ఎత్తబడుట
1…యూమా ప్రాంతమునకు మరలి వచ్చునుట్లు మనము పొందిన ఈ ఆహ్వానము ఒక గొప్ప ధన్యతయై యున్నది. గత పర్యాయము, అద్భుతమైన సమయమును ఇచ్చట గడిపితిమి. నేను మరలా ఇక్కడకు వచ్చుటకు తలంచినప్పుడు, అది నన్నెంతో పరవసింప చేయుచున్నది. ఈ సాక్ష్యములను ఈ ప్రజల నుండి మధురమైన మాటలతో వినుచుండగా అది మనలను ఉత్సాహపరచుచున్నది.
2ఈ ఆరాధన ముగించిన వెంటనే, లాస్ వేగాస్ నుండి వచ్చిన సహోదరుడు ఆ ప్రాంతమందు ఒక కూడికను ఏర్పాటు చేయుటకు గాను, నన్ను కలియుటకు ఇష్టపడినట్లు (కుమారుడు) బిల్లీ నాతో చెప్పాడు. జనవరి మాసము, పోనిక్స్‌లో కూడికలు జరుగుటకు ముందు, ఒక రాత్రి కూడికకు లాస్వేగాస్‌నకు రావలసినదిగా ఆయన కోరాడు. ఆ ప్రాంతమునకు వెళ్ళుటకు మనము ఎప్పుడును ఇష్టపడుదుము. సహో॥ఆర్ట్ విల్‌సన్ కూడా ఎంతో కాలముగా ఆ ప్రాంతములో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఆయనను, సహోదరి విల్‌సన్ నన్ను అచ్చటకు ఎప్పుడు రమ్మనుచుందురు. అయితే ఈ తరుణమును ఇంత వరకు నేను పొందలేకపోయాను, కావున నేను ఇక్కడకు వచ్చుటకు ఇదే ఆ తరుణము కావచ్చును.
బిల్లీపాల్ లేక సహో॥ రాయ్ బాడర్స్ — ఇక్కడెక్కడో ఉన్నారు. సహోదరుడు రాయ్ లేక సహో॥ పెర్రీ లేక సహో॥ లీ, వీరిలో ఎవ్వరైనను మీకు ఆ (కూటములు) తేదీలను తెలిపెదరు, అప్పుడు మనమందరము అక్కడ కూడుకొనగలము.
LUKE 13:32
3ఇప్పుడు అనేకులైన సేవకులను, ఇక్కడ చూచుటతో వారిని నా సహోదరులుగా కలియుటలోను నేనెంతో సంతోషించుచున్నాను. నాకు సమయమున్న యెడల మీతో మీ గృహములకు వచ్చియుందును, ఎందుకనగా ఈ దేశములోని మంచి వంట మనిషిని మీరు కలిగియుందురు. అది ఎంతో మంచిది.
సహో॥ పెర్రీ వద్ద రెండు రాత్రులు గడిపితిని. అతనిపై రెండు నేరములను ఉంచుచున్నాను. ఒకటేమనగా అక్కడున్న మైక్రోఫోనును తీసివేశాడు. అందువలన సహో॥ పెర్రీ నీవు నేరస్తుడవు. నిజముగా నీవు నేరస్తుడవు నేను తలంచలేదు… ''ఎవ్వరో మాట్లాడుటకు ఏర్పాటు చేయుచున్నారు.'' ఆయన చాలా మంచివాడు.
ఆ తరువాత ఆయన వెళ్లి సహో॥ కాలిన్స్‌తో ఇలా చెప్పుచుండెను; ''ఆ రాత్రి భోజనము ఎంతో బాగుండినది, అయితే నేను నీతో చెప్పునదేమనగా, ఆ వంట మనిషి ఒక స్పానిష్ దేశస్తుడై యుండవచ్చు, ఎందుకనగా నేను రుచి చూచిన దానిలో అది ఘాటైన మిరియాల పొడి రుచి గలిగి యుండినది,'' ఈలాగున ఆ ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడుచుండెను.
అందుకతడు ''నేనే ఆ వ్యక్తిని'' అని చెప్పాడు.
అది నీకు టెక్సాస్ ప్రాంతముగా ఉన్నది. అయితే మనము అతనికి అరిజోనా ప్రాంతమునకు మరలించవలసి యున్నది. అతడు మనతో యున్న యెడల మనమలా చేయలేమా?
ఇక్కడుండుట ఎంతో ఆనందముగా ఉన్నది. వినుచున్న ఆ సాక్ష్యములు తమాషాలుగా లేవు గాని, అది వారి హృదయపు వైఖరియై యున్నది. మన ప్రభువు కూడా అలాంటి మనస్సును కలిగి యుండెనని మీకు తెలియును. ఆయన ఇలా చెప్పెను. ''నీవు వెళ్ళిహేరోదుతో … ఆ నక్కతో ఇలా చెప్పుము. [చూశారా?] నేను ఈ రోజు దయ్యములను వెళ్ళగొట్టుదును, మరియు రేపు ఇకపై నేను బాగు చేయుదును.'' అలాంటి మనస్సున్న యెడల, ఎందుకు అది మనలను బాధపరచదు, ఎప్పుడు కూడా నేను అలా తలంచలేదు.
4ఇప్పుడు కొంత ఆలస్యమైనది. సాధారణముగా నేను నాలుగు గంటలపాటు ప్రసంగించెదను. ఆ సహోదరుడు, సహోదరి హృదయ స్థితిని ఎరిగిన వారమై ఈ రాత్రి ఆ అంశముపై మాట్లాడుటను నిలిపి వేయుదును. నేను సహో॥ టెర్రీతో మాట్లాడినప్పుడు అతడు రెండు గంటలు పరుగిడు టేపును అమర్చమనెదరా? అని అడిగెను.
''వద్దని'' టెర్రీతో చెప్పితిని, ఇదొక "విందుగా" ఉన్నది. "కేవలము ముప్పది, లేక నలువది నిముషములు మాత్రము ఈ ప్రజలతో మాట్లాడుదును, ప్రతిసారి నేను అలా ప్రయత్నింతును."
5నేను బాలునిగా ఉన్నప్పుడు ప్రజలు ఆ ప్రసంగమును వినుటకు వచ్చెదరు, ఎందుకనగా నేనొక బాల ప్రసంగికునిగా యుంటిని. కేవలము ఒక యవ్వనునిగా ఉన్నప్పుడు వారిలా చెప్పెదరు. ''ఓ విలియం బ్రెన్‌హామ్…'' ఒక చిన్నవానిగా ఉంటివి, పాఠశాల చదువులేమియు లేవు. వారు నా చెదరిన ఆంగ్ల పదములను వినుటకు వచ్చెదరు, అది నా కెంటకీ ఆంగ్లముగా ఉండినది, అందువలన అవన్నియూ నా అనుభవాలుగా వుండినవి. ఇక్కడ కొంత కాలము క్రితము వారు నా ప్రసంగమును విని ''మంచిది, మనము లేచి నిలిచి, దేశీయ గీతమునకు పాడుదము,'' అని చెప్పెదరు.
అప్పుడు నేను లేచి ఇలా చెప్పాను, "నా సొంత కెంటకీ గృహము ఎంతో దూరముగా ఉన్నది." అదొక్కటే నేనెరిగిన దేశమై యుండినది. అందువలన అది నాకైతే ఒక దేశీయ గీతముగా ఉన్నది.
1COR 13:11
6మీరు వృద్ధులైనప్పుడు, అంతగా ఎందుకు, మీరిక్కడకు వచ్చినప్పుడు దాని కంటెను అధికమైన దానిని కలిగియున్నారు. మీరు చూశారా, పౌలు ఇలా చెప్పాడు, ''నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని.'' మీరొక పిల్లవానివలె నడచుకొందురు, అయితే మీరు ఎదిగి పెద్దవారైనప్పుడు - మీరు అలా పడుతూ, లేస్తూ మరలా ప్రయత్నించుదురు. ఆ తరువాత చక్కగా నడచుటకు ప్రారంభింతురు. మనము సిలువ సైనికులుగా దానినే చేయవలసియున్నది. ఇప్పుడు మనము చక్కగా నడచుచు మహిమ యొక్క రహదారికి వెళ్లవలసియున్నది.
PS 27:1
7మనమిప్పుడు ఈ ప్రపంచపు ముగింపు చరిత్ర యందున్నామని మన మెరుగుదుము. నేను దానిని నమ్ముచున్నాము, ప్రభువు యొక్క రాకడ మనము తలంచు దాని కన్నను అతి చేరువైయున్నది. ఇప్పుడు ఈ సమయములో ముప్పది నిముషములు, మీ దృష్టిని, నేను ఈ అంశముగా తీసికొన్న లేఖన భాగముపై ఉంచాలని కోరుచున్నాను. గత దినములలో నా గృహమందు దీనిపై ధ్యానించుచుంటిని. అప్పుడు నేను తలంచినదేమనగా, మంచిది లేఖన భాగములన్నింటి నుండి నేను మాట్లాడలేను గాని, అందులో ఒక భాగమును తీసికొని, ఈ రాత్రి మనకు జరుగనైయున్న కొద్ది ప్రసంగమును చేసెదను. ఇప్పుడు మీరు కీర్తనల గ్రంథము 27వ అధ్యాయమునకు త్రిప్పుచుండగా ఆ మొదటి 5వ వచనములను మాత్రము నేను చదువుటకు ఇష్టపడుచున్నానని మీకు తెలుపుచున్నాను.
8పుల్ గాస్పల్ బిసినెస్ మన్స్ — పాఠములకు ఇది సంబంధించినది. సహో॥ పెర్రీ, తమ యొద్ద క్రొత్తగా ముద్రించబడిన (సందేశ) పుస్తకములను గురించి మాట్లాడుచుండెను. నేను ఫోనిక్స్‌లో జరిగిన సమావేశమందు ప్రసంగించిన, ''అయ్యలారా! ఇది ఏ సమయమైయున్నది?'' అదియే ఆ పుస్తక ప్రారంభమైయున్నది. (మీరు చూశారా?) ఇది సంభవించినదప్పుడే.
ఇప్పుడు మనమధ్య అధికమైన అతీతమైన ప్రత్యక్షతలు, వ్రాయబడిన దేవుని వాక్యమందు పదిల పరచబడి ఇంకను నెరవేరని ఈ ఘడియకు సంబంధించిన ప్రత్యక్షతలుగా ఉన్నవి. అది నిజముగా వాస్తవమై యున్నది. నిజముగా జరుగుచున్న దానిని చూచిన యెడల, అది మీకెంతో ఆశ్చర్యముగా ఉండును. మీలో అనేకులు క్రొత్తవారుగా ఉండవచ్చును. ఇక్కడి వారు ఈ వర్తమానమును గురించి చెప్పు సంగతులను వినుచున్నారు. ఇది ఈ ఘడియకు సంబంధించినది. వారు దేనిని సమీపించుచున్నారు, ఇది ఈ ఘడియకు సంబంధించిన దేవుని వాగ్దానమునకు, అది ఆయన ఏమి చేయునని వాగ్దానము చేసెనో, అదేయై యున్నది; ఆయన చెప్పినట్లే ఆ విధముగానే, ఆయన ఆత్మీయముగా నిరూపించిన దానిని మనము చూచాము. ప్రతిసారి ముందుగా చెప్పబడి అది ఖచ్చితముగా నెరవేరుచున్నది, ఎందుకనగా అది దేవుడు చెప్పినదై యున్నది.
9ఎవరైనను, వారెవరైనను నాకు అక్కరలేదు. ఈలాంటి వాటిని ప్రవచించుటకు ప్రయత్నించిన యెడల… లక్షలలో ఒక్కదానిని నెరవేర్చునని అతడు చెప్పిన యెడల అది ఊహకు సంబంధించినది. అయితే ప్రతి సమయములోను మనము దానిని ఖచ్చితముగా నెరవేరుటను చూచినప్పుడు, అప్పుడది దేవునిదై యున్నది. అప్పుడు మనము లేఖనములోనికి వెళ్ళినప్పుడు అవి అన్యములుగా కనిపించవచ్చును గాని, మనము ఎచ్చట చూడవలయునని ఎరుగక ఏ లేఖనములోకి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ ఆ లేఖన భాగములన్నిటిని జతపరచి, మనము జీవించు ఈ కాలమును చక్కగా చూపును. మనము కాలాంతములను మార్చుచున్నాము.
10మనము ఒక మూలన ఉన్నాము. ఎవ్వరైనను మూలను త్రిప్పిన యెడల — అనగా కట్టు పనివారు — మూల రాతిని త్రిప్పిన తరువాత దానిని ప్రారంభించుటకు సులభము. ప్రతి ఒక్కరు ఆ వరుసలో రాతిని ఉంచగలరు, సంస్థలు అలాగే చేయుచున్నవి, వారు అలాగే రాళ్ళను పెట్టుకొనుచు పోవుచున్నారే గాని మూలలను త్రిప్పుట లేదు. దేవుడు ఒక గోడను కట్టుట లేదు గాని ఒక గృహమును కట్టుచున్నాడు. చూశారా? ఈ జీవ గ్రంథమందు అనేక చెక్కుళ్ళు, తిరుగుళ్ళు ప్రవచింపబడి యున్నవి. ఎవరైనను ఒక మూలను త్రిప్పవలయుననిన అది కట్టడపు మాదిరి యుందు యున్నట్లే ఉండవలసి యున్నది. అది అలా లేనట్లయిన దానిని చింపివేయవలసి యున్నది.
11అందుకొరకు మనము దేవుని స్తుతించుచున్నాము మరియు ఆయన మంచితనమునకును, మీ సహవాసమునకును, ప్రభువు మనకు దయచేసి తెరచిన ద్వారపు తలుపులు కొరకై ఆయనను స్తుతించుచున్నాము. ఈ సేవకుల ద్వారా నేనెంతో తృప్తి చెందియున్నాను. సంస్థలను విశదీకరించుటకు నాకు అధిక సమయము లేదు. ప్రతి ఒక్కరు సంస్థ తన చుట్టూ ఒక కంచెను వేసికొని యున్నది.
అది ఎలా ఉన్నదనగా సహో॥ డేవిడ్ చెప్పిన చిన్న బాతుల కథ వలెనున్నది. ఆయన కొన్ని బాతులను పెంచుచున్నాడు, నదిలో నీళ్ళు వచ్చినప్పుడు, ఆ బాతులు ఒక దానితో ఒకటి సహవాసము చేయుటకు ప్రయత్నించును గాని, వాటి చుట్టూ కంచె ఉన్నందున అవి అలా కలిసి యుండలేవు. అయితే ఈ నీళ్ళు ఎక్కువై ఎత్తునకు వచ్చినప్పుడు, ఆ బాతులను ఆ కంచెల నుండి విడిపించును. (ఆ నీళ్ళు ఆ కంచెలకు పైన పొర్లిపారును) అది చేయుటకు అదియే విధానమని నేను తలంచెదను. ఆ నీరు పైకి వచ్చుచున్నది. (మీరు చూశారా?) అప్పుడు మనమా కంచెల నుండి వెలుపలకు రాగలము. ఒకరితో ఒకరు సహవసించగలము. మీరు గ్రహించారా, నిజమైన క్రీస్తు ప్రేమను మన హృదయముల యందు కలిగియుందుము.
REV 3:20
12సంపూర్ణ సువార్త సేవకులందరు నా కొరకై ఎడారిలో నీటి వనరులుగా ఉన్నారు, ఎందుకనగా అనేక పర్యాయములు నేను వారిని కలిసినప్పుడు, ప్రతి సంస్థయందును వారు మంచి సేవకులుగా ఉన్నారు. వారిలో అనేకులను, ప్రెస్బిటేరియనులను, లూధరులును, బాప్టిస్టు వారిని, పెంతెకోస్తు వారిని ఇంకనూ అనేక రకములైన పెంతెకొస్తువారిని, దేవుని సంఘము వారిని, నజరేను వారిని, పరిశుద్ధ యాత్రకులను కలిశాను. వారెంతో మంచివారు, అయితే వారు అనేక పర్యాయములు నన్ను వారి సహవాసమందు చేర్చుకొనరు. ఎందుకనగా… చూశారా? వారు నమ్మలేకపోయినందున కాదు గాని, అది వారిని వారి సంస్థ నుండి విడదీయుచున్నది, చూశారా, అదియే ఆ విధముగా చేయుచున్నది.
ఇక్కడ కొంత కాలము క్రితము ఒక మెతడిస్టు సహోదరుడు నన్ను కలిశాడు. అతడు చాలా మంచివాడు, ఆయన పేరును తెలుపలేను. ఆయన దైవీక స్వస్థతను గురించి వ్రాయుచుండెను, అతను నా యొద్దకు ఏదో కొంత మాట్లాడుటకు గాను వచ్చినప్పుడు, మేము కూర్చొని కొంతసేపు మాట్లాడుచుంటిమి. అప్పుడతడు ఇలా చెప్పాడు, ''వ్యతిరేఖముగా మాకున్నది ఒక్కటే, అదేమనగా నీవెక్కడకు వెళ్లినను పెంతెకోస్తు వారిని నీ చుట్టూ ఉంచుకొనుచున్నావు.''
అందుకు నేనిలా చెప్పాను, ''మెతడిస్టు సంఘము దాని బాధ్యతను గైకొనిన అక్కడకు నేను వచ్చెదను.''
అదియే ఆ వ్యత్యాసము, చూశారా? అతడు మరలా ఇలా చెప్పాడు, ''నేను మెతడిస్టు సంఘమునకు సంబంధించిన వాడిని కాను గాని వారితో కలిసిన వాడినే.''
అందుకు నేను చెప్పినదేమనగా, ''అది అలాగే ఉన్నదా!'' చూశారా? ''తలుపులు తెరచిన వారిలో పెంతెకొస్తులు ఒకరై యున్నారు.'' ''వారితోనే నేను వెళ్ళగలను,'' చూశారా? ఎందరు తలుపులు తెరచెదరో మేము లోపలకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాము. ప్రకటన 3వ అధ్యాయమందు ఆయన ఇలా చెప్పెను, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తీసిన యెడల నేను లోపలకు వచ్చి భోజనము చేయుదును.'' ఆయనే యేసు, ఆయన క్రీస్తని నేనెల్లప్పుడు ఎరిగియున్నాను, ఆయన వాక్యమై యున్నాడు. అది వాస్తవము! ఆయన వాక్యమైయున్నాడు.
13అందువలన మనము చేరు స్థలములన్నిటను సంపూర్ణ సువార్త సేవకులు మనకు నీటి వనరులుగా వున్నారు. ఏ సంఘము కూడా దానిని బాధ్యత వహించడము లేదు. వారు నిజమునకు సంఘమునకు వెలుపలి వారుగా ఉన్నారు. అందువలన మనమందరము ఒక సహవాసముగా ప్రతి స్థలమందు ప్రపంచమంతటను ఉండగలుగుచున్నాము.
ప్రపంచమంతటను ఎన్నో కూడికల ద్వారా సంపూర్ణ సువార్త సేవకులకు సహాయపడితిని. నాకు దయచేసిన ఆ అవకాశము కొరకు నేనెంతో వందస్తుడనైయున్నాను. అక్కడ ఆ సేవకులు ఆ బాధ్యతను వహించారు, సంఘములన్నియు రావలసినదిగా వారు కోరారు. అయితే నేను ఎవ్వరని గాని వారి సంఘము నుండి బయటకు తెచ్చుటకు ఇష్టపడుట లేదు. నీవు నీ సంఘమందుండి వెలుగును ప్రకాశింపనియ్యుము. చూశావా? నిజ క్రైస్తవునిగా వుండుము; నీ కాపరి నిన్ను అభినందించును. ఒక నిజ నమ్మకమైన, వాస్తవ, సమర్పితుడివిగా ఉండుము. దేవుని యందు విశ్వసించు ఎవ్వరైనను అలాంటి వారిని అభినందింతురు. అదే నిజము.
ఇప్పుడు, ఇచ్చట ఉన్న ఆ సహోదరుడును, ఆయన భార్యకు, మరియు ఇచ్చటున్న పరిశుద్ధుల సభను, ఈ గొప్ప తరుణము నిమిత్తము నేను వందనములు తెలుపుచున్నాను. ఈ సభ అభివృద్ధి చెందును గాక, దేవుని ఆశీర్వాదములు వీరిపై ఉండును గాక, దేవుని చేతిలోని ఆయుధముగా ఉండి, వందలాది ప్రజలను, ప్రభువు రాకడకు ముందు వారిని రక్షించుటలో వాడబడును గాక, తక్కిన పరిశుద్ధ సభలు లేక వాటినుండి వచ్చిన ప్రతినిధులను అలాగే ఉందురు గాక.
14కీర్తనలు గ్రంథమందు… ఇప్పుడు నిజమునకు కొంత సమయము ఒక వింతైన అంశమును ఈ రాత్రి మాట్లాడెదను. నేను కొన్ని లేఖన భాగములను సిద్ధపరచి యున్నాను. ఈ రాత్రికి నేనొక వ్యత్యాసమైన విధముగా మాట్లాడెదనని తలంచుచున్నాను, అయితే సమయమై పోవుచున్నది. ఇక నేను ఇతర సంగతులపై మాట్లాడుటకు ఇష్టపడుట లేదు. ఇప్పుడు నేను కొన్ని లేఖన భాగములకు వెళ్లుదును, (వేరు స్థితికి) ''ఎత్తబడుట'' అను అంశముపై మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను. చూశారా?
ఇప్పుడు మనము ''ఎత్తబడుట'' ఉన్నదని నమ్ముదుము. క్రైస్తవులందరు దానిని నమ్ముదురు, బైబిలు పాఠకులకు కూడా ''ఎత్తబడుట'' ఉన్నది నమ్ముదురు.
PS 27:1-5
15ఇప్పుడు మనము దాని వెనుక ఉన్న లేఖన భాగమును కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు చదువుదుము.
''యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు.'' నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును?
నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను భాదించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి.
నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును.
యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగితిని దానిని నేను వెదకుచున్నాను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.
అపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును
చదువబడిన ఆయన వాక్యమునకు ప్రభువు తన ఆశీర్వాదములను సమకూర్చును గాక.
16ఈనాడు ఈ అంశముపై మాట్లాడుచుండగా, మీలో కొందరు అనేక రకముల తలంపులను కలిగియుందురు, అయితే అచ్చట ఎందరు విశ్వాసులు మరియు బైబిలు పాఠకుల సంఘము ఎత్తబడుట అనునది ఉన్నదని నమ్ముదురు? అవునండి! అది వాస్తవము! సంఘమును పట్టబడుట. మీరు, మెతడిస్టులైనప్పటికిని, బాప్టిస్టులైనప్పటికిని, ప్రెస్బిటేరియనులైనను, లేక ఎవ్వరైనను పెంతెకోస్తులైనను పట్టబడుట అనునది ఉన్నది.
దీనిని నేను మాట్లాడుచుండగా, నేనేదో నిలుచుండి ప్రజలను సంతోష పెట్టుటకై ఏదో కొంత చెప్పుటకు ప్రయత్నించుట లేదు. దాని నిమిత్తము నేను అపరాధిని అగుట లేదు. నేను లేచి నాకు కలుగు నడుపుదల ప్రకారము మాట్లాడుదును. అది మీకెంతో మేలగును. మీరు క్రైస్తవులైతే ఇంకనూ దేవునితో మీ అనుభవము చేరువగుటకు సహాయపడును. అందునిమిత్తమే నేనెప్పుడు ప్రభువు నన్ను నడిపించు రీతిగా నా తలంపులను ఏకపరతును.
2PET 3:3
17ఇప్పుడు ఈ చివరి దినముల యందు దీనియొక్క సిద్ధాంతము తిరస్కరించబడునని హెచ్చరించబడుచున్నాము. వీలుపడిన మనమా భాగమును ఒక్క నిమిషము చదువుదుము. అది II పేతురు 3వ అధ్యాయమందున్నది. దానిని ఒక్క నిమిషము చదువుదము. 3వ అధ్యాయము 3, 4, 5వ చనములు, ఇది నిజము కాదా అని చూచెదము.
''అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన
రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్లే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.
ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండియు నీళ్లవలను సమకూర్చబడిన భూమియు, దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెదరు.''
2TIM 3:1
18అందువలననే ఈ అంశము ఎంతో వెలిగించబడుచున్నది, ఎందుకనగా ఆ ప్రవక్త కడవరి దినముల యందు అపహాసకులు వచ్చి ఈలాగు మాట్లాడుదురని చెప్పుచున్నాడు. చూశారా? అది ప్రవచింపబడినది. ఈనాడు ఈ ప్రజలు ఎందుకలా జీవించుచూ నడుచుకొనుచున్నారనగా…. మంచిది, మీరు దానిని ఖచ్చితముగా ఎదురు చూచునదే, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పుచున్నది: ''అంత్యదినముల యందు మనుష్యులు, స్వార్ధప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాందులు దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము.'' సత్య వేషధారణను మనము చూచుట లేదా? ఖచ్చితముగా చూచుచున్నాము.
EXOD 7:10•
2TIM 3:8
19మోషే తన చేతి కర్రను నిరూపణగా ఇశ్రాయేలు పిల్లలను విడిపించుటకు ఐగుప్తునకు వెళ్లినప్పుడు, ఆయన వెనుక పరలోకపు దేవుడుండగా ఎన్నో అద్భుతములు చేసెను. అప్పుడు మోషే చేసిన కార్యములనే చేయుటకు వేషధారులు అక్కడకు వచ్చారు. ఆ కార్యములను అతని వలె వారును చేశారు. చూశారా? అతడు (మోషే) మొదట చేసిన తరువాత వారు వచ్చారు. వారు ఆ చుట్టూ చేరారు, వారు మోషే చేసిన కార్యములను అలాగే చేశారు. మనము దానిని చూచాము. అప్పుడు మీరిలా చెప్పవచ్చు, ''మంచిది అని మోషే దినములయందు జరిగినవి,'' అయితే అదే వాక్యము, అలాంటివారు అంత్యదినములలో మరలా వచ్చెదరని తేటగా చెప్పుచున్నది. ''యెన్నె, యెంబ్రెల వలె మోషేను ఎదురించుచు, సత్య విషయమై దూషణ మనస్సు గలిగి యుందురు.'' చూశారా? వేషదారులు ప్రజలను అన్ని రకములుగా తల క్రిందులు చేసెదరు.
అట్లయిన, రానున్న ఈ ''ఎత్తబడుట'' దేవుని వాక్యానుసారముగా ఉన్నదా! అప్పుడు కొందరు దానిని తలక్రిందులు చేయుటకు తప్పక వెళ్లెదరు. అది సాతాను ఉద్దేశ్యముగా ఉన్నది.
లాస్ వేగాస్ ప్రాంతములో జరిగిన కూటములో ఆ సహోదరుడు చెప్పినట్లు, ''సాతాను," "ప్రపంచము సాతానుని రాజ్యమై యున్నది, మరియు అతని ప్రధాన కార్యాలయమైయున్నది.'' సాతాను ఈ ప్రపంచపు దేవుడని నేను ఎరిగి యున్నాను. పరలోకము క్రిందనున్న ప్రతి రాజ్యము అతనిచే నడిపించబడుచున్నది. అది నిశ్చయము! ఈ ప్రపంచము సాతానుకు స్వంతమైయున్నది. అయితే యేసు దానిని స్వాధీనపరచుకొనును. అతడు (సాతాను) దానిని (ప్రపంచమును) ఆయనకు (యేసుకు) ఇచ్చుటకు చూచెను; కాని ఆయన (యేసు) దానిని నిరాకరించెను, అయితే ఆయన ఇలా చెప్పెను, ''రానున్న కాలములో నేను దానికి వారసుడనని ఆయన ఎరిగి యుండెను.''
20అపహాసకులు - ఆ మాటపై కొన్నినిమిషములు మనము ముందుకుసాగక మునుపు తీసికొందుము. అపహాసకులు — ట్యూసాన్ ప్రాంతములో రెండు వారముల క్రితము ఒక వార్త పత్రికను చదువుచుంటిని: ఇంగ్లాండు దేశము నుండి ఒక ఆంగ్లేయుడు దానిని చెప్పి యుండెను. అది ఆ పత్రికలో ప్రధమ వరుసలో ఉండినది. అదేమనగా, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణము, పిలాతు మరియు యేసు మధ్యలో ఒక అబద్ధమైయున్నది. ఆయన (యేసు) తన్నుతాను గొప్ప, చేసికొనుటకై వచ్చెనని అక్కడ వ్రాయబడి యుండెను. దానిని అసత్యమని నిరూపించుటకు ఏ మార్గము లేదు, ఎందుకనగా దేవుని కార్యములన్నియు విశ్వాసముతో గైకొనవలసి యున్నది. మనము ఆ కార్యములను విశ్వాసించవలసి యున్నది, ఆ విధముగా అతడు (ఆ పత్రికలోని రచయిత) దానిని వర్ణించుకొనుచూ వెళ్ళెను.
21కొంత కాలము క్రితము ఆ బండను మహారాజ్యము ఇంగ్లాండు దేశమందు, జాన్‌వెస్లీ, చార్లెస్, స్పర్జ్‌న్ మొదలగు గొప్ప భక్తులు అచ్చట సువార్తను ప్రకటించిరి, వారా సువార్తను నిరాకరించిరి. ఈనాడు వారి స్థితి ఏమైనదో చూడండి. అక్కడే సహో॥ విలియమ్స్ మొదలగు వారు ఈ రాత్రి ఉన్నారు. ఇప్పుడది ప్రపంచములోని హీనమైన రాజ్యములో ఒకటై యున్నది. నేను ప్రపంచమంతటను చూచాను గాని ఇంగ్లాండు దేశము లాంటి వ్యభిచార దేశమును చూడలేదు. సహో॥ బిల్లీ గ్రహమ్ దానిని గురించి చెప్పాడు. ఆయన తన భార్యాతో ఒక పూల తోటకు వెళ్ళాడట. ఆ పూల తోటలో స్త్రీ, పురుషులు ఎంతో అసహ్యముగా బహిరంగముగా ఉన్నారట. నేను అక్కడ ఉన్నప్పుడు అది ఏ విధముగా ఉండినదనగా, మానవ హృదయము బ్రద్ధలై పోవునంతగా ఉండినది. ఆ ఇంగ్లాండు దేశము ఒకప్పుడు ప్రపంచమును పునరుద్ధరణకు నడిపించినదై యుండినది. అది ఇప్పుడు ఏ విధముగా విడిపోయినది చూపుచున్నది.
మీరు చూడండి. ఆ విధముగా జరుగుటకు కారణమేమి, అప్పుడు వారి మధ్యకు వెళ్ళిన వర్తమానమునే, నేటి వరకు వారు కలిగియున్నారు. అది ఈనాడు పని చేయదు. అది పని చేయదు.
అది ఎలా…
22మోషే దిగి వచ్చి నోవహు వర్తమానమును తెలిపినయెడల — మనమొక ఓడ నిర్మించి నైలు నదిపై తేల చేయుదమా? అని చెప్పిన యెడల, అది పని చేసి యుండదు. లేక యేసు యొక్క వర్తమానము తెలిపినను అది పనిచేయదు, లూథరు వర్తమానము, వెస్లీ కాలమందు పనిచేయదు. ఈనాడు పెంతుకోస్తు మనకు చివరి పునరుద్ధరణగా ఉన్నది. మనము ఈనాడు ఆ పెంతెకోస్తు వర్తమానము నుండి ముందుకు వెళ్ళుచున్నాము. అది మనతో కలువదు, ఎందుకనగా అది ముందు దినమునకు సంబంధించినది. అదంతయు దేవుని వాక్యమై యున్నది, అయితే అది కట్టబడుచున్నది. చేతులు, పాదములు ఎలా పెరిగి పెద్దవగుతాయో అలాగే ఎత్తబడుటకు గాను ఆ వాక్యము ఒక వధువును రూపించుచున్నది. చూశారా, అచ్చట ప్రజలను తప్పుగా ఉంచుట జరుగదు; వారు వారి వర్తమానమునకై జీవింతురు. వధువులో ఉన్న వారందరు దాని నుండి వెలుపలకు వచ్చెదరు. అది ఎలా ఉన్నదనగా గోధుమ మొక్కవలె నున్నది. అది విత్తనమును విడచి మొక్కగా మారి మరలా అనేక గోధుమ గింజలగుచున్నది. గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది దాని విడచిపెట్టును.
23కొంత కాలము క్రితము ఒక జర్మను దేశీయుడు రచించిన వాఖ్యాన పుస్తకమును చదువుచుంటిని, అప్పుడు అందులో ఇలా వ్రాయబడి యుండినది, ''ప్రపంచములోని బుద్ధిహీనులందరిలో, విల్లియం బ్రెన్‌హామ్ అందరికంటే మొదటివాడు." "ఆయన మరేది కాదు, ఒక మాంత్రికుడు, అందువల్లనే ఈ కార్యములను చేయుచున్నాడు,'' అని వ్యాఖ్యానించి యున్నాడు… చూశారా, ఆ మనుష్యునికి మరేది తెలిసినట్లు లేదు.
అతడొక విమర్శకుడు. అతడు దేవుని నమ్మువాడు కాడు. మరియు అతడిలా వ్రాయుచున్నాడు, ''ఒక దేవుడు చీకటి కాలములను ఏర్పరచి, చేతులను కట్టుకొని, అనేక క్రైస్తవులు, తల్లులు, చివరకు, తన శిష్యులు, చిన్న బిడ్డలు, సింహములకు ఆహారమైనప్పుడు తనచేతిని చాపకుండునా?'' శరీరక మనస్సు ఎలా ఉన్నదో చూచారా, విద్య ఇతర కార్యములు దర్శనమును అందుకోజాలవు.
24ఆ గోధుమ విత్తనము భూమిలో పడవలసియున్నది.
యేసు మరణించి మరలా లేచినట్లే యున్నది, ఆ విధముగానే పెంతెకొస్తు (దినపు) సంఘమునకు జరుగవలసియున్నది. ఆ చీకటి కాలములో అది భూమియందు పడవలసి యున్నది. ఏ గోధుమ గింజయైనను, మరలా మొలకెత్తవలయునన్న భూమిలోని చీకటి యుందు ఉండవలసియున్నది. అదే విధముగా చీకటి కాలములో (మరణించిన) సంఘము మార్టిన్ లూధర్ కాలములో చిగురించినది. వెస్లీ ద్వారా, పెంతెకోస్తుకు వచ్చినది; ఇప్పుడది విత్తనముగా మారుచున్నది. సంస్థలు వాటి విధానములు, వెనుక విడచినవిగా, మొక్కలోని కాండముగా ఉన్నది. వాటిస్థితి అంత వరకే. ఆ సంస్థల విధానములు కాల్చి వేయుటకు గాను సిద్ధముగా ఉన్నవి. అయితే ఆ పునరుద్దరణల ద్వారా వెలుపలకు వచ్చిన నిజ గోధుమ గింజ వధువులో చేర్చబడి కొనిపోబడును. వారందరును చేరి వధువుగా చేయబడుదురు.
25ఇంగ్లాండులోని కొందరు ప్రజలు సిలువ మరణము వేషమును ధరించి, చిన్న పిల్లలు పొడవైన వెంట్రుకలు కలిగి, దొర్లాడుచు యేసును ''డాడీ-ఓ డాడీ,'' అని పిలుచుచుండిరి, ఇదెంత నీచము.
అది ఇంగ్లాండులోని లండనులో జరిగినదని, ''మీరు చెప్పవచ్చు, గతవారపు పత్రికలో చూచినప్పుడు అమెరికాలోను అదే స్థితిని చదువగలము. ఒక గొప్ప బైబిలు పండితుడు చెప్పినదేమనిన - సిలువ మరణము ఒక అబద్ధము, యేసు అలా తన్ను చూపుకొనుటకు ప్రయత్నించెను. అతడు మత్తును త్రాగాడు'' ఆదికాండములో దానిని గురించి చెప్పబడినది, అవి మారిజాన లేక మరేదో (marijuana). దానిని త్రాగినప్పుడు, నిద్రమత్తులగుదురు. రెండు, మూడు, దినముల వరకు మరణించిన స్థితిలో ఉందురు.
MATT 27:48•
JOHN 19:29
26అతడింకనూ ఇలా చెప్పెను, ''వారు ఆయనకు చిరకను త్రాగుటకు ఇచ్చినప్పుడు ఇదంతయు వీలగును, అది ఒక విధమైన మత్తును కలిగించు మొక్కగా ఉన్నది. వారలా చేయుచు ఆయనకు త్రాగుటకు ఇచ్చిరి. ఆయన ఆ సిలువకు వెళ్లి, మరణించిన వానివలె అయిపోయాడు. వారాయనను సమాధి యందుంచిరి, వారాయనను అక్కడుంచిరి. రెండు, మూడు రోజుల తరువాత అతడు లేచాడు. అదంతయు అలా జరిగినది. చివరకు ఆయన వెళ్ళి ఇండియా దేశములో ఒక మారుమూలన మరణించాడు.'' అలా అతడు ఒక మతమునే అబద్ధము చేయుటకు ప్రయత్నించుచున్నాడు. మొదటిగా ఆ వాఖ్యాన కర్త (స్థితి ఏమిటి)… ఈ ప్రజలు సంగతి ఏమిటి? చూశారా? అది ఖచ్చితముగా మనము జీవించు ఈ దినమై యున్నది, అపహాసకులు (చూశారా?) ప్రవచనము నెరవేరు దినముగా ఉన్నది.
27దేవుడు తన వాక్యమును ఆయాకాలములకు ప్రత్యేకపరచి యున్నాడు. ఈ ఒక్కొక్క కాలము ఆ వాక్యమును బయలుపరచుచున్నది. ఆ వాక్యమును నిరూపించుటకు, ముందు నిర్ణయించబడిన వారు ఏర్పరచబడియున్నారు. ప్రతి పర్యాయము (ఆయా కాలములకు) తన వాక్యమును సిద్ధపరచి, దానిని నిరూపించుటకు ఒకరిని ఏర్పరచి యున్నాడు. ఆయన మోషే కాలమునకు మోషేను ఏర్పరచెను. దేవుని కుమారుడు జన్మించు కాలమునకు ఏర్పరచినప్పుడు ఆయన దాని కొరకు సిద్ధపరచెను. ప్రతి కాలమునకు, ముందు నిర్ణయించబడిన ఆయన మనుష్యులను ఆయన సిద్ధపరచి యున్నాడు. బైబిలు చెప్పునదేమనగా, (ఆయనకు) మరుగైనది ఏది లేదు… దేవుడు నిత్యుడు, సర్వశక్తిగలవాడు. ఆయనకు పరిచర్య చేయుటకు గాను ఏది లేదు. మనమలా తలంచగలమా? ప్రతి ఒక్కటి దాని క్రమములో వెళ్లుచున్నది.
ఆయన వాక్యములోనికి చూచుచు, ఆయన ఏమి చేయుచున్నాడో గమనించుము. అప్పుడు మనము దానిని గ్రహించగలము.
28దానిని తలంచి చూడుము. ఆ సేవకుడు చెప్పినట్లు, మొదటిగా ఆ చిరకను ఆయన నోట ఉంచినప్పుడు ఆయన దాని ఉమ్మి వేశాడు. మొదటిగా ఆయన దానిని తీసికొనలేదు. చూశారా? అది కేవలము అపహాసకులు పైకి వచ్చుటయై యున్నది. మరొక సంగతి ఏమనగా, ఏ విధముగా ఈ నజరేయుడైన యేసు జీవితము ప్రతి ఒక్క లేఖనమునకు పాత నిబంధన యందు అమర్చబడియున్నది? అది ఎలా ఉన్నది. దేవునిచే అభిషేకించ బడనియెడల అది అలా జరుగదు. పాత నిబంధనలోని ప్రతి లేఖన భాగమునకు ఆయన జీవితము అమర్చబడినది. మరొక సంగతి, ఆ శిష్యులు ఆ విధముగా ఆయనను మోసపుచ్చిన యెడల, ఎందుకు వారిలో ప్రతి ఒక్కరు అలా హతసాక్షులుగా మరణించారు? అపొ॥ పేతురు చెప్పినదేమనగా, ''నన్ను తలక్రిందులు చేయుడి, ఆయన వలె మరణించుటకు నేను అర్హుడను కాను. అది ఎలా ఉన్నది… వారు ఆంద్రేయను సిలువకు అడ్డముగా ఉంచి (చంపిరి). వారిలో ప్రతి ఒక్కరు వారి సాక్ష్యమును వారి రక్తముతో ముద్రించిరి. వారాయనను ప్రేమించి, విశ్వసించిరి. ఆయన కొరకు వారి ప్రాణములనిచ్చిరి. ఆయన ఒక అబద్ధికుడైన యెడల, వారు దానినంతటిని ఎలా చేయగలరు? చూడండి, అది ఆత్మీయ సమర్పణయై యున్నది, ప్రజలు దానిని గ్రహించలేరు.
29కొంతకాలము క్రితము ఒక గొప్ప మనుష్యుడు, ఒక గొప్ప రబ్బీ (బోధకుడు) ఏమి వ్రాశాడనగా, ''మోషే అలా ఎర్ర సముద్రమును దాటుచుండగా, అది నిజముగా నీళ్ళు కాదు, నీళ్ళు గోడగా ఎప్పుడును నిలువలేవు. అదేమై ఉన్నదనగా ఆ మృత సముద్రమునకు ఆవలి రెల్లులై యున్నది. ఆయన ఆ రెల్లుల మధ్యగా నడిచిపోయెను — అది నీటి రెల్లుగా ఉన్నవి. నిజమునకు అక్కడ నీరు లేదు. అచ్చట రెల్లులు మాత్రమే, ఆగాధ సముద్రము వలె ఉండెను. దాని ద్వారా వారు నడచిపోయిరి.'' అయినా ఈ విధముగా వ్రాసిన దానిని అనేక సేవకులు నమ్మి అంగీకరించారు.
కొంత కాలము క్రితము మొదటిగా నక్షత్ర మండలమునకు వెళ్లిన వాడు, మరల వచ్చి, ''అచ్చట దేవుడనునది ఏది కనబడలేదు,'' అని చెప్పినప్పుడు, అనేక సేవకులు అతని చుట్టూ చేరి, దేవుడు కొన్ని వందల మైళ్ళ ఎత్తులో ఎక్కడో నివాసము చేయుచున్నాడని తలంచుచున్నారు.
30ఎందుకు, ఈ ప్రపంచపు విద్య, జ్ఞానము సంఘమును చింపిరి కలుపుగా మార్చి యున్నది.
విద్య, విద్యా విధానములు, విజ్ఞానము, నాగరికత ఇవన్నియు సాతానుకు సంబంధించినవి. అది సాతాను నాగరికతయైయున్నది. పరిశుద్ధ గ్రంథము అలా చెప్పుచున్నది. రానున్న మన నాగరికతతో ఏమీ చేయలేదు. అది ఏమియు లేనిదై యున్నది. అది మరో రకమైన నాగరికతయై యున్నది. మనము ఈ నాగరికతలోకి, ఈ శాస్త్రములోకి వెళ్ళుచుండగా మరణములోకి వెళ్లుచున్నాము. కార్యములను, ప్రతి ఒక్కటియు మరణమునకు వలను ఒడ్డి యున్నవి. ఆ రానున్న ఆ క్రొత్త నాగరికత యందు మరణము లేదు. వ్యాధి లేదు, వేధన, బాధ లేదు. చూడండి? అక్కడ అలాంటిదేదియు లేదు. కావున ఈ నాగరికత నాశనము చేయబడవలసియున్నది, ఎందుకనగా ఇది సాతానుది.
GEN 4:17
31మనము దీనిని ఆదికాండము 4వ అధ్యాయములో చూచెదము. కయీను ప్రజలు ఈ నాగరికతను ప్రారంభించి భవనములను కట్టిరి, పట్టణములను నిర్మించిరి, వారికి సంగీత వాద్యములుండినవి, వారు అలా విజ్ఞానశాస్త్రములోనికి వచ్చారు. వారు ఆ విధముగా దేవునికి ఎంతో దూరమై పోయారు, అయినను వారు మత వాదులుగా ఉండిరి. అయితే షేతు సంతానము వచ్చినది. వారు ప్రభువు నామమున పిలువబడిరి. ఆహా, అలా ఏ (ప్రజను) గురించి మాట్లాడబడెను.
ఇక్కడ ఎవరి తలంపులను నేను గాయపర్చడము లేదు, సంఘమును గురించి మరేదో చెప్పుట లేదు. మీరు ఇక్కడ ఈ సంఘమునకు చెందిన వారైనను మిమ్ములను, మీ తలంపులను గాయపరచుటకు దీనిని చెప్పుట లేదు, ఎందుకనగా ప్రతి ఒక్క సంఘమందును మంచి వారున్నారు. గత వారము ''ష్రీవ్ పోర్ట్‌లో'' చదువుచుండినప్పుడు అక్కడ ఒక కాథలిక్స్ ఇలా తెలిపినది. ఇప్పుడు వారందరు ఒక్కటై మత సంబంధ ఆలోచన సభగా ఏర్పడుచున్నారట. పరిశుద్ధ గ్రంథమందు సెలవిచ్చినట్టే ఖచ్చితముగా అది నెరవేరుచున్నది. ఖచ్చితముగా అలాగున్నది.
32ఇప్పుడు, వారు ఇలా చెప్పుట మనము కనుగొనగలము, ''బైబిలు అలా చెప్పుచున్నదని కొందరు ప్రొటెస్టంటు వారు బైబిలును అంటిబెట్టుకొని యుండుటకు ఇష్టపడెదరు. బైబిలు ఒక సంఘచరిత్ర గ్రంథము. ఆ గ్రంథము 250 సం॥లకు పూర్వము (పుస్తక) సాహిత్యమందు లేదు. కొందరు సంఘమే ప్రాముఖ్యము, బైబిలు కాదు. అది కేవలము సంఘము చేసిన దానిని అందులో పదిలపర్చబడినది,'' అని చెప్పెదరు. ఇది ఒక తంత్రముతో కూడిన అబద్ధమై యున్నది. మనము ఈ పరిశుద్ధ గ్రంధమును మూడు వేల సంవత్సరముల నుండి కలిగియున్నాము. పాత నిబంధన గ్రంథము క్రీస్తు రాకడకు ముందు వందలాది సంవత్సరముల క్రితము లేఖనముల యందు వ్రాయబడి యుండినది. వారు చెప్పునది కేవలము సాతానుని తంత్రమై యున్నది.
JOHN 1:1•
JOHN 5:22•
ACTS 10:42•
ROM 2:16•
HEB 13:8
33మనము ఈ దినములలో పరిశుద్ధ గ్రంథమును గురించి అపహాసించుటయు, పరిహాసించుటయు జరుగుటకు చూచుచున్నాము. దానిని దూరపర్చుచు దేవుడు మరి దేనితోనో సంఘమును తీర్పు తీర్చునని అనుకొనుచున్నారు. ఆయన కేవలము… నేను ఈ వీధి వెంబడి వెళ్లుచుండగా - నీవు ముప్పది మైళ్ళ వేగముతో వెళ్లుచున్నావు. ఈ ప్రాంతములో 20 మైళ్ల వేగముతో వెళ్లుచున్నావని నన్ను బంధించవలెనన్న, ''అక్కడ 20 మైళ్ల వేగముతో వెళ్లవలయును'' సంకేతము ఉండవలసి యున్నది. అది అచ్చట ఉండవలసి యున్నది. దేవుడు ఒక దినమున సంఘమును - ప్రజలను తీర్పు తీర్చనై యున్నాడు. దానిని మనము ఎరిగియున్నాము. ఒక తీర్పు వచ్చుచున్నది. అట్లయిన ఆయన కాథలిక్ సంఘము ద్వారా తీర్పు తీర్చవలెనన్న, ఏ కాథలిక్ సంఘము ద్వారా తీర్పు తీర్చును? మెతడిస్టు సంఘము ద్వారా తీర్పుతీర్చనై యున్న యెడల, బాప్టిస్టు సంఘము విడచి పెట్టబడును. ఆయన ఏకత్వపు వారి ద్వారా తీర్పు తీర్చిన యెడల, మరొక తరగతి వారు నశించెదరు. చూశారా? అట్లయిన ఆయన దేని ద్వారా తీర్పు తీర్చనైయున్నాడు? ఆయన క్రీస్తు ద్వారానే తీర్పు తీర్చునని సెలవిచ్చియున్నాడు. క్రీస్తు వాక్యమై యున్నాడు, కావున ఆయన తీర్పు తీర్చనై యున్నది దేవుని వాక్యముతోనే. ''ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.'' చూశారా? కావున ఆయన తన వాక్యముతో తీర్పు తీర్చును.
ఈ దినములో సంఘమును అంగీకరించుచు పరిశుద్ధ గ్రంథమును త్రోసివేయుచుండగా… సంఘమునకు పరిశుద్ధ గ్రంథము అక్కరలేకున్నది — అందువలన వారు ఎలాంటి సిద్ధాంతమునైనను, మరొక దానిని కలిగి యుండి దానినే వెంబడించుచున్నారు.
EXOD 12:15
34ష్రీవ్‌పోర్టు నందు గత రాత్రి మాట్లాడుచున్నప్పుడు, ఆ దినములలో వారు సంస్కారమును ఆచరించినప్పుడు వారు ఒక గొర్రెపిల్లను చంపెదరు. వారు ఏ కారణము చేతను ఆ ఏడు దినములలోను పులిసినది వారి మధ్య ఉంచుకొనరు. పులిసినది లేదు, పులిసిన రొట్టె ఉండదు. ప్రతి ఒక్కటియు పులవనిదియై యుండి, మనము ఈ గ్రంథమందు కలిగియుండు ఏడు సంఘ కాలములకు ప్రాతినిధ్యము వహించుచున్నది. అక్కడ పులిసినదంటూ ఏది ఉండదు, కాని మనము కల్పితమైన సిద్ధాంతములను, సంస్థలను కలిగియున్నాము. ప్రతి ఒక్క దానిని వాక్యముతో కలిపి దానిని దేవుని వాక్యమని పిలుచుటకు ప్రయత్నించుచున్నాము. ఆ ఏడు దినములు పూర్తిగా ఎలాంటి పులిసినది గాని ఉండకూడదు.
35ఈనాడు భుజించినది, రేపటికి ఉంచుకొనగూడదు. సూర్యుడు ఉదయించుటకు ముందుగానే దానిని కాల్చివేయవలెను, ఎందుకనగా క్రొత్త వర్తమానము ముందుకు వచ్చుచున్నది, అది క్రొత్తదై యున్నది.
చూశారా, దానిని చేపట్టి యుండుటకు ప్రయత్నించుడి, అదియే సంఘ వైఖరియై యుండవలయును. అప్పుడే ఉజ్జీవము బయలుదేరును, మొదటిగా మీరు తెలిసికొనవలసిన దేమనగా, మూడు సంవత్సరములలో వారు దానిపై ఒక సంస్థను ప్రారంభించిరి. సంస్థ ఒక సమాఖ్యను ప్రారంభించినది, అయితే మీరు గమనించినట్లయిన, ఇది ఇరువది సంవత్సరములుగా కొనసాగుచున్నది కాని ఎటువంటి సామాఖ్యలును లేవు. ఇకపై ఉండవు. ఇది చివరిదై యున్నది. గోధుమ, గోధుమగింజలుగా వచ్చినవి. తొక్క రాలిపోవలసియున్నది. ఆ గోధుమ సూర్య వెలుగులో పరిపక్వమగుటకు ఉంచబడవలసియున్నది.
ZECH 14:7
36కొంతకాలము క్రితము తూర్పు తీరములో గొప్ప చీకటి ఏర్పడినది. అది ఒక ఆశ్చర్య కార్యము కాదా? వారు దాని గ్రహించలేదు. గత వారములో టెక్సాస్ పట్టణము చీకటై పోయినది. వారు దానిని గ్రహించుట లేదా? ఇశ్రాయేలు తన సొంత భూభాగమందున్నది. ఈ సూచనలన్నియు మనము చివరి కాలములో ఉన్నామని సూచించుచున్నవి. ఈ విధముగా చీకటి ఏర్పడునప్పుడు ప్రవక్త చెప్పినట్లు, ''అస్తమయ కాలమున వెలుతురు కలుగును,'' ఈలాగున చీకటి కమ్ముచుండగా సాయంకాల సమయములో వెలుతురు వచ్చుచున్నది.
2PET 3:3
37అది (లోక సంఘము) ఏ విధముగా చీకటి కమ్మిపోవుచున్నదో చూడుడి.
పోపు ఇచ్చుటకు (ఇశ్రాయేలుకు) అప్పుడే వచ్చాడు. అప్పుడు ఆ దినమున ఈ మందిరములో జరిగినదేమిటో దానిని ప్రభువు ఎలాగు చూపెనో - మీ వద్ద టేపులున్నవి. ఈ టేపుల యందు (ఆ వర్తమానము) పదిలపర్చబడి యున్నది. ఖచ్చితముగా ఆ ఏడు సంఘములు ఏలాగున్నవో చూపించాడు. ఇచ్చట ఆ నల్ల బల్లపై దానిని చిత్రించి చూపియున్నాను. మీరు చూచిన ఆ ఏడు సంఘ కాలములు ఈ పుస్తకమందు చిత్రించబడియున్నది. ఆ పరిశుద్ధాత్మ గొప్ప అగ్ని స్తంభములో దిగివచ్చి, ఆ గోడకు సమీపముగా వెళ్లి, ఆయనే ఆ మూడు, నాలుగు వందల మంది చూచుచుండగా; ఆ గోడపై వ్రాశాడు. పోపు ఇచ్చుటకు (ఇశ్రాయేలుకు) వచ్చుటకు గాను బయలు దేరుచుండగా, చంద్రునిలో ఆ చీకటి ఏర్పడినది. వారు (అనేకులు) దానిని ఫోటో తీశారు, అది ఖచ్చితముగా ఇచ్చట చిత్రించి చూపినట్లే ఉండినది. అతడు (పోపు) 13వ తారీఖున వచ్చి 13 అను సంఖ్యగల దేశమై యున్నది. (అమెరికా దేశము) ప్రతి చోటను చీకటి కమ్మినది. మనమెచ్చట ఉన్నామో చూడలేరా? మనము చివరి-కాలమందున్నాము.
''అంత్యదినముల యందు అపహాసకులు బయలుదేరుదురు, 'కాలములయందు ఎలాంటి బేధము లేదని వారు చెప్పుదురు, తండ్రులు నిద్రించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కటిగా ఉన్నదని వారు చెప్పుదురు.'" అయితే వీటిని మీరు చూచినప్పుడు, మీ తలలు పైకెత్తుడి; సిద్ధపడుడి; ఏ సమయమునైనను ఏదో జరుగనైయున్నది. క్రీస్తు తన సంఘము కొరకు రానున్నాడు.
PS 22:1,16•
MATT 27:46•
MARK 15:34•
LUKE 22:34
38ఇప్పుడు, వారు దానిని విశ్వసించరు, ఎందుకనగా వారు ఆ లేఖనములను నెరవేర్చుచున్నారని గ్రహించలేరు. ప్రజలు నిజమునకు తమ ద్వారా ఈ లేఖనములు నెరవేరుచున్నవని గ్రహించకున్నారు. ఎంతగా ఆనాటి కయప ప్రధాన యాజకుడిగా ఉండినను ఆయనను అపహసించి, పరిహాసించాడు — వారు ఆరాధించుచు పాడుచుండు 22వ కీర్తనలో ''నా దేవా, నా దేవా నన్నేల విడనాడితివి'' అనునది ఆయనేనని వారు ఎరుగకుండిరి. ''నా చేతులలో, నా పాదములలో, వారు మేకులు కొట్టిరి'' [కీర్తనలు 22]. "వారా విధముగా దేవాలయములో పాడుచుండగా వెలుపల ఆయన (యేసు) అక్కడ సిలువపై మరణించుచున్నాడు. కొద్దిగానైనను వారలా చేయుచున్నామని గ్రహించుట లేదు." యేసు ఇలా ప్రార్ధించెను. ''తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు''. ఎందుకనగా వారే ఖచ్చితముగా ప్రవచనములను నెరవేర్చుచున్నాను, ఆ లేఖనములకు వారు గ్రుడ్డివారైరి.
REV 3:17
39మీకు తెలియునా, ఈ అంత్యదినములయందు కాథలిక్ సంఘము, మరియు ప్రొటెస్టెంటు సంఘము గ్రుడ్డివగునని ప్రవచింపబడినది. అదే కార్యము మరలా జరుగుచున్నది, క్రీస్తు వెలుపలనుండి లోపలకు వచ్చుటకు ప్రయత్నించుట లేదా? ''ఎందుకనగా నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునైయున్నావని యెరుగక!" ప్రకటన 3. అచ్చటనే నీవున్నావు. మరలా (ఆత్మీయ) గ్రుడ్డితనమునకు వచ్చావు, దేవుని కార్యములను త్రొక్కుచూ, అవి వారికి అర్థము లేనట్లే భావించుచు, పరిహసించి, అపహసించుచున్నారు; దానినే బైబిలు కూడ చెప్పుచున్నది.
40అయితే సంఘమునకు అనగా వధువునకు, ఎత్తబడుట అనునది ఒక ప్రత్యక్షతయై యున్నది. అది ఆమెకు ప్రత్యక్షపరచబడినది, ఆ నిజ ప్రత్యక్షత కొరకే క్రీస్తు యొక్క వధువు వేచి యున్నది. అది ఎత్తబడుట యొక్క ప్రత్యక్షతయై యున్నది.
అదియే ప్రత్యక్షత, విశ్వాసమనగా ప్రత్యక్షతయై యున్నది. నీవు విశ్వసించనిదే నీకు ప్రత్యక్షత కలుగదు. విశ్వాసము ప్రత్యక్షతయై యున్నది, ఎందుకనగా అది నీకు బయలుపరచబడినదై యున్నది. అది అబ్రాహామునకు బయలుపడినట్లున్నది, అది ఎంత వ్యతిరేకముగా ఉన్నప్పటికిని, కార్యములు అలా లేకుండినప్పటికిని అతడు దానిని నమ్మెను. అదియే విశ్వాసము, అది దేవుని ప్రత్యక్షతయైయున్నది. సంఘము (వధువు) ఆ ప్రత్యక్షతపై కట్టబడుచున్నది, అది పరిపూర్ణ శరీరమై యున్నది.
JOHN 3:16,36•
JOHN 5:24•
JOHN 6:47•
1TIM 1:16
41ఇక్కడ కొన్ని వారముల క్రితము ఒక చక్కని బాప్టిస్టు సహోదరునితో మాట్లాడుచున్నప్పుడు. అతడు నాతో మాట్లాడుచు, "నేను మిమ్ములను ఒక దేవుని మనిషిగా ఇష్టపడుచున్నాను, గాని మీరు అన్నింటిని కలిపి వేయుచున్నారు," అని చెప్పెను.
అప్పుడు నేను, ''దయచేసి నాకు సహాయము చేసినయెడల నన్ను సరిచేసికొందును,'' అని చెప్పితిని. అందుకతడు ''….. "వాక్యముతో నా అని అడిగెను."
మరియు అతడు, "సహో॥ బ్రెన్‌హామ్, వాక్యముపై వాక్యము గ్రీకు (పదములతో) సరిపోతేనే గాని మేము దేనిని జతచేయము,'' అని చెప్పెను.
అందుకు నేను, ''ఓ, అయ్యా, మీకింకా బాగా తెలుసు. క్రీస్తు మరణము నుండి మూడు-వందల-సంవత్సరాల తర్వాత ఆ నైసియా సభ యొద్ద వారు తర్కించుకొన్నారు. ఇంకను వారు ఏ గ్రీకు వేద పండితుడు సరియా అని వాదించుకొనుచూనే వున్నారు… అదొక ప్రత్యక్షత. అదంతయు అంతే…'' అన్నాడు.
''నేను ప్రత్యక్షతను అంగీకరించలేను,'' అని అతడు చెప్పెను.
''అట్లయిన క్రీస్తును నీవు ఎలాగు అంగీకరించగలవు?'' అని నేను అడిగితిని.
అందుకతడు, ''ఏలయనగా! యేసుక్రీస్తు నందు విశ్వాసముంచునప్పుడు మనకు నిత్య జీవము కలుగునని, బైబిలు చెప్పుట లేదా,'' అని అన్నాడు.
''అది నిజమే, అయితే ప్రత్యక్షత ద్వారానే కాని యేసును క్రీస్తు అని పిలువలేరు. ప్రత్యక్షత ద్వారానే పరిశుద్ధాత్మ దానిని అతనికి బయలుపర్చుచున్నది,'' అని చెప్పితిని. చూశారా? అచ్చటే మీరున్నారు, అక్కడే వెనుదిరుగుచున్నారు, ప్రత్యక్షత కొరకు వచ్చుచున్నారు. అది ప్రత్యక్షము కావలసి యున్నది.
MATT 16:13-18•
MARK 8:27,28•
LUKE 9:18-20•
2COR 5:19•
HEB 11:4
42పరిశుద్ధ గ్రంథమందు… కయీను,హేబేలు అనువారు చదువుటకు అప్పుడు వారికి బైబిలనునది లేదు, అయితే హేబేలుకు విశ్వాసము ద్వారా ప్రత్యక్షపరచబడినది. అది ప్రత్యక్షతయైయున్నది, కయీను కంటెను హేబెలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించెను, దానిని బట్టి దేవుడతనిని నీతిమంతునిగా తీర్చెను. యేసు, మత్తయి 16:13లో, చదువుటకు మనకు సమయము లేదు. గుర్తించుకొనుడి. ''నేను ఎవరినని మనుష్యులు చెప్పుకొనుచున్నారు. మనుష్య కుమారుడననియా?'' అని వారిని అడిగెను.
వారిలో ఒకరు ''నీవు మోషే, లేక ఏలియా, లేక మరొకరై యుండవచ్చునని'' వారు చెప్పుకొనుచున్నారు అని బదులిచ్చారు.
అందుకాయన ''మీరేమని తలంచుచున్నారు, నేనెవరినని మీరు చెప్పుచున్నారు?'' అని ఆయన అడిగెను.
అందుకు అతడు (పేతురు) ''నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు,'' అని చెప్పెను.
అందుకు యేసు, ''యోనా కుమారుడవైన సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని; పరలోకమందుననా తండ్రి దానిని నీకు బయలుపరచెను.'' ఈ బండపై (ప్రత్యక్షతపై) అనగా, దేవుడు ఎవ్వరై యున్నాడు, యేసు ఎవరు, అను ఆత్మీయ ప్రత్యక్షతపై మరియు యేసు దేవుని ప్రత్యక్షతయై యున్నాడనియు, దేవుడు శరీరధారియై ప్రపంచమును తనతో సమాధానపరచుకొనుచు, దేవుడు ఒక మాంసపు శరీరములో బయలుపడిన దానిపై… కట్టెదననెను. ''నీవు క్రీస్తువు, అభిషేకించబడిన దేవుని కుమారుడవు.''
''రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, అయితే పరలోక మందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. ఈ బండ (ప్రత్యక్షత)పై నేను నా సంఘమును కట్టుదును. (దాని కాలమందు బయలుపడిన వాక్యప్రత్యక్షతపై), నా సంఘమును కట్టుదును మరియు పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు,'' అని యేసు చెప్పెను.
REV 22:13,18
43ప్రకటన గ్రంథము బైబిలునందు చివరి పుస్తకమై యున్నది. అది అవిశ్వాసులకు ముద్రించబడియున్నది. అక్కడ 22 వ అధ్యాయమందు బైబిలు ఏమి చెప్పుచున్నదనగా, ''ఎవ్వరైనను దీని నుండి ఏదైనను తీసివేసినయెడల, దీనితో మరేదైనను కలిపిన యెడల, జీవగ్రంథము నుండి నేనతని భాగమును తీసివేతును.'' అట్లయిన ఇది కేవలము విశ్వసించు వారికి ఇవ్వబడినదని మనము గ్రహించవచ్చును. అది ఈ ప్రకటన గ్రంథమును తెరచి, ఈ గ్రంథకర్త ఎవ్వరని బయలుపర్చుచున్నది, (ఆయన అల్ఫాయు, ఓమేగయునై, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు, యేసుక్రీస్తు సూటిగా గ్రంథమంతటను కనబడును ఆయన యొక్క పూర్తి మర్మమును బయలుపరచుచు, రానున్న ఆయన యొక్క సంఘ కాలములలో ఆయన చిత్తమేమై యున్నదని తెలుపుచు, ఏడు ముద్రలతో ముద్రించబడియున్నది.
REV 10:7
44ఇప్పుడు, ఈ పుస్తకము వ్రాయబడియున్నది గాని, అప్పుడది ఏడు ముద్రలచే ముద్రించబడియున్నది. ఈ ఏడు ముద్రలు ప్రకటన 10, అధ్యాయములోని భూలోకపు దూత భూమిపై దానిని ప్రకటించు వరకు అది విప్పబడకూడనివి. ప్రకటన 10:7. చూశారా? ''యేడవ దూత పలుకు దినములలో, చివరి దూత (వర్తమానికుడు) వర్తమానమందు, దేవుని మర్మము ఆ కాలములో సమాప్తమగును.'' మనము జీవించుచున్న ఈ దినము ఆ కాలమైయున్నది.
మనము లవొదికయ కాలములో జీవించుచున్నామని మన మెరుగుదుము. దీని తరువాత మరొక కాలము లేదు; ఉండనేరదు. కావున మనము లవొదికయ కాలములో జీవించుచున్నాము, ప్రజలకు మర్మముగా ఉన్న ఆ ఏడు ముద్రలు, ఈ దినమున విప్పబడవలసి యున్నది. దానినే ఆయన వాగ్దానము చేసెను. అది వాక్యమునకు వెలుపల ఉండునది కాదు, ఎందుకనగా వాక్యములో మరేదియు చేర్చలేవు లేదా మరి తీసివేయలేవు. అది ఎల్లప్పుడు వాక్యముగానే ఉండవలసి యున్నది. అది ఏమైయున్నదో అదే విధముగా తక్కిన లేఖనములతో సరిపోవునట్లు చేయుచున్నది. దేవుడు దానిని సత్యమని నిరూపించుచున్నాడు.
GEN 1:3•
JOHN 5:36•
JOHN 10:37
45చూడండి, దేవునికి అనువాదము చేయువాడు అక్కరలేదు. అయనే తన స్వంత అనువాదకుడు. లేఖనముల యందలి కార్యములను నెరవేర్చుట ద్వారా అయనే తన వాక్యమును అనువదించును. ఆదిలో ఆయన చేసినట్లే, "ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను!" అందుకు అనువాదము మరేది అక్కర లేదు. అది నెరవేరినది.
ఆయన ఈ కడవరి దినమందు లేఖనములలో కొన్ని ముఖ్యమైన కార్యములను వాగ్దానము చేసెను, అవి మన మధ్య వున్నవి. అవి యేసు ఏ విధముగా దేవుని కుమారుడై యున్నాడని తెలుపుచున్నది. ఆయనను (మరలా) పంపుదునని ఆయన వాగ్దానము చేసెను. ఆయన ఈ భూమిపై ఉన్న దినములలో ప్రజలు ఆయన యందు విశ్వాసముంచలేదు. ''లేఖనములను వెతికి చూడుడి, వాటియందు నిత్యజీవమున్నదని మీరు తలంచుచున్నారు; వాటికి అవియే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. నా తండ్రి కార్యములను నేను చేయకున్నయెడల, నన్ను నమ్మకుడి. మీరు నా యందు విశ్వాసముంచకున్నను, నేను చేయు కార్యములయందు విశ్వాసముంచుడి; ఎందుకనగా నేను ఎవరినని అవి సాక్ష్యమిచ్చుచున్నవి."
46అట్లయిన అది, మంచిదే, వెస్లీ కాలములో ఆయన చేసిన కార్యములు, ఆయన ఎవరని సాక్ష్యమిచ్చుచున్నది. (మార్టిన్) లూథర్ కాలములో సంస్కరణముపై ఆయన చేసిన కార్యములు ఆయన ఎవరని సాక్ష్యమిచ్చుచున్నవి. పెంతెకొస్తు దినములలో మరలా వరములను పొంది, బాషలలో మాట్లాడుచు, దయ్యములను పారద్రోలినప్పుడు ఆ వరములు సాక్ష్యమిచ్చుచున్నవి. దానిని గురించి ఎటువంటి తమాషాగా మాట్లాడుట అనునది లేదు.
పెంతెకొస్తు చరిత్రను నేను చదువుచుండగా, ఆ అనుభవముపైకి వచ్చినప్పుడు, ''అది ఇక తొలగిపోదు; అది దహించునదైయున్నది,'' అని ఆ ప్రజలు చెప్పిరి. అది ఇప్పుడును దహించుచున్నది. ఎందుకు? అది ఇకపై ఆరిపోదు. అది ఎల్లప్పుడు అక్కడ ఉండునని దేవుడు సెలవిచ్చెను. అది వాక్యము యొక్క భాగమై యున్నది. దానిని నీవు ఆర్పజాలవు… మరియు దాని నుండి వధువు పిలువబడినప్పుడు, నీవు ఏ విధముగా దాని అడ్డగించగలవు? అది సత్యరూపమైన వాక్యపు ప్రత్యక్షతయై యున్నది. మనము ఆ దినములో జీవించుచున్నాము. దేవునికి స్తోత్రము! ఆయనను గురించిన మర్మము యొక్క ప్రత్యక్షతయైయున్నది.
47ఇప్పుడు, ఈ ఎత్తబడుట అనునది, మనము మాట్లాడుచున్న ఎత్తబడుట అనునది వధువుకు మాత్రమే జరుగునదిగా వున్నది. గుర్తుంచుకొనండి, బైబిల్ చెప్పుచున్నది, ''మిగిలిన వారు మరణించిన వారై ఆ తరువాత వేయి సంవత్సరములకు జీవించి యుండరు." ఇది ఒక గొప్ప ఎత్తబడుటయై యున్నది… స్నేహితులారా! ఎత్తబడుట అనునది లేకున్న యెడల, మనమెక్కడ ఉండవలసి యున్నది? మనమేమి చేయనైయున్నాము? మనము దేనియందు జీవించుచున్నాము, మనము కలిగియున్న వాగ్దానమేది? ఎత్తబడుట అనునది ఉన్నది. అది ఉన్నదని బైబిలు చెప్పుచున్నది; అది ఎన్నుకొనిన వారికి మాత్రమే, అది ఎన్నుకొనిన స్త్రీగా, ఈ దినమున సంఘముగా వధువు వెలుపలకు తేబడుచున్నది.
సంఘమను పదమునకు "బయటకు పిలవబడిన వారు," అను భావము. మోషే ఒక దేశమును మరొక దేశము నుండి వెలుపలకు తెచ్చినట్లు, పరిశుద్ధాత్మ వధువును సంఘము నుండి వెలుపలకు తెచ్చుచున్నది. సంఘము నుండి ఒక సంఘము, సంస్థలలో నుండి వెలుపలకు వచ్చిన ప్రతి సభ్యుడు వధువుగా చేయబడుచున్నాడు, వధువు అను వృక్షము… అది టేపుల యందు పదిలపరచబడియున్నది. ఒక వధువు వెలుపలకు పిలువబడి వచ్చుచున్నది, ఆమెయే ఎత్తబడుటలో ఉండబోవుచున్నది. ఆమె మాత్రమే, ఆమె కాక మరొకరు కాదు. ఆది నుండి దేవుడని పూర్వజ్ఞానమందు ఎన్నుకొనబడిన ఒకటి, తండ్రి యొక్క ఆత్మీయ సంతతియై యున్నది.
ఇచ్చట మనము కొంత ఆగుదుము… మిమ్ములను ఎక్కువ కాలము కూర్చుండ నిచ్చుచున్నానని తలంచుచు, కలత చెందుచున్నాను.
48అయితే గమనించండి! మీలో ప్రతి ఒక్కరు, అనేక సంవత్సరముల క్రితము నుండి మీ తండ్రుల (జీవము) వంశములో జన్మించిన వారై యున్నారు. అది నిజము! ఒక జీవ విత్తనము నీ తండ్రి యందుండి, ఆ పురుషుని నుండి వచ్చినది, స్త్రీ నుండి వచ్చినది కాదు. చూశారా? స్త్రీ గర్భమందుండు గ్రుడ్డు ద్వారా వచ్చుచున్నది. అది ఒక విత్తనము వేయుటకు గాను ఉపయోగించు భూమివలె నున్నది, అయితే జీవకణము పురుషుని నుండి వచ్చుచున్నది.
నేను పదహారు సంవత్సరముల వాడనై యున్నప్పుడు, ఇచ్చటనున్న నా కుమారుడు నాలో ఉండెను. నేనతనిని ఎరుగను గాని, అతడక్కడ ఉండెను. గర్భము ద్వారా, పరిశుద్ధ వివాహము ద్వారా, నా స్వరూపమందు అతడు వచ్చెను. ఇప్పుడు నేనతనిని ఎరుగుదును; అతనితో సహవాసము చేయగలను. అతడు నిర్ణయించబడిన కాలమున జన్మించెను.
49అందువలన నీవు నిత్యజీవమును కలిగియున్నావని, ఈ ప్రపంచమునకు పూర్వము నీవు దేవుని యందున్నావు. నీవు దేవునిలో ఒక భాగముగా, దేవుని కుమారునిగా, ఆయన గుణలక్షణములుగా ఉన్నావు. నీవు వచ్చు కాలమును ఆయన ఎరిగి యున్నాడు. ఆ కాలమందు ఆ స్థానమునకు నిన్ను ముందుగా నిర్ణయించియున్నాడు, మరెవ్వరు ఆ స్థానమునకు రాలేరు. మారు వేషధారులు ఎందరు వచ్చినను, నీవు అక్కడ వుందువు, ఎందుకనగా నీవు అచ్చట ఉండుటను ఆయన ముందుగా ఎరిగియున్నాడు. నీవు రూపించబడితివి; ఇప్పుడు నీవు ఆయనతో సహవాసము చేయగలుగుచున్నావు, దానినే ఆయన కోరుచున్నాడు. ఆయనతో సహవసించి, ఆయనను ఆరాధించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. అయితే నీ జీవితము ఎల్లప్పుడును దేవుని గుణలక్షణములను కలిగి యుండుటలేదు. నీవు క్రైస్తవుని వలె కనబడుచున్నావు. చూచారా? అనేకమంది, కోట్లమంది క్రైస్తవుల వలె కనబడుచున్నారు.
50ఇంతకు క్రితమే నేను గుర్తు చేశాను. సహో॥ డిమోస్ షికారియన్ వద్ద నేను ఉన్నప్పుడు కొన్ని సంకర జాతి పశువులును చూచాను. వాటిని డాక్టర్లు గర్బధారణ చేయు రీతిని చూచాను.
పురుష జీవకణములనేకములు ప్రతిసారి వచ్చుచుండును. స్త్రీ గర్భమందు గ్రుడ్లు అనేకములు అదే సమయమున ఏర్పడుచుండును. మీరు గమనించినట్లయిన కొన్ని వేల జీవకనములలో ఒక్కటి మాత్రమే జీవమునకు వచ్చుచున్నది. ఒక్క గ్రుడ్డు మాత్రమే గర్భము ధరించినది? ఆ ఒక్క చిన్న జీవకణము మాత్రము మిగిలినవాటన్నిటితో పోరాడి, వాటన్నిటిపై ప్రాకి వచ్చి ఆ ఫలవంతమైన గ్రుడ్డును కనుగొని దానిలో ప్రవేశించుచున్నది, అప్పుడు మిగిలిన జీవ కణములన్నియు మరణించుచున్నవి. కన్యకకు జన్మించిన దానిని గురించి మాట్లాడుచున్నప్పుడు, అది సాధారణ గర్భధారణ కాదు. అది దేవునిచే ముందుగా అభిషేకించబడి నిర్ణయించబడినదై యున్నది.
ఇప్పుడు, ఆదియందు, అనేక వేల సంవత్సరముల క్రితము, కాలమనునది ప్రారంభించకముందే నీ తండ్రియైన దేవుని యందు నీవుండినందుననే ఈ రాత్రి ఇచ్చట ఒక క్రీస్తు వాడివిగా ఉండగలవు. అందువలననే ఈ జీవములోకి వచ్చి, క్రైస్తవ్యాన్ని పొందినప్పుడు సమస్తమును తప్పిపోవుచున్నది, ఇది ఎందులకని నీవు ఆశ్చర్యపడవచ్చును. నీవు దీని గురించి ఆశ్చర్యపడుదువు. అయితే ఒక దినము ఏదో నిన్ను కదిలించుచుండుటను నీవు గమనింతువు. అది ఏమిటి? ఆదిలో ఉన్న జీవమే అది.
51నేను చెప్పిన ఆ చిన్న కథలో ఆ పెద్ద తల్లి పక్షిరాజును ఆ పక్షిరాజు పిల్ల కనుగొనినట్లే ఉన్నది. నేను దానిపై ప్రసంగించినది మీరు విన్నారు, ఆ చిన్న పక్షిరాజు పిల్ల ఒక కోడి పెట్ట క్రింద పొదుగబడినది. ఆ కోడి, దాని పిల్లల ఆహార విధానమును ఈ పక్షిరాజు పిల్ల భరించలేకపోయినది, ఎందుకనగా పుట్టుకలతో అది ఒక కోడి పిల్లకాదు, అయినను ఆ కోడి పిల్లలతో ఆ దిబ్బలోనిది తినుచున్నప్పుడు ఆ పక్షిరాజు పిల్ల దాని భరించలేకపోయినది. ప్రతికోడి పిల్ల పొడుచుకొని తినుచూ వెళ్లుచుండగా ఈ పక్షిరాజు పిల్లయు వాటి వెంబడి వెళ్లుచున్నదే గాని, (ఆహారమును తినలేక యున్నది).
ఒక దినమున ఆ తల్లి పక్షి, తాను రెండు గ్రుడ్లను గూటిలో ఉంచినప్పుడు ఒకటి లేకపోవుటను కనుగొన్నది. అది ఎక్కడో ఉండవలసియున్నదని తలంచి, దానిని వెతుకుటకు బయలుదేరినది. ఎగురుచు, ఎగురుచు చివరకు ఆ కళ్లముపైకి వచ్చినది, అక్కడ తన బిడ్డను కనుగొన్నది. దానిని చూచి ఆక్రందన చేసినది, ఆ స్వరము తన స్వంత స్వరమని ఆ చిన్న పిల్ల కనుగొన్నది. దాని కొరకే ఇంత కాలము ఎదురు చూచుచుండినది. చూశారా? అప్పుడది తానొక కోడిపిల్ల కాదని, ఒక పక్షిరాజని గ్రహించినది. ప్రతి క్రొత్తగా జన్మించిన క్రైస్తవుని మార్గము అలాగే యున్నది. మీరిక్కడకు వచ్చినప్పుడు, ఎన్నిసంస్థలకు మీరు చెందియున్నారు, లేక ఎన్ని సంఘ పుస్తకముల యందు మీ పేరున్నదని నాకు అనవసరము. వాక్యము మీ ముందు నిరూపించబడినప్పుడు, ఆ పక్షిరాజు పిల్లవలె మీరున్నయెడల దానిని గ్రహింతురు. ఎందుకనగా ఇవన్నియు కోడి చేయు శబ్దములుగా ఉన్నవి, మీరు దానిలో, దీనిలో చేరినంత మాత్రమున, ఆ మార్గములో ఈ మార్గములో వెళ్లినంత మాత్రమున మీరు పొందగలిగినదేమి లేదు, అదంతయు బుద్ధిహీనముగా ఉన్నది. ఇదైతే సత్యవాక్యము, వాక్యముతో నిన్ను చేర్చునదే యున్నది.
52స్త్రీ గర్భములో ఒక జీవకణము ప్రవేశించినప్పుడు, ఒక మనుష్య జీవముగానో, మరొక సారి ఒక కుక్కగానో, మరొకసారి ఒక పిల్లిగానో, మరొకసారి కోడిపిల్లగానో మారడు; అదంతయూ మానవ జీవకణమై యున్నది. వధువు, యేసుక్రీస్తు శరీర భాగమైయున్నది, ఆయన వాక్యమై యున్నాడు. వధువు కూడా వాక్యమై యుండవలెను. వాక్యముతో వాక్యము జత చేరుచున్నది. లూథరు సమాధాన సంస్కరణము, వెస్లీ శుద్ధీకరణమును,పెంతెకోస్తు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, వరముల పునరుద్ధరణయు మిగిలినవన్నియు ఆ వాక్యముతో వెళ్ళునవై యున్నవి. అది వాక్యముపై వాక్యమై, జీవముపై జీవముగా, జీవకణముగా, వధువు పూర్తి స్వరూపమును, అనగా యేసు ప్రభువు వధువు యొక్క పూర్తి స్వరూపమును తెచ్చుచున్నది. మీరు జ్ఞాపకముంచుకొనుడి.
మీరు దేవుని గుణలక్షణమై యున్నారు.
53వీటన్నిటిని మనము కనుగొనిన తరువాత, దానిని గురించి మనము తెలిసికొనవలసినదేమనగా, క్రీస్తు తన వధువు కొరకు వచ్చుచున్నాడు. మనమేలాగు ఆ వధువులో చేరగలము? ఇప్పుడది ఆ ప్రశ్నయై యున్నది. అనేకులు ఏమని చెప్పుదురనగా, ''మా సహవాసములో చేరండి.'' అయితే వారిలో ఒకరు ఒక రకమైన బాప్తిస్మము కోరుదురు, మరి కొందరేమో అది ఇది చేయవలయుననెదరు, ఒకరేమో మీరు భాషలతో మాట్లాడితేనే గాని మీరు అందులో చేరలేరు, అని చెప్పెదరు. మరొకరేమో మీరు ఆత్మలో నాట్యమాడితేనే గాని, మరొకరేమో మీరు పెద్దగా శబ్దము చేయనిదే మీరు అందులో చేరలేరనెదరు. ఇది ఒక రకమైన అవేశముతో కూడినది. అదంతయు మంచిదే, అయితే అదంతయు తప్పిదముగా ఉన్నది. ఏ విధముగా దేవుని ఆత్మ యందు జన్మించిన స్త్రీ, పురుషుడు, లేక దేవుని కుమారుడు, దేవుని వాక్యమును నెట్టివేయును? లేక కాదనును? దానిని దేవుడే తనకుతానే అనువదించి ఇలా చెప్పియున్నాడు, ''దాని భావము ఇదియే. నేను దీనిని వాగ్దానము చేశాను; అది మీ మధ్య వున్నది.'' ఈ విధముగా సాధారణముగా నిరూపించుచున్నాడు. వారు దానిని చూడవలసియున్నది. చూశారా? ఏ విధముగా క్రీస్తు తన సొంత వాక్యమును నిరాకరించును. క్రీస్తు నీలో ఉన్న యెడల, ఆయన తన సొంత వాక్యమును నిరాకరించును.
1COR 12:13
54మనమెలా ఈ శరీరములో చేరగలము? I కొరింథీ 12 ''ఒక్క బాప్తిస్మము ద్వారానే మన మీ శరీరములో చేరగలము ''ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే. మీరు వ్రాసికొన తలంచిన I కొరింథీ 12:13: ''ఒక్క ఆత్మ ద్వారా మన మందరము బాప్తిస్మము పొందితిమి…'' ఆత్మ క్రీస్తు జీవమై యున్నది. (అది నిజమేనా?), అది క్రీస్తు జీవమై యున్నది. విత్తనములో ఉన్న జీవము ఆ విత్తనమును జీవమునకు తెచ్చును — ఆయన వాక్య విత్తనమై యున్నాడు. మీరు అందుకోగలిగారా? ఆ జీవము ఆ విత్తనమందున్నది మరియు పరిశుద్ధాత్మ దాని పైకి వచ్చును, అది ఆ విత్తనమును జీవమునకు తేవలసియున్నది.
55కొంతకాలము క్రితము ఫోనిక్సులో నేను చెప్పినట్లు సహో॥ జాన్ షారియట్‌తో మాట్లాడుచుంటిని. మేమలా వెలుపలకు వెళ్లినప్పుడు, ఆయన ఒక చెట్టును చూపించాడు, అది ఒక నిమ్మ చెట్టు. ఆయన అనేక నిమ్మపండ్లను పండించుచున్నాడు. ఆయన నాకు ఒక చెట్టును చూపించినప్పుడు అది కొన్నిరకములైన, ఎనిమిది లేక తొమ్మిది రకములైన పండ్లను కలిగియుండినది. అప్పుడు నేను ''సహో॥ షారియట్, ఇదే రకమైన చెట్టని?'' అడిగితిని.
అందుకాయన, ''అది ఒక ఆరంజి చెట్టు" అని చెప్పెను,
"అయితే ఎందుకు నిమ్మ, ద్రాక్ష మరి పలు రకముల పండ్లు అందులో ఉన్నవి?" అడిగితిని.
అందుకతడు, ''అది నిజమునకు నిమ్మ చెట్టే గాని, అందులో తక్కినవి అంటు గట్టబడినవి,'' అని చెప్పెను.
''ఓ, అలాగా, అప్పుడు మరుసటి సంవత్సరము, ఆ చెట్టున ఆరంజి పండ్లు ఉండును,'' అని చెప్పితిని.
''అయితే, ఓ అలా కాదు. ప్రతి చెట్టు దాని ఫలములను ఫలించును… ప్రతి కొమ్మ దాని ఫలములను భరించియుండును.''
56ఈ లోయలోవాటిని పండించు అనేకులు దీనిని ఎరిగియున్నారు; దాని ఫలమును అది కలిగి యుండును.
మీరు ఒక నిమ్మ కొమ్మను ఆరంజి చెట్టునకు అంటుగట్టినయెడల, అది నిమ్మపండును ఫలించును, అది దాని స్వభావమై ఉన్నది. అంటు గట్టినప్పుడు అది దాని స్వభావసిద్ధమైన ఫలమును ఫలించదు. ఇప్పుడు దానినే మనము చేయునదిగా ఉన్నది. మనము సిద్ధాంతముతో ప్రతి దాని ద్వారా అంటుగట్టబడి యున్నాము. ఏ విధముగా మెతడిస్టును కాక మరొకరిని తేగలడు? ఏ సంస్థయైనను తమ సంస్థకు సంబంధించిన పిల్లలను గాక మరొకరిని తేగలదు?
అయితే ఆ చెట్టు తన స్వంత కొమ్మను చిగురించుటకు ప్రారంభించినప్పుడు అది తన స్వంత ఆరంజి పండ్లను తెచ్చును. ఆ విధముగానే దేవుడు తన సంఘమందు, ఏదైనను చేయదలచిన యెడల ఆ సంఘము మరలా ఖచ్చితమైన వాక్యమును తెచ్చునదైయున్నది. అది అలాగే ఉండవలసి యున్నది, ఎందుకనగా జీవము చెట్టులో ఉన్నది, అది దాని రకమును తెచ్చును.
JOHN 15:1
57ఇప్పుడు మనము చూచినట్లు… ఒక గొప్ప సంఘము కాలములలో ముందుకు వెళ్ళినప్పుడు దాని ఫలములను అది తెచ్చినది. దాని అవయములు తగ్గించబడి వాటిని కత్తిరించుట జరిగినది. యోహాను 15వ అధ్యాయములో ఆ ద్రాక్షవల్లి నరకబడలేదు. ఇప్పుడు ఆయన ఆ కొమ్మలను తీసివేయున్నాడు, వాటిని త్రుంచి వేయుచున్నాడు, ఎందుకనగా అవి వాటి ఫలములను ఫలించలేదు.
యేసు తన కొరకు ఫలములను కోరుచున్నాడు. ఆయన భార్య ఆయన లాంటి పిల్లలను తేవలసియున్నది. ఆ విధముగా వారు ఆ పిల్లలను తేవలసియున్నది. ఆ విధముగా వారు ఆ పిల్లలను తేకున్నయెడల వధువు పిల్లలు, వాక్యపు పిల్లలను తేకున్నయెడల, వారు సంస్థల పిల్లలై యుందురు. అప్పుడు ఈ లోకము కొరకు సంస్థల కొరకు ఆమె తొలి ప్రేమ, మరలా వెనుదిరిగి వాటి వైపునకు పోయినది. ఒక నిజ సంతానమును, అసలైన క్రొత్తగా జన్మించిన క్రైస్తవుని తేలేకపోయినది, ఎందుకనగా వారిని తెచ్చుటకు అక్కడ ఏమియు లేదు.
మీరొక నిమ్మ కొమ్మను తెచ్చి అంటుకట్టిన యెడల; అది నిమ్మ పండ్లను తెచ్చును. అది ఆరంజి పండును ఫలించదు, ఎందుకనగా ఆదిలో (కాండములో) అది లేదు. అయితే వధువు ఆదిలో అభిషేకము పొంది యున్నది. దేవుడు తన పూర్వజ్ఞానమందు, ముందుగా ఎన్నుకొనియున్నాడు. ఆ విధముగా ఆ వధువు జన్మించియున్నది, అది ఆరంజి పండ్లను తెచ్చును; మరొక దానిని అది ఫలించదు.
58ఆ విధముగానే సజీవ దేవుని సంఘము ఉండవలసి యున్నది. కాలము సమీపించినప్పుడు, మీలో ప్రతి ఒక్కరు… దేనినో చేయుటకు, దేవుని అనుమతించెదరు, ప్రతి ఒక్కరు ఆ బంతిని పొంది వెళ్లిపోయారు. చూశారా? అది ఎల్లప్పుడు అలాగే యున్నది. కొంతకాలము క్రితము మార్టిన్ లూథర్ చరిత్రను చదువుచుంటిని. మార్టిన్ లూథర్ కాథలిక్ సంఘమును ఎదిరించెనని ప్రతి ఒక్కరు నమ్మగలరు అని వ్రాసియున్నది; అయితే అక్కడ ఆశ్చర్యమేమనగా తన ఉజ్జీవమును వెంబడించిన సమస్త మూఢభక్తిని ఎదిరించినవాడై, తన మార్గమందు తీర్పు వర్తమానము వైపుకు వెళ్లాడు. చూశారా? అక్కడ అనుకరణ మరియు ప్రతిఒక్కటి మరియు అవన్నియు ఆయనను వెంబడి౦చెను.
1COR 14:34•
1TIM 2:11
59శ్రీయుతులు సెంపిల్ మాక్ఫెర్సెర్, సెంపిల్ మాక్ పెర్స్‌న్‌ను చూడండి. ఈ ఆలయమును ఇచ్చట కలిగియున్నాడు. ప్రతి స్త్రీ బోధకులు తమ చేతులను చాచి బైబిలును పట్టుకొని యున్నారు, వారు శారీరిక అవతారులుగా ఉన్నారు. వారు అసలైన వారు కారు. అదే విధముగా సంఘములును అసలైనవి కావు. ఒక సంఘము ఒకటి గైకొనిన మరొకటి దానిని భరించలేదు. చూశారా? వారు ఇకపై అసలైన వారు కారు. దేవుని వాక్యము అసలైనదిగా ఉన్నది. అది వాక్యమైయున్నది. అది దాని రకమును తేవలసియున్నది. దాని కాలమందు అది ఎన్నుకొనబడినదై, తండ్రియైన దేవునిచే ముందు నిర్ణయించబడినదిగా ఉన్నది.
ఇప్పుడు, మనమేలాగు ఆ సంఘమందు చేరగలము? ఒక్క ఆత్మచే మనమందరము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొందుచున్నాము, అది క్రీస్తు శరీరమైయున్నది, ఆ వధువు వాక్యమై పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందుచున్నది.
GEN 5:18•
LUKE 3:37•
1JN 3:12
60మనము ఇప్పుడు చివరి కాలము లేక యుగములో ఉన్నామా లేదా గమనింతుము. ఇప్పుడు, మనము ఆదికాండములో వెనుకకు త్రిప్పిన ఎడల అక్కడ 5వ అధ్యాయమందును మరియు లూకా వ్రాసిన సువార్త యందును, (నోవాహు) ఆదాము నుండి హనోకు ఏడవవాడని మనము చూడగలము. అక్కడ మీరు సర్ప సంతానమును చూడగలరు, ఎందుకనగా కయీను ఆదాము సంతానమైన యెడల హానోకు ఎనిమిదవ వాడగును. మీరు చూశారా? అయితే బైబిలు నందు ఎక్కడ కూడ కయీను ఆదాము కుమారుడని చెప్పబడలేదు గాని, అతడు అపవాది సంబంధి. అయితే ఆదాము అపవాది సంబంధి కాదు. చూశారా? అతడు (కయీను) అపవాది సంబంధి.
61ఇప్పుడు మనము హానోకు, (నోవాహు) ఆదాము నుండి ఏడవ వాడని కనుగొన్నాము. ఆది సంఘ కాలములకు సాదృశ్యముగా ఉన్నది. హానోకు ముందున్న ఆరుగురును మరణించిరి, అయితే హానోకు దేవునిచే కొనిపోబడెను. హానోకు ఎత్తబడెను, అతడు ఏడవవాడుగా ఉన్నాడు. ఏడవ సంఘ కాలములో ఎత్తబడుట జరుగునని అక్కడ చూపబడుచున్నది. మనము ఏడవ సంఘ కాలమందున్నామనుటలో, ఏ సందేహము లేదు. దానిని మనమందరము ఎరిగి యున్నాము.
ఇప్పుడు ఈ ఏడవ సంఘ కాలమందు ఎత్తబడుట జరుగనైయున్నది. మిగిలిన ఆ ఆరుగురు మరణించిరి. అయితే హానోకు మరురూపము చెందాడు, ఎందుకనగా అతడు కనబడక పోయాడు; దేవుడతనిని తీసికొనెను. అయితే హనోకు ఎత్తబడెను, మిగిలిన వన్నియు మరణించినవనుటకు మాదిరిగా ఉన్నది, అయితే చివరి కాలపు వధువు పిలువబడును. (మరణమును చూడక, ఎత్తబడును) అది ఏడవ సంఘకాలమందు పిలువబడుచున్నది. అందుకు మనము ఆ కాలమునకు సాక్ష్యమును కలిగియున్నాము. ఓ, నేనేమందును! ఇంకనూ లోతునకు వెళ్లుదము. చూశారా?
JOHN 6:53•
JOHN 10:30•
REV 10:7
62ఇప్పుడు ఏడు సంఘ కాలము యొక్క ఒక మాదిరి ఇక్కడున్నది, అది ప్రకటన 10:7లో ఆ గ్రంథము యొక్క గొప్ప రహస్యమై ఏడవ దూత వర్తమానము ద్వారా విప్పబడినది.
ఇప్పుడు వీటన్నిటికి పైన ఒక వర్తమానికుడు, ఈ భూమిపై నున్నాడు. ఆంగ్లములో దూత అనగా, ''ఒక వర్తమానికుడు'' అను భావము. ఏడవ దూత (వర్తమానికుడు) వర్తమానమందు తన పరిచర్యను ప్రకటించుచుండగా, తన పరిచర్యను పలుకుచుండగా అతడు (దూత) ప్రారంభించినప్పుడు కాదు… యేసు, ఆయనే దానిని ప్రారంభించినప్పుడు, ఆయన (యేసు) వ్యాధిగ్రస్తులను, బాధితులను స్వస్థపరచెను. ''ఓ, ఆ గొప్ప రబ్బీ (బోధకుడు) ఒక ప్రవక్తగా ఉన్నాడు." ప్రతి ఒక్కరు తమ సంఘములోనికి ఆయనను కోరారు, అయితే ఆయన ఒక దినమున ఒక చోట కూర్చొని ''నేనును, నా తండ్రియు ఒక్కటై యున్నాము,'' అని చెప్పినప్పుడు అది వ్యత్యాసముగా ఉండినది. అదియే ఆ వ్యత్యాసము, మరియు ఆయన మనుష్య కుమారుని శరీరమును తిని రక్తమును త్రాగని యెడల మీలో జీవముండదు,'' అని చెప్పినప్పుడు ''అతడు మనుష్య మాంసమును తినువాడనిరి.'' చూశారా? అదియే ఆ వ్యత్యాసము, అయితే ఆయన దానిని వివరించలేదు. వారు ఆ ప్రత్యక్షతను ముందుగా చూశారు. ఆయన కాలమునకైన దేవుని వాక్యము వారి కన్నుల ఎదుట నిరూపించబడినది. మరియు ఆ కాలమునకు వర్తమానికుడు ఆయనేయని నిరూపించబడినది. ఆయన దానిని వివరించవలసిన అవసరత లేదు.
ఆ శిష్యులు దానిని వివరించవలసిన అవసరము లేదు, వారు దానిని వివరించలేకపోయినను దానిని వారు నమ్మిరి. వారు నెమ్మదిగా ఉండి దానిని నమ్మిరి. ఆయన మాంసమును తిని ఆయన రక్తమును త్రాగుమని వారు ఎలా చెప్పగలరు? అది వారి వలన కాదు, అయినను వారు నమ్మిరి, ఎందుకనగా వారు (ముందుగా) అభిషేకింపబడిన వారు. ''ఈ భూమికి పునాదులు వేయక మునుపే వారు ఎన్నుకొనబడిరని'' యేసు చెప్పెను. చూశారా? వారు దానిని నమ్మిరి. వారు దానిని వివరించినను వివరించకపోయినను వారు దానిని నమ్మిరి.
63ఇప్పుడు, గమనించండి! ఏడవ సంఘకాలములో ఏడవ దూత బూరను ఊదుటకు ప్రారంభించినప్పుడు అక్కడ దేవుని మర్మము తెలియపర్చబడి యున్నది, సంస్కరణ కర్తల కాలములో లేనివి ఏడు ముద్రలు, లూథరు ఎంతో కాలము జీవించలేడు. ఆ కాలములు ఎంతో కాలము కొనసాగలేదు… ఆ సంస్కరణ కర్తలు వారి కాలమునకు వారి వర్తమానమును కలిగి యుండిరి. ప్రజలు దానిని గైకొని ఆ తరువాత సంస్థలుగా చేసిరి. అది ఏమై యున్నది?
64మీరు ప్రకృతితో పోరాడలేరు. ప్రకృతి ఎల్లప్పుడు సాక్ష్యమిచ్చును. దేవుడు ప్రకృతితో సమానముగా కదలుచున్నాడు. అది అలా ఉండవలసి యున్నది. సూర్యుని చూచినప్పుడు, సూర్యుడు ఉదయించును. అప్పుడది ఒక శిశువు జన్మించినట్లుండును. అది బలహీనముగా అధిక ఉష్ణము కలిగియుండదు. పది గంటలకు అది ఉన్నత పాఠశాల నుండి వచ్చుచున్నట్లుండును. దినపు మధ్యలో జీవితములో ప్రవేశించునట్లుండును. సాయంకాలము మూడు గంటలకు వృద్ధాప్యములో ప్రవేశించినట్లుండును. సాయంత్రము 5 గంటలకు మరణములో ప్రవేశించుచున్నది. మరలా వృద్ధాప్యమందు బలహీనమగుచు సమాధికి వెళ్లుచున్నది. అది దాని అంతమైయున్నదా? మరుసటి ఉదయము అది మరలా ఉదయించుచున్నది. చూశారా?
వృక్షములను చూడుడి అవి ఎలా చిగురించుచున్నవో, ప్రతి ఒక్కటిని వాటి వాటి క్రమములో జరుగుచున్నది. వృక్షముల నుండి ఆకురాలుచుండుటను మనము కనుగొనుచున్నాము. అది ఏమి? ఆ జీవము మరలా చెట్టు వేరునకు వెళ్లుచున్నది. అది దాని ముగింపుగా ఉన్నదా? కొత్త జీవముతో మరలా మరుసటి సంవత్సరమున చిగురించు కాలమున వచ్చుచున్నది.
MATT 24:24•
MARK 13:22
65సంఘములను గమనించి చూడుడి, సంస్కరణలో అదే విధముగా జరిగినది. అది ఇప్పుడు పైకి వచ్చుచున్నది. చీకటి కాలములో హతసాక్షుల కాలమందు ఆ గోధుమ గింజ భూమిలో పడి మరణించినది. అది భూమిలోకి వెళ్లినది. అది మరణించవలసియున్నది. ఆత్మీయ మానవుడు ఎవరైనను దానిని చూడగలడు. ఆ విత్తనము మరణించి, క్రుళ్లితేనే గాని అది ఫలించదు. అది ఒంటరిగా మిగిలిపోవును. అది ఆ చీకటి కాలములలో భూమిలోకి వెళ్లవలసియున్నది. అక్కడ అది పడి క్రుళ్లవలసి యున్నది. అప్పుడది లూథరన్ సంఘమను పేరున రెండు ఆకులతో చిగురించి పైకి వచ్చినవి. ఆ లూథరన్ సంఘము నుండి అనేక ఆకులు వెలుపలకు వచ్చినవి. జ్వింగ్లీ ఇంకను అనేకులు వచ్చిరి, అది అలా జాన్ వెస్లీగా కాండములోనికి వచ్చినది. ఆయన ఆ కాలపు గొప్ప మిషనరీగా ఉండెను. అది పడిపోయినది. దాని నుండి మోసపుచ్చు కాలము వచ్చినది. అదియే పెంతెకోస్తు కాలము. ఆ ఒక్క గోధుమ గింజ (ఇన్ని రూపములను దాల్చి…..)
ఇక్కడ ఎవరైనను గోధుమ పండించువారు ఉన్నారా? ఆ గోధుమ కంకిని చూడండి. మీరు దాని చూచినప్పుడు, అది గోధుమలుగా కనబడుట వలన, ''నేను గోధుమలను పండించాను,'' అని మీరు చెప్పెదరు. మీరు గోధుమలను కలిగి యున్నట్లు తలంచెదరు; కాని నిజమునకు దగ్గరగా వాటిని విప్పి చూచినప్పుడు దానిలో గోధుమ గింజ ఉండదు గాని అది పాల కంకిగా ఉండును, తరువాత గోదుమ వలె కనిపించును, మత్తయి 24:22-24లో యేసు మనలను హెచ్చరించలేదా, అంత్యదినములలో ఆ రెండు ఆత్మలు ఒక్కటిగా నుండి ఎన్నుకొనిన దానిని కూడా వీలుపడితే మోసపుచ్చును. చూశారా? ఇప్పుడు గమనించుడి, అది తెచ్చునదై యున్నది.
66ఇప్పుడు, లూథరన్ నుండి వచ్చిన జీవము వెస్లీని చేసినది. వెస్లీ నుండి వచ్చిన జీవము పెంతెకోస్తును చేసినది. పెంతెకోస్తు నుండి వచ్చిన జీవము గోధుమగా ఏర్పడినది. అయితే అవి అన్నియు ఈ గోధుమను మోసికొని వచ్చునవిగా ఉన్నవి. చూచారా? నిజజీవము అలా అక్కడకు వచ్చినది. వర్తమానము అలా వాటి ద్వార వచ్చినది గాని చివరకు గోధుమలో నిలిచినది. అందు నిమిత్తమే గోధుమలు పైకి వచ్చి ఆ కార్యమంతయు ఎత్తబడుటలో పైగా నిలిచినది. వధువు తనకుతాను ప్రతికాలము నుండి వచ్చినది, అయితే సంస్థాగతమైన కాండము మరణించి ఎండిపోయినది.
మీరు గమనించార? ఆఖరు దినములలో ఎలా లాగబడుతుందో? ఎప్పుడైతే గోధుమ పెరగడం ప్రారంభం అవుతుందో, అప్పుడు తొక్క దానితో విడిపోతుంది.
67ఈ కడవరి దినములలో అది ఎలా బయటికి ఈడ్వబడినదో చూశారా. ఈ గోధుమ విత్తనము ఎదుగుటకు ప్రారంభించినప్పుడు, దానిపైనున్న (గోధుమ వలె ఇంతకాలము కనిపించుచున్న) పొట్టు రాలిపోవును. అది ఆదిలో వేయబడిన గోధుమగా మరలా కనిపించును. మీరు ఆ చిన్న గోధుమను చూడవలయునన్న ముప్పది శక్తి గల దూరదర్శిని కావలసియున్నది. చూశారా? అయితే అది అలా వచ్చుచున్నది, అది ఎదుగుటకు ప్రారంభమైనది. ఇంతకాలము దానిని కాపాడిన ఆ పొట్టును విడచి వెళ్ళు అవకాశమియ్యవలసియున్నది. అది ఎదుగుటకు ప్రారంభించినప్పుడు, వర్తమానము బయలు వెళ్లును. అప్పుడా పొట్టు రాలిపోవును. ఆ పొట్టులో నుండి జీవము విత్తనమునకు వెళ్లిపోయినది. అలానే పోవుచున్నది. అలానే ప్రతి కాలములోను జరిగినది. ప్రకృతిని నెట్టి వేయజాలదు; అది దేవుని వరుసలో ఉన్నది. అది ఆ కార్యములను ఆయన చేయు విధముగా ఉన్నది.
GEN 18:9•
LUKE 17:30
68ఇప్పుడు ఆ కాలమందే మనము జీవించుచున్నాము. అది ఏడవ సంఘ కాలమైయున్నది.
ఇప్పుడు, అదంతయు చివరిలో ఒక్క గోధుమ గింజగా రూపించబడవలసియున్నది. మనము లూకా 17:30వ వచనమును చూచిన యెడల, అక్కడ ఆయన ఇలా చెప్పుచున్నాడు, ''అవి సొదొమ దినముల వలె నుండును. అటువలెను మనుష్య కుమారుని రాకడలోను ఉండును, అప్పుడు మనుష్య కుమారుడు తనను బయలుపరచ కొనుటకు ప్రారంభించును.'' ఏది ప్రత్యక్షమగును? ఆయన ఈ దినమున ప్రజలకు తనను ఎలా ప్రత్యక్షపరచుకొనుచున్నాడు అనేదే. ఈ దినమున తెలియపరచబడిన వాక్యము, పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలకు ప్రత్యక్షపరచబడుచున్నది, ఆ విధముగా యేసు మన మధ్యన జీవించువాడైయున్నాడు.
అక్కడ ఆయన ఒక మనిషిగా తనను తెలుపుకొనెనని జ్ఞాపకము చేసికొనుడి. ఆయన ఏమి చెప్పెననగా, ''దానివలెనే, మనము చదువు అదే పరిశుద్ధ గ్రంథమును ఆయన చదివెను. అదే ఆదికాండము. అక్కడ ఆదికాండమందు ఆ అధ్యాయములో యేసు దానిని గురించి ఇలా మాట్లాడుచున్నాడు.''
69అక్కడ ఆయన తన వీపును ఆ గుడారము వైపు ఉంచి గుడారములో ఉన్న శారాతో మాట్లాడుచున్నాడు, ఆయన ఒక ప్రశ్నను అడిగాడు. మరియు ఆమె దానిని నమ్మలేకపోయినది, కాని ఏమి జరుగవలసియున్నదో అదే జరుగనైయున్నది. ఆయన ఇలా పలికెను, ''అబ్రహామా, నేను జీవపు కాలప్రకారము నిన్ను దర్శించనైయున్నాను. అలా చెప్పుటను విని శారా దానిని గురించి నవ్వినది.'' అందుకాయన, ''శారా ఎందుకు నవ్వుచున్నది,'' అని అడిగెను. ''ఈ కార్యములు ఎలా జరుగునని ఆమె ఎందుకు అడుగుచున్నది?'' అక్కడ యేసు వాగ్దానము చేసెను. అది ఆయనే. అబ్రహాము ఆయనను ''ఎలోహిం'' సర్వశక్తుడు అని పిలిచెను. అది ఆయనే.
ఇప్పుడు, అటువంటిదే మరలా ఈ చివరి దినమందు వచ్చునని బైబిలు చెప్పుచున్నది. యేసు అలా చెప్పెను. ఇది జరుగుటకు ప్రారంభించుటను మీరు చూచినప్పుడు, జ్ఞాపకముంచుకొనుడి. ఈ విధముగా జరుగుట ప్రారంభించినప్పుడు కాలము వాకిలి యొద్ద సమీపముగా యున్నదని మీరు గ్రహించుడి.
70ఈ ప్రపంచ వైఖరిని చూడుడి. సొదొమ అను ఒకటి యున్నయెడల దానిని మన మీ ప్రపంచములో చూడగలము. ఈ ప్రజలను చూడండి, వారు వక్రస్థితి యందున్నారు. వారి తలంపులు వక్రీకరించియున్నవి. వారు సహజ మర్యాదను ఎరుగరు. వారి బాహ్య చట్టములను చూడుడి. పురుషగాములు ప్రతి ఒక్కటి అలానే ఉన్నవి. మన స్త్రీలను చూడండి, ఎంత అవినీతికరముగా ఉన్నదో! అమర్యాదకరమైన స్థితి. స్త్రీల మధ్యలో అవినీతి. ఆ ''వారు మెతడిస్టులు" అని మీరు చెప్పవచ్చును. అయితే పెంతెకోస్తు వారును అలాగే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు.
మన పురుషులను చూడండి; దేవుని వాక్యమును అంటిపెట్టుకొని యుండుటకు బదులు, సంస్థాగతమైన పారంపర్య ఆచారములకు బానిసలైయున్నారు. దేవుడు వారి మధ్య తనను తాను పూర్తిగా తెలియపరచుకొనుటను వారు చూచినప్పుడు, దానిని విడిచి వెలుపలకు వచ్చుటకు బదులుగా, వారు ఆ సంస్థలతో అంటిపెట్టుకొనియున్నారు. కారణమేమనగా, వారు గ్రుడ్డివారై చూడలేరు.
మనము త్వరపడుచుండగా ఇప్పుడు జరుగుచున్నదేమిటని మనము గమనించవలసియున్నది. ఆ స్త్రీ (సభలో కూర్చొనియున్న స్త్రీ) మనలను విడిచివెళ్ళుటకు ఇష్టపడుచున్నది; ఆమె తన చేతులను ఊపుటను నేను చూచుచున్నాను, ఎందుకో ఆమె వెళ్ళుటకు ఇష్టపడుచున్నది, కావున
మనము త్వరపడెదము.
REV 10:7
71ఇప్పుడు గమనించుడి, హనోకు సంఘమునకు ఒక మాదిరియై యున్నాడు. ఇక్కడ ఆయన ఏడవ సంఘ కాలమునకు మాదిరియైయున్నాడు. దానిని గురించి మీరు తలంచగలరా? ఏడవ సంఘ కాలము… గమనించండి, (ఏడవ దూత) పలుకు దినముల యందు….
ఏడు సంఘములకు ఏడుగురు (దూతలున్నారని) ఎందరు నమ్ముదురు? ఓ, మీ బైబిలును నమ్మినట్లయిన దానిని నమ్మగలము. మనము ఈ పరిశుద్ధ గ్రంథమును నమ్మకపోయిన యెడల మనము దానిని నమ్మలేము. ఒకవేళ (చూశారా?) మనము ఈ పరిశుద్ధ గ్రంథమును నమ్మలేకపోయిన, ఆ (కార్యములను) నమ్మలేము. అయితే మనకే (విశ్వాసము) కావాలసియున్నది….
ఇప్పుడు, మనము ఏడవ సంఘ కాలమందున్నాము. బైబిలు దీనిని ఏడవ సంఘ కాలమని చెప్పుచున్నది…. ఏడవ సంఘ కాల వర్తమానికుడు తన వర్తమానమును పలుకుటకు ప్రారంభించగా, కాలముల యందు మరుగైన (సత్యములు) రహస్యములు ఆ కాలమందు బయలు పడెను. ఇక్కడ దానిని మనము చూచుచున్నాము. మనుష్య కుమారుడు తన ప్రజల మధ్యకు వచ్చి అవే కార్యములను (తన మొదట రాకడలో చేసిన కార్యములనే) చేయుచు, ఆయన చేయుదునని చెప్పినట్లే తన వర్తమానమును సిద్ధపరచుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కడవరి కాలమందు మనము దానిని చూచుచున్నాము.
ఇప్పుడు… ఆ ఏడు వేచి యుండు కాలములో ఒకటి వచ్చి యున్నది…. మొదటిగా వేచి యుండుటలో ఆయన రాలేదు. మరి రెండవ దాని యందైనను, మూడవ దాని యందైనను, నాల్గవ దాని యందైనను ఆయన రాలేదు గాని, మరి ఏడవ పర్యాయము వేచి యుండుటలో ఆయన వచ్చెను. అది హనోకుగా ఉన్నది, ఆయన ఏడవవాడు, రూపాంతరము చెందెను. నోవహు యూదా శేషమునకు సాదృశ్యముగా ఉన్నాడు. అది ముందుకు కొనసాగవలసియున్నది.
ఇప్పుడు బైబిలు కాలములలో — వేచి యుండుటను గురించి మాట్లాడవలెనన్న — రాత్రులు గంటలుగా విభజింపబడలేదు.
72(ఇప్పుడు కొంచెము జాగ్రత్తగా వినండి, నేను తొందరలో ముగించవలసియున్నది, ఎందుకనగా వారికి ఈ గది కావలసియున్నది.) లేదు, బైబిలు ఆ విధముగా విభాగింపబడలేదు… లేదా
రాత్రిని బైబిలు కాలమందు గంటలుగా విభాగింపలేదు; అయితే వేచి యుండుటగా విభాగించబడినది.
మూడు వేచి యుండుటవున్నవి. మొదటిది 9 గం॥ల నుండి 12 గం॥ల వరకును, రెండవది 12 గం॥ల నుండి 3 గం॥ల వరకును, ఆ మూడవది రాత్రి 3 గం॥ల నుండి 6 గం॥ల వరకు కొనసాగినది. మనకు మూడున్నవి. మూడు మూళ్లు తొమ్మిది. అది క్రమము కాని సంఖ్య, అంతట మనము ఎత్తబడుటకు గాను ఏడవ దానికి వచ్చియున్నాము. నేను విశ్వసించినట్లు అది 6 గం॥ల మరియు 7 గం॥ల లేక 6 గం॥ల నుండి 9 గంటలలో ఉదయకాలమందు జరుగును. అప్పుడు దేవుని బూర మ్రోగును.
ఆ ప్రకాశమాన మేఘారహిత ఉదయమందు
క్రీస్తునందు మృతులైన వారు లేచునప్పుడు,
ఆయన పునరుత్థాన మహిమ భాగింపబడగా;
ఆయనచే ఎన్నుకొనిన వారు ఆకాశమునకు
ఆవలి తమ గృహాలకు చేరుకొనుచుండగా,
ఆవలిగట్టున పేర్లు పిలుచుచుండగా,
నేను కూడా చేరి యుందునచ్చటన్.
1THS 4:13-16
73బైబిలు నందు "ఎత్తబడుట" అను పదము వాడబడలేదు. మనమాపదమును అచ్చట ఉంచాము. బైబిలు చెప్పునదేమనగా, ''పైకి పట్టబడుదము'', పైకి పట్టబడుచుండగా మనము థెస్సలోనియులకు (అపొ॥ పౌలు వ్రాసిన పత్రిక యందు) ఈ ఎత్తబడుట విధానము గొప్పగా ఎలా జరుగనై యున్నదో, ఈ కడవరి దినములలో అది ఎలా సంభవించుచున్నదో అక్కడున్నది. మనము 13వ వచనము నుండి చదువుదుము.
సహోదరులారా, నిరీక్షణ లేని యితరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు.
యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.
[ఇప్పుడు జాగ్రత్తగా వినుడి.] ఆర్భాటము తోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటలేతురు.
1THS 4:16
74ఇప్పుడు, ఇచ్చట ఒక గొప్ప కార్యము సంభవించుటను మీరు గమనించవలయునని నేను ఇష్టపడుచున్నాను. దీనిని తప్పిపోనివ్వకండి. చూశారా? ఇప్పుడు గమనించండి, మూడు కార్యములు… గమనించండి, 13వ వచనము ను౦డి 16వ వచనము వరకు మూడు కార్యములు, ప్రభువు వచ్చుటకు ముందుగా జరుగుటను మనము గమనించవలసియున్నది. (మనము త్వరగా ముగించవలసి యున్నది, చూశారా?) మొదటిగా జరుగనదేమనగా, గమనించుడి: ఆర్బాటము, శబ్దము, బూర. దీనిని మనము చదువుచుండగా, అది అలా ఉన్నదేమోనని చూచెదము. చూశారా?
ప్రభువు తనకు తానే [16వ వచనము] పరలోకము నుండి ఒక ఆర్భాటముతో దిగివచ్చును, మరియు ప్రధాన దూత శబ్దముతో… దేవుని బూరతో…
AMOS 3:7•
1THS 4:16
75మూడు కార్యములు జరుగుచున్నవి; ఆర్భాటము, శబ్దము, బూర, యేసు కనబడుటకు ముందు అవి జరుగవలసియున్నవి. ఇప్పుడ బార్భటమును చూచెదము. యేసు వీటినన్నిటని, ఆయన దిగి వచ్చుచుండగా ఈ మూడింటిని చేయును. ''ఆర్భాటము,'' "ఆర్భాటము" అనగా ఏమిటి? మొదటిగా వెళ్లు వర్తమానమై యున్నది. అది జీవించుచున్న జీవాహారమై వధువును ముందుకు తెచ్చుచున్నది.
ఇప్పుడు, దేవుడు తన కార్యములను చేయుటకు తనకొక మార్గమును కలిగియున్నాడు. ఆయన విధానమును ఆయన మార్చువాడు కాదు. ఆయన ఎప్పటికిని మారని దేవుడు. ఆమోసు 3:7 ఆయన మార్పు చెందని దేవుడుగా ఉన్నాడు. అక్కడ ఆయన చెప్పినదేమనగా, మొదటిగా తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయక, ఆయన, ఏ కార్యమును చేయడు. అది ఆయన వాగ్దానము చేసినంత నిజముగా ఉన్నది, ఆయన దానిని చేయగలడు.
MAL 4:5
76ఇప్పుడు, మనము సంఘ కాలముల ద్వారా వచ్చియున్నాము. మలాకి 4ను బట్టి ఒక ప్రవక్త మరలా ఈ భూమిపైకి వచ్చుటకు మనము వాగ్దానము చేయబడితిమి. అది వాస్తవము. ఆయన స్వభావమును, ఆయన దేనిని పోలియుండునో గమనించుడి. దేవుడు ఆ ఆత్మను ఐదు పర్యాయములు వాడుచున్నాడు: మొదటిగా, ఏలియా; మరలా, ఎలీషా; మూడవదిగా, బాప్మిస్మమిచ్చు యోహాను; నాల్గవదిగా, సంఘమును పిలచుటకు గాను (సహో॥ బ్రెన్‌హామ్ ద్వారా); ఐదవదిగా, యూదా శేషము కొరకు; ఐదు పర్యాయములు అది కృపకు సాదృశ్యము. యేసు ( J-e-s-u-s) విశ్వాసము (F-a-i-t-h) అది కృపా సంఖ్యగా ఉన్నది. చూడగలిగారా? మంచిది.
NUM 22:18,26,38•
HEB 1:1
77ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, వర్తమానము వాగ్దానము చేయబడినది. ఈ మర్మములన్నియు ఈ మత బోధకుల ద్వారా చుట్టబడి మరుగు చేయబడుచున్నప్పుడు. ఒక నిజ ప్రవక్త అనగా, ఆ కార్యములను బయలుపరచుటకు గాను ఒక నిజ ప్రవక్త దేవుని నుండి రావలసియున్నది. ఆయన చేయుదునని వాగ్దానము చేసినట్లే జరుగుచున్నది. దానిని మీరు చూడగలుగుచున్నారా?
దేవుని వాక్యము ప్రవక్తకు కాక మరో మతవాదికి రాదు, ప్రవక్తకు మాత్రము వచ్చును. ప్రవక్త దేవుని వాక్యమును ప్రతిబింబించువానిగా ఉన్నాడు. అతడు మరొక కార్యమును చెప్పలేడు. తన స్వంత తలంపులను అతడు తెలియపరచలేడు. దేవుడు దేనిని అతనికి బయలుపరచునో, దానిని మాత్రము తెలియజేయును, దానిని మాత్రము మాట్లాడువానిగా ఉన్నాడు. బిలాము తన హక్కును అమ్ముకొన చూచినప్పుడు, ''ఏలాగున, ఏ ప్రవక్తయైనను, దేవుడు తన నోట నుంచినది తప్ప వేరొక మాట్లాడగలడు?'' అది దేవునిచే చేయబడు కార్యమైయున్నది, కావున నీవు మరి వేరైన దానిని చెప్పలేవు. ప్రవక్త అనువాడు, ఆ విధముగా జన్మించియున్నాడు.
నీవు మరొక దానిని చెప్పలేవు.
1COR 14:37
78నీవు ఒక దానిని చూచుచు, "నా కళ్లు తెరువలేకున్నానని," చెప్పగలవు. చూశారా? మీరు అలా చెప్పగలరు. అయితే నీవు ఒక మానవునిగా ఉండి, ఒక కుక్కవు కాలేవు, నీవు మానవుని వలె చేయబడితివి. దేవుడు ఎప్పుడును అనగా ఏలియా, యోషయా, యిర్మియా కాలములలో, ఆ కాలములు గతించిపోయినవి. అప్పటి మత వాదులు ఆనాటి కార్యములను మిశ్రితము చేసి ఉంచారు. అటువంటి కాలమందు, ఆయన (దేవుడు) తన ప్రవక్తను పంపుచున్నాడు. ఇచ్చట నుండియే అతనిని లేపుచున్నాడు. ఆ ప్రవక్త ఆనాటి మతవాదుల స్థితులకు సంబంధించిన వాడు కాదు, కాని ఆయన వాక్యమును మాత్రమే పలుకువాడై యున్నాడు. కొంత సమయమునకు ఆ ప్రవక్త కనబడి, మరుగైపోవును. దేవుని సత్య విషయములో అతడు ఒక మోటువాడుగా కనబడును.
అది ఎల్లప్పుడు… నీవు ఆయనను (ప్రవక్త) చెప్పు విధానమైయున్నది. దేవుడు ఇలా చెప్పెను.
79''ఎవరైనను, మీ మధ్య ఆత్మీయముగా లేక ఒక ప్రవక్తగా…'' ఒక ప్రవక్త…. సంఘములో అలాంటి ప్రవచన వరమున్నది, అయితే ప్రవక్త అనువాడు ఆ ఘడియ కొరకు ముందుగా నిర్ణయించబడి పూర్వమే అభిషేకము నొందినవాడుగా ఉన్నాడు. చూశారా? అవునండి.
ఇప్పుడు, ఒక ప్రవచనము ముందుకు వచ్చినప్పుడు, ఇద్దరు లేక ముగ్గురిచే అది స్థిరపరచవలసియున్నది. అప్పుడది సంఘముచే అంగీకరించబడును, అయితే ప్రవక్త ముందు ఎవ్వరూ నిలువజాలరు, ఎందుకనగా దేవుని నిర్ధిష్టమైన వాక్కును అతడు కలిగియున్నాడు. ఆ కాలమునకు అతడు ఆ వాక్కుగా ఉన్నాడు, అతడు దేవున్ని ప్రతిబింబింపజేయును…
ఇప్పుడు, ఈ మతవాద కలియక నుండి, ఈ కడవరి దినములలో ఆ వధువును వెలుపలకు కొని తెచ్చుటకు అలాంటి కార్యమును (ఒక ప్రవక్తను మనమధ్య ఉంచుట) పంపెదనని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. అలా (వెలుపలకు తెచ్చుట) జరుగుట అదొక్కటే మార్గము.
80అది ఇంతకు ముందు జరిగినది కాదు… (వేరు మార్గము ద్వారా) సంఘము క్రీస్తును పొందనేరదు. మనము…పెంతెకొస్తులము. మనము ఈ వర్తమానమును, నేటి సంఘ స్థితిలలో కొనిపోలేము, ఎందుకనగా వారిలో ఒకరిపై విరోధముగా మరొకరున్నారు. ప్రతిది మత సంబంధముగా ఉన్నప్పుడు ఈ చివరి కాలమును ఏ విధముగా వెలుపలకు తీసికొని వెళ్లగలము? ఓ, కృప దొరకును గాక. అది ఒక మిశ్రమము, అది సంస్థలోనికి చెదరిపోయినది. ఏ కాలమందైనను, ఏ చరిత్రకారునినైనను నేను అడిగినప్పుడు, ఎంతో వ్యత్యాసము చెప్పును. భూమి పైకి వర్తమానము వచ్చినప్పుడెల్ల, వారు ఒక సమాఖ్యగా కూడా యుందురు. అప్పుడే అది అక్కడ మరణించియుండును.పెంతెకోస్తు కూడ దానినే చేసినది — వారందరు వెలుపలకు వచ్చినవారు.
ISA 27:3
81''అసెంబ్లీస్ అఫ్ గాడ్, అను మీరు మీ తల్లిదండ్రులు, ఆ సంస్థలను విడచి వెలుపలకు వచ్చి, దేవుని స్తుతించి వారి కార్యములకు విరోధముగా మాట్లాడిరి; అయితే మీరు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, వారు చేసిన కార్యములనే తిరిగి చేయుచున్నారు. ఇప్పుడు మీరు మీ దయా పాత్రలను మూసివేసియున్నారు. మీలో ఎవరైన చేరవలయునన్న సహవాసపు కార్డులను కోరుచున్నారు.
ఏకత్వము అను మీరు అలాంటి వర్తమానమునే దేవుడు మీకనుగ్రహించినను, దానిని చేపట్టి వినయముతో ముందుకు కొనసాగుటకు బదులుగా దానినంతటిని విడచిపెట్టి, సమాఖ్యలుగా చేరారు. మీరందరు ఎచ్చట ఉన్నారు? ఒకే రకమైన తొట్టిలోనే ఉన్నారు. ఇది వాస్తవము! అయితే దేవుని ఆత్మ ముందుకు వెళ్లుచున్నది. ''ప్రభువునైన నేను నాటుదును; దానికి పగలు మరియు రాత్రి నీరు పోయుదును. మరెవ్వరిని…
ఈ కార్యములన్నియు ఆ విధముగా ఉండవలసి యున్నదని ఆయన అభిషేకించియున్నాడు, మరియు ఆయనే దానిని పంపించును.
MAL 4:5•
MATT 25:6•
LUKE 17:30
82ఆయన పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు, ఆ మొదటి వచ్చినదేమనగా అప్పుడొక ఆర్భాటము కలిగినది! అది ఏమిటి? ప్రజలను ఐక్యపరచు వర్తమానముగా ఉన్నది. ''దీపములను చక్కదిద్దు సమయమిది, లేచి మీ దీపములను చక్కదిద్దుకొనుడి.'' అది ఏ విధమైన వేచి యుండుటయైయున్నది? అది ఏడవదిగా వేచి యుండుటకై వున్నది. ఆరవ కాలమందు వేచి యుండుట కాదు గాని, అది ఏడవ కాలమందు వేచి యుండుటగా ఉన్నది. ''ఇదిగో పెండ్లి కుమారుడు, లేచి మీ దీపములు చక్కదిద్దుకొనుడి.'' వారు ఆ విధముగానే చక్కదిద్దుకొనిరి, అయితే వారిలో కొందరికేమో వారి దీపముల యందు నూనె లేకుండుటను కనుగొనిరి. చూశారా? అయితే ఇది దీపములను సరిదిద్దు సమయముగా ఉన్నది. అతడు వచ్చినప్పుడు అది మలాకీ 4వ అధ్యాయపు కాలముగా ఉన్నది… ఇది లూకా 17 కాలమైయున్నది. ఇది యెషయాలో…. ఉన్న ప్రవచనములన్నియు క్రమముగా లేఖనముల యందు ఈ దినము కొరకు చక్కగా అమర్చబడి యున్న కాలమై యున్నది… అవి మన యెదుట జీవము కలిగి నెరవేరుటను చూచుచున్నాము. అక్కడ ఏదియు…
83నా ప్రియ సోదరీ సోదరుడా, ఈ కార్యములు జరుగుటను చూడుము. నేను ఇప్పుడు ఈ వేదికపై ఒక వేళ మరణించిన యెడల, పరలోకపు తండ్రి దానిని యెరిగి యున్నాడు. నీవు కొంత సమయము దానిని గమనించుము. అదెంత ఆశ్చర్యము, దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి, మానవ సమూహముల మధ్య నిలచి, ఇప్పుడు మన మధ్య నిలచి, తనకు తానుగా తెలియపరచుకొనుచున్నాడు. ఆయన ఎప్పుడు చేయునట్లే చేయుచున్నాడు. అది సత్యమైయున్నది. ఈ బైబిలు పూర్తిగా తెరువబడినది. చూశారా? మన మీ స్థలమందే ఉన్నాము!
సంస్థాగతమైన విధానము చనిపోయినది. అది గతించి పోయినది. అది మరలా పైకి రాజాలదు. అది కాల్చివేయబడును. పొలము నందలి పొట్టును, మీరు ఆ విధముగానే చేయుదురు. దాని నుండి ఎగిరిపోవుడి. క్రీస్తులోనికి చేరుడి. ''నేను మెతడిస్టు వాడిని, నేను బాప్టిస్టుకు చెందియున్నాను, నేను పెంతెకొస్తుకు చెందియున్నానని చెప్పకుడి.'' మీరు క్రీస్తులోనికి రండి. మీరు క్రీస్తునందున్న యెడల, మీరు విశ్వసించునది కాక మరొక మాట ఇక్కడ లేదు. ఇతరులు ఏమి చెప్పినను నాకు అక్కర లేదు. దేవుడు ఆ కార్యమును నిజరూపమునకు తెచ్చాడు. ఆయన ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు, ఆ వాక్యమందు ఏమి జరుగుచున్నది? అది కేవలము విత్తనముపై నీరు చల్లినట్లే ఉన్నది. అది జీవించును, అది దాని రకపు ఫలములను తెచ్చును.
MATT 5:45
84''నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందియున్నానని,'' నీవు చెప్పవచ్చు. అది నీవు రక్షింపబడినావను భావము కాదు, సుదూర మార్గముల ద్వారా అది జరుగదు.
ఇక్కడ చూడుము నీవు మూడు విధముల జీవిగా ఉన్నావు. ఈ చిన్నదైన శరీరము లోపల ఒక జీవమున్నది, ఆ తరువాత ఒక ఆత్మ ఉన్నది. ఆ తరువాత శరీరమున్నది. నీకు ఐదు జ్ఞానేంద్రియములు ఈ భూలోక గృహమును సంధించుటకు గాను ఈ శరీరమందున్నవి. ఆ విధముగానే ఆత్మకు సంబంధించి ఐదు జ్ఞానేద్రియములున్నవి. ప్రేమ, మనసాక్షి మొదలగునవి. అయితే ఇక్కడే నీవు జీవించుచున్నావు. అదే నీవైయున్నావు.
నీతిమంతుల మీదను, అనీతిమతుల మీదను వర్షము కురియుచున్నదని యేసు పలుకలేదా? కలుపు (మొక్కను) గోధుమ (మొక్కను) ఉంచి నీరు పోయుము. వాటికి మంచి ఎరువులను వేయుము, అవి రెండును ఆ నీటి ద్వారానే ఎదుగుట లేదా? నిజమే? అది ఏమి? అందులో ఒకటి కలుపు విత్తనమును ఫలించును, ఎందుకనగా అది కలుపుగా ఉన్నది. ఆ కలుపు మొక్క కూడ, ఆ గోధుమ వలే చేతులెత్తి అరచుచు ఆ గోధుమ వలె ఉల్లసించును.
MATT 24:24•
MARK 13:22
85అబద్ధపు క్రీస్తులు కడవరి దినములలో వచ్చెదరని పరిశుద్ధ గ్రంథమందు చెప్పుట లేదా, కాదు, అబద్ధపు క్రీస్తులు. వారు అభిషేకము చేయబడినవారు. వాక్యమునకు విరోధముగా అభిషేకము చేయబడిన వారు. వారు సంస్థల అభిషేకము పొందిరేగాని వాక్యము ద్వారా పొందలేదు. వాక్యము తనకు తాను సాక్ష్యము కలిగియున్నది. అంత్యకాలపు అభిషక్తులు వచ్చెదరు. (''అంత్యకాలపు అభిషక్తులు'') అను ప్రసంగముపై నేను మాట్లాడిన టేపులున్నవి. ఆ అభిషేకము…. ఓ, మీరు ఒకరిని పిలిచి ''నీవు యేసువు అని చెప్పరు. ''ఓ, ఖచ్చితముగా చెప్పరు.'' వారు దానిని సహించలేరు, అయితే నిజమైన అభిషేకము వచ్చునప్పుడు, ''ఓ, మహిమ కలుగు గాక.'' ఆ అభిషేకమును నేను పొందియున్నాను…. అది అసలైన అభిషేకమై యున్నది.
గుర్తు౦చుకోనండి, కయప కూడ అభిషేకమును పొంది ప్రవచించెను. అదే విధముగా బిలాము అభిషేకము పొంది ప్రవచించెను, అయితే లోపలి కార్యమునకు ఏ మాత్రము అది ఉపయోగపడదు. అది దేవుని నుండి కలిగిన విత్తనమైనచో, ఆయన జీవమును కలిగి ఆది నుండి ముందుగా నిర్ణయించబడియుండును. దానితో నీవు సంపూర్ణుడగుదువు. నీవు ఎంతగా కేకలు వేసినను, అన్యభాషలతో మాట్లాడినను, పరుగులిడినను, అవి దీనితో (ఈ జీవముతో) సంబంధపడవు. ఒక గడ్డి పరక మిగిలిన వాటితో లెక్కించబడదు. అన్యులు ఈ విధముగా కేకలు వేయుటను, భాషలతో మాట్లాడుటయు నేను చూచియున్నాను. వారు మానవ పుర్రెలలో రక్తమును పోసి త్రాగుచు దయ్యములను పిలుతురు. చూశారా? కావున అలాంటి అను భూతులను కలిగి యుండుటకు ప్రయత్నించకు; వాటిని మరచిపొమ్ము. వాక్యమందు నీ హృదయమును ఉండవలసియున్నది. అదే క్రీస్తుగా ఉన్నది. దానిని తెచ్చి అది తక్కిన విత్తనములవలె తనకుతాను వెలికివచ్చి ఎలా తనను తెలుపుకొనుచున్నదో గమనించుము. అది జీవించు కాలమును తెలియపరచుచున్నది.
86లూథరు చిగురును తెచ్చాడు. తరువాత వచ్చిన వారు మిగిలిన కార్యములను తెచ్చారు. ఇప్పుడు మనము గోధుమ (గింజ) కాలమందున్నాము. అసలైన లూథరునులు నిజ లూథరును తెచ్చారు. నిజ పెంతెకొస్తు వారు నిజ పెంతెకొస్తును తెచ్చారు. అంతే గాని మరేమి లేదు. మనము వాటన్నిటిని దాటి వెళ్లుచున్నాము.
పెంతెకొస్తులను కాథలిక్ సంఘము ప్రారంభించినదని మీకు తెలియునా? ఆ పెంతెకొస్తు సంఘము ఈ రెండు వేల సంవత్సరములు నిలచియుండినట్లయిన, అది ఆనాటి కాథలిక్ సంఘము కన్నను హీనమైపోయియుండును. అది వాస్తవము, నా ప్రియ సోదరీ, సోదరులకు నేను చెప్పునదేమనగా నేను మిమ్ములను ఎంతగానో ప్రేమించుచున్నాను. దేవునికి అది బాగుగా తెలియును, అయితే జ్ఞాపకముంచుకొనుడి. రానున్న తీర్పులో నేను మిమ్ములను సంధించవలసియున్నది. అది ఎంతో దూరాన లేదు. సత్యమును గురించిన సాక్ష్యమును నేను కలిగియున్నాను.
MATT 13:4•
MARK 4:4•
LUKE 8:5
87నేను కూడికలకు వెళ్లి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుచున్నప్పుడు, ఆ కాలములు ఎంతో బాగుండును, అయితే నేను వర్తమానముతో వచ్చినప్పుడు… మరేదైన వర్తమానము బయలు వెళ్లినప్పుడు, అది సత్య వర్తమానమైనయెడల, అది సత్యమైన దేవుని అసలైన మహత్కార్యములై ఆ సంస్థలలో అది ఉన్నప్పుడు నిజముగా అది దేవుని నుండి కలిగినది కాదు, ఎందుకనగా అది అంతకు పూర్వము తెలుపబడినది. యేసు ఆ ప్రజలను ఆకర్షించుటకు గాను సూచక క్రియలు చేసెను. ఆ తరువాత ఆయన వర్తమానము వచ్చును. అది సరియైనది! దేవుడు తెలియపరచునదిగా అది ఉండవలసియున్నది. దైవీక స్వస్థత… అటువంటి సూచనలు, ప్రజల కళ్లను ఆకర్షించునవిగా ఉన్నవి. అయితే హృదయ కేంద్రముగా వర్తమానమున్నది. అది అక్కడున్నది. అది ఇచ్చట నుండి వచ్చునదిగా ఉన్నది. ఆ విధముగా ప్రజలు మన్ననలను పొందుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు. దాని ద్వారా వారు కూర్చొని ఆయనకు చెవి చాపగలరు. చూశారా? జీవమును ప్రతిష్టించుటకు ఆక్కడేదో కొంత ఉండవలసియున్నది. కొన్ని గోధుమ విత్తనములు నేలను పడినవి. పక్షులు వాటి నెత్తుకొని పోయినవి. మరి కొన్నేమో ముండ్ల పొదలు మధ్య పడినవి. కొన్ని సిద్దపరచడిన నేలను పడినవి. సిద్ధపరచబడిన నేల ఆ విత్తనములను మొలిపించినది.
JOHN 11:38
88ఇప్పుడు, ఆ మొదటిది ఆర్భాటముగా ఉన్నది — ఆ తరువాత శబ్దము , అటు తరువాత దేవుని బూర, ఆర్భాటము, ప్రజలను సిద్ధపరచు వర్తమానముగా ఉన్నది. రెండవది పునరుత్థానము శబ్దము. అదే శబ్దము యోహాను 11:38 నుండి 44 వరకు, అక్కడ లాజరును సమాధి నుండి బయటకు పిలచుచున్నది. మొదటిగా వర్తమానము వధువును ఐక్యపరచుచున్నది. ఆ తరువాత మరణించిన వారి పునరుత్థానము. (చూచారా?), మూడవదిగా దానితో కొనిపోబడుట. ఇప్పుడా మూడింటిని గమనించండి.
తరువాత ఏమిటి? ఇప్పుడు మూడవది బూరయైయున్నది. ఆర్భాటము — శబ్దము, బూర.
89ఇప్పుడు, ఆ మూడవది బూరగా ఉన్నది. అది ఎల్లప్పుడును ప్రజలను బూరలు పండుగకు పిలచుచున్నదిగా ఉన్నది; అది వధువు యొక్క భోజనమైయున్నది, మధ్యాకాశమందు వధువుతో గొర్రెపిల్ల విందు భోజనమైయున్నది.
చూడండి, మొదటిగా వచ్చుచున్నది వర్తమానమై యుండి వధువును ఐక్యపరచుచున్నది. రెండవదిగా నిద్రచుచున్న వధువు యొక్క పునరుత్థానము. వారు గడచిన కాలములు యందు మరణించిన వారు, వారు ఎత్తబడిరి, బూర ఆకాశమందు విందుగా ఉన్నది, అది పరలోకపు విందుగా ఉన్నది. స్నేహితులారా అదియే జరుగనై యున్నది.
మనము ఇప్పుడు ఆ చోట సిద్ధముగా ఉన్నాము. జరుగవలసిన ఒక్క కార్యమేదనగా, సంఘము వెలుపలకు వచ్చి సూర్యుని కాంతియందు పక్వము కాలవసియున్నది. ఆ తరువాత కొద్దికాలమునకు ఆ గొప్ప కలియిక వచ్చును. గోధుమ గింజలు కళ్లమునకు చేర్చుచుండగా, కాండము కాల్చివేయబడును. చూశారా?
90మీరు గ్రుడ్డివారు కారు. మీరు తెలివిగలవారు, నేను ఇచ్చట నిలుచుండి ఆ కార్యములకు విరోధముగా మాట్లాడినయెడల… నేనెందుకు వీటిని చెప్పుచున్నాననగా అది జీవమైయున్నది. నేను దీనిని చెప్పుట వలన దేవునికి బాధ్యుడనగుదును. నేను దానిని ఖచ్చితముగా చెప్పవలసియున్నది. నా వర్తమానము…. ఎల్లప్పుడు స్వస్థతలయందు జనుల దృష్టిని మరల్చునట్టుగా నుండినది. అదంతయు ప్రజల గమనమును ఆకర్షించుటకుగాను జరిగినవి. దీని ద్వారా వర్తమానము వచ్చుట తెలిసికొందురు. అది (వర్తమానము) ఇప్పుడు మన మధ్య ఉన్నది.
ఆ విధముగా ఆ ఏడు ముద్రలు విప్పబడి గత కాలములందు ఏమి జరిగినవో, ఆ రహస్యములన్నియు తెలియజేసినవి. వాటిని, అవి ఏమై యున్నవో నేనెరుగను, అయితే ఇప్పుడు నా ప్రక్కగా ఒకరు నిలుచుండి దానిని తెలుపుచున్నాడు. ఈ వాక్యమును ''అయ్యలారా! ఇది ఏ సమయము లేక కాలము అయివున్నది?'' అను ప్రసంగమందు ఉపదేశించియున్నాను. ఆ ఉదయ కాలము చెప్పబడినట్లే ఆ ఏడుగురు దూతలు పరలోకమునుండి దిగి వచ్చి అక్కడే నిలిచి వారు వెళ్లిపోవుటను గమనించుచుంటిమి. దేశమంతటను మరియు మెక్సికో వరకు అక్కడ జరిగిన ఆ సంభవమును చూచారు, విజ్ఞాన శాస్త్రము దానిని ఫోటో తీసినది.
COL 2:9
91అప్పుడు అక్కడే నేను దానిని గమనించుచుంటిని….
ఒక దినమున ఈ ఏడు సంఘ కాలములను నేను ప్రసంగించుటకు ప్రారంభించినప్పుడు, ఒక గొప్ప వేదాంత పండితుడైన జాక్‌మూర్ సహోదదరుని నేను పిలిచాను. అప్పుడు నేను, ''జాక్, అక్కడ నిలుచున్న వ్యక్తి ఎవ్వరు? మనుష్య కుమారుని పోలినవాడు అక్కడ నిలుచుని వున్నాడు. ఆయన వెంట్రుకలు తెల్లని ఉన్నివలె ఉన్నవి,'' అని అడిగాను. మరియు ''అతడు ఒక యవ్వనుడిగా ఉన్నాడు కానీ, ఆ తెల్లని వెంట్రుకలను అతడు విధముగా కలిగియున్నాడు?'' అని అడిగాను.
అందుకతడు, ''బ్రెన్‌హామ్ సోదరుడా, అది ఆయన యొక్క మహిమ శరీరమైయున్నది,'' అని చెప్పాడు. అది ఆ గంటను మ్రోగించలేదు. నేను నా గది లోనికి వెళ్లి ప్రార్థించుటకు ప్రారంభించగా, అది ఏమని ఆయన నాకు తెలిపెను.
చూచారా, ఆయన గొప్ప దైవత్వమును గూర్చి పలు మార్లు నేను ఉపదేశించియున్నాను, ఆయన కేవలము ఒక మానవునిగా మాత్రము కాదు గాని; ఆయన శరీరమును దాల్చిన దేవుడైయున్నాడు, దేవుడు, దేవుని ప్రేమ లక్షణము, ఆ గొప్ప లక్షణములను ఈ భూమిపై ప్రచురించుటకు ఆయన వచ్చియున్నాడు. యేసు దేవుని ప్రేమయై యున్నాడు, యోహోవా, తాను నివాసము చేయుటకు ఏర్పరచుకొనిన ఒక శరీరమైయున్నాడు. ఆయన ఈ శరీరమందు దేవుని పరిపూర్ణమైయున్నాడు. దేవుడేమైయున్నాడో, అదంతయు ఆ శరీరమందు రూపుదిద్దియున్నాడు. ఆయన తన రక్తముతో వధువును కడుగునట్లు, ఆ శరీరమందు మరణించవలసియున్నది. ఆయన (స్వంత) రక్తముతో.
92గమనించండి, వధువు కడుగబడుటయే కాదు గాని, మన్నించబడి ఆమె నీతికరించబడినది. చూశారా? నీతి కలిగి అను పదమును భావమును ఎప్పుడైనను చూచుటకు ప్రయత్నించారా? ఒక సందర్భము చెప్ప వలెనన్న, నేను త్రాగి యున్నానని సహో॥ గ్రీన్ వినిన యెడల, నేను చెడు కార్యమును చేసినవాడనైతిని. ఈ తరువాత నేను దానిని చేయకున్నప్పుడు అతడు కనుగొని, నా దగ్గరకు వచ్చి ''బ్రెన్‌హామ్ సోదరుడా, నేను నిన్ను మన్నించానని చెప్పును.''
''నీవు మన్నించావా? నేను ఇప్పుడు దాని చేయలేదు. మరాదేనిని మన్నించావు.'' చూశారా? అయితే నేను నేరస్తుడనైనప్పుడు క్షమించబడవలసిన వానినే. అయినను నేను నీతిమంతుడను కాను, ఎందుకనగా నేను దాని చేశాను. అయితే ''నీతికరణము''అను పదము ''నీవు దాని చేయనప్పటికిని'' అను భావమును కలిగియున్నది. నీతికరణము అనగా తీర్పు తీర్చబడుట. యేసుక్రీస్తు రక్తము మన పాపములను ఎంతగా కడిగినదనగా, దేవుని (మరచిపోవు) పుస్తకమందు అది వ్రాయబడినది. ఆయన ఒక్కడే దాని చేయగలడు. మనము దాని చేయలేము. మనము క్షమించగలము గాని మరిచిపోలేము.
నేను నిన్ను క్షమించగలను గాని, నీవు చేసిన చెడు కార్యములను ఎప్పుడును జ్ఞాపకమునందుంచుకొని యుందును. నీవు మన్నించావే గాని తీర్పు చేయలేదు. అయితే దేవుని దృష్టిలో వధువు తీర్పు తీర్చబడింది (నీతికరించబడింది) ఆ మొదటి స్థలమందే ఆమె దాని చేయలేదు. ఆమేన్. నీతిమంతుడైన దేవుని కుమారునితో పెండ్లి చేయబడి అక్కడ నిలుచునియున్నది. ఆమె యందు పాపమేలేదు. ఎందుకు? ఆమె ముందుగానే అభిషేకము చేయబడింది; ఆమె దానిలో పట్టబడినది. ఆమె సత్యమును విని ముందుకు వచ్చినప్పుడు, ఆ రక్తము ఆమెను శుద్ధిచేసినది. ఆమె అక్కడ నీతిమంతురాలిగా నిలబడియున్నది. చూశారా? ఇక ఎటువంటి పాపమును ఆమెపై లేదు.
93అందువలన, వర్తమానము వధువును ఒక్క సహవాసమునకు పిలచుచున్నది. అది ఆర్భాటము గాను, తదుపరి శబ్దము ఉన్నది. ఆ ఉదయకాలమందు ఆయన గొప్ప స్వరముతో, ఆ వర్తమానముతో కేక వేసెను. ఆ స్వరము లాజరును లేపినది. బలమైన స్వరముతో ఆయన, ''లాజరు, బయటకు రమ్ము!'' అని అరిచాడు. చూశారా? ఆ స్వరము లేపినది. నిద్రించుచున్న వధువును లేపెను. ఆమె మరల నిద్రయందుండినది.
ఆ బూర, ఆ బూర శబ్దముతో పిలిచినది… ఎప్పుడును ''బూర ఇశ్రాయేలును బూరల పండుగకు పిలచునదిగా ఉన్నది.'' (చూశారా?) అది పెంతెకొస్తు పండుగయై యున్నది ఆకాశమందు గొప్ప పండుగగా, బూరల పండుగగా ఉన్నది… ఇప్పుడు ఆ బూర ఐక్యమును పిలచుచున్నది. పండుగకు పిలచుచున్నది. అదియే ఆకాశమందు గొర్రెపిల్ల వివాహ భోజనము (సప్పర్)గా ఉన్నది. ఇప్పుడు గమనించండి, వధువులో ఒక్కటిగా సమకూడుట. అదియే (ఆత్మీయ) బూరల పండుగ, అది పెండ్లి విందైయున్నది. (ది వెడ్డింగ్ సప్పర్) (సప్పర్ - సాయంకాల భోజనము).
మనము దానిని మాదిరులలో (టైప్స్) చూచాము. ఇప్పుడు మనము ముగించుటకు ముందుగా జాగ్రత్తతో గమనించండి.
MATT 18:16•
1JN 5:7
94ఇప్పుడు, మనము ఆ మాదిరి చూచామని గమనించండి. ఇప్పుడు మీరు మత్తయి 18:16ను చదివినట్లయిన అచ్చట చెప్పబడినదేమనగా, అచ్చట ముగ్గురు సాక్ష్యమును కలిగియున్నారు. చూశారా? పరిశుద్ధ యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 5:7 మరియు అనేక స్థలములందు… ఎల్లప్పుడు ముగ్గురుగా సాక్ష్యముగా ఉన్నారు. అది నిజమేనా? ఏదో ఒక నిజమైన దానికి అది మరో పరిశీలనగా ఉన్నది. ముగ్గురు సాక్ష్యము కలిగియున్న దేమనగా… ''ప్రతి మాటయు ఇద్దరు లేక ముగ్గురి సాక్ష్యముతో స్థిరపడుచున్నది.''
ఇప్పుడు గమనించండి, మనము ముగ్గురి సాక్ష్యములను కలిగి యున్నాము. మూడు అనునది ఒక సాక్ష్యముగా ఉన్నది. గతములో పాత నిబంధన యందు, ఇంతకు మునుపే ముమ్మారు ఎత్తబడుట జరిగినది. (అది మీకు తెలయునా?) అది ఒక సాక్ష్యముగా యేసు. యేసు (తాళపు) ప్రధాన రాయిగా (కీ స్టోన్) ఉన్నందున ఆయన కూడా సాక్ష్యమును కలిగియున్నాడు. ఆయన పాత, క్రొత్త నిబంధనలకు మధ్య కలయిక రాయిగా ఉన్నాడు, ఎందుకనగా ఆయన మొదటిగా మరణించి ఆ తరువాత ఎత్తబడెను. ఆయన మరణించి, జీవమునకు వచ్చి, ఇచ్చట (భూమిపై) మనతో నడిచెను. ఆ తరువాత పైకి తీసికొనబడెను, ఎందుకనగా ఆ రెండింటిని (పాత, క్రొత్త నిబంధనలను) జతగా చేసిన ప్రధాన రాయిగా ఆయన ఉన్నాడు. ఆయన పునరుత్థానుడై, ఎత్తబడిన తరువాత (చూడండి) ఆయన దానిని చేసిపాత నిబంధనను నిరూపించిన తరువాత… హనోకు మారు రూపము దాల్చెనని మనకందరికి తెలియును. ఏలీయా సుడిగాలి యందు ఎత్తబడెనని మనము ఎరిగి యున్నాము. (అది నిజమా?) అగ్ని రధమందు ఎత్తబడెను. యేసు మరణించి, సమాధి చేయబడి, లేచి భూమిపై నివసించెను, ఆ తరువాత ఎత్తబడెను. ఆయన ప్రధానరాయిగా ఉన్నాడు. ఆ ముగ్గురు సాక్ష్యమను కలిగియున్నారు. ఇది నిజమేనా?
MATT 27:45-53
95ఇప్పుడు, ఒకసారి ఎత్తబడుట జరిగి పోయినది. అది మీకు తలియునా? మనము త్వరగా చదువగలిగిన యెడల దానిని చూచెదము. మత్తయి 27వ అధ్యాయము 45వ వచనము దీనిని కొంత చదువుట వలన మనకు సహాయముగా ఉండును. త్వరితముగా చదువుదుము. 27:45 అని నేను నమ్ముదును. ఇక్కడ వ్రాసియుంచి యున్నాను. మనము చదువుదము.
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
ఇంచుమించు మూడు గంటలప్పుడు, యేసు - ఏలీ, ఏలీ, లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు ''నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని,'' అర్థము.
అక్కడ నిలచియున్న వారిలో కొందరా మాట విని, ఇతడు ఏలీయాను పిలచుచున్నాడనిరి.
వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొనిపోయి, స్పాంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను.
తక్కినవారు, ''ఊరకుండుడీ, ఏలీయా అతనిని రక్షింప వచ్చునేమో చూతమనిరి.''
యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడచెను [ఒక బిగ్గరగా కేక గమనించండి.]
అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చిరిగెను; భూమి వణికెను; బండలు బద్దలాయెను;
మరియు సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి.
MATT 27:50•
1THS 4:12
96ఒక ఎత్తబడుట జరిగిపోయినది. పాతనిబంధన యందు దేవుని వాక్యము ఎవ్వరికి వచ్చినదో, సిద్ధపడినవారైయుండి ముగ్గురికి జరిగినది. చూశారా? హనోకునకు ప్రభువు వాక్యము వచ్చినది. ఏలీయాకు ప్రభువు వాక్యము వచ్చినది. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. చూశారా? యేసు దేవుని వాక్యమైయున్నాడు. చూశారా?
ఈ ఎత్తబడుట జరిగినప్పుడు, పాత నిబంధనలోని ఆ పరిశుద్ధులను గమనించండి. 50వ వచనమందు గమనించండి. ఆయన బిగ్గరగా వేసిన కేక పాత నిబంధనలోని పరిశుద్ధులను లేపినది. అది ఖచ్చితముగా యేసు లాజరును లేపినట్లే ఉన్నది. చూశారా? ఆ గొప్ప స్వరము వారిని లేపినది. రెండవది II థెస్సలోని 4వ అధ్యాయమందు నెరవేరినది. మనము దానిని చదివెదము. మనము కొన్ని నిమిషముల క్రితమే దాని చదివాము. చూశారా? ''సహోదరులారా, నిరీక్షణ లేని యితరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు…''అది 1 థెస్సలోని 4:12-18 వరకు వ్రాయబడియున్నాది. అది రెండవదిగా ఎత్తబడుటయైయున్నది. వధువును తీసికొని పోవుటయే రెండవ ఎత్తబడుటగా ఉన్నది.
97ఆ పాత నిబంధన పరిశుద్ధులందరు ఆయన సన్నిధికి వెళ్లిపోయిరి, ఇక పరదైసు లేకపోయినది. ఆయన బిగ్గరగా కేకవేసినప్పుడు, ఆ పాత నిబంధన పరిశుద్ధులు పైకి ఎక్కిపోయిరి. గతములో వారు తమ శరీరములను విడచిపెట్టిరి. ఎందుకు అలా జరిగినదనగా, వారి పాపముల నిమిత్తము జరుగవలసిన పరిహారార్థ బలికొరకు వేచియుండిరి. వారు ఒక గొర్రెపిల్లను బలిగా సమర్పించుటకు, ఒక ఖచ్చితమైన గొర్రెపిల్ల రానైయున్నదని వారు విశ్వసించిరి. ఆయన మరణించి ఆత్మను అప్పగించుకొనప్పుడు, ఆయన గొప్ప స్వరముతో కేక వేసెను. అప్పుడా పాత నిబంధన పరిశుద్ధులు లేచిరి. మరలా ఆ ఆర్భాటమును, ఆ స్వరమును ఇక్కడ ఉండుట గమనించుడి. ఆయన రాకడలో అదే విధముగా జరిగినది. చూశారా? తన ఆత్మను విడచెను, ఆ విధముగా ఆయన ఖచ్చితమైన బలిని సమర్పించినప్పుడు, పరదైసు ఖాళీ అయిపోయినది. పాత నిబంధన పరిశుద్ధులు మరలా భూమి పైకి వచ్చిరి. ఆ తరువాత ఆయన ఎత్తబడినప్పుడు, మరియు ఆయనతో పరలోకమందు ప్రవేశించిరి.
PS 24:7-10•
EPH 4:8•
1THS 4:15
98దావీదు ఒకచోట ఇలా చెప్పుచున్నాడు, ''నిత్య నివాసులారా, (పురాతనమైన గుమ్మములారా) పైకిలేవుడి. మీరు లేపబడుదురు గాక.''
ఆయన (చెరను, చెరగా విడిచెను) బంధకముల నుండి విడిపించి, మానవునికి బహుమానములు నిచ్చెను. పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో వెళ్లిరి. వారు ఇలా పలికిరి ''నీతి గల ఈ రాజు ఎవరు?''
''మహిమగల ఈ ప్రభువు సైన్యములకు అధిపతి, శక్తి గలవాడు,'' అలా చెప్పుకుంటూ వారు నడచి వచ్చుచున్నారు. యేసు బంధకమును బంధకములో విడిచెను. ఇదిగో ఆయన పాత నిబంధన పరిశుద్ధులతో వచ్చుచున్నాడు. అక్కడ నూతన వాకిళ్లలో ప్రవేశించుచున్నాడు. ఆయన ఇలా చెప్పుచున్నాడు, ''నిత్యనివాసములారా, పైకి లేవుడి. మహిమ రాజు మీలో ప్రవేశించునట్లు మీరు పైకి రండి.
ఆ లోపలి నుండి వచ్చిన స్వరము ఇలా పలికినది, ''నీతిగల ఈ రాజు ఎవరు?''
''ఆయన యుద్ధములో శూరుడగు యెహోవా (ప్రభువు).'' ఆ వాకిళ్లు (గుమ్మములు) తెరువబడినవి. తనను నమ్మినవారి చెరను చెరగా చేసి దాని జయించెను, ఆ వాక్యము వారికి వచ్చినది. అక్కడ ఆ పాత నిబంధన పరిశుద్ధులు వేచియున్నారు. ఆయన చెరను చెరగా చేసెను, ఉన్నతములకు ఎక్కి వెళ్లెను. ఆ పాత నిబంధన పరిశుద్ధులును ఆయనతో వెళ్లిరి. ఆ విధముగా ఆ మొదటి ఎత్తబడుట జరిగిపోయినది.
తరువాత జరుగనైయున్న ఎత్తబడుట (II థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలో) వధువు సంఘము పునరుత్థానము నొంది మహిమలోకి ఎత్తబడుచున్నది. ''సజీవులమై నిలచియుండు మనము, (భూమిపై ఈ శరీరము విడిచిపెట్టబడును) నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము; దేవుని బూర ఊదబడును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. (చూచారా?) ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము, వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండములకు మేఘములపై కొనిపోబడుదుము.''
99ఒక దినము ఆ వీధి చివర నేను నిలుచుని వున్నప్పుడు, ''ఆర్మిస్టైస్ డే'' అను పరేడ్‌ను గమనించుచుంటిని. వారా విధముగా నడిచి వెళ్లుచుండగా, నేను నా కుమారుడైన జోసఫ్‌తో నిలచిచూచుచుంటిని. మొదటిగా పురాతన యుద్ధ-ట్యాంకులు వచ్చినవి. ఆ తరువాత చిన్న ట్యాంకులు (యుద్ధ-నౌకలు) వచ్చినవి. ఆ తరువాత షెర్‌మాన్ ట్యాంక్ లు వచ్చినవి. అవి అధునాతన గొప్ప శక్తి గల ట్యాంకులు, వాటి వెనుక సైనికులు వచ్చారు. ఆ తరువాత బంగారు నక్షత్రములను కలిగిన తల్లులు వచ్చారు, ఆ తరువాత ఒక ఓడ-వంటిది ఒకటి వచ్చినది. దాని ముందు భాగమున తెలియబడని సిపాయిలు సమాధి ఉండినది. అక్కడఒక సిపాయి కావలియున్నాడు. దాని ప్రక్కగా ఒక ఓడ నిలిచియున్నది. దాని ప్రక్క నావికుడు నిలిచియున్నాడు. అక్కడొక బంగారు (పథకము) నక్షత్రము కలిగిన తల్లి నిలిచియున్నది. ఆమె తన బాలున్ని పోగొట్టుకొన్నది. అక్కడొక యవ్వన భార్య తన తలను వాల్చి కన్నీరు కార్చుచున్నది. ఆమెకు ప్రక్కగా తన కుమారుడున్నాడు. ఆ చిన్నవాడు కన్నీరు కార్చుచుచున్నాడు. ఆ చిన్న వాడు తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆ విధముగా ఆ సిపాయిలు వెళ్లుచుండగా, "ఎంత దుఃఖకరముగా ఉన్నదని నేను తలంచాను. వారితో పాటు కుంటివారు, వృద్ధులు, సైన్యపు దుస్తులను ధరించి వెళ్లుచున్నారు. వారు ఎంతో గర్వకారణముగా వెళ్లుచున్నారు, ఎందుకనగా వారందరు ఆమెరికనులు."
అప్పుడు నేనిలా తలంచాను, "ఓ, నా ప్రభువా."
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33•
1THS 4:16•
REV 11:11
100ఒక దినమున ఆకాశము నుండి భయంకరమైన ప్రేలుడు కలుగనైయున్నది.'' ''క్రీస్తునందుండి, మృతులైన వారు మొదట లేతురు.'' ఆ పాత నిబంధన పరిశుద్ధులు ఆ తీరమున ఒక గొప్ప ప్రేలుడు కలుగుటకు గాను వేచియున్నారు. ఆ తరువాత వారు ఈ పునరుత్థానములోకి ప్రవేశింతురు. మనము వారితో ఏకమై, ఈ శరీరముల యందు మార్పు చెంది ఆయన మహిమ శరీరమును పోలి ఆకాశములకు ఎత్తబడుదుము. అది ఎటువంటి సమూహపు నడతగా ఉండునో, అలా బయలుదేరి పరలోకము వైపునకు ప్రయాణించుచుండగా ఆ ఎత్తబడుకాలము ముందున్నది. ఓ, ఎంతో గర్వకారణముగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును తమ ఎదపై చల్లబడి వెళ్లుచున్నప్పుడు, దేవుని వర్తమానమందు ఈ ఘడియలో వారు జీవించిరి. సోదరుడా, ఆ ఘడియనే మనము ఎదురు చూచుచున్నాము.
మనము ముగించుచుండగా, గమనించుడి, ఇది రెండవ పునరుత్థానమై యున్నది, మొదటిది గతించినది. ఇప్పుడా రెండవది సమీపములో ఉన్నది, అది వచ్చుచుచున్నది — ఇప్పుడిక్కడ ఉన్నది.
ఆ మూడవ (ఎత్తబడుట) ప్రకటనలోని 11:11 మరియు 12లో ఉన్న ఇద్దరు సాక్షులు. ఈ ఇద్దరు క్రీస్తు ఆత్మను కలిగి తిరిగి వత్తురు. యోసేపు తన సహోదరులకు సాక్ష్యమిచ్చినట్లుగా వారు యూదులకు క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చెదరు. వారి శవములు మూడున్నర దినములు వీధులలో పడియుండునని మీకు జ్ఞాపకముండును; అంతట జీవాత్మ వారిలో ప్రవేశించి వారు ఎత్తబడి పరలోకమునకు కొనిపోబడుదురు. అక్కడ మీరు మూడో ఎత్తబడుటను క్రొత్త నిబంధన యందు కలిగియున్నారు. మూడు పాత నిబంధన ఎత్తబడుటలు ముగించిపోయినవి.
ఇప్పుడు, మనము పరిశుద్ధుల ఎత్తబడుటకై వేచియున్నాము. దానిని గురించి పలుకబడినది. అది అలాగే జరుగును.
దేవుడేదైననూ చెప్పినయెడల, భూమ్యాకాశములు గతించుపోవుననే గాని, వాక్యము తప్పిపోదు.
GEN 1:3•
EXOD 19:9•
EXOD 20:19•
DEUT 18:18
101దేవుడు ఆదికాండము 1వ అధ్యాయమందు, ''వెలుగు కలుగును గాక,'' అని పలికెను. వెలుగు కలుగునప్పటికి ఎన్నో వేల సంవత్సరములు గతించిపోయి ఉండవచ్చు. ఆయన ''ఒక ఈత చెట్టు కలుగును గాక; ఒక టేకు చెట్టు కలుగును గాక; ఒక ఎడారి కలుగును గాక; ఒక పర్వతము ఏర్పడును గాక; ఇది ఏర్పడును గాక,'' అని ఆయన పలికినప్పుడు, ఆయన నోటి నుండి ఆ మాట బయలు వెళ్లి రూపము దాల్చెను. అది ఆ విధముగా కలిగెను. మీరు చూచారా? అది ఆ విధముగానే ఉండవలసియున్నది.
ఒక దినము ఆయన తన ప్రజలను పిలచెను, అగ్నిస్తంభము నుండి మోషే అను ఒక మనిషితో మాట్లాడెను, అది ఒక వెలుగు, పరిశుద్ధమైనది, పరిశుద్ధ అగ్ని. ఆ ప్రజలు మోషేను నమ్మలేదు, అప్పుడు ఆయన (దేవుడు) చెప్పినదేమనగా, ''వారిని ఈ పర్వతమునకు తీసికొనిరమ్ము.''
ఆ ఉదయము ఆ పర్వతము నిండుగా అగ్ని దూమమయముగా ఉండినది, ఉరుములు, మెరుపులు ఆ విధముగా ఉన్నప్పుడు ఆ ప్రజలు దాని చూచి, ''నీవు మాతో మాట్లాడుము, మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము.'' చూశారా?
అప్పుడు దేవుడిలా పలికెను "ఇకపై ఈ ప్రజలతో ఈ విధముగా మాట్లాడను, వారి కొరకు ఒక ప్రవక్తనులేపుదును. అతని ద్వారా నేను మాట్లాడుదును, అతను చెప్పునది జరుగునప్పుడు మీరతనిని నమ్ముడి, ఎందుకనగా అతనితో నేనుందును." ఇప్పుడు, అయన ఆ విధుముగా మాట్లాడెను. అవి నెరవేరునని అయన పలికెను.
2CH 26:18
102ఒక మనిషిగా అక్కడ నిలిచియున్న యెషయాను చూడుడి, ఒక జ్ఞానము గలవానిగా రాజుచే అంగీకరించబడెను, రాజగు ఉజ్జీయతో ఉండెను, ఆయన ఒక గొప్ప రాజు. బోధకుని స్థానమును చేపట్టుటకు వెళ్లి కుష్ఠుతో మొత్తబడెను. ఆ వ్యాపారులతో దానినే నేను చెప్పితిని. ఏ కారణము చేతనైనను ఒక బోధకుని స్థానమును ఆశించవద్దు. వద్దండి! నీవు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో అక్కడే ఉండుము. చూశారా? నీ పనిని నీవు చేయుము, దేవుడేమి చెప్పాడో దానిని చేయుము. నీవు వ్రేలిగా ఉన్నప్పుడు, చెవిగా ఉండుటకు ప్రయత్నించకుము; నీవు చెవిగా ఉన్నప్పుడు, ముక్కుగానో లేకకంటిగానో ఉండుటకు ప్రయత్నించకు. చూశారా? నీ స్థానమందు నీవుండుము.
గత దినమందు వెలువడిన వర్తమానమును మీరు విని యుందురు. ''దేవునికి సేవ చేయుటకు ప్రయత్నించుట దావీదు అభిషేకము చేయబడిన రాజు, ప్రజలందరు ఆర్భాటముతో కేకలు వేయుచున్నారు, నిజమే, అదంతయు బాగున్నది; అయితే దేవుని ప్రవక్తను సంప్రదించలేదు. వారిలో ఒకరు మరణించాడు, సమస్తమును చెదరిపోయినది. దేవుని మెప్పించుటకు ప్రయత్నించకు. దేవుని తరుణము వచ్చు వరకు వేచి యుండుము. ఆయన చేయు విధానములో దానిని రానిమ్ము. ''నేను ఈ గొప్ప కార్యమును ప్రారంభించుదును, దాని వలన ఇది జరుగునని తలంచకు. సోదరుడా, జాగురూకడవై యుండుము.
2SAM 6:6•
1CH 13:1•
MATT 24:35•
MARK 13:31•
LUKE 21:33
103ఇప్పుడు, దావీదు ఎవరో బాగుగా తెలియును, ఆ దినమున నాతాను దేశమందున్నాడు. దావీదు అతనిని ఏ మాత్రము సంప్రదించలేదు. చూశారా? దావీదు సేనలకు అధిపతులను కలిసి సంప్రదించెను. ప్రజలందరు ఆర్భటించుచు, నాట్యమాడుచు, కేకలు వేయుచున్నారు మరియు నాట్యమాడుచున్నారు మరియు [స్పష్టత లేని మాటలు]. వారందరు భక్తి పారవశ్యములో వున్నారు, కానీ అది దేవుని వాక్య క్రమములో లేదు గనుక అది విఫలమైనది. దేవుని వాక్యవరుస మరియు క్రమము లేనిదేదైనా సరే, అది విఫలమగును. కేవలం దేవుని వాక్యమే నిత్యము నిలుచును. ''భూమ్యాకాశములు గతించును, కానీ నా మాటలు నిత్యము నిలుచును.''
ISA 7:14•
ISA 9:6•
JOHN 5:28•
JOHN 11:43
104యోషయాను గమనించండి, అధిక జ్ఞానముగల యవ్వనుడు అక్కడ నిలుచునియున్నాడు. వెంటనే ఆత్మ అతనిపైకి వచ్చినది. అతడు వ్యత్యాసమైన దానిని చెప్పుటలేదు, అతడు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అప్పుడతడు చెప్పినదేమనగా, ''ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. మనకు కుమారుడు జన్మించెను, మనకొక శిశువు జన్మించెను. ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. ఆలోచనకర్త అనియు, సమాధాన రాజనియు, బలవంతుడగు దేవుడనియు, నిత్యుడగు తండ్రి అనియు ఆయనకు పేరు.'' ఆయన రాజ్యము ఆయన భుజముల పైనున్నది, ఆయన పరిపాలనకు అంతము లేదు.'' ఏ విధముగా ఆ మనుష్యుడు జ్ఞానము కలిగి ఒక కన్యక గర్భవతి యగునని చెప్పగలడు? ప్రతిఒక్కరు దాని కొరకు ఎదురు చూచిరి. అదేమో పలుకబడినది; అది ''యోహోవా సెలవిచ్చుచున్నాడు." అది నెరవేరవలసి యున్నది, ఎందుకనగా అది దేవుని వాక్యమైయున్నది. ఆ వాక్యము ఎటువంటిదనగా ఆదికాండమందు ఆయన సముద్రపు అడుగు భాగములో వేసిన విత్తనములు, భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉన్నప్పుడు, అగాధ జలములు దానిని కమ్మియుండదినవి. చూశారా, అది నిజస్థితికి రావలసియున్నది.
ఎనిమిది వందల సం॥ల తరువాత ఒక దినమందు ఒక కన్యక దేవుని బీజమును (వాక్యము) గర్భము ధరించినది, అది ఒక సృష్టించిన బీజము. ఆమె ఒక కుమారుని కనినది. అదే కుమారుడు ఒక దినమందు నిలిచి ఇలా చెప్పాడు, ''లాజరూ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను.'' ఒక మనుష్యుడు నాలుగు దినముల క్రితము మరణించి, అతని శరీరము కుళ్ళి, పడిపోయిన స్థితియందుండగ; అతడు లేచి వచ్చాడు. అంతకు ముందు ఆయన ఇలా చెప్పెను. ''దీనికి ఆశ్చర్యపడవద్దు, గాని నా సమయమింకనూ రాలేదు, అది వచ్చుచున్నది. (ఆమేన్!) అప్పుడు సమాధిలో ఉన్నవారు దేవుని కుమారుని స్వరమును విందురు.'' అప్పుడది పలుకబడినది; అది నెరవేరవలసియున్నది. ఎత్తబడుట అనునది జరుగనైయున్నది.
ఓ, మై!
105చివరిగా కాలిఫోర్నియాలో నా వర్తమానమును జ్ఞాపకము చేసికొనుచున్నాను. నేను మరలా అక్కడకు తిరిగి వెళ్లనని తలంచితిని, అప్పుడు నేను, లాస్‌ఏంజలీస్ పట్టణము సముద్రపు అడుగు భాగములో ఉండునని ప్రవచించితిని. "అది యెహోవా సెలవిచ్చుచున్నాడు," అది అలా జరుగును! దానికి ఆ విధముగా జరుగును; అది (లాస్ ఏంజలీస్) కడిగి వేయబడును; అంతటితో అది ముగిసిపోవును. ఇది ఏ ఘడియగా ఉన్నది? అదెప్పుడు జరుగునో నేనెరుగను, అయితే అది మునిగిపోవును. అలా చెప్పిన వెంటనే భూకంపము వచ్చి దాని కదిలించినది.
మీకు జ్ఞాపకమున్నదా, మీలో అనేకులు అక్కడ నిలిచియున్నప్పుడు, ఆ దినమున ఆ దేవదూత దిగి వచ్చినప్పుడు, ఆ బండ చుట్టూ ఆ గొప్ప వెలుగు, పరలోకము నుండి పడిన అగ్ని, ఆ పర్వతము పైనున్న రాళ్లు చెదరిపోయినవి. ఆ పర్వతము మూడు పర్యాయములు కంపించినది; అప్పుడు నేను చెప్పినదేమనగా, ''తీర్పు పడమటి తీరమును కొట్టుచున్నది.'' రెండు దినముల తరువాత అలస్కా మునిగి పోయినది.
MATT 11:23•
LUKE 10:15
106జ్ఞాపకము చేసికొనుడి, అదే దేవుడు లాస్ ఏంజలీస్ పట్టణము మునిగిపోవునని సెలవిచ్చియున్నాడు. అది అంతటితో ముగిసిపోయినది. అయితే అది ఎప్పుడో నాకు తెలియదు; నేను దానిని మీకు చెప్పలేను.
నాకు తెలియదు గాని నేను దానిని చెప్పుచున్నాను. ఇక్కడ ఉన్న ఈ సహోదరులలో, మోసలీష్ ఒకరు, వీధిలో నన్ను కలిసికొన్నప్పుడు, నేను దానిని తిరిగి చూచినంత వరకు అదేమో నాకు తెలియదు. నేను లేఖనములయందు చూచాను, అక్కడ యేసు అన్నాడు, ''కపెర్నహూమా, కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడినదానా? నీవు పాతాళము వరకు దిగిపోయెదవు, నీలో చేయబడిన అద్భతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచియుండును.'' ఆ తరువాత నూట-ఏబది సం॥లకు కపెర్నహూము నీటి అడుగు భాగమున నేటి వరకు ఉన్నది — సొదొమ ముందుగానే భూమి అడుగు భాగములయందున్నది.
107దేవుని ఆత్మ ఈ కార్యములన్నింటిని పలికి నెరవేర్చినది, అక్కడ ఈ విధముగా చెప్పబడినది. ''ఓ పట్టణమా! కపెర్నహూమా! దేవుని దూతల పేరున నిన్ను నీవు పిలచుకొంటివి. లాస్ఏంజలీస్, ఆకాశమునకు ఎంతగా హెచ్చించుకొంటివి. (అది సాతాను వేరుగాను, స్థానముగాను ఉన్నది. చూశారా?) నిన్ను నీవు హెచ్చించుకొంటివి.''
బోధకులారా, అది వారికి సమాధుల తోటయైయున్నది. మంచివారు అక్కడకు వెళ్లి ఎలుకల వలె మరణించిరి. ఎంత విచారము.
''నిన్ను నీవు దేవదూతల నామమున పిలుచుకొంటివి, నీలో జరిగిన అద్భుతములు సొదొమలో జరిగి యుండిన యెడల నేడు అది నిలచి యుండును. అయితే నీ ఘడియ వచ్చియున్నది,'' మీరు గమనించి చూడుడి. అవి అలా లేకుండిన యెడల నేను ఒక అబద్ధ ప్రవక్తనగుదును. చూశారా? ఆమె అక్కడున్నది, అక్కడ పడియున్నది.
108ఆ రాత్రి నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను… ముందుగా నేను దానిని చూశాను. వధువు యొక్క ముందు దర్శనము చూచాను. నేను అక్కడ నిలిచియుండగా ఒక చక్కని స్త్రీ ఖచ్చితముగా దుస్తులు ధరించి, అలా నడచుకొంటూ వస్తూ వున్నది. ఆ దర్శనములో ఎవరో నా ప్రక్కగా నిలచియున్నారు. వారు ఇలా చెప్పుటను నేను చూచితిని, ''అది వధువు యొక్క పూర్వ దర్శనము,'' ఆమె అలా వెళ్లుచుండగా నేను చూచాను. వారు ఈ ప్రక్కగా వచ్చి వెళ్లారు.
సంఘము మరో ప్రక్కనుండి వచ్చుటను నేను విన్నాను, అక్కడ ఆసియా సంఘము వచ్చినది. ఓ, అది అసహ్యము. ఇక్కడేమో ఐరోపా సంఘము వచ్చుచున్నది. ఓ, మై! అది రాక్-అండ్-రోల్ వేసుకుంటూ వచ్చుచున్నది; ఇప్పుడు వచ్చుచున్నది మిస్ అమెరికా సంఘము. ఆమె పై అసలు బట్టలు లేవు ఆమె కాగితము తగిలించుకొనియున్నది, అవి వార్తా పత్రికలు, వాటి రంగు బూడిద రంగు ఆ కాగితములను వారి ముందు భాగములయందుంచుకొనియున్నారు. వారు రాక్-అండ్-రోల్ నాట్యమాడుచు వచ్చుచున్నారు — అది మిస్ అమెరికా సంఘముగా ఉన్నది.
ఆయన సన్నిధిలో నేనక్కడ నిలిచాను. ''ఓ, దేవా, ఒక సేవకునిగా దానిని మాత్రమేనా చేయగలము. ఓహో!'' అని నేను తలంచాను. నీవు ఏ విధముగా తలంచెదవో, నీకు తెలియును. ''దేవా, నన్ను దాచుము, ఇక్కడ నుండి నేను వెళ్లిపోవుచున్నాను, మేము చేసిన దానిని మేము ఉత్పత్తి చేశాము. అదే మేము చేసినదైతే…'' అని నేను తలంచాను.
109ఆ విధముగా స్త్రీలు అన్ని రకముల నాట్యములతో, కార్యములతో, పొట్టిగా తమ తలవెంట్రుకలను ఉంచుకొని, ముఖమునకు రంగులు వేసికొనిసాగిపోవుచున్నారు. ఆ విధముగా సాగిపోవు వారు క్రీస్తుకు కన్యలుగా ఉండవలసిన వారు… వారు సాగిపోవుచుండగా నేను నా ముఖమును త్రిప్పుకొంటిని, అదెంతో విశ్వాస ఘతకము. వారలా వెళ్లుచుండిరి.
అలా ఏడ్చుకొంటూనేను నా తలను త్రిప్పుకొంటిని. అక్కడ నేను నిలువలేకపోయాను. ఆయనేమో అక్కడ నిలిచియున్నాడు, నేనొక సంఘ సేవకునిగా, ఆయన కొరకు దానిని ఉత్పత్తి చేయగలిగానా, ''ఓ, దేవా, నేను దాని చూడలేను. నన్ను మరణించనిమ్ము. నన్ను గతించిపోనిమ్ము,'' అని నేను చెప్పితిని.
అది వెళ్ళిన వెంటనే — వారిలో ఒకరు వచ్చుచు ప్రతిసారి ఏదో ఒక స్థలమునకు వెళ్లి నిలిచిపోవుచున్నారు, వెళ్లుచుండగా నేను శబ్దమును మాత్రమే చేయుచుంటిని. ఆ తరువాత ''ఆన్ వోడ్ క్రిస్టియన్ సోల్జెర్స్'' అను దానిని వింటిని, అలా చూచుచుండగా పరిశుద్ధ గుంపుగా చిన్న ఆడపిల్లలు చక్కగా బట్టలు ధరించి పొడుగాటి తల వెంట్రుకలు కలిగి సువార్త మెట్టుకు సున్నితముగా, శుభ్రముగా, నడుచుకొంటూ వచ్చుచున్నారు. ఆమెయే వాక్యమైయున్నది. వారిని చూచుచుండగా ప్రతి దేశము నుండి వచ్చిన వారిగా ఉన్నారు. వారు వెళ్లుచుండగా వారిని చూచుచుంటిని, క్రిందికి వెళ్ళుటకు బదులుగా వారు పైకి వెళ్లుచున్నారు. వారిలో ఒకరు, ఇద్దరు ఆ వరుస నుండి తొలుగుట ప్రయత్నించుచున్నారు. అప్పుడు నేను ఇలా కేకవేసాను, ''వరుసలో నిలువుడి'' అంతట ఆ దర్శనము నన్ను విడిచిపోయినది. నేనా గదిలో, ''వరుసలో నిలువుడి'' అని కేకవేయుచూ నిలిచిపోయాను.
110ఎంత ఆశ్చర్యము, అది అంతయు జరిగిపోయినదా? వధువు ముందుగానే పిలువబడినదా? ఈనాడు మనము వెళ్లుచున్నది అదేనా? ఆమె క్రీస్తు స్వరూపమునకు పోత పోయబడవలసి యున్నది, క్రీస్తు వాక్యమై యున్నాడు. అదొక్కటే అసలుసంగతి. చూశారా, అది అక్కడున్నది, వాక్యమందున్నది. చూడండి, దానితో మరేది చేర్చబడుటకు వీలు లేదు. ఒక చేయి స్త్రీది గాను, మరొక చేయి పురుషునిది గాను, ఒక పాదము పందిగాను, మరొకటి కుక్కగాను ఉండుటకు వీలులేదు; అది ఖచ్చితముగా దేవుని వాక్యమైయుండవలసియున్నది, ఆయన వాక్యమై యునట్లు అది ఉండవలెను. వధువు వరునిలో భాగమైయున్నది. భార్య భర్త యొక్క భాగమైయున్నది, ఎందుకనగా ఆమె ఆ భర్తలో నుండి తీయబడినది. హవ్వ ఆదాములోని భాగమైయున్నది. అతని ప్రక్కనుండి తీయబడినది, అటువలెనె వధువు కూడా ఉన్నది. సంస్థల నుండి తీయబడలేదు గాని, ఈనాటి దేవుని వాక్యపు రొమ్మున నుండి తీయబడినది.
111ఎత్తబడుట:
దేవుని బూర ఊదబడును;
క్రీస్తునందుండి మృతులైన వారు లేచెదరు,
ఆయన పునరుత్థాన మహిమలో పాలు పొందెదరు;
ఆకాశమునకు ఆవలి గృహమునకు
ఎన్నుకొనబడిన వారు, సమకూర్చబడినప్పుడు,
ఆవలి ఆ పేర్లు పిలువబడినప్పుడు….
(స్నేహితులారా, అందరము అచ్చట ఉండుటకు ప్రయత్నించుదుము.) దేవుడు మిమ్మును దీవించు గాక. అది పలుకబడినది; అది నెరవేరవలసియున్నది. అది నెరవేరును! జనులు ఎవ్వరు చనిపోవుటకు ఇష్టపడరు. ఎవ్వరూ తప్పిపోవుటకు ఇష్టపడరు. దీనిని మీకు చెప్పనివ్వండి, మీరేమి చేసినప్పటికిని, మీరు ఎంత చక్కగా ఆలయమునకు వెళ్లినను, సంఘమునకు ఎంత నమ్మకముగా ఉన్నను… అది మంచిదే గాని, దాని వ్యతిరేకముగా ఏదీ లేదు. మీరు సంఘమునకు వెళ్లవలసి యున్నది, మీరు అలా చేయుడి; సంఘమునకు వెళ్లుచుండుడి, అయితే అదేమైనప్పటికిని, ఈ మీ పారంపర్యములను విడచి, క్రీస్తులోనికి ముందుకు వెళ్లుడి; ఎందుకనగా ఈ దినములలో ఒక దాని యందు అది మ్రోగనై యున్నది, మీరు మృగపు ముద్రనందు పట్టబడనైయున్నారు. ఆలస్యమైపోయినందున దానిని ఎరుగకున్నారు. అది నిశ్చయము!
112దేవుడు మిమ్ము దీవించును గాక, ఇంత వరకు మిమ్ములను ఆలస్యముగా ఉంచినందుకు చింతించుచున్నాను. మిమ్ములను అధిక సమయము ఇచ్చట ఉంచాలని తలంచుట లేదు. నేను కోరనప్పటికిని నా కొరకు మీరు తీసిన కానుకలు, సోదరుడా… అది దయతో కూడినది. దాని తీసికొని ఈ స్థలమునకు చెల్లించుడి. మిమ్ములను అధిక సమయముగా ఉంచినందుకు, నిర్ణయించిన కాలము కంటెను అధికమైనది. ఇక్కడ నేను కొన్ని కార్యములను కలిగి యున్నాను. ఇక్కడ నా యొద్ద ఎనిమిది లేక పది పేజీల వరకు ఈ ఎత్తబడుటపై వ్రాయబడినది ఉన్నవి, అయితే దానంతటిని చెప్పుటకుసమయము చాలదు.
దేవుడు మిమ్మును దీవించును గాక! యేసు ప్రభువును మీరు ప్రేమించుచున్నారా? ఒక్క నిముషము లేచి నిలిచియుందము. నెమ్మదిగా గౌరవ ప్రధముగా ఉందము. నేను చెప్పిన దానిని జ్ఞాపకము చేసికొనుడి. మనము చివరి ఘడియలో ఉన్నాము.
దేశములు విడిపోవుచున్నవి,
ఇశ్రాయేలుమేలుకొనుచున్నది;
ఆ సూచనలు బైబిలు నందు ముందుగా చెప్పబడినవి.
అన్యుల దినములు లెక్కించబడినవి.
ఓ చెదరిపోయిన దానా, నీ దానికి నీవు తిరిగిరమ్ము,
విమోచన దినము సమీపమై యున్నది,
మనుష్యుల హృదయములు భయము నిలచిపోవుచున్నవి.
ఆత్మతో నింపబడుము.
దీపమును చక్కదిద్దుకొనుము,
నీ విమోచన సమీపమై యున్నది దాని చూడుము,
(అది నీకు తెలియునా?)
అబద్ద ప్రవక్తలు కల్లలాడుచున్నారు.
దేవుని సత్యమును వారు నిరాకరించుచున్నారు.
(అదంతయు నిజమని మనకు తెలియును. లేదా?)
నేనాయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా, ఆయనే నన్ను ముందుగా ప్రేమించెను.
నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షముపైనే.
ఎందరు ఆయనను నిజముగా ప్రేమించుచున్నారు, మీ చేతులెత్తండి. ఈ పల్లవి విని మరలా పాడుచుండగా మీ చేతులను ఒకరితో ఒకరు కరచాలనను చేసుకొనుడని నేను కోరుచున్నాను. అలా చేయుచు, ''యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును గాక,'' అని చెప్పుడి. మనము యాత్రికులము, తెలియని వారమును యాత్రికులము కామా?
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను,
ఎందుకనగా, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను;
నా రక్షణను కొనెను,
ఆ కల్వరి వృక్షముపైనె.
113మీరు ఎత్తబడుటకు ఆశించుచున్నారా? ఎందరలా చేయుటకు ఇష్టపడుచున్నారు? వారు ఇలా చెప్పండి, ''దేవా, నా హృదయమంతటితో నేను దాని చేయుటకు ఇష్టపడుచున్నాను.''
''దేవుని మారని చేతికి సమర్పించుకొనుము.'' ఈ కీర్తన మీకు తలియునా? సోదరీ నీకు తెలియునా? "దేవుని మారని చేతికి సమర్పించుకొనుము."
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము
ఆ నిత్యత్వప కార్యములపై నీ నమ్మకముంచుకొనకుము.
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము
నీవు దానిని ఇష్టపడుచున్నావా?
మన యాత్ర ముగిసినప్పుడు నీవు దేవునికి నమ్మకముగా ఉండిన
నీ నివాసము మహిమ యందు అందముగాను ప్రకాశముగా నుండును. ఎత్తబడుటనీ ఆత్మ చూచుచు!
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము!
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము!
నిత్యత్వపు కార్యములపై నీ నమ్మకముంచుము.
దేవునిమారని చేతికి సమర్పించుకొనుము.
ఇప్పుడు ఒక నిముషము మీ తలలు వంచి యుండవలసినదిగా కోరుచున్నాను.
ఆశించకు ఈ లోకపు వృధా సంపదలను అతి త్వరలో నశించును,
పరలోకపు సంపదను పొందుటకు ఆశించుము,
అవి గతించిపోవు ఎన్నడును!
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము!
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము!
నిత్యత్వపు కార్యములపై నీ నమ్మకముంచుము,
దేవుని మారని చేతికి సమర్పించుకొనుము.
114మీ తలలు వంచి యుండగా దీనిని తలంచుడి, ఈ భూమి నుండి వచ్చిన మనము మన తలలను ఈ ధూళి వైపునకు వంచియున్నాము. ఒక దినమున తిరిగి వెళ్లి పోవుదము. అయితే దేవునికి జవాబు చెప్పవలసిన ఆత్మ మనలో ఉన్నది… నీవు ఎత్తబడుటకు సిద్దముగా లేవని తలంచిన ఎడల, ఒకవేళ ఈ రాత్రికి అది జరిగినయెడల, నీవు ప్రార్థనలో జ్ఞాపకము చేయబడుటకు ఆశించిన యెడల, నీ చేతిని పైకెత్తుము. బలిపీఠమైయున్నది, మీ చేతుల నెత్తుడి. దేవుడు మిమ్మును దీవించును గాక, నిన్ను నిన్ను దీవించును గాక. ఓ, ''బ్రెన్‌హామ్ సాహోదరుడా, నేను సిద్ధముగా లేను. నేను ఒక నిజ క్రైస్తవునిగా ఉండుటకు ఆశించుచున్నాను. నేను ఆ విధముగా ఉండుటకు ప్రయత్నించాను గాని, ఎల్లప్పుడు తప్పిపోవుచునే యున్నాను. నేనెక్కడ ఉండవలసియున్నదో అక్కడ ఉండుటలేదు. కృప జూపుము, దేవా, ఇదిగో నా చేతులెత్తియున్నాను. నా పట్ల కృప జూపుము.'' ఇప్పటికే ఇరువది ముప్పది చేతులెత్తబడినవి. ఈ చిన్న మందలో ఇంకను ఎత్తుచున్నారు.
115ప్రియమైన దేవా, ఆ చేతుల వెనుక వారి హృదయమందు ఏమున్నదో నీవు ఎరిగియున్నావు. ప్రియమైన దేవా, నేను ప్రార్థించునదేమనగా… నేను ఒక దానికి బాధ్యుడను, అదేమనగా సత్యమును చెప్పుట. ప్రియమైన దేవా, వారు రక్షింపబడుటకు ఇష్టపడుచున్నారు. వారు నిజముగానే ఆ విధముగా ఉండుటకు ఆశించుచున్నారు. ఏదో అవేశముతోనో లేక కార్యములతోనో, సంస్థల విధానముతో, సిద్ధాంతములతో ఉండుటకు వారు ఇష్టపడుట లేదు. తండ్రి, వారు దానిని గ్రహించియున్నారు, వారు కల్పితము లేని దేవుని వాక్యమును అంగీకరించుటకు ఇష్టపడుచున్నారు. ప్రతి ఒక్కటి గతించిపోవును, భూమ్యాకాశములు గతించిపోవును, కాని నీ మాట గతించిపోదు. మేము ఆ వాక్యమైనప్పుడు, ఈ భూమి మా క్రిందనుండి గతించిపోయినను మేము తప్పిపోము, ఎందుకనగా మేము ఆ వాక్యమై యున్నాము, పెండ్లి కుమారుని యొక్క వధువుగా ఉన్నాము.
తండ్రీ, వీరిలో ప్రతి ఒక్కరి మనో వాంఛను అంగీకరించుమని నేను ప్రార్థించుచున్నాను. నన్ను మన్నించుము తండ్రీ. ఈ రాత్రి ఎంతో నరముల బలహీనత ఏర్పడినది, ఎంతో ఆలస్యమైనది, వాక్యములు చెదిరిపోయినవి, ఎట్లయినను ఆ గొప్ప పరిశుద్ధాత్మ వాటన్నిటిని క్రమపరిచాడు. అది నీ పరిశుద్ధ మార్గము ప్రకారమే యుండినది. నా హృదయము నుండి వెలువడు ప్రతి దానిని వారి హృదయములకు చేరనిమ్ము. ప్రభువా, నీవు అలా చేయవా? ఎవరెవరు రక్షింపబడవలసి యున్నదో వారందరిని రక్షించి నీ ప్రక్కకు త్రిప్పుము. ప్రభువా, త్వరలో సమీపమున నున్న ఎత్తబడుచుండుటకు మేము సిద్ధపడుదుము గాక. యేసు నామమందు దీనిని నేను అడుగుచున్నాను. ఆమేన్.
దేవుడు మిమ్మును దీవించు గాక. ఇప్పుడు ఈ సభాద్యక్షునికి దీనిని అప్పగించుచున్నాను.