జరుగనైయున్న సంగతులు
1బ్రదర్ బూన్ మరియు సమూహమునకు - తిరిగి ఈ సాన్-బెర్నార్డినో లోనికి నేను వచ్చుట ఎంతో గొప్ప భాగ్యమని నిశ్చయంగా చెప్పుచున్నాను. గతించిన రోజుల యొక్క ఎన్నో గొప్ప జ్ఞాపకములను ఈ స్థలము పట్టుకొనియున్నది. ఇక్కడికి వచ్చుటవలన ఇంకా సజీవ ప్రభావము నిలిచియున్నదని వినుచున్నాము. సంవత్సరాల క్రితమే ఈ విధంగా ప్రభువు మనలను నడిపించెనని తలంచుకొన్నపుడు నిశ్చయంగా ఎంతో ఆనందము మనకు కలుగుచున్నది.
ఇప్పుడే ఆ కార్లు నిలిపియుండు స్థలంలో ఉండగా, జరిగిన సంగతులలో ఒకటి గుర్తుకు తెచ్చుకొనుటకు యత్నించాను. ఫిన్లాండులో శ్రీమతి. ఐసాక్సన్ నాకు అనువాదకురాలుగా నుండెను. ( ఫిన్లాండు దేశపు కూటములలో), మరియు నేను వచ్చే ముందు ఆమె కారు వద్దకు వచ్చి, "నీవు ఫిన్లాండు యొక్క స్వరానివి," అని అన్నది. ఈ చుట్టు ప్రక్కల శ్రీమతి. ఐసాక్సన్ ఉన్నదేమోనని నేను అనుకొంటున్నాను. నాకు తెలియదు. ఈ రాత్రి ఆమె రాదనే నేను అనుకొంటున్నాను. శ్రీమతి. మే ఐజక్సన్? ఆమె ఫిన్లాండు నివాసి.
2మరొక చక్కని సంగతి నాకు జ్ఞాపకమునకు వచ్చినది. ఆంట్లర్స్ హోటల్ అని పిలిచే స్థలానికి దగ్గర్లో నేను భోజనము చేసే ఒక విశ్రాంతి గృహములో పనిచేసే వెయిటర్ గుర్తుకొచ్చినది. అదిప్పుడు సరియేనని నమ్ముచున్నాను. ఆ చిన్న స్త్రీ… ఆమెతో నేను ప్రార్థించుచుంటిని, ఆమె ఒక చక్కని స్త్రీ ,కాని క్రైస్తవురాలు కాదు. కూటమునకు ఆమెను ఆహ్వానించితిని. ఆమె ఒక బిడ్డను పోగొట్టుకొన్నది. ఆమె, తన భర్త విడిపోయారనుకొంటాను. ఆమె తిరిగి తన భర్తను కలియవలెనని లేక వారిద్దరూ ఏకము కావలెనని మేము ప్రార్థించుచున్నాము. ఆ దీన స్త్రీ వస్తే బాగుండునని అనుకొంటున్నాను.
మరో సంఘటన జరిగినది ఎక్కడ నుండో (కారులో ఒక రోజు ప్రయాణము) వచ్చిన ఒక తల్లి తన చేతుల్లో చనిపోయిన బిడ్డను తీసికొనిరాగా, ఆ బిడ్డ తిరిగి బ్రతికెను. ఆమె ఇక్కడ ఉన్నదా? ఆమె ఈ మార్గంలో ఆ చుట్టూనున్న రాష్ట్రం నుండి వచ్చిందనుకొంటాను… అది ఇటు పైగా ఉన్నది. ఆ తల్లిదండ్రులిద్దరూ రాత్రంతా కారు నడుపుకొని వచ్చారు. చనిపోయిన ఆ చిన్న బిడ్డను పట్టుకొని ఆ తల్లి విచారంగా కూర్చొన్నది. "ఎంత విశ్వాసము! నేను ఈ లోకంలోని పెద్ద వేషధారిని అయినా గాని దేవుడు ఆ తల్లి విశ్వాసాన్ని గౌరవించియుండును," అని అనుకొన్నాను. నేనా చిన్నబిడ్డను ఆ విధంగా చేతుల్లో పట్టుకొని ప్రార్ధించగా, బిడ్డకు వేడిపుట్టి కదల నారంభించి చిన్న కళ్ళు తెరచినది, తిరిగి నేను తల్లికి అప్పగించాను. వారు ఎక్కడ నుండో వచ్చారు. వారు పెంతెకోస్తువారని నేను అనుకోను… వారేదో సంఘస్థులు… వారసలు క్రైస్తవులో కారో నాకు తెలియదు. నేను వారినెన్నడూ అడుగలేదు, ఆ బిడ్డ తిరిగి జీవం పొందేసరికి నేను ఎంతో ఉక్కిరి బిక్కిరయిపోయాను.
అప్పటి నుండి సహోదరుడా బూన్, నదిలో నీరు ఎంత తగ్గిపోయినా గాని, మేము నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్న ఆ దేవునినే సేవించుచున్నాము.
3చుట్టూ కలియచూడగా, ఇక్కడ కూర్చొనియున్న సహోదరుడు లిరోయ్ కాప్ కనబడుచున్నాడు. చాలా కాలము తరువాత ఇదే ఆయన్ను మొదటగా చూచుట. పౌల్, అది సరియైనది, లిరోయ్ తండ్రి. అవును. ఓ, మై, రష్యా. అది… ఈ ధైర్య సైనికుడచ్చట ఉన్నాడంటే, అక్కడతడు రాజు పనిమీద యున్నాడు. మన పరిచర్యలవలన ఉత్తేజము పొందితినని ఈ యువ సేవకుడు చెప్పుట ఇక్కడ వింటున్నందుకు నిశ్చయంగా సంతోషంగా ఉన్నది. అదెంతో గొప్ప ఉల్లాసము.
ఇప్పుడు ఈ విధంగా నమ్ముచున్నాను, అదేమనగా… ప్రజలు నిలబడియున్నారు ఎక్కువ సేపు మనముంచకూడదు. ఈ గొప్ప స్వస్థత కూటములను మనము గుర్తు చేసికొనుచున్నాము.
4లిరోయ్ జెంకిన్స్ అను ఒక సోదరుడు ఈ పొరుగున ఎక్కడో ఒక స్వస్థత కూటము జరిగించుచుండినట్లుగా నాకు అర్థమయినది. అది నిజమని నమ్ముచున్నాను కనుక నేను చాలా కృతజ్ఞతతో ప్రభువు అతన్ని దీవించి గొప్ప సేవ ఈయవలెనని నమ్ముచున్నాము.
ఇట్టి సంఘములోనికి ఈ రాత్రి నేను వచ్చుట ద్వారా నిజంగా గౌరవించబడితినని నేను తలంచుచున్నాను. ఆడిటోరియముల కంటే ఆలయములోనే నాకు బాగుండును. ఆడిటోరియములకు నేను వ్యతిరేకినికాను. కాని మీకు తెలుసు, అదొక మూఢనమ్మకము కావచ్చు, లేక నాకు అది సత్యమువలె కనిపించుచున్నది. చూడండి, వారు… ముష్టియుద్దములు, కుస్తీలు, అల్లరి ఆటలు మొదలగునవి జరుగు ఆడిటోరియములలోనికి మీరు వెళ్ళినపుడు, ఆ దురాత్మలు ఆ చోటులో వ్రేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు, అదొక మూఢనమ్మకముగా కనిపించ వచ్చును, కాని కాదు. కాని మీరు ఒక ఆలయములోనికి వచ్చినపుడు, మామూలుగా… అది ఒక ఆత్మీయసంఘమై ఉంటుంది - మీరు ఎంతో స్వేచ్చగా ఉన్నట్టు అనుభూతి పొందుదురు, ఇక్కడ ఉన్నట్లుగా ఉందురు. అక్కడ ఏదో దేవుని సన్నిధి ఉన్నది, ఏదో తేడాగా ఉంటుంది. ఆలయము ఎట్టి ఫలితమునిచ్చునో నాకు తెలియదు గాని, అక్కడే ప్రజలు కూడుకొంటారు. అదే జనులు ఇతర స్థలములోను ఉందురు గాని, ఆ స్థలను చెడ్డది. ఒకవేళ నా ఆలోచన ఆలాగున ఉన్నదేమో, ఏమైనా గాని, ఇక్కడ ఈ రాత్రి ఉండుట నాకు ఆనందముగా నున్నది.
5ఇప్పుడు, మేము మిమ్మును ఎక్కువసేపు ఉంచగోరుట లేదు, ఎందుకనగా మీరు నిలబడియున్నారు. ఇక్కడే ఏదో మరో స్థలానికి రేపు రాత్రికి మనము వెళ్ళుదము. అదెక్కడో నాకు కూడా తెలియదు. అది ఇక్కడే ఉన్న ఆరెంజ్-షో ఆడిటోరియము, రేపు రాత్రి కూటము అక్కడే జరుగును. సేవకులు అనగా సంపూర్ణ సువార్త సేవకులుగుంపు యొక్క ఆహ్వానముపై వారి తరపున ప్రపంచమంతా పర్యటించి ప్రసంగించే కార్యక్రమమలో యున్నాను. కాబట్టి అక్కడ ఒక ప్రాణమిత్రుడు రమ్మని మమ్మును ఆహ్వానించెను. ఈ రాత్రి ఈ ఆలయములో నుండుట సంతోషము.
బైబిలు తెరచుముందుగా ఇప్పుడు… శరీరబలమున్న వారెవరైనా గాని ఈ రీతిగా తెరవవచ్చును (చూచారా?), కాని పరిశుద్ధాత్మ మనకొరకు వాక్యమును తెరువవలసి యున్నది. మన అవగాహనను తెరచి లేఖనములను బయలుపరచవలెను. నేను బైబిలును విశ్వసించుచున్నాను. అది దేవుని వాక్యమని నమ్ముచున్నాను. ఈ వాక్యము ద్వారానే ఒక రోజున భూలోకపు జనులకు తీర్పుచేయబడునని నమ్ముచున్నాను. అది వింతగా కనబడవచ్చును. ఆ అభిప్రాయమును అనేకులు విభేదించుచున్నారు.
JOHN 1:1•
HEB 13:8
6కాథలిక్కు వాడుగా ఒకడు నాకు మిక్కిలి నమ్మకమైన స్నేహితుడు ఇట్లు చెప్పెను, "దేవుడు లోకమునకు కాథలిక్కు సంఘము ద్వారా తీర్పు చేయును." అదే వాస్తవమైనచో మరి ఏ కాథలిక్కు సంఘము ద్వారా? చూచారా? మెతడిస్టు ద్వారా ఆయన తీర్పు చేసినచో, మరి బాప్టిస్టు మాట ఏమిటి? చూడండి? ఒక దానితో ఆయన తీర్పు చేసినచో మరొకటి నశించును. అందుకే అక్కడ ఎంతో గందరగోళమున్నది. దానిని గూర్చి మనము ఆలోచించుటకు వాస్తవమును వెల్లడి చేయు దానినొద్దకు వెళ్ళవలెను. యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చునని బైబిలు చెప్పుచున్నది. ఆయనే వాక్యము. యోహాను 1: "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." హెబ్రీ 13:8 లో - ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని చెప్పబడెను. అది సత్యమని నేను నమ్ముదును.
ఇప్పుడు, నేను నమ్ముదును…
7దేవుడు, ఆదిలో, అనంతుడగు దేవుడై యుండెను. ఆయన అనంతుడు, మనము అంతము గలవారము. ఆయన మనస్సు ఎంతో గొప్పది. మనము మన చిన్న మనస్సుతో ఆయన అనంత జ్ఞానమును అర్థము చేసికొనజాలము. వాక్యములో ఆయన చెప్పిన సంగతులు అందువలననే మనకు వినుటకు వింతగా నుండును గాని, అవి నెరవేరును. ఆయన మాటలెన్నడూ గతించవని నేను నమ్ముచున్నాను; అందుకే, మనము మన యొక్క చిన్న మనస్సుతో ఆయన యొక్క గొప్ప మనస్సును అనువదించజాలమని ఎరుగుదుము. ఆయనే తన స్వంతవాక్యమును అనువదించుకొనును, ఏ అనువాదకుడూ ఆయన కవసరములేదు. వాక్యమును దాని కాలములో బయలుపరచుట ద్వారా ఆయన తన స్వంత వాక్యమును అనువదించుకొనును.
8దేవుడు ఆదియందు - నోవహు ఆయన వర్తమానమునకు ఆనాటి వాక్యమైయుండెను. తరువాత మోషే వచ్చెను. నోవహు యొక్క వర్తమానమును మోషే తీసికొనజాలడు. అతడు ఒక ఓడను నిర్మించి, వారిని ఐగుప్తు నుండి బయటకు రప్పించుటకు నైలునది గుండా ఆ ఓడను తేలచేసి వాగ్దాన దేశమునకు నడిపించజాలడు. అలాగే అతని వర్తమానము నోవహు దీనమునకు పనికిరాదు. అది మోషే ద్వారా సత్యముగా బయలు పరచబడిన దేవుని వాక్యములో భాగము మోషే వాక్యమును యేసు తీసికొనజాలడు. కాథలిక్కు సంఘము యొక్క వాక్యమును లూథర్ తీసికొని పనిచేయజాలడు. లూథర్ యొక్క వాక్యముతో వెస్లీ పనిచేయజాలడు. మెతడిస్టు వాక్యముతో పెంతెకొస్తు వారు రాజాలరు. చూడండి, సంఘము ఎదుగుతూ యున్నది. ప్రతికాలములోనూ ఇక్కడున్న వాక్యములో అది కేటాయించబడినది. కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమును బయలు పరచుచున్నాడు. ఆయనే దానిని బయలుపరచి ప్రత్యక్షపరచుచున్నాడు. వాగ్దానము చేయబడిన దినమునకు దానిని రప్పించి, అది జరుగునట్లుగా చేసి, అది తన వాక్యమని చూపించుచున్నాడు
JOHN 5:46•
JOHN 10:38
9యేసు అది చెప్పెను. "నన్ను నమ్మనియెడల నేను చేయు కార్యములు నమ్ముడని," ఆయన చెప్పెను. ఆయన ఎవరైయున్నారో అవి సాక్ష్యమిచ్చుచున్నవి, చూచారా. ఎవరికైనా వాక్యము తెలిసియున్నచో… ఆయనెంతో భిన్నముగా, వింతగా, వచ్చినందున జనులు ఆయనను నమ్మలేదు, ఎందుకనగా ఆయన నరుడైయుండి దేవునిగా చెప్పుకొనుచున్నాడనిరి. కనుక ఆయన నరరూపధారియగు దేవుడు. దేవుడు క్రీస్తులో యుండి లోకమును సమాధానపరచుచుండెను. దేవుడాయనకు తోడైయుంటేనే గాని ఎవడును ఈ కార్యములు చేయజాలడని నికోదేము చెప్పిన మాటను మన మెరుగుదము, సన్హెంద్రియను దానిని నమ్మెను.
అది వాక్యమని ఇప్పుడు మనము నమ్ముదుము… వారు వాక్యము ఎరిగియుండినచో… ఆయనిట్లు పలికెను, "మీరు మోషేను ఎరిగియుండినచో, నన్నును ఎరిగియుందురు, ఎందుకనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను." మనము చూచుచున్నాము… మెస్సీయా వచ్చినపుడు ఏమి చేయునో వారు వాక్యములోనికి తిరిగి చూచియుండినచో వారు అప్పుడు ఆ రుజువు ద్వారా తెలిసికొని యుండేవారు. దేవుడు క్రీస్తు ద్వారా లోకమును సమాధానపరచుచుండి, మెస్సీయాకు చెందిన వాగ్దానములన్నింటిని నెరవేర్చుచుండెను. ఆయన చేయవలసినవి జరుగుచుండెను. ఆ వాక్యమునకు యేసు సాక్ష్యమిచ్చెను. ఆ దినము కొరకు వాక్యమును జీవింపచేయుచుండెను.
10అదే సంగతిలో నేడు మనమును జీవించుచున్నామని నేను నమ్ముచున్నాను. తాను చేయుదునని ఆయన చెప్పిన వాటిని బయలుపరచుట ద్వారా ఆయన తన వాక్యమునకు సాక్ష్యమిచ్చుచున్నాడు.
ఇప్పుడు, నేడే రక్షణ దినమని ఇప్పుడు మనము ఎరుగుదుము. లోకము నుండి మనుష్యులను దేవుడు పిలచుచున్నాడు. పాపజీవితము నుండి సేవ చేయు జీవితమునకు పిలుచుచున్నాడు . పైనుండి తన ఆత్మను దేవుడు కుమ్మరించి గొప్ప సూచకక్రియలు, అద్భుతముల ద్వారా ఈ నాటి సేవను పెంచి దాచవలసియుండును. ఇది తొలకరి కడవరి వర్షములు కలిసి కురియుచున్న కాలము. గొప్ప సూచక క్రియలు అద్భుతములు ఉండవలసిన కాలమని మన మెరుగుదుము, గొప్ప సంఘ శాఖలలో ఇది తిరస్కరించబడెను. కాని నేను ప్రవేశించిన, తెరువబడిన ఈ ద్వారముల నిమిత్తము వందనములు చెల్లించుచున్నాను, ఇక్కడ మీ యవ్వన సంఘ కాపరికి అది దైవావేశమును ఇచ్చుచున్నది, అది వారిని… నేను వృద్ధుడనగుచున్నాను. నా దినములు లెక్కించబడినవని ఎరిగియున్నాను. ప్రభుని రాకడ ఈ తరములో రానిచో ఆయన వచ్చువరకు ఈ యువకులు ఈ వర్తమానమును ప్రభువు రాకడ వరకు ఈడ్చుకొని పోగలరని ఎరుగుదును… నేనాయనను చూడ నిరీక్షించుచున్నాను… ప్రతిదినము ఆయన కొరకు చూచి, కనిపెట్టికొని ఆ ఘడియకు నన్ను సిద్దపాటు చేసికొనుచున్నాను.
11ఆయన గ్రంథమును చదువుటకు ముందుగా మన తలలు వంచి గ్రంధకర్తతో ఇప్పుడు మాట్లాడుదుము. పరమ తండ్రీ, ఈ రాత్రి సజీవులమైయుండి, ఈ గొప్ప పట్టణమునకు వచ్చియున్నందుకు కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఈ సుందర పర్వతాల మధ్య కూర్చొని పైకి చూస్తూ ఉంటే మంచు మరియు నారింజ పూత ఒకేసిరి వికసించటం చూస్తూండగా మేము నివసించుటకు ఎంత చక్కని లోకాన్ని నీవు ఇచ్చావు. అయితే మనిషి దీనిని చెరిపి, లోకములో ప్రవర్తించుచున్న తీరు చూస్తూంటే తండ్రీ, మాకే సిగ్గు కలుగుచున్నది. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యమును మనుష్యులు చూచునట్లుగా దీనికి ఆవల ఇంకా గొప్పది వున్నదని మీ ప్రమాణాలను ఇక్కడ అందించుటకు ఈ రాత్రి ఇక్కడిక్కడే యున్నాము. తండ్రీ, నీ వాక్యమును చదివి దానివైపునకు తిరుగుచుండగా, దానిని మేము ఈ రాత్రి చూతుము గాక. తండ్రీ, దానిని మేము చదువగలము, కాని ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధాత్మ దానిని మాకు బయలుపరచనిమ్ము, యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
12ఇప్పుడు, బహుశా నోట్సు వ్రాసికొనువారుండ వచ్చును మరియు సేవకునితో పాటు వాక్యము చదువుచూ, ఎప్పటివలెనే వారు చదువుదురు… సంవత్సరాల క్రితం నేను వాక్యములను వ్రాసియుంచెడివాడిని కాను, కాని కొద్దిగా ముసలివాడనైపోయాను. చూచారా, పాతిక సంవత్సరాల క్రితము - ఇటీవల నేను పాతిక సంవత్సరాలు పూర్తి చేసాను. కావున తర్వాత కొద్దిగా బాగోలేదు. ఆయన నన్ను పిలుచు వరకూ చేయుటకు నాకు తెలిసినదంతా ఆయన వాక్య విషయములో చేయుటకు ఇంకా ప్రయత్నించుదును.
JOHN 14:1-7
13ఇప్పుడు, మనము యోహాను సువార్త 14వ అధ్యాయము తీయుదము. బాగా తెలిసిన వాక్యమును చదివి ఈ రాత్రి ప్రభుని చిత్తమయితే దానిలో నుండి ఒక అంశమును తీయుదును, దాదాపు అందరికి ఇది తెలుసును. చాలాసార్లు సమాధి కార్యక్రమములలో దీనిని వాడుతున్నట్లుగా కనబడును, ఒక సమాధి కార్యక్రమములో ఎప్పుడైనా నేను మాట్లాడుట జరిగినచో ఈ లోకమునకు ఇదే చెప్పెదను. దానిని చనిపోయి తిరిగి పుట్టనీయుడి. యోహాను 14:1-7 వరకు నేను గీత గీసి యుంచాను.
మీ హృదయమును కలవరపడ నియ్యకుడి: దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడి.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను.
నేను వెళ్ళి మీకు స్థలమును సిద్దపరిచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును.
నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.
అందుకు తోమా - ప్రభువా యెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని అడుగగా?
యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
చదువబడిన ఆయన వాక్యమును ప్రభువు దీవించును గాక. మనము సంభాషించుకొనుచుండగా మరల ఆయా సమయములలో దానిని మనము చూచెదము. సంఘమునకు చిన్న పాఠమును చెప్పగోరుచున్నాను.
14ఆరిజోనాలోని, యుమాలో గత సాయంత్రము నేను ఉన్నాను. ఇప్పుడు నా గృహము అక్కడున్నది… ఇంతకు ముందు నేనిక్కడున్నపుడు ఇండియానాలోని, జెఫర్సన్-విల్ లో ఉన్నాను. కొద్ది సంవత్సరాల క్రితం ఒక దర్శనము నన్ను ఇప్పుడుంటున్న అరిజోనాకు పంపించినది. ఇప్పుడు మేము అచ్చట నివాసముంటున్నాము. అక్కడ నాకు ఎటువంటి సంఘము లేదు. ఇప్పుడు మనతోనున్న బ్రదర్ గ్రీన్, ఒక గుడారమును స్థాపించెను… అసెంబ్లీస్-చర్చి-ఆఫ్-గాడ్ — డౌన్-టౌన్ అసెంబ్లీస్… వారు కలిసిపోయిరి, వారంతా బ్రదర్ బ్రాక్ మరియు బ్రదర్ గిల్మోర్ తో వెళ్ళిపోయిరి మరియు ఈ సంఘమును విడిచి పెట్టారు; బ్రదర్ పెర్రగ్రీన్, టెక్సాస్ నుండి వచ్చేసి, ఆ స్థలమును తీసికొనెను, అతడు మనతో సహవాసము చేయుచున్నాడు. మూయబడిన ఆ సంఘమును, బ్రదర్ గ్రీన్ తిరిగి తెరచినందుకు మనము సంతోషించుచున్నాము.
15గత రాత్రి యుమాలో "ఎత్తబడుట" అను అంశముపై క్రైస్తవ వ్యాపారస్తుల కూటములో మాట్లాడాను. అట్టి అంశమును మాట్లాడుట వింతగానుండ వచ్చును. కాని అక్కడున్న వారిలో ఎక్కువ మంది క్రైస్తవులు. ఒక సంఘములో, లేదా ఇట్టి చోట అటువంటి విధంగా మాట్లాడుట సరియే. "మీలో ఎందరు క్రైస్తవులు?" అని నేనడిగినచో, దాదాపు అన్ని చేతులూ పైకి లేచును. నీవు ఒక క్రైస్తవుడవు. కావున మనము క్రైస్తవులమైననచో ముందుగానే ఒక విధముగా గ్రహింపును పొందవలసియుండునని నేను అనుకొనుచున్నాను. దానిని మనము ఊహించుట కాదు; మన గమ్యము ఏమిటో మనకు తెలుపబడినది.
ఈ రాత్రికి దాని పైనే నేను మాట్లాడగోరుచున్నాను. అంశము: "జరుగనైయున్న సంగతులు." గత రాత్రి "ఎత్తబడుట," అను అంశము పై మాట్లాడాను. కావున ఈ రాత్రి, ఈ అంశముపై మాట్లాడాలని కోరుచున్నాను, నేను గత రాత్రి వర్తామనముతో బహుశా దీనిని కొంత కలుపుదును. ఇప్పుడు, ఎత్తబడుట సంభవించనై యున్నది; అది మనకు తెలియును. అది భవిష్యత్తులో జరుగనైయున్నది.
JOHN 14:1
16ఇప్పుడు యేసు ఇక్కడ మాట్లాడుచున్నది… మనకు స్థలము సిద్ధపరచుటకు ఆయన ముందే వెళ్ళిపోయెను. "మీ హృదయములు కలవర పడనియ్యకుడి." ఇక్కడాయన యూదులతో మాట్లాడుచున్నాడు. "మీరిపుడు దేవునియందు విశ్వాసముంచుచున్నారు. నా యందు విశ్వాసముంచుడి. దేవుని నమ్మినట్లుగానే నన్నును నమ్ముడి, ఎందుకనగా నేను దేవుని కుమారుడను," అని చెప్పెను. చూచారా? మరియు దేవుడు… ఇంకో మాటలో, "తండ్రి నేను ఏకమైయున్నాము. నాలో తండ్రి నివాసము చేయుచున్నాడు. నేను చేయు క్రియలు, నాయందు నివాసమున్న తండ్రి జరిగించుచున్నాడే గాని నేను కాను; ఆయనే క్రియలు చేయుచున్నాడు." క్రీస్తులో దేవుడు ఉండి లోకమును తనతో సమాధాన పరచుచుండెను.
JOHN 14:2
17ఒక గొప్ప సహజాతీతమగు దేవుడున్నాడని నమ్మునట్లు యూదులకు తరముల నుండి నేర్పించబడుచున్నది. అందువలన ఆలాగు నమ్ముట వారికి సులభము. కాని ఆ దేవుడు క్రిందికి దిగివచ్చి తన కుమారుడగు యేసుక్రీస్తు అను వ్యక్తిలో ప్రత్యక్షమాయెనని ఆలోచించుట, అనగా — దేవుడు ఒక శరీరములో నివాసముండెనని అర్థము చేసికొనుట వారికి కొద్దిగా కష్టమైన కర్యముగా ఉండెను. కాని ఆయనట్లు చెప్పెను, "మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను." యేసు యొక్క జీవితము ఈ లోకములో సమాప్తమై యుండెను. గొప్ప సూచన క్రియలు, అద్భుతముల ద్వారా, ఏ బైబిలులోని వచనములయితే ఆయనను గూర్చి చూపించినవో, ఆయన తానే అని, శరీరధారియైన యెహోవా తానే అని ఆయన జనులకు చూపించి రుజువు చేసెను. బయలుపరిచిన దేవుడు తానే అని ఆయన రుజువు చేసెను. "నా జీవితము పరిసమాప్తమగుట మీరు చూచినపుడు, అది ఒక ఉద్దేశము కొరకు సమాప్తమగుచున్నదని తెలిసికొనుడి. మీ కొరకు ఒక స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను. నేనుండు చోటులో మీరుండులాగున స్థలము సిద్ధపచ వెళ్ళుచున్నాను," అని ఆయన చెప్పెను. కాబట్టి తన జీవితము మరణమువలన సమాప్తము కాదని యేసు తన శిష్యులకు చెప్పుచుండెను.
18ఇది సమాధి కార్యక్రమపు అంశమని చెప్పాను, గుర్తించుకొనండి, మరణము మన ఎదుటనే ఉంచబడినది. మనకు ఏమి తెలియదు… ఈ భవనములోనున్న వారిలో కొందరు శరీర జీవితములో సజీవముగా బయటకు వెళ్ళుట జరుగక పోవచ్చును. అనగా అది అంత అనిశ్చితముగా నున్నది. మరో అయిదు నిమిషములలో యవ్వనత్వము, ఆరోగ్యముతో నున్న జనులు శవములుగా మారవచ్చును. అది నిజము. మరల అయిదు నిమిషములలో మనందరము మహిమలో నుండవచ్చును. మనకు తెలియదు. అది దేవుని యొక్క చేతులలో ఉన్నది. ఆ సమయమెప్పుడు వచ్చునో, యేసు, తనకే తెలియదని చెప్పెను. తండ్రి యొక్క చేతులలో మాత్రమే అది ఉన్నది.
మరణము తరువాత జీవితమున్నదని ఆయన వారితో చెప్పుచుండెను. ఎందుకనగా "నేను వెళ్ళి స్థలము సిద్ధపరచుదును." వారిని చేర్చుకొనును. (ఆయన వారితో మాట్లాడుచున్నాడు.) ఈ జీవితము ముగిసిన పిదప ఒక జీవితమున్నదని ఆయన చూపించుచున్నాడు. ఈ జీవితము అయిపోయిన పిదప మరొక జీవితములో ప్రవేశించుదుమని ఎరుగుట మనకెంతో ఆదరణ నిచ్చును. మీరు వృద్ధులగుచున్నపుడు అది మరింత వాస్తవముగా కనిపించును. నీ జీవిత దినములు సమాప్తమగు దశకు చేరుచున్నవని నీవు చూడనారంభించినపుడు, అన్నీ సర్దుకొని ఆ గొప్ప సంఘటనకు సిద్ధపడెదవు. మరో లోకములో, మరొక స్థలములో ఈ జీవితమే కొనసాగును.
19నీ జన్మ ఇక్కడ ముందుగానే ప్రణాళిక చేయబడెను. మీరది నమ్ముచున్నారనుకొంటాను. ఇక్కడి మన పుట్టుక ముందు ప్రణాళికను బట్టి జరిగినదని మీర౦దరూ ఎరుగుదురు. ఒక కట్టు కథ లేక ఒక ఊహను బట్టి నీ ఉనికి ఇక్కడ ప్రారంభము కాలేదని నీవు ఎరుగుదువా? ప్రతిది కూడా జగత్తు పునాది వేయబడకముందే దేవుని ద్వారా ముందుగా ఉద్దేశించబడినది. అనంతుడగు దేవుడెరుగును… ఆయన అనంతుడు అని పిలువబడవలేనన్నచో, ఈ భూమి పైకి రానున్న ప్రతి ఈగ, అదెన్ని సార్లు తన కను రెప్ప వేయునో అనే దానిని ఆయన ఎరిగియుండవలెను. అది అనంతము. చూచారా? నీవు, మనము, మన చిన్ని మనసుతో అనంతము యొక్క అర్థపు లోతును గ్రహించజాలము. ఆయన అనంతుడగు దేవుడు. ఆయన అన్ని సంగతులు ఎరుగును, కాబట్టి ఏదీ క్రమము తప్పిరాదు.
దేవుని వాక్యమును మనము ఎరిగియున్నచో మనమెక్కడ జీవించుచున్నామో మనమెరుగుదుము. మనము జీవించుచున్న ఘడియను ఎరుగుదుము. ముందు ఏమి యున్నదో ఎరుగుదుము. ఏది దాటియున్నామో మనమెరుగుదుము. దేవుని యొక్క గ్రంధము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. యుగములన్నింటిలోనూ ఆయన క్రియలు అనగా ప్రకటన గ్రంధము వరకును, తరువాత రానున్న ఆయన వాగ్దానములు… కనుక ఆయన వాగ్దానములన్నియు నిజము. స్థిరపరచకుండా దేవుడు ఏ మాటను పలుకడు. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరవలసియున్నది.
జగత్తు పునాది వేయబడక ముందు…
GEN 1:3•
ISA 7:14•
ISA 9:6•
AMOS 3:7•
JOHN 14:2,3
20"దేవుడు తాను చెప్పిన దానిని తిరిగి చెప్పునని," కొందరు ప్రజలు అంటూ ఆదికాండమును కలగలుపు చేయుదురు. కాదు, అది మీ యొక్క అపార్ధము. చూడండి, ఆదియందు దేవుడు, "కలుగును గాక! కలుగును గాక! కలుగును గాక !" అని చెప్పెను. లోకము ఒక అగాధ కూపములో యుండెను. "వెలుగు కలుగును గాక!" అని ఆయన పలుకక పూర్వము కొన్ని వందల సంవత్సరములకు ముందే అది పైకి రాకుండా యుండియుండెను; కాని ఆయన చెప్పినపుడు, అది జరిగెను. ఆ రీతిగానే ఉండి తీరాలి, చూచారా. ఆయన తన మాట పలికెను. ఆ విత్తనములు నీటి క్రింద యుండెను. ఆయన భూమిని ఎండిపోజేసి పిదప విత్తనములు పైకి తెచ్చెను. ఆయన చెప్పిన ప్రతిది తప్పక నెరవేరవలెను.
ఆయన ప్రవక్తల ద్వారా పలికెను… గత సాయంకాలము దానిని చెప్పాను. మనము యెషయాను తీసికొందుము, కన్యక గర్భవతియగును అని అతడు పలికెను. ఒక కన్యక గర్భవతియగునని చెప్పిన మనషిని గూర్చి వారందరు ఏమి అనుకొని యుందురు? కాని అతడు… దేవుని ప్రతిబింబించేవాడు ఒక ప్రవక్త. తన స్వంత మాటలను పలుకలేనివానిగా అతడు తయారు కాబడెను. అతడు మాట్లాడునది దేవుని యొక్క మాటలే కావలెను. అతడు కేవలము ఒక ప్రతిబింబించువాడు. అతడు దేవుని యొక్క మాట్లాడు సాధనము. కాబట్టి అతడు, "కన్యక గర్భవతియగును" అని చెప్పెను; బహుశా అతనికది అర్థమయియుండదు, కాని అతని ద్వారా దేవుడు దానిని పలికెను, ఎందుకనగా తన దాసులగు ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియు చేయనని ఆయన వాగ్దానము చేసెను. అతడు పలికిన ఆ మాట ఎనిమిదివందల సంవత్సరముల తరువాత నెరవేరెను, అయితే తప్పక అది నెరవేరబడవలెను.
చివరగా, దేవుని యొక్క ఆ మాటలు ఒక కన్యక గర్భమందు పడగా, ఆమె గర్భము ధరించి ఇమ్మానుయేలును కనెను. "మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను. ఒక శిశువు మనకు పుట్టెను. ఆయనకు ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధానాధిపతి, నిత్యుడగు తండ్రి," అని పేరు పెట్టబడును. అది ఆ విధముగా ఉండవలసియుండెను, ఎందుకనగా దేవుడు తన ప్రవక్త నోటి ద్వారా ఆలాగు పలికెను. దేవుని యొక్క మాటలన్నియూ నెరవేర్చబడవలెను; కనుక యేసు స్థలము సిద్దపరచి తన కొరకు ఒక ప్రజలను చేర్చుకొనుటకు వెళ్ళియుండెనని మనకు తెలియును. మనము ఆ విధముగా చేర్చుకొనే జనులలో భాగమై ఉన్నామని ఈ రాత్రి నమ్ముచున్నాను. అది అట్లు కాని యెడల, స్నేహితుడా, దేవుడు ఒక మార్గమును, షరతును నీవు కోరినచో అందులో చేర్చబడుటకు అనుగ్రహించెను. నీవు స్వేచ్ఛాజీవివి; నీవు కోరిన విధముగా ప్రవర్తించగలవు.
కాని ఇప్పుడు గమనించండి! ఇప్పుడు, ఆ రానున్న లోకములో… ఒక లోకము రానున్నది.
HEB 7:1,2,9,10
21నీవిక్కడ పుట్టిన ప్రకారమే, అని చెప్పాను గదా? నీవు సిద్ధపరచబడితివి; నీవిక్కడుందువని దేవునికి తెలియును. నీ తల్లిదండ్రులు చేసిన క్రియలు నీవెరుగుదువు. తరము నుండి తరమునకు అది దర్శించబడుట జరుగలేదని జనులు అనుకొందురు గాని అది వున్నది.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో అనుకొంటాను, ఇట్లు చెప్పెను. (దానిని వ్రాసినవాడు పౌలు అని నమ్ముచున్నాను) రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్నపుడు, అబ్రహాము తన దశమ-భాగములను మెల్కీసెదెకునకు చెల్లించిన గొప్ప సంఘటన గూర్చి చెప్పబడెను. రాజులను సంహరించి తిరిగి వచ్చుచూ అబ్రహాము మెల్కీసెదెకును కలిసికొన్నపుడు, ఆబ్రహాము యొక్క గర్బములో లేవీ ఉండెను. పితరుడగు అబ్రహాము గర్భములో లేవీ ఉన్నందున లేవీ కూడా ఈ దశమ-భాగము చెల్లించనట్లుగా లెక్క వచ్చెను. జనుల యొక్క పాపమును ఆయన వారి పిల్లల పిల్లల తరము మీదికి తీసికొని వచ్చును, ఆయన మాట వినని వారికిది వర్తించును.
22చూచారా, మీరందరూ దేవునిచే ముందుగా ఉద్దేశించబడిరి. దేవుని విషయములో హఠాత్తుగా ఏదో జరిగినదనుటకు వీలులేదు. అంతటిని గూర్చి ఆయనకు తెలియును. అంతా ముందు ప్రణాళిక. నీవు ఈ రాత్రి ఇక్కడుందువని ఎన్నో తరములకు ముందే ఆయన ఉద్దేశించెను. నీవది ఎరుగుదువా? ఆలోచించు! నీవు ఒకప్పుడు (దీనిని మరల చెప్పెదను) నీవు ఒకప్పుడు నీ తండ్రి యొక్క జన్యువులో నుంటివి. ఆ సమయములో అతడు నిన్ను ఎరుగడు. నీవును అతనిని ఎరుగవు. కాని చూడు, నీవు ఆ తరువాత నేలలో పడితివి. పరిశుద్ద వివాహా బంధము ద్వారా తల్లి గర్భములో ఉంచబడితివి. అప్పుడు నీవు నీ తండ్రి పోలికలో ఒక వ్యక్తిగా రూపొందితివి. అప్పుడు అక్కడ సహవాసముండెను.
JOHN 1:1,14
23నీవు దేవుని కుమారునిగా లేక కుమార్తెగా నుండుటకు ఒకే మార్గము… ఎందుకనగా నీవు నిత్యజీవమును పొందవలసియున్నావు. ఒకే ఒక విధమగు నిత్యజీవమున్నది, అది దేవుని జీవము. ఒకే ఒక రకమగు నిత్యజీవము: అది దేవుడే. అక్కడ నీవు దేవుని కుమారునిగా ఉండవలెనన్నచో ఎల్లపుడూ ఆయనలో నీవు నిలచియుండవలెను. నీ జీవితము యొక్క జన్యువు, ఆత్మీయ జీవితము, ఈ రాత్రి తండ్రియగు దేవునిలో సూక్ష్మ కణమనునది లేక పూర్వమే ఉన్నది. చూచారా? నీవు ఒక దేవుని కుమారునిగా దేవుని జన్యువులో నున్న జీవపు ప్రత్యక్షత తప్ప మరొకటి కావు. ఈ కాలమును వెలిగించుటకు. నీలోనికి వాక్యము వచ్చిన తరువాత నీవు వ్యక్తము కాబడితివి. నీవు, నీలో దేవుని జీవమును వ్యక్తము చేయుచున్నావు, ఎందుకనగా నీవు దేవుని యొక్క కుమార్తె లేదా కుమారునిగానున్నావు. కాబట్టి… నేను చెప్పునది గ్రహించారా? చూచారా? నీవిపుడు… తయారు కాబడితివి… ఈ దేశమునకు, ఈ ప్రజలకు, నీవు నివసించి సహవాసము చేయుచున్న పొరుగువారికి దేవుని వ్యక్తము చేయవలసిన బాధ్యత నీకు ఉన్నది. కాబట్టి ఈ రాత్రి నీవు ఇచ్చట కూర్చొనియున్నావు.
నీవెక్కడున్ననూ, నీ విక్కడ ఉందువని దేవుడెరుగును, ఎందుకనగా నీవు ఆయన యొక్క జన్యువులలో లేదా ఆయన పోలికలలో ఒకటిగా ఉండవలసి యున్నావు. నీవట్లు ఉండవలసియున్నావు. నీవెప్పుడైనా… నిత్యజీవము పొంది యుండినచో అప్పుడు ఎల్లపుడూ నీలో నిత్యజీవముండును. నీవిక్కడ ఉందువని లోకపు పునాది వేయబడకముందే దేవుడు ఎరిగియుండెను. వాక్యము — లేదా నీరు, వాక్యపు నీరు నిన్ను కడిగినపుడు నీ వొక వ్యక్తిగా రూపొందితివి. నీవు నీ భూలోకపు తండ్రితో ఉన్నట్లుగానే, తండ్రియగు నీ దేవునితో సహవాసమును కలిగియున్నావు, చూడండి. మీరు రాజు యొక్క పౌరులు, పౌరులు కారు, కాని మీరు పిల్లలు, ఆ నిత్యజీవము మీలో నివాసము చేయుచున్నచో మీరు సజీవ దేవుని పిల్లలు, కుమారులును మరియు కుమార్తెలునైయున్నారు.
JOHN 1:1,14
24ఇప్పుడు, అలాగయితే యేసు దేవుని యొక్క సర్వపరిపూర్ణత. శరీరరీతిగా ఆయన దేవత్వము యొక్క సర్వపరిపూర్ణతయై యున్నాడు. కాబట్టి ఆయన భూమి మీదకు వచ్చి శరీరధారిగా ప్రత్యక్షమయినపుడు, ఆయన వాక్యము గనుక నీవు అపుడే ఆయనలో ఉన్నావు.
ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.
వాక్యము శరీరధారియాయెను; కాబట్టి, మీరాయనతో నడిచితిరి. ఆయన భూమి పైనున్నపుడు మీరాయనలో నుండిరి. మీరాయనతో శ్రమ పొందిరి. ఆయనతో చనిపోయిరి; మీరాయనతో సమాధిచేయబడిరి. ఇప్పుడు ఆయనతో పాటు లేచి, దేవుని గుణలక్షణములతో బయలుపరచబడి పరలోక స్థలములందు కూర్చుండబెట్టబడిరి. ఎప్పుడో తిరిగి లేచిరి. నూతన జీవమునకు పునరుత్థానులైరి. క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థానములందు కూర్చుండ పెట్టబడిరి. ఓ, సంఘమా, ఈ దినములలో అదెంతో భావముగలది. అది మనకెంతో ఆర్థవంతమైనది. యేసుక్రీస్తులో మనము చక్కగా కూర్చుండ పెట్టబడియున్నాము.
25ఇప్పుడు, మనము ఆ దేవుని పోలికమైనచో, మత సిద్ధాంతముల ద్వారా జీవించజాలము. శాఖా తత్సము ద్వారా జీవించజాలము; మనము తప్పక వాక్యము ద్వారా జీవించవలెను, ఎందుకనగా భార్య - భర్తలో భాగమైయున్న ప్రకారము వధువు, పెండ్లికుమారునిలో భాగము. కాబట్టి మనము తప్పకుండా ఆ వాక్యవధువుగా వుండవలెను. ఆ వాక్యవధువు ఏమిటి? ఈ ఘడియ యొక్క ప్రత్యక్షత — వధువు. ఒక సిద్దాంతము లేదా శాఖ కాదు గాని, దేవుని యొక్క సజీవ వాక్యము, దేవుని యొక్క సజీవ స్వరూపమై దేవుని యొక్క గుణలక్షణములను లోకమునకు చూపించుచూ నేడు మనము జీవించుచున్న ఘడియలో వ్యక్త పరచబడవలసిన వధువును రూపొందించుచున్నది.
మనము వ్యక్తము చేయుచున్న గుణలక్షణములను మార్టిన్ లూథర్ వ్యక్తపరచలేకపోయేను, ఎందుకనగా అది ఆరంభమైయుండెను, పునరుత్థానము, గోధుమ గింజ భూమిలో పడినట్లుండెను.
MATT 16:17,18
26ఇప్పుడు, దీనిని తిరిగి చెప్పెదము. మీరు బహుశా ఆ గ్రంథము చదివియుందురు. ఆ జర్మను దేశస్తులు నన్ను హేళన చేసి వెర్రివారందరిలో కంటే పెద్ద వెర్రివాడినని చెప్పెను. అతడు పూర్తిగా దేవుని సంగతులన్నింటికి వ్యతిరేకి, దేవునిని కూడా హేళన చేసెను. "ఎర్ర సముద్రమును తెరచిన దేవుడు తన ప్రజలను బయటకు రప్పించియుండినచో, మరి ఈ అంధకార యుగములలో ఆ ప్రజలు శ్రమపడి, మరణించుచూ, ఆ చిన్న పిల్లలు సింహాల ద్వారా తినివేయుచుండగా, పొట్టమీద చేతులు వేసుకొని కూర్చుండి ఎలాగు అనుమతించగలడు," అని చెప్పెను.
మొత్తము కార్యక్రమము, మొత్తము సంఘము దైవ ప్రత్యక్షత మీదన నిర్మించబడినది. మత్తయి 16 అధ్యాయములో యేసు చెప్పెను. "రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రియే దీనిని బయలుపరచెను." అది ఏమిటి? ఆయనెవరో దానిని తెలుపు ప్రత్యక్షత. "ఈ బండ పై నేను నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువజాలవు." ఈ ఘడియలోని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, మరో ఘడియలో ఆయనేమైయుండెనో అన్నది కాదు. ఇప్పుడాయన ఎవరు అన్నది. పూర్ణ వ్యక్తిత్వములోనికి ఆ వధువు ఎదుగుచున్నదని బైబిలు వ్యక్తము చేయుచున్నది. కాబట్టి క్రీస్తు అను గోధుమగింజ భూమిలో పడి చావవలసియుండినపుడు, ఆలాగే వధువు కూడా అంధకార యుగములలో భూమిలో పడిపోవలసియుండును గదా. భూమిలో పడిన ప్రతి విత్తనము తప్పక చనిపోవలెను, లేనిచో అది ప్రత్యుత్పత్తిని చేయజాలదు. పరిశుద్ధాత్మను పంపుట ద్వారా పెంతెకోస్తు దినమున ఆయన స్థాపించిన గొప్ప సంఘము హతసాక్షులుగా శ్రమపడి ధూళిలోనికి పోయి అంధకార యుగములో భూమిలో యుండి లూథర్ యుగములో మరల బయటకు వచ్చి, ఈ చివరి దినమున యేసుక్రీస్తు యొక్క వధువుగా పూర్ణ వ్యక్తిత్వము పొందుకొనుచున్నది. చూచారా? మరో మార్గము లేదు….
JOHN 14:2
27కాబట్టి ఎత్తబడునపుడు వధువు బయటకు వచ్చును, మరియు అదంతా దేవునిచే ముందుగా రూపొందించబడినది, అంతా సంకల్పించబడినది. ఆది నుండియు, ఆయన ప్రతి మనిషిని, ప్రతి స్థలమును, ఎవరు కూర్చుందురో, దాని గూర్చి అంతయూ ఆయన ఎరుగును. అదంతయూ ముందుగా సంకల్పమాయెను. అది ఇక్కడుండునని దేవుడెరుగును. ఆయన దానిని ఆ విధంగా తయారుచేసినపుడు, మనకొరకు స్థలము సిద్దపరచవెళ్ళెను. అక్కడికి మనము వెళ్ళినపుడు, ఈ రాత్రి ఎట్లు సిద్దపరచబడినదో, అదే రీతిగా అంతయూ సిద్దపరచబడును. ఈ ఘడియ సిద్దపరచబడినట్లుగానే ఉండును.
ఆయన గొప్ప ముందస్తు జ్ఞానము వీటన్నింటిని ఆయనకు చెప్పును, ముందస్తు జ్ఞానము వలన.
28ఆయన సర్వాంతర్యామి, ఎందుకనగా ఆయన సర్వజ్ఞాని; సర్వజ్ఞాని ఎందుకనగా ఆయన సర్వాంతర్యామి. కాబట్టి ఆయన తన ముందస్తు జ్ఞానము ద్వారా… ఇప్పుడు, ఆయన భూమి మీద గాలివలె ఉండజాలడు, ఎందుకనగా ఆయన ఒక జీవి. ఆయన ఒక కట్టు కథ కాదు; ఆయన ఒక జీవి. ఆయన నివసించును; ఆయన ఒక ఇంటిలో కూడా నివసించును. పరలోకమనబడు చోటులో ఆయన నివసించును; కాబట్టి ఆయన తన సర్వవ్యాప్తి ద్వారా — సర్వజ్ఞానిగా నుండుటచే, అన్ని సంగతులను ఎరిగియున్నాడు. అన్నింటినీ ఆయన ఎరిగియున్నాడు గనుక ఆయన సర్వాంతర్యామి.
ఇప్పుడు, మీరు పుట్టిన నాటినుండి ఎదుగుచున్నారు… మీరు పుట్టి ఈ లోకములోనికి వచ్చినపుడు, ఈ లోకములో ఇక్కడ ఉందురని దేవునికి తెలియును. మీరు బాల్యము నుండి పరిపక్వతకు ఎదిగియున్నారు. మీ యవ్వనత్వములో, యవ్వన స్త్రీ పురుషులుగా, పిల్లలుగా నున్నపుడు కార్యములు ఎంతో వింతగా కనబడేవి, ఇప్పుడు వాస్తవముగా కనిపించును. చిన్నబిడ్డగా నున్నప్పుడు నీవు దానిని అర్ధము చేసికొనజాలవు. కానీ ఇప్పుడు నీవు పెద్దవానివయినప్పుడు అర్దము చేసికొనుచూ, అంతా చక్కగా ఏర్పాటు చేయబడినదని గమనించెదవు. ఇప్పుడు నీకు అది నిజంగా అర్ధవంతముగా కనబడును.
29నీ ఆత్మీయ పుట్టుకలోనూ అలాగే యున్నది. నీవు చిన్న బిడ్డగా వేదిక నొద్దకు వచ్చి క్రీస్తుకు నీ జీవితమును ఇచ్చినపుడు అర్థముకాని వాటిని నీవు చేసెదవు. అట్టి వింతసంగతులు నీవు చేసెదవు. ఎందుకలా చేశానా అని ఆశ్చర్యపడెదవు. కాని కొంతకాలమైన పిదప నీవు పరిపక్వత చెంది, పరిపక్వ క్రైస్తవునివయినపుడు దానిని నీవు అర్థము చేసికొందువు, చూచారా. ఏదో నిన్ను పట్టుకొని పైకిలేపును మరియు అప్పుడు అది నీవెందుకు చేయవలసి వచ్చెనో చూచెదవు. నీ ఆత్మీయ పుట్టుక… లేక, నీ శరీర పుట్టుక - నీ ఆత్మీయ పుట్టుకను సూచించును. ఎట్లు నీకది తగియున్నది. నీ జీవితములో నీవు పెరుగుచుండగా అంతయూ చక్కగా సరిపోవుచుండును, ఎందుకనగా నీవు దానికొరకు తయారు కాబడినావు. సువార్త కూటములోనికి, గుడారపు కూడికలోనికి లేదా ఎక్కడో మూలనున్న చిన్న సంఘములోనికి, లేదా మరెక్కడికో నీవు వచ్చి నిలబడిన రాత్రి ఆశ్చర్యకరము కాదా? ఒక ప్రసంగీకుడు ఏదో అంశముపై బోధించగా, నీవు బలిపీఠముపై పడితివి. చూచారా, చూచారా? దేవుడు దానిని లోకపు పునాది వేయకముందే ఎరుగును, చూడండి. అప్పుడెందుకలాగు చేశావో నీకు ఆశ్చర్యముగానే ఉండును, కాని ఇప్పుడు నీవు అర్థము చేసికొంటివి. నీవు అర్థము చేసికొంటివి. ఏమి జరిగెనో తెలిసికొంటివి. ఈ జీవితములో అన్నీ సరిపోయినట్లుగానే రానున్న జీవితములోనూ సరిపోవును. నీవు పరిపక్వత చెందుచుండగా, ఈ లోకము దాని జీవము అభివృద్ధి చెందుచున్నట్లు కనిపించును. అంతా నీతో చక్కగా సాగిపోవుచున్నట్లే కనిపించును.
30ఆకస్మిక పరిణామము వలన ఇక్కడికి వచ్చుట జరిగినదని చెప్పే వ్యక్తిని, ఆ మాటను నేను నమ్మను. కాస్త ఆలోచించు, నీవు లోకమునకు వచ్చినపుడు నీ కొరకు అంతా ముందుగా సిద్ధపాటు కావలసియుండెను. లేదా నీ కొరకు సిద్ధపరచబడెను. ఈ మంచి వాటన్నింటినీ మనకొరకు సిద్దపరచియుంచిన దేవుని, ఎందుకు మనము నమ్మలేకపోవుచున్నామో నాకసలు అర్థమగుట లేదు. నేడు మనముంటున్న ఈ గందరగోళ స్థితిలోనికి ఆయన తెచ్చినను, ఇక్కడి జీవితమునకు మేలులను మనకు సిద్దపరచియుంచెను, రానున్న వాటికి కూడా సిద్ధపరచియుంచిన ఆయనను ఎంతగా మనము విశ్వసించవలెను (చూచారా?), నిత్యజీవ సంగతులు. చాలా వింతగా కనబడుచున్నదని నేను అందును.
31మా అమ్మ నాతో చెప్పినట్లుగా పరలోకము ఉండునని నేను తలంచను. దానిలో నుండి సంఘము ఇంకా ఎంతో ఎదిగినదని నమ్ముచున్నాను. అదెట్లుండునో ఆలోచించుట… ఒక వంద లేదా రెండు వందల సంవత్సరాల క్రితం, పాతకాలపు వాళ్ళు అనుకొన్నదేమనగా, చనిపోయిన వారందరూ పరలోకము వెళ్ళుదురు. అక్కడ ఒక వీనె పట్టుకొని మేఘముల మీద కూర్చొని అది వాయించుచుందురు. పరలోకమని పిలువబడు స్థలము ఒకటున్నదని వారికి తెలిసియున్నది, కాని వారు… అది ఆలాగయినచో వాయిద్యకారులందరూ దానిని పొందుదురు. మీరు చూచారా? కాని అది అటువంటి స్థలము కాదు. అసలు వీనెలు వాయించుట కానే కాదు. బైబిలు దానిని అలా బోధించుచున్నదంటే, నేను నమ్మను. ఈ కాలములో మనకు వాగ్దానము చేయబడిన ఏడు ముద్రలు తెరవబడుటకు ముందుగా, వాక్యము యొక్క పరిపూర్ణత ఉనికిలోనికి వచ్చు ముందుగా వారికుండిన ఒక అభిప్రాయము మాత్రమే అది. దానిని మనము అప్పుడు అర్థము చేసికొనెదము.
ఇప్పుడు మనమున్న స్థలము ఎంత నిజమో, పరలోకము కూడా ఒక నిజమగు స్థలము. (చూచారా?), ఎందుకనగా దేవుడు మన ఆత్మీయ ఎదుగుదలను ఈ స్థలములోనే ప్రారంభించెను. మనమున్న ఈ స్థలమంత వాస్తవమగు స్థలము పరలోకమని నేను నమ్ముచున్నాను. ఆ మేఘము మీద కూర్చొని నిత్యత్వమంతా గడుపుదమనుకొనుట కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన పిదప ఇక ఎప్పుడు ఆ వీణను నిర్లక్ష్యముగా వాయించుచు కూర్చునుట కాదు, కాని మనము ఒక యధార్ధమగు స్థలములోనికి వెళ్ళబోవుచున్నాము. అక్కడ పనులు చేయుదుము; అక్కడ మనము జీవించుదుము; మనము కార్యములు చేసెదము; మనము అనుభవించేదము; మనము బ్రతుకుదుము, జీవితమును పొందుదుము, నిజమగు నిత్యజీవము పొందెదము. మనము పరలోకమునకు, పరదైసునకు వెళ్ళుదుము. ఆదాము హవ్వలు పనిచేసినట్లుగానే, వారు జీవించితిని, అనుభవించునట్లుగానే, పాపము రాకముందు ఏదేను తోటలో వారుండినట్లుగానే మనమును ఉందుము, తిరిగి అదే చోటకు పోవు త్రోవలో మనమున్నాము. అది నిజము. మొదటి ఆదాము పాపము ద్వారా మనలను బయటకు లాగివేసెను. రెండవ ఆదాము నీతి ద్వారా తిరిగి వెనుకటి దానిలోనికి తీసికొచ్చి వచ్చెను — మనలను నీతిమంతులుగా తీర్చి తిరిగి లోనికి తెచ్చెను.
MATT 7:11
32నీతీకరణ మీద ప్రసంగమును వినుటకు టేపులు తీసికొనిన వారిని వాటిని తీసికొనివెళ్ళమని చెప్పుచున్నాను… దానిని వినుటకు తప్పక మీరు టేపులు తీసికెళ్ళండి. కొంతకాలము క్రిందట ఇక్కడే దానిపై నేను మాట్లాడాను. నీ విక్కడికి రాకముందు నీ భూలోకపు తల్లిదండ్రులు నీ రాక కొరకు అన్నీ సిద్దపరచియుంచారు. చూడు, నీవు రాకపూర్వమే వారు సిద్దపరిచారు. నీ భూలోకపు తల్లిదండ్రులను, దాని గూర్చి యోచించు. భూలోకపు తల్లిదండ్రులు, పరలోకపు తండ్రికి మాదిరి. "మనము మన పిల్లలకు మంచి ఈవులు ఈయనెరిగియుండగా, మన పరలోకపు తండ్రి మనకు మరి నిశ్చయమగా శ్రేష్ఠమైన ఈవుల ననుగ్రహించును గదా?" ఈ మాటలు యేసు పలికెను.
చూచారా, వారు మీ రాకకై అన్నీ సిద్దపాట్లు చేసారు. వారొక చిన్న ఉయ్యాల తయారు చేశారు, లేదా చిన్నచిన్న బూట్లు, చిన్న దుస్తులు, మొదలగునవి ఏర్పాటు చేశారు. నీవు ఈ భూమిమీదకు రాకముందే వారు అన్ని ఏర్పాట్లు సిద్ధము చేశారు.
JOHN 14:2•
REV 22:18,19
33మనము వెళ్ళేసరికి అన్నీ సిద్ధపరచుటకు యేసు వెళ్ళెను.
ఇప్పుడు గమనించండి: "నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు." లేనియెడల… వాక్యమునకు మరేదీ కలుపుట గాని, తీసివేయుట గాని అని నా భావము కాదు. మనకది తగదు, ప్రకటన 22లో ఇట్లున్నది, "దానిలో నుండి ఒకటి తీసివేసినా, దానికి ఒకటి కలిపినా…" కాని ఒక విషయమును గ్రహించుటకు నన్ను ఈలాగు చెప్పనీయండి. ఇది కలుపుట కాదు. "నా తండ్రి ఇంట అనేక విధములగు నివాసములున్నవి." పరలోకమునకు వెళ్ళినపుడు మనందరమూ ఎట్లున్నామో అట్లే ఉందుమని, అలాగే కనబడుదుము అని నేను నమ్ముటలేదు. మనము అందమైన వారముగాను, లేదా నల్లగాను, లేదా చిన్నగాను, లేదా పెద్దగాను, లేదా రాక్షసులవలెను ఉండమని నేను నమ్ముచున్నాను. దేవుడు పలు విధములైన వాటిని కలిగియున్నాడని నేను నమ్ముదును. దానిని ఈ లోకము రుజువు చేస్తున్నది. ఆయనకు పెద్ద పర్వతములు, చిన్న కొండలు ఉన్నవి. ఆయనకు విశాల స్థలములున్నవి. ఎడారులున్నవి; విభిన్నమైనవి ఆయనకున్నవి, ఎందుకనగా ఆయన తాను కోరిన రీతిగా వాటిని తయారు చేసెను. రుతువులు ఆయన చేసెను: ఎండాకాలము, చలికాలము, వసంతకాలము, ఆకురాలుకాలము. కాలములను ఆయన చేసెను. ఆయన అన్నిటిని గల దేవుడని అది నిరూపించుచున్నది. నిన్ను ఒక విధముగా తయారు చేసెను. కొందరు ఎంతో ఉద్రేకము కలవారు గాను, కొందరు నిశ్చితాభిప్రాయము కలవారు గాను, కొందరు చక్కగాను, మరికొందరు దయగలవారుగాను ఉందురు. ఆయన రాజ్యములో నీవు అన్ని రకముల మనుష్యులను చూచెదవు.
చూచారా,
34పేతురును అంద్రెయతో పోల్చి చూడండి. చూచారా, అంద్రెయ బహు ప్రార్ధనా యోధుడు, సమయమంతా మోకాళ్ళ మీదనే ఉండేవాడు. అపోస్తలుడగు పేతురు అగ్నిలాంటివాడు, బోధించేవాడు, ఇంకా ఆయా కార్యములు చేశాడు. పౌలు పాండిత్యము కలిగినవాడులా ఉండేవాడు లేక ప్రవక్తవలె ఉండేవాడు మరియు…
చూడండి, మోషే పాతనిబంధన గ్రంధములో మొదటి నాలుగు పుస్తకములను వ్రాసెను… అతడు పాతనిబంధన వ్రాసెను. తక్కినదంతయూ ఆజ్ఞలు, రాజులు, కీర్తనలు మొదలగునవి. కొన్ని ప్రవక్తల గూర్చి వ్రాయబడెను. కాని మోషే ధర్మశాస్త్రమును, బైబిలులోని మొదటి నాలుగు గ్రంధములను వ్రాసెను; ఆదికాండము, నిర్గమకాండము, లేవీ కాండము, ద్వితీయోపదేశ కాండము. ఆ తరువాత పౌలు క్రొత్త నిబంధన వ్రాసెను. అది సత్యము.
మత్తయి, మార్కు, లూకా, యోహానులు జరిగిన కార్యములు మొదలగునవి వ్రాసిరి. కాని పౌలు ధర్మశాస్త్రమును కృపను వేరుచేసి వాటివాటి స్థానములలో ఉ౦చెను, చూచారా. అతడు క్రొత్త నిబంధన యొక్క గ్రంధకర్త. అతడు క్రొత్త నిబంధన యొక్క వ్రాతలను దేవుని వాక్యపు క్రమములో నుంచి ఇచ్చెను.
ఇప్పుడు గమనించండి, చాలా నివాసములు, చాలా రకముల నివాసములు.
35చాలా రకముల కొండలు, చాలా రకముల నదులు, ఊటలు, సరస్సులు వలెనే, నీవు మొదట ఇక్కడకు వచ్చినప్పటికే అవి ఇక్కడున్నవి, ఎందుకనగా పరలోక తండ్రి యొక్క దయ వాటిని ఇచ్చట ఉంచెను, ఎందుకనగా కొందరు పర్వతములను; కొందరు జలములను; కొందరు ఎడారులను ఇష్టపడెదరు. కాబట్టి నీవు చూడు, నీ స్వభావమును ఆయన ఎరిగి మరియు నీవెట్లుందువో తెలిసియుండి, నీవు అనుభవించు రీతిలో వాటిని తయారుచేసెను. ఓ, ఆయన అద్బుతమగు తండ్రి అని తలంచుచున్నాను (చూచారా?), దీనిని ఆయన ఈ విధముగా చేసెను. ఆయన పర్వతములు తయారు చేసినందుకు నేనానందించుచున్నాను; నేను పర్వతములను ప్రేమించుచున్నాను. అవి నాకు ఇష్టము. కొందరయితే, "ఓ, వీటిని నేను తట్టుకోలేను; సున్నపు కలపను అక్కడ ఖాళీ చేస్తే బాగుండు," అందురు. నేను అనుభవించునట్లుగా ఆయన దానిని ఖాళీ చేసెను. మీరు చూచారా?
"మైదానములంటే నాకిష్టము. ఎంతో దూరము చూడగలను," అని నీవందువు. రెండు విభిన్న స్వభావములు. ఇరువురమూ క్రైస్తవులమే. నీవిక్కడ ఉందువని తండ్రికి తెలియును. నీ విక్కడికి రాకముందే అన్నీ నీ కొరకే ఏర్పాటు చేసెను. ఆమేన్! నీ మొదటి రాకకు, నీవిక్కడకి వచ్చేసరికి ఆయన నీ కొరకు అన్నీ సిద్ద పరచియుంచెను. ఆయన చేసినవి ఆలోచించుట అద్భుతము కాదా?
36కాని ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఇవన్నీ మాదిరిగానున్న తాత్కాలిక బహుమతులు. అరణ్యములో మోషే ఆలయమును నిర్మించునపుడు, లేదా సిద్దపరచినపుడు, అతడు అన్నింటిని పరలోకములో తాను చూచిన దాని ప్రకారము చేసెనని చెప్పెను, చూచారా. కనుక భూలోక విషయములు నిత్యత్వపు సంగతులను వ్యక్తము చేయుచున్నవి. నేడు మనము జీవించుచున్న ఈ పెద్ద భూమిని ప్రేమించుచున్నాము. జీవించుటకు ఇష్టపడుచున్నాము, గాలిని పీల్చుచున్నాము, పూవులను మొదలగు వాటిని చూస్తున్నాము… ఇక్కడున్నది వ్యక్తీకరణ అయితే అనగా చనిపోవుచున్నది నిత్యమైన దానిని వ్యక్తీకరించుచున్నది. ఒక చెట్టు ప్రయాసపడుచు లాగుకొని జీవించుటకు యత్నించుట నీవు చూచెదవు, అనగా ఆలాగు చేయని చెట్టు మరెక్కడో ఉన్నదని దాని భావము. ఇక్కడ ఒక మనిషి జీవించుటకు పోరాడుట. ఆస్పత్రిలో ఎవరో లేక రోగ శయ్యపై ఒకరు, లేదా ఒక ప్రమాదములో కొట్టుకొంటూ గొంతులో మరణముండగా లాక్కొంటూ, జీవము కొరకు ఏడ్చుచూ, మొర పెట్టుచూ, కేకలు వేయును. దాని భావమేమి? అతని శరీరము ఎక్కడో ఒక చోటున్నది; పోరాడవలసిన అవసరము లేని, కేకలు పెట్టవలసిన పనిలేని శరీరము ఒకటున్నది, చూచారా. అది ఆలాగు శ్రమపడవలసిన పనిలేదు.
ఇప్పుడు, అవి మనకు తాత్కాలిక బహుమతులు, నిత్యమూ ఉండు వాటిని ఇవి వ్యక్తము చేయుచున్నవి. దానినే, నిత్యమైన దానినే మన కొరకు సిద్ధపరచుటకు యేసు వెళ్ళెను. అదే విధమైనవి ఇంకా గొప్పవి ఉన్నవని అవి ఇప్పుడు తెలియ చేయుచున్నది, ఎందుకనగా ఇవి అదే విధమైనవి.
2COR 5:1
37ఇప్పుడు, గుర్తుంచుకొనండి, బైబిలు ఇట్లు పలికెను, "భూమి మీద నివాసమగు మన ఈగుడారము శిధిలమై పోయినను, మరి యొకటి మన కొరకు ఎదురుచూచుచున్నది." ఒక చిన్న బిడ్డ వలెనే చిన్న కండరములు తల్లి గర్భములో గంతులు వేస్తూ తిరుగుచున్నట్లు ఉండును… కాని… చూడండి. ఒక స్త్రీని గమనించండి, ఆమె ఎంత చెడ్డదయినా గాని తల్లి అయినపుడు, అనగా ఆ చిన్న బిడ్డ జన్మించుటకు కొద్దిగా ముందు స్త్రీలో ఒక విధమగు దయ కనబడును. ఆమెను పరికించి చూడండి. ఏదో గోచరించును. ఆమె ఎంతో మృధువుగా నుండును. ఎందువలన? ఆ స్వాభావిక శరీరమును పొందుటకు అక్కడ ఒక చిన్న దేవదూత ఆత్మ కనిపెట్టుచున్నది. జన్మించిన వెంటనే దానిలోనికి జీవవాయువు వచ్చును. దానిలోనికి దేవుడు ఊదగా, అది అక్కడే జీవించు ఆత్మయగును. ఇప్పుడు ఈ బిడ్డ జన్మించిన రీతిగానే ఆత్మీయ శరీరము కూడా దానిని చేర్చుకొనుటకు అక్కడున్నది. ఈ శరీరము ఇక్కడి మట్టిలో పడవేయబడినపుడు, అనగా చిన్న బిడ్డను పడవేసినట్లుగా, తిరిగి దానిని తనలోనికి చేర్చుకొనుటకు, అనగా ఆత్మను చేర్చుకొనుటకు అమర్త్య దేహము కనిపెట్టుకొని చూస్తున్నది. ఓ, ఎంత గొప్ప సంగతి! ఇప్పుడు మనము క్రీస్తు యేసునందున్నాము. (ఆమేన్!) పిల్లలు, క్రీస్తులో చిన్న బిడ్డలు, దేవుని పిల్లలు, ప్రభువైన యేసు రాకడలో పూర్తి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ మర్త్య శరీరము, అమర్త్యతను ధరించుకొన్నపుడు, ఆయన తనలోనికి మనలను చేర్చుకొనును.
MATT 4:8•
1COR 15:49
38పోలిక, ఆయన చేసినవన్నియూ రానున్నవాటిని వ్యక్తము చేయుచున్నవి. ఇక్కడ నీకు శరీరము ఇచ్చినట్లుగానే… ఇక్కడ జీవించుటకు ఆయన నీకిచ్చిన శరీరము ఇంకా గొప్పదిగా నున్నదని తెలియచేయుచున్నది, చూచారా. భూసంబంధమైన రూపము మనము కలిగియున్నవుడు, పరలోక స్వరూపమును కూడా కలిగియుందుము. ఆ రానున్న దానిలో ఏ చెడును ఉండదు. ఇప్పుడు ఇది తప్పక చెడు, రోగము, మరణము, దుఃఖములను కలిగియున్నది.
కొద్దికాలము క్రిందట నేను ఇక్కడ వ్యక్తపరచాను ("దేవుని వాక్య రూపాంతరము అను ప్రసంగము చేసినపుడు") చెడు కలిగియున్న ఈ శరీరము నేడు మనము జీవించుచున్న ఈ ఆధునిక నాగరికత అంతయూ దయ్యము నుండి కలిగినది. మీరది నమ్మారా? ఆలాగు బైబిలు స్పష్టముగా దానిని చెప్పుచున్నది. ప్రతి ప్రభుత్వము, ఈ ప్రతి భూలోక రాజ్యము అపవాదికి స్వంతమైయుండి, అపవాది ద్వారా ఏలబడుచున్నది. యేసు సాతానుచే శోధించబడినపుడు అన్ని రాజ్యములను, లోకమును రానున్న రాజ్యములను ఇంకా ఏవేవో సాతాను ఆయనకు చూపించెను. యేసు ఎన్నడూ వానితో వాదించలేదు, ఎందుకనగా వాడే ఈ లోకపు దేవుడు. చూచారా? బలి అర్పించకుండా యేసుకు వాటిని ఇత్తునని వాడు చెప్పెను. చూచారా? "నీవు నాకు మొక్కి సేవించినచో వాటిని నీకు ఇచ్చెదను," అని చెప్పెను. చూడండి, ఆయనతో బేరమాడసాగెను. కాని లోకము పాపము చేసెను గనుక పాపము యొక్క శిక్ష మరణము, మరియు ఆయన మరణించవలసి యుండెను. శిక్షను చెల్లించుటకు మరణమును ఆయన తనపై వేసికొనుటకే యేసు శరీరమందు ప్రత్యక్షమయ్యెను. ఏదీ తిరిగి వచ్చునది లేదు; అది స్వంతము కాలేదు. ఇప్పుడు అది ఉచితముగా పూర్తిగా చెల్లించబడెను! అప్పులన్నియూ చెల్లించబడెను. ఇప్పుడు అది ఆయనకు చెందును. మన రాజగు యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఇక్కడ కూడుకొనియున్న మనము ఆయన రాజ్య ప్రతినిధులము, పరలోకస్థలములందు కూర్చుండపెట్టబడియున్నాము
GEN 4:17
39మనము ఇప్పుడు జీవించుచున్న ఈ లోకములో, విద్య… నేను మీకు రుజువు పరచగోరుచున్నాను. విద్య, సైన్సు, నాగరికత, నేడు మనకున్నవన్నియూ, ఎంతో అనుభవించుచున్నట్లుగా కనబడుచున్నవన్నియూ సాతానుకు చెందినవి మరియు అవి నశించును. "బ్రదర్ బ్రెన్హాం, నాగరికత కూడానా?" అని నీవందువేమో. అవునండీ! ఈ నాగరికత సాతాను వలన వచ్చెను. ఆదికాండము 4 దానిని రుజువు చేయును. కయీను కుమారుడు (చూచారా?) ఈ నాగరికతను ప్రారంభించెను. పట్టణములను కట్టెను, వాయిద్యములు మొదలగునవి కనిపెట్టెను. నాగరికత జ్ఞానము ద్వారా వచ్చెను. అపవాది జ్ఞానమునే ఏదేను తోటలో హవ్వకు అమ్మెను. ఆ కారణముగా ఆమె దేవుని ఆజ్ఞలను మీరి పాపము చేసెను. మనము వెళ్ళబోవుచున్న లోకములో నాగరికత యుండును గాని, అది ఇట్టి నాగరికత కాదు. ఈ నాగరికతలో మనకు వ్యాధులు, దుఃఖము, దురాశ, మరణము; కానీ ఆ నాగరికతలో ఇట్టివి ఏమీ ఉండవు. మనకు సైన్సు అవసరముండదు. సైన్సు అనునది అసలయిన దానిని వంకర చేయుటయే. చూచారా? నీవొక సూక్ష్మ కణమును బ్రద్దలు చేయుచున్నవి. అణువులను విడగొట్టి ఏవేవో తయారు చేసి, నిన్ను ఎగరగొట్టుచున్నారు. తుపాకీ మందు చూడండి. దాని ద్వారా దేనినయినా చంపవచ్చును. కారును తీసికొండి, పెట్రోలును తీసికోనండి. భూమిలో నుండి వీటినీ మరెన్నో పదార్థాలను బయటకు తీసేస్తున్నారు. భూమి పొరలు వదులుగా అయిపోయి పేలిపోవును. గంటకు తొంబై మైళ్ళ వేగంలో రోడ్డు మీద వెళుతూ ఎందరినో చంపుచున్నారు. చూచారా? ఓ, ఎంతో ఉద్రిక్తత, వత్తిడి, తొందర, పరుగెత్తి త్రోసికెళ్ళి తీసికోవాలను కొంటున్నారు… ఓ, చూడండి, ఇదంతా అపవాది నుండి కలిగినది. దేవుని రాజ్యములో మోటారు శకటములు, విమానములు, లేదా మరే ఇతర శాస్త్రీయ ప్రగతి సాధనములు ఉండవు. లేవు! అసలు దానిలో ఎట్టి విద్య ఉండదు. దీనికి ఎంతో పైగా నున్న విద్య అక్కడుండును. అసలు దీనిని ఆలోచించుటయే జరుగదు. చూచారా? విద్య, నాగరికత, మరియు ఇదంతా సాతాను నుండియే వచ్చెను.
"బ్రదర్ బ్రెన్హాం, అయితే మరెందుకు నీవు చదువుకొన్నావు?" అని మీరిపుడు అడుగుదురేమో.
40చూడండి, అలాగే, ఇప్పుడు నేను ఎందుకు దుస్తులు ధరించాను? రానున్న నాగరికతలో మొదటిగా దుస్తుల అవసరత ఉండదు; వారు ముసుగుచే కప్పబడిరి. వారికి దిగంబరులుగా నున్నామన్న సంగతి తెలియదు గనుక బట్టలు ధరించుటకు హేతువే కనిపించదు. ఇప్పుడు మీకూ దిగంబరులుగా ఉన్నారన్న సంగతి తెలియును, ఇక్కడ పాము నివాసము చేయుచున్నది, అందువలన మనము దుస్తులు ధరించుకోవలసియున్నాము. కాని ఆదియందు ఆలాగున లేదు; అప్పుడు అక్కడ పాపము లేదు. చూచారా?
ఇప్పుడు, నాగరికత మార్గములోనూ అదే యున్నది. మనమందరము చదువుచున్నాము, వ్రాయుచున్నాము, ఏవేవో చేయుచున్నాము, కాని ఎన్నడూ దానితో మీరు సర్దుకోవద్దు; దానిని మీ దేవునిగా చేసికొనవద్దు. అది కమ్యూనిజము యొక్క దేవుడు. చూచారా? అది యేసుక్రీస్తుకు చెందినది కాదు.
GEN 17:17
41యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా ఉన్నాడు, శాస్త్రీయముగా నీవు రుజువు చేయకలుగుట ద్వారా కాదు కాని నీవు విశ్వసించిన దానిని బట్టియే.
దేవుడు ఉన్నాడని ఈ రాత్రి మీకు ఈ భవనములో శాస్త్రీయంగా నేను రుజువుపరచలేను, అయినను, ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలియును. నా విశ్వాసము దానిని వెల్లడి చేయుచున్నది. దాదాపు వంద సంవత్సరాల వయస్సులో నున్న, ఆ స్త్రీ ద్వారా తనకొక బిడ్డ పుట్టనున్నాడని అబ్రహాము శాస్త్రీయంగా మీకు రుజువు పరచలేదు, కాని అతని విశ్వాసము దానిని స్థిరపరచెను. చూచారా? ఏ విధమైన సైన్సు రుజువు అవసరము లేదు. వారిని చూచిన వైద్యుడే, ఈలాగు చెప్పి యుండును, "ఈ ముసలివానికి పిచ్చి పట్టినది. వంద సంవత్సరముల వయస్సులో నున్న అతడు తొంబది సంవత్సరముల వయస్సులో నున్న ఆ స్త్రీ ద్వారా ఒక బిడ్డను పొందబోవుచున్నావని చెప్పుచున్నాడు." కాని మీకు తెలుసా, దేవుడు ఆలాగు చెప్పెను కాబట్టి సైన్సు దానికి అక్కరలేదు. దేవుని మాటను నమ్ముటకు విశ్వాసము కావలెను, సైన్సు కాదు.
42కనుక మన పాఠశాలలు ఇవన్నీ పేలిపోవును. "వెళ్ళి పాఠశాలలు నిర్మించుకొనండి," అని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. బైబిలు స్కూళ్ళు కూడా, అది మీరెరుగుదురా? "వాక్యమును బోధించండి" అని ఆయన చెప్పెను. ఖచ్చితంగా నిజము. నాకు తెలిసిన వాటన్నింటిలోను దేవుని నుండి దూరంగా మనలను తీసికొనిపోయేది విద్యా విధానము తప్ప మరొకటి కాదు. (అది నిజము) — దేవునికి దూరం చేస్తున్నది. స్కూళ్ళు నిర్మించవద్దు, హాస్పిటలు కట్టవద్దు, అవన్నీలోకమునకు ఆ గుంపుకు చెందినది. కాని.. వాటికి నేను వ్యతిరేకము కాను; వాటి బాధ్యతలను అవి నెరవేర్చుచున్నవి కాని అది అక్కడ లేనేలేదు. ఎంతో మంచి వైద్యశాల మనము కట్టుచున్నాము. మనకున్న అత్యుత్తమ మందుతో పనిచేయుచున్నాము. అయినను రోజుకు వేలాదిమంది చనిపోవుచున్నారు. కాని ఓ, మై, ఆ దేవుని రాజ్యములో మరణము లేదు, దుఃఖము లేదు. ఆమేన్! లోకము యొక్క ఈ కార్యములు అవసరము లేదు! మనము ఈ విషయములలో నుండి దేవుని యొక్క వాస్తవములలోనికి దాటి యున్నాము. సైన్సు ద్వారా ఏదో కనుగొనవలెనను ప్రయత్నములో ఎంత కష్టపడీ పోరాడుచున్నామో, అంతగా మనము సైన్సు పొందుచున్నాము గాని అంత ఎక్కువగానే మనము మరణమును కొనితెచ్చుకొనుచున్నాము. మనము ఓడిపోవు యుద్ధమును అక్కడ పోరాడుచున్నాము. కనుక దానిని వదిలి పెట్టండి. విశ్వాసము ద్వారా ఈ రాత్రి దేవుని కుమారుడగు యేసుక్రీస్తును నమ్మి ఆయనను అంగీకరించండి. ఆయన ఒక్కడే.
సైన్సు నీ కొరకు ఏమి సిద్దపరచుచున్నది? అధిక మరణము. అది సత్యము. అంతరిక్ష నౌకలు మొదలగునవి పైకి వెళ్ళుచున్నవి. ఇవన్నియూ మరణమును భూమియంతటకు వ్యాప్తి చేయుచున్నవి. దాని వైపు చూడవద్దు. దానికంటే ఉన్నతమైన ఆ పరలోకము వైపునకు నీ తలను ఎత్తుము. చూడు…ఈ రాత్రి యేసు దేవుని యొక్క కుడి పార్శమున కూర్చొనియున్నాడు. ఆయన వాక్యమును గూర్చి ఏమి మనము ఒప్పుకోనుచున్నామో దానిని బట్టి విజ్ఞాపనలు చేయుటకు సత్యమగు ఆయన సదా జీవించుచున్నాడు.
43ఈ జీవితము అన్ని విధముల చెడులను కలిగియున్నదని మనము కనుగొన్నాము. కాబట్టి రానున్న జీవితము దానిని కలిగియుండదు. దీనిలో దురాశ, వ్యాధి, మరణము ఉన్నవి. ఎందువలన ఆలాగున్నది? ఇది ఆయన సిద్దపరచుటకు వెళ్ళిన గృహము కాదు. ఇది తెగుళ్ళ గృహము. తెగుళ్ళ గృహమును గూర్చి ఎందరికి తెలియును? నిశ్చయంగా మీరందులోనే ఉంటున్నారు. తెగుళ్ళు మీరందులోనే ఉంటున్నారు. చనిపోయిన వారిని గృహములో ఉంచుదురు అదే తెగుళ్ళ గృహము. వారు ఎవరినీ అందులోనికి, అనగా తెగుళ్ళు గృహములోనికి రానియ్యరు, ఎందుకనగా అందులో అన్ని రకముల క్రిములు ఎగురుచుండును; మరియు ప్రజలు ఈ క్రిములను తీసికొని వారికి వారే వ్యాధి గ్రస్తులగుదురు. పాపము మనలను ఈలాగు చేసినది. అది భూలోక తెగులు గృహములో మనలను పెట్టెను. పాపము మనలను అపవాది యొక్క తెగుళ్ళ గృహములోనికి తీసికొనివచ్చెను.
MATT 5:48•
JOHN 14:3
44ఓ, ఆ మరియొకటి నా తండ్రి గృహమని పిలువబడెను. "నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును. ఈ తెగుళ్ళ గృహముల నుండి తీసివేసి నా తండ్రి ఇంటిలో ఉంచెదను." ఆమేన్! నీవు అక్కడున్నావు ఈ పాత భూలోక తెగుళ్ళ గృహము నుండి నన్ను తీసివేయుము. ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళెను, పరిపూర్ణ స్థలము, చెడు అక్కడుండదు, వ్యాధి ఉండదు, వృద్ధాప్యము వుండదు, మరణము వుండదు. అది పరిపూర్ణ స్థలము. ఆ పరిపూర్ణతకు నిన్ను పిలుచుచున్నది. అక్కడకు వెళ్లుటకు నీవు పరిపూర్ణునిగా వుండవలెను. బైబిలు ఆలాగు చెప్పెను. యేసు ఇట్లనెను, "పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైయున్న ప్రకారము మీరును పరిపూర్ణులైయుండుడి." అది పరిపూర్ణ రాజ్యము కనుక తప్పక అందులోనికి పరిపూర్ణ జనులే రావలెను; ఎందుకనగా నీవు నిలబడి పరిపూర్ణమగు దేవుని కుమారునికి వివాహముకాడవలసియున్నావు. నీవు తప్పక పరిపూర్ణ వధువైయుండవలెను. దేవుని యొక్క పరిపూర్ణ వాక్యము ద్వారా తప్ప మరి దేనివలన నీవు ఆ విధముగా తయారుకాగలవు? మనలను పాపముల నుండి కడుగు ప్రత్యేక శుద్ధ జలము అదే. ఆమేన్! యేసుక్రీస్తు యొక్క రక్తము. దాని గూర్చి ఆలోచించు! కారుచున్న రక్తపు వాక్యము! ఆమేన్! ఆ రక్తము, రక్తము స్రవించుచున్న ఆ దేవుని వాక్యము వధువును కడుగును. ఆమేన్! అవునండీ! ఆమె పరిపూర్ణత కన్యకగా, మచ్చలేనిదిగా నిలబడును; ఆమె మొదటగా ఎన్నడు పాపమే చేయలేదు. ఆమేన్! ఆమె దానిలోనికి వలవేయబడినది. చూచారా? ఆయన సిద్ధపరచుటకు వెళ్ళిన ఆ తండ్రి గృహము అచ్చటున్నది.
45ఇది లైంగిక పతనము ద్వారా వచ్చెను గనుక పతనము ద్వారానే తిరిగి కూలిపోవును. పాత దానికి నీవెంతగా మాసికలు వేసినా సరే. అది పడిపోక మానదు. ఆమె పని అయిపోయినది, ఎందుకనగా దానికి తీర్పు తీర్చబడెను; ఎందుకనగా దేవుడాలాగు చెప్పెను! ఆమె పని సమాప్తమాయెను! దానిని దేవుడు నాశనము చేయబోవుచున్నాడు. ఆయన ఆ విధముగా చెప్పెను, అంతయూ తిరిగి పునఃనిర్మాణము జరుగును. అది నీవు నమ్ముదువా? ఆదిలో ఈ భూమి పుట్టినపుడు, దేవుడు మొదట జలములను వేరు పరచినపుడు — తల్లి గర్భములో నుండి నీటిని వేరుచేసినట్లుగానే ప్రపంచము పుట్టెను, అవును! దేవుడు వారిని అక్కడ ఉంచగా జనులు దానిపై జీవించసాగిరి. అప్పుడు వారు పాపము చేయసాగిరి. నోవహు దినములలో ముంచబడుట ద్వారా అది బాప్తిస్మము పొందెను. తరువాత సృష్టికర్త యొక్క రక్తము దాని పై పడుటవలన శుద్ధీకరణము పొందెను.
ఇప్పుడు నీవును ఆ విధంగానే వచ్చితివి: నీతీకరణము ద్వారా దేవుని నమ్ముటకు వచ్చావు. నీ పాపముల క్షమాపన నిమిత్తము నీవు బాప్తిస్మము పొందావు. దేవుని ఎదుట నీవు నీ పాపములు ఒప్పుకొంటివి, మరియు దానిని బట్టి ఆయన నిన్ను క్షమించెను. క్షమాపణ పొందినట్లుగా చూపించుటకు జనుల ఎదుట ఒప్పుకొనుటకు, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయెనని నీవు నమ్మినదానిని లోకమునకు చూపించుటకు, బాప్తిస్మము పొందితివి. ఆయన నీ స్థానము తీసికొనెను. ఇప్పుడు నీవు ఆయన స్థానములో నిలబడియున్నావు. నీవు ఆయనగా మారునట్లు ఆయన నీవలె మారెను. అప్పుడు దేవుని యొక్క శుద్ధీకరణ శక్తి నీ జీవితములో అలవాట్లనన్నింటినీ కడిగివేసెను. నీవు పొగత్రాగుటకు, మద్యము సేవించుటకు, చెడ్డ కార్యములు చేయుటకు అలవాటయితివి. అబద్ధములు మొదలగువన్నీ చెప్పితివి. అప్పుడు యేసుక్రీస్తు రక్తము యొక్క శుద్దీకరణ శక్తి నీ లోనికి వచ్చెను. అది నీ జీవితములోని ఈ కార్యములన్నింటినీ దూరముగా పారద్రోలును. ఎప్పుడైనా నీవు ఏదైనా పొరపాటు చేయుట జరిగినచో, వెంటనే నీవు ఈలాగందువు. "ఒక్క నిమిషము ఆగండి నన్ను క్షమించండి. ఆ విధమగు అర్థముతో నేను అనలేదు," చూచారా? అపవాది అక్కడ ఒక వలవేసి ఉంచెను, కాని నీవు నిజ క్రైస్తవునివైనచో తిరిగి వచ్చుటకు కృప యున్నది. "నేను పొరపాటు చేశాను," అని చెప్పుము. అవును! కాబట్టి…
ROM 8:15
46ఇప్పుడు తరువాత నీవు పొందునది పరిశుద్ధాత్మ మరియు అగ్ని బాప్తిస్మము. ఇప్పుడు దేవుడు ఈ వెయ్యేండ్ల పాలన ముగిసిన పిదప, దేవుడు అగ్నితో లోకమునకు బాప్తిస్మము ఇచ్చును. అది సమస్తమును బద్దలు చేయును. భూమ్యాకాశములు మండిపోవును. పేతురు ఆలాగు చెప్పెను. ఇది అగ్ని బాప్తిస్మము పొందును. అంతయూ తిరిగి సరిదిద్దబడును. అప్పుడు నూతన ఆకాశము మరియు నూతన భూమి ఏర్పడును. అప్పుడు అందులో నీతి నివాసము చేయును. అక్కడే మనమున్నాము… మన ఆత్మలను దేవుని వాక్యము వెలిగించినపుడు, మర్త్యత నుండి కాలపరిధి జీవము నుండి నిత్యత్వపు జీవులముగా, దేవుని కుమారులము, కుమార్తెలముగా ఆయన గుణలక్షణములతో పుట్టి, దేవుని జన్యువు మనలో నుండీ పరలోకమందున్న తండ్రి యొక్క కుమారులము, కుమార్తెలము అయి "అబ్బా, తండ్రి, నా దేవా, నా దేవా!" అని మొర్ర పెట్టుచున్నాము. నా తండ్రి ఇంట…
47ఇప్పుడు, ఈ పాత ప్రపంచము తప్పక పతనము కావలెను, ఎందుకనగా ఇది లైంగిక చర్య వలన ఉద్భవించెను; ఆదిలో అవిధేయత వలన ఇది వచ్చినది. మనము మనుష్యేచ్ఛవలన పతనమువలన పుట్టియున్నాము కాబట్టి తప్పక ఇది అదే రీతిగా మరల వెనుకకు వెళ్ళి పతనమగును. కాని నీ కొరకు ఆయన సిద్ధపరచుచున్నది కూలిపోదు, ఎందుకనగా ఆయన ఆ రీతిగా దానిని తయారు చేయుచున్నాడు. ఇట్టి విధముగు శరీరములో మనమున్నంత మాత్రాన ఏమగును? మరణము అనేది అక్కడ వున్నదని నీవు సంతోషించుట లేదా? అది ఇప్పుడు వింతగా లేదా? కాని ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకొందాము. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న బాలుడిని, ఇప్పుడు నేను మధ్య-వయుస్కుడిని. డాచ్ అను ఒక నా స్నేహితుడు అక్కడ కూర్చొనియున్నాడు. కొద్ది రోజుల క్రితమే తొంబది-మూడేండ్ల వయస్సులోనికి వచ్చాడు. ఇపుడాయనను చూడండి, ఇంకా నలుబది లేదా నలుబది-అయిదు సంవత్సరాలకు నేను అలాగే ఉందును. మరో నలుబది సంవత్సరాలు ఆయనకు కలుపండి. నీవెక్కడకు వెళ్ళుదువు? కేవలము…
48ఈ తెగుళ్ళ గృహము నుండి మనలను బయటకు కొనిపోవునది ఏదో ఒకటి ఉన్నందుకు నేను సంతోషించుచున్నాను. తెరువబడిన ద్వారమొకటి యున్నది, మరియు దాని పేరు మరణము. యేసు ఆ ద్వారము నొద్ద నిలువబడియున్నాడు. ఆమేన్! ఆయన నన్ను ఆ నది ఆవతలకు నడిపించును! ఆ ద్వారము గుండా ఆయన నన్ను తీసికొని వెళ్ళును.
మరణము అను ఒక గొప్ప ద్వారము అవతల నిలబడియున్నది. నీ గుండె కొట్టుకొనునప్పుడల్లనూ నీవు దీనికి దగ్గరవుచున్నావు. నేను ఒక రోజున తప్పక ఆ ద్వారము వద్దకు రావలెను, నీవును అక్కడికి తప్పక రావలెను. అయితే నేను అక్కడికి వచ్చినపుడు, ఒక పిరికివానిగ ఉండగోరుట లేదు; నేను కేకలువేసి వెనుకంజ వేయగోరుటలేదు. నేను ఆ ద్వారము నోధకు రాగోరుచున్నాను, నన్ను నేను ఆయన నీతి వస్త్రములలో చుట్టుకోగోరుచున్నాను, నావి కాదు, ఆయనవి! ఆయన పునరుత్థాన శక్తిలో నేను ఆయనను ఎరుగుదునని దీనిద్వారా నేను తెలిసికొనుచున్నాను. ఆయన పిలచినప్పుడు, నేను ఆయనతో పాటుగా నుండుటకు మృతులలో నుండి తిరిగి లేచెదను. ఈ తెగుళ్ళ గృహము నుండి వచ్చెదను. ఈ శరీరము ఎక్కడ పడిపోయినా గాని, మరియు ఆయన నాకు వాగ్దానము చేసెను కాబట్టి ఏ నేలలో ఉన్నాగాని, ఏమైపోయినా గాని, ఒక దినమున నేను బయటకు వచ్చుదును, ఎందుకనగా ఆయన నాకు వాగ్ధానము చేసియున్నాడు, మరియు దానిని మనము నమ్ముచున్నాము. అవునయ్యా! పడిపోని దానినొకటి ఆయన చేయుచున్నాడు.
49నేడు ఈ భూమి మీద బిడ్డను కననైయున్న తల్లిని గమనించండి. కొన్నింటి కొరకు ఆ తల్లి శరీరము ఎట్లు తపించునో చూడండి. నేను మాట్లాడుచున్నాను, పెద్దవారందరూ అర్ధము చేసికొందురని ఆశించుచున్నాను. బిడ్డను ప్రసవించునపుడు తల్లి తన శరీరములో ఏదైనా కొరతగానున్నచో, ఆమె ఆ ప్రత్యేకమగు వాటి కొరకు పరితపించుమ. తండ్రి ఎట్లుండునో చూడండి… నేను ఎంతో పేద కుటుంబములో పుట్టి పెరిగాను… మేము బిడ్డలముగా ఉన్నపుడు కనీసము తినుటకు ఏదీ లేక కష్టపడ్డాము. మీలో అనేకులు అలాగే శ్రమించి యుందురు.
కాబట్టి, బిడ్డ జన్మించు ముందుగా, తల్లి కొన్నింటి కొరకు తృష్ణగొనును. ఆమె కొరకు అన్నీ సమకూర్చుటకు తండ్రి మూలలు వెతుక్కుంటూ కష్టపడతాడు. అది ఆమె శరీరము… ఆమె శరీరము యొక్క కాల్షియం మొదలగునవి విటమినులు ఆమెకు అవసరమగును. నీవు వాటిని తయారుచేయవలెను (చూచారా?) దేనికొరకో ఆమె ఆకలిగొనును, రానున్న బిడ్డ కొరకు ఆహారము. సాధ్యమైనంత పరిపూర్ణముగా, ఆనందముగా బిడ్డ జన్మించవలెనని తల్లిదండ్రులెంత శ్రమ పడుదురో చూడండి. నీ తల్లిదండ్రులు దానిని ఎట్లు చేతురో చూడు. ఏదైనా అవసరమయినపుడు, తల్లి దానిని గూర్చి చెప్పును. చూచారా? ఆమె నిర్మాణము అట్లున్నది. రానున్న బిడ్డ కొరకు ఏదయినా అవసరమున్నపుడు ఎలా తల్లి దానికొరకు ఆకలిగొనును అని నీవు అర్ధము చేసుకొనుము.
50ఇప్పుడు, ఒక్క క్షణము ఆగండి. ఉజ్జీవములు మనము ఎందుకు కలిగియున్నాము? ఎందుకు మనము కూడుకొనుచున్నాము? ఎందుకు నేను ఎపుడు ప్రజలను గద్దించుచున్నాను. ఈ పెంతెకోస్తు స్త్రీలు రంగులు పూసికొనుట మానమని, అలంకరణలు జుట్టు కత్తిరింపులు, మొదలగునవి అన్నియూ ఆపివేయమని, ఎందుకు నేను బోధించుచున్నాను? ఎందుకు ఆ విధంగా చెప్పుచున్నాను? ఎందుకనగా, ఆ పాతకాలపు పెంతెకోస్తు అటువంటివి చేసేది కాదు. ఆలాగు చేయరాదనునదే నిజమగు బైబిలు మార్గము. పురుషునికి సంబంధించిన దుస్తులు, పొట్టి వస్త్రములు మీరు ధరించుచున్నారు. అది దేవునికి అసహ్యమని బైబిలు చెప్పుచున్న మాట మీరెరుగుదురా? కాని దానిని మనము అనుమతించుచున్నాము! పరిశుద్ధాత్మ ఎందుకు మానక, కేకవేయుచున్నాడో? ఏదో లోపించినదనీ ఆయనకు తెలియును. మనము తప్పకుండా యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వములో నుండవలెను. తప్పక మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలముగా నుండవలెను. మనము తప్పకుండా దేవుని పిల్లలవలె ప్రవర్తించవలెను.
51పూర్వము ఒక కధ చెప్పుచుండేవారు. ఒక నల్లరంగు సోదరుడు వెనుక కూర్చొనియుండుట నేను గమనించాను. దక్షిణాన వారు బానిసలను అమ్ముచుండేవారు - బానిసత్వము అమలులో ఉన్న రోజుల్లో బానిసలను అమ్మేవారు - దాస్య విముక్తి ప్రకటన చేయబడకముందు, వారు వెళ్ళి కొనుచుండిరి. వాడిన కార్లు అమ్మువానివలే, ఆ ప్రజలను అమ్ముచుండిరి. వారు అమ్మకపు బిల్లును ఇచ్చేవారు. వాడిన కార్లు అమ్మిన రీతిగానే, వారు మానవులను అమ్ముచుండిరి. వారితో పాటు అమ్మకపు బిల్లు కూడా నీకు ఇవ్వబడును.
52ఒకసారి ఒక దళారి కొనుటకు వచ్చెను. ఆ పెద్ద చెట్లు నాటే కార్యక్రమమునకు బానిసలను కొనుటకు అతడు వెళ్ళుచుండెను. చాలా మంది బానిసలున్న ఒక పెద్ద చెట్లు నాటే స్థలము వద్దకు వచ్చెను. ఎందరక్కడ ఉన్నారో చూచుటకు వచ్చాడు. వారందరూ అక్కడ పని చేయుచుండిరి. వారు చాలా విచారముగా నుండిరి. వారు ఇంటి నుండి దూరంగా వచ్చేశారు. వారు ఆఫ్రికా నుండి వచ్చారు. వారిని ఇక్కడకి తీసుకొని వచ్చారు. మధ్యవర్తి వారిని తీసుకొని వచ్చి బానిసలుగా వారిని అమ్మేశారు. అందుకే వారు విచారముగా ఉండిరి. తిరిగి మరెన్నడూ ఇక ఇంటికి వెళ్ళరని వారెరుగుదురు. అక్కడే వారు జీవించి చనిపోదురు. వారు… చాలాసార్లు వారిని కొరడాలతో కొట్టుచుండిరి. వారు యజమాని యొక్క సొత్తు, అతడు తన ఇష్టమైన దానిని వారితో చేయించుకొనేవాడు. అతడు… వారిని చంపితే చంపవచ్చును; అతడు ఏమయినా గాని చేయువాడు. అదే బానిసత్వము. ఇశ్రాయేలు మరియు ఆయా అనేక దేశములు దాస్యములోనికి తేబడినట్లుగానే.
వారు ఆ అమాయక బానిసలను తీసికొని… పని చేయించుకొనుచుండిరి. సమయమంతా వారు దుఃఖించుచూ (మీకు తెలియును) విచారముతో నుండిరి.
53కాని ఆ బానిసలలో ఒక యువకుడు ఛాతీ చాచుకొని తల పైకి ఎత్తుకొని హుందాగా కనిపించుట వారు గమనించారు. ఎన్నడూ వారు అతనిని కొరడాతో కొట్టలేదు. ఏమి చేయవలెనో ఎన్నడూ వారు అతనికి చెప్పలేదు. అప్పుడా మధ్యవర్తి, "నేను ఈ బానిసను కొంటాను," అన్నాడు.
"అతడు అమ్మబడడు," అని చెప్పారు.
"నేను ఇతడిని కొనగోరుచున్నాను," అనడిగాడు.
"లేదు, ఇతన్ని అమ్మకానికి పెట్టలేదు," అని చెప్పెను.
"తక్కిన వారందరికి ఇతడు యజమానియా?" అనడిగాడు.
"కాదు, యజమాని కాదు; అతడు ఒక బానిస," అని చెప్పాడు.
"బహుశా, నీవు తక్కిన వారికంటే వేరుగా అతనిని పోషించావేమో?" అని అన్నాడు.
"లేదు, వాళ్ళందరూ ఆ స్థలములో కలిసే తింటున్నారు," అని చెప్పెను.
"అయితే ఈ కుర్రాడు ఆ తక్కిన వారందరికంటే వ్యత్యాసముగా చేయునది ఏమిటి?" అనడిగాడు.
"ఒక సంగతి ఇక్కడున్నది. నేను కొంతకాలం ఈలాగే ఆశ్చర్యపోయాను, కాని ఆ కుర్రాడు - ఆఫ్రికా నుండి వచ్చినవాడు - కాని ఆఫ్రికాలో అతని తండ్రి ఒక తెగకు రాజు. అతడు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పటికిని, రాజు గారి కుమారునివలెనే ప్రవర్తించుచున్నాడు. ఎక్కడో ఆ దేశంలో తన తండ్రి ఒక తెగకు రాజు అని అతడెరుగును. తాను రాజు కుమారుడు అని ఎరిగినవాడు గనుక ఆ విధంగా ఇప్పుడును ప్రవర్తించుచున్నాడు," అని చెప్పెను.
DEUT 22:5•
1COR 11:5
54ఓ సోదరుడా, సోదరీ, ఈ లోకములలో బ్రతుకుచున్న నీవు నేను, దేవుని కుమారులు, కుమార్తెలువలె ప్రవర్తించుదము. ఇక్కడ మనము పరదేశులము, కాని మన ప్రవర్తన దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారము ఉండవలసియున్నది. మనము దేవుని కుమారులమును, కుమార్తెలమును అయినట్లుగా ప్రవర్తించవలెను! మన ప్రవర్తన, మన తీరు, చేతలు, సమస్తమూ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా ఉండవలెను. పురుషునికి చెందిన దుస్తులు ధరించుట స్త్రీకి హేయము. ఆమె తన జుట్టును కత్తిరించుకొనుట తప్పు, పాపము. బైబిలు ఆలాగు చెప్పెను. ఆలాగు ఆమె ప్రార్థించుట కూడా అసాధారణ విషయము. "దీని మాట ఏమిటి?" అని నీవందువేమో.
55ఈ మధ్య ఒకాయన (ఒక గొప్ప పేరుగల బోధకుడు) నాతో, "బ్రదర్ బ్రెన్హాం, రమ్ము, నేను నీపై చేతులుంచి ప్రార్థించుదును. నీవు నీ సేవను నాశనము చేసికొనుచున్నావు," అని చెప్పాడు.
"ఏమిటి?" అని నేనడిగాను.
"ఆ విధంగా జనులను గద్దించుట తగదు," అన్నాడు.
"నేను చెప్తున్నాను…" అని అన్నాను.
"ఓ, అది నేను నమ్ముచున్నాను. నేను కూడా పెంతెకొస్తునే. ఆ స్త్రీలు జుట్టు కత్తిరించుకో కూడదనియు, ప్యాంట్లు ధరించరాదనియు, ముఖాలకు రంగులు పూసికొనుట మొదలగునవి చేయరాదనియు నేను నమ్ముచున్నాను. వారలాగు చేయకూడదు, కాని దేవుడు నిన్ను రోగులకు ప్రార్థించుటకు పిలిచాడు," అని చెప్పెను.
"సువార్త బోధించుటకు ఆయన నన్ను పిలిచెను!" అన్నాను. చూచారా?
"దానిని నేను నమ్ముచున్నాను, కాని "నీవు …" అని అన్నాడు.
"ఇక్కడ మీకున్నవన్నీ చూడండి, గొప్ప కార్యక్రమములు, టెలివిజన్లు, సమస్తమూ ఉన్నవి. నాకు ఏదియూ లేదు, కాని దేవునికి జవాబు చెప్పాలి," అన్నాను. అది నిజము. "నాకు ఏదియూ లేదు, కాని దేవునికి జవాబు చెప్పవలసియున్నది," అని నేను అన్నాను.
"నీవు నీ సేవను నాశనము చేసికొనుచున్నావు," అని చెప్పాడు.
"దేవుని వాక్యము ఏ సేవను నాశనము చేయునో, దానిని నాశనము కానీయండి," అని నేను అన్నాను. అది నిజము! నిశ్చయంగా. అది ఖచ్చితము!
"సరే, నీవు దానిని నాశనము చేసికొనుచున్నావు," అని అన్నాడు.
56నేను అన్నాను, "అయితే మరి దానిని ఎవరు చెప్పెదరు? (చూచారా?) ఎవరో ఒకరు దానిని చెప్పవలెను. అది ఎందరిని బాధపెట్టినా గాని, ఎవరో ఒకరు సత్యము కొరకు నిలబడవలసియున్నారు." పరలోకము వెళ్ళుచున్నామని నమ్మచున్నమనము. క్రైస్తవులముగా, స్నేహితులుగా చెప్పవలెను, పరిశుద్ధాత్మ తానే దేవుని వాక్యములో మనలను మాదిరిగా ఉంచుచున్నది.
"నీవు ఏమి చేయవలసియున్నావో నీకు తెలియునా? ప్రజలు నిన్ను ప్రవక్త అని నమ్ముచున్నారు. ప్రవచన వరము, ఇంకా ఆయా సంగతులు, ఇంకా గొప్ప కార్యములను ఎట్లు పొందవలెనో నీవు చెప్పవలసియున్నది. కాని ఇలాటి చిన్న చిన్న విషయములను కాదు," అని అతడు అనెను.
"ఆ జనులు ఎ.బి.సి.లు నేర్చుకోకుండా గణితశాస్త్రము ఎట్లు నేను నేర్పగలను? సహజముగా చేయవలసినవి సాధారణమైనవి వారు చేయకున్నారు. అసలు వారికి ప్రారంభమే తెలియనపుడు, ఉన్నతమైన సంగతులు ఎట్లు నేర్పించగలవు? నీవు ముందు నిచ్చెన ఎక్కకుండా పైకి వెళ్ళాలని కోరుచున్నావు… అందుకే మీరు పడిపోవుచున్నారు. చూచారా?అడుగు నుండి ప్రారంభించిన దేవుడు నిన్ను నడిపించిన ప్రకారము పైకి ఎక్కుము. చూచారా? నీవు చేయుట కొరకు దేవుడు నీ కొరకు నిర్ణయించియుంచిన ప్రతి చిన్న దైవ వాక్యమును వెంబడించుటకు నీ జీవితమును ముడివేసికొనుము.
57ఇప్పుడు, ఆలోచించండి దేవుడేలాగు… మనము ఆలాగు ప్రవర్తింపవలెను మరియు క్రైస్తవులవలె మెలగవలెను; మన ప్రవర్తన క్రైస్తవులవలె ఉండవలెను, ఎందుకనగా ఇక్కడ మనము పరదేశులము. ఇది మన గృహము కాదు. కాదు, మనమిక్కడ తాత్కాలికముగా ఉంచబడినాము. మనందరము వెళ్ళిపోవలసియున్నాము.
ఇప్పుడు యోచించండి, దేవుడు తన దయచొప్పున ఆ తల్లిని… ఆ చిన్నబిడ్డ పుట్టబోవు ముందుగా ఏదో విటమిను కొరకు ఆకలిగొనును. ఆ తల్లి మాటలలో ఇట్లు ధ్వనించును. "నాన్నా, నాకు ఒక పుచ్చకాయ లేదా మరో ఫలము కావలెను; నాకు మరొక్కటేదో కావలెను." ఎందుకు, దానిని సంపాదించుటకు అతడు అన్నివిధములా ప్రయత్నము చేయును, ఎందుకనగా అతడు తన బిడ్డ సాధ్యమైనంత సంపూర్ణ ఆరోగ్యముతో జన్మింపవలెనని కోరును, చూచారా. అడిగిన దానిని సంపాదించుటకు తనకు వీలయినదంతయూ చేయును. వాటికి సంపాదించి ఇచ్చుటకు ఆయన మరెంతో సమర్థుడు గదా? ఆయన సృష్టికర్త.
ఇప్పుడు, ఆయన యొక్క స్వంత మహిమ శరీరమువలెనే మన శరీరమును సిద్దపరచుటకు ఆయన ఎంత సమర్థుడో ఆలోచించుము. మనము జీవించ కోరినట్లయితే. మనలో ఏదో జీవించుటకు పిలచుచున్నది. మనలో ఏదో సరియైనది చేయుటకు, మనలను పిలచుచున్నది. అప్పుడు దేవుడు ఎవరినో వేదిక లేదా బలిపీఠము పైకి పిలచి సంపూర్ణ సత్యమును బోధించమని కోరును! ఎందువలన? చూచారా? నీవు నిజమైన దేవుని బిడ్డవో కాదో అది చూపించును. నిజ దేవుని బిడ్డవైనచో ఇట్లు మొరపెట్టెదవు, "దేవా, నా నుండి ఇవి దూరము చేయుము. దీనినుండి నాకు సున్నతి దయచేయుము. నాలోనుండి ఇవి దూరము చేయుము." ఎందువలన? నీవు వెళ్ళబోవుచున్న నీ పరలోక గృహమునకు అది అవసరము. దానిని సిద్దపరచుటకు ఆయన వెళ్ళియుండెను. నీవు ఒక నిజమగు క్రీస్తు యొక్క వాక్యవధువుగా ఉండవలసియున్నావు.
58పరిహారపు బలి అర్పణను గూర్చి నేను కొద్ది రాత్రుల క్రితం ప్రసంగించాను. దేవుని యొక్క ఒకే స్థలము - ఒక మనిషిని దేవుడు కలిసికొను ఒకే సంఘము గూర్చి ప్రసంగించుచుంటిని; అది… ఆయన చెప్పెను, తన పేరు పెట్టు ఆ స్థలము. ఆయనిట్లు చెప్పెను, "నా నామము పెట్టబడిన ఆ స్థలము (ద్వారము) యొద్ద తప్ప మరే ఇతర స్థలము వద్దను వారిని కలిసికొనను." ఇపుడు, ఆయన నిన్ను ఒక మెతడిస్టు ద్వారము నొద్ద, ఒక బాప్టిస్టు ద్వారము నొద్ద, లేక పెంతెకొస్తు ద్వారము నొద్ద లేక మరే ఇతర ద్వారము నొద్దను కలిసికొనడు గాని, ఆయన నామము తన కుమారునికి పెట్టబడినది. ఆయనట్లు చెప్పెను, "నేను నా తండ్రి నామములో వచ్చియున్నాను." ఏ మనుష్యుడైనను వచ్చి… ఏ బిడ్డ అయినను తన తండ్రి నామములో వచ్చును. నేను బ్రెన్హాం పేరున వచ్చాను, ఎందుకనగా నా తండ్రి ఒక బ్రెన్హాం. మీరు మీ పేరులో వచ్చారు. కారణము అది మీ తండ్రి పేరు. యేసు, కుమారుడు, తండ్రి నామములో వచ్చెను. ఆయన చెప్పినదేమనగా, తన పేరును… "నా నామమున పెట్టిన ఆ ద్వారములోనే అర్పణ ఉంచబడవలెను." దేవుని యొక్క సహవాసము, ఆరాధన ఎప్పుడైనా నీకు దొరకవలెనన్నచో అది యేసుక్రీస్తు అను ఒకే ఒక చోట దొరుకును.
"మంచిది, నేను సంఘానికి చెందితిని," అని నీవు చెప్పవచ్చును. దాని వలన ఏ ఒక్క మార్పు కలుగదు. నీవు క్రీస్తులో ఉండవలసియున్నావు.
ఒక ప్రత్యేక సంఘ శాఖకు చెందిన సేవకుడు, ఒక రాత్రి నాతో ఈలాగు చెప్పెను, "మిస్టర్. బ్రెన్హాం, ఇటు చూడు, యేసు ఇట్లు చెప్పెను, "ఎందరు విశ్వసించుదురో బైబిలు ఇట్లు చెప్పెను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించు వాడు దేవుని ఆత్మమూలముగా పుట్టినవాడు."
59"పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసును క్రీస్తు అని పిలువజాలడని కూడా బైబిలు చెప్పుట లేదా?" అని నేనడిగాను. చూచారా? నీవు బైబిలును అబద్దమాడునట్లు చేయజాలవు. దానిని సరిగా జోడించి పట్టుకోవలెను, కావున నీవు సంపూర్తిగా తిరిగి పరిశుద్ధాత్మ మూలముగా జన్మించవలసి యున్నావు. నీలో నున్న పరిశుద్ధాత్మ దానిగూర్చి బయటకు సాక్ష్యము చెప్పును. ఆయన దేవుని కుమారుడని నీకు నీవే తెలిసికొందువు. అప్పుడు నీవు ఒక భాగమైనచో… నీవు దేవుని వాక్యములోని ఒక దేవుని బిడ్డవైనచో వాక్యమును ఎట్లు కాదందువు? బైబిలు ఈ విధముగా చేయుమని చెప్పుచుండగా, నీవు ఆలాగు కాదు ఈలాగు చేయుమను చెప్పు ఒక మత సిద్ధాంతమును నమ్మునట్లుగా నిన్ను పరిశుద్ధాత్మ ఎట్లు చేయగలడు? మనము సంఘములో చేరవలెను. ఇది చేయవలెను, అది చేయవలెను, "బైబిలు ఏమి చేయవలెనో నీకు స్పష్టముగా చెప్పుచున్నది." చూచారా? నీవు దానిని చూచినపుడు వెంటనే నీవు దానిలోనికి గంతులేసి దానితో సరిచేసికొందువు, నేరుగా పైకి కదులుచు వెళ్ళుదువు. అండము ఒక స్త్రీ గరములోనికి వచ్చినట్లుగా అది ఉండవలసియున్నది. ఆ చిన్న అండము ఎదుగనారంభించినపుడు, కణములు తొడుగ నారంభించినపుడు, అది ఒకటి మానవబీజమును మరొకటి కుక్క కణమును, మరొకటి ఆవు కణమును కలిగియుండదు గాని, అది అన్ని మానవ బీజములను ధరించుకొనును.
EXOD 12:19•
MATT 4:4•
1JN 2:15
60దేవుని బిడ్డ, ఆ ముందు నిర్ణయించబడిన వ్యక్తి … వాడుటకు అది ఒక చెడ్డ మాట గాని… నేను దేవుని బైబిలును వాడవలసియున్నాను. దేవుని యొక్క ముందస్తు జ్ఞానము, ముందు నిర్ణయము చేయగలదు, సమస్తమూ తన ఘనత కొరకు ఆయన పని చేయించుకోగలడు. నీవుగా ఉండవలసిన ఆ ముందే నిర్ణయించబడిన బీజము, దేవుడు నిన్ను పిలిచెను, చిన్న పక్షి రాజుగా నున్న ఆ విత్తనము అక్కడ దేవుని వాక్యమును వినెను. అది ఉన్నతముగా నివాసము నిర్మించుకొనును. ఒక వాక్యము పై మరొకటి, దానిపై మరొకటి, దాని పై మరొకటి; అది ఏ మత సిద్ధాంతములతోనూ మిళితము కాదు.
గమనించండి, ఈ ద్వారములలో వారు ప్రతిరోజు నూతన రొట్టెను తినవలెను, ఏడు దినముల పాటు పులిసినది ఏదియూ వారిమధ్య కనబడకూడదు. అది నిజమేనా? అప్పుడు ఏడు సంఘ కాలములు పైకి ఎదిగిపోతూ ఉండవలెను. ఒక కణము ఎదిగినట్లుగా ఎదుగవలెను, పూర్తిగా పులియని రొట్టె. మీ మధ్య ఏ విధమగు పులిసినదియు కనబడకూడదు. వాక్యమే ఆ పులియనిది. అది మాత్రమే… ఆ వాక్యము దేవుడైయున్నాడు, దేవుడు యేసుక్రీస్తు అను వ్యక్తిలో శరీరధారిగా వచ్చెను, అదే ఆ ద్వారము. "దేవుని ఆజ్ఞలను నీవు వెంబడించుచున్నపుడు ఆరాధించుటకు నిన్ను కలిసికొను ద్వారము అక్కడున్నది."
REV 22:16
61కాబట్టి ఈ రాత్రి వచ్చి ఇట్లు చెప్పుము, "యేసుక్రీస్తుకు నా జీవితమును అర్పించుదును," ఎప్పుడూ పరిశుద్ధాత్మను నీవు పొందనిచో దానిలోనికి రమ్ము! దానిని నీవు తప్పక చేయవలెను! తప్పకుండా నీవు దానిలోనికి ఎదుగవలెను! నీవు దేవుని యొక్క కుమార్తె లేదా దేవుని యొక్క కుమారునిగా పూర్ణవ్యక్తిత్వములోనికి మారు వరకు ఆ విధముగా వాక్యము పై వాక్యమును పేర్చమని దేవుని అడుగుము. లోక విషయములు తీసివేసి… I యోహానులో ఇట్లున్నది, "మీరు లోకమునుగాని లోకములో ఉన్నవాటినిగాని ప్రేమించినయెడల, దేవుని ప్రేమ మీలో నిలిచియుండదు." మీరు మోసపోయిరి. లోకము యొక్క ప్రేమ అక్కడ మీరు కలిగియున్నారు. అది నిన్ను మోసపుచ్చెను. అక్కడ వాటన్నింటిని పేర్చి చూపించుట ద్వారా సాతాను మోసపుచ్చును… చూడండి… బైబిలులో నుండి దైవ మాటను ఒక్కదానిని కూడా మీరు తీసివేయజాలరు! మొదటి పాపమునకు కారణము ఏమిటి? ఏదో పెద్ద అబద్ధము ఆడినందువలన కాదు, కాని హవ్వ ఒక్క మాటను నమ్మనందువలన (అపవాది ఆలాగు చేసెను) ఒక్క మాట. ఒక్క మాట ఆ గొలుసును విడగొట్టెను. హవ్వ ఒక్క మాటను తీసికొనుటకు నిరాకరించెను. అది బైబిలు యొక్క ప్రారంభము. యేసు బైబిలు మధ్యలో వచ్చెను; ఇట్లు చెప్పెను, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును." అదియే పూర్తి దేవుని వాక్యము. అది ఆయన యొక్క ప్రత్యక్షత అని నీవు నమ్ముదువా? దేవుని యొక్క పూర్తి వాక్యము.
తరువాత ప్రకటన 22లో పత్మాసు ద్వీపమందు యేసు యోహాను నొద్దకు వచ్చెను. మరియు యేసు ఇట్లు పలికెను, "యేసు అను నేను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపియున్నాను. (చూచారా?) దీనిలోనుండి ఒక్క మాటను తీసివేయువానికి, లేదా దానికి ఒక్క మాట కలుపు వానికి, జీవగ్రంథములో నుండి పొలు లేకుండా చేతును."
62చాలామంది ఇట్లందురు, "మంచిది, నేను యేసుక్రీస్తును దేవుని కుమారునిగా నమ్ముదును." అది అంతా మంచిది. అపుడు దానికి తక్కినదంతయూ చేర్చుము.
"నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. నేను నా చేతిని సేవకుని కిచ్చాను. నేను యేసుక్రీస్తును నమ్ముచున్నాను," అని నీవందువు. అయితే నీవు తిరిగి జన్మించవలసియున్నావు! నీవు పరిశుద్ధాత్మతో తప్పక నింపబడవలసియున్నావు! చూచారా? నీవు ముందుకు కొనసాగుచుండగా అన్ని కలుపుకుంటూ పోవలెను. దేవుని యొక్క కుమారుడు లేదా కుమార్తె యొక్క వ్యక్తిత్వములోనికి నీవు ఎదుగుచున్నావు. మై! దేవుడు మనకు సిద్దపరచగల సమర్థుడు, ఏదో మనము చూడవలెనన్న ఆ తీవ్రమగు కోరికను మన జీవితములో సిద్దపరచుటకు లేదా ఇచ్చుటకు ఆయన సమర్థుడు. ఇంకా ఎక్కువగా దేవుని నుండి ఏదో పొందవలెనని ఎందరు కోరుచున్నారు? మీ కొరకు ఇంకా ఎంతో ఉన్నదని అది సూచించుచున్నది. చూచారా? ఇక్కడ ఎంత మంది దానిని మీరు పొందనాశించుచున్నారు? మీకు చిన్న ప్రసవ నొప్పులు ముందుకు వచ్చుచున్నవి. చూచారా? మనము సంతోషముగా, స్వేచ్చగా మరియు పూర్ణులముగా నుండునట్లు మీకు ఇంకా ఎక్కువ అవసరము. మనము పొందవలసియున్నాము.
63ఆ చిన్న జీవకణము దేవుని యొక్క రొమ్మున నున్న ప్రకారముగానే, ఆ చిన్న జీవకణము తల్లి యొక్క గర్భమందు ఉన్న ప్రకారముగానే.
దేవుడు… మనకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళియుండెను, ఆయనతో పాటు నిత్యత్వ స్థలములో నుండుటకు. మరణావస్థలో తెగుళ్ళ ఇంటిలో నీవు ఉంటున్న స్థలము కాదు. పాపము వ్యభిచారము లోకము యొక్క మురికి ఇక్కడున్నది. నీ మనస్సు దానిమీద ఉన్నచో, ఎన్నడూ అది దేవునితో సంబంధము కలిగియుండుటకు రాలేదని చూపించుచున్నది, చూచారా. నీవు ఉత్తేజము చెందియున్నావు. మానసిక భ్రమను నీవు పొందావు. నీవు కేవలము ఒక సంఘములో చేరి, "మంచిది, నేను దీనికి చెందియున్నాను. నా తల్లి దానికి చెందియున్నది," అని అనుకొనుచున్నావు. నీ తల్లి దినల్లో అది సరియైనదే కావచ్చును, కాని మనము మరో దినమున జీవిస్తున్నాము.
వెస్లీ వర్తమానము ఎన్నడును… లూథర్ దానిని తీసికొనజూలదు. లూథర్ నీతీకరణమునందు విశ్వసించెను, కాని వెస్లీ శుద్ధీకరణమును నమ్మెను. తరువాత పెంతెకోస్తు వారొచ్చారు. వారు కేవలము నీతీకరణము, శుద్ధీకరణములను మాత్రమే స్వీకరించలేకపోయిరి. వారు అది వరముల పునరుద్ధరణ యొక్క కాలము. ఇప్పుడు మనము అక్కడ నుండి ముందుకొచ్చాము. చూచారా? ద్రాక్షావల్లి యొక్క మూడు దశలు ఇప్పుడు ముందుకొస్తున్నవి, మొదట అది ఒక చిన్న పోచవలె ఉన్నది. లూథర్ సంస్కరణ నుండి వచ్చెను. మంచిది, అది కాండము. ప్రకృతిని గమనించండి; దేవుడు ప్రకృతి నిరంతరతలో పనిచేయును, ఎందుకనగా దేవుడు ప్రకృతిలో ఉన్నాడు. ఆ తరువాత కుచ్చు వచ్చినది. అదే పుప్పొడి, మెతడిస్టు కాలము. ఆ తరువాత పెంతెకోస్తువారు వచ్చిరి. ఓ, ఎంతో చక్కగా సరిపోయినది. చూచారా? ఆ గోధుమ గింజ కనబడిన రీతిగానే అది పూర్ణమగు గోధుమ గింజ; దాని తెరచి చూడండి; అందులో అసలు గోధుమ గింజ లేనేలేదు. అది కేవలము పొట్టు, గింజను మోసే పొర, కాని ఆ జీవము ఇంకా ముందకు పనిచేయుచునే యున్నది. చూచారా?
64వెనుక ఆ లూథర్ కాలములో, లూథర్ తప్ప, ఆ జీవము ముందుకు వచ్చినది, కాని అది వెళ్ళి శాఖగా మారిపోయినది. అది ఒక శాఖగా మారిపోయినదని; మొదటగా నీవు తెలిసికొనవలెను, దాని అంతము కాల్చబడుటయే. చూచారా? ఆ కాండము ఎండిపోయినది; అది కేవలము ఒక వాహకము మాత్రమే. వారిలో కొందరు ఇంకా ఆ పాత వాహక కాండములోనే నిలిచియుండ ప్రయత్నించుచున్నారు, దేవుని గూర్చి ఏమియూ తెలియదు, చనిపోయినవారు. "చూడండి, మేము ఆకులము. మేమే లూధరనులము," అని వారంటున్నారు. అది నిజము. కాని అది ఇప్పుడెక్కడున్నదో చూడండి. చూచారా? "మేము మెతడిస్టులము," ఇంకా "మేము పెంతెకోస్తులము." కాని పెంతెకోస్తువైపు చూడండి, ఎంత చల్లగా అలవాటు ప్రక్రియగా మారిపోయిందో! అందరూ ఎలాగు విడిచి వెళ్లిపోవుచున్నారో చూడండి. చూచారా? ఏమిటది? నిజమైన విత్తనమును మోసికొని వచ్చిన వాహకము మాత్రమే అది. చూచారా? ఆ తక్కినవన్నీ కూడా వాహకములే, కాని శాఖలుగా మారినవి.
"నేను పెంతెకోస్తు," అని నీవు చెప్పినంత మాత్రమున దేవునికి ఏమీ గొప్ప కాదు. నీవు రోమను కాతలిక్కు, లేక యూదుడు అని చెప్పిన దానికంటే ఎక్కువ అర్థవంతముగా దేవుడు దానిని ఎంచడు. నీవు మరేదైనా కావచ్చును. నీవు తిరిగి జన్మించవలసియున్నావు. అక్కడున్న వాహకము ద్వారా వచ్చిన ఆ జీవము… కాండములో నిలచిలేదు; కుచ్చులో నిలిచి లేదు; బయటనున్న పరిపూర్ణ భాగములోనికి అది వెళ్ళిపోవుచున్నది.
65ఇప్పుడు గుర్తుంచుకొనండి, ప్రతి సంస్కరణలోనూ, అనగా మనకున్న లూథరన్ ఇంకా ఆయా శాఖలు, మూడు సంత్సరాలలో సంస్థగా మారినవి. అది నిజము. ప్రతి ఉజ్జీవము మూడు సంవత్సరాలలో సంస్థగా తీసికొని వచ్చెను. ఇదెంత కాలము నుండి కొనసాగుచున్నచో ఆలోచించండి: ఇరవై లేదా ఇంకా ఎక్కువ ఏండ్ల నుండి అయినా గాని ఇంకా సంస్థ కాలేదు! ఎందువలన? విత్తనము వచ్చుచున్నది. ఇటువంటి పొట్టు క్రింద అది రూపొందుచున్నది. ఇప్పుడు బయటపడినది. ఆ మొదటి దానికిలోనికి వెళ్లిన విత్తనమువలేనె మహిమకరమగు విత్తనముగా నుండుటకు అది సూర్యుని యొక్క వెలుగులో పరిపక్వత చెందవలసియున్నది. మొదటగా వెళ్ళిన ఆ నిజ సంఘము; మరియొక సంఘముగా ఉద్భవించుటకు అది తిరిగి ఆ కాండము గుండా వస్తున్నది. లూథర్ లో బయలు వెళ్ళిన జీవమును, మెతడిస్టులో బయలు వెళ్ళిన జీవమును, పెంతెకోస్తులో బయలు వెళ్ళిన జీవమును కలిపి తీసుకొనుటకు ఆ జీవము విత్తనములోనికి వెళ్ళి, ఆ విత్తనములోని జీవమంతయు తిరిగి బయటకు వెళ్ళి, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ శరీరమును రూపొందించుచున్నది.
66ఉదయమున సూర్యుడు వచ్చుచున్నట్లగానే యుండును. దేవుని గూర్చిన సాక్ష్యమును ఇయ్యనిచో నీవు ఏ ప్రకృతి వైపు కూడా చూడలేవు. దేవుడున్నాడని తెలిసికొనుటకు నీకు బైబిలు కూడా అవసరము లేదు. చిన్న సూర్యుడు ఒక చిన్న బలహీనుమగు బిడ్డవలె జన్మించును. 7 గంటలకు బడికి వెళ్ళనారంభించును. 10 లేదా 11 గంటల ప్రాంతములో బయటకు వచ్చును. పన్నెండు గంటలకు అది పూర్తి బలముతో నుండును. మధ్యాహ్నము 3 గంటలకు అది ముసలిదగును… 5 లేక 6. గంటలకు సాయంత్రపు వేళ భుజములు వంగినదై చనిపోవును. అదే దానియొక్క అంతమా? కాదు! అది తిరిగి మరుసటి ఉదయాన పునరుత్థానము చెందును - ఒక జీవము, మరణము, సమాధి, పునరుత్థానము.
67చెట్టు పైన ఆకులు వచ్చుట చూడండి. అది ఒక మంచి, చక్కని ఆకును తీసికొని వచ్చును. నీడను ఇచ్చును. దాని ఫలమును ఇచ్చును. తరువాత… మొదటి సంగతి మీరు తెలిసికొనవలసినది ఏమనగా ఆకురాలు కాలము వచ్చును. మరణముతో తాకబడును. వేరుగుండా తిరిగి భూమిలోనికి వెళ్ళిపోవును. అదే దాని అంతమా? మరుసటి వసంత కాలమున అది తిరిగి సాక్ష్యమిచ్చుటకు వచ్చును. ఓ, అది శాశ్వతమగు జీవము, కాని సోదరీ సోదరుడా, మనము నిత్యజీవమును కలిగియున్నాము. వచ్చి వెళ్ళిపోయిన ఒక గొప్ప వ్యక్తి ద్వారా మనము నిత్యజీవము పొందాము. ఆయన మనకు ఒక శరీరము సిద్దపరచగల సమర్థుడు. ఎక్కువగుచున్న ఈ నొప్పులు మనము అనుభవించుచున్నట్లుగా స్త్రీలు చేయుచున్న దానిని బట్టి గద్దించి ఖండించుచుండగా బాధ పడుచున్న ప్రకారముగా, పురుషులు ఒక వేదాంత పాఠశాల సిద్ధాంతమునకు కట్టుబడి యుండినట్లుగా; మీరందరు ఇట్లు అందురు, "నేను ఈ విశ్వాస సూత్రము వల్లించుదును; నేను ఇది చేయుదును,"… అయితే గ్రుడ్డివారి కన్నులు తెరవబడుట నీవు చూచినపుడు, మూగ గ్రుడ్డి, ఇంకా వాగ్దానము చేయబడిన సంగతులన్నీ జరుగుట నీవు చూచినపుడు, ఏదో ఇక్కడ ఉన్నది అని చెప్పెదవు. వాక్యము దాని శక్తితో ప్రకటీంచుబడుచున్నది చూడు. వీధిలోని వేశ్య మర్యాదగల గృహిణిగా తయారైనది. చూడు, ఒక త్రాగుబోతు వచ్చి దేవుని పరిశుద్దుడయనాడు. మై! చూడు, అక్కడేదో యున్నది — అక్కడ జీవమున్నది. నీవును దానిని తాక నారంభించుదువు. "మంచిది, నేను అది చేయకూడదు గదా." కాని అది ఏమిటో చూడు. అవతల నీ శరీరమునకు అవసరమగునది ఏదో అది అయి ఉండును. రమ్ము, ఆ శరీరము యొక్క ప్రతి అంగమునకు అవసరమయిన విటమినులు ఇక్కడే ఉన్నవి. దేవుని యొక్క రొమ్మునందు స్థలము సిద్ధపరచుటకు యేసు వెళ్ళెను. అవునండీ! ఒక చిన్న కణము, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క ఒక కుమారుడు లేక కుమార్తె అగును.
JOHN 17:24
68యేసు తండ్రికి ప్రార్థన చేసినపుడు ఒక సంగతి మాత్రమే అడిగెను. అదేమిటో మీరెరుగుదురా? ఒక్కటి, ఇక్కడ ఈ భూమిమీద ఆయన తన అర్పణ అంతా చేసిన పిదప, తాను బ్రదికిన బ్రదుకులో ఆయన నడిచిన బాటలో, ఒక్కదాని కొరకు ఆయన అడిగెను: "నేనుండు చోటున వారును ఉండులాగున." ఆయన మన సహవాసము కొరకు ప్రార్థనలో ఆయన తండ్రిని అడిగినది అదొక్కటే: నిత్యమూ మీ సహవాసము. మీరు దీనిని చదువగోరినచో యోహాను 17, వచనము 24 చదువండి… అయితే ఎంతగా ఆయనను మనము కోరవలెను? ఆయన… ఇప్పుడు వినండి, మీరు నిజంగా దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించినట్లయితే, అదే మీకు సర్వస్వమగును. చూచారా? అది మీకు శాసనముల గ్రంథముగా ఉండదు. మీరు ఏ శాసనములు మరే ఇతర వాటి ద్వారా జీవించరు. మీరు దేవుని కృపవలన, దేవుని ఆత్మవలన జీవింతురు.
69నేను తరచుగా ఇది చెప్పుదును. మిషనెరీగా నేను విదేశాలు వెళ్ళుచుందును. నేను నా భార్యను పిల్లలను తీసికొనివస్తే మాత్రము ఏమిటి? "ఇప్పుడిటు చూడండి, పిల్లలారా… ఇటు విను, శ్రీమతి. బ్రెన్హాం, నేను నీ భర్తను. నేను వెళ్ళిపోయిన తరువాత మరెవరినీ నీవు భర్తగా ఉంచుకొనకూడదు. నీవలాగు చేసినచో, నేను వచ్చిన తరువాత నీ తోలు ఒలిచివేయుదును!" చూచారా? కాళ్ళుతో తొక్కుతాను! "పిల్లలారా, నేను ఏమి చెప్పానో విన్నారా?"
"అవును, తండ్రి. అవును, తండ్రి."
"ఒక్క అతిక్రమము మీరు చేసినట్లు నేను విన్నానా…" చూచారా? ఇప్పుడు, అది ఒక గృహము అని అనిపించుకోదు గదా?
ఇప్పుడు, మరల ఆమె ఈలాగు చెప్పినచో ఎట్లుండును, "అయ్యా, ఇప్పుడు మీరు చెప్పునది అయిపోయినదా? నేను ఒక సంగతి చెప్పుచున్నాను. మిస్టర్. బ్రెన్హాం, నేను నీ ధర్మపత్నిని, చట్టరీత్యా పెండ్లాడాను. బయటకు వెళ్ళినపుడు మీరు కూడా ఏ ఆడ స్నేహితులతో ఉండకూడదు." ఇప్పుడు, అది ఒక గృహముగా ఉండదుగదా? అది ఎదో అయి యుండును. మనము అది చేయము. నేను ఆమెను, ఆమె నన్ను ప్రేమించుకొనుచున్నాము. నేను వెళ్ళుచున్నానని ఆమెకు తెలిసినపుడు, ప్రభువు నన్ను పిలిస్తేనే గాని వెళ్ళనని ఆమె ఎరుగును. మేము నేలకు వంగి పిల్లలను చుట్టూ ఉంచి ప్రార్థించుము. "నా ప్రియ దేవా, నా భార్యను, చిన్న పిల్లలను కాపాడుము," అని నేను అందును.
"దేవా, బయటకు వెళ్ళినపుడు నాన్నగారిని కాపాడుము," అని వారు అందురు. అప్పుడు మేము వెళ్ళిపోయిన తరువాత…
70నేను ఒకవేళ అక్కడ పొరపాటు చేసినచో ఏమగును? నేను పాపము చేసినచో, తప్పు చేసినచో ఏమిటి? నేను తిరిగి వచ్చి ధీనురాలగు నా భార్య యొద్దకు వెళ్ళి, అక్కడ నిలబడి ఆమె నెరయుచున్న వెంట్రుకలను చూస్తూ నడుచుచూ ఈలాగు చెప్పుదును, "ప్రియమైనదానా, నీకు ఒక్కటి చెప్పగోరుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలియునుగదా?"
"నిశ్చయంగా, బిల్, నీవు నిన్ను ప్రేమించుచున్నానని నాకు తెలియును."
"నేను ఏమి చేశానో చెప్పెదను. నేను ఒక పిల్లను ఇంటికి తీసికొచ్చాను. దానిని నీవు క్షమించుదువా?" అని అడిగితే ఆమె క్షమించునని నమ్ముచున్నాను. నేను నిజంగా నమ్ముచున్నాను. కాని నేను ఆ పని చేయుదునా? నేను అక్కడ నిలబడి నెరయుచున్న ఆమే వెండ్రుకలు చూస్తున్నపుడు, ఆమె నాకును, ప్రజలకును మధ్య నిలబడినదని తెలియును. ఆమె ఎంత నిజమగు భార్యయో తెలిసికొన్నపుడు, నేను అది చేయుదునా? ఆమెను బాధ పెట్టేకంటే నేను చనిపోదును. నేను అదే చేయుదును? అది నా భార్య పట్ల ఫీలియో ప్రేమ అయినచో, నా దేవుని పట్ల అగాపే ప్రేమ మరెంత గొప్పగా నుండునో కదా! ఓ, నేను ఆయనను బాధపెట్టునది ఏదీ చేయను. నిశ్చయంగా, చేయను. నేను ఆయనను ప్రేమింతును. ఆయన నన్ను చేయమని కోరునది అంతా ఆయన కొరకు చేయగోరుదును. ఆయన చెప్పిన ప్రతి మాటతో నేను సహకరించుదును. లోకము ఏమి చెప్పినా నాకక్కరలేదు. ఏమయినను - వారు ఏలాగూ నమ్మరు. ఆయన నన్ను ఏది చేయమని కోరునో దానిని తెలిసికోగోరుచున్నాను. నేను ఏదైనా లోటులో ఉన్నచో ఆయనను ఇమ్మని అర్థింతును, ఆయన కొరకు జీవించుదును. లోకము నుండి మనలను మనము వేరుచేసికొందుము.
71ఈ పాత భూలోక శరీరము… నేను మీకది చెప్పనీయండి; ఎంతగానో ఆలోచించుకొనుచున్న ఈమె యొక్క భూలోక శరీరమును హాలీవుడ్ పోకడలో అలంకరించుచున్నది — మీరు దానికి దగ్గరగా ఉన్నారు, అది అక్కడ ఎక్కువ కాలము ఉండదు. మీరు గుర్తుంచుకోండి, మీరు ప్రవచనమును విన్నారు (చూచారా?) అది ప్రభువు నాకిచ్చినది; అది నేరవేరుచున్నది! అవునండి! గమనించండి! అది నెరవేరును; మీరు గమనించి చూడండి. ఆయన ఎప్పుడును తప్పు అయిన దానిని ఇంతవరకు చెప్పలేదు. చెప్పగోరువారు ఎవరివద్దకైనను దానిని నేను తీసుకొని వెళ్ళెదను. ఎప్పుడు, ఎక్కడ అనేది నేను చెప్పలేను, కాని ఆమె చేసినది. దాని పై తీర్పు వ్రేలాడుచున్నది; దానికి ఎట్టి విమోచన లేదు; అది దాటిపోయెను. చూశారా?
MATT 5:28
72ఇప్పుడు, దీనిని గమనించండి… ఆయన కొరకు జీవించండి, లోకము నుండి మనలను దూరము చేసికొందుము. ఇప్పుడు చూడండి! టెలివిజను పై చూడండి. ఈ సోదరీలలో కొందరు ఇక్కడికి వెళ్ళి… యౌవన స్త్రీలను మీరు. మీరు యవ్వనులు, నాకిది తెలియును, కాని మీరు క్రైస్తవులు. చూచారా? మీరు ప్రత్యేకముగా నున్నారు. మీరు లోకమువలె ఉండరాదు. లోకములోని వాటిని మీరు ప్రేమించుచున్నారు — మీ యౌవనులు మాత్రమే కాదు గాని, మీలోని కొందరు వృద్దులు కూడా. చూచారా? సరి, ఆలాగు చేయునది ఏమిటి? చూడండి? మీరు టెలివిజను చూస్తున్నారు; మీరు దుకాణముల యొద్దకు వెళ్ళుచున్నారు; దైవికముగాలేని స్త్రీలు ధరించు ఆ చిన్నపాటి పాత దుస్తులు చూస్తున్నారు. తీర్పు దినమున ఏమి జరుగనైయున్నదో తెలియునా? నీవు నీ భర్తకు ఎంతో సద్గుణముగల భార్యగా ఉండవచ్చును కాని తీర్పుదినమున నీవు వ్యభిచారము చేసినందుకు తీర్పులో జవాబు చెప్పవలసియున్నావు. యేసు చెప్పెను, "ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును." ఎవరు నిందింపబడవలెను? నీవే. చూచారా? ఆ పొట్టి బట్టలు, పొడవాటి మగవారి ప్యాంట్లతో నిన్ను కనుబరచుకొన్నావు. కొంత కాలము క్రిందట కొందరు స్త్రీలు నాతో చెప్పిరి, "నేను పొట్టి దుస్తులు వేసికొనుట లేదు బ్రదర్ బ్రెన్హాం. దానికై నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను. నేను పొడవాటి ప్యాంట్లు మాత్రమే వేసికొందును."
"అది ఇంకా నీచము, మరీ నీచము" అని చెప్పాను. అది నిజము.
MATT 24:24•
MARK 13:22
73ఒక స్త్రీ బట్టలు అసలు కొనుటానికి కూడా దొరుకుట కష్టమైపోతున్నది.
ఆమె అన్నది… ఒక స్త్రీ అన్నది, "సరే, నీవు సత్యము చెప్పావు; నీవు వాటిని కొనలేవు." కాని వారు ఇంకా కుట్టు మిషన్లు, కావలసిన సరుకు అమ్ముచున్నారు (చూచారా?), కనుక అసలు నెపము చెప్పు అవకాశమే లేదు. చూచారా? సోదరీ… నేను మీ సోదరుడనని ఇది చూపించుచున్నది. నేను క్రీస్తు దాసుడను, ఈ రాత్రి నేను చెప్పిన దానికి తీర్పు దినమున ఆయనకు జవాబు చెప్పవలసియున్నాను. చూచారా? మీ హృదయములో నుండి దేవుని ప్రేమ సన్నగిల్లిపోయినది కనుక మీరు వ్యభిచార దోషమునకు నిలువబడవలసియున్నారు. మీరింకా ఆలయానికి వెళ్ళుచుండవచ్చును. మీరింకా ఆత్మలో నాట్యము చేస్తుండవచ్చును, మరయు ఇంకా మీరు భాషలో మాట్లాడుచూ ఉండవచ్చును. అవి అన్నీ మంచివే, కాని ఇంకా చాలా ఉన్నది. లేదయ్యా!
బైబిలు చెప్పునది గుర్తుంచుకొనండి, "అంత్యదినములలో అబద్ద క్రీస్తులు వచ్చుదురు." అబద్ద యేసులు కారు. వారు దానికి ఇంకా నిలబడజాలరు. కాని అబద్ద క్రీస్తులు - అబద్ద అభిషిక్తులు. వారు నిరాక్షేపముగా ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు, కాని ఇంకా అబద్ధికులుగానే ఉందురు. చూచారా?
MATT 5:45
74మీలో ముగ్గురు మనుష్యులున్నారు; బయటది శరీరము (Body). దానితో నీవు భూలోక గృహమును సంధించుటకు అయిదు జ్ఞానేంద్రియములున్నవి. లోపల ఉన్నది ఆత్మ ( Spirit). దానికి అక్కడ అయిదు జ్ఞానేంద్రియములున్నవి: ప్రేమ, మనస్సాక్షి, మొదలగు వాటితో నీవు సంధించుదువు. కాని దానికి లోపల లేక ప్రాణము (soul) ఒకటి ఉన్నది.
గుర్తుంచుకొనండి, వర్షము నీతిమంతుల మీద అనీతిమంతుల మీద పడుచున్నది. ఒక గోధుమ గింజను ఎదుగునట్లుగా చేయు అదే వర్షము, ఒక గురుగును కూడా ఎదుగునట్లు చేయుచున్నది. చూచారా? ఏమిటది? ఆ విత్తనము లోపల ఒక స్వభావమున్నది. ఆ స్వభావము దానంతట అదే బయటపడును. అది కూడా అదే పొలములో నిలబడవచ్చును, కలుపు మొక్కతోనే కలిసియుండును. గోధుమ మరియు కలుపు మొక్క కలిసే నిలబడును, ఒకేలా ఆనందించును. అది తల క్రిందికి వంచును, దాహము తీర్చుకొనుటకు తపించును. వర్షము పడును, గోధుమ ఆనందముతో కేకలు వేసినట్లుగానే గురుగు కూడా బిగ్గరగా కేకలు వేయును. కాని వారి ఫలముల వలన మీరు వాటిని తెలిసికొందురు. చూచారా?
75క్రైస్తవులారా, తిరిగి నేను ఎన్నడూ మిమ్మును చూడకపోవచ్చును. ఎన్నో సంవత్సరాల తరువాత నేను ఇక్కడికి వచ్చాను. మరల ఎన్నడూ తిరిగి చూడకపోవచ్చును. దేవుని వాక్యముతో సరిచేసుకోండి. అద్దములో చూడండి. ఎక్కడో ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు చూచినట్లుగా, ఆ కుర్రాడెప్పుడూ అద్ధమును చూడలేదు. అతడు తన ఆంటి ఇంటికి వచ్చాడు. మెట్ల మీద నుండి వెళ్తున్నాడు. ఒక అద్దమును చూచాడు; ఆ అద్దములో ఒక చిన్నవాడిని చూచాడు. చూచుకంటూ నడిచిపోతున్నాడు, తాను చేతులూపుతుంటే వాడు కూడా ఊపుచున్నాడు. ఇంకా చూస్తూనే ఉండిపోయాడు. అతడు తాను ఎన్నడూ అద్దంలో చూసుకోలేదు. కనుక వాడు దానికి దగ్గరగా వచ్చిపుడు, అమ్మ వైపు తిరిగి, "అమ్మా, అది నేనే!" అని చెప్పెను.
దేవుని యొక్క అద్దములోనికి నీవు ఎట్లు చూసుకొంటున్నావు? దేవుని యొక్క కుమారుని లేక కుమార్తెను గాని అది ప్రతిబించుచున్నదా? నీవు వినగలుగుచున్నది ఏదైనా ఉన్నదా? దానిని చెప్పుచున్న మనిషిని అసహ్యించుకొనునట్లుగా చేయుచున్నదా, లేక "ఆ మనుష్యుడు చెప్పుచున్నది నిజము, ఎందుకనగా అది లేఖనములో ఉన్నది," అని ఏదో నిన్ను లాగి చెప్పుచున్నదా? అయితే అక్కడుండుటకు అభిషేకించబడిన ఈ శరీరమునకు అవసరమయిన విటమినులు అవే. నీవు అక్కడికి వెళ్ళినపుడు ఉండుటకు కావలసిన గృహము అదే. చూచారా? ఈ గృహము… మనము భూసంబంధముగా జన్మించినచో…
76ఇపుడు గుర్తుంచుకొనండి, మనము ఈ శరీరము గూర్చి ఎంతగానో ఆలోచించుదుము. దానికి ఎన్నో బట్టలు ధరింప చేయుదుము. అనవసరమైనవి ఎన్నో మనము చేయుదుము. ఎన్నో మార్పుల తరువాత మార్పులు చేయుదము… అందరమూ చేసేదే అది. ఎందుకు? ఎవరైనా ఒకరు ఏదైనా ప్రారంభించనీయండి. మీరు మీ మెట్టుకు ఎర్రగా రంగు వేయుదురు, ఆ జోనెస్స్ అనువారు ఎర్ర రంగు వేసుకొందురు. చేవర్లెట్ కారును మార్చి, ఫోర్టుకారు కొనుచుందురు, వారు దానిని చూచి సహించలేరు. ఇది జత కూర్చుకొను సమయము. ఒక విధమగు టోపి పెట్టు కొన్న ఒక స్త్రీని మీరు చర్చికి రానీయండి, తక్కిన స్త్రీలందరూ అది చూచి ముఖ్యంగా పాస్టరుగారి భార్య దానిని సంపాదించుకొనును. చూచారా? ఏమి జరుగుచున్నదో కాస్త గమనించండి. ఇపుడు, అది నిజము. ఇది ఖచ్చితముగా సత్యము. ఇది జత సరిపోయిందో లేదో చూచుకొనే సమయము. సోదరుడా, ఇది ఆ జత కూర్చుకొను సమయముగానే ఉండవలసియున్నది. వారందరూ అవన్నియూ ఒక ఉద్దేశము నిమిత్తమే. నా ప్యాంటుకి నా కోటు జత సరిపోయిందో లేదో నేను పట్టించుకోను. నేను కష్టకాలంలో ఉన్నాను. నా భార్య, లేదా నా కోడలు, లేదా మరెవరో నాకు ఎటువంటి టై కట్టుకోవాలో చెప్పవలసియున్నారు. అసలు అవి జతగా సరిపోయాయే లేదో నాకవసరము లేదు, నా అనుభవము దేవుని వాక్యముతో జతగా ఉన్నదో లేదో నేను కోరుచున్నాను. అదే అసలు విషయము, ఎందుకనగా ఆ గురితోనే నేను బ్రతుకుచున్నాను. ఎక్కడో ఆ మూలనవున్న జోనెసెసను గురిగా పెట్టుకొని కాదు, కాని అవన్ని మహిమలో యేసు మన కొరకు ఒక స్థలము సిద్ధపరచుటకు వెళ్ళిన సంగతిని గురిగా వుంచుకొన్నాను. అవును! అది మనకు కావలెను. అవునండీ!
దీనంతటి నుండి దూరముగా ఉండు…
77ఇక్కడున్న ఈ పాత భూగుడారము ఏమిటో నీకు తెలుసునా? ఈ శరీరము నీవు ధరించుకొన్న ఆ పాత కోటు వంటిది. ఒకప్పుడు నీవు వేసికొనిన కోటువంటిది. కాని ఇపుడు, నీకు ఇంకా మంచిది ఒకటున్నది, దానిని ఇక మీదట వాడవు. ఏమి చేయుదువు? కాబట్టి పాతదానిని అలమరలో తగిలించెదవు, నీకు మంచి కోటు ఒకటున్నది. నీవు వాడుచున్న ఆ పాత దానికంటే ఇంకా మంచి అధునాతన కోటు ఒకటున్నది. ఏమిటది? అది ఆ వస్త్రము, నీవు దానిలోపల ఉన్నావు. గుర్తుంచుకో, ఆ వస్త్రమ ఏలాగు తయారుకాబడినది? అది నీ రూపమును కలిగియున్నది. చూచారా? కాని ఇక మీదట అది నీకు అవసరము లేదు. దానిని నీవు తగిలించి పెట్టావు. అది చింపిరి పీలిక అయినది. ఈ పాత శరీరము ఆ రీతిగానే యున్నది. అది పరలోక స్వరూపమును కలిగియున్నది, అయినను అది నీవు కావు. నీవు ఆ శరీరము యొక్క లోపట ఉన్నావు. నీవు, అనగా దేవుని ఆత్మ, ఆ శరీరము యొక్క లోపల ఉన్నది. లోపలది లాగుచున్నది కాబట్టే (చూచారా?) బయటది లోబడుచున్నది. దేవుని వాక్యము యొక్క వరుసలోనికి దానిని అది తీసికొనివచ్చుచున్నది: నీ అంతరంగము, నీవు, నీవే, నీ వ్యక్తియే.
ఈ శరీరము ఒక పాత కోటు మాత్రమే, మరియు ఒక రోజున నీవు దానితో ఏమి చేయుదువు? కొద్దికాలము పాటు నీవు ఈ వస్త్రములో ఉందువు. అది భూలోక వస్త్రమువలెనే ఈ శరీరము, నీవు నీ నిజ శరీరము, నీ నిజ స్వరూపము ఈ పాత కోటు లోపల ఉన్నది. దానిని నీవు విలియం బ్రెన్హాం అని, లేదా సుసీ జోన్స్, లేదా మరేదో పేరుతో పిలుచుచున్నావు. చూచారా? ఒక రోజున అది నీ యొక్క జ్ఞాపకార్ధముగా భూమి యొక్క ఆవరణలో తగిలించబడును. దానిని నీవు సమాధిలో ఉంచెదవు. ఎవరో వచ్చి దాని పై సమాధి రాయిని ఉంచెదరు. "ఇక్కడ ఫలాని ఆయన, లేదా యోహాను, ఫలానీ, ఫలాని." అది అక్కడ నీ జ్ఞాపకార్ధముగా పడియుండును. దీనిని చూచిన జనులు నీవేమై యుంటివో, నీ వాస్తవ రూపమును, దానిలోపలనున్న దానిని చూడగలుగుదురు. ఆ పాత కోటులోనే పరలోక స్వరూపము ఉన్నది. ఓ జనులారా, కోటులు మార్చుటకు మీరు రిజర్వేషన్లు చేశారా? పరలోకమునకు మీరు రిజర్వేషన్లు చేసికొన్నారా? గుర్తుంచుకొనండి, తప్పక మీరు రిజర్వేషన్లు చేసికొనవలెను. అది లేకుండా నీవు అందులో ప్రవేశించలేవు. ఇపుడు నేను మీతో ఆధునిక భాషలో మాట్లాడుచున్నాను. కాని మీకు తెలుసు, ఒక హోటలుకు వెళ్ళి మరియు చెప్పినట్లయితే, "మంచిది, నేను…"
78"మీకు రిజర్వేషన్లు ఉన్నవా? అయితే, అంతా నిండిపోయినది, విచారించుచున్నాము." నీవు ఆ చలిలో ఉండవలెను, ఎందుకనగా ముందు రిజర్వేషన్లు చేసికొనుటలో విఫలమయ్యావు. రిజర్వేషన్లు లేకుండా నీవు నీ జీవిత ప్రయాణములో అంత్యదశకు వచ్చినపుడు, నిన్ను కలిసికొనుటకు అక్కడ ఎవరూ ఉండరు. అంధకార నిత్యత్వములోనికి నీవు అడుగు వేయవలసియుందువు. అక్కడ కేకలును, ఏడ్సును, దుఃఖమును, పండ్లు కొరుకటయును యుండును. తప్పక నీవు చేసికొనవలెను; లేనిచో ఆ పట్టణములోనికి వెళ్ళలేవు, ఎందుకనగా నీకు రిజర్వేషన్లు లేవు. నీ కొరకు యేసు స్థలము సిద్దపాటు చేయుటకు వెళ్ళిన ఆ పట్టణములో ప్రవేశించుటకు నీకు ముందు ఏర్పాట్లు తప్పక కావలెను. గుర్తుంచుకో, నీకు తప్పక రిజర్వేషన్లు మరియు రక్షణ వస్త్రము కావలెను. నీవు వెళ్ళలేవు…
MATT 22:3-6,9,11
79మత్తయిలోని లేఖనము ఒకటి ఇక్కడున్నది (నేను లేఖనమును గమనించుచున్నాను), మత్తయి 22:1-14. దానిని చదువుటకు నాకు సమయము లేదు, ఎందుకనగా చాలా ఆలస్యమగుచున్నది. మీతో చాలా సేపు మాట్లాడాను. కాని గుర్తుంచుకొనండి, రాజు విందు సిద్దము చేసి పంపించెను. తన ఎద్దులన్నింటిని వధించెను మరియు క్రొవ్విన వాటిని సిద్దము చేసెను. అంతా సమకూర్చి గొప్ప విందు సిద్దపరచెను. అతడు అనేకులను రమ్మని కబురు పంపెను. ఒకడిట్లు అనెను, "నీకు తెలుసా, నేను దీనికి చెందినవాడిని,. నాకు ఇది ఉన్నది. నేను నా పొలానికి వెళ్ళాలి," ప్రతి ఒక్కరు బహు నెపములు చెప్పెను. అతడు మరలా పంపించెను, మరియు వారు దుర్మార్గముగా వారి పట్ల ప్రవర్తించిరి.
చివరగా… యేసు ఆ యూదా తరముతో మాట్లాడుచుండెను; వారికి చేయవలసినది మరేదో యున్నది. అప్పుడు తుదకు, ఆయనను పంపి ఇట్లనెను, "వెళ్ళి, వారిని బలవంతము చేయుము. వీధులలోనికి, రాజమార్గములోనికి ప్రతి చోటుకు వెళ్ళి, వారిని రమ్మని బలవంతము చేయుము." దాని తరువాత ఆయన గృహములో తన పెండ్లి విందు వడ్డించుదునని నిశ్చయించుకొనెను. అక్కడ అతిధులు ఉండబోవుచున్నారు. అప్పుడు అక్కడ ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా కూర్చెనెను. ఆ పాత కోటునే పట్టుకొని యుండెను. ఆయన ఏమి చెప్పెనో చూడండి, "స్నేహితుడా, నా పెండ్లి విందుకు నిన్ను నేను ఆహ్వానించిన తరువాత, నేను పిలిచాను మరియు రమ్మని కబురు పంపాను…."
JOHN 10:7
80మీరెప్పుడయినా ఆ తూర్పు దేశాల్లో ఉంటే అర్థమగును, నేను చాలాసార్లు అక్కడ బోధించాను. అప్పుడెట్లుండెనో అదే రీతిగా ఇప్పుడును ఆ పెండ్ల విందు కొనసాగుచున్నది. పెండ్లి కుమారుడు, చాలామంది అతిధులను పిలువవలసియుండును. బహుశా బ్రదర్ క్రాప్, ఇండియాలో దానిని గమనించయుండునని అనుకొంటాను. చూచారా? చాలామంది అతిధులను అతడు రమ్మని పిలువవలసి యుండును. మాటకు ముప్పయి మందిని పిలువవలసి యున్నాడనుకొందాము. పెండ్లి కుమారుడు వారికి వస్త్రములు ఇవ్వవలసియుండును. అతడే వాటిని ఇవ్వవలసియుండును. కాబట్టి ఒక వ్యక్తి ద్వారము యొద్ద నిలబడి ఆహ్వానముతో వచ్చుచున్న వారికి, ఆ ఆహ్వానమును పరీక్షించి ఒక వస్త్రమును ఇచ్చుచుండును. ఒక అంగీని ఇచ్చును… వారిలో కొందరు ధనికులు కొందరు పేదవారు కొందరు మరొక రీతిగా నుందురు. కాని ఈ బట్టలు ధరించినపుడు, వారందరూ ఒకేలా ఉందురు. అంతా ఒకే రకముగా కనబడుదురు. మీరందరూ ఒకేలా ఉందురు. "నేను మెతడిస్టును కాబట్టి ఇక్కడుందును," "నేను ప్రెస్బిటేరియనును గాన ఇక్కడుందును," అని నీవనటానికి వీలులేదు. అలా కాదు! మొదట చెప్పాలంటే, నీవు వెళ్ళుట లేదు. చూచారా? నీవు ద్వారము ద్వారానే రావలెను, యేసు చెప్పెను, "గొర్రెలు పోవు ద్వారము నేనే."
"నేను పెంతెకోస్తును, నేను ఇది, నేను అది." అది అర్థంలేనిది. ఆ ద్వారము ద్వారానే నీవు రావలేను. నీవు ఆ ద్వారము గుండా వచ్చినపుడే, వస్త్రము పొందెదవు.
MATT 22:12•
1JN 2:15
81ఈ మనుష్యుని ఆయన ఇట్లడిగెను, "స్నేహితుడా, ఇక్కడికి నీవు ఎట్లు వచ్చావు?" చూచారా? అతడు మరో మార్గాన వచ్చినట్లు ఇది సూచించుచున్నది. కిటికీ గుండానో, దొడ్డి దారి గుండానో వచ్చాడు గాని ద్వారము గుండా, తలుపుగుండా, యేసు వచ్చిన మార్గము గుండా, నిస్వార్థ త్యాగము ద్వారా, సర్వస్వము దేవునికి ఇచ్చుట ద్వారా, కల్వరి సిలువ నొద్దకు నడిచి వచ్చి, ఆయనతో పాటు సిలువ వేయబడి, తిరిగి లేచి, ఆయన యొక్క సమర్పణ వస్త్రమును, లోక విషయముల పట్ల చనిపోయిన వస్త్రమును ధరించుకొని రాలేదు.
"మీరు లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమ మీలో ఉండదు." చూచారా? నీలో ఇంకా లోకపు ప్రేమ నిలిచియుండి, లోకమువలె ప్రవర్తించుచూ, లోకమువలె నడచుచూ, ఇంకా నీవు ప్రయత్నించుచూ… అయినను సంఘములో నీవు ఉన్నట్లయితే, నీవు గోధుమతో కలిసియున్న గురుగువి. తక్కినవారితో కూడా కేకలు వేయుదువు; మిగిలిన వారితో పాటు ఆనందించుదువు; ఆత్మీయ దీవెనలన్నియూ నీపై కుమ్మరించబడును. "మంచిది, నేను ప్రవచించుచున్నాను," అని నీవు అనవచ్చును. కయప కూడా ప్రవచించెను; బిలాము కూడా ప్రవచించెను. దానివలన…
82"నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాను." అయినాగాని దాని వలన ఏమీ కాదు. అది కేవలము నీకు ఒక తాత్కాలిక బహుమానము. నిజమైన బహుమానము నీలోనున్న ప్రాణము, చూచారా? అది దేవుని మూలముగా జన్మించవలసియున్నది. దేవుని వాక్యము మరియు దేవుని చిత్తమునకు లోబడునట్లు, అదే సమస్తమును వశములో ఉంచును. అప్పుడు నీవు పైకి ఎదుగుదువు. చూచారా? అప్పుడు నీవు దేవుని కుమారుడు మరియు కుమార్తెగా నుందువు. నీవు దేవుని బిడ్డవు. నీవు పొందిన ఈ సంగతులు… ఇప్పుడు తల్లి వలెనే, నీవును భూమి గర్భములో నుండి బయటకు వచ్చుటకు ప్రయత్నించుచున్నావు. దేవుని కుమారునిగా నీవు వచ్చి, వాక్యమును చూచి, "నేనిది చేయవలెను; నేను తిరిగి జన్మించవలెను," అని చెప్పుదువు. "మంచిది, నేను ఒక సంఘానికి చెందియున్నాను." దానివలన ఏమీ ప్రయోజనము లేదు. చూచారా?
"నేను మెతడిస్టుని, నా తల్లి…" నీ తల్లికి అది మంచిదే.
"మంచిది, నేను పెంతెకోస్తును; నేను దానికి చెందాను…" దేవుని వాక్యముతో నీవు ఏకీభవించనిచో, ఏదో పొరపాటు యున్నది. చూచారా? అప్పుడు మీరు చూడండి, మీ నిజ తండ్రి దేవుడు కాడు (చూచారా?), ఏలయనగా ఆత్మ అనునది లేకముందే ప్రాణము నిజముగా ఆరంభమాయెను, అది నీ యొక్క ప్రాణము. ఆ ప్రాణము దేవుని నుండి రాలేదు, అయితే ప్రారంభములోనూ అది దేవుని జీవకణము కాదు. నీవు మోసపుచ్చబడితివి. నీవు కలుపు మొక్కల గుంపులో నుండి, కలుపు మొక్కల యొక్క లోకపు సాక్ష్యమును కలిగియున్నావు. లోకమువలె ప్రవర్తించుచూ, లోకములోని వాటిని ప్రేమించుచూ వచ్చుచుందువు, ఎందుకనగా దేవుని యొక్క ప్రేమ నీలో లేదు.
MATT 7:22,23
83ఇప్పుడు, చివరి దినములలో అబద్ద అభిషిక్తులుందురు. అబద్ద యేసులు కారు; వారు దానికి నిలబడలేరు, కాని అబద్ద ఆభిషిక్తులు. వారు అభిషేకించడినవారు. అవునండీ ! కాని వారు క్రీస్తు విరోధులు. క్రీస్తు చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. చేయుటకు వారు ఆత్మతో అభిషేకింపబడిరి, కాని ఆయన వాక్యమును ఏకీభవించరు. చూచారా? "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, 'ప్రభువా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా,'" అని అందురు.
అందుకాయన, "అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి తొలగిపోవుడి, నేను మిమ్మును ఎరుగను," అని చెప్పును.
"ప్రభువా, నేను పెంతెకోస్తును. దేవునికి మహిమ! నేను కేకలు వేశాను; భాషలతో మాట్లాడాను; రోగులపై చేతులుంచి ప్రార్థించి మరియు స్వస్థపరిచాను, దయ్యములు వెళ్ళగొట్టాను."
"అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి తొలగిపోవుడి: నేను మిమ్మును ఎరుగను."
84నా భావము ఏమిటో చూచారా?
ఓ, చిన్న పిల్లలారా, ఈ రాత్రి ఆ విటమిటనుల యొక్క అవసరతను గ్రహించారా? అదేదో…? అవతల ఒక శరీరము ఎదురు చూస్తున్నది; పొందబడుటకు ఒక శరీరము కాచుకొని చూస్తున్నది. ప్రజలారా, మీరు మోసపోకుడి! మోసపోవద్దు! అపవాది మోసగాడు. పెండ్లి వస్త్రమును నీవు తప్పక ధరించవలెను. అది తప్పక ఉండవలెను.
ఇప్పుడు, మనము సాయంకాల సమయంలో ఉన్నాము. ఈ భూసంబంధమగు శరీరము శిధిలమగుటకు సిద్దముగా ఉన్నది. పరలోక సంబంధమగు దానిలో ప్రవేశించుటకు మనము సిద్ధపడుచున్నాము. ఈ గొప్ప ఏధేనుకు వెళ్ళమను దేవుని యొక్క వింత పిలుపును మనము ఇప్పుడు వినుచున్నాము. ఇక్కడ మనము జన్మించకముందే ఏర్పాటు కాబడవలసిన దానికొరకు మన చిన్న శరీరములు మొరపెట్టినవి. ఆ విధముగా మనకు ఏర్పాటు చేయబడనిచో, మనము బాధనొందు పిల్లలుగా పుట్టియుందుము. అక్కడ దేవునికి ఏ బాధలును లేవు. అక్కడ అందరూ చక్కగా వరసలు తీరి, వధువు, పెండ్లి కుమారుడు ఉన్నంత సంపూర్ణ స్థితిలోనే ఉందురు. దాని రుతువును బట్టి వాక్యము ప్రత్యక్షమగును. పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మన ప్రతి ఒక్కరికి దానిని అనుగ్రహించును గాక. వెళ్ళుటకు అక్కడొక పరలోకమున్నది; దూరముగా వెళ్ళిపోవుటకు అక్కడొక నరకమున్నది.
85ఇప్పుడు, ప్రభువు నాకు దర్శనములు ఇచ్చెనని మీలో చాలామంది ఎరుగుదురు. అవి వేలాదిగా ఉన్నవి. గొప్పది… నాకు మరణము గూర్చి భయముండేది. మూడు సంవత్సరాల క్రితం మీరు క్రైస్తవ సేవకుల పత్రిక చూచియుందురు. కాలము యొక్క తెరను దాటాను. ఈ రాత్రి కూడా నేను జీవించియుండక పోవచ్చునని నేను గ్రహించాను. ఇక్కడ మరెన్నడూ మిమ్మును తిరిగి చూడకపోవచ్చును. కాని ఇది నిజము. నేను దానిని ఒక దర్శనము అని పిలువాలో మరేమని పిలువాలో తెలియుట లేదు. ఒక ఉదయాన, ఈ మధ్యనే, అప్పుడే నేను పడక మీద నుండి మేల్కొన్నాను. నేను కూటముల నుండి వచ్చేసరికి నా భార్య నిద్రపోతూ ఉన్నది. "నీవు మెళకువగా ఉన్నావా, హనీ?" అని నేనామెను అడిగాను. ఆమె ఇంకా నిద్ర పోవుచున్నది. పిల్లలను బడికి పంపించుటకై మేము లేచిపోవాలని ఎరుగుదుము. నేను ఈ విధంగా వెనుక చేతులు ముడుచుకొని ఈలాగు చెప్పాను, "ఇదిగో, బిల్ బ్రెన్హాం. నీకు ఏబది సంవత్సరాలు దాటిపోయాయా? చెప్పుము? ప్రభువు కొరకు నీవు ఏదైనా చేయాలనుకొంటే నీవు త్వరగా చేయాలి, ఎందుకనగా నీకు సమయము ఎక్కువగా లేదు." నేను ఆలోచించాను, "ప్రభువైన యేసు రాకడను చూచువరకు జీవించగలనని నేను ఆశించుచున్నాను." నా మనస్సులో ఎల్లపుడు ఈలాగు ఉండేది — మనము చనిపోయినపుడు… ఇక్కడ సోదరునివలే చెప్పుచున్నాను…
"హే, బ్రదర్ బ్రెన్హాం, ఒక రాత్రి నీవు భూమి క్రిందనున్న మా సంఘములో బోధించావు." కానీ అతడు ఒక ఆత్మరూపి. అతని చేతిని నేను పట్టుకొనలేకపోయాను, ఎందుకనగా అతని చేయి ఎక్కడో సమాధిలో క్రుళ్ళిపోయినది. నాది కూడాను. నేను ఆలాగు ఆలోచించేవాడిని.
86కాని ఆ ఉదయాన నన్ను ఏదో కప్పినట్లుగా అనుభూతి చెందాను మరియు నేను ఆలోచించాను — మామూలుగా దర్శనము వచ్చినట్లే ఉన్నది — నేను చూచాను, చూచాను, ఆలోచించాను, "మై, ఇదేమిటి?" మహా పచ్చని పర్వతాలను, అన్నిచోట్ల నుండి వచ్చుచున్న యువతులను వేలాది వందలవేలాది పదివేలాది మందిని చూచాను. పొడవైన జుట్టు వారి వీపు వెనుక వ్రేలాడుచుండగా, వారందరూ వచ్చుచుండిరి. తెల్లవి అంగీలు ధరించిరి, వట్టికాళ్ళతో నుండిరి, కేకలు వేయుచూ, కేరింతలు కొట్టుచూ నుండిరి, "మన సోదరుడు!"
నేనిట్లు తలంచాను, "ఇది చాలా వింతగా నున్నది." మరియు నేను వెనుకకు తిరిగి చూచాను, నేను అక్కడే ఉంచబడియున్నాను; నా భార్య అక్కడ పరుపు మీద ఉండెను. నేనిట్లు అన్నాను, "ఇప్పుడు, ఏమయిందో తెలుసా? నేను చనిపోయాను." అదే జరిగినది. నేను మృతిచెందాను. నాకు గుండెపోటు లేదా మరేదో రావచ్చును. నేను చనిపోయాను. అక్కడ నా శరీరము పడియున్నది." నేను అక్కడ నా చేతులు ఈ విధంగా పెట్టుకొని పడియున్నాను (చూచారా?), కరుడుబారి పోయియున్నాను. "అది నాకు ఇరవై అడుగుల దూరంలో కూడా లేదు," అనుకొన్నాను. అక్కడ నేను చూస్తున్నాను; "అదిగో అక్కడ నా భార్య ఉన్నది. అక్కడ, అంతా అచ్చటనే యున్నది. ఆ మంచపు కోడుకు నా షర్టు తగిలించబడియున్నది," అనుకొన్నాను. "నేను ఇక్కడున్నాను," అని ఆలోచించాను.
87మరలా చుట్టూ నేను చూశాను. ఈ స్త్రీలందరూ వచ్చుచున్నారు; వారు… ఈ మార్గమున వచ్చుట నేను చూశాను. అక్కడ నా సోదరులు వచ్చుచున్నారు. వాస్తవంగా వారున్నారు. వారందరూ యువకుల వలె కనిపించారు. వారు కేకలు వేయుచున్నారు, "మా ప్రశస్త సోదరుడా!" ఏమి ఆలోచించాలో నాకు తెలియలేదు.
"ఇది వింతగా ఉన్నది," అనుకొన్నాను. వెనక్కి చూచాను, నేను ముసలివానిగా లేను, యువకునిగా ఉన్నాను. "ఇది చాలా వింత సంగతి, ఇది దర్శనమా?" అనుకొన్నాను. నా వేలును కరచుకొని, "కాదు!" ఇది నాకు వచ్చిన దర్శనము వంటిది కాదు.
అప్పుడు, ఇక్కడ ఏదో నాతో మాట్లాడనారంభించి ఇట్లు చెప్పెను, "నీవు నీ జనులలోనికి ప్రవేశించావు."
"నా ప్రజలా? వీరందరూ బ్రెన్హామ్లా?" అనుకొన్నాను.
"వారు క్రీస్తు నొద్దకు నీవు నడిపించినవారు," అని చెప్పెను. ఈ స్త్రీలు… నాకెప్పుడూ ఒక విధమగు ఆలోచన ఉంటుంది, మీకు తెలియును… వారు నన్ను స్త్రీ ద్వేషకుడని అంటారు, సరి, నేను కాను (చూచారా?), నాకు అవినీతి, అసభ్యత ఇష్టముండదు; క్రీస్తులో నిజమైన సోదరీలంటే నాకు ఇష్టము. ఆ రకంగా అయితే మంచిదే.
88నేను బాలునిగా నున్నపుడు నాకు కొన్ని గాయపు మచ్చలుండేవి. జరిగిన సంగతులు నాకు తెలియును. ఆ విధంగా ఏర్పడడానికి కారణములు నేనెరుగుదును. కాని అది అంతా దేవుని సృష్టి, ఈ ఘడియ కొరకు నన్ను మలిచెను. చూచారా?
ఇప్పుడు, నేను ఒక నిజమైన సోదరి, దానికంటే మంచిది ఏమి ఉండదు అని నేను అనుకొనుచున్నాను. దేవుడు మానవునికి ఇచ్చిన దానిలో శ్రేష్ఠమైనది రక్షణ, ఆ తరువాత భార్యయే. చూచారా? అయితే ఇంకా ఏదయినా మంచిది అంతా అచ్చటనే యున్నది. ఆయన ఇవ్వకలిగి యుండినచో ఇచ్చియుండేవాడు. కాని వారిలో కొందరు ఎదురు తిరిగి భార్యవలె ప్రవర్తించక, పెండ్లి ప్రమాణములకు లోబడక ఉందురు. వారి భర్తలు కూడా ఆలాగే కొందరున్నారు. మీరు బ్రతికి యున్నంతకాలము ఒకరినొకరు ఎడబాయక ఉండవలెనని జ్ఞాపకముంచుకొనండి. దేవుడు భూమి మీద వేటిని జతచేయునో వారిని పరలోకమందును జతచేయబడును. చూచారా?
89అప్పుడు, నేను ఆది చూచాను. ఈ స్త్రీలు పరుగెత్తికొనివచ్చి, వారి చేతులతో నన్ను చుట్టేశారు, నన్ను హత్తుకొన్నారు, మరియు నన్ను సోదరుడా అని పిలిచారు. ఇప్పుడు వారు స్త్రీలు, కాని ఆ స్థలములో పాపము అనునది ఎన్నడూ ఉండదు. చూచారా? వారు స్త్రీలు, కాని చూడండి, మనలను చేయునది ఏమిటి…. స్త్రీకి స్త్రీ గ్రంధి, పురుషునికి పురుష గ్రంధి ఉండును; పిల్లలను కనుటకు ఇప్పుడు ఆలాగు మనమున్నాము. అక్కడ ఆలాగుండదు. వారందరూ ఒకే గ్రంధిని కలిగియుందురు, అయినను వారు రూపములో ఉందురు… ఈ లోకములో వారికుండిన స్వరూపము అక్కడ కూడా ఉండును, కాని అక్కడ పాపము అనునది ఎన్నడూ ఉండదు. మీరందరును ఒకే మాదిరిగా ఉందురు. అక్కడ పిల్లలను కనుట ఇక ఉ౦డదు. చూచారా? అది నిజము. అది అంతా ఆలాగే యుండును.
కనుక నేను ఆ స్త్రీల వైపు చూశాను…
90ఈ సోదరులు నన్ను పైకి ఎత్తి, ఒక స్థలములో కూర్చోబెట్టారు. "మీరెందుకిలా చేస్తున్నారు," అనడిగాను.
"నీవు భూమిమీద ఒక నాయకునిగా ఉన్నావు. వీరు నీ ప్రజలు," అని చెప్పారు.
అప్పుడు కొందరు స్త్రీలు వచ్చి, ఇట్లు అన్నారు, "మా ప్రశస్త సోదరుడా," అన్నారు. ఒక అతి సుందరమగు స్త్రీ దాటి వెళ్ళిపోతూ ఉండగా, ఈ స్వరము నాతో ఈలాగు చెప్పెను, "ఆమె నీకు గుర్తులేదా?"
"లేదు!" అన్నాను.
"ఆమె తొంబై ఏండ్లు దాటిన తరువాత నీవు క్రీస్తునొద్దకు నడిపించావు. చూచావా? ప్రశస్త సోదరుడా అని ఆమె ఎందుకనుచున్నదో గ్రహించావా?"
"మంచిది, నీవు…" అని నేను అన్నాను.
"లేదు, మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాము," అని వారు చెప్పారు.
"సరే, నేను దాటి వచ్చినట్లయితే యేసును చూడగోరుచున్నాను," అని చెప్పాను.
"నీవిపుడు ఆయనను చూడలేవు. బలిపీఠము క్రిందనున్న ఆత్మలని వాక్యము చెప్పినది ఇదే. ఆయన కొద్దిగా పైన ఉన్నాడు. ఒక దినమున ఆయన తిరిగి వచ్చును. తిరిగి మనము భూమిమీదకు వెళ్ళుదుము. ఇక్కడ మనకు తినుట లేక త్రాగుట లేవు," అని చెప్పిరి.
91"దీనికి నేను భయపడుదునని మీరు అనుకోనుచున్నారా? ఏమి ఇది…?" అని నేను అన్నాను. స్నేహితుడా, దాని గూర్చి మాట్లేడేందుకు మాటలు లేవు. అది… పరిపూర్ణత అనే మాట కూడా దానిని అంటుకొనజాలదు. "అపూర్వము," నాకు తెలిసిన ఏ ఆంగ్ల పదము, ఏ మాట కూడా అదేమిటో వివరించజాలరు. అది నాకు తెలిసిన దేనికన్నను మించిపోయినది. అక్కడ ఆయనుండెను; ఆ స్థలములో వ్యాధి, దుఃఖము లేదు. నీవు చనిపోలేవు; నీవు పాపము చేయలేవు. అది ఖచ్చితంగా పరిపూర్ణము, ఖచ్చితంగా పరిపూర్ణము. స్నేహితులారా, తప్పక దానిని పోగొట్టుకొనవద్దు, తప్పనిసరిగా పోగొట్టుకొనవద్దు.
గుర్తుంచుకొనండి… నేను చిన్న పిల్లవానిగా, ఒక బాలునిగా ఉన్నపుడు నరకమును గూర్చిన దర్శనమును చూచాను. ఈ నాటి స్త్రీలు తమ కళ్ళను తోడేలువలె లేదా అటువంటి దానివలె అలంకరించుకొనుట, కళ్ళ క్రింద నీలరంగు పదార్థము ఏదో పూసికొనుట నేను చూచాను. (ఈ పని మర్యాదగల స్త్రీలు చేయరు) నేను మునిగిపోవుచున్నాను. నేను బాలునిగా నుండగా నాకు తుపాకి దెబ్బ తగిలినది. నేను ఒక వైద్యశాలలో మరణ శయ్యపై ఉన్నాను. నేను ఎప్పుడూ దేవుడున్నాడని నమ్ముచుండేవాడు. నేను మొదటగా ప్రార్ధించుటకు ప్రయత్నించిన ప్రార్ధన జ్ఞాపకమున్నది. నేను చెప్పకలిగింది ఒక్కటే… ఇంతకుముందెన్నడూ ఇది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పవలెనని అనిపించుచున్నది. నేను తుఫాకీతో కొట్టబడ్డాను. పొలములో చనిపోతూ పడి ఉన్నాను. దేవునికి నేను పెట్టిన మొర్ర ఒక్కటే యున్నది, "ప్రభువా, నేనెన్నడూ వ్యభిచారము చేయలేదని నీవెరుగుదువు," అన్నాను. చూచారా? పదిహేను సంవత్సరాల ఒక చిన్న యువకునిగా నేను మంచిగా జీవించయత్నించాను. నేనిట్లు చెప్పాను, "నేను పవిత్రంగా జీవించాను. నేను చెప్పకలిగినదంతా అదే." నేను ఆయనకు అర్పించకలిగిన ప్రతిభ అదొక్కటే.
92నేను అక్కడ పడియుండినపుడు… వైద్యుడు నన్ను చూచి దూరంగా వెళ్ళిపోయాడు. చీకటి నిత్యత్వములోనికి నేను మునిగిపోతున్నట్లు నాయంతట నాకే ఆనిపించినది… నేను తండ్రి కోసమే కేకలు వేశాను. "ఓ, నాన్నా, నాకు సాయం చెయ్యి!" అన్నాను. అక్కడ ఏ తండ్రీ లేడు, "అమ్మా! నాకు సహాయం చెయ్యి!" అన్నాను. అక్కడ అమ్మ లేదు. "దేవా, సహాయం చేయుము!" అక్కడ దేవుడు లేడు. అది అంతములేని భయంకరమగు, ఓ, పీడకల. మండిపోతూ దహించివేస్తూన్న పాతాళము. దాని ప్రక్కగానున్న దానిలో ఉండుటయే ఆనందముగా నుండును. దానిగుండా పడుట, "అమ్మో!" అనుకొన్నాను. మరల మరల ఈలాగే ఉండును. ఒక స్థలంలోనికి వెళ్ళాను — పొగ, చీకటి, వ్యాధి; అమ్మో, ఎటువంటి అనుభూతి. నాపై మరణమున్నది. కండ్లకు రంగులు వంటివి పూసికొని ఆ స్త్రీలు నా యొద్దకు వచ్చుట నేను చూడకలిగాను. ఇప్పుడు గుర్తుంచుకొనండి, అది నలభై-అయిదేండ్ల క్రితం జరిగినది — ఏదైనా గాని నలభై ఏండ్లు పై బడినది. వెళ్ళుచుండిరి… వారు వెళ్ళుచున్నారు. "నేను ఎప్పటికీ అక్కడ ఉండవలసియున్నదా?" అనుకొన్నాను.
"ఎప్పటికీ."
"ఓ దేవా, ఇప్పుడు నన్ను ఇక్కడి నుండి బయటకు తీసినచో నేను నీ గూర్చి ఎన్నడూ సిగ్గుపడను. ఎప్పుడూ సిగ్గుపడను దేవా, దయచేసి నాకో అవకాశమిమ్ము," అనడిగాను. మీకు తెలియునా, మొదటగా నాయంతట నేను వేనుకకు వచ్చుచున్నట్లు నాకు అనిపించినది. వైద్యుడు ఆశ్చర్యపడిపోయెను, ఎందుకనగా నా గుండె నిమిషమునకు పదిహేనుసార్లు మాత్రమే కొట్టుకొనుచుండెను. నా రక్తమంతా కారిపోయి అంతా జరిగిపోయినది. కారిన నా స్వంత రక్తములోనే నేను పరుండియున్నాను. ఒక దినమున అది జరుగునేమోనని నేను కలవరము చెందాను.
93రెండు సంవత్సరాల క్రితం బహుశా నేను టుకిసాన్ కు తరలి వెళ్ళాను. జె.సి. పెన్నీస్ వద్ద నేను నా భార్యతో ఉన్నాను. నేను ఆ విధంగా అక్కడ కూర్చోనియున్నాను. నా తల క్రిందికి పెట్టి ఎదురు చూస్తున్నాను, ఎందుకనగా స్త్రీలు ఎంతసేపు షాపులో కొంటారో మీకు తెలియును గదా. నేను నా తల క్రిందికి పెట్టి, ఈలాగు అక్కడ కూర్చున్నాను. కదిలే మెట్లు పైకి వచ్చుచున్నవి. కొందరు స్త్రీలు నీటితల కత్తిరింపులుతో వస్తున్నారు - మీకు తెలియును అది ఎట్లుండేదో, వారితో పాటుగా ఒక విధంగా రంగులు కళ్ళకు పూసికొనిన స్త్రీలు వస్తున్నారు; వారు స్పానిష్ మాట్లాడుకొనుచుండిరి. అది… అదంతా దర్శనము తిరిగి సంభవించుచున్నది. అది అక్కడుండెను, "ఉహ్, ఉహ్."
సోదరుడా, సోదరీ, ఒక సంగతి మీకు చెప్పనీయండి. ఇపుడది హాస్యంగా కనిపించవచ్చును, కాని ఒక్కసారి నీవు అక్కడికి వెళ్ళు. అది చాలా తీవ్రమైన విషయము. నీవెన్నడూ ఆ మార్గంలో వెళ్ళవద్దు!
94నేను ఒక ముసలివానిగా, ఒక సేవకునిగా, ప్రపంచము తిరిగి ప్రసంగించాను, మిలియనుల కొలది స్నేహితులున్నారు,కాని నేను మీతో కూడా అవతలి ప్రక్కన నిలబడవలసియున్నాను. లోకపు సంగతులు నుండి దూరంగా పొండి. నీవు మునుపు ప్రవర్తించినది ఇంకా నీలో ఏదైనా ఉండి ఆ విధంగా ప్రవర్తించవలెనని కోరిక ఇంకా ఉన్నచో, మీలో లోకపు సంగతులు ఇంకా నిలిచియున్నచో, గుర్తుంచుకొనండి, మీరు దేవునివారు కారు; నీవు కేవలము ఒక సంఘ సభ్యునివి. ఆ పిలుపు వచ్చువరకు, కరడు కరడును పిలుచువరకు… చూచారా?
చేప వీపు మీద ఈదే రెక్క ఉండటానికి ముందే ఈత వేయుటకు కావలసిన నీరు మొదటి ఉండవలెను, లేకపోయినచో దానికి ఆ ఈదే రెక్క ఉండేది కాదు. భూమీ మీద చెట్టు పెరుగుటకు ముందే అసలు భూమి అనేది ఉండవలెను, లేకపోయినచో ఆ చెట్టు దేనిమీద పెరుగును. ఆ చెట్టునకు ఏ కారణము అక్కడ యుండదు. దానిని తయారు చేయుటకు…
MATT 5:6
95సృష్టి అనునది ఉండటానికి ముందుగా అక్కడ సృష్టికర్త ఉండవలెను.
"నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు." మనలో ఏదో యున్నది. కొద్దిసేపటి క్రితం మీరు మీ చేతిని ఎత్తారు: "నాకింకా ఎక్కువగా దేవుడు కావలెను." చూచారా? ఏదో అవసరతగా యున్నది. మీరు లోకమును ప్రేమించినచో (ఆ మార్గములో వెళ్ళినచో), లోకపు సంగతులు ప్రేమించినచో, లోకపు ప్రయాణములో నీవు వెళ్ళెదవు, నాశనములో నీవు ఉందువు. చూచారా? బయటకు రండి! మీరు రాజు యొక్క కుమారులు, కుమార్తెలు. ఆ రాజునకు మర్యాదస్తులగు స్త్రీ, పురుషునివలె ఉండండి. క్రైస్తవులవలె నడుచుకొనుడి; క్రైస్తవులవలె జీవించండి; క్రైస్తవులవలె ప్రవర్తించుడి. గుర్తుంచుకొనండి, ఈ మాటలతోనే ఆ తీర్పు దినమున నేను మిమ్మును కలిసికొందును. చూచారా?
ఈ రాత్రి మీ చూసే అద్దములో చూచుకొనండి మరియు చూడండి, "ఎటువైపు నేను పురోగమించుచున్నాను. నా కొరకు యేసు ఒక స్థలము, ఒక శరీరము సిద్ధపరచుచున్నాడా? ఆ శరీరము పరిపూర్ణమైనది; ఆ శరీరము క్రమపద్ధతిలో నడచును; అది దేవుని ఎదుట ఒక కుమారుడు లేదా కుమార్తె. అక్కడున్న ఆ శరీరములోనికి జన్మించుటకు ఇక్కడ నేను ప్రసవ నొప్పులు పడుచున్నాను. నేనింకను లోకమును ప్రేమించుచున్నచో, నాకు అక్కడ శరీరము లేదని అది సూచించుచున్నది. నేను కేవలము ఒక సంఘ సభ్యునినే. నేను దేవుని యొక్క బీజమును కాను. ఆయన నా తండ్రి కాడు."
JOHN 14:2,3
96"మీరు శిక్షకు తట్టుకోనిచో (ఇప్పుడు మీరు అదే పొందుచున్నారు) అప్పుడు మీరు అవిధేయులగు పిల్లలుగా నుందురు. దేవుని పిల్లలుగా నుండరు." అది నిజము కాదా? బైబిలు ఇది చెప్పుట లేదా? దేవుని యొక్క శిక్షను నీవు తాళుకొనినచో, వాక్యము నిన్ను క్రమములో పెట్టుట నీవు చూచునపుడు "ఓ, అది వినవలసిన పని నాకు లేదు. నేను క్రైస్తవుడిని. నేను చేసేదే చేయుదును…" అని అందువు. సరే, ఆలాగే వెళ్ళిపో. చూచారా? నీవు దేవుని బిడ్డవు కాదని అది ఒక ఖచ్చితమగు రుజువు. అయితే ఒక నిజమగు దేవుని బిడ్డ ఆకలి మరియు దప్పులు కలిగియుండును. ఎందుకు? అక్కడ అది అవసరము అని నీ హృదయములో ఏదో కోరిక చెప్పుచున్నచో, ఏదో జీవనాడి కొట్టుకొనుటను అది చూపించుచున్నది. అక్కడికి నిన్ను లాక్కొని వెళ్ళుటకు యత్నించుచున్నది. అక్కడ ఒక శరీరమున్నది. ఇది దానికి ఒక మాదిరి. దీనిని నీవు దేనికొరకు వాడుచున్నావు? అపవాదిని మహిమపరచుటకా? లోకమును, లోకపు ధోరణులను, కార్యములను మహిమపరచుటకా? లేక నీవు పరలోకము తట్టు చూచుచున్నావా? అక్కడ ఏదో ఉన్నది; నీవు నీ జీవితములో దేవుని మహిమ పరచుచున్నావు.
"నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు; లేనియెడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరల వచ్చి మిమ్మును తీసికొనిపోవుదును. నేనుండు చోటనే మీరును ఉందురు." జరుగనైయున్న సంగతులు. ఇప్పుడు వుండిన ఈ సంగతులు సామర్థ్యాన్ని కలిగియుండి, రానున్న సంగతులను పిలచుచున్నవి.
మనము ప్రార్ధించుదము.
97తీవ్రముగా ఆలోచించండి, ప్రియ క్రైస్తవ స్నేహితుడా, ఆలాగు చేయుదువా? ఒక్క క్షణము నిజముగా తీవ్రముగా ఆలోచించండి. ఒక్క నిమిషము పాటు బహు నెమ్మదిగా ఉందుము, పరిశుద్ధాత్మను మాట్లాడనీయండి.
ఇప్పుడు, పెంతెకోస్తు ప్రజలగు మీ యొద్దకు ప్రభువైన యేసు ఎప్పుడో నన్ను పంపించెను. ఈ పరిచర్య ఫలితమువలన ఇక్కడి మీ కుమారులలో ఒకరు మీ సంఘ కాపరిగా ఉండుటకు వచ్చియున్నాడని చెప్పారు. గ్రుడ్డివారి కన్నులను ప్రభువైన యేసు తెరచుటయు, నీరు పట్టిన తలలు వెంటనే వాపు తగ్గిపోవుటయు అతడు చూచెనని చెప్పెను. ఇంకా స్వస్థత కూటములను నేను కలిగియున్నాను, కాని నేను గ్రహించినదేమనగా, బాగా వ్యాధిగ్రస్తులుగా నున్న వారికి అనేకమందికి నేను ప్రార్ధించాను. వారు స్వస్థత పొందిరి. ప్రభువు ప్రార్థనలకు జవాబునిచ్చి రోగులను బాగు చేసేను, కాని మీకు తెలుసా? చాలా మంది బాగయినవారు ఇప్పటికే మరణించారు. నీవెంత రోగిగా నున్ననూ పరవాలేదు. నీవు స్వస్థత పొందినను ఎప్పుడయినా చనిపోవుదువు, కాని ఆ ప్రాణము, నా ప్రశస్త సోదరుడా, ఆ ప్రాణము, నా ప్రశస్త సోదరీ, దాని గూర్చి ఆలోచించవా? అది నిత్యత్వముతో కూడినది. దేవుని యొక్క ప్రేమ అక్కడ లేనిచో లాక్కొని పోయేది ఏదీ లేదు. దేవునిని ఈలాగు అడుగుదుమా? "ఓ దేవా, ఈ రాత్రి నూతనముగా నన్ను రూపొందించుటకు ఆరంభము చేయుము, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నిన్ను ప్రేమించగోరుచున్నాను. నీకు సన్నిహితముగా జీవించుట అవశ్యమని నా హృదయములో ఏదో నాకు చెప్పుచున్నది. ప్రభువా, ఇప్పుడే నేను వచ్చి దానిని చేయుదును." అటువంటి వ్యక్తి లేదా వ్యక్తులు ఈ భవనములో గాని భవనము బయట గాని ఉన్నచో, యేసుక్రీస్తు నామమున దేవుని దాసునిగా నేను అడుగుచున్నాను. నీవు నీ తలను వంచియుండగా, నీ చేతిని ఎత్తి దేవునికి ఈలాగు మాత్రము చెప్పుము, "దేవా, దగ్గరగా మరీ దగ్గరగా ప్రియ దేవా, నన్ను లాగుకొనుము. నీవు నీ వాక్యములో కలిగియున్న సమస్తమునకు నేను అంగీకరించగోరుచున్నాను." ఇప్పుడు మీరు చేతులెత్తండి. నిజమగు యధార్థముతో ఉండండి.
కాస్త ఆలోచించండి.
98"నేను ఇది చేశాను, నేను ఆత్మతో కేకలు వేశాను; నేను భాషలో మాట్లాడాను, కాని చూడు, నా జీవితంలో ఏదో కొరతగా యున్నది. దేవుని యొక్క వాక్య అద్దములోనికి నేను చూచాను. అక్కడ ఏదో ఉన్నది. నేను సంఘానికి వెళ్ళుచున్నాను, కాని నేను ఉండవలసినట్లుగా లేను," అని ఇప్పుడు మీరు చెప్పండి. చూచారా? ఒక దానిని అది చూపించుచున్నది… ఇప్పుడు, నీవు నీవైపు చూచుకొనగలిగినచో దేవుని యొక్క వాక్యముతో నీ జీవితము క్రమపరచబడలేదని చూచుకొనినచో, నీ చేతిని ఎత్తుటకు హేతువైనది అక్కడ వున్నది. ఏదో పొరపాటు ఉన్నదని నీవు అప్పుడు తెలిసికొందువు. నీకు… అక్కడ… అమ్మ నాతో ఈలాగు చెప్పుచుండెడిది, "చిలగడ దుంపలో నుండి నీవు రక్తమును రప్పించలేవు, ఎందుకనగా అందులో రక్తము లేదు." చూచారా? బహు తీవ్రముగా దానిగూర్చి ఆలోచించుము. ఇదే నీ చివరి అవకాశము కావచ్చును. ఇక్కడున్న ఈ చిన్న గుంపులో సంఘ నిర్వాహకునితో సహా ముప్పది లేదా నలుబది చేతులు పైకి లేచినవి.
99ఒక్క క్షణము నిజమగు మర్యాదతో నుండండి. నిజమగు సూటిగా ఇప్పుడు ఆలోచించండి. ప్రియ దేవా, ఒక ప్రమాదములో నేను ఈ రాత్రి చనిపోవచ్చును. గుండెపోటుతో నేను చనిపోవచ్చును. ఏదో ఒక ఉదయాన నేను వైద్యుని పిలువ వచ్చును అతడు వచ్చును. నా నాడి చొక్కా చేతిలో నుండి కూడా కనిపించునంత తీవ్రముగా కొట్టుకొనుట జరుగును. నేను వెళ్ళిపోయాను. నేను నా బుగ్గను దండుకు నొక్కి పట్టుకొని ఇట్లందును," ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా!" చూచారా? ఆ గుండె తన చివరి పోటును కొట్టినది; నీవు ఆ గొప్ప ద్వారము నొద్దకు వచ్చుచున్నావు. దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించితేనే గాని నీవెన్నడూ బయటకు రావు. నీలో ఎదో ఉంటె తప్ప నీవు బయటకు రావు — దేవుని ఆత్మ మూలముగా జన్మించిన తరువాత — దేవునితో పాటు వెళ్ళుటకు ఆకలి దప్పులు కలిగియుందువు. తప్పక అది యుండవలెను. చూచారా? భూమిలో నీవు ఒక బిడ్డవు, భూమి యొక్క గర్భము దేవుని రాజ్యములోనికి ప్రవేశించుటకు ఇంకనూ కనిపెట్టి చూచుచున్నది, ఎందుకనగా ఆయన ఒక శరీరము నీ కొరకు సిద్ధపరచుటకు వెళ్ళెను. అది పరిపూర్ణ శరీరము. ఇప్పుడు, చాలా లోతుగా ఆలోచించుము, అందరము కలసి ప్రార్థించుదము.
MATT 15:6•
MARK 7:13
100ప్రియ దేవా, గ్రంథములోని పుటలలో ఇది యున్నదని నేనెరుగుదును, గొప్ప సాక్ష్యము. మేము సైన్సు వలన తప్పులోనికి వెళ్లిపోయాము. ప్రభువా, మమ్ములను మేల్కొలుపుటకు ఇది చాలును. మేము వేయు ప్రతి కదలిక భూమి చుట్టూ ప్రదక్షిణము చేయునను వాస్తవములు తెలిసికొనుటకు ఇది చాలును. దానిని మేము చేయునపుడే అది కూడా జరుగుచున్నది. టెలివిజను ద్వారా మేము దానిని పొందుచున్నాము, తండ్రి, మేము గ్రహించుచున్న దేమనగా, టెలివిజను ఒక బొమ్మను ఉత్పత్తి చేయుటలేదు గాని బొమ్మను తయారుచేయు ఒక నాళములోనికి కంపములను పోనిచ్చు మార్గమును ఏర్పాటు చేయుచున్నది. మేము ధరించిన బట్టల రంగులు కూడా గాలిలోని ఈథరు అలలవలన అలాగే చూపించబడుచున్నవి. ప్రపంచము చుట్టూ ఆ కంపనమున్నది. ఆ బట్టలు ధరించుకొని మా సోదరీలు ఆలాగు ప్రవర్తించుట, ఆకలి లేకుండా - రంగుల ముఖాలతో, జుట్టు కత్తిరించుకొని…
వేదాంత విద్య నభ్యసించుటకు ఏదో సెమినరీకి వెళ్ళు సేవకులు మనుష్యుల మాటలను తీసికొని - అవి వారి ఆచారమల వలన ఏర్పడినవి - దేవుని ఆజ్ఞలను నిరర్థకములేని వాటిగా జనులకు చూపించుచున్నారు… వారి ఆచారములను బట్టీ సంఘానికి చెందవలెను మరియు అది చాలు, అని చెప్పుచున్నారు. ఓ, దేవా, మేము చెప్పిన ప్రతిమాట నమోదు అవుచున్నదని సైన్సు ప్రకారము రుజువైనది. మేము ఈ భూమి మీద జీవించుట ఆరంభమైనపుడే అది కూడా మొదలయినది. మేము చనిపోయినపుడు అది ముగియును. తీర్పు దినమున అది దేవుని యొక్క ఆల్బములో నుండి తీసి తిరిగి చూపించబడును. దీనిని జనులు గ్రహించునట్లు చేయుము. మన యెదుట ఇంత స్పష్టముగా ఉంచబడిన దీనిని త్రోసివేసినపుడు, దేవుని యొక్క శిక్షను ఎట్లు తప్పించుకొందుము? ఓ, ప్రియ దేవా, ఈ మాటలు ఎన్నడూ చనిపోవు, అవి నీరంతరం కొనసాగును. తీర్పు దినమున ఆ రికార్డరులో చూపించబడును. తండ్రీ, పైకి ఎత్తిన ఆ చేతులను నీవు చూచియున్నావు. తీర్పు దినమున అది అక్కడే యుండును. మరియు వారి హృదయము ఏమి ఆలోచించుచున్నదో తీర్పు దినమున అక్కడ ఉండును.
PS 66:18
101తండ్రియగు దేవా, ఇప్పుడు నీ సేవకునిగా నేను ప్రార్థించి అడుగునదేమనగా, నీ జనులతో నుండి దోషమును పూర్తిగా తీసివేయుము. అతిక్రమము అనగా, "చేయవలెనని మాకు తెలిసి కూడా చేయకుండుట," దావీదు పలికెను, "నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల, దేవుడు నా ప్రార్థన ఆలకింపకుండును.'' దేవా, మా దోషమును పరిహరించుమని నేను ప్రార్థించుచున్నాను, ఎందుకనగా మమ్ములను చూపించు అద్దమే నీ వాక్యము. రాజు యొక్క కుమారులు, కుమార్తెలముగా నుండుటకు ఎంత లోటులో ఉన్నామో చూపించుము. తండ్రి, దానిని నీవు ఈ రాత్రి చేయుమని ప్రార్థించుచున్నాము.
దానిని ఒక బలిపీఠముగా చేయుము, ఎందుకనగా బలిపీఠము జనులతో నిండియున్నది. వారు కూర్చొనియున్న ఆ కుర్చీని బలిపీఠముగా చేయుము. వారి హృదయములను బలిపీఠముగా చేయుము. ఇక్కడున్న ప్రతి సోదరుడు, సోదరిలో నుండి లోకము తొలగిపోవును గాక! ఆ చిన్న జీవ కణము, దేవుని యొక్క జన్యువు, దాని గూర్చి మేము మాట్లాడుకొనియున్నాము. దేవుని నుండి దిగి వచ్చిన ఆ ప్రతిరూపము దేవుని ఘనవరచుటకు, మహిమపరచుటకు ఇక్కడ ప్రత్యక్షపరచబడినది… దేవుడు లోకమును వారికొరకు కదిలించెను.
ప్రభువా, ఇతరులకు ప్రార్థించలేను, ఎందుకనగా వ్యాధి మరణము నిమిత్తము వచ్చెను, కదలుటకు వారిని ప్రేరేపించునది ఏదీ అక్కడ లేదు. కాని ఎవరయితే కదల కలిగి అది తప్పు అని ఎరిగియున్నారో వారి హృదయములను శుద్ధి చేసి, ఆత్మలను ఈ రాత్రి పవిత్రపరచుము. తండ్రి, వారు నీ ఆత్మచే నింపబడి, నీ వెలుగులో నడచుదురు గాక.
ISA 53:5
102ఈ ప్రియమగు, యవ్వన, ఆరోగ్య, బలముగా కనబడుచున్న ఇక్కడి సంఘ కాపరిని ఆశీర్వదించుము, ప్రభువా, ఈ యవ్వనుడు నీవు చేసిన దానిని చూచి ప్రభావితము చెందియున్నాడు అని చెప్పియున్నాడు. ఓ దేవా, ఈ చక్కని యువకుని ఆత్మను అగ్నివలె మండించుము. ప్రభువా, అది అనుగ్రహించుము, ఎక్కడయితే పరిశుద్ధాత్మ అతనిని మందను కాయు పైనాయకునిగా ఉంచునో, అక్కడ కాలమంతయు ఎడతెగక నిజమగు కాపరి వలే అతడు ఉండునట్లు చేయుము, ప్రభువా అది అనుగ్రహించుము. అతడు కుడి ఎడమలకు తిరుగక, ఏ మత సిద్దాంతమునకు చోటియ్యక, దేనికి తావీయ్యక, దేవుని నోట నుండి వచ్చు కల్తి లేని దేవుని వాక్యమును మాత్రమే ప్రకటించునట్లు కృప చూపుము. దేవా, అతనిని ఆశీర్వదించుము. ఆయనను ఆయన ప్రియులను ఇక్కడున్న ఆయన చిన్న సంఘమును దీవించుము, వారందరితో ఉండుము, తండ్రీ.
తండ్రీ, దీనిని నీకు అప్పగించుచున్నాను. విత్తనము చల్లబడినది. జీవమునకు ఉద్దేశించబడినది ఆ విత్తనముపై పడి, ఇక్కడున్న ఈ సంఘమునకు, వారెక్కడి నుండి వచ్చిరో ఆ సంఘమునకు గొప్ప బలమగు క్రైస్తవులుగా నుండుటకు ఎదుగుదురు గాక! ప్రభువా, దాని దయచేయుము. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామమున దీనిని నీకు అర్పించుచున్నాను.
మరియు తండ్రీ, "ఆయన మా అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. మా దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను. మా సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బలవలన మేము స్వస్థపరచబడియున్నాము."
103నరముల ఉద్రిక్తత కలిగిన ఒక దీన స్త్రీ గుమ్మము ద్వారా కదలివెళ్ళుట కొద్ది నిమిషాల క్రితము నేను చూచాను. ఓ దేవా, ఆమె స్వంత కుటుంబములో ఎంత గొప్ప కార్యములు జరిగినవి. నిన్ను నీవు బయలుపరచుకొంటివి. దేవా, ఆ స్త్రీ కొరకు నేను ప్రార్ధించుచున్నాను. ఆమె యొక్క గత జీవితములోని దానినంతటిని తీసివేసి, ప్రభువా, ఆమెను ఈ రాత్రి బాగుచేయుము. ప్రభువా, బాగుచేయవా? ఆమెను నీ కొరకు తీసికొనుము.
చిన్న పిల్లలు ఇక్కడ కూర్చుని యుండుట చూస్తున్నాము, ప్రభువా, వారు ఇతరుల స్వస్థత అవసరతతో వచ్చియున్నారు. తండ్రి, వారిని బాగుచేయుమని ప్రార్థించుచున్నాను. దానిని అనుగ్రహించుము. నీ గొప్ప స్వస్థతా శక్తి వచ్చి, మా ఆత్మ, శరీరములు రెండింటిని బాగుచేయును గాక.
MARK 16:15-18
104ఇప్పుడు, ఇక్కడ సంఘములో ఉన్నవారు లేదా బయటి వారు స్వస్థత అవసరతతో ఉన్నచో, చేతులెత్తి ఈలాగు చెప్పమని కోరుచున్నాను. "బ్రదర్ బ్రెన్హాం, నాకు స్వస్థత కావలెను." అందరూ చేయునట్లుగా చూడండి. సరే, మంచిది. నన్ను దైవ సేవకుడని నమ్మువారు, "ఆమెన్" చెప్పండి. అయితే మీరు ఒకరిమీద ఒకరు చేతులుంచవలెనని కోరుచున్నాను. ఒకరిపై ఒకరి చేతులుంచుకొనండి, మీరు చేతులెత్తారు, (బయట ఉన్నా లోపల ఉన్నా గాని) - దేవునిలో విశ్వాసులు అని వారు చేతులెత్తి వ్యక్తము చేసారు. యేసుక్రీస్తు చెప్పెను (సంఘమునకు ఆయనిచ్చిన చివరి ఆజ్ఞ), "మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచనలు కనబడును: నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు; వారు క్రొత్తభాషలు మాట్లాడుదురు; వారు సర్పములను ఎత్తిపట్టుకొందురు, విషకరమైనది ఏదయినను వారు త్రాగినను వారికి హానిచేయదు. వారు రోగులపై చేతులుంచినపుడు బాగుపడుదురు." ఇప్పుడు, యేసు అది చెప్పెను. గుర్తుంచుకొనండి, అది ఆయన చెప్పెను! అది అలాగే జరుగవలసియున్నది! ఆ వాక్యమును పట్టుకొనువారు ఎవరో అక్కడ లేకుండా ఉన్నచో, ఆయన ఆ మాట చెప్పియుండెడివాడు కాడు.
ISA 7:14•
EPH 2:6
105మరియ గర్భము ఆ కణమును పట్టుకొన్న విధముగా: "కన్యక గర్భవతి యుగును." ఖర్జూరపు వృక్షము సృష్టింపబడినట్లు మరియు ఓక్ వృక్షము వలె — ఆయన మాట దానిని చేసెను. ఆయన మాట ఇప్పుడే నీ హృదయములోనికి చొచ్చుకొనిపోవును. "ప్రభువా, నేను విశ్వాసిని, నా చేతులుంచిన ఈ స్త్రీ లేదా పురుషుడు బాధపడుచున్నారు. నా కొరకు నేను ప్రార్థించుట లేదు, ఎందుకనగా వారు నా కొరకు ప్రార్థించుచున్నారు. నేను ఆమె కొరకు లేదా ఆయన కొరకు ప్రార్థన చేయుచున్నాను. నా దేవా, ఆమెను బాగుచేయుము, అతనిని బాగుచేయుము. నేను ఒక విశ్వాసిని, ఇప్పుడు మేము కూడికొనియున్నాము. ఆయన భూమి మీద నడిచినపుడు క్రీస్తుతో మేమున్నామని ఇప్పుడే మేము నేర్చుకొనియున్నాము. ఏలయనగా మేము ఆయన యొక్క వాక్యములో భాగమైయున్నాము. మేము ఆయనతో శ్రమపడియున్నాము; ఆయనతో మేము రక్తము కార్చియున్నాము; ఆయనతో మేము చనిపోయియున్నాము; ఆయనతో మేము పాతి పెట్టబడియున్నాము; ఆయనతో కూడా మేము తిరిగి లేచియున్నాము, యేసుక్రీస్తుతో పాటుగా ఉన్నత స్థలములందు మేము కూర్చుండ పెట్టబడియున్నాము - ఆయన గొప్ప రాజు, ఇక్కడ మన మధ్య ఆయన కూర్చొనియున్నాడు. నేను ఈ రాజు యొక్క కుమారుడు లేక కుమార్తెను, నా కొరకు ప్రార్థించుచున్న ఆ రాజు యొక్క కుమార్తె లేదా కుమారుని మీద నా చేతులుంచాను. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇప్పుడు ప్రభువా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చి ఈ దేవుని కుమార్తెను లేదో దేవుని కుమారుని బాగుచేయుము. కలిసి మనమందరము ఒకని కొరకు ఒకరము ప్రార్థన చేయుదము.
JAS 5:15,16
106ప్రభువైన యేసూ, మేము తగ్గించుకొని మా తప్పును ఒప్పుకొనుచున్నాము. వ్యాధి మరణము మరియు దుఃఖమునకు మేము యోగ్యులమేనని ఒప్పుకొని వచ్చుచున్నాము, కాని మేము మా పాపము మరియు రోగుల నిమిత్తమై పరిహారమును అంగీకరించుచున్నాము. ఈ రాత్రి ఇక్కడ కూర్చునియుండిన దేవుని కుమారులు, కుమార్తెలు వాక్యము యొక్క దిద్దుబాటును విన్నారు, తమ చేతులు ఎత్తిరి, సన్నిహిత నడకను కోరారు. ఇప్పుడు వారు ఒకరిపై ఒకరు చేతులుంచారు, ఎందుకనగా వారు నీ వాక్యము సత్యమని నమ్మిరి. మేము ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడి, ఆయనతో కూడా పరలోక స్థలములందు కూర్చొన పెట్టబడియున్నామని వారు నమ్మిరి. వారు ఒకరిమీద ఒకరు చేతులుంచారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించారు. విశ్వాస సహితమగు ప్రార్థన రోగిని లేపును. దేవుడతనిని బాగుచేయును. వాడు పాపము చేసిన వాడయినచో వాని పాపములు క్షమించబడును, అని నీవు చెప్పావు. మీ పాపములు ఒకనికి ఒకడు ఒప్పుకొనుడి. మీరు బాగుపడునట్లుగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనుడి. ఆసక్తి కలిగి నీతిమంతుడు ప్రార్థించినపుడు ఎంతో ప్రభావము కలిగియుండి మేలు కలుగచేయును.
ఓ, నిత్యుడగు దేవా, నీ సేవకుని యొక్క ప్రార్థనను వినుము. మరల ఈ విధముగా వ్రాయబడియున్నది, "నా నామము పెట్టబడిన నా జనులు కూడుకొని కలిసి ప్రార్థించినచో నేను ఆకాశము నుండి వారి ప్రార్థన విందును!" ఓ దేవా, ఈ రాత్రి ఆకాశము నుండి నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించుము. ఒక బలముగా వీచుచున్న గాలివలె ఈ జనసమూహము మీదికి పరిశుద్ధాత్మను పంపించుము.
ఈ జనులను దేవుని యెదుటికి మేము తెచ్చుచున్నాము.
107సాతానా, నీవు ఓడిపోతివి. నీవు ఓడిపోయిన వానివి. కల్వరి యొద్ద యేసుక్రీస్తు నిన్ను జయించెను. నీకు శక్తి ఏమీ లేదు. నీవు మోసగాడివి. ఈ రాత్రి నీ చేతిని మేము గద్దించుచున్నాము. యేసుక్రీస్తు నామమున ఇక్కడున్న ఈ జనులలో నుండి బయటకు రమ్ము, రోగము మరియు వ్యాధి — దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామము విడిచిపోవును గాక.
హల్లెలూయా! దేవుని మహిమను అనుభూతి చెందండి; మీ ప్రార్థనకు జవాబును అనుభూతి చెందండి! నీ ప్రక్కను కూర్చునియున్న వ్యక్తికి దేవుడు జవాబు ఇచ్చెనని నీవు నమ్ముచున్నావా? ఎంత మంది దానిని నమ్ముచున్నారు, చేతులు ఎత్తండి? మంచిది! ఓ, అద్భుతము.
నేను ఆయనను ప్రేమింతును,
నేను ఆయనను ప్రేమింతును.
(చేతులు పైకెత్తి మీ పూర్ణహృదయముతో ఆయనకు పాడుడి),
ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను,
(ఇప్పుడు మీ పూర్ణహృదయముతో దానిని చెప్పుచున్నారా?)
నా రక్షణను కొనెను,
కల్వరి వృక్షము మీద.
108మీ దోషమును మరియు మీరు చేసినవాటిని దేవుడు క్షమించెనని ఎంతమంది అనుభూతిని పొందియున్నారు? ఈ రాత్రి నుండి, "ఓ దేవుని గొర్రెపిల్లా, నీతిగా నడచుకొందునని వాగ్దానము చేయుచున్నాను. ఒక క్రైస్తవునిగా పిలువబడుచున్న పేరును గౌరవించునట్లుగా నేను నడచుకొందును. క్రీస్తును పోలిన విధముగా, దేవా, నా చేతులు ఎత్తుచున్నాను: ఈ రాత్రి నూతనముగా నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. వెలుగులో నేను నడిచెదను," ఆమేన్!
మనము వెలుగులో నడుచుదము, అందమగు వెలుగు
కృపా హిమబిందువులు కాంతివంతముగా నున్న చోటుకు రండి.
దివారాత్రులు మా చుట్టూ ప్రకాశించుము,
యేసే లోకమునకు వెలుగు.
మనము వెలుగులో నడచుదము, అది అంతటి అందమగు వెలుగు.
కృపా హిమబిందువులు
కాంతివంతముగా నున్న చోటుకు అది వచ్చును.
(అక్కడికే ఆయన మన కొరకు స్థలము సిద్దపరచ వెళ్ళెను!)
దీవా రాత్రులు మా చుట్టూ ప్రకాశించుము,
యేసే లోకమునకు వెలుగు.
వెలుగు ప్రకటించుచున్న పరిశుద్దులందరూ రండి,
యేసే లోకమునకు వెలుగు
సత్యము, కృప ఆయన పేరులో ఉన్నవి
యేసే లోకమునకు వెలుగు
(అయితే అప్పుడు మనమేమి చేయుదుము?)
మనము వెలుగులో నడచుదము, అట్టి అందమైన వెలుగు
దీవా రాత్రులు మా చుట్టూ ప్రకాశించుము;
యేసే లోకమునకు వెలుగు
ఓ, అంతా పోయి చక్కగా నున్నట్టుగా మీకు అనిపించుట లేదా? ఓ, మై! మరల పాడుచుండగా మనము కరచాలనము చేయుదము.
మనము వెలుగులో నడచుదము, అట్టి అందమైన వెలుగు;
కృపా ప్రకాశించుచున్న (దేవుడు నిన్ను దీవించును!) చోటకు వచ్చును
దివా రాత్రులు మా చుట్టూ ప్రకాశించుము
యేసే లోకమునకు వెలుగు.
దివా రాత్రులు మా చుట్టూ ప్రకాశించుము.
యేసే లోకమునకు వెలుగు.
మనము కండ్లు మూసికొని దానిని లోలోపల పాడుదము !
[జనులు ఆలపించుచున్నారు.]
(మనము పిల్లల వలె ప్రవర్తిస్తాము; మనము పిల్లలము.)
ఓ, అది ఎంతటి అందమగు వెలుగు;
కృపా హిమబిందువులు
కాంతివంతముగా నున్న చోటుకు వచ్చును
ఓ, మా చుట్టూ దివా రాత్రులు ప్రకాశించుము.
యేసే లోకమునకు వెలుగు.
మీరాయనను ప్రేమింతురా?
నా విశ్వాసము నీ వైపు చూస్తున్నది,
కల్వరి గొర్రెపిల్లా,
(మీ కండ్లు మూసుకొని దానిని పాడుడి.
ఆత్మలో ఆరాధించుడి!)
దైవ రక్షకుడా!
నేను ప్రార్థించుచుండగా ఇప్పుడు వినుము,
నా పాపములన్నింటిని తీసివేయుము.
ఈ దినము నుండి పూర్తిగా నీవానిగా ఉండనిమ్ము!
జీవితముపు చీకటి త్రోవ నేను తొక్కుచుండగా
నీ ప్రక్క నుండి నన్నెపుడూ తొలగి పోనీయకుము.
ఓ, నేను కేవలము పాత కాలపువాడినని మీకు తెలియును, నాకిష్టము… దానికి అన్నీ కొత్త రూపులు దిద్ది, చిటపటల వంటి, రాక్-ఎన్-రోల్ సంగీత బాణి అనుకరణలు మిలియను మైళ్ళు చొచ్చుకొనిపోవుచున్నవి. ఆ పాత కవులు ఆ పాటలను వ్రాసిరి, పరిశుద్ధాత్మ ఆ కాలమును తాకగా వారు వ్రాయనారంభించిరి. ఓ, మై! నేను ఎడ్డీ పెర్రోనెట్ మరియు ఇంకా ఆ గొప్పవారు… ఫానీ క్రాస్ బీ, గూర్చి ఆలోచిస్తున్నాను.
ఓ మృదువైన రక్షకుడా, నన్ను దాటిపోకుము
నా దీన మొరను వినుము;…
JOHN 14:2,3
109ఒకసారి ఆమెను తీసికొని రావాలనుకొని ప్రయత్నించారు. ఆమె ఆ పెంతుకోస్తు ఎల్విస్ ప్రిస్లే వలె కాడిలాక్స్ కోసం జన్మహక్కును ఆమె అమ్ముకొనదు. ఆమె… ఆమె యొద్దకు వారు వచ్చి లోక పాటలను వ్రాయమని ఆమెను కోరారు. "నేను దేనికి కూడా ఆ పని చేయను," అని ఆమె అన్నది.
"సరి, నీవు గ్రుడ్డి దానవు కదా, నీవు పరలోకమునకు వెళ్ళినపుడు ఏలాగు…" అనడిగాడు.
ఆమె ఆత్మావేశముతో తిరిగి ఇట్లు చెప్పెను:
నేనాయనను ఎరుగుదును, నేనాయనను ఎరుగుదును,
ఆయన ప్రక్క ద్వారా విమోచించబడి నేను నిలబడుదును,
నేనాయనను ఎరుగుదును, నేనాయనను ఎరుగుదును, (ఏలాగు?)
ఆయన చేతులలో నున్న మేకుల గురుతుల ద్వారా.
"నేనాయనను చూడలేకపోతే, ఆయన చేతులు తాకుదును."
నేనాయనను ఎరుగుదును, నేనాయనను ఎరుగుదును,
నేనాయనను ఎరుగుదును, నేను ఆయనను ఎరుగుదును
ఆయన ప్రక్క ద్వారా విమోచించబడి నేను నిలబడుదును,
నేనాయనను ఎరుగుదును, నేను ఆయనను ఎరుగుదును
ఆయన చేతులలోని మేకుల గురుతుల ద్వారా.
అది నిన్ను ఆయనను ప్రేమించునట్లుగా చేయుట లేదా? మనకు స్థలము సిద్దపరచ వెళ్ళెను. "నేను వెళ్ళి, మీకు స్థలము సిద్దపరచినయెడల, నేనుండు స్థలములో మీరుండులాగున మరల వచ్చి మిమ్ము చేర్చుకొందును."
HEB 13:8
110చిన్న పిల్లలు ఇప్పుడు ప్రసవవేదనలో ఉన్నారు, దేవుని ఆజ్ఞలకు లోబడుము. ఇక్కడున్న సంఘ కాపరి, ఎవరైనా బాప్తిస్మము పొందని వారున్నచో, నీరు సిద్ధముగా యున్నది మరియు సంఘ సభ్యత్వము కొరకు లేదా మీరు చేయగోరునది లేక మీరు ఎందుకు చేయుచున్నారో ఆ ప్రకారముగానే. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందనిచో, దానిని పొందుటకు ఇదే రాత్రి. దానిని నీవు నమ్మవా?
"ఓ, బ్రదర్ బ్రెన్హాం, చాలా ఆలస్యమయినది, నీవు చాలా సేపు ప్రసంగించావు," అని మీరనవచ్చును. ఒక రాత్రి పౌలు ఇదే రకమగు ప్రసంగమును రాత్రంతా బోధించెను. ఒక చిన్న — ఒక యువకుడు గోడమీద నుండి పడి చనిపోయెను. ఆ వర్తమానముతో పౌలు ఎంతగానో అభిషేకించబడినవాడై, ఆతనిపై తన శరీరమును చాచగా మరల జీవము అతనిలోకి వచ్చెను. ఆయన ఇంకనూ నిన్న, నేడు నిరంతరము, ఏకరీతిగా నున్న యేసుక్రీస్తు. నీవాయనను ప్రేమించవా? మనము ఒక్కసారి చేతులు పైకెత్తి, నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును.
పియానో వాయించువారు ఎక్కడ? సోదరీ, అక్కడెవరైనా గాని మీకిష్టమైనచో రాగము చిన్నగా అందించండి.
ఎందరాయనను ప్రేమించుచున్నారు? చేతులెత్తి ఈలాగు చెప్పండి, "నేను నిజంగా ఆయనను ప్రేమింతును. నా పూర్ణహృదయముతో, నేనాయనను ప్రేమింతును. నేనాయనను ప్రేమింతును."
1JN 4:20
111మనమిప్పుడు కండ్లు మూసికొని, చేతులు ఆకాశము వైపు ఎత్తి, దేవుని మహిమ కొరకు దానిని పాడుదము. నేనాయనను ప్రేమింతును, నేనాయనను ప్రేమింతును. మనము ఆయనను ఆరాధించుదము. నీవు బోధించి, కోసి, చీల్చి ఆ విధంగా చెండాడినపుడు, ఇది దేవుడు అందించు గుగ్గిలము. అది స్వస్థపరచును. ఆత్మ కొరకైన గుగ్గిలము గిలాదులో ఉన్నది. ఇప్పుడు దానిని మనము పాడుదము. దానిపై ఒక రాగమును మీరు అందించండి.
నేనాయనను ప్రేమింతును,
నేనాయనను ప్రేమింతును.
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను.
నా రక్షణను కొనెను
ఆ కల్వరి వృక్షము మీద.
మరియు… మీరు ఒకని నొకరు ప్రేమించుటను బట్టి మీరు నా శిష్యులని జనులందరును తెలిసికొందురు." అది నిజము. చూచుచున్న వారిని, అనగా, ఒకరిని ఒకరము మనము ప్రేమించనిచో, చూడలేని దేవునిని ఎట్లు మనము ప్రేమించుదుము?
నేనాయనను ప్రేమింతును,
నేనాయనను ప్రేమింతును,
ఏలయనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను
నా రక్షణను కొనెను
ఆ కల్వరి వృక్షము మీద.