుడు ఎవరి పట్ల పక్షపాతి కాడు అని గుర్తుంచుకొనండి. ఆయన నోవహునకు వర్తమానము పంపెను. బాప్తిస్మమిచ్చు యోహానుకు వర్తమానము పంపెను. దానిని నాకు పంపగలడు, ఇతరులకు పంపగలడు.
ప్రభావా, ఇప్పుడు, ప్రతి హృదయములోనికి ఆ పావురము ఎగిరి వెళ్ళి తన చిన్న బంగారు ముక్కుతో, ''ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి,'' అని చెప్పును గాక! దేవా, మా అతిక్రమములు తుడిచివేయబడునట్లును, మా పాపములు క్షమించబడునట్లును, మా వ్యాధి స్వస్థత పొందునట్లును కృప చూపుము. తండ్రీ, అది నీ చేతులలోయున్నది. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.
ఇంకొక నిమిషము మీ శిరములు వంచియుంచుడి.
75ఇక్కడున్నవారిలో ఎందరు ఈ విధంగా చెప్పగలరు? ''బ్రన్హం సోదరుడా, నా జీవితమంతా తప్పు చేశాను. నేను దేవుని సేవించవలెనని కోరాను, ఈ రాత్రి నేను సమర్పించుకొనుటకు సిద్దంగాయున్నాను. దేవా, ఈ రాత్రి ఆ పావురము నా హృదయములోనికి ఎగిరి వచ్చునట్లు అడుగుచున్నాను. అది రెక్కలు ఆడించుచూ నా లోనికి వచ్చుట చూచుచున్నాను.'' మీరు చేతులు ఎత్తెదరా? ఈ కనబడు జనులు మరియు భవనమునందున్న వారందరూ.
దేశమంతటా చెదిరియున్న జనులందరూ; సహో. హాంట్ మరియు సహో. కోల్‌మన్, సహో. లియో మొదలగు వారు; టుసాన్ మరియు బ్రెన్హాం ఆలయములోనున్నవారు; పశ్చిమ తీరము నున్నవారు; ఎక్కడున్నాగాని చేతులు ఎత్తండి. ''ఈ రాత్రి పావురము, నా హృదయములోనికి ఎగిరిరావలెనని కోరుచున్నాను. పరిశుద్దాత్మ అను హిమమంత తెల్లనయిన పావురపు రెక్కల మీద దేవుని మాధుర్య ప్రేమను నీకు తీసికొని వచ్చునట్లు చేయుము. ప్రభువా, ఈ రాత్రి దానిని నా యొద్దకు తెచ్చి, నాకు అవసరమగు విశ్వాసమును నా హృదయములో జారవిడువుము.''
దేవా, యేసుక్రీస్తు నామమున, మా పాపములను క్షమించుమని ప్రార్థించుచున్నాను. ''సమాప్తమాయెను!'' అను వర్తమానమును గాయపడిన పావురము తీసికొని వచ్చెను. దానిని మేము నమ్ముచున్నాము. దానిని నమ్మగల విశ్వాసము దయచేయుమని, యేసు నామములో మేము ప్రార్థించుచున్నాము.
హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను.
ఓ! పై నుండి ఒక సూచన
పావురపు రెక్కల మీద వచ్చెను.
76పావురము ఎక్కడ నుండి వచ్చినది? నాకు తెలియదు. ఆ విధముగా అడవిలో అది యుండజాలదు. అది అక్కడ ఉండదు. అదెందుకు తెల్లగాయున్నది? అది నా షర్టువలె అంత తెల్లగా యున్నదని పరమందలి దేవునికి తెలియును. దానిని ఆయనే అక్కడుంచెను.
అది హిమమంత తెల్లనైన పావురపు రెక్కల మీద ఉండెను,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను.
ఓ! పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల పైన.
హిమమంత తెల్లనైన పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర,
మాధుర్య ప్రేమను పంపెను.
ఓ! పైనుండి ఒక సూచన,
పావురపు రెక్కల పైన.
ఓ! మీరు నిజమగు దీనత్వమును అనుభూతి పొందుట లేదా? మనము ఒకరికొకరము కరచాలనము చేయుచూ దానిని పాడుదము:
హిమమంత తెల్లనైన పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను,
ఓ! పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల పైన.
ఆయన వైపు మనము చేతులెత్తి దానిని పాడుదము:
హిమమంత తె ల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను,
ఓ! పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద వచ్చెను.
నోవాహు పయనించెను చాలా రోజులు
జలప్రళయములలో అతడు నేల కొరకు వెదికెను,
బహు రీతులుగా అతనికి కొన్ని శ్రమలు కలిగెను,
కాని పైనుండి కాదు.
దేవుడు తన సూచనను పంపెను,
పావురపు రెక్కల మీద హిమమంత తెల్లనైన పావురపు రెక్కల మీద,
దేవుడు, తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపెను
ఓ! పైనుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద,
యేసు మన రక్షకుడు,
ఒకనాడు భూమి మీదికి వచ్చెను;
పశుల తొట్టిలో పుట్టెను పశుల పాకలో,
ఆయన విసర్జించబడినను,
దేవుడు ఆయన సూచన మనకిచ్చెను.
పావురపు రెక్కల మీద.
హిమమంత తెల్లనైన పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర మాధుర్య ప్రేమను పంపెను,
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద.
77ఎందుకు, నేను ముసలివాడను, నా జీవితమంతా శ్రమపడితిని, ఇప్పుడాయన ఎందుకు నన్ను స్వస్థపరచెను? మరల నేను ఈ స్వారీ చేసెదనని నమ్ముచున్నాను, ఒక వర్తమానమును నేను తీసికొని రావలసియున్నాను. ప్రభువా! నీ దాసుడు సేవచేయ సిద్ధముగా ఉన్నాడు, నా తండ్రికి అదే నేను చెప్పెదను, ఇక్కడున్న కిటికీల మీద ఆ పావురపు రెక్కలు కదులుచుండుట జూనియర్ ఒక రాత్రి చూచెను. ఆమేన్!
హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర మాధుర్య ప్రేమను నాకు పంపును,
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల పైన.
ఈ జన సమూహములో ఇప్పుడాయన సంచరించుచున్నాడని నమ్ముదుము.
హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కల మీద…
(ప్రభువా, మేము ఎదుదుచూచుచున్నాము)
దేవుడు తన పవిత్ర మాధుర్య ప్రేమను పంపును.
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద.
78ఇక్కడున్న బల్లల వరుసలో ప్రార్థనా కార్డులున్నవారు, ఈ ముందుకు రండి, ఈ మార్గమున ఈ ముందుకు రండి, ఈ వైపు.
హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర మాధుర్య ప్రేమను పంపును,
పై నుండి ఒక సూచన,
పావుర పురెక్కల మీద.
ఈ వరుసలలో ప్రార్థన కార్డులున్న వారు మీ ఎడమవైపునకు రండి
హిమమంత తెల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపును.
పైనుండి ఒక సూచన
పావురపు రెక్కల మీద.
హిమమంత తె ల్లగా నున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర మాధుర్య ప్రేమను పంపును,
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద.
GEN 22:8
79ఆ అరణ్యములో పావురము ఎక్కడి నుండి వచ్చినది? నేనీలాగు చెప్పెదను: అబ్రాహాముకు పొట్టేలు ఒక సూచనగా అవసరమున్నదని దేవుడు చూచెను. ఆయన యెహోవా యీరే. ''దేవుడు బలిని తానే ఏర్పరచుకొనును.'' దానిని గూర్చి ఆలోచించండి! మారని దేవుడు, మారని తన ప్రేరణ ద్వారా, మారని తన ప్రజల కొరకు, ఒక పావురమును పంపెను. ఆయన ఇంకనూ దేవుడే. యెహోవా యీరే తనకు అవసరమగు దేనినయినా గాని సమకూర్చుకొనును.
ఇప్పుడు మీరు ఈ ప్రార్థనవరుస గుండా వచ్చుచుండగా, పావురపు రెక్కల మీద దేవుని మీకు సహాయము పంపమని అడుగుదురా? పరిశుద్ధాత్మ అను పావురము, మీరు స్వస్థత పొందుదురనే విశ్వాసమును మీ హృదయములో మీకిచ్చును.
80వారందరు లేచి నిలబడవలెనని నేను కోరుచున్నాను, చూడండి. ఇప్పుడు నేను అడుగుచున్నాను. సహో. బ్రవున్ తన చోటులో యున్నాడు. ఏమందురు? [ఎవరో సహో. బ్రన్హంతో మాట్లాడుచున్నారు - సంపా.] మంచిది. ఈ భాగములోని వారు ముందుగా ఈ వైపునుండి వచ్చెదరు. ఆ విధంగా వరుసలో యున్నారు. ఈ వెనుకభాగములో నున్నవారు వారి వెంట వచ్చెదరు, వీరు ఆ వెనుక వచ్చెదరు. ఇక్కడున్న మీరు, వీరు చుట్టు నుండి ప్రార్థనకు వచ్చెదరు.
ఇది త్వరగా ముగించుటకు ఏర్పరచిన వరుస కాదని నిశ్చయంగా నాకు తెలియును. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి కోసము కొద్ది సమయము తీసికొని నిజంగా ప్రార్థన చేయుదము.
నేను నా వర్తమానము ఇప్పుడు కొద్దిగా కుదించాను. (మీ అందరూ అది చూచారు) వీరికి ప్రార్థన చేయుటకే అలాగు చేశాను. ఇది ఒక జ్ఞాపకార్ధ వరుస. సహో. జాక్ మూర్, యంగ్ బ్రవున్, వారి గౌరవార్థము ఏర్పరచటమైనది. మీ భార్యలు మిమ్ములను పోనిచ్చినయెడల మీరు రండి. మనము కాలిఫోర్నియాకు, అరిజోనా అంతటికీ వెళ్ళుదము, ఎడారి గుండా, రోగులకు ప్రార్ధించుదము.
81మీకు తెలియునా? అపుడు చనిపోవుచున్నవారు ఇప్పుడు జీవించుచున్నారు, ఆ ప్రభావము వల్లనే ఇంకా బ్రదికియున్నారు. అది ఏమి చేసెను? ఆ ప్రాంతములో నున్న ప్రతి సంఘములోను దైవిక స్వస్థతలు పుట్టుకొచ్చినవి, ఇప్పుడు ప్రెస్బిటేరియనులు మరియు మొదలగువారు సహితము. అది వారి నోళ్ళను మూసెను; వారు గొల్యాతును చంపుటకు దేవుడు ఒకరిని అభిషేకించెను, అది జరుగగలదని ఆయన చూపించెను. అప్పుడు ఆ మిగిలిన వారంతా ధైర్యము పుంజుకొని అనుసరించిరి (అది నిజము) అలా ముందుకు సాగినది. అది మరల జరుగగలదు, ఆయన పావురపు రెక్కల మీద ఇంకా తన ప్రేమను పంపగలడు.
క్రైస్తవులారా, మీరు వినవలెనని కోరుచున్నాను. గత మూడు సంవత్సరములలో జరిగిన దైవ సంబంధ కార్యములు, నేను చూచినవాటిని మీకు చెప్పవలెనన్న మరలా శనివారము రాత్రి ఈ సమయము వరకు ఇక్కడే ఉండవలసివచ్చెను. వాటిని గూర్చి ఎక్కువగా చెప్పలేదు, ఎందుకనగా అది అసాధ్యమన్నట్లుగా మీకు తోచును. కాని మీకు సత్యమే చెప్పెదను. అది అక్షరాలా నిజము. మనము గొప్ప యెహోవా శక్తివంతమైన నాయకత్వము క్రింద జీవించుచున్నాము. పాత నిబంధనలో ప్రవక్తలతో నున్నవాడు, క్రొత్త నిబంధనలో సంఘముతో నున్నవాడు, ఆయనే. ఆయన తన నామము నిమిత్తము అన్య జనాంగములో నుండి ఒక పెండ్లికుమార్తెను ఏర్పరచుటకు ఇక్కడున్నాడు. దానిని నమ్మండి! ప్రజలారా, నమ్మరా? ఇపుడే మీరు నమ్మండి. అది మీరు చేయవలెనని కోరుచున్నాను. ఈ రాత్రి ఇంకేమి జరుగునో మనకు తెలియదు. ఏమి జరుగునో మనమెరుగము. మనము ఏదో జరుగునని ఎదురుచూచుచున్నాము.
82దయచేసి ప్రభువైన యేసు నామము పేరట, ఆయన దాసునిగా మిమ్మును అడుగుచున్నాను. జన సమూహములతో పనిచేయుచున్నపుడు అంతా ఈలాగే కలగలుపగునని నాకు తెలియును. కాని నన్ను దైవదాసునిగా మీరు నమ్మండి, మీ హృదయములో ఎంత చిన్న "సందేహమున్నాగాని, అవిశ్వాసమైన," ఇప్పుడే దానిని తీసివేయమని, తండ్రిని అడగండి. చూచారా? మీరు అసలయిన విశ్వాసముతో రావలెను. మీరు మొదట దానినిపొందితేనేగాని నా చేతులు ఏమియూ చేయజాలవు. అది మిమ్మును వెలిగించినపుడు, మీరు స్వస్థత పొందుదురు. అది నిజము, మీరు స్వస్థత పొందినట్లుగా మీరే తెలిసికొందురు. చూడండి. దానిని మీరు నమ్ముదురు.
83ఇప్పుడు, మీ ప్రతిఒక్కరి కొరకు నేను ప్రార్థించనైయున్నాను. మీరిది చేయునపుడు, మీరు మీ చేతులను మరియొకరి మీద కూడ పెట్టవచ్చును. నీవెవరి మీద చేతులుంచితిరో, ఆ వ్యక్తి కొరకు ప్రార్థించుము, నిన్ను వరుసలో నేను కలిసికొని ప్రార్థించుదును, నీతో పాటు వరుసలో నున్న ఒకని మీదనీ చేతినుంచుము.
MARK 16:17
84ప్రియదేవ, ఈ సంగతులు మరేలాగు చెప్పవలెనో నాకు తెలియును. నాకు సత్యమని తెలిసినది మాత్రమే నేను చెప్పెదను, నేను సత్యము చెప్పుచున్నాననుటకు ఈ రాత్రి మీరే సాక్షులు. ప్రభువా, భవిష్యత్తులో నా స్వంత స్వస్థత కొరకు విశ్వాసము నిమ్ము; అది ఎప్పుడు, ఏలాగు జరుగునో, నాకు తెలియదు, కాని ప్రభువా, దానిని నేను నమ్ముచున్నాను. పైనుండి నేను ఒక సూచనను పొందియున్నాను. ఏడవ పావురము చివరగా ఇక్కడికి వచ్చియున్నది, జంతువు మీద ఏడవ అంగుళము త్వరలోనే సమాప్తమాయెను. అది ముగిసినది.
దేవా, నీ జనులకు సేవ చేయగోరుచున్నాను. మేము ఈ రాత్రి ఎవరి మీద చేతులుంచుదుమో వారు స్వస్థతపొందునట్లు మమ్మును అభిషేకించుమని ప్రార్థించుచున్నాను. మమ్మును బట్టి కాదు గాని, నీ ఆజ్ఞను బట్టియే. ''నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును,'' అని నీవు చెప్పావు. ప్రభువా, నమ్ముటకు సహాయము చేయుము. వారి హృదయములు విశ్వాసపు నేలగా యుండునట్లు సహాయము చేయుము. ఈ ఆజ్ఞలకు ఇప్పుడు లోబడుచున్న ప్రతిరోగి, ప్రతి శ్రమపడు వ్యక్తి, ఈ భవనములో నున్నవారు, (లేదా ఈ భావనంపు ప్రదేశమంతటా ఉన్నవారు) అది ఈ ఆజ్ఞలను పాటించుట, బాగవునట్లు నీ మహిమార్థమై చేయుము. దీనిని యేసు క్రీస్తు నామము పేరట అడుగుచున్నాను. ఆమేన్.
85విశ్వాసముంచుడి, మీరందరూ, మాతో ప్రార్థించుడి. ఇప్పుడు, ఇది వివేచన వరుస కాదు.
[టేపు మీద ఖాళీయున్నది] అణచివేత, భయము అనగా ఏమిటో నాకు తెలియును. ఒకామె తన జీవితములో ఎన్నడూ శాంతిని చూడలేదని చెప్పినది. పరుండలేదు, భయము, ఉద్రిక్తత.
ప్రియదేవా, నేను సత్యము చెప్పితినని నాతో సాక్ష్యమిమ్ము. ఈ స్త్రీ కొరకు నేనెంతో బాధపడుచున్నాను! నీవు నీ మాటకు కట్టుబడియుండి నీ మాటను నెరవేర్చుదువని నమ్మునట్లు చేయు విశ్వాసమును పైనుండి పంపించుము. నా సోదరిలో నుండి పరమందున్న దేవుడు ఈ భయమును తొలగించును గాక! ఆమె మీద నా చేతులుంచి దానిని గద్దించుట ద్వారా నీ ఆజ్ఞకు నేను లోబడుచున్నాను. యేసుక్రీస్తు నామము పేరట అది ఆమెలో నుండి బయటకు వచ్చును గాక! ఆమెన్.
సోదరీ, ఇప్పుడు చూడుము. నన్ను నమ్ముము. సిలువను బట్టి ఇక్కడి నుండియే నీవు ప్రారంభించుము. ఈ రాత్రి నుండి అది నీకు లేదనుకొనుము. ''ఇక అది నాకు లేదు,'' అని చెప్పుము. అది నిన్ను విడిచిపెట్టును.
86మన సోదరీ పామర్ ఇచ్చటున్నది. ఆమె భర్త నాకు అతి ప్రియమగు స్నేహితుడు, జార్జియా లేదా అలబామా నుండి వచ్చిన సేవకుడు. జార్జియా నుండియే. ఒక్క కూటము కొరకు వారు పదిహేను వందల మైళ్ళు కారు నడుపుకొని వచ్చిరి. ఆలయములో నేను ప్రసంగించుట వినుటకు వచ్చిరి. సహో. పాముర్ లేక అతని బాలుడు కారు యొక్క అదుపును కోల్పోయిరి. ఒక మూల తిరుగుచుండగా అది ఢీ-కొట్టినది. ఆమెకు అందువలన హాని జరిగినది. మనము ప్రార్థించుదము:
ప్రియదేవా, నీ దాసుని యొక్క భార్యను ఇందులో నుండి విడిపించుము. అతడు క్రీస్తుకు విధేయునిగా లోబడి పనిచేయుచున్నాడు. నమ్మకమగు దాసుడు దేవా, ఇక్కడ సహో. జాక్ మూర్‌తో కలిసి నేను ఆమె మీద చేతులుంచుచుండగా, ఆమెను బాగుచేసి స్వస్థపరచుమని ప్రార్థించుచున్నాను. యేసు నామములో. ఆమేన్.
ISA 53:5•
1PET 2:24
87కుడి పాదముతో నీవాయన కొరకు నిలబడియున్నావా? అతని చిన్న బాలుడు కుంటివాడు, అతని కడుపు మరియు వీపు మీద గాయమున్నది. ప్రార్థించుదుము:
ప్రియదేవా, ఇప్పుడే ఆ హిమమువలె తెల్లనైన పావురము అతని హృదయము లోనికి దిగునట్లు చేయుము. ''మన దోషముల కొరకు గాయపరచబడెను, మన అతిక్రమముల కొరకు నలుగగొట్టబడెను, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థతపొందితిమి.'' మన సోదరుడు ఆయన చిన్న బాలుడు ఆ విధముగా అగునట్లు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
తీవ్రమగు తలనొప్పి, అతడు పనిచేయుచుండగా కాలునొప్పి బాధించుచున్నది.
ప్రియదేవా, ఈ యువకుని మీద నీ స్వస్థతా దీవెనను దయచేయుము. మేము దేవుని దాసులముగా ఇతని మీద చేతులుంచుచున్నాము. యేసుక్రీస్తు నామమున ఆమేన్.
88ఆమెకు స్త్రీ సంబంధమగు వ్యాధియున్నది. ఆమె పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కూడా కోరుచున్నది.
ప్రియదేవా, ఈమె కొరకు ఈ విశ్వాస సహిత ప్రార్థనను నేను అర్పించుచుండగా, ఈమెలో నుండి ఇప్పుడే, ఆ స్త్రీ వ్యాధిపోవును గాక! పావురపు రెక్కల మీద పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చును గాక! యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దేవుడు దీవించునుగాక, సహోదరి.
ఆయన కన్ను మీది కంతి కొరకు, ఆయన యొక్క ప్రియ భార్య కొరకు ప్రార్థించుచున్నాము.
ప్రియదేవా, మానవుల హృదయములు నీకు తెలియును. ఈ సోదరుడు అడిగిన మనవిని దయచేయుమని యేసు నామములో తండ్రీ, నీకు ప్రార్థించుచున్నాను. ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును.
ఆమె ఎడమవైపున ఆమెకు ఒక వాపున్నది. ఆమె స్వరము కూడా బాగోలేదు!
ప్రియ యేసూ. ఈ సోదరిని స్వస్థపరచుమని ప్రార్థించుచున్నాను; ఆమె బాగవునట్లు యేసుక్రీస్తు నామములో ఆమె మీద చేతులుంచుచున్నాను. ఆమేన్. నా సోదరీ, దేవుడు నిన్ను దీవించును
దీన సోదరీ. నీ శ్రమను చూచుచున్నాను. అవయము వాచినది. మూత్రపిండము, సంచి, మణికట్టు స్థాన భ్రంశము చెందినవి.
ఓ, తండ్రీ. దేవా, ప్రభువా, ఈ ప్రశస్త స్త్రీని బాగుచేయుమని ప్రార్థించుచూ ఈమె మీద యేసుక్రీస్తు నామము పేరట చేతులుంచుచున్నాను. ఆమేన్.
సోదరీ, దేవుడు నిన్ను దీవించును. అదియే మార్గము. అది జరుగును.
మైక్రోఫోను ద్వారా వచ్చుచున్నది. నీవు వినుచున్నావా? ఆ సాక్ష్యము. లేదా వారు చెప్పునది వినునట్లు ఇంజనీరు వచ్చి దీనిని బాగుచేయవలెనని కోరుచున్నాను. దానిని మీరు వినునపుడు వారికొరకు ప్రార్థనలోయుండుడి. నేను ప్రార్థించనారంభించినపుడు మీరు నాతో ప్రార్థించుడి.
ప్రియదేవా, ఈ మా సోదరిని, నీవు బాగుచేయుమని ప్రార్థించుచున్నాను. ఇది నీ ఆజ్ఞ గనుక దీనిని మేము చేయుచున్నాము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
89ప్రియదేవా, నీవు ఆ సాక్ష్యమును విన్నావు. శత్రువు ఆమెకు ఏమి చేసినదో నీవు విన్నావు. మేము యేసు నామమును తీసికొని ఈ శత్రువును ఓడించ ప్రయత్నించుచున్నాము. ఎప్పుడో వాడు ఓడిపోయెను, ఎందుకనగా గాయపడిన, నలుగగొట్టబడిన పావురము ''సమాప్తమాయెను,'' అను వర్తమానముతో దేవునియొక్క ఇంటి వాకిట పడియున్నది, దానిని దయచేయుము. ఆమె దానిని నమ్మును గాక, తండ్రీ. యేసు నామమున అడుగుచున్నాము.
ప్రియదేవా, ఈ మా సోదరిని నీవు బాగు చేయుమని ప్రార్థించుచున్నాను. ఆమె బాగవునట్లుగా దేవుని యొక్క పావురము దానిని చేసెనని ఈ రాత్రి సాక్ష్యమిచ్చును గాక. యేసు నామములో. ఆమేన్.
ప్రియదేవా, ఇక్కడ నిలబడియున్న మా సోదరుని మీద నేను చేతులు వేయుచున్నాను. ఇక్కడకు వచ్చుటకు తగిన విశ్వాసము అతనికి ఉన్నది, ప్రభువా, ఇప్పుడు, స్వస్తతను పొందుకోనును గాక, నీ స్థానములో వెళ్ళి బాగవుము. యేసు నామమున.
ప్రియదేవా, ఇక్కడ నిలబడియున్న మా సోదరుని మీద నేను చేతులు వేయుచున్నాను. ప్రియదేవా, ఈ సమయములో దేవునియొక్క విశ్వాసము అతనిలో పడునట్లు సహాయము చేయుము. అబ్రాహామువలె లేనివాటిని ఉన్నవానిగా పిలుచునట్లు చేయుము, ఏలయనగా దేవుడు వాగ్దానము చేసెను. యేసు నామములో. ఆమేన్.
90ప్రియదేవా, నీవు చెప్పిన దానిని చేయుదువని నమ్మి విధేయతతో మా సోదరి మీద చేతులుంచుచున్నాను. ప్రభువా, ఇటువంటి ప్రార్థన వరుస ప్రారంభించి చాలా సంవత్సరములయినది, కాని అప్పుడేమి జరిగినదో మాకు తెలియును. నేడు మేము అదే విశ్వాసము కలిగియున్నచో నీవును ఆ మారని దేవునిగానే యున్నావని ఎరుగుదుము. మా సోదరి కొరకు యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.
ప్రియదేవా, నీవు చెప్పిన దానిని చేయుదునని నమ్మి విధేయతతో మా సోదరి మీద నా చేతులుంచుచున్నాను. ప్రభువా, అటువంటి ప్రార్థన వరుస ప్రారంభించి చాలా సంవత్సరములయినది; కాని అప్పుడేమి జరిగినదో మాకు తెలియును, నేడు మేము అదే విశ్వాసము కలిగియున్నచో నీవును ఆ మారని దేవునిగా యున్నావని ఎరుగుదుము. మా సోదరి స్వస్థత కొరకు యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.
ప్రియదేవా, ఇక్కడున్న మా సోదరుని మీద నా చేతులుంచి, అతని స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాను. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
తండ్రీ, ఈ రాత్రి నీ ముందుకు మా సోదరుని తీసికొనివచ్చుచున్నాము. నీ బలమునకును, నీ దర్శనములకును, నీ వాక్యమునకును, నీ దేవుడైయున్నావనుటకును ఒక సాక్షిగా నిలబడియున్నానని రుజువు చేయుటకు ఈమె మీద చేతులుంచుచున్నాను. నా దేవునియొక్క వాక్యమునకు విధేయత చూపుచూ, ఆమె స్వస్థత కొరకు అడుగుచూ చేతులుంచుచున్నాను. ఆమేన్.
91ప్రియదేవా, ఆ విధముగానే, మీ బలమునకు సాక్షిగా నా సోదరుని మీద చేతులుంచి, యేసుక్రీస్తు నామములో స్వస్థత కొరకు అడుగుచున్నాను. ఆమెన్.
[టేపు మీద ఖాళీయున్నది] ''ఏమిటి?''
''ఆయన స్వస్థపరచువాడు,'' అని ఆమె చెప్పెను. ''ఆర్కన్సాస్ నుండి వచ్చిన ఒకాయన ఈ ఉదయమున స్వస్థత పొందెను. అతడు ఒక గ్రుడ్డి, చెప్పులు కుట్టుకొను వ్యక్తి.'' మీరు ఆ కధ ఎరుగుదురు, అది రేడియోలో వచ్చినది.
నేను ఒక వేషధారి పాత్ర నటించాననుకొనుచున్నాను. ''ఇది సత్యమని మీదు నమ్ముట లేదా?'' అని అడిగాను.
''అవునండీ! నమ్ముదును'' అన్నదామె.
''ఈ దినమున దేవుడు అలాంటిది చేయునని నీవు నమ్ముచున్నావా?'' అనడిగాను.
''అయ్యా! నేను మత కార్యక్రమము విన్నాను. నేను క్రైస్తవురాలను.'' నేను కార్యక్రమములను విన్నాను. ఆ గ్రుడ్డి చెప్పులు కుట్టు వ్యక్తి స్వస్థత పొందెనని ఈ ఉదయమున నేను విన్నాను. వారతనిని ఆలయములో నుండి బయటకు త్రోసివేసిరి. అతడు ఎంతో గోల చేసెను. ఒక సంఘము తరువాతమరో సంఘమునకు వెళ్ళెను. ఒక కర్ర మీద టోపీ తగిలించి దాన్ని త్రిప్పుకొంటూ ఆలయంలో అటు ఇటూ పరుగెత్తెను. అతడు పట్టణములో ప్రతిచోట, ''నేను స్వస్థత పొందాను. బాగయ్యాను అని అరచుకొంటూ తిరిగెను. గ్రుడ్డి చెప్పులు కుట్టువాడు.''
''దానిని నీవు నమ్ముచున్నావా?'' అనడిగాను.
ఆమె కొద్దిసేపు అక్కడ నిలబడినది. సన్నని జల్లుపడుచున్నది. ''అయ్యా, ఆయనున్న చోటకు నన్ను తీసికొని వెళ్ళినచో నా తండ్రిని కనుగొందును,'' అని ఆమె చెప్పినది. అప్పుడు నేను అలాగు భావించాను.
''బహుశా నీవు ఎదురుచూచుచున్నది, నీ కోసమేనేమో,'' అన్నాను.
ఆమె నా కోటు చెంగులు పట్టుకొని ''నీవేనా ఆ స్వస్థతా వరముగల వానివి?'' అని అడిగినది.
''కాదు. సోదరీ! నేను సహో. బ్రన్హంను,'' అని చెప్పాను.
''నా మీద దయచూపుము,'' అన్నది. నాకు ఆ గత అంధురాలగు ఫానీ క్రాస్‌బీ గుర్తుకు వచ్చినది, ''ఇతరులు గూర్చి నీవు ఆలోచించుచూ, నన్ను దాటి పోకుము.'' చూడండి. ఆయన ఒకరిని స్వస్థపరచెను, ఆమెను కూడా బాగుచుయగలడు.
నేను ఆమె కండ్ల మీద చేతులుచాను. ''ప్రియ యేసూ, ఒకరోజున ఒక పాత సిలువ వీధిలో తూలుతూ వచ్చినది. దానిని మోయుచున్న భుజముల నుండి రక్తము కారుచున్నది. ఆ చిన్న బలహీన శరీరము ఆ బరువు క్రీంద పడినది. వర్ణజాతి వాడగు కురేనీయుడను సీమోను వచ్చి ఆ సిలువను లేపెను. దానిని మోయుటకు ఆయనకు సహాయము చేసెను. తండ్రీ, నీవు తప్పక దానిని గుర్తుంచుకొందువని నాకు తెలియును. ఆయన బిడ్డలలో ఒకరు ఇక్కడ అంధకారములో కొట్టుమిట్టాడుచున్నాడు. నీవు తప్పక అర్థము చేసికొందువని నాకు తెలియును.
''దేవునికి మహిమ! నేను చూడగలను,'' అని చెప్పెను!
''నీవు చూడగలవా'' అనడిగాను.
''అవునండీ'' అన్నది.
''ఆ దీపములను లెక్కించు'' అన్నాను. ఆమె వాటిని లెక్కించినది. ''నేను ఏ రంగు సూటు ధరించాను.'' అనడిగాను.
''మీరు బూడిద రంగు సూటు, పసుపు టై కట్టుకొన్నారు,'' అని చెప్పినది. ఆమె చూడకలిగినది.
ఓ! దేవుడు దీనులను గౌరవించును. "దైవిక ప్రేమలో అద్భుతమగు విజయమును దానంతట అదే తీసికొని వచ్చును."
ప్రియదేవా, దయయుంచి యేసుక్రీస్తు నామము పేరట నా సోదరిని స్వస్థపరచుము. ఆమేన్.
LUKE 2:29,30
92ప్రియదేవా, నేను ఈ బలహీన, ముడతల చేతిని తీసికొనుచున్నాను. దీనిగుండా ఏమి బయలు వెళ్ళినదో నీకే తెలియును. ప్రియదేవా, ఆనాడు సిమియోను యొక్క బలహీనపు చేతులే నిన్ను కౌగలించుకొన్నవి. నా చేతులును అలాగేయున్నవి. ''ప్రభువా, నీ దాసుని సమాధానముగా పోనిమ్ము, ఏలయనగా ఇప్పుడు నేను నీ రక్షణను చూచి యున్నాను.'' ప్రభువా, నీ రక్షణను ఆమె మీదికి రానిమ్ము. యేసు నామములో ఆమెను బాగుచేయుము.ఆవేన్.
MARK 16:18
93[టేపు మీద ఖాళీయున్నది] నేర పరిశోధన అను ప్రసంగము అయ్యగారైన అవిశ్వాసము, యేసు క్రీస్తు మీద ఆరోపణ చేసినది. మీకు ఆ నేర పరిశోధన గుర్తున్నదా? ఎవరు ఎవరి పక్షమున నిలబడియున్నారో ఎరుగుము. నేరము మోపు ప్రతివాది సాతాను. అది నేరము మోపుచున్నది. ఆరోపణ చూశాము.
సందేహకుడు ఈలాగు చెప్పెను, ''నూనె రాసి ప్రార్థన చేసిన యెడల రోగి బాగుపడునని బైబిలులో యున్నదని ఒక బోధకుడు చెప్పుట విన్నాను. నేను నూనె రాసి ప్రార్థన చేశాను గాని, ఏమీ స్వస్థత రాలేదు.'' మరొకడు''రోగుల మీద చేతులుంచినపుడు బాగవుదురు'' అని చెప్పెను. ఈ విధముగా అతడు నేరారోపణ చేయుచున్నాడు.
కాని సాక్షి అక్కడికి వచ్చెను, ''నా మీద నేను చేతులుంచుకొని ఆరు నెలలయినది. రోగుల మీద చేతులుంచినపుడు వారు బాగవుదురని నీ వాక్యము చెప్పెను. నీవు అభిషేకించిన ఒక దాసుడు ఒకడు నా మీద చేతులుంచెను, కాని ఇంకా నేను బాగుపడలేదు; కాబట్టి నీవు ఒక అబద్ధ వేషధారివి, ఎందుకనగా నీ వాక్యము చెప్పినట్లు జరుగుట లేదు.''
GEN 7:4•
GEN 18:10•
MARK 16:17,18•
JAS 5:15
94సాక్షి వచ్చి సత్యము చెప్పెను, ''ఆయన మాట సత్యము. దానిని ఎప్పుడు చేయుదునో ఆయన చెప్పలేదు.'' ఆయనీలాగు పలికెను, ''నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును, వారు రోగులు మీద చేతులుంచినపుడు బాగవుదురు.'' చూచారా? వారు బాగవుదురు అని ఆయన చెప్పెను, కాబట్టి అది ఉన్నపాటున ఒక అద్భుతమువలె జరుగవచ్చును, ఏమయినా గాని దేవునికి లోబడవలెను. ఏ వ్యక్తికి ఏమి చేయునో ఆయన ఇష్టము. చూచారా? కాని వ్యక్తి దానిని నమ్మినచో అదెంత కాలము పట్టినా పరవాలేదు. ''నీకు శారా వలన కుమారుడు కలుగును,'' అని ఆయన అబ్రాహాముతో చెప్పెను. కాని ఇరవైఅయిదేండ్ల పాటు ఏ బిడ్డ కలుగలేదు. ''వర్షము కురియును'' అని నోవహుతో ఆయన చెప్పెను. జలప్రళయము రాకముందు, ఎన్నో సంవత్సరముల ముందే అతడు ఓడను నిర్మించెను, కాని వర్షము కురియునని అతనికి తెలియును. ''విశ్వాస సహితమగు ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు వానిని లేపును,'' అని బైబిలు చెప్పెను. ఎప్పుడు? ఆయన చెప్పలేదు. దేవుడు నీతిమంతుడు. ఆయన సత్యవంతుడు. ఆయన వాక్యము చెప్పుచున్న దానిని చదువుము.
ఈ రాత్రి నేను చేసినది అదియే. రోగులు మీద చేతులుంచాను. వారందరూ బాగవుదురని నేను నమ్ముచున్నాను. ప్రతిఒక్కరూ బాగవుదురు. మీరును అలాగే నమ్ముచున్నారా? ఈ శ్రమపడుచున్న వారి కొరకు నమ్ముము.
95ఇక్కడొక స్త్రీ యున్నది, ఈమెను నేను తెలిసికొనవలసినట్లున్నాను, ఆ బయట ప్రార్థన వరుసలో గత రాత్రి ఆమె కొరకు నేను ప్రార్థించాను. ఆమె పేరు ఏమిటి? చాంబర్స్… చాంబ్లెస్. ఈమె వ్యాధికి గురికాకుండా మామూలుగా ఉండియుండినయెడల నిశ్చయంగా ఒక అందమగు స్త్రీగానే యుండును. ఇప్పుడామె వణుకుచూ అక్కడ కూర్చొనియున్నది. ఓ! అది ఎంతగా నా హృదయమును బ్రద్దలు చేయుచున్నది! ఆమె బాగవుట నాకెంతో ఇష్టము.
ఇక్కడ ఒక చిన్న బాలుని పట్టుకొని ఆ స్త్రీ కూర్చొనియున్నది. ఆ బిడ్డ నాలుక బయటకు వచ్చియుండి చిన్న శరీరము జబ్బుకు గురి అయినది. నా చిన్న జోసెఫ్ అలాగుండిన యెడల ఎట్లుండును, నా చిన్న మనుమడు పాల్? అలాగుండిన ఎట్లుండును. నా భార్య మిడా, ఆ శ్రీమతి సింప్సన్‌వలె ఉన్నచో ఎట్లుండును? ఇక్కడ కూర్చొనియున్న యువకుడే బిల్లీపాల్ అయినచో ఎట్లుండును! ఇక్కడ కూర్చొనియున్న వృద్ధ స్త్రీ, నా తల్లి అయినచో ఎట్లుండును? గుర్తుంచుకొనండి. వారు ఒకరి పిల్లలు, ఒకరి సోదరీలు, ఒకరి కుమార్తెలు, ఒకరి కుమారుడు. చూచారా? నేను వారి సోదరుడను, ఆయన రక్షకుడు, వారి పక్షమున నాకున్న విశ్వాసమంతటినీ సమర్పించుట ఒక్కటే నేను చేయగలను. నాకు అది మాత్రమే తెలియును.
MATT 16:19•
ACTS 2:38•
ACTS 8:16
96ఇప్పుడు, ప్రభువు నాకు ఒక దర్శనము చూపించగలడు. ఆ ప్రతిఒక్కరి సంగతి ఆయన నాకు చెప్పగలడు. దానిని మీకు రుజువు చేయగలను. చూడండి. మీరిది ఎరుగుదురు, కాని అందువలన వారికి స్వస్థత రాదు. వారు బాగవరు చూడండి. లేదు, వారిలోనికి ఒకటి రావలసియున్నది.
నేను మీ ఒక్కొక్కరిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పట్టుకొని బాప్తిస్మము ఇయ్యగలను, అందువలన మీ పాపములు పోవు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము క్రొత్త జన్మకు అంటే నేను నమ్మను. రక్తము క్రొత్త జన్మను ఇచ్చునని నమ్ముచున్నాను. చూడండి. నీటియొద్ద కాదు. మిమ్మల్ని ఎన్ని సార్లయినా నేను ముంచవచ్చు, కాని ఒక ఎండుపాపి, తడిసిన పాపిగా మాత్రమే బయటకు వచ్చును. మీరు పూర్తిగా మారుమనస్సు పొందవలెను. మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. చూచారా? ఏకత్వ ఉద్యమము వారితో నా భేదము అదే. క్రొత్త జన్మకు బాప్తిస్మము కాదు. రక్తము శుద్ధిచేయునని నేను నమ్ముచున్నాను. నీరు కాదు. చూచారా? మారు మనస్సు, అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము.
ACTS 19:12
97ఇప్పుడు నేను ప్రార్థించుటకు వెళ్ళుచున్నాను. ఈ ప్రజలు మీకెంతో నాకు అంతే, నా స్వంత బంధువుల కంటె మిన్నగా నున్నారు.
ఇప్పుడు మనమందరము ఏకమవుదము. విశ్వాసముతో మీ చేతిని, నా చేతిని కలుపుదము. ఈ కుంటివారి మీదకి ప్రభువైన యేసు చేతులను దించుదము. మీరు నాతో ప్రార్థించెదరా.
[టేపులో ఖాళీ] వ్యాధిగ్రస్తుల కొరకు మరియు బాధింపబడిన వారికొరకు గాను చేతి రుమాళ్ళు కలిగియున్న వారు ఆరాధన ముగిసిన పిదప వాటిని మీరు తీసికొని రావచ్చును. ఇపుడు, వీరికి ప్రార్థించుటకు మీరు నాకు సహాయపడగలరా, మీరు చేయగలరా?
దేవా, నీకు వందనములు. ప్రభువా, ఈ రాత్రి నీవు చేసిన దానికొరకు వందనములు. ఈ వరుసలో వచ్చుచున్న ప్రతివ్యక్తి స్వస్థత కొరకు ముందుగానే నీకు వందనములు చెల్లించుచున్నాను. బహుశా కూటమునకు కూడా రాలేని వారికొరకు వారిని ప్రేమించువారు చేతి రుమాళ్ళు తెచ్చియున్నారు. పౌలుయొక్క శరీరమును తాకిన చేతి రుమాళ్ళు లేక గుడ్డలు, వారు తీసికొని వెళ్ళిరని బైబిలులో యున్నది. ఆ వెనుక అపుడుండిన జనులు, నీ సన్నిధిలో జీవించిరి. వారు మిమ్ములను వీధిలో చూచిరి, వారి కూటములలో మిమ్ములను చూచిరి. మీ అదే ఆత్మ పౌలు మీద ఉండుట వారు చూచియున్నారు. ఆ మనిషైన పౌలును వారు చూడలేదు గాని, అతని జీవితమును ఏలుచున్న నీ ఆత్మను వారు చూచిరి. నీవు చేసిన క్రియలనే పౌలు చేయుటను మేము చూచియున్నాము.
ప్రభువా, ఆయన సంఘములో, ఆయన జనులలో ఆ దేవుడే నివసంచుట ఈనాడు జనులు చూచుచున్నారు. వారు ఈ చేతి రుమాళ్ళను తెచ్చియున్నారు. వాటిని ఇక్కడ నుండి వారి ప్రియుల కొరకు తీసికొని పోవుదురు. నీ మార్గములో ఆ ప్రతిఒక్కరు స్వస్థతపొందునట్లు దయచేయుము. ఒక ప్రత్యేకమగు రీతిగా, ఒక ప్రత్యేకమగు స్వభావముతో ఒక ప్రత్యేక పని చేయుమని మేము మనవి చేయుటలేదు. ''తండ్రీ, నీ స్వంత మార్గమున వారిని బాగుచేయుము,'' అని మాత్రమే అడుగుచున్నాము. దేవుని మహిమార్థము ఈ విశ్వాస సహిత ప్రార్థనను సమర్పించుచున్నాము. యేసుక్రీస్తు నామములో. ఆమెన్.
98యేసు క్రీస్తు నందలి మీ విశ్వాసములోను, సన్నిధిలోను నేను అద్భుతమగు సహవాస సమయమును గడిపాను. ఇక్కడ జరిగిన దానినిబట్టి ఈ కూటము చిరకాలము నాకు జ్ఞాపకముండును? ప్రేమ, సహకారము, సహవాసము.
తిరిగి మనము కలియువరకు పరలోకమందలి దేవుడు మిమ్మును నడిపించును గాక! మార్గము చీకటితో కనబడని సమయములో నక్షత్రములను ప్రకాశించు ఆయనే, మీ త్రోవను బెత్లేహేము నక్షత్రముతో! ఆయన వాక్యమునకు పూర్తిగా లోబడు జీవితమునకు మిమ్ములను నడిపించను గాక! అదియే నా ప్రార్థన.
తిరిగి మనము కలిసికొనువరకు,
తిరిగి మనము కలిసికొనువరకు,
యేసు పాదముల యొద్ద
మనము కలిసికొనువరకు
తిరిగి మనము కలియ వరకు,
తిరిగి మనము కలియ వరకు
తిరిగి మనము కలిసికొనువరకు
దేవుడు మీకు తోడైయుండును గాక!
ఇప్పుడు మనము నిలబడుదుము. నా విశ్వాసము నీ వైపు చూచును… వానిని మార్చుదును. అది చక్కనిదని నాకు నమ్మకమున్నది.
నా విశ్వాసము నీ వైపు చూచును
కల్వరి గొర్రెపిల్లా!
దైవ రక్షకా!
నేను ప్రార్థించుచుండగా,
ఇప్పుడు వినుము,
నా పాపమంతటినీ తీసివేయుము.
ఓ! ఈ రోజు నుండి,
పూర్తిగా నీవానిగా చేయుము!
99వారు పాడుచుండగా మనము ఒకరికొకరము కరచాలనము చేయుదము:
జీవితపు చీకటి దారి నేను త్రొక్కుచుండగా,
నా చూట్టూ వేదనలు అవరించియుండగా,
నీవే నా మార్గదర్శివి కమ్ము.
చీకటిని వెలుగుగా మార్చుము దుఃఖములు,
కన్నీరు తుడిచివేయుము,
నీ ప్రక్కనుండి ఎన్నడూ,
దూరముగా తొలగకుండా చేయుము.
ఇప్పుడు మంచిగా అనుభూతి చెందుచున్నారా? కాదా?
హిమమంత తెల్లనైన
పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర,
మాధుర్య ప్రేమను పంపును.
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద,
ఇప్పుడు హిమమంత తెల్లగానున్న,
పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర,
మాధుర్య ప్రేమను పంపును.
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద.
ఈ కూటమునకు అదే మన ముగింపు వర్తమానము.
హిమమంత తెల్లగానున్న,
పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర,
మాధుర్య ప్రేమను పంపును.
పై నుండి ఒక సూచనా,
పావురపురెక్కల మీద.
100మన తలలు వంచుదము. ఇంటికి వెళ్ళు పాటను పాడుటను మీరు వినండి. ఆ శకటపు చక్రముల ధ్వనిని, ఇంజను శబ్దమును మీరు వినవలెను.
హిమమంత తెల్లగానున్న పావురపు రెక్కల మీద,
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపును.
పై నుండి ఒక సూచన పావురపు రెక్కల మీద.
[సహో, బ్రెన్హాం ఆ సంగీతమును ఆలపించుట ప్రారంభించారు]
… పావురము
దేవుడు తన పవిత్ర, మాధుర్య ప్రేమను పంపును.
పై నుండి ఒక సూచన,
పావురపు రెక్కల మీద.
మీరు తలలు వంచియుండగా. నేను మిమ్ములను అప్పగించుచున్నాను. మీ సహోదరుడు నోయల్.