ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు

ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు

1మనము మన తలలు వంచుదము. ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు మా ప్రార్ధనలకు జవాబు దయచేసినందున మీకు కృతజ్ఞతాస్తుతుల చెల్లించుచున్నాము. ఈ దీన స్త్రీ ఇక్కడ పడియున్నది, ఆమె యొక్క శాస్త్ర చికిత్స విఫలమైనది. కాని, ఓ దేవా, ఈ భూమి పై జరుపబడిన మొదటి శాస్త్ర చికిత్సను మేము జ్ఞాపకము చేసుకొనుచున్నాము, అది నీవే చేసియున్నావు. ఆదాము ప్రక్క నుండి ఒక ఎముకను తీసుకొని, దానిని ముసి, మరియు భార్యను చేసియున్నావు. ఓ తండ్రి, నీ యొక్క హస్తము ఇప్పుడే క్రిందికి వచ్చి మరియు మేము అడుగుచున్న ఈ యొక్క సంగతిని మాకు నెరవేర్చుము గాక, అని మేము ప్రార్ధన చేయుచున్నాము. మరియు ఇతర విషయాలు, ప్రభువా, ఈ స్త్రీ మానసిక ఒత్తిడితో సతమతమగుచున్నది, మరియు విజ్ఞాపనలు కలిగియున్న ఇతరులను మా పూర్ణహృదయముతో మీకు వారిని అప్పగించుచున్నాము, తండ్రి. యేసు నామమున. ఆమెన్.

ఈ రాత్రి ఇక్కడుండుట నిశ్చయముగా ఒక భాగ్యమే. చక్కని జనులను చూచుచున్నాను. అద్భుతమగు చిన్న గాయక బృందము చక్కగా పాడిరి. తేడాను నేను అక్కడ నిలబడి గమనించుచున్నాను. ఆ బాలురు చక్కగా జుట్టు కత్తిరించుకొని శుభ్రముగా కనబడుతున్నారు. రాత్రి నేనుండిన చోటు గూర్చి ఆలోచించుచున్నారు. కొందరు అల్లరి మూక అక్కడికి వచ్చి ఒక బాలుని ఈత కొలనులో ముంచసాగిరి; వారిని చెదరగొట్టుటకు మరొకరిని పిలువవలసి వచ్చెను. ఎంత తేడా! ఈ బాలురు నిలబడి సువార్త పాటలు పాడుచున్నారు.

2"ఆ కుర్రవాళ్ళు స్త్రీల వలె జుట్టు పెంచుకొనిరి," అని సహోదరుడు హెన్రీ అన్నది నిజమే, చూడండి. వారు జుట్టు పెంచుకొని ఉంగరాలు త్రిప్పి ముఖము మీదికి దువ్వుకొనిరి. కొన్నిసార్లు నేను నిరుత్సాహము చెందాను. ఇది నిజంగా వంకర కాలము వలె కనిపించుచున్నది. పురుషులు స్త్రీల దుస్తుల వంటివి ధరించ ప్రయత్నించుచున్నారు. స్త్రీలు మగవారి దుస్తులు ధరించుచున్నారు. మగవారు స్త్రీల వలె జుట్టు పెంచుకొనుచుండగా, స్త్రీలు మగవారి వలె జుట్టు కత్తిరించుకొనుచున్నారు. ఈ జనులకు ఏమయినది? ఈ దేశములో, ఈ ప్రజలలో, ఈ ప్రపంచములో సభ్యత, గౌరవము నశించినది.

ఇది భయంకర కాలము, కాని సువార్త ప్రకటించుటకు ఇది ఈ లోకమునకు అతి మహిమకరమగు కాలము. ఈ సమయము అనేది ఉండక ముందు నేను కాలము ఒడ్డున నిలబడియుండగా, తండ్రి నావైపు చూచి, "నీవు ఏ కాలములో వెళ్ళి బోధించుటకు ఇష్టపడుచున్నావు?" అని అడిగినచో నేను ఈ సమయమునే ఎన్నుకొందును. ఆయన రాకకు ముందు కాలమిది.

3మనముందు కూర్చొని యున్న జనులను చూచుచున్నాను. సేవకుడగు ఒక నా స్నేహితుడు నిన్న టుసాన్ లో ఒక గుర్రము పై స్వారీ చేయుచుండెను. (వీపులో యంత్రము (డిస్క్) అమర్చిన ఈమె గూర్చి నేను ఆలోచించుచున్నాను.) ఈ గుర్రము అతనిని పడవేసినది. ఈ ఉదయము ఒంటిగంటకు నా హోటలుకు ఒక వ్యక్తి ఫోను చేసి, ''అతడు వెటరన్ హాస్పిటల్ లో యున్నాడు, అతడి కండ్లు దెబ్బతిన్నవి, వీపు నలిగిపోయినది, మూత్రపిండములు బయటకు వచ్చినవి, గుండె ఆగిపోవుచున్నది,'' అని చెప్పెను. నేను వెంటనే నేల పై మోకరించాను. టెలిఫోనులో అవతలి వ్యక్తి కొరకు ప్రార్థించాను. ఈ రాత్రి అతడు ఇక్కడే కూర్చొనియున్నాడు. గత రాత్రి అది జరిగినది. బాబ్, లేచి నిలబడగలవా?" ఉదయము, రాత్రి, మధ్యాహ్నము, అర్ధరాత్రి ఎప్పుడైనా గాని దేవుడు ప్రార్ధనకు జవాబిచ్చును.

4వారు నన్ను దీర్ఘ ప్రసంగీకుడని, పిలచుచుందురు. ఈలాగు రాత్రి సమయములో ప్రారంభించుట నాకు ఇష్టముండదు. వెళ్ళిపోయి మరల రావలెననుకొందును. ఒక రాత్రి ఒక చోట బోధించుచుండగా ప్రజలు పళ్ళెములు పట్టుకొని నా వైపు చూపుచూ, ''ఆపు! నోరు మూయి, ఇక్కడ నుండి వెళ్ళిపో," అని సైగలు చేసిరి. సిగరెట్లు త్రాగుచూ అల్లరి చేసిరి. అది ఏర్పాటు చేసిన వారి తప్పు కాదు గాని, అద్దెకు తీసికొన్నవారి తప్పు. అధ్యక్షుని భార్య వెళ్ళి మేనేజరుతో చెప్పినది.

''9:30కు ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవలెను," అని చెప్పిరి.

"మీరు అద్దెకు ఇవ్వకుండా ఉండాలి,'' అన్నాను.

ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన స్త్రీ (చాలా మంచిది) ఇవ్నది, ''మీరెంతసేపు వాడుకొందురో వాడుకొనండి," అని చెప్పెను. కాబట్టి నేను చాలా కృతజ్ఞత చెల్లించుచున్నాను. అది ఎంతో మంచిది.

5హెన్రీ సోదరుగా, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నీ దయను నేను నిశ్చయంగా ప్రశంసించుచున్నాను.

గత రాత్రి ఇక్కడ అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ వారి సమావేశములో ఉండు అవకాశము దొరికినది. సహోదరుడు బూన్ దానికి సంఘ కాపరి అనుకొనుచున్నాను. ఆ జనులతో అద్బుతమగు సమయము గడిపాను. రేపు రాత్రి నీతో మరో చోటికి వచ్చెదను. (అదెక్కడో నాకు తెలియదు), అది మరో కూటము. వారే దానిని చూచుకొందురు; నేను ప్రార్ధించుచూ, చదువుచూ యుందును. నేను చేసేదంతా అదే.

6నేడు మనము వింత సంగతులు చూచుచున్నాము. గతసారి నేనిచ్చట గుడారపు కూటములో పాల్గొన్నాను. గత రాత్రి దాని గూర్చి చెప్పిన జ్ఞాపకమున్నది. ఒక జంట తమ చనిపోయిన బిడ్డను తీసికొచ్చిరి. వారు పగలు, రాత్రి కారు నడుపుకొని వచ్చిరి. ఆ చిన్న బిడ్డను చేతులలో ఎత్తికొని ఆ తల్లి విచారముగా కూర్చొన్నది. నాకు తెలిసినంతవరకు ఆమె ఇక్కడే కూర్చొని యుండును. నన్ను కారు యొద్దకు రమ్మని ఆ భర్త అడిగెను. (అతడే) నేను చిన్న బిడ్డను బయటకు తీసి పట్టుకొన్నాను. చనిపోయి, చల్లగా, బిగుసుకొనిపోయినది. నేను ప్రార్థించసాగాను. నేను ప్రార్థించగా, ఆ శరీరమునకు వేడి తగిలినట్లాయెను. నేను మానక ప్రార్థించాను. ఆ బిడ్డ కదలుచూ ఏడ్వ సాగినది. ఆ బిడ్డను తిరిగి తల్లికి అప్పగించాను. ఆమె బిడ్డను ఎత్తికొని ఇంటికి వెళ్ళినది. నాకు తెలిసినంత వరకూ వారు క్రైస్తవులే కారు, చూచారా. అది అద్భుతము.

HEB 13:8

 

7ఈ రాత్రి నేను చనిపోవుచున్న సంఘము గూర్చి ఆలోచించుచున్నాను: వారు పెంతెకోస్తు ప్రజలు. వారిని మనము కదుపవలసి యున్నాము. ప్రార్ధన మాత్రమే చేయవలెను. దేవుని వాక్యవరుసలోనికి రావలెను. అది మాత్రమే చేయవలెను. దేవుని వాక్యవరుసలోనికి రావలెను. అది మాత్రమే మనము చేయవలసియున్నాము. ఒకే మార్గమున్నది. ఆయనే ఆ మార్గము. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఇంగ్లాండులో ఉండిన సంఘము స్థితిలోనికి మనమును రాగోరుచున్నామా? ఆ కారణము చేతనే నేను అంత గట్టిగా కేకలు వేయుచున్నాను. ఆలాగు చేయవలెనని నేననుకొనను, కాని సంఘము అట్టి స్థితిలోనికి వచ్చుటకు నేను ఇష్టపడును. మీరు ఆ స్థితిలోనికి రాగోరరు. అందుకే ఆ మేకులోనికి దిగునటులగా కొట్టవలసియున్నాము. ఆ పని చేయవలసి యున్నాము.

నేను ఈ రాత్రి కొంతసేపు కొన్ని లేఖనముల మీద మాట్లాడగోరుచున్నాను. ఇంత సమయమని చెప్పలేను. మీరు అలసిపోవుదురు గనుక ముప్పది నిమిషములలో నేను ముగించెదను. ఎల్లప్పుడూ నేను పరిశుద్ధాత్మకే దానిని విడిచి పెట్టెదను. కూటమును ఆయన నడిపింపునకు విడిచి పెట్టుదము.

8మరి కొద్దిసేపు మన తలలు వంచుదము. ఆయన గ్రంథము తెరచు ముందుగా గ్రంధకర్తతో మాట్లాడుదము.

సర్వశక్తుడవగు దేవా, ఈ గ్రంధకర్తా, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఇప్పటికే ఈ రాత్రి వినిన దాని గూర్చి వందనములు చెల్లించుచున్నాము. "ఆమేన్" అని చెప్పి ఇంటికి వెళ్ళుట మంచిది, ఎందుకనగా నీవు మాతో యున్నావని మాకు తెలియును. తండ్రి, ఇప్పుడు మేము నీ వాక్యము తెరచుచుండగా, నీ వాక్యములో నుండి ప్రత్యక్షముగా మాతో మాట్లాడుము. మేము ఏ ఘడియలో జీవించుచున్నామో తెలియజేయుము. మేము జీవించుచున్న ఘడియను మేము ఎరిగినయెడల ఆ ఘడియ కొరకు మేము సిద్ధపడుదుము. ఏమిటో, ఎక్కడికో తెలియకుండా గ్రుడ్డిగా మేము వెళ్ళుచున్నచో ఎట్లు సిద్ధపడవలెనో ఎరుగము. కాబట్టి తండ్రీ, మేము ఆ ఓడను, ద్వారమును చూచి వర్తమానములోనికి పిలచుచుండగా ప్రవేశించుదుము గాక! యేసుక్రీస్తు నామము ద్వారా దాని దయచేయుము. ఆమేన్.

LUKE 24:13-27

 

9పరిశుద్ద లేఖనముల నుండి ఒక భాగము చదువగోరుచున్నాను. లూకా 24వ అధ్యాయము 13 వచనారంభము నుండి చదువుదము:

ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు.

జరిగిన ఈ సంగతులన్నిటిని ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి.

వారు సంభాషించుచూ ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకు వచ్చి వారిలో కూడా నడిచెను.

అయితే వారాయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను.

ఆయన - మీరు నడచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా, వారు దుఃఖముఖులై నిలిచిరి.

వారిలో క్లెయొపా అనువాడు - యెరూషలేములో బసచేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే యెరుగవా ? అని ఆయనను అడిగెను.

ఆయన - అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు - నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

మన ప్రధానయాజకులును, అధికారులును, ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి, సిలువ వేయించిరో నీకు తెలియదా?

ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించు యుంటిమి; ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.

అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి - కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.

మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.

అందుకాయన - అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల నన్నిటిని నమ్మని మందమతులారా.

క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి.

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

చదువబడిన మాటలకు ప్రభువు తన దీవెన దయచేయును గాక!

REV 3:17

 

10నా అంశము ఇది: ఆధునిక సంగతులు ప్రవచనము ద్వారా స్పష్టపరచబడినవి. కొన్ని ప్రత్యేక సంగతులు జరుగుటకు ముందే దేవుడు తన ప్రజలకు తెలియ చేయుట, దేవుని మారని విధానము.

ప్రభువైన యేసు దినములలో జీవించిన జనులు దేవుని వెదకి జరుగవలసియున్న దానిని గూర్చి ఎరిగియున్నచో, వారు యేసును మరణమునకు అప్పగించియుండేవారు కారు. లేఖనములు నెరవేర్చబడవలసియున్నవి, యూదులు గ్రుడ్డివారు కావలసి యుండిరి. దానిని మనమందరము ఎరుగుదుము.

మనము జీవించుచున్న ఈ కాలములో మరల అదే వాగ్దానము చేయమడినదని మీరు గ్రహించారా? మనము ఏడవదగు లవొదకయ సంఘ కాలములో యున్నాము. ఇది దిగంబరి, దిక్కుమాలినది, గ్రుడ్డిది, కాని ఎరుగదు. ఏర్పరచబడిన జనులకు తన వర్తమానమును అందించు ఉద్దేశ్యముతో ఆయన వారిని గ్రుడ్డివారినిగా చేసెను, నేడు కూడా ఆయన అదే వాగ్దానము చేసెను.

MATT 17:10,12

 

11గౌరవనీయులకు, నా సోదర సోదరీలందరకు చెప్పుచున్నాను, ఈ దినములలో ఒక దినమున ఎవరో ఈలాగు చెప్పెదరు, "ఈ సంగతులు మొదట జరుగునని వ్రాయబడియుండలేదా?''

అప్పటి వలెనే ఇప్పుడును ఉండును, ''ఆయన ఎప్పుడో వచ్చెను. వారాయనకు చేయవలసిన దానిని చేసిరి," అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

"ఏలియా మొదట రావలెనని శాస్త్రులు ఏల చెప్పుచున్నారు?" అని వారు యేసును అడిగిరి.

''ఆయన ఎప్పుడో వచ్చెను గాని మీరు తెలిసికోలేదు,'' అని ఆయన చెప్పెను, చూచారా. ముగింపులో కూడా బహుశా ఆలాగే జరుగును.

12మనము జీవించుచున్న ఈ కాలములో జరుగనైయున్న దేమిటో తెలిసికొనుటకు మనము సంసిద్దులము కావలెను. దేవుడు ప్రతి యుగమునకు తన మాటను ఇచ్చెను. కొంత, కొంత ఆయన ఇచ్చెను. ఒక యుగము ఇంకో యుగములోనికి వెళ్ళజాలదు. ఆలాగు జరుగదు. దానికి ఉదాహరణ గతరాత్రి నేను చెప్పాను. నేను ప్రతి రాత్రి మాట్లాడుట వలన చెప్పిన దానినే రెండోసారి చెప్పుట జరుగును. అనుకొని దానిని తిరిగి చెప్పను. కాని దీనిని చెప్పుచున్నాను: నోవహు వర్తమానమును మోషే బోధించిన యెడల, ఏమి లాభము? మోషే వర్తమానమును యేసు బోధించిన యెడల, ఏమి లాభము? కాతలిక్కు వర్తమానమునే మార్టిన్ లూధరు కొనసాగించిన యెడల, ఏమి లాభము? లూధరను వర్తమానమునే వెస్లీ బోధించిన యెడల, ఏమి లాభము? మెడిస్టు వర్తమానమునే పెంతెకోస్తు వారు కొనసాగించిన యెడల, ఏమి లాభము? వధువు పిలువబడిన తరువాత పెంతెకోస్తు వారు తమ వర్తమానమును కొనసాగించినచో ఏమి లాభము? మనము విత్తనముల కాలములో యున్నాము. మనము అంత్యకాలములో యున్నాము. గోధుమగింజ భూమిలో పడనియెడల, అది ఒంటిగానే యుండును.

13ఒక జర్మను గ్రంధకర్త అతి విమర్శనాత్మక వ్యాసములను వ్రాసెను. అతడు ఒక నాస్తికుడు. ఆ పుస్తకము మీ పట్టణములోనికి వచ్చియుండును. నన్ను ఎంతగానో ఖండించినందున నేనతనిని ఖండించలేదు, నాస్తికుడు వ్రాసెను గనుక అతని పుస్తకము మన ఇంటిలో ఉండరాదు. అతడిట్లు వ్రాసెను, "ఎర్ర సముద్రమును ఎండిపోచేసి తన జనులను విమోచించిన దేవుడు ఈ అంధకార యుగములలో క్రైస్తవులు సింహముల ద్వారా చీల్చబడుచుండగా, స్త్రీలు దహించబడుచుండగా, సిలువల మీద వ్రేలాడుచుండగా, గర్బిణీ స్త్రీల కడుపులు చీల్చుచుండగా, కూర్చొని చేతులు ముచుకొని చూస్తూ యున్నాడు; వారందరూ దేవుని దాసులు.''

MATT 16:17,18•

JOHN 1:1,14•

HEB 13:8

 

14చూడండి, లేఖనము ఆత్మ ప్రేరితము. ఒక వేదాంత దృష్టిలో, విద్యా దృష్టిలో వాక్యమును కూర్చొని చదవినచో నీ వెన్నడూ తెలిసికొన జాలవు; ఆలాగు క్రియ జరుగదు.

"సరైన గ్రీకు నేర్చుకొను వరకు మనకు అర్ధము కాదు," అని ఒక బాప్టిస్టు సేవకుడు కొంతకాలము క్రిందట నాతో చెప్పెను.

''బైబిలులోని గ్రీకు మాటలను గూర్చి నైసిన్ ఆలోచనా సభలో, అంతకు ముందు కూడా వారు వాదించుచుండిరి."

దైవావేశము ద్వారానే బైబిలు బయలుపరచబడవలెను. ప్రత్యక్షత ఒక్కటే మార్గము. "ఈ బండ మీద" అని యేసు పేతురుతో చెప్పెను. ఆయనెవరైయున్నారో బయలుపరచబడినది. అదే ఆ బండ. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు గాని, పరలోక మందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును." పేతురు మీద కాదు గాని, ఆయనెవరై యుండెనో, ఆ ప్రత్యక్షత మీదనే కట్టును.

ఆయనే వాక్యము! యోహాను 1: "ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను." హెబ్రీ 13:8. "ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.''

15పెంతెకోస్తు యుగమునకు కాదు గాని, దానికి వేరుగా నున్న యుగమునకు దేవుని వాక్యప్రత్యక్షత రానున్న కాలములో మనము జీవించుచున్నాము. నేను విద్య లేనివాడిని; కాని ప్రకృతిని మసము అధిగమించజాలము, ఎందుకనగా దేవుడు ప్రకృతి కొనసాగింపులోనే పని చేయును. సూర్యుడుదయించును, అస్తమించును; దినమంతా నడచును, అది. పాఠశాలకు వెళ్ళినట్లున్నది; సాయంకాల మందు మరణించును, మరల తరువాత ఉదయమున లేచును. చలికాలములో చెట్ల వేర్లలోనికి రసము పోవును. వేరులలోనికి వెళ్ళి, మరల వసంతకాలములో వచ్చును.

చూడండి, వధువును ఆయన ఒక గోధుమ గింజతో పోల్చెను. దానికి దేవుని యొద్ద ఒక కారణమున్నది. పెంతెకోస్తు దినమున స్థాపించబడిన ఆ చక్కని నిజమగు సంఘము ఎంతో ఎదిగినది. గొప్ప సంఘముగా విస్తరించినది. ఆ అంధకార యుగములో అది భూమిలో పడవలసి యుండెను. అన్ని విత్తనముల వలెనే భూమిలో దాగియుండెను. సంస్కరణలో తిరిగి వచ్చునట్లుగా అది చావవలసి యుండెను. మార్టిన్ లూథరు యొక్క సంస్కరణలో అది రావలసి యుండెను. గోధుమ గింజ కాండము వలె అది వచ్చెను. మొదటగా రెండు చిన్న దళములు వచ్చును. ఆ తరువాత మరెన్నో వచ్చును. మార్టిన్ లూథర్, జ్వింగ్లీ కాల్విన్ మొదలగువారు వచ్చిరి.

16ఇంకా అది విత్తనముల కుచ్చుగా ఎదిగినది. అదే జాన్ వెస్లీ కాలము. పుప్పొడి రాలిపోయినది.

అందులో నుండి పెంతెకోస్తు కాలము వచ్చినది: ఎంతో దగ్గరగా, నిజమగు గోధుమ గింజ వలె యున్నది. కాని దానిని పట్టి చూచినచో, అందులో ఏదీ లేదు. అది గింజ ఆకారములో నున్న పొట్టు, కాని అది ఒక ఉద్దేశ్యము చొప్పునే అక్కడున్నది. గింజకు అది ఆశ్రయము లేనియెడల, ఎండ తాకిడికి అది చచ్చును.

ఒక ప్రత్యేక కాలము వరకు అది అచ్చట నిలచియుండవలెను. జీవము పొట్టును విడిచి గింజలోనికి వెళ్ళును. (కాండము, పుప్పొడి పోయినట్లే) తిరిగి అది మొదట భూమిలోనికి వెళ్ళిన గింజవలె యుండును.

17వర్తమానము ఇవ్వబడిన మూడు సంవత్సరములకు ఒక సంస్థ తయారగునని మనందరకు తెలియును. అది వెంటనే చనిపోవును. లూథర్ దినములలోను, వెస్లీ దినములలోను, అలెగ్జాండరు కాంప్బెల్ దినములలోను, పెంతెకోస్తు దినములలోను ఆ ప్రకారమే జరిగెను. ఖచ్చితముగా! చూచారా, వారు ఆచార రీతిగా మారుదురు, నామకార్దులగుదురు, క్రొత్త ప్రత్యక్షతను వారు చేర్చుకొనరు. వారు స్థిరపడుదురు; అక్కడే వారు చనిపోవుదురు. దానిలో నుండి జీవము బయటకు వచ్చి గోధుమ గింజ తయారగును. ఆ గోధుమగింజ బయటకు వచ్చినప్పుడు, ఆ గింజ ద్వారా పయనించిన జీవము, పునరుత్థానము మొత్తమును తీసికొని వచ్చును; ఎత్తబడుటకు సిద్ధమగును.

JOHN 6:53•

JOHN 10:30

 

18దైవిక స్వస్థత, అద్భుతములు చేయుటతో ఈ వర్తమానము మొదట ప్రారంభమాయెను. దేవుడు ఒక సామాన్య సంఘము ద్వారా దానిని జరిగించినందున ఎవరూ దానిని చూడలేదు. దేవునికి పై మెరుగులు అక్కరలేదు. మనలను వినోద పరచుటకు ఆయన క్రియలు చేయనవసరం లేదు. అమెరికనులు వినోదమునకు అలవాటయిరి, కాని జనులు దృష్టిని ఆకర్షించుటకు ఆయన దానిని చేయును, ఆయన ఒకటి చేయనైయున్నాడు.

ఆయన ఎట్లు వచ్చేనో చూడండి. ''అద్బుతమగు చిన్న ప్రవక్త, రబ్బీ, గలిలయ ప్రవక్త." ఎందుకు, ఆయన సేవ అద్భుతము, ప్రతి సంఘమూ ఆయనకు ఆహ్వానించెను.

కాని ఒకనాడు ఆయన కూర్చొని, "నేను, నా తండ్రి ఏకమైయున్నాము,'' అనెను.

"ఓ, మై! వానికి దూరముగా ఉండండి,'' అన్నారు.

"మనుష్యకుమారుని శరీరము తిని, రక్తము త్రాగనిచో మీకు జీవము లేదు."

"ఇతడు రక్త పిపాసి! వానికి దూరముగా పొండి!'' చూచారా?

ఆ గురుతును ఏదో వెంబడించవలసి యున్నది. చూడండి. ఒకటి వెంబడించెను.

పొట్టు ఇప్పుడు రాలిపోయినది; రాలిపోవలెను. ఇరవై సంవత్సరములు గతించినవి, కాని అందులో నుండి మరే శాఖ రాలేదు, మరియు రాదు. శాఖల అంతములో మనం ఉన్నాము, గోధుమ గింజ రూపమేర్పడినది. అయితే గోధుమ సంగతి ఏమిటి? ఇపుడది ప్రోగుచేయబడక ముందు, వృద్ధిచెందుటకు కుమారుని సన్నిధిలో పడియుండవలెను.

19ఇప్పుడు, జరుగుచున్న సంగతులను మనము చూచుచున్నాము, ప్రతి కాలము, అవి ఖచ్చితముగా బైబిలో అవి చూపబడినవి. మనము అస్తవ్యస్తమైనదనుకొనుచున్నాము గాని, మనము కాదు, దేవుని వాక్యప్రకారమే మనము నడచుచున్నాము.

ఏ ఇతర పవిత్ర గ్రంధము కన్నను బైబిలు వేరయినది. బైబిలు అనగా అక్షర రూపములో యున్న దేవుడే, చూచారా. వ్యక్తపరచబడిన ఆలోచనయే మాట. దేవుని ఆలోచన దానిని వ్యక్తము చేసెను. ప్రవక్తల ద్వారా ఆయన మాటలు వ్యక్తపరచబడెను. వారు వాక్యము వ్రాసిరి. అది వాక్యరూపము. దానిని యేసు "విత్తనము" అని పిలచెను. ఏ విత్తనమయినా సరైనదైతే తన జాతి మొక్కనే మరల మొలిపించును, మంచి వాతావరణము కావలెను. ఇది ప్రవచన గ్రంథము, ఇది భవిష్యత్తు విషయములను ముందే చెప్పును. ఈ గ్రంథము మొత్తం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను బయలుపరచును. దానికి ఏదీ నీవు చేర్చరాదు లేదా దానిలో నుండి ఏదీ తీసివేయరాదు. ప్రతి ప్రత్యక్షత దానివలనే రావలెను. చూడండి, అది తప్పక వాక్యమైయుండును.

20''నాకు ప్రత్యక్షత యున్నది," అని కొందరు చెప్పుకొందరు. జోసెఫ్ స్మిత్, ఇంకా చాలామంది ప్రత్యక్షతలున్నవని చెప్పుకొనుచున్నారు, కాని అది వాక్యమునకు విరుద్ధము.

దేవుని నుండి వచ్చినట్టయితే, అది వాక్యప్రకారమే రావలెను, ఎందుకనగా అది దేవుని సన్నిధిని బయలుపరచవలెను, లేదా రుజువు చేయవలెను. ఆయన తన ముందు జ్ఞానము ద్వారా వీటినన్నింటిని ఎరుగును. ముందుగానే నిర్ణయించెను. (బైబిలులో దీనిని "ముందుగా నిర్ణయము," అనిరి.) ప్రతి కాలమునకు దాని స్థానమున్నది. ప్రతి మనిషికి వాని స్థానమున్నది. ప్రతి వర్తమానికునికి వాని స్థానమున్నది. ఆయన దేవుడు; అపవాది ఏమియూ ఆయనను చేయజాలదు. ఆయన దేవుడు, జరుగు ప్రతి దానిని ఆయన ముందే నిర్ణయించెను, మరియు ఆయన వాక్యప్రకారమే అన్నియూ జరుగును.

కాబట్టి ఆయన వాక్యము బట్టి మనము ఏ కాలములో, ఏ యుగములో జీవించుచున్నామో ఎరుగుదుము. ఈ కాలములో ఏమి జరుగవలసియున్నదో బైబిలులో చూడగలము.

AMOS 3:7

 

21పవిత్ర గ్రంధములుగా వారు పిలచుచున్న వాటిని అనగా ఖురాను మొదలగు వాటిని నేను చదివాను. కాని వారి పవిత్ర గ్రంథములు నీతి, మంచి ప్రవర్తన, వేదాంతములను గూర్చి బోధించును.

కాని ఇది ప్రవక్త గ్రంథము, ప్రతి గ్రంథమునకు ఇది వేరైనది. బైబిలు దేవుని వాక్యమై యుండి భవిష్యత్తు సంగతులను చెప్పును. ముందుగానే అది హెచ్చరించెను గనుక ముందుగానే చెప్పును.

మొదట తన దాసులగు ప్రవక్తలకు తెలియజేయకుండా ఆయన భూమి మీదికి దేనిని పంపడు. అది ఆయన వాగ్దానము. (ఆమోసు 3:7.), దేవుడు అబద్దమాడడు. దానిని ఆయన బయలు పరచును; అన్ని కాలములలోను ఆయన విధానమే అది. దానిని చేయకుండా ఎన్నడూ ఆయన విఫలము కాలేదు.

MAL 4:5

 

22ఇప్పుడు, సమకూర్చుదునని ఆయన చివరి దినములలో మనకు వాగ్దానము చేసెను. మెతడిస్టు, బాప్టిస్టు, పెస్బిటేరియను, పెంతెకోస్తు మొదలగు ఏ సంఘమైనా గాని, ఏ శాఖ అయినా గాని వధువుగా ఈ సంఘమును రూపుదిద్దలేరు, (వారి యొక్క ఆధునిక స్థితిలో) వారది చేయలేరు. వారది చేయలేరు, వారు విఫలమగుదురు. ఒకరంటే ఒకరికి గిట్టదు, లోకము వారిలో ప్రవేశించెను, వారు ఎప్పుడో చనిపోయిరి. దానిని దేవుడెరుగును.

''ఇది నాకు తెలిసినది. దేవునికి స్తోత్రము, అది ఆలాగున్నది," అని వాక్యము గూర్చి కొందరందురు. యేసు మొదటసారి వచ్చినప్పుడు ఆ విధంగానే యుండెను; ప్రతివారికి ఒక బోధ యున్నది. దేవుని యొద్ద నుండి అది మనకు పంపబడవలసి యున్నది. దేవుడు దానిని వాగ్దానము చేసెను. దేవుని మాదిరి ఎన్నడూ మారదు. మలాకీ 4 ప్రకారము అంత్యదినములలో జనుల హృదయములను త్రిప్పు ప్రవక్తను ఆయన భూమి మీదికి పంపుదునని వాగ్దానము చేసెను. ''పిల్లల హృదయములను అపోస్తల తండ్రుల వైపు త్రిప్పను.'' ఆయన తన వాక్యములో దానిని వాగ్దానము చేసెను. లూకా 17 ఇంకా చాలా చోట్ల దానిని ఆయన వాగ్దానము చేసెను. ఈ చివరి దినములలో ఆయన తన రుజువుచేయబడిన వాక్యమును బయలుపరచును.

23మనిషి దేనినయినా చెప్పగలడు, కాని దేవుడే వాక్యమునకు అనువాదము చేయవలెను. ఇప్పుడు మనకు మన స్వంత అనువాదము ఉన్నది; దీని భావము ఇది అని చెప్పుచున్నాము. మెతడిస్టు వారు ఒక రకంగా, బాప్టిస్టువారు ఒక రకంగా, పెంతెకోస్తువారు ఒక రకంగా, ఏకత్వము వారు ఒక రకంగా, ద్విత్వము వారు ఒక రకంగా చెప్పుచున్నారు. కాని దేవునికి అనువాదకుడు అక్కర లేదు; ఆయనే తన స్వంత అనువాదకుడు. ఏ కాలమునకు అది ఉద్దేశించబడి, ఇయ్యబడినదో ఆ కాలమును దానిని బయలుపరచుట ద్వారా ఆయన తన స్వంత మాటకు అనువాదము చెప్పుకొనును.

మనము పెంతెకోస్తు కాలములో జీవించుట లేదు, మరో కాలములో మనము జీవించుచున్నాము. చూడండి, మెతడిస్టు కాలములో మనము జీవించుట లేదు గాని, మరో కాలములో జీవించుచున్నాము. వధువు కాలములో మనము జీవించుచున్నాము. సంఘము బయటకు పిలువబడుచున్నది, ఎత్తబడుటకు సమాయత్తమగుచున్నది. ప్రస్తుతము ఆ కాలములో మనము జీవించుచున్నాము. నా యొక్క యదార్ధ అభిప్రాయం, అది ఖచ్చితముగా సత్యము.

HEB 13:8

 

24ఇది ప్రవచన గ్రంథము. దానిని విశ్వసించువారు దానిని గౌరవించి చదువవలెను. దాని గ్రంథకర్తను నమ్మవలెను. అందులో వ్రాయబడిన ప్రతి మాటయు నెరవేరుట నిశ్చయము. వాగ్దానము చేయబడిన ప్రతిదియు నెరవేరవలసియున్నది, ఎందుకనగా అది ఆ కాలమునకు యేసుక్రీస్తు. నిన్నటి నోవహు కాలములో యేసుక్రీస్తు; మోషేలో యేసుక్రీస్తుండేను, దావీదులో యేసుక్రీస్తుండెను, యోసేపులో యేసుక్రీస్తుండెను; యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. నేడు యేసుక్రీస్తు తన జనుల మధ్య ఉండి, ఈ కాలములో తాను చేయుదునని వాగ్దానము చేసిన కార్యములను చేయుచున్నాడు. ఆయన యేసుక్రీస్తు.

కాని సంఘము చాలా చల్లబడినది, చాలా దూరముపోయినది, సోదరుడు చెప్పినట్లే యున్నది. మన సంఘములు ఆలాగే మారుచున్నవి. తిరిగి వాక్యము నొద్దకు మనలను తీసికొని వచ్చుటకు ఎదో ఒకటి కావలెను. అది జరుగునని మనకెట్లు తెలియును? దేవుని స్వంత పథకము ప్రకారము అది రావలసి యున్నది. సంఘస్తుల ద్వారా అది రాదు, వ్యాపారుల ద్వారా అది రాదు, సంఘముల ద్వారా అది రాదు. దేవుడు తన ప్రణాళికను అమలు చేసెను.

1CH 13:1

 

25దేవుని చిత్తము లేకుండానే దేవునికి ఒక పని చేయ ప్రయత్నించుట, అను అంశము మీద ఒకనాడు శ్రీవ్-పోర్టులోని జాతీయ రేడియో ప్రసారంలో మాట్లాడాను. దేవుని మందసమును దావీదు తిరిగి మందిరములోనికి తేగోరెను. అతడు అభిషేకము గల రాజు. ఎందుకు, అతడు తన అధికారులను, సహస్రాధిపతులను, సైన్యాధిపతులను సంప్రదించెను. ''అది యెహోవా వాక్కు,'' అని వారనిరి. ''అది అద్బుతము,'' అని యాజకుడనెను. వారంతా ఎంతో ఆత్మావేశముతో కేకలు వేసిరి. మత క్రియలన్ని జరిగించిరి. కాని అది దేవుని చిత్తమునకు పూర్తిగా విరోధము, ఎందుకనగా అప్పుడు దేశములో నాతాను అను ఒక ప్రవక్త యుండెను. ఆ ప్రవక్తను వారు సంప్రదించనే లేదు. వారు యధార్ధముగా దేవుని సేవ చేయ ప్రయత్నించినా గాని అది జరుగలేదు అని మను చూచాము.

26నీవు చాలా యదార్ధవంతుడవుగా ఉండవచ్చును; కాని నీవు చేయుచున్నదానిని నీవు ఎరుగు వరకు, నీవు గాలితో పోరాడుచున్నట్లే. దేవుని వాక్యము నొద్దకు తిరిగి రమ్ము, సరిచేసికొని పొమ్ము; అప్పుడు నీకు తెలియును. ఒక సైనికుడు పైనుండి ఆజ్ఞ పొందు వరకు ఏమీ చేయలేడు. మనము క్రైస్తవ సైనికులము, మరియు ఈ ఘడియకు మనము బైబిలు నుండి ఆజ్ఞను పొందవలెను; నిన్నటి ఆజ్ఞ కాదు, మొన్నటి ఆజ్ఞ కాదు, కాని నేటి ఆజ్ఞ (ఏ మార్గమున మనము వెళ్ళవలెను). నేడు మనము జీవించున్న ఘడియను తెలిసికొనుము.

ఈ ఆధునిక సంగతులు బహు వేగముగా జరిగిపోవుచున్నవి. ఏమీ లేకుండా మనము విడిచి పెట్టబడితిమని ఒక రోజున తెలిసికొందుము, తెలియకముందే మృగపు ముద్రను వేయించుకొందుము.

27దీనికొరకు ఓపికతో మనము కనిపెట్టవలెను, ఎందుకనగా వాగ్దానము చేయబడిన ప్రవచనములు ప్రతి ఒక్కటి దాని కాలములో తప్పక నెరవేరవలెను. ముందే మనకు చెప్పబడెను, దీనికి ముందుగానే సృష్టికర్త దానిని నెరవేర్చెను, ఆయన దానిని మరల చేయునని ఎదురు చూచుచున్నాము. ఎట్టి కాలములో మనము జీవించుచున్నాము! నీవు ఏ సంవత్సరములో, ఏ దినములో జీవించుచున్నావో చూడవలెనన్న కేలెండరు యొద్దకు వెళ్ళేదవు. ఆలాగే ఏ కాలములో మనము జీవించుచున్నామో తెలిసికొనుటకు బైబిలును చూడవలెను. మనము మెతడిస్టు లేదా బాప్టిస్టు కాలములో జీవించుట లేదు. మనము వధువు కాలములో జీవించుచున్నాము. ఆయన వాగ్దానము చేసిన మార్గము ద్వారా తిరిగి దేవుని యొద్దకు పిలచుచున్నాడు. దానిని చేయుదునని ఆయన వాగ్దానము చేసెను.

ప్రతి కాలములోను జనులు వేదాంతము ద్వారా వాక్యమునకు స్వంత అనువాదము చెప్పుచున్నారు. దానికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను వారు నమ్మరు. (అది దేవుని అనువాదము); నేను చెప్పినది కాదు, మరెవరో చెప్పినది కాదు; కాని దేవుడు వాగ్దానము చేసినది మరియు దేవుడు చేసినది, దేవుడు తన వాక్యమునకు తానే స్వంతముగా అనువాదము చెప్పుచున్నాడు అని రుజువు చేయుచున్నది.

JOHN 5:46

 

28నలుబది-అయిదు, ఏబది సంవత్సరాల క్రితమే వారు పెంతెకోస్తు వారికి చెప్పిరి. మీ తల్లిదండ్రులు నిజమగు పెంతెకోస్తువారు, ఒక సంస్థను శపించి మరియు దానినుండి బయటకు నడచి వచ్చిరి. అయితే కుక్క తన వాంతికి తిరిగినట్లు మరల అందులోనికి వెళ్ళిరి. సంఘమును చంపిన దానినే వారనుసరించిరి, అదే కార్యము ద్వారా మీకు మీరే చంపుకొనిరి. ప్రజలకు వ్యతిరేకము కాదు; అది చేయుచున్న ఆ వ్యవస్థ క్రమమును నేను వ్యతిరేకించుచున్నాను.

నేను ఇంటికి వెళ్లి, ఇతరుల కూటములలో దీనిని నేను బోధించను. "సర్పము జాడ," అను దానిని బోధించబోవుచున్నాను. మీరు టేపులను తీసుకున్నట్లయితే దాని వినండి.

29మరియు గమనించండి, దేవుని వాక్యప్రవచనములు నెరవేరుట చూచుటకు వారు తప్పిపోయియున్నారు. మెస్సీయా ఖచ్చితముగా ఈ విధముగానే రాబోవుచున్నాడు అని వారు నిశ్చయముగా ఉండిరి; ఏమి జరుగునో వారు ఎరిగియుండిరి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు వారి వారి ఉద్దేశ్యములను కలిగియుండిరి. ఆయన వారనుకొన్నదానికి విరోధముగా వచ్చెను, కాని అక్షరాలా వాక్యప్రకారమే వచ్చెను. యేసు కూడా అదే ఇక్కడ చెప్పెను: "మీరు నన్ను ఎరిగియుండిన యెడల, నా దినమును ఎరిగియుందురు." "మాకు మోషే ఉన్నాడు," అని వారనిరి. "మీరు మోషేను నమ్మినయెడల, నన్నును నమ్మియుందురు, ఎందుకనగా అతడు నన్ను గూర్చి వ్రాసెను,'' అని ఆయన చెప్పెను.

అయితే, చూడండి, దేవుడు తాను వాగ్ధానము చేసిన దానినే రుజువు చేయుచున్నాడు. మెస్సీయా గొప్ప హోదాలో రావలెనని వారూహించిరి. మెస్సీయా తమ గుంపు యొద్దకే రావలెను, లేనియెడల ఆయన మెస్సీయా కాడని వారనుకొనిరి. నేడును దాదాపు ఆలాగే యున్నది. "నీవు నా కళ్ళద్దాల గుండా చూడనిచో, నీవు చూడలేవు" అనుచున్నారు. ఆ విధంగానే యున్నది. అది సత్యము. మనము దానిని ఆలోచించము, కాని అది పూర్తిగా సత్యము.

HEB 1:1

 

30హెబ్రీ 1:1: దేవుడు ఆయా సమయములలో బైబిలును తాను స్వంతగా ఎన్నుకొనిన విధానములో వ్రాసెను. వేదాంత పండితుల ద్వారం ఎన్నడూ ఆయన వ్రాయలేదు, వేదాంతజ్ఞాల ద్వారా ఆయన దానికి అనువాదము చెప్పించలేదు. దేవుని వాక్యమును వేదాంత పండితులు ఏ కాలములోను అనువాదము చేయలేదు. ప్రవక్తలకు మాత్రమే అనువాదము చెప్పు శక్తి కలదు. దేవుడు మనకు ప్రవక్తను పంపినప్పుడే ఈ గందరగోళమంతటి నుండియూ బయట పడగలము, ఖచ్చితముగా, అది చేయుటకు అదొక్కటే మార్గము. దానిని నమ్మి, ఎదురు చూచి, నెరవేర్పును గమనించిరి.

చూడండి, అది మనిషి ద్వారా వ్రాయబడలేదు గాని, దేవుని ద్వారా వ్రాయబడెను. అది మానవ గ్రంథము కాదు, అది వేదాంత గ్రంథము కాదు. అది దేవుని గ్రంథము, ప్రవచన గ్రంథమైయుండి, ప్రవక్తల ద్వారా వ్రాయబడి - ప్రవక్తల ద్వారా అనువదింపబడెను. "యెహోవా వాక్కు ప్రవక్తల యొద్దకు వచ్చును'' అని బైబిలు చెప్పెను. ఖచ్చితంగా!

JOHN 1:1,14,26,29

 

31ఎంత చక్కగా అది వివరించబడి, వర్ణించబడినది! యేసు భూమి మీదికి వచ్చినప్పుడు, యోహోను ఆ దినమునకు ప్రవక్త, మరియు అతడు ప్రవచించుచుండెను. ''మా పెద్ద సంస్థలను దేవుడు ముక్కలు చేయునని నీవు చెప్పుచున్నావా? మా ఆలయములలో ఆరాధన జరుగని కాలములు వచ్చునా ?" అని వారడిగిరి.

''దేవుని గొర్రెపిల్ల యగు ఒకాయన బలిగా అర్పించబడు కాలము ఒకటి వచ్చుచున్నది," అని అతడు చెప్పెను. ఆయన వచ్చుట నాకు తెలియునని చెప్పెను. అతడు తన వర్తమానము గూర్చి అంత నిశ్చయత కలిగియుండెను. "ఇప్పుడాయన మీ మధ్యనే నిలబడి యున్నాడు గాని మీరెగుగరు" అని అతడనెను. ఆయన మీ మధ్యనే యున్నాడు మరియు మీకు తెలియదు.

ఒక రోజు యేసు నడిచి వచ్చుచుండగా, ఆయన పైన ఒక గురుతును యోహాను చూచెను. "ఇదిగో, లోకపాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల,'' అనెను. తాను అదే నిమిషములో జనుల ఎదుట బయలుపరచబడితినని యేసుకు తెలియును. ఆయనే వాక్యము; అందులో మనకు సందేహము గలదా? ఆయన వాక్యమని బైబిలు చెప్పెను, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను." ఆ వాక్యము భూమి మీద యున్నది. (చూడండి! ఖచ్చితంగా!) నీటిలో యున్న ప్రవక్త యొద్దకు వచ్చెను.

32అది సరియే, వాక్యమెల్లప్పుడూ ప్రవక్త యొద్దకే వచ్చును. కాబట్టి అది వేదాంతజ్ఞుల యొద్దకు వచ్చునని ఆశించరాదు. శాఖల యొద్దకు అది వచ్చునని తలంచరాదు. దేవుని మార్గము ద్వారానే అది రావలెను. దాని గూర్చి ఆయన మనకు ముందే చెప్పెను. అదెప్పుడూ ఆ మార్గము ద్వారా మాత్రమే వచ్చును. దానిని ద్వేషించి, తృణీకరించి, విసర్జించుదురు. దానిని ఒక ప్రక్కకు త్రోసివేయుదురు, మరియు సమస్తము చేయుదురు, కాని దేవుడెట్లయినా తన పనిని చేయును. యేసుక్రీస్తులో అది నిరాకరించబడెను, యోహానులో అది తిరస్కరించబడెను, యిర్మియాలో అది తిరస్కరించబడెను, మోషేలో అది తిరస్కరించబడెను. ఎల్లప్పుడూ ఆ విధంగానే యున్నది. కాని దేవుడు తాన చేయుదునని వాగ్దానము చేసిన విధానములోనే కదలుచుండును. అవును, అదే రీతిగా చేయుటలో ఆయన ఎన్నడూ విఫలము కాడు.

33ఆయన దర్శనమును చూచినా, ఆయన స్వరమును వినినా, పూర్తిగా అది అర్థము కాదు. అతడు దేవుని సాధనము గనుక చాలా సార్లు అతనికి అది తెలియనే తెలియదు. మానవుల పెదవుల ద్వారా దేవుని ఆలోచనలు వ్యక్తమగును. అది ఒక వ్యక్తపరచబడిన మాటయే. దేవుడు తాను ముందుగా నిర్ణయించుకొనిన వారిని ఎన్నుకొనును. ప్రతి కాలములోను ఆయనాలాగే చేసెను. ప్రతి కాలమునకు ఆయన ఒకనిని నియమించెను. ఆయన అబ్రాహాముకు చెప్పిన దానిని మోషే నెరవేర్చవలసి వచ్చెను. మోషే ఒక మంచి బాలునిగా పుట్టెను, కాబట్టి మరో విధంగా అతడు ఉండజాలడు. ఆ విధముగా అతడు జన్మించెను, ఎందుకనగా ఆ ఉద్దేశ్యము కొరకే అతడు పుట్టెను.

కాబట్టి ప్రతి కాలములోను దేవుడాలాగు చేయుట మనకు కనబడును. దేవుడు తన స్వంత నిర్ణయము ద్వారా ముందుగా ఎన్నుకొనును. ఆ కాలమునకు తన ప్రవక్తలను ఎన్నుకొనును. అతని స్వభావమును, బోధించు విధానమును ఆయనే నిర్ణయించును. అతని వరమును ఘనపరచును. ఆ దినపు సవాలును ఎదుర్కొనుటకు అతనికి కావలసినదంతయూ ఆయన సమకూర్చును. దేవుడే ఆతనిని సృజించి పంపును. (గత రాత్రి నేను చెప్పాను) దేవుని యొక్క మనస్సులో మనమొక సూక్ష్మ కణముగా యున్నాము. అణువు లేదా వెలుగు లేదా భూమి మీద మరేదియూ లేకముందే ఆతడు ఏ కాలములో భూమి మీదికి వచ్చునో ఆయనకు తెలియును.

34నీవు నీ తండ్రి యొక్క జీవకణమైయున్నావు, నీవు నీ తండ్రిలో యున్నావు, అయినను నీవు అతనికి తెలియవు, మరియు అతడు నీకు తెలియదు, మీకెట్టి సహవాసము లేదు, కాని అతుడు నీతో సహవాసము చేయునట్లుగా నీవు బయలుపరచబడితివి. నీవు తిరిగి జన్మించినట్లుగా, నిత్యజీవము పొందుచున్నావు. నిత్యజీవమనగా, అది దేవుని జీవము. (గ్రీకు మాట జో; ఒకే ఒక నిత్యజీవ రూపమున్నది.)

నీవు దేవుని కుమారుడవు లేదా కుమార్తెవైనచో, నీవు సదాకాలము దేవునిలోనే యున్నావు. నీవు ఏ సమయములో రూపింపబడుదువో ఆయనకు తెలియును. నీవు ఒక సృష్టివి, దేవుని కుమారునివి, ఈ ఘడియ యొక్క సవాలును ఎదుర్కొనుటకు దేవుని కుమారుడు లేదా కుమార్తెగా బయలుపరచబడితివి. ఈ ఘడియ యొక్క నిజమగు సజీవ దేవుని నీవు బయలుపరచుదువు. ఈ కాలములో వచ్చుచున్న వర్తమానమును అందించెదవు. అది నిజము. జగత్తు పునాదికి ముందే నీవు అక్కడున్నావు. నీవు ఆ మార్గమును ఎన్నుకొన్నందునే వచ్చావు గాని, దానిని ఎంతగా అనుకరించినా గాని నీ వల్ల కాదు. ఒక దుంపలో నుండి నీవు రక్తమును ఎట్లు పిండుకోగలవు? అసలు అందులో రక్తమే లేదు.

35స్త్రీలు జుట్టు కత్తిరించుకొనుట చూచి నేను కేకలు వేయుచున్నాను. నా బోధను జనులు ఖండించుచున్నారు. ''నీ సేవ నాశనమగును,'' అనుచున్నారు. దేవుడే అభిషేకించిన సేవ నాశనమగునా? అదెన్నడూ జరుగదు! ప్రజలు దేవుని మాట వినుచున్నారు… తల్లి గర్భములో ఒక బిడ్డ రూపొందును. ఒక కణము మీద మరొక కణము పెరుగుచుండును. ఒకటి మానవ కణము, ఒకటి కుక్క కణము, ఒకటి పిల్ల కణము, మరొకటి మరో కణము కాదు గాని, అది పూర్తిగా మానవ కణము. దేవుని ఆత్మవలన ఒకడు జన్మించినప్పుడు, తన జీవితములోనికి దేనినీ అతడు చొప్పించనక్కర లేదు. కల్తీ లేని దేవుని వాక్కు ఆ ఘడియకు బయలుపరచబడును. అతడు పూర్తి దేవుని వాక్యమును తీసికొనును. దానిలో ఆచారములు చేర్చడు. అది పూర్తిగా కల్తీ లేని దేవుని వాక్కుగా మనకు తేటపడును.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

1JN 2:15

 

36బైబిల్ లో చూడుము, ఏ కాలంలో ఎక్కడ మనము జీవించుచున్నామో చూడు. ఈ గొప్ప సంగతులు బయలుపరచబడుట చూడుము. దానిని చేయుదునని దేవుడు వాగ్దానము చేసెను. ప్రతి కాలాంతమున, అనగా సంఘము ఒక మలుపు యొద్దకు వచ్చినప్పుడు ఆయన దానిని చేయును. వాక్యము నుండి వెనుదిరిగి పాపము మరియు లోకత్వములోనికి సంఘము వచ్చును. లోకత్వమే పాపము. మీరు లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిన యెడల, దేవుని ప్రేమ మీలో ఉండదని," బైబిలు చెప్పెను.

గతరాత్రి బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల గూర్చి మాట్లాడాను. అది ఏడు దినములు ఉండవలెను, ఏడు సంఘ కాలములకు అది సాదృశ్యము. ఆ ఏడు దినములలో పులిసినదేదియు జనుల మధ్య కనబడరాదు. దాని అర్ధమేమనగా దానికి మరేదియు కలుపరాదు. అది ఎప్పుడూ పులియనదిగా ఉండవలెను. మనము ఆచారములను పులిసిన మరి దేనిని మనలో కలుపరాదు. లోకమును మనతో కలుపరాదు. అది దేవుని యొక్క పులియని రొట్టె, అనగా దేవుని వాక్యము, కల్తీ లేని దేవుని వాక్యము, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును."

37మన శాఖల పద్దతులు, విభేదములు, క్రియలు, మనలో పులుపును ఉంచినవి. ఇది అది, లోకము నాజూకు, మొదలగునవి పులిసిన స్థితిని కలిగించును. ఎక్కడ చూచినా దాదాపు హలీవుడ్ కనబడుచున్నది. చివరకిది ఇంగ్లాండ్ వలె తయారగును. అక్కడ వేదిక పిలుపు సిగ్గుకరముగా ఎంచబడుచున్నది. సోదరుడు చెప్పినట్లుగా పడవలో చేపనెట్లు కనుగొనగలవు?" అది నిజమే.

సువార్తను దాని సంపూర్ణతలోనూ దేవుని శక్తితోను మనము బోధించవలసియున్నాము. ఆ కాలపు వాగ్దానము ప్రకారము దేవుడు దానిని బయలుపరచి, అది సంపూర్తిగా దేవుని చిత్తమని రుజువు చేయును. దానికి వెలుపల నీవు ఉన్నచో కేవలము ఒక సంఘ సభ్యునిగా మిగిలియుందువు. దేవునికి సేవ చేయవలెనని నీవెంత ప్రయత్నించినా ఫలితం లేదు. నీవు సంఘమునకు ఎంతో నమ్మకముగా పనిచేయుచూ ఉండవచ్చును; కాని నీలో నిత్యజీవ కణము ముందుగా నిర్దయించబడనిచో, దేవుని కుమారునిగా లేదా కుమార్తెగా ఉండలేవు, నీవు ఒక వికృత రూపంలో ఎదుగుదువు; ఎన్నడూ నిజమగు దేవుని కుమారునిగా లేదా కుమార్తెగా ఉండలేవు.

38ఒక చిన్న పక్షిరాజు గూర్చిన నా చిన్న కథను మీకు తరచు చెప్పుచుందును. మీరవి మరో విధంగా భావించరని నమ్ముచున్నాను. ఒక రైతు కోడి పెట్ట క్రింద కొన్ని గ్రుడ్లు పొదుగుటకు ఉంచెను. దానిగూర్చి మీకు తెలియును. అతడు పక్షిరాజు గూటిలో నుండి ఒక గ్రుడ్డును తెచ్చి, దానిని కోడి పెట్ట క్రింద ఉంచెను.

ఆ పక్షిరాజు పిల్లగా పొదగబడి మిగిలిన కోడిపిల్లలతో పాటు కోడి రెక్కల క్రింద ఉండెను. బయటకు వచ్చినప్పుడు పక్షిరాజు పిల్లకు కోడిపిల్లల కేకలు అర్ధము కాలేదు. కోడి పిల్లలు గాదె వెనుకకు వెళ్ళి త్రవ్వుకొంటూ గింజలు, పురుగులూ తినుచుండెను. కాని పక్షిరాజు, పిల్లకది సహించలేదు. వాటి మద్య ఆ పక్షిరాజు వింతగా ఉండెను. తల్లి కోడి పిలుపు దానికి అర్ధము కాలేదు. అది అటు, ఇటు వెళ్ళుచూ ఏదేదో తినుటకు ప్రయత్నించెను. దాని చేత కాలేదు. ఒక రోజున జరిగిన సంగతి వినండి.

తల్లి పక్షిరాజు తాను పెట్టిన రెండు గ్రుడ్లలో ఒకటి కనబడనందున వెదకుటకు బయలుదేరినది. ఆ ప్రాంతమంతా గాలించినది. చివరకది ఎగురుచూ ధాన్యపు గాదె యొద్దకు వచ్చినది. తల్లి పెట్ట వద్ద ఉండిన పక్షిరాజు పిల్లను చూచినది. ఈలాగు అరచినది, ''అమ్మా! నీవు కోడిపిల్లవు కాదు, పక్షిరాజువు!" ఆ స్వరము దానికి చక్కగా వినబడినది. ఎందువలన? దాని పుట్టుక పక్షిరాజు కనుకనే.

39ఒక వ్యక్తి ఆచారములు, అలవాట్లు, చల్లదనముతో నిండిన మతము క్రింద పొదగబడిన, ఆ వ్యక్తి దేవుని కుమారునిగా ఉండుటకు ముందు నిర్ణయించబడినచో, అతడు దేవుని వాక్యము దాని శక్తితో బోధించబడుట చూచును, దానిని దేవుడు బయలుపరచును. అతడు పక్షిరాజు అయినచో నిశ్చయముగా దాని యొద్దకు పరుగెత్తకుండా ఉండలేడు, ఎందుకనగా దేవుని వాక్యము ప్రేమించు స్వభావం అతనిలో ఉన్నది. ఎవరేమి చెప్పినా లెక్క చేయడు. దేవుని వాక్యము బయలుపరచబడుట చూచి దాని యొద్దకు ఎగిరి వెళ్ళును, ఎందుకనగా అతడొక చిన్న పక్షిరాజు.

''అమ్మా! ఇక్కడ నుంచి నేను నీ యొద్దకు ఎట్లు రాగలను,'' అని ఆ పిల్ల అడిగినది.

''ఒక్కసారి పైకి ఎగురు; నిన్ను నేను తన్నుకొనిపోదును," అన్నది.

నీవు చేయవలసినవి అదొకటే, దేవుని యొద్దకు ఒక్కసారి దూకుము, ఒక వాగ్దానము చేయుము, ''ప్రభువైన యేసూ, నా పూర్ణ హృదయములో నిన్ను నమ్ముచున్నాను. ఈ ఘడియ యొక్క వర్తమానమును నమ్ముచున్నాను. అది నిరూపించబడుట చూచుచున్నాను. అది నిజమని ఎరుగుదును," అని చెప్పి ఒకసారి పైకి ఎగురుము. తల్లి నిన్ను పట్టుకొనును. బాధపడవద్దు; నీవొక పక్షిరాజువు, నిన్ను పట్టుకొనుటకు ఆమె అక్కడ ఉండును.

40ఒక అద్బుతమగు కాలములో, ఒక గొప్ప కాలములో మనము జీవించుచున్నామని గ్రహించాము. ఇది ఒక బైబిల్ సత్యము. దాని ప్రత్యక్షతను విశ్వాసులు చూచారు. ఆ ప్రత్యక్షత, అందులో దేవుడున్నాడనుటకు రుజువు. ఖచ్చితముగా! దేవుని వాగ్దానము తెలియచేయబడినది. విత్తనము బ్రద్దలైనది, దానిని వారు చూచి నమ్ముదురు. మరి కొందరు దానిని చూడలేరు; ఎట్లయిన వారు కూర్చొని దానిని చూచెదరు.

జుట్టు కత్తిరించుకొనిన స్త్రీ దేశములో ఉండకుండునట్లు, నేను ఈ దేశమంతా తిరిగి ఎంతో కఠినముగా బోదించాను,. కాని నేను మరల వచ్చేసరికి వారు ఎక్కువగుచున్నారు. ఏమిటి సంగతి? ఎక్కడో పొరపాటున్నది! దేవుని వాక్యము ఆలాగు చెప్పుచున్నదని మీరెరుగుదురు! "మంచిది, అది ఏ వ్యత్యాసమును తీసుకొని రాదు," అని మీరంటారు. అది తప్పక వ్యత్యాసమును తెచ్చును!

41ఒక మంచి సోదరుడు నా యొద్దకు వచ్చి బ్రెన్హాం సోదరుడా, ''నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీ మీద చేతులుంచి ప్రార్ధించెదను. నీ సేవను నాశనము చేసికొనుచున్నావు." "ఆ స్త్రీల గూర్చి చెప్పుట ఆపు. ఆ పనిని సంఘ కాపరులను చేయనిమ్ము," అన్నాడు.

"వారు చేయుట లేదు గదా," అన్నాను.

అది నీ పని కాదు. నీవు రోగులకు ప్రార్ధించి వెళ్ళు," అన్నాడు.

"అయితే అది ఎవరి పని? నేను సువార్త బోధించుటకు పిలువబడ్డాను," అని అన్నాను.

''దేవుడు ఆ మనసును నీలో నుండి తీసివేయునట్లు, నీ మీద చేతులుంచి ప్రార్ధించెదను'' అని అన్నాడు.

"నీ మీద కూడ నేను చేతులుంచెదను. నీ కండ్లు తెరవబడి దానిని చూచునట్లుగా ప్రార్ధించెదను అని చెప్పాను. అది నిజమే.

ప్రజలు నిన్ను దేవుని ప్రవక్తవని నమ్ముచున్నారు. నీవు ఆ స్త్రీలు గొప్ప వరములను ప్రవచనమును మొదలగువాటిని పొందుట ఏట్లో నేర్పితే బాగుండును," అన్నాడు.

వారికి అ, ఆలు కూడా రాకుండా లెక్కలు ఎట్లు భోదించగలనని నేను అడిగాను. అది జరగని పని. మామూలు పనులే నీవు చేయలేనప్పుడు ఆత్మీయ క్రియల నెట్లు చేయగలవు? సాధారణ కార్యములే చేయలేకున్నావు. సోదరీ, సోదరుడా ఇది ఒక సరసోక్తివలె అనిపించును గాని, ఇది సువార్త. ఇది సువార్త సత్యము. అది నిజము.

MATT 7:22,23

 

42చూడండి, చాలా మంది ప్రజలు ఆత్మ నింపుదల కలిగిన వారు కూడా దానిని నమ్మలేకపోతున్నారు. మీకు ఆశ్చర్యము కలిగించు మాట చెప్పెదను. పరిశుద్ధాత్మ బాప్తీస్మము కలిగినంత మాత్రాన మీరు వెళ్ళుదురు అని కాదు, ఏ మాత్రము కాదు, దానిని బట్టి కాదు, మీ ఆత్మతో ఎట్టి సంబంధమూ లేదు. అది బాప్తీస్మము, చూచారా. నీ లోపల ఉన్న ఆత్మ; అది దేవుని యొద్ద నుండి రావలెను. నీకు బయట అయిదు జ్ఞానేంద్రియములున్నవి, అవి నీ భౌతిక నివాసమును సంబంధించును. లోపల ఆత్మ యున్నది, దానికి అయిదు ద్వారములున్నవి: మనస్సాక్షి, ప్రేమ మొదలగు అయిదు ద్వారములు ఆత్మకున్నవి. గుర్తుంచుకో, ఆ ఆత్మలో, నీవు నిజమగు దేవుని ఆత్మతో బాప్తీస్మము పొందగలవు, అయినా నీవు నశించవచ్చు. ఆత్మయే జీవించును. అది దేవునిచే ముందుగా నిర్ణయించబడెను.

యేసు, "ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి నేను దయ్యములకు వెళ్ళగొట్టలేదా? మహ గొప్ప కార్యములు చేయలేదా? ప్రవచింపలేదా?" అని అందురు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపొండి. నేనెన్నడు మిమ్ము నేరుగనూ అని చెప్పుదునని," యేసు అనలేదా.

GEN 24:57,58•

NUM 22:12

 

43కయప ప్రవచించలేదా, అతడొక అపవాది. యాజకులు ఆ దినములలోని గొప్ప నాయకులు దీనులుగా ఉండిరి, కాని వాళ్ళ కళ్ళ ఎదుటే బయలుపరచబడిన దేవుని వాక్యమును చూడలేకపోయిరి.

అందులో కొందరిని గూర్చి చెప్పగలను. బిలాము ఎవరు? "దేవుడు తన మనసును మార్చుకొనెను" అని మీరందురు. దేవుడు తన మనసుకు ఎన్నడూ మార్చుకొనడు!

బిలాము ఒక ప్రవక్తగా, లేదా బిషప్పుగా, లేదా బోధకునిగా వెళ్ళెను. అతనిని మీరేమైనా పిలువండి; అతడు గొప్పవాడు. కాని అతడు దేవుని సంప్రదించి, ఇశ్రాయేలును శపించుటకు బయలుదేరెను (ఇశ్రాయేలు అంటే అతనికి ముందే ఇష్టం లేదు), అందుకే అతడు వెళ్ళుదనని అడిగెను, వెళ్ళవద్దని దేవుడు చెప్పెను.

అతనిని ఒప్పించుటకు బాగా చదువుకొన్న వారిని, గొప్ప హోదా కలవారిని, వారు పంపించిరి. అతడు వెళ్ళి, మరల దేవుని అడిగెను. నీవు దేవుని మరల రెండవసారి అడుగక్కర లేదు. ఒకసారి అడిగితే చాలు. దేవుడు చెప్పిన తరువాత నీవిక ఎదురు చూడనక్కరలేదు.

రెండవ ఆజ్ఞ కొరకు రిబ్కా ఆగలేదు. "నీవు వెళ్ళుదువా," అని ఆమెనడిగిరి.

''ఆమెనే చెప్పనీయండి.''

''నేను వెళ్ళుదును," అన్నదామె. ఆమె దేవుని ప్రేరణచే గట్టిగా ఒప్పించబడెను. దేవుని ఆత్మ చెప్పిన దానికి అనుగుణంగా పని చేసినందున, బైబిల్ లోని రాణులలో ఆమె ఒకటాయెను. ఆమె సంపూర్ణ సత్యమును చేర్చుకొని, దానిని నమ్మి ముందుకు కదిలినది.

44బిలాము చూడలేకపోయెనని మనకు తెలియును. అతడు వెళ్ళి జనులను చూచి ఇట్లనుకొనెను, "మేము చాలా పెద్ద గుంపుగానే యున్నాము గాని, చెదరి పోయాము." మేమందరము ఒకే దేవుని నమ్ముచున్నాము.

అది నిజము. వారందరూ ఒకే దేవునియందు విశ్వాసముంచిరి, వారందరూ యెహోవానే ఆరాధించిరి. బిలాము యొక్క బలిని చూడండి. ఏడు బలిపీఠములను నిర్మించెను. అది దేవుని పరిపూర్ణ సంఖ్య, ఏడు సంఘములు, చూచారా; ఏడు పొట్టేళ్ళు, ప్రభుని రాకను గూర్చి మాట్లాడుచున్నవి. అతడు మౌలికంగా మోషే వలె యుండును; అయితే, మీరు చూడండి, దైవిక ప్రత్యక్షత లేదు. వారిద్దరూ ప్రవక్తలే.

మోషే సేవ క్రింద ఒక దైవ సంబంధమగు అగ్నిస్తంభము, ఒక వెలుగు పాళెములో కనబడెను. దైవిక స్వస్థత అక్కడుండెను. పాళెములో రాజును బూర ఊదుచుండిరి. గొప్ప సూచక క్రియలు, దైవిక స్వస్థత, అద్భుతములు వారి మధ్య జరుగుచుండెను. ప్రజల మధ్య సజీవ దేవుడున్నట్లు అది రుజువు.

ప్రాథమికముగా వారిద్దరూ ఒకేలాగున్నారు. బిలాము జనులను ఒప్పింప ప్రయత్నించెను. అందులోనికి వారిని రప్పింగోరెను. ఎపుడు? వాగ్దాన దేశము చేరు ముందుగా మరో రెండు రోజులలో వారు వాగ్దాన దేశములో యుందురు.

AMOS 3:3

 

45ఇది చాలా కఠినమగు మాట; నేను దీనిని బట్టి ఒక రోజున కాల్చి చంపబడ వచ్చును. కాని దీనిని మరచిపోవద్దు. ప్రపంచ సంఘ సమిత ద్వారా సంఘములు మోసపోవుచున్నవి. తిన్నగా అందులోనికి పోవుచున్నారు. ''అంతా ఒక్కటే,'' అనుచున్నారు. అంతా ఒక్కటి కాదు! అందులో నుండి బయటకు వచ్చి ప్రత్యేకించుకొనండి. నిశ్చయంగా, ఇది సత్యము. సాధ్యమైనంత త్వరగా మనము దాని నుండి దూరముగా పోవలెను.

"మనందరము ఒకే దేవుని నమ్ముచున్నాము కాబట్టి మన పిల్లలకు వారి పిల్లలను పెండ్లి చేయుదము," అని బిలాము చెప్పెను.

"సమ్మతించకుండా ఇద్దరు కూడి నడువగలరా?" ఆయన వాక్యముతో నీవు సమ్మతించకుండా, దేవునితో నీవెట్లు కలిసి నడువగలవు? ఆచారములు నీవు దానికి చేర్చరాదు. నీవు అందుకు నిర్ణయింపబడలేదు. అది చేయరాదని నీవు ఆజ్ఞాపించబడినది. సోదరీ, సోదరుడా, అది నీవు చేయగల మార్గము లేదు. పులియని దానితో నీవు పులిసిన దానిని కలుపరాదు. నీటిని, నీరును నీవు కలుపలేవు. చీకటి, వెలుగు కలువదు. వెలుగు చాలా శక్తివంతమైనది, గనుక చీకటిని పారద్రోలును.

2COR 6:17

 

46కాబట్టి దానిని మనము కలుప జాలము. లోకమును మరియు పాపమును నీవు మిశ్రమము చేయలేవు. సంఘమును మరియు శాఖను నీవు కలుపలేవు. సంఘమును మరియు ఆచారమును నీవు కలుపలేవు. లోకమును మరియు సువార్తను నీవు కలుపలేవు. అవి కలువవు! ''మీరు వాటిలో నుండి బయటకు వచ్చి ప్రత్యేకించబడుడి." "నేను మిమ్మును చేర్చుకొనును," అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మీరాయన కుమారులు మరియు కుమార్తెలు అయి యుందురు, ఆయన మీ దేవుడై యుండును. ఈ సంగతులు బయలు పరచబడువరకు మనమేమీ చేయజాలము. ఈ ఘడియ యొక్క వాక్యము సత్యమని నిరూపించబడినది. అడుగు జాడలను వెంబడించుము.

47పెంతెకోస్తు వచ్చినందున లూథరు తన వర్తమానమును కోల్పోపోయెను. వెస్లీ వర్తమానము కూడా అంతే! చూడండి, వెస్లీ సంఘము ఆగని యెడల పెంతెకోస్తు ముందుకు రాదు. లూథరనులు ఆగని యెడల మెతడిస్టు వారు ముందుకు రాలేరు, చూచారా. పెంతెకోస్తు వారు ఆగినప్పుడు వధువు ముందుకు వచ్చును. నీవు లోకము లోనికి తిరిగి నడిచిన యెడల నశించేదవు. నీవు కాండము మరియు పొట్టుగా ఉండి దహించబడెదవు. నీకది తెలియును. ఆయన గోధుమలను కొట్టులో కూర్చును. పొట్టును ఆరని అగ్నితో దహించును. అది వాహకమే గాని కాల్చబడును. నిశ్చయంగా, అది మోసికొని వచ్చెను, కాని అది పొట్టు గనుక జీవము లేదు. పరిపూర్ణ రూపమును తెచ్చుటకు అది సహాయపడెను.

ఆ విధంగానే సంఘము నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ముందుకు వచ్చినది. (వరములు తిరిగి సమకూర్చబడినవి), క్రీస్తు యొక్క రూపములోనికి మారుచున్నాము. క్రీస్తు పెండ్లి కుమారునిలో భాగము. అది వాక్యసంఘముగా ఉండవలసియున్నది, శాఖా సంఘము కాదు. అది వాక్యసంఘముగా ఉండును. బయలుపరచబడిన వాక్యము ద్వారా అది తెలియచేయబడినది.

NUM 16:3,4,21

 

48బిలాము ఆ తేడాను చూడలేకపోయెను. చాలామంది అంతే.

ఫరో దానిని చూడలేకపోయెను, అతనికి బయలు పరచబడినా చూడలేదు.

దాతాను దానిని చూడలేకపోయెను. దాతాను అక్కడికి వచ్చెను, అతను మోషేను ఎరుగును. "నీవొక్కడివా పరిశుద్దుడవా?" అని అతడు అడిగెను. "సర్వసమాజము పరిశుద్దమే," అని చెప్పెను. దేవుడెన్నడూ ఆలాగనడు ఆయనకు బాగుగా తెలియును. "సర్వసమాజము పరిశుద్దమే," అనెను. [ఈనాడు మనం వాడుకలో ఈలాగు అందుము], సముద్ర తీరాన ఒక్కటే గులకరాయి ఉన్నట్లు, నిన్ను నీవు చేసుకోనుచున్నావు.''

అందుకొరకే తాను పంబడెను అని మోషేను తెలియును. ఆలయపు ద్వారము నొద్ద అతడు పడెను.

"నీవు వేరుగా ఉండు,'' అని దేవుడు చెప్పెను. ఆయన నారిని మ్రింగివేసెను.

MATT 24:24•

MARK 13:22

 

49గుర్తుంచుకొనండి, ఇశ్రాయేలు చేసిన పాపమునకు ఎన్నడూ క్షమాపణ లేదు. ("వారంతా ఒక్కటే," అని బిలాము చెప్పెను.) ఒక సంచలనము కలిగించు సంఖ్యను మీకు చెప్పెదను. ఐగుప్తులో నుండి రెండు మిలియనుల మంది బయలుదేరగా, వాగ్దాన దేశములోనికి ఇద్దరే ప్రవేశించిరి. వారందరూ ఒకే ఆహారము తినిరి, వారందరూ ఆత్మలో నాట్యమాడిరి, వారందరూ ఒకేలాగుండిరి; కాని వేరుకాబడు కాలము వచ్చెను, వారిని వాక్యము వేరు చేసెను. ఆ సమయము వచ్చెను!

చాలా దగ్గరగా యున్నది, బైబిలు చూడండి, ''చివరి దినములలో రెండు - ఆత్మలు ఒకేలాగుండును." మత్తయి 24:24, ''బహు దగ్గరగా యుండి సాధ్యమైనచో ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేయును." ఆ పొట్టు గింజవలె కనిపించెను, కాని అది గింజ కాదు; చూచారా. అది గోధుమ గింజ కాదు గాని, ఆలాగే కనిపించెను. చూచారా, చాలా దగ్గరగా యున్నది. ఏర్పరచబడిన వారిని మోసము చేయును. మీరు ఆ శాఖలో పడిపోయిరి. ఎండిపోయి చనిపోయారు. గింజ ముందుకు కొనసాగినది. చూచారా, ఇది నిజము! అది వాహకమే గాని గింజ కాదు.

గుర్తుంచుకొనండి, గోధుమ గింజ ముందుకు వచ్చును. పురుత్థానములో శక్తి మొత్తం గింజలోనికి వచ్చును. శిరస్సుగా తయారగుసు. గొప్ప పునరుత్థానములోనికి వచ్చును.

ఎన్నడూ క్షమించబడదు!

50ఒక నిమిషం ఇక్కడ ఆగుదము. మిమ్మును ఊపిరాడకుండా చేయాలని నేను అనుకోవట్లేదు. కాని చూడండి, ఒక సంగతి అడుగుచున్నాను, పశువుల వీర్యమును సంకరము చేయుట మీరెరుగుదురు. పురుష వీర్యములో దాదాపు ఒక మిలియను కణములుండును. స్త్రీ అయితే ఒక మిలియను అండములను విడుదల చేయును. కాని అందులో ఒక్కటి మాత్రమే ఫలదీకరణము చెందునని మీరెరుగుదురా? తక్కిన వన్నియూ చనిపోవును. ఒక్కటి మాత్రమే జీవించుటకు నిర్ణయించమడినది. అన్ని ఒకటే అయినా మిలియనులో ఒకటి మాత్రమే జీవమును పొందును. మిగిలినవి చనిపోవును. నా లెక్క బహుశా సరికావచ్చును. మిలియనులో ఒకటి!

ఆలాగే ఈ రాత్రి జరిగిన ఏమగును? ప్రపంచములో దాదాపు అయిదు వందల మిలియనుల క్రైస్తవులున్నారు. ఈ రాత్రి రాకడ వచ్చినట్లయితే అయిదువందల మంది ఎత్తబడుదురేమో. చాలామంది తప్పిపోవుదురు. వారిని లెక్కించరు. వధువు ఎత్తబడును. ఇదంతా ఏమిటా అని ఆశ్చర్యపడుదురు, ప్రజలలో బోధకొనసాగును, ఇది లేక అది అని చెప్పుచుందురు. అదెంత మోసమో చూడండి. అది అదే కావచ్చు అని అనుకుందాము; అది అని నేను చెప్పుటలేదు, నాకా అధికారము లేదు. దానికి దేవుడే తీర్పరి. కాని అదెంత తేలికగా జరుగునో చూడండి, సంగతులు మరియు కార్యాలు ఎట్లు రుజువగుచున్నవో చూడండి.

51కోరహు దానిని ఎందుకు చూడలేదు? దాతాను దానిని ఎందుకు చూడలేదు?

ఆహాబు దానిని ఎందుకు చూడలేదు? ఆహాబు యొద్దకు యెహోషాపాతు వెళ్ళి, "ఆహాబూ, మనం ఆపదలో యున్నాము. దేవుడు మనకు ఈ స్థలమును ఇచ్చెనని నీవెరుగుదువా?" యెహోషువా దీనిని పంచెను. ఆ సిరియనులు తీసికొనిన నేల మనదే కదా?" అనడిగెను.

''అవును!''

''మన పిల్లలు ఆకలితో ఉన్నారు. సిరియనుల (వారు శత్రువుల) పిల్లలు చక్కగా తినుచున్నారు, మనము తినవలసిన గోధుమలను వారు తినుచున్నారు. దానిని మనము స్వాధీనము చేసికొందము. సహాయము చేయుదువా?'' అనడిగెను.

ఇప్పుడు, చెడ్డవాని ప్రభావము వలన కొన్నిసార్లు మంచివాడు పాడగును. సంఘమా, జాగ్రత్తగా గమనించుము.

1KGS 22:4-7•

2CH 18:3-6

 

52గొప్ప మత భక్తిగల యెహోషాపాతు చెప్పినది మొదట గమనించండి. నిశ్చయంగా, మనము వెళ్ళుదము. మనందరమూ ఒక్కటే. మీది మాది ఒకటే సంఘము. మనమంతా ఒకే జనులము. తప్పకుండా వెళ్ళుదము, కాని మొదటగా యెహోవాను సంప్రదించుదము.

కవుయన ఆమె అన్నది, ఓ ఆహాబు, "నిశ్చయంగా ఆలాగు చేయుదము.".

''యెహోవా ప్రవక్త ఎవరైనా యున్నాడా?"

పెద్ద సెమినరీ నిండా యున్నారు. ఉత్తమగు నాలుగువందల మంది నా యొద్ద నున్నారు. వారికి పి.హెచ్.డి, ఎల్.ఎల్.డి, ఎల్.డి. డబుల్ డిగ్రీలున్నవి," అన్నాడు. గుర్తుంచుకొనండి, వారందరూ హెబ్రీ ప్రవక్తలు. పాఠశాల నుండి వచ్చిరి.

''వారు చెప్పేది విందము, తీసికొని రండి," అనెను.

1KGS 22:6-11•

2CH 18:5-10

 

53ఆత్మావేశము కలిగిన సిద్కియా వచ్చెను, వారందరి పైన బిషప్పు, సంపూర్ణ ఆవేశమున్నది. రెండు పెద్ద ఇనుప కొమ్ములు తయారుచేసికొనెను. "మీకు తెలుసా, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' రాత్రిలో ఆ ఎవరికీ కనబడని కొమ్ముల ద్వారా సిరియనులను ఆ ప్రాంతము నుండి త్రోసివేసెదవు,'" అని చెప్పెను.

''అది ఖచ్చితంగా నిజము!'' అని మిగతా వారందరూ ప్రవచించిరి. మొత్తం ఆ సెమినరీలోని ప్రతి ఒక్కరు అంగీకరించిరి, చూచారా.

"చూచారా?" అని ఆహాబు అనెను.

యెహోషాపాతు ఒక విధంగా ఆత్మ సంబంధి. అతడు పూర్తిగా అంగీకరించలేదు. "మనము సంప్రదించుటకు మరియొక ప్రవక్త లేడా?" అని అడిగెను.

"అది సరియేనని మొత్త సెమీనరీ (ఆలోచన సభ) చెప్పుచుండగా, ఇంకెవరిని సంప్రదించాలి? అందరూ ఏకగ్రీవంగా చెప్పారు గదా?" అన్నాడు.

"ఇంకోక ప్రవక్త లేడా ?" అనడిగాడు.

"ఒకడున్నాడు. ఇమ్లా కుమారుడగు మీకాయా ఉన్నాడు. అతడంటే నాకు గిట్టదు, ఎందుకనగా ఎప్పుడూ జనులను తిట్టుచుండును. నన్ను శపించును. నా గూర్చి కీడే పలుకును. అతనంటే నాకు అసహ్యము,'' అని చెప్పెను.

"రాజా! ఆలాగు పలుకవద్దు."

"అతనిని రప్పించండి," అని చెప్పెను.

1KGS 22:8,13-18•

2CH 18:7,12,13,16

 

54కొందరు బిషప్పులు, పెద్దలు ఇమ్లా కుమారుని తెచ్చుటకు వెళ్ళిరి. ఇట్లన్నారు, "నీవు మరల సంస్థలోనికి రాగోరుచున్నావా? అయితే విను. వారేది చెప్పిరో అదే నీవు చెప్పవలెను."

మానవుల చేతులకు చిక్కని ఒకనిని దేవుడు కలిగియున్నాడు; అతని మీద దేవుని హస్తమున్నది. అతడు దేవుని సత్యమును ప్రతిబింబించువాడు. నిశ్చయముగా నేను వచ్చెదను, కాని దేవుడు నా చోట ఉంచిన దానినే పలికెదను. ఒక రాత్రి సమయమియ్యండి," అన్నాడు. అతడు దైవజనుడు. రాత్రిలో ఆ ప్రవక్తతో ప్రభువు మాట్లాడేను. మరుసటి ఉదయం బయలుదేరి వచ్చెను.

"ఇమ్లా ఏమి చెప్పెదవు?" అన్నారు.

''వెళ్ళండి, కాని ఇశ్రాయేలీయులు కొండ మీద కాపరిలేని గొర్రెలవలే చెదరి యుండుట చూచాను," అన్నాడు.

"నేను చెప్పలేదా? ఇతడాలాగే పలుకును," అని అన్నాడు.

1KGS 22:24•

2CH 18:23•

MATT 4:4•

LUKE 4:4•

REV 22:18,19

 

55పెద్ద బిషప్ప అతని దగ్గరకు వెళ్ళి చెంపమీద కొట్టి దేవుని ఆత్మ ఎటు వెళ్ళినదో చెప్పుము? నాకు ఆత్మ కలదు. అందులో నేను నాట్యమాడాను. ఇన్ని పనులు చేశాను. నా మీద ఆత్మ ఉన్నది. నీ ఆత్మ ఎటు వెళ్ళినది?" అనడిగాడు.

ఇప్పుడు, చూడండి, ఇమ్లా దేవుని కుమారుడు, దేవుని నిజ ప్రవక్త. అతడు వాక్యముతో తన దర్శనమును పరీక్షించుకొనెను. అది వాక్యమునకు సరిపడనిచో తప్పు, చూచారా. ఆ ఘడియ వాక్యము, చూచారా. వాక్యప్రకారమే అతడు పలికెను. ఆ భూమి వారికే చెందును. ఒక్కటి తప్ప అంతా వాక్యానుసారముగానే యున్నది.

ఒక్క మాట వినకపోవుట వల్లనే గందరగోళమంతా వచ్చెను. హవ్వ దేవుని మాటనొకదానిని నమ్మలేదు. బైబిలు మొదట్లో ఒక మాటను నమ్మనందునే శ్రమ వచ్చెను. బైబిలు మధ్యలో యేసు వచ్చి, ''దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను మానవుడు జీవించును,'' అని చెప్పెను. దానికి ఏదీ చేర్చరాదు, దానిలో నుండి ఏదీ తీసివేయరాదు,'' అని బైబిలు చివరలో చెప్పెను.

56మెతడిస్టులు, బాప్టిస్టులు, పెస్బిటేరియనులు, కాతలిక్కులు, యెహోవా సాక్షులు ఒక్కొక్క భాగమును పట్టుకొనిరి.

మొత్తం వాక్యమును చూడవలెను. అది ఈ ఘడియ వాక్కు దానిని నిలబడి చెప్పగల ప్రవక్తను దేవుడు అభిషేకించనంతవరకు మనమేమీ చేయలేము. అది నిజమని ఆయన ధృవపరచి, నిరూపించును. అది జనుల ముందరే పోవును గాని వారెన్నడూ దానిని ఎరుగరు. ఎప్పుడూ అంతే!

జోన్-ఆఫ్-ఆర్క్ ను కాతలిక్కులు కాల్చి చంపిరి. ఆమె మంత్రగత్తె అని వారు తలంచిరి. రెండువందల సంవత్సరాల తరువాత ఆ యాజకుల శిధిలాలను త్రవ్వి, నదిలో పారవేసిరి. సెంట్ పాట్రిక్ మొదలుకొని ఎవరినీ మీరెరుగరు.

మరల అది మీ చేతుల గుండానే జరుగను. దానిని దేవుడు చేయును గాని అది జరిగినట్లు కూడా మీకు తెలియదు. ఆయన మెల్లగా జారివెళ్ళును. తన వధువును ఎత్తికొనిపోవును, ఆమెను నేరుగా పైకి కొనిపోవును, జనుల మధ్యలో నుండి ఆమెను దొంగిలించుకొనిపోవును.

1KGS 21:19•

REV 3:17

 

57తనకు ముందున్న ప్రవక్తలో దేవుడు చెప్పిన దానితో తన దర్శనమును మీకాయా పరీక్షించుకొనెను. ముందున్న ప్రవక్త ఏమి చెప్పెను? "ఆహాబూ, నీతిమంతుల రక్తము (నాబోతు), నీవు చిందించితివి గనుక నీ రక్తమును, యెజెబెలు రక్తమును కుక్కలు, నాకును." దానిని దేవుడు చెప్పెను గనుక నెరవేరి తీరును. కాబట్టి ఆ ప్రవక్త మేలునెట్లు ప్రవచించగలడు?

దేవుడు నేరములు మోపగా ఈ లవొదకయ సంఘము గూర్చి మేలు నేనెట్లు పలుకగలను? నీవు దిగంబరివి, దిక్కుమాలినదానవు! "నేను ధనవంతురాలను. నాకు ఇది ఉన్నది, అది ఉన్నది. నాది మెతడిస్టు, బాప్టిస్టు లేదా ప్రేస్బిటేరియను సంఘము," అని నీవు చెప్పుకొనుచున్నావు. అది సరియే కాని, నీవు దిగంబరివనియు, గ్రుడ్డిదానివనియు, దిక్కుమాలిన దానవనియు ఎరుగక యున్నావు. దేవుడు బయలుపరచుచున్న నిజమైన దానిని నీవు గ్రహించుట లేదు. నీవు అలాగే వెళ్ళుచున్నావు, నేరుగా బయటకు నడచుకొనిపోవుచున్నావు. జనులారా, ఆలస్యము కాకముందే మీరు నమ్మండి.

1KGS 22:19,22,24•

2CH 18:18,21,23

 

58''దేవుని ఆత్మ ఎటువైపు వెళ్ళినదో చెప్పుము'' అని అతని నోటి మీద కొట్టెను.

మీకాయా ఇట్లు చెప్పెను, "దేవుడు సింహాసనము మీద కూర్చొని యుండుట చూచాను. పరలోక సైన్యమును ఆయన పిలచెను. ఆహాబును మోసము చేయుటకు మనలో ఎవరు వెళ్ళుదురు?" అని చెప్పుకొనిరి. అబద్ధమాడు ఆత్మ ప్రవక్తలలో ప్రవేశించెను. వారి మీద నున్న ఆత్మ వాక్యానుసారమైనది కాదు. కాని వారు రాజు యొక్క ప్రవక్తలు గనుక అంతా వారికి చక్కగా యుండినందున దేనినీ గమనించలేదు.

REV 3:16

 

59నేడు సంఘము ఆలాగే చేసినది. సంవత్సరాల క్రితం ఉన్న ఆ పాత-కాలపు అనుభవమును నీవు విడిచిపెట్టావు. నీవు వీధి మూలన నిలబడి సువార్త ప్రకటించావు. నీవు ఆ సంస్థలో నుండి బయటకు వచ్చి "స్వాతంత్ర్యము'' పొందావు. కాని ఇప్పుడు మరల అందులోనికి వెళ్ళుచున్నావు. కుక్క తన శాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలోనికి వెళ్ళినట్లు యున్నావు. మొదటసారి దానికి వాంతి అయినది గనుక మరల వాంతియగును. అది నిజము! దేవుడు తన నోట నుండి నిన్ను ఉమ్మి వేసెను. ''నీవు నులివెచ్చగా యున్నావు, వెచ్చగాను లేవు చల్లగాను లేవు." కొన్ని కూటములలో పాటను పాడావు. సంగీతము వాయించావు. అది దాదాపు క్రైస్తవ్యమునకు అవమానముగా మారినది.

నా కుమారుడు ఒకనాడు నన్ను పిలచి టెలివిజనులో వచ్చుచున్న పాటలను వినమనెను. ఒక యువగుంపు నిలబడి రాక్-ఎన్-రోల్ వలె కదలుచుండిరి. పాటలు పాడుచుండిరి. యేసు క్రీస్తుకు అది అవమానము! అసలు సంఘములో మర్యాదలేదు. అది రాక్-ఎన్-రోల్ వలె మారిపోయినది. నాజూకు ప్రదర్శన అయినది. సజీవ దేవుని సంఘములో యేసుక్రీస్తు తన శక్తితో బయలుపడుట లేదు. ఆలాగుండరాదు! ఎక్కడో పొరపాటున్నది. నీవు జారిపోవుచున్నావు. ఆ విధంగానే యుండునని బైబిలు చెప్పెను, చూచారా. మీరెక్కడున్నారో చూడండి. జాగ్రత్తగా యుండండి. ఆలస్యము కాకముందే మేల్కొనండి.

1KGS 22:20,27,28•

2CH 18:19,27•

MATT 24:35•

MARK 13:31•

LUKE 21:33

 

60"ఆహాబును మోసము చేయుటకు ఎవరిని పంపుదము? ఆ ప్రవక్త మాటలను ఎవరు నెరవేర్చెదరు?" అని ప్రశ్నించుకొనిరి. ప్రవక్త పలికిన మాట భూమ్యాకాశములు గతించినా గాని తప్పిపోదు. అది నెరవేరవలెను. జరిగి తీరును.

లోపల చెరసాలలో ఇతనిని ఉంచండి. దుఃఖమును ఇతనికి అన్న పానములుగా ఇయ్యండి. నేను సమాధానముగా తిరిగి వచ్చిన తరువాత వీని పని చూచెదను," అని అతడు పలికెను.

మీకాయా అక్కడ గట్టిగా నిలబడెను. తనలో దేవుని ఆత్మ యున్నట్లు అతనికి తెలియును. అతని ప్రవచనము, దర్శనము నిజము. అతని వర్తమానమున నిజము, ఎందుకనగా అది "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు." దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," వచ్చెను. ఆ "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు," నిజము కావలసియుండెను. "నీవు అసలు తిరిగి వచ్చనచో దేవుడు నాతో మాట్లాడలేదని తెలిసికొనుము,'' అన్నాడు. ఏమి జరిగినదో నిశ్చయంగా మీరెరుగుదురు.

వినండి సోదరులారా! గ్రహించండి.

PS 22:1•

HEB 13:8•

REV 3:19

 

61కయప దానిని చూడలేకపోయెను. ఎందుకతడు చూడలేకపోయెను? అతడు ఒక బిషప్పు, సంఘములన్నింటినీ ఏకము చేసిన పోపు అతడే. ఆ మనుష్యుడు ఎందువలన యేసును చూడలేకపోయెను? వారు ఆలయములో 22వ కీర్తనను పాడుచుండిరి. "నా దేవా, నా దేవా నన్నేల చేయి విడిచితివి?" ఆయనే సిలువ మీద వ్రేలాడుచుండెను. వారు చదువుచున్న లేఖనములు, వారు ఆరాధించుచున్న దేవుడు ఆయనే గాని వారాయనను ఖండించి ''మతోన్మాది'' అని చంపుచుండిరి.

అది మరలా జరుగుచున్నదని నేను చెప్పినయెడల మీరు ఆశ్చర్యపడుదురు. ఆయన బయట నిలబడి లోపలకు రావలెనని తలుపు తట్టుచున్నాడు. ఎవరూ ఆయనను రానియ్యు లేదని బైబిలు చెప్పుచున్నది. నేను ప్రేమించుచున్నవారినందరిని గద్దించి శిక్షించుచున్నాను, నేను వారిని ప్రేమించుచున్నాను గనుక కుదుపుచూ గద్దించుచున్నాను." నేను సంఘములోనికి రావలెనని ప్రయత్నించుట లేదు గాని, వ్యక్తిలోనికి రాగోరుచున్నాను,'' అని పలుకుచున్నాడు. వారందరూ సంస్థగా మారిరి. ఈ సంఘ కాలములో ఆయన వెలుపల నిలబడియున్నాడు. బయట ఉంచిరి! నిరాకరించారు! విసర్జించారు! ఇతర సంఘములలో తాత్కాలికంగా ఆయన ప్రత్యక్షమాయెను, నీతీకరణము రూపములో, మొదలగు వాటిలో ఆయన కనబడెను; కాని ఇక్కడ, ఇప్పుడు వచ్చుచున్న కాలములో, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత రుజువుతో ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. మనకు చాలా అనుకరణ కర్తలున్నారు, కాని అసలయిన మొదటి దానిని మీరు గుర్తించండి.

2TIM 3:8

 

62ఇశ్రాయేలును విమోచించుటకు మోషే దేవుని ఆజ్ఞ బట్టి వెళ్ళెను. అతడు కొన్ని అద్భుతములను జరిగించెను. అతనిని అనుకరించిన వారున్నారు. వారు మొదటగా చేసినవారయితే ఇతడు అనుకరణ కర్త అగును. చూడండి, అతనికి యెహోవా వాక్కున్నది, ప్రభువు బయలుపరచినందున నెమ్మదిగా కూర్చొనెను.

చివరి దినములలోను ఆలాగే జరుగునని చెప్పలేదా? ''యన్నే, యంబ్రెలు మోషేను ఎదిరించినట్లుగా ఈ మనుష్యులు భ్రష్ఠమనస్సుతో సత్యమును ఎదిరించెదరు." సంస్థలో చేరి ఒకనిని పైకెత్తుచున్నారు. అది దేవుని సంబంధమైనది కాదు. ప్రజల మనస్సులను ఆకర్షించుటకు దేవుడా పనిని చేయును. దాని వెనుక వర్తమానము వచ్చును, లేనియెడల అది దేవునికి సంబంధించినది కానే కాదు. దేవుడెప్పుడూ వర్తమానమిచ్చును.

యూదా దానిని అర్ధము చేసికోలేకపోయెను. ఆయనతోనే నడిచెను గాని దానిని చూడలేకపోయెను.

DEUT 8:3•

MATT 4:4•

LUKE 4:4•

COL 1:20•

COL 2:9

 

63నిజముగా దేవునిచే అభిషేకించబడిన వాని ఆత్మ దేవునిలో జగత్తు పునాది వేయబడక ముందే యున్నది. ఈ రాత్రి మీలో నిజముగా దేవుని ఆత్మ యున్నచో మీరు క్రీస్తులో యున్నారు, ఎందుకనగా ఆయనే వాక్యసంపూర్ణత. శరీరరీత్యా ఆయనే దేవుని యొక్క స్వరూపము. దేవుడు క్రీస్తులో యుండి లోకమును సమాధానపరచుచుండెను. దానిని మీరు నమ్ముచున్నారా? చూడండి, ఆయన క్రీస్తులో యున్నాడు. నీవు ఆదిలోనే దేవునిలో ఒక కణముగా, ఒక మాటగా, ఒక రూపముగా యుండినచో నీవు ఆయనతో కూడా ఈ భూమి మీద నడిచావు. ఈ భూమి మీద ఆయనతో మాట్లాడావు. ఈ భూమి మీద ఆయనతో పాటు శ్రమపడితివి. కల్వరి యొద్ద ఆయనతో పాటు మరణించితివి. ఆయనతో కూడా తిరిగి లేచావు. ఇప్పుడు నీవు క్రీస్తు యేసునందు పరలోక స్థలములందు కూర్చొని యున్నావు. ఆయనతో సహవాసము చేయుచున్నావు. (వాక్యము) అది నీ ఆత్మను పోషించును. "బయలు వెళ్ళు ప్రతి మాట వలనను మానవుడు జీవించును.''

మెతడిస్టు మాట కాదు, బాప్టిస్టు మాట కాదు; బలి అర్పణలో ఏదయినా మిగిలిపోయినచో, ఉదయముకాక ముందే కాల్చబడవలెను. రేపు మరో సంఘ కాలము. అవునా? నిర్గమనము, అది నిజము. ఒక గురుతు, ఒక విధముగు అర్పణ.

JOHN 5:43•

JOHN 10:9

 

64"అన్నిచోట్ల మీరు నన్ను ఆరాధించలేరు. ఒకే ద్వార మున్నది. ఆ ద్వారములో నా పేరుంచియున్నాను. ఆ ద్వారము నేనే,'' అని యేసు యోహాను 10వ అధ్యాయములో చెప్పెను. ప్రభువు తన నామమును ఎక్కడ ఉంచెనో, ఆ చోటనే దేవుడు నీ బలిని అంగీకరించును.

దేవుడు యేసులో తన నామము నుంచెను. దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన దేవుని కుమారుడు. ప్రతి కుమారుడు తన తండ్రి నామములో వచ్చును. నేను నా తండ్రి నామములో వచ్చితిని గాని మీరు చేర్చుకొనలేదు,'' అని ఆయన చెప్పెను. నేను నా తండ్రి పేరున వచ్చాను. మీరు మీ తండ్రి పేరున వచ్చారు. యేసు తన తండ్రి పేరులో వచ్చెను. కాబట్టి ఆయన తండ్రి పేరు యేసు. నిజంగానే ఆయన తన తండ్రి నామములో వచ్చెను.

"మీరు నన్ను చేర్చుకొనలేదు. మరొకడు వచ్చును, అతనిని మీరు చేర్చుకొందురు.'' మీరు మీ శాఖలతో అతనిని వెంబడించెదరు , మరియు ఆలాగే వెళ్ళండి. బైబిలు ఇట్లు చెప్పెను, "దీనిని నెరవేర్చుటకే వారు పుట్టిరి. గ్రుడ్డివారు, దిగంబరులు కాని ఎరుగరు." సంఘము, మతము, భక్తి చాలా యున్నది. కయీనువలె యున్నాను; బలి అర్పించిరి, హేబెలు వలెనె అంతా చేసిరి. కాని ప్రత్యక్షత ద్వారా అది బయలుపరచబడెను. పొలములోని ఫలములు కాదు.

శరీరధారియైన వాక్యమును విశ్వాసి చూడగలడు గాని ఇతరులు చూడలేరు.

JOHN 6:31,49

 

65ఇశ్రాయేలీయులందరూ మోషే చేసిన క్రియలను చూచారు. అయినా వారందరూ బిలామునే వెంబడించారు. ''మేము బిలామునే అనుసరించెదము. డాక్టర్ బిలాము సరైనవాడనుకొనుచున్నాము. చాలా విద్యగలవాడు, తెలివైనవాడు, అతనినే వెంబడించెదము,'' అనిరి.

దేవుడు ఎన్నడూ వారిని క్షమించలేదు. అరణ్యములోనే వారిని నాశనము చేసెను. వారిలో ఒక్కరును రక్షించబడరని యేసు చెప్పెను.

''మా పితరులు నలుబదేండ్లపాటు అరణ్యములో మన్నాను తినిరి," అన్నారు.

"వారందరూ చచ్చిరి, నిత్యముగా దేవుని నుండి దూరమయిరి," అని ఆయన పలికెను. నిశ్చయంగా! ఎందుకనగా వారు ఒక తప్పును వినిరి. మోషే దేవుని చేత రుజువుచేయబడినవాడు, వాగ్దాన దేశమునకు వారికి దారి చూపించు నాయకుడు. చాలా దూరము బాగానే వచ్చిరి, కాని తరువాత అతనితో నడవలేకపోయిరి.

విశ్వాసులు దానిని చూడగలరు, కాని ఆ ప్రత్యక్షతను అవిశ్వాసులు చూడలేరు.

JOHN 6:53•

JOHN 8:44•

JOHN 10:30

 

66కయప ఎంత భక్తిగలవాడో చూడండి. ఆ యాజకులందరూ ఎంత భక్తిగలవారో చూడండి. "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాని క్రియలే చేయుచున్నారు," అని ఆయన వారి వైపు తిరిగి చెప్పెను.

కాని అక్కడ కొద్దిమంది విశ్వాసులు కూర్చొనియుండిరి. ''నేను, నా తండ్రి ఏకమై యున్నాము," అని యేసు చెప్పిన మాటను శిష్యులు గ్రహించారనుకొనుచున్నారా? దానిని వారు గ్రహించలేరు. ''మనుష్యకుమారుని శరీరము తిని, రక్తము త్రాగితేనే గాని మీకు నిత్యజీవముండదు,'' అని ఆయన చెప్పిన మాటను గ్రహించారనుకొనుచున్నారా? లేదు. కాని వారది నమ్మిరి, ఎందుకనగా దేవుడు శరీరమందు బయలుపరచబడుట వారు చూచారు.

JOHN 10:4,11

 

67యేసు చెప్పెను, ''నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. కాని నేను నా తండ్రి క్రియలు చేయుచూ, నేను చేయవలసియున్న దానిని చేయుచున్నచో నన్ను నమ్మకపోయినా

నా క్రియలు చూచి నమ్ముడి. మీరు రక్షించబడుదురు." చూచారా? యేసు చెప్పెను, "నా గొర్రెలు నా స్వరము వినును. వాటికి నా మాట తెలియును. ఆ కాలమునకు బయలుపరచబడిన వాక్యమును వారు చూచెదరు.''

''కపకు కూడా వాక్యము తెలియును!" కాని ఆ కాలపు వాక్యము తెలియదు. పరిసయ్యులు అతనికి చెప్పిన మాటనే నమ్మెను గాని ఆ ఘడియకు బయలుపరచబడిన వాక్కును నమ్మలేదు.

"వారు నా స్వరమును ఎరుగుదురు, నా గురుతును వారెరుగుదురు, నా అద్బుతమును వారెరుగుదురు."

తిరిగి మన అంశము యొద్దకు వెళ్ళుదము, లేనియెడల చాలా వాక్యభాగమును మనము తప్పిపోవుదుము. ఏలాగయినా గాని కొద్ది నిమిషములలో నేను ముగించవలెను. కొద్ది నిమిషములలో పది గంటలగును. నేనాయనను ప్రేమించుచున్నాను. ఆమేన్.

MATT 10:25

 

68స్నేహితులారా, కొద్దిసేపటి క్రితం మీరు వచ్చి అర్పణలు చెల్లించారు; నా పిల్లలను పోషించారు; వారికి దుస్తులిచ్చారు; మీరు మీ డబ్బును అర్పణల పళ్ళెములో యుంచారు. (మీ సంపాదన) అదెక్కడికి వెళ్ళునో మీకు తెలియునా? దేవుని గూర్చి ఎన్నడును వినని అన్యుల యొద్దకు నేను వెళ్ళుటకు అది సహాయపడును. దానితో అదే నేను చేయుదును. దేవుడే నా న్యాయాధిపతి. నా సంఘ ఖజానాలో బకాయన కూర్చొనియున్నాడు. వారమునకు నేను వంద డాలర్లు మాత్రమే తీసికొందును. తక్కినదంతయూ విదేశములలోని కూటములకే వెళ్ళును.

సంఘములు నన్ను రానియ్యవు. నేను వారికిష్టముండను. ఇది నిజము. నన్ను వారు, ''యేసు నామము వాడు" లేదా "మతోన్మాది" లేదా "యెజెబెలు" అని పిలచుచున్నారు. యెజెబెలు కాదు గాని ఆయనను బయల్జెబూబు అని పిలచిరి. చెడ్డ నామములతో ఆయనను పిలచిరి. "వారు ఇంటి యజమానినే బయల్జెబూబు అని పిలచిన యెడల ఆయన శిష్యులను మరింతగా వారు పిలచుదురు?" కాబట్టి పెద్ద పట్టించుకోనవసరము లేదు.

నేను ఇక్కడ వేషధారిగా నిలబడి ఇవన్నీ చెప్పుచున్నానా? లేదా దేవుని నుండి వచ్చిన దానినే చెప్పుచున్నానా? మీరే దేవుని సహాయముతో చెప్పండి.

69నేను మిమ్మును ప్రేమించుచూ మరియు సత్యమునే చెప్పుచున్నాను. ప్రభుని నామములో నేను చెప్పినది ఏనాడైనా నెరవేరకమానేనా? లేదు. అందరినీ అడుగుచున్నాను. వేలాది సంగతులు చెప్పాను, అవన్నీ నెరవేరును. ఇశ్రాయేలీయులు తక్కిన రాజ్యముల వారి వలె ఉండగోరిరి. పెంతెకోస్తువారు ఆలాగే యున్నారు. తక్కిన జనులవలె మీరు ప్రవర్తించగోరుచున్నారు. మీరట్టి వారు కారు. వారి నుండి దూరమగుడి: పెద్ద సంఘములు పెద్ద కార్యక్రమములు బాగానే యున్నవి. ఓ, సోదరుడా! ఆలాగు చేరవద్దు. ప్రభుని రాకడ సమీపమాయెనని మనము బోదించుచున్నాము; బయటకు వెళ్ళి అన్యులకు ప్రకటించుదుము. చూచారా, దాని గురించి ఏదైన చేయవలెను.

1SAM 12:3,4

 

70కాని సమూయేలు చెప్పినది వినండి, ''నా జీవనము కొరకు మీ ద్రవ్యమును ఎన్నడయినా నేను తీసికొన్నానా?"

"లేదు, సమూయేలు, నీవెన్నడూ ఆలాగు చేయలేదు,'' అనిరి.

''యెహోవా నామములో నేను చెప్పినది ఎన్నడైనా జరుగకుండా పోయేనా?" అనడిగెను.

''సమూయేలూ! నీవు దేవునిచే పంపబడిన ప్రవక్తవని మాకు తెలియును. సమూయేలు! నీవు చెప్పినవన్నీ జరిగినవి. అయినా గాని మాకు కావలెను.'' ఏమి జరిగెనో మీరెరుగుదురు. ఓ సోదురుడా, వాక్యము తిరిగి పునరావృతమగుచుండును, ఎందుకనగా అది దేవుడు చేయు విధానము. ఇటువంటి కాలములు వచ్చునని తెలిసికొనుము.

వెంటనే మన అంశము యొద్దకు వెళ్ళుదము. ఇంకా నా అంశము నొద్దకు ఇంతవరకూ రాలేదు.

HEB 13:8

 

71అది నా హృదయములో యున్నది! మిమ్మును ప్రేమించుచున్నాను! లోకముతోపాటు నశించకుడి! మీరు లోక సంబంధులయితే లోకముతోనే నశించుదురు. మీరు దేవుని సంబంధులయితే పునరుత్థానమందు ఆయనతో పాటు మేల్కొందురు. కాబట్టి ఈ రాత్రి మీ స్వభావమును మార్చుకొనండి. లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించకుడి. ఈ ఆచారములను ప్రేమించకుడి. కల్వరిలోని బలిని మీరు తిన్నగా చూడండి. అక్కడాయనను కలిసికొనండి, ఎందుకనగా ఆయన నిన్ను కలిసికొనుచోటు అది ఒక్కటే.

"ఆయన మా సంఘములో యున్నాడు" అని మెతడిస్టువారు, బాప్టిస్టువారు, పెంతెకోస్తువారు, పెస్బిటేరియనులు ఎవరికి వారే చెప్పుకొనుచున్నారు.

''కాని ఒక్కచోటనే నేను కలిసికొందును. అందులో నా నామము ఉంచి యున్నాను'' అని ఆయన చెప్పెను. అది యేసు క్రీస్తులోనే. అక్కడే యేసు తన నామము నుంచెను. ఆయన నిన్ను కలిసికొనుచోటు అదొక్కటే; క్రీస్తే వాక్యము, … ఏకరీతిగా యున్నాడు. అది ఎదిగియున్నది, తల ఏర్పడినది, పూర్ణ వ్యక్తిత్వము ఏర్పడుచున్నది, వధువు, పెండ్లికుమారుని వలె యున్నది.

MAL 3:1•

MATT 3:12•

MATT 11:3•

LUKE 3:17•

LUKE 7:19

 

72వెంటనే మన అంశములోనికి వెళ్ళుదము. దాదాపు పది నిషములలో ముగించుదము. ఇప్పుడు మన లేఖనము.

మలాకీ 3లో వాగ్దానము చేసినట్లుగా దేవుడు తన ప్రవక్తను పంపెను. "ఆయన రాకకు ముందుగా నేను ఒక వర్తమానికుని పంపుదును."

మత్తయి 11వ అధ్యాయము దానిని నిరూపించును. యోహాను శిష్యులు వచ్చి యేసును చూచిరి. యోహాను చెరసాలలో యున్నాడు. నీవు ఆయనవో కాదో అడిగి రమ్మనెను," అని చెప్పిరి.

యోహాను యొక్క నేత్రములు పక్షిరాజు నేత్రముల వంటివి. అతడు చెరసాలలో యున్నాడు, అతడు చనిపోవనైయున్నాడు; "వెళ్ళి ఆయనను అడగండి," అనెను.

చూడండి, యోహాను ఇట్లు చెప్పెను, ''ఓ, ఆయన చేట ఆయన చేతిలో యున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును.'' వెయ్యేండ్ల పాలన అప్పుడే ప్రారంభమగునని అతడనుకోను. గోధుమ గింజ సిద్దమయినదనుకొనెను. అది చనిపోయి భూమిలో క్రుళ్ళిపోయినప్పుడే తిరిగి జన్మించును, నిజమగు వధువు తయారగును. ఆయన తన గోధుమలను కొట్టులో కూర్చును. పొట్టును ఆయన అగ్నితో కాల్చివేయును." ఆ కాలములోని ఆయన దూతను గమనించండి, ఆయన చెప్పినవి జరుగును.

73మీరు నిద్రించుట లేదనుకొనుచున్నాను. గింజ ఇక్కడున్నది! అది కొట్టులో సమకూర్చబడును. అది వధువు, అందులో భాగము. కాని పొట్టుకు ఏమి జరుగునని ఆయన చెప్పెను? ఆరని అగ్నితో అది కాల్చబడును. దొరుకు సమయములోనే రక్షణను వెదకుడి. పొట్టుగా కాదు, గింజగా యుండండి, చూచారా. జీవములోనికి వెళ్ళండి, చచ్చిన పాత ఆచారము కాదు. క్రీస్తు జీవములోనికి వెళ్ళండి, వాక్యము బయలుపరచబడినది. ఇది సమకూర్చు సమయము. మీరు గింజలలోనికి చేరండి, ఎందుకనగా పొట్టు విడిచి పెట్టబడును.

MATT 11:4-9•

LUKE 7:22-26

 

74మత్తయి 11లోని దానిని వినండి. యోహానుకు ఆయన ఏదో గ్రంథమును పంపలేదు. అతడు చెరసాలలోనున్న విశ్వాసి. జరుగుచున్న దానిని చూడమని చెప్పెను. "వెళ్ళి జరుగుచున్న వాటిని యోహానుకు చెప్పండి, కుంటివారు నడచుచున్నారు, గ్రుడ్డివారు చూచుచున్నారు, మృతులు లేచుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది ప్రవక్త చెప్పినదే జరుగుచున్నది. నా గూర్చి అభ్యంతరపడనివాడు ధన్యుడని ఆయన చెప్పెను."

ఆతని శిష్యులు కొండ దిగుచుండిరి, ఆయన వారిని చూచి ఇట్లనెను, "మీరేమి చూడవెళ్ళితిరి? చక్కని వస్త్రములను ధరించిన వానిని చూడ వెళ్ళితిరా? అట్టివారు రాజగృహములలో యుందురు. వారు చిన్న పిల్లలను ముద్దాడుదురు, మృతులను పాతి పెట్టుదురు; రెండంచులు ఖడ్గమునెట్లు వాడవలెనో వారికి తెలియదు. చూచారా, మీరేమి చూడ వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? ఇక్కడికి వచ్చినచో ఎక్కువ డబ్బు ఇచ్చెదమని వారనుచున్నారు. (ఇక నేను మెతడిస్టును కాను, పెంతెకోస్తును, లేదా మరేదో అని చెప్పుకొనుచున్నారు.) గాలికి కదలుచున్న రెల్లును మీరు చూడజాలరు. ప్రవక్తను చూడవెళ్ళితిరా? ప్రవక్తకంటే గొప్పవాడిచ్చట యున్నాడు."

MAL 3:1•

MAL 4:5•

MATT 11:3,7,11•

MATT 17:10,12•

LUKE 7:19,24,28•

REV 11:3

 

75యోహాను తాను చెల్లించగలిగిన దానిని యేసుకు చెల్లించెను. ఆయనను పరిచయము చేసెను. ఆయన మీద గురుతును చూచెను. ''ఈయనే మెస్సీయా'' అని చెప్పెను. ఆ తరువాత ఆయనను నీవేనా లేక మరొకని కొరకు చూడవలెనా?" అని అడిగెను.

దానిని యేసు ఎరిగి యేసు ఇట్లడిగెను, "గాలికి కదలుచున్న రెల్లును మీరు చూడ వెళ్ళితిరా?" ఈ రోజు వరకు స్త్రీలకు పుట్టిన వారిలో యోహానంత గొప్పవాడు ఎవరూ లేరు." అది నిజము. ఒక మానవుని గూర్చి ఆయన ఎంత గొప్పగా చెప్పెనో చూడండి!

ముందుగా దూత పంపబడునని మలాకీ 3లో, 4 కాదు, చెప్పబడిన ప్రవచనము వారి కళ్ళముందే నెరవేరినది.

మలాకీ 3లో బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి యేసు చెప్పెను. వారాయను ప్రశ్నించిరి.

"అతడు ఎప్పుడో వచ్చెను. వారతనికి చేయవలసినది చేసిరి.''

గుర్తుంచుకొనండి, మలాకీ 4, ఏలియా నాలుగుసార్లు వచ్చును. అయిదవసారి ప్రకటన 2లో శేషించిన యూదుల కొరకు సాక్షిగా వచ్చును. దేవుడు ఒకే ఆత్మను అయిదుసార్లు వాడుకొనెను. అది కృప. యేసుకు సాదృశ్యము. విశ్వాసమునకు గురుతు. కృపకు అయిదు సంఖ్య సూచనగా యున్నది. దానిని ఆయన వాడెను. రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు - అయిదుసార్లు వాడుకొనెను.

MAL 4:1•

MATT 11:10•

LUKE 7:27•

LUKE 17:28-30

 

76మనము ముగించుకొనుచుండగా త్వరగా వినండి. "నాకు ముందుగా నా దూతను పంపుదునని ఇతని గూర్చియే చెప్పబడెను," అని ఆయన పలికెను.

మలాకీ 4లో ఆ ప్రవక్త ప్రవచించిన వెంటనే భూమి యావత్తు కాలిపోవును. దుర్మార్గుల ధూళిమీద నీతిమంతుల నడిచిపోవుదురు, చూచారా. నిశ్చయంగా! అది మలాకీ 4 ప్రవచనము.

లూకా 17లో ఆయన చెప్పినది గమనించండి, "చివరి దినములలో సొదొమ గొమొర్రా స్థితి యుండును.'' మనము చూచామా? తిరిగి సొదొమ, గొమొర్రా స్థితి వచ్చినదా? దేశములన్నియూ దానిని చూచుచున్నవి. ఇంగ్లాండు గూర్చి చెప్పబడినది వినండి, అంతా అక్రమమే. ఆహారము కూడా అక్రమంగా మారినది. గత నెల రీడర్స్ డైజస్టు చదివారా? ఇరవై మరియు ఇరవై-అయిదేళ్ళ మధ్యలోనే బాల బాలికలు నడివయస్కులుగా మారుచున్నారు. కూటములో వారిని కలిసికొన్నాను, చిన్న పిల్లలే రుతుస్రావము కలిగియున్నారు. ఇరవై-రెండేళ్ళకే ముసలివారగుచున్నారు. ఏమి జరిగినది? వంకర తనము, సంకరము, శరీరమంతా చెడిపోయినది. మనము ఒక సంకరజాతి మొక్కవలె యున్నాము.

77మీరు ఒక సంకర జాతి మొక్కను చూడండి, దానికి చీడ పట్టును. కాని అసలయిన మొక్కకు పురుగు పట్టదు. దానిని అంటుకో జాలదు. ఈనాడు సంఘము సంకరజాతి మొక్కవలె యున్నది.

పెర్రీ గ్రీన్ యొక్క ముసలి గుర్రమును చూడండి (ఒకనాడు అబ్బాయిని క్రింద పడవేసినది): చూచారా? అది కంచర గాడిద. దానికి తన తల్లిదండ్రులెవరో తెలియదు. సగం గాడిద, సగం గుర్రము; అదేమైయున్నదో దానికే తెలియదు. ఎప్పుడూ అది నిన్ను తన్నుటకే చూచును. అది నిజము! నీవెంత దానిని గారాబంగా పిలిచినా గాని అది సకిలించుట తప్ప మరేమీ చేయదు. చూచారా?

78"అద్భుతాలు జరుగు రోజులు గతించాయి," అని చెప్పి కొందరు గాడిద వలె సకిలించుచున్నారు. ఈ సంకరపు జాతి వారు సంఘ సభ్యులుగా, క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. నేను హాస్యమునకు ఇది చెప్పుట లేదు; ఇది సత్యము. కాని సోదరుడా, నిజమగు అసలైన బీజమునకు పుట్టినవానికి, వాని తండ్రి ఎవరో తెలియును, తన తల్లి ఎవరో తెలియును, తన తాత ఎవరో తెలియును, తన మామ్మ ఎవరో తెలియును; నీవు వానికి ఏదైనా నేర్పించగలవు, అతడు సున్నితమైనవాడు.

పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, దేవుని వాక్యము మరియు శక్తితో నింపబడిన ఒక నిజమగు క్రైస్తవుడు తన తండ్రిని, తల్లిని, తాతను, మామ్మను ఎరుగును. అంతా అతనికి తెలియును. దేనినయినా అతనికి నీవు నేర్పించగలవు.

కాని సంఘములు సంకర జాతిగా యున్నది. లోకము, మత సంస్థలకు కలిపి పుట్టినవి. చిన్న వాక్యమును ఇక్కడ, చిన్న వాక్యమును అక్కడ కలుపుకొనుచున్నారు. మోసము చేయుటకు అది చాలును. నిజమగు దేవుని వాక్యము బయలుపరచబడుట వారు చూచియు, కయపవలె దానికి దూరముగా తొలగిపోవుచున్నారు; వారికి తెలియదు. సంకరజాతి!

ISA 40:3•

MATT 3:7,9,10•

LUKE 3:7-9

 

79యెషయా 40:3 కూడా యోహానును బయలుపరచెను. అరణ్యములో కేకవేయు ఒక శబ్దము ఆ ప్రవక్తయే, "ప్రభువు మార్గము సిద్దపరచుడి, ఆయన త్రోవ సరాళము చేయుడి." ఆతనిని సంఘము నమ్మలేదు, ఎందుకనగా అతడు వారి గుంపువాడు కాడు. ఆ ప్రవక్త అరణ్యములో లేచెను. ఎవరికీ తెలియకుండా వచ్చెను. ఏలియా యొక్క ఆత్మ అతని మీద ఉండెను: అతడు అరణ్యములో ఎదిగిన వ్యక్తి, దుర్నీతి స్త్రీలను అతడు అసహ్యించుకొనెను.

గుర్తుంచుకోండి ఎలాగు ఏలియా… యెజెబెలు అతనిని చంప గోరినది కదా? అతనిని అరణ్యములోనికి తరిమినది.

బాప్తిస్మమిచ్చు యోహాను కూడా అరణ్యమును ప్రేమించెను. వేటగానిగా, అడవి మనిషిగా ఉండెను. అతనిని గమనించండి. అతనికి చదువు లేదు. అతని బోధ వేదాంత విద్యగలవానివలె లేదు. ''ఓ, సర్పసంతానమా!" అని అరచేను. అరణ్యములో పాము కంటే దుష్ట జంతువు మరొకటి ఉండదు. ఆతడు ఆ యాజకులను, "సర్పసంతానమా!" రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ది చెప్పినవాడెవడు? మేము ఫలాని దానికి చెందియున్నామని చెప్పవద్దు, ఎందుకనగా దేవుడు రాళ్ళ ద్వారా తనకు పిల్లలను పుట్టించుకొనగలడు. [అతడు వాడిన పదము చూడండి], గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి, అగ్నిలో వేయబడును," అని సంబోధించెను. ఆమేన్.

MAL 3:1

 

80అతడు ప్రకృతి బోధకుడు. గొప్ప దైవజనుడు. కొద్దికాలమే జీవించెను, కాని నిశ్చయంగా భూమిని మండించెను. తన ఆరు నెలల సేవలో ఆ తరమునకు సంచలనము కలిగించెను. ఆరు నెలల సేవకొరకు దేవుడు ముప్పదేండ్లు అతనిని పెంచెను. దేవునికి స్వంత విదానమున్నది; తన కోత ఏమిటో తనకు తెలియును.

జరిగినదేమిటో మనకు ఖచ్చితంగా తెలియును. వారతనిని నమ్మలేదు, ఎందుకనగా అతడు వారివాడు కాడు. వారు ఎప్పటివలెనే చూడలేకపోయిరి. మలాకీ 3లోని దేవుని మాటను వారు నమ్మలేదు. ఆ వర్తమానికుడు ఇతడేనని అక్షరాలా వారు చూచియుండేవారు. నాలుగువందల సంవత్సరాలపాటు వారికి ప్రవక్తలేడు, అకస్మాత్తుగా రంగము మీద ఒకడు లేచెను. చూచారా? ప్రజలు, విశ్వాసులు, అతడే అని నమ్మిరి. చూచారా, కాని వారు దానిని నమ్ములేదు. ఆ ప్రవక్త యొద్దకే వాక్యమైయున్న యేసు వచ్చి బాప్తిస్మము పొందెను. వారందరూ దానిని నిలబడి చూచిరి.

MATT 3:14,15

 

81ఆ సంగతి గూర్చి చాలామంది వాదించుదురు. ''నేను నీ వలన బాప్తిస్మము పొందనైయుండగా, నీవేల నా యొద్దకు వచ్చితివి?" అని యోహాను అడిగెను.

''ఇప్పటికిలాగు కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు జరుగవలసి యున్నది. యోహానూ, ప్రవక్తవగు నీవు అర్పించబడు ముందుగా బలి కడుగబడవలెనని ఎరుగవా? నేనే ఆ బలిని, నీవు ప్రవక్తపు గనుక ఎరుగుదువు," అని యేసు చెప్పెను. అంతట ఆయనకు బాప్తిస్మమిచ్చెను, చూచారా. అది అతనికి తెలియును.

82చూడండి, వారతనిని చూచి నవ్విరి. విద్య లేని మొరటు మనిషి అని వారు పిలిచారు. యేసు మొదటి రాకను చాటించిన వాడతడే.

నేడు మనకు కూడా అసలయిన దానిని అనుకరించువారు చాలా మంది యున్నారు. నిశ్చయంగా వారనుకరించుదురు. అయితే గుర్తుంచుకొనండి, నిజమగు డాలరు లేకుండా నకిలీ డాలరు పుట్టదు. ఒకడు క్రైస్తవునిగా నటించుచున్నాడనగా నిజమైన క్రైస్తవుడు ఎక్కడో ఉన్నాడని అర్ధము. అసలయినది ఉన్నపుడే నకిలీది వచ్చును. మొదటి దానిని పరీక్షించండి, మొదటిది వాగ్దాన ప్రకారముగా ఉన్నదో లేదో చూడండి. ఉన్నయెడల దానిని నమ్మండి: అదియే ఆ కాలపు వాగ్దానము.

యోహాను యొక్క ప్రవచనము దేవుని క్రమములో బయలుపరచబడినది. వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చెను, ఆ వ్యక్తిగా బయలుపరచబడెను.

83వారు ఆ లేఖనమును అర్ధము చేసికొనినట్లుగా ఆయన రాలేదు. ఆ రీతిగా వారు అర్ధము చేసికొనలేదు. (ఇప్పుడు మనము చివరకు వచ్చుచున్నాము) ప్రవక్త వాక్యప్రకారము అక్షరాలా అది నెరవేరినది; కాని అది వారు తలంచినట్లుగా జరుగలేదు. ఏది సత్యమో లేక ఏది అసత్యమో వారు గ్రహించగలరా? దానికి దేవుడే అర్దము చెప్పుచున్నాడు. అబద్ద యేసులు లేచిరి, నాలుగు వందల మంది అరణ్యములో పెరిగిరి; కాని వాక్యమెన్నడూ వారిద్వారా ఋజువు కాలేదు.

LUKE 17:30

 

84యేసు ప్రవక్తగా వచ్చెను. యేసు తిరిగి వచ్చు ముందు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ వ్యక్తిత్వము శరీరమందు ప్రత్యక్షమగును. దాని గూర్చి ఆలోచించండి. యేసు చెప్పెను, ''సొదొమలో ఉండినట్లుగానే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండును." ఏమి బయలుపరచబడినది? రహస్యము వెల్లడయినది. మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున ఈ లోకము సొదొమ స్థితిలో యుండును. ఆలాగున్నది కదా? ఎందరు దీనిని నమ్ముతున్నారు? ఇది సొదొమ స్థితిలో యున్నది. ఇది అక్షరాలా నిజము. ఇదేట్టి స్థితిలో ఉన్నదో చూడండి.

గుర్తుంచుకొనండి, ప్రతిచోట మూడు రకముల జనులుందురు. అవిశ్వాసులు, విశ్వాసులు, మరియు వేషధారులు. ప్రతి గుంపులోను వారుందురు. ప్రతికాలములోను వారుందురు. సొదొమవారు, లోతువారు, మరియు అబ్రాహాము.

GEN 18:3

 

85అబ్రహామనగా బయటకు పిలువబడిన గుంపు; సొదోమలో అతడు లేడు. వారి వర్తమానము గమనించండి! చాలా సంవత్సరముల నుండి వారు వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుచున్నారు. అబ్రాహాముకు దేవుడెన్నో గొప్ప సూచక క్రియలు, అద్భుతములు చూపించెను, కాని ఇప్పుడు దేవుడే మానవునిగా దిగి వచ్చెను.

''అది ఒక దేవదూత'' అని మీరందురు.

అబ్రాహాము ఆయనను "ప్రభువా!" అని పిలచెను. పెద్దక్షరములలో వ్రాయబడినది. అది 'ఎలోహిం' అని బైబిలు చదువువారికి తెలియును. "ప్రభువగు దేవుడు, ఎలోహిం,'' అని ఆయనను అబ్రాహాము పిలచెను. ఆయన సర్వమునకు చాలినవాడు.

GEN 18:22•

GAL 3:29

 

86సొదొమలోనికి వర్తమానమును తీసికొని ఇద్దరు వెళ్ళిరి. సొదొమ వారికి వారు బోధించిరి. వారేమీ చేయలేదు, కాని వారిని గ్రుడ్డివారినిగా చేసిరి. సువార్త ప్రకటన అవిశ్వాసికి గ్రుడ్డితనము కలుగజేయును.

అబ్రాహాము గుంపు ఎట్ట విధమగు గురుతు పొందెనో చూడండి.

మనము అబ్రాహాము యొక్క రాజసంతానమై యున్నాము. ఇస్సాకు ప్రకృతి సంబంధమగు సంతానము. వాగ్దానము చేయబడిన వాక్యమందు విశ్వాసముంచిన వారు రాజసంతానము (దీనిని మరువవద్దు); అబ్రాహాము సంతానము: అబ్రాహాము యొక్క విశ్వాసము. "క్రీస్తునందు మృతి పొందిన మనము అబ్రాహాము యొక్క సంతానమై యున్నాము. వాగ్దాన ప్రకారము ఆయనతో వారసులము.

అదంతయూ జరుగుచుండగా సొదొమలోనికి ఇద్దరు సేవకులు వెళ్ళి, గొప్ప వర్తమానము బోధించిరి.

GEN 17:15•

GEN 18:8-12

 

87ఆ గుంపువలె బుద్దిహీనులు కాని అబ్రాహాము గుంపువారు ఒకరున్నారు. అబ్రాహాము గుంపులో నిలచియున్నవాడు వారికి ఏ విధమగు గురుతు ఇచ్చెనో చూడండి. దానికి కొద్ది రోజుల ముందు అతని పేరు అబ్రాము. ఆమె పేరు శారయి; శారా, కాదు (రాజకుమారి). ఆయన గుడారమువైపు వీపు త్రిప్పి యుండెను.

ఆనాటి స్త్రీలు ఈనాటి స్త్రీల వలె లేరు. వారు తమ భర్తకు అన్ని పనులు చేయుచూ గుడారములోనే ఉండెడివారు.

ఆ దేవదూతలు అచ్చట కూర్చొని యుండిరి. "అబ్రహామా, నీ భార్యయగు శారా ఎచ్చట?" అని ఆ దూత ప్రశ్నించెను. (శారా) అది ఆ దూతకేలాగు తెలియును?

"ఆమె నీ వెనుక గుడారములో యున్నది," అనెను.

''నేను నీకు వాగ్దానము చేసినట్లుగా దర్శించబోవుచున్నాను. నిన్ను నేను దర్శించెదను." ఆ మాట విని శారా నవ్వుకొనెను.

GEN 18:13•

LUKE 17:28-30

 

88గుడారము వెనుక నిలబడిన అతడు, "శారా ఎందుకు నవ్వినది ? ఇదెట్లు జరుగునని తలంచియే కాదు?" అనడిగెను. ఆ సమయములో ఆమె అబ్రాహాము యొక్క భార్యగా లేనియెడల దేవుడు చంపియుండును. ఈనాడు అవిశ్వాసముతో యున్న మనము క్రీస్తులో లేనియెడల, ఆలాగే అగుదుము. శారాను ఏదయినా చేసినచో అబ్రాహాము బాధపడును. అందుకే ఆయనేమీ చేయలేదు, చూచారా.

యేసు చెప్పినది గుర్తుచేసికొనండి, "సొదొమ దినములలో ఉండినట్లే మనుష్యకుమారుని రాకడలోను ఉండును.'' లోకము సొదొమ స్థితిలో యున్నట్లు అందరూ అంగీకరించుచున్నారు. కొద్దికాలం క్రిందట లాస్-ఏంజలస్ పత్రికలో ఈలాగు చదివాను. ''లాస్-ఏంజలస్ లో పురుషసంయోగులు ఇరవై లేదా ముప్పయి శాతము ప్రతి ఏడాది పెరుగుచున్నారు. ఓ, అది భయంకరము! మన ప్రభుత్వము, సంఘము, అన్నియూ వంకరతనములో నిండియున్నవి. అది నిజము. ఇది వంకర కాలము.

89వేదాంతజ్ఞులగు నా సోదరులను నేను అడుగుచున్నాను. నా ప్రియ సోదరులారా, మీకు వ్యతిరేకముగా నేను మాట్లాడుట లేదు. మీకు సహాయము చేయుటకే ఇచ్చటున్నాను. దేవుని వాక్యము చెప్పినదాని మీద నిలబడుటకే నేను ఇచ్చటున్నాను. దీనంతటిలో నుండి జనులను నేను చేయి పట్టుకొని బయటకు తెచ్చుచున్నాను. ఇది నిజము.

ఇటు చూడండి, "హాం" అను చివర పేరు గల వర్తమానికుడు సొదొమలో మందెన్నడూ లేదు. స్పర్జన్, వెస్లీ, లూథర్ మొదలగు వారున్నారు. కాని "హాం" అను పేరు గల అంతర్జాతీయ వర్తమానికు ఎన్నడూ రాలేదు. బిల్లీ గ్రాహం. పేరు పొందిన సువార్తకుడు. గొప్ప దేవుని పనివాడు. దేవునిచేత పంపబడినవాడు. నీతీకరణముతో అతడు దేశమును కదిలించుచున్నాడు.

పెంతెకోస్తు శాఖకు ఓరల్ రాబర్ట్స్ ను చూడండి. ఎన్నడైనా అటువంటి వారున్నారా?

గ్రాహం అను ఆంగ్ల పేరులో ఆరు అక్షరములున్నవి. అబ్రహాం అను ఆంగ్ల పేరులో ఏడు అక్షరములున్నవి.

ఇప్పుడు వర్తమానికులను చూడండి. మనము ఏ కాలములో ఉన్నామో చూడండి. చరిత్రలో ఇట్టి కాలమెన్నడూ రాలేదు. ప్రతి గుంపుకు ఆయన ఇచ్చుచునని వాగ్దానము చేసిన గురుతులను చూడండి. వారెక్కడున్నారో చూడండి. వారు చక్కగా క్రమంలోనే కూర్చొనియున్నారు. ప్రకృతి, ప్రపంచము ఈ కాలములో ఉండవలసిన రీతిగానే యున్నవి.

90దీనిని తప్పిపోక వినండి, త్వరగా చెప్పుదును. చాలా ఆలస్యమైనది. ఇటు చూడండి. ప్రవక్త చెప్పిన ప్రకారము, వాక్యము చెప్పిన ప్రకారము. సమయ ప్రకారము ఆతడు వచ్చెను.

మనము ఏ కాలములో జీవించుచున్నామో చూడండి. సరిగ్గా సొదొమ కాలములో మనము జీవించుట లేదా? అబ్రాహాము గుంపు యొక్క వర్తమానికుని చూడండి. ఆతని పేరు యొక్క సంఖ్యను. అక్షరములను చూడండి. "పేరులో ఏమీ లేదు'' అని మీరందురు. ఆ విధంగా ఎవరూ చెప్పవద్దు. అబ్రాము పేరును అబ్రాహాముగాను, శారయి పేరును శారాగాను ఆయన ఎందుకు మార్చెను? సీమోనును పేతురుగా ఆయనెందుకు మార్చెను? చూచారా? అక్కడే ఉన్నది. ఖచ్చితముగా!

91అందుకే ఎన్నడూ మీ పిల్లలను "రికీ," "ఎల్విస్" అని పిలువకూడదంటాను. ఎల్విన్ అనగా "పిల్లి.'' రికీ అనగా ''ఎలుక.'' మీ పిల్లలను ఆలాగు పిలువరాదు. జనులారా, ఆలాటి పేర్లను వెంటనే మార్చండి. మీరు నన్ను దైవసేవకునిగా నమ్ముచున్నయెడల, పిల్లలకు ఆ పేర్లు పెట్టవద్దు, చూచారా. లేదండి, వారికి వేరే పేర్లు పెట్టండి. మై! నా అంశము వేరు, కాని అది చెప్పుట జరిగిగెను మరియు అంతే. అలాగే జరుగును, కొన్ని అనుకోకుండానే చెప్పుట జరుగును, చూచారా.

ISA 9:6•

MATT 12:24•

MARK 3:22•

LUKE 11:15•

JOHN 1:1,14•

JOHN 10:33

 

92ఆయనను వారు "జాతకము చూచువాడు, దయ్యము, బయల్జెబూబు," అని పిలచారు. "తనను తాను దేవునిగా చేసుకొనుచున్నాడు," అనిరి.

యెషయా ప్రవక్త చెప్పలేదా? బలవంతుడగు దేవుడని పిలువబడును. యెషయా 9:6. "ఏలయనగా తునకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆలోచన కర్త, సమాదానాధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి," అని ఆయనకు పేరు పెట్టబడును. యోహాను 1:1, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెను." దానిని మీరు నమ్ముచున్నారా? ఆయన ఒక ప్రవక్త, కాని ఆయన ఒక ప్రవక్త కంటే గొప్పవాడు; ఆయన దైవ ప్రవక్త. ఆయనెందుకు రావలసిన వచ్చెను?

93ఆయన ముగ్గురు కుమారుల నామములో వచ్చెను. మొదటగా ఆయన మనుష్య కుమారుడు. ''దేవుని కుమారుడుగా" పిలచుకొనలేదు. మీరెరుగుదురు. మనుష్యకుమారునిగా ఆయన వచ్చెను, ఒక ప్రవక్త, ఆయనే తండ్రి, ఆయనే యెహోవా. "మనుష్యకుమారుడు" అని యిర్మియా పిలచెను;. ప్రవక్త అనగా మనుష్య కుమారుడు.

పెంతెకోస్తు దినమున ఆయన పరిశుద్ధాత్మ ఆకారములో వచ్చెను. సహజాతీతమగు ఆత్మ. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు.

వెయ్యేండ్ల పాలనలో ఆయన దావీదు కుమారునిగా యుండును. దావీదు సింహాసనము మీద కూర్చొనును. ఆయన దేవుని కుమారుడు, మనుష్యకుమారుడు, దావీదు కుమారుడు.

94బైబిలు నిండా ఇట్టి మచ్చుతునకలున్నవి. ఒక రాత్రిలో అవన్నీ చెప్పుకోలేము. కాని ఇప్పుడు సందర్భానుసారముగా చెప్పుకొంటిమి. రేపు అనునది లేకపోవచ్చు. రేపు రాకముందే మనము చనిపోవచ్చు. రేపు ఉదయము చనిపోవు వ్యక్తికే ఈ రాత్రి నేను బోధించుచుండవచ్చును. ఉదయము రాకముందే నేను పోవచ్చును. సోదరీ, సోదరుడా, ఇది కట్టుకథ కాదు; పూర్తి నిజము! ఏ సమయములో పోదుమో మనకు తెలియదు, నీ శరీరమును ఆ తుది శ్వాస విడిచిన తరువాత, ఇక నీకు ఎట్టి తరుణము ఉండదు. ఇపుడే సిద్దపడుము, రేపు ఉదయమునకు ఆలస్యము కావచ్చు.

REV 3:17

 

95ఆయనకు వారేమి చేయుదురని ప్రవక్తలు చెప్పిరో సరిగ్గా వారదే చేసిరి. ఈ లవొదకయ సంఘ దినము వరకు వారు ఆలాగే చేయుచున్నారు. దానిని మీరు చూడగోరినచో, ప్రకటన 3 చూడండి, "గ్రుడ్డివారు, దిగంబరులు, కాని దానినెరుగరు." భూమిలోనికి వెళ్ళిన ఆయనే తిరిగి వధువుగా ఉండుటకు వచ్చును. తిరిగి ఆయన విత్తన రూపములో ప్రత్యక్షమవనారంభించుచున్నాడు; కేవలము పెండ్లి కుమారుడు మరియు వధువు, ఒకే రక్తమాంసములు, ఒకే సేవ, అవే కార్యములు, ఆయన చేసినటువంటి క్రియలు చేయుచు; ఆత్మ.

వారు అనుకరణలు చేయుచున్నారు మరియు సమస్తము చేయుచున్నారు, మరియు ప్రతివారు తన పుస్తకమును కలిగియుండి మరియు పరుగిడుచున్నారు. ఓ, అటువంటి ఉద్రేకముల గురించి నీవెన్నాడు వినలేదు. "మరియు నేను దయ్యమును వాసన చూచుచున్నామని" చెప్పుచున్నారు. ఎంత వాక్యరహితమది!

MATT 15:14•

HEB 13:8

 

96అసలయినది వారి ముందే యున్నది, కాని వారది చూడకుండా పోవుచున్నారు. "వారు మా సంస్థకు చెందినవారు కాదు'' అని అందురు. గ్రుడ్డివారు, గ్రుడ్డివారికి త్రోవ చూపుచున్నారు. అందరూ కలిసి గుంటలో పడుదురు. మానవుల ఆచారములు, శాఖల ద్వారా గ్రుడ్డివారయిరి. దేవుడు వారేమి చేయుదురని చెప్పెనో, ఆలాగే వారాయనను తమ సంఘమునకు వెలుపల ఉంచియున్నారు. ప్రకటన 3 చూడండి; ప్రవచించినట్లే జరిగినది.

యేసు తరచుగా తన శిష్యులకు తన్ను తెలియపరచుకొనెను. ఇద్దరు శిష్యులున్నారు, క్లెయొపా, అతని స్నేహితుడు. ఇప్పుడు, మొదటి పునరుత్థానము అయిపోయిన తరువాత ఉదయము; ఎంత చక్కని ఉదయము, యేసు మృతులలో నుండి లేచి తన జనులమధ్య జీవించుచున్నాడు. ఎంత గొప్ప సంగతి!

ఆయన ఆ దినము ఉన్నట్లే, ఈ దినమున ఉన్నాడు, ఎందుకనగా నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఏ కాలములోను లేనంతగా నేడు ఏకరీతిగా యున్నాడు. ఏ కాలములోను లేనంతగా, నేడు ఆయన తన్ను తాను బయలుపరచుకొనుచున్నాడు. గింజ, కాండము, పొట్టు, (అంతా గతించెను), మనము మరల గింజలో ఉన్నాము. చూడండి, తిరిగి మనము గింజగా వచ్చి యున్నాము.

LUKE 24:25

 

97ఆయన తన జనులకు ఎట్లు తన్ను తెలియపరచుకొనెనో చూడండి. ఆ కాలమునకు వాగ్దానము చేయబడిన వాక్కు మెస్సీయా ఆయనే. (ముగించుచున్నాను) ప్రవక్తలో చెప్పినట్లుగానే ఆయన వారికి ప్రత్యక్షమాయెను. "ఆయన గూర్చి వ్రాయబడిన లేఖనములన్నియూ నెరవేరునని ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని అవివేకులారా, మందమతులారా," అని పిలచుట, చూడండి.

ఆయనను చూడండి! దేవుని వాక్యమునే ఆయన మరల ఎత్తి చూపుతున్నాడు. "మీరు నన్నెరుగరా? నేను మెస్సీయాను, పునరుత్థానము పొందాను,'' అని ఆయన వెంటనే చెప్పుకోలేదు. వారికి - ఆయన లేఖనము ఇచ్చెను; యోహాను తదితరులు ఆలాగే చేసిరి, చూచారా. వారు దానిని గ్రహించవలెను. వారికి వారే తీర్పు తీర్చుకోవలెను. ఇప్పుడు, నిద్రించవద్దు, నీకునీవే తీర్పు తీర్చుకో.

''అవివేకులారా, ప్రవక్తలు చెప్పినవన్నియూ నెరవేరునని నమ్మని మందమతులారా!" ఆయనను ఎరుగుదుమని చెప్పుకొనిన వారికి ఎట్టి గద్దింపు, చూచారా.

LUKE 24:25

 

98ఆయన అంశము నెట్లు సమీపించెనో చూడండి. వెంటనే ఆయన చెప్పలేదు, "ఈ కాలమునకు నేనే మెస్సీయానని మీరెరుగరా? నేనే ఆయననని మీరెరుగరా?" అనలేదు. నిజమగు దేవుని దాసుడు ఎన్నడూ ఆ విధంగా చెప్పుకొనడు; అతనెవరో లేఖనమే గుర్తించును. నిశ్చయంగా! ప్రవక్తలు చెప్పిన దానివైపు వారి దృష్టిని మళ్ళించెను. మెస్సీయా కాలమును చూడమని చెప్పెను. వెనక్కు వెళ్ళండి: ''మెస్సీయా గూర్చి ప్రవక్తలు చెప్పినవన్నియూ నెరవేరునని నమ్మని అవివేకులారా, మందమతులారా!" అనెను.

బైబిలు యొక్క వాక్యమే యోహానును గుర్తించెను. అది కావలసినంత తేటగా కనబడెను. వాక్యమే ఆయనను గుర్తించినందున తేటగా యున్నది. ఆ వాగ్దానము కొరకే వారు చూచుచుండిరి. ఆ సమయములో రంగము మీదికి ఒకరు రావలసియున్నారు, అది వారెరుగుదురు.

ఈ దినమున ఏమి జరుగవలసియున్నదని వాక్యము చూపించుచున్నదో చూడండి.

EXOD 20:19•

DEUT 18:15•

JOHN 5:39

 

99ఈ రాత్రి ప్రతి మాట ద్వారా నేను దానినే చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. పేర్లు, సంఖ్యలు, సూచనలు, కాలములు చూడండి. మనము అంత్యకాలములో లేమా? నేను మాట్లాడుతున్న దానిని గూర్చి నిశ్చయంగా మీరు చూడగలరు, చూచారా. అది చాలా తేటగా యున్నది. దానికి ఏ గుర్తింపు అవసరము లేదు. ఆయన ఈ భూమిమీద ఉండగా చెప్పినది వినండి, "ఓ లేఖనములను పరిశోధించుడి. వాటిలో నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేనెవరినో చూపించుచున్నవి."

గమనించండి, ప్రవక్తయగు మోషేతో ఆయన ప్రారంభించేను. ద్వితీయోపదేశకాండము 18:15. ఇక్కడ లేఖనమును గమనించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 18:15, "నా దేవుడైన యెహోవా…"

చూచారా, కొండ శిఖరము మీద దేవుడతనితో మాట్లాడెను. మెరుపులు, ఉరుములు కనబడెను; "దేవుడు మాట్లాడినచో మేము నశించెదము. మోషే మాట్లాడితే చాలును," అనిరి.

"ఇకమీదట ఈ విధంగా వారితో నేను మాట్లాడను. వారి కొరకు ఒక ప్రవక్తను లేపెదను,'' అని చెప్పెను. ఎప్పుడూ అదే ఆయన వర్తమానము. అంతటిని సమాప్తము చేయునది అదే, ఎందుకనగా యెహోవా వాక్కు ప్రవక్త యొద్దకు వచ్చును. వారి యొద్దకు మాత్రమే వచ్చును. ఆలాగు కానియెడల దేవుని వాక్యము తప్పు అగును, చూచారా. ఎన్నడు సెమినరీ లోనికి రాదు; ప్రవక్త యొద్దకే వచ్చును! ప్రవక్త దేవునిచే అభిషేకించబడి పంపబడును. మానవుడు చెప్పినది కాదు.

100మనము ఏలియాలు, దుప్పట్లు, వివిధములగు బుద్ధిహీనతలు నేడు ఈ సంస్థల నుండి బయలు వెళ్ళుట చూచుచున్నాము.

కాని ఈ భూమి మీదికి ఒక నిజమగు దైవదాసుడు వచ్చునని దేవుడు వాగ్దానము చేసెను. దేవునివలన గుర్తింపబడును (ఆతని మాటయే ఈ దినపు జవాబు), అది వధువును క్రమపరచును (చిన్న గుంపు) మరియు పైకి కొనిపోవును. అది నిజము! "ఇదిగో! నేను మాట్లాడినవాడు వచ్చుచున్నాడు," అని ఆయన పరిచయము చేయును.

ఈ కాలములో ఆయనను గూర్చి ప్రవక్తలు చెప్పినది అదే. ఆయన మాట వినుట చాలా ఆసక్తికరముగా ఉండును. ఆయన మాట వినవలెనను కోరిక మీకు లేదా? తనను గూర్చి ప్రవక్తలేమి చెప్పిరో, ఆయనే స్వయంగా వాక్యమును ఎత్తిచూపి చెప్పెను, (ఆయనే వాక్యము).

GEN 22:3•

PS 16:10•

PS 22:1,7,8,16-18•

PS 35:11•

PS 41:9•

ISA 7:14•

ISA 9:6•

ISA 35:7•

ISA 50:6•

ISA 53:9,12•

ZECH 11:12•

ZECH 13:7•

MAL 3:1

 

101ఇప్పుడు ఆయన ఎత్తి చూపిన మాటలను చూద్దాం. ఆయన వారితో చెప్పిన మాటలు మీరు వినగోరుటలేదా? ముగింపులో వారి సంభాషణను చూద్దాం.

ఆ మధ్యనే జరిగిన సిలువ సంగతులను వారు చెప్పుకొనిరి. సమాధి యొద్ద ఆయనను స్త్రీలు చూచిన గాధను వివరించిరి. మరొకరు ఆయనను చూచిరి. అది క్లుప్తంగా వారు ఆయనతో చెప్పిరి. ఆయన వాక్యము ఎత్తి చూపుచునే వెళ్ళుచుండెను.

జెకర్యా 12 చూడండి.'' (జెకర్యా 11:12 ఆయన చెప్పి యుండును.) "ముప్పది వెండి నాణెములకు ఆయన అమ్మబడెను. మెస్సీయా ముప్పది వెండి నాణెములకు అమ్మబడునని చెప్పబడలేదా?"

"ఆయన స్నేహితులే ఆయనను అప్పగించెదరని, కీర్తన 41:9 లో లేదా?" చూచారా.

''జెకర్యా 13:7 లో ఆయన శిష్యులే విడిచి పెట్టెదరని చెప్పలేదా?"

"అబద్ద సాక్ష్యములు పలుకుదురని కీర్తన 35:11లో లేదా?"

ఆయన నేరారోపణ చేయు వారి యెదుట నోరు తెరువలేదు. మూగవానివలె ఉండెనని యెషయా 35:7 లో చెప్పలేదా?" (అయ్యా, మంచిది.)

''కొట్టువారికి నా వీపును అప్పగించితినినని, యెషయా 50:6లో ఉన్నది."

కీర్తన 22. ఆయన సిలువలో, "నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి? వారు నా ఎముకలను పొడిచిరి. నా కాలు చేతులలో గాయములు చేసిరి," అని పలుకలేదా? (ఆయన ఎన్ని ప్రవచనములు ఎత్తి చూపెనో చూచారా?)

''యెషయా 9:6, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను. కన్యక గర్బవతి యగును.''

"కీర్తన 22:18, వారాయన వస్త్రములను పంచుకొనిరి."

''యెషయా 7:14. కన్యక గర్భవతి యగును.''

''కీర్తన 22:7, 8, సంఘమే ఆయనకు శత్రువాయెను. ఆయనకు స్నేహితులుగా ఉండవలసిన వారే ఆయనను, హేళన చేసిరి.''

కీర్తన 22. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విడువబడదు. వారాయన కాలు చేతులకు గాయములు చేసిరి."

''యెషయా 53:12, ఆయన దొంగలతో చనిపోయెను."

''యెషయా 53:9, గాయపరచబడి, ధనిక సోదరులతో సమాధి చేయబడెను."

"కీర్తన 16:10. ఆయన మృతులలో నుండి పురుద్ధానము పొందెను. నా పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయను. ఆయనాత్మను పాతాళములో విడిచి పెట్టను. ఆయన మృతులలో నుండి తిరిగి లేచును, అని దావీదు చెప్పలేదా?"

''బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనకు ముందుగా వచ్చును. మలాకీ 3."

ఎన్నో లేఖనములను ఆయన చూపించి యుండును. ఆదికాండము 22లో అబ్రాహాము, ఇస్సాకును కొండమీదికి బలిగా తీసికొనివెళ్ళుట ఆయనకు మాదిరి.

LUKE 24:25,32

 

102ఆ దినమునకు వాగ్దానము చేయబడిన ఈ లేఖనములను ఎవరు నెరవేర్చిరో వారు చూడనారంభించారు. చాలా ఆలస్యంగా వారు చూడసాగారు. సిలువ వేయబడిన తమ స్నేహితుడగు యేసే వాగ్దానము చేయబడిన ప్రవక్త అని వారు ఎరిగియుండిరి చూడండి. వారు లేఖనములను గ్రహించలేదు.

సిలువలో జరుగవలసియున్న సంగతులన్నీ జరిగిపోయినవి. ప్రవక్తలు చెప్పిన దానిని గ్రహించలేని అవివేకులు, మందమతులు వారు. మెస్సీయా ఎట్లు శ్రమపడి మహిమలో ప్రవేశించి, మూడవ దినమున లేచునో వారు గ్రహించలేదు.

''అవును, అది నిజమే. మన హృదయములు మనలో మండుచుండలేదా?" అనిరి. వారి హృదయములు మండుటలో ఆశ్చర్యము లేదు. ఆయన వారితో చెప్పిన ప్రవచనములు నెరవేరినవి.

ZECH 14:7•

HEB 13:8

 

103వారాయనకు స్నేహితులు. ఆయనతో వారు భోజనము చేసిరి, ఆయనతో మాట్లాడిరి, ఆయనతో సహవాసము చేసిరి, ఆయనతో చేపలు పట్టిరి, అరణ్యములో పరుండిరి, ఆయనే ఆ ఘడియకు వాగ్దానము చేయబడిన ప్రతి మాటను నెరవేర్చెనని వారు గ్రహించసాగిరి! వారు ఆరుమైళ్ళ దూరం నడిచినా కొద్ది సమయం వలె కనబడెను అని నేను అనుకొనుచున్నాను. బయలుపరచబడిన ప్రవచనము మీద వారు ఆరు గంటల వర్తమానము వినిరి (ఈ రాత్రి మన వర్తమానము కంటే ఎక్కువ సమయము, చూచారా). చీకటి పడినది; సాయంకాలపు దీపములు వెలిగినవి.

సంఘమా, అంతే సమయమయినది! సాయంకాలపు వెలుగు వచ్చినది. హెబ్రీ 13:8, ''ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ప్రవచనము ద్వారా సంగతులు తేటపరచబడుచున్నవి. నేడు ఆలాగే జరుగుచున్నది. జెకర్యా 14:7లో దేవుని ప్రవక్త ద్వారా వాగ్దానము చేయబడిన సాయంకాలపు దీపములు నిజవిశ్వాసుల నేత్రములను మరల తెరచి, నేడు సంభవించుచున్న సంగతులను చూపించును గాక! మనము అంత్యకాలమందున్నామని ప్రవచనముల ద్వారా రుజువైనది. యేసు వచ్చుచున్నాడు.

ZECH 14:7

 

104ఆయన చెప్పెను, "ఒక దినము రాబోవుచున్నది…" [టేపు మీద ఖాళీ యున్నది.]

ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీకు వందనములు చెల్లించుచున్నాము, ఎందుకనగా మా ప్రార్థనకు నీవు జవాబు ఇచ్చెదవు. శస్త్ర చికిత్స విఫలము చెందిన స్త్రీ ఇక్కడ పడియున్నది. ఓ దేవా, భూమిమీద మొదటిసారి చేసిన శస్త్ర చికిత్సను మేము గుర్తుచేసికొనుచున్నాము. దానిని నీవే చేసితివి. ఆదాము వెన్నెముకను నీవు తెరచి అతనికి ఒక భార్యను తయారు చేసితివి. ఓ తండ్రీ, ఇపుడు నీ హస్తము దిగివచ్చి మేమడిగిన ఈ గొప్ప కార్యమును చేయవలెనని ప్రార్థించుచున్నాము. ప్రభువా, ఈ స్త్రీ మానసిన ఆందోళనతో యున్నది. మనవి చేసిన తక్కిన వారినందరినీ జ్ఞాపకము చేసికొనుచున్నాము. తండ్రీ, మా పూర్ణహృదయములో నీకు సమర్పించుకొనుచున్నాము. యేసుక్రీస్తు నామములో, ఆమేన్.

"పగలు కాదు, రాత్రి కాని ఒక దినముండును," అని ఆయన చెప్పెను. "సాయంకాలమున వెలుగు కలుగును," అని ఆయన చెప్పెను. భౌగోళికంగా సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించును. ఇప్పుడు, ప్రవక్త చెప్పెను, "పగలు కాని, రాత్రి కాని ఒక దినము; అది ఒక రకమైన, పాక్షికముగా చీకటిగా వుండు దినము."

కుమారుడెచ్చట ఉదయించును? ఇప్పుడు మనము కుమారుని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. స్వాభావిక సూర్యుడు తూర్పున ఉదయించి, పశ్చిమాన అస్తమించును. దేవుని కుమారుడు తూర్పు జనుల కొరకు ముందు తూర్పున ఉదయించెను.

ఆయన వెళ్ళిపోయిన తరువాత, వారేమి చేసిరి? మూడు వందల సంవత్సరముల తరువాత వారు తమ మొదటి సంస్థను ప్రారంభించిరి: అదే కాతలిక్కు చర్చి, చీకటి కాలము గుండా వారు వచ్చిరి. వారేమి చేసిరి? అదే కార్యము చేసిరి. అది పగలు కాదు, చీకటి కాదు. ఆతడే దేవుని కుమారుడని వారు నమ్మిరి, తమకు దొరికిన వెలుగులోనే నడిచిరి, సంఘములు కట్టిరి, ఆస్పత్రులు నిర్మించిరి, స్కూళ్ళ, సెమినరీలు నిర్మించి తమ పిల్లలను ఆ పాఠశాలలకు పంపిరి.

ZECH 14:7•

LUKE 17:30

 

105"సాయంకాలమందు మరల వెలుగుండును. కుమారుడు మరల తొంగిచూచును; వెలుగు కలుగును,'' అని ప్రవక్త చెప్పెను. ఉదయకాలమున శరీరములో ప్రత్యక్షమైన దేవుడే మరల సాయంకాలమున ప్రత్యక్షమగును. (కుమారుడు)

ఇప్పుడు లూకా 17:30 ని పోల్చండి. మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు ఆ దినమున లోకము సొదొమ స్థితిలో యుండును.''

సాయంకాలమందు వెలుగు కలుగును.

మహిమ బాటను నిశ్చయముగా నీవు కనుకొందువు.

ఓ! జనులారా! మనం ఎచ్చటున్నాము?

దేశములు బ్రద్దలగుచున్నవి. ఇశ్రాయేలు మేల్కొనుచున్నది.

ప్రవక్తలు ముందే చెప్పిన గురుతులు;

అన్యుల దినములు లెక్కించబడినవి.

(సముద్రములోనికిఅది జారిపోవుట గమనించండి!)

ఓ, విడువబడినదానా! నీ యజమాని యొద్దకు తిరిగి రా!

విమోచనా దినము సమీపించినది,

భయముతో మానవుల గుండెలు దద్దరిల్లుచున్నవి.

ఆత్మతో నింపబడుడి, మీ దీపములు

శుభ్రము చేసి వెలిగించుడి.

పైకి చూడండి! మీ విడుదల సమీపించినది.

(మంచిది.)

సోదరీ, సోదరుడా, ఇది భయము కలిగించు కాలము. ప్రవచించబడిన సంగతులను, జరుగుచున్న సంభవములను చూడండి. ప్రవచనమంతయూ నెరవేరబడుట గమనించండి. ఇదంతా ఏమిటో మనకు తెలియును. ఇది మతోన్మాదము కాదు. దేవుడు తన మాటను అక్షరాలా ధృవపరచుచున్నాడు. స్నేహితులారా, బండ కొట్టబడినది. వీలయినంత త్వరగా పారిపొండి. మనము జీవించుచున్న ఈ దినమును ప్రవచనము బయలుపరచుచున్నది.

106మన తలలు వంచుదము. [ఒక సోదరుడు వేరే భాషలో మాట్లాడుతున్నాడు. ఒక సోదరి అర్ధము చెప్పుచున్నది. వేదిక మీద ఉన్న ఒక వ్యక్తి చెప్పుచున్నాడు, "కొంత సేపు ఆగుదురా? దేవుడు సహోదరుడు బ్రెన్హాం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సహోదరుడు బ్రెన్హాం మీద ఇంకా అభిషేకమున్నది, అయిపోలేదు."]

ఓ, మై. స్నేహితులారా, మనం జీవించుచున్న దినములను గ్రహించారా? "దేవునితో వివాదము పడుటకు తెగించుదురా? ఆయన వీటిని రుజువు చేయగా, ఆయన సరికాదు అని చెప్పగల ధైర్యమున్నదా? ఆయనే తన స్వంత అనువాదకుడు. మీరాయనను సేవించగోరుచున్నారా?

సోదరీ సోదరులారా, తలలు వంచండి, హృదయములు వంచండి:

ఇది మన చివరి కూటము కావచ్చును. నేను బ్రదికి బాగుండి ఒక సంవత్సరము తరువాత మరల ఇక్కడికి వచ్చినచో, నేడు జీవించియున్న వారిలో చాలామంది అప్పుడుండరు. నేను మిమ్మును తీర్పు నొద్ద కలిసికొని, ఈ రాత్రి నేను చెప్పిన ప్రతిదానికి జవాబు ఇయ్యవలసియుందును.

107మీరు సరైన, స్తితిలో యుండిన ఈ సమయంలోనే ఈ మాత్రము దేవునికి చేయలేరా? మీరెవరయినా గాని దేవుని అద్దములో మిమ్మును చూచుకొనుడి (బైబిలు), "నేను చేయు ఈ క్రియల వలన దేవునికి కుమార్తెగా నేను ఉండుట లేదు. నా కార్యముల వలన నేను దేవుని కుమారునిగా ఉండు అర్హత కోల్పయాను. దేవా, ఇట్టి స్థితి నుండి నన్ను బయటకు తెమ్ము," అని చెప్పండి. ఈ భవనంలో నీవు ఎక్కడున్నా గాని, నీ చేతిని దేవుని వైపు ఎత్తి, ''నేను దేవుని కుమారునిగా ఉండగోరుచున్నాను. దేవుని కుమార్తెగా ఉండగోరుచున్నాను. నా ప్రభువు ఆజ్ఞాపించిన సమస్తమూ నెరవేర్చగోరుచున్నాను,'' అని చెప్పుము. తొంబయి శాతం మంది జనులు చేతులెత్తిరి. దేవుడు మిమ్ము దీవించును.

నా స్నేహితుడా, ఇటు చూడు. యోహాను బోధించిన దినములలో మనము జీవించియుండినచో ఎట్లుండెడిది? యేసు ఇక్కడుండిన దినములలో మనము జీవించినచో ఎట్లుండెడిది? నీవు ఎవరి పక్షమున ఉండియుందువు? నీవు అప్పుడుండినా, ఇప్పటివలెనె ఉండి యుందువని మరువవద్దు. అదే యేసు తన మాట ద్వారా తన్ను బయలుపరచుకొనుచున్నాడు, చూడండి, ఆయన మాటంటే లెక్క లేదు.

HEB 10:25

 

108కాని సంఘములకు వెళ్ళవద్దని జనులతో నేను చెప్పుట లేదు. సమాజముగా కూడుట మానక, ఆలయములకు వెళ్ళుడని నేను చెప్పుచున్నాను. దేవుని రాజ్యములోనికి చొరబడుడి అని మీతో నేను చెప్పుచున్నాను. ఈ సంగతులు గ్రహించండి.

పెంతెకోస్తు వారలారా, మీరు మరీ లోకస్తులగుచున్నారు. మీరు మరీ లోకము కొరకు ప్రాకులాడుచున్నారు. టెలివిజనులు చూచుట, ఆయా సంగతులలో పాల్గొనుట, మీరు చేయు విధానము, మరియు అన్నియు. ఈ విషయములలో సెమినరీలు, పాఠశాలలు రాజీపడుచున్నవి, మొదటి సంగతి మీకు తెలుసా… ఆ విధముగా రావలసియున్నది. పెంతెకోస్తు చర్చి నన్ను చాలా సహాయకరముగా ఉన్నది; దానికివ్యతిరేకముగా నేనేమీ అనలేను. అయితే నేను కేకవేయుచున్నాను, "నా సోదరులారా, బయటకు రండి!" ఇంతకు ముందువలె ఇప్పుడు మీకు కూటములు లేవు. జనులు ఇంతకు ముందునట్లు లేరు. కాని యేసుక్రీస్తు మారలేదు. ఆయన లోనికి రండి.

109చేతులెత్తిన వారు గుర్తుంచుకొనండి, అరణ్యములో ఒక బండ కొట్టబడినది, ఈ రాత్రి ఇంకా ఆ ప్రవాహము తెరిచేయున్నది. ఆ కొట్టబడిన బండ క్రీస్తే.

ఈ రాత్రి నాకు తెలిసినంత వరకు పిలుపు సమయము అయిపోయినదనుకొనుచున్నాను; నాకు తెలియదు. నేను చెప్పలేను. గుర్తుంచుకొనండి, యేసును సిలువ వేసిన తరువాత జనులు మామూలుగానే కూటములను ఏర్పాట్లు చేసికొనిరి. బోధించుచు మరియు రక్షింపబడియున్నామని చెప్పుకొందురు. ప్రపంచము ఎప్పటివలెనే కొనసాగినదని వారందురు. కాని అప్పటికే అది చాలా ఆలస్యమయిపోయినది.

2TIM 3:8

 

110నా సోదరుడా, ఇంకా నీకు తరుణమున్నది. నా సోదరీ, ఇంకా నీకు అవకాశమున్నది. దేవుని రాజ్యములోనికి రమ్ము. ఏ ఒత్తిడి వలన నీవు రానవసరము లేదు, కాని మంచి విశ్వాసముతో వాక్యమును నమ్ముము. ఆయనే ఆ వాక్కు! "ప్రభువైన యేసూ! ఇప్పుడు నేను దేవుని వాక్యమగు నీ అద్దములో నన్ను చూచుకొనుచున్నాను. నేనెంతో లేమిలో యున్నాను. కాని ఈ రాత్రి, ఈ సోమవారము - రాత్రి, ఈ కాలిఫోర్నియోలోని సాన్-బెర్డ్నాడినో ఆడిటోరియంలో ప్రియదేవా, నాకున్న సమస్తము నీకిచ్చుచున్నాను. ప్రభువా, ఉన్నపాటున నన్ను స్వీకరించెదవా? వెంటనే నన్ను సిలువనొద్దకు పరుగిడ చేయుము. వర్తమానికులను నేను చూచుచున్నాను. కాలమును నేను చూచుచున్నాను, సాదొమ నుండి బయటకు రమ్మను పిలుపు వినుచున్నాను. గురుతులను చూచుచున్నాను. అబ్రాహాము యొక్క గుంపు వెలుగును పొందుట చూచుచున్నాను. ప్రత్యక్షతను నేను చూచుచున్నాను. మా మధ్య యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూచుచున్నాము. నీవు వాగ్దానము చేసిన వాటినన్నింటినీ నేను చూచుచున్నాను. అనుకరణలు చేయు వారిని చూచుచున్నాను. మోషే కాలములో యన్నే, యంబ్రెలు అనుకరణలు చేసినట్లుగానే, నేడును వీరు చేయుచున్నారు, ఇదంతా చూచుచున్నాను."

JOHN 10:4

 

111చూడండి, వారు మోషేను వెంబడించి వాక్యమును గ్రహించలేకపోయిరి. ఇశ్రాయేలీయులను అరణ్యములో నుండి బయటకు తీసికొనిరాలేకపోయిరి, ఎందుకనగా వారు ఐగుప్తుతో సహవాసము చేసిరి. వారు అవే క్రియలు చేసినా వారి పాపము బయట పడినది. ''చివరి దినమున మరల అదే జరుగును," అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మీరు ఆత్మ సంబంధులయితే మీ నేత్రములతో మీరే అది చూచెదరు. దానిని నేను వివరించలేను. దానిని వివరించవలసిన అవసరత నాకు లేదు. "నా గొర్రెలు నా స్వరము వినును.'' ఇంకా అవకాశముండగానే ఆయన యొద్దకు రారా. మీరు వచ్చేదరా?

112మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అవసరమైనా, మరల నీవు దేవునికి ప్రతిష్టించుకోవలెననుకొన్నా, క్రొత్త జీవము పొందగోరినా, నీ సంఘ కాపరి కాదనడు గాని సంతోషించును. ఈ రాత్రి నిన్నునీవు పూర్తిగా దేవునికి సమర్పించుకొనుము. ఇంకా మనం ఇక్కడున్నాము. ఇది చాలా కఠినముగా, వింతగా, కొత్తగా యున్నదని నేనెరుగుదును. ఆలాగు చెప్పవలెనని నేననుకోలేదు. యధార్ధముగా దానిని నేను చేయుచున్నాను. మిమ్మును, దేవునిని ప్రేమించుచున్నాను గనుక ఆలాగు నేను చేసితిని. మీకు సహాయులు చేయ ప్రయత్నించాను. నా పూర్ణహృదయముతో, నా పూర్ణ విశ్వాసముతో నా వర్తమానము దేవుని యొద్దనుండి వచ్చినదని నేను నమ్ముచున్నాను. ఎన్నో ఏండ్లనుండి మీకది రుజువగుచున్నది.

ఇప్పుడు వినండి, ఈ రాత్రి మీరు పూర్తిగా ఆయనకు అప్పగించుకొనండి. మీ ప్రతి అవసరమును చెప్పుకొనండి, మీరు నిలబడి చేతులెత్తి, "ప్రియ దేవా, నన్ను స్వీకరించుము. నా మనస్సును వాడుకొనుము. నేను పరిశుద్ధముగా ఉండవలెనని, నేను తిరిగి-జన్మించి ఆత్మతో నింపబడవలెనని తెలిసికొనియున్నాను. ప్రియదేవా, ఆలాగుండుటకు నన్ను నడిపించుము. నీకు స్వాధీనమగుటకు ఇష్టపడుచున్నాను," అని చెప్పండి.

113అందరూ లేచి నిలబడండి.

ఉన్నట్టు నేను వచ్చెదన్,

అయితే నీ రక్తము నా కొరకు చిందింపబడినది,

మరియు నీ యొద్దకు రమ్మని పిలచుచున్నావు,

ఓ, దేవుని గొర్రెపిల్ల! (దేవుని ద్వారము) నేను వచ్చుచున్నాను!

(మీ పని, మీ అలసట, మీ సమస్తము ప్రక్కకు పెట్టండి.

ఇప్పుడు మీరు చనిపోతే ఏమగుదురు?)

ఉన్నట్టు నేను వచ్చుచున్నాను, చేర్చుకొనుము.

క్షమించి, శుద్ది చేసి, చేర్చుకొనుము.

(ఈ వచనము పాడుచూ మీ చేయి ఎత్తైదరా?)

నేను నమ్ముచున్నానని వాగ్దానము చేయుచున్నాను.

ఓ, దేవుని గొర్రెపిల్ల! నేను వచ్చుచున్నాను!

ఇప్పుడు ఆర్గానిస్టు పాటను ఆగక వాయించుచుండగా.

MATT 5:28•

1JN 2:15

 

114యువకులారా, ఆ వీధులలో తిరుగుచున్న రౌడీల వలె మీరుండగోరుచున్నారా?

సోదరీ, నీవు జట్టు కత్తిరించుకొనగోరుచున్నావా? పొడవైన వెండ్రుకలుండుట దేవునికి నాజీరు చేయబడుట. కాబట్టి ఆమెకు అది ఘనత. "జుట్టు కత్తిరించుకొనుట ఆమెకు అవమానము.'' నేడు వారు ధరించుచున్న పొట్టి బట్టలు, దుర్నీతి దుస్తులు, శరీరమును బయటకు చూపించు బట్టలు మీరు వేసికొని వీధులలో తిరుగగోరుచున్నారా? నిన్ను మోహపు చూపుతో చూచు ప్రతి వ్యక్తి అపుడే తన హృదయమందు నీతో వ్యభిచరించినవాడగునని ఎరుగవా? నిన్నునీవు ఆలాగు కనుపరచుకొనుచున్నావు. రంగులు పూసికొనుచున్న స్త్రీలారా, బైబిలులో ఒకే ఒక స్త్రీ రంగులు వేసికొన్నదని మీరెరుగుదురా? దేవుడామెను కుక్కలకు తినిపించెను. ఆ రోజు నుండి యెజెబెలు అను పేరు ఆమె క్రియల వలన హేయమైనదిగా ఎంచబడినది. ఆమెను ఆ విధంగా శపించినవాడు ప్రవక్తయగు ఏలియా. బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదియను ఖండించెనని మీరెరుగుదురా? ఈ లోకపు హాలీవుడ్ క్రియలు మీరు చేయవద్దు. "మీరు లోకమును గాని, లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినచో, దేవుని ప్రేమ మీలో యుండదు."

115సోదరుడా, సేవక స్నేహితుడా, నన్ను దయచేసి అర్ధము చేసికొనండి. నేను మీ సోదరుడను. నీ తల్లి, నీ తండ్రి ఒక సంఘమునకు చెందియున్నారు గనుక నీవును దానిని హత్తుకొని యున్నావా? (నీవు మెతడిస్టు, బాప్టిస్టు, మరేదయినా కావచ్చు), నీ తాతలు తండ్రులు ఒక దానిలో నుండి బయటకు వచ్చి, అందులో చేరిరి. అది వారి దినములలో దొరికిన వెలుగు; నోవహు కాలములో వలె యున్నది. ఇది మరో రోజు.

"మంచిది, నాకు మరో…" అని నీవనవచ్చు.

ఇది పెంతెకోస్తు దినము కాదు. పెంతెకోస్తు కాలము గతించెను. ఇది కోత కాలము, చూచారా. కోత కాలములో గింజ తయారగును. నీరు కుమ్మరించబడినది. గింజ పరిపక్వమైనది. నా ప్రియ సోదరుడా, గింజగా మారుము. నా మాట వినండి. నన్ను నమ్మండి. నేను దేవుని దాసుడని మీరు నమ్ముచున్నయెడల, దీనముగా తలను వంచి మీ ప్రార్థనను ఆయనకు అర్పించండి. "దేవా, ఉన్నపాటున నన్ను స్వీకరించుము," అని చెప్పండి.

సోదరీ, సోదరుడా, నేను కూడా ఈ రాత్రి నన్ను బలిపీఠము మీద ఉంచుకొనుచున్నాను. దేవా, నన్ను మలచుము, ప్రత్యేకమగు వ్యక్తిగా చేయుము. దేవా, నీ పోలికలో నన్ను రూపించుము.

ఇక్కడ నిలబడి జనులను ఆ విధంగా కోయుట తేలికని మీరు తలంచుచున్నారా? అది చాలా కష్టమగు పని. కాని ఆలాగు నేను చేయని యెడల నాకు శ్రమ!

REV 10:7

 

116ప్రియ దేవా, ఈ జనులు తమ శిరస్సులు, హృదయములు వంచి యున్నారు. ఈ బైబిలు ప్రసంగమును ముగించు ఆఖరి క్షణములివి. పరిశుద్ధాత్మ ఈ దేశమును కదిలించినది. దానికి ఈ గొప్ప ఉజ్జీవములే రుజువు. ఈ తరువాత మరొకటి జరుగనని ఎరుగుదుము. ఆరిజోనాలోని ఆ కొండ మీదికి ఏడు దేవదూతలు దిగివచ్చుట చూచాము. దేశములోని పత్రికలు దానిని ప్రచురించినవి. యేసు ఆకాశములలో నుండి తొంగి చూచి ఇట్లు చెప్పెను, " ప్రకటన 10:1లోని ఏడవ దూత, వర్తమానము అందించు సమయములో ఈ ముద్రలు విప్పబడును. దేవుని మర్మములు తెలియచేయబడును." వాటినన్నింటిని బయటకు తెచ్చుటకు కావలసిన సమయము ఆ సంస్కరణ కర్తలకు లేదు. ఈ ఏడు ముద్రలలో ముద్రించబడిన దంతయూ ఈ దినమున విప్పబడును. ఈ గొప్ప అద్భుతములు, సూచక క్రియలు జరుగుట చూచుచున్నాము. జరుగకముందే వాటిని గూర్చి చెప్పబడెను. ఒక్కసారి కూడా నీవు నెరవేర్చకుండా తప్పిపోలేదు, చెప్పినట్లుగానే సమస్తమూ జరిగించితివి.

117ప్రియ దేవా, యేసుక్రీస్తు మా మధ్య ఉన్నాడని గ్రహించియున్నాము. ఆయన ఇక్కడున్నాడని మాకు తెలియును. ఈ రాత్రి ఆయన ఇచ్చటున్నాడు. అదృశ్యడగు దేవుడు ఇచ్చట మాతో యున్నాడు. ఆయన తన వాక్యములో చేసిన ప్రతి వాగ్దానమును స్థిరపరచగలడు. నీవు వెనుదిరిగి నిలబడి వారికెట్లు రుజువు చేసితివో చూచాము. ప్రభువా, అప్పటికింకా, అనుకరణలు చేయువారు రంగములోనికి రాలేదు. అది జరుగు విధానమును ఖచ్చితంగా నీవు మాకు చూపించి, రుజువు చేసి, ప్రవచించియున్నావు. ఆ విధంగానే అది జరుగుట మేము చూచుచున్నాము. తండ్రి, దేవా, అది మానవుల వలన కాదు; దేవుడే చేయవలెను. ఈ రాత్రి నీవే ఇచ్చటున్నావని మాకు తెలియును. మా పాపములను క్షమించుము.

ప్రియ దేవా, మా వ్యాధులను బాగుచేసియున్నావు. ప్రభువా, మా పాపములు క్షమించుము. మంచి రకమైన క్రైస్తవులుగా ఉండునట్లు చేయుము. సంపూర్త సువార్తకు చెందినవారమని చెప్పుకొనుచున్నాము, కాని శాఖలకు చెందిన కోడిపిల్లల వలె యున్నాము. ప్రియ దేవా, మాకు సహాయము చేయుము. మమ్మును తీసికొని నీ పరిశుద్ధాత్మచే కదిలించుము. నీకు ఇష్టము కానిది మాలో ఏదయినా యున్నయెడల, తీసివేయుము. దేవుని పరిశుద్ద వాక్యములో మా పాదములు నిలుపుము. మా హృదయములో పరిశుద్ధాత్మ మంట పుట్టించి ఈనాటి అవిశ్వాసమును, సోమరితనమును పారద్రోలుము. మమ్మును మేల్కొలుపుము. దేవా, దయచూపుము. మమ్మును శుద్ధి చేయుము. మమ్మును మలచుము! రూపించుము! దేవా, అనుగ్రహించుము.

118ప్రభువా, ఆ విత్తనమును హృదయములలో కలిగియున్న వారు ఈ రాత్రి ఇక్కడున్నారు. దేవుని బీజము వారిలో యున్నది. జగత్తు పునాది వేయబడక ముందే వారు జీవమునకు నిర్ణయించబడిరి. వారు ఈ ఘడియలో ఉండి దీనిని వినుటకు నిర్ణయించబడిరి. ప్రభువా, నాకది తెలియును. వారి ఆత్మను నింపి, తాజా పరిశుద్ధాత్మ బాప్తిస్మములో వారిని వెలుగించమని, వారు సంతోషముతో ఆనందించుచు తమ దారిన వెళ్ళునట్లు చేయుమని దేవా, నేను ప్రార్ధించుచున్నాను.

ప్రభువైన దేవా, వారిని నీకనుగ్రహించుచున్నాను. వారెవరో నాకు తెలియదు; నీకు తెలియును. ప్రభువా, నీవు బయలుపరచిన రీతిగా నీ వాక్యమును బోధించుట నా బాధ్యతయై యున్నది. మిగిలిన పని చేయు బాధ్యత నీది. విత్తనము చల్లుచున్నాను. ప్రభువగు దేవా, అది మంచి నేలలో, సారవంతమగుచోట ఈ రాత్రి పడునట్లుగా ప్రార్ధించున్నాను. ప్రభువా, దానిని చాలామంది చూచి ఈ చివరి దినమున ప్రకాశించు క్రైస్తవులుగా ఎదుగుదురు గాక. మేము ఎదురు చూచుచున్న ఆ గొప్పది త్వరగా వచ్చును గాక! ప్రభువా, దయచేయుము. నీ సంఘమును, నీ వధువును నీవు స్వీకరించి, నీ గృహమునకు కొనిపొమ్ము. అంతా క్రమముగా యుండుట మేము చూచుచున్నాము. ప్రభువైన యేసూ, రమ్ము. ఫలితముల కొరకు సమస్తమును యేసుక్రీస్తు నామములో నీకు సమర్పించుచున్నాము. ఆమేన్.

నేనాయనను ప్రేమించుచున్నాను,

నేనాయనను ప్రేమించుచున్నాను,

ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను పైన.

119మీరాయనను ప్రేమించుచున్నారా? అయితే మీరు ఒకరినొకరు పేమించవలెను. దీనిని మరల పాడుచుండగా ఒకరితో ఒకరు చేతులు కలపండి:

నేనాయనను ప్రేమించుచున్నాను,

నేనాయనను ప్రేమించుచున్నాను,

నా రక్షణను కొనెను,

కల్వరి మ్రాను పైన.

ఇపుడాయనకు స్తుతి చెల్లించుదము. ఈ పాట ఎందరెరుగుదురు:

నేనాయనను స్తుతింతును, స్తుతింతును,

పాపులకై వధించబడిన గొర్రెపిల్లను స్తుతించుము;

జనులారా, మీరందరూ ఆయనను మహిమపరచుడి;

ఎందుకనగా ఆయన "రక్తము ప్రతి డాగును కడిగెను.

ఇప్పుడు దానిని పాడుదము:

నేనాయనను స్తుతింతును, స్తుతింతును,

పాపులకై వధించబడిన గొర్రెపిల్లను స్తుతించుము;

జనులారా, మీరందరూ ఆయనను మహిమపరచుడి;

ఎందుకనగా ఆయన "రక్తము ప్రతి డాగును కడిగెను.

అంతా పోయినట్లుగా మీకనిపించుటలేదా? మీ చేతులెత్తి, "ఓ, అది నాకు మంచి అనుభూతి ఇచ్చుచున్నది," అని చెప్పండి. సోదరుడా, ఆ పాత-కాలపు పాటలు నాకు ఇష్టము. మీకు నచ్చవా? అవి హృదయములోనికి వెళ్ళుము.

నేనాయనను స్తుతింతును. స్తుతింతును,

పాపులకై వధించబడిన గొర్రెపిల్లను స్తుతించుము;

జనులారా, మీరందరూ ఆయనను మహిమపరచుడి,

ఎందుకనగా ఆయన రక్తము ప్రతి డాగును కడిగెను.

120ఇప్పుడు మనము చేతులెత్తి మనకిష్టము వచ్చిన రీతిలో దేవుని స్తుతించుదము:

ప్రభువైన యేసూ, నీకు వందనములు. ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. బబులోనులో నుండి బయటకు పిలువబడిన జనులముగా మేము నీకు స్తుతి చెల్లించుచున్నాము. నీ కుమారుడగు యేసుక్రీస్తు రక్తమును బట్టి నీకు వందనములు. ఈ నిమిషములో ఆయన మమ్మును శుద్దీకరించెను గనుక నీకు వందనములు. మా తప్పులను, బుద్దిహీనతను చీకటిలోని మా తొట్రుబాటును ప్రభువా, క్షమించుము. ఓ దేవా, మేము లేచి ప్రకాశించెదము గాక! సాయంకాల వెలుగులో నడిచెదము గాక! సాయంకాల వెలుగు ద్వారా వచ్చు చెట్టు ఫలముగా ఉందుము గాక! ప్రియ దేవా, అది అనుగ్రహించుము. మమ్మును మేము యేసుక్రీస్తు నామములో నీకు సమర్పించుకొనుచున్నాము.

మీరిప్పుడు తలలు వంచియుంచుడి, సంఘ కాపరులగు మీకు ఈ ఆరాధనను తిరిగి అప్పగించుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...